నీటితాత - వాయువు, (గాలి నుండి అగ్ని దీని నుండి నీరు పుట్టుటచే నీటికి తాత.)
శ్వసనః స్పర్శనో వాయు ర్మాత రిశ్వా సదాగతిః,
పృషదస్వో గంధవాహో గంధవాహాని లాశుగాః,
సమీర మారుత మరు జ్జగత్ప్రాణ ప్రభంజనాః,
(ప్రకంపన శ్చాతిబలో ఝుంఝూవాత స్సవృష్ణికః.)
శ్వసనము - శ్వాసము, వాయువు.
శ్వసితము - శ్వాసము.
అంతఃశ్వసనము - (జీవ.) ప్రాణవాయువును లోపలికి పీల్చుకొను క్రియ (Inspiration).
హీమోగ్లోబిన్ - (Haemoglobin) ప్రాణవాయువును గ్రహించి తీసికొని పోవు రక్తమునందలి ఎఱ్ఱనిపదార్థము.
ఆక్సీహీమోగ్లోబిన్ - (జం.) (Oxi-haemoglibin) హీమో గ్లోబిన్ ప్రాణవాయువుతో కలిసి ఏర్పడిన సమ్మిళిత ద్రవ్యము.
శ్వశన నియంత్రిక నాడిముడి - పుఱ్ఱెనుండి బయటికి వచ్చిన తరువాత ప్రాణేశనాడిపై నగుపడు ముడి, (Vagus ganglion).
శ్వాసము - 1.వూపిరి, 2.ఉబ్బసము, 3.వాయువు.
ఊపిరి - శ్వాసము, ఊర్పు.
ఊరుపు1 - ఊపిరి, శ్వాసము, రూ.ఊర్పు, సం.ఊర్జః.
ఊరుపు2 - ఒకవిధముగా వండినకూర, ఒకరకపు వ్యంజనము, రూ.ఊర్పు.
క్షయరోగము - ఊపిరితిత్తులరోగము, క్షయవయాధి, (Tuberculosis).
క్షయము - 1.క్షయవ్యాధి, 2.తగ్గుదల, 3.ప్రళయము, 4.క్షయనామ సంవత్సరము.
ఊర్జము - 1.కార్తికమాసము, 2.పూనిక, 3.ఉత్సాహము, 4.ఊపిరి వెలుపలికి విడుచుట విణ.బలము గలది.
పూనిక - 1.యత్నము, 2.సన్నాహము, 3.పట్టుదల.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
పట్టుదల - వదలనిపట్లు, చలము.
ఊర్జితము - ధృడము చేవగలది, వి.1.బలము, 2.ఉత్సాహము.
ఊర్జస్వలుఁడు - 1.మిక్కిలిబలము గలవాడు, 2.మిక్కిలి ఉత్సాహము కలవాడు, 3.గొప్పవాడు. అధికుఁడు - గొప్పవాడు.
ఊర్జస్వి - మిక్కిలి బలవంతుడు, వి.ఒక అర్థాలంకారము.
ఉత్సహించు - 1.యత్నించు, 2.ఉత్సాహపడు, రూ.ఉత్సాహించు.
ఉత్సాహించు - ఉత్సహించు.
ఉత్సాహకుఁడు - 1.ఇష్టకార్యసిద్ధికై ప్రయత్నించువాడు, 2.ఇష్టవస్తు ప్రాప్తికై తహతహపడువాడు.
బాహులము - 1.బాహుత్రాణము, 2.కార్తీక మాసము.
బాహులేయుడు - కుమారస్వామి.
కార్తికేయుఁడు - కుమారస్వామి, వ్యు.కృత్తికల కుమారుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
ఆశ్వాసము - 1.గ్రంథభాగము, 2.ఊరడించుట, 3.బతిమాలుట.
ప్రకరణము - 1.ప్రస్తావము, 2.గ్రంథభాగము, 3.ఒక తెగ రూపకము.
కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణము నందు షట్కాండములు గలవు), 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము. కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.
ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశ్శక్తిః పరాక్రమమః|
షడై తే యత్రతిష్టంతి తత్ర దేవోపి తిష్టతి||
తా. సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము; ఈ యారు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. - నీతిశాస్త్రము
ఆనము - ఊపిరి వెలికిబుచ్చుట, ఉచ్ఛ్వాసము.
ఉచ్ఛ్వాసము - 1.ఊపిరి వెలికి వచ్చుట, 2.నిటూర్పు, 3.ఊరట, 4.గ్రంథభాగము.
ఊర్పోవు - (ఊర్పు + పోవు) ఊపిరివిడుచు.
నిశ్వాసము - నిటూర్పు.
నిశ్వసించు - నిటూర్చు, నిశ్వాసించు.
నిశ్వసనము - నిటూర్చుట.
నిట్టూరుపు - దీర్ఘనిశ్వాసము.
నిట్టూరుచు - (నిడుద+ఊరుచు) దీర్ఘ నిశ్వాసముచేయు.
ఊఱట - 1.విశ్రాంతి, విరామము, 2.ఊరడించుట, 3.స్వస్థి చిత్తత, విణ.విశ్రాంతి నిచ్చునది.
విశ్రాంతి కొరకు ఆరాటపడి మానవులు అలసిపోతూ వుంటారు. - లారెన్స్ స్టెరెన్
పూరకము - ఊపిరి నిండించుట, విణ.నించునది.
రేచకము - ఊపిరి విడుచుట.
కుంభకము - ఊపిరి బిగబట్టుట, (ఇది ప్రాణాయామమునకు ఒక అంగము).
ప్రాణాయామము - నాసికాముఖముల యందు, సంచరించెడు వాయువును మంత్ర పూర్వకముగా నిరోధించుట.
శ్వాసత్వక్ కుహరము - (జం.) ధమన మూలములో బృహద్ధమన కుహరము ప్రక్కనున్న అర (Cavum pulmo-cutaneum) ఇది ఎడమ వైపున నుండును.
శ్వాసమండలము - (జం.) ప్రాణవాయువును పీల్చుకొని బొగ్గుపులుసు గాలిని వదలివేయు క్రియలో సంబంధించిన అవయములు, (Respiratory system).
ప్రాణవాయు యుతశ్వసనము - (వృక్ష.) ప్రాణవాయువును తీసికొని బొగ్గుపులుసు గాలిని వదలివేయు శ్వసన క్రియ (Aerobic respiration).
ప్రాణవాయు రహిత శ్వసనము - (వృక్ష.) ప్రాణవాయువును తీసికొనకుండనే బొగ్గుపులుసు గాలిని వదలివేయు శ్వసనక్రియ (Anacrobic respiration).
బహిఃశ్వసనము - (జం.) బొగ్గుపులుసు గాలిని బయటికి వదలివేయు క్రియ (Expiration).
ఉబ్బసము - ఊర్థ్వశ్వాస రోగము, వగరువురోగము, సం.ఉచ్ఛ్వాసః.
ఉబ్బసవు దగ్గు - (గృహ.) ఉబ్బసము, భారమైనదగ్గు, ఊపిరాడకుండ వచ్చు దగ్గు, (Asthma).
శ్వాసకాసము - ఉబ్బసముతోడి దగ్గు.
వగర్చు - శ్వాసరోగము difficulty in breathing.
Dyspncea - శ్వాస కృచ్ఛము, difficulty in breathing.
ఊపిరికుట్టు - ఊపిరి పీల్చునపుడు బాధ కలిగించెడి ఒక వ్యాధి, యౌకము.
యౌకము - ఊపిరికుట్టు. ఊపిరిగొట్టు నొప్పి, Stitching or catching pain. ఉశ్వాసము విడిచినప్పుడు గుండెలలో నొకప్రక్కను పోటుపొడచి నట్లు లేచెడి నొప్పి.
శ్వాసావరోధన - (గృహ.) ఉక్కిరి బిక్కిరియగుట, ఊపిరి యాడకపోవుట, (Suffocation).
ఉడ్డుగుడుచు - ఊపిరి తిరుగక బాధపడు, ఉక్కిరిబిక్కిరి యగు.
ఉక్కిరిబిక్కిరి - ఊపిరాడనిది, వి.ఊపిరాడకుండుట.
శ్వాసనాళము - (జం.) ముఖ కుహరమునుండి ఊపిరితిత్తులలోనికి గాలిని తీసికొనుటకు వదులటకు ఉపయోగించు గొట్టము. (Trachea).
వాయునోత్ర్కమతోత్తారః కఫసంరుద్ద నాడికః|
కాసశ్వాసకృతాయాసః కంఠే ఝురఝురాయతే|
క్షవధువు - 1.కాసరోగము, 2.తుమ్ము, 3.దగ్గు, 4.ఎక్కిలి.
ఉక్కిలి - పొడిదగ్గు, కాసరోగము.
కాసము - దగ్గు(cough).
తుమ్ము - క్షుతముచేయు, వి.క్షుతము.
దగ్గు - కాసముచేయు, కాసము, రూ.డగ్గు.
ఎక్కిలి - దప్పి మొ. నిచే గలుగు బాధ, సం.హిక్కా.
హిక్క - 1.ఎక్కిలి, 2.పైడికంటి యను పక్షి.
పైడిఁకంటి - 1.చిన్నగూబ, 2.కంఠమున పెట్టుకొను బంగారు కంటె. విక్షావము - 1.తుమ్ము, 2.దగ్గు.
కాసము - దగ్గు(cough).
ఉక్కిస - పొడిదగ్గు, కాసరోగము.
కోరింత దగ్గు - కుక్కదగ్గు (Whooping cough), (ఈ దగ్గు సాధారణముగా చిన్న పిల్లలకు వచ్చును).
స్పర్శనము - 1.తాకుడు, 2.ఈవి, 3.వాయువు.
స్పర్శము - 1.తాకుడు, 2.ఈవి, 3.వ్యాధి.
స్పృక్కు - స్పర్శము; స్పృష్టి - తాకుడు.
తాఁకుడు - తాకుట, సోకుడు, స్పర్శ.
సోఁకుడు - 1.స్పర్శము, 2.గ్రహావేశము, 3.పిశాచము, 4.రాక్షసుడు.
సోఁకు - 1.తగులు, 2.గ్రహమావేశించు, వి.1.స్పర్శము, 2.రాక్షసుడు.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడలనుండి కారు మదము, 3.చతురపాయములలో నొకటి, 4.ఛేదనము.
వితరణము - ఈవి; వితరణి - ఈవి; విశ్రాణము - ఈవి, దానము. వరము - కోరిక, వరించుట.
బహుమానము - (గృహ.) కానుక, బహుమానము.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
మోమాటము - 1.దాక్షిణ్యము, కనికరము(అనుక్రోశము - కనికరము), 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.
దాతృత్వం ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞ తా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా. ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిఁగి తెలివిగానుండుట, యీనాలుగు తనతోఁ గూడఁ బుట్టునవియే కాని నేర్చుకొనుటచే గలుగవు. – నీతిశాస్త్రము
వ్యాధి - తెవులు, రోగము; రోగము - వ్యాధి.
తెవులు - తెగులు; తెగులు - వ్యాధి, చీడ, రూ.తెవులు.
తాఁకుడువేఁకి - వరుసజ్వరము, పోవుచు వచ్చుచుండు జ్వరము.
సోఁకుదయ్యము - వాయువు.
మారి1 - 1.మసూరిక, స్ఫోటము, 2.పార్వతి, 3.జనక్షయము, 4.ఒక గ్రామ దేవత.
మారి2 - తాచ్ఛీల్యమునవచ్చు ప్రత్యయము, ఉదా.కొట్లమారి, మొ.నవి.
అంటువ్యాధి - ఒకరినుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిముల వలన లేక స్పర్శవలన) వ్యాపించువ్యాధి, (విషూచి, మశూచి మొ.) (Infectious disease).
మశూచకము - (గృహ.) స్ఫోటకము, అమ్మవారు, (Small-pox) (ఇది అంటు వ్యాధి, నీటి ద్వారా వ్యాపించును.)
అమ్మవారు - 1.స్త్రీ దేవత, గ్రామదేవత, 2.పూజ్యస్త్రీ, 3.స్ఫోటకము, 4.స్ఫోటకాధిష్ఠానదేవత.
మశూచిక - స్ఫోటకము.
విషూచి - (గృహ.) వమన విరేచన వ్యాధి (కలరా).
కలరా - (Cholera) వాంతి భేది. (ఇది నీటి ద్వారా వ్యాపించు ప్రాణాపాయకరమైన జాడ్యము.)
వమనము - డోకు, వమధువు.
వమనేచ్ఛ - (గృహ.) వికారము, వాంతి వచ్చునట్లుండుట (Nausea).
కిసరు - 1.కోపవికారము, 2.అంటు సోకుటచే పసిబిడ్దలకు గలుగు రోగము.
ఆటలమ్మ - (గృహ.) తట్టు, చిన్నమ్మవారు అను ఒక అంటువ్యాధి (Chicken-pox, measles). (ఇది ఎక్కువగ చిన్న పిల్లలకు వచ్చు అంటువ్యాధి).
తట్టు - 1.కలుగు, 2.తోచు, 3.చరచు, హిం.వి. పొట్టిగుఱ్ఱము, వై. వి. దరి, పార్శ్వము.
తట్టమ్మవారు - చర్మముపై ఎఱ్ఱనిమచ్చలు కనిపించు అంటువ్యాధి, పొంగు (Measles).
పొంగు - 1.సంతోషము, 2.సముద్రపుపోటు, 3.ఆటలమ్మ, క్రి.1.సంతోషించు, 2.ఉబ్బు.
పొగరు - 1.గర్వము, 2.పొంగు, 3.మెండు.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలి1 - 1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒకవిధమైన పశువ్యాధి.
గాలి2 - 1.నింద, 2.శాపము.
దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించు కన్య నిచ్చిచేయు వివాహము.
దేవుఁడు - భగవంతుడు.
భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము. విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
దేవత - వేలుపు; వేలుపు - దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నిర్జరుఁడు - వేలుపు.
దైవికము - విణ. దైవము వలన కలిగినది.
అదృష్టం వహ్నితోయాది :
న దృష్టం అదృష్టం దైవకృతత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహ్నితోయాది - అగ్ని జలాదులవలన బుట్టిన భయము.
అదిశబ్దము చేత వ్యాధి, దుర్భిక్ష, మూషిక, శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.
జియ్య - 1.దేవుడు, 2.రాజు, సం.ఆచార్యః.
జియ్యరు - వైష్ణవ సన్న్యాసి, సం.ఆచార్యః.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
పసి - 1.పశ్వాదుల మీదగాలి, 1.పువ్వుల మీదిగాలి, విణ.లేత. వై.వి. గోగణము గోవులు, సం. పశుః.
హిస్టీరియా - (గృహ.) (Hysteria) సూతికా(సూతిక - బాలెంతరాలు) వాయువుమనో వికారముచే అన్ని విధములైన నాడులు, అక్రమముగా పనిచేయుటచే కలుగు వికారపు చేష్టలు, (ఇవి సాధారణము గా బలహీనము చేతను ఆశాభంగము చేతను యువతులకు వచ్చు వ్యాధి.)
గంగవెఱ్ఱి - 1.విశేషమైన మైమరుపుచే ఏమియు తోపకయుండు స్థితి, 2.పశువులకు వచ్చు ఒక విధమైన నరముల జబ్బు.
వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.
కోరవాయువు - వాతరోగము.
వాతరోగము - (గృహ.) వాతము చేత నేర్పడు రోగము, (సాధారణముగ ఈ నొప్పులు శరీరము నందు కీళ్ళవద్ద, Joints వద్ద ఏర్పడును),(Rheumatism).
సంధివాతము - (గృహ.) సంధుల వాపులు, నొప్పులు దీర్ఘవ్యాప్తమగు కీళ్ళనొప్పులు, (Rheumatism).
ధనుర్వాతము - (గృహ.) ఇది అంటు వ్యాధి సంబంధమైన జబ్బు, 'టిటానస్ ' (Tetanus), అనెడి విషక్రిముల (poisonous insects) వలన ఈ వ్యాధి కలుగును. ఇది ప్రాణాపాయకరమైన వ్యాధి.
మహావాతము - 1.గాలితో గూడిన పెద్దవాన, 2.పెద్ద వాతరోగము.
వాతూలము - 1.గాలి, 2.సుడిగాలి.
వాత్య - సుడిగాలి.
సుడిగాలి - వాత్య, (భూగో.) మిక్కిలి వేగముతో గుండ్రముగా గిరగిర తిరిగెడు గాలి.
వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
గాలి2 - 1.నింద, 2.శాపము.
ఉపక్రోశము - నింద; నింద - దూరు, అపదూరు.
దూఱు - నిందించు, వి.నింద.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
శాపము - 1.తిట్టు, 2.ఒట్టు.
తిట్టు - 1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
ఒట్టు - 1.కలుగు, 2.ఉంచు, 3.రగుల్చు అంటించు, వి.శపథము.
నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.
ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణమునకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశనము.
ఆక్రోశించు - 1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.
ఆశుగము - 1.బాణము, 2.గాలి, వ్యు.వేగముగ పోవునది, రూ.అశుగామి.
యోగము -1.ప్రాణాయామాదికము, 2.కూడిక(సాంగత్యము - కూడిక), 3.ఔషధము, 4.ప్రయత్నము.
కూడిక - సంయోగము, చేరిక, (Addition).
ఔషధము - 1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు.
ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఓషధీశుఁడు - చంద్రుడు.
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
ఓరు1 - వై.విణ. పెద్ద, సం.ఉరుః.
ఓరు2 - 1.ఎఱ్ఱమట్టి వట్టె, 2.గాలి మొ.ని ధ్వని.
ఓరుగాలి - శబ్దముతో వీచుగాలి, రూ.హోరుగాలి.
మాతరిశ్త్వుఁడు - గాలి, వ్యు.ఆకాశమున వృద్ధినొందువాడు.
సదాగతి - 1.వాయువు, 2.మోక్షము, 3.సూర్యుడు, 4.సర్వేశ్వరుడు.
సదాతనుఁడు - 1.విష్ణువు, 2.శాశ్వతుడు.
సనాతనుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, విణ.శాశ్వతుడు.
సదాశివుఁడు - శివుడు. (సదా - ఎల్లప్పుడు.)
సర్వము నీలోనిదిగా, సర్వాత్ముఁడ,
వాత్మవస్తు సంపన్నుఁడవై
సర్వమయుఁడ వగు నీకును,
సర్వేశ్వర! లేవు లోనుసంధులు వెలియున్.
భా|| సృష్టి అంతా నీలోనే ఉన్నది గనుక సర్వమునకూ ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులతో సర్వమునందు నిండి యున్న నీకు లోపల, బయట, మధ్య ఉండే మార్పులు అనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడవు.
పేరుప్రతిష్ఠలకై పాకులాడేవారు, అన్నీ తామే చేస్తున్నామనే భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సర్వేశ్వరుడే అన్నింటినీ నడిపే కర్త అని వారు గమనించలేక పోతున్నారు. కాని బుద్ధిమంతులయిన వారు, ఆ సర్వేశ్వరుడే అన్నింటికీ కర్త అనీ, అన్నిటినీ నడిపించేవాడనీ భావిస్తారు. - శ్రీరామకృష్ణ పరమహంస
పృషదశ్వుఁడు - వాయువు.
పృషతము - 1.దుప్పి, 2.నీటిబొట్టు, విణ.బ్రహ్మబిందువుతో కూడినది. పృషత్కము - అమ్ము, బాణము.
గంధవాహుఁడు - వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొని పోవువాడు.
గంధము - 1.గర్వము, 2.గంధకము, 3.సంబంధము, 4.చందనాది లేపన ద్రవ్యము, (రసా.) వాసన (Odour).
గంధవహ - ముక్కు, రూ.గంధవాహ.
అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులతో నొకడు.
అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము. అనంత్యనేనేత్యనిలః అన ప్రాణనే - ఇతనిచేత బ్రతుకుదురు.
అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.
సుడి - 1.జలావర్తము, నీటిసుడి(సుడిగుండము) 2.రోమావర్తము, వెండ్రుకలసుడి 3.అనిలావర్తము, గాలిసుడి(వాత రోగము).
అనిలో మృగనాభిరేణుగంధి ర్హరవామాంగకుచో త్తరీయ
హరతే మరణశ్రమం జనానా మథికాశి ప్రణవోపదేశకాలే|
భా|| మనోజ్ఞమైన (మృగనాభి - మృగమదము, కస్తూరి.) కస్తూరికా రేణుగంధిలమై శివుని వామాంగకుచోత్తరీయ సం జనితమైన పిల్లగాడ్పు కాశీపురమందుఁ బ్రణవోపదేశసమయమున దేహుల మరణ శ్రమ మపన యించును. (ఉత్క్రమణ సమయమున దేహునకు శంకరుఁడు(ఉ)మా సమేతుఁడై ప్రణవోపదేశము సేయునని భావము.)
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః.
సమీరుఁడు - వాయువు.
సమ్యక్ ఈరతి గచ్ఛతీతి సమీరః. ఈగతౌ - లెస్సగా సంచరించువాఁడు.
మారుతము - వాయువు.
మరుదేవ మారుతః. వక్ష్యమాణంబగు మరుచ్ఛబ్దమునకుఁ గల యర్థమే మారుత శబ్దమునకును.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.
మరుత్తు - వేలుపు(దేవత-వేలుపు), గాలి.
కుపితేన అనేన మ్రియతే లోక ఇతి మరుత్. అ. పు. మృఙ్ ప్రాణత్యాగే - కుపితుఁడైన యితనిచేత లోకము మృతిఁబొందింపఁబడును.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
జగతాం ప్రాణః జగత్ప్రాణః - జగత్తునకు ప్రాణమైనవాఁడు. జగత్ - ప్రాణః ఇతి భిన్నపదం వా, గచ్ఛతీతి జగత్. త-పు గమ్‌గతౌ - సంచరించువాఁడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి.
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా. విష్ణువుచేత గాని, శివుని(హరుఁడు - శివుడు)చేత గాని, బ్రహ్మచేత గాని, ఇతరమైన దేవతలచేత గాని నొసట వ్రాయబడిన వ్రాత తుడిచివేయ నలవి కాదు (మనుష్యమాత్రుల కాగలదా.) - నీతిశాస్త్రము
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ |
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణ జీవనీ ||
చల - 1.లక్ష్మి, 2.మారుస్వభావము గల వాయువు యొక్క ఆయతనము దానిపై నుండు ఒత్తిడిని బట్టి ఉండును (తాపక్రమము మారనప్పుడు) అందుచే వాయువు యొక్క ఆయతనము ఒక చలము లేదా చలరాశి (Variable).
చరరాశి - (గణి.) అస్థిరరాశి (Variable).
సమీరణుఁడు - 1.వాయువు, 2.బాటసారి, వ్యు.లెస్సగా చరించువాడు.
సమ్యక్ ఈరితం గంతుం శీలమస్య సమీరణః. ఈరగతౌ - లెస్సగా సంచరించు స్వభావము గలవాఁడు.
యాతువు - 1.బాటసారి, 2.యముడు, 3.రాక్షసుడు, 4.వాయువు.
నభస్వంతుఁడు - వాయువు.
నభఃకారణత్వాన్నభో స్యాస్తీతి నభస్వాన్. త-పు. - ఆకాశము ఉత్పత్తి స్థానముగాఁగలవాఁడు.
నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
ప్రభంజనుఁడు - గాలి, వ్యు.వృక్షాదులను బాగుగ విరుచువాడు. మోటనము - 1.బ్రద్దలు చేయుట, 2.గాలి.
కరువలి - గాలి.
కరువలిపట్టి - (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని.
గాడుపు - గాలి, వాయువు, రూ.గాడ్పు.
గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపు సంగవీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
పావని - 1.ఆవు, 2.భీముడు, 2.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.
యోగచరుఁడు - ఆంజనేయుడు.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్.
హనుమంతుఁడు - ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః.
పవనము - 1.గాలి, 2.తూర్పెత్తుట, చెరుగుట.
తూరుపాఱఁబట్టు - పొల్లుగింజలు దూరముగ పోవునట్లు గాలి కెత్తిపోయు, రూ. తూరుపెత్తు, తూర్పెత్తు, తూర్పాఱఁబట్టు.
చెరుగు - ధాన్యమును చేటలో చెరుగు.
పునాతీతి పవనః, పవమానశ్చ, పూఞ్ పవనే - పవిత్రముఁ జేయువాడు గనుక పవనుఁడు, పవమానుఁడును. పవతీతివా పవనః, పవమానశ్చ. పవ గతౌ - సంచరించువాఁడు.
సామయిక పవనములు - ఎల్లప్పుడు ఒకే సమయమున నీచు పవనములు.
ప్రతిచక్రవాతము - (భూగో.) ప్రతి చక్రవాతము గల ప్రదేశము మధ్యలో వాయుపీడనము ఎక్కువగ నుండి, ప్రదేశపుటంచులలో బయలుదేరి సుడులు తిరుగుచు బయటికి పోవును.
ప్రతిచక్రవాతములు - (భూగో.) అధికపీడన ప్రణాశికలు. ఇందు ఉత్తరార్ధగోళమున పవనములు సవ్యముగాను, దక్షిణార్ధగోళమున అపసవ్యము గాను వీచును, (వీని వలన చక్కని పవస్థితి యేర్పడును).
ప్రభంజనుఁడు - గాలి, వ్యు.వృక్షములను బాగుగ విరుచువాడు.
గాలిదిండు - సర్పము.
గాడుపు మేపరి - పాము, పవనాశము. పవనః అశనంయస్య సః పవనాశనః - వాయువు ఆహారముగాఁ గలిగినది.
వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాల తంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచు నుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
భా|| ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకొంటూ దూరంగాపోతూన్న విధంగా ఈ ప్రపంచం లోని ప్రాణికోటి సమస్తమూ కాలచక్రం వల్ల కూడుతూ, వీడుతూ ఉంటుంది. స్వేచ్ఛ అనేది లేదు. కాలం ఒకే విధంగా ప్రవర్తించదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. కాలం ఎన్నో రకాలైన పనులను చేస్తూ ఉంటుంది. ఎంత వారు కూడా ఈ కాల ప్రవాహాన్ని దాటలేరు.
సూర్యుని కాంతి వలన సమస్త జీవులు ఎలా ఉండునో అదే విధంగా ప్రాణాది దశవిధ వాయువులు దేహంలోని ఆత్మ యొక్క సామర్థ్యంచే పని చేయును.
ప్రాణో అపాన స్సమాన శ్చోదాన వ్యానౌ చ వాయనః.
(హృది ప్రాణో గుదే అపాన స్సమానో నాభిసంస్థితః,
ఉదానః కణ్ఠదేశస్థో వ్యాన స్సర్వశరీరగః.
నాగశ్చ కూర్మః కృకరో దేవదత్తో ధనఞ్జయః.
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మ ఉన్మీలనే స్మృతః.
కృకరాచ్చ క్షుతం జ్ఞేయం దేవదత్తా ద్విజృమ్భణం,
న జహాతి మృతం వాపి సర్వవ్యాపీ ధనంజయః.) శరీరస్థా ఇమే -
ప్రకర్షేణ అన్యంత నేనేతి ప్రాణః. - ప్రాణశబ్దము మొదలు వ్యానశబ్దము వరకు నొక ధాతువు.
అన ప్రాణనే - దీనిచేత లేస్సగా బ్రతుకుదురు.
ప్రకర్షేణ బహిరానయతి శ్వాసాదీ నితివా ప్రాణః - ప్రకర్షముగా శ్వాసాదులను బయలు వెడలించునది. ణీఞ్ ప్రాపణే.
1. అధోవిణ్మూత్రాదిత్యాజనా దనంత్యనేనే త్యపానః - దీనిచేత విణ్మూత్రములు మొదలైనవి అధోముఖములై ప్రాణులు జీవించును.
అధో మలాన్నయతీతి అపానః - విణ్మూత్రాదుల నధోభాగము నొందించునట్టిది.
2. సమ్యగనం త్యనన సమానః - దీనిచేత లెస్సగా బ్రతుకుదురు.
సర్వత్ర అసృగాది నయతీతి వా సమానః - దేహమం దంతట నెత్తురు మొదలైనవానిఁ బొందించునది.
3. భాషణాది సామర్థ్య జననాత్ ఊర్థ్వ మనంత్యనేనే త్యుదానః - మాటలాడుట మొదలైన సామర్థ్యము గలుగఁజేయుట వలన ఊర్థ్వప్రదేశంబున దీనిచేత బ్రతుకుదురు.
ఉత్ ఊర్థ్వమానయతి శబ్దాదీనితీవా ఉదానః - శబ్దాదుల నూర్థ్వమునకుఁ దెచ్చునట్టిది.
4. విశేష మనంత్యనేన వ్యానః - దీనిచేత విశేషముగా బ్రతుకుదురు.
వినయతీతి వ్యానః - శరీరమందంతట నుండునది. ఇమే = ఈ ప్రాణాది శబ్దములు.
5. శరీరస్థాః - శరీరమందు నుండెడి వాయువుల పేర్లు. ఈ వాయువు లుండెడి ప్రదేశములు.
దశవాయు జయాకారా కళాషోడశ సంయుతా|
కాశ్యపీ కమలాదేవి నాద చక్ర నివాసినీ||
హృది ప్రాణః, గుదే అపానః సమానో నాభి సంస్థితః, ఉదానః కంఠదేశస్థః, వ్యానః సర్వశరీరగః -
1. ప్రాణము హృదయము నందుండి గర్భమునం దన్నాదులఁ బ్రవేశింపఁ జేయు చుండును.
2.అపానము గుదస్థానము నందుండి విణ్మూత రేతస్సుల నధోముఖంబు నొందించును.
3. సమానము నాభియం దుండి అన్నాదుల జీర్ణము నొందించును.
4. ఉదానము కంఠస్థానము నందుంది భాషణాదులఁ బుట్టించును.
5. వ్యానము సర్వశరీరమునం దుండి స్వేద సృఙ్ని మేషాదులఁ బుట్టించును.
ప్రాణ అపాన వ్యానో దాన సమాన నాగ కృకర దేవదత్త ధనుంజయ కూర్మా ఇది దశ వాయువః |
1. ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
అసువులు - ప్రాణములు.
ప్రాణంత్యనేన ప్రాణః. అన ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
ప్రకర్షేణానంతి జీవంత్యనేన ప్రాణః. అన. ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
ప్రాణవాయువు ప్రాణమును నిలబెట్టుచున్నది. హృదయ స్థానమున నుండి, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసతో జీవనాధారమై యుండును. జీవిని ఇట్లు లోకములో ప్రయాణము చేయించుచున్నది కనుకనే ప్రాణమనబడును. ప్రాణవాయువు జీవాత్మను వృద్ధి నొందించు చుండును.
పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడిపోవును).
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, ప్రాణ, (జం.) గుండెకాయ, గుండె (Heart).
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.
గుండె - గుండియ.
గుండియ - హృదయము, రూ.గుండె.
కందనకాయ - గుండెకాయ.
డెందము - హృదయము.
హృదయ స్పందనము - (గృహ.) గుండె కొట్టుకొనుట(heart beat).
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సుకింపైనది.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు.
హృదయం హృత్ :
హ్రియత ఇతి హృదయం హృచ్చ. ద. స. హృఞ్ హరణే. - హరింప బడునది.
హృదయములో పద్మాకారమై యుండు మాంస విశేషము పేర్లు. గుండెకాయ, ఇదే హృదయకమలమందురు, వృక్కాదులు, గుండెకాయ వేళ్ళని కొందరు.
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యదో ముఖం,
అధో నిష్ట్యా వితస్త్వాంతే నాభ్యా ముపరి తిష్టతి|
తా. మన శరీరంలోని గొంతుకు దిగువ, నాభికి పైనగల ప్రదేశంలో పన్నెండు అంగుళాలు ఎడంగా హృదయకమలం ఉంది. హృదయే నారాయణః అది విష్ణువు నివాస స్థానమని వేదం స్పస్టం చేస్తోంది.
గుండె తేలికగా వుంటే ప్రాణం గట్టిగా నిలుస్తుంది. - షేక్స్ పియర్
అనైచ్చిక కండరములు - (జం.) అనిచ్ఛాపూర్వకముగ పనిచేయు కండరములు (Involuntary muscles), ఉదా. గుండెకాయ, పేగుల యొక్క కండరములు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.
ఆంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.
జీవాత్మ - దేహి, జీవుడు.
దేహి - దేహము గలవాడు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
శరీరి - ప్రాణి. జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - 1.గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
ఆధ్యాత్మము - (వేదాం.) 1.ఆత్మ సంబంధమైనది, 2.వి.జీవాత్మ పరమాత్మల సంబంధము, అవ్య. ఆత్మకు సంబంధించి.
ఆత్మనాత్మానమన్విచ్ఛేత్ మనో బుద్ధీంద్రియైర్యతైః |
ఆత్మాహ్యేవాత్మనో బంధుః ఆత్మైన రిపురాత్మనః ||
అదుపుగల మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో, తనకు తానుగా తన ఆత్మను పొందాలి. తనకు తానే చుట్టము, తనకు తానే(రిపువు - శత్రువు)శత్రువు.
రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
రూయతే స్తూయత ఇతి రవిః. ఇ. పు. రుశబ్దే - నుతింపఁబడువాఁడు.
హంసము - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభ గుణము లేని రాజు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
శరీరి - ప్రాణి.
జీవి - జీవించువాడు, వి.ప్రాణి. ప్రాణులలో మెలిగే - జీవి ఎవరు?
ప్రాణి ఏకాంతరోత్త్పత్తిక్రమము - (జీవ.) ప్రాణి జీవమున లింగ సంబంధమును, లింగసంబంధము కానిదియునగు రెండు దశలు నొకదాని తరువాత నొకటి వచ్చుట ((Alternation of generations).
ఆత్మవలనఁ గలిగి అమరుదేహాదుల,
నాత్మకంటె వేఱు లవి యటంచుఁ
దలఁచువాఁడు మూఢతముఁడు గావున నీశ!,
విశ్వ మెల్ల నీవ, వేఱు లేదు.
భా|| ఆత్మనుండే శరీరం మనస్సు మొదలైనవి పుట్టుకువస్తాయి. వాటిని ఆత్మకన్నా వేరు అని అనుకునే వాడు మూర్ఖులలో కెల్లా మూర్ఖుడు. కనుక విశ్వమంతా నీవే. నీవు కానిది వేరుగా ఏమీ లేదు. నీవు మాకు ఈశ్వరుడవు.
ఆత్మను మించిన ఉత్తమ స్నేహితుడు - లేడు.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
చైతన్యము - 1.తెలివి, 2.ప్రాణము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
చేతము - మానసము.
అంతరాత్మ- (జం.)1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.
అంతఃకరణము - 1.మనస్సు, 2.దయ.
అనుక్రోశము - కనికరము. దయ - కనికరము.
అనుగ్రహము - దయ, కరుణ.
కరుణ - 1.కనికరము, 2.దయ.
కరుణించు - కనికరించు.
అంతరంగము - 1.హృదయము, 2.ఉల్లము, మనస్సు.
ఉల్లము - 1.హృదయము, 2.కోరిక. స్పృహ - కోరిక.
చిత్తము - మనస్సు. (చిత్తము నందు దేవీస్థానం బ్రహ్మకళ.)
సక్తము - ఒకదానియందు లగ్నమైంది (మనసు).
అంతరంగుడు - స్నేహితుడు.
ఆత్మనిగ్రహము - ఆత్మస్వాధీనత, మనస్సును వశమునం దుంచుకొనుట (Self-control).
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగిణము, 5.స్వభావము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపఱు - 1.చచ్చు(ౘచ్చు - క్రి.మరణించు), 2.అంగవిహీనమగు.
సహజజ్ఞానము - (జం.) వివేకముతో గాని అనుభవముతో గాని నిమిత్తము లేనట్లు జంతువులు తమ సహజమైన ప్రేరేపణ సాయముతో ప్రవర్తించుట, (Instinct).
మంచి స్వభావము, సౌందర్యం తాలూకు లోటును ఎప్పుడూ భర్తీ చేస్తుంది. కాని, సౌందర్యం మంచి స్వభావమనే లోటును భర్తీ చేయలేదు. - ఎడిసన్
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము, (Property).
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
ఇంగితము - 1.హృద్గతాభిప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విన.కదలినది.
స్వామ్యము - సమత్వము, పోలిక.
ప్రతిభా విశేషము -(గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).
ఆకారవిజ్ఞానము - (జీవ.) ఒక ప్రాణియొక్క ఆకారము, వివిధమగు అవయవములు, అవి చేయుపనులు అను వానిని గూర్చిన జ్ఞానము (Morphology).
దేహము - శరీరము, మేను.
శరీరము - దేహము. మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.
ఒడలు - మేను, దేహము, రూ.ఒళ్ళు.
కాయము1 - 1.మేను, శరీరము, 2.స్వభావము.
కాయము2 - బాలెంతకిచ్చు మందు, సర్మ్య.
కాయకము - శరీర సంబంధమైనది.
కాయస్థుఁడు - 1.లెక్క వ్రాయువాడు, 2.పరమాత్ముడు, 3.కాయస్థ తెగకు చెందినవాడు.
వర్చస్సు - 1.కాంతి, మేని 2.రూపము.
కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్|
విద్యారూపం విరూపాణాం క్షమారూప తపస్వినామ్||
తా. కోకిలకు(కోయిలేమో నల్లనిది)స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము(పాతివ్రత్యము - పతివ్రత యొక్క శీలము), కురూపునకు విద్యయే రూపము, యతులకు(కర్మంది - యతి) శాంతమే రూపము. - నీతిశాస్త్రము
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు(మనసి చంద్రః), 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః. ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివి తేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ. మది. మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.
ఆత్మ బుద్ధి స్సుఖ చైవ గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా. తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱుచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. – నీతిశాస్త్రము
బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః| బుద్ధి మనస్సు కంటే శ్రేష్ఠమైనది.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము, మొ.వి. విణ. గుహా యందుండునది.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
అక్షయము - 1.తరుగనిది, నాశముకానిది, 2.ఇల్లులేనిది, వి.పరమాత్మ.
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి. హృదయరూప గుహలో రహస్యముగా నుండునది.
కందర - కొండబిలము, గుహ.
కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహ వేగముచే వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కంధము.
స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
ప్రకాండము - చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా. పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
బోదియ - 1.ప్రకాండము, 2.మిరపచేల యందు కాలువ లేర్పరిచి కట్టిన కట్ట, 3 స్తంభముల మీది దూలముల క్రింద నుండు పీట.
ప్రకాండవ్యూహము - (వృక్ష.) మొక్కకు భూమిపై నున్న కాండము, కొమ్మలు, ఆకుల మొదలగు భాగముల సముదాయము (Shoot system).
శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).
సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
గవి1 - ఆవు Cow.
గవి2 - 1.గుహ, 2.గుంట.
దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్.
దరి - గుహ.
స్వాంతము - 1.మనస్సు, 2.గుహ.
అంతఃకరణము - 1.మనస్సు, 2.దయ(దయ - కనికరము).
గూఢాపథము - 1.అంతఃకరణము, హృదయము, 2.రహస్యమార్గము.
ఏకోదేవః కేశవోదా శివోదా, ఏకోవాసః పట్టణందా వనందా|
ఏకోమిత్త్రః భూపతిర్వా యతిర్వా, ఏకోనారీ సుందరీదా దరీదా||
తా. విష్ణువైన(కేశవుఁడు - విష్ణువు)శివుడైన నొకండే దేవుండని నమ్మ వలయును. పట్టణమైన, వనమైన నొండు వాసయోగ్యముగా నెంచ వలయును. రాజు(భూపతి - నేలరేడు, రాజు.)తోనైన సన్యాసితోనైన స్నేహము చేయవలయును. సౌందర్యముగలభార్య(సహధర్మిణి - భార్య)తో కూడియైనను గుహ యందైన నుండవలయును - నీతిశాస్త్రము
కొండగుహలోన దాగియె యుండుటేల
చాటుదారులతో నేమి చాటఁగలవొ
నేమమును గాంచియుంటయే ప్రేమమౌనె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
మానసము - 1.ఒక కొలను (మానస సరస్సు), 2.మనస్సు.
మానసౌక(స)ము - హంస.
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental development).
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయువిశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.
యమి - 1.ముని, 2.హంస.
మౌని - మౌనవ్రతుఁడు(మౌనము - మాటాడకుండుట), ముని.
ముని - 1.ఋషి, 2.అవిసిచెట్టు.
ఋషి - 1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.
మౌన సదాసనజయః స్థైర్యం ప్రాణజయః శనైః |
ప్రత్యాహారశ్చేంద్రియాణాం విషయాన్మనసా హృది | - శ్రీమత్భాగవతం
యోగి - యోగాభ్యాసము జ్యేయు పురుషుడు.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.
గుహాయాం గేహే వా బహి రపి వనే వా(అ)ద్రిశిఖరే
జలేవా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్|
సదా యస్యైవాంతఃకరణ మపి శంభో తవ పదే
స్థితం చే ద్యోగోసౌ స చ పరమయోగీ స చ సుఖీ|| - 12శ్లో
తా|| కొండగుహ యందుగాని, గృహము(గేహము - గృహము, ఇల్లు.)నందుగాని, బయటగాని, తోటయందుగాని, పర్వతశిఖరము నందుగాని, నీటియందుగాని, అగ్ని(వహ్ని - అగ్ని)యందుగాని ఉండుగాక ! అందువల్ల నేమి ఫలమున్నది? ఓ శంకరా!(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభువు.)ఎవని హృదయము నీ చరణాలను ఆశ్రయించి ఉండునో అదియే శివయోగము. అలాంటి వాడు ఉత్తమయోగి. అతడే పరమానందము గలవాడు(సుఖీ - సుఖము గలవాడు). - శివానందలహరి
జీవము - ప్రాణము.
జీవితము - 1.ప్రాణము, 2.జీవము.
జీవితేశుఁడు - 1.ప్రాణనాథుడు, 2.యముడు.
ప్రియుఁడు - ప్రాణనాథుడు.
యముఁడు - 1.కాలుఁడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు; శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn). ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమనుఁడు - యముడు.
తను వదెవరి సొమ్ము తనదని పొషింప
ద్రవ్య మెవరిసొమ్ము దాచుకొనగ
బ్రాణ మెవరిసొమ్ము పారిపోకను నిల్వ విశ్వ.
తా|| తనదని పోషింప శరీరము యెవరిది, దాచుకొనుటకు ధన మెవరిదిది? చనిపోక ఈ ప్రపంచములో శాశ్వతముగా నుండుటకు ప్రాణము ఎవరిది?
దండపాణి(యముని) బాధ తొలుగుటకు కోదండపాణి(శ్రీరాముని) నాశ్రయించాలి.
భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికా పీతా,
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా.
- భజగోవిందం
ఉసురు - తాపమునందగు నిశ్వాస ధ్వన్యనుకరణము, రూ.ఉస్సురు.
ఉస్సురు - ఉసురు. Air in the Heart.
ఉసుఱు - 1.ప్రాణము, ఆయువు, 2.ప్రాణక్షోభమువలని దుష్ఫలము.
ఆపసోపాలుపడు - క్రి. జ్వరాది తాపకృతమగు బాధలుపడు, ఉస్సురుస్సురను.
ఉహ్హు - 1.నిప్పు, ధూళి మొ.ని ఊదుట యం దగుధ్వనికి అనుకరణము, 3.ఉస్సురు.
అసురుసురు - శ్రమం దగు ఊపిరిధ్వని అనుకరణము.
Air, wind, breath, life, vitality, the living soul.
ఆయువు - జీవితకాలము, ఆయుస్సు. జీవితకాలము - ఆయువు.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు. కొఱసంది - ఆయము, జీవస్థానము, మర్మము.
ఆయు ర్జీవిత కాలః -
ఏతీత్యాయుః స. న. ఇణ్. గతౌ. - పోవునది.
జీవితస్య కాలః జీవితకాలః - బ్రతికి యుండుకాలము. ఈ రెండు ఆయుస్సు పేర్లు.
గాలిని బంధించిన మొనగాడులేడు! గాలిని బంధించి హసించి దాచిన పని లేదు…
ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది - సంవత్సరాది. సమ - సంవత్సరము.
ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రౌషధి సమాగమా|
దానమానావమానాశ్చ నవగోప్యాః మనీషిభిః||
తా. ఆయుస్సు, ద్రవ్యము, ఇంటిగుట్టు, మంత్రము, ఔషధము, సంగమము(సమాగమము - 1.చక్కనిరాక, 2.పొందిక.), దానము, మానము, అవమానము(అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.), ఈ తొమ్మిదియును బుద్ధిమంతులగు వారిచేఁ బరులకు దెలియనీయక దాఁచఁదగినవి. - నీతిశాస్త్రము.
ఇంటికిగుట్టు రోగమునకు రట్టు. బ్రతికి వున్నంతకాలము గుట్టుగా వుండగలముగాని, గుట్టుగా ఉన్నంత మాత్రాన ఎల్లకాలము బ్రతలేము కదా!
ప్రాణగొడ్డము - ప్రాణహింసకము, సం.ప్రాణకుట్టః.
గొడ్దగము - బాధకము, సం.కుట్టకమ్.
కుట్టుసురు - (కుఱు+ఉసురు) కొన ప్రాణము.
కొఱప్రాణము - కుట్టుసురు, కొనయూపిరి.
పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయ రోఁత,
నరముల శల్యముల్ నవరంధ్రములు రక్తమాంసముల్ కండలు మేలతిత్తి,
బలువైన యెండవానల కోర్వదెంతైనఁ దాళలే దాఁకలి దాహములకు,
సకల రోగములకు సంస్థానమయియుండు నిలువ దస్థిరమైన నీటిబుగ్గ, బొందిలోనుండి ప్రాణముల్ పోయినంతఁ
గాటికే కాని కొఱగాదు గవ్వకైన, భూ.
తా. నరసింహస్వామీ! శరీరము పచ్చితోలు సంచి, సారములేనిది, లోపలంతయు వెదుక నసహ్యము, నరములు, ఎముకలు, తొమ్మిది తూట్లు (కనులు, చెవులు, ముక్కు, నోరు, గుదము, గుహ్యము) రక్తమాంసము కందలు, ముఱికిసంచి, అధికమైన యెండవానల కోర్వలేదు, ఆకలిదప్పులకు తాళలేదు, రోగములన్నిటికి ఉనికియై యుండును, నిలువలేదు. నిలకడలేని నీటిబుగ్గ. దేహములో ప్రాణములు పోయినంతనే ఆ దేహము శ్మశానము నకేగాని గవ్వకైన పనికిరాదు.
బ్రతికినన్నాళ్ళు నిజము నీ భజన మాన
మరణకాలంబునందు నీ స్మరణ నిచ్చి
నీదుజ్ఞానంపుఁ బుప్పొడి పాదుకొల్పి
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే(అ)పానం తథా(అ)పరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః || - 29శ్లో జ్ఞానయోగః తా|| ప్రాణాయామ తత్పరులగువారు ప్రాణవాయువును అపాన వాయువు నందు హోమము చేయుచున్నారు. అపానవాయువును ప్రాణవాయువునందు హోమ మొనర్చి రేచకమును ప్రాణాయామమును చేయుచున్నారు. ప్రాణాపాన వాయువుల గతులను నిరోధించి కుంభకమ ను ప్రాణాయామమును చేయుచున్నారు. - భగవద్గీత
2. అపానము - 1.ముడ్డి, 2.అపానవాయువు, పిత్తు.
ముడ్డి - అపానము, గుదము.
గుదము - మూడి (ముడ్డి), పాయువు, (జం.) అన్నవాహిక చివర నుండు ద్వారము (Anus).
పాయువు - గుదము. కుట్టియ - గుదస్థానము.
పురీషనాళము - (జం.) అన్నవాహిక యొక్క చివర భాగము, (Rectum) దీనిలో మలముండును. పురీషనాళ సంబంధి = Rectal.
గుదం త్వపానం పాయు ర్నా -
గువతి పురీషముత్సృజతీతి గుదం. గు పురీషోత్సర్గే. - మలమును విడుచునది.
అపానతి అధోవాయు మత్సృజతి అపానం. అన ప్రాణనే. - అధోవాయువును విడుచునది.
పాతి మలోత్సర్జనేన పాయుః. ఉ. పు. పా. రక్షణే. - మలమును విడుచుటచేత రక్షించునది. ఈ 3 గుద స్థానము పేర్లు.
అపానము శరీరములో పశ్చిమభాగము (గుదస్థానము) నాశ్రయించి యుండును. తిన్న అహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్రరూపము లో క్రిందికి త్రోయునది అపాన వాయువు.
పృష్టము - 1.ముడ్డి, 2.పెరడు, 3.వీపు, 4.వెనుకప్రక్క, విణ.(జీవ.) పైభాగమునకుగాని, వెన్నుభాగమునకు గాని సంబంధించినది, (Dorsal). క్రింది భాగమునకుగాని, రొమ్ము భాగమునకు గాని సంబంధించినది (Ventral).
ఉచ్చారము - 1.ఉచ్చారణము, 2.మలము, పురీషము.
ఉచ్చారణము - పలుకుట, ఉచ్చరించుట.
ఉచ్చరణము - 1.నోట పలుకుట, 2.ఊర్థ్వగమనము, 3.బహిర్గమనము, రూ.ఉచ్ఛారణము.
పలుకుబడి - ఉచ్ఛారణము, (గృహ.) ధనము, ప్రాబల్యము, మాట చెల్లుబడి (Influence).
నుడికారము - మాటచమత్కారము, పలుకుబడి.
నొడికారము - మాటచమత్కారము, రూ.నుడికారము.
నొడికారి - నుడువరి, చమత్కారముగా మాటాడువాడు.
నుడువరి - మాటలమారి, వాచాలుడు.
మాటలమారి - వాచాటుడు; వాచాలుఁడు - వదరుబోతు; వాచాటుఁడు – వదరుబోతు; జల్పాకుఁడు - వదరుబోతు
మాటకారి - 1.వాగ్మి, 2.వాచాటుడు.
నుడికాఁడు - మాటకారి. నుడుఱేఁడు - బృహస్పతి, గీష్పతి.
వాగ్మి-1.చిలుక, 2.బృహస్పతి, విణ.యుక్తయుక్తముగా మాటాడువాడు.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
మేధావి - విణ.ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.
ధారణశక్తి - (భౌతి.) అయస్కాంత శక్తిని నిలుపు కొనగలిగిన శక్తి (Retentivity).
ధారణ - 1.భగవంతునం దేకాగ్ర చిత్తము, 2.మేర, 3.వస్తువినియము, 4.జ్ఞాపకశక్తి.
జ్ఞాపకము - తెలియ చేయునది, స్మృతి (Memory).
స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.
ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.
ప్రస్తావ సదృశంవాక్యం స్వభావ సదృశక్రియామ్|
ఆత్మశక్తి సమకోపం యోజనాతి సపండితః||
తా. ప్రస్తావమునకుఁ దగినమాట, పరుల స్వభావమునకుఁ దగిన కార్యము తనశక్తికి దగిన కోపము, ఎవండెఱుంగునోవాఁడు వివేకియగును. - నీతిశాస్త్రము
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ,
శ్రుతి స్మృతి ర్ధృతి ర్ధన్యా భూతి రిష్టి ర్మనీషిణీ. - 33శ్లో
విడిముడి - ధనము (విడియు + ముడి).
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి. (గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది, 2.తెలియబడినది.
అవగతము - తెలియబడినది, జ్ఞాతము.
జ్ఞాతము - తెలియబడినది.
జ్ఞాపితము - తెలియబదినది, రూ.జ్ఞప్తము.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది (Positive).
పలుకుబడి క్షేత్రము - సామ్రాజ్యవాద దేశములు యితర దేశములలో ఏర్పరుచుకొనిన ఆర్థిక రాజకీయములైన పలుకుబడి క్షేత్రములు. (ఈ క్షేత్రములలో అధినివేశ రాజ్యములకు విశిష్టమైన అర్థిక రాజకీయాధి కారము లుండును. పలుకుబడి క్షేత్రము పేరునకు మాత్రము స్వతంత్ర రాజ్యముగ పరిగణించ వచ్చును.)
రై - 1.ధనము, 2.హిరణ్యము.
రైవతుఁడు - శివుడు; శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసుష్ఠుడు, మరీచి).
కపర్థము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
గవ్వ - 1.గాజువంటి ఒకానొక పురుగు చిప్ప, పరాటిక, 2.ఒకానొక చిన్న నాణెము.
కపర్థి - శివుడు.
ప్రాబల్యము - 1.ప్రబలత్వము, 2.బలిష్ఠత.
ప్రాబల్యము - (భౌతి.) పనిచేయుట కున్న సామర్థ్యము (Strength), (బలముగా నుండుట).
క్షత్త్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము(శరీరము - దేహము), 3.ధనము, 4.నీరు.
యస్యాస్తి విత్తం సనరః కులీన, స్సపండితః సశ్రుత ణాన్వివిజ్ఞః|
సవీవవక్తా స చదర్శనీయ, స్సర్వేగుణాః కాంచన మాశ్రయన్తి||
తా. ధనముగలవాఁడే సత్కులవంతుఁడు, వాడే పండితుఁడు, వాఁడే శాస్త్రజ్ఞుఁడు, వాఁడే కర్తవ్యా కర్తవ్య విధిజ్ఞుఁడును, వాడే పలుక నేర్చినవాఁడు, వాడే చూడదగినవాఁడు గనుక సకల గుణంబులు ధనము నాశ్రయించి యున్నవి. - నీతిశాస్త్రము
యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజ పరివారోరక్తః,
పస్చాత్ జీవతి, జర్జరదేహే వార్తాం కో పి న పృచ్ఛతి గేహే. - భజగోవిందం As long as you have the ability to earn money, so long will your dependents be attached to you. After that, when you live with an infirm body no one would even speak to you a word.
ఉచ్ఛారమార్గము - (జన.) (Cloaca) మూత్రమునకు, పురీషమునకు కలిసి ఒకటిగానుండు మార్గము, ఉచ్ఛారద్వారము (Cloacal aperture).
పురీషము - మలము; విట్టు - మలము.
మలము - 1.పేడ(గోమయము, రూ.పెండ), రెట్ట(1.పక్షిమలము, 2.భుజము), విష్ట 2.ముఱికి(కల్మషము, మాలిన్యము Dirt), 3.పాపము Sin, 4.దోషము, (వస., శుక్లము, రక్తము(నెత్తురు Blood), మజ్జము marrow, మూత్రము Urine, విష్ఠ, పింజూషము, నఖము(గోరు Nail), శ్లేష్మము(కఫము Phlegm), అశ్రువు(కన్నీరు Tears), దూషిక, స్వేదము(చెమట Sweat), అని 12 రకములు.)
అమేధ్యము - మలినము, పవిత్రము కానిది, పరిశుద్ధముకానిది, వి.పురీషము, మలము.
శకృత్తు - విష్ఠ; విష్ఠ - మలము.
అనామ్నాయమలా వేదాః బ్రాహ్మణస్యావ్రతం మలమ్ ||
మల పృథివ్యా బాహ్లీకాః పురుషస్యానృతం మలమ్ |
కౌతూహలమలా సాధ్వీ విప్రవాసమలాః స్త్రియః ||
అభ్యాసం లేకపోవడమే వేదాలకు దోషం - వ్రతం(దీక్ష) లేకపోవడమే బ్రాహ్మణునకు దోషం - భూమికి బాహ్లికులు దోషం - పురుషునికి అసత్యం దోషం - సాద్వికి కుతూహలం దోషం - స్త్రీకి ఎడబాటు దోషం.
త్రిదోషములు - వాత పిత్త శ్లేష్మములు.
పిత్త - ఒక ధాతువు (వాత పిత్త శ్లేష్మము అనునవి త్రివిధధాతువులు.)
Who is a friend?
One who saves from sin.
అంహస్సు - పాపము, దోషము.
పాపము - దుషృతము, కలుషము.
దుష్కృతము - పాము; పాము - 1.సర్పము, కష్టము, క్రి.రుద్దు.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
దోషము - 1.తప్పు, 2.పాపము.
తప్పు - 1.చెడుగుచేయు, 2.అతిక్రమించు(మీరు, దాటు, ఉల్లంఘించు), వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.
కలుషము - పాపము.
దోషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు.
దోషాచరుడు - 1.చంద్రుడు, 2.రాక్షసుడు, వ్యు.నిసియందు తిరుగువాడు.
దోషజ్ఞుడు - 1.విద్వాంసుడు 2.వైద్యుడు, విణ.దోష మేరిగినవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ. ఎరుకగలవాడు.
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
చికిత్సకుఁడు - వైద్యుడు; వెజ్జు - వైద్యుడు, విణ.వైద్యః.
జీవదుఁడు - వైద్యుడు.
సీ. కాయమెంత భయానఁ గాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కఁబోదు,
ఏవేళ నేరోగ మేమరించునో ? సత్త్వ మొందఁగఁ జేయు మే చందము నను,
ఔషధంబులు మంచి వనుభవించినఁ గాని కర్మ క్షణంబైనఁగాని విడదు,
కోటివైద్యులు గుంపు గూడివచ్చినఁ గాని మరణ మయ్యెడు వ్యాధి మాన్పలేరు,
తే. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన?
భూషణవికాస ! శ్రీథర్మపురనివాస !
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర !
తా. నరసింహా ! శరీర మెంత భయముతో కాపాడుకొన్నను భూమిలో నది నిలువపోదు. ఏవేళ కేరోగము వచ్చునో, (శరీరము)బల మొందునట్లు చేయు ఎన్ని విధములగు మంచి మందులు సేవించినను పాపము నశించినగాని (రోగము)విడవదు. కోటిమంది వైద్యులు గుంపుగ వచ్చిన ను చావను రోగమును మాన్పలేరు. జీవుని(జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.) ప్రయాణకాలమాసన్నమైనచో దేహము భూమియందొక్క నిమిషమైన నిలుచునా ! (నిలువబడ దనుట.)
కాలం బెడగని పాపము,
మూలముఁ బెఱుపంగవలయు మును రోగములన్
దేలిన దోషము నెఱుఁగుచు,
వాలాయము దాని నడఁచు వైద్యుని భంగిన్.
వాలాయము - అనివార్యము, అవశ్యము, నిరంతరము, వి.నిర్బంధము.
అనివార్యము - నివారింపరానిది.
అవశ్యము - 1.అణపరానిది, లోబడనిది, 2.తప్పనిసరైనది, 3.నిశ్చయముగా, తప్పకుండా.
నిరంతరము - 1.దట్టము, 2.ఎడతెగనిది.
నిర్బంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
నిత్యము - ఎల్లప్పుడు, ఎడతెగనిది.
గుహ్యము - 1.ఏకాంతము, 2.పురీషమార్గము, 3.వంచన, 4.తాబేలు, విణ.దాచదగినది.
గుహ్యకేశ్వరుఁడు - కుబేరుడు.
గుహ్యకుఁడు - గుహ్యక జాతివాడు, యక్షులలో నొగతెగవాడు.
ధనాని భూమౌ పశవాశ్చ గోష్ఠే, నారీ గృహద్వారే సఖ శ్మశానే|
దేహం చితా పరలోక మార్గే, ధర్మాను గోగచ్ఛతి జీవ ఏకః||
తా. చనిపోయిన వ్యక్తి తాను కష్టపడి సంపాదించిన ధనాన్ని భూమి మీద విడిచిపోతున్నాడు. తనకు అత్యంత ఇష్టమైన గోసంపదను పశువుల శాలలో వదలి వెడుతున్నాడు. తనకు ఎంతో ప్రీతిని కలిగించే పుత్రికలు, భార్య గృహద్వారం దగ్గరే నిలిచిపోతున్నారు. తన కష్టసుఖములను పంచుకొని ఓదార్చే మిత్రులు కేవలం శ్మశానం వరకే వస్తున్నారు. చివరకు పుట్టినప్పటి నుంచీ అంటిపెట్టుకొని ఉన్న దేహం కూడా శ్మశానం వరకే వెళ్ళి తరువాత భస్మమైపోతుంది. అంతిమ సమయంలో జీవుని వెంటవెళ్ళేది ఒకే ఒక్కటి, అదే ధర్మం. - చాణక్యనీతి
రిక్థము - 1.ధనము, 2.హిరణ్యము, (శాస.) మరణ సమయమున విడిచిన ఆస్తి (లెగసీ Legacy బిక్వెస్టు bequest).
మా కురు ధనజనయౌవనగర్వం - హరతి నిమేషాత్ కాలః సర్వమ్,
మాయామయమిదమఖిలం బుద్ధ్వా - బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా.
Do not be proud of wealth, kindred, and youth; Time takes away all these in a moment. Leaving aside this entire(World) which is of the nature of an illusion, and knowing the state of Brahman, enter into it.
పాతకము - మహాపాపము (పంచ మహాపాతకములు:- స్వర్ణపేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము).
బ్రహ్మహత్య - విప్రుని చంపుట (మహాపాతకములలో నొకటి).
విప్రుఁడు - బ్రాహ్మణుడు, పారుడు; బ్రాహ్మణుఁడు - పారుడు.
3. వ్యానము - వ్యానవాయువు, శరీరము(శరీరము - దేహము.) నందంతటను వ్యాపించిన ఒక వాయువు. air which pervades, spreads the whole body.
వ్యాపనము - వ్యాపించుట, (భౌతి.) ప్రసరణము, (Propagation).
ప్రసరణము - అంతట వ్యాపించుట, వి.(భౌతి.) కాంతి కిరణముల ప్రయాణము (Propagation).
వ్యానము శరీరమంతట వ్యాపించి యుండును. శరీరమును ఎటు కావలసిన అటు వంగునట్లు(కదలునట్లు) చేయుచు, కంఠముదాక వ్యాపించియుండి, ఆహార విహారాదులలో ఏమాత్రము తేడా వచ్చినను వ్యాధులు గలిగించునది వ్యాన వాయువు.
అపఘనము - 1.శరీరావయవము, 2.శరీరము, విన.మబ్బులేనిది.
సర్వాంగీణము - 1.ఎల్ల యవయముల సంబంధముతో గూడినది, 2.ఎల్ల యవయవము లందు వ్యాపించినది.
అవఘశము - 1.అతిశయము, పెంపు, 2.సామర్థ్యము, 3.వ్యాపనము, విణ.1.హెచ్చైనది, 2.అసాధ్యము, 3.అకృత్యము.
అవఘశించు - 1.తుల్యమగు, 2.వ్యాపించు, 3.మీరు, 4.అడచు.
అవఘశుఁడు - సమర్థుడు, వ్యాపకుడు.
సమర్థుఁడు - నేర్పరి; నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు.
ౘదురుఁడు - 1.చతురుడు, 2.సమర్థుడు, సం.చతురః.
చతురుఁడు - నేర్పరితనము. చతురిమ – నేర్పరి; నిష్ణాతుఁడు - నేర్పరి.
ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
వ్యక్తుఁడు - విశారదుడు; విశారదుఁడు - విద్వాంసుడు, నేర్పరి.
కోవిదుఁడు - విద్వాంసుడు, వ్యు.ఇది అది అను ఇయమము లేక సర్వమును ఎరిగినవాడు.
వఱలు - 1.ప్రకాశించు, ఒప్పు, 2.వ్యాపించు.
ఒప్పు - 1.ఒప్పితమగు, తగు, 2.సమ్మతించు, వి.1.అందము, 2.తప్పుకానిది, 3.సమ్మతి.
ఒప్పుకొను - సమ్మతించు, అంగీకరించు.
ఒప్పిదము - 1.అందము, 2.అలంకారము, 3.విధము, విణ.1.మనోజ్ఞము, 2.తగినది.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కొంపైనది, మదికి హితమైనది.
హృద్యంగమము - మనస్సు కింపైనది.
యోగ్యము - 1.తగినది, 2.నేర్పుగలది.
పర్యాప్తము - 1.యధేష్టము, 2.తృప్తి, 3.సామర్థ్యము.
పరవు - వ్యాపించు, వి.వ్యాపనము, రూ.పర్వు.
అసాధ్యము - 1.సాధ్యము కానిది, 2.కారణములచే సమర్థింపరానిది, 3.నెరవేర్పరానిది.
అకృత్యము - చేయరానిది.
స్వగృహేపూజ్యతే మూర్ఖః - స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా - విద్వాన్ సర్వత్రపూజ్యతే||
తా. మూర్ఖుఁడు తన యింటియందును, ప్రభువు స్వగ్రామమందును, రాజు తన రాజ్యమందును (గొ)కొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశముయందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము
సంవ్యానము - 1.ఉత్తరీయము, 2.వస్త్రము.
ఉత్తరవాసము - పైవస్త్రము, ఉత్తరీయము. కండువా - ఉత్తరీయము. బైరవాసము - ఉత్తరీయము, బహిర్వాసము, సం.బహిర్వాసః.
ఒలె - వస్త్రము, ఉత్తరీయము, రూ.ఒల్లె, ఒల్లియ, వల్లె, వల్లియ.
ఒల్లెవాటు - ఉత్తరీయము మెడచుట్టి వచ్చునట్లు భుజముల మీద వైచుకొనుట, రూ.వల్లెవాటు.
వలెవాటు - వల్లెవాటుగా వైచుకొనిన ఉత్తరీయము.
అంశుకము - 1.వస్త్రము, 2.సన్నని వస్త్రము, 3.ఉత్తరీయము, పైట, 4.మృదుకాంతి, (వృక్ష.) ఆకుపత్రి.
వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
వస్త్రము - బట్ట, వలువ.
వలువ - సన్నవస్త్రము, బట్ట.
కోక - వలువ, చీర.
చీర - వస్త్రము (ఇది వాడుక యందు స్త్రీ వస్త్రమాత్ర పర్యాయముగ కాన బడుచున్నది. నేడు "కోక" అను అర్థమున రూఢము).
అంతరీయము - కట్టుబట్ట, పరిధానము.
పరిధానము - ధోవతి.
కట్టుగోక - మొలగుడ్డ, ధోవతి.
సాలు1 - 1.ఉన్నిబట్ట, 2.సన్నని వస్త్రము, రూ.సాలువు.
సాలు2 - సంవత్సరము; సమ - సంవత్సరము.
సేల - చేల, వస్త్రము, సం.చేలమ్.
చేలము - వస్త్రము, రూ.చేల, సేల.
సెల్లా - సన్నని వస్త్రము (రవసెల్లా), సం.చేలమ్.
పైఁట - పయట, సం.పైఠా.
పయఁట - స్త్రీల రొమ్ము మీది వస్త్రము చెరుగు, రూ.పయ్యఁట, పైట, సం.ప్రతిష్ఠానమ్, పైఠా.
పయ్యెద - (పై+యెద) పయట, రూ.పయ్యద.
ఎద1 - పశుఋతువు.
ఎద2 - హృదయము, సం.హృత్.
ఎడఁద - ఎద, హృదయము.
ఆచ్ఛాదనము - 1.కప్పుట, 2.వస్త్రము.
కప్పు - 1.అచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు(నీలిమ – నలుపు), 4.చీకటి, క్రి.1.క్రమ్ము, 2.మూయు.
కప్పుకుత్తుక పులుగు - నెమలి, నీలకంఠము.
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వస్త్ర ముఖ్య స్వలంకారః ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం విద్యాముఖ్యస్తు పూరుషః||
తా. అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము) ముఖ్యములు. - నీతిశాస్త్రము
యావత్ పవనో నివసతి దేహే - తావత్ పృచ్ఛతి కుశలం గేహే,
గతవతి వాయౌ దేహాపాయే - భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. – భజగోవిందం
As long as there is breath in the body, so long people in the household ask about one’s welfare. Once the breath leaves, on the destruction of the body, the dependents dread that very same body.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ.
స్థితి - 1.ఉనికి, 2.కూర్చుండుట, 3.నిలుకడ, 4.మేర, సం.వి.(రసా,) 1.అవస్థ (Phase), 2.ఘన, ద్రవ, వాయు, ద్రవ్యావస్థలలో నొకటి, 1.ఒక వస్తువు యొక్క యునికి, రీతి (State), 2.అది ఆక్రమించిన స్థానము, (భౌతి.) ఏ వస్తువు అయినను ఉన్న విధము, అవస్థ (Mode of existence).
సన్నివేశము - (గృహ.) స్థితి, స్థానము, అవస్థ (Situation).
నిలుకడ - 1.ఉనికి, 2.స్థైర్యము, 3.విరామము, వి.(గణి.భౌతి.) నిశ్చలముగా నుండుట (Rest).
స్తైర్యము - స్థిరత్వము.
స్థితిశక్తి - (భౌతి.) దాని స్థితిని బట్టి ఒక వస్తువునందు నెలకొనియుండు శక్తి (Potential energy).
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థాని - స్థానము కలది.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
నిర్వాతము - చలింపనిగాలి, విణ.గాలిలేనిది (చోటు).
4. ఉదానము - 1.బొడ్డు, 2.కంఠము నందలి గాలి, 3.ఒకానొక పాము.
ఉదానః కంఠదేశస్థః : ఉదానము, కంఠస్థానము నందుండి భాషణాదులఁ బుట్టించునది.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
ఉదానము కంఠ ప్రదేశమున నుండి దేహములో సగము భాగమును పెంచుట కుపయోగించును. కంఠస్థానం(ప్రదేశమును) నుండి ముఖమును, పెదవులను, కన్నులను అదురు నట్లు చేయుచు కామ క్రోధాదులను ఉత్తేజపరచునది ఉదాన వాయువు.
బొడ్డు - 1.నాభి, 2.నూతిచుట్టు పెట్టిన గోడ.
బొడ్దుచేరులు- (గృహ.) నాభిగొట్టము, బొడ్డుత్రాడు (Umbilical cord).
నాభిజన్ముఁడు - బ్రహ్మ, పొక్కిలిచూలి, వ్యు.బొడ్డునుండి జన్మించినవాడు. air that rises in the throat and navel.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
సనాభి - జ్ఞాతి, సమానుడు.
స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు. తొలఁగుబావ - శత్రువు, దాయ.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
ప్రత్యర్థి - శత్రువు; విద్విషుఁడు - శత్రువు; అరాతి - శత్రువు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు).
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు.
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిగా...
అహితుఁడు - శత్రువు, విరోధి.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
దాయాదౌ సుత బాన్ధనౌ,
దాయాదశబ్దము కొడుకునకును, జ్ఞాతికిని పేరు.
దాయం విభజనీయం ధన మత్తీతి, ఆదత్త ఇతి వా దాయాదః అద భక్షణే, డు దాఞ్ దానే. – పాలిసొమ్మును భుజించువాఁడుగాని, పుచ్చుకొను వాఁడు గాని దాయాదుఁడు.
వైరిణం నోప సేవేత సహాయం చైవ వైరిణః,
అధార్శికం తస్కరంచ తథైవ పరయోషితం|
తా. శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ(తస్కరుఁడు - దొంగ), పరస్త్రీ(యోష - 1.బోటి, 2.ఆఁడుది, రూ.యోషిత, యోషిత్తు.), వీరలతో సహవాసము జేయరాదు. - నీతిశాస్త్రము
నాభ్యంతరము - (భౌతి.) నాభి ధ్రువముల మధ్య దూరము(Focal length).
నాభి - 1.కస్తూరి, 2.బొడ్డు, 3.బండి చక్రపు నడిమితూము, 4.విష విశేషము. 1.(గణి.) ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువునకు గల దూరము. ఆ శంకుచ్ఛేద సంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనివృత్తిలో నుండునట్టి స్థిర బిందువు (Focus). 2.(భౌతి.) పరావర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence)ను చెందునో యట్టి బిందువు. ముఖ్యాక్షమునకు సమాంతరముగా నుండు కిరణములు పరావర్తనము చెంది కేద్రీకరించెడి బిందువు. లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus).
అండజ - కస్తూరి, వ్యు.కస్తూరి మృగము యొక్క బొడ్డుతిత్తి నుండి పుట్టినది.
ధాత -1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
ఆంగీరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు. బ్రహ్మ ముఖములందు దేవీస్థానం సరస్వతి. సరస్వతి యందు దేవమాత. సరస్వతిని మున్ముందు సేవించినవాడు బ్రహ్మ.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
నిజము - స్వభావము, విణ.1.తనది, 2.శాశ్వతమైనది.
నిజము - సత్యము, విణ.1.శాశ్వతమైనది, 2.సత్యమైనది. సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది. సత్యము గలిగియున్న వేరు తపస్సు పనిలేదు.
అవితథము - 1.యథార్థము, 2.వ్యర్థము కానిది, వి.సత్యవచనము.
సత్యం బ్రూయాత్ప్రియంబూయాన్న బ్రూయాత్సత్య మప్రియం |
ప్రియంచనానృతంబ్రూయా దేషధర్మస్సనాతనః |
భద్ర భద్రమితి బూయాద్భద్రమి త్యేవనావదేత్ ||
తా. సత్యము నిష్టముగాఁ బలుకవలయును, సత్యమెన దైనను అప్రియముఁ బలుకరాదు, ప్రియమైనదైనను అసత్యముఁ బలుకరాదు. భద్రమనఁగా శుభము. కావున ప్రియమును(ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చు వెలగలది.)బలుకునపుడు భద్రము భద్రమని పలుక వలయును. - నీతిశాస్త్రము
In whose control lies the community of creatures?
One who speaks the truth, is kindly and is humble.
సత్యం న సత్యం ఖలు యత్ర హింసా, దయాన్వితం చానృతమేవ సత్యమ్|
హితం సరాణాం భవ తీహ యేన, తదేవ సత్యం న తథాన్యధైవ||
హింసకు దారి తీసేది కీడు కలిగించేది అయితే, అది సత్యమైన సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. మనిషికి ఏది హితమో అది సత్యం తప్ప మరొకటి కానేరదు.
ఉపనిషత్తు - 1.బ్రహ్మజ్ఞానము, 2.వేదాంతము, ఛాందోగ్యము, మొ.వి, 3.ధర్మము, 3.ఏకాంతము.
ఆనందని - బ్రహ్మపట్టణము.
ఆనందము - సంతోషము, సుఖము.
ఆనందనము - బంధు మిత్రాదులను కుశలప్రశ్న ఆలింగనాదులచే సంతోషపెట్టుట.
ణ్యము - బ్రహ్మలోకమందలి యొక సరోవరము.
ఖచితము - చెక్కబడినది, పొదగబడినది, సం.వి.బ్రహ్మయొక్క ఖడ్గము, వికృ.కచ్చితము.
కుశలప్రశ్నము - క్షేమ మరయుట.
కుశలము - 1.క్షేమము, శుభము, 2. (వ్యావ.) చిన్నది, ఉదా. "మాయిల్లు కుశలము" = ఇరుకైనది, 3.తనివి, 4.పుణ్యము. కల్యాణము - 1.క్షేమము, 2.శుభము, 3.పెండ్లి. స్వస్తి - శుభము. సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది.
What is the most desirable for human beings?
Life dedicated to one’s and others’ welfare.
భవికము - మేలు, శుభము.
భవిష్యము - 1.శుభము, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విన.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
శివము - 1.శుభము, 2.సుఖము, 3.మోక్షము.
శుభము - మంగళము; మంగళము - శుభము, క్షేమము.
క్షేమము - కలిగిన శుభము చెదకుండుట, వికృ. సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
క్షేమంకరుఁడు - శుభంకరుడు, వ్యు.క్షేమమును కలిగించువాడు.
శుభంకరుఁడు - శుభమును చేయువాడు.
శుభంయువు - శుభముతో గూడుకొన్నవాడు.
శివంకరుఁడు - శుభకరుడు.
కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.
శుభకృత్తు - అరువది సంవత్సరములలొ నొకటి.
సదాగతి - 1.వాయువు, 2.మోక్షము, 3.సూర్యుడు, 4.సర్వేశ్వరుడు.
లోకః పృచ్ఛతిసద్వార్తాం శరీరే కుశలం తవ|
కుతః కుశల మస్మాకమాయు ర్యాతి దినేదినే||
తా. సాధారణముగా లోకమున నందఱు అప్పా నీవు కుశలమా అని యడిగెదరు గాని దినదినంబును క్షీణించుచుండెడి ఆయువు గల మాకు కుశలం బెక్కడిది, అనఁగా నూరు సంవత్సరములు పరిమితి గలదు. మనుజులకు నొక్కొక్క దినంబును, గతించుచుండగా (నా)ఆయువు నశించునునే వచ్చుచున్నది. దానివలన కుశలం బెక్కడిదని భావము. శరీర భ్రమచే (నా)ఆయువు దినే దినే తగ్గుచున్నదని మఱపు గలుగుటకు కుశలంబుగాదు. కుశలంబన్నది తానైన స్వరూపాత్మకు నిత్యత్వమం దెల్లప్పుడుండునదే కుశలంబు. – నీతిశాస్త్రము
యోగరతో వా భోగరతో వా - సంగరతో వా సంగవిహీనః,
యస్య బహ్మణి రమతే చిత్తం వందతి నందతి నందిత్యేవ. - 19శ్లో
Let one practise concentration; or let one indulge in sense-enjoyment. Let one find pleasure in company; or in solitude. he alone is happy, happy, verily happy, whose mind revels in Brahman. - భజగోవిందం
5. సమానము - (సజాతీయము) సం.(గణి.) ఒకే జాతికి సంబంధించి నది, ఒకే ఘాత సంఖ్య కలిగినది (Like), వై.వి. సమ్మతి, సం.వి. నాభి యందలి వాయువు, విణ.తుల్యము.
తుల్యము - సమానము, సాటి. equality in air.
నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.
సమానము సర్వనాడులు ఏర్పడునట్లు చూచుచుండును. త్రాగిన వానిని, తిన్నవానిని రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా, వాయువుగా (వాతముగా)మార్చి, శరీరమునకు సమానముగా అందజేయునది సమాన వాయువు.
అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
అభిమతము - 1.సమ్మతి, 2.కోరిక, 3.మమకారము, విణ.1.నమ్మకము, 2.ఆదరింపబడినది, 3.ప్రియమైనది, 4.కోరబడినది.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ.
అంగీకారము - 1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
స్వీకారము - అంగీకారము.
అనుమోదము - 1.సంతోషము, 2.అంగీకారము, సమ్మతి.
ఆహ్లాదము - సంతోషము; సంతోషము - సంతసము, ముదము.
సంతసము - సంతోషము, రూ.సంతోసము, సంతోషః.
సంతోసము - సంతసము. ముదము - సంతోషము.
శర్మము - సంతోషము. సంశ్రవము - అంగీకారము.
హ్లాదనము - సంతోషించుట, సంతోషము, రూ.హ్లాదము.
హ్లాదితము - సంతొషింపబడినది.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఇచ్ఛ - అభిలాష, కోరిక. అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
మనోరథము - కోరిక; సమీహ - కోరిక.
సమ్మతము - ఇష్టమైనది, అంగీకృతమైనది, సం.వి.(గృహ.) స్వీకరణ, అంగీకారము, (Acceptance).
అభినందనము - 1.సంతోషము, 2.పొగడుట, 3.ప్రోత్సాహపరచుట.
ఇంపు - 1.ఇచ్ఛ, 2.ఆనందము, 3.మనోజ్ఞత, విణ.ఇష్టము, ప్రియము.
ఇంపితము - ఇంపైనది.
అభిరామము - మనోహరము, ఇంపైనది, ఒప్పిదమైనది.
మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింపజేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కొంపైనది, మదికి హితమైనది.
హృద్యంగమము - మనస్సు కింపైనది.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను అభిమానము.
నమ్మకము - విశ్వాసము, నచ్చిక, రూ.నమ్మిక, నమ్మిగ.
నచ్చిక - విశ్వాసము, రూ.నచ్చిగ, నచ్చికము.
నమ్మిక - నమ్మకము.
నమ్ము - విశ్వసించు.
విశ్వసనీయము - విశ్వసింపదగినది.
విశ్వస్తము - విశ్వసింపబడినది.
నమికి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
నెమ్మిలి - నెమలి; నర్తనప్రియము - నెమలి.
మయూరము – 1.నెమిలి, 2.నెమిలి జుట్టు.
నెమ్మి - 1.ప్రేమ, 2.నెమ్మది, 3.సంతోషము, 4.క్షేమము, 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము, 2.బండిచక్రముకమ్మి, సం.నేమిః.
నెమ్మిరౌతు - కుమారస్వామి.
ముద్దు - 1.ప్రేమము, ఆదరము, 2.మనోజ్ఞత, 3.చుంబనము.
చుంబనము - ముద్దు. ముద్దాడు - చుంబనాది పూర్వకముగా లాలనచేయు, ఆదరించు.
లాలనము - బుజ్జగము, ముద్దుచేయుట. లాలన వలన పుత్త్రుడు నశించిపోవును.
లాలనము - అధికేచ్చ, ఔత్సుక్యము.
బు(ౙ)జ్జగము - ఇచ్ఛకము, ఉపలాలనము.
ఉపలాలనము - బుజ్జగించుట.
ఇచ్చ(ౘ)కము - 1.ముఖప్రీతి, ముఖస్తుతి, 2.ప్రియవచనము, విణ.ప్రియము, ప్రీతికరము.
ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చువెలగలది.
ప్రియంవదుఁడు - ఇచ్చక మాడువాడు, ప్రియవాది.
ఇచ్చకాలమారి - ఇచ్చకాలాడువాడు, ముఖస్తుతి చేయు స్వభావము కలవాడు.
ఇచ్చగొండి - ఇచ్చకాలమారి.
ముద్దయ్య - (ముద్దు + అయ్య) కుమారస్వామి.
మారాము - 1.మర్మము, 2.గారాబము, 3.పెంకిపట్టు.
గోము - 1.సౌకుమార్యము, 2.వికాసము, 3.గారబము, 4.విధము, 5.గౌరవము, 6.గర్వము, విణ.1.మృదువైనది, 2.అందమైనది.
ఎలమి - 1.ఆనందము, 2.వికాసము, 3.ధైర్యము.
ఆనంద - ప్రభవాది సంవత్సరములలో నలువదియవ(40వ) సంవత్సరము. ఆనందము - సంతోషము, సుఖము.
వికాసము - తెలివి; జ్ఞానము - తెలివి, ఎరుక.
దైర్యము - ధీరత్వము.
అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
అభిజ్ఞుఁడు - 1.తెలివిగలవాడు, 2.నేర్పరి, 3.పండితుడు.
అభిజాతుఁడు - 1.గొప్పవంశమునందు పుట్టినవాడు, 2.పండితుడు, 3.న్యాయవంతుడు, 4.శ్రేష్ఠుడు.
ధృతి - 1.ధైర్యము, 2.ధరించుట, 3.సంతోషము, 4.సౌఖ్యము.
ధృతము - ధరింపబడినది.
సంతోషాన్ని, ఆనందాన్ని దాచుకోగల వ్యక్తి బాధలను దాచుకునేవాడి కన్నా గొప్పవాడు. - లావాటర్
సన్నిభము - సమానము.
సదృశ్యము - (గణి.) అనురూపము, సం.విణ.సమానము, తగినది. (Corresponding).
అనురూపము - 1.తగినది, 2.అనుగుణము, 3.సాటియైనది, 4.(గణి.) ఒక దాని కొకటి అనుగుణముగా నున్నది, అనుగుణ్యము కలది, (Corresponding).
అనుగుణము - 1.సమానగుణము కలది, 2.అనుకూలమైనది, తగ్గినది.
అ ను గ ల ము - 1.అనుకూలము, 2.సమానము, 3.సహాయము.
అనుకూలము - 1.ఇష్టము, 2.సరిపడునది, 3.సహాయమైనది, (వ్యతి.) ప్రతికూలము. బాసట - సహాయము.
సధర్మము - 1.సమానము, 2.ధర్మముతో కూడినది.
పంచశీల - (చరి. రాజ.) క్రీ. శ. 1954 సంవత్సరములో ఏప్రిల్ 29వ తేదీని భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ, చైనా విదేశాంగ మంత్రి శ్రీ చౌ.ఎస్. లైతమ యభయ దేశముల తరపున ప్రపంచ శాంతి కొరకు, ముఖ్యమైన టిబెట్టు(Tibet)శాంతి భద్రతలకొరకు, చేసికొనిన సూత్రములు.
1.వివిధ రాజ్యములు ఒండొరుల రాజ్య పరిధులను అధికారములను గౌరవించుట .
2.ఒకరి రాజ్యముపై నొంకొకరు దురాక్రమణ చేయకుండుట.
3.ఒకరి అంతరంగిక విషయములలో నొంకొకరు కలుగ చేసి కొనకుండుట.
4.సమానత్వము, అన్యోన్య(పరస్పరము - అన్యోన్యము) సాహాయ్యము.
5.శాంతియుత సహజీవనము.
సమ్మితము - 1.సమానము, 2.సమానమైన పరిమితి కలది.
ఉజ్జి - జత, విణ.సాటి, రూ.ఉజ్జీ, ఉద్ది.
నెట్టె - సరియగు జత, ఉద్ది.
ఉద్ది - 1.జత, జట్టు, 2.చెలిమి, విణ.1.సమానము, 2.ప్రతిస్పర్ధి.
ఉద్ధీఁడు - 1.జతకాడు, 2.మిత్రుడు, రూ.ఉద్ధికాఁడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.
సుహృదుఁడు - మిత్రుడు.
సాప్తపదీనము - చెలిమి, వ్యు.ఏడు మాటలలో లేక ఏడు అడుగులలో కలుగునది.
సాటి1 - ఒకవస్తువునిచ్చి మరొకటి మార్చుకొనుట, వినిమయము, పరివర్తనము, రూ.సాటా, సాటాకోటి.
వినిమయము - వస్తువుల మారుపు, పిరాయింపు, మారకము.
మారకము1 - 1.అంటువ్యాధి, 2.డేగ, వ్యు.చంపునది.
మారకము2 - (అర్థ.) వినిమయము, ఒక దేశపు ద్రవ్యమునకు మరియొక దేశపు ద్రవ్యములో గల విలువ.
సాటి2 - సమానము, రూ.సాటిక.
ప్రతి - 1.సమానము, 2.మారు, 3.ఒక్కొక్క.
మారు - ప్రతి.
సజాతి - (గణి.) ఒకే జాతికి చెందిన, ఒకే ఘనత కలిగిన (Like).
సాజాతనము - 1.సజాతిత్వము, 2.పోలిక.
తౌల్యము - సామ్యము, పోలిక; సామ్యము - సమత్వము, పోలిక. సాధర్మ్యము - పోలిక; సాదృశ్యము - పోలిక; పాటి - సామ్యము, విణ.సమము.
తుల - 1.త్రాసు, 2.పోలిక(పోలిక - సామ్యము), 3.రాసులలో ఒకటి.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
సమన్వితము - కూడుకొన్నది.
సమము - 1.సమానము, 2.సాధువు.
సమ్మితము - 1.సమానము, 2.సమానమైన పరిమితి కలది.
సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు.
సహృదయుఁడు - మంచిమనస్సు గలవాడు.
చెలఁగరు కలఁగరు సాధులు,
మిళితములయి పరులవలన మేలుం గీడున్
నెలకొనిననైన నాత్మకు,
నొలయవు సుఖదుఃఖచయము లుగ్రము లగుచున్.
భా|| సజ్జనులు ఇతరులు చేసిన ఉపకారానికి పొంగిపోరు. అపకారానికి క్రుంగిపోరు. మహాత్ముల(మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)ఆత్మలను సుఖ దుఃఖాలు ఆవహించవు.
ప్రఖ్యుఁడు - సమానుడు, (ఉత్తర పదమైనచో).
జాతి1 - 1.కులము, 2.పుట్టుక, 3.సమానత్వము, 4.జాజికాయ(జాతికోశము - జాజికాయ), 5.మాలతి, 6.పద్యభేదము.
జాతి2 - (జీవ.) గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలిసి ఒక జాతిగా వర్గీకరింపబడినది (Genus).
జాతి3 - (చరి, రాజ.) ఒక దేశములో నివసించుచు సాధారనముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు.
సజాతీయత - (చరి.,రాజ) భాష, మతము, ఆచారము, సాంప్రదాయములు, చరిత్ర యొక్క బంధముగల ప్రజలు (Nationality).
జాతము - సమూహము, విణ.పుట్టినది.
గణము - 1.గుంపు, సమూహము, 2.సేనలో ఒక భాగము, వర్ణముల సమూహము, 4.గురులఘు వర్ణముల కూడిక కలది.
గణనాయిక - గౌరి, పార్వతి(శివుని సన్నిధి నందు దేవిస్థానం పార్వతి).
గణపతి - వినాయకుడు; విఘ్నరాజు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
సమవాయము - 1.సమూహము, 2.కూడిన సంబంధము.
సమవేతము - సమవాయము నొందినది.
సంఘము - 1.ప్రాణిసమూహము, 2.గుంపు.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ. నివహము - గుంపు.
కులము - 1.వంశము, 2.ఇల్లు, 3.తెగ, 4.శరీరము, 5.ఊరు.
వంశము - 1.కులము, 2.వాసము (వెదురు), 3.పిల్లనగ్రోవి, 3.వెన్నుగాడి, 4.సమూహము, 5.ఒక పురాణ లక్షణము.
నివసతి - ఇల్లు; నివసనము - ఇల్లు.
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివాసి - వాసము చేయువాడు.
పదుగు - 1.సజాతీయ ప్రాణి సమూహము, 2.కొలము, 3.పంక్తి.
కొలము - 1.వంశము, సజాతీయ ప్రాణిసమూహము, సం.కులమ్.
ధామము - 1.ఇల్లు, 2.చోటు, 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము, 6.మేను, 7.పుట్టువు.
ధామనిధి - సూర్యుడు Sun.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక.
జని - 1.స్త్రీ, 2.భార్య, 3.కోడలు, పుట్టుక.
స్త్రీ - ఆడుది. అబల - స్త్రీ; అతివ - స్త్రీ.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
కోడలు - కుమారుని భార్య.
జననము - 1.పుట్టుక, 2.వంశము.
గోత్రము - 1.వంశము, 2.పేరు, 3.కొండ.
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 2.భూమిని రక్షించువాడు.
సంభవము - 1.పుట్టుక, 2.హేతువు, 3.కూడిక.
సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
వేద మూలమిదం జ్ఞానం, భార్యామూలమిదం గృహమ్|
కృషిమూల మిదంధాన్యం, ధనమూల మిదంజగత్||
తా. జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు భార్యయేమూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. - నీతిశాస్త్రము
అన్వవాయము - కులము, వంశము.
అన్వితము - 1.కూడుకున్నది, 2.పదాదుల పరస్పర సంబంధము కలది, అన్వయించినది, రూ.అన్వీతము.
అన్వయము - 1.పదములకు గాని పదార్థములకుగాని పరస్పర సంబంధము, 2.కులము, 3.(తర్క.) సాధనమునకును, సాధ్యమునకు ను గల నియత సంబంధము.
అభిజనము - 1.కులము, 2.జన్మభూమి, 3.పరిజనము, 4.కులాంగత మైన టెక్కెము మొ.బిరుదు.
యూధము - సజాతీయ పశుసమూహము, పశుపక్షి సమూహము.
ప్రాకృతిక గోత్రము - (వృక్ష.) ముఖ్యమగు కొన్ని సమానలక్షణములు గల కొన్ని కుటుంబముల సమూహము, స్వాభావిక గోత్రము.
ఉపగతి - 1.ప్రాప్తి, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.అంగీకారము.
ఉపగమము - 1.అంగీకారము, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.ప్రాప్తి, 5.కలియుట. పొసఁగుడు - 1.ప్రాప్తి, 2.స్నేహము.
సారూప్యము - 1.సమానరూపత్వము, 2.ఒక విధమైన ముక్తి.
సానిధ్యము - సామీప్యము; సామీప్యము - సమీపత్వము, దగ్గర.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
దగ్గఱ - డగ్గర; డగ్గఱు - క్రి.సమీపించు.
దగ్గఱ - క్రి.సమీపించు, రూ.డగ్గఱు.
సాలోక్యము - 1.సమానలోకత్వము, 2.ఒక విధమగు ముక్తి.
సాయుజ్యము - 1.సహయోగము, 2.ఒక విధమైన మూర్తి.
సారూప్యం తవపూజనే, శివ! మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే
సాలోక్యం సచరాచరత్మక తనుధ్యానే భవానీపతే !
సాయుజ్యం మమ సిద్ధ మత్ర భవతి స్వామిన్ | కృతార్ధో స్మ్యహమ్.
భా|| దేవదేవా ! ఈ జన్మలో నేను నిన్ను ఆరాధించడం వల్ల సారూప్యము, 'శివా! మహాదేవా!' (మహాదేవుడు - శివుడు)అని స్తోత్రం చెయ్యడం వల్ల సామీప్యము, నీ భక్త జనులతోటి(సాంగత్యము - కూడిక)సంభాషణాదుల వల్ల సాలోక్యము, చరాచరాత్మకమైన భవదీయ స్వరూప ధ్యానం వల్ల భవానీ(భవాని-పార్వతి)పతే సాయుజ్యము లభిస్తున్నాయి. ప్రభూ ! కనుక నేను కృతార్ధుడ నయ్యాను దేవా ! - శివానందలహరి
సమవర్తి - యముడు, వ్యు.అందరి యెడ సమానముగ నుండువాడు. సమం వర్తిం శీలమస్యేతి సమవర్తీ. న. పు. వృతు వర్తనే - అందఱియందు ను పక్షపాతము లేక సమముగా వర్తించు స్వభావము గలవాఁడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
6. నాగము - 1.సత్తు, 2.తగరము, 3.పాము, 4.ఏనుగు, 5.కొండ, 6.మేఘము, మబ్బు 7.తములపాకుతీగ. air in organs.
సత్తు - సత్త్వము, సత్యము, సారము, వి.సీసము, సం.విణ. (సత్) ఉన్నది, 1.చదువరి(ౘదువరి - విద్వాంసుడు), 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒకగుణము, 4.జంతువు. జంతువు - చేతనము, ప్రాణముగలది.
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగల సారము, (Active principle).
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
కృత్యము - యుగములు నాల్గింటిలో మొదటిది, విణ.చేయబడినది.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ.
సత్తి - 1.శక్తి, 2.ఒక ఆయుధము, 3.కాళి, 4.బలము, 5.వసిష్ఠుని కుమారుడు, సం.శక్తిః.
సత్తితాలుపు - కుమారస్వామి, శక్తిధరుడు.
శక్తిధరుఁడు - కుమారస్వామి.
సైన్యము -1.సేనతోకూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరుగుఱ్ఱములో నొకటి.
సేన - దండు, విణ.అధికము, చాల.
దండు - 1.దండము, 2.సేన, 3.గుంపు, సం.దండః.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి. మహాసేనుఁడు - కుమారస్వామి.
లావు - 1.బలము, 2.అతిశయము, 3.సామర్థ్యము, విన.స్థూలము.
లావరి - (లావు+అరి) బలవంతుడు.
సామర్థ్యము - 1.నేర్పు(విచక్షణత - నేర్పు), 2.యోగ్యత (భౌతి.) పనిచేయు రేటు, (Power), (గృహ.) బలము, సత్తువ.
నేరిమి - సామర్థ్యము, రూ.నేరుపు, నేర్మి, నేర్పు.
యోగ్యత - అర్హత, eligibility.
ఔచిత్యము - యోగ్యత; ఔచితి - 1.ఉచితత్వము, 2.యోగ్యత.
ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.
శక్తిపరిమాణము - (గృహ.) విశాలము(విశాలము - విరివియైనది), యోగ్యత, సామర్థ్యము, తాహతు (Capacity or ability).
శక్తి - (గణి., భౌతి.) అచల స్థితినిగాని, ఒకేదిక్కుగా చలించెడి స్థితినిగాని కలుగజేయు బలము, (శక్తి వివిధ రూపములలో నుండును. ఉదా. యాంత్రిక, తేజః విద్యుత్, ఉష్ణ, అయస్కాంత, రసాయనిక, శబ్దశక్తులు మొదలైనవి, (Energy) సం.వి.1.బలిమి, 2.చిల్లకోల, 3.పార్వతి ఇచ్ఛాది శక్తులు మూడు (జ్ఞాన, క్రియ, ఇచ్ఛ), ఉత్సాహాది శక్తిత్రయము (ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి). (సర్వదేహుల యందు దేవీస్థానం శక్తి.)
కాళి - 1.గౌరి, పార్వతి(గణనాయిక - గౌరి, పార్వతి), ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు. కాలంజరమునందు కాళి. కన్యాకుబ్జమునందు గౌరి. శివుని సన్నిధిని పార్వతి.
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి - క్రియాశక్తి స్వరూపిణీ|
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ.
ఆస్తేనియా - (గృహ.) (Asthenia) బలము తగ్గుట లేక బలము లేకపోవుట.
తగరము - తవురము, ఒక తెల్లని లోహము, రూ.తవరము, సం.తవరమ్, వై.వి. (రసా.) వంగము సులభముగా కరగు వెండివలె తెల్లనగు ధాతువు (Tin) (ఇది ఆవర్తక్రమ పట్టికలో నాల్గవ వర్గమున కననగును.) సం.వి.పొట్టేలు.
వంగము - 1.తగరము, సత్తు, 2.వంగ, 3.వంగదేశము.
వంగ - వంగచెట్టు, సం.వంగమ్.
వంకాయ - (వంగ+కాయ) వంగకాయ, వార్తాకము.
వార్తాకము - వంగ.
వంగలేపనము - (రసా.) ఇనుమునకు, ఇత్తడికి రాగికి తగరపు కళాయి పూయుట, (Tinning).
వినమ్రము - మిక్కిలి వంగినది, సం.వి.తగరము (వినమితము).
తమరము - 1.తగరము, 2.సీసము. మహాబలము- సీసము.
ఉరణము - పొట్టేలు, వ్యు.బిగ్గరగా మొరపెట్టునది.
ఉరభ్రము - ఉరణము, పొట్టేలు, తగరు.
పొటేలు - మగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
తగరు - పొట్టే, సం.తగరః.
తగరురౌతు - అగ్ని.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి. అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.
నాగువు - నాగము, త్రాచు, రూ.నాగుబాము, నాగులు, సం.నాగః.
నాగ - 1.పూజ్యము, (ఉదా. నాగ బెత్తము.) 2.పెద్ద (నాగగన్నేరు) సం.నాగః.
త్రాచు - నాగుబాము; మంచిపాము - నాగుపాము.
నాగిని - నాకిని; నాకిని - దేవత స్త్రీ.
నాగుఁడు - శేషుడు, సం.నాగః.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
శేషశయనుఁడు - విష్ణువు.
తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.
7. కృకము - కంఠనాళము, కంఠపు బుడిపి, కుత్తుక.
మ్రింగుటలో సహాయపడునది కృకరవాయువు. రాహుర్గళే |
కుతిక - గొంతు, రూ.కుతుక, కుత్తుక.
గొంతు - 1.కుత్తుక, 2.కంఠధ్వని, రూ.గొంతుక, సం.కంఠః.
కుత్తుక బంటి - కంఠము వరకు, ఉదా.కుత్తుక బంటి అన్నము తిని.
గొంతెమ్మ - (వ్యావ.) ఒకానొక గ్రామదేవర, రూ.గొంతెమ.
గొంతెమ్మ కోర్కెలు - అలభ్యమగు కోరికలు, కోరదగనికోర్కెలు.
కంఠము - 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము.
కంఠ్యము - కంఠము నందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
కంఠబిలము - గళమునుండి శ్వాస నాళికలోనికి పోవు ద్వారము (Glottis).
కృకవాకువు - 1.కోడి, 2.నెమలి, వ్యు.తలయెత్తి కూయునది, 3.మైల చాయ తొండ, సరటము.
కృకలాసము - ఊసరవెల్లి, తొండ, రూ.కృకలాశము, వ్యు.కంఠముతో ఆడునది.
కృకవాకుధ్వజుఁడు - కుమారస్వామి.
8. దేవదత్తము - అర్జునుని శంఖము.
ఇంద్రియములు విజృంభించునట్లు చేయునది దేవదత్తవాయువు.
9. ధనంజయ - 1.అగ్ని, 2.అర్జునుడు. air in the stomach.
ధనుజయతీతి ధనుంజయః జి జయే - ధనమును జయించువాఁడు.
ధనంజయః = రాజసూయయాగమునకు అనేక రాజులనుండి ధనమును సంపాదించి తెచ్చుటచేతను, లేక ధనమునుగూర్చిన ఆశను జయించినవాడగుట చేతను అర్జునునకు ధనంజయుడని పేరు వచ్చింది.
ప్రాణఘోషయందు నిలుచును, ప్రాణము పోయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయ వాయువు. (చెవులు వ్రేళ్ళు పెటుకొన్నచో గుయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము).
కృపీటయోని - అగ్ని, వ్యు.నీటికి ఉత్పత్తిస్థానమైనది.
కృపీటము - 1.జలము, 2.కడుపు, 3.సమిధ.
కృపీట ముదకం యోనిః కారణం యస్య సః కృపీట యోనిః ఇ-పు. - కృపీటమనఁగా ఉదకము; అది కారణముగాఁ గలవాఁడు.
కృపీట స్యాంభసో యోనిః - ఉదకమునకు నుత్పత్తిస్థానము.
జాతవేదుఁడు - అగ్ని.
జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః న - పు. - ఇతనివలన వేదములు పుట్టినవి.
జాతేజాతే విద్యత ఇతి వా జాతవేదాః విద స్తాయాం - పుట్టిన దేహము నందెల్ల నుండువాఁడు.
జాతం శుభాశుభం వేత్తీభం వేత్తీతివా, విద జ్ఞానే - పుట్టిన శుభాశుభము ల నెఱుంగువాఁడు.
వేదో హిరణ్య మస్మాజ్ఞాత ఇతివా - హిరణ్యము వీనివలనఁ బుట్టినది.
తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనము(పచనము - వండుట)చేసి శరీరము పడకుండ కాపాడునది.
తనూం న పాతయతి ధారయతీతి తనూనపాత్. త.పు. వఌ గతౌ - శరీరమును నిలుపువాఁడు.
ఇంధనం వినా స్వతనుం నపాతీతివా. పా రక్షణే - ఇంధనము లేక తన్ను రక్షించుకొనఁ జాలనివాఁడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.
(ౙ)జంటమోము వేలుపు - 1.అగ్నిదేవుడు.
నాలుగు కన్నుల వెలుపు - అగ్ని.
సతనాల్కల జేజే - అగ్ని, సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.
ఊర్థ్వలోచనము - మీగండ్ల మెకము, శరభము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
దచ్చికాళ్ళ మెకము - శరభము, అష్టాపదము.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్.
అష్టాపదము - బంగారము; బంగారము - దుర్లభము, వి.స్వర్ణము Gold. జాతరూపము - బంగారము; కార్తస్వరము - బంగారము.
బర్హిస్సు - అగ్ని.
బర్హి - 1.నెమలి Peacock, 2.దర్భ.
బర్హము - నెమలిపురి.
బర్హిః. స-పు బృంహతి వర్థతే అజ్యాదినేతి బర్హిః. బృహి వృద్ధౌ - అజ్యాదులచేత వృద్ధిఁబొందివాఁడు.
శుష్మా న-పు శోషయతి జలమితి శుష్మా, శుష శోషణే - ఉదకమును శోషింపఁజేయువాఁడు.
ప. బర్హిశ్శుష్మా. న-పు బర్హిషో దర్భాః శుష్మ బలమస్యేతి బర్హిశ్హుష్మేత్యే కంవాపదం - దర్భలు బలముగాఁ గలవాఁడు.
బృహద్భానువు - అగ్ని.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
తన సత్క ర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైనఁ బెరుఁగు * నయ్యః కుమారా !
తా. తాను చేసిన మంచికార్యముల సాయముచేతనే అదృష్టము త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడపాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా?
కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము, దురాచారుడు.
కృష్ణం వర్త్మ మార్గోయస్యసః కృష్నవర్త్మాన - పు. నల్లనిజాడ గలవాఁడు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
దురాచారుడు - చెడునడవడి కలవాడు.
ఖరువు - 1.గుఱ్ఱము, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము(రదనము - దంతము), 5.భర్తను వరించు కన్య, విణ.దురాచారుడు, 2.క్రూరము.
విధుంతుదుఁడు - రాహుగ్రహము.
గ్రహ కల్లోలము - రాహుగ్రహము.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా. అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయ(కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము
జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః. - భజగోవిందం
అర్జునుఁడు - 1.పాడవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణోత్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||
తా. సహజముగా బ్రాహ్మణులకుఁ(విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రత(సాధ్వి - పతివ్రత)లకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము
పావకుడు - అగ్ని.
పావకో - పునాతీతిపావకః పూఙ్ పవనే - పవిత్రమును జేయువాఁడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనతి జీవంత్యనేన లోకా ఇత్యనలః అన ప్రాణనే - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాప్తి ర్నాస్త్యస్యేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేనివాఁడు.
10. కూర్మము - air in the eyes.
కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మవత్ స్థితత్వాత్కచ్ఛపః - కూర్మము వలె నుండునది. కన్నులు తెరచునట్లు చేయునది కూర్మవాయువు.
క్రోడపాదము - తాబేలు, వ్యు.రొమ్మున నిముడ్చుకొను పాదములు కలది.
కూర్మము - కమఠము, తాబేలు.
కమఠము - తాబేలు, భిక్షాపాత్రము.
తామేలు - తాబేలు.
ధరాధరము - 1.కొండ, 2.తాబేలు.
పీవరము - బలిసినది, వి.తాబేలు.
పీనము - బలిసినది, వి.సంతోషము.
లప్ప - రాశి, విణ.కండకలది, బలిసినది.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
తాబేలు - A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.
Turtle - Tortoise with short legs, An animal of water covered with a hard shell, withdraws all its limbs in its body.
యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్దేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || - 58శ్లో సాంఖ్యయోగః
తాబేలు తన అంగములను(తలను, నాలుగు కాళ్ళను) చాపి పనిలేన పుడు బొరుసు(తాబేటి చిప్ప)లోనికి ముడుచుకొనునట్లు, ఎవడు తన (యోగి)రాగద్వేషాది దోష భయమున పంచేద్రియములను సర్వ విషయ సుఖముల నుండి వెనుకకు మరల్పగల్గునో అట్టివాడు స్థితప్రజ్ఞుడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. - భగవద్గీత
ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారమ్,
జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానమ్. - భజగోవిందం
The regulation of breath, the withdrawal of the senses(from their respective objects), the inquiry consisting in the discrimination between the eternal and non-eternal, the method of mind-control associated with the muttering of mantras – perform these with great care.
ధారణం చాలనం క్షేపం సంకోచ ప్రసరం తథా|
వయోః పంచగుణాః ప్రోక్తాః బ్రహ్మజ్ఞానేన భాషితమ్||
స్థిరత్వం, చలనం, తిరస్కారం, లాగికొనుట, దూరంగా జరుగుట అనేవి వాయువు యొక్క పంచగుణాలు.
ముడుచుట, సాచుట, పరిగెత్తుట, దాటుట, వ్యాపారం; ఈ ఐదు 5 వాయువు యొక్క గుణాలు
1. ముఁడుగు - 1.సంకోచించు, 2.చేష్టలుడుగు, సం.ముకుళనమ్.
సంకోచించు - సంకోచము నొందు, 2.అనుమానించు, జంకు.
సంకోచము - 1.ముకుళీభావము, 2.సంక్షేప్తము.
మొగుచు - ముడుచు.
మొగుడు - వై.క్రి. ముకుళించు.
అనిత్యము - 1.నిత్యము కానిది, నశ్వరము, 2.నిలుకడ లేనిది, 3.సంశయాస్పదము, 4.తాత్కాలికము.
ముడుతలు - (గృహ.) నలుగుట, సాపులేక పోవుట, చర్మము లేదా బట్టలు ముడుతలు (Wrinkles).
కుంచించుకొని పోవుట - (గృహ.) ముడుచుకొని పోవుట, క్రొత్త బట్టను నీటిలో ముంచినచో లేదా ఉదికినప్పుడు అది ముడుచుకొనుటచే చిన్నదిగనగుట (Shrinkage).
ఆకుంచనము - 1.ముడుచుట, ముడుగుట, 2.వంచుట, వంగుట.
2. తతము - 1.బిగించబడినది, 2.వ్యాపించినది(Strectched), వి.1.ఇటునటు బలముగా లాగబడిన తంతువు (Stretched String), 2.బిరడాలు త్రిప్పిన లాగబడిన (బిగిసిన) తీగ, 3.వీణాది వాద్యము, 4.గాలి.
3. దౌడు - పరుగు, రూ.దవుడు, సం.ధావ్.
ధావనము - 1.పరుగు, 2.శుద్ధి.
పరువు - ధావనము, పరుగెత్తుట, 2.కోసుదూరము, రూ.పరుగు. ధావనము - (రసా.) కడుగుట, (Washing).
ధావకుఁడు - చాకలి.
శుద్ధి - 1.శోధనము, 2.మార్జనము, 3.కడుగుట, 4.పవిత్రత.
శోధనము - (రసా.) ఒక ద్రవ్యమును శుద్ధము చేయుట, (Purification), సం.వి.శుద్ధిచేయుట, పరిశోధించుట, వెదకుట.
మార్జనము - 1.శుద్ధి, 2.తుడుచుట.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషము లేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
పరికర్మము - దేహమునందలి మురికి పోగొట్టుట.
పరిపూరితము - పవిత్రమైనది.
వీతి - 1.పరుగు, 2.తిండి, 3.జిగి(జిగి - కాంతి), 4.గుఱ్ఱము.
వీతిహోత్రుఁడు - అగ్ని.
మనిషికి నిలబడటం తేలిక - పరుగెత్తడము కష్టము.
కాని మనస్సుకు పరుగెత్తడం తేలిక - నిలబడటం కష్టము.
4. నిస్తరణము - దాటుట, రూ.నిస్తారము.
నిస్తరించు - దాటు.
దాఁటు - 1.లంఘించు, 2.తరించు, 3.ఉల్లంఘించు, వి.లంఘనము.
లంఘనము - 1.దాటు, 2.లాగు, 3.గుఱ్ఱపు దూకుడు, సం.(గృహ.) తిండి లేక మాడుట (Starvation).
లాఁగు - 1.చల్లడము, 2.మల్లబంధము, 3.లంఘనము, సం.లంఘః. తరణము - 1.దాటుట, 2.తరించుట.
చంక్రమణము - 1.దాటుట, 2.కదలుట.
ఉల్లంఘనము - 1.దాటుట, 2.అతిక్రమణము, మీరుట.
అతిక్రమణము - (భౌతి.) 1.కాంతి కిరణము, 2.సామాన్య మార్గమును అతిక్రమించుట (Deviation).
అతిక్రమించు - మీరు, దాటు, ఉల్లంఘించు.
అతిక్రాంతము - 1.మీరినది, అతీతము, గతించినది.
అతకరించు - 1.క్రిందుపరచు, మించు, అతిక్రమించు, 2.ఉల్లంఘించు. మీఱు - అతిక్రమించు, కడచు.
(ౙ)జంగ - 1.పిక్క, 2.దాటు, సం.జంఘా.
(ౙ)జంగగొను - 1.దాటు, 2.దుముకు.
గంతు - 1.దుముకు, ఒక విధమైన గుఱ్ఱపు నడక, బహు.త్రుళ్ళు, మిడిసిపాటు.
దుముకు - 1.ఉరుకు, గంతువేయు, దూకు.
ఉఱుకు - 1.దుముకు, 2.పరుగెత్తు, 3.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప.
త్రుళ్ళు - 1.ఎగిరిపడు, 2.గర్వించు.
మిడిసిపాటు - మిట్టుపాటు.
మిట్టు - ఎగురు, మిట్టిపడు, ఎగిరిపడు.
మిడి - మిట్టిపాటు, గర్వము, విణ.1.మిడిసిపాటు గలది, 2.ఉన్నతము.
మిడినాగు - ఎగిరి ఎగిరిపడు పాము, రూ.మిడునాగు.
ప్లవంగము - 1.కోతి, 2.కప్ప, వ్యు.దాటుచు పోవునది.
ప్లవము - 1.తెప్ప, 2.కప్ప, 3.కోతి.
తెప్ప - 1.నీటిపై పడవవలె తేలగట్టిన కొయ్యలు, 2.రాశి, రూ.తేవ.
తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.
పోతము - 1.పక్షిపిల్ల, 2.పదేండ్ల యేనుగు, 3.ఓడ.
పోతవణిజుఁడు - ఓడ బేరగాడు.
వహనము - 1.పడవ, ఓడ, 2.స్నాయువు.
పడవ - మిక్కిలి పల్లమైనది.
ఓడ - నావ(నావ - ఓడ), తరణి, హోడః.
హోడము - నావ, ఓడ.
తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.
స్నాయుః స్త్రియామ్ -
వస్తేఛాదయతి దేహం వస్నసా. వస ఆచ్ఛాదనే. - దేహమును గప్పుకొని యుండునది. పా. స్నసా. "స్నసా స్నాయుశ్చ కథితా" ఇత్య మరమాలాయాం.
స్నాతి సదా ఆర్ద్రీభవతి స్నాయుః. సీ. ప్ణా శౌచే. - ఎప్పుడును ఆర్ద్రమై యుండునది. ఈ రెండు సన్నపు నరముల పేర్లు.
కండరము - స్నాయువు, మాంసరజ్జువు.
స్నాయువు - సన్ననరము, సం. (జం.) ఎముకలను కలిసియుంచు ఆధారకణజాలములో నేర్పడిన పట్టి, సంధి, బంధనము. (Ligament).
సంధి - 1.కూడిక, 2.శత్రువుల తోడి పొందు, 3.సందు, 4.సొరంగము, 5.రూపకముల యొందొక అంగము, (వ్యాక.) ముందరిపదము యొక్క చివర యక్షరము, ఒకదానితో నొకటి కూడుకొనుట. ఉదా. వాడు+ అన్నము తినెను = వాడన్నము తినెను.
సంధి - (జం.) కీలు, వేరుగానున్న రెండు ఎముకలు గాని గట్టిపడిన భాగములుగాని కలియుచోటు (Joint).
బంధనము - 1.కట్టు, 2.చెర, 3.తొడిమ(తొడిమ – కాడ), 4.కట్టెడు సాధనము.
అక్కరపాటువచ్చు సమయంబునఁ జుఋఋఅము లొక్కరొక్కరి
న్మక్కువ నుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడలబండ్లు బండ్లనోడలున్
దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా.
తా. భాస్కరా! ఒక్కొక్కఫ్ఫుడు నీటిలో నడచు ఓడలమీద బండ్లును, నేలమీద నడచు బండ్ల మీద ఓడలును వచ్చుచుండుట నందఱును చూచుచున్నదియే గదా. అట్లే, తగిన అవసరము వచ్చినప్పుడు బంధువు లొకరి నొకరు కాపాడుకొనుట మిత్రత్వమునకు మిక్కిలి మంచిది.
కా తే కాంతా ధనగతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా,
త్రిజగతి సజ్జనసంగతిరేకా భవతి భవార్ణవతరణే నౌకా. – భజగోవిందం
Why worry about wife, wealth, etc., O crazy one; is there not for you the One who ordains? In the three worlds, it is only the association with good people that can serve as the boat that can carry one across the sea of birth (metempsychosis).
గోపనము - 1.దాటుట, 2.కాపాడుట, 3.గుప్తపరచుట, రహస్యముగా నుంచుట, గూఢ పరచుట, దాచిపెట్టు, మరుగు చేయుట (Concealment).
గోప్యము - రక్షింపదగినది, (వ్యవ.) రహస్యమైనది.
గోపాయితము - 1.రక్షితము, 2.దాపబడినది.
దాఁపరికము - గోపనము.
దాఁపు - దాచు, చూ.దాఁగు.
దాఁపురము - 1.మరుగుపుచ్చుట, గోపనము, 2.దాచిన సొమ్ము.
5. వ్యాపారము - 1.పని, 2.ఉద్యోగము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
కార్యము - 1.పని, 2.హేతువు(హేతువు – కారణము), 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది.
కృత్యము - పని, వ్యాపారము, విణ.చేయదగినది.
కృత్య - 1.ఒకానొక దేవత 2.చేష్ట.
చేష్ట - 1.పని, 2.వ్యాపారము.
చెయిది - చెయిదము, చేష్ట.
చెయిదము - 1.పని, చేష్ట, రూ.చెయిది, చెయ్ది, చెయువు.
చెయ్ది - చెయిదము; చెయ్దము - చెయిదము.
చెయ్వు - చెయువు; చెయువు - చెయిదము.
చెయువుల సాకిరి(సాకిరి – సాక్షి) - 1.కర్మసాక్షి, సూర్యుడు.
కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలకు సాక్షియైనవాడు.
చిరక్రియుఁడు - విణ. తామసించి కార్యము చేయువాడు, రూ.చిరకారి. అస్పదము - 1.నెలవు, 2.పని, 3.గొప్పపదవి.
వ్యావృత్తి - వ్యాపారము.
వర్తకము - వ్యాపారము, బేహారము.
బేహారము - వ్యాపారము, రూ.బెహారము.
బెహారము - వాణిజ్యము, రూ.బెహరము, బేహారము, సం.వ్యవహారః.
వాణిజ్యము - (అర్థ.) వ్యాపారము, వర్తకము, సరకులను లాభముల కొరకు అమ్ము వృత్తి.
బేహారి - వ్యాపారము తెలిసినవాడు, వణిజుడు.
వాణిజుఁడు - సార్థవాహుడు.
సార్థవాహుఁడు - వర్తకుడు, విణ.ముఖ్యుడు.
వర్తకుఁడు - వ్యాపారి.
వ్యాపారి - మాధ్వబ్రాహ్మణుడు, విణ.వ్యాపారము గలవాడు.
వినీతుఁడు - 1.జితేంద్రియుడు, 2.గురువు చేత శిక్షింపబడినవాడు, 3.విధేయుడు(వశవర్తి - విధేయుడు), వి.వర్తకుడు, వ్యాపారి.
వర్తకతాటకము - (అర్థ.) విదేశములలో వ్యాపారము సలుపునపుడు ఎగుమతుల దిగుమతుల అంత్యఫలితము. విదేశ వాణిజ్యావశేషము, (ఇది అనుకూలముగ గాని ప్రతికూలముగ గాని యుండును).
సత్యానృతము - వర్తకము, వ్యు.కొంత నిజము, కొంతకల్లతో కూడినది.
భాగస్వామి - (వాణి.) వ్యాపార సంస్థలు మొ. వానిలో భాగము గలవ్యక్తి (Partner).
భాగస్వామిత్వము - (వాణి.,శాస.) ఉమ్మడిగా గాని, అందరి తరపున ఒకనిచే గాని నిర్వహింపబడు చుండెడి వ్యాపారము వలన లభ్యమగు లాభములను పంచుకొనుటకు గాను ఒడంబడిక చేసికొనిన వ్యక్తుల మధ్యనున్న సంబంధము, లాభనష్టములను భాగస్వాములు నియత నిష్పత్తిలోగాని, అది లేనిచో సమానముగ గాని పంచుకొందురు. చట్టరీత్యా ఒక భాగస్వామి చేయు పనులకు మిగిలిన వారు వైయుక్తికముగను, సమిష్టిగను అపరిమిత బాధ్యత కలిగి యుందురు.
పరమమిత్ర రాష్ట్రఖండము - (రాజ.) ఒడంబడిక చేసికొనునపుడు ఒక దేశము మరియొక దేశము నెడల వాణిజ్యవర్తక విషయములలో పక్షపాతము చూపనని హామీ యిచ్చుట.
సార్థము - 1.జంతుసమూహము, 2.వర్తకజన సమూహము, విణ.అర్థముతో కూడినది.
బుల్స్ - (అర్థ.) (Bulls) సాహసిక వ్యాపారములో ధర పెరుగు నని ఆశించి ఆశ ఫలించినచో లాభము పొందు ఒక కంపెనీ వాటా వ్యాపారులు.
వాటాదారు - (వాణి.) వ్యాపార సంస్థలలో వాటాలు గల వ్యక్తి (Share holder)
వాటాహక్కు నష్టము - (వాణి.) వాటాదారుడు, వాటాలపై కట్టవలసిన సొమ్మును గడువులో చెల్లింపనిచో కంపనీ నిర్దేశకులు అతనిని వాటాదారుగ తొలగింతురు, ఇట్లు హక్కు నష్టము చేసిన వాటాలపై ఇదివరకే చెల్లించిన సొమ్మును, కంపనీ తిరిగి యియ్యక పోవుటయేకాక, ఆ వాటాలను మరియుకనికి అమ్ముట కూడ జరుగును.
స్వేచ్ఛావ్యాపారము - (అర్థ.) ప్రభుత్వ నియంత్రణ కాని జోక్యము కాని లేని వ్యాపారము.
చిల్లరవర్తకుఁడు - (వాణి.) టోకువర్తకుల యొద్ద చిన్న మొత్తములలో సరకులను కొని భోక్తల కందించు వర్తకుడు.
టోకువర్తకుడు - పెద్దరాసులలో సరకులు కొని చిల్లరవర్తకుల కమ్మువాడు.
టోకుబేరము - మొత్తముబేరము, వ్యతి.చిల్లర బేరము.
చిల్లర - 1.కొంచెపాటి నాణెము, 2.చింతపండు మొదలగు సరకులు, విణ.సామాన్యము.
నేలవిడిచి సాము - జాతీ. నిరాధార వ్యాపారము.
ఆఢ్యుఁడు - ధనికుడు, సమృద్ధికలవాడు.
ధనికుఁడు - 1.ధనము కలవాడు, 2.మంచివాడు, 3.అప్పిచ్చువాడు.
ధని - ధనము కలవాడు.
ధనిక - 1.వర్తకుని భార్య, 2.యువతి.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
సెట్టి - శ్రేష్ఠి, వర్తకులు మొ. వారి పట్టపుపేరు, వర్తకుడు, సం.శ్రేష్ఠి.
శ్రేష్ఠి - కులమందు శ్రేష్ఠుడైన శిల్పి, కోమట్ల బిరుదు, విణ.కులశ్రేష్ఠుడు, వికృ.చెట్టి.
దానం భోగో నాశస్తిప్రోగతయో భవంతి విత్తస్య
యోనదదాతి నభుం క్తేతస్య తృతీయాగతి ర్భవతి||
తా. ధనమునకు దానము, అనుభవము, నాశము అను నీ మూడు విధములైన గతులుగలవు. ఏ ధనికుండు యెవరికి నియ్యక తా ననుభవించక యున్నాఁడో వాని ధనము దొంగలపాలగును. - నీతిశాస్త్రము
ఉపయోగము - 1.అనుకూల్యము, 2.వాడుక, 3.ప్రయోజనము.
ఉపయుక్తి - (అర్థ.) ఉపయోగము, ఉపయోగిత, అక్కరగల వస్తువు యొక్క అనుభవసౌఖ్యము.
ఉపయుక్తి - (అర్థ.) ఉపయోగిత, వస్తువు యొక్క ఉపయోగము, వ్యక్తి యొక్కవాంఛలను తీర్చగలశక్తి, ప్రయోజనము. (ఏదేని పదార్థమును అనుభోగించుట మొదలిడిన వెంటనే ఆ పదార్థ రాశి వలన వచ్చు ఉపయోగిత ఎక్కువగు చుండును. అటుపై ఇంకను అదే పదార్థమును అనుభోగించిన ఉపయోగిత స్థిరముగ నుండును. అటు పిమ్మట క్రమముగ తగ్గిపోవుచుండును.)
ఉపయుక్తము - 1.అనుకూలమైనది, సరిపడినది, 2.ఉపయోగింప బడినది, 3.న్యాయమైనది.
వాడుక - 1.ఉపయోగము, 2.పాడి, 3.రివాజు, 4.అభ్యాసము.
వాడుక - (గృహ.) క్రమము, పరిపాటి, నియతచర్య (Routine).
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము.
అభ్యాసము - 1.అలవాటు, 2.ఆవృత్తి, సాధన, 3.(గణి.) గుణించుట, విణ.దాపైనది.
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధాంతము వి.(అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తి నిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో ముల్య మధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (Motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).
కర్మ1 - (వ్యాక.) ధాతువుయొక్క అర్థమైన ఫలమును ఆశ్రయమైనది, ఉదా.వాడు అన్నము వండెను. వండుట అను పనికి అన్నమగుట ఫలము, ఈ వాక్యములో అన్నము కర్మ.
కర్మ2 - (భౌతి.) ఏబల ప్రయోగ బిందువు కొంత దూరము ఆ బలము పనిచేయు దిక్కుననే జరుగునో ఆబలము సాధనముగ ఒక ఫలమును జనింపజేయు క్రియ,(Work). (బలమును బలప్రయోగ బిందువు జరిగిన దూరముచే గుణించినచో ఫలిత-కర్మ= (పని) లభ్యమగును).
కర్మంది - యతి.
యతి - 1.పద్యవిశ్రమ స్థానము, 2.సన్యాసి.
సన్న్యాసి - సన్న్యసించినవాడు.
ఆఫలోదయకర్ముఁడు - ఫలము కలుగు నతవరకు కర్మచేయువాడు.
ఉద్యోగము - 1.యత్నము, 2.పని, 3.కొలువు, 4.పాటుపడుట.
యతనము - యత్నము, వికృ.జతనము.
కొలువు - 1.ఓలగము, ఆస్థానము, 2.సేవ.
ఓలగము - 1.కొలువు, 2.కొలువు కూటము.
ఆస్థానము - సభ, రాజసభ, సభామండపము.
సేవ - శుశ్రూష, కొలువు.
శుశ్రూష - 1.విననిచ్ఛ, 2.సేవధి, 3.చెప్పుట.
శుశ్రూషకుఁడు - శుశ్రూషచేయువాడు, శిష్యుడు, సేవకుడు.
శిష్యుఁడు - విద్యకొరకుచేరి సేవించుచు శిక్షింపబడువాడు.
సేవకుఁడు - కొలువుకాడు.
ఉత్తమం కులవిద్యాచ మధ్యమం కృషివాణిజాత్|
అధమం సేవకావృత్తిః మృత్యుశ్చౌర్యోప జీవనాత్||
తా. కులవిద్యవలను జీవనము సేయుటయు ఉత్తమము, కృషివల్లను వర్తకమువల్లను జీవించుట మధ్యమము, కొలువుగొలిచి జీవించుట(అ)ధమము, దొంగతనముచేత జీవించుటకంటె చావుమంచిదని తెలియ వలెను. – నీతిశాస్త్రము
దీర్ఘసూత్రుఁడు - ఆలసించి పనిచేయువాడు.
శ్రమకము - (గృహ.) పాటుపడెడు స్వభావము కలది, పనిచేసెడు స్వభావము గలది, (Industrious).
ఉద్యోగపత్ని క్రియ : క్రియ శూన్యమిన కర్మ వ్యర్థం.
బూర్జువా - (రాజ., అర్థ) మధ్య తరగతి ప్రజలు సామంత తంత్రపు కాలములో ఉన్నత ప్రభు వంశమునకు చెందిన కాయ కష్టముచేసి జీవించెడి ప్రజలను (దీనిలో వర్తకులు, శిల్పులు, వైద్యులు, న్యాయవాదులు కూడ చేర్చబడిరి) ఇట్లు సంబోధించుచుండిరి.
రాజీనామా -1.ఒప్పందము, 2.ఉద్యోగాదులను ఇష్టము మీద విడుచుట.
ఒప్పందము - 1.వ్యాపారుల ఒడంబడిక, 2.అంగీకారము.
గ్రాట్యుటీ - (Gratuity) ఉద్యోగము నుండి విరమించిన వ్యక్తికి లభించు ఉచితార్థ పారితోషికము.
ప్రావిడెంటు ఫండు - (శాస.) (Provident fund) భవిష్యన్నిధి, ఆపదర్థనిధి. ముందు జాగ్రతకోరకు ఏర్పాటు చేయబడిన నిధి. ఉద్యోగి ఉద్యోగము నుండి విరమించునప్పుడు పారితోషికముగా ప్రభుత్వముగాని సంస్థగాని ఇచ్చు నిధి. ఈ నిధికి ఉద్యోగికూడ ఉద్యోగములో నున్నంత కాలము ప్రతిమాసము తన వేతనములో కొంత శతాంశము ఇయ్యవలసి యుండును.
పింఛను - (వ్యావ., రాజ.) ఉపకార వేతనము, ఉద్యోగము చేసిపనినుండి తొలగిన తరువాత ప్రభుత్వము నుండి దొరకు భరణము (Pension).
అభ్యాసానుతరీవిద్యా బుద్ధిః కర్మానుసారిణీ|
ఉద్యోగసారణీ లక్ష్మీ ఫలంభాగ్యానుసారిణీ||
తా. అభ్యాసము ననుసరించి విద్యవచ్చును, కర్మానుసారముగా బుద్ధి గలుఁగును, ఉద్యోగానుసారముగా నయిశ్వర్యము వచ్చును, భాగ్యాను సారముగా ఫలము గలుగును. – నీతిశాస్త్రము
సమాజము - 1.మనుష్యుల గుంపు, 2.సభ, 3.ఏనుగు.
సదము - సభ, రూ.సదసు, సదస్సు.
సమజ్య - 1.సభ, 2.కీర్తి.
మహామృగము - ఏనుగు.
సభలోపల నవ్వినయెడ
సభవా ర్నిరసింతు రెట్టి * జనుని; న్నెఱి నీ
కభయం బొసంగె నేనియుఁ
బ్రభు కరుణను నమ్మి గర్వ * పడకు కుమారా!
తా. సభలో నవ్వరాదు. నవ్వినయెడల ఎంత గొప్పవాఁడయినను తిరస్కరింపబడును. రాజు తనకు ఎంత శరణము నొసంగినప్పటికిని, రాజుల దయను మనస్సున నమ్ముకొని గర్వింపఁగూడదు.
సభ - 1.కొలువుకూటము, 2.సమూహము, 3.జూదము.
దివాణము - 1.రాజభవనము, 2.కొలువుకూటము, సం.దేవాయనమ్.
దర్బారు - కొలువుకూటము; కచేరి - కొలువుకూటము, రూ.కచ్చేరి.
ప్రతిశయము - 1.కొలువుకూటము, 2.గృహము.
గృహము - 1.ఇల్లు, 2.భార్య; గృహిణి - ఇల్లాలు, భార్య.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
ద్యూతము - జూదము; (ౙ)జూదము - జూజము.
జూజము - ద్యూతము, పందెము వేసి యాడెడియాత, మోసము, రూ.జూదము, సం.ద్యూతము.
సమాహ్వయము - 1.పేరు, 2.ప్రాణి, 3.ద్యూతము, 4.యుద్ధము.
శరీరి - ప్రాణి.; జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురుగు, 2.గురుడు (Jupiter).
గురుఁడు - గురువు, బృహస్పతి.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
నవకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాధులతోడన్
నవ్వకుమీ పరసతితో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ.
తా. సభలయందు నవ్వుటయు, తలిదండ్రులను, అధికారులను పరిహసించుట, ఇతరుని భార్యతోటి పరిహాసములు పలుకుటయును, బ్రాహ్మణ శ్రేష్టులను పరిహసించుటయు తగనిపనులు.