గోవు పరమ పవిత్రమైనది. భూమి దుష్ట భారంతో క్రుంగి తప్పించుకొనే మార్గం తోచక గోరూపం ధరించింది. ప్రకృతి అయిన ఆదిశక్తే గోరూపిణిగా, గోవుగా జన్మించింది.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.
ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాక్భతిః|
అనేకకోటి బ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా ||
గావో విశ్వస్య మాతరః - కన్న తల్లి స్వరూపం గోవు. గోవులు సమస్థ కోరికలను తీర్చే దేవతలు. గోవులనగా వేదములు. ఒక్క గోవుని పూజిస్తే సమస్థ దేవతలనూ పూజించినట్లే! దీనివలన దేవతలంతా తృప్తులవుతారు.
దరాందోళిత దీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ|
గురుమూర్తి ర్గుణనిధి - ర్గోమాతా గుహజన్మభూః. - 121శ్లో
సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
కామధేనువు - వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు.
సురగలి - కామధేనువు; కామదుఘ - కామధేనువు.
తెలిమొదవు - కామధేనువు(మొదవు - పాడియావు).
వెలిగిడ్డి - కామధేనువు; ఈవులమొదవు - కామధేనువు.
తెల్లని మేనును నమృతము,
జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం
బెల్లున నర్థుల కోర్కులు,
వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్.
భా|| చిలుకుతున్న పాలసముద్రంలో నుంచి తెల్లని శరీరము, జిల్లుమంటూ బాగా పాలుకార్చే పొదుగు చక్కని కొమ్ములు కలిగి ఉన్నది అయిన కామధేనువు మొదటగా పుట్టింది. అది పుష్కలంగా కోరిన కొరికలను కురిపించే వెల్పుటావు.
సురభి(కామధేనువు) గోమాత, ప్రకృతి కళ నుండి పుట్టినది. సురభి గోలోకంలో వుండే పరమపావనమూర్తి. గోమాత యనగా సర్వలోకా రాధ్యయైన కామధేనువునకు ప్రతిరూపము.
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నదీ, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు గురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి.
లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.
కళ్యాణి - 1.గౌరి(కన్యాకుబ్జమునందు దేవీస్థానం గౌరి), 2.భూమి, 3.ఒకానొక రాగము 4.ఆవు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ(చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.
ఆఁబోతు - (ఆవు+పోతు), 1.ఎద్దు, 2.అచ్చుపోసి విడిచిన ఎద్దు, బసవడు.
ఎద్దు - వృషము, (బహు. ఎడ్లు).
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.
బసవఁడు - వృషభము.
వృషభము - 1.ఎద్దు, బసవన్న, 2.వృషభరాశి.
నంది - 1.శివుని వాహనమైన వృషభము, 2.వృషభము.
బసవి - శివునకు పరిచర్య చేయుటకై చిన్నతనమునందే యర్పింపబడిన స్త్రీ, సం.పశుపీ.
ఆఁబోతురౌతు - శివుడు, వ్యు.అబోతు నెక్కువాడు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
ఆఁబోతుసొరము - వీణ యందును కంఠము నందును బుట్టు ఒక స్వరము, సప్తస్వరములలో రెండవది, ఋషభము.
ఋషభము - 1.ఎద్దు, 2.మదించిన ఏనుగు, 3.సప్తస్వరములలో ఒకటి.
ఋషభధ్వజుఁడు - శివుడు.
ఆఁబసి - (ఆవు+పసి) ఆవు.
గోవునకు గవి, మాహేయి, ఇల, ఇడ, శృంగిణి, సావిత్రి(ఆవు, తల్లి) మొదలగు పేర్లు కలవు.
గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.
గవి1 - ఆవు; ఆవు - గోవు.
గవి2 - 1.గుహ, 2.గుంట.
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.
ఎద1 - పశుఋతువు.
ఎద2 - హృదయము, సం.హృత్.
మాహేయీ సౌరభేయీ గౌ రుస్రా మాహా చ శృఙ్గిణీ.
అర్జు న్యఘ్నా రోహిణీ స్యాత్ :
మాహాగౌఁ, తస్యా అపత్యం మాహేయీ. ఈ.సీ. - మాహ యనఁగా ఆవు, దానికి పుట్టినది.
సురభే ర్గోత్రాపత్యం స్త్రీ సౌరభేయీ. ఈ.సీ. - సురభి అనఁగా కామధేనువు; దాని వంశమందుఁ బుట్టినది.
గచ్ఛతి స్వస్థానమితిగోః. ఓ. సీ. - ఉనికిపట్టునకుఁ బోవునది.
వసత్యస్మిన్ క్షీరమితి ఉస్రా. వస నివాసే. - దీనియందు పాలుండును.
మహ్యత ఇతి మాహా. మహ పూజాయాం. - పూజింపఁ బడునది.
శృంగ యోగాత్ శృగిణీ. ఈ.సీ. - కొమ్ములు గలది.
ప్రాయేణ ద్వళత్వా (ద)అర్జునీ. ఈ.సీ. - తఱచుగా తెల్లనై యుండునది.
నహన్యత ఇత్యఘ్నా. హన హింసాగత్యోః. - హింసింపఁ బడునది.
రోహిణీనక్షత్ర వదభ్యుదయ హేతుత్వ్వత్. రోహిణీ. ఈ.సీ. - రోహిణీ నక్షత్రమువలె శుభహేతువైనది. ఈ ఎనిమిది ఆవు పేర్లు.
మాహేయి - ఆవు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.(Mars)
కుజుఁడు -1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు.
సౌరభేయి - ఆవు.
సౌరభేయము - ఎద్దు.
సౌరభము - 1.తావి, వాసన, 2.ఎద్దు, 3.కుంకుమము.
సౌరభ్యము - 1.వాసన, 2.ఒప్పిదము, 3.గుణగౌరము.
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరిపోలవురా ||వినరా
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ అర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గంగమైలావు - (గంగమైల + ఆవు), 1.పసుపు, నలుపును కలిసిన వర్ణము కల ఆవు, 2.మిక్కిలినల్లని ఆవు.
మైలావు - పొగ చాయగల ఆవు.
గంగి - పూజ్యము, (గంగెద్దు= గంగి+ఎద్దు), వి.సాధువైన ఆవు.
గంగెద్దు - (గంగి+ఎద్దు) దాసరులు వస్త్రాదులచే అలంకరించి భిక్షాటనము కై తీసుకొని వచ్చెడి ఎద్దు, రూ.గంగిరెద్దు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివడైననేల ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వ.
తా. మంచిపాలు గరిటెడైనను త్రాగుటకు శ్రేష్ఠముగా నుండును. గాడిద పాలు కడవతో యిచ్చిననూ త్రాగలేముకదా. అట్లే ప్రేమతో బెట్టిన పిడికెడు భోజనమైనను సంతోషము గదా.
కల్లాకపటం ఎరుగని గంగిగోవును నేను
యేది చెప్పినాకాదని ఎదురుచెప్పలేను
పారేసిన గడ్డితిని బ్రతుకు గడుపుచున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నా ||వినరా
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ. పవిత్రురాలు. చేమటియావు - చిత్ర వర్ణముల యావు.
శృంగిణి - ఆవు.
గోవునకు ప్రదక్షణం చేయునపుడు పఠించునది :
శ్లో|| గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ
యస్మాత్తస్మా చ్ఛివం మేస్య అతశ్శాంతిం ప్రయచ్ఛమే.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.
అర్జుని - 1.ఆవు, 2.ఒకజాతి పాము, 3.బహుదానది(హస్తహీనుడైన మునికి బాహువులు(భుజములు) ఇచ్చినందున ఆ నది 'బాహుదా అయింది) 4.కుంటెన కత్తె(సంచారిక) 5.బాణాసురుని కూతురు, ఉష. (అనిరుద్ధుఁడు భార్య, దూర్వాశ శాపగ్రస్తురాలగు తిలోత్తమ)
ఉష - 1.రేయి, 2.రాత్రి విశేషము, 3.బాణాసురుని కూతురు. (భామలలో దేవిస్థానం తిలోత్తమ)
శర్వరీ దీపకశ్చంద్రః - ప్రభాతోదీపకో రవిః |
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపకః ||
తా. చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ ప్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింప జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము
భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా,
కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా.
అఘ్న్య - ఆవు విణ.చంపదగనిది. ఆవు పూజనీయమైనది, సాధు జంతువు. గోవు లేకపోతే లోకానికి సుఖశాంతులు ఉండవు.
ధేనుక - 1.లేగటి యావు, 2.ఆడేనుగు, 3.ఆడుగుఱ్ఱము, 4.చిన్నకత్తి, 5.పార్వతి(శివసన్నిధిని పార్వతి) రూ.ధేనువు.
ధేనువు - లేగటి యావు. పడ్డ - తొలిచూలియావు.
లేఁగడియావు - లేతదూడగల యావు.
లేఁగ - (లేత+కానుపు) క్రొత్తగా బుట్టిన దూడ.
నా బిడ్డలు భూమిచీల్చి దుక్కిదున్నారోయ్
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నారోయ్
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా ఒళ్ళే ఢంకాలకు నాదం పుట్టించునోయి ||వినరా
వలనుగ గానలందు ప్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలగను చూడనొక్కటి నిలంగను ధేనువు రెండుమూడునే
డులకటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలుగడువృద్ధిజెందవె యధర్మము ధర్మముదెల్ప, భాస్కరా.
తా. ఆవు రెండు మూడేండ్లకొక దూడవంతున నీనినను అవి వృద్ధి జెంది మందలగు చున్నవి. పులి ప్రతి సంవత్సరము నాలుగైదు పిల్లలను ఈనినను నవి వృద్ధి పొందలేదు. అధర్మము నిలువకుండుటకు, ధర్మము నిలిచియుండుటకు ఇవియే తార్కాణము.
క్రేపు – 1.శిఖరము (గిరిక్రేపులు), 2.దూడ, 3.పాడిపశువు.
దూడ - పశుశిశువు.
అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లొభవర్తియై
కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వాని కె
య్యెడల, నెదెట్లు పాలుతమకిచ్చునె యెచ్చటనైన లేఁగలన్
గుడువఁగనీనిచోఁగెరలి గోవులు తన్నునుగాక భాస్కరా.
తా. మనుష్యులు ఆవుల యొక్క లేగదూడలను వాని తల్లులపాలు త్రాగ నీయకుండ, వారు పాలు తీసికొంద మన్నచో నా గోవులు వారికి పాల నివ్వక తన్నును. అదే విధముగా లోభివానివలె (పిసినిగొట్టుతనము గలవాడై) వర్తించు మనుష్యుడును తనవద్ద కరుదెంచిన భిక్షుల కోర్కెలను తెలిసికొనకయే పొమ్మనినచో వానికి ధర్మమనెడి దైవము మరియొక ప్పుడు ఐశ్వర్యము కలుగజేయదు.
సవిత్ర - 1.తల్లి, 2.ఆవు.
సవిత - 1.సూర్యుడు(నమస్కారప్రియుడు) 2.తండ్రి రూ. సవితృడు. ప్రజాపతిర్వై సవితా. సూర్యుడిని ' సవిత ' అంటారు. సవిత అంటే బుద్ధికి ప్రేరణను ఇచ్చేవాడని అర్థం.
బభ్రువు - 1.కపిల గోవు, 2.అగ్ని, 3.బట్టతలవాడు, విణ.1. పచ్చనిది 2. రోగము వలన బట్టతల కలవాడు.
కపిల - 1.ఆగ్నేయ దిశయందలి ఆడేనుగు, 2.పుల్లావు (కపిల గోవు).
పుల్లావు - కపిలగోవు. మహాలింగము నందు దేవిస్థానం కపిల.
కపిల వర్ణత్వాత్కపిలా - కపిల వర్ణము గలిగినది.
కామ్యత ఇతి కపిలా - కోరఁబడునది. కపిలే కృష్ణపింగళే|
పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె - ఐదోది "కపి"లావతారం. ఆయన సిద్ధులకు ప్రభువగు కపిలమహర్షిగా అవతరించి దేవహుతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహణునికి తత్త్వసముదాయమును విశేషంగా నిర్ధారించి చెప్పే సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
ధృతి : కపిలపత్ని, లోకాలకు ధైర్యరూపం. పిండాకరము నందు దేవిస్థానం ధృతి.
దేవమాత సురేశానా వేదగర్భాంబికా ధృతిః.
ధృతి : ధృతిశబ్దము ధరించుటకును, ధైర్యమునకును పేరు. ధరణం, ధ్రియతే అనయాచ ధృతిః. సీ. ధృజ్ ధారణే. ధరించుట, దీనిచేత ధరింపఁ బడును ధృతి.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గికంటి - శివుడు.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
శివుని కంటిలోని ఎఱ్ఱజీర పడికూడా చలించకుండా స్థిరంగా ఉంది.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.
కపిలా క్షీరపానెన అన్యస్త్రీ సంగ మేనచ|
వేదాక్షర విహీనేన ద్విజశ్చండాలతాం వ్రజేత్||
తా. కపిలవర్ణముగల గోవుపాలను పానముచేయుటయు, ఇతర స్త్రీలతో భోగించు(భోగించు - సుఖించు, అనుభవించు)టయు, వేదాక్షరవిచారము లేక యుండుటయు, నిట్టికార్యములు బ్రహ్మణులొనరించిన చండాల త్వము నొందించును. - నీతి శాస్త్రము
గోదానము అన్నింటిలోకి కపిల గోవు దానము సర్వ శ్రేష్ఠమైనది.
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీ పతిః|
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగ కృతాన్తకృత్||
గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 2.భూమిని రక్షించువాడు.
గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గోష్ఠాధ్యక్షే అపి గోవిన్దః -
గోవింద శబ్దము ఆవుల నేలువానికిని, అపిశబ్దము వలన శ్రీకృష్ణునికిని, బృహస్పతికిని పేరు.
గాః విందీతి గోవిందః. విద్ ఌ లాభే. - ఆవులను బొందినవాడు, వాక్కులను బొందినవాఁడును గనుక గోవిందుఁడు.
గోపాలకృష్ణుతోడను,
గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా
గోపాలు రెంత ధన్యులో,
గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే?
భా|| గోవులు కాసే సమయంలో గోపాలకృష్ణునితో కలసిమెలసి తిరిగే ఆ గోపాలకు లెంత పుణ్యాత్ములో! భూమిని పాలించే ప్రభువులకైనా ఆ గొల్లల యందు గలమేలైన తేజస్సు ఇట్టి గొప్ప అనుభవం ఉన్నదా?
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గమునుగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
గోపుఁడు - రక్షించువాడు, వి.1. రాజు, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి, (అయిదింటి పైగాని, పదింటి పైగాని అధికారము కలిగి గ్రామములలోని భూముల ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్తవ్యములై యుండెను.)
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
క్షత్రియుఁడు - రాచవాడు.
కాటిపాఁపడు - 1.గొల్లవాడు, 2.కాటికాపరి.
కాటిఱేఁడు - శివుడు.
గొల్ల1 - 1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.
దౌవారికుఁడు – ద్వారపాలకుడు; ద్వారపాలకుఁడు - వాకిటి కావలివాడు.
ద్వార్థ్సికుఁడు - ద్వారపాలకుడు, రూ.ద్వార్థ్సుడు.
దోగ్ధ - 1.గొల్లవాడు(వల్లవుఁడు - గొల్లవాడు), 2.దూడ(దూడ– పశుశిశువు), 3.కవిత్వము(కవిత్వము - కవిత)చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
దోగ్ధ్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది (మహాశూద్రి - గొల్లది).
అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు.
జీవవృత్తి - గోవులు మున్నగు వానిని కాచుకొని జీవించుట.
గోపే గోపాల గోసంఖ్య గోధు గాభీర వల్లవాః,
గాః పాతీతి గోపః, గాః పాలయతీతి గోపాలః. పా రక్షణే; పాలరక్షణే. - ఆవులను రక్షించువాడు.
గా స్సంచష్టే గోసంఖ్యః. చక్షిఙ్ వ్యక్తాయాం వాచి. - ఆవులను విచారించువాఁడు.
గాః దోగ్ధీతి గోధుక్. హ.పు. దుహ ప్రపూరనే. - ఆవులను బితుకువాఁడు.
ఆసమంతాత్ భియం రాతీతి అభీరః. రా ఆదానే. - అంతట భయము గలవాఁడు.
బత్ స్థైర్యం లునాతీతి లవః బదః స్థైర్యస్యలవో వల్లవః, బద స్థైర్యే. లూఞ్ ఛేదనే. వబయోరభేదః - భయము నొంది మనస్థైర్యము వీడినవాఁడు.
గోమహిస్యాదికం వలమానాః సంవృణ్వంతో వాంతి గచ్ఛంతీతి వల్లవాః. వల సంవరణే. వా గతిగంధనయోః. - గోమహిష్యాదులను జుట్టుకొని పోవువాఁడు. ఈ ఆరు గొల్లవాని పేర్లు.
గొల్లవారి బ్రదుకు గొఱఁతన వచ్చునే,
గొల్లరీతిఁ బాలకుప్పఁ ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు,
చేటు లేని మందు సిరియుఁ గనిరి.
భా|| గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు. దేవతలు గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ శ్రీలక్ష్మినీ పొందగలిగాడు.
వ్రే - గొల్లకులము, సం.వృష్ణిః. ఏ కులము నీదంటే గోకులము నవ్విందీ...
వ్రేఁడు - గొల్లడు(కిలారి – గొల్లడు), సం.వృష్ణిః.
వ్రేపల్లియ - గొల్లపల్లె.
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
మహాశూద్రి - గొల్లది.
వ్రేఁత - గొల్లది; గోపి - గొల్లది(గోపిక).
అభీరపల్లి - గొల్లపల్లె, వ్రేపల్లె.
అభీరి - 1.గొల్లది, 2.గొల్లవాని భార్య, 3.గొల్లలభాష.
అభీరుఁడు - 1.గొల్లవాడు, వ్యు.మిక్కిలి పిరికివాడు, 2.అభీరదేశవాసి. వల్లవుఁడు - గొల్లవాడు.
ఘోషము - 1.గొల్లపల్లె, 2.ఆవులమంద.
మంద - 1.ఊరిబయట పసులుండుచోటు, 2.గొల్లపల్లె, 3.పశు సమూహము. (ౙ)జంగిలి - గో సమూహము, పశుసమూహము.
మందప్రోయాలు - గొల్లది.
గవ్య - 1.ఆవులమంద, 2.రెండు క్రోసుల దూరము, గవ్యూతి, 3.గోరోజనము.
గోరోచక - పసుల నాభియందుండు పసుపుపచ్చని వస్తువు, రూ.గోరోజనము.
రోచన - 1.గోరోజనము, 2.ఎఱ్ఱగలువ, ఉత్తమస్త్రీ.
కెందొగ - (కెంపు+తొగ) ఎఱ్ఱకలువ.
పరహితమైన కార్య మతిభారముతోడిదియైన పూను స
త్పురుషుడు, లోకముల్ పొగడఁ బూర్వమునందొక ఱాళ్ళవర్షముల్
గురియఁగఁ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొకకేల నెత్తెనట కృష్ణుడు ఛత్రముభాతి, భాస్కరా.
తా. ఒకప్పుడు యాదవులు ఇంద్ర పూజలు చేయుచుండగా శ్రీకృష్ణుడు పూజలను మానిపించెను. మహేంద్రు(ఇంద్రుడు) డందులకు కోపించి వ్రేపల్లెపై రాళ్ళ వర్షమును కురిపించగా శ్రీకృష్ణుడు వెంటనే గోవులను గోపకులను కాచుటకు గొడుగు వలె ఒక చేతితో గోవర్ధన పర్వతము నెత్తెను. గొప్పవాడు లోక హితార్థమై ఎంత కష్టమైన పనియినను చేయుటకు పూనుకొనును.
గోవర్ధనాచలోద్ధర్తా గోపాల స్సర్వపాలకః,
అజో నిరఞ్జనః కామజనకః కఞ్జలోచనః. - 10శ్లో
పశువు - చతుష్పాదము, గొడ్డు.
పశుపతి - శివుడు.
పశుపాలనము - (వ్యవ.) ఉన్ని, పాలు, మాంసము, క్రొవ్వు మొదలగు వాని కొరకు పశువులను పెంచుట (Cattle rearing).
గోద1 - 1.విష్ణుచిత్తుని పుత్త్రిక, గోదాదేవి, 2.గోదావరి.
గోద2 - ఎద్దు, వృషభము, (వ్యావ.) గొడ్డు, గోద.
గొడ్డు - ఈనని పశువు, గొడ్రాలు, విణ.శూన్యము.
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పడిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక.
శూద్రి - శూద్రుని భార్య.
విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||
తా. లోకమునందు గొడ్రాలు, సహింపగూడని ప్రసవవేదన నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము
మలప - దూడచచ్చి పాలిచ్చెడి ఆవు.
అఱవ - సాధువుకాని ఆవు, విణ.దుష్టుడు, ధుష్టము.
నఱవ - అరవ, సాధువుకాని యావు.
అరవ - 1.తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
నఱ్ఱ - 1.ప్రయాసచే పిదుకదగిన యావు, 2.ప్రయాసముచే బండికి గట్టబడిన యెద్దు. అఱ్ఱ - 1.అఱ, గది, 2.ప్రయాసమున పాలు పిదుకదగిన ఆవు.
కరట - 1.ప్రయాసచే పిదుకదగిన ఆవు, 2.కాకి.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
వాయసము - కాకి.
గోవు ఎంత పవిత్రమైనదంటే - సమస్త దేవతలు తమ నివాస స్థానాన్ని గోమాత అంగాలలో నెలకొల్పుకున్నారు. ఈ కారణముచేత గోప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సరిసమానమైన పుణ్య ఫలంబు నొసగును.
గోమహత్యం:- 1.గోవు పాదము పితృ దేవతలు, 2.పిక్కలు పిడు గంటలు, 3.అడుగులు ఆకాశ గంగలు, 4.ముక్కోలు కొలుకులు ముచ్హిక చిప్పలు, 5.కర్రి కర్రేనుగ, 6.పొదుగు పుండరీకాక్ష, 7.సన్నుకట్టు సప్త సాగరాలు, 8. గోవుమయం శ్రీలక్ష్మీ, 9.పాలు పంచామృతాలు, 10.తోక 90కోట్ల ఋషులు, 11.బొడ్డు పొన్నపువ్వు, 12.కడుపు కైలాసం, 13.కొమ్ములు కోటి గుడులు, 14.మొగము దెస్థ, 15.వెన్ను యమధర్మరాజు, 16.ముక్కుసిరి, 17.కళ్ళు కలువరేకులు, 18.చెవులు శంఖ నాదం, 19.నాలుక నారాయణ స్వరూపము, 20.దంతములు దేవతలు, 21.పళ్ళు పరమేశ్వరి, 22.నోరు లోకనిధి.
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4వ వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములలో అధద్వయముచే వేరుచేయబడిన నాలుగుభాగములలో నొకటి (Quadrant).
ఆలవాలము - 1.పాదు.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.
కేదారము - 1.వరిమడి, 2.కొండ, 3.కేదారఘట్టము (కాశీలో నొక పుణ్యస్థలము), 4.పాదు, 5.శివలింగభేదము.
పితరులు - పితృదేవతలు, రూ.పితాళ్ళు. పితరః ప్రజాపతిః
ధర్మధేనువు స్వరూపం యొక్క నాలుగు పాదములు: 1.సత్యము(సత్యం చ సమ దర్శనం) 2.దయ, కనికరము 3.శౌచము(కృతశౌచము నందు దేవి సింహిక, శుచిత్వము) 4.తపస్సు.
పిక్క - 1.చిరుతొడ, జంఘ, 2.గింజ, సం.1.పిండికా, 2.స్పృక్క.
చిఱుదొడ - పిక్క; జంఘ - పిక్క.
పిక్కచెదఱు - 1.చెదరు, 2.భయపడు.
గొరిజ - పసువు కాలిగిట్ట, సం. ఖురః.
ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3.మంచపు కోడు.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపు కోడు, క్రి. మండు. కాలికి జూటూకున్న పాము కరవక మానునా?
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపు కోడు.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా|
పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ.
తొఱ్ఱు - ఆవు.
తొఱ్ఱుపట్టు - 1.ఆవులమంద, 2.గోవుల సాల, 3.గొల్లపల్లె.
ఘోషము - 1.గొల్లపల్లె, 2.ఆవులమంద.
గోష్ఠము - ఆవులమంద యుండు చోటు, గొట్టము.
గోష్పదము - 1.ఆవుడెక్క, 2.గోవులు తిరిగెడు చోటు, 3.గోవుపాదమంత చోటు.
గిట్ట - 1.పసులకాలిగోరు, డెక్క, 2.బాణము.
డెక్క - గిట్ట.
గోవు నాలుగు పాదముల గిట్టల యందు చతుర్వేదములుండును. గోవు కాలిగిట్టలలో అన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఆవులు నడుస్తున్నపుడు వాటి గిట్టల నుంచి లేచే దుమ్ము ఎవరి తల మీద పడితే వారు పవిత్రులు అవుతారు. గోవుల గిట్టల నుండి ఎగిరిన గోధూళిని, తన శిరస్సున ధరించినవాడు పుణ్యతీర్థాలలో స్నానమాడిన ఫలాన్ని పొందుతాడు. మరియు సమస్త పాపాల నుండి విముక్తుడౌతాడు. దాని పరమ పవిత్రమైన ధూళిలో గొప్ప శక్తి వుంది. గోధూళి మన మీద పడిన సమయంలో ఏకార్యం చేసినా సఫలమవుతుంది. గంగకంటే గోధూళి గొప్పది. గోధూళి ఎఱ్ఱన ఎందువలనా.…
పసి - 1.పశ్వాదుల మీదిగాలి, 2.పువ్వుల మీదిగాలి, విణ.లేత, వై.వి.గోగణము, గోవులు, సం.పశుః.
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.
అడుగు - 1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.
అడుగుపుట్టువు -1.గంగ, 2.శూద్రుడు(శూద్రుఁడు-నాలవ జాతివాడు).
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గంగలు - కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి - వీనినే పంచ గంగ లందురు.
గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి. గాంగేయుఁడు - గాంగుడు.
గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు - గంగాధరుఁడు, శివుడు, వ్యు.శిరస్సున భార్యకలవాడు.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి మంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ - సీత; వరజు - నాగటి చాలు, సీత.
పొదుఁగు - పశ్వాదులకు పాలుండుచోటు, ఊధము.
ఊధము - ఆవు, మొ. వాని పొదుగు, (ఇది బహువ్రీహి యందు ఉత్తరపదమినచో "ఊధ్నీ" అగును. ఉదా.కుండోధ్ని).
ఊధస్యము - పాలు, క్షీరము, వ్యు.పొదుగున పుట్టినది.
ముఱ్ఱు - చూలైన ఆవు మొ. వాని చన్నులు పిదుకగావచ్చు జిగట పదార్థము (ముఱ్ఱుబాలు). గుమ్మపాలు - అప్పుడు పిదికినపాలు, ఉష్ణధార లని వాడుక.
గుమ్మ - 1.పాలు పిండునపుడు వచ్చు ధార (గుమ్మపాలు), 2.స్త్రీ, (త,) కుమ్మలి = స్త్రీ, 3.గాదె.
పితుకు - క్రి. పశువుల పాలుపిండు, రూ.పిదుకు.
పిండు - 1.పాలుపితుకు, 2.రసము పిండు, 3.తడిసిన బట్ట పిండు, వి.1.గుంపు, 2.చెండు.
గోస్తనము - 1.నలుబది పేటల హారము, 2.ఆవు చన్ను. ఆవు పొదుగు నందు సప్త సముద్రాలుండును.
గోస్తని - 1.ద్రాక్ష, 2.ఒకనది. శక్తిపీఠం మాణిక్యే ద్రాక్షవాటికా|
ద్రాక్ష - ఒకజాతి ఫలలత, ద్రాక్షపండు.
ద్రాక్షచక్కెర - (వృక్ష.) ద్రాక్ష పండ్లలో నుండు చక్కెర, గ్లూకోజ్, (Glucose).
డెక్ స్ట్రోజ్ - (జీవ.) (Dextrose) ద్రాక్ష చక్కెర.
గ్లైకోజిన్ - (గృహ.) (Glycogen) కాలేయపు చక్కెర, (కాలేయము రక్తములో ఎక్కువగానున్న గ్లూకోస్(Glucose)ను, గ్లైకోజిగాన్ మార్చి నిల్వచేయును కాలేయములోను, కండర జీవకణములోను నిలువ చేయబడు చెక్కెర రూపము).
అదనుఁలంచికూర్చి ప్రజ నారిదమొప్ప విభుండుకోరినన్
గదిసి పదార్ధమిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌ బొదుగు మూలముఁ గోసిన పాలుఁగల్గునే
పిదికినఁగాక భూమిఁబశుబృందము నెవ్వరికైన, భాస్కరా.
తా. భాస్కరా! ఈ భూమి యందెవరికైనను పాలు కావలసి వచ్చినప్పుడు ఆవుల వద్దకు వెళ్ళి వాటి పొదుగులను పితికినచో వానికి పాలు లభించును. అట్లు పితుకుటమాని పాలకొఱకా (యా)ఆవుల పొదుగులను కోసినచో వానికిపాలు లభించవు. అట్లే ప్రజలను పాలించు రాజు తగిన సమయమును కనిపెట్టి ప్రజలను గౌరవముగా చూచినచో వారు ఆదరాభిమానమును లాతనిపైఁ జూపుటయే గాక, యతనిని సమీపించి ధనము నొసంగుదురు. కాని, రాజు వారిని బాధించి ధనము నిమ్మని కోరినచో వరేమియు నీయక ఆ రాజునే విడచి పోవుదురు.
పుండరీకాక్షుఁడు - విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
ఆవుపాలు రక్తం ద్వారా దాని శరీరమంతా వ్యాపించి ఉన్నా, అవి దాని చెవుల ద్వారా, కొమ్ములద్వారా కాక, పొదుగు ద్వారా మాత్రమే లభిస్తాయి. అలాగే భగవంతుడు సర్వాంతర్యామి అయినా, పవిత్రమైన దేవాలయాలలోనే అధ్యాత్మికానుభూతి సులభంగా లభిస్తుంది. ఎందరో మహాభక్తుల జీవితాలవల్ల, వారి పారమార్థిక సాధన వలన దేవాలయాలు పవిత్రమై ఉండడమే ఇందుకు కారణం. - శ్రీ రామకృష్ణ పరమహంస
నైచికి - 1.మంచిరూపము, 2.ప్రాయము, 3.సమృద్ధి, 4.పాలిచ్చునట్టి ఆవు.
ఉత్తమా గోషు నైచికీ,
నీచైః స్వరేణాపి చరతీతి నైచికీ. ఈ. సీ. చర గతిభక్షణయోః. - సన్నపు టెలుఁగునఁ (బి)పిలిచినను వచ్చునది. గోషు ఉత్తమా. ఈ రెండు ఆవులలో చాల పాలుగలిగి మంచి లక్షణములు గల యావు పేరు.
ప్రాయము - 1.వయస్సు, 2.బాహుళ్యము, 3.చావు.
వయసు - ప్రాయము, యౌవనము.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50వ)సంవత్సరముల వఱకు గలప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారెండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
ౙవ్వని - యౌవనవతి; ౙవరాలు - యౌవనవతి.
వయసు - ప్రాయము, యౌవనము.
ఈడు1 - 1.వయస్సు, 2.యౌవనము, విన.1.అనురూపమైన వయస్సు గలది, 2.సామ్యము, 3.తాకట్టు, విణ.సమానము, తగినది శక్యము.
ఈడు2 - క్రి.1.పాలు పిదుకు, 2.ముందు నకుబోవు, 3.వెనుకబడు.
ఈడుపు - 1.లాగుట, 2.జాగు, విలంబము.
ఈడుముంత - పాలు పిదుకు పాత్రము.
దోహనము - పాలుపిదుకుట.
తోడుఁబాలు - పాలుపిండబోవునపుడు పాత్రలో నుంచుకున్న నీరు.
వంజుల - ఎక్కువగా పాలిచ్చు ఆవు.
పినోధ్ని - పెద్ద పొదుగు గల యావు.
వత్సము - 1.ఏడాదిలోపు దూడ, 2.రొమ్ము.
పెయ్య - వత్స, ఆడుదూడ, రూ.పేయ.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు విణ.త్రావదగినది.
ఆఁబడ్డ - (ఆవు+పడ్డ) పాలు విడిచిన ఆవుపెయ్య.
తఱపి - 1.పెయ్య, 2.తారుణ్యము.
తారుణ్యము - జవ్వనము. తరుణిమ - యౌవనము, రూ.తారుణ్యము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
యౌవతము - యువతీ సమూహము.
వత్సౌ తర్ణకవర్షౌ ద్వౌ :
వత్సశబ్దము దూడకును, సంవత్సరమునకును పేరు. వసతి, వసత్య స్మిన్నితి చ వత్సః. వస నివాసే. - ఉండునది. గనుక, దీనియందన్నియు నుండును గనుకను వత్సము.
ఆవు తన వత్సాన్ని ప్రేమగా ఒళ్ళంతా నాకుతూ ఉండటం వల్ల వత్సలత లేక వాత్సల్యం(వత్సలం - పుత్రాదిస్నేహ రూపము) అనే పేరు వచ్చింది.
నలంఘయే ద్వత్సతంత్రీం నప్రధా వేచ్చ వర్షతి|
నచోదకే నిరీక్షేత స్వం రూప మితినిర్ణయం||
తా. దూడను గట్టిన త్రాడును(గుదిత్రాడు - దూడకాలికి గట్టుత్రాడు, బంధము.)దాఁటకూడదు, వానయందు పరుగెత్తరాదు, నీటియందు తన నీడను జూడరాదు. - నీతిశాస్త్రము
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః||
పైరము - ఆవు.
పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు - 1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
నీళ్ళు - నీరు; నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
క్షీరదము - (జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు.
పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెరచుగావున
బాలిసుడగు వానిపొందు వలదుర సుమతీ.
తా. తెలివిహీనుల(బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.) స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం.
కమ్మనైన గుమ్మపాలు కడవనిండ లేస్తున్న
కార్యానుకూలతకు మీకు ఎదురు వస్తున్న
వయసుడిగిన నాకు నన్ను కటికవాని పల్జేస్తే
ఉసురు కోలుపోకుండా మీకే ఉపయోగిస్తున్నా ||వినరా
పాఁడి - పాలు. పాలిచ్చే గోవులకు పసుపు కుంకం(కుంకుమ).....
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పంచామృతములు - ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస - 1.అంౘ, 1.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
మృత్పిండమేకో బహుభాండరూపం, సువర్ణమేకం బహు భూషణాని|
గోక్షీరమేకం బహుధేనుజాతం, ఏకః పరాత్మా బహు దేహవర్తీ||
తా. కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము వేర్వేరు బంగారమొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే శరీరములు వేర్వేరు పరమాత్మ యొక్కటే. - నీతిశాస్త్రము
పయోధరము - 1.స్తనము 2.మేఘము.
పయోధి - సముద్రము.
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది. నీరు త్రాగుతువున్న ఆవును బెదిరించి పారద్రోలినవారు కడ లేని నరక యాతనలు పడవలసి వస్తుంది. దూడ కడిచినకాని ఆవు చేపదు. పాలు కుడుపుతున్న ఆవును చూడరాదు.
ఒక చెరువుకు నాలుగు తూములు-తెల్ల వారి పొద్దు పొడిచేసరికి ఐదు పంటలు పండుతాయి. ఆవుపొదుగు - పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి.
గవ్యము - 1.వింటినారి, 2.పసులు మేయు పొలము, విణ. 1.గోహితవైనది, 2.గోసంబంధమైనది, 3.గోవికారమైనది(పాలు, మొ.వి).
గోసంభంధమైన పంచ గవ్యములు - గోమయము, గోమూత్రము, గోఘ్రుతము, గోధధి, గోక్షీరము. ఇవి పవిత్రములు, పాప హరములు.
పంచగవ్యములు - ఆవు పేడ, ఆవు పంచితము(పంచితము – గోమూత్రము), ఆవు పాలు, ఆవు పెరుగు, యోగ వాహి - ఆవునెయ్యి. పంచామృతములు - ఉదకము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె.
అమిత ముదమృతం ముహు ర్దుహంతీం
విమల భత్పదగోష్ఠ మావసంతీం
సయద పశుపతే! సుపుణ్యపాకాం
మమ పరిపాలయ, భక్తిధేను మేకామ్. - 68శ్లో
తా. పశుపతే(పశుపతి - శివుడు)! అమితానందామృతరూప క్షీరాలను పిదుకునదీ, విమలమైన నీ పాదాలనే గోశాలలో నివసించేదీ, పుణ్య పరిపాకమైనదీ, అయిన నా భక్తిరూప ధేనువును రక్షించు స్వామీ! - శివానందలహరి
84 లక్షల జీవరాశులలో ఆవు చాలా పవిత్రమైనది. దాని మలమూత్రములు అతి పవిత్రమైనవి. రాత్రిపూట ఆవుపేడ, నీళ్ళు, మట్టి, తేకూడదు.
పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవు పేడ(గోమయము), విణ. పరిశుద్ధము.
పేఁడ - గోమయము, రూ.పెండ.
(ౙ)జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము. జందెము - జందియము.
గోవి డ్గోమయ మస్త్రియామ్ :
గోః విట్ పురీషం గోవిట్. ష. సీ. గోమయంచ. అ. ప్న. ఆవుపేఁడ గోవిట్టు, గోమయమును. ఈ ఒకటి ఆవుపేఁడ పేరు.
కరీషము - 1.ఎరువు, 2.ఏరు పిడక, 3.గోమయము.
గొబ్బరము - ఎరువు.
ఎరువు1 - పైరు కై చేర్చియుంచిన చెత్త పేడ, మొ.వి. వ్యు.ఎండచే ఎరియునది.
ఎరువు2 - (వ్యవ.) నేలలో తగ్గిన సారమును మరల చేర్చి స్త్తువ చేయుటకు ఉపయోగించు పదార్థము (Manure).
పొలివెంటి - శుష్కగోమయము.
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.
గొబ్బి - 1.ధనుర్మాసమున బాలికలు చేతులు చరచుచు గుండ్రముగా తిరుగుచు పాటలు పాడువేడుక, 2.ఇక్షురకము, గొలిమిడి, మొగబీర.
గొబ్బిళ్ళు - 1.గొబ్బి, 2.నమస్కార భేదము, 3.బాలక్రీడ, 4.గొబ్బిపాట. కలయంపి - దుమ్ము అడగుటకు చల్లు పేడనీళ్ళు, రూ.కలాపి, కలవడము.
కడివెడు నీళ్ళు కలాపి ౙల్లి గొబిళ్ళో గొబిళ్ళో......
శ్రీ-1.లక్ష్మి 2.సంపద, ఐశ్వర్యము 3.కాంతి 4.అలంకారము 5.విషము. లక్ష్మి -1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్టదామర.
సముద్ర మథనేలేభే హరిర్లక్ష్మీం హరోవిషమ్|
భాగ్యం ఫలతి సర్వత్రన విద్యానచపౌరుషమ్||
తా. సముద్రమును మధించినపుడు విష్ణువు లక్ష్మీదేవిని, శివుడు విషంబును బొందిరి, గాన వారివారి భాగ్యానుసారముగా ఫలంబు గలుగును. - నీతిశాస్త్రము
అమ్మ కడుపున పడ్డను - అంతసుఖాన వున్నాను - నీ చేత పడ్డాను దెబ్బలు తిన్నాను - నిలువునా ఎండిపోయాను - నిప్పుల గుండం త్రొక్కను - గుప్పెడు బూడిదైపోయాను. గోమయ భస్మ(విభూతి)ధారణ అష్టైశ్వర్య ప్రదాయకము.
నా కొమ్ములే దువ్వనలై మీ తల చిక్కునుదీర్చు
నే సంకల్పించిన విభూతి మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుభములెన్నో కలిగించు
నా చేయూతలే చివరకు వైతరణిని దాటించు ||వినరా
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. ఐశ్వర్యమునకు అంతము లేదు.
విభూతి - 1.తిర్యక్సుండ్రధారులు ధరించెడు భస్మము, 2.ఒక ఐశ్వర్యము.
త్రిపుండ్రము - నొసట నుంచుకొను విబూతి మూడు రేఖలు, (నామము ఊర్ధ్వపుండ్రము.)
భూతి - 1.ఐశ్వర్యము, సంపత్తి 2.పుట్టుక, 3.భస్మము.
భూతేశుఁడు - శివుడు.
భవము - 1.బాము, పుట్టుక, 2.ప్రాప్తి, 3.సంసారము.
బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక.
జననము - 1.పుట్టుక, 2.వంశము.
జననవిద్య - (జీవ.) అనువంశమును గూర్చి తెలియు శాస్త్రము(Genetics).
తిరునీఱు - బూది, విభూతి.
తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
వెలిబూది - విభూతి; భసితము - భస్మము.
నీఱు - భస్మము, రూ.నిగురు, నివురు.
నిగుఱు - కట్టెల నిప్పుమీది బూడిద, రూ.నివురు, నీరు.
నివుఱు - నిగురు, బూడిద.
బూడిద - 1.కఱ్ఱలు మొదలగునవి కాలగా మిగిలిన భస్మము, 2.గోమయ భస్మము, సం.భూతిః.
భస్మము - బూడిద; బుగ్గి - బూడిద; భస్మాంగుఁడు - శివుడు.
తనీయాంసం పాంసుం - తవ చరణపంకేరుహభవం
విరించిః స్సంచిన్వన్ - విరచయతి లోకా నవికలామ్|
వహ త్యేనం శౌరిః - కథమపి సహస్రేణ శిరసాం
హరః స్సంక్షుద్యైనం - భజతి భసితోద్ధూళనవిధిమ్|| - 2శ్లో
తా. తల్లీ! బ్రహ్మ(విరించి - బ్రహ్మ) నీ యొక్క పాదపద్మముల తగిలి యున్న ధూళినే అణుమాత్రము సాధనముగా గ్రహించుచున్నవాడై చరాచర సహితమైన సకల లోక సృష్టిని సమగ్రముగా గావించుచున్నాడు. ఆ పరాగ కణమునే వేయి శిరస్సులచే నతి కష్టముగా అనంతరూపుడైన(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు)విష్ణువు మోయుచున్నాడు. దానినే ఈశ్వరుడు చక్కగా మెదిపి శరీరముననంతటను విబూదిగా(భస్మము)ధరించుచున్నాడు. - సౌందర్యలహరి
(అనగా శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టి స్థితి లయ శక్తులను అనుగ్రహించుచున్నది. మహమాయా గుణములైన రజస్సత్త్వతమోగుణములైన త్రిగుణములే త్రిమూర్తుల కృత్యముల కాధారములు).
అణిమ - 1.అణుత్వము, 2.ఒక ఐశ్వర్యము, అష్టసిద్ధులలో ఒకటి, రూ.అణిమము.
మహిమా - 1.గొప్పతనము, 2.ఐశ్వర్యము.
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.)పురుషవాచక శబ్ద సంజ్ఞ.
మహాత్మ్యము - గొప్పతనము.
గరిమ - 1.గొప్పదనము, 2.బరువు, 3.అణిమాద్యష్టైశ్వర్యములలో ఒకటి, 4.విధము (ఈయర్థము తెలుగున మాత్రమే కలదు.)
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.
లఘిమ - లఘుత్వము; తేలిక - చులకన, లఘుత్వము.
(ౘ)చులకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
ఆరోగ్యము - రోగము లేమి, స్వాస్థ్యము.
అవాప్తి - ప్రాప్తి, పొందుట.
సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సంవృద్ధమైనది.
స్వదేహోద్భూతాభి - ర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
నిషేవ్యే! నిత్యే! త్వా - మహమితి సదా భావయతి యః|
కి మాశ్చ్యర్యం తస్య - త్రినయన సమృద్ధిం తృణయతః
మహా సంవర్తాగ్ని - ర్వరచయతి నీరాజన విధిమ్|| - 30శ్లో
తా. శాశ్వతమైనదానా! ఆదంత్యంతములు లేని తల్లీ! లోకముచేత సేవింపదగిన జగన్మాతా! నీ చరణకమలముల నుండి పుట్టిన కాంతులచేత అణిమాది అష్టసిద్ధులతోను(అష్టైశ్వరస్వ రూప నిత్యలగు అష్టశక్తులతో) చుట్టును కూడికొని, నిత్యము సేవింపబడుచున్న నిన్ను ఏ సాధకుడు 'అహం' భావనతో నిరంతరము ధ్యానించుచున్నాడో, వాడు త్రినయనుని సమృద్ధిగల ఐశ్వర్యమును సైతము తృణీకరించువాడై యుండగా వానికి ప్రళయకాలాగ్ని నీరాజన విధి చేయుచున్నది. ఈశ్వర సంపదను గణింపని వానికి సంవర్త మను ప్రళయాగ్ని నీరాజనమిచ్చుటలో నాశ్చర్యము లేదు. ఇందుకు ఆశ్చర్యమేమి? (ఏ ఆశ్చర్యమును లేదు.) శ్రీదేవితో తాదాత్మ్యము పొందిన సాధకుడు శ్రీదేవియే. ఆమె ప్రళయాగ్ని నీరాజనము. – సౌందర్యలహరి
చిలువాలు - 1.ఇవురుగాచినపాలు, 2.ఆనవాలు, రూ.చిఱువాలు.
చిఱువాలు - ఇగురుగాచిన పాలు, రూ.చిలువాలు.
ఆనవాలు - 1.గుర్తు, 2.(ఆన+పాలు) ఇగురు కాచినపాలు, రూ.ఆనాలు.
కేసిన్ - (గృహ.) (Casein) పాలకోవలోని ఒకమాంసకృత్తు.
తోడు -1.ఆన, 2.తోబుట్టువు, 3.చేమరి, తోడుమజ్జిగ, విణ.సహాయము.
ఆన - ఉత్తరువు, సం.ఆజ్ఞా.
ఉత్తరువు - ఆజ్ఞ, అనుజ్ఞ, సెలవు, సం.ఉత్తరమ్.
ఆజ్ఞ - 1.ఉత్తరువు, ఆదేశము, 2.దండనము, 3.(యోగ.) కనుబొమల నడుమ నుండెది చక్రము, వికృ.ఆన.
ఆజ్ఞప్తి - ఉత్తరువు, ఆజ్ఞ, వికృ.ఆనతి.
ఆనతి1 - 1.మ్రొక్కు, 2.నమ్రత, 3.వంగుట.
ఆనతి2 - ఉత్తరువు, సం.ఆజ్ఞప్తిః.
తోఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోబుట్టుగు, తోబుట్టువు, తోడబుట్టువు.
తోడ(ౘ)చూలు - తోబుట్టువు.
తోడఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోడబుట్టువు.
చేమరి - పాలు తోడు పెట్టు; తోడుపెట్టు - చేమరిపెట్టు.
తోడుచల్ల - చేమరిపెట్టు మజ్జిగ.
ఆతంచనము - చేమరిపెట్టుట, పాలలో మజ్జిగ కలుపుట, (రసా.) పాల విరుగువలె దగ్గరపడుట (Wagulation), (జం.) (రక్తము) గడ్డకట్టుట (Coagulation).
ఆతంకము - 1.భయము, 2.సంతాపము, బాధ, 3.రోగము, 4.సందేహము, 5.ఆరాటము, 6.పాలు తోడుపెట్టుట.
తోడుకొను - క్రి.1.పాలుపేరుకొను, 2.పిల్చుకొను, రూ.తోడికొను, తోడ్కొను. తోడ్కొను - తోడుకొను.
తోకొను - తోడుకొను, వెంటబెట్టుకొను.
మొదట చప్పన - నడుమ పుల్లన - చివర కమ్మన. - పాలు-పెరుగు-నెయ్యి
గోమూత్ర మాత్రేణపయో వినష్టం | తక్రస్య గోమూత్రశతేన కింవా |
అత్యల్పపాపైర్వపద శ్శుచినాం పాపాత్మనాం పాపశతేన్ కింవా ||
తా. గోమూత్రము కొంచెము పడుటచేతనే పాలుచెడిపోవును, గోమూత్ర మెంత(ఎంతగా)కలిసినను మజ్జిగకు చెఱుపులేదు. అలాగే పరిశుద్ధుఁడైన సత్పురుషులకు అల్పపాపంబుచేతనే విపత్తు(విపత్తు - ఆపద)గలుగును, పాపాత్ముల కధిక పాపంబు వలనను చెఱుపు(కీడు)గలుగదు. - నీతిశాస్త్రము
గోవుమూత్రమే పరిశుద్ధి గూర్చుఁగాన
గోవుపాలలో మిసిమియుఁ గూడుటరుదె,
యవుర గోత్రము గోష్ఠమొ యరసి యరసి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ |
హైయంగవీనము - తొలినాడు చిలికి యెత్తిన ఆవు వెన్న, లేక వెన్న కాచిన నేయి.
నే - నేయి.
నేయి - నెయ్యి, సం.స్నేహః.
నేయము - నెయ్యము, సం.స్నేహః.
నెయి - ఘృతము, రూ.నెయ్యి, నేయి, సం.స్నేహః.
ఘృతము - 1.నెయ్యి, 2.నీరు.
ఘృతం - ఘృతంచ మధుచ ప్రజాపతి రా సీత్| నెయ్యి వేదంలో ఎంతో పవిత్రత సంతరించుకుంది. యజ్ఞంలో ఆవు నెయ్యి హవిస్సుగా దేవతలకు చేరి దేవతలను పోషిస్తోంది.
స్తేమము - 1.తడియుట, 2.స్నేహము.
ఘృతేన వర్ధ తేబుద్ధిః, క్షీరేణా యుర్వి వర్థనమ్|
శాకేన వర్ధ తేవ్యాధి ర్మాంసం మాంసేన వర్ధతే||
తా. నేతిచేత బుద్ధియు, పాలచేత నాయువు(ఆయువు - జీవితకాలము, ఆయుస్సు), కూరగాయల చేత వ్యాధియు, మానసముచేత మాంసమును వృద్ధిపొందుచున్నవి. - నీతిశాస్త్రము
తోయడము - 1.మేఘము(మేఘము - మబ్బు), 2.నెయ్యి, వ్యు.నీటినిచ్చునది.
తోయధి - సముద్రము.
వాజము - 1.నెయ్యి, 2.నీరు, 3.రెక్క.
వాజపేయము - ఒకానొక యాగము.
వాజి - గుఱ్ఱము. పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రావదగినది.
స్మరం యోనిం లక్ష్మీ - త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే! - నిరవధి మహాభోగ రసికాః|
భజంతి త్వాం చింతా - మణిగుణ నిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వన్తః - స్సురభిఘృత ధారాహుతి శతైః|| - 33శ్లో
తా. ఆద్యంతరహితయైన నిత్యయగు ఓ త్రిపురసుందరీ! పరమయోగులు కొందఱు నీ మంత్రమునకు మొదటి కామ బీజమగు ఐం, యోని బీజమగు హ్రీం, లక్ష్మీ బీజమగు శ్రీం అను వర్ణములను జేర్చి, చింతామణులచే సమగూర్చబడిన జపమాల(అక్షమాల)లను హస్తము లందు గలిగి, కామధేనువు సంబంధ మగు నేతి ధారలచే శివాగ్ని యందు హోమముచేయుచు, నిన్నుకొలుచుచున్నారు. - సౌందర్యలహరి
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ,
శ్రీం బీజ జపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా.
సింగాణి - 1.కొమ్ములతోచేసిన విల్లు, 2.విల్లు, రూ.సింగిణి, సం.శార్జ్గమ్, శృంగిణీ.
శృంగిణి - ఆవు; ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
శృంగిణి - ఆవు. శృంగయోగాత్ శృంగిణీ. ఈ. సీ. - కొమ్ములు గలది.
శృంగము క్తత్వాత్ శృఙ్గీ. సీ. - కొమ్ములు గలది.
శృఙ్గీతు వృషభో వృషః -
శృంగాకారావయవత్వాత్ శృంగీ, న.పు. అత ఏవ వృషభసామ్యాద్వృషభః. పా. ఋషభః - వృషశ్చ కొమ్మువంటి వయములు గలదిగనుక శృంగి.
వృషభమువలె నుండునది, గనుక వృషభము, ఋషభము, వృషమును. ఈ 3 వృషభమహౌషధము పేర్లు.
కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ,వి. కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ,వి. ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శొంఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 6.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
కొవురు - 1.కొండకొమ్ము, 2.శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము - 1.కొండ కొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు.
గోపురము - 1.గవసు, పురద్వారము, వాకిలి, 2.గాలిగోపురము, దేవాలయ ముఖమున ఎత్తుగా కట్టినద్వారము, (గణి.) సూచ్యగ్ర స్తూపము (Pyramid).
పిరమిడ్లు - (చరి.) (Pyramids) ఈజిప్టులోని పెద్దరాతి కట్టడములు. ఇవి త్రికోణాకారములో ప్రాచీనకాలపు ఈజిప్టు చక్రవర్తులైన ఫారోలకు స్మారక చిహ్నములుగా కట్టబడినవి(వీనిలో కెల్ల పెద్ద పిరమిడు ' గిజే ' పిరమిడు 6 మైళ్ళ పొడవులో 484 అడుగుల ఎత్తు 13 1/4 ఎకరముల వైశాల్యముతో నైలునది Nile river యొద్ద నున్నది.)
శార్జము - విష్ణువు విల్లు, విల్లు, వ్యు.శృంగముతో జేయబడినది.
శృంగము -1.కొమ్ము, 2.కొండ కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
శార్జి - విష్ణువు, వ్యు.శార్జము కలవాడు.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.
వనమాలీ గదీ శార్ఙీ శంఖీ చక్రీ చ నందకీ
శ్రీమాన్నారాయణో విష్ణుఃర్వాసుదేవో భిరక్షతు.
ధేనువు కుడి కొమ్ము నందు గంగానదియు, ఎడమ కొమ్ము నందు యమున నదియు, కొమ్ముల మధ్య భాగమున సరస్వతీ నదియు వశించుచుండును. ఎవరైతే కార్తీక ద్వాదశి నాడు ఆవును వెండి దెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి దూడతో సహా, గోదానము చేస్తారో, వాళ్ళు ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు వుంటాయో, అన్ని వేల సంవత్సరములు స్వర్గములో నివసిస్తారు.
వైతరణీనదీ సద్యుత్తరణార్ధం గోదానాలు చేస్తుంటారు. గోదానము చేయు వారు సూర్యలోకమునకు వెళ్ళుదురు. శక్తిలేని వారు గోపూజ చేసిన సర్వ శ్రేయొదాయకుము.
ఈ సప్తర్షి మండలానికి సుదూరముగా పదునొకొండు లక్షల యోజనాలపైన సర్వసంస్తవనీయమైన పరమ వైష్ణవ పదమునందు ఉత్తానపాదుని కొడుకు, వైకుంఠునకు ఇష్టభక్తుడు ధ్రువుడు వుంటాడు. తోక మొదట ధ్రువుడు. తోకమీద ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు, తోకచివర ధాత, విధాత, కటి-నడుము(కటిం భగవతీ దేవీ)యందు, సప్తర్షులు వుంటారు.
ధ్రువుఁడు - 1.ఉత్తాన పాదుని కొడుకు 2.విష్ణువు 3.శివుడు(విష్ణు భక్తుడు), ఉత్తర దిక్కులోనుండు నక్షత్రము, ధ్రువనక్షత్రము.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః. పువ్వు – పుష్పము.
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు. కడుపు - ఉదరము, ఉదరం సింహవాహిని.
గోపుచ్ఛము - 1.కోతి, 2.ఆవుతోక.
వనచరము - కోతి; మర్కటము - కోతి; వానరము - కోతి; తిమ్మఁడు - కోతి; కొండత్రిమ్మరి - కోతి.
కపి - కోతి.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి చిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణోత్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||
తా. సహజముగా బ్రాహ్మణులకుఁ (బ)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకరము, పతివ్రతలకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త -మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(యుద్ధము - కయ్యము, పోరు)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము
గోముఖము - 1.అలుకుట, 2.ఒక వాద్యము, 3.వంకరగా కట్టిన ఇల్లు, 4.ఆవు మొగము.
గోరోచక - పసుల నాభియందుండు పసుపుపచ్చని వస్తువు, రూ.గోరోజనము.
రోచన - 1.గోరోజనము 2.ఎఱ్రగలువ, ఉత్తమ స్త్రీ.
తామర - ఎఱ్రకలువ.
తామర చెలి - సూర్యుడు, పద్మ మిత్రుడు.
గోకర్ణము - 1.కడితిమృగము, 2.పాము, 3.కంచరగాడిద, 4.ఆవు చెవి ఆకారము గల పాత్రము, 5.దక్షిణ దేశమందలి ఒక శివక్షేత్రము.
(గోకర్ణమునందు దేవీస్థానం భధ్రకర్ణిక).
అశ్వతరము - 1.కంచరగాడిద, 2.పాతాళలోకము నందలి ఒకసర్పము, 3.కోడెదూడ, 4.గంధర్వులలో ఒక తెగ.
ప్రఖరము - 1.గుఱ్ఱపు కవచము, 2.కంచరగాడిద, విణ.మిక్కిలి వాడియైనది.
కంౘరగాడిద - కంచరము లాగు గాడిద, అశ్వతరము.
వేసడము - కంచరగాడిద, రూ.వేసరము, సం.వెసరః.
మయము - 1.ఒంటె, 2.కంచరగాడిద.
కోడె - 1.కాడి మరపదగిన దూడ, 2.విటుడు.
కోడెకాడు - 1.యుక్తవయసువాడు, 2.విటుడు.
కోడెరౌతు - వృషభవాహనుడు, శివుడు.
గోకర్ణము - 1.కడితిమృగము, 2.పాము, 3.కంచరగాడిద, 4.ఆవు చెవి ఆకారము గల పాత్రము, 5.దక్షిణ దేశమందలి ఒక శివక్షేత్రము.
(గోకర్ణము నందు దేవీస్థానం భధ్రకర్ణిక).
అశ్వతరము - 1.కంచరగాడిద, 2.పాతాళలోకము నందలి ఒకసర్పము, 3.కోడెదూడ, 4.గంధర్వులలో ఒక తెగ.
కంౘరగాడిద - కంచరము లాగు గాడిద, అశ్వతరము.
వేసడము - కంచరగాడిద, రూ.వేసరము, సం.వెసరః.
మయము - 1.ఒంటె, 2.కంచరగాడిద.
కోడె - 1.కాడి మరపదగిన దూడ, 2.విటుడు.
కోడెకాడు - 1.యుక్తవయసువాడు, 2.విటుడు.
కోడెరౌతు - వృషభవాహనుడు, శివుడు.
తతో (అ)భివ్రజ్య భగవాన్ కేరళాంస్తు త్రిగర్తకాన్ |
గోకర్ణాఖ్యం శివక్షేత్రం సాన్నిధ్యం యత్ర ధూర్జటేః |
గిడ్డి - ఆవు, పొట్టియావు, సం.గృష్టిః.
గిత్త - కోడె, పొట్టియెద్దు.
కోడియ - కోడెదూడ, గిత్త, రూ.కోడె.
గుజ్జు(ౙ) - 1.పొట్టిదనము, 2.కోడెదూడ, 3.పాపట, 4.దూలము మీది గురుజు, 5.క్రొవ్వు, విణ.1.పొట్టివాడు, సం.కుబ్జః.
గుజ్జువేలుపు - వినాయకుడు.
గోవు మూపున బ్రహ్మదేవుడు, మధ్య భాగమున రుద్రమహేశ్వరాది సహితముగా శివుడు, కటి ప్రదేశము నందు విష్ణుమూర్తి నివశింతురు. ఇట్లే గోమాత పృష్ఠభాగమందు సర్వపుణ్యతీర్థములు, గో గర్భము నందు కుడి భాగమున మహర్షి గణములు, వామ భాగమున దేవతాగణములు అడుగు భాగమున సమస్త నదులూ వశించుచుండును.
వెన్ను - 1.కంకి, 2.ఇంటి నడికప్పు, 3.వీపు.
వెన్నుఁడు - విష్ణువు సం.విష్ణుః
విష్ణువు - వెన్నుడు - అలంకారప్రియుడు(అలంకారములు వస్త్రములు గాను), విశ్వమంతటా వ్యాపించినవాడు.
యమధర్మరాజు - సూర్యుని పుత్రుడు, ధర్మము నెరింగి పాలంచువాడు. దక్షిణ దిక్కున కధిపతి. ధర్మాధర్మాలను నిష్పక్షపాతంగా నిర్వర్తించేవాడు. కాలపాశము ఆయుధముగా గలవాడు. దండపాణియైన యముడుఁ డేమి విధించునో?
ముకు - నాసిక, రూ.ముక్కు.
నాన - ముక్కు, రూ.నస, నాసిక. (నాసత్యులు - అశ్వినీదేవతలు)
సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.
గోవుల సముదాయం ఏ స్తానంలో నిర్భయంగా కూర్చుని శ్వాస పీలుస్తుందో ఆ ప్రదేశం శోభాయమానమవటమే కాక ఆ స్థలంలోని పాపాలన్ని పీల్చబడతాయి. గోశాల పవిత్రమైన ప్రదేశం.
ముప్పదిమూడుకోట్ల దేవతలు యేకమైతే ముక్కు పట్టించగలరు కాని ప్రాణాయామము పట్టించగలరా!
నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి. సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది.
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో
ఇల - 1.నేల, 2.బుధుని భార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ - 1.(యోగ) ఒక నాడి, ఇడ చంద్రరూపిణి (తెలుపు, చంద్రుని తేజస్సు),2.మైత్రావరుణి యను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఇళ - అల; అల - తరంగము, విణ. 1.ప్రసిద్ధిని తెలుపును, ఉదా. అలవైకుంఠములో.
గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకును, వాక్కునకును పేరు. ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు. ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును. ఇళాశబో భుధభార్యాయామపి. యస్యాః పుత్రః పురూరవాః. "ఊర్వశిసంభవ స్యాయమైళ సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోర్వశీయే.
హంభ - గోధ్వని, ఆవు అరుపు.
ఉంబ - గోవుల అంబారవము, సం.అంభా.
బే - ఆవుయొక్క అరపు 'అంబే' యనుట.
దేవేంద్రుని భార్య శచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయుణి భార్య లక్ష్మీదేవి, శ్రీకృష్ణుని భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వసిష్ఠుని భార్య అరుంధతీదేవి - వీరంతా కూడి ప్రాతః కాలమున లేచి స్త్రీలు చేసిన పాపములు ఎలా పోవును కృష్ణ అని అడిగినారు. పొద్దుటే లేచి గోవు మహత్యము పఠించుకుంటే సకల పాపములు పోవును. మధ్యాహ్న కాలమందు పఠిస్తే సహస్ర గదులలో దీపారాధన చేసినట్లు, నూరు గోవులు దానము చేసినట్లగును. అర్ధరాత్రి వేళ పఠిస్తే యమ బాధలు పడబోరు, యమ కింకరులు చూడబోరు.
గోవుల నామాలను, గుణాలను సంకీర్తన చేయడం, వానిని శ్రవణం చేయడం, గోవులను దానం చేయడం మరియు వానిని దర్శించటం - ఈ చేష్ఠలన్నీ ప్రశంసనీయాలుగా చెప్పబడ్డాయి. వీనివలన సమస్థ పాపాలు తుడిచిపెట్టుకొనిపోవడమేకాక, అత్యంత శుభాలు కలుగుతాయి. – మహాభారతము
గోమహత్యము పఠించిన వారికి, విన్న వారికి, చెప్పిన వారికి విష్ణు లోకములు, పుణ్య లోకములు కలుగును.
very interesting mam, keep it up
ReplyDelete