Saturday, October 20, 2012

సప్త స్వరములు

స్వరములు ఏడైన.... రాగాలెన్నో...
హృదయం ఒకటైనా...భావాలెన్నో....

సరము - స్వరము, ముకుగాలి, షడ్జాది స్వరము, స్వర సం.వి. 1.హారము(నూట ఎనిమిది పేటల ముత్యాలహారము) 2.గమనము.

స్వరము - 1.కంఠ ధ్వని, 2.ముక్కు గాలి, 3.అచ్చు (అకారాది) ఉదాత్తానుదాత్త స్వరితములు (వేదములోని) 4.షడ్జాది సంగీత స్వరములు ఏడు, సం.వి. (భౌతి.) సంగీత ధ్వనులలో ఒక నియత ధ్వనిని సూచించు చిహ్నము (Note), సం.వి. (భౌతి.) ధ్వని యొక్క గుణము (Tone).  
అచ్చు - స్వరము, (అకారాదులు). 

సప్త - ఏడు తంతులు గల వీణ, పరివారిది.
స్వరములు -
(భౌతి.) వినుట కింపైన ధ్వనులు (Notes). ప్రణవ నాదమే(నాదము - ధ్వని) సప్తస్వరములు.

రవము - కంఠధ్వని.
రావము -
1.రవము, 2.ధ్వని.

కృకము - కంఠనాళము, కంఠపు బుడిపి, కుత్తుక. 
కుతుక -
గొంతు, రూ.కుతుక, కుత్తుక.
గొంతు - 1.కుత్తుక, 2.కంఠధ్వని, రూ.గొంతుక, సం.కంఠః.
గళము - 1.కుత్తుక, 2.ఒకానొక వాద్యము.

గ్రీవము - 1.కిరణము, 2.కంఠము.
గ్రీవ - 1.కంఠము, 2.మెడనరము, రూ.గ్రీవము.

శిరోధి - మెడ.
మెడ -
కంఠము, రూ.మెడకాయ.
కంఠము - 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము.
కంఠ్యము - కంఠము నందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, ఘ, జ, హః అను ధ్వనులు.

సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
అఱుత -
1.సమీపమందు, 2.కంఠమందు.

కంధరము - 1.కంఠము, 2.మెడ, 3.మబ్బు.
మెడిదము - ధ్వని.

నాదము - ధ్వని.
నాదు -
నాదము, ధ్వని, సం.నాదః.
నాదస్వరము - మేళగాండ్రు పాటలు పలికించు క్రోవి, సన్నాయి.
మంగలికోళ్ళు - సన్నాయి, వ్యు.మంగలి ఊదు గొట్టము. 
సన్నాయి - నాదస్వరము, హిం. షహ్ నాయి.
మౌరి - నాగసరము, నాదస్వరము, రూ.మవురి.
నాగస్వరము - పాములవాడు ఊదు క్రోవి, నాగసరము. 

(ౙ)జో - జోకొట్టు ధ్వని.
జోకొట్టు -
'జో' యని బిడ్దను నిద్రపుచ్చుటకు తట్టు.
జోజో - 1.జోకొట్టు, 2.దీవన.
జోల - బిడ్డల నిద్రపుచ్చుటకు పాడెడిపాట, రూ.జోవ.
(ౙ)జోవ - జోల.

ఫణితము - వాక్కు, శబ్దము, విణ.చెప్పబడినది.
ఫణితి - 1.వాక్కు, 2.పాడెడు పద్దతి. 

శబ్దము - 1.ధ్వని, 2.వ్యాకరణ శిక్షితమైన పదము.
ధ్వని -
1.శబ్దము, చప్పుడు, 2.వ్యంగప్రధానశబ్దము, 3.వ్యంగము,(భౌతి.) శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహింపపడు సంక్షోభము, (Sound).
సద్దు - శబ్దము, చప్పుడు, సం.శబ్దః.
ౘప్పుడు - అచేతన వస్తువులు ఒకటితో నొకటి తాకుటచే కలుగుధ్వని, శబ్దము.
శబ్దశాస్త్రము - (వ్యాక.) వ్యాకరణ శాస్త్రము.

శబ్దగ్రహము - 1.చెవి, 2.శబ్దజ్ఞానము. ఆకాశము శబ్దము.
చెవి - 1.శ్రవణము, వినెడియింద్రియము, 2.రాట్నము మొదలగు వానియందుగల యొక భాగము, 3.తాళపుచెవి.
శ్రవణము - 1.చెవి, 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
శ్రోతము -
చెవి; శ్రవము - చెవి.
శ్రవ్యము - (భౌతి.) చెవి, గ్రహింప బడ గలది, (Audible).
వినికి - వినుట, రూ.వినుకలి.
ఆకర్ణనము - వినికి, శ్రవణము.

అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ
వ కళాశ్రేణి వివేక సాధనము లొప్పం బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్పూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్ర బంధ లతికన్ శ్రీకాళహస్తీశ్వరా !
 
తా|| ఈశ్వరా! నాదబిందు కళారూపిణియై, శ్రీచక్రాంతర వర్తియైన భువనేశ్వరీదేవి యందు మనస్సును సుస్థిరముగా నిలిపి, ఆ దుర్గాదేవి దయవలన మనసు యొక్క వేగచాలన గర్వమును బోగొట్టినట్టి యోగులకు(శ్రీవిద్యోపాసకులకు) సంసారబంధములు తొలగుపోవును గదా ! - ధూర్జటి(ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.)  

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్|
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్||

అ(ౘ)చ్చరము - అక్షరము, సం.అక్షరమ్.
అక్కరము - అచ్చరము, సం.అక్షరమ్.

అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి. 1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.
అక్షమాల - 1.అకారము మొదలు క్ష కారము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తావళము, 3.అరుంధతి.  
అక్షసరము - జపమాల; అక్షసూత్రము - జపమాల. రుద్రాక్షమాల - అక్షమాల.
తావడము - రుద్రాక్షలు మొదలగునవి కూర్చిన హారము, రూ.తావళము.
అరుంధతి - 1.వసిష్ఠుని భార్య(సతుల యందు దేవీస్థానం అరుంధతి), 2.ఒకానొక నక్షత్రము, 3.దక్షుని కూతురు, వికృ. ఆరంజ్యోతి.
ఆరంజ్యోతి - 1.వసిష్ఠుని భార్య, 2. ఆ పేరుగల నక్షత్రము, సం.అరుంధతీ.

అకారాది క్షకారాంత సర్వవర్ణ కృతస్థలా,
సర్వలక్ష్మీ స్సదానందా సారవిద్యా సదాశివా|

ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.
ప్రణవము -
ఓంకారము.
ఓం - 1.పరబ్రహ్మార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క సారభూతము. వేదాంత గ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ + ఉ + మ). మంత్రముల కెల్ల శిరోమణి. ఓంకారము నందు సమస్తజగత్తును ఇమిడి యున్నదని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారేశ్వరుడు - శివుడు.

ఓంకార ప్రణవౌ సమౌ :
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రకృష్టో నవః ప్రణవః, ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము. ప్రణూయతే ప్రస్తుయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయఁబడునది. ఈ రెండు ఓంకారము పేర్లు.

కావేరికానర్మదయోః పవిత్రే, సమాగమే సజ్జనతారణాయ|
సదైవ మాన్ధాతృపురే వసన్త, మోంకార మీశం శివ మేక మీడే||

అర్ణము - 1.నీరు, 2.వర్ణము, అక్షరము, 3.టేకు, విణ.1.చలించునది, 2.కలతపడినది.

వర్ణము - 1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.
వర్ణుఁడు - కుమారుడు.

అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.

వర్ణో ద్విజాదౌ శుక్లాదౌ స్తుదౌ వర్ణం తు వాక్షరే :
వర్ణశబ్దము బ్రహ్మక్షత్ర వైశ్యశూద్ర జాతులకును, తెలుపు, నలుపు మొదలైన వన్నెలకును, స్తోత్రమునకును పేరైనపుడు పు. అక్షరమునకు పేరైనపుడు ప్న వర్ణ్యతే, వర్ణయతి వర్ణం. వర్ణ స్తుతౌ. - కొనియాడఁ బడునది, కొనియాడునది గనుక వర్ణము. "వర్ణస్తాల విశేషేస్యాద్ బ్రహ్మచర్యే విశేషనే, విలేపనే కుధాయాం"చేతి శేషః.

సంహిత - 1.వర్ణసంయోగము, 2.ధర్మశాస్త్రము, విణ.సంధింపబడినది.

వర్ణా స్స్యుర్బ్రాహ్మణాదయః :
వర్ణ్యంతే కపిలారుణ పీతకృష్ణవర్ణ్యేః నిరూప్యన్త ఇతి వర్ణాః. వర్ణ స్తుతౌ. - కపిలారుణ పీత నీల వర్ణములచేత స్తోత్రము చేయఁబడునది. "కపిలాశ్చారుణాః పీతాః కృష్ణా శ్చేతి పృథక్పృథక్, బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రా శ్చేతి వివక్షితాః" ఇతి శ్రీవిష్ణుపురాణే. - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులు.

(విప్ర క్షతియవిట్ఛూద్రా శ్చాతుర్వర్ణ్యమితి స్మృతమ్)
(బ్రహ్మక్షత్త్రవిట్ఛూద్ర వర్ణములు గూడి చాతుర్వర్ణ్య మనంబడును. చత్వారో వర్ణాః చాతుర్వర్ణ్యం. - నాలుగు జాతులు గనుక చాతుర్వర్ణ్యము.)

వేదాంతగో బ్రాహ్మణః స్స్వాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధః స్స్వాత్ శూద్రః స్సుఖమవాప్నుయాత్.

వర్ఛస్సు - 1.కాంతి, 2.రూపము.
రూపము -
1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక(పోలిక - సామ్యము), (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
ఒడలు - మేను, దేహము, రూ.ఒళ్ళు. 
దేహము - శరీరము, మేను.
ఇంగితము - 1.హృద్గతాభిప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విన.కదలినది.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
సౌందర్యము - చక్కదనము.

స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము -
1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది. 

ప్రతిభా విశేషము - (గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.

బంగారు(జంబూనదము) - బంగారు.
పూత(పూతము) - పరిశుద్ధమైనది.

మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
హృద్యము -
మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సు కింపైనది.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు.   

రాగము - 1.అనురాగము, 2.రంగు, 3.మాత్సర్యము, 4.సంగీతమున నాట మొ|| రాగము.
అనురాగము - అనురక్తి, ప్రేమ, కూర్మి.
అనురక్తి - అనురాగము, ప్రేమ.
రక్తి - అనురాగము; రక్తకుఁడు - అనురాగము గలవాఁడు.
అనురకము - 1.అనురాగము కలది, 2.ఎఱ్ఱనిది, 3.రంగుకలది.
అనురక్త - అనురాగముకలది.
అనురక్తిఁడు - అనురాగము కలవాడు.

మమకారము - 1.ప్రేమ, 2.నాది యను అభిమానము.
పేరిమి - 1.ప్రేమ, 2.గౌరవము, 3.అతిశయము.
నెనరు - 1.కృతజ్ఞత, 2.ప్రేమము.
కృతజ్ఞుఁడు - చేసినమేలు తలచువాడు.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పదనము, 3.మన్నన.
అతిశయము - అధిక్యము; వలదు - అధిక్యము, అవ్య.వద్దు.

లలి - 1.ప్రేమము, 2.ఒయారము, 3.క్రమము, 4.ఉత్సాహము.
లలితము - సౌకుమార్యముచే అంగ విన్యాసరూపమగు స్త్రీల శృంగారచేష్ట, విణ.మనోజ్ఞము, ఈప్పిదము.

రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.

మాత్సర్యము - చలము, మత్సరము.
రాగరజ్జువు - మన్మథుడు; మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.

సరాగము - ఒద్దిక, సం.విణ.రాగముతో గూడినది.
ఒద్దిక -
1.నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము, 2.అనుకూల్యము, పోలిక, 3.వినయము, 4.ప్రతిమానమైన పడి, వస్తువునకు సమానమైన తూకపురాయు.
అనుకూలము - 1.ఇష్టము, 2.సరిపడునది, 3.సహాయమైనది, (వ్యతి.ప్రతికూలము).
అనుకూల్యము - ఒద్దిక, తగియుండుట, అనుకూలభావము.
అనుగుణ్యము - అనుగుణభావము, తగియుండుట, అనుకూల్యము.
అనురూప్యము - తగియుండుట, (భౌతి.) రెండింటి మధ్యగల అంగప్రత్యంగ సాదృశ్యము (Correspondence). 
పోలిక - సామ్యము. వినయము - 1.అడకువ, 2.గురుశిక్ష.  

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

జాతి1 - 1.కులము, 2.పుట్టుక, 3.సమానత్వము, 4.జాజికాయ(జాతికోశము - జాజికాయ), 5.మాలతి, 6.పద్యభేదము.
జాతి2 - (జీవ.) గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలిసి ఒక జాతిగా వర్గీకరింపబడినది (Genus).
జాతి3 - (చరి, రాజ.) ఒక దేశములో నివసించుచు సాధారనముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు. 

జాతి స్సామాన్యజన్మనోః,
జాతిశబ్దము గోత్వాదిజాతులకును, పుట్టుటకును పేరు. జాయతేభిన్నే ష్వభిన్నాభిదాన ప్రత్యయా వనయేతి, జననం చ జాతిః. సీ. జనీ ప్రాదుర్భావే. భిన్నము లయిన వస్తువులయందు అభిన్నములైన నామ జ్ఞానములు దీనిచేతఁ బుట్టును గనుకను, పుట్టుట గనుకను జాతి.

సజాతీయత - (చరి.,రాజ) భాష, మతము, ఆచారము, సాంప్రదాయములు, చరిత్ర యొక్క బంధముగల ప్రజలు (Nationality).

జాతము - సమూహము, విణ.పుట్టినది.
గణము -
1.గుంపు, సమూహము, 2.సేనలో ఒక భాగము, వర్ణముల సమూహము, 4.గురులఘు వర్ణముల కూడిక కలది.
గణనాయిక - గౌరి, పార్వతి(శివుని సన్నిధి నందు దేవిస్థానం పార్వతి).
గణపతి - వినాయకుడు; విఘ్నరాజు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు. 

సంఘము - 1.ప్రాణిసమూహము, 2.గుంపు.
గుంపు -
1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ. నివహము - గుంపు.

కులము - 1.వంశము, 2.ఇల్లు, 3.తెగ, 4.శరీరము, 5.ఊరు.  జననము - 1.పుట్టుక(జన్మము - పుట్టుక), 2.వంశము.

వంశము - 1.కులము, 2.వాసము (వెదురు), 2.పిల్లనగ్రోవి, 3.వెన్నుగాడి, 4.సమూహము, 5.ఒక పురాణ లక్షణము.
వాస -
వాసము (వెదురు).
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వాసకము - ఇల్లు; ఆవాసము - ఇల్లు.
వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి. కరతలే వేణుమ్.

కొలము - 1.వంశము, సజాతీయ ప్రాణిసమూహము, సం.కులమ్.

తెగ - 1.సజాతీయ సమూహము, 2.సమూహము, రూ.తెవ, 3.పక్షము, 4.విధము, 5.అల్లెత్రాడు ఎక్కుపెట్టుట, 6.నిడుపుడు, అవ్య. 1.నిశ్శేషముగా, 2.ఖండితముగా.
శరీరము - దేహము; దేహము - శరీరము, మేను.

గాత్రము1 - 1.దేహము (శరీరము, మేను), 2.అవయవము.
గాత్రము2 - స్థూలము.
శారీరము - కంఠస్వరము.

అవయవము - అంగము, (జీవ.) ఇంద్రియము, శరీరములో కొన్నిరకముల జీవకణజాలముతో ఏర్పడిన ఒక ప్రత్యేక భాగము.
అంగము1 -
1.రీతి, విధము, 2.అందము.
అంగము2 - 1.అవయవము, దేహము, 2.ఉపాయము, 3.ఒక దేశము, విణ. 1.అవయవముగలది, 2.సమీపించినది, వి.(గణి.) ఏదేని వస్తువు యొక్క ముఖ్యభాగము, మూలధర్మము, ములకము (Element).
అందము - 1.సౌందర్యము, చక్కదనము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
స్థూలము - గుడారము, విణ.బలిసినది, (గణి.) యథార్థమునకు దగ్గరగా నుండునది, అందాజు.
స్థూలలక్ష్యుఁడు - 1.మిక్కిలి యీవికాడు, 2.మిక్కిలి తెలివిగలవాడు. ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.

ఊరు - 1.లోపలనుండి నీరు బయటికి వచ్చు, 2.నాను, 3.పుట్టు(సంభవించు, జన్మించు), 4.పెద్దది యగు, వి.1.గ్రామము, 2.ఏడికోల లేని నాగలి, 3.దేశము.

గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.) షడ్జాది స్వరము. జనపదము - 1.గ్రామము, 2.దేశము, రూ.జానపదము, (చరి.) ప్రాచీన భారతదేశము (క్రీ. పూ. 600 ఉత్తర హిందూ స్థానమందలి) లోని రాజ్యములు, (వీరి పరిపాలకులను 'విరాటీ' అని పిలుచుచుండిరి.) నివసథము - గ్రామము.
జనాంతము - జనపదము, దేశము.
జనపదుఁడు - పల్లెటూరివాడు, రూ.జానపదుఁడు.

ఆద్వా రేణచ నాతీయాద్గ్రామందా వేశ్మనావృతం|
రాత్రౌ చ వృక్షమూలాని దూరతః పరివర్జ యేత్|| 
తా.
గ్రామమునకుగాని, యింటికిగాని వాకిలివిడిచి తప్పుత్రోవలో పోరాదు, రాత్రియందు వృక్షమూలమును పరిత్యజింప వలయును. - నీతిశాస్త్రము 

గ్రామత - 1.గ్రామముల సమూహము, 2.త్రాళ్ళ సమూహము.

బృందము - సమూహము.
బృందారకుఁడు - వెలుపు, విణ. మనోజ్ఞుడు.

ఏఱువ - దేశము, సీమ.
సీమ1 - 1.దేశము, 2.ప్రదేశము, 3.రాజ్యము, 4.పరదేశము.
సీమ2 - 1.ఎల్ల, 2.పెడతల.
ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య. సర్వశబ్దార్థకము.
పొలిమేర-1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు(సరిహద్దు – మేర), ఎల్ల.
కృకాటిక - 1.పెడతల, 2.పెడతల యందలి ముచ్చిలిగుంట.
ఉపకంఠము - విణ.దాపైనది, వి.1.పొలిమేర, 2.సమీపదేశము, 3.సమీపకాలము.

ముయ్యెల గుట్ట - (మూడు+ఎల్ల+గుట్ట) 1.మూడు ఎల్లలు కలియు చోటు, 2.మూడుదారులు కలియుచోటు, 3.త్రికము (ఎల్ల శబ్దమున కిచట స్థానమని అర్థము).
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస(ము(ౘ)చ్చ - ముడ్డిపూస), (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.

సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
ప్రాజ్ఞుఁడు -
1.సమర్థుడు(సమర్థుఁడు - నేర్పరి), 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (Inner voice).  

చిత్రము - 1.ఆశ్చర్యము, 2.పటమున వ్రాసిన రూపము, 2.చతుర్విధ కవిత్వములో నొకటి, 4. విణ. నానా వర్ణములు గలది.
చిత్తరువు - 1.చిత్రము, ఆశ్చర్యము, 3.పటమునందలి రూపు.
బంధకవిత్వము - చక్రము, ఖడ్గము, రథము, మొదలగు వాని యాకృతు లుగ పద్యములు వ్రాయుట.
ఆశుకవిత్వము - తలచినంత మాత్రమున వేగముగ ధారాళముగ చెప్పు కవిత్వము, (ఇవి కవిత చెప్పువారు ఆశుకవులు).
రౌచికుఁడు - మృదుమధురముగ కవిత రచించువాడు.

అభిజనము - 1.కులము, 2.జన్మభూమి, 3.పరిజనము, 4.కులాంగత మైన టెక్కెము మొ.బిరుదు.

జాతీయగీతము - రాష్ట్ర గానము, దేశమును పొగడుచు దేశభక్తిని ప్రభోధించు గీతము. (National Anthem).

వర్గము - (రసా.) సమాన ధర్మములు గల ద్రవముల సమూహము (Group) సం. (జీవ.) తరగతి (Class) సం. (గణి.) ఒక రాశిని ఆ రాశిచేతనే గణించగా లభించు లబ్ధము (Square) సం. 1.వి.సజాతీయ సమూహము, 2.తెగ, 3.అధ్యాయము, 4.కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనునవి అరిషడ్వర్గము లన బడును.
త్రివర్గములు - 1.ధర్మార్థకామములు, 2.సత్త్వరజస్తమములు, 3.క్షయ స్థాన వృద్ధులు.
వర్గయుక్కులు - ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ధ, థ, ఫ, భ లు. 

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.

ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.   
రవి - 1.సూర్యుడు, 2.జీవుడు. 
సూర్యుఁడు - వెలుగురేడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు -
1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.  
ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు. హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము; సురలోకము - స్వర్గము.  

శర్వరీ దీపకశ్చంద్రః - ప్రభాతోదీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపకః||
తా.
చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ బ్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును బ్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).

అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామాతురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధాతురాణాం నరుచిర్నపక్వమ్||

తా. ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్షగలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలికొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. - నీతిశాస్త్రము

కీర్తన - 1.కీర్తి, యశస్సు(యశము - కీర్తి), 2.పాట.
కీర్తి - 1.యశస్సు(ఖ్యాతి - యశస్సు, కీర్తి), (వికృ.) కీరితి, 2.పేరు, 3.తేట, 4.అడుసు, 5.విరివి. (యశస్వి – కీర్తిగలవాఁడు.)
పేరు - 1.నామము, 2.కీర్తి, 3.దండ (కాసుల దండ), క్రి.ముద్దకుట్టు.
నామము - నొసట పెట్టుకొను బొట్టు, సం.వి.నామధేయము.
విశేషకము - నొసటి బొట్టు, విణ.విశేషింప జేయునది.
తేట - నైర్మల్యము, ప్రసన్నత.
విరివి - విస్తృతి, విణ. విస్తృతము, వెడల్పైనది.

కర్దమము - అడుసు, పంకము, బురద.
అడుసు -
బురద.
పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.
అసలు - 1.బురద, హిం.వి.(వాణి.) అప్పుగా తీసికొనిన సొమ్ము(Principal).
అసలుఁబుట్టువు - తామర, పంకజము.
పంకజము - తామర, వ్యు.బురదలో పుట్టినది.
పంకరుహము - తామర.
పంకేరుహము - పంకజము, తామర.

ఋక్కు - 1.ఛందోబద్ధమగు వేదమంత్రము, 2.ఋగ్వేదము, 3.స్తుతి.
ఋగ్వేదము -
నాలుగు వేదములలో ఒకటి.
స్తుతి - స్తోత్రము; స్తవము - స్తోత్రము.
వర్ణనము - స్తోత్రము, వస్తు గుణములను వివరించుట. 
స్తోత్రము - పొగడ్త; పొగడ్త - స్తుతి, మెప్పు.
మెప్పు - 1.మెచ్చు, 2.వరము, 3.ప్రీతి.
మెచ్చు - 1.శ్లాఘవ, 2.ప్రేమము, క్రి. శ్లాఘించు(పొగడు).
వరము - 1.కోరిక(కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.), వరించుట.
ప్రీతి - సంతోషము(ప్రహ్లాదము – సంతోషము), స్నేహము.

అఘమర్షణము - సర్వపాపములు(అఘము- పాపము) పోవుటకై జపించు మంత్రము, (ఋగ్వేదము 10-190).

ఉదాత్తము - 1.వేదమునందలి ఊర్ధ్వస్వరము, (వ్యతి. అనుదాత్తము), 2.దానము, 3.పెద్దమద్దెల, 4.(అలం.) ఒక అర్థాలంకారము, విణ.1.ఎత్తైనది, 2.గౌరవము కలది, 3.ధారాళము(ధారాళము - అడ్దుపాటులేనిది).
తారస్వరము - (భౌతి.) గట్టిగా వినిపించు స్వరము, (High-note).
స్వరోచ్ఛత - (భౌతి.) ధ్వని యొక్క తీవ్రతాంశ (Pitch).

ఉదాత్తాద్యాస్త్రయ స్స్వరాః :
ఉదాత్తాద్యాః త్రయః స్వరా ఇత్యుచ్యంతే - ఇదాతానుదాత్త స్వరితము లనెడు మూడును స్వరము లనంబడును.
స్వర్యతే ఉచ్చార్యంత ఇతి స్వరా. స్వృశబ్దోపతాపయోః - ఉచ్చరింపఁబడునవి.
స్వేన రాజంత ఇతి వా స్వరాః రాజృ దీప్తౌ - తమంతటనే ప్రకాశించునవి.
ఉచ్చైరా దీయతే ఉచ్చార్యత ఇత్యుదాత్తః - మీఁదఁ బలుకఁబడునది.
అను నీచేరాదీయత ఇత్యనుదాత్తః - తగ్గునఁ బలుకఁబడునది.
ఆజ్ పూర్వోదా దానే ఇతి ధాతుః. ఉదాత్తానుదాత్తయో స్సమాహారః స్వరితః - ఉదాత్తానుదాత్తముల యొక్క సమాహారము స్వరితము.
స్యర్యత ఇతి స్వరితః స్వృశబ్దోపతాపయోః - ఉచ్చరింపఁబడునది.

ఔడవము - ఐదు స్వరములతో గూడిన రాగము, సం.విణ.నక్షత్రసంబంధి.
షాడవము -
ఆరు స్వరములుగల రాగము.

భైరవి - 1.పార్వతి, 2.ఒకానొక రాగము.
మంజిష్ఠారాగము -
గాఢానురాగము.
మంజిష్ఠ - మిక్కిలి ప్రకాశించు ఎరుపు.
మోహన - ఒకానొక రాగము.
బేగడ - కాకి బంగారు; ముచ్చెబంగారు - కాకి బంగారు.
కుసుంభ రాగము - బయటికి కనబడుచు అంతఃకరణమున లేని ప్రేమ.

కన్నడ - 1.ఉపేక్ష, 2.రాగములలో ఒకటి.
ఉపేక్ష -
1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము.
అశ్రద్ధ - 1.అసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి(కడపటి రెండర్థములును తెనుగునందు మాత్రమే కలవు).
నిర్లక్ష్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దైవాధీనమైనది (Casual), వి.అశ్రద్ధ.
అసడ్డ - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
ఒప్పరికము - ఉపేక్ష, ఒప్పరికించు విధము.
ఔదాసీన్యము - ఉపేక్షగా నుండుట, మిత్రశత్రు భావములు లేకుండుట. 

సంగీత సామ్రాజ్య సంచారిణీ...
శృంగార శృంగేరి పురవాసినీ.....||సంగీత

మూర్ఛన - సంగీతమునందు క్రమముగా సప్తస్వరముల ఆరోహణావ రోహణములు.

1. స - షడ్జము - సంగీతమున సప్తస్వరములలో నొకటి.

సారణి - కాలువ, షడ్జస్వరము, పలికెడి తంతి, (భౌతి.) సమాచార దత్తాంశములను సంక్షిప్తముగా తెలియజేయునది (Table).

షట్సుస్థానేషు జాయత ఇతి షడ్జః. జనీప్రాదుర్భావే. "నాసా కంఠము రసాలు జిహ్వా దన్తాశ్చ సంస్పృన్, షడ్బ్యస్సంజాయతే యస్మాత్తతష్షడ్జస్స ఉచ్యతే" - నాసిక, కంఠము, ఱొమ్ము, దవడలు, నాలుక, దంతములు అనెడు నీ స్థలములయందును బుట్టునది.

శోభిల్లు(ప్రకాశించు) సప్తస్వర సుందరుల భజింపవే మనసా ||శో

ఆక్విడత్ - (Aqueduct), 1.నాళి, 2.కాలువ, 3.పొర్లుమదుము, 4.జలపుశాలి, రసపుశాలి.       

క్రయ్య - కుల్య, కాలువ.
కుల్య -
1.కయ్య, 2.నది నుండి త్రవ్విన కాలువ.
కయ్య - 1.చిన్న నీటికాలువ, 2.మడి.
కాలువ - నీరుపారు మార్గము.

ఊష్మము - 1.ఆవిరి, 2.వేసగి, 3.గ్రీష్మ ఋతువు, 3.ఊష్మధ్వనులు (శ, ష, స, హ).
గ్రీష్మఋతువు - వేసవి (జేష్ఠాషాఢ మాసములు.)
గ్రీష్మము - 1.వేడి, 2.వేసవి.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధుడైన మంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు - చంద్రుడు, రూ.శుభ్రాంకుడు.

నాభి హృత్కంఠ రసన నాసాదులయందు ||శోభిల్లు

సరి - హారము, గుచ్ఛము, విణ.1.సమము, యుక్తము, 2.సమాప్తి, పూర్ణముగా, అవ్య.అంగీకార్థము, సం.సరః.
హారము - 1.నూట యెనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది 'హారము' (Denomination). 
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము.
సరిగ -
1.హారము, 2.జరీ, సం.సరికా, స్రక్.
ౙరి - జరీ, వెండి బంగారములతో మొలాము చేసిన నూలిపోగు.
ౙరత - జతారు, సరిగ, రూ.జరతారు.
ౙలతారు - జరత.
సమము - 1.సమానము, 2.సాధువు.
సమానము -
(సజాతీయము) - (గణి.) ఒకే జాతికి సంబంధించినది, ఒకే ఘాతసంఖ్య కలిగినది (Like), వై.వి.సమ్మతి, సం.వి.నాభియందలి వాయువు, విణ.తుల్యము.
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.

గుచ్ఛములరీతి నొండొంట గుబులుదీరి
కలసిమెలసియే లోక సంగతులమీరి  
నిన్ను సేవింతురు కదా మనీషివర్య
సిరులనిడుము వేదద్రి లక్ష్మీనృసింహ !

మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్ద ముత్తెము. 

మాల1 - 1.పూదండ, 2.వరుస. 
మాలిక - 1.పూదండ, 2.వరుస, 3.విరజాజి, 4.శంకరాభరణము, 5.కూతురు.
వరుస -1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు. 
విరజాజి - నవమల్లికా కుసుమము; నవమాలిక - విరజాజి.
ఆత్మజ - 1.కూతురు(కూతురు - కొమార్తె), 2.బుద్ధి.   

సప్తలా నవమాలికా,
సప్తమనోబుద్ధ్యంతానీంద్రియాణి లాతీతి సప్తలా. లా ఆదానే. - మనోబుద్ధులతోఁ గూడిన పంచేంద్రియములను అనఁగా నేడింటిని పరిమళముచేత స్వవశముగా జేసికొనునది.
నవాస్తుత్యామాలా అస్యా ఇతి నవమాలికా - స్తోత్రము చేయఁదగిన దండగలది. ఈ మూడు 3 విరజాజి పేర్లు.

వైజయంతి - 1.టెక్కెము, 2.విష్ణుమాలిక, 3.విష్ణు ప్రాకారము.

నాను - జలాదులందు చాలాకాలముండు, వి.హారము.
ముక్తావళి - ముత్యాలదండ. కంఠేచ ముక్తావళిం.....

2. రి - ఆబోతుసొరము(స్వరము) - వీణయందును, కంఠము నందును బుట్టు ఒక స్వరము, సప్తస్వరములలో రెండవది(రి), ఋషభము.

ఋషభము -1.ఎద్దు, 2.మదించిన ఏనుగు, 3.సప్తస్వరములలో ఒకటి. 
ఋషభధ్వజుఁడు - శివుడు. వృషభధ్వజ విజ్ఞాన భావనానై నమో నమః.

ఋషతి హృదయం ప్రవిశతీతి ఋషభః. ఋషగతౌ. - హృదయమును ప్రవేశించునది.   
ఋషష స్వర సంవాదిత్వాద్వా ఋషభః - వృషభ స్వరము వంటి స్వరమును పలుకునది.

ధర ఋక్సామాదులలో వరగాయత్రీ హృదయమున
సుర భూసుర మానసమున శుభ త్యాగరాజాదులలో ||శోభిల్లు

ధవళము - ఆబోతు, విణ.1.తెల్లనిది, 2.చక్కనిది.
ఆఁబోతు -
(ఆవు+పోతు), 1.ఎద్దు, 2.అచ్చుపోసి విడిచిన ఎద్దు, బసవడు.
ఆఁబోతురౌతు - శివుడు, వ్యు.అబోతు నెక్కువాడు. 

ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
ఆవు -
గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

పాలిచ్చే గోవులకు పసుపు కుంకం(కుంకుమ), పనిచేసే బసవడికి పత్రి పుష్పం...

వృషభము - 1.ఎద్దు, బసవన్న, 2.వృషభరాశి.
నంది -
1.శివుని వాహనమైన వృషభము, 2.వృషభము.
ఆలఱేఁడు - ఎద్దు, ఆబోతు, బసవడు.
బసవఁడు - వృషభము.
బసివి - శివునకు పరిచర్య చేయుటకై చిన్నతనమునందే యర్పింపబడిన స్త్రీ, సం.పశుపీ.

శివ ! తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ! మమగుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే
సకల భువన బంధో ! సచ్చిదానంద సింధో !
సదయ ! హృదయ గేహే సర్వదా సంవసత్వమ్. - 84శ్లో
తా.
సమస్త భువనాలకూ బంధువైనవాడా ! సచ్చిదానంద సాగరా ! దయాహృదయా ! గౌరీసమేతుడవగు(భవుఁడు - శివుడు) నిన్ను సేవించడానికి - నా బుద్ధిరూప కన్యను నీకు సమర్పించు చున్నాను. నువ్వు నా హృదయ(గేహము - గృహము, ఇల్లు.) సదనంలో సదా వసించెదవు గాక ! - శివానందలహరి

చిత్కళా (ఆ)నందకలికా ప్రేమరూపా ప్రియంకరీ|
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ. - 141శ్లో

ఎద్దు - వృషము (బహు. ఎద్లు).
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము.(Property)

పుంగవము - వృషభము.
పుంగవుఁడు - (సమాసమున ఉత్తర పదమైనచో) శ్రేష్ఠుడు.

గణిల్లు - ఎద్దు రంకె వేయుధ్వని.
ఱంకె -
1.కేక, 2.వృషభధ్వని, 3.ధ్వని, రూ.ఱంకియ.
కేక - నెమలికూత.
కేకరించు1 - క్రి. 1.కేకలువేయు, 2.గొంతుక సరిచేసికొనునట్లు ధ్వని చేయు.
కేకరించు2 - క్రి. క్రీగంటచూచు. 
ధ్వని - 1.శబ్దము, చప్పుడు, 2.వ్యంగప్రధానశబ్దము, 3.వ్యంగము, (భౌతి.) శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహింపబడు సంక్షోభము, (Sound).

నందివర్ధనము - 1.ఒక జాతి పూలచెట్టు, 2.అమావాస్య లేక పున్నమ.
నంద్యానర్తము -
1.పడమట తక్క, తక్కిన మూడు దిక్కుల వాకిళ్ళు గల రాజగృహము, 2.నందివర్ధన వృక్షము.
అపీతము - 1.త్రాగబడినది, 2.కొంచెము పసుపువన్నె కలది, వి.1.ఇంచుక పసుపువన్నె, 2.పద్మకేశరములు, 3.నందివృక్షము.  

కుణిః కచ్ఛః కాన్తలకో నన్దివృక్షః -
తుద్యతే హస్త్యాదిభిరితి తున్నః తుద వ్యథనే. - గజాదులచేఁ బీడింపఁ బడునది.
కుత్సీంబేరమస్యాస్తీతి కుబేరకః - కుత్సితమైన శరీరముగలది.
శాఖాభంగాత్కౌతీతి కుణిః పు. కు శబ్దే. - కొమ్మలు విరుగునప్పుడు మ్రోయునది.
కవ్యతే గజైః కచ్ఛః కష హింసాయాం. - గజములచేఁ బీడింపఁబడునది.
కస్య జలస్య అంతం గచ్ఛంతీతి కాంతాగజాః తైర్లక్యత ఇతి కాంతలకః. లకి ఆస్వాదనే. - జలసమీపమును బొందునవి గనుక కాంతము లనఁగా గజములు; వానిచేత నాస్వాదింపఁబడునది.
నన్దయతీతి నన్దీ, నన్దిసమ్జకో వృక్షః నందివృక్షః - సంతోషపెట్టునది గనుక నన్ది; నందియను పేరు గల వృక్షము. ఈ ఐదు5 నందివృక్షము పేర్లు.  

నిమిత్తస్థో నిమిత్తం చ నంది ర్నాందికరో హరిః, 
నందీశ్వరశ్చ నందీ చ నందనో సంధివర్థనః. - 76శ్లో

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒక రాగము, 4.ఆవు.
గౌరి -
1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
భూమి - నేల, చోటు, పృథివి. (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూ - భూమి. భువి - 1.భూమి, 2.స్థానము.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి. 
సీత - 1.శ్రీరముని భార్య, 2.నాగటి చూలు, 3.ఆకాశ గంగ.
జానకి - జనకుని కూతురు, సీత. 

బృహతి - విశ్వావసుని వీణ, విణ.గొప్పది.
బృహత్తు -
గొప్పది.

మహతి - 1.నూరు తంతులు గల నారదమహర్షి వీణ, 2.(వ్యాక.) స్త్రీ వాచక శబ్దసంజ్ఞ, విణ.గొప్పది. నారదుడు మహతీ వీణావాదన నిపుణుడు, సప్త స్వరాత్మకమైన సంగీత విద్యకు నిధి. సప్తస్వరాలు తమంతతామే మ్రోగే వీణ మహతి.

వీణాభేదే (అ)పి మహతీ -
మహతీ శబ్దము నారదుని వీణకును, అపిశబ్దము వలన అధికమైన దానికిని పేరు.
మహత్య ఇతి మహతీ. సీ.మహ పూజాయాం. - పూజింపఁబడునది.

వాయించు వీణ నెప్పడు,
మ్రోయించు ముకుందగీతముల జగములకుం
జేయించుఁ జెవుల పండువుః,
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే.

భా|| సర్వదా మహతీ అనే పెరుగల తన విపంచి వాయిస్తూ, ముకుందుని(ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.)స్తుతి గీతాలు మ్రోయించటంచేత సకల జగత్తులకూ వీనుల విందు చేయిస్తూ, లోకుల పాపసమూహాలను పోగొట్టేటట్లు చేస్తూ సంచరించే పాపరహితుడైన మేటి భక్తుడు నారదమహర్షి. ఆయనకు ఆయనే సాటి.

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా|
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా. - 148శ్లో

కంఠీరవము - 1.సింహము, 2.మదపుటేనుగు, 3.పావురము.
కంఠే రవో యస్య సః కంఠీరవః - కంఠమందు ధ్వనిగలది.
మదకలము - మత్తుచేత అవ్యక్త మధురమైనది, వి.మదపుటేనుగు.
గంధగజము - మదపుటేనుగు, ఒక రకమైన ఏనుగు.

అరాళము - వంకరైనది, వి.1.మదపుటేనుగు, 2.మద్ధిజిగురు, 3.ఒకరకపు అభినయ హస్తము. 
మదకలము - మత్తుచేత అవ్యక్త మధురమైనది; వి.మదపు టేనుగు.
మత్తవారణము - 1.ఒరగుదిండు, 2.మదపు టేనుగు. 

కరిపురనాథ సంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగత కరాబ్జం.....

3. గాంధారము - 1.(సంగీ.) ఒక విధమగు స్వరము, 2.సింధూరము, 3.కాంధహార్ అను ఒకానొక దేశము.  
మేకసొరము -
స్వరవిశేషము, గాంధారము. 

సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బలు సరళములు. 

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.

గ - ఒక యక్షరము.  

తదుక్తం "షడ్జం మయూరో వదతి గావస్త్వృషభ భాషిణః" ఇత్యాది. గాం వాచం ధరతీతి గాంధారః. దృఞ్ధారణే. - వాక్కులను ధరించునది.
స్వరాంతరస్య గంధంలేశం ఆరాతీతివా గాంధారః. రా. ఆదనే. - స్వరాంతరము యొక్క శ్రుతిని పుచ్చుకొనునది.
గాంధారదేశీయైర్గీయత ఇతి వాగాంధారః - గాంధార దేశపు జనులచేఁ పాడఁబడునది.

(ౘ)చుక్కాను - 1.మేక, 2.సంతాపము నందు కలిగించు ధ్వని.
మేక -
ఆడుమేక, సం.మేకః.
మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.

చుక్కాను - పడవనడుపు తెడ్డు, అరిత్రము.
అరిత్రము -
1.చుక్కాని, 2.ఓడ తెడ్డు.
తండువు - 1.తెడ్డుకొయ్య, 2.నందికేశ్వరుడు.

పీలికాఁడు - చుక్కాను పట్టువాడు.

కర్ణము1 - 1.చెవి, 2.చుక్కాను. 
శ్రుతి - 1.వేదము, 2.చెవి, 3.వినికి.

అజ - 1.ప్రకృతి, వ్యు.పుట్టుకలేనిది, శాశతమైనది(శాశ్వతము – నాశనములేనిది), 2.ఆడుమేక, వ్యు.ఎక్కువగా తిరుగునది.

అజా క్షయ వినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ|
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా.

ప్రకృతి - (వ్యాక.) 1.ప్రత్యయము చేరకమందటి శబ్ద రూపము, 2.సౌరవర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము, (స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి సప్త ప్రకృతులు.)
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.

సృష్టి - 1.సృజించుట, 2.ప్రకృతి, 3.స్వభావము.
సృజన -
సృష్టి.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము -
1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము.(Property)

పగిది - 1.ప్రకృతి, 2.విధము, రీతి(తరహా - రీతి.), సం.ప్రకృతిః.
(ౘ)చందు -
1.విధము, 2.అందము, 3.చంద్రుడు.
విధము - ప్రకారము, విధి.
ప్రకారము - 1.విధము, 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. 
విధాత  - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

హరిచందనము - 1.చెందిరము, 2.వెన్నెల, 3.కల్పవృక్షము. సర్వాంగే హరిచందనం చ కలయన్....   
చెందిరము - 1.సింధూరము, 2.కుంకుమ, రూ.చెంద్రము, చెందిరము.

సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ. కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
కాంతరజము - కుంకుమము.
(ౘ)చందురుకావి - సిందూర వర్ణము, రూ.చంద్రకావి.

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా||

కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
(ౘ)చందమామ -
చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందురుమామ - చంద్రుడు, చందమామ.
చంద్రము - చందురము, సం.చంద్రః.
(ౙ)జాబిల్లి - చందమామ, రూ.జాబిల్లి.
జాబిలితాలుపు - శివుడు, చంద్రధరుడు.
జాబిలిమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

వనచంద్రికా న్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెల యనురీతి, నిష్ప్రయోజన మని యర్థము).

దృశా ద్రాఘ్రీయస్యా - దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం - స్నపయ కృపయా మామపి శివే!
అనేనా యం ధన్యో - భవతి నచ తే హానిరియతా
వనే వా హర్మ్యో వా - సమకరనిపాతో హిమకరః.
- 57శ్లో 
తా.
తల్లీ! పార్వతీదేవీ! మిగుల దీర్ఘమైన(పొడవైనదియు) కొంచెము వికసించిన నల్లకలువల కాంతివంటి, కాంతి గలిగిన నీ కడగంటి చూపులోని కృపారసముచేత - కడు దూరమున నున్న దీనుడనగు నా యందు, దయతో నీ చూపును పడనిమ్ము. ఈ మాత్రము చేత నేను ధన్యుడ నగు దును. ఇందుచే నీకేవిధమైన నష్టము లేదు. శీతకిరణుడైన చంద్రుడు వనమున గాని, మేడలపైగాని తన కిరణములను సమానముగనే ప్రసరింపజేయుచున్నాడు కదా! – సౌందర్యలహరి

సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ,
గాయత్రీ సోమసంభూతి స్సావిత్రీ ప్రణవాత్మికా|

చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక. హరిశ్చంద్రము నందు దేవీస్థానం చంద్రిక.
వెన్నెల -
(వెలి+నెల), చంద్రిక.
చెంద్రిక - చెందిరిక.
చంద్రశాల - 1.పైమేడ, 2.వెన్నెల; ఓవరి - 1.లోపలిగది, 2.చంద్రశాల.  
శిరోగృహము - చంద్రశాల.  
చంద్రతాపము - వెన్నెల; చాంద్రి - వెన్నెల; నెలవెలుగు - వెన్నెల. 

చన్ద్రికా కౌముదీ జ్యోత్స్నా -
చంద్రో స్త్యస్యామితి చంద్రికా - చంద్రయుక్తమైనది.
కు ముదానా మియం కౌముదీ, తద్వికాస హేతుత్వాత్ - కలువలు పుష్పించుటకు హేతువైనది గనుక కౌముది.
జ్యోతి రస్యామస్తీతి జ్యోత్స్నా - ప్రకాశము గలిగినది. ఈ మూడు వెన్నెల పేర్లు. 

కౌముది - 1.వెన్నెల, వ్యు.కుముదములను వికసింపజేయునది, భూజాను(భూజాని - 1.విష్ణువు, 2.రాజు)లను సంతోషపెట్టునది, 2.ఉత్సవము, పండుగ, 3.కార్తీక పూర్ణిమ.
కౌమోదకి - విష్ణుమూర్తి గద.

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.  
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.
ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.నిధి, 3.ఒకానొక మణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

జ్యోత్స్న - వెన్నెలరేయి, రూ.జ్యోత్స్ని.
జ్యోత్స్ని- వెన్నెలరేయి. 
వెన్నెలగతి - చంద్రుడు; చంద్రుడు - నెల, చందమామ.

స్మితజ్యోత్స్నా జాలం - తవ వదనచన్ద్రస్య పిబతాం
చకోరాణా మాసీ - దతిరసతయా చంచుజడిమా, |  
అత స్తే శీతాంశో - రమృతలహరీ మామ్లరుచయః
పిబన్తి స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజిక ధియా || - 63శ్లో
తా.
అమ్మా! ఓ భగవతీ, అతిమధురమైన నీ ముఖచంద్రబింబ మందస్మితము(చిరునగ వనెడి) వెన్నెలను గ్రోలుతున్న (త్రాగుచున్న) చకోరపక్షుల నాలుకలు మొద్దుబారినవైనవి. చకోరములకు మిక్కుటమగు తీపిని ఆస్వాదించుటచే ముక్కులు రుచి నెఱుగజాలకున్నవి. అందువల్ల నా పక్షులు తమ జిహ్వలు తిరిగి రుచిని పొందుటకై పులుపును గోరినవై అవి ప్రతి రాత్రులయందును స్వేచ్ఛగ, చంద్రుడి అమృతపు వెల్లువను, అన్నపుగంజి అనేభ్రాంతితో త్రాగుచున్నవి. - సౌందర్యలహరి            

రాకామలజ్యోత్స్న ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ...

(ౘ)చందమామ పులుగు - చకోరము.
చకోరము -
చకోరకము; నెలత్రావడము - చకోరము, వెన్నెలపులుగు.
జీవంజీవము - వెన్నెల పులుగు, చకోర పక్షి.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెల చూచి తృప్తి పొందునది. 

ఫలమతిసూక్ష్మమైనను నృపాలుఁడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతవి కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైన దామనుభవింప జకోరము లాసఁజేరవే
చలువగలట్టివాదయినఁ జందురు నెంతయుఁగోరి, భాస్కరా.
తా.
చంద్రుని యందలి చల్లదనమును ఆ కిరణములను భక్షించుటకు ఎక్కువ ఆశక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే బుద్ధిమంతులు రాజు మంచివాఁదయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను, సంతోషముతో నట్టిరాజునే కోరుదురు.

దేవతరువు - కల్పవృక్షము.
మెచ్చులచెట్టు -
కల్పవృక్షము; వెలిమ్రాను - కల్పవృక్షము; ఈగిమ్రాను - కల్పవృక్షము.

సాధారణగాంధారము, అంతరగాంధారము :

గాంధార పంచమ దైవత భూషిణి
నిషాద మధ్యమ సప్త స్వరూపిణి...   
మందార కుసుమ మణిమయ తేజో
మాధుర్య మోహన కల్యాణ స్వరూపిణి ||సంగీత

4. మ - మధ్యమము - నడుము, (గణి.) రెండు పదముల మధ్య చొప్పించ బడిన పదము (Mean).

గుణే సత్త్వే ప్రకృష్టే చ ప్రశబ్దో వర్తచే శ్రుతః|
మధ్యమే రజసి కృశ్చ తిశబ్ద స్తమసి స్మృతః||

మధ్యమః "తద్వదేవోత్థితో వాయు రురః కంఠ సమాహితః, నాభిప్రాప్తోమహానాదో మధ్యస్థత్వాత్తు మధ్యమః" - ఉరఃకంఠములతోఁ గూడి మధ్యావయవమైన నాభివలనఁ పుట్టునది.
స్వరాణాం మధ్యస్థితత్వాద్వా మధ్యమః - సప్తస్వరముల యొక్క మధ్యము నందుండునది.

అవలగ్నము - నడుము, విణ. తగులుకొనినది.
వలగ్నము -
నడుము.
కటి - నడుము.
నడుము - 1.కౌను, 2.మధ్యభాగము, రూ.నడ్ము.
కౌను - 1.నడుము, 2.వింటినడుము.

మధ్యమం చావలగ్నం చ మధ్యో స్త్రీ :
మధ్యేభవం మద్యం, మధ్యమం చ, - శరీరము నడుమఁ బుట్టినది.
అవలగ్యత ఇతి అవలగ్నం లగే సఙ్గే. - పూర్వాపరములతోఁ గలియునది. ఈ మూడు3 నడుము పేర్లు.  

ఉదరము - 1.కడుపు, (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).

నిసర్గక్షిణస్య - స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తే నాభౌ - నారీతిలక! శనకై స్త్రుట్యత ఇవ|
చిరం తే మధ్యస్య - త్రుటితతటినీతీరతరుణా 
సమావస్థా స్థేమ్నో - భవతు కుశలం శైలతనయే| - 79శ్లో
తా.
ఓ శైలతనయా! ఓ నారీ తిలకమా! (ర్నారీతిలక - నాభౌవలిషు) స్వాభావముచేతనే సన్ననిదీ, స్తనమండలము యొక్క భారముచేత బడలిపోయి క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నది. ప్రవాహ వేగమున గట్టు మెల్లగ తెగిపోవు చున్నదో యనునట్లున్నదియు, యేటిగట్టుపైనున్న చెట్టుతోడ తుల్యమైన ఉనికియందున్నదియు నగు, అట్టి నీ నడుము చిరకాలము సురక్షితంగా ఉండుగాక!  - సౌందర్యలహరి       

కంఠాధః కటిపర్యంత - మధ్యకూట స్వరూపిణీ|
శక్తి కూటైకతాపన్న - కట్యధో భాగధారిణీ. - 35శ్లో

ఉదానము - 1.బొడ్డు, 2. కంఠము నందలి గాలి, 3. ఒకానొక పాము. ఉదానము కంఠస్థానము నందుండి భాషణాదులఁ బుట్టించును.
భాషణాది సామర్థ్యజననాత్ ఊర్థ్వ మనంత్యనేనే త్యుదానః - మాటలాడుట మొదలైన సామర్థ్యము గలుగఁజేయుటవలన ఊర్థ్వప్రదేశంబున దీనిచేత బ్రతుకుదురు.
ఉత ఊర్థ్వమానయతి శబ్దాదీనితీవా ఉదానః - శబ్దాదుల నూర్థ్వమునకుఁ దెచ్చునట్టిది.

ప్రాణాయామము - నాసికా ముఖముల యందు, సంచరించెడి వాయువును మంత్ర పూర్వకముగా నిరోధించుట.
కుంభకము - ఊపిరి బిగపట్టుట, (ఇది ప్రాణాయామమునకు ఒక అంగము).

ప్రాణాపానౌ సంవిరుంధ్యాత్ పూరకుంభకరేచకైః|
యావన్మనస్త్యజేత్కామాన్ స్వనాసాగ్ర నిరీషణః|

ఇడానాడి (ఇడ చంద్రరూపిణి, ముక్కు ఎడమ రంధ్రం)ద్వారా వెలుపలి వాయువును పీల్చాలి. ప్రణవమును ఉచ్చరించే కాలములో షుషుమ్నా నాడి (అగ్ని రూప)చే ఊపిరితిత్తులలో ఆపి, పింగళనాడి (పింగళ సూర్యరూపిణి, ముక్కు కుడి రంధ్రం)ద్వారా విడవడం(రేచకం - ఊపిరి విడుచుట) ప్రాణాయామము అని పేరు.

ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః|
ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరమచంచలమ్||

బొడ్డు - 1.నాభి, 2.నూతిచుట్టు పెట్టిన గోడ.
నాభి -
1.కస్తూరి, 2.బొడ్డు, 3.బండి చక్రపు నడిమితూము, 4.విష విశేషము, 1.(గణి.) ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువు నకు గల దూరము. ఆ శంకుచ్ఛేద సంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనిష్పత్తిలో నుండునట్టి స్థిర బిందువు (Focus), 2.(భౌతి.) పరాపర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence)ను చెందునో యట్టి బొందువు. ముఖ్యాక్షమునకు సమాంతరముగా నుండు కిరణములు పరావర్తనము చెంది కేంద్రీకరించెడి బిందువు. లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus).
నాభిజన్ముఁడు - బ్రహ్మ, పొక్కిలి చూలి, వ్యు.బొడ్దు నుండి జన్మించినవాడు.

కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి. కస్తూరీ తిలకం లలాట పలకే…
మృగమదము -
కస్తూరి; మృగనాభి - మృగమదము, కస్తూరి.

కళంకః కస్తూరీ - రజనికరబింబం జలమయం
కళాభిః కర్పూరై - ర్మరకతకరండం నిబిడితమ్,
అత స్త్వద్భోగేన - ప్రతిదిన మిదం రిక్తకుహరం
విధి ర్భూయోభూయో - నిబిడయతి నూనం తవ కృతే. - 94శ్లో
తా.
ఓ త్రిలోకసుందరీ! చంద్రుని కళంకము, కస్తూరి; చంద్రబింబము జలముతోను, కళలతోను, కర్పూరముతోను నింపిన పెట్టె. మరకత మాణిక్యము ఈ చంద్రుడు. అందువలన బ్రహ్మ ప్రతిదినమును నీవు ఉప్యోగించుటచే శూన్యమైన ఈ పెట్టెను మాటిమాటికి నీకై పై వస్తువులచే నింపుచున్నాడు నిజము. - సౌందర్యలహరి   

అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా|
ముఖచంద్ర కళంకాభ - మృగనాభి విశేషకా.

వీణియ - 1.కస్తూరి మృగము యొక్క బొడ్డు కాయ, 2.వీణ, సం.వీణా.
వీణ -
విపంచి, తంత్రీవాద్యము, రూ.వీణాము, వీణె, వీణియ.
వల్లకి - వీణ.
విపంచి - వీణ; (విపంచిక). 

వీణా తు వల్లకీ విపఞ్చీ -
వేతి జాయతే స్వరో స్యామితి వీణా. వీ గతివ్రజనకాంత్యసన ఖాదనేషు. - స్వరము దీనియందుఁ బుట్టును.
వల్లతే ధ్వని విశేషమితి వల్లకీ. ఈ. సీ. వల వల్ల సంవరణే. - స్వర విశేషమును ధరించునది.
విపంచయతి స్వరానితి విపంచీ. ఈ. సీ. పచి విస్తారే. - స్వరములను విస్తరింపఁ జేయునది.
వివిధం పంచ్యంతే వ్యక్తీక్రియంతే స్వరా అస్యామితి వావిపంచీ. పచి వ్యక్తీకరణే. - దీనియందు స్వరములు వ్యక్తములుగాఁ జేయబడును. ఈ మూడు 3 వీణ పేర్లు. 

ఘోషవతి - వీణ.
సారెలు -
వీణ మెట్లు.
నిక్వణము - వీణ లోనగు వాని మ్రోత, రూ.నిక్వాణము.
క్వణసము - వీణ, భూషణము మొ.ని. మ్రోత.
క్వాణము - వీణాదుల మ్రోత. 

గౌసెన - వీణ మొ.ని. యొర, రూ.గవుసెన, సం.కోశః. 
నిచోళము -
గౌసెన, కప్పుడు దుప్పటి.
నిచులము - 1.కప్పుడు దుప్పటి, 2.ఎఱ్ఱగన్నేరు. 

వాద్యము - వీణలోనగునవి.
వాపు -
వీణాది వాద్యము వాయించుట, రూ.వాయింపు.

వాదిత్రము - 1.తతము (వీణ మొదలగు), 2.ఆనద్ధము (మద్దెల మొదలగు, 3.సుషిరము (పిల్లనగ్రోవి), 4.ఘనము, తాళములు మొదలగునవి, అను వాద్య చతుష్టయము, వాద్యధ్వని.
తతము - (భౌతి.) 1.బిగించబడినది, 2.వ్యాపించినది (Strectched), వి.1.ఇటునటు బలముగా లాగబడిన తంతువు (Stretched String), 3.బిరడాలు త్రిప్పిన లాగబడిన (బిగిసిన) తీగ, 3.వీణాది వాద్యము, 4.గాలి.
వాదవము - 1.వీణాది చతుర్విధ వాద్య ధ్వని, 2.మ్రోయించుట.

ఒళగు - 1.మర్మము, 2.లోకువ, 3.వీణాదండము, రూ.ఒళవు.
మర్మము -
జీవస్థానము, ఆయుస్సు.
ఒళవు - ఒళగు.
ఒళవరి - మర్మజ్ఞుడు.

బై సణ - వీణసొరకాయ యొక్క బంధనము, రూ.బయిసణ. 
కిటకిట -
1.పెక్కురు ఎడుములేకుండ కిక్కిరియుట, 2.వీ ణె బి ర డ త్రిప్పుట యందలి ధ్వన్యనుకరణము. 

స్పందనము - (భౌతి.) ఒక బిగించి యున్న వీణతీగవంటి దానిని చేతిలో లాగి విడిచిపెట్టి నప్పుడు ఆతీగ అటునటు చేయు ఊగులాట, ఒక వస్తువు దాని విశ్రాంతి స్థితినుండి ఇటునటు చలించి మరల మరల విశ్రాంతి స్థానమునకు వచ్చు చలనపురీతి, (Vibration).   

విపంచ్యా గాయన్తీ - వివిధ మపదానం పశుపతే
స్త్వయా రబ్ధే - వక్తుం చలితశిరసా సాధువచనే|
త్వదీయై ర్మాధుర్యై - రపలపిత తంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ - నిచుళయతి చోళేన నిభృతమ్|| - 66శ్లో
 
తా. తల్లి! సరస్వతి(వాణి - 1.పలుకు, 2.సరస్వతి.)నీ యెదుట ఈశ్వరుని(పశుపతి - శివుడు)గాథలను తన వీణియతో గానము చేయుచున్నది. అపుడు నీవు తలయూపుచు మనస్సునందు కలిగిన సంతోషముతో ప్రసంసా వాక్యములు పలుకగనే, నీ వాఙ్మాధుర్యము తన వీణానాదము కంటె మాధుర్యము కలదని తెలిసి, సరస్వతీదేవి తన వీణ(వీణాతంత్రీ    కలరవమును) గవిసెనతో కన్పడ నిలాగు కప్పుచున్నది. - సౌందర్యలహరి 

నడుమంతరము - 1.కౌను, 2.మధ్యకాలము, విణ.మధ్యకాలమున కలిగినది, రూ.నడుమంత్రము.
నడుమంత్రపుసిరి - మధ్యకాలమున వచ్చిన యైశ్వర్యము, మిడిసిపాటు కల్గించునది.

న్యాయే పి మధ్యమ్ :
మధ్యశబ్దము ఉచితమయినదానికిని, అపిశబ్దమువలన నడుమునకును, అవకాశమునకును, అధమునికిని పేరు. "న్యాయ్యావలగ్నయోర్మధ్య మంతర్రే చాధమే త్రిషు" అని రభసుఁడు. మన్యత ఇతి మధ్యం. మన జ్ఞానే. - తలపఁబడునది.

తాపత్రయాగ్నిసంతప్త - సమాహ్లాదన చంద్రికా|
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమో పహా.

ప్రతి మద్యమము, శుద్ధ మధ్యమము :
ప్రతి -
1.సమానము, 2.మారు(ప్రతి) 3.ఒక్కొక్క.
సమానము - (సజాతీయము) సం.(గణి.) ఒకే జాతికి సంబంధి బిన్నపత్రము ధించినది, ఒకే ఘాతసంఖ్య కలిగినది (Like), వై.వి. సమ్మతి, సం.వి. నాభి యందలి వాయువు, విణ.తుల్యము.
తుల్యము - సమానము, సాటి. equality in air.

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.

సమము - 1.సమానము, 2.సాధువు.
సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
సమస్వరము - 1.శ్రావ్యమైనది(శ్రావ్యము - వినదగినది), 2.స్వర సమ్మతిగల ఒకదానితో నొకటి సరిపడునట్లుగా అమర్చినది,(Harmonious).

అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ. 
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ. ఇచ్ఛ - అభిలాష, కోరిక.
సమ్మతము - ఇష్టమైనది, అంగీకృతమైనది, సం.వి. స్వీకరణ, అంగీకారము, (Acceptance). 

ఇంపు - 1.ఇచ్ఛ, 2.ఆనందము, 3.మనోజ్ఞత, విణ.ఇష్టము, ప్రియము.
ఇంపితము - ఇంపైనది.

మనోరథము - కోరిక; సమీహ - కోరిక; కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.

అంగీకారము - 1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
స్వీకారము - అంగీకారము.
అనుమోదము - 1.సంతోషము, 2.అంగీకారము, సమ్మతి.
సంతోషము - సంతసము, ముదము.
సంతసము - సంతోషము, రూ.సంతోసము, సంతోషః.
సంతోసము - సంతసము. ముదము - సంతోషము.
సంశ్రవము - అంగీకారము.

తుల్యనిన్దాస్తుతి ర్మౌనీ, సంతుష్టో యేన కేనచిత్|
అని కేతః స్థ్సిరమతిః ర్భక్తిమాన్మే ప్రియో నరః|| - భగవద్గీత 12-19

శుద్ధత - (రసా.) శుద్ధముగా నుండు స్థితి (Purity).
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషము లేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
విశదము - తెల్లనిది, స్పష్టమైనది.  తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము. 
శుద్ధస్వరము - (భౌతి.) ఉపస్వరముల కలగలుపు లేకుండ వినబడు స్వరము (Pure note).

అ(ౘ)చ్చము - 1.స్వచ్చము, తెల్లనిది, 3.కేవలము, రూ.అచ్చ, సం.అచ్చమ్.
స్వచ్ఛము - తెలుపు, విణ.తెల్లనిది.
కేవలము - 1.నిర్ణయము(నిర్ణయము - ఏర్పాటు), అవధారణము, విణ.1.అంత, సమస్తము, 2.అచ్చము, ఒకటి, 3.ప్రధానము. 

ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్దులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు. 
ఔజ్జ్వల్యము - ఉజ్జ్వలత్వము, ప్రకాశము. 

కేవలుఁడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
పరమము -
పరమాత్మ, విణ. 1.ఉత్కృష్టము, 2.ఆద్యము, 3.ప్రధానము.  
ఉత్కృష్టము - 1.మేలైనది, 2.అధికము.
ఆద్యము - 1.మొదటిది, 2.తినదగినది, భక్ష్యము.
ప్రధానము - 1.ముఖ్యము(ముఖ్యము – ప్రధానము), 2.ముందిచ్చు సొమ్ము, 3.వివాహాత్పూర్వము వధువున కలంకారాదుల నిచ్చి నిశ్చయించు కొనుట, 4.పరమాత్మ.

మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము -
1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము(ధ్వని).

మన్ద్రస్తు గమ్భీరే :  
మన్యతే బుద్ధ్యతే అనేనేతి మంద్రః - దీనిచేత నెఱుఁగఁబడును.
మందతే శన్నైర్నిస్సరతీతి మంద్రః. మది స్తుతి మోద మద స్వప్న కాంతిగతిషు. - మెల్లగా బలుకఁబడునది. ఈ ఒకటి గంభీరధ్వని పేరు.

అధరము - క్రిందిపెదవి, విణ.1.తక్కువైనది, 2.క్రిందిది, 3.నీచము. నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
అధమము - తక్కువైనది(తక్కువ - కొరత), నీచము.
రేఫము - ర వర్ణము, విణ.అధమము.
వలపలగిలక - రేఫము.

నిమ్నము - పల్లము. విణ.లోతైనది, (విణ.) అధస్థ్సితము(Inferior).
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము.

నిమ్నం గభీరం గమ్భీరమ్ :
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.  

పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా|
మధ్యమా వైఖరీరూపా భక్తమానస హంసికా.

గాతము - పల్లము, గుంత, సం.ఖాతమ్.
ఖాతము -
1.గాతము, 2.అగడ్త(కందకము – అగడ్త), 3.పుష్కరిణి.
అగడ్త - అగడిత.
అగదిత - కోటచుట్టు త్రవ్వబడిన కందకము, రూ.అగడత, అగడ్త.
పుష్కరిణి - 1.తామరకొలను, కోనేరు, 2.ఆడేనుగు(వశ - ఆడేనుగు).
కోనేఱు - (కోన+ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి (కట్టుదొన – కోనేరు).
తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
తిరు - శ్రీ ప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.

మడుఁగు - అడుగు, వంగు, వి.1.గుణము, 2.కొలను, 3. 8 వీసెలు, రూ.మడువు, మడ్గు, మణుగు, మణువు.
అడుగు -
1.ప్రశించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.
వంగు - మందటికి వాలు.
గుణము - 1.శీలము, 2.అల్లత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
కొలను - కొలఁకు; కొలఁకు - సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్.
సరస్సు - సరసి; సరసిజనాభుఁడు - విష్ణువు. 

సరసిజభవుఁడు - బ్రహ్మ.
సరసిజాతము - తామర; సరసీరుహము - తామర.  

ఓష్ఠ్యము - 1.పెదవులకు తగిలి పలుకునది, (ప, ఫ, బ, భ, మ లు), 2.పెదవులకు సంబంధించినది. 

5. పంచమము - 1.కోయిల, 2.రాగవిశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.

ప - ఒక అక్షరము. ప యోగము

పంచమము – A tenor(a singer with such a voice)note, similar to that of  the cock when crowing; also a note like that of the cuckoo. The musical treble (high in pich; shrill). The two notes పంచమము and షడ్జము  are called the నిత్యస్వరములు or constant (pervading) notes; they are called స్వయంభు స్వరములు the supreme sounds. adj. Fifth, అయిదవది Fine, melodious, ఇంపైన పంచమస్థితి.

పంచమము - నాభినుండి మొదలై హృదయం, కంఠం, మూర్దము(మూర్దము - తల) లందు తిరిగెడె శబ్దాన్ని పంచమము అంటారు. 

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
తలకాయ - శిరస్సు.

పంచమః "వాయుస్సముత్థితో నాభేరురోహృత్కంఠ మూర్ధసు, సంచరన్ పంచమస్థాన ప్రాప్త్యా పంచమ ఉచ్యతే" - నాభి, ఉరస్సు, హృదయము, కంఠము, శిరస్సు అనెడి ఐదు స్థానములయందుఁ పుట్టునది గనుక పంచమము. పంచమం జగతీ ఖ్యాతం.
పికైః పంచ్యత ఇతి వా పంచమః పచి విస్తారే. - కోయిలల చేత విస్తరింపఁ జేయఁబడునది. 

కోకిలము - కోయిల.
పరితము -
కోయిల, సం.పరభృత్.
పరభృతము - కోయిల; పికము - కోయిల.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు. 

వనప్రియః పరభృతః కోకిలః పిక ఇత్యపి :
వనం ప్రియమస్య వనప్రియః - వనమే ప్రియముగాఁగలది.
పరైః కాకైః భృతః పరభృతః భృఞ్ భరణే. - పరుల(కాకుల) చేతఁ బెంచఁ బడునది.  
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః. కుక వృక అదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
అపికాయతీతి పికః కైగైశబ్దే. - చాటున నుండి కూయునది. అపిరంతర్ధౌ. ఈ నాలుగు 4 కోయిల పేర్లు.

చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గ ప్రవర్తినీ,
కోకిలా కులచక్రేశా పక్షతిః పఙ్క్తి పావనీ.

కోవెల - గుడి, వై.వి. కోకిలము.
గుడి -
1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.

దేవాలయము - గుడి. ఇంటి కన్నా గుడి పదిలంట! 
ప్రాసాదము -
1.దేవాలయము, 2.రాజగృహము.
నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు. 

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో... దీపముంది.. అదియే దైవం...

గుడిసె - గుండ్రని చిన్న ఆకుటిల్లు, సం.కుటీరః.
ఆకుటిల్లు -
(ఆకు + ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.
పర్ణశాల - ఆకుటిల్లు. 

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము -
గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు; తీఁగయిల్లు - పొదరిల్లు. కుడుంగము - పొదరిల్లు.

మంజులము - 1.పాచి, శైవలము, 2.పొదరిల్లు, విణ.ఒప్పిదమైనది.

ఆయతనము - 1.ఇల్లు, 2.ఆశ్రయము, 3.యజ్ఞశాల, 4.దేవాలయము, 5.బౌద్ధాలయము, 6.(భౌతి., రసా.) ఒక వస్తువు యొక్క ఘనపరిమాణము (ద్రవముల విషయమై 'ఆయతనము' ఘనపరిమాణార్థమున ప్రయోగములో ఉన్నది.) ఒక వస్తువు ఆక్రమించు చోటు, ఒక ద్రవము ఆక్రమించు చోటు (Volume). 

ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.

కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు గలది.
కెంజాయ -
(కెంపు+చాయ) ఎరుపు.

కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్|
విద్యారూపం విరూపాణాం క్షమారూప తపస్వినామ్||
తా.
కోకిలకు(కోయిలేమో నల్లనిది)స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము(పాతివ్రత్యము - పతివ్రత యొక్క శీలము), కురూపునకు విద్యయే రూపము, యతులకు(కర్మంది - యతి) శాంతమే రూపము. - నీతిశాస్త్రము

మాసరమయ్యె నంత మధు మాసము పాంథ విలాసినీ జన
త్రాసము పుష్పబాణ నవరాజ్య విలాసము వల్లరే వధూ
హాసము మత్త కోకిల సమంచిత పంచమ నాదమం జిరు
వ్యాసము జీవలోక హృదయంగమ సౌఖ్య వికాసమెంతయున్. - పశుపతి నాగనాథ కవి(సంస్కృతకవి) క్ర్రి.శ. 1369

వసంతము - 1.చైత్ర వైశాఖ మాసములు, 2.ఒకానొక రాగము, వి. పసుపును సున్నమును కలిపిన యెఱ్ఱనీళ్ళు. లాక్షారసము - పారాణి. ఆమని - 1.వసంతఋతువు, వసంతుడు, 2.ఫలసమృద్ధి, విణ.1.మిక్కుటము, 2.తృప్తికరము, క్రి.విణ.1.మిక్కుటముగా, 2.తృప్తికరముగా. ఆమని పాడవె కోయిల మూగవైపోకు ఈవేళ... 
మదనము - 1.ఆమని, వసంతకాలము, 2.ఉమ్మెత్త.
మదనుఁడు - మన్మథుడు. 

మామిడి చిగురుటాకులను నమలెడు కొయిల జిల్లేడు కొనలను నోట కొరుకునా? సుకుమారమైన మామిడి పండును గోరెడి చిలుక యిష్టముతో వుమ్మెత్త కాయ తినునా?

వాసంతము - వసంత సంబంధమైనది, వి.1.ఒంటె, 2.కోయిల, 3.తెమ్మెర. 

వసంతం యౌవనంవృక్షాః, పురుషా ధనయౌవనమ్|
సౌభాగ్యం యౌవనానార్యో, యౌవనావిద్యయా బుధాః||
తా.
వృక్షములకు వసంతఋతువు యౌవనము, పురుషులకు ధనము యౌవనము, స్త్రీలకు భాగ్యమే యౌవనము, పండితులకు విద్యయే యౌవనము. - నీతిశాస్త్రము    

చిగురాకుదిండి - కోయిల, పల్లవఖాది.
చిగురు -
1.పల్లవము, విణ.లేత, రూ.చివురు.
పల్లవము - 1.చిగురు, 2.చిగురించిన కొమ్మ, 3.కోకచెరగు, 4.విరివి.
పల్ల - పాటల (కపిల) వర్ణము గలది, సం.పాటలః. పుండ్రవర్ధనము నందు దేవిస్థానం పాటల.

లలిత సహకార పల్లవ,
కలితాస్వాదన కషాయ కంఠ విరాజ
త్కలకంఠ పంచమ స్వర,
కలనాదము లుల్లసిల్లఁ గడు రమ్యములై.
భా||
లేతలేత తియ్యమామిడి చిగుళ్ళను తెగమెక్కి వగరెక్కి పొగరెక్కిన గొంతులతో కోయిలలు ఎంతో రమ్యంగా అవ్యక్త మధురంగా, పంచమ స్వరంతో కూస్తూ ఉన్నంతచేత చక్కగా ఆ వనం(వన్యము - వనము నందు బుట్టినది.) ఒప్పుతున్నది.

మామిడి చివిళ్ళు నోమియోమి
గొంతు సవరించి కీలించి వంతగించి
పాటపాడెడి పిల్లల పలుకు కులుకు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

గంధర్వులు - దేవలోకము నందు గానముచేయు ఒక తెగ దేవతలు.
గంధర్వము -
1.ఒకానొక మృగము, 2.గుఱ్ఱము, అశ్వము 3.మగకోయిల, 4.కడఁతి, మరణమునకును పునర్జన్మమునకును మధ్యకాలమున యాతనాశరీరమును ధరించు ప్రాణి.
కడతి - గంధర్వమృగము, రూ.కడతి, కణతి, కణితి.

అన్తరాభవసత్త్వే అశ్వే గన్ధర్వో దివ్యగాయనే -
గంధర్వ శబ్దము అంతర పిశాచమునకును, గుఱ్ఱమునకును, దేవలోక మందు పాడునట్టి విశ్వావసువు మొదలయినవారికిని పేరు. గంధమర్వతీతి గంధర్వః. అర్వపర్వగతౌ. గంధమును బొందును గనుక గంధర్వము, గంధర్వుఁడును.  

గాంధర్వం త్రివిధం గీత వాద్య నర్తన భేదత|
గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్యతే||

గాంధర్వము - 1.గానము, సంగీతము, 2.గుఱ్ఱము, 3.వధూవరులు పరస్పరేచ్ఛచేత చేసికొను వివాహము, 5.దినము యొక్క పదునేను భాగములలో ఏడవ భాగము.
గాంధర్వవేదము - నృత్యగీతవాద్యాభినయాదుల వివరించు ఉపవేదము.  

సంగీతము - గానము. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః
గానము -
1.పాట, 2.ధ్వని, Sound 3.స్తుతి.

విద్యాశ్చతస్రో సాధ్యాస్స్యుర్జన్మనా సహసంభవాః|
గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దానశీలతా||
తా.
జనులకు సంగీతము, కవిత్వము(కవిత - కవిత్వము), శౌర్యము, దానశీలత్వము; ఈ నాలుగు విద్యలు నుత్పత్తితోడ గలుగవలసినవి గాని నేర్పుచేత సాధింపదగినవి కావు. – నీతిశాస్త్రము

నేదుర్మృదంగపటహ శంఖభేర్యానకాదయః |
ననృతుర్నటనర్తక్యస్తుష్టువుః సూతమాగధాః |
జగుః సుకంఠ్యో గంధర్వ్యః సంగీతం సహభతృకాః | - శ్రీమద్భావతమ్

గంధర్వాదుల గాన స్వరాలు, Singing or Music ఆనందకరముగ నుండును. విచారమును, మనోవ్యాకులతను పోగొట్టును. ఆయుర్వృద్ధి నిచ్చును. మనశ్శంతి నిచ్చును.

యోగ ధ్యాన వేదాధ్యయన విధులలో మనకు కలిగే ఈశ్వరానుభవం సులభంగా సంగీతం మూలకంగా, రాగతాళ జ్ఞానతో కలుగుతుందని, ధర్మశాస్త్ర కర్తయైన యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఈ క్రింది శ్లోకంలో చెబుతున్నారు.

వీణావాదన తత్త్వజ్ఞ శ్రుతి జాతి విశారదః |
తాళ జ్ఞాచ్చ ప్రయత్నేన మోక్షమార్గః సగచ్ఛతి ||

సంగీత లహరిలో మునిగిన మనస్సులో శాంతి అప్రయత్నంగా కలుగుతున్నది. సంగీతం తెలిసినవారు ఈ ఆనందానుభూతినీ, శాంతినీ తాము అనుభవించడమే కాక ఇతరులకూ పంచి పెడుతున్నారు. మోక్షమార్గంలో అప్రయత్నంగా పోవచ్చునని ఉద్ఘాటి స్తున్నారు.  - కంచి మహాస్వామి 

ౙతి - గాన నాట్యయోగ్య శబ్దస్వరసంతతి.

గేయము - పాట, విణ.పాడతగినది.
గీతము -
పాట, విణ.పలుకబడినది, పాడబడినది.
పాట - 1.సంగీతము, 2.వేలము పాట.
గీతి - 1.గోపకుల గీతము, పాట, 2.వృత్తభేదము, విణ.1.గానము చేయువాడు, 2.సంగీతముతో చదువువాడు.

పిళ్ళారి - వినాయకుడు, త.పిళ్ళైయార్.
వినాయకుఁడు -
1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు - వినాయకుడు.

వర్ణాటుఁడు - 1.గాయకుడు, 2.ముచ్చి చిత్రకారుడు(ముచ్చి - చిత్రకారుడు), 3. స్త్రీ వలన బ్రతుకువాడు.
గాయకుడు - 1.పాటపాడువాడు, 2.నర్తకుడు, నటుడు, 3.ప్రౌఢుడు, నేర్పరి, చతురుడు.
గీష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు.
గీష్పతి - బృహస్పతి Jupiter, 2.పండితుడు.

గాణ - 1.పాటకాడు, 2.పాటకత్తె, సం.గాయనః.
గాయని -
పాటకత్తె.
గాయనుఁడు - 1.పాటపాడువాడు, 2.గానము వృత్తిగా గలవాడు.

గీతావాద్యే తధానృత్యేనం గ్రామే రిపుసంకటే|
ఆహారే వ్యవహారేచ త్యక్త్వాలజ్జాం సుఖీభవేత్||
తా.
సంగీతము పాడునపుడు, వాద్యము వాయించునపుడు, నాట్యమాడునపుడు, శత్రువులతో బోరునపుడు, భోజనము చేయునపుడు, వ్యవహార మాడునపుడు సిగ్గు విడిచిన సుఖము గల్గును. - నీతిశాస్త్రము

గండుఁగోయిల - 1.మగకోయిల, 2.కొవ్వెక్కిన కోయిల.
గండశైలము -
1.పెద్దరాయి, 2.కొండనుండి భూకంపాదులవలన జారిన పెద్దరాయి, 3.కోయిల.

కింకరము - 1.కోయిల, 2.తుమ్మెద, 3.గుఱ్ఱము.
కింకిరాటుఁడు -
మన్మథుడు, రూ.కింకిరాతుడు.
కింకిరుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు; మరుఁడు - మన్మథుడు. 

పేశలము - 1.నేర్పుగలది, 2.చక్కనిది, వి.1.కోయిల, 2.రోకలి.
రోఁకలి -
దంచుసాధనము, ముసలము, సం.గోకీలః.
ముసలము - రోకలి.
చారౌ దక్షే చ పేశలః : పేశల శబ్దము అందమైనదానికిని, నేర్పరికిని, చకారమువలన కోయిలకును, ముసలమునకును పేరు. పింశతీతి పేశలః. పిశి అవయవే. - అవయమై యుండునది. 'వేశలో మృదులే ప్రక్తో ముసలే కోకిలే హర 'ఇతి శేషః.

వనం కుసుమితం శ్రీమన్నదచ్చిత్రమృగద్విజమ్|
గాయన్మయూర భ్రమరం కూజత్కోకిలసారసమ్||

పరభృతము - కోయిల.
కాకపుష్ఠము -
కోయిల(పికము - కోయిల), వ్యు.కాకిచే పోషింపబడినది.
కాకము - కాకి, వాయసము.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకపిక న్యాయము - కోయిల కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము.   

పంచమ స్థాయిని సుతారముగా కూసే కోయిలలు, పైకి కాకుల వలె కనిపిస్తాయి. గాని గొంతు విప్పితే వాటి మధురగానం (కోకిల స్వరం) బయటికి వస్తుంది.

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.
కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు.మధురమైన కంఠము కలది.

ధ్వనౌ తు మధురాస్పుటే, కలో :
మధురే శ్రుతిసుఖే, అస్ఫుటే అవ్యక్తాక్షరే ధ్వనౌ కలః - సుఖమై వ్యక్తముగాని వర్ణములు గలిగిన ధ్వని కల మనంబడును.
కం సుఖం లాతీతికలః. లాదానే. - సుఖము నిచ్చునది.
కలో మదః తద్యోగాద్వాకలః. కల మదే. - కల మనఁగా మదము, అది గలిగినది. అవ్యక్తమధుర ధ్వని పేరు.

కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధురస్వరము.
కళ - 1. 8 సెకనుల(8 Seconds) కాలము, 2.చంద్రకళ, 3.ఒకపాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతానతము కాని పదము.
నెలపాలు - చంద్రకళ. చంద్రభాగము నందు దేవిస్థానం కళ.
నెలవీసము - చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

కళానిధి - చంద్రుడు.
కళానాం నిధిః కళానిధిః. ఇ. పు. - కళల కునికిపట్టు.
కలాదుఁడు - 1.స్వర్ణకారుడు, కంసాలి, 2.చంద్రుఁడు, 3.గురువు, ఉపాధ్యాయుడు (Jupiter). 

కలా తు షోడశో భాగో :
చంద్రస్య షోడశోభాగోయః సకళేత్యుచ్యతే - చంద్రుని పదియారవ భాగము కళ యనంబడును.
కల్యతే సంఖ్యాయత ఇతి కలా, కలసం ఖ్యానే - లెక్క పెట్టఁబడునది. చంద్రునిలోని పదియాఱవపాలు.

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః|
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా. - 152శ్లో 

షోడశము - పదునారు, విణ.పదునారవది, వి.చనిపోయినవానికి పదునొకండవ దినమునచేయు శ్రాద్ధవిశేషము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.

సూర్యస్య ద్వాదశ కళస్తా - ఇందోః షోడశ స్మృతాః|
దశ వహ్నేః కళాః ప్రోక్తాస్తా - భిర్యుక్తాంస్తు తాన్ స్మరేత్||

కల2 - స్వప్నము.
స్వప్నము -
1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).   

నిదుర - నిద్ర, కునుకు, కూరుకు, రూ.నిద్దుర.
నిద్దుర -
నిదుర , సం. నిద్రా.
నిద్ర - కూరుకు. కూరుకు - నిద్దుర, క్రి.నిద్రించు.
కునుకు - నిద్రచే తూలు, తూగు, కునికి పడు.
తందర - తంద్ర, తూగు, కునికిపాటు, సం.తంద్రాః.
తంద్ర - తూగు, రూ.తంద్రి.
తూఁగు - 1.ఊగు, 2.నిద్రించు, 3.చలించు(తిరుగు), వి.1.ఊగుట, 2.కునికిపాటు. ముచ్చిలిపాటు - కునికిపాటు.
ప్రమీల - 1.కునికిపాటు, 2.మళయాళదేశపు రాణి.

సకలము - 1.సర్వము, 2.కలతో గూడినది.
సర్వము -
(సర్వ.) సమస్తము, అంతయు.
సమస్తము - సర్వము.

నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్నసంభవాః|
నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః||

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
భాగము -
1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
విషయము - గ్రంథాదులందు దెలియు నంశము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము -
అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది. 

ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాగల్యము.
భాగ్యము -
అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము,3.భాగ్యము,విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకడు (Venus).   

తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
నసలం బెంతైనఁ బెరుగు * నయ్యః కుమారా!
తా.
తాను చేసిన మంచికార్యముల సాయముచేతనే అదృష్టము త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడ్పాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా ? 

పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
నీళ్ళు - నీరు; నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.  
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది. 

క్షీరదము - (జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు.

పోసనము - 1.క్షీరము, 2.పైపూత, 3.కాంతి.

పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెరచుగావున  
బాలిసుడగు వానిపొందు వలదుర సుమతీ.  
తా.
తెలివిహీనుల(బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.) స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం. 

క్షీరాబ్ధి లోపల క్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ...

భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తుఁడు - భక్తి గలవాడు.

క్షీరాన్నము - పరమాన్నము.
పారలౌకికము -
పాయసము, పరమాన్నము, విణ.పరలోక సంబంధమైనది.
పాయసము - పరమాన్నము, వ్యు.పయస్సుతో వండినది; పాసెము, సం.వి. (రసా.) (Emulsion) ఒక ద్రవమును ఇంకొక దానితో కొల్లోయిడ్ స్థితిని పొందునట్లు చేయబడిన అవలంబితము  (Suspension). 

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు - చంద్రుడు, అమృత కిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు.
అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్ 
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా. 
తా. పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాల ముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలను త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, పిల్లి అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)గలవాడు, తగవు యొక్క న్యాయ న్యాయములను విమర్శించి నిర్ణయించును, తెలివి లేనివా డట్లుచేయలేదు.   

పాయసాన్నప్రియా తక్ స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమాహాశక్తి - సంవృతా డాకినీశ్వరీ. - 99శ్లో

చిత్రకంఠము - 1.కపోతము, 2.గువ్వ.
కపోతము -
పావురము, గువ్వ, పారావతము.
కాపోతము - 1.బూడిద రంగు గలది, 2.కపోత సంబంధమైనది.
కలరవము - పావురము.
గువ్వ - 1.అడవిపావురము, 2.పక్షి.
పారావతము - పావురము. కూకి - ఒక రకము పావురము.

పారావతః కలరవః కపోతః :
పారేన బలేన అవతీతి పారావతః అవ రక్షణాదౌ. - పారమనఁగా బలము. దానిచేతః బోవునది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని గలది.
శీఘ్రగామిత్వేన కస్య వాయోః పోత ఇవ కపోతః - వేగముచేత వాయువు కొదమ వలె నుండునది. ఈ మూడు పావురము పేర్లు.

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్రభానుఁడు -
1.అగ్ని, 2.సూర్యుడు.

సూర్య వహ్నీ చిత్రభానూ :
చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు.
చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః - నానావిధములైన కిరణములు గలవాఁడు.

కాదంబరి - 1.కల్లు, 2.ఆడుకోయిల, 3.ఆడుగోరువంక, 4.బాణ విరచిన కాదంబరీ కావ్యము, 5.సరస్వతి(సరస్వతి యందు దేవీస్థానం దేవమాత).
కల్లు1 -
1.బండికన్ను (చక్రము), 2.శిల, 3.కన్ను(చక్షువు - కన్ను).
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

మద్యమ్ లోపలికి పోయి, వివేకాన్ని బయటకి తరిమి వేస్తుంది. - థామస్ బేకన్(1512-1567)

కలహంస - 1.కాదంబము, ధూమ్ర వర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.
కాదంబము - 1.మధురముగ కూయు హంస, ధూమ్రవర్ణము లైన ముక్కు, కాళ్ళు, ఱెక్కలుగల హంస, కలహంస, 2.బాణము.

కాదమ్బః కలహంస స్స్యాత్ :
కదంబస్య స్వసంఘస్య సహచారిత్వాత్ కాదంబః - కదంబమనఁగా తన సమూహము; ఆ సంఘముతోఁ గూడియుండునది.
కలో మధురాస్పుట ధ్వని, తద్వాన్ హంసః కలహంసః - అవ్యక్త మధురధ్వని గల హంస. ఈ రెండు 2 ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు గలిగిన హంస పేర్లు.

రాజహంస - 1.రాయంచ, 2.ఎఱ్ఱని ముక్కు కాళ్ళుగల హంస, 3.మధురముగ బలుకు హంస.
ధార్తరాష్ట్రము - 1.నల్లని ముక్కు కాళ్ళు గల హంస.

నిత్యానంద రసాలయం, సురముని స్వాంతాంబు జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ సేవితం కలుషహృ త్సద్వాసనావిష్కృతం|
శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస! స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి||
తా.
ఓ మానస రాజహంసా! బ్రహ్మానంద జలాలకు స్థానమైనదీ, సుర మున్యాదుల మనస్సరోజాలకు నిలయ మైనదీ, నిర్మలమైనదీ, సద్బ్రాహ్మణ సేవితమైనదీ, పాపాలను రూపు మాపేదీ, జన్మాంతర సుకృతాలను ప్రకాశింప జేసేదీ, సుస్థిరమైనదీ అయి భగద్ధ్యానమనే సరస్సునే ఆశ్రయంచుము. నీచులను ఆశ్రయించడమన్న మురికి కాల్వలను ఆశ్రయించాలని ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? – శివానందలహరి 

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ , వ్యు. ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ. 

చతురాననసమ్రాజ్ఞీ బ్రహ్మవిష్ణుశివాత్మికా,
హంసాసనా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ|

యోగి - యోగాభాసము జేయు పురుషుడు.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.

వంచ యింతలేక నెటువంటిమహాత్ముల నాశ్రయించినన్
కొంచెమె కాని యేలు సమగూడ దదృష్టములేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ నవిశంబును వీఁపునమోయునట్టి రా
యంచకుఁదమ్మి తూండ్లు దిననాయె కదాఫలమేమి, భాస్కరా.

తా. సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సంచితబుద్దితో వీపున మోసెడి రాజహంసకు బ్రహ్మనుమోయు ఫలితము లేదాయెను. అది తామర తూండ్లనే తినవలసి వచ్చెను. మోసగించక సేవ చేయువారి కావంతయు లాభ ముండదు. (ఈ పద్య మందుపమానమున్నను రాయంచ లోపమేమియు వ్యక్తీకరించలేదు. అందుచే సమభావము పారమార్ధికనిమిత్తముగా నుండునుగదా, అందు తప్పేమున్నది.)

అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు. 

తూఁడు దిండి - హంస, వ్యు. తూడే భోజనముగా కలది. 
తూఁడు -
తామరకాడ, బిసము.
బిసము - తామరతూడు, తామర తీగ.
బిసిని - 1.తామర కొలను, 2.తామరతీగ.

హంసాస్తు శ్వేతగరుత శ్చక్రాఙ్గా మానసౌకసః,
హంతి గచ్ఛతీతి హంసః హన హింసాగత్యోః. - చరించునది.
శ్వేతీగరుతః పక్షా అస్యేతి శ్వేతగరుత్. త. పు. - తెల్లని ఱెక్కలు గలది.
చక్రవత్ వృత్తమంగ మస్యేతి చక్రాంగః. - చక్రము వలె వట్రువయైన అంగముగలది.
మానససరః ఓకః స్థానమస్య మాన సౌకః. స. పు. - మానససరస్సు స్థానముగాఁ గలది. - ఈ 3మూడు సామాన్యముగా హంసల పేర్లు. 

శ్వేతగరుత్తు - శ్వేతపత్రము, హంస. 
చక్రాంగము -
1.హంస, 2.జక్కవ. చక్రవాకము - జక్కవ.
చక్రపక్షము - హంస; తెలిపిట్ట - హంస.

యమి - 1.ముని, 2.హంస.
వాచంయముఁడు -
మౌని (ముని). 
మౌని - మౌనవ్రతుడు, ముని. మౌనము - మాటాడకుండుట.   
నిరాదారి - మౌని, సం.నిరాహారీ.
ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
ఋషి - 1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు. 

వాచంయమో మునిఁ,
వాచం నియచ్ఛతీతి వాచంయమః. యమ ఉపరమే. - వాక్కును నిలుపువాఁడు.
మన్యత్తే మునిః ఇ. పు. మనజ్ఞానే. - జ్ఞానము గలవాఁడు. ఈ 2 మౌనవత్రము గలవాని పేర్లు. ఈ రెండు యు సన్న్యాసి పేర్లని కొందరు.

మానసౌక(స)ము - హంస.
మానసము -
1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
చేతము - మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము(Mental-development).

ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదర్ధాలున్నయి. 1) హంస-అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగు వేళ వాయువు "హ" కారములో బహిర్గతమై "స" కారములో లోపలికి వస్తుంది అంటే హంస శబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉంది. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్ర రూపిణీయైన దేవికి వందనాలు. - శ్రీ లలితా త్రిశతీ నామావళిః   

ఓం హంసిన్యై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులూన్నయి. అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేధము.

సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వంద్వం - కిమపి మహతాం మానసచరమ్
యదాలాసా దష్టా - దశగుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్బ్యః పయ ఇవ. - 38శ్లో
తా.
ఓ దేవీ! ఏ హంసల జంటల కూతలు(ఆలాపనము - 1.రాగాలాపనము, 2.మాటలాడుట.)పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణము లను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి మకరందముచే ఆనందించు మహాత్ముల యొక్క మనస్సు లనెడి మానస సరస్సునందు విహరించు నా హంసల జంటను సేవించుదును. - సౌందర్యలహరి   

మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ! 

మహాయోగీ మహామౌనీ మౌనీశ శ్శేయసాంపతిః
హంసః పరమహంసశ్చ విశ్వగోప్తా విరాట్ స్వరాట్.

గండోలి - 1.ఎఱ్ఱతుమ్మెద, కణుదురీగ, 2.ఆడుహంస, 3.భద్రానది. ఇంటిలో కణుదురీగ దూరితే ఇల్లు కాల్చుకుంటారా!
కందురీఁగ - కందురు.
వరట - ఆడుహంస, వి.పేడ యెండిన చెక్క.  
హంసి - ఆడుహంస.

గణ్డోలీ వరటా ద్వయోః :
గణ్డం కపోలం ఉలతి ఆవృణోతీతి గణ్డోలీ. ప్స. ఉల సంవరణే. – చెక్కిలి (కపోలము - చెక్కిలి) మీఁద ముసురునది.
పా, గన్ధయ త్యర్దయతి గన్ధోలీ. గన్ధ అర్ధనే. - పీడించునది.
వృణోతీతి వరటా. ప్స. వృఞ్ వరణే. - అంతట వ్యాపించునది. ఈ మూడు  కణుఁదురీగ(ఎఱ్ఱతుమ్మెద) పేర్లు.

అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన. క్ర్రేంకృతము - 1.హంసాదులధ్వని, 2.అందెలచప్పుడు. 

పదన్యాసక్రీడా - పరిచయ మివారబ్ధుమనసః
స్ఖలన్త స్తే ఖేలం - భవనకలహంసా న జహతి,
అతస్తేషాం శిక్షాం - సుభగమణిమఞ్జీర  రణిత
చ్ఛలా దాచక్షాణం - చరణకమలం చారుచరితే! - 91శ్లో
తా.
చక్కని నడువడిగల యో పార్వతీ! నీ అద్భుత గమనవిన్యాసాన్ని (క్రీడనము - 1.ఖేలనము, విలాసము, ఆట, 2.ఆటబొమ్మ.)గాంచి అడుగువేయ(నడక) నేర్చుకోదలచినవై, నీ యింటనున్న హంసలు తొట్రుపాతు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి(పెంపుడు హంసలు స్వాభికముగా పెంచువారి వెంట పోవును.). అందువల్ల నీ పాదకమలం, కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో, ఆ రజహంసలకు(కలహంస - 1.కాదంబము, ధూమ్రవర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.) ఖేలన(ఖేల - ఆట)శిక్షను నేర్పుతున్నట్లుగా ఉన్నది. - సౌందర్యలహరి

సరసి సారస హంస విహంగాః - చారుగీతహృత చేతస ఏత్య|
హరిముపాసత తే యతచిత్తాః - హంత మీలితదృశో ధృతమౌనాః|

నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
కాంతపక్షి -
నెమలి, మయూరము.
మయూరము - 1.నెమిలి, 2.నెమిలి జుట్టు.
నెమ్మిలి - నెమ్మలి. నెవిలి - నెమిలి.
నమిలి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.
నెమ్మి - 1.ప్రేమ, 2.నెమ్మది, 3.సంతోషము, 4.క్షేమము, 5.నెమలి, వై.వి. 1.తినాసవృక్షము, 2.బండిచక్రము కమ్మి, సం.నేమి.
నెమ్మిరౌతు - కుమారస్వామి; సుబ్రహ్మణ్యుఁడు - కుమారస్వామి.

శిఖావళము - నెమలి.
శిఖండి -
1.దృష్టద్యుమ్నుని అన్న, 2.నెమలి, 3.నెమలిపురి, 4.కోడి, 5.బాణము.
శిఖి - 1.అగ్ని, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.
శిఖివాహనుఁడు - కుమారస్వామి. షోడశ శ్శిఖివాహనః|

నర్తనప్రియము - నెమలి.
మాయురము -
నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది.

కేకి - నెమలి; కేక - నెమలికూత.
కేకరించు1 -
1.కేకలువేయు, 2.గొంతుక సరిచేసికొనునట్లు ధ్వనిచేయు.
కేకరించు2 - క్రీగంట చూచు.

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు -
ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు. (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.

శిఖండకము - నెమలిపురి, పిల్లిజుట్టు, రూ.శింఖండము.
పించెము -
నెమలిపురి, సం. పింఛమ్.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, సం.గుచ్ఛము.
చంద్రకము - నెమలిపురి కన్ను. ఎన్ని కన్నులున్నా రెండు కన్నులతోనే చేసేది.  
మేచకము - 1.చీకటి, 2.నెమలి పురికన్ను, విణ.నల్లనిది.
మసక - 1.ఇంచుక నలుపు, 2.మునిచీకటి, సం.మేచకః.
కనుచీఁకటి - లేచీకటి, మసకచీకటి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు(గొంగ - శత్రువు).

నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'A' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి, (Kerophthalmia.) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డి యగును).
బాహ్యత్వచాజాడ్యము - (గృహ.) కాచబింబము(Cornea) మెత్తనగు వ్యాధి, ఆహారములో వైటమిన్ "A", తక్కువైన ఈ వ్యాధి కలుగును.    కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia). 

చంద్రకి - 1.నెమలి, 2.కౌజు.
నీలకంఠము -
1.నెమలి, 2.పిచ్చుక. (నల్లని కంఠము కలది).
కప్పుకుత్తుక పులుగు - నెమలి, నీలకంఠము.
చటకము - పిచ్చుక.

మయూరకేకాభిరుతం మదాంధాలివి మూర్ఛితమ్|
ప్లావితై రక్తకంఠానాం కూజితైశ్చ పతత్త్రిణామ్|

బర్హి - 1.నెమలి, 2.దర్భ.
బర్హిస్సు
- అగ్ని; జాతవేదుఁడు - అగ్ని.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.

కుశము - 1.దర్భ, 2.పలుపు, 3.ఒక ద్వీపము, 4.నీరు.
దబ్భ -
1.బద్ధ, 2.వెదురుబద్ద, 3.దర్భ, సం.ధర్భః. 
కుథము - 1.పవిత్రము, 2.దర్భ, 3.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.
పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.
(ౙ)జూలు - 1.సింహము మొదలగు వాని మీద వెండ్రుకలు, 2.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.
కుశస్థలము - కన్యాకులబ్జ దేశము.
కుశస్థలి - ద్వారకానగరము, ఉదా. "కుశస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజింపగ నున్నవాడు".
కౌశాంబి - ఒక పట్టణము, వ్యు.కుశాంబునిచే నిర్మింపబడినది. కౌశాంబికేదేవి నారాయణి నమోస్తుతే|    

దామము - 1.పలుపు, 2.హారము, దండ.
దండ -
1.దగ్గర, 2.ప్రాపు, ఆధారము, 3.చోటు.
దామెన - దామని, పెక్కు తలుగులు గల నిడివి తాడు, సం.దామనీ.
దామని - దామెన త్రాడు.
 
దామోదరుఁడు - కృష్ణుడు.
దామోదరః ఉదరే దామయస్యేతి దామోదరః - ఉదరమందు తులసిమాలిక గలవాడు.
దామ్నోఉదరే మాత్రా బద్ధ; - బాల్యమందు యశోదచేత పలుపున నుదర మందుఁ గట్టబడినవాఁడు.

కిన్నర - ఒక రకము వీణ.
కిన్నెర -
కిన్నర, సం.కిన్నరా.
దండియ - 1.దండిక, 2.కిన్నెర, 3.వీణ, 4.వీణాదండము, 5.తుంబుర, 6.పల్లకీ బొంగు, 7.త్రాసుకోల, రూ.దండె.
దండిక - 1.కిన్నెర, 2.హారము నందలి పేట.
దంట - హారము, సం.దండికా.

తంబుర - శ్రుతికై యుంచుకొను తంత్రీవాద్యము.
తంతి -
లోహపుతీగ, సం.తంత్రీ.
తంత్రీ - 1.కంతి, 2.నరము, 3.త్రాడు.
నరము - నాడి; నారి - అల్లెత్రాడు, వై.వి.నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.

ఆరజము - ఒక రకపు వాద్యము.
ఆరజము -
విణ. మనోజ్ఞమైనది, ఇంపైనది, వి.1.అవ్యక్త మధురధ్వని, 2.విలాసము, 3.దుర్విలాసము.

అంగరంగ వైభవాల అమర కామినులాడ
నింగి నుండి దేవతలు నిను చూడఁగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయ
సంగడిఁ దేలేటి మీకు సాసముఖా ||సింగార

6. ధ - ధైవతము - సప్త స్వరములలో నారవది (ఇది గుఱ్ఱము సకిలింత ధ్వనివంటిది.) హయము - గుఱ్ఱము, వ్యు.త్వరగా పోవునది.

ధీమద్భిర్గీయ త ఇతి ధైవతః. - బుద్ధిమంతులచేతఁ పాడఁబడునది.
ధావు గతిశుద్ధ్యోః - నాభ్యాదిస్థానముల వలనఁ పుట్టునది.

దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది.
వేలుపు -
1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము(జ్యోతిష్యము - జ్యోస్యము).
దేవత - వేలుపు; నిర్జరుఁడు - వేలుపు.
సురలు - వేలుపులు. 
బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. బృందారకుఁడు - వేలుపు, విణ.మనోజ్ఞుడు.

దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నదిపిన ఋత్విజు నలనక్రించి కన్య నిచ్చిచేయు వివాహము.
దేవర -
1.దేవత, దేవుడు, 2.ప్రభువు.
దేవుఁడు - భగవంతుడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
భగవంతుఁడు -1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు. 
విభుఁడు - 1.ప్రభువు, సర్వవ్యాపకుడు, 2.బ్రహ్మ, 3.శివుడు.   

తనకు లేనినాడు దైవంబు దూరును
తంకు గల్గెనేని దైవమేల
తనకు దైవమునకు తగులాట మెట్టిదో విశ్వ.

తా|| తనకు ధనము కలిగినకాలములో భగవంతుని అవసరముండదు. భగవంతుడెందుకు? కానిచేత ధనములేనప్పుడు భగవంతుని దూషించును(నిందించు). భగవంతునకు తనకుగల సంబంధము తెలుసుకొనలేడు.    

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
బుద్ధుడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
విఘ్నరాజు - వినాయకుడు.

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి -
1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బొజ్జ - కడుపు. (కడుపు - ఉదరము, పొట్ట.) 
బొజ్జదేవర - వినాయకుడు.

దైవికము - దైవము వలన కలిగినది.
గ్రుడ్డివాటు -
(గ్రుడ్డి+పాటు) దైవము వలన కలిగినది, దైవికము. అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property). 

స్వగృహేపూజ్యతే మూర్ఖః స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా విద్వాన్ సర్వత్రపూజ్యతేః||
తా.
మూర్ఖుఁడు తన ఇంటియందును, ప్రభువు స్వగ్రామమందును, రాజు తన రాజ్యమందును గొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశముల యందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము

ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.
బుద్ధిమంతుఁడు -
బుద్ధిగలవాడు.
ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్ర్యము కలవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు. ౘదువరి - విద్వాంసుడు.
సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు. 
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.వి.నేర్పరి.
విశారదుఁడు - విద్వాంసుడు, నేర్పరి; వ్యక్తుఁడు - విశారదుడు. 

కుట్టి - కోవిదుడు, విద్వాంసుడు.
కోవిదుఁడు -
విద్వాంసుడు, వ్యు.ఇది అది అనువిషయము లేక సర్వమును ఎరిగినవాడు.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

ధీ - బుద్ధి.
ధీంద్రియము -
(ధీ+ఇంద్రియము) జ్ఞానేంద్రియము.
జ్ఞానేన్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీఘ్రగ్రాహియైన అవయము (Sense organ).
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది.
మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
చిత్తము - మనస్సు. చిత్తము నందు దేవీస్థానం బ్రహ్మకళ. 

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.

ఆత్మ బుద్ధి స్సుఖ చైవ గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా.
తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱుచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. – నీతిశాస్త్రము

విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||

కాంభోజము - 1.ఒకానొక దేశము, 2.కాంభోజ దేశపు గుఱ్ఱము.    ప్లుతము - 1.మూడు మాత్రల కాలము గల స్వరము, 2.అశ్వగతి విశేషము.
నిబ్బరము - 1.అశ్వగతి, ప్లుతము, విణ.అధికము, సం.నిర్భరః.  దువాళము - గుఱ్ఱము యొక్క ఒక విధమైన నడక, ప్లుతము, రూ. దువాళి.

హయారూఢా సేవితాంఘ్రి ర్హయమేథ సమర్చితా,
హర్యక్షవాహనా హంసవాహనా, హతదానవా.

7. ఏనుఁగుసొరము - సప్తస్వరములలో ఏడవది, నిషాదము.
నిషాదము -
సప్తస్వరములలో నొకటి.

ని - ద్వితీయా విభక్తి ప్రత్యయము. 

నిషీదంతి స్వరా అస్మిన్నితి నిషాదః, షద్ విశరణ గత్యవసాదనేషు. - కడపటి స్వరమగుటవల్ల దీనియందు స్వరములన్నియుఁ జేరి యుండును.

బృంహితము - ఏనుగు గీక, ఘీంకారము. 
ఘీకారము -
ఏనుగు కూత, రూ.ఘీంకృతి. 
గీఁక - ఏనుగుకూత, బృంహితము, సం.ఘీంకారః.
కీక - 1.ఏనుగు కూత, సం.ఘీంకారః, 2.నెమలి కూత, సం.కేకా.

కాకలి నిషాదము, కైశిక నిషాదము : కైశికుడు - చంద్రుడు.

కాకలీ తు కలే సూక్ష్మే : కలః మధురాస్ఫుటో ధ్వనిః. సూక్ష్మేతస్మి న్ కాకలీ. ఈ.సీ. - కల మనఁగా మధురంబును అస్పుటంబునునైన ధ్వని. అది సూక్ష్మమైన యెడల కాకలి యనంబడును.
కుః సూక్ష్మః సచా సౌ కలశ్చ కాకలీ. - సూక్ష్మమైన కల ధ్వని. ఈ ఒకటి సూక్ష్మమైన ధ్వని పేరు.

కాకలి - సూక్ష్మమైన అవ్యక్త మధురాక్షర ధ్వని.
కాకువు -
1.స్వరము, 2.శోకభయాదులచే ధ్వని వికారము 3.డగ్గుత్తిక. డగ్గుత్తిక - గగ్గద స్వరము, (డగ్గు+కుత్తిక).
రుతము - మృగపక్ష్యాదుల ధ్వని.  

వేధ్యము - గురి, విణ.తొలగించదగినది.

సూటి - 1.గురి, 2.విధము.
సూటికాడు - 1.గురికాడు, 2.అందగాడు.

కృతహస్తుఁడు - 1.నేర్పరి, 2.గురితప్పక వేయువాడు.

లక్ష్యము - 1.గురి, 2.లెక్క.
లచ్చనము -
1.లక్షణము, 2.గురుతు, 3.వ్యాకరణశాస్త్రము.
లక్కనము - లక్షణము, గురుతు, సం.లక్షణమ్.
శరవ్యము - గురి, లక్ష్యము. 

లక్షణము1 - గురి, గురుతుశాస్త్రము.
లక్షణము2 - (రసా., భౌతి.) ఒక వస్తువునకు లేదా ద్రవ్యమునకు నియతముగా నుండి, ఆవస్తువును (ద్రవ్యమును) గుర్తించుటకు అవశ్యకమైన ధర్మము, (Characteristic).
లక్షణము3 - (గృహ.) 1.గుణము, 2.స్వభావము (Trait).

లక్ష్యం లక్షం శరవ్యం చ -
లక్ష్యత ఇతి లక్ష్యం. లక్షం చ. లక్ష దర్శనాంక నయోః. - చూడఁబడునది గనుక లక్ష్యము. లక్షమును.
శరైః వీయత ఇతి శరవ్యం. వ్యేఞ్ సంవరణే. - బాణములచేతఁ గప్పఁబడునది. ఈ మూడు గుఱి పేర్లు.   

నిమిత్తము - 1.కారణము, 2.శకునము, 3.గురి.
కారణము -
1.హేతువు(హేతువు - కారణము), 2.పనిముట్టు.
శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి (పక్షములు గలది).

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||
తా.
ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము చూచుకొని పోవలయునని బృహస్పతి(Jupiter) చెప్పెను. ఎపుడు బయలుదేరిన కార్యము సఫలమగునని నిస్సంశయముగా(నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా) మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్దనుండు(జనార్థనుఁడు - విష్ణువు) చెప్పెను. - నీతిశాస్త్రము

ఉద్దేశము - 1.గురి, 2.తలంపు, 3.నిశ్చయము, 4.ఎత్తైన ప్రదేశము.
తలంపు -
1.ఊహించుట, 2.ఆలోచనము, రూ.తలఁపు.
తలఁపు - 1.తలచుట, 2.కోరిక(స్పృహ - కోరిక), 3.ఆలోచనము, 4.జ్ఞప్తి(జ్ఞప్తి - 1.తెలివి, 2.తలవు), 5.హృదయము, 6.అభిప్రాయము, 7.ఊహించుట.
తలఁపుచూలి - మన్మథుడు, భావజుడు.
భావజుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. 

అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
గుఱి -
1.లక్ష్యము, 2.గుర్తు, 3.నిదర్శనము, 4.నమ్మిక, నమ్మకము, 5.సాక్షి, 6.నిర్ణయము(నిర్ణయము - ఏర్పాటు), 7.యుక్తి, 8.పరిమితి, 9.కళంకము.

లక్ష్యము - 1.చిహ్నము, 2.మచ్చ, 3.ముఖ్యము.
గుఱుతు -
1.చిహ్నము, 2.మేర, 3.కీర్తి, 4.పరిమితి, 5.స్థానము, 6.విధము, 7.మచ్చ(కళంకము - మచ్చ), 8.సాక్షి, రూ.గుర్తు.
నిదర్శనము - 1.దృష్టాంతము, 2.(అలం.) ఒక అర్థాలంకారము.
నమ్మకము - విశ్వాసము, నచ్చిక, రూ.నమ్మిక, నమ్మిగ.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
యుక్తి - 1.కూడిక, 2.ఉపాయము, 3.న్యాయము.

ఉజ్జ(ౙ) - 1.ఊహ, 2.లక్ష్యము.
ఊహ -
1.యోచన, భావము, 2.వితర్కము.
యోచన - ఆలోచన; ఆలోచన - 1.చూచుట, 2.ఆలోచించుట, యోచన, తలంపు. సలహా - ఆలోచన.
భావము - 1.అభిప్రాయము, 2.మనోవికారము, 3.పుట్టుక, 4.ధాత్వర్థ రూప క్రియ, 5.సత్తు, 6.స్వభావము, సం.(గృహ.)ఊహ, సామాన్యమైన ఊహ, భావన (Concept).
ఆంతర్యము - 1.అభిప్రాయము, 2.మిక్కిలి సన్నిహిత సంబంధము, 3.అక్షరములకు స్థానప్రయత్నాదులచే కలుగు పరస్పర సాదృశ్యము, 4.గుట్టు, 5.హృదయము.

సామజము - ఏనుగు, వ్యు.సామవేదము వలన పుట్టినది.
సామవేదము -
వేదమంత్రములకు స్వరములు కల్పించి గానరూపమును చూపు సంహిత. సామవేదం మొత్తం దైవాన్ని ప్రసన్నం చేసుకునే, సంగీత సంప్రదాయాలోని సప్తస్వరాల కూర్పు.

సామము - 1.ఒక వేదము, 2.మంచిమాట, 3.అనుకూలోపాయము.
స్వాంతము -
1.సామోపాయము 2. దాక్షిణ్యము.

సామ సాన్త్వమ్ -
స్యతి వైరం సామ. న. న. షో అన్తకర్మణి. - వైరమును జెఱుచునది.
స్వాంత్వయంత్యసేన సాంత్వం. సాంత్వ సామప్రయోగే. - దీని చేత నూరడింతురు. ఈ రెండు సామోపాయము పేర్లు. 

దాక్షిణ్యము - 1.దయ, 2.నేర్పు, 3.సామర్థ్యము, 4.దక్షిణ నాయక భావము.
మోమాటము -
1.దాక్షిణ్యము, కనికరము, 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.
మొగమాట - దాక్షిణ్యము, ముఖప్రీతి, రూ.మొగమోటము, మోమోటము.
కృప - దయ, కనికరము.
దయ - కనికరము; అనుక్రోశము - కనికరము; కనికరము - 1.దయ, 2.శోకము(దుఃఖముచే తపించుట, వగవు).
కృపాళువు - దయాళువు, దయకలవాడు.
దయాళువు - కనికరము కలవాడు. 

ఉద్గాత - యజ్ఞమందు సామవేద తంత్రమును నడుపు వ్యక్తి. 

వేదానాం సామవేదోస్మి - వేదాలలో సామవేదమును నేనే! – గీత 10-22

సామ సంగీతరాయ సర్వమోహనరాయ
ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ...

గిష్ణుఁడు - 1.వేదాంతి, 2.గాయకుడు, 3.సామదానవేత్త.
బ్రహ్మవాది -
వేదాంతి; వేదాంతి - వేదాంతము తెలిసినవాడు.
గాయకుఁడు - 1.పాటపాడువాడు, 2.నర్తకుడు, నటుడు, 3.ప్రౌఢుడు, నేర్పరి, చతురుడు.
సీకారి - పాటపాడువాడు, గాయకుడు, సం.శ్రీకారీ.
గాయనుఁడు - 1.పాటపాడువాడు, 2.గానము వృత్తిగా గలవాడు.
గాయని - పాటకత్తె.
గేష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు, విణ.పాడెడివాడు (అనికొందఱు.)
గీష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు.
గీష్పతి - 1.బృహస్పతి, 2.పండితుడు.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice).

శతవిష్కో ధనాఢ్యశ్చ శతగ్రామే నభూపతిః|
శతాశ్వః క్షత్రియోరాజా శతశ్లోకేన పండితః||
తా.
నూరు వరహాలు (వరహా - వరాహముద్ర గల బంగారు నాడెము, సం.వరాహః.)కలిగినవాఁడు ధనికుఁడనిపించుకొనును, నూరు గ్రామముల (క)అధిపతియైనవాఁడు రాజనిపించుకొనును, నూరు శ్లోకములు రచించినవాఁడు పండితుఁడని యనిపించుకొనును. - నీతిశాస్త్రము

నర్తకుఁడు - 1.నట్టువుడు, 2.పాములవాడు, విన.ఆడెడువాడు.
ఆటకాఁడు -
ఆటయాడువాడు, నటుడు, నర్తకుడు.
నృత్తము - నర్తనము. నర్తనము - 1.నటనము, 2.ఆట.
నటనము - 1.నాట్యము, 2.కపట వర్తనము. 
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్త నేత్రాభినయముల్చే భావములను తెలుపుచు ఆడెడి ఆట.
ఆట - (ఆడు+ట) 1.క్రీడ, 2.నృత్యము, 3.విహారము, ఉదా.ఆటతోట, 4.స్నానముచేయుట, 5.చెరుకు, నువ్వులు మొ.వి గానుగలో వేసి త్రిప్పుట, 6.పలుకుట, 7.నింద, 8.పరిహాసము.
ఆటకత్తియ - ఆటయాడునది, నటి, నర్తకి, రూ.ఆటకత్తె. 
నటి - 1.వేశ్య, 2.నట్టువుని భార్య.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు. 
నర్తించు - 1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.  
నటించు - 1.నర్తించు, వర్తించు, 2.కపటముగా వర్తించు.
జాయాజీవుఁడు - 1.వేషగాడు, 2.నాట్యము చేయువాడు, 3.భార్య వలన జీవించువాడు.
జాయ - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.  

ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు -
నేర్పరి; చతురిమ - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు.
ప్రోఢ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.  
చతురుఁడు - నేర్పరి తనము; కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము. ప్రావీణ్యము - నేర్పు.  

దాక్షిణ్యంస్వజనే దయాపరిజనే శాఠ్యంసదా దుర్జనే
ప్రీతిస్సాధుజనే నయోనృపజనే విద్ద్వజ్జనే చార్జవం|
శౌర్యంశత్రుజనే క్షమాగురుజనే కాంతాజనే ధృష్టతా
యేచై వంపురుషాఃకలామ కుశలా స్తేష్వేవలోకస్థితిః||
తా.
బంధుజనులయందు దాక్షిణ్యమును, భృత్యులయందు దయయును దుర్జనులయందు గపటమును, సజ్జనులయందు ప్రీతియు, రాజుల యందు నీతియు(నీతి - న్యాయము)ను, విద్ద్వజ్జనుల యందు నిష్కాపట్యమును, శత్రువుల యందు శౌర్యమును, గురువులయందు తాల్మియును, స్త్రీల యెడల దిట్టతనమును గలిగి ప్రవర్తించునట్టి విద్యా ప్రావీణ్యమును గల పురుషుల యందు లోకము నిలుచును. – నీతిశాస్త్రము   

సామగానలోల మనసిజలావణ్య ధన్యమూర్ధన్యు ||లెందరో|| 

వీణాహస్తే నమస్తుభ్యం నమో గీతరతే సదా,
సర్వవిద్యాప్రదే తుభ్యం నమః శక్త్యాదిపూజితే.

Saraswati-3_thumb