Wednesday, August 22, 2012

గ్రహనక్షత్రములు

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావనః

తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే.

నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువడి యేడు 27).
నక్షత్రమాల -
1.ఇరువదేడు ముత్యముల కూర్చిన హారము, 2.ఇరువదేడు 27 పద్యములు గల కావ్యము.
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్కరాయుడు.

నక్షత్రమృక్షం భం తారా తారకాప్యుడు వా స్త్రియమ్ :
నక్షత్రతీతి నక్షత్రం, క్షర సంచలనే - నశింపనిది గనుక నక్షత్రము.
న క్షీయత ఇతి వా నక్షత్రం. క్షీ క్షయే - నశింపనిది.
ఋక్షతి తమో నాశయతీతి ఋక్షం, ఋక్షగతౌ - సంచరించునది.
భాతీతి భం, భా దీప్తౌ - ప్రకాశించునది.
తరంత్యనయా నావికా ఇతి తారా. తారకా. చ.స్న. తౄప్లవన తరణయోః - దీనిచేత నావికులు తరింతురు.
ఉడ్డీయత ఇత్యుడు. ఉ. స్న. డీఙ్ విహాయసా గతౌ - ఆకాశమందు సంచరించునది.
ఉడు వాస్త్రియాం. ఉడుశబ్దో వికల్పేన స్త్రీలింగే వర్తతే. పక్షే నపుంసకలింగేచ. తారక పీత్యపిశబ్దేన తార కాశబ్దస్యాపి వాస్త్రియామి త్యనేనాన్వయః పక్షేక్లీ బత్వం చ ఉడుశబ్ద సాహచర్యాత్.
తదుక్తం - ద్విత్రై ర్వ్యోమ్ని తుషార బిందు మధురచ్ఛాయైః స్థితం తారకై రితి - ఉడు శబ్దమునకు స్త్రీ నపుంసకలింగములు గలవు.
తారాతారకా శబ్దములకు ఉడుశబ్దమునకు వలె లింగములు గలవు. ఈ. ఆరు సాధారణముగా నన్ని చుక్కలకుఁ పేర్లు.

(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.

చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు -
చంద్రుడు. చంద్రుని ఎవరు - ప్రకాశించమన్నారు?

ఏకోపి గుణవాన్ పుత్రో నిర్గుణేవ శతైరపి|
ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనమ్||
తా.
సకల గుణసంపన్నుఁడైన కుమారుం డొకఁడేచాలును, గుణములేని కుమారులు నూఱుగురున్న(వందమంది యున్న)నేమి ప్రయోజన మున్నది. ఇందుకు నిదర్శనము ఒక చంద్రుడుండిన లోకమంతయు ప్రకాశించును. ఆ చంద్రుఁడులేక నక్షత్రము లెన్నియున్న నేమి ప్రయోజనమున్నది. - నీతిశాస్త్రము     

అనిర్వణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః |
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమఁ క్షామ స్సమీహనః ||

దాక్షాయణ్యో శ్వినీత్యాది తారాః :
అశ్వినీత్యాదితారా దాక్షాయణ్య ఇత్యుచ్యంతే - అశ్విన్యాది రేవత్యంత నక్షత్రములు దాక్షాయణు లనంబడును.
దక్షస్య ప్రజాపతే రపత్యాని స్త్రియః దాక్షాయణ్యః - దక్షప్రజాపతి యొక్క కొమార్తెలు. అశ్విని మొదలు 27 నక్షత్రములకుఁ పేర్లు.

ఆచంద్రతారార్కము - చంద్రుడు నక్షత్రములు సూర్యుడు ఉండు నంతి వరకు, శాశ్వతముగా, ఎల్లప్పుడు. 

వెలది(వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి. స్త్రీ) నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.

రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
రిక్క -
నక్షత్రము, సం.ఋక్షమ్. రిక్కదారి - ఆకాశము.

ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవత కాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి. ఋక్షరాజు - చంద్రుడు, జాంబవంతుడు.

రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు -
దొర, మగడు, అధిపతి.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు -
1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.

క్షత్రియుఁడు - రాచవాడు; రాట్టు - రేడు; స్వారాట్టు - ఇంద్రుడు.
క్షత్త్రము - 1.క్షత్త్రియ కులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైన శ్రేష్థుడు, ఉదా. రాజేంద్రుడు. విష్ణువు ముఖము నుండి అగ్నితో కలిసి ఇంద్రుడు పుట్టెను.
చంద్రుడు - నెల, చందమామ.  

వర్మ - క్షత్రియులు నామాంతరమున పెట్టుకొను గుర్తు. (శర్మ గుప్త మొదలగునవి వలె.)

రాజకము - 1.రాజసమూహము, 2.క్షత్రియ జాతి సమూహము. 

క్షత్రియాణి - క్షత్రియ స్త్రీ, రూ.క్షత్రియ, క్షత్రియిక.
క్షత్రియి - క్షత్రియుని భార్య.
దొరసాని - రాణి; రాణి - రాజ్ఞి, భార్య; రాజ్ఞి - రాణి.
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దేవేరి - 1.దేవి, 2.దొరసాని, రూ.దేవెరి, సం.దేవేశ్వరీ. 

ఠాకురు - 1.తండ్రి, 2.అధిపతి, 3.గురువు, రూ.ఠాగూరు, సం.ఠక్కురః. బాబు - 1.పూజ్యుడు, 2.తండ్రి, సం.భావ్యః.

పిత - జనకుడు, (కన్నవాడు, వడుగుచేసినవాడు, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.)
జనకుఁడు - తండ్రి, సం.పితా.

జనితా చోపనీతాచ యేన విద్యోపదిశ్యతే|
అన్నదాతా భయత్రాతా పంచె తే పితరస్మృతాః||
తా.
కన్నతండ్రి, ఉపనయనము చేసినవాఁడు, విద్య చెప్పినవాఁడు, అన్నము బెట్టినవాఁడు, భయము తిర్చినవాఁడు; ఈ ఐదుగురును తండ్రులు. - నీతిశాస్త్రము 

భంబు - 1.ఆకాశము, 2.నక్షత్రము.
(ౘ)చుక్కల తెరవు - 1.ఆకాశము, నక్షత్రమార్గము.
సత్పథము - 1.మంచిమార్గము, 2.నక్షత్రమార్గము.

నక్షత్రములు అనేకము - ఆకాశము ఒకటే.
నక్షత్రములను ఎవరు - మెరవమన్నారు?

భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.
ౙగము -
లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
చరాచరము - 1.జగత్తు, 2.విణ.తిరుగునదియు, తిరుగనదియు.
జనము - ప్రజ; ప్రజ - జనము, సంతతి. 
కుటుంబము - పెండ్లాము, బిడ్డలు మొ.వారు భార్యభర్తలు, వారి సంతానము. ఒక గృహములో నివసించు బంధువర్గము (Family).

కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
పురంధ్రి -
కుటుంబిని, స్త్రీ(ఆడుది).
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

ౙగ - గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా -
గొప్ప, పెద్ద. గొప్ప - అధికము, పెద్దది
(ౙ)జాగా - 1.పెద్దది, 2.గొప్పది, 3.చోటు, రూ.జగ, జగా, జెగ, సం.జగత్.

ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.
లోకమాత - 1.జగము తల్లి 2.లక్ష్మి 3.గంగ.
లోకజనని - 1.జగము తల్లి 2.లక్ష్మి 3.గంగ.

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి (పంచమాతలు :- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
లోకబాంధవుఁడు -
సూర్యుడు. లోకబాంధవో లోకబాంధవః - లోకమునకుఁ చుట్టము, బంధువు.
ౙగముచుట్టము - సూర్యుడు; ౙగముకన్ను - సూర్యుడు.
జగచ్చక్షువు - సూర్యుడు. 

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.   
భా||
ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. 

సూర్యుని చూడలేక పోయానని కన్నీరు కారుస్తు కూర్చుంటే నక్షత్రాలను కూడా చూడలేవు. - రవీంద్రనాథ్ టాగోర్

విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి.(భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe). విశ్వము నందు దేవిస్థానం విశ్వేశ్వరి.
విశ్వసృజుఁడు - బ్రహ్మ.
విశ్వతోముఖము - అంతట వ్యాపించినది, సర్వతోముఖము.
సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు -
వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమని, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.

నింగి - ఆకాశము.
నింగిచూలు -
వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.
నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.
వ్యోమకేశుఁడు - శంకరుడు, వ్యు.ఆకాశము జుట్టుగా గలవాడు.
శంకరుఁడు - శివుడు, విణ. సుఖమును గలుగ జేయువాడు. శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.

వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
ఆకసము -
మిన్ను, సం.ఆకాశః.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
ఆకాశగంగ -
మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతిమంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
మందాకిని - 1.గంగ 2.అరువదేండ్ల స్త్రీ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్య కలవాడు.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.

ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.
నీరు -
1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము; జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ. తెలివిలేనిది. 

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైరుతి దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

సహస్రపత్రము - కమలము, తామర.
కమలము -
1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి(Copper), 4.మందు(ఔషధము, ఉపాయము). ఔషధే చింతయే విష్ణుం…
కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.
కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన బంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

తా. తామరలు జలమును వదలిన యెడల తమకాప్తులైన సూర్యుని కిరణాలు సోకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు.

నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము.
తామర -
1.తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.) తామరచెలి - సూర్యుడు, పద్మ మిత్రుడు.
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మ వ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు 5.ముఖము పైగల చుక్కలు. కువేలము - 1.కలువ 2.పద్మము. ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పశువులను త్రోలుట.
పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ. ఎఱ్ఱనిది.

శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒకనిధి.
గుల్ల -
1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము), సం.క్షుల్లః.
నత్త - గుల్ల యందుండు పురుగు.
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల.

దేవమణి - 1.కౌస్తుభము, 2.గుఱ్ఱపు మెడ మీది సుడి.
కౌస్తుభము -
విష్ణువక్షస్స్థలము నందలి మణి, వ్యు. కస్తుభ = సముద్ర మందు బుట్టినది.
కౌస్తుభవక్షుఁడు - విష్ణువు.

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము(బట్ట, వలువ), 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.

ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి 3.అభ్రకము 4.బ్రహ్మము 5.(గణి.) సున్న, శూన్యము 6. (భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతిక వస్తువులు ఆక్రమించు చోటు (Space).
విను - ఆకర్షించు, వి.ఆకాశము, రూ.విన్ను. వినువాఁక - గంగ.
మిను - ఆకాశము, రూ.మిన్ను. (మినుచూలు - వాయువు)
మిన్ను - ఆకాశము, రూ.మిను. మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
ఖంబు - 1.ఆకాశము 2.స్వర్గము 3.శూన్యము 4.సుఖము.
అభ్రము - 1.మేఘము 2.ఆకాశము 3.అభ్రకము 4.బంగారు 5.హారతి కర్పూరము 6.తుంగమస్త 7.(గణి.) సున్న.
బ్రహ్మము - 1.హంసుడు 2.వేదము 3.పరమాత్మ 4.తపము.
సున్న - 1.శూన్యము 2.అనుస్వారము 3.అభావము.
శూన్యము - (గణి.) సున్న = మూల్య రహితము (Null) గాలి తీసివేసిన చోటు (Vacuum) సం.వి.సున్న, విణ.పాడు.
అంతరాళము - 1.ఎల్లదిక్కులకు నడిమిచోటు 2.(దేశ కాలముల) నడిమి భాగము 3.సంకీర్ణజాతి, సంకరజాతి.
అంతరిక్షము - ఆకాశము, రూ.అంతరిక్షము. విష్ణువు నాభి ప్రదేశము నుండి అంతరిక్షము పుట్టెను.

ఖగోళము - ఆకాశమండలము.
ఖగోళశాస్త్రము -
(ఖగో.) నక్షత్రములు, గ్రహములు మొ.గు వానిని గూర్చి తెలుపు శాస్త్రము (Astronomy).

ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖగపతి -
గరుడుడు.

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పులుఁగు - పిట్ట.
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు(సేవకుఁడు – కొలువుకాడు). బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.

తూపు - బాణము.
తూపురిక్క -
శ్రవణ నక్షత్రము.
తూపురిక్కనెల - శ్రావణమాసము.

గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
సుపర్ణుఁడు -
గరుత్మంతుడు, వ్యు.మంచి రెక్కలు గలవాడు.
వజ్రతుండుఁడు - గరుడుడు, వ్యు.వజ్రము వంటి ముక్కుగలవాడు.
బొల్లిగ్రద్ద - గరుడుడు; బొల్లి - 1.తెల్లనిది, 2.తెల్లనివాడు.
వైనతేయుఁడు - గరుడుడు, వినతా తనయుడు, అసూరుడు.
నాగాంతకుఁడు - గరుడుడు, వ్యు.పాములను చంపువాడు.

ఆళువారు - 1.హరిభక్తుడు, 2.గరుత్మంతుడు, రూ.ఆళ్వారు.
గరుడధ్వజుఁడు -
వెన్నుడు, విష్ణువు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.

పక్షిణాం బలమాకాశం మత్స్యానా ముదకం బలమ్|
దుర్బలస్య బలంరాజా బాలానాం రోదనం బలమ్||
తా.
పక్షులకు ఆకాశము బలము, చేపలకు నీళ్ళు బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము బలము. – నీతిశాస్త్రము

సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్ |
సూర్యసూతమనూమారుం చ కద్రూర్నాగాననేకశః |

గ్రహము - 1.రాహుగ్రహము, 2.అనుగ్రహము(దయ, కరుణ), 3.చెర, 4.యుద్ధ యత్నము, 5.పిశాచము (పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము), 6.సూర్యాది నవగ్రహములు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు). (భౌతి.) ఆకాశములో సూర్యుని చుట్టు తిరుగుచు స్థిరముగా కాంతిని వెదచల్లెడు ఖగోళరాశి (Planet).

ఉపగ్రహము - 1.ఉపయోగము, 2.చెర, 3.(ఖగో.) ఒక పెద్దగ్రహము చుట్టు తిరుగు చిన్నగ్రహము.
ఉపయోగము -
1.అనుకూల్యము, 2.వాడుక, 3.ప్రయోజనము.
చెఱ - 1.కారాగృహము, 2.నిర్బంధము, సం.చారః.
బంది - నిర్భంధము, చెర, సం.బంధీ.
బందిఖానా - చెరసాల (బందిగము). కారాగారము - చెరసాల.
నిర్బంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
కృష్ణజన్మస్థానము - బంధనాయలము, చెరసాల, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన స్థలము.

ఆఁక - 1.అడ్డు, 2.చెర, 3.కట్టుబాటు, 4.చెలియలకట్ట.

నిర్బన్ధోపరాగార్కాదయో గ్రహః :
గ్రహ శబ్దము నిర్బంధమునకును, సూర్యచంద్ర గ్రహణములకును, సూర్యాది నవగ్రహములకును పేరు. నిర్బంధమనగా పట్టుట యని కొందరు. గృహ్ణాతీతి గ్రహణం, గృహ్యత ఇతి చ గ్రహః గ్రహ ఉపాదానే . పట్టును గనుకను, పట్టుటగనుకను, పట్టఁబడును గనుకను గ్రహము. "గ్రహో నుగ్రహ నిర్బంధ గ్రహణేషు రణోద్యమే, సూర్యాదౌ పూతనాదౌ చ సైంహికేయోప రాగయో"రితి శేషః.

అస్థిరాయిడ్ - (ఖగో.) (Asteriod) గురుకుజ గ్రహకక్ష్యల నడుమ కక్ష్యలో తిరుగు లఘుగ్రహము.
నెప్ట్యూన్ - (Neptune) సూర్యుని చుట్టు తిరుగు ఒక గ్రహము.
ప్లూటో - (Pluto), సూర్యునిచుట్టు తిరుగు ఒక గ్రహము.
యురేనస్ - (Uranus) సూర్యుని చుట్టు తిరుగు గ్రహముల లోఒకటి.

జ్యోతిశ్చక్రము - గ్రహనక్షత్ర మండలము. గ్రహములను ఎవరు – నడవమన్నారు ?

గ్రహరాజు - 1.సూర్యుడు, 2.చంద్రుడు.
గ్రహపతి - 1.సూర్యుడు.

గోచారము - సూర్యాదిగ్రహముల సంచారము.
గ్రహచారము -
1.గ్రహముల యొక్క సంచారము, 2.దురదృష్టము.
దురదృష్టము - దౌర్భాగ్యము; దౌర్భాగ్యము - దురదృష్టము.

పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు -
1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
పొందుకాఁడు - స్నేహితుడు.
పోలిక - సామ్యము.
సామ్యము - సమత్వము, పోలిక.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు 2.వేలుపు 3.సూర్యమండలాంతర్గత విష్ణువు. ద్వాదశాత్ముఁడు - సూర్యుడు.

విశ్వమును ప్రకాశింపజేయు సూర్యుడు విష్ణువు కన్నుల నుండి ప్రభవించెను. శీతోష్ణములకు, వర్షములకు, కాలమునకు, వెలుగునకు అతడే మూలము.

సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.

సహస్ర పాదుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు.
సహస్రాంశువు - సూర్యుడు, వేవెలుగు.

సంక్రాంతి - మేషాది సంక్రమణము.
సంక్రమణము -
సూర్యుడొక రాశి నుండి మరియొక రాశికి ప్రవేశించుట. సం.వి.(భౌతి.) ఒక చోటగల స్థితి, దశ, రీతి విషయము అను వానినుండి మరొకచోట గలస్థితి, దశ, రీతి విషయము అనువానికి మార్పు, (Transition), సం.వి.(రసా.) దాటుట (Transition), ఉదా.రాంబిక్ గంధకము 96 డిగ్రీల యొద్ద మోనోక్లినిక్ రూపమునకు సంక్రమణము చేయును. 

నేక్షేతోత్యంత మాదిత్యమ్నా స్తంయాంతం కదాచన
ప్రతిబింబం సదారిస్థం నమధ్యం నభసోగతం||
తా.
సూర్యు డుదయించుచున్నప్పుడు, అస్తమయ మగుచున్నపుడు, ఆకాశ మధ్యంబును బొందియున్నపుడు ప్రతిసూర్యుని (అనఁగా ఉదకమందలి సూర్య ప్రతిబింబమును) జూడరాదు. – నీతిశాస్త్రము

ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
అస్తమయము - 1.(సూర్యాదులు) కుంకుట, 2.నాశము, 3.(జ్యోతి.) గ్రహములు సూర్యునితో కలిసియుండుట.
అస్తము - 1.ప్రొద్దుక్రుంకు కొండ, అస్తాద్రి, 2.గ్రహములకు సూర్యునితోడి సంయోగము, 3.నాశము, 4.క్రుంకుట, విణ.1.త్రోయబడినది, 2.నశించినది, 3.కనబడనిది.

ఉడుపు1 - ఉడుగు. (ఉడుగు - 1.మాను 2.ఇంకు 3.నశించు.)
ఉడుపు2 -
నక్షత్రము.
ఉడురాజు - చంద్రుడు.

ధామనిధి - సూర్యుడు.
ధామము -
1.ఇల్లు, 2.చోటు, తావు 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము 6.మేను, 7.పుట్టువు.

నివసతి - ఇల్లు; నివసనము - ఇల్లు.
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివాసి - వాసము చేయువాడు. 

పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాన నగరము.
శరీరము - దేహము; దేహము - శరీరము, మేను. శరీరి - ప్రాణి.
ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - ఇల్లాలు, భార్య.
పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రు పురముల నాశమొనర్చువాడు.

ఓజము - 1.బేసి, విషమము(సమముకానిది) 2.జ్యోతి, రూ.ఓజస్సు.
బేసి -
విషమము, సమముకానిది, విణ. (గణి.) సరిగాని సంఖ్య(Odd), 1, 3, 5, 7 వంటివి, చూ (అయుగ్మ సంఖ్య).
ఆయుగ్మము - బేసి, ఉదా. రెండుచే నిశ్సేషముగా భాగింపబడని అంకె 3, 7, 9 మొ, వి.
బేసికంటి - (బేసి + కన్ను) ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

(ౙ)జ్యోతి - జ్యోతి, కాంతి, దీపము, సం.జ్యోతిః.
జ్యోతి -
1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
వెలుగు - 1.కిరణము 2.ప్రకాశము(వెలుగు, విణ. బయలు పడినది). నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు, 27). అగ్ని - 1.నిప్పు(అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక) 2.అగ్నిదేవుడు. అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
సూర్యుడు - వెలుగురేడు. సూర్యుని ఎవరు - ఉదయించమన్నారు?సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి, శిల.

సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
ప్రాజ్ఞుఁడు -
1.సమర్థుడు(సమర్థుఁడు - నేర్పరి), 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (Inner voice).  

కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి -
సూర్యుడు.
మయూఖము - 1.కిరణము 2.కాంతి 3.జ్వాల, మంట Flame.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది (Light).
దీప్తి - కాంతి, స. (భౌతి.) ప్రకాశము, (Luminosity), కాంతి యొక్క తీక్ష్ణత, (Brightness). జ్వాలాజిహుఁడు - అగ్ని.

దివియ - 1.దీపము, 2.దివ్వటీ, రూ.దివె, దివ్వె, దివ్వియ, దీవియ, దీవె, సం.దీపికా. దీపముండగనే యిల్లు చక్కబర్చుకోవలెను.
దీపము - లాంతరు, రూ.దీపిక.
దబ్బెము - దీపము, సం.దీపః.
దీవియ - దివియ, సం.దీపికా. 
గృహమణి - దీపము; దీపవల్లి - దీపపువత్తి.
దీపకము - 1.ఓమము, 2.దీపము, 3.దీమము, 4.(అలం.)సాహిత్యమున నొక యలంకారము.
ఓమము - జీలకఱ్ఱవలె నుండు ఒకరకపు వాసనగింజలు, దీప్యము, రూ.వాము.
దీమము - 1.దీపకము 2.వేటాడుటకై వేటకాడు పెంచు పక్షి, మృగము, రూ.దీపము.

తక్కటి - మూడు ముఖములు గల దీపా రాత్రికపు తట్ట, త్రిముఖదీపిక. దీపము పేరు చెబితే చీకటిపోతుందా? దీపము దానము చేయువాడు, నిర్మలమైన నేత్రములు కలవాడు కాగలడు.

జ్యోతి ర్ఖ ద్యోత దృష్టిషు :
జ్యొతి శ్శబ్దము నక్షత్రమునకును, తేజస్సునకును, దృష్టికిని పేరు. ద్యోతత ఇతి జ్యోతిః. స. న. ద్యుత దీప్తౌ, ప్రకాశించునది. సూర్యునికిని, అగ్నికిని పేర్గునపుడు పుల్లింగమును గలదు. 'జ్యోతి ర్నా భాస్కరే గ్నౌచ క్లీబం ఖద్యోత దృష్టిషు' ఇతి రుద్రః 'జ్యోతిః ప్రకాశేతారాయాం వేదాంగాంతర నేత్రయో' రిత్యజయశ్చ. 'జ్యోతిః పుంస్యత్ని సూర్యయోః, చంద్రే చ' ఇతి శేషః.

ఓజస్సు -1.తేజము 2.ఉత్సాహము 3.బలము 4.వెలుతురు 5.పటిమ.
తేజము -
1.ప్రకాశము 2.ప్రభావము 3.పరాక్రమము 4.రేతస్సు, రూ.తేజస్సు. తేజి - గుఱ్ఱము.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము(శర్మము – సంతోషము) 3.కోరిక 4.ప్రభు భక్తి 5.(అలం.)వీరరసమునకు స్థాయి 6.ఆస్థ.
బలము - 1.సత్తువ(దేహబలము, సం.సత్యమ్.) 2.సైన్యము.
సైన్యము - 1.సేనతోకూడినది 2.సేన 3.కృష్ణుని తేతి గుఱ్ఱము లోనొకటి.
వెలుతురు - 1.ఎండ (ఎండదొర - సూర్యుడు) 2.ప్రకాశము.
పటిమ - నేర్పు, సామర్థ్యము.
ఓజు(ౙ) - 1.కమసాలి 2.శిల్పి 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపసః|
బుద్ధఃస్సష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశు ర్భాస్కరద్యుతిః||

కలాదుఁడు - 1.స్వర్ణకారుడు, 2.చంద్రుఁడు 3.గురువు, ఉపాధ్యాయుడు. పంచాణుఁడు - 1.స్వర్ణకారుడు, 2.శిల్పి.
స్వర్ణకారుఁడు - కమసాలి; కమ్మటీఁడు - కమసాలి.
అగసాలి - కమసాలి, స్వర్ణకారుడు, బంగారుపనిచేయువాడు, రూ.అగసాలె. బంగారం లేనిదే కంసాలి ఆభరణాలు చెయ్యలేడు.

సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
సొన్నారి - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.

బత్తుఁడు - కంసాలివారి పట్టపు పేరు, వై.వి. భక్తుడు, సం.భక్తః.

పశ్యలోహరుఁడు - కమసాలె, పచ్చెకాడు, వ్యు.చూచుచుండగనే దొంగిలించువాడు.
పచ్చియము - చూచుచుండగ దొంగిలుట, సం.పశ్యతో హరణమ్.
పశ్యత్పాలుడు - శివుడు, ముక్కంటి. 

ఉత్తమం కులవిద్యాచ మధ్యమం కృషివాణిజాత్|
అధమం సేవకావృత్తిః మృత్యుశ్చౌర్యోప జీవనాత్||
తా.
కులవిద్యవలను జీవనము సేయుటయు ఉత్తమము, కృషివల్లను వర్తకమువల్లను జీవించుట మధ్యమము, కొలువుగొలిచి జీవించుట(అ)ధమము, దొంగతనముచేత జీవించుటకంటె చావుమంచిదని తెలియవలెను. – నీతిశాస్త్రము

శిల్పి - శిల్పకారుడు బొమ్మలు పని మొదలగునవి.
శిల్పము -
చిత్తరువు వ్రాయుట, శిల్పుల పని మొదలగునవి.
మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదులు చెక్కు శిల్ప విద్య (Sculpture).
వాస్తుశాస్త్రము - శిల్పి, వాస్తుశాస్త్రము తెలిసినవాడు.
వాస్తుశాస్త్రము -
దేవాలయములు, గృహములు, సౌధములు నిర్మించుట యందు యుక్తాయుక్తములదెలియుజేయు శాస్త్రము, వాస్తుకళ, శిల్పశాస్త్రము, కట్టడములలో నేర్పరితనము (Architecture).
వాస్తుపతి - వాస్తోష్పత్తి, ఇంద్రుడు.

తక్షకుఁడు - 1.నాగరాజు(పాఁపఱేఁడు – నాగరాజు), 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు - తక్షకుడు.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్యపని చేయువాడు, 2.పక్షి విశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.

విశ్వక ర్మార్క సురశిల్పినోః : విశ్వకర్మ శబ్దము సూర్యునికిని, దేవశిల్పికిని పేరు. విశ్వం కర్మాస్యేతి విశ్వకర్మా. న. పు. సకలమైన క్రియలు గలవాఁడు. టీ. స. విశ్వస్యకర్మాణి యస్మాదితి విశ్వకర్మేతి సూర్యపక్షే.

అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః|
విశ్వకర్మా మనుస్తస్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః||

శ్రేష్ఠి - కులమందు శ్రేష్ఠుడైన శిల్పి, కోమట్ల బిరుదు, విణ.కులశ్రేష్ఠుడు, వికృ. చెట్టి.
స్థపతి - 1.శిల్పి, 2.అంతఃపురపు కావలివాడు, విణ.శ్రేష్ఠుడు.
విశ్వకర్మ - దేవశిల్పి. మయుఁడు - అమర శిల్పి.

వసోరాంగిరసీ పుత్రో విశ్వకర్మాకృతీపతిః |
తతో మనుశ్చాక్షుషో భూత్ విశ్వే సాధ్యా మనోఃసుతాః |

సూర్యతనయుఁడు - 1.శని, 2.కర్ణుడు.
సూర్యతనయ - యమున.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు. 

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి (వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

2. సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు. చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు 2.నెలతాలుపు.

సహస్రాక్షో విశాలాక్ష స్సోమో నక్షత్రసాధకః,
చంద్ర స్సూర్య శ్శనిః కేతు ర్గ్రహో గ్రహపతి త్వరః. - 38శ్లో 

చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా.
స్థానము - 1.చోటు, ఉనికి 2.విలుకాని యుద్ధ మప్పటి నిలికడ.

కర్పూరము - ఘనసారము, కప్పురము.
ఘనసారము -
1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
హిమవాలుక - కప్పురము, కర్పూరము.
జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.
జైవాతృకుఁడు - 1.చంద్రుడు, 2.పంటకాపు, 3.వైద్యుడు(జీవదుఁడు - వైద్యుడు), విణ.దీర్ఘాయువు కలవాడు.

ఆయుష్మంతుడు - దీర్ఘ కాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి -
1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.
దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.

జైవాతృక స్స్యా దాయుష్మాన్ -
జీవతి చిరకాల మితి జైవాతృకః. జీవ ప్రాణధారనే. - అనేకకాలము బ్రతుకువాఁడు.
అధిక మాయు రస్యాస్తీ త్యాయుష్మాన్ త. - అధికమైన ఆయుస్సు గలవాఁడు. ఈ రెండు దీర్ఘాయుష్మంతుని పేర్లు.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.

శర్వరీ దీపకశ్చంద్రః - ప్రభాతోదీపకో రవిః |
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపకః ||
తా.
చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ ప్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింప జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. – నీతిశాస్త్రము

నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
నెలతాలుపు -
శివుడు, చంద్రశేఖరుడు.

నెల మేపరి - రాహువు.
సోపపవుఁడు -
రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు).

రాహుగ్రస్తే త్విన్దౌ చ పూష్టి చ సోపప్లవోప రక్తౌ ద్వౌ -
ఉపప్లవేన ఆకులతయా సహవత్త ఇతి సోపప్లవః - ఉపప్లవముతోఁ గూడినవాఁడు.
ఉపరజ్యతే ఉపరమతే వ్యాపారాదిత్యువరక్తః – వ్యాపారము వలన నుపరతుఁ డైనవాఁడు, ఉపరజ్యత ఇత్యువరక్తః - రాహువుచేత తమోయుక్తుఁడుగాఁ జేయఁబడినవాఁడు. ఈ రెండు రాహుగ్రస్తులైన సూర్యచంద్రుల పేర్లు.     

అజుఁడు వాని శిరము నంబరవీథిని,
గ్రహము సేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను బట్టుచుండు.
భా||
బ్రహ్మదేవుడు రాహువు శిరస్సును ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించాడు. ఆ రాహుగ్రహము సూర్యచంద్రులకు నిత్యవైరి కనుక పగ వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికీ అడ్డగిస్తూ ఉంది, వారిపై దాడిచేయుటకు సదా ప్రయత్నిస్తు ఉంది.  

సూర్యగ్రహణము - రాహుకేతువు లలో నేదైన ఒక బిందువు భూమికి వెనుకగా వచ్చినచో సూర్యకిరణములు భూమిపై సోకక, తగులనప్పుడు సూర్యగ్రహణము కలుగును.

అంగుళీయాకారము - (ఖగో.) ఉంగరమువంటి ఆకారము, వర్తులా కారము (Annular). ఉదా.అంగుళీయ కాకార సూర్యగ్రహణము, చంద్రుని ఛాయ సూర్యబింబ మధ్య భాగమును గప్పగా చుట్టును వెలుతురు కనిపించు సూర్యగ్రహణము.

ఉపరాగము - 1.సూర్యాది గ్రహణము, 2.వ్యసనము, దుర్వ్యసనము, 3.అన్యాయము.
గ్రహణము - 1.రాహు కేతువులు సూర్యచంద్రులను పట్టుట, 2.గ్రహించుట, 3.బుద్ధి, (భౌతి.) గ్రహమునకు వేరు గ్రహము అడ్డువచ్చి కంపించకుండుట. (Eclipse), (భూగో.) భూమియొక్క కక్ష్య, చంద్రుని యొక్క కక్ష్య, రెండు బిందువుల (రాహుకేతువుల)లో కలియును. ఆ రెండింటిలో ఏదైన ఒక బిందువు భూమికి తిన్నగా వెనుకగాని ముందుగాని, భూమికిని సూర్యునకును మధ్యగాని, వెనుకగాని వచ్చినచో గ్రహణము కలుగును. ఆకాశన పట్టే గ్రహణమంతా చూసేదే.
బుద్ధి -
బుద్ధి, మతి, సం.బుద్ధిః (గృహ.)తెలివి తేటలు(Intelligence)
కక్ష్య - (భూమి.) భూమి సూర్యుని చుట్టు పూర్తిగా తిరుగుట.

ఉపరాగో గ్రహః -
ఉపరజ్యేతే సూర్యచంద్ర మసావనేన ఉపరాగః, రంజరాగే - సూర్యచంద్రులు దీనిచేత రాగమును బొందింపఁబడుదురు.
గృహ్యేతే సూర్యాచంద్రమసావనేన గ్రహః - గ్రహ ఉపాదానే. దీనిచేత సూర్యచంద్రులు గ్రహింపఁబడుదురు. ఈ రెండు గ్రహణము పేర్లు.      

సకలజన ప్రియత్వము నిజంబు గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగగన్
టకటక మానియుండడె దృఢస్థితి నెప్పటి యట్ల ! భాస్కరా.
తా.
చంద్రుడు తన్ను రాహువు మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికినీ ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము బాధింపదు, అతిత్వరలోనే అతడు కోలుకొనును.

రాహువు, కేతువుల గ్రహ బాధల వల్ల సూర్యచంద్రునికి గ్రహణాలు ఉన్నాయి. చంద్రునికి వృద్ధిక్షయాలు ఉన్నాయి.

చంద్రుడు వృద్ధిపొందే పొందే పక్షము నందలి కళలచే దేవతలకూ, క్షీణ కళలచే పితృదేవతలకూ ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. చంద్రుడు వృద్ధిక్షయాలకు చలించని తత్త్వాన్ని బోధించాడు.

కరుణచే చల్లనైన విష్ణువు మనస్సు నుండి చంద్రుడు జన్మించెను. అతడు నీటికి, అన్ని ఓషధులకు, బ్రహ్మణులకు రక్షకుడు.

చందిరుడు - చంద్రుడు; చంద్రముఁడు - చంద్రుడు.
చంద్రము -
1.కర్పూరము, 2.నీరు 3.బంగారు.
చంద్రకి - 1.నెమలి, 2.కౌజు.
నెమలి - మయూరము, రూ.నెమ్మిలి(నెమ్మలి).
కౌఁజు - కపుఁజుపిట్ట, సం.కపింజలః.
నెమ్మి - 1.ప్రేమ 2.నెమ్మది 3.సంతోషము 4.క్షేమము 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము 2.బండిచక్రము కమ్మి, సం.నేమిః.
నెమ్మిరౌతు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ. కొమరుసామి.

శివుడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు -
1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.

లిబ్బిదొర - శ్రీదుడు(శ్రీదుఁడు - కుబేరుడు), కుబేరుడు.
లిబ్బిపడఁతి -
లక్ష్మి. (పడఁతి - స్త్రీ, రూ.పణఁతి.)
లిబ్బి - 1.పాతర, 2.రాశి, 3.నిధి, 4.ప్రోగు, ధనము.

ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత(దాత - ఇచ్చువాడు).
ధనాధిపుఁడు -
కుబేరుడు. 

దాతదరిద్రః కృపణోధనాఢ్యః, పాపీచిరాయుస్సు కృతీగతాయుః|
రాజాకులీన స్సుకులీనసేవ్యః, కలౌయుగే షడ్గుణ మాశ్రయంతి|
తా.
దాతయైనవాఁడు దరిద్రుఁడౌట, లోభి ధనాఢ్యుడౌట, పాపి ధీర్ఘాయుష్మ తుడౌట, పుణ్యాత్ముఁడు అల్పాయుష్కుండౌట, హీనకులుడు రాజౌట, శ్రేష్ఠకులుడు సేవకుడౌట, ఈ యాఱు(6)గుణములు కలియుగమునందు కలిగియున్నది. - నీతిశాస్త్రము 

రొక్కపుదొర - కుబేరుడు.
రొక్కము -
1.నగదు, 2.చేతివెల, 3.సమూహము, సం.ఋక్థమ్.
నగదు - నాణెము రూపమైన సొమ్ము, (అర్థః.) రొక్కము, సొమ్ము, పైకము, ద్రవ్యము.
సొమ్ము - 1.స్వము, 2.ధనము, 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీనవస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ద్రవ్యము - 1.ధనము, 2.వస్తువు.
ద్రవ్యము - (అర్థ.) 1.క్రయవిక్రయ కార్యములలో వినిమయమునకు ఉపయుక్తమగునట్టిది (Money), 2.ప్రభుత్వామోదము కలిగిన ఏదైన వస్తువు, 3.(భౌతి.) పదార్థము (Matter).

దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.

అర్థాగృహేనివర్తంతే శ్మశానే మిత్ర బంధవాః|
సుకృతం దుష్కృతం చవగచ్ఛంత మనుగచ్ఛతి|| 
తా.
ద్రవ్యమును సంపాదించి ధర్మము సేయక దాచినను లోకాంతర గతుండౌనపు డాద్రవ్యము గృహమందుండును, వాని వెంటరాదు. పుత్త్రమిత్త్ర బాంధవులు శ్మశాన పర్యంతము వత్తురు కాని వెంటరారు, పుణ్యపాపములు రెండును వెంట వచ్చును. కనుక ధర్మమే చేయ వలెయును. - నీతిశాస్త్రము

వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలిచూలి -
1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని.

మారుతము - వాయువు.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.

కరువలి - గాలి.
కరువలిపట్టి (గాలిచూలి) -
1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
విధాత -
1.బ్రహ్మ, 2.మన్మథుడు.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.

3. అంగారకుడు - నవగ్రహములలో కుజుడు(Mars).
కుజుడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు 2.అంగారకుడు.
భౌముఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు, వ్యు.భూమికి పుత్రుడు.
భూమిజుడు - 1.అంగారకుడు 2.నరకాసురుడు.
నేలపట్టి(బిడ్డ) - 1.అంగారకుడు 2.నరకాసురుడు.
లోహితాంగుఁడు - అంగారకుడు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.

దుస్స్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వ విమోచకః,
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః.

అఙ్గారకః కుజో భౌమో లోహితాఙ్గో మహీసుతః. :
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగాని అరయతి పీడయతీతి వా, అర పీడనే - శరీరములను పీడించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటి వర్ణము గలవాఁడు.
కౌ పృథివ్యాంజాతః కుజః, నీప్రాజదుర్భావే - భూమియందుఁ బుట్టినవాఁడు.
భూమేరపత్యం భౌమః - భూమికొడుకు.
లోహితమంగం యస్యసః లోహితాంగః - ఎఱ్ఱని శరీరకాంతిగలవాఁడు.
మహ్యాః సుతః మహీసుతః - భూమికొడుకు. ఈ ఐదు అంగారకుని పేర్లు.

అత ఊర్ద్వమంగారకో (అ)పి యోజన లక్షద్వితయ ఉపలభ్యమానస్త్రిభిస్త్రిభిః వక్ష్యైరేకైకశో రాశీన్ ద్వాదశానుభుంక్తే యది న వక్రేణాభివర్తతే ప్రాయేణా శుభగ్రహో (అ)ఘశంసః  

లోహితాంగుఁడు - అంగారకుడు.
లోహితకము -
1.రక్తచందనము, 2.సింధూరము, 3.నెత్తురు.
లోహితాస్యుఁడు - హరిశ్చంద్ర నృపాలుని కొమరుడు, రూ.రోహితాస్యుడు. (లౌహితాశ్వుడని కొందరు).
రోహితాశ్వుఁడు-1.అగ్ని,2.హరిశ్చంద్రుని కొడుకు, రూ.1.రోహితాశ్వుడు, 2.లోహితాస్యుడు.

మాహేయి - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.

విశ్వ - భూమి.
విశ్వంభరుఁడు -
విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషు.

భూ - భూమి. భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
భూమిజుఁడు -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.

నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి -
భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
నేల వేలుపు - భూసురుడు; భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథ్వీ.
పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది.
పృథువు - గొప్పది, వి.ఒక రాజు.

పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
పార్థుఁడు -
1.రాజు, 2.అర్జునుడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
క్షత్రియుఁడు - రాచవాడు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు. 

బల్లిదుడైన సత్ప్రభువు పాయకయుండినగాని రచ్చలో
జిల్లరవారు నూరుగురు సేరినఁ (తే)దేజముగల్గ దెయ్యెడన్
జల్లని చందురుం డెడసి సన్నపుజుక్కలు కోటియున్న రం
జిల్లునె న్నెలల్ జగము చీకటులన్నియు బాయ! భాస్కరా.
తా.
భాస్కరా! చుక్కలెన్ని(మిక్కిలి చిన్నవగు నక్షత్రములు కోటి సంఖ్యలో) వుండి ప్రకాశించినను చీకటితొలగదు. వానికి తోడుగా చల్లని కిరణములుగల చంద్రుడున్నప్పుడే, లోకమున చీకటి లేకుండా నుండును. అట్లే బలవంతుడగు మంచిరాజు(నరపాలుఁడు – రాజు) సభ యందు విడువక ఉంటేనేగాని సభ ప్రకాశింపదు, సాధారణ జనులెందరుండినను ప్రయోజనము లేదు.

ఐలుఁడు - 1.పురూరవ చక్రవర్తి, 2.అంగారకుడు, Mars 3.అందగాడు.

ౙమీను - భూమి.
ౙమీందారి -
జమీందారుని వశమున నుండు భూమి.
ౙమీందారు - 1.భూమి కలవాడు, 2.రాజునకు శిస్తు చెల్లించు ఒక అధికారి.

మంగళుఁడు - కుజుడు.
మంగళ -
పార్వతి.
మంగళదేవత - లక్ష్మి.

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః,
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః.

కర్షకుఁడు 1.దున్నుకొని బ్రతుకువాడు 2.ఈడ్చువాడు, సం.వి.కుజుడు.
కార్షుఁడు -
దున్నుకొని బ్రతుకువాడు.
కృషికుఁడు - దున్నువాడు, వ్యవసాయి.
కృషీవలుఁడు - కృషికుడు, వ్యవసాయము చేయువాడు, వ్యవసాయ దారుడు, రైతు, కర్షకుడు, సేద్యగాడు (Cultivator).
రైతు - సేద్యకాడు; సేద్యకాఁడు - కృషీవలుడు.
సేద్యము - కృషి, వ్యవసాయము, సం.సేత్యమ్.
కృషి - సేద్యము, వ్యవసాయము. వ్యవసాయము - ప్రయత్నము, కృషి.
పంట - 1.పండుట, 2.కృషి.
పంటవలతి - భూమి.

ప్రతి చోటా కృషికి స్థానం ఉంటుంది. చూడకపోవుట వలన కృషి కూడ నశించిపోవును. కృషితో సమానమైన ధర్మము, వ్యవసాయముతో సమానమైన వాణిజ్యము లేదు.

అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు.
జ్ఞాతి -
1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
పాలికాపు - 1.పాలేరువాడు, 2.భాగస్థుడు, (వ్యవ.) కొంత పాలు ఫలసాయమును పుచ్చుకొని తనతోపాటు పనిచేయుట కొప్పుకొనిన రైతు, (Sharing partner).  
పాలేరు - పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిరా!

రెడ్డి - కాపువారి పట్టపు బేరు(పేరు).  
(ౘ)చౌదరి - గ్రామమునకు పెత్తనకాడగు కాపు, (కమ్మవారి పేర్లలో చివరిభాగము) రూ.చవుదరి, సం.చతుర్.

త్రాణము - కాపు, రక్షణము, విణ.కావబడినది, రూ.త్రాతము.
కాపు -
1.కాపుగడ, రక్షణము, 2.కాయలు కాచుట.
త్రాత - కాచువాడు.
కా(ౘ)చు - 1.(కాయ) కాచు, 2.(ఎండ) కాయు, 3.రక్షించు, 4.ఓర్పు, సహించు, 5.ఎదురుచూచు.
కాపాడు - రక్షించు; రక్షణ - (గృహ.) కాపాడుట, (Protection).
సాఁకు - కాపాడు, పెంచు; పెంచు - క్రి.పోషించు.
పాలించు - 1.ఏలు, 2.రక్షించు.
ఏలు - 1.పరిగ్రహించు, 2.పాలించు.
కాపరి - (కాపు+అరి) రక్షకుఁడు, ఉదా.పసులకాపరి.
రక్షకుఁడు - రక్షించువాడు. 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.

కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం|
మౌనేన కలహం నాస్తి, నాస్తి జాగరతో భయమ్||
తా.
కృషి చేసికొనువానికి కఱువులేదు, జపము చేసికొనువానికి పాపము లేదు, మౌనముతో నున్నవానికి కలహములేదు, మేల్కొని యున్న వానికి భయములేదు. – నీతిశాస్త్రము

చరుఁడు - 1.వేగులవాడు, 2.అంగారకుడు.
గూడచారి -
వేగులవాడు, ఇతర దేశముల రహస్యములను తెలిసికొనుటకు నియమింపబడినవాడు.
గూఢపురుషుడు - వేగులవాడు, గూఢచారుడు.
అనిరుద్దుఁడు - 1.అడ్డగింప బడనివాడు, 2.లొంగనివాడు, వి.1.గూఢచారుడు, 2.ప్రద్యుమ్నుని కొడుకు, 3.విష్ణువు, 4.శివుడు.
విశ్వకేతువు - అనిరుద్దుడు, వ్యు. పెక్కుధ్వజములు కలవాడు.

పారిషదుఁడు - 1.శివభటుడు, 2.రాజున కనుచరుడు, 3.సభ్యుడు.
భృంగి -
శివభృత్యులలో నొకడు.
అనుచరుఁడు - 1.సహాయుడు, 2.భృత్యుడు(సేవకుడు, పనివాడు).
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
సభ్యుఁడు - 1.సభ యందుండువాడు, మంచివాడు.

4. బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

రౌహిణేయో బుధ స్సౌమ్యః :
రోహిణ్యాః అప్యతం రౌహిణేయః. - రోహిణీదేవి కోడుకు.
బుధ్యతే సర్వమితి బుధః - బుధ అవగమనే - సర్వము నెరింగినవాఁడు.
సోమస్యాపత్యం సౌమ్యః - చంద్రుని కొడుకు. - ఈ మూడు 3 బుధుని పేర్లు.

ఆత్రేయగోత్రజో త్యంతవినయో విశ్వపావనః,
చాంపేయపుష్ప సంకాశచరణ శ్చారుభూషణః.

రోహిణి -1.నాల్గవ నక్షత్రము, 2.తొమ్మిదేండ్ల కన్యక, 3.బలరాముని తల్లి.

రౌహిణేయుడు - 1.బలరాముడు, 2.బుధుడు.
బలుఁడు -
బలరాముడు, విణ.బలము గలవాడు.
హలాయుధుఁడు - బలరాముడు.
హలి - 1.నాగలి, 2.బలరాముడు, 3.పొలముదున్నువాడు.
హలము - నాగలి, రూ.హాలము.
నాగఁటిజోదు - బలరాముడు, హలాయుధుడు.

నాఁగటి (ౘ)చాలు యతివ(అతివ - స్త్రీ) - సీత. 

ఉశనసా బుధో వ్యాఖ్యాతః తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనతో బుధః సోమసుత ఉపలభ్యమానః ప్రాయేణ శుభకృత్ యదార్కాద్వృతిరిచ్యేత తదాతి వాతాభ్రప్రాయా - నావృష్ట్యాదిభయమాశంసతే   

బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విబుధుఁడు - విద్వాంసుడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు; బుద్ధుడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు. 
వేలుపు - దేవత(దేవత -వేలుపు), దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు -
వేలుపు; సుపర్వుఁడు - వేలుపు.
త్రిదివము - స్వర్గము.

విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||

సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు.
నేరిమి -
సామర్థ్యము, రూ.నేరుపు, నేర్మి, నేర్పు Skill.
సామర్థ్యము - 1.నేర్పు, యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు (Power) (గృహ.) బలము, సత్తువ.
యోగ్యత - అర్హత.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్. 

విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
నిష్ణాతుఁడు - నేర్పరి; చతురిమ - నేర్పరి.
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి. 

వేదవి ద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞాన భాస్వరః,
విద్యావిచక్షణో విభు ర్విద్వత్ప్రీతికరో బుధః.

ధీమంతుఁడు(ధీ - బుద్ధి) - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.
ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము కలవాడు. విపశ్చితుఁడు - విద్వాంసుడు; సుధి - విద్వాంసుడు.

కృతి - 1.ప్రబంధము, సప్తసంతానములలో ఒకటి, చదువరి, విన.నేర్పరి.
కృతికర్త - గ్రంథము రచించినవాడు, కవి.
కృతహస్తుఁడు - 1.నేర్పరి, 2.గురితప్పక వేయువాడు.

స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశే పూజ్యతే రాజా విద్వ్వన్ సర్వత్ర పూజ్యతేః ||
తా.
మూర్ఖుఁడు తన యింటియందును, ప్రభువు స్వగ్రామ మందును, రాజు తన రాజ్యమందును గొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశములయందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము

సత్యవాస స్సత్యవచాః శ్రేయసాంపతి రవ్యయః,
సోమజ స్సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః.

సౌమ్యుఁడు - బుధుడు, విణ. 1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.
సౌమ్యము -
మృదుత్వము(Soft). సౌమ్యగంధ - గులాబిపువ్వు.
మృదులము - మెత్తనిది, మృదువు.
మృదువు - మెత్తనిది.

బుధో బుధార్చిత స్సౌమ్య స్సౌమ్యచిత్త శ్శుభప్రదః
దృఢవ్రతో దృఢఫల శ్శ్రుతిజాల ప్రభోధకః.

తిన్న - 1.మనోజ్ఞము, 2.యుక్తము, 3.స్వస్థము, 4.ఋజువు, 5.సౌమ్యము.
మనోజ్ఞము -
1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సుకింపైనది, మదికి హితమైనది.
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.
స్వస్థము - నెమ్మదిగా నుండునది.
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.ఋజువర్త నిష్కపటము.
సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బలు సరళములు. 

ఒప్పిదము - 1.అందము, 2.అలంకారము, 3.విధము, విణ.1.మనోజ్ఞము 2.తగినది.
అందము -
1.సౌందర్యము, చక్కదనము, 2.అలంకారము, 3.విధము, విణ. 1.చక్కనిది, 2.తగినది.
సౌందర్యము - చక్కదనము; ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమానాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
సింగారము - శృంగారము, అలంకారము, సం.శృంగారః.
శృంగారము - 1.నవరసములలో నొకటి, 2.అలంకారము, వికృ.సింగారము.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్డులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.

రమ్యము - ఒప్పిదమైనది; రమణీయము - ఒప్పిదమైనది.

(ౘ)చందు - 1.విధము, 2.అందము, 3.చంద్రుడు.
విధము -
ప్రకారము, విధి.
ప్రకారము - 1.విధము, 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. 
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

కోమలికము - చక్కదనము.
కోమలి -
చక్కదనము గల స్త్రీ.
అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.  
ఒప్పులాఁడీ - చక్కదనముగల స్త్రీ.
ౘక్కనయ్య - 1.సుందరమైనవాడు, 2.వి.మన్మథుడు.  

తుల - 1.త్రాసు, 2.పోలిక, 3.రాసులలో ఒకటి.
సాధర్మ్యము -
పోలిక.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము, (Property).
గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకర స్సుఖీ,
సింహాధిరూఢ స్సర్వజ్ఞ శ్శిఖివర్ణ శ్శివంకరః.

వస్త్రముఖ్య స్వలంకారః, ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం, విద్యాముఖ్యస్తు పూరుషః||
తా.
అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము) ముఖ్యములు. - నీతిశాస్త్రము

ఇల - 1.నేల, 2.బుధుని భార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ -
ఇడ చంద్రరూపిణి (తెలుపు, చంద్రుని తేజస్సు) 1.(యోగ.) ఒక నాడి, 2.మైత్రావరుణి యను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఈశ - 1.ఏడి కోల, బండినొక, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.
వేల - 1.చెలియలకట్ట పోలిమే, 2.అనాయాస(ఆయాసములేనిది) మరణము, 3.బుధునిభార్య, 4.దాస్యము.
చెలియలకట్ట - సముద్రపుగట్టు, వేల, రూ.చెల్లెలికట్ట.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః.

అంబువు - నీరు, (జ్యోతి, లగ్నము నకు నాలుగవ స్థానము, (ఛం.) ఒకరకపు వృత్తము.
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నము నకు నాలుగవ స్థానము, (వృక్ష.) కురువేరు.

ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు -
మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. 

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్దకేలు వేలుపు.
ఉడ్డకేలు వేలుపు -
చతుర్భుజుడు, విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ -
బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
పులస్త్యుఁడు - బ్రహ్మ మానస పుత్రుడు.
పౌలస్త్యుఁడు -పులస్త్య బ్రహ్మ వంశమువాడు, 1.కుబేరుడు, 2.రావణుడు. దశకంఠుఁడు - రావణుడు, లంకాధిపతి.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
పౌలోమి - శచీదేవి. శచి - ఇంద్రుని భార్య.
పులహుడు -
ఆంగీరసుఁడు -
1.అంగిరసుని పుత్త్రుడు, బృహస్పతి 2.జీవాత్మ, రూ.అంగిరసుడు. అంగిరసః అపత్యం ఆన్గిరసః - అంగిరస్సు కొడుకు. జీవాత్మ - దేహి, జీవుడు; దేహి - దేహము కలవాడు.

ప్రజాపతేరంగిరసః స్వధా పత్నీ పితౄనథ |
అథర్వాంగిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ ||

అనసూయ - 1.అసూయలేమి, 2.అత్రిమహర్షి భార్య.

క్రతువు - యజ్ఞము; క్రతుధ్వంసి - శివుడు, వ్యు. దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.
క్రతుభుజుఁడు -
వేలుపు, జన్నపుఁ దిండి, రూ. క్రతుభుక్కు.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, రాజసూయ యాగము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచయజ్ఞములు). వికృ. జన్నము.
యజ్ఞపురుషుఁడు - విష్ణువు.
ౙన్నము -
యజ్ఞము, ,వెలిమి, హోమము, వ్రేల్మి, సం.యజ్ఞః.
ౙన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
ౙన్నపుగొంగ(శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.

ౙన్నపుఁబొజ్జ - ఋత్విజుడు.
ఋత్విజుడు - ఋత్విక్కు, యజ్ఞకర్త వలన ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు, యాజకుడు, రూ.ఋత్విజుడు.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః|
సర్వదర్శీ నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమమ్||

చక్షువు - కన్ను; కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలి పురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.పలినము, సన్నని తెలుపుబట్ట.
(ౙ)జాడ -
1.అడుగుల గురుతు(వర్తని - త్రోవ, కాలిజాడ) 2.సైగ, సంజ్ఞ 3.త్రోవ, మార్గము 4.విధము (ప్రకారము, విధి).
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.
కనుపుల విలుఁకాడు - చెరకు విలుకాడు, మన్మథుడు.

సర్వస్య గాత్రస్య శిరఃప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాం రసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదుల కంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము

తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది, రూ.తుర్యము.
బ్రహ్మము -
1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభ గుణము లేని రాజు.

ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.    
రవి - 1.సూర్యుడు(సూర్యుఁడు - వెలుగురేడు), 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.

నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకౌకసుఁడు -
1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.

హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception). 

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).

అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామాతురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధాతురాణాం నరుచిర్నపక్వమ్||
తా.
ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్షగలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలికొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. - నీతిశాస్త్రము

5. బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter). 

బృహస్పతి స్సురాచార్యో గీష్పతి ర్ధిషణో గురుః
జీవ ఆజ్గీరసో వాచస్పతి శ్చిత్ర శిఖండిజః. -
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఇ.పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు(బృహత్తు - గొప్పది)లనం బడును. వారలకై నను వానికైనను ప్రభువు.
సురాణాం ఆచార్యః సురాచార్యః - దేవతల కాచార్యుఁడు.
గిరాం పతిః గీష్పతిః - వాక్కులకు పతిః 3 దిషణాబుద్ధిరస్యాస్తీతి ధిషణః - మంచిబుద్ధి గలవాఁడు.
సర్వార్థాన్ గృణాతీతి గురుః. ఉ. వు. గృశబ్దే - సర్వార్థములను వచించువాఁడు.
జీవయతి దేవానితి జీవః. జీవప్రాణధారణే - దేవతలను బ్రతికించువాఁడు.
జీవ్యతే మృతో అనేనజీవః - చచ్చినవాఁడు ఈయనవలన బ్రతుకును.     
అంగిరసః అపత్యం అజ్గీరసః - అంగిరస్సు కొడుకు.
వాచాం పతిః వాచస్పతిః - వాక్కులకు పతి.
అంగిరా ఏవ చిత్రశిఖండీ తస్యాజ్జాతః చిత్రశిఖండిజః - చిత్ర శిఖండి యనఁగా నంగిరస్సు(అంగిరస్సు), వానికొడుకు. ఈ ఎనిమిది 8 బృహస్పతి(దేవగురువు) పేర్లు.  

గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.  

సాత్వికౌదార్యశంకరాచార్య గురుఁడు
శ్రేయమును గోరి "లక్ష్మీనృసింహ దేహి
మమ కరావలంబన" మని స్మరణ చేసె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.

సురచార్యుఁడు - బృహస్పతి.
సురలు -
వేలుపులు; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బొజ్జదేవర(బొజ్జ - కడుపు) - వినాయకుడు.
పిళ్లారి - వినాయకుడు, త. పిళ్ళెయార్.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు -
వినాయకుఁడు.
అర్కబంధువు - 1.బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు (కావున నీవ్యవహారము).
అర్కుఁడు - 1.సూర్యుడు, 2.ఇంద్రుడు.

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

ఆచార్యుఁడు - 1.వేదవ్యాఖ్యానము చేయువాడు, 2.వేదాధ్యయనము చేయించువాడు, 3.మతస్థాపకుడు, 4.యజ్ఞాదులందు కర్మోపదేశికుడు, 5.ఉపాధ్యాయుడు, గురువు, 6.ఏదైన ఒక విషయమున నిశిత పాండిత్యము గలవాడు, 7.ద్రోణుడు.
ఆచార్యకము - 1.ఉపాధ్యాయత్వము, 2.ఉపదేశము.
ఆచార్య - 1.వేదార్థమును వ్యాఖ్యానించెడి స్త్రీ, 2.ధర్మోపదేశికురాలు.
ఆచార్యాని - ఆచార్యుని భార్య.
కృపి - ద్రోణుని భార్య.
కృపుఁడు - ద్రోణుని మరిది.

ఒజ్జ(ౙ) - 1.ఉపాద్యాయుడు, 2.పురోహితుడు, 3.యాజకుడు, సం.ఉపాధ్యాయః.
ఒజ్జదనము - ఉపాధ్యాయత్వము.
ఒజ్జబంతి - 1.ఉపాధ్యాయుడు చూపిన పద్ధతి, 2.మేలుబంతి, రూ.ఓౙబంతి.
ఒరవడి - మేలుబంతి, ఒజ్జబంతి.
ఒజ్జసాని - ఒజ్జభార్య.     

దేశికుఁడు - గురువు. 

ఉపాధ్యాయన్ దశాచార్య | ఆచార్యణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా | గౌరవేణితి రిచ్యతే ||
భా||
పదిమంది ఉపాధ్యాయులు కన్న ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యులకంటె కన్నతండ్రి(కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్న తండ్రి, సం.కృష్ణః.), వెయ్యి మంది తండ్రులకన్నా విద్యావంతురాలైన ఒక తల్లి గొప్పది.   

ఏడుగడ - (ఏడు + కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.    

వినీతుఁడు - 1.జితేంద్రియుడు, 2.గురువుచేత శిక్షింపబడినవాడు, 3.విధేయుడు, వి.వర్తకుడు.
జితేంద్రియుఁడు - ఇంద్రియములను జయించినవాడు.
విధేయుఁడు - వినయము(వినయ సంపద) కలవాడు.
వినయము - 1.అడకువ, 2.గురుశిక్ష.
అడఁకువ - వినయము, నమ్రత, రూ.అణకువ.
అణఁకువ - నమ్రత, రూ.అడకువ.  
నమ్రత - అణకువ, వినయము, అగర్వము. 

సముద్ధతుఁడు - గురువుచే శిక్షింప బడినవాడు, దుడుకువాడు.
దుడుకు -
1.దౌష్యము, 2.ఉద్ధతి, 3.చెడ్డపని, త. తటుక్కు, క.దుడుకు.
దౌష్ట్యము - దుష్టత్వము.
దుందుడుకు - 1.గర్వము, ఉద్దతి, 2.తొందర.
దుండగము - 1.తప్పు, 2.దౌష్ట్యము, 3.కీడు, రూ.దుండఱికము, సం.దుంకుకః.
దుండఱికము - దుండగము. కాకృత్యము - అకార్యము, చెడ్డపని.
దుర్మతి - 1.చెడ్డబుద్ధి కలవాడు, వి.60 సంవత్సరములలో నొకటి. 

శివే రుష్టే గురు ప్త్రాతా, గురే రుష్టే స శంకరః||
శివుడు కోపిస్తే గురువు కాపాడగలడు. గురువు కోపిస్తే ఆ శిష్యుణ్ణి శివుడు కాపాడలేడు.

గీష్పతి - 1.బృహస్పతి, 2.పండితుడు. 
నుడుఱేఁడు -
బృహస్పతి, గీష్పతి.
వాచస్పతి - సురాచార్యుడు, బృహస్పతి.
ధిషణుఁడు - బృహస్పతి. ధిషణ - బుద్ధి.   

జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి. 
జీవి -
జీవించువాడు, వి.ప్రాణి.
శరీరి - ప్రాణి.
జీవాత్మ - దేహి(దేహి - దేహము గలవాడు), జీవుడు.

అంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.
ఆంగిరస - 1.ప్రభవాది షష్ఠి సంవత్సరములలో ఒకటి, 2.పుష్యమీ నక్షత్రము. 
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. 
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ -
(వేదాం.) 1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఆత్మ బుద్ధి స్సుఖ చైవ గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా.
తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱుచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. - నీతిశాస్త్రము

గురు ర్గురుతమో ధామ సత్యస్సత్య పరాక్రమః|
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||

వాచస్పతి - సు రా చా ర్యు డు, బృహస్పతి.
సురాచార్యుఁడు -
బృహస్పతి.
బృహస్పతి - సురగురువు, 2.గురుడు. 
గురుఁడు - 1.గురువు, 2.బృహస్పతి (Jupiter). 

వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ.యుక్తియుక్తముగా మాటాడు వాడు. 
చిరు - చిలుక; చిలుక - కీరము, శుకము, రూ.చిల్క. 
కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము. 
లాజము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
శుకము - చిలుక; శుకవాహుఁడు - మన్మథుడు.
రామతమ్మ - చిలుక; చిలుకరౌతు - మదనుడు.
ౘదువుల పులుఁగు - చిలుక; పలుకుఁ దత్తడి - చిలుక.  
వచము - చిలుక. చిలుకలకొలికి - స్త్రీ; స్త్రీ - ఆడుది.  

కీరశుకౌ సమౌ,
కీతి శబ్దం రాతి కీరః. రా ఆదానే. కీ యను శబ్దమును గ్రహించునది.
వుకతీతి శుకః శుక గతః. చరించునది. ఈ రెండు చిలుక పేర్లు.

మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ -
ధారణాశక్తి గల బుద్ధి.

రాకొమరుల్ రస్జుని దిరంబుగ మన్నననుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁదమలోపలనుంపరు, నిక్కమేకదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక, పెంతురే
కాకము నెవ్వరైన, శుభకారణ సన్ముని సేవ్య! భాస్కరా.
తా.
చిలుకను చూచినా, దాని పలుకులను ఆలకించినా మానవులకు ఆనందం కలుగుతుంది. ఎవ్వరైనను మనుష్యులు భూమిమీద చిలుకను పెంచుదురు గాని కాకిని(కాకము - కాకి, వాయసము.) పెంచరు. అట్లే, ప్రభువులు ఒక రసజ్ఞుని(పండితుని) పోషించిన విధముగా మూర్ఖుని తనఇంటిలో నుంచి కొనరుగదా.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
హరివాసరము(వాసరము - దినము) - ఏకాదశి. 

వాచస్పతిస్తథా మిథ్యావక్తా చేద్దానవాన్ప్రతి |
కః సత్యవక్తా సంసారే భవిష్యతి గృహాశ్రమీ ||

చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు,(సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).

దిదీవి - 1.అన్నము, 2.బృహస్పతి, 3.సర్గము, దేవలోకము.
అన్నము -
కూడు, బువ్వ, విణ. తినబడినది. కూడు బెట్టిన వానిని - కూలద్రోయకు.

అన్నదానాత్పరం దానం నభూతం న భవిష్యతి|
నాత్ర పాత్ర పరీక్షా స్స్యాన్న కాలనియమః క్వచిత్||
తా.
అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. ఇది అందరూ(తరతరముగా), అందరికీ అన్నివేళలా చెయ్యదగిన ఉత్తమోత్తమ దానం.

దిషణుఁడు - బృహస్పతి.
దిష్ణ్యము -
1.ఇల్లు, సదనము 2.చోటు, తావు 3.బలము (బలము -1.సత్తువ, 2.సైన్యము), 4.నక్షత్రము.

ధామము - 1.ఇల్లు, 2.చోటు, 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము, 6.మేను, 7.పుట్టువు.
ధామనిధి - సూర్యుడు Sun.

తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య(బృహస్పతి సతి తార, ప్రకృతి కళవల్ల పుట్టిన స్త్రీ), 3.వాలిభార్య(కిష్కింధాచలము నందు దేవిస్థానం తార).
తారాపతి -
చంద్రుడు. తారాచంద్రుల విలాసములతో...….

వ్రతినీ మేనకాదేవి బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ,
ఏకాక్షరపరా తారా భవ బంధ వినాశినీ.

ముక్తాశుద్ధౌ చ తార స్స్యాత్ :
తార శబ్దము ముత్యముల నిర్దోషత్వమునకును, చకారమువలన నక్షత్రమునకును, అత్యుచ్చస్వరమునకును, కనుగుడ్డునకును పేరు.
తరంత్యనేనేతి తారః - దీనిచేత తరింతురు.
"తారో నామౌక్తికే శుద్ధే గురు సుగ్రీవ భార్యయోః, బౌద్ధదేవ్యాం స్తారా దౌరూప్యవర్ణ యోః, తారమత్యుచ్ఛ నిద్ధ్వనతరీ సంబంధయోస్త్రిషు"ఇతి శేషః.

తారాపథము - ఆకాశము. ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈవేళ.....

తారకము - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింప చేయునది.   
కనీనిక - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.చిటికెన వ్రేలు.
నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక. 
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.

ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా...
రమ్మని నీవైనా చెప్పరాదా... పాపను నాపైన జాలిలేదా..

బార్హ స్పత్య మానాబ్ధము - ఒక రాశి యందు బృహస్పతి నివసించి యుండు కాలము. (ఇది వింద్యపర్వతమున(కు) ఉత్తరమున వ్యవహారములో గలదు. సంవత్సరమునకు 361 దినములు).

గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ఏడాది(సంవత్సరం) వుంటాడు. వక్రగతిలో తప్ప మిగతా కాలమంతా ప్రజలకు మేలు కలిగించే శుభగ్రహం బృహస్పతి.

మౌఢ్యము - 1.మూఢ భావము, 2.గురు శుక్ర గ్రహముల అస్తమయము, శుభకార్య నిరోధము.
నిరోధము - 1.అడ్డు, 2.చేటు, సం.(భౌతి.) ఒకవస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).

6. శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). అంతశుద్ధికి శుక్రుడు.

శుక్రో దైత్యగురుః కావ్య ఉశనా భార్గవః కవిః :
శుక్లవర్ణత్వా చ్ఛుక్రః - శ్వేతవర్ణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేణ నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రుని రేతస్సు వలనఁ బుట్టినవాఁడు.  
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రాదానే - దేవతలకు దుఃఖము నిచ్చువాఁడు.
దైత్యగురుః ఉ-పు. - దైత్యులకు గురువు.
కవే రపత్యం కావ్యః - కవి యను ఋషికొడుకు.
వష్టి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః. స పు. వరకాంతౌ - అసురుల శ్రేయస్సు నిచ్ఛయించువాఁడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు.
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యముచేత వర్ణించువాఁడు. ఈ ఆరు శుక్రుని పేర్లు. 

సితిఁడు - శుక్రుడు, విణ.తెల్లనివాడు.
తెలిగాము -
శుక్రుడు.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషములేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మల్యము. 
తెల్ల - 1.ధవళము, 2.స్పస్టము. స్పష్టము - వెల్లడియైనది.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.

సుక్కురుఁడు - శుక్రుడు, శుక్రః.
చుక్క -
1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం. 1.శుక్రః, 2.చుక్రః.

పృషకము - 1.దుప్పి, 2.నీటిబొట్టు, విణ. బ్రహ్మబిందువుతో కూడినది.
దుప్పి -
పొడలుగల అడవిమృగము, చమూరువు.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం. (గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
బొట్టు - 1.తిలకము, 2.చుక్క, సున్న 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సఅం. 1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.

సోఁకుబొజ్జ - శుక్రుడు.
సోఁకు -
1.తగులు 2.గ్రహమావేశించు, వి.1.స్పర్శము, 2.రాక్షసుడు.
సోఁకుడు - 1.స్పర్శము 2.గ్రహావేశము 3.పిశాచము 4.రాక్షసుడు.
స్పర్శము - 1.తాకుడు 2.ఈవి 3.వ్యాధి(తెవులు, రోగము).
తాఁకుడు - తాకుట, సోకుడు, స్పర్శ.
ఈవి - 1.దానము, వితరణము 2.వరము(కోరిక, వరించుట) 3.బహుమానము, రూ.ఈగి.
వ్యాధి - తెవులు, రోగము(రోగము - వ్యాధి).
తెవులు - తెగులు; తెగులు - వ్యాధి, చీడ.
చీడ - పైరులను చెరిపెడి పురుగు.

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
బ్రహ్మ -
నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

భార్గవుఁడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు.
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి.

కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటికాకి.
కావ్యము -
కవికృత గ్రంథము, కవికల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కావ్యగుణములు - (అలం.) శ్లేష్మము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
కావ్యుఁడు - శుక్రుడు; కవిత్వము - కవిత. సుకవిత్వము రాజ్యము వంటిది.

ఒంటికంటిగాము - శుక్రుడు.
ఒంటి -
ఏకాకిత్వము, విణ.ఒకటి.

ఉశనుఁడు - శుక్రుడు, రూ.ఉశనసుడు.
ఉశీరము -
వట్టివేరు.

దాతృత్వం ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞతా|
అభ్యాసేన నలభ్యంతే చ త్వార స్సహజాగుణాః||
తా.
ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిగి తెలివిగానుండుట, యీనాలుగు తనతోఁ గూడఁ బుట్టు నవియే కాని నేర్చుకొనుటచే గలుగవు. - నీతిశాస్త్రము  

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింస చేయువాడు.
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.

అరి1 - 1.చక్రము, 2.చక్రాయుధము, 3.చక్రవాకపక్షి, 4.శత్రువు, 5.(జ్యోతి.) లగ్నమునుండి ఆరవస్థానము, 6.చండ్రచెట్టు.
అరి2 -
1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.
అరి3 - అవ్య. కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా.కల్లరి, నేర్పరి (కల్ల+అరి, నేర్పు+అరి). 

చక్రము - 1.శ్రీకృష్ణువి ఆయుధము, 2.బండికల్లు, రథచక్రము, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము(దేశము, ఉపద్రవము) 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.

చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము. చక్రధరము - పాము. చక్రధరుఁడు - విష్ణువు; చక్రపాణి - విష్ణువు.
రారాజు - 1.చక్రవర్తి, సార్వభౌముడు, 2.దుర్యోధనుడు, 3.చంద్రుడు.
చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు.
సార్వభౌముడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.

రథాంగము - 1.రథచక్రము, 2.చక్రవాకము.
బండికల్లు -
రథచక్రము. 

చందమామపులుగు - చకోరము.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు. వెన్నెల చూచి తృప్తి పొందునది.

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతవి కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁజేరవే
చలువగలట్టి వాడయినఁ(ౘ)జందురు నెంతయుఁగోరి, భాస్కరా.
తా. చంద్రుని యందలి వెన్నెల కాంతిని, ఆ కిరణముల చల్లదనమును, తాము అనుభవించుట కొరకు(భక్షించుటకు) ఎక్కువ ఆశక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే వివేకము కలవారు రాజు మంచివాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను సంతోషముతో నట్టిరాజునే కోరుదురు.

కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు కలది 2.కుమ్మరి.
కుమ్మర -
కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
ఘటికారుఁడు - కుమ్మరి.
నీఁడు - కుమ్మరివారి బిరుదు పేరు, రూ.నాయుడు (ఉదా. అంకినీడు), సం.నాయకః.
నాయఁకుఁడు - 1.అధిపతి, 2.పన్నిద్దరు భటుల కధిపతి, సం.నాయకః. 
నాయఁడు - 1.ప్రభువు, 2.బలిజలుమున్నగు వారి పట్టపు పేరు, వై. విణ. శ్రేష్ఠుడు, సం. నాయకః.

అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

మృత్పిండమేకో బహు భాండరూపం, సువర్ణమేకం బహు భూషణాని |
గోక్షీర మేకం బహు ధేనుజాతం, ఏకఃపరాత్మా బహు దేహవర్తీ ||
తా.
కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము(నగ, అలంకరణము) వేర్వేరు బంగార మొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే శరీరములు వేర్వేరు పరమాత్మ యొక్కటే. - నీతిశాస్త్రము

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.

రథాంగము - 1.రథచక్రము, 2.చక్రవాకము.
చక్రాంగము - 1.హంస, చక్రపక్షము 2.జక్కవ, చక్రవాకము.

ౙక్కవ - చక్రవాక పక్షి, రూ.జక్కువ.
ౙక్కవ గొంగ(శత్రువు) - చంద్రుడు.
ౙక్కవఱేఁడు - సూర్యుడు.

సనాభి - జ్ఞాతి, సమానుడు. 
స్వజనుఁడు -
తనవాడు, జ్ఞాతి.
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు.
అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు. 
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.  
తొలఁగుబావ - శత్రువు, దాయ.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
ప్రత్యర్థి - శత్రువు; విద్విషుఁడు - శత్రువు; అరాతి - శత్రువు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు).
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.  

అహితుఁడు - శత్రువు, విరోధి.
విరోధి -
1.పగవాడు, 2.ఇరువది మూడవ సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.  

వైరిణం నోవసేవేత సహాయం చైవ వైరిణః |
అధార్మికం తస్కరంచ తథైవ పరయోషితం ||
తా.
శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ, పరస్త్రీ, వీరలతో సహవాసము జేయరాదు. - నీతిశాస్త్రము 

అరిందముఁడు - 1.శత్రువుల నణచువాడు, 2.అరిషడ్వర్గమును గెలుచువాడు, వి.1.శివుడు, 2.ఒకానొక ఋషి.

అరి2 - 1.కప్పము, 2.అల్లెతాడు, 3.హద్దు, మర్యాద.
భాగధేయము - 1.భాగ్యము, 2.కప్పము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, ధనుస్సు (గణి.) గుణము.(Property)

సధర్మము - 1.సమానము, 2.ధర్మముతో కూడినది.

అరి3 - కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా. కల్లరి, నేర్పరి (కల్ల + అరి, నేర్పు+అరి).
కలవాడు - 1.ఆప్తుడు 2.ధనవంతుడు 3.శక్తుడు, శక్తి కలవాడు.
ఆప్తుడు - 1.బంధువు 2.స్నేహితుడు, చెలికాడు 3.యదార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

ఆప్తప్రత్యయితౌ సమౌ :
ఆప్నోతి రహస్య మిత్యాప్తః. ఆప్ ఌ వ్యాప్తౌ. రహస్యమును బొందువాఁడు.
పు.ప. త్రి. ప్రత్య విశ్వాసో స్య సంజాతః. ప్రత్యయితః. - విశ్వాసము ఇతని యందుఁ బుట్టును. ఈ రెండు ఆప్తుని పేర్లు.

సబంధుర్యోహి తేషుస్స్యా త్సపితాయస్తు పోషకః|
సఖాయత్ర విశ్వాసస్స భార్యాయత్ర నిర్వృతిః||
తా.
హితము గోరువాఁడే బంధువు, పోషించినవాఁడే తండ్రి, విశ్వాసము గలవాఁడే స్నేహితుఁడు, సుఖింపజేయునదే భార్య యగును. – నీతిశాస్త్రము

7. శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).

సురగురువునకు మీఁదై భా
స్కరసుతుఁ డిరు లక్షలను జగములకుఁ బీడల్
జరుపుచుఁ ద్రింశన్మాసము,
లరుదుగ నొక్కొక్కరాశి యందు వసించున్.
భా||
బృహస్పతి లేక గురుగ్రహము కన్న రెండు లక్షల యోజనాలకు పైన సూర్యుని కుమారుడైన శని(Saturn) తిరుగుతుంటాడు. ఇతడు ప్రతి రాశిలోను, ముప్పయి మాసాలు(30 months) చరిస్తాడు. ఈ ముప్పయి మాసాలలోనూ శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు. అందరికీ అశాంతినే కలిగిస్తాడు. 

తత ఉపరిష్టాద్యోజనలక్షద్వయాత్ ప్రతీయమానః శనైశ్చర ఏకైకస్మిన్ రాశౌ త్రింశన్ మాసాన్ విలంబమానః సర్వానేవానుపర్యేతి తావద్భిరనువత్సరైః ప్రాయేణ హి సర్వేషామ శాంతికరః.

సమౌ సౌరి శనైశ్చరౌ : (శనిమన్దౌ పఙ్గు కాళౌ ఛాయాపుత్రో సితో ర్కజః.)
సూరస్యాపత్యం సౌరిః - పా. సౌరో వా సూర్యుని కొడుకు.
శనైర్మందం చరతీతి శనైశ్చరః, చర గతిభక్షణయోః - మెల్లఁగా సంచరించు వాఁడు. (శనిః, మన్దః, పఙ్గుః, కాళః చాయాపుత్రః, అసితః, అర్కజః) ఏతాన్య పిశనైశ్చర నామాని. - ఈ రెండు శనైశ్చరుని పేర్లు.

సమవర్తి - యముడు, వ్యు.అందరి యెడ సమానముగ నుండువాడు.
యముఁడు -
1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః. 
శమనుఁడు - యముడు.
శమనము - శాంతి పథము, రూ.శామనము.
శామనము - 1.శమనము, 2.వధము.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యడగి యుండుట.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.  

సౌరి - 1.శని, 2.యముడు, వ్యు.సూర్యుని కుమారుడు.
సౌరికుడు -
కల్లమ్మువాడు. కబ్బిలి - కల్లమ్మువాడు, శౌండికుడు.
శౌండికుఁడు - కల్లు అమ్మువాడు.

శనైశ్చరుఁడు - శని, వ్యు.మెల్లగా నడుచువాడు.

(ౘ)చాయపట్టి(బిడ్ద) - శనైశ్చరుడు.
చాయ - 1.ఛాయ, 2.కాంతి, 3.సూర్యునిభార్య, 4.నీడ, 5.పోలిక, 6.రంగు, 7.వైపు, 8.జాడ, 9.సమీపము, 10.చక్కన, 11.(జీవ.) జీవ పదార్థము లకు సహజమైన రంగు నిచ్చు పదార్థములు (Pigment).
చాయమగఁడు - సూర్యుడు.

ఛాయ - 1.నీడ, ఛాయ 2.కాంతి, 3.రంగు, 4.ప్రతిబింబము, 5.సూర్యునిభార్య, 6.లంచము, 7.వరుస, 8.కొంచెము, 9.చీకటి(అంధకారము), (భౌతి.) ఒక కాంతి నిరోధకమైన వస్తువునకు వెనుకవైపున నుండు కాంతి విహీన చిత్రము, (Shadow).
రంగు - 1.ఛాయ, కాంతి 2.సొంపు, సం.రంగః.
ఛాయాపుత్త్రుఁడు - శని.

ఛాయాకరుఁడు - గొడుగు పట్టువాడు, విణ.నీడను కలుగచేయువాడు.

ఛాయా సూర్యప్రియా కాన్తిః ప్రతిబిమ్బ మనాతపః :
ఛాయా శబ్దము సూర్యుని పెండ్లామునకును, కాంతికిని, ప్రతి బింబమునకును, నీడకును పేరు. ఛ్యతి తాపాదికమితి ఛాయా. ఛోచ్ఛేదనే. - తాపము మొదలయిన దానిని బోమొత్తునది. "ఛాయా స్యాత్పాలనో త్కోచ స చ్ఛోభాకావ్యరీతి" ప్వితిశేషః.

ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలము, వి.(భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).

ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః |
కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్ |

నీలము - 1.నీలిచెట్టు, Indigo plant, 2.నలుపు, 3.నల్లరాయి. నీలము - ఒక విలువ గల రత్నము,(Sapphire). (ఇది రాసాయనికముగ ఎల్యూమినియమ్ ఆక్సైడ్ (Corundum). దీని నీలిరంగునకు కారణము అందులో అతిసూక్ష్మరాశిగా నుండు క్రోమియమ్ ఆక్సైడ్).
ఇంద్రనీలము - నీలమణి; కప్పుఱాయి - నీలమణి.
నీలలోహితము - (రసా.) బచ్చలి పండు రంగు గలది (Purple).
నీలలోహితుఁడు - శివుడు.

శ్యామలము - నలుపు, విణ. నల్లనిది.
(ౘ)చామనము -
శ్యామలము, నల్లనిది.
చామ - 1.యౌవనవతి, 2.నలుపు(నీలిమ - నలుపు), 3.ఒక జాతి పైరు, సం. శ్యామా, 2.శ్యామాకః.
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ 5.కాళికాదేవి, వికృ.చామ.
శ్యామల - పార్వతి, విణ. నల్లనిది. 

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ,
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః.

నీలాంబరుఁడు - 1.బలరాముడు 2.నైరృతి, 3.శని.
నీలాబ్జము -
నల్లకలువ.;ఉత్పలము - కలువ, నల్లకలువ.
ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలి తామర.
అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.

ఉత్పలము - కలువ, నల్లకలువ.
కలువ -
ఉత్పలము, రూ.కల్వ, స.కైరవమ్.
కలువ కంటి - కలువరేకుల వంటి కన్నులు గల స్త్రీ.
కలువరాయుడు - చందమామ. ఆకాశమున చంద్రుని జూచి కలువలు వికసించును.
కువలయము - 1.భూమండలము 2.నల్లకలువ, రూ.కువలము.
కువలేశయము - తామరపువ్వు, వ్యు.నీటియం దుండునది.
కువలేశుఁడు - విష్ణుమూర్తి.

ఛాయాపుత్త్రాయ శర్వాయ శరతూణీరధారిణే,
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః.

అసితుఁడు - నల్లనివాడు, వి. 1.శనైశ్చరుడు, 2.దేవలుడు అను ముని.
అసితము -
నల్లనిది, వి.నలుపు Black, నీలవర్ణము Blue.
శనైశ్చరుఁడు - శని, వ్యు.మెల్లగా నడుచువాడు.
దేవలుఁడు - తంబళవాడు, నంబివాడు, పూజారి.
పూజారి - పూజచేయువాడు, అర్చకుడు.
తంబళ - శివార్చన చేసి బ్రతికెడు ఒక జాతి.
నంబి - విష్ణు పూజకుడు.

నంబెరుమాళ్ళు - శ్రీరంగనాయకుడు.
రంగఁడు -
1.శ్రీరంగడు, 2.నంబెరుమాళ్ళు.
సిరంగఁడు - శ్రీరంగనాథుడు, సం.శ్రీరంగః.
సిరంగము - శ్రీరంగము.
రంగము - 1.సత్తు, 2.యుద్ధభూమి, 3.నాట్యస్థానము, 4.శ్రీరంగము, 5.రంగు.
రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.

సత్తు - సత్త్వము, సత్యము, సారము, వి.సీసము (మహాబలము – సీసము, Lead), సం.విణ, (సత్) ఉన్నది, 1.చదువరి, 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
సత్త్వము -1.సత్త, బలము 2.స్వభావము 3.ఒక గుణము 4.జంతువు. సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము. సారము - 1.జవము, 2.ధనము, 3.న్యాయము, 4.బలిమి, 5.చేప, 6.మూలగ, విణ.శ్రేష్ఠము, వి.(గృహ.) ఫలత్వము, 7.ఫలించుశక్తి (Fertility).

సాధు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
సమము - 1.సమానము, 2.సాధువు.
సమవర్తి - యముడు, వ్యు.అందరి యెడ సమానముగనుండువాడు.

కుమ్మర పురుగు - అడుసు నందు తిరియు అడుసునంటుకొనక చరించు పురుగు, మట్టిపురుగు.
కుమ్మరి పురుగు - కీటకము, కుదురులేనిది, సాధువు.
కీఁచుఱాయి - 1.కుమ్మరి పురుగు, 2.ఇలకోడి, ఈలపురుగు.
ఉరిడె - 1.కుమ్మరి పురుగు, 2.ఊరు మూలదేశము.
యమకీటకము - కుమ్మరి పురుగు. రొంపిలో కుమ్మరి పురుగు మెలగినను దాని దేహమునకు బురద అంటు కొనక అట్లే యుండును.

ఆయోధము - 1.యుద్ధము, 2.యుద్ధభూమి, 3.వధము, చంపుట.
యుద్ధము -
1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము. పొలికలను - యుద్ధభూమి.

మందుఁడు - శని, విణ.1.అల్పుడు, 2.మూర్ఖుడు, 3.వ్యాధిగ్రస్తుడు.
ధీహరుఁడు - మందుడు. (ధీ - బుద్ధి; హరుఁడు - శివుడు.)
అల్పుఁడు - నీచుడు; నీచుఁడు - అధముడు, రూ.నీచు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు.
పామరుఁడు - 1.మూర్ఖుడు, అజ్ఞుడు, 2.నీచుడు.
అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.

నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.
నొప్పి -
1.బాధ, 2.ఆపద.
ఆపద - విపత్తు(విపత్తు - ఆపద), ఇడుమ.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.

మన్దస్తు తున్ద పరిమృజ ఆలస్య శ్శీతకో అలసో అనుష్ణః :
ఆలస్యేన మందతే - స్వపితీవేతి మందః. మది స్తుత్యాదౌ. - ఆలస్యము చేత నిద్రపోవువానివలె నుండువాఁడు.
పునః పునస్తుందం పరిమార్ష్టీతి తుందపరిమృజః. మృజూ శుద్ధౌ. - పలుమాఱు కడుపు నిమురుకొనువాఁడు.
నలసతీ త్యలసః అలస ఏవాలస్యః - ప్రకాశించువాఁడు కాఁడు గనుక అలసుఁడు, అలసుఁడే ఆలస్యుఁడు.
శీతం మందం కరోతీతి శీతకః - మందముగా కార్యమును జేయువాఁడు.
అలసః ఉక్తః. నవిద్యతే ఉష్ణం తేజో అస్యేతి అనుష్ట్ణః - ప్రకాశము లేనివాడు. ఈ ఆరు అలసుని పేర్లు.

మన్దాయ మన్దచేష్టాయ మహనీయగుణాత్మనే,
మర్త్యపావన పాదాయ మహేశాయ నమోనమః.

మసలిక - మాంద్యము, విణ.అలసము.
మాంద్యము - 1.ఆలస్యము, 2.జాడ్యము.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త(అజాగ్రత్త కొంచెమైన కీడు అధికము) 3.జాగు.
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము. (ౙ)జాగు - ఆలస్యము.
అలసము - 1.మందమైనది, సోమరి, 2.శ్రమచెందినది, వి.1.బురదలో తిరుగుటచే కాలివ్రేళ్ళనడుమ వచ్చు పుండు, బురదపుండు, 2.ఒకరకపు అజీర్ణవ్యాధి, 2.విషముగల ఎలుక.
జడత్వము - (భౌతి.) విశ్రాంతిస్థితిలో గాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.

సుస్తి - 1.సోమరితనము 2.జబ్బు, సం.అస్వాస్థ్యం.
బయ్యఁడు - మందుడు. ౙబ్బు - అలసము, వి.రోగము.
నచ్చుకాఁడు - అలసుడు, బాధకుడు. సోమరి - అలసుడు, మందుడు. అలు(ౘ)చు - అలసుడు, సోమరి, అలసః.
అలసుఁడు - సోమరి, చురుకుదనము లేనివాడు.

జాడ్యంధియో హరతినిఞ్చతివాచి సత్యం, మానోన్నతిం
దిశతిపాపమపాకరోతి | చేతః ప్రసాదయతి దిక్షుతనోతి
కీర్తిం, సత్సంగతిః కథయ కిం నకరోతి పుంసాం ||
తా.
సత్సాంగత్యము బుద్ధి జాడ్యమును బోగొట్టును, వాక్కునందు సత్యము గలుగఁజేయును, గౌరవమునిచ్చును, పాపములబోగొట్టును, మనస్సును స్వచ్ఛముగాజేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింప జేయును, మఱియు నెట్టి శుభముల నైనను గలుగజేయును. – నీతిశాస్త్రము

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్|
నిర్మోహత్వే నిశ్చలత్తత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. - భజగోవిందం

పంగువు - శని, విణ.కుంటివాడు.
ఖోడుఁడు -
శనిగ్రహము, విణ.కుంటివాడు.
కుంటిగాము - శనిగ్రహము.
శ్రోణుడు - పిచ్చుకకుంటు, కుంటివాడు.
కుంటి - 1.కాలు విరిగినవాడు, ఖంజుడు, 2.పుట్టుకతో కాలుచెడినవాడు, పంగువు.
ఖంజము - ఒక కాలు కుంటియైంది.
ఖంజ - కుంటిది, వి.1.పసుపు, 2.దూది. 

ఈ లోకంబునఁ బూర్వము,
నాలుగు పాదముల నీవు నడతువు నేఁడా
శ్రీలలనేశుఁడు లేమిని,
గాలముచే నీకు నొంటి కాలయ్యెఁ గదే!
భా||
ధర్మదేవతాస్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈ నాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేనందువల్లనే కదా కాలప్రభావానికి లోబడిన నీవు ఒంటి కాలితో నడుస్తున్నావు ! 

అర్కజుఁడు - 1.శని, 2.యముడు.
అర్కుఁడు -
1.సూర్యుడు, 2.ఇంద్రుడు.
అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు, (కావుననీ వ్యవహారము)
అర్కము - 1.జిల్లేడు, 2.రాగి, 3.(రసా.) ఒక ద్రవ్యమునుండి స్వేదనముచే గాని ద్రావణముచేగాని లాగబడిన అంశము (Extract). జిల్లెడు - అర్కవృక్షము, రూ.జిల్లేడు.

ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను
అంటనియ్యక శని వెంట దిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వ.
తా||
ఎన్నిచోట్ల తిరిగి యెన్ని కష్టములుబడినను, లాభము కలుగనీయక శని(Saturn) వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైన తినువారు క్రొత్తవారు కాదు గదా.

కప్పుమేనిగాము - శనిగ్రహము.
కప్పువేల్పు -
కరివెల్పు, కృష్ణుఁడు, విష్ణువు.
కప్పు - 1.ఆచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు, 4.చీకటి, క్రి.1.క్రమ్ము, 2.మూయు.
ఆచ్ఛాదనము - 1.కప్పుట, 2.వస్త్రము (బట్ట, వలువ).
క్రమ్ము - 1.కవియు, వ్యాపించు, 2.పైకుబుకు.
కప్పుఁదెరువరి - అగ్ని.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.

హీనాంగా నతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయౌధికాన్ |
రూపద్రవ్య విహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షిపేత్ ||
తా.
కుఱచగల నిడుపులైన చేతులు, కాళ్ళు మొదలయిన అవయములుగల వారలను, విద్యావిహీనులను, వయసుచేత పెద్దనైన వారలను, సౌందర్యము(చక్కదనము), ద్రవ్యము(ధనము, వస్తువు), జాతి వీనిచే దక్కువైనవారలను ఆక్షేపింపఁగూడదు. - నీతిశాస్త్రము

కళత్రము - 1.పెండ్లాము, 2.కోట, 3.నితంబము, (జ్యోతి.) లగ్నము నకు ఏడవస్థానము. (లగ్నము - మేషాదిరాసుల ఉదయము, విణ.తగులుకొన్నది.)
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
కోట - 1.దుర్గపురము, 2.పట్టణము, చుట్టుగల ప్రహరి, సం.కోటః.
కోట్టము - దుర్గపురము, కోట. దుర్గము - కోట.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాననగరము.
నగరము - పట్టణము, రూ.నగరి.
నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు.  

అమృతం సద్గుణాభార్యా అమృతం బాలభాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మానభోజనమ్||
తా.
గుణవతియైన యాలు(స్త్రీ, భార్య), బాలుని ముద్దుమాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము

ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని, 4.కర్ణుడు, కుంతి పెద్దకొడుకు, 5.సుగ్రీవుడు.
ప్రొద్దు - 1.సూర్యుడు(Sun), 2.కాలము, 3.దినము Day, సం.బ్రధృః. యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలము1 - 1.సమయము 2.నలుపు 3.చావు, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము(Time).

కాలాంతకుఁడు - శివుడు, (వ్యవ.) అసాధ్యుడు.
గడుసరి -
1.అసాధ్యుడు, 2.కఠినుడు, 3.దుష్టుడు.
కఠోరుఁడు - కఠినుడు.
దుర్జనుఁడు - దుష్టుడు; దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్డజాతి.
కాలసర్పము - కృష్ణసర్పము, నల్లత్రాచు.
కృష్ణసర్పము - నల్లత్రాచు.

క్రోడుఁడు - శనిగ్రహము.
కోణుఁడు -
 శని.
క్రూరదృషి -
1.అంగారకుడు, 2.శని, విణ.క్రూరదృషికలవాడు.
క్రూరదృక్కు - 1.పిశునుడు, లోభి(లోభికి ఖర్చు ఎక్కువ), 2.శని, 3.అంగారకుడు, 4.రాహువు, విణ.క్రూరదృష్టి కలవాడు.

తమస్తు రాహుస్స్యర్భాను స్సైంహికేయో విధుంతుదః :
సూర్యాచంద్రమసౌ అనేన తామ్యత ఇతి తమః. అ. పు. తము గ్లానౌ - ఇతనిచేత సూర్యచంద్రులు వ్యథను బొందుదురు.
ప. తమస్కారిత్వాత్తమః. స. స. - తమస్సును జేయువాఁడు.
తమ ఆకృతి రస్య తమః - స. న. - చీఁకటి రూపముగా గలవాఁడు.
రహతి భుక్త్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః. ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు.
స్వః స్వర్గే భాతీతిస్వర్భానుః. ఉ. పు. భాదీప్తౌ - స్వర్గమునందు ప్రకాశించువాడు.
సింహికాయాః అపత్యం సైంహికేయః - సింహిక హిరణ్యకశిపుని చెల్లెలు, ఆమె కొడుకు.
విధు తుదతీతి విధుంతుదః, తుద వ్యథనే - విదు వనఁగా చంద్రుఁడు వానిని వ్యథఁ బెట్టువాఁడు - ఈ నాలుగు రాహువు పేర్లు. (కేతుః. శిఖి, రెండు కేతువు పేర్లు.) 

విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనత్ |
రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వం య ఉపాగతః | 

8. రాహువు - ఒక చాయాగ్రహము, దలగాము.(Shadowy Planet)

ముండుఁడు - రాహుగ్రహము, విణ.తెగిన కాళ్ళు చేతులు కలవాడు.
ముండము -
తల.
తలగాము - రాహువు.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ. మొదలు.
గాము - 1.సూర్యాది గ్రహము 2.పిశాచము, సం.గ్రహః.

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

తమస్సు - తమము.
తమము -
1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
శోకము - దుఃఖముచే తపించుట, వగపు(శోకము).
అంధకరిపుఁడు(రిపువు - శత్రువు) - శివుడు.
చీఁకటిగాము - రాహువు.
గాము - 1.సూర్యాదిగ్రహము, 2.పిశాచము, సం.గ్రహః. 
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు. చీకటికి శత్రువు.

స్వర్భానుఁడు - రాహువు.
భయానకము - 1.పులి, 2.రాహువు, 3.భయానకరసము.
పృదాకువు -
1.పులి, 2.పాము, 3.తేలు.
పులి - 1.నల్లని, 2.పులిసినది, వి.శార్దూలము.
శార్దూలము - పులి. వ్యాఘ్రము - వేగి, పులి.

ఆధిభౌతికము - వ్యాఘ్ర సర్పాది భూతముల వలన కలిగినది. (ఇది తాపత్రయములలో ఒకటి).

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్రవము. 
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

వృశ్చికము - 1.తేలు(పొట్టియ - తేలు), 2.వృశ్చికరాశి.
తేలు -
1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.

వృశ్చికస్య విషంపుచ్ఛం మక్షికస్య విషంశిరః|
తక్షకస్య విషం దంష్ట్రః, సర్వాంగం దుర్జనేవిషమ్||
తా.
తేలునకు తోకయందును, ఈఁగకు శిరస్సునందును, పామునకు కోఱలయందును, దుర్జనునకు సర్వాంగములందును విషముండును. - నీతిశాస్త్రము

అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృత్రాసురుడు.
పాము -
1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
అహిపతి - శేషుడు, వేయిపడగలు గల సర్పరాజు.
అహిభయము - 1.పాముల వలని భయము, 2.రాజులకు స్వపక్షము వారి వలని భయము.
అహిద్విషము - 1.నెమలి, 2.గ్రద్ద, 3.ముంగిస.
అహిద్విషుఁడు - 1.గరుడుడు, 2.ఇంద్రుడు.
అహిభుక్కు - 1.గరుడుడు, 2.ముంగిస, 3.నెమలి.
వృత్రహుఁడు - ఇంద్రుడు, వ్యు.వృత్రాసురుని చంపినవాడు.
అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.

అహి ర్వృత్రే పి :
అహిశబ్దము వృత్రాసురునికిని, అపిశబ్దమువలన పామునకును పేరు. హంతీ త్యహిః. పు. హన హింసాగత్యోః హింసించును గనుక అహి.
అంహతి లోకాన్ వ్యాప్నోతీతి అహిః. అహి గతౌ. వృత్రేయథా _ "ధృతం దనుష్ఖండ మివాహివిద్విష"ఇతి భారవిః. "సర్పే వృత్రాసురే ప్యహి"రితి రభసః.

కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము, దురాచారుడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు -
అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
దురాచారుడు - చెడునడవడి కలవాడు.

ఖరువు - 1.గుఱ్ఱము, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము(రదనము - దంతము), 5.భర్తను వరించు కన్య, విణ.దురాచారుడు, 2.క్రూరము.

దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా.
అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయ(కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము

జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః. - భజగోవిందం

విధుంతుదుఁడు - రాహుగ్రహము.
గ్రహ కల్లోలము -
రాహుగ్రహము.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.

ముండుఁడు - రాహుగ్రహము, విణ.తెగినకాళ్ళు చేతులు కలవాడు. మొండెపుగాము - రాహువు.
మొండి -
1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.

కబంధము - 1.జలము, 2.మొండెము, 3.సముద్రము.
జలము -
1.నీరు, 2.జడము 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, Urine సం.నీరమ్.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.

మొండెము - తలతెగిన కళేబరము, కబంధము, సం.వి.ముండమ్, (గృహ.) భుజము క్రింది తుంటిపై భాగము, కభంధము, ఊర్థ్వకాయము (Trunk).

జడధి - సముద్రము. సముద్రము - సాగరము.

కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కనుఁడు -
కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్.

9. కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము -
1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు. 
కూచి - 1.యుద్ధయాత్రకై వాద్యము మ్రోగించుట, 2.ఆడుది(స్త్రీ - ఆడుది), విణ.1.వాడియైనది, 2.వికసించినది.

గ్రహభేదే ధ్వజే కేతుః :
కేతుశబ్దము కేతుగ్రహమునకును, టెక్కెమునకును పేరు. కిత్యతే అనేనేతి కేతుః. కిత జ్ఞానే. - దీనెచేత నెఱుఁగబడును. కేతుశబ్దము కాంత్యుత్పాత చిహ్నములకును పేరు. "పతాకాయాం ద్యుతౌ కేతుః గ్రహోత్పాతాది లక్ష్మసు" అనె రుద్రుఁడు.

నవమగ్రహక స్సింహికాసురీగర్భసంభవః,
మహాభీతికర శ్చిత్రవర్ణో వా పిఙ్గలాక్షకః|

గుఱుతు - 1.చిహ్నము, 2.మేర, 3.కీర్తి, 4.పరిమితి, 5.స్థానము, 6.విధము, 7.మచ్చ(కళంకము - మచ్చ), 8.సాక్షి, రూ.గుర్తు.
చిహ్నము - 1.గురుతు, 2.టెక్కెము.
చిన్నియ - 1.చిహ్నము, గురుతు, 2.విలాసము, రూ.చిన్నె.
చెన్నె - చిన్నియ యొక్క రూపాంతరము
చిన్నెలాఁడు - విలాసవంతుడు.
చిన్నెలాడి - విలాసవతి.

లక్ష్మము - 1.చిహ్నము, 2.మచ్చ, 3.ముఖ్యము.

మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
కీర్తి-1.యశస్సు, (వికృ.) కీరితి, 2.పేరు, 3.తేట, 4.అడుసు, 5.విరివి. విరివి - విస్తృతి, విణ.విస్తృయము, వెడల్పైనది.
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
విధము - ప్రకారము, విధి.
మచ్చ - 1.గాయపుగుర్తు, 2.పుట్టుమచ్చ(కాలకము - పుట్టుమచ్చ).
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.

గండము - 1.ఏనుగు చెక్కిలి, 2.ఖడ్గమృగము, 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి(కపోలము - చెక్కిలి), 6.ప్రాణాపాయము.
అపమృత్యువు -
1.అకస్మాత్తుగా కలిగిన చావు, 2.గండము.

గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము(కటిక మెకము - ఖడ్గమృగము), 3.పులిగోరు పదకము, 4.చేపపిల్ల, 5.ఒక సంఖ్య.

అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
లలామము -
1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొట్టు, 5.తోక, 6.గుఱ్ఱము (ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).

ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
టెక్కెము -
టెక్కియము.
టెక్కియము - జండా(జెండా - టెక్కెము), రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము(Ketu), 2.మిత్తిచూలు.
కంబము -
గుంజ, సం.స్కంభః.
గుంజ - 1.గురివెంద తీగ, 2.తప్పెట, 3.కల్లు దుకాణము, 4.అవ్యక్త మధుర ధ్వని, 5.ఉప్పళము(ఉప్పళము - ఉప్పు పండు నేల).
గరువము - 1.గర్వము, 2.గొప్పతనము, విణ.1.విస్తృతము, 2.పెద్దది, సం.గౌరవమ్.
కంబమయ్య - కంబము,(స్తంభము)నందు ఉద్భవించిన నృసింహస్వామి.

కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెము -
టెక్కియము.
టెక్కియము - జండా(జెండా - టెక్కెము), రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.

మిత్తి (ౘ)చూలు - కేతువు.
మిత్తి -
1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః 2.మితిః.
మిత్తిగొంగ - మృత్యుంజయుడు, శివుడు. 

తోఁక - తొంక; పుచ్ఛము - తోక.
తొంక -
పుచ్ఛము, వ్యు.తొంగునది, వంగియుండునది, రూ.తోఁక.
పుచ్ఛసంబంధి - (జం.) తోకకు సంబంధించినది (Caudal).
వాలము - 1.తోక, 2.కత్తి.

అగ్న్యుత్పాతౌ ధూమకేతూ -
ధూమకేతుశబ్దము అగ్నికి, ఉత్పాతమునకును పేరు. ధూమః కేతు శ్చిహ్నమస్యేతి, ధూమప్రధానం కేతు రుత్పాత ఇతి చ ధూమ-కేతుః - ధుమము చిహ్నముగాఁ గలవాఁడు గనుకను, ధూమప్రధానమైన యుత్పాతము గనుకను ధూమకేతువు.

ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.
దుమగతికేతు -
ధూమకేతువు, అరిష్ట సూచకమగు తోకచుక్క.
తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో,) సూర్యునిచుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగుచున్న తోక గలిగిన ఒక గ్రహము, (Comet).
ఉత్పాతము - 1.ఉల్కాపాతము మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
అజన్యము - ఉత్పాతము, విణ.జన్యము కానిది.
ఉపప్లవము - 1.ఉత్పాతము, 2.ఉపద్రవము, 2.నీటిపై తేలుట.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.  
ఉల్కశ్మలోహము - (రసా.) ఆకాశమునుండి అప్పుడప్పుడు భూతలము పైబడు ఉల్కలలో నుండు ఇనుము (Meteoric iron).
ఉల్క - 1.కొఱివికట్టె, 2.కాగడా, 3.ఆకాశమునుండి పడు తేజపుంజము, 4.అగ్ని కణము (Meteor).
మిడుఁగు - అగ్నికణము; విస్ఫులింగము - అగ్నికణము. 

ఆపద - విపత్తు(విపత్తు - ఆపద), ఇడుమ.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి, కలుగుట, 3.(తర్క) అయథార్థజ్ఞానము.

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని -
1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.   

అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు.

యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
నక్షత్రాణివా అపామాయతనం, ఆయతనవాన్ భవతి,
యో నక్షత్రాణామాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
ఆపోవై నక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి, య యేవ వేద.
  తా. జలాలకును నక్షత్రాలే స్థానం. ఆ నక్షత్రాల స్థితిని తెలుసుకుని నక్షత్రాలకు జలమే(ఉదకము) స్థానమని గ్రహించినవారు ముక్తిని పొందుతారు. - మంత్రపుష్పం     

LordVishnu