Monday, November 14, 2011

పవిత్ర నదులు

చంద్రవశా తామ్రపర్ణీ అవటోదా కృతమాలా వైహాయసీ కావేరీ వేణీ పయస్వినీ శర్కరావర్తా తుంగభద్రా కృష్ణా వేణ్యా భీమరథీ గోదావరీ నిర్వింధ్యా పయోష్ణీ తాపీ రేవా సురసా నర్మదా చర్మణ్వాతీ సింధురంధః శోణశ్చ నదౌ మహానదీ వేదస్మృతిరృషికుల్యా త్రిసామా కౌశికీ మందాకినీ యమునా సరస్వతీ దృషద్వతీ గోమతీ సరయూరోధస్వతీ సప్తవతీ సుషోమా శతద్రూశ్చంద్రభాగా మరుద్వృధా వితస్తా అసిక్నీ విశ్వేతి మహానద్యః.

అథ నదీ సరిత్,
తరఙ్గిణీ శైవలినీ హ్రాదినీ ధునీ,
స్రోతస్వినీ ద్వీపవతీ స్రవన్తీ నిమ్నగాపగా -
(కూలంకకషా నిర్ఝరిణీ రోధోవక్రా సరస్వతీ)  

నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
సరిత్తు -
నది.
సరిస్పతి - సముద్రుడు.
ఏటిఱేఁడు - (ఏరు + ఱేఁడు) సముద్రుడు, సరిస్పతి.

ౙక్కర - నది.
ౙక్కరరాయఁడు - సముద్రుడు, సరిత్పతి.

సరితో న్యాశ్చ -
అన్యాశ్చ - ఇతరములైన కృష్ణ, వేణి, గోదావరి, సరయువు మొదలైన వియు సరిత్తు లనంబడును.   

తరంగిణి - నది, ప్రవాహము.
ప్రవాహము -
1.వెల్లువ, 2.పరంపర, వి.(భౌతి.) ప్రవహించునది (Current).
పరంపర - 1.వరుస, 2.విడువక సాగునది, సం.వి.(గణి.) ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల గుంపు (Series). ఉదా.1,3,5,7,9.....
వరుస - 1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
శ్రేణి - వరుస, (గణి.) ఒక దత్త న్యాయము ప్రకారము వ్రాయబడిన పదముల సముదాయము దత్తన్యాయము ననుసరించి వ్రాయబడిన రాసుల సముదాయము. (Progression)

పద్ధతి - 1.మార్గము(త్రోవ - మార్గము), 2.వరుస, సం.వి. (గణి. భౌతి. రసా.) సమకూర్చబడిన అవయములు (భాగములు) కలిగి క్రమసహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడినది (System) లేదా ఒక పూర్ణము గా పరిగణింప బడు వస్తువుల సమూహము.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
పదవి - మార్గము, వై. వి. ఉన్నతస్థితి, సం.పదమ్.
ఏకపది - 1.మార్గము, 2.ఒకడే నడువదగ్గ మార్గము.    

వెల్లి - ప్రవాహము, పరంపర, తెలుపు, సం.వేల్ల్. 
వెల్లివాక -
గంగ.

గంగ పారు నెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్న తనము పేర్మి యీలాగురా, విశ్వ.
తా.
ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగ పారుచుండును. మురికినీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. మంచి చెడ్డ వారితేడా ఆ విధముగనే ఉండును.

ఇఱ్ఱిగేషన్ ప్రోజెక్ట్ - (Irrigation project) నీటి పారుదల యోచన (ప్రణాళిక).

జలవిభాజన క్షేత్రము - (భూగో.) నదివాలు, నది ఉత్పత్తి స్థానము.

ధార - 1.నీటిచాలు, 2.ఆయుధముల వాదర, 3.చిల్లి, 4.అశ్వగతి విశేషము, 5.ప్రవాహము, 6.పరంపర.
దార - 1.ధార, 2.నీటిచాలు, 3.దానము, 4.క్రమము, సం.ధారా.
దార - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

నీటిపాఱుదల - మానవ ప్రయత్నము చేత కాలువల ద్వారా, ఉపనదుల ద్వారా సేద్యము కొరకు నీటిని పొలమున కందచేయుట. 
నీటివాలు - (భౌతి.) నీరు ఎత్తునుండి పల్లమునకు పారు వైఖరి.

గాతము - పల్లము, గుంత, సం.ఖాతమ్. 
ఖాతము -
1.గాతము, 2.అగడ్త, 3.పుష్కరిణి. 
ఖేయము - 1.ఆగడ్త, 2.ఆనకట్ట, సేతువు, విణ.త్రవ్వదగినది.
కందకము - అగడ్త; అగడ్త - అగడిత.
అగదిత - కోటచుట్టు త్రవ్వబడిన కందకము, రూ.అగడత, అగడ్త. 
పుష్కరిణి - 1.తామరకొలను, కోనేరు, 2.ఆడేనుగు(వశ - ఆడేనుగు).
కోనేఱు - (కోన+ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి (కట్టుదొన - కోనేరు). 
తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
తిరు - శ్రీ ప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.

ఖాతకుఁడు - 1.అప్పు పడినవాడు, 2.త్రవ్వెడివాడు.

సదాజల కాలువలు - (భూగో.) 1.ఏటి కాలువలు, 2.నదికి ఆనకట్ట కట్టి, నీటిని ఆపి ఎప్పటికి ఎండిపోకుండ ఏర్పరచిన సరస్సు.

అన1 - 1.అన్న, 2.చిగురు, 3.ఆనకట్ట.
అన2 -
1.అనుటకు, అనగా మొ.ని; ఉత్ప్రేక్షావాచకముగా ఉపయోగింప బడును.
అన్న - జ్యేష్ఠసోదరుడు.
జ్యేష్ఠుడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రజుఁడు - 1.బ్రహ్మ(పరమేష్ఠి - బ్రహ్మ), 2.బ్రాహ్మణుడు, 3.అన్న.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ, దేవతలలో పెద్దవాడు.
విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు. బ్రాహ్మణుఁడు - పారుడు.
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు(అధికుఁడు - గొప్పవాడు), 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం. పృద్ధః, పృథుః.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్థుడు, మరీచి).   

జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త. ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.వి., సొత్తు.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్. 
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.  
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle). 
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు. 

విప్రానాం జ్ఞానతో జ్యేష్ఠం, క్షత్రియాణాంతు వీర్యంతః|
వైశ్యానాం ధాన్యధనత, శ్శూద్రాణా మేవ జన్మతః||
తా.
బ్రాహ్మణులలో జ్ఞానము(జ్ఞానము - తెలివి, ఎరుక.)గలవాడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమవంతుఁడు పెద్ద, వైశ్యులలో ధనధాన్యము గలవాఁడు పెద్ద, శూద్రులలో వయోధికుఁడు పెద్దయని భావము. - నీతిశాస్త్రము

వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||

ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించున ఆడ్డంకి.
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట.
డామ్ - (భూగో. అర్థ.) (Dam) నీటిపారుదల, విద్యుచ్ఛక్తి తయారు చేయుటకుకై నది లోని నీరు వృథాకాకుండ నిలుచుటకై కట్టిన ఆనకట్ట. 
జలవిద్యుచ్ఛక్తి - (భూగో. అర్థ.) నీరు ఎత్తు నుండి లోతునకు పడునపుడు ఉత్పత్తియగు శక్తినుండి సేక్రించు విద్యుచ్ఛక్తి.  
వారధి - వంతెన, అడ్డకట్ట (ఈ అర్థము తెలుగునందే). 
వంతెన - ఏటిపైకట్ట, వారధి.
కట్టుగొమ్మ - అడ్దకట్ట, సేతువు. కట్ట - 1.అడ్డకట్ట, 2.మోపు, అవ్య.సంతానమును దెలుపును. సేతువు - నీటికట్ట.   

బరాజ్ - (వ్యవ., అర్థ, భూగో.) (Baraz) నీటిపారుదల వసతులకై నదిలోని నీరును భద్రము చేయుటకై కట్టిన కట్టడము. 

గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించినదానికై విచారించుట.

డెల్టా - (భూగో.) (Delta) నది పెక్కు పాయలుగా నేర్పడి సముద్రమున కలయునప్పుడు త్రికోణముగ ఏర్పడిన భూభాగము. అట్లు పాయలుగా చీలినప్పుడు గ్రీకు అక్షరములలో డెల్టావలె నుండుటచే ఈ పేరు వచ్చినది. డెల్టాభూము లన్నియు త్రికోణాకారముగా నుండునని భావించుటకు వీలు లేదు.

జలస్థంభము - (భూగో.) సముద్రములోను, నదులలోను పెద్ద స్థంభము వలె లేచుచు పడు నీరు. 

నదీమాతృకము - ఏటి నీటిచే పండెడు భూమి.
మొగాళము - (వ్యావ.) నదీసముద్రాదుల ముఖము.

శైవలిని - ఏరు, నది.
శైవలము -
నీటిపాచి, రూ. శైవాలము, శేవలము. 

తటిని - ఏరు, వ్యు.తటముకలది.
తటి -
1.ఏటియొడ్డు, 2.ప్రదేశము.
తటము - 1.ఏటియొడ్డు, 2.కొండచరియ, 3.ప్రదేశము.

హ్రాదిని - 1.వజ్రాయుధము, 2.ఏరు, 3.మెరుపు.
ధుని - ఏరు.

స్త్రోతస్విని - నది, వ్యు.ప్రవాహము కలది.
స్రోతస్సు - 1.ప్రవాహము, ఏరు, 2.నీరువచ్చు తూము.

ద్వీపవతి - నది.
స్రవంతీ -
నది, ఏరు. 
నిమ్నగ - ఏరు, వ్యు.పల్లమునకు పారునది.

ఆపగ - నది, ఏరు, వ్యు.జలముతో పోవునది.
ఆపగేయుఁడు -
గంగాపుత్త్రుడు, భీష్ముడు. 
గంగాపుత్త్రుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
భీష్ముఁడు - 1.శంతను పుత్త్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.

కూలంకష - ఏరు, నది, వ్యు.గట్టుల నొరయునది.

నిర్ఝరణి - నది.
నిర్ఝరము -
సెలయేరు, రూ.ఝురము.
ఝురము - సెలయేరు, రూ.ఝురి.
సెల - 1.సెలయేరు, 2.బాణపుములికి, 3.శల్యము, 4.ఏదుపందిములు, 5.మునిలోల యందలి ఇముపముల్లు, 6.బాణము, 7.వ్రనము నుండి చీము వ్యాపించు రంథ్రము, సం.1.ఝురీ, 2.కల్యమ్.

సెలయేరు - నిర్ఝరము, కొండయేరు.
జలపాతము -
(భూగో.) నిర్ఝరము, కొండ కాలువ, సెలయేరు, కొండమీద నుండి నిటారుగా క్రిందికి తీవ్ర వేగముతో ప్రవహించు నీరు (Water fall). వాఁగు - 1.సెలయేరు, 2.సేవ. సం.వాహః, వై.క్రి. ప్రేలు.
వాఁగులు - 1.అలలు, 2.సెలయేళ్ళు.

తామ్రపర్ణి -1.ఒకనది, 2.పడమటి దిక్కుననదలి అంజన మను దిగ్గజము యొక్క భార్య.

తత్రాయుతమదాద్ ధేనూర్ర్బాహ్మణేభ్యో హలాయుధః |
కృతమాలం తామ్రపర్ణీం మలయం చ కులాచలమ్ | 

పిబంతి నద్య స్స్వయ మేవనాపః, ఖాదంతి నస్వాదు ఫలానివృక్షాః|
పయోధ రాస్సస్యమ దంతినైవ, పరోపకారాయ సతాం విధూతయః||
తా.
నదులు తమ జలమును తాము త్రాగవు, వృక్షములు తమయందు ఫలించిన ఫలములను తాము భక్షింపవు. మేఘములు (పయోధరము - 1.స్తనము, 2.మేఘము.)వర్షించుటచే పండిన పైరులు నా మేఘములు భక్షింపవు. కావున లోకమందు ధర్మాత్ములైన సత్పురుషులు సంపాదించిన ధనమును పరోపకారము సేయుదురు. – నీతిశాస్త్రము

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ అర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).

గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు -
1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి.

గంగోదకము - Water of the Ganges గంగానది జలము స్వచ్ఛముగ నుండును. చలువచేయును, దాహమును, మేహమును హరించును. అగ్నిదీప్తినిచ్చును. జీర్ణముగావించును. పథ్యముగ నుండును. బుద్ధికి మిక్కిలి బలమిచ్చును. మిక్కిలి ఆరోగ్యకరమైనవి, పవిత్రమైనవి.

గంగి - పూజ్యము, (గంగెద్దు= గంగి+ఎద్దు), వి.సాధువైన ఆవు.
గంగెద్దు -
(గంగి+ఎద్దు) దాసరులు వస్త్రాదులచే అలంకరించి భిక్షాటనము కై తీసుకొని వచ్చెడి ఎద్దు, రూ.గంగిరెద్దు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.

గంగమైలావు - (గంగమైల + ఆవు), 1.పసుపు, నలుపును కలిసిన వర్ణము కల ఆవు, 2.మిక్కిలినల్లని ఆవు.
మైలావు - పొగ చాయగల ఆవు.

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివడైననేల ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వ.
తా.
మంచిపాలు గరిటెడైనను త్రాగుటకు శ్రేష్ఠముగా నుండును. గాడిద పాలు కడవతో యిచ్చిననూ త్రాగలేముకదా. అట్లే ప్రేమతో బెట్టిన పిడికెడు భోజనమైనను సంతోషము గదా. 

గంగాయాః పరమం నామ పాపారణ్యదవానలః
భవవ్యాధిహరీ గంగా తస్మా త్సేవ్యా ప్రయత్నతః| 

నతీర్థం గంగాయాస్సమానః : గంగతో సరి సమానమైన జలము లేదు.

చర్మానికి ఎముకలకి పాపం పట్టుకుని ఉంటుంది, కాబట్టి మానవుడు యొక్క అస్తికలు గంగానదిలో కలుపుతారు.

గంగ: మేషరాశిలో గురుడు(బృహస్పతి) ప్రవేశం గంగానది పుష్కరాలు.

సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందునా చెరుతుంది. అన్ని నదులలో గంగానది మున్నెన్న దగినది. గంగను మించిన తీర్ధం లేదు.

గజ్గా విష్ణుపదీ జహ్నుతనయా సురనిమ్నగా
భాగీరథీ త్రిపథగా త్రిస్రోతా భీష్మసూరపి.
హరిచరణాత్ గాం భూమింగతా గంగా. గమ్‌గతౌ - హరిపాదము వలన భూమిని బొందినది;
హరోత్తమాంగాద్భూమిం గతా గంగా - హర శిరస్సువలన భూమిని బొందినది.
విష్ణుపదోద్భవా విష్ణుపదీ. ఈ. సీ. - విష్ణుపాదమునఁ బుట్టినది.
జహ్నోస్తనయా జాహ్నవీ - జహ్ను మహామునియొక్క చెవియందుఁ బుట్టినది.
సురాణాం నిమ్నగా సురనిమ్నగా - సురలయొక్క నది.
భగీరథేన రాజ్ఞా భూలోకమవతారితేతి భాగిరథీ. ఈ. సీ. - భగీరథుఁడను రాజుచేత భూలోకమునకుఁ దేఁబడినది.
స్వర్ణమర్త్యపాతాళ మార్గేషు త్రిషు గచ్ఛతీతి త్రిపథగా. గ ఌ గతౌ. - సర్గ, మర్త్య, పాతాళ మార్గములయందు మూఁటియందును బోవునది.
త్రీణిస్రోతాంసి యస్యాస్సా త్రిస్రోతాః. స. సీ. - మూఁడు ప్రవాహములు గలది.
భీషం సూత ఇతి భీష్మసూ. ఊ. సీ. షూజ్ ప్రాణిప్రసవే. - భీష్మునిఁ గన్నది. ఈ ఏడు గంగానది పేర్లు.   

నమస్తే గంగే త్వదంగ ప్రసంగా - ద్బుజంగా స్తురంగా కురంగాః ప్లవంగాః
అనఁగారి రంగాసకంగా శ్సివంగా - భుజంగాధిపాంగీ కృతాంగా భవంతి. 

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము). 
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.

హరిపదపాద్యతరఙ్గిణి గఙ్గే హిమవిధుముక్తాధవళతరఙ్గే |
దూరీకురు మమ దుషృతిభారం కురుకృపయా భవసాగరపారమ్ ||

ఓ గంగా మాతా! నీవు శ్రీహరి పాదతీర్థంగా ఉద్భవించిన నదీమతల్లివి. నీ తరంగముల ధవళకాంతులు చంద్రము, హిమము, ముత్యముల వలె భాసిల్లుతున్నవి. నా సకల పాపభారాన్ని దూరం చేసి, కృపతో ఈ సంసార సాగరాన్ని దాటించు. - 3శ్లో

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి(వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా.
విష్ణువుచేత గాని, శివుని(హరుఁడు - శివుడు)చేత గాని, బ్రహ్మచేత గాని, ఇతరమైన దేవతలచేత గాని నొసట వ్రాయబడిన వ్రాత తుడిచివేయ నలవి కాదు (మనుష్యమాత్రుల కాగలదా.) - నీతిశాస్త్రము

విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణుపది -
గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగాగలది.
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. 
వాసుకము - వైకుంఠము. వైకుంఠాలయ సంస్థిత రామ్|
వైకుంఠుడు -
1.విష్ణువు, 2.ఇంద్రుడు.

విష్ణు పది - గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగా గలది. గంగానది విష్ణుపాదనఖము నుండి జన్మించుటవలననో శివుని శిరస్సు నందున్న చంద్రుని స్పర్శము వలననో మంచుకొండ శిఖరమునుండి పడుటవలననో దేని వలననోగాని స్పటికమణివలె స్వచ్ఛమైన జలము గలిగియున్నది.    

వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.

రామో విరామో విరజో మార్గనేయో నయో(అ)నయః
వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మవిదుత్తమః - 43శ్లో 

విరజ - వైకుంఠము నందుండు నది(మోక్షం కలగాలంటే దీన్ని దాటాలి). పరమపదమున సమీపముగా నుండునది విరజానది, ఆ విరజానదియే యమునగా మారి వచ్చినది - తిరుప్పవై.

విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా,
యస్యాః సందర్శనా న్మర్త్యాః పునాత్యాసప్తమం కులమ్ |
ఉత్కలదేశమున విరజయను క్షేత్రముకలదు. ఆ క్షేత్ర అధిస్ఠానదేవతకు విరజయను సంజ్ఞ కలదు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడిన ఈ దేవతా సందర్శనమున నేడుతరముల(ఏడు తరముల)వారిని పునీతుల చేయుదురని బ్రహ్మాండపురాణమున తెలియుచున్నది.   

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. - 149శ్లో 

ఆకాశము - 1.విన్ను, మిన్ను, 2.భూతము లైదింటిలో ఒకటి, 3.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).
విను - క్రి. ఆకర్షించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినువాఁక - గంగ.

వినుకెంపు - సూర్యుడు, వ్యు.విన్నునకు కెంపువంటివాడు, ద్యుమణి.
ద్యుమణి -
సూర్యుడు, చదలు మానికము.

వినుచూలి - వాయువు; మిను(ౘ)చూలు - వాయువు.

పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి ప్రొతసామస్మి జాహ్నవీ || - 31శ్లో
పావన మొనర్చువాటిలో వాయువును, శస్త్రధారులలో రాముడును, జలచరములలో మొసలియు, నదులలో గంగయు నావిభూతులే.
రామబాణ మఘోఘమైనది కావుననే శత్రధారులలో అతడగ్రేసరుడు.

త్రిలోకపావనియగు గంగ విష్ణుపాదమునుండి పుట్టినది. వైజ్ఞానికులు గంగా జలములు ఎంతకాలముంచినను చెడిపోవనియు, వీనియందు రోగక్రిములు జీవింప జాలవనియు ఋజువు చేసిరి. హిందువులు గంగను పూజించుటచే సర్వపాపములు నశించి ముక్తికలుగునని విశ్వసింతురు. - భగవద్గీత  విభూతియోగః   

త్రివిక్రముడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించినవాడు.

అడుగు - క్రి. 1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.
అడుగుపుట్టువు - 1.గంగ, 2.శూద్రుడు(శూద్రుఁడు - నాలవజాతివాడు).

పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా
స్పదమగు నబ్బలీంద్రునొక పాదమునం దలక్రిందనొత్తిమే
లొదవజగత్తయంబు బురుహుతునకియ్య వటుండవై నచి
త్సదలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
ఒక పాదము భూమియందును, మఱొకటి ఆకాశమునందును పెట్టి, యట్లు రెండు పాదములచే లోకమాక్రమించి, మహాపరాక్రమవంతుఁడైన బలిచక్రవర్తి తలమీఁద నొక పాదము పెట్టి పాతాళమునకు అణఁగ ద్రొక్కి మేలగునట్లు ముల్లోకమునలను ఇంద్రునకు యిచ్చుటకై వటువుగాఁ బుట్టిన సచ్చిదాననదమూర్తిని నీవెకాని మఱి ఎవ్వరునుగారు కనుక నన్నుఁ గాపాడుమా !    

త్రిలోక పావనియగు గంగ విష్ణు పాదము నుండి పుట్టినది. విష్ణు పాదము నుంచి వుద్భవించిన గంగకు నాటి నుండి "విష్ణు పది" అనే పేరు వచ్చింది.  గంగను చుచినా తాకినా పాపాలు పోగొట్టే పరమపావని, స్నానపానాదుల తో సర్వప్రానులకూ ఆనందమునూ, పుణ్యమునూ; అంతర్బాహ్య శుద్ధినీ కలిగించేది, శివుని శిరస్సునందు ఆణి ముత్తెపు దండయైన దివ్యసుందరి, గోలోక ప్రాప్తికి సోపానరేఖ, కలుషితమైన కలికాలంలో కూడా మహిమ తగ్గని గంగ ప్రధానంశ వల్ల పుట్టిన శక్తులలో ప్రధమగణ్య. సర్వనదీ నదతీర్థాలలోకీ ఉత్తమోత్తమైనది.

విష్ణు పాదము సత్యలోకమును చేరగా బ్రహ్మ కమండలంలోని నీటితో పాదము కడిగెను. ఆ పాద సంపర్కముగల నీటి నుండి పుట్టిన గంగానది సర్వమంగళ, ముల్లోకములను పవిత్ర మొనర్చునది.   

బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానె నీ పాదము ||

మున్ముందు విష్ణుపాదము నుంచి బయల్వెడలిన గంగ బ్రహ్మ పుట్టినిల్లయిన పద్మమునందు పడి అక్కడ నుంచి నాలుగు పాయలు (నదిలో నుండి చిలిన శాఖలు), అయింది. సీత, చక్షువు, అలకానంద, భద్ర అని వరుసగా ఆ భాగాలకు పేర్లు.

తవ జలమమలం యేన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతమ్ |
మాతర్గఙ్గే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం న యమః శక్తః ||
 
ఓ దేవీ! నీ జలాన్ని పానం చేసిన వారందరూ నిశ్చయంగా ఆ పరమపదాన్నే పొందారు. గంగామాతా! నీ భక్తుడిని యమధర్మరాజు చూడడానికైనా సాహసించడు. (అంటే నీ భక్తులు మరణానంతరం నరకానికి కాక, వైకుంఠానికి చేరుదురు). – 4శ్లో

భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా|| 

అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి.1.విష్ణుశంఖము, 2.మేఘము, 3.అభ్రకము, 4.(వృక్ష.) వావిలి, 5.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్దశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.  

శ్రవణము - 1.చెవి, 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
చెవి -
1.శ్రవణము, వినెడియింద్రియము, 2.రాట్నము మొదలగు వానియందుగల యొక భాగము, 3.తాళపుచెవి.
శ్రవము - చెవి; వినికి - వినుట, రూ.వినికిలి.
శ్రవణీయము - వినదగినది. 

భవములకు మందు, చిత్త, శ్రవణానందము
ముముక్షుజన పదము, హరి
స్తవము పశుఘ్నుఁడు, దక్కను,
జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁదే.
భా||
శ్రీహరియైన విష్ణువుయొక్క స్తోత్రం సంసార బాధలకు ఔషధం వంటిది. అది చెవులకు మనస్సుకు ఆనందం కలిగిస్తుంది, మోక్షం అర్థించే జనులు కోరే స్థానం అది. అటువంటి హరిస్తోత్రం విని కసాయివాడు అయితే తప్ప ' నాకు తృప్తి కలిగింది చాలు ' అనే మూర్ఖుడు ఎవ్వడూ ఉండడు. 

భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ.పూజ్య స్త్రీ.
సరస్వతి -
1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
పలుకుఁజెలి - సరస్వతి. విద్యలకు అధిస్ఠాన దేవత సరస్వతి.
పలుకు - క్రి.మాటాడు, అను, వి.1.వచనము, 2.నింద, 3.విద్య, 4.తునక.
పలుకరించు - క్రి.మాటాడు, రూ.పల్కరించు. 

శరీరం త్వం శంభో - శ్శశిమిహిరవక్షోరుహయుగం,
తవా(ఆ)త్మానం మన్యే - భగవతి! నవాత్మాన మనఘమ్|
అత శ్శేషా శ్శేషీ - త్యయ ముభయసాధారణతయా
స్థిత స్సంబంధో వాం - సమరసపరానందపరయోః|| -34శ్లో
తా. ఉత్పత్యాదులగు ఆరు విషయముల నెఱింగిన దానవైన భగవతీ! నీవు చంద్ర సూర్యులు(సూర్యచంద్రులు) స్తనయుగ్మముగా గల శివునకు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)శరీరమగుచున్నావు. అయితే తల్లీ! నవవ్యూహాత్మకుడై అనఘుడైన ఆనదభైరవుని నీ దేహముగా తలంచుచున్నాను. అందు వలన పుణ్యాత్మకమగు నీ రూపమును నవవ్యూహాత్మకముగ తలంచు చున్నాను. ఈ విధముగా మీ యిరువురకు ఐక్యముండుట వలన నీవు శేషము, అతడు శేషి; అతడు శేషము, నీవు శేషి - అను యీ శేషి శేషభావ సంబంధము సామరస్యముతో గూడి ఆనందభైరవ ఆనందభైరవీ(చిచ్ఛక్తు) రూపులైన మీ యిరువురకు (శివశక్తులకు ఉభయసాధారణ ముగా (ఉభయులకు సమానత్వము పొంది)నున్నదని నేను తెలిసికొను చున్నానని భావము. కాబట్టి సమరసపరమానంద రూపులగు మీ యుభయులకు శేషశేషత్వ సంబంధము నిత్యమైనది. - సౌందర్యలహరి   

సరస్వంత్తౌ నదార్ణవౌ : సరస్వచ్ఛబ్దము సరస్వంతమను నదమునకును, సముద్రమునకును పేరు. సరో స్యాస్తీతి సరస్వాన్ - సరస్సు గలిగినది. (సరస్సనఁగా నదపక్షమందు మడుఁగును, సముద్రపక్షమందు నీళ్ళును. "సరో నీరే తటాకే చ" అని రుద్రుడు). సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రమునకును, నదీ విశేషమునకును, ఆవునకును పేరు. "సరస్వతీ స్యాత్ స్త్రీరత్నే నద్యాం నద్యంతరే గవి" యని అజయుడు. "సరస్వతీ నదీ భేదే" అని ప్రతాపుఁడు.

బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మలోక మందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ బ్రవహించునది.  

సరస్వతీజలము - Water of the river Saraswati. చల్లగా, నిర్మలముగ, రుచిగనుండును, బలమిచ్చును; సర్వేద్రియములకు (నా)ఆప్యాయము గలుగజేయును, ఆయువునిచ్చును; పాపహరమైనది.

దేవి సురేశ్వరి భగవతి గఙ్గే త్రిభువనతారిణి తరళతరఙ్గే |
శఙ్కర మౌళివిహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే ||
ఓ దేవీ గంగా ! నీవు దేవగణానికి ఈశ్వరివి. ఓ భగవతీ! నీ తరళ తరంగాలతో ముల్లోకాలను తరింపజేయు దానవు. విమల(విమలము - నిర్మలమైనది) జలంతో శంకర శిరస్సున విహరించే నీ చరణకమలములపై, నా మనస్సు సతతమూ నిలిచి ఉండుగాక ! - 1శ్లో     

భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలినీ|
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ. – 65శ్లో

Bhagavati or Sarveswari, the Supreme Goddess of creation. She alone casts the net of infatuation over the living beings and binds them to the mundane life. But, if a person seeks her grace earnestly, she blesses him with the right knowledge which enables him to get free from the bondages.

జహ్నుతనయ - గంగ(జహ్నువు - 1.ఒక ముని, 2.విష్ణువు).
జాహ్నవి - గంగ.
    

జహ్నోస్తనయా జాహ్నవీ - జహ్ను మహాముని యొక్క చెవియందుఁ బుట్టినది. జహ్నుమహర్షి పుత్రిక అయినందున 'జాహ్నవి ' అయింది.   

నమోజహ్ను కన్యేనమన్యే త్వదన్యై - ర్ని సర్గేందు చిహ్నాది భిల్లోకభర్తుః
అతో హం నతో హంస్వతో గౌరతోయే - వసిష్టాది భిర్గీయమానా భిదేయే.

జహ్నువు యజ్ఞశాలను గంగ ముంచెత్తగా కోపముచే కన్నెఱ్ఱచేసి, భగవంతుని యజ్ఞపురుషు(యజ్ఞపురుషుఁడు - విష్ణువు)ని పరమ సమాధి చేత ఆత్మారోహణము చేసుకొని, గంగనెల్ల త్రావి వైచెను. అప్పుడు దేవర్షులు ప్రసన్నుని కావించి, గంగను మునికి కుమార్తెను కావించిరి.  

పతితోద్ధరిణి జాహ్నవి గఙ్గే ఖణ్డితగిరివర మణ్డితభఙ్గే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువనధన్యే ||
పతితులను ఉద్దరించే జహ్ను పుత్రి గంగా! నీ తరంగముల హిమగిరులను ఖండిస్తూ సుశోభితంగా ప్రవహిస్తుంటాయి. నీవు మునివర జహ్ను పుత్రికవు, భీష్ముని జననివి. పతితులను పావనం చేసి, త్రిభువనాలలో ధన్యత నొందుతావు. - 5శ్లో  

నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా,
చిత్రఘంటా సునందా శ్రీ ర్మానవీ మనుసంభవా. - 38శ్లో

సురదీర్ఘిక - గంగ. గాంగేయభూషిణి - గంగాతరంగిణి. వెల్లివాక - గంగ. వెల్లి - ప్రవాహము, పరంపర, తెలుపు, సం.వేల్.

ఆకంఠం సలిరే నిమజ్జ్య పులినాభోగోపధానే శిరః
కృత్వా శైలసుతాపతే ! పురరిపో ! గంగాధరేత్యాలపన్
గృహ్ణన్ కర్ణపుటే శివేన కృపయా ప్రత్యాహృతం తారకం
తీరే జాహ్నవి ! జహ్నునందని ! కదా మోక్షే శరీరం ముదా.
తా.
గంగా! నీజలములం దాకంఠము మునింగి శిరంబును నీసంబఁధములగు నిసుకతిన్నెలను తగడయందుఁ జేర్చికొని శంభూ ! పార్వతీ రమణా ! పురహరా ! గంగాధరా ! యని వాకొనుచుఁ గృపతోడ శివుడు(శివుండు) గర్ణపుటమునందు సూచించు మహనీయమగు తారక మంత్రమును గ్రహించి సంతృప్తుఁడనై యెన్నఁడీ దేహమును ద్యజియించెదనో కదా ?

సుర నిమ్నగ - దేవ గంగ.
భాగీరథి - గంగ (వ్యు. భగీరథునిచే భూమికి తేబడినది.)
త్రిపధగ - 1.గంగ, 2.ముత్త్రోవ ద్రిన్మురి.
ముయ్యేఱు - త్రిపథగ, గంగ.
త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది.

భాగీరథి - గంగ (వ్యు. భగీరథునిచే భూమికి తేబడినది).  

భాగీరథీ సుఖదాయిని మాతః తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ||
ఓ భాగీరథీ ! నీవు సుఖప్రదాయినివి. వేదశాస్త్రాలలో నీ జలమహత్యము కీర్తించబడినది. దయామయి! నీ మహిమలు తెలియని అజ్ఞానినైన నన్ను కృపతో రక్షించు. - 2శ్లో

గంగానదీ ప్రాశస్త్యం, హిమాలయ పర్వతాలలో పుట్టి 13,800 అడుగులు ఎత్తున గల గంగోత్రికి ఉత్తరాన జన్మస్థలం. గంగోత్రికి మరోపేరు భగీరథి. భగీరథుడు గంగను భూమికి తీసుకు రావడానికి తపస్సు చేసిన ప్రాంతం, గంగోత్రికి దక్షిణంగా సుమారు 2 మైళ్ళ దూరాన ఉన్న ప్రాంతాన్ని బిందుసారమని అంటారు.

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||

సురదీర్ఘిక - గంగ.
సురనిమ్నగ - దేవగంగ.

గాంగము - 1.గంగ యందు పుట్టినది, 2.గంగకు సంబంధించినది
గాంగేయము -
1.బంగారము, 2.తామర, 3.ఉమ్మెత్త, 4. ఒకానొక చేప.

పుష్కరము(పుష్కరమునందు దేవీస్థానం పురుహూత) -  1.మెట్ట తామర దుంప, 2.తామర(ఎఱ్ర కలువ, మన జాతీయ పుష్పము, నీటినుండి పుట్టినది lotus) 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.

కాశ్మీరము - 1.కుంకుమ పువ్వు. పువ్వుగాని పువ్వూ - పూసుకుంటే నవ్వు. 2.మెట్ట తామర దుంప, 3.కాశ్మీర దేశము(కాశ్మీరము నందు దేవీ స్థానం మేధ - ధారణాశక్తి గల బుద్ధిగలది).

మేరు వింధ్యాతి సంస్థానా కాశ్మీర పురవాసినీ.

పుష్కరిణి - 1.తామర కొలను, కోనేరు, 3.ఆడేనుగు.
కోనేఱు -
(కోన + ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి.
తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
తిరు - శ్రీ పదము, పూజ్యమైన, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.

దైవగంగ, పాండన గంగ - స్వామి పుష్కరిని(కొమరెఱు), కుమారధార. స్వామి పుష్కరిణి పవిత్రమైన తీర్ధములన్నిటిలో అతి పవిత్రమైనది, మంగళకరమైన వాటిలో మంగళకరమైనది.

వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
ఆకసము -
మిన్ను, సం.ఆకాశః
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను. 

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు -
వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమని, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.

నింగి - ఆకాశము.
నింగిచూలు -
వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.
నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.
వ్యోమకేశుఁడు - శంకరుడు, వ్యు.ఆకాశము జుట్టుగా గలవాడు.
శంకరుఁడు - శివుడు, విణ. సుఖమును గలుగ జేయువాడు.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.

ఆకాశధార - ఆకసమునుండి కొండ పైకిని అచటినుండి క్రిందిని ప్రవహించు ధార.

ఆకాశ గంగ - మిన్నేరు 1.మందాకిని, 2.పాలవెల్లి(milky way - నక్షత్ర వీధి).
మందాకిని -
1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ
భాగీరథి - గంగ (వ్యు.భగీరథునిచే భూమికి తేబడినది). (భగిరథుడు, సూర్యవంశపురాజు మందాకిని నదిని తెచ్చి ఈ భుమిని పరమ పవిత్రం గవించాడు). కేదార్నాథ్ లోంచి ప్రవహించే గంగ మందాకిని.     

మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1.
మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ. 2.వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ. 3.స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గమందుండెడి నది. 4.సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.   

సీత - 1.శీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.   

సోమధార - ఆకాశ గంగ, పాలపుంత.
మిన్నువాక -
ఆకాశ గంగ, మిన్ను కొనలను.
ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
చారలేరు - ఆకాశ గంగ; చదలేరు - ఆకాశ గంగ.
తెలియేఱు - ఆకాశ గంగ. తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము. 

పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది -
పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).

తరణికులేశ నా నుడులఁ దప్పులుగల్గిన నీదు నామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచు వంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్వముం
దరమె గఱింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
సూర్యవంశమున జన్మించినవారిలో శ్రేష్ఠుడైనవాడా ! నా మాటల యందు దోషము లెన్నియున్నను, నీయొక్క నామముతోడ శ్రేష్టమయి నదియు రచింపఁబడినదియు, కావ్యము పవిత్రమయినది కదా ? (అగు ననుట) అనగా ఆకాశగంగయొక్క నీరు ప్రవహించుచు, వంకరగా పాఱినను ముఱికిగల ఆకారములో ప్రవహించినను, దాని మహత్మ్యము ఎన్నుటకు శక్యమా. (కాదనుట)

ఆకాశే తారకం లింగం పాతాళే హఠకేశ్వరః
భూలోకేచ మాహాకాలే లింగత్రయ నమోస్తుతే.

గంగ ఆకాశం నుంచి దిగింది. సమస్త జీవులకు నీరే ప్రాణాధారం. నీరు దానము చేయువాడు మంచి రూపమును పొందును.

పాయ - 1.ఖండము, 2.ఒక నదిలోనుండి చీలిన శాఖ.

తత్ర చతుర్థా భిద్యమానా చతుర్భిర్నామభి శ్చతుర్దిశమభిస్పందంతీ నదనదీపతిమేవాభినివిశతి సీతాలకనందా చక్షుర్భద్రేతి |

సీత: సీత బ్రహ్మ గృహము నుంచి బయల్వెడలి నానా పర్వతాల పై ప్రవహించి గంధమాధవ శిఖరమును చేరి అక్కడ నుంచి భధ్రాశ్వ వర్షమును చేరి తూర్పు సముద్రములో కలిసింది.

సీతా తు బ్రహ్మసదనాత్ కేసరాచలాది గిరిశిఖరేభ్యో ధోధః ప్రస్రవంతీ గంధమాదన మూర్ధసు పతిత్వాంతరేణ భద్రాశ్వ వర్షం ప్రాచ్యాం దిశి క్షార సముద్రమభి ప్రవిశతి |

సీత - 1.శ్రీ రాముని భార్య, 2.నాగటి చూలు, 3.ఆకాశ గంగ. పంచమ మార్గమున నేగి ప్రథమతనూజన్(ఆకాశము-సీత).    

అయోనిజ - గర్భమున పుట్టని స్త్రీ(అయోనిజ-వృషధ్వజుని కూతురు)వి.సీత. శీత - నాగటి చూలు, రూ.సీత. నాగటి చూలు పేరి యతివ – సీత; వరజు - నాగటి చూలు, సీత.

అయోనిజుఁడు - గర్భమున పుట్టని వాడు వి. 1.విష్ణువు, 2.శివుడు.

జానకి - జనకుని కూతురు, సీత(యఙ్ఞ భూమిన జనకునికి లభించింది).
జనకుడు - 1.తండ్రి, 2.సీతయొక్క తండ్రి, (జనకర్షి). 

భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి -
సీత, భూపుత్రి.
పుడమి కానుపు - 1.సీత, 2.చెట్టు(భూమి నుండి పుట్టినది). 
అవనిజ - సీత. అవని - భూమి, నేల. సీత పుట్టుక లంకకు చేటు.

సీతగా పుట్టిన వేదవతి, లక్ష్మిలో లీనమయిది. చిత్రకూటమునందు దేవీస్థానం సీత. రామావతారంలో శ్రీదేవి అంశతో సీతాదేవిగా పుట్టింది.    

వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు(శైలూషి - ఆటకత్తె, నటి, నర్తకి).

శ్రీరమ సీతగాఁగ నిజ సేవకబృందము వీరవైష్ణవా
చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్రశైల శిఖరాగ్రముగాఁగ వసించుచేతనో
ద్ధారకు డన విష్ణుఁడవు ధాశరథీ కరుణాపయోనిధీ.
తా.
దశరథరామా ! నీవు పరమపదమందున్న లక్షీదేవిని ఇచట సీతగాఁ జేసికొని, అందలి పరివారము ఇచట వీరవైష్ణవజనులుగా వచ్చి కొలుచు చుండగా, అచ్చట విరజానది ఇచట గోదావరిగా ప్రవహింపగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రగిరి కొమ్మకొనయై రాణింపగా వేంచేసి చేతనులను ఉద్దరించుచున్న శ్రీవిష్ణుదేవుండవే కాని వేఱుకావు.   

జానకీ మిథిలానందా రాక్షసాంతవిధాయినీ|
రావణాంతకరీ రమ్యా రామవక్షఃస్థల స్థితా||

చక్షువు: చక్షుర్నది అనే రెండవభాగం మాల్యవంతము (మేరు పర్వతము నకు పడమట గల ఒక కొండ) గిరులన్నియు దాటి తరువాత పడమట గల కేతుమాల వర్షమును ప్రవేశించి పడమటి కడలిలో కలిసింది. కేతుమాల వర్షమునందు హరి స్మరరూపముతో అవతరించి వుంటాడు. రమ, లక్ష్మి స్వరూపిణి  ఆ హరిని  సర్వకళా సంపూర్ణునిగా, అమృతమూర్తిగా, జగన్మోహనమూర్తిగా భావించి స్తుతిస్తూ సేవిస్తూ ఉంటుంది.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి(వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.

"హరి" యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్త్వము
హరిహరి | పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా.
తా.
అంబుజనాభా ! కృష్ణా ! సమస్త పాపములు పోగొట్టు ' హరి ' అను రెండక్షరముల మహిమను విష్ణువుకూడా పొగడఁజాలడు. నా బోటివానికి వీలగునా, కాదు.

లక్ష్మి -1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్ర భూష్ణాదుల శోభ 4.మెట్ట తామర.
రమ - లక్ష్మి. పద్మ - 1.లక్ష్మి, 2.మెట్ట దామర(స్థల పద్మము).
అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము(విజయ అను మద్యము) విణ. సముద్రమున బుట్టినది.        

విష్ణుపత్ని లక్ష్మీదేవి చంద్రుడుకి సహోదరి, పాలకడలి యందు కార్తీక శుక్ల పంచమి రోజు ఉద్భవించింది–పుట్టినది.

హరిస్త్వా మారాధ్య - ప్రణతజనసౌభాగ్యజననీం
పురా నారీ భూత్వా - పురరిపు మపి క్షోభ మనయత్|
స్మరో(అ)పి త్వాం నత్వా - రతినయన లేహ్యేన వపుషా
మునీనా మప్యంతః - ప్రభవతి హి మోహాయ మహతామ్. - 5శ్లో
తా.
తల్లీ! వినమ్రతతో నమస్కరించు జనులకు సౌభాగ్యప్రదురాల(సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.)వైనట్టి నిన్ను ఆరాధించి పూర్వము విష్ణువు స్త్రీరూపమును పొంది(జగన్మోహినియై), త్రిపురాసుర సంహారకుడైన ఈశ్వరుని కూడ కలతపొందించెను. అనంగుడగు మన్మథుడును నీకు ప్రణమిల్లినవాడై రతీదేవి కన్నులచే ఆస్వాంచదగిన శరీరముతో మునుల మన్సూలను మోహపెట్టుటకు సమర్థుడగుచున్నాడు కదా!(నీ అనుగ్రహప్రసాదగరిమ లోకాద్భుతము కదా!) - సౌందర్యలహరి              

ఏవం మాల్యవచ్ఛిఖారాన్నిష్పతంతీ తతో అనుపరతవేగా కేతుమాలమభి చక్షుః ప్రతీచ్యాం దిశి సరిత్పతిం ప్రవిశతి |       

చక్షువు - కన్ను; కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలి పురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
వలిపము -
సన్నని తెలుపుబట్ట.

(ౙ)జాడ - 1.అడుగుల గురుతు(వర్తని - త్రోవ, కాలిజాడ) 2.సైగ, సంజ్ఞ 3.త్రోవ, మార్గము 4.విధము (ప్రకారము, విధి).
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.

దృష్టి  - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు(నయనము - 1.కన్ను, 2.పొందించుట)ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము(నీరు)ప్రధానమని తెలియవలెను. - నీతిశాస్త్రము

భూమి - "పృథివీ హ్యేషా నిథిః", అన్నది వేదం. భూమి(రత్నగర్భ) వసుంధర, వసువును ధరించునది. వసువు అంటే బంగారం, రత్నం, ధనం, కిరణం, అగ్ని. ఇవన్ని భూమిలో ఉన్నయి. ప్రకృతి అంశవల్ల భూదేవి ఉధ్భవించి సమస్తాన్ని భరిస్తున్నది.  

భూమ్యంతర్భాగ జలప్రదేశము - (భూగ.) భూమిలోపల భాగమున అంతర్వాహినిగా పారుచుండిన నీటి ప్రదేశము.

భూతధాత్రి - భూమి, వ్యు.జీవులన్నిటిని ధరించునది. భూమి మాత్రమే జీవులందరిని మోయగలిగినది. జీవరాశులన్నిటికి ఆశ్రయమును ఇచ్చిన భూమి విష్ణు పాదముల నుండే ఉద్భవించింది. భూమి మిక్కిలి భయపడుచున్నదై చుట్టూరా నీటితోనిండి ఉండెను.

తథైవాలకనందా దక్షిణేన తు బ్రహ్మసదనాద్బహూని గిరికూటానతిక్రమ్య హేమకూట హిమకూటాని అతిరభసతర రంహసా లుఠంతీ భారతమభివర్షం కర్మక్షేత్రం దక్షిణస్యాం దిశి జలధిమనుప్రవిశతి | యస్యాం స్నానార్థం చాగచ్ఛతః పుంసః పదే పదే అశ్వమేద రిజసూయాదీనాం ఫలం న దుర్లభమితి || 

అలకనంద: అలకనంద నానా వన పర్వతాలపై ప్రవహించి దక్షిణ దిశగా బయలుదేరి హేమకూటాద్రిమీదకు దిగి అతివేగవతిగా భరతవర్షమును చేరి, ఏడు భాగములై దక్షిణ సముద్రంలో కలుస్తోంది. భారతవర్షము నందు శ్రీమహావిష్ణువు, నారాయణుడు అనే పేరుతో ఉంటాడు. సాధువులు, పరమభాగవతులూ, భారత వర్షము నందు సర్వదా శ్రీహరి నామసంకీర్తనం చేస్తూవుంటారు.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.  
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి. సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది. 

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో  

కేదారక్షేత్రమునకు తూర్పున అలకనంద, పడమట మందాకిని ప్రవహించు చుండును. హిమవత్పర్వతమున నున్న కేదార క్షేత్రము నందలి పావన గంగను గ్రోలుట కష్టసాధ్యము.  బదరీ పుణ్యక్షేత్రము నుండి 'అలకనంద' కేదార్ నుంచి 'మందాకిని' బయలు దేరుతాయి. ఈ  రెండు నదులు రుద్ర ప్రయాగలో సంగమిస్తాయ. ఇది శివకేశవ సమైక్యత.

అలకనంద అను శాఖను పరమేశ్వరుడు శంభుడు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)నూరు వత్సరముల కంటె ఎక్కువగా శిరమ్మున ధరించెను. అతని జటాకలాపము నుండిదిగి, సగర కుమారుల అస్థి చూర్ణములను తడిపి, వారికి ఉత్తమ గతులను అనుగ్రహించెను. అందు స్నానము మొనర్చిన వెంటనే అప్పుడే పాపము పోవును. అపూర్వమైన పుణ్యము లభించును. కుమారులు తండ్రులకు వదలిన(తర్పణము) ఈ ఉదకములు, నూరేండ్లవరకు వారికి తృప్తి నిచ్చును.

అలకానన్దే పరమానన్దే కురు కరుణామయి కాతరవన్ద్యే |
తవ తటనికటే యస్య నివాసః ఖలు వైకుణ్థే తస్య నివాసః ||
ఆర్తత్రాణ పరాయణి గంగామాతా! సర్గానికే ఆనందాన్ని ప్రసాదించే పరమానందమయీ నన్ను కరుణించు. ఓ మాతా! నీ ప్రవాహతీరాన నివసించుట, వైకుంఠవాసానికి సమానమైనది. - 10శ్లో 

భద్ర: భధ్ర బ్రహ్మస్థానము నుంచి బయల్వెడలి శృంగవంతము అనే కొండను ఒరసి ప్రవహిస్తూ ఉత్తర కురు భూములలో చొచ్చి ఉత్తర సముద్రగామిని అయింది. ఉత్తర కురుభూము లందు హరి వరాహమూర్తియై వుంటాడు. భూదేవి ఆ దేవుణ్ణి దివ్య మంత్రాలతో స్తుతిస్తూ వుంటుంది.

భద్రా చోత్తరతో మేరుశిరసో నిపతితా గిరిశిఖరాద్గిరి శిఖరమతిహాయ శృంగవతః | శ్రంగాదవస్యందమానా ఉత్తరాంస్తు కురూనభితః ఉదీచ్యాం దిశి జలధిమభి ప్రవిశతి |

భద్రపాద ప్రియా చైవ గోవిందపథ గామినీ,
దేవర్షిగణసంస్తుత్యా వనమాలా విభూషితా|- గాయత్రీ

భూసతి - భూదేవి, భూమాతను అక్కున జేర్చుకున్నాడు(శ్వేత వరాహం, వరాహావతారంలో)

భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి ధృడమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.

భూమే భూమిప సర్వస్వే భూమిపాల పరాయణీ|
భూమిపానం సుఖకరే భూమిం దేహి చ భూమిదే||

గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు -
1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి.

గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.  
గాంగేయుఁడు -
గాంగుడు. 
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి. 
భీష్ముఁడు - 1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.

అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగువాడు, విష్ణువు.

జితేంద్రియుడు - ఇంద్రియము లను జయించినవాడు. కామ క్రోధాలకు లొంగనివాడే జితేంద్రియుడు. జితేంద్రియులకు తప్ప సామాన్యులకు శాంతి కలుగదు. జితేంద్రియుడగు యోగి కర్మ ఫలములయం దపేక్షను వదలి శాశ్వతముగు ఆత్మశాంతి పొందును.

పరసతుల గోష్టినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
గరిత సుశీలయైనను,
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ.
తా||
బ్రహ్మచారియైన భీష్మునంతటి వాడైనను ఇతర స్త్రీలతో సరస సంభాషణలు జరిపినచో లోకం అట్టి వానిని అనుమానించును. అట్లే యెంతటి(గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.) సుశీలయైన స్త్రీ అయినను అన్యపురుషుల పోషణలోవున్న నిందల పాలగును.

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
చంద్రుడు -
నెల, చందమామ.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలువు.

ఆత్రేయ గోత్రజాయ! చంద్రుడు నీటితో కూడినవాడు, బ్రహ్మ యొక్క అంశనుండి అనసూయ యందు జన్మించాడు. అనసూయకు రుద్రుని అంశ నుండి దూర్వాసుడు(మహాముని, కోపిష్టి), విష్ణు అంశ నుండి దత్తకుడు(దత్తత్రేయుడు) జన్మించిరి. 

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుడు -
1.శివుడు  2.పరమాత్మ  విణ. శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుడు - శివుడు, ముక్కంటి. 
ముక్కంటిచుక్క - ఉత్తరభధ్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు -
కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
కుబేరుడు(కుబేరాగారమందు దేవీస్థానం నిధి) - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.
ధనాధిపుఁడు - కుబేరుడు. దాత - ఇచ్చువాడు.
రత్నగర్భుడు - 1.సముద్రుడు, 2.కుబేరుడు, విణ. దాత.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.  

విడువరి - పరిత్యాగశీలుడు, వదాన్యుడు, దాత.
వదాన్యుఁడు -
మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉత్తంసుఁడు - గొప్పవాడు.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి. నిష్ణాతుఁడు - నేర్పరి. 
మహనీయుఁడు - గొప్పవాడు; అలఘుఁడు - గొప్పవాడు.
మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు. 

దాతదరిద్రః కృపణోధనాఢ్యః, పాపీచిరాయుస్సు కృతీగతాయుః|
రాజాకులీన స్సుకులీనసేవ్యః, కలౌయుగే షడ్గుణ మాశ్రయంతి|

తా. దాతయైనవాఁడు దరిద్రుఁడౌట, లోభి ధనాఢ్యుడౌట, పాపి ధీర్ఘాయుష్మ తుడౌట, పుణ్యాత్ముఁడు అల్పాయుష్కుండౌట, హీనకులుడు రాజౌట, శ్రేష్ఠకులుడు సేవకుడౌట, ఈ యాఱు(6)గుణములు కలియుగమునందు కలిగియున్నది. - నీతిశాస్త్రము

సోమోద్భవ - నర్మదానది. 
మేఖలకన్యక - నర్మదానది వ్యు. మేఖల పర్వతము నుండి పుట్టినది.
మేఖల - 1.స్త్రీలు ధరించు ఎనిమిది పేటల మొలనూలు, 2.కొండనడుము, 3.ఆయుధము జారకుండ మణికట్టున గట్టు కట్టు.

రేవ - నర్మదానది.  నర్మదానది దర్శనం మహాపుణ్యం. నర్మద విద్యగిరి నుండి వెలువడినది.

రేవా తు నర్మదా సోమోద్భవా మేఖలకన్యకా :                         రేవతే రేవా, రేవృ ప్లవగతౌ - దాఁటులతో బోవునది.
నర్మ కేళిందదాతీతి నర్మదా - నర్మమనఁగా క్రీడ, దానినిచ్చునది.
సోమవంశజేన పురూరవసా భువం ప్రత్యవతారితా సోమోద్భవా - సోమ వంశమునఁ బుట్టిన పురూరవుఁడను రాజుచేత భూమికిఁ దేఁబడినది.
మేఖలపర్వత ప్రభవత్వాన్మేఖలకన్యకా - మేఖల పర్వతమునఁ బుట్టుట వలన మేఖలకన్యక.  

ఐలుఁడు - 1.పురూరవ చక్రవర్తి, 2.అంగారకుడు, 3.అందగాడు.

ప్రవిశ్య రేవామగమద్ యత్ర మాహిష్మతీ పురీ |
మనుతీర్థముపస్పృశ్య ప్రభాసం పునరాగమత్ |

వృషభరాశిలో(గురుడు ప్రవేశం) రేవానది(నర్మద) పుష్కరాలు. 

వామనావతారములో శ్రీ మహా విష్ణువు, బలి చక్రవర్తి (బలి ప్రహ్లాదుని మనుమడు)నెత్తిన పాదము మోపిన స్థలము. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలిని దానమడిగి పాతాళానికి అణగద్రొక్కాడు. నీకు(వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు.)గానే చెయ్యి చాచి మూడడుగుల దానము పుచుకున్న ప్రదేశము.

బలిచక్రవర్తి - పాతాలలోక ప్రభువు, అతి ధనవంతుడు, మహాదాత.

ఒంటివాడ నాకు ఒండు రెండడగుల
మేర యిమ్ము; సొమ్ము మేర యొల్ల
కొర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టెద
దాన కుతుక సాంద్ర దానవేంద్ర! - భాగవతం

శర్మద యమదండ క్షత, నర్మద,
నతి కఠినముక్తి వనితాచేతో
మర్మద, నంబునివారిత, దుర్మదం
నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.
భా||
వామనుడు(వటువు - బ్రహ్మచారి, బాలకుడు.) ప్రయాణాన్ని సాగించి దారిలో శుభాలను(శర్మము - సంతోషము)అందించేది, యమబాధల నుండి కవచంవలె కాపాడేది, గడుసుతనంతోకూడిన ముక్తికాంత మనసులోని గుట్టు బయట పెట్టేది, తన నీళ్ళతో దోషాలను నివారించేది అయిన నర్మదానదిని దాటెను.

నర్మదా మోక్షదా చైవ కామధర్మార్థదాయినీ,
గాయత్త్రీ చాథ సావిత్రీ త్రిసంథ్యా తీర్థగామినీ|
 

ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.
ప్రణవము -
ఓంకారము.
ఓమ్ - 1.పరబ్రహ్మార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క పారభూతము. వేద్యాంత గ్రంథము లన్నియు దీనిని ప్రసంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ + ఉ + మ). మంత్రముల కెల్ల శిరోమణి. ఓంకారము నందు సమస్తజగత్తును ఇమిడి యున్నదని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారేశ్వరుడు - శివుడు. 

ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే(మేనకాదేవి) అడ్డు పెట్ట బడినది, 2.కాంతి, 3.పసుపు(హరిద్ర), 4.యశము (యశము - కీర్తి). ఉ - వర్ణమాలలో ఐదవ అక్షరము. ఉ - ఓ బాలికా! మా - వలదు, అని యట్లు తల్లి చేఁ తపస్సు కెళ్ళవద్దని వారించటం వలన పార్వతీదేవికి, ఉమ అని పేరు వచ్చింది.(సనాతనులైన ఉమామహేశ్వరులు).
ఉమాపతి - శివుడు. ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.   

ఆరావంబుదయించెఁదారకముగా నాత్మాభ్రవీథిన్ మహా
కారోకార మకార యుక్తమగు నోంకా రాభిధానంబు, చె
న్నారున్ విశ్వమనంగఁ దన్మహిమచే, నా నాదబిందుల్ సుఖ
శ్రీరంజిల్లఁ గడంగు నీవదె సుమీ! శ్రీకాళహస్తీశ్వరా! 
తా||
ఈశ్వరా! అకార ఉకార మకారములతో ఏర్పడిన ప్రణవనాదము దహరాకాశములో బుట్టినది. అది జీవులను తరింపజేయును. దాని ప్రభావము వలననే విశ్వమంతయు నడచుచున్నది. ఆ ప్రణవ నాదమే బ్రహ్మానంద స్వరూపము. ఆ బ్రహ్మానంద స్వరూపుడవు నీవేకదా!

త్య్రక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా.

కాంతి1 - 1.కోరిక 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ. అభీష్టము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light). హరిద్ర - పసుపు.
వరవర్ణిని -
1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు. పసుపు - (వ్యవ.) ఇది ఒక దుంపజాతి సంబార ద్రవ్యము (Turmeric). అల్లపు కుటుంబము (Zingiberaceae) లోని curcuma longa అను మొక్కను వ్యవసాయదారులు పైరు చేయుదురు. ఈ మొక్కల దుంపలను ఎండబెట్టి పసుపు తయారు చేయుదురు. 

సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీ ర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ,
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శిఖా.

అభివాదనశీలస్య నిత్యం వృద్ధోప సేవినః
చత్వారి సంప్రవర్థంతే కీర్తి రాయు ర్యశో బలమ్.
తా.
పూజనీయులను నమస్కరించు స్వభావము కలిగి, పెద్దల నెల్లపుడు సేవించువానికి కీర్తి, ఆయువు, యశస్సు, బలము అను నీ నాలుగు వృద్ధి నందును.

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ|
సదైవ మాన్ధాతృపురే వసన్త - మోంకార మీశం శివ మేక మీడే.

త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది. 
త్రివేణి -
గంగ, వ్యు.గంగ, యమున, సరస్వతి(అంతర్వాహిని - భూమి లోపల పారెడు నది.) అను మూడు నదులు గలది. ప్రయాగ, త్రివేణి యను పుణ్యతీర్థము మూడు నదుల సంగమము కలిగిన గొప్ప పుణ్యక్షేత్రము.

భగీరథి, జాహ్నవి, అలకనంద అనే ఉపనదులు కలిసి గంగ అనే పేరుతో ప్రయాణం సాగించి హరిద్వార్ వద్ద పెద్దనదిగా మారుతుంది. ప్రయాగ(ప్రయాగము నందు దేవీస్థానం లలిత)దగ్గర యమున, సరస్వతి(అంతర్వాహిని - భూమిలోపల పారెడు నది )దీనిలో కలుస్తుంది. 

నదీశాఖ - (భూగో.) ఒక నది నుండి వేరుపడి ప్రవహించు శాఖోపశాఖలు, (ఇట్టి శాఖలు తిరిగి నదిలో కలియవు).

శోణము - 1.ఎరుపు, 2.ఒక నది, 3.నిప్పు.
శోణిమ -
ఎరుపు, రూ.శోణిమము.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.

శోణో హిరణ్యవామ స్స్యాత్ -
శోణతీతి శోణః. శోణృ వర్ణగత్యోః. - ప్రవహించునది.
శోణవర్ణత్వాద్వా శోణః - ఎఱ్ఱనికాంతి గలది.
హిరణ్యం(హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.)వహతీతి హిరణ్యవాహః. వహ ప్రాపణే. - హిరణ్యమును వహించునది. ఈ రెండు శోణ నదము పేర్లు.

పవిత్రీకర్తుం నః - పశుపతిపరాధీనహృదయే 
దయామిత్రై ర్నేత్రై - రరుణధవళ శ్యామరుచిభిః|
నద శ్శోణో గంగా - తపనతనయేతి ధ్రువ మముం
త్రయాణాం తీర్ణానా - ముపనయసి సమ్భేద మనఘమ్|| - 54శ్లో
తా.
అజ్ఞానులైన ప్రాణులను కాపాడువాడైన పశుపతి(పశుపతి - శివుడు)యందు లగ్నమైన హృదయము గలిగిన తల్లీ!  దయామిత్రములైన ఎఱ్ఱని, తెల్లని, నల్లని కాంతులుగల నీ కనులచే పాపహరమగు మూడు తీర్థములైన శోణనదము(ఎర్రని) గంగ(ధవళిమ - తెలుపు) యమున (నల్లని) నదుల సంగమ స్థానమును, మమ్ము పవిత్రులనుగా చేయుట కొఱకు తెచ్చు నట్లున్నది. ఇది నిజము. - సౌందర్యలహరి.   

వారణాసి పట్టణము దాటి గంగానది బీహారు చేరిన తరువాత శోణభద్రానది వచ్చి చేరుతున్నది. దీనికి ప్రాంతీయ వ్యవహారము ' సోన్ ' అని.

గయ - ఫల్గునీ నదీ ప్రాంత నగరము, బీహారు రాష్ట్రము నందలి ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రము. గయలో శక్తిపీఠం గయా మాంగళ్యగౌరికా| 

గోమతీం గండకీం స్నాత్వా విపాశం శోణ ఆప్లుతః |
గయాం గత్వా పితౄనిష్ట్వా గంగాసాగరసంగమే|

కేదారుడు - గంగాధరుడు, శివుడు వ్యు.శిరస్సున భర్య కలవాడు.  గంగాధరుడు - 1.శివుడు, 2.సముద్రుడు(శంతనుడు సముద్ర అంశతో జన్మించినినవాడు, కావుననే గంగ అతనిని భర్తగా ఒప్పుకుంది).  కేదార పీఠము నందు సన్మార్గదాయిని.

హరుఁడు - శివుడు.
శివుఁడు -
ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 

విమలం పరిలఘు శిశిరం గంగే ! తవ వారి కథ మహం గాహే,
మలినయతి కంఠమూలం జటిలయతి శిరో నిటల ముష్ణయతి|
తా.
గంగా! పరిశుద్ధమును మిగులఁదేలికయైనదియు నత్యంతము శీతల స్వభావము కలదియు నైన నీజలములయం దెట్లు మునుఁగుదును ? ముఁనిగిన వెంటనే కంఠమూలము నైల్యమును వహించును. తల జటిలమౌను. నిటలము వేఁడియెక్కును. (గంగాజలమందు మునిఁగిన వాఁడు శివస్వరూపము జెందునని భావము.)

కేదారం హిమవత్ పృష్ఠే - కేదారేశ్వరుడు (ఉత్తరాంచల్)

కేదారము - 1.వరిమడి, 2.కొండ, 3.కేదారఘట్టము (కాశీలో నొక పుణ్యస్థలము), 4.పాదు, 5.శివలింగభేదము.
పాదు - 1.కుదురు, ఆలవాలము, 2.నిలకడ, 3.ఆశ్రయము, సం.పాదః, పదమ్.
ఆలవాలము - 1.పాదు.
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4వ వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములలో అధద్వయముచే వేరుచేయబడిన నాలుగుభాగములలో నొకటి (Quadrant).
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు. 

హిమాద్రి పార్శ్వేద్రి తటే రమన్తం - సంపూజ్యమానం సతతం మునీన్ద్రైః|
సురాసురై ర్యక్షమహోరగాద్ర్యైః  - కేదార సంజ్ఞం శివ మీశ మీడే.

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక(కూతురు, బంగారు బొమ్మ).
విశాలాక్షి -
హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షీ శక్తిపీఠం|
భవ్య - పార్వతి, హైమవతి. 

లోకజనని - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
లోకమాత - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.          

లోకానం మాతా లోకమాతా - ఎల్ల లోకములకు తల్లి.

మా - 1.లక్ష్మి, 2.తల్లి,  విణ. మిక్కిలి  సం.మహాన్.
మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి (పంచ మాతలు :- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య వదిన తల్లివంటిది, భార్యజనని, స్వజనని).

శ్రుతీనాం మూర్ధానో - దధతి తవ యౌ శేఖరతయా
మమా ప్యేతౌ మాత! - శ్శిరసి దయయా ధేహి చరణౌ|
యయోః పాద్యం పాథః - పశుపతి జటాజూట తటినీ
యయౌ ర్లాక్షాలక్ష్మీ - రరుణ హరి చూడామణిరుచిః|| - 84శ్లో 
తా.
ఓ! లోకమాతా! శ్రుతుల(వేదముల) శిరస్సులైన ఉపనిషత్తులు నీ సిగలో అలంకరించుకొన్న పుష్పములుగ(శిరోభూషణములుగ) నున్నవి. శివుని(పశుపతి - శివుడు)జటాజూటంలో వర్తించే గంగానది(నెత్తికెక్కిన ఆడది చిత్తం స్వామీ అంటూ కాళ్ళు కడుగుతోంది) నీకు పాద్యము(పాద్యము - పాదము కొరకైన నీళ్ళు) అగు చున్నది. ఎఱ్ఱనై హరికి శిరోభూషణమైన మణిమయకిరీటం(చింతామణి - కోరికలొసగు దేవమణి) యొక్క కాంతులే లాక్షారస(చరణలత్తుక) కాంతి గాగలవియు నగు నీదు పాదములు, కృపతో కూడిన చిత్తంగల దానవై, నా శిరస్సు మీదకూడ ఉంచు. -  సౌందర్యలహరి         

దేవి దశనామస్తొత్రం

శ్లో|| గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ,
      రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశా||

ఆదిశక్తి - 1. పరమేశ్వరుని మాయాశక్తి, 2. దుర్గ(ప్రకృతి శివునితో కలిసి ఉన్నపుడు దుర్గ రూపం), 3. లక్ష్మి(ప్రకృతి విష్ణువుతో కలిసి ఉన్నపుడు లక్ష్మీ రూపం) 4. సరస్వతి.
మహాలక్ష్మి - 1.సరస్వతి,  2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి. కరవీరము నందు దేవీస్థానం మహాలక్ష్మి
దత్తాత్రేయుని భార్య, మహాలక్ష్మి. - ఈ విశ్వంలోని సకల సంపదలకు, సిరులకు మూలము శ్రీ మహాలక్ష్మియే.
మహాలక్ష్మీ ర్మహాకాళీ మహాకన్యా సరస్వతీ.

భారతి - 1.సరస్వతి, 2.వాక్కు. 
సరస్వతి - బ్రహ్మదేవుని భార్య, చదువులరాణి, గొప్ప అందగత్తె. సరస్వతిని ఎన్నడూ చులకనగా చూడరాదు.

మిధునరాశిలో(గురుడు) సరస్వతినది పుష్కరాలు. చాతుర్మాస్యలలో పౌర్ణమినాడు, సూర్య చంద్ర గ్రహణ సమయాలలో, పర్వదినాల్లో సరస్వతి నదిలో స్నానం చేసినవాడు భూమిలో సర్వపూజ్యుడై జన్మాతమందు నాకలోకవాసి అవుతాడు. (నాకము - స్వర్గము, ఆకాశము.)

Naimisaranya forest, is a hallowed place on the banks of the river Saraswati, where all puranas were narrated(నైమిశమునందు దేవి లింగధారిణి).

భారతీ కమలా భాషా పద్మా పద్మావతీ కృతిః,
గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ. - 37శ్లో

శారద -1.సరస్వతి 2.పార్వతి. శారదా శరసంధానా సర్వశస్త్ర స్వరూపిణీ. సావిస్ర - 1.సరస్వతి, 2.పార్వతి, 3.సత్యవంతుని భార్య.

స్వాహాకారః స్వధాచైవ - కళా కాష్ఠా సరస్వతీ|
సావిత్రీ వేదమాతా చ - తథా వేదాంత ఉచ్యతే||

త్రిపది - 1.ఏనుగు కాలి సంకెల 2.గాయత్రి. వేదవదమునందు గాయత్రి, సవిత్రీ చ సౌమంగల్యాధి దేవతా.

సహస్రాదిత్య సంకాశా చంద్రికా చంద్రరూపిణీ,
గాయత్రీ సోమసంభూతి స్సావిత్రీ ప్రణవాత్మికా.

గాయత్రి, సరస్వతుల యందు స్నానం చేసినవారికి ఆనందముతో గర్భవాస(జన్మ) క్లేశము ఉండదు.

వరదాభయ హస్తాబ్జా రేవాతీర నివాసినీ,
ణిప్రత్యయ విశేష్జా యంత్రాకృతి విరాజితా| - గాయత్రీ

బ్రహ్మకు సరస్వతి, గాయత్రి భర్యలు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు - పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ, సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందుతాయి. గాయత్రికి మంత్రమాత్రుక అని పేరు,  తనను కిర్తించేవారిని కాపాడునది. గాయత్రి అన్నా సావిత్రి. సావిత్రి వేదమాత. ప్రకృతి బ్రహ్మతో చేరినపుడు సావిత్రిగా రూపం పొందుతుంది.

గాయత్రీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా,
గేయగాన ప్రియా గౌరీ గోవింద పదపూజితా| - గాయత్రీ

గంగలు: 1. కావేరి, 2.తుంగభద్ర, 3.కృష్ణవేణి, 4.గౌతమి, 5.భాగీరథి,  వీనినే పంచ గంగలందురు.

గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వశ్యత తుంగభద్ర, సుప్రయోగ మరియు కావేరి, సహ్యపర్వత పాదప్రదేశమునుండి బయలుదేరిన దక్షిణాపథపు నదులు. 

కావేరి - 1.కావేరీనది,  2.పసుపు.
కావేరినదిని దక్షిణ గంగ అని పిలుస్తారు. కావేరి జలశక్తి అధికముగా సమకూర్చునది. కావేరి తీరంలో శ్రీరంగం (శ్రీరంగడు) క్షేత్రం ఉంది, అది భూలోక వైకుంఠాము(విష్ణు స్థానము, అక్షయ స్థానము). 

నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోక విలాసినీ,
వైకుంఠ రాజ మహిషీ శ్రీరంగ నగరాశ్రితే|

కావేరీ జలము - Water or the Cavery రుచిగా, తేలికగా నుండును; శ్రమను పోగొట్టును; ఆకలిపుట్టించును; దద్దురు, కుష్టు మొదలగు చర్మరోగములను, వాతమును, కడుపులోబల్ల వీనిని హరించును; రుచి బుట్టించును; బుద్ధికి బలమిచ్చును; వీర్య(వీర్యము - 1.పరాక్రమము, తేజము, ప్రభావము, 2.రేతస్సు.)వృద్ధి; మిక్కిలి ఆరోగ్యకరమైనది.

కవేరపర్వతాత్ప్రభవతీతి కావేరీ - కవేరమనెడు పర్వతమునఁ బుట్టినది. కవేరస్య రాజ్ఞో పత్యం స్త్రీ కావేరీ - కవేరుఁ డనురాజు కూఁతురు.

తులారాశిలో(గురుడు) కావేరినది పుష్కరాలు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలయందునా చేరుతుంది. కార్తీకమందలి సుర్యోదయవేళ కావేరినదిలో స్నానం చేసి, విష్ణ్వర్చన చెసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు.

స్నాత్వా తులార్కే కావేర్యాం మహాత్మ్యశ్రవణంకురు,
గవాశ్వవస్త్రధాన్యాన్న భూమికన్యాప్రదో భవ. - 16శ్లో  

హరిద్ర - పసుపు.
హళఁది -
1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ. 
వరవర్ణిని - 1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.

ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొడుచు పసరు రేఖ, సం.పలాశః.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.  
గరుడపచ్చ(ౘ) - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము. 
కిరీటపచ్చ - మరకతము, గరుడపచ్చ.
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు. 
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు). ఇంద్రనీలము - నీలమణి.  
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు). 
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, 12000 శ్లోకములు గలది, గరుడదేవతాకమైన అస్త్రము.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు. 

అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.    

పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.
పీతాంబర పరిధాన సూరకల్యాణనిధాన నారాయణ|

కామకోటిపురీం కాంచీం కావేరీం చ సరిద్వరామ్ |
శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః | 

వేణి - 1.అనేక ప్రవాహముల కూడిక, 2.కాలువ, 3.వేనలి (సర్పాకారముగల జడ).
కాలువ - నీరుపారు మార్గము.
వేనలి - వేణి, కొప్పు, కేశకలాసము, జుట్టు, సం.వేణీ.

వేణీ ప్రవేణీ -
వేణతీతి వేణీ. ప్రవేణీ చ. - అణగి యుండునది.
వేణృ నిశామన వాదిత్రాదాన గమన జ్ఞాన చిన్తాసు. పా. వేణిః ప్రవేణిః. ఈ రెండు (మగఁ డూరలేని మగువలు మున్నగువారు) అల్లిన జడ పేర్లు.    

గంగా సరస్వతీ వేణీ యమునా నర్మదాపగా,
సముద్ర వనసా వాసా బ్రహ్మాడ శ్రేణి మేఖలా.

పయస్విని - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్ 
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా.
  
తా. పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలను త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, పిల్లి అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)గలవాడు, తగవు యొక్క న్యాయ న్యాయములను విమర్శించి నిర్ణయించును, తెలివి లేనివా డట్లుచేయలేదు.    

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 -
హంస, సం.హంసః.
అంచ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘరౌతు - హంసవాహనముగా గలవాడు, బ్రహ్మ.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.

తుంగభద్ర  -  Water of the Tungabhadra river. తుంగభద్ర నదీ జలాల ప్రాశస్త్యాన్ని సూచించేదే 'గంగా స్నానం - తుంగా పానం'  అన్న సామెత. తుంగా జలాలు తాగటానికే కాదు, స్నానానికీ మంచివే. చల్లగ, నిర్మలముగ, ఆరోగ్యముగ నుండును. త్రిదోషహరమై బలము నిస్తుంది.  

మకరరాశిలో(గురుడు) తుంగభద్రనది పుష్కరాలు. కృష్ణానదికి తుంగభద్ర ప్రధాన ఉపనది.

ఉపనది - (భూగో.) పెద్దనదిలోనికి పోయిచేరెడి చిన్ననది.

తుంగ - ఒక విధమిన గడ్డి.
నాగరము -
1.సొంటె, 2.తుంగ, 3.సంసృతలిపి, సం.విణ. నగరమున పుట్టినది, వి.స్త్రీలు తలపై ధరించు ఒక నగ.
ముస్త - తుంగ.
ముస్తె - తుంగగడ్డ, సం.ముస్తా.
తుంగము - పొడవైనది.

(ౙ)జంబు - ఒక విధమైన తుంగ.
జంబుగూడు - జంబుతో నల్లినగూడు, రూ.జమ్ముగూడు.

శ్రీమచ్ఛంకరదేశికేంద్రరచితే తుంగాపగాతీరగే
శృంగేరాఖ్యపురస్థితే సువిమలే సన్మౌనిసంసేవితే|
పీఠే తాం రవికోటిదీప్తిసహితాం రారాజమానాం శివాం
రాజీవాక్షముఖామరార్చితపదాం వందే సదా శారదామ్.

గండోలి - 1.ఎఱ్ఱతుమ్మెద, కణుదురీగ, 2.ఆడుహంస, 3.భద్రానది. ఇంటిలో కణుదురీగ దూరితే ఇల్లు కాల్చుకుంటారా!
కందురీఁగ - కందురు.
వరట - ఆడుహంస, వి.పేడ యెండిన చెక్క.  
హంసి - ఆడుహంస.

గణ్డోలీ వరటా ద్వయోః :
గణ్డం కపోలం ఉలతి ఆవృణోతీతి గణ్డోలీ. ప్స. ఉల సంవరణే. – చెక్కిలి (కపోలము - చెక్కిలి) మీఁద ముసురునది.
పా, గన్ధయ త్యర్దయతి గన్ధోలీ. గన్ధ అర్ధనే. - పీడించునది.
వృణోతీతి వరటా. ప్స. వృఞ్ వరణే. - అంతట వ్యాపించునది. ఈ మూడు  కణుఁదురీగ(ఎఱ్ఱతుమ్మెద) పేర్లు.

అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
క్ర్రేంకృతము - 1.హంసాదులధ్వని, 2.అందెలచప్పుడు. 

పదన్యాసక్రీడా - పరిచయ మివారబ్ధుమనసః
స్ఖలన్త స్తే ఖేలం - భవనకలహంసా న జహతి,
అతస్తేషాం శిక్షాం - సుభగమణిమఞ్జీర  రణిత
చ్ఛలా దాచక్షాణం - చరణకమలం చారుచరితే! - 91శ్లో

తా. చక్కని నడువడిగల యో పార్వతీ! నీ అద్భుత గమనవిన్యాసాన్ని (క్రీడనము - 1.ఖేలనము, విలాసము, ఆట, 2.ఆటబొమ్మ.)గాంచి అడుగువేయ(నడక) నేర్చుకోదలచినవై, నీ యింటనున్న హంసలు తొట్రుపాతు చెందుతూ నీ గమన విలాసాన్ని వీడకున్నవి(పెంపుడు హంసలు స్వాభికముగా పెంచువారి వెంట పోవును.). అందువల్ల నీ పాదకమలం, కెంపులు మొదలగు రత్నాలు తాపిన అందియ మ్రోతలనే నెపంతో, ఆ రజహంసలకు(కలహంస - 1.కాదంబము, ధూమ్రవర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.) ఖేలన(ఖేల - ఆట)శిక్షను నేర్పుతున్నట్లుగా ఉన్నది. - సౌందర్యలహరి

తుంగభద్రా తటే పూర్వమభూత్పత్తన ముత్తమమ్|
యత్ర వర్ణాః స్వధర్మేణ సత్యసత్కర్మతత్పరాః||

కృష్ణవేణి - కృష్ణవేణి అనునది, కృష్ణానది.
కృష్ణ -
కృష్ణానది(కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం), యమునానది, ద్రౌపది( పాండవుల భార్య, ధీరురాలు, పార్వతీదేవి భక్తురాలు), నీలిద్రాక్ష, జీలకర్ర, కృష్ణ తులసి, నల్లావాలు. 

కృష్ణోదకము - Water of the Krishna river కృష్ణానది జలము రిచిగానుండును. కాక, పైత్యముజేయును, మిక్కిలి జఠరదీప్తి నిచ్చును. వాతమును, జడత్వమును, కడుపులో బల్లను బోగొట్టును, వీర్య(వీర్యము - 1.పరాక్రమము, తేజము, ప్రభావము, 2.రేతస్సు.)పుష్టి, బలము, ఆరోగ్యము నిచ్చును. 

కన్యారాశిలో(గురుడు) కృష్ణానది పుష్కరాలు.

కేవలంబు కృష్ణాతరంగిణిని జేరి
బ్రహ్మకోరిన దంతయుఁ బండుచేసి
వెలసినాఁడవు నీటిలోతులను దెలిసి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

కాళింది - యమునానది, శ్రీకృష్ణుని భార్య.
యమున -  యమునానది, పార్వతి(శివ సన్నిధిని పార్వతి), (వికృ.) జమున.
జమున - యమున(యమున యందు దేవీస్థానం మృగావలి).
సూర్యతనయ - యమున, యముని తోబుట్టువు.

కాళిందీ సూర్యతనయా యమునా శమనస్వసా:           కళిందపర్వతాజ్ఞాతా కాళిందీ - కళింద పర్వతమువలనఁ బుట్టినది. సూర్యస్య తనయా సూర్యతనయా - సూర్యుని కూఁతురు.          యమేన సహ జాతా యమునా - యమునితోఁ గూడఁ బుట్టినది. శమనస్య యమస్య స్వసా శమనస్వసా - యముని చెల్లెలు. 

యదేత త్కాళిందీ - తనుతరతరఙ్గాకృతి శివే!     
కృశే మధ్యే కించి - జ్జనని తవ యద్భాతి సుధియామ్| 
విమర్దా దన్యోన్యం - కుచకలశయో రంతరగతం 
తనూభూతం వ్యోమ - ప్రవిశదివ నాభిం కుహరిణీమ్|| - 77శ్లో
తా.
తల్లీ! పరమశివుని పట్టపురాణీ! యమునానది తరంగమువలె సన్ననైన కృశించిన(తనుమధ్య - స్త్రీ, సన్నని నడుముకలది.)నీ నడుము నందు కొలదిగనున్న(కించిత్తు - ఇంచుక కొంచెము)నూగారు - కలశములవంటి స్తనముల నడుమ మధ్యనున్న ఆకాశం(వ్యోమము - 1.ఆకసము, 2.నీరు), ఆ కుచములు రెండు పరస్పరం ఒరయుటవల్ల, మిగుల నలిగినల్లనై సన్నగా కిందికి నాభివరకు(కుహరము - 1.గుహ, 2.రంధరము.) - లక్కజారినట్లు జారినదిగా పండితు(సుధి-విద్వాంసుడు)లూహించుచున్నారు. – సౌందర్యలహరి 

ఇడా పింగళా సుషుప్నా నాడులను గంగ యమునా సరస్వతులుగా చెప్పుట కలదు. కాళిందీ నామ యమున నామధేయ పింగళానాడి గత ప్రాణ క్రియను మనసునందుచుకొని యీ ఉపమానమును కల్పించుట వున్నది. జారునట్టి ఆకాశతత్త్వము సూర్యమండలమునుండి క్రింది జాఱుచున్నది.   

కర్కాటకరాశిలో(గురుడు ప్రవేశం) యమునానది పుష్కరాలు.    

యమునోదకము - Water of the Jamuna river రుచిగా నుండును. ఇంద్రనీల కాంతిగలిగి మనోహరమై యుండును; గ్రీష్మఋతువు(గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్టాషాడ మాసములు.)నందు కోరతగినది, జఠరదీప్తి, మనోవికాసము, బుద్ధి, బలము, కాంతి వీనినిచ్చును; ఆయాసమును బోగొట్టును, ఆరోగ్యమునిచ్చును.

గంగాం సరస్వతీం నందాం కాలిందీం సితవారణమ్ |
ధ్రువం బ్రహ్మఋషీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్ | 

మధుర -ఒక పట్టణము. ఉత్తరప్రదేశ్ శ్రీకృష్ణ జన్మభూమి - యమునానది. యమునానది వర్షాకాలపు కొత్త నీటి పొంగు తగలి, అంతంత ఎత్తుకి ఎగిరెకెరటాలలో ఉరకలుపెడుతూ, కడు వడిగా ప్రవహిస్తూ ఉంది. వసుదేవుడు పసిగుడ్దు చిన్నికృష్ణునితో నదిలో దిగగానే (శ్రీకృష్ణుని పాదలు తగిలిన యమున పునీతమయింది) మోకాలి బంటి అయి దారియిచ్చి సహాయపడినది.

యమునాతీరవిహార ధృతకౌస్తుభ మణిహార నారాయణ|

శ్రీకృష్ణడు గోపికలతో కలసి జలక్రీడలు సలిపిన పవిత్రమైన నది యమునానది. పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది తీరమున విహరించువాడు శ్రీకృష్ణుడు. 

యమున తీరమున.. సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నదికాదా.....
 

జమునయ్య - సూర్యుడు.

జమున తోబుట్టువు - యముడు.
యముఁడు -
1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ౙముఁడు - యముడు, సమనుడు, సం.యమః.
శమనుడు - యముడు. 

యమునానద్యాః భ్రాతా యమునాభ్రాతా - యమునానదికి తోడఁబుట్టిన వాఁడు. యమునయా సహ యమళత్వేన జాతత్వాద్యమః - యమున తోఁగూడ కవగాఁ బుట్టినవాఁడు.

కాళిందీ బోధసుఁడు - బలరాముడు.
కాళిందీం యమునాం హలేన భినత్తీతి కాళిందీ భేదనః : హలముచేతఁ కాళిందీ నదిని భేదించినవాడు.

దేవకీనన్దన శ్శ్రీశో నన్దగోప ప్రియాత్మజః,
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః.
 

శ్యామ - 1.నడి యవ్వనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి(దుర్గ అంశ), వికృ. చామ.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ. జమున.

ఉష - 1.రేయి, 2.రాత్రివిశేషము, 3.బాణాసురుని కూతురు.
రే - రేయి, యొక్క రూపాంతరము, రాత్రి.
రేయి -
రాతిరి, రూ.రేయి, సం.రాత్రి.
రేకంటు - (రేయి+కంటు) సూర్యుడు, వ్యు.రాత్రికి శత్రువు.

త్రియామ - 1.రాతిరి, 2.పసుపు, 3.యమున.

రజిని - రాత్రి; యామిని - రాత్రి. 
రాత్రి - సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము. 
రాత్రిమణి - చంద్రుడు.

రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.
రక్షస్సు -
రాక్షసుడు.
రక్కసి - రాక్షసి, రాక్షసుడు, రక్కసీడు, సం.రక్షసః. 
రాకాసి - రాక్షసి, రక్కసి,సం.రాక్షసః.
రాక్షసి - రక్కసి.
రక్కెన - 1.రాక్షస స్త్రీ, 2.రక్కెన చెట్టు, విన.ఆయుక్తము, సం.రాక్షసః.
రాక్షస - అరువది సంవత్సరములలో 49వ దాని పేరు. 

హరిద్ర - పసుపు.
వరవర్ణిని -
1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.

ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.

అర్జుని - 1.ఆవు, 2.ఒకజాతి పాము, 3.బహుదానది, 4.కుంటెనకత్తె, 5.బాణాసురుని కూతురు.

శ్యామల - పార్వతి విణ. నల్లనిది.
శ్యామలాంగి -
శ్యామల.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది. 
(ౘ)చామనము - శ్యామలము, నల్లనిది.
(ౘ)చామ - 1.యౌవనవతి, 2.నలుపు, 3.ఒకజాతి పైరు, సం.1.శ్యామా, 2.శ్యామకః.
నీలిమ - నలుపు. (ౘ)చామనచాయ - నల్లనిరంగు.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు. కాలంజరము నందు కాళి, పార్వతి అవతారము, రౌద్రమూర్తి, భయంకరరూపం. 

కాళిందీ నది నలుపు | నలుపు బింబిత మాహాకాశంబు నల్పు |
అందులో కూలంబందు తమాల రాశి నలుపు | ఆ ఘోరాహియున్ నలుపు
తన్ మౌళిన్ నర్తియు నీవు నలుపు | నల్పులు భావింపగా నిన్ని యున్
నాలో నలుపు తొలగున్, చిత్రమిది కృష్ణా ఆపదోద్ధారకా !
    

గోస్తని - 1.ద్రాక్ష, 2.ఒకనది. శక్తిపీఠం మాణిక్యే ద్రాక్షవాటికా|
మధురస - ద్రాక్ష;ద్రాక్ష - ఒకజాతి ఫలలత, ద్రాక్షపండు.
అంగూరు - ఒక రకపు ద్రాక్ష.
ద్రాక్షచక్కెర - (వృక్ష.) ద్రాక్ష పండ్లలో నుండు చక్కెర, గ్లూకోజ్, (Glucose). 
డెక్ స్ట్రోజ్ - (జీవ.) (Dextrose) ద్రాక్ష చక్కెర.
గ్లైకోజిన్ - (గృహ.) (Glycogen) కాలేయపు చక్కెర, (కాలేయము రక్తములో ఎక్కువగానున్న గ్లూకోస్(Glucose)ను, గ్లైకోజిగాన్ మార్చి నిల్వచేయును కాలేయములోను, కండర జీవకణములోను నిలువ చేయబడు చెక్కెర రూపము).

తులసి : ధర్మధ్వజుడు కూతురు తులసి. తులసి నారాయణుని అర్ధాంగి, పద్మాక్షుని వక్షానికి నిత్యనూతనాలంకారం, దుఖః వినాశిని, సర్వసుమ సారం. పుష్కరాది తీర్థాలు, గంగానదులు, విష్ణ్వాది దేవతలు తులసి దళాలలో నివసిస్తూంటారు. తులసీ దళాలుతో విష్ణువును(విష్ణువు అలంకార ప్రియుడు) పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు.

కళయా తులసీ రూపం ధర్మధ్వజసుతా సతీ|
భుక్త్వా కదా లభిష్యామి త్వత్పాదాంబజ మచ్యుత||

బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ|
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణ జీవనీ||

గండకి - 1. సాలగ్రామములు పుట్టెడినది(గంగానదికి ఉపనది), 2. ఆడు ఖడ్గమృగము. సాలగ్రామమునందు దేవీస్థానం మహాదేవి.

సాలగ్రమము - విష్ణుమూర్తి చిహ్నత శిల రూ. శాలగ్రమము. ఎంతటి పాపనికైనా సరే కార్తీక ద్వదశినాడు(మాసంలో) సాలగ్రం దానం చేయడమే సర్వోత్తమైన ప్రయశ్చిత్తం. సాలిగ్రామము ఎంత చిన్నదైతే అంత ప్రశస్తం.
తులసి తనువు విడిచిన శరీరం 'గండకీ అనే పేరుతో ఒక నదియై ప్రవహిస్తోంది. గంగ వలెనే గణనీయ తులసి, తులసి పరదేవత. తులసీ వనమెక్కడ ఉంటుందో, పద్మ వనమెక్కడ ఉన్నదో, సాలగ్రామ శిల ఎక్కడ ఉన్నదో, ఆ ప్రదేశాలలో అచ్చట శ్రీహరి(విష్ణువు) ఉంటాడు.

గండకినది గజేంద్రుడికి(గజదేహుడైన జయుడుకి, మొసలిగా వుంటున్న విజయుడుకి) మోక్షం ఇచ్చిన హరిక్షేత్రంగా విరాజిల్ల సాగింది.

శాలగ్రామం చ తులసీం శంఖం చైకత్ర ఏవచ|
యో రక్షతి మహాజ్ఞానీ స భవేత్ శ్రీహరేః ప్రియః||

గోదారి - 1.వెన్నకాచిన మడ్డి 2.గోదవరి, గోదావరి యందు దేవీ త్రిసంధ్య.
గోదవరి -
గౌతమినది(గౌతమముని భార్య, అహల్య - గౌతముని భార్య, అందగత్తె). గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ|

హలకులిశాంకుధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాతరేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలఁపున జేర్చి కావగదె దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
అహల్యకు నాఁగేలు, వజ్రాయుధము, అంకుశము మొదలయిన వాని రూపములు గల రేఖలుదాల్చియున్న మీ పాదారవిందములను ఇచ్చి, ఆమెను కృతార్థురాలునిగా చేసినట్లు నా హృదయనందు(నీపాదములను) చేర్చి నన్ను కృతార్థునిగా చేయుమా.

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః,
జితేంద్రియో జితక్రోదో జితామిత్రో జగద్గురుః. - 8శ్లో 

శాపకారణము నహల్య చాపరాతి చందమాయె
పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే
రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ||ఎన్నగాను రామభజన||

మిథునం ముద్గలాద్భార్మ్యాద్దివోదాసః పుమానభూత్ |
అహల్యా కన్యకా యస్యాం శతానందస్తు గౌతమాత్ |

గోదావరి - The Godavari water. రుచిగా, మనోహరముగా నుండును; పైత్యవికారము, మేహము, రక్తపైత్యము వీనిని పోగొట్టును; ఆకలి బుట్టించును; దాహమునణచును; దుష్టవ్యాధుల నణచును; శ్లేష్మము, వాతము, శిరోరోగము, పాండువు, ఉబ్బు వీనిని హరించును; యీపవిత్రమైన నదిలో స్నానము చేయుచుండిన మేహపైత్య రోగములు హరించుటయేగాక దేహపుష్టి, బలము, కాంతి, బుద్ధిబలము, ఆయుర్వృద్ధి ఆరోగ్యము నిచ్చును. 

సప్త గోదావరీ మాతా - గోదావరి విశ్వరూపము రాజమహేంద్ర వరము దగ్గరనే| ఇక్కడ గోదావరికే అఖండ గౌతమి అని పేరు (గౌతమీ గోమతీ గౌరీ ఈశానా హంసవాహినీ). ఇక్కడ నుండి గోదావరిని సప్తఋషులు ఏడుపాయలుగా తేసుకొని వెల్లి సముద్రమున కలిపిరి.

గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు. గౌతముడు శివుని గురించి చేసిన ఘోరమైన తపస్సు చేసాడు. ఆ ప్రయత్నంలోనే గోదావరీనది ఆవిర్భవించింది. సమస్త దేవతలు ప్రత్యక్షమై పన్నెండేండ్ల కొకసారి బృహస్పతి(గురుడు) సింహరాశిలో ప్రవేశించిన ముహూర్తంలో (గోదావరి పుష్కరాలు)తాము, ఈ గంగలో నివసించి వుంటామని గౌతమునికి వరమిచ్చారు.

ఉపస్పృశ్య మహేంద్రాద్రౌ రామం దృష్ట్వాభివాద్య చ |
సప్తగోదావరీం వేణాం పంపాం భీమరథీం తతః |

ఆత్రేయ - 1. ఋతుమతి, 2.అత్రివంశమున పుట్టిన స్త్రీ, 3. అత్రి మహాముని భార్య, 4. సప్త గోదావరులలో ఒకటి.
ఋతుమతి - పుష్పవతి, ముట్టుత.
పుష్పవతి - రజస్వల, ముట్టుత.
రజస్వల - ముట్టుది; ముట్టుత - రజస్వల.
పుష్పిణి - పుష్పవతి.
స్త్రీ ధర్మిణి - ఋతుమతి, చెరగు మాసినది.

నై కస్వస్యాచ్ఛూన్య గేహేశయానాం నప్రధర్షయేత్ |
నోదక్యాయా భిభాషేత యజ్ఞంగచ్చేన్నచాహుతిః |
తా.
శూన్యగృహమం దొక్కఁడు నిద్రింపఁగూడదు, నిద్రించువాని లేపఁగూడదు, రజస్వలయై యున్న స్త్రీతో మాట్లాడరాదు, పిలువకనే యజ్ఞంబునకుఁ బోవలయును. - నీతిశాస్త్రము

అనసూయ - అత్రిమహాముని ధర్మపత్ని, మహాపతివ్రత, తన పాతివ్రత్య మహిమచే త్రిమూర్తులను పసిబిడ్డలుగా చేసి లాలించింది. అనసూయ, అసూయలేమి  

ముగ్గురాడవాళ్ళు ముగ్గురయ్యల్ని పంపితే - ఆ అమ్మ ఆ ముగ్గుర్ని ఒకేసారి కన్నది - అనసూయ.

అనఘుం డత్రిమహాముని,
యనసూయా దేవివలన నజ హరి పుర సూ
దనుల కళాంశంబుల నం,
దనులను మువ్వురను గాంచెఁ దద్దయుఁ బ్రీతిన్.
భా||
పవిత్ర చరిత్రుడయిన అత్రిమహాముని, తన అర్థాంగియైన అనసూయాదేవివల్ల ముగ్గురు కొడుకులను పొందాడు. ఆ కొడుకులు ముగ్గురు బ్రహ్మ అంశవల్ల చంద్రుడు, విష్ణువు అంశవల్ల యోగవేత్త అయిన దత్తాత్రేయుడు, మహేశ్వరుల(మహాదేవుని - శివుడు)అంశవల్ల దుర్వాసుడు జన్మించారు. ఆ ముగ్గురు పుత్రులు సాటిలేని పవిత్రశీలము గల ఉత్తాగుణ సంపన్నులు.      

Brahma was born to her(Anasuya Devi) as Chandra (the Moon). By his pleasant and cool rays, he protects plants, herbs and human beings. Atri made his son Chandra as Prajapati(progenitor). In Chandra’s lineage, several illustrious kings were born and ruled the earth righteously.

Maheswara was born as Durvasa to her(Anasuya Devi) and he became a sage. By virtue of Rudra’s divinity in him, he could punish any one who might resort to insulting him, by his fiery looks alone. He was always on the move in the world, visiting several holy places.

పడతి మోసెనొకడు - పడతి మేసెనొకడు - పడతి నెదను పెట్టి బ్రతికెనొకడు. - శివుడు - బ్రహ్మ - విష్ణువు

గోద1 - 1.విష్ణుచిత్తుని పుత్త్రిక, గోదాదేవి, 2.గోదావరి.
గోద2 - ఎద్దు, వృషభము, (వ్యావ.) గొడ్డు, గోద.
గొడ్డు - ఈనని పశువు, గొడ్రాలు, విణ.శూన్యము. 
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పడిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక.
శూద్రి - శూద్రుని భార్య.   

పశువు - చతుష్పాదము, గొడ్డు.
పశుపతి - శివుడు.

విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||

తా. లోకమునందు గొడ్రాలు, సహింపగూడని ప్రసవవేదన నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము

గోల - 1.వట్రువయగు నీటికాగు, 2. గుండ్రని పదార్ధము, 3.మణిశిల, 4.చెలికత్తె, 5.గోదావరీనది, వి. 1.ముగ్ధ, ముగ్ధుడు, 2.కలకలము.

క్రూరమనస్కులౌ పతులఁగొల్చివసించిన మంచివారికిన్
వారిగుణంబుపట్టి చెదువర్తనవాటిలుఁ, మధురీజలో
ధారలు గౌతమీముఖమాహానదు లంబుధిఁగూడినంతనే
క్షారముఁజెందవే మొదలి కట్టడలన్నియుఁదప్పి భాస్కరా.
తా.
గోదావరీ మొదలగు మహా నదులలోని తియ్యని నీళ్ళు సముద్రమున కలసి నంతనే, వాని తీయదనమును పోగొట్టుకొని ఉప్ప దనమునే పొందును. అట్లే దుర్మార్గులగు యజమానులను సేవించు వారికి వారి దుర్మార్గతయే పట్టుబడును.  

గోదావరీ భీమరథీ కృష్ణా వేణీ చ గౌతమీ. - గోదావరి, భీమరథి, కృష్ణవేణి నదులు సహ్యగిరి పాదమందు పుట్టినవి.

సహ్యాద్రిపార్శ్వేబ్ది తటే రమన్తం  గోదావరీ తీర పవిత్ర దేశేః|
యద్దర్శనా త్పాతక జాతనాశః  ప్రజాయతే త్ర్యమ్బక మీశ మీడే.

వృశ్చికరాశిలో(గురుడు ప్రవేశం) భీమానది పుష్కరాలు. పండరీపురం భీమానది ఒడ్డున వుంది. భీమానది కృష్ణానది ఉపనదిలో ఒకటి, పశ్చిమాన పారి కృష్ణానదిలో కలుస్తుంది.

శ్లో. అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తధా|
పంచ కన్యాః స్మరేన్నిత్యం మహా పాతక నాశనం||

భాగీరథి - గంగ, భాగీరథునిచే భుమికి తేబడినది.  భగీరథేన రాజ్ఞా భూలోకమవతారితేతి భాగీరథీ - భగీరథుఁడను రాజుచేత భూలోకమునకుఁ దేఁబడినది. భగీరథుడు నేలకు దించినందున 'భాగీరథి' అయింది. Bhagirathi river where blood and beauty are represented in equal measure.

అమ్మా ! నినుఁ జూచిన నరుఁ,
బొమ్మాయని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో,
రమ్మా నా కెదుర గంగ ! రమ్యతరంగా
భా||
అమ్మా ! గంగమ్మా ! రమణీయ తరంగాలు కలిగినదానా ! ఉన్నావమ్మా ! నిన్ను దర్శించిన వారిని 'పో' అని అంటూ మోక్షానికి పంపిస్తావని విన్నాను. కదలి లేచి రావమ్మా ! నీ రూపంలో కనికరించి నాకు ఎదుట నిలిచి దర్శన మీయవమ్మా !

సింధువు -1.ఒక నది, అఖంఢ భారత్ లో పొడవయినది, 2.సముద్రము, 3.ఏనుగు(మహామృగము - ఏనుగు), 4.నదము, 5. ఒక దేశము.

దేశే నదవిశేషే బ్ధౌ సిన్ధు ర్నా సరితి స్త్రియామ్ :
సింధుశబ్దము దేశ విశేషమునకును, నద విశేషమునకును, సముద్రము నకును పేరైనపుడు పు. సామాన్యముగా నదికిని నదీ విశేషమునకును పేరైనప్పుడు సీ. స్యందత ఇతి సింధుః. స్యందూ ప్రస్రవణే. - ప్రవహించునది. "సింధు ర్గజమదే పిస్యా' దితి శేషః.

మహాశయము - సముద్రము; మకరాలయము - సముద్రము. 
సాగరము1 -
నేయి మొ.నవి నింపిన సిద్దెల జోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.
సంద్రుఁడు - సముద్రుడు, సం.సముద్రః.
సంద్రము - సందరము, సం.సముద్రః.
సందరము - సముద్రము, మున్నీరు, రూ.సంద్రము, సం.సముద్రః.

రత్నగర్భుఁడు - 1.సముద్రుడు, 2.కుబేరుడు.
రత్నాకరము -
సముద్రము. సముద్రము - సాగరము.
రత్నగర్భ - భూమి. ప్రకృతి అంశవల్ల భూదేవి ఉద్భవించి సమస్తాన్ని భరిస్తుంది. రత్నాలన్నీ ఇందు ఉండడంతో దీనికి రత్నగర్భ అని పేరు.

అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.

మున్నీరు - మును+నీరు) సముద్రము.
మున్నీటిచూలి - క్షీరసాగరకన్యక, లక్ష్మి.

శ్రీ గల భాగ్యశాలిఁగడుఁ జేరగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన, నిల్వను
ద్యోగ్యముజేసి, రత్ననిలయుండగాదె సమస్త వాహినుల్
సాగరుఁజేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి, భాస్కరా.
తా.
భాస్కరా! నదులన్నియు, సముద్రుడు రత్నములకు స్థానమైన వాడను నాశతో యాతని సమీపించుచున్నవి, అట్లె జనులెల్లరును ఐశ్వర్యవంతు డెక్కడ నుండిన యక్కడి కెంత దూరమునుండి యైనను శ్రమయని తలంపక తమంతమే ఓపికతో నతనిని జేరుటకు వచ్చెదరు.

నదము - 1.పడమరగా పారెడు యేరు, 2.మడుగు, 3.సముద్రము, 4.మ్రోత. బుసి - పశ్చిమ సముద్రము నడుమ నుండు వరుణోద్యాన నది.

సముద్రము - సాగరము.
సాగరము1 -
నేయి మొ. నవి నింపిన సిద్దెలజోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడల నుండి కారుమదము, 3.చతురపాయములలో నొకటి, 4.ఛేదనము.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
వితరణము - ఈవి.
వితరణి - దాత; దాత - ఇచ్చువాడు.
దాని - 1.మదముకలది, 2.దాత.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.

సింధురము - ఏనుగు, వ్యు.కణతల నుండి మదము కారుచుండునది.

ఉదత్తుఁడు - 1.వేదమందలి ఊర్థ్వస్వరము, (వ్యతి.) అనుదత్తము), 2.దానము, 3.పెద్దమద్దెల, 4.(అలం.) ఒక అర్థాలంకారము, విణ.1.ఎత్తైనది, 2.గౌరవము కలది, 3.ధారాళము.
ఉదత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుఁడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.  
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము. 
మోమాటము - 1.దాక్షిణ్యము, కనికరము, 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.

దాతృత్వము ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞాతా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా.
ఈవి యిచ్చుట, విననింపుగా బలుకుట, ధైర్యము(ధైర్యము - ధీరత్వము) కలిగి యుండుట, మంచిచెడులెఱిగి తెలివిగానుండుట, ఈ నాలుగు తనతోఁ గూడఁ పుట్టునవి యే కాని నేర్చుటచే గలుగవు. - నీతిశాస్త్రము  

సింధునది సముద్రంలో సంగమించే తీర్థానికి వరుణ తీర్థం అని పేరు. కుంభరాశిలో(గురుడు) ప్రవేశం సింధునది పుష్కరాలు.

మొగాళము - (వ్యావ.) నదీ సముద్రాదుల ముఖము.
సముద్ర సంగమము - (భూగో.)నదులు సముద్రమున కలియు స్థలము. వేల్మోరి - (భూగో.) నదీసముద్ర సంగమము వద్ద వైశాల్యము తక్కువగు టచే నీరుగోడవలె లేచి కదలుట (Tidal-wave).  

కురుతే గంగా సాగరగమనం ప్రతిపరిపాలన మథవా దానమ్|
జ్ఞాన విహీనః స్సర్వమతేన ముక్తిం న భవతి జన్మశతేన||భజ||
 

వైతరణి - నరకము నందుండు నిప్పుల ఏరు.
నరకము -
దుర్గతి-పాపముచేసి అనుభవించునది.
నిరయము - 1.దుర్గతి, 2.నరకము.
దుర్గతి - 1.నరకము, 2.బీదతనము.

వైతరణీ సిన్ధుః :
విగతం తరణమత్ర వైతరణీ. తౄ ప్లవనతరణయోః - దీనియందు దాఁటుట లేదు.  
వితరణేన(వితరణి - దాత.)గోదానాదినా తీర్యత ఇతి వైతరణిః - గోదానాదులచే దాఁటఁ బడునది.
విరుద్ధం వితరణం(వితరణము - ఈవి.)వితరణం, తదస్యామస్తీతి వైతరణీ - కష్టమైన దాఁటుట గలది.
వితరణౌ అసూర్యే పాతాళీ భవా వైతరణీ. - సూర్యుఁడు లేనిది గనుక వితరణ పాతాళము(పాతాళము - క్రిందిలోకము); అందుఁ బుట్టినది వైతరణి. పాతాళము నందు దేవీస్థానం  పరమేశ్వరి.

క్రోధో వైవస్వతోరాజా ఆశా వైతరణీనదీ|
విద్యా కామధుగ్దేరు స్సంతుష్టో నందనం వనమ్||
తా.
కోపము యముని(వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.)తో సమానమైనది, ఆశ వైతరిణి నదితో సమానమైనది, విద్య(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)కామధేనువుతో సమానమైనది, సంతోషము నందనవనముతో సమానమైనది. - నీతి శాస్త్రము

దానం వలన వైతరిణి నది దాటుతాము. యముడి బలంతో నడుస్తాము. ద అంటే ఇచ్చేది అని అర్ధం. దానం అంటే ఇవ్వబడేది. దాత అంతే ఇచ్చేవాడు, ప్రదాత అంతే విశేషంగా ఇచ్చేవాడు. భూలోకమున దానము శ్రేష్ఠమైనది. ఆ దానము ఆర్తులకు చేసిన మహాపుణ్యము.

"రామో విగ్రహవాన్ ధర్మః" శ్రీ రామచంద్రుడు సూర్యవంశానికి తిలకం లాంటివాడు, రాజులలో శ్రేష్ఠుడైన దశరధునికి పుత్రుడు, సాక్షాత్తూ సృష్టికర్తయైన బ్రహ్మ నిత్య తారకమంత్రంగా జపించే పరబ్రహ్మము.  ఎంత ధనము సంపాదించినా, రామనామం అనే ధనం చివరకు మిగులుతుంది.

Shiva Ganga

 

      
             

 


 

Wednesday, November 2, 2011

గోవు

గోవు పరమ పవిత్రమైనది. భూమి దుష్ట భారంతో క్రుంగి తప్పించుకొనే మార్గం తోచక గోరూపం ధరించింది. ప్రకృతి అయిన ఆదిశక్తే గోరూపిణిగా, గోవుగా జన్మించింది.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాక్భతిః|
అనేకకోటి బ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా ||

గావో విశ్వస్య మాతరః - కన్న తల్లి స్వరూపం గోవు. గోవులు సమస్థ కోరికలను తీర్చే దేవతలు. గోవులనగా వేదములు. ఒక్క గోవుని పూజిస్తే సమస్థ దేవతలనూ పూజించినట్లే! దీనివలన దేవతలంతా తృప్తులవుతారు.

దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ|
గురుమూర్తి ర్గుణనిధి - ర్గోమాతా గుహజన్మభూః. - 121శ్లో

సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
కామధేనువు -
వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు.
సురగలి - కామధేనువు; కామదుఘ - కామధేనువు.
తెలిమొదవు - కామధేనువు; వెలిగిడ్డి - కామధేనువు.
ఈవులమొదవు - కామధేనువు. 

తెల్లని మేనును నమృతము,
జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బెల్లున నర్థుల కోర్కులు,
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.
భా||
చిలుకుతున్న పాలసముద్రంలో నుంచి తెల్లని శరీరమూ, జిల్లుమంటూ బాగా పాలుకార్చే పొదుగూ చక్కని కొమ్ములూ కలిగి ఉన్నది అయిన కామధేనువు మొదటగా పుట్టింది. అది పుష్కలంగా కోరిన కొరికలను కురిపించే వెల్పుటావు.

సురభి(కామధేనువు) గోమాత, ప్రకృతి కళ నుండి పుట్టినది. సురభి గోలోకంలో వుండే పరమపావనమూర్తి. గోమాత యనగా సర్వలోకా రాధ్యయైన కామధేనువునకు ప్రతిరూపము.

సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నదీ, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు గురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.

లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.

కళ్యాణి - 1.గౌరి(కన్యాకుబ్జమునందు దేవీస్థానం గౌరి), 2.భూమి, 3.ఒకానొక రాగము 4.ఆవు.

వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ(చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి -
1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.
ఆఁబోతు - (ఆవు+పోతు), 1.ఎద్దు, 2.అచ్చుపోసి విడిచిన ఎద్దు, బసవడు.
ఎద్దు - వృషము, (బహు. ఎడ్లు).
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.
బసవఁడు - వృషభము.
వృషభము - 1.ఎద్దు, బసవన్న, 2.వృషభరాశి.
నంది - 1.శివుని వాహనమైన వృషభము, 2.వృషభము.
బసవి - శివునకు పరిచర్య చేయుటకై చిన్నతనమునందే యర్పింపబడిన స్త్రీ, సం.పశుపీ.
ఆఁబోతురౌతు - శివుడు, వ్యు.అబోతు నెక్కువాడు.  

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).

ఆఁబోతుసొరము - వీణ యందును కంఠము నందును బుట్టు ఒక స్వరము, సప్తస్వరములలో రెండవది, ఋషభము.
ఋషభము - 1.ఎద్దు, 2.మదించిన ఏనుగు, 3.సప్తస్వరములలో ఒకటి.
ఋషభధ్వజుఁడు - శివుడు.

ఆఁబసి - (ఆవు+పసి) ఆవు.

గోవునకు గవి, మాహేయి, ఇల, ఇడ, శృంగిణి, సావిత్రి(ఆవు, తల్లి) మొదలగు పేర్లు కలవు.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

గవి1 - ఆవు; ఆవు - గోవు.
గవి2 -
1.గుహ, 2.గుంట.
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.

ఎద1 - పశుఋతువు.
ఎద2 - హృదయము, సం.హృత్.

మాహేయీ సౌరభేయీ గౌ రుస్రా మాహా చ శృఙ్గిణీ.
అర్జు న్యఘ్నా రోహిణీ స్యాత్ :
మాహాగౌఁ, తస్యా అపత్యం మాహేయీ. ఈ.సీ. - మాహ యనఁగా ఆవు, దానికి పుట్టినది.
సురభే ర్గోత్రాపత్యం స్త్రీ సౌరభేయీ. ఈ.సీ. - సురభి అనఁగా కామధేనువు; దాని వంశమందుఁ బుట్టినది.
గచ్ఛతి స్వస్థానమితిగోః. ఓ. సీ. - ఉనికిపట్టునకుఁ బోవునది.
వసత్యస్మిన్ క్షీరమితి ఉస్రా. వస నివాసే. - దీనియందు పాలుండును.
మహ్యత ఇతి మాహా. మహ పూజాయాం. - పూజింపఁ బడునది.
శృంగ యోగాత్ శృగిణీ. ఈ.సీ. - కొమ్ములు గలది.
ప్రాయేణ ద్వళత్వా (ద)అర్జునీ. ఈ.సీ. - తఱచుగా తెల్లనై యుండునది.
నహన్యత ఇత్యఘ్నా. హన హింసాగత్యోః. - హింసింపఁ బడునది.
రోహిణీనక్షత్ర వదభ్యుదయ హేతుత్వ్వత్. రోహిణీ. ఈ.సీ. - రోహిణీ నక్షత్రమువలె శుభహేతువైనది. ఈ ఎనిమిది ఆవు పేర్లు.

మాహేయి - ఆవు.
మాహేయుఁడు -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.(Mars)
కుజుఁడు -1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు.

సౌరభేయి - ఆవు.
సౌరభేయము -
ఎద్దు.
సౌరభము - 1.తావి, వాసన, 2.ఎద్దు, 3.కుంకుమము.
సౌరభ్యము - 1.వాసన, 2.ఒప్పిదము, 3.గుణగౌరము.

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరిపోలవురా ||వినరా

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ అర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గంగమైలావు - (గంగమైల + ఆవు), 1.పసుపు, నలుపును కలిసిన వర్ణము కల ఆవు, 2.మిక్కిలినల్లని ఆవు.
మైలావు - పొగ చాయగల ఆవు.

గంగి - పూజ్యము, (గంగెద్దు= గంగి+ఎద్దు), వి.సాధువైన ఆవు.
గంగెద్దు -
(గంగి+ఎద్దు) దాసరులు వస్త్రాదులచే అలంకరించి భిక్షాటనము కై తీసుకొని వచ్చెడి ఎద్దు, రూ.గంగిరెద్దు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివడైననేల ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వ.
తా.
మంచిపాలు గరిటెడైనను త్రాగుటకు శ్రేష్ఠముగా నుండును. గాడిద పాలు కడవతో యిచ్చిననూ త్రాగలేముకదా. అట్లే ప్రేమతో బెట్టిన పిడికెడు భోజనమైనను సంతోషము గదా. 

కల్లాకపటం ఎరుగని గంగిగోవును నేను
యేది చెప్పినాకాదని ఎదురుచెప్పలేను
పారేసిన గడ్డితిని బ్రతుకు గడుపుచున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నా ||వినరా

పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ. పవిత్రురాలు. చేమటియావు - చిత్ర వర్ణముల యావు.
శృంగిణి - ఆవు.

గోవునకు ప్రదక్షణం చేయునపుడు పఠించునది :

శ్లో|| గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ
యస్మాత్తస్మా చ్ఛివం మేస్య అతశ్శాంతిం ప్రయచ్ఛమే.

ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.

అర్జుని - 1.ఆవు, 2.ఒకజాతి పాము, 3.బహుదానది(హస్తహీనుడైన మునికి బాహువులు(భుజములు) ఇచ్చినందున ఆ నది 'బాహుదా అయింది) 4.కుంటెన కత్తె(సంచారిక) 5.బాణాసురుని కూతురు, ఉష. (అనిరుద్ధుఁడు భార్య, దూర్వాశ శాపగ్రస్తురాలగు తిలోత్తమ)
ఉష - 1.రేయి, 2.రాత్రి విశేషము, 3.బాణాసురుని కూతురు. (భామలలో దేవిస్థానం తిలోత్తమ)

శర్వరీ దీపకశ్చంద్రః - ప్రభాతోదీపకో రవిః |
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపకః ||
తా.
చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ ప్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింప జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము

భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా,
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా.

అఘ్న్య - ఆవు విణ.చంపదగనిది. ఆవు పూజనీయమైనది, సాధు జంతువు. గోవు లేకపోతే లోకానికి సుఖశాంతులు ఉండవు.

ధేనుక - 1.లేగటి యావు, 2.ఆడేనుగు, 3.ఆడుగుఱ్ఱము, 4.చిన్నకత్తి, 5.పార్వతి(శివసన్నిధిని పార్వతి) రూ.ధేనువు.
ధేనువు - లేగటి యావు. పడ్డ - తొలిచూలియావు.
లేఁగడియావు - లేతదూడగల యావు.
లేఁగ - (లేత+కానుపు) క్రొత్తగా బుట్టిన దూడ. 

నా బిడ్డలు భూమిచీల్చి దుక్కిదున్నారోయ్
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నారోయ్
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా ఒళ్ళే ఢంకాలకు నాదం పుట్టించునోయి ||వినరా

వలనుగ గానలందు ప్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలగను చూడనొక్కటి నిలంగను ధేనువు రెండుమూడునే
డులకటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలుగడువృద్ధిజెందవె యధర్మము ధర్మముదెల్ప, భాస్కరా.
తా.
ఆవు రెండు మూడేండ్లకొక దూడవంతున నీనినను అవి వృద్ధి జెంది మందలగు చున్నవి. పులి ప్రతి సంవత్సరము నాలుగైదు పిల్లలను ఈనినను నవి వృద్ధి పొందలేదు. అధర్మము నిలువకుండుటకు, ధర్మము నిలిచియుండుటకు ఇవియే తార్కాణము.

క్రేపు - శిఖరము (గిరిక్రేపులు), 2.దూడ, 3.పాడిపశువు.
దూడ -
పశుశిశువు.

అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లొభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల, నెదెట్లు పాలుతమకిచ్చునె యెచ్చటనైన లేఁగలన్
గుడువఁగనీనిచోఁగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా.
తా.
మనుష్యులు ఆవుల యొక్క లేగదూడలను వాని తల్లులపాలు త్రాగ నీయకుండ, వారు పాలు తీసికొంద మన్నచో నా గోవులు వారికి పాల నివ్వక తన్నును. అదే విధముగా లోభివానివలె (పిసినిగొట్టుతనము గలవాడై) వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొక ప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు.

సవిత్ర - 1.తల్లి, 2.ఆవు.
సవిత -
1.సూర్యుడు(నమస్కారప్రియుడు) 2.తండ్రి  రూ. సవితృడు. ప్రజాపతిర్వై సవితా. సూర్యుడిని ' సవిత ' అంటారు. సవిత అంటే బుద్ధికి ప్రేరణను ఇచ్చేవాడని అర్థం. 

బభ్రువు - 1.కపిల గోవు, 2.అగ్ని, 3.బట్టతలవాడు, విణ.1. పచ్చనిది 2. రోగము వలన బట్టతల కలవాడు.

కపిల - 1.ఆగ్నేయ దిశయందలి ఆడేనుగు, 2.పుల్లావు (కపిల గోవు).
పుల్లావు -
కపిలగోవు. మహాలింగము నందు దేవిస్థానం కపిల.
కపిల వర్ణత్వాత్కపిలా - కపిల వర్ణము గలిగినది.
కామ్యత ఇతి కపిలా - కోరఁబడునది. కపిలే కృష్ణపింగళే|    

పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె - ఐదోది "కపి"లావతారం. ఆయన సిద్ధులకు ప్రభువగు కపిలమహర్షిగా అవతరించి దేవహుతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహణునికి తత్త్వసముదాయమును విశేషంగా నిర్ధారించి చెప్పే సాంఖ్యాన్ని ఉపదేశించాడు.  

ధృతి : కపిలపత్ని, లోకాలకు ధైర్యరూపం. పిండాకరము నందు దేవిస్థానం ధృతి.
దేవమాత సురేశానా వేదగర్భాంబికా ధృతిః.
ధృతి : ధృతిశబ్దము ధరించుటకును, ధైర్యమునకును పేరు. ధరణం, ధ్రియతే అనయాచ ధృతిః. సీ. ధృజ్ ధారణే. ధరించుట, దీనిచేత ధరింపఁ బడును ధృతి.

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి -
నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గికంటి - శివుడు.
అగ్గితత్తడి -  అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.

శివుని కంటిలోని ఎఱ్ఱజీర పడికూడా చలించకుండా స్థిరంగా ఉంది.

అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.

నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.

కపిలా క్షీరపానెన అన్యస్త్రీ సంగ మేనచ|
వేదాక్షర విహీనేన ద్విజశ్చండాలతాం వ్రజేత్||
తా.
కపిలవర్ణముగల గోవుపాలను పానముచేయుటయు, ఇతర స్త్రీలతో భోగించు(భోగించు - సుఖించు, అనుభవించు)టయు, వేదాక్షరవిచారము లేక యుండుటయు, నిట్టికార్యములు బ్రహ్మణులొనరించిన చండాల త్వము నొందించును. - నీతి శాస్త్రము 

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీ పతిః|
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగ కృతాన్తకృత్||

గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోపాలుఁడు -
1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.  
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 2.భూమిని రక్షించువాడు.
గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.

గోష్ఠాధ్యక్షే అపి గోవిన్దః -
గోవింద శబ్దము ఆవుల నేలువానికిని, అపిశబ్దము వలన శ్రీకృష్ణునికిని, బృహస్పతికిని పేరు.
గాః విందీతి గోవిందః. విద్ ఌ లాభే. - ఆవులను బొందినవాడు, వాక్కులను బొందినవాఁడును గనుక గోవిందుఁడు.

గోపాలకృష్ణుతోడను,
గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలు రెంత ధన్యులో,
గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?
భా||
గోవులు కాసే సమయంలో గోపాలకృష్ణునితో కలసిమెలసి తిరిగే ఆ గోపాలకు లెంత పుణ్యాత్ములో! భూమిని పాలించే ప్రభువులకైనా ఆ గొల్లల యందు గలమేలైన తేజస్సు ఇట్టి గొప్ప అనుభవం ఉన్నదా?

గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గమునుగాని, వేదమునుగాని పొందెడువాఁడు.

గోపుఁడు - రక్షించువాడు, వి.1. రాజు, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి, (అయిదింటి పైగాని, పదింటి పైగాని అధికారము కలిగి గ్రామములలోని భూముల ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్తవ్యములై యుండెను.)

రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
క్షత్రియుఁడు -
రాచవాడు.
కాటిపాఁపడు - 1.గొల్లవాడు, 2.కాటికాపరి.
కాటిఱేఁడు - శివుడు.

గొల్ల1 - 1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.
దౌవారికుఁడు – ద్వారపాలకుడు; ద్వారపాలకుఁడు - వాకిటి కావలివాడు.
ద్వార్థ్సికుఁడు - ద్వారపాలకుడు, రూ.ద్వార్థ్సుడు.

దోగ్ధ - 1.గొల్లవాడు(వల్లవుఁడు - గొల్లవాడు), 2.దూడ(దూడ– పశుశిశువు), 3.కవిత్వము(కవిత్వము - కవిత)చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
దోగ్ధ్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది (మహాశూద్రి - గొల్లది).
అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు.

జీవవృత్తి - గోవులు మున్నగు వానిని కాచుకొని జీవించుట.

గోపే గోపాల గోసంఖ్య గోధు గాభీర వల్లవాః,
గాః పాతీతి గోపః, గాః పాలయతీతి గోపాలః. పా రక్షణే; పాలరక్షణే. - ఆవులను రక్షించువాడు.
గా స్సంచష్టే గోసంఖ్యః. చక్షిఙ్ వ్యక్తాయాం వాచి. - ఆవులను విచారించువాఁడు.
గాః దోగ్ధీతి గోధుక్. హ.పు. దుహ ప్రపూరనే. - ఆవులను బితుకువాఁడు.
ఆసమంతాత్ భియం రాతీతి అభీరః. రా ఆదానే. - అంతట భయము గలవాఁడు.
బత్ స్థైర్యం లునాతీతి లవః బదః స్థైర్యస్యలవో వల్లవః, బద స్థైర్యే. లూఞ్ ఛేదనే. వబయోరభేదః - భయము నొంది మనస్థైర్యము వీడినవాఁడు.
గోమహిస్యాదికం వలమానాః సంవృణ్వంతో వాంతి గచ్ఛంతీతి వల్లవాః. వల సంవరణే. వా గతిగంధనయోః. - గోమహిష్యాదులను జుట్టుకొని పోవువాఁడు. ఈ ఆరు గొల్లవాని పేర్లు.

గొల్లవారి బ్రదుకు గొఱఁతన వచ్చునే,
గొల్లరీతిఁ బాలకుప్పఁ ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు,
చేటు లేని మందు సిరియుఁ గనిరి.
భా||
గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు. దేవతలు గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ శ్రీలక్ష్మినీ పొందగలిగాడు.

వ్రే - గొల్లకులము, సం.వృష్ణిః. ఏ కులము నీదంటే గోకులము నవ్విందీ...
వ్రేఁడు -
గొల్లడు(కిలారి – గొల్లడు), సం.వృష్ణిః.
వ్రేపల్లియ - గొల్లపల్లె.

రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
మహాశూద్రి -
గొల్లది.
వ్రేఁత - గొల్లది; గోపి - గొల్లది(గోపిక).

అభీరపల్లి - గొల్లపల్లె, వ్రేపల్లె.
అభీరి -
1.గొల్లది, 2.గొల్లవాని భార్య, 3.గొల్లలభాష.
అభీరుఁడు - 1.గొల్లవాడు, వ్యు.మిక్కిలి పిరికివాడు, 2.అభీరదేశవాసి. వల్లవుఁడు - గొల్లవాడు.

ఘోషము - 1.గొల్లపల్లె, 2.ఆవులమంద.
మంద -
1.ఊరిబయట పసులుండుచోటు, 2.గొల్లపల్లె, 3.పశు సమూహము. (ౙ)జంగిలి - గో సమూహము, పశుసమూహము.
మందప్రోయాలు - గొల్లది.

గవ్య - 1.ఆవులమంద, 2.రెండు క్రోసుల దూరము, గవ్యూతి, 3.గోరోజనము.
గోరోచక - పసుల నాభియందుండు పసుపుపచ్చని వస్తువు, రూ.గోరోజనము.
రోచన - 1.గోరోజనము, 2.ఎఱ్ఱగలువ, ఉత్తమస్త్రీ.
కెందొగ - (కెంపు+తొగ) ఎఱ్ఱకలువ.

పరహితమైన కార్య మతిభారముతోడిదియైన పూను స
త్పురుషుడు, లోకముల్ పొగడఁ బూర్వమునందొక ఱాళ్ళవర్షముల్
గురియఁగఁ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొకకేల నెత్తెనట కృష్ణుడు ఛత్రముభాతి, భాస్కరా.
తా.
ఒకప్పుడు యాదవులు ఇంద్ర పూజలు చేయుచుండగా శ్రీకృష్ణుడు పూజలను మానిపించెను. మహేంద్రు(ఇంద్రుడు) డందులకు కోపించి వ్రేపల్లెపై రాళ్ళ వర్షమును కురిపించగా శ్రీకృష్ణుడు వెంటనే గోవులను గోపకులను కాచుటకు గొడుగు వలె ఒక చేతితో గోవర్ధన పర్వతము నెత్తెను. గొప్పవాడు లోక హితార్థమై ఎంత కష్టమైన పనియినను చేయుటకు పూనుకొనును.    

గోవర్ధనాచలోద్ధర్తా గోపాల స్సర్వపాలకః,
అజో నిరఞ్జనః కామజనకః కఞ్జలోచనః. - 10శ్లో

పశువు - చతుష్పాదము, గొడ్డు.
పశుపతి -
శివుడు.

పశుపాలనము - (వ్యవ.) ఉన్ని, పాలు, మాంసము, క్రొవ్వు మొదలగు వాని కొరకు పశువులను పెంచుట (Cattle rearing).

గోద1 - 1.విష్ణుచిత్తుని పుత్త్రిక, గోదాదేవి, 2.గోదావరి.
గోద2 - ఎద్దు, వృషభము, (వ్యావ.) గొడ్డు, గోద.
గొడ్డు - ఈనని పశువు, గొడ్రాలు, విణ.శూన్యము. 
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పడిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక.
శూద్రి - శూద్రుని భార్య.  

విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||
తా.
లోకమునందు గొడ్రాలు, సహింపగూడని ప్రసవవేదన నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము 

మలప - దూడచచ్చి పాలిచ్చెడి ఆవు.

అఱవ - సాధువుకాని ఆవు, విణ.దుష్టుడు, ధుష్టము.
నఱవ -
 అరవ, సాధువుకాని యావు.
అరవ -
తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
నఱ్ఱ - 1.ప్రయాసచే పిదుకదగిన యావు, 2.ప్రయాసముచే బండికి గట్టబడిన యెద్దు. అఱ్ఱ - 1.అఱ, గది, 2.ప్రయాసమున పాలు పిదుకదగిన ఆవు. 

కరట - 1.ప్రయాసచే పిదుకదగిన ఆవు, 2.కాకి.
కాకి -
వాయసము, విణ.అల్పము, సం.కాకః.
వాయసము - కాకి.

గోవు ఎంత పవిత్రమైనదంటే - సమస్త దేవతలు తమ నివాస స్థానాన్ని గోమాత అంగాలలో నెలకొల్పుకున్నారు. ఈ కారణముచేత గోప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సరిసమానమైన పుణ్య ఫలంబు నొసగును.

గోమహత్యం:- 1.గోవు పాదము పితృ దేవతలు, 2.పిక్కలు పిడు గంటలు, 3.అడుగులు ఆకాశ గంగలు, 4.ముక్కోలు కొలుకులు ముచ్హిక చిప్పలు, 5.కర్రి కర్రేనుగ, 6.పొదుగు పుండరీకాక్ష, 7.సన్నుకట్టు సప్త సాగరాలు, 8. గోవుమయం శ్రీలక్ష్మీ, 9.పాలు పంచామృతాలు, 10.తోక 90కోట్ల ఋషులు, 11.బొడ్డు పొన్నపువ్వు, 12.కడుపు కైలాసం, 13.కొమ్ములు కోటి గుడులు, 14.మొగము దెస్థ, 15.వెన్ను యమధర్మరాజు, 16.ముక్కుసిరి, 17.కళ్ళు కలువరేకులు, 18.చెవులు శంఖ నాదం, 19.నాలుక నారాయణ స్వరూపము, 20.దంతములు దేవతలు, 21.పళ్ళు పరమేశ్వరి, 22.నోరు లోకనిధి.

పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4వ వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములలో అధద్వయముచే వేరుచేయబడిన నాలుగుభాగములలో నొకటి (Quadrant).
ఆలవాలము - 1.పాదు.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు. 

కేదారము - 1.వరిమడి, 2.కొండ, 3.కేదారఘట్టము (కాశీలో నొక పుణ్యస్థలము), 4.పాదు, 5.శివలింగభేదము.

పితరులు - పితృదేవతలు, రూ.పితాళ్ళు. పితరః ప్రజాపతిః
ధర్మధేనువు స్వరూపం యొక్క నాలుగు పాదములు: 1.సత్యము(సత్యం చ సమ దర్శనం) 2.దయ, కనికరము 3.శౌచము(కృతశౌచము నందు దేవి సింహిక, శుచిత్వము) 4.తపస్సు.

పిక్క - 1.చిరుతొడ, జంఘ, 2.గింజ, సం.1.పిండికా, 2.స్పృక్క.
చిఱుదొడ -
పిక్క; జంఘ - పిక్క.
పిక్కచెదఱు - 1.చెదరు, 2.భయపడు.

గొరిజ - పసువు కాలిగిట్ట, సం. ఖురః.
ఖురము -
1.గొరిజ, 2.మంగలి కత్తి, 3.మంచపు కోడు.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపు కోడు, క్రి. మండు. కాలికి జూటూకున్న పాము కరవక మానునా?
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపు కోడు.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు. 

ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా|
పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ.

తొఱ్ఱు - ఆవు.
తొఱ్ఱుపట్టు -
1.ఆవులమంద, 2.గోవుల సాల, 3.గొల్లపల్లె.
ఘోషము - 1.గొల్లపల్లె, 2.ఆవులమంద.
గోష్ఠము - ఆవులమంద యుండు చోటు, గొట్టము.
గోష్పదము - 1.ఆవుడెక్క, 2.గోవులు తిరిగెడు చోటు, 3.గోవుపాదమంత చోటు.
గిట్ట - 1.పసులకాలిగోరు, డెక్క, 2.బాణము.
డెక్క - గిట్ట.

గోవు నాలుగు పాదముల గిట్టల యందు చతుర్వేదములుండును. గోవు కాలిగిట్టలలో అన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఆవులు నడుస్తున్నపుడు వాటి గిట్టల నుంచి లేచే దుమ్ము ఎవరి తల మీద పడితే వారు పవిత్రులు అవుతారు. గోవుల గిట్టల నుండి ఎగిరిన గోధూళిని, తన శిరస్సున ధరించినవాడు పుణ్యతీర్థాలలో స్నానమాడిన ఫలాన్ని పొందుతాడు. మరియు సమస్త పాపాల నుండి విముక్తుడౌతాడు. దాని పరమ పవిత్రమైన ధూళిలో గొప్ప శక్తి వుంది. గోధూళి మన మీద పడిన సమయంలో ఏకార్యం చేసినా సఫలమవుతుంది. గంగకంటే గోధూళి గొప్పది. గోధూళి ఎఱ్ఱన ఎందువలనా.…

పసి - 1.పశ్వాదుల మీదిగాలి, 2.పువ్వుల మీదిగాలి, విణ.లేత, వై.వి.గోగణము, గోవులు, సం.పశుః.

స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.

అడుగు - 1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.

అడుగుపుట్టువు -1.గంగ, 2.శూద్రుడు(శూద్రుఁడు-నాలవ జాతివాడు). 
గంగ -
1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గంగలు - కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి - వీనినే పంచ గంగ లందురు.
గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి. గాంగేయుఁడు - గాంగుడు.

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు -
గంగాధరుఁడు, శివుడు, వ్యు.శిరస్సున భార్యకలవాడు.

ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మందాకిని -
1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి మంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ -
సీత; వరజు - నాగటి చాలు, సీత.

పొదుఁగు - పశ్వాదులకు పాలుండుచోటు, ఊధము.
ఊధము -
ఆవు, మొ. వాని పొదుగు, (ఇది బహువ్రీహి యందు ఉత్తరపదమినచో "ఊధ్నీ" అగును. ఉదా.కుండోధ్ని).
ఊధస్యము - పాలు, క్షీరము, వ్యు.పొదుగున పుట్టినది.
ముఱ్ఱు - చూలైన ఆవు మొ. వాని చన్నులు పిదుకగావచ్చు జిగట పదార్థము (ముఱ్ఱుబాలు). గుమ్మపాలు - అప్పుడు పిదికినపాలు, ఉష్ణధార లని వాడుక.
గుమ్మ - 1.పాలు పిండునపుడు వచ్చు ధార (గుమ్మపాలు), 2.స్త్రీ, (త,) కుమ్మలి = స్త్రీ, 3.గాదె.

పితుకు - క్రి. పశువుల పాలుపిండు, రూ.పిదుకు.
పిండు -
1.పాలుపితుకు, 2.రసము పిండు, 3.తడిసిన బట్ట పిండు, వి.1.గుంపు, 2.చెండు.

గోస్తనము - 1.నలుబది పేటల హారము, 2.ఆవు చన్ను. ఆవు పొదుగు నందు సప్త సముద్రాలుండును.

గోస్తని - 1.ద్రాక్ష, 2.ఒకనది. శక్తిపీఠం మాణిక్యే ద్రాక్షవాటికా|
ద్రాక్ష -
ఒకజాతి ఫలలత, ద్రాక్షపండు.
ద్రాక్షచక్కెర - (వృక్ష.) ద్రాక్ష పండ్లలో నుండు చక్కెర, గ్లూకోజ్, (Glucose).
డెక్ స్ట్రోజ్ - (జీవ.) (Dextrose) ద్రాక్ష చక్కెర.
గ్లైకోజిన్ - (గృహ.)  (Glycogen) కాలేయపు చక్కెర, (కాలేయము రక్తములో ఎక్కువగానున్న గ్లూకోస్(Glucose)ను, గ్లైకోజిగాన్ మార్చి నిల్వచేయును కాలేయములోను, కండర జీవకణములోను నిలువ చేయబడు చెక్కెర రూపము).

అదనుఁలంచికూర్చి ప్రజ నారిదమొప్ప విభుండుకోరినన్
గదిసి పదార్ధమిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ బొదుగు మూలముఁ గోసిన పాలుఁగల్గునే
పిదికినఁగాక భూమిఁబశుబృందము నెవ్వరికైన, భాస్కరా.
తా.
భాస్కరా! ఈ భూమి యందెవరికైనను పాలు కావలసి వచ్చినప్పుడు ఆవుల వద్దకు వెళ్ళి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలకొఱకా (యా)ఆవుల పొదుగులను కోసినచో వానికిపాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవముగా చూచినచో వారు ఆదరాభిమానమును లాతనిపైఁ జూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వరేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు.     

పుండరీకాక్షుఁడు - విష్ణువు.
విష్ణువు -
విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.

ఆవుపాలు రక్తం ద్వారా దాని శరీరమంతా వ్యాపించి ఉన్నా, అవి దాని చెవుల ద్వారా, కొమ్ములద్వారా కాక, పొదుగు ద్వారా మాత్రమే లభిస్తాయి. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అయినా, పవిత్రమైన దేవాలయాలలోనే అధ్యాత్మికానుభూతి సులభంగా లభిస్తుంది. ఎందరో మహాభక్తుల జీవితాలవల్ల, వారి పారమార్థిక సాధన వలన దేవాలయాలు పవిత్రమై ఉండడమే ఇందుకు కారణం. - శ్రీ రామకృష్ణ పరమహంస 

నైచికి - 1.మంచిరూపము, 2.ప్రాయము, 3.సమృద్ధి, 4.పాలిచ్చునట్టి ఆవు. 

ఉత్తమా గోషు నైచికీ,
నీచైః స్వరేణాపి చరతీతి నైచికీ. ఈ. సీ. చర గతిభక్షణయోః. - సన్నపు టెలుఁగునఁ (బి)పిలిచినను వచ్చునది. గోషు ఉత్తమా. ఈ రెండు ఆవులలో చాల పాలుగలిగి మంచి లక్షణములు గల యావు పేరు.

ప్రాయము - 1.వయస్సు, 2.బాహుళ్యము, 3.చావు.
వయసు -
ప్రాయము, యౌవనము.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50వ)సంవత్సరముల వఱకు గలప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారెండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
ౙవ్వని - యౌవనవతి; ౙవరాలు - యౌవనవతి. 

వయసు - ప్రాయము, యౌవనము.
ఈడు1 -
1.వయస్సు, 2.యౌవనము, విన.1.అనురూపమైన వయస్సు గలది, 2.సామ్యము, 3.తాకట్టు, విణ.సమానము, తగినది శక్యము.
ఈడు2 - క్రి.1.పాలు పిదుకు, 2.ముందు నకుబోవు, 3.వెనుకబడు.
ఈడుపు - 1.లాగుట, 2.జాగు, విలంబము.
ఈడుముంత - పాలు పిదుకు పాత్రము. 

దోహనము - పాలుపిదుకుట.
తోడుఁబాలు -
పాలుపిండబోవునపుడు పాత్రలో నుంచుకున్న నీరు.

వంజుల - ఎక్కువగా పాలిచ్చు ఆవు.
పినోధ్ని -
పెద్ద పొదుగు గల యావు.

వత్సము - 1.ఏడాదిలోపు దూడ, 2.రొమ్ము.
పెయ్య -
వత్స, ఆడుదూడ, రూ.పేయ.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు విణ.త్రావదగినది. 
ఆఁబడ్డ - (ఆవు+పడ్డ) పాలు విడిచిన ఆవుపెయ్య.
తఱపి - 1.పెయ్య, 2.తారుణ్యము.
తారుణ్యము - జవ్వనము. తరుణిమ - యౌవనము, రూ.తారుణ్యము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.  
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
యౌవతము - యువతీ సమూహము.

వత్సౌ తర్ణకవర్షౌ ద్వౌ :
వత్సశబ్దము దూడకును, సంవత్సరమునకును పేరు. వసతి, వసత్య స్మిన్నితి చ వత్సః. వస నివాసే. - ఉండునది. గనుక, దీనియందన్నియు నుండును గనుకను వత్సము.

ఆవు తన వత్సాన్ని ప్రేమగా ఒళ్ళంతా నాకుతూ ఉండటం వల్ల వత్సలత లేక వాత్సల్యం(వత్సలం - పుత్రాదిస్నేహ రూపము) అనే పేరు వచ్చింది.

నలంఘయే ద్వత్సతంత్రీం నప్రధా వేచ్చ వర్షతి|
నచోదకే నిరీక్షేత స్వం రూప మితినిర్ణయం||
తా.
దూడను గట్టిన త్రాడును(గుదిత్రాడు - దూడకాలికి గట్టుత్రాడు, బంధము.)దాఁటకూడదు, వానయందు పరుగెత్తరాదు, నీటియందు తన నీడను జూడరాదు. - నీతిశాస్త్రము

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః||

పైరము - ఆవు.

పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
నీళ్ళు - నీరు; నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.  
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.  

క్షీరదము - (జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు.

పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెరచుగావున  
బాలిసుడగు వానిపొందు వలదుర సుమతీ.
  
తా. తెలివిహీనుల(బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.) స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం.

కమ్మనైన గుమ్మపాలు కడవనిండ లేస్తున్న
కార్యానుకూలతకు మీకు ఎదురు వస్తున్న
వయసుడిగిన నాకు నన్ను కటికవాని పల్జేస్తే
ఉసురు కోలుపోకుండా మీకే ఉపయోగిస్తున్నా ||వినరా

పాఁడి - పాలు. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం(కుంకుమ).....
పాలు -
1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పంచామృతములు - ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె.

క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస -
1.అంౘ, 1.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.

మృత్పిండమేకో బహుభాండరూపం, సువర్ణమేకం బహు భూషణాని|
గోక్షీరమేకం బహుధేనుజాతం, ఏకః పరాత్మా బహు దేహవర్తీ||
తా.
కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము వేర్వేరు బంగారమొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే శరీరములు వేర్వేరు పరమాత్మ యొక్కటే. - నీతిశాస్త్రము    

పయోధరము - 1.స్తనము 2.మేఘము.
పయోధి -
సముద్రము.

ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది. నీరు త్రాగుతువున్న ఆవును బెదిరించి పారద్రోలినవారు కడ లేని నరక యాతనలు పడవలసి వస్తుంది. దూడ కడిచినకాని ఆవు చేపదు. పాలు కుడుపుతున్న ఆవును చూడరాదు.

ఒక చెరువుకు నాలుగు తూములు-తెల్ల వారి పొద్దు పొడిచేసరికి ఐదు పంటలు పండుతాయి. ఆవుపొదుగు - పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి.

గవ్యము - 1.వింటినారి, 2.పసులు మేయు పొలము, విణ. 1.గోహితవైనది, 2.గోసంబంధమైనది, 3.గోవికారమైనది(పాలు, మొ.వి). 

గోసంభంధమైన పంచ గవ్యములు - గోమయము, గోమూత్రము, గోఘ్రుతము, గోధధి, గోక్షీరము. ఇవి పవిత్రములు, పాప హరములు.

పంచగవ్యములు - ఆవు పేడ, ఆవు పంచితము(పంచితము – గోమూత్రము), ఆవు పాలు, ఆవు పెరుగు, యోగ వాహి - ఆవునెయ్యి. పంచామృతములు - ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె.

అమిత ముదమృతం ముహు ర్దుహంతీం
విమల భత్పదగోష్ఠ మావసంతీం
సయద పశుపతే! సుపుణ్యపాకాం
మమ పరిపాలయ, భక్తిధేను మేకామ్. - 68శ్లో
తా.
పశుపతే(పశుపతి - శివుడు)! అమితానందామృతరూప క్షీరాలను పిదుకునదీ, విమలమైన నీ పాదాలనే గోశాలలో నివసించేదీ, పుణ్య పరిపాకమైనదీ, అయిన నా భక్తిరూప ధేనువును రక్షించు స్వామీ! - శివానందలహరి 

84 లక్షల జీవరాశులలో ఆవు చాలా పవిత్రమైనది. దాని మలమూత్రములు అతి పవిత్రమైనవి. రాత్రిపూట ఆవుపేడ, నీళ్ళు, మట్టి, తేకూడదు.

పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవు పేడ(గోమయము), విణ. పరిశుద్ధము.
పేఁడ - గోమయము, రూ.పెండ.
(ౙ)జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము. జందెము - జందియము.

గోవి డ్గోమయ మస్త్రియామ్ :
గోః విట్ పురీషం గోవిట్. ష. సీ. గోమయంచ. అ. ప్న. ఆవుపేఁడ గోవిట్టు, గోమయమును. ఈ ఒకటి ఆవుపేఁడ పేరు.

కరీషము - 1.ఎరువు, 2.ఏరు పిడక, 3.గోమయము.
గొబ్బరము -
ఎరువు.
ఎరువు1 - పైరు కై చేర్చియుంచిన చెత్త పేడ, మొ.వి. వ్యు.ఎండచే ఎరియునది.
ఎరువు2 - (వ్యవ.) నేలలో తగ్గిన సారమును మరల చేర్చి స్త్తువ చేయుటకు ఉపయోగించు పదార్థము (Manure).
పొలివెంటి - శుష్కగోమయము.

గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును. 

గొబ్బి - 1.ధనుర్మాసమున బాలికలు చేతులు చరచుచు గుండ్రముగా తిరుగుచు పాటలు పాడువేడుక, 2.ఇక్షురకము, గొలిమిడి, మొగబీర.
గొబ్బిళ్ళు - 1.గొబ్బి, 2.నమస్కార భేదము, 3.బాలక్రీడ, 4.గొబ్బిపాట. కలయంపి - దుమ్ము అడగుటకు చల్లు పేడనీళ్ళు, రూ.కలాపి, కలవడము.
కడివెడు నీళ్ళు కలాపి ౙల్లి గొబిళ్ళో గొబిళ్ళో......

శ్రీ-1.లక్ష్మి 2.సంపద, ఐశ్వర్యము 3.కాంతి 4.అలంకారము 5.విషము. లక్ష్మి -1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్టదామర.

సముద్ర మథనేలేభే హరిర్లక్ష్మీం హరోవిషమ్|
భాగ్యం ఫలతి సర్వత్రన విద్యానచపౌరుషమ్||
తా.
సముద్రమును మధించినపుడు విష్ణువు లక్ష్మీదేవిని, శివుడు విషంబును బొందిరి, గాన వారివారి భాగ్యానుసారముగా ఫలంబు గలుగును. - నీతిశాస్త్రము

అమ్మ కడుపున పడ్డను - అంతసుఖాన వున్నాను - నీ చేత పడ్డాను దెబ్బలు తిన్నాను - నిలువునా ఎండిపోయాను - నిప్పుల గుండం త్రొక్కను - గుప్పెడు బూడిదైపోయాను. గోమయ భస్మ(విభూతి)ధారణ అష్టైశ్వర్య ప్రదాయకము.

నా కొమ్ములే దువ్వనలై మీ తల చిక్కునుదీర్చు
నే సంకల్పించిన విభూతి మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుభములెన్నో కలిగించు
నా చేయూతలే చివరకు వైతరణిని దాటించు ||వినరా

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. ఐశ్వర్యమునకు అంతము లేదు.
విభూతి - 1.తిర్యక్సుండ్రధారులు ధరించెడు భస్మము, 2.ఒక ఐశ్వర్యము.
త్రిపుండ్రము - నొసట నుంచుకొను విబూతి మూడు రేఖలు, (నామము ఊర్ధ్వపుండ్రము.) 
భూతి - 1.ఐశ్వర్యము, సంపత్తి 2.పుట్టుక, 3.భస్మము.
భూతేశుఁడు - శివుడు.

భవము - 1.బాము, పుట్టుక, 2.ప్రాప్తి, 3.సంసారము.
బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక.
జననము - 1.పుట్టుక, 2.వంశము.
జననవిద్య - (జీవ.) అనువంశమును గూర్చి తెలియు శాస్త్రము(Genetics).

తిరునీఱు - బూది, విభూతి.
తిరు -
శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.

వెలిబూది - విభూతి; భసితము - భస్మము.
నీఱు -
భస్మము, రూ.నిగురు, నివురు. 
నిగుఱు - కట్టెల నిప్పుమీది బూడిద, రూ.నివురు, నీరు.
నివుఱు - నిగురు, బూడిద.
బూడిద - 1.కఱ్ఱలు మొదలగునవి కాలగా మిగిలిన భస్మము, 2.గోమయ భస్మము, సం.భూతిః.
భస్మము - బూడిద; బుగ్గి - బూడిద; భస్మాంగుఁడు - శివుడు.

తనీయాంసం పాంసుం - తవ చరణపంకేరుహభవం
విరించిః స్సంచిన్వన్ - విరచయతి లోకా నవికలామ్|
వహ త్యేనం శౌరిః - కథమపి సహస్రేణ శిరసాం
హరః స్సంక్షుద్యైనం - భజతి భసితోద్ధూళనవిధిమ్|| - 2శ్లో 
తా.
తల్లీ! బ్రహ్మ(విరించి - బ్రహ్మ) నీ యొక్క పాదపద్మముల తగిలి యున్న ధూళినే అణుమాత్రము సాధనముగా గ్రహించుచున్నవాడై చరాచర సహితమైన సకల లోక సృష్టిని సమగ్రముగా గావించుచున్నాడు. ఆ పరాగ కణమునే వేయి శిరస్సులచే నతి కష్టముగా అనంతరూపుడైన(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు)విష్ణువు మోయుచున్నాడు. దానినే ఈశ్వరుడు చక్కగా మెదిపి శరీరముననంతటను విబూదిగా(భస్మము)ధరించుచున్నాడు.  - సౌందర్యలహరి

(అనగా శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టి స్థితి లయ శక్తులను అనుగ్రహించుచున్నది. మహమాయా గుణములైన రజస్సత్త్వతమోగుణములైన త్రిగుణములే త్రిమూర్తుల కృత్యముల కాధారములు).

అణిమ - 1.అణుత్వము, 2.ఒక ఐశ్వర్యము, అష్టసిద్ధులలో ఒకటి, రూ.అణిమము.
మహిమా - 1.గొప్పతనము, 2.ఐశ్వర్యము.
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.)పురుషవాచక శబ్ద సంజ్ఞ.
మహాత్మ్యము - గొప్పతనము.
గరిమ - 1.గొప్పదనము, 2.బరువు, 3.అణిమాద్యష్టైశ్వర్యములలో ఒకటి, 4.విధము (ఈయర్థము తెలుగున మాత్రమే కలదు.) 
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.  
లఘిమ - లఘుత్వము; తేలిక - చులకన, లఘుత్వము.
(ౘ)చులకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
ఆరోగ్యము - రోగము లేమి, స్వాస్థ్యము.
అవాప్తి - ప్రాప్తి, పొందుట.
సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద. 
సంపన్నము - సంపదతో గూడినది, సంవృద్ధమైనది.     

స్వదేహోద్భూతాభి - ర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
నిషేవ్యే! నిత్యే! త్వా - మహమితి సదా భావయతి యః|
కి మాశ్చ్యర్యం తస్య - త్రినయన సమృద్ధిం తృణయతః
మహా సంవర్తాగ్ని - ర్వరచయతి నీరాజన విధిమ్|| - 30శ్లో

తా. శాశ్వతమైనదానా! ఆదంత్యంతములు లేని తల్లీ! లోకముచేత సేవింపదగిన జగన్మాతా! నీ చరణకమలముల నుండి పుట్టిన కాంతులచేత అణిమాది అష్టసిద్ధులతోను(అష్టైశ్వరస్వ రూప నిత్యలగు అష్టశక్తులతో) చుట్టును కూడికొని, నిత్యము సేవింపబడుచున్న నిన్ను ఏ సాధకుడు 'అహం' భావనతో  నిరంతరము ధ్యానించుచున్నాడో, వాడు త్రినయనుని సమృద్ధిగల ఐశ్వర్యమును సైతము తృణీకరించువాడై యుండగా వానికి  ప్రళయకాలాగ్ని నీరాజన విధి చేయుచున్నది. ఈశ్వర సంపదను గణింపని వానికి సంవర్త మను ప్రళయాగ్ని నీరాజనమిచ్చుటలో నాశ్చర్యము లేదు. ఇందుకు ఆశ్చర్యమేమి? (ఏ ఆశ్చర్యమును లేదు.) శ్రీదేవితో తాదాత్మ్యము పొందిన సాధకుడు శ్రీదేవియే. ఆమె ప్రళయాగ్ని నీరాజనము. – సౌందర్యలహరి  

చిలువాలు - 1.ఇవురుగాచినపాలు, 2.ఆనవాలు, రూ.చిఱువాలు.
చిఱువాలు -
ఇగురుగాచిన పాలు, రూ.చిలువాలు.
ఆనవాలు - 1.గుర్తు, 2.(ఆన+పాలు) ఇగురు కాచినపాలు, రూ.ఆనాలు.

కేసిన్ - (గృహ.) (Casein) పాలకోవలోని ఒకమాంసకృత్తు.

తోడు -1.ఆన, 2.తోబుట్టువు, 3.చేమరి, తోడుమజ్జిగ, విణ.సహాయము.
ఆన -
ఉత్తరువు, సం.ఆజ్ఞా.
ఉత్తరువు - ఆజ్ఞ, అనుజ్ఞ, సెలవు, సం.ఉత్తరమ్.
ఆజ్ఞ - 1.ఉత్తరువు, ఆదేశము, 2.దండనము, 3.(యోగ.) కనుబొమల నడుమ నుండెది చక్రము, వికృ.ఆన.
ఆజ్ఞప్తి - ఉత్తరువు, ఆజ్ఞ, వికృ.ఆనతి.
ఆనతి1 - 1.మ్రొక్కు, 2.నమ్రత, 3.వంగుట.
ఆనతి2 - ఉత్తరువు, సం.ఆజ్ఞప్తిః.
తోఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోబుట్టుగు, తోబుట్టువు, తోడబుట్టువు.
తోడ(ౘ)చూలు - తోబుట్టువు.
తోడఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోడబుట్టువు.
చేమరి - పాలు తోడు పెట్టు; తోడుపెట్టు - చేమరిపెట్టు.
తోడుచల్ల - చేమరిపెట్టు మజ్జిగ.
ఆతంచనము - చేమరిపెట్టుట, పాలలో మజ్జిగ కలుపుట, (రసా.) పాల విరుగువలె దగ్గరపడుట (Wagulation), (జం.) (రక్తము) గడ్డకట్టుట (Coagulation).
ఆతంకము - 1.భయము, 2.సంతాపము, బాధ, 3.రోగము, 4.సందేహము, 5.ఆరాటము, 6.పాలు తోడుపెట్టుట. 
తోడుకొను - క్రి.1.పాలుపేరుకొను, 2.పిల్చుకొను, రూ.తోడికొను, తోడ్కొను. తోడ్కొను - తోడుకొను.
తోకొను - తోడుకొను, వెంటబెట్టుకొను.

మొదట చప్పన - నడుమ పుల్లన - చివర కమ్మన. - పాలు-పెరుగు-నెయ్యి 

గోమూత్ర మాత్రేణపయో వినష్టం | తక్రస్య గోమూత్రశతేన కింవా |
అత్యల్పపాపైర్వపద శ్శుచినాం పాపాత్మనాం పాపశతేన్ కింవా ||
తా.
గోమూత్రము కొంచెము పడుటచేతనే పాలుచెడిపోవును, గోమూత్ర మెంత(ఎంతగా)కలిసినను మజ్జిగకు చెఱుపులేదు. అలాగే పరిశుద్ధుఁడైన సత్పురుషులకు అల్పపాపంబుచేతనే విపత్తు(విపత్తు - ఆపద)గలుగును, పాపాత్ముల కధిక పాపంబు వలనను చెఱుపు(కీడు)గలుగదు. - నీతిశాస్త్రము  

గోవుమూత్రమే పరిశుద్ధి గూర్చుఁగాన
గోవుపాలలో మిసిమియుఁ గూడుటరుదె,
యవుర గోత్రము గోష్ఠమొ యరసి యరసి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ |

హైయంగవీనము - తొలినాడు చిలికి యెత్తిన ఆవు వెన్న, లేక వెన్న కాచిన నేయి.

నే - నేయి.
నేయి - నెయ్యి, సం.స్నేహః.
నేయము - నెయ్యము, సం.స్నేహః.
నెయి - ఘృతము, రూ.నెయ్యి, నేయి, సం.స్నేహః.
ఘృతము - 1.నెయ్యి, 2.నీరు.

ఘృతం - ఘృతంచ మధుచ ప్రజాపతి రా సీత్| నెయ్యి వేదంలో ఎంతో పవిత్రత సంతరించుకుంది. యజ్ఞంలో ఆవు నెయ్యి హవిస్సుగా దేవతలకు చేరి దేవతలను పోషిస్తోంది.

స్తేమము - 1.తడియుట, 2.స్నేహము.

ఘృతేన వర్ధ తేబుద్ధిః, క్షీరేణా యుర్వి వర్థనమ్|
శాకేన వర్ధ తేవ్యాధి ర్మాంసం మాంసేన వర్ధతే||
తా.
నేతిచేత బుద్ధియు, పాలచేత నాయువు(ఆయువు - జీవితకాలము, ఆయుస్సు), కూరగాయల చేత వ్యాధియు, మానసముచేత మాంసమును వృద్ధిపొందుచున్నవి. - నీతిశాస్త్రము 

తోయడము - 1.మేఘము(మేఘము - మబ్బు), 2.నెయ్యి, వ్యు.నీటినిచ్చునది.
తోయధి - సముద్రము.

వాజము - 1.నెయ్యి, 2.నీరు, 3.రెక్క.
వాజపేయము -
ఒకానొక యాగము.
వాజి - గుఱ్ఱము. పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రావదగినది.

స్మరం యోనిం లక్ష్మీ - త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే! - నిరవధి మహాభోగ రసికాః|
భజంతి త్వాం చింతా - మణిగుణ నిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వన్తః - స్సురభిఘృత ధారాహుతి శతైః|| - 33శ్లో     
తా.
ఆద్యంతరహితయైన నిత్యయగు ఓ త్రిపురసుందరీ! పరమయోగులు కొందఱు నీ మంత్రమునకు మొదటి కామ బీజమగు ఐం, యోని బీజమగు హ్రీం, లక్ష్మీ బీజమగు శ్రీం అను వర్ణములను జేర్చి, చింతామణులచే సమగూర్చబడిన జపమాల(అక్షమాల)లను హస్తము లందు గలిగి, కామధేనువు సంబంధ మగు నేతి ధారలచే శివాగ్ని యందు హోమముచేయుచు, నిన్నుకొలుచుచున్నారు. - సౌందర్యలహరి          

శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ,
శ్రీం బీజ జపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా.
         

ధేనువు కుడి కొమ్ము నందు గంగానదియు, ఎడమ కొమ్ము నందు యమున నదియు, కొమ్ముల మధ్య భాగమున సరస్వతీ నదియు వశించుచుండును. ఎవరైతే కార్తీక ద్వాదశి నాడు ఆవును వెండి దెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి దూడతో సహా, గోదానము చేస్తారో, వాళ్ళు ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు వుంటాయో, అన్ని వేల సంవత్సరములు స్వర్గములో నివసిస్తారు. అన్నింటిలోకి కపిల గోవు దానము సర్వ శ్రేష్ఠమైనది.

వైతరణీనదీ సద్యుత్తరణార్ధం గోదానాలు చేస్తుంటారు. గోదానము చేయు వారు సూర్యలోకమునకు వెళ్ళుదురు. శక్తిలేని వారు గోపూజ చేసిన సర్వ శ్రేయొదాయకుము.

ఈ సప్తర్షి మండలానికి సుదూరముగా పదునొకొండు లక్షల యోజనాలపైన సర్వసంస్తవనీయమైన పరమ వైష్ణవ పదమునందు ఉత్తానపాదుని కొడుకు, వైకుంఠునకు ఇష్టభక్తుడు ధ్రువుడు వుంటాడు. తోక మొదట ధ్రువుడు. తోకమీద ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు, తోకచివర ధాత, విధాత, కటి-నడుము(కటిం భగవతీ దేవీ)యందు, సప్తర్షులు వుంటారు.

ధ్రువుఁడు - 1.ఉత్తాన పాదుని కొడుకు 2.విష్ణువు 3.శివుడు(విష్ణు భక్తుడు), ఉత్తర దిక్కులోనుండు నక్షత్రము, ధ్రువనక్షత్రము.   

పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.  పువ్వు – పుష్పము.   
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు. కడుపు - ఉదరము, ఉదరం సింహవాహిని.

గోపుచ్ఛము - 1.కోతి, 2.ఆవుతోక.
వనచరము -
కోతి;  మర్కటము - కోతి; వానరము - కోతి; తిమ్మఁడు - కోతి; కొండత్రిమ్మరి - కోతి.
కపి - కోతి.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి చిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణోత్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||

తా. సహజముగా బ్రాహ్మణులకుఁ (బ)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకరము, పతివ్రతలకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త -మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(యుద్ధము - కయ్యము, పోరు)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము

గోముఖము - 1.అలుకుట, 2.ఒక వాద్యము, 3.వంకరగా కట్టిన ఇల్లు, 4.ఆవు మొగము.

గోరోచక - పసుల నాభియందుండు పసుపుపచ్చని వస్తువు, రూ.గోరోజనము.
రోచన -
1.గోరోజనము 2.ఎఱ్రగలువ, ఉత్తమ స్త్రీ.
తామర - ఎఱ్రకలువ.
తామర చెలి - సూర్యుడు, పద్మ మిత్రుడు.

గోకర్ణము - 1.కడితిమృగము, 2.పాము, 3.కంచరగాడిద, 4.ఆవు చెవి ఆకారము గల పాత్రము, 5.దక్షిణ దేశమందలి ఒక శివక్షేత్రము.
(గోకర్ణమునందు దేవీస్థానం భధ్రకర్ణిక).
అశ్వతరము -
  1.కంచరగాడిద, 2.పాతాళలోకము నందలి ఒకసర్పము, 3.కోడెదూడ, 4.గంధర్వులలో ఒక తెగ.
ప్రఖరము - 1.గుఱ్ఱపు కవచము, 2.కంచరగాడిద, విణ.మిక్కిలి వాడియైనది.  
కంౘరగాడిద - కంచరము లాగు గాడిద, అశ్వతరము.
వేసడము - కంచరగాడిద, రూ.వేసరము, సం.వెసరః.
మయము - 1.ఒంటె, 2.కంచరగాడిద. 
కోడె - 1.కాడి మరపదగిన దూడ, 2.విటుడు. 
కోడెకాడు - 1.యుక్తవయసువాడు, 2.విటుడు. 
కోడెరౌతు - వృషభవాహనుడు, శివుడు.  

గోకర్ణము - 1.కడితిమృగము, 2.పాము, 3.కంచరగాడిద, 4.ఆవు చెవి ఆకారము గల పాత్రము, 5.దక్షిణ దేశమందలి ఒక శివక్షేత్రము.
(గోకర్ణము నందు దేవీస్థానం భధ్రకర్ణిక).
అశ్వతరము -
  1.కంచరగాడిద, 2.పాతాళలోకము నందలి ఒకసర్పము, 3.కోడెదూడ, 4.గంధర్వులలో ఒక తెగ.
కంౘరగాడిద - కంచరము లాగు గాడిద, అశ్వతరము.
వేసడము - కంచరగాడిద, రూ.వేసరము, సం.వెసరః.
మయము - 1.ఒంటె, 2.కంచరగాడిద. 
కోడె - 1.కాడి మరపదగిన దూడ, 2.విటుడు. 
కోడెకాడు - 1.యుక్తవయసువాడు, 2.విటుడు. 
కోడెరౌతు - వృషభవాహనుడు, శివుడు. 

తతో (అ)భివ్రజ్య భగవాన్ కేరళాంస్తు త్రిగర్తకాన్ |
గోకర్ణాఖ్యం శివక్షేత్రం సాన్నిధ్యం యత్ర ధూర్జటేః |

గిడ్డి - ఆవు, పొట్టియావు, సం.గృష్టిః.
గిత్త - కోడె, పొట్టియెద్దు.
కోడియ - కోడెదూడ, గిత్త, రూ.కోడె.
గుజ్జు(ౙ) - 1.పొట్టిదనము, 2.కోడెదూడ, 3.పాపట, 4.దూలము మీది గురుజు, 5.క్రొవ్వు, విణ.1.పొట్టివాడు, సం.కుబ్జః.
గుజ్జువేలుపు - వినాయకుడు.    

గోవు మూపున బ్రహ్మదేవుడు, మధ్య భాగమున రుద్రమహేశ్వరాది సహితముగా శివుడు, కటి ప్రదేశము నందు విష్ణుమూర్తి నివశింతురు. ఇట్లే గోమాత పృష్ఠభాగమందు సర్వపుణ్యతీర్థములు, గో గర్భము నందు కుడి భాగమున మహర్షి గణములు, వామ భాగమున దేవతాగణములు అడుగు భాగమున సమస్త నదులూ వశించుచుండును.

వెన్ను - 1.కంకి, 2.ఇంటి నడికప్పు, 3.వీపు.
వెన్నుఁడు - విష్ణువు సం.విష్ణుః
విష్ణువు - వెన్నుడు -  అలంకారప్రియుడు(అలంకారములు వస్త్రములు గాను), విశ్వమంతటా వ్యాపించినవాడు.
యమధర్మరాజు - సూర్యుని పుత్రుడు, ధర్మము నెరింగి పాలంచువాడు. దక్షిణ దిక్కున కధిపతి. ధర్మాధర్మాలను నిష్పక్షపాతంగా నిర్వర్తించేవాడు. కాలపాశము ఆయుధముగా గలవాడు. దండపాణియైన యముడుఁ డేమి విధించునో?

ముకు - నాసిక, రూ.ముక్కు.
నాన - ముక్కు, రూ.నస, నాసిక. (నాసత్యులు - అశ్వినీదేవతలు)
సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.

గోవుల సముదాయం ఏ స్తానంలో నిర్భయంగా కూర్చుని శ్వాస పీలుస్తుందో ఆ ప్రదేశం శోభాయమానమవటమే కాక ఆ స్థలంలోని పాపాలన్ని పీల్చబడతాయి. గోశాల పవిత్రమైన ప్రదేశం.

ముప్పదిమూడుకోట్ల దేవతలు యేకమైతే ముక్కు పట్టించగలరు కాని ప్రాణాయామము పట్టించగలరా!

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.  
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి. సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది.

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో   

ఇల - 1.నేల, 2.బుధుని భార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ -
1.(యోగ) ఒక నాడి, ఇడ చంద్రరూపిణి (తెలుపు, చంద్రుని తేజస్సు),2.మైత్రావరుణి యను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.

ఇళ - అల; అల - తరంగము, విణ. 1.ప్రసిద్ధిని తెలుపును, ఉదా. అలవైకుంఠములో.

గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకును, వాక్కునకును పేరు. ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు. ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును. ఇళాశబో భుధభార్యాయామపి. యస్యాః పుత్రః పురూరవాః. "ఊర్వశిసంభవ స్యాయమైళ సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోర్వశీయే.

హంభ - గోధ్వని, ఆవు అరుపు.
ఉంబ -
గోవుల అంబారవము, సం.అంభా.
బే - ఆవుయొక్క అరపు 'అంబే' యనుట. 

దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయుణి భార్య లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వసిష్ఠుని భార్య అరుంధతీదేవి - వీరంతా కూడి ప్రాతః  కాలమున లేచి స్త్రీలు చేసిన పాపములు ఎలా పోవును కృష్ణ అని అడిగినారు. పొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. మధ్యాహ్న కాలమందు పఠిస్తే సహస్ర గదులలో దీపారాధన చేసినట్లు, నూరు గోవులు దానము చేసినట్లగును. అర్ధరాత్రి వేళ పఠిస్తే యమ బాధలు పడబోరు, యమ కింకరులు చూడబోరు.

గోవుల నామాలను, గుణాలను సంకీర్తన చేయడం, వానిని శ్రవణం చేయడం, గోవులను దానం చేయడం మరియు వానిని దర్శించటం - ఈ చేష్ఠలన్నీ ప్రశంసనీయాలుగా చెప్పబడ్డాయి. వీనివలన సమస్థ పాపాలు తుడిచిపెట్టుకొనిపోవడమేకాక, అత్యంత శుభాలు కలుగుతాయి. – మహాభారతము

గోమహత్యము పఠించిన వారికి, విన్న వారికి, చెప్పిన వారికి విష్ణు లోకములు, పుణ్య లోకములు కలుగును.

కామ ధేనువు