పూర్వాభాద్ర 1 పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు - మీనం, చేప.
మగ మీనమవై జలనిధి
పగతుని సొమకునిఁజంపి పద్మభవునకు
నిగమములుఁ దెచ్చియిచ్చితి
సుగుణాకర మమ్ముఁగరుణఁ జూడుము కృష్ణా.
తా. కృష్ణా! మత్స్యావతారమెత్తి, సముద్రములో దాఁగిన సోమకుని (ౘ)జంపి, వేదములు బ్రహ్మకొసంగిన దేవా! వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి…
నీరిలోన తల్లడించి, మోత నీటి మడుగులో ఈత గఱచినవాడు - ప్రళయాంబుధిలో మీనమై సోమకాసురుడు దొంగిలించిన వేదాలను తెచ్చినవాడు.
ప్రళయపయోధిజలే ధృతవానసి వేదమ్,
విహితవహిత్ర చరిత్ర మఖేదమ్|
కేశవ! ధృత మీనశరీర! జయ జగదీశ! హరే!
మత్స్యావతారమై మడుగులోపలఁ జొచ్చి,
సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను;
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల,
బ్రహ్మకిచ్చితి వీవు భళి యనంగ;
నా వేదముల నంది యాచారనిష్ఠల,
ననుభవించుచు నుంచు రవనిసురులు;
సకల పాపంబులు సమసిపోవు నటంచు,
మనుజులందఱు నీదు మహిమఁ దెలియ.
కుందు, రరవిందనయన ! నీ యునికిఁ దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ ! భూ.
తా. ఓ, నరసింహా ! చేపపుట్టుకనెత్తి మడుగులోనికి బోయి సోమకాసురుఁ జంపి చిత్రముగ వేదములదెచ్చి బ్రహ్మదేవునకు మెచ్చగా నిచ్చితివి. ఆ వేదముల నిచ్చుటచే సత్ప్రవర్తనము, నియమముల బ్రాహ్మణులను భవించుచున్నారు. మనుష్యులందరు సన్నిపాపములను నీ మహిమచే నశించిపోవునని దెలియకుందురు. అనగా నీ వుండుట నెఱింగినవారికి వెంటనే మోక్షము వచ్చును.
చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబయిన మీనావతారంబు నొంది మహీరూపంబగు నావ నెక్కించి వైవస్వత మనువు నుద్ధరించె - చాక్షుష మన్వంతరంలో నావరూపంలో ఉన్న భూమిపై పదవదైన "మత్యావతారం" దాల్చి వైవస్వత మనువును(వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.)ని కాపాడాడు.
మీనము - 1.చేప, 2.మీనరాశి (Pisces).
చేఁప - మత్స్యము; మత్స్యము - చేప.
మీనోతి క్షిపతి జలమితి వామీనః, డుమిఞ్ ప్రక్షేపణే. - జలము చల్లునది.
చేప - ఈతగాడు, నీటిలో నివాసము గలది. ఈత చేతనైతే ఏంతలోతైనా ఒకటే. ఈత నేర్చిన వానికే, నీటి గండం.
కొత్తనీటికి చేప లెదురెక్కినట్లు, వడిగా ప్రవహించు యేరులో ఎదురడుట మిక్కిలి ఆపదలు కలిగించును. గాలి గండమే కాని నీటి గండం లేనిది, చేప.
మీనకేతనుఁడు - మన్మథుడు.
మీనకేతనః మినః కేతనం ధ్వజో యస్య సః - మత్స్యము టెక్కెముగాఁ గలవాఁడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.
అథ కేతనం కృత్యే కేతా పుపనిమన్త్రణే :
కేతన శబ్దము చేయఁదగిన పనికిని, టెక్కెమునకును, బ్రాహ్మణుల నియంత్రణము చేయుటకును పేరు.
కేతం త్యనేనేతి కేతనం. కిత జ్ఞానే. - దీనిచేత నెఱుఁగుదురు.
టీ. స. అవశ్యకర్తవ్యే _ "నివాపాంజలి దానేన కేతనై శ్శ్రాద్ధకర్మభి"ధ్వజే _ 'మీనకేతనః' నిమంత్రణే _ "కృతకేతనం బ్రాహ్మణం నాతిక్రామే" దితి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జెండా - టెక్కెము.
లలామము - 1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొటు, 5.తోక, 6.గుఱ్ఱము(ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.
మిత్తిచూ(ౘ)లు - కేతువు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని Fire.
కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కనుఁడు - కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్.
ప్రకట మకర వరుణ పాశంబులందుల,
జలములందు నెందుఁ బొలయ కుండఁ
గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డైనట్టి
మత్యమూర్తి విద్యామానకీర్తి.
భా|| ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించే మత్యావతారమూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణపాశములు అగు జలజంతువుల బారిన పడకుండా జలాలయందు సర్వదా సంరక్షించు గాక !
ఝషము - 1.చేప, 2.మొసలి.
ఝషకేతుఁడు - మన్మథుడు.
ఝషతి హిదస్తి బాల మస్త్యా నితి ఝషః ఝష హింసాయాం - పిల్ల చేఁపలను (ౘ)చంపి తినునది.
పృథురోమా ఝుషో మత్సో మీనో వైసారిణో (అ)ణ్దజః విసార శ్సకులీ చ -
ముఖదేశే పృథూని రోమాణ్యస్య పృథురోమా. న. పు. - ముఖమునందు పొడుగు రోమములుగలది.
మత్య సామాన్యమునకు పేరుగనుక నీపృథురోమ శబ్దము రోమములేని మత్స్యమునందును వర్తించును.
క్షుద్రాక్షేణేవ జాలేన ఝుషావపిహితావురూ |
కామాశ్చ రాజన్ క్రోధశ్చ తౌ ప్రజ్ఞానం విలుంపతః ||
రాజా! రెండు పెద్దచేపలు సన్నని చిల్లులు గల వల(వల- కామము, సం.వల్.)చే కప్పబడి దానిని ఎలా కొరుకుతాయో, కామక్రోధాలు రెండూ అలాగే(అదుపు చెయ్యబడక) వివేకాన్ని(వివేక - జ్ఞానము, విచారము.)లోపింప చేస్తాయి.
(కామక్రోధాలు చేపవలె శత్రువులు - కాని అవి వలలో పడినపుడు మిత్రభావంతో కలిసి వలను కొరుకుతాయి. - అలాగే కామక్రోధాలు రెండూ కలిసి వివేకాన్ని కొరికేస్తాయి).
మాత్స్య న్యాయము - పెద్ద చేప చిన్న చేపను తినునను న్యాయము. హెచ్చు బలము కలిగిన పెద్ద చేపలు బలహీనమైన చిన్న చేపలను బలవంతంగా, మింగుతుంటాయి.
శిశుకము - 1.శిశువు, 2.ఉలుచ మీను, 3.మొసలి.
పసిబిడ్డ - (గృహ.) శిశువు, చంటిబిడ్డ (Infant child).
చేతిబిడ్ద - పసిబిడ్ద.
శిశువు - బిడ్డ; బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు, రూ.ప్రసూనుడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
సూనువు - 1.కొడుకు, 2.కూతురు.
తమ్ముఁడు - వెనుక పుట్టినవాడు, అనుజుఁడు, రూ.తమ్మువాడు.
అనుజుఁడు - తమ్ముడు; తమ్మువాఁడు - తమ్ముడు.
శిశుసంరక్షణ - (గృహ.) చంటిబిడ్దను జాగ్రత్తగా పెంచుట (Child care).
శిశుసంరక్షణశాల - (గృహ.) పసిబిడ్డలకు కావలసిన సంరక్షణలు చేయు వైద్యశాల, (Child Clinic).
ఉలుచ - మిక్కిలి చాపల్యముగల చేప, సం.ఉలూపిః.
ఉలూపి - 1.ఒక నాగకన్య, 2.ఉలుచ చేప.
ఉలూపీ శిశుకస్సమౌ :
ఉత్ ఊర్థ్వం లుంపతి భ్రంతీతి ఉల్లూపీ. లుప్ ఌ చేదనే. - ఊర్థ్వముగా భ్రమించునది.
చాపల్యచ్ఛిశురివ శిశుకః - చాపల్యము వలన శిశువువంటిది. ఈ రెండు శిశువు వలె చపలమైన ఉలసమీను పేర్లు.
(ౘ)చోఱ - ఒక తెగ చేప, రూ.చోర.
చోఱ - చోర, విణ. బాలుడు. పోఱఁడు - బాలుడు.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
చోఱబుడుత - 1.చోరమీనుపిల్ల, 2.చేపలవంటి కన్నులు గల స్త్రీ.
మచ్ఛె కంటి - (మచ్చెము + కన్ను) చేపల వంటికన్నులు గల స్త్రీ.
మచ్ఛెము - చేప, సం.మత్స్యః.
గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము, 3.పులిగోరు పదకము, 4.చేప పిల్ల, 5.ఒక సంఖ్య.
విఘ్నము - అంతరాయము, అడ్డు. విఘ్నరాజు - వినాయకుడు.
ఖడ్గము - 1.కత్తి 2.ఖడ్గమృగము, దాని కొమ్ము.
గండము - 1.ఏనుఁగు చెక్కిలి, 2.ఖడ్గమృగము, 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి, 6.ప్రాణాపాయము.
చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా? వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.
నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరడైన బారలేదు
స్థానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వ.
తా. చేప నీళ్ళలో చాలా వేగముగా పోవును, బైట మూరెడు దూరమైననూ పోలేదు. అందు చేత అది స్థానబలిమేగాని దానిబలముగాదు.
వాలుగ - ఒక రకము చేప.
వాలుగంటి - స్త్రీ, దీర్ఘములైన కన్నులు గల స్త్రీ.
వాలుచూపు - ఓరచూపు.
శఫరి - ఎగసిపడెడు చేప, రూ.శఫరము.
తెఱగంటి - 1.తెప్పపాటు లేనివాడు, దేవత, 2.చేప.
తెఱగంటి ఱేఁడు - ఇంద్రుడు.
అనిమిషుఁడు - వేలుపు, దేవత. దేవత - వేలుపు.
అనిమీషము - 1.రెప్పపాటులేనిది, 2.జాగరూకము, 3.వికసించినది, వి.చేప. రెప్పలు ముయ్యని జాణ. - చేప.
సుర మత్స్యా వనిమిషా :
అనిమిష శబ్దము దేవతలకును, మత్యమునకును పేరు. న నిమిషత్య నిమిషః మిష నిమీలనే ఱెప్పపాటు లేనిది.
మెలయు మీనాక్షి కిని మీనరాశి....
తవాపర్ణే! కర్ణే - జపనయన - పైశున్య - చకితాః
నిలీయంతే తోయే - నియత మినిమేషా శ్శఫరికాః,
ఇయం చ శ్రీ ర్బద్ధ - చ్ఛదవుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే - నిశి చ విఘటయ్య ప్రవిశతి. - 56శ్లో
తా. ఓ అపర్ణా! పార్వతీదేవి ! ఱెప్పపాటులేని చేపలు చెవి దగ్గరనున్న నీ కనులు తమ రహస్యమును బయట పెట్టునని భయపడినవై శఫరితలు నీటిలో మునుగు చున్నవి.(దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా వుండటంవల్ల తమచేష్టలన్నీ అమ్మచేత గమనింప బడుతున్నాయని భయం.) ఇక నీ నేత్రలక్ష్మి రాత్రిసమయంలో కలువ యందు ఉండి, ఉదయాన దాని దళాలను మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి, రాత్రివేళ మరల కలువలు విప్పారగనే లోన ప్రవేశించుచున్నది. కనులు చేపలవలెను కలువలువలె నున్నవనుట. (అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరొపోల్చదగ్గ నేత్రలు అని భావము) - సౌందర్యలహరి
అపర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ,
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా. - 52శ్లో
వారిచరము - చేప మొ.
వారి - నీరు.
వారిజము - 1.తామర, 2.శంఖము, 3.ఉప్పు.
వారిచరావతారమున వారధిలోఁ జొరబాణిఁ క్రోధవి
స్తారగుడైన యానిగమ తస్కరనీర నిశాచ నరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! మత్స్యావతారమునందు సముద్రము లోపల వేగముగా చొచ్చి మిక్కిలి కోపాతిశయము గలిగిననా డవై, వేదములను దొంగిలించు కొనిపోయిన వీరుఁడైన మేటిరాక్షసుఁడగు సోమకాసురుని పట్టి చంపి వేదములచిక్కు విడఁదీసి బ్రహ్మకు మరల వానిని మిక్కిలి యౌదార్యముతో నిచ్చినవాఁడవు నీవే కాని మఱెవ్వరునుగారు. అట్టి నీవు నన్ను కాపాడఁదగును.
గాంగేయము - 1.బంగారము, 2.తామర, 3.ఉమ్మెత్త, 4.ఒకానొకచేప. గఙ్గాయాం అగ్నినా న్యస్తస్య మాహేశ్వరవీర్యస్య హిరణ్యత్వేన భూతత్వ్వత్ గాంగేయం - గంగ యందు ఈశ్వరుని వీర్యము అగ్నిహోత్రుఁడు విడువఁగా సువర్ణ రూపమాయెను గనుక గాంగేయము.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గాంగేయుఁడు - గాంగుఁడు.
గాంగము - 1.గంగ యందు పుట్టినది, 2.గంగకు సంబంధించినది.
కశేరు హేమ్నోర్గాజ్గేయమ్ :
గాంగేయ శబ్దము కమ్మరేఁగున(ఒక రకము చేఁప)కును, బంగారము నకును పేరు. కుశేరువనఁగా కొందఱు తామర, కలువ మొదలయినవాని దుంపయనియును, కొందఱు తృణ విశేషమనియు నందురు. గంగాయాం భవం గాంగేయం - గంగ యందుఁ బుట్టినది. '......షడాననే, గాంగేయః పుంసి భీష్మేచ గాంగేయం ముక్తకే భవే'ఇతి శేషః.
కుశేశయము - తామరపువ్వు, వ్యు.నీటియం దుండునది. కుశే జలే శేత ఇతికుశేశయం. శీఙ్ స్వప్నే. - నీళ్ళ యందు వుండునది.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.) తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.
తమఃప్రకర్షో రసో స్య తామరసం - ప్రకృష్టమైన రసము గలిగినది.
తామ్యద్భిః రస్యత ఇతి వా తామరసం. రస అస్వాదే. - బడలినవారిచే నాస్వాదింపంబడునది.
హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హాటకగర్భుడు - బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
కపర్ధి - శివుడు.
హేమము - 1.బంగారు 2.ఉమ్మెత్త.
ఉమెత్త - దుత్తురము, రూ.ఉమ్మెత్త, సం.ఉన్మత్త.
ధుత్తురము - ఉమ్మెత్త. వేఁదురు - ఉన్మాదము.
ఉన్మాదము - 1.వెఱ్ఱి, పిచ్చి 2.(అలం.) సంచారీభావములలో ఒకటి.
ఉన్మత్తము -1.వెఱ్ఱియెత్తినది 2.కై పక్కినది 3.గర్వించినది 4.పిశాచా ద్యావేశము కలది, వి.ఉమ్మెత్త చెట్టు.
శీల ధర్మపత్నులు - త్రప(లజ్జ), శాంతి అని ఇద్దరు. వీరు లేకపోతే లోకం ఉన్మత్తం అవుతుంది.
ఉన్మత్త ఉన్మాదవతి : ఉన్మద్యతే ఉన్మత్తః. మదీ హర్షగ్లపనయోః. - మిక్కిలి మదించినవాఁడు. వెఱ్ఱియెత్తినవాని పేరు.
కైపు - 1.సారాయి మత్తు, 2.అందము, 3.విజృంభణము.
కితపుఁడు - జూదరి, విణ.మత్తుడు, మోసగాడు.
కితవము - ఉమ్మెత్త.
రిమ్మ - ఉన్మాదము, చూ.రింబ. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు.
రింబ - రిమ్మ, పిచ్చి. ఎవరి పిచ్చి వారికి ఆనందము.
మాయువు - పైత్యరోగము.
పిచ్చ - తక్కువ, కొరత (పిచ్చకుంచము), వై. వి. 1.వెఱ్ఱి 2.వృషణము(బీజము), సం.1.పిత్తమ్ 2.పిచ్ఛా.
పిత్తము -ఒక ధాతువు (వాత పిత్త శ్లేష్మము లనునవి త్రివిధధాతువులు.)
పిత్తకోశము - (గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువజేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువ చేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).
మాయుః పిత్తమ్ -
మీనోతి శిరో భ్రమణేన బువి క్షేపయతీతి మాయుః. ఉ. పు. దు మిఞ్ ప్రక్షేపణే. శిరోభ్రమణముచేత జనమును బడఁద్రొబ్బునది.
పతతి పిత్తం పత్ ఌ గతౌ. ద్రవరూపమై పడునది. ఈ రెండు 2 పైత్యము పేర్లు.
వెఱ్ఱి - పిచ్చి, అవివేకము, విణ.పిచ్చివాడు.
తిక్క - పిచ్చి, రూ.త్రిక్క.
తిక్కకొను - పిచ్చియెత్తు.
అలర్కరోగము - (గృహ.) వెఱ్ఱి కుక్క కరచినచో వచ్చు పచ్చి.
కుక్క వెఱ్ఱి - (గృహ.) వెఱ్ఱికుక్క కాటు వల్ల కలిగెడు ఒక రోగము, జలద్వేషము (Hydrophobia). (యోగితము - పిచ్చికుక్క.)
పంచశరుఁడు - మన్మథుడు, ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనములను ఐదు బాణములు కలవాడు.
ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనాఖ్యాః పంచశరాః యస్యసః పంచశరః - ఉన్మాదన శోషణ స్తంభన సమ్మోహనములను (నై)ఐదు బాణములు గలవాఁడు.
వలవాక - మన్మథ తాపము.
వలవంత - 1.మన్మథవ్యథ, 2.సంతానము.
సోన్మాద స్తూ న్మదిష్ణు స్స్యాత్ :
ఉనాదేన సహితః సోన్మాదః - ఉన్మాదముతోఁ గూడుకొన్నవాఁడు. పా. సూన్మాదః ఉన్మదః.
ఉన్మాదశీలః ఉన్మదిష్ణుః. మదీ హర్షగ్లేపనయోః. - ఉన్మాద స్వభావము గలవాఁడు. ఈ రెండు భూతావేశాదులచేత నొడలెఱుఁగనివాని పేర్లు.
నశ్యత్య నాయకం కార్యం తదైవ శిశునాయకమ్|
స్త్రీ నాయకం తధోన్మత్త నాయకం బహునాయకమ్||
తా. యజమానుఁడు లేని కార్యమును, బాలురు, స్త్రీలు, ఉన్మత్తులు, అనేకులు(పెక్కుమంది); ఈ ఐదుగురు విచారించగల కార్యములు చెడిపోవును. – నీతిశాస్త్రము
పార్షి - 1.ఉన్మత్తురాలు, 2.మడమ(గుదికాలు, చీలమండ అడుగు భాగము) 3.దండు వెనుక.
ఉన్మత్తః కితవో ధూర్తో ధుత్తూతః కనకాహ్వయః మాతులో మదనశ్చ :
ఉన్మాదయతీత్యున్మత్తః తథైవ కితవశ్చ. మదీ హర్షగ్లేపనయోః - ఉన్మాదమును జేయునది.
ధూర్వతి ఉన్మాదేన హిన స్తీతి ధూర్తః. దుర్వీ హింసాయాం. – ఉన్మాదము చేత హింసించునది.
వాతాదిరోగా న్ ధువతీతి ధుత్తూరః. ధూ విధూననే. - వాతాది రోగములను కంపింపఁ జేయునది. పా. ధూస్తూరః.
కనకస్య ఆహ్వయోయస్య కనకాహ్వయః - బంగారు యొక్క పేరుగలది.
ఉన్మాదకద్ర వ్యేషు మానా స్తితు లాస్యేతి మాతులః - ఉన్మాదక ద్రవ్యములలో సాటిలేనిది.
మదయతీతి మదనః. మదీహర్షగ్లేపనయోః. - మదింపఁ జేయునది. ఈ ఆరు ఉమ్మెత పేర్లు.
ఉదర్కము - 1.భావికాలము, 2.భావి ఫలము, 3.ఉమ్మెత్తముల్లు.
భావి - భవిష్యత్తు, కాగలది. భవిష్యత్తు - కాగలది.
కంటకిఫలము - 1.పనస, 2.ఉమ్మెత్త, 3.పల్లేరు. పనసపండులో మామిడిపండు రసముండునా?
అస్య ఫలే మాతులపుత్రకః :
మాతులస్య పుత్రః ఫలం మాతుల పుత్రకః - మాతుల మనఁగా ఉమ్మెత్త; అందుఁ పుట్టినది. ఈ ఒకటి ఉమ్మెత్తకాయ పేరు.
కైవతము - 1.కపటము, 2.జూదము, 3.ఉమ్మెత్త, 4.వైడూర్యమణి.
కౌడు - 1.మోసము, 2.ప్రమాదము, తప్పు, రూ.కవుడు, సం.కపటః.
కపటము - కవుడు, వ్యాజము.
జూదము - జూజము. జూజము - ద్యూతము, పందెము వేసి ఆడెడి ఆట, మోసము, రూ.జూదము, సం.ద్యూతమ్. ద్యూదము - జూదము.
వైడూర్యము - ఒక విధమగు రత్నము, పిల్ల కన్రతనము.
బేరిల్ - (భూగ.) (Beryl) వైడూర్యము.
ఖలము - 1.చోటు, 2.పాపము, 3.తెలకపిండి, 4.వెదురు, 5.ఉమ్మెత్త, 6.క్రూరము, 7.నీచము, వికృ. కళ్ళము.
విసారము - 1.చేప, 2.కొయ్య.
వసరతీతి విసారీ విసార్యేవ వైసారిణః. సృగతౌ. - చరించునది గనుక విసారి. విసారియే వైసారణము.
కొయ్య - కఱ్ఱ, మ్రాను.
కాష్ఠము - కఱ్ఱ, కొయ్య.
కఱ్ఱ - కొయ్య, పుల్ల, దండము.
పుల్ల - పులుపు గలది, వి.పుడక. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదట.
మ్రాను - మాఁకు; మాకు - మ్రాను; మ్రాఁకు - మాను, చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
దారువు - 1.కొయ్య, 2.ఇత్తడి.
దారు పురుష న్యాయము - కఱ్ఱ మొద్దును చూచి మనుష్యుడని భ్రమపడిన రీతి.
ధటము - కొయ్య త్రాసు.
రీతి - 1.తెరగు, 2.మేర, 3.ఇత్తడి, 4.కావ్యశైలి పద్దతి (కావ్య శైలి త్రివిధము., పాంచాలి, గౌడ, వైధర్భి.)
తెఱఁగు - 1.విధము, క్రమము, 2.చక్కన, 3.సంధి, రూ.తెఱవు.
విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య.సర్వశబ్దర్థకము.
పొలిమేర - 1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు, ఎల్ల.
వఱ - మేర, హద్దు.
వఱగొడ్దము - 1.వంకరమాట, 2.మర్యాద నతిక్రమించుమాట.
ఇత్తడీ - అరకూట మను లోహము, రూ.ఇత్తమ్, సం.పిత్తళమ్. (రసా.) రాగి జింకుల కలయిక గల ఒక ధాతుమిశ్రమము.
ఆరకూటము - ఇత్తడి; పిత్తలము - ఇత్తడి, Brass.
రీతిః స్త్రియా మారకూటో న స్త్రియామ్ -
రీయతే స్రవత్యగ్ని సమయోగాదితి రీతిః. ఈ. సీ. రి. గతౌ. - అగ్ని సంయోగము వలనఁ గరఁగునది.
ఆరస్య సువర్ణస్య కూటః మాయా రూపమివ భాసత ఇతి ఆరకూటః. అ. ప్న. - ఆర మనఁగా బంగారు; దాని మాయారూపమువలె నుండునది. ఈ రెండు ఇత్తడి పేర్లు.
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱగున గలుగు నేర్చు నెయ్యెడలందా
నెత్తిచ్చి కరగపోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
తా. నీచుడు మంచివారి యొక్క చెలిమి చెసినను, వారియొక్క మంచి గుణములు గ్రహింపజాలడు. యెట్లనగా బంగారంతో సమానమగు ఇత్తడిని తూచి, గరగించి (బంగారం కరిగించిపోసిన మూసలోపోసినను) అది బంగారం కాజాలదు కదా! ఇత్తడి ప్రక్కనవున్నప్పుడే, బంగారం విలువ తెలుస్తుంది.
కిలుము - (గృహ.) ఇత్తడి లేక రాగిమీద ఏర్పడు మాలిన్యము, (ఇది ఒకవిధమైన విషము), రూ.చిలుము, (Veradigris).
చిలుము - 1.రాగి మొదలగు లోహము లందలి మురికి, 2.విషము, 3.పొగ పీల్చుట కుపయోగించు గొట్టము.
బ్రాస్సో - (గృహ.) (Brasso) అలంకారపు ఇత్తడి సామానులను పాలిష్ (Polish) చేయుటకు ప్రయోగించుద్రవము లేక పొడి.
సారము - 1.జవము, 2.ధనము, 3.న్యాయము, 4.బలిమి, 5.చేప, 6.మూలగ, విణ.శ్రేష్ఠము, వి.(గృహ.) ఫలత్వము, 7.ఫలించు శక్తి (Fertility).
సారో బలేస్థిరాంశే న్యాయ్యేక్లీబం వరే త్రిషు. : సార శబ్దము సత్తువకును, చేవకును పేరైనపుడు. పు. యుక్తమైనదానికి, పేరైనపుడు న. శ్రేష్ఠమైనదానికి పేరైనపుడు త్రి. సరతి స్థిరీభవతీతి సారః. సృ గతౌ. - స్థిరమైయుండునది.
అసారే ఖలుసంసారే - సారం శ్వశురమందిరమ్|
హిమాలయే హర శ్శేతే - హరి శ్శేతే మహోదధౌ||
తా. సంసారము సారము లేనిదైనను శ్వశురగృహంబు (శ్వశురులు - అత్తమామలు) సారంబు గలది. గనుకనే శివుఁడు హిమవత్పర్వతంబు నందు, విష్ణువు సముద్రము(మహాశయము - సముద్రము)నందును శయనించిరి. - నీతిశాస్త్రము
జవము - వేగము; జవనము - వేగముకలది, వి.వేగము.
వేగము - జవము, త్వర, (గణి.) భౌతి.) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
త్వర - వేగిరపాటు. వేగిరము - వేగము, విణ.త్వరితము.
త్వరితము - శీఘ్రము, వడిగలది. శీఘ్రము - వడి, విణ.వడిగలది. తరస్సు - 1.బలిమి, 2.వడి.
రై - 1.ధనము, 2.హిరణ్యము.
రైవతుఁడు - శివుడు; శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
క్షత్త్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము(శరీరము - దేహము), 3.ధనము, 4.నీరు.
ధనము - 1.విత్తము(విత్తము కొద్దీ వైభవము) 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది 2.తెలియబడినది.
యస్యాస్తి విత్తం సనరః కులీన, స్సపండితః సశ్రుత ణాన్వివిజ్ఞః|
సవీవవక్తా స చదర్శనీయ, స్సర్వేగుణాః కాంచన మాశ్రయన్తి||
తా. ధనముగలవాఁడే సత్కులవంతుఁడు, వాడే పండితుఁడు, వాఁడే శాస్త్రజ్ఞుఁడు, వాఁడే కర్తవ్యా కర్తవ్య విధిజ్ఞుఁడును, వాడే పలుక నేర్చినవాఁడు, వాడే చూడదగినవాఁడు గనుక సకల గుణంబులు ధనము నాశ్రయించి యున్నవి. - నీతిశాస్త్రము
యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః,
పశ్చాత్ జీవతి, జర్జరదేహే వార్తాం కో పి న పృచ్ఛతి గేహే. - భజగోవిందం
న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్క శాస్త్రము.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లి కూతురునకు తల్లితండ్ర్రు లిచ్చు బహుమానము.
నాయము - 1.న్యాయము, 2.ధర్మము, సం.న్యాయః.
సమంజసము - న్యాయము, ఒప్పిదము.
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
తత్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి.(భౌతి.) మౌలికమైన, సారమైన విషయము. దేని మీద ఇతర సత్యములు ఆధారబడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).
పురుషుఁడు -1.మనుష్యుడు(మర్త్యుఁడు - మనుష్యుడు), 2.పరమాత్మ.
మనుష్యుఁడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
పస - 1.చాతుర్యము, 2.సారము, 3.సమృద్ధి.
చాతుర్యము - 1.నేర్పు, రూ.చాతురి. చాతురి - నేర్పు.
నేరమి - సామర్థ్యము, రూ.నేరువు, నేర్మి, నేర్పు.
సామర్థ్యము - 1.నేర్పు(విచక్షణత - నేర్పు), 2.యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు, (Power), (గృహ.) బలము, సత్తువ.
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి. నీతి(నీతి - న్యాయము)లేకపోవుట వలన సమృద్ధి నశించును.
నిక్కచ్చి - 1.నిర్బంధము, 2.సారము, 3.మోగమోటమి లేమి, సం.నిష్కర్షః.
చేవ - 1.చేగ, సారము 2.ధైర్యము, ధీరత్వము 3.(వృక్ష.) ద్వితీయ వృద్ధి చెందిన దారుకణ సంహతి. (Secondary xylem).
చేగ - 1.కొయ్య నడిమి నల్లని గట్టి భాగము, 2.సారము, 3.ధైర్యము, రూ.చేవ. చేవ చచ్చిందా! అన్నది ఒక రకమైన తిట్టు.
సంహతి - 1.సమూహము, గుంపు 2.కలయిక, 3.సత్తువ.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
మూలగ - ఎముకల మధ్యనుండు మాంససారము, మజ్జ, సం.మూలగః.
మజ్జ - 1.చెట్టుచేవ, 2.ఎముకల యందలి నేయి.
నెనడు - మజ్జ, మూలగ.
మజ్జారజ్జువు - (జం.) వెన్నుపాము, సుషుమ్న నాడి మొదలు నుండి వెన్నెముక గుండా దాని చివరవరకు గల నాడుల త్రాడు(Spinal cord). మైరవము - (జం.) వెన్నెముకకుగాని, వెన్నుపామునకుగాని, సంబంధించినది. మేరుపు = వెన్ను పాము, (Spinal).
వెన్నుబాము - (గృహ.) వెన్నుపూసలో పారు ముఖ్యమైన నరము.(Spinal cord).
మజ్జాసంస్థా హంసవతీ - ముఖ్యశక్తి సమన్వితా|
హరిద్రాన్నైకరసికా - హాకినీరూపధారిణీ.
ఎమ్మూట - (ఎమ్ము + ఊట) ఎముకల లోని క్రొవ్వు, మూలగ.
ఎముక - శల్యము, రూ.ఎమ్ము. (Bone)
ఊట - 1.ఊరగాయరసము, 2.చేప, 3.మూలగ, 4.భూమిలోపలి నుండి పీడనము వలన పైకి ఉబికివచ్చు జలము (Spring).
ఊట వెలుపడు గ్రంథులు - (గృహ.) లోపల ఊరిన రసమును నాళుల ద్వారా బయటకి పంపు గ్రంథులు (Exocrine glands).
మజ్జద్రవ్యము - (గృహ.) క్రొవ్వు పదార్థములు, నెయ్యి, వెన్న, నూనె మొ.వి.(Fats).
నూనియ - చమురు, రూ.నూనె.
ౘమురు - రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.
ౘమురు గింజల పైరులు - (వ్యవ.) నూనెనిచ్చు గింజల పైరులు, ఉదా. ఆముదము, వేరుసెనగ, కుసుమ, నూవు మొదలగునవి, (Oiled crops).
ౘమురు దినుసులు - (వ్యవ.) నూనెగింజల పైరులుగాక నూనె లభించు ఇతర ద్రవ్యములు, ఉదా.నిమ్మగడ్డ, చందనము, సీమబాదము, కొబ్బరి మొదలగునవి, (Oil stuffs).
యూకలిప్టస్ నూనె - (రసా.) (Eucalypatus oil) ఇది జామి కుటుంబము (Myrtaceae)నకు చెందిన Eucalyptus globulus, E. citriodora, అను చెట్ల యాకుల నుండి తీయబడు అస్థిరతైలము.
అస్థిర తైలము - (వ్యవ.) గాలి పారినచో వాయురూపము నంది శీఘ్రముగా హరించిపోవు నూనెలు. (Volatile or essential oils). ఉదా. నిమ్మగడ్డి నూనె, గులాబినూనె మొ,వి.
జంబీరము - 1.నిమ్మ(నిమ్మ - జంబీరము), 2.మరువము.
కమ్మనిమ్మ - తియ్యనిమ్మ.
మరువకము - మరువము, వాసన మొలక.
ముర - మరువము, వాసనగల మొక్క.
గజనిమ్మ - పెద్దనిమ్మ, లకుచము.
లకుచము - గజనిమ్మ, రూ.లికుచము.
లికుచము - 1.గజనిమ్మ, 2.గంగరేగు.
సిట్రికామ్లము - (రసా.) ఇది నిమ్మ, దబ్బ మొ. పులుపు పండ్లరసము లో నున్న సేంద్రియామ్ల ద్రవ్యము, "నిమ్మపువ్వు"అనునది దీని ఘన ద్రవ్యము.
అండజము - 1.పక్షి, 2.చేప, 3.పాము, 4.తొండ(తొండ - సరటము), వ్యు. గుడ్డు నుంచి పుట్టినది.
అండాత్ జాయత ఇత్యండజః. జనీప్రాదుర్భావే. - గ్రుడ్డువలనఁ బుట్టునది.
విచిత్రం సరతీతి విసారః, సృ గతౌ. - విచిత్రముగాఁ జరించునది.
పక్షి - (పక్షములు గలది) పులుగు. పక్కి - పక్షి, పులుగు, సం. పక్షీ. చేఁప - మత్స్యము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
చక్రధరము - పాము.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.
చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్రవము.
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
లేలిహాసము - సర్పము, వ్యు.మాటిమాటికి నాలుక చాచునది.
తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.
ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము(దంతము - పల్లు, కోర.), 4.చేప, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి. ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.
ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమద్విజుడు.
ద్విజానాం బ్రహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.
ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః. - చంద్రుడు
దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతమునకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.
అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||
తా. తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు రాజు, సిగ్గుగల వేశ్య(గణిక - 1.ఆడేనుగు, 2.వేశ్య.), సిగ్గులేని(సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.)లేని ఇల్లాలు చెడుదురు. - నీతిశాస్త్రము
ద్వితీయ స్వపరార్ధస్య వర్తమానస్య వైద్విజ
వారాహ ఇతి కల్పోయం ప్రథమః పరికీర్తితః. - మత్స్యపురాణం
కొఱ - 1.పాఠీనము, 2.చేప, 3.కొఱ్ఱ ధాన్యము, 4.కొరత, వెలితి 5.ప్రయోజనము, 6.శిల్పము.
సహస్రదంష్ట్రము - పాఠీనము, వేయికోరలు గల చేప.
పాఠీనము - ఒక రకమైన చేప.
సహస్రదంష్ట్రః పాఠీనః :
సహస్రం దంష్ట్రాః అస్య సహస్రదంష్ట్రః - వేయికోఱలు గలిగినది.
పాఠీం పృష్ఠ మున్నయతీతి పాఠీనః - పాఠీ అనఁగా వీఁపు; దాని నెత్తికొని యుండునది.
భక్ష్యతయా శాస్త్రే పఠ్యత ఇతివా పాఠీనః. పఠవ్యక్తాయాం వాచి. - శాస్త్రములయందు భక్యముగాఁ బఠింపఁబడినది. ఈ రెండు వేయికోఱలు గల మీను పేర్లు.
చేప రసనేద్రియం జిహ్వ(నాలుక) వల్ల : ఇంద్రియ నిగ్రహం లేక నశించిపోతుంది.
రసజ్ఞా రసనా జిహ్వా :
రసం జానాతీతి రసజ్ఞా. జ్ఞా అవబోధనే. - రసము నెఱుఁగునది.
రస్యతే అనయా రసనా. రస అస్వాదనే. - దీనిచేత నాస్వాదింపఁబడును.
హ్వయతి రసవద్వస్తు జిహ్వా. హ్వేఞ్ స్వర్థాయాం శబ్దే చ. - రసయుక్తమైన వస్తువుల నిచ్ఛయించునది. ఈ మూడు నాలుక పేర్లు.
రసజ్ఞుఁడు - పండితుడు, విణ.రుచి నెరిగినవాడు, కళాసౌందర్యవేత్త. రస - 1.నాలుక, 2.రసాతలము(పాతాళలోకము, అధోలోకము.).
రసన - నాలుక; నాలుక - నాలిక.
నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వ - నాలుక. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
జిహ్వాచాపల్యము - తినవలెననెడి కోరిక.
ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12 లేక ' డి ' లోపము వలన కలుగు వ్యాధి (Stomattis).
లోల - 1.నాలుక, 2.లక్ష్మి, విణ. 1.కదలునది, 2.మిక్కిలి యిచ్ఛగలది.
మిక్కిలి - విణ. 1.అధికము 2.శ్రేష్ఠము. ఇచ్ఛ - అభిలాష, కోరిక. అభిరుచి - 1.అత్యాసక్తి (మితిమీరిన ఆసక్తి) 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినవి (Taste).
రుచి - 1.ఇచ్ఛ 2. చవి, 3.కాంతి 4.సూర్యకిరణము.(లోకో భిన్నరుచిః)
ౘవి - 1.రుచి, 2.రసము. ౘప్పరించు (నాలిక) - చవిచూచు.
రుచి - (రసా.) నాలుకతో గుర్తించ బడు వస్తుగుణము, ఉదా. పులుపు, తీపి, చేదు.
వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
భాతి - 1.కాంతి, 2.రీతి.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.
గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
భా - 1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు.
భానువు - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు.
భామము - 1.కోపము, 2.రోషము, 3.సూర్యకిరణము.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్త్రబాంధవాః|
జిహ్వాగ్రే బంధసంప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం||
తా. నాలుకవలన సంపద (గ)కలుగును, నాలుకవలన చుట్టాలు స్నేహితులు వత్తురు, నాలుకవలన సంకెళ్ళు ప్రాప్తమగును, నాలుకవలన చావును కలుగును. – నీతిశాస్త్రము
నరములేని నాల్క నాల్గువిధముల పల్కులు పల్క గలదు. 'జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి' లక్ష్మి నాలుక చివరన వసిస్తుంది. తీయని మాటకు లక్ష్మి నిలుస్తుంది. చేదు మాటకు పారిపోతుంది.
ముఖతస్తాలునిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే|
తతో నానారసో జజ్ఞే జిహ్వయా యో ధిగమ్యతే||
ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (Motive). (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).
శిల్పము - చిత్తరువు వ్రాయుట, శిల్పుల పని మొదలగునవి.
శిల్పి - శిల్పకారుడు, బొమ్మలు చెక్కువాడు. శిలకు రూపం శిల్పం. రాయికి(శిలకు) రూపం తెచ్చేవాడు శిల్పి.
స్థపతి - 1.శిల్పి, 2.అంతఃపురపు కావలివాడు, విణ.శ్రేష్ఠుడు.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదులు చెక్కు శిల్ప విద్య (Sculpture).
మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
వాస్తుశాస్త్రము - శిల్పి, వాస్తుశాస్త్రము తెలిసినవాడు.
వాస్తుశాస్త్రము - దేవాలయములు, గృహములు, సౌధములు నిర్మించుట యందు యుక్తాయుక్తములదెలియుజేయు శాస్త్రము, వాస్తుకళ, శిల్ప శాస్త్రము, కట్టడములలో నేర్పరితనము (Architecture).
వాస్తుపతి - వాస్తోష్పత్తి, ఇంద్రుడు.
ఓజు(ౙ) - 1.కమసాలి, 2.శిల్పి, 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.
శ్రేష్ఠి - కులమందు శ్రేష్ఠుడైన శిల్పి, కోమట్ల బిరుదు, విణ.కులశ్రేష్ఠుడు, వికృ. చెట్టి.
బత్తుఁడు - కంసాలివారి పట్టపు పేరు, వై.వి. భక్తుడు, సం.భక్తః.
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపసః|
బుద్ధఃస్సష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశు ర్భాస్కరద్యుతిః||
కలాదుఁడు-1.స్వర్ణకారుడు, 2.చంద్రుఁడు, 3.గురువు, ఉపాధ్యాయుడు.
పంచాణుఁడు - 1.స్వర్ణకారుడు, 2.శిల్పి.
స్వర్ణకారుఁడు - కమసాలి; కమ్మటీఁడు - కమసాలి.
సొన్నారి - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.
సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
తట్ర - బంగారు పనిచేసి బ్రతుకుజాతి, అగసాలె, సం.త్వష్టా.
అగసాలి - కమసాలి, స్వర్ణకారుడు, బంగారు పనిచేయువాడు, రూ.అగసాలె. బంగారం లేనిదే కంసాలి ఆభరణాలు చెయ్యలేడు.
పశ్యలోహరుఁడు - కమసాలె, పచ్చెకాడు(పచ్చెకాఁడు – పచ్చిదొంగ), వ్యు.చూచుచుండగనే దొంగిలించువాడు.
పచ్చియము - చూచుచుండగ దొంగిలుట, సం.పశ్యతో హరణమ్.
పశ్యత్పాలుడు - శివుడు, ముక్కంటి.
ఏల సమస్తవిద్యలు నొకించుక భాగ్యము కల్గియుండినన్
జాలు ననేకమార్గముల సన్నుతికెక్కు నదెట్లొకోయన్
రాలకునేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు వెట్టరెవేయివిధాలు! భాస్కరా.
తా. రాళ్ళు విద్యలు నేర్వకున్నను, వానిని దేవతా విగ్రహముగా చేసినచో వాని పాదముల మీదబడి, పూవులతో వానిని మానవులు పూజింతురు. అటులనే కొంచెము భాగ్యమైనను గల మానవుడు అనేక రీతులుగ పొగడ బడుచుండును కాని, విద్యలు నేర్చినందున కాదు.
రోహితము - 1. కుంకుడు పువ్వు, 2.నెత్తురు, 3.ఎరుపు, 4.ఎఱ్ఱచేప.
రాజి - 1.పంక్తి, 2.రేఖ.
బేడిస - ఒక రకము చేప. శకులము - బేడిస చేప.
తిమి - సముద్రమందలి ఒక చేప.
తిమింగిలము - తిమిని మ్రింగెడు చేప Whale.
రోహితో మద్గుర శ్శాలో రాజీవ శ్శకుల స్తిమిః, తిమింగిలాదయశ్చ :
రోహితత్వాత్ రోహితః - ఎఱ్ఱనై యుండునది.
జలే మజ్జతీతి మద్గురః. టుమస్ మజ్జనే. - జలమందు మునిఁగి యుండునది.
శలతిశీఘ్రం గచ్ఛతీతి శాలః. శల అశుగమనే. - శీఘ్రముగాఁ బోవునది. అరబు మీను.
రాజిః పఙ్తిరస్త్యస్య రాజీవః - మత్స్యముల వరుస గలిగినది. కొలువాసములను మీను.
శక్నోతి గంతుం శకులః. శక్ల శక్తౌ. - వేగిరముగాఁ బోవుటకు శక్తమయినది. బేడిసమీను.
తిమ్యతీతి తిమిః. ఇ. పు. తిమి ష్టిమ ఆర్ద్రీభావే. - ఆర్ధ్రమైయుండునది. నూఱుయోజనముల నిడుపుగల మీను.
తిమింగిలతీతి తిమింగిలః. గౄ నిగరణే. - తిమిని మ్రింగునది.
ఆదిశబ్దము చేత తిమింగిల గిలాదులును గ్రహింప బడుచున్నవి. తరుక్తం రామాయణే - ' తిమింగిలగిలో ప్యస్తి తద్గిలో ప్యస్తి రాఘవ ' ఇతి. ఈ ఏడును వేర్వేరుగా నొక్కొక్క మత్స్య విశేషము పేర్లు.
శకులము - బేడిస చేప.
బేడిస - ఒక రకము చేప.
మస్త్యానాం కవచప్రాయా స్థూలా శకులః, తద్యోగాచ్ఛకులీ. న. పు. పా. శకలీ - మత్స్యములకు కవచప్రాయమై స్థూలమైఉండు చర్మము శకులము; అది గలిగినది శకులి.
అదృష్టవంతుడిని సముద్రంలో పారేస్తే నోట చేప కరచుకుని పైకి వస్తాడు. - అరబ్ సామెత
శల్యపృష్ఠము - (జం.) వీనిచర్మములపై ముండ్లు అధికముగా నుండును. ఇవి సముద్రములో నుండు జంతువులు. ఈ జంతువులలో ప్రత్యేకమైన రక్తప్రసరణ మండలముగాని, విసర్జకమండలము గాని లేదు (Echinodermata), ఉదా. శల్యతారక. (Star-fish)
మత్స్యపాలనము - (వ్యవ.) ఆహారము కొరకు వివిధ జాతుల చేపలను పెంచి అభివృద్ధి చేయుట (Pisici culture).
కుంటముక్కు - ఒకానొక చేప.
కుంట - 1.కొలను, 2.పల్లము, రూ.గుంట, సం.కుండమ్.
కొలను - కొలఁకు.
మొట్టె - ఒకరకపు మత్స్యము.
రొయ్య - చిరుచేప, పొడవు మీసములుగల చేప.
వజ్జీరము - 1.వజ్రము, 2.మత్స్యము.
మగఱాయి - వజ్రము.
మగమానికము - వజ్రము.
మూలఱాయి - వజ్రమణి.
నిర్ఘాతము - 1.పిడుగు, 2.వజ్రము.
వజ్రాన్ని కూరగాయల సంతలో అమ్మబోతే దానికి పలికేది వంకాయల ధరే! - కబీరు
వజ్ర్రి - 1.ఇంద్రుడు, 2.బుద్ధుడు, 3.ఆకుజెముడు.
వజ్రో స్యాతివజ్రీ. న-పు. - వజ్రాయుధము గలవాడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
(ౘ)చోఱ - ఒక తెగ చేప, రూ.చోర.
చోఱ - చోర, విణ. బాలుడు.
చోఱబుడుత - 1.చోరమీనుపిల్ల, 2.చేపలవంటి కన్నులు గల స్త్రీ. మచ్ఛె కంటి - (మచ్చెము + కన్ను) చేపల వంటికన్నులు గల స్త్రీ.
మచ్ఛెము - చేప, సం.మత్స్యః.
మత్స్యము - చేప.
చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా? వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.
పువ్వారలు - (జం.) మొప్పలు, నీటిలో నివసించు జంతువు (చేప మొ.) యొక్క శ్వాసావయములు (Gills).
మొప్పలు - చేప మెడ కిరు ప్రక్కల నుండు ద్వారములు.
పరిగె - 1.మత్యవిశేషము, 2.కోసిన చేనిలో దిగబడిపోయిన వెన్నులు.
పిధానము - (జీవ.) మూత, కొన్ని చేపల యొక్క పువ్వారములను మూసి యుంచు పైకవచము (Operculum).
అపిధానము - మరుగు, మూత, అచ్ఛాదనము, రూ.పిధానము.
మఱుఁగు - మఱుఁగు చోటు, క్రి.1.డాగు, చాటగు, 2.సంతాపించు.
డాగు - 1.గురుతు, 2.కర, మరక.
కఱ - 1.నలుపు, 2.మరక, సం.కాలః.
మఱక - 1.కఱ, 2.మేకపడ్డ, (రసా.) నూనె మొ.వానిచే కలుగుమచ్చ (Stain). కఱకంఠుఁడు - నీలకంఠుడు, శివుడు.
మూఁత - 1.మూకుడు, 2.బిరడ, 3.కనురెప్ప మూత.
మూఁకుడు - మట్టిమూత, శరావము.
శరావము - 1.మూకుడు, 2.మూత.
ఉదంచనము - 1.మూకుడు, 2.చేద, 3.ఎగజిమ్ముట, విణ.ఎగజిమ్ముటకు సాధనమైనది.
పిహితము - 1.కనురెప్ప మూత, 2.(అలం.) ఒక అర్థాలంకారము, విణ.కప్పబడినది.
గడము1 - కుండలోనగువాని మూత, గడి.
గడము2 - 1.తెర, 2.కంచె, 3.అగడ్త, 4.విఘ్నము(అంతరాయము, అడ్డు), 5.గండె చేప, 6.ఒకానొక దేశము.
గడి - 1.ఎల్ల, సీమ, పొలిమేర, మేర, 2.చదరంగపు బల్లమీదిగడి, 3.సమీపము, 4.దుర్గము, కోట, 5.కోడెదూడ.
కంటకి - 1.రేగు, 2.ముండ్లు గల చెట్టు, 3.చేప, విణ. కంటకము గలది. రేను - రేగు (బదరీ వృక్షము).
బదరి - 1.రేగుచెట్టు 2.ప్రత్తిచెట్టు 3.ఒక పుణ్యక్షేత్రము.
రేఁగు - 1.విజృంభించు, 2.పైకిలేచు, 3.ఉద్రేకించు, 4.హుంకరించు, వి. బదరీ వృక్షము.
విజృంభణము - ఎగసిపాటు, ఉద్రేకము చెలెరేగుట.
ఉద్రేకించు - 1.విజృంభించు, 2.అతిశయించు.
హుంకారించు - హుమ్మని ధ్వనించు, రూ.హూంకృతి.
పదరు - 1.త్వరపడు, 2.కోపించు, 3.చలించు, 4.అక్షేపించు, వి.త్వరితపు మాట.
చలనము - 1.కదులుట, 2.తిరుగుట, (భౌతి.) ఒక ప్రదేశము నుండి అన్య ప్రదేశమునకు ప్రయాణించుట. (Motion)
చరించు - 1.కదలు, 2.తిరుగు, 3.చేయు.
మాత్సర్యము - చలము, మత్సర్యము.
మత్సరము - మచ్చరము, క్రోధము.
అంౘలము - 1.చలము, మాత్సర్యము 2.కోపము.
చలము - 1.చలించునది, 2.వణుకునది 3.వి.వణుకు.
కోపము - కినుక, క్రోధము.
క్షత్త - 1.బ్రహ్మ, 2.సారథి, 3.దాసీపుత్రుడు, 4.శూద్రస్త్రీ యందు క్షత్రియునకుగాని, క్షత్రియస్త్రీ యందు శూద్రునికినిగాని పుట్టినవాడు 5.చేప, 6.రోకలి.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు. (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి).
తేరు - 1.కలుగు, వై.వి. 1.రథము 2.బండి, సం.రథః.
తేరుపూన్పరి - సారథి.
సారథి - 1.తేరునడుపువాడు 2.నియంత.
నియంత - తేరునడపువాడు, విణ.నడపువాడు, సం.వి.(చరి. రాజ.) సర్వాధికారి, అధినాయకుడు (Dictator).
క్షత్తా స్యాత్సారథౌ ద్వార్ స్థే క్షత్రియాయం చ శూద్ర జే : క్షత్తృ శబ్దము సారథికిని, వాకిలిఁ గాచువానికిని, శూద్రుని వలన క్షత్రియ స్త్రీ యందుఁ బుట్టినవానికిని పేరు.
క్షదతీతి క్షత్తా. ఋ. పు. క్షద గతిహింసనయాః - పీడించువాఁడు.
చేప - Fish.
రోఁకలి - దంచుసాధనము, ముసలము-రోకలి, సం.గోకీలః. మామిడికర్ర తోనే రోకలి చేయడము.
ఉలూఖలము - రోలు, రూ.ఉదూఖలము.
కక్కు - క్రి. 1.కడుపులోనిది వెలిపుచ్చు, వి.విసురురాయి, రోలు మొ.కి కలుగుజేసెడు గరుకు. రోట్లో తలపెట్టి, రోకలిపోటుకు వెరుస్తే ఎలా?
ముసల మాయుధ మస్యాస్తీతి ముసలీ. న-పు. - రోఁకలి ఆయుధముగాఁ గలవాఁడు, బలరాముడు.
దృతి - 1.తిత్తి, 2.తోలు, 3.చేప.
తిత్తి - 1.చిన్నసంచి, 2.కొలిమి తిత్తి, 3.సుతితిత్తి, సం.దృతి.
తోలు - పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
దృతిక - (జం.) (Utriculus) చెవిలో మధ్య గుహ, (Vestibute) యొక్క పై భాగము.
ఆటి - 1.ఒక జాతి బాతు, 2.ఆడేలు పిట్ట, 3.ఒక రకపు చేప.
శరారి - బాతు.
ఆడెలు - ఆడి(ఆడి - ఆటి.), ఒక జాతి పక్షి, రూ.ఆడేలు.
శరారి రాటి రాతిశ్చ -
శరం నీరం హింసాం వా ఋచ్ఛతి శరారిః - నీటిని గాని హింసనుగాని పొందునది. ఋ గతౌ.
అటతీత్యాటిః. సీ. అట గతౌ. - చరించునది.
అతతీత్యాతిః. సీ. అత సాతత్యగమనే. - ఎల్లప్పుడు తిరుగునది. ఈ మూడు 3 ఆఁడేలను పక్షి పేర్లు.
మీనవల్లంకి - ఒకానొకపిట్ట, రూ.మీనవల్లఁకి, సం.మీనవల్లికా.
లకుమిక - చేపలబట్టు పిట్ట, తిట్టిభము.
ఉల్లంకి - చేపలను, పురుగులను తిను ఒక జాతి పిట్ట.
ఆకాశంలో పక్షికి నీటిలోని చేప ఆహారం! చేప కనిపించే వరకు కొంగకు యోగదృష్టి అభాసమే. కొంగలు సరస్సులోని చేపలనీడను పట్టి రయ్యిన దిగి, చేపలను నోట కరచు కొని ఎగురుతాయి!
బెస్త - 1.ఒక తెగ బోయ (చేపలు పట్టుట, పల్లకి మోయుట వీరి వృత్తి).
మాలుగు - 1.బెస్తల భుజముల మీది తడిమడత, 2.సోమరితనము.
ధీవరుఁడు - జాలరి. (ౙ)జాలరి - చేపల పట్టువాడు.
కైవర్తుఁడు - 1.జాలరి, 2.పడవ నడుపువాడు, 3.నీటిలో వర్తించువాడు.
నావికుఁడు - ఓడ నడుపువాడు.
పొల - 1.మాంసము, 2.దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.ఫలమ్.
పొలను - 1.మాంసము, 2.మాంసపు దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.ఫలమ్.
ఎఱచి - పొల, మాంసము. దుర్గంధము - చెడువాసన.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీద పొలుసు, 8.తునక, విణ.అల్పము.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః. మదీ హర్షే. - మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.
మీయతే ధీవరేణమీనః. మీఙ్ హింసాయాం. – జాలరి వానిచేత హింసింపఁ బడునది.
నీళ్ళలోన మీను నెరమాంస మాశించి
గాలమందుఁజిక్కు కరణి భువిని
ఆశదగిలి నరిడు అల్లగె చెడిపోవు విశ్వ.
తా. నీటిలో చేప ఎర్రయొక్క మాంసమునకు ఆశపడి(మత్స్యము ఆకలిగొని గాలముచే)గాలమునకు చిక్కుకున్నట్లుగ నరుడు(నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.)ఆశచేత ఆ చేప రీతిగనే చెడిపోవు చున్నాడు.
ఊఁత1 - 1.ఊనిక, అవలంబము 2.చేపలు పట్టు సాధనము.
ఊఁత2 - (భౌతి.) దేనికైన ఆధారమగు నట్టిది (Support).
ఊఁతకోల - ఊనుకొనెడి కఱ్ఱ, ఆధారముగ పట్టుకొను కఱ్ఱ 2.రక్షణము. దండగోల - 1.ఊత, 2.ఊతగఱ్ఱ.
ఊఁదు - 1.వాచు, 2.నిప్పు మొ. వానిని రగులజేయు, 3.శంఖము మొ. వానిని శబ్దింపజేయు, 4.ఉంచు, 5.ఊఁతతో చేపలుపట్టు.
వల - 1.చేపలుపట్టు జాలము, 2.సమూహమునందు వలను శబ్దపు రూపము, ఉదా. వలను+కడ = వలకడ.
వల - వై.వి. కామము, సం.వల్.
(ౙ)జాల - 1.జాలము, చేపలపట్టు, 2.కిటికీ, సం.జాలమ్.
(ౙ)జాలము - చాగు, ఆలస్యము.
(ౘ)చాగు - 1.పోవు, 2.ప్రవర్తిల్లు, 3.యత్నించు, రూ.సాగు.
(ౘ)చాఁగు - 1.దీర్ఘమగు, 2.దండాకారముగ నేలకు వ్రాలు, అవ్య.ప్రశంసార్థకము, రూ.సాగు.
(ౙ)జాలరి - చేపల పట్టువాడు.
Fish for a person, you feed him a meal; teach him how to fish, and you feed him for a lifetime.
బడిశము - గాలము.
గాలము - 1.చేపలను పట్టు వంపు గల కొక్కిబడిశము, 2.నూతిలో పడిపోయిన చేద మొ.వి.తీయు సాధనము.
ద్రొబ్బుడుపటము - చేపలను పట్టుటకు కుపయోగించు సాధనము.
ద్రొబ్బు - క్రి.పడద్రోయు.
బడిశం మత్స్యబన్ధనమ్ :
బలినః మత్స్యా న్ శ్యతీతి బడిశం. శో తనూకరణే. - బలముగల మత్స్యములను కృశముగాఁ జేయునది. లడయోరభేదః.
మత్స్యాః బధ్యంతే అనేన మత్స్య బంధనం. బన్ధ బంధనే. - మత్స్యములు దీనిచే బంధింపఁబడును.
పా. మత్స్యాః విధ్యంతే యేన తత్ మత్స్యవేధనం వ్యధతాడనే. - మత్స్యములఁ బీడించునది. ఈ మూడు గాలము పేర్లు.
భక్ష్యోత్తమప్రతిచ్ఛన్నం మత్స్యో బడిశమాయసమ్ |
లోభాభిపాతీ గ్రసతే నానుబంధమవేక్షతే ||
చప చక్కని తినుబండారంలాగా కనపడే ఇనుపగాలాన్ని దురాశకు లోనై మింగుతుంది. దానివల్ల జరుగబోయే అనుబంధాన్ని/కీడును గమనించదు.
సంసారజాలపతితస్య జగన్నివాస!
సర్వేన్ద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య!
ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
వస్తాడు పోతాడు నాకోసం - వచ్చి కూర్చున్నాడు నీ కోసం, సగంచచ్చి వున్నాను నీ కోసం పూర్తిగా చస్తావు నాకోసం. – ఎర-చేప
రావణుడు సీతను 'వింద' నామకమను ముహూర్తమున అపహరించి నందుకు ఎర తగిలించు కొక్కెము పట్టుకొనిన మత్స్యం వలె నశించును అని జటాయువు పలికెను.
పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరు కాలము. February, March నెలలు, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు శిశిర ఋతువు.
26. పూరాభాద్ర, ఉత్తరాభాద్ర - రెండేసి 4 నక్షత్రములుండును.
భాద్రపద - 1.ఉత్తరభద్ర పదా నక్షత్రము, 2.ఇరువది యారవది.
స్యూర్నభస్య ప్రౌష్ఠపద భాద్ర భాద్రపదా స్సమాః :
నభాంసి మేఘాః తేషుసాధు ర్నభస్యః. - నభస్సులనఁగా మేఘములు, వాని యందు సమర్థమైయుండును.
ప్రోష్ఠపదా నక్షత్రయుక్తా పూర్ణిమా స్మిన్నితి ప్రోష్ఠపదః - ప్రోష్ఠపదా నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁగలదు.
భాద్రపదైన భాద్రా, 'నామైక దేశేనామ గ్రహణ ' మితిన్యాయత్. - భీమోభీమసేన ఇతివత్. భాద్రయుక్తా పూర్ణిమా స్మిన్నితి భాద్రః. భాద్రపదశ్చ - భాద్రపద నక్షత్రమే భాద్రము, భాద్రనక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు. ఈ నాలుగు 4 భాద్రపద మాసము పేర్లు.
అహిర్బుధ్నియః ప్రథమా న ఏతి | శ్రేష్ఠో దేవానాముత మానుషాణామ్ | తం బ్రాహ్మణాస్సోమపాస్సోమ్యాసః | ప్రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే | చత్వార ఏకమభి కర్మ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వదంతి | తే బుధ్నియం పరిషద్యగ్గ్ స్తువంతః | అహిగ్ం రక్షంతి నమసోపసద్య ||26||
అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
త్రీణిలోచనాని యస్యసః త్రిలోచః - మూడుకన్నులు గలవాఁడు.
త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః - మూఁడుకన్నులు గలవాఁడు.
త్ర్యంబకుఁడు - శివుడు, ముక్కంటి.
త్యంబక సఖుఁడు - కుబేరుడు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
మిక్కిలి కంటి వేల్పు - ముక్కంటి.
మిక్కిలి - విణ. 1.అధికము 2.శ్రేష్ఠము.
బేసికంటి - (బేసి + కన్ను) ముక్కంటి.
బేసి - విషమము, సమముకానిది, విణ.(గణి.) సరిగాని సంఖ్య(Odd). 1, 3, 5, 7 వంటివి, చూ. (ఆయుగ్మ సంఖ్య).
విషమము - సమము కానిది.
విషమాక్షుడు - శివుడు, వ్యు.బేసి కన్నులు కలవాడు.
బేసి కైదువుజోదు - అసమశరుడు, మన్మథుడు.
అసమశరుఁడు - మనమథుడు.
కైదువు - ఆయుధము.
(ౙ)జోదు - యోధుడు, యుద్ధముచేయువాడు, సం.యోధః.
ముక్కంటి చుక్క - ఉత్తరభాద్ర పదా నక్షత్రము, ఆర్థానక్షత్రమని కొందరు.
చుక్క- 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః 2.చుక్రః.
శుక్రో దైత్యగురుః కావ్య ఉశనా భార్గవః కవిః :
శుక్ల వర్ణత్వా చ్ఛుక్రః - శ్వేతవర్ణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేణ నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రుని రేతస్సు వలనఁ బుట్టినవాఁడు.
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రదానే - దేవతలను దుఃఖము నిచ్చువాఁడు.
దైత్యగురుః. ఉ-పు. - దైత్యులకు గురువు.
కవే రపత్యం కావ్యః. - కవియను ఋషి కొడుకు.
వష్టి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః. న పు. వరకాంతౌ - అసురుల శ్రేయస్సు నిచ్ఛయించువాఁడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు.
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యము చేత వర్ణించువాఁడు. ఈ ఎనిమిది శుక్రుని పేర్లు.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని వ్యు.తేజస్సు కలవాడు నవగ్రహములలో నొకటి (Venus). అంతఃశుద్ధికి శుక్రుడు.
ఒంటికంటి గాము - శుక్రుడు. కావ్యుఁడు - శుక్రుడు.
భృగువు - 1.ఒక ముని, భృగు మహాముని భార్య పులోమ, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు. భార్గవదర్ప వినాశక రామ్.
భార్గవి - 1.లక్ష్మి 2.పార్వతి. భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.
పరశురాముడు - జమదగ్ని మహర్షికిని రేణుకకును పుట్టినవాడు.
ఖండ పరశువు - 1.శివుడు, 2.పరశురాముడు.
ఖండపరశుః ఉ-పు. ఖణ్డయతీతి ఖణ్డః ఖణ్డః పరశుర్యస్య సః ఖణ్డపరశుః - ఖండించెడు గండ్రగొడ్డలి గలవాఁడు. ఖండపర్శుః అని రూపాంతరము.
ఖండ భేదనే. ఖండః ఖండితః పరశురిత్యసురో నేనేతివా - పరశు వనెడు రాక్షసుఁడు ఇతనిచే ఖండింపఁబడెను.
కదాచిత్ఖండితో స్య పరశురితి వా - ఒకానొకప్పుడు ఈయన పరశువు(గండ్ర గొడ్డలి) ఖండిత మాయెను.
రేణుక - 1.గంధ ద్రవ్యము, 2.జమదగ్ని భార్య.
కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటి కాకి.
కుశీలవుఁడు - 1.చారణుడు, 2.నానాదేశ సంచారియైన నట్టువుడు, 3.వాల్మీకి 4.బట్టువాడు.
చారణుఁడు - 1.నానాదేశ సంచారకుడైనట్టి నటకుడు, 2.దేవతలలో చారణ తెగకు చెందినవాడు.
సుధన్యా ఖణ్ణ పరుశుః దారుణో ద్రవిణః ప్రదః|
దివిద్పృక్ సర్వ దృగ్వ్యసో వాచస్పతి రయోనిజః||
ఎదురుచుక్క - 1.అశుభప్రదము, 2.అనిష్టము, 3.కూడనిది. (శుక్ర నక్షత్రము ఎదురుగున్నప్పుడు ప్రయాణించుట కూడదందురు.)
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.
27. రేవతి - చేపవలె 32 నక్షత్రములుండును.
రేవతి - 1.ఇరువది ఏడవ నక్షత్రము, 2.బలరాముని భార్య.
రేవతి ప్రకృతి కళవల్ల పుట్టింది. పితృదేవతల మానస పుత్రియై హిమగిరి పత్నియైన మేనక, ప్రకృతి కళవల్ల పుట్టిన స్త్రీ.
మీనురూపు రిక్క - రేవతీ నక్షత్రము.
కడ చుక్క - రేవతీ నక్షత్రము.
పూషా రేవత్యన్వేతి పంథామ్ | పుష్టిపతీ పశుపా వాజబస్త్యౌ | ఇమాని హవ్యా ప్రయతా జుషాణా | సుగైర్నోయానైరుపయాతాం యజ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీ నః | గావో నో అశ్వాగ్ం అన్వేతు పూషా | అన్నగ్ం రక్షంతౌ బహుధా విరూపమ్ | వాజగ్ం సనుతాం యజమానాయ యజ్ఞమ్ ||27||
పూషుఁడు - సూర్యుడు. సూర్యుఁడు - వెలుగురేడు.
పుష్ణాతీతి పుషా. న. పు. పుష పుష్టౌ - పోషించువాఁడు.
మేన1 - మేనక. ఒక పేరుంది - అ పేరుకు మధ్య అక్షరం తీసేస్తే నాలుగు కాళ్ళ జంతువు పేరొస్తుంది - మే(న)క.
మేనకాయాః ఆత్మజా మేనకాత్మజా - మేనక కూతురు, పార్వతీదేవి.
మేన2 - తోడబుట్టిన దాని యొక్కయు, తల్లిదండ్రుల తోడబుట్టిన వారి యొక్కయు దేహసంబంధము, ఉదా. మేనకోడలు, మేనత్త.
మైనాకుఁడు - హిమవంతుని కొడుకు, మైనకాత్మజుడు.
వ్రతినీ మేనకా దేవి బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ,
ఏకాక్షరపరా తారా భవబంధ వినాశినీ.
అంబిక - 1.తల్లి, 2.మేనత్త, 3.పార్వతి, 4.ధృతరాష్ట్రుని తల్లి.
జగన్మాతృత్వా దంబికా - లోకముల తల్లి. అంబతే జనయతి సర్వ మంబికా - సమస్తమును జనింపఁజేయునది. అంబ జననే. అమ్మిక - పార్వతి, దుర్గ, సం. అంబికా.
పురుషార్థ ప్రదా పూర్ణా భొగినీ భువనేశ్వరీ,
అంబికా నాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా. - 69శ్లో
ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.
భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రం యుతేనచ|
సేతుస్స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృ వందనే||
తా. ఆరుమారులు భూప్రదక్షిణంబులు, పదివేలమారలు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున కలుగు ఫలము తమ తల్లికి ప్రీతిపూర్వకముగా వందన (వందనము - 1.పూజ, 2.స్తోత్రము 3.నమస్కారము)మాచరించుటవలన కలుగును. - నీతిశాస్త్రము
కొనరిక్క - రేవతీ నక్షత్రము, అశ్వని మొ. వానిలో చివరి నక్షత్రము.
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపు జూలు.
చివర - 1.కొన, 2.అగ్రము.
అగ్రము - 1.ఎదురు, 2.సమీపము, 3.కొన, విణ.మొదటిది, (భూగో.) సముద్రములోనికి చొచ్చుకొని పోయిన నేలకొన.
కడ(ౘ)చుక్క - రేవతీ నక్షత్రము.
కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కాష్ఠ - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
దిక్కు - 1.శరణము 2.దిశ, స్థానము, నెలవు.
దిశ - దిక్కు, దెస (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కులలో నొకటి.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా 2.దశా. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది.
శరణము - 1.రక్షకము, రక్షణము, 2.గృహము.
గృహము - 1.ఇల్లు 2.భార్య.
శరణం గృహరక్షిత్రోః :
శరణ శబ్దము ఇంటికిని, రక్షించువానికిని పేరు. శీర్యతే శృణాతి దుఃఖాదికమితి శరణం. శౄ హింసాయాం. నశించునది. దుఃఖాదులను జెఱుచువాఁడును గనుక శరణము. "ప్రతిశరణమశీర్ణ జ్యోతిరగ్న్యాహితానా" మితి గృహే ప్రయోగః. 'శర్ణం తరుణేందుశేఖర"' ఇతి రక్షకే ప్రయోగః.'"శరణం రక్షణే వధ"ఇతి విశ్వప్రకాశః.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
ఆశ - 1.కోరిక 2.దిక్కు. ఆశ కంతము లేదు, నిరాశకాదిలేదు.
ఆస - అపేక్ష 3.దిక్కు, సం.ఆశా.
అపేక్ష - కోరిక, కాంక్ష.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.
అంక - పార్శ్వము, ప్రక్క, రూ.అణక.
అణక - ఎద్దు మెడమీద కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.
క్రేవ - పార్శ్వము.
పార్శ్వము - 1.ప్రక్క 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), విం. విణ. (జీవ.) క్రన్నులనుండి బయలు దేరినది (Latral).
అంతము -1.తుద, 2.చావు, 3.స్వభావము, విణ.1.సమీపము, 2.రమ్యము.
తుద - చివర, కడ, అంతము, రూ.తుది.
చివర - 1.కొన, 2.అగ్రము.
మృతి - చావు.
మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.
మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మిత్తిగొంగ(గొంగ - శత్రువు) - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
సహజము - స్వభావము, విణ.కూడ బెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది, (Normal).
రమ్యము - ఒప్పిదమైనది.
రమణ - 1.ఒప్పిదము, 2.ప్రీతి, సం.రమణమ్, రమ్యమ్. రామతీర్థము నందు దేవీస్థానం రమణ.
సదేశము - సమీపము.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
చేవాటు - సమీపము. చేయలఁతి - సమీపము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము.
చేరుగడ - 1.సమీపము, 2.దిక్కు, 3.శరణము.
చేరువకాడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 3.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ద మప్పటి నిలుకడ.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువూన్నచోటు (Position).
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెలవుకొను - క్రి.1.నిలుకడయగు, 2.నిలుచుండు, రూ.నెలకొను.
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, చుక్కలరాయుడు.
చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు.
చుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.
జీవనమింకఁ బంకమున జిక్కినమీను చలింపకెంతయున్
దాపుననిల్చి జీవనమె తద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తాపక భక్తియోగమున దాశరథీ కరుణాపయోనిథీ.
తా. చేఁప నీళ్ళు ఎండిపోయిన బురదలో చిక్కుకొన్నను, ఆ చోటును విడిచి కదలక అందే నిలిచి నీళ్ళనే తుదకు గోరునట్లు, నీయందలి చింతనము నందే గుఱియుంచి ఎన్ని కష్టములు వచ్చినను దానిని వదలక యుండు వాడు. అట్లుండుటచే నీయెడల భక్తి (యు)ఉదయించి ఆ భక్తియోగమున సంసారము దాటునని తాత్పర్యము.
కా తే కాంతా కస్తే పుత్రః - సంసారో య మతీవ విచిత్రః,
కస్య త్వం వా కుత ఆయాతః - తత్వం చింతయ తదిహభ్రాతః. - భజగోవిందం
No comments:
Post a Comment