Thursday, December 29, 2016

ధనురాశి

మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదములు ధనుస్సురాశి.

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - ఇల్లాలు, భార్య.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

బృందము - సమూహము.
బృందారకుఁడు -
వేలుపు, విన.మనోజ్ఞుడు.

వింటిరాశి - ధనూరాశి.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
విల్లు -
ధనుస్సు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

దమ్మము - ధర్మము, సం.ధర్మః.
ధర్మము - ధర్మమునుండి తొలగనిది.    
ధర్మి - ధర్మముగలది. 
 
ధర్మస్తు తద్విధిః,
ధరతి లోకానితి ధర్మః - లోకములను ధరించునది.
ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేఁ బూనఁబదునది. ఈ ఒకటి వేదవిహితమైన కర్మ పేరు.  

అష్టౌ గుణాః పురుషం దీపయంతి ప్రజ్ఞా చ కౌల్యం చ దమః శ్రుతం చ|
పరాక్రమ శ్చాబహుభాషితా చ దానం యథాశక్తి కృతజ్ఞతా చ||
ఎనిమిదిగుణాలు పురుషుని ప్రాకాశింపచేస్తాయి. అవి ఇవి 1.ప్రజ్ఞ(ప్రజ్ఞం - బుద్ధి, సామర్థ్యం.), 2.సద్వంశంలో జన్మించడం, 3.ఇంద్రియ నిగ్రహం, 4.చదువు, 5.పరాక్రమం(పరాక్రమము - 1.బలము, 2.శౌర్యము.), 6.మితంగామాట్లాడతం, 7.యథాశక్తిగా దానం చేయడం, 8.కృతజ్ఞత కలిగి ఉండటం.

పినాకి - శివుడు.
పినాక ఇతి ధనురస్యా స్తీతి పినాకీ, న-పు.- పినాక మనెడి విల్లు గలవాఁడు.
అథ పినాకో స్త్రీ శూలంశంకరధన్వనోః. - పినాక శబ్దము శూలమునకును, ఈశ్వరుని వింటికిని పేరు. పాతీతి పినాకః. అ. ప్న. పా రక్షణే. - రక్షించునది.

పినాకము - 1.శివునివిల్లు, 2.త్రిశూలము.
అజగవము - శివుని విల్లు, రూ.అజీగవము, అజీగావము, అజకవము, అజీకవము.
అజీగవము - అజగవము, రూ.అజీగావము.

పినాకో జగవం ధనుః :
పినాకః త్రిపుత దాహకాలే శరజ్వాలాజాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మేరుధనుస్త్వాత్ - త్రిపుర దహనకాలమందు శరజ్వాలలచేత స్వర్గమును గప్పినది గనుక పినాకము.
అజగవాస్థి వికారత్వా దజగవం. అ-న. - అజగవము యొక్క అస్థివికారమైనది. ఈ రెండు శివుని విల్లు పేర్లు.

పెన్న - పినాకినీ నది, సం.పినాకినీ.

మహితము - శివుని త్రిశూలము, విణ.గొప్పది, పూజ్యము. 
త్రిశిఖము - 1.త్రిశూలము, 2.సిగదండ.
త్రిశూలము - ముమ్మొనవాలు.
ముమ్మొనవాలు - (మూడు+మొనవాలు) త్రిశూలము.
శూలము - 1.మొమ్మొనవాలు, 2.టెక్కెము, 3.ఒక రోగవిశేషము. 

శేఖరము - సిగదండ, (ఉత్తరపదమైనచో) శ్రేష్ఠము.
సిగరము - శిఖరము, సం.శేఖరమ్.
సిగబంతి - శేఖరము, సికదండ.

వతంసము - సిగబంతి, పూగమ్మ, రూ.అవతంపము.
అవతంసము - 1.పూగమ్మ, 2.సిగబంతి (పండితావతంసుడు మొ. చోట్ల శ్రేష్ఠవాచకము), రూ.వతంసము.

కంకటము - 1.కవచము, 2.శివుని త్రిశూలము.
కం వక్షః కటతీతి కంకటకః, కటే వర్షావరణయోః - వక్షస్సును గప్పునది.   

కవచము - 1.బొందలము, తనుత్రాణము, 2.తప్పెట, 3.ఒక రకమైన మంత్రము.
బొందడము - కవచము, రూ.బొందళము.
తనుత్రాణము - కవచము.

తనుత్రము - కవచము, వ్యు.దేహమును రక్షించునది.
తనుం త్రాయత ఇతి తనుత్రం, త్రైఙ్ పాలనే. - శరీరమును రక్షించునది. 

వర్మము - కవచము.
కంచుకము - 1.రవిక, 2. చొక్కాయ, 3.కవచము.
(ౘ)చొకా - కంచుకము, చొక్కాయ, రూ.చొకాయ, చొక్కా, చొగాని.
చొక్కాయ - చొక్కా; (ౘ)చొక్కా - చొక్కా Shirt.
అంగరకా - చొక్కాయ, సం.అంగరక్షా, వ్యు.అంగములను రక్షించునది.

ౘట్ట - 1.కవచము, 2.చొక్కాయ, 3.పూత, సం.కాటకః. వి.1.చిన్నగోనె, 2.తొడకు వెలుపలి భాగము.

నివాతము - 1.బాణాములచే భేదింపరానిది (కవచము), 2.గాలిలేనిది.   

ఆయుధ్యంతే అనే నేత్యాయుధం, యుధ సంప్రహారే. - దీనిచేత యుద్ధము చేయుదురు.
ప్రహరణము - 1.ఆయుధము, 2.బాణము, 3.కొట్టుట.
ప్రహరం త్యనేన ప్రహరణం - దీనిచేతఁ గొట్టుదురు.

ప్రహరము - 1.దెబ్బ, 2.జాము.

శస్త్రి - చురకత్తి, మాదిగకత్తి, విణ.శస్త్రము గలవాడు.
శస్త్రము - 1.ఆయుధము, 2.ఇనుము.
శస్యతే (అ)నేనేతి శస్త్రం, శసు హింసాయాం. - దీనిచేత హింసింతురు.

కత్తి - 1.ఖడ్గము, 2.మంగలికత్తి, సం.కర్త్రీ.

ప్రమథానా మథిపః ప్రమథాధిపః – ప్రమథగణము లకు నధిపుఁడు.  

ఉగ్రుఁడు - 1.శివుడు, 2.క్షత్రియునకు శూద్ర స్త్రీయందు పుట్టిన వాడు, విణ.భయంకరుడు.
ఉగ్రత్వా దుగ్రః - భయంకరుడు.

శూద్రా క్షత్రియ యోరుగ్రః - 
ఉచతి సమవైతి వర్ణద్వయమితి ఉగ్రః ఉచ సమవాయే. - రెండు జాతుల యందు కూడువాఁడు. ఈ ఒకటి శూద్రస్త్రీకిని క్షత్రియునికిని బుట్టినవాని పేరు.

ఒక్కెఱ - ఉగ్రత, కోపభావము, సం.ఉగ్రమ్.
ఉగ్రము - 1.క్రూరమైనది, భయంకరమైనది, 2.మిక్కుటమైనది.

రౌద్రము - 1.భయంకరము, 2.తీక్ష్ణము, వి.1.ఎండ, 2.రౌద్రరసము, 3.దినముయొక్క మొదటి భాగము.    

రౌద్రం తూగ్రమ్ -
రుద్రో దేవతాస్య రౌద్రం. - రుద్రుఁడే అధిదేవతగాఁ గలిగినది.
ఉగ్రత్వా దుగ్రం. - ఉగ్రమైనది. ఈ 2 రౌద్రరసము పేర్లు.

రౌరవము - నరక విశేషము, విణ.భయంకరము.
మహాన్ రౌరః రవః అత్రేతి మహారౌరవః, రౌరవశ్చ - మిక్కిలి భయంకరమైన ధ్వని గలిగినది.
రౌద్రి - ఏబది నాల్గవ(54వ) సంవత్సరము.

భైరవుఁడు - 1.శివుడు, 2.శునకము, విణ.భయంకరరసము గలవాడు.
శునకము - కుక్క.
శునతి ఇతస్తతో గచ్ఛతీతి శునకః శునగతౌ. - ఇట్టటుఁ దిరుగునది.
భైరవము - 1.భయానకరసము, 2.భయము.
భీ - భయము; భీతి - భయము, బెదురు. 
భీరోస్సంత్రాసకృదృఐరవం, ఞ్ భీ భయే. - భీరులకు వెఱపుఁబుట్టించునది.
బిభ్యేత్యస్మాదధీర ఇతివా భైరవం. - అధీరుఁడు దీనిచేత వెఱపుఁజెందును.

కాతరుఁడు - భయశీలుడు, పిరికి.
కాతరము - అధీరము, పిరికి.

బిభీషిక - 1.భయము, 2.బెదిరించుట.
బిభీషణము - భయంకరము, వి.భయపరుచుట.

దారుణము - భయంకరము.
దారయతి చిత్తమితి దారుణం, దౄ విదారణే. - చిత్తమును భేదించునది.

చకితము - 1.భయము, విణ.2.భయపడినది.     

భయానకము - 1.పులి, 2.రాహువు Rahu, 3.భయానకరసము.
భయంకరోతీతి భయంకరం, డుకృఞ్ కరణే. - భయమును గలుగఁజేయునది.

ఘోరము - భయంకరము, సం.వి నక్క Fox, కుంకుమపువ్వు.
ఘురతీతిఘోరం ఘుర భీమార్థశబ్దయోః. - వెఱపించునది.

విశసనము - 1.చంపుట, 2.కత్తి.
విశస్యతేస్మ విశసనం, శమ హింసాయాం.
విశసిం(ౘ)చు - క్రి.సంహరించుట.   
 
విశరఘాతము - చంపుట, బాధించిచంపుట.
విశరణం విశరః, శౄ హింసాయాం.

నిర్వాసము - 1.చంపుట, 2.వెడలగొట్టుట 

క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.


హంత - హింసించువాడు.
ప్రియతే హన్తుమితి పరః, పృఞ్ వ్యాయామే. - హింసించుటకై తిరుగువాఁడు.
 
నృశంసుఁడు - క్రూరుడు.
నౄన్ శనతి శంసతి చ నృశంసః శసు హింసాయాం; శంసు స్తుతౌ దుర్గతౌ చ. - మనుష్యులను బీడించువాఁడు.

భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
భరణీయో భృత్యః, డు భృఞ్ ధరణ పోషణయోః - పోషింపఁదగినవాఁడు. 

ఏకః సంపన్న మశ్నాతి వస్తే వాసశ్చ శోభనమ్|
యో(అ)సంవిభజ్య భృత్త్యేభ్యః కో నృశంస తరస్తతః ||

భా|| తాను పోషింపవలసిన వాళ్ళకు కల్పించ కుండా తానొక్కడు చక్కగా భోంచేస్తాడు. ఒక్కడే అందమైన గుడ్డలు కడతాడు. తన్ను ఆశ్రయించిన వారికి భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.కి కూడా విదపడు. వాడికన్న గొప్ప క్రూరుడెవడుంటాడు ?   

ఘాతకుఁడు - హింసకుడు.
హంతీతి ఘాతుకః హనహింసాగయో. - హింసించువాఁడు.

శరారువు - ఘాతుకము, చంపునది.
ఘాతిని - చంపునట్టిది.
హన్యతే ఘాతః.

శరారు ర్ఘాతుకో హింస్రః -
శృనాతి తాచ్ఛీల్యేనేతి శరారుః, హంతితచ్ఛీల్యేనేతి ఘాతుకః, హినస్తితాచ్చీల్యే నేతిహింస్రః, శౄహింసాయాం, హనహింసాగత్యోః హిసి హింసాయాం. - స్వభావముననే చంపెడువాఁడు. ఈ 3 చంపు స్వభావము గలవాని పేర్లు.

ఘాతము - 1.దెబ్బ, 2.బాణము, (గణి.) 24 అని వ్రాయునపుడు '4' '2' యొక్క ఘాతము.

ఘాతుక భజన పాతకనాశన గౌరీసమేత గిరీశ శివ|  

క్రూరుఁడు - దయలేనివాడు.
కృంతతీతి క్రూరః కృతీ ఛేదనే. - వ్యథ పెట్టువాఁడు.

క్రూరౌ కఠిన నిర్దయౌ : క్రూరశబ్దము కఠినమయినదానికిని, దయలేని వానికిని పేరు. మఱియు, భయంకరమైన దానికిని పేరు.
కృణాతీతి క్రూరః. కృఞ్ హింసాయం. - హింసించునది.

కఠోరుఁడు - కఠినుడు.
కఠతి క్లేశేన జీవతీతికఠినం, కఠోరం చ - క్లేశముచేత బ్రతుకునది గనుక కఠినము, కఠోరమును.
కఠినము - 1.పరుషము, 2.నిష్ఠురము, 3.క్రూరము, వి.వంటకుండ.   

నిర్దయుఁడు - దయలేనివాడు.
చెడగరము - 1.క్రూరము, 2.క్రూరుడు.   
క్రూరము - 1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది.
కృంతతి క్రూరం, కృతీ ఛేదనే. - నొప్పించునది.  

క్రౌర్యము - క్రూరస్వభావము, క్రూరత్వము.  
ప్రామిడి - (ప్రాము+ఇడి) క్రౌర్యము, విణ.క్రూరుడు.

క్రూరదృష్టి - 1.అంగారకుడు Mars, 2.శని Saturn, విణ.క్రూరదృష్టికలవాడు.

ద్రుణము - 1.కత్తి, 2.విల్లు, 3.తేలు, 4.తుమ్మెద.
ద్రూణము -
ఎఱ్ఱతేలు, తేలు రూ.ద్రుణము.

విల్లు - ధనుస్సు.   
తేలు - 1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.
వృశ్చికము - 1.తేలు, 2.వృశ్చికరాశి.
పొట్టియ - తేలు Scorpion.

తమాలము - 1.బొట్టు, 2.కత్తి, 3.చీకటిచెట్టు.
బొట్టు -
1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
చీఁకటిచెట్టు - తమాల వృక్షము.       
తమి - రాతిరి, చీకటి.
తమిస్ర - చీకటిరేయి, చిమ్మచీకటి.  
తమిస్రము - 1.చీకటి, 2.కోపము, 3.పసుపుపొడి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, తలగాము.
తలగాము - రాహువు Rahu
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.  

విశసనము - 1.చంపుట, 2.కత్తి.
విశసిం(ౘ)చు -
క్రి.సంహరించుట.
విశరఘాతము - చంపుట, బాధించిచంపుట.

నిర్వాసము - 1.చంపుట, 2.వెడలగొట్టుట.

ధార్మికుఁడు - 1.పుణ్యాత్ముడు, 2.విలుకాడు.     

ధన్వి ధనుష్య్మాన్ ధానుష్కో నిషఙ్గ్య ధనుర్ధరః, 
ధన్వి - 1.విలుకాడు, 2.నేర్పరి.
ధన్వాస్యాస్తీతి ధన్వీ, న. పు. 1 ధను రస్యాస్తీతి ధనుష్మాన్, త. - విల్లు గలవాఁడు.
విల్లు - ధనుస్సు.
ధనుష్మంతుఁడు - విలుకాడు.
ధనుః ప్రహరణమస్యేతి ధానుష్కః - విల్లే ఆయుధముగాఁ గలవాఁడు.
నిషంగము - అమ్ములపొది.
నిషంగో (అ)స్యాస్తీతి నిషంగీ, న. పు. - నిషంగమనఁగా అమ్ములపొది, అది గలవాఁడు.
అస్త్రం మంత్రప్రయుకాయుధం; త దస్యాస్తీతి అస్త్రీ, నాంతః - మంత్ర ప్రయుకాయుధము గలవాఁడు.
"అస్త్రం చాపః తదస్యాస్తీతి అస్త్రీ - అస్త్రమనఁగా విల్లు; అది గలవాఁడు. "అస్త్రం చాపాయుధయోః" అని రభసుఁడు.

అథస్త్రియౌ, ధను శ్చాపా ధన్వ శరాసన కోదణ్డ కార్ముకమ్, ఇష్వాసో అపి :
అస్త్రము - 1.మంత్రపూర్వకముగ ప్రయోగింపబడు ఆయుధము, 2.విల్లు, 3.కత్తి.
అస్యత ఇతి అస్త్రం, అసు క్షేపణే. - దేహాదుల మీఁదఁ జిమ్మఁబడునది.
ధనుర్థరుఁడు - విలుకాడు.
దనుర్ధరతీతి ధనుర్ధరః, ధృఞ్ ధారణే. - విల్లును బట్టినవాఁడు.

ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు. ధన్యతే ప్రార్థతే ధనుః స. న. - ప్రార్థింపఁబడునది. "ధనుర్వంశ విశుద్ధో అపి నిర్గుణః కిం కరిష్యతి" యని ఉకారాంత పులింగ ప్రయోగమును గలదు. "శరావహీ ధనూః స్త్రీ స్యాత్ "అని, త్రికాండశేష మందు ఊకారాంత స్త్రీలింగముగాః జెప్పఁ,బడియున్నది.  
విల్లు - ధనుస్సు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

కలికి బొమవిండ్లు గల కాంతకును ధనురాశి...

చాపము - 1.ధనుస్సు, విల్లు, 2.(భౌతి.) ఒకవక్రరేఖ యొక్కగాని వృత్తము యొక్కగాని భాగము (Arc).
చపస్యవేణో ర్వృక్ష విశేషస్య వా వికారశ్చాపః - చప మనఁగా వేణు విశేషము, లేక వృక్ష విశేషము. దానిచేతఁ జేయఁబడునది.
చాపరేఖ - (గణి.) పరిధిలోని భాగము (Arc).

గురుచాపరేఖ - (గణి.) అర్ధవృత్తము కన్న పెద్దదియగు చాపరేఖ (Major arc).   

ఆరూఢ భక్తి గుణ కుంచిత భావ చాప
యుక్తై శ్సివస్మరణ బాణగణై రమోఘైః
నిర్జత్య కల్బిష రిపూన్ విజయీ సుధీంద్ర
స్సానంద మాతహతి సుస్థిర రాజ్యలక్ష్మీమ్|

తా|| శ్రేష్ఠజ్ఞానం కలవాడు - సుస్థిర భక్తి అనే నారితో సారించ బడిన భావరూప ధనుస్సుకు కూర్చబడిన శివధ్యానం అనే బాణాలతో పాపరూప శత్రువులను రూపుమాపి స్థిర రాజ్యాన్ని- అంటే మోక్ష సామ్రాజ్యాన్ని ఆనందంగా(ఆనందము - సంతోషము, సుఖము.)పొందుచున్నాడు. – శివానందలహరి

ధన్వము - 1.మెట్టనేల, 2.విల్లు, 3.నిర్జలనేల. దన్యతే ధన్వ. న. న. ధన ధాన్యే ప్రార్థనాయాం చ. - ప్రార్థింపఁబడునది.
జాంగలము - మెరకనేల; మెరక - మెట్ట నేల.
స్థలము - 1.మెట్ట నేల, 2.చోటు.
జాగా - చోటు; ప్రదేశము - స్థలము, చోటు. 
మెట్ట - నీరాస లేక పండెడు చేను, మెరక పొలము.
ఎడవు - నిర్జలప్రదేశము, విణ.దూరము.

ఎగుడు - మిట్ట (వ్యతి.దిగుడు, పల్లము).
మిట్ట -
ఉన్నత భూమి, విణ.ఉన్నతము.
మిట్టమిఱ్ఱు - (మిఱ్ఱు+మిఱ్ఱు) అత్యున్నత భూమి.
మిఱ్ఱు - ఉన్నత భూమి. 

భూమి - నేల, చోటు, పృథివి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.

భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి -
సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

ఎడ1 - 1.స్థానము, 2.అవకాశము, 3.దూరము, 4.గడువు, 5.భేదము, 6.విఘ్నము, 7.వ్యవహారము, 8.దౌత్యము, విణ.1.అధికము, 2.ఎలప్రాయము కలది, 3.ఎడమప్రక్కనున్న, అవ్య. అందు విషయమున.
ఎడ2 - హృదయము, సం.హృత్.
ఎడఁద - ఎద, హృదయము.
ఎద1 - పశుఋతువు.
ఎద2 - హృదయము, సం.హృత్.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె Heart.

హృదయ స్పందనము - (గృహ.) గుండె కొట్టుకొనుట (Heart beat).
హృత్కోశము -
(జం.) గుండెకాయ చుట్టును ఉండు సంచి (Pericardium).
హృత్కుంచనము - (జం.) హృదయములోని కండర భిత్తికలన్నియులోని రక్తమును బయటికిపంపుటకు సంకోచము నొందు స్థితి (Systole).
హృదయవ్యాకోచము - (జం.) కండరములలో నేర్పడిన హృదయము యొక్క గోడలు ఒకసారి ముడుచుకొనిన తరువాత తిరిగి యథాస్థితికి వచ్చుట (Diastole).  

మిట్ట - ఉన్నత భూమి, విణ.ఉన్నతము.
గాధము -
1.లోతులేనిచోటు, మిట్ట, 2.సంపాదింపకోరిక, విణ.1.లోతులేనిది, 2.దాటుటకు యోగ్యమైనది, వ్యతి.అగాధము. దంతురము - 1.ప్రక్కలణగి నడుము పొడువైనది, 2.మిట్టపల్లమైనది.

నంజనేలలు - (వ్యవ.) మెట్ట లేక మెరక నేలలు, వర్షాధారముననే సాగు చేయబడు నేలలు. (Dry lands.) దేవమాతృకము - వర్షాధారమున పండెడు పైరు గల దేశము. 

పోడుసాగు - (వ్యవ.) ఇది మెట్ట సేద్యములో నొక అనాగరిక పద్ధతి, అడవి నరకి, కంపలను, ఆకులను, అలములను అచటనే కాల్చి, నేలను దున్నకుండ విత్తులను చల్లి పైరుచేయుట. ఏటేట క్రొత్త యడవి నరకి విత్తులను చల్లుచుందురు. (Shifting cultivation)

భౌతికశోష - (వృక్ష.) నిర్జల స్థలములలో మొక్కలకు నీరు లభించని స్థితి (Physical drought).
నిర్జలీకరణము - (రసా.) నీరులేకుండ చేయుట (Dehydration).
నిర్జల స్థలోద్భిదము - (వృక్ష.) నీరు లభించని స్థలములో పెరుగు మొక్క (Xerophyte).

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము.(Property)

ధర్మశాస్త్రములు - (చరి.) భారతీయ సామాజిక వ్యక్తిగత జీవితములను శాసించు గ్రంథాలు. (బౌద్ధాయన, ఆపస్తంబ విశిష్ట ధర్మ సూత్రములు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి స్మృతులు, దేవన్నిభట్టు రచించిన స్మృతి చంద్రిక. క్రీ.శ. 12వ శతాబ్దము, నీలకంఠుడు రచించిన వ్యవహార ముఖము ధర్మశాస్త్రములుగా గుర్తించబడినవి).

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

ఏకో ధర్మః పరం శ్రేయః - క్షమైకా శాంతి రుత్తమా,
విద్యైకా పరమా తృప్తి - రహిం సైకా సుఖావహా|
తా.
ధర్మ మొక్కటే ఉత్తమ శ్రేయము (ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు), ఓర్పు(క్షమ - 1.ఓర్పు Patience, 2.నేల, 3.మన్నింపు.)ఒక్కటే ఉత్తమమైన శాంతి, విద్య(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.) యొక్కటే గొప్ప తృప్తి(తృప్తి-తనివి), అహింస యొక్కటే సుఖము కలిగించునది. ధర్మాలలో గొప్పది అహింస.

శరాఁ అస్యంతే అనేన శగాసనం. అసుక్షేపణే. - బాణములు దీనిచేత వేయఁబడును.       

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా|
నిజారుణప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా. - 3స్తో

కోదండము1 - 1.విల్లు (నాలుగు మూరలు గలది), 2.వెదురువిల్లు, వ్యు.కుత్సితమైన దండము గలది.
కుర్ధంతే అనేనేతి కోదండం. కుర్ద క్రీడాయాం. - దీనిచేత వేఁటాడుదురు.
కోదండము2 - బాలురను దండిచుటకై పట్టుకొని వ్రేలాడునట్లు మీద గట్టెడి త్రాడు. 

ఆ దండకా వనంబున
కోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ!
నా దండ గావ రమ్మీ  
వేదండము కాఁచినట్టి వేల్పువు కృష్ణా.
  
తా. కృష్ణా! దండకాటవిలో కోదండము దాల్చినవాఁడవు, గజేంద్రుని(వేదండము - ఏనుగు) కాపాడినవాఁడవు, నా యెడనుండి, నన్ను గాపాడరమ్ము.  

భూరి భూధర కోడండమూర్తి ధ్యేయస్వరూపిణే,
నమోస్తు తేజోనిధయే రామా......

బాణాగ్ర రూపము - (వృక్ష.) బాణము యొక్క కొనవలె నుండునది (ఆకు) (Sagittate).
బాణాసనము - విల్లు.

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బానధరో హరిః,
సదానందః సత్యసంధః సత్యసంకల్ప మానసః| 

"ఒక విలుకాడు మొట్టమొదట పెద్దపెద్ద వస్తువులను గురిచూచి కొట్టడం నేర్చుకుంటాడు. అందులో నైపుణ్యాన్ని సాధించిన తరువాత చిన్నచిన్న వస్తువులను సులభంగా కొట్టగలుగుతాడు. అదే విధంగా ఒక స్పస్టమైన ఆకారం ఉన్న విగ్రహం మీద మనస్సును లగ్నం చేయడం నేర్చుకొన్న తరువాత నిరాకార బ్రహ్మం మీద మనస్సును నిలపడం సులభమవుతుంది. - శ్రీరామకృష్ణ పరమహంస 

         

కర్మకారుఁడు - ఇనుప పని చేయువాడు, వికృ.కమ్మరి. 
కమ్మర -
ఇనుప పనిచేసి బ్రతుకుజాతి కమ్మరి, సం.కర్మారః.
కమ్మరీఁడు - బాణములు చేయువాడు, సం.కర్మారః.
లోహకారకుఁడు - కమ్మరి.

కొలిమి - కమ్మరి లోహాదులను కాల్చెడు నిప్పుగుంట. 

"కమ్మరివాడు గాలి ఊది కొలిమిలో నిప్పును మరింత రగిలించినట్లే, మనం మన మన్స్సును సత్సాగత్యం ద్వారా నిర్మలంగాను, ప్రశాంతంగాను ఉంచుకోవాలి."  - శ్రీరామకృష్ణ పరమహంస 

ఐద్దాయులు - (ఐదు దాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.

కార్ముకము - 1.విల్లు, 2.వెదురు, వ్యు.కర్మకారునిచే చేయబడినది.
కర్మణే ప్రభవతి కార్ముకం - యుద్ధకర్మ కొఱకు సమర్థమైనది.
కర్మ ఇయర్తి కర్మారః ఋ గతః. - క్రియను బొందునది. భుజౌ భగ్నేశ కార్ముకః| త్ర్యంబక కార్ముకభంజక రామ్| 

వెదురు - వేణువు, సం.వేణుకః.
వేణువు -
వెదురు, పిల్లనగ్రోవి. కరతలే వేణుమ్.....       

వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి.

వంశము - 1.కులము, 2.వాసము(వెదురు) 3.పిల్లనగ్రోవి, 4.వెన్నుగాడి, 5.సమూహము, 6.ఒక పురాణలక్షణము.

ద్వౌ వంశౌ కుల మస్కరౌ,
వంశశబ్దము కులమునకు, వెదురునకును పేరు. వన్యత ఇతి వంశః, వన షణ సంభక్తౌ. - ఆశ్రయింపఁబడునది. "పృష్ఠాస్థి గేహోర్ధ్యకాష్ఠే వంశే వేణౌ గణేకుల" ఇతి విశ్వప్రకాశః.  


వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వాసకము - ఇల్లు.   

వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
వసతి - 1.ఇల్లు, ఉనికి. నివసతి - ఇల్లు.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).   
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.  
స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికుంచుట (Dislocation).          

నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివసనము - ఇల్లు.
నివాసి - వాసముచేయువాడు.

త్వక్సారము - వెదురు, రూ.త్వచిసారము.
త్వక్కు -
1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము. 

మురళి - 1.పిల్లనగ్రోవి, 2.ఒక విధమైన గుఱ్ఱపునడక.  
మైలక్రోవి - మురళి.
మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.  
మాలిన్యము - మలినత. మలినము - మాసినది, నల్లనిది.
ముఱికి - కల్మషము, మాలిన్యము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.

మానవనాథు డాత్మరిపు మర్మ మెరింగినవాని నేలినం
గాని జయింప లే డరుల గార్ముకదక్షుడు రామభద్రుడా
దానవనాయకున్ గెలువ దానెటులోపు దదీయ నాభికా
సానసుధ న్విభీషణుడు తార్కొనిచెప్పక యున్న, భాస్కరా.

తా. రావణుని ఉదరమందుగల యమృత భాండమును విభీషణుడు రామునితో చెప్పకున్నచో రావణుని రాముడు గెలువగలడా ? విభీషణుడు శరణార్ధిగా రాగా రాముడాతని గుణము తెలిసి కాపాడుటచేత గదా అతడా విషయమును చెప్పెను. అట్లే శత్రువును గెలువవలెనంటే రిపువు - శత్రువు రహస్యమును తెలిసి కొన్నవారిని రక్షింపవలెను.     

నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ 
దండితాఖిలదైత్యాయ రామా యాపన్నివారిణే|

ఇష్వాసము - విల్లు; విల్లు - ధనుస్సు.
ఇషవఁ అస్యంతే అనేనేతి ఇష్వాసః. అసు క్షేపణే. - బాణములు దీనిచేత వేయఁబడును.
సెలవిల్లు - సెలసు బద్దలతో చేసిన విల్లు, రూ.సెలసు విల్లు.
సెలసు - ఒకానొక చెట్టు.

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బానధరో హరిః,
సదానందః సత్యసంధః సత్యసంకల్ప మానసః| 

"ఒక విలుకాడు మొట్టమొదట పెద్దపెద్ద వస్తువులను గురిచూచి కొట్టడం నేర్చుకుంటాడు. అందులో నైపుణ్యాన్ని సాధించిన తరువాత చిన్నచిన్న వస్తువులను సులభంగా కొట్టగలుగుతాడు. అదే విధంగా ఒక స్పస్టమైన ఆకారం ఉన్న విగ్రహం మీద మనస్సును లగ్నం చేయడం నేర్చుకొన్న తరువాత నిరాకార బ్రహ్మం మీద మనస్సును నిలపడం సులభమవుతుంది. - శ్రీరామకృష్ణ పరమహంస 

శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.

19. మూల : చెంబును పోలి 5 నక్షత్రములుండును.

చెంబు - చిన్నలోహ పాత్రము.
సగ్గెడ - చెంబు.

మూలం ప్రజాం వీరపతీం విదేయ | పరాచ్యేతు నిర్ఋతిః పరాచా | గోభిర్నక్షత్రం పశుభిస్సమక్తమ్| అహర్భూయాద్యజమానాయా మహ్యమ్ | అహర్నో అద్య సువితే దధాతు | మూలం నక్షత్రమితి యద్వదంతి | పరాచీం వాచా నిర్ఋతిం సుదామి | శివం ప్రజాయై శివమస్తు మహ్యమ్ ||18||

    

మూల1 - మూలానక్షత్రము.
మూల2 -
1.విదిక్కు, 2.కోణము, 3.గొంది, 4.కొప్పు.
విదిక్కు - రెండు దిక్కుల నడుమ.
కోణము - మూల, అంచు.
అం(ౘ)చు1 - 1.కొన, 2.చీరచెరగు, 2.విధము, (గణి.) రెండు సమతలములు కలియు రేఖ, ముఖములు కలియు ప్రదేశము (Edge).
అం(ౘ)చు2 - క్రి. 1.ఆజ్ఞాపించు, 2.పంపించు, రూ.అనుచు.

మూల మాద్యే శిఫా భయోః :
మూలశబ్దము మొదటికిని, ఊడకును, మూలానక్షత్రమునకును పేరు. మూలతీతి మూల. మూల ప్రతిష్ఠాయాం.- నిలుకడ గలిగియుండునది.
"మూల మంతిక కుంజయో"రితి శేషః.

గొల - 1.గొంది, 2.బిలము, 3.మూల, సం.గుహా.
గొంది -
1.మూల, 2.కొండయొక్క చిన్న మరుగుచోటు, 3.చిన్న సందు, 4.స్థానము.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
రంధ్రము - 1.క్రంత, సందు, 2.దూఱు.
గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహ వేగముచే వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కంధము.
స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk). 
ప్రకాండము - చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా. పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు. 
బోదియ - 1.ప్రకాండము, 2.మిరపచేల యందు కాలువ లేర్పరిచి కట్టిన కట్ట 3 స్తంభముల మీది దూలముల క్రింద నుండు పీట.       
ప్రకాండవ్యూహము - (వృక్ష.) మొక్కకు భూమిపై నున్న కాండము, కొమ్మలు, ఆకుల మొదలగు భాగముల సముదాయము (Shoot system).  

శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).  

గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము , మొ.వి విణ.గుహా యందుండునది.  

గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.

గవి1 - ఆవు.
గవి2 - 1.గుహ 2.గుంట.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
శీర్షము - తల, (గణి.) భూమి కెదురుగా నుండు కోణబిందువు, (Vertex).
తలకాయ - శిరస్సు.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు.
ఉత్తమాంగము - తల.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన. 
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు. 

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదుల కంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. - నీతిశాస్త్రము 

ఉపాంతము - 1.సమీపము, 2.కొన, 3.మూల. కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు. 
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.

పర్యన్తభూః పరిసరః -
పర్యంతము - (భూగో.) ఒక ప్రాణి చుట్టును నుండు శీతోష్ఠ్ణాది బాహ్యపరిస్థితులు (Environment).
పర్యంతే ఉపాంతే భూః పర్యంతభూః, పరితస్సరంతి చర్యంత్యత్రేతి పరిసరః, సృగతౌ. - దీనియందు నలుదిక్కుల సంచరింతురు. ఈ ఒకటి గ్రామ నగరాదులయొక్క సమీపభూమి పేరు.
పరిసరము - 1.సమీపము, 2.దాపు, 3.వైశాల్యము.
పరిసరములు - (గృహ.) 1.పరిస్థితులు, 2.చుట్టుప్రక్కలు, ఈ రు గు పొ రు గు (Environments).

అధ్వగుఁడు - బాటసారి, వి.సూర్యుడు Sun.
అధ్వనీనుఁడు - 1.ప్రయాణము చేయుటకు సమర్థుడు, వేగముగా పయనము చేయువాడు, 2.బాటసారి. 

కమాను - 1.విల్లు (విల్లు - ధనుస్సు), 2.పయనము, 3.ఫిడేలు వాయించు కొడుపు, 4.ఆర్చి (Arch). మాను గాని మాను - కమాను.
పయనము - ప్రయాణము, Journey సం.ప్రయాణమ్.

వర్త్మ - 1.మార్గము, 2.కనురెప్ప.
వర్తంతే అనేనేతి వర్త్మ, న. న. వృతు వర్తనే. - దీనిచేత నడచెదరి.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
మృగయాంతే గవేషయంత్యనేన మార్గః, మృగ అన్వేషణే. - దీనిచేతఁ బదార్థమును వెదకుదురు.
మృజ్యతే పథికపదై ర్నిస్తృణీక్రియత ఇతి మార్గః, మృజూ శుద్ధౌ. - తెరువరుల యడుగులచేతఁ దుడవఁబడునది.

అన్వేష్ట - వెదకువాడు.
అన్వేషణ - వెదకుట.
అన్విప్యతే అనయా అన్వేషణా. - దీనిచేత వెంటఁ దిరుగఁబడును. వినష్ట సీతాన్వేషక రామ్|
గవి1 - ఆవు.
గవి2 - 1.గుహ, 2.గుంట.
గవేషణ - వెదకుట.
గవేషణం, గవేషనా గవేష మార్గణే - వెదకుట.

తెరవు - దారి, రూ.తెర్వు. త్రోవ - మార్గము.
నడవ - 1.మార్గము, 2.అళిందము, (తల వాకిటికిని మధ్యగల చోటు).
అళిందము - (గృహ.) 1.బహిర్ద్వార ప్రకోష్టము, పంచపాళి, తలవాకిటి ప్రక్కనుండు గృహము, 2.వాకిటికి వెలుపల నున్న నలుచదరపు చోటు.

పరిపంది - 1.శత్రువు, 2.దారి గొట్టు దొంగ.
పరిపంథయతీతి పరిపంథీ, న. పు. - బంధించువాఁడు.

పంచబంగాళము - 1.చెల్లాచెదరైనది, 2.దూరము.

ఎడదవ్వు - అతిదూరము. సుదూరము - మిక్కిలిదవ్వు. 

తడ - 1.అడ్దు, 2.కడ, 3.దూరము.
తడకట్టు -
క్రి.అడ్డగించు, నిరోధించు.

అధ్వము - 1.దారి, 2.దూరము, 3.పయనము, 3.వేదశాఖ, 5.కాలము, 6.ఆకాశము, 7.పయనమునందు ఆగెడి స్థలము, 8.ఉపాయము.
అద్యతేభక్ష్యతే పథికైరత్ర అధ్వా, న. పు. అదభక్షణే. - దీనియందు పథికులచేత భుజింపఁబడును.

త్రోవరి - దారి తెలిసినవాడు.
త్రోవ - మార్గము.

తడ - 1.అడ్దు, 2.కడ, 3.దూరము.
తడకట్టు -
క్రి.అడ్డగించు, నిరోధించు.

స్యా ద్దూరం విప్రకృష్టకమ్,
దూరము - దవ్వు.
దుఃఖేన ఈయతేప్రావ్యత ఇతి దూరం, ఇణ్ గతౌ. - ప్రయాసచేతఁ బొందఁ బడునది.
విప్రకర్షము - దూరము, దవ్వు.
విప్రకృప్యతే సమీపా దితి విప్రకృష్టకం, కృషవిలేఖనే. - సమీపమునుండి లాగఁబడునది. ఈ 2 దవ్వైనదాని పేరు. 

దౌ - దూరము, విణ.దూరముగా, సం.దూర్, రూ.దవు, దవ్వు, దౌవు. 
దౌవు - దౌ, రూ.దవ్వు.     
దవ్వు - దూరము, సం.దవీయః.

పంచబంగాళము - 1.చెల్లాచెదరైనది, 2.దూరము.

ఎడదవ్వు - అతిదూరము. సుదూరము - మిక్కిలిదవ్వు. 

సమీరణుఁడు - 1.వాయువు, 2.బాటసారి, వ్యు.లెస్సగా చరించువాడు.
సమ్యక్ ఈరితుం గంతుం శీలమస్య సమీరణః, ఈరగతౌ - లెస్సగా సంచరించు స్వభావము గలవాఁడు. 

పంథుఁడు - పథికుడు, తెరువరి, బాటసారి.
పథికుఁడు - పాంథుడు, బాటసారి.
వాటచారి - బాటసారి, పాంధుడు. 
పంథంతి యాంత్యనేన పంథాః, న-పు, పథిగతౌ. - దీనిచేత బోవుదురు.
పథగుఁడు - భటుడు.
పదాతి - భటుడు, రూ.పదాజి.
పదవి - మార్గము, వై.వి. ఉన్నత స్థితి, సం.పదమ్.
పద్యంతే గచ్చంత్య స్యామితి పదవీ, ఈ.సీ. పద్ ఌ గతౌ. - దీనియందు నడతురు.

అరదేశి - 1.పరదేశి, 2.యాత్రికుడు.

యాత్రా వ్రజ్యాభి నిర్మాణం ప్రస్థానం గమనం గమః,  
యాత్ర - 1.పోవుట, 2.పుణ్యక్షేత్రముల కేగుట, 3.జాతర.
యాంత్యస్యామితి యాత్రా, యా ప్రాపనే. - దీనియందు కదలిపోవుదురు.
ౙాతర - 1.యాత్ర, 2.గ్రామ దేవత మొదలగు శక్త్యుత్సవము, 3.ఉత్సవము, సం.యాత్రా.  
యానము - 1.పోవుట, 2.దండెత్తి పోవుట, 3.వాహనము, 4.యాన పాత్రము, జనులెక్కిపోయెడి ఓడ.
వ్రజము - 1.పసులమంద, సమూహము, 2.త్రోవ, 3.పసులకొట్టము.
వ్రజనం వ్రజ్యా, వ్రజగతౌ. - కదలిపోవుట.
అభిముఖ్యేన నిర్యాణం అభినిర్యాణం, యా ప్రాపణే. - ఎదురుగాఁ గదలిపోవుట.  
ప్రస్థానము - 1.ప్రయాణము, 2.శాస్త్రము.
ప్రస్థీయత ఇతి ప్రస్థానం, ష్ఠా గతి నివృత్తౌ. - ప్రపూర్మమగుటచేత గమనార్థకము, కదలిపోవుట.
గమనము - 1.పోవుట, 2.తలపు, 3.ప్రయాణము, 4.పొందుట, 5.రమించుట.
గమ్యతే గమనం; గమశ్చ, గమ్ ఌ గతౌ. - కదలిపోవుట. ఈ 5 గెలువ నిచ్ఛయించిన రాజుయొక్క పయనము పేర్లు.

తరలు - ప్రయాణమగు.
తెలిగొను - క్రి. ప్రయాణము చేయించు.

నగ చ్ఛేద్రాజయుగ్మంచ - నగ చ్ఛద్బ్రాహ్మణ త్రియం|
చతుశ్శూఁదానగచ్ఛేయుర్నగ చ్ఛే ద్వైశ్య పంచకం||
తా.
ఒకానొక కార్యమునకుఁ బోవునపుడు ఇద్దరు క్షత్రియులు, ముగ్గురు బ్రాహ్మణులు, నలుగురు శూద్రులు, ఐదుగురు వైశ్యులు పోరాదు. పోయిన నా(ఆ)పని కానేరదు. – నీతిశాస్త్రము

సరణి - 1.త్రోవ, 2.వరుస, 3.విధము. 
సృతి - 1.త్రోవ, 2.పోక, (గణి.) ఒక స్థిరబిందువునకు ఒక చల బిందువుతో కలుపు ఋజురేఖ (Radius vector).
సరంత్యనేనసృతి ఈ-సీ సరణిశ్చ, ఈ. సీ. సృగతౌ. - దీనిచేత సంచరింతురు.

పంపిణి - 1.పంచిపెట్టుట, 2.పద్దతి, వి. (గణి.) వ్యాపనము (Distribution).  

పద్దతి - 1.మార్గము, 2.వరుస, సం.వి. (గణి, భౌతి, రసా.) సమకూర్చ బడిన అవయములు (భాగములు) కలిగి క్రమ సహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడునది (Sysytem), లేదా ఒక పూర్ణముగా పరిగణింపబడు వస్తువుల సమూహము.
పదాభ్యాం హన్యత ఇతి పద్దతిః ఈ. సీ. హన హింసాగత్యోః. - పాదములచేతఁ గొట్టఁబడునది.
పద్యము - గణయతిప్రాస నియమములు గలది.
పద్య - త్రోవ.
తృణకంటకాది రహితత్వాత్ పాదాయ హితా పద్యా - తృణకంట కాదిశూన్యమై యుండుటవలనఁ బాదములకు హితమైనది. 
వర్తని - త్రోవ, కాలిజాడ.
వర్తంతే అనయావర్తనీ, ఈ. సీ. వృతు వర్తనే. - దీనిచేతఁ బ్రవర్తింతురు.
ఏకపది - 1.మార్గము, 2.ఒకడే నడవదగ్గ మార్గము.
ఏకే కతిపయే పదా లక్ష్యంతే అస్యామితి ఏకపదీ, ఈ. సీ. - కొన్ని యడుగులు దీనియందుఁ గానబడును.
ఏకః ఆనహితః పాదో (అ)స్యామితివా ఏకపదీ - విడివిడిగా నుండు నడుగులుగలది. ఈ 12 త్రోవ పేర్లు.

దారి - 1.ద్వారము, 2.మార్గము, 3.గతి, సం.ద్వారమ్.    

గతి - 1.పోక, 2.విధము, 3.త్రోవ, 4.స్థానము, 5.ప్రమాణము, 6.ఆధారము, 7.ఉపాయము, (భౌతి.) చలనము (Motion).
గతిశక్తి - (భౌతి.) వస్తు చలనము నకు తోడ్పడు శక్తి (Kinetic energy).
గతిశాస్త్రము - (భౌతి.) వస్తువుల చలనమును గురించి చర్చించు భౌతికశాస్త్ర భాగము (Dynamics), వస్తువుల చలన రూపములకు చెందిన నియమముల చర్చించు శాస్త్రము (Kinetics).

అగతికుఁడు - గతిలేనివాడు, దిక్కులేనివాడు. గతిలేనిది, గతిలేనివాడు అని తిడుతుంటారు.

టికాణా - 1.గతి, 2.చోటు, హిం.టికానా.     
ఎక్కడా టికానా లేదు. టికాణా లేనిది, లేనివాడు అని నిందిస్తూంటారు.

అటని - వింటికొప్పు. 

గతిరాత్మవతాం సంతః సంత ఏవ సతాం గతిః |
అసతాం చ గతిఃన్సంతః న త్వసంతః సతాం గతిః ||
బుద్ధిమంతులకు(ఆత్మ) మంచివారు దిక్కు, మంచివారే మంచివారికి గతి. చెడ్దవారికీ మంచి వారే దిక్కు. చెడ్దవారు మాత్రం మంచివారికి దిక్కు కానేకారు.

పూగము - పోక; పోఁక - వక్క, సం.పూగః.
పునాతి ముఖ మితి పూగః పూఞ్ పవనే. - ముఖమును బవిత్రముగాఁ జేయునది.
క్రముకము - పోక.
క్రామంత్యస్మిన్ ఫలార్థన ఇతి క్రమకః, క్రము పాదవిక్షేపే. - దీనియందు ఫలార్థు లెక్కుదురు.
వక్క - ఉడకబెట్టిన పోకచెక్క, సం.వల్కః.

పూగః క్రముక బృన్దయోః,
పూగశబ్దము పోఁకచెట్టునకును, సమూహమునకును పేరు. పునానీతి పూగః పూఞ్ పవనే. - పవిత్రముఁ జేయునది గనుక పూగము.

ముప్పోకలాఁడు - (మూడు + పోకలు + ఆఁడు) త్రిగుణాత్మకుడు, భగవంతుడు.   

పోఁకొత్తు - అడకొత్తు, పోకలను కత్తిరించు సాదనము.
అడకత్తెర - వక్కలను కత్తిరించు కత్తెర. అడకత్తెరలో పోకచెక్క.

బాగములు - పూగములు, పోకచెక్కలు, వక్కపొడి.

చిక్కటారి - చికటారి, చిన్నకత్తి.
చిక్కణము - 1.చాయవక్క, విణ.నునుపైనది, 2.తరచైనది, 3.చిక్కనైనది, రూ.చికినము.
చికినము - 1.చిక్కణము, 2.చాయవక్క, రూ.చికిని.
చికిని - చికినము.
చిక్కనం మసృణం స్నిగ్ధమ్ -
చిక్కన - 1.చిక్కణము, 2.తరచు, 3.ధార్ధ్యము, 4.బలము.
చిక్కత ఇతి చిక్కణం, చితీసంజ్ఞానే. - ఎఱుఁగఁ బడునది.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
బలతి ప్రాణితి స్వపక్షో (అ)నేన బలం, బల ప్రాణనే. - స్వపక్షము దీనిచేత బ్రతుకుదురు. 
మసృణము - 1.చిక్కనిది, 2.నునుపైనది.
మస్యతిద్రవత్వేన పరిణమతీతి మసృణం, మస పరిణామే. - ద్రవముగాఁ బరిణమించునది.
స్నిగ్ధుఁడు - స్నేహితుడు.
స్నిగ్ధము - 1.స్నేహముగలది, 2.నునుపుగలది, 3.చిక్కనగలది.
స్నిహ్యతీతి స్నిగ్ధం, ష్ణిహప్రీతౌ. - మిసిమిగలది. ఈ 3 మిసిమి (నిగ్గు)గల వస్తువు పేర్లు, దట్టమును.
స్నిగ్థవయనము - (గృహ.) నునూపు నేత, బట్టకు మెరుపు నునుపునిచ్చు ఒక విధమైన నేత (Satin weave). 

గనయము - 1.పోకముడి, 2.నీవీబంధము, 2.వింటికొప్పు.
నీవీ పరిపణో మూలధనమ్ -
నీవి - 1.సంచి మొదలు (మూల ధనము), 2.పోకముడి, 3.పందెపుసొమ్ము, 4.చెరసాల.
నితరాం అధికత్వేనేతి లాభః డు లభేష్ ప్రాప్తౌ. - అధికముగా పొందఁబడునది.
సంచి మొదలు - మూల ధనము.
పోఁకముడి - నీవి, స్త్రీల కట్టుకోక ముడి.
ఉచ్చయము - 1.సమూహము, 2.పోకముడి, 3.పూలు మొ.వి కోయుట, 4.అతిశయము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
పందెము - 1.ఒడ్డనము, 2.జూదములో ఒడ్డు ధనము, రూ.పందియము, సం.పణితమ్.
పరిపణ్యతే లాభార్థం ప్రయుజ్యత ఇతి పరిపణః పణవ్యవహారేస్తుతౌ చ, - లాభార్థమై వ్యవహింపఁ బడునది.
కార - చెరసాల, బంధనాలయము. 
మొదలు - 1.ఆది, 2.పూర్వము, 3.మూలము, 4.మూలధనము, 5.ప్రభృతి. 
మూలం చ తత్ ధనం చ మూలధనం మొదటిసొమ్ము. ఈ 3 మొదలిసొమ్ము పేర్లు.

ఆది1 - (గృహ.) 1.నగలుచేయుటకు, దుస్తులు కుట్టుటకు ఇచ్చు కొలత (Measurement); ఆ కొలత దెల్పెడి వసువు, 2.మొదలు, 3.మూలము, 3.ప్రమాణము, సం.విణ.1.మొదటిది, 2.మొదలుగాగల, 3.సదృశ్యము.
ఆది2 - గురి.
ఆదికొను - క్రి.1.కన్నువేయు, 2.ఎదుర్కొను.

లక్ష్యము - 1.గురి, 2.లెక్క.
లచ్చనము -
1.లక్షణము, 2.గురుతు, 3.వ్యాకరణశాస్త్రము.
లక్కనము - లక్షణము, గురుతు, సం.లక్షణమ్.
శరవ్యము - గురి, లక్ష్యము. ఐమ(ౘ)చ్చ - లక్షణము, గుర్తు.  

గుఱి - 1.లక్ష్యము, 2.గుర్తు, 3.నిదర్శనము, 4.నమ్మిక, నమ్మకము  4.సాక్షి, 6.నిర్ణయము, 7.యుక్తి, 8.పరిమితి, 9.కళంకము.

లక్ష్యం లక్షం శరవ్యం చ :
లక్ష్యత ఇతి లక్ష్యం. లక్ష్య. చ. లక్ష దర్శనాంక నయోః - చూఁబడునది గనుక లక్ష్యము, లక్ష్యమును.
శరైః వీయత ఇతి శరవ్యం. వ్యేఞ్ సంవరణే. - బాణములచేతఁ గప్పఁబడునది. ఈ మూడు గుఱి పేర్లు.

వేధ్యము - గురి, విణ.తొలగించదగినది.

                          

నిమిత్తము - 1.కారణము, 2.శకునము, 3.గురి.
కారణము -
1.హేతువు(హేతువు - కారణము), 2.పనిముట్టు.
శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి (పక్షములు గలది).

అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
గుఱుతు -
1.చిహ్నము, 2.మేర, 3.కీర్తి, 4.పరిమితి, 5.స్థానము, 6.విధము, 7.మచ్చ, 8.సాక్షి, రూ.గుర్తు.

లలామము - 1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొట్టు, 5.తోక, 6.గుఱ్ఱము (ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

మచ్చ - 1.గాయపుగుర్తు, 2.పుట్టుమచ్చ.
కళంకము -
మచ్చ.

బండవలము - 1.సామర్థ్యము, 2.సంచి మొదలు, మూలధనము, సం.భాండ బలమ్.
సామర్థ్యము - 1.నేర్పు, 2.యోగ్యత (భౌతి.) పనిచేయు రేటు, (Power), (గృహ.) బలము, సత్తువ.
నేరిమి - సామర్థ్యము, రూ.నేరుపు, నేర్మి, నేర్పు. ప్రావీణ్యము - నేర్పు.
ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.
యోగ్యత - అర్హత, eligibility.
ఔచిత్యము - యోగ్యత; ఔచితి - 1.ఉచితత్వము, 2.యోగ్యత.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
లావు - 1.బలము, 2.అతిశయము, 3.సామర్థ్యము, విన.స్థూలము.
లావరి - (లావు+అరి) బలవంతుడు. 

ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్త్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion).  

ప్రావీణ్యము - నేర్పు; విచక్షణత - నేర్పు.
చాతుర్యము -
1.నేర్పు, రూ.చాతురి. చాతురి - నేర్పు.
చమత్కారము - 1.నేర్పు, రూ.చమత్కృతి.
చమత్కృతి - చమత్కారము.
విన్ననువు - నేర్పు, సాధనము, సం.విజ్ఞానమ్.
విన్నాణము - నేర్పు, ఇప్పిదము, సం.విజ్ఞానమ్.

కృతహస్తుఁడు - 1.నేర్పరి, 2.గురితప్పక చేయువాడు.     

మూలధనము - పెట్టుబడి (Capital) (అర్థ.) ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యక్రమము కొనసాగుటకు అవసరమైన ధనము, దీనిని కంపెనీ వాటాల వలనగాని ఋణ పత్రముల వలన కాని, అప్పువలనకాని, గత సంవత్సరములలో కలిగిన లాభాంశముల వలన కాని సేకరింపవచ్చును.

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా. అదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు; కూఁతురు - కొమార్తె.

ప్రభృతి - మొదలు; లగాయతు - మొదలు.

సదృశ్యము - (గణి.) అనురూపము, సం.విణ. సమానము, తగినది, (Corresponding).
అనురూపము - 1.తగినది, 2.అనుగుణము, 3.సాటియైనది, 4.(గణి.) ఒక దాని కొకటి అనుగుణముగా నున్నది, అనుగుణ్యము కలది, (Corresponding).

ముందర - 1.మునుపు, 2.మొదలు, 3.ఎదురు.
ముందఱికాళ్ళకుఁ బందెములు వేయుట - జాతీ. రాబోవు దానికి అడ్డు చెప్పుట.

పూర్వము - మొదటిది, (జం.)ముందుగా నున్న(Anterior).
మొదటి -
1.ప్రథమము, 2.ముఖ్యమైనది, 3.ఆదిమము(Primary) ప్రాథమికము, ఆదికాలికము (Primitive).
ప్రథమము - 1.ముఖ్యము, 2.మొదటిది.
ప్రాథమికము - ముఖ్యమైనది, ప్రధానమైనది, మొదటిది (Primary).
అగ్రిమము-ప్రధానము; ముఖ్యము - ప్రధానము.

ప్రధానము - 1.ముఖ్యము, 2.ముందిచ్చు సొమ్ము, 3.వివాహాత్పూర్వము, వధువున కలంకారాదుల నిచ్చి నిశ్చయించు కొనుట, 4.పరమాత్మ.

పరమము - పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము, 2.ఆద్యము, 3.ప్రధానము. 

 

క్రవ్యాదుఁడు - 1.మాంసము తినువాడు, 2.రక్కసుడు, రూ.క్రవ్యాత్తు.
క్రవ్యాత్తు - రాక్షసుడు, వ్యు.మాంసము తినువాడు.
క్రవ్యం మాంస మత్తీతి క్రవ్యాత్, ద. పు. క్రవ్యాదశ్చ, అదభక్షణే - క్రవ్యమనఁగా మాంసము, దానిని భక్షించువాఁడు గనుక క్రవ్యాత్తు, క్రవ్యాదుఁడును.
క్రవ్యము - మాంసము.

అస్రపుఁడు - 1.రాక్షసుడు, వ్యు.నెత్తురు త్రాగువాడు, 2.నైరృతుడు.
అస్రం రక్తం పిబతీత్యస్రపః పాపానే. - రక్తమును పానము చేయువాఁడు.
పా, అశ్రపః, సశ్రపయతి మాంసాదిక మిత్యశ్రపః, శ్రాపానే - మాంసాదులను పచనముసేయక భక్షించువాఁడు. 
పా, అసృక్పః అసృక్ పిబతీ త్యసృక్పః - నెత్తురు ద్రావువాఁడు.
నెత్తురు ద్రావుడు - రక్కసుడు.
అస్రప - 1.జలగ, 2.పిశాచస్త్రీ, వ్యు.నెత్తురు త్రావునది.
జలగ - (జం.) జంతువుల రక్తాన్ని పీల్చుకొని నీళ్ళలో జీవించు పరాన్న జీవి, (Leech), రూ.జెలగ.      

సురద్విషుఁడు - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
సురాన్ ద్విషంతీతి సురద్విషః - ష-పు. దేవతలను ద్వేషించువారు.ద్విష అప్రీతౌ.
వేల్పుదాయ - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
ఆసురాః, న విద్యతే సురా యేషాం తే అమృతము లేనివారు.
సురేభ్యో (అ)న్యే వా - దేవతలు గానివారు.
యజ్ఞభాగాన్ని రస్యంత ఇతి వా - యజ్ఞభాగము వలనఁ ద్రోయఁబడినవారు.
అసు క్షేపనే, అసూన్ ప్రాణాన్ రాంతి గృహ్ణంతీతివా - ప్రాణముల గొనువారు, రా ఆదానే.  
ఆసురుఁడు - నిరృతి, రాక్షసుడు.    
అశృణాతి హీన స్తీత్యాశరః శౄ హింసాయాం - హింసించువాఁడు.
పా, అసురః-అసూన్ రాతీత్యసురః అసుర ఏవ అసురః, రా ఆదానే - ప్రాణముల నపహరించువాఁడు - అసురుఁడు , వాఁడే అసురుఁడు.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.

అసురము - ధన మిచ్చి కన్యను కొని చేసికొనెడి పెండ్లి, అష్టవిధ వివాహములలో ఒకటి, విణ.అసురులకు సంబంధించినది.

అసురము - 1.ఏనుగు, 2.మాలకాకి.
ఆసురాః, న విద్యతే సురా యేషాం తే - అమృతము లేనివారు.
సురేభ్యో (అ)న్యే వా - దేవతలు గానివారు. 
యజ్ఞభాగాన్ని రస్యంత ఇతి వా - - యజ్ఞభాగము వలనఁ ద్రోయఁబడినవారు.
అసు క్షేపనే, అసూన్ ప్రాణాన్ రాంతి గృహ్ణంతీతివా - ప్రాణములు గొనువారు, రా ఆదానే.

ఐంద్రము - 1.మాలకాకి, 2.(జ్యోతి.) ఒకానొక పంచాంగ యోగము, విణ.ఇంద్రునకు సంబంధించింది.

ద్రోణకాకస్తు కాకోలో :
ద్రుణాతీతి ద్రోణః, ద్రోణశ్చాసౌ కాకశ్చ ద్రోణకాకః. ద్రూ హింసాయాం. - హింసించెడు కాకి.
కాకేషు కోలతి స్థూలో భవతీతి కాకోలః. కుల సంస్త్యానే. - కాకులలో గొప్పది. ఈ రెండు మాలకాకి పేర్లు.

ద్రోణము - వి. ద్రోణము, సం.వి.1.తూము, 2.తేలు, 3.మాలకాకి.
తూము -1.నీరుపోవుటకు కట్టిన కాలువ, 2.నాలుగు కుంచముల కొలత.
నీరుగండి - తూము.
తేలు - 1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము Scorpion.
తేలగిల్లు - 1.పైకితేలు, 2.పరవశమగు, రూ.తేలగిలు.      

కాకోలము - 1.ఒకవిధమగు నరకము, 2.బొంతకాకి, 3.ఎఱ్ఱని పాము Red snake, 4.విషము. 
కాకవత్కృష్ణవర్ణత్వాత్కాకోలః - కాకివలె నల్లనై యుండునది.
కా ఈషత్ కోలతి సంస్త్యాయతీతి కాకోలః, కుల సంస్త్యానే. - ఇంచుక కూడి వ్యాపించునది. బొంతకాకి - మాలకాకి.

విషము - 1.గరళము, 2.జలము.
దేహం వేవేష్టీతి విషం, విష్ ఌ వ్యాప్తౌ. - దేహమును వ్యాపించునది.

విష మప్సు చ,
విషశబ్దము నీళ్ళకును, చకారమువలన విషమునకును పేరు.
వేవేష్టీతి విషయం, విష్ ఌ వ్యాప్తౌ. - వ్యాపించునది.

గరళము - 1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు.
గిరతి జీవం గరళం, గౄ నిగరణే. - ప్రాణమును మ్రింగునది.

శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః|
పరోపకారః పుణ్యాయ - పాపాయ పర పీడనమ్||
తా.
అనేక గ్రంథములయందు జెప్పబడిన విషయమును నేనర్థ శ్లోకమందు దేటపఱచెద(విశదమగునది). అదెట్లనిన, పరులకు ఉపకారము జేయుట పుణ్యముకొఱకును, పరులను పీడించుట పాపము(పాపము - దుష్కృతము, కలుషము.)కొఱకు నగును. - నీతిశాస్త్రము

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుమణుఁడు, వ్యు.అసురలను హింస చేయువాడు.
ద్రుహిణః ద్రుహ్యతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులను హింస చేయువాఁడు. ద్రుహ జిఘాం సాయాం. ద్రుహిణ ముఖసదనే శారదా|
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.
రాతౌ చరతీతి రాత్రించరః రాత్రిచరశ్చ చరగతి భక్షణయోః - రాత్రియందు సంచరించువాఁడును భక్షించువాఁడును గనుక రాత్రిచరుఁడు, రాత్రిచరుఁడును.
రాత్రిచరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు. 
రాత్రి - సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము. 

కర్బురుఁడు - చిత్రవర్ణము గలవాడు.
కర్బురవర్ణత్వాత్కర్బురః - చిత్రవర్ణము గలవాడు.
 
కర్బురము - 1.జలము, 2.బంగారము, విణ.చిత్రవర్ణము గలది.
కర్వతి లోహమధ్యే శ్రేష్ఠత్వా త్కర్బురం, క్ర్వ గర్వ దర్పే వబయో రభేదః - లోహములలో శ్రేష్టమౌట చేత గర్వించునది.

యాతధానుఁడు - రాక్షసుడు.
యాతునామధీయతే అస్మిన్నితి యాతుధానః, డు ధాఞ్ ధారణ పోష్ణయోః - యాతు వనెది నామము ధరించినవాఁడు.

సుక్కురుఁడు - వై.వి. శుక్రుడు Venus, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
సుకృతీ పుణ్యవా న్ధన్యః -
సుకృతి - 1.పుణ్యుడు 2.శుభుడు.
సుకృత మస్తాస్తీతి సుకృతీ, నాంతః - సుకృతముగలవాఁడు.
సుకృతము - 1.పుణ్యము 2.శుభము.
పుణ్య మస్యాస్తీతి పుణ్యవాన్, త. - పుణ్యము గలవాఁడు.
ధన్యుఁడు - పుణ్యవంతుడు.
ధనం పుణ్యం లబ్దో ధనీః- ధన మనఁగా బుణ్యము, దాని బొందినవాఁడు. ఈ 3 పుణ్యముగలవాని పేర్లు. 
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము.(Property)

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

ధర్మశాస్త్రములు - (చరి.) భారతీయ సామాజిక వ్యక్తిగత జీవితములను శాసించు గ్రంథాలు. (బౌద్ధాయన, ఆపస్తంబ విశిష్ట ధర్మ సూత్రములు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి స్మృతులు, దేవన్నిభట్టు రచించిన స్మృతి చంద్రిక. క్రీ.శ. 12వ శతాబ్దము, నీలకంఠుడు రచించిన వ్యవహార ముఖము ధర్మశాస్త్రములుగా గుర్తించబడినవి).

ఏకో ధర్మః పరం శ్రేయః - క్షమైకా శాంతి రుత్తమా,
విద్యైకా పరమా తృప్తి - రహిం సైకా సుఖావహా|
తా.
ధర్మ మొక్కటే ఉత్తమ శ్రేయము (ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, క్షమ - 1.ఓర్పు Patience, 2.నేల, 3.మన్నింపు.)ఒక్కటే ఉత్తమమైన శాంతి, విద్య - 1.చదువు, 2.జ్ఞానము.) యొక్కటే గొప్ప తృప్తి(తృప్తి-తనివి), అహింస యొక్కటే సుఖము కలిగించునది. ధర్మాలలో గొప్పది అహింస.

పుణ్యజనుఁడు - 1.నైరృతి, 2.రాక్షసుడు, 3.పుణ్యపురుషుడు.
విరుద్ధలక్షణయా పుణ్యవాన్ జనః పుణ్యజనః - విపరీత లక్షణచేత పుణ్యము గలవాఁడు.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
పున్నెము - పుణ్యము, రూ.పున్నియము, సం.పుణ్యమ్.
నైరృతుఁడు - నాలవ దిక్కు నేలువాడు, నిరృతి.
నిరృతి - (నిర్ + ఋతి)1.అలక్ష్మి, 2.ఒక దిక్పాలుడు, విణ. ఉపద్రవము లేనిది.  
విరుద్ధలక్షణయా పుణ్యవాన్ జనః - విపరీత లక్షణముచేత పుణ్యము గలవాఁడు.    

స్యా దలక్ష్మీ స్తు నిరృతిః :
లక్ష్మీర్న భవతీత్య లక్ష్మిః. ఈ. సీ. - సంపత్తుగానిది అలక్ష్మి.
ఋతేస్య స్మార్థా న్నిష్క్రాంతా నిరృతిః - సన్మార్గము వలనఁ బాసినది. ఈ రెండు నరకసంబంధమైన యభాగ్యము పేర్లు.

నీలాంబరుఁడు - 1.బలరాముడు, 2.నైరృతి, 3.శని Saturn.
నీలాంబరః నీల మంబరం వాసో యస్యసః - నల్లని వలువ గలవాఁడు.
నల్లవలువ తాలుపు - నీలాంబరుడు, బలరాముడు. 

నైరృతి - నిరృతి.
నిరృతే ర్దిక్పాలస్య అపత్యం నైరృతః - నిరృతి యనెడి దిక్పాలుని కొడుకు.

యాతువు - 1.బాటసారి, 2.యముడు, 3.రాక్షసుడు, 4.వాయువు.
యాతయతి వ్యథయతీతి యాతు, ఉ-న. - వ్యథ పెట్టెడువాఁడు.
రక్కసి - రాక్షసి, రాక్షసుడు, రక్కసీడు, సం.రక్షసః.
రక్షస్సు - రాక్షసుడు; రాక్షసి - రక్కసి.
రక్షత్యాత్మానమేవేతి రక్షః, స-న. రక్షపాలనే - తన ప్రాణము రక్షించుకొనువాఁడు.
రక్ష్యతే (అ)నేన విదిగితి రక్షః - ఇతనిచేత విదిక్కు రక్షింపఁబడుచున్నది. 
రంపెలాఁడు - రాక్షసకృత్యములు గలస్త్రీ.  

రక్కెన - 1.రాక్షస స్త్రీ, 2.రక్కెనచెట్టు, విణ.ఆయుక్తము, సం.రాక్షసః.
రాక్షస - అరువది సంవత్సరములలో 49వ దాని పేరు.
రాక్షసము - బలాత్కారముగ కన్య నపహరించుకొని వచ్చి చేసికొనెడి పెండ్లి.

యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు -
యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమనుడు - యముడు.

రక్షకుఁడు - రక్షించువాడు.
రక్షితవ్యము - 1.రక్షింపదగినది, 2.గోప్యము. 

 

దానవుఁడు - దనుజుడు, రాక్షసుడు.
దనుజుఁడు -
రాక్షసుడు, వ్యు.దనువు నందు జన్మించినవాడు.  

శుక్రశిష్యుఁడు - రాక్షసుడు.

కూటము1 - 1.కొలువు కూటము, 2.చావడి.
కూటము2 - 1.అమ్ము, 2.కపటము, 3.కొఱ్ఱు, 3.దుఃఖము, 4.ప్రోగు, 6.బొంకు, 7.ఇల్లు, 8.కొండకొమ్ము, పర్వత శిఖరము.

కూటో (అ)స్త్రీ శిఖరం శృఙ్గమ్ -
కూట్యతే దహ్యతే సూర్యదావాభ్యాం కూటః, అ. ప్న. కూటదా హే. - సూర్యదావాగ్నులచేత దహింపఁబడునది.

శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన. శిఖేవాగ్ర శిలా అస్యాస్తీతి శిఖరం. అ. ప్న. శిఖవంటి కొనఱాయిగలది. "సారాంధకార శిఖర సహస్రాంగారతోనా" ఇతి పున్నపుంసకాధికారే చంద్రగోమినా పఠితత్వాత్ శిఖరశబ్దస్య పుంస్త్వమపి.
కొవురు - 1.కొండకొమ్ము, 2.శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము - 1.కొండ కొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది.

వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

గోపురము - 1.గవసు, పురద్వారము, వాకిలి, 2.గాలిగోపురము, దేవాలయ ముఖమున ఎత్తుగా కట్టినద్వారము, (గణి.) సూచ్యగ్ర స్తూపము (Pyramid).
పిరమిడ్లు - (చరి.) (Pyramids) ఈజిప్టులోని పెద్దరాతి కట్టడములు. ఇవి త్రికోణాకారములో ప్రాచీనకాలపు ఈజిప్టు చక్రవర్తులైన ఫారోలకు స్మారక చిహ్నములుగా కట్టబడినవి(వీనిలో కెల్ల పెద్ద పిరమిడు ' గిజే ' పిరమిడు 6 మైళ్ళ పొడవులో 484 అడుగుల ఎత్తు 13 1/4 ఎకరముల వైశాల్యముతో నైలునది Nile river యొద్ద నున్నది.)

కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ,వి. కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ,వి. ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శొంఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 6.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.

పీలుపు - 1.ఏనుగు, 2.అమ్ము, 3.పరిమాణువు, 4.గోగు, 5.టేకు.
పృషత్కము - అమ్ము, బాణము.

               

మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా|
నిజారుణప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా. - 3స్తో

శార్ఙి - విష్ణువు, వ్యు.శార్ఙ్గము కలవాడు.  
శృఙ్గస్య వికారః శార్ఙ్గీం ధనుః తదస్యాస్తీతి శార్ఙ్గీ మనెడి విల్లు గలవాఁడు.
శార్జము - విష్ణువు విల్లు, విల్లు, వ్యు.శృంగముతో జేయబడినది.

సింగాణి - 1.కొమ్ములతోచేసిన విల్లు, 2.విల్లు, రూ.సింగిణి, సం.శార్జ్గమ్, శృంగిణీ.
   
శృంగిణి - ఆవు. ప్రద్యుమ్నే శృంగాళాదేవి శక్తిపీఠం|  
శృంగయోగాత్ శృంగిణీ. ఈ. సీ.- కొమ్ములు గలది.
శృంగము క్తత్వాత్ శృఙ్గీ. సీ. - కొమ్ములు గలది. 
ఆవు - గోవు. 
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

శృంగము - 1.కొమ్ము, 2.కొండ కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
శృణాని హినస్తీతి శృంగం. శౄ హింసాయాం. - హింసించునది.

కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ,వి. కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ,వి. ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శొంఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 6.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.


కృతహస్తుఁడు - 1.నేర్పరి, 2.గురితప్పక వేయువాడు.
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
విజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.మిక్కిలి తెలిసినవాడు.
సమర్థుఁడు - నేర్పరి. ప్రవరుఁడు - 1.నమ్రుడు, 2.సమర్థుడు.   
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు. 
వినగ్ధుడు - నేర్పరి, చొరవవాడు. నిష్ణాతుఁడు - నేర్పరి.
చతురిమ - నేర్పరి. చంగము - 1.నేర్పరి, 2.చక్కనిది.

గవ్యము - 1.వింటినారి, 2.పసులు మేయు పొలము, విణ.1.గోహితవైనది, 2.గోసంబంధ మైనది, 3.గోవికారమైనది (పాలు మొ.వి).
గవ్యములు - గోసంబంధమైనవి, (పంచగవ్యములు:- గోమయము, గోమూత్రము, గోఘృతము, గోదధి, గోక్షీరము. ఇవి పవిత్రములు, పాపహరములు).

గొబ్బి - 1.ధనుర్మాసమున బాలికలు చేతులు చరచుచు గుండ్రముగా తిరుగుచు పాటలు పాడువేడుక, 2.ఇక్షురకము, గొలిమిడి, మొగబీర.
గొబిళ్ళు - 1.గొబ్బి, 2.నమస్కార భేదము, 3.బాలక్రీడ, 4.గొబ్బిపాట.

అరి2 - 1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.

నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి. స్త్రీ.
నృణాతి నయతి స్వవశం పురుషమితి నారీ, సీ, నృ నయే. - పురుషుని వశము చేసికొనునది. 

నరము - నాడి nerve.
నాడి - 1.నరము, రూ.నాడు, సం.వి. గడియకాలము, 3.ఈనె, 4.కాడ.
నాడీక - దేశము, రూ.నాడు, సం.వి. గడియకాలము, రూ.నాడి.
నాడు - క్రి. నాటు, వి.1.దేశము Country, 2.గ్రామము.

నాడీ కాలే (అ)పి షట్ క్షణే, 
నాడీశబ్దము ఆరుక్షణములు(6 Seconds) గల కాలమునకును, అపిశబ్దమువలన క్రోవినరముల కును, కూరకాఁడ మొదలయినవానికిని పేరు. ఆఱుక్షనములనగా నొక్కగడియ, నళతీతి నాడీ, సీ నళ గతౌ. - పోవునది.    

యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్త్రై తాస్తు న పూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః|

మౌర్వీ - అల్లెత్రాడు.
మూర్వా వృక్ష విశేషః తద్వికారో మౌర్వీ. ఈ. సీ. - మూర్వయనఁగా చాఁగ దానిచేతఁ జేయఁబడునది. 
అల్లియ - వింటినారి, మౌర్వి, రూ.అల్లె.
అల్లె - అల్లియ; వలియ - వింటినారి, సం.వల్లిక.   

ఙవమానధను ర్మౌర్వీరవరత
పవమానధృత వ్యజనకృతి ముదిత| ||శరవణభవ||

జ్యూ - 1.వింటినారి, 2.భూమి, (గణి.) వృత్త పరిధిలోని రెండు బిందువు లతో నంతమగు సరళ రేఖ (Chord).
జినాతి కాలే శిథలీ భవతీతి జ్యా. జ్యా వయోహానౌ. - కాలక్రమమున శిథిలమౌనది.
జినాతి సర్వమస్యామతి జ్యా, జ్యూ వయోహానౌ. - సర్వము దీనియందు నశించును.   

భూమి - నేల, చోటు, పృథివి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.

భూమిజ- సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

నిర్వాతము - చలింపనిగాలి, విణ.గాలిలేనిది (చోటు).   

శింజిని - 1.వింటినారి, 2.కాలియందె.
శిఞ్జతి అవ్యక్తం స్వనతీతి శింజనీ. ఈ. సీ. శిజి అవ్యక్తే శబ్దే. - అవ్యక్తముగా మ్రోయునది (తాలవ్యాది).
హంసకము - కాలియందె. 
పాయపట్టము - కాలియందె(కాలి అందె), సం.పాదపట్టమ్.   
శింజ - 1.వింటినారి మ్రోత, 2.అందెల చప్పుడు. శింజానము - శింజా ధ్వనికలది.
శింజితము - భూషణముల ధ్వని. 

భూషణానాం తు శిఞ్జితమ్,
శింజతీతి శిఞ్జితం, శిజి అవ్యక్తేశబ్దే. - అస్ఫుటముగా మ్రోయునది. ఈ ఒకటి భూషణముల ధ్వనికి పేరు.

లక్షణము1 - గురి, గురుతుశాస్త్రము.
లక్షణము2 - (రసా., భౌతి.) ఒక వస్తువునకు లేదా ద్రవ్యమునకు నియతముగా నుండి, ఆవస్తువును (ద్రవ్యమును) గుర్తించుటకు అవశ్యక మైన ధర్మము, (Characteristic).
లక్షణము3 - (గృహ.) 1.గుణము, 2.స్వభావము (Trait).

గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
గుణ్యతే అభ్యస్యత ఇతి గుణః. గుణ అభ్యాసే. - అభ్యసింపఁబడునది.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.
శీలము - 1.స్వభావము, 2.మంచి నడత.
శీలం స్వభావే సద్వృత్తే - 
శీలశబ్దము స్వభావమునకును, మంచినడతకును పేరు. శీలతీతి శీలం, శీల సమాధౌ. - నియతమై యుండునది.

శుచౌ తు చరితే శీలమ్ -
శీలతీతి శీలం, శీల సమాధౌ. - లెస్సగా నడచుట శీలము.    

స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వస్య భావః స్వభావః - తనయొక్క భావము స్వభావము.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
సహజజ్ఞానము - (జం.) వివేకముతో గాని అనుభవముతో గాని నిమిత్తము లేనట్లు జంతువులు తమ సహజమైన ప్రేరేపణ సాయముతో ప్రవర్తించుట, (Instinct).
సాజము - సహజము, సం.సహజః.

Most mother’s are instinctive philosophers.

మంచి స్వభావము, సౌందర్యం తాలూకు లోటును ఎప్పుడూ భర్తీచేస్తుంది. కాని, సౌందర్యం మంచి స్వభావమనే లోటును భర్తీ చేయలేదు. - ఎడిసన్

స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఇలువడి - 1.మంచినడత, 2.కులీనత.
కులీనత - మంచి కులమున పుట్టుట.
ఆర్జవము - 1.మంచినడత, 2.సరళత్వము.
నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ. 
దారము - పేనినత్రాడు, నూలు, పోగు. (Yarn)
పోఁగు - 1.దారము, 2.చెవినగ.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థ దీపనము, ఔదార్యము(ఉదారత్వము, దాతృత్వము), కాంతి, ఓజము, సమాధి(మనోలయము, నియమము), సౌకుమార్యము.

మనం ప్రదర్శించే గుణాలనుబట్టి మనుషులను ఆకర్షిస్తాం. మనలోని గుణాలను బట్టి నిలుపుకుంటాం. - స్వార్ట్  

గొనము - 1.సౌశీల్యాది గుణము, 2.వింటినారి, సం.గుణః.
సౌశీల్యము -
సుశీలత్వము, మంచి ప్రవర్తన.
గొనయము - 1.వింటినారి, 2.వింటికొప్పు, సం.గుణః.
స్థావరము - (భౌతి.) కదలనిది, చలనము లేనిది, స్థిరము, మార్పులేనిది(Stationary), సం.వి.1.వింటినారి, 2.కొండ, 3.వృద్ధత్వము.
స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది. 
అచరము - కదలనిది, స్థావరము.
తావరము - స్థావరము, తిరమైనది, సం.స్థావరమ్. 

గొనబు  - మనోజ్ఞత, విణ.1.మంజులము, 2.మధురము, 3.శ్రావ్యము, 4.పరిమళించు, సం.గుణః.
గొనబుకాఁడు -
అందగాడు, సుందరుడు.
సుందరుఁడు - చక్కని వాడు.

కులము కంటె గుణము గొప్పది, ముఖ్యమైనది.

టంకారము - 1.వింటినారి ధ్వని, 2.ఆశ్చర్యము, 3.ఆశ్చర్యము కల్గించు శబ్దము. 

విస్ఫారము - వింటిమ్రోత, విణ.మిక్కిలి అధికమైనది.
అధిజ్యము -
ఎక్కుపెట్టబడినది (విల్లు).
ప్రహితము - విణ.వింటినుండి విడువబడినది.  
స్వానము - ధ్వని, రూ.స్వనము.
స్వనము - శబ్దము, నిస్వనము.
నిస్వనము - ధ్వని, మ్రోత, రూ.నిస్వానము.

విస్ఫారో ధనుషాం స్వానః -
విస్ఫురతి అరిహృదయ మితి విస్ఫారః స్ఫుర స్ఫురణే. - శత్రు హృదయము దీనిచేత చలించును. పా. విస్ఫారః. - ఈ ఒకటి విండ్లమ్రోఁత పేరు.  

మోపు - 1.మోయచేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్దిమోపు, 2.వింటినారి, విణ.అధికము.
ఆరోపము -
1.(నిందాదులు) మోపుట, 2.నిఘంటువులలో అకారాదిగ ఇచ్చిన పదము, 3.ఒకదాని ధర్మములు అవిలేని వేరొకదాని యందు ఉన్నట్లు చెప్పుట, రూ.ఆరోపణము.

ఆరూఢము - 1.ఎక్కినది, 2.ఎక్కబడినది (చెట్టు మొ.) 3.పొందినది, వి.ఆరోహణము, 2.పెంపు, అధికము.     

ఆరోహణం స్యా త్సోపానమ్ -
ఆరోహంత్య నేనేత్యారోహణం, రుహ బీజ జన్మని ప్రాదుర్భావేచ. - దీనిచేత ఉన్నతస్థలము నెక్కుదురు.
సహ ఉపానమం త్యస్తిన్నితి సోపానం, ణము ప్రహ్వత్వే శబ్దే. - దీనియందు ఎక్కునప్పుడు దిగునపుడును ఇంచుకంత వంగుదురు. ఈ 2 మెట్టు పేర్లు.

ఎక్కుడు - 1.ఆరోహణము, 2.వాహనము, 3.వింటినారి, విణ.అధికము.
ఆరోహణము -
1.(అశ్వాదులను) ఎక్కుట, 2.నిచ్చెన, 3.మొలకెత్తుట, 4.నర్తనమునకై ఎత్తుగ కట్టిన రంగ స్థలము.
అధిరోహణము - 1.ఎక్కుట, ఆరోహణము, 2.ఎక్కించుట, ఎత్తుట.
ఆరోహణ - (గణి.) క్రమముగా వృద్ధిచెందుట (Ascent).
ఆరోహణక్రమము - (గణి.) వరుసగ పెరుగుచుపోవు క్రమము (Ascending order).
అసులోపము - ఆరోహణ క్రమము గలది.

రోహణము - 1.ఎక్కుట, 2.ఒక కొండ.
రోహము - 1.ఎక్కుట, 2.మొలక.

సోపానము - మెట్టు.
సోపనము - సోపానము, మెట్టు, సం.సోపానమ్.
మెటిక - 1.సోపానము, 2.వ్రేలిగనుపు, రూ.మెట్టు, మెట్టిక.

సౌధసోపానన్యాయము - న్యా. మెట్లన్నియు నెక్కకుండ నొకసారిగ మేడ(సౌధము - 1.రాజగృహము, 2.మేడ.)నెక్కుట కష్టమను రీతి.

తాప - 1.నిచ్చెన, 2.మెట్టు Step.
మెట్టు - 1.వీణా సోపానము, పులి కడుగు, 3.సుంకము తీయు ఘట్టము, 4.కొండ, క్రి.త్రొక్కు.     

నిఃశ్రేణి స్త్వధిరోహిణీ,
నిశ్చయేన శ్రయంతి ఉన్నత స్తలమన్యేతి నిశ్శ్రేణిః, ఇ. స. శ్రిఞ్ సేవాయాం. - దీనిచేత ఉన్నత స్థలమును నిశ్చయముగాఁ బొందుదురు. 
అధిరోహంత్యనయేతి అధిరోహిణీ, ఈ. సీ. రుహ బీజజన్మని ప్రాదుర్భావే. - దీనిచేత ఉన్నత స్థలము నెక్కుదురు. ఈ 2 నిచ్చెన పేర్లు.

నిశ్రేణి - నిచ్చెన.
నిచ్చెన - నిశ్రేణి, పై కెక్కదగిన సాధనము, సం.నిశ్రేణిః.
అధిరోహిణీ - నిచ్చెన, మెట్లవరుస.

వాహనము - ఎక్కదగిన ఏనుగులోనగునది. ధోరణము - వాహనము.
ఎక్కు - వింటినారి, క్రి.1.అతిశయించు, 2.ఆరోహించు, 3.ఇష్టమగు. 

యానము - 1.పోవుట, 2.దండెత్తిపోవుట, 3.వాహనము, 4.యాన పాత్రము, జనులెక్కిపోయెది ఓడ.

ఆరురుక్షువు - 1.ఎక్కనిచ్చకలవాడు, 2.ఉచ్ఛదశను పొందనిచ్చ గలవాడు.

షడేవ తు గుణాః పుంసా న హాతవ్యాః కదాచన,
సత్యం దాన మనాలస్య మనసూయా క్షమా ధృతిః|
తా||
మనుజు డెన్నటికి విడువరాని గుణము లారు(ఆరు గుణములు). అవి సత్యము(Truth), దానము, సోమరితనము లేకుండుట, అసూయ లేకుండుట, ఓర్పు(క్షమ -1.ఓర్పుPatience, 2.నేల, 3.మన్నింపు.)కలిగివుండుట, ధైర్యము(ధృతి-1.ధైర్యము, 2.ధరించుట, 3.సంతోషము, 4.సౌఖ్యము.)   

అనేక సుగుణాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. వాటిని జీవితానికి అన్వయించుకోవాలి కదా! - రోచ్ ఫకాల్ట్

లోచకము - 1.దీపపుకొణుదురు, 2.బొట్టు, 3.వింటియల్లెత్రాడు.
బొట్టు -
1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళ సూత్రమున కూర్చు సర్ణాభరణము, సం. 1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱచెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
వృత్తము - 1.నియత గణములును యతిప్రాసములుగల పద్యము, 2.నడత(నడత - ప్రవర్తనము), 3.జీవనము(జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.), విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే రూపములో చరించు బిందువు యొక్క పథము, (Circle).

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు Moon.

శుక్రుడు - 1.అసురగురువు వ్యు. తెల్లనివాడు, అగ్ని. వ్యు.తేజస్సు కలవాడు నవగ్రహములలో నొకటి(Venus).
సోకుఁబొజ్జ -
శుక్రుడు. వేగుఁచుక్క - శుక్రుడు.

               

కపర్ధి - శివుడు.
కపర్ధో స్యోస్తీతి కపర్దీ. న - పు. - కపర్ద మనెడి జట్టజూటము గలవాఁడు.
కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.

కపర్దో (అ)స్య జట్టజూటః
ఆస్య = ఈ శివునియొక్క జటాజూటః = జటాసమూహము, కపర్దః = కపర్దమని, ఉచ్యతే = చెప్పఁబడుచున్నది.
కపర్దః కేన సుఖేన వా పరం పూర్తిం దదాతీతి కపర్దః = సుఖముచే నిండించునది. పర్వ పూరణే. ఈ ఒకటి శివుని జట్టజూటము.

కాకిణి - 1.కాణి, కర్షము నందు నాల్గవ పాలు, 2.గవ్వ, 3.కొలతకోల.
కాని1 - అవ్య. వికల్పార్థకము, ఉదా. వాడు గాని నీవు గాని అడుగవచ్చును, విణ.సులభముగ, విణ.సంభవింపని, తగని మొ, అర్థముల సూచించును, ఉదా.కానిపని, కాని తలపు మొ, వి.
కాని2 - వీసమున నాలగ భాగము, కాకిణి, కానికి గొనక (జాతీ.) = లక్ష్యపెట్టక.

గవ్వ - 1.గాజువంటి ఒకానొక పురుగు చిప్ప, పరాటిక, 2.ఒకానొక చిన్న నాణేము.  

ౙడముడిజంగము - శివుడు, కపర్ధి.
ౙడముడి - 1.కపర్దము, ఈశ్వరుని జటాజూటము, 2.జడలుగంటు.     
జూటము - 1.శివుని జడముడి, 2.జడముడి. కోటీరము - 1.కిరీటము, 2.జటజూటము.  

నగేభ్యో యాంతీనాం కథయ తటినీనాం కత మయా
పురాణాం సంహర్తుః సురధుని కపర్దోధిరురుహే|
కయా వా శ్రీభర్తుః పదకమలమక్షాలి సలిలైః
తులాలేశో యస్యాం తవ జనని దీయేత కవిభిః ||

తా. అమ్మా! గంగామాతా! హిమాలయాలలో ఎన్నో నదులు ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఏ నదులు కూడా శివుని జటాజూటమందు అధిష్ఠించి లేవు. ఆ మహోన్నతాలైన విష్ణుపాదం, శివుని మస్తకం నీకు నెలవులు. ఎంత అదృష్టవంతురాలవు తల్లీ! అందువల్ల ఏ కవీ నీకు ఉపమానంగా ఏ నదినీ చెప్పలేదు. నీకు నీవే సాటి. - 22 

సత్యజ్ఞానానందరూపా సామరస్యపరాయణా|
కపర్దినీ కళామాలా కామదు క్కామరూపిణీ.
    

ౙడలమెకము - సింహము, చమరము.
జటిలము - జటాలము, వి.సింహము.
జటాలము - జడలుగలది, రూ.జటిలము.
ౙడ - 1.వెండ్రుకల యల్లిక, 2.జూలు, సం.1.జటా, 2.సటా.
(ౙ)జూలు - 1.సింహము మొదలగు వాని మీది నెండ్రుకలు, 2.ఏనుగు పై పరచు ఎఱ్ఱ కంబళి.

జట - 1.జడ, 2.ఊడ.
సట - కపటము, మోసము, సం.వి.1.సన్న్యాసుల జడ, 2.జూలు.

వ్రతినస్తు జటా సటా,
జటతి సంఘీభవతీతి జటా, జట ఝట సంఘాతే. - కూడుకొనియుండునది.
సటతీతి సటా, షట అవయవే. - వ్రతమునకు అంగమగునది. ఈ 2 వ్రతియొక్క జడ పేర్లు.

ఊఢ - 1.పెండ్లియైన స్త్రీ, 2.భార్య.

మూలే లగ్నకచే జటా :
జటా శబ్దము ఊడకు, జడకును పేరు. జటతీతి జటా. జట సంఘాతే. - గుంపై యుండునది.

మూలము - 1.వేరు, 2.ఊడ, 3.మూలమట్టము మొదలు, 4.(గణి.) ఒక రాశిని అదే రాశిచే కొన్ని తడవలు గుణించగా లభించు లబ్ధము. దత్తరాశికి సమానముకాగా మొదటిరాశిని దత్తరాశికి మూలమందురు (Root), ఉదా. (Root) x=a అను సమీకరణమును సంతృప్తి చేయు x యొక్క విలువ.
వేరు - చెట్టుయొక్క మూలము.
ఊడ - మఱ్ఱి మొ. వాని కొమ్మల నుండి క్రిందికి దిగెడివేరు శిఫ. (ఊడ, పడుకొమ్మ, ఈ యూడల వేళ్ళవలననే చెట్టున కాహార మందును). శిఫ - ఊడ, పడుగొమ్మ.

వేద మూలమిదం జ్ఞానం, భార్యా మూలమిదం గృహమ్|
కృషి మూలమిదం ధాన్యం, ధన మూలమిదం జగత్ ||
తా.
జ్ఞానమునకు వేదమే మూలము, గృహమునకు(గృహము - 1.ఇల్లు, 2.భార్య.)భార్యయే మూలము, ధాన్యమునకు కృషియే మూలము, జగత్తునకు ధనమే మూలము. – నీతిశాస్త్రము

చమరము - 1.వింజామరము, రూ.చామరము, 2.సవరము, 3.చమరీ మృగము.
చమతి తృణం చమరః, చము అదనే. - తృణమును భక్షించునది, చమరీమృగము.

కుచ్చుల బఱ్ఱె - జడల బఱ్ఱె, చమరీ మృగము.
ౙడబఱ్ఱె - చమరీమృగము.
చమరీ - ఆడు చమరీమృగము.

చామారం తు ప్రకీర్ణకమ్,
చమరమృగ సంబంధి చామరం - చమరమృగ సంబంధమైనది.
ప్రకీర్యతే రాజసమీప ఇతి ప్రకీర్నకం, కౄ విక్షేపే. - రజ సమీపమందు విసరఁబడునది. ఈ 2 వింజామర పేర్లు.

చామరము - వింజామరము, రూ.చమరము.
వింజామరము - (వెల్ల + చామరము) తెల్లని చామరము, సురటి.
వీచోపులు - (వీచు+ చోపులు) వింజామరలు.
వీచు - గాలి విసరు. వీవరి - వాయువు.        

లగ్న చామరహస్త శ్రీ శారదా పరివీజితా,
లజ్జా పద సమారాధ్యా లంపటా లకులేశ్వరీ|

ఔశీనరుఁడు - శిబిచక్రవర్తి.
ఔశీరము - చామరము, సురటి, విణ.వట్టివేళ్ళతో చేయబడిన మందు.

చామరము - వింజామరము, రూ.చమరము.
సురఁటి - వట్రువ విసనకఱ్ఱ.

సీవిరి - 1.వింజామరము, 2.ఆలపట్టము.
ఆలపట్టము - 1.వస్త్రముతో చేయబడిన గుండ్రని విసనకఱ్ఱ, 2.గుండ్రని విసనకఱ్ఱ వలె నుండి రాజులకు ఎండ తగులకుండ పట్టు సాధనము, సం.ఆలావర్తమ్.

ప్రకీర్ణము - 1.విరివి, విసృతము, 2.వింజామరము, 3.గుఱ్ఱము.

చామరము - వింజామరము, రూ.చమరము.
సురఁటి - వట్రువ విసనకఱ్ఱ.

సచామర రమా వాణీ విరాజితాయై నమో నమః

గుడాకేశుడు - 1.అర్జునుడు, 2.శివుడు, వ్యు.జెముడువలె గుబురుగా పెరిగిన జుట్టు కలవాఁడు.

ధర్మధ్వజే లిఙ్గవృత్తిః -
ధర్మస్య ధ్వజ శ్చిహ్న మస్యేతి ధర్మధ్వజీ, స. పు. - ధర్మము యొక్క చిహ్నము గలవాఁడు. 
లింగం చిహ్నం వీత్తిర్జీవన మస్యేతి లింగవృత్తిః, ఈ. పు. - చిహ్నమే జీవనముఁ గలవాఁడు. ఈ ఒకటి డంభార్థమై జటాదిచిహ్నములు(చిహ్నము - 1.గురుతు, టెక్కెము.)ధరించుకొని దానివలన బ్రతుకువాని పేర్లు.

ధర్మధ్వజి - జీవనార్థము సన్న్యాసి వేషము ధరించినవాడు.
ౙడదారి - జడలు ధరించిన సన్న్యాసి, సం.జటాధారీ.
జటి - జడలుగల సన్న్యాసి.

తిరుముడి - 1.వైష్ణవుడు, 2.జడలు కట్టిన జుట్టు.
వైష్ణవుఁడు - విష్ణుభక్తుడు. 
వైష్ణవము - విష్ణుసంబంధమైనది, వి.ఒక మతము. 
మడిచేఱు - (మడిచిన+చేఱు) వైష్ణవ స్త్రీలు ముందునుండి యెత్తి వెనుకకు పెట్టుకొను కోక చేఱు.  

తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమాళిగ - 1.గృహము, 2.వైష్ణవుల పూజాగృహము, 3.పూజ్యులుండు గృహము.

దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||

తా. అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయ(కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. – నీతిశాస్త్రము

జటిలో ముండీ లుంచితకేశః, కాషాయాంబర బహుకృతవేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృతవేషః || - 14

జడలు కట్టిన జుట్టు కలవాడైనను, గుండుగా గీయబడిన తలగలవాడైనను, వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా పీకివేయబడిన తల గలవాడైనను, కాషాయ వస్త్రం ధరించిన వాడైనను, ఇలాంటి అనేకమైన వేషాలు వేసినవాడైనను, చుస్తూ కూడా, ఏమి చూడనట్టి మూఢుడే, ఏలనన, ఈ వేషాలన్నీ కేవలం ఉదరపోషణకోసం వేసినవే గనుక. - భజగోవిందం

The ascetic with matted looks, the one with his head shaven, the one with hairs pulled out one by one, the one who disguises himself variously with the ochre-coloured robes – such a one is a fool who, though seeing, does not see. Indeed, this varied disguise is for the sake of the belly. – 14

అశ్రము - 1.కన్నీరు, అశ్రువు, 2.నెత్తురు, రూ.అస్రము.
ఆస్యతే త్వగ్భేదేన అసృక్, జ. న. అస్రంచ, అసుక్షేపణే. - చర్మము తెగినమాత్రమునఁ బ్రవహించునది.
అస్రము - 1.కన్నీరు, 2.నెత్తురు blood, 3.మూల, 4.వెండ్రుక. 
అస్యతే అస్రం. అస్రుచ. ఉ.న. అసు క్షేపణే. - చేత మీటఁబడునది.
పా. అశ్రం. ప్రావర్తయన్నదీర స్రైర్ద్విషతాం యోషితాం చ సః' అని మాఘమందు రుధిర వాచకముతోఁ గూడ శ్లేషగా జెప్పుట వలన సకారయుక్తము. 'శమశ్శీలే అ జగరే చాశ్రమశ్రుణి ' అనిశాంతమున రుద్రుఁడు.  

అశ్రువు - కన్నీరు, బాష్పము.
అశ్నుతే కపోలం అశ్రు. ఉ. న. అశూ వ్యాప్తౌ - కపోలముల యందు వ్యాపించునది.
కన్నీరు - హర్ష శోకముల వలన కన్నుల నుండి కారెడు నీరు.
బాష్పము - 1.కన్నీరు 2.ఆవిరి, వి.(భౌతి.) ఘన, ద్రవ ద్రవ్యముల ఆవిరి, సంధిగ్ధ తాపక్రమము క్రిందనుండి ప్రేషము వలన ద్రవీభవించుటకు వీలుగా నున్న వాయువు (Vapour).

అశ్రుగ్రంధి - (జం.) కన్నీటి గ్రంధి (ఈ గ్రంధులు ముక్కుకు ఇదుప్రక్కల, కండ్లకు చేరువుగా ఉండును.)
ఉపాశ్రుగ్రంధి -
(జం.) కన్నీరు ఉత్పత్తి చేయుగ్రంథులకు సహాయకారిగా నుండు గ్రంధి. (ఇది నేత్ర శుక్లమును తడిగా నుంచుచుండును,) (Harderian gland).   
నేత్ర రసము - (జం.) నేత్రరస వేశ్మములో నుండు నీటివంటి ద్రవము, కన్నీరు (Aqueous humour).
ఆక్వియస్ హ్యూమర్ - (Aqueous humour) కంటిగ్రుడ్డులో ముందు భాగమున గల స్వచ్ఛమైన ద్రవము, జలాకార రసము.  జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic).

బహువిధ పరితోష బాష్పపూర
స్పుట పులకాంకిత చారుభోగభూమిం
చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం
పరమ సదాశివ భావనాం ప్రపద్యే| - 67శ్లో

భా. ఆనందబాష్ప ప్రవాహాలను స్ఫురింపజేసి పులకాంకురాలకు సముదిత భోగస్థానమైనదీ, ముక్తి ఫలాన్ని అభిలషించే వారిచే సేవింపబడేదీ అయిన పరమశివ(సదాశివుఁడు - శివుడు)భావనను నేను శరణు వేడుతున్నాను.-శివానందలహరి 

కుంతలము - 1.వెండ్రుక, 2.ఒక దేశము, 3.నాగలి.
దైర్ఘ్యాత్ కున్తాకారం లాతీతి కుంతలః, లా ఆదానే. - దైత్ఘ్యముచే కుంతమను నాయుధకృతిని ధరించునది.

వాలము - 1.తోక, 2.కత్తి.
వల్యతే వస్త్రేణ వాలః వల సంవరణే. - వస్త్రముచేతఁ జుట్టఁబడునది.
తోఁక - తొంక; తొంక - పుచ్ఛము, వ్యు.తొంగునది, వంగియుండునది, రూ.తోఁక.
పుచ్ఛము - తోక. 
పుచ్ఛసంబంధి - (జం.) తోకకు సంబంధించినది (Caudal).

తోకఁచిచ్చు - 1.నిప్పు రగిల్చిన పిడకల వరుస, 2.ఒక దాని నుండి మరొకటి అంటు కొనుచు వ్యాపించు అగ్ని.
అంటుకొను - క్రి. 1.అగ్ని రగులుకొను, 2.ముట్టుకొను.
క్రమము - విణ.ఇంపైనది, వి.పిడక నిప్పు.  

అంటించు - 1.అతికించు, 2.చేర్చు, 3.(తేలు) కుట్టు.
అతుకు1 -
చేర్చి కుట్టుట(అతుకు-కుట్టు), కత్తిరిచిన వానినిదగ్గర చేర్చికుట్టిన భాగము (Seam).
అతుకు2 - క్రి. 1.అతికించు, కలిసిపోవునట్లు చేయు, 2.అంటుకొను, 3.సరిపడు, వి.అతుకుట, 2.అతికినభాగము, రూ.అదుకు.
అదుకు - క్రి. అతుకు.
చేరుచు - క్రి. చేర చేయు, రూ.చేర్చు.
కుట్టు - 1.శూల రోగము (Chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు. సూల - శూలరోగము, సం.శూలా.

తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో.) సూర్యుని చుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగు చున్న తోక గలిగిన ఒక గ్రహము, (Comet).
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.

కోపు - 1.కడ్డీ, 2.అందము, 3.వింటికొప్పు, 4.నాట్యము, 5.తీర్పు, 6.కల్లు, 7.నిమిత్తము.  

కచము - జుట్టు, కేశము.
కుచ్యతే కచః, కచ బంధనే. - ముడవఁబడునది.    
కంచబంధము - జుట్టుముడి.

కేశము - 1.తలవెండ్రుక, 2.కురువేరు.
కే శిరసి వేతే వర్తతే కేశః, శీఙ్ స్వప్నే. - శిరస్సున నుండునది. 
వెండ్రుక - కేశము, రూ.వెంట్రుక. 

విశ్వస్త - విధవ (కేశములుకలది). 
విధవ - పెనిమిటిలేనిది, అనాథ.
అనాథ - నాథుడు లేనిది, దిక్కులేనిది, అనాథుడు. అనాథ రక్షక గోవిందా|
అనద - 1.దిక్కులేనిది, దిక్కులేనివాడు, 2.అశక్తుడు, అల్పుఁడు, 3.విధవ, సం.అనాథ. 

విశ్వస్తా విధవే సమే,
విశ్వసితి విగతశ్వసనేన తిష్ఠతి మృతప్రాయత్వాదితి విశ్వస్తా. శ్వస ప్రాణనే. - మృతప్రాయమైనది గనుక ప్రాణము లేనిదానివలె నుండునది.
విగతో ధవఃపతి ర్యస్యాస్సా విధవా - చనిపోయిన (ధవుఁడు - 1.పెనిమిటి, 2.రాజు.)పెనిమిటి గలది. ఈ రెండు పెనిమిటిలేని స్త్రీ పేర్లు.
 
వితంతువు - విధవ, వ్యు.తంతువు(సూత్రము) లేనిది.

అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.

ఉదీచ్యము - 1.ఉత్తర దిక్కున ఉన్నది, 2.ఉత్తర కాలమున ఉన్నది, వి.1.శరావతీ నదికి వాయవ్యమున ఉన్న దేశము, 2.కురువేరు.
ఉదక్ ఉత్తరస్యాం భవం ఉదీచీనం - ఉత్తరదిక్కునఁ బుట్టినది.
హ్రీబేరము - కురువేరు. హ్రీ - సిగ్గు.

కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
కురుళము - ముంగురులు.

శిరోరుహము - తలవెండ్రుక.
శిరసి రోహతీతి శిరోరుహః, ఉహ బీజజన్మని ప్రాదుర్భావేచ. - శిరస్సున మొలచునది.
శిరోజము - తలవెండ్రుక. 

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు. 

పుణ్యజనుఁడు - 1.నైరృతి, 2.రాక్షసుడు, 3.పుణ్యపురుషుడు.
విరుద్ధలక్షణయా పుణ్యవాన్ జనః పుణ్యజనః - విపరీత లక్షనచేత పుణ్యము గలవాఁడు.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
పున్నెము - పుణ్యము, రూ.పున్నియము, సం.పుణ్యమ్.
నైరృతుఁడు - నాలవ దిక్కు నేలువాడు, నిరృతి.
నిరృతి - (నిర్ + ఋతి)1.అలక్ష్మి, 2.ఒక దిక్పాలుడు, విణ. ఉపద్రవము లేనిది.  
విరుద్ధలక్షణయా పుణ్యవాన్ జనః - విపరీత లక్షణముచేత పుణ్యము గలవాఁడు.    

స్యా దలక్ష్మీ స్తు నిరృతిః :
లక్ష్మీర్న భవతీత్య లక్ష్మిః. ఈ. సీ. - సంపత్తుగానిది అలక్ష్మి.
ఋతేస్య స్మార్థా న్నిష్క్రాంతా నిరృతిః - సన్మార్గము వలనఁ బాసినది. ఈ రెండు నరకసంబంధమైన యభాగ్యము పేర్లు.

నైరృతి - నిరృతి.
నిరృతే ర్దిక్పాలస్య అపత్యం నైరృతః - నిరృతి యనెడి దిక్పాలుని కొడుకు.

యాతువు - 1.బాటసారి, 2.యముడు, 3.రాక్షసుడు, 4.వాయువు.
యాతయతి వ్యథయతీతి యాతు, ఉ-న. - వ్యథ పెట్టెడువాఁడు.
రక్కసి - రాక్షసి, రాక్షసుడు, రక్కసీడు, సం.రక్షసః.
రక్షస్సు - రాక్షసుడు; రాక్షసి - రక్కసి.
రక్షత్యాత్మానమేవేతి రక్షః, స-న. రక్షపాలనే - తన ప్రాణము రక్షించుకొనువాఁడు.
రక్ష్యతే (అ)నేన విదిగితి రక్షః - ఇతనిచేత విదిక్కు రక్షింపఁబడుచున్నది. 
రంపెలాఁడు - రాక్షసకృత్యములు గలస్త్రీ.  

రక్కెన - 1.రాక్షస స్త్రీ, 2.రక్కెనచెట్టు, విణ.ఆయుక్తము, సం.రాక్షసః.
రాక్షస - అరువది సంవత్సరములలో 49వ దాని పేరు.
రాక్షసము - బలాత్కారముగ కన్య నపహరించుకొని వచ్చి చేసికొనెడి పెండ్లి.

యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు -
యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమనుడు - యముడు.

రక్షకుఁడు - రక్షించువాడు.
రక్షితవ్యము - 1.రక్షింపదగినది, 2.గోప్యము. 

 

దానవుఁడు - దనుజుడు, రాక్షసుడు.
దనుజుఁడు -
రాక్షసుడు, వ్యు.దనువు నందు జన్మించినవాడు.  

శుక్రశిష్యుఁడు - రాక్షసుడు.           

సమీరుఁడు - వాయువు.
సమీరణుఁడు -
1.వాయువు, 2.బాటసారి, వ్యు.లెస్సగా చరించువాడు.

వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలి1 -
1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒకవిధమైన పశువ్యాధి.
గాలి2 - 1.నింద, 2.శాపము.

నింద - దూరు, అపదూరు.
అపదూఱు -
నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
నిందీతుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.

శాపము - 1.తిట్టు, 2.ఒట్టు.
తిట్టు -
1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
చీవాట్లు - 1.గద్దింపు మాటలు, 2.తిట్లు. 

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

నింద - దూరు, అపదూరు.
అపదూఱు -
నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
నిందీతుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.

శాపము - 1.తిట్టు, 2.ఒట్టు.
తిట్టు -
1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
చీవాట్లు - 1.గద్దింపు మాటలు, 2.తిట్లు. 

వరాంగము - 1.ఏనుగు, 2.తల.
వారణము - 1.నిరోధము, 2.ఏనుగు. 
నిరోధము - 1.అడ్దు, 2.చేటు, సం. (భౌతి.) ఒక వస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).              

విఘ్నో న్తరాయః ప్రత్యూహః -
హననం కార్యస్యేతి విఘ్నః, హన హింసాగత్యోః. - కార్యము చెడుట.
అంతరా మధ్యే అయనం అంతరాయః, అయ పయ గతౌ. - నడుమ నెడతెగుట.
ప్రతికూల మూహసమితి ప్రత్యూహః, ఊహవితర్కే ప్రతికూలమైన ఊహ. ఈ 3 విఘ్నము పేర్లు.

విఘ్నము - అంతరాయము, అడ్డు. 
అంతరాయము - అడ్డు, విఘ్నము, ఆటంకము.
ఆటంకము - అడ్డంకి, నిరోధము.
అడ్డంకి - అడ్డి, అడ్డు, నిరోధము.
అడ్డకఱ్ఱ - 1.అడ్డి, విఘ్నము, 2.ఒక రకపు సుఖరోగము. 
విఘ్నరాజు - వినాయకుడు. 
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter. 

శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
(ౙ)జుట్టు - సిగ, సం.చూడా.
చూడ - 1.నెమలిజుట్టు, 2.జుట్టు, 3.చూరు, 4.బాహుపురి.

కాకపక్షము - పిల్లజుట్టు, కూకటి.
కూఁకటి - పిల్లజుట్టు, జుట్టు, విణ.1.ప్రధానము, 2.లేతది, సం.కూటకః. 
కుంకటి - పిల్లజుట్టు, విణ.ప్రధానము, ఉదా. కుంకటివేరు = తల్లివేరు, రూ.కూకటి.
చూలిక - పిల్లజుట్టు. తల్లివేరు - మొదటి వేరు.

(ౙ)జుట్టు - సిగ, సం.చూడా.
జుట్టుపిట్ట -
నెమలి శిఖ.
చూడ - 1.నెమలిజుట్టు, 2.జుట్టు, 3.చూరు, 4.బాహుపురి.
(ౘ)చూరు - 1.ఇంటిమీది కప్పు చివర, సం.చూడా, 2.ఏదేని వస్తువు యొక్క పొడి, సం.చూర్ణమ్. క్రి.పొగతగులు.
బాహుపురి - కేయూరము.
కేయూరము - భుజకీర్తులు, వ్యు.భుజాగ్రమున నుండునది.
భుజకీర్తి - బాహుపురి, కేయూరము.
బాహులేయుఁడు - కుమారస్వామి. 

ఘృణిజ్వాలే అపి శిఖే : శిఖా శబ్దము కిరణమునకును, అగ్నిజ్వాలకును, అపి శబ్దము వలన సిగకును పేరు.
శేతే ఇతి శిఖా. శీఞ్ స్వప్నే. ధాతూనా మనే కార్థత్వాదత్ర వ్యాప్తిరర్థః. – వ్యాపించునది.

సిగ - సిక, సం.శిఖా.
సిక - శిఖ, జుట్టు, రూ.సిగ.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడి కలవాడు.

మౌళి - 1.కొప్పు, 2.కిరీటము, 3.సిగ (ఉత్తర పదమైనచో శ్రేష్ఠార్థకము).

జడతా పశుతా కళంకితా
కుటిలచరత్వం చ నా స్తిమయి,
దేవ ! అ స్తి యది రాజమౌళే
భవదాభరనస్య నాస్తి కిం పాత్రమ్. - 69శ్లో

భా. ఓ సోమశేఖరా! జడత్వ పశుత్వ, కళంకత్వ, కుటిలత్వాలలో ఏవీ నాలో లేవు. ఒకవేళ ఉన్నాయే అనుకో, అయితే మాత్రం భవదీయ ఆదరానికి పాత్రుడను కానా ? – శివానందలహరి

                                     

ఉపాంతము - 1.సమీపము, చేరువ, 2.కొన, 3.మూల.
సదేశము -
సమీపము; సమీపము - చేరువ. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది. 
కొన - 1.చివర, 2.చెట్టు కొమ్మ చివర, 3.గుఱ్ఱపుజూలు.        

ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతు ముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.  
ముడికాఁడు - ధూర్తుడు, వంచకుడు.

ముడిగిబ్బ - ఆబోతు.
గిబ్బ - 1.ఆచ్చుటెద్దు, 2.బుడ్డకొట్టని కోడె, 3.ఎద్దు, 4.సమాసోత్తర పరమైనపుడు శ్రేష్ఠ వాచకము, ఉదా. జక్కవ గిబ్బలు మొ.వి.
గిబ్బరౌతు - శివుడు, వృషభ వాహనుడు.

ముడి - 1.గ్రంథి 2.చెట్టు మొ.ని. ముడి, 3.దారము ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.
గ్రంథి - 1.బుడిపి, గడ్దవలె పుట్టు రోగము, 2.చెట్టు మొ.ని ముడి, 3.కీలు (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
బుడిపి - 1.మ్రాని యందలి ముడి, కనుపు, 2.బొప్పి.
కణుపు - 1.బుడిపి, 2.వెదురు, చెరకు మొ.ని కనుపు, 3.(వృక్ష.) కాండముపై ఆకు బయలుదేరిన స్థానము (Node).
గంటు - 1.కనుపు, బుడిపి, 2.గాయము, 3.వెండ్రుకలముడి, 4.రూకలముడి, క్రి.గాయపరచు.
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.
పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
గ్రంథికుఁడు - 1.జోస్యుడు, 2.సహదేవుడు.
కాలజ్ఞుఁడు - జ్యోస్యుడు; జ్యోతిషికుఁడు - జోస్యుడు, (Astrologer).  
దైవజ్ఞుఁడు - 1.జ్యోస్యుడు, 2.గణకుడు.  

గ్రంథులసిరలు - (జం.) హెచ్చు తగ్గులుగా ఉబ్బిన సిరలు (ఎక్కువ కాలము నిలిచి పనిచేసినచో సిరలు పైకుబికి ఉండును (Vericose veins). 

అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వతః|
నిత్యంసన్నిహితో మృత్యుః కర్తవ్యోధర్మ సంగ్రహః||
తా.
శరీర మనిత్యము, సంపద శాశ్వతము కాదు, మృత్యువెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగినదని సహదేవుడు వచించెను. - నీతిశాస్త్రము 

మూలఱేఁడు - నిరృతి, కోణపుడు.
కోణఁపుడు - నైరృతుడు; కోణుఁడు - శని Saturn.
సోఁకులఱేడు - నైరృతి. 

            

సోఁకుఁజుక్క - మూలానక్షత్రము.
సోఁకు - 1.తగులు, 2.గ్రహమావేశించు, వి.1.స్పర్శము, 2.రాక్షసుడు.
తగులు -
క్రి.1.చిక్కు, 2.పట్టు, 3.తాకు, 4.సక్తమగు, 5.అంటు, 9.పొసగు, 7.వెంబడించు, వి.1.ఆసక్తి, అభిలాష, 2.తగులాటము, రూ.తవులు, తౌలు.
చిక్కు - 1.కృశించు, 2.తక్కు, 3.తగులు, 4.దొరకు, 5.మిగులు, 6.మెలి, 7.సంకటము. 
పట్టు - 1.చెల్లు, 2.ప్రారంభించు, 3.కలుగు, 4.గ్రహించు, వి.1.గ్రహణము, 2.స్థానము, 3.అవలంబము.
తాఁకు - స్పృశించు, అంటు.
సక్తము - ఒకదాని యందు లగ్నమైనది (మనసు).
అంటు - (వృక్ష.) 1.చెట్టురెమ్మను వంచి నేలలో పాతుటవలన పుట్టిన మొక్క, 2.ఒక మొక్కను వేరొక చెట్టురెమ్మను అంట గట్టి పెంచబడిన మొక్క. ఉదా.మామిడి అంటు, నిమ్మ అంటు మొ||వి. 3.స్పర్శ 4.ముట్టు, మైల 5.మిత్రుడు, స్నేహము,  క్రి.1.తాకు, 2.(నూనె మొ||వి.)రాచు, 3.అతుకు.
పొసఁగు - 1.అంకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.
వెంబడించు - వెంటబడు.

అంటువ్యాధి - ఒకరి నుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిముల వలన లేక స్పర్శవలన) వ్యాపించు వ్యాధి (విషూచి, మశూచి మొ.) (Infectious disease). 

కిసరు - 1.కోపవికారము, 2.అంటు సోకుటచే పసిబిడ్డలకు గలుగు దోషము.

అంటుగట్టు - (వ్యవ.) క్రొత్తజాతి మొక్కలను సృష్టించుటకై ఒక జాతి రెమ్మను వేరొక జాతి మొక్క కాంటముతో అంటగట్టి పెంచుట, (Graft).

శ్రద్ధ - 1.అక్కర, 2.ఆసక్తి; హాళి - ఆసక్తి .
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
తగులాటము - 1.బంధము, తగులు 2.తొడుసు, సంబంధము.
ఆసంగము - 1.ఆసక్తి, 2.పట్టుదల, 3.సంబంధము, 4.ఆశ్రయము.

శ్రద్ధా సంప్రత్యయః స్పృహా : శ్రద్ధా శబ్దము భక్త్యాతిశయమునకును, ఇచ్ఛకును పేరు. శ్రద్ధధతే అనయేతి శ్రద్ధా, డుధాఞ్ ధారణ పోషణయోః, దీనిచేత విశ్వసింతురు.

శ్రద్ధ, భక్తి అనే ఇద్దరూ వైరాగ్య పత్నులు. మోక్షానికి మార్గాలు.         

అంటసిల్లు - అంటు, తాకు (అంటసిలబడు-నేలకూలబదు.).
అంటరానివేలుపు - అగ్ని.

తగులుడు - తగులు; సిలుగు - చిక్కు.
చిక్కుపడు - 1.మెలిపడు, 2.సంకటపడు, 3.చిక్కగు.
తగులఁబడు - క్రి.1.తగులు, 2.చిక్కు, 3.కాలు, దగ్ధమగు.
అంటుకొను - 1.అగ్ని రగులుకొను, 2.ముట్టుకొను.

సోకుడు - 1.స్పర్శము, 2.గ్రహావేశము, 3.పిశాచము, 4.రాక్షసుడు.
స్పర్శము -
1.తాకుడు, 2.ఈవి, 3.వ్యాధి.
తాఁకుడు - తాకుట, సోకుడు, స్పర్శ.
స్పర్శనము - 1.తాకుడు, 2.ఈవి, 3.వాయువు.

తాఁకుడువేఁకి - వరుస జ్వరము, పోవుచు వచ్చుచుండు జ్వరము.

ఈవి -1.దానము, వితరణము 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి. వరము - కోరిక, వరించుట.
వరవర్ణిని - 1.భర్త యందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.

దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడల నుండి కారుమదము, 3.చతురపాయములలో నొకటి, 4.ఛేదనము.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
వితరణము - ఈవి.
వితరణి - దాత; దాత - ఇచ్చువాడు.
దాని - 1.మదముకలది, 2.దాత.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.

ఉదత్తుఁడు - 1.వేదమందలి ఊర్థ్వస్వరము, (వ్యతి.) అనుదత్తము), 2.దానము, 3.పెద్దమద్దెల, 4.(అలం.) ఒక అర్థాలంకారము, విణ.1.ఎత్తైనది, 2.గౌరవము కలది, 3.ధారాళము.
ఉదత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుఁడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.  

ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
మోమాటము -
1.దాక్షిణ్యము, కనికరము, 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.

దాతృత్వము ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞాతా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా.
ఈవి యిచ్చుట, విననింపుగా బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడులెఱిగి తెలివిగానుండుట, ఈ నాలుగు తనతోఁ గూడఁ పుట్టునవి యే కాని నేర్చుటచే గలుగవు. - నీతిశాస్త్రము

స్వస్తి(స్వస్తి - శుభము) - వాయుపత్ని. ఈమెను విడిచి చేసే దాన విధులు ఫలించవు.

వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలి1 -
1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒకవిధమైన పశువ్యాధి.
గాలి2 - 1.నింద, 2.శాపము.

పసి - 1.పశ్వాదుల మీదగాలి, 1.పువ్వుల మీదిగాలి, విణ.లేత. వై.వి. గోగణము గోవులు, సం. పశుః.
హిస్టీరియా - (గృహ.) (Hysteria) సూతికా(సూతిక - బాలెంతరాలు) వాయువుమనో వికారముచే అన్ని విధములైన నాడులు, అక్రమముగా పనిచేయుటచే కలుగు వికారపు చేష్టలు, (ఇవి సాధారణము గా బలహీనము చేతను ఆశాభంగము చేతను యువతులకు వచ్చు వ్యాధి.)

గంగవెఱ్ఱి - 1.విశేషమైన మైమరుపుచే ఏమియు తోపకయుండు స్థితి, 2.పశువులకు వచ్చు ఒక విధమైన నరముల జబ్బు.  

దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించు కన్య నిచ్చిచేయు వివాహము.
దేవుఁడు - భగవంతుడు.
భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము. విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
దేవత - వేలుపు;  వేలుపు - దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నిర్జరుఁడు - వేలుపు.
దైవికము - విణ. దైవము వలన కలిగినది.      

అదృష్టం వహ్నితోయాది :
న దృష్టం అదృష్టం దైవకృతత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహ్నితోయాది - అగ్ని జలాదులవలన బుట్టిన భయము.
అదిశబ్దము చేత వ్యాధి, దుర్భిక్ష, మూషిక, శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును. 

జియ్య - 1.దేవుడు, 2.రాజు, సం.ఆచార్యః.
జియ్యరు - వైష్ణవ సన్న్యాసి, సం.ఆచార్యః.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత -
1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.

విధి ర్విధానే దైవే పి : విధి శబ్దము చేయుటకును, అపిశబ్దము వలన బ్రహ్మదేవునికిని, ప్రకారమునకును, విధాయక వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః, పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్థే పజాపతా"వితి శేషః.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును.

కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు(చావు - మృతి).
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు.

కాలయతి మన ఇతి కాలః కల కిల క్షేపే. - మనస్సును ప్రేరేపించునది. 

శ్యామిక - చీకటి, నలుపు.
శ్యామలము -
నలుపు, విణ.నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.

చేయుట - 1.ఒనర్చుట 2.నిర్వహించుట.
నిర్వహించు - నడిపించు, చేయు (Transact).
ఆచరణము - 1.చేయుట, అనుష్ఠానము, 2.ప్రవర్తనము, 3.ఆచారము.
ఆచారము - 1.అనుష్ఠానము, 2.సంప్రదాయము, పరంపరగా వచ్చు వాడుక, 3.ప్రవర్తనము.
ప్రవర్తన - నడవడి, నడత (Behavior).
నడవడి - ప్రవర్తనము, నడత, చరిత్రము, రూ.నడవడిక.
భాగ్యము - అదృష్టము, సుకృతము. విణ.భాగింపదగినది.

అదృష్టవంతుడు అరణ్యంలో ఉన్నా, ఘోర సంగ్రామంలో చిక్కుకున్నా, పురాకృత పుణ్య విశేష ఫలాన తన ప్రయత్నం లేకుండానే బయట పడతాడని భావావ్వయం.
అదృష్టవంతుని చెరచలేరు - దురదృష్టవంతుని బాగుపరచలేరు! అన్నది ఏవరూ కాదనలేని అనుభవసత్యం.

కాలము ప్రబలులకును బలి,
కాలాత్ముం డీశ్వరుం డగుణ్యుఁడు జనులం
గాలవశులుగాఁ జేయును,
గాలము గడవంగలేరు ఘను లెవ్వరున్.
భా||
కాలం లోకములోని మహా బలవంతుల కంటె బలమయినది. భగవంతుడే కాలస్వరూపుడు. అత డిట్టివాడని  నిరూపింప శక్యంకాదు. ఆ కాలస్వరూపుడైన భగవంతుడు అందరు జనులను కాలానికి అధీనులుగా చేస్తాడు, కనుక ఎంత దొడ్డ(దొడ్డ - గొప్ప)వారయినా కాలాన్ని దాటలేరు.  

గాలి2 - 1.నింద, 2.శాపము.
ఉపక్రోశము -
నింద; నింద - దూరు, అపదూరు.
దూఱు - నిందించు, వి.నింద.
నిందితుఁడు - దూరబడినవాడు; నింద్యుఁడు - దూరదగినవాడు.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
శాపము - 1.తిట్టు, 2.ఒట్టు. శపథము - ఒట్టు, రూ.శపథము.   శపించు - తిట్టు; తిట్టు - 1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
ఒట్టు - 1.కలుగు, 2.ఉంచు, 3.రగుల్చు అంటించు, వి.శపథము.

ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణమునకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశనము.
ఆక్రోశించు - 1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.

మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.

అధోముఖము - 1.దిగుముఖము గలది, ముఖము వంచినది 2.తలక్రిందైనది. వి.(జ్యొతి.) 1.మూలాది నక్షత్ర గణము, 2.ఒకానొక నరకము.  

నైఋతి వర్షవాయువు - (వ్యావ.) జూన్ June నుండి సెప్టెంబరు September వరకు నైఋతి మూలనుండి వీచు వాయువు (South-west monsoon). 

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  
కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము, చంద్రుడు Moon.  

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు -
విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
మోక్షము - 1.కైవల్యము, 2.మోచనము, విడుపు, 3.ముక్తి.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

జీవో వినయితాసాక్షీ ముకుందో(అ)మిత విక్రమః
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. – 55శ్లో

శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.

కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

20. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ - రెండు రెండు నక్షత్రములుండును.

తొలునీటి రిక్క - పూర్వాషాడ (పూర్వ - తూర్పు).
నీటిరిక్క - పూర్వాషాడ.

తూరుపు - సూర్యుడుదయించు దిక్కు, ప్రాగ్దిశ, రూ.తూర్పు.
ప్రాచి -
తూర్పు.
తూరుపుఱేఁడు - ఇంద్రుడు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు. 

ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రుని భార్య, 4.జ్యేష్ఠానక్షత్రము, 5.తూర్పు.
ఐంద్రుడు -
ఇంద్రపుత్రుడు, వి.1.జయంతుడు, 2.అర్జునుడు, 3.వాలి.
జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు. 

జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము.  

రిక్క - నక్షత్రము, సం.ఋక్షము.
నక్షత్రము -
రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్కరాయుడు.

యా దివ్యా ఆపః పయసా సంబభూవుః | యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః | యాసా-మషాఢా అనుయంతి కామమ్ | తా న ఆపః శగ్గ్ స్యోనా భవంతు | యాశ్చ కూప్యా యాశ్చ నాద్యాస్సముద్రియాః | యాశ్చ వైశంతీరుత ప్రాసచీర్యాః | యాసామషాఢా మధు భక్షయంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భవంతు ||19||   

ఆపగ - నది, ఏరు, వ్యు.జలముతో పోవునది.
అపాం సమూహః ఆవం, తేన గచ్ఛతీ త్యాపగా ఉదకసమూహము ఆపము; దానిచేతఁ బోవునది.
ఆపగేయుఁడు - గంగాపుత్త్రుడు, భీష్ముడు.
గంగాపుత్త్రుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.

భీష్ముఁడు - 1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.

త్రిషు ద్వే ఆప్య మమ్మయమ్,
అపాం వికార ఆప్యం; అమ్మయం చ, త్రి. - జలముయొక్క వికారము ఆప్యము, అమ్మయంబును. ఈ 2 జలవికారము పేర్లు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస. 
హంస - 1.అంచ, యోగి, 3.పరమాత్మ, 4.తెల్ల గుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.

కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ. కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.

సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
దేవసేనాం నయతి ప్రాపయతి సేనానీః, ఈ-పు. - దేవసేనను నడిపించువాఁడు, ణీఞ్ ప్రాపణే.

సైన్యము - 1.సేనతో కూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరిగుఱ్ఱములలో నొకటి.
మేఘపుష్పము - 1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.   

వృధావృష్టి స్సముద్రేచ - వృథా తృప్తేచ భోజనమ్| 
వృధా ధనవంతౌ దానం - దరిద్రే యౌవనం వృథా||

తా. సముద్రమున వృష్టి - వర్షము, వాన వర్షించుట, ఆఁకలి లేనివానికి(తృప్తము - తృప్తి నొందినది.)వానికి భోజనము బెట్టుట, ధనవంతునకు దానము చేయుట, దరిద్రుఁడు-బీదవాడు నకు గల యౌవనము ఇవి వృథ - వ్యర్థము, నిష్ప్రయౌజనములు. – నీతిశాస్త్రము

కురుతే గంగా సాగరగమనం ప్రతిపరిపాలన మథవా దానమ్|
జ్ఞాన విహీనః స్సర్వమతేన ముక్తిం న భవతి జన్మశతేన||భజ|| - 17

One goes on pilgrimage to the place where the Ganga joins the sea: or observes the religious vows with care; or offers gifts. But if he be devoid of knowledge, he does not gain release – according to all schools of thought – even in a hundred lives.

          

కడలిఱేఁడు - వరుణుడు.
కడలి -
సముద్రము.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలిమీఁగడ ముద్ద - చందమామ.
కడలివెన్న - 1.చంద్రుడు Moon, 2.అమృతము.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.

అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు -
చంద్రుడు, అమృత కిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు; అమృతకరుఁడు - చంద్రుడు.

సుధాసిన్ధో ర్మధ్యే - సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపో - పవనవతి చిన్తామణిగృహే |
శివాకారే మఞ్చే - పరమశివపర్యఙ్కనిలయామ్  
భజన్తి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ || - 8శ్లో
   
తా. ఓ జననీ! పాలకడలి(అమృతసముద్ర మధ్యమున) నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, చుట్టును కల్పవృక్షములు వరుసతో చుట్టబడిన దైన కదంబచెట్ల పూదోటలలో చెలువొందు చింతామణులతో నిర్మితమైన(చింతామణి)గృహంలో, శివరూపమగు మంచమందు పరమశివుని పడుక యందుండు(పర్యంకనిలయమైన), నిరతిశయానంద ప్రవాహస్వరూపిణివైన(జ్ఞానానంద ప్రవాహమైన)నిన్ను కొందరు ధన్యులు సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యముగా నీ సేవ లభించదని భావం.) – సౌందర్యలహరి  

ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః|      

ఓం పంచ ప్రేతమంచాధి శాయిన్యై నమః : బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు - నాలుగు మంచంకొళ్ళును, సదాశివుడు ఫలక స్థానంలో విరాజిల్లునట్టి మంచంమీద శయనించు మహేశ్వరికి వందనాలు.  

ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః : బ్రహ్మ, విష్ణు, ఈశ, రుద్రులు మంచంకోళ్ళుగాను, సదాశివుడు ఫలకస్థానంతోనూ తేజరిల్లునట్టి ఆసనంపై విరాజిల్లు తల్లికి వందనాలు.

ధర్మార్థ కామ(కోరిక)మోక్షములనే నాలుగు కోళ్ళుగల కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య రూపమైన మంచము. ఎంచబోతే మంచమంతా కంతలే!

మహాపద్మాటవీసంస్థా - కదంబవనవాసినీ|
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ. - 23స్తో

శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.

21. ఉత్తరాషాడ - ఇరువది యొకటవ నక్షత్రము.

ఏౘకంకటి చుక్క - ఉత్తరాషాడా నక్షత్రము.
ఏౘ -
1.గ్రామ్యము, 2.వంకర, రూ.ఏవ.
కంకటి - మంచము రూ.కంగటి సం.ఖట్టికా, ఖట్వా.
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః. 

శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). 

నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు.)
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon.

(ౘ)చుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది,  వి.ప్రాతికూల్యము.

(ౘ)చుక్కలదొర - చంద్రుడు; చుక్కలఱేఁడు - చంద్రుడు Moon.
చుక్కలతెరవు - ఆకాశము, నక్షత్రమార్గము.

ఏౘ - 1.గ్రామ్యము, 2.వంకర, రూ.ఏవ.
ఏస -
విజృంభణము విణ.1.గ్రామ్యము 2.వక్రము రూ.ఏచ. 
గ్రామ్యము - 1.అశ్లీలము 2.అసభ్యమగు మాట 3.పామరజన వాక్యము విణ.1.ఊరియందు పుట్టినది, 2.తెలివిలేనిది, 3.నాగరికత లేనిది.  
అశ్లీలము - 1.(అలం.) ఒక అర్థ దోషము, 2.ఒక శబ్దదోషము, 3.అసభ్య వచనము, ఏవగింపు(ఏవగింపు - రోత)పుట్టించుమాట, బూతు. 
ఏవ - రోత, విణ.రోతయైనది, రూ.ఏవము.
ఏవము - ఏవ. ఏహ్యము - ఏవము, విణ.రోత పుట్టించునది, సం.హేయమ్.
హేయము - 1.రోతయైనది, 2.విడువదగినది.
ఏవగించు - క్రి.1.రోతపడు, 2.నిందించు, 3.విడుచు.
బూతు - 1.కుత్సితపు తిట్టు, 2.బట్టువాడు.

గ్రామ్యము - గ్రామ్య మశ్లీలమ్:
గ్రామే భవం గ్రామ్యం - గ్రామమందుఁ బుట్టినది.
శ్రీఃచారుతా సా నాస్త్త్యస్మిన్నిత్య శ్లీల - శ్రీ యనఁగా నొప్పిదము; అది లేనిది గనుక అశ్లీలము. 

అసభ్యము - 1.సభకు తగనిది, 2.అశ్లీలము.
అసభ్యపరవర్తన -
(శాస.) పార్లమెంటు సభామర్యాదకు విరుద్ధముగా ప్రవర్తించుట.

కావ్యదోషములు - (అలం.) పదదోషములు 17 :- అప్రయుక్తము, అపుష్టార్థము, అసమర్థము, నిరర్థకము, నేయార్థము, చ్యుత సంస్కారము, సంధిగ్థము, అప్రయోజనము, క్లిష్టము, గూఢార్థకము, గ్రామ్యము మొ.వి.

విజృంభణము - ఎగిసిపాటు, ఉద్రేకము చెలరేగుట.
ఎగిసిపాటు -
1.గర్వము, 2.మిడిసిపాటు.
మిడిసిపాటు - మిట్టిపాటు.
మిడి - మిట్టిపాటు, గర్వము, విణ.1.మిడిసిపాటు గలది, 2.ఉన్నతము.
మిడినాగు - ఎగిరి ఎగిరిపడు పాము, రూ.మిడినాగు.
ఉద్రేకము - 1.అతిశయము, 2.విజృంభణము.

వెడఁగు - 1.వికారము, 2.అవివేకము, సం.వికటః.
వికారము -
1.మారురూపు, 2.తెవులు.
వికారి - వికారముగలది, వి.ముప్పది మూడువ(33వ)సంవత్సరము. 
వెగడు - తడబాటు, సం.వికటః.
వ్యత్యయము - 1.తడబాటు, 2.వైపరీత్యము, 3.తారుమారు.
వ్యత్యస్తము - వ్యత్యాసపడినది.  
తడఁబాటు - తొట్రుపాటు. 
తడఁబడు - క్రి.1.తొట్రుపడు, 2.వ్యత్యాసపడు, చలించు.
తొట్రుపడు - క్రి.సంభ్రమించు; తొట్రిల్లు - క్రి.1.సంభ్రమించు, 2.భేదిల్లు.  
వెగటు - నిరసము, సం.వికటః.
నిరసనము - 1.తిరస్కారము, ఆక్షేపము, 2.వధము, రూ.నిరాసనము.
తిరస్కృతి - తిరస్కారము. 
వికటము - 1.విరివియైనది, 2.మిక్కిలి వంకరైనది.

అవివేకము - అజ్ఞానము, తెలివిలేమి, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమి, విణ.తెలివిలేనిది, మంచిచెడులను విభజించి తెలిసికొను సామర్థ్యము లేనిది.

వంవ - 1.వంకర 2.వాగు సం.వక్రః.
వాఁగు -
1.సెలయేరు, 2.సేవ(శుశ్రూష, కొలువు), సం.వాహః వై.క్రి. ప్రేలు.
సెలయేఱు - నిర్ఘరము కొండయేరు.
నిర్ఘరము - సెలయేరు, రూ.ఝరము.
నిర్ఝరణి - నది.

గంగ పారు నెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్న తనము పేర్మి యీలాగురా, విశ్వ.
తా.
ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగ పారుచుండును. మురికి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. మంచి చెడ్ద వారితేడా ఆ విధముగనే ఉండును.

వక్రము - వంకి, వంకర, విణ.క్రూరమైనది.
వంకి - బాకు, సం.వక్రీ.
బాఁకు - 1.బాణము, 2.కటారి.
కటారి - 1.కత్తి, బాకు, రూ.కటారు, సం.కఠారః.
వంకర - వక్రత్వము.
వక్తము - (గణి.) వంకరగా ఉన్నది (Curved).
వక్రతమములు - "ఐ, ఔ"లు. (ఎ, ఏ, ఒ, ఓ లు వక్రములు)
వక్రములు - ఎ, ఏ, ఒ, ఓ, లు (వంకరగా నుండునవి).
వక్రోక్తి - 1.ఒక అలంకారము, 2.అన్యార్థకల్పన మొనర్చుట, 3.వంకర మాట.  

వక్కరము - వక్రము, స.వక్రమ్.
వక్కురాలు - కుటిలస్త్రీ. (కుటిలము - వంకరైనది.) 

ప్రతీపం వక్రం ద్రుష్టుం శీలమస్యా ఇతి ప్రతీపదర్శినీ. సీ. - వక్రముగా నాలోచించునది.
వామత్వేన వక్రస్వభావత్వేవ రమ్యత్వేన వా వామా - వక్ర శీలమైనదిగాని రమ్యమైనది(ఒప్పిదమైనది) గాని వామ(వామ - ఉత్తమ స్త్రీ).

వామదేవుఁడు - శివుడు.
వాముః శ్రేష్ఠ స్ప చాసౌ దేవశ్చ వామదేవః - శ్రేషుడైన దేవుడు.
వామపార్శ్వే ధృతా దేవీయస్య సః - ఎడమ ప్రక్కను ధరింపఁబడిన భార్య గలవాఁడు.
వామయా దీవ్యతీతి వా - స్త్రీచే ప్రకాశించువాఁడు.
దివ్ క్రీడావిజీగీషా వ్యవహార - ద్యుతి స్తుతిమోద మద స్వప్న కాంతిగతిషు.
వక్రత్వాద్వామస్స చాసౌ దేవశ్చేతి వా - వక్రత్వము గల దేవుఁడు.    

వక్రుడు - శని Saturn, అంగారకుడు Mars.

కంకటి - మంచము రూ.కంగటి సం.ఖట్టికా, ఖట్వా.
ఖట్టిక -
1.గద్దియ, సింహాసనము, 2.మంచము.
ఖట్వ - మంచము.
గద్దియ - 1.సింహాసనము, 2.పీఠము, 3.పువ్వులలోని దుద్దు, రూ.గద్దె, సం.ఖటికా, 4.బంగారునాణెము, వరహా, రూ.గద్దె, సం.గద్యాణమ్.
గద్దె - గద్దియ, సోదె.
గద్యాణము - గద్దియ.
సింహాసనము - సింహ ముఖమేర్పరచిన స్వర్ణ రత్నమయోన్నత పీఠము.
పీఠము - 1.ఇల్లు కట్టుటకు వేసిన పునాది స్థానము (Plinth), 2.పీట.

పలకము - చిన్నమంచము, కుక్కి, సం.పల్యంకః.
కుక్కి -
1.పల్లము, 2.త్రాళ్ళు సడలి పల్లముపడిన మంచము, విణ.లోతుగలది.  
పల్యంకము - 1.పాలకి, 2.మంచము, 3.యతులు లోనగువారి యానము.

పర్యంకము - మంచము.
పానుపు -
1.పడక, మంచము,  2.పరుపు.

కంకటీకుఁడు - ముక్కంటి, శివుడు.
ఖట్వాంగపాణి -
ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతి యందు గలవాడు.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.

తన్నో విశ్వే ఉప శృణ్వంతు దేవాః | తదషాఢా అభిసంయంతు యజ్ఞమ్ | తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః | కృషిర్వృష్టి - ర్యజమానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా యువతయస్తుపేశసః | కర్మకృత్ - స్సుకృతో విర్యావతీః | విశ్వాన్ దేవాన్, హవిషా వర్ధయంతీః | అషాఢాః కామ-ముపయాంతు యజ్ఞమ్ ||20||

 379ff26628897c552cc44260338bd1f7

No comments:

Post a Comment