పునర్వసు 1, పుష్యము 4, ఆశ్లేష 4 పాదములు కర్కాటక రాశి.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహ్ణాతి పురుషేణార్జితం ధనమితి గృహం, గేహం చ గ్రహ ఉపాదానే. - పురుషునిచే సంపాదింపఁ బడిన ధనమును గ్రహించునది.
గృహిణి - ఇల్లాలు, భార్య.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
బృందము - సమూహము.
బృందారకుఁడు - వేలుపు, విణ.మనోజ్ఞుడు.
ఆత్రేయగోత్రజో త్యన్త వినయః ప్రియదాయకః
కరుణారస సంపూర్ణః కర్కటప్రభు రవ్యయః. - చంద్రుడు
కర్కటము - 1.ఎండ్రకాయ, 2.కర్కాటరాశి.
కుళీరము - ఎండ్రకాయ, పీత.
కులిరము - ఎండ్రకాయ, రూ.కులీరము.
స్యాత్కుళీరః కర్కటకః :
కౌ భూమౌ లీయత ఇతి కుళీరః - భూమియం దణఁగియుండునది.
కృణౌతి జననీ(జనని - 1.తల్లి, 2.దయ, 3.లక్క, 4.కోరిక.)కర్కటః కృఞ్ హింసాయాం - పుట్టినప్పుడు తల్లిని జంపునది. ఈ రెండు ఎండ్రకాయ పేర్లు.
ఎండ్రకాయ - కర్కటము, పీత, రూ.1.ఎండ్రి 2.ఎండ్రిక.
పీత - కర్కాటకము, కన్నములు వేయునది.
కన్నము - రంధ్రము, సం.ఖననమ్.
రంధ్రము - 1.క్రంత, సందు, 2.దూఱు.
క్రంత1 - పెండ్లికొడుకువారు పెండ్లికూతురునకు తీసికొనిపోయెడు ప్రధానద్రవ్యము, రూ.కంత.
క్రంత2 - 1.సందుత్రోవ, 2.రాజవీధి, 3.రచ్చ, 4.రంధ్రము, సం.గర్తః.
రంధ్రాన్వేషణము - రంధ్రములను అన్వేషించుట (తప్పులు వెదుకుట యని వాడుకలోని యర్థము.)
రంథ్రముల కుట్టు - (గృహ.) అలంకారపు కుట్టులో రంథ్రముల నేర్పరుచు కుట్టు (Eyelet-stitch).
భూకము - 1.బొక్క, 2.కాలము.
బొక్క - 1.బిలము, కన్నము, 2.శవమునుపూడ్చెడు గొయ్యి, స.భూకః.
గని - 1.బంగారు మొ.వి. పుట్టు చోటు, ధాతువులను త్రవ్వి తీసెడు భూభాగము, 2.బిలము, రంధ్రము, సం.ఖని.
ఖని - రత్నములు, లోహములు పుట్టెడిచోటు, వికృ.గని.
బొఱియ - 1.బిలము, గొయ్యి, 2.ఎండిన బొండ్లము.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
గొయ్యి-పల్లము, రూ.గోయి.
కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము - (జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.
గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము, మొ.వి. విణ.గుహా యందుండునది.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆంతర్యము - 1.అభిప్రాయము, 2.మిక్కిలి సన్నిహిత సంబంధము, 3.అక్షరములకు స్థానప్రత్యాదులచే కలుగు పరస్పర సాదృశ్యము, 4.గుట్టు, 5.హృదయము.
గామిడి గుట్టు మాటల సతి కర్కాటకరాశి.....
సంధిపారయుతములు - (జం.) వేరువేరు భాగములు కలిసి ఏర్పడిన కాళ్ళు గల జంతువులు (Arthropoda). ఉదా. పీతలు, కీటకములు మొదలగునవి.
పీతనగము - (జం.) భూణము ఏకభిత్తిక గో ళ ద శ యందున్నప్పుడు ఆద్యాంత్రముఖమునకు బిరడావలె నుండు అండపీతముతో నిం డి న జీవకణములు (Yolk plug).
కైటిన్ - (జం.) (Chitin) సంధిపాద జీవుల శరీరము యొక్క పైభాగమున కవచముగా నేర్పడు కొమ్మువంటి పదార్థము.
త్వత్పతనము - (జం.) సంధిపాద జంతువులు శరీరముపై నుండు చర్మమును విసర్జించుట. (Ecdysis.)
కాయగాని కాయ, కాయల్లో నడిచే కాయ. - ఎండ్రకాయ
ఎనిమిది కాళ్ళున్నాయి-నాలుగు కొమ్ములున్నాయి-అడ్డంగా నడుస్తుంది-శిరములేదు-తోకలేదు-ప్రాణం వుంది. - పీత
ఏటి వెంబడి అంగుళ్ళు - పీతబొక్కలు
తల్లిని గండాన పుట్టిన పిల్లలు - పీతపిల్లలు(కర్కాటము).
తల్లిలేని బిడ్డడు బతకడు. బతికినా ఆరోగ్యంగా ఉండడు. తల్లి చనిపోతే తండ్రి, పినతండ్రి వంటివాడే? తల్లిగండము, పిల్లగండము కాని మంత్రసాని గండముండునా? 'నిత్యగండం నూరేళ ఆయుష్యం' అని నేటి సామెత.
అపమృత్యువు - 1.అకస్మాత్తుగా కలిగిన చావు, 2.గండము.
గణ్డౌ కపోలౌ -
గండము - 1.ఏనుగు చెక్కిలి, 2.ఖడ్గమృగము(కటిక మెకము - ఖడ్గమృగము), 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి, 6.ప్రాణాపాయము.
గణ్డ గండః గది వదనైక దేశే. – కూడుకొని యుండునది.
కపోలము - చెక్కిలి.
భక్షణసమయే కంపత ఇతి కపోలం, కపి కిఞ్చిచ్ఛలనే. - భక్షించు సమయమందుఁ జలించునది. ఈ 2 చెక్కిలి పేర్లు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ – స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము, 3.పులిగోరు పదకము, 4.చేపపిల్ల, 5.ఒక సంఖ్య.
విఘ్నము - అంతరాయము, అడ్దు.
పుండు - కురుపు, వ్రణము.
ఈమ - పుండు, వ్రణము. ఈగ ఎక్కడ పుండు వుండునో అక్కడే వ్రాలును.
వ్రణము - గాయము, గడ్డ, కురుపు.
గడ్డ - 1.కురుపు, 2.మంటిగడ్డ, 3.కందమూలములు, 4.ఒడ్డు, సం.గండః, కందః.
క్షతి - 1.గాయము, 2.నాశము.
గాయము - కత్తి మొ.వానితాకున గలుగు దెబ్బనరకు, క్షతి.
క్షతము - 1.గాయపడినది, 2.చీల్చబడినది, 3.నాశనమైనది, సం.వి.1.గాయము, 2.చీల్చుట, 3.దెబ్బ.
గంటి - 1.గాయము, క్షతి, 2.దుఃఖము, 3.కన్నము.
కిణకము - (వృక్ష.) గా య ము ను కప్పుచు ఏర్పడిన మృదుకణముల సమూహము, (Callus).
చెంక - కపోలము, చెక్కిలి, రూ.చెంప.
చెంప - 1.కపోలము, 2.పార్శ్వము.
చెంపకొప్పు - ప్రక్కకొరగ వేసికొను కొప్పు.
చెక్కిలి - 1.చెంప, కపోలము, రూ.చెక్కు.
చెక్ - (అర్థ.) (Cheque) 1.హుండి, 2.బ్యాంకు ఖాతాదారు తన ఖాతాలో ఒక నిర్ణీతమైన మొత్తమును అడగిన వెంటనే బ్యాంకునకు వ్రాసి యిచ్చు ఆజ్ఞాపత్రము, రూ.చెక్కు.
చెక్కు - క్రి.1.పొదుగు, 2.చేర్చు, 3.చెక్కులుచేయు, వి.చెంప, జం.వి (అర్థ.) బ్యాంకులో ఖాతాదారుడు తనకు గల సొమ్ములో కొంత భాగమును తనకుగాని తాను వ్రాసిన వానికిగాని ఇయ్యవలసినదిగా బ్యాంకుకు వ్రాసి ఇచ్చు అజ్ఞాపత్రము.
బుగ్గ - 1.చెక్కిలి, 2.నీటిబుడగ, 3.సంతతధారగా పై కుబికి వచ్చు నీరు.
చెంపసరలు - స్త్రీ భూషావిశేషము.
మాతృహీన శిశు జీవనం వృథా, కాంతహీన నవయౌవనం వృథా|
శాంతిహీన తపసః ఫలం వృథా, తింత్రీణీరస విహీన భోజనమ్||
తా. తల్లిలేని బిడ్డయును(జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.), కాంత - కొరతగిన స్త్రీ, స్త్రీ. లేని క్రొత్తయౌవనమును, శాంతి - శమనము లేని తపంబును, పులుసు(దప్పళము - పులుసు)లేని భోజనమును వ్యర్థమని భావము. – నీతిశాస్త్రము
What a home without a mother?
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
దాస్యామి యౌవనప్రాప్తం పాలయిత్వా మహీపతే |
న మాతృరహితః పుత్రో జీవేన్న చ సుఖీ భవేత్ ||
కర్కటరేఖ - (భూగో.) భూమధ్యరేఖకు ఉత్తరమున 23 1/2 degrees లో ఉన్న రేఖ (Tropic of cancer).
ఆర్కిటిక్ వలయము - (భూగో.) ఉత్తర ధ్రువవృత్తము, 23 1/2 degrees కర్కాటకరేఖ, ఉత్తర అక్షాంక రేఖ, ఉత్తరాయణ రేఖ.
దక్షిణాయనము - (భూగో.) సూర్యుడు జూన్ 21 తేదీని కర్కాటక రేఖను చేరి అచట తన కిరణములను లంబముగా ప్రసరింపజేసిన తరువాత దక్షిణమునకు మరలుట, (దీని పరిమితి ఆరునెలలు).
ఉత్తర సమశీతమండలము - (భూగో.) కర్కాటక రేఖను ఉత్తర ధ్రువము నకును మధ్య నున్న ప్రదేశము.
దోస - కర్కటి లత, దోసకాయ తీగ.
పునర్వసు - ధనుస్సువంటి యాకారమును పోలి 5 నక్షత్రములుండును.
తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
తొలకరిసూడు - హంస, వ్యు.వర్షాకాల విరోధి.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
సూడు - 1.పగ, 2.పగవాడు.
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ 23వ సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
ఆరబము - 1.తొలకరిపైరు, 2.పైరు, సం.ఆరంభః.
ఆరంబము - 1.మొదలు పెట్టుట, ఉపక్రమము, 2.ప్రయత్నము, 3.కార్యము, 4.త్వర, సం.ఆరంభః, 5.పైరు (ఇది తెనుగున మాత్రము కానవచ్చును), రూ.ఆరబము.
ఆరంభము - ఆరంబము.
ఆరంభించు - యత్నించు, మొదలు పెట్టు.
పైరు - సస్యము; సస్యము - పైరు, రూ.శస్యము.
సస్యపరివర్తనము - (వ్యవ.) ఆయా పైరులను తగినరీతిని మార్చుచు సేద్యము చేయుట Rotation of crop).
సస్యసంగ్రహణము - (వ్యవ.) పైరు పంటకు వచ్చిన తర్వాతచేయు పనులు (Harvest etc., of crops). ఆరకాఁడు - కృషీవలుడు, రైతు.
కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
వయసు - ప్రాయము, యౌవనము.
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు.
కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు, 4.నస, 5.ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).
పునాసలు - పునర్వసు నక్షత్రమందు సూర్యు డుండినపుడు చల్లిన ధాన్యము.
జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
పునర్నో దేవ్యదితి స్పృణోతు | పునర్వసూనః పునరేతాం యజ్ఞమ్ | పునర్నో దేవా అభియంతు సర్వే | పునః పునర్వో హవిషా యజామః | ఏవా న దేవ్యదితిరనర్వా | విశ్వస్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా | పునర్వసూ హవిషా వర్ధయంతీ | ప్రియం దేవానా - మప్యేతు పాథః ||5||
అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య, 2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము.
పునర్వసు - ఒక నక్షత్రము.
పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
అదితియుఁ గశ్యపుఁడును నన,
విదితుల రగు మీకుఁ గుఱుచవేషంబున నే
నుదయించితి వామనుఁ డనఁ
ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవమునన్|
భా|| రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో 'వామనుడు' అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రునికి నేను(అనుజుఁడు - తమ్ముడు)ను, నాకు ఇంద్రుడు అన్నగారు.
పునర్వసు - ఒక నక్షత్రము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్క రాయుడు.
చంద్రుడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు Moon, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
పునర్వసు పుష్యౌ దక్షిణవామయోః - పునర్వసు శ్రీరాముని జన్మనక్షత్రము. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశపురాజు, త్రేతాయుగమున రాక్షసులను సంహరించి మానవులను కాపాడెను. - శ్రీమన్నారాయణుని అవతారము.
అజుఁడు -1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒక రాజు.
అజాండము - బ్రహ్మాండము.
బ్రహ్మాండము - భూగోళ ఖగోళాదికము, అందలి లోకములు చరాచరాఖిలము.
కల్మాషపాదుఁడు - ఇక్ష్వాకు కులుడగు ఒక రాజు.
ఇక్ష్వాకుఁడు - ఇక్ష్వాకు వంశమున బుట్టినవాడు.
రాజరాజ సుహృద్యోషార్చిత మంగళమూర్తయే,
నమ ఇక్ష్వువంశాయ రామా......
రాముఁడు - 1.రఘురాముడు, 2.బలరాముడు, 3.పరశురాముడు.
మహారాజులు - వీరు పదునార్గురు :- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.
ఈ జగమందుఁదామనుజుఁ దెంత మహాత్మకు డైన దైవమా
తేజముతప్పఁజూచునెడ ద్రిమ్మరుకోల్పడు నెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడుగాల్నడఁ గాయలాకులన్
భోజనమై తగన్వనికిఁబోయి చరింపఁడె మున్ను, భాస్కరా.
తా. పూర్వము మహా రాజ కుమారుడైన రామచంద్రుడు కాలినడకతో అడవి కేగి, కాయలు, ఆకులు అహారముగా గైకొని ఆ యడవి యందు సంచరించెను. అట్లే మనుష్యు డెంతగొప్ప(మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)వాడైనను, దైవానుగ్రము లేనిచో తన గొప్పతనము బోగొట్టుకొని దేశసంచారియై ప్రవర్తించును.
పదునెనిమిదవదైన రామాభిధానంబున దేవకార్యర్థంబు రాజత్వంబునొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె; పద్దెనిమిదో
18వ పర్యాయం "శ్రీరాము"డై సముద్ర బంధనాది వీరకృత్యాలాచరించి దేవకార్యం నిర్వరించటం కోసం తాను రాజైనాడు.
ఏకపత్నీవ్రతుఁడు - త్రికరణశుద్ధిగా ఒకే భార్య యను వ్రతము గలిగినవాడు.
రామరాజ్యము - రాముని రాజ్యము సుఖమైన రాజ్యమని వాడుక యందలి యర్థము.
రామాయణము - రఘువంశీయుడైన శ్రీరామచంద్రుని కథను తెల్పు పుణ్యకావ్యము. (శ్రీరామచంద్రుని భగవ దవతారముగ హిందువులు భావించుచుందురు. వాల్మీకి మహర్షిచే రచింప బడిన ఈ గ్రంథము క్రీ. పూ. 2530-1950 ప్రాంతములలో రచింపబడినదిగా చరిత్రకారులు భావించు చున్నారు. రామాయణము వలన మనకు ఆర్యులు మొదటిసారిగా వైదిక ధర్మమును, సంస్కృతిని దక్షిణాపథమున వ్యాపింప జేసినట్లు తెలియు చున్నది.)
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
రాముఁడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లి కా
రాముడు షడ్వికారజయరాముఁడు సాధుజనా వన వ్రతో
ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగుగెం
దామరలే భజించెదను దాశరథీ కరుణా పయోనిధీ.
తా. సకల జనులను రమింపఁజేయువా డును, ఘోరమయినపాపము లను తొలగించువాఁడును, కళ్యాణగుణములను అవ్వారిగాఁగలవాఁడును, వికారరహితుఁడై ప్రకాశించువాఁడును, సాధుజను లను(సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.)రక్షించునట్టివాఁడును రాముఁడే మాకు పరమదైవమని మీ (కెందమ్మి - (కెంపు+తమ్మి)వంటి పాదారవిందములను కొలిచెదను.
రామరాజ్యంబు నిప్పుడు రా ముదంబె
యౌర! యే మొ సుగ్రీవాజ్ఞ సారమౌనె
యాంజనేయునిభక్తి భాగ్యంబె సీత
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణమునందు షట్కాండములు గలవు) 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము(గుఱ్ఱము - అశ్వము), 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.
చిత్తు - 1.జ్ఞానము, 2.వి.మొదట వ్రాసిన వ్రాత.
జ్ఞానము - తెలివి, ఎరుక. ఎఱుకువ - తెలివి.
తెలివి - 1.వివేకము, 2.ప్రకాశము, 3.కాంతి, వికాసము, 4.తేరుట, 5.తెలుపు.
విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.
ఉత్స్వేదనము - (వృక్ష.) ఆకుల నుండికాని, కాండము నుండి కాని నీరు ఆవిరిరూపమున బయటికిపోవుట (Transpiration).
ఆశ్వాసము - 1.గ్రంధభాగము, 2.ఊరడించుట, 3.బతిమిలాడుట.
భార్యావియోగశ్చ జనాపవాదః ఋణస్య శేషః కుజ సస్యసేవా |
దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ, వినాగ్ని మా పంచ దహంతి కాయమ్ ||
తా. భార్యావియోగమును, జనులచే అపవాదము ను, ఋణశేషమును, చెడ్డవానియొద్ద(కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, అంగారకుడు (Mars) కొలువును, దారిద్ర్యకాల మందు స్నేహితులు వచ్చుటయు; నీయైదును శరీరమును(కాయము - 1.మేను, శరీరము, 2.స్వభావము.)నిప్పులేకయే దహించును. – నీతిశాస్త్రము
దశరథ రాజకుమార దానవమదసంహార నారాయణ|
రమ్యగుణధామ రంజిత రామనామ
శక్తిహితకామ పోషిత సర్వసామ
కామ్యపరిణామ బుద్ధివికాస సోమ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
శ్రీరామో రామభద్రశ్చ రామచన్ద్రశ్చ శాశ్వతః,
రాజీవలోచనః శ్రీమాన్ రాజేన్ద్రో రఘుపుజ్గవః.
రామదాసు - ఒకపిట్ట.
రామ - స్త్రీ, వ్యు.గీతకళాదుల నేర్పి రమించునది.
లేమ - స్త్రీ, సం.రామా.
రామః రమయతి మోదయతి రూపసంపదేతి రామః - రూపసంపద చేత సంతోషింపఁ జేయువాఁడు. రము క్రీడాయాం.
బలే రామో నీల చారు సితే త్రిషు,
రామశబ్దము బలభద్రునికి పేరైనపుడు పు. నల్లనిదానికిని, అందమైన దానికిని, తెల్లనిదానికిని పేరైనపుడు త్రి. రమయతీతి రామః. రము క్రీడాయాం, రమింపఁజేయు(నది) వాఁడు.
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా' కవాటమై
డీకొని ప్రోచునిక్కమని ధీయుతులెన్నఁ దదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక వివత్పరం వరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణా పయోనిధీ.
తా. "రా" అను (రామ)అనెడి దివ్యనామములోని రేఫము పాపముల నన్నిటిని బయటికి తఱుమగా, "మా" అను అక్షరము తలుపులు వలె(కవాటము - 1.తలుపు, 2.(భౌతి.) ఒకవైపునకు పోయిన వాయు పదార్థములను గాని, ద్రవ పదార్థములనుగాని, వెనుకకు రాకుండ అడ్డు కొనుచు ఒక వైపునకు తెరచుకొనియుండు తలుపు (Valve) అడ్దుపడి వానిని ఎదిరించి లోపలికి రాకుండునట్లు చేసి ఆశ్రితులను కాపాడును. ఇది నిజమని జ్ఞానవంతులు చెప్పగా మూఢులా యక్షరము లను గ్రహించి జపింప నేరకున్నారు. అట్లుకాక, లోకులు వానిని జపింపరేని యెడతెగక వచ్చు ఆపదలు వారికి కలుగవు.
రామాయన చపలాక్షులపేరు
కామాదుల పోరువారు వీరు
రామాయన బ్రహ్మమునకుఁ బేరు
ఆ మానవ జననార్తులు దీఱు ||తెలిసి||
కుశుఁడు - శ్రీరామ చంద్రుని జ్యేష్ట పుత్రుడు. స్వతనయ కుశలవ పండిత రామ్|
అతిథి - 1.భోజన సమయమునకు వచ్చు పరదేశి, 2.ఆహుతుడు, 3.కుశుని కొడుకు.
వితరసి దిక్షు రణే దిక్పతికమనీయమ్, దశముఖమౌళిబలిం రమణీయమ్|
కేశవ! ధృత రఘుపతివేష! జయ జగదీశ! హరే! ||
ద్వాదశాత్ముఁడు - సూర్యుడు.
ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా. న. పు. పండ్రెండువిధములైన మూర్తులు గలవాఁడు.
ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
భా|| ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే (హరి) భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.
ద్వాదశి - పక్షమందు పండ్రెండవ తిథి, దోదసి.
దోదసి - ద్వాదశి, ఒకానొక తిథి.
బారసి - ద్వాదశి, సం.ద్వాదశీ, ద్వాదశాహః
ద్వాదశకము - పండ్రెండు.
పండ్రెండు - (పది+ రెండు) ద్వాదశ సంఖ్య.
ద్వాదళము - పండ్రెండవది.
పరక - 1.రెండి వీసములు, 2.పండ్రెండ్రు, 3.గడ్డిపోచ.
ముచ్చౌకము - 1.పండ్రెండు (3x4), 2.మూడు చౌకములు.
ఈరాఱు - (ఈరు + ఆఱు) రెండు ఆర్లు అనగా పండ్రెండు.
నాన్నోదకసమం దానం న ద్వాదశ్యాః పరం వ్రతమ్|
నగాయత్ర్యః పరం మంత్రం సమాతుర్ద్యైవతం పరమ్||
తా. అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతిశాస్త్రము
ఆరిరాధయిషుః కృష్ణం మహిష్యా తుల్యశీలయా|
యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతమ్||
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
దివా దినం కరోతీతి దివాకరః - దినమును జేయువాఁడు.
దివ అహని ప్రాణినశ్చేష్టావతః కరోతీతి దివాకరః - పగలు జీవులను వ్యాపవంతులుగాః జేయువాఁడు.
భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాసం కరోతీతి భాస్కరః - కాంతిని కలుగజేయువాఁడు.
అహస్కరుఁడు - సూర్యుడు.
అహః కరోతీత్యహస్కరః - అహస్సును జేయువాఁడు.
బ్రధ్నుఁడు - 1.సూర్యుడు, 2.శివుడు.
అన్యతేజః బధ్నాతి ప్రతిబధ్నాతీతి బ్రధ్నః - ఇతర తేజస్సులను నిరోధించువాఁడు.
బధ్నాతి తిమిరంబ్రద్ధ్నః బధబంధనే - తిమిరమును నడ్దపెట్తువాఁడు.
ప్రభాకరుఁడు - సూర్యుడు.
ప్రభాం కరోతీతి ప్రభాకరః - ప్రశస్తమైన కాంతినిఁ జేయువాఁడు.
విభాకరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విశేషేణభాం కరోతీతి విభాకరః - మిక్కిలి కాంతినిఁ గలుగఁజేయువాఁడు.
భాస్వరుఁడు - సూర్యుడు.
భాసః అస్య సన్తీతి భాస్వాన్ త. పు. - కాంతులు గలవాఁడు.
వివస్వంతుఁడు - సూర్యుడు.
వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్. వస ఆచ్ఛాదనే - కాంతిచేత నన్నిటినిఁ గప్పెడువాఁడు.
దేవ సురౌ వివస్వంత్తౌ -
వివస్వచ్చబ్దము దేవతలకును, సూర్యునకు పేరు. వివస్తేజః; తదస్యాస్తీతి వివస్వాన్. త. పు. వస ఆచ్ఛాదనే - తేజస్సు గల వాడు.
వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.
వివస్వత సూర్యస్య అపత్యం వైవస్వతః - సూర్యుని కొడుకు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
మనువులు - స్వాయంభువుడు (స్మృతి కర్త) స్వారోచితుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు (పదు నాల్గురు).
శనివారము - ఏడవ వారము (ఆదివారము మొదలుకొని).
స్థిరవారము - శనివారము Saturday.
వికర్తనుఁడు - సూర్యుడు.
వికృన్తతి తమ ఇతి వికర్తనః కృతీ ఛేదనే - తమస్సును పోఁగొట్టువాఁడు.
విశ్వకర్మణా వికృత ఇతి వా వికర్తనః - పూర్వ మితఁడు సహింప గూడని తేజస్సుగలవాఁడై యుండఁగా విశ్వకర్మచేత నితని కాంతి సానపట్టి తగ్గించఁబడినది.
అర్కుఁడు - 1.సూర్యుడు, 2.ఇంద్రుడు.
అర్చ్యత ఇత్యర్కః, ర్చపూజాయాం. - పూజింపఁ బడువాఁడు.
అర్క స్స్ఫటిక సూర్యయోః,
అర్కశబ్దము స్పటికమందును, సూర్యుని యందును వర్తించును. అర్బ్యత ఇత్యర్కః, అర్బ పూజాయాంః, ఆర్బ పూజాయాం. - పూజింపఁబడును. 'అర్కో ర్కపర్ణే స్పూటికే రవౌ తామ్రే దివస్పతా' వితి విశ్వప్రకాశః.
అర్కజుఁడు - 1.శని Saturn, 2.యముడు.
అర్కము - 1.జిల్లేడు, 2.రాగి, 3.(రసా.) ఒక ద్రవ్యమునుండి స్వేదనముచేగాని ద్రావణముచే గాని, లాగబడిన అంశము (Extract).
జిల్లెడు - అర్కవృక్షము, రూ.జిల్లేడు.
అర్కాహ్వ వసు కాస్ఫోట గనరూప వికీరనాః, మన్దార శ్చార్కపర్ణే. -
అర్కస్య అహ్వానామాస్యా స్తీతి అర్కాహ్వః - సూర్యుని యొక్క పేరుగలది.
వసత్యస్మిన్ తేజ ఇతి వసుకః వస నివాసే. - దీనియందు తేజస్సుండును.
ఆ స్ఫుట త్యాస్ఫోటః స్ఫుట వికసనే. - వికాసము గలిగినది. పా. ఆస్ఫోతః.
గణరూపాణి బహురూపాణ్యస్య గణరూపః - కాలక్రమమున ననేక రూపములు గలది.
పుష్పాణి వికిరతీతి వికీరణః. కౄ విక్షేపే. - పువ్వులఁ జల్లునది.
మందాన్ క్షుద్ర వ్యాధీన్ ఔషధత్వేన ఇయర్తీతి మందారః. - క్షుద్రవ్యాధులను బోఁగొట్టునది.
అర్కాభాని పర్ణా న్యస్య అర్కపర్ణః - సూర్యునివలె వేఁడిమి గల యాకులు గలది. ఈ ఆరు 6 జిల్లేడుచెట్టు పేర్లు.
అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్కవంశత్వాత్ అర్కబంధుః, ఉ-పు. - సూర్యవంశమున జనించుటవలన అర్కబంధువు.
అర్క మనుచు జిల్లెడు తరుపేరు
మర్కట బుద్ధులెట్ల దీఱు
అర్కుడనుచు భాస్కరునికి పేరు కు
తర్కమనే అంధాకారము తీఱు ||తెలిసి||
మార్తాండుఁడు - సూర్యుడు.
మృతండస్యాపత్యం మార్తాండః – మృతుండుఁ డను వాని కొడుకు. పా, మార్తాండః మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తాండః - నశించిన బ్రహ్మాండమును బ్రతికించువాఁడు.
పద్మసంభవభూతేశ ముని సంస్తుత కీర్తయే,
నమో మార్తాండవంశ్యాయ రామా....
మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్త రాజ్యధూః|
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా. - 150స్తో
మిహిరాణుఁడు - శివుడు.
మిహి - 1.శ్రేష్ఠము 2.నున్ననిది 3.క్రొత్తది.
మిహిక - మంచు.
మేహతి భువనమితి మిహీకా, మిహ సేచనే - భూమిని దడుపునది, పా, మహికా మహ్యతే రాగిభిరతి మహికా, మహ పూజాయాం - కాముకులచేత పూజింపఁబడునది.
పా, హిమికా, హినోతి వర్ధతే హిమికా, హి గతౌ వృద్ధౌ చ - వృద్ధిబొందునది.
ఇవక - శైత్యము, హిమము, సం.మిహికా.
శైత్యము - 1.చలువ, 2.జలుబు.
ఇవసూడు - సూర్యుడు(ఇవమునకు శత్రువు).
ఇవము - ఇగము.
ఇగము - 1.మంచు, హిమము 2.శైత్యము, చల్లదనము రూ.ఇవము, ఈము.
ఈము - 1.మంచు, 2.చల్లదనము, సం.హిమమ్.
మంచును ఎవరు - కురవ మన్నారు?
ౘలువజ్యోతి - చంద్రుడు; ౘలువఱేఁడు - చంద్రుడు.
ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి.
శైత్యము - 1.చలువ, 2.జలుబు.
ౘలువడి - చలువ.
ౘల్లన - శైత్యము, విణ.శీతము.
తనుపు - తనియచేయు, వి.1.తనివి, 2.శైత్యము, 3.శైత్యోపచారము, 4.పితృయజ్ఞము, 5.తడి.
తనివి - తృప్తి, రూ.తనివు.
తృప్తి - తనివి. తనివోవు - తృప్తిపడు.
శైత్యము - 1.చలువ, 2.జలుబు.
ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి.
ఈమిరి - తడి.
మిహిరుఁడు - 1.సూర్యుడు, 2.చంద్రుడు, 3.వాయువు, 4.వృద్ధుడు.
మేహతి మేఘరూపీ విశ్వం సించతీతి మిహిరః, మిహ సేచనే - తాను మేఘరూపియై ప్రపంచమును తడిపెడువాఁడు.
వర్షీయుఁడు - మిక్కిలి వృద్ధుడు.
అతిశయేన వృద్ధో వర్షీయాన్ స.పు. - మిక్కిలివృద్ధు.
విస్రస - జర, ముసలితనము.
జర - ముసలితనము.
జరఠము - 1.ముసలిది, 2.గట్టియైనది.
విస్రసాజరా,
విస్రంసతే అధఃపతతి శరీర మనయేతి విస్రసా, స్రంసు అధఃపతనే. - శరీరము దీనిచేత దిగువఁ బడును.
జీర్యంత్యనయా అఙ్గానీతి జరా, జౄష్వయోహానౌ. - దీనిచేత అంగములు వయోహాని నొందును, చాలముదిమి.
త్రుటి - 1.లఘ్వక్షరపు చతుర్థ భాగోచ్ఛరణము చేయునంత కాలము, 2.ఇంచుక.
కాంౘు - క్రి.1.చూచు, వీక్షించు, 2.పొందు.
యువ - 60 సంవత్సరములలో తొమ్మిదవది, విణ.వయసువాడు.
నరం వర్షీయాంసం - నయనవిరసం నర్మసు జడం
తవా(అ)పాంగాలోకే - పతిత మనుధావంతి శతశః|
గళద్వేణీబంధాః - కుచకలశ విస్రస్తిసిచయాః
హఠాత్ త్రుట్యత్కాంచో - విగళితదుకూలా యువతయః|| - 13శ్లో
తా. ఓ శివా! నీ కడగంట అపాంగము - కడకన్ను, విణ.అంగహీనము.పడిన నరుడు ముసలియైనను, పతితుఁడు- 1.పడినవాడు, 2.పదవిచెడినవాడు., అట్టి వానిని తరుణులు కొప్పులు వీడుచున్నను, స్తనములపై దుకూలము -1.తెల్లవస్త్రము, 2.సన్నవస్త్రము. జారుచున్నను, విగళితము - మిక్కిలి జారుట కట్టుబట్ట లూడిపోవుచున్నను నూరకొలది వెంటబడుదురు. - సౌందర్యలహరి
జాని - 1.ముదిమి, 2.భార్య, 3.స్త్రీ.
ముదిమి - ముసలితనము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
స్త్రీ - ఆడుది.
ముది - వార్ధకము, ముదిమి, ముసలితనము.
వార్థకము - వృద్ధత్వము.
వృద్ధము - 1.వృద్ధిబొందినది, 2.ముదిసినది.
అరులు మరలు - 1.ముదిమిచే మనసునకు గలుగు తబ్బిబ్బు, 2.వెఱ్ఱిప్రేమ.
అరులు - వాత్సల్యము, ప్రేమ.
నిర్జరుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
నిర్జరాః న విద్యతే జరా యేషాం తే. - ముదిమి లేనివారుగనుక నిర్జరులు.
బుధుఁడు - 1. ఒక గ్ర హ ము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
జరభీరువు - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మదనః మదయతీతి మదనః - మదింప జేయువాఁడు, మదీ హర్ష గ్లేపనయోః.
మన్మథుఁడు - మారుడు, విష్నువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
అధ్వా జరా దేహవతాం - పర్వతానాం జలం జరా|
అసంభోగో జరా స్త్రీణాం - వాక్శల్యం మనసో జరా ||
భా|| శరీరులకు(దేహము - శరీరము, మేను.) అధిక ప్రయాణం, పర్వతాలకు ఎడతెగని నీరు, స్త్రీలకు (సంభోగము - 1.మంచిసుఖము, 2.సురతము.)లేకపోవడం, మనస్సుకు వగ్బాణాలు ముసలితం చేకూరుస్తాయి.
పెరుఁగు - వృద్ధిచెందు, ఎదుగు, వి.దధి, విణ.వృద్ధుడు.
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
పెడ - 1.పెద్ద, 2.వెనుకటిది, 3.విపరీతము, సం.వృద్ధః.
పన్న - 1.వృధుడు, 2.అనామధేయుడు.
ప్రవరుఁడు - శ్రేష్ఠుడు.
ప్రవయా స్థ్సవిరో వృద్ధో జీనో జీర్ణో జరన్నపి,
ప్రగతం యౌవనాఖ్యం వయో (అ)స్యేతి ప్రవయోః, స. పు. - పోయిన యౌవనము గలవాఁడు.
బహుకాలం తిష్ఠతీతి స్థవిరః, ష్ఠా గతినివృత్తౌ. - బహుకాలముగా నుండెడువాఁడు.
వర్ధతే వృద్ధః వృధు వృద్ధౌ. - వృద్ధిఁబొందినవాఁడు.
జినాతి వయసో హీయతే జీనః, జ్యా వయోహానౌ. - వయస్సువల్లఁ బాసినవాఁడు.
జీర్యతే జీర్ణః, జరఠశ్చ, త. పు. జౄష్ వయోహానౌ. - వయౌ హానిగలవాఁడు. ఈ 5 ముసలివాని పేర్లు.
స్థావరము - (భౌతి.) కదలనిది, చలనము లేనిది, స్థిరము, మార్పులేనిది, (Stationary), విణ.1.వింటినారి, 2.కొండ, 3.వృద్ధత్వము.
స్యాత్ స్థావిరం తు వృద్ధత్వమ్ ,
స్థవిరస్య భావః స్థావిరం; వృద్ధస్య భావః వృద్ధత్వం - వృద్ధుని యొక్క భావము స్థావిరము, వృద్థ్వము. ఈ 2 ఏఁబదియేండ్లకు మీఁది ముదిమివయస్సు పేర్లు.
స్థవిరుఁడు - ముసలివాడు.
స్థవిర - ముసలిది.
వృద్ధత్వము - ముసలితనము, (Senility).
వృద్ధః - ముసలిది.
ముది - వార్ధకము, ముదిమి, ముసలితనము.
వార్థకము - వృద్ధత్వము.
వృద్ధు - 1.ముసలివాడు, 2.తెలిసినవాడు.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్ది.
పెరుఁగు - వృద్ధిచెందు, ఎదుగు, వి.దధి, విణ.వృద్ధుడు.
వృద్ధ ప్రశస్యయో ర్జ్యాయాన్ : జ్యాయశ్శబ్దము మిక్కిలి వృద్ధునికిని, మిక్కిలి శ్రేష్ఠునికిని పేరు. అతిశయేన వృద్ధః ప్రశస్తశ్చ జ్యాయాన్. స. - మిక్కిలి వృద్ధుఁడును మిక్కిలి ప్రశస్తమైనవాఁడును.
ప్రజ్ఞావృద్ధం ధర్మవృద్ధం స్వబంధుం
విద్యావృద్ధం వయసా చాపి వృద్ధమ్ |
కార్యాకార్యే పూజయిత్వా ప్రసాద్య
యః సంపృచ్ఛేన్న సముహ్యేత్ కదాచిత్ ||
భా|| ప్రజ్ఞచేత, ధర్మంచేత, విద్యచేత వయసుచేత వృద్ధుడయిన తన బంధువును పూజించి ప్రసన్నుని చేసికొని కర్తవ్యాకర్తవ్యాలు అడిగే వాడు ఎప్పుడూ పొరపడడు.
అరగడము - ముసలి, వృద్ధు.
జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము.
జీర్ణ శూల - (గృహ.) కడుపునొప్పి, చిన పిల్లలకు అజీర్ణము వలన వచ్చు కడుపు నొప్పి, (Colic).
తరుణము - సమయము, సం.విణ. క్రొత్తది, యౌవనముగలది.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
తరుణిమ - యౌవనము, రూ.తారుణ్యము.
అసభ్యాసే విషం శాస్త్ర - అజీర్ణే భోజనం విషమ్|
దరిద్రస్య విషం గోష్ఠీ - వృద్ధస్య తరుణీ విషమ్||
తా. అభ్యాసము లేనివారికి శాస్త్రము విషము, అజీర్ణము - అన్నాదులు అరుగక పోవుట, విణ.జీర్ణముకానిది.)జీర్ణముకాక యున్నపుడు భోజనము విషము, దరిద్రునికి(పేదవానికి) వినోదగోష్ఠి విషము, ముసలివానికి వయసు పెండ్లాము(తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.)విషము. - నీతిశాస్త్రము
పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద, 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
అంగం గళితం, పలితం ముండం, దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం, తదపి సముంచత్యాశాపిండం || - 15
శరీరం శిథిలమైపోయింది, తల నెరిసిపోయింది, దంతాలు లేని నోరు బోసిపోయింది, వృద్ధుడు కర్ర పట్టుకొని తిరుగుతాడు. అయినా, అతడు తన కోరికల మూటను విడిచిపెట్టడు కదా!
The body has become decrepit; the head has turned grey; the mouth has been rendered toothless; grasping a stick, the old man moves about. Even then, the mass of desires does not go. - భజగోవిందం
అరుణుఁడు - 1.అనూరుడు, సూర్యసారథి, 2.సూర్యుడు.
ఇయర్తి గచ్ఛతీత్యరుణః ఋగతౌ. - సంచరించు వాఁడు.
ఋచ్యతీతి త్యరుణః ఋ గతౌ- గమనయుక్తుఁడు.
సూతుఁడు - (చరి.) ఆర్యుల కాలము నాటి రాజుయొక్క రథసారథి రాజు యుద్ధయాత్రలకు వెళ్ళునప్పుడు రథము తోలుటయేకాక, ఉత్సాహము కలిగించు వీరోచితగాథలు ధర్మములు బోదించుట, సూతుని యొక్క ముఖ్య కర్తవ్యము. సూర్యస్య సూతః సూర్యసూతః - సూర్యుని సారథి.
పూషుఁడు - సూర్యుడు Sun.
పుష్ణాతీతి పుషా. న. పు. పుష పుష్టౌ - పోషించువాఁడు.
సూర్యతనయ - యమున.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు.
సబంధుర్యో హితేషుస్స్యా త్సపితాయస్తు పోషకః|
సఖాయత్ర విశ్వానస్స- భార్యాయత్ర నిర్వృతిః||
తా. హితముగోరువాఁడే(హితైషి- మంచికోరువాడు)బంధువు, పోషించిన వాఁడే(పితరుఁడు - తండ్రి, సం.పితా.)తండ్రి, విశ్వాసము గలవాఁడే(సఖీ - 1.సకి, చెలికత్తె, 2.స్నేహితుడు, సహాయుడు, రూ.సఖుడు.)స్నేహితుఁడు, సుఖింప జేయునదే భార్య యగును. – నీతిశాస్త్రము
దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును.
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
పూషదంత వినాసాయ భగనేత్రభిదే నమః
భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః |
ద్యుమణి - సూర్యుడు, చదలు మానికము.
దివః ఆకాశన్య మణిః ద్యుమణిః, ఇ. పు. - ఆకాశమునకు మణివంటివాఁడు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమణి, నభోమణి.
ౘదలు - ఆకాశము. ౘదలుకాఁపు - వేలుపు.
ౘదలేఱు - ఆకాశగంగ.
సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయము తో కూడి కాంతిమంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1. మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ. 2.వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ. 3.స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గమందుండెడి నది. 4.సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.
మందాకిని - 1.గంగ 2.అరువదేండ్ల స్త్రీ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
చారలేరు - ఆకాశ గంగ; తెలియేఱు - ఆకాశ గంగ. తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటిచాలు, 3.ఆకాశ గంగ.
ఆకాశధార - ఆకసమునుండి కొండపైకిని అచటినుండి క్రిందికిని ప్రవహించుధార.
మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై ‘మ’ కార మహితాయ నమశ్శివాయ|
ద్యుమణి - సూర్యుడు, చదలు మానికము.
దివః ఆకాశన్య మణిః ద్యుమణిః, ఇ. పు. - ఆకాశమునకు మణివంటివాఁడు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమణి, నభోమణి.
ౘదలు - ఆకాశము. ౘదలుకాఁపు - వేలుపు.
ౘదలేఱు - ఆకాశగంగ.
సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయము తో కూడి కాంతిమంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1. మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ. 2.వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ. 3.స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గమందుండెడి నది. 4.సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.
మందాకిని - 1.గంగ 2.అరువదేండ్ల స్త్రీ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
చారలేరు - ఆకాశ గంగ; తెలియేఱు - ఆకాశ గంగ. తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటిచాలు, 3.ఆకాశ గంగ.
ఆకాశధార - ఆకసమునుండి కొండపైకిని అచటినుండి క్రిందికిని ప్రవహించుధార.
మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై ‘మ’ కార మహితాయ నమశ్శివాయ|
తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.
తరంత్యనేన తమితి తరణిః ఈ-పు, తౄప్లవన తరణయోః - అంధకారమున నితనిచేతఁ దరింతురు.
తరతి నభ ఇతి వా - ఆకాశమును దాటువాఁడు.
తరణికులేశ నా నుడులఁ దప్పులుగల్గిన నీదు నామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియ న్నదీజలం
బరగుచు వంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్వముం
దరమె గఱింప నెవ్వరికి దాశరథీ కరుణా పయోనిధీ.
తా. సూర్యవంశమున జన్మించినవారిలో శ్రేష్ఠుడైన వాడా ! నా మాటల యందు దోషము లెన్ని యున్నను, నీయొక్క నామముతోడ శ్రేష్టమయినది యు రచింపఁబడినదియు, కావ్యము పవిత్రమయి నది కదా ? (అగు ననుట) అనగా ఆకాశగంగ(మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్ను కొలను.)యొక్క నీరు ప్రవహించుచు, వంకరగా పాఱినను ముఱికిగల ఆకారములో ప్రవహించినను, దాని మహత్మ్యము ఎన్నుటకు శక్యమా. (కాదనుట)
కాతే కాంతా ధనగతచింతా, వాతుల కిం నాస్తి నియంతా|
త్రిజగతి సజ్జనసంగతిరేకా, భవతి భవార్ణవ తరణే నౌకా|| - 13
ఓయీ వాతులా! కామినీ కాంచనాల గురించే నీకెందుకయ్యా ఇంతయాతన? చింతన చేయడానికి నీకు ఈశ్వరుడు లేడా? సంసార సాగరాన్ని దాటించగల నౌక, ఈ ముల్లోకాల్లోనూ ఒక్కటే ఉంది - అదే సజ్జ్జనసాంగత్యమని తెలుసుకో! - భజగోవిందం
Why worry about wife, wealth etc., O crazy one; is there not for you the One who ordains? In the three worlds, it is only the association with good people that can serve as the boat that can carry one across the sea of birth.
తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.
తరంత్యనేన తమితి తరణిః ఈ-పు, తౄప్లవన తరణయోః - అంధకారమున నితనిచేతఁ దరింతురు.
తరతి నభ ఇతి వా - ఆకాశమును దాటువాఁడు.
తనుచ్ఛాయాభిస్తే - తరుణ తరణి శ్రీసరణిభిః
దివం సర్వాముర్వీ - మరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవన్త్యస్య త్రస్య – ద్వనహరి ణ శాలీనా నయనాః
సహోర్వశ్యాః వశ్యాః - కతి కతి న గీర్వాణ గణికాః || - 18శ్లో
తా|| తల్లీ ! ఉదయవేళల బాలసూర్యుని కాంతి పుంజములను వెదజల్లుతున్న నీ నెమ్మేని కాంతి సౌభాగ్యముచేత భూమ్యాకాశాలు(దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.)కెంపు జిలుగ(అరుణ వర్ణమునందు)మునిగిన దానినిగా - ఆ దివ్యతేజో రూపాన్ని ఎవ్వడు ధ్యానించుచున్నాడో(తలంచునో), వానికి బెదరిన అడవి జింకల వలె చక్కని కన్నులుగల ఎందఱెందరు అప్సరస కన్యలు, ఊర్వశి సైతం వశులవుతారు.(అమ్మ లోకాతీతమైన దివ్యమంగళ రూపాన్ని ధ్యానించు వారు సర్వ సమ్మోహనరూపాన్ని పొందుతారు. అందరూవారికి ఆకర్షితులవుతారని భావము). – సౌందర్యలహరి
తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.
కప్పలి - ఓడ, నావ, త. కప్పల్.
నౌక - ఓడ.
ఓడ - నావ, తరణి, సం.హోడః.
హోడము - నావ, ఓడ.
నావ - ఓడ.
స్త్రియాం నౌ స్తరణి స్తరిః,
నయతీతి నౌః ఔ, సీ. ణీఞ్ ప్రాపనే - పదార్థమును గట్టును బొందించునది.
నుద్యత ఇతివా నౌః ణుద ప్రేరణే - ప్రేరేరింపఁ బడునది.
తరంత్యనయా నదీమితి తరణిః. ఇ.సీ. తరిశ్చ. ఈ-సీ. పా, తరీ. ఈ-సీ. 'తరీషు తత్ర్యమఫల్గుభాండ ' మితి మాఘః. - దీనిచేత తరింతురు గనుక తరణి, తరియు. ఈ 3 ఓడల పేర్లు.
సరణి - 1.త్రోవ, 2.వరుస, 3.విధము.
సరంత్యనేనసృతి, ఈ-సీ. సరణిశ్చ, ఈ. సీ. సృగతౌ. - దీనిచేత సంచరింతురు.
స్రోతో (అ)మ్బుసరణం స్వతః,
స్వతః అంబుసరణం స్రోత ఇత్యుచ్యతే - తనంతట పాఱుచున్న ప్రవాహము ప్రోతస్సనంబడును.
స్వతః సరతీతి స్రోతః, స. న. సృగతౌ - తనంతటఁ బోవునది. ఈ ఒకటి తనంతటపాఱునదాని పేరు.
సరడు - 1.సరండము, స్త్రీల మెడకు ధరించు బంగారు అల్లిక తీగ, 2.నూలు దారము, సం.సరండః.
సరణశ్రేణి - (గణి.) ఒకదానిపైన ఒకటి జారుటకు వీలుగా నమర్చిన రెండు లఘుఘటక చిహ్నిత మాపక శ్రేణులుగల కొలుచుయాంత్రిక పరికరము,(Sliderule).
దిక్సూచి - నావికులు వాడు ఒక పరికరము (Compass).
నావికాదిక్సూచి - (భౌతి.) సముద్రముపై ప్రయాణము చేయు నావికులుపయోగించు దిక్సూచి (Mariner's compass) (నావ ఎట్లొదిగినను ఇది సమతలము ననే యుండుట దీని ముఖ్య లక్షణము).
అయస్కాంతపు దిక్సూచి ఎల్లప్పుడు ఉత్తర దిశను చూపించడంవల్ల ఓడ దారి తప్పిపోకుండా ప్రయాణిస్తుంది. అలాగే మనిషి హృదయం భగవంతుని వైపు త్రిప్పబడి ఉన్నంతవరకు అతడు సంసార సాగరంలో దారి తప్పకుండా ముందుకు సాగిపోగలుగుతాడు. - శ్రీ రామకృష్ణ పరమహంస
భూ - భూమి (సమాసములందే).
భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూజము - వృక్షము.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
భూభృత్తు - 1.రాజు, 2.కొండ.
భూజాని - 1.విష్ణువు, 2.రాజు.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ. సీతానాయక గోవిందా|
జానకి - జనకుని కూతురు, సీత.
అయోనిజ - గర్భమున పుట్టని స్త్రీ, వి.సీత. సీతా ప్రాణాధారక రామ్| సీతాదర్శన మోదిత రామ్|
వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.
విదేహదేశేభవా వైదేహీ. సీ. - విదేహదేశ మందుఁ బుట్టినది. విదేహ మానస రంజక రామ్|
శీత - నాగటిచాలు, రూ.సీత.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ(అతివ - స్త్రీ)- సీత.
వరజు - నాగటి చాలు, సీత.
శీతకరుఁడు - చంద్రుడు, చలివెలుగు.
శీతభానుఁడు - చంద్రుడు; శీతాంశుఁడు - చంద్రుడు Moon. శీతమయూఖుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు కలవాడు.
భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
ఐలుఁడు - 1.పురూరవ చక్రవర్తి, 2.అంగారకుడు, 3.అందగాడు.
ధరణీశ్వరుఁడు- 1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు.
ధరణీశ్వరుడు - రాజు.
ధరణీనురుఁడు - బ్రాహ్మణుడు.
ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి.
ధరతి విశ్వం ధరా, ధరిత్రీ. ఈ. సీ. ధరణిశ్చ. ఇ.సీ. - విశ్వమును ధరించునది.
ధారణి - భూమి, రూ.ధారుణి, ధరణి.
ధరణా - భూమి, రూ.ధారణి.
ధరణీజాతము లే యే
తరి నెట్లెట్లను ఫలించుఁ * దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవము:
గరమనుభవనీయ మగును * గాదె? కుమారా!
తా. లోకమున చెట్లు ఏయే విధముగా పండు చున్నవో, ఆ విధముగనే పూర్వము చేసినకర్మను అనుసరించి ఆ ఫలము అనుభవింపఁ దగియుండును. చేసినంత తప్పక యనుభవింప వలసినదే.
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియదాన శివ|
అహార్యము - కొండ, విణ.హరింప శక్యము కానిది.
హర్తుమశక్యః అహార్యః, హృఞ్ హరణే. - హరింప నశక్యమైనది.
ధరాధరము - 1.కొండ, 2.తాబేలు.
తామేలు - తాబేలు.
సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి నిర్మాణములు, ఊపిరితిత్తులు, రెండు బృహద్ధమన చాపములు గల పృష్ట వంశిక జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
కరమనురక్తిమందరముగవ్వముగా యహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధిమధించు చున్నచో
ధరనిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరధీ కరుణాపయోనిధీ.
తా. రామా! దేవతలును, రాక్షసులును, మందర పర్వతమును కవ్వముగాను, అహిరాజగు(అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.)అహిపతి - శేషుడు వాసుకుని కవ్వపు త్రాడుగా జేసి పాల సముద్రమును(పయోధి - సముద్రము) చిలుకు చుండగా, అపుడాకొండ తటాలున మునుగుటచేత భూమి, లోకములు తల్లడిల్లటం జూచి కూర్మావతారము యెత్తి కొండను వీఁపుమీఁద దాల్చినవాడవు నీవేకదా!
గిరిధరుఁడు - విష్ణువు, వ్యు.మందర పర్వతమును ధరించినవాడు.
కొండమోసెడి యయ్యకుఁ గూడ నణువు
కాని నేనె భారమ్మైతి నింక
నాదు గతి యేమొ తెల్పరా వాదమేల
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోక ధృత్|
సుమేధా మేధజో ధన్యః స్సత్య మేధా ధరా ధరః|| - 80స్తో
ధరము - 1.కొండ, 2.వెల.
ధరతి భువం ధరః. ధృఞ్ ధరణే. - భూమిని ధరించునది.
ధర - భూమి.
దర - ధర, వెల, సం.ధరా ధారణా.
దారణ - ధర, వెల, రూ.దర, సం.ధారణా.
వెల - (అర్థ.) ధర, ఖరీదు cost, నాణెములచే పదార్థములలోనుండు మూల్య పరిమాణమును నిర్ణయించుట.
వెల - కొనువస్తువులకిచ్చు విలువ, వస్తువులకు జెప్పుధర.
వెలకట్టుట - (గృహ.) విలువను స్థాపించుట, విలువ నిశ్చయించుట, మూల్యనిర్ణయము (Evaluation).
అవక్రయము - 1.బాడుగ, అద్దె, 2.వెల, 3.రాజునకు చెల్లించు పన్ను, 4.కూలి, జీతము.
బాడుగ - అద్దె, భాటకము, భూమిపై గాని, భవనములపైగాని, వస్తువుల పైగాని, వాటి ఉపయోగము కొరకై చెల్లించు ధనము.
అద్దె - అద్దియ; అద్దియ - ఇంటిబాడుగ, కిరాయి, రూ.అద్దె.
కిరాయి - బాడుగ, కూలి.
బాడిగ - 1.కూలి, 2.అద్దె, సం.భాటకః.
కూలి - పనిచేసినందుల కిచ్చెడు ధనము.
భరణ్యము - 1.కూలి, 2.జీతము.
జీతము - వేతనము, సం.జీవితమ్.
వేతనము - భృతి, కూలి, చేసినపనికి ప్రతిఫలముగ నిచ్చు ద్రవ్యము, జీతము.
వేతనముల స్థాయి - (అర్థ.) వేతన ప్రమాణము.
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భృత్య - కూలి.
భరణము - 1.భరించుట, 2.జీతము, 3.కూలి.
భాటకము - 1.ఇంటిపన్ను, 2.బాడిగ.
బాడుగ నియంత్రణము - (అర్థ.) ఇంటి యజమానులు అద్దెకు ఇచ్చు ఇండ్లు, వానికి ఇచ్చు బాడుగను ప్రభుత్వము నియంత్రించుట.
భర్మము - 1.బంగారు, 2.జీతము.
జీతగాఁడు - జీతము గొని పనిచేయువాడు.
భృతకుఁడు - కూలివాడు; భరటుఁడు - 1.కూలివాడు, 2.కుమ్మరి.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు. సేవకుఁడు - కొలువుకాడు.
ఐద్దాయులు - (ఐదు+రాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.
చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు గలది, 2.కుమ్మరి.
క్రయము-1.ఖరీదు, వెల, 2.వెల ఇచ్చికొనుట.
క్రీతకుఁడు - తల్లిదండ్రుల యొద్ద వెలకు గొన్న కొడుకు.
అర్హము - తగినది, వి.వెల.
అర్ఘము - 1.వెల, 2.పూజావిధి, 3.చౌక, రూ.అర్ఘువు.
అర్ఘ్యము - 1.మిక్కిలి వెలగలది, 2.పూజకు తగినది, 3.పూజకోరకైనది.
అర్ఘువు - అర్ఘము.
వెలఁదుక - (వెలది+ఉక) ఆడుది, వెలది.
వెలది నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.
వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి.స్త్రీ.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషములేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి.
అమూల్యము - 1.వెలలేనిది, 2.మిక్కిలి వెలగలది.
గిరాకి - అధికమగు వెలగలది, (జాతీ.) ఒక సమయమందు ఒక నిర్ణీతమైన ధరకు కొనుగోలుదారులు కొనుటకు సిద్ధపడువస్తువుల లేక సేవల సౌకర్యముల రాశి.
గిరాకి సరఫరా వక్రరేఖలు - (అర్థ.) ఒక సమయమందు ఒక సరకు యొక్క వ్యాపారులకు నమ్మకమైన గరిష్ఠమైన అమ్మకపు మార్కెట్టు ధరలను చూపురేఖలు.
అగ్గువ - వెలతక్కువది, చౌక, విణ.వెల తక్కువైనది, రూ.అగ్గువ, సం.అఘిః.
(ౘ)చౌక - 1.అగ్గువ, 2.తక్కువ, 3.తేలిక.
చౌకబారు - (వ్యవ.) న్యూనమైనది, వెల తక్కువది.
తక్కువ - కొరత; వెలితి - తక్కువ.
తేలిక - చులకన, లఘుత్వము. లఘిమ - లఘుత్వము.
(ౘ)చులుకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
అనామయము - రోగములేనిది, వి.ఆరోగ్యము.
ఆరోగ్యము - రో గ ము లే మి, స్వాస్థ్యము.
స్వాస్థ్యము - 1.నెమ్మది, 2.స్వార్థత.
హాయి - 1.సౌఖ్యము, 2.నెమ్మది. మదిమది - 1.నెమ్మది, 2.శాంతి, 2.అనాలోచనము.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
వామనము - లేతది.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.
ధరనే వస్తువు లైనన్
దరుగుటకై వృద్ధినిందుఁ * దగఁ బొడ వెదుగున్
విరుగుటకై ; పాయుటకై
దరిఁజేరును ; వీని మదిని * దలఁపు కుమారా!
తా. లోకములో నే వస్తువులైనను వృద్ధిపొందుట నశించుటకే. పొడవుగా పెఁరుగుట విఱిగిపోవుటకే. దగ్గరఁజేరుట (పాయుట - క్రి.1.చిక్కెడలించు, 2.తొలగుట .)కొరకు, విడిపోవుటకే యగును. ఈ విషయముల నన్నింటిని మనస్సునందుంచు కొనవలయును.
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
మదించు - క్రి.వెలయూహించు, 2.సంకల్పించు.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,) 3.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
అంచనా- పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.
ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ|
లోకతీతా గుణాతీతా - సర్వాతీతా శమాత్మికా. - 176శ్లో
కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మము - air in the eyes.
స్తూపపృష్టము - తాబేలు, వ్యు.దిబ్బవంటి వీపుకలది.
స్తూపము - మట్టి మొదలగువాని దిబ్బ.
పీవరము - బలిసినది, వి.తాబేలు.
పీనము - బలిసినది, వి.సంతోషము.
లప్ప - రాశి, విణ.కండకలది, బలిసినది.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
కూర్మవత్ స్థితత్వాత్కచ్ఛపః - కూర్మము వలె నుండునది.
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.
వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో విస్తారాత్ పరిగ తలక్షయోజననేన|
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నినేథ||
శ్రీ మహావిష్ణు! కూర్మ రూపముననున్న నీ యొక్క వెన్నుచిప్ప, వజ్రము కంటె మిక్కిలి కఠినముగా లక్షయోజనముల వైశాల్యమున ఉండెను. సముద్రము లోపల గుభిల్లుమను శబ్దముతో పడిపోయిన మందర పర్వతమును ఆ చిప్పపై ఉంచుకొని దానిని సముద్రముపైకి తెచ్చితివి. – నారాయణీయము
గుహ్యము - 1.ఏకాంతము, 2.పురీషమార్గము, 3.వంచన, 4.తాబేలు, విణ.దాచదగినది.
క్షితి రతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే, ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే|
కేశవ్! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే!
మొగపిఱికి - మొగము (+పిఱికి) తాబేలు, వ్యు.మొగము చూచుటకు పిరికితనము కలది.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
మోము - మొగము, సం.ముఖమ్. మొకము - ముఖము, సం.ముఖమ్. ముఖః పాతు వరాలక్ష్మీ|
ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity).
ముఖశ్వసనము - (జం.) నోటితో గాలినిపీల్చి వదలివేయుట (Buccal respiration).
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము (Peristome).
ముఖపథము - (జం.) బహిశ్చర్మము లోనికి పెరుగుటచే ఏర్పడిన అన్నవాహిక యొక్క ముందరి భాగము, (Stomodaeum).
ముఖపాకము - (గృహ.) నాలుక పూత(Red-tongue) విటమిన్ 'B12' లేక 'డి' లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).
యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || - 58శ్లో
తా|| భయపడిన తాబేలు తలను, నాలుగు కాళ్ళను లోనికిముడుచు కొనునట్లు, ఆత్మారాముడగు యోగి రాగద్వేషాది దోష భయమున పంచేద్రియములను సర్వ విషయములనుండి వెనుకకు మరల్చి స్థిత ప్రజ్ఞుడగుచున్నాడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. - సాంఖ్యయోగము, భగవద్గీత
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా,
గూఢగుల్భాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. – 18శ్లో
వసుమతి - భూమి.
వసుధనమస్యామస్తీతి వసుమతీ. ఈ. సీ. - ధనము దీనియందుఁ గలదు.
వసుధ - భూమి, వ్యు.వసువుని(బంగారమును) ధరించునది.
వసుధనమస్యామస్తీతి వసుమతీ. ఈ. సీ. - ధనము దీనియందుఁ గలదు.
వసు దధతీతి వసుధా. డుధాఞ్ ధారణ పోషణయోః - ధనమును ధరించునది.
వసువు - బంగారు, ధనము, రత్నము.
వసతి ప్రభూణాం గృహే వసు, ఉ. న. వస నివాసే. - ప్రభు గృహముల యందుందునది.
రత్నము - 1.మణి, 2.స్వజాతియందు శ్రేష్ఠమైనది (నవరత్నములు_ మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వడూర్యము.)
వాసవుఁడు - ఇంద్రుడు.
వసూని రత్నాన్యస్య సంతీతి వాసవః - రత్నములు గలవాడు.
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్|
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవామ్|
ఉర్వి - భూమి, వ్యు.విశాలమైనది.
ఉర్వీపతి - రాజు, భూమీశుడు.
ఉర్వీశుఁడు - రాజు, భూపతి.
భూపతి - నేలరేడు, రాజు. నేలఱేఁడు - రాజు.
ఉర్వరా సర్వసస్యాఢ్యా -
ఉర్వతి క్షుధం హినస్తీత్యుర్వరా. ఉర్వీ హింసాయాం. - ఆఁకలిని బోఁగొట్టునది
ఉరుం మహాంతం వృణోతి తదర్హత్వా దుర్వరా - అధికమును వరించునది. ఈ ఒకటి సమస్తమైన పైర్లతోఁ గూడియున్న భూమి పేరు.
భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
తప్పులెన్నువారు తండోపతండంబు
నుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వ.
తా. ఇతరుల, తప్పులను పట్టుకొనువారు, అనేకులుగలరు. కాని తమ తప్పును తెలుసుకొన లేరు.
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ - నత్యాన్నదానేశ్వరీ|
సాక్షా న్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్న్నపూర్ణేశ్వరీ. - 7
వసుంధర - భూమి.
వసుంధరయతీతి వసున్ధరా. ధృ ధారణే. - ధనమును ధరించునది. వసుంధరాదేవి|
దేవభేదే (అ)నలే రశ్మౌ వసూ రత్నే ధనే వసు,
వసుశబ్దము అష్టవసువులకును, అగ్నికిని కిరణమునకును(రశ్మి - (భౌతి.) 1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.) పేరైనపుడు పు. రత్నమునకును, ధనమునకును పేరైనపుడు న. వసతీతి వసుః, పు. వస నివాసే. ఉండును గనుక వసువు. టీ. స. కిరణధనయోర్యథా_ 'నిరకాసయ ద్రవి మపేతవసుం వియదాలయా దపరదిగ్గణికా' ఇతి మాఘకావ్యే.
పైఁడిచూలాలు - వసుంధర, భూమి.
(ౘ)చూలాలు - గర్భవతి.
పైఁడిఱేఁడు - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావనుని అన్న.
పైఁడినెలఁత - లక్ష్మి.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ధన మగ్ని ర్థనం వాయుః ధనం సూర్యో ధనం వసుః |
ధన మింద్రో బృహస్పతి ర్వరుణో ధన మశ్నుతే ||
వసువులు - గణాధి దేవతలు, అష్టవసువులు.
వసవః, ఉ-పు. ఆహత్య వసంతీతి వసవః - కూడుకొని యుండువారు. వస నివాసే వారలెనమండ్రు(ఎనిమిది మంది). అవుడు, ధ్రువుఁడు, సోముఁడు, అధ్వరుఁడు, అనిలుఁడు, ప్రత్యూషుఁడు, అనలుఁడు, ప్రభాసుఁడు అనువారలు.
The eight vasus, వసిష్టుని శాపానికి మానవులై పుట్టవలసి వచ్చినది. వసువులు అగ్నికధిస్ఠాన దేవతలు.
1. అవుఁడు - క్రింది పెదవి, అధరము, పల్లు, దంతము, ఔడు.
అదరము1 - క్రిందిపెదవి, సం.అధరః
అదరము2 - 1.భయము లేనిది, 2.లోతులేనిది.
అధరము - క్రిందిపెదవి విణ.1.తక్కువైంది 2.క్రిందిది 3.నీచము. ఔడు - పెదవి క్రింద చోటు, సం.ఓష్ఠః.
దంతము - పల్లు, కోర. రదనము - దంతము.
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
' సి ' విటమిన్ - (గృహ.) Vitamin ‘ C’ 1.పళ్ళచిగుళ్ళ బలహీనతను తొలగించు విటమిన్, 2.శరీర కణజాలముల బంధనమునకు తోడ్పడు విటమిన్.
పయోరియా - (గృహ.) పంటిచిగురు రోగము, ఒక విధమైన పండ్ల వ్యాధి, పన్నుకుదురులలో నుండి చీమురక్తము స్రవించువ్యాధి,(Pyorrhoea). స్కర్వీ (సీతాదము) - (గృహ.) (Scurvy) 'సి' విటమిన్ Vitamin C, లోపము వలన కలుగువ్యాధి. చిగుళ్ళవాపు, పండ్ల నుండి రక్తము కారుట, (ఈ వ్యాధి ఖటిక (Calcium) లోపము వలన కూడ కలుగ వచ్చును.
2. ధ్రువుఁడు - ఉత్తర దిక్కులోనుండు నక్షత్రము, 1.ఉత్తానపాదుని కొడుకు 2.విష్ణువు 3.శివుడు(విష్ణు భక్తుడు).
3. సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
4. అధ్వరుఁడు - అధర్వా వై ప్రజాపతిః యాగము నందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, అధ్వర్యువు. అధ్వర్యము - 1.హింసా రహితము 2.సావధానము, విణ. 1యజ్ఞము 2.సామయాగము 3.ఆకాశము. (ఆకాశము కంటే ఉన్నతమైనవాడు కన్నతండ్రి).
5. అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు. అనిలము - గాలి దేహము నందలి వాతధాతువు, వాతరోగము. అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.
6. ప్రత్యుషుఁడు - వేగుజాము, ప్రభాతము.
7. అనలుఁడు- 1.అగ్నిదేవుడు 2.అష్టవసువులలో ఒకడు.
8. ప్రభాసుఁడు - Source, ప్రతాపము, తేజము, చర్మము యొక్క పైపొర Epidermis.
ప్రభాసిని - (జం.) చర్మము యొక్క పైపొర (Epidermis).
జవ్వు - 1.దుర్మద జలము, 2.చర్మము లోపలిపొర(Epidermis) 3.సొగసు, అందము.
అష్టవసువులలో అష్టమ వసువు భీష్ముడు. వసువు అంశతో భీష్ముడు గంగకి(గంగానది) పుట్టాడు. భీష్ముఁడు పితృభక్తి పరాయణుడు, రాజకీయ విద్యావిశారదుడు, ఇచ్ఛా మరణము పొందినవాడు.
ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.
స్త్రీయోరత్నాస్తధావిద్యా ధర్మశ్శౌచం సుభాషితం|
వివిధానిచ శిల్పాని సమాధేయాని సర్వతః||
తా. సద్గుణవంతులైన వనితలు, రత్నములు, విద్య(విద్య - చదువు, జ్ఞానము.), ధర్మము, పరిశుద్ధము(శౌచము - శుచిత్వము), సద్వాక్యము, నానావిధములయిన శిల్పము లివి యెచ్చట నున్నను గ్రహింపవలయును. - నీతిశాస్త్రము
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శ్శిల్పాది కర్మచ|
వేదాః శ్శస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్||
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శోచయతీతి శుచిః. ఇ. పు. శుచశోచనే - దుఖింపఁ జేయువాఁడు.
శుచిత్వాచ్ఛుచిః - శుచియైనవాఁడు.
గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్ఠాషాఢ మాసములు.)
గ్రీష్మము - 1.వేడి, 2.వేసంగి.
హైపర్ వైటమినోసిన్ - (గృహ.) (Hypervitaminosis) కొన్ని విటమినులు ఎక్కువగుటచే శరీరమునకు కలుగు హాని, ఉదా.ఎండ దెబ్బ.
వేఁడివేలుపు - 1.వహ్ని, 2.సూర్యుడు.
వహ్ని - అగ్ని.
పీతాముత్పలధారిణీం శుచిసుతాం పీతాంబరాలంకృతాం|
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందారమాలాధరాం||
చిచ్చఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్చుఱ, సం.శుచిః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గికంటి - శివుడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టు ముడికలవాడు.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
తాపత్రయము - మూడు విధములైన తాపములు - ఆధ్యాత్మికము, అధిదైవికము, ఆధిభౌతికము.
ఊష్మము - 1.ఆవిరి, 2.వేసగి, 3.గ్రీష్మఋతువు, 3.(వ్యా.) ఊష్మ ధ్వనులు, (శ, ష, స, హ).
ఆవిరి - బాగుగ కాచిన నీటి నుండి లేచు ఊష్మము, అవి (Steam).
అవి1 - 1.శ్వాసము, ఊపిరి, 2.తాపము, 3.ఆవిరి, 4.చీడ.
ఆవి2 - 1.ప్రసవవేదన, 2.రజస్వల, 3.చూలాలు.
ఆమనస్యము - ప్రసవవేదన, బిడ్డకుట్టు.
బిడ్డకుట్టు - ప్రసవవేదన.
గర్భవతి - చూలాలు.
ఊష్మలము - 1ఉమ్మగలది, 2.ఆవిరిగలది.
ఉమ్మ - ఉబ్బ. ఉబ్బ - ఉక్క, రూ.ఉమ్మ, ఉమ్మదము, సం.ఊష్మః.
ఉమ్మదము - ఉబ్బ, సం.ఊష్మదమ్.
ఉక్క - ఉమ్మ, తాపము, వేడి.
తాపము - 1.వేడిమి, 2.బాధ, సం.వి.(భౌతి.) వేడి (Hot).
తపన - తాపము, రూ.తపనము.
శ్వాసము - 1.వూపిరి, 2.ఉబ్బసము, 3.వాయువు.
ఊపిరి - శ్వాసము, ఊర్పు.
ఊరుపు1 - ఊపిరి, శ్వాసము, రూ.ఊర్పు, సం.ఊర్జః.
ఊరుపు2 - ఒకవిధముగా వండినకూర, ఒకరకపు వ్యంజనము, రూ.ఊర్పు.
ఊపిరికుట్టు - ఊపిరి పీల్చునపుడు బాధ కలిగించెడి ఒక వ్యాధి, యౌకము.
యౌకము - ఊపిరికుట్టు. ఊపిరిగొట్టు నొప్పి, Stitching or catching pain ఉశ్వాసము విడిచినప్పుడు గుండెలలో నొకప్రక్కను పోటుపొడచి నట్లు లేచెడి నొప్పి.
యువాకోశము - (జం.) ఊపిరితిత్తి నిర్మాణములో నున్న ఒక్కొక్క సూక్ష్మమైన గాలిగది, (Alveolus).
ఉబ్బసము - ఊర్థ్వశ్వాస రోగము, వగరువురోగము, సం.ఉచ్ఛ్వాసః.
ఉబ్బసపుదగ్గు - (గృహ.) ఉబ్బసము, భారమైనదగ్గు, ఊపిరాడకుండ వచ్చు దగ్గు. (Asthma).
శ్వాసకాసము - ఉబ్బసముతోడి దగ్గు.
శ్వాసావరోధన - (గృహ.) ఉక్కిరి బిక్కిరియగుట, ఊపిరి యాడకపోవుట, (Suffocation). ఉడ్డుగుడుచు - ఊపిరి తిరుగక బాధపడు, ఉక్కిరి బిక్కిరి యగు.
ఉక్కిరిబిక్కిరి - ఊపిరాడనిది, వి.ఊపిరాడకుండుట.
శ్వాసత్వక్ కుహరము - (జం.) ధమన మూలములో బృహద్ధమన కుహరము ప్రక్కనున్న అర (Cavum pulmo-cutaneum) ఇది ఎడమ వైపున నుండును.
Dyspncea - శ్వాస కృచ్ఛము, difficulty in breathing.
వగర్చు - శ్వాసరోగము difficulty in breathing.
ప్రాణగొడ్డము - ప్రాణహింసకము, సం.ప్రాణకుట్టః.
గొడ్దగము - బాధకము, సం.కుట్టకమ్.
కుట్టుసురు - (కుఱు+ఉసురు) కొన ప్రాణము.
కొఱప్రాణము - కుట్టుసురు, కొనయూపిరి.
వాయునోత్ర్కమతోత్తారః కఫసంరుద్ద నాడికః|
కాసశ్వాసకృతాయాసః కంఠే ఝురఝురా యతే|
Death-rattle - చనిపోవు సమయమున గొంతులో పుట్టెడు గురగుర శబ్దము.
ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచోఁ గఫము కుత్తుకనిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీ స్మరణ గల్గునో గల్గదొ నాఁటికిప్పుడే
తప్పకచేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ.
తా. శ్రీరామా ముసలితనమువచ్చి నేనున్నచోటికి యమదూతలు వచ్చినపుడు, రోగములు మిక్కిలి ముమ్మురమైనప్పుడు, మరణము సమీపింపఁగా కఫము గొంతుకయందు నిండియున్నప్పును, అప్పుడు చుట్టములు చుట్టును క్రమ్ముకొని యుండగాను, మిమ్ము స్మరించుట నాకు కలుగునో కలుగదో చెప్పజాలను, కనుక ఇప్పుడే తప్పక నిన్ను భజన చేసెదను.
డండపాణి (యముని) బాధ తొలుగుటకు కోదండపాణి (శ్రీరాముని) నాశ్రయించాలి.
పునాసలు - పునర్వసు నక్షత్రమందు సూర్యు డుండినపుడు చల్లిన ధాన్యము.
ఆరబము - 1.తొలకరిపైరు, 2.పైరు, సం.ఆరంభః.
ఆరంబము - 1.మొదలు పెట్టుట, ఉపక్రమము, 2.ప్రయత్నము, 3.కార్యము, 4.త్వర, సం.ఆరంభః, 5.పైరు (ఇది తెనుగున మాత్రము కానవచ్చును), రూ.ఆరబము.
ఆరంభము - ఆరంబము.
ఆరంభించు - యత్నించు, మొదలు పెట్టు.
పైరు - సస్యము; సస్యము - పైరు, రూ.శస్యము.
సస్యపరివర్తనము - (వ్యవ.) ఆయా పైరులను తగినరీతిని మార్చుచు సేద్యము చేయుట Rotation of crop).
సస్యసంగ్రహణము - (వ్యవ.) పైరు పంటకు వచ్చిన తర్వాతచేయు పనులు (Harvest etc., of crops). ఆరకాఁడు - కృషీవలుడు, రైతు.
క్ష్మా - భూమి, వ్యు.భారము నోర్చునది.
క్షమతే భారం క్ష్మా - భారము నోర్చునది.
క్ష్మాభృత్తు - 1.కొంగ, 2.ఱేడు, వ్యు.భూమిని మోయునది(వాడు).
క్ష్మాం బిభ ర్తీతి క్ష్మాభృత్, త. పు. డు భృఙ్ ధారణపోషణయోః. - భూమిని ధరించునది.
క్ష్మాం భువం బిభ ర్తీతి క్ష్మాభృత్ త. పు. భృఞ్ భరణే. - భూమిని భరించువాఁడు.
కొంగ - బకము, సం.క్రుజ్.
బకము - కొంగ, రూ.బకోటము.
క్రుఙ్ క్రౌఞ్చః -
క్రుఞ్చతి పఙ్క్తి రూపేణ గచ్ఛతీతి క్రుఙ్, చ. పు. క్రౌంచశ్చ, క్రుఞ్చ గతికౌటిల్యాల్పీ భావయోః. - పంక్తిరూపముగాఁ బోవునది. లేక కుటిలమై యుండునది. ఈ 2 కొంగ పేర్లు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
క్ష్మాయిత - కంపించువాడు.
క్ష్మాజము - చెట్టు, వ్యు. భూమి నుండి జన్మించినది.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
వృక్షము - చెట్టు, సం. (వృక్ష.) చాల యెత్తుగా, లావైన కాండము, ఎక్కువ ధారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree).
వృశ్చ్య ఛిద్యత ఇతి వృక్షః, ఓవ్రశ్చూ చ్ఛేదనే. - ఛేదింపఁబడునది.
చెట్టుగట్టు - క్రి.చెట్టుగా నేర్పడు (అవయవ సౌష్ఠవ మేర్పడుట).
కర్కరేటుః కరేటు స్స్యాత్ -
కర్కః సితాశ్వ ఇవ రేటతీతి కర్కరేటుః, ఉ. ప్స, రేటృ పరిభాషణే. - తెల్లగుఱ్ఱమువలె శబ్దించునది.
కర్క ఇతి రేటతి కర్కరేటుః - కర్కయని పలుకునది.
కే వృక్షాదీనాంశిరసి రేటతీతి కరేటుః, ఉ. ప్స. - వృక్షాదులకొనయందుఁ బలుకునది. ఈ 2 పెద్దకొక్కెర పేర్లు.
బలాక - పెద్ద కొక్కెర.
బలాకా బిసకణ్డికా,
బలేన మేఘమాలా అకతి బలాకా, అక కుటిలాయాం గతౌ. - బలముచే (కాదంబిని - మేఘపంక్తి) మేఘపంక్తి బొందునది.
బిసవత్ కంఠో (అ)స్యా ఇతి బిస కంఠికా - తామర తూఁడు(బిసము - తామరతూడు, తామర తీగ.)వంటి మెడగలది. ఈ 2 తెల్లకొక్కెర పేర్లు.
క్రౌంచము - 1.క్రౌంచపర్వతము, 2.ఒకానొక ద్వీపము, 3.ఒకరకపు కొంగ.
క్రొంచ - కొంచ, సం.క్రౌంచః.
కొంౘ - 1.క్రౌంచము, 2.ఒకానొక పర్వతము, సం.క్రౌంచః.
కొంౘగుబ్బలి - క్రౌంచపర్వతము.
క్రౌంచదారణుడు - కుమారస్వామి, గుహుడు, వ్యు.క్రౌంచపర్వతమును భేదించినవాడు.
క్రౌంచాఖ్యం పర్వతం దారితవాన్ క్రౌంచదారణః - క్రౌంచపర్వతమును వ్రక్కలించినవాఁడు. దౄ విదారణే. క్రౌంచదారీ పంచదశః|
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
గుహుఁడు - కుమారస్వామి, వ్యు.దేవసేనలను పొదివి రక్షించువాడు, 2.ఒక నిషాదరాజు.
గూహతి పరాయు ధేభ్య ఆత్మసైన్యం గోపాయతీతి గుహః - తన సైన్యమును రక్షించుకొనువాఁడు, గుహూ సంవరణే.
సారవివేకవర్తనుల సన్నుతికెక్కిన వారి లోపలన్
జేరినయంత మూఢులకు జేపడదానడ యెట్లనగాఁ
సారములోన హంసముల సంగతినుండెడి కొంగ పిట్టకే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ ! భాస్కరా.
తా. హంసలతో(హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.)గలిసినంత మాత్రమున కొంగపిట్టకు రాయంచ గమన ప్రవర్తనములు ఏ విధముగా, కలుగును? (కలుగదు) రాదు. అట్లే, మంచి యోగ్యతలు(నిజమగు యుక్తాయుక్త విచక్షణ)గల వారి నాశ్రయించినంత మాత్రమున మూర్ఖులకా(మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.)గొప్పవారి పేరు ప్రతిష్ఠలు రావు.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
బల మస్యాస్తీతి బలః - బలము గలవాఁడు.
బలు - 1.సమాసమందు బలువు శబ్దమున కేర్పడు రూపము, 2.గొప్పది, 3.బలము కలది.
బలీయము - ఎక్కువ బలము కలది (బలి, బలీయము, బలిష్ఠము).
బలియుఁడు - బలవంతుడు, సం.బలియస్.
బల్లిదుఁడు - మిక్కిలి బలము కలవాడు, సం.బలిష్ఠః.
బల్లిదము - (బలిష్ఠమ్) మిక్కిలి బలము కలది, సం.బలిష్ఠమ్.
బల్లిదురాలు - మిక్కిలి బలముగలది.
బలీయ (మైన) లక్షణము - (జీవ.) శిశువులో ప్రవేశించిన రెండు పరస్పర వ్యత్యాసము గల లక్షణములలో ఒక లక్షణము (తండ్రి నుండి వచ్చినదిగాని, తల్లినుండి వచ్చినదిగాని) మాత్రమే పైకి కనబడునది (Dominan character).
బలము - సత్తువ, సైన్యము.
బలవియోజనము - (భౌతి.) ఒక బలమును రెండు ఘటక బలముల ఫలముగా ప్రదర్శించుట(Resolution of forces).
అరిష్టము - 1.హింసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము, 5.మరణచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ. ఉత్పాతము, 9.రాగి.
రివ్యతేరోగైరి త్యరిష్టః, రిషహింసాయాం. - రోగములచే హింసింపఁబడనిది.
రిష్టం మరణ లక్షణం తదస్యనా స్తీతి అరిష్టః. - (త్వరగా) మరణములేనిది.
బలిపుష్ఠము - కాకి.
బలినా పుష్టః బలిపుష్టః పుష పుష్టౌ. - బలిచేఁ బొషింపబడునది.
బలిప్రసన్నో(అ)భయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః|
ధ్వాంక్షము - 1.కాకి Crow, 2.కొక్కెర.
ధ్వాంక్షతి కాంక్షతి ఆమిషమితి ధ్వాంక్షః, ధ్వాక్షి కాంక్షాయాం. - మాంసమును గాంక్షించునది.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
వాయసము - కాకి.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము.
కాకదంతపరీక్ష - న్యా. వ్యర్థమైనపని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.)
కాక మత్యత్ఖగౌ ధ్వాఙ్క్షౌ -
ధ్వాంక్షశబ్దము కాకికిని, కొక్కెరకును పేరు. ధ్వాంక్షతి మాంసమితిధ్వాంక్షః - ధ్వాక్షి కాక్షాయాం. - మాంసము నిచ్చయించునది. "ధ్వాంక్షౌ తు బక వాయసా" విత్యమరమాలా.
కొక్కెర - కొక్కరాయి.
కొక్కరాయి - కొంగ, బకము, రూ.కొక్కెర, కొక్కెరాయి.
కొంగ - బకము, సం.క్రుఙ్.
కృకణ క్రకరౌ సమౌ,
కృ ఇతి క్వనతి సభ్దాయతే కృకణః, కణ శబ్దే. - కృ అనుధ్వనిఁ జేయునది.
కృకం శిరోగ్రం పార్శ్వ కండూయనాయ నయతీతి కృకణః, ణీఞ్ ప్రాపణే. - శిరోగ్రమును పార్శ్వ కండూయనము కొఱకు పొందించునది.
క్ర ఇతి శబ్దం కరోతీతి క్రకరః, డుకృఞ్ కరణే. క్ర యనెడు శబ్దము జేయునది. ఈ 2 కొక్కెర పేర్లు.
కక్కెర - కొంగ, సం.క్రకరః.
క్రకరము - 1.రంపము, 2.కక్కెర పక్షి, 3.వెణుతురు చెట్టు.
క్రకచము - రంపము; ఱంపము - క్రకచము, పలకలులోనగు వానిని కోసెడు సాధనము.
కరపత్రము - 1.క్రకచము, రంపము, 2.జలక్రీడ, 3.ప్రకటన పత్రము.
క్రకచవత్ - (వృక్ష.) రంపపు పండ్లు వలెనున్న, రంపగరివలె నున్న (Serrated).
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి(ఇంద్రనీలము - నీలమణి), 3.రంపము.
విద్య లేనివాడు విద్యాధికుల చెంత
నుండినత పండితుండు కాడు
కొలని హంసలకడఁ గొక్కెర యున్నట్లు విశ్వ.
తా. ఓ వేమా! విద్యలేనివాడు పండితులతో కలిసి తిరుగుచున్నను పండితుడు కాలేడు. హంసలు(హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.) వుండుకొలనులో కొంగ కూడ వుండును. కాని, అంతమాత్రమునకు ఆ కొంగ హంస కాలేదు కదా.
కోయష్ఠికము - చీకుకొక్కెర, గ్రుడ్డి కొంగ.
ఓకసా స్థానే యజతే సంగచ్ఛతే కోయష్టికః, యజ దేవపూజాదౌ. - స్థానముతో సంగతమై యుండునది.
కోయ - ఒకజాతి బోయ.
చీఁకు - క్రి.1.చప్పరించు, 2.చుంబించు, వి.అంధత్వము, విణ.అంధుడు.
చీఁకురించు - క్రి.అంధమగు.
ౘప్పరించు - క్రి.చవిచూచు.
ముద్దయ్య - (ముద్దు+అయ్య) కుమారస్వామి.
ముద్దు - 1.ప్రేమము, ఆదరము, 2.మనోజ్ఞత, 3.చుంబనము.
చుంబనము - ముద్దు.
చుంబించు - క్రి.ముద్దిడుకొను.
ముద్దాడు - క్రి.చుంబనాది పూర్వకముగా లాలనచేయు, ఆదరించు.
ముద్దువాడు - ఏమియు తెలియనివాడు, సం.ముగ్ధః.
కొమరసామి - స్కందుడు.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొ మ రు ద న ము) కొ మ రు ప్రాయము=యౌవనము).
దాన పరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేకశూన్యునకు లేములు వచ్చిన నేమి? సంపదల్
పూనిననేమి? నొక్కసరిపోలును, చీకున కర్ధ రాత్రియం
దైన నదే మి పట్టపగలైన నదేమియులేదు! భాస్కరా.
తా. గ్రుడ్డివానికి పగలైనను, పట్టపగలు -(పగలు+పగలు) మట్ట మధ్యాన్నము యైన, రాత్రి(సరిప్రొద్దు - అర్ధ రాత్రము)యైనను ఒకటే. అట్లే దానపరోపకారమను గుణధన్యత(ధన్య - దాది, విణ.ధన్యురాలు)మనస్సులో లేని వానికి భాగ్యము(సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.)భాగ్యము కలుగినను దరిద్రము(లేమి - దారిద్ర్యము, లేమిడి, ఉండమి.)సంభవించినను ఒకటే.
అంథిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
అంధుఁడు - 1.గ్రుడ్డివాడు, 2.వివేకము లేనివాడు, వి.బాహ్యదృష్టి లేని సన్న్యాసి.
కాననివాఁడు - గ్రుడ్డి, అంధుడు.
గ్రుడ్డి - అంధుడు (రాలు), చూడశక్తి లేనిది (వాడు).
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గుడ్డివాడు, 3.మంచి కన్నులు కలవాడు.
అంధము - చీకటి; విణ.గ్రుడ్డిది.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.
అన్ధం తమస్యపి,
అంధశబ్దము అంధకారమునకును పేరగునపుడు న. అపిశబ్దము వలన గ్రుడ్డివానికిఁ బేరగునపుడు త్రి, అన్ధయతీ త్యన్ధం, అన్ధ దుష్ట్ట్యపసంహారే. - కానరాకుండఁ జేయునదియు, కానరానివాఁడును అంధము, అంధుఁడును.
గ్రుడ్డు - 1.కనుగ్రుడ్డు, 2.పక్షుల అండము, విణ.గ్రుడ్డితనము.
గ్రుడ్డిచుక్క - (గృహ.) కన్నుగ్రుడ్డులో రెటీనాకు వెనుకభాగమున దృష్టినరము బయలుదేరు చోటనున్న చుక్క (చూచిన వస్తువునీడ ఈ చుక్కపైబడిన దృష్టి కనిపించదు)(Blind spot).
అంధబిందువు - (జం.) 1.గ్రుడ్దిచుక్క, 2.కంటిపూవు, 3.కంటియొక్క మూర్తిపటములో అక్షనాడి ప్రవేశించు చోటు (Blind spot). అంధ్యము - గ్రుడ్డితనము, అంధత్వము.
ప్రతిబంధము చేయు వ్యాధులు - (గృహ.) వ్యాధులు రాకుండ తప్పించుట, ఆహారలోపము వలన కలుగు వ్యాధులు రాకుండ తప్పించుకొనుట (Preventable diseases), ఉదా. (Deficienc diseases) ఎఱ్ఱనాలుక, కండ్లజబ్బు మొదలగునవి.
గ్రుడ్డుకానుపు - 1.పాము, 2.పిట్ట, పక్షి.
కాయకంటి - కుబేరుడు.
కాయకన్ను - కాయకాచిన కన్ను.
కాయ - 1.చెట్టున కాయకాచు, 2.కఠినవస్తు స్పర్శచే హస్తాదులందు కలుగు కాయ, 5.కంటి తెవులు.
పటోలి - 1.పొట్ల తీగ, 2.కాయ.
ఐర - కంటె తెవులు, నేత్రరోగము, రూ.అయిర.
అర్భుదము - 1.పదికోట్లు, 2.(గృహ.) కొరకుపుండు (Cancer), 3.నేత్రవ్యాధి, 4.హానికరమైనగ్రంధి, మాంసార్భుదము, విణ.పదికోట్ల సంఖ్యగలది, 2.కఠినము.
ఐరిస్ - (జం.) (Iris) కనుపాపలో దృష్టిని క్రమపరచు భాగము.
కాయజుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం, మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
కాయకము - బ్రదుకు, జీవనము.
గ్రుడ్డివాటు - (గ్రుడ్డి+పాటు) దైవము వలన కలిగినది.
దైవికము - దైవము వలన కలిగినది.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత మగుటవలన కానఁబడనిది. వహ్నితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆది శబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాంగల్యము.
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి గలవాడు, 2.గ్రుడ్డివాడు, 3.మంచికన్నులు కలవాడు.
బాహ్యపటలము - (గృహ.) కన్ను గ్రుడ్దునకు పైపొర (Scierotic layer).
బాహ్యత్వజాడ్యము - (గృహ.) కాచబింబము మెత్తనగు వ్యాధి, ఆహారములో వైటమిన్ "A", తక్కువైన ఈ వ్యాధి కలుగును.
నేత్రశుక్లము - (జం.) కంటి గ్రుడ్డు యొక్క కాచబింబముతో కలిసియుండు పలుచని అధిచ్ఛదపు పొర (Conjuctive).
నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'ఆ' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి, (Kerophthalimia) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డి యగును).
కాచబింబము - (జం.) కంటి గ్రుడ్డులోని ఎదుటి భాగము, (ఇది కొంచెము ఉబ్బెత్తుగా ఉన్న స్వచ్ఛమైన పొర) (Cornea).
తనకు నదృష్టరేఖ విశదంబుఁగ గలిగినఁగాని లేనిచో
జనునకు నెయ్యెడన్ బరులసంపదవల్ల ఫలంబులేదుగా
కదుఁగవ లెస్సగాఁ దెలివిఁ గల్గినవారికిఁగాక, గ్రుడ్డికిన్
గనుపడునెట్లు వెన్నెలలుగాయఁగ నందొక రూపు, భాస్కరా.
తా. వెన్నెల(కాయు - క్రి.వెన్నెల ఎండ మొ.వి ప్రకాశించు.)ప్రాకాశించునప్పుడు రెండు కండ్లకు దృష్టి సరిగా నున్న వారికి అందలి వినోద సందర్భమున కనువుగా నుండినచో నతనికే లాభము. కాని వెన్నెల(చంద్రతాపము - వెన్నెల)యొక్క స్వరూపమైనను గనుగొనలేని గ్రుడ్దివానికేమి లాభము? తన కదృష్టరేఖ కల్గినచో లాభముండు నుగాని, తనకాయదృష్ట రేఖ లేకపోయి నచో పరుల సంపద తన కెట్లబ్బును ? అబ్బదు అంచుచే లాభము లేదు.
ఆత్మఘోషము - 1.కాకి, 2.కోడి, 3.ఆత్మస్తుతి.
ఆత్మానమేవ ఘోషతికాకేతి ఆత్మఘోషః - కా కా అని తన పేరును బలుకునది.
వికత్తనము - ఆత్మస్తుతి.
అహం కేంద్రకత - తన్నుతాను పొగడుకొనుట, ఆత్మస్తుతి (Egocentra- lism).
ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
అవ1 - 1.తల్లి తల్లి, 2.తండ్రి తల్లి, 3.తల్లి, 4.పూజ్యస్త్రీ, 5.వృద్ధురాలు, రూ.అవ్వ.
అవ్వ - అవ1. అవ్వ పేరే ముసలమ్మ.
అవ2 - ఇది సమాసపూర్వపదమై క్రింది అర్థముల తెలుపును, 1.వంగినది, ఉదా. అవాగ్రము = వంగిన అగ్రముకలది, 2.విరుద్ధము, ఉదా.అవమానము(అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము), 3.అనాదరమును సూచించునది, ఉదా.అవకర్ణనము = అనాదరముతో వినుట. అవ్వకావాలి బువ్వకావాలి అంటే ఎట్లా!
మాతామహి - తల్లి తల్లి, అమ్మమ్మ.
పితామహి - తండ్రితల్లి.
అప్పం దన తల్లిగ మే
లొప్పం గని జరుపవలయు * నుర్వీస్థలిఁ జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడఁతియు మాతృతుల్య * యండ్రు కుమారా!
తా. తోడఁబుట్టిన అక్కచెల్లెండ్రను గౌరముగాఁ జూచి సంతోషించునట్లు వారికి క్షేమము కలుగ చేయవలెను. బాల్యమునఁ జనుపాలనిచ్చి పెంచిన స్త్రీని కూడ తల్లితో సమానురాలని మర్యాద చేయవలెనని పెద్దలు చెప్పుదురు.
అవని - 1.భూమి, 2.నేల.
అవతి ప్రజాః, అవ్యతే నృపైర్వా అవనిః, ఈ. సీ. - ప్రజలను రక్షించునదిః లేక రాజులచేత రక్షింపఁ బడునది అవని. అవనీతనయా కామిత రామ్|
భూమిజ- సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె
ట్లవగుణులై ననేమి? పనులన్నియుఁజేకురు వారిచేతనే
ప్రవిమల నీతిశాలియగు రామునికార్యము మర్కటంబులే
తవిలియొనర్పవే జలధిదాటి సురారుల ద్రుంచి, భాస్కరా.
తా. రాజనీతి విశారదు డగు రాముని యొక్క పనిని వానరులే (మర్కటము - కోతి)పూనుకొని సముద్రమును దాటి రాక్షసులను చంపి, నెరవేర్చి నవి. అట్లే రాజగు వాడు(విభుఁడు - 1.ప్రభువు, సర్వవ్యాపకుడు, 2.బ్రహ్మ, 3.శివుడు.)మిక్కిలి నిపుణతగా సంచరించినచో అతనిని గొల్చు సేవకులు మొదలుగు వా రాయన పనిని యధావిధి గా నెరవేర్చుదురు.
పూర్వగాథ :- రాము డరణ్య వాసము చేయు చుండగా నొకనాడు రావణుడు మాయవేషమున రామునికిఁ తెలియకుండగా సీతనుగొనిచని తన లంకయందుంచెను. రాజనీతి గల నీతి సురక్షిత జనపద రామ్| రాముడు సుగ్రీవాది వానరుల తోడనే సముద్రము దాటి, వారి సహాయముననే తిరిగి సీతనుకొని అయోధ్యకుఁ జని సుఖముగా నుండెను.
మేదిని - భూమి.
మెయి - తృతీయ విభక్తి యందు ఒకచో వచ్చు ప్రత్యయము, వి.1.విధము, 2.పార్శ్వము, 3.వెంబడి, 4.భూమి, మహి, 5.దేహము.
మెయితాలుపు - ప్రాణి, శరీరి; శరీరి - ప్రాణి.
పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువు యొక్క ఒక భాగము(Side), విం. విణ. (జీవ.) క్రక్కనుల నుండి బయలు దేరీనది.(Latral).
దేహము - శరీరము(దేహము), మేను.
మేను - 1.శరీరము, 2.జన్మము, పుట్టుక, 3.పార్శ్వము.
పరికర్మము - దేహమునందలి మురికి పోగొట్టుట.
నిలువు - 1.నిలుపు, నిలుచుట 2.చేయి మీది కెత్తుకొని నిలుచున్న మనుజునిపొడవు కొలది, 3.మీదియంతస్తు, 4.ఆకృతి, 5.ఒడలు.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా, భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము, (Shape).
ఒడలు - మేను, దేహము, రూ.ఒళ్ళు.
ఒడలిచూపొడయఁడు - ఇంద్రుడు.
అండజము - 1.పక్షి, 2.చేప, 3.పాము, 4.తొండ, వ్యు. గుడ్డు నుంచి పుట్టినది.
అండాత్ జాయత ఇత్యండజః. జనీప్రాదుర్భావే. - గ్రుడ్డువలనఁ బుట్టునది Fish.
అండాజ్ఞాయతే అండజః, జనీ ప్రాదుర్భావే. - గుడ్డువలనఁ బుట్టునది Bird.
పక్షిసర్పాదయో అణ్డజాః,
అండాజ్జాయంత ఇత్యండజాః, జనీ ప్రాదుర్భావే. - గ్రుడ్డువలనఁ బుట్టినవి.
1. పక్షులు పాములు మొదలైనవాని పేరు. అదిశబ్దముచేత పిపీలికాదులకును పేరు.
అండపీతము - (జం.) గ్రుడ్డులోని పసుపు పచ్చని పదార్థము, జెన (Yolk)
పీతనగము - (జం.) భ్రూణము ఏక భిత్తిక గో ళ ద శ యం దు న్న ప్పు డు ఆద్యాంత్రముఖమునకు బిరడావలె నుండు అండపీతముతో నిండిన జీవకణములు (Yolk plug).
అండపీతకళ - (జం.) అండపీతము చుట్టును ఉండు పొర (Vitelline membrane).
కోశము - 1.కత్తియొర, 2.గ్రుడ్డు, 3.పుస్తకము, 4.బొక్కసము, (పంచ కోశములు:- అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు).
పేశి - 1.గ్రుడ్డు, 2.కత్తియోర, 3.మాంసపుముద్ద.
విౘ్చుకత్తి - ఒరదూసిన కత్తి.
వేశీ కోశో ద్విహీనే(అ)ణ్డమ్,
వేశయతి గర్భమితి వేశీ. పిశ అవయవే. - దీనియందు గర్భం బ(అ)వయవ యుక్తమగును.
గర్భస్య కోశత్వా త్కోశః - గర్భమున కాధారమైనది.
పేశీనాం మాంసఖండానాం కోశః పేశీకోశః - మాంసఖండముల యొక్క సమూహము అని యేకనామముఁగా గొందఱు.
అమతి నిస్సరత్యస్మాచ్ఛితి రిత్యండం. అమ గతౌ. - దీనివలనఁ బిల్ల(పిల్ల) వెడలును. ఈ 3 గ్రుడ్డు పేర్లు.
గుడ్దు - (వ్యావ.) 1.అండము, 2.సున్న.
అండము - 1.గ్రుడ్డు, 2.వృషణము, (జీవ.) 3.వీర్యము, శుక్లము (ovum).
గ్రుడ్డు - 1.కనుగ్రుడ్డు, 2.పక్షుల అండము, విణ.గ్రుడ్డితనము.
డింభము - పిల్ల, గ్రుడ్దు.
డయతే డింభః, డీఙ్ విహాయసాగతౌ. - కాలక్రమమున నెగయునది.
డయతే గమనాయ డింభా, డీఙ్ విహాయసాగతౌ. - గమనము కొఱకు నెగయునది. గ్రుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిదిట.
డీనము - పక్షిగతి, మీది కెగరుట.
డిమ్భౌతు శిశు బాలిశౌ,
డింభశబ్దము శిశువునకును, మూర్ఖునికిని పేరు. డయతే డింభః, దీఙ్ విహాయసా గతౌ. - ఎరుగువాఁడు.
బాల - పదునారేండ్లకు లో బడిన పిల్ల.
బాలాజీ - శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, విణ.బాలా.
బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.
పరదత్తం బలిం పూజాంశ్యతీతి బలిశః; బలిశ ఏవ బాలిశః - తనకుఁ జేసిన సన్మానమును జెఱుచుకొనువాఁడు బాలిశుఁడు.
దేవతార్థం దత్తమవూపాది బలిం శ్యతి భక్షణేన తనూకరోతీతి బలిశః; బలిశ ఏవబాలిశః - దేవతార్థమై యుంచఁబడిన యపూపాదులను భక్షించి స్వల్పముగాఁ జేయువాడు.
డింభౌషణము - (గృహ.) పొదుగుటకు అనుపగుస్థితి, గ్రుడ్లుగాని, క్రిమిబీజములుగాని వృద్ధి పొందుటకు అనువగు సూచనలు అనగా తగు శీతోష్ణస్థితులు కలిగి యుండుట, (Incubation).
డింభౌషణకాలము - (జం.) గ్రుడ్డు పగిలి దానినుండి ప్రాణి బయటికి వచ్చుటకు పట్టుకాలము, శరీరమున రోగజీవులు ప్రవేశించినది మొదలు రోగ చిహ్నములు పైకి కనబడువరకు పట్టుకాలము (Incubation period).
డింభాకృతియుత రంభానటరత
జంభారివినుత కుంభోద్భవ నుత| ||శరవణభవ||
పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
పుస్తకము - పొత్తము.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి.
ఐందవి - పల్కుజెలి, సరస్వతి.
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ.
శరజ్జ్యోత్స్నాశుద్ధాం - శశియుత జటాజూట మకుటాం
వరస్త్రాసత్రాణ - స్ఫటికఘు(ఘ)టికా పుస్తక కరామ్,
సకృన్నత్వా న త్వా - కథమివ సతాంసన్నిద ధతే
మధుక్షీరద్రాక్షా - మధురిమధురీణాః ఫణి తయః. - 15శ్లో
తా. తల్లీ! శరత్కాలమునందలి వెన్నెలను పోలిన(చంద్రికవలె) శుద్ధమైన శరీరము కలదానవు, శిరస్సున చంద్రునితో గూడిన జడముడి యున్న కిరీటము కలదానవు, సకలాభీష్టములను తీర్చు వరముద్రను, భయము నుండి రక్షించునట్టి (వర అభయ ముద్రలను), స్ఫటిక మణులతో గూర్చిన అక్షమాలను, పుస్తకము(పొత్తువు-సరస్వతి, సం.పుస్తకమ్.)చేతుల ధరించిన నిన్ను ఒక్కసారి యైనను నమస్కరించిన సజ్జనులకు - ఎల్లప్పుడు తేనియ, ఆవుపాలతో, ద్రక్షాఫలములతో సాటివచ్చు(సదృశ్యమైన) మాధుర్య వంతమైన వాగ్వైఖరీ వైభవము, మధురమైన వాక్కులు ఎట్లు ప్రాప్తింప కుండును? - సౌందర్యలహరి
గ్రంథము - 1.కావ్యము, పుస్తకము, 2.ధనము, 3.ముప్పది రెండక్షరముల శ్లోకము.
కితాబు - 1.బిరుదు, 2.పుస్తకము.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధిని ప్రీణనే. - సంతోష పెట్టునది. 'ధన ధాన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
ప్రబంధము - కావ్యము.
కావ్యము - కవికృత గ్రంథము, కవి కల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కావ్యుఁడు - శుక్రుడు. శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలొ నొకటి (Venus).
పుస్తకేషుచ యావిద్యా పరహస్తే చ యద్ధనమ్|
సమయేతు పరిప్రాప్తేన సావిద్యా నతద్ధనమ్||
తా. పుస్తకములోని చదువు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.), పరులకిచ్చిన ధనము, ఇవి సమయమున కుపయోగింపవు. - నీతిశాస్త్రము
గంజము - 1.గాదె, 2.తిరస్కారము, 3.గోష్ఠము, పసులపాక, 4.అంగడి, 5.బొక్కసము.
కోష్ఠము - 1.లోకడుపు, 2.గాదె, 3.సామాగ్రు లుంచుకొనుకొట్టు, (జం.) అననుకూల పరిస్థితులలోగాని ఒక ప్రాణిచుట్టును ఏర్పడిన నిరోధక శక్తికల పొర (Cyst) (cneystment) = పరివేష్టనము, (వృక్ష.) కోశము, అండాశయములో నుండు గది (Locule).
పుంసి కోష్ఠో(అ)న్తరజ్ఠరం కుసూలో (అ)న్తర్గృహం తథా,
కోష్ఠ శబ్దములోని కడుపునకును, గాదెకును, లోపలియింటికిని పేరు.
కుప్యతే (అ)స్మిన్ని తికోష్ఠ, కుషనిష్కర్హే. - దీనియందుఁ గూర్చఁబడును.
క్రీగడుఁపు - (క్రిందు+కడుపు) పొత్తి కడుపు.
వస్తి - 1.బద్దె, 2.పొత్తికడుపు.
బద్దె - 1.వస్త్రము మొదలు, 2.అపరకర్మము చేయునపుడు జందమువలె వేసుకొను వస్త్ర ఖండము (బద్దియ), సం.వస్తిః, పట్టికా.
వ్రీహ్యగారము - 1.గాదె, 2.వడ్లకొట్టు.
వ్రీహి - 1.వడ్లు, 2.ధాన్యము.
తిరస్కృతి - తిరస్కారము.
తిరస్కరిణి - 1.తెర, 2.ఒకానొక మంత్ర విద్య.
తెర - 1.మరుగుచీర, 2.అల, 3.పరంపర, సం.1.తిరః, 2.తరంగః, 3.పరంపరా, వై.వి. (భౌతి.) ప్రతిబింబములను పట్టుటకు వీలయిన సమతలము, (Screen).
కోట్టాము - 1.పసుల గట్టెడిచోటు, రూ.కొట్టము, సం.గోష్ఠమ్, 2.కొట్టు, సం.కోష్ఠమ్.
కొట్టు1 - కొట్టడి; కొట్టడి - సామగ్రు లుంచుగది, రూ.కొట్టు, సం.కోష్ఠః.
కొట్టు2 - క్రి.ప్రహరించు.
ద్వికోష్ఠకము - (వృక్ష.) రెండు గదులుగలది, Bilocular, (అండాశయము).
గోష్ఠము - ఆవులమంద యుండు చోటు, గొట్టము.
గోష్ఠం గోస్థానకమ్ -
గావ స్తిష్ఠంత్యత్ర గోష్ఠం, ష్ఠా గతినివృత్తౌ. - దీనియందు గోవులుండును.
గవాంస్థానం - గోవులుండెడి స్థానము. ఈ 2 ఆవులుండెదు మంద పేర్లు.
కోట్టాము - 1.పసుల గట్టెడిచోటు, రూ.కొట్టము, సం.గోష్ఠమ్, 2.కొట్టు, సం.కోష్ఠమ్.
కొట్టు1 - కొట్టడి; కొట్టడి - సామగ్రు లుంచుగది, రూ.కొట్టు, సం.కోష్ఠః.
కొట్టు2 - క్రి.ప్రహరించు.
ద్వికోష్ఠకము - (వృక్ష.) రెండు గదులుగలది, Bilocular, (అండాశయము).
గొట్టము - క్రోవి, (భౌతి.) ఒక చోటు నుండి మరియొక చోటికి, ద్రవ్యములను గాని, వాయువునుగాని, కొనిపోవు పరికరము (Tube). నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనక్రోవి.
బొక్కసము - 1.పంటసాల, 2.ముల్లె, 3.ధనాగరాము.
ఉగ్రాణము - 1.సామగ్రు లుంచెడిగది, 2.బొక్కసము.
భాండాగారము - బండారము, బొక్కసము.
భండారము - బొక్కసము.
బండరువు - (భండారువు), బొక్కసము, రూ.బండారము, బండారు(బండారు - పసుపు పొడి), సం.భండారః.
బండారి - బొక్కసమున కధికారి. ఖజానా - ధనాగారము.
మూట - ముడియ, ముల్లె.
ముడియ - మూట.
ములుగు1 - బొక్కసము, సం.మూలకమ్.
మూలకము - (రసా.) ఎట్టి రాసాయనిక క్రియలచేతను భిన్న ధర్మములు గల సూక్మపదార్థములుగా విభజింపవీలుగాని పదార్థము.
ములుగు2 - క్రి.మూలుగు.
మూలుగు - క్రి.నొప్పిచేబాధపడు, కూయు.
కూయి - కుయ్యి.
కూయు - క్రి.అరచు, మొరపెట్టు.
కోశాధికారి - ఒక సంస్థ యొక్క లేక ప్రభుత్వము యొక్క బొక్కసముపై అధికారి.
రాజ్యాంగములు - (రాజ.) రాజు, మంత్రి, చెలికాండ్రు, భాండారము, పట్టణము, కోట, సైన్యము అనునవి ఏడు.
ఆశ్వాసము - 1.గ్రంధభాగము, 2.ఊరడించుట, 3.బతిమిలాడుట.
ఉపోత్ఘాతము - 1.పీఠిక, 2.ఆరంభము.
అవతారిక - పీఠిక. పీఠికాయాం పురూహూతికా శక్తిపీఠం|
పీఠిక - 1.మేలైన పీఠము, 2.గ్రంథ ప్రారంభమున వ్రాయు ఉపోత్ఘాతము.
పీఠము - 1.ఇల్లు కట్టుటకు వేసిన పునాది స్థానము (Plinth), 2.పీట.
పట్టుచీర ఎరువిచ్చి, పీటపట్టుకొని కూడా తిరిగిందిట.
పీఁఠవెట్టు - క్రి.లేవక యొక చోటనే నాదుకొని యుండు.
ఆసనము - 1.పీఠము, 2.దేశకాలాదులను పట్టి దండెత్తిపోక నిల్చియుండుట (వ్యతి)యానము, 3.యోగాసనము.
పీఠ మాసనమ్,
పీఠ్యతే సంశ్లిష్యతే పీఠం, పీఠ సంశ్లేషణే. - పొందఁబడునది.
ఆస్తే (అ)త్రేత్యాసనం, ఆస ఉపవేశనే. - దీనియందుఁ గూర్చుందురు. ఈ 2 పీఁట పేర్లు.
ఆసనాస్థి - (జం.) తుంటి ఎముకలలో ఒకటి (Ischium).
పీఠసంయోగము - (వృక్ష.) ఒక గది మాత్రమే గల అండాశయములో క్రింది భాగమున పుష్పాసనము పై నేర్పడిన జరాయువు మీద నొకబీజాండ ముండు స్థితి (Basal placentation).
బాలాతపః ప్రేతధూమో వర్జ్య భిన్నం తథా సనం|
వచ్ఛింద్యాన్నఖరోమాని దంతైర్నోత్పాట యే ర్నఖాన్||
తా. లేత యెండయును, పీనుగుమీది పొగయును, విఱిగిన(ఆసనము- 1.పీఠము, 2.దేశకాలాదులను పట్టి దండెత్తిపోక నిల్చియుండుట (వ్యతి.) యావము, 3.యోగాసనము.)పీటయును వర్జింప దగును(విడువ దగినవి), గోళ్ళను, వెంట్రుకలను గిల్లరాదు, దంతము - పల్లు, కోర )చేత గోళ్ళను గొఱుక(కొరక)రాదు. - నీతిశాస్త్రము
ఆగమ నిగదిత మంగళ గుణగణ
ఆదిపురుష పురుహూత సుపూజిత | ||శరవణభవ||
తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
8. పుష్యమి - పుష్యమి నక్షత్రము(మీన లగ్నంలో) భరతుడు, దశరథ కుమారుడు జన్మించెను.
భరత ప్రాణప్రియకర రామ్| భరతార్పిత నిజపాదుక రామ్|
రామరాజ్యము - రాముని రాజ్యము సుఖమైన రాజ్యమని వాడుక యందలి యర్థము. భరతుని పట్టణము, రాముని రాజ్యము సుఖప్రదములే. రాముని వంటి రాజుంటే, ఆంజనేయుని వంటి బంటు వుంటాడు.
కైకేయి - కైక, కేకయ రాజపుత్రి, భరతునితల్లి.
కేకయి - కై కేయి. కై కేయీ తనయార్థిత రామ్|
మానిని చెప్పిన ట్లెఱుకమాలినవా డటుచేసి నన్ మహా
హానిఘటించు నే ఘనునికై ననసంశయము, యుర్విపైగృపా
హీనత బల్కినన్ దశరథేశ్వరు డంగనమాటకై గుణాం
భోనిధి రాముఁబాసి చనిపోవడె శోకముతోడ, భాస్కరా.
తా. భార్యయగు కైక (అంగన)దయలేక పలికిన మాటకై దశరధుడు మారు పలకనివాడై, పుత్ర ప్రేమచే, గుణాంభోనిధి రాముడు అడవికి పోవుటను సహించనివాడై, దశరథ సంతత చింతిత రామ్| దుఃఖితుడై చనిపోయెను. కావున(మానిని - మానవతి)స్త్రీల మాటవలన రాబోవు విషయము నాలోచింపక వారు చెప్పిన చొప్పున ప్రవరించినచో ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు. నెట్టివారైనను గొప్పహాని బొందుదురు.
దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ|
రామరాజ్యంబు నిప్పుడు రా ముదంబె
యౌర! యేమొ సుగ్రీవాజ్ఞ సారమౌనె
యాంజనేయునిభక్తి భాగ్యంబె సీత
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
బృహస్పతిః ప్రథమం జాయమానః | తిష్యం నక్షత్రమభి సంబభూవ | శ్రేష్ఠో దేవానాం పృతనాసుజిష్ణుః | దిశోను సర్వా అభయన్నో అస్తు | తిష్యః పురస్తాదుత మధ్యతో నః | బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ | బాధేతాం ద్వేషో అభయం కృణుతామ్ | సువీర్యస్య పతయస్స్యామ ||6||
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఈ,పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు లనంబడును, వారలకై నను వానికైనను ప్రభువు.
సురాచార్యుఁడు - గురువు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
ప్రథమము - 1.ముఖ్యము, 2.మొదటిది.
ముఖ్యము - ప్రధానము.
జాయమానము - విణ.1.కలుగుచున్నది, 2.పుట్టుచున్నది.
అంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు. అంగిరసః అపత్యం అజ్గీరసః - అంగిరస్సు కొడుకు.
ఆంగిరస - 1.ప్రభవాది షష్ఠి సంవత్సరము లలో ఒకటి, 2.పుష్యమీ నక్షత్రము.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.
పరమము - పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము, 2.ఆద్యము, 3.ప్రధానము.
పరమము - (భౌతి.) అన్నిటికిని పరమైనది (Absolute).
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మని మనసి భవతి త్యాత్మభూః ఊ-పు. మనస్సున బుట్టువాఁడు.
ఆత్మనా స్వయమేవ భవతీతివా - తనంతతనే పుట్టువాఁడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివి తేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ. మది.
మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే..
మారుఁడు - మన్మథుడు.
మారయతి విరహిజనం మారః - విరహిజనులను జంపువాడు, మృఙ్ ప్రాణత్యాగే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
ప్రజాపతేరంగిరసః స్వధా పత్నీ పితౄ నథ|
అథర్వాంగిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ|
వాచస్పతి - సు రా చా ర్యు డు, బృహస్పతి.
వాచాం పతిః వాచస్పతిః - వాక్కులకు పతి.
వాగీశో వాక్పతి స్సమౌ,
వాచామీశో వాగీశః, వాచాం పతిర్వాకపతిః - వాక్కులకు కర్త వాగీశుఁడు, వాక్పతియును. ఈ 2 (గ్రద్యపద్యాది ప్రబంధములను) నిర్ధోషముగాఁ బలుకనేర్చినవాని పేర్లు.
భారతి - 1.సరస్వతి, 2.వాక్కు.
బిభర్తీతి భారతీ. ఈ. సీ. భృఞ్ భరణే - భరించునది.
భరతేన మునినా అవతారితత్వాద్వా భారతీ - ఈ లోకమునకు భరతుఁడను ముని చేత తేఁబడినది.
ఇడ - 1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గురు ర్గురుతమో ధామ సత్యస్సత్య పరాక్రమః|
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||
సురాచార్యుఁడు - బృహస్పతి.
బృహస్పతి - సురగురువు, 2.గురుడు.
గురుఁడు - 1.గురువు, 2.బృహస్పతి (Jupiter).
వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ. యుక్తయుక్తముగా మాటాడు వాడు.
మాటకారి - 1.వాగ్మి, 2.వాచాటుడు. మాటలమారి - వాచాటుడు.
వక్త - 1.విశేషముగ మాటలాడువాడు, వాచాటుడు, 2.పండితుడు.
వచత్నువు - 1.వక్త, సభలో నిర్భయముగా మాటాడు నతడు, 2.బ్రాహ్మణుడు.
లాజము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
వచము - చిలుక. పలుకుఁ దత్తడి - చిలుక. ౘదువుల పులుఁగు - చిలుక.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
రామతమ్మ - చిలుక.
చిరి - చిలుక; చిలుకలకొలికి - స్త్రీ.
చిలుకరౌతు - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మదనః, మదయతీతి మదనః - మదింప జేయువాఁడు. మదీ హర్ష గ్లేపనయోః.
కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
చిలుక - కీరము, శుకము, రూ.చిల్క.
శుకము - చిలుక.
చిరి - చిలుక; చిలుకలకొలికి - స్త్రీ.
కీరశుకౌ సమౌ,
కీతి శబ్దం రాతి కీరః. రా ఆదానే. కీ యను శబ్దమును గ్రహించునది.
వుకతీతి శుకః శుక గతః. చరించునది. ఈ రెండు చిలుక పేర్లు.
శుకవాహుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం, మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.
రాకొమరుల్ రస్జుని దిరంబుగ మన్నననుంచి నట్లు భూ
లోకమునందు మూఢుఁదమలోపలనుంపరు, నిక్కమేకదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురు గాక, పెంతురే
కాకము నెవ్వరైన, శుభకారణ సన్ముని సేవ్య! భాస్కరా.
తా. చిలుకను చూచినా, దాని పలుకులను ఆలకించినా మానవులకు ఆనందం కలుగుతుంది. ఎవ్వరైనను మనుష్యులు భూమిమీద చిలుకను పెంచుదురు గాని కాకిని (కాకము - కాకి, వాయసము.) పెంచరు. అట్లే, ప్రభువులు ఒక రసజ్ఞుని(పండితుని) పోషించిన విధముగా మూర్ఖుని తనఇంటిలో నుంచి కొనరుగదా.
వాచస్పతిస్తథా మిథ్యావక్తా చేద్దానవాన్ప్రతి |
కః సత్యవక్తా సంసారే భవిష్యతి గృహాశ్రమీ ||
పుష్యమి - పుష్యమి నక్షత్రము.
పుష్యము - ఒక నక్షత్రము, పౌషమాసము.
పౌషము - పుష్యమీ నక్షత్ర సహిత పూర్ణిమగల నెల,
తైషము - పుష్యమాసము. పుష్యమాసంలో పూసలు గుచ్చేపాటి పొద్దేనా ఉండదు.
పుష్యే తు సిద్ద్యతిష్యా :
పుష్ణాతి అభిలషితమితి పుష్యః పుష్యంత్యస్మి న్నర్థా ఇతి వా పుష్యః, పుష పుష్టౌ - కోరికను వృద్ధిఁ బొందించునది.
సిద్ధ్యం త్యస్మిన్నర్థా ఇతి సిద్ధ్యః(సిద్ధము - 1.ఆయితమైనది,2.ఈడేరినది.) - దీని యందు ప్రయోజనములు సిద్ధించును గనుక సిద్ధ్యము.
సాధ్నోతి వాంఛిత(వాంఛితము-కోరబడినది)మితి సిద్ధః - కోరికను సాధించునది.
తుష్యం త్యస్మి న్నర్థసిద్ధయే ఇతి తిప్యః తుష తుష్టౌ(తుష్టి - 1.తృప్తి, 2.సంతోషము.) - దీనియందు కార్యసిద్ధి కొఱకు సంతోషింతురు.
త్వేషత ఇతి వా తిప్యః త్విష దీప్తౌ - ప్రకాశించునది. ఈ మూడు పుష్యమీ నక్షత్రము పేర్లు.
ఋష్యమాసంబున భగుండను నామంబు దాల్చిస్పూర్జుం దరిష్టనేమి యూర్ణం దాయువు కర్కోటకుండు పూర్వచిత్తి యనెదు సభ్యజన పరివృత్తుండై కాలక్షేపణంబు సేయుచునుండు;
పుష్య మాసంలో సూర్యుడుSun భగుడనే పేరు ధరించినవాడై స్పూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణుడు, ఆయువు(ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.), కర్కోటకుడు(క్షేడము - కర్కోటము అను పాము), పూర్వచిత్తి అనేవారు సభ్యజనులై అనుసరింపగా సమయం జరుపు తుంటాడు.
నూపురాలంకృతపదో వ్యాళయజ్ఞోప వీతకః,
భగనేత్రహరో దీర్ఘబాహు ర్బంధ విమోచకః|
కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ|
గుణాంబా గుహ్యాకారాధ్యా కోమలాంగీ గురుప్రియా. - 139శ్లో
భగము - 1.ఆడుగురి, 2.సంపత్తి(సంపత్తి - సంపద, సంవృద్ధి), 3.వైరాగ్యము, 4.తెలివి, 5.వీర్యము, 6.కీర్తి, 7.మహత్త్వము.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
భగశ్శ్రీ కామమహాత్మ్య వీర్య యత్నార్క కీర్తిషు,
భగశబ్దము ఐశ్వర్యమునకును, ఇచ్ఛకును, దొడ్దతనమునకును, శక్తికిని, ప్రయత్నమునకును, సూర్యునికిని, కీర్తికిని, పేరు.
భజ్యత ఇతి భగః భజసేవాయాం. - ఆశ్రయింపఁ బడునది.
'భగంశ్రీయోనివీర్యేషు జ్ఞానవైరాగ్యధర్మయో'రితి రభసః. - జ్ఞానవైరాగ్య యోర్యోనౌ భగమస్త్రీ రవౌతునా'ఇతి రుద్రః.
బాగు- క్షేమము, విణ.యోగ్యమైనది, సం.భగః.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
శుభంయువు - శుభముతో గూడుకొన్నవాడు.
శుభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.
శుభము - మంగళము; మంగళము - శుభము, క్షేమము.
శుభంయుస్తు శుభాన్వితః,
శుభమితి మాంతమవ్యయం మంగళార్థే, శుభమస్యేతి శుభంయుః - శుభము గలవాఁడు.
శుభేనాన్వితః శుభాన్వితః. - శుభముతోఁ గూడుకొన్నవాఁడు. ఈ 2 శుభము గలవాని పేర్లు.
సర్వమంగళ - పార్వతి.
సరాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమతమైన శుభములు గలది.
మంగళ - పార్వతి.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. ఈ. సీ. – పర్వతమునకు గూతుఁరు.
మంగళదేవత - లక్ష్మి.
భగాంగా భగరూపా చ భక్తిభావపరాయణా,
ఛిన్నమస్తా మహాధూమా తథా ధూమ్ర విభూషణా|
త్విషాంపతి - సూర్యుడు.
త్విషాం ప్రభాణాం పతిః, త్విషాంపతిః, ఇ.పు. - కాంతులకు పతి. అలుక్సమానము.
త్విట్టు - 1.జిగి, కాంతి, 2.మంట, 3.వెలుగు, రూ.త్విష.
త్వేషతే త్విత్, ష. సీ. త్విష దీప్తౌ - కాంతి యుక్తమైనది.
జిగి - కాంతి.
జిగిలి - చక్కనైనది.
తిష్యః పుష్యే కలియుగే :
తిష్యశబ్దము పుష్యనక్షత్రమునకును, కలియుగము నకును(కర్మయుగము - కలియుగము)పేరు. త్వేషతే తిష్యః త్విష దీప్తౌ. ప్రకాశించునది. "తిష్యా త్వామలకీ స్త్రియా"మితి శేషః.
అహర్పతి- 1.సూర్యుడు, 2.శివుడు, 3.జిల్లేడు.
అహ్నపతిః అహర్పతిః, ఇ. పు. - పగటికిఁ బ్రభువు. అహస్కరుఁడు - సూర్యుడు.
భానుఁడు - 1.సూర్యుడు, 2.ఒక సంస్కృత నాటక కవి.
భాతీతి భానుః, ఉ.పు. భాదీప్తౌ - ప్రకాశించువాఁడు.
భానూ రశ్మి దివాకరౌ,
భానుశబ్దము కిరణమునకును, సూర్యునికిని పేరు. భాతీతి భానుః, భా దీప్తౌ. - ప్రకాశించును గనుక భానువు.
రశ్మి - (భౌతి.) 1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.
భానువు - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు.
భా - 1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు. భామము - 1.కోపము 2.రోషము 3.సూర్యకిరణము.
భామ - స్త్రీ. భామలలో దేవీస్థానం తిలోత్తమ|
భామిని - 1.క్రీడాసమయమందు కోపము చూపెడు స్త్రీ, 2.స్త్రీ.
కోపనా సైవ భామినీ :
కోపశీలా కోపనా - కోపమే స్వభావముగాఁ గలిగినది.
భామ్యత్యవశ్యం కుప్యతి భామినీ. భామక్రోధే. - అవశ్యము కోపగించు కొనునది. ఈ రెండు కోపముగల స్త్రీ పేర్లు.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.
బావ - తోడ పుట్టిన దాని మగడు, సం.భావుకః.
భావుకుఁడు - తోడపుట్టిన దాని మగడు, బావ.
భానుఁడు తూర్పునందు గనుపట్టినఁబావక చంద్రతేజముల్
హీనతజెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము సేయుచున్నఁ బరదై వమరీచు లడంగ కుండునే
దానవ గర్వనిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ.
తా. సూర్యుని కాంతికి అగ్ని మొదలయినవాని కాంతులడంగునట్లు జగత్తతయు ప్రకాశించున్నా నీ పదధ్యానము యొక్క ప్రకాశమునకు ఇతర దేవతల(మరీచి - 1.కిరణము, 2.వెలుగు, 3.ఎండమావులు, 4.ఒక ప్రజాపతి.)ప్రకాశములు అడఁగిపోవును.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుక సమర్పిత జానుః,
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచ త్యాశా పాశః| - 16
పగలు సూర్యునివైపు వీపును, ముందరకు చలిమంటను పెట్టుకొని, రాత్రులందు మోకాళ్ళకు గడ్డాన్ని ఆనించి ముడుచుకుంటూ, భిక్షాపాత్ర బదులుగ దోసిట్లోనే భిక్ష తీసుకొని తింటూ, చెట్లకిందనే కాలం గడుపుతున్న వ్యక్తి కూడా, ఆశాపాశాన్ని తొలగించుకోడు - భజగోవిందం
In front, there is fire; at the back, there is the Sun; in the night, (the ascetic sits) with the knees stuck to the chin; he receives alms in his palms, and lives under the trees; yet the bondage of desire does not leave him.
హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
హంతి తమ ఇతి హంసః హన హింసాగత్యోః - తమస్సును బోఁగొట్తువాఁడు.
సహస్రాంశువు - సూర్యుడు, వేవెలుగు.
సహస్రమంశవో యస్య సహస్రాంశుః, ఉ.పు - వేయికిరణములు గలవాఁడు.
తపనుఁడు - సూర్యుడు.
తపతీతి తపనః, తపసంతాపే - తపింపఁ జేయువాఁడు.
లేఁబగలు - (లేత+పగలు) ప్రాహ్ణము.
ప్రాహ్ణము - ఉదయాదిగ పది గడియలవరకు గల కాలము, లేబగలు.
తాపత్రయము - మూడు విధములైన తాపములు - ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆదిభౌతికము.
తపనీయము - బంగారు.
తాప మర్హతీతి తపనీయం, తప సంతాపే. - కాఁచుటకు యోగ్యమైనది.
గౌరుఁడు - చంద్రుడు.
చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా.
నెల మేపరి - రాహువు Rahu.
సోపపవుఁడు - రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు).
గౌరో (అ)రుణేసితే పీతే -
గౌరశబ్దము ఎఱుపు వస్తువునకును, తెలుపువస్తువు నకును, పచ్చవస్తువునకును పేరు. మఱియు, మృగవిశేషమునకును పేరు.
గూయత ఇతి గౌరః, గుఞ్ గతౌ. - పొందబడునది గాని, యెఱుఁగఁబడునదిగాని గౌరము.
అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.
అరుణవర్ణత్వాదరుణః - ఎఱ్ఱనికాంతి గలవాఁడు.
అరుణవర్ణత్వాదరుణా - ఎఱ్ఱవన్నెగలది.
అవ్యక్తరాగ స్త్వరుణః -
ఇయర్తీత్యరుణః ఋ గతౌ. - మనస్సును బొందునది. ఈ ఒకటి వ్యక్తము కాని యెఱుపు పేరు.
రంజనకిరణములు - (భౌతి.) ఒక శూన్యావరణములో నుంచబడిన ఋణాగ్రము నుండి వెలుతురు ఎలక్ట్రాను కిరణ పంక్తి ఒక వస్తువుపై బడినప్పుడు ప్రార్భవించు తేజః కిరణ విశేషము, (Rontgen rays).
విరించి - బ్రహ్మ.
విరించిః ఇ-పు. విరచయతి భూతాని విరించిః - భూతములను సృజించువాఁడు.
విభిః హంసై రిచ్యతే ఉహ్యత ఇతి వా-వి శబ్దము పక్షి వాచకము గనుక హంసలచేత వహింపఁ బడువాడు
కవీంద్రాణాం చేతః - కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః - కతిచిదరుణా మేవ భవతీమ్,
విరించిప్రేయస్యా - స్తరుణ!తరశృంగారలహరీ
గభీరాభి ర్వాగ్భి - ర్విదధతి సతాం రంజన మమీ| - 16శ్లో
తా. ఓ జననీ! ఏ సుజనులు కవుల మనస్సు లనెడి పద్మవనమునకు లే యండయైన ఎఱ్ఱనగు - అరుణా! ( అను పేరుగల లేక అరుణ వర్ణము గల)నిన్ను సేవింతురో - వారు(విరించి- బ్రహ్మ)ప్రియురాలగు సరస్వతి యౌవన శృంగార(లహరి -1.పెద్ద అల, 2.వీచి.) ప్రవాహముచే, గంభీరమైన వాక్కులచే సత్పురుషుల హృదయాన్ని రంజింప చేయుచున్నారు. - సౌందర్యలహరి
అరుణారుణకౌసుంభ - వస్త్రభాస్వత్కటీతటీ|
రత్నకింకిణికారమ్య - రశనాదామభూషితా.
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్థ
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే|
దృష్టి ప్రవృష్ట కమలోదరదీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః|| - 10
సర్వంసహ - భూమి.
సర్వం సహత ఇతి సర్వంసహా, షహమర్షనే. - సర్వమును సహించునది.
సహ - భూమి.
సై - సహ, తోడ, రూ.సయి, సం.సహ.
సయ్యాట - (సయి+ఆట) 1.సహక్రీడ, 2.లీల, 3.సల్లాపము, రూ.సయ్యాటము.
సయ్యాటించు - క్రి.పరిహసించు.
సల్లాపము - పరస్పరసంభాషణము, రూ.సల్లపనము.
సైదోఁడు - తోబుట్టువు.
సహజీవి - (జం.) సహజీవనముచేయు ప్రాణులలో ఒకటి (Symbiont).
సహజీవనము - (వృక్ష.) ఒక తరగతి ప్రాణియు మరియొక తరగతి ప్రాణియు కలిసి పరస్పర లాభదాయకముగా జీవించుట (Symbioais).
సహవేదననాడులు - (జం.) పరిణాహ నాడీ మండలమునకు చెందిన ఒక తరగతి నాడులు (Sympathetic nerves).
సహసమన్వయము - (భౌతి., గణి రసా.) ఒకదానితో నింకొకదానిని సంబంధమునకు తెచ్చుట. రెండిటి మధ్య అనురూప్యమును గాని సంబంధమును గాని స్థాపించుట.
సహదర్మణి - భార్య.
పత్యాభర్త్రా సహ ధర్మః దాన యజ్ఞాది రస్యా ఇతి సహధర్మణీ, సీ. - పతితోఁ గూడ దానయజ్ఞాది ధర్మములు గలిగినది.
సహవాసము - 1.కూడనుండుట, 2.స్నేహము.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
సహచరుఁడు- మిత్రుడు, విణ.కూడదిరుగువాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun. సుహృదుఁడు - మిత్రుడు.
సహోదరుఁడు - తోడబుట్టినవాడు.
సహోదరి - తోడబుట్టినది.
సమానోదర్య సోదర్య సగర్భ్య సహజా స్సమాః,
సమానే ఉదరే శయితః సమానోదర్యః, సోదర్యశ్చ - ఒక గర్భమందున్నవాఁడు.
సమానే గర్భేభవ స్వగర్భాః - ఒక గర్భమునఁ బుట్టినవాఁడు.
సహ జాయత ఇతి సహజః, జనీ ప్రాదుర్భావే. - కూఁడబుట్టినవాఁడు. ఈ 4 ఒకతల్లి బిడ్డల పేర్లు.
సోదరుఁడు - తోడబుట్టినవాడు.
సోదర్యుఁడు - సోదరుడు.
సౌభ్రాతము - మంచి తోడపుట్టుతనము.
సహజ - తోడబుట్టినది.
ఆఁడుతోడు - సోదరి, తోడబుట్టువు.
సోదరి - తోడబుట్టినది.
తోఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోబుట్టుగు, తో బుట్టువు, తోడబుట్టువు.
తోడ(ౘ)చూలు - తోబుట్టువు.
తోడఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోడబుట్టువు.
తల్లిని దండ్రిని సహజల
నల్లరఁబెట్టినను వార * లలుగుచు నీపై
నుల్లముల రోయుచుందురు
కల్లరి వీఁటనుచుఁ గీర్తి * గందఁ గుమారా!
తా. తల్లిదండ్రులను, తోడఁబుట్టువులను కలవరపెట్టవలదు. వారు కోపింతురు, నీమీఁద మనస్సులో(రోయు - క్రి.1.రోతపడు, 2.వెదకు, 3.నిందించు) దుర్మార్గుఁడని తలంతురు. నీకు కీర్తి కలుగకుండునట్లు అసహ్యపడి నిందింతురు.
యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కుల స్త్రీ.
సభతృక - మగనాలు, ముత్తైదువు.
పతిపత్నీ సభర్తృకా,
జీవన్ పతి రస్యా అస్తీతి భర్తా సహితా సభర్తృకా - బ్రతికియుండు పెనిమిటిగలది. ఈ 2 మగనాలి పేర్లు.
భగిని - సహోదరి; సహోదరి - తోడబుట్టినది.
స్వస - తోడబుట్టునామె.
భగినీ స్వసా,
భగః కల్యాణం శ్రేయః వివాహే అస్యా ఇతి భగినీ - వివాహ మందిలి శ్రేయస్సు గలది.
సుష్ఠు అస్య సోద రాయాసమితి స్వసా. ఋ. సీ. అసు క్షేపణే. - సోదరుని (యా)ఆయాసమును బోఁగొట్టునది. ఈ రెండు తోడఁ బుట్టిన స్త్రీ పేర్లు.
భగినీపతి రావుత్తో -
అవతి భగినీమిత్యావుత్తః అవరక్షణే, తోఁబుట్టువు నేలువాఁడు. ఈ ఒకటి తోడఁబుట్టిన దాని మగని పేరు.
గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు - భూసురుడు.
విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.
బాఁపఁడు - బ్రాహ్మణుడు, సం.బ్రాహ్మణః.
బాఁపత - బ్రాహ్మణి.
భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
ఓరిమియే కలిగియుండిన
వారలఁ గని ప్రజ్ఞలేని * వా రనియెద; రౌ;
నారయ సత్పురుషాళికి
నోరిమియే భూషణంబు * రోరి కుమారా !
తా. ఓర్పుకలిగినవారినిఁ జూచి తెలివిలేనివారని పలుకుదురు. ఇది నిజమే. ఓర్పు కవచము వంటిది. సజ్జనులకు ఓర్పే అలకారమగును గాని మఱి యొకటి కాదు.
By whom is this world conquered?
By the person who has truthfulness and endurance.
సవిత- 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవిత్రుడు.
సువతి సుప్తం ప్రేరయతీతి సవితా, ఋ.పు. షూ ప్రేరణే - సుప్తుని ప్రేరేపించువాఁడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
తలి - జనని, రూ తల్లి.
తల్లి - జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
గీర్దేవి - సరస్వతి, వాగ్దేవి.
గృణం త్యేతామితి గీః. ర. సీ. గౄశబ్దే - దీనిని బలుకుదురు.
గృణాతి అస్ఖలితముచ్చరతీతి గీః - లెస్సఁగాఁ బలుకునది యని సరస్వతీ పక్షమందు.
ఉచ్యత ఇతి వాక్. చ. సీ. వచ పరిభాషణే – పలుకఁబడునది.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి.
సవిత్రీభి ర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం - సహ జనని సఞ్చిన్త యతి యః |
స కర్తా కావ్యానాం - భవతి మహతాం భఙ్గి రుచిభిః
వచోభిర్వాగ్దేవీ - వదన కమలామోదమధురైః || - 17శ్లో
తా. తల్లీ ! ఎవడు వాక్కుల నొసగు నట్టియు చంద్రకాంత మణులవలె ప్రకాశించు వశిన్యాది దేవతలచే కూడియున్న నీ దివ్యస్వరూపాన్ని ఎవరు ధ్యానించుచున్నాడో, (చంద్రకాంతమణి శిల అతిధావళ్యమును కలిగి యుండుట జగత్ప్రసి ద్ధము.) అతడు మహాత్ములవలె నింపగుననియు, కావ్యములను రచింప సమర్థుడవుచున్నాడు. అతని కవిత్వం మృదువైన తీయని మాటలచే రుచిమంతమై, సరస్వతీదేవి(గీర్దేవి - సరస్వతి, వాగ్దేవి.)యొక్క ముఖకమలము(వదనము - నోరు, ముఖము.), పద్మమువలె పరిమళాలను వెదజల్లుతుంది. - సౌందర్యలహరి
గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి|
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయైః
తస్త్యై నమస్త్రిభునైక గురోస్తరుణ్యై|| - 11
హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకానా మింద్రియాణామీశః - ఇంద్రిలములకు నీశ్వరుఁడు.
హృషీకం విష యీన్ద్రియమ్,
హృష్యంత్యనేనేతి హృషీకం, హృషతుష్టౌ. - దీనిచేత సంతోషింతురు.
విషయము- గ్రంథాదులందు దెలియు నంశము.
విషయో (అ)స్యాస్తీతి విషయి - విషయము గలిగినది.
ఇంద్రస్య అత్మనః లింగం ఇంద్రియం - ఇంద్రుఁడనఁగా నాత్మ; ఆత్మకు జ్ఞాపకముగనుక ఇంద్రియము. ఈ 3 ఇంద్రియముల పేర్లు.
హృషీకము - ఇంద్రియము.
ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు 5 అను శంఖ్య.
ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్షజ్ఞానము (Perception).
అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).
జీవితస్థాయి - (అర్థ.) వ్యక్తి తన జీవితావసరములను సమకూర్చుకొన గలుగు పరిమితి (Standard of Life).
అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామా తురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వమ్||
తా. ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్ష గలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలి కొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. – నీతిశాస్త్రము
ఖ - ఒక అక్షరము, సం.వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
ఖనతి జ్ఞానమితి ఖం, నీరూపత్వాద్దుర్ఝే యమిత్యర్థః, ఖను అవదారణే. - రూపము లేనిది కనుక బుద్ధిచేతఁ దెలియఁగూడనిది.
రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
రూయతే స్తూయత ఇతి రవిః. ఇ. పు. రుశబ్దే - నుతింపఁబడువాఁడు.
రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్ఠునికిని పేరు.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభ గుణము లేని రాజు.
ఆపన్నత్వ - గర్భిణి, వ్యు.లోపల ప్రాణిగలది.
ఆపన్నం గృహీతం సత్వం గర్భో (అ)నయే త్యాపన్నసత్త్వా - గ్రహింపఁబడిన గర్భముగలది.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
జీవయతి దేవానితి జీవః, జీవప్రాణధారనే - దేవతలను బ్రతికించువాఁడు.
జీవ్యతే మృతో (అ)నేనజీవః - చచ్చినవాఁడు ఈయనవలన బ్రతుకును.
జీవాత్మ - దేహి, జీవుడు.
శరీరి - ప్రాణి. జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాద్యాయుడు, 2.కులము పెద్ద,3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
ప్రాణి ఏకాంతరోత్త్పత్తిక్రమము - (జీవ.) ప్రాణి జీవమున లింగ సంబంధమును, లింగసంబంధము కానిదియునగు రెండు దశలు నొకదాని తరువాత నొకటి వచ్చుట ((Alternation of generations).
జీవోత్పత్తి క్రమము - (జీవ.) ప్రాణులు ఇదివరకున్న ప్రాణుల నుండియే పుట్టగలవు గాని ఆసస్మికముగా బయలుదేరుట కవకాశము లేదను భావన (Biogenesis).
జీవి - జీవించువాడు, వి.ప్రాణి. ప్రాణులలో మెలిగే - జీవి ఎవరు?
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఇ.పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు(బృహత్తు - గొప్పది)లనం బడును. వారలకై నను వానికైనను ప్రభువు.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
స్వర్గము - దేవలోకము.
రాము డొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో! విశ్వ.
తా. శ్రీరాముడు జన్మించి (రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)సూర్య వంశమునకు పేరుతెచ్చెను. దుర్యోధనుడు పుట్టి కౌరవ(కౌరవులు - కురువంశపు వారు.)కులమును పాడుచేసెను. ఈ ప్రపంచము లో(ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.)ను పుణ్యము, పాపము అనునవి యీ విధముగనే ఉండును.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
విహాయసగతిర్యోతిః స్సురుచిః హుతభుగ్విభుః
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః|
కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలను సాక్షియైనవాడు.
కర్మణః సాక్షీ కర్మసాక్షీ, న.పు. - కర్మలకు సాక్షి.
కర్మక్రియా -
కరణం కర్మ. న. క్రియా చ. డుకృఞ్ కరణే. - చేయుట గనుక కర్మ, క్రియయును, కర్మన్ శబ్దము పుంలింగమును గలదు.
"కర్మవ్యాప్యే క్రియాయాంచ పున్న పుంసక యోర్మతమ్" అని రుద్రుఁడు.
"క్షపయత్యశుభం కర్మ కర్మాణం చినుతే శుభ" మితి దశటీకాసర్వస్వకారః, అత్ర శేషకారః _ "కారః కృత్యం సనా కారిః ప్రశ్నోక్త్యోః కారికా కృతిః ఇతి టీ. స. ఈ 2 చేయుట పేర్లు.
కర్మ1 - ధాతువుయొక్క అర్థమైన ఫలమునకు ఆశ్రయమైనది, ఉదా. వాడు అన్నము వండెను. వండుట అను పనికి అన్నమగుట ఫలము. ఈవాక్యములో అన్నము కర్మ.
కర్మ2 - (భౌతి.) ఏబలప్రయోగ బొందువు కొంత దూరము ఆ బలము పనిచేయు దిక్కునకే జరుగునో, ఆబలము సాధనముగ ఒక ఫలమును జనింపజేయు క్రియ, (Work). (బలమును బలప్రయోగ బొందువు జరిగిన దూరముచే గణించినచో ఫలిత-కర్మ=(పని) లభ్యమగును).
కర్మంది - యతి.
కర్మిష్ఠుఁడు - 1.కర్మయందు అధిక నిష్టగలవాడు, 2.పనియందు నేర్పరి.
కర్మయుగము - కలియుగము.
కలి - 1.కయ్యము, కలియుగము, 4,32,000 సంవ. ల కాలము.
చతుర్థే పి యుగే కలిః : కలిశబ్దము కలియుగమునకూ, అపిశబ్దము వలన కలహమునకును పేరు.
కల్యన్తే స్నిన్మితి కలిః. పు. కల కిల క్షేపే. - దీనియందు ద్రొబ్బఁబడుదురు. నిపాతనము - దిగద్రొబ్బుట, పడద్రోయుట. ద్రొబ్బు - క్రి. పడదోయు.(బడుదురు)
కల్యన్తే బాణా అత్రేతి కలిః, ఈ. పు. కల కిల క్షేపే. - ఇందు బాణములు వేయఁబడును.
కయ్యము - జగడము, యుద్ధము.
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
కలహము - సమరము, వికృ.కయ్యము.
సంయుగము - యుద్ధము.
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు.
సమీకము - యుద్ధము, వ్యు.పరస్పరము కదియుంచునది.
సమీయంతే సంగచ్ఛంతే (అ)స్మిన్నితి సమీకం, ఈఙ్ గతౌ. - పరస్పరము దీనియందుఁ కదియుదురు.
సాంపరాయము - 1.యుద్ధము, 2.ఆపద, 3.రాగలకాలము, రూ.సంపరాయము.
సంపాయన్తే (అ)స్మిన్నితి సాంపరాయికం, అయ గతౌ. - పరస్పరము దీనియందు కదియుదురు.
సాంపరాయికము - యుద్ధము, రూ.సంపరాయికము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది.
మరేణ సమ వర్త ఇతి సమరః - మరణముతోఁ గూడినది.
రణము - 1.యుద్ధము, 2.మ్రోత.
రణన్తి భేర్యాదయో (అ)త్ర రణః రణశబ్దే. - భేరి మొదయైనవి దీని యందు మ్రోయును.
కలహము - సమరము, వికృ.కయ్యము.
కలం వికలంఘ్నన్త్యత్రేతి కలహః, హన హింసాగత్యోః. - దీనియందు వికలుఁడయినవాని హింసింతురు.
విరుద్ధము - విరోధము గలది.
విరుద్ధం గృహ్ణన్యత్ర విగ్రహః - దీనియందు విరుద్ధముగా శత్రువులను బట్టుదురు.
విరోధము - పగ, ఎడబాటు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
విరోధచర్య - (రాజ.) యుద్ధము ప్రకటించుటకు తగినంత కారణముగా నెంచదగినచర్య.
కయ్యపుదిండి - (కయ్యము + తిండి) కలహభోజనుడు, నారదుడు.
ముళ్ళయతి - నారదుడు, సన్న్యాసి (ముడులు పెట్టుయతి.)
ముళ్ళమాటలు - కలహపుమాటలు.
ముళ్ళు - మారాముళ్ళు, చిక్కులు.
మారాటము - 1.కలహము, 2.యుద్ధము.
పెనఁకువ - 1.మేళసము, 2.చుట్టుకొనుట, 3.వివాదము, కలహము.
పెనఁగు - క్రి. 1.పెనుగొను, 2.చుట్టుకొను, 3.మారాడు, 4.యుద్ధము చేయు.
పెనవరి - (పెనవు+అరి) వివాదశీలుడు.
ఆరివేరపుఁదపసి - కలహప్రియుడగుముని నారదుడు.
ఆరివేరము - విరోధము, కలహము, సం.అరివీర్యమ్.
సంప్రహారము - 1.యుద్ధము, 2.గమనము.
రిపూన్ సమ్యక్ ప్రమరన్త్యస్తిన్నితి సంప్రహారః - దీనియందు శత్రువులను లెస్సగాఁ బ్రహరింతురు.
సమితి - 1.సమూహము, 2.యుద్ధము.
సమిత్తు - యుద్ధము, పోరు. పోరు నష్టము పొందు లాభము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము, (Group).
వివాదశీలాం స్వయమర్థచోరిణీం, పరాను కూలాం పరిహాసభాషిణీమ్ |
అగ్రాశినీం మధ్య గృహప్రవేశినీం, త్యజంతి భార్యాం దశపుత్త్రమాతరమ్ |
తా. జగడమాడెడు స్వభావముగలదానిని, ఇంటిసొమ్ము దొంగిలించు దానిని, పెనిమిటికన్న ముండు భుజించుదానిని, ఎల్లప్పుడు పొరుగింటి లో(గృహము - 1.ఇల్లు, 2.భార్య.)సంచరించు దానిని(సంచరణము - సంచారము, తిరుగుట, నడుచుట.); ఈ గుణములు గలిగిన పెండ్లాము(పెండ్లము-భార్య, రూ.పెండ్లాము.) పదిబిడ్డల తల్లియైనను దానిని విడువ వలెను(త్యాజ్యము - విడువదగినది). - నీతిశాస్త్రము
కలియుగమున జనములను గనికరమునఁ
దగిన వెరవును గనుకొని తనుపు చునికిఁ
గృతయుగమునను గలుగని హితము గలుగు
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ|
తొండరూపు రిక్క - పుష్యమీ నక్షత్రము.
సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి నిర్మాణములు, ఊపిరితిత్తులు, రెండు బృహద్ధమన చాపములుగల పృష్ట వంశిక జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
ఆర్కియోప్టెరి - (జం.) (Archaeopteryx) పక్షి జాతులలో ఒకటి, (పరిమాణములో సరీసృపముల నుండి పక్షులు వచ్చిన వని చెప్పుటకు ఇది యొక తార్కాణము.)
తొండరూపు రిక్క - పుష్యమీ నక్షత్రము.
తొండ - సరటము; సరటము - తొండ.
జౌహకము - తొండ.
సరటః కృకలాస స్స్యాత్ :
సతీతి సరటః సృ గతౌ - చరించునది.
కృకేన గళేన లసతీతి కృకలాసః లస శ్లేషణ క్రీడనయోః - కంఠముతో నాడునది. ఈ రెండు తొండ పేర్లు.
కృకలాసము - ఊసరవెల్లి, తొండ, రూ.కృకలాళము, వ్యు.కంఠముతో ఆడునది.
ఊసరవెల్లి - మూడు వన్నెలతొండ, బింబకము (రంగులు మార్చు తొండ).
బహురూపము - ఊసరవెల్లి. తొండ ముదిరి, ఊసరవెల్లి అయినట్లు. Grey Lizard
చిత్రబింబము - ఊసరవెల్లి.
కృకవాకుధ్వజుఁడు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుస్వామి.
కృకవాకువు - 1.కోడి, 2.నెమలి, వ్యు.తలయెత్తి కూయునది, 2.మైలచాయ తొండ, సరటము.
కృకేన శిరోగ్రేణవక్తీతి కృకవాకుః. ఉ.పు. వచ పరిభాషణే. - తలయెత్తి కూయునది.
కృకము - కంఠనాళము, కంఠపు బుడిపి, కుత్తుక.
కుతుక - గొంతు, రూ.కుతుక, కుత్తుక.
గొంతు - 1.కుత్తుక, 2.కంఠధ్వని, రూ.గొంతుక, సం.కంఠః.
కంఠ్యము - కంఠము నందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
తామ్రచూడము - కోడి.
తామ్రవర్ణా చూడాస్యేతి తామ్రచూడః - తామ్రవర్ణమైన చుంచుగలది.
కుక్కుటము - 1.కోడి, 2.కపటము, 3.కుక్క, 4.మిడుగురులు.
కుకు ఇతి శబ్ద ముచ్చారయన్ కుటతీతి కుక్కుటః. కుట కౌటిల్యే - కుకు అను శబ్దమును బలుకుచు వక్రముగాఁ బోవునది.
చరణాయుధము - 1.కోడి, అజ్జవాలు.
చరణా వే వాయుధం యస్య సః చరణాయుధః - కాళ్ళే ఆయుధముగాః గలది.
అజ్జ(ౙ)వాలు - కోడి, చరణాయుధము.
కోడి - అజ్జవాలు, సం.కుక్కుటః.
కుక్కురము - 1.కుక్క, వ్యు.ఎముకలు మొ.వి తెచ్చుకొనునది, 2.మాచిపత్రి.
కోకతే అస్థ్యాదిక మాదత్త ఇతి కుక్కురః, కుక వృక ఆదానే. - ముడుసు (ఎముక)లు మొదల్యినవానిని దెచ్చుకొనునది. ముడుసు - ఎముక.
చరణాయుధధర కరణావృతిహర
తరుణాకృతివర కరుణా సాగర| ||శరవణభవ||
అ(ౙ)జ్జ - 1.పాదము, 2.సమయము, అవ్య.బళీ!
పాదము - (గణి.) త్రిభుజ శీర్షముగా నుండి భుజములను గీయబడిన లంబముల పాదములకు సంబంధించినది (Pedal).
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమునందలి ఒక చరణము, 4.1/4వ వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములలో అక్షద్వయముచే వేరు చేయబడిన నాలుగుభాగములలో నొకటి (Quadrant).
చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
పరిప్లవము - నీరుకోడి, విణ.కదలునది.
కుక్కుటపాలనము - (వ్యవ.) గుడ్ల కొరకు, మాంసము కొరకును, వినోదముల కొరకును కోళ్ళను పెంచుట, కోళ్ళ పెంపకము (Poultry keeping).
పొదుగుపెట్టె - (వ్యవ.) కోడి గ్రుడ్లను వేడిమిచే పొదుగుట కుపయోగించు పెట్టె (Incubator).
ధవళము - కోడిగ్రుడ్డులోని తెల్లని సొన (Albumen).
ఆల్బుమిన్1 - (వృక్ష.) (Albumin or endosperum) అంకురచ్ఛదము, బీజపోషక పదార్థము, భ్రూణము పెరుగుటకు భ్రూణస్యూనములో ఏర్పడిన ఆహారము.
ఆల్బుమిన్2 - (Albumin) ఆహార పదార్థములలో ముఖ్యముగా పాలలోను గ్రుడ్డులోను గల ఒకరకపు మాంసకృత్తు.
అల్ బ్యూమినాయిడ్స్ - (గృహ.) (Albuminoids) గ్రుడ్డులోని తెల్లని మాంసకృత్తులు.
జంతుమాంసకృత్తులు - (జం.) జంతువుల శరీరములో తయారైన మాంసకృత్తులు(Animal proteins) ఉదా.ఆల్బుమిన్ (Albumen), కేసిన్(Casein) ఫ్రైబ్రిన్(Fibrin), మయోసిన్ (Myocin), జిలాటిన్ (Gelatin).
గిజరు - 1.పండులో నుండు గుంజు, పేసెము, 2.కోడిగ్రుడ్డులోని పచ్చసొన, రూ.గిజరు.
పేసెము - పండ్లలోని గుజ్జు, సం.పేశీ, పేశిః.
పేశి- 1.గ్రుడ్డు, 2.కత్తియొర, 3.మాంసపుముద్ద.
గ్రుడ్డు - 1.కనుగ్రుడ్డు, 2.పక్షుల అండము, విణ.గుడ్డితనము.
కోడిగుడ్డు మీద ఈకలు పీకేరకం. కోడుగ్రుడ్డు పగులగొట్టుటకు గుండ్రాయి కావలెనా?
A hen is only an egg's way of making another egg.
కోడి నలుపైనా, ఎరుపైనా గ్రుడ్డు తెలుపే. కోడిపెట్ట యెక్కడున్నా గుడ్లమీదనే ధ్యానము. గుడ్లను అమ్మకపోతే కోడిపిల్లలు కావలసినన్ని. కోడిపిల్ల మీద పందిపిల్ల బలాదూర్.
ఋతా మృతాభ్యాంజివేత్తు మృతేన ప్రమృతే సదా|
సత్యావృతాభ్యా మపిచం నశ్యవృత్యా కదాచన||
ఋణ ముఞ్ఛశీలం జ్ఞేయమమృతంస్యాదయా చితం|
మృతంతుయాచితంభై క్షంప్రమృతం కర్షణం స్మృతం||
సత్యానృతంతు వాణిజ్యం తేన సేవాపి జీవ్యతే|
అస్వవృత్తిర్న చాధ్యాసే త్తస్మాతాం పరి వర్జయేత్||
తా. ఇండ్లయందు కోళ్ల మొదటఁబడిన గింజల నేరుకతి జీవించుట ఉంఛము, ముళ్ళలోని యెన్నుల దెచ్చుకొని జీవించుట శీలము, ఈ రెండును ఋణమనంబడును. అమృతమనగా యాచింపక యదృచ్ఛా లబ్దమైన ద్రవ్యముచేత జీవించుట, ప్రమృతమనఁగా కృషి. సత్యావృత మనగా వర్తకం, అస్వవృత్తియనఁగా కొలువు గొలుచుట, ఇందు బ్రాహ్మణునికి వెనుక చెప్పబడిన యొక్కొక్క వృత్తికంటె ముందు చెప్పఁబడిన యొక్కొక్క వృత్తి శ్రేష్ఠమయినది, కావున ఉంఛవృత్తి మొదలు వాణిజ్యము వరకుఁ జెప్పబడిన వృత్తులచే జీవించవచ్చును. కాని బ్రాహ్మణుం డన్యవృత్తిచేత నొకప్పుడును జీవింపరాదు. - నీతిశాస్త్రము
నఖరాయుధము - కోడి, వ్యు.గోరే ఆయుధముగా కలది.
నఖము - గోరు, రూ.నఖరము.
పునర్నవము - గోరు, వ్యు.తీసివేసిన మరల వచ్చును.
గోరు - 1.నఖము, 2.ఒకానొక చోర సాధనము, విణ.అల్పము, సం.ఖురః. గోరుతో పోయేది, గొడ్డళ్ళ వరకు తెస్తే ఎల్లా?
నఖము - గోరు, రూ.నఖరము.
గిచ్చు(ౘ) - క్రి.గోటితోనొక్కు, గీచు, గిల్లు.
గిల్లు - క్రి.గోటితో గిచ్చు, వి.నఖక్షతము.
గోకు - క్రి.గీకు, గీరు.
గీఁకు - క్రి.రక్కు, గోరు మొ.ని తో గీచు.
గివురు - క్రి.1.గీకు, గీరు, గోకు, 2.భేదించు, 3.రక్కు.
అరె - 1.చెప్పులు కుట్టు సూది, 2.కోడి మున్నగు పక్షుల కాలి వెనుక గోరు, 3.ఒకరకపు బాణము, సం.ఆరా.
ఆర1 - 1.మాదిగవాడు చెప్పులు కుట్టు సూది, 2.(వైద్య.) శస్త్రములలో ఒకటి, 3.గుఱ్ఱములను తోలు కొరడా.
ఆర2 - సంభోధనమున బహువచనముందు వచ్చు ఆగమము, ఉదా.జనులారా, మగువలారా మొ.వి, రూ.ఆరా.
స్మరాంకుశము - పెంచి దిద్దిన గోరు.
గోరుచుట్టు - గోటికి చుట్టు లేచెడి పుండు.
నఖవ్రణము - (గృహ.) జట్ట, గోరుచుట్టు, గోరుపుండు, వ్రేలికి చివరవచ్చు కురుపు. గోరుచుట్టుపై రోకలిపోటు చందాన. గోరంత వుంటే కొండంత చేసినట్లు.
నఖోత్పాటని - గోరుగల్లు.
గోరుగల్లు - గోళ్ళు తీసెడి లొహపు సలాక.
గోరుచిక్కుడు - ఒక జాతి చిన్న చిక్కుడు, ఒక శాకము.
కాలజ్ఞము - 1.కోడి, 2.కోయిల.
కోకిలము - కోయిల: కోవెల - గుడి, వై.వి.కోకిలము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
పంచమము - 1.కోయిల, 2.రాగ విశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.
పుంజు - 1.కోడిపుంజు, 2.కాలజ్ఞము.
కాహళము - 1.కోడిపుంజు, 2.శబ్దము, 3.బాకా ఊదెడు కొమ్ము.
రణభేరు - పందెపు కోడి పుంజు.
కాలజ్ఞుఁడు - జ్యోస్యుడు.
జ్యోతిషికుఁడు - జ్యోస్యుడు. జ్యౌతిషికుఁడు - జ్యోతిషికుడు.
(ౙ)జ్యోసి - జోస్యుడు, స.జౌతిషకః.
జోస్యము - జ్యోతిశ్శాత్రము, సం.జౌతిషమ్.
జ్యోతీమ్షి నక్షత్రాణ్యధికృత్య కృతో గంథో జ్యోతిషం; తద్వేత్తీతి జ్యౌతిషికః, (ఔ కారాది.) జ్యోతిస్సు లనఁగా నక్షత్రములు. వాని నధికరించి చేయఁబడిన గ్రంథము జ్యోతిషము, దాని నెఱిఁగినవాఁడు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
జ్యోతిశ్శ్చక్రము - గ్రహనక్షత్రమండలము.
జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
దైవజ్ఞుఁడు - 1.జ్యోస్యుడు, 2.గణకుడు.
దైవం శుభాశుభం జానాతీతి దైవజ్ఞః, జ్ఞా అవబోధనే. - దైవమనఁగా శుభాశుభములు; దాని నెఱిఁగినవాఁడు.
దైవజ్ఞ - 1.సోదెకత్తె, 2.బల్లి Lizard.
యోగిని - 1.సోదెకత్తె, 2.యోగాభ్యాసము చేయు స్త్రీ, వికృ.జోగిణీ.
(ౙ)జోగిని - యోగిని, సోదెకత్తె, సం.యోగినీ.
సోదెకత్తె - సోదె చెప్పునది.
సోదె - రాగలమేలు కీడులను గూర్చిన ప్రశ్నయు, రూ.సోదియ, సం.చోద్యమ్.
సోదేము - చోద్యము, ఆశ్చర్యము, రూ.సోద్దెము, చోద్దెము, సం.చోద్యమ్. ఎదేమి చోద్దెమమ్మా!
పల్లి - 1.ప్రల్లె, 2.దేశము, 3.బల్లి.
గౌళి - బల్లి, రూ.గవుళి. అందరికి శకునములు పలికిన బల్లి తాను కుడితి గోలెంలో పడినది.
విప్రశ్నికా త్వీషణీకా దైవజ్ఞా -
శుభాశుభ విషయే విశేషతః ప్రశ్నో అస్యా ఇతి విప్రశ్నికా - శుభా శుభ విషయమై విశేషముగా జనులచేతఁ జేయఁబడిన ప్రశ్న గలది.
ఈక్షణం శుభాశుభ దర్శనం. తదస్యా ఇతి ఈక్షణీకా. ఈక్ష దర్శనే. - శుభాశుభములను జూచునది.
దైవం శుభాసుభం జనాతి దైవజ్ఞా. జ్ఞా అవబోధనే. - దైవమనగా శుభా శుభము. దాని నెఱిఁగినది. ఈ మూడు 3 వేల్పుల సానిపేర్లు, సోదెకత్తె.
యస్మి దేశే నసమ్మానో నప్రీతిర్న చ బాంధవాః|
నవిద్యా నాస్తి ధనికో నతత్ర దివసంవ శత్||
తా. ఏ దేశమందు సమ్మానములు, ప్రియమును ప్రీతి - 1.సంతొషము, 2.స్నేహము., బంధువు లును, విద్యయును, ధనికులును లేనందునో యచ్చట ఒకదినమైన వసింప గూడదు. – నీతిశాస్త్రము
గణకుఁడు - 1.జ్యోస్యుడు, 2.కరణము.
గనయతి కాలం గణకః, గన సుఖ్యానే. - కాలమును లెక్కఁబెట్టువాఁడు.
కరణము1 - 1.గణకుడు, 2.కారణము, 3.పని, (త్రికరణములు - మనస్సు, వాక్కు, శరీరము).
కరణము2 - (వ్యాక.) పనిని సిద్ధింప చేయుట యందు ఉపయోగించు సాధనము, ఉదా. కత్తిచేత ఖండించెను, ఖండించుట అనెది పనిని సిద్ధింప చేయుట యందు కత్తి ముఖ్య సాధనము కావున కత్తి కరణము.
గణనము - (గణి.) లెక్కగట్టుట, లెక్కపెట్టుట (Calculation).
కరణకమ్మలు - బ్రాహ్మణులలో నొక తెగవారు.
గణపతి - వినాయకుడు.
గణము - 1.గుంపు, సమూహము, 2.సేనలో ఒక భాగము, 3.వర్ణముల సమూహము, 4.గురులఘు వర్ణముల కూడిక కలది.
గణనాయిక - గౌరి, పార్వతి.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.
కరణము గరణము నమ్మిన
మరణాంతక మౌనుగాని మనలేడు సుమ్మీ
కరణము తనసరి కరణము
మఱి నమ్మక మర్మమీక మనవలె సుమతీ.
తా. గ్రామలేఖకుడు మరొక లేఖకుని నమ్మక ముంచిన మరణించుటతో సమానమైన ఆపద చెందునుగాని తప్పించుకొని మనలేడు. కనుక కరణము మరియొక కరణమును నమ్మక, రసస్యాలు తెల్పక బ్రతుకవలెను.
మౌహూర్తికుఁడు - జ్యోస్యుడు.
ముహూర్తం కాలం వేత్తీతి మౌహూర్తికో మౌహూర్తశ్చ. - ముహూర్తము నెఱిఁగినవాఁడు.
తే తు ముహూర్తో ద్వాదశాస్త్రియమ్,
తే క్షణాః ద్వాదశ ముహూర్త ఇత్యుచ్యతే - 12 క్షణములు(12 Seconds) గూడిన కాలము ముహూర్తమనంబడును.
హూర్ఛతి కుటిలో భవతి శుభాశుభదర్శనాదితి ముహూర్తః, ప్న. హుర్భాకౌటిల్యే. - శుభశుభ దర్శనమువలన కుటిలమగునట్టిది.
ముహూర్ము హురియర్తీతి ముహూర్తః. ఋ గతౌ. - పలుమాఱును బోవుచుందునది.
ఘటికాద్వయం ముహూర్తః 12 క్షణములు ఒకటి ముహూర్తము (రెండు గడియలసేపు).
ముహూర్తము - 1.పండ్రెండు క్షణముల కాలము(12 Seconds), 2.రెండు గడియల కాలము.
ముహుః - సం. అవ్య. మటికి మాటికి.
ఘటిక - 1. 24 నిమిషముల కాలము, గడియ, 2.చిన్నకుండ, 3.ముహూర్తము, 4.ఒకానొక విద్యాసంస్థ.
విగడియ - గడియలో అరపదవభాగము, 24 సెకనులు, సం.వి.ఘటికా.
గడియ - 24 నిమిషముల కాలము, సం.ఘటికా, వి.తలుపునకు అడ్డుగ వైచు కఱ్ఱ, రూ.గడెయ.
వరుటము - తలుపు గడియ.
గొండెము - తలుపు చిలుకు, రూ.గొళ్ళెము, గొండ్లెము.
షడిమాని వినశ్యంతి ముహూర్తమవవేక్షణాత్ |
గావః సేవా కృషిర్భార్యా విద్యా వృషల సంగతిః||
భా|| గోవులు, సేవకావృత్తి(సేవ - శుశ్రూష, కొలువు.), వ్యవసాయం(కృషి - సేద్యము, వ్యవసాయము.), భార్య(భార్య - అగ్నిసాక్షిగ పైణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.), చదువు(విద్య-1.చదువు, 2.జ్ఞానము.), అధర్మ పరులతో కలయిక(సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.) - ఈ ఆరు ముహూర్తకాలం పట్టించుకోకుండా ఉంటే చాలు నశిస్తాయి.
జ్ఞాని - 1.జ్యొస్యుడు, 2.కోడి, విణ.తెలివి గలవాడు.
జ్ఞానమస్యాస్తితి జ్ఞానీ, న. పు. - కాలజ్ఞానము గలవాఁడు.
గ్రంథికుఁడు - 1.జ్యోస్యుడు, 2.సహదేవుడు.
గ్రంథి - 1.బుడిపి, గడ్డవలె పుట్టురోగము, 2.చెట్టు మొ, ని ముడి, 3.కీలు (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
జీవకణ సంహతి - (వృక్ష.) జీవకణ స మూ హ ము, (Tissue).
జీవకణజాలము - (జీవ.) ఒకే నిర్మాణము, ఒకే వ్యాపారము గల జీవకణముల సమూహము, (Tissue).
అనిత్యాని శరీరాని విభవో నైవశాశ్వతః|
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః||
తా. శరీర మనిత్యము, (విభవము - సంపద, ఐశ్వర్యము.)సంపద శాశ్వతము కాదు, మృత్యు వెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగిన దని సహదేవుఁడు వచించెను. - నీతిశాస్త్రము
కార్తాంతికుఁడు - జ్యోస్యుడు.
కృతాన్తో దైవం, తద్వేత్తీతి కార్తాన్తికః కృతాంత మనఁగా దైవము; దాని నెఱిఁగినవాఁడు.
దైవికము - దైవము వలన కలిగినది.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
శిఖి - 1.అగ్ని, 2.నెమిలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.
శిఖివాహనుఁడు - కుమారస్వామి.
శిఖీమయూరో వాహనం యస్య సః శిఖివాహనః - నెమిలి వాహనముగాఁ గలవాఁడు. షోడశ శ్శిఖివాహనః|
శిఖండి - 1.ధృష్టద్యుమ్ముని అన్న, 2.నెమిలి, 3.నెమలిపురి, 4.కోడి, 5.బాణము.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి(నెమ్మిలి - నెమ్మలి).
మయూరము - 1.నెమిలి, 2.నెమిలి జుట్టు.
నెమ్మి - 1.ప్రేమ, 2.నెమ్మది, 3.సంతోషము, 4.క్షేమము, 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము, 2.బండి చక్రముకమ్మి, సం.నేమిః.
నెమ్మిరౌతు - కుమారస్వామి.
కన్నెము - కోడి గుండెకాయ.
విష్కిరము - 1.పక్షి, 2.కోడి, 3.నెమలి.
పక్షి - (పక్షములు గలది) పులుగు(పులుఁగు - పిట్ట).
కృకము - కంఠనాళము, కంఠపు బుడిపి, కుత్తుక.
కుతుక - గొంతు, రూ.కుతుక, కుత్తుక.
గొంతు - 1.కుత్తుక, 2.కంఠధ్వని, రూ.గొంతుక, సం.కంఠః.
కంఠ్యము - కంఠము నందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
కంఠము - Throat 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
అంటుమెడ - అణగినమెడ, పొట్టిమెడ.
కంఠస్థము - కంఠపాఠముగా వచ్చునది.
కంఠోక్తి - 1.గట్టిగా జెప్పుట 2.స్పష్టముగా జెప్పుట.
ఉదానము - 1.బొడ్డు, Navel 2.కంఠము(throat) నందలి గాలి, 3.ఒకానొక పాము.
ఉదానః కంఠదేశస్థః : ఉదానము, కంఠస్థానము నందుండి భాషణాదులఁ బుట్టించునది.
గ్రీవ - 1.కంఠము, 2.మెడనరము, రూ.గ్రీవము.
గ్రీవము - 1.కిరణము, 2.కంఠము.
కంధరము - 1.కంఠము, 2.మెడ, 3.మబ్బు. కంధౌ జానకి పాతు|
మెడ - కంఠము, రూ.మెడకాయ.
శిరోధి - మెడ.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
కణ్డో గళః :
కణతి ధ్వనతి కణ్ఠః కణ శబ్దే. - పలుకునది.
గళ త్యనేన గళః. గళ అదనే. - దీనిచేత మ్రింగుదురు. ఈ రెండు కుత్తుక పేర్లు.
గళము - 1.కుత్తుక, 2.ఒకానొక వాద్యము.
గళసంబంధము - (జం.) గొంతుతో సంబంధము కలది, కూడినది (Phanyngeal).
గళగ్రంధి - (జం.) ద్విత సాధనమునకు గళగ్రంధి(కప్ప) (Hyoid apparatus) ద్వితసాధనము గాని, సర్వపేటికకుగాని ఇరువైపుల నుండు అంతస్స్రావ గ్రంధి(Thyroid gland) దీనినుండి జలతిగ్మి (ThyroXin) అనున్స్రావము ఊరును. కాకళము, (గృహ.) గవడబిళ్ళలు లేక గాలిబిళ్ళలు అనెడివ్యాధి (Mumps).
గళగండము - కండమాల, మెడ చుట్టును గడ్డలు లేచు వ్యాధి, (గృహ.) అంగుడువాపు, ఒక తీవ్ర కంఠవ్యాధి, (ఇది విషకంఠ జ్వరము) (Diphtheria).
నాళరహిత గ్రంథులు - (గృహ.) వాహికలు లేని గ్రంథులు (Ductless glands), ఉదా.పిట్యుటరీ, థైరాయిడ్ మొదలగు గ్రంథులు.
సప్తపథ - (జంతు.) గళము, నోరు, గొంతుగొట్టము, నిగళము(Pharynx), ఈ రెంటికిని మధ్య నున్న అన్నవాహిక యొక్క భాగము (Oesophagus)ముక్కు నోటిద్వారము కలియు ద్వారము, Throat.
నామగుంట - గొంతుక క్రింది పల్లము, గళగర్తము.
వావిక - కుత్తుక మొదటగల గుంట.
అంగిలి - లోకుత్తుక.
అంగిటిముల్లు - కుత్తుకలో కలుగు రోగము, గళ్వాకురము.
కంఠబిలము - గళమునుండి శ్వాస నాళికలోనికి పోవు ద్వారము (Glottis).
గళశుండిక - చిరునాలుక, కొండనాలుక.
ఘంటిక - 1.చిరుగంట, 2.కొండనాలుక, (గృహ.) చిరునాలుక (Epiglottis).
సూన - 1.కూతురు, రూ.ప్రసూన, 2.కొండనాలుక, 3.వధస్థానము. కొండనాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడిండట.
నిగరణము - 1.మ్రింగుట 2.కంఠము.
నిగరము - మ్రింగుట, వై.విణ. శ్రేష్ఠము.
గిలి1 - భయము.
గిలి2 - మ్రింగుట.
గ్రుక్క - 1.మ్రింగుట, 2.గుటక(గుటక - గ్రుక్క), 3.ఊపిరి, 4.కంఠనాళ రూపమగు పరిమాణము.
గ్రుక్కలుమ్రింగు - 1.అపేక్షించు, 2.సంకోచించు, అనుమానించు, రూ.గ్రుక్కిళ్ళు మ్రింగు.
Dyspha’gia - మ్రింగలేక పోవుట, కంఠ కర్ణ నాళము.
కంఠ కర్ణ నాళము - (జం.) నోటిలోనుండి కర్ణభేరి లోపలి వైపునకు పోవు గొట్టము (Eusta chiantube).
కంఠరోహిణి - ఒకరకము అంటు వ్యాధి.
కంఠమాల - మెడచుట్టు గడ్డలు లేచెడు తెవులు, రూ.గండమాల.
గండమాల - గలగండ మనురోగము, మెడచుట్టును వ్రణములు లేచెడి ఒక వ్యాధి (గృహ.)కంఠకణత పెరిగిన తైరాయిడ్ గ్రంథి, కంఠగ్రంధి పెరుగుట (Goitre).
కంఠశోషణము - 1.కుత్తుక ఎండుట, 2.వ్యర్థ సంభాషణము.
Dyspha’gy - difficulty in swallowing.
Dyspho’nia - నోటితో మాట్లాడుట కష్టముగా నుండుట, difficulty in producing sounds.
నోరు - 1.ముఖద్వారము, 2.వదనము.
వదనము - నోరు, ముఖము.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
ఆస్యము - 1.ముఖము, 2.నోరు, విణ.1.నోటనున్నది, 2.ముఖమున ఉన్నది.
ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity).
ముఖశ్వసనము - (జం.) నోటితో గాలినిపీల్చి వదలివేయుట (Buceal respiration).
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము (Peristome).
ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12' లేక ‘డి ' లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).
గ్రస్తము - 1.తినబడినది, 2.మ్రింగబడినది, 3.లోపించిన వర్ణములు గలది (మాట).
నోరుమెంగ - మూగ(Dumb).
క్రోవ - 1.సరము, 2.బిడ్డలకు గొంతుక యందు కలుగు రోగము.
సరము - స్వరము, ముకుగాలి, షడ్జాది స్వరము, సం.స్వరః, సం.వి.1.హారము, 2.గమనము.
స్వరపేటిక - (జం.) శబ్దమును ఉత్పత్తి చేయు అవయములు గల గది వంటిభాగము (Larynx) సం.వి. (గృహ.) ఇది గొంతులో కొండనాలుకకు క్రింది భాగమునకు గలదు. ఇది మనుష్యులకు మాటలాడుటకు ఆధారమై యుండును. (Voice box).
ముద్రాకాస్థి - (జం.) కప్పయొక్క స్వరపేటికలో ఉన్న రెండు మృదులాస్థి నిర్మాణములలో నిది యొకటి (Cricoid cartilage). రెండవది దర్వీకాస్థీ (Arytenoid cartilage).
దర్వికాస్థులు - (జం.) స్వరపేటికలో ముద్రాకాస్థి వలయముచే చుట్టబడి అర్థ చంద్రాకార కవాటమువలె నుండు కోమలాస్థి నిర్మాణములు (కఫ్ఫ) (Arytenoid cartilage).
కోమలాస్థి - (జం.) సంకోచ వ్యాకోచ శక్తిగల సున్నితమయిన (జంతు) సంబంధమగు, ఎముకవంటి పదార్థము (Cartilage).
పొరబారుట - (గృహ.) గొంతుకపడుట, ఆహారము గాలిగొట్టములొనికి పోయినచో కలుగుస్థితి (choking).
ఆహారనాళిక - (జం.) ఆహారపు గొట్టము, గొంతునకును అన్నకోశము నకు మధ్యనున్న గొట్టము (Aesophagus).
నిగళము - (జం.) అన్నవాహికలో గళము తరువాత నుండు భాగము (Gullet or Oesophagus), సం. వి.1.ఏనుగు కాలి సంకెల, 2.సంకెల, రూ.నిగడము.
నిగళ్యతే మదేనేతి నిగళః గళ సేచనే . - మదముచేతఁ దడుపఁబడునది, పా. నిగడః.
త్రిపది - 1.ఏనుగు కాలి సంకెల, 2.గాయత్రి.
అందుకము - 1.అందె, 2.ఏనుగు సంకెల, 3.సంకెల.
అన్దతి బద్నాత్యనే నేత్యందుకః, అది బంధనే. - దీనిచేత కట్టివేయుదురు.
అందె - అందియ.
అందువు - 1.ఏనుగు కాలికి గట్టెడు గొలుసు, 2.అందె, రూ.అందుగు.
తోడా - 1.బిరుదుగా వేసిన హస్తభూషణము, 1.అందె.
అందుగు - (వృక్ష.) పల్లకి, చిల్లచెట్టు, రూ.అందువు.
గొలుసు - 1.మెడను వ్రేలాడు నగ, 2.ఏనుగు కాలికి కట్టెడు సంకెల, 3.సంకెల.
సంకెల - సంకలియ, సం.శృంఖలా.
తులాకోటి - అందె; అందె - అందియ.
తులతి ఆకుటతీతి చ తులాకోటిః, ఇ. పు. తుల ఉన్మానే, కుటి కౌటిల్యే. - అధికమైన తూనికగలిగి వక్రమైయుండునది.
మంజీరము - అందె.
మంజు మనోహరం ఈరయతి ధ్వనతీతి మంజీరః. - మనోహరముగాఁ మ్రోయునది.
నూపురము - అందె.
నూయతే నూపురః, అ. ప్న. ణు స్తుతౌ. - స్తోత్రము చేయఁబడునది.
హారనూపుర కిరీటకుండల విభూషితావయవ శోభినీం,
కారణేశ వర మౌళికోటి పరికల్ప్యమానపద పీఠికామ్,
కాలకాలఫణి పాశబాణధనురంకుశా మరుణ మేఖలాం,
పాలభూతిలక లోచనాం మనసి భావయామి పరదేవతామ్. - 1శ్లో
అందియ - 1.స్త్రీలు కాలియందు ధరించు నగ, నూపురము, 2.బిరుదు చిహ్నముగ కాలికి తొడుగుకొను నగ, రూ.అందె, సం.అందుః.
అందెబందెలు - (ని, బహు.) 1.చిక్కులు, 2.జంజాటము, 3.కట్టుదిట్టములు.
మంత్రము1 - 1.గాయత్రి, మొ.వి. 1.రహస్యము, 2.అధర్వణ వేదము.
మంత్రము2 - 1.ప్రస వోపాయము, 2.జాలవిద్య.
వేదభేదే గుప్తవాదే మన్త్రః -
మంత్రశబ్దము గాయత్రాది వేదమంత్రములకును, రసస్యాలోచనకును పేరు. మన్యత ఇతి మంత్రః, మనజ్ఞానే. - విచారింపఁబడునది. "మంత్రో దేవాదిసాధన" ఇతి శేషః.
గాయత్రి - 1.సంధ్యావందన సమయమున జపించు ఒకానొక మంత్రము, 2.సంధ్యావందన సమయమున ఉపాసింపపడు దేవత, 3.పాదమునకు ఆరేసి అక్షరములు గల ఒక వైదిక చ్ఛందస్సు.
గాయంతం వాఇద్యం త్రాయత ఇతి గాయత్రీ, త్రైఙ్ పాలనే, ఈ.సీ. - గాయంతు లనఁగా వైద్యులు; వారిని రక్షించునది.
రహస్యము - ఏకాంతము, విణ.దాచదగినది.
రహస్యం తద్భవే త్రిషు,
రహసి భవం రహస్యం, త్రి. - ఏంకాంతస్థలమందు బుట్టినది. ఈ ఒకటి అవిజనస్థలమందు బుట్టిన మాట పేరు.
ఏకాంతము - 1.మిక్కిలి, 2.ఇద్దర కంటె ఎక్కువ జనములేనిది (చోటు), 3.రహస్యము.
మంత్రము2 - 1.ప్రస వోపాయము, 2.జాలవిద్య.
మంత్రసాని - (గృహ.) మంతర సాని (Mid Wife).
మంతర సాని - ప్రసవ మంత్రముల దెలిసినది, సుఖప్రసూతిచేయు ఉపాయము నెరుగు దాది, రూ.మంతురసాని, మంత్రసాని.
జాలవిద్య - గారడీ విద్య, ఇంద్రజాలము.
ఇంద్రజాలము - 1.కనుకట్టు విద్య, 2.మాయ, 3.మోసగించుట.
కనికట్టు - కండ్ల కగపడకుండ జేయు గారడి రూ.కనికట్టు.
మాయము - మాయ, కనికట్టు, మాయావి.
మాయ - 1.అవిద్య, 2.ఇంద్రజాలవిద్య, 3.ఒక పట్టణము, వి.(గృహ.) మావి, పిండపుసంచి (Placenta)
మావి - 1.గర్భస్థ పిండమునకు మీద కప్పికొని యుండు తోలు సంచి, జారాయువు, 2.మామిడి.
జరాయువు - 1.మావి, 2.జాటాయువు, (వృక్ష.) పుష్పముల అండాశయములో బీజాండము లమరియుండు దిమ్మ, (Placenta).
మామిడి - మామిడిచెట్టు, రూ.మావి.
అవిద్య - 1.అజ్ఞానము, తత్త్వజ్ఞానములేమి, 2.మాయ.
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వ గానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలం కృతామ్|
గఙ్గగౌతమగర్గసంనుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు, ఆగస్టు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర కార్తెలు, ((Mid-rainy season).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి, సం.క్రాంతిః.
కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
వయసు - ప్రాయము, యౌవనము.
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు.
కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు, 4.నస, 5.ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).
9. ఆశ్లేష - పామువలె మెలికలుగా 7 నక్షత్రములుండును.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
సప్పము - సర్పము, సం.సర్పః.
సర్పము - పాము, సప్పము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
రుద్దు - క్రి.పులుము, తోము. తోము - క్రి.రుద్దు.
వాహసము - 1.సర్పము, 2.తూముకాలువ.
(ౘ)చుక్క- 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.శుక్ర, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
(ౘ)చుక్కలదొర - చంద్రుడు; చుక్కలఱేఁడు - చంద్రుడు.
(ౘ)చుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.
ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్ | అశ్రేషా యేషామనుయంతి చేతః | యే అంతరిక్షం పృథివీం క్షియంతి | తే సస్సర్పాసో హవమాగ మిష్ఠాః | యే రోచనే సూర్యస్యాపి సర్పాః | యే దివం దేవీమనుసంచరంతి | యేషామా శ్రేషా అసుయంతి కామమ్| తేభ్యస్సర్పేభ్యో మధుమజ్జహోమి ||7||
అంతరిక్షము - ఆకాశము, రూ.అంతరిక్షము.
అంతః ఈక్ష్యతే జగదస్మిన్ని త్యంతరిక్షం, ఈక్ష దర్శనే. - దీనిలోపలను జగత్తు చూడఁబడును.
అంత ఋక్షాణి నత్యస్మిన్ని త్యంతరిక్షం - నక్షత్రము లిందుఁ గలవు.
ఆశ్లేష - ఇరువదియేడు నక్షత్రములలో తొమ్మిదవది.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
ఉరగము - 1.పాము, వ్యు.రొమ్ముతో ప్రాకునది 2.ఆశ్లేషా నక్షత్రము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
ఆశ్లేషము - 1.కౌగిలింత, 2.కూడిక.
శ్లిష్టి - 1.కౌగిలింత, 2.అంటుకొని యుండుట.
శ్లిష్టము - శ్లేషతో కూడినది.
సంశ్లేషము - కౌగిలింత (వ్యాక.) ద్రుతము తరువాత హల్లుతో కూడికొనుట, ఉదా.పూచెన్గలువ.
సంశ్లేషించు - క్రి.కౌగిలించు.
సంశ్లిష్టము - కౌగిలింపబడినది.
ఉపగుహనము - 1.కౌగిలింత, 2.చాచుట.
ఉపగూఢము - 1.కౌగిలింపబడినది, 2.దాచబడినది, 3.పట్టుకొనబడినది.
క్రోడీకరణము - 1.ఒకటిగా చేయుట, 2.ఆలింగనము.
ఆలింగనము - కౌగిలింత; కౌగిఁలి - ఆలింగనము, రూ.కవుగిలి.
హేళి - 1.సూర్యుడు Sun, 2.ఆలింగనము.
పరిరంభము - కవుగిలింత.
కవుగిఁలి - 1.ఆలింగనము, 2.భుజాంతరము, రూ.కౌగిలి, సం.కోలః.
సంబంధము - 1.చుట్టరికము, 2.కూడిక.
(ౘ)చుట్టఱికము - బంధుత్వము, సంబంధము.
బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship).
శ్లేష -(అలం.)1.ఒక అలంకారము కావ్యగుణములలో నొకటి, 2.కలయిక.
యుక్తి - 1.కూడిక, 2.ఉపాయము, 3.న్యాయము.
సాంగత్యము - కూడిక; కూడిక - సంయోగము, చేరిక, (Addition).
సంయోగము - కూడిక, సం.వి. (రసా.) 1.రెండు ద్రవ్యముల రాసాయనికముగ నుపయోగించుట (Combination), 2.కొన్ని మూలకముల రసాయన సమ్మేళనమువలన నేర్పడిన పదార్థము (Compound).
చేరిక - 1.కూడిక, 2.సమీపము; సమీపము - చేరువ.
సన్నిధి - సమీపము; సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము, (Property).
చేరువ - 1.సమీపము, సమూహము, 3.సేన.
చేరువకాఁడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేన - దండు, విణ.అధికము, చాల.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి; కొమరుసామి - స్కందుడు.
కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 4.పైదూలము మీది గుజ్జు, (కొమరుదనము, కొమరు ప్రాయము = యౌవనము).
మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింపచేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
పుడమితాలుపు - శేషుడు, వ్యు.భూమిని ధరించినవాడు.
పుడమి - భూమి, సం.పృథివి.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
ధరణీశ్వరుఁడు - 1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు. ధరణీనాయక గోవిందా|
ధరణీశ్వరుఁడు - రాజు.
ధరణా - భూమి, రూ.ధారణి.
ధరణినురుఁడు - బ్రాహ్మణుడు.
నాగ స్తోత్రమ్ :
నమస్త్రే దేవ దేవేశ నమస్త్రే ధరణీధర|
నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమో స్తుతే||
అహిపతి - శేషుడు.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
శేషాహి - విష్ణువు యొక్క పానుపు, వేయిపడగలు గల పాము.
నాగుఁడు - శేషుడు, సం.నాగః.
శేషో అనన్తో :
శేతే హరిరస్మిన్నితి శేషః శీజ్ స్వప్నే - హరి యతని మీఁద శయనించును.
కల్పంతే పి శిష్యత ఇతివా శేషః – కల్పాంతము నందును మిగిలియుండు వాఁడు.
న విద్యతే అంతో నాశో యస్య సః అనంతః - నాశము లేనివాడు. ఈ మూడు నాగులకు రాజైన ఆదిశేషుని పేర్లు.
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసా మహమ్ |
పితౄణా మర్యమా చాస్మి యమ స్సమ్యమతా మహమ్ || - 29శ్లో
తా|| నాగులలో అనంతుడను నాగరాజును, జలదేవతలలో వరుణుడనువాడను, పితృదేవత లలో అర్యముడను(అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు.), దండించువారిలో యముడను నేనే. - విభూతియోగము, భగవద్గీత
కద్రువ - పాములతల్లి, కశ్యపుని భార్య.
కామయత ఇది కద్రుః, ఉ. కముకాంతౌ - ఒప్పునట్టిది.
కుత్సితం ద్రారీతి కద్రుః, ద్రా కుత్సాయాం గతౌ. - కుత్సితము నొందునది.
కాద్రవేయుఁడు - కద్రువ కొడుకు, పాము.
కద్రువ తన కుమారులైన శేషుడు, వాసుకి, తక్షక, కర్కోటకాదులతో గుర్రం తోక నల్లగా ఉండేట్టు వ్రేలాడాలని కోరింది. తల్లి అక్రమానికి శేషుడు మొదలైనవారు సహాయం చెయ్యలేమన్నారు. శేషుడు తపస్సుకి వెళ్ళి బ్రహ్మ వరంతో శ్రీమహావిష్ణువు పానుపుయై భూభారాన్ని వహించాడు.
కాశ్యాం నవీణరుద్రాణాం భూషాయై భోగి మండలే
ఆశేషే నిర్గ తే శేష శ్శేషోభూ న్న ఫణీశ్వరః|
తా. కాశికా నగరమందలి క్రొత్తరుద్రుల యలంకార్థమై పాతాళమునందలి సర్పసమూహ మంతయుం గదలిపోవ నాదిశేషుఁడు శేషుఁడే (మిగిలిన వాఁడే) యాయ్యెఁగాని ఫణీశ్వరుడు మాత్రము గాకపోయెను. సర్పము లుండినఁగదా శేషుఁడు ఫణీశ్వరుఁడగుట ? సర్పములన్నియుం బోయిన పిమ్మట శేషుఁడు శేషుడు మాత్రముగాక వేనికి రాజగును ? కాఁడనుట.
శేష వాసుకి సంసేవ్యా చపలా వరవర్ణీని,
కారుణ్యాకార సంపత్తిః కీలకృన్మంత్రకీలికా. - 96శ్లో
అనంతుడు - 1.శ్రేష్ఠుడు, 2.విష్ణువు, 3.వాసుకి, విణ.తుదిలేనివాడు.
అనన్తో నవధావపి : అనంత శబ్దము అవధిలేని దానికి పేరైనపుడు త్రి. అపిశబ్దము వలన శేషునికిని, విష్ణువునకును పేరైనపుడు పు. ఆకాశము నకు పేరైనపుడు న. భూమికి పేరైనపుడు సీ. న విద్యతో అంతో యస్యే త్యనంతః కడలేనిది. "అనంత శ్శేషవిష్ణ్వోస్స్యా దనంతం సురవర్త్మని, అనంతా శారిబా దూర్వా విశాల్యా లాలీషుచ, అనంతా హైమవత్యాం చ గుడూచ్యాం చావనావ" పీతి విశ్వప్రకాశః.
అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి.1.విష్ణుశంఖము, 2.మేఘము, 3.అభ్రకము, 4.(వృక్ష.) వావిలి, 5.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్ధశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.
అనంతశయనుఁడు - విష్ణువు.
శేషశయనుఁడు - విష్ణువు. శేషతల్ప సుఖనిద్రిత రామ్|
ఏకకుండలుఁడు-1.బలరాముడు, 2.కుబేరుడు, 3.ఆదిశేషుడు.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ఆశ్లేష - ఇది ఆదిశేషుని జన్మ నక్షత్రం.
ఆదిశేషుడు - సర్పరాజు.
వాసుకి - 1.సర్పరాజు, 2.మృగపక్షి ధ్వని.
ఆదిశేషుడు పడగలు విప్పి పసిబాలుడైన శ్రీకృష్ణునికి గొడుగుగా పట్టినవాడు.
వాసుకిస్తు సర్పరాజః -
వసు రత్నం కే శిరసి యస్య సః వసుకః, తస్యాపత్యం వాసుకిః, ఈ. పు. - వసు వనఁగా రత్నము, అది శిరస్సునఁ గలవాఁడు వసుకుఁడు, వాని కొడుకు వాసుకి.
వసతి పాతాళ ఇతి వాసుకిః, వస నివాసే. - పాతాళ(నాగలోకము - పాతాళము)మందుండువాఁడు.
సర్పాణాం రాజా సర్పరాజః - సర్పములకు ఱేఁడు. ఈ 2 వాసుకి పేర్లు.
వరదాభయకర వాసుకి భూషణ వనమాలాది విభూషణ శివ|
లక్ష్మణుఁడు, శత్రుఘ్నుఁడు ఆశ్లేష నక్షత్రములో జన్మించారు.
లక్కుమనుఁడు - లక్ష్మణుడు, సం. లక్ష్మణః. హితకర లక్ష్మణసంయుత రామ్| లక్ష్మణాగ్రజ గోవిందా|
త్రేతాయుగంలో ఆదిశేషుడు లక్ష్మణుఁడుగా జన్మించి, శ్రీరాముడుగా అవతరించిన విష్ణుమూర్తిని సేవించాడు. ద్వాపరయుగములో విష్ణువు, శ్రీకృష్ణుడిగా జన్మించి అన్న బలరాముడుగా అవతరించిన ఆదిశేషుడిని సేవించాడు.
ఊర్మిళ - 1.లక్ష్మణుని భార్య, జనక మహారాజు కూతురు, 2.పెనిమిటి నెడబాసిన స్త్రీ.
వైకుణ్ఠః పురుషః ప్రాణఁ ప్రాణదః ప్రణవః పృథుః|
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః||
అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజో(అ)గ్రహః
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః| - 95స్తో
తుష్టి : అనంతుని భార్య. తుష్టిలేని జగాలు నష్టపోతాయి. విశ్వేశ్వరము నందు దేవిస్థానం తుష్టి|
చిలువతాలుపు - శివుడు, భుజంగభూషణుడు.
చిలువఱేఁడు - సర్పరాజు, శేషుడు.
చిలువ - పాము.
బట్టకాఁడు - 1.చిలువ, 2.గోరువంక, వ్యు.పలుకు నేర్పు గలది.
చిలువ - 1.కొంచెముగ చేరి నిలచిన నీరు, 2.జందెవలె చుట్టిన నూలుచుట్టు, విణ.అల్పము.
గోర - గోరంకిపిట్ట, సం.గోరంకుః, గోరికా.
చిలువతిండి - 1.గరుడపక్షి, 2.నెమలి.
భుజంగము - పాము, వ్యు.భుజముతో పాకి పోవునది.
భుజం కుటిలం గచ్ఛతీతి భుజగః భుజంగ; భుజనమశ్చ. గమ్ఌ గతౌ. - కుటిలముగాఁ బోవునది గనుక భుజగము, భుజంగము, భుజంగమము.
భుజంగభుక్కు - నెమిలి, వ్యు.పాములను తినునది.
అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.
అహిపతి - శేషుడు.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
నాగుఁడు - శేషుడు, సం.నాగః.
వృతహుఁడు - ఇంద్రుడు, వ్యు.వృత్రాసురుని చంపినవాడు.
వృత్రాం హతవాన్ వృత్రహా, న-పు. - వృత్రాసురునిఁ జంపినవాఁడు.
అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృత్రాసురుడు.
అంహతీత్యహిః. అహి గతౌ. - చరించునది.
అహి ర్వృత్రే పి :
అహిశబ్దము వృత్రాసురునికిని, అపిశబ్దమువలన పామునకును పేరు. హంతీ త్యహిః. పు. హన హింసాగత్యోః హింసించును గనుక అహి.
అంహతి లోకాన్ వ్యాప్నోతీతి అహిః. అహి గతౌ. వృత్రేయథా _ "ధృతం దనుష్ఖండ మివాహివిద్విష"ఇతి భారవిః. "సర్పే వృత్రాసురే ప్యహి"రితి రభసః.
త్వాష్ట్రుడు - 1.విశ్వరూపుడు, 2.వృతాసురుడు, 3.పనికిమాలినవాడు.
ధ్వాంతరి దానవా వృత్రాః -
వృత్రశబ్దము చీఁకటికిని, శత్రువునకును, వృత్రాసురునికిని పేరు. వృణోతీతి వృత్రః, వృఞ్ వరణే. - ఆవరించునది. 'శైలేచక్రఘనేవృత్ర ' ఇతి శేషః, చక్రాకారో మేఘ శ్చక్రఘనః.
అహిభయము - 1.పాములవలని భయము, 2.రాజులకు స్వపక్షము వారి వలని భయము.
రాజులకు మూలబలము మొదలగు నేడు విధములైన స్వపక్షముల వలనఁ బుట్టిన భయము అహిభయము మనంబడును.
అహేరివ భయం అహిభయం - సర్ప భయమువంటి భయము.
అహితుఁడు - శత్రువు, విరోధి.
న హితః అహితః, హితుఁడు గానివాఁడు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23va) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు.
అనిష్టము - 1.ఇష్టముకానిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.
అహిద్విషుఁడు - 1.గరుడుడు, 2.ఇంద్రుడు.
అహిభుక్కు - 1.గరుడుడు, 2.ముంగిస, 3.నెమలి peacock.
కేకి తార్థ్యా వహిభుఙౌ -
అహిభుక్ఛశబ్దము నెమలికిని, గరుత్మంతునకును పేరు. అహీన్ భుఙ్త్కే అహిభుక్, జ. పు. భుజ పాలనాభ్య వహారయోః. - పాములఁ దినునది.
అహిద్విషము - 1.నెమలి, 2.గ్రద్ధ, 3.ముంగిస.
కౌశికము - 1.గుడ్లగూబ, 2.ముంగిస. కౌశిక మఖ సంరక్షక రామ్|
కౌశికుఁడు - 1.విశ్వామిత్రుడు, వ్యు.కుశికపుత్రుడు, 2.ఇంద్రుడు, 3.నిఘంటువు తెలిసినవాడు, 4.పాములవాడు.
గాధేయుఁడు - విశ్వామిత్రుడు, గ్రాధిపుత్త్రుడు. విశ్వామిత్ర ప్రియతమ రామ్|
నరేంద్రుడు - 1.రాజు, 2.పాములవాడు.
పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
అర్జుఁనుడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
అహితుండికుఁడు - పాములవాడు.
అహి తుణ్ణేన జీవతీత్యహి తుణ్ణికః - సర్పముఖము చేత బ్రతుకువాఁడు.
బరిజోగి - పాములవాడు.
నవిగర్హ్యకథాంకుర్యాద్యహి ర్మాల్యం నథారయేత్ |
గవాం చయానం వృష్ఠేన సర్వదైవ విగర్హితం ||
తా. నిందింపఁలగిన ప్రబంధకల్పన చేయరాదు, చిలువల మాల్యము(అహి - 1.పాము, 2.రాహు గ్రహము, 3.వృత్రాసురుడు.)ధరింపరాదు, ఎద్దు(గవయము - 1.గురుపోతు, వన వృషభము, అడవియెద్దు.)నెక్కిపోవుట అన్నివిధంబులచేత నిషిద్ధమైనది. - నీతిశాస్త్రము
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర
దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః|
నాగరివాహన! సుధాబ్ధినివాస! శౌరే!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. -7
అశీరుఁడు - 1.అగ్ని, 2.రాక్షసుడు, 3.సూర్యుడు Sun.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.
అశృణాతి హిన స్తీత్యాశరః శ్రు హింసాయాం - హింసించువాఁడు.
పా, అసురః-అసూన్ రాతీత్యసురః, అసురేఅవ అసురః, రా ఆదానే - ప్రాణముల నపహరించు వాఁడు - అసురుఁడు, వాఁడే అసురుఁడు.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
అశిషి దంష్ట్రాయాం విషమస్యాస్తీ త్యాశీవిషః - ఆశీస్సు అనఁగా కోఱ, అందు విషము గలది.
అశీశబ్ద ఈకారాంతో(అ)ప్యస్తి. "ఆశీమివ కలామిందో" రితి రాజశేఖరః.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.
స్త్రీ త్వాశీర్హితాశంపాహి దంష్ట్రయోః,
అశీశ్శబ్దము హితమైన యర్థము గావలయు ననుటకును, పాముకోఱకును పేరు.
అశాసనం, అశంసతీతి చ అశీః, స. సీ. ఆజ శ్శాసు ఇచ్ఛాయాం, ఇచ్ఛయించుటయు, హింసించునదియు ఆశీస్సు.
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర
దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః|
నాగరివాహన! సుధాబ్ధినివాస! శౌరే!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. - 7
విషధరము - 1.పాము, 2.మేషము, (విషము = నీరు, విషము).
విషస్య ధరః విషధరః - విషమును ధరించునది.
విషము - 1.గరళము, 2.జలము(నీరము - జలము).
గరళము - 1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు.
అహిఫేనము - 1.నల్లమందు, అభిని, 2.గరళము, 3.పామునోటి చొంగ.
అభిని - నల్లమందు, సం.అహిఫేనమ్, అఫేనమ్.
నల్లమందు - (వ్యవ.) అభిని, అహిఫేనము (Opium), (ఇది మాదక పదార్థముగను వైద్యమునందును ఉపయోగింపబడును. దీనిని Papaveraceae అను కుటుంబమునకు చెందిన Opium poppy (అభిని లేక గసగసా) అను మొక్క కాయలను గీయగా వచ్చిన పాలతో తయారుచేయుదురు. నల్లమందులో మార్ఫిన్ (Morphine) అను ముఖ్యమైన క్షారముండును.)
గసగసాలు - ఒక దినుసు విత్తులు, (వ్యవ.) ఇవి సంబారద్రవ్యముగా వాడబడుచుండును. (ఇవి నల్లమందు మొక్క యొక్క గింజలు. వీనిలో సుమారు నూటికి 50 వంతులు చమురుండును), సం.గసకః.
మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.
మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.
విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితం|
ఆమిత్త్రాదపి సద్వృత్త మమేథ్యాదపి కాఞ్చనం||
తా. విషము వలనైన నమృతంబును గ్రహింపవలయును, బాలునిచే నైనను మంచి మాటలను గ్రహింపవలయును. శత్రువుల నైనను సత్స్వభావమును గ్రహింపవలయును, అమేధ్యము వలన నైనను బంగారమును గ్రహింపవలయును. - నీతిశాస్త్రము
తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.
చక్రధరము - పాము.
శిరసి చక్రయోగాచ్చక్రీ, న. పు. - శిరస్సునందు చక్రము గలిగినది.
చక్రం మండలాకారతా అస్యాస్తీతివా చక్రీ - మండలాకారమై యుండునది.
చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
మండలి -1.సమూహము, 2.పరిషత్తు, 3.సూర్యుడు Sun, 4.పాము.
మండలము - 1.దేశము Country, 2.పరివేషము, 3.విలుకాడు రెండు కాళ్ళను మండలాకారముగ నుంచి నిలుచుండుట, 4.సూర్యచంద్ర బింబములు, 5.సమూహము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
చక్రవాళము - 1.గుంపు, 2.మండలము, 3.లోకాలోక పర్వతము, 4.చుట్టుకొండ.
లోకాలోకము - 1.చక్రవాళ పర్వతము, భూమిచుట్టుకొనియుండు కొండ.
మండలిత రాజ్యములు - (రాజ.) రాజ్య మండలములో సభికత్వము గల రాజ్యములు.
మండలేశ్వరుఁడు - రాజు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon.
మాడెము - మండెము, సం.మండలము.
మండెము - మన్నెపు ప్రదేశము.
మన్నెము - 1.కొండల మధ్య గల భూమి, 2.సన్మానించి యిచ్చిన భూమి, రూ.మాన్యము, మన్యము, సం.మాన్యమ్.
మాన్యము - 1.పన్ను లేక అనుభవించునట్లు సన్మానించి యివ్వబడిన భూమి, 2.కొండల నడుమ అరణ్యముల మధ్య గల భూమి (రోగభూయిష్ట మగు భూమియని కొందరు,) రూ.మన్నియము, మన్నము.
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ.
తా|| తొండము లేకుండా కొండంత ఏనుగు ఉన్నను లాభం లేదు, అట్లే మండలాధిపతికి(భూ దానము చేయువాడు మండలాధీశుడు కాగలడు) సమర్ధుడైన మంత్రి(ప్రధానమంత్రి - (రాజ, శాస,) మంత్రి వర్గనాయకుడు, కేంద్రమంత్రి వర్గనాయకుడు.)లేనిచో లాభముండదు.
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశశివ|
వ్యాళము - 1.పాము, 2.పులి, విణ.క్రూరమైనది, రూ.వ్యాడము.
దుష్టం వ్యడతీతి వ్యాడః, ళడయోభేదాత్. వ్యాళః. అద ఉద్యమనే. - కఱువ నుద్యమించునది.
బేద్యలిఙ్గ శ్శఠే వ్యాళః పుంసి శ్వాపద సర్పయోః,
వ్యాళశబ్దము దుర్జనునకు పేరైనపుడు త్రి. పులికిని, పామునకును పేరైనపుడు. విరుద్ధ మాసమంతా దలతీతి వ్యాళః, అల భూషణాదౌ. - అడ్దగింపఁబడును.
వ్యాళగ్రాహి - పాములవాడు.
సరీసృపము - పాము, ప్రాకుడు జంతువు.
కుటిలం సర్పతీతి సరీసృపః సృప్ ఌ గతౌ. - కుటిలముగా బోవునది.
స రీ సృ ప ము లు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్తి ని ర్మా ణ ము లు, ఊపిరి తిత్తులు, రెండు బృహద్ధమన చాపములుగల పృష్టవంశిక జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
కుండలి - 1.పాము, 2.మండలాకార నృత్యము, 3.నెమలి, 4.గొండ్లి, (భౌతి.) 1.తీగచుట్టు, 2.విద్యుత్ర్పవాహనమున కుచితమైన తీగచుట్ట, (Coil), విణ.పోగులు గలవాడు.కుండలాకారం వపురస్యేతి కుండలీ, న. పు. - కుండలాకారమైన శరీరముగలది.
పాము - సర్పము, కష్టము, క్రి.రుద్దు.
మండలాకారము - (వృక్ష.) వలయాకారము గలది, పత్ర ఫలకము (Orbicular)
శిఖావళము - నెమలి; నెమిలి(నెమలి) - మయూరము, రూ.నెమ్మిలి.
గొండిలి - 1.కుండలాకార నృత్యము, 2.ఆట, 3.నర్తకి, సం.క్రీడా, రూ.గొండ్లి.
కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం
అంధకంతక మాస్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| - 5
గూఢపాత్తు - సర్పము, వ్యు.కానిరాని పాదములు కలది.
గూఢాః పాదాః యస్య సః గూఢపాత్. ద.పు. - కానరాని పాదములు గలది.
గూఢము - 1.రహస్యమైనది, 2.దాచదగినది.
గుప్తము - 1.దాచదగినది, 2.కావబడినది.
ఏకాంతము - 1.మిక్కిలి, 2.ఇద్దరు కంటె ఎక్కువ జనములేనిది (చోటు), 3.రహస్యము.
రహస్యము - ఏకాంతము, విణ.దాచదగినది.
మోడి - 1.బిగువు, 2.బింకము, 3.గణికాదులు మొగ్గవాలి పాద సమీప మందుంచిన వస్తువు నెత్తుట, 4.వ్రాత వైఖరి, గొలుసుకట్టు, వ్రాత.
బింకము - 1.గర్వము, 2.నిక్కు, బిగువు.
నిక్కు - 1.ఉన్నతమగు, 2.అతిశయించు, 3.గర్వించు, 4.వర్ధిల్లు, వి.1.ఉన్నతి, 2.గర్వము.
నిక్కుఁబోతు - గర్వ స్వభావము గలవాడు.
ఉన్నతి - 1.ఎత్తు, 2.ఉచ్ఛస్థితి, 3.గరుడుని భార్య.
ఆతతి - 1.బిగువు (Tension), 2.సాగదీసిన స్థితి, 3.వాయువుల యొక్కగాని బాష్పముల యొక్కగాని ప్రేషము, 4.విద్యుచ్ఛాలకలలము (రసా., భౌతి.) 1.బిగి, 2.బిగిసినస్థితి, భౌతిక శాస్త్రదృష్టిలో ఇదియొక బలరూపము.
గుత్తము - బిగువు, విణ.1.ఎచ్చు తక్కువలు లేక సరిగా నుండునది, కచ్చితము(రైక మొ.వి), 2.గట్టిది. 3.రహస్యము, గూఢము, సం.గుప్తమ్.
బిగువు - బిఱ్ఱు బిగిసి (Tension). బిఱ్ఱబిగియు - మిక్కిలి బిగిసికొను.
బిగి - 1.బిగువు, 2.గర్వము. లవణి - బిగువు.
గట్టి - ధృఢము, కఠినము, కర్కశము, బిగువైనది, సడలనిది, గుల్లకానిది, సం.ఘట్టః.
గోపనము - 1.దాటుట, 2.కాపాడుట, 3.గుప్తపరచుట, రహస్యముగా నుంచుట, గూఢ పరచుట, దాచిపెట్టు, మరుగు చేయుట (Concealment).
గోప్యము - రక్షింపదగినది, (వ్యవ.) రహస్యమైనది.
దాఁపరికము - గోపనము.
దాఁపు - దాచు, చూ.దాఁగు.
దాఁపురము - 1.మరుగుపుచ్చుట, గోపనము, 2.దాచిన సొమ్ము.
నిహ్నవము - 1.అవిశ్వాసము, 2.కపటము, 3.తిరస్కారము, 4.దాపరికము, 5.నమ్మిక(నమ్మిక - నమ్మకము), 6.మరుగుమాట.
నిహ్నవించు - మరుగువెట్టు, దాచు.
నిహ్నుతి - మరుగుపుచ్చుట.
యాపనము- 1.కాలాయాపనము, కాలము గడుపుట, 2.తిరస్కారము.
కాలాయాపనము - కాలక్షేపము.
కాలక్షేపము - 1.వృథాగా చేయు ఆలస్యము, విలంబము, 2.ఉబుసు పోక.
విలంబము - జోగు, వ్రేలుట.
అధిక్షేపము - 1.అక్షేపము, నింద, 2.త్రోసిపుచ్చుట, తిరస్కారము, 3.స్థాపనము.
తిరస్కృతి - తిరస్కారము; అలను -తిరస్కారము, లోకువ, రూ.అలుసు.
లోఁకువ - అధీనము, తక్కువ. తక్కువ - కొరత.
స్థాపనము - 1.నిలుపుట, 2.సమాధిచేయుట, 3.స్థాపించుట.
గొలుసుమోడి - కలిపి వ్రాసిన వ్రాత (గొలుసుకుట్టు వ్రాత).
తీఁగమోడి - 1.వ్రాతపని, 2.గొలుసుకుట్టు వ్రాత.
జిలుగు - 1.గొలుసువ్రాత, 2.చిక్కు.
విశాఖము - విలుకాడు రెండు పాదముల నడుమ జేరెడెడముగ నిలుచుట విణ.శాఖలులేనిది.
జగచ్చక్షువు - సూర్యుడు Sun.
జగతశ్చక్షురివ జగచ్చక్షుః, స.పు - జగత్తునకు నేత్రమువంటివాఁడు.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
గమ్య తేజనైరితి జగతీ, ఈ. సీ. జగచ, త. న. గమ్ ఌ గతౌ. - జనులచేత బొందఁబడునది.
ప్రళయకాలే గచ్చతీతి జగతీ జగచ్ఛ – ప్రళయకాల మందు లయమైపోవునది.
ౙగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద.
చక్షువు - కన్ను.
చష్టే వస్తు స్వరూపం వక్తి చక్షుః. స. న. చక్లిఙ్ వ్యక్తాయాం వాచి. - వస్తు స్వరూపమును చెప్పునది.
చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).
మూర్తీ పటము - (జం.) కనుగ్రుడ్డు పొరలలో అన్నిటి కంటె లోపలనున్న పొర. (ఇది పలుతురును శీఘ్రముగా గ్రహించును. అందుచే నిది దృష్టికి అవసరమగు ముఖ్యావయవము (Retina).
శలాకలు, శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (దీనిని శీఘ్ర గ్రహణశక్తి గలదు) (Rods and cones).
చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్రవము.
చక్షుర్భ్యాం శృణోతీతి చక్షుశ్శ్రవాః, స. పు. శ్రు శ్రవణే - కన్నులవలన వినునది.
చక్షుషీ శ్రవణే యస్యేతి, వా - కన్నులే చెవులుగాఁ గలిగినది.
కాకోదరము - 1.పాము, 2.గుడ్లగూబ.
కాఈషత్ అకం కుటిలగతికం ఉదరమస్యేతి కాకోదరః - ఇంచుకంత కుటిలగతియైన కడుపు గలది.
కాకస్యేవ ఉదరమస్యేతి వాకాకోదరః - కాకిపొట్టవంటి పొట్టగలది.
గూబ1 - చెవిగూబ, కర్ణమూలము.
గూబ2 - గుడ్లగూబ, సం.ఘూకః.
ఘూకము - గుడ్లగూబ.
ఘూకీ - ఆడు గుడ్లగూబ.
ఘోరదర్శనము - 1.పులి, 2.గూబ.
కౌశికము - 1.గుడ్లగూబ, 2.ముంగిస.
కౌశికుఁడు - 1.విశ్వామిత్రుడు, వ్యు.కుశికపుత్రుడు, 2.ఇంద్రుడు, 3.నిఘంటువు తెలిసినవాడు, 4.పాములవాడు.
గాధేయుఁడు - విశ్వామిత్రుడు, గ్రాధిపుత్త్రుడు. అహితుండికుఁడు - పాములవాడు; బరిజోగి - పాములవాడు.
ఫణి - సర్పము, వ్యు.ఫణము గలది.
ఫణము - పాము పడగ.
తలనుండు విషము ఫణికిని
వెలయంగ దోకనుండు వృశ్చికమునకు
దలతోక యనక యుండును
ఖలుని నిలువెల్ల విషము గదరా సుమతీ.
తా. పామునకు శిరస్సునందు, తేలునకు తోకయందు మాత్రమే విషముండును, దుష్టునకు(ఖలుఁడు - 1.దుర్జనుడు, నీచుడు, అధముడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున నుండువాడు.)దలతోక యనక నిలువెల్ల విషముందును.
ఫణి నాగకంఠే భుజంగాద్య నేకం
గళేరుండమాలం మహావీరశూరం
కటివ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం
భజే పార్వతీ వల్లభం నీలకంఠం| - 4
స్ఫటి - పాము, వ్యు.పడగ గలది.
స్ఫట - పాముపడగ.
స్ఫుటము - 1.స్పష్టమైనది, 2.వికసించినది, సం.వి.పాముపడగ.
పడగ - 1.పాముపడగ, 2.టెక్కము, సం.1.స్పుటం 2.పతాకా.
స్పటాయాం తు ఫణా ద్వయోః,
స్పుటతీతి స్పటా. పా. స్ఫుటా. స్పుటిర్ విశరణే. - విస్తీర్ణమైనది.
ఫత్యనయా పణా, ప్స. ఫణ గతౌ. - సర్పము దీనిచేఁ బోవును. ఈ 2 పడిగ పేర్లు.
పతాకము - 1.పడగ, 2.టెక్కెము.
టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జెండా - టెక్కెము.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు Ketu.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
స్ఫుటనము - భేదించుట.
స్ఫోటము - భేదించుట.
భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది :- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).
స్వస్తికము - 1.చదుకము, 2.మంగళ వస్తువు(స్వస్తి - శుభము), 3.పాముపడగ మీది నల్లనిరేఖ, 4.ఒక గుర్తు.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
శృంగాటకము - చదుకము, నాలుగు త్రోవల కూడలి.
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, 3.నాల్గు.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతుష్పదము.
చతుష్టయము - నాలుగు, నలుగురు, 2.(వృక్ష.) సూక్ష్మబీజాణు మాతృకోశిలలో ఏర్పడు నాలుగు (పుప్పొడి రేణువులు) కణములు, (Tetrad) (ఇట్లే స్థూల బీజాణు మాతృకోశికలో గూడ నాలుగు జీవకణములు ఏర్పడును.)
చతుష్పాద - 1.చతుష్పదము, 2.నాలుగు కాళ్ళ జంతువు.
దుర్వీకరము - పాము.
దుర్వ్యాకారత్వాత్ఫణా దర్వీ, సైవ ప్రహరణాదౌ కరో (అ)స్యేతి దర్వీకరః - తెడ్దువంటి ఆకారము గలిగి నది గనుక పడిగదర్వి యనంబడును. ఆ పడిగ హస్తముగాఁ గలిగినది.
గమిష్యామః కాశీనగర మగరాజస్య తనయా
కరాందోలద్దర్వీతలసులభభిక్షామృతరసమ్
యదంతర్వాస్తవ్యై స్సతత ముపనిద్రై స్సుకృతిభి ర్నిశాసు శ్రూయంతే హరవృషభ ఘంటాఘణఘణాః|
తా. ఏ పట్టణమునం దాకొనియున్న వారలకు నగాత్మజాత దర్విచే మనోహరమైన హస్తముతో సుధారభిక్షను బెట్టుచున్నదో యే పురవరంబున సుకృతవశంబున ననారతము శివుడు(హరుఁడు - శివుడు)వాహనమైన నందీశ్వరుని ఘంటానాదము శ్రవణపేయముగ విననగుచున్నదో యట్టి కాశీ పురమున కేగెదము.
దుర్వి - 1.గరిట, అబక, 2.పాము పడగ.
గరిట - కఱ్ఱతో లేక ఇనుముతో చేసిన తెడ్డు, రూ. గరిఁటె, గంటె, (రసా.) ద్రవ్యము లను గ్రహించు సాధనము (Ladle).
కంబి - వెదురుకమ్మి, 2.గరిటె. అబక - అగప.
అగప- 1.టెంకాయ చిప్ప, కొయ్య గరిటె, 2.ఓడల మురికిని గోకి శుభ్రము చేయు కొయ్యగుద్దలి, రూ.అపక, అబక.
తెడ్డు - 1.తుండువు, 2.కొయ్యగరిటె, 3.పడవ త్రోసెడు పలక, రూ.త్రెడ్డు.
తండువు - 1.త్రెడ్డుకొయ్య, 2.నందికేశ్వరుడు.
త్రెడ్డు - తెడ్డు, సం.తండూః.
దుర్వీపాకరస న్యాయము - న్యా. గరిటె పాకమున ఉన్నను ఆ రుచి దానికి తెలియదను రీతి.
ఎడ్డెమనుష్యుడేమెఱుఁగు నెన్నిదినంబులు గూడియుండినన్
దొడ్డగుణాఢ్యునందుగల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే
ర్వడ్డ వివేకిరీతి? రుచిపాకము నాలుక గాకెఱుంగునే
తెడ్డదికూరలోఁ, గలయ ద్రిమ్మరుచుండిననైన, భాస్కరా.
తా. కూరలో నుండి గరిటె నటునిటు ఎన్నిసార్లు త్రిప్పినను అది దాక రుచిని తెలిసికొనలేదు. ఆ రుచి ఎట్లున్నదో నాలుకకే తెలియును. అట్లే యొని గుణవంతుని వద్ద అవివేకి(ఎడ్డియ - మూఢుడు, రూ.ఎడ్డె, ఎడ్డెడు.) యెక్కడెన్ని దినములు కలిసియండి నను అతని గొప్ప(గుణము) ప్రవర్తనము తెలిసికొనలేడు. వివేకియైన వాడు గుణవంతునితో కలిసి నట్లయినచో నతడే యా గుణవంతుని ప్రవర్తనమును గ్రహించును.
దీర్ఘ పృష్ఠము - పాము.
దీర్ఘం పృష్ఠం అస్యేతి దీర్ఘపృష్ఠః - దీర్ఘమైన వీఁపు గలిగినది.
నిడుదవెన్ను - పాము, రూ.నిడుపఁడు.
నిడుద - పొడవు, దీర్ఘము, రూ.నిడుపు.
నిడివి - పొడవు; దీర్ఘము - నిడుద.
పొడవు - (గణి.) రెండు బిందువుల మధ్య దూరము (Length).
తడవుల నిడుపడు - శేషుడు, వ్యు. చిరకాలము నుండి యుండు దీర్ఘమైన శరీరము కలవాడు.
తడవు - 1.చేతులతో ప్రాకు, దోగాడు, నిమురు, వెదకు 2.ప్రస్తావించు 3.విచారించు, వి.1.ఆలస్యము 2.చిరకాలము 3.సేపు.
నిమురు - క్రి.శరీరమును మెల్లగా తడుము, నివురు. నివురు - క్రి.నిమురు.
వెనకు - క్రి.వెదుకు; వెదకు - క్రి.గాలించు, అన్వేషించు.
గాలించు - క్రి.1.బియ్యము మొ.వి రాళ్ళు లేకుండ శోధించు, అన్వేషించు, వెదకు.
అన్వేషణ - వెదకుట, అన్వేష్ట - వెదకువాడు. తడవుడు - వెదకుట.
శోధనము - (రసా.) ఒక ద్రవ్యమును శుద్ధముచేయుట, (Purification), సం.వి. శుద్ధిచేయుట, పరిశోధించుట, వెదకుట.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త, 3.జాగు.
అజాగ్రత్త - జాగ్రత్తలేమి, మెలకువలేమి.
(ౙ)జాగు - ఆలస్యము.
లేటు - (Late) 1.వెనుకటిది, 2.మరణించినది, 3.ఆలస్యము.
సేపు - కాలము.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
దీర్ఘసూత్రుఁడు - ఆలసించి పనిచేయువాడు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామవర్ణో (అ)స్యాస్తీతి శ్యామలః - శ్యామవర్ణము గలిగినది.
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
ౙమున - యమున.
తనకు ఫలంబులేదని యెదన్ దలపోయడు కీర్తిగోరు నా
ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుగొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలిఁగ్రోలి
ననిశము మోయఁదేమఱి మహాభారమైన ధరిత్రి, భాస్కరా.
తా. మహా భారముతోఁ గూడిన (ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి)భూమిని, (విశ్వజనహితమని)ఆదిశేషుఁడు తన వేయి శిరస్సులతో గాలిని పీల్చుచూ మోయుచున్నాడు. అట్లే సజ్జనుఁడును(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)కీర్తినిగోరు వాడు అగునట్టి వాడు స్వార్ధము చింతింపక, లోకములోని జనుల కుపకరించు కార్యము ఎంత కష్టమైనను అది సుఖముగనే భావించి నేరనేర్చు పూనును.
సంసారసర్ప విషదిగ్ధమహోగ్రతీవ్ర -
దంష్ట్రాగ్రకోటిపరిదష్ట వినష్టమూర్తేః|
నాగారివాహన! సుధాబ్ధినివాస! శౌరే!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
దంతశూకుఁడు - ఒక రాక్షసుడు.
దంతశూకము - పాము, వ్యు.కుత్శితముగా కరచునది.
కుత్సితం దసతీతి దంతశూకః, దంశదసనే. - కుత్సితముగాఁ గఱచునది.
అసూయకో దందశూకః నిష్థురో వైరకృచ్ఛఠః |
స కృచ్ఛం మహదాప్నోతి న చిరాత్ పాపమాచరన్ ||
భా|| అసూయ కలవాడు, మర్మస్థానాల్లో కొట్టేవాడు, నిష్ఠురంగా మాట్లాడేవాడు, కలహాలు పెట్టేవాడు, మోసగాడు - వీళ్ళు పాపం చేస్తూ ఎంతో దుఃఖం పొందుతూ ఉంటారు.
కుహనము - 1.ఎలుక, 2.పాము.
ఎలుక - మూషికము.
కుహనా లోభాన్మిధ్యేర్యా పథకల్పనా,
లోభాత్ = అన్నాదికాంక్షవలన, మిథ్యేర్యాపథకల్పనా = అసత్యమైన యీర్య యనెడు భిక్షు ధర్మముయొక్క మార్గమును కల్పించుకొనుట కుహన యనంబడును.
కుహన - అర్థాపేక్షచేనగు కపటచర్య.
కుహతీతి కుహనా, కుహ విస్మాపనే - మోసపుచ్చునది.
అన్నదులకోకై డంబముగా ధ్యానమౌనవ్రతాదుల ధరించి వేసముతోఁ దిరుగు టక్కరి సన్న్యాసి.
బిలేశయము - 1.పాము, 2.ఎలుక.
బిలే శేత ఇతి బిలేశయః. శీఙ్ స్వప్నే. - బిలము నందు నిద్రించునది.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
రంధ్రము - 1.క్రంత, సందు, 2.దూఱు.
క్రంత1 - పెండ్లికొడుకువారు పెండ్లి కూతురునకు తీసికొనిపోయెడు ప్రధానద్రవ్యము, రూ.కంత.
క్రంత2 - 1.సందుత్రోవ, 2.రాజవీధి, 3.రచ్చ, 4.రంధ్రము, సం.గర్తః.
రంధ్రముల కుట్టు - (గృహ.) అలంకారపు కుట్టులో రంధ్రముల నేర్ప రు చు కు ట్టు, (Eyelet-stitch).
లాఁగదాఁగుడు - సర్పము, వ్యు.బొరియ లందు దాగుకొనునది.
లాఁగ - రంధ్రము, బొరియ.
రంధ్రాన్వేషణము - రంధ్రములను అన్వేషించుట (తప్పులు వెదకుట యని వాడుకలోని యర్థము.)
కొక్కురౌతు - వినాయకుడు.
కొక్కు - పందికొక్కు; పందికొక్కు - మూషికము.
మూషికము - 1.ఎలుక, 2.పందికొక్కు.
ఎలుక - మూషికము.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
గురువు - 1.ఉపాద్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
ఎలుకతోలుఁ దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినఁ బలుకునా విశ్వ.
తా. ఓ వేమా! యెలుకతోలు యెంతకాలము వుతికినను దాని నలుపు రంగు పోయి తెలుపు రాదు. కర్ర(కొయ్య - కఱ్ఱ, మ్రాను.)బొమ్మను తెచ్చి యెంత కొట్టిననూ అది మాటలాడదు. అట్లే దుర్మార్గుడు తన చెడ్దగుణములు వదలడు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
శయాళువు - పెనుబాము, విణ.నిద్రపోతు, రూ.శయతుడు.
నిదురపోతు - నిద్రాళువు, రూ.నిద్దురపోతు.
నిద్రాళువు - నిదురపోతు, నిద్రించు స్వభావము గలవాడు.
స్వప్నక్ శయాళుర్నిద్రాళుః -
స్వపితి తాచ్ఛీల్యేనేతి స్వప్నక్, జ. ఞి స్వప్ శయే. - శేతే తాచ్ఛీల్యేనేతి శయాళుః, శీఙ్ స్వప్నే. నిద్రాతి తాచ్చీల్యేనేతి నిద్రాళుః, ద్రా కుత్సాయాంగతౌ. - నిద్రపోవు స్వభావము గలవాఁడు. ఈ 3 నిద్రపోతు పేర్లు, తూఁగపోతు.
శయము - 1.శయ్య, 2.చెయి, 3.పాము.
శయ్య - 1.పడక, 2.పదగంఫనము, 3.విధము.
శయనము - శయ్య, నిద్ర.
శయనీయము - శయ్య, వ్యు.శయనింపదగినది.
పడకపుండు - (గృహ.) ఎక్కువ జబ్బుతో కదలలేకుండ పండుకొని యున్న వారికి మంచమువేడివల వచ్చుపుండ్లు (Bedsore).
కదా శయానో మణికర్ణి కాయాం
కర్ణే జప త్యక్షర మిందుమౌళౌ
అవాప్య నిద్రాం గతమోహముద్రాం
నాలోకయామిహపునః ప్రపంచమ్|
భా|| మణికర్ణికాతీరమున శయనించినఁ నా శ్రవణపుటమునందు (ఇందుఁడు - చంద్రుడు)చంద్రమౌళీశ్వరుడు ప్రణవమంత్రము నుపదేశించుచుండగాఁ బోయిన మోహముద్ర గలిగిన నిద్రా సుఖము ననుభవించుచు మరల నేన్నఁడీ మహోగ్రకలుషసంభఠితమైన ప్రపంచమును గాంచకుండుడునో కదా?
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః| - 100స్తో
ఉరగము - 1.పాము, వ్యు.రొమ్ముతో ప్రాకునది, 2.ఆశ్లేషా నక్షత్రము.
ఉరసా గచ్ఛతీత్యురగః గమ్ ఌ గతౌ. ఉరస్సుచేత సంచరించునది.
ఉరము - వృక్షము, రూ.ఉరస్సు, వికృ.రొమ్ము.
ఉరస్సు - పక్షము.
ఉరోజము - స్తనము, వ్యు.ఉరము నందు జనించినది.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము రూ.హృది ప్రాణః (జం.)గుండెకాయ, గుండె(Heart).
రొమ్ము - పక్షము, రూ.ఱొమ్ము, సం.ఉరస్.
రొమ్ము పడిసెము - (వైద్య., గృహ.) గుండె జలుబు.
రొంప - పడిసెము.
ౙలుబు - శైత్యము, సం.జలమ్, శైత్యమ్. ప్రతిశ్యాయము - పడిసెము, రూ.ప్రతిశ్య.
ఉపయోజనము - (జీవ.) నిర్మాణము నందును, శరీర ధర్మముల యందును, ప్రాణి ప్రత్యేక పర్యావరణమునకు తగియుండు క్రమము (Adaptation).
ఉరము - వృక్షము, రూ.ఉరస్సు, వికృ.రొమ్ము.
వృక్షము - చెట్టు, సం. (వృక్షః) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో దృఢమైన శాఖలుగల మొక్క (Tree).
చెట్టూఁగట్టు - క్రి. చెట్టుగా నేర్పడు (అవయవ సౌష్ఠవ మేర్పడుట).
ఉరో వత్సం చ వక్షశ్చ :
స్త్యైర్య మృచ్ఛత్యురః స. న. ఋ గతౌ. - స్థైర్యమును బొందునది.
వ్స్యతే వస్తేణ వత్సం. వస - ఆచ్ఛాదనే వస్త్రేముచేఁ గప్పబడునది.
నక్షతే సురతాదౌ వక్షః స. న. వక్ష సంఘతే - సురతాదులయందుఁ గొట్టఁబడునది. ఈ మూడు ఱొమ్ము పేర్లు.
వత్సము - 1.ఏడాదిలోపు దూడ, 2.రొమ్ము.
పెయ్య - వత్స, ఆడుదూడ, రూ.పేయ.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రావదగినది.
ఆఁబడ్డ - (ఆవు+పడ్డ) పాలు విడిచిన ఆవుపెయ్య.
తఱపి - 1.పెయ్య, 2.తారుణ్యము.
తారుణ్యము - జవ్వనము. తరుణిమ - యౌవనము, రూ.తారుణ్యము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
యౌవతము - యువతీ సమూహము.
చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
తరుణము - సమయము, సం.క్రొత్తది, యౌవనముగలది.
వయసు - ప్రాయము, యౌవనము.
ఈడు1 - 1.వయస్సు, 2.యౌవనము, విన.1.అనురూపమైన వయస్సు గలది, 2.సామ్యము, 3.తాకట్టు, విణ.సమానము, తగినది శక్యము.
ఈడు2 - క్రి.1.పాలు పిదుకు, 2.ముందు నకుబోవు, 3.వెనుకబడు.
ఈడుపు - 1.లాగుట, 2.జాగు, విలంబము.
ఈడుముంత - పాలు పిదుకు పాత్రము.
ముంత - చిన్న మాని పాత్రము.
దుత్త - 1.చిన్నకడవ, 2.పాలముంత. అత్తమీద కోపము దుత్త మీద చూపిస్తే ఎట్లా?
చల్లకొచ్చి ముంత దాయడమెందుకు? మబ్బులో నీళ్ళు చూసుకొని ముంతలో నీళ్ళు పారపోసు కొనుట, తెలివితక్కువతనము.
దోహనము - పాలు పిదుకుట.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).
వత్సౌ తర్ణకవర్షౌ ద్వౌ :
వత్సశబ్దము దూడకును, సంవత్సరమునకును పేరు. వసతి, వసత్య స్మిన్నితి చ వత్సః. వస నివాసే. - ఉండునది. గనుక, దీనియందన్నియు నుండును గనుకను వత్సము.
మలప - దూడచచ్చి పాలిచ్చెడి ఆవు.
దోషకము- 1.దోసె, 2.ఆవుదూడ, (అని కొందరు).
దోసె - అట్టు, త. దోసై, క. దోసె.
అట్టు - ఒక రకపు పిండివంట, దోసె, అవ్య. ఆ ప్రకారముగా.
అటు - 1.ఆప్రకారము, 2.అక్కడకు చూ.అటు, అట్టులు.
అట్టులు - అటు.
ఒబ్బట్లు - 1.అట్లు, 2.పోళీలు.
పోళీ - (పోలీ) బొబట్లు (భక్ష్యవిశేషము).
వర్షము - 1.వాన, 2.పేడితము, 3.ద్వీపము, 4.సంవత్సరము.
వాన - వర్షము;
వానకాళ్ళు - వర్షధారలు.
వత్సరము - ఏడాది; వత్సము - ఏడాది.
ఏఁడాది - సంవత్సరము.
వత్సరః : తే ద్వే వత్సర ఇత్యుచ్యతే. ఆ దక్షిణాయనోత్తరరాయణములు, కూడిన కాలము వత్సర మనంబడును. ఉతరాయణ దక్షిణాయనములు రెండు చేరి ఒక సంవత్సరము Year పేరు.
దుర్దినము - 1.చెడు కలిగిన దినము, 2.మబ్బు క్రమ్మిన దినము, 3.వాన.
నలంఘయే ద్వత్సతంత్రీం నప్రధా వేచ్చ వర్షతి|
నచోదకే నిరీక్షేత స్వం రూప మితినిర్ణయం||
తా. దూడను గట్టిన త్రాడును(గుదిత్రాడు - దూడకాలికి గట్టుత్రాడు, బంధము.)దాఁటకూడదు, వాన(వాన - వర్షము)యందు పరుగెత్తరాదు, నీటియందు(ఉదకము - నీరు, వ్యు.తడుపునది, రూ.ఉదము.) తననీడను(నిరీక్షణము - చూపు)జూడరాదు. - నీతిశాస్త్రము
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మ కృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః||
ఉరస్సు - పక్షము.
పక్షము - 1.నెలయందు బదునైదు 15 దినములు (శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క.
చెట్టువ - 1.రెక్క, రూ.చట్టువ. ౘట్టుప - రెక్క, రూ.చెట్టుప. రెక్క ఆడితే గాని డొక్క ఆడదు.
రెక్క - రెక్క, పక్షివిరక. పక్షి - (పక్షములు గలది) పులుగు. పక్షివాహన గోవిందా|
వక్షము - రొమ్ము.
వక్షోరుహము - స్తనము.
రొమ్ము - పక్షము, రూ.ఱొమ్ము. సం.ఉరస్.
ఱొమ్ము - వక్షము, సం.ఉరస్.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.
పక్షాంతరము - మరియొక విధము.
పక్షాంతరస్థాపన - (గణి.) ఒక పక్షము నుండి మరియొక పక్షమునకు రాసులను కొనిపోవు ప్రక్రియ (Traansposition).
ఉరగాదిప్రియ భూషణ శంకర నరకవినాశ నటేశ శివ|
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.
స్తనము - కుచము.
కుచము - చన్ను, స్తనము.
ౘను - చన్ను, సం.స్తనః.
స్తనము - కుచము.
కుచము - చన్ను, స్తనము.
స్తనౌ కుచౌ,
స్తనతి బాల ఆభ్యా మితి స్తనౌ, అ. పు. స్తన శబ్దే. - వీనికొఱకు బాలుఁడు మొఱపెట్టును.
కుచ్యతే కామినా నఖైః కుచౌ, అ. పు. నాయకునిగోళ్ళచే గిల్లఁబడునవి. ఈ 2 చన్నుల పేర్లు.
ౘను - చన్ను, సం.స్తనః.
ౘన్ను - 1.స్తనము, 2.మొగలి యూడ, 3.తాటిముంజె, 4.తాటిచన్నులు, సం.స్తనః.
ౘన్నుకట్టు - 1.రవిక, 2.స్తనప్రదేశము.
ౘనుఁగప్పు - రవిక, రూ.చన్నుగప్పు.
రైక - రవిక.
పాలిండ్లు - (బహు.) స్తనములు, పాలకు ఇండ్లు వంటివి.
స్తన్యము - చనుపాలు.
స్తన్యదము - (జం.) పాలిచ్చుజంతువు క్షీరదము, (Mammal).
స్తనంధము - పాలుత్రాగు ఆడుబిడ్డ.
స్తసంధయుఁడు - పాలుత్రాగు మగబిడ్డ.
బర్పింగ్ - (గృహ.) (burping) చంటి బిడ్డకు పాలుపట్టిన తర్వాత భుజము మీద వేసుకొని వీపుపై నెమ్మదిగా తట్టుట. (ఇట్లు చేయుట వలన పాలలో నున్న గాలి బుడకలు బయటికి వచ్చును).
స్తనదూరీకరణము - (గృహ.) తల్లి పాలు మాన్పించుట, సంవత్సరము దాటిన తరువాత శిశువును తల్లిపాలు మరపించి యితర ఆహారముపై ఆధరాపడునట్లు అలవాటు చేయుట (Weaning).
నారీస్తనభరనాభీదేశం, దృష్ట్వా మాగా మోహావేశం |
ఏతన్మాంసవసాదివికారం, మనసి విచింతయ వారం వారం || - భజగోవిందం
ౘను - క్రి.1.పోవు, 2.చెల్లు, 3.తగు, 4.కడచు.
పోవు - క్రి.1.వెళ్ళు, 2.నశించు, 3.యత్నించు, 4.కలయు.
వెళ్ళు - క్రి.వెదలు, నిర్గమించు.
వెడలు - క్రి.బయలుదేరు, విశాలము.
వెడఁద - విశాలము; వెంబ - విశాలము.
విశాలము - విరివియైనది.
చెల్లు - క్రి.అయిపోవు, కడచు, 2.కొనసాగు, 3.తగు, 4.శక్యమగు, 5.చేరు, 6.చావు, 7.మారు, విణ.చెల్లినది.
కొనసాగు - క్రి.1.సమకూడు, 2.నెరవేరు, 3.వర్థిల్లు.
తగు - క్రి.అర్హమగు, రూ.తవు.
తవు - తగు యొక్క రూపాంతరము.
ౘనుదెంచు - క్రి.1.వచ్చు, పోవు.
వచ్చు - క్రి. సమీపమునకు నడుచు.
ౘనవు - 1.అధికారము, 2.అనురాగము, 3.కోరిక, 4.చెల్లుబడి.
చెల్లుబడి - 1.అధికారము, 2.మాట సాగుదల, 3.చెల్లుట.
ౘనువాఁడు - చెల్లుబడి కలవాడు.
పలుకుబడి - ఉచ్ఛారణము, వి. (గృహ.) ధనము, ప్రాబల్యము, మాట చెల్లుబడి (Influence).
బస్ట్ - (గృహ.) (Bust) ఊర్థ్వభాగము, స్త్రీలకు నడుమునకు పైభాగము, రొమ్ము.
పయఁట - స్త్రీల రొమ్ముమీదివస్త్రము చెరుగు, రూ.పయ్యఁట, పైట, సం.ప్రతిష్ఠానమ్, పై ఠా.
పైఁట - పయట, సం.పైఠా.
పైయ్యెద - (పై+ఎద) పయట, రూ.పయ్యద.
ఎద1 - పశుఋతువు.
ఎద2 - హృదయము, సం.హృత్.
ఎడఁద - ఎద, హృదయము.
ఉరసా తరసా మమానిథైనాం భువనానాం జననీమనన్య భావమ్|
త్వదురో విలసత్తదీక్షణశ్రీపరివృష్ట్యా పరిపుష్టమాస విశ్వమ్||8||
స్వామీ! అనన్య భావముతో నిన్ను సేవించుటకు వచ్చిన లోకమాతయైన లక్ష్మీదేవికి నీ వక్షస్థలమున ఆశ్రయమిచ్చి, సమ్మానించితివి. నీ వక్షస్థల మున విలసిల్లుచున్న ఆ దేవియొక్క చల్లని చూపులకు విశ్వమంతయు ను ఎంతయు సుసంపన్నమై నది. - నారాయణీయము
భక్తి గలిగిన నీకును బండు వగును
నంశ లొకటియే యౌటచే నౌనుగాదె
నీదు ఱొమ్మున వరలక్ష్మి నుండియుండు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
ఉరగ శయాన - శేషునిపై శయనించువాడు, శ్రీ మహావిష్ణువు.
ఉరము - వృక్షస్థలము/రొమ్ము. ఉరము నందు లక్ష్మి వున్నవాడు హరి.
శ్రీవత్సలాంచనః శ్రీవత్సోనామ వక్షఃస్థలే మహాపురుష లక్షణో రోమావర్త విశేషః సఏవ లాఞ్చనం యస్యసః - వక్షః స్థలమందు మహాపురుష లక్షణమైన శ్రీవత్స మనెడు మచ్చ గుఱుతుగాఁ గల వాఁడు. - విష్ణువు
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||
స్వభువు - 1.విష్ణువు, 2.శివుడు, వ్యు.స్వయముగ పుట్టినవాడు.
స్వభూః - ఊ-పు. స్వే నాత్మనా జాయత ఇతి స్వభూః - తనంతఁదానే పుట్టినవాఁడు.
స్వయంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మదనుడు.
స్వయంభూః. ఊ-పు. స్వయం భవతీతి స్వయంభూః - తనంతతనే పుట్టినవాఁడు.
స్వజాతే త్వౌర సారస్యా -
ఔరసుఁడు - ధర్మపత్ని యందు బుట్టిన కొడుకు.
ఉరసా నిర్మితః ఔరస్యశ్చ - తనయు(ఉ)రస్సుచేత పుట్టినవాఁడు.
స్వజాతే అను పదముచేత దత్తక్షేత్రజాది నిరాసము. ఈ 2 రెండు సవర్ణస్త్రీయందు తనవలనఁ బుట్టిన కొడుకు పేర్లు.
జాతము - సమూహము, విన.పుట్టినది.
జాతకుఁడు- 1.పుట్టినవాడు, 2.అదృష్టవంతుడు.
స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.
ఛాయననొసగు చెట్టు సాధువు బోధట్టు
లడగి దరినిజేరి వడయవచ్చు
నట్టనిట్టు దాటనిది పోవునది రామ! విశ్వ.
తా|| నీడనిచ్చే చెట్టు, మంచి బోధించు గురువు వల్ల అందరింకీ మేలు జరుగుతుంది. చెంతచేర గానే చెట్టేమో నీడనిస్తుంది. గురువు బోధతో (విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)లభిస్తుంది. కాబట్టి చెట్టు లేకపోతే నీడ ఉండదు. గురువు లేకపోతే జ్ఞానం రాదు.
బోరప్రాఁకుడు - పాము.
బోర - 1.రొమ్ము, 2.పెద్దరెక్కతలుపు.
బోరగిల్లు - క్రి.రొమ్ము భూమి నాను.
అక్షకాస్తి - (జం.) బోర యెముక (Clavicle).
రొమ్ము పడుసెము - (గృహ. వైద్య) గుండె జలుబు. (Bronchitis)
ౙలుబు - శైత్యము, సం.జలమ్, శైత్యమ్.
రొంప - పడిసెము; పీనసము - పడిసెము; ప్రతిశ్యాయము - పడిసెము, రూ.ప్రతిశ్య. పడిశెము పది రోగాల పెట్టు.
విషపడిశెము - (గృహ.) శ్వాసనాళమునకు సంబంధించిన అంటు జ్వరములు, జలుబులు (Influenza).
పీనజ్విరము - జలుబు పడిశముతో వచ్చు జ్వరము. (ఇది ఒక రకపు ఎలర్జీ వలన కలుగు జ్వరము). (Hay fever).
అక్కు - 1.ఱొమ్ము 2.గుండె. అక్కున చేర్చుకొనుట, దగ్గరకు తీసుకొనుట.
గుండె - గుండియ.
గుండియ - హృదయము, రూ.గుండె.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము రూ.హృది ప్రాణః (జం.)గుండెకాయ, గుండె(Heart). హృదయం హరిసుందరి|
హృదయం హృత్ :
హ్రియత ఇతి హృదయం హృచ్చ. ద. స. హృఞ్ హరణే. - హరింప బడునది.
హృదయములో పద్మాకారమై యుండు మాంస విశేషము పేర్లు. గుండెకాయ, ఇదే హృదయకమల మందురు, వృక్కాదులు, గుండెకాయ వేళ్ళని కొందరు.
అనై చ్చిక కండరములు - (జం.) అనిచ్చాపూర్వకముగ పనిచేయు కండరములు (Involuntary muscles), ఉదా. గుండెకాయ, పేగులయొక్క కండరములు.
డెందము - హృదయము.
హృది ప్రాణః - ప్రాణము హృదయము నందుండి గర్భమునం (దన్నా) అన్నాదులఁ బ్రవేశింపఁ జేయుచుండును.
హృతి - హరణము, రూ.ఆహృతి.
హృతము - హరింపబడినది, రూ.ఆహృతము.
హృదయ స్పందనము - (గృహ.) గుండె కొట్టుకొనుట (Heart beat).
హృద్యము - మనసుసు కింపైనది, మదికి హితమైనది.
హృత్కోశము - (జం.) గుండెకాయ చుట్టును ఉండు సంచి (Pericardium).
హృత్కుంచనము - (జం.) హృదయములోని కండర భిత్తికలన్నియులోని రక్తమును బయటికిపంపుటకు సంకోచము నొందు స్థితి (Systole).
హృదయవ్యాకోచము - (జం.) కండరములలో నేర్పడిన హృదయము యొక్క గోడలు ఒకసారి ముడుచుకొనిన తరువాత తిరిగి యథాస్థితికి వచ్చుట (Diastole).
దిగులు - 1.గుండెయదురు, 2.అధైర్యము.
దిగ్గురను - గుండెగభీలుమను, భయపడు.
ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
ఉసురు - తాపమునందగు నిశ్వాసధ్వన్యను కరణము, రూ.ఉస్సురు.
ఉస్సురు - ఉసురు. Air in the Heart.
ఉసుఱు - 1.ప్రాణము, ఆయువు, 2.ప్రాణక్షోభము వలని దుష్ఫలము. Air, wind, breath, life, vitality, the living soul.
జీవితము - 1.ప్రాణము, 2.జీవము.
జీవము - ప్రాణము.
గాలిని బంధించిన మొనగాడులేడు! గాలిని బంధించి హసించి దాచిన పని లేదు……
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు.
సహృదయుఁడు - మంచిమనస్సు గలవాడు.
హృదయాళు స్సుహృదయః :
ప్రకృష్టం హృదయ మస్య హృదయాళుః - శ్రేష్ఠమైన హృదయము గలవాడు.
శోభనం హృదయమస్య సుహృదయః - మంచి హృదయము గలవాఁడు. ఈ రెండు మంచిమనస్సు గలవాని పేర్లు.
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యదో ముఖం,
అధో నిష్ట్యా వితస్త్వాంతే నాభ్యా ముపరి తిష్టతి|
తా. మన శరీరంలోని గొంతుకు దిగువ, నాభికి పైనగల ప్రదేశంలో పన్నెండు అంగుళాలు ఎడంగా హృదయకమలం ఉంది. అది విష్ణువు నివాస స్థానమని వేదం స్పస్టం చేస్తోంది.
బ్రహ్మేద్రరుద్రమరుదర్కకిరీటకోటి-
సంఘటితాంఘ్రి కమలామలకా న్తికా న్త!
లక్ష్మీలసకుచసరోరుహ రాజహంస!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.
జీవితకాలము - ఆయువు.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు.
ఆయు ర్జీవిత కాలః -
ఏతీత్యాయుః స. న. ఇణ్. గతౌ. - పోవునది.
జీవితస్య కాలః జీవితకాలః - బ్రతికి యుండుకాలము. ఈ రెండు ఆయుస్సు పేర్లు.
జీవితము - 1.ప్రాణము, 2.జీవము.
జీవము - ప్రాణము.
ఆయము 1 - 1.జీవస్థానము, ఆయువుపట్టు, 2,మర్మము, సం.ఆయుః.
ఆయము2 - 1.రాక, 2.లాభము, 3.రాబడి, 4.పన్ను.
రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడినపున్నమ, 2.ఒకయేఱు, వి.ఆగమనము. రాకాచంద్ర సమానన రామ్|
మారాము - 1.మర్మము, 2.గారాబము, 3.పెంకిపట్టు.
లబ్ధి - లాభము; లాభము - (అర్థ.) పరిశ్రమలవలన కాని వ్యాపారము వలన కాని ఖర్చులుపోను మిగిలిన నికరపు ఆదాయము. విక్రయించుటకు కావలసిన అన్ని వ్యయములుపోగ మిగిలిన సొమ్ము, సం.వి.క్రయ విక్రయములందు వచ్చు హెచ్చు ధనము అధికముగా పొందబడినది.
నయము - 1.లాభము, 2.మనువు, 3.మృదుత్వము, 4.అందము, విణ.చౌక.
నయగారము -1.మృదుత్వము, 2.మృదువచనము, 3.అనుకూలము.
నయగారి - మృదుత్వము గలవాడు.
నయ - అందము, నయము.
నయము - 1.నీతి, 2.పొందించు. నీతి సురక్షిత జనపద రామ్|
నయించు - క్రి.పొందించు.
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీసంయోగము, 3.లాభము, 4.చెలిమి, 5.రాబోవుకాలము, ఆయతి.
ఆప్తము - 1.పొందబడినది, 2.నమ్మదగినది, 3.యదార్థజ్ఞానము కలది, 4.నిండినది, 5.యుక్తయుక్తమైనది, 6.(గణి.) భాగహారముచేయగా ఏర్పడిన సంఖ్య, లబ్ధము. ప్రణిహితము - పొందబడినది.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.
ప్రతిపత్తి - 1.సామర్థ్యము, 2.ప్రాప్తి, 3.లాభము.
ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి(రాబడి-ఆదాయము), 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
ఆయతి1 - 1.రాబడి(రస్మి - (వ్యావ.) రాబడి.), 2.నిడుపు, 3.రాగల కాలము, 4.కోశ దండముల వలన రాజునకు గలుగుశక్తి, ప్రభావము, 5.ఫలము గలుగు సమయము, 6.ప్రాపణము, 7.కూడిక, 8.పని, 9.సంయమము.
ఆయతి2 - జ్యేష్థాది మాసచతుష్ఠయము, కందాయము.
కందాయము - సంవత్సరమున మూడవ భాగము, జ్యేష్ఠాది మాస చతుష్టయము.
ఆదాయము1 - 1.గ్రహించుట, 2.లాభము, లబ్ధద్రవ్యము, రాబడి.
ఆదాయము2 - (అర్థ.) ఆస్తి వలనగాని, కృషివలనగాని మానవుడు ఆర్జించు సంపాదన.
ఆదాయపుపన్ను - (అర్థ.) వ్యక్తి యొక్క ఆదాయమునుబట్టి ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పన్ను, రాబడిపై పన్ను, (ఇది వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లింప వలసి యున్నది. ఇది సంవత్సరాది కాదాయముపై విధింపబడును. దీనిని మన దేశములో కేంద్రప్రభుత్వము వసూలు చేయుచున్నది, (Income-tax).
పన్ను మదింపు - మొత్తము రాబడినిబట్టి పన్ను విధించుట.
సిద్ధాయము - 1.వెచ్చపు సొమ్ము నందు కూడబెట్టిన ధనము, 2.శిస్తు, సం.సిద్ధాయః.
సిద్ధయము - సిద్ధాయము, కప్పము.
శిస్తు - (వ్యవ., శాస.) భూస్వామికి కౌలుదారుగా నిర్ణయింపబడిన అద్దె, పన్ను, (ధనరూపముగాగాని ధాన్యరూపముగాగాని) (Rent).
అవజ్ఞ - అవమానము.
అవమతి - 1.అవమానము, 2.తిరస్కారము, 3.అనాదరము.
అవమయస్మతే లవమతం, అవజ్ఞాయతే స్మ అవజ్ఞాతం, మన జ్ఞానే, జ్ఞా అవబోధనే. - నికృష్టముగాఁ దలఁచబడినది అవమతము, అవజ్ఞాతమును.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అవమానము.
అవమాన్యతే స్మ అవమానితం, భూ సత్తాయాం, పరిపూర్వస్తిరస్కారే - తిరస్కరింపఁబడినది.
ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రౌషధి సమాగమా|
దానమానావమానాశ్చ నవగోప్యాః మనీషిభిః||
తా. ఆయుస్సు, ద్రవ్యము(విత్తము - ధనము, సం.విణ.1.విచారింప బడినది, 2.తెలియ బడినది.), ఇంటిగుట్టు, మంత్రము, ఔషధము, సంగమము(సమాగమము - 1.చక్కనిరాక, 2.పొందిక.), దానము, మానము, అవమానము, ఈ తొమ్మిదియును బుద్ధిమంతులగు వారిచేఁ బరులకు దెలియనీయక దాఁచఁదగినవి. - నీతిశాస్త్రము.
జీవలోకైకజీవాతు ర్భద్రోదారవిలోకనా,
తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ|
పన్నగా అశనం యస్య సః పన్నగాశనః - సర్పము(పన్నగము - పాము)లన్నముగా గలవాఁడు.
పన్నగము - పాము.
పద్భ్యాం న గచ్ఛతీతి పన్నగః - పాదములచేతః బోవునది.
పన్నం పతితం యథాతథా గచ్ఛతీతి పన్నగః - పడినట్టుగాఁ బోవుంది.
పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ|
గిరింద్రాత్మజా సంగృహీతార్థదేహం
గిరౌ సంస్థితం సర్వదా పన్న గేశం
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభు మీశానమీడే| – 5
భోగవతి - 1.పాతాళము, 2.పాతాళమందలి నది, విణ.భోగము గలది.
అధోభువనము - పాతాళలోకము.
అధః స్థితం భువన మధోభువనం - క్రిందనుండు లోకము.
పాతాళము - క్రిందిలోకము.
పతం త్యస్మిన్ పాపాత్పాతాళం. పత్ ఌ గతౌ. – పాపము వలన దీనియందుఁ బడుదురు.
బలిధ్వంసి - విష్ణువు.
బలిధ్వంసీ న-పు, బలినం ధ్వంసితం శీలమస్యేతి - బలి నణచినవాఁడు, ధ్వంసు అవస్రంసనే.
బలి - 1.దేవత యెదుట మృగాదుల నరకుట, 2.కప్పము, 3.కానుక, విణ.బలము గలవాడు.
బలిసద్మము(సద్మము - గృహము.) -
బలేరసురస్య సద్మ నివాసః బలిసద్మ. న. న. - బలిచక్రవర్తికి నివాసము.
బలిపుష్ఠము - కాకి.
బలినా పుష్టః బలిపుష్టః పుష పుష్టౌ. - బలిచేఁ బొషింపబడునది.
కుండిక - 1.రసాతలము, 2.చిన్నపాత్ర.
రసాతలము - పాతాళలోకము, అధోలోకము.
రసాయాః భూమేః తల మధోభాగః రసాతలం - భూమి యొక్క అధోభాగము.
నాగలోకము - పాతాళము; పాపౙగము - నాగలోకము.
నాగానాం సర్పాణాం లోకః నాగలోకః - సర్పములు యొక్క లోకము.
నాగవాసము - గొండ్లెము తగిలించెడు రెండు కొనలు వంచిన యినుప కమ్మి, వై.వి.1.వేశ్యాసమూహము, 2.ఆటమేళము, సం.వి.నాగలోకము.
ఏకకుండలుఁడు-1.బలరాముడు, 2.కుబేరుడు, 3.ఆదిశేషుడు.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ఆశ్లేష - ఇది ఆదిశేషుని జన్మ నక్షత్రం.
ఆదిశేషుడు - సర్పరాజు.
వాసుకి - 1.సర్పరాజు, 2.మృగపక్షి ధ్వని.
ఆదిశేషుడు పడగలు విప్పి పసిబాలుడైన శ్రీకృష్ణునికి గొడుగుగా పట్టినవాడు.
వాసుకిస్తు సర్పరాజః -
వసు రత్నం కే శిరసి యస్య సః వసుకః, తస్యాపత్యం వాసుకిః, ఈ. పు. - వసు వనఁగా రత్నము, అది శిరస్సునఁ గలవాఁడు వసుకుఁడు, వాని కొడుకు వాసుకి.
వసతి పాతాళ ఇతి వాసుకిః, వస నివాసే. - పాతాళ(నాగలోకము - పాతాళము)మందుండువాఁడు.
సర్పాణాం రాజా సర్పరాజః - సర్పములకు ఱేఁడు. ఈ 2 వాసుకి పేర్లు.
వరదాభయకర వాసుకి భూషణ వనమాలాది విభూషణ శివ|
లక్ష్మణుఁడు, శత్రుఘ్నుఁడు ఆశ్లేష నక్షత్రములో జన్మించారు.
లక్కుమనుఁడు - లక్ష్మణుడు, సం. లక్ష్మణః. హితకర లక్ష్మణసంయుత రామ్| లక్ష్మణాగ్రజ గోవిందా|
త్రేతాయుగంలో ఆదిశేషుడు లక్ష్మణుఁడుగా జన్మించి, శ్రీరాముడుగా అవతరించిన విష్ణుమూర్తిని సేవించాడు. ద్వాపరయుగములో విష్ణువు, శ్రీకృష్ణుడిగా జన్మించి అన్న బలరాముడుగా అవతరించిన ఆదిశేషుడిని సేవించాడు.
ఊర్మిళ - 1.లక్ష్మణుని భార్య, జనక మహారాజు కూతురు, 2.పెనిమిటి నెడబాసిన స్త్రీ.
వైకుణ్ఠః పురుషః ప్రాణఁ ప్రాణదః ప్రణవః పృథుః|
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః||
భోగి - 1.పాము, 2.రాజు, 3.భోగిపండుగ, 4.మంగలి.
భోగస్సర్పశరీరం దతస్యాస్తీతి భోగీ. న.పు. - భోగమనఁగా సర్పశరీరము; అది గలిగినది.
భోగిని - 1.ఆడుపాము, 2.వేశ్య, 3.పట్టాభిషిక్తురాలుకాని రాజు భార్య.
భోగిన్యో(అ)న్యా నృపస్త్రియః,
భోగః సంభోగో యాస్వితి భోగిన్యః - ఎవ్వరియందు సంభోగము గలదో వారు భోగినులు. ఈ ఒకటి తక్కిన రాజభార్యలు.
భోగ్యము - 1.ధనము, 2.ధాన్యము, విణ.భోగింపదగినది.
భోగించు - 1.సుఖించు, 2.అనుభవించు.
కుప్ప - ధాన్యము మొ. ని రాశి.
కుప్పట - ధాన్యము వలన ధనము.
భోగము - 1.సుఖము(సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము.), సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది:- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).
దాసీ భృత్య స్సుతో బంధుర్వస్తు వాహన మేవచ|
ధన ధాన్య సమృద్ధిశ్చా వ్యష్ట భోగాః ప్రకీ ర్తీతాః||
తా. దాసీజనులు, భటులు(భృత్యుఁడు-సేవకుడు, పనివాడు.), కొమారులు, చుట్టములు(ౘుట్టము - 1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు.), పదార్థములు, వాహనములు, ధనము, ధాన్యము ఇవి అష్టభోగములు. - నీతిశాస్త్రము
ఆమర్దసంజ్ఞే నగరే చ రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః|
సద్భుక్తిము క్తిప్రద మీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. - 6
నీదు శయ్యము భోగియౌ నేది తీరు
నన్ని వంకలె నీ కున్న వెన్న నేల
నాదువంకను గొనక సమ్మోదముననె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
జిహ్మగము - పాము, విణ.వంకరగా పోవునది.
జిహ్మం వక్రం గచ్ఛతీతి జిహ్మగః గమ్ ఌ గతౌ. - వక్రముగాఁ బోవునది.
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.
ద్విరస్వనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
ద్విజిహ్వ శబ్దము సర్పమునకును, కొండెగానికిని పేరు. ద్వేజిహ్వే అస్యేతి ద్విజిహ్వః - రెండు నాలుకలు గలిగిన (వాఁడు)ది.
కుంభీనసము - పాము, విషజ్వాలలు గ్రక్కు సర్పము.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
గాలిదిండు - సర్పము.
గాడుపుమేపరి - పాము, పవనాశము.
పవనః అశనంయస్య సః పవనాశనః - వాయువు ఆహారముగాఁ గలిగినది.
హరి ! నీకుఁ బర్యంకమైన శేషుఁడు చాలఁ బవనము భక్షించు బ్రతుకు చుండు,
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్పపామును నోఁటఁ గొఱకుచుండు,
నదిగాక నీభార్యయైన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు;
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలుచేసి ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుంద్రు,
తే. స్పష్టముగ నీకు గ్రాసము జరుగుచుండఁ
గాసు నీచేతి దొకటైనఁ గాదు వ్యయము,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార ! నరసింహ! దురితదూర ! - 48
తా. హరీ! నీకు పాన్పైన శేషుడు వాయువును తిని బ్రతుకుచుండును. చక్కగా నీకు వాహనమైన గరుత్మంతుడు గొప్పపామును నోటితో గొరుకు చుండును. అంతియెకాక నీ భార్యయగు లక్ష్మీదేవి దినము పేరంటమునకై(పేరంటము - పసుపు బొట్టులకు శుభకార్య సమయమున ముత్తెదువుల పిలుచుట, వారుచేయు కార్యము, రూ.పేరంట్రము.)తిరుగుచుండును. నిన్ను భక్తులుపిల్చి దినపూజలు గావించి ప్రేమతో వండిన య(అ)న్నములను బెట్టు చుందురు. దిగులు లేకుండా నీకు భోజనము జరుగుచుండగా నీచేత దొక్కకానియైన ఖర్చుగాదు. - శేషప్ప కవి, నరసింహ శతకం
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
అహిరము - 1.కప్ప, 2.గాలి, 3.ముంగిలి.
భేకము - 1.కప్ప, మండూకము, 2.మేఘము.
బిభేతి సర్పాద్భేకః, ఞి భయే. - సర్పమువలన భయపడునది.
భేకి - ఆడుకప్ప.
భేకీ వర్షాభ్వీ -
భేకస్య స్త్రీ భేకీ - భేకముయొక్క స్త్రీ భేకీ.
వర్షాభ్వాః స్త్రీ వర్షాభ్వీ, ఈ. సీ. - వర్షాభువుయొక్క స్త్రీ వర్షాభ్వి. ఈ 2 ఆఁడుకప్ప పేర్లు.
భేకశిశువు - (జం.) చిరుకప్ప, కప్ప యొక్క జీవితదశలలో చేపవలె నుండు మొదటి డింభ దశ (Tadpole).
శృంగద్వితము - (జం.) భేక శిశువు యొక్క శ్వాసనాలికా చాపములకు ఎదుట నుండు ద్వితచాపములోనిది, ఒక భాగము (Gerotophyl).
దంతాస్థి - (జం.) (కప్ప) క్రింది దవడ ఎముకలలో ఒకటి (Dentary).
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టుధ్వని, ఉదా. ౘ, ౙ.
మెంటో మెకిలియన్ - (జం.) (Mento meckelian) భేకశిశువు యొక్క క్రింది దవుడలో దంతాస్థి ప్రక్కనున్న చిన ఎముక.
మెకెల్స్ కార్టిలేజ్ - (Meckel's cartilage,) భేకశిశువు యొక్క క్రింది దవుడలోనున్న మృదులాస్థి భాగము.
మేరుపుచ్ఛము - (జం.) భేకశిశువు తోకలోనున్న కీకసలు కలసిపోయి పొడవైన కడ్డీవలె ఏర్పడు ఎముక (Unostyle).
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తా. ఎంతపని చేసినను(ఎపుడు - ఎల్లప్పుడు, ఏకాలము, రూ.ఎప్పుడు, ఎప్డు.)తన యందు దోషమునే వెదకుచుండు ఆపురుషునియొక్క(పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.)కొలువును మానుకొన వలెను. లేని యెడల సర్పము(సర్పము - పాము, సప్పము.)పడగ క్రింద ఉన్న కప్ప రీతి ఆపదలకు గురికాగలడు.
కప్ప - మండూకము; మండూకము - కప్ప.
మండతె శోభతే తటాకాదౌ మండూకః, మడి భూషాయాం. - తటాకాదులయం దొప్పునది.
వర్షాసు భవతీతి వర్షాభూః. ఊ - పు. భూ. సత్తాయాం. - వర్షాకాలమునఁ బుట్టునది.
శలతి ఉత్సుత్య గచ్ఛతీతి శాలువః, శలగతౌ. - గంతులువేయుచు చరించునది.
పా. సాదిరప్యస్తి. ‘పరిసరకృకలాసన్వేద సాలూరసర్వాః' ఇతి ప్రయోగాత్.
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు, రది యెట్లన్నన్
దెలుప్పగ చెఱువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తా. ఎప్పుడు మానవునికి సంపదలు కల్గునో, అప్పుడు వాని యింటికి లేక్కలేని బంధువులు పిలువకుండగనే వచ్చెదరు, అట్లుగానే చెఱువులు సమృద్ధిగా నిండియున్న తరుణమందు కప్పలు అనేకము అందు చేరుచున్నవు గదా!
అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
చిప్ప - 1.కప్ప చిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపు చిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విన.అల్పము.
ఉరోస్థి - (జం.) రొమ్ము యొక్క ఎముక, ఇది పూర్వోరుకాస్థి (Epesternum), పూర్వోరోస్థి (Omosteranum), మధ్యరోస్థి(Mesosternum), పశ్చోరోస్థి(Xiphisternum=Metasternum)అను నాలుగు భాగములుగ కలిసియుండును, ఉదా.కప్ప.
నిమీలకచ్ఛదము - (జం.) మూడవ కనురెప్ప (కప్ప) (Nicitating membrane)). (దీనిని స్వేచ్ఛగా కదల్చుటకు వీలగును), కంటిపొర.
నిమీలనము - 1.కనులుమూయుట, 2.చావు.
అధికాశి మహచ్చిత్ర మహీనా కబలీకృతః
మండూక స్తేన బధ్నాతి కపర్థం దృఢ మాత్మనః|
భా|| కాశీ నగరమునం దొక విచిత్రము కలదు. అచటఁ బాముచే మ్రింగఁబడిన కప్ప తిరిగి తన జటాజూటము నా పాముచేతనే కట్టి బిగించుకొను చున్నది. (కాశిలో మరణించిన తిర్యగ్జంతువులు సైతము శివస్వభావమును బొందునని భావము.)
పుప్పసములు (కప్ప).
పప్పున - (జం.) ఊపిరితిత్తులకు సంబంధించినది (Pulmonary).
పప్పుస ధమని - (గృహ.) కుడి జఠరిక నుండి ఊపిరి తిత్తులోనికి చెడ్ద రక్తమును కొనిపోవు నాళములు (Pulmonary artery).
పుప్పుస సిరలు - (గృహ.) ఊపిరి తిత్తులలో నుండి శుభ్రపరచిన రక్తమును ఎడమ కర్ణికలోనికి గొంపోవు నాళములు (Pulmonary vein).
పుప్పుస ప్రసరణము - (గృహ.) రక్తము గుండె నుండి ఊపిరితిత్తులకు చేరి తిరిగి ఊపిరితిత్తుల నుండి గుండెకు చేరువరకు జరుగు రక్తప్రసరణము (Pulmonary circulation).
పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడి పోవును).
పుప్పుసము - (జం.) క్లోమము, ఊపిరి తిత్తి, (Lung).
క్లోమము1 - (జం.) 1.కడుపులోని నీరు తిత్తి.
క్లోమము2 - (గృహ.) సర్వకిణ్వము, (ఇది ఒక నాళగ్రంథి, ఇందులో పుట్టు మధుర రసము చిన్న ప్రేవులలో ఆహారము జీర్ణమగుటకు సహాయపడును), 2.తియ్యదబ్బ, (Pancreas).
తిలకం క్లోమ -
తిలతీతి తిలకం. తిల స్నేహనే. - మెఱుఁగై యుండునది.
క్లామ్యతి క్లోమ. న. న. క్లము. గ్లానౌ. - వాడునది. పా. క్లోమ.
ఈ రెండు కడుపులో నొక ప్రక్క నెఱ్ఱనైయుండు మాంస విశేషము పేర్లు. నీరుతిత్తి యని కొందరు.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహుత్కోళపు పొర క్రింద నుండు అంతస్స్రావగ్రంథి (Thymus gland).
అమైలాప్సిన్ - (జం.) (Amylopsin) క్లోమ (Pancreas) గ్రంధినుండి తయారగు సేంద్రియ ఖండము (Ferment), ఇది పిండి పదార్థమును చెక్కెరాగా మార్చును).
స్వాదుపిండము - (జం.) సర్వకిణ్వి కడుపు ఆంత్ర మూలముచే నేర్పడిన మడతలో నుండు గ్రంథి (Pancreas). (ఇది మధురసమును ఉత్పత్తి చేయును. దీనిలో సర్వకిణ్వములు ఉండ వచ్చును).
స్వాదువు - 1.ఇంపైనది, 2.తియ్యనిది, 3.మంచిది.
సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
స్వాదుధన్వుఁడు - తియ్యవిలుకాడు, మన్మథుడు.
యువాకోశము - (జం.) ఊపిరితిత్తి నిర్మాణములో నున్న ఒక్కొక్క సూక్ష్మమైన గాలిగది (Alveolus).
శ్వాసనాళము - (జం.) ముఖకుహరమునుండి ఊపిరితిత్తులలోనికి గాలిని తీసికొనుటకు వదులుటకు ఉపయోగించు గొట్టము, (Trachea).
క్లోమనాళము - (జం.) శ్వాసనాళము యొక్క శాఖ (Bronchus).
రొమ్ము పడిసెము - (వైద్య., గృహ) గుండె జలుబు, (Bronchitis).
రొంప - పడిసెము; పీనసము - పడిసెము.
విషపడిశెము - (గృహ.) శ్వాసనాళము నకు సంబంధించిన అంటు జ్వరములు, జలుబులు, (Influenza).
పీనజ్విరము - జలుబు పడిశముతో వచ్చు జ్వరము. (ఇది ఒక రకపు ఎలర్జీ వలన కలుగు జ్వరము). (Hay fever).
అ నా ఫి లి స్ - (Anophele) దోమలలో ఒక జాతి. (ఈజాతి ఆడు దోమల ద్వారా అనాఫిలిస్ మలేరియా వ్యాపించును.)
మలేరియా - (గృహ.) (Malaria), చలి జ్వరము, (ఈ జ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)
గుణనపూర్వదశ - (జం.) మానవ రక్త కణములలో ప్రవేశించిన మలేరియా రోగజీవి అభివృద్ధి చందుచు విభజనకు సిద్ధముగా నున్న దశ (Schizont).
ఖండ గుణము - (జం.) మానవరక్త కణములలో జరుగు మలేరియా రోగజీవి యొక్క జీవితదశలు (Schizogony).
బీజానుగుణనము - (జం.) దోమ శరీరములో జరుగు మలేరియా రోగజీవి జీవిత దశలు (Sporogany).
బీజఖండము - (జం.) మలేరియా వ్యాధికి కారణమగు రోగజీవి జీవన చక్రములో మనుష్యుని రక్తములో నగుపడు దశలలో నొకటి (Merozoite).
చలయుక్తము - (జం.) క్రిమివలె కదలుచుండు సంయుక్త బీజము. ఉదా:- మలేరియా రొగ జీవి యొక్క (Ookinite).
క్వినీన్ - (వ్యవ.) (Quinine) మలేరియా జ్వరమును పోగొట్టు మందు, (కాఫీ మొక్క కుటుంబము (Rubia ceae)నకు చెందిన (Cinchona offlcinalis) అను చిన్నచెట్టు యొక్క పట్టనుండి దీనిని తయారు చేయుదురు.)
అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
ఘోషన్యూనములు - (జం.) మగకప్ప గొంతునకు రెండు వైపుల గల సంచులు. (ఇవి శబ్దమును దీర్ఘముగా చేయుటకు ఉపయోగపడును) (Vocal sacs).
ముద్రాకాస్థి - (జం.) కప్పయొక్క స్వరపేటికలో ఉన్న రెండు మృదులాస్తి నిర్మాణములలో నిది యొకటి (Cricoid cartilage), రెండవది దుర్వీకాస్థీ (Arytenoid cartilage).
స్తంభాకారాధిచ్ఛదము - (జం.) నిలువుగా నొకటి ప్రక్క మరియొకటి స్తంభమువలె నమర్చబడిన పొడవైన జీవకణముల పొర (Columanar epithelium) (కప్ప ప్రేగు లోపల అస్తరుగా నున్న పొరలో దీనిని చూడనగును).
తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.
అరిగోలు - నదిని దాటించు సాధనములలో ఒకటి, తెప్ప.
ఉడువము - తెప్ప, పుట్టి.
ఉడవః ఆపః తాభ్యః పాతీత్యుడుపం, పా రక్షనే. - ఉడువు లనఁగా దూకములు; దాని వలన రక్షించునది.
ప్లవము - 1.తెప్ప, 2.కప్ప, 3.కోతి.
ప్లవంత్యనేనేతి ప్లవః, ప్లవగతౌ. - దీనిచేత దాఁటుదురు.
కట్టుమ్రాను - తెప్ప.
ప్లవంగము - 1.కోతి, 2.కప్ప, వ్యు.దాటుచు పోవునది.
ప్లవంగ - నలుబది యొకటవ(41వ) సంవత్సరము.
ప్లవ - ముప్పదియైదవ(35వ) సంవత్సరము. ప్లవతే ప్లవః. ప్లుఙ్గతౌ. - గంతులు వేయుచుఁ బోవునది.
టర్ టరాయణము - (జం.) కప్ప అరుపులు (Croaking of frogs).
ఉత్తరించు1 - క్రి.ఖండించు.
ఉత్తరించు2 - క్రి.దాటు.
ఉఱుకు - క్రి.1.దుముకు, 2.పరుగెత్తు, 3.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప.
దర్దురము - కప్ప.
శబ్దేన కర్ణే దృణాతీతి దర్దురః దౄ విదారణే. - శబ్దముచేత చెవులను వ్రక్కలించునది.
సరసునిమానసంబు సరసజ్ఞుఁడెఱుగును ముష్కరాధముం
డెఱిఁగి గ్రహించువాఁడెకొలనేక నివాసముగాఁగ దుర్ధురం
బరయఁగ నేర్చునెట్లు వికచాబ్జమరంద రసైక సారభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! కప్ప సరస్సులోనే యెప్పుడు నివాసము చేయుచిండున దైనను అందుండిన తామరల యందలి పూదేనె వాసనలను( తెలియఁ జాలడు. తుమ్మెదయో(మిళిందము - తుమ్మెద)దానిని తెలిసి యనుభవించును. అట్లే రసికుని మనసు లోని భావమును(మానసము - 1.ఒక కొలను(మానస సరస్సు), 2.మనస్సు.) రసికుడే తెలిసికొని యానందింప కలడుగాని మూఢుఁడైన(ముష్కరుఁడు - మొక్కలుడు, కుటిలుడు.)అధముడు తెలిసికొన జాలఁడు.
కోలము1 - 1.రేగుపండు, 2.పంది, 3.ఒడి, 4.కౌఁగిలి, 5.తెప్ప.
కోల్యాః ఫలం కోలం. - కోలియనఁగా రేఁగు చెట్టు; దానియొక్క ఫలము.
కోలతి నిబిడావయవత్వాత్ కోలీ, ఈ సీ. కులసంస్త్యానే. - దట్టమై యుండునది.
కోలతి సమ్హతాంగో భవతీతి కోలః కుల సంస్త్యానే. - ఘనమైన శరీరము గలది.
కోలము2 - ఒకవిధమైన నాట్యము.
కోలాటము - చేతులతో కోలలుంచుకొని ఆడెడి ఆట.
కోలతి సంస్త్యాయతి కోలః కుల సంస్త్యానే. - తెలుచుండునది, తెప్ప.
సూకరము - పంది, శూకరము.
పంది - సూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.
తెప్ప - 1.నీటిపై పడవవలె తేలగట్టిన కొయ్యలు, 2.రాశి, రూ.తేప.
తెప్పలఁదేలు - ఓలలాడు.
ఓలలాడు - క్రి.1.స్నానముచేయు, 2.ఓల ఓల యనుచు నీటిలో ఆడు.
ఈదుకొయ్య - ఈదుటకు సాయపడు కొయ్య, తెప్పకొయ్య.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైనను పతితులైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!
తా. కప్పకు కుంటికాలయినను, పామునకు రోగము వచ్చినను, (పతితుఁడు - 1.పడినవాడు, 2.పదవిచెడినవాడు.)లైనను, ముసలితనములో(ముప్పు - 1.వార్థకము, 2.విపత్తు.)దారిద్యము సంభవించిననూ మిక్కిలి కష్ట దాయకములు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, వెలుగురేడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి, హరిప్రియ.
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
అనన్తరూపో నన్తశ్రీః జితమన్యు ర్భయాపహః
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః| – 100స్తో
పోత్రము - 1.పందిమూతి, 2.నాగటి దుంప మొన.
దీర్ఘం పోత్రం ముఖాగ్రమస్యేతి పోత్రీ, న. పు. - అధికమైన మోరగలది.
మోర - పశ్వాదుల ముఖము, ముట్టె.
ముట్టె - పశ్వాదుల మూతి, పంది ముక్కు, సం.ముఖమ్.
ముటెతోఁపు - (వ్యావ.) నిదానములేని తొందర.
మొర - పశ్వాదుల దీర్ఘ ముఖము, రూ.మోర, మొరచ.
మోరత్రోపు - వైముఖ్యము.
వైముఖ్యము - విముఖత్వము, వ్యతిరేకత.
విముఖత్వము - వైముఖ్యము.
స్థూలనాసము - పంది.
అసహాయాశూరుఁడు - ఒంటరిగా నిలిచి పోరు యోధుడు.
కిరము - పంది, రూ.కిరి, వ్యు.ముఖము(ముట్టె)చే భూమిని త్రవ్వునది.
క్షితిం కిరతీతి కిరిః, వు. కౄ విక్షేపే. - ముఖము చేత భూమిని ద్రవ్వునది. పా, కిరః 'వరాహశ్చకిరః కిరి ' రితి యాదవః.
ముట్టె - పశ్వాదుల మూతి, పంది ముక్కు, సం.ముఖమ్.
సూకరము - పంది, శూకరము.
పంది - సూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.
కిరంతీ మంగేభ్యః - కిరణనికురంబా(అ)మృతరసం
హృది త్వా మాధత్తే - హిమకరశిలామూర్తిమివ యః,
స సర్పాణాం దర్పం - శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్వా - ముఖయతి సుధాధారా సిరయా. - 20శ్లో
తా. ఓ తల్లీ! ఎవడు నీ యవయముల నుండి(నికురుంబము - సమూహము)చిమ్ముచున్న కాంతిసుధను చంద్రకాంతమణివలె(హిమకరుఁడు - చంద్రుడు)వలె మనస్సున ధ్యానించునో, వాడు గరుడుని వలె సర్పముల గర్వము నణచును. జ్వర బాధితులను(సుధ- 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.)అమృతమును స్రవించు తన దృష్టిచే(దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)చే సుఖింపజేయును. – సౌందర్యలహరి
కిరిచక్ర రథారూఢ - దండనాథా పురస్కృతా|
జ్వాలామాలిని కాక్షిప్త - వహ్నిప్రాకారమధ్యగా.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, వెలుగురేడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి, హరిప్రియ.
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
అనన్తరూపో నన్తశ్రీః జితమన్యు ర్భయాపహః
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః| – 100స్తో