Tuesday, May 21, 2013

భూమి

భూమే భూమిప సర్వస్వే భూమిపాల పరాయణీ|
భూమిపానం సుఖకరే భూమిం దేహి చ భూమి దే||

భూ ర్భూమి రచ లాసన్తా రసా విశ్వమ్భరా స్థిరా,
ధరా ధరిత్రీ ధరణిః క్షోణిర్జ్వా కాశ్యపీ క్షితిః.
సర్వంసహా వసుమతీ వసుధార్వీ వసున్ధరా,
గోత్రాకుః పృథివీ పృథీక్ష్మా అవని ర్మేదినీ మహీ,
(విపులా గహ్వరీ ధాత్రీ గౌరిలా కుమ్భినీ క్షమా,
జగతీ రత్నగర్భా చ భూతధా త్రబ్ధిమేఖలా.)

భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ!

భవతీతి భూః ఊ.సీ భూమిశ్చ. ఇ. సీ. - ఇది (యు)ఉదకమువలనఁ బుట్టును.

1. భూ - భూమి.
భూమి - నేల, చోటు(తావు), పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము(స్థలము, చోటు).  నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ -
సీత.
వరజు - నాగటి చాలు, సీత.
శీత - నాగటి చాలు.

భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు -
నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars). 
నరకఁడు - 1.దుష్టుడు, 2.దయలేనివాడు, సం.నరకగః.

మహేయి - ఆవు.
మాహేయుఁడు -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.

అచల - భూమి.
అచలము -
కొండ, విణ. కదలనిది.
కొండ - పర్వతము.
కొండ(ౘ)చూలి - పార్వతి.
కొండమల్లయ్య - శివుడు.; కొండయల్లుఁడు - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.
కొండపగతుఁడు - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు.

అనంత - 1.భూమి, 2.పార్వతి, (వృక్ష) 1.ఎద్దు నాలుక చెట్టు, 2.గరిక, 3.ఉసిరిక, 4.తిప్పతీగ, 5.జీలకఱ్ఱ, 6.పిప్పలి.

విశ్వ - భూమి.
విశ్వంభరుఁడు -
విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషు.
విశ్వసృజుడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

స్థిర - భూమి.
స్థిరము -
1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది.
తిరము - స్థిరము.
స్థిరుఁడు - శని; శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn). 
తిరుడు - స్థిరుడు.
తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము.

స్థావరము - (భౌతి.) కదలనిది, చలనము లేనిది, స్థిరము, మార్పులేనిది, (Stationary), సం.వి. 1.వింటినారి, 2.కొండ, 3.వృద్ధత్వము.

ధర - భూమి.
ధరణా -
భూమి, రూ.ధారణి.
ధారణి - భూమి, రూ.ధారుణి, ధరణి.
ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి.  
ధరణీనురుఁడు - బ్రాహ్మణుడు.
ధరణీశ్వరుఁడు -
1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు.
ధరణీశ్వరుడు - రాజు.

ఉర్వి - భూమి, వ్యు.విశాలమైనది.
ఉర్వీపతి -
రాజు, భూమీశుడు.
ఉర్వీశుఁడు - రాజు, భూపతి.
భూపతి - నేలరేడు, రాజు. నేలఱేఁడు - రాజు. 

భూభృత్తు - 1.రాజు, 2.కొండ.
భూభుజుఁడు -
రాజు.
భూజాని - 1.విష్ణువు, 2.రాజు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.

భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు -
భూసురుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు. 

రాష్ట్రము - 1.దేశము, 2.ఉపద్రవము.
ఉపద్రవము -
1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ(పీడ – బాధ), 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
రావడి - ఉపద్రవము, విపత్తు.
రాయిడి - ఉపద్రవము, విపత్తు.
విపత్తు - ఆపద; వల్లడి - అకారాణమగు నాపద, విపత్తు.
ఆపద - విపత్తు, ఇడుమ. ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
విప్లవము - (వ్యావ.,చరి.,రాజ.,అర్థ.) తీవ్రపరివర్తనము, రాజ్యక్రాంతి, సం.వి.కొల్ల మొదలగు దేశోపద్రవము, విపత్తు.
విప్లవకారులు - (వ్యావ.) విప్లవము లేపినవారు.  

అంతర్యుద్ధము - (చరి.) 1.ఒక దేశప్రజలలో జరుగు యుద్ధము, 2.అంత కలహము, 3.మనస్సులో జరుగు సంఘర్షణము.

త్యజే దేకం కులస్యార్థే గ్రామస్శార్థే కులంత్య జేత్|
గ్రామ జనపదసా ర్థే ఆత్మార్థే పృధివీం త్యజేత్||
తా.
కులహాని కలుగునపు డందుకు హేతుభూతుడైన వానిని, గ్రామహాని కలుగునపుడందుకు హేతుభూతమైన కులమును, దేశహాని కలుగునపుడు దానికి హేతుభూతమగు గ్రామమును, తనకుపద్రవము వచ్చినపుడు తానున్న భూమిని విడువవలయును ననుట. - నీతిశాస్త్రము  

రాష్ట్రపతి - (శాస., రాజ., చరి.,) భారత రాజ్యాధిపతి, అధ్యక్షుడు (President).
అధ్యక్షుఁడు - అధిష్ఠాత, ప్రధానాధికారి, విణ. 1.ఇంద్రియములకు గోచరించువాడు, 2.పనులు కనుపెట్టు చూచువాడు, 3.ప్రత్యక్షమైనవాడు.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిపానదేవత - అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.

దేశములు అనేకము - భూమి ఒకటే.

అదితి - 1.దేవతలతల్లి, కశ్యపుని భార్య, 2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము.
పార్వతి -
1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పునర్వసు - ఒక నక్షత్రము. 

కాశ్యపి - భూమి, వ్యు.పరశురామునిచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయబడినది.

క్షితి - 1.భూమి, 2.ఉనికిపట్టు.
క్షితిధరము -
కొండ.
క్షితిపతి - రాజు, భూమీశుడు.
క్షితిరుహము - చెట్టు.

సర్వంసహ – భూమి; సహ - భూమి.

వసుంధర - భూమి.
వసుధ -
భూమి, వ్యు.వసువును (బంగారమును) ధరించునది.
వసువు - బంగారు, ధనము(పైఁడి - బంగారు, ధనము.), రత్నము.
వసువులు - గణాధి దేవతలు, అష్టవసువులు. 1.అవుడు, 2.ధ్రువుడు, 3.సోముడు, 4.అధ్వరుడు, 5.అనిలుడు, 6.ప్రత్యూషుడు, 7.అనలుడు, 8.ప్రభాసుడు.

పైఁడిచూలాలు - వసుంధర, భూమి.
పైఁడిఱేఁడు -
కుబేరుడు.
పైఁడినెలఁత - లక్ష్మి.

గోత్రము - 1.వంశము, 2.పేరు, 3.కొండ.
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 3.భూమిమి రక్షించువాడు.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి -
1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.
గొస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.

భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.కడచినది, 2.పొందబడినది.
భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది. 

పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్క చేయబడినది, విశాలమైనది. పృథువు - గొప్పది, వి. ఒక రాజు.
భూతేశుఁడు - శివుడు.   

అవని - భూమి, నేల.
మేదిని - భూమి.
మెయి -
తృతీయ విభక్తి యందు ఒకచో వచ్చు ప్రత్యయము, వి.1.విధము, 2.పార్శ్వము, 3.వెంబడి, 4.భూమి, మహి, 5.దేహము. 
మెయితాలుపు - ప్రాణి, శరీరి; శరీరి - ప్రాణి.
పార్శ్వము -
1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువు యొక్క ఒక భాగము(Side), విం. విణ. (జీవ.) క్రక్కనుల నుండి బయలు దేరీనది.(Latral).
దేహము - శరీరము(దేహము), మేను.
మేను - 1.శరీరము, 2.జన్మము, పుట్టుక, 3.పార్శ్వము.

పరికర్మము - దేహమునందలి మురికి పోగొట్టుట.

ఒడలు - మేను, దేహము, రూ.ఒళ్ళు.
ఒడలిచూపొడయఁడు - ఇంద్రుడు.

ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా, భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము, (Shape).

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథివీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
పుడమితాలుపు - శేషుడు, వ్యు. భూమిని ధరించువాడు.

పూచిన పువ్వులు అన్నీకాయలే అయితే పుడమి భరించగలదా ?

విపుల – భూమి; విపులము - విస్తారమైనది.

ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ -
1.(యోగ.) ఒక నాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.

కుంభిని - నేల.
మను -
1.జీవించు, 2.నర్తించు, వి.1.మన్ను, 2.నేల.
క్షమ - 1.ఓర్పు, Patience 2.నేల, 3.మన్నింపు.
ఓర్మి - క్షమ, సహనము, సహించుట, రూ.ఓరిమి (Tolerance).
ఓరిమి - క్షమ, శాంతము, ఓరుపు.
సహనము - ఓర్పు; ఓరుపు - ఓరిమి.
ఓపిక - 1.బలము, శక్తి, 2.ఓర్పు.
తితిక్ష - ఓర్పు; తితిక్షువు - ఓర్పరి.
తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి. తాల్మి - తాలిమి.

క్షాంతి - 1.ఓర్పు, 2.మన్నించుట.
క్షాంతము -
1.ఓర్పు స్వభావము గలది, 2.మన్నింపబడినది.

క్షమ గలిగిన సిరి గలుగును,
క్షమ గలిగిన వాని గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును,  
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
భా||
ఓ తండ్రీ! క్షమకలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. సూర్యప్రభలు కలిగిన క్షమా గుణమును అలవర్చుకొనుట బ్రాహ్మణుని ధర్మము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).

విశ్వ - భూమి.
విశ్వంభరుఁడు -
విష్ణువు.
విశ్వసృజుడు - బ్రహ్మ.

క్ష్మా - భూమి, వ్యు.భారము నోర్చునది.
క్ష్మాజము -
చెట్టు, వ్యు. భూమి నుండి జన్మించినది.
క్ష్మాభృత్తు - 1.కొంగ, 2.ఱేడు, వ్యు. భూమిని మోయునది (వాడు). కోయష్ఠికము - చీకుకొక్కెర, గ్రుడ్డి కొంగ.

ధ్వాంక్షము - 1.కాకి, 2.కొక్కెర.
కొక్కెర -
కొక్కరాయి; బలాక - పెద్ద కొక్కెర.  
కొక్కరాయి - కొంగ, బకము, రూ.కొక్కెర, కొక్కెరాయి.
కొంగ - బకము, సం.క్రుజ్.
బకము - కొంగ, రూ.బకోటము.

క్రౌంచము - 1.క్రౌంచపర్వతము, 2.ఒకానొక ద్వీపము, 3.ఒకరకపు కొంగ.
క్రొంచ -
కొంచ, సం.క్రౌంచః.
కొంౘ - 1.క్రౌంచము, 2.ఒకానొక పర్వతము, సం.క్రౌంచః.
కొంౘగుబ్బలి - క్రౌంచపర్వతము.
క్రౌంచదారణుడు - కుమారస్వామి, గుహుడు, వ్యు.క్రౌంచపర్వతమును భేదించినవాడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
గుహుఁడు - కుమారస్వామి, వ్యు.దేవసేనలను పొదివి రక్షించువాడు, 2.ఒక నిషాదరాజు. 

సారవివేకవర్తనుల సన్నుతికెక్కిన వారిలోపలన్
జేరినయంత మూఢులకు జేపడదానడ యెట్లనగాఁ
సారములోన హంసముల సంగతినుండెడి కొంగపిట్టకే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ ! భాస్కరా. 
తా.
హంసలతో గలిసినంత మాత్రమున కొంగపిట్టకు రాయంచగమన ప్రవర్తనములు ఏ విధముగా, కలుగును?(కలుగదు) రాదు. అట్లే, మంచి యోగ్యతలు(నిజమగు యుక్తాయుక్త విచక్షణ)గల వారి నాశ్రయించినంత మాత్రమున మూర్ఖులకా(మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.) గొప్పవారి కా పేరు ప్రతిష్ఠలు రావు.            

కర్మభూమి - కర్మాచరణం దెక్కువ ఆదరణ గల భూమి, ఆర్యావర్తము.
ఆర్యావర్తము -
ఆర్యులు తమ పశు సముదాయముంతో చరించిన భూమి (వింధ్యాచల హిమాచల మధ్య భూమి.) పుణ్యభూమి.
పుణ్యభూమి - వింధ్యాహిమాహల మధ్య సీమ (ఆర్యావర్తము).

చర్మం, ఎముకలు, నరాలు, వెంట్రుకలు, మాంసము; ఈ ఐదు భూమి యొక్క గుణాలు.

అస్తి మాంసం నఖంచైవ త్వగ్లోమానిచ పంచమమ్|
పృథ్వీ పంచగుణాః ప్రోక్తా బ్రహ్మజ్ఞానేన భాషితమ్||
ఎముకలు, మాంసం, గోళ్ళు, చర్మం, వెంట్రుకలు అనేవి పృథ్వీభూతము యొక్క పంచగుణములు.

1. చర్మము - 1.తోలు, 2.కేడెము, డాలు.
తోలు -
పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
త్రోలు - క్రి. పశ్వాదులను తోలు, రూ.తోలు.
తోలుదాలుఁపు - శివుడు, చర్మాంబరుడు.

స్త్రియాం తు త్వగస్వగృరా :
త్వచతి మాంసం వేష్టయతి త్వక్. చ. సీ. త్వచ సంవరనే. - మాంసమును గప్పునది. అకారాంతంబుబు గలదు. "త్వచవేష్టిత మస్థిపంజరం యది కాయం సమవైషి యోషితాం" అని యశ్వషోషుఁడు.
అసృజం రక్తం వృణోతీతి అసృగ్వరా. - నెత్తురును గప్పియుండునది. పా. అసృగ్థరా. ఈ రెండు చర్మము.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.

కృత్తి - 1.చర్మము, తోలు, 2.కృత్తికానక్షత్రము.
కృత్తివాసుఁడు -
ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.

దృతి - 1.తిత్తి, 2.తోలు, 3.చేప.
తిత్తి -
1.చిన్నసంచి, 2.కొలిమితిత్తి, 3.సుతితిత్తి, సం.దృతి.
చేఁప - మత్స్యము; మత్స్యము - చేప.

కళవసము - తోలు, రూ.రూ.కళాసము.
కళాసము - కళవసము.

కృత్తిక - ఇరువదియేడు నక్షత్రములలో మూడవది, కత్తెర.
కృత్తికాసుతుఁడు -
కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.
స్కందుఁడు - కుమారస్వామి.
కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొమరుదనము, కొమరు ప్రాయము = యౌవనము).

మంగలకత్తి రూపు - కృత్తికా నక్షత్రము.
మంగల1 -
క్షౌరముచేసి జీవించు జాతి.
మంగల2 - 1.పతివ్రత, 2.దుర్గ.
పతివ్రత - సాధ్వి; సాధ్వి - పతివ్రత.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.

మంగళ - పార్వతి; మంగళదేవత - లక్ష్మి.
మంగళుఁడు - కుజుడు.

త్వక్కు - 1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము.
త్వచము - (వృక్ష.) బెరడు, బెండు (Cork).
బెరడు - చెట్టుబోదె పై కప్పు, బెరడు, (Bark).
పట్ట - చెట్టు మీది తోలు, బెరడు, వై.వి. (వృక్ష.) వృక్షకాండము పైభాగమున నుండు దట్టమైన బెరడు, సం.పట్టమ్ .
తొక్క - 1.చెట్టుపట్ట, 2.పండ్లమీది చర్మము, సం.త్వక్.
నార - చీల్చిన చెట్టుపట్టలోని పీచు, వల్కలము.
వల్కలము - చెట్టుమీది పట్ట.

రేషము - (వృక్ష.) నార, పీచు, పోగు, (Fibre).
నార -
చీల్చిన చెట్టుపట్టలోని పీచు, వల్కలము.
పీచువేళ్ళు - (వృక్ష.) తల్లి వేరు ప్రత్యేకముగ లేకుండ అన్నియు నార వలె నుండు వేళ్ళు (Fibrous roots).

అంత స్త్వచిక - (వృక్ష.) వల్కలము, కాండము యొక్క బహిశ్చర్మమునకును అంతశ్చర్మమునకు మధ్యనుండు భాగము (Cortex).
అంతస్త్వచిక జనకము -
(వృక్ష.) పెరుగుచున్న అవయములకొనల యందు గల ప్రవి భాజిక జీవకణజాలములో బహిశ్చర్మ జనకము క్రిందనుండి అంతస్త్వచిక కణ సంహతిని ఉత్పత్తిచేయ కణజాలము (Periblem).

యువగండము - మొటిమ.
మొటిమ -
యౌవనము నందు ముఖమున లేచు గుల్ల, విణ.మొటిమె, బొటిమ.
స్థూలోచ్ఛయము - 1.పెద్దరాయి, 2.బొటిమ. బొటిమ - మొటిమ.
వరండము - 1.మొగమందలి మొటిమ, 2.నోరుడికెడి తెవులు, 3.గడ్డివామి, 4.సమూహము.

త్వగ్దాహము - (గృహ.) 1.చర్మదాహము, 2.కరకైన చర్మము, 3.చర్మవ్యాధి, 4.బొటిమలు పెరిగిన, పగిలి చర్మము, విటమిన్ 'ఎ 'లోపమువలన కలుగు వ్యాధి. (Der matitis).

చెలిది - 1.చర్మరోగము, 2.మేహరోగము, రూ.చెల్ది.
మేహము - ఒక రోగము.

ౙవ్వు - 1.దుర్మదజలము, 2.చర్మము లోపలి పొర, 3.సొగసు.
సొగసు -
అందము, సం.సుకాశ్.
అందము - 1.సౌందర్యము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.

ఛవి - 1.కాంతి, 2.కిరణము, 3.చర్మము, 4.రంగు.
చెవ్వ -
1.బిడ్డలకు పుట్టిన వెంటనే కలుగు వ్యాధి విశేషము, 2.చర్మ మాలిన్యము.

'డి' విటమిన్ - (గృహ.) (Vitamin – D) సూర్య కిరణముల తాకిడి చే చర్మములో తయారగు విటమిన్.

అతి నీలలోహిత కిరణములు - (గృహ.) సూర్యరశ్మిలోని ఒక రకపు కిరణములు. (ఇవి శరీరమును తాకిన విటమిన్ ' డి ' తయారగును) (Ultra violet rays).
అతి నీలలోహితము - (భౌతి.) కాంతివర్ణమాలతో నీలలోహితమండలము నకు ఆవలనున్న కాంతివర్ణమాలకు చెందినది (Ultra violent).

ప్రభాసిని - (జం.) చర్మము యొక్క పైపొర (Epidermis).
అధిచర్మము -
(జం.) చర్మము యొక్క బయటి పొర (Epidermis).
అదిచద్ఛము - (జం.) దేహము పై భాగమున లోపలి భాగమున ఉండు ఒక విధమగు జీవకణములతో నేర్పడు పొర (Epithelium).

ఆద్యస్తరము - (జం.) భ్రూణములో ఉన్న మూలాధారమగు జీవకణపు పొరలలో (బహిశ్చర్మము, మధ్యస్తరము, అంతశ్చరము) ఒకటి. (దీని నుండి ప్రౌఢ జంతు శరీరములో, జీవకణజాలములు, అవయములు ఏర్పడును) (Germlayer).

బహిశ్చర్మ జనకము - (వృక్ష.) పెరుగుచున్న అవయముల (ముఖ్యముగా శాఖల వేళ్ళ కొనల యందు గల ప్రతి భాజక జీవకణ జాలములోనిది బయటనున్నది (Dermatogen). (ఇది బహిశ్చర్మమును ఉత్పత్తి చేయును. ఇది ఒక జీవకణ అంత మందముగ నుండును.)
స్పర్శకణము - (జం.) బహిశ్చర్మము క్రిందనుండు జ్ఞాననాడీకణములు, (Tactile cells).

మధ్యస్తరము - (జం.) భూణములో బహిశ్చర్మమునకు అంతశ్చర్మము నకు మధ్య నుండు జీవకణముల పొర (Mesoblast or mesoderm).

మధ్యశ్లేషము - (జం.) అంతర్గుహినము లలో బహిశ్చర్మమునకు, అంతశ్చర్మమునకు మధ్య ఏర్పడు జెల్లీ వంటి పదార్థము (Mesogloea).
అధశ్చర్మము-(జం.) చర్మమునకు క్రింద నున్నది(Subcutaneous). అధఃస్తరము - (వృక్ష.) బహిఃస్తరము క్రిందనుండు పొర (Hypodermis).

ఆటలమ్మ - (గృహ.) తట్టు, చిన్నమ్మవారు, అను ఒక అంటువ్యాధి (Chicken-pox, measles). (ఇది ఎక్కువగ చిన్న పిల్లలకు వచ్చు అంటువ్యాధి).
తట్టమ్మవారు - చర్మముపై ఎఱ్ఱమచ్చలు కనిపించు అంటువ్యాధి, పొంగు (Measles).
పొంగు - 1.సంతోషము, 2.సముద్రపు పోటు, 3.ఆటలమ్మ, క్రి.1.సంతోషించు, 2.ఉబ్బు.
తట్టు - 1.కలుగు, 2.తోచు, 3.చరచు, హిం.వి. 1.పొట్టిగుఱ్ఱము, వై.వి.దరి, పార్శ్వము.
తట్టువ - గుఱ్ఱము, రూ.తట్టువము.

ముసిఁడి - ముషిణి చెట్టు.
ముషిణి - విషముష్టి (ఓషధి,) (దీని రసము చర్మరోగములను హరించును).

హరిగ - కేడెము, డాలు, రూ.అరిగ.
కేడెము -
డాలు, రూ.కేడియము, సం.కేటకమ్.
డాలు - 1.కాంతి, 2.రంగు, 3.జెండా, టెక్కెము 4.కేడెము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.

గ్రహభేదే ధ్వజే కేతుః :
కేతుశబ్దము కేతుగ్రహమునకును, టెక్కెమునకును పేరు. కిత్యతే అనేనేతి కేతుః. కిత జ్ఞానే. - దీనెచేత నెఱుఁగబడును. కేతుశబ్దము కాంత్యుత్పాత చిహ్నములకును పేరు. "పతాకాయాం ద్యుతౌ కేతుః గ్రహోత్పాతాదిలక్ష్మను"అనె రుద్రుఁడు. 

అండనము - కేడెము, డాలు, రూ.అడ్డనము.
ఖేటకము -
1.డాలు, రూ.ఖేటము, 2.ఒకరకపు గ్రామము, 3.శ్లేష్మము.
ఖేటము - 1.రైతులుండు పల్లె, 2.వర్తకు లుండు పేట, 3.సూర్యాది గ్రహము, 4.శ్లేష్మము, 5.బలరాముని గద, 6.వేట, 7.చర్మము, 8.గడ్డి, 9.డాలు, విణ.1.అధమము, 2.వడ్డీ బ్రదుకునది.

చర్మి - కేడెము ధరించినవాడు.
చర్మకారుడు - మాదిగవాడు.

మతంగుఁడు - 1.ఋషి, 2.మాదిగవాడు.
ఋషి - 1.జ్ఞానముచే సంసారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.
వెలుగు - కిరణము, 2.ప్రకాశము.
మాదిగ - చెప్పులు కుట్టి జీవించు జాతి, కరటుడు, గోహింసకుడు, సం.మాతంగః.
మాతంగుఁడు - మాదిగవాడు.

ఆసాది - 1.మాదిగవాడు, మతంగుడు, 2.గ్రామదేవతను పూజించు పూజారి.

శ్లో|| త్వగసృఙ్మాంస మేధో అస్థి ధాతవశ్శక్తిమూలకాః
      మజ్జాశుక్లప్రాణ జీవ ధాతవ శ్శివమూలకాః|| 
చర్మ, రక్త, మాంసములు, మెదడు, ఎముకలు, అనునవి ధాతువు లైదును శక్తిమూలకములు. మజ్జ (ఎముకలలోని గుజ్జు), వీర్యము, ప్రాణము, జీవము(జీవము – ప్రాణము.) అను నాలుగు ధాతువులును శివమూలకములు.   

2. ఎముక - శల్యము, రూ.ఎమ్ము.
శల్యము -
1.ఎముక, 2.బాణము, చిల్లకోల 3.విషము, 4.మేకు, 5.ఏదు పందిముల్లు.
శల్యములు - (వృక్ష.) మొగ్గగాని, శాఖగాని, ముళ్ళుగామారిన నిర్మాణములు (Spines).

బొమిక - 1.ఎముక, 2.బోకె.
బోఁకె - బొమికె, శల్యము.

కుల్యము - శల్యము, ఎముక, సం.విణ.1.గొప్పది, 2.మంచి కులమున పుట్టినది.  
కుల్యికులు -
(జం.) ఎముకలో నుండు అతి సూక్ష్మమైన శాఖలు గల చిన్న చిన్న గొట్టములు (Canaliculi).
నికుల్యములు - (జం.) ఎముకలలో సూక్ష్మమగు రక్తనాళములుండు చిన్న చిన్న కాలువలు (Havesiar canals).

అస్థి - 1.ఎముక, 2.టెంక, గింజ.
అస్థికణజాలము -
(జం.) ఎముకలకు కారణమైన కణజాలము (Bony tissue).
అస్థికృతములు - (జం.) ఎముకకు సంబంధించిన జీవకణములు (Osteoblasts).
అస్థికవచము - (జం.) ఎముకకుపైన గట్టిగా, పీచుగా నుండు తొడుగు వంటి పొర (Periosteum).

అస్థిఅంగారము - (రసా.) ఎముకల బొగ్గు, బొగ్గగునట్లు కాల్పబడిన ఎముక (Bone-black).
అస్థిభస్మము - (రసా.) ఎముకలు కాల్చిన బూడిద, (ఇందు కాల్సియమ్ పాస్ఫేట్ ఉండును) (Bone-ash).

శరము - 1.బాణము, 2.రెల్లు, 3.జలము.
విశిఖము -
బాణము; బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.
ఱెల్లు - తృణ విశేషము, శరము. 
ఱెల్లుచూలి - కుమారస్వామి, శరజన్ముడు. 

భవ్యము - 1.శుభమైనది, 2.యోగ్యమైనది, వి.ఎముక.

కొయ్యబద్ద - (గృహ.) ఎముక విరిగినప్పుడు ఆసార పెట్టి కట్టుసాధనము (Splint).

కీకసము - 1.ఎముక, 2.నులిపురుగు.
నులిపురుగులు -
కడుపులోని సన్నని పురుగులు.

మేకు - 1.శూలము, 2.చీల.
శూలము -
1.ముమ్మొనవాలు, 2.టెక్కెము, 3.ఒక రోగవిశేషము.
ముమ్మొనవాలు - (మూడు + మొనవాలు) త్రిశూలము.
త్రిశూలము - ముమ్మొనవాలు.
త్రిశిఖము - 1.త్రిశూలము, 2.సిగదండ.
సిగబంతి - శేఖరము, సికదండ.
శేఖరము - సిగదండ,(ఉత్తరపద మైనచో) శ్రేష్ఠము.

చీల - 1.మేకు, 2.కీలము, రూ.సీల.
శివకము -
1.పసులగట్టు గూటము, 2.మేకు.
కీల - 1.మోచేతిదిబ్బ, 2.మేకు, 3.మంట, జ్వాల.
కీలము - 1.మేకు, 2.మంట, 3.లేశము, 4.మోచేయి, (వృక్ష.) అండకోశములో అండాశయముపై నున్న కాడ (Style).
కీలాగ్రము - (వృక్ష.) కీలము యొక్క కొన (Stigma).
కీలి - అగ్ని, వ్యు.కీలలు కలది. 

స్థాణువు - 1.మేకు, 2.శివుడు, 3.కొమ్మలులేని చెట్టు మ్రోడు, విణ.స్థిరమైనది.

మ్రోడు - 1.మొద్దు, స్థాణువు, 2.మూర్ఖుడు.
మొద్దు - మ్రానిమోడు, విణ.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.

అవుఁగాములు - 1.కలిమి లేములు, 2.మేలుకీళ్ళు, 3.కష్టసుఖములు, 4.మంచిచెడ్డలు, రూ.ఔఁగాములు (అవు +కామి).
ఔగాములు -
(ఔట+కామి) 1.కలిమి లేములు, 2.మేలుకీళ్ళు, 3.యుక్తాయుక్తములు, రూ.అవుగాములు.

శలము - 1.ఏదుపందిముల్లు, 2.ఏదుపంది, రూ.1.శబలము, 2.శలవి.
శబలము -
చిత్రవర్ణము.
శలాక - 1.గొడుగు లోనగువాని కమ్ము, వీణ మొదలగువాని వాయించు కొడుపు, 2.బాణము, 3.ఎముక, 4.ఏదుపంది.
సలాక - శలాక, కమ్మి, సం.శలాకా.
సలుగు - శుల్కము, ఏదుపంది, రూ.సలుపు, సం.శల్యకః.
శుల్కము - 1.సుంకము, 2.ఉంకువ, 3.వేశ్య కిచ్చుధనము. 
సుంకము - 1.శుల్కము, అమ్ముడు సరకులకు దొరతనము వారికిచ్చు పన్ను, 2.తరుగు, 3.ప్రతిబంధము, సం.శుల్కమ్.
ఉంకువ - అల్లుడు కన్యకొరకు మామ కిచ్చు ధనము, ఓలి, శుల్కము.
ఓలి1 - ఉంకువ, కన్యాశుల్కము.
ఓలి2 - వరుస, బారు, సం.ఆళిః. 
కన్యాశుల్కము - ఓలి, వధువును గ్రహించుటకు ఇచ్చు ధనము.

సంపూర్ణసంధి - (జం.) చలసంధి, అన్ని వైపులకును ఎముకలు స్వేచ్ఛగా తిరుగుటకు వీలుగానున్న కీలు (Perfect joint).

అచలసంధి - (జం.) కదలికకు వీలులేని ఎముకలసంధి, ఉదా. పుఱ్ఱెలోని ఎముకలు కదలని కీలు (Immovable joint).
కదలని కీళ్ళు -(జం.) కదల్చుటకు వీలుకాని కీళ్ళు, ఉదా. తలఎముకలు (Immovable joints).

పునక - తలపుఱ్ఱె, తలయెముక.
పుఱ్ఱె -
(గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium). 

కపాలము - 1.తలపుఱ్ఱె, 2.సమూహిము, 3.కుండపెంకు, (జం.) 1.పుఱ్ఱె, 2.పృష్ఠ వంశీక జంతువుల తలలోనున్న ఎముకల సముదాయము.
కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (cranial nerves).

బుఱ్ఱ - 1.కొబ్బెరకాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

హలాస్థులు - (జం.) నాసాస్థులకు పైన పుఱ్ఱెలో మూడు రేఖలుగల ఎముకలు (Vomers)

శ్వసన నియంత్రిక నాడిముడి - పుఱ్ఱెనుండి బయటికి వచ్చిన తరువాత ప్రాణేశ నాడిపై నగుపడు ముడి, (Vagus ganglion).

పశ్చకపోల మహార్భుదములు - (జం.) కపోల ద్వారమున కిరుప్రక్కల నుండు ఉత్పశ్చకపాలస్థులకు గల ఉబ్బిన గుండ్రమగు భాగములు(బొడుపులు) (Occipital condyles).
పశ్చమ - (జీవ.) వెనుక నున్నది (Posterier). 

కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium). కపాల మొచనము నందు దేవీస్థానం శుద్ధి.
కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.
గాబు - మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.
కప్పెర - 1.పుఱ్ఱె, 2.భిక్షాపాత్రము, సం.కర్పరః.
కమఠము - 1.తాబేలు, 2.భిక్షాపాత్రము. అక్షయపాత్ర - భిక్షాపాత్ర. భవనాసి - (వ్యావ.) 1.బిచ్చగాని గిన్నె, 2.అక్షయపాత్ర.
బొచ్చె - 1.కుండలోనగు వాని పెంకు, 2.తలపుఱ్ఱె.

న్రస్థిమాలీ - శివుడు, వ్యు.పుఱ్ఱెల దండ ధరించినవాడు.

అస్థిపంజరము - కంకాళము, ఎముకలగూడు.
కంకాళము -
ఎముకలగూడు.
కరకము - 1.ఎముకగూడు, 2.కమండలువు, 3.దానిమ్మ, 4.పక్షి, వడగల్లు.
కరంకము - 1.పుఱ్ఱె, 2.లోపల నెమియు లేని  బొండ్లపు చిప్ప, 3.తల, 4.కంకాళము.

కమండలువు - సన్యాసు లుంచుకొను గిండి వంటి పాత్ర.  
కుండి -
కమండలువు, వికృ.గిండి.
గిండి - సన్నని మెడగల చిన్నచెంబు, సం.కుండీ.

కుసుంభము - 1.కుసుంభపువ్వు, 2.కమండలువు.
కుసుంభరాగము - బయటికి కనబడుచు అంతఃకరణమందు లేనిప్రేమ.

లలాట పార్శ్వాస్థి - (జం.) పుఱ్ఱెలో పైభాగమును ఏర్పరుచు ఎముకలలో నొకటి. ఇది లలాటాస్థి, పార్శ్వాస్థి అను రెండు ఎముకలుకలిసి ఏర్పడినది, (Frontoparietal bone).
పార్శ్వకపోలాస్థి - (జం.) పుఱ్ఱెకు పైభాగమున ప్రక్కవైపు నున్న ఎముక (Parietal bone).

అలికము - నొసలు, లలాటము, రూ.అళికము.
అళీకము -
1.అప్రియమైనది, 2.అసత్యమైనది, వి.1.అప్రియము, 2.బొంకు, 3.నొసలు.
నొసలు - నుదురు; లలాటము - నుదురు; నుదురు - నొసలు.
నిటలము - నొసలు, రూ.నిటాలము.
నిటలాఖుఁడు - శివుడు.

ఫాలము - నెత్తి, లలాటము.
నెత్తి - తల. కళ్ళు నెత్తి కెక్కాయా! వాడి కళ్ళు ఎప్పుడూ నెత్తి మీదుంటాయి. ఉదా. అహంకారము, పొగరుకు వాడుమాటలు.   
ఫాలనేత్రుడు - ముక్కంటి. 
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.

ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్ష మెత్తఁగ వలసెన్
దనవారి కెంతగల్గిన
దనభాగ్యమె తనకుఁగాక తధ్యము సుమతీ.
తా.
కుబేరుడంతటి ధనవంతుడే స్నేహితుడుగా ఉన్నను, ఫాలాక్షునకు భిక్షాటన తప్పలేదు. కాబట్టి తనవారి కెనలేని సంపద యున్నను, తనకెంత ప్రాప్తమో అంతే లభించును. కాని ఎక్కువ కల్లనేరదు. 

బాహ్యకంకాళము - (జం.) జంతువు యొక్క శరీరమునకు బయట నుండు ఎముకల గూడు (Exo-skeleton).
అంతఃకంకాళము - (జం.) శరీరము లోపలనుండు ఎముకల గూడు (Endo-skeleton). 

అక్షకంకాళము - (జం.) 1.పుఱ్ఱె, 2.వెన్నెముక, 3.రొమ్ముఎముక, వానికి సంబంధించిన ఎముక (Axial skeleton).
అక్షకాస్తి - (జం.) బోర యెముక (Clavicle).
అక్షకీకసము - (జం.) వెన్నెముక లోని రెండవ పూస, (Axis vertebra).

మైరువము - (జం.) వెన్నుముకకు గాని, వెన్నుపామునకుగాని, సంబంధించినది. మేరువు = వెన్నుపాము, (Spinal).
మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుంచెడి మణి, 3.హారమధ్యము నందు వ్రేలెడు మణి.

అగ్రయోజవర్ధము - (జం.) వెన్నెముకలో నున్న చేతాకుల్యముపై ప్రతి కీకసమునకు చెరియొక వైపున ముందు భాగమున నుండు చిన్న బొడిపెలు (Prezygapophysis). వెనుక భాగమున నున్నవి పశ్చయోజవర్ధములు (Postzy-gapophysis). 
పశ్చమ - (జీవ.) వెనుక నున్నది (Posterier).

ద్విపుటాకారము - (జం.) రెండు వైపులును మధ్య పల్లముగా నున్నది, (Amphicoelous), ఉదా.వెన్నెముకలోని కొన్ని పూసలు.

ఉత్పశ్చకఫాలాస్థులు - (జం.) పుఱ్ఱె యొక్క క్రింది భాగమున అసమానముగ నుండు రెండు ఎముకలు (Exoccipitals).

నిహానుయోజము - (జం.) పుఱ్ఱెతో క్రింది దవుడ తగిల్చియుండు ఏర్పాటు (Suspensorium) (ఇది అగ్రగండాస్థి, చతుష్కాణాస్థి, రోస్థి, అను ఎముకలతో నేర్పదియున్నది.) 

అగ్రగండాస్థి - (జం.) పుఱ్ఱెలో శ్రవణ ప్రావరమునకు ప్రక్కగానున్న ' T ' ఆకారముగల ఎముక (Squamosal bone).
చతుష్కోణాస్థి - (జం.) కపోలములోని ఎముకలలో అగ్రగండాస్థి యొక్క పొడవైన భాగమునకు నురోస్థి వెనుకభాగము నకును మధ్య కడ్డీవలె నుండు మృదులాస్థి (Quadrate).
రోస్థి - (జం.) కపాలమునకు అడుగు భాగమున నుండు T ఆకారముగల ఎముక (బ్రహ్మలిపిలో "రో" అను అక్షరము T వలె నుండును). (Parasphenoid).

రో - 1.కుదువ, 2.చేబదులు, 3.వేశ్య కిచ్చు శుల్కము, రూ.రోయి, సం.రై.
రో - ధనము. రై - 1.ధనము, 2.హిరణ్యము.
రోయి -
1.వేశ్యకిచ్చెడు శుల్కము, 2.పందెము, కుదువ, 3.చేబదులు, 4.ఎరవు.
పందెము - 1.ఒడ్డనము, 2.జూదములో ఒడ్దు ధనము, రూ. పందియము, సం.పణితమ్.
ఒడ్దనము1 - 1.పందెము, 2.వ్యూహము.
ఒడ్దనము2 - బెత్తము మొ.చే చేయబడిన కేడెము, సం.అందనమ్.
పణము - 1.పందెము, 2.విలువ, 3.కూలి, 3.ధనము, 5.జూదము.
(ౙ)జూదము - జూజము; జూజము - ద్యూతము, పందెము వేసి యాడెడుయాట, మోసము, రూ.జూదము, సం.ద్యూతమ్.
పణితము - 1.పొగడబడినది, 2.పందెముగా చేయబడినది.
ఆహకము1 - కుదువ, తాకట్టు, రూ.ఆయకము.
ఆయకము -
తాకట్టు, కుదువ, ఆధి.
కుదువ - తాకట్టు; తాకట్టు - 1.కుదువ, ఉద్దర, 2.తణఖా, 3.అస్తి కుదువపెట్టి ఋణము తీసికొనుట. ఉద్దర - తాకట్టు.
గిరవు - 1.తాకట్టు, కుదువ, 2.కానుక, హిం.గిర్వీ.
కనుక - కానిక; కానిక - ఉపహారము, రూ.కానుక, కాన్క.
ఆధి - 1.మనోవ్యధ, 2.తాకట్టు, 3.ఆధారము, 4.అత్యాశ.
లాలూచి - 1.అత్యాశ, 2.నైచ్యము. నైచ్యము - నీచభావము.
ఆహకము2 - ముక్కున గలుగు ఒక రోగము.

చేబదులు - 1.చేతి అప్పు, 2.అల్పకాలమునకు దీసినయప్పు, 3.వ్రాత మూలకము కాని అప్పు.
వెచ్చము - 1.ఇంటికి వలయు తినుబండములు రొక్కమీయక అప్పు దెచ్చుకొనుట, 2.వ్యయము, సం.వ్యయః.  
వ్యయము - వెచ్చము, ఖర్చు. ఖర్చు - వెచ్చము, వ్యయము. లోభికి ఖర్చెక్కువ.
ఎరువు - ఒకటి రెండు దినములు వాడుకొనుట కై యడిగి తెచ్చుకొను సొమ్ము. ఎరువు సొమ్ము బరువు చేటు.    

బంగారు కుదువబెట్టకు
సంగరమున బాఱిపోకు సరసుడవైనన్
అంగడి వెచ్చములాడకు
వెంగలితోఁ జెలిమివలదు వినరా సుమతీ.
తా|| బంగారు నగలను తాకట్టుపెట్టుట, యుద్ధమునందు (ఓడి)నోడి పారిపోవుట, అంగడి యందు అప్పుతెచ్చుట, తెలివిహీనుని(వెంగలి - మూఢుడు, జడుడు, సం.వికలః)తో స్నేహము చేయుట తగని పనులు.

కీలసంధి , వివర్తసంధి - (గృహ.) బొంగరపు కీలు, ఒక ఎముకలో ఇంకొక ఎముక గుండ్రముగా తిరుగుటకు అమరచిన కీలు, ఉదా.మెడ, తల, కీలు (Pivot joint).

మాడపట్టు - తలమీద ఎదుటి వెనుకటి ఎముకల కూడికలు (Fontanelle).

మస్తకము - శిఖరము, రూ.మస్తము.
శిఖరము -
1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
కొపురు - 1.కొండకొమ్ము, శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము - 1.కొండకొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది. శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు. సిరమము - శిర, తల, సం.శిరః.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్. వి.1.శిరస్సు,  2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు. వరాంగము - 1.ఏనుగు Elephant, 2.తల.

శీర్షము - తల, (గణి.) భూమి కెదురుగా నుండు కోణబిందువు, (Vertex).

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. - నీతిశాస్త్రము

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు -
1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.

అగ్రహనువు - (జం.) కపాలములో హనువునకు ముందరి భాగమున నున్న ఎముక (Premaxilla).

శిరోధి - మెడ.
మెడ -
కంఠము, రూ.మెడకాయ.
కంఠము - 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము.
కంధరము - 1.కంఠము, 2.మెడ, మబ్బు.

కంఠేకాలుఁడు - శివుడు, వ్యు.కంఠము నందు నలుపు కలవాడు.
నీలకంఠుఁడు - శివుడు; శితికంఠుఁడు - శివుడు, వ్యు.నల్లని కంఠము గలవాడు.

జతుక - లక్క, రూ.జతువు, ఇంగువ.
జత్రువు -
1.మెడ ఎముక, 2.కొంకులు (Collarbone or Clavicle).

వాహము - 1.గుఱ్ఱము, ఎద్దు, 3.భుజము.
గుఱ్ఱము -
అశ్వము; అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
భుజము - (గణి.) సమతల క్షేత్రములో వరుసగానున్న రెండు కోణబిందువుల కలువగావచ్చు సరళరేఖ (Side) సం.వి.చేయి.
భుజసంధి - (జం.) భుజపు కీలు, చెయ్యి ఎముక భుజపు ఎముక కలిసిన భాగము (Shoulder joint).
ౙబ్బ - 1.భుజము, 2.తొడ వెలుపలి మీది భాగము, సం.భుజా.
రెట్ట - 1.పక్షిమలము, 2.భుజము.
బాజు(ౙ)బందు - 1.భుజబంధము, 2.భూషణము, జం.బాహుబంధః.
దో - బాహువు; బాహువు - భుజము.
బాహులేయుఁడు - కుమారస్వామి. కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.

బాహ్వస్థి - (జం.) దండయెముక, మోచేతిపై యెముక, భుజపు టెముక (Humerus).

దోష - 1.భుజము, 2.రాత్రి.
దోర్మధ్యము -
1.పిడికిలిపోటు, 2.భుజముల నడిమి ప్రదేశము. 
దోర్యుగము - రెండు బాహువులు. ఎగుభుజము - ఉన్నత భుజము.

స్కన్ధో భుజశిరో అంసో (అ)స్త్రీ -
కం శిరో దధాతీతి స్కంధః డు ధాఞ్ ధారణపోణయోః. - శిరస్సును ధరించునది.
భుజస్య శిరో అగ్రం భుజశిరః. స. న. - భుజము యొక్కకొన.
అమ్యతే భారణే అంసః. అ. ప్న. అమరోగే. - భారముచేఁ బీడింపఁబడునది. ఈ 3 మూఁపు పేర్లు.   

స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
ప్రకాండము -
చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా.పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము(రామాయణమునందు షట్కాండములు గలవు), 2. సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.  

అంసము - 1.మూపు, భుజాగ్రము, 2.అంశము.
మూపు -
భుజ శిరస్సు, అంసము.
అంసకూటము - ఎద్దుమూపురము.
అంసలుఁడు - మంచిమూపు గలవాడు, బలవంతుడు.

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
వంతు -
1.భాగము, 2.వరుస, 3.సామ్యము, 4.పోటీ.
విషయము - గ్రంథాదులందు దెలియు నంశము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాలసముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.

అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.

సహస్రాంశువు - సూర్యుడు, వేవెలుగు.
సహస్రపాదుఁడు -
1.విష్ణువు, 2.సూర్యుడు.

అంసచక్రము - (జం.) భుజవలయము, మొండెమునకు ముందు భాగమును వర్తులాకారముగ ఆవరించి చేతులకు ఆధారముగ నుండు ఎముకల కూర్పు (Pectoral girdle).
అంస ఫలకభాగము -
(జం.) అంసచక్రములో అంస సంధి కూపము చుట్టును ఉన్న ఎముకలలో నిదియొకటి. వెడల్పుగా నున్న దీని పైభాగము ఉదంసఫలక (Supra scapula) మనియు సన్నగా నున్న క్రింది భాగము అంసఫలక (Scapula) మనియు అందురు (Scapular portion).
అంస ఫలకము - (జం.) భుజపు వెనుక ఎముక (Scapula or shoulder blade). పెడ కేలు - వెనుకకు త్రిప్పిన భుజము.

ఆకృషి - (జం.) భుజాస్థి యొక్క క్రిందికొన, (ఇది స్పంజి ఎముకలతో ఏర్పడినది) (Trochlea). 

అంససంధికూపము - (జం.) భుజపుకీలునకుండు గిన్నెవంటి భాగము. బంతి గిన్నె కీలు - (జం.) ఒక ఎముక యొక్క గుండ్రని తల మరియొక ఎముకకు గల గిన్నెలో నమిరి అన్ని వైపులకు కదుపుటకును చక్రము వలె తిరుగుటకును వీలుగా నుండు కీలు (Ball and socket joint).
ఉలూఖలసంధి - (జం.) బంతిగిన్నె కీలు, గిన్నెవంటి భాగమునందు బంతివలె నుండు ఎముక భాగము ఇమిడి కదలునది, ఉదా.భుజముకీలు (Ball and socket joint), తొడ ఎముక సంధి.

సంధిరసము - (జం.) బంతిగిన్నె కీలువంటి కీలులో ఎముకల మధ్య నుండు రసము (Synovial fluid).

బాహుజుఁడు - 1.అశ్వవిదుడు, 2.నలుడు, 3.కీచకుడు, 4.పుణ్యశ్లోకుడు.
కీచకుఁడు -
భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.
కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
బాహుజుఁడు - రాచవాడు; క్షత్రియుఁడు - రాచవాడు. 

ఆజానుబాహువు - మోకాళ్ళవరకు వ్రేలాడు నిడుదచేతులు కలవాడు.

ఉపాంగ కంకాళము - (జం.) కాళ్ళు, చేతులు, వీనికి సంబంధించిన ఎముకల సముదాయము (Appendicular skeleton).

కదలెడికీళ్ళు - (జం.) అవయవ భాగము వంచుటకు లేదా త్రిప్పుటకు వీలగుకీళ్ళు, ఉదా. చేతి ఎముకలు (Movable joints).

మడత బందుకీలు - (జీవ.) తలుపువలె ముడుచుటకు వీలగు కీలు, ఉదా.మోచేతికీలు (Hinge-joint).

మోఁచేయి - (మోపు+చేయి) కూర్పరము.
కపోణీ -
మోచేయి.
కపోణ్యగ్ర ప్రవర్ధము - (జం.) మోచేతికీలులో రేడియో అల్మాకు పైకి పొడుచుకొని వచ్చిన భాగము (Olecanon process).

కూబరము - సం.విణ. మనోజ్ఞము, సుందరము, సం.వి.1.బండినొగ, 2.మోచేయి.

రేడియస్ - (జీవ.) (Radius) మోచేతి క్రింది రెండు ఎముకలలో కుడి ప్రక్కది.
రేడియల్ - (జీవ.) (Radiale) మణికట్టులో నున్న ఎముకలలో అన్వర్తిక క్రిందనున్న ఎముక.
అన్వర్తిక - (జం.) ముంజేతిలో నుండు ఎముకలలో ఒకటి (Radius). అరత్నిక (Ulna) ముంచేత నుండు రెండవ ఎముక. ఈ రెండును కలసి 'Radioulna ' అనబడును.

అల్నా - (జం.) (Ulna) మోచేతి క్రింది ఎముకలలో ఎడమప్రక్కది, అరత్నిక.
అల్నేర్ - (జం.) (Ulnare) అరత్నిక క్రిందనున్న మణికట్టు ఎముక.
రేడియోధార్మికత - (భౌతి., రసా,) కొన్ని రాసాయనిక మూల ద్రవ్యముల (యూరేనియమ్, తోరియమ్‌మొ.) స్వయం ప్రేరిత విచ్ఛేదనము. ఇందు అల్ఫా() బిటా (B-) గామా () కిరణములు బయటికి చిమ్మబడును. (Radio-activity). రేడియో అల్నా (కప్ప) రేడియల్ అల్నేర్.
అల్ఫా - 

మణిబంధము; మణికట్టు - (గృహ.) అరచేతికి మోచేతికి మధ్యనున్న కీలు (Carpus).
మణి బంధాస్థి - (జం.) చేతి మణికట్టులో నున్న ఎముకల సముదాయము (Carpus).

పాణి - మణికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిగ్రహణము -
వివాహము; పెండ్లి - వివాహము.
పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. కరగ్రహణము - పెండ్లి, పాణిగ్రహణము. 

కరభము - 1.మనికట్టు మొదలు చిటికెనవ్రేలి మొదలుదాక చేతి వెలుపలి చోటు, 2.ఒంటెపిల్ల.
కరభాస్థులు - (జం.) అరచేతి ఎముకలు (Metacarpal Bones). పాణిశలాకలు - (జం.) అరచేతికుండు ఎముకలు (Meta-carpals).

జాఱెడికీలు - (జం.) వరుసగా అమర్చిన ఎముకలు ఒకదాని మీదికి ఒకటి జరుగు కీలు, ప్రసరసంధి, (Gliding joint).
ప్రససంధి - (జం.) జారుడు కీలు, వరుసగా నమర్చిన చిన్న ఎముకలు ఒక దానిపై నొకటి జరుగుచుండు కీలు (Gliding joint), ఉదా. అరచేతి ఎముకలు.

పంచాంగుళిక - (జం.) ఐదు చేతి వ్రేళ్ళుగాని కాలి వ్రేళ్ళుగాని కలది (Pentadactyle).

అంగుళులు - (జం.) 1.చేతివేళ్ళు, 2.కాలివేళ్ళు (Digits).
అంగుళీశలాకులు - (జం.) చేతివేళ్ళకు, కాలివేళ్ళకు ఉండు ఎముకలు (Phalanges).
అంగుళ్యస్థులు - (జం.) వేళ్ళ ఎముకలు, అంగుళీ శలాకలు(Phalanges). 

నెటిక - వ్రేళ్ళు కీళ్ళ కదలిక వలని చప్పుడు, రూ.నెటిక.
నెటికసీల - వై.వి. నైష్ఠికశీలుడు, సదాచారసంపన్నుడు, సం.నైష్ఠికశీలః.

పూస - 1.పూదె, 2.మణి, 3.వ్రేలులోనగు వాని కీలు.
పూదియ -
బంగారుపూస.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు.
పచ్చ(ౘ) - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరురేఖ, సం.పలాశః.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, అల్యూమినియమ్ సిలికేట్ (Emerald). ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)

పీతము - పసుపురంగు, వి. త్రాగబడినది.
పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.

సంధి - (జం.) కీలు, వేరుగానున్న రెండు ఎముకలు గాని, గట్టిపడిన భాగములుగాని కలియుచోటు (Joint).
సంధులు - (గృహ.) కీళ్ళు, ఒక ఎముకను మరియొక ఎముకను కూర్చునవి, (Joints).

వాతరోగము - (గృహ.) వాతము చేత నేర్పడు రోగము, (సాధారణముగ ఈ నొప్పులు శరీరము నందు కీళ్ళవద్ద, Joints వద్ద ఏర్పడును),(Rheumatism).
సంధివాతము - (గృహ.) సంధుల వాపులు, నొప్పులు దీర్ఘవ్యాప్తమగు కీళ్ళనొప్పులు, (Rheumatism).
ధనుర్వాతము - (గృహ.) ఇది అంటు వ్యాధి సంబంధమైన జబ్బు, 'టిటానస్ ' (Tetanus), అనెడి విషక్రిముల (poisonous insects) వలన ఈ వ్యాధి కలుగును. ఇది ప్రాణాపాయకరమైన వ్యాధి. 
కోరవాయువు - వాతరోగము. వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.

వాతఘ్నము - ఆముదపు చెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.

ఆస్లోమలేషియా - (Ostomalacia) ఎముకల బలహీనత (సాధారణముగ ఇది చాలమంది పిల్లలను కన్న తల్లులకును, ఎండ తగులని స్త్రీలకును కలుగువ్యాధి.)  
ఆస్ప్రిన్ - (రసా.) (Asprin) అసటిల్ శాలిసిలి కామ్లముతో చేయబడిన మందు ఇది కీళ్ళ నొప్పుల తగ్గించుటకు వాడుదురు.)

స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు సడలించుట, 4.బెణికించుట, (Dislocation).

మేరుమంతములు - (జం.) తాత్కాలికముగా గాని శాశ్వతముగాగాని వెన్నెముక గల జంతువులు (Chordata).

తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోళపు పొర క్రింద నుండు అంతస్స్రావ గ్రంథి, (Thymus gland).

ఉరోస్థి - (జం.) రొమ్ము యొక్క ఎముక, ఇది పూర్వోరుకాస్థి (Epersternum), పూర్వోరోస్థి (Omosternum), మధ్యోరోస్థి (Mesosternum), ప్రశ్చోరోస్థి(Xiphisternum=Mesosternum)అను నాలుగు భాగములుగ కలిసియుండును, ఉదా. కప్ప.
కప్ప - మండూకము; మండూకము - కప్ప.

ప్రక్క యెముకలు - (గృహ.) రొమ్ము ప్రక్క ఎముకలు (Ribs).

అధస్తుండీఖాతములు - (జం.) పై దవడ ముందు భాగమునకు గల అంచువెనుక ఉండు పొట్టలు(కప్పలో) (Subrostral fossac).
కకుత్ప్రవర్ధము - (జం.) (కప్ప యొక్క) క్రింది దవుడ ఎముకలలో కోణ నిహానవాస్థి (Angulo-splenial bone) అను ఎముకకు పైకి పొడుచుకొని యుండు భాగము (Coronary process).

అగ్రహనువు - (జం.) కపాలములో హనువునకు ముందరి భాగమున నున్న ఎముక (Premaxilla).

పడఁత - 1.హనువు, 2.కాడిభారము.
హనువు -
1.చామ, 2.ఆయుధము, 3.చెక్కిలి మీది భాగము, సం. (జం.) పైదవడ ఎముకలలో నొకటి. దీని కూడ పండ్లు ఉండును. కీటకముల నోటిభాగము లలో నొకటి (Maxilla).
తాలువు - దౌడభాగము (Palate). కాకుదము - తాలుపు, దవుడ.
దౌడ - తాలువు, రూ.దవుడ.
తాలవ్యము - (జం.) హనువును మస్తిష్కాగ్రాస్థితో కలుపు ఎముక, (Palatine). (వ్యావ.) తాలుజర్యమైన అక్షరము (Palatal) ' చ ' మొదలగునవి.

దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టినధ్వని, ఉదా. ౘ, ౙ.

సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బలు సరళములు. 
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.

అధస్తుండీ భాతములు - (జం.) పైదవడ ముందు భాగమునకుగల అంచు వెనుక ఉండు పొట్టలు (కప్పలో) (Subrostral fossac).

చతుష్క యుగీయాస్థి - (జం.) పైదవుడ ఎముకలలో నొకటియగు హనువు యొక్క వెనుక భాగముతో కలిసియుండు సన్నని ఎముక, దీనికి పండ్లు ఉండవు (Quadrato Jugal).   

అధరహనువు - (జం.) గడ్డమునకు ఇరువైపుల నుండు భాగము. క్రిందిదౌడ (Lower jaw).
అధోహనువు -  (జం.) (కప్ప) క్రింది దవుడ, కీటకముల నోటి భాగములలో ఒకటి, దీనికి పండ్లు అమర్చబడి ఉండును, చిబుకాస్థి (Mandible).

అధోవ్భంతము - (జం.) కీటకముల హనువు (Maxilla)లో ఉండు మొదటి తునక.

దంతాస్థి - (జం.) (కప్ప) క్రింది దవడ ఎముకలలొ ఒకటి, (Dentary). కకుత్ప్రవర్ధము - (జం.) (కప్ప యొక్క) క్రింది దవుడ ఎముకలలో కోణ నిహానవాస్థి (Angulo-spleniala bone)అను ఎముకకు పైకి పొడుచు కొనియుండు భాగము (Coronary process).

మెంటో మెకిలియన్ - (జం.) (Mento meckelian) భేకశిశువు యొక్క క్రింది దవుడలో దంతాస్థి ప్రక్కనున్న చిన్న ఎముక.

అంకలి - 1.కలత, 2.అడ్డగింత, 3.ఆపద, 4.నాశము, 5.మర్మము, 6.దౌడకీలు, (బహు.) అంకిళ్ళు.

అక్కలి - 1.కలత, అంకలి, విచారము, 2.రోగము.
కలఁత - 1.క్షోభము, 2.సంతాపము. సంతాపము - కాక, వేడిమి.
క్షోభము - 1.సంతాపము, 2.కలత, 3.వికారము, 4.చలనము.
క్షోభ - (భౌతి.) అల్లకల్లోలము (Disturbance).

ఆపద - విపత్తు(విపత్తు - ఆపద), ఇడుమ.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి, కలుగుట, (తర్క) అయథార్థ జ్ఞానము.

ఎదురు కుత్తుకలు - అంకిళ్ళు పట్టుకొనెడి వ్యాధి.

(ౘ)చామ - 1.యౌవనవతి, 2.నలుపు(నీలిమ – నలుపు), 3.ఒకజాతి పైరు, సం.1.శ్యామా, 2.శ్యామకః.
చామనచాయ - నల్లనిరంగు.
చామనము - శ్యామలము, నల్లనిది.

శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
శ్యామల -
పార్వతి, విణ.నల్లనిది.
యమున - 1.యమునానది(కాళింది - యమునానది), 2.పార్వతి, వికృ. జమున.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
శ్యామిక - చీకటి, నలుపు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామము - 1.మిరియము, 2.ఆకుపచ్చ, 3.నలుపు, 4.మబ్బు.
శ్యామాకము - 1.చామలు, 2.ఒక రకమైన ధాన్యము. 

కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి, 5.క్రొత్త మబ్బు.
కాలియ -
పిశాచము, సం.కాళికా.
పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.), 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.

మేరుపుచ్ఛము - (జం.) భేకశిశువు తోకలోనున్న కీకసలు కలసిపోయి పొడవైన కడ్డీవలె ఏర్పడు ఎముక (Unostyle).
కీకస - (జం.) కళేరుక, వెన్నెముకలో నుండు ఒక్కొక్క పూస(Vertebra).
కీకసకాయము - (జం.) వెన్నెముక లోని వెన్నెపూసకుండు ముఖ్యభాగము (Centrum).

అగ్రయోజవర్ధము - (జం.) వెన్నెముకలో నున్న చేతాకుల్యముపై ప్రతి కీకసము నకు చెరియొక వైపున ముందు భాగమున నుండు చిన్న బొడిపెలు (Prezygapophysis). వెనుక భాగమున నున్నవి పశ్చయోజ వర్ధములు (Postzy-gapophysis).

త్రికాస్థి - (జం.) కప్పయొక్క వెన్నెముకలో నున్న యెముక, తొమ్మిదవ కీకస, వెన్నెముకలలో ముడ్ది పూస లన్నియు ఒకటిగా కలిసియున్న యెముక (Sacrum).

పృష్ఠవంశినము - (జం.) వెన్నెముక గల జంతువు (Vertebrate).
పృష్ఠవంశము -
(జం.) వెన్నెముక (Vertebral Column-Backbone)
పృష్ఠలగ్నము - (వృక్ష.) కింజల్కము యొక్క దండము పుప్పొడితిత్తి వెనుక భాగమున అంటుకొని యున్న (స్థితి) (Dorsifixed).
పృష్ఠమేరువు - (జం.) పృష్ఠవంశిన జంతువుల భ్రూణము అభివృద్ధి చెందునపుడు దేహకుహరము యొక్క పృష్ఠభాగమున ఏర్పడిన ఊచవంటి నిర్మాణము దీని చుట్టును తరువాత వెన్నుపాము ఏర్పడును, మేరుమంత ప్రాణులకు ముఖ్య లక్షణముగా జీవకణ కోశములతో నేర్పడిన కడ్డీ. దీని స్థానమున పృష్ఠవంశిన ప్రాణులలో వెన్నెముక ఏర్పడును (Notochord).  

పృష్ఠము - 1.ముడ్ది, 2.పెరడు, 3.వీపు, 4.వెనుకపక్క, విణ. (జీవ.) పైభాగమునకుగాని, వెన్నుభాగమునకు గాని సంబంధించినది. (Dorsal) క్రింది భాగమునకుగాని, రొమ్ము భాగమునకు గాని సంబంధించినది (Ventral).
పృష్ఠికటి సంబంధము - (జం.) వీపు నడుమునకు సంబంధించినది (Dorso-lumbar).

అపానము - 1.ముడ్డి, 2.అపానవాయువు, పిత్తు.
ముడ్డి -
అపానము, గుదము.
గుదము - మూడి (ముడ్డి), పాయువు, (జం.) అన్నవాహిక చివర నుండు ద్వారము (Anus).
పాయువు - గుదము. కుట్టియ - గుదస్థానము.
పురీషనాళము - (జం.) అన్నవాహిక యొక్క చివర భాగము, (Rectum) దీనిలో మలముండును. పురీషనాళ సంబంధి = Rectal.
అమేధ్యము - మలినము, పవిత్రముకానిది, పరిశుద్ధముకానిది, వి.పురీషము, మలము.
పురీషము - మలము.

అవపానసూత్రము - (జం.) దారము వలె ఉన్న వెన్నుపాము చివరిభాగము (Filum terminale).

త్రికము - 1.త్రయము, 2.ముడ్డి పూస, (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
టికము -
ముడ్డిపూస, స,.త్రికమ్.
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస(ము(ౘ)చ్చ- ముడ్డిపూస), (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
ముయ్యెల గుట్ట - (మూడు+ఎల్ల+గుట్ట) 1.మూడు ఎల్లలు కలియు చోటు, 2.మూడుదారులు కలియుచోటు, 3.త్రికము (ఎల్ల శబ్దమున కిచట స్థానమని అర్థము).
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు. 

దొడ్డి - ద్రోణి, పసులుమేయు కంచె, పసులకొట్టము, పెరడు, సం.ద్రోణీ.
ద్రోణి -
1.చిన్నపడవ, 2.దోనె, 3.పసులు మేయు కంచె, 4.కొండపల్లము.
దొన - 1.తూణము, అమ్ములపొది, 2.ద్రోణి, కొండమీది పల్లము, 3.చెరువు, సం.1.తూణమ్, 2.ద్రోణీ.
తూణము -  అమ్ములపొది, రూ.తూణీరము, తూణి.

వీఁపు - వెనుక మేను, వెన్ను.
వెన్ను -
1.కంకి, 2.ఇంటి నడికొప్పు, 3.వీపు.
కంకి - (జొన్న లోనగువాని ఎన్ను) ఎన్ను.
ఎన్ను - 1.లెక్కించు, 2.అక్షేపించు.
ఇంటి నడికొప్పు: మొగడు - ఇంటి నడికొప్పు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విష్ణుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.

వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

అపరాంగము - 1.వీపుతట్టునుండు దేహభాగము, 2.గుణిభూత వ్యంగములలో నొకటి.

మేరుశీర్షము - (జం.) మజ్జాముఖము పై మెదడునకును వెనుబామునకును మధ్యలోనున్న భాగము (Medulla oblongata). మస్తిష్క పుచ్ఛము - (జం.) మెదడు యొక్క నిలువుకోత త్రికోణాకారముగ నుండు మస్తిష్క వెనుక భాగము (దీని తరువాత కుహరములు, వెన్నుపాము ఉండును) (Medulla oblongata).

మైరువము - (జం.) వెన్నుముకకు గాని, వెన్నుపామునకుగాని, సంబంధించినది. మేరువు = వెన్నుపాము, (Spinal).
మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుంచెడి మణి, 3.హారమధ్యము నందు వ్రేలెడు మణి.

దవ్వ - మ్రాని నడిమి మెత్తని భాగము, (వృక్ష.) కొమ్మ వేరు మొదలయిన భాగముల లోపల మధ్యగా నుండు జీవకణ సంహతి (Pith or medulla).
దవ్వరేఖలు - (వృక్ష.) ద్విదళ బీజకములగు మొక్కల కాండములోని దవ్వనుండి 'ఒడ్డాణము' వరకు వ్యాపించుచు వాహినీ పుంజముల మధ్య నగుపడు మృదు కణజాలముల రేకలు, (Medullary Rays).

దవీయము - విణ.మిక్కిలి దవ్వైనది.
దవ్వు -
దూరము(దవ్వు - దూరము.), సం.దవీయః.
దూఁట - అరటియూచ, దవ్వు.
దుర్దాంతము - 1.ఆడపరానిది, 2.గర్వించనిది, వి.1.పోరు, 2.దూట. బొందియ - అరటి ఊచ, దూట, రూ.బొందె.   

కళత్రము - 1.పెండ్లాము, 2.కోట, 3.నితంబము, (జ్యోతి.) లగ్నము నకు ఏడవస్థానము. (లగ్నము - మేషాదిరాసుల ఉదయము, విణ.తగులుకొన్నది.)
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
కోట - 1.దుర్గపురము, 2.పట్టణము, చుట్టుగల ప్రహరి, సం.కోటః.
కోట్టము - దుర్గపురము, కోట. దుర్గము - కోట.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాననగరము.
నగరము - పట్టణము, రూ.నగరి.
నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు.    

నితంబము - 1.పిరుదు, మొల, 2.కొండ నడుము, 3.మూపు, 4.దరి, ఒడ్దు.
మొల -
1.కటి ప్రదేశము(కటి - నడుము), 2.చీల, 3.త్రాసుముల్లు.
శ్రోణి - పిరుదు, మొల; శ్రోణీఫలకము - మొల.
శ్రోణము - (జం.) తుంటి సంబంధమైనది, కటి సంబంధమైనది (Pelvic).
శ్రోణీచక్రము - (జం.) తుంటికి సంబంధించిన ఎముకల కూర్పు, నితంబ మేఖలము (Pelvic-girdle).
నితంబ మేఖల - (జం.) కటివలయము, తుంటి యెముకల చక్రము (Hip-girdle or pelvic-girdle).
శ్రోణ్యులూఖలము - (జం.) నితంబ మేఖలమునకు ఇరుప్రక్కల నుండు గిన్నె వంటి లోతైన భాగము (దీనిలో తొడ ఎముక యొక్క తల అమరి యుండును).
నితంబ సంబంధము - (జం.) తుంటికి సంబంధించినది (Sciatic).
నితంబిని - స్త్రీ.

అమృతం సద్గుణాభార్యా అమృతం బాలభాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మానభోజనమ్||
తా.
గుణవతియైన యాలు(స్త్రీ, భార్య), బాలుని ముద్దుమాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము

కటకము1 - (భౌతి.) కాంతి కిరణములను కేంద్రాభి ముఖములుగగాని కేంద్రాభి సారులుగ గాని త్రిప్పగల పారదర్శక ఘనరూపము (Lens).
కటకము2 - 1.కడియము, 2.రాచవీడు(రాచవీఁడు - రాజధాని.), 3.నితంబము, 4.కొండ నడుము, 5.ఓంఢ్రదేశపు రాజధాని కటక్. మేఖల - 1.స్త్రీలు ధరించు ఎనిమిది పేటల మొలనూలు, 2.కొండనడుము, 3.ఆయుధము జారకుండ మణికట్టున గట్టు కట్టు.

ఉత్కళము - ఆంధ్ర దేశమునకు ఉత్తరమున నుండు ఒక దేశము, ఓఢ్రదేశము, రూ.ఉత్కలము.
ఓఢ్రదేశము - ఉత్కలము (ఒరిస్సా Orrissa). 
ఉత్కలుఁడు - నిర్వాహకుడు, భారవాహకుడు, వి.1.ఉత్కల దేశస్థుడ్డు, 2.బోయవాడు. 

ప్రావృత స్నాయువు - (జం.) తుంటి కీలునకు గల స్నాయువు (Capsular ligament). ఇది చుట్టును అమర్చబడి యుండును. కూపకము - (జం.) పొత్తికడుపు చుట్టునుండు అస్థిపంజరము (Pelvis).

అసంపూర్ణ సంధి - (జం.) రెండు ఎముకలు కలిసినచోట మధ్య ఒకపొర. మృదులాస్థి ఉండుటచే కొంచెముగా కదల్చుటకు అవకాశము గల కీలు, ఉదా.అంసచక్రము, నితంబమేఖలము లందలి ఎముకలు (Imperfect joint). అసంపూర్ణము - (గణి.) సంపూర్ణముకానిది (Partial).

సడుగులు - 1.నడుము కీళ్ళు, 2.వంకర(వక్రత్వము) మాటలు.
వఱగొడ్దము -
1.వంకరమాట, 2.మర్యాద నతిక్రమించుమాట.

పృష్ఠనితంబాస్థి - (జం.) తుంటి ఎముకలో నొకటి (Llium). 
పురోనితాంబాస్థి - (జం.) తుంటి ఎముకలలో నొకటి (Pubis).
పురోడాళము - (జం.) తుంటి ఎముకలలో నొకటి (Pubis).
ఆసనాస్థి - (జం.) తుంటి ఎముకలలో ఒకటి (Ischium)

ఉపాస్థి కణజాలము - (జీవ.) మెత్తని ఎముకవంటి కణజాలము (Cartilagenous tissue).

ఊర్వస్థి - (జం.) (ఊరు+అస్థి) తొడ ఎముక (Femur).
ఊర్వశి - ఒకానొక అప్సరస.

ఊరువు - తొడ, వ్యు.వస్త్రముచే అచ్ఛాదింపబడునది.
ఊరుసంధి -
(జం.) తుంటికీలు, పెల్విస్ (Pelvis), తొడ ఎముకతో కలియు భాగము (Hip-joint).

అంకపాళి - 1.తొడ, 2.తిన్నె, 3.కౌగిలి, 4.దాది, రూ.అంకపాలి, అంకపాలిక, అంకపాళిక.
తొడ -
ఊరువు; కుఱువు - తొడ; సక్థి - తొడ. 

ఊరవ్యుఁడు - వైశ్యుడు, కోమటి, వ్యు.విరాట్పురుషుని తొడలనుండి పుట్టినవాడు.
విరాట్టు -
1.ఆదిదేవుడు, 2.క్షత్రియుడు, 3.గరుత్మంతుడు.

ౙగతి - తిన్నె; ౙగిలె - తిన్నె, రూ.జగిలె.
తిన్నె -
తిన్నియ.
తిన్నియ - అరుగు, వేదిక, రూ.తిన్నె, తీనియ, తీనె.
అరుఁగు - తిన్నె, రూ.అరఁగు. తీనియ - తిన్నియ.
వేది - 1.వేదిక, తిన్నె, 2.విద్వాంసుడు, విణ.తెలిసినవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు. 

ఊరుపర్వము - మోకాలు, జానువు, వ్యు.తొడకు కణుపు వంటిది.

జానువు - మోకాలు.
మోకాలు - (మోపు+కాలు) జానువు.
మోఁకరించు - క్రి. మోకాళ్ళు నేలనూని ముందరికొరగు, మోకరిలు.
జాను ఫలకము - (గృహ.) మోకాటి చిప్ప, తొడ ఎముక, మోకాలి ఎముక కీలుపై గల బిళ్ళ, (Knee-cap). 

జంఘ - పిక్క.
జంఘాలుఁడు - మిక్కిలి వేగముగా నడచువాడు.

జఙ్ఘాతు ప్రసృతా -
జాయత ఇతి జంఘా. జనీ ప్రాదుర్భావే. - పుట్టునది.
ప్రసరతీతి ప్రసృతా - సృగతౌ, వృద్ధిఁబొందునది. ఈ ఒకటి పిక్క పేర్లు.

ప్రజంఘ కండరము - (జం.) పిక్క ఎముకపై నుండు బలమైన కండరము (Gastrocnemius muscle).

టంక - 1.పిక్క, జంఘ, 2.వెలిగారము. 
వెలిగారము - గర్వచౌకము, టంకము, సం.ధవళక్షారః. (గృహ.,రసా.) టంకణము, సిల్కు బట్టలకు తేటగా చేయుటకును బట్టల మీది మచ్చలు తీయుటకును ఉపయోగించెడి రాసాయనిక ద్రవ్యము, (ఇది బోరికామ్లము యొక్క సోడియపు లవణము). (Borax).   

పిక్క - 1.చిరుతొడ, జంఘ, 2.గింజ, సం.1.పిండికా, 2.స్పృక్కా.
చిఱుదొడ - పిక్క.
(ౙ)జంగ - - 1.పిక్క, 2.దాటు, సం.జంఘా.
(ౙ)జంగగొను - 1.దాటు, 2.దుముకు.
గింౙ - విత్తు; విత్తనము - గింజ. 

పిక్కచెదురు - 1.చెదురు, 2.భయపడు.
చెదురు - 1.నీళ్ళలోనగునవి ఎగిరిపడు, 2.వ్యాపించు, 3.చెదరుట.

జంఘాస్థి - (జం.) పిక్క ఎముకలలో లోపలివైపున నున్న ఎముక, (Tiblo).
జంఘిక - (జం.) పిక్క యెముకలలో రెండవది, అనుజంఘాస్థి, (Fibula). జానుక - (జం.) అనుజంఘాస్థి, పిక్క ఎముకలలో బయటివైపున నున్న ఎముక (Fibula).
జంఘానుజంఘాస్థి - (జం.) జంఘాస్థి అనుజంఘాస్థి కలసియున్న యెముక (Tiblo-fibula).

అస్థిమార్దవ రోగము - (గృహ.) విటమిన్ 'డి' లేక ఖటికలోపము వలన కలుగు వ్యాధి, ఎముకల బలహీనత.(సాధారణముగ ఇది చిన్నపిల్లలకు వచ్చు వ్యాధి. వంకరకాళ్ళు లేక దొడ్డికాళ్ళు తయారగును) (Rickets). రికెట్సు - (వైద్య.) (Rickets) అస్థి మార్ధవరోగము. విటమిన్ ' డి ' (Vitamin D) లోపమువలన కలుగువ్యాధి (ఎముకల బలహీనత, సాధారణముగా చిన్న పిల్లలకువచ్చు వ్యాధి, వంకర కాళ్ళు మొ.) 

మాతృక - 1.తల్లి, 2.దాది, 3.పార్వతి, 4.అసలు గ్రంథము.
తల్లి -
జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.
జనని - 1.తల్లి, 2.దయ(దయ - కనికరము), 3.లక్క, 4.కోరిక.
తలి - జనని, తల్లి.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి. 

జనయిత్రీ ప్రసూర్మాతా జననీ -
జనయతీతి జనయత్రీ; జననీ చ. సీ. జనీప్రాదుర్భావే. - కొడుకులఁ గనునది.
ప్రసూతే ప్రసూః. ఊ. సీ. షూఙ్ ప్రాణి ప్రసవే. - కొడుకులను గనునది.
మాతి వర్తతే గర్భో త్ర మాతా. ఋ. సీ. మామానేవర్తనే చ-గర్భ మీమెయం దిమిడియుండును. ఈ నాలుగు తల్లి పేర్లు.

ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు 16 మొదలు ఏఁబది 50 సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము. స్త్రీలకు భాగ్యమే యౌవ్వనము. తరుణిమ - యౌవనము, రూ.తరుణ్యము.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.  
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు(హరిద్ర - పసుపు).

తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ. సీ. తౄప్లవనర్తరణయోః. - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః. యు మిశ్రనే. పురుషునితోఁ గూడునది. ఈ ఒకటి జవ్వని పేరు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.

ఉమ - 1.పార్వతి(శివసన్నిధిని దేవిస్థానం పార్వతి), వ్యు.తపము వలదని తల్లిచే అడ్డుపెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము. వరవర్ణిని - 1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.  

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు -
యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదువన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభత్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్ర యుతేనచ|
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే||
తా.
ఆరుమారులు భూప్రదక్షిణంబులు, పదివేలమారులు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున గలుగు ఫలము తమతల్లికి ప్రీతిపూర్వకముగా వందనమాచరించుట వలన గలుగును. – నీతిశాస్త్రము

ధన్య - దాది, విణ. ధన్యురాలు.
దాది -
1.ధాత్రి 2.పాలిచ్చి పెంచు తల్లి, రూ.దాదిలి, సం.దాత్రీ.
ధాత్రి - 1.భూమి 2.దాది 3.తల్లి, విణ.ధరించునది.
ధాత్రేయి - 1.దాది 2.భూమి.

అనంత - 1.భూమి, 2.పార్వతి, (వృక్ష.) 1.ఎద్దు నాలుక చెట్టు, 2.గరిక, 3.ఉసిరిక, 4.తిప్పతీగ, 5.జీలకఱ్ఱ, 6.పిప్పలి.

మండ1 - ఉసిరిక.
మండ2 - 1.శాఖ, చిన్నకొమ్మ, 2.చీలమండ.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.

సీల - చీల.
సీలమండ -
చీలమండ.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.సీలమండ. (Ankle bone).

తత్ద్రంథీ ఘుటికే గుల్ఫౌ -
ఘోటతే పరివర్తతే ఘుటికా. ఘుట పరివర్తనే. - చుట్టువాఱియుండునది.
అభిఘాతాద్గుల్యతే రక్ష్యత ఇతి గుల్ఫాః. గుడ రక్షయాం. - అభిఘాతము వలన రక్షింపఁబడునది. ఈ 2 రెండు పాదముల పార్శ్వముల యందలి బుడుపుల పేర్లు(చీలమండ).

గుత్తి - 1.పూగుత్తి, 2.చీలమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః. గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము. గుళుచ్ఛము - 1.గుత్తి, 2.పూగుత్తి.

మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.

అధ్వము - 1.దారి, 2.దూరము, 3.పయనము, 4.వేదశాఖ, 5.కాలము, 6.ఆకాశము, 7.పయనమునందు ఆగెడి స్థలము, 8.ఉపాయము.

ఘుటిక - 1.గుళిక, చిన్నమాత్ర, 2.చీలమండ.
గుళిక -
ఉండ, మాత్ర, (రసగుళిక).
ఉండ - గుళిక, విణ.గుండ్రము.
ఉంట - 1.ఉండ, 2.ఉండుట, విణ.గుండ్రనిది.
ఉండు - 1.వసించు, 2.మిగులు.
ఉండ్రము1 - గుండ్రనిది, రూ.ఉండ్రస.
ఉండ్రము2 - వేడినీళ్ళతో తడిపిన పిండిని గుండ్రని ఉండలు చేసి ఆవిరిపై ఉడికించిన భక్ష్యము, మోదకము, సం.ఉండేరకః.
మోదకము - కుడుము లడ్డు.

ఊఁతాళి - ఊపిరాడకుండ చేయు చీల.

మడమ - గుదికాలు, చీలమండ అడుగు భాగము.
పాదమూలాస్థి -
(జం.) మడమ ఎముకల కూటము (Tarsus).
పాదశలాకలు - (జం.) పాదముల కుండు ఎముకలు (Meta-tarsals).

పార్షి - 1.ఉన్మత్తురాలు, 2.మడమ, 3.దండు వెనుక.
ఉన్మత్తము -
1.వెఱ్ఱి యెత్తినది, 2.కై పెక్కినది, 3.గర్వించినది, 4.పిశాచాత్యావేశము కలది, వి.ఉమ్మెత్తచెట్టు.
ఉన్మాదము - 1.వెఱ్ఱి, పిచ్చి 2.(అలం.) సంచారీభావములలో ఒకటి.

నాశ్యత్య నాయకం కార్యం తదైవ శిశునాయకమ్|
స్తీ నాయకం తధోన్మత్త నాయకం బహునాయకమ్||
తా.
యజమానుఁడు లేనికార్యమును, బాలురు, స్త్రీలు, ఉన్మత్తులు, అనేకులు, ఈ ఐదుగురు విచారించగల కార్యములు చెడిపోవును. - నీతిశాస్త్రము

కూర్ఛాస్థులు - (జం.) మడమ యందుండు ఎముకలు (Tarsals).
ఉపాంగుష్ఠము - (జం.) కూర్ఛాస్థులకు ఒకప్రక్క నున్న వ్రేలు వంటి అదనపు ఎముక (Calcar).

ప్రగల్భుఁడు - ప్రౌఢుడు.
ప్రగుల్భాస్థి -
(జం.) మడమ ఎముకలలో నొకటి (Fibulare or calcaneum).

అనుగుల్పాస్థి - (జం.) మడమ ఎముకలలో ఒకటి జంఘాస్థిక (Tibiale or Astragalus).

అంఘ్రి - 1.కాలు, 2.వేరు, 3.పద్యపాదము.
కాలు -
1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపుకోడు, క్రి.మండు.
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4 వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములో అక్షద్వయముచే వేరు చేయబడిన నాలుగుభాగములలో ఒకటి (Quadrant).
వేరు - చెట్టు యొక్క మూలము.

విక్లబుఁడు - భయశోకాదులచే కాళ్ళు చేతులు విలవిలపోవువాడు.

పదము - 1.కాలు, 2.పద్యమందలి నాలవ చరణము, 3.చిహ్నము, 4.స్థానము, 5.శబ్దము, సం.వి. (గణి.) 1.ఒక సమాసములోగాని, సమీకరణములోగాని ఉండు నొక రాశి(Term) ax2+bx+c=0 ఇందుమూడు పదము లున్నవి, 2.ఒక లెక్కచేయుటలో కనబరచిన క్రమము (Step).

హజ్జ - పాదము, రూ.అజ్జ.
అ(ౙ)జ్జ -
1.పాదము, 2.సమయము, అవ్య.బళీ.
అడుగు - 1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమానము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.
అడువు - 1.ప్రశ్నించు, 2.కొట్టు, వి.అడుగు, పాదము.

అంగ - కాలు చాచి పెట్టిన అడుగు.

పాదా రశ్మ్యఙ్ఘ్రి తుర్యాంశాః -
పాదశబ్దము కిరణమునకును, కాలికి, నాలవపాలికిని పేరు. పద్యంతే అనేనేతి పాదః పద గతౌ. - దీనిచేత పొందుదురు. "పాదస్స్యాద్బుధ్న పూజ్యయో" రితిశేషః.

ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3మంచపుకోడు.
గొరిజ -
పశువు కాలిగిట్ట, సం.ఖురః.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.

పారీణుఁడు - పాదము ముట్టినవాడు, మిక్కిలి నేర్పరి.

పాదశలాకలు -(జం.)పాదముల కుండు ఎముకలు (Meta-tarsals). తిరుగుడుచీల - మరచీల.
తిరుగుడు -
1.తిరుగుట, 2.మారుపాటు, 3.మర.

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.

అంఘ్రిపము - చెట్టు, పాదపము.
పాదపము - చెట్టు.

విటపి - చెట్టు, వ్యు.విటపములు కలది.
విటపము -
1.చివురించిన కొమ్మ, 2.చిగురు, 3.కొమ్మ, 4.బోదెలేని చెట్టు.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ. 

చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము -
గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద(పొద - చిన్న చెట్ల గుంపు), 4.బోదెలేనిచెట్టు, 5.పురాభి ముఖ రాజమార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలి ఠాణా.

ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి. (జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen).

భూజము - వృక్షము.
భూజాని - 1.విష్ణువు, 2.రాజు.

కోటరము1 - చెట్టుతొఱ్ఱ.
కోటరము2 - కోడంట్రము, కోడలితనము.
కోడంట్రము - కోటరికము, రూ.కోడంట్రికము, కోడరికము.
కోటఱికము - కోడరికము. 

మించుఁగాలు - కుడి పాదము.
మించు -
1.విద్యుత్తు, 2.కిరణము, 3.ప్రకాశము, 4.కాలిమెట్టె, 5.అధిక్యము, క్రి.1.అతిశయించు, 2.దాటిపోవు.
విద్యుత్తు - మెరుపు.
మెఱఁగు - 1.మించు, మెరుపు, 2.అధికప్రభ.
శంప - మెరుపు, రూ.సంప.
శంపాలత - మెరుపు తీగ; ఘనవల్లి - మెరుపు తీగ.

ఒడలు స్వాధీనంగాని యిల్లాలు కాలిమట్టెలకు కందినదట.

మట్టియ1 - స్త్రీ కాలి రెండవ వ్రేలినగ, రూ.మట్టె, మెట్టె.
మట్టియ2 - మట్టి, సం.మృత్.

చపల - 1.లక్ష్మి, 2.మెరుపు, 3.రంకుటాలు(చడీప - రంకుటాలు).   

క్షణ ప్రభ - మెరుపు, వ్యు.అల్పకాలమే వెలుగునది.
అచితద్యుతి - మెరుపు.
శతమ్రాడ - 1.మెరుపు, 2.వజ్రాయుధము.
శతకోటి - వజ్రాయుధము.

హాద్రము - 1.వజ్రాయుధము, 2.ఏరు, 3.మెరుపు.
దంబోళి -
1.వజ్రాయుధము, 2.రాతివాలు, వ్యు.శత్రువులను దుఃఖపెట్టునది.

ధారుణిలోన వదాన్యుల,
కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే
కోరినఁ దన మేనెముకలు,
ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే.
భా||
దాతలకు దానం చేయరాని వస్తువంటూ ఏమీలేదు. మునుపు దేవతలు వచ్చి అడుగగా తన శరీరములో ఎముకలను కోరిన వెంటనే ఇచ్చిన దధీచిని గూర్చి మనం వినలేదా!

కుక్కురము 1.కుక్క, వ్యు.ఎముకలు మొ.ని తెచ్చుకొనునది, 2.మాచిపత్రి.
కుక్క -
శునకము, సం.కుర్కురః.

విశ్యలకరణి - విరిగిన ఎముకలను నతుకు ఓషధి, (దీనితో చేరినవి సంధానకరణి, సౌవర్ణకరణి, సంజీవకరణి).
సంధానకరిణి - చెడిన అవయములను కూర్చు ఓషధి.
సౌవర్ణకరిణి -
ఒక ఓషధి, (ఇది తాకినది బంగార మగునందురు).
సంజీవకరిణి -
 జీవము నిచ్చు ఓషధి.

3. నరము - నాడి.
నాడి -
దేశము, రూ.నాడు, సం.వి.గడియకాలము, రూ.నాడి.
నాడిక - దేశము, రూ.నాడు, సం.వి.గడియకాలము, రూ.నాడి.
నాఁడు - ఆకాలము, ఆదినము, కాలము.
నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.

కుహూర్విశ్వోదరీ, వారాణా, హస్తి, జిహ్వాయసోవతీ, గాంధారీ, పూషా, శంఖినీ, పయస్వినీ, సరస్వతీ, ఇడా, పింగళా, సుషుప్నా, చేతి చతుర్దశనాడ్యః| సర్వసంక్షోభిణ్యాది చతుర్దశ శక్తయః||

దేహములో ఆకుపచ్చని - నల్లని - పసుపుపచ్చని - ఎర్రని - తెల్లనినాడులు ఉన్నాయి. అవి అన్నీ - రుధిరస్య పూర్ణాః - రక్తముతో పరిపూర్ణములై ఉన్నాయి.

వారణము - 1.నిరోధము, 2.ఏనుగు.
నిరోధము -
1.అడ్దు, 2.చేటు, సం. (భౌతి.) ఒక వస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).
అడ్డు - క్రి. అడ్డగించు, నిరోధించు, విణ.నొరోధకము, నిరోధకుడు.
అడ్డంకి - అడ్డి, అడ్డు, నిరోధము.
అడ్డి - అడ్డంకి, నిరోధము.
నిరోధించు - క్రి.అడ్డగించు. నివారణము - అడ్డగింత. 
నివారణీయము - అడ్డగింపదగినది, రూ.నివార్యము.
అడ్డకఱ్ఱ - 1.అడ్డి, విఘ్నము, 2.ఒక రకపు సుఖరోగము.
అడ్డగాలు - అడ్డకఱ్ఱ; అడ్డగఱ్ఱ - 1.అడ్డి, అడ్డంకి, విఘ్నము, 2.కొయ్యగడియ, గడియమ్రాను, విణ.విఘాతము, విఘ్నకరము.
విఘాతము - 1.అడ్డంకి, 2.చెరువు, 3.పెద్దదెబ్బ.
విఘ్నము - అంతరాయము, అడ్డు. 
అంతరాయము - అడ్డు, విఘ్నము, ఆటంకము.
ఆటంకము - అడ్డంకి, నిరోధము.
విఘ్నరాజు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విన.శౌర్యముచే గర్వించినవాడు.   

మతంగజము - ఏనుగు.
ఏనుఁగు -
ఏనిక, విణ.పెద్దది, రూ.ఏన్గు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
దంతి - ఏనుగు, విణ. కోరపండ్లవాడు.
ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగాగలది.
ఏనుఁగు గొంగ - సింహము, వ్యు.ఎన్గులకు శత్రువు.
ఏనుఁగురాకాసి గొంగ(గొంగ - శత్రువు) - గజాసుర వైరి, శివుడు.  

ఏనుఁగు మోముసామి - గజాననుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజాననుడు - గజవదనుఁడు - వినాయకుడు.

ఏనుఁగుకాలు - కాలు లావగు వ్యాధి, బోదకాలు (Elephantiasis). బోదకాలు - వ్యాధిచే వచ్చు ఏనుగు కాలు వంటి కాలు.
పుట్టకాలు - బోదకాలు.

ఏనుఁగుగజ్జి - మూగగజ్జి (Eczema).
మూగతీట -
ఓడలిపై దట్టముగ పేలిన తీట.

వారణానన మయూరవాహముఖ దాహవారణ పయోధరాం,
చారణాది సురసుందరీ చికుర శేఖరీ కృత పదాంబుజాం|
కారణాధిపతి పంచక ప్రకృతి కారణ ప్రథమ మాతృకాం,
వారణాస్య ముఖసారణాం మనసి భావయామి పరదేవతాం. - 6శ్లో

గజము -1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగములలో ఒకటి.
గౙ -
పెద్ద, సం.గజః.
గజయాన - ఏనుగు నడకవంటి నడకగల స్త్రీ, స్త్రీ.
గజవదనుడు - వినాయకుడు. 

లావు గలవాని కంటెను,
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును,  
మావటివాఁ డెక్కినట్లుమహిలో సుమతీ.

తా. శరీరబలము గలవానికంటెను బుద్ధిబలముగల మానవుడు శక్తిమంతుడు. ఎట్లనగా గొప్ప బలముగల ఏనుగును మావటివాడు స్వాధీనపరచుకొనుట యిందుకు నిదర్శనం.

పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు గలది.
హస్తి -
ఏనుఁగు వ్యు.హస్తము కలది.
చేగల మెకము - ఏనుగు, హస్తి.
కరటి - ఏనుగు, హస్తి.  మాతంగము - ఏనుగు. 
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర. 
హస్తిసఖుఁడు - మావటీడు.
మావటి - శూరుడు, మల్లుడు, రూ.మావటీడు, మాస్టీడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లుఁడు - జెట్టి; జెట్టి - 1.మల్లుడు, 2.శూరుడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లు - 1.కోతి, 2.మల్లుడు, జెట్టి, సం.మల్లః.  

హస్తిని - 1.ఆడేనుగు, 2.ఒక స్త్రీజాతి, (శంఖినీ, పద్మినీ, చిత్రిణీ జాతు లితరములు).
గణిక -
1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ. 
చిత్రిణి - చిత్తిని, ఒకజాతి స్త్రీ.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.

పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది. 
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.  

భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి -
1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తుఁడు - భక్తి గలవాడు.

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.   

పోసనము - 1.క్షీరము, 2.పైపూత, 3.కాంతి.
క్షీరదము -
(జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు. 

క్షీరాన్నము - పరమాన్నము.
పారలౌకికము -
పాయసము, పరమాన్నము, విణ.పరలోక సంబంధమైనది.
పాయసము - పరమాన్నము, వ్యు.పయస్సుతో వండినది; పాసెము, సం.వి. (రసా.) (Emulsion) ఒక ద్రవమును ఇంకొక దానితో కొల్లోయిడ్ స్థితిని పొందునట్లు చేయబడిన అవలంబితము (Suspension). 

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పా ల క డ లి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు.
అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్ 
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా. 
తా.
పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలను త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, పిల్లి అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)గలవాడు, తగవు యొక్క న్యాయ న్యాయములను విమర్శించి నిర్ణయించును, తెలివి లేనివా డట్లుచేయలేదు.   

పాయసాన్నప్రియా తక్ స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమాహాశక్తి - సంవృతా డాకినీశ్వరీ. - 99శ్లో

సుషుమ్న - ఒక నాడి.
సుషుప్తి -
ఒడలెరుగని నిద్ర.

నాడీసంబంధము - (జం.) నాడికిగాని, నాడీమండలమునకు గాని సంబంధించినది (neural).   
నాడీ మండలము - (జం.) కేంద్రనాడీ మండలము, పరిణాహ నాడీ మండలము. ఆ మండలములలో నున్న నాడులు మొ|| (Nervous system).

కేంద్రనాడీ మండలము - (జం.) మెదడు, వెన్నుపాము వీనికి సంబంధించిన నాడుల గుంపు (Central nervous system). పరిణాహ నాడీ మండలము - (జం.) కేంద్రనాడీ మండలమును శరీరము యొక్క వివిధ భాగములతో కలుపు నాడీకూటము. ఈ మండలములో ప్రమస్తిష్క నాడులు, మైరువనాడులు, సహవేదననాడులు అను మూడు తరగతుల నాడు లుండును (Peripheral nervous system).

మస్తిష్కము - తల మెదడు, (జం.) మెదడు (Brain) (పుఱ్ఱెలోనున్న ఖాళి స్థలములో ఇది అమరియుండును.) వెన్నుపాము దీనితో కలసి యున్న వెనుక భాగము.

మస్తిష్కం గోర్దమ్ -
మస్తం శిరోదేశ మిష్యతి మస్తిష్కం. ఇష గతౌ. - శిరస్సును బొంది యుండునది.
గూర్యతే గురతేవా గోర్దం. గురీ ఉద్యమనే. - యత్నించునది. ఈ రెండు మెదడు పేర్లు.

మెదడు - తలయందుండు క్రొవ్వు (గృహ.) నాడీ కణ సముదాయము, సం.మేదస్ (Brain).
మేధస్సు - మెదడు.
మేదోమయ కణజాలము - (గృహ.) క్రొవ్వు కణజాలము (Fatty tissue).
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.
మేధావి - విణ. ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.  లాజము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.

నాడీముడి - (జం.) కొన్ని నాడీకణములు జత ముడిగా ఏర్పడినది (Ganglin).

నాడీకణము - (జం.) ప్రేరణలను శరీరములోనికి తీసికొనుపోవు జీవకణ సంహతులలో నున్న జీవకణము  (neuron or nerve cell). (దీనిలో కణశరీరము (Cell body), లాంగూలము(Axon)(లాంగూలము - తోక.),  నాడీ రోమము (Dendron or dendrite) అను మూడుభాగము లుండును).   
నాడీ జీవకణము - (జం.) నాడీకణ శరీరము, దాని కోశరసప్రవర్థకములతో కూడియున్న జీవకణము (Neuron).
నాడీకణజాలము - (జం.) నాడీ కణములు, నరములు (Nerve fibres) కలిసి ఏర్పడిన కణజాలము (Nervous tissue).
నాడీతంత్వావరణము - (జం.) నరముపై ఆవరణగా నుండుపొర (Neurole mma).

మస్తిష్క కుహరములు - (జం.) మెదడు యొక్క వివిధ భాగములలో నుండు గుహలు (Ventricles of the brain).

అగ్రమస్తిష్కము - (జం.) మెదడులో మొదటిభాగము (Procence phalon or forebrain).

మధ్యమస్తిష్కము - (జం.) మెదడులో దృక్పాళులకు (Optic lobes) ముందు నున్న మెదడు యొక్క మధ్య భాగము (దీనిలో మెదడు యొక్క మూడవ కుహరముండును (Diencephalon or thala-mencephalon).   

ఐటర్ - (జం.) (Iter) మస్తిష్కము లోని మూడవ కుహరమును నాలుగవ కుహరముతో కలుపు సన్నని మార్గము. 

చాలక తంతువులు - (జీవ.) మెదడు నుండి అంగములకు వార్తలనందౙయు నరములు అనగా అవి అంగముల చలనమును కలుగచేయును, (Motor nerves).

అక్సన్ - (జం.) (Auxin) 1.నరముల కణములకు గల వెండ్రుకలవంటి పోగులు, 2.అవయవ భాగముల నుండి వార్తలను మెదడునకు అందజేయు వెండ్రుకల వంటి నరముల కొనలు.

పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడిపోవును).   

ధమని - 1.అవయములకు గుండె నుండి నెత్తురు తీసికొనిపోవు నరము, 2.మెడ, 3.అగసాలెవాని ఊదుగొట్టము, సం.వి. (జం.) మంచి రక్తమును తీసికొని పోవు రక్తనాళము, (Artery).

సిరమము - శిర, తల, సం.శిరః.
శిర - 1.నరము(నరము - నాడి), ఈనె.
ఈన - ఆకులలోని నరము, చీపురుపుల్ల, ర్రొ.ఈనియ, ఈనె.
సిర - 1.నాడి, 2.ఈనె (జం.) శరీరమునుండి గుండెకు రక్తము తీసికొనిపోవు రక్తనాళము. (Vein)
ఉత్తమాంగము - తల. 

గళధమని - (జం.) తలలో నుండు వివిధ భాగములకు మంచిరక్తమును పంపు రక్తనాళము (Carotid artery).

పాలగొట్టములు - (గృహ.) సూక్ష్మ రక్తనాళములు. ఇవి శృంగముల మధ్యలో నుండును (క్రొవ్వు ఆహారము జీర్ణమైన తరువాత వీనిచే రక్తములోనికి తీసుకొన బడును) (Lacteals).

శిరాలుఁడు - లావు నరములు గలవాడు.

నాడి - 1.నరము, 2.గడియకాలము, 3.ఈనె, 4.కాడ.
నాడీక -
దేశము, రూ.నాడు, సం.వి. గడియకాలము, రూ.నాడి.
దేశ్యము - దేశమునకు తగినది, వి.భాషలోతత్సమాది విభాగములలో నొకటి.
గడియ - 24 నిమిషముల కాలము, సం.ఘటికా, వి.తలుపునకు అడ్డుగ వైచు కఱ్ఱ, రూ.గడెయ. ఘటిక - 1. 24నిమిషముల కాలము, గడియ, 2.చిన్నకుండ, 3.ముహూర్తము, 4.ఒకానొక విద్యాసంస్థ.
ఈన - ఆకులలోని నరము, చీపురు పుల్ల, రూ.ఈనియ, ఈనె.
ఈనియ -
ఈన.
ఈనెలు - (వృక్ష.) 1.పత్రఫలముపై అగపడు మధ్య ఈనె. దాని శాఖోపశాఖలు (Veins).

పార్శ్వసిర - (వృక్ష.) పత్రఫలకము పైనున్న మధ్య ఈననుండి ప్రక్కలకు బయలుదేరు ఈనె (Lateral vein).

మధ్యశిర - (వృక్ష.) పత్రఫలకములో మధ్యగా దట్టముగా, స్పష్టముగా నుండు ఈనె, మధ్య ఈనె (Mid-rib).

అధోజిహ్వనాడి - (జం.) వెనుపాము నుండి బయలుదేరు నాడులలో మొదటిది (ఇది నాలుక యొక్క కండరములకును, నోటి అడుగు భాగమునకును పోవును) (Hypoglossal).  
అధరమహాసిర -
సిరాకోటరము లోనికి దాని క్రింది వైపునుండి ప్రవేశించు పెద్దసిర (Post caval vein or posterior vena cava).

అధోబృహత్సిర - (జం.) క్రిందిభాగముల నుండి మలిన రక్తమును కుడి కర్ణికకు తీసికొని పోవు సిర (Inferior Venecava).
ఊర్ధ్వబృహత్సిర - (జం.) గుండెకు పైనున్న(మీది) భాగమునుండి మలిన రక్తమును కుడికర్ణికకు తెచ్చుసిర (Superior venacava).

తంత్రి - 1.కంతి, 2.నరము, 3.త్రాడు.
కంతి -
1.దెబ్బవలనివాపు, 2.బొప్పి(బొప్పి - బుడిపు), 3.దద్దు, 4.చేరకు మొ.ని కనుపు, రూ.కడతి, కణితి, సం.గ్రంథిః.
బుడిపి - 1.మ్రాని యందలి ముడు, కనుపు, 2.బొప్పి.
దద్దు - దద్రువు(దద్రువు - దద్దు), చిన్నవాపు, రూ.దద్దురు, సం.దద్రుః.
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.

కనుపుల విలుకాఁడు - చెరకు విలుకాడు, మన్మథుడు.

పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
గ్రంథి - 1.బుడిపు, గడ్దవలె పుట్టు రోగము, 2.చెట్టు మొ.ని ముడు, 2.కీలు, (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
గ్రంథికుఁడు - 1.జోస్యుడు, 2.సహదేవుడు.
జ్యోతిషికుఁడు - జోస్యుడు, (Astrologer).

అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వతః|
నిత్యంసన్నిహితో మృత్యుః కర్తవ్యోధర్మసంగ్రహః||
తా.
శరీర మనిత్యము, సంపద శాశ్వతము కాదు, మృత్యువెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగినదని సహదేవుడు వచించెను. – నీతిశాస్త్రము

గ్రంథులసిరలు - (జం.) హెచ్చు తగ్గులుగా ఉబ్బిన సిరలు (ఎక్కువ కాలము నిలిచి పనిచేసినచో సిరలు పైకుబికి ఉండును (Vericose veins). 

పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడిపోవును).  

రుద్రవాతము - (వైద్య, గృహ.) మెదడులో రక్తనాళములు పగిలి రక్తస్రావము వలన కలుగు వ్యాధి (Apoplexy).

రక్తస్రావము - (జీవ.) రక్తము వెలుపడుట, (Hemorrhage) (ఇది శరీరములో జరిగిన చాల అపాయకరము.)
అంతస్స్రావము - (జం.) వాహిక ద్వారాకాక, తిన్నగా రక్తములోనికి గాని శోషరసము లోనికిగాని ప్రవేశించు స్రావము (Internal secretion). 

నరము - నాడి.
త్రాడు -
1.పేనినదారము, 2.పాశము(పాశము - త్రాడు), 3.కిరణము, వెలుగు.
త్రాడుఁదాలుపు - వరుణుడు; పాశి - 1.వరుణుడు, 2.యముడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.

నారికురుపు - నాడీవ్రణము.
నాడీవ్రణము -
నారికురుపు; సెలపుండు - నారికురుపు.
నారపురుగు - (జం.) నీళ్ళ నుండి మనుష్యుల శరీరములో ప్రవేశించి నారకురుపుకు కారణమైన పురుగు (Guinea-worm).

నాడీయుక్తో వ్రణో నాడీవ్రణః. - రంధ్రముగల వ్రణము. ఈ ఒకటి నెల వేసిన పుంటి పేరు.

సెరిబ్రమ్ - (Cerebrum) పెద్దమెదడు, మెదడుపై భాగము.
సెరిబిలమ్ - (Cerebellum) చిన్న మెదడు, మెదడులోని క్రింది భాగము.

బృహస్మస్తిష్కము - (జం.) పెద్ద మెదడు (Cerebrum).
ప్రమ స్తిష్కము -
(జం.) మెదడులో మధ్యనున్న ఒక ముఖ్య భాగము (Cerebrum).
ప్రమస్తిష్క నాడులు - (జం.) మెదడు నుండి బయలుదేరి వివిధభాగములకు పోవు నాడులు (Cerebral nerves).
ప్రమస్తిష్క నాడిముడులు - (జం.) మెదడువలె దాని స్థానమున పనిచేయు నాడులలో ఏర్పడిన ముడివంటి నిర్మాణములు (Cerebral ganglia).
ప్రమస్తిష్క గోళార్థకములు - (జం.) ప్రమస్తిష్కము యొక్క మృదువైన అండాకారము గల రెండు గోళ భాగములు (Cerebral hemispheres).

అనుమస్తిష్కము - (జం.) మెదడు తోకకు ముందు భాగమున అడ్దముగా పట్టి వలెనుండు నాడీకణజాలము.

నివాపము - పితరుల నుద్దేశించిన తిల తర్పణాది కర్మము, సం.వి. (జం.) మస్తిషములో దృక్ స్వాస్తికము వెనుక మధ్య మస్తిష్కము యొక్క అడుగు భాగము రెండు తమ్మెలు సొట్టపడి యుండు భాగము (Infundibulum).
నివాపరూపము - (జం.) గరాటు వలె నుండునది (Infundibuli form).

ఫోరమెన్ మాగ్నమ్- (గృహ.) (Foramen magnum), మెదడు పెట్టెనుండి వెన్నెముక గొట్టములోనికిగల మార్గము. తలకు వెనుక క్రిందిభాగమున గల ఆక్సివిటల్ ఎముకలో 1 1/3 అంకల వెడల్పుగల రంద్రము. దీని ద్వారా మెదడునుండి వెన్నుపూస నరములు పారును.  

అపవాహినాడులు - (జం.) ప్రేరేపణను కేంద్రనాడీమండలము నుండి కండరములకు తీసికొనిపోవు నాడులు (Efferent nerves). సహవేదననాడులు - (జం.) పరిణాహ నాడీ మండలమునకు చెందిన ఒక తరగతి నాడులు. (Sympathetic nerves).

అధోజిహ్వనాడి - (జం.) వెనుపామునుండి బయలుదేరు నాడులలో మొదటిది (ఇది నాలుక యొక్క కండలములను, నోటి అడుగు భాగమునకును పోవును (Hypoglossal).

త్రిశాఖనాడి - (జం.) ప్రమ స్తిష్క నాడులలో ఐదవనాడి, (Trigeminal nerve). (ఇది మూడు శాఖలుగల మిశ్రమనాడి).

ప్రమస్తిష్క వృంతయోజము - (జం.) మజ్జికము (Medulla) నుండి ప్రమస్తిష్క గోళార్ధముల వరకు దృక్పాకుల (Optic lobes) క్రిందనుండి వ్యాపించు తెల్లని స్థంభాకార నాడీ పదార్థములు (Crura-cerebri).
మధ్య మస్తిష్కము - (జం.) మెదడులో దృక్పాళులకు (Optic lobes) ముందు నున్న మెదడు యొక్క మధ్య భాగము (దీనిలో మెదడు యొక్క మూడవ కుహరముండును (Diencephalon or thala-mencephalon).

తృతీయనేత్ర గ్రంధి - (జం.) మస్తిష్కములో పూర్వ ఝుల్లరీ ప్రతానము నకు వెనుక నుండు గ్రంధివంటి నిర్మాణము (Pineal stalk).

దృక్పిండములు - (జం.) మధ్య మస్తిష్కము యొక్క పార్శ్వములందు దట్టముగా నేర్పడిన భాగములు (Optic thalami).

ఐటర్ - (జం.) (Iter) మస్తిష్కము లోని మూడవ కుహరమును నాలుగవ కుహరముతో కలుపు సన్నని మార్గము.  

కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (Cranial nerves).

ఆకృషినాడి - (జం.) కపాలము నుండి బయలుదేరి కనుగ్రుడ్డు యొక్క కందరమునకు బోవునాడి (Pathetic nerve).
ఆకృషి - (జం.) భుజాస్థి యొక్క క్రిందికొన, (ఇది స్పంజి ఎముకలతో ఏర్పడినది) (Trochlea).

దృష్టి నాడి - (జీవ.) దృష్టి జ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve).
దృష్టి  -
1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.

సంవేదక నాడులు - (జం.) జ్ఞానేంద్రియముల (చర్మము, నాలుక, కన్ను, ముక్కు, చెవి) నుండి కేంద్ర నాడీమండలమునకు ప్రేరేపణలు పంపు నాడులు, జ్ఞాననాడులు, (Sensory nerves). 

జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీఘ్రగ్రాహిత మైన అవయవము (Sense organ).
జ్ఞానతంతువులు - (గృహ.) ఈనరముల తంతువులు జ్ఞానేద్రియముల నుండి మెదడునకు వార్తలను గొంపోవును, (ఇవి చైతన్యము కలుగ చేయును), (Sense nerves).

శ్రోతం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రూణమేవ చ |
అధిష్ఠాయ మనస్చాయం విషయానుప సేవతే || -9శ్లో భగవద్గీత
జీవుడు చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియ పంచకమును, మనస్సును ఆశ్రయించి వాటిద్వారా విషయసుఖముల ననుభవించును. - పురుషోత్తమప్రాప్తి యోగః  

కృకాటిక - 1.పెడతల, 2.పెడతల యందలి ముచ్చిలిగుంట.
పెడ -
1.పెద్ద, 2.వెనుకటిది, 3.విపరీతము, సం.వృద్ధః.
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు(అధికుఁడు - గొప్పవాడు), 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.వృద్ధః, పృథుః.
పెరుఁగు - వృద్ధిచెందు, ఎదుగు, వి.దధి, విణ.వృద్ధుడు.
పెద్దతల - పెద్దగా నుండి కార్యము నడపించువాడు.

సీమ1 - 1.దేశము, 2.ప్రదేశము, 3.రాజ్యము, 4.పరదేశము.
సీమ2 - 1.ఎల్ల, 2.పెడతల.

మైరవము - (జం.) వెన్నెముకకు గాని, వెన్నుపామునకు గాని, సంబంధించినది, మేరువు = వెన్ను పాము, (Spinal).
వెన్నుబాము -
(గృహ.) వెన్నుపూసలో పారు ముఖ్యమైన నరము (Spinal-cord).
మజ్జారజ్జువు - (జం.) వెన్నుపాము, సుషుమ్న నాడి మెదడు నుండి వెన్నెముక గుండా దాని చివరవరకు గల నాడుల త్రాడు (Spinal-cord). 

శ్వేతద్రవ్యము - (జం.) వెన్నుపాములో బయటి భాగమునుండు నాడీకణజాలము (White matter).

ధూసురద్రవ్యము - (జం.) వెన్నుపాము లోపలి భాగమున నుండు నాడీ కణజాలము (Greymatter). 

అధోజిహ్వనాడి - (జం.) వెనుపాము నుండి బయలుదేరు నాడులలో మొదటిది (ఇది నాలుక యొక్క కండరములకును, నోటి అడుగు భాగమునకును పోవును) (Hypoglossal).

బహునాడి దాహము - (గృహ.) ఒక వ్యాధి, దీనిచే శరీరమంతటిలోను నాడులు బాధ కలిగించును (Polyneuritis).

హిస్టీరియా - (గృహ.) (Hysteria) సూతికా(సూతిక - బాలెంతరాలు.) వాయువు మనో వికారముచే అన్ని విధములైన నాడులు, అక్రమముగా పనిచేయుటచే కలుగు వికారపు చేష్టలు, (ఇవి సాధారణముగా బలహీనము చేతను ఆశాభంగము చేతను యువతులకు వచ్చు వ్యాధి.)
కాకిసోమాల - (గృహ.) మూర్ఛ, సంధి, ఆపరాని ఉద్రేకముతో పట్టినట్లు కనబడు ఒకవ్యాధి (Hysteria).
కాకితీపు - ఒక రకపు మూర్ఛ వ్యాధి, ఈడ్చుకొని పడు మూర్ఛ రోగము.
మూర్ఛ - రోగాదులచేత స్మృతి తప్పుట, సొమ్మ.
సొమ్మ - మూర్ఛ, సం.శ్రమః.
సొమ్మగొను - మూర్ఛుల్లు, రూ.సొమ్ము, వోవు, సొమ్మసిల్లు.
మూర్ఛాలుఁడు - మూర్ఛరోగి.

4. వెండ్రుక - కేశము, రూ.వెంట్రుక.
కేశము -
1.తలవెండ్రుక, 2.కురువేరు.
శిరోజము - తలవెండ్రుక.
శిరోరుహము - తలవెండ్రుక.

కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు -
చంద్రుడు Moon. 

ఉదీచ్యము - 1.ఉత్తర దిక్కున ఉన్నది, 2.ఉత్తర కాలమున ఉన్నది, వి.1.శరావతీ నదికి వాయవ్యమున ఉన్న దేశము, 2.కురువేరు.
ఉదక్ ఉత్తరస్యాం భవం ఉదీచీనం - ఉత్తరదిక్కునఁ బుట్టినది.
హ్రీబేరము - కురువేరు. హ్రీ - సిగ్గు.

అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.

అంకురము - 1.మొలక, బీజము, 2.నీళ్ళు, 3.నెత్తురు, 4.వెండ్రుక, రూ.అంకూరము, (జీవ.) పిండము, భ్రూణము (Embryo).
అంకూరము - అంకురము.

చికురము - 1.వెండ్రుక, 2.కొండ, 3.ఒకజాతి పక్షి, 4.పాము, 5.ముంగిస, విణ.కదలునది.

కుంతలము - 1.వెండ్రుక, 2.ఒక దేశము, 3.నాగలి.

నాఁగలి - దున్ను సాధనము, లాంగులము, రూ.నాఁగెలు, నాఁగేలు, స.లాంగలః.
లాంగలము -
నాగలి.
నాగఁటిజోదు - బలరాముడు, హలాయుధుడు.
హలాయుధుఁడు - బలరాముడు.
హలి - 1.నాగలి, 2.బలరాముడు, 3.పొలముదున్నువాడు.
హలము - నాగలి, రూ.హాలము.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.

నాగటి(ౘ)చాలు పేరి యతివ - సీత.

(ౘ)చాలు - క్రి.కావలసినంతయగు, ఓపు, వి.1.వరుస, 2.దున్ను నప్పుడు కఱ్ఱుచే నేర్పడురేఖ, ధార, 3.(వ్యవ.) నాగటికఱ్ఱు నేలలోనికి పోయి కొంతమట్టిని లేవదీసి యిరుప్రక్కలకు నొత్తగించగా నేర్పడిన రేఖ, (Furrow of the plough).
ఓపు - బలిమి, క్రి.1.చాలు, 2.సహించు.
(ౘ) చాలుపు - వరుస.
నక్కు - క్రి.ఒదుగు, వి.1.మ్రానియతుకు, 2.బంగారపు బిల్ల, 3.బంగారు నరుకగా నడుమ కనుపట్టెడు నిగ్గు, 4.నాగటికఱ్ఱు.
ఒదుగు - క్రి.సమృద్ధమగు, అధికమగు, వి.సమృద్ధము, రూ.ఒదుగు.
ఒదువు - క్రి.క్రమ్ము, వి.సమృద్ధి, విణ.సమృద్ధము, రూ.ఒదుగు.
ఒదుగుబడి - సమృద్ధి.
ఒదుఁగు - క్రి.1.తొలగు, 2.దాగు, 3.ఒదికిలు.  

కచము - జుట్టు, కేశము.
కంచబంధము - జుట్టుముడి.

కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
కురుళము - ముంగురులు.

కుంజరము - 1.ఏనుగు, వ్యు.కుంజము కలది, 2.వెండ్రుక.
కుంజము -
1.పొదరిల్లు, 2.ఏనుగు కొమ్ము.
కుడుంగము - పొదరిల్లు; నికుంజము - పొదరిల్లు.

కుంజరుఁడు - 1.సూర్యుడు, 2.బ్రహ్మ.

నికురుంజము - సమూహము.

ధునోతు ధ్వాంతం న - స్తులిత దళితేన్దీవరవనం   
ఘనస్నిగ్దం శ్లక్షణం - చికుర నికురుంబము తవ శివే
యదీయం సౌరభ్యం - సహజ ముపలబ్థం సుమససో
వసంత్యస్మిన్మన్యే - వలమథన వాటీ విటపినామ్. - 43శ్లో
తా.
ఓ మంగళ దేవతా! అప్పుడే వికసిస్తున్న నల్లకలువలకు సాటియైన వియు, దట్టమై నున్ననై మృదువైనవగు నీ కురుల సమూహము మా అజ్ఞానము తొలగించుగాక! మహేంద్రుడి నందనవనము(ఉద్యానవనము)కల్పవృక్షాల పూవులు సహజమగు నీ కురుల సువాసనను పొందుటకు నీ కుంతలముల వసించు చున్నవని తలచు చున్నాను. (ఆ చెట్ల పూవులు నీకురులకు సౌరభ్యాన్ని ఆపాదించటానికి బదులుగా అవే నీకురులనుండి సౌరభ్యాన్ని గ్రహిస్తున్నా యని భావము) - సౌందర్యలహరి    

కాకపక్షము - పిల్లజుట్టు, కూకటి.
కూఁకటి -
పిల్లజుట్టు, జుట్టు, విణ.1.ప్రధానము, 2.లేతది, సం.కూటకః. 
కుంకటి - పిల్లజుట్టు, విణ.ప్రధానము, ఉదా. కుంకటివేరు = తల్లివేరు, రూ.కూకటి.
చూలిక - పిల్లజుట్టు. తల్లివేరు - మొదటి వేరు. 

(ౙ)జుట్టు - సిగ, సం.చూడా.
చూడ -
1.నెమలిజుట్టు, 2.జుట్టు, 3.చూరు, 4.బాహుపురి.
(ౙ)జుట్టుపిట్ట - నెమలి శిఖ.

సిగ - సిక, సం.శిఖా.
సిక -
శిఖ, జుట్టు, రూ.సిగ.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడి కలవాడు.

కబరి - కొప్పు.
కేశబంధము -
1.కొప్పు, 2.ముడి.
కొప్పు - 1.దోపిన వెండ్రుకల ముడి, 2.వింటికొన, 3.కోపు, 4.ఇంటి నడికొప్పు.
కోపు - 1.కడ్డీ, 2.అందము, 3.వింటికొప్పు, 4.నాట్యము, 5.తీర్పు, 6.కల్లు, 7.నిమిత్తము.

ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతు ముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.  
ముడికాఁడు - ధూర్తుడు, వంచకుడు.
ముడిగిబ్బ - ఆబోతు.
గిబ్బ -
1.ఆచ్చుటెద్దు, 2.బుడ్డకొట్టని కోడె, 3.ఎద్దు, 4.సమాసోత్తర పరమైనపుడు శ్రేష్ఠ వాచకము, ఉదా. జక్కవ గిబ్బలు మొ.వి.
గిబ్బరౌతు - శివుడు, వృషభ వాహనుడు.

కేశవీథి - పాపట.
సీమంతము -
1.పాపట, 2.గర్భిణి స్త్రీలకు చేయు ఒక శుభకర్మము.
సీమంతిని - స్త్రీ. చేరుచుక్క - పాపట బొట్టు, చేర్చుక్క.
సీమాటి - భాగ్యశాలిని యగు ఆడుది, సం.శ్రీమతీ.  

తనోతు క్షేమ న - స్తవ వదనసౌందర్యలహరీ
పరీవాహస్రోత - స్సరణిరివ సీమన్తసరణిః |
వహన్తీ సిన్దూరం - ప్రబల కవరీభార తిమిర  
ద్విషాం బృన్దై ర్బన్దీ - కృత మివ నవీనార్క కిరణమ్|| -44శ్లో
తా.
తల్లీ! భగవతీ! నీటి జాలువలెనున్న పాపట బడాటయు(పాపటిదారిని అలకరించిన నీ సింధూరపు బొట్టు), దట్టమగు జుట్టు ముడి యొక్క నల్లదన మనెడి శత్రుసమూహము(బలమైన కేశపాసాల)చే బంధింపబడి బాల సూర్యకిరణము వలె నున్న సింధూర తిలకముగలదియు అగు నీ ముఖసౌందర్య ప్రవాహము మాకు యోగక్షేమాలను కలుగచేయుగాక! పాపటయందు సిందూరపురేఖ ధరించుట పుణ్యస్త్రీల(సువాసినీ స్త్రీల) ఆచారము. ఇది మంగళ చిహ్నము. – సౌందర్యలహరి 

కకుప్పు - 1.దిక్కు, 2.సంపెంగ దండ, 3.కాంతి, 4.అల్లిక, 5.జడ.             

ౙడ - 1.వెండ్రుకల యల్లిక, 2.జూలు, సం.1.జటా, 2.సటా.
ౙడముడి -
1.కపర్దము, ఈశ్వరుని జటాజూటము, 2.జడలుగంటు.
జూటము - 1.శివుని జడముడి, 2.జడముడి.
కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
ౙడముడిజంగము - శివుడు, కపర్ధి.
కపర్ధి - శివుడు.

సట - కపటము, మోసము, సం.వి.1.సన్న్యాసుల జడ, 2.జూలు.
ౙడదారి - జడలు ధరించిన సన్యాసి, సం.జటాధారీ.
 

ౙడలమెకము - సింహము, చమరము.
సింహము -
1.కేసరి, సింగము, 2.ఒక రాశి, 3.శ్రేష్ఠము (సమాసోత్తర పదమైనచో).
కేసరి - 1.సింహము, 2.గుఱ్ఱము, వ్యు.కేసరములు గలది, 3.ఒక విధమగు వరి పైరు, విణ.శ్రేష్ఠుడు.
కేశి - 1.ఒకానొక రాక్షసుడు, 2.సింహము, విణ.మంచి తలవెండ్రుకలు కలవాడు.
కేశిసూదనుఁడు - శ్రీకృష్ణుడు, వ్యు.కేశి యను రాక్షసుని చంపినవాడు.
కేశవుఁడు - విష్ణువు.

విడిముడి - ధనము, (విడియు + ముడి).
ధనము -
1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింప బడినది, 2.తెలియబడినది.
విడియు - 1.బాటసారులు దారిలో నొకచోట దిగు, 2.జారు సడలు.
విడి - 1.ప్రతాపము, పరాక్రమము, 2.కోపము, విన.ఒంటరి.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము, 2.వికసింపనిది.

కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్తనాళములు (ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries).

పలితము - 1.నరపు, 2.నరవెండ్రుక, 3.బురద.

చమురు గ్రంథులు - (జీవ.) చమురును అందచేసి శరీరము మీద రోమములు పెరుగుటకు సహాయపడు గ్రంథులు (Sebacous glands).

అశోషకతైలములు - (వ్యవ.) గాలి పారినను చాలకాలము జిడ్డుగా నుండు నూనెలు. ఉదా. నూవులనూనె, వేరు సెనగనూనె మొ.వి (Non drying oils).
కుసుమ - 1.ఒకరకపు ధాన్యము (వడ్లలో పెద్ద కుసుమ, చిన్న కుసుమ, గుత్తికుసుమ మొ.వి. 2.(వ్యవ.) గింజల నుండి 'కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower).  నూనియ - చమురు,రూ.నూనె.

చెక్కియము - 1.ఎముకలయం దుండు నెయ్యి, రూ.చెక్కెము.

రోమము - ముఖము, శిరముతక్క తక్కిన దేహములోగల వెండ్రుక.
రోమశము -
1.పంది, 2.గొఱ్ఱె, విణ.ఒడలిపై నెక్కువ వెండ్రుకలు కలది. లోమము - తనూరుహము, వెండ్రుక, రూ.రోమము.
లోమశుఁడు - శరీరముందెల్ల నిడువెండ్రుకలు కలవాడు.

ఆరు1 - 1.కలుగు, 2.నిండు, 3.ఒప్పు, 4.అతిశయిల్లు, వి.1.రొమ్ము నుండి నాభివరకు గల రోమావళి, నూగారు, 2.నింద, ఉదా. అరుసు, సోరుసు లేని సంసారము.
ఆరు2 - (వ్యవ.) గుంటకయను పనిముట్టులో ముఖ్యమైన భాగము (Blade).

వల్గువు - రెప్పమీది వెంటుక, విణ.చక్కనిది.
సీలియా -
(గృహ.) (Cilia) 1.సన్నని రోమములు, 2.కను రెప్పల యందలి రోమములు.

చౌలము - వెండ్రుకలు తీయు నొకానొక కర్మ, చూడాకర్మ, పుట్టు వెండ్రుకలుతీయు సంస్కారము.
చూడాకర్మము - పుట్టువెండ్రుకలు తీయుట.

ఇంద్రలు ప్తకము - 1.బట్టతల, 2.తల వెండ్రుకలూడిపోవు ఒక రోగము, రూ.ఇంద్రలుప్తము.
ఖర్వాటుఁడు - బట్టతలవాడు, రూ.ఖల్వాటుడు.

5. నంజు(ౙ) - మాంసము.
నంజు(ౙ)డు దిండి - రక్కసుడు, విణ.మాంసము తినువాడు.

నంజు(ౙ)డు - మాంసము.
నంజుడుదిండి -
రక్కసుడు, విణ.మాంసము తినువాడు.
రక్కసి - రాక్షసి, రాక్షసుడు, రక్కసీడు, సం.రక్షసః.
రాక్షసి - రక్కసి.
రాకాసి - రాక్షసి, రక్కసి, సం.రాక్షసః.

జంతుమాంసకృత్తులు - (జం.) జంతువుల శరీరములో తయారైన మాంసకృత్తులు, (Animal proteins) ఉదా.ఆల్బుమిన్ (Albumen), కేసిన్ (Casein) ఫ్రైబ్రిన్ (Fibrin), మయోసిన్ (Myocin), జిలాటిన్ (Gelatin).
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.

ఆల్బుమిన్1 - (వృక్ష.) (Albumin or endosperum) అంకురచ్ఛదము, బీజపోషకపదార్థము, భ్రూణము పెరుగుటకు భ్రూణస్యూనములో ఏర్పడిన ఆహారము.
ఆల్బుమిన్2 - (Albumin) ఆహార పదార్థములలో ముఖ్యముగా పాలలోను గ్రుడ్డులోను గల ఒకరకపు మాంసకృత్తు.

కేజీన్ - (వ్యవ.) (Casein) పాలలో నుండు ఒకవిధమగు మాంసకృత్తు.
కేసిన్ - (గృహ.) (Casein) పాలకోవ లోని ఒకమాంసకృత్తు.

పాలను బలపఱుచుట - (గృహ.) పాలతో పోషణపదార్థములను కలుపుట (Forti-fyning milk), ఉదా. 'డి' విటమిన్(Vitamin D) కలిపిన పాలు (Vitaminised milk).

తంతుజనని - (జం.) రక్తములో నుండు ద్రవపదార్థముల నున్న మాంసకృత్తు. దీని నుండి తాంతవము తయారగును. (Fibri-nogen).
తాంతవము - (జం.) రక్తము గడ్డ కట్టినపుడు దానిలో నేర్పడిన సూక్ష్మమైన తంతుకములలో నుండు పదార్థము (Fibrin) విణ.తంతు సంబంధమైనది. 

మయోసిన్ - (గృహ.) (Myosin) మాంసకండరములలోని ఒక మాంసకృత్తు.

మాంసకృత్తులు - (జీవ. రసా.) ఆహార పదార్థములలో ఒక ప్రధాన వర్గము (అందు కర్బనము, ఉదజని, అమ్లజనితో పాటు ముక్యముగా నత్రజని, తరువాత గంధకము, భాస్వరము కూడ నుండును). (రసా.) శరీర పోషకములగు నత్రజని కూడి యుండిన కొన్ని సమ్మేళనములు (Proteins). (గృహ.) కండరాభి వృద్ధిచేయు ఆహారము, పెరుగుదలకు తోడపడు ఆహారము, పుష్టినిచ్చు ఆహారము, బలమునిచ్చు ఆహారము (Proteins).

ట్రిప్సిన్ - (జం.) (Trypsin) మాంసకృత్తు పదార్థములను పక్వ పదార్థములుగాను తరువాత వానిని తిక్త అమ్లముగాను మార్చు సేంద్రియ పదార్థము, ఇది సర్వకిణ్వగ్రంధి నుండి తయారగును. 

పక్వమాంసకృత్తులు - (జం.) మాంసకృత్తులు, ' పాచకము ' అను సేంద్రియ మండముచే ప్రసరణకు అనుకూలముగా నుండునట్లు మార్చ బడిన పదార్థములు (Peptones).
పాచకము - (జం.) జఠర రసమందు కల సేంద్రియమండము, (Pepsin).

పెప్టోనులు - (గృహ.) (Heptones) మాంసకృత్తులు సగము జీర్ణమైన అవస్థలో జనించు ద్రవ్యములు.

అమినో యాసిడ్స్ - (జీవ. రసా.) (Amino acids) జీర్ణమైన మాంసకృత్తుల నుండి జనించు అమినో గుణములుగల ఆమ్లములు.
ముఖ్యావసరమైన అమినో ఆసిడ్స్ -
(గృహ.) ఇప్పటికి 22 అమినో ఆసిడ్స్ కనుగొనబడినవి. వీనిలో 8 మానవునకు భోజనము ద్వారా ముఖ్యముగా లభించవలెను. ఇవి శరీరములో తయారగును. కనుక వాని వలన లోపము కలుగదు (Essential amino acids).

మాంసకృత్విలయకము - (జం.) మాంసకృత్తులపై పనిచేయునది. (Proteolytic).
మంసలఫలము - (వృక్ష.) కండగాని గుజ్జుగాని కల పండు (Fleshy fruit).
మాంసలుఁడు - బలిసినవాడు.

పిట్యూటరీ మాంసగ్రంధులు - (గృహ.) పీనస మాంసగ్రంధులు, పోషగ్రంధులు (Pituitary glands).

పోషక గ్రంధి - (జం.) మస్తికము నకు క్రింది భాగమునకుండు ఒక ముఖ్యమగు గ్రంధి (Pituitary body).  
పిట్యూట్రిన్ - (జం.) (Pitutrin) పోషగ్రంథి తయారు చేయు అంతస్సావము  (Hormone) పోషగ్రంధి నిస్సారము. 
హార్ మోన్స్ - (గృహ.) (Hormones) నిర్నాస గ్రంధులలో ఊరు రసము., (ఇవి శరీర క్రియలను క్రమపరచును) అంతస్స్రావములు.

పోషకపదార్థములు - (గృహ.) శరీరము పెరుగుటకు సహాయపడు పదార్థములు (Nutrients), ఉదా. పిండి, చక్కెర పదార్థములు, మాంసకృత్తులు, లవణములు.

పిండి - పిష్టము, సం.పిష్టమ్, పిండిః.
పిండి -
(రసా.) కర్బను హైడ్రోజను ఆక్సిజనులు కలిసిన ఒక సమ్మేళనము (Starch).
పిష్టము - (రహ.) చూర్ణముగా చేయబడినది (Pulverised).
పిష్టకము - 1.కంటితెవులు, 2.పిండివంట.
పిష్టద్రవ్య సస్యములు - (వ్య్వ.) పిండి పదార్థము నిచ్చు పైరులు (Starch crops). ఉదా.ఆలుగడ్డ, కఱ్ఱపెండలము మొదలగునవి.

మండము - 1.మీగడ, 2.గంజి, (వృక్ష.) పిండి పదార్థము (Starch).
మీఁగడ -
పాలమీది తెట్టె, పాల నుండి వేరుచేయుటకు వీలగు వెన్నతో గూడిన భాగము, (Cream).
కాంజి - పులి కడుగు, వికృ.గంజి.  గంజి - అన్నము వార్చిన నీరు, సం.కాంజిక్తము.

ట్రిఫిల్ పుడింగ్ - (గృహ.) (Triffle pudding) స్పంజికేకును, పండ్ల ముక్కలను పొరలు పొరలుగా అమర్చి, మీద క్రీము (మీగడ) వేసి భోజనానంతరము పెట్టు పదార్థము. 

ఘృతేన వర్ధతేబుద్ధిః - క్షీ రేణాయు ర్వివర్థనమ్|
శాకేన వర్ధ తేవ్యాధి - ర్మాంసం మాంసేవ వర్థతే||
తా.
నేతిచేత బుద్ధియు, పాలచేత (నా)ఆయువు, కూరగాయలచేత వ్యాధియు, మానసముచేత మాంసమును వృద్ధిపొందుచున్నవి. - నీతిశాస్త్రము

పిశితము - మాంసము.
చియ్య - కండ, మాంసము.
కండ -
1.మాంసము, 2.మాంసపు ముక్క, సం.ఖండః.
కండకావరము - 1.గర్వము, 2.అహంకారము, సం.ఖండగర్వః.

కండరము - స్నాయువు, మాంస రజ్జువు.
స్నాయువు -
సన్ననరము, సం (జం.) ఎముకలను కలిపియుంచు ఆధారకణజాలముతో నేర్పడిన పట్టి, సంధి, బంధనము (Ligament).
సన్నము - సూక్ష్మత్వము, విణ.సూక్ష్మము.
కండరములు - (జం.) మాంసపు కండెలు (Muscles).
కండరమండలము - (జం.) శరీరములో నున్న కండరముల సంపుటి (Muscular system).
కండర కణజాలము - మాంసపుకండ (Muscular tissue).
కండర బంధనము - (జం.) కండరము యొక్క కొన. (ఇది కండరమును ఎముకతో అతికించును. ఆధారపు కణజాలము (Connective tissue)తో నేర్పడిన పట్టీ వంటి నిర్మాణము (Tendon).

కండ గుండె వుండేవాడికి బుఱ్ఱ తక్కువుగ ఇస్తావు
కలేజా లేని పిరికిపందకు అతితెలివిని జత చేస్తావు.....

ఉన్నామక కండరము - (జం.) అవయములను పై కెత్తుటకు ఉపయోగపడు కండరము (Elevator muscle).
ప్రావసాదక కండరము - (జం.) అవయములకు క్రిందికి దించుటకు కుపయోగపడు కండరము (Depressor muscle).  

ద్విసిర కండరము - (జీవ.) చేతిదండ (Biceps muscle).
ఐచ్చిక కండరములు - (జం.) ఇచ్ఛాకండరములు(ఇచ్ఛ - అభిలాష, కోరిక.), ఇష్టము వచ్చినప్పుడు పనిచేయు కండరములు, ఉదా. చేయి, కన్ను, కాలు మొ. వాని కండరములు (Voluntary muscles).
అనై చ్ఛిక కండరములు - (జం.) అనిచ్ఛాపూర్వకముగ పనిచేయు కండరములు (Involuntary muscles), ఉదా.గుండెకాయ, పేగులయొక్క కండరములు. 

ప్రజంఘకండరము(కప్ప)  - (జం.) పిక్క ఎముకపై నుండు బలమైన కండరము (Gastrocnemius muscle).
ఆకోచక కండరము - కీలునందలి ఎముకలను ముడుచుకొనునట్లు చేయు కండరము (Flexor muscle).

వ్యాకోచ కండరము - (జం.) కీలు నందలి ఎముకలను సమరేఖలోనికి తెచ్చు కండరము, (Extension muscle). 
అపచాలక కండరము - శరీరము యొక్క మధ్యరేఖ నుండి దూరముగ ఎముకను లాగుకొను కండరము (Abducent or Abductor muscle).

పరిభ్రమణ కండరము - (జం.) ఒక భాగముపై మరియొక భాగము త్రిప్పుట కుపయోగపడు కండరము (Rotator Muscle).

సంకోదచ కండరము - (జం.) ద్వారముల యందుండి కవాటము వలె పనిచేయు కండరము, (Sphincter muscle).

కుష్ఠురోగము - పెద్దరోగము(పెద్దరోగము – కుష్టువు), (ఈ వ్యాధి వలన కండరములు క్రమముగా క్షీణించి అవయములు వశము కాకపోవును) (Leprosy).

ఉలుము - కుష్ఠురోగము, రూ.పులుము.
శిపివిష్టుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బట్టతలవాడు, 4.కుష్టురోగి.

ఎఱచి - పొల, మాంసము.
పొల -
1.మాంసము, 2.దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.పలమ్.
పొలసు - 1.మాంసము, 2.మాంసపు దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.పలమ్.

దొబ్బ - 1.మాంసఖండము, 2.ముద్ద.
ముద్ద -
కబళము, పిండము, పిడుచ.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిండము - 1.బ్రతుకుతెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపు ముద్ద(కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము), 3.గర్భము, 4.సమూహము, సం.వి. (గృహ.) గర్భములోమి శిశువు. (Foetus embryo).
పిడుౘ - 1.ముద్ద, 2.కబళము.

ఆమిపము - 1.మాంసము, 2.భోగవస్తువు, 3.ఆశగొల్పు వస్తువు, 4.భోగము, 5.లోభము, 6.లంచము.

లోభము - 1.కక్కురితి, 2.పితలాటము, 3.పిసినితనము.
లోభి -
లుబ్ధుడు.
లుబ్దుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
లుబ్ధకుఁడు - 1.పిసినిగొట్టు, లోభి, 2.బోయవాడు. 

రుసుము - 1.లంచము, 2.లాభము, 3.ఫీజు, 4.కమీషను.
అపప్రదానము - లంచము.
లంచగొండి -
లంచము గొనువాడు, వైవి. కార్యార్థమిచ్చు సొమ్ము. పోరాచి - 1.కానుక, 2.లంచము, విణ.వ్యర్థము.
కట్టనము - 1.కానుక, 2.లంచము, రూ.కట్నము.

ఉపద - 1.కానుక, 2.లంచము.
ఉపదానము -
1.అరణము, 2.కానుక, 3.లంచము.
అరణము - వివాహకాలమందు వధూవరుల కిచ్చు ధనాదికము, సారె, సం.హరణమ్.
సారె1 - 1.కూతురు నత్తగారింటికి పంపు నపుడు ఇచ్చెడు వస్తువులు, 2.కుమ్మర వాని చక్రము, (గృహ.) వధువు అత్తగారింటికి పోవునపుడు తీసికొనిపోవు సామగ్రి. వధువు స్వగృహమును నిర్మించుకొనుటకై తలితండ్రులు సహాయార్థమిచ్చు గృహసామగ్రి.
సారె2 - 1.శారి, 2.పగడశాలకాయ, 3.పాచిక, 4.గోరువంక.

పలము - 1.నిష్కము, మూడుతులములు, 2.మాంసము.
నిష్కము -
1.మాడ, టంకము, 2.పతకము, 3.బంగారము, 4.వెండి.

పలలము - 1.మాంసము, 2.బురద. 

కటిక - 1.కటికవాడు, 2.బెత్తము పట్టియుండువాడు, 3.మాంసము అమ్మువాడు.

త్వక్మాంస రక్తము తదుపరి నాడులు మజ్జాస్థి మేథయు మలములాది
మిశ్రిత దేహము మీద ప్రేమను కల్గి నాదనుకొనుట వినాశకరము
పంచీకృతమ్మిది పంచభూతములచె ప్రారబ్ద కర్మల ఫలము యిద్ది
ఉత్తమ మధ్యమా సత్త్వమౌ కాయమ్ము సుఖదుఖఃములకును స్థూల్లమైన......

sri_lalita

No comments:

Post a Comment