ఉత్తర 3, హస్త 4, చిత్త 2 పాదములు కన్యరాశి.
మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః. - బుధుడు
కన్య - 1.పెండ్లి కాని పడుచు, 2.కన్యారాశి, వి.కన్నియ.
కన్నియ - పెండ్లి కాని పడుచు, సం.కన్యా.
అనూఢ - పండ్లి కాని పడుచు.
వరద - 1.పెండ్లి కాని పడుచు, 2.దుర్గ, వై.వి. వెల్లువ, సం.ప్రవాహ్.
కన్నె పాయపు సతికి కన్నెరాశి.....
పడుచురాశి - కన్యారాశి.
పడుచు - 1.కన్యక, 2.కన్నెరికముగాని వేశ్య. కన్యల దూషించరాదు. పడుచుల కాపురం చితుకుల మంట.
కన్యాకుమారీ :
కన్యతే కామ్యత ఇతి కన్యా. కన దీప్తికాంతిగతిషు - కోరఁబడునది.
కుమారయతి క్రీడయతీతి కుమారీ, సీ. కుమార క్రీడాయాం - క్రీడించునది.
కుత్సితో మారో స్యా ఇతి కుమారీ - మన్మథుని దిరస్కరించునది. ఈ మూడు మొదటివయస్సున నున్న పెండ్లికాని పడుచు పేర్లు.
పంచ కన్యలు :
అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా|
పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్||
కన్యాకుమారి : కన్యాకుమారి దేవాలయము, బంగాళాఖాతము - అరేబియా సముద్రము - హిందూమహాసముద్రములు కలియుచోటు. రాజరాజేశ్వరీ దేవికన్యాకుమారి రక్షించు జగదీశ్వరీ.....
కుమారి - 1.కూతురు, 2.పెండ్లికాని ఎనిమిదేండ్ల పడుచు, 3.పార్వతి. మయాపురి యందు దేవిస్థానం కుమారి.
పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.
కూఁతురు - కుమార్తె. ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
కొమారి - కూతురు, సం.కుమారీ.
కొమరె - కుమారి, యౌవనము గల స్త్రీ.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి
బాలార్కసదృశాకారే పూర్ణ చంద్రనిభాననే|
కౌమారి - 1.పార్వతి, 2.బ్రహ్మచర్య వ్రతమున నుండువానిని పెండ్లి యాడిన స్త్రీ, 3.సప్త మాతృకలలో ఒకతె.
కౌమారము - మూడవ యేడు మొదలు పదునారేండ్ల (3-16)వరకునైన ప్రాయము.
బాల - పదునారెండ్లకు లోబడిన పిల్ల.
మధ్య - పదుమూడేండ్ల నుండి పదునెనిమిది(13-18) వరకు వయస్సు గల కన్య.
పితారక్షతి కౌమారే - భర్తారక్షతి యౌవనే|
రక్షంతి వార్ధ కేపుత్త్రా - న స్త్రీస్వాతంత్ర్య మర్హతి||
తా. స్త్రీలను బాల్యమందు(చిన్నతనము-1.బాల్యము, 2.అవమానము.) దండ్రియును(పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.), యౌవన మందు పెనిమిటియు(భర్త), ముదిమి(ముసలితనము)యందు కొమారులును(కొమరుఁడు -1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.)రక్షింతురు. కాబట్టి యొక కాలమందును స్త్రీలకు స్వాతంత్ర్యము లేదు. - నీతిశాస్త్రము
దుర్గ - పార్వతి, రూ.దుర్గి. శివుని సన్నిధి నందు దేవీస్థానం పార్వతి.
దుఃఖేన గంతుం శక్యతే దుర్గా - కష్టముచే నెఱుగఁదగినది.
దుర్గం వనగిరిరూప మావాసోయ స్యా స్సా - వనాదిదుర్గము స్థానముగాఁ గలది.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి(సర్వంసహ - భూమి), 4.వరుణుని భార్య.
విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ 27వ సంవత్సరము.
పార్వతి - 1.గౌరి, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపిత్త్రిక), 2.బొమ్మ.
కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి, 5.క్రొత్త మబ్బు.
కాత్యాయిని - 1.గౌరి(కన్యాకుబ్జమునందు దేవీస్థానం గౌరి), పార్వతి, 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
కృష్ణవేణి - కృష్ణవేణి అను నది, కృష్ణానది.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌరుఁడు - చంద్రుడు.
దుర్గము - కోట.
కోట - 1.దుర్గపురము, 2.పట్టణము చుట్టుగల ప్రహరి, సం.కోటః.
కోట్టము - దుర్గపురము, కోట.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాననగరము.
గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమ శ్శాప్తబలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్థితః
విద్యావస్తు సమృద్ధి రిత్యఖిలసామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రయ! దేవ! మామక మనోదుర్గే నివాసం కురు || - 42శ్లో
తా. దుర్గకు అత్యంత ప్రియుడైన స్వామీ! గాంభీర్య కందకంతో, ధైర్యరూప ప్రాకారంతో, సద్గుణాలే హితాన్ని చేకూర్చే సేనగా దేహంలో వున్న ఇంద్రియాలే ద్వారాలుగా, జ్ఞానమే సర్వవస్తు సంపదగా వున్న నా మనో దుర్గంలో సదాశివ దేవా! సదా నివసించవయ్యా! - శివానందలహరి
దుర్గమ క్లేశాల నుండి అంటే బాధలనుండి భక్తులను కాపాడు తల్లి దుర్గ.
వెల్లువ - 1.వరద, అధికప్రవాహము, 2.సేన, దండు, విణ.అధికము.
వఱద - వెల్లువ, నీటికాలువ.
అనీకము - 1.సేన, 2.సమూహము, 3.యుద్ధము.
అనీకిని - 1.సైన్యము, 2.అక్షౌణిలో పదియవపాలు.
సైన్యము -1.సేనతోకూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరుగుఱ్ఱములో నొకటి.
ఆరక్షము - రక్షించునది, వి.1.రక్షణము, 2.ఏనుగు కుంభస్థలముల క్రింది చోటు, 3.సైన్యము.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి. మహాసేనుఁడు - కుమారస్వామి.
సేన - దండు, విణ.అధికము, చాల.
వరూధిని - దండు, సేన.
ధ్వజిని - సేన.
దండు - 1.దండము, 2.సేన, 3.గుంపు, సం.దండః.
దండము - నమస్కారము. నమస్సు - నమస్కారము.
నమస్కారము - మ్రొక్కు, రూ.నమస్క్రియ, నమస్కృతి.
రాణువ - 1.దండు, 2.పరివారము.
పరివారము - 1.దండు, 2.కత్తియొర, 3.పరిజనము.
మంది - 1.కాల్బలము, 2.జనసమూహము, 2.పరిజనము.
పరిజనము - పరివారము.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ. నివహము - గుంపు. సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
ప్రవాహము - 1.వెల్లువ, 2.పరంపర, వి.(భౌతి.) ప్రవహించునది (Current).
వెల్లువ - 1.వరద, అధికప్రవాహము, 2.సేన, దండు, విణ.అధికము.
వఱద - వెల్లువ, నీటికాలువ.
వఱత - వెల్లువ, ఏరు, రూ.వఱద.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
వఱద కాలువలు - వర్షము వచ్చునప్పుడు మాత్రమే నిండి పొలములకు, నీటి నందజేయు కాలువలు.
ప్రవాహస్తు ప్రవృత్తి స్స్యాత్ :
ప్రకర్షేవిచ్ఛేదేన వహతీతి ప్రవాహః వహ ప్రాపణే. - ఎడతెగక నడుచునది.
ప్రవర్తన ఇతి ప్రవృత్తిః సీ. వృతువర్తనే. - ప్రవర్తించునది. ఈ రెండు ఎడతెగక వచ్చు జలాదుల పరంపర పేర్లు.
ప్రవృత్తి - 1.నడక, 2.ప్రవేశము, 3.బ్రతుకుతెరువు.
ప్రవాహి - (రసా.) ప్రవహించు స్వభావము గల ద్రవ్యము, చలన స్వేచ్ఛ గల అణువులు కూర్పు అయిన ద్రవ్యము (Fluid), ఉదా. ద్రవములు, వాయువులు.
ప్రవాహిత - (భౌతి.) ఇటునటు చలించుటకు స్వేచ్ఛగల అనువులుగలిగి యుండుట (Fluidity).
యవ్వనం ఒక మహాప్రవాహం లాంటిది. దానికి సరైన ఆనకట్ట కట్టి నీటిని మళ్ళించినప్పుడే జీవితం ధన్యమౌతుంది. - శ్రీరామకృష్ణ పరమహంస
ధార - 1.నీటిచాలు, 2.ఆయుధముల వాదర, 3.చిల్లి, 4.అశ్వగతి విశేషము, 5.ప్రవాహము, 6.పరంపర.
దార - 1.ధార, 2.నీటిచాలు, 3.దానము, 4.క్రమము, సం.ధారా.
దార - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
నీటిపాఱుదల - మానవ ప్రయత్నము చేత కాలువల ద్వారా, ఉపనదుల ద్వారా సేద్యము కొరకు నీటిని పొలమున కందచేయుట.
నీటివాలు - (భౌతి.) నీరు ఎత్తునుండి పల్లమునకు పారు వైఖరి.
స్రోతస్సు - 1.ప్రవాహము, ఏరు, 2.నీరువచ్చు తూము.
స్రోతస్విని - నది, వ్యు. ప్రవాహము కలది.
తరంగిణి - నది, ప్రవాహము.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
నదీమాతృకము - ఏటి నీటిచే పండెడు భూమి.
ఆపగ - నది, ఏరు, వ్యు.జలముతో పోవునది.
ఆపగేయుఁడు - గంగాపుత్త్రుడు, భీష్ముడు.
గంగాపుత్త్రుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
ఊర్ధ్వరేతసుఁడు - 1.జితేంద్రియుడు, 2.అధః పతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుడు, 3.భీష్ముడు, రూ.ఊర్ధ్వరేతుడు.
జితేంద్రియుఁడు - ఇంద్రియము లను జయించినవాడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
భీష్ముఁడు - 1.శంత పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగువాడు, విష్ణువు.
వెల్లి - ప్రవాహము, పరంపర, తెలుపు, సం.వేల్ల్.
వెల్లివాక - గంగ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది.
గంగ పారు నెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్న తనము పేర్మి యీలాగురా, విశ్వ.
తా. ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగ పారుచుండును. మురికినీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. మంచి చెడ్డ వారితేడా ఆ విధముగనే ఉండును.
ప్రవహించే నీరు కొన్నిచోట్లు సుడులు తిరిగినా, వెంటనే వాటిని అధిగమించి ముందుకు సాగిపోతుంది. అలాగే తన హృదయం తరచుగా నిరాశ, దుఃఖం, అవిశ్వాసం వంటి సుడులలో చిక్కుకొన్నప్పటికీ, అవి తాత్కాలిక మేనని గ్రహించి భక్తుడు ముందుకు సాగాలి. - శ్రీ రామకృష్ణ పరమహంస
వఱ్ఱు - 1.ప్రవాహము, 2.అతిశయము.
అతిశయము - ఆధిక్యము.
మెండు - 1.అధిక్యము, అతిశయము, 2.మిఱ్ఱు(మిఱ్ఱు- ఉన్నత భూమి). వలదు - అధిక్యము, అవ్య.వద్ధు.
వేణి - 1.అనేక ప్రవాహముల కూడిక, 2.కాలువ, 3.వేనలి (సర్పాకారముగల జడ).
కాలువ - నీరుపారు మార్గము.
వేనలి - వేణి, కొప్పు, కేశకలాసము, జుట్టు, సం.వేణీ.
పాఱు - 1.ప్రవహించు, 2.పరువెత్తు.
పాఱుఁడు - బ్రాహ్మణుడు; బ్రాహ్మణుడు - పారుడు.
పరంపర - 1.వరుస, 2.విడువక సాగునది, సం.వి.(గణి.) ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల గుంపు (Series). ఉదా.1,3,5,7,9.....
పవుఁజు(ౙ) - 1.వరుస, 2.శ్రేణి, 3.దండు.
వరుస - 1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
శ్రేణి - వరుస, (గణి.) ఒక దత్త న్యాయము ప్రకారము వ్రాయబడిన పదముల సముదాయము దత్తన్యాయము ననుసరించి వ్రాయబడిన రాసుల సముదాయము. (Progression)
బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship).
పద్ధతి - 1.మార్గము, 2.వరుస, సం.వి. (గణి. భౌతి. రసా.) సమకూర్చ బడిన అవయములు (భాగములు) కలిగి క్రమసహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడినది (System) లేదా ఒక పూర్ణముగా పరిగణింప బడు వస్తువుల సమూహము.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
పదవి - మార్గము, వై. వి. ఉన్నతస్థితి, సం.పదమ్.
ఏకపది - 1.మార్గము, 2.ఒకడే నడువదగ్గ మార్గము.
సబంధుర్యో హితేషుస్స్యా త్సపితాయస్తు పోషకః|
సఖాయత్ర విశ్వానస్స - భార్యాయత్ర నిర్వృతిః||
తా. హితము(మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు.)గోరువాఁడే బంధువు, పోషించినవాఁడే(పూషుఁడు - సూర్యుడు)తండ్రి, విశ్వాసము గలవాఁడే స్నేహితుఁడు(అంతరంగుడు-స్నేహితుడు), సుఖింప జేయునదే భార్యయగును. - నీతిశాస్త్రము
వంతు - 1.భాగము, 2.వరుస, 3.సామ్యము, 4.పోటీ.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
భాగము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సామ్యము - సమత్వము, పోలిక.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property).
పోటీ - 1.స్పర్థ, 2.ఊతగానిల్చిన స్తంభాదికము.
పంతము - 1.స్పర్థ, పోటీ, 2.విధము, సం.స్పర్ధా.
పోరితము - 1.స్పర్థ, 2.పోరాటము.
స్పర్థ - (అర్థ, వాణి) అనుభోక్త లెల్లరు తమసరుకులనే కొనవలెనని ఉత్సాదికులు తమలో తాము పోటీపదుట ఉత్పాదన తక్కువగానున్న సరకుకొరకు అనుభోక్తుల మధ్యగల పోటీ, మొదటి పరిస్థితిలో ధరలు తగ్గుట. రెండవ పరిస్థితితో ధరలు పెరుగుట జరుగును, సం.వి. 1.పోటీ, 2.పోలిక(పోలిక - సామ్యము), 3.క్రమమున్నతి.
పోరాటము - జగడము, కలహము, యుద్ధము.
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
కలహము - సమరము, వికృ.కయ్యము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది.
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు.
కయ్యము - జగడము, యుద్ధము.
గీతావాద్యే తధానృ త్యే సంగ్రామే రిపు సంకటే|
ఆహారే వ్యవహారే చ త్యక్త్వా లజ్జాం సుఖీభవేత్||
తా. సంగీతము పాడునపుడు, వాద్యము వాయించునపుడు, నాట్య మాడునపుడు(నాట్యము చేయునపుడు), శత్రువులతో బోరునపుడు, భోజనము(ఆహారము, సాపాటు)చేయునపుడు, వ్యవహార మాడునపుడు సిగ్గు విడిచిన సుఖము గల్గును. - నీతిశాస్త్రము
కయ్యపుదిండి - (కయ్యము+తిండి) కలహభోజనుడు, నారదుడు.
ౙగడగొండి - కలహశీలుడు, కలహశీలురాలు.
కానీనుఁడు - సం. విణ.కన్యకు పుట్టినవాడు వి.1.కర్ణుడు, 2.వ్యాసుడు.
ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని, 4.కర్ణుడు, 5.సుగ్రీవుడు.
కానీనః కన్యకాజాత స్సుతః : కన్యయాః పుత్రః కానీనః - కన్యక కొడుకు. పెండ్లిగాని పడుచు కొడుకు.
వధూటి - 1.కన్యక, 2.కోడలు(కోడలు - కుమారుని భార్య).
ఆఁడుపాప - 1.కన్యక, 2.ఆడుబిడ్ద, 3.స్త్రీ శిశువు.
ఆఁడుఁబడుచు - 1.కూతురు, 2.మగని సోదరి, రూ.ఆఁడబడుచు.
నందన - 1.కూతురు, 2.అరువది సంవత్సరములలో ఒకటి.
వదినె - అన్నభార్య, మగని తోబుట్టువు, మేనత్త మేనమామలకూతురు, భార్యాక్క, సం.వధూని.
ననన్దా తు స్వసా పత్యుః :
న నన్దయతీతి ననన్దా. ఋ. సీ. టు నది సమృద్ధౌ. - సంతోషింపఁ జేయనిది. దీర్ఘ మధ్యమంబును హ్రస్వమధ్యమంబును గలదు. "నవనాన్దతు స్వసాపత్యుర్న నాన్దా నన్దినీచ" నేతి శబ్దార్ణవే. - మగనితోడఁ బుట్టిన స్త్రీ పేరు. ఆఁడుబిడ్ద.
అమ్మాయి - 1.బాలిక, చిన్నపిల్ల, 2.కూతురు.
అమ్మి - 1.అమ్మాయి, 2.నీచజాతి స్త్రీ, సం.అంబిః.
బాల - పదునారేండ్లకు(16) లోబడిన పిల్ల.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).
ఆఁడపీక - బాలిక, (భ)ద్రాచల ప్రాంతమున వాడుకలో ఉన్నది).
పోఱి - ఆడపిల్ల, బాలిక.
వాసువు - (నాట్యపరిభాషలో) బాలిక.
బలారిష్టము - పుట్టినది మొదలు 12 సంవత్సరముల లోపున బాలబాలికలకు కలుగుకీడు, మరణము.
కొండిక - 1.చిన్నది, 2.అల్పము, వి.1.చిన్నవాడు, 2.బాలుడు, 3.బాలిక, సం.కుణకః.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
చిన్నవాడు - బాలుడు. కున్నడు - బాలుడు, బిడ్డడు.
బాలిశుడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కూన - కున్న, కుర్ర, సం.కుణకః.
కున్నడు - బాలుడు, బిడ్డడు.
కుఱ - 1.కొడుకు, 2.బిడ్డ, 3.బాలుడు, రూ.కుఱఁడు.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
బిడ్ద - 1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు, రూ.ప్రసూనుడు.
స్కందుఁడు - కుమారస్వామి; కొమరసామి - స్కందుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
పోఱఁడు - బాలుడు.
గున్న - 1.పిల్ల, 2.ఏనుగు మొ.ని పిల్ల, 3.గుబురుగా పెరిగిన లేత మొక్క, ఉదా.మామిడిగున్న, సం.కుణకః.
కుణకము - పిల్ల; కలభము - ఏనుగుగున్న; ఎత్తుగున్న- ఏనుగుగున్న.
తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను,
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
భా|| గున్న ఏనుగులు ఎక్కువ బలసంపదతో ఎదిరించే శక్తి కలిగి కొండలను డీకొనుటానికైననూ వెనుదీయవు. సింహాలకు కూడ భయపడి తొలగక ఎదిరించి నిలుస్తాయి. పిడుగులను సైతం లెక్క చేయకుండా ముందంజ వేస్తాయి.
చిన్నపిల్లలు గతమును గురించిగాని, జరుగబోవు దానినిగురించి కాని ఆలోచించరు. ఇది మనలో కొందరికే చేతనవుతుంది. వారు ప్రస్తుతాన్ని(వాస్తవాన్ని) సంతోషముగా గడుపుతారు. - సూక్తి.
పోతము - 1.పక్షిపిల్ల, 2.పదేండ్ల యేనుగు, 3.ఓడ.
పోతవణిజుఁడు - ఓడ బేరగాడు.
పిల్ల - 1.పక్షాదుల సంతతి, 2.పడుచు, విణ.చిన్నది, సం.పీలుకః.
కుణకము - పిల్ల. పిల్లాకము - పక్షిపిల్ల; పీటకము - పక్షిపిల్ల.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).
నీడోద్భవము - పక్షి, గూటికానుపు.
నీడము - 1.చోటు, 2.పక్షి గూడు. నీడ - ఛాయ.
గూఁడుకానుపు - పక్షి, నీడోద్భవము.
గూఁడు - 1.కులాయము, 2.పంజరము, 3.గోడలో దీపముంచుటకు ఏర్పరచిన చోటు, 4.ఆకుగుడిసె, 5.చాప మొ.నితో కట్టిన బండిపైకప్పు, బహు. గూండ్లు, గూడులు.
కులాయము - 1.పక్షిగూడు, 2.చోటు, 3.ఇల్లు.
పంౙరము - పక్షులను పెంచెడుగూడు, సం.పంజరమ్. పంజరము చక్కదనము పక్షికి రుచించేది కాదు.
సనీడము - సమీపము, విణ.నీడముతో గూడినది.
కొదమ - పశుపక్ష్యాదుల పిల్ల, ఉదా.సింగపుఁగొదమ, అంచకొదమ, తేటి కొదమ మొ.వి. 2.ఆడమేకపిల్ల, విణ.1.యౌవనము తలచూపినది, 2.దృఢము, 3.లేతది.
దృఢము - (భౌతి.) వంగనిది, చిన్న దెబ్బలకు వికారము చెందనిది, గట్టిది, (Rigid) ఉదా.దృఢవస్తువు (Rigid body).
దిట - 1.దార్ఢ్యము, సత్తువ, శక్తి, 2.ధైర్యము(ధీరత్వము), రూ.దిటము, దిటవు, సం.దృఢమ్.
దిట్ట - దార్ఢ్యము, శక్తి, విణ.దార్ఢ్యముకలవాడు, సం.దృఢః, ధృష్టః.
దిట్టఁడు - సమర్థుడు, 2.నేర్పరి, 3.ధైర్యము గలవాడు, సం.ధృష్టః.
దిట్టము -1.ధృఢము(దిటము - దృఢము), 2.నిర్ణయము(నిర్ణయము - ఏర్పాటు), సం.దృఢమ్.
సదాటు - ధృఢము.
తుటారము - 1.దిట్టతనము, 2.పురుషవచనము.
తుటారి - 1.దిట్టతనముగలది, 2.పారుష్యముగలది.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
వామనము - లేతది.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది. ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.
బాలసఖత్వ మకారణ హాస్యం, స్త్రీ షువివాద మనజ్జనసేవా|
గార్దభయాన, మసంస్కృతవాణి, షట్సువరో లఘుతా ముపయాతి||
తా. బాలురతో చెలిమి(చెలిమి - స్నేహము), కారణంలేని నగవు, స్త్రీలతో వాదులాడుట, దుర్జనునియొద్ద కొలువుండుట, గాడిద నెక్కుట, సంస్కృతభాష తెలియకుండుట; ఈ యాఱింటిచే మనుష్యులు చులకనయగుదురు. – నీతిశాస్త్రము
కిశోరము - 1.గుఱ్ఱపు పిల్ల, 2.మృగాదుల పిల్ల.
కిశోరుఁడు - వేడివేలుపు (సూర్యుడు), విణ.యౌవనావస్థ కలవాడు.
కిశోర న్యాయాలయము - (శాస.) యుక్తవయస్సురాని బాలబాలికలు చేసిన నేరముల విచారించు స్థలము, బాల న్యాయస్థానము (Juvinial court).
నగ్నిక - 1.కన్య, 2.దిసమొల ఆడది, రూ.నగ్నా.
ఉచ్చమల్లి - 1.దిసమొల స్త్రీ, నగ్నిక, 2.రోత పుట్టించు స్త్రీ.
దిసమొల(బిత్తల - దిసమొల) - నగ్నత్వము, రూ.దిస్సమొల.
స్త్రీ నగ్నికా కోటవీ స్యాత్ :
నజతే నగ్ని కా. ఓనజీ వ్రీడే. - లజ్జించునది.
కుటేన కౌటిలేన వేతి యాతీతి కోటవీ. సీ. వీ గతిప్రజనన కాంత్యసన ఖాదనేషు. – కౌటిల్యము చేత పోవునది. ఈ రెండు 2 దిసమొలతో నుండు స్త్రీ పేర్లు.
నాగ్నింముఖే నోపథ మే నగ్నాం నేక్షేతచ స్త్రీయం|
నామేధ్యం ప్రక్షి పేదగ్నౌ నచపాదౌ ప్రతాపయేత్ ||
తా. అగ్నిని నోటిచే నూదరాదు, దిగంబరియైయున్న(వివస్త్రయైయున్న) స్త్రీని జూడరాదు, అపిశుద్ధమైన వస్తువు అగ్నియందు వేయరాదు, అడుగులను గాచుకొన గూడదు. – నీతిశాస్త్రము
గోరంకువు - 1.బట్టువాడు, 2.దిసమొలవాడు, 3.గోరువంక పిట్ట.
వైదేహకుఁడు - బట్టువాడు, వంది.
వంది - స్తుతిచేసి జీవించువాడు.
బట్టు - 1.వంది, 2.పాఠకుడు, సం.భట్టః.
భట్టుఁడు - 1.పాఠకుడు, 2.బట్టువాడు.
బూతు - 1.కుచ్చితపు తిట్టు(కుత్సితము - నికృష్టము), 2.బట్టువాడు.
దిసమొలవాడు - దిగంబరుడు.
దిగంబరుఁడు - శివుడు, విణ.నగ్నుడు.
నగ్నుఁడు - బుద్ధుడు, విణ.దిసమొలవాడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
దిసమొలవేలుపు - 1.శివుడు, 2.కాలభైరవుడు.
గోర - గోరంకిపిట్ట, సం.గోరంకుః, గోరికా.
శారి - గోరువంక, రూ.1.శారిక, 2.జూదపు సారె.
శారము - 1.చిత్రవర్ణము, 2.జూదపు సారె.
బట్టకాఁడు - 1.చిలువ, 2.గోరువంక, వ్యు.పలుకు నేర్పు గలది.
చిలువ - 1.కొంచెముగ చేరి నిలచిన నీరు, 2.జందెవలె చుట్టిన నూలుచుట్టు, విణ.అల్పము.
చిలువ - పాము.
చిలువతాలుపు - శివుడు, భుజంగభూషణుడు.
నగ్నో వాసా దిగమ్బరః. -
నలజ్జత ఇతి నగ్నః. ఓ లస్జీ వ్రీడే. - సిగ్గులేనివాడు.
న విద్యతే వాసో యస్యేత్యవాసాః. స. - బట్టలేనివాఁడు.
దిక్ అంబరం యస్యేతి దిగంబరః - బయలే బట్టగాఁ గలవాఁడు. ఈ మూడు 3 దిసమొలవాని పేర్లు.
నాన్నమద్యాదేక వాసా ననగ్నః స్నానమాచరేత్!
తా. ఉత్తమ మనుజుఁడు ఒంటివస్త్రముతో భుజింపరాదు, దిగంబరుఁడై స్నానము సేయఁగూడదు. - నీతిశాస్త్రము్
భైరవుఁడు - 1.శివుడు, 2.శునకము, విణ.భయానకరసము గలవాడు.
భైరవము - 1.భయానకరసము, 2.భయము(భీ - భయము).
భయానకము - 1.పులి, 2.రాహువు, 3.భయానకరసము.
భైరవి - 1.పార్వతి, 2.ఒకానొక రాగము.
వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక. వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పడిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
గొడ్డు - ఈనని పశువు, గొడ్రాలు, విణ.శూన్యము.
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
శూద్రి - శూద్రుని భార్య.
కన్యక -
విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||
తా. లోకమునందు గొడ్రాలు, సహింపగూడని ప్రసవవేదన(బిడ్డకుట్టు – ప్రసవవేదన) నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ నెఱుఁగలేఁడు. – నీతిశాస్త్రము
వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).
13. హస్త - నక్షత్రముల యందొకటి. 5 నక్షత్రములు హస్తము లేక అరచేతి వలె నుండును.
హస్తా తు పాణినక్షత్రే : హస్తశబ్దము చేతికిని, నక్షత్ర విశేషమునకును పేరు. హసతీతి హస్తః. హసే హసనే. ప్రకాశించునది.
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
హస్తకళలు - (అర్థ.) చేతిపనులు.
పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిశలాకలు - (జం.) అరచేతికుండు ఎముకలు (Meta-carpals).
పాణిగ్రహణము - వివాహము; కరగ్రహణము - పెండ్లి, పాణిగ్రహణము.
పరిణయము - వివాహము.
వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్టవిధములు).
పెండ్లి - వివాహము. పెండిలి - వివాహము, రూ.పెండ్లి.
పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.
పాణిః గృహీతో (అ)స్యా ఇతి పాణిగృహీతీ. సీ. - దీనిహస్తము గ్రహింపఁ బడును.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము. పత్ని - భార్య.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
కల్యాణము - 1.క్షేమము, 2.శుభము, 3.పెండ్లి.
వియ్యము - వైవాహిక సంబంధము, సం.వివాహః.
వియ్యంకుఁడు - వియ్యము పొందినవాడు.
అయాతు దేవస్సవితోపయాతు | హిరణ్యయేన సువృతా రథేన | వహన్, హస్తగ్ం సుభగ్ం విద్మనాపసమ్ | ప్రయచ్ఛంతం పపురిం పుణ్యమచ్చ | హస్తః ప్రయచ్ఛ త్వమృతం వసీయః | దక్షిణేన ప్రతిగృణమ ఏనత్ | దాతా-రమద్య సవితా విదేయ విదేయ | యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞమ్ ||11||
సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు.
సూర్యతనయ - యమున. యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ. జమున.
ౙమున - యమున.
ౙమునతోఁబుట్టు(వు) - యముడు. యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
ౙమునయ్య - సూర్యుడు.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసుష్ఠుడు, మరీచి).
భవరోగభిష గ్ధన్వంతరిః కామార్యధోక్షజౌ,
ఊర్థ్వకేశో హృషీకేశః క్రతుధ్వంసక రక్షకౌ |
కైసాటి చుక్క - హస్తా నక్షత్రము.
హస్త నక్షత్రము, ధన్వంతరి జన్మనక్షత్రం. పాలకడలి నుంచి ఉద్భబించిన వాడు. పూర్వం సముద్ర మథనకాలంలో ధన్వంతరి జన్మించాడు. ఆదివైద్యుడు ధన్వంతరి. అతడికి బ్రహ్మజ్ఞుడని పేరు పెట్టారు - ఇతడు బ్రహ్మకుమారుడు.
ధన్వంతరి - 1.దేవవైద్యుడు, 2.సూర్యుడు, 3.మహేశ్వరుడు.
అబ్జుఁడు - 1.చంద్రుడు, 2.ధన్వంతరి, వ్యు.నీటి నుండి పుట్టినవాడు.
అప్సుజాతఃఅబ్జః జనీ ప్రాదుర్భావే - నీటియందుఁ బుట్టినవాఁడు.
వేల్పువెజ్జు - దేవవైద్యుడు.
ఓషధీశుఁడు - చంద్రుడు.
ఓషధీనామీశః ఓషధీశః - వరి మొదలగు నోషధులకుఁ బ్రభువు.
ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఔషధము - 1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు. (ఉత్తర కురుక్షేత్రము నందు దేవీస్థానం ఓషది.)
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
చందిరుడు - చంద్రుడు; చంద్రముఁడు - చంద్రుడు.
చందురుమామ - చంద్రుడు, చందమామ.
చంద్రము - చందురము, సం.చంద్రః.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రుడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు.
ముక్కంటిచెలి - కుబేరుడు; ధనాధిపుఁడు - కుబేరుడు.
అప్పిచ్చువాడు, వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పాఱు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూరు మందుము
చొప్పడికున్నట్టియూరు జొరకును సుమతీ.
తా. అవసరమునకు ఆదుకొనినవాడు(ఉత్తమర్ణుఁడు - అప్పిచ్చువాడు. (వ్యతి.అధమర్ణుడు.), రోగం వచ్చినప్పుడు మందులు యిచ్చువాడును, స్నానపానములకు నిత్యం ప్రవహించు నది లేక కాలువయును, శుభాశుభ కర్మలకును అవసరమగు బ్రాహ్మణుడు(ద్విజుఁడు -1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.) ఉన్నట్టి గ్రామమున నివసింపవలెను.
ధన్వంతరి రితి ఖ్యాత ఆయుర్వేదదృగిజ్యాభాక్|
తమాలోక్యాసురాః సర్వే కలశం చామృతాభృతమ్|
నెలపాలు - చంద్రకళ.
నెలవీసము - చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.
కళ - 1. 8 సెకనుల(8 Seconds)కాలము, 2.చంద్రకళ, 3.ఒక పాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతాంతము కాని పదము.
కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధురస్వరము.
కల2 - స్వప్నము.
స్వప్నము - 1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).
కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.
కళానిధి - చంద్రుడు. కళానాం నిధిః కళానిధిః. ఇ. పు. - కళల కునికిపట్టు.
కలాదుఁడు - 1.స్వర్ణకారుడు, కంసాలి, 2.చంద్రుఁడు, 3.గురువు, ఉపాధ్యాయుడు (Jupiter).
కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు; విబుధుఁడు - విద్వాంసుడు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
నిష్ణాతుఁడు - నేర్పరి. చతురిమ - నేర్పరి.
వేలుపు - దేవత(దేవత -వేలుపు), దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది.
త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు - వేలుపు; సుపర్వుఁడు - వేలుపు.
వేల్పుటెంకి - స్వర్గము, వ్యు.దేవతలకు నివాసస్థానము.
త్రిదివము - స్వర్గము; త్రివిష్టపము - స్వర్గము; స్వర్గము- దేవలోకము.
త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే.
ధ్యేయః కాళీవిశ్వనాథో మహేశో
రుద్రాక్షోవై భూతి రామ్నాయవేద్యా
మంత్రాధీశో భాతి పంచాక్షరీయం
నిస్తుల్యోయం శుద్ధకైవల్యమార్గః|
తా. మహేశ్వరుఁడే ధ్యానింపఁదగినవాఁడు. వేదోచితములైన విభూతి రుద్రాక్షలే ధరింపదగినవి. మహామహిమోపేతమగు పంచాక్షరీ మంత్రరాజ మే జపింపఁ దగినది. నిరుపమానమును బరమకైవల్యప్రాప్తికి మార్గమును నిదియే !
జైవాతృకుఁడు-1.చంద్రుడు, 2.పంటకాపు, 3.వైద్యుడు, విణ.దీర్ఘాయువు కలవాడు.
ఓషధీః జీవయతీతి జైవాతృకః జీవప్రాణధారనే -పైరులను బ్రతికించువాఁడు.
జైవాతృక స్స్యా దాయుష్మాన్ -
జీవతి చిరకాల మితి జైవాతృకః. జీవ ప్రాణధారనే. - అనేకకాలము బ్రతుకువాఁడు.
అధిక మాయు రస్యాస్తీ త్యాయుష్మాన్ త. - అధికమైన ఆయుస్సు గలవాఁడు. ఈ రెండు దీర్ఘాయుష్మంతుని పేర్లు.
ఆయుష్మంతుడు - దీర్ఘ కాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి - 1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.
దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.
కాకపుష్ఠము - కోయిల, వ్యు.కాకిచే పోషింపబడినది.
కాకపిక న్యాయము - న్యా. కోయిల(పికము - కోయిల) కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము. కాకి మరియొక కాకిని పొడవదు. నూరు కాకులలో ఒక కోకిల.
కాకదంత పరీక్ష - న్యా. వ్యర్థమైన పని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.)
లోకములోన దుర్జనులలోఁతు నెఱుంగక చేరరాదు, సు
శ్లోకుఁడు జేరినంగవయజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁగన్న చోటఁగుమిగూడియు సహ్వపుగూతలార్చుచున్
గాకులుతన్నవే తరిమి కాయము తల్లదమంద! భాస్కరా.
తా. లోకమందు సజ్జనుఁడు(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టిన వాడు, 2.మంచివాడు.)దుర్మార్గులకు లోనుండు గుట్టును తెలిసికొనకయే వారి(ప్రక్కను) కలియరాదు. అట్లు కలిసినచో వారు వేళాకోళము(వేళాకోళము - చిక్కు, పరిహాసము, ఎగతాళి(అని వాడుకలో)చేసి అతనితో గలియబడుదురు. కీడు కలుగును. కోకిలను గన్న కాకులు దాని చుట్టును మూగి అసహ్యపు కూతలను కూయుచూ దానిని తన్ని తరిమివేయును కదా!
జైవాతృక శ్శుచి శ్శుభ్రో జయీ జయఫలప్రదః,
సుధామయ స్సురస్వామీ భక్తానా మిష్టదాయకః. - చంద్రుడు
జీవదుఁడు - వైద్యుడు; వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
చికిత్సకుఁడు - వైద్యుడు; వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.
భిషక్కు - వైద్యుడు.
వైద్యము - రోగచికిత్స శాస్త్రము.
చికిత్స - రోగమునకుచేయు ప్రతిక్రియ.
చాలా ఔషధాలు ఎంత నిరుపయోగకరమో తెలిసిన వాడు ఉత్తమ వైద్యుడు. - బెంజమిన్ ఫాంక్లిన్
ఆయుర్వేదము - హిందూ వైద్యశాస్త్రము.
డాక్టర్ - (Doctor) 1.వైద్యుడు, 2.పరిశోధనచేసిన వ్యక్తికి విశ్వవిద్యాలయ మిచ్చు పి. హెచ్ డి. పట్టము.
వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురుడు.
విఘ్నరాజు - వినాయకుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
కాని ప్రయోజనంబు సమకట్టదు, తాభువినెంత విద్యవా
డైనను, దొడ్డరాజు కోడుకైనను నదెట్లు, మహేశుపట్టి, వి
ద్యానిధి, సవవిద్యలకుఁ దానెగురుండు, వినాయకుండుదాఁ
నేనుఁగు రీతినుండియు నదేమిటికాడఁడు పెండ్లి! భాస్కరా.
తా. వినాయకు డీశ్వరుని కుమారుఁడయ్యు, భూమి యందు తాను, సర్వ విద్యలకు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నకు మూలపురుషుడయ్యు జ్ఞానము నిచ్చు వాడయ్యు, ఏనుగు బలము కలవాడయ్యు అతడు (పెండ్లి - వివాహము)పెండ్లాడక లేక పోయెను. అట్లే ఎంత గొప్పవాడైనను తనకు వశము(స్వాధీనము)కాని పని చేయ బూనినచో నెరవేర్చుకొన లేడు.
మహేశ్వరప్రియో దాన్తో మేరుగోత్రప్రదక్షిణః,
గ్రహమణ్డల మధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః. - చంద్రుడు
కానీనుఁడు - సం. విణ.కన్యకు పుట్టినవాడు వి.1.కర్ణుడు, 2.వ్యాసుడు. కర్ణుఁడు - కుంతి పెద్ద కోడుకు. పాండవుల అగ్రజుడు, యుద్ధమునందు మహావీరుడు, మహాదాత. కుంతీదేవి కన్యగా నున్నపుడు సూర్యుని వలన పుట్టినవాడు.
ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని, 4.కర్ణుడు, 5.సుగ్రీవుడు.
ప్రొద్దు - 1.సూర్యుడు, 2.కాలము, 3.దినము, సం.బ్రధృః.
సూర్యతనయుఁడు - 1.శని(Saturn), 2.కర్ణుడు.
సూర్యతనయ - యమున.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
యువరాజు - 1.చిన్నరాజు, రాజు తర్వాత రాజ్యమున కర్హుడైనవాడు, 2.కర్ణుడు.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విన.చీల్చువాడు.
భత్తృదారకుఁడు - (నాట్యపరిభాష యందు) యువరాజు.
యౌవరాజ్యము - (రాజ.) యువరాజు యొక్క దొరతనము.
యువరాజస్తు కుమారో భత్తృదారకః. -
యువా చాసౌ రాజా చ యువరాజః. - పిన్నఱేఁడు.
కుమారయతీతి కుమారః. - ఆడువాఁడు. కుమార క్రీడాయామ్.
ద్రియత ఇతి దారకః. - ఆదరింపఁబడువాఁడు.
భర్తుః దారకః భత్తృదారకః - దొరకొడుకు. ఈ 3 యువరాజు పేర్లు.
రాధేయుఁడు - కర్ణుడు.
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
కర్ణుఁడు - కుంతి పెద్దకొడుకు. (కుంతి - పాండవులతల్లి, వికృ.గొంతి.)
కర్ణానుజుఁడు - యుధిష్ఠిరుడు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.
కాలపృష్టము - 1.కర్ణునివిల్లు, 2.విల్లు.
విల్లు - ధనుస్సు.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
అథ కర్ణస్య కాలపృష్టం శరాసనమ్ -
కాలవర్ణ పృష్టో యస్య సః కాలపృష్ఠః - నల్లనైన వెనుకదిక్కుగలది.
కర్ణస్య శరాసనమ్- కర్ణుని విల్లు.
దీనహస్తే ధనంద్యాత్స్వ భార్యాయాంచ యౌవనమ్|
స్వామికార్యేషుచ ప్రాణం నిశ్చయో మమ మాధవ||
తా. ఓ కృష్ణా! తాను సంపాదించిన సొమ్మును బీదలకు వినియోగము చేయవలయును, తన యౌవనమును తనభార్యయందు వినియోగము చేయవలయును, తనప్రాణమును స్వామికార్యముల యందు వినియోగ పరచవలయును అని, నా నిశ్చయమని కర్ణుడు చెప్పెను. - నీతిశాస్త్రము
కృష్ణుఁడు-1.విష్ణువు 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు(నల్లనివాడు).
వాసుదేవుడు - కృష్ణుడు, వ్యు.వసుదేవ కుమారుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
కృష్ణమూర్తి - కృష్ణావతారము.
యాశోదేయుఁడు - యశోద కొడుకు, శ్రీకృష్ణుడు.
ఉపేంద్రుఁడు - 1.వామనుడు, విష్ణువు, 2.కృష్ణుడు.
వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు.
ఇంద్రావరజుఁడు - ఇంద్రునితమ్ముడు, ఉపేంద్రుడు, విష్ణువు.
ఉపేంద్రః ఇంద్ర ముపగతః అనుజత్వా దుపేంద్రః - ఇంద్రునికి తమ్ముడు గనుక ఉపేంద్రుడు.
ఇంద్రరక్షణాయ తత్సమీపే స్థితో వా - ఇంద్రుని రక్షించుటకై అతనియొద్ద నున్నవాఁడు.
ఇంద్రలోకా దుపరితిస్థతీతి వా ఉపేంద్రః - ఇంద్రలోకమున కంటె పైలోకమందుండువాఁడు.
ఇంద్రస్య అవరజః ఇంద్రావరజః - ఇంద్రుని దమ్ముడు.
ఛలయసి విక్రమనే బలిమద్భుతవామన,
పదనఖనీరజనిత జనపావన|
కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే! ||
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
కృష్ణః సర్వంకరీతీతి కృష్ణః - అన్నిటిని జేయువాడు.
డుకృఞ్ కరణే దైత్యాన్ కర్షతీతి వా - దైతులను నలిపివేయువాడు.
కృష్ణ విలేఖనే-కృష్ణవర్ణ త్వాద్వా - కృష్ణవర్ణుడు గనుక కృష్ణుడు.
మునుపొనరించుపాతక, మమోఘము జీవుకెల్లబూనియా
వెనుకటి జన్మం దనుభవింపకదీరదు, రాఘవుండు వా
లిని బడవేసి తా మగుడ లీల యదూద్భువుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తనమేను, భాస్కరా.
తా. రఘురాముడు వాలిని వధించిన యనంతరము రామావతారము చాలించి తిరిగి యదుకుల సంభూతుడై పుట్టెను. ఆ కృష్ణావతారము(కృష్ణమూర్తి-కృష్ణావతారము)నందు యుగాంతమునకు దాపుగా శ్రీకృష్ణుడు అడవిలో తపము చేయుచుండగా నొక కిరాతు డాతనిని మృగముగా భావించి యొక వాడికోల నేయగా దానిచే కృష్ణుడు తనమేనుఁ బాసెను. కావున సమస్తజీవులకు పూర్వజన్మమున జేయు పాపఫల మేజన్మమందు ననుభవింపక తీరదు.
వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
కృష్ణద్వైపాయణుఁడు - వ్యాసుడు; బాదరాయణుఁడు - వ్యాసుడు.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.
నల్లని ద్వీపమునందు జన్మించి నందు వల్ల, కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడయినాడు. ద్వైపాయనుడైన వ్యాసమహర్షి అజ్ఞానం నుంచి రక్షించును.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.
గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
వ్యాసుడు వశిష్టుని మునిమనుమడు. శక్తికి పుత్రుడు-నిష్కల్మషుడు-పరాశరుని పుత్రుడు. శ్రీశుకుని తండ్రి, తపోధనుడు వ్యాస మహర్షి. కాలాంతరమున ఏకరాశిగా నున్న వేదాలను విడివిడిగా (నాలుగు వేదాలుగా విభజించుట) ఏర్పరచడం మూలాన వ్యాసుడు (వేదాల చిక్కు విడగొట్టేవాడు) లేక వేదవ్యాసుడు అనే పేరు పొందినాడు.
ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
భా. ప్రతియుగంలో కాలం యొక్క ప్రభావంచేత అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారూ అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. వారు అపారమైన వేదరాశిని అధిగమించలేరు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి యుగధర్మానికి తగిన విధంగా ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.
వ్యాసం వసిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్.
జయ - 1.పార్వతి, 2.పార్వతిచెలి, 3.సంవత్సరములలో నొకటి, 4.మహాభారతము.
జయపెట్టు - క్రి. జయజయయని దీవించు.
జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె - వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము.
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.
జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము.
త్రయాణాం దేవానాం - త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా - తవ చరణయో ర్యా విరచితా |
తథహి త్వత్పాదో - ద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వ - న్ముకుళిత కరోత్తంసమకుటాః. - 25శ్లో
తా. ఓ పార్వతీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించినవారైన త్రిమూర్తులకు(బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు)చేసే పూజ కూడా, నీ పదములకు చేయబడినచో నదియే పూజ యగును. ఎట్లనగా ఈ మువ్వురును మణిమయమగు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో శిరసున చేతులు జోడించుకొని యుండువారే గదా! భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం. - సౌందర్యలహరి
భారతము - 1.వ్యాసభట్టారక ప్రోక్తమైన పంచమవేదము, 2.భరత ఖండము.
భరతము - 1.నాట్యము, 2.భరత పిట్ట, 3.భరత ఖండము.
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెడి ఆట.
నాటకము - 1.నర్తనము, 2.ప్రవర్తనము, సం.వి.నాట్య ప్రధానకావ్యము, (దశ విధ రుపకములలో నొకటి).
నృత్తము - నర్తనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తించు - క్రి.1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు.
నర్తనప్రియము - నెమలి; నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
కంసారాతి - శ్రీకృష్ణుడు.
కంసుఁడు - కృష్ణుని మేనమామ.
నీవే తల్లివి దండ్రివి,
నీవే నాతోడునీడ * నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము,
నీవే నాపతియు గతియు, నిజముగ కృష్ణా.
తా. కృష్ణా ! నీవే నాతల్లివి, తండ్రివి, హితుఁడవు, సోదరుఁడవు, గురుఁడవు, దైవమువు, నా ప్రభుఁడవు నాకు ఆధారుఁడవు అని నిజముగ నమ్మితిని.
అబ్జము - 1.తామర, 2.నూరుకోట్లు, 3.ఉప్పు, 4.శంఖము, 5.హారతి కర్పూరము, 6.(వృక్ష.) నీటిప్రబ్బలి, విణ.నీట బుట్టినది.
అబ్జ బాంధవుడు - సూర్యుడు వ్యు.తామరలకు బంధువు.
అబ్జమిత్రుఁడు - సూర్యుడు.
అబ్జౌ శజ్ఖ శశాఙ్కాచ - అబ్జశబ్దము శంఖమునకును, చంద్రునికిని, చకారము వలన తామరకును, ధన్వంతరికిని పేరు. అద్భ్యః జాయత ఇత్యబ్జః, అబ్జం చ. జనీ ప్రాదుర్భావే. - నీళ్ళ వలనఁ బుట్టునది. "శంఖే ధన్వంతరౌ చంద్రే పుం స్యబ్జః క్టీబమంబుజ" ఇతి నానార్థ సంగ్రహః. పూజ్యుడైన ధన్వంతరి రోగహేతువైన అపథ్యము నుంచి రక్షించును.
జలజము - 1.తామర, 2.శంఖము.
తామర - తామరసము, పద్మము, తూ.తమ్మి, వి.చర్మరోగము, (ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయరుహము - తామర, వ్యు.నీటియందు జన్మించినది.
అబ్జజుఁడు - బ్రహ్మ, తుమ్మిచూలి.
అబ్జయోని - బ్రహ్మ, తమ్మిచూలి.
అబ్జవైరి - చంద్రుడు, వ్యు.తామరలకు శత్రువు.
అబ్జారి - చంద్రుడు.
బిలియను – (Billion), నూరుకోట్లు.
ఉప్పు - ఆవిరిపోకుండ ఉడకబెట్టు, వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.
లవణము - ఉప్పు, సైంధవ, సౌవర్చ, కాచ, బిడా, సముద్ర లవణములని పంచ లవణములు.
ఉప్పదనము -
సొమ్ము - 1.స్వము, 2.ధనము(నెలగ - ధనము), 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీన వస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive). స్వాపతేయము - ధనము.
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది, 2.తెలియబడినది.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్.
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము(Active Principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
నిజము - స్వభావము, 1.తనది, 2.శాశ్వతమైనది.
తాను - తాశబ్దమునకు ప్రథమైక వచనము. తన - ఆత్మార్థకము.
ఆత్మీయము - తన సంబంధమైనది, తనది, స్వకీయము.
సొంతము - స్వతంత్రము, స్వకీయము, సం.స్వతంత్రమ్.
స్వకీయము - తనది, రూ.స్వకము, (వ్యతి. పరకీయము).
స్వీయము - తనది, వ్యతి.పరకీయము.
నైజము - 1.తనది, 2.స్వాభావికము; నైసర్గికము - స్వాభావికము.
స్వాభావికము - స్వభావముచేత కలిగినది.
ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ - భూషణము; భూషణము - అలంకరణము.
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది.
ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింపబడినది.
పిత్రార్జితము - పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).
జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త.
స్త్రీ ధనము - పెండ్లి మున్నగు, సమయములలో స్త్రీకిచ్చిన ధనము.
సౌదాయికము - స్త్రీ కిచ్చిన ధనము.
ఉత్తమం స్వార్జితం విత్తం - మధ్యమం పితురర్జితమ్|
అధమం భ్రాతృవిత్తంచ - స్త్రీవిత్త మధమాధమమ్||
తా. తాను సంపాదించినసొమ్ము ఉత్తమము(శ్రేష్ఠము, ముఖ్యము), తండ్రిసొమ్ము మధ్యమము, తోడబుట్టినవాని సొమ్మధమము(అధమము - తక్కువైనది, నీచము), స్త్రీసొమ్ము మిక్కిలి యధమము. - నీతిశాస్త్రము
కంబువు - 1.శంఖము, 2.ఏనుగు, 3.కడియము, 4.నత్తగుల్ల.
కంబుగ్రీవ - 1.మూడు ముడుతలు గల మెడ, 2.శంఖము వంటి మెడగలది.
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
గుల్ల - 1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ. 1.అల్పము, 2.బోలు, సం.క్షుల్లః.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల. (గుల్ల కడియము.)
డొల్ల - 1.బల్లవంటిది, 2.బుఱ్ఱ, 3.డొల్లక.
బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
పొక్కు - 1.బొబ్బ, 2.ఎండి లేచినపెల్ల, 3.జనశ్రుతి, క్రి.1.దుఃఖించు, 2.బొబ్బలేచు.
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
సూక్ష్మము - అణువు, విణ.సన్నము.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
శఙ్ఖో నిధౌ లలాటాస్థ్ని కమ్బౌన స్త్రీ : శంఖ శబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖమునకును పేరు. శమయతి దుఃఖమితి శంఖః శము ఉపశమే. - దుఃఖమును శమింపఁ జేయునది.
వెలిగుల్ల - శంఖము. శంఖధ్వని వినిపించే చోటు లక్ష్మీదేవి ఉంటుంది.
శ ఙస్స్యాత్కమ్బు రస్త్రియౌ :
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః ఖను అవధారనే. - సుఖమును బుట్టించునది.
కామ్యతే శుభార్థిభిరితికంబుః. ఉ-ప్న. కము కాంతౌ. - శుభర్థులైనవారిచేత కాంక్షింపఁబడునది. ఈ రెండు శంఖము పేర్లు.
శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతియందు ధరించువాడు.
అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.
అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.
నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.
హారతి కర్పూరము - (వ్యవ.) (Lauraceac) అను కుటుంబమునకు చెందిన Laurus camphor అను చెట్టువేళ్ళు కాండములనుండి ఈద్రవ్యమును అస్థిర తైలమును తీయుదురు (Camphor).
ఆజ్యము - 1.నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.
ద్వౌ పరివ్యాధ విదులౌ నాదేయీ చామ్బువేతనే :
పరివిధ్యతే అంభసా పరివ్యాధః వ్యథ తాడనే. - జలముచేత అంతట కొట్టఁబడును.
విదుల్యతే అంభసా విదులః, డుల క్షేపే. - జలముచేతఁ ద్రవ్వఁబడినది.
నద్యాం భవా నాదేయీ, ఈ. సీ. - నదియందుఁ బుట్టినది.
అంబుని వేతసో మ్భు వేతసః - జలమందలి ప్రబ్బలి. ఈ నాలుగు నీరు ప్రబ్బలి పేర్లు.
కైసాటి చుక్క - హస్తా నక్షత్రము.
కై - చతుర్ధీ విభక్తి ప్రత్యయము, వి. 1.చేయి, 2.తొండము, రూ.కయి.
కొఱకు - చతుర్థీ విభక్తి ప్రత్యయము.
కయి - 1.చేయి, హస్తము, 2.(కై) చతుర్థీ విభక్తి ప్రత్యయము.
చేయి - 1.చెయి, హస్తము, 2.కిరణము, 3.తొండము, 4.పక్షము.
చెయి - 1.హస్తము, 2.తొండము, రూ.చేయి, చే, చెయ్యి.
సాటి - ఒకవస్తువునిచ్చి మనొకటి మార్చుకొనుట, వినిమయము, పరివర్తనము, రూ.సాటా, సాటాకోటి.
సాటి - సమానము, రూ.సాటిక.
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
శాఖ - 1.చెట్టు కొమ్మ, 2.వేద భాగము, 3.చేయి.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది(స్త్రీ - ఆడుది), రూ.కొమ్మ.
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.
పోటకత్తి - (వ్యవ.) పొడవైన పిడితో వంపు తిరిగి యుండు చిన్నకత్తి, (ఇది కొమ్మలను నరకుటకు కుపయోగించును) (Bill-hook).
An old Chinese saying, the branch which does not bend in the wind will break.
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
చే - తృతీయ విభక్తియందు వచ్చు ప్రత్యయము, వి.1.హస్తము, 2.తొండము.
చేత - 1.తృతీయా విభక్తి ప్రత్యయము, రూ.చేన్.
తోడ - తృతీయ్యవిభక్తి ప్రత్యయము, రూ.తోడుత, అవ్య, కూడ, వెంబడి.
తోడుతో - వెంబడిని, రూ.తోడుతోడ, తోడ్తో, తోడ్తోడ.
తోడ్తో - తోడుకో. తోడ్తోడ - తోడుతోడు.
హస్తకళలు - (అర్థ.) చేతిపనులు.
హాండీక్రాఫ్‌ట్సు - (వాణి.) (Handi-crafts) చేతిపనులు.
రత్ని - మూర, మోచేయి మొదలు పిడివరకు గల కొలత.
ప్రకోష్టము - 1.తొట్టికట్టు, 2.ముంజేయి.
కిష్కువు - 1.ముంజేయి, 2.జేన, 3.మూర.
ముంజెయి - (ముందు+చెయి) ముంగేయి. ముంచేతి కంకణమునకు అద్దమేల.
ముంగమురము - ముంజేతి కంకణము, రూ.ముంగమురాము, ముంగమురారి, ముంగైమురారి.
జేన - పండ్రెండగుళముల కొలది, వితస్తి.
మూర - రెండు జేనల కొలది.
ద్విసిరకండరము - (జీవ.) చేతిదండ (Biceps muscle).
కైదండ - 1.హస్తభూషణము, 2.హస్తావలంబము.
కయిదండ - హస్తావలంబము, రూ.కైదండ.
చేదండ - హస్తావలంబనము, చేతిలోనుంచు కొను పూదండ.
స్రజము - పూలదండ.
స్రగ్వి - పూదండగలవాడు.
కడియము1 - హస్తభూషణము, సం.కటకః, రూ.కడెము.
సూడిగములు - గాజులు Bangles, చేతికడియములు.
కడెము - కడియము1.
కడియము2 - వరికుప్ప నూర్పుచేయుచు చుట్టును వేయు గడ్దవామి.
పరిహార్యము - హస్త కంకణము, విణ.విడువదగినది.
తోడా - బిరుదుగా వేసిన హస్త భూషణము, 1.అందె.
అందె - అందియ; అందియ - స్త్రీలు కాలియందు ధరించు నగ, నూపురము, 2.బిరుదు చిహ్నముగ కాలికి తొడుగుకొను నగ, రూ.అందె, సం.అందుః.
చేదర్సెనము - చేకానుక.
చేకానుక - పెద్దల దర్శించబోవునపుడు తీసికొనిపోవు కానుక, చేదర్సెనము.
పోఁచి - మనికట్టు మీది చోటు.
పోఁచీలు - ఆడువారి ముంజేతి నగలు.
గోఁటు - 1.కోరికయందున చేర్చికట్టెడు సన్నని సరిగపట్టె, 2.చేతినగ, 3.ఒయ్యారము.
గోఁటుకత్తె - ఓయ్యారము; ఒయ్యారము - ఒయారము.
ఒయారము - 1.విలాసము, 2.సౌందర్యము, 3.గర్వము, రూ.ఒయ్యారము, ఓయారము.
ఒయ్యారి - ఒయారి; ఒయారి - 1.విలాసిని, 2.సుందరి, విణ.సౌందర్యముగలది, రూ.ఒయ్యారి, ఒయారి.
గోఁటుకాఁడు - ఒయ్యారము గలవాడు.
పూస - 1.పూదె, 2.మణి, 3.వ్రేలులోనగు వాని కీలు.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము(ముత్యము), 3.మనికట్టు.
ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరురేఖః, సం.పలాశః.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు.
నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.
మణికారుఁడు - రత్నములను సాన బట్టువాడు.
మణిగము - అధికారము, రూ.మణియము.
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్ సిలికేట్ (Emerald). (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
గరుడపచ్చ(ౘ) - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
కిరీటపచ్చ - మరకతము, గరుడపచ్చ.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
ఇంద్రనీలము - నీలమణి.
గారుత్మతం మరకత మశ్మగర్భో మరిన్మణిః,
గరుత్మతో జాతం గారుత్మతం - గరుత్మంతునివలనఁ బుట్టినది.
మరం మరణం తకత్యనేనేతి మరకతం. తక హనహసనయోః - విష హరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.
అశ్మాగర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగా గలది.
హరిద్వర్ణో మణిః హరిన్మణిః - పచ్చనిమణి. ఈ 4 నాలుగు పచ్చల పేర్లు.
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, 12000 శ్లోకములు గలది, గరుడదేవతాకమైన అస్త్రము.
మణిబంధము; మణికట్టు - (గృహ.) అరచేతికి మోచేతికి మధ్యనున్న కీలు (Carpus).
మణి బంధాస్థి - (జం.) చేతి మణికట్టులోనున్న ఎముకల సముదాయము (Carpus).
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.
ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చ గుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.
పత్రహరితము - (వృక్ష.) ఆకులలో నుండు ఆకుపచ్చని పదార్థము, హరితము (Chlorophyll).
హరిత్తు - 1.దిక్కు, 2.ఆకుపచ్చవన్నె, 3.పచ్చగుఱ్ఱము.
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.
ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చ గుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.
హరిత్తు - 1.దిక్కు, 2.ఆకుపచ్చవన్నె, 3.పచ్చగుఱ్ఱము.
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.
పత్రము - 1.ఆకు, 2.రెక్క, 3.వ్యవహారము, చెల్లుబడికై వ్రాసికొను కాగితము, 4.వాహనము, 5.బాణము.
పతత్రము - 1.రెక్క, 2.పత్రము.
పతత్రి - పక్షి, వ్యు.రెక్కలుగలది.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.
హరిద్ర - పసుపు.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ.
పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.
అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.
బంధూకము - మోదుగ పూవు, మోదుగ.
మంకెన - 1.బంధూకము, మోదుగు, 2.ఎద్దు మీద నీళ్ళబిందెలు ఆనుటకై వేయుబెత్తపు బుట్టల జత.
మోదుగు - కింశుక వృక్షము, రూ.మోదువు.
కింశుకము - పలాశము, మోదుగు చెట్టు.
పలాశే కింశుకః పర్ణో వాతషోథః -
పుణ్యాని పాలశాని యస్య సః పలాసః - పుణ్యములైన ఆకులు గలది.
సంపుప్పైః పలం మాంసం అశ్నాతీవ తిష్ఠతీతి నా పలాశః - పుష్పములచేత మాంసమును భక్షించు దానివలె నుండునది.
కించిచ్ఛుకవన్నీలత్వాత్కింశుకః - ఇంచికంత పచ్చనై చిలుకవలె నుండునది.
ప్రశ స్తపర్ణ యోగాత్వర్ణః - మంచి ఆకులు గలది.
వాత రోగం పోథయతీతి వాతపోథ. పుథ హింసాయాం. - వాతరోగమును బోఁగొట్టునది. ఈ నాలుగు మోదుగచెట్టు పేర్లు.
శుకములు(శుకము - చిలుక) మోదుగ పూలు జూచి పండ్లని భ్రాంతిపడి వెళ్ళగా వానికి నిరాశయే మిగులును.
రూపయౌవన సంపన్నా విశుద్ధ కులసంభందాః|
విద్యాహీనా నశోభంతే నిర్గంధా ఇవకింశుకాః||
తా. రూపము, ప్రాయము, సంపద, మంచికులగోత్రములు, ఇవి గలవారై నను విద్య(విద్య - 1.జ్ఞానము, 2.చదువు.)లేనివారు ప్రకాశింపరు. అది యెట్లనిన, మోదుగ పువ్వులు ఎంత యెరుపు(ఎఱుపు) గలిగినవైనను పరిమళము లేనందు వలన ప్రకాశింపవు గదా. - నీతిశాస్త్రము
బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ|
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ. - 177శ్లో
కరము1 - 1.చేయి, 2.కిరణము, 3.తొండము, 4.కప్పము.
కరము2 - మిక్కిలి, కడు, అత్యంతము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.
పృశ్ని - కిరణము, 1.పొట్టిది 2.చిన్నది. పృశ్ని గర్భుడు అనగా శ్రీమహావిష్ణువు.
అంశువు - 1.కిరణము, 2.కాంతి, 3.కొస, 4.అణువు, 5.దారము.
అంశుమంతుఁడు - 1.సూర్యుడు, 2.సగరచక్రవర్తి మనుమడు, 3.ధనవంతుడు.
అంశుమాలి - సూర్యుడు.
తొండము - 1.తుండము, గజహస్తము, 2.కపిలబాన తోక, సం.తుండమ్.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
పక్షము - 1.నెలయందు బదునైదు దినములు (శుక్ల కృష్ణపక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు.
చెయిదము - 1.పని, చేష్ట, రూ.చెయిది, చెయ్ది, చెయువు.
చేష్ట - 1.పని, 2.వ్యాపారము.
చెయిది - చెయిదము, చేష్ట.
చెయ్ది - చెయిదము; చెయ్దము - చెయిదము.
చెయ్వు - చెయువు; చెయువు - చెయిదము.
చెయువుల సాకిరి(సాకిరి - సాక్షి) - 1.కర్మసాక్షి, సూర్యుడు.
కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలకు సాక్షియైనవాడు.
చేతులకుఁ దొడవు దానము
భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియతొడ నెవారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ.
తా. హస్తములకు దాన మొసంగుటయు, రాజులకు సత్యవాక్పరి పాలనము సర్వజనులకు న్యాయమార్గాను (అను)సరణము, స్త్రీలకు(నాతి - స్త్రీ, రూ.నాతుక.)మానరక్షణము ఆభరణములుగా భువిలో శోభించును.
అందంగా ఇవ్వటము, తీసుకోవటము కూడా ఒక కళే. ఇచ్చేవాడు వాడే-పుచ్చుకునే వాడూ వాడే - చెయ్యి.
కేలు - 1.చేయి, 2.తొండము, సం.కులిః.
కేలుమొగ్గ - కేలుమోడ్పు, అంజలి బంధము.
కైకట్టు - 1.సందర్భము, 2.చేమోడ్చు.
కృతాంజలి - చేతులు మోడ్చినవాడు, వి.లజ్జాళువు.
లజ్జ - సిగ్గు. లజ్జ భూషణము వంటిది.
సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.
సిగ్గరి - సిగ్గుకలవాడు.
నాన - సిగ్గు, సం.జ్ఞానమ్, త. నాణ్, క. నాణ.
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ.
తా|| పట్టణమునకు వైశ్యుడు(కోమటి - వైశ్యుడు, సం.కర్పటికః.), వరికి నీరు, గజమునకు(ఏనుగునకు) తొండము, ధన సంపదకు వనితయు (మగువ - స్త్రీ) ప్రాణాధారముల వంటివి.
కై(ౘ)చాపులు - అంజలి, నమస్కారములు.
అంజలి - 1.చేమోడ్పు, నమస్కారము, 2.ఒకరకపు అభినయ హస్తము.
దోయిలి - అంజలి, పంపబడిన రెండు చేతులచేరిక, రూ.దోసిలి.
దోసిలి - దోయిలి, నమస్కారము.
నమస్కారము - మ్రొక్కు, రూ.నమస్క్రియ, నమస్కృతి.
నమస్సు - నమస్కారము; చేతివిప్పు - నమస్కారము పెట్టు.
చేమోడ్పు - 1.నమస్కారము, రూ.చేమోడుపు.
కైకట్టు - 1.సందర్భము, 2.చేమోడ్పు.
సందర్భము - 1.ప్రబంధము కూర్పు, 2.సమయము.
చేమోడుచు - మ్రొక్కు; మొక్కు - నమస్కరించు, వి.ముడుపు, రూ.మ్రొక్కు.
వినతి - నమస్కారము. నమించు - నమస్కరించు.
వందనము - 1.పూజ, 2.స్తోత్రము, 3.నమస్కారము.
నమస్య - 1.పూజ, 2.సపర్య; వేల్పుఁడు - పూజ, సపర్య; సపర్య - 1.పూజ, 2.సేవ.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె - వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము.
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.
కయికోలు - అంగీకారము, సమ్మతి.
అంగీకారము - 1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ.
కోలు - 1.అను ప్రయుక్తమైన కొను ధాతువునకు కృదంతరూపము, ఉదా.వీడుకోలు, ఇచ్చుకోలు, కొనుగోలు, 2.కొల్ల, విన.మిక్కిలి.
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మన్సు ధృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వ.
తా. ఓ వేమా! పూజచేయుట కంటె పూజనీయమైన బుద్ధి కలిగివుండుట మంచిది. మాటలు చెప్పుటకంటె నిశ్చలమైన మనస్సు కలిగి వుండుట మంచిది. కులము కంటె గుణము ముఖ్యమైనది.
Hands that help are holier than the lips that pray.
శయము - 1.శయ్య, 2.చెయి, 3.పాము.
శయ్య - 1.పడక, 2.పదగంఫనము, 3.విధము.
శయనము - శయ్య, నిద్ర.
శయనీయము - శయ్య, వ్యు.శయనింపదగినది.
శయాళువు - పెనుబాము, విణ.నిద్రపోతు, రూ.శయతుడు.
బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.
పెద్దనిద్దుర - మరణము, దీర్ఘనిద్ర. దీర్ఘనిద్ర - చావు; మృతి - చావు.
నిదురపోతు - నిద్రాళువు, రూ.నిద్దురపోతు.
నిద్రాళువు - నిదురపోతు, నిద్రించు స్వభావము గలవాడు.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవు చున్నట్టు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).
పడకపుండు - (గృహ.) ఎక్కువ జబ్బుతో కదలలేకుండ పండుకొని యున్న వారికి మంచమువేడివల వచ్చుపుండ్లు (Bedsore).
పడక తడుపుకొనుట - (గృహ.) పడకలో మూత్రము విడుచుట (Enuresis).
షడ్భాగము - కప్పము.
భాగధేయము - 1.భాగ్యము, 2.కప్పము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
అరి - 1.కప్పము, 2.అల్లెతాడు, 3.హద్దు, మర్యాద.
అరిగాఁపు - 1.పన్ను చెల్లించురైతు, 2.కప్పము చెల్లించినవాడు.
మౌర్వి - అల్లెత్రాడు.
నారి - అల్లెత్రాడు వై.వి. నరము, సం.నాడీ స.వి. స్త్రీ.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
బయసి - 1.మర్యాద, గౌరవము, 2.దయ, 3.భాగ్యము.
బైసి - 1.గౌరవము, 2.భాగ్యము, రూ.బయిసి, బవిసి, బగిసి, సం.భూయసీ.
మర్యాద - 1.కట్టుబాటు, 2.తీరము, 3.సన్మానము.
అదుపు - 1.కట్టుబాటు, 2.హద్దు(మేర, ఆజ్ఞ), 3.స్వాధీనము.
కట్టుదిట్టము - కట్టుబాటు. మిర - మేర, హద్దు, మర్యాద.
తీరము - దరి, (భూగో.) అంచువలె సముద్రపు నీటికి తగిలియున్న భూమి.
దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్.
గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువుకట్ట, పర్వతము, సం.ఘట్టః.
సమీపము - చేరువ; సదేశము - సమీపము.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
గట్టుతాలుపు - విష్ణువు, వ్యు.మందరగిరి నెత్తినవాడు.
గట్టువిలుకాడు - శివుడు, వ్యు.మేరువు విల్లుగా గలవాడు.
యద్య త్పరవశం కర్మ తత్తద్యత్నేవ వర్జయేత్|
యద్య దాత్మవశంతు స్యాత్తత్తత్సేవేత యత్నతః||
సర్వం పరవశందుఃఖం సర్వమాత్మ వశంసుఖం|
ఏతద్వేద్యా త్సమాసేన లక్షణం సుఖదుఃఖయోః||
తా. పరాధీనమైన కార్యమును(పనిని) విడువవలయును, స్వాధీనమైన(వశము - స్వాధీనము)కార్యమును చేయవలయును, అది యేమనిన, పరాధీనమైన వన్నియు దుఃఖకరంబులు, స్వాధీనమైనవి సుఖఃకరంబులు, ఇవి సంక్షేమముగా సుఖదుఃఖములకు లక్షణము. - నీతిశాస్త్రము
హస్తిని - 1.ఆడేనుగు, 2.ఒక స్త్రీజాతి, (శంఖినీ, పద్మినీ, చిత్రిణీ జాతు లితరములు).
గణిక - 1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ.
చిత్రిణి - చిత్తిని, ఒకజాతి స్త్రీ.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.
పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు గలది.
హస్తి - ఏనుఁగు వ్యు.హస్తము కలది.
చేగల మెకము - ఏనుగు, హస్తి.
కరటి - ఏనుగు, హస్తి. మాతంగము - ఏనుగు.
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
హస్తిసఖుఁడు - మావటీడు.
మావటి - శూరుడు, మల్లుడు, రూ.మావటీడు, మాస్టీడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లుఁడు - జెట్టి; జెట్టి - 1.మల్లుడు, 2.శూరుడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లు - 1.కోతి, 2.మల్లుడు, జెట్టి, సం.మల్లః.
గజము -1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేన్నాంగములలో ఒకటి.
గౙ - పెద్ద, సం.గజః.
గజయాన - ఏనుగు నడకవంటి నడకగల స్త్రీ, స్త్రీ.
గజవదనుడు - వినాయకుడు.
లావు గలవాని కంటెను,
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును,
మావటివాఁ డెక్కినట్లుమహిలో సుమతీ.
తా. శరీరబలము గలవానికంటెను బుద్ధిబలముగల మానవుడు శక్తిమంతుడు. ఎట్లనగా గొప్ప బలముగల ఏనుగును మావటివాడు స్వాధీనపరచుకొనుట యిందుకు నిదర్శనం.
అత్తి - (వృక్ష.) మేడి ఉదుంబరము, వై. వి. ఏనుగు, సం.హస్తిః.
మేడి - అంజూరు, అత్తిచెట్టు.
అం(ౙ)జూరు - 1.అత్తిపండు, 2.అత్తిచెట్టు.
ఉదుంబరము - 1.గడప, 2.అత్తిచెట్టు, 3.రావిచెట్టు.
కడప - దేహళి, రూ.గడప, వై.కదంబము (చెట్టు), సం.కదంబః.
దేహళి - గడప, కడప, రూ.గేహళి.
గేహళి - గడప, రూ.దేహళి.
దేహళీ దీపన్యాయము - న్యా. గడప మీద దీపము పెట్టిన నింటిలోన బైట గూడ ఉపయోగించు రీతి, దేహళీదత్త దీపన్యాయము.
ఉదుమ్బరో జన్తుఫలో యజ్ఞాజ్గో హేమదుగ్దకః,
ఉన్నతత్వా దుల్లంఘిత మంబరం అనే నేతి ఉదుంబరః - ఔనత్యముచేత నాకాశమును దాఁటునది.
జంతుయుక్తం ఫలమస్యేతి జంతుఫలః - జంతువు(జంతువు - చేతనము, ప్రాణముగలది)లతోఁ గూడిన ఫలములు గలిగినది.
యూపాదిరూపేణ యజ్ఞస్యాంగ మువకరణ మితి యజ్ఞాంగః – యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమైయుండునది.
హేమవర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః - బంగారువంటి పాలుగలది. ఈ నాలుగు 4 అత్తిచెట్లు పేర్లు.
గేహేశూరన్యాయము - న్యా.ఇంటిలో డంబములు కొట్టువాడే కాని పనికిరాని వాడనుట.
గేహేశూరుఁడు - ఇంటిలోనే డంబములు కొట్టువాడు, పిరికివాడు.(దంభము - 1.కపటము, 2.తప్పు, 3.గర్వము. అదరుగుండె - పిరికివాడు).
మేడిపండుచూడ మేలిమైయుండును
పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వ.
తా. ఓ వేమా! మేడిపండు చూచుటకు పైకిపచ్చగా బంగారమువలె కంటిపింపుగా కనబడును కాని, దానిని బ్రద్దలుచేసి చూచినచో లోపల పురుగులు వుండును. చెడ్డవారుచూచుటకు పైకి బాగుగనే కన్పించు చున్ననూ, లోపల వారి గుణములు మాత్రము చాలా చెడ్డవిగ వుండును.
ఔదౌంబరము - 1.ఒకలోహము, 2.రాగి, విణ.ఉదుంబర (మేడి) వృక్ష సంబంధమైనది.
ఉదుంబరక ఫలము - (వృక్ష.) పుష్పమంజరి అంతయు కలిసి ఏర్పడిన ఫలములలో నిది యొకటి. దీనిలో చుట్టును ఆవరించి యున్న పుష్పాసవము మాంసలమై యుండును, ఉదా.అత్తి మొ.వి.
కడిమి1 - 1.అతిశయము, 2.పరాక్రమము; గోహరి - పరాక్రమము.
కడిమి2 - కడప (చెట్టు), సం.కదంబః.
నీపము - కడిమిచెట్టు.
కదంబరము - గుంపు, వై. విణ. మిశ్రము.
కదుపు - సజాతీయ పశు పక్ష్యాది సమూహము, సం.కదంబమ్.
ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్|
మత్స్యాపాదంజ లే పశ్యే న్ననారీ హృదయస్థితమ్||
తా. మేడిపువ్వులనైన గానవచ్చును, తెల్లని కాకి(ధూంక్ష్మము - తెల్లకాకి)నైనఁ గానవచ్చును, నీళ్ళలోపల చేపల యడుగులనైనఁ గానవచ్చును, స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను. – నీతిశాస్త్రము
వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).
14. చిత్త - ముత్యము వలె గుండ్రముగా ఒకటే నక్షత్ర ముండును.
సృష్టి ' చిత్ర ' నిర్మాణం చేసిన సమయంగల నక్షత్రమిది కనుక ' చిత్ర ' అనే పేరు వచ్చిందని పెద్దలమాట(శాస్త్రకారుల).
త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రామ్ | సుభగ్ం ససంయువతిగ్ం రాచ-మానామ్ | నివేశయన్నమృతాన్మర్త్యాగ్‌శ్చ | రూపాణి పిగ్ంశన్ భువనాని విశ్వా | తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టామ్ | తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యమ్ | తన్నః ప్రజాం వీరవతీగ్ం సనోతు | గోభిర్నో అశ్వైస్సమనక్తు యజ్ఞమ్ ||12||
త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ - దేవశిల్పి; మయుఁడు - అమర శిల్పి.
తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
పాఁపఱేఁడు - నాగరాజు.
తక్షుడు - తక్షకుడు.
స్కల్ ప్ణర్ - (చరి.) (Sculptor) తక్షకుడు, విగ్రహములు చెక్కు శిల్పి.
రథకారుఁడు - తేరుచేయువాడు, వడ్లవాడు.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్యపని చేయువాడు, 2.పక్షివిశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.
వర్థకి - వడ్రంగి, Carpenter.
సూత్రధారుఁడు -1.నాటకము లాడించు ముఖ్యనటుడు, 2.నడుపువాడు, 3.వడ్రంగి.
కీలుకాఁడు - 1.సూత్రధారుఁడు, 2.యంత్రము త్రిప్పువాడు.
కీలు - 1.మర, 2.మర్మము, 3.ఉపాయము, 4.కఱ్ఱలకు పూసెడు నల్లని చమురు.
ఉలి - వడ్రంగి సాధనము, విణ.అల్పము, రూ.నులి.
నులి - 1.ప్రేగులలో నొప్పి, 2.చిక్కు, విణ.అల్పము.
ఐద్దాయులు - (ఐదు+ దాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె కాసెకులస్థుల పనులు.
ముత్తెపురిక్క నెల - చైత్ర మాసము(చిత్తా నక్షత్ర యుక్తము). చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందు గలదు, గనుక చైత్రము, చైత్రికమును అనబడును.
చైత్రసఖుఁడు - మన్మథుడు.
చైత్రసారథి - మన్మథుడు.
స్యా చ్చైత్రే చైత్రికో మధుః :
చిత్తనక్షత్రయుక్తా పూర్ణిమా చైత్రీ సా స్నిన్నస్తీతి చైత్రః. చైత్రికశ్చ - చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు. గనుక చైత్రము, చత్రికమును.
మన్య్తే సర్వత్ర కామదేవో మధుః. ఉ-పు. మన జ్ఞానే - దీనియందు మన్మథుఁ డంతటఁ దలంపఁబడును.
మధునా పుష్పరసేన యోగాద్వా మధుః - దీనియందు మకరంద ముండును. ఈ మూడు చైత్రమాసము పేర్లు.
చైత్రికము - చైత్రమాసము.
చైత్రము - 1.నెల, 2.ఒకానొక కొండ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు 3.వేలుపు.
చంద్రుఁడు - నెల, చందమామ.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుఁడు - చంద్రుడు.
(ౘ)చందురుమామ - చంద్రుడు, చందమామ.
చందమామ పులుఁగు - చకోరము.
చకోరము - చకోరకము.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెల చూచి తృప్తి పొందునది.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
హిమవాలుక - కప్పురము, కర్పూరము.
కర్పూరము - ఘనసారము, కప్పురము.
ఘనసారము - 1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.
సితాభము - కర్పూరము, రూ. సితాభ్రము.
కందకము - అగడ్త; అగడ్త - అగడిత.
అగదిత - కోట చుట్టుత్రవ్వబడిన కందకము, రూ.అగడత, అగడ్త.
ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁజేరవే
చలువగలట్టివాడయినఁజందురు నెంతయుఁగోరి, భాస్కరా.
తా. చంద్రుని యందలి చల్లదనమునకు, ఆ కిరణములను భక్షించుటకు ఎక్కువ ఆసక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే బుద్ధిమంతులు రాజు(నృపాలుఁడు - రాజు) మంచివాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను, సంతోషముతో నట్టిరాజునే కోరుదురు.
మధువు - 1.నీరు, 2.పాలు, 3.తేనె(నననీరు - మకరందము, తేనె.), 4.కల్లు, 5.వసంతర్తువు, 6.చైత్రమాసము.
నీరు - 1.నీరము, జలము(నీరము - జలము), 2.మూత్రము, సం.నీరమ్.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
పయస్సు - 1.క్షీరము, 2.నీరు.
పయస్విని - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
కుసుమాసవము - తేనె, మధువు.
తెనియ - మధువు, రూ.తేనె.
తేనెదిండి - తుమ్మెద; తుమ్మెద - భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెదకు కంటు గల్గించునది.
మధుకరము - 1.భిక్షాన్నము, 2.తుమ్మెద.
మధుపము - తుమ్మెద.
మధులిహము - మధుపము, తుమ్మెద.
కురుళము - ముంగురులు.
కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
ముంగురులు - (ముందు+కురులు) నొసటిపైన గునిసి యాడెడు ఉంగరపు వెండ్రుకలు.
భ్రామరి - పార్వతి.
భ్రమరాంబ - అంబ, పార్వతి.
మాధవి - 1.పూల గురివెంద, 2.కల్లు, 3.తేనె, 4.లక్ష్మి, 5.కుంటెనకత్తె.
వాసంతి - అడవి మొల్ల, పూలగురివెంద.
ముక్కు నలుపు - ఒడలంతా ఎరుపు. – గురివిందగింజ
అంబిష్ట - 1.(వృక్ష.) 1.అడవిమొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి.
అతిముక్తము -మాధవీలత, పువ్వుల గురివెంద, విణ. విముక్తి పొందినది.
కల్లు1 - 1.బండికన్ను(చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.
మదిర - కల్లు; మదురువు - 1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.
ఐరేయము - 1.కల్లు, సుర, 2.నూగుదోస, విణ.అన్నముతో సంబంధించినది.
బలేయము - 1.నూగుదోస, 2.ఒక పరిమళద్రవ్యము.
కూతురుబుడమ - నూగుదోసకాయ.
మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు.
మాధుర్యము - 1.తీపు, 2.పక్షులు మొ. నవి వచ్చుటకు బోయ వేయు ఈల, 3.శృంగారచేష్ట.
తీపు - 1.మాధుర్యము, 2.గుంజెడుబాధ.
మాధ్వి - 1.మద్యము, 2.మకరందము.
మధూళి - 1.కల్లు, 2.పూదేనె. పూఁదేనియ - మకరందము.
కమ్మనీరు - పూదేనె, మకరందము. మకరందము - పుష్పరసము, మరందము. పుష్పరసము - మకరందము.
కౌసుమము - 1.పూదేనె, 2.పుప్పొడి, విణ.కుసుమ సంబంధమైనది.
కుసుమము - 1.పూవు, 2.నేత్రరోగము, 3.స్త్రీరజస్సు, 4.పండు.
పువు - పుష్పము, రూ.పువ్వు, సం.పుష్పమ్.
సుమము - పువ్వు, కుసుమము.
పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.
రజస్సు - 1.రజోగుణము, 2.దుమ్ము, 3.స్త్రీ రజస్సు, 4.పుప్పొడి.
రజము - రజస్సు.
మధూలిక - పుప్పొడి. పుప్పొడి - (పూ+పొడి) పుష్పములాందలి ధూళి.
సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు.
విరి - పువ్వు.
విరిఁబోఁడి - పుష్పమువలె మనోజ్ఞమైన స్త్రీ.
పువుఁబోఁడి - అందకత్తె, రూ.పువ్వుబోడి, పూబోడి.
పువ్వువిలుతుఁడు - మన్మథుడు.
పుష్పశరుఁడు - మన్మథుడు.
అబ్ధిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురికన్ను, 3.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రనాదులయందలి రంధ్రము.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
నేత్రపర్వము - కనులపండువు.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృష్తి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు.
కుసుమాకరము - 1.వసంతర్తువు, 2.తోట.
కుసుమాయుధుఁడు - మన్మథుడు.
ధనుః పౌష్పం మౌర్వీ - మధుకరమయీ పంచ విశిఖాః
వసంత స్సామన్తో - మలయ మరుదాయో దనరథః|
తథాప్వేకః సర్వం - హిమగిరి సుతే! కామపి కృపామ్
అపాంగా త్తే లబ్ధ్వా - జగదిద మనఙ్గో విజయతే|| - 6శ్లో
తా. ఓ హైమవతీ! మృదువులై తాకిన కందిపోవును తాకుటకు గాని వంచుటకు గాని వీలుగాని విల్లు పూలది; ఒకటి కొకటికి పొందిక లేనందున త్రాడగుటకు తగని, అల్లెత్రాడు(మౌర్వీ- అల్లెత్రాడు)తుమ్మెదల మొత్తము; బాణములు ఐదు; వసంతుడు మంత్రి; మందమై ఎల్లపుడు నుండక స్థిరముకాని, రూపములేని మలయమారుతము యుద్ధరథము. ఇట్లు ఉపయోగ రహితములన పరికరములను కలిగిన మన్మథు(అనంగఁడు - మన్మథుడు, విణ.అంగములేనివాడు.)డొక్కడే నీ క్రీగంటి(అపాంగము - కడకన్ను, విణ.అంగహీనము.)చూపు వలన అనిర్వాచ్య మగు దయను పొంది ఈ జగత్తు నంతను జయించుచున్నాడు. - సౌందర్యలహరి
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రములందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.
సూర్యుడు చైత్ర మాసంలో ధాత అనే పేరు ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు అనేవాడు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు.
ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
ధాతా. ఋ.పు. సర్వం దధాతీతి ధాతా - సమస్తమును ధరించువాడు. డుధాఞ్ ధారణ పోషణయోః.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
అగ్నిశిఖము - కుంకుమపూవు.
ఘుసృణము - కుంకుమపువ్వు; వహ్నిశిఖము - కుంకుమపువ్వు. కాశ్మీరము -1.కుంకుమపూవు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీరదేశము.
అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము(వస్త్రము - బట్ట, వలువ), 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూత్యాది వ్యసనము.
చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
చిత్రభానుఁడు - 1.అగ్ని 2.సూర్యుడు.
బృహద్భానువు - అగ్ని; వహ్ని - అగ్ని.
భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాస్వరుడు - సూర్యుడు. సూర్యుఁడు - వెలుగురేడు.
భాస్వంతుఁడు - సూర్యుడు, విణ.ప్రకాశించువాడు.
సూర్య వహ్నీ చిత్రభానూ : చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు. చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః - నానావిధములైన కిరణములు గలవాఁడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు, (సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).
చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
చిత్రగుప్తుఁడు - 1.యముడు, 2.యముని యొద్ద లేఖఖుడు.
కంటిపాప - చిత్రగుప్తుడు.
కంటిపాప - కంటి నల్లగ్రుడ్డులోని చుక్క, (ఈ ద్వారమునకే వెలుగు లోపలికి ప్రవేశించును) (Pupil).
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.
తారకము - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింప చేయునది.
కనీనిక - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.చిటికెన వ్రేలు.
నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక.
చిటికెన - 1.చిన్నవ్రేలు(చిటివ్రేలు - చిన్నవ్రేలు), 2.కనిష్ఠిక.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.
కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).
తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య, 3.వాలిభార్య.
తారాపతి - చంద్రుడు.
కాలద్వర కవాటబంధనము, దుష్కాల ప్రమాణ క్రియా
లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీక్రోగ జిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధి, మృత్యుముఖ దంష్ట్రా హర్యవజ్రంబు, ది
క్చేలాలంకృత! నీదు నామ మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!
తా|| ఈశ్వరా! పవిత్రమైన నీ నామము, యముని యింటి ద్వారములను మూసివేయును; జీవుల మరణకాలములను నిర్దేశించు చిత్రగుప్తుని నో రనెడి పుట్టలోని పాములకు గరుడుని వంటిదై అతని యాలోచనల నుపసంహరించును. మృత్యువు కోరలనెడి పర్వతములను గూడ ఛేదించును. (అనగా పుట్టిన తరువాత జనులకు చావురాదని కాదు. నీ నామస్మరణము చేయువారికి ఈ జన్మము తరువాత మరల పుట్టుట, చచ్చుట అనునవి ఉండవని యర్థము.) - ధూర్జటి
మాయ - 1.అవిద్య, 2.ఇంద్ర జాలాదివిద్య, 2.ఒక పట్టణము, వి.(గృహ.) మావి, పిండపుసంచి (Placenta).
అవిద్య - 1.అజ్ఞానము, తత్త్వజ్ఞానము లేమి 2.మాయ.
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
అథాజ్ఞాన మవిద్యాహంమతిః స్త్రియామ్ :
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము.
విపరీతజ్ఞాన మవిద్యా. విదజ్ఞానే - విపరీత జ్ఞానము అవిద్య. అహమితిబుద్ధిరహం మతిః. సీ. - నే ననేడు స్వతంత్రబుద్ధి అహంమతిః. ఈ మూడు అజ్ఞానము పేర్లు.
అవిద్య వల్ల బంధం, విద్య(చదువు, జ్ఞానం) వల్ల మోక్షం కలుగుతాయి. విధ్యాధిక్యతకడ వివేకం, అవివేకం గూడ నుండవచ్చును. భేధము లన్నిటినీ అధిగమించునదే విద్య.
'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనగా అవిద్యచే జరా మరణములను లేకుండ చేసికొని, విద్యచే అమృతస్థితిని (మోక్షమును) పొందునని శ్రుతి(వేదము) చెప్పినది.
విద్యావంతులైన ప్రజలను నడిపించడం తేలిక, తోలడం కష్టం; పరిపాలించడం తేలిక, అణగద్రొక్కడం అసాధ్యం. - లార్డ్ బ్రూగం
అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
అజ్ఞేయతావాదము - దేవుడున్నాడో లేడో తెలియ దనువాదము.
మావి - 1.గర్భస్థ పిండమునకు మీద కప్పికొని యుండు తోలు సంచి, జరాయువు, 2.మామిడి.
జరాయువు - 1.మావి, 2.జటాయువు, (వృక్ష.) అండాశయములో బీజాండము లమరియుండు దిమ్మ, (Placenta).
మామిడి - మామిడిచెట్టు, రూ.మావి.
మాకందము - మామిడి చెట్టు; చూతము - మామిడిచెట్టు.
మాఁగాయ - మామిడికాయ.
ప్రియాలము - ఒక విధమగు మామిడిచెట్టు, రూ.ప్రియాళువు.
అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు Mango fruit.
సహకారము - వ్యష్టి, సమిష్ఠి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి. తియ్య మామిడి చెట్టు.
వ్యష్టి - ప్రయోజనము. ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చుశక్తి (Utility).
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధంతము, వి. (అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తినిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో మూల్యమధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
పుల్ల విరుగుడు తెగులు - (వ్యవ.) చెట్ల కొమ్మలు, రెమ్మలు నీరసించి ఆకులు రాలిపోయి యెండిపోవుట (Die back disease) ఉదా. నారింజ, మామిడి మొ. ఇది యొకజాతి శిలీంద్రము వలన కల్గును.
మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ|
మహామాయా మహాసత్త్వా మహాశక్తి ర్మహారతిః||
శాంభరి - 1.మాయ, 2.రతీదేవి(హరిద్వారము నందు దేవీస్థానం రతీప్రియ).
మాయ - శుద్దతత్త్వమాయ.
మాయ - సత్త్వరజస్తమో గుణ రూపాలను (మూడు గుణాలకు) తెలియ జేయునట్టి తెలుపు, ఎరుపు, నీలము వర్ణాలకు మూలం. ఆత్మను దర్శించుటకు 'మాయ ' అడ్డమై నిలిచును’.
కైలాటము -1.మ్రొక్కు నతి, 2.మాయోపాయము, రూ.కయిలాటకము.
మాయ - అద్దం దుమ్ము చేత మలినమానట్లుగా, అగ్ని పొగతో కప్పబడినట్లుగా, జ్ఞాన్నన్ని మాకం మలినం చేస్తుంది. ఆ విధంగా మలినమైన జ్ఞానం స్వధర్మాన్ని దూరం చేస్తుంది. పరధర్మమ పై మోజు కలుగ జేస్తుంది.
మాయాదేవ్యాస్సుతః మాయాదేవీసుత - మాయాదేవి కొడుకు, శాక్యముని.
సర్వార్థసిద్ధుఁడు - శాక్యబుద్ధుడు.
రతి - 1.రతనాల తూనికయం దొక యెత్తు, 2.మణుగునం దిరువది యైదవ భాగము, సం.వి.1.సురతము, 2.మన్మధుని భార్య, 3.అనురాగము.
రతము - 1.సురతము, 2.సంయోగము.
సురతము - స్త్రీపురుషుల కలయిక, రతి. పైసరము - రతి.
సంయోగము - కూడిక, సం.వి. (రసా.) 1.రెండు ద్రవ్యముల రాసాయనికముగ నుపయోగించుట (Combination), 2.కొన్ని మూలకముల రసాయన సమ్మేళనమువలన నేర్పడిన పదార్థము (Compound).
కూటము - 1.కూడిక(సంగము - కూడిక), 2.సురతము.
రంతు - రతి, క్రీడ, సం.రతిః.
రంతుకాఁడు - క్రీడాపరుడు.
సంభోగము - 1.మంచిసుఖము, 2.సురతము.
సంభోగించు - 1.కలయు, 2.రమించు(రమించు - క్రీడించు).
సంగమము - కలయిక, సంయోగము, సం. (జం.) రెండు భాగములు, కలిసి యుండుట సామాన్యముగా రెండు ఎముకలు కలిసియుండుట, (Symphysis) సం.వి. (గణి.) ఒకే బిందువుతో రేఖలు కలిసికొనుట (Concurrence).
సంహతి - 1.సమూహము, 2.కలయిక, 3.సత్తువ.
సమ్మేళనము - కలయిక, సమావేశము.
సమేలము - 1.సమ్మేళనము, 2.ఒద్దిక, చేరిక, సం.సమ్మేళనమ్. సరాగము - ఒద్దిక, సం.విణ. రాగముతో గూడినది.
సయ్యొద్ద - చేరిక, స్నేహము, రూ.సయ్యోద్ధ.
చేరిక - 1.కూడిక, 2.సమీపము.
సమీపము - చేరువ; చేయలఁతి - సమీపము; సదేశము - సమీపము.
రాగము - 1.అనురాగము, 2.రంగు, 3.మాత్సర్యము, 4.సంగీతమున నాట మొ|| రాగము.
అనురాగము - అనురక్తి, ప్రేమ, కూర్మి.
అనురక్తి - అనురాగము, ప్రేమ.
రక్తి - అనురాగము; రక్తకుఁడు - అనురాగము గలవాఁడు.
అనురకము - 1.అనురాగము కలది, 2.ఎఱ్ఱనిది, 3.రంగుకలది.
అనురక్త - అనురాగముకలది.
అనురక్తిఁడు - అనురాగము కలవాడు.
మమకారము - 1.ప్రేమ, 2.నాది యను అభిమానము.
పేరిమి - 1.ప్రేమ, 2.గౌరవము, 3.అతిశయము.
నెనరు - 1.కృతజ్ఞత, 2.ప్రేమము.
కృతజ్ఞుఁడు - చేసినమేలు తలచువాడు.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పదనము, 3.మన్నన.
అతిశయము - అధిక్యము; వలదు - అధిక్యము, అవ్య.వద్దు.
ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.
లలి - 1.ప్రేమము, 2.ఒయారము, 3.క్రమము, 4.ఉత్సాహము.
లలితము - సౌకుమార్యముచే అంగ విన్యాసరూపమగు స్త్రీల శృంగారచేష్ట, విణ.మనోజ్ఞము, ఈప్పిదము.
సరాగము - ఒద్దిక, సం.విణ.రాగముతో గూడినది.
ఒద్దిక - 1.నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము, 2.అనుకూల్యము, పోలిక, 3.వినయము, 4.ప్రతిమానమైన పడి, వస్తువునకు సమానమైన తూకపురాయు.
అనుకూలము - 1.ఇష్టము, 2.సరిపడునది, 3.సహాయమైనది, (వ్యతి.ప్రతికూలము).
అనుకూల్యము - ఒద్దిక, తగియుండుట, అనుకూలభావము.
అనుగుణ్యము - అనుగుణభావము, తగియుండుట, అనుకూల్యము.
అనురూప్యము - తగియుండుట, (భౌతి.) రెండింటి మధ్యగల అంగప్రత్యంగ సాదృశ్యము (Correspondence).
పోలిక - సామ్యము. వినయము - 1.అడకువ, 2.గురుశిక్ష.
రాగరజ్జువు - మన్మథుడు. మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
గాయకము - 1.మర్మము, 2.మాయ, వంచన, విన.1.వంచకము, 2.మిక్కిలి వెలగలది.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు.
ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.
కొఱసంది - ఆయము, జీవస్థానము, మర్మము.
ఆయము1 - 1.జీవస్థానము, ఆయువు పట్టు, 2.మర్మము, సం.అయుః.
ఆయము2 - 1.రాక, 2.లాభము, 3.రాబడి(రాబడి - ఆదాయము), 4.పన్ను.
మతకము - కపటము, మాయ, సం.మంత్రకః.
మతకరి - మాయావి (మతకము+అరి).
మాయావి - మాయదారి, మాయలు కలవాడు, రూ.మాయకుడు, మాయి.
మాయకాఁడు - వంచకుడు, మాయావి.
మాడులాఁడు - మాయకాడు.
మాయము - మాయ, కనికట్టు, కనుకట్టు.
కపటము - కవుడు, వ్యాజము.
వ్యాజనము - కపటము, నెపము.
నెపము - 1.వ్యాజము, కారణము, 2.తప్పు, రూ.నెపము, సం.నిభ, త. నిపమ్, క.నెవ, నెవను. నిభము - నెపము, విణ.సమానము.
తప్పు - 1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.
తప్పిదము - దోషము; దోసము - దోషము.
దొషము -1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.) కొలతలలోని తప్పులు.
చిక్కు - క్రి.కృశించు, 2.తక్కు, 3.తగులు, 4.దొరకు, 5.మిగులు, 6.మెలి, 7.సంకటము.
తనకవి - 1.చిక్కు, 2.చిక్కుపెట్టువాడు.
దొరకు - 1.లభించు, 2.చిక్కు.
మెలి - మెలిక, చిక్కు, సం.మిళితమ్.
మిళితము - 1.మెలిక, 2.పేనబడినది, 3.కలిసినది.
క్షీణించు - క్రి.తరుగు, కృశించు.
క్షీణము - క్షయించినది, కృశించినది.
క్షీణించుట - (గృహ.) 1.శుషించుట, 2.బలహీనమగుట, 3.సన్నగిల్లుట.
కృశము - 1.బక్క, 2.సన్నము, 3.అల్పము.
కృశాంగి - స్త్రీ, విణ.బక్కపలుచని దేహము కలది.
క్షీణోపయుక్తి న్యాయము - న్యా. (అర్థ.) ఒకే వస్తువును అనుభోగించు నపుడు, రానురాను ఆవ్యక్తికిని దానికిని గల ఉపయుక్తి తరుగుచుండు నను న్యాయము.
మాయ గెల్చినవాఁడు నీమాయగాఁడు
మాయ గెల్వనివాఁడు నీమాయ గాఁడు
మాయ గెల్చియు గెల్వనిదే యదేమొ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
మాయువు - పైత్యరోగము. పైత్య వికారము పది విధములు.
పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.
పైత్యరసము - (జం.) కాలేయము నుండి ఊరురసము(Bile). (ఇది పిత్తాశయములో నిలువచేయబడును.)
రోగము - వ్యాధి. కర్మకృతము, ధాతుకృతము అని వ్యాధి ద్వివిధము. అందు మొదటిది అనుభవనుననే నశింపవలయును. కర్మము క్షీణించిన పిదప చికిత్సతో నిమ్మిత్తము లేకయే వ్యాధి కుదురును. రెండవది చికిత్సాదులచే నాశము పొందవచ్చును.
పిత్తము - ఒక ధాతువు (వాత, పిత్త, శ్లేష్మము లనునవి త్రివిధ ధాతువులు.)
పిత్తకోశము - (గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువచేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కాలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువచేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).
అరతి - 1.విరక్తుడు, 2.సంతోషము లేనివాడు, వి.1.విషయములందు ఇష్టము లేమి, 2.అనురక్తి(అనురాగము, ప్రేమ)లేమి, 3.సంతోషము లేమి, 4.బాధ, 4. అరుచిని కలిగించు పిత్తరోగము, 6.క్రోధము, 7.(అలం.) మన్మథావథలు పదింటిలో నారవది (దేని యందు ఇష్టము లేకుండుట).
అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సు లేనివాడు, 2.దుఃఖము నొందినవాదు, 3.ధ్యాన నిమగ్నుడు.
అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు.
అనిష్టము - 1.ఇష్టముకానిది, 2.యజింప బడనిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.
విరక్తి - విరాగము, వైరాగ్యము.(Dispassion)
వైరాగ్యము - వేషయేచ్ఛా రహితత్వము, లౌకిక సుఖములం దిచ్ఛలేమి.
వీతరాగి - విరాగుడు, వైరాగ్యము గలవాడు.
వైరాగి - బైరాగి.
బైరాగి - విరక్తుడైన తీర్థవాసి, సం.విరాగీ.
నిర్వేదము - 1.దుఃఖము, 2.వైరాగ్యము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
అరుచి - 1.రోత(ఏవగింపు – రోత), 2.నోటికి రుచి కాకుండుట.
క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము. క్రోధము శత్రువు వంటిది.
భగము - 1.ఆడుగురి, 2.సంపత్తి, 3.వైరాగ్యము, 4.తెలివి, 5.వీర్యము, 6.కీర్తి, 7.మహత్త్వము(మహాత్మ్యము - గొప్పతనము).
రాజా రాష్ట్ర కృతంపాపం రాజపాపం పురోహితః|
భర్తాచ స్త్రీకృత పాపం శిష్యపాపం గురుర్వ్రజేత్||
తా. తనదేశమునందలి ప్రజలు చేయు పాపమును రాజు పొందును. రాజు చేయు పాపమును పురోహితుడు పొందును, పెండ్లాము చేయు పాపమును మగడు పొందును, శిష్యుడు చేయు పాపమును గురువు పొందును. - నీతిశాస్త్రము
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్దనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||
ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది - సంవత్సరాది.
ఋతువృత్తి - సంవత్సరము.
సంవత్సరము - ఏడు; ఏడు - ఆరునొకటి. వత్సరము - ఏడాది.
హాయనము - 1.సంవత్సరము, 2.కిరణము.
కిరణము - వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.
సప్తకము - ఏడు, విణ.ఏడవది.
సప్తమము - ఏడవది.
సప్తహస్తుఁడు - అగ్ని.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.
చిత్రిణి - చిత్తిని, ఒక జాతి స్త్రీ.
చిత్రకంఠము - 1.కపోతము 2.గువ్వ.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
పావురాయి - పావురము, సం.పారావతః.
పారావతము - పావురము; కలరవము - పావురము.
గువ్వ - 1.అడవిపావురము 2.పక్షి. కూకి - ఒకరకము పావురము.
కామి - 1.కాముకుడు, 2.పావురము, 3.జక్కవ.
కామిని - 1.ప్రియ సంగమమందు అద్కేచ్ఛ గల స్త్రీ, 2.ఆడుజక్కవ, 3.ఆడుపావురము, 4.బదనిక, (కాముకి). మాటీనంగ - కాముకి. గంధమాదనము నందు దేవీస్థానం కాముకి.
బదనిక - చెట్టు మీద మొలుచు ఓషధి విశేషము సం.పందానికా,(వృక్ష.) పరాన్నభుక్కుగా జీవించు ఉద్భిజము(Parasitic plant).
కపోతవృక్షము - (గృహ.) బలహీనమైన చాతీ, బలహీనత వలన నీరసముగా పెర్గిగిన ప్రక్క ఎముకుల గూడు (Pigeon chest).
కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు. మధురమైన కంఠము కలది. కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని. కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.
పంచమము - 1.కోయిల, 2.రాగ విశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.
కలహంస - 1.కాదంబము, ధూమ్రవర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.
కాదంబము - 1.మధురముగ కూయు హంస, ధూమ్రవర్ణములైన ముక్కు, కాళ్ళు, ఱెక్కలుగల హంస, కలహంస, 2.బాణము.
రాజహంస - 1.రాయంచ, 2.ఎఱ్ఱని ముక్కు కాళ్ళుగల హంస, 3.మధురముగ బలుకు హంస.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.వాయు విశేషము, రూ.హంసము.
యమి - 1.ముని, 2.హంస.
మౌని - మౌనవ్రతుఁడు, ముని.
నిత్యానంద రసాలయం, సురముని స్వాంతాంబు జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ సేవితం కలుషహృ త్సద్వాసనావిష్కృతం|
శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస! స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి||
తా. ఓ మానస రాజహంసా! బ్రహ్మానంద జలాలకు స్థానమైనదీ, సుర మున్యాదుల మనస్సరోజాలకు నిలయ మైనదీ, నిర్మలమైనదీ, సద్బ్రాహ్మణ సేవితమైనదీ, పాపాలను రూపు మాపేదీ, జన్మాంతర సుకృతాలను ప్రకాశింప జేసేదీ, సుస్థిరమైనదీ అయి భగద్ధ్యానమనే సరస్సునే ఆశ్రయంచుము. నీచులను ఆశ్రయించడమన్న మురికి కాల్వలను ఆశ్రయించాలని ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? - శివానందలహరి
కాదంబరి - 1.కల్లు, 2.ఆడుకోయిల, 3.ఆడుగోరువంక, 4.బాణవిరచిన కాదంబరీ కావ్యము, 5.సరస్వతి.
కాదంబిని - మేఘపంక్తి. ఆగడపలు - 1.మెట్లవలె ఏర్పడిన మబ్బు తునకల వరుసలు, 2.మేఘపంక్తి.
సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.
పలుకుఁజెలి - సరస్వతి.
కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్|
విద్యారూపం విరూపాణాం క్షమారూప తపస్వినామ్||
తా. కోకిలకు (కోకిల నల్లనిది) స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము(పాతివ్రత్యము - పతివ్రత యొక్క శీలము), కురూపునకు విద్యయే రూపము, యతులకు(కర్మంది - యతి) శాంతమే రూపము. - నీతిశాస్త్రము
శాంతము కలిగియున్న వేరు బలము పనిలేదు. యతికి ఆత్మావగతి కళత్రము, దేహము గృహము, ఇంద్రియ నిగ్రహము సౌఖ్యము, శిష్యులు పుత్రులు. ఇక అతనికి కావలసినదేమున్నది?
No comments:
Post a Comment