Friday, January 4, 2013

సప్త మాతృకలు

షాణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.

ఓం మాతృమండల సమ్యుక్త లలితాయై నమో నమః : మాతృకా సమూహంలో కలసి విలసిల్లు నట్టి జననికి నమస్కారాలు.

మాతృకలు :- బ్రహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.

బ్రాహ్మీత్యాద్యాస్తు మాతరః :
బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా,
వారాహీ చైవ చేంద్రాణి చాముండా సప్తమాతరః.

బ్రాహ్యాద్యాః మాతరః రుద్రపరిచర్యాశీలాః, మాంతి పరిచర్యాం మాతరః - శివునికి పరిచర్యలు సేయువారు. మాజ్ మానే వర్తనేచ తా స్సప్త. (బ్రహ్మసంబంధినీ బ్రాహ్మీ, మహేశ్వర సంబంధినీ మహేశ్వరి, కుమారసంభంధినీ కౌమారీ, విష్ణుసంబంధినీ వైష్ణవీ, వరాహస్యేయం వారాహీ, ఇంద్రసంబంధినీ ఇంద్రాణీ, చాముండనామాసుర సంహారిణి చాముండా) ఈ క్రమముగా బ్రాహ్మి మొదలగు శక్తుల పేర్లు.

మాతృకలనగా యాభయిరెండు 52 అక్షరములు. వానిలో ఓంకారము మొదటిది, తరువాత పదునాలుగు స్వరములు (అచ్చులు), ముప్పయి మూడు హల్లులు, అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయ, ఉపధ్మా నీయములు కలిపి యాభయిరెండు.

ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.
ప్రణవము -
ఓంకారము.
ఓమ్ - 1.పరబ్రహార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క సారభూతము. వేదాంత గ్రంథము అన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ+ఉ+మ). మంత్రములకెల్ల శిరోమణి, ఓంకారమునందు సమస్త జగత్తును ఇమిడి యున్న దని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారేశ్వరుఁడు - శివుడు.

కావేరికా నర్మదయోః పవిత్రే - సమాగమే సజ్జన తారణాయ|
సదైవ మాన్దా తృపురే వసన్త - మోంకార మీశం శివ మేక మీడే.

అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి.1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.
అక్షమాల (రుద్రాక్షమాల - అక్షమాల) - 1.అకారము మొదలు క్ష కారము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తాళవము, 3.అరుంధతి. అరుంధతి - 1.వసిష్ఠునిభార్య, 2.ఒకానొక నక్షత్రము, 3.దక్షుని కూతురు, వికృ.ఆరంజ్యోతి. సతుల యందు దేవీస్థానం అరుంధతి.
ఆరంజ్యోతి- 1.వసిష్ఠుని భార్య, 2.ఆ పేరుగల నక్షత్రము, సం.అరుంధతీ. మాతంగి - 1.పార్వతి, 2.వసిష్ఠుని భార్య. మాతంగీ మధుశాలినీ.......

భూచరీ ఖేచరీ మాయా మాతంగీ భువనేశ్వరీ,
కాంతా పతివ్రతా సాక్షీ సుచక్షుః కుండవాసినీ.

జపము - 1.మంత్రావృత్తి, 2.వేదాధ్యయనము, రూ.జపము.
జపించు - జపముచేయు.

రుద్రాక్షమాల - అక్షమాల; అక్షసరము - జపమాల; అక్షసూత్రము - జపమాల.
అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.

మాతృక - 1.తల్లి, 2.దాది, 3.పార్వతి, 4.అసలు గ్రంథము.
తల్లి -
జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.
తలి - జనని, తల్లి.
జనని - 1.తల్లి, 2.దయ(దయ - కనికరము), 3.లక్క, 4.కోరిక.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి.  

జనయిత్రీ ప్రసూర్మాతా జననీ -
జనయతీతి జనయత్రీ; జననీ చ. సీ. జనీప్రాదుర్భావే. - కొడుకులఁ గనునది.
ప్రసూతే ప్రసూః. ఊ. సీ. షూఙ్ ప్రాణి ప్రసవే. - కొడుకులను గనునది.
మాతి వర్తతే గర్భో త్ర మాతా. ఋ. సీ. మామానేవర్తనే చ-గర్భ మీమెయం దిమిడియుండును. ఈ నాలుగు తల్లి పేర్లు.

ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము -
పదియాఱు 16 మొదలు ఏఁబది 50 సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము. స్త్రీలకు భాగ్యమే యౌవ్వనము. ౙవరాలు – యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
తరుణిమ - యౌవనము, రూ.తరుణ్యము. 
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు(హరిద్ర - పసుపు).

తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ. సీ. తౄప్లవనర్తరణయోః. - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః. యు మిశ్రనే. పురుషునితోఁ గూడునది. ఈ ఒకటి జవ్వని పేరు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.

ఉమ - 1.పార్వతి(శివసన్నిధిని దేవిస్థానం పార్వతి), వ్యు.తపము వలదని తల్లిచే అడ్డుపెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉమాపతి -
శివుడు.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

హరిద్ర - పసుపు.
వరవర్ణిని -
1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు -
యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదువన్నెలు సుమంగళి చిహ్నములు). జీవభత్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః
చత్వారి సంప్రవర్ధంతే కీర్తి రాయు ర్యశ్యో బలమ్|
తా.
పూజనీయులను నమస్కరించు స్వభావము కలిగి, పెద్దల నెల్లపుడు సేవించువానికి కీర్తి, ఆయువు, యశస్సు, బలము అను నీ నాలుగు వృద్ధి నందును.  

అనంత - 1.భూమి, 2.పార్వతి, (వృక్ష.) 1.ఎద్దు నాలుక చెట్టు, 2.గరిక, 3.ఉసిరిక, 4.తిప్పతీగ, 5.జీలకఱ్ఱ, పిప్పలి.

విశ్వ - భూమి.
విశ్వంభరుఁడు -
విష్ణువు.

ధాత్రి - 1.భూమి 2.దాది 3.తల్లి, విణ.ధరించునది.
ధాత్రేయి -
1.దాది 2.భూమి.
దాది - 1.ధాత్రి 2.పాలిచ్చి పెంచు తల్లి, రూ.దాదిలి, సం.దాత్రీ.
ధన్య - దాది, విణ. ధన్యురాలు. సీత తల్లి ధన్యాదేవి.

ధాత్రీ స్యాదు ప మాతాపి క్షితిరప్యా మలక్యపి :
ధాత్రీ శబ్దము దాదికిని, భూమికిని, ఉసిరికచెట్టునకును పేరు. రధతీతి ధాత్రీ. సీ. డు ధాఞ్ ధారణపోషణయోః, ధరించునది, పోషించునది ధాత్రి. టీ. స. ధయంత్యేనామితి ధాత్రీ. ధే ట్పానే.

యథా మాతా స్తనాం ధానాం శిశూనాం శైశవే సదా |
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ||

పుట్టిన శిశువుకి ఆహారంగా తన పాలతో పెంచగల పోషకురాలు స్త్రీ. సంపన్నుల కుటుంబములో బిడ్డల ఆలనాపాలనా చూసుకొనేది దాది. బిడ్డలను సొంత పిల్లల మాదిరే ఆదరిస్తుంది. కాని ఆ బిడ్డల మీద తనకు ఏలాంటి హక్కు(హక్కు - బాధ్యత)లేదని, వుండదని ఆమెకు తెలుసు. ధాత్రి (రాజ కన్యలకు పెంపుడు తల్లి)తల్లిలేని శిశువుల్ని(శిశువు - బిడ్డ) కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నారు, వుంటారు.

ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ|
లోకతీతా గుణాతీతా - సర్వాతీతా శమాత్మికా. - 176శ్లో

భూ - భూమి.
భూమి -
నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి(భూ - భూమి), 2.ప్రదేశము, 3.దేశము.
ప్రదేశము - స్థలము, చోటు.
స్థలము - 1.మెట్ట నేల(మెరక - మెట్ట నేల), 2.చోటు(తావు).
భూపతి - నేలరేడు, రాజు.
నేలఱేఁడు - రాజు; భూభుజుఁడు - రాజు.
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు; నేల వేలుపు - భూసురుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.
విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.

రాజు - 1.రేడు(రాట్టు – రేడు), రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
రాజన్యుఁడు –
క్షత్రియుడు; క్షత్రియుఁడు - రాచవాడు.

రాష్ట్రము - 1.దేశము, 2.ఉపద్రవము.
రాష్ట్రపతి -
(శాస., రాజ., చరి.,) భారత రాజ్యాధిపతి, అధ్యక్షుడు (President).
అధ్యక్షుఁడు - అధిష్ఠాత, ప్రధానాధికారి, విణ. 1.ఇంద్రియములకు గోచరించువాడు, 2.పనులు కనుపెట్టు చూచువాడు, 3.ప్రత్యక్షమైనవాడు.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిష్ఠానదేవత - అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.

విప్రానాం జ్ఞానతో జ్యేష్ఠం - క్షత్రియాణాంతు వీర్యతః |
వైశ్యానాం ధాన్యధనత - శ్శూద్రాణా మేవజ్ఞతః||
తా.
బ్రాహ్మణులలో జ్ఞానముగలవాఁడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమవంతుఁడు పెద్ద, వైశ్యులలో ధనధాన్యము గలవాఁడు పెద్ద, శూద్రులలో వయోధకుఁడు పెద్దయని భావము. – నీతిశాస్త్రము

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథివీ.
పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి. చిత్రకూటము నందు దేవీస్థానం సీత. వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.

జన్మనా జనకః సో అభూద్వైదేహస్తు విదేహజః|
మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా||

సీత - 1.శ్రీరాముని భార్య, అతిరూపవతి మహాపతివ్రత 2.నాగటి చూలు, 3.ఆకాశగంగ.
జానకి -
జనకుని కూతురు, సీత.
అయోనిజ - గర్భమున పుట్టని స్త్రీ, వి.సీత.
శీత - నాగటిచాలు, రూ.సీత; వరజు – నాగటి చాలు, సీత.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి(Milkyway).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.

భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్ర యుతేనచ|
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే||
తా.
ఆరుమారులు భూ(భూ - భూమి) ప్రదక్షిణంబులు, పదివేలమారులు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున గలుగు ఫలము తమతల్లికి ప్రీతిపూర్వకముగా వందన మాచరించుట వలన గలుగును. - నీతిశాస్త్రము

అమలకము - 1.ఉసిరికాయ, 2.ఉసిరి చెట్టు.
ఉసిరిక -
1.అమలక వృక్షము, నెల్లిచెట్టు, 2.నేల ఉసిరిక.
మండ1 - ఉసిరిక; నెల్లి - ఉసిరిక.
మండ2 - 1.శాఖ, చిన్న కొమ్మ, 2.చీలమండ.

కరతలామలకము - జాతీ. అరచేతి లోని ఉసిరికాయ, సులువుగా అధీన మగునది.

అంకపాళి - 1.తొడ, 2.తిన్నె, 3.కౌగిలి, 4.దాది, రూ. అంకపాళి, అంకపాలిక, అంకపాళిక.
తొడ - ఊరువు.
ఊరువు - తొడ, వ్యు. వస్రము ఆచ్ఛాదింపబడునది.
తొడపుట్టువు - వైశ్యుడు.
వైశ్యుఁడు – కోమటి; భూమిస్పృశుఁడు - కోమటి.
కోమటి - వైశ్యుడు, సం.కార్పటికః.
కార్పటీకుఁడు - కోమటి.
విశుఁడు - 1.వైశ్యుడు, 2.మనుష్యుడు.
మనుష్యుఁడు - మానిసి, మానవుడు.
మానిసి – 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.

పురుషా వాత్మ మానవౌ : పురుష శబ్దము జీవునికిని, మనుష్యునికిని పేరు. పిపర్తీతి పురుషః. పౄ పాలన పూరనయోః. - పాలించువాఁడు.

ౙగతి - తిన్నె; ౙగిలె - తిన్నె, రూ.జగిలె.
తిన్నె -
తిన్నియ.
తిన్నియ - అరుగు, వేదిక, రూ.తిన్నె, తీనియ, తీనె.
అరుఁగు - తిన్నె, రూ.అరఁగు. తీనియ - తిన్నియ.
వేది - 1.వేదిక, తిన్నె, 2.విద్వాంసుడు, విణ.తెలిసినవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు. 

కౌగిఁలి - ఆలింగనము, రూ.కవుగిలి.
ఆలింగనము - కౌగిలింత.
కవుగిఁలి - 1.ఆలింగనము, 2.భుజాంతరము, రూ.కౌగిలి, సం.కోలః. శ్లిష్టి - 1.కౌగిలింత, 2.అంటుకొని యుండుట.

క్షమ - 1.ఓర్పు, 2.నేల, 3.మన్నింపు. ఓర్పు కవచము వంటిది. ఓరిమి -క్షమ, శాంతము, ఓరుపు. శాంతము కలిగిన వేరు బలము లేదు.

జగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగ - గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద. గొప్ప - అధికము, పెద్దది.
(ౙ)జాగా - 1.పెద్దది, 2.గొప్పది, 2.చోటు, రూ.జగ, జగా, జెగ, సం.జగత్.

ఏఱువ - దేశము, సీమ.
సీమ1 -
1.దేశము, 2.ప్రదేశము, 3.రాజ్యము, 4.పరదేశము.
సీమ2 - 1.ఎల్ల, 2.పెడతల.
ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య. సర్వశబ్దార్థకము.
అంతకము - 1.మొత్తము, 2.ఎల్ల, సీమ, (సం.వి. అని కొందరు).
పొలిమేర-1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు(సరిహద్దు - మేర), ఎల్ల.
ఉపకంఠము - దాపైనది, వి.1.పొలిమేర, 2.సమీపదేశము, 3.సమీపకాలము.
కృకాటిక - 1.పెడతల, 2.పెడతల యందలి ముచ్చిలిగుంట.  

పెడ - 1.పెద్ద, 2.వెనుకటిది, 3.విపరీతము, సం.వృద్ధః.
పెద్ద -
1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
వృద్ధు - 1.ముసలివాడు, 2.తెలిసినవాడు.
జ్యేష్ఠుఁడు - 1.అగ్రజుఁడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రజుఁడు - 1.బ్రహ్మ, 2.బ్రాహ్మణుడు, 3.అన్న(జ్యేష్ఠసోదరుడు).
అధికుఁడు - గొప్పవాడు.
శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.   
దీర్ఘము - నిడుద; నిడుద - పొడవు, దీర్ఘము, రూ.నిడుపు.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము.  

పెరుఁగు - వృద్ధిచెందు, ఎదుగు, వి.ధధి(దధి - పెరుగు), విణ.వృద్ధుడు.
ఎదుగు - వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
పెరుగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).

ఉరుగుణవంతుడొడ్లుదనకొండపకారము చేయునప్పుడున్
బరహితమే యునర్చునొకపట్టునైనను గీడుఁజేయఁగా
నెఱుఁగడునిక్కమేకదా యదెట్లనఁ గవ్వముఁబట్టియెంతయున్
దరువఁగజొచ్చినన్ బెరుంగు తామిసీయదెవెన్న, భాస్కరా.
తా.
పెరుగును కవ్వముతో నెంత తరచిన నంత వెన్న నిచ్చును, అట్లే గుణవంతుడు తనకు పరు లపకారము చేసినను, వాని నన్నిటిని సహించి వారికి ఉపకారమునే చేయును.  

దక్షిణాపథము - వింధ్య మొదలు సేతువు(నీటి కట్ట) వరకు గల దేశము.
ఆర్యావర్తము -
ఆర్యులు తమ పశు సముదాయముతో చరించిన భూమి (వింధ్యాచల హిమాచల మధ్య భూమి.) పుణ్యభూమి.

కంచి - కాంచీనగరము, విణ.పెద్ద.
కాంచీ -
1.స్త్రీలు ధరించెడు ఒంటి పేట మొలనూలు, 2.కాంచీపురము, (పుణ్యనగరము లేండింటిలో ఒకటి). కామాక్షీ కంచికాపురీ శక్తిపీఠం| 
మొలనూలు - ఆడువారు అలంకారార్థము ధరించెడు కటి సూత్రము.
కంచిమేఁక - పెద్దపొదుగు గల మేక.

క్వణత్కాంచీదామా - కరికలభకుంభ స్తననతా
పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా | 
ధనుర్బాణాన్ పాశం - సృణి మపి దదానా కరతలైః
పురస్తా దాస్తాం నః - పురమథితు రాహో పురుషికా || - 7శ్లో
తా.
మ్రోగుచున్న(చిరుగంటలతో కూడిన) బంగరు మొలనూలు గలదియు, గున్న యేనుగు కుంభస్థలముల వంటి స్తనములచే కాస్త వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుని వంటి ముఖము గలదీ, చేతులతో చెరుకు విల్లుని, పుష్పబాణాలను, పాశము అంకుశమును(సృణి - అంకుశము) ధరించినదియు నైన త్రిపురాంతకుని యహంకార రూపిణియగు దేవత మా యెదుట సుఖాసీనయై ప్రత్యక్షమగు గాక!  - సౌందర్యలహరి  

మహాపద్మాటవీసంస్థా - కదంబవనవాసినీ,
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ | - 23శ్లో 

కదంబారణ్యనిలయా వింధ్యాచలనివాసినీ,  
హరప్రియా కామకోటిపీఠస్థా వాంఛితార్థదా. - 7శ్లో

1. బ్రాహ్మి -  1.సరస్వతి, 2.పొన్నగంటి కూర,  రూ.బ్రాహ్మి 
    బ్రహ్మి - 1.సరస్వతి, 2.బాపన చేమ, 3.పొన్నగంటికూర.

Brahmi from Brahma, with rosary and kamandalam in her hands  and seated on a swan. కమండలము ధరించు నవదుర్గ బ్రహ్మచారిణి. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం|

అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మత్మైక్య స్వరూపిణీ|
బృహతీ బ్రాహ్మణీ బ్రహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. –
132శ్లో

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొం దిం చు వా డు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్య్డు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుద్ముఖుడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.

కమండలువు - సన్యాసు లుంచుకొను గిండి వంటి పాత్ర. 
కుండి -
కమండలువు, వికృ.గిండి.
గిండి - సన్నని మెడగల చిన్నచెంబు, సం.కుండీ.
కరకము - 1.ఎముకలగూడు, 2.కమండలువు, 3.దానిమ్మ, 4.పక్షి, 5.వడగల్లు.
దాడినిమ్మ - దాడిమము, ఒక ఫల వృక్షము, రూ.దానిమ్మ, దాడిమ్మ, దాళిమ్మ.

అస్త్రీ కమణ్డలుః కుణ్డీ -
కం జలం అండే మధ్యే లాతీతి కమండలుః ఉ.ప్న.లా ఆదానే. - ఉదకమును మధ్యమందు గ్రహించునది.
కుండవద్వృత్తత్వాత్ కుండీ. ఈ. సీ. కుండవలె వట్రువుగా నుండునది. ఈ రెండు కమండలువు పేర్లు.

కుసుంభము - 1.కుసుంభపువ్వు, 2.కమండలువు.
కుసుంభరాగము -
బయటికి కనబడుచు అంతఃకరణమందు లేనిప్రేమ.

అస్థిపంజరము - కంకాళము, ఎముకలగూడు.
కంకాళము -
ఎముకలగూడు.
కరంకము - 1.పుఱ్ఱె, 2.లోపల నెమియు లేని  బొండ్లపు చిప్ప, 3.తల, 4.కంకాళము.
పుఱ్ఱె - (గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium). 
బుఱ్ఱ - 1.కొబ్బెరకాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

న్రస్థిమాలీ - శివుడు, వ్యు.పుఱ్ఱెల దండ ధరించినవాడు.

కపాలము - 1.తలపుఱ్ఱె, 2.సమూహిము, 3.కుండపెంకు, (జం.) 1.పుఱ్ఱె, 2.పృష్ఠ వంశీక జంతువుల తలలోనున్న ఎముకల సముదాయము. కపాల మొచనము నందు దేవీస్థానం శుద్ధి.    
పునక -
తలపుఱ్ఱె, తలయెముక.
బొచ్చె - 1.కుండలోనగు వాని పెంకు, 2.తలపుఱ్ఱె.
కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (cranial nerves).

ఆకృషినాడి - (జం.) కపాలము నుండి బయలుదేరి కనుగ్రుడ్డు యొక్క కండరములకు బో వు నా డి (Pathetic nerve).

కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium).
కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.
కప్పెర - 1.పుఱ్ఱె, 2.భిక్షాపాత్రము, సం.కర్పరః.
గాబు - మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.
కమఠము - 1.తాబేలు, 2.భిక్షాపాత్రము. అక్షయపాత్ర - భిక్షాపాత్ర.
భవనాసి - (వ్యావ.) 1.బిచ్చగాని గిన్నె, 2.అక్షయపాత్ర.

ఆదిభిక్షువు - శివుడు.

వరాంగము - 1.ఏనుగు, 2.తల.
తల -
1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్. వి.1.శిరస్సు,  2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు.
సిరమము - శిర, తల, సం.శిరః.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
మస్తకము - శిఖరము, రూ.మస్తము.
కొపురు - 1.కొండకొమ్ము, శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము - 1.కొండకొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది.
శీర్షము - తల, (గణి.) భూమి కెదురుగా నుండు కోణబిందువు, (Vertex). 

కీలసంధి , వివర్తసంధి - (గృహ.) బొంగరపు కీలు, ఒక ఎముకలో ఇంకొక ఎముక గుండ్రముగా తిరుగుటకు అమరచిన కీలు, ఉదా.మెడ, తల, కీలు (Pivot joint).
మాడపట్టు - తలమీద ఎదుటి వెనుకటి ఎముకల కూడికలు (Fontanelle).

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు -
1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదుల కంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. - నీతిశాస్త్రము

సత్య జ్ఞానాత్మికా నందా బ్రహ్మీ బ్రహ్మ సనాతనీ,
అవిద్యా వసనా మాయా ప్రకృతి స్సర్వ మోహినీ. -
98శ్లో

బ్రాహ్మీ తు భారతీ భాషా గీ ర్వా గ్వాణీ సరస్వతీ :
బ్రహ్మణః ఇయం బ్రాహ్మీ. ఈ. సీ. - బ్రహ్మ సంబంధినియైనది.
బిభర్తీతి భారతీ. ఈ. సీ. భృఞ్ భరణే - భరించునది. భరతేన మునినా అవతారితత్వాద్వా భారతీ - ఈ లోకమునకు భరతుఁడను ముని చేత తేఁబడినది.
భాష్యత ఇతి భాషా. భాష వ్యక్తాయాం వాచి - భాషింపఁబడునది.
గృణం త్యేతామితి గీః. ర. సీ. గౄశబ్దే - దీనిని బలుకుదురు. గృణాతి అస్ఖలితముచ్చరతీతి గీః - లెస్సఁగాఁబలుకునది యని సరస్వతీ పక్షమందు.
ఉచ్యత ఇతి వాక్. చ. సీ. వచ పరిభాషణే - పలుకఁబడునది.
వణ్యతే శబ్ద్యత ఇతి వానీ. ఈ. సీ. వణ శబ్దే - పలుకఁబడునది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ – బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది. ఈ ఏడు వాగధి దేవత పేర్లు.    

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా చ భోగదా,
గోవిందా భారతీ భామా గోమతీ జటిలా తథా. - 6శ్లో

భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ.పూజ్యస్త్రీ.

సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రమునకును, నదీ విశేషము నకును, ఆవునకును(ఆవు - గోవు)పేరు. "సరస్వతీ స్యాత్ స్త్రీరత్నే నద్యాం నద్యంతరే గవి" యని అజయుడు.

భారతి - 1.సరస్వతి, 2.వాక్కు.
సరస్వతి -
1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
పలుకుఁజెలి - సరస్వతి.
ఐందవి - పల్కుజెలి, సరస్వతి.
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు; చెలియ - స్త్రీ; స్త్రీ - ఆడుది.

భా - 1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు.

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా,
బ్రహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరిస్రుతా| - 9శ్లో

ఇడ - 1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.

కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.

ఫణతి - 1.వాక్కు, 2.పాడెడె పద్దతి. 
ఫణితము -
వాక్కు, శబ్దము, విణ.చెప్పబడినది.

శబ్దము - 1.ధ్వని, 2.వ్యాకరణ శిక్షితమయిన పదము.
శబ్దశాస్త్రము - (వ్యాక.) వ్యాకరణ శాస్త్రము.

ధ్వని - 1.శబ్దము, చప్పుడు, 2.వ్యంగప్రధానశబ్దము, 3.వ్యంగము, (భౌతి.) శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహింపపడు సంక్షోభము, (Sound).
ౘప్పుడు - అచేతన వస్తువులు ఒకటితో నొకటి తాకుటచే కలుగుధ్వని, శబ్దము.
ౘప్పుడించు - క్రి. శబ్దముచేయు.
ధ్వనికము - (భౌతి.) ధ్వని సంబంధమైనది (Acoustic).
ధ్వనిశాస్త్రము - (భౌతి.) ధ్వని యొక్కపుట్టుక, ప్రసారము, స్వభావము-వీనిని గురించి తెలుపు భౌతిక శాస్త్రశాఖ, (Acoustics).శబ్ద సంబంధమైన విద్య.
ధ్వానము - ధ్వని. ధ్వనితము - శబ్దించునది. 
విభక్తి - (వాక్య.) శబ్దముల పరస్పర సంబంధమును దెలియజేయునది. 

అలికిడి - ధ్వని, చప్పుడు, సవ్వడి.
అలుకుడు -
అలికిడి.
సలి - చప్పుడు, సందడి.
సలించు - వై.క్రి.చలించు, సం.చల్.
సందడి - 1.ఒరిసికొను జనసమూహము, 2.జనసమూహధ్వని, 3.అతిశయము, విణ.సంకులము.
సంకులము - 1.పూర్వోత్తర విరుద్ధమైనది (మాట), 2.సంకీర్ణము.
సంకీర్ణము - ఒకటితో నొకటి కలిసినది.
సందడించు - క్రి.సందడిగొను, సందడిపడు.
సవడి - సవ్వడి; సవ్వడి - సవడి.

నాదము - ధ్వని.
నాదు -
నాదము, ధ్వని, సం.నాదః.

గానము - 1.పాట, 2.ధ్వని, 3.స్తుతి.

శబ్దగ్రహము - 1.చెవి, 2.శబ్దజ్ఞానము.

శాబ్దికుఁడు - వైయాకరణుడు, శబ్దశాస్త్రము తెలిసినవాడు.
వైయాకరణుఁడు -
వ్యాకరణశాస్త్ర పండితుడు.

భాషారూపా బృహత్సేనా భావాభావావివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః . - 133శ్లో

శారద - 1.సరస్వతి, 2.పార్వతి.
శారదము -
సంవత్సరము, విణ.శరత్కాలమున బుట్టినది.

సరస్వతీ శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరమ్|
కోటి చంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహామ్||

మినుకుఁజేడియ - సరస్వతి.
మినుకు -
1.కిరణము, 2.తాలిబొట్టు, 3.మినుకు మినుక్కు మను కాంతి, 4.వేదము. విప్రులకు వేదం - బలం.
కిరణము -
వెలుగు, మయూఖము.
తాలిబొట్టు - మంగళసూత్రపు బొట్టు, రూ.తాళిబొట్టు.
పెనుమినుకులు - వేదము.
మినుకులబరణి - సూర్యుడు, వ్యు.కాంతులకు బరణివంటివాడు.

త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.

కంఠసూత్రము - పుస్తె, మంగళసూత్రము.
పుస్తె -
తాళిబొట్టు.
మంగళసూత్రము - మాంగల్యము, పుస్తె.
మాంగల్యము - 1.మంగళత్వము, 2.తాళిబొట్టు.
శతమానము - 1.నూటికొలది, 2.పుస్తె, మంగళసూత్రము.

వేదమూల మిదంజ్ఞానం - భార్యామూల మిదంగృహమ్|
కృషిమూల మిదంధాన్యం - ధనమూల మిదంజగత్||
తా.
జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు భార్యయేమూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. – నీతిశాస్త్రము

చదువు ఒకప్పుడైనా శాపం కావచ్చు గాని, జ్ఞానం ఎప్పుడూ మనిషికి వరమే. - జాన్ వి. షెడ్

ౘదువులపడఁతి - సరస్వతి; పడతి - స్త్రీ, విణ.పణతి.
ౘదువుల వేలుపు -
బ్రహ్మ.
ౘదువు - పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.
పాఠము - 1.చదువు(పఠనము - చదువు), 2.వేదపఠనము.
విద్దె - చదువు, విద్దియ, సం.విద్యా.
విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
తొలిచదువులు - వేదములు.  

చదువు పేదవానికి పెన్నిధి, సంపన్నునికి గౌరవం, యువతకు బలం, ముసలివారికి ఆసరా. - లావెటర్

విద్యానామ నరస్యరూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం|
విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాంగురుః||
విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరాదేవతా|
విద్యారాజసుపూజ్య తే నహిధనం విద్యావిహీనఃపశుః||
తా.
విద్య పురుషునికి శ్రేష్ఠమైన రూపము, రహస్యముగా దాచిన ధనము, భోగమును కీర్తిని సుఖమును గలుగఁజేయునది, గురువుల కందఱికి పూజ్యమైనది. దేశాంతర గమనమున బంధుజనములవలె రక్షించునది. ఉత్తమమయిన దైవమువలె నభీష్టముల నిచ్చునది, ప్రభువులవలనఁ (బూ)పూజింపఁబడునది. ఇట్టి విద్యకు సరియైన ధనము లేదు, గావున విద్యలేనివాఁదు పశుప్రాయుఁడు. – నీతిశాస్త్రము

విద్యావంతులైన ప్రజలను నడిపించడం తేలిక, తోలడం కష్టం; పరిపాలించడం తేలిక, అణగద్రొక్కడం అసాధ్యం. - లార్డ్ బ్రూగమ్

విద్యావాసా చండికా చ సుభద్రా సురపూజితా,
వినిద్రా వైష్ణవీ బ్రహ్మీ బ్రహ్మజ్ఞానైక సాధనా.

వాణి - 1.పలుకు, 2.సరస్వతి.
పలుకు -
మాటాడు, అను, వి.1.వచనము, 2.నింద, 3.విద్య, 4.తునక.
అను1 - క్రి.1.చెప్పు, వచించు, 2.అనుకరణ శబ్దములను అనుప్రయుక్త మగును.
అను2 - అవ్య. ఈ క్రింది అర్థములనిచ్చు ఉపసర్గ: 1.ఆశ్రయము, 2.ప్రాప్తము, 3.పోలిక, 4.తరువాత, 5.తగినది, 6.క్రమము, 7.సామీప్యము, 8.సహార్థము, 9.అనుకూల్యము. 

వ్యాహారము - పలుకు, వచనము. 
వ్యాహృతము -
వచించబడినది.

వచనము - మాట.
మాట - 1.పలుకు, వచనము, 2.నింద, వృత్తాంతము.
వృత్తాంతము - 1.వర్తమానము, 2.కథ, 3.ప్రస్తావము.
వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుచున్నది.

విద్యామానము - వర్తమానము.
కత -
చరితము, సం.కథా.
చరితము - చరిత; చరిత - 1.నడవడి, 2.తిరుగు, 3.చేయు.
నడవడి - 1.ప్రవర్తనము, 2.నడత, చరిత్రము, రూ.నడవడిక.
ప్రవర్తన - (గృహ.) నడవడి, నడత (Behaviour).
చరిత్ర - 1.చరితము, 2.మానవ నాగరికత, గత చరిత్ర సంఘటనలతో అవినాభావ సమబంధము కలిగి భవిష్యత్ మానవ సాంస్కృతికార్థిక, రాజకీయ, సాంఘిక, పురోగమునకు దారిచూపు శాస్త్రము.
చరిత్రయుగము - (చరి.) దేశ చరిత్ర తెలిసికొనుటకు లిఖితాధారములు గలకాలము.
కథ - తొల్లింటికత, వాస్తవార్థము కలది.
కథనము - చెప్పుట, వర్ణించుట, ఉల్లెఖనము.
కథితము - చెప్పబడినది.
కథకుఁడు - 1.కథలు చెప్పువాడు, 2.పురాణము తెలిసినవాడు.
ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గణి.) విషయ విపులీకరణము (Exposition).  

ఉపాఖ్యానము - ప్రధాన కథలో వచ్చెడి అవాంతర కథ.

ఆఖ్యానము - 1.చెప్పుట, 2.పూర్వ వృత్త కథనము, 3.ప్రత్యుత్తరము, 4.కథ.
ఆఖ్యాయకుఁడు - 1.ఒక విషయమును వివరించి చెప్పువాడు, కథకుడు, 2.దూత.
ఆఖ్యాయిక - వాస్తవముగా జరిగిన కథను చెప్పెది గద్యగ్రంథము, ఉదా. బాణుని హర్షచరితము.

వక్త - 1.విశేషముగ మాటాలాడువాడు, వాచాటుడు, 2.పండితుడు.
వచత్నువు -
1.వక్త, సభలో నిర్భయముగా మాటాడునతడు, 2.బ్రాహ్మణుడు.

కదా కాలే మాతః - కథయ కలితాలక్తకరసం 
పిబేయం విద్యార్థీ - తవ చరణ నిర్ణేజనజలమ్|
ప్రకృత్యా మూకానా - మపి చ కవితా కారణతయా
కదా ధత్తే వాణీ - ముఖకమలతాంబూల రసతామ్ || - 98శ్లో 
తా.
తల్లీ!  పారాణి వలె ఎఱ్ఱని లత్తుక రసంతో గూడిన నీ పాదములు, కడిగిన పాదప్రక్షాళిత జలం(తీర్థమును) బ్రహ్మవిద్య నర్థించువిద్యార్థినైన నేను ఎప్పుడు పుచ్చుకొనగలుగుదునో(త్రాగుదును) చెప్పుము? ఆ నీ పాదోదకము స్వభావముగానే చెవిటివారికి విను శక్తిని, పుట్టుకతో మూగయైన వారలకు గూడ మాటాడు శక్తిని కలిగించి వారికి కవిత్వము(కవిత్వము - కవిత)వచ్చుటకు కారణభూతమైన వాణీ ముఖకమల తాంబూల రససమును నెప్పుడు గ్రహింతునో! – సౌందర్యలహరి

అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ,
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా. - 10శ్లో

మాటకారి - 1.వాగ్మి, 2.వాచాటుడు. 

వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ.యుక్తియుక్తముగా మాటాడు వాడు. 
చిరు -
చిలుక; చిలుక - కీరము, శుకము, రూ.చిల్క. 
కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము. 
లాజము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
శుకము - చిలుక; శుకవాహుఁడు - మన్మథుడు.
రామతమ్మ - చిలుక; చిలుకరౌతు - మదనుడు.
ౘదువుల పులుఁగు - చిలుక; పలుకుఁ దత్తడి - చిలుక.  
వచము - చిలుక. చిలుకలకొలికి - స్త్రీ; స్త్రీ - ఆడుది.  

కీరశుకౌ సమౌ,
కీతి శబ్దం రాతి కీరః. రా ఆదానే. కీ యను శబ్దమును గ్రహించునది.
వుకతీతి శుకః శుక గతః. చరించునది. ఈ రెండు చిలుక పేర్లు.

మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ -
ధారణాశక్తి గల బుద్ధి.

రాకొమరుల్ రస్జుని దిరంబుగ మన్నననుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁదమలోపలనుంపరు, నిక్కమేకదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక, పెంతురే
కాకము నెవ్వరైన, శుభకారణ సన్ముని సేవ్య! భాస్కరా.
తా.
చిలుకను చూచినా, దాని పలుకులను ఆలకించినా మానవులకు ఆనందం కలుగుతుంది. ఎవ్వరైనను మనుష్యులు భూమిమీద చిలుకను పెంచుదురు గాని కాకిని(కాకము - కాకి, వాయసము.)పెంచరు. అట్లే, ప్రభువులు ఒక రసజ్ఞుని(పండితుని) పోషించిన విధముగా మూర్ఖుని తనఇంటిలో నుంచి కొనరుగదా.     

వాచస్పతిస్తథా మిథ్యావక్తా చేద్దానవాన్ప్రతి |
కః సత్యవక్తా సంసారే భవిష్యతి గృహాశ్రమీ ||

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

అవాచ్యము - 1.చెప్ప శక్యము కానిది, 2.చెప్పదగనిది, వి.నిందా వచనము.
గ్రస్తము -
1.తినబడినది, 2.మ్రింగబడినది, 3.లోపించిన వర్ణములు గలది(మాట). 

జల్పము - ఉపయుక్తముకాని మాట.
జల్పాకుఁడు - వదరుబోతు.

మాటలమారి - వాచాటుడు; వాచాటుఁడు - వదరుబోతు; వాచాలుఁడు - వదరుబోతు.  

సడి - 1.అపకీర్తి, నింద, 2.జాడ, 3.ధ్వని.సడిచేయకో గాలి సడి చేయకే.. అపకీర్తి - చెడుపేరు, దురస్యము.

నింద - దూరు, అపదూరు.
దూఱు - నిందించు, వి.నింద.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు. నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.

దిసంతడుచు - క్రి.దూరు, నిందించు.
దూఱు -
క్రి. నిందించు, వి.నింద.
దిసంతు - 1.నింద, 2.రోత, సం.దూషితమ్.
దిసంతుకొట్టు - క్రి. దిసంతుపడు.
దూషణము - నిందించుట.

మాట్ల్లాడవలసిన అవసరం వున్నపుడు మాట్లాడకుండా వూరుకోవడం, మాట్లాడక పోవడం మంచిదైనపుడు మాట్లాడటం, ఇవి రెండూ మనిషి బలహీనతకు నిదర్శనాలు. - పర్షియన్ సామెత

సారస్వతము - సరస్వతీ సంబంధమైనది, వి.1.వాఙ్మయము, 2.భాష.
వాఙ్మయము -
భాష.
భాష - 1.మాట, 2.ప్రతిజ్ఞ, 3.ప్రమాణము, 4.వ్యవహారయోగ్యమైన వాక్యాదికము, 5.సంస్కృతాది భాష, వి.బాస.
భాషితము - మాట.

బాస - 1.భాష, 2.ప్రతిజ్ఞ, 3.ఒట్టు, 4.సంకేతము, సం.భాషా.
బాసవాలు - 1.వేలుపు, 2.ఋషి, వ్యు.పలుకే ఆయుధమైనవాడు.

ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
మౌని - మౌనవ్రతుడు, ముని. మౌనము - మాటాడకుండుట.
ఋషి - 1.జ్ఞానముచే సంసారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.

సవిత్రీభి ర్వాచాం - శశిమణి శిలాభఙ్గరుచిభిః
వశిన్యాద్యాభిస్త్యాం - సహ జనని సఞ్చిన్తయతి యః |
స కర్తా కావ్యానాం - భవతి మహతాం భఙ్గి రుచిభిః
వచోభిర్వాగ్దేవీ - వదన కమలామోదమధురైః || - 17శ్లో 
తా.
ఓ అమ్మా !  ఎవడు వాక్కుల నొసగునట్టియు చంద్రకాంత మణులవలె ప్రకాశించు వశిన్యాది దేవతలచే కూడియున్న నీ దివ్యస్వరూపాన్ని ఎవరు ధ్యానిస్తారో(వశినీ మున్నగు భక్తులతో నిన్ను ధ్యానించునో), అతడు మహాత్ములవలె నింపగుననియు, సరస్వతీదేవి(గీర్దేవి - సరస్వతి, వాగ్దేవి.)యొక్క ముఖ పద్మమువలె పరిమళించు నవియు అగు తీయని మాటలచే రుచివంతమై, కావ్యములను రచించు వాడగును. - సౌందర్యలహరి    

వాగ్దేవీ ర్వశినీముఖ్యా స్సమాహూయేద మబ్రవీత్ |
వగ్దేవతా వశిన్యాద్యా శ్శృణుద్వం వచనం మమ.
 

వా - నోరు, వాదర, రూ.వాయి, సం.వాక్.
వాయి -
1.నోరు, ముఖము, 2.ఖడ్గధార, సం.వాక్. వాయి ముడు.   
వాపుచ్చు - క్రి.నోరు తెరచు, వచించు. 
వాదోడు - మాటకు సాహాయము (వా+దోడు) (చేదోడువాదోడు).
వాదర - (వాడి+దార) కత్తి యొక్క పదునుగల అంచు.
వాతప్పు - (వాయి+తప్పు) నోట వెలుపడిన తప్పుమాట.  

మౌఖికము - (జం.) నోటి సంబంధము గలది (Oral).
మౌఖరి - ముఖరత్వము, వాగుట. వాగటం ఆపి నోరు మూస్తావా లేదా! నోరు మూసుకుని కూర్చో అని కోప్పడుతుంటారు.  

ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
ఆననము -
1.మొగము, 2.నోరు.
మొకము - ముఖము, సం.ముఖమ్.
మూతి - నోటి పైభాగము, ముఖము, సం.ముఖమ్.
ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity). 
నోరు - 1.ముఖద్వారము, 2.వదనము.
వదనము - నోరు, ముఖము.
నోరుమొదల్చు - క్రి.మాటలాడ ప్రయత్నించు.
ముఖరము - 1.మ్రోగునది, 2.అసంబద్ధవచనము లాడునది.
మొకరి - 1.మ్రోగునది, 2.అసంబద్ధ వచనము లాడునది, సం.ముఖరమ్.
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము (Peristome). 

ఆస్యము - 1.ముఖము, 2.నోరు, విణ.1.నోటనున్నది, 2.ముఖమున ఉన్నది. నోరు వుంటే తల గాస్తుంది.  

శంస - 1.మాట, 2.స్తోత్రము, 3.ఇచ్ఛ.
శంసనము - 1.చెప్పుట, 2.స్తుతించుట, 3.ఇచ్ఛించుట.

ప్రస్తావ సదృశంవాక్యం స్వభావ సదృశక్రియామ్|
ఆత్మశక్తి సమంకోపం యోజానాతి సపండితః||
తా.
ప్రస్తావనకుఁ దగినమాట, పరుల స్వభావమునకుఁ దగిన కార్యము, తన శక్తికి దగిన కోపము, ఏవండెఱుగునోవాఁడు వివేకియగు. – నీతిశాస్త్రము

భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా|
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః||

నియమము - (భౌతి.) కొన్ని ప్రకృతి సంఘటనల సంతతక్రమమును సూచించు సూత్రము (Law) విజ్ఞానశాస్త్రములందు ప్రత్యవేక్షింపబడిన ఏదేని ఒక సంబద్ధ భూతార్థముల సమూహమును సమన్వయించి ప్రకృతి ప్రవర్తనను సూచించు సూత్రము, సం.వి. (గణి.) షరతు (Condition), షరతు - ప్రతిబంధము, కారణప్రక్రియల కై ప్రవర్తమానమగినది, సం.వి. 1.ఏర్పాటు, 2.కట్టు, 3.పసుపు(హరిద్ర - పసుపు),4.ప్రతిజ్ఞ, 5.వ్రతము, రూ.నియామము. వ్రతము - నియమము, నోము, ఉపవాసాది పుణ్యకర్మము.
నోము - 1.వ్రతముచేయు, 2.పోగొట్టు, వి.వ్రతము
నియతి - 1.నియమము, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది. 
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, చూడబడనిది. భవిష్యము - 1.శుభము(శుభము - మంగళము), 2.భాగ్యము.

నాన్నోదకసమం దానం, నద్వాశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యాః పరంమంత్రం, సమాతుర్ద్వైవతం పరమ్||
తా.
అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశి వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతిశాస్త్రము.

వాణిజుఁడు - సార్థవాహుడు.
సార్థవాహుఁడు -
వర్తకుడు, విణ.ముఖ్యుడు.
వర్తకుఁడు - వ్యాపారి.
వ్యాపారి - మాధ్వబ్రాహ్మణుడు, విణ.వ్యాపారము గలవాడు.
వ్యాపారము - 1.పని, 2.ఉద్యోగము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
కార్యము - 1.పని, 2.హేతువు, 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది.
ఉద్యోగము - 1.యత్నము, 2.పని, 3.కొలువు, 4.పాటుపడుట.

అభ్యాసానుఁరీవిద్యా బుద్ధిః కర్మానుసారిణీ|
ఉద్యోగసారిణీ లక్ష్మీ ఫ్లంభాగ్యానుసారిణి||
తా.
అభ్యాసము అను సరించి విద్యవచ్చును, కర్మానుసారముగా బుద్ధి గలుగును, ఉద్యోగానుసారముగా నయిశ్వర్యము వచ్చును, భాగ్యాను సారముగా ఫలము గలుగును. - నీతిశాస్త్రము

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.)  

గీర్దేవి - సరస్వతి, వాగ్దేవి. సరస్వతి యందు దేవీస్థానం దేవమాత, బ్రహ్మ ముఖములందు సరస్వతి.

గీర్దేవ తేతి గరుడధ్వజ సుంద రీతి
శాకంభ రీతి శశిశేఖర వల్ల భేతి
సృష్టిస్థితిప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువ నైక గురో స్తరుణ్యై. - 10శ్లో

పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
కితాబు -
1.బిరుదు, 2.పుస్తకము.
పుస్తకము - పొత్తము.
గ్రంథము - 1.కావ్యము, పుస్తకము, 2.ధనము, 3.ముప్పది రెండక్షరముల శ్లోకము.

కావ్యము -  కవికృత గ్రంథము, కవి కల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కావ్యుఁడు - శుక్రుడు.

వాచకము - 1.వ్యాక్యర్థమును తెలిపెడి శబ్దము, 2.తరగతి పాఠ్య పుస్తకము.
వాచ్యము - చెప్పదగినది.
వాచస్పత్యము - ఒక నిఘంటువు పేరు.

పుస్తకం వనితావిత్తం పరహస్తం గతంగతం|
అధవా పునరాయాతం జీర్ణం భ్రష్టాచ ఖండశః||
తా.
పుస్తకము, వనిత, ధనము, ఒకరిచేతికి పోయిన పోయినదియే యగును. ఒక వేళ తిరుగవచ్చినను పుస్తకము జీర్ణమెవచ్చును, వనిత భ్రష్టురాలై(వెలివేయబడినదై, వ్యాధిగ్రస్తురాలై)వచ్చును, ధనము కొంచెముగా వచ్చును. – నీతిశాస్త్రము

త్రిపురా భైరవీ విద్య హంసా వాగీశ్వరీ శివా.
వాగ్దేవీ చ మహారాత్రిః కాళరాత్రి స్త్రిలోచనా. - 5శ్లో

సావిస్ర - 1.సరస్వతి, 2.పార్వతి, 3.సత్యవంతుని భార్య.

ఋతము - 1.సత్యమైనది, 2.పూజింపబడినది, 3.ప్రాప్తము, వి.1.జలము, 2.సత్యము, 3.మోక్షము, 4.యజ్ఞము.
ఋతంభరుఁడు - 1.సత్యపాలకుడు, 2.పరమేశ్వరుడు.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాక్భతిః|
అనేకకోటిబ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా. - 124శ్లో

లోల - 1.నాలుక, 2.లక్ష్మి, విణ. 1.కదలునది, 2.మిక్కిలి యిచ్ఛగలది.
నాలుక -
నాలిక. నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వ - నాలుక. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
జిహ్వాచాపల్యము -
తినవలెననెడి కోరిక.
రస - 1.నాలుక, 2.రసాతలము(పాతాళలోకము, అధోలోకము.).
రసన - నాలుక.
రసభరితము - (వృక్ష.) రసముతో నిండినది, (Succulent).

కుండిక - 1.రసాతలము, 2.చిన్నపాత్ర.
రసాతలము -
పాతాళలోకము, అధోలోకము.
అధోభువనము - పాతాళలోకము.
పాతాళము - క్రిందిలోకము; నాగలోకము - పాతాళము.

రసజ్ఞా రసనా జిహ్వా :
రసం జానాతీతి రసజ్ఞా. జ్ఞా అవబోధనే. - రసము నెఱుఁగునది.
రస్యతే అనయా రసనా. రస అస్వాదనే. - దీనిచేత నాస్వాదింపఁబడును.
హ్వయతి రసవద్వస్తు జిహ్వా. హ్వేఞ్ స్వర్థాయాం శబ్దే చ. - రసయుక్తమైన వస్తువుల నిచ్ఛయించునది. ఈ మూడు నాలుక పేర్లు.

జిహ్విక - నాలుక, (వృక్ష.) తృణ పుచ్ఛము, వరి, జొన్న మొదలగు తృణజాతి (గడ్డిజాతి) మొక్కల ఆకులకు పత్రఫలకము, పత్రవృంతము కలియుచోట లోపలి వైపు కనబడు చిన్న తోకవంటి లేక నాలుకవంటి నిర్మాణము, (Lingua).
జిహ్వ - నాలుక, (lingua) కీటకముల క్రింది పెదవి, (Labium) లో గల మూడు భాగములలో నొకటి. చిబుకము (Mentum) (Sub-mentum) అనునవి తక్కిన రెండు భాగములు. 
జిహ్వాసంబంధము - (జం.) నాలుకకు సంబంధించినది, (Lingual).
జిహ్వాగ్రసని సంబంధము - (జం.) నాలుక గళములతో సంబంధము గలది, (Glosso-pharayngeal).
జిహ్వామూలీయము - (వ్యాక.) 1.జిహ్వ యొక్క మూలమునుండి (మొదలు నుండి)పుట్టు అక్షరములు. క, ఖ, అనువానికి ముందున్న విసర్గ స్థానమందు వచ్చు ఒక వర్ణము. దీనిని (తలకట్టు లేని రెండు గ లు ఒకదాని పైన ఒకటి, కిందకి పైకి) అను విధముగ వ్రాయుదురు, ఉదా.యశ () కాయము, 2.కవర్గము. 

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.             

కులుకము - నాలుక మురికి.

ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12 లేక ' డి ' లోపము వలన కలుగు వ్యాధి (Stomattis). 

రుచి - 1.ఇచ్ఛ, 2. చవి, 3.కాంతి, 4.సూర్యకిరణము.
ఇచ్ఛ -
అభిలాష, కోరిక.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ౘవి - 1.రుచి, 2.రసము. ౘప్పరించు (నాలిక) - చవిచూచు. 
రుచి - (రసా.) నాలుకతో గుర్తించ బడు వస్తుగుణము, ఉదా. పులుపు, తీపి, చేదు.
అభిరుచి - 1.అత్యాసక్తి (మితిమీరిన ఆసక్తి) 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినవి (Taste). (లోకో భిన్నరుచిః)

రసజ్ఞుఁడు - పండితుడు, విణ.రుచి నెరిగినవాడు, కళాసౌందర్యవేత్త.
సూరి -
1.సూర్యుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (Inner-voice).

రుక్కు - 1.కాంతి, 2.సూర్యకిరణము, 3.ఇచ్ఛ.

వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
భాతి -
1.కాంతి, 2.రీతి. 
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి. 
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
భా -
1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు.
భానువు - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు.
భామము - 1.కోపము, 2.రోషము, 3.సూర్యకిరణము.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.

చేప రసనేద్రియం జిహ్వ(నాలుక) వల్ల : ఇంద్రియ నిగ్రహం లేక నశించి పోతుంది.

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్త్రబాంధవాః|
జిహ్వాగ్రే బంధసంప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం||
తా.
నాలుకవలన సంపద (గ)కలుగును, నాలుకవలన చుట్టాలు(బంధువు, సంబంధి.) స్నేహితులు వత్తురు, నాలుకవలన సంకెళ్ళు ప్రాప్తమగును, నాలుకవలన చావును కలుగును. - నీతిశాస్త్రము

నరములేని నాల్క నాల్గువిధముల పల్కులు పల్క గలదు. 'జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి' లక్ష్మి నాలుక చివరన వసిస్తుంది. తీయని మాటకు లక్ష్మి నిలుస్తుంది. చేదు మాటకు పారిపోతుంది.

ముఖతస్తాలునిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే|
తతో నానారసో జజ్ఞే జిహ్వయా యో ధిగమ్యతే||

2. మాహేశ్వరి : మహాకాళము నందు దేవీస్థానం మహేశ్వరి.
మహేశ్వరీపురి యందు స్వాహా. స్వాహా అగ్నిదేవుని భార్య.

Maheswari from Maheswara with trident in hand, chandra rekha (cresent Moon) on her head, garlands of serpents on her body and seated on a bull.

ముక్కోల - త్రిడందము, మూడు కోలలు కలిపి కట్టిన దండము.
త్రిదండి -
మనోదండము, వాగ్దండము, కర్మదండము అను మూడు దండములు గల సన్యాసి.

హారనూపుర కిరీటకుండల విభూషితావయవశోభినీం,
కారణేశ వర మౌళికోటి పరికల్పయమానపద పీఠికామ్|
కాలకాలఫణి పాశబాణధనురంకుశా మరుణమేఖలాం,
ఫాలభూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతామ్|| - 1

మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా|
అపర్ణా చండికా చండ - ముండాసురనిషూదనీ. - 145శ్లో

సర్వయంత్రాత్మికా సర్వ - తంత్రరూపా మనోన్మనీ|
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా. - 53శ్లో

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము -
పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.

పృదాకువు - 1.పులి, 2.పాము, 3.తేలు.
పులి -
కౄరజంతువు, ధైర్యశాలి.1.నల్లని 2.పులిసినది, వి.శార్దూలము.

శార్దూల ద్వీపినౌ వ్యాఘ్రే. -
శృణాతీతి శార్దూలః. శృ హింసాయాం. - హింసించునది.
నివాసత్వేన ద్వీపమస్యేతి ద్వీపీ. న. పు. ద్వీప మునికిపట్టుగాఁ గలది. ద్వీప శ్చర్మాస్యా స్తీతి వా ద్వీపీ - ద్వీపమనఁగా చర్మము. అది గలది.
వ్యాజిఘ్రతీతి వ్యాఘ్రః. ఘ్రా గంధోపాదానే. - చంపునప్పుడు వాసనఁ జూచునది.
(అధికపాఠము. పుండరీకః పఞ్చానఖశ్చిత్ర కాయ మృగద్విషౌ, పుండం మాంసం రీకతి హరతీతి పుండరీకః - మాంసమును హరించునది.
పంచనఖాః యస్య నః పంచనఖః - ఐదుగోళ్ళు గలది.
చిత్రః కాయః యస్య చిత్రకాయః - పొడలచేత నానావర్ణములగల శరీరము గలిగినది.
మృగాణాం ద్విట్ మృగద్విట్. ష. పు. మృగములకు శత్రువు. ఈ నాలుగు 4 పెద్దపులి పేర్లు.   

శార్దూలము - పులి.
ద్వీపి -
1.పులి, 2.చిరుతపులి, 3.సముద్రము.
ద్వీపము - 1.పులితోలు, 2.లంకదీవి నలువైపుల నీటిచే చుట్టబడిన భూమి.
ద్వీపపుంజము - (భూగో.) సముద్ర మధ్యమున లేక నీటి మధ్యమున నున్న ద్వీప సమూహము.
వ్యాఘ్రము - వేగి, పులి. వేఁగి - పులి, సం.వ్యాఘ్రః.    

పర్దతీతి పృదాకుః ఉ. పు. పర్ద కుత్సితేశబ్దే. - కుత్సితముగా బలుకునది.

పుండరీకము - 1.తెల్లదామర, 2.అగ్నేయపు దిక్కునందలి యేనుగు, 3.శార్దూలము, పులి.

పుణ్ణరీకం సితామ్భోజం :
పుణతి మంగళత్వా త్పుండరీకం. పుణ కర్మణి శుభే.
సితం చ అంభోజం చ సితాంభోజం - తెల్లనైన తామర. ఈ రెండు తెల్లతామర పేర్లు.

పుండరీకాక్షుఁడు - విష్ణువు.
పుండరీకాక్ష. పుండరీకే ఇవ అక్షిణీ యస్య సః - తెల్లదామరవంటి కన్నులు గలవాడు.
పుండరీకం హృత్కమలం అక్ష్ణోతి వ్యాప్నోతీతివా - హృదయకలమలమును వ్యాపించియుండువాఁడు. అక్షూ వ్యాప్తౌగా.     

పంచనఖము - పులి, శార్ధూలము.  
చిత్రకాయము -
చిఱుతపులి. పొన్నాడ - ఒక తెగ చిరుతపులి.
చిత్రకము - 1.చిరుతపులి, 2.బొట్టు.
చిఱుత - 1.చిన్న, వి.చిన్నజాతి పులి.

మేకవన్నె పులి - జాతీ. మేకవలె సాధువుగా గాన్పించుచు క్రూర స్వభావము కలది.

(ౘ)చాఱల మెకము - పెద్దపులి.
కోల్పులి -
పెద్దపులి, రూ.క్రోల్పులి, క్రోలుపులి.
గాండ్ర - కాండ్రుమన శబ్దము (పెద్దపులి) 'కాండ్రు ' మనును.
గాండ్రించు - క్రి.1.ఉబ్బు, 2.పెద్దగా అరచు. 

పెద్దపులి చుట్టానికి పెడుతుందా? పులి అయినా తనపిల్లల జోలికి పోదు. పులిపిల్ల అయితే గోళ్ళుండవా యేమిటి. పిల్లి పులికి మేనమామో, మేనత్తో. పులి కడుపున చలిచీమలు పుట్టునా?

భయానకము - 1.పులి, 2.రాహువు, 3.భయానకరసము.
రాహువు -
ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

భీమము - భయానకరసము. భీకరము - భయంకరము.
భీషణము - భీమము, విణ.భయంకరము.
భీష్మము - భయానకరసము గలది, విణ.భయంకరమైనది.
ఉగ్రము - 1.క్రూరమైనది, భయంకరమైనది, 2.మిక్కుటమైనది.
ఉగ్రుఁడు - 1.శివుడు, 2.క్షత్రియునకు శూద్ర స్త్రీయందు పుట్టినవాడు. విణ.భయంకరుడు.
ఉగ్రత్వా దుగ్రః - భయంకరుఁడు.
ౘల్లజంపు - 1.భయంకరుడు, 2.చల్లగా చంపువాడు.  

పులిలో కూడా దేవుడు ఉంటాడు నిజమే! కాని మనం ఆ క్రూరజంతువుకు ఎదురుగా వెళ్ళి నిలబడవచ్చునా? అదే విధంగా పరమదుర్మార్గులలో కూడా భగవంతుడు ఉన్నప్పటికీ మనం వారితో స్నేహం చేయడం మంచిది కాదు. - శ్రీరామకృష్ణ పరమహంస

రౌద్రము - 1.భయంకరము, 2.తీక్ష్ణము, వి.1.ఎండ, 2.రౌద్రరసము, 3.దినముయొక్క మొదటి భాగము.
రౌరవము -
నరక విశేషము, విణ.భయంకరము.
రౌద్రి - ఏబది నాల్గవ సంవత్సరము.

క్రూరౌ కఠిన నిర్దయౌ : క్రూరశబ్దము కఠినమయినదానికిని, (నిర్దయుఁడు - దయలేనివాడు)దయలేని వానికిని పేరు. మఱియు, భయంకరమైన దానికిని పేరు.
కృణాతీతి క్రూరః. కృఞ్ హింసాయం. - హింసించునది.

దువ్వు -1.దువ్వెనతో తల వెండ్రుకల చిక్కుదీయు, 2.నిమురు, 3.పులి. నిమురు-శరీరమును మెల్లగా తడుము, నివురు, నివురు గప్పిన నిప్పు. 
పుల్లసిలు - భయాదులచే వివర్ణమగు, భయపడు. రూ.పుల్లసిల్లు.

క్రౌర్యము - క్రూరస్వభావము, క్రూరత్వము.
నృశంసుఁడు -
క్రూరుడు; క్రూరుఁడు - దయలేనివాడు. 

వ్యాళము - 1.పాము, 2.పులి, విణ.క్రూరమైనది, రూ.వ్యాడము.
వ్యాళగ్రాహి -
పాములవాడు.

పులిపాలు దెచ్చి యిచ్చిన
నలవడగా గుండెకోసి యఱచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి గూర్మిలేదు వినరా సుమతీ.
తా||
వ్యాఘ్రపు పాలను దెచ్చినను, గుండెనుకోసి అరిచేతియందు ఉంచినను, తలయెత్తు ద్రవ్యరాశి పోసినను, వేశ్యకు(వెలయాలు - (వెల+ఆలు)వేశ్య.)నిజమయిన ప్రేమ యుండదు.

ఆధిభౌతికము - వ్యాఘ్ర సర్పాది భూతముల వలన కలిగినది. (ఇది తాపత్రయములలో ఒకటి).

పుల్లరీకము - 1.ఒకానొక దేశము, 2.పాము.
పాము -
1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు. 
దుష్కృతము - పాము.

భుజంగము - పాము, వ్యు.భుజముతో పాకిపోవునది.
భుజం కుటిలం గచ్ఛతీతి భుజగః భుజంగ; భుజనమశ్చ. గమ్ఌ గతౌ. - కుటిలముగాఁ బోవునది గనుక భుజగము, భుజంగము, భుజంగమము. 
భుజంగభుక్కు - నెమిలి, వ్యు.పాములను తినునది.

చిలువ - పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు. 
చిలువతాలుపు - శివుడు, భుజంగభూషణుడు.
చిలువతిండి - 1.గరుడపక్షి, 2.నెమలి.
చిలువరేఁడు - సర్పరాజు, శేషుడు.

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే|
పయఃపానం భుజంగానాం కేవలం విష్వర్థనమ్||
తా.
పాముకు పాలుపోయుటచేత మిక్కిలి విషవృద్ధి యెట్లుకలుగునో(పయస్సు - 1.క్షీరము, 2.నీరు. పాములు పాలు త్రాగవు), యారీతిగా నీచుల(ఉ)కుపకారము చేయ నపకారమే సంభవించును. - నీతిశాస్త్రము 

హారనూపుర కిరీటకుండల విభూషితావయవశోభినీం,
కారణేశ వర మౌళికోటి పరికల్ప్యమానపద పీఠికామ్,
కాలకాలఫణి పాశబాణధనురంకుశా మరుణమేఖలాం,
పాలభూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతామ్. – 1శ్లో

అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.
అహిభయము -
1.పాములవలని భయము, 2.రాజులకు స్వపక్షము వారి వలని భయము.
వృతహుఁడు - ఇంద్రుడు, వ్యు.వృత్రాసురుని చంపినవాడు.
అహిద్విషుఁడు - 1.గరుడుడు, 2.ఇంద్రుడు.

అహిద్విషము - 1.నెమలి, 2.గ్రద్ధ, 3.ముంగిస.
కౌశికము -
1.గుడ్లగూబ, 2.ముంగిస. 
కౌశికుఁడు - 1.విశ్వామిత్రుడు, వ్యు.కుశికపుత్రుడు, 2.ఇంద్రుడు, 3.నిఘంటువు తెలిసినవాడు, 4.పాములవాడు.
గాధేయుఁడు - విశ్వామిత్రుడు, గ్రాధిపుత్త్రుడు. 

నరేంద్రుడు - 1.రాజు, 2.పాములవాడు.
పార్థుఁడు -
1.రాజు, 2.అర్జునుడు.    

ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.

అంహతీత్యహిః. అహి గతౌ. - చరించునది.
అశిషి దంష్ట్రాయాం విషమస్యాస్తీ త్యాశీవిషః - ఆశీస్సు అనఁగా కోఱ, అందు విషము గలది.
అశీశబ్ద ఈకారాంతో(అ)ప్యస్తి. "ఆశీమివ కలామిందో" రితి రాజశేఖరః.

విషధరము - 1.పాము, 2.మేషము, (విషము = నీరు, విషము).
విషస్య ధరః విషధరః - విషమును ధరించునది.
విషము - 1.గరళము, 2.జలము(నీరము - జలము).
గరళము - 1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు. 
అహిఫేనము - 1.నల్లమందు, అభిని, 2.గరళము, 3.పామునోటి చొంగ.
అభిని - నల్లమందు, సం.అహిఫేనమ్, అఫేనమ్. 
నల్లమందు - (వ్యవ.) అభిని, అహిఫేనము (Opium), (ఇది మాదక పదార్థముగను వైద్యమునందును ఉపయోగింపబడును. దీనిని Papaveraceae అను కుటుంబమునకు చెందిన Opium poppy (అభిని లేక గసగసా) అను మొక్క కాయలను గీయగా వచ్చిన పాలతో తయారుచేయుదురు. నల్లమందులో మార్ఫిన్ (Morphine) అను ముఖ్యమైన క్షారముండును.) 

గసగసాలు - ఒక దినుసు విత్తులు, (వ్యవ.) ఇవి సంబారద్రవ్యముగా వాడబడుచుండును. (ఇవి నల్లమందు మొక్క యొక్క గింజలు. వీనిలో సుమారు నూటికి 50 వంతులు చమురుండును), సం.గసకః.

మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.

మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.

విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితం|
ఆమిత్త్రాదపి సద్వృత్త మమేథ్యాదపి కాఞ్చనం||
తా.
విషము వలనైన నమృతంబును గ్రహింపవలయును, బాలునిచే నైనను మంచిమాటలను గ్రహింపవలయును. శత్రువులనైనను సత్స్వభావమును గ్రహింపవలయును, అమేధ్యము వలన నైనను బంగారమును గ్రహింపవలయును. - నీతిశాస్త్రము 

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి -
పాము, చక్షుశ్రవము.
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.  
ద్విరస్వనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.

దంతశూకము - పాము, వ్యు.కుత్శితముగా కరచునది.
దంతశూకుఁడు -
ఒక రాక్షసుడు.

ద్విజిహ్వ శబ్దము సర్పమునకును, కొండెగానికిని పేరు. ద్వేజిహ్వే అస్యేతి ద్విజిహ్వః - రెండు నాలుకలు గలిగిన (వాఁడు)ది.

వృశ్చికము - 1.తేలు(పొట్టియ - తేలు.) 2.వృశ్చికరాశి.
తేలురాశి -
వృశ్చికము.
తేలు - 1.నీళ్ళలో మునగక పైకి వచ్చు, 2.నీటిలో క్రీడించు(ఆటలాడు చోట అలుక పూనరాదు.), 3.తేలగిల్లు, 4.పొడ చూపు, వి.వృశ్చికము.

వృశ్చికస్య విషంపుచ్ఛని మక్షికస్య విషఁశిర|
తక్షకస్య విషందంష్ట్రః, సర్వాంగం దుర్జనేవిషమ్||
తా.
తేలునకు తోక(పుచ్ఛము - తోక)యందును, ఈఁగకు శిరస్సు నందును, పామునకు కోఱలయందును, దుర్జను(దుర్జనుఁడు - దుష్టుడు)నకు సర్వాంగములందును విషముండును. - నీతిశాస్త్రము

నాగము - 1.సత్తు, 2.తగరము, 3.పాము, 4.ఏనుగు, 5.కొండ, 6.మేఘము, 7.తమలపాకుతీగ. Air in organs 
సత్తు - సత్త్వము, సత్యము, సారము, వి.సీసము Lead, సం.విణ. (సత్) ఉన్నది 1.చదువరి (ౘదువరి - విద్వాంసుడు), 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
సత్త్వము -1.సత్త, బలము 2.స్వభావము 3.ఒక గుణము 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒకవస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
బలము - సత్తువ, సైన్యము.  
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ. 
జంతుశాస్త్రము - (జం.) జీవశాస్త్రపు శాఖలలో నొక శాఖ, జంతువుల జీవితములను గురించి తెలియచేయుశాస్త్రము, (Zoology).  

సత్తి - 1.శక్తి, 2.ఒక ఆయుధము, 3.కాళి, 4.బలము, 5.వశిష్టుని కుమారుడు, సం.శక్తిః.
శక్తి -
(గణి,. భౌతి) అచల స్థితిని గాని, ఒకేదిక్కుగా చలించెడి స్థితినిగాని కలుగజేయు బలము, (శక్తి వివిధ రూపములలో నుండును, ఉదా. యాంత్రిక, తేజః, విద్యుత, ఉష్ణ, అయస్కాంత, రసాయనిక, శబ్దశక్తులు మొదలైనవి, (Energy) సం.వి. 1.బలిమి 2.చిల్లకోల 3.పార్వతి ఇచ్ఛాది శక్తులు మూడు (జ్ఞాన, క్రియ, ఇచ్ఛ). ఉత్సాహాది శక్తిత్రయము (ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి) (సర్వదేహుల యందు దేవీస్థానం శక్తి).

సత్తితాలుపు - కుమారస్వామి, శక్తిధరుడు.
శక్తిధరుఁడు -
కుమారస్వామి.

కాళి - 1.గౌరి, పార్వతి, 2.ఆది శక్తులలో ఒకతె, 3.బొగ్గు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
బలము - సత్తువ (సత్తువ - దేహబలమ్, సం.సత్యమ్.) సైన్యము.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
కృత్యము - యుగములు నాల్గింటిలో మొదటిది, విణ.చేయబడినది.  

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి - క్రియాశక్తి స్వరూపిణీ|
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ. – 130శ్లో

వంగము - 1.తగరము, సత్తు, 2.వంగ, 3.వంగదేశము.
వంగ -
వంగచెట్టు, సం.వంగమ్.
వంకాయ - (వంగ+కాయ) వంగకాయ, వార్తాకము.
వార్తాకము - వంగ.
వంగలేపనము - (రసా.) ఇనుమునకు, ఇత్తడికి రాగికి తగరపు కళాయి పూయుట, (Tinning). కలాయి - పాత్రలకు తగరము పూయుట, రూ.కళాయి.

అదృశ్య విషజీవులు - (వ్యవ.) సూక్ష్మదర్శని సాయమునకూడ నిరూపించరాని కొన్ని అతిసూక్ష్మజీవులు. ఉదా. వంగ, సీమవంగ మొ. మొక్కలకు తెగులు కలిగించునట్టి జీవులు. అట్టి తెగుళ్ళను అదృశ్య విషరోగములు, (Virus disease) అందురు. 

తగరము - తవురము, ఒక తెల్లని లోహము, రూ.తవరము, సం.తమరమ్, వై.వి. (రసా.) వంగము, సులభముగా కరగు వెండివలె తెల్లనగు ధాతువు (Tin). (ఇది ఆవర్తక్రమ పట్టికలో నాల్గవ వర్గమున కననగును.) సం.వి. పొట్టేలు.

వినమ్రము - మిక్కిలి వంగినది, సం.వి.తగరము (వినమితము).
తమరము - 1.తగరము, 2.సీసము. మహాబలము - సీసము.

మండలి - 1.సమూహము, 2.పరిషత్తు, 3.సూర్యుడు, 4.పాము.
మండలము -
1.దేశము, 2.పరివేషము, 3.విలుకాడు రెండు కాళ్ళను మండలాకారముగ నుంచి నిలుచుండుట, 4.సూర్యచంద్రబింబములు, 5.సమూహము.
మండలిత రాజ్యములు - (రాజ.) రాజ్య మండలములో సభికత్వము గల రాజ్యములు.
మండలేశ్వరుఁడు - రాజు. 

మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ.
తా||
తొండము లేకుండా కొండంత ఏనుగు ఉన్నను లాభం లేదు, అట్లే మండలాధిపతికి(భూ దానము చేయువాడు మండలాధీశుడు కాగలడు) సమర్ధుడైన మంత్రి(ప్రధానమంత్రి - (రాజ, శాస,) మంత్రి వర్గనాయకుడు, కేంద్రమంత్రి వర్గనాయకుడు.)లేనిచో లాభముండదు.

ఫణి - సర్పము, వ్యు.ఫణము గలది.
ఫణము -
పాము పడగ. 

తలనుండు విషము ఫణికిని
వెలయంగ దోకనుండు వృశ్చికమునకు
దలతోక యనక యుండును
ఖలుని నిలువెల్ల విషము గదరా సుమతీ.
తా.
పామునకు శిరస్సునందు, తేలునకు తోకయందు మాత్రమే విషముండును, దుష్టునకు(ఖలుఁడు - 1.దుర్జనుడు, నీచుడు, అధముడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున నుండువాడు.) దలతోక యనక నిలువెల్ల విషముందును.

భోగి - 1.పాము, 2.రాజు, 3.భోగిపండుగ, 4.మంగలి.
భోగిని -
1.ఆడుపాము, 2.వేశ్య, 3.పట్టాభిషిక్తురాలుకాని రాజు భార్య.
భోగ్యము - 1.ధనము, 2.ధాన్యము, విణ.భోగింపదగినది.
భోగించు - 1.సుఖించు, 2.అనుభవించు.

భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది:- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము). 

దాసీ భృత్య స్సుతో బంధుర్వస్తు వాహన మేవచ|
ధన ధాన్య సమృద్ధిశ్చా వ్యష్ట భోగాః ప్రకీ ర్తీతాః||
తా.
దాసీజనులు, భటులు, కొమారులు, చుట్టములు(ౘ)చుట్టము -  1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు), పదార్థములు, వాహనములు, ధనము, ధాన్యము ఇవి అష్టభోగములు. - నీతిశాస్త్రము

ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ,
హృల్లేఖా పరమా శక్తి ర్మాతృకా బీజరూపిణీ| – 3శ్లో

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

సీదరము2 - 1.పాము, 2.పాము కుబుసము, సం.శ్రీధరః.
శ్రీధరుఁడు - విష్ణువు.

మాతానిందతి నాభిన దతిపితాభ్రాతాన సంభాషతే|
భృత్యుఃకుప్యతి నానుగచ్ఛతిసుతః కాంతాపినాలింగతే
అర్థప్రార్థవ శంకయానకురుతే నలాపమాత్రంసుహృ|
విత్తస్మాదర్థపార్జయ శ్రుణుసఖ్యేహ్యర్థేన సర్వేవశాః||

తా. దరిద్రుని తల్లి నిందించును, తండ్రి సంతసింపడు, అన్నదమ్ములు (భ్రాత - తోడ బుట్టినవాడు)మాటలాడరు, పనివాఁడు(భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.)కోపగించు కొనును, కొడుకు(సుతుఁడు - కొడుకు) వెంటరాడు, ఆలు(కాంత - కోరతగిన స్త్రీ, స్త్రీ.) గౌగలించుకొనదు, తన్ను ద్రవ్యమడుగునను శంకచేత స్నేహితుఁడు(సుహృదుఁడు - మిత్రుడు)  తుదకు పలుకరింపనొల్లఁడు. ధనమువలన నందరును స్వాధీను లగుదురు. కావున ధనమే (యా)ఆర్జింపవలెను. - నీతిశాస్త్రము 

జగదుత్పత్తిసంస్థాన సంహారత్రయకారణా,
త్వ మంబ విష్ణుసర్వస్వా నమస్తే స్తు మహేశ్వరీ. - 134శ్లో

ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము(దంతము - పల్లు, కోర.), 4.చేప, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
ఇరుఁబుట్టువు -
(ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి. ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ. ఇరుగడ - రెండు ప్రక్కలు.

దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతమునకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి, సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.

ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమద్విజుడు.
ద్విజానాం బ్రహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు. 
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః. - చంద్రుడు

అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||
తా.
తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు రాజు, సిగ్గుగల వేశ్య(గణిక - 1.ఆడేనుగు, 2.వేశ్య.), సిగ్గులేని(సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.)లేని ఇల్లాలు చెడుదురు. - నీతిశాస్త్రము

ద్వితీయ స్వపరార్ధస్య వర్తమానస్య వైద్విజ
వారాహ ఇతి కల్పోయం ప్రథమః పరికీర్తితః. - మత్స్యపురాణం 

చక్రధరము - పాము.
చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్రవము. 
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః. 

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

కష్టము - 1.దుఃఖము(బాధ, చింత) 2.దోషము(తప్పు, పాపము) 3.పాపము(దుష్కృతము, కలుషము).
రుద్దు - పులుము, తోము.
పాములబిడారము - (వ్యావ.) పుట్ట. పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి.....

క్రిమిశైలము - పుట్ట, వల్మీకము.
క్రిములు -(జం.) ఎముకలు, కాళ్ళు లేని బహుకణజీవులు (Worms). పుట్ట - 1.వల్మీకము, 2.చిన్నపొద, 3.స్థానము, ఉదా. "రోగముల పుట్ట ".
పుట్టచూలు - వాల్మీకి మహర్షి.

ఖేలకము - 1.శిశువు, 2.వల్మీకము, 3.కుళ్ళాయి.
శిశువు -
బిడ్డ; బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు. కూఁతురు - కుమార్తె.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు, రూ.ప్రసూనుడు.
వల్మీకము - పుట్ట.
ఖోలకము - 1.కుల్లాయి, 2.పుట్ట, 3.పోకచిప్ప, 4.ఒకరకపు వంటపాత్ర, 5.స్వర్గము.

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవై నయట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశులపాల జేరు భువిలో సుమతీ.
తా.
చీమలు కష్టపడి వాల్మీకములు నిర్మించిన, అవి పాములకు తావైనట్లు, పామరులు కూడబెట్టిన బంగారం రాజుల పాలగును. 

నాగువు - నాగము, త్రాచు, రూ.నాగుబాము, నాగులు, సం.నాగః.
నాగ -
1.పూజ్యము, (ఉదా. నాగ బెత్తము.) 2.పెద్ద (నాగగన్నేరు) సం.నాగః.
త్రాచు - నాగుబాము; మంచిపాము - నాగుపాము.
నాగిని - నాకిని; నాకిని - దేవత స్త్రీ.
నాగుఁడు - శేషుడు, సం.నాగః.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
శేషశయనుఁడు - విష్ణువు.

గజే పి నాగ మాతఙ్గా :
నాగ శబ్దము ఎనుగుఁనకున, అపిశబ్దము వలన పామునకును, సీసమునకును పేరు. మాతంగశబ్దము ఏనుఁగునకును, అపిశబ్దము వలన చండాలునకును పేరు. నగే భవో నాగః - పర్వమందుఁ బుట్టినది. మాతంగాదృషేర్జాతో మాతంగః - మతంగుఁడను ఋషివలనఁ బుట్టెను మాతంగము, మాతంగుఁడును.

గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగములలో ఒకటి.
గజయాన -
ఏనుగు నడకవంటి నడక గల స్త్రీ, స్త్రీ.

మాతంగము - ఏనుగు; మతంగజము - ఏనుగు.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏన్గు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
ఏనుఁగుకాలు - కాలు లావగు వ్యాధి, బోదకాలు (Elephantiasis).
పుట్టకాలు - బోదకాలు; బూరకాలు - బోదకాలు.
బోదకాలు - వ్యాధిచే వచ్చు ఏనుగు కాలు వంటి కాలు.
ఏనుఁగు గజ్జి - మూగగజ్జి (Eczema).
ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగా గలది.
ఏనుఁగు గొంగ - సింహము, వ్యు.ఏన్గులకు శత్రువు.

అగము - 1.చెట్టు, 2.కొండ, 3.పాము, 4.సప్త సంఖ్య.
చెట్టు -
1.గుల్మము 2.వృక్షము.
గుల్మము - గుల్మరోగము, (ప్లీహము, పెద్దదగు రోగము), 2.ప్లీహము, Spleen ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలెని చెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6. 9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన 7.పల్లెయందలి ఠాణా.
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము + సేన-అందుండు వాడు.)
వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృఢమైన శాఖలుగల మొక్క(Tree).

తిప్ప - 1.చిన్నకొండ, 2.కొండ, 3.దిబ్బ, సం.ద్వీపః.
గుట్ట -
1.చిన్నకొండ, 2.ప్రోవు, సం.గోత్ర, విణ.భీరువు.
దిబ్బ - 1.ఎత్తైననేల, కుప్ప, 2.దీవి, సం.ద్వీపః.
దీవి - 1.ద్వీపము, నీటినడిమి భూభాగము, సం.ద్వీపః.
నడుదిన్నె - ద్వీపము. కుప్ప - ధాన్యము మొ.రాశి.

అద్రి - 1.కొండ, 2.చెట్టు, 3.సూర్యుడు.
నగము -
1.కొండ 2.చెట్టు రూ.అగము.
నగవైరి - ఇంద్రుడు వ్యు.కొండలకు శత్రువు.

అహార్యము - కొండ, విణ.హరింప శక్యముకానిది.

కొండ - మల, పర్వతము.
మల -
పర్వతము, మలై.
కొండచూలి - పార్వతి. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కొండయల్లుఁడు - శివుడు; కొండమల్లయ్య - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.

దూరగిరిన్యాయము - న్యా. దూరముగా నున్న పర్వతములు నునుపుగా కాన్పించును, దగ్గరకు పోవ గుట్టలు మిట్టలు ముండ్లుగా నుండునను రీతీ, దూరపు కొండలు నునుపు.

ఆఖండలుఁడు - ఇంద్రుడు, వేలుపురేడు, పర్వతములను భేదించువాడు. కొండ పగతుఁడు - ఇంద్రుడు, కొండలకు శత్రువు.

మేఘము - మబ్బు.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము(తెలివిలేనితనము).
చీఁకటి - అంధకారము.
చీఁకటిగాము - రాహువు.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.

నాగవల్లి - పెండ్లిలో తుది దినమున జరుపు శుభకార్యము, సం.వి. తములపాకు తీగ, సం.నాకబలిః.
నాకబలి -
నాగవలి.
తాంబూలవల్లి - తములపాకు తీగ, రూ.తాంబూలి.
తములపాకు - నాగవల్లి దళము, రూ.తములపుటాకు.
తమలపాకు - (వ్యవ.) ఈ ఆకులు తాంబూలమునకును, వైద్యమునకును ఉపయోగించును. (ఈ తీగ మిరియపు కుటుంబము (Piperaceae) నకు చెందిన Piper betle అను మొక్క.) రూ.తమలపాకు.  
కమ్మెరాకు - కారపు నల్ల తమలపాకు.

తాంబూవల్లీ తామ్బూలీ నాగవల్ల్యపి :
తాంబూలార్థం వల్లీ తాంబూలవల్లీ - తాంబూలము కొఱకైన తీఁగె.
తామ్యతి వివశోభవ త్యనయా జన ఇతి తాంబూలీ. సీ. తము గ్లానౌ. - దీనిచేత నరుఁడు వివశుఁ డగుచున్నాఁడు.
నాగస్త్యైరావణస్యాలానే జాతత్వాన్నాగవల్లీ. సీ. - ఐరావతము యొక్క కట్టుకంబమందుఁ బుట్టినది.
"నాగలోకాదానీతా వా వల్లీ నాగవల్లీ - నాగలోకము నుండి తేఁబడిన తీఁగె. ఈ మూడు 3 తమలపాకుతీఁగె పేర్లు.

తమలపాకు తీగ ఆధారం లేకుండా పెరగదు బ్రతకదు.

ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము. 

ఆకుతోట - తమలపాకుల తోట.
ఆకుమడుపు -
తమలపుచుట్ట.
మావటము - తమలపాకుల కట్ట.
కన్నాకు - మేలుతరము, శ్రేష్ఠము, వి.1.ముఖ్యుడు, 2.తమలపాకు కట్టయందు పైననుండు పెద్ద ఆకు. 

ఆకులోకెల్ల మేలైన ఆకు - తమలపాకు.
ఇంతింతాకు - పచ్చని ఆకు - రాజులు మెచ్చిన రత్నాలాకు -తమలపాకు.

ఆకుతెగుళ్ళు - (వ్యవ.) మొక్కల ఆకులకు శిలీంద్రముల వలన సంభవించు తెగుళ్ళు (Leaf diseases). (ఇవి సామాన్యముగా 1.మచ్చతెగుళ్ళు (Leaf Spots), 2.చారతెగుళ్ళు (Rusts), 3.బూడిద తెగుళ్ళు (Mibdews) అని మూడు రకములుగా ఉండును).
మచ్చతెగులు - (వ్యవ.) ఆకులపై ఎరుపు, గోధుమ, నల్లని రంగు గల మచ్చలేర్పడు రోగము.

తములము - తాంబూలము, వక్కాకు, రూ.తమ్మలము, సం.తాంబూలమ్.
తాకబూలము - వక్కాకు, తములము.
కిళ్లి - పరిమళ ద్రవ్యములతో గూడిన తాంబూలము.
విడియము - తాంబూలము, రూ.విడియ, వీడెము, విడ్యము, వీడ్యము, సం.వీటికా.

అన్నదమ్ములం ముగ్గురం మేము - అయితే బుద్ధులు వేరు - నీళ్ళలో మునిగేవాడొకడు - తేలేవాడొకడు - కరిగేవాడొకడు, మేమెవవరం? – వక్క-ఆకు-సున్నం

సుదియ - తమలపాకుల బరువులో సగము, విన.తులువ.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు; దుర్జనుఁడు - దుష్టుడు.
తులువకత్తి - వంపు చురకత్తి.    

తమ్మ - నమలిన తాంబూలము, సం.తాంబూలమ్.
తమ్మతనుకు - తమ్మపడిగ, తాంబూలముమియు పాత్రము.

నాగవసాని - నాగవల్లి నడుపు ముత్తైదువ, రూ.నాపసాని.
నాపసాని -
నాగపసాని, నాగవల్లి నడుపు పెద్ద మూత్తైదువ.
ముత్తయిదువ - సుమంగళి.
సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.పరలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ.

నాగవల్లి నిష్ఠురము - (జాతీ.) పెండ్లియైదవ నాటిదెప్పులు, పనియైన పిదప పోరాటము.

హడవము - అడపము, వక్కలాకులుంచుకొను బరణి. 
అడపము - 1.వక్కాకులు పెట్టుకొను సంచి, 2.మంగలి పొది.
కరతిత్తి - వట్రవు సంచి, తమలపాకులు మొ.వి ఉంచుకొను చేతిసంచి, సం.కరదృతిః.
వట్రము - కురుచ, హ్రస్వము, వి.వక్కాకు తిత్తి.
అడపకాఁడు - 1.మంగలి, 2.అడపము పట్టుకొనువాడు.
అడప - తాంబూలపు బరణి పట్టుకొను సేవకురాలు.
అడపకత్తె - వక్కలాకుల బరణిని మోయు స్త్రీ.  

వలవదు క్రూరసంగతి యవశ్యమొకప్పుడు సేయబడ్డచో
గొలదియెకాక యొక్కవలుగూడవు తమ్ములపాకులోపలన్
గలసిన సున్న మించుకయెగాక మఱించుక యెక్కువైనచో
నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాబుకపొక్కకయున్నె, బాస్కరా.

తా. తాంబూలములో కలియు సున్నము స్వల్పమయినచో బాధలేదు, ఎక్కువైనచో నాలుక మండును, అట్లే, దుర్మార్గులతో స్నేహము జేయరాదు, చేసిననూ అంత అధికముగా నుండరాదు.

గంధసార ఘనసార చారునవనాగవల్లి రసవాసినీం,
సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం|
మంథరాయతవిలోచనాం అమలబాలచంద్ర కృతశేఖరీం,
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతాం|| - 2

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా|
మృగక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. - 114శ్లో

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము). 
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా.
విష్ణువుచేత గాని, శివుని(హరుఁడు - శివుడు)చేత గాని, బ్రహ్మచేత గాని, ఇతరమైన దేవతలచేత గాని నొసట వ్రాయబడిన వ్రాత తుడిచివేయ నలవి కాదు (మనుష్యమాత్రుల కాగలదా.) - నీతిశాస్త్రము

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి(వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.

 3. కౌమారి - 1. పార్వతి, 2.బ్రహ్మచర్య వ్రతమున నుండు వానిని పెండ్లి యాడిన స్త్రీ, 3. సప్త మాతృకలలో ఒకతె.

పార్వతి -1.గౌరీ (పర్వత పుత్ర్తి), ద్రౌపది. శివుని సన్నిధి నందు పార్వతి. 
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. ఈ. సీ. - పర్వతమునకు కూతుఁరు.

ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి -
1.ద్రౌపది (పాంచాల రాజపిత్త్రిక), 2.బొమ్మ.
పంచమి - 1.పక్షమునందు ఐదవ తిథి, 2.ద్రౌపది.

తచ్ఛాయా ద్రౌపదీ దేవీ ద్వాపరే ద్రుపదాత్మజా |
త్రిహాయనీ చ సా ప్రోక్తా విద్యామానా యుగత్రయే ||

గయిరమ్మ - పార్వతి, రూ.గౌరమ్మ, గవరమ్మ, సం.గౌరంబా.
గౌరి -
1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. (కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి)  
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ సంవత్సరము.
కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ.(షష్ఠా కాత్యాయి నీతి చ)

కాత్య అనే ఋషి తనకు పార్వతీదేవి కుమార్తెగా జన్మించాలని తపాసు చేసాడు. అతనికి కూతురుగా ఆమె జన్మించింది కనుక కాత్యాయిని అనే పేరు వచ్చింది.

విశ్వస్త - విధవ (కేశములుకలది).
విధవ -
పెనిమిటిలేనిది, అనాథ.
అనాథ - నాథుడు లేనిది, దిక్కులేనిది, అనాథుడు.
అనద - 1.దిక్కులేనిది, దిక్కులేనివాడు, 2.అశక్తుడు, అల్పుఁడు, 3.విధవ, సం.అనాథ. 

విశ్వస్తా విధవే సమే,
విశ్వసితి విగతశ్వసనేన తిష్ఠతి మృతప్రాయత్వాదితి విశ్వస్తా. శ్వస ప్రాణనే. - మృతప్రాయమైనది గనుక ప్రాణము లేనిదానివలె నుండునది.
విగతో ధవఃపతి ర్యస్యాస్సా విధవా - చనిపోయిన పెనిమిటి గలది. ఈ రెండు పెనిమిటిలేని స్త్రీ పేర్లు. 

తెంపి - 1.విధవ, 2.తెగువ.
తెంపు -
తెంచు, వి.1.తెగువ, 2.తెగుట.
తెంచు - తెగచేయు, రూ.త్రెంచు, త్రెంపు.
త్రెంచు - త్రెగచేయు, రూ.తెంచు, తెంపు, తెంపు.
తెగుడు - 1.తెగుట(తృటనము - తెగుట.), 2.తెగువ.
తెగదెంపు - తెగువ, సాహసము.
సాహసము - 1.తెగువ, దండోపాయము.
తెగువ - 1.దాతృత్వము, 2.సాహసము.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము. 

ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశ్శక్తిః పరాక్రమమః|
షడై తే యత్రతిష్టంతి తత్ర దేవోపి తిష్టతి||
తా.
సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము; ఈ యారు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. - నీతిశాస్త్రము 

పాతకము - మహాపాపము (పంచ మహా పాతకములు :- స్వర్ణస్తేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము).
బ్రహ్మహత్య - విప్రుని చంపుట (మహాపాతకములలో నొకటి).

మృడాని - పార్వతి.
మృడుఁడు - శివుడు, వ్యు.భక్తులను సంతోషపెట్టువాడు.

Koumaari from kumaaraswamy (son of Siva and Parvathi) holding Sakti weapon and seated on a peacock. కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ|

కౌమారం వ్రత మాస్థాయ - త్రిదివం పావితం త్వయా|
తేన త్వం స్తూయసే దేవి - త్రిదశైః పూజ్యసే పి చ.

శిఖావళము - నెమలి.
శిఖి -
1.అగ్ని, 2.నెమిలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.
శిఖివాహనుడు - కుమారస్వామి.   

నిర్మదా నియతాదారా నిష్కామా నిగమాలయా |
అనాదిబోధా బ్రహ్మాణీ కౌమారీ గురురూపిణీ ||

కుమారి - 1.కూతురు, 2.పెండ్లికాని ఎనిమిదేండ్ల పడుచు, 3.పార్వతి.
పుత్త్రిక -
1.కూతురు, 2.బంగారు బొమ్మ.
కొమారి - కూతురు, సం.కుమారీ.
కొమరె - కుమారి, యౌవనము గల స్త్రీ.  
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము. 
కౌమారము - మూడవ యేడు మొదలు పదునారేండ్ల (3-16)వరకునైన ప్రాయము.
బాల - పదునారెండ్లకు లోబడిన పిల్ల.
మధ్య - పదుమూడేండ్ల నుండి పదునెనిమిది(13-18) వరకు వయస్సు గల కన్య.

పితారక్షతి కౌమారే - భర్తారక్షతి యౌవనే|
రక్షంతి వార్ధ కేపుత్త్రా - న స్త్రీస్వాతంత్ర్య మర్హతి||
తా.
స్త్రీలను బాల్యమందు(చిన్నతనము-1.బాల్యము, 2.అవమానము.) దండ్రియును(పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.), యౌవన మందు పెనిమిటియు(భర్త), ముదిమి(ముసలితనము)యందు కొమారులును(కొమరుఁడు -1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.)రక్షింతురు. కాబట్టి యొక కాలమందును స్త్రీలకు స్వాతంత్ర్యము లేదు. - నీతిశాస్త్రము

కౌమారీం దర్శయంశ్చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసామ్|
రుదన్నివహసన్ముగ్ద బాలసింహావలోకనః |

4. వైష్ణవి : జ్వాలాయాం వైష్ణవీదేవీ శక్తిపీఠం. మాతల యందు దేవీస్థానం వైష్ణవి.

వైష్ణవీదేవి - శ్రీ శక్తి శిరస్సే, ఈ జనని జమ్ములోని 'జ్వాలాకేతంలో' వెలుగొందుతోంది. జ్ఞాన వైరాగ్య వర్థినిగా పూజలందు కుంటున్న భగవతి ఈ జనని. వైష్ణోదేవి(వైష్ణవీ శక్తి) ఉన్న ఆలయం త్రికూట పర్వతం.

వైష్ణవీ విమలాకారా మహేంద్రీ మంత్రరూపిణీ,
మహాలక్ష్మీ ర్మహాసిద్ధి ర్మహామాయా మహేశ్వరీ.

ౙమ్ము - జంబు.
(ౙ)జంబు -
ఒక విధమైన తుంగ.
(ౙ)జంబేఱు - జంబూనది, నేరేడేరు.
జంబువు - 1.నేరేడుచెట్టు, 2.నేరేడు దీవి, నేరెఱేరు.
నేరెడు - జంబూవృక్షము, రూ.నేరేడు.
నేరెటేఱు - జంబూనది. నేరెడిదీవి - జంబూ ద్వీపము. తొలుదీవి – జంబూద్వీపము.  

ఫలే జమ్బ్వాః జమ్బూఁ స్త్రీ జామ్బవమ్. -
జంబ్వాః ఫలం జంబూః. ఊ. సీ. జంబు ఉ. న. - జాంబవంచ. ఈ 3 నేరేడుపండు పేర్లు.   

జాంబవము - 1.నేరేడుపండు, 2.బంగారు.
జాంబూనదము -
బంగారు.

శాతకుంభము - బంగారు, వ్యు.శతకుంభ పర్వతమున పుట్టినది.

త్వం వైష్ణవీ శక్తి రనన్తవీర్యా
విశ్వస్య బీజం పరమా సి మాయా|
సమ్మోహితం దేవి సమస్త మేత-
త్త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః.

జ్వాల - మంట, సం.వి. (రసా.) పరిశోధనాగారములో బున్సెన్ బర్నర్ (దాహని) వంటి గొట్టముల ద్వార పంపబడు ఇంధన వాయువును జ్వలింపచేసి నపుడు లభ్యమగు తేజోవంతమైన గాలుల ప్రవాహము, (Flame).
జ్వలనము - 1.మంట, 2.అగ్ని. 
జ్వాలాజిహ్వుఁడు - అగ్ని.
ఉదర్చి - 1.శివుడు, 2.అగ్ని, విణ.పై కెగయు జ్వాలలు కలది.   

త్విట్టు - 1.జిగి, కాంతి, 2.మంట, 2.వెలుగు, రూ.త్విష.
త్విషాంపతి - సూర్యుడు.

శోచిస్సు - 1.సూర్యకిరణము, 2.మంట.
శోచిష్కేశుఁడు -
అగ్ని, వ్యు.జ్వాలలే జుట్టుగా కలవాడు. 

హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
అగ్నిశిఖము -
కుంకుమపూవు.
ఘుసృణము - కుంకుమపువ్వు; వహ్నిశిఖము - కుంకుమపువ్వు.
కాశ్మీరము -1.కుంకుమపూవు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీరదేశము.(కాశ్మీరము నందు దేవీ స్థానం మేధ)

కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం| మేరు వింధ్యాతి సంస్థానా కాశ్మీర పురవాసినీ.

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము(వస్త్రము - బట్ట, వలువ), 4.కుంకుమపువ్వు(పువ్వుగాని పువ్వూ - పూసుకుంటే నవ్వు.), 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూత్యాది వ్యసనము.

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ|
అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ. -
166శ్లో.

వైష్ణవీ సమాయాచారా కౌళినీ కులదేవతా |
సామగానప్రియా సర్వవేదరూపా సరస్వతీ ||

రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణామ్|
గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతామ్||

Vaishnavi from Vishnu, holding Sakti, sankha, chakra, mace, sword and saranga bow and seated on Garuda, the bird king.

విరాట్టు - 1.ఆదిదేవుడు, 2.క్షత్రియుడు, 3.గరుత్మంతుడు.

గరుత్మాన్ గరుడ స్తారోక్ష్య వైనతేయః ఖగేశ్వరః,
నాగాంతకో విష్ణురథ స్సుపర్ణః పన్నగాశనః.
              
గరుతః పక్షా అస్య సంతీతి గరుత్మాన్. త-పు. ఱెక్కలు గలవాఁడు.
గరుద్భిః డయత ఇతి గరుడః - ఱెక్కలుచేత నెగసెడివాఁడు.
డీఙ్ విహాయసాగతౌ. గిరతి సర్పానితివా - సర్పములను భక్షించువాడు. గౄ నిగరణే.
తృక్షస్య ఋషే రపత్యం తా ర్ఖ్యః - తృక్షుఁడను మునికొడుకు.
వినతాయా అపత్యం వైనతేయః - వినతకొడుకు.
ఖగానా మీశ్వరః ఖగేశ్వరః - పక్షుల కీశ్వరుడు.
నాగానాముతకః నాగాంతకుః - సర్పములకు నాశకుఁడు.
విష్ణో రథః విష్ణురథః - విష్ణువునకు వాహనమైనవాఁడు.
శోభనాని పర్ణాని పక్షాయస్యసః సుపర్ణః - మంచిఱెక్కలు గలవాఁడు.
పన్నగా అశనం యస్య సః పన్నగాశనః - సర్పము(పన్నగము - పాము)లన్నముగా గలవాఁడు. ఈ 8 గరుత్మంతుని పేర్లు.

గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
గరుత్తు - రెక్క, పక్షము. 
ఱెక్క - పక్షము. రెక్క - రెక్క, పక్షివిరక.  
పక్షము - 1.నెలయందు పదునైదు దినములు(శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.

వజ్రతుండుఁడు - గరుడుడు, వ్యు.వజ్రము వంటి ముక్కుగలవాడు.
బొల్లిగ్రద్ద -
గరుడుడు; బొల్లి - 1.తెల్లనిది, 2.తెల్లనివాడు.

తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు - తక్షకుడు.

వైనతేయుఁడు - గరుడుడు, వినతా తనయుడు, అనూరుడు.
అనూరుఁడు -
తొడలులేనివాడు, వి.గరుత్మంతుని అన్న (సూర్యసారథి).
వినత - గరుత్మంతుని తల్లి. తనయుఁడు - కొడుకు.

ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖగపతి -
గరుడుడు.

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పులుఁగు - పిట్ట.
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు(సేవకుఁడు – కొలువుకాడు).
బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.

తూపు - బాణము.
తూపురిక్క -
శ్రవణ నక్షత్రము.
తూపురిక్కనెల - శ్రావణమాసము.

నాగాంతకుఁడు - గరుడుడు, వ్యు.పాములను చంపువాడు.

పెందిరువడి - గరుడుడు (వైష్ణవ పరిభాష యందు.)
పెందెరువు - రాజమార్గము.
పెరుమాళ్ళు - విష్ణువు, త. పెరుమాళ్. 

ఆళువారు - 1.హరిభక్తుడు, 2.గరుత్మంతుడు, రూ.ఆళ్వారు.
వైష్ణవుఁడు -
విష్ణుభక్తుడు.
వైష్ణవము - విష్ణుసంబంధమైనది, వి.ఒక మతము. 
సుపర్ణుఁడు - గరుత్మంతుడు, వ్యు.మంచి రెక్కలు గలవాడు. 

గరుడధ్వజుఁడు - వెన్నుడు, విష్ణువు.
గరుడధ్వజః గరుడః ధ్వజః యస్య సః - గరుత్మంతుఁడే ధ్వజముగాఁ గలవాఁడు.

పక్షిణాం బలమాకాశం మత్స్యానా ముదకం బలమ్|
దుర్బలస్య బలంరాజా బాలానాం రోదనం బలమ్||
తా.
పక్షులకు ఆకాశము బలము, చేపలకు నీళ్ళు(ఉదకము - నీరు, (వ్యు.)తడుపునది, రూ.ఉదము.)బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము(రోదనము - 1.శోకము, ఏడ్పు, 2.కన్నీరు.)బలము. - నీతిశాస్త్రము   

సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్ |
సూర్యసూతమనూమారుం చ కద్రూర్నాగాననేకశః |

గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, 12000 శ్లోకములు గలది, గరుడదేవతాకమైన అస్త్రము.

గారుత్మతం మరకత మశ్మగర్భో మరిన్మణిః,
గరుత్మతో జాతం గారుత్మతం - గరుత్మంతునివలనఁ బుట్టినది.
మరం మరణం తకత్యనేనేతి మరకతం. తక హనహసనయోః - విష హరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.
అశ్మాగర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగా గలది.  
హరిద్వర్ణో మణిః హరిన్మణిః - పచ్చనిమణి. ఈ 4 నాలుగు పచ్చల పేర్లు.   

గరుడపచ్చ(ౘ) - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
కిరీటపచ్చ -
మరకతము, గరుడపచ్చ.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్ సిలికేట్ (Emerald). (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొడుచు పసరు రేఖ, సం.పలాశః.
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు). 
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు). 
ఇంద్రనీలము - నీలమణి.    

మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.

పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
ఆకు -
1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము. 
ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చ గుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.
హరిత్తు - 1.దిక్కు, 2.ఆకుపచ్చవన్నె, 3.పచ్చగుఱ్ఱము.
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.

పత్రము - 1.ఆకు, 2.రెక్క, 3.వ్యవహారము, చెల్లుబడికై వ్రాసికొను కాగితము, 4.వాహనము, 5.బాణము.
పతత్రము - 1.రెక్క, 2.పత్రము.
పతత్రి - పక్షి, వ్యు.రెక్కలుగలది.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.

బంధూకము - మోదుగ పూవు, మోదుగ.
మంకెన -
1.బంధూకము, మోదుగు, 2.ఎద్దు మీద నీళ్ళబిందెలు ఆనుటకై వేయుబెత్తపు బుట్టల జత. 
మోదుగు - కింశుక వృక్షము, రూ.మోదువు.
కింశుకము - పలాశము, మోదుగు చెట్టు.

పలాశే కింశుకః పర్ణో వాతషోథః - 
పుణ్యాని పాలశాని యస్య సః పలాసః - పుణ్యములైన ఆకులు గలది.
సంపుప్పైః పలం మాంసం అశ్నాతీవ తిష్ఠతీతి నా పలాశః - పుష్పములచేత మాంసమును భక్షించు దానివలె నుండునది.
కించిచ్ఛుకవన్నీలత్వాత్కింశుకః - ఇంచికంత పచ్చనై చిలుకవలె నుండునది.
ప్రశ స్తపర్ణ యోగాత్వర్ణః - మంచి ఆకులు గలది.
వాత రోగం పోథయతీతి వాతపోథ. పుథ హింసాయాం. - వాతరోగమును బోఁగొట్టునది. ఈ నాలుగు మోదుగచెట్టు పేర్లు. 

శుకములు(శుకము - చిలుక) మోదుగ పూలు జూచి పండ్లని భ్రాంతిపడి వెళ్ళగా వానికి నిరాశయే మిగులును. 

రూపయౌవన సంపన్నా విశుద్ధ కులసంభందాః|
విద్యాహీనా నశోభంతే నిర్గంధా ఇవకింశుకాః||
తా.
రూపము, ప్రాయము, సంపద, మంచికులగోత్రములు, ఇవి గలవారై నను విద్య(విద్య - 1.జ్ఞానము, 2.చదువు.)లేనివారు ప్రకాశింపరు. అది యెట్లనిన, మోదుగ పువ్వులు ఎంత యెరుపు(ఎఱుపు) గలిగినవైనను పరిమళము లేనందు వలన ప్రకాశింపవు గదా. - నీతిశాస్త్రము    

బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ|
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ. - 177శ్లో

కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.
హరిద్ర -
పసుపు.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ. 

అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.   

పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి-1.లక్ష్మి, 2.పార్వతి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ. నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది.

విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణుపది -
గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగాగలది.
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. 
వాసుకము - వైకుంఠము.
వైకుంఠుడు - 1.విష్ణువు, 2.ఇంద్రుడు.

వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.

లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీర్హరిప్రియా,
(ఇందిరా లోకమాతా మా రమా మఙ్గళదేవతా, భార్గవీ లోకజననీ క్షీరసాగరకన్యకా.)

లక్ష్మి -1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదులశోభ, 4.మెట్టదామర.
లక్కి - లక్ష్మి, సం.లక్ష్మి.
లక్కిమి - లచ్చి; లచ్చి - లక్ష్మీ, సంపద, సం.లక్ష్మీః. 
లక్ష్మీః ఈసీ. లక్ష్యతే సర్వో అనయేతి లక్ష్మీః - ఈమెచేత సర్వము చూడబడుఁగాన లక్ష్మి. లక్ష దర్శనాం కనయోః.

మాధవుఁడు - లచ్చిమగడు, విష్ణువు. మానవ సేవే మాధవ సేవ.
మాధవః మాయాః లక్ష్మ్యాః ధవః - లక్ష్మీదేవికి భర్త.
యదోర్జ్యాయా స్పుత్రో మధుః, తద్వంశ జత్వాన్మాధవః - యదువనెడివాని పెద్దకొడుకు మధుఁడు; అతని వంశమునఁ బుట్టినవాఁడు.
మధూయతే శత్రూనితివా - శత్రువులఁ గంపింపఁజేయువాఁడు. ధూఞ్ కంపనే. 

పద్మాలయ - లక్ష్మి; తమ్మియింటి గరిత - లక్ష్మి, పద్మాలయ.
గరిత -
1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.
పద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర. మెట్టతామర - స్థలపద్మము.
పద్మాలయా, పద్మ మాలయో యస్యాస్సా - పద్మమే ఇల్లుగాఁగలది.

అవ్యథా అతిచరా పద్మాచారణీ పద్మచారణీ :
న వ్యథతే అనయేత్యవ్యథా, వ్యథ భయచలనయోః - దీనిచేత వ్యథను బొందరు.
అత్యర్థం చరతి వ్యాప్నోతీతి అతిచరా. చర గతి భక్షణయోః - మిక్కిలి వ్యాపించునది.
పద్మాసాదృశ్యాత్పద్మా. - పద్మమువంటిది.
చరతి వ్యాప్నోతీతి చారటీ. సీ. - వ్యాపించునది.
పద్మమివ చరతీతి పద్మచారిణీ - పద్మమువలె వ్యాపించునది. ఈ నాలుగు 4 మెట్ట(కాశ్మీరదేశపు)తామర పేర్లు.

పద్మనాభుఁడ వని నిన్నుఁ బల్కినాను
గట్టితనమేల మానరా కట్టులేదె
పలుకుపలుకున నగు కట్టుబాటు లరసి
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ |

పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
తామర -
తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు  అంటువ్యాధి.)  
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మవ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు. తోయజాక్షి - తమ్మికంటి.
తమ్మిదొర - సూర్యుడు.
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
తమ్మిపగతుఁడు - చంద్రుడు.

పద్మాసనము - ఆసనములలో నొకటి.
బాసికపట్టు -
పద్మాసనము, (వ్యావ.) బాసీపట్టు.

తామరసము - 1.తామర, 2.బంగారు, 3.రాగి.
తామరచెలి -
సూర్యుడు, పద్మమిత్రుడు.

పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము. 
ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పసువులను త్రోలుట.

తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయరుహము - తామర, వ్యు.నీటియందు జన్మించినది.

కంజము - తామరపువ్వు.
కంజాతము -
తామర, పద్మము.
కంజజుఁడు - నలువ, బ్రహ్మ.
కంజనుఁడు - మన్మథుడు, వ్యు.సుఖమును కల్గించువాడు. 

తామరతంపము - 1.తామరల సమూహము, 2.అభివృద్ధి, రూ.తామరతంపర.
తామరతంపర - తామరతంపము.
తామరతూపరి - మదనుడు; మదనుఁడు - మన్మథుఁడు. 

నాళీకము - 1.తామర, 2.బాణము, 3.బాణపు ములికి.
నాళము -
1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 2.కూతురు, సం.1.భేత్త్రీ, 2.పుత్త్రః, 3.పుత్రి. 

పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు గలది.
హస్తి -
ఏనుఁగు వ్యు.హస్తము కలది.
చేగల మెకము - ఏనుగు, హస్తి.
కరటి - ఏనుగు, హస్తి. 

హస్తిని - 1.ఆడేనుగు, 2.ఒక స్త్రీజాతి, (శంఖినీ, పద్మినీ, చిత్రిణీ జాతు లితరములు).
గణిక -
1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ. 
చిత్రిణి - చిత్తిని, ఒకజాతి స్త్రీ.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.

పద్మాకారము - కొలను; కొలను - కొలఁకు.
కొలఁకు -
సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్.
సరసి - కొలను, రూ.సరసు, సరస్సు.
సరసు - క్రి.సరదు, సం.వి.సరసి.
సరదు - క్రి.సమముగా పంచు.
వనబంధము - సరస్సు, కోనేరు.
పుష్కరిణి - 1.తామర కొలను, కోనేరు, 3.ఆడేనుగు.
కోనేఱు - (కోన + ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి. 
తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.  

సరోజము - 1.తామర, 2.తామర కొలను.
సరసిజము -
తామర, రూ.సరసీజము.
సరసిజాతము - తామర; సరసీరుహము - తామర.
సరసిజనాభుఁడు - విష్ణువు.
సరసిజభవుఁడు - బ్రహ్మ.

రాజీవము - తామర. మాధవ మంత్రమునకు రాజీవము.

విద్య లేనివాడు విద్యాధికుల చెంత
నుండినత పండితుండు కాడు
కొలని హంసలకడఁ గొక్కెర యున్నట్లు విశ్వ.
తా.
ఓ వేమా! విద్యలేనివాడు పండితులతో కలిసి తిరుగుచున్నను పండితుడు కాలేడు. హంసలు వుండుకొలనులో కొంగ కూడ వుండును. కాని, అంతమాత్రమునకు ఆ కొంగ హంస కాలేదు కదా. 

మానసము - 1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
చేతము -
మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
మానసౌక(స)ము - హంస. 
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental-development).

సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వన్ద్వం - కిమపి మహతాం మానసచరమ్| 
యదాలాపా దష్టా - దశగణిత విద్యా పరిణతిః
ర్యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ|| - 38శ్లో 
తా.
ఓ దేవీ! ఏ హంసల జంటల యొక్క కూతలు(ఆలాపనము - 1.రాగాలాపనము, 2.మాటలాడుట.) పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణములను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి మకరందముచే ననందించు యోగీశ్వరుల యొక్క మనస్సు లనెది మానస సరస్సు నందు విహరించు నా హంస జంటను సేవించుదును. - సౌందర్యలహరి     

పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ. (పోషయతీతి పుష్కరం. పుష పుష్టౌ, - పోషించునది.) 

పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము -
కెంపు; లోహితకము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
శోణరత్నము - కెంపు. కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
కురువిందము - ఎఱ్ఱని కెంపు, అద్దము (రసా.) గనులలో దొరకు ఎల్యూమినియం ఆక్సైడ్ (ద్విఎల్యూమినియమ్ త్ర్యామ్లజనిదము). (సర్ణకారులు బంగారు మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగింతురు) (Corundum).

అద్దము - 1.సగము, సం.అర్థమ్, 2.దర్పణము, సం.అబ్దమ్.
దర్పణము -
అద్దము, (భౌతి.) కాంతి కిరణమును క్రమపరావర్తనము నొందించు నునుపైన ఉపరతలము గల వస్తువు, (Mirror).
సగము - 1.స్వామి, 2.అర్ధము, రూ.సవము, సాము, సం.సామి.
స్వామి -
1.ఒడయడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.
ఒడయుఁడు - 1.మగడు, 2.ప్రభువు, రూ.ఒడయుఁడు.
సామి - 1.స్వామి, 2.రాజు, 3.పెమిటి, 4.కుమారస్వామి, సం.స్వామీ.
సవము - సగము, సం.సామి.
సవము - యజ్ఞము, జన్నము.
సవనము - యజ్ఞము.
సాము - 1.సగము, 2.వ్యాయామము, సం.1.సామి, 2.శ్రమః. 

ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
దర్శనము -
1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దర్శము - 1.అమావాస్య, 2.చూపు.

కర్కము - 1.అందము 2.అద్దము 3.అగ్ని.
అందము -
1.సౌందర్యము 2.అలంకారము 3.విధము. విణ.1.చక్కనిది 2.తగినది. పొంకము - 1.పొందిక, 2.సౌందర్యము.

పాటము - కెంపుల నాణెము చూచుటకు తగిన యెండ, సం.ప్రభాతమ్.
ప్రభాతము -
వరువాత, వేగుజాము.
వరువాత - ప్రాతఃకాలము, విణ.ప్రాతః.
ప్రత్యూషము - వేగుజాము; వేకువ - వేగుజాము.
స్రీ ఘోషము - వేకువ.
ఉషస్సు - తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము, ప్రత్యూషము, వేకువ. 
ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.

తెలియని కార్యమెల్ల గడదేర్చుటకొక్క వివేకిజేకొనన్
వలయు, దానదిద్దికొననచ్చు, బ్రయోజనమాంద్యమేమయిన్
గలుఁగదు, ఫాలమందుఁ దిలకంబిడునప్పుడు చేతనద్దమున్
గలిగినఁ జక్కఁజేసికొనుఁగాదె నరుండది చూచి, భాస్కరా.
తా.
చేతిలో అద్దము గలవాడు అది చూచి బొట్టు(కురువము - తిలకము)చక్కగా పెట్టుకొనును, అట్లే తనకు తెలియనిపనిని చేయవలసి వచ్చినట్ల యతే, ఆ పని నెరింగిన మంచివారి నాశ్రయించి నెరవేర్చుకొన వలెను.

ఒకే సూర్యరశ్మి భూమిమీద అనేక ప్రదేశాలలో పడుతుంది. కానీ ఆ కాంతి అద్దంమీద కానీ, మెరుగు పెట్టిన లోహాల మీద కానీ, నీటిమీద కానీ పడినప్పుడే చక్కగా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా భగవంతుని తేజస్సు అందరి హృదయాల మీద సమానంగా ప్రసరిస్తుంది. కానీ మంచివారు, సాధువులు మాత్రమే తమ నిర్మల హృదయాలతో ఆ తేజస్సును స్వీకరించి ఆ వెలుగును తిరిగి అందరికీ పంచగలుగుతారు. - శ్రీరామకృష్ణ పరమహంస  

ఆదర్శగజ న్యాయము - పెద్ద ఏనుగు చిన్న అద్దములో కనిపించుట అను న్యాయము.

కెంపుసవతు - స్వాతీనక్షత్రము.
కెంపు -
1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
సవతు - సమత, సామ్యము, సం.సమత్వమ్.
సామ్యము - సమత్వము, పోలిక; పోలిక - సామ్యము.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

స్వాతి - 1.సంజ్ఞాదేవి,  2.నక్షత్రములలో నొకటి. 
త్రసరేణువు - 1.సంజ్ఞాదేవి, 2.ముప్పది పరమాణువుల కొలది.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.

అబ్జము - 1.తామర, 2.నూరుకోట్లు, 3.ఉప్పు, 4.శంఖము, 5.హారతి కర్పూరము, 6.(వృక్ష.) నీటిప్రబ్బలి, విణ.నీట బుట్టినది.
అబ్జ బాంధవుడు -
సూర్యుడు వ్యు.తామరలకు బంధువు.
అబ్జమిత్రుఁడు - సూర్యుడు.

అబ్జజుఁడు - బ్రహ్మ, తుమ్మిచూలి.
అబ్జయోని - బ్రహ్మ, తమ్మిచూలి.

అబ్జవైరి - చంద్రుడు, వ్యు.తామరలకు శత్రువు.
అబ్జారి -
చంద్రుడు.

బిలియను – (Billion), నూరుకోట్లు.

ఉప్పు - ఆవిరిపోకుండ ఉడకబెట్టు, వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.
లవణము - ఉప్పు, సైంధవ, సౌవర్చ, కాచ, బిడా, సముద్ర లవణములని పంచ లవణములు.
ఉప్పదనము -

సొమ్ము - 1.స్వము, 2.ధనము(నెలగ - ధనము), 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీన వస్తువు.
స్వము -
1.ధనము, 2.తాను, విణ.తనది.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (ఫొసితివె). స్వాపతేయము - ధనము.
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది, 2.తెలియబడినది.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్. 
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.  
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము(ఆచ్తివె ఫ్రించిప్లె).  
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.  
నిజము - స్వభావము, 1.తనది, 2.శాశ్వతమైనది.
తాను - తాశబ్దమునకు ప్రథమైక వచనము. తన - ఆత్మార్థకము.
ఆత్మీయము - తన సంబంధమైనది, తనది, స్వకీయము.
సొంతము - స్వతంత్రము, స్వకీయము, సం.స్వతంత్రమ్.
స్వకీయము - తనది, రూ.స్వకము, (వ్యతి. పరకీయము). 
స్వీయము - తనది, వ్యతి.పరకీయము. 
నైజము - 1.తనది, 2.స్వాభావికము; నైసర్గికము - స్వాభావికము. 
స్వాభావికము - స్వభావముచేత కలిగినది. 

ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ -
భూషణము; భూషణము - అలంకరణము. 
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది.
ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property). 

పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింపబడినది.
పిత్రార్జితము -
పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).  
జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త.

స్త్రీ ధనము - పెండ్లి మున్నగు, సమయములలో స్త్రీకిచ్చిన ధనము.
సౌదాయికము - స్త్రీ కిచ్చిన ధనము.

ఉత్తమం స్వార్జితం విత్తం - మధ్యమం పితురర్జితమ్|
అధమం భ్రాతృవిత్తంచ - స్త్రీవిత్త మధమాధమమ్||
తా.
తాను సంపాదించినసొమ్ము ఉత్తమము(శ్రేష్ఠము, ముఖ్యము), తండ్రిసొమ్ము మధ్యమము, తోడబుట్టినవాని సొమ్మధమము(అధమము - తక్కువైనది, నీచము), స్త్రీసొమ్ము మిక్కిలి యధమము. - నీతిశాస్త్రము  

అసలు - 1.బురద, హిం. వి. (వాణి.) అప్పుగా తీసికొనిన సొమ్ము ((Principal).
పంకము -
1.బురద, 2.పాపము, వి.పాలు.
బాడె - బురద, అడుసు, సం.పంకమ్.
కర్దమము - అడుసు, పంకము, బురద. పంకిలము - విణ.బురదగలది.
అసలుఁబుట్టువు - తామర, పంకజము.
పంకజము - తామర, వ్యు.బురదలో పుట్టినది.
పంకేరుహము - పంకజము, తామర.
పంకరుహము - తామర. 

కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 2.కమలాఫలము.
కమలాలయము నందు దేవిస్థానం కమల.
కమలమస్యా అస్తీతి కమలా - కమలము చేతియందు గలిగినది.
కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.

మహాలక్ష్మి - 1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి -
పరాశక్తి, మహాలక్ష్మి. కొల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం|  కరవీరము నందు దేవీస్థానం మహాలక్షి.

శాంకరీ వైష్ణవీ సర్వదేవనమస్కృతా,
సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీర నివాసినీ| - 15శ్లో

పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ|
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ.
 

స్యాత్కురజ్గే పి కమలః :
కమల శబ్దము ఇఱ్ఱికి పేరైనపుడు పు. అపిశబ్దము వలన తామరకును, నీళ్ళకును పేరైనపుడు న. మహాలక్ష్మికీ పేరైనపుడు సీ. కామ్యత ఇతి కమలః. కము కాంతౌ. కోరఁబడునది. 'కమలం సలిలే తామ్రే జలజే క్లోమ్ని భేషజే, మృగప్రభేదే కమలః కమలా శ్రీవరస్త్రియో' రితి విశ్వప్రకాశః.

దశవాయుజయాకారా కళాషోడశ సంయుతా,
కాశ్యపీ కమలా దేవీ నాదచక్ర నివాసినీ|

కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
సహస్రపత్రము -
కమలము, తామర.
శతపత్రము - తామర. కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.
జలము - 1.నీరు 2.జడము 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు),  రూ.జలము  విణ.తెలివిలేనిది.

కామ్యతే తృషార్తైరితి కమలం. కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరఁబడునది.   

తామరసము - 1.తామర, 2.బంగారు, 3.రాగి.
రాగి -
ఒక విధమైన పైరు, వై.వి.తామ్రము, సం.విణ.1.అనురాగము కలది, 2.ఎరుపుగలది.
తామ్రము - 1.రాగి, 2.ఎరుపు, సం.వి. (రసా.) (Copper) రాగి, పిశంగ (Brown) వర్ణము గల ధాతువు. (ఇది ఆవర్త క్రమపట్టికలో రెండవవర్గములో వెండి బంగారముతోపాటు అమర్చబడి యున్నది. మొక్కలకు కావలసిన సూక్ష్మమూల ద్రవ్యములలో నిది యొకటి).
పిశంగము - (రసా.) రాగి రంగుగలది, (Brown) సం.వి.కపిలవర్ణము.

సంకటి - రాగిపిండి లోనగు వానితో వండిన సంకటము, అంబలి.
అంబలి -
ఒకరకపు జావ. అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడొకట్ట.

కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
కమలుఁడు - 1.బ్రహ్మ, 2.ఇంద్రుడు.

అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.
చెంగలువ -
ఎఱ్ఱకలువ. కెందొగ - (కెంపు+దొగ) ఎఱ్ఱకలువ.

పద్మనాభో (అ)రవిందాక్షః పద్మగర్భ శరీరభృత్,
మహర్థిః ఋథ్థో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. - 38శ్లో

రోచన - 1.గోరోచనము, 2.ఎఱ్ఱగలువ, ఉత్తమ స్త్రీ.
గోరోచక -
పసుల నాభియందుండు పసుపుపచ్చని వస్తువు, రూ.గోరోజనము.
గోమేధికము - పసుపుపచ్చని రంగు గల రత్నము, రూ.గోమేదకము, గోమేదము.

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  

కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము, చంద్రుడు.   

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు -
విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

జీవో వినయితాసాక్షీ ముకుందో(అ)మిత విక్రమః
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. - 55శ్లో

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
తా.
తామరులు జలమును వదలినయెడల తమకాప్తులైన సూర్యుని కిరణం(రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువు లగుదురు.  

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. - 157శ్లో

అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంబుజగర్భుఁడు -
తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.

అబ్భోజము - 1.తామర, (జం.) సారసపక్షి, బెగ్గురుపక్షి.
అంబోరుహము -
1.తామరపువ్వు, 2.(జం.) బెగ్గురుపక్షి.
కంజము - తామరపువ్వు. సారసము - 1.తామర, 2.బెగ్గురుపక్షి.
బెగ్గురు - సారసపక్షి, రూ.బెగ్గురము.

ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామర.
నీలాబ్జము -
నల్లకలువ.
ఉత్పలము - కలువ, నల్లకలువ.
కలువ - ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.
కువేలము - 1.కలువ, 2.పద్మము.
కలువకంటి - కలువరేకుల వంటి కన్నులుగల స్త్రీ.
కలువరాయుఁడు - చందమామ. రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
కువలయము -
1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.
కువలేశుఁడు - విష్ణుమూర్తి.

కల్హారము - మిక్కిలి పరిమళము గల కలువ.
కలువడము -
(కలువ+వడము) ఉత్సవములలో కట్టెడు బంగారు కలువ పూదండ, స.కైరవ వటః.

తొగ - 1.కలువ, 2.సమూహము, 3.విధము, రూ.తొవ.
తొగకంటి -
కలువకంటి, స్త్రీ.
కలువకంటి - కలువ రేకులవంటి కన్నులుగల స్త్రీ.
తొగచెలికాఁడు - చందుడు.
తొగఱేఁడు - చంద్రుడు; తొగవించు - చంద్రుడు Moon.

తొగసూడు - సూర్యుడు, వ్యు.కలువలకు శత్రువు.

శుభాంగ శ్శాన్తిద స్స్రస్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||

శతానందము - విష్ణురథము.
శతానందుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు. 

కందసుందరము - పలురంగుల తామరపద్మము.

నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము(నీటియిక్క).
జలజము -
1.తామర, 2.శంఖము. రాజీవము - తామర.

కంబువు - 1.శంఖము, 2.ఏనుగు, 3.కడియము, 4.నత్తగుల్ల.
కంబుగ్రీవ - 1.మూడు ముడుతలు గల మెడ, 2.శంఖము వంటి మెడగలది.

వెలిగుల్ల - శంఖము. శంఖధ్వని వినిపించే చోటు లక్ష్మీదేవి ఉంటుంది. 

శ ఙస్స్యాత్కమ్బు రస్త్రియౌ :
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః ఖను అవధారనే. - సుఖమును  బుట్టించునది.
కామ్యతే శుభార్థిభిరితికంబుః. ఉ-ప్న. కము కాంతౌ. - శుభర్థులైనవారిచేత కాంక్షింపఁబడునది. ఈ రెండు శంఖము పేర్లు.

శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒకనిధి.
గుల్ల -
1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము), సం.క్షుల్లః.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
నత్త - గుల్ల యందుండు పురుగు.
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల.  

శఙ్ఖో నిధౌ లలాటాస్థ్ని కమ్బౌన స్త్రీ -
శంఖ శబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖము నకును పేరు.
శమయతి దుఃఖమితి శంఖః శము ఉపశమమే. - దుఁఖమును శమింపఁ జేయునది.

శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతియందు ధరించువాడు.

శుక్తి - 1.ముత్తెపుచిప్ప, 2.శంఖము, 3.నత్తగుల్ల, 4.పుఱ్ఱెపెంచిక.
శుక్త్యంబు బిందున్యాయము - ముత్యపుచిప్పలోబడ్డ నీటిబిందువు ముత్యమగు ననురీతి.

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

హారతి కర్పూరము - (వ్యవ.) (Lauraceac) అను కుటుంబమునకు చెందిన Laurus camphor అను చెట్టువేళ్ళు కాండములనుండి ఈద్రవ్యమును అస్థిర తైలమును తీయుదురు (Camphor).

ఆజ్యము - 1.నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.

కౌస్తుభము - విష్ణువక్షస్థలము నందలి మణి, వ్యు.కుస్తుభ- సముద్ర మందు పుట్టినది. 
దేవమణి - 1.కౌస్తుభము, 2.గుఱ్ఱము మెడ మీది సుడి.
కౌస్తుభవక్షుడు - విష్ణువు (వక్షస్తలే కౌస్తుభం).

ఊరక వచ్చుఁ బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగఁగల్గువానికిఁ, బ్రయాసము నొందిన దేవదానవుల్
వారలటుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగదె శృం
గారపుఁ బ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు, భాస్కరా.
తా.
సురాసురలు అమృతమునకై మందరపర్వతమును కవ్వముగాను, వాసుకి యను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభరత్నమును, కల్పవృక్షమును, కామధేనువును పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో "లక్ష్మియు, కౌస్తుభరత్నము" అను నీ రెండును ప్రయాసపడకుండనే విష్ణువునకు లభించెను. అదృష్టవంతున కభివృద్ధి కలుగబోవునెడల నతడే ప్రయాసమును బడకుండగనే అతనికి భాగ్యము కల్గును.   

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
సిరి -
1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.
శోభ - 1.వస్త్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
శ్రీః ఈసీ. శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.

శుద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ|
శ్రీ లక్ష్మీ ర్వర లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా|

సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు -
ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సమృద్ధమైనది.

సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపద్యతే జనైరితి సంపత్. ద.సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. - జనులచేత పొందఁబడునది.
శ్రియతే జనైరితి శ్రీః ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది.
లక్ష్యతే లక్ష్మీః. ఈ. సీ. లక్ష దర్శనాంకనయోః. - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు 4 సంపద పేర్లు. 

సిరిమంతుఁడు - శ్రీమంతుడు, సం.శ్రీమాన్.
శ్రీమంతుఁడు -
సంపదకలవాడు.
శ్రీమంతము - 1.సంపదకలది, 2.ఒప్పిదముకలది.
శ్రీకరుఁడు - సంపత్కరుడు.

వైభవము - విభవము, సంపద.
విభవము -
సంపద, ఐశ్వర్యము.
కలిమి - 1.అతిశయము(అతిశయము - అధిక్యము), 2.సంపద.
సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.
సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి.   

శ్లీలము - 1.సంపదగలది, 2.సభ్యత కలది.
శ్లీలుడు -
అదృష్టవంతుడు. జాతకుఁడు - 1.పుట్టినవాడు, 2.అదృష్టవంతుడు. మాఢ్యుడు - సిరితో గూడినవాడు.

శ్రీదుఁడు - కుబేరుడు. 

సిరి చేర్చు బంధువుఁల నా
సిరియే శుభముల నొసంగు * చెలువులఁ గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించుగం మఁ * దలంపు కుమారా !
తా.
కుమారా! సంపదయే చుట్టములను దగ్గరఁ జేరునట్లుచేయును, శుభములన్నింటిని యిచ్చును. అందముకూడ కలిగించును. ప్రపంచములో గుణవంతుఁడని పొగడునట్లు చేయును.

శ్రీదః  శ్రీశః  శ్రీనివాసః  శ్రీనిధి  శ్రీవిభావనః|
శ్రీధర  శ్రీకర  శ్రేయః  శ్రీమాన్ లోకత్రయాశ్రయః||

శ్రీపతి - 1.విష్ణువు, 2.రాజు.
శ్రీధరుఁడు -
విష్ణువు. శ్రీధరం ప్రియ సంగమే! 
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీద తండ్రి.
తిమ్మ - స్వస్థము; స్వస్థము - నెమ్మదిగా నుండునది.

శ్రియఃపతి - విష్ణువు, లక్ష్మీభర్త.
శ్రీపతిః. ఇ - పు. శ్రియః లక్ష్మ్యాః పతిః - లక్ష్మీదేవికి భర్త. 

తిరు - శ్రీ ప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల -
వేంకటాచలము.
శేషశైలము - తిరుమల; శేషాచలము - తిరుమల.
శేషాద్రి - తిరుమల. 

స్మరం యోనిం లక్ష్మీ - త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే! - నిరవధి మహాభోగ రసికాః|
భజంతి త్వాం చింతా - మణిగుణ నిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వన్తః - స్సురభిఘృత ధారాహుతి శతైః|| - 33శ్లో
     
తా. ఆద్యంతరహితయైన నిత్యయగు ఓ త్రిపురసుందరీ! పరమయోగులు కొందఱు నీ మంత్రమునకు మొదటి కామ బీజమగు ఐం, యోని బీజమగు హ్రీం, లక్ష్మీ బీజమగు శ్రీం అను వర్ణములను జేర్చి, చింతామణులచే సమగూర్చబడిన జపమాల(అక్షమాల)లను హస్తము లందు గలిగి, కామధేనువు సంబంధ మగు నేతి ధారలచే శివాగ్ని యందు హోమముచేయుచు, నిన్నుకొలుచుచున్నారు. - సౌందర్యలహరి  

శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ,
శ్రీం బీజ జపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా| - 152శ్లో

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.  

ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య - బంధమోక్షానుదర్శనమ్|
వివిక్తపదమజ్ఞాయ కిమసత్కర్మభిర్భవేత్ |

ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి. 

కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సుకింపైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.

వర్చస్సు - 1.కాంతి 2.రూపము.
కాంతి1 -
1.కోరిక 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ. అభీష్టము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
రూపము - 1.ఆకారము 2.చక్షురింద్రియ గోచరము 3.సౌందర్యము 4.అగ్నిగుణము 5.స్వభావము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.

అలంకారము - 1.అలంకరించుట, సింగారము 2.హారాది ఆభరణము 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
పాటన - 1.అలంకారము, 2.ఆదరణము.
ఆదరణము - 1.సన్మానించుట, 2.మన్నించుట, 2.లక్ష్యముచేయుట, పాటించుట.
ఆదరణీయము - సన్మానింపదగినది.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్దులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు. 
ఔజ్జ్వల్యము - ఉజ్జ్వలత్వము, ప్రకాశము.    

శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి -
మదనుడు; మరుఁడు - మన్మథుడు.
మదనుఁడు - మన్మథుడు; మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. జరాభీరువు - మదనుడు(జర - ముసలితనము).     

వస్త్రముఖ్య స్వలంకారః - ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం - విద్యాముఖ్యస్తు పూరుషః||
తా. అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును ముఖ్యములు. – నీతిశాస్త్రము

దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా,
శ్రీ స్సౌమ్యలక్షణా(అ)తీత దుర్గా సూత్ర ప్రబోధికా. - 32శ్లో  

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.

సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.

హరి ! నీకుఁ బర్యంకమైన శేషుఁడు చాలఁ బవనము భక్షించు బ్రతుకు చుండు,
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్పపామును నోఁటఁ గొఱకుచుండు,
నదిగాక నీభార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు;
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలుచేసి ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుంద్రు,

తే. స్పష్టముగ నీకు గ్రాసము జరుగుచుండఁ
     గాసు నీచేతి దొకటైనఁ గాదు వ్యయము,
    భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
    దుష్టసంహార ! నరసింహ! దురితదూర ! - 48 
తా.
హరీ! నీకు పాన్పైన శేషుడు వాయువును తిని బ్రతుకుచుండును. చక్కగా నీకు వాహనమైన గరుత్మంతుడు గొప్పపామును నోటితో గొరుకుచుండును. అంతియెకాక నీ భార్యయగు లక్ష్మీదేవి దినము పేరంటమునకై(పేరంటము - పసుపు బొట్టులకు శుభకార్య సమయమున ముత్తెదువుల పిలుచుట, వారుచేయు కార్యము, రూ.పేరంట్రము.)తిరుగుచుండును. నిన్ను భక్తులుపిల్చి దినపూజలు గావించి ప్రేమతో వండిన య(అ)న్నములను బెట్టు చుందురు. దిగులు లేకుండా నీకు భోజనము జరుగుచుండగా నీచేత దొక్కకానియైన ఖర్చుగాదు. - శేషప్ప కవి, నరసింహ శతకం      

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి (వాసరము - దినము).
ప్రియ - ప్రియురాలు; ప్రణయిని - ప్రియురాలు.  
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.   

ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా,
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ. - 9శ్లో

ఇందిర - లక్ష్మి; ఇంది - లక్ష్మి, రూ.ఇందిర.
అధికపాఠము. ఇందిరా లోకమాతా మా క్షీరాబ్ధితనయా రమా(రమ - లక్ష్మి) - ఇందతీ తీందిరా - పరమైశ్వర్యయుక్తురాలు. ఇది పరమైశ్వర్యై.

మున్నీటిచూలి - క్షీరసాగరకన్యక, లక్ష్మి.
మున్నీరు -
(మును+నీరు) సముద్రము.

పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే,
ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగర కన్యకే. - 145శ్లో

లోకజనని - 1.జగము తల్లి, 2. లక్ష్మి, 3.గంగ.
లోకమాత - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.
లోకానాం మాతా లోకమాతా - ఎల్ల లోకములకు తల్లి. మా. అస్త్యైవ నామ్న ఏకదేశగ్రహణం మేతి - లోకమాత యను నామముననే మా అని యేకదేశగ్రహణము.

సృష్ట్యాది కారణాకార వితతే దోషవర్జితే,
జగల్లక్ష్మీ ర్జగన్మాత ర్విష్ణుపత్నీ నమోస్తుతే. - 137శ్లో 

శ్రుతీనాం మూర్ధానో - దధతి తవ యౌ శేఖరతయా
మమా ప్యేతౌ మాత! - శ్శిరసి దయయా ధేహి చరణౌ|
యయోః పాద్యం పాథః - పశుపతి జటాజూట తటినీ
యయౌ ర్లాక్షాలక్ష్మీ - రరుణ హరి చూడామణిరుచిః|| - 84శ్లో 
తా.
ఓ! లోకమాతా! శ్రుతుల(వేదముల) శిరస్సులైన ఉపనిషత్తులు నీ సిగలో అలంకరించుకొన్న పుష్పములుగ(శిరోభూషణములుగ) నున్నవి. శివుని(పశుపతి - శివుడు)జటాజూటంలో వర్తించే గంగానది(నెత్తికెక్కిన ఆడది చిత్తం స్వామీ అంటూ కాళ్ళు కడుగుతోంది)నీకు పాద్యము(పాద్యము - పాదము కొరకైన నీళ్ళు)అగు చున్నది. ఎఱ్ఱనై హరికి శిరోభూషణమైన మణిమయకిరీటం(చింతామణి - కోరికలొసగు దేవమణి) యొక్క కాంతులే లాక్షారస(చరణలత్తుక) కాంతి గాగలవియునగు నీదు పాదములు, కృపతో కూడిన చిత్తంగల దానవై, నా శిరస్సుమీదకూడ ఉంచు. -  సౌందర్యలహరి      

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక (పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ).
విశాలాక్షి -
హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షీ శక్తిపీఠం| (సతీదేవి ముఖం పడిన చోట వారాణసి, అక్కడ వుండే గౌరికి విశాలాక్షి అనిపేరు).
భవ్య - పార్వతి, హైమవతి.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ|
ప్రగల్భా పరామోదారా పరామోదా మనోమయీ. - 174శ్లో

హిమానీహంతవ్యం - హిమగిరినివాసైకచతురౌ 
నిశాయాం నిద్రాణాం - నిశి చరమభాగే చ విశదౌ |
పరం లక్ష్మీపాత్రం - శ్రియ మతిసృజంతౌ సమయినాం, 
సరోజం త్వత్పాదౌ - జనని! జయత శ్చిత్ర మిహ కిమ్ || - 87శ్లో
తా.
ఓ జననీ ! హిమాలయము నందు నివసించుటకు సమర్థమైన వియు, రాత్రి వేకువనగూడ విశదములైనవి(విశదము - తెల్లనిది, స్పష్టమైనది.), భక్తులకు సంపదలను(లక్ష్మిని) కలిగించేవి అయిన నీ పాదములు, మంచుచే గొట్టబడినది రాత్రి(నిశ - 1.రేయి, 2.పసుపు.)యందు ముడుచుకొని పోవునదియు లక్ష్మీదేవికి ఆలవాలమైన పద్మము(సరోజము - 1.తామర, 2.తామరకొలను.)ను జయించు చున్నది ననుటలో ఆశ్చర్యం ఏమున్నది ? ఏమీ లేదు.  - సౌందర్యలహరి      

పద్మకాంతిపద పాణిపల్లవ పయోధరానన సరోరుహాం,
పద్మరాగమణి మేఖలావలయ నీవిశోభిత నితంబినీం|
పద్మ సంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం,
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం| -
7శ్లో

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గాందిని -
గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు.
గాంగేయుఁడు - గాంగుఁడు.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు -
గంగాధరుఁడు, శివుడు, వ్యు.శిరస్సున భార్యకలవాడు.

గాంగము - 1.గంగ యందు పుట్టినది, 2.గంగకు సంబంధించినది
గాంగేయము -
1.బంగారము, 2.తామర, 3.ఉమ్మెత్త, 4. ఒకానొక చేప. గఙ్గాయాం అగ్నినా న్యస్తస్య మాహేశ్వరవీర్యస్య హిరణ్యత్వేన భూతత్వ్వత్ గాంగేయం - గంగ యందు ఈశ్వరుని వీర్యము అగ్నిహోత్రుఁడు విడువఁగా సువర్ణ రూపమాయెను గనుక గాంగేయము.

బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
స్వర్ణము -
బంగారము, రూ.సువర్ణము, సం.వి. (రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ వర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.
సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచివర్ణము కలది.

సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచి వర్ణము కలది.
బిస్తము -
మాడ(మాడ - అరవరా, పదిరూకలు), సువర్ణము.

సువర్ణబిస్తా హేమ్నో క్షే :
సువర్ణమత్రాస్తీతి సువర్ణః - సువర్ణము దీనియందుఁ గలదు.
బిస్యతి తులాకోటిం నీచైః ప్రేరయతీతి బిస్తః బిసప్రేరణే - త్రాసును క్రిందికి వంచునది. పా. విస్తః. అక్షమెత్తు బంగారు పేర్లు.

మొగ్గు - గౌరవము, క్రి.బరువు వైపు వంగు.

కుశేశయము - తామరపువ్వు, వ్యు.నీటియం దుండునది.
కుశే జలే శేత ఇతికుశేశయం. శీఙ్ స్వప్నే. - నీళ్ళ యందు వుండునది. 

వనజము - తామర, వ్యు.నీటియందు పుట్టినది.

కశేరు హేమ్నోర్గాజ్గేయమ్ :
గాంగేయ శబ్దము కమ్మరేఁగున(ఒక రకము చేఁప)కును, బంగారము నకును పేరు. కుశేరువనఁగా కొందఱు తామర, కలువ మొదలయినవాని దుంపయనియును, కొందఱు తృణ విశేషమనియు నందురు. గంగాయాం భవం గాంగేయం - గంగ యందుఁ బుట్టినది. '......షడాననే, గాంగేయః పుంసి భీష్మేచ గాంగేయం ముక్తకే భవే'ఇతి శేషః.

కర్బురము - 1.జలము, 2.బంగారము, విణ.చిత్రవర్ణములు గలది.

సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
కామధేనువు - వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు.
సురగలి - కామధేనువు; కామదుఘ - కామధేనువు.
తెలిమొదవు - కామధేనువు; వెలిగిడ్డి - కామధేనువు.
ఈవులమొదవు - కామధేనువు. 

సురభిళము - మంచివాసనగలది.
సురభీకరించు - క్రి.మంచివాసన కలదిగాచేయు.

చాంపేయము - 1.బంగారము, 2.సంపెంగ.
చామీకరము -
బంగారము.
జాతరూపము - బంగారము; అష్టాపదము - బంగారము.
చంపకము - సంపెంగ, సంపెగ.
సంపగియ - చంపకము, రూ.సంపగి, సంపెంగ, సంపగి, సం.చంపకః.
కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
హేమము - 1.బంగారు, 2.ఉమెత్త. 
క్షౌద్రము - 1.తేనె, 2.ఉదకము, 3.సంపెంగ.
తేనెదిండి - తుమ్మెద.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెద కంటు గల్గించునది. 

అథ చామ్పేయ శ్చమ్పకో హేమపుష్పః.
చంపాఖ్యదేశే భవః చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చమ్యతే అశిభిరితి చంపకః. చము అదనే. - తుమ్మెదలచే నాస్వాదింపఁ బడునది.
హేమవర్ణం పుష్యమన్యేతి హేమ పుష్పకః - బంగారు వన్నెగల పువ్వులు గలది. ఈ 3 సంపెంగ చెట్టు పేర్లు.

పూనూనె - సంపెంగనూనె.
కమ్మనూనియ -
సంపెంగ, మొ.వి చేర్చి చేసిన తైలము, రూ.కమ్మనూనె. మింగమెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అన్నట్లు.

గంధఫలి - సంపెంగ మొగ్గ, రూ.గంధఫలి.

సమూహఫలము - (వృక్ష.) ఒకే పుష్పములోని విభక్తాండ కోశము నుండి తయారైన ఫలసమూహము (Etacrio), ఉదా. సీతాఫలము, సంపంగి. పేర్లు
పుంజఫలము - (వృక్ష.) ఒకేపుష్పము నందు బయలుదేరి, విభక్తకమైన అండాశయము నుండి తయారైన పండు (Aggregate fruit), ఉదా. సీతాఫలము), చూ. సమూహఫలము.

దుర్జనం కాంచనం భేరీ దుష్టస్త్రీ దుష్టవాహ మ్|
ఇక్షుం తిలా నౌషధాకాశ్చ మర్దయేడ్గుణ వృద్ధమ్||
తా.
దుర్జనులను, బంగారమును, భేరిని, దుష్ట స్త్రీని, చెడుగుఱ్ఱమును, చెఱుకుగడలను, నువ్వులను, మందును గుణవృద్ధి కొరకు మర్దింప వలయును. - నీతిశాస్త్రము     

చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచా|
కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా.

మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
హృద్యము -
మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సు కింపైనది.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.

చిన్నిదము - 1.చిన్నపువ్వు, 2.బంగారు.
చిన్నిపువు - 1.నమస్కృతి, 2.భూషావిశేషము, రూ.చిన్నపువ్వు.

కలికి - 1.ఆడుది, 2.మనోజ్ఞురాలగు స్త్రీ, విణ.మనోజ్ఞము.
పొన్నారి - మనోజ్ఞము.

పొన్ను - 1.బంగారు, 2.కట్టుగావేయు లోహవలయము.
తపనీయము -
బంగారు. ఔజనము - బంగారు.

పయిఁడి - బంగారు; పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పసిఁడి - 1.బంగారు, 2.ధనము. 

హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హాటకగర్భుడు -
బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.

రై - 1.ధనము, 2.హిరణ్యము.
రైవతుఁడు -
శివుడు.
హిరణ్మయము - బంగారుతో నిండినది.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.  

కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
కపర్ధి - శివుడు. 

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు -
1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
దచ్చికాళ్ళమెకము - శరభము, అష్టాపదము.
అష్టాపదము - బంగారము.

కాంచన వస్తుసంకలిత కల్మష మగ్నిపుటంబుబెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భక్తియోగదహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచన కుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
రామా! బంగారులోని మాలిన్యము అగ్నిపుటమువలన పోవునట్లు ఆత్మయందుగల మూఁడుమలములు నీయందలి భక్తియోగముచేతనే, నశించునుగాని మరొక విధమున నశింపవు.

ఉమెత్త - దుత్తురము, రూ.ఉమ్మెత్త, సం.ఉన్మత్త.
దుత్తురము -
ఉమ్మెత్త; కితవము - ఉమ్మెత్త.

ఉన్మత్తః కితవో ధూర్తో ధుత్తూతః కనకాహ్వయః మాతులో మదనశ్చ :
ఉన్మాదయతీత్యున్మత్తః తథైవ కితవశ్చ. మదీ హర్షగ్లేపనయోః - ఉన్మాదమును జేయునది.
ధూర్వతి ఉన్మాదేన హిన స్తీతి ధూర్తః. దుర్వీ హింసాయాం. - ఉన్మాదముచేత హింసించునది.
వాతాదిరోగా న్ ధువతీతి ధుత్తూరః. ధూ విధూననే. - వాతాది రోగము లను కంపింపఁ జేయునది. పా. ధూస్తూరః.
కనకస్య ఆహ్వయోయస్య కనకాహ్వయః - బంగారు యొక్క పేరుగలది.
ఉన్మాదకద్ర వ్యేషు మానా స్తితు లాస్యేతి మాతులః - ఉన్మాదక ద్రవ్యము లలో సాటిలేనిది.
మదయతీతి మదనః. మదీహర్షగ్లేపనయోః. - మదింపఁ జేయునది. ఈ ఆరు ఉమ్మెత పేర్లు.

కైవతము - 1.కపటము, 2.జూదము, 3.ఉమ్మెత్త, 4.వైడూర్యమణి.
దుత్తూరము -
కపటము, సం.ధూర్తతా.
కపటము - కవుడు, వ్యాజము.
కౌడు - 1.మోసము, 2.ప్రమాదము, తప్పు, రూ.కవుడు, సం.కపటః.
జూదము - జూజము. జూజము - ద్యూతము, పందెము వేసి ఆడెడి ఆట, మోసము, రూ.జూదము, సం.ద్యూతమ్. ద్యూదము - జూదము.
వైడూర్యము - ఒక విధమగు రత్నము, పిల్ల కన్రతనము.  
బేరిల్ - (భూగ.) (Beryl) వైడూర్యము. 

మా1 - 1.లక్ష్మి, 2.తల్లి.
మా2 -
విణ. మిక్కిలి, సం.మహాన్.
మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి, (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని). సిద్ధవనము నందు దేవీస్థానం మాత, కయావదోహణము నందు మాత.

ధరణినాయకు రాణియు
గురురాణియు నన్నరాణి * కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁ * దలఁవుఁ గుమారా!
తా.
రాజు భార్యయును(రాణి - రాజ్ఞి, భార్య), గురు భార్యయును, అన్న భార్యయును, భార్యతల్లి(అత్తయును), తన(తన - ఆత్మార్థకము)కన్నతల్లి, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.      

మున్నీటిచూలి - క్షీరసాగరకన్యక, లక్ష్మి.
మున్నీరు -
(మును+నీరు) సముద్రము. క్షీరసాగరకన్యక - క్షీరాబ్ధేస్తనయా క్షీరాబ్ధితనయా - పాలకడలికూఁతురు. రమతైతి(రమ – లక్ష్మి)రమా - క్రీడించునది. రము క్రీడాయాం. - ఈ నాలుగు 4 లక్ష్మికి నామములు.

రమాభూమి సుతారాధ్య పదాద్జాయై నమః

రత్నాకరము - సముద్రము.
రత్నగర్భుఁడు -
1.సముద్రుడు, 2.కుబేరుడు.
శ్రీదుఁడు - కుబేరుడు.

సముద్ర మథనే లేభే హరిర్లక్ష్మీం హరోవిషమ్|
భాగ్యం ఫలతి సర్వత్రన విద్యానచ పౌరుషమ్||
తా.
సముద్రమును మధించినపుడు విష్ణువు లక్ష్మీదేవిని, శివుడు విషంబును (బొ)పొందిరి. గాన వారివారి భాగ్యాసుసారముగా ఫలంబు గలుగును. – నీతిశాస్త్రము  

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

మంగళదేవత - లక్ష్మి.
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి. 

అంతస్థము - (వ్యాక.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది.

భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదా స్థితా,
వ్యోమకేశాఖిల ప్రాణా పంచకోశవిలక్షణా. - 58శ్లో

ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ,
శాంభరీ మహాకోణా గరుడోపరిసంస్థితా. - 65శ్లో 

వైష్ణవీ సుభగాకారా సుకుల్యా కులపూజితా,
వామాంగా వామాచారాచ వామదేవప్రియా తథా. - శ్రీ భువనేశ్వర్యష్టోత్రమ్

5. వారాహి - 1. ఒక మాతృక,  2.అడవి యాడుపంది. సోమేశ్వరము నందు దేవీస్థానం వరారోహ.

Varahi, from Yagna Varaha murthi, the divine wild boar.

గ్రాహము - 1.పంది, 2.చెర, 3.మొసలి, 4.గ్రహణము, 5.గ్రహించుట.
పంది -
సూకరము.

తొలుపంది - ఆదివరాహము.

వరాహ స్సూకరో ఘృష్టిః కోలః పోత్రీ కిరిః కిటిః,
దంష్ట్రీ ఘోణీ స్తబ్ధరోమా క్రోణోభూదార ఇత్యపి. -

వరాహము - 1.పంది, 2.వరహా, 3.కోతి, 4.కొండ.
ఏకలీఁడు -
అడవిపంది, వరాహము. 
ఏకచరము - 1.ఒంటరిగాడు, 2.అడవిపంది, విణ.ఏకాంతమైనది.
ఒంటరికాడు - 1.ఒంటియై తిరుగువాడు, ఏకాకి, 2.పంది, ఏకచరము.
ఒంటరి - 1.ఏకాకి, 2.అసహాయుడైన బంటు, రూ.ఒంటరీఁడు.
ఏకాకి - 1.అసహాయుడు, 2.ఒంటరి(ఒంటరీఁడు - ఒంటరి), 3.ఏకాంగి.
ఏకలము - అసహాయ, వి.అడవిపంది (ఇది దేశ్యపదముగాగూడ వాడ బడుచున్నది. కాని పూర్వక విప్రయోగము మృగ్యము.)
ఒంటికాఁడు - పంది, విణ.1.వియోగి, 2.ఏకాకి, 3.సన్యాసి.
సన్న్యాసి - సన్న్యసించినవాడు.
ఏకాంగి - విరక్తుడగు విష్ణుభక్తుడు, విణ.ఒంటరివాడు.

వరాహము - 1.పంది, 2.వరహా, 3.కోతి, 4.కొండ.
వరహా -
వరాహముద్రగల బంగారు నాణెము, సం.వరాహః.
నాణెము - 1.సొగసు, 2.అలకారము, 3.నాగరికత, రూ.నాడెము, సం.నాణకమ్.
నాన - సిగ్గు, సం.జ్ఞానమ్, త.నాన్, క. నాణ.
బిడియము - సిగ్గు; సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.
లజ్జ - సిగ్గు.

వరారోహ - ఉత్తమ స్త్రీ, పెద్ద పిరుదులు గల స్త్రీ.
వామ -
ఉత్తమ స్త్రీ.
వామదేవుఁడు - శివుడు.

విశుక్రప్రాణహరణ - వారాహీ వీర్యనందితా|
కామేశ్వరముఖాలోక - కల్పితా శ్రీగణేశ్వరా.

కరి1 - 1.ఏనుగు, 2.కోతి.
కరి2 - 1.నిదర్శనము, 2.మేర, విణ.సాక్షి.
కరిముఖుడు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు(Jupiter).

కరణీప్రసవ న్యాయము - న్యా. పందికి పదిపిల్లలు పుట్టుక కన్న ఏనుగుకు ఒక పిల్ల పుట్టుట మేలు అను భావము. (కరణి - విధము, రీతి.).

సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలలితము భంగిన్
సిరి దా బోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిన్ సుమతీ.
తా.
కొబ్బరికాయలో ఏరీతిగా నీరుచేరునో ఆవిధంగా సిరివచ్చిన వచ్చును. అట్లే సిరిపోయినపుడు ఏనుగు విసర్జించిన వెలగపండులో గుజ్జు మాయ మయిన రీతిగా పోవును.

గోపుచ్ఛము - 1.కోతి, 2.ఆవుతోక.
క్రోఁతి -
వానరము, రూ.కోతి. వానరము - కోతి; వనచరము - కోతి; మర్కటము - కోతి.
కపి - కోతి; తిమ్మఁడు - కోతి; కొండత్రిమ్మరి - కోతి. 
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి చిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు(జయుడు, శాపం వల్ల మొసలిగా జన్మించిన విజయుడు).

కొండ - మల, పర్వతము.
మల -
పర్వతము, త. మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
కొండ(ౘ)చూలి - పార్వతి. (చూలు - 1.గర్భము, 2.బిడ్ద.)
కొండయల్లుఁడు - శివుడు; కొండమల్లయ్య - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.
కొండపగతుఁడు - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు.

తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి.
శ్రీనివాసుఁడు -
విష్ణువు, వేంకటేశ్వరుడు.

శతవిష్కో ధనాఢ్యశ్చ శతగ్రామే నభూపతిః|
శతాశ్వః క్షత్రియోరాజా శతశ్లోకేన పండితః||
తా.
నూరు వరహాలు (వరహా - వరాహముద్ర గల బంగారు నాడెము, సం.వరాహః.)కలిగినవాఁడు ధనికుఁడనిపించుకొనును, నూరు గ్రామముల కధిపతియైనవాఁడు రాజనిపించుకొనును, నూరు శ్లోకములు(శ్లోకము - 1.సంస్కృత పద్యము, 2.కీర్తి.)రచించినవాఁడు పండితుఁడని యనిపించు కొనును. - నీతిశాస్త్రము

సూకరము - పంది, రూ.శూకరము.
శూకరము - సం.వి. రక్షింపబడని దుష్టాశ్వము.

అయం తు కథితః కల్పో ద్వితీయస్యాపి భారత |
వరాహ ఇతి విఖ్యాతో యత్రాసీత్ సూకరో హరిః |

ఘృష్టి - 1.పాచితీగ, 2.పోటి, 3.పంది, 4.రాపిడి, 5.కిరణము.
పోటి -
1.స్పర్థ, 2.ఊతగానిల్చిన స్తంభాదికము.
ఘృణి - 1.కిరణము, 2.వెలుగు.

విష్వక్సేనప్రియా ఘృష్టి ర్వారాహీ బదరేత్యపి -
విష్వక్సేన(విష్వక్సేనుఁడు - విష్ణు సేనాధిపతి)ప్రియత్వా ద్విష్వక్సేన ప్రియా - విష్ణువునకుఁ బ్రియమైనది.
వారాహైః ఘృష్యత ఇతి ఘృష్టిః సీ. ఘృషు సంఘర్షణే. - వరాహములచేత నొరయఁ బడునది.
వారాహైరాక్రాంతా వారాహీ. - అడవిపందులచేత నాక్రమింపఁ బడునది.
బదతి స్థిరీభవతీతి బదరా. బడస్త్యైర్యే. - స్థిరమైయుండునది.  ఈ మూడు 3 పాఁచితీఁగె పేర్లు.

కోలము1 - 1.రేగుపండు, 2.పంది, 3.ఒడి, 4.కౌఁగిలి, 5.తెప్ప.
కోలము2 -
ఒకవిధమైన నాట్యము.

పోత్రము - 1.పందిమూతి, 2.నాగటి దుంప మొన.

కిరము - పంది, రూ.కిరి, వ్యు.ముఖము(ముట్టె)చే భూమిని త్రవ్వునది.
ముట్టె -
పశ్వాదుల మూతి, పంది ముక్కు, సం.ముఖమ్.
కిటి - పంది, సూకరము.
పంది - సూకరము; సూకరము - పంది, శూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.

స్థూలనాసము - పంది.

దంష్ట్రి - పంది, వ్యు.దంష్ట్రలుకలది. 
దంష్ట్ర -
కోరపల్లు.
దంష్ట్రాయుధము - పంది, వ్యు.దంష్ట్రలే ఆయుధముగా కలది. 

కిరిచక్ర రథారూఢ - దండనాథా పురస్కృతా|
జ్వాలామాలిని కాక్షిప్త - వహ్ని ప్రాకారమధ్యగా. - 27శ్లో.

ఓం కిరి చక్ర రథా రూఢ దండనాథా పురస్కృతాయై నమః : కిరి(వరాహం) రూపంతో ఉండినది, వరాహాలు వాహనాలుగా కట్టబడిన రథానికి కిరి చక్రరథమని నామము. అట్టి రథాన్ని అధిరోహించి దండనాయికయైన వారాహీ శక్తిచే సేవింప బడుతూన్న లలితాంబకు ప్రణామాలు.

అవిద్యానా మంత - స్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య - స్తబక మకరందస్రుతిఘురీ,
దరిద్రాణాం చింతా - మణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా - మురరిపు వరాహస్య భవతి. - 3శ్లో
తా.
అమ్మా! నీ పాద రజము(పాదకమల పరాగరేణువు), లోపల అజ్ఞానమను చీకటితో నున్నవారికి సూర్యుడు(ద్వాదశాదిత్యులు) దయించెడు భూమియందు నగరము వంటిది. మూఢులకు చైతన్యమనెడు కల్పవృక్ష పుష్పగుచ్ఛము యొక్క తేనె జాలు. దారిద్ర్యమువలన బాధపడుచున్న దీనులకు చింతామణి గుణముల ప్రోవు. సంసార సముద్రమున తేలిరాలేక మునిగిన వారలకు యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు యొక్క దంష్ట్రము అగుచున్నది. -  సౌందర్యలహరి  

మురరిపు వరాహస్య దంష్ట్రాః : విష్ణురూపాది వరాహము దంష్ట్ర - ఉద్దారకారి. జనన మరణ సంసార సముద్రమున మునిగిన వారికి యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు యొక్క దంష్ట్రము.

విశుక్రప్రాణహరణ - వారాహీ వీర్యనందితా|
కామేశ్వరముఖాలోక - కల్పితా శ్రీగణేశ్వరా.

ఘోణి - ఏనుగు, దోమ, పంది.

స్తబ్ధరోమము - పంది.
రోమశము -
1.పంది, 2.గొఱ్ఱె, విణ.ఒడలిపై నెక్కువ వెండ్రుకలుకలది.

అసహాయాశూరుఁడు - ఒంటరిగా నిలిచి పోరు యోధుడు.

వైనాయకి వరారోహా శ్రోణివేలా బహిర్వశిః,
జంభినీ జృంభిణీ జంభకారిణీ గణకారికా.

మాతంగీ మత్తమాతంగీ మహాదేవప్రియా సదా,
దైత్యహన్త్రీచ వారాహీ సర్వశాస్త్రమయీ శుభా|   

క్రోడము - 1.రొమ్ము, 2.పంది, 3.ఒడి.
క్రోడాడు -
1.(ఎద్దు మొ.వి) కొమ్ములతో నేలను పొడిచి దుమ్మెగజల్లు, 2.(పంది) ముట్టెతో నేలను కెల్లగించు.
కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ, వి కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ, వి ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శింఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 8.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.
క్రోడుఁడు - శనిగ్రహము.

మోటు - 1.మొద్దు, 2.తట్టువ గుఱ్ఱము, 3.పందికెదుట మనుష్యా కారముగ నిల్చిన కపటలక్ష్యము, విణ.మూర్ఖుడు, సం.మూఢః.
మొద్దు -
మ్రానిమోడు, విణ.1.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్. 
అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
తట్టువ - గుఱ్ఱము, రూ.తట్టువము.

ఊరఁబంది - (ఊరు+పంది)ఊరియందు తిరుగు పంది, గ్రామసూకరము. 
ఇబ్బంది - (ఇరు+పంది) 1.అడవిపందికి ఊరపందికి పుట్టిన పంది, 2.ఇక్కట్టు, 3.నిర్భంధము.
నిర్భంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
నిక్కచ్ఛి - 1.నిర్భంధము, 2.సారము, 3.మొగమాటమి లేమి, సం.నిష్కర్షః. 

ఒగు నోగుమెచ్చు నొనరాంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా? విశ్వ.
తా||
ఒక దుర్మార్గుని మరియొక దుర్మార్గుడు మెచ్చుకొనును. అజ్ఞాని పరమలుబ్ధు(లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.)ని మెచ్చు కొనును. పంది బురదనే మెచ్చుగాని పన్నీటి(పన్నీరు - చల్లనినీరు, సం.పన్నీరమ్)ని మెచ్చదు. 

చెర, చెఱ - 1.కారాగృహము 2.నిర్బంధము, సం.చారః.

గ్రాహి - వెలగ, విణ.1.గ్రహించునది, 2.మలబంధనము కలిగించునది.
వెలఁగ - కపిత్థము.
కపిత్థము - వెలగచెట్టు.

మాతంగీ మత్తమాతంగీ మహాదేవప్రియా సదా,
దైత్యహన్త్రీచ వారాహీ సర్వశాస్త్రమయీ శుభా. - శ్రీ భువనేశ్వర్యష్టోత్రమ్

కాళరాత్రిః ప్రహరణా కళాధారా నిరంజనా,
వరారోహా చ వాగ్దేవీ వారాహీ వారిజాసనా. - శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రమ్

6. ఇంద్రాణి : ఇంద్రుని భార్య, శచీదేవి. దేవలోకము(స్వర్గము) నందు దేవీస్థానం ఇంద్రాణి.

Indrani (indraani) from Indra, having thousand eyes, with diamond sword (vajraayudha) and seated on Iravata, the white elephant.

పులోమజ - శచీదేవి, వ్యు.పులోముని కూతురు.
పౌలోమి -
శచీదేవి.
ఇంద్రాణీ - ఇంద్రుని భార్య, శచీదేవి.

పులోమజా శ చీంద్రాణీ :
పులోమ్నో మునేర్జాతా పులోమజా - పులోముఁడను ముని వలనఁ బుట్టినది.
పురాణి లోమాని యస్య పులోమా. తస్మా జ్జాతేతివా - విస్తారమైన రోమములు గలవాఁడు పులోముఁడు. అతని కూఁతురు. జనీ ప్రాదుర్భావే.
శచతి హంసవద్గచ్ఛతీతి శచీ - హంసవలె నడచునది. శచి శ్వచి గతౌ.
ఇంద్రస్య పత్నీ ఇంద్రాణీ. ఈ-సీ. - ఇంద్రుని భార్య. ఈ మూడు 3 శచీదేవి పేర్లు. 

సురతాణి - 1.ఇంద్రుడు, 2.ఇంద్రాణి, సం. సురత్రాణః.
ఇంద్రుఁడు -
1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా. రాజేంద్రుడు.

శచీధవుని(ధవుఁడు - 1.పెనిమిటి, 2.రాజు.) గర్వహృదయునిగా జేసిన దాశరథీ...  

మాతలి - ఇంద్రుని సారథి. 

ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రునిభార్య, 4.జ్యేష్ఠా నక్షత్రము, 5.తూర్పు.
ఐంద్రుడు -
ఇంద్రపుత్రుడు వి.1జయంతుడు, 2.అర్జునుడు, 3.వాలి.
జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
భీముడు : పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.

పాకశాశని - 1.అర్జునుడు, 2.జయంతుడు, వ్యు.పాకశాసనుని కొడుకు.
పాకశాసనుఁడు -
ఇంద్రుడు, వ్యు.పాకుడను రాక్షసుని పరిమార్చిన వాడు.         

సన్నుతకార్యదక్షుఁ డొకచాయ, నిజప్రభప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు, సత్త్వసం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణముకావడె యేకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపునరూపడగించి, భాస్కరా.
తా.
పూర్వము పాండవు లజ్ఞాతవాసము చేయునప్పుడు ఏకచక్ర పురమగు గ్రామములో బ్రాహ్మణ వేషధారులై యున్నప్పుడు, ఆ పుర మందు భీముడు బకాసురుడను రాక్షసుని జంపి, ఆ గ్రామవాసుల(ద్విజుఁడు -1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.)యాదరమునకు పాత్రుడయ్యెను. సజ్జనుడగువాడు తనకు విభవము కోరవోయిననూ గుణశక్తితో లోకులకు మేలుచేసి కీర్తిని పొందును.

అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
అర్జునుఁడు : పాండవ మధ్యముడు, యుద్ధరంగమున అపజయము ఎరుగనివాడు. రెండు చేతులతో యుద్ధము చేయువాడు, నరోత్తముడు.

ఫల్గునుఁడు - అర్జునుడు; పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
గెలుపు పేరుగలఁవాడు -
పార్థుడు, అర్జునుడు, విజయు డను పేరు గలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణుద్వారపాలకులలో నొకడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి(కపి - కోతి)చిహ్నము ధ్వజమందు కలవాడు.
కిరీటి - 1.అర్జునుడు, వ్యు.ఇంద్రదత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి.
క్రీడి - అర్జునుడు, సం.కిరీటి. 
శ్వేతవాహనుఁడు - 1.చంద్రుడు, 2.అర్జునుడు. 
బీభత్సుఁడు - అర్జునుడు, వివచ్చుడు, విణ.వికారము గలవాడు.
వివచ్ఛుఁడు - అర్జునుడు, సం.బీభత్సః.
ధనంజయుఁడు - 1.అగ్ని, 2.అర్జునుడు. 

గుడాకేశుడు - 1.అర్జునుడు, 2.శివుడు, వ్యు.జెముడువలె గుబురుగా పెరిగిన జుట్టు కలవాడు.
నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.
బృహన్నల - అజ్ఞాతవాసము నందలి అర్జునుని పేరు.

కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 -
1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).

జిష్ణువు -1.ఇంద్రుడు, 2.అర్జునుడు, విణ.జయశీలుడు, రూ.జిష్ణుడు.
జిత్వరుఁడు
- జయశీలుడు.

భుజబలశౌర్యవంతులగు పుత్రులఁగాంచిన వారికెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కముచేకురు కుంతిదేవికిన్
విజయబలాఢ్యునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమునుదెచ్చి తల్లివ్రతకార్యముఁదీర్పడె తొల్లి భాస్కరా.
తా.
కుంతీదేవికి వీరుడును, పరాక్రమ వంతుడును యగు (న)అర్జునుడు కుమారుడగుట చేతనే తల్లివ్రతమును సఫలము చేయుటకు ఐరావతము ను సైతము తీసికొని వచ్చి ఆ పనిని నెరవేర్చెను. పరాక్రమవంతులగు పుత్రులనుగన్న తల్లితండ్రులకు కావలసిన కోర్కెలన్నియు సమకూరును గదా.

నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.
మనుష్యుఁడు -
మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ(ఆడుది), 4.భటుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మర్త్యుఁడు - మనుష్యుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
మనువులు - స్వాయంభువుడు (స్మృతి కర్త.) స్వారోచిషుడు, ఉత్తముడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు (పదు నాల్గురు).
స్వయంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మదనుడు.
వైవస్వతుఁడు - 1.యముడు, శని Saturn.
కృతకము - మనుష్యులచే చేయబడునది, కృత్రిమము.
కృత్రిమము - మనుష్యులచే చేయబడినది, (భౌతి. రసా,) ప్రకృతిలో దొరకునదికాక మానవునిచే నిర్మితమైనది (Artificial).

అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణోత్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||
తా.
సహజముగా బ్రాహ్మణులకుఁ(విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రత(సాధ్వి - పతివ్రత)లకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము    

గాండీవము - అర్జునుని విల్లు, రూ.గాండీవము.
గాండీవి - అర్జునుడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపిచిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.

కపిధ్వజస్య గాణ్డీవ గాణ్డివౌ పుంనపుంసకౌ,
గాండీకృతం అశ్లక్షీ కృతం పర్వస్థాన మస్యేతి గాండీవః, గాండివశ్చ. ప్న. - నునుపుగాఁ జేయఁబడని గణుపులు గలది. ఈ ఒకటి అర్జునుని వింటి పేరు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).

భూరిబలాఢ్యుడైనఁ దలపోయగ విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవుగా దతడొక్కడె మోసపోవుగా
వీరవరేణ్య డర్జునుడు వింటికి నే నధికుండనంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగనోపడు కృష్ణుడులేమి, భాస్కరా.
తా.
అర్జునుడు జగదేక వీరుఁడనని గర్వించి, తానే తన గాండీవమునకు దగినవాడనని తలంచుచు శ్రీకృష్ణ నిర్యాణానంతరము ఆ విల్లు నెక్కుపెట్టుట కైనను చాలని వాడాయెను. అట్లే మనుష్యుడు(మనుష్యుడు - మానిసి, మానవుడు.)తనకు భుజబల మున్నదని గర్వించి, తానే గొప్పవాడనని చెప్పుకొనరాదు. అట్లగునేమి నొకప్పుడు మోసపోవును.

శచీదేవి, ద్రుపదుని ఇంట యజ్ఞకుండంలో పుట్టిన ద్రౌపది. పాండవులందరూ ఇంద్ర తేజంలో భాగాలు.

స్వారాట్టు - ఇంద్రుడు. శచ్యాః పతి శ్శ్చీపతిః - శచీదేవికి భర్త.

పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రుపురముల నాశమొనర్చువాడు.
పురంధ్రి -
కుటుంబిని, స్త్రీ.
పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.

వృషాకపాయి - 1.లక్ష్మి, 2.పార్వతి, 3.శచి, 4.స్వాహా.
వృషాకపి -
1.విష్ణువు, 2.శివుడు, 3.అగ్ని.

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
స్వాహా - అగ్నిభార్య.  

అమరావతి - 1.ఇంద్రుని పట్టణము, 2.స్వర్గము, 3.గుంటూరుజిల్లాలోని ప్రాచీన పట్టణము.
వైజయంతము -
ఇంద్రుని నగరు. అమరావతిలో బాలచాముండిక.
స్వారాజ్యము -
స్వర్గలోకపు దొరతనము.

మించి యమరావతిని నివసించినట్టి
చండికాదేవి నీ తోడు నండయౌనె
యామె యే నీవొ, నీవె యా యామె యేమొ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ! 

జ్యేష్ఠ - 1.ఒక నక్షత్రము, 2.పెద్దమ్మ.
పెద్దమ్మ -
1.జ్యేష్ఠాదేవి, 2.పెద్దతల్లి.
మూదేవి - (వ్యవ.) పెద్దమ్మ. 
జెష్ఠ - 1.దారిద్ర్యదేవత, 2.పెద్దమ్మ, సం.జ్యేష్ఠా.

భ్రష్టున కర్ధవంతులగు బాంధవు లెందఱుగల్గినన్, నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపగలేరు సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి
జ్యేష్ఠ కదేటికిం గలుగ జేయదు తోడనెబుట్టి, భాస్కరా.
తా.
అందరకును భాగ్యమిచ్చు లక్ష్మి తన తోబుట్టువైన జ్యేష్ఠాదేవికి సంపద నీయజాలక పోయెను. అట్లే పనికిమాలిన వానికి భాగ్యవంతులగు చుట్టము లెందరున్నను అతని (క)అదృష్ఠరేఖ లేనిచో బీదవాడై యుండును.   

కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా,
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ.

అక్క1 - 1.తనకంటె పెద్దది అగు తోడబుట్టువు, జేష్ఠభగిని, అప్ప, 2.పూజ్య స్త్రీ, 3.వంటలక్క.
అక - అక్క, పూజ్యస్త్రీ.
ఆయక - (ఆ+అక) 1.ఆపూజ్యస్త్రీ, 2.అకె, ఆ యక్క.
ఆకె - ఆమె(ఆమె - స్త్రీ), ఆయమ.
ఆయమ - (ఆ+ఆమె) ఆమె, ఆపె, ఆకె.
ఆపె - ఆమె, రూ.ఆకె.
ఆబిడ - (ఆ+బిడ్ద) ఆపె, రూ.అబిడె.
అంతిక - 1.అక్క, 2.పొయ్యి, 3.(వృక్ష). సాతల మనెడు ఓషధి. 
అవంతి - 1.ఉజ్జయిని, 2.అక్క. ఉజ్జయిన్యాం మహంకాళీ శతిపీఠం |

అక్క2 - తల్లి.
తల్లి -
జనని, రూ.తల్లి, విణ.మొదటిది, సం.వి. జవరాలు, తరుణి.
జనని - 1.తల్లి, 2.దయ, కనికరము, 3.లక్క, 4.కొరిక.
రక్ష - 1.రక్షణము, 2.లక్క(క్షతఘ్నము - లక్క).
అలక్తము - లక్క, లత్తుక. లత్తుక - లక్క, సం.లాక్షా.

వంటలక్క - వంటకత్తె; పాచకి - వంటలక్క.
అడచాల -
1.వంటవాడు, 2.వంటలక్క.
వంటరి - (వంట+అరి) వంటవాడు, వంటలక్క.

అత్తా మాతా సైవ అత్తికా. - తల్లియే అత్తిక యనఁబడును. పా. అన్తికా 'అత్తికా చాన్తికా తథా'ఇతి ద్విరూపకోశాత్. ఈ ఒకటి అక్క పేరు. 

సై - సహ, తోడ, రూ.సయి, సం.సహ.
తోడ -
తృతీయావిభక్తి ప్రత్యయము, రూ.తోడుక, అవ్య. కూడ, వెంబడి.
తోడఁబుట్టు - 1.సోదరుడు, సోదరి, రూ.తోడబుట్టువు.
తోడ(ౘ)చూలు - తోబుట్టువు; సైదోఁడు - తోబుట్టువు.
సోదరి - తోడపుట్టినది; స్వస - తోడపుట్టునామె.
సోదరుఁడు - తోడపుట్టినవాడు; సోదర్యుఁడు - సోదరుడు. 
సహ - భూమి.   

ఆఁడుతోడు - సోదరి, తోడబుట్టువు.
భగిని -
సహోదరి; సహోదరి - తోడబుట్టినది; సహజ - తోడబుట్టినది.
స్వస - తోడబుట్టునామె.

భగినీ స్వసా,
భగః కల్యాణం శ్రేయః వివాహే అస్యా ఇతి భగినీ - వివాహ మందిలి శ్రేయస్సు గలది.
సుష్ఠు అస్య సోద రాయాసమితి స్వసా. ఋ. సీ. అసు క్షేపణే. - సోదరుని (యా)ఆయాసమును బోఁగొట్టునది. ఈ రెండు తోడఁ బుట్టిన స్త్రీ పేర్లు.

అప్ప - అప1.
అప1 -
  అవ్య. సమాసపూర్వ పదముగా నుండి క్రింది అర్థముల నిచ్చును, 1.విపరీతము ఎక్ష్త్రెమె, ఉదా.అపకీర్తి (అపప్రధ – చెడ్డపేరు; అపకీర్తి - చెడుపేరు, దుర్యశము. అపకీర్తి కలిగిన మరణము పనిలేదు.) 2.అపగతము(అపగతము - పోయినది), ఉదా.అపక్రమము = క్రమము తప్పినది, క్రమములేనిది, 3.చెడ్దది, ఉదా.అపక్రమము = చెడ్డపని.
అప2 - 1.తల్లి, 2.తండ్రి, 3.అక్క, రూ.అప్ప.
అయ్య - తండ్రి, విణ.పూజ్యుడు, రూ.అయ, సం.ఆర్యః.
అయ - 1.తండ్రి, 2.పూజ్యతను తెలుపు పదము, 3.పురుషనామము లకు అనుప్రయుక్తము, రూ.అయ్య, సం.ఆర్యః.
ఆర్య - 1.పదునారెండ్ల కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద.) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట.) నటుడు భార్యను పిల్చునపుడు వాడెది మాట.  

అవ్వ - అవ1.
అవ1 -
1.తల్లి తల్లి, 2.తండ్రి తల్లి, 3.తల్లి, 4.పూజ్యస్త్రీ, 5.వృద్ధురాలు, రూ.అవ్వ.
అవ2 - ఇది సమాసపూర్వపదమై క్రింది అర్థముల తెలుపును, 1.వంగినది, ఉదా. అవాగ్రము = వంగిన అగ్రముకలది, 2.విరుద్ధము, ఉదా.అవమానము(అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము), 3.అనాదరమును సూచించునది, ఉదా.అవకర్ణనము = అనాదరముతో వినుట.
మాతామహి - తల్లి తల్లి, అమ్మమ్మ.  
పితామహి - తండ్రితల్లి.  

అప్పం దన తల్లిగ మే
లొప్పం గని జరుపవలయు * నుర్వీస్థలిఁ జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడఁతియు మాతృతుల్య * యండ్రు కుమారా!
తా.
తోడఁబుట్టిన అక్కచెల్లెండ్రను గౌరముగాఁజూచి సంతోషించునట్లు వారికి క్షేమము కలుగ చేయవలెను. బాల్యమునఁ జనుపాలనిచ్చి పెంచిన స్త్రీని కూడ తల్లితో సమానురాలని మర్యాద చేయవలెనని పెద్దలు చెప్పుదురు.

తాయి - తల్లి.
తాయెత్తు - తల్లి బిడ్దలకు కట్టు రక్షాబంధనము, రూ.తాయెత్తు.

అక్క2 - తల్లి.
అమ -
1.తల్లి, 2.పూజ్యురాలు, రూ.అమ్మ, సం.అంబా.
అమ్మ - 1.తల్లి, 2.పూజ్యురాలు, సం.అంబా. అవ్య. ఆశ్చర్యాది వాచకము, ఔర.
అంబ - 1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.
అమ్లము - 1.పులుపు, 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ, 3.పులిసిన పెరుగు, 4.పులిచింత, 5.దబ్బ.
అంబరీషము - 1.యుద్దము, 2.మంగలము, 3.పశ్చాత్తాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అంబిష్ట - (వృక్ష.) 1.అడవి మొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి. 
భ్రమరాంబ - అంబ, పార్వతి. భ్రామరి - పార్వతి. శ్రీశైలే భ్రమరాంబికా|  

అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.

అంబిక - 1.తల్లి, 2.మేనత్త, 3.పార్వతి, 4.దృతరాష్ట్రుని తల్లి.
అమ్మిక -
పార్వతి, దుర్గ, సం.అంబికా. సంతానము నందు దేవీస్థానం అంబిక.
ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.

సత్యం మాతాపితా జ్ఞానం ధర్మోభ్రాతా దయాసఖా|
శాంతిఃపత్నీ క్షమాపుత్ర ష్షడైతే మమభాంధవాః||
తా.
సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము తోఁడబుట్టినవాఁడు, దయ స్నేహితుఁడు, శాంతి భార్య, క్షమ కుమారుఁడు, ఈ యాఱును నాకు బాంధవులని ధర్మరాజు (ధర్మరాజు - 1.యుధిష్ఠిరుడు, 2.యముడు, 3.బుద్ధదేవుడు) చెప్పెను. – నీతిశాస్త్రము

అత్త - 1.భర్తతల్లి, 2.భార్యతల్లి, 3.తండ్రికి సోదరి, 4.మేనమామ భార్య.
మాతుల -
మేనమామ భార్య, రూ.మాతులి, మాతులాని.
మాతులాని - మాతుల.
మామ - 1.తల్లిసోదరుడు, మేనమామ, 2.ఆలుమగల తండ్రి, శ్వశురుడు, 3.తండ్రి తోబుట్టువుభర్త, సం.మామకః.
శ్వశురుఁడు - మామగారు; శ్వశ్రువు - అత్తగారు.
శ్వశురులు - అత్తమామలు.

అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా… కోడలు లేని అత్త గుణవంతురాలు.....

శ్వశ్రూభిక్షా న్యాయము - కోడలు లేదనినదాని కడ్డుతగిలి అత్త స్వతంత్రురాలై తానులేదనిన రీతి.  

పూర్వ - తూర్పు; ప్రాచి - తూర్పు.
తూరుపు -
సూర్యుడుదయించు దిక్కు, ప్రాగ్దిశ, రూ.తూర్పు.
తూరుపుఁఱేడు - ఇంద్రుడు.
ప్రాచీనబర్హి - ఇంద్రుడు.

పూర్వత్వాత్పూర్వా - మొదటిదిక్కు.
ప్రాక్ ప్రాచ్యం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.
ప్రాక్ ప్రథమం అంచత్యస్యాం రవి రితి ప్రాచీ. ఈ-సీ. - ప్రథమమున సూర్యుఁడు ఈదిక్కున బొడమును గనుక ప్రాచి.

నేక్షేతోత్యంత మాదిత్యం నాస్తంయాతం కదాచన,
ప్రతిబింబం సదారిస్థం సమధ్యం నభసోగతం|
తా.
సూర్యు డుదయించుచున్నప్పుడు, అస్తమయ మగుచున్నపుడు, ఆకాశమధ్యంబును బొందియున్నపుడు ప్రతిసూర్యుడు, (అనఁగా ఉదక మందలి సూర్య ప్రతిబింబమును) జూడగూడదు. - నీతిశాస్త్రము

సూర్యుడు తూర్పు దిక్కున మాత్రమే ఉదయిస్తాడు. సూర్యుని ఎవరు – ఉదయించ మన్నారు?

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
హరివాసరము - ఏకాదశి(వాసరము - దినము). 

కులిశము - వజ్రాయుధము, వ్యు.కొండల రెక్కలను ఛేదించునది.
శతకోటి -
వజ్రాయుధము.
శతాపము - వజ్రాయుధము.
శతమ్రాడ - 1.మెరుపు, 2.వజ్రాయుధము.

హ్రాదిని - 1.వజ్రాయుధము, 2.ఏరు, 3.మెరుపు.

ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రుని ఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.

మువ్వన్నెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు -
(భౌతి.) సూర్య కిరణములు(మువ్వన్నెకాఁడు - సూర్యుడు) నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow).
శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.
శక్తుడు - శక్తికలవాడు. (ౘ)చాలువాఁడు - శక్తుడు.  

ఇంద్రాయుధం శక్రధనుః -
ఇంద్రస్య ఆయుధం ఇంద్రాయుధం. - ఇంద్రుని యాయుధము.
శక్రస్య ధనుః శక్రధనుః. స-న. - శక్రుని ధనుస్సు. శక్రుడు - ఇంద్రుడు, వ్యు. దుష్ట జయమందు శక్తుడు.
మేఘప్రతి ఫలిత నానావఋనస్య ధానురాకారేన దృశ్యమానస్య సూర్యరశ్మే ర్నామనీ - ఇది మేఘము నందు బ్రతిఫలించి, నానావర్ణమై ధనురాకారముగా నగపడుచున్న సూర్యరశ్మి. ఈ రెండు ఇంద్రుని ధనుస్సు పేర్లు. 

గతై ర్మాణిక్యత్వం - గగనమణిభి స్సాంద్రఘటితం
కిరీటం తే హైమం - హిమగిరి సుతే! కీర్తయతి యః, |
స నీడేయచ్ఛాయా - చ్ఛురణ (పటలం) శబలం చంద్రశకలం
ధనుః శ్శౌనాసీరం - కిమతి న నిబధ్నాతి ధిషణామ్. - 42శ్లో
తా.
ఓ హైమవతీ ! ఆకాశంలో వెలుగొందుతున్న ద్వాదశాదిత్యులనే మాణిక్యాలచే(సూర్యకాంతమణులు) చక్కగా కూర్చబడినదైన(పొదిగిన) నీ బంగారు కిరీటమును - ఎవడు కీర్తించుచున్నాడో(వర్ణిస్తున్నాడో) - ఆ కవీంద్రుడు - గోళాకారమైన ఆ కిరీటమునందు కుదుళ్ళయందు బిగింప బడిన(ద్వాదశాదిత్యులను) మణులయొక్క కాంతులతో కలియుటచేత చిత్ర చిత్ర వర్ణములు గల చంద్రరేఖ(నీ పాపట బొట్టుగానున్న చంద్రరేఖను) కాంచి అదినిజంగా ఇంద్రధనుస్సే అయివుంటుందని ఎందుకు(తన చిత్తము నందు) స్థిరముగా భావించడు? (చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి ఇంద్రధనుస్సే అని నిశ్చయబుద్ధి కల్పించు కొనుచున్నాడని భావము.) - సౌందర్యలహరి

ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు (నాల్గు దంతములు కలది), 2.అమృతము. (ౘ)చౌదంతి - చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము.
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.

ఇరా ఆప అస్మిన్ సంతీతి ఇరావాన్ సముద్రః. తస్మిన్ జాతః ఐరావతః - సముద్రమునందుఁ బుట్టినది.

పుంనాగే పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః,
పున్నాగ ఇవ పున్నాగః - పురుష శ్రేష్ఠునివలె పూజ్యమైనది.
పురుషవ దున్నతత్వాత్పురుషః తుంగశ్చ - పురుషునివలె ఉన్నతమైనది పురుషము, తుంగమును,
ప్రశస్తాః కేశరాస్సంత్యస్య కేసరః - మంచి ఆకరవులు గలది.
దేవానాం వల్లభః - దేవతలకు ప్రియమైనది. ఈ నాలుగు 4 సురపొన్న పేర్లు.

ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
అభ్రమువు -
తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య. 
యమపత్ని - ఐరావతి. 

ఐరావతీ సుధా దీక్షా రుద్రాణ్యో రుద్ర తే స్త్రియః ||

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలివెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదు పదార్థము, 7.బంగారు, 8.పాదరసము(Mercury), 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము. 

పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం - పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.

ఎట్లుగఁ బాటుపడ్డనొకయించుక ప్రాప్తములేకవస్తువుల్
పట్టుపడంగనేరవు నిబద్ధి, సురావళిఁ గూడి రాక్షసుల్
గటుపెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించిరెంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు, భాస్కరా.
తా.
రాక్షసులు దేవతలతో కలిసి మందరపర్వతమును పెకలించు దానిని తీసుకొనివచ్చి కవ్వముగా నుపయోగించి, పాలసముద్రము మదించిరి. తుదకు అమృత మందు జనితమయ్యెను. కాని ప్రయాసపడిన రక్కసులు దానిని తామనుభవింపలేకపోయిరి. కావున యెవరెంత కష్టపడినను, వారికి అదృష్టములేనిచో తామాశించు ఫలమును పొందలేరు. 

పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను -
1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను. 
సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు; అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధుసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.

సుధా మప్యాస్వాద్య - ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యన్తే విశ్వే - విధి శత మఖ్యాద్యా దివిషదః, |
కరాళం యత్ క్ష్వేళం - కబళితవతః కాలకలనా
న శమ్భో స్తమ్మూలం - తవ జనని! తాటంకమహిమా || - 28శ్లో
 
తా. ఓ తల్లీ ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలు భయంకరమైన జరామృత్యువులను(వార్ధక్యమును మరణమును) హరించే అమృతము త్రావియు నాపద లందుచున్నారు(అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు). అతిభయంకరమై లోకాలను దహించే(భయంకరమగు) కాలకూటమును మహావిషాన్ని మ్రింగిన శివునకు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.) మరణ భయము లేదు. ఇందులకు కారణము నీ చెవికమ్మల(తాటంకము - చెవికమ్మ) ప్రభావమే కదా! (నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము). - సౌందర్యలహరి 

ఇంద్రజిత్తు - మేఘనాథుడు, రావణుని కొడుకు, వ్యు.ఇంద్రుని జయించినవాడు.
మేఘనాథుఁడు -
రావణుని కొడుకు.

7. చాముండి : ప్రకృతి ముఖము నుంచి రూపొందిన దేవత. ఈమే చండీ రూపంలో సమస్తానీ(సమస్తము - సర్వము) నశింప చేస్తుంది. అసురలను అంతం చేయడానికి ‘చాముండా’ రూపాన్ని ధరించి లోకాలకు మేలు చేసిన దేవి.

సర్వదేవస్తుతా సౌమ్యా సురాసుర నమస్కృతా,
రక్తబీజనిహంత్రీ చ చాముండా ముండకాంబికా.

చండి - 1. పార్వతి,  2.కోపముగల స్త్రీ,  3.స్త్రీ, ఆడుది,  రూ.చండిక.
చండి - చండి, పార్వతి (అమర కంటకము నందు దేవీస్థానం చండిక)   విణ. 1.మూర్ఖపుట్టు గలవాడు, 2.క్రూరుడు(క్రూరుడు – దయలేనివాడు).

మూర్ఖము - మౌర్ఖ్యము గలది.
ముదిగారము - మౌర్ఖ్యము; మౌర్ఖ్యము - మూర్ఖత్వము.
మొప్పె - 1.మూర్ఖుడు, 2.కరకు. పెడసగము - మౌర్ఖ్యము, మూఢత్వము.

పెంకితనము - చెప్పినమాట వినకుండుట, మూర్ఖత.
వైధేయుఁడు - మూర్ఖుడు.
యథాజాతుఁడు - 1.మూర్ఖుడు, 2.జ్ఞానము లేనివాడు.

స్వగృహే పూజ్యతేమూర్ఖః, స్వగ్రామే పూజ్యతేప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్రపూజ్యతే||
తా.
మూర్ఖుడు తన యింటియందును, ప్రభువు స్వగ్రామందును, రాజు తన రాజ్యమందును గొనియాడబడును. విద్వాంసుఁడు సకల దేశముల యందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము 

చండికా చండ రూపేశా చాముండా చక్రధారిణీ
త్రైలోక్య జననీ దేవీ త్రైలోక్య విజయోత్తమా.

కుమారా! నీకు ముందుండి పరదేవత పాలించు గాక| వెనుక పార్వతీదేవి వుండి కాపాడు గాక| విషమ మార్గము నందు వారాహి, దుర్గములందు దుర్గ, భయంకర రణమందు భద్రకాళి, స్వయంవరము నందు మాతంగి, రాజుల నడుమ భవాని, కొండ కోనల యందు కొండలరేని కూతురు పార్వతిదేవి, చత్వరముల యందు చాముండ, వివాదము లందు వైష్ణవి, అడవులందు కామేశ్వరి, శత్రు మధ్యమున భైరవి, అంతటా లోకమాత భువనేశ్వరి నిన్ను కాపాడుదురు గాక| - దేవీభాగవతము

చాముండికాంబా శ్రీకంఠః పార్వతీ పరమేశ్వరః,
మహారాజ్ఞీ మహాదేవ స్సదారాధ్యా సదాశివః.

బ్రాహ్మీ, మహేశ్వరీ, వైష్ణవి, వారాహీ వందితాయై |చాముండీ మహాలక్ష్మీ, ఇంద్రాణీ పరిపూతాయై, షట్క్యోణ యంత్ర ప్రకారిణ్యై నమః.

386944_453545551344045_1520160728_n