Wednesday, March 15, 2017

కన్యారాశి

ఉత్తర 3, హస్త 4, చిత్త 2 పాదములు కన్యరాశి.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః. - బుధుడు

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.    
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహ్ణాతి పురు షేణార్జితం ధనమితి గృహం, గేహం చ, గ్రహ ఉపాదనే. - పురుషునిచే సంపాదింపఁబడిన ధనమును గ్రహించునది.

బృందము - సమూహము.
బృందారకుఁడు -
వేలుపు, విన.మనోజ్ఞుడు.

కన్య - 1.పెండ్లి కాని పడుచు, 2.కన్యారాశి, వి.కన్నియ.
కన్నియ -
పెండ్లి కాని పడుచు, సం.కన్యా.
అనూఢ - పండ్లి కాని పడుచు.

కన్యాకుమారీ :
కన్యతే కామ్యత ఇతి కన్యా. కన దీప్తికాంతిగతిషు - కోరఁబడునది.
కుమారయతి క్రీడయతీతి కుమారీ, సీ. కుమార క్రీడాయాం - క్రీడించునది.
కుత్సితో మారో స్యా ఇతి కుమారీ - మన్మథుని(మారుఁడు - మన్మథుడు)ని దిరస్కరించునది. ఈ మూడు మొదటివయస్సున నున్న పెండ్లికాని పడుచు పేర్లు.

కుమారి - 1.కూతురు, 2.పెండ్లికాని ఎనిమిదేండ్ల పడుచు, 3.పార్వతి.
కూకువు - ఎనిమిదేండ్లవరకు పెండ్లి కాని పడుచు. మయాపురి యందు దేవిస్థానం కుమారి|

పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.  
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. 
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|

కౌమారి - 1.పార్వతి, 2.బ్రహ్మచర్య వ్రతమున నుండువానిని పెండ్లి యాడిన స్త్రీ, 3.సప్త మాతృకలలో ఒకతె.

కొమారి - కూతురు, సం.కుమారీ. 
కొమరె - కుమారి, యౌవనము గల స్త్రీ.

కన్యాకుమారి : కన్యాకుమారి దేవాలయము, బంగాళాఖాతము - అరేబియా సముద్రము - హిందూమహాసముద్రములు కలియుచోటు.

పంచ కన్యలు :
అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా|
పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్||

కౌమారము - మూడవ యేడు మొదలు పదునారేండ్ల (3-16)వరకునైన ప్రాయము.
మధ్య - పదుమూడేండ్ల నుండి పదునెనిమిది(13-18)వరకు వయస్సు గల కన్య. 
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
యౌవతము - యువతీ సమూహము.    

పితారక్షతి కౌమారే - భర్తారక్షతి యౌవనే|
రక్షంతి వార్ధ కేపుత్త్రా - న స్త్రీస్వాతంత్ర్య మర్హతి||

తా. స్త్రీలను బాల్యమందు తండ్రియు(పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.), యౌవన మందు భర్త - మగడు, విణ.ప్రోచువాడు., వార్థకము - వృద్ధత్వము)ముదిమి యందు కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.)లును రక్షింతురు. కాబట్టి యొక కాలమందు ను స్త్రీలకు స్వాతంత్ర్యము లేదు. – నీతిశాస్త్రము

పుత్త్రుడు - కొడుకు, పున్నమ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండ్రుగురు; ఔరసుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, సౌవర్చవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు). 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.

కైలాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ|
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా(అ)న్నపూర్నేశ్వరీ. - 4

వరద - 1.పెండ్లి కాని పడుచు, 2.దుర్గ, వై.వి. వెల్లువ, సం.ప్రవాహ్.

దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ -
దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుఃఖేన గంతుం శక్యతే దుర్గా - కష్టముచే నెఱుగఁ దగినది.
దుర్గం వనగిరిరూప మావాసోయ స్యా స్సా – వనాది దుర్గము స్థానముగాఁ గలది.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.  

వరదుఁడు - 1.సమర్థకుడు, 2.మిగులదయాళువు.

వెల్లువ - 1.వరద, అధికప్రవాహము, 2.సేన, దండు, విణ.అధికము.
వఱద - వెల్లువ, నీటికాలువ.
వరూధిని - దండు, సేన.

సుప్రతీప స్సుతామ్రాక్ష స్సుబ్రహ్మణ్య స్సుఖప్రదః,
వక్ర స్తంభాదిగమనో వరేణ్యో వరద స్సుఖీ|

ప్రవాహము - 1.వెల్లువ, 2.పరంపర, వి.(భౌతి.) ప్రవహించునది (Current).
వెల్లువ - 1.వరద, అధికప్రవాహము, 2.సేన, దండు, విణ.అధికము.
వఱద - వెల్లువ, నీటికాలువ.
వఱత - వెల్లువ, ఏరు, రూ.వఱద.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
వఱద కాలువలు - వర్షము వచ్చునప్పుడు మాత్రమే నిండి పొలములకు, నీటి నందజేయు కాలువలు. 

ప్రవాహస్తు ప్రవృత్తి స్స్యాత్ :
ప్రకర్షేవిచ్ఛేదేన వహతీతి ప్రవాహః వహ ప్రాపణే. - ఎడతెగక నడుచునది.
ప్రవర్తన ఇతి ప్రవృత్తిః సీ. వృతువర్తనే. - ప్రవర్తించునది. ఈ రెండు ఎడతెగక వచ్చు జలాదుల పరంపర పేర్లు.

ప్రవృత్తి - 1.నడక, 2.ప్రవేశము, 3.బ్రతుకుతెరువు.

నీటిపాఱుదల - మానవ ప్రయత్నము చేత కాలువల ద్వారా, ఉపనదుల ద్వారా సేద్యము కొరకు నీటిని పొలమున కందచేయుట. 
నీటివాలు - (భౌతి.) నీరు ఎత్తునుండి పల్లమునకు పారు వైఖరి.

ప్రవాహి - (రసా.) ప్రవహించు స్వభావము గల ద్రవ్యము, చలన స్వేచ్ఛ గల అణువులు కూర్పు అయిన ద్రవ్యము (Fluid), ఉదా. ద్రవములు, వాయువులు.
ప్రవాహిత - (భౌతి.) ఇటునటు చలించుటకు స్వేచ్ఛగల అనువులుగలిగి యుండుట (Fluidity).

వరదాభయకర వాసుకి భూషణ వనమాలాది విభూష శివ| 

యవ్వనం ఒక మహాప్రవాహం లాంటిది. దానికి సరైన ఆనకట్ట కట్టి నీటిని మళ్ళించినప్పుడే జీవితం ధన్యమౌతుంది. - శ్రీరామకృష్ణ పరమహంస 

శ్లో|| ప్రథమ శైలపుత్రీతి - ద్వితీయా బ్రహ్మచారిణీ
     తృతీయా చిన్న ఘంటేతి - కుష్మాండేతి చతుర్థకీ 
     పంచమాస్కందమాతేతి - షష్ఠా కాత్యాయినీతిచ
     సప్తమా కాళరాత్రీ చ - అష్టమాచాతి భైరవీ
     నవమా సర్వసిద్ధిశ్చాత్ - నవదుర్గా ప్రకీర్తితాః|

ఆర్య - 1.పదునారెండ్ల 16సం. కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద.) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట.) నటుడు భార్యను పిల్చునపుడు వాడెడు మాట.
ఆర్యాణి - 1.పూజ్యురాలు, 2.పార్వతి.
శ్రేష్ఠత్వా దార్యా - శ్రేష్ఠురాలు.   

గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమ శ్శాప్తబలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్థితః
విద్యావస్తు సమృద్ధి రిత్యఖిలసామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రయ! దేవ! మామక మనోదుర్గే నివాసం కురు || - 42శ్లో
తా.
దుర్గకు అత్యంత ప్రియుడైన స్వామీ! గాంభీర్య కందకంతో, ధైర్యరూప ప్రాకారంతో, సద్గుణాలే హితాన్ని చేకూర్చే సేనగా దేహంలో వున్న ఇంద్రియాలే ద్వారాలుగా, జ్ఞానమే సర్వవస్తు సంపదగా వున్న నా మనో దుర్గంలో సదాశివ దేవా! సదా నివసించవయ్యా! - శివానందలహరి  

దుష్టదూరా దురాచార - శమనీ దోషవర్జితా|
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా. - 51శ్లో 

కన్యాకుమారి : కన్యాకుమారి దేవాలయము, బంగాళాఖాతము - అరేబియా సముద్రము - హిందూమహాసముద్రములు కలియుచోటు.

పంచ కన్యలు :
అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా|
పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్||

నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి
బాలార్కసదృశాకారే పూర్ణ చంద్రనిభాననే| 

కన్నె పాయపు సతికి కన్నెరాశి.....

పడుచురాశి - కన్యారాశి.
పడుచు -
1.కన్యక, 2.కన్నెరికముగాని వేశ్య.

రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
రూపుమాపు - క్రి.చంపు, నాశనమొనర్చు.    

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).

పిల్ల - 1.పక్షాదుల సంతతి, 2.పడుచు, విణ.చిన్నది, సం.పీలుకః.
కుణకము -
పిల్ల.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).

వాసువు - (నాట్యపరిభాషలో) బాలిక.
వసతి మాతృసమీపే వాసూః, ఊ-సీ, వస నివాసే. - తల్లిసమీపమున నుండునది. ఈ ఒకటి పిన్నపడుచు పేరు.

పోతవణిజుఁడు - ఓడ బేరగాడు.
పోతము - 1.పక్షిపిల్ల, 2.పదేండ్ల యేనుగు, 3.ఓడ.
పిల్లాకము - పక్షిపిల్ల; పీటకము - పక్షిపిల్ల.
బోద - పక్షిలోనగు వానిపిల్ల, పోతము, సం.పోతః.

కిశోరుఁడు - వేడివేలుపు (సూర్యుడు), విణ.యౌవనావస్థ కలవాడు.
కిశోరము - 1.గుఱ్ఱపు పిల్ల, 2.మృగాదుల పిల్ల.

బాలః కిశోరః, కశ గతిశాతనయోః. - శిక్షింపఁబడునది. ఈ ఒకటి గుఱ్ఱపుపిల్ల పేరు.
 
బాల - పదునా రేండ్లకు లోబడిన పిల్ల.
బాలాజీ - శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలా.

కిశోర న్యాయాలయము - (శాస.) యుక్తవయస్సు రాని బాలబాలికలు చేసిన నేరముల విచారించు స్థలము, బాల న్యాయస్థానము (Juvinial court).

కుంక - 1.బాలవిధవ, 2.రండ.
చత్వరిక - బాలవిధవ. 
రండ - విధవ; విధవ - పెనిమిటిలేనిది, అనాథ.
వితంతువు - విధవ, వ్యు.తంతువు (సూత్రము)లేనిది. అనాథ రక్షక గోవిందా|
కుంకటి - పిల్లకుట్టు, విణ.ప్రధానము, ఉదా, కుంకటివేరు = తల్లివేరు, రూ.కూఁకటి.
కూఁకటి - పిల్లజుట్టు, జుట్టు, విణ.1.ప్రధానము, 2.లేతది, సం.కూకటః.

అమ్మాయి - 1.బాలిక, చిన్నపిల్ల, 2.కూతురు.
అమ్మి -
1.అమ్మాయి, 2.నీచజాతి స్త్రీ, సం.అంబిః.

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు.

ఆఁడపీక - బాలిక, (భ)ద్రాచల ప్రాంతమున వాడుకలో ఉన్నది).
పోఱి - ఆడపిల్ల, బాలిక.

బలారిష్టము - పుట్టినది మొదలు 12 సంవత్సరముల లోపున బాలబాలిక లకు కలుగుకీడు, మరణము.

కొండిక - 1.చిన్నది, 2.అల్పము, వి.1.చిన్నవాడు, 2.బాలుడు, 3.బాలిక, సం.కుణకః.

చిన్నది-బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు). అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.  లే - (లేత) అల్పము, (వ్యాక.) లేత శబ్దమునకు మీదివర్ణము లోపింపగా మిగిలిన రూపము.
లేఁబ్రాయము - (లేత+ప్రాయము) బాల్యము.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.

వామనము - లేతది.
లేఁత -
1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.

చిన్నవాడు - బాలుడు.
బాలిశుడు -
1.మూర్ఖుడు, 2.బాలుడు. 

కుఱ - 1.కొడుకు, 2.బిడ్డ, 3.బాలుడు, రూ.కుఱఁడు.
బిడ్ద -
1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు Sun, రూ.ప్రసూనుడు.      

                                                                                                                 

కొదమ - పశుపక్ష్యాదుల పిల్ల, ఉదా.సింగపుఁ గొదమ, అంచకొదమ, తేటికొదమ మొ.వి, 2.ఆడుమేకపిల్ల, విణ.1యౌవనము తలచూపినది, 2.దృఢము, 3.లేతది. 

దృఢము - (భౌతి.) వంగనిది, చిన్న దెబ్బలకు వికారము చెందనిది, గట్టిది, (Rigid) ఉదా.దృఢవస్తువు (Rigid body).
దిట - 1.దార్ఢ్యము, సత్తువ, శక్తి, 2.ధైర్యము(ధీరత్వము), రూ.దిటము, దిటవు, సం.దృఢమ్.
దిట్ట - దార్ఢ్యము, శక్తి, విణ.దార్ఢ్యముకలవాడు, సం.దృఢః, ధృష్టః.
దిట్టఁడు - సమర్థుడు, 2.నేర్పరి, 3.ధైర్యము గలవాడు, సం.ధృష్టః.
దిట్టము -1.ధృఢము(దిటము - దృఢము), 2.నిర్ణయము(నిర్ణయము - ఏర్పాటు), సం.దృఢమ్.

సదాటు - ధృఢము.
తుటారము -
1.దిట్టతనము, 2.పురుషవచనము.
తుటారి - 1.దిట్టతనముగలది, 2.పారుష్యముగలది.

పోతవణిజుఁడు - ఓడ బేరగాడు.
పోతము - 1.పక్షిపిల్ల, 2.పదేండ్ల యేనుగు, 3.ఓడ.
పిల్లాకము - పక్షిపిల్ల; పీటకము - పక్షిపిల్ల.
బోద - పక్షిలోనగు వానిపిల్ల, పోతము, సం.పోతః.                         

అనీకము - 1.సేన, 2.సమూహము, 3.యుద్ధము.
అనీకిని - 1.సైన్యము, 2.అక్షౌణిలో పదియవపాలు.

సైన్యము - 1.సేనతోకూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరుగుఱ్ఱములో నొకటి.
ఆరక్షము -
రక్షించునది, వి.1.రక్షణము, 2.ఏనుగు కుంభస్థలముల క్రింది చోటు, 3.సైన్యము.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి. మహాసేనుఁడు - కుమారస్వామి. 

మొనకాఁడు - సేనాధిపతి, విణ.1.శూరుడు, 2.ముఖ్యుడు.
మొన - 1.అగ్రము, 2.దండు, 3.సేనాముఖము.  

సేన - దండు, విణ.అధికము, చాల.
వరూధిని -
దండు, సేన.
ధ్వజిని - సేన.
దండు - 1.దండము, 2.సేన, 3.గుంపు, సం.దండః.
దండము - నమస్కారము. నమస్సు - నమస్కారము.
నమస్కారము - మ్రొక్కు, రూ.నమస్క్రియ, నమస్కృతి.

రాణువ - 1.దండు, 2.పరివారము.
పరివారము -
1.దండు, 2.కత్తియొర, 3.పరిజనము.
మంది - 1.కాల్బలము, 2.జనసమూహము, 2.పరిజనము. 
పరిజనము - పరివారము.

సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group). 
గుంపు -
1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
నివహము - గుంపు.   

ధార - 1.నీటిచాలు, 2.ఆయుధముల వాదర, 3.చిల్లి, 4.అశ్వగతి విశేషము, 5.ప్రవాహము, 6.పరంపర.
దార - 1.ధార, 2.నీటిచాలు, 3.దానము, 4.క్రమము, సం.ధారా.
దార - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
ధారపోయు - క్రి.చేతనీరుగొని దత్తముచేయు.

దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విణ.చీల్చువాడు.  

బోడిక - 1.బాలకుడు, 2.సేవకుడు.

వఱ్ఱు - 1.ప్రవాహము, 2.అతిశయము.
అతిశయము -
ఆధిక్యము.
మెండు - 1.అధిక్యము, అతిశయము, 2.మిఱ్ఱు(మిఱ్ఱు- ఉన్నత భూమి). వలదు - అధిక్యము, అవ్య.వద్ధు.

పాఱు - 1.ప్రవహించు, 2.పరువెత్తు.
పాఱుఁడు - బ్రాహ్మణుడు; బ్రాహ్మణుడు - పారుడు.

పరంపర - 1.వరుస, 2.విడువక సాగునది, సం.వి.(గణి.) ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల గుంపు (Series). ఉదా.1,3,5,7,9.....
పవుఁజు(ౙ) - 1.వరుస, 2.శ్రేణి, 3.దండు.
వరుస - 1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
శ్రేణి - వరుస, (గణి.) ఒక దత్త న్యాయము ప్రకారము వ్రాయబడిన పదముల సముదాయము దత్తన్యాయము ననుసరించి వ్రాయబడిన రాసుల సముదాయము. (Progression)
బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship).

వంతు - 1.భాగము, 2.వరుస, 3.సామ్యము, 4.పోటీ.
భాగము -
1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
భాగము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.

క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.

నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు – ఆగస్ఠు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
నడి - నడుము అను శబ్దమునకు సమాసము నందు వచ్చు రూపము, ఉదా. 1.నడితల, 2.నడిరేయి, 2.మధ్యము, రూ.నడు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

ఉత్తర - 1.ఉత్తర ఫల్గునీ నక్షత్రము, 2.ఉత్తరదిక్కు, 3.విరటుని కూతురు.
ఉత్తరఫల్గుని -
పండ్రెండవ నక్షత్రము.

ఉత్తరుఁడు - శ్రేష్టుడు, 1.శివుడు, 2.విష్ణువు, 3.విరటుని కొడుకు.

నక్షత్రము - రిక్క, నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
రిక్క -
నక్షత్రము సం.ఋక్షమ్.
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్క రాయుడు.

ఉత్తరపక్షము - 1.సిద్ధాంతము (వ్యతి పూర్వ పక్షము, 2.కృష్ణపక్షము.
అపరపక్షము - బహుళ పక్షము, కృష్ణపక్షము.

ఉత్తరకృషి - (వ్యవ.) విత్తనములు చల్లిన తరువాతగాని, నాట్లు వేసిన తరువాతగాని చేయు గొప్పు త్రవ్వుట, కలుపుతీయుట మొ. పనులు.
గొప్పులు - 1.వరిమడిలోని చిన్న మెరక స్థలములు, 2.మిరపతోట మొ.వి యందు కొంచెము యెత్తుగా నుండెడిచోటు.
కలుపుతీయుట - (వ్యవ.) చేనిలో పెరిగిన కలుపుమొక్కలను తీసివేయుట (Weeding).
కలుపుమొక్కలు - (వ్యవ.) మడిలో సాగు చేయబడుచున్న మొ క్క లు గా క అచట బయలుదేరిన ఇతర జాతి మొక్కలు (Weeds).

ఉత్తరుఁడు - శ్రేష్టుడు, 1.శివుడు, 2.విష్ణువు, 3.విరటుని కొడుకు.

శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.

కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.  

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః ఉ-పు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.

ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
ఈష్టే ఈశః - ఐశ్వర్యయుక్తుఁడు, ఈశ ఐశ్వర్యే. 
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 3.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి. 

శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.
శంభుః ఉ-పు శం సుఖం భవ త్యస్మాత్ శంభుః - శ మ్మనఁగా సుఖము, అది యీయనవలనఁ గలుగుఁగాన శంభువు.
భూసత్తాయాం. శంప్రాప్తనానితి వా, పరమానంద రూపో నిత్యం విద్యత ఇత్యర్థః - సుఖరూపియై యుండువాడు. భూప్రాప్తా వాత్మనేపదీ.
శాంభవి - పార్వతి.

శంభూ బ్రహ్మ త్రిలోచనౌ,
శంభుశబ్దము బ్రహ్మకును, శివునికిని పేరు. శం సుఖం భవ త్యస్మాదితి శంభుః, భూ సత్తాయాం. - ఇతనివలన సుఖము గలుగును. టీ. స. విష్ణావపి శంభుశబ్ద ఇతి ఛంద్రః.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసుష్ఠుడు, మరీచి).  

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః ఉ-పు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.      

బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుద్ధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

తవా(ఆ)జ్ఞాచక్రస్థం - తపన శశికోటిద్యుతి ధరం
పరం శంభుం వందే - పరిమిళితపార్శ్వం పరచితా,
యమారాధ్యా న్భక్త్త్యా - రవిశశిశుచీనా మవిషయే
నిరాలోకే(అ)లోకే - నివసతి హి భాలోకభువనే| - 36శ్లో

తా. అమ్మా! భక్తితో నెవని నారాధించి సూర్యచంద్రాగ్నులకు విషయము కాక చూడ శక్యము గాక జనరహితమై ప్రకాశించు సహస్రార చక్రమం దుండునో, కోటి సూర్యచంద్రులవలే ప్రకాశించు నీ యాజ్ఞాచక్రమందు పరాకార జ్ఞానముతో నిరుపార్శ్వముల నాక్రమించియున్న ఆ పరాత్పరుదగు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)నకు నమస్కరించుచున్నాను. - సౌందర్యలహరి   

స్వామినీ శంభువనితా శాంభవీ చ సరస్వతీ,
సముద్రమథినీ శీఘ్రగామినీ శీఘ్రసిద్ధిదా|

పశుపతి - శివుడు.
పశూనాంజీవానాం పతిః పశుపతిః. ఈ-పు. - పశువులనగా ప్రమథులు, జంతువులు, వానికి ప్రభువు.
పశువః క్షేత్రజ్ఞాః తేషాం పతిఃత్రాతా సంసార బంధనాత్ - పశువులనఁగా జీవులు, వారిని సంసారబంధమువలన రక్షించువాడు.

పాశుపతము - 1.పశుపతి (శివుడు), అధిదైవతముగా గల అస్త్రము, 2.పశుపతి మతము.
పశుపతే రయం ప్రియః పాశుపతః - శివునికి ప్రియమైనది. 

ఆరాధ్యుఁడు - పూజింపదగినవాడు వి.1.లింగధారి, 2.శైవమత గురువు.

  

పశువు - చతుష్పాదము, గొడ్డు.
గొడ్డు - 1.ఈనని పశువు, గొడ్రాలు, విణ.శూన్యము.
గొడ్డుఁబోతు - 1.నిష్ప్రయోజకుడు, 2.సంతతి లేనివాడు, 3.కాపులేని చెట్టు.
వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక. 
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
శూద్రి - శూద్రుని భార్య.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పరచిన కమ్ములు.
స్వయంవంధ్యత - (వృక్ష.) పుష్పములోని పుంకేసరములుగాని, స్త్రీ కేసరములుగాని అదే పుష్పములో ఫలదీకరణమునకు పనికిరాకుండుట (Self-sterility).
వంధ్యకేసరము - పుప్పొడి తిత్తిలేని పుంకేసరము (Staminod).

దొంగగొడ్డు - దొంగమేతమేయుపసరము.

గొడ్డంబలి - నూకలులేని గంజి.

గోణి1 - ఎద్దు, సం.గోనీః.
గోణి2 - పెద్దగోతము, వి.గోనె.
గోతము - 1.జనుపనార సంచి, 2.ఒకానొక మల్లసాధనము, రూ.గోతాము.
పంబు - ఎద్దుమీద వేయు పెద్ద సిద్దె.

దబ్బనము - గోనెల కుట్టెడు పెద్దసూది.

గోద1 - 1.విష్ణుచిత్తుని పుత్త్రిక, గోదాదేవి, 2.గోదావరి.
గోద2 - ఎద్దు, వృషభము, (వ్యావ.) గొడ్డు, గోద.
ఎద్దు - వృషము (బహు. ఎడ్లు).
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.

పూచు - క్రి.1.పుష్పించు, 2.నిస్సరమగు, 3.గొడ్లకు తప్పు సుళ్ళుకల్గు.

పశుపాలనము - (వ్యవ.) ఉన్ని, పాలు, మాంసము, క్రొవ్వు మొదలగు వాని కొరకు పశువులను పెంచుట (Cattle rearing).
పశుగ్రాస సస్యములు - (వ్యవ.) పశువుల మేతకొరకు ఉపయోగపడు పైరులు (Fodder Crops), ఉదా. గినీగడ్డి, నేపియర్ గడ్ది, జనుము, లూస్ర్న్ మొ||

విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||

తా. లోకమునందు గొడ్రాలు, సహింపగూడని గుర్వి - గర్భిణి)ప్రసవవేదన(బిడ్డకుట్టు - ప్రసవవేదన)నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ-1.శ్రమము, 2.కర్మాగారము మొ.నవి (Industry)నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము

 

ప్రాణీ తు చేతనో జన్మీ జన్తు జన్యు శరీరిణః,
ప్రాణో (అ)స్యోస్తీతి ప్రాణీ, న-పు. - ప్రాణము గలిగినది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.      
చేత తీతిచేతనః చితీ సంజ్ఞానే. - ఎఱుఁగునది.
జన్మి - జంతువు, శరీరధారి.    
జన్మ అస్యాస్తీతి జన్మీ, న. పు. - జన్మము గలిగినది.
జంతువు - చేతనము, ప్రాణముగలది.    
జాయత ఇతి జంతుః, ఉ. పు. జన్యుశ్చ, ఉ. పు. జనీ ప్రాదుర్భావే. - పుట్టునది.
జన్యువు - 1.జంతువు, 2.అగ్ని, 3.బ్రహ్మ.
శరీరి - ప్రాణి.
శరీరమస్యాస్తీతి శరీరీ, న. పు. - శరీరము గలది. ఈ 5 జంతువుల పేర్లు.

ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
ప్రాణగొడ్డము - ప్రాణహింసకము, సం.ప్రాణకుట్టః. 

జీవము - ప్రాణము.
జీవితము - 1.ప్రాణము, 2.జీవము.

చైతన్యము - 1.తెలివి, 2.ప్రాణము.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.

ఉత్పన్నము - 1.పుట్టినది, 2.ఒనగూడినది.
ఉపపన్నము - 1.పుట్టినది, 2.పొందబడినది, 3.యుక్తయుకతము, 4.తగినది.
ఉపపత్తి - 1.కలిమి, 2.పుట్టుక, 3.కారణము, 4.(గణి.) ఒక సిద్ధాంతమును స్థాపించుటకు లేదా రుజువు చేయుటకు కల్పించబడు సబబు.    
కలిమి - 1.అతిశయము, 2.సంపద.
అతిశయము - అధిక్యము.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

తనకలిమి యింద్రభోగము
తనదుఃఖమె సర్వలోక దారిద్యంబౌఁ
దనచావు జలప్రళయము
తనువలచిన యదియె రంభ తధ్యము సుమతీ!

తా|| తన(తన - ఆత్మార్థకము)ఐశ్వర్యమే దేవేంద్ర పదవిగాను, తనదుఃఖము - బాధ, చింత సర్వలోక దారిద్ర్యముగాను, తనమృతి - చావు యుగ ప్రళయముగాను, తను వలచిన(అది - ఆ వస్తువు, ఆమె.)స్త్రీ రంభగాను తోచుట తధ్యము. 

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి. 
శివః శామ్యతిపరమా నందరూపత్వా న్నిర్వికారో భవతీతిః శివః - బ్రహ్మానంద స్వరూపుఁడును నిర్వికారుండును గనుక శమించియుండు వాఁడు.
శేరతే సజ్జ మనాం స్యస్మిన్నితి వా - ఇతని యందు సజ్జనమనస్సు లుండును. శేతే సజ్జన మనస్స్వితి సాధువుల మనస్సుల యందు శయనించి యుండువాఁడు. 
శీఙ్ స్వప్నే శివం కల్యాణం తద్యోగా ద్వా - శివ మనఁగా శుభము దానితోఁ గూడినవాఁడు.
శివప్రదత్వా ద్వా - శుభముల నిచ్చువాఁడు.

శుభంకరుఁడు - శుభమును చేయువాడు.
క్షేమంకరుఁడు - శుభంకరుడు, వ్యు.క్షేమమును కలిగించువాడు.
క్షేమం కరోతీతి క్షేమంకరః, డుకృఞ్ కరణే. - క్షేమమును జేయువాఁడు.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.  
రిష్టము-1.క్షేమము, 2.అశుభము, 3.అభావము.
రిష్టం హింసన మశుభం, రిషి హింసాయాం, రిష్టం న భవతీత్యరిష్తం శుభం, తత్కరోతీ త్యరిష్టతాతిః, రిష్ట మనఁగా నశుభము; అది గానిది యరిష్టము - శుభము; దానిఁ జేయువాఁడు.
రిష్ట - 1.అశుభము, 2.పెద్దకత్తి.  
శివతాతి - శివశంకరుడు.
శివంకరోతీతి శివతాతిః, శివంకరశ్చ, డుకృఞ్ కరణే. - శుభమును జేయువాఁడు.
శివంకరుఁడు - శుభకరుడు.
శివము - 1.శుభము, 2.సుఖము, 3.మోక్షము. సిగము - శివము, ఆవేశము, రూ.సిగము, సం.శివా.

శివ - 1.పార్వతి, 2.నక్క.    
శివం మంగళ సస్యా అస్తీతి శివా - శుభము గలది.
శివస్య పత్నీ తివా శివా - శివుని భార్య.
శకునేన మొదహేతుత్వాచ్ఛివా - శకునముచేత సంతోషపెట్టునది. ఈశబ్దము మొగ నక్కను జెప్పునపుడును స్త్రీలింగమే.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

శివాగౌరీ ఫేరవయోః -
శివాశబ్దము గౌరీదేవికిని నక్కకును(ఫేరవము - నక్క, ఫేరువు.)పేరు. మఱియును, కరక చెట్టునకును, ఉసిరిచెట్టునకును పేరు.
శివునికిని పేరగునపుడు పు శ్యుతి దుఃఖాదికమితివా శివా, శో తనూకరణే. - దుఃఖాదులఁ జెఱుచునది.
"మోక్షే భద్రే సుఖే శివం, హరే యోగాన్తరే వేదే వాలుకే గుగ్గులావపి" ఇతి శేషః.

ఫేరవము - నక్క, ఫేరువు.  
ఫే ఇతి రౌతి ఫేరుః, ఉ. పు. రు. శబ్దే. ఫే యని కూయునది.
ఫే ఇతి రవో  ఫేరవః - ఫే యను ధ్వని గలది.

శివము - 1.శుభము, 2.సుఖము, 3.మోక్షము.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ. సేమము.
క్షిణోత్యశుభమితి క్షేమం, ప్న. క్షిణుహింసాయాం - అశుభమును బోఁగొట్టునది.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్. 

విశుద్ధౌ తే శుద్ధ - స్పతికవిశదం వోమజనకం
శివం సేవే దేవీ - మపి శివసమానవ్యవసితామ్,
యయోః కాంత్యా యాంత్యా - శ్శశికిరణ సారూప్య సరణే
ర్విధుతాంతర్ద్వాంతా - విలసతి చకోరీవ జగతీ| - 37శ్లో

తా. ఓ జననీ! చీకటి తొలగి చకోర పక్షివలె చకోరకము - వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెలచుచ్చి తృప్తిపొందునది.) జగత్తు ఏ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఛంద్ర కిరణముల వలె ప్రకాశించు మార్గమున వెలుగొందునో, అట్టి నీ విశుద్ధ చక్రమందు స్ఫటికమువలె నిర్మలమై, ఆకాశ తత్త్వమున కాధారమైన శివ తత్త్వమును, శివసారూప్యమగు దేవిని గూడ సేవించుచున్నాను. - సౌందర్యలహరి 

విశుద్ధిచక్రనిలయా-(ఆ)రక్తవర్ణా త్రిలోచనా|
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా.

శివానుజా పుస్తహస్తా జ్ఞానముద్రా రమా చ వై,
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ|  

సర్వమంగళ - పార్వతి.
సరాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమతమైన శుభములు గలది.
మంగళ - పార్వతి.
పార్వతి - పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
మంగళదేవత - లక్ష్మి.

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్త్రీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ|

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

కల్యాణము - 1.క్షేమము, 2.శుభము, 3.పెండ్లి.
కల్యం సుఖం అనయతి ప్రాపయతీతి కల్యాణం, అణగతౌ. - సుఖమును పొందించునది.
మంగళము - శుభము, క్షేమము.
మంగం సుఖం లాతీతి మంగళం, లాదానే - సుఖము నిచ్చునది.
శుభము - మంగళము.
శోభతి ఇతి శుభం, శుభ శోభనే. - ఒప్పునది.

శుభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.     

మంగళుఁడు - కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
కౌ పృథివ్యాంజాతః కుజః, నీప్రాజదుర్భావే - భూమియందుఁ బుట్టినవాఁడు.

ఉదర్చి - 1.శివుడు, 2.అగ్ని, విణ. పై కెగయు జ్వాలలు కలది.
అర్చి - 1.అగ్నిజ్వాల, 2.కిరణము, 3.కాంతి, వెలుగు, రూ.అరిస్సు.
సప్త అర్చీమ్షి కాళీ, కరాళీ, మనోజవా, ధూమవర్ణా, స్సులింగినీ, విశ్వవదాదినామ్న్యః జిహ్వారూపాః జ్వాలాయస్య నః సప్తార్చిః, న. వు. - జిహ్వరూపములైన కాళి, కరాళి మొదలయిన యేడు జ్వాలలు గలవాఁడు.   

సతనాల్కల జేజే - అగ్ని, సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు - అగ్ని.

జ్వలనము - 1.మంట, 2.అగ్ని.
జ్వలతీతి జ్వలనః, జ్వల దీప్తౌ - జ్వలించుఁవాడు.
జ్వాలాజిహ్వుఁడు - అగ్ని. 
జ్వాల - మంట, సం.వి. (రసా.) పరిశోధనాగరములో బున్సెన్ బర్నర్ (దాహని) వంటి గొట్టముల ద్వారా పంపబడు ఇంధన వాయువును జ్వలింపచేసి నపుడు లభ్యమగు తేజోవంతమైన గాలుల ప్రవాహము, (Flame).
జ్వలితము - 1.మండినది, 2.ప్రకాశించినది.
జ్వలించు - క్రి.మండు.

త్విషాంపతి - సూర్యుడు Sun.
త్విషాం ప్రభాణాం పతిః, త్విషాంపతిః, ఇ.పు. - కాంతులకు పతి.
త్విట్టు - 1.జిగి, కాంతి, 2.మంట, 3.వెలుగు, రూ.త్విష.
త్వేషతే త్విత్, ష. సీ. త్విష దీప్తౌ - కాంతియుక్తమైనది.

చిచ్చఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్చుఱ, సం.శుచిః.

సెక కంటి - శివుడు, చిచ్చుకంటి.
సెక - శిఖ, జ్వాల, వేడిమి, రూ.సెగ, సెవ, సం.శిఖా.

సెకఱేఁడు - అగ్ని, రూ.సెగఱేడు, వ్యు.మంటలు గలవాడు.
సెక - శిఖ, జ్వాల, వేడిమి, రూ.సెగ, సెవ, సం.శిఖా.
సెక వెలుగు - సూర్యుడు Sun.

మంటమారి - జ్వలశీలుడు, కోపశీలుడు.
మంట - 1.రోషము, 2.జ్వాల, 3.చురుకుమను నొప్పి.

కనలు - 1.కోపము, 2.మంట, క్రి.1.కోపించు, 2.మండు.
కోపము - కినుక, క్రోధము.
కనకన - మండుట, ప్రకాశించుట మొ.ని యం దగు అనుకరణము. 

                                    

శివకము - 1.పసులగట్టు గూటము, 2.మేకు.
గూటము - 1.గుంజ, 2.డేరామేకు, 3.వడ్రంగి మొ. వారు ఉపయోగించెడు పనిముట్టు, రూ.గూటాము, సం.కూటః.

సమౌ శివక కీలకౌ,
దౌష్ట్యశమనేన శివకరత్వాత్ శివకః - పసుల దుష్ట్యత్వమును మాన్పుటవలన శుభకరమైంది.
కీల్యతే పశ్వాదిక మత్రేతి కీలకః, కీలబంధనే. - పసులు దీనియందుఁ గట్టఁబడును. ఈ 2 పసులఁ గట్టు కొయ్యపేర్లు, గూటము.

కీలక - ప్రభవాది అరువది సంవత్సరములలో నలువది రెండవది(42వ).  

కీలము - 1.మేకు, 2.మంట, 3.లేశము, 4.మోచేయి, (వృక్ష.) అండాశయములో అండాశయముపై నున్న కాడ (Style).
కీలాగ్రము - (వృక్ష.) కీలము యొక్క కొన (Stigma).

కీలుకాఁడు - 1.సూత్రధారుడు, 2.యంత్రము త్రిప్పువాడు.
కీలరి - (కీలు+అరి) కీలెరిగినవాడు. కీలెరిగి వాతపెట్టమన్నారు.
కీలకము - కిటుకు, మర్మము.
కిటుకు - 1.కపటము, 2.మర్మము.
కీలు - 1.మర, 2.మర్మము, 3.ఉపాయము, 4.కఱ్ఱలకు పూసెడు నల్లనిచమురు.
మర - తిరుగుడు చీల, కీలు (భౌతి.) 1. మరలు కలిగిన మేకు (మొల), 2.సర్పిలా కారముగ నున్న గాడికల స్తూపము (Screw).
మరచుట్టు - తిరుగుడు చీల.
మరమేకు - తిరుగుడు చీల; తిరుగుచీల - మరచీల.
కీలుబొమ్మ - 1.మరలలో అమర్చబడిన బొమ్మ, 2.వ్యక్తిత్వము లేనివాడు.

కీలసంధి , విస్తర్తసంధి - (గృహ.) బొంగరపు కీలు, ఒక ఎముకలో ఇంకొక ఎముక గుండ్రముగా తిరుగుటకు అమర్చిన కీలు, ఉదా.మెడ, తల కీలు (Pivot joint).

గసిక - 1.మేకు, 2.బాణము, 3.త్రవ్వుటకు అనువుగా కొనచెక్కిన కొయ్య.

మేకు - 1.శూలము, 2.చీల.
చీల - 1.మేకు, 2.కీలము, రూ.సీల.
సీల - చీల.
సీలమండ - చీలమండ.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.చీలమండ (Ankle bone).

మరగాలు - కృత్రిమ పాదము.    

కీలాలము - 1.నెత్తురు Blood, 2.నీరు.
కీలాన్ జ్వాలాన్ అలతి వారయతీతి కీలాలం, అల భూషణపర్యాప్తి శక్తివారణేషు. - అగ్నిజ్వాలలను వారించునది.
కీల్యతే బద్ద్యత ఇతివా కీలాలం, కీల బంధనే. - బంధింపఁబడునది.

శోణితే(అ)మ్భసి కీలాలమ్ -
కీలాలశబ్దము నీళ్ళకును, నెత్తురునకును పేరు. కీలా నగ్నిజ్వాలా నలతీతి కీలాలం, అల భూషణ పర్యాప్తి వారణేషు. - అగ్నిజ్వాలల నడ్దగించునది. టీ. స, కీల్యతే మాంసే బధ్యతే, అల్యతే త్వచా వార్యత ఇతి కీలాలం - శోణితం, కీల బంధనే, అల భూషణాదౌ.  

కీలి - అగ్ని, వ్యు.కీలలు కలది.
కీల - 1.మోచేతిదిబ్బ, 2.మేకు, 3.మంట, జ్వాల.
కీలతి పక్ష్యాదిగతిం నిరుణద్ధీతి కీలః, ప్స. కీలబంధనే. - పక్ష్యాదులయొక్క గతిని నిరోధించునది.

ఉదర్చి - 1.శివుడు, 2.అగ్ని, విణ. పై కెగయు జ్వాలలు కలది.
సప్త అర్చీమ్షి కాళీ, కరాళీ, మనోజవా, ధూమవర్ణా, స్సులింగినీ, విశ్వవదాదినామ్న్యః జిహ్వారూపాః జ్వాలాయస్య నః సప్తార్చిః, న. వు. - జిహ్వరూపములైన కాళి, కరాళి మొదలయిన యేడు జ్వాలలు గలవాఁడు.   

సతనాల్కల జేజే - అగ్ని, సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు - అగ్ని.

జ్వలనము - 1.మంట, 2.అగ్ని.
జ్వలతీతి జ్వలనః, జ్వల దీప్తౌ - జ్వలించుఁవాడు.
జ్వాలాజిహ్వుఁడు - అగ్ని. 
జ్వాల - మంట, సం.వి. (రసా.) పరిశోధనాగరములో బున్సెన్ బర్నర్ (దాహని) వంటి గొట్టముల ద్వారా పంపబడు ఇంధన వాయువును జ్వలింపచేసి నపుడు లభ్యమగు తేజోవంతమైన గాలుల ప్రవాహము, (Flame).
జ్వలితము - 1.మండినది, 2.ప్రకాశించినది.
జ్వలించు - క్రి.మండు.

జ్వాలాభాసో ర్న పుంస్యర్చిః -
అర్చిశ్శబ్దము అగ్నిజ్వాలకును, కాంతికిని పేరు. అర్చ్యత ఇత్యర్చిః స, స్న అర్చ పూజాయాం. - పూజింపఁబడునది.  

అర్చి - 1.అగ్నిజ్వాల, 2.కిరణము, 3.కాంతి, వెలుగు, రూ.అర్చిస్సు.
అర్చ్యత ఇత్యర్చిః, స-స్న, అర్చపూజాయాం - అర్చింపఁబడునది.
హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
హినోతి ఇతస్తతో గచ్ఛతి - వర్ధతే వా, హేతిః, ఈ-సీ, హిగతౌ వృద్ధౌ చ - ఇట్టట్తు చలించునది; లేక వృద్ధిఁబొందునది.
హన్యతే అనయేతిహేతిః, హనహింసాగత్యోః - దీనిచేత హింసింపఁబడును.

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడి కలవాడు.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శాఖతే వ్యాప్నోతీతి శిఖా, శాఖృ వ్యాప్తౌ - వ్యాపించునది.

గసిక - 1.మేకు, 2.బాణము, 3.త్రవ్వుటకు అనువుగా కొనచెక్కిన కొయ్య.

స్థాణువు - 1.మేకు, 2.శివుడు, 3.కొమ్మలులేని చెట్టు, మ్రోడు, విణ.స్థిరమైనది.
మ్రోడు - 1.మొద్దు, స్థాణువు, 2.మూర్ఖుడు.
మొద్దు - మ్రానిమోడు, విణ.1.మూడుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.

శూలపాణి - శివుడు, వ్యు.శూలము చేతి యందు గలవాడు.
శూలమస్యాస్తీతి శూలీ, న.పు. - శూలమనెడి ఆయుధము గలవాఁడు.  
శూలి - శూలపాణి.    

అస్త్రీ శూలం రుగాయుధమ్,
శూలశబ్దము శూలరోగమునకును, ఆయుధ భేదమునకు పేరు.
శూలయతీతి శూలం, శూల రుజాయాం. - వ్యథ(వ్యధ - బాధ, క్లేశము, ఆయాసము.)పెట్టునది.
రోగభేదే భవే చ్చూలం మృత్యోః ప్రావరణాంతరే, యోగభేదే ధ్వజే శూలః శూలాపణస్త్రియాం మతా శూలం విక్రయణే (అ)పి స్యా'దితి ప్రతాపః.

శూలము - 1.మొమ్మొనవాలు, 2.టెక్కెము, 3.ఒక రోగవిశేషము. 

త్రిశూలము - ముమ్మొనవాలు.
ముమ్మొనవాలు - (మూడు+మొనవాలు) త్రిశూలము.

మహితము - శివుని శూలము, విణ.గొప్పది, పూజ్యము.

సూల - శూలరోగము, సం.శూలా.
కుట్టు - 1.శూల రోగము (Chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు.

సంవర్తము - ప్రళయము.
సంవర్తతే ఉపరమతే జగ దస్మిన్నితి సంవర్తః, వృతు వర్తనే. - దీనియందు జగత్తు ఉపరతమౌను.

తవ స్వాధిస్ఠానే - హుతవహ మధిష్ఠాయ నిరతం
త మీడే సంవర్తం - జనని! మహతీం తాం చ సమయామ్|
యదాలోకే లోకాన్ - దహతి మహతి క్రోధకలితే
దయర్ద్రా యా దృష్టి - శ్శిశిర ముపచారం రచయతి|| - 39శ్లో.
తా.
జనని ! ఓ తల్లీ! స్వాధిష్ఠానమందు అధిష్ఠించి నిరంతరము ప్రకాశించుచు ప్రసిద్ధుడైన హుతవహుఁడు - అగ్ని)అగ్నిరూపముతో వెలుగు చున్న సమయమను ప్రళయాగ్నిని పొంది యున్నదో, యా సమయశక్తిని (సమయాకళాదృష్తి) స్తుతించుచున్నాను. ప్రచండమైన తన క్రోధాగ్నితో రుద్రుడు(ప్రళయకాలంలో విజృంభించే కాలాగ్ని రుద్రుడిని)మహాశక్తి స్వరూపము,  లోకాలను సంవర్తము-ప్రళయము)దహించునో, నీ చల్లని దయార్ద్ర దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి. శీతలమైన ఉపచారము కావించు చున్నది. - సౌందర్యలహరి   

స్వాధిస్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా| 
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణా తిగర్వితా.
                        

కానీనుఁడు - సం. విణ.కన్యకు పుట్టినవాడు వి.1.కర్ణుడు, 2.వ్యాసుడు.
కానీనః కన్యకాజాత స్సుతః : కన్యయాః పుత్రః కానీనః - కన్యక కొడుకు. పెండ్లిగాని పడుచు కొడుకు. 

ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని(Saturn), 4.కర్ణుడు, 5.సుగ్రీవుడు.
ప్రొద్దు -
1.సూర్యుడు, 2.కాలము, 3.దినము, సం.బ్రధృః.

సూర్యతనయుఁడు - 1.శని, 2.కర్ణుడు.
సూర్యతనయ - యమున. యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.

యువరాజు - 1.చిన్నరాజు, రాజు తర్వాత రాజ్యమున కర్హుడైనవాడు, 2.కర్ణుడు.
కుమారుఁడు -
1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విన.చీల్చువాడు.
భత్తృదారకుఁడు - (నాట్యపరిభాష యందు) యువరాజు.

యౌవరాజ్యము - (రాజ.) యువరాజు యొక్క దొరతనము. 

యువరాజస్తు కుమారో భత్తృదారకః. -
యువా చాసౌ రాజా చ యువరాజః. - పిన్నఱేఁడు.
కుమారయతీతి కుమారః. - ఆడువాఁడు. కుమార క్రీడాయామ్.
ద్రియత ఇతి దారకః. - ఆదరింపఁబడువాఁడు.
భర్తుః దారకః భత్తృదారకః - దొరకొడుకు. ఈ 3 యువరాజు పేర్లు.

రాధేయుఁడు - కర్ణుడు.
రాధ -
ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి. 

కర్ణుఁడు - కుంతి పెద్ద కోడుకు. పాండవుల అగ్రజుడు, యుద్ధమునందు మహావీరుడు, మహాదాత. కుంతీదేవి కన్యగా నున్నపుడు సూర్యుని వలన పుట్టినవాడు.  

కర్ణుఁడు - కుంతి పెద్దకొడుకు. (కుంతి - పాండవులతల్లి, వికృ.గొంతి.)
కర్ణానుజుఁడు - యుధిష్ఠిరుడు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.

కాలపృష్టము - 1.కర్ణునివిల్లు, 2.విల్లు.
విల్లు -
ధనుస్సు.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

అథ కర్ణస్య కాలపృష్టం శరాసనమ్ -
కాలవర్ణ పృష్టో యస్య సః కాలపృష్ఠః - నల్లనైన వెనుకదిక్కుగలది.
కర్ణస్య శరాసనమ్- కర్ణుని విల్లు.

దీనహస్తే ధనంద్యాత్స్వ భార్యాయాంచ యౌవనమ్|
స్వామికార్యేషుచ ప్రాణం నిశ్చయో మమ మాధవ||
తా.
ఓ కృష్ణా! మాధవా(మాధవుఁడు - లచ్చిమగడు, విష్ణువు.)! తాను సంపాదించిన సొమ్మును బీదలకు వినియోగము చేయ వలయును, తన యౌవనమును తనభార్య యందు వినియోగము చేయవలయును, తన ప్రాణమును స్వామికార్యముల యందు వినియోగ పరచవలయును అని, నా నిశ్చయమని కర్ణుడు చెప్పెను. – నీతిశాస్త్రము

కృష్ణద్వైపాయణుఁడు - వ్యాసుడు.
వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
బాదరాయణుఁడు - వ్యాసుడు.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.

భారతము - 1.వ్యాసభట్టారక ప్రోక్తమైన పంచమవేదము, 2.భరత ఖండము.
భరతము - 1.నాట్యము, 2.భరత పిట్ట, 3.భరత ఖండము.
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము -  శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెడి ఆట.     

జయ - 1.పార్వతి, 2.పార్వతిచెలి, 3.సంవత్సరములలో నొకటి, 4.మహాభారతము.  
జయపెట్టు -
క్రి. జయజయయని దీవించు.
జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె - వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము. 
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.  

జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము.

                                     

వ్యాసం వసిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్.

పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.
యమి - 1.ముని, 2.హంస.
హంస - 1.అంచ, యోగి, 3.పరమాత్మ, 4.తెల్ల గుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.

మానసౌక(స)ము - హంస.
మానససరః ఓకః స్థానమస్య మాన సౌకః. స. పు. - మానససరస్సు స్థానముగాఁ గలది.    
చేతము - మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.

మానసము - 1.ఒక కొలను(మానస సరస్సు), 2.మనస్సు.
మన్యతే అనేనేతి మనః, స-న. మనేఅవ మానసం, మన జ్ఞానే. - దీనిచేత నెఱుఁగబడును గనుక మనస్సు మనస్సే మానసము.    
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఆత్మనిగ్రహము - ఆత్మస్వాధీనత, మ న స్సు ను వశమునునం దుంచుకొనుట (Self-control). 

మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental-development).

హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె (Heart).
హృదయ స్పందనము - (గృహ.) గుండెకొట్టు కొనుట (Heart beat).

ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదర్ధాలున్నయి. 1) హంస-అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగు వేళ వాయువు "హ" కారములో బహిర్గతమై "స" కారములో లోపలికి వస్తుంది అంటే హంస శబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉంది. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్ర రూపిణీయైన దేవికి వందనాలు. - శ్రీ లలితా త్రిశతీ నామావళిః  

సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వంద్వం - కిమపి మహతాం మానసచరమ్
యదాలాసా దష్టా - దశగుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్బ్యః పయ ఇవ. - 38శ్లో

తా. ఓ దేవీ! ఏ హంసల జంటల కూతలు పదునెనిమిది(అష్టాదశము - పదునెనిమదవది)విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణము లను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి మకరందముచే ఆనందించు మహాత్ముల యొక్క మనస్సు లనెడి మానస సరస్సునందు విహరించు నా హంసల జంటను సేవించుదును. - సౌందర్యలహరి

ఏవం కృతా యేన విచిత్రలీలా
మాయామనుష్యేణ నృపచ్ఛలేన |
తం వై మరాలం మునిమానసానాం
శ్రీజానకీజీవనమానతో స్మి | - 8
 

    

త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
మహేశ్వరుఁడు - శివుడు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే.

మహేచ్ఛస్తు మాహాశయః,
మహతీ ఇచ్ఛా యస్య మహేచ్ఛః - ఘనమైన యిచ్ఛగలవాఁడు.
మహాశయుఁడు-గొప్ప ఆభిప్రాయము కలవాడు.
మహానాశయో మనోయస్య స మహాశయః - ఘనమైన మనస్సుగలవాఁడు.

ఓం మహేశ్వరయుక్త నటన తత్పరాయై నమో నమః|

ధన్వంతరి - 1.దేవవైద్యుడు, 2.సూర్యుడు, 3.మహేశ్వరుడు.   
వేల్పువెజ్జు - దేవవైద్యుడు.

సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు. 
సూర్యతనయ - యమున.

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి -
1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.         
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురుడు.
విఘ్నరాజు - వినాయకుడు.

గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు -
1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

కాని ప్రయోజనంబు సమకట్టదు, తాభువినెంత విద్యవా
డైనను, దొడ్డరాజు కోడుకైనను నదెట్లు, మహేశుపట్టి, వి
ద్యానిధి, సవవిద్యలకుఁ దానెగురుండు, వినాయకుండుదాఁ
నేనుఁగు రీతినుండియు నదేమిటికాడఁడు పెండ్లి! భాస్కరా.
తా.
వినాయకు డీశ్వరుని కుమారుఁడయ్యు, భూమి యందు తాను, సర్వ విద్యలకు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నకు మూలపురుషుడయ్యు జ్ఞానము నిచ్చు వాడయ్యు, ఏనుగు బలము కలవాడయ్యు అతడు (పెండ్లి - వివాహము)పెండ్లాడక లేక పోయెను. అట్లే ఎంత గొప్పవాడైనను తనకు వశము(స్వాధీనము)కాని పని చేయ బూనినచో నెరవేర్చుకొన లేడు. 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.       

మహేశ్వరప్రియో దాన్తో మేరుగోత్రప్రదక్షిణః,
గ్రహమణ్డల మధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః.

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు October, నవంబరు November నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).

కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

13. హస్త - నక్షత్రముల యందొకటి. 5 నక్షత్రములు హస్తము లేక అరచేతి వలె నుండును. 

హస్తా తు పాణినక్షత్రే : హస్తశబ్దము చేతికిని, నక్షత్ర విశేషమునకును పేరు. హసతీతి హస్తః. హసే హసనే. ప్రకాశించునది.  

అయాతు దేవస్సవితోపయాతు | హిరణ్యయేన సువృతా రథేన | వహన్, హస్తగ్ం సుభగ్ం విద్మనాపసమ్ | ప్రయచ్ఛంతం పపురిం పుణ్యమచ్చ | హస్తః ప్రయచ్ఛ త్వమృతం వసీయః | దక్షిణేన ప్రతిగృణమ ఏనత్ | దాతా-రమద్య సవితా విదేయ విదేయ | యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞమ్ ||11||

సవిత- 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవిత్రుడు.
సువతి సుప్తం ప్రేరయతీతి సవితా, ఋ.పు. షూ ప్రేరణే - సుప్తుని ప్రేరేపించువాఁడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
తలి - జనని, రూ తల్లి.
తల్లి - జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యం రేతో యస్యసః హిరణ్య రేతాః, న.పు. - హిరణ్యమే రేతస్సుగాఁ గలవాఁడు.  
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసుష్ఠుడు, మరీచి).                                                  

హిమాంశువు - చంద్రుడు.
హిమాః శీతాః అంశవో యస్య సః హిమాంశుః ఉ. పు. - చల్లని కిరణములు గలవాడు.

చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.

పంచదశి - 1.అమవస, 2.పున్నమ.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.

పక్షాంత్తౌ పఞ్చదశ్చౌ ద్వే - పక్షయోః అంతౌ పక్షాంత్తౌ, శుక్ల కృష్ణపక్షములయొక్క తుదలు. పంచదశానాం తిథీనాం పూరణ్యౌ పంచదశ్యౌ, పంచదశ తిథులను నిండించునవి. పూర్ణిమకును అమావాస్యకును పేర్లు.

పౌర్ణమి - సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని అర్థభాగము పై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.  

పౌర్ణమాసీ తు పూర్ణిమా :
మీయతే తిథిరనేన మాః చంద్రః పూర్ణశ్చాసౌ మాశ్చ పూర్ణిమాః, తస్యేయం పుర్ణమాసీ. ఇతనిచేత తిథి లెక్క పెట్టఁబడును గనుక మాః అనఁగా చంద్రుఁడు. అతఁ డిందు పూర్ణుడుగాఁ దోఁచును. పూర్ణోమాసో స్యామితావా, మాసము ఇందు పూర్ణమౌను. చంద్రస్య పూర్ణతయా నిర్వృత్తా పూర్ణిమా, చంద్రునియొక్క నిండుటచేత నిర్వృత్తమైనది. పూర్ణఃమాశ్చంద్రో స్యామితివా పూర్ణిమా, అఖండచంద్రుఁడు గలిగినది.

పూర్ణిమ-పున్నమ, అఖండ చంద్రుడు గలది. 
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా.   

రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము. 

పూర్ణే రాకా నిశాకరే :
తస్మిన్ పూర్ణే సతి సా రాకేత్యుచ్యతే శుద్ధేతిభావః - చంద్రుఁడు పూర్ణుఁడై యున్నపుడు ఆ పున్నమ రాక యనంబడును. అనఁగాఁ చతుర్దశి వేధ లేనిది. అసుమన్యంతే దేవాః పితృసహితా అస్యామిత్యనుమతిః. దీని యందు దేవతలు పితృసహితులై సేవకొఱకు తలఁపఁబడుదురు. రాతి దదాతి సుఖమితి రాకా. రా దానే - సుఖము నిచ్చునది. అన్ని కళలతో నిండిన చంద్రుఁడు గలది.

ఆగమనము - 1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
అవాప్తి - ప్రాప్తి, పొందుట. 
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది, వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి. రాకాచంద్ర సమానన రామ్|   

నిశాపతి - చంద్రుడు.
నిశ - 1.రేయి, 2.పసుపు.
నిశాకరుఁడు - చంద్రుడు Moon. 

కళాహీనే సానుమతిః -
అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
నిశాకరే కళాహీనే నతి సా పూర్ణిమా అనుమతి రిత్యుచ్యతే. - చతుర్దశీ యుక్తేతి భావః - చంద్రుఁడు కళాహినుఁడైనపుడు ఆ పున్నమ అనుమతి యనంబడును, అనఁగాఁ జతుర్దశితో గూడినదని భావము. 1 ఒకకళ తక్కువగాఁ గల చంద్రునితో గూడిన పున్నమ.

హిమకరుఁడు - చంద్రుడు.
హిమధాముఁడు - చంద్రుడు.

ఇందుఁడు - చంద్రుడు.
ఉనక్తి తుషారకణైరితి ఇందుః, ఉ-పు. ఉందీ క్లేదనే - మంచుకిరణములచేత తడ్పెడువాఁడు.
ఇందువారము - సోమవారము.
సోమవారము - వారములలో రెండవ దినము.

ఐందవము - చంద్రుని సంబంధమైనది, వి.1.చాంద్రమానము, 2.చాంద్రాయణ వ్రతము.
చాంద్రమానము -
చంద్రుని గతిని బట్టి యేర్పరచిన కాల ప్రమాణము.
చాంద్రాయణము - చంద్రుని వృద్ధిక్షయముల ననుసరించి ఆహార పరిమితి దిన క్రమమున హెచ్చించుచు తగ్గించు వ్రతము.
చాంద్రసంవత్సరము - చంద్రుడు అమావాస్య మొదలుకొని అమావాస్య వరకు భూమిచుట్టు తిరిగివచ్చు కాలమును బట్టి నెలను నిర్ణయించుట, చాంద్ర సంవత్సరమున గల 365 రోజులకు దానిని సరి పుచ్చుటకై అధిక మాసము వచ్చును.

మలమాసము - అధిక మాసము.
అధిక మాసము - చాంద్రమానమున మూడేండ్ల కొకసారి వచ్చు పదమూడవ నెల. సూర్యసంక్రమణము లేని చాంద్రమాన మాసము.
ఐందవి - పల్కుచెలి, సరస్వతి.
పలుకుఁజెలి -
సరస్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒకనది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.    
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ.      

ఇందుకళాధర ఇంద్రాది ప్రియ సుందరరూప సురేశశివ |

ఇందిర - లక్ష్మి; ఇంది - లక్ష్మి, రూ.ఇందిర.
అధికపాఠము. ఇందిరా లోకమాతా మా క్షీరాబ్ధితనయా రమా(రమ - లక్ష్మి) - ఇందతీ తీందిరా - పరమైశ్వర్యయుక్తురాలు. ఇది పరమైశ్వర్యై.

చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందుశీతలామ్,
ఆహ్లాదజననీం పుష్ఠిం శివాం శివకరీం సతీమ్|

ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామర.
నీలాబ్జము - నల్లకలువ.

ఇన్దీవరం చ నీలే (అ)స్మిన్ -
అంబుని జన్మ అస్యేత్యంబుజన్మ నీలం చ తత్ అంబుజన్మ, న. న. - నీటియందు జన్మము గలిగినది అంబుజన్మము; నీలమైన అంబుజన్మము నీలాంబుజన్మము.
ఇన్దతీతి ఇన్దీ ర్లక్ష్మీః, తయా వ్రియత ఇతి ఇన్దీ వరం. వృఞ్ వరనే. ఐశ్వర్యయుక్తురాలు గనుక ఇంది యనఁగా లక్ష్మి; ఆమెచేత వరింపఁబడినది.
ఇంద్రియాని వృణోతీతి వా ఇందీవరం. వృఞ్ వరణే. - ఇంద్రియములను సంతోషముచేతఁ గప్పునది. ఈ రెండు నల్లకలువ పేర్లు.

ఇందిందిరము - తుమ్మెద.
ఇందతి ఇందిరయా ఇందిందిరః ఇది పరమైశ్వర్యే. - పద్మ సంపదతోఁ గూడినది.

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షమ్
ఆనందహేతు రధికం మురవిద్విషో పి|
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థమ్
ఇందీవరోదరసహోదరమిందిరాయాః|| - 4 

గంధసార ఘనసార చారునవనాగవల్లి రసవాసినీం,
సాధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం
మంథరాయతవిలోచనాం అమలబాలచంద్ర కృతశేఖరీం,
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతాం|
     

కుముదబాంధవుఁడు - చంద్రుడు.
కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము.

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

సితుఁడు-శుక్రుడు Venus, విణ.తెల్లనివాడు.  
సితము - 1.తెల్లనిది, 2.కట్టబడినది. 
సినోతి మన ఇతి సితః, సిఞ్ బంధనే. - మనస్సును బంధించునది. 

అల్లి1 - మందము.
అల్లి2 - 1.తెల్లకలువ, 2.కలువవంటి నీటిపువ్వు, 3.ఒకానొక చెట్టు, 4.ఒక రకమైన పిల్లలయాట.
మందము1 - యుద్ధకాలమున వాహన యోగ్యమైన గజజాతి.
మందము2 - దట్టము, స్థూలము.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధారూపా అంశవో యస్య సః సుధాంశుః, ఉ-పు. - అమృతరూపములైన కిరణములుగలవాఁడు.
సుధాకరుడు - చంద్రుడు.

నెల మేపరి - రాహువు.
సోపపవుఁడు -
రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు).

రాహుగ్రస్తే త్విన్దౌ చ పూష్టి చ సోపప్లవోప రక్తౌ ద్వౌ -
ఉపప్లవేన ఆకులతయా సహవత్త ఇతి సోపప్లవః - ఉపప్లవముతోఁ గూడినవాఁడు.
ఉపరజ్యతే ఉపరమతే వ్యాపారాదిత్యువరక్తః – వ్యాపారము వలన నుపరతుఁ డైనవాఁడు, ఉపరజ్యత ఇత్యువరక్తః - రాహువుచేత తమోయుక్తుఁడుగాఁ జేయఁబడినవాఁడు. ఈ రెండు రాహుగ్రస్తులైన సూర్యచంద్రుల పేర్లు.     

సకలజన ప్రియత్వము నిజంబు గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగగన్
టకటక మానియుండడె దృఢస్థితి నెప్పటి యట్ల ! భాస్కరా.
తా.
చంద్రుడు తన్ను రాహువు(రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము Rahu) మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికినీ ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము బాధింపదు, అతిత్వరలోనే అతడు కోలుకొనును.

అమృతకరుఁడు - చంద్రుడు. లలాటం అమృతోత్భవ|

అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
అమర్త్యాః నమ్రియంత ఇత్యమర్త్యాః - చావనివారు. మృఙ్ ప్రాణత్యాగే. అమృతాంధనః-న-వు. అమృత మంధో (అ)న్నమేషాం తే - అమృతము అన్నముగాఁ గలవారు.

పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం- పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.

పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను - 1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.

వేల్పుబోనము - అమృతము.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము. 
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

అమృతం సద్గుణాభార్యా అమృతం బాల భాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్||

తా. గుణవతియైన భార్య - అగ్నిసాక్షిగ పరిణయ మాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. బాలుని బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల. ముద్దు మాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము

సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా,
సీతా సర్వాశ్రయా సంధ్యా సుఫలా సుఖదాయినీ |

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః|

ఫాలవిలోచన భానుకోటిప్రభ, హాలాహలధర అమృత శివ|

హాలహలము - పాలసముద్రమున పుట్టిన విషము, 'రూ. హాలహలము, హలహాలము, హాలహలము, హాలహాలము.
హలతి జఠరం విలిఖతి నలి ఖతి చ హలహలః, హల విలేఖనే. - కడుపులో నొకపర్యాయము చీల్చుచున్నట్టును, ఒక పర్యాయము లేనట్టు నుండునది.
తాళపత్ర సంస్థాన నీలగోస్తాకృతిగుచ్ఛవృక్షదాహక విషనామః ఇదం హిమవత్పర్వత కిష్కింధా కోకణదేశ దక్షిణసింధ్వాదిషు భవతి - తాటాకు వంటి యాకృతి గలిగి నల్లనై గోస్తనాకృతియైన గుత్తులు గలిగి సమీపమందుండెడు వృక్షముల దహించునది; ఇది హిమవత్పర్వత కిష్కింధాదుల యందుఁ బుట్టును.   

చాలఁబవిత్రవంశమున సంజనితురిడగునేని యెట్టి దు
శ్శీలునినై నఁ దత్కులవిశేషముచే నొకపుణ్య పు  డెంతయున్
దాలిమి నుద్ధరించును, సుధానిధిఁబుట్టగఁ గాదె, శంభుడా
హాలహలానంబు గళమందు ధరించుటఁబూని, భాస్కరా.

తా. మున్ను సురాసురలు పాల సముద్రము మధింపగా అందుండి పుట్టిన హాలాహలం (పాల సముద్రమున పుట్టిన విషము.)మనెడి యగ్నిని శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు. తన కంఠ మందు ధరించెను. అది ఆ యగ్ని గొప్పతనముకాదు, అది పుట్టినట్టి పాల సముద్రము యొక్క గొప్పతనము చేతనే. అట్లే, మంచి వంశమందు బుట్టిన, వాడు నీచుడైనను వానిని ఆ కులము యొక్క ఔనత్యము ను దలంచియే సజ్జనులు (తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)తో కాపాడుదురు గాని ఆ నీచుని జూచికాదు.

శుభ్రాంశువు - చంద్రుడు Moon, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశనో యస్యసః శుభ్రాంశుః. ఉ-పు. - తెల్లని కిరణములు గలవాఁడు.  
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.   

ఓషధీశుఁడు - చంద్రుడు.
ఓషధీనామీశః ఓషధీశః - వరి మొదలగు నోషధులకుఁ బ్రభువు.
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి. 
ఔషధము - 1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు. 
ఓషధ్యాః భవం ఔషధం. - ఓషధివలనఁ బుట్టినది.
ఓషం దాహం ధయతీతి ఔషధం, ధేట్ పానే. - జ్వరమువలని దాహమును నశింపఁజేయునది. ఉత్తర కురుక్షేత్రము నందు దేవీస్థానం ఓషది|   

సంజీవకరణి - జీవమునిచ్చు ఓషధి.
సంజీవి - జీవమును కలుగజేయునది.

బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.     

సంచికట్టు - సంచిపట్టుకొని అదేపనిమీద ప్రవర్తించువాడు, వైద్యుడు.
వంట్రము - మందులసంచి.

రోగము - వ్యాధి.
రోగనిరోధకశక్తి - (జీవ.) రోగము నెదుర్కొని, దానిని జయించుశక్తి.
రోగనిర్భయత - (జీవ.) రక్షణశక్తి, శరీరములో, రోగమును కలిగించు జీవులు ప్రవేశించి రోగములు కలుగజేయకుండ నిరోధించుశక్తి, (Immunity).

రోగహా ర్యగద్కారో భిషగ్వైద్య శ్చికిత్సకే,
రోగం హరతి తాచ్ఛీల్యేన రోగహారీ, న, త్రి, హృఞ్ హరణే. - రోగమును హరించు స్వభావము గలవాఁడు.

అగదంకారుఁడు - వైద్యుడు, వ్యు.ఆరోగ్యమును కలిగించువాడు.
అగద మరోగం కరోతి ప్రాణినమి త్యగదంకారః - శరీరి - ప్రాణిని రోగము లేనివానిఁగా జేయువాఁడు.
అగదము - 1.తెవులులేనిది, 2.పలుకనిది, వి.1.మందు, ఔషధము, 2.ఆరోగ్యము, 3.ఆయుర్వేదమున విషాదుల విరుగుడును తెలుపు భాగము.
అవిద్యామానో గదః అనేనేతి అగదః - దీనిచే వ్యాధి లేదు.

పాటవము - 1.ఆరోగ్యము, 2.శక్తత.
అనామయం స్యా దారోగ్యమ్ -
అనామయము - రోగములేనిది, వి.ఆరోగ్యము.
ఆమయస్య వ్యాధేరభావః అనామయం - రోగము లేకయుండుట.
ఆరోగ్యము - రో గ ము లే మి, స్వాస్థ్యము.
ఆరోగస్య భవః ఆరోగ్యం. - రోగము లేనివానియొక్క భావము. ఈ 2 ఆరోగ్యము పేర్లు.

ఆరోగ్యరక్షణము - (గృహ.) రోగము రాకుండుటకై శుభ్రత నవలంబించుట (Sanitation). 

యోగము - 1.ప్రాణాయామాదికము, 2.కూడిక, 3.ఔషధము, 4.ప్రయత్నము. ఔషధేచింతయే ద్విష్ణుం|

జయతి రోగాన్ జాయుః ఎ.పు. జి జయే. - రోగములను గెలుచునది. ఈ 4 ఔషధము పేర్లు. 

భిషక్కు - వైద్యుడు.
భిషజ్యతి భిషక్, జ. భిషఙ్ చికిత్సాయాం. - చికిత్ససేయువాఁడు. 
భేషజము - ఔషధము, వ్యు.భిషక్ సంబంధమైనది.
భిషజ్యన్తి చికిత్సన్త్య నేనేతి భేషణం, భైషజ్యంచ, భిఝుఙ్ చికిత్సాయాం. - దీనిచేత చికిత్స చేయుదురు.

గృహేపచారము - (గృహ.) రోగికి చేయు ఉపచారము, వైద్య విధానమునకు అంగముగ రోగికి గృహములో చేయు సేవ (Home-nursing).     

సార్థః ప్రవసతో మిత్రం - భార్యా మిత్రం గృహే సతః
ఆతురస్య భిషక్ మిత్రం - దానం మిత్రం మరిష్యతః.

తా. ప్రవాసికి ప్రవాసుల గుంపు మిత్రుడగును, ఇంటిలో నున్నవానికి భార్యయే మిత్రము, రోగికి ఆతురుఁడు - 1.వ్యాధిగ్రస్తుడు, 2.ఉత్కంఠుడు, తహతహపడువాడు. వైద్యుడే మిత్రుడు, చావనున్న వానికి దానమే మిత్రుడు. 

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రిలోచనం
భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హనం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతివై యమః| - 6
  

జీవదుఁడు - వైద్యుడు.
విద్యామాయర్వేదమధీతే వేత్తివా వైద్యః - ఆయుర్వేదమును జదివిన వాఁడుగాని యెఱిగినవాఁడుగాని వైద్యుడు.  
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
చికిత్సకుఁడు - వైద్యుడు.
చికిత్సతి చికితకః. - చికిత్స చేయువాఁడు. ఈ 5 వైద్యుని పేర్లు.
వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.

ఆయుర్వేదము - హిందూ వైద్యశాస్త్రము. 

ఉపచారము - 1.సేవ, 2.సన్మానము, 3.చికిత్స, 4.పూజ.
ఉపచరించు - క్రి.1.సన్మానించు, 2.సేవించు, 3.బోధించు, 4.నియోగించు.

వైద్యము - రోగచికిత్స శాస్త్రము.
చికిత్స - రోగమునకుచేయు ప్రతిక్రియ.

అప్పిచ్చువాడు, వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పాఱు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూరు మందుము
చొప్పడికున్నట్టియూరు జొరకును సుమతీ.

తా. అవసరమునకు ఆదుకొనినవాడు(ఉత్తమర్ణుఁడు - అప్పిచ్చువాడు. (వ్యతి. అధమర్ణుడు.), రోగం వచ్చినప్పుడు మందులు యిచ్చువాడును, స్నానపానములకు నిత్యం ప్రవహించు నది river లేక కాలువయును, శుభాశుభ కర్మలకును అవసరమగు బ్రాహ్మణుడు(ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.)ఉన్నట్టి గ్రామమున నివసింపవలెను.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్దనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||

నిశాపతి - చంద్రుడు.
నిశాయాః పతిః నిశాపతిః, ఈ. పు. - రాతిరికి ఱేడు.

అథ శర్వరీ
నిశా నిశీధినీ రాత్రి స్త్రియామ క్షణదా క్షపా
విభావరీ తమస్విన్యౌ రజనీ యామినీ తమీ. -

శర్వరి - రాత్రి.
శృణతి వ్యాపారం దినం వా శర్వరీ. ఈ. సీ. శౄ హింసాయాం - వ్యాపారమునుగాని దినమునుగాని చెఱుచునది.
శార్వరి - 1.రాత్రి, 2.అరువది సంవత్సరములలో నొకటి.

శర్వరీ దీపక శ్చంద్రః - ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపికః||

తా. చంద్రుఁడు రాత్రిని ప్రకాశింపఁ జేయును, రవి - 1.సూర్యుడు, 2.జీవుడు. పగటినిఁ ప్రకాశింపఁ జేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము  

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ,
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా| - 71స్తో

నిశాకరుఁడు - చంద్రుడు Moon.
నిసి - నిశ, రేయి, సం.నిశా.   
నిశ - 1.రేయి, 2.పసుపు.
నితరాం శ్యతి సర్వవ్యాపారన్ నిశా. శో తనూకరణే - అన్ని వ్యాపారము లను మిక్కిలి స్వల్పముగాఁ జేయునది.

నిశాంతము - 1.వేకువ, 2.ఇల్లు.
నితరాం శామ్యతి దుఃఖమత్రేతి నిశాంతం. శము ఉపశమే. - దీనియందు దుఃఖము మిక్కిలి శమించును.
అవశ్యం నిశాయా మమ్యతే గమ్యత ఇతి నిశాంతం. అమ గతౌ. - అవశ్యముగా రాత్రియందు పొందఁబడునది.

నివాసము - ఇల్లు, రూ. నివసనము, వాసము.
నివసనము - ఇల్లు.
నివాసి - వాసముచేయువాడు.
నివసించు - క్రి.ఉండు, వాసముచేయు.
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.

ఇల్లు - ఇలు; ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గేహము - గృహము, ఇల్లు.
గృహ్ణాతి పురుషేణార్జితం ధనమితి గృహం, గేహం చ గ్రహ ఉపాదానే. - పురుషునిచే సంపాదింపఁబడిన ధనము గ్రహించునది.  
గృహిణి - ఇల్లాలు, భార్య.
ఇల్లాలు - భార్య, ఇంటియజమానురాలు.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

ఇలుదొర - గృహస్థు.
గృహమేధి - గృహస్థు, వ్యు.భార్యతో చేరియుండువాడు.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః. 

ఇలువడి - 1.మంచినడత, 2.కులీనత.
కులీనత - మంచి కులమున పుట్టుట.

నివసథము - గ్రామము.
గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.) షడ్జాది స్వరము.
నివహము - గుంపు.
నితరాం వహతి ప్రాపయతి స్వసంబంధినా మేకత్వమితి నివహః, వహ ప్రాపణే. - తన సంబంధమైన వస్తువులను మిక్కిలి యేకత్వమును బొందించునది.

యాదృశైః సంనివిశతే యాదృశాంశ్చోపసేవతే|
యాదృగిచ్ఛతి భవితూం తాదృగ్భవతి పూరుషః ||
 
భా|| మానవుడు(పూరుషుఁడు - మనుష్యుడు) ఎటువంటి వారితో సహవాసం చేస్తాడో అటువంటి వాడే అవుతాడు. ఎటువంటి వారిని సేవిస్తాడో అటువంటివాడే అవుతాడు. ఎటువంటివాడు కావాలని కోరుకుంటాడో అటువంటి వాడే అవుతాడు.  

వసతి - 1.ఇల్లు, ఉనికి.
నివసతి - ఇల్లు.  

వసతీ రాత్రి వేశ్మనోః,
వసతిశబ్దము రాత్రికిని, ఇంటికిని పేరు. వసంత్యస్యామితి వసతిః, సీ. వసనివాసే. - దీనియందుందురు గనుక వసతి. 'వసతిస్స్య దవస్థాన ' ఇతి శేషః. 

వేశ్మము - సదనము, ఇల్లు.
సద్మము - గృహము; సదనము - ఇల్లు.

వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).    
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.  
స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికుంచుట (Dislocation).

The house of every one is to him his castle and fortress, as well for his defence against injury and violence, as for his respose - Sir Edward Coke, Semayne’s Case (19605)

అనేకార్కకోటి ప్రభావజ్జ్వలం తం |
మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తం |
శ్రితానా మభీష్టం నిశాంతం నితాంతం |
భజే షణ్ముఖం తం శరచ్చంద్ర కాంతమ్ ||

ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.
ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.

ఉదయః పూర్వపర్వతః,
ఉత్యన్ని స్సూర్యాదయ అస్మాత్ ఉదయః, ఇణ్ గతౌ. - దీనియందు సూర్యాదులు ఉదయింతురు.
పూర్వాశ్చాసౌ పర్వతశ్చ పూర్వపర్వతః - తూర్పు దిక్కున నుండెడు పర్వతము. ఈ 2 ఉదయపర్వతము పేర్లు.

జననము - 1.పుట్టుక, 2.వంశము.
జన్యతే ఉత్తరోత్తరమనేనేతి జననం, జనీ ప్రాదుర్భావే. - ఉత్తరోత్తరము దీనివలనఁ బుట్టుదురు.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక.
జననవిద్య - (జీవ.) అనువంశమును గూర్చి తెలియు శాస్త్రము(Genetics).
ప్రాదుర్భావము - పుట్టుక.

జని - 1.స్త్రీ, ఆడుది 2.భార్య, 3.కోడలు(కుమారుని భార్య), పుట్టుక.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
జాయాజీవుఁడు - 1.వేషగాడు, 2.నాట్యము చేయువాడు, 3.భార్య వలన జీవించువాడు. 
జాయ - భార్య.
జాయతే స్యాం పతిః పుత్రరూపేణేతి జాయా. జనీ ప్రాదుర్భావే. - ఈమె యందు పతి పుత్రరూపమున జనించును.
బ్రియత ఇతి భార్యా. బృఞ్ భరణే. - భరింపబడునది.
జాయమానము - 1.కలుగుచున్నది, 2.పుట్టుచున్నది.  

బాలార్కః ప్రేతధూమశ్చ - వృద్ధ స్త్రీ పల్వ లోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుక్షీణం దినదినే||

తా. ఉదయకాలమందు ఎండగాచుకొనుటయు, పీనుగు కాలెడి పొగ తనమీదఁ బాఱుటయు, (వృద్ధ - ముసలిది)తనకంటె పెద్దదానితో సంగమము చేయుటయు, ఆకులు మురిన నీళ్ళను ద్రావుటయు, రాత్రి - సూర్యాస్త సమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.)పెరుగన్నము భోజనము చేయుటయు నివి దినదినమున (కా)ఆయుస్సును తరుగ జేయును. – నీతిశాస్త్రము

అరుణోదయము - సూర్యోదయమునకు ముందు నాలుగు గడియలకాలము, వేకువజాము.

ప్రత్యూషము - వేగుజాము.
ప్రత్యూషతి నిశాం ప్రత్యూషః, ఊష రుజాయాం - రాత్రిని బోఁగొట్టునది.
పా, ప్రత్యుషః, అ. పు. ఓషత్యంధకారమితి ప్రత్యుషః - చీఁకటిని బోఁగొట్టునది.
తథాచ ప్రయోగః_ 'ప్రత్యుషః పారిజాత ' ఇతి సూర్యశతకే.
అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
అహ్నః ముఖమారంభః అహర్ముఖం - అహస్సుయొక్క ప్రారంభము.
కల్యము - 1.వేకువ, 2.ఉపాయము.
కల్యంతే ప్రతిబుధ్యంతే (అ)త్ర కల్యం, కలగతౌ. - ఇందు జనులు ప్రబోధింపఁబడుదురు.
కలయతి మంగళంకల్యం, కలశబ్ద సంఖ్యానయోః - శుభమును జేయునది. పా, కాలే సాధు కాల్యమితి వా - కాలమందు యోగ్యమైనది.
కల్యవ ఠ్తము - ప్రాతఃకాల భోజనము.
స్త్రీఘోషము - వేకువ; వేకువ - వేగుజాము.
వ్యుష్టము - వేగుజాము. 

ఉష - 1.రేయి, 2.రాత్రివిశేషము, 3.బాణాసురుని కూతురు.

ఉషా రాత్రే రవసానే -
ఉషా - ఇది ప్రాతఃకాలమందును, ఉ, 'ఉషా జనాః ప్రతి బుధ్యంతే', 'ఉషా తమో వాయు రుపైతి మందం' పా, ఉషః, 'ఉషా స్యా ద్రజనీశేషే ఉష ఇత్యపి దృశ్యతే' అని రభసుడు.

ఉషస్సు -  సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.
ఔషసి - వేకువ, ఉషఃకాలము.
ఓషతి అర్కకరై రిత్యుషః ప్రత్యుషశ్చ, స. న. ఉషదాహే - సూర్యకిరణములచేత దహింపఁజేయునది, వ్రతిరుపసర్గాంతర వ్యావర్తకః.
విభాతము - ప్రభాతము, వేకువ.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
భాతం ప్రవృత్తం ప్రభాతం, భా దీప్తౌ - ప్రకాశింపఁ బ్రవర్తించునది. 
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః. 
రేపకడ - ప్రాతఃకాలము.

ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.
ఉషసి ప్రభాతే బుధ్యతే జ్వలతే త్యుషద్బుధః, బుధ అవగమనే - ప్రభాతకాలమునందు జ్వలించువాఁడు.

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||

తా. ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి.)చూచుకొని పోవలయునని బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. చెప్పెను. ఎపుడు బయలుదేరిన కార్యము సఫల మగునని నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా)మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్దనుండు జనార్థనుఁడు - విష్ణువు చెప్పెను. - నీతిశాస్త్రము

శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
కృష్ణవర్ణత్వాత్ శ్యామా - నల్లనిది.

నిశీధిని - రేయి, (నడురేయి కలది.)
నిశీథః అస్యామస్తీతి నిశీథినీ. ఈ.సీ. - నిశీథమనఁగా, అది దీని యందుఁ గలదు.    
అపరాతిరి - నడురేయి, అర్థరాత్రము. 
నడికిరేయి - అర్ధరాత్రము, రూ.నడురేయి.
సరిపొద్దు - అర్ధ రాత్రము.
మహారాత్రము - అద్దమ రేయి.  
కాఁదారి - అద్దమరేయి, అర్థరాత్రము, కాదారి మాదారి పొద్దు అని వాడుక.

అర్ధరాత్ర నీశీథౌ ద్వౌ -
అర్ధ రాత్రే రర్ధరాత్రః - రాత్రియొక్క సగము.
నిశీధము - నడురేయి.
నియతం శేరతే అస్మిన్నితి నీశీథః, శీఙ్ స్వప్నే - దీనియందు నియతముగా నిద్రింతురు.

నడి - నడుము అను శబ్దమునకు సమాసము నందు వచ్చు రూపము, ఉదా. 1.నడితల, 2.నడిరేయి, 2.మధ్యము, రూ.నడు.

నిసివెలుఁగు - చంద్రుడు Moon.
నిసి - నిశ, రేయి, సం.నిశా.
నిసుఁగు - శిశువు, బిడ్ద, రూ.నిసువు, సం.శిశుః.

రే - రేయి, యొక్క రూపాంతరము, రాత్రి.
రేకంటు - (రేయి+కంటు) సూర్యుడు Sun, రాత్రికి శత్రువు.
రాత్రిమణి - చంద్రుడు Moon.
రాత్రి - సూర్యాస్తసమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాతి సుఖమితిరాత్రిః ఇ. సీ. రాదానే. - సుఖము నిచ్చునది. 

రాత్రిదుస్తులు - (గృహ.) పైజామాజత మొదలగు రాత్రిదుస్తులు (Night dress).

రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.
రాతౌ చరతీతి రాత్రించరః రాత్రిచరశ్చ చరగతి భక్షణయోః - రాత్రియందు సంచరించువాఁడును భక్షించువాఁడును గనుక రాత్రిచరుఁడు, రాత్రిచరుఁడును.
రాత్రిచరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.

సస్నాన మాచరే ద్భుక్త్వా నాతురో న మాహా నిశి|
నదాసోభి ర్విరాజస్రం  నావిజ్ఞాతే జలాశయే||

తా. భోజనము చేసిన పిమ్మటను, ఆతురుఁడు - 1.వ్యాధిగ్రస్తుడు, 2.ఉత్కంఠుడు, తహతహలాడు వాడు.)వ్యాధిపీడితుఁడై యున్నను, అర్ధరాత్రి యందును, విరాజమానము - మిక్కిలి ప్రకాశించున్నది.)వస్త్రము లేకుండగను, తా నెఱుఁగని జలాశయము - తటాకము నందును స్నానముచేయుట కూడదు. - నీతిశాస్త్రము      

నిశాఖ్యా కాఞ్చనీ పీతా హరిద్రా వరవర్ణినీ,
నిశాయాః ఆఖ్యా యస్యాస్సా నిశాఖ్యా - రాత్రి కేపేళ్ళు గలవో ఆపేళ్ళు దీనికిఁ గలవు గనుక నిశాఖ్య.
కాంచనవర్ణత్వాత్ కాంచనీ, ఈ. సీ. - బంగారు వన్నెగలది.  
పీతవర్ణత్వాత్ పీతా - పచ్చని వన్నెగలది.
హరిద్ర - పసుపు.
హరిద్వర్ణం ద్రాతీతి హరిద్రా. ద్ర కుత్సాయాం గతౌ. - పచ్చనివన్నె గలది.
వరవర్థినీ - 1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
శ్రేష్ఠవర్ణత్వాత్ వరవర్ణినీ. ఈ. సీ. మంచివన్నె గలది. ఈ 5 పసుపు పేళ్ళు.

కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
కచతి దీప్యత ఇతి కాఞ్చనం, కచి దీప్తి బంధనయోః. - ప్రకాశించునది.  
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి. (రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ వర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది. కాంచనాంబరధర గోవిందా|

కనకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
కనతి దీప్యత ఇతి కనకం, కన దీప్తౌ. - ప్రకాశించునది.
బంగారుతీఁగెలు - ఒక జాతి వడ్లు.

హేమము - 1.బంగారు, 2.ఉమెత్త.
హినోతి వర్ధత ఇతి హేమ, న, న, హి గతౌ వృద్ధౌ చ - లోహాంతరమును గూడి వృద్ధిఁబొందునది. 

బంగరు - బంగారము, సం.భృంగారః.
భృంగారము - 1.బంగారు పాత్రము, 2.గుంటగలిజేరు.      

కాంచన వస్తుసంకలిత కల్మష మగ్నిపుటంబు వెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మల త్రయం
బంచిత భక్తియోగదహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణా పయోనిధీ.

తా. రామా! బంగారులోని మాలిన్యము అగ్ని పుటము వలన పోవునట్లు అత్మయందుగల మూఁడుమలములు నీయందలి భక్తియోగము చేతనే, నశించునుగాని మరొక విధముగ నశింపవు.

కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.
కవేరపర్వతత్ప్రభవతీతి కావేరీ, ఈ. సీ. కవేరమనెడు పర్వతమున బుట్తినది.
కవేరస్య రాజ్ఞో (అ)పత్యం స్త్రీ కావేరీ - కవేరుఁ డనురాజు కూఁతురు. 
హరిద్ర - పసుపు.
హరిద్వర్ణం ద్రాతీతి హరిద్రా. ద్ర కుత్సాయాం గతౌ. - పచ్చనివన్నె గలది. 

పసుపు - (వ్యవ.) ఇది ఒక దుంపజాతి సంబార ద్రవ్యము (Turmeric), అల్లపు కుటుంబము (Zingiberaceae) లోని curcuma longa అను మొక్కను వ్యవసాయదారులు పైరు చేయుదురు. ఈ మొక్కల దుంపలను ఎండబెట్టి పసుపు తయారు చేయుదురు.
పసుపు(ౘ)చుక్క - (గృహ.) కన్ను గ్రుడ్డులో ఈ చుక్క ఉన్నచోట ప్రతిబింబము పడిన అదిస్పష్టముగా కనబడును (Yellow-spot).

త్రియామ - 1.రాతిరి, 2.పసుపు, 3.యమున. 
యామము -
జాము, మూడు గంటల కాలము.  
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము 7.30, సం.యామః.
త్రయో యామాః ఊస్యాంసాత్రియామా - యామమనఁగా జాము, మూఁడు జాములు గలది, రాత్రియందు ప్రథమయామము చేష్టాకాలము గనుకను, అంత్యయామము విబోధకాలము గనుకను నీ రెండు యామములందు సగము దివసముగా వునఁ ద్రియామ యనంబడును. 

శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
కృష్ణవర్ణత్వాత్ శ్యామా - నల్లనిది.

యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. యమున యందు దేవీస్థానం మృగావతి|

క్షణద - 1.రాత్రి, 2.పసుపు, వ్యు.తీరికను వేడుకను కలిగించునది.
క్షణమవ్యాపారస్థితిం యూనాముత్సవం వాదదాతీతి క్షణదా, డుదాఞ్ దానే - వ్యాపారశూన్యమైన స్థితినిగాని యౌవనవంతులకు నుత్సవము నుగాని యిచ్చునది.

చిత్రభానుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు.
చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః, ఉ-పు. - నానావర్ణములైన కిరణములుగలవాఁడు.
చిత్రభాను - అరువది సంవత్సరములలో నొకటి.

సూర్య వహ్నీ చిత్రభానూ :
చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు.
చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః – నానావిధము లైన కిరణములు గలవాఁడు.

చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు, (సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).
చిత్రశ్సిఖండాః చూడావిశేషాః ఏషాం సంతీతి చిత్రశిఖండిన, న. పు. - చిత్రములైన జటా విశేషములుగలవారు. 
చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
అంగిరా ఏవ చిత్రశిఖండీ తస్మాజ్జాతః చిత్రశిఖండిజః - చిత్ర శిఖండి యనఁగా నంగిరస్సు వానికొడుకు.   
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.  
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter). గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, రూ.గురుఁడు.

విరోచనుఁడు - ప్రహ్లాదుని కొడుకు.
విశేషేణరోచతే ప్రకాశత ఇతి విరోచనః, రుచ దీప్తౌ - విశేషముగాఁ బ్రకాశించువాఁడు.

చన్ద్రాగ్న్యర్కా విరోచనాః,
విరోచనశబ్దము చంద్రునికి, అగ్నికి, సూర్యునికిని పేరు. విరోచత ఇతి విరోచనః రుచ దీప్తౌ. -  ప్రకాశించువాఁడు. "విరోచనో బలేస్తాత" ఇతి శేషః.

విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విభాప్రదైవ వసుద్రవ్యమస్య విభావసుః, ఉ.పు. - కాంతియే ధనముగాఁగలవాఁడు. 

సూర్యవహ్నీ విభావసూ,
విభావసుశబ్దము సూర్యునికి, అగ్నికిని పేరు. విభైవ వసు ధనమ స్యేతి విభావసుః. పు. - ప్రభయే ధనముగాఁ గలవాఁడు. 'విభావసుర్హారభేద ' ఇతి శేషః.

ప్రభ - 1.వెలుగు, 2.సూర్యునిభార్య, 3.కుబేరుని నగరము.

విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ - చంద్రాదులచేతఁ ప్రకాశించునది.

విభవము - సంపద, ఐశ్వర్యము.
విభవతి కార్యసిద్ధౌ సమర్థో భవతీతి విభవః, భూ సత్తాయాం. - కార్యసిద్ధియందు సమర్థమైనది.
విభవ - రెండవ(2వ) తెలుగు సంవత్సరము.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. 
  
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్కుని తపమున్
తప్పరయని నృపురాజ్యము
దెప్పరమైన మీదు కీడు తెచ్చుర సుమతీ.

తా. అప్పుచేసి ఆడంబరకృత్యాలు చేయకూడదు. ముప్పు - 1.వార్థకము, 2.విపత్తు.)ముసలితనము న వయసులోనున్న కన్యను పెండ్లాడకూడదు, జ్ఞానహీనులు తపము చేయరాదు. నృపుఁడు - రాజు (అధికారి) క్రిందివారు చేసే పనులను జాగ్రత్తగా విచారించు చుండవలెను. ఆ విధంగా ఉండనివారు దెప్పరము - ఆపద, విణ.దుస్సహము, అశక్యము, రూ.డెప్పరము.)ఆపదలకు గురికాగలరు.   

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ||

తమి - రాతిరి, చీకటి.
తమస్విని -
రాతిరి.
తమః అస్యామ స్తీతి తమస్వినీ. ఈ. సీ. - చీఁకటి గలిగినది.
తమిస్ర - 1.చీకటిరేయి, చిమ్మచీకటి.
తమిస్రము - 1.చీకటి, 2.కోపము, 3.పసుపుపొడి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ(గొంగ-శత్రువు) - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu. 

అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.

ఇరులు - (వి. బహు.) చీకటి.
ఇరులుగొంగ -
సూర్యుడు Sun, వ్యు.చీకటులకు శత్రువు.

రజని - రాత్రి.
రంజంతి కామినో త్ర రజనీ. ఈ.సీ. రంజ రాగే - దీనియందు కాముకులు రాగయుక్తులగుదురు.
రజనిజలము - మంచు.

ప్రదోషో రజనీముఖమ్,
దోషాయాః ప్రారంభః ప్రదోషః. - దోష యనఁగా రాత్రి, దాని యొక్క ప్రారంభము.
రజన్యాః ముఖం రజనీముఖం. - రాత్రియొక్క యారంభము. ఈ 2 రాత్రి యొక్క మొదలు.

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్దర నారాయణా|

యామిని - రాత్రి.
యామా అస్యాం సంతీతి యామిని  - యామములు గలిగినది.
యామము- జాము, మూడు 3.00 గంటలకాలము.
(ౙ)జాము-యామము, ఏడున్నర 7.30 గడియల కాలము, సం.యామః.

యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
మగనాలు -
(మగని+ఆలు) పతిపత్ని, కుల స్త్రీ. క్రొత్తడి - 1.మగనాలు, 2.పతివ్రత, రూ.క్రొత్తడి, గొత్తడి.

సభత్తృక - మగనాలు, ముత్తైదువు.
ముత్తైదువ - ముత్తయిదువ; ముత్తయిదువ - సుమంగళి. సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.సురలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ. 
సహజ - తోడ బుట్టినది.

అథ కులస్త్రీ కులపాలికా :
కులేన అవ్యభిచారేణ రక్షితాస్త్రీ కులస్త్రీ – ఒచ్చెము(న్యూనత, కొరత)లేని కులముచేత రక్షితయైనది.
కులం పాలయతీతి కులపాలికా. పాల రక్షణే. - కులమును రక్షించునది. వ్యభిచారము చేయక కులమును మానమును కాపాడుకొను స్త్రీ పేర్లు.

కులపాలిక - 1.తల్లిదండ్ర్లచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.

యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
యౌవతము - యువతీ సమూహము.

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపసుమీ
కలకంటి కంట కన్నీరొలికిన
సిరి యింటనుండ నొల్లదు సుమతీ.

తా. కులసతితో కయ్యము, లేనిదోషాలు ఆరోపించుట మంచిది కాదు, ఏలయన స్త్రీ కన్నీరు విడిచిన, ఆ యింటి యందు(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)లక్ష్మి నివసించదు.

ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.

ఆపన్న జన రక్షైకదీక్షా యామితతేజసే,
నమోస్తు విష్ణవే తుభ్యం రామా…..

అబ్జుఁడు - 1.చంద్రుడు, 2.ధన్వంతరి, వ్యు.నీటి నుండి పుట్టినవాడు.
అప్సుజాతఃఅబ్జః జనీ ప్రాదుర్భావే - నీటియందుఁ బుట్టినవాఁడు.

ధన్వంతరి రితి ఖ్యాత ఆయుర్వేద దృగిజ్యా భాక్|
తమాలోక్యాసురాః సర్వే కలశం చామృతా భృతమ్|

ధన్వంతరి - 1.దేవవైద్యుడు, 2.సూర్యుడు, 3.మహేశ్వరుడు.   
వేల్పువెజ్జు - దేవవైద్యుడు.

హస్త నక్షత్రము, ధన్వంతరి జన్మనక్షత్రం. పాలకడలి నుంచి ఉద్భబించిన వాడు. పూర్వం సముద్ర మథనకాలంలో ధన్వంతరి జన్మించాడు. ఆదివైద్యుడు ధన్వంతరి. అతడికి బ్రహ్మజ్ఞుడని పేరు పెట్టారు - ఇతడు బ్రహ్మకుమారుడు.  

సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు. 
సూర్యతనయ - యమున.

ఓం మహేశ్వరయుక్త నటన తత్పరాయై నమో నమః|

త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
మహేశ్వరుఁడు - శివుడు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే.

మహేచ్ఛస్తు మాహాశయః,
మహతీ ఇచ్ఛా యస్య మహేచ్ఛః - ఘనమైన యిచ్ఛగలవాఁడు.
మహాశయుఁడు-గొప్ప ఆభిప్రాయము కలవాడు.
మహానాశయో మనోయస్య స మహాశయః - ఘనమైన మనస్సుగలవాఁడు.

ధ్యేయః కాళీవిశ్వనాథో మహేశో
రుద్రాక్షోవై భూతి రామ్నాయవేద్యా
మంత్రాధీశో భాతి పంచాక్షరీయం
నిస్తుల్యోయం శుద్ధకైవల్యమార్గః|
తా.
మహేశ్వరుఁడే ధ్యానింపఁదగినవాఁడు. వేదోచితములైన విభూతి రుద్రాక్షలే ధరింపదగినవి. మహామహిమోపేతమగు పంచాక్షరీ మంత్రరాజ మే జపింపఁ దగినది. నిరుపమానమును బరమకైవల్యప్రాప్తికి మార్గమును నిదియే !

పీతాముత్పలధారిణీం శుచిసుతాం పీతాంబరాలంకృతాం |
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందారమాలాధరాం||

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి -
1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.         
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురుడు.
విఘ్నరాజు - వినాయకుడు.

గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు -
1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

కాని ప్రయోజనంబు సమకట్టదు, తాభువినెంత విద్యవా
డైనను, దొడ్డరాజు కోడుకైనను నదెట్లు, మహేశుపట్టి, వి
ద్యానిధి, సవవిద్యలకుఁ దానెగురుండు, వినాయకుండుదాఁ
నేనుఁగు రీతినుండియు నదేమిటికాడఁడు పెండ్లి! భాస్కరా.
తా.
వినాయకు డీశ్వరుని కుమారుఁడయ్యు, భూమి యందు తాను, సర్వ విద్యలకు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నకు మూలపురుషుడయ్యు జ్ఞానము నిచ్చు వాడయ్యు, ఏనుగు బలము కలవాడయ్యు అతడు (పెండ్లి - వివాహము)పెండ్లాడక లేక పోయెను. అట్లే ఎంత గొప్పవాడైనను తనకు వశము(స్వాధీనము)కాని పని చేయ బూనినచో నెరవేర్చుకొన లేడు. 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.       

మహేశ్వరప్రియో దాన్తో మేరుగోత్రప్రదక్షిణః,
గ్రహమణ్డల మధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః.

ధన్వంతరి యను పండ్రెండవ 12వ తనువున సురాసుర మథ్యమాన క్షిరపాథోధి మధ్య భాగంబున నమృత కలశహస్తుండై వెడలె - పనెండో అవతారంలో సర్వవ్యాపకుడైన భగవంతుడు "ధన్వంతరి"యై దేవ దానవులు మథిస్తున్న పాలసముద్రంమధ్యభాగంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 

సీ|| తరుణుండు దీర్ఘ దోర్దాండుండు గంబుకంధరుఁడు పీతాంబరధారి స్రగ్వి
     లాలిత భూషణాలంకృతుం దరుణాక్షుఁ డున్నతోరస్కుఁ డచ్యుత్తముండు
     నీలకుంచిత కేశ నివహుండు జలధర శ్యాముండు మృగరాజ సత్త్వశాలి
     మణికుండలుఁడు రత్నమంజీరుఁ దచ్చ్యుతు నంశాంశ సంభవుం    డమలమూర్తి
ఆ|| భూరియాగభాగ భోక్త ధన్వంతరి,
     యనఁగ నమృత కలసహస్తుఁ డగుచు
     నిఖిలవైద్యశాస్త్ర నిపుణుఁ డాయుర్వేది
     వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చె|

భా|| మంచిప్రాయం కలవాడు, ఆజానుబాహుడు, శంఖం వంటి కంఠమూ, పట్టు వస్త్రమును ధరించినవాడు, పూలదండను మెడలో ధరించినవాడు, ఎఱ్ఱని కన్నులూ, ఎత్తైన రొమ్మూ, నల్లని వెండ్రుకలూ, మేఘంవంటి రంగూ, మణిఖచిత మకరకుండలాలూ, రత్నాల కాలి అందెలూ కలవాడు, మెరసే నగలు ధరించినవాడు, సింహంవంటి శక్తి కల్గినవాడు. విష్ణువు(అచ్చ్యుతుఁడు - విష్ణువు)అంశంతో జన్మించినవాడు, పవిత్రమైన యజ్ఞాలలోని హవిర్భాగాన్ని పొందే యోగ్యత కలవాడు, వైద్య విద్యలో ఆరితేరినవాడు; దేవతలకు వైద్యుడు అయిన ధన్వంతరి అనే దివ్యపురుషుడు తన చేతులలో అమృత కలశాన్ని పట్టుకొని, ఆ పాలకడలి నుండి ఉద్భవించాడు. 

తరుణాంబుదసుందరస్తదా త్వం నను ధన్వంతరిరుత్థితో(అం)బురాశేః|
అమృతం కలశే వహన్ కరాభ్యాం అభిలార్తిం హర మారుతాలయేశ||10||
నూతన నీల మేఘమువలె సుందరముగానున్న నీవు అమృత కలశమును చేబూని, ధన్వంతరి రూపమున క్షిర్రసముద్రమునుండి ఆవిర్భవించితివి. గురువాయూరు(మారుతము - వాయువు)పురాధీశ! నీవు నా బాధలన్నిటిని తొలగింపుము. - నారాయణీయము    

అబ్జమిత్రుఁడు - సూర్యుడు Sun.
అబ్జ బాంధవుడు - సూర్యుడు వ్యు.తామరలకు బంధువు. 
అబ్జము - 1.తామర, 2.నూరుకోట్లు, 3.ఉప్పు, 4.శంఖము, 5.హారతి కర్పూరము, 6.(వృక్ష.) నీటిప్రబ్బలి, విణ.నీట బుట్టినది.
అప్సుజాతఃఅబ్జః జనీ ప్రాదుర్భావే - నీటియందుఁ బుట్టినవాఁడు.

అబ్జయోని - బ్రహ్మ, తమ్మిచూలి.
అబ్జయోనిః ఇ.పు. అబ్జం విష్ణునాభికమలం యొని రుత్పత్తిస్థానం యస్యసః - విష్ణునాభికమలమే ఉత్పత్తి స్థానముగాఁ గలవాఁడు.
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు. అబ్జజుఁడు - బ్రహ్మ, తుమ్మిచూలి.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

అబ్జవైరి - చంద్రుడు, వ్యు.తామరలకు శత్రువు.
అబ్జారి -
చంద్రుడు.

అబ్జౌ శజ్ఖ శశాఙ్కాచ - అబ్జశబ్దము శంఖమునకును, చంద్రునికిని, చకారము వలన తామరకును, ధన్వంతరికిని పేరు. అద్భ్యః జాయత ఇత్యబ్జః, అబ్జం చ. జనీ ప్రాదుర్భావే. - నీళ్ళ వలనఁ బుట్టునది. "శంఖే ధన్వంతరౌ చంద్రే పుం స్యబ్జః క్టీబమంబుజ" ఇతి నానార్థ సంగ్రహః. పూజ్యుడైన ధన్వంతరి రోగహేతువైన అపథ్యము నుంచి రక్షించును.

బిలియను - (Billion), నూరుకోట్లు.

కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు, 4.నస, 5.ముదిమి. కారిత లవణాసుర వధ రామ్|

క్షారసింధువు - లవణ సముద్రము.
లవణము - ఉప్పు, సైంధవ, సౌవర్చ, కాచ, బిడా, సముద్ర లవణములని పంచ లవణములు.
ఉప్పుఁగడలి - (ఉప్పు+కడలి) లవణ సముద్రము.
లవణమివ ఉదకం యస్యసః లవణోదః - లవణమువంటి ఉదకము గలిగినది.
గెల్లి - ఉప్పుకుప్ప.

లవణః -
లునాతివాతం జాడ్యం వా లవణః, లూఞ్ ఛేదనే. - వాయువును గాని జాడ్యమునుగాని పోఁగొట్టునది. ఈ ఒకటి ఉప్పు పేరు. 

సువర్చలవణము - సోడియం నైట్రేట్ (ఇది చలి దేశములో గనులలో దొరుకును) (Salt-petre).

ఉప్పళము - ఉప్పుపండు నేల. 
ఉప్పుఁబఱ్ఱ - (ఉప్పు+పఱ్ఱ) ఉప్పుతనంతట పండెడి నేల, చవుటినేల.
పఱ్ఱు - 1.పఱ్ఱనేల ఊషరక్షేత్రము, విస్సరామగు భూమి, 2.ఉప్పుపండునేల.    

ఊషక్షారము - చవిటి ఉప్పు.
ఊషర బీజ న్యాయము - న్యా. చవుటి నేల యందు విత్తిన బీజములవలె నిరుపయోగము.

స్యా దూషః క్షారమృత్తికా,
ఉషతి బీజమూషః, ఊష ఉజాయాం. - విత్తనమును జెఱుచునది.
క్షారా చ సా మృత్తికా చ క్షారమృత్తికా - ఉప్పుమన్ను క్షారమృత్తిక. ఈ 2 చౌటిమట్టి పేర్లు.

ఇరిణము - 1.చవుటిది (నేల) 2.పాడైనది, రూ.ఈరిణము. 

చౌరు - 1.తీపితో కలిసిన ఇంచుక ఉప్పు, 2.వేడిమిచే వరివెన్ను ఎండిపోవురోగము.

రుమ - 1.ఉప్పు పండదగిన నేల, 2.సుగ్రీవుని భార్య.

ఉప్పుఁగండ - ఉప్పురాచి ఎండబెట్టినకండ.

ఔషరము - 1.రా తి ఉప్పు, 2.సూదంటురాయి, 3.చౌటినేల.

కారము1 - 1.ఆరు రుచులలో ఒకటి, 2.బిడ్దలకు పోయు మందు, 3.చవుడు, 4.నూలు తడిపెడి ఒకానొక ద్రవద్రవ్యము, సం.క్షారః.
కారము2 - కప్పము; షడ్భాగము - కప్పము.

అరి2 - 1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.  

ౘవుడు - చగుడు.
ౘగుడు - కారపుమన్ను, రూ.చవుడు, చౌడు.
ౘవుడు - (వ్యవ.) చౌడు, ఊషరక్షేత్రము లలో నేలమీద కనబడు క్షార పదార్థము (చాకలివాండ్రు దీనిని బట్టల నుతుకుట కుపయోగించు చుందురు.) (Alkaline material).
(ౘ)చౌడు - 1.ఊషరక్షేత్రము, 2.చౌటి నేల, 3.చౌటిమన్ను.

ఇరిణము - 1.చవుటిది (నేల) 2.పాడైనది, రూ.ఈరిణము.      

ఊషరము - చవుటిది (నేల). 
ఊసరము1 - చవిటిది (నేల), సం.ఊషరః.
ఊసరము2 - కృశించినది.  
ఊషరవృష్టిన్యాయము - న్యా. చవుటి నేలలో వర్షముపడినట్లు నిరుపయోగము.

వల్లూరము - 1.పందిమాంసము, 2.ఎండినచేప, 3.చవిటినేల, 4.అగ్ని.
వల్యతే శోషణార్థ మితి వల్లూరం, అ, త్రి, వల సంవరణే - ఎండించుకొఱకు ఆవరింపఁబడునది.
ఉప్పుఁజేఁప - ఉప్పురాచి ఎండబెట్టిన చేప.

వాన - వర్షము.
వానకాళ్ళు - వర్షధారలు.

వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరద పారు
వరద కరవు రెండు వరుసతో నెరుగుడీ విశ్వ.

తా|| వాన కురియనిచో క్షామము - కరవు, విణ.తక్కువైనది. వచ్చును, వాన కురిసిన వరద - 1.పెండ్లి కాని పడుచు, 2.దుర్గ, వై.వి.వెల్లువ, సం.ప్రవాహ్. వచ్చును. వరదా కరువు రెండునూ వచ్చిన నష్టము సంభవించును కదా!

ఉప్పురిల్లు - క్రి.ప్రాతగిలి ఉప్పుమట్టిగా రాలిపోవు, ఉప్పురుసిపోవు.

నవాసారము - నవక్షారము, ఒక దినుసు ఉప్పు, వి.(రసా.) అమ్మోనియమ్ క్లోరైడ్ (Salammoniac) తెల్లనిలవణము - (వేడెక్కించినచో విఘటనము చెంది అమ్మోనియా, హైడ్రోజన్ క్లోరైడు క్రింద విడిపోవును).
నవక్షారము - నవాసారము.    

లవణనిగరణశక్తి - (వ్యవ, భూగో.) నేల యందలి నీటిలో కరిగి యుండు లవణములను మట్టిరేణువులు కొన్నిటిని హెచ్చుగను, కొన్నిటిని తక్కువగను ఆకర్షించుశక్తి (Salt absorption power).
లవణజలము - (రసా.) లవణము పాలు ఎక్కువగా కలిగియున్న నీరు (Brine).

ఫ్లోరినము - (రసా.) లవణజనకము లగు మూల ద్రవ్యములలో నొకటి, ఆ వర్గములో మొదటి చురుకైన ద్రవ్యము (Flourine).

నీళ్ళవరుగు - ఉప్పు.
ఉప్పు - ఆవిరిపోకుండ ఉడకబెట్టు, వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.    
ఉప్పదనము -

ఉప్పిళ్ళు - ఉప్పుడు బియ్యము.
ఉప్పుడుబియ్యము - (గృహ.) వడ్లు కొంచెము ఉడకబెట్టి ఎండబెట్టినపిదప దంచిన బియ్యము (Parboiled rice).
ఉప్పుడు - ఉడికినది, ఉడకబెట్టినది.
ఉప్పుఁబిండి - (ఉప్పు+పిండి) ఉప్పువేసి వండినది.

సీ. తల్లి గర్భమునుండి ధనము దేఁ డెవ్వఁడు,
      వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,
   లక్షాధికారైన లవణ మన్న మెకాని, 
      మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
   విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,
     కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు, 
   పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
     దానధర్మము లేక దాఁచి దాఁచి,
తే. తుదకు దొంగల కిత్తురో ? దొరల కవునొ ?
  తెనె జుంటీ గ లియ్యవా తెరువరులకు ? భూ.

భా|| నరసింహా ! తల్లి కడుపునుండి ధన మెవ్వడు  తీసుకొనిరాడు, పోవునాడు వెంటరాదు.  లక్షాధికారైన (లవణము)నుప్పు మెతుకులేకాని, మెఱుగు బంగారమును మ్రింగ లేడు. విత్తము-డబ్బు సంపాదించి పగరు బడవలసినదేకాని, దానధనము వెంటరాదు. బాగుగ రహస్యమైనచోట భూమిలో సొమ్ము ధర్మము చేయక దాచినవారు తుదకు (తుద - చివర, అంతము, రూ.తుది.)దొంగలకో, దొరలకో, యొసంగుదురు. ౙుంటీగ-చిన్నతెనెటీగ, సరఘు. కష్టపడి దాచిన ౙుంతేనె - జున్ను తెనె, జుంటీగలు కూర్చిన తెనె. తెనెను బాటసారుల కిచ్చినట్లగును (దానధర్మములు సేయక సొమ్ము దాచకూడదనుట.)

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).

ఉప్పుఁగాయ - (ఊరు+కాయ) ఊరుగాయ.
రుచిఁగాయ - ఊరుగాయ.

తొక్కు - 1.ఉప్పుకారము చెర్చి దంచిన కాయలు (ఊరగాయ), రూ.తొక్కుడు, 2.అవ్యక్తము (మాట) 3.పసిబిడ్దల వచ్చియు రాని మాటలు.
అవ్యక్తవాక్కు - (గృహ.) వచ్చీ రాని మాటలు (Babbling).

రుచి - 1.ఇచ్ఛ, 2.చవి, 3.కాంతి, 4.సూర్యకిరణము.
రుచి - (రసా.) నాలుకతో గుర్తించ పడు వస్తుగుణము, ఉదా.పులుపు, తీపి, చేదు.

లక్ష్మీదేవి పుట్టకముందు ఆకులేని పంట పండింది - ఉప్పు.

సామి - 1.స్వామి, 2.రాజు, 3.పెనిమిటి, 4.కుమారస్వామి, సం.స్వామి.
స్వ మైశ్వర్య మస్యాస్తీతి స్వామీ, నాంతః - సొమ్ము గలవాఁడు.

సొమ్ము - 1.స్వము, 2.ధనము(నెలగ - ధనము), 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీన వస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive). స్వాపతేయము - ధనము.    
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్. 
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.  
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము(Active Principle).  
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.  
నిజము - స్వభావము, 1.తనది, 2.శాశ్వతమైనది.
తాను - తాశబ్దమునకు ప్రథమైక వచనము. తన - ఆత్మార్థకము.
ఆత్మీయము - తన సంబంధమైనది, తనది, స్వకీయము.
సొంతము - స్వతంత్రము, స్వకీయము, సం.స్వతంత్రమ్.
స్వకీయము - తనది, రూ.స్వకము, (వ్యతి. పరకీయము).
స్వీయము - తనది, వ్యతి.పరకీయము.

నైజము - 1.తనది, స్వాభావికము.
నైసర్గికము - స్వాభావికము.
స్వాభావికము - స్వభావముచేత కలిగినది. 
నైసర్గికలక్షణము - (భూగో.) ఒక ప్రదేశపు సహజగుణము, ఉదా. ఒక ప్రాంతము చెట్లలోగాని, కొండలలోగాని, నదులలోగాని నిండియుండు స్థితి.

ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ -
భూషణము; భూషణము - అలంకరణము. 
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది.
ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.

పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింప బడినది.
పిత్రార్జితము -
పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).  

జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త.

స్త్రీ ధనము - పెండ్లి మున్నగు, సమయములలో స్త్రీకిచ్చిన ధనము.
సౌదాయికము - స్త్రీ కిచ్చిన ధనము.

విత్తము - ధనము, సం.విణ.1.విచారింపబడినది, 2.తెలియబడినది.
విద్యతే లభ్యత ఇతి విత్తం, విద్ ఌ లాభే. - పొందఁబడునది.   

ఉత్తమం స్వార్జితం విత్తం - మధ్యమం పితు రర్జితమ్|
అధమం భ్రాతృవిత్తంచ - స్త్రీవిత్త మధమాధ మమ్||
తా.
తాను సంపాదించినసొమ్ము ఉత్తమము(శ్రేష్ఠము, ముఖ్యము), తండ్రిసొమ్ము మధ్యమము, భ్రాత - తోడబుట్టినవాడు వాని సొమ్మధమము(అధమము - తక్కువైనది, నీచము), స్త్రీసొమ్ము మిక్కిలి యధమము. – నీతిశాస్త్రము

కంబువు - 1.శంఖము, 2.ఏనుగు, 3.కడియము, 4.నత్తగుల్ల.
కంబుగ్రీవ -
1.మూడు ముడుతలు గల మెడ, 2.శంఖము వంటి మెడగలది.

శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
గుల్ల -
1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ. 1.అల్పము, 2.బోలు, సం.క్షుల్లః.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల. (గుల్ల కడియము.)
డొల్ల - 1.బల్లవంటిది, 2.బుఱ్ఱ, 3.డొల్లక.
బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద. 
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
పొక్కు - 1.బొబ్బ, 2.ఎండి లేచినపెల్ల, 3.జనశ్రుతి, క్రి.1.దుఃఖించు, 2.బొబ్బలేచు.
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low). 
సూక్ష్మము - అణువు, విణ.సన్నము.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).      
శంఖిని - స్త్రీ జాతి విశేషము. 

శఙ్ఖో నిధౌ లలాటాస్థ్ని కమ్బౌన స్త్రీ : శంఖ శబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖమునకును పేరు. శమయతి దుఃఖమితి శంఖః శము ఉపశమే. - దుఃఖమును శమింపఁ జేయునది.    

వెలిగుల్ల - శంఖము. శంఖధ్వని వినిపించే చోటు లక్ష్మీదేవి ఉంటుంది. 

శ ఙస్స్యాత్కమ్బు రస్త్రియౌ :
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః ఖను అవధారనే. - సుఖమును  బుట్టించునది.
కామ్యతే శుభార్థిభిరితికంబుః. ఉ-ప్న. కము కాంతౌ. - శుభర్థులైనవారిచేత కాంక్షింపఁబడునది. ఈ రెండు శంఖము పేర్లు.

శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతియందు ధరించువాడు.     

అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.

అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

హారతి కర్పూరము - (వ్యవ.) (Lauraceac) అను కుటుంబమునకు చెందిన Laurus camphor అను చెట్టువేళ్ళు కాండములనుండి ఈద్రవ్యమును అస్థిర తైలమును తీయుదురు (Camphor).

ఆజ్యము - 1.నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.

ద్వౌ పరివ్యాధ విదులౌ నాదేయీ చామ్బువేతనే :
పరివిధ్యతే అంభసా పరివ్యాధః వ్యథ తాడనే. - జలముచేత అంతట కొట్టఁబడును.
విదుల్యతే అంభసా విదులః, డుల క్షేపే. - జలముచేతఁ ద్రవ్వఁబడినది.
నద్యాం భవా నాదేయీ, ఈ. సీ. - నదియందుఁ బుట్టినది.
అంబుని వేతసో మ్భు వేతసః - జలమందలి ప్రబ్బలి. ఈ నాలుగు నీరు ప్రబ్బలి పేర్లు.

భవరోగభిష గ్ధన్వంతరిః కామార్యధోక్షజౌ,
ఊర్థ్వకేశో హృషీకేశః క్రతుధ్వంసక రక్షకౌ |

జైవాతృకుఁడు - 1.చంద్రుడు, 2.పంటకాపు, 3.వైద్యుడు, విణ.దీర్ఘాయువు కలవాడు.
ఓషధీః జీవయతీతి జైవాతృకః జీవప్రాణధారణే - పైరులను బ్రతికించువాఁడు.

జైవాతృక స్స్యాదాయుష్మాన్-
జీవతి చిరకాల మితి జైవాతృకః, జీవ ప్రాణధారణే. - అనేకకాలము బ్రతుకువాఁడు.
అధిక మాయు రస్యాస్తీ త్యాయుష్మాన్ త. - అధికమైన ఆయుస్సు గలవాఁడు. ఈ 2 దీర్ఘాయుష్మంతుని పేర్లు. 

జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.

జైవాతృక శ్శశాఙ్కే (అ)పి -
జైవాతృకశబ్దము చంద్రునికిని, అపిశబ్దమువలన ఆయుష్మంతునికిని పేరు.
జీవతీతి జైవాతృకః, జీవ ప్రాణధారణే. - బ్రతుకువాఁడు.
"జై వాతృకః కృషే చంద్రే భైషజ్యా యుష్మతోరపి" ఇతి విశ్వప్రకాశః. కృషః = కృషకః.

శశాంకుఁడు - చంద్రుడు.

శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః|
శశాంక ఖండ సంయు క్త మకుటాయై నమో నమః|

జీవదుఁడు - వైద్యుడు.
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.

జైవాతృక శ్శుచి శ్శుభ్రో జయీ జయఫలప్రదః,
సుధామయ స్పురస్వామీ భక్తానా మిష్టదాయకః|- 6

ఆయుష్మంతుడు - దీర్ఘ కాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి - 1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.
చిరంజీవతీతి చిరజీవీ, న. పు. జీవ ప్రాణధారణే. - చాలాకాలము బ్రతుకునది.
దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.  

కాకపుష్ఠము - కోయిల, వ్యు.కాకిచే పోషింపబడినది.    

కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.    

పికము - కోయిల.
అపికాయతీతి పికః, కైగైశబ్దే. చాటుననుండి కూయునది, అపిరంతర్ధౌ.
కోవెల - గుడి, వై.వి. కోకిలము.
కోకిలము - కోయిల.
పికం వర్ధయతి పికవర్ధనః, వృధు వృద్ధౌ. - కోవెలలను వృద్ధిపొంచునది.
కాకపిక న్యాయము - న్యా. కోయిల కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము.

పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.

కాకలి - సూక్ష్మమైన అవ్యక్త మధురాక్షరధ్వని.  

దైవతము - వేలుపు, విణ. దేవతా సంబంధమైనది.

వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
సంశ్చాసౌ జనశ్చ సజ్జనః - మంచిజనుఁడు.

లోకములోన దుర్జనులలోఁతు నెఱుంగక చేరరాదు, సు
శ్లోకుఁడు జేరినంగవయజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁగన్న చోటఁగుమిగూడియు సహ్వపుగూత లార్చుచున్
గాకులుతన్నవే తరిమి కాయము తల్లదమంద! భాస్కరా.

తా. లోకమందు సజ్జనుఁడు(సజ్జనుఁడు- 1.మంచి కులమున బుట్టిన వాడు, 2.మంచివాడు.)దుర్మార్గులకు లోనుండు(దుర్జనుఁడు - దుష్టుడు)గుట్టును తెలిసికొనకయే వారి(ప్రక్కను) కలియ రాదు. అట్లు కలిసినచో వారు వేళాకోళము(ఎకనకియము - 1.వికటపుమాట, 2.అవమానము, 3.వంచన, 4.అపహాస్యము, విణ.వికటము.)చేసి అతనితో గలియబడుదురు. కీడు కలుగును. కోకిలను గన్న కాకులు దాని చుట్టును మూగి అసహ్యపు కూతలను కూయుచూ దానిని తన్ని తరిమి వేయును కదా!

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదో న్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్దనం గతి దాయకమ్,
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్| - 7

పరితము - కోయిల, సం.పరభృత్.
పరభృతము - కోయిల.
పరైః కాకైః భృతః పరభృతః భృఞ్భరనే. - పరుల (కాకుల)చేతఁ బెంచఁబడునది. 
పరంకోకిలం బిభర్తీతి పరభృత్. త. పు. భృఞ్ భరణే. కోయిల పిల్లను పోషించునది.

బలిభుక్కు - 1.కాకి, 2.ఊరుపిచ్చుక.
బలింభుఙ్క్తే బలిభుక్, జ. పు. బుజ పాలనా భ్యవహారయోః - బలిని భుజించునది.
ఊరఁబిచ్చిక - (ఊరు+పిచ్చిక) ఊరి యందు తిరిగెడు పిట్ట, చటకము, రూ.ఊరఁబిచ్చుక.
ఊరఁబిచ్చుక - (ఊరు+పిచ్చుక). చటకము - పిచ్చుక.

వాయసము - కాకి Crow.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.

కాకదంత పరీక్ష - న్యా. వ్యర్థమైన పని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.) నూరు కాకులలో ఒక కోకిల. కాకి మరియొక కాకిని పొడవదు. 

విద్వాంసుఁడు-చదువరి, విణ.ఎరుకగలవాడు.
వేత్తి సర్వం విద్వాన్, స. పు. - సర్వము నెఱింగినవాఁడు.

విపశ్చితుఁడు - విద్వాంసుడు.
విశేషేణ పశ్యన్ చేతతీతి విపశ్చిత్. త. పు. చిత్రీ సంజ్ఞానే. - విశేషముగాఁ జూచుచు నెఱుంగువాఁడు.

దోషజ్ఞుఁడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోష మెరిగినవాడు.
దోషం జానాతీతి దోషజ్ఞః జ్ఞా అవబోధనే. - దోషము నెఱిఁగినవాఁడు. 

దోష్టిక దృక్సురోభాగీ -
దోషమేకం పశ్యతి దోషైకదృక్, శ. దృశిర్ ప్రక్షణే. - కేవలము దోషమునే చూచువాఁడు.
పురో దోషం భజతి గృహ్ణాతి తాచ్ఛేల్యేనేతి పురోభాగీ, నాంతః, భజ సేవాయాం. - ముందు దోషమును స్వభావమున గ్రహించువాఁడు. ఈ 2 దోషమునే వెదుకువాని పేర్లు. 

దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, వలయందలి రంధ్రము, 9.వ్రణదులయందలి రంధ్రము.

దృష్టి రాజ్ఞానే అక్ష్ణి దర్శనే,  
దృష్టిశబ్దము జ్ఞానమునకును, కంటికిని, చూపునకును పేరు. దృశ్యతే అనయా దర్శనం చేతి దృష్టిః, సీ దృశిర్ ప్రక్షణే. - దీనిచేత చూడఁబడును గనుకను, చూచుట గనుకను దృష్టి.

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృష్టించు - క్రి.చూచు.
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగ్రుడ్డునకు సంబంధించినది, (Optic).
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదదున కందచేయు నాడి (Optic nerve).
దృష్టిరేఖ - (భౌతి.) మనచూపు పరచు ౠజురేఖ, (Line of vision). 

అక్షి - 1.కన్ను, 2.రెండు అను సంఖ్యకు సంకేతము.
అక్ష్ణోతి దూరమిత్యక్షి, అక్షూ వ్యాప్తౌ. - దూరముగా వ్యాపించినది.

వళిరః కేకరే -
వలతే విషయగ్రహన వేళాయాం అపాఙ్గదేశం ప్రతీతి వళిర్గోళకం; తద్యోగాత్ వళిరం నేత్రం; తద్యోఅత్ పురుషో (అ)పి వళిరః - పదార్థముల గ్రహించునప్పుడు కడకంటికివచ్చు చూపు కలవాఁడు.
కే శిరస్సమీపే అక్షిసఞ్చారం కరోతీతి కేకరః. - శిరస్సమీపమందు నేత్రసంచారముఁ జేయువాఁడు. ఈ 2 మెల్లకంటివాని పేరు.

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దర్శనీయము - చూడదగినది.

దోషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలమేపరి - రాహువు Rahu. 

దుర్జనః ఖలః,
దుర్జనుఁడు - దుష్టుడు.
దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్దజాతి.  
దుష్టో జనః దుర్జనః - దుష్టమయిన జనుఁడు.
ఖలతి ధ్ర్మాదితి ఖలః, కల సంచలనే. - ధర్మమువలనఁ జలించువాఁడు. ఈ 2 దుష్టుఁడయినవాని పేర్లు.
కర్ణేజన శబ్దము మొదలు 4 పరదోష ప్రకాశకుని పేర్లని కొందఱు. 
పిశున దుర్జనఖల శబ్దములు 3 ను జనులలో నొకని కొకనికి తగువు పెట్టువాని పేర్లని కొందఱు.

ఖలుఁడు - 1.దుర్జనుడు, నీచుడు, అధముడు, 2.సూర్యుడు Sun, వ్యు.ఆకాశమున నుండువాడు.
నీచుఁడు - అధముడు, రూ.నీచు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.

సత్యం న సత్యం ఖలు యత్ర హింసా, దయాన్వితం చానృతమేవ సత్యమ్|
హితం సరాణాం భవ తీహ యేన, తదేవ సత్యం న తథాన్యధైవ||

హింసకు దారి తీసేది కీడు కలిగించేది అయితే, అది సత్యమైన సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. మనిషికి ఏది హితమో అది సత్యం తప్ప మరొకటి కానేరదు.

పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
అట్తి పాము చెప్పినట్లు వినును
ఖలుని గుణము మాన్ప ఘనులెవ్వరునులేరు, విశ్వ!

తా. దుష్టజంతువు అయిన పాము(పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.)చేతకూడ చెప్పినట్లు చేయించవచ్చునుకాని, దుర్మార్గుని చెడ్దగుణములు పోగొట్టుటకు యెవ్వరికిని సాధ్యముగాకున్నది.

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రవాత్
మాఙ్గల్యభాజి మధుమాథిని మన్మథేన
మ య్యాపతే త్త ది హ మన్థర మీక్షణార్థం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయః|
– 8

దోషకారి - దోషముచేయువాడు.
దోసి - దోషి.

దోష - 1.భుజము, 2.రాత్రి.    

దోసము - దోషము.
దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.)కొలతలలోని తప్పులు.
దోషయుతము - లోపములు గలది, సరికానిది, నేరము కలది, (Faulty).  

కదనము - 1.దోసము, పాపము, 2.యుద్ధము. దోసము - దోషము.
దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.)కొలతలలోని తప్పులు.
దోషయుతము - లోపములు గలది, సరికానిది, నేరము కలది, (Faulty).
కిల్బిషము - దోషము, పాపము.     

అవగుణము - దుర్గుణము, తప్పు.
ప్రావ - దోషము, సం.పాపమ్.    

నయమున బాలుల ద్రావరు
భయమున విషమునయిన భక్షింతురుగా
నయమేంత దోసకారియొ
భయమే జూపంగవలయు బాగుగ సుమతీ.

తా|| బ్రతిమాలినను(నయ - 1.అందము, నయము.)న పాలు త్రాగనివారు భయపెట్టినచో విషము(విషము - 1.గరళము, 2.జలము.)నైన భుజింతురు. కాబట్టి, మంచిపనులు మనవలన నెరవేరనప్పుడు, వాటిని భయపెట్టుటద్వారా సాధించవచ్చును.

కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
కప్యతి హినస్తీతి కష్టం, కష హింసాయాం. - హింసించునది.

ఆగము - తప్పు, నేరము, పాపము.
తప్పు - క్రి.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.
నేరము - తప్పు. తప్పిదము - దోషము.
అపచారము - 1.పెద్దలయెడ చేయు తప్పు, 2.లోపము, 3.అపథ్యము, 4.అపథ్యపదార్థము.
లోపము - 1.తక్కువ, 2.మరుగుపాటు.  
అపథ్యము - 1.తినరానిది, 2.హితము కానిది, తగనిది.

ఆగో (అ)పరాధో మంతుశ్చ -
అగతికుటిలం గచ్ఛతీ త్యాగః, స. న. అగ కుటిలాయాం గతౌ. - కుటిలముగా బొందునది.
అపరాధ్యంతే అనే నేత్యపరాధః, రాధ హింసాయాం. - దీనిచేత హింసింపఁబడుదురు.
మన్యతే కష్టమితి మంతుః, ఉ. పు. మన జ్ఞానే. - కష్టమని తలంపఁబడునది. ఈ 3 అపరాధము పేర్లు.

మంతువు - 1.తెలివి, 2.అపరాధము, 3.రాజు 4.మనుష్యుడు.

కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
కీడుపడు - క్రి.1.తక్కువగు, 2.దైన్యపడు, 3.చచ్చు, రూ.కీడ్పడు.

వృజినము - పాపము, దోషము, క్లేశము, విణ.వక్రము, రూ.వృజనము.
వర్జ్యతతసిష్టైరితి వృజినం, వృజీవర్జనే - శిష్టులచేత వర్జింపఁబడునది.
వృజ్యత ఇతి వృజినం, వృజీ వర్జనే. – విడువఁ బడునది.  

దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.)కొలతలలోని తప్పులు.
దోషయుతము - లోపములు గలది, సరికానిది, నేరము కలది, (Faulty).

కల్మాషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.
కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.

దురితము - పాపము; పాపము - దుష్కృతము, కలుషము. 
పాపమస్యేతి పపః - పాపముగలవాఁడు.
దుష్కృతము - పాము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.

కంఠేకాలుఁడు - శివుడు, వ్యు.కంఠము నందు నలుపు కలవాడు.    

కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
కాలరాత్రి - 1.ప్రళయకాలము, 2.దుర్గామూర్తి భేధము, 3.చీకటిరాత్రి, సం.వి.కాలిబంటు, పదాతి.

దోషాపనుత్తయే కాశీం గత్వా త్యక్త్వా కళేబరమ్
తత్రాయం జాయతే చిత్రం దోషాకరశిరోమః|

భా|| దోషసంక్షాశనార్ధమై వారణాసికిం జని యచట మరణించి (కళేబరము - మేను, శరీరము.)తిరిగి నరుఁడు దోషాకరశిరోవతంసుఁడై జన్మించు చున్నాఁడు. ఆహా ! ఇట్టి విచిత్ర సంఘటన మెచ్చటనై నఁగలదా? (వారణాసియందు మృతిఁ బొందిన మనుజుఁడు దోషాక శిరోవతంసుడుఁ చంద్రుఁడే శేఖరుముగాఁ గలవాఁ (ఈశ్వరుఁ) దగుచున్నాఁడని భావము.)

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

సుధి - విద్వాంసుడు.
శోభనం ధ్యాయతీతి సుధీః, ఈ. పు. ధ్యై చింతాయాం. - లెస్సగా విచారించువాఁడు.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః.


కుట్టి - కోవిదుడు, విద్వాంసుడు.
కోవిదుఁడు - విద్వాంసుడు, వ్యు.ఇది అది అనునియమము లేక సర్వమును ఎరిగినవడు.
కిం నామ న నేత్తీతి కోవిదః, విద జ్ఞానే. - ఇది అది యను నియమములేక సర్వము నెఱిఁగినవాఁడు.

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసలోక పుణ్యపాప శోధకం విభుం |
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || – 8

ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈష్ట ఇతీశ్వరః - ఐశ్వర్యయుక్తుఁడు, (ప్రభుత్వము గలవాఁడు).
ఈశ్వరి - పార్వతి.
ఈశ్వరస్య పత్నీ ఈశ్వరీ, ఈ-సీ. - ఈశ్వరుని భార్య.
ఈశ్వర - ప్రభవాది అరువది సంవత్సరములలొ పదునొకండవది(11వ).

ఈశ్వరస్యభావ ఐశ్వర్యం, అ-న. - ఈశ్వరభావము.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

పరమము - పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము, 2.ఆద్యము, 3.ప్రధానము.
పరమము - (భౌతి.) అన్నింటికి పరమైనది (Absolute).
ప్రధానము - 1.ముఖ్యము, 2.ముందిచ్చు సొమ్ము, 3.వివాహాత్పూర్వము, వధువున కలంకారాదుల నిచ్చి నిశ్చయించు కొనుట, 4.పరమాత్మ.

బలముతొలంగు కాలమునఁ బ్రాభవసంపద లెంత ధన్యుడున్
నిలుపుకొనంగనోప డదినిశ్చయమర్జునుఁడీశ్వ రాదులన్
గెలిచినవాడు దాయకు గీడ్పడిచూచుచు గృష్ణ భార్యలన్
బలువురనీయడే నిలువబఁట్టి సమర్థుడుగాక! భాస్కరా.

తా. తన బాహుబలము తగ్గి పోయినప్పుడు యెంతటి(ధన్యుఁడు - పుణ్యవంతుడు)గొప్పవాఁడ యిననూ తన(ప్రాభవము - ప్రభుత్వము)సంపద లను నిల్పునొకలేడు. మహాబలశాలి, ఈశ్వరాదు లను గెల్చినవీరుడైన అర్జునుడు(అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జు నుడు, 3.తల్లికి ఒకడే కొడుకైన వాడు.)శ్రీ కృష్ణ పట్ట మహిషులను దొంగలకు(దాయ - 1.దాయాదుడు, జ్ఞాతి, 2.శత్రువు,సం.దాయాదః.)దోచుకొనుట కిచ్చివేసెను గదా!

శర్వుఁడు - శివుడు, వ్యు.ప్రళయ కాలమున భూతముల హింసించువాడు.  
శర్వః, ప్రళయే భూతానిశృనాతి హీనస్తీతి శర్వః - ప్రళయమందు భూతములను హింసించువాఁడు, శౄహింసాయాం.
శర్వాణి - పార్వతి. శర్వాణీ శర్వమూర్తిమాన్|
శర్వస్య పత్నీ శర్వాణీ, ఈ. సీ. - శర్వుని భార్య.

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయావహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.

విలయము - ప్రళయము.
వ్రలీయతే జగదత్ర ప్రళయః, లీఙ్ శ్లేషనే. - జగత్తు దీనియందుఁ విలయ మొందును.
యుగాంతము - మహాప్రళయము.
మహాప్రళయము - లోకనాశము.
కల్పతే ప్రభవతి జగన్నాశాయేతి కల్పః, కృపూ సామర్థే. - లోకనాశముకొఱకు సమర్థమైనది.
క్షయము - 1.క్షయవ్యాధి, 2.తగ్గుదల, 3.ప్రళయము, 4.క్షయనామ సంవత్సరము. 
క్షీయతే జగదస్మిన్నితి క్షయః, క్షిక్షయే. - దీనియందు జగత్తు క్షయించును.

యక్ష్మము - క్షయరోగము.
క్షయరోగము - ఊపిరితిత్తుల రోగము, క్షయవ్యాధి, (Tuberculosis).
రాజయక్షము - క్షయరోగము, Consumption.

పుమాన్ యక్ష్మా క్షయ శ్శోషః -
యక్ష్యతే రోగేషు యక్ష్మా. న. పు. యక్ష పూజాయాం. - రోగములయందు రాజవుటవలనఁ బూజింపఁ బడునది.
క్షీయన్తే అనేనేతి క్షయః క్షి క్షయే. - దీనిచేత క్షయింతురు. 
శుషన్తే అనేనేతి శోషః. శుష శోషణే. - దీనిచేత శోషింతురు. ఈ మూడు 3 క్షయరోగము పేర్లు.

శోషణము - 1.శోషరోగము, 2.క్షయరోగము.
శోషణము - 1.ఇంకుట, ఎండుట, సం.వి. (రసా.) తేమను తొలగించు విధానము (Dessication).
శోషించు - ఇంకిపోవు.
ఎండు - 1.నీరింకు, 2.తడియారు, 3.శుషించు, 4.తపించు.
ఎండుతెవులు - దేహమును శుష్కింప జేసెడి ఒక వ్యాధి.

నవఁత - 1.శ్రమ, 2.దుఃఖము, 3.క్షయరోగము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.

కార్శ్యరోగము - (గృహ.) చిక్కి శల్యమగుటకు క్షీణించి పోవుట (Emaciation).

ఆస్తేనియా - (గృహ.) (Asthenia) బలము తగ్గుట లేక బలము లేకపోవుట.

క్షయకరణము - (రసా.) ఒక పదార్థమునందలి, ఆక్సిజన్ మొ. ఋణ విద్యుదాత్మకము లగు మూలకములను తొలగించుట లేక వాని నిష్పత్తి తగ్గించుట, న్యూనీకరణము, అపచయము (Reduction).
న్యూనము - తక్కువైనది.  

అఱు1 - క్రి.నశించు, 2.క్షీణించు.
అఱు2 - 1.కంఠము, 2.సమీపము, 3.ముందుభాగము, రూ.అఱ్ఱు.
అఱ్ఱు - అఱు.

అతిరోగము - అధికమైన రోగము కలది, వి.1.అధికమైన రోగము, 2.క్షయవ్యాధి.
క్షయరోగమునకు ముఖ్యముగ కాస, శ్వాసలు, కఫము, జ్వరము, దేహము శుష్కించుట, నీరసము, అరుచి, అగ్నిమాంద్యము గలిగి యుండును.

ప్రళయము - 1.కల్పాంతము, 2.అపాయము, 3.మృత్యువు, 4.మూర్ఛ.
ప్రళయనం ప్రళయః, లీఙ్ శ్లేషణే. - పంచభూతములు కలియుట ప్రళయము.

అపాయము - హాని.
హాని - 1.తక్కువగుట, 2.కీడు.

అపచయము - 1.హాని, నష్టము, తగ్గుట, 2.పుష్పాదులను కోయుట, (రసా.) తగ్గించుట, చూ. హాసము.
నష్టము - నశించినది.
అవగడము - 1.ఏమరిపాటు, 2.అపాయము, విణ.1.అపాయకరము, ఇతరులకు అశక్యమైనది, 3.చెడ్డది. 
ఏమఱిపాటు - 1.పరాకు, 2.ప్రమాదము, విణ.1.అకస్మాత్తుగా, 2.వంచనగా, రూ.ఏమఱుపాటు.
పరాకు - 1.తత్పరత, 2.ప్రమాదము.
ప్రమాదము - (గృహ.) హటాత్తుగా కలిగిన నష్టము (Casuality).

ప్రమాదో (అ)నవధానతా,
శక్తుండైయుండియు చేయఁదగిన కార్యము చేయకుండుట ప్రమాదము. ప్రకృష్టో మదః ప్రమాదః మదీ హర్షగ్లేపనయోః, ప్రకృష్తమైన మదము ప్రమాదము.
అనవధానస్య భావః అనవధానతా. - అవధానము లేనియొక్క భావము అనవధానత. ఈ 2 ప్రమాధము పేర్లు.

ప్రమత్తుఁడు - ప్రమాదపడినవాడు.
ప్రమాది - అరువది సంవత్సరములలో నొకటి (13వది).
ప్రమాదీచ - నలువదియేడవ(47వ) సంవత్సరము. 
ఏమఱిలు - 1.క్రి. 1.ఏమఱు, 2.ఉపేక్షించు, మరచు, ఏమరిలు, ఏమరిల్లు.
ఏమఱచు - క్రి.ఏమరజేయు, రూ.ఏమాఱుచు.

దౌర్మంత్రానృపతి ర్వినశ్యతి యతిస్సంగా త్పుతోలాలనా
ద్వి పోనధ్యయనా, త్కులం కుతపయా చ్చీలం, ఖలో పాసనత్ |  
హ్రీర్మద్యా, దనవేక్షణాదపి కృషిః, స్నేహః ప్రవాసాశ్రయా
న్మైత్రిశ్చా ప్రణయాత్సమృద్ధి రనయాత్త్యాగా త్ప్రమాదాద్ధనం ||
       
తా. దుర్మంత్రి కలుగుటవలన నృపతి - రాజు, రూ.నరపతి, సంగమమువలన యతి - 1.పద్య విశ్రమస్థానము, 2.సన్న్యాసి యును, లాలనము - బుజ్జగము, ముద్దుచేయుట వలన పుత్రుడును, వేదము చదవకపోవుట వలన బ్రాహ్మణుఁడును, దుష్టపుత్రుని వలన కులంబును, ఖలుఁడు - 1.దుర్జనుడు, నీచుడు, అధముడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున నుండువాడు.)దుష్ట సాంగత్యము వలన సత్సభావమును, మద్యపానము వలన హ్రీ - సిగ్గును, చూడకపోవుట వలన కృషి - సేద్యము, వ్యవసాయము, ప్రవాసము - పరదేశవాసము, పరదేశగమనము వలన స్నేహము, ప్రణయము - 1.ప్రేమము, 2.వినయము లేకపోవుట వలన మైత్రియును, నీతి - న్యాయము లేకపోవుట వలన సమృద్ధియును, మతిలేక యిచ్చుట వలనను హెచ్చరిక తప్పుట వలనను ధనంబును నశించును. - నీతిశాస్త్రము

ప్రమత్తదైత్యభయద శ్శ్రీకణ్ఠో విభుదేశ్వరః,
రమార్చితో నిధి ర్నాగరాజయజ్ఞోపవీతవాన్|
 

లోకువ - అధీనము, తక్కువ.
తగ్గుదల - తక్కువ; తక్కువ - కొరత.
తగ్గు - క్రి.1.తక్కువగు, 2.వెనుదీయు, 3.తెగిపడు, వి.తక్కువ.

కల్పము - 1.బ్రహ్మదినము, 2.ప్రళయము, 3.శాస్త్రము.    
కల్పస్య స్ర్ష్టే రంతః కల్పాంతః - కల్పముయొక్క అంతము.

ఆనర్తము - 1.నాటకశాల, 2.పోరు, 3.సౌరాష్ట్ర దేశము, (దీని రాజధాని ద్వారక).
నాటకసాల - నాట్యశాల, సం.నాటకశాలా.
నాటకము - 1.నర్తనము, 2.ప్రవర్తనము, సం.వి.నాట్య ప్రధానకావ్యము, (దశ విధ రుపకములలో నొకటి).
నృత్తము - నర్తనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తించు - క్రి.1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.  
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు.  
నర్తనప్రియము - నెమలి.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి Peacock.

తవాధారే మూలే - సహ సమయయా లాస్య పరయా
నవాత్మానం మన్యే - నవరస మాహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా - ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే - జనక జననీమజ్జగదిదమ్ || - 41శ్లో

తా. ఓ తల్లీ! నీ మూలాధార చక్రమునందు లాస్యరూపమైన నృత్యమునందు మిక్కిలి ఆసక్తు రాలై సమయాకళతో(చంద్రకళతో కూడిన) ఆనందభైరవి యను శక్తితో గూడి, నవరసములతో నొప్పు తాండవ నృత్యమును నటించు నటుడైన వానిని నవాత్ముడైన ఆనందభైరవునిగా తలచెదను. ఏలననగా పుట్టుక నుద్దేశించి (దగ్దమైన లోకమును మరల పుట్టింపవలె నని దయచేత కూడియున్న ఆనందభైరవీ భైరవులను ఈ జగత్తు తల్లిదండ్రులుగ దలంచుచున్నాను.) – సౌందర్యలహరి

మూలాధారే హకారం చ - హృదయే చ రకారకం |
భ్రూమధ్యే తద్వదీకారం - హ్రీంకారం మస్తకే న్యసేత్ || 

సౌరాష్ట్రదేశే వసుధావాకాశే జ్యోతిర్మయం ఛన్ద్రకలావతంసమ్|
భక్తిప్రదానాయ కృతావతారాం తం సోమనాథం శరణం ప్రపద్యే. - 1 

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
సూతే అమృతమితి సోమః, షూఞ్ ప్రాణిప్రసవే - అమృతమును బుట్టించువాఁడు.
సూయతే ఇతివా సోమః - ప్రతిపక్షమునందును బుట్టింపఁబడువాఁడు.  

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
సోమోద్భవ - నర్మదానది.

సోమవారము - వారములో రెండవ దినము.
ఇందువారము - సోమవారము.

చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

నెలపాలు - చంద్రకళ.
నెలవీసము -
చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.
కళ - 1. 8 సెకనుల(8 Seconds)కాలము, 2.చంద్రకళ, 3.ఒక పాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతాంతము కాని పదము.
కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధురస్వరము.
కల2 - స్వప్నము. 
స్వప్నము - 1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement). 

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

సోము - 1.సుఖము, 2.కోరిక, విణ.ఆసక్తము, సం.1.సుఖము, 2.సమీహ.
సుఖము - 1.సౌక్యము, 2.స్వర్గము.
సౌక్యము - సుఖము. సమీహ - కోరిక.

సౌమ్యుఁడు - బుద్ధుడు, విణ.1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.

సౌమ్యం తు సున్దరే సోమదైవతే,
సౌమ్యశబ్దము ఒప్పెడువానికిని, సోముఁడు దేవతగాఁ గలహ విస్సూక్తాదులకును పేరు.
సోమో దేవతాస్యేతి సౌమ్యం, త్రి. - సోముఁడు దేవతగాఁ గలది గనుక సౌమ్యము.

సౌమనస్యము - 1.సుమనోభావము, 2.తృప్తి.
సౌమ్య - 1.అరువది సంవత్సరములలో నొకటి, 2.కొంచెము సబ్బు ద్రావణములో కలిసిన వెంటనే కొంతసేపు నిలకడగా నుండు నురుగునిచ్చు జలము యొక్క గుణము, 3.మృదుత్వము(Soft).
సౌమ్యగంధ - గులాబిపూవు.

పుష్పాదికములు - (గృహ.) పుష్పముల కొరకు, రమణీయత కొరకు పెంచబడు మొక్కలు (Flowers and plants) ఉదా. గులాబి, క్రోటనులు మొ.

సత్యవాస స్సత్యవచాః శ్రేయసాంపతి రవ్యయః,
సోమజ స్సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు.

నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ముక్కంటిచెలి - కుబేరుడు.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధర శ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తి ప్రదాన వ్రతామ్|
కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలస న్మధ్యమాం
శీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే|

ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.
ఈష్టే ఈశానః - ఐశ్వర్యముగలవాఁడు.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
 
ఈశానము - 1.కాంతి, 2.శివుని 5 ముఖములలో ఒకటి, 3.పదునొకండు అను శంఖ్య, 4.అర్ద్రానక్షత్రము.

ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
పబువు - ప్రభువు, సం.ప్రభుః.
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అధిపాతీతి అధిపః, పా రక్షణే. - అధిక్యమున రక్షించువాఁడు. 
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.

అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయుఁడు - రాజు, రాయలు, సం.రాజా.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు. 

రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon. 

విభుఁడు - 1.ప్రభువు, సర్వవ్యాపకుడు, 2.బ్రహ్మ, 3.శివుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

దేవర - 1.దేవత, దేవుడు, 2.ప్రభువు.
దేవత - వేలుపు; వేలుపు - దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది. 

అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.

అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆదిశబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.

భాగ్యము - అదృష్తము, సుకృతము, విణ.భాగింపదగినది.
భక్తము - భాగింపదగినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.

రాజవత్పుత్త్ర దారాశ్చ - భాగ్యావంతం త్రబాంధవాః|
ఆచార్య వత్సభామధ్యే భాగ్యవంతం స్తువంతిహి||

తా. లోకమునందు భాగ్యవంతుని తన దార - భార్య) బిడ్డలు ప్రభువు వలె జూతురు. చుట్టములు, స్నేహితులు యజమానునివలె భావింతురు, ప్రభువులు సభయందు ఆచార్యుని వలెఁ జూతురు. కావున భాగ్యము(భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.)గలవాఁడే గొప్పవాఁడు. – నీతిశాస్త్రము

భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
భగవాన్ త.పు. శ్లో. "మహాత్మస్య సమగ్రస్య ధైర్యస్య యశసశ్శ్రియః జ్ఞానవైరాగ్య యోశ్చ్యైవ షణ్ణాం భ" ఇత్యక్తభగో అస్యాస్తీతి. భగవాన్ - సంపూర్ణమైన మహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునివి భగమని చెప్పబడును అది గలవాఁడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
పరాత్పరుఁడు - శ్రేష్ఠుల కందరికి శ్రేష్ఠుడు (భగవంతుడు).

విష్ణువు - విశ్వమంతత వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, విషుః.

ముప్పోకలాఁడు - (మూడు + పోకలు + ఆఁడు) త్రిగుణాత్మకుడు, భగవంతుడు.

దేవుఁడు - భగవంతుడు.
దేవర - 1.దేవత, దేవుడు, 2.ప్రభువు.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.    
దైవికము - దైవము వలన కలిగినది.

దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది. 

అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.

అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆదిశబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.

భాగ్యము - అదృష్తము, సుకృతము, విణ.భాగింపదగినది.
భక్తము - భాగింపదగినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.

కైంకర్యము - 1.భగవంతునికి చేయుసేవ, 2.ఊడిగము.
ఊడిగము - పరిచర్య, సేవ, రూ.ఊడెము, ఉడిగము, ఊళిగము, ఉళిగము.
ఉడిగము - 1.సేవ, 2.అడకువ, రూ.ఊడిగము.

తనకు లేనినాడు దైవంబు దూరును
తనకు గల్గెనేని దై వ మేల
తనకు దైవమునకు తగులాట మెట్టిదో విశ్వ.

తా|| తనకుధనము కలిగినకాలములో భగవంతుని అవసరముండదుకాని, చేత ధనములేనప్పుడు భగవంతుని దూషించును. భగవంతునకు తనకుగల(తన - ఆత్మార్థకము)సంబంధము తెలుసుకొనలేడు. 

కైసాటి చుక్క - హస్తా నక్షత్రము.
కై -
చతుర్ధీ విభక్తి ప్రత్యయము, వి. 1.చేయి, 2.తొండము, రూ.కయి.
కొఱకు - చతుర్థీ విభక్తి ప్రత్యయము.
కయి - 1.చేయి, హస్తము, 2.(కై) చతుర్థీ విభక్తి ప్రత్యయము.      

కేలు - 1.చేయి, 2.తొండము, సం.కులిః.
కేలుమొగ్గ -
కేలుమోడ్పు, అంజలి బంధము.
కైకట్టు - 1.సందర్భము, 2.చేమోడ్చు.

కృతాంజలి - చేతులు మోడ్చినవాడు, వి.లజ్జాళువు.
లజ్జ -
సిగ్గు. లజ్జ భూషణము వంటిది.
సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.
సిగ్గరి - సిగ్గుకలవాడు.
నాన - సిగ్గు, సం.జ్ఞానమ్, త. నాణ్, క. నాణ. 

కయికోలు - అంగీకారము, సమ్మతి.
అంగీకారము -
1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ.

తుల్యము - సమానము, సాటి.

సాటి - ఒకవస్తువునిచ్చి మనొకటి మార్చుకొనుట, వినిమయము, పరివర్తనము, రూ.సాటా, సాటాకోటి.
సాటి - సమానము, రూ.సాటిక.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.

హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
హస్తకళలు -
(అర్థ.) చేతిపనులు.

పఞ్చశాఖశ్శయః పాణిః -
పఞ్చ శాఖా - అఙ్గుళీరూపా అస్యేతి పఞ్చశాఖః. - వేళ్ళనెడి యయిదు కొమ్మలు గలది.
స్వకీయ ధనమత్ర శేతే తిష్ఠతీతి శయః, శీఙ్-స్వప్నే. - తన ధనము దీనియం దుండును.
పణతి వ్యవహరత్యనేన పాణిఃం ఇ. పు. పణ వ్యవహారే స్తుతౌ చ. దీనిచేత నరుఁడు(నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ౠషి.)వ్యవహరించును. ఈ 3 మణికట్టునుండి వ్రేళ్ళతోఁ గూడిన చేతి పేర్లు.

లేట - 1.కొమ్మ, 2.శాఖ.
లేటమొగముపడు - క్రి.1.విముఖమగు, 2.దైన్యపడు.

శాఖ - 1.చెట్టు కొమ్మ, 2.వేద భాగము, 3.చేయి.
కొమ్మ -
1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది(స్త్రీ - ఆడుది), రూ.కొమ్మ. 
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి. 
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.

ౙవ్వని - యౌవనవతి.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50వ)సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
యౌవతము - యువతీ సమూహము. 

బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.

పోటకత్తి - (వ్యవ.) పొడవైన పిడితో వంపు తిరిగి యుండు చిన్నకత్తి, (ఇది కొమ్మలను నరకుటకు కుపయోగించును) (Bill-hook).

An old Chinese saying, the branch which does not bend in the wind will break.

శాఖామృగము - కోతి, వ్యు.చెట్ల కొమ్మలపై తిరుగు మృగము.
కొమ్మత్రిమ్మరి - కోతి.
శాఖాచారీ మృగః శాఖామృగః - కొమ్మలయందుఁ జరించు మృగము.

చేయి - 1.చెయి, హస్తము, 2.కిరణము, 3.తొండము, 4.పక్షము.
చెయి - 1.హస్తము, 2.తొండము, రూ.చేయి, చే, చెయ్యి. 

హస్తకళలు - (అర్థ.) చేతిపనులు.
హాండీక్రాఫ్‌ట్సు -
(వాణి.) (Handi-crafts) చేతిపనులు. 

ఐచ్చిక కండరములు - (జం.) ఇచ్ఛాకండరములు, ఇష్టము వచ్చిన ప్పుడు పనిచేయు కండరములు, ఉదా. చేయి, కన్ను, కాలు మొ. వాని కండరములు (Voluntary muscles).

కదలెడికీళ్ళు - (జం.) అవయవ భాగము వంచుటకు లేదా త్రిప్పుటకు వీలగుకీళ్ళు, ఉదా. చేతి ఎముకలు (Movable joints).

చే - తృతీయ విభక్తియందు వచ్చు ప్రత్యయము, వి.1.హస్తము, 2.తొండము.
చేత - 1.తృతీయా విభక్తి ప్రత్యయము, రూ.చేన్.
తోడ - తృతీయ్యవిభక్తి ప్రత్యయము, రూ.తోడుత, అవ్య, కూడ, వెంబడి.
తోడుతో - వెంబడిని, రూ.తోడుతోడ, తోడ్తో, తోడ్తోడ.
తోడ్తో - తోడుకో. తోడ్తోడ - తోడుతోడు.   

తొండము - 1.తుండము, గజహస్తము, 2.కపిలబాన తోక, సం.తుండమ్. 
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.  
తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.

పక్షము - 1.నెలయందు బదునైదు దినములు (శుక్ల కృష్ణపక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.   
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.

చేతులకుఁ దొడవు దానము
భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియతొడ నెవారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ.
తా.
హస్తములకు దాన మొసంగుటయు, రాజులకు సత్యవాక్పరి పాలనము సర్వజనులకు న్యాయమార్గాను (అను)సరణము, స్త్రీలకు(నాతి - స్త్రీ, రూ.నాతుక.)మానరక్షణము ఆభరణములుగా భువిలో శోభించును. 

అందంగా ఇవ్వటము, తీసుకోవటము కూడా ఒక కళే. ఇచ్చేవాడు వాడే-పుచ్చుకునే వాడూ వాడే. - చెయ్యి 

పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిశలాకలు - (జం.)అరచేతికుండు ఎముకలు(Meta-carpals).

పాణిగ్రహణము - వివాహము; కరగ్రహణము - పెండ్లి, పాణిగ్రహణము.
పరిణయము - వివాహము. 
వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్టవిధములు). 
పెండ్లి - వివాహము; పెండిలి - వివాహము, రూ.పెండ్లి.

కల్యాణము - 1.క్షేమము, 2.శుభము, 3.పెండ్లి.

వియ్యము - వైవాహిక సంబంధము, సం.వివాహః.
వియ్యంకుఁడు - వియ్యము పొందినవాడు.

పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.
పాణిః గృహీతో (అ)స్యా ఇతి పాణిగృహీతీ. సీ. - దీనిహస్తము గ్రహింపఁ బడును.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. – 8స్తో    

కై(ౘ)చాపులు - అంజలి, నమస్కారములు.
అంజలి - 1.చేమోడ్పు, నమస్కారము, 2.ఒకరకపు అభినయ హస్తము.
దోయిలి - అంజలి, పంపబడిన రెండు చేతులచేరిక, రూ.దోసిలి. 
దోసిలి - దోయిలి, నమస్కారము. 
కయిమోడుపు - నమస్కారము.

కైకట్టు - 1.సందర్భము, 2.చేమోడ్పు. 
సందర్భము - 1.ప్రబంధము కూర్పు, 2.సమయము.
చేమోడ్పు - 1.నమస్కారము, రూ.చేమోడుపు.
చేమోడుచు - మ్రొక్కు; మొక్కు - నమస్కరించు, వి.ముడుపు, రూ.మ్రొక్కు.
నమస్కారము - మ్రొక్కు, రూ.నమస్క్రియ, నమస్కృతి.
నమస్సు - నమస్కారము; చేతివిప్పు - నమస్కారము పెట్టు.
వినతి - నమస్కారము. నమించు - నమస్కరించు. 
వందనము - 1.పూజ, 2.స్తోత్రము, 3.నమస్కారము.  
నమస్య - 1.పూజ, 2.సపర్య.
వేల్పుఁడు - పూజ, సపర్య; సపర్య - 1.పూజ, 2.సేవ. 

భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము. 

జే  - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె -
వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము.
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.

శరణము - 1.రక్షకము, 2.రక్షణము, 2.గృహము.
శరణు -
1.రక్షకము, శరణాగతి, 2.నమస్కారము, రూ.శరణము.
శరణుచొ(ౘ)చ్చు - శరణాగతి పొందు.  
శరణ్యుఁడు - శరణు చొరదగినవాడు. 

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు
 ధృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వ.
తా.
ఓ వేమా! పూజచేయుట కంటె పూజనీయమైన బుద్ధి కలిగివుండుట మంచిది. మాటలు చెప్పుటకంటె నిశ్చలమైన మనస్సు కలిగి వుండుట మంచిది. కులము కంటె గుణము ముఖ్యమైనది.

Hands that help are holier than the lips that pray.  

కిరణమాలి - సూర్యుడు.
కిరణము - 1.వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.   

కరము1 - 1.చేయి, 2.కిరణము, 3.తొండము, 4.కప్పము.
కరము2 - మిక్కిలి, కడు, అత్యంతము.

                                      

పృశ్నిగర్భుడు  - శ్రీమహావిష్ణువు.
పృశ్ని - కిరణము, 1.పొట్టిది, 2.చిన్నది.

                                 

పోఁచి - మనికట్టు మీది చోటు.
పోఁచీలు -
ఆడువారి ముంజేతి నగలు. 

కడియము1 - హస్తభూషణము, సం.కటకః, రూ.కడెము.
సూడిగములు - గాజులు Bangles, చేతి కడియములు.
కడెము - కడియము1.
కడియము2 - వరికుప్ప నూర్పుచేయుచు చుట్టును వేయు గడ్దవామి.

పరిహార్యము - హస్త కంకణము, విణ.విడువదగినది.
తోడా -
బిరుదుగా వేసిన హస్త భూషణము, 1.అందె.
అందె - అందియ; అందియ - స్త్రీలు కాలియందు ధరించు నగ, నూపురము, 2.బిరుదు చిహ్నముగ కాలికి తొడుగుకొను నగ, రూ.అందె, సం.అందుః.

చేదర్సెనము - చేకానుక.
చేకానుక -
పెద్దల దర్శించబోవునపుడు తీసికొనిపోవు కానుక, చేదర్సెనము.

గోఁటు - 1.కోరికయందున చేర్చికట్టెడు సన్నని సరిగపట్టె, 2.చేతినగ, 3.ఒయ్యారము.
గోఁటుకత్తె - ఓయ్యారము; ఒయ్యారము - ఒయారము.
ఒయారము - 1.విలాసము, 2.సౌందర్యము, 3.గర్వము, రూ.ఒయ్యారము, ఓయారము.
ఒయ్యారి - ఒయారి; ఒయారి - 1.విలాసిని, 2.సుందరి, విణ.సౌందర్యముగలది, రూ.ఒయ్యారి, ఒయారి.
గోఁటుకాఁడు - ఒయ్యారము గలవాడు.

పూస - 1.పూదె, 2.మణి, 3.వ్రేలులోనగు వాని కీలు.

శమంతకమణి - విష్ణుహస్తము నందలి మణి.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము pearl, 3.మనికట్టు.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి.  
పౘ్చ  - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరురేఖః, సం.పలాశః.

మణిబంధము; మణికట్టు - (గృహ.) అరచేతికి మోచేతికి మధ్యనున్న కీలు (Carpus).
మణి బంధాస్థి - (జం.) చేతి మణికట్టులోనున్న ఎముకల సముదాయము (Carpus).  

మణికారుఁడు - రత్నములను సాన బట్టువాడు.
మణిగము - అధికారము, రూ.మణియము.

శబలము - చిత్రవర్ణము.
శబతి నానా వర్ణానితిశబలః శబగతౌ - అనేక వర్ణములఁ బొందునది.

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుమణుఁడు, వ్యు.అసురలను హింస చేయువాడు.
ద్రుహిణః ద్రుహ్యతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులను హింస చేయువాఁడు. ద్రుహ జిఘాం సాయాం. ద్రుహిణ ముఖసదనే శారదా|
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

గతై ర్మాణిక్యత్వం - గగనమణిభి స్సాంద్ర ఘటితం
కిరీటం తే హైమం - హిమగిరి సుతే! కీర్తయతి యః |
స నీడేయచ్ఛాయా - చ్ఛురణ (పటలం) శబలం చంద్రశకలం
ధనుః శ్శౌనాసీరం - కిమతి న నిబధ్నాతి ధిషణామ్. - 42శ్లో

తా. ఓ హైమవతీ! హిమవంతుని కూతురా! ఎవడు దట్టముగ మాణిక్యము - కెంపు, సూర్యకాంత మణులు పొదిగిన నీ బంగారు కిరీటమును వర్ణిస్తున్నాడో - వాడు గూళ్ళయందు పొదిగిన వివిధములగు రత్నకాంతులుగల శబలము - చిత్రవర్ణము  గల చంద్రకళను ఇంద్రధనుస్సుగ నూహింపకుండునా? (చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అదినిజంగా ఇంద్రధనుస్సే అని నిశ్చయబుద్ధి కల్పించు కొనుచున్నాడని భావము.) - సౌందర్యలహరి

గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, గరుడ పురాణము(మజ్జ) 12000 శ్లోకములు గలది. గరుడదేవతాకమైన అస్త్రము.  

గరుడ పచ్చ-ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ.   

గారుత్మతం మరకత మశ్మగర్భో హరిస్మణిః -
గరుత్మతో జాతం గారుత్మతం - గరుత్మంతుని వలనఁ బుట్టినది.
మరం మరణం తకత్యనేనేతి మరకతం. తక హనహసనయోః - విషహరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.
అశ్మగర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగాఁ గలది.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి. ఈ 4 పచ్చల పేర్లు.

మకరతము - మరకతమణి, రూ.మరకతము.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.

ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొడుచు పసరు రేఖ, సం.పలాశః.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు. 
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ. 

అశ్మగర్భము - మరకతము, పచ్చ.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.

అద్భ్యో(అ)గ్ని ర్బ్రహ్మతః క్షత్రమ్ అశ్మనో లోహముత్ధితమ్ |
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శామ్యతి ||

నీటినుండి అగ్ని పుట్టింది. బ్రాహ్మణత్వం నుండి క్షత్రియత్వం పుట్టింది. రాతినుండి లోహం పుట్టింది. అంతటా ప్రసరించే వీటి తేజస్సు తమ జన్మ స్థలాల్లో మాత్రం అణగిపోతుంది.

తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 2.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు). 
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
అంచనా - పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.

మందాళి - 1.పచ్చపట్టు చీర, 2.కృత్రిమ మరకతము.
మంజడి - 1.చిత్రవర్ణ వస్త్రము, నీల వస్త్రము, సం.మాంజిష్ఠమ్.

ఇంద్రనీలము - నీలమణి; కప్పుఱాయి - నీలమణి.
నీలము - ఒక విలువ గల రత్నము,(Sapphire). (ఇది రాసాయని కముగ ఎల్యూమినియమ్ ఆక్సైడ్ (Corundum). దీని నీలిరంగునకు కారణము అందులో అతిసూక్ష్మరాశిగా నుండు క్రోమియమ్ ఆక్సైడ్).
నీలము - 1.నీలిచెట్టు, Indigo plant, 2.నలుపు, 3.నల్లరాయి.
నీలి - నల్లనూలు Black wool, విణ.నల్లనిది, సం.నీలమ్. సం.వి.ఒకానొక చెట్టు, విణ.గారడము, సం.వి.(వ్యవ.) నీలిమందు (Indigo), రంగు ద్రవ్యములలో నొకటి, (Leguminose) అను కుటుంబములో Papilonaceae అను కుటుంబమునకు చెందిన Indigo feratinctoria అను మొక్క పట్తనుండి దీనిని తయారు చేయుదురు).
నీలీకరణము - (గృహ.) బట్టలకు నీలివేయుట, తెల్లబట్టలను ఉదికినప్పుడు తేట నిచ్చుటకై కొంచెము నీలి రంగు వేయుట (Bluing). 

ప్రకోష్టము - 1.తొట్టికట్టు, 2.ముంజేయి.
ముంజెయి -
(ముందు+చెయి) ముంగేయి. ముంచేతి కంకణమునకు అద్దమేల.
ముంగమురము - ముంజేతి కంకణము, రూ.ముంగమురాము, ముంగమురారి, ముంగైమురారి.
కిష్కువు - 1.ముంజేయి, 2.జేన, 3.మూర.
జేన - పండ్రెండగుళముల కొలది, వితస్తి. 
మూర - రెండు జేనల కొలది.

ప్రకోష్ఠే విస్తృతకరే హస్తో -
కపోణేరధః ప్రకోష్ఠః ఈత్ర విస్తృతకరే సతి హస్త ఇత్యుచ్యతే - చాఁచబడిన అరచెయ్యిగల మోఁచేతికి దిగువనున్న ప్రదేశము హస్తమనం బడును.
హన్యతే అంసుకాదిరనేన హస్తః హన హింసాగత్యో - దీనిచేత వస్త్రాదులు కొట్టఁబడును. అనఁగా కొలవఁ బడుననుట.

తొట్టికట్టు - లోగిలి; లోగిలి - ముంగిలి.
ముంగిలి -
(ముంగల+ఇల్లు), 1.అంగణము, 2.బయలు.

అంకణము - నలుచదరపుచోటు, రెండు దూలముల మధ్య ప్రదేశము, కక్ష్య, సం.అంగణమ్.

అఙ్గణం చత్వ రాజిరే,
అంగణము - 1.ఇంటిముందుచోటు, ముంగిలి, 2.ప్రదేశము.
అంగస్త్యత్రేతి అంగణం, అగి రతౌ. - జనులు దీనిని బొందుదురు, పా, అంగనం, "అంగనం ప్రాంగణే యానే కామిన్యా మంగనామ" తేతి విశ్వప్రకాశః అంకణమనియుఁ గలదు.
ప్రాంగణము - ముంగిలి.
ముంగిలి - (ముంగల+ఇల్లు), 1.అంగణము, 2.బయలు.     
చత్వర - ముంగిలి. 
అత్రస్థిత్వా యాచకైః చత్యత ఇతి చత్వరం, చతే యాచనే. - దీనియందుండి యాచకులడుగుదురు.
అజిరము - 1.కప్ప, 2.గాలి, 3.ముంగిలి.
అజంతి క్షిపంతి ధాన్యాదికమత్రే త్యజిరం, అజ గతి క్షేపణయోః. - దీనియందు ధాన్యాదులఁ జల్లుదురు. ఈ 3 ముంగిలి పేర్లు.

అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
అజిహము - కప్ప, విణ.నాలుక లేనిది.

అన్వర్త్నిక - (జం.) ముంజేతిలో నుండు ఎముకలలో ఒకటి (Radius), అరత్నిక (Ulna) ముంజేతి నుండు రెండవ ఎముక. ఈ రెండును కలసి 'Radioulna' అనబడును.      

ద్విసిరకండరము - (జీవ.) చేతిదండ (Biceps muscle).
కైదండ -
1.హస్తభూషణము, 2.హస్తావలంబము.
కయిదండ - హస్తావలంబము, రూ.కైదండ.
చేదండ - హస్తావలంబనము, చేతిలోనుంచు కొను పూదండ.

స్రజము - పూలదండ.
స్రగ్వి -
పూదండగలవాడు.

రత్ని - మూర, మోచేయి మొదలు పిడివరకు గల కొలత.

ముష్ట్యాతు బద్ధయా, స రత్ని స్స్యాత్ -
బద్ధయా ముష్ట్యా ఉపలక్షితః సహస్తో రత్ని రుచ్యతే - ముడువఁబడిన య(అ)ఱచేయిగల యా హస్తము రత్ని యనంబడును.
రమన్తే వ్యవహారిణో (అ)నేనేతి రత్నిః, రము క్రీడాయాం. - దీనిచేత వ్యవహారులు క్రీడింతురు. ఈ ఒకటి పిడిమూరపేరు.  

కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.
హరిద్ర -
పసుపు.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ. 

పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.

అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.   

                                 

అరి - 1.కప్పము, 2.అల్లెతాడు, 3.హద్దు, మర్యాద. 
అరిగాఁపు - 1.పన్ను చెల్లించురైతు, 2.కప్పము చెల్లించినవాడు.
మౌర్వి - అల్లెత్రాడు.
నారి -
అల్లెత్రాడు వై.వి. నరము, సం.నాడీ స.వి. స్త్రీ.

షడ్భాగము - కప్పము.
భాగధేయము -
1.భాగ్యము, 2.కప్పము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.


సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

బయసి - 1.మర్యాద, గౌరవము, 2.దయ, 3.భాగ్యము.
బైసి -
1.గౌరవము, 2.భాగ్యము, రూ.బయిసి, బవిసి, బగిసి, సం.భూయసీ.

మర్యాద - 1.కట్టుబాటు, 2.తీరము, 3.సన్మానము.
అదుపు - 1.కట్టుబాటు, 2.హద్దు(మేర, ఆజ్ఞ), 3.స్వాధీనము.
కట్టుదిట్టము - కట్టుబాటు. మిర - మేర, హద్దు, మర్యాద. 
తీరము - దరి, (భూగో.) అంచువలె సముద్రపు నీటికి తగిలియున్న భూమి.
దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్.   

హస్తి - ఏనుగు, వ్యు.హస్తము కలది.
హస్తో (అ)స్యాస్తీతి హ స్తీ న. పు. - తొండముగలది.
చేగల మెకము - ఏనుగు, హస్తి.
కరటి - ఏనుగు, హస్తి.   
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.

హస్తా తు పాణినక్షత్రే -
హస్తశబ్దము చేతికిని, నక్షత్ర విశేషమునకును పేరు. హసతీతి హస్తః - హసే హసనే, ప్రకాశించునది. 

పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిశలాకలు - (జం.) అరచేతికుండు ఎముకలు (Meta-carpals).

పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు గలది.
పద్మం బిందుజాలక మస్యాస్తీతి పద్మీ.న్. పు. – పద్మమనఁగా దేహమందలి బొట్లు; అవి గలిగినది.

హస్తకళలు - (అర్థ.) చేతిపనులు.
హాండీక్రాఫ్‌ట్సు - (వాణి.) (Handi-crafts) చేతిపనులు.  

ఐచ్చిక కండరములు - (జం.) ఇచ్ఛాకండరములు, ఇష్టము వచ్చిన ప్పుడు పనిచేయు కండరములు, ఉదా. చేయి, కన్ను, కాలు మొ. వాని కండరములు (Voluntary muscles).

హస్తిసఖుఁడు - మావటీడు.
మావటి -
శూరుడు, మల్లుడు, రూ.మావటీడు, మాస్టీడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లుఁడు - జెట్టి; జెట్టి - 1.మల్లుడు, 2.శూరుడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లు - 1.కోతి, 2.మల్లుడు, జెట్టి, సం.మల్లః.

శూరుఁడు- సూర్యుడు, విన.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుఢు.
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.

గజము -1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేన్నాంగములలో ఒకటి.
గౙ -
పెద్ద, సం.గజః.
గజయాన - ఏనుగు నడకవంటి నడకగల స్త్రీ, స్త్రీ.
గజవదనుడు - వినాయకుడు. 

లావు గలవాని కంటెను,
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును,  
మావటివాఁ డెక్కినట్లుమహిలో సుమతీ.
తా.
శరీరబలము గలవానికంటెను బుద్ధిబలముగల మానవుడు శక్తిమంతుడు. ఎట్లనగా గొప్ప బలముగల ఏనుగును మావటివాడు స్వాధీనపరచు కొనుట యిందుకు నిదర్శనం.

హస్తిని - 1.ఆడేనుగు, 2.ఒక స్త్రీజాతి, (శంఖినీ, పద్మినీ, చిత్రిణీ జాతు లితరములు).
గణిక -
1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ. 
చిత్రిణి - చిత్తిని, ఒకజాతి స్త్రీ.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ. 

అత్తి - (వృక్ష.) మేడి ఉదుంబరము, వై. వి. ఏనుగు, సం.హస్తిః.
మేడి -
అంజూరు, అత్తిచెట్టు.
అం(ౙ)జూరు - 1.అత్తిపండు, 2.అత్తిచెట్టు.
ఉదుంబరము - 1.గడప, 2.అత్తిచెట్టు, 3.రావిచెట్టు.
కడప - దేహళి, రూ.గడప, వై. కదంబము (చెట్టు), సం.కదంబః.
దేహళి - గడప, కడప, రూ.గేహళి.
గేహళి - గడప, రూ.దేహళి.

దేహళీ దీపన్యాయము - న్యా. గడప మీద దీపము పెట్టిన నింటిలోన బైట గూడ ఉపయోగించు రీతి, దేహళీదత్త దీపన్యాయము.

ఉదుమ్బరో జన్తుఫలో యజ్ఞాజ్గో హేమదుగ్దకః,
ఉన్నతత్వా దుల్లంఘిత మంబరం అనే నేతి ఉదుంబరః - ఔనత్యముచేత నాకాశమును దాఁటునది.
జంతుయుక్తం ఫలమస్యేతి జంతుఫలః - జంతువు(జంతువు - చేతనము, ప్రాణముగలది)లతోఁ గూడిన ఫలములు గలిగినది.  
యూపాదిరూపేణ యజ్ఞస్యాంగ మువకరణ మితి యజ్ఞాంగః – యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమైయుండునది.
హేమవర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః - బంగారువంటి పాలుగలది. ఈ నాలుగు 4 అత్తిచెట్లు పేర్లు.    

గేహేశూరన్యాయము - న్యా.ఇంటిలో డంబములు కొట్టువాడే కాని పనికిరాని వాడనుట.
గేహేశూరుఁడు -
ఇంటిలోనే డంబములు కొట్టువాడు, పిరికివాడు.(దంభము - 1.కపటము, 2.తప్పు, 3.గర్వము. అదరుగుండె - పిరికివాడు).

మేడిపండుచూడ మేలిమైయుండును
పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వ.
తా.
ఓ వేమా! మేడిపండు చూచుటకు పైకిపచ్చగా బంగారమువలె కంటికింపుగా కనబడును కాని, దానిని బ్రద్దలుచేసి చూచినచో లోపల పురుగులు వుండును.  చెడ్డవారుచూచుటకు పైకి బాగుగనే కన్పించు చున్ననూ, లోపల వారి(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)గుణములు (బింకము - 1.గర్వము, 2.నిక్కు, బిగువు.)మాత్రము చాలా చెడ్డవిగ వుండును.

ఔదౌంబరము - 1.ఒకలోహము, 2.రాగి, విణ.ఉదుంబర (మేడి) వృక్ష సంబంధమైనది. 

ఉదుంబరక ఫలము - (వృక్ష.) పుష్పమంజరి అంతయు కలిసి ఏర్పడిన ఫలములలో నిది యొకటి. దీనిలో చుట్టును ఆవరించి యున్న పుష్పాసవము మాంసలమై యుండును, ఉదా.అత్తి మొ.వి.

కడిమి1 - 1.అతిశయము, 2.పరాక్రమము; గోహరి - పరాక్రమము.
కడిమి2 - కడప (చెట్టు), సం.కదంబః.
నీపము - కడిమిచెట్టు.
కదంబరము - గుంపు, వై. విణ. మిశ్రము.
కదుపు - సజాతీయ పశు పక్ష్యాది సమూహము, సం.కదంబమ్. 

ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్|
మత్స్యాపాదంజ లే పశ్యే న్ననారీ హృదయస్థితమ్||

తా. మేడిపువ్వులనైన గానవచ్చును, తెల్లని వాయసము-కాకి (ధూంక్ష్మము - తెల్లకాకి)నైనఁ గానవచ్చును, నీళ్ళలోపల(మత్స్యము - చేప)చేపల యడుగులనైనఁ గానవచ్చును, స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను. - నీతిశాస్త్రము  

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా|
కల్యాణీ జగతీకందా కరుణారససాగరా. - 73శ్లో

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా|
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా. – 74శ్లో

కృష్ణవేణి - కృష్ణవేణి అను నది, కృష్ణానది.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

వేణి- 1.అనేక ప్రవాహముల కూడిక, 2.కాలువ, 3.వేనలి (సర్పాకారము గల జడ).
కాలువ - నీరుపారు మార్గము.
వేనలి - వేణి, కొప్పు, కేశకలాసము, జుట్టు, సం.వేణీ.

కేశబంధము - 1.కొప్పు, 2.ముడి.
క్రొమ్ముడి-(క్రొత్త+ముడి)ఒకరకపు కేశంబంధము, వేనలి.

వేణీ ప్రవేణీ -
వేణతీతి వేణీ. ప్రవేణీ చ. - అణగి యుండునది.
వేణృ నిశామన వాదిత్రాదాన గమన జ్ఞాన చిన్తాసు. పా. వేణిః ప్రవేణిః. ఈ రెండు(మగఁ డూరలేని మగువలు మున్నగువారు) అల్లిన జడ పేర్లు.

సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం సమద్వజ్రపాణిమ్|  
సుధామంథరాస్యాం ముదా(అ)చింత్యవేణీం
భజే శారదాంబా మజస్రం మదంబామ్.

ధమ్మిల్లము - కొప్పు.
కొప్పు -
1.దోపిన వెండ్రుకలముడి, 2.వింటికొన, 3.కోపు, 4.ఇంటి నడికొప్పు.

అథ ధమ్మిల్ల స్వయంతాః కచాః,
సమ్యతా, బద్ధాః కేశా ధమ్మిల్ల ఇత్యుచ్యతే. - కట్టఁబడిన వెండ్రుకలు ధమిల్ల మనంబడును.
చ మిత్యవ్యయం మూర్ధధః ఊర్ధ్వం వా మిల్యతే ధమ్మిలః, మిల శ్లేషణే. - శిరస్సుయొక్క అధోభాగమనుఁగాని ఊర్ధ్వభాగమందుఁగాని కూడు యుండునది. ఈ ఒకటి కీలుగంటు పేరు.

కచము - జుట్టు, కేశము.
కంచబంధము -
జుట్టుముడి.

కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
కురుళము - ముంగురులు.

వరాంగము - 1.ఏనుగు, 2.తల.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలము, తలమ్. వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

తలగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

వారణము - 1.నిరోధము, 2.ఏనుగు.
పరబలం వారయతీతి వారణః, వృఞ్ వరణే. - పరబలము నడ్దపెట్టునది.
హస్తేన వారణం హస్తవారణం-చేత నడ్దగించుట, పా ఘాతుక హస్తస్య ధారణం నిర్వ్యాపారీకరణ మత్రేతి హస్తధారణం - చంపెడు వాని హస్తము(హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.)నుబట్టి నిలుపుట, చంపెదనని వచ్చినవాని నడ్దగించుట.  

నిరోధము - 1.అడ్డు, 2.చేటు, సం.వి.(భౌతి.) ఒక వస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).
నిరోధించు - క్రి.అడ్దగించు.

కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు - చంద్రుడు Moon. 

తద్బృన్దే కైశికం కైశ్యమ్ -
కేశానాం సమూహః కైశికం కైశ్యం చ, కేశముల సమూహము కైశికము కైశ్యము. ఈ 2 తలవెండ్రుకల సమూహము పేర్లు.

నికురుంబము - సమూహము.
నితరాం కురతి శబ్దాయతే నికురుంబం, కుర శబ్దే. - మిక్కిలి రొదచేయునది.

కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్తనాళములు (ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries). 

ధునోతు ధ్వాంతం న - స్తులిత దళితేన్దీవర వనం   
ఘనస్నిగ్దం శ్లక్షణం - చికుర నికురుంబము తవ శివే
యదీయం సౌరభ్యం - సహజ ముపలబ్థం సుమససో
వసంత్యస్మిన్మన్యే - బలమథన వాటీ విటపి నామ్. - 43శ్లో

తా. ఓ మంగళ దేవతా! అప్పుడే వికసిస్తున్న నల్లకలువలకు(ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామర.)సాటియైన వియు, దట్టమై నున్ననై మృదువైనవగు నీ కురుల సమూహము మా అజ్ఞానము తొలగించుగాక! మహేంద్రుడి నందనవనము(ఉద్యానవనము)కల్పవృక్షాల పూవులు సహజమగు నీ కురుల సువాసనను పొందుటకు నీ కుంతలముల వసించు చున్నవని తలచు చున్నాను. (ఆ చెట్ల పూవులు నీకురులకు సౌరభ్యాన్ని ఆపాదించటానికి బదులుగా అవే నీకురులనుండి సౌరభ్యాన్ని గ్రహిస్తున్నా యని భావము) - సౌందర్యలహరి

వారణానన మయూరవాహముఖ దాహవారణ పయోధరాం,
చారణాది సురసుందరీ చికుర శేఖరీ కృత పదాంబుజాం|
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం,
వారణాస్య ముఖసారణాం మనసి భావయామి పరదేవతాం. - 6శ్లో

కుంజరుఁడు - 1.సూర్యుడు Sun, 2.బ్రహ్మ.
బ్రహ్మ - నలువ , వ్యు. ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
కుంజరము - 1.ఏనుగు, వ్యు.కుంజము కలది, 2.వెండ్రుక, కేశము.
కుంజౌ కుంభాధో గర్తావస్యస్త ఇతి కుంజరః - కుంజము లనఁగా కుంభస్థలమలకు దిగువనుండు గుంతలు; అవి గలిగినవి.
కుంజము - 1.పొదరిల్లు, 2.ఏనుగు కొమ్ము.
కుడుంగము - పొదరిల్లు; నికుంజము - పొదరిల్లు.

ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతు ముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.

క్రొమ్ముడి-(క్రొత్త+ముడి)ఒకరకపు కేశంబంధము, వేనలి.     

కబరి - కొప్పు.
కేశబంధము - 1.కొప్పు, 2.ముడి.

కబరీ కేశవేశః -
కం శిరః వృణోతీతి కబరీ, సీ. వృఞ్ వరణే. - శిరస్సును జుట్టియుండునది. ఈ ఒకటి కేశావిశం త్యస్తిన్మితి కేశవేశః, విశ ప్రవేశనే, కేశములు దీనియందుండును, తుఱుము వేళ్ళు, కొప్పు.

సీమంతిని - స్త్రీ.
సీమంతం కేశవీథీ అస్యా ఇతి సీమ న్తినీ, సీ. సీమంతమనఁగా బాపట; అది గలిగినది. 
సీమంతము - 1.పాపట, 2.గర్భిణి స్త్రీలకు చేయు ఒక శుభకర్మము. 
కేశవీథి - పాపట.
చేరుచుక్క - పాపట బొట్టు, చేర్చుక్క.
సీమాటి - భాగ్యశాలిని యగు ఆడుది, శ్రీమతీ.    

గుజ్జు - 1.పొట్టిదనము, 2.కోడెదూడ, 3.పాపట, 4.దూలము మీది గురుజు, 5.క్రొవ్వు, విణ.1.పొట్టివాడు, సం.కుంజః.
గుజ్జువేలుపు - వినాయకుడు.
విఘ్నరాజు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.

తనోతు క్షేమం న - స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోత - స్సరణిరివ సీమన్తసరణిః |
వహన్తీ సిన్దూరం - ప్రబల కబ
రీభార తిమిర  
ద్విషాం బృన్దై ర్బన్దీ - కృత మివ నవీనార్క కిరణమ్|| - 44శ్లో

తా. తల్లీ! భగవతీ! నీటి జాలువలెనున్న పాపట బడాటయు(పాపటిదారిని అలకరించిన నీ సింధూరపు బొట్టు), దట్టమగు జుట్టు ముడి యొక్క నల్లదన మనెడి శత్రుసమూహము(బలమైన కేశపాసాల)చే బంధింపబడి బాల సూర్యకిరణము వలె నున్న సింధూర తిలకముగలదియు అగు నీ ముఖసౌందర్య ప్రవాహము మాకు యోగక్షేమాలను కలుగచేయుగాక! పాపటయందు సిందూరపురేఖ ధరించుట పుణ్యస్త్రీల(సువాసినీ స్త్రీల)ఆచారము. ఇది మంగళ చిహ్నము. - సౌందర్యలహరి     

కిరీటి - 1.అర్జునుడు, వ్యు.ఇంద్రదత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి.
క్రీడి - అర్జునుడు, సం.కిరీటి.
క్రీడించు - క్రి.ఆటలాడు, విహరించు. 

కోఁతి - వానరము, రూ.క్రోఁతి.
వానరము - కోతి.
నర ఇవ వానరః - నరునివలె నుండునది.
కోఁతికొమ్మచ్చి - ఒకవిధమగు బాలక్రీడ.

వృశ్చిక వానర న్యాయము - న్యా. అసలే కోతి, దాని వికార చేష్టలతో పాటు, తేలు కుట్టినచో మరింత వికారముగ గంతులు వేయునను రీతి.

కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపిచిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు. 

కపి - కోతి.
కంపతే చలతీతి కపిః, పు. - కపి చలనే చలించునది.

గాండీవి - అర్జునుడు.
గాండీవము - అర్జునుని విల్లు, రూ.గాండీవము.

కపిధ్వజస్య గాణ్డీవ గాణ్డివౌ పుంనపుంసకౌ,
గాండీకృతం అశ్లక్షీ కృతం పర్వస్థాన మస్యేతి గాండీవః, గాండివశ్చ. ప్న. - నునుపుగాఁ జేయఁబడని గణుపులు గలది. ఈ ఒకటి అర్జునుని వింటి పేరు.

గెలుపుపేరుగలఁవాడు - పార్థుడు, అర్జునుడు, విజయు డను పేరుగలవాడు.

అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు. 

భూరిబలాఢ్యుడైనఁ దలపోయగ విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవుగా దతడొక్కడె మోసపోవుగా
వీరవరేణ్య డర్జునుడు వింటికి నే నధికుండ నంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగనోపడు కృష్ణుడులేమి, భాస్కరా.

తా. అర్జునుడు జగదేక వీరుఁడనని గర్వించి, తానే తన గాండీవమునకు దగినవాడనని తలంచుచు కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.) నిర్యాణానంతరము ఆ విల్లు నెక్కుపెట్టుట కైనను చాలని వాడాయెను. అట్లే మనుష్యుడు తనకు భుజబల మున్నదని గర్వించి, తానే గొప్పవాడనని చెప్పుకొనరాదు. అట్లగునేమి నొకప్పుడు మోసపోవును.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య , దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).

14. చిత్త - ముత్యము వలె గుండ్రముగా ఒకటే నక్షత్ర ముండును.

సృష్టి ' చిత్ర ' నిర్మాణం చేసిన సమయంగల నక్షత్రమిది కనుక ' చిత్ర ' అనే పేరు వచ్చిందని పెద్దలమాట(శాస్త్రకారుల).

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె -
సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.

కిచిడి - చిత్రాన్నము.
పులియోర - (వ్యావ.) పులుసులోనగున కలిపిన అన్నము, చిత్రాన్నము. 

చిత్రకారుడు - 1.చిత్తరువు వ్రాయువాడు, ముచ్చి.
ముచ్చి - చిత్రకారుడు.
అం(ౘ)చులవాడు - చిత్రకారుడు, చిత్తరువులు వ్రాయువాడు, ముచ్చి.  

చిత్తము - మనస్సు. చిత్తము నందు దేవీస్థానం బ్రహ్మకళ.
చిత్తగించు - క్రి.1.మనస్కరించు, 2.తలచు, 3.యోచించు.
మనస్కరించు - క్రి.ఇష్తపడు.
తలఁచు - క్రి.ఎంచు, 2.ధ్యానించు, రూ.తల్చు.
ఎంచు - క్రి.1.గణించు, 2.అపేక్షించు, 3.ప్రశంసించు, 4.తలంచు.

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.

శబలము - చిత్రవర్ణము.
శబతి నానా వర్ణానితిశబలః శబగతౌ - అనేక వర్ణములఁ బొందునది.
 
తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్|
పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్|| 

త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రామ్ | సుభగ్ం ససంయువతిగ్ం  రాచ-మానామ్ | నివేశయన్నమృతాన్మర్త్యాగ్‌శ్చ | రూపాణి పిగ్ంశన్ భువనాని విశ్వా | తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టామ్ | తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యమ్ | తన్నః ప్రజాం వీరవతీగ్ం సనోతు | గోభిర్నో అశ్వైస్సమనక్తు యజ్ఞమ్ ||12||    

త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ -
దేవశిల్పి; మయుఁడు - అమర శిల్పి.
విశ్వకర్మన్ శబ్దము సూర్యునికిని, దేవశిల్పికిని పేరు. విశ్వం కర్మాస్యేతి విశ్వకర్మా. న. పు. - సకలమైన క్రియలు గలవాఁడు. టీ. స. విశ్వస్య కర్మాణి యస్మాదితి విశ్వకర్మేతి సూర్యపక్షే.  

తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు - తక్షకుడు. పాఁపఱేఁడు - నాగరాజు. 
స్కల్ ప్ణర్ - (చరి.) (Sculptor) తక్షకుడు, విగ్రహములు చెక్కు శిల్పి.
రథకారుఁడు - తేరుచేయువాడు, వడ్లవాడు.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్యపని చేయువాడు, 2.పక్షివిశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.
వర్థకి - వడ్రంగి, Carpenter. 
సూత్రధారుఁడు - 1.నాటకము లాడించు ముఖ్యనటుడు, 2.నడుపువాడు, 3.వడ్రంగి.
కీలుకాఁడు - 1.సూత్రధారుఁడు, 2.యంత్రము త్రిప్పువాడు.
కీలు - 1.మర, 2.మర్మము, 3.ఉపాయము, 4.కఱ్ఱలకు పూసెడు నల్లని చమురు.

ఉలి - వడ్రంగి సాధనము, విణ.అల్పము, రూ.నులి.
నులి -
1.ప్రేగులలో నొప్పి, 2.చిక్కు, విణ.అల్పము.

ఐద్దాయులు - (ఐదు+ దాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె కాసెకులస్థుల పనులు.

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః - 6స్తో

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె -
సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.  

చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.
చిత్రిణి -
చిత్తిని, ఒక జాతి స్త్రీ.

చిత్రకంఠము - 1.కపోతము, 2.గువ్వ. 
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
గువ్వ - 1.అడవిపావురము, 2.పక్షి.

పారావతః కలరవః కపోతః :
పారేన బలేన అవతీతి పారావతః అవ రక్షణాదౌ. - పారమనఁగా బలము. దానిచేతః బోవునది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని గలది.
శీఘ్రగామిత్వేన కస్య వాయోః పోత ఇవ కపోతః - వేగముచేత వాయువు కొదమ వలె నుండునది. ఈ మూడు పావురము పేర్లు.

పావురాయి - పావురము, సం.పారవతః. 
పారావతము - పావురము.
కలరవము - పావురము.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
కాపోతము - 1.బూడిద రంగు గలది, 2.కపోత సంబంధమైనది.
కపోతానాం సమూహః కాపోతం - గువ్వలయొక్క సమూహము. 
కూకి - ఒక రకము పావురము.

కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు. మధురమైన కంఠము కలది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని.

కపోతవృక్షము - (గృహ.) బలహీనమైన చాతీ, బలహీనత వలన నీరసముగా పెర్గిగిన ప్రక్క ఎముకుల గూడు (Pigeon chest).

కామి - 1.కాముకుడు, 2.పావురము, 3.జక్కవ.
కామిని -
1.ప్రియ సంగమమందు అద్కేచ్ఛ గల స్త్రీ, 2.ఆడుజక్కవ, 3.ఆడుపావురము, 4.బదనిక, (కాముకి). మాటీనంగ - కాముకి. గంధమాదనము నందు దేవీస్థానం కాముకి|
బదనిక -
చెట్టు మీద మొలుచు ఓషధి విశేషము  సం.పందానికా,(వృక్ష.) పరాన్నభుక్కుగా జీవించు ఉద్భిజము(Parasitic plant).

వన్దాయామపి కామినీ,
కామినీశబ్దము బదనికకును, అపిశబ్దమువలన విలాసినియైన స్త్రీకిని పేరు.
కామో (అ)స్యా అస్తీతి కామినీ, సీ, అభిలాష గలిగినది. "శామాపారావతీ స్త్రీషు చక్రవాక్యాం చ కామినీ" ఇతి ప్రతాపః.  

చిత్రభానుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు.
చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః, ఉ-పు. - నానావర్ణములైన కిరణములుగలవాఁడు.
చిత్రభాను - అరువది సంవత్సరములలో నొకటి.

సూర్య వహ్నీ చిత్రభానూ :
చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు.
చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః – నానావిధము లైన కిరణములు గలవాఁడు.       

ముత్తెపురిక్క నెల - చైత్ర మాసము (చిత్తా నక్షత్ర యుక్తము). చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ(పూర్ణిమ - పున్నమ, అఖంఢ చంద్రుడు గలది.) దీనియందు గలదు, గనుక చైత్రము, చైత్రికమును అనబడును.

సూర్యుడు చైత్ర మాసంలో ధాత అనే పేరు ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు అనేవాడు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు. 

ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
ధాతా. ఋ.పు. సర్వం దధాతీతి ధాతా - సమస్తమును ధరించువాడు. డుధాఞ్ ధారణ పోషణయోః. 

హేతి - 1.అగిశిఖ, 2.మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
హినోతి ఇతస్తతో గచ్ఛతి-వర్ధతే వా, హేతిః, ఈ-సీ, హిగతౌ వృద్ధౌ చ - ఇట్టట్టు చలించునది, లేక వృద్ధిఁబొందునది.
హన్యతే అనయేతిహేతిః, హనహింసాగత్యోః - దీనిచేత హింసింపఁబడును.

వాసుకి - 1.సర్పరాజు, 2.మృగపక్షి ధ్వని.  

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

                                                                                                

ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్ర స్త్వష్టా ధ్రువో ధరః
ప్రభావ స్సర్వగో వాయు రర్యమా సవితా రవిః| – 105స్తో

జ్వలత్కాంతివహిం జగన్మోహనాంగీం – భజన్మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్|
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం - భజే శారదాంబా మజస్రం మదంబామ్.  

చైత్రము - 1.నెల, 2.ఒకానొక కొండ.
చైత్రికము -
చైత్రమాసము. 

స్యా చ్చైత్రే చైత్రికో మధుః :
చిత్తనక్షత్రయుక్తా పూర్ణిమా చైత్రీ సా స్నిన్నస్తీతి చైత్రః. చైత్రికశ్చ - చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ(పున్నమ - పూర్ణిమ, సం.పూర్ణిమా, ప్రా.పుణ్ణమా.)దీనియందుఁ గలదు. గనుక చైత్రము, చత్రికమును.
మన్య్తే సర్వత్ర కామదేవో మధుః. ఉ-పు. మన జ్ఞానే - దీనియందు మన్మథుఁ (మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.)డంతటఁ దలంపఁబడును.
మధునా పుష్పరసేన యోగాద్వా మధుః - దీనియందు మకరంద(మకరందము - పుష్పరసము, మరందము.)ముండును. ఈ మూడు చైత్రమాసము పేర్లు.

నెల - 1.మాసము 2.చంద్రుడు 3.పున్నమి 4. స్థానము 5.కర్పూరము.
మాసము -
నెల, (చైత్రము, వైసాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావనము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాసరము - 1.పొడవైనది, 2.వ్యాపించినది, 3.అందమైనది.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురిగింజల యెత్తు.
మినుము - మినుపపైరు, మాషము.

మాసస్తు తావుభౌ :
తావుభౌ మాస ఇత్యుచ్యతే ఆ పక్షములు రెండు కూడిన కాలము మాసమనంబడును.
మస్యతే పరిమీయతే నేనేతి మాసః. మసీ పరిమాణే - దీనిచేత కాలము పరిమాణము చేయఁబడును. రెండు పక్షములు ఒక నెల.

చంద్రుడు - నెల, చందమామ.
నెల -
1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.    

నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు -
1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు 3.వేలుపు.

నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయగ్రహము, తలగాము.
తలగాము - రాహువు Rahu.

చైత్రరథము - కుబేరుని తోట.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.

అస్యోద్యానం చైత్రరథం -
చిత్రరథో నామ గంధర్వరాజః తేన నిర్మితం చైత్రరథం - చిత్రరథుఁ డను గంధర్వరాజుచేత నిర్మింపఁబడినది. ఒకటి కుబేరుని యుద్యానము. చైత్రరథము నందు దేవిస్థానం మదోత్కట|

చైత్రసఖుఁడు - మన్మథుడు.
చైత్రసారథి - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

                                                                                                                                         

సౌరి - 1.శని, 2.యముడు, వ్యు.సూర్యుని కుమారుడు.
సూరస్యాపత్యం సౌరిః - పా. సౌరో వా సూర్యుని కొడుకు.
సౌరికుడు - కల్లమ్మువాడు. 

శౌణ్డికో మణ్డహారకః,
శుండా పానస్థానం తాత్ధ్యత్ సురాపిశుండా, సా పణ్యమస్యేతి శౌండికః. - శుండ యనఁగా పానస్థానము; అందుండునది గనుక సురయుశుండ యనిపించు కొనును, దాని నమ్మువాఁడు.
మండ మచ్చసురాంహరతీతి మందహారకః హృఞ్ హరణే. - కల్లుమీఁది తేటను అమ్ముటకై తీయువాఁడు. ఈ 2 కల్లమువాని పేళ్ళు.

శౌండికుఁడు - కల్లు అమ్మువాడు.
కబ్బిలి - కల్లమ్మువాడు, శౌండికుడు.

శుండాలము - ఏనుగు.
శుండ - 1.తొండము, 2.కల్లు, 3.వేశ్య. 

శుణ్డా పానం మదస్థానమ్ -
శునంత్యేనాం పానార్థమితి శుండా, శున గతౌ. - పానముసేయుట కొఱకు దీనిఁగూర్చి పోవుదురు.
పిబంత్యస్మిన్నితి పానం, పా పానే. - దీనియందు కల్లు ద్రాగుదురు.
మదస్య స్థానం మదస్థానం - మదమునకు నునికిపెట్టెనది. ఈ 3 కల్లుపాక పేర్లు. 

సురోదము - కల్లు సముద్రము.    

కల్లు1- 1.బండికన్ను(చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురి కన్ను, 3.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రనాదులయందలి రంధ్రము.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
నేత్రపర్వము - కనులపండువు.

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు -
1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు. (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దృష్టించు - క్రి.చూచు. దృష్టము - చూడదగినది.
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగ్రుడ్డునకు సంబంధించినది (Optic).  
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve).

దిదృక్ష - చూడవలెనన్న కోరిక.
దిదృక్షువు - చూడనిచ్చగలవాడు.

చక్షువు - కన్ను.
చాక్షుషము -
(భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్డివాడు, 3.మంచికన్నులు కలవాడు.

నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'A' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి, (Kerophthalmia.) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డి యగును).
బాహ్యత్వచాజాడ్యము - (గృహ.) కాచబింబము(Cornea) మెత్తనగు వ్యాధి, ఆహారములో వైటమిన్ "A", తక్కువైన ఈ వ్యాధి కలుగును.    కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).

మూర్తీ పటము - (జం.) కనుగ్రుడ్డు పొరలలో అన్నిటి కంటె లోపలనున్న పొర. (ఇది పలుతురును శీఘ్రముగా గ్రహించును. అందుచే నిది దృష్టికి అవసరమగు ముఖ్యావయవము (Retina).
శలాకలు, శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (దీనిని శీఘ్ర గ్రహణశక్తి గలదు) (Rods and cones).

గవుండ్లవాడు - కల్లు, సారాయి అమ్మువాడు, రూ.గౌండ్లవాడు, గౌఁడు, సం.గొండః.
గౌండ్లవాడు - గమళ్ళవాడు, గవుండ్లవాడు, సురాజీవి, సం.గొండః.

ఈండ్ర - కల్లుగీచి జీవించు ఒకజాతి, ఈడిగ.   
ఈడిగ - ఈండ్ర.

వారుణీ - 1.పడమటి దిక్కు, సారాయి.
సారాయి -
సుర, మద్యము, రూ.సారాయము, సం.సారః.

సురా ప్రత్యక్చ వారుణీ :
వారుణీ శబ్దము మద్యమునకును, పడమటి(West) దిక్కు నకును పేరు.
వరుణా జ్జాతా, వరుణ స్యేయ మితి చ వారుణీ. సీ. - వరుణుని వలనఁ బుట్టినది. వరుణుని సంబంధ మయినది గనుక వారుణి.

సురోదము - కల్లు సముద్రము.
సుర1 - 1.గాలిసుడి, 2.గాలి.
సుర2 - కల్లు, పెద్ద.  
సుష్ఠు రాంత్యేనాతి సురా, రా ఆదానే. - లెస్సగా దీనిం బుచ్చుకొందురు.

చారవాయువు - పడమటిగాలి.

సురగాలి - సుడిగాలి.
సుడిగాలి - వాత్య (భూగో.) మిక్కిలి వేగముతో గుండ్రముగా గిరగిర తిరిగెడు గాలి.
సుడిగొట్టు - గాలి.
సుడి - 1.జలావర్తము, నీటిసుడి, 2.రోమావర్తము, వెండ్రుకలసుడి, 3.అనిలావర్తము, గాలిసుడి.

ఐరేయము - 1.కల్లు, సుర, 2.నూగుదోస, విణ.అన్నముతో సంబంధించినది.
బలేయము -
1.నూగుదోస, 2.ఒక పరిమళద్రవ్యము.
కూతురుబుడమ - నూగుదోసకాయ.

హాల - సారాయి.
హీయతే లజ్జా అనయేతి హాలా, ఓహాక్ త్యాగే. - దీనిచేత సిగ్గు విడువఁబడును.

వారిధిఁ దరువఁగ నంతట,
వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్
వారిజలోచను సమ్మతి,
వారై కైకొనిరి దాని వారిజనేత్రన్.
భా||
పాలసముద్రాన్ని ఆతరువాత తిరిగి చిలికారు. అప్పుడు వారుణి అనే అందగత్తె అయిన కన్య పుట్టింది. ఆ కన్యను పద్మలోచనుడైన విష్ణువు యొక్క అనుమతితో రాక్షసులు తీసుకొన్నారు.  

బ్రహ్మ సంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ,
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ.

గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
గంధే నోత్తమా గంధోత్తమా - పరిమళముచేత నుత్తమమైనది.
మదిర - కల్లు.
మాద్యం త్యనయేతి మదిరా, మధ్యం చ మదీ హర్షే. - దీనిచేత మదింతురు గాన మదిరము, మద్యమును.
మదురువు - 1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.  

మద్యమ్ లోపలికి పోయి, వివేకాన్ని బయటకి తరిమి వేస్తుంది. - థామస్ బేకన్(1512-1567)

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

మధువు - 1.నీరు, 2.పాలు, 3.తేనె, 4.కల్లు, 5.వసంతర్తువు, 6.చైత్రమాసము.
మన్యతే అభిలష్యత ఇతి మధు, ఉ, న, మన జ్ఞానే. - అభిలాషచేఁ దలఁచఁబడునది. 
క్షౌద్రము - 1.తేనె, 2.ఉదకము, 3.సంపెంగ.
క్షుద్రభిర్మక్షికాభిః కృతం క్షౌద్రం - క్షుద్రము లనఁగా జుంటీఁగలు, వానిచేఁ గూర్పఁబడినది.
నననీరు - మకరందము, తేనె.

అతిముక్తము - మాధవీలత, పువ్వుల గురివెంద, విణ. విముక్తి పొందినది.
అతిక్రాంతో ముక్తాన్ విరక్తా నిత్యతిముక్తః - విరక్తుల నతిక్రమించునది.
వాసంతి - అడవి మొల్ల, పూలగురివెంద.
వసంతే పుష్ప్యతీతి వాసంతీ, ఈ. సీ. - వసంతకాలమందుఁ బుష్పించునది.
మాధవి - 1.పూల గురివెంద, 2.కల్లు, 3.తెనె, 4.లక్ష్మి, 5.కుంటెనకత్తె.
మధౌ చైత్రే పుష్పవతీతి మాధవీ, ఈ. సీ. - చైత్ర మాసమందుఁ బుష్పించునది.  

ముక్కు నలుపు - ఒడలంతా ఎరుపు - గురివిందగింజ. 

అంబిష్ట - 1.(వృక్ష.) 1.అడవిమొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి.

ఆపానము - 1.అనేకులు గూడి కల్లు త్రాగుచోటు, 2.కల్లు అంగడి.
అపిబన్త్యస్మిన్ని త్యాపానం - దీనియందు మద్యపానము సేయుదురు.
పానము - 1.త్రాగుడు, 2.త్రాగుడు గిన్నె, వై.వి. పానపట్టము, లింగపీఠము, పానీయవృత్తమ్.
త్రాగుడు - త్రాగుట, రూ.త్రావు.
త్రాగు - క్రి.పానముచేయు, రూ.త్రావు.
త్రావు - క్రి.త్రావు. లింగపీఠము - పానపట్టము.

స్వాదనము - 1.పానము, 2.రుచి చూచుట.
స్వాదుముకుళములు - (జం.) రుచిని గ్రహించు జీవకణములు గుంపులు (Taste buds).

బొళ్ళపాయి - కల్లుత్రాగు తాటాకువాయ.
బొళ్ళ - శూన్యము, ఉత్తది.

లొట్టిముచ్చు - త్రాగుబోతు.
లొట్టి - కల్లుదీసెడి ముంత.

కుసుమాసవము - తేనె, మధువు.
తెనియ -
మధువు, రూ.తేనె.  

తేనెదిండి - తుమ్మెద.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెద కంటు గల్గించునది.

ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.
ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పసువులను త్రోలుట.

నీరు - 1.నీరము, జలము(నీరము - జలము), 2.మూత్రము, సం.నీరమ్.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.

మూత్రము - ఉచ్చ, కాలుమడి.
ఉచ్ఛ(ౘ) -
మూత్రము.
ఉచ్చబుడ్డ - మూత్రాశయము.

ఉచ్చమల్లి - 1.దిసమొల స్త్రీ, నగ్నిక, 2.రోత పుట్టించు స్త్రీ.
నగ్నిక -
1.కన్య, 2.దిసమొల ఆడది, రూ.నగ్నా.
దిసమొల(బిత్తల - దిసమొల) - నగ్నత్వము, రూ.దిస్సమొల.

స్త్రీ నగ్నికా కోటవీ స్యాత్ :
నజతే నగ్ని కా. ఓనజీ వ్రీడే. - లజ్జించునది.
కుటేన కౌటిలేన వేతి యాతీతి కోటవీ. సీ. వీ గతిప్రజనన కాంత్యసన ఖాదనేషు. - కౌటిల్యము చేత పోవునది. ఈ రెండు 2 దిసమొలతో నుండు స్త్రీ పేర్లు.

నాగ్నింముఖే నోపథ మే నగ్నాం నేక్షేతచ స్త్రీయం|
నామేధ్యం ప్రక్షి పేదగ్నౌ నచపాదౌ ప్రతాపయేత్ ||
తా.
అగ్నిని నోటిచే నూదరాదు, దిగంబరియైయున్న(వివస్త్రయైయున్న) స్త్రీని జూడరాదు, అపిశుద్ధమైన వస్తువు అగ్నియందు వేయరాదు, అడుగులను గాచుకొన గూడదు. – నీతిశాస్త్రము 

వసంతము - 1.చైత్ర వైశాఖ మాసములు, 2.ఒకానొక రాగము, వి. పసుపును సున్నమును కలిపిన యెఱ్ఱనీళ్ళు.
లాక్షారసము -
పారాణి.

వసన్తే పుష్పసమయ స్సురభిః :
వసతి కామో స్నిన్నితి వసంతః. వసనివాసే. - దీనియందు మన్మథుఁడు వసించును.
వసంతి సుఖం యథాతథా అస్మిన్నితి వసంతః. - దీని యందు జనులు సుఖముగా నుందురు.
పుషాణాం సమయః కాలః పుష్ప సమయః - పుష్పము పూచెడు కాలము.
సుష్ఠురభంతే హృష్యంత్యత్రేతి సురభిః. ఇ-పు. రభరాభ్యసే. - దీనియందు జనులు లెస్సఁగా సంతోషింతురు.
సుష్ఠు రభంతే ఉపక్రమంతే శుభకార్యం కర్తుమితి సురభిః. - దీనియందు జనులు శుభకార్యముఁ జేయ నారంభింతురు. ఈ మూడు 3 చైత్ర వైశాఖములతోఁ జేరిన ఋతువు పేర్లు.

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు; మదనుఁడు - మన్మథుడు.

పుష్ప సమయము - వసంత ఋతువు
పూదఱి -
వి.పుష్పసమయము, వసంతఋతువు.
ఋతుపతి - వసంతర్తువు, king of seasons.

వసంత - Spring, ననకారు, పూల ఋతువు.
ననకారు -
వసంతము; పూల ఋతువు.
ననాహత - వసంతకాలము.
నన - 1.పువ్వు, 2.మొగ్గ, 3.చివురు.
ననయు - క్రి.పూచు, చిగురించు.
ననుచు - క్రి.1.పూచు చిగురించు, 2.మొగ్గతొడుగు, 3.అతిశయించు, 4.అనురాగ మందు, 5.ఇంపగు, రూ.నవయు.
ననవిలుకాఁడు - మన్మథుడు, రూ.ననవిలుతుఁడు.  

పల్లవము - 1.చిగురు, 2.చిగిరించిన కొమ్మ, 3.కోక చెరగు, 4.విరివి.
చిగురు -
1.పల్లవము, విణ.లేత, రూ.చిగురు. కిసలము - చిగురు, రూ.కిసలయము, కిసాలము, కిసాలయము.

పల్లవో (అ)స్తీకిసలయమ్ -
పలతె వాయువశాచ్చలతీతి పల్లవః, అ, ప్న. పల గతౌ. - వాయువశమునఁ గదలునది.
కించిచ్చలతీతి కిసలయం, షల గతౌ. - ఇంచుకంత చలించునది. ఈ 2 చిగురుపేర్లు. ఆకులతోఁ గూడిన కొమ్మ పేళ్ళని కొందఱు.

చిగురాకుదిండి - కోయిల, పల్లవఖాది.
ప్రబలము - చిగురు విణ. మిక్కిలి బలముగలది.  

మామిడి చిగురుటాకులను నమలెడు కొయిల జిల్లేడు కొనలను నోట కొరుకునా?

పల్ల - పాటల (కపిల) వర్ణము గలది, సం.పాటలః. పుండ్రవర్ధనము నందు దేవిస్థానం పాటల|

లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
వామనము -
లేతది.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.

లలిత సహకార పల్లవ,
కలితాస్వాదన కషాయ కంఠ విరాజ
త్కలకంఠ పంచమ స్వర,   
కలనాదము లుల్లసిల్లఁ గడు రమ్యములై.
భా||
లేతలేత తియ్యమామిడి చిగుళ్ళను తెగమెక్కి వగరెక్కి పొగరెక్కిన గొంతులతో కోయిలలు ఎంతో రమ్యంగా అవ్యక్త మధురంగా, పంచమ స్వరంతో కూస్తూ ఉన్నంతచేత చక్కగా ఆ వనం(వన్యము - వనము నందు బుట్టినది.)ఒప్పుతున్నది.

మామిడి చివిళ్ళు నోమియోమి
గొంతు సవరించి కీలించి వంతగించి
పాటపాడెడి పిల్లల పలుకు కులుకు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
కామధేనువు -
వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు.
సురగలి - కామధేనువు; కామదుఘ - కామధేనువు.
తెలిమొదవు - కామధేనువు(మొదవు - పాడియావు).
వెలిగిడ్డి - కామధేనువు; ఈవులమొదవు - కామధేనువు.

సురభిశబ్దము ఆవునకు పేరగునపుడు సీ. చకారమువలన వసంత ఋతువునకు పేరైనపుడు పు. మంచి పరిమళము గలిగినదానికిని, మనోహరమైన దానికిని పేరైనపుడు త్రి. కామధేనువునకు పేరైనపుడు సీ. సుష్ఠు రభత ఇతి సురభిః. రభ రాభస్యే, మిక్కిలి వేగిరపడునది. "సురభి ర్నా జాతిఫలే వసంతే చంపకద్రుమే, సల్లక్యాం స్త్రీ మాతృభేదే మనోజ్ఞేతు విశేవ్యవ"దితి శేషః.

ఆవు - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.

చాంపేయము - 1.బంగారము, 2.సంపెంగ.
చంపాఖ్యదేశే భవత్వాచ్చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చంపకము - సంపెంగ, సంపెగ.
సంపగియ - చంపకము, రూ.సంపగి, సంపెంగ, సంపగి, సం.చంపకః.

అథ చామ్పేయ శ్చమ్పకో హేమపుష్పః.
చంపాఖ్యదేశే భవః చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చమ్యతే అశిభిరితి చంపకః. చము అదనే. - తుమ్మెదలచే నాస్వాదింపఁ బడునది.
హేమవర్ణం పుష్యమన్యేతి హేమ పుష్పకః - బంగారు వన్నెగల పువ్వులు గలది. ఈ 3 సంపెంగ చెట్టు పేర్లు.    

గంధఫలి - సంపెంగ మొగ్గ, రూ.గంధఫలి.

పూనూనె - సంపెంగనూనె.
కమ్మనూనియ -
సంపెంగ, మొ.వి చేర్చి చేసిన తైలము, రూ.కమ్మనూనె. మింగమెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అన్నట్లు.

సమూహఫలము - (వృక్ష.) ఒకే పుష్పములోని విభక్తాండ కోశము నుండి తయారైన ఫలసమూహము (Etacrio), ఉదా. సీతాఫలము, సంపంగి. పేర్లు
పుంజఫలము - (వృక్ష.) ఒకేపుష్పము నందు బయలుదేరి, విభక్తకమైన అండాశయము నుండి తయారైన పండు (Aggregate fruit), ఉదా. సీతాఫలము), చూ. సమూహఫలము.

దుర్జనం కాంచనం భేరీ దుష్టస్త్రీ దుష్టవాహ మ్|
ఇక్షుం తిలా నౌషధాకాశ్చ మర్దయేడ్గుణ వృద్ధమ్||
తా.
దుర్జనులను, బంగారమును, భేరిని, దుష్ట స్త్రీని, చెడుగుఱ్ఱమును, చెఱుకుగడలను, నువ్వులను, మందును గుణవృద్ధి కొరకు మర్దింప వలయును. - నీతిశాస్త్రము     

చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచా|
కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా.

కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
కచతి దీప్యత ఇతి కాఞ్చనం, కచి దీప్తి బంధనయోః. - ప్రకాశించునది.  
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి. (రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ వర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.

కనకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
కనతి దీప్యత ఇతి కనకం, కన దీప్తౌ. - ప్రకాశించునది.
బంగారుతీఁగెలు - ఒక జాతి వడ్లు.

హేమము - 1.బంగారు, 2.ఉమెత్త.
హినోతి వర్ధత ఇతి హేమ, న, న, హి గతౌ వృద్ధౌ చ - లోహాంతరమును గూడి వృద్ధిఁబొందునది. 

బంగరు - బంగారము, సం.భృంగారః.
భృంగారము - 1.బంగారు పాత్రము, 2.గుంటగలిజేరు.      

కాంచన వస్తుసంకలిత కల్మష మగ్నిపుటంబు వెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మల త్రయం
బంచిత భక్తియోగదహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణా పయోనిధీ.

తా. రామా! బంగారులోని మాలిన్యము అగ్ని పుటము వలన పోవునట్లు అత్మయందుగల మూఁడుమలములు నీయందలి భక్తియోగము చేతనే, నశించునుగాని మరొక విధముగ నశింపవు.

మదనము - 1.ఆమని, వసంతకాలము, 2.ఉమ్మెత్త.
ఆమని -
1.వసంతఋతువు, వసంతుడు, 2.ఫలసమృద్ధి, విణ.1.మిక్కుటము, 2.తృప్తికరము, క్రి.విణ.1.మిక్కుటముగా, 2.తృప్తికరముగా.

ఆమని పాడవే కోయిల మూగవైపోకు ఈవేళ... సుకుమారమైన మామిడి పండును గోరెడి చిలుక యిష్టముతో వుమ్మెత్త కాయ తినునా?

మిక్కటము - మిక్కిలి, అతిశయము, రూ.మిక్కుటము.
తుష్టి -
1.తృప్తి, 2.సంతొషము. 

ననుపు - 1.అనురాగము, 2.అతిశయము, 3.ఇంపు.
ననుపుకత్తె -
ప్రియురాలు, విటి.
ననుపుకాఁడు - ప్రియుడు, విటుడు.
ననువుపడు - క్రి.పొత్తు కలుగు.

వసంతదారువు - (వృక్ష.) కాండములో వసంత కాలమున ఉత్పత్తియైన దారువు (Spring wood).

వసంతం యౌవనంవృక్షాః పురుషా ధన యౌవనమ్|
సౌభాగ్యం యౌవనానార్యో యౌవనావిద్యయా బుధాః||
తా.
వృక్షములకు వసంత ఋతువు యౌవనము, పురుషులకు ధనము యౌవనము, స్త్రీలకు భాగ్యమే యౌవనము, పండితులకు విద్యయే యౌవనము. – నీతిశాస్త్రము

కుసుమాకరము - 1.వసంతర్తువు, 2.తోట.
తోఁట -
1.ఉపవనము, 2.ఆశ్రమము.
ఉపవనము - పెంచినతోట, ఉద్యానము, అవ్య. వనసమీపమున.
ఉద్యానవనము - రమణీయములగు అనేక విధములైన చెట్లు, లతలు, గుల్మములు అందముగ నమర్చి పెంచుతోట (Garden).
ఉద్యానము - 1.(రాజుల) విహారార్థమైన తోట, 2.విహారము కొరకు వెడలుట, 3.ప్రయోజనము(ఉద్దేశ్యము, కారణము (Motive).
వనాన్ని ఒకరెవరో పుట్టిస్తే మిగతావారు దానిని పెంచి పెద్ద చేస్తారు. 

తోఁపు - 1.పెంపుడు వనము, తోట, 2.ఎరుపు, 2.తోపిక.
తోఁపిక - తలపు, తోచుట.

పూర్తము - నూతిని, చెరువును త్రవ్వించుట,  గుడి కట్టించుట, తోట నిర్మించుట, అన్నము పెట్టుట, విణ.నింపబడినది.

తోఁట సేద్యము - (వృక్ష.) ఎక్కువ నీరు నిలువకుండ తగుమాత్రము నీరు పెట్టి పైరులను సాగుచేయు పద్ధతి. దీనికి అనుకూలముగా నుండు నేలలు ' తోటనేలలు ' అనబడును, (Garden cultivation).  

సహకారము - వ్యష్ఠి, సమిష్టి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి.తియ్యమామిడి చెట్టు.

సుకుమారమైన మామిడి పండును గోరెడి చిలుక యిష్టముతో వుమ్మెత్త కాయ తినునా?

వృక్షవాటిక - 1.ధనికుల గృహముల యందలి ఉపవనము, 2.చిన్నతోట.
వనమహోత్సవము - (వ్యవ.) చెట్ల పండుగ. సంవత్సరమున కొకసారి క్రొత్త వృక్షములను నాటు పండుగ. (ఇది మన దేశములో ఇటీవల సుమారు 15 ఏండ్ల నుండి ఆచారములోనికి తీసుకొని రాబడినది, వనములను పెంచుటకై వృక్షములు నాటు ఉత్సవము.) ఈ ఉత్సవము భారతదేశములో మొదటిసారిగా శ్రీ కనయ్యాలాల్ మున్షీచే క్రీ.శ. 1950లో ప్రారంభించబడెను.

పంటవలఁతి - భూమి.
పంట -
1.పండుట, 2.కృషి.     
కృషి - సేద్యము, వ్యవసాయము.
సేద్యము - కృషి, వ్యవసాయము, సం.సేత్యమ్.

కృషితోనాస్తి దుర్భిక్షం జపతోనాస్తి పాతకం|
మౌనేన కలహంనాస్తి నాస్తిజాగరతో భయమ్||
తా. కృషి చేసుకొనువానికి కఱవులేదు, జపము జేసికొనువానికి పాపము(పాతకం - మహాపాపము (పంచ మ హా పాతకములు: స్వర్ణపేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము). లేదు, మౌనముతో నున్నవానికి కలహములేదు, మేల్కొని యున్నవానికి భయములేదు. - నీతిశాస్త్రము 

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః|
పరర్థిః పరమస్పటః తుష్టః పుష్ట శ్శుభేక్షణః||

ఫసలు - (వ్యవ.) 1.పంట, 2.ఋతువు, 3.కాలము, 4.జరుగుచున్న సంవత్సరము.
ఫలము -
1.పండు, 2.పంట, 3.ప్రయోజనము, 4.లాభము, వి.(రసా.) భౌతిక రసాయనిక ప్రక్రియల యొక్క పర్యవసానము (Effect), వి.(గణి.) కొన్ని రాసులపై గనితశాస్త్ర విధానముల నుపయోగించిన లభించు రాశి (Result).
ఫలసాయము - (వ్యావ.) పండినపంట.
ఫలినము - పండ్లుగలది (వృక్షము).

ఋతుఁడు - సూర్యుడు Sun.
ఆర్తనము - 1.వసంతాది ఋతు సంబంధమైనది, 2.స్త్రీ ఋతు సంబంధమైనది, వి.1.స్త్రీ ఋతువు, 2.పువ్వు, 3.ఋతుస్నానమైన పిదప గర్భోత్పత్తికి అనుకూలమైన కాలము.  

ఋతుః స్త్రీకుసుమే పి చ. : ఋతుశబ్దము స్త్రీల రజస్సునకును, వసంతాది ఋతువులకును పేరు. ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ. - పోవునది.

ఋతువు - 1.రెండు మాసముల కాలము, 2.గర్భధారణకు యోగ్యకాలము, 3.స్త్రీ రజస్సు, 4.వెలుగు, ప్రకాశము.

ద్వౌద్వౌ మాఘాదిమాసా స్యా దృతుః :
ద్వౌద్వౌ మాఘాదిమాసౌ ఋతురిత్యుచ్యతే. - మాఘము మొదలైన రెండేసి మాసములు ఋతు వనంబడును.
ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ - గతించునది. ఈ రెండు నెలలు ఒక ఋతువు.

ఋతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః|
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||

పుష్పవంతులు - సూర్యచంద్రులు.

పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.
పుష్ప్యతీతి పుష్పం, పుష్ప వికసనే. - వికసించునది.
ప్రసూనము - 1.పువ్వు, 2.ఫలము.    
పువు - పుష్పము, రూ.పువ్వు, సం.పుష్పమ్.
ప్రసూయత ఇతి ప్రసూనం, షూఙ్ ప్రాణిప్రసవే. - పుట్టినది.

కుసుమాయుధుఁడు - మన్మథుడు.
కుసుమేషుః ఉ-పు కుసుమాన్యేన ఇషవో యస్యసః - పుష్పములే బాణములుగా గలవాఁడు.

సుమము - పువ్వు, కుసుమము.
కుసుమము - 1.పూవు, 2.నేత్రరోగము, 3.స్త్రీరజస్సు, 4.పండు.
కుస్యతి భ్రమరాదినా శ్లిష్యతీతి కుసుమం, కుస శ్లేషనే. - భ్రమరములతోఁ గూడియుండునది.

పరాగము - 1.పుప్పొడి, దుమ్ము.
పుష్పపరాగము - (వృక్ష.) పుప్పొడి (Pollen), పరాగ రేణువులు = Pollen grains. 
బుక్కాము - పుప్పొడి, సుమనోరజము.   

పరాగ స్సుమనోరజః,
పరాగచ్చతి వాయువశేనేతి పరాగః, పరాఙ్ పూర్వో గమ్ ఌ గతావితి ధాతుః. - వాయువశమునఁ బోవునది.
సుమనసాం రజః సుమనోరజః, స. న. - పుష్పములయొక్క ధూళి. ఈ 2 పుప్పొడి పేర్లు.

పరాగకోశము - (వృక్ష.) పుప్పొడి తిత్తి, పుప్పొడి యనబడు పిండితో నిండి పుంకేసరము చివర ఉబికియుండు కోశము (కింజల్కము) (Anther).
పరాగరేణు బహిఃకవచము - వృక్ష.) పుప్పొడి రేణునకు బయటనుండు పొర (Extine)
పరాగరేణ్వాంతః కవచము - (వృక్ష.) పుప్పొడి రేణువునకు గల రెండు పొరలలో లోపలనున్న మృదువైన పొర (Intine).
పరాగనాళిక - (వృక్ష.) పరాగ సంపర్కమైన తరువాత పుప్పొడి రేణువు నుండి బయలుదేరి అండకోశ కీలములోనికి చొచ్చుకొని పెరుగు నాళము (pollen tube).  
పరాగసంపర్కము -  

పరాగః కౌసుమే రేణౌ స్నానీయాదౌ రజస్యపి,
పరాగశందము పుప్పొడికిని, స్నానసాధనమైన పిండి మొదలైన దానికిని, ధూళికిని పేరు.
పరాగచ్ఛతి వాయునేతి పరాగః, గమ ఌ గతౌ. - గాలి కెగిరిపోవునది గనుక పరాగము.

కౌసుమము - 1.పూదేనె, 2.పుప్పొడి, విణ.కుసుమ సంబంధమైనది.

కుధరము - కొండ.
కుసుమ - 1.ఒకరకపుధాన్యము (వడ్లలో పెద్దకుసుమ, చిన్నకుసుమ, గుత్తికుసుమ మొ.వి, 2.(వ్యవ.) గింజలనుండి ' కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower).  

కింజల్కము - ఆకరవు, కేసరము, (వృక్ష.) పుం కేసరము, పుష్పములోని పురుషభాగము, పుప్పొడి తిత్తిగల కాడ (Stamen).
కేసరము - 1.ఆకరవు, 2.ఇంగువ, 3.జూలు, 4.పొగడ, 5.పొన్న, రూ.కేశరము.
ఆకరువు - తామరదుద్దుచుట్టు నుండునది, రూ.అకరు, ఆకరు. 

కింజల్క కేసరో (అ)స్త్రియమ్,
కించిజ్జలతి జడీభవతి కింజల్క - ఇంచుకంత జడమైయుండునది.
కే జలే సరతి కేసరః అ. ప్న. సృగతౌ. - జలమందుండునది.
పా, కేసరః, 'ఆందోళిత కుసుమ కేసరే కేసర ' ఇతి వాసవదత్తాయాం, కేశీర్యత ఇతి కేశర, శౄ హింసాయాం. - కొనయందు విడిపోవునది. ఆకరువుపేర్లు.

కేసరదండము - (వృక్ష.) కింజల్కమునకు గల కాడ, శై వలసూత్రము (Filament).
ఫిలమెంటు - (భౌతి.) (Filament) ఎలక్ట్రిక్ బల్బులలో నుండు సన్నని తీగచుట్ట.  
ఆధారలగ్నము - (వృక్ష.) కింజల్కము యొక్క దండము పుప్పొడి తిత్తి క్రింది భాగమున అంటుకొని యున్న స్థితి (Innate or basefixed). 
యోజి - (వృక్ష., జీవ.) కింజల్కము యొక్క కాడ పుప్పొడి తిత్తుల వెనుక కూడపెరిగియున్న భాగము (Connective).

పుంకేసరనాళము - (వృక్ష.) కింజల్కము లన్నియు కలిసి గొట్టముగా నేర్పడిన నిర్మాణము (Staminal tube).
పుంకేసరమకుటము - (వృక్ష.) కొన్ని పుష్పములు కింజల్కములపై నగుపడు రోమములు మొదల్గు ప్రవర్థకములు (Staminal corona).
పుంకేసరవలయము - (వృక్ష.) ఇది పుష్పములలో ఆకర్షణపత్రములలోపల నుండు మూడవవలయము (Androecium) పువ్వులలో నున్న కింజల్కముల కన్నిటికి ఈ పదము వర్తించును.

అభిలగ్నము - (వృక్ష.) పుష్పములో ఉన్న ఒకరకముభాగము మరియొక రకము భాగముతో కలిసియున్న స్థితి, ఉదా. ఆకర్షణపత్రములు, పుంకేసరములతో కలిసియున్న స్థితి (Adhesion).    

ఆకర్షణపత్రలగ్నము - (వృక్ష.) ఆకర్షణ పత్రములతో కలిసియున్న (కింజల్కములు). (ఈస్థితి సాధారణముగ సంయుక్తదళములుగల పుష్పములలో ఉండును.) (Epipetalous). కీలభిన్నత - (వృక్ష.) పొడువైన కింజల్కములు పొట్టి కీలము గల పువ్వులును, పొట్టి కింజల్కములు పొడువైన కీలములుగల పువ్వులును ఒకే మొక్కపై నుండుట (Heterostyly).    

పూర్వపుంపక్వము - (వృక్ష.) పుష్పములో నున్న కింజల్కములు కీలాగ్రము కంటె ముందుగా పక్వదశకువచ్చిన(స్థితి) (protandrous).

మధూలిక - పుప్పొడి; పుప్పొడి- (పూ+పొడి) పుష్పములాందలి ధూళి.

అరాళై స్వభావ్యా దళికలభస శ్రీభి రలకైః
పరీతం తే వక్త్రం - పరిహసతి పంకేరుహ రుచిమ్,
దరస్మేరే యస్మిన్ - దశనరుచి కింజల్క రుచిరే
సుగంధౌ మాద్యంతి - స్మరదహన చక్షు ర్మధులిహః| - 45శ్లో

తా. ఓ త్రిపురసుందరీ! చిఱునగవు గలదియు, దంతకాంతులచే నొప్పునదియు, పరిమళించు నీ ముఖమునందు మన్మథుని హింసించిన శివుని యొక్క కన్నులనెడి తుమ్మెదలు మత్తిల్లుచున్నవో, స్వాభావికముగ నొక్కులుగలిగి తుమ్మెదలవలె ప్రకాశించు ముంగురులచే వ్యాపించిన నీ ముఖము(పంకేరుహము - పంకజము, తామర.)పద్మపు కాంతిని మించి యున్నది. – సౌందర్యలహరి

2. విదియ - రెండవ తిధి  సం.ద్వితీయా.    
ద్వితీయ - - 1.భార్య, 2.విదియ, 3.రెండవది స్త్రీ, 4.(వ్యక) ద్వితీయా విభక్తి.
యజ్ఞాధికార ఫలభాగినో ర్జాయాపత్యో రన్యతరత్వేన ద్వితీయా - యజ్ఞాధికార మందు ఫలమును బొందునప్పుడు పతితోఁ గూడ తాను రెండవది. ద్వితీయం చ సరస్వతీ| ద్వితీయా బ్రహ్మచారిణీ| 

దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.
దయిత - 1.భార్య, 2.స్త్రీ.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు. భరింపదగినది.
భ్రియత ఇతి భార్యా. భృఞ్ భరణే. - భరింపఁబడునది.

ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
స్కందుఁడు - కుమారస్వామి. ద్వితీయః స్కంద ఏవ చ| 

ద్వితయము - రెండు.
దుగ - ద్వికము, రెండు, రూ.దువ, సం.ద్వికమ్.
రెండు - 1.భేదము, వేరుపాటు, 2.ద్వయము.

ఇరుగడ - రెండు ప్రక్కలు.
ఇరు - సర్వ. (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా.ఇరుగడ.
ఇరుగురు - ఇద్దరు, రూ.ఇరువురు. 
ఇరువురు - ఇరుగురు.  

ని - ద్వితీయా విభక్తి ప్రత్యయము.
ను - 1.ద్వితీయా విభక్తి ప్రత్యయము, 2.క్రియాప్రత్యయము, ఉదా.తద్ధర్మాదు లందు ప్రథమ పురుషైక వచనమున చేరు ప్రత్యయము, సూర్యుడు తూర్పున ఉదయించును, 2.సముచ్ఛయార్థకము, ఉదా.వాడును నీవును రండు.
తద్ధర్మము - (వ్యాక.) 1.మూడు కాలములను బోధించు క్రియాపదము, ఉదా.సూర్యుడుదయించును, 2.దాని యొక ధర్మము, 3.స్వభావము.

భాతి - 1.కాంతి, 2.రీతి.

లలాటం లావణ్య ద్యుతి - విమల మాభూతి తవ యత్
ద్వితీయం తన్మన్యే - మకుట ఘటితం చంద్రశకలమ్|
విపర్యాసన్యాసా దుభయమపి - సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః- పరిణమతి రాకాహిమకరః|| - 46శ్లో

తా. తల్లీ! లావణ్యమను వెన్నెల చేత స్వచ్ఛముగ ప్రకాశించుచున్న నీ లలాటము - నుదురు కిరీటమందున్న రెండవ నెలపాలు - చంద్రకళగా భావించుచున్నాను. ఈ రెండును  క్రిందు మీదుగ(తలక్రిందులుగా) నుండుటవలన పరస్పరము కలిసి, అమృతము పూసిన పూర్ణిమ చంద్రుని హిమకరుఁడు - చంద్రుడువలె నీ ముఖము గన్పట్టుచున్నది. – సౌందర్యలహరి

ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం,
ఆగమావయశోభినీం అఖిల వేదసారకృత శేఖరీం,
మూలమంత్ర ముఖమండలాం ముదిత నాద బిందునవయౌవనాం
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్. – 8శ్లో

ఉభయము - 1.రెండవయములు గలది, 2.రెండు, వి.గుడిఉత్సవము నడుపు వంతు.

ద్వితీయ(విదియ)చంద్రుని దర్శించునపుడు :
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర|
హిరణ్య మకుటా భాస్వదాచల చంద్ర నమోస్తుతే||

విదియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడు.

కార్తీకశుద్ధ విదియ(యమ ద్వితీయ)నాడు ఎవడు తన సోదరి యింట భోజనం చేస్తాడో, అతనికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుభయం కాని సంభవించని విధంగా యమునకు వరం ప్రసాదించాడు.

సోదరుణ్ని తనఇంటికి అహ్వానించి, మనఃపూర్వకంగా తన చేతి వంటకాలను వడ్డించి, తృప్తిపరిచే చెల్లెల్లు(స్త్రీ) వైధవ్యం పొందక చిరకాలం 'సువాసిని' గానే ఉంటుంది, అన్నాడు యమధర్మరాజు, తన చెల్లెల్లు యమునతో. పసుపు-కుంకుమ స్త్రీకి పుష్టి కలిగిస్తుంది.

అలరువిలుకాఁడు - మన్మథుడు.
అలరువిల్తుఁడు - మన్మథుడు.
అలరు - క్రి.1.వికసించు, 2.సంతోషించు, 3.శోభిల్లు, 4.ఒప్పు, కలుగు, వి.1.పుష్పము, 2.సంతోషము, 3.శోభ.
అలరుఁబోఁడి - పుష్పమువలె మనోజ్ఞురాలగు స్త్రీ, రూ.అలరుఁబోణి.
ననఁబోడి - అలరుబోడి.

మాల్యము - 1.పుష్పమాలిక, 2.పుష్పము. సీతార్పిత వరమాలిక రామ్|

పుష్పాదికములు - (గృహ.) పుష్పముల కొరకు, రమణీయత కొరకు పెంచబడు మొక్కలు (Flowers and plants) ఉదా. గులాబి, క్రోటనులు మొ.

పువ్వువిలుతుఁడు - మన్మథుడు.
పుష్పశరుఁడు - మన్మథుడు.
విరి - పువ్వు.
విరిఁబోఁడి - పుష్పమువలె మనోజ్ఞమైన స్త్రీ.
పువుఁబోఁడి - అందకత్తె, రూ.పువ్వుబోడి, పూబోడి. 

పూరేడు - ఒకరకము పక్షి. 

నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవు చున్నట్టు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).

పూనీరు - పన్నీరు, సం.పుష్పనీరమ్.
పన్నీరు -
చల్లనినీరు, సం.పన్నీరమ్.

"అహింసా ప్రథమం పుష్పం – పుష్పమింద్రియనిగ్రహః
సర్వభూతదయా పుష్పం - క్షమా పుష్పం విశేషతః
శాంతిః పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ
సత్య మష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్"
  - ఈ పరిశుద్ధ పుష్పములు ఎమినిటియు కలిగి యుండుటయే పరమేశ్వరికి పుష్పపూజ యగును. 

పువ్వులను ఎవరు - పూయమన్నారు? పువ్వులకు రంగులు - ఎవరు వేశారు? అంతటా సుగంధాలను - ఎవరు నింపమన్నారు?

మాధ్వి - 1.మద్యము, 2.మకరందము.
మధూళి -
1.కల్లు, 2.పూదేనె.

పూఁదేనియ - మకరందము.
కమ్మనీరు - పూదేనె, మకరందము. మకరందము - పుష్పరసము, మరందము. పుష్పరసము - మకరందము.

మకరన్దః పుస్పరసః -
మంక్యతే పుష్ప్యతే అనే నేతి మకరందః, మకి మండనే. - దీనిచేత పుష్పమలంకరింపఁబడును.
పుష్పాణాం రసః పుష్పరసః. - పుష్పముల యొక్క రసము. ఈ 2 పూఁదేనె పేర్లు.

రేణువు - 1.చూర్ణము, ధూళి, 2.నలుసు, నలక.
నలుసు - రేణువు. 

రేణువాసము - తుమ్మెద, పుప్పొడిలో నుండునది.
పుష్పందయము - తుమ్మెద; తుమ్మెద - భ్రమరము.

రజము - రజస్సు.
రజస్సు -
1.రజోగుణము, 2.దుమ్ము, 3.స్త్రీరజస్సు, 4.పుప్పొడి.
రాజసము - రజోగుణము వలన కలిగినది.

తేజము - 1.ప్రకాశము, వెలుగు, విణ.బయలు పడినది 2.ప్రభావము(ప్రతాపము, తేజము),3.పరాక్రమము(బలము, శౌర్యము), 4.రేతస్సు రూ.తేజస్సు. 

కుసుమ - 1.ఒకరకపుధాన్యము (వడ్లలో పెద్దకుసుమ, చిన్నకుసుమ, గుత్తికుసుమ మొ.వి, 2.(వ్యవ.) గింజలనుండి ' కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower).  

కుసుమాయోజనము - (గృహ.) సర్దుకొన లేకపోవుట, అమర్చుకొన లేకపోవుట, అలవడకపోవుట, కలసిమెలసి యుండలేకపోవుట (Maladjustment). 
అలవడు - 1.అభ్యస్తమగు, అబ్బు, 2.పరిమితమగు, 3.కలుగు, 4.శక్యమగు, 5.సిద్ధించు, 6.తగు, 7.కలియు(కలియు - పొందు), 8.ఒప్పు, 9.ఉండు, 10.స్వాధీనమగు.
అమరు - క్రి.1.ఒప్పు, 2.కుదురు, 3.సిద్ధమగు, సిద్ధించు, లభించు, కలుగు, 4.సరిపడు, 5.ఏర్పడు, పొసగు.
పొసఁగు - 1.అనుకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.
పొసఁగుడు - వి.ప్రాప్తి, 2.స్నేహము.  

మ్లాని - (పుష్పాదులు), 1.వాడుట, 2.మురికి.

పూనిన భాగ్యరేక చెడిపోయిన పిమ్మట, నెట్టి మానవుం 
డైనను వానినెవ్వరును ప్రియంబునబల్కరు పిల్వరెచ్చటన్
దానది యెట్లోకో యనిన తథ్యము పుష్పము వాడి వాసనా 
హీనతనొంది యున్నయెడ నెవ్వరు ముట్టదు రయ్య, భాస్కరా.
   
తా. సువాసన గల పూవు(పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.)వాడి తన సువాసనను గోల్పోయి నంతనే దాని నెవ్వరూ ముట్టరు. అట్లే మొదట అదృష్టము గలిగి పిదప అది తొలగిన వానిని ఎవరును మునుపటి వలెనే చూడరు. వానితో సంభాషింపరు. వాడు పిలిచినను పలకరు.

మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు.
మాధుర్యము -
1.తీపు, 2.పక్షులు మొ. నవి వచ్చుటకు బోయ వేయు ఈల, 3.శృంగారచేష్ట.      
తీపు - 1.మాధుర్యము, 2.గుంజెడుబాధ.

కుసుమాసవము - తేనె, మధువు.
తెనియ -
మధువు, రూ.తేనె.
తేనెదిండి - తుమ్మెద; తుమ్మెద - భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెదకు కంటు గల్గించునది.

కురుళము - ముంగురులు.
కురులు -
ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
ముంగురులు - (ముందు+కురులు) నొసటిపైన గునిసి యాడెడు ఉంగరపు వెండ్రుకలు.

మధుకరము -  1.భిక్షాన్నము, 2.తుమ్మెద.
మధుపము -
తుమ్మెద.
మధులిహము - మధుపము, తుమ్మెద.

భ్రువౌ భుగ్నే కించి - ద్భువన భయభంగ వ్యసనిని!
త్వదీయే నేత్రాభ్యాం - మధుకరరుచిభ్యాం ధృత గుణమ్|
ధను ర్మన్యే సవ్యే-తర - కరగృహీతం రతిపతేః 
ప్రకోష్ఠే ముష్టౌ చ - స్థగయతి నిగూఢాన్తర ముమే|| - 47శ్లో
 
తా. ఉమే! ఓ  ఉమాదేవీ! జగముల(భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.)భయమును దొలగించ నాసక్తిగల తల్లీ! కొంచెము వంపుగ నున్న నీ కనుబొమ్మలు, తుమ్మెదల వలె ప్రకాశించు నీ కనులు - ముడి బడిన నీ కనుబొమల జంట - నారిని పట్టుకొన్నయగు మన్మథుని కుడిచేతియందలి(ప్రకోష్టము - 1.తొట్టికట్టు, 2.ముంజేయి.)ముంజెయి పిడికిలిని కప్పబడినదిగా  చూచుటకు కనుపింపని మధ్యభాగము(నారి - అల్లెత్రాడు, వై.వి.నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.)గల ధనుస్సుగ తలచు చున్నాను. దేవి కనులు మన్మథుని(రతీదేవి భర్తయైన మన్మథుడు)కుడిచేతియందలి ధనుస్సువలె ప్రకాశించు చున్న వనుట. – సౌందర్యలహరి

ఉభయము - 1.రెండవయములు గలది, 2.రెండు, వి.గుడిఉత్సవము నడుపు వంతు.

కోవెల - గుడి, వై.వి. కోకిలము.
గుడి -
1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.

కోకిలము - కోయిల.
పరితము -
కోయిల, సం.పరభృత్.
పరభృతము - కోయిల; పికము - కోయిల.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు. 

వనప్రియః పరభృతః కోకిలః పిక ఇత్యపి :
వనం ప్రియమస్య వనప్రియః - వనమే ప్రియముగాఁగలది.
పరైః కాకైః భృతః పరభృతః భృఞ్ భరణే. - పరుల(కాకుల) చేతఁ బెంచఁ బడునది.  
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః. కుక వృక అదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
అపికాయతీతి పికః కైగైశబ్దే. - చాటున నుండి కూయునది. అపిరంతర్ధౌ. ఈ నాలుగు 4 కోయిల పేర్లు.

చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గ ప్రవర్తినీ,
కోకిలా కులచక్రేశా పక్షతిః పఙ్క్తి పావనీ|

దేవాలయము - గుడి. ఇంటి కన్నా గుడి పదిలంట!
దేవళము -
దేవాలయము, గుడి, సం.దేవాలయః. 
ప్రాసాదము - 1.దేవాలయము, 2.రాజగృహము.
నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు.
మందిరము - 1.ఇల్లు, 2.పట్టణము, 3.దేవగృహము, 4.దేవపీఠము.
ఇలు - గృహము, రూ.ఇల్లు.  
గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - భార్య. 
నగరము - పట్టణము, రూ.నగరి.  
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమైన ప్రథాననగరము. 
పుటభేదనము - పట్టణము, రూ.పుటభేదము. 

ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో... దీపముంది.. అదియే దైవం...

గుడిసె - గుండ్రని చిన్న ఆకుటిల్లు, సం.కుటీరః.
ఆకుటిల్లు -
(ఆకు + ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.
పర్ణశాల - ఆకుటిల్లు.

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము -
గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు; తీఁగయిల్లు - పొదరిల్లు. కుడుంగము - పొదరిల్లు.

మంజులము - 1.పాచి, శైవలము, 2.పొదరిల్లు, విణ.ఒప్పిదమైనది.

పరాయణము - 1.ఆశ్రమము, 2.అత్యంతాసక్తి, విణ.అభీష్టమైనది.
ఆశ్రమము -
1.మునుల ఇల్లు, 2.ఆకుటిల్లు, 3.మఠము, 4.బ్రహ్మచర్యాది, 5.పాఠశాల.
ఆకుటిల్లు - (ఆకు+ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల; పర్ణశాల - ఆకుటిల్లు.
మఠము - సన్న్యాసులు మొ.వారుండు చోటు.
పాఠశాల - బడి; బడి - 1.పాఠశాలు, 2.క్రమము, అవ్య.వెంబడి.
బడితోఁటలు - (వ్యవ.) బడిపిల్లలకు ప్రకృతి జ్ఞానము గరపుటకు పాఠశాలల ఆవరణములలో పెంచు తోటలు (School gardens). 

ఆశ్రమములు - 1.బ్రహ్మచర్యము, 2.గార్హస్థ్యము, 3.వానప్రస్థము, 4.సన్న్యాసము.

ఆయతనము - 1.ఇల్లు, 2.ఆశ్రయము, 3.యజ్ఞశాల, 4.దేవాలయము, 5.బౌద్ధాలయము, 6.(భౌతి., రసా.) ఒక వస్తువు యొక్క ఘనపరిమాణము  (ద్రవముల విషయమై 'ఆయతనము' ఘనపరిమాణార్థమున ప్రయోగములో ఉన్నది.) ఒక వస్తువు ఆక్రమించు చోటు, ఒక ద్రవము ఆక్రమించు చోటు (Volume). 

కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు కలది.
కెంపు -
1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.

కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్|
విద్యారూపం విరూపాణాం క్షమారూప తపస్వి నామ్||
తా.
కోకిలకు(కోయిలేమో నల్లనిది)స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము(పాతివ్రత్యము - పతివ్రత యొక్క శీలము), కురూపునకు విద్యయే రూపము, యతులకు(కర్మంది - యతి) శాంతమే రూపము. - నీతిశాస్త్రము

మాసరమయ్యె నంత మధు మాసము పాంథ విలాసినీ జన
త్రాసము పుష్పబాణ నవరాజ్య విలాసము వల్లరే వధూ
హాసము మత్త కోకిల సమంచిత పంచమ నాదమం జిరు
వ్యాసము జీవలోక హృదయంగమ సౌఖ్య వికాసమెంతయున్. - పశుపతి నాగనాథ కవి(సంస్కృతకవి) క్ర్రి.శ. 1369

పరభృతము - కోయిల.
కాకపుష్ఠము -
కోయిల, వ్యు.కాకిచే పోషింపబడినది.
కాకము - కాకి, వాయసము. 
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకపిక న్యాయము - కోయిల కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము. 

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.
కలకంఠము -
1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు.మధురమైన కంఠము కలది.

ధ్వనౌ తు మధురాస్పుటే, కలో :
మధురే శ్రుతిసుఖే, అస్ఫుటే అవ్యక్తాక్షరే ధ్వనౌ కలః - సుఖమై వ్యక్తముగాని వర్ణములు గలిగిన ధ్వని కల మనంబడును.
కం సుఖం లాతీతికలః. లాదానే. - సుఖము నిచ్చునది.
కలో మదః తద్యోగాద్వాకలః. కల మదే. - కల మనఁగా మదము, అది గలిగినది. అవ్యక్తమధుర ధ్వని పేరు.

కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధురస్వరము.
కళ - 1. 8 సెకనుల(8 Seconds) కాలము, 2.చంద్రకళ, 3.ఒకపాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతానతము కాని పదము.
నెలపాలు - చంద్రకళ. చంద్రభాగ యందు దేవిస్థానం కళ|
నెలవీసము -
చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

కల2 - స్వప్నము.
స్వప్నము - 1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).

కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు. మధురమైన కంఠము కలది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని.
కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.      

నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవాః|
నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః||  

కలహంస - 1.కాదంబము, ధూమ్ర వర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.
కాదంబము - 1.మధురముగ కూయు హంస, ధూమ్రవర్ణము లైన ముక్కు, కాళ్ళు, ఱెక్కలుగల హంస, కలహంస, 2.బాణము.

బాణము - అమ్ము.
వణతీతి బాణః వణ క్వణ శబ్దే. - మ్రోయునది.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాతమ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.

కాదమ్బః కలహంస స్స్యాత్ :
కదంబస్య స్వసంఘస్య సహచారిత్వాత్ కాదంబః - కదంబమనఁగా తన సమూహము; ఆ సంఘముతోఁ గూడియుండునది.
కలో మధురాస్పుట ధ్వని, తద్వాన్ హంసః కలహంసః - అవ్యక్త మధురధ్వని గల హంస. ఈ రెండు 2 ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు గలిగిన హంస పేర్లు.

రాజహంస - 1.రాయంచ, 2.ఎఱ్ఱని ముక్కు కాళ్ళుగల హంస, 3.మధురముగ బలుకు హంస.

కాదంబరి - 1.కల్లు, 2.ఆడుకోయిల, 3.ఆడుగోరువంక, 4.బాణ విరచిన కాదంబరీ కావ్యము, 5.సరస్వతి.

గోమంతపర్వతే కదంబకోటరే జాతత్వాత్ కాదంబరీ, ఈ. సీ. - గోమంతపర్వతమందు కడపచెట్టుతొఱ్ఱలోఁ బుట్టినది.

కాదంబిని  - మేఘపంక్తి. ఆగడపలు - 1.మెట్లవలె ఏర్పడిన మబ్బు తునకల వరుసలు, 2.మేఘపంక్తి.  

సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి.

ధార్తరాష్ట్రము - 1.నల్లని ముక్కు కాళ్ళు గల హంస.

నిత్యానంద రసాలయం, సురముని స్వాంతాంబు జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ సేవితం కలుషహృత్సద్వా సనావిష్కృతం|
శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసా వతంస! స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి|| - 48 
తా.
ఓ మానస రాజహంసా! బ్రహ్మానంద జలాలకు స్థానమైనదీ, సుర మున్యాదుల మనస్సరోజాలకు నిలయమైనదీ, నిర్మలమైనదీ, సద్బ్రాహ్మణ సేవితమైనదీ, పాపాలను రూపు మాపేదీ, జన్మాంతర సుకృతాలను ప్రకాశింప జేసేదీ, సుస్థిరమైనదీ అయి(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.) భగద్ధ్యానమనే సరస్సునే ఆశ్రయంచుము. క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.)నీచులను ఆశ్రయించడ మన్న మురికి కాల్వలను ఆశ్రయించాలని ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? - శివానందలహరి

భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం - లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్|
చలచ్చంచలాచారుతాటంక కర్ణాం భజే శారదాంబా మజస్రం మదంబామ్. 

విద్వాంసుఁడు-చదువరి, విణ.ఎరుకగలవాడు.
వేత్తి సర్వం విద్వాన్, స. పు. - సర్వము నెఱింగినవాఁడు.

విపశ్చితుఁడు - విద్వాంసుడు.
విశేషేణ పశ్యన్ చేతతీతి విపశ్చిత్. త. పు. చిత్రీ సంజ్ఞానే. - విశేషముగాఁ జూచుచు నెఱుంగువాఁడు. 

కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
నెలవెలుగు -
వెన్నెల.
చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక
చెంద్రిక - చెందిరిక; చెందిరిక - 1.కమ్మపైదుద్దు, రూ.చంద్రిక.  

హరిచందనము - 1.చెందిరము, 2.వెన్నెల, 3.కల్పవృక్షము.
చెందిరము -
1.సింధూరము, 2.కుంకుమ, రూ.చెంద్రము, చందురము.
చెంద్రము - చెందిరము. 
గాంధారము - 1.(సంగీ.) ఒకవిధమగు స్వరము, 2.సింధూరము, 3.కాంధహార్ అను ఒకానొక దేశము.

చంద్రోదయము - 1.ఉల్లెడ, 2.చందురా, 3.చంద్ర్రుని పొడుగు.
ఉల్లడ -
మేలుకట్టు, చాందిని, రూ.ఉల్లెద, సం.ఉల్లాభః.
చాందిని - మేలుకట్టు.
(ౘ)చందువ - మేలుకట్టు, ఉల్లెడ, రూ.చందురా, సం.చంద్రోదయః.
(ౘ)చందుర - చంద్రకాంతము; చంద్రకాంతము - చలువరాయి.
(ౘ)చలువరాయి - చంద్రకాంతము.

(ౘ)చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడ కట్టిన చలువరాయి ఎలావచ్చెనో తెలుపగలవా.....

                                                             

భువి - 1.భూమి, 2.స్థానము.
స్థానము -
1.చోటు ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ. 
స్థలము - 1.మెట్టనేల 2.చోటు.
నెలకువ - స్థానము; నెలవు - నివాసము, విణ. 1.వాసస్థానము, 2. స్థానము, 3.పరిచయము.

చందమామ పులుఁగు - చకోరము.
చకోరము -
చకోరకము.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెల చూచి తృప్తి పొందునది.

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచి గుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁ జేరవే
చలువగలట్టివాడయినఁజందురు నెంతయుఁ గోరి, భాస్కరా.
తా.
చంద్రుని యందలి చల్లదనమునకు, (చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక)ఆ కిరణములను భక్షించుటకు ఎక్కువ ఆసక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే బుద్ధిమంతులు రాజు(నృపాలుఁడు - రాజు) మంచివాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను, సంతోషముతో నట్టిరాజునే కోరుదురు.

త్రిధాముఁడు - 1.అగ్ని, 2.విష్ణువు, 3.శివుడు, 4.యముడు.

భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాసం కరోతీతి భాస్కరః - కాంతిని కలుగజేయువాఁడు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతె కుటిలం ఊర్థ్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఇ-పు. అగ కుటిలాయాం గతౌ. - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది. 

అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః, ఊ-పు. అగ్నివలనఁ బుట్టినవాఁడు.

అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు. అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.     
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.

తిగంటి - శివుడు, వ్యు.మూడు కన్నులు కలవాడు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభధ్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.    

యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
యమనాత్ యమాః ప్రజాసంయమోద్యమాః మృత్యుప్రభృతయో (అ)స్యకింకరాః, యమ ఉపరమే, తేషు రాజత ఇతి యమరాట్,జ.వు. రాజృగీప్తౌ. - ఇతని కింకరులైన మృత్యువు మొదలైనవారు ప్రజల నియమించువారు గనుక యములనంబడుదురు, వారికి రాజు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).

అహస్కరుఁడు - సూర్యుడు.
అహః కరోతీత్యహస్కరః - అహస్సును జేయువాఁడు.

అహస్సు - అహము.
అహము - 1.దినము, రేయుంబవలు, 2.పగలు, రూ.అహస్సు, 3.గర్వము.
అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య, దేహత్మభ్రాంతి.

గర్వో(అ)భిమానో(అ)హంకారో -
గర్వయనేనేతి గర్వః ఖర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
ఆత్మానముత్కృష్టం మానయతీత్యభిమానః - మను అవబోధనే తన్ను ఉత్కృష్టునిఁగాఁ దలఁపించునది.
అహమితి బుద్ధిం కరోతీత్యహంకార. డుకృఞ్ కరణే. - నేను ఉత్కృష్టుఁడ నను బుద్ధినిఁ జేయునది. ఈ 3 అహంకారము పేర్లు.

హంకారము - 1.అహంకారము, 2.అభిమానము, సం.అహంకారః.

అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.ఆత్మాభిమానము (Egotism), 5.క్రోధము, (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది, రూ.అహకృతి, అహంక్రియ.

అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
అజ్ఞానము - తెలివిలేనితనము.
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము.
అవిద్య - 1.అజ్ఞానము, తత్త్వజ్ఞానములేమి, 2.మాయ.
విపరీతజ్ఞాన మవిద్యా, విదజ్ఞానే. - విపరీత జ్ఞానము అవిద్య.
అహమ్మతి - అజ్ఞానము.
అహమితిబుద్ధిరహం మతిః, సీ. - నే ననెడు స్వతంత్రబుద్ధి అహంమతి. ఈ 3 అజ్ఞానము పేర్లు.

అజ్ఞాతరాశి - (గణి.) సమీకరణముల లోని తెలియని రాశి (Unknown Quantity).
అజ్ఞేయవాదము - దేవుడున్నాదో లేడో తెలియ దనువాదము.

అక్షయము - 1.తరుగనిది, నాశముకానిది, 2.ఇల్లులేనిది, వి.పరమాత్మ.

3. తదియ - తృతీయ, పక్షమునందు  మూడవ తిథి. సం.తృతీయా.  
తృతీయ -
1.పక్షమునందు మూడవ దినము, తదియ.

తద్దె - తదియ, తద్దియ.
అట్లతద్దె ఉండ్రాళ్ళ తద్దె. తద్దికి అట్లు బలం అన్నారు.

తృతీయకము - (గృహ.) మూడవది, రూ.తృతీయము. తృతీయం శారదా దేవీ|
తృతీయము - తృతీయకము. 

తీ - సమాసమునందు తిగ శబ్దమునకు ఆదేశ రూపము, ఉదా.తీవంచ.
తీవంచ-నాలుగు,(తీ=తిగ=మూడు+వంచ=ఒకటి). 

ముగురు - (మూడు+గురు) మువ్వురు, రూ.ముగ్గురు, మువురు, మూగురు, మూవురు.
మూగురు - ముగ్గురు.

ప్రథానసంఖ్య - (గణి.) ఒకటి తప్ప మరి యేఇతరసంఖ్యచేతను తెగని సంఖ్య 3, 7, 11, 17, 19, వంటివి, ఒకటికాక ఈతర కారణాంకములు లేని సంఖ్య (Prime number).  

ముఖ్య సంఖ్యలు - (గణి.) ఎన్ని? అను ప్రశ్నకు సమాధానము నిచ్చు 1, 2, 3, 4 వంటి అంకెలు (Cardinal numbers) (చూ. క్రమిక = Ordinal) 

త్రింశత్తు - ముప్పది.
త్రింశము - ముప్పదవది.

త్రింశత్తు తాః కలాః,
త్రింశత్యాష్ఠాః కలేత్యుచ్యతే. 30 కాష్టలకాలము కల యనంబడును.
కాలం కలయతీతి కలా, కల సంఖ్యానే. - కాలమును లెక్కపెట్తునది. ఈ ఒకటి 30 కాష్టలు 1 కల. 

కాష్ఠ - 1.పదునెనిదిది రెపపాట్లు కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది.

అహస్సూతే సవ్యం - తవ నయన మర్కాత్మక తయా
త్రియామాం వామం తే - సృజతి రజనీ నాయక తయా, |
తృతీయా - తే దృష్టి ర్దరదళిత హేమామ్భుజ రుచిః
సమాధత్తే సంధ్యాం - దివసనిశయో రన్తర చరీమ్ || - 48శ్లో
తా.
ఓ భగవతీ ! నీ కుడికన్ను(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)సూర్యాత్మకమైన పగటిని సృజిస్తోంది, నీ దాకన్ను - ఎడమకన్ను చంద్రుడు అధిదేవతగాగల రాత్రి(రజని-రాత్రి)ని కలిగిస్తుంది. ఇంచుక వికసించిన సువర్ణకమలాన్ని(పుష్పించిన బంగారు పద్మపు కాంతి)పోలిన నీ మూడవ దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)దివారాత్రాల నడుమ కలిగే సంధ్యలను ఏర్పరుస్తోంది. (ఎఱసంౙ - 1.ప్రాతసంధ్య, 2.సాయంసంధ్య. రాత్రిం బగళ్ళకు మధ్యనున్న సాయం సమయమును చేయుచున్నది) - సౌందర్యలహరి 

దుష్ట విద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ,
శారదా శరసంధానా సర్వశస్త్ర స్వరూపిణీ. - 24శ్లో

కువలేశుఁడు - విష్ణుమూర్తి.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.

కువలయము - 1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కౌ భువి వలతే భ్రమతీతి కువలం, వ్ల సంచలనే. - భూమియందు చరించునది.

కువ - కువ్వ, కుప్ప.
కుప్ప - ధాన్యము మొ. ని రాశి.

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)

శుభాంగ శ్శాన్తిద స్స్రస్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||

కలువరాయుఁడు - చందమామ.
కువేలము - 1.కలువ, 2.పద్మము.
కలువ - ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.
ఉత్పలము - కలువ, నల్లకలువ.
కలువకంటి - కలువరేకుల వంటి కన్నులుగల స్త్రీ.

కల్హారము - మిక్కిలి పరిమళము గల కలువ.
కలువడము - (కలువ+వడము) ఉత్సవములలో కట్టెడు బంగారు కలువ పూదండ, స.కైరవ వటః.

విశాలా కల్యాణీ - స్పుటరుచి రయోధ్య కువలయైః
కృపాధారా (ఆ)ధారా - కిమపి మధురా భోగవతికా,
అవంతీ దృష్టిస్తే బహునగర విస్తారవిజయా
ధ్రువం తత్తమ్మామ - వ్యవహరణ
యోగ్యా విజయతే. - 49శ్లో
తా. ఓ సకలాధారా! మాతా! నీ దృష్టి విశాలమైనది, శుభము నిచ్చునది, స్పష్ట ప్రకాశముగలది, కలువలచే జయింపరానిది, దయ కాధారమైనది. భోగము కలది, రక్షించునది, పెక్కు నగరములను జయించునదియై ఆయా పేరులతో పిలుచుటకు దగినదై సర్వోత్కృష్టముగ నున్నది. అనగా విశాల, కల్యాణి, అయోధ్య, మధుర, భోగవతి, అవంతి, విజయ అను నగర నామములు దేవి దృష్టిచేతనే యేర్పడినవని భావము. – సౌందర్యలహరి

ననుచు భయమందనేల నేననుచు నీవె
నీతులను నేర్పి యభయప్రదాత వగుచు
వెన్నుతట్టుచు నుందువో విష్ణుమూర్తి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|

                                                       

చిత్రగుప్తుఁడు - 1.యముడు, 2.యముని యొద్ద లేఖఖుడు.
కంటిపాప -
చిత్రగుప్తుడు.
కంటిపాప - కంటి నల్లగ్రుడ్డులోని చుక్క, (ఈ ద్వారమునకే వెలుగు లోపలికి ప్రవేశించును) (Pupil).
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.

కాలద్వర కవాటబంధనము, దుష్కాల ప్రమాణ క్రియా
లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీక్రోగ జిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధి, మృత్యుముఖ దంష్ట్రా హర్యవజ్రంబు, ది
క్చేలాలంకృత! నీదు నామ మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!
తా||
ఈశ్వరా! పవిత్రమైన నీ నామము, యముని యింటి ద్వారములను మూసివేయును; జీవుల మరణకాలములను నిర్దేశించు చిత్రగుప్తుని నో రనెడి పుట్టలోని పాములకు గరుడుని వంటిదై అతని యాలోచనల నుపసంహరించును. మృత్యువు కోరలనెడి పర్వతములను గూడ ఛేదించును. (అనగా పుట్టిన తరువాత జనులకు చావురాదని కాదు. నీ నామస్మరణము చేయువారికి ఈ జన్మము తరువాత మరల పుట్టుట, చచ్చుట అనునవి ఉండవని యర్థము.) - ధూర్జటి


తారకము - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింప చేయునది.   
కనీనిక - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.చిటికెన వ్రేలు.
నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక. 
చిటికెన - 1.చిన్నవ్రేలు(చిటివ్రేలు - చిన్నవ్రేలు), 2.కనిష్ఠిక.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము. 

తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య, 3.వాలిభార్య.
తారాపతి -
చంద్రుడు Moon.

కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).

యముఁడు - 1.కాలుడు, 2.శని Saturn, వికృ.జముడు.

అత్యాస - మితిమీరిన ఆశ, పేరాస.
లాలూచి - 1.అత్యాశ, 2.నైచ్యము.

ఆతురే నియమో నాస్తి బాలేవృద్ధే తధైవచ |
సదాచార రతౌచైవ హ్యేషధర్మ స్సనాతనః||
తా.
అత్యాశ గలవానికి, బాల - పదునా రెండ్లకు లోబడిన పిల్ల  బాలునికి, వృద్ధునికి, సదాచార రతునికి వీరలకు వ్రతంబు పనిలేదు. - నీతిశాస్త్రము

మాయ - 1.అవిద్య, 2.ఇంద్ర జాలాదివిద్య, 2.ఒక పట్టణము, వి.(గృహ.) మావి, పిండపుసంచి (Placenta).
అవిద్య -
1.అజ్ఞానము, తత్త్వజ్ఞానము లేమి 2.మాయ. 
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.  

అథాజ్ఞాన మవిద్యాహంమతిః స్త్రియామ్ :
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము.
విపరీతజ్ఞాన మవిద్యా. విదజ్ఞానే - విపరీత జ్ఞానము అవిద్య. అహమితిబుద్ధిరహం మతిః. సీ. - నే ననేడు స్వతంత్రబుద్ధి అహంమతిః. ఈ మూడు అజ్ఞానము పేర్లు.

అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.

అవిద్య వల్ల బంధం, విద్య(చదువు, జ్ఞానం) వల్ల మోక్షం కలుగుతాయి. విధ్యాధిక్యతకడ వివేకం, అవివేకం గూడ నుండవచ్చును. భేధము లన్నిటినీ అధిగమించునదే విద్య.

'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనగా అవిద్యచే జరా మరణములను లేకుండ చేసికొని, విద్యచే అమృతస్థితిని (మోక్షమును) పొందునని శ్రుతి(వేదము) చెప్పినది.

విద్యావంతులైన ప్రజలను నడిపించడం తేలిక, తోలడం కష్టం; పరిపాలించడం తేలిక, అణగద్రొక్కడం అసాధ్యం. - లార్డ్ బ్రూగం 

ఇంద్రజాలము - 1.కనుకట్టు విద్య, 2.మాయ, 3.మోసగించుట.
కనుకట్తు - కనికట్టు, ఇంద్రజాలము.
కనికట్టు - కండ్ల కగపడకుండ జేయుగారడి, రూ.కనుకట్టు.
మాయము - మాయ, కనికట్టు, కనుకట్టు.
మాయకాఁడు - వంచకుడు, మాయావి.
వంచకుఁడు - మోసకాడు.
మాయావి - మాయదారి, మాయలు కలవాడు, రూ.మాయకుడు, మాయి.
మాడులాఁడు - మాయకాడు.
మాయలాఁడి - స్త్రీ టక్కులాడి.
టక్కులాడి - టక్కులు చేయునది (స్త్రీ).
తక్కులాడి - 1.టక్కులాడి, వన్నెలాడి, 2.మోసకత్తె.

కైలాట -1.మాయ, ఉదా.కల్లగాదిదికైలాట గాదు సుమ్మి, రూ.కైలాటకము.
కైలాటము -
1.మ్రొక్కు నతి, 2.మాయోపాయము, రూ.కయిలాటకము.  

నతి - మ్రొక్కు, వి. (గణి.) వాలుతనము (Slope, inclination).
మొక్కు - క్రి.నమస్కరించు, వి.ముడుపు, రూ.మ్రొక్కు.
ముడుపు - శుభకార్యాదుల ఆరంభమున ధనము ముడిచి మీదు కట్టిన మూట, ముల్లె.
మూట - ముడియ, ముల్లె.
మ్రొక్కుబడి - దేవతలకిచ్చెదనని మ్రొక్కు కొనిని కానుక.
ముల్లియ - మూట, ముడుపు, సం.మూలమ్.
ముల్లియవిప్పు - మూటల దొంగ.

గాయకము - 1.మర్మము, 2.మాయ, వంచన, విణ.1.వంచకము, 2.మిక్కిలి వెలగలది.
మర్మము - జీవస్థానము.
నెరకు - మర్మము, జీవస్థానము, రూ.నెరను.
నెళవు - 1.పరిచయము, 2.మర్మము, రూ.నెలవు.
పరిచయము - 1.ఎరుక, 2.స్నేహము.
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెళవరి - 1.పరిచయము కలవాడు, 2.మర్మమెరిగినవాడు, రూ.నెలవరి.
నెలవరి - 1.పరిచయము కలవాడు, 2.మర్మజ్ఞుడు.

మారాము - 1.మర్మము, 2.గారాబము, 3.పెంకిపట్టు. 

మతకము - కపటము, మాయ, సం.మంత్రకః.
మతకరి -
మాయావి (మతకము+అరి).
మాయావి - మాయదారి, మాయలు కలవాడు, రూ.మాయకుడు, మాయి.
మాయకాఁడు - వంచకుడు, మాయావి.
మాడులాఁడు - మాయకాడు.    

కపటము - కవుడు, వ్యాజము.
వ్యాజనము -
కపటము, నెపము.
నెపము - 1.వ్యాజము, కారణము, 2.తప్పు, రూ.నెపము, సం.నిభ, త. నిపమ్, క.నెవ, నెవను. నిభము - నెపము, విణ.సమానము.
తప్పు - 1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.

తప్పిదము - దోషము; దోసము - దోషము. 
దొషము -1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.) కొలతలలోని తప్పులు.

చిక్కు - క్రి.కృశించు, 2.తక్కు, 3.తగులు, 4.దొరకు, 5.మిగులు, 6.మెలి, 7.సంకటము.
తనకవి - 1.చిక్కు, 2.చిక్కుపెట్టువాడు.
దొరకు - 1.లభించు, 2.చిక్కు.
మెలి - మెలిక, చిక్కు, సం.మిళితమ్.
మిళితము - 1.మెలిక, 2.పేనబడినది, 3.కలిసినది.
క్షీణించు - క్రి.తరుగు, కృశించు.
క్షీణము - క్షయించినది, కృశించినది.
క్షీణించుట - (గృహ.) 1.శుషించుట, 2.బలహీనమగుట, 3.సన్నగిల్లుట.
కృశము - 1.బక్క, 2.సన్నము, 3.అల్పము.
కృశాంగి - స్త్రీ, విణ.బక్కపలుచని దేహము కలది.

క్షీణోపయుక్తి న్యాయము - న్యా. (అర్థ.) ఒకే వస్తువును అనుభోగించు నపుడు, రానురాను ఆవ్యక్తికిని దానికిని గల ఉపయుక్తి తరుగుచుండు నను న్యాయము.

మాయ గెల్చినవాఁడు నీమాయగాఁడు
మాయ గెల్వనివాఁడు నీమాయ గాఁడు
మాయ గెల్చియు గెల్వనిదే యదేమొ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

గారడము - 1.గరుడదేతాక మైన విషయంత్రము, 2.మాయ, సం.గారుడమ్.
గారడీవాడు - 1.ఇంద్రజాలికుడు, 2.పాములవాడు, గారుడమంత్రము తెలిసినవాడు. 

రతిపతి - మన్మథుడు.
రతేః పతిః రతిపతిః - రతీదేవికి భర్త, మన్మథుడు.

శాంభరి - 1.మాయ, 2.రతీదేవి.   

మాయాదేవ్యాస్సుతః మాయాదేవీసుత - మాయాదేవి కొడుకు, శాక్యముని.
సర్వార్థసిద్ధుఁడు - శాక్యబుద్ధుడు.

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ|
మహామాయా మహాసత్త్వా మహాశక్తి ర్మహారతిః||

రతి - 1.రతనాల తూనికయం దొక యెత్తు, 2.మణుగునం దిరువది యైదవ భాగము, సం.వి.1.సురతము, 2.మన్మధుని భార్య, 3.అనురాగము.

రతము - 1.సురతము, 2.సంయోగము.
సురతము - స్త్రీపురుషుల కలయిక, రతి.
పైసరము - రతి.
సంయోగము - కూడిక, సం.వి. (రసా.) 1.రెండు ద్రవ్యముల రాసాయనికముగ నుపయోగించుట (Combination), 2.కొన్ని మూలకముల రసాయన సమ్మేళనమువలన నేర్పడిన పదార్థము (Compound).
కూటము - 1.కూడిక(సంగము - కూడిక), 2.సురతము.
రంతు - రతి, క్రీడ, సం.రతిః.
రంతుకాఁడు - క్రీడాపరుడు. 

సంభోగము - 1.మంచిసుఖము, 2.సురతము.
సంభోగించు - 1.కలయు, 2.రమించు(రమించు - క్రీడించు).
సంగమించు - క్రి.కలియు.

సంగమము - కలయిక, సంయోగము, సం. (జం.) రెండు భాగములు, కలిసి యుండుట సామాన్యముగా రెండు ఎముకలు కలిసియుండుట, (Symphysis) సం.వి. (గణి.) ఒకే బిందువుతో రేఖలు కలిసికొనుట (Concurrence).

సంహతి - 1.సమూహము, 2.కలయిక, 3.సత్తువ.
సమ్మేళనము -
కలయిక, సమావేశము.
సమేలము - 1.సమ్మేళనము, 2.ఒద్దిక, చేరిక, సం.సమ్మేళనమ్.    

సయ్యొద్ద - చేరిక, స్నేహము, రూ.సయ్యోద్ధ.
చేరిక -
1.కూడిక, 2.సమీపము.
సమీపము - చేరువ; చేయలఁతి - సమీపము; సదేశము - సమీపము. 

కొక్కోక మెల్లఁ జదివిన
జక్కనివాడైన రాజచంద్రుండైనన్
మిక్కిలి రొక్కము లీయక
చిక్కుదురా వారకాంత సిద్ధము సుమతీ!

తా. రతి శాస్త్రమును చదివినవాడైనను, (ౘక్కనయ్య-1.సుందరమైనవాడు, 2.వి.మన్మథుడు.)అందగాడైనను, రాజయినను అధిక ధన మీయనిదే వేశ్య(వారకాంత - వేశ్య)పొందు పొందలడు.

సహస్ర రతి సౌందర్య శరీరాయై నమో నమః

రాగము - 1.అనురాగము, 2.రంగు, 3.మాత్సర్యము, 4.సంగీతమున నాట మొ|| రాగము.
అనురాగము -
అనురక్తి, ప్రేమ, కూర్మి.
అనురక్తి - అనురాగము, ప్రేమ.
రక్తి - అనురాగము; రక్తకుఁడు - అనురాగము గలవాఁడు.
అనురకము - 1.అనురాగము కలది, 2.ఎఱ్ఱనిది, 3.రంగుకలది.
అనురక్త - అనురాగముకలది.
అనురక్తిఁడు - అనురాగము కలవాడు. 

మమకారము - 1.ప్రేమ, 2.నాది యను అభిమానము.
పేరిమి -
1.ప్రేమ, 2.గౌరవము, 3.అతిశయము.
నెనరు - 1.కృతజ్ఞత, 2.ప్రేమము.
కృతజ్ఞుఁడు - చేసినమేలు తలచువాడు.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పదనము, 3.మన్నన.
అతిశయము - అధిక్యము; వలదు - అధిక్యము, అవ్య.వద్దు.

ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.  

లలి - 1.ప్రేమము, 2.ఒయారము, 3.క్రమము, 4.ఉత్సాహము.
లలితము - సౌకుమార్యముచే అంగ విన్యాసరూపమగు స్త్రీల శృంగారచేష్ట, విణ.మనోజ్ఞము, ఈప్పిదము.

సరాగము - ఒద్దిక, సం.విణ.రాగముతో గూడినది.
ఒద్దిక -
1.నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము, 2.అనుకూల్యము, పోలిక, 3.వినయము, 4.ప్రతిమానమైన పడి, వస్తువునకు సమానమైన తూకపురాయు.
అనుకూలము - 1.ఇష్టము, 2.సరిపడునది, 3.సహాయమైనది, (వ్యతి.ప్రతికూలము). 
అనుకూల్యము - ఒద్దిక, తగియుండుట, అనుకూలభావము.
అనుగుణ్యము - అనుగుణభావము, తగియుండుట, అనుకూల్యము.
అనురూప్యము - తగియుండుట, (భౌతి.) రెండింటి మధ్యగల అంగప్రత్యంగ సాదృశ్యము (Correspondence). 
పోలిక - సామ్యము. సామ్యము - సమత్వము, పోలిక. వినయము - 1.అడకువ, 2.గురుశిక్ష.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property). 

రాగరజ్జువు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

అనగ  ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వ.
తా||
తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగా నుండును, ప్రతిదినము తినుచుండిన వేప(వేము-వేపచెట్టు)వేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయుచుండిన పనులు నెరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు ఈ విధముగ నుండును.

గాయకము - 1.మర్మము, 2.మాయ, వంచన, విన.1.వంచకము, 2.మిక్కిలి వెలగలది.
మర్మము -
జీవస్థానము, ఆయుస్సు.
ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.
కొఱసంది - ఆయము, జీవస్థానము, మర్మము.
ఆయము1 - 1.జీవస్థానము, ఆయువు పట్టు, 2.మర్మము, సం.అయుః.
ఆయము2 - 1.రాక, 2.లాభము, 3.రాబడి(రాబడి - ఆదాయము), 4.పన్ను.   

ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది - సంవత్సరాది.

ఋతువృత్తి - సంవత్సరము.
సంవత్సరము -
ఏడు; ఏడు - ఆరునొకటి. వత్సరము - ఏడాది.
హాయనము - 1.సంవత్సరము, 2.కిరణము.
కిరణము - వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.

                                                              

నిర్వేదము - 1.దుఃఖము, 2.వైరాగ్యము.
నిర్విణ్ణుఁడు - నిర్వేదము నొందినవాడు.
  
విరక్తి - విరాగము, వైరాగ్యము.(Dispassion)
వైరాగ్యము - వేషయేచ్ఛా రహితత్వము, లౌకిక సుఖములం దిచ్ఛలేమి.
వీతరాగి - విరాగుడు, వైరాగ్యము గలవాడు.
వైరాగి - బైరాగి; బైరాగి - విరక్తుడైన తీర్థవాసి, సం.విరాగీ.

అరతి - 1.విరక్తుడు, 2.సంతోషము లేనివాడు, వి.1.విషయములందు ఇష్టము లేమి, 2.అనురక్తి(అను రక్తి - అనురాగము, ప్రేమ)లేమి , 3.సంతోషము లేమి, 4.బాధ, 4. అరుచిని కలిగించు పిత్తరోగము, 6.క్రోధము, 7.(అలం.) మన్మథావథలు పదింటిలో నారవది (దేని యందు ఇష్టము లేకుండుట).

అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సు లేనివాడు, 2.దుఃఖము నొందినవాడు, 3.ధ్యాన నిమగ్నుడు.   

అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు. 
అనిష్టము - 1.ఇష్టముకానిది, 2.యజింప బడనిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.

కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
కీడుపడు - క్రి.1.తక్కువగు, 2.దైన్యపడు, 3.చచ్చు, రూ.కీడ్పడు. 


దుఃఖము - 1.బాధ, 2.చింత.
అరుచి - 1.రోత(ఏవగింపు – రోత), 2.నోటికి రుచి కాకుండుట.

మాయువు - పైత్యరోగము. పైత్య వికారము పది విధములు.
పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.
పైత్యరసము - (జం.) కాలేయము నుండి ఊరురసము(Bile). (ఇది పిత్తాశయములో నిలువచేయబడును.)

పిత్తము - ఒక ధాతువు (వాత, పిత్త, శ్లేష్మము లనునవి త్రివిధ ధాతువులు.)
పిత్తకోశము - (గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువచేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కాలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువచేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).

క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము. క్రోధము శత్రువు వంటిది.

భగము - 1.ఆడుగురి, 2.సంపత్తి, 3.వైరాగ్యము, 4.తెలివి, 5.వీర్యము, 6.కీర్తి, 7.మహత్త్వము. మహాత్మ్యము - గొప్పతనము.

రాజా రాష్ట్ర కృతంపాపం - రాజపాపం పురోహితః|
భర్తాచ స్త్రీకృత పాపం - శిష్యపాపం గురుర్వ్రజేత్||

తా. తనదేశమునందలి ప్రజలు చేయు (పాపము - దుష్కృతము, కలుషము.)పాపమును రాజు పొందును. రాజు చేయు పాపమును పురోహితుడు పొందును, పెండ్లాము చేయు పాపమును మగడు పొందును, శిష్యుడు చేయు పాపమును గురువు(గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter)పొందును. - నీతిశాస్త్రము   

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్దనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||

కావ్యుఁడు - శుక్రుడు Venus.
కవే రపత్యం కావ్యః - కవి యను ఋషికొడుకు. కావ్యము - కవికృత గ్రంథము, కవికల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కావ్యగుణములు - (అలం.) శ్లేష్మము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

ఉశనుఁడు-  శుక్రుడు Venus, రూ.ఉశనసుడు.
వష్తి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః, స. పు. వరకాంతౌ. - అసురులశ్రేయస్సు నిచ్ఛయించువాఁడు. 

ఉశీరము - వట్టివేరు. 
ఉశయ ఇతి ఉశీరం, అ, ప్న వశ కాంతౌ. - కాంక్షింపఁబడునది.
నలదము - 1.వట్టివేరు, 2.పూదేన.
నలత్యర్ధ యతీతి నలం పిత్తాదికం, తద్ద్యతీతి నలదం, నల గంధనే, దో అవఖండనే. - పీడించునవి గనుక నల మనఁగా బిత్తాదులు, వానిని ఖండించునది.
లయము - 1.నాశము, 2.ఆలింగనము, 3.నీటి వట్టివేరు. 
జఠరాగ్నౌ లీయత ఇతి లౌఅం, లీఙ్ శ్లేష్నే. - జఠరాగ్నియందు నణఁగునది, లఘులయమని యేకపదముగాను జెప్పుదురు.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
నశ్యతే నాశః, ణశ అదర్శనే. - నశించుట నాశము.
నాశిల్లు - నశించు. 
అవదాహము - 1.వేడిమి, 2.కాల్చివేయుట, 3.వట్టివేరు. 
అవనశ్యతి దాహో నేనే త్యవదాహం - దీనిచేత దాహ మణుఁగును.
కాపథము-1.కుత్సితపు త్రోవ, 2.నీటివట్టి వేరు.
వాతవత్వేన గమన నొరోధ కత్వాదిష్తం కాపథమన్యేతి ఇప్లకాపథం - వాతకారియై గమనమును నిరోధించుటచేత నిష్టమైన కుత్సిత మార్గము గలది.   

ప్రచేతసుఁడు - వాల్మీకిముని తండ్రి, విణ.గొప్పమనస్సు గలవాడు.
ప్రకృష్టు చేతః యస్య సః ప్రచేతాః. స-పు. - మంచి మనస్సు గలవాఁడు.

ప్రకృష్టము - ప్రకర్షము గలది, శ్రేష్టమైనది.
ప్రకర్షము - 1.మేలు, అతిశయము.

కుశీలవుఁడు - 1.చారణుడు, 2.నానాదేశ  సంచారియైన నట్టువుడు, 3.వాల్మీకి, 4.బట్టువాడు.
చారణుఁడు - 1.నానాదేశ  సంచారకుడైనట్టి నటకుడు, 2.దేవతలలో చారణ తెగకు చెందినవాడు.

కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటి కాకి.   
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యముచేత వర్ణించువాఁడు.
కావ్యము - కవికృత గ్రంథము, కవి కల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).

కృతి - 1.ప్రబంధము, సప్తసంతానములలో ఒకటి, 2.చదువరి, విణ.నేర్పరి.
కృతం జ్ఞాన మనేన కృతీ. న. పు. జ్ఞానము వీనిచేతఁ జేయఁబడును.
ప్రబంధము - కావ్యము.
కృతికర్త - గ్రంథము రచించినవాడు, కవి. 
ౘదువరి - విద్వాంసుడు.

గ్రంథము - 1.కావ్యము, పుస్తకము, 2.ధనము, 3.ముప్పది రెండక్షరముల శ్లోకము.
పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
పుస్తకము - పొత్తము. 

సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి. 
ఐందవి - పల్కుజెలి, సరస్వతి.  
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ.

ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధిని ప్రీణనే. - సంతోష పెట్టునది. 'ధన ధాన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.

కృతిపతి - గ్రంథమును అంకిత మందినవాడు.  

మురారి-1.కృష్ణుడు, 2.ఒకానొక సంస్కృతకవి.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.

గ్రంథనము - 1.పుష్పములు మొ,వి. కూర్చుట, గ్రుచ్చుట, 2.రచన, రూ.గ్రథనము.
భూమిక - 1.మారువేషము, 2.రచన.

స్తబకము - పూగుత్తి.
స్తూయతే స్తబకః, స్టుఙ్ స్తుతౌ. - స్తోత్రముచేయ బడినది.

కవీనాం సందర్భ - స్తబక మకరందైకరసికం (భరితం)
కటాక్షవ్యాక్షేప - భ్రమరకలభౌ కర్ణయుగామ్,
అముంచంతౌ దృష్ట్యా - తవ నవరసాస్వాద తరళౌ
అసూయా సమసర్గా - దలిక నయనం కించిదరుణామ్| - 50శ్లో

తా. ఓ జననీ! కావ్యము లనెడి పూగుత్తుల యందలి మకరందము - పుష్పరసము, మరందము.) నానదించు నీ కర్ణద్వయమును నెడబాయక నవరసముల రుచి చూచుట యందాసక్తి గల క్రీగంటి చూపులనెడి తుమ్మెదలను జూచి యసూయ గలిగి నీ నొసటి(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)కన్ను కొంచె మెఱ్ఱబాఱినది. - సౌందర్యలహరి  

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని|
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః|| - 3   

త్రివేణి - గంగ, వ్యు.గంగ, యమున, సరస్వతి అను మూడు నదులు గలది.     
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.    

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. యమున యందు దేవీస్థానం మృగావతి|

8. త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది. త్రీణిస్రోతాంసి యస్యాస్సా త్రిస్రోతాః. స. సీ. - మూఁడు ప్రవాహములు గలది.

వెల్లివాక - గంగ.
వెల్లి - ప్రవాహము, పరంపర, తెలుపు, సం.వేల్ల్.

గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వ జనేశశివ|  

స్రోతస్విని - నది, వ్యు.ప్రవాహము కలది.
స్రోతః అస్యా అస్తీతి స్రోతస్వినీ - తనంతటఁ బ్రవహించునది.

స్రోతస్సు - 1.ప్రవాహము, 2.ఏరు, 2.నీరువచ్చు తూము. 

స్రోత ఇన్ద్రియ నిమ్నగారయే,
స్రోతశ్శబ్దము చెవులు మొదలయిన ఇంద్రియ ద్వారములకును, నదీ వేగమునకును పేరు. స్రువతీతి స్రోతః, స్రు ప్రస్రవణే. స్రవించునది గనుక స్రోతస్సు, టీ. స. - ఇంద్రియ మింద్రియ స్థానగతం ద్వారం. 'స్త్రోతోభిస్త్రిదశజా మదం క్షరంత ' ఇతి భారవిః, రయశబ్దేనాత్ర ప్రవాహః, యథా - తీవ్రస్రోతాః.

నిమ్నగ - ఏరు, వ్యు.పల్లమునకు పారునది.
నిమ్నం గచ్ఛతీతి నిమ్నగా, గమ్ గతౌ. - పల్లమునకు గూర్చి పోవునది. 

ౙాలు - ఏరు, చిన ప్రవాహము నీరు, రూ.జోలువు (జామునకు బహు.)
ౙాలువారు - క్రి.ప్రవహించు.
ౙాలువు - జాలు, సం.ఝరా. 

శృంగవక్రసరస్సు - (భూగో.) నదీ ప్రవాహములో వంకరలు తిరుగుచు శృంగ వక్రమువలె పాఱు నదీ సమీప తీరము. నది 'U' వలె ప్రవహించి మధ్యప్రాంతమును సారవంతముగ తయారుచేయును.

సరణి - 1.త్రోవ, 2.వరుస, 3.విధము.
సరంత్యనేనసృతి, ఈ-సీ. సరణిశ్చ, ఈ. సీ. సృగతౌ. - దీనిచేత సంచరింతురు.

స్రోతో (అ)మ్బుసరణం స్వతః,
స్వతః అంబుసరణం స్రోత ఇత్యుచ్యతే - తనంతట పాఱుచున్న ప్రవాహము ప్రోతస్సనంబడును.
స్వతః సరతీతి స్రోతః, స. న. సృగతౌ - తనంతటఁ బోవునది. ఈ ఒకటి తనంతట పాఱునదాని పేరు.  
 
సరడు - 1.సరండము, స్త్రీల మెడకు ధరించు బంగారు అల్లిక తీగ, 2.నూలు దారము, సం.సరండః.
సరణశ్రేణి - (గణి.) ఒకదానిపైన ఒకటి జారుటకు వీలుగా నమర్చిన రెండు లఘుఘటక చిహ్నిత మాపక శ్రేణులుగల కొలుచుయాంత్రిక పరికరము,(Sliderule).

శివే శృంగారార్ద్రా - తదితరజనే కుత్సనపరా
సరోషా గంగాయాం - గిరిశచరితే (నయనే) విస్మయవతీ,
హరాహిభ్యో భీతా - సరసిరుహ సౌభాగ్య జననీ(జయినీ)
సఖీషు స్మేరా తే - మయి జనని దృష్టి స్సకరుణా. - 51శ్లో

తా. ఓ జననీ! నీ దృష్టి శివునియందు శృంగారము గను, ఇతరుల యందు ద్వేషించు నదిగని, గంగ యందు కోపము(స రోషము -1.కినుక, రోసము.)గలదిగను, శివుని(గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.)కంటి విషయమై(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)ఆశ్చర్యము గలది గను, హరుఁడు - శివుడు సర్పముల(అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.)విషయమై భయమును గొల్పునదిగను, (సరసిరుహము - తామర)పద్మముల సౌభాగ్యమును జయించు నదిగను, సఖుల విషయమున చిరునగవు గలది గను, నా యందు(మయి - 1.దేహము, 2.విధము, 3.పార్శము, 4.తడవ, రూ.మై.)కరుణ గలదిగను నగుచున్నది. దేవి దృష్టి(దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)నవరస భరితమయినదని భావము. – సౌందర్యలహరి

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షమ్
ఆనందహేతు రధికం మురవిద్విషో(అ)పి|
ఈషాన్నిషీదతు మయు క్షణమీక్షణార్థమ్
ఇందీవరోదరసహోదరమిందిరాయాః || - 4  

ప్రవహించే నీరు కొన్నిచోట్లు సుడులు తిరిగినా, వెంటనే వాటిని అధిగమించి ముందుకు సాగిపోతుంది. అలాగే తన హృదయం తరచుగా నిరాశ, దుఃఖం, అవిశ్వాసం వంటి సుడులలో చిక్కుకొన్నప్పటికీ, అవి తాత్కాలిక మేనని గ్రహించి భక్తుడు ముందుకు సాగాలి. - శ్రీరామ కృష్ణ పరమహంస

భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ.పూజ్యస్త్రీ.
సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ బ్రవహించునది.
సరాంసి అస్యాం సన్తీతి సరస్వతీ. ఈ. సీ.- సరస్సులు దీనియందుఁ గలవు.

భారతి - 1.సరస్వతి, 2.వాక్కు.
బిభర్తీతి భారతీ. ఈ. సీ. భృఞ్ భరణే - భరించునది.
భరతేన మునినా అవతారితత్వాద్వా భారతీ - ఈ లోకమునకు భరతుఁడను ముని చేత తేఁబడినది.

ఇడ - 1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.  

దేవి సురేశ్వరి భగవతి గఙ్గే త్రిభువనతారిణి తరళతరఙ్గే |
శఙ్కర మౌళివిహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పదకమలే ||

భా|| ఓ దేవీ గంగా! నీవు దేవగణానికి ఈశ్వరివి. ఓ భగవతీ! నీ తరళ తరంగాలతో ముల్లోకాలను తరింపజేయు దానవు. విమల జలంతో శంకర శిరస్సున విహరించే నీ చరణకమలములపై నా మనస్సు(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)సతతమూ నిలిచి ఉండుగాక! - 1     

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా|
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుప్లపవా.

శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.
శం సుఖం కరోతీతి శంకరః - సుఖమును గలుగఁ జేయువాఁడు, డు కృఙ్ కరణే.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.

విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.

సుగతే చ వినాయకః
వినాయకశబ్దము బుద్ధదేవునియందును, చకారము వలన గణాధిపతి యందును, గర్త్మంతుని యందును, గురువునందును వర్తించును.
వినయతి శిక్షయతీతి వినాయకః, ణీఞ్ ప్రాపణే. - శిక్షించువాఁడు. "వినాయకస్తు హేరంబే గరుత్మతి గురావ" పీతి శేషః.

గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).  

కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ. కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.
కొమరుసామి - స్కందుడు.
స్కందయతి శత్రూన్ శోషయతీతి స్కందః - శత్రువుల శోషింపజేయువాఁడు.
దేవస్త్రీదర్శదీశ్వర రేతసః స్కందతీతి ద్కందః - దేవస్త్రీ దర్శనమువలనఁ వదలిన యీశ్వర రేతస్సువలనఁ బుట్టినవాఁడు, స్కదిర్ గతి శోషణయోః.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
దేవసేనాం నయతి ప్రాపయతి సేనానీః, ఈ-పు. - దేవసేనను నడిపించువాఁడు.

కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
సదా బాలత్వాత్ కుమరః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాఁడు.
కుత్సితాన్ మారయతీతి వా - కుత్సితుల సంహరించువాఁడు.
మృఙ్ప్రాణత్యాగే, కౌ పృథివ్యాం మార్యతి మన్మథవ దాచరతీతి వా - భూమియందు మన్మథునివలె సుందరుఁడైనవాఁడు.
కౌ పృథివ్యాం మాం లక్ష్మీం రాతి దదాతీతి వా - భూమి యందు సంపద నిచ్చువాఁడు.
రాదానే, సదా బ్రహ్మచారిత్వా ధ్వా - ఎల్లప్పుడు బ్రహ్మచారి గనుక కుమారుఁడు.

పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
పోఱఁడు -
బాలుడు; చిన్నవాడు - బాలుడు.

కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొమరుదనము, కొమరు ప్రాయము = యౌవనము).
కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.

ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు. కొడుకు - కుమారుడు, సం.కుణకః. ద్వితీయః స్కంద ఏవ చ|

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం|

పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.  
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.

శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమోనమః|

సరస్వత్యా స్సూక్తీ - రమృతలహరీ కౌశలహరీః
పిబన్త్యా శ్శర్వాణి - శ్రవణచుళుకాభ్యా మవిరళమ్,
చమత్కారా శ్లాఘా - చలిత శిరసః కుండలగణో
ఝుణత్కారై స్తారైః - ప్రతివచన మాచష్ట ఇవ తే| - 60శ్లో

తా. తల్లీ! శర్వాణి! అమృతలహరీ వంటి కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.)మాధుర్య మార్దవములను హరించు పలుకులతో సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒకనది.)చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ళచేత చక్కగా పుచ్చుకొనుచున్న దానవు (వినుచున్నదానవు); నీవు ఆ స్తోత్రగానములోని చమత్కారమును(శ్లాఘ - 1.ప్రశంస, 2.పరిచర్య, 3.ఇచ్ఛ.) శ్లాఝించుటకు గాను కదల్పబడిన శిరస్సు కల దానవగుచుండగా నీయొక్క కర్ణ భూషణముల సముదాయము - అతి బహుళము లైన ఝణత్కారము చేయుచు అనుమోదించు మాటలను చెప్పుచున్నదో యన్నటుల నుండెను. - సౌందర్యలహరి

జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూషిత భూషిత వాసిత వాద్యనుతే !
కనకధరాస్తుతి వైభవ వంధిత శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం| – 6
  

చంద్రశేఖరుఁడు - 1.శివుడు, 2.నెలతాలుపు.
చంద్రశేఖరః, ఛంద్ర శేఖరఃశిరోభూషణం యస్య - చంద్రుడు శిరోభూషణముగాఁ గలవాడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.

చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా. 

నెలచూలి - బుధుడు Mercury, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.

నెలమేపరి - రాహువు Rahu.
రహతి భుక్త్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః. ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు.
రాహువు - ఒక చాయాగ్రహము, దలగాము.(Shadowy Planet)

భూతేశుఁడు - శివుడు.
భూతేశః భూతానాం ప్రమథనా మిశః - ప్రమథగణములకు నీశ్వరుడు.
భూతము - 1.పృధివ్యాధి భూతములు (ఇవి:- పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.)2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.

బూ(ౘ)చులఱేఁడు - శివుడు. 
బూచి - భూతము, సం.భూతః.
బూతము - భూతము, పిశాచము, సం.భూతః.
బూదె - చతుర్దశి తిథి, సం.భూతః. శివతేజ శ్చతుర్దశః|

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.

గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.

గ్రహము - 1.రాహుగ్రహము, 2.అనుగ్రహము, 3.చెర, 4.యుద్ధయత్నము, 5.పిశాచము, 6.సూర్యాది నవగ్రహములు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు), (భౌతి.) ఆకాశములో సూర్యునిచుట్టు తిరుగుచు స్థిరముగా కాంతిని వెదచల్లెడు ఖగోళరాశి (Planet). 

ఖండ పరశువు - 1.శివుడు, 2.పరశురాముడు.
ఖండపరశుః ఉ-పు. ఖణ్డయతీతి ఖణ్డః ఖణ్డః పరశుర్యస్య సః ఖణ్డపరశుః - ఖండించెడు గండ్రగొడ్డలి గలవాఁడు. ఖండపర్శుః అని రూపాంతరము.
ఖండ భేదనే. ఖండః ఖండితః పరశురిత్యసురో నేనేతివా - పరశు వనెడు రాక్షసుఁడు ఇతనిచే ఖండింపఁబడెను. 
కదాచిత్ఖండితో స్య పరశురితి వా - ఒకానొకప్పుడు ఈయన పరశువు(గండ్ర గొడ్డలి) ఖండిత మాయెను.

సుధన్యా ఖణ్ణ పరుశుః దారుణో ద్రవిణః ప్రదః,     
దివిద్పృక్ సర్వ దృగ్వ్యసో వాచస్పతి రయోనిజః|
- 61స్తో

కుఠారము - గొడ్డలి.
గొడ్దలి - చెట్లునరకు సాధనము, కుఠారము (వ్యవ.) పెద్దచెట్లను వానిశాఖలను నరకుట కుపయోగించు ఇనుప పనిముట్టు, సం.కుఠారః.
పరశువు - గండ్ర గొడ్దలి.
పరశ్వధము - గండ్రగొడ్దలి, రూ.పరస్వధము.

ద్వయోః కుఠార స్స్వధితిః పరశుశ్చ పరశ్వథః,
కుఠాన్ వృక్షాన్ ఇయర్తీతి కుఠార ప్స. ఋ గతౌ. - వృక్షములఁ బొందునది.
స్వం స్వకీయం ధియతి బిభర్తీతి స్వధితిః. ఈ. పు. దిధరణే. - స్వకీయమైనవారిని బోషించునది
స్వము - 1.ధనము, 2.తాను, తనది.
స్వకీయము - తనది, రూ.స్వకము. (వ్యతి.పరకీయము).  తన - ఆత్మార్థకము. 
పరాన్ శృణాతీతి పరశుః. ఉ. పు. శౄ హింసాయాం. - శత్రువులను హింసించునది. 
పరాన్ శ్యతీతి పరశ్వథః శో తనూకరణే. - పరులను క్షయింపఁజేయునది. ఈ 4 గండ్రగొడ్డలి పేర్లు.

కలిలము - 1.చొరరానిది, 2.ఎరుగరానిది, వి.గండ్రగొడ్డలి, రూ.కలలము.

ద్రూఘణము - 1.గండ్రగొడ్దలి, 2.ఇనుపగుదియ, రూ.ద్రుఘణము.

చిప్పగొడ్డలి - చెట్లునరకు గొడ్డలి. 

గంధర్వో హ్యదితి స్తార్ క్ష్య స్సువిజ్ఞేయ స్సుశారదః,
పరశ్వథాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః|

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్
క్ష్వేనీలగళం పరశ్వథధారణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| - 4

పదునాఱవదియైన(16వ) భార్గవ రామాకృతి నిఁ గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులయిన రాజుల నిరువది యొక్కమాఱు వధియించి భూమి నిఃక్షత్రంబుఁ గావించె; పదహారోమారు పరశురాముని రూపమును ధరించినవాడై రౌద్రకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి భూమిని క్షత్రియశూన్యం కావించాడు.   

ఇరువదియొక్కమాఱు ధరణీశులనెల్ల వధించి తత్క ళే
బర రుధిర ప్రవాహమున భైఁ తృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామ మూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.

తా. రామా! రాజులనందఱిని ఇరువదియొక్క పర్యాయములు చంపి, వారి దేహముల నెత్తుటి వెల్లువలచేత పితరులకు జలతర్పణమిచ్చి వారి యొద్దనుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహమునకు సంతోషము(ముదము - సంతోషము) కలుగునట్లు దానము చేసిన పరశురాముఁడవు నీవేయగుదువు. 

క్షత్రియరుధిరమయే జగదపగతపాపమ్,
స్నపయసి పయసి శమితభవతాపమ్|
కేశవ! ధృత భృగుపతిరూప! జయ జగధీశ! హరే!| – 6

పరశురాముడు - జమదగ్ని మహర్షికిని రేణుకకును పుట్టినవాడు.
రేణుక - 1.గంధ ద్రవ్యము, 2.జమదగ్ని భార్య.

అథ ద్విజా,
హరేణూ రేణుకా కౌన్తీ కపిలా భస్మగన్ధినీ,

ద్విర్ణాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.
హరతి రోగాన్ హరేనూ, సీ. హృఞ్ హరణే. - రోగములు హరించునది.
రేణు యోగాద్రేణుకా - ధూళి(ధూళి - దుమ్ము)గలది.
కుంత్యై దుర్వాసనా దత్తా కౌంతీ, సీ. - కుంతికొఱకు దుర్వాసునిచే నియ్యబడినది.
కపిలవర్ణత్వాత్కపిలా - కపిలవర్ణము గలది.
భస్మ గంధయతి భస్మగంధినీ. సీ. గంధ అర్దనే. - ధూళిచేఁ బీడించునది. ఈ 5 రేణుక యనుగంధద్రవ్యము పేళ్ళు. తక్కోలము.

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
బ్రహ్మ -
నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ప్రపాతస్తు తటో భృగుః,
ప్రవతంత్యస్మాదితి ప్రాపాతః, పత్ ఌ గతౌ. - దీనినుండి పడుదురు.
తటతీతి తటః, తట ఉచ్ఛ్రాయే. - ఉన్నతమైనది.
భ్రజ్యతే తవ్యతే సూర్యాగ్ని తేజసా భృగుః, ఉ పు. భ్రస్ట పాకే. - సూర్యాగ్ని తేజస్సులచేతఁ దపింపఁ జేయఁబడునది. ఈ 3 కొండచఱియ పేర్లు.   

భృగు ర్భోగకరో భూమీసురపాలనతత్పరః,
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః| - 6

కొండౘఱియ - కొండపార్శ్వభాగము.
తటము - 1.ఏటియొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము. 
తటి - 1.ఏటియొడ్డు, 2.ప్రదేశము.

ౘఱి - సంచరింప నశక్యమగు పర్వత శిఖరము క్రిందిచోటు, రూ.చఱియ.
జాఱువు - 1.కొండచఱి, 2.జారుట.  
(ౙ)జాఱుఁడు - జారుట.
(ౙ)జాఱు - క్రి.1.జరుగు, 2.ఉరుకు, 3.వదలు, 4.స్రవించు, వి.1.స్ఖలనము, 2.జారుట.

ౙరుగు - క్రి.1.రొమ్ముతో ప్రాకు, జారు, 2.జీవనము నడుచు, 3.కడచు, 4.పోవు, రూ.జరుగు.

ఉఱుకు - క్రి.1.దుముకు, పరుగెత్తు, 2.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప. 

వదలు - క్రి.శిథిలమగు, పట్టువీడు.
శ్లథము - శిథిలమైనది, వదులైనది.
శిథిలము - సంధులు వదిలినది, శ్లథము.

జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము. 

నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
క్షితిపతివంశ క్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూ ర్తే
భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మామ్| - 6
 

భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు. భార్గవదర్ప వినాశక రామ్|
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి(Venus).
శుక్రవారము - భృ గు వా ర ము, వారములలో నొక దినము Friday.
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి. 
భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.

భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదా స్థితా,
వ్యోమకేశాఖిల ప్రాణా పంచకోశవిలక్షణా|

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || – 6

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోద్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటి కాకి.   
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యముచేత వర్ణించువాఁడు.

భద్రమూర్తి ర్భద్రగుణో భార్గవో భక్తపాలనః,
భగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః|

కాశ్యపి - భూమి, వ్యు.పరశురాముచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయబడినది.
కాశ్యపస్యేయం కాశ్యపీ, ఈ.సీ. - పరశురాముచేత కశ్యపునికొఱకు యజ్ఞ దక్షిణగా నియ్యబడినది.
తథాచోక్తం._ 'శ్లో. త్రిసప్తకృత్య్వః పృధివీం కృత్వానిః క్షత్రియాం తతః, దక్షిణా మశ్వమేధాంతే కశ్యపాయాదదాత్ప్రభు' రితి.

కశ్యపస్య అపత్యం కాశ్యపిః. ఈ. పు. - కశ్యప ప్రజాపతి కొడుకు. 

న కశ్చిన్నాపనయతే పుమానవ్యత్ర భార్గవాత్|
శేషసంప్రతిపత్తిస్తు బుద్ధిమత్స్వేవ తిష్ఠతి ||

భా|| శుక్రాచార్యుడు తప్ప ఇంకెవరూ తప్పు చేయరని ఎక్కడా లేదు. అందరూ ఎపుడో ఒకప్పుడు తప్పు చేస్తాం. కాని మిగిలిన పనిని గురించి మంచి చెడు విచారణ మాత్రం తెలివైన వారే చేస్తారు. (పొరబాటు పడినతరువాత సరిదిద్దుకుంటారు).

ప్రణుతి సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషన శాంతి సమాకృత హాస్యముఖే|
నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయమాం||

కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.
కృష్ణః సర్వంకరోతీతి కృష్ణః - అన్నిటిని జేయువాడు.    
డుకృఙ్ కరణే, దైత్యాన్ కర్ష్తీతి వా - దైత్యులను నలిపివేయువాడు.
కృష్ణ విలేఖనే-కృష్ణవర్ణ త్వాద్వా - కృష్ణవర్ణుడు గనుక కృష్ణుడు.

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్ఠి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు. విష్ణు వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).     

కృష్ణజన్మస్థానము - బంధనాలయము, చెరసాల, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన స్థలము.

కృష్ణద్వైపాయణుఁడు - వ్యాసుడు.
వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
బాదరాయణుఁడు - వ్యాసుడు.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.  

బదునేడవ(17వ)దియైన వ్యాసగాత్రంబున నల్పమతులయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; పదిహేడోసారి వేదవ్యాసుని రూపంలో అల్పప్రజ్ఞు లైన వారికోసం వేదము అనే వృక్షానికి శాఖలను విస్తరింపజేసాడు. 

నల్లని ద్వీపమునందు జన్మించి నందు వల్ల, కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడయినాడు. ద్వైపాయనుడైన వ్యాసమహర్షి అజ్ఞానం నుంచి రక్షించును.

గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.

వ్యాసుడు వశిష్టుని మునిమనుమడు. శక్తికి పుత్రుడు-నిష్కల్మషుడు-పరాశరుని పుత్రుడు. శ్రీశుకుని తండ్రి, తపోధనుడు వ్యాస మహర్షి. కాలాంతరమున ఏకరాశిగా నున్న వేదాలను విడివిడిగా (నాలుగు వేదాలుగా విభజించుట) ఏర్పరచడం మూలాన వ్యాసుడు (వేదాల చిక్కు విడగొట్టేవాడు) లేక వేదవ్యాసుడు అనే పేరు పొందినాడు.

ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించి నట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.

భా|| ప్రతియుగంలో కాలం యొక్క ప్రభావంచేత అల్పబుద్ధులు, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారూ అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. వారు అపారమైన వేదరాశిని అధిగమించలేరు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి యుగధర్మానికి తగిన విధంగా ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.

కృష్ణమూర్తి - కృష్ణావతారము.
యాశోదేయుఁడు - యశోద కొడుకు, శ్రీకృష్ణుడు.

కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
కన్న - ప్రత్య. 'కంటె' అను అర్థమున వచ్చు ప్రత్యయము.
కంటియ - మెడనగ, రూ.కంటె, విణ.కంఠికా. 

నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు. 
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.

ఒక్కప్రక్కను దుఃఖ మింకొక్కప్రక్క
సుఖము గూచుచు నుండుట చోద్యమేమొ
నన్ను ముందైనఁ బ్రోవుము కన్నతండ్రి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|   

గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
గిరేః కైలాసస్యేసః గిరీశః - కైలాసమున కీశ్వరుడు.
గిరౌ శేతే గిరిశః - కైలాస మందు శయనించువాఁడు, శీఙ్ స్వప్నే.

ఓం గిరీశ బద్ధ మాంగల్య మంగళాయై నమో నమః|

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం|

భవ్యము - 1.శుభమైనది, 2.యోగ్యమైనది, వి.ఎముక.

తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.
తుహినము - మంచు.
తోహతి అర్దయతి పద్మమితి తుహినం, తుహిర్ అర్దనే - పద్మమును బీడించునది.

పట్టి - పంచమీ విభ క్తి ప్రత్యయము, వి.బిడ్డ.

అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి!
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, |
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తా మణిధరః || - 61శ్లో
  
తా. హిమవంశమునకు పతాకవంటి(జండాయైన) ఓ తల్లీ! నీ ముక్కు అనెడి వెదురు మాకు చేరిక యైన తగిన ఫలము నొసగు గాక, ఏ నాసిక లోపల చంద్రనాడి యనెడి నిటూర్పు నుండి(శ్వాస వదలేటప్పుడు) జారిన ముత్తెములను ధరించు చున్నదో ఆ నాసిక వెలుపలను గూడ ముత్తెము మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు. లను ధరించుచున్నది - సౌందర్యలహరి

మృడుఁడు - శివుడు, వ్యు.భక్తులను సంతోషపెట్టువాడు.
మృడతి సుఖయతి భక్తా నితి మృడః - భక్తుల సుఖింపఁ జేయువాఁడు.  
స్వయం సుఖీ వా - తాను సుఖము గలవాఁడు.
మృడాని - పార్వతి.
మృడస్య పత్నీ మృడానీ. ఈ. సీ. - మృడుని భార్య.

భక్తుఁడు - భక్తి కలవాడు.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.

బత్తుఁడు - కంసాలివారి పట్టపు పేరు, వై.వి. భక్తుడు, సం.భక్తః.

పూర్వోత్తరే పారలికాభిధానే - సదాశివం తం గిరిజాసమేతమ్|
సురా(అ)సురా (ఆ)రాధితపాదపద్మం - శ్రీవైద్యానాథం సతతం స్మరామి.
  

    dhanvantari2