పూర్వాభాద్ర 1 పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు - మీనం, చేప.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సమూహము - రాసుల సమూహము (Group).
రాసులు - ఇవి పండ్రెండు, మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
వారిధి, వారాశి, సముద్రము.
వారాశి - నీటికుప్ప, సముద్రము.
వార్థి - సముద్రము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి శముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా శముద్రః రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా నహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.
వారి - నీరు.
అపవారయతి నిమ్నోన్నతమితి, వాః ర, న్న, వారి చ, ఈ-న, వృఞ్ వరణే. - నిమ్నోన్నతములను గప్పునది.
వార్ శబ్దో రేఫాంతః స్త్రీలింగః పూర్వసాహచర్యాత్ ; ఉత్తరసాహచర్యాత్ క్లీబే చ.
వారిచరము - చేప Fish, మొ.
వారిజము - 1.తామర, 2.శంఖము, 3.ఉప్పు.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము (Ring worm), (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
శంఖము-1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః, ఖను అవదారణే. - సుఖమును బుట్టించునది.
దుఃఖం శమయతీతి శంఖః, శము ఉపశమనే - దుఃఖమును శమింపఁజేయునది, నిధి.
శఙ్ఖో నిధౌ లలాటస్థి కమ్బౌన స్త్రీ-
శంఖశబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖమునకును పేరు. శమయతీతి దుఃఖమితి శంఖః, శము ఉపశమే. - దుఃఖమును శమింపఁజేయునది.
వారిదము - మేఘము, వ్యు.నీటి నిచ్చునది.
వరి వహతీతి వారివాహః, వహ ప్రాపణే - జలమును వహించునది.
వారిమసి - మేఘము, వ్యు.నీరుని మసివలె నల్లగ చేయును.
వారిత్రము - గొడుగు Umbrella, వాన నీటినుండి రక్షించునది.
వారిచరావతారమున వారధిలోఁ జొరబాణిఁ క్రోధవి
స్తారగుడైన యానిగమ తస్కరనీర నిశాచ నరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించి కిన్ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! మత్స్యావతారమునందు సముద్రము లోపల వేగముగా చొచ్చి మిక్కిలి కోపాతిశయము గలిగిననా డవై, వేదములను దొంగిలించుకొని పోయిన వీరుఁడైన మేటిరాక్షసుఁడగు సోమకాసురుని పట్టి చంపి వేదములచిక్కు విడఁదీసి విరించి - బ్రహ్మకు మరల వానిని మిక్కిలి యౌదార్యముతో నిచ్చినవాఁడవు నీవే కాని మఱెవ్వరునుగారు. అట్టి నీవు నన్ను కాపాడఁ దగును.
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ|
జలజము - 1.తామర, 2.శంఖము.తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
దుఃఖం శమయతీతి శంఖః, శము ఉపశమునే - దుఃఖమును శమింపఁజేయునది.
దరము - 1.భయము, 2.గొయ్యి, 3.శంఖము, అవ్య.ఇంచుక.
రసానుక్వా భావానాహ - దరేతి దీర్యతే (అ)స్యాదితి దరః, దౄభయే.
గొయ్యి - పల్లము, రూ.గోయి.
దరో (అ)స్త్రియాం భయే శ్వభ్రే -
దరశబ్దము భయమునకును, గుంటకును పేరు. దరణం, దీర్యత ఇతి చ దరః, ప్న. దౄ విదారణే. వెఱచుట, త్రవ్యఁబడునదియును దరము. ఈషదర్థమందు దరశబ్ద మవ్యయము. "దరదళిత హరిద్రాపింజరాణ్యంగకాని" "ఈషదర్ధే ద రాలింగ" మితి శేషః.
శ్వభ్రము - రంధ్రము, బెజ్జము.
శోభసమభ్ర మాకాశ మస్మిన్నితి శ్వభ్రం. - బయలు దీనియందు లెస్సగాఁ గలదు.
ముందుకుపోతే నుయ్యి, వెనుకకుపోతే గొయ్యి. శంఖములో పోస్తే తీర్థము, పెంకులో పోస్తే నీళ్ళు.
జలజనిభ నయనఖిల మనుజమథన
బలిదనుజ మదన కలికలుష శమన| ||శరవణభవ||
అథో ఝుషాః, రోహితో మద్గుర శ్శాలో రాజీవ శ్శకుల స్తిమిః, తిమింగిలాదయశ్చ :
పృథురోమా ఝుషో మత్స్యో మీనో వైసారిణో (అ)ణ్డజః, విసార శ్శకులీ చ -
ముఖదేశే పృథూని రోమాణ్యస్య పృథురోమా, న. పు. - ముఖమునందు పొడుగు రోమములుగలది.
మత్స్య సామాన్యమునకు పేరుగనుక నీపృథురోమ శబ్దము రోమములేని మత్స్యమునందు వర్తించును.
1.ఝుషము - 1.చేప, 2.మొసలి.
ఝషతి హినస్తి బాలమత్స్యానితి ఝషః ఝష హింసాయాం - పిల్ల చేఁపలను (ౘ)చంపి తినునది.
చేఁప - మత్స్యము; మత్స్యము - చేప Fish.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః, మదీ హర్షే. - మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.
మాత్స్య న్యాయము - న్యా. పెద్ద చేప చిన్న చేపను తినునను న్యాయము. హెచ్చు బలము కలిగిన పెద్ద చేపలు బలహీనమైన చిన్న చేపలను బలవంతంగా, మింగుతుంటాయి.
మొసలి - నక్రము, మకరము.
మొసలిరాశి - మకరరాశి.
మకరరేఖ - (భూగో.) భూమధ్య రేఖకు దక్షిణమున 23 1/2 డిగ్రీలలో ఉన్న రేఖ (Tropic of Capricorn).
వలదొర - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
వల - 1.చేపలపట్టు జాలము, 2.సమూహము నందు వలను శబ్దపు రూపము, ఉదా.వలను+కడ =వలకడ.
వల - కామము, సం.వల్.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.
వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.
క్షుద్రాక్షేణేవ జాలేన ఝుషావపిహితావురూ |
కామాశ్చ రాజన్ క్రోధశ్చ తౌ ప్రజ్ఞానం విలుంపతః ||
రాజా! రెండు పెద్దచేపలు సన్నని చిల్లులు గల వల- కామము, సం.వల్.)చే కప్పబడి దానిని ఎలా కొరుకుతాయో, కామక్రోధాలు రెండూ అలాగే(అదుపు చెయ్యబడక) వివేకాన్ని(ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.)లోపింప చేస్తాయి.
(కామక్రోధాలు చేపవలె శత్రువులు - కాని అవి వలలో పడినపుడు మిత్రభావంతో కలిసి వలను కొరుకుతాయి. - అలాగే కామక్రోధాలు రెండూ కలిసి వివేకాన్ని కొరికేస్తాయి).
ఝషకేతుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మారుఁడు - మన్మథుడు.
మారయతి విరహిజనం మారః - విరహినులను జంపువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
ఝుష కేతన సమవృష కేతనరమ
మిష చేతనయమ వృషకారి సుగమ| ||శరవణభవ||
చేఁప - మత్స్యము; మత్స్యము - చేప Fish.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః, మదీ హర్షే. - మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.
మచ్ఛెము - చేప, సం.మత్స్యః.
మచ్ఛె కంటి - (మచ్చెము + కన్ను) చేపల వంటికన్నులు గల స్త్రీ.
(ౘ)చోఱ - ఒక తెగ చేప, రూ.చోర.
చోఱ - చోర, విణ. బాలుడు.
పోఱఁడు - బాలుడు.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
చోఱబుడుత - 1.చోరమీనుపిల్ల, 2.చేపలవంటి కన్నులు గల స్త్రీ.
చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా?
మత్స్యాదిభిరవతారైరవతారవతావతా సదా వసుధామ్ |
పరమేశ్వర! పరిపాల్యో భవతా భవతాపభీతో(అ)హమ్| - 5
మత్స్యపాలనము - (వ్యవ.) ఆహారము కొరకు వివిధ జాతుల చేపలను పెంచి అభివృద్ధి చేయుట (Pisici culture).
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి ప్రొతసామస్మి జాహ్నవీ || - 31శ్లో
పావనమొనర్చువాటిలో వాయువును, శస్త్రధారులలో రాముడును, జలచరములలో మొసలియు, నదులలో జాహ్నవి - గంగ నావిభూతులే. రామబాణమఘోఘమైనది కావుననే శత్రధారులలో అతడగ్రేసరుడు.
త్రిలోకపావనియగు గంగ విష్ణుపాదమునుండి పుట్టినది. వైజ్ఞానికులు గంగా జలములు ఎంతకాలముంచినను చెడిపోవనియు, వీనియందు రోగక్రిములు జీవింప జాలవనియు ఋజువు చేసిరి. హిందువులు గంగను పూజించుటచే సర్వపాపములు నశించి ముక్తికలుగునని విశ్వసింతురు. - భగవద్గీత విభూతియోగః
రోహితాశ్వుఁడు - 1.అగ్ని, 2.హరిశ్చద్రుని కొడుకు, రూ.రోహితాశ్వుడు, రోహితాస్యుడు.
లోహితాస్యుఁడు - హరిశ్చంద్ర నృపాలుని కొమరుడు, రూ.రోహితాస్యుడు, (లౌహితాశ్వుడని కొందఱు.)
లోహితవర్ణాః అశ్వాః యస్యసః లోహితాశ్వః - ఎఱ్ఱని గుఱ్ఱములు గలవాఁడు. (పా, రోహితో మృగః స ఏవ అశ్వో యస్యసః రోహితాశ్వః - రోహితమృగము వాహనముగాఁ గలవాఁడు).
తదేవ ఋజు రోహితమ్,
తదేవ ఋజు రోహిత మిత్యుచ్యతే - ఆ యింద్ర ధనుస్సు చక్కఁగా నుండునేని రోహిత మనంబడును.
రోహతీతి రోహితం, రుహ బీజజన్మని ప్రాదుర్భావే చ-ప్రాదుర్భవించునది.
రోహితవర్ణత్వా ద్వా రోహితం రక్తవర్ణము గలది. ఈ ఒకటి చక్కని యింద్రధనుస్సు.
రుధిరే (అ)సృగ్లోహితాస్ర రక్త క్షతజ శోణితమ్,
రుధిరము - 1.నెత్తురు blood, 2.సిందూరము.
రుద్యతే త్వచా రుధిరం రుధిర్ ఆవరణే. - చర్మముచేత కప్పఁబడునది.
సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
లోహితో రోహితో రక్తః -
లోహితము - 1.రక్త చందనము, 2.సింధూరము, 3.నెత్తురు blood.
రోహితి ప్రాదుర్భవతి సంధ్యాదావితి రోహితః - రలయోర భేదాత్ లోహితశ్చ రుహ బీజజన్మని ప్రాదుర్భావే. - సంధ్యాదికాలములయందుఁ బుట్టునది. అది దాసాని పువ్వు వంటిది.
సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
అరిష్టః ఫేనిల స్సమౌ,
అరిష్టము - 1.హింసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము, 5.మరణచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ, ఉత్పాతము, 9.రాగి.
నరిష్యంత్య అరిష్టః రక్షా హేతుత్వాత్, రిష హింసాయాం. - రక్షా హేతువైనది గనుక దీనిచేత హింసింపఁబదరు.
ఫేనిలము - నురుగుకలది, వి.1.కుంకుడు, 2.రేగుపండు.
హేనా స్సంత్యస్యఫేనిలః - నురుఁగులు గలది. ఈ 2 కుంకుడుచెట్టు పేర్లు.
రోహితము - 1. కుంకుడు పువ్వు, 2.నెత్తురు, 3.ఎరుపు, 4.ఎఱ్ఱచేప red fish.
రోహితత్వాత్ రోహితః - ఎఱ్ఱనై యుండునది.
జలే మజ్జతీతి మద్గురః. టుమస్ మజ్జనే. - జలమందు మునిఁగి యుండునది .
రక్తవర్ణత్వేన రోహితః - ఎఱ్ఱని వన్నెగలది, కేసరి యను మృగము.
రక్తము - 1.నెత్తురు, 2.కుంకుమ, 3.ఎరుపు.
లోహితవర్ణత్వాత్ లోహితం. రక్తం చ. - ఎఱ్ఱని వన్నె గలది, లోహితము రక్తము blood.
రజ్యత ఇతి రక్తః, రంజరాగే. - రాగమును బొందునది, అది సంధ్యారాగమువంటిది. ఈ 3 ఎఱుపువన్నె పేర్లు.
రక్తచందనము - ఎఱ్ఱ చందనము, (రక్త) ద్రవపదార్థము సం.వి. (జం.) సామాన్యముగా రక్తములోనున్న ద్రవపదార్థ భాగము, (Plasma) రసకళ, Plasma membrane.
ఎఱ్ఱగందము - రక్తచందనము.
లోహితాంగుఁడు - అంగారకుడు Mars.
లోహితమంగం యస్యసః లోహితాంగః - ఎఱ్ఱని శరీరకాంతిగలవాఁడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
మీనము - 1.చేప, 2.మీనరాశి (Pisces).
మీయతే ధివరేణమీనః, మీఞ్ హింసాయాం. - జాలరివానిచేత హింసింపఁబడునది.
మినోతి క్షిపతి జలమితి వా మినః, దుమిఞ్ ప్రక్షేపనే. - జలము చల్లునది.
చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబయిన మీనావతారంబు నొంది మహీరూపంబగు నావ నెక్కించి వైవస్వత మనువు నుద్ధరించె - చాక్షుష మన్వంతరంలో నావరూపంలో ఉన్న భూమిపై పదవదైన 10వ "మత్యావతారం" దాల్చి వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని Saturn. మనువును కాపాడాడు. మర్త్యావతారా గోవిందా|
మత్స్యావతారమై మడుగులోపలఁ జొచ్చి,
సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను;
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల,
బ్రహ్మకిచ్చితి వీవు భళి యనంగ;
నా వేదముల నంది యాచారనిష్ఠల,
ననుభవించుచు నుంచు రవనిసురులు;
సకల పాపంబులు సమసిపోవు నటంచు,
మనుజులందఱు నీదు మహిమఁ దెలియ.
కుందు, రరవిందనయన ! నీ యునికిఁ దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ ! భూ.
తా. ఓ, నరసింహా ! చేపపుట్టుకనెత్తి మడుగులోనికి బోయి సోమకాసురుఁ జంపి చిత్రముగ వేదములదెచ్చి బ్రహ్మదేవునకు మెచ్చగా నిచ్చితివి. ఆ వేదముల నిచ్చుటచే సత్ప్రవర్తనము, నియమముల బ్రాహ్మణులను భవించుచున్నారు. మనుష్యులందరు సన్నిపాపములను నీ మహిమచే నశించిపోవునని దెలియకుందురు. అనగా నీ వుండుట నెఱింగినవారికి వెంటనే మోక్షము వచ్చును.
ప్రళయపయోధిజలే ధృతవానసి వేదమ్,
విహితవహిత్ర చరిత్ర మఖేదమ్|
కేశవ! ధృత మీనశరీర! జయ జగదీశ! హరే!
వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి…
నీరిలోన తల్లడించి, మోత నీటి మడుగులో ఈత గఱచినవాడు - ప్రళయాంబుధిలో మీనమై సోమకాసురుడు దొంగిలించిన వేదాలను తెచ్చినవాడు.
మగ మీనమవై జలనిధి
పగతుని సొమకునిఁజంపి పద్మభవునకు
నిగమములుఁ దెచ్చియిచ్చితి
సుగుణాకర మమ్ముఁగరుణఁ జూడుము కృష్ణా.
తా. కృష్ణా! మత్స్యావతారమెత్తి, సముద్రములో దాఁగిన సోమకుని (ౘ)జంపి, వేదములు బ్రహ్మకొసంగిన దేవా!
మాయామానుష దేహాయ వేదోద్దరణ హేతవే,
నమోస్తు మత్యరూపాయ రామా.....
బోదా - కిరాతుడు, కైవర్తుడు.
కిరాతుఁడు - ఆటవికుడు, అడవియందు తిరిగెడు బోయ.
కైవర్తుఁడు - 1.జాలరి, 2.పడవ నడుపువాడు, 3.నీటిలో వర్తించువాడు.
కే జలే వర్తన్త ఇతి కేవర్తాః మత్స్యాదయః, తేషామయం హంత కైవర్తః జలమునందు వర్తించునట్తివిగనుక కేవర్తములు అనఁగా మత్స్యాదులు; వాని జంపెడువాఁడు.
కస్య జలస్య ఈః లక్ష్మిః తయావర్తః వర్తనం యస్యసః కైవర్తః జలలక్ష్మిచేత వర్తనముగలవాఁడు.
(ౙ)జాలరి - చేపల పట్తువాడు.
వికేయణ మత్స్యాన్ దాసతి ద్యతి దాస్నోతీతివా దాసః దాశృదానే; దో అవఖండనే; దాశహింసాయాం. - విక్రయముచేత మత్స్యాదుల నిచ్చువాఁడుగాని ఖండించువాఁడుగాని పీడించువాఁడుగాని దాశుఁడు. పా, సాంతో (అ)స్తీస్తి "కైవర్త భృత్యయోర్దాస" ఇతి రుద్రః.
ధీవరుఁడు - జాలరి. (ధీ - బుద్ధి.)
ధత్తే మత్స్యాదీనితి ధీవరః, డు ధాఙ్ - ధారణ పోషణయోః - మత్స్యాదులను ధరించువాఁడు.
బెస్త - 1.ఒక తెగ బోయ (చేపలు పట్టుట, పల్లకి మోయుట వీరి వృత్తి).
మాలుగు - 1.బెస్తల భుజముల మీది తడిమడత, 2.సోమరితనము.
మెలయు మీనాక్షి కిని మీనరాశి....
మీనము - 1.చేప, 2.మీనరాశి (Pisces).
మీయతే ధివరేణమీనః, మీఞ్ హింసాయాం. - జాలరివానిచేత హింసింపఁబడునది.
మినోతి క్షిపతి జలమితి వా మినః, దుమిఞ్ ప్రక్షేపనే. - జలము చల్లునది.
నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరడైన బారలేదు
స్థానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వ.
తా. చేప నీళ్ళలో చాలా వేగముగా పోవును, బైట మూరెడు దూరమైనను పోలేదు. అందు చేత అది స్థానబలిమేగాని దానిబలముగాదు.
మీనవల్లంకి - ఒకానొకపిట్ట, రూ.మీనవల్లఁకి, సం.మీనవల్లి కా.
మీనకేతనుఁడు - మన్మథుడు.
మీనకేతనః మినః కేతనం ధ్వజో యస్య సః - మత్స్యము టెక్కెముగాఁ గలవాఁడు.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
కేత్యతే జ్ఞాయతే (అ)నేన అయ మసా వితి కేతనం, కిత జ్ఞానే. - దీనిచేత వీఁడు వాఁడని యెఱుఁగబడును.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
అథ కేతనం కృత్యే కేతా పుపనిమన్త్రణే :
కేతన శబ్దము చేయఁదగిన పనికిని, టెక్కెము నకును, బ్రాహ్మణుల నియంత్రణము చేయుటకును పేరు.
కేతం త్యనేనేతి కేతనం. కిత జ్ఞానే. - దీనిచేత నెఱుఁగుదురు.
టీ. స. అవశ్యకర్తవ్యే _ "నివాపాంజలి దానేన కేతనై శ్శ్రాద్ధకర్మభి"ధ్వజే _ 'మీనకేతనః' నిమంత్రణే _ "కృతకేతనం బ్రాహ్మణం నాతిక్రామే" దితి.
టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జెండా - టెక్కెము.
లలామము - 1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొటు, 5.తోక, 6.గుఱ్ఱము(ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.
మిత్తిౘూలు - కేతువు Ketu.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
ప్రకట మకర వరుణ పాశంబులందుల,
జలములందు నెందుఁ బొలయ కుండఁ
గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డైనట్టి
మత్యమూర్తి విద్యామానకీర్తి.
భా|| ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించే మత్యావతారమూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణపాశములు అగు జలజంతువుల బారిన పడకుండా జలాలయందు సర్వదా సంరక్షించు గాక !
వసరతీతి విసారీ విసార్యేవ వైసారిణః. సృగతౌ. - చరించునది గనుక విసారి. విసారియే వైసారణము.
అండజము - 1.పక్షి, 2.చేప, 3.పాము, 4.తొండ, వ్యు. గుడ్డు నుంచి పుట్టినది.
అండాత్ జాయత ఇత్యండజః. జనీప్రాదుర్భావే. - గ్రుడ్డువలనఁ బుట్టునది Fish.
ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము(దంతము - పల్లు, కోర.), 4.చేప, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది. అండరూపేణ పక్షిరూపేణ చ ద్విర్జాయతితి ద్విజః, జనీ ప్రాదుర్భావే. - గ్రుడ్డుగాను పక్షిగాను రెండుమార్లుగాఁ బుట్టునది.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమద్విజుడు.
ద్విజానాం బ్రహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.
ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి.
ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.
ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః. - చంద్రుడు
దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతమునకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.
అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||
తా. తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు రాజు, సిగ్గుగల వేశ్య(గణిక - 1.ఆడేనుగు, 2.వేశ్య.), సిగ్గులేని(సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.)లేని ఇల్లాలు చెడుదురు. - నీతిశాస్త్రము
ద్వితీయ స్వపరార్ధస్య వర్తమానస్య వైద్విజ
వారాహ ఇతి కల్పోయం ప్రథమః పరికీర్తితః. – మత్స్యపురాణం
వాలుగ - ఒక రకము చేప.
వాలుగంటి - స్త్రీ, దీర్ఘములైన కన్నులు గల స్త్రీ.
వాలుచూపు - ఓరచూపు.
ఓరచూపు - 1.ప్రక్కచూపు, క్రీగంటి చూపు, 2.ఉపేక్ష, 3.మోహపుచూపు.
విచిత్రం సరతీతి విసారః, సృ గతౌ. - విచిత్రముగాఁ జరించునది.
వసరతీతి విసారీ విసార్యేవ వైసారిణః. సృగతౌ. - చరించునది గనుక విసారి. విసారియే వైసారణము.
కాష్టం దారు -
కాష్ఠము - కఱ్ఱ, కొయ్య.
కాశతే అగ్ని నా నమం కాష్టం, కాశృదీప్తౌ. - అగ్నితోఁగూడి ప్రకాశించునది.
కఱ్ఱ - కొయ్య, పుల్ల, దండము.
పుల్ల - పులుపు గలది, వి.పుడక. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదట.
కొయ్య - కఱ్ఱ, మ్రాను.
జలే మజ్జతీతి మద్గురః. టుమస్ మజ్జనే. - జలమందు మునిఁగి యుండునది.
మద్గురస్యప్రియ శృఙ్గీ -
మద్గురస్య జలాంతర్య్మకరస్య ప్రియా శృంగీత్యుచ్యతే - శృంగీ శబ్దము మద్గురమను మీనుయొక్క పెంటిపేరు.
శృంగి - 1.పాపమీను, 2.ఏనుగు, 3.కొండ, 4.మ్రాను.
శృణాతీతి శృంగీ, ఈ. సీ. శౄ హింసాయాం. - హింసించునది. ఆఁడు మద్గురము పేరు.
సింగి - ఎరుకది, సం.శృంగీ.
ఎఱుకత - బోయ స్త్రీ, ఎఱుకసాని.
బోయత - కిరాత స్త్రీ, రూ.బోయత, (చెంచెత వలె).
చెంచు - ఒక తెగ బోయ.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏనుగు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
దంతి - ఏనుగు, విణ.కోరపండ్ల వాడు.
దంతావస్యస్త ఇతి దంతీ, న. పు. దంతావళశ్చ - దంతములు గలది.
దంతావళము - ఏనుగు, వ్యు.ప్రశస్త దంతములు గలది.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి.
కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
మ్రాను - మాఁకు; మాకు - మ్రాను; మ్రాఁకు - మాను, చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
మ్రానుద్రిమ్మరి - కోతి monkey.
మ్రానిపోటు పులుగు - వడ్రంగి పిట్ట , మ్రానుగోయిల.
ఘుణము - మ్రానిని తొలుచు పురుగు.
ఘుణతి వృత్తతయా భ్రమతీతి ఘోంటా, ఘుణ ఘూర్ణభ్రమణే. - వట్రువై తిరుగునది.
ఘుణాక్షర న్యాయము - న్యా. మ్రాని యందు నుసిపురుగులుతొలువగా ఏర్పడిన అక్షరముల న్యాయము. ఈ యక్షరములు పురుగుయొక్క ప్రయత్నమువలన ఏర్పడినవి కావు. అప్రయత్నముగ ఏర్పడినవి. ఉద్దేశములేక జరిగిన ఫ ల సి ద్ధి ప ట్ల ఈ న్యాయము చెల్లును.
నుసిపురుగు - ఘుణము, దూలములను తొలుచు పురుగు.
నుసి - పురుగులు తొలువగా రాలిన పొడి, విణ.అల్పము.
కొయ్యబద్ద - (గృహ.) ఎముక విరిగినప్పుడు ఆసారపెట్టి కట్టు సాధనము (Splint).
వంపుకఱ్ఱగాల్చి వంపు దీర్చగ వచ్చు
కొండలన్ని పిండి గొట్తవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపరాదు విశ్వ.
తా|| వంకరగానున్న కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును, కొండలన్నిటినీ పిండిగొట్ట వచ్చును. కాని, ఱాతిగుండె - కఠిన హృదయము. కఠిన హృదయుని ౙద్దు- కఠిన హృదయత్వము.)మనసు మాత్రము మార్చలేము.
నరుని నిను రాజ్యలక్ష్మి యేవరుసఁ గోరె
హరిని నినుఁ జెంచులక్ష్మి యే యదును నందె
నరహరుని బీదసాదలు నన్నియుంద్రు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
దారువు - 1.కొయ్య, 2.ఇత్తడి brass.
కుఠారాది నా దీర్యత ఇతిదారు, ఉ. స. దౄవిదారణే. - గొడ్డలి(కుఠారము - గొడ్దలి) మొదలయిన వానిచేఁ జీల్చఁబడునది. పా, దారుః, 'పున్నపుంసకయోర్దారు ' రితి త్రికాండశేష. ఈ 2 కొయ్య పేర్లు.
ప్రాథమికదారువు - (వృక్ష.) వేరుకాని కాండము గాని లేతగా నున్నప్పుడు దాని వాహినీపుంజము లలో మొదటనున్న దారువు (Primary xylem).
ఉపదారువు - (వృక్ష.) వేరుగాని, కాండముగాని ముదిరిన తరువాత రెండవసారి ఏర్పడిన దారువు (Secondary xylem).
బహిరారంభ (దారువు) - (వృక్ష.) దారువులో ఆది దారువు కేంద్రమునకు దూరముగా నున్న స్థితి (Exarch).
ధటము - కొయ్య త్రాసు.
దారు పురుష న్యాయము - న్యా. కఱ్ఱ మొద్దును చూచి మనుష్యుడని భ్రమపడిన రీతి.
యదతప్తం ప్రణమితి న తత్ సంతాపయం త్యపి |
యచ్చ స్వయం నతం దారు న తత్ సంనమయం త్యపి ||
తా|| కాల్చకుండా వంగేదాన్ని మంటలో కాల్చరు. తనకు తానుగా నతము - (గణి.) వాలుగానున్నది (Inclined), సం.విణ.1.వంగినది, వంకరైనది, 2.లోతైనది.)వంగిన కొయ్యను వంచరు.
రీతి - 1.తెరగు, 2.మేర, 3.ఇత్తడి Brass, 4.కావ్యశైలి పద్దతి (కావ్య శైలి త్రివిధము., పాంచాలి, గౌడ, వైధర్భి.)
రీతిః స్త్రియా మారకూటో న స్త్రియామ్ -
రీయతే స్రవత్యగ్ని సమయోగాదితి రీతిః. ఈ. సీ. రి. గతౌ. - అగ్ని సంయోగము వలనఁ గరఁగునది.
ఆరస్య సువర్ణస్య కూటః మాయా రూపమివ భాసత ఇతి ఆరకూటః. అ. ప్న. - ఆర మనఁగా బంగారు; దాని మాయారూపమువలె నుండునది. ఈ రెండు ఇత్తడి పేర్లు.
వడువు - విధము, రీతి.
తెఱఁగు - 1.విధము, క్రమము, 2.చక్కన, 3.సంధి, రూ.తెఱవు.
విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య.సర్వశబ్దర్థకము.
పొలిమేర - 1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు, ఎల్ల.
వఱ - మేర, హద్దు.
వఱగొడ్దము - 1.వంకరమాట, 2.మర్యాద నతిక్రమించుమాట.
అంగము1 - 1.రీతి, విధము, 2.అందము.
అంగు - 1.అందము, 2.రీతి, విధము, 3.అంగబలము, 4.ఇంటిలొని సామగ్రి, రూ.హంగు.
అందము - 1.సౌందర్యము, చక్కదనము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
అంగము2 - 1.అవయవము, దేహము, 2.ఉపాయము, 3.ఒక దేశము, విణ.1.అవయవము గలది, 2.సమీపించినది, వి.(గణి.) ఏదేని వస్తువుయొక్క ముఖ్యభాగము, మూలధర్మము, మూలకము (Element).
గాత్రము1 - 1.దేహము, 2.అవయవము.
గాతే గచ్ఛతీతి గాత్రం, గాఙ్ గతౌ. - పోవునది.
గాత్రము2 - స్థూలము.
శారీరము - కంఠస్వరము.
స్థూలము - గుడారము, విణ.బలిసినది, (గణి.) యథార్థమునకు దగ్గరగా నుండునది, అందాజు.
స్థూలలక్ష్యుఁడు - 1.మిక్కిలి యీవికాడు, 2.మిక్కిలి తెలివిగలవాడు.
అవయవము - అంగము, (జీవ.) ఇంద్రియము, శరీరములో కొన్ని రకముల జీవకణజాలముతో ఏర్పడిన ఒక ప్రత్యేక భాగము.
అంగహారము - వి.అవయముల కదలిక, అంగ విశేషము.
అపఘనము - 1.శరీరావయవము, 2.శరీరము, విణ.మబ్బులేనిది.
సర్వాంగీణము - 1.ఎల్ల యవయముల సంబంధముతో గూడినది, 2.ఎల్ల యవయవము లందు వ్యాపించినది.
అంగభవుడు - 1.మన్మథుడు, 2.పుత్రుడు.
అంగజుఁడు - 1.మన్మథుడు, 2.కొడుకు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మారుఁడు - మన్మథుడు.
మారయతి విరహిజనం మారః - విరహినులను జంపువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌవర్భవుడు, స్వయందిత్తుడు, జ్ఞాతిరేతుడు.
ఆరకూటము - ఇత్తడి, Brass.
ఆరస్య సువర్ణస్య కూటః మాయా రూపమివ భాసత ఇతి ఆరకూటః. అ. ప్న. - ఆర మనఁగా బంగారు; దాని మాయారూపమువలె నుండునది. ఈ రెండు ఇత్తడి పేర్లు.
ఇత్తడీ - అరకూట మను లోహము, రూ.ఇత్తమ్, సం.పిత్తళమ్. (రసా.) రాగి జింకుల కలయిక గల ఒక ధాతుమిశ్రమము.
పిత్తలము - ఇత్తడి.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్త్రిక), 2.బొమ్మ.
పాంచాలదేశే భవ పాంచాలికా - పాంచాలదేశ మందుఁ బుట్టినది.
వైదర్భి - దమయంతి, రుక్మిణి.
కిలుము - (గృహ.) ఇత్తడి లేక రాగిమీద ఏర్పడు మాలిన్యము, (ఇది ఒకవిధమైన విషము), రూ.చిలుము, (Veradigris).
చిలుము - 1.రాగి మొదలగు లోహము లందలి మురికి, 2.విషము, 3.పొగ పీల్చుట కుపయోగించు గొట్టము.
బ్రాస్సో - (గృహ.) (Brasso) అలంకారపు ఇత్తడి సామానులను పాలిష్ (Polish) చేయుటకు ప్రయోగించుద్రవము లేక పొడి.
సిబ్బి - ఇత్తడి మూకుడు.
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱగున గలుగు నేర్చు నెయ్యెడలందా
నెత్తిచ్చి కరగపోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
తా. నీచుడు(నీచుఁడు - అధముడు, రూ.నీచు.)మంచివారి యొక్క చెలిమి చేసినను, వారియొక్క మంచి గుణములు గ్రహింపజాలడు. యెట్లనగా బంగారంతో సమానమగు ఇత్తడిని తూచి, గరగించి (బంగారం కరిగించిపోసిన మూసలోపోసినను) అది బంగారం కాజాలదు కదా! ఇత్తడి brass ప్రక్కన వున్నప్పుడే, బంగారం విలువ తెలుస్తుంది.
అజం రుక్మిణీప్రాణసంజీవనం తం,
పరం ధామ కైవల్యమేకం తురీయమ్ |
ప్రసన్నం ప్రపన్నర్తిహం దేవదేవం
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || - 8
శలతిశీఘ్రం గచ్ఛతీతి శాలః. శల అశుగమనే. - శీఘ్రముగాఁ బోవునది. అరబు మీను.
రాజీవము - తామర.
కేనరరాజియోగాత్ రాజీవం - ఆకరులయొక్క పంక్తి గలిగినది. రాజీవలోచన|
రాజిః పఙ్తిరస్త్యస్య రాజీవః - మత్స్యముల వరుస గలిగినది. కొలువాసములను మీను.
రాజీవ శోచిస్సంస్పంద రుచిరాంగాదిశోచిషే,
నమః కైవల్య నిధయే రామా......
శకులము - బేడిస చేప.
శక్నోతి గంతుం శకులః. శక్ల శక్తౌ. - వేగిరముగాఁ బోవుటకు శక్తమయినది. బేడిసమీను.
బేడిస - ఒక రకము చేప.
మస్త్యానాం కవచప్రాయా స్థూలా శకులః, తద్యోగాచ్ఛకులీ. న. పు. పా. శకలీ - మత్స్యములకు కవచప్రాయమై స్థూలమైఉండు చర్మము శకులము; అది గలిగినది శకులి.
అథ గడక శ్సకులార్భకః,
అడతి సించతీతి గడకః, గడ సేచనే. - నీళ్ళు చల్లునది.
శకులస్య అర్భకః శకులార్భకః - చేఁపపిల్ల శకులార్భకము.
శకుల అర్భక ఇవ శకులార్భకః - పిల్లవంటి మీను శకులార్భకము. 2 మీను పిల్లల పేర్లు. జెల్లలపేర్లని కొందఱు.
తిమి - సముద్రమందలి ఒక చేప.
తిమ్యతీతి తిమిః. ఇ. పు. తిమి ష్టిమ ఆర్ద్రీభావే. - ఆర్ధ్రమైయుండునది. నూఱుయోజనముల నిడుపుగల మీను.
తిమింగిలము - తిమిని మ్రింగెడు చేప Whale.
తిమింగిలతీతి తిమింగిలః. గౄ నిగరణే. - తిమిని మ్రింగునది.
ఆదిశబ్దము చేత తిమింగిల గిలాదులును గ్రహింప బడుచున్నవి. తరుక్తం రామాయణే - ' తిమింగిలగిలో ప్యస్తి తద్గిలో ప్యస్తి రాఘవ ' ఇతి.
అదృష్టవంతుడిని సముద్రంలో పారేస్తే నోట చేప కరచుకుని పైకి వస్తాడు. - అరబ్ సామెత
శల్యపృష్ఠము - (జం.) వీనిచర్మములపై ముండ్లు అధికముగా నుండును. ఇవి సముద్రములో నుండు జంతువులు. ఈ జంతువులలో ప్రత్యేకమైన రక్తప్రసరణ మండలముగాని, విసర్జకమండలము గాని లేదు (Echinodermata), ఉదా. శల్యతారక. (Star-fish)
క్షారకము - 1.పసరుమొగ్గ, 2.చేపలను పక్షులను వేయుబుట్ట.
క్షరతి ప్రసూతే క్షారకః, క్షర సంచలనే. - పుష్పాదులఁ బుట్టించునది.
వాతయనము - గవాక్షము, జాలకము.
వాతస్య అయనం మార్గో వాతాయనం - వాయువునకు మార్గము.
వాతాయనము - (భౌతి., గృహ.) ఇండ్లలో మనము విడుచుగాలి బయటికి పోవుటకు ఏర్పరచినకిటికి (Ventilator).
గవాక్షము - కిటికి.
గహం కిరణానాం అక్షో వ్యాపారో (అ)త్రేతి గవాక్షః, అక్షూవ్యాప్తౌ. - గోవులనఁగా కిరణములు దాని వ్యాపారము దీనియందు గలదు. ఈ 2 గవాక్షి పేర్లు.
జాలకము - 1.మొగ్గ, 2.వల, 3.కిటికి, 4.సమూహము, 5.కపటము.
జలతీతి జాలకం, జల ఘాత్యే. - తీక్ష్ణమైనది.
ఎత్తెల - చేపలపట్టు వల.
వల - 1.చేపలుపట్టు జాలము, 2.సమూహము నందు వలను శబ్దపు రూపము, ఉదా. వలను+కడ = వలకడ.
వల - వై.వి. కామము, సం.వల్.
ౙాల - 1.జాలము, చేపలపట్టు, 2.కిటికీ, సం.జాలమ్.
ౙాము - చాగు, ఆలస్యము.
ద్వౌ వాగురిక జాలికౌ,
వాగురయా చరతి వాగురికః, జాలేన చరతి జాలికః - వలచేత చరించువాఁడు. ఈ 2 ను వలవేఁట కాని పేర్లు.
మత్స్యధానీ కువేణీ స్యాత్ -
మత్స్యా ధీయంతే (అ)త్ర మత్స్యధానీ, ఈ. సీ. డు ధాఞ్ ధారణపోషణయోః. - మత్స్యములు దీనియందు వేయఁబడును.
కువేణి - చేపలబుట్ట.
కుత్సితం వేణంతే మత్స్యా అస్యామితి కువేణీ, ఈ. సీ. వేణృగతౌ. - మత్స్యములు దీనియందు కుత్సితముగా సంచరించును. ఈ 2 చేపలబుట్ట పేర్లు.
దండగోల - 1.ఊత, 2.ఊతగఱ్ఱ.
ఊఁత1 - 1.ఊనిక, అవలంబము 2.చేపలు పట్టు సాధనము.
ఊనిక - 1.దిటవు, 2.ఆనిక.
ఊఁత2 - (భౌతి.) దేనికైన ఆధారమగు నట్టిది (Support).
ఊఁతకోల - 1.ఊనుకొనెడి కఱ్ఱ, ఆధారముగ పట్టుకొను కఱ్ఱ 2.రక్షణము.
ఊఁదు - 1.వాచు, 2.నిప్పు మొ. వానిని రగులజేయు, 3.శంఖము మొ. వానిని శబ్దింపజేయు, 4.ఉంచు, 5.ఊఁతతో చేపలుపట్టు.
ఎత్తెల - చేపలపట్టు వల.
వల - 1.చేపలుపట్టు జాలము, 2.సమూహము నందు వలను శబ్దపు రూపము, ఉదా. వలను+కడ = వలకడ.
వల - వై.వి. కామము, సం.వల్.
(ౙ)జాల - 1.జాలము, చేపలపట్టు, 2.కిటికీ, సం.జాలమ్.
(ౙ)జాలము - చాగు, ఆలస్యము.
(ౘ)చాగు - 1.పోవు, 2.ప్రవర్తిల్లు, 3.యత్నించు, రూ.సాగు.
(ౘ)చాఁగు - 1.దీర్ఘమగు, 2.దండాకారముగ నేలకు వ్రాలు, అవ్య.ప్రశంసార్థకము, రూ.సాగు.
గాలము - 1.చేపలను పట్టు వంపు గల కొక్కిబడిశము, 2.నూతిలో పడిపోయిన చేద మొ.వి.తీయు సాధనము.
ద్రొబ్బుడుపటము - చేపలను పట్టుటకు కుపయోగించు సాధనము.
ద్రొబ్బు - క్రి.పడద్రోయు.
బడిశం మత్స్యబన్ధనమ్ :
బడిశము - గాలము.
బలినః మత్స్యా న్ శ్యతీతి బడిశం. శో తనూకరణే. - బలముగల మత్స్యములను కృశముగాఁ జేయునది. లడయోరభేదః.
మత్స్యాః బధ్యంతే అనేన మత్స్య బంధనం. బన్ధ బంధనే. - మత్స్యములు దీనిచే బంధింపఁబడును.
పా. మత్స్యాః విధ్యంతే యేన తత్ మత్స్యవేధనం వ్యధతాడనే. - మత్స్యములఁ బీడించునది. ఈ మూడు గాలము పేర్లు.
ఎఱచి - పొల, మాంసము.
పొల - 1.మాంసము, 2.దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.పలమ్.
పొలసు - 1.మాంసము, 2.మాంసపు దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.పలమ్.
గౌలు - దుర్గంధము; దుర్గంధము - చెడువాసన.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.
వస్తాడు పోతాడు నాకోసం - వచ్చి కూర్చున్నాడు నీ కోసం, సగంచచ్చి వున్నాను నీ కోసం పూర్తిగా చస్తావు నాకోసం. - ఎర-చేప
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీద పొలుసు, 8.తునక, విణ.అల్పము.
తత్పరుఁడు - ఆసగలవాడు.
ఆస - 1.అపేక్ష, 2.దిక్కు, సం.ఆశా.
ఆశ - 1.కోరిక, 2.దిక్కు.
ఆసమంతాత్ అశ్నువత ఇత్యాశాః, అశూ వ్యాప్తౌ - వ్యాపించియుండునవి.
ఆశా తృష్ణాపి చాయతా,
ఆశాశబ్దము అధికమైన అపేక్షకును, అపిశబ్దమువలన దిక్కునకును పేరు. అశ్నుత ఇత్యాశా, అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది. అశాసనమాశా, అఙ్పూర్వ శ్శాసు ఇచ్ఛాయాం, ఉచ్ఛయించుట ఆశ. 'ఆశో వ్యాప్తౌ భుజౌ చ నా" ఇతి శేషః.
నీళ్ళలోన మీను నెరమాంస మాశించి
గాలమందుఁజిక్కు కరణి భువిని
ఆశదగిలి నరుడు అలాగె చెడిపోవు విశ్వ.
తా. నీటిలో చేప fish ఎర్రయొక్క మాంసమునకు ఆశపడి(మత్స్యము ఆకలిగొని గాలముచే)గాలమునకు చిక్కుకున్నట్లుగ, నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.)ఆశచేత ఆ చేప కరణి - విధము, రీతి.)గనే చెడిపోవు చున్నాడు.
రావణుడు సీతను 'వింద' నామకమను ముహూర్తమున అపహరించి నందుకు ఎర తగిలించు కొక్కెము పట్టుకొనిన మత్స్యం వలె నశించును అని జటాయువు పలికెను.
Fish for a person, you feed him a meal; teach him how to fish, and you feed him for a lifetime.
వల్లూరము - 1.పందిమాంసము, 2.ఎండినచేప, 3.చవిటినేల, 4.అగ్ని.
వల్యతే శోషణార్థ మితి వల్లూరం, అ, త్రి, వల సంవరణే - ఏండించుకొఱకు ఆవరింపఁబడునది.
భక్ష్యోత్తమప్రతిచ్ఛన్నం మత్స్యో బడిశ మాయసమ్ |
లోభాభిపాతీ గ్రసతే నానుబంధమవేక్షతే ||
చేప చక్కని తినుబండారంలాగా కనపడే ఇనుపగాలాన్ని దురాశకు లోనై మింగుతుంది. దానివల్ల జరుగబోయే అనుబంధాన్ని/కీడును గమనించదు.
సంసారజాలపతితస్య జగన్నివాస!
సర్వేన్ద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య!
ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్|
నిర్ఝరణి - నది.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
నిర్ఝరము - సెలయేరు, రూ.ఝురము.
జలపాతము - (భూగో.) నిర్ఝరము, కొండ కాలువ, సెలయేరు, కొండమీద నుండి నిటారుగా క్రిందికి తీవ్ర వేగముతో ప్రవహించు నీరు (Water fall).
సెలయేఱు - నిర్ఝరము, కొండయేరు.
కొండకాలువ - సెలయేరు.
ఝురము - సెలయేరు, రూ.ఝురి.
వారిప్రవాహో ని ర్ఝీ రో ఝరః,
నిర్ఝ ర్యతే కాలేన స్వల్పో భవతీతి నిర్ఝరః, ఝరశ్చ, ఝౄష వయోహానౌ. - కాలక్రమముచేత స్వల్పమై పొవునది, పా. ఝరీ. కొండలయందుఁ బుట్టిన జలప్రవాహము (సెలయేరు) పేర్లు. ఈ 2 ను పర్యాయములని కొందఱు.
వాగు - 1.సెలయేరు, 2.సేవ, సం.వాహః, వై.క్రి.ప్రేలు.
వాఁగులు - 1.అలలు, 2.సెలయేళ్ళు.
సెల - 1.సెలయేరు, 2.బాణపుములికి, 3.శల్యము, 4.ఏదుపందిములు, 5.మునిలోల యందలి ఇముపముల్లు, 6.బాణము, 7.వ్రణము నుండి చీము వ్యాపించు రంథ్రము, సం.1.ఝురీ, 2.కల్యమ్.
ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము.
నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పారు వేగఁ బొర్లి
అల్పుడాడురీతి నదికుండు నాడునా? విశ్వ.
తా. ఓ వేమా నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి పారుచుండును. చిన్న సెలయేరులు పైకిపొర్లి వేగముగ ప్రవహించు చుండును. చెడ్దగుణములు గలవారు(అల్పుఁడు - నీచుడు)మాటలాడినంతటి తొందరగా, మంచి గుణములు కలవారు (అధికుఁడు - గొప్పవాడు)మాట్లాడరు.
పాషాణము - 1.రాయి, 2.విషద్రవ్యము.
వస్తూని పినష్టి చూర్ణయతీతి పాషాణః, పిష్ ఌ సంచూర్ణణే. - వస్తువులను చూర్ణము చేయునది.
ప్రస్తరము - 1.రాయి, 2.రత్నము, 3.చిగుళ్ళు మొదలగు వానిచే ఏర్పరచిన సెజ్జ.
స్తృణాతి అచ్ఛాదయతి భువమితి ప్రస్తరః, స్తృఞ్ అచ్ఛాదనే. - భూమిని గప్పునది.
మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)
రత్నం మణిర్ధ్వయో రశ్మజాతౌ ముక్తాదికే పిచ :
రమతే స్మి న్ మన ఇతి రత్నం. రము క్రీడాయాం. - దీనియందు మనస్సు రమించును.
మణ్యతే స్తూయత ఇతి మణిః. ఇ. ప్స. - మణి శబ్దే స్తోత్రము చేయఁ బడునది. శిలాజాతు లయిన పద్మరాగ మరకత స్ఫటికాదులకును, మౌక్తిక విద్రుమాదులకును సామాన్యముగా పేర్లు.
అశ్మము - రాయి.
అశ్నుతే వ్యాప్నోతి భువ మశ్మా, న. పు. అశూ వ్యాప్తౌ. - భూమిని వ్యాపించునది.
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
అశ్మా గర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగాఁ గలది.
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి, 3.రంపము.
అశ్మనస్సారః అశ్మసారః - ఱాతియొక్క సారము. ఈ 7 ఇనుము పేర్లు
అశ్మజము - 1.సిలాజిత్తు, 2.ఇనుము, విణ.రాతినుండి పుట్టినది.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
శాణము - సానరాయి, రూ.శాణి.
శ్యతి స్వర్ణం తనూకరోతీతి శానః, శో తనూకరణే. - బంగారు నఱుగఁ దీయునది.
నికషము - 1.ఒరగల్లు, 2.సాన.
నికష్యతే స్వర్ణ ముత్రేతి నికషః, కషశ్చ, కషహింసాయాం. - బంగారు దీనియందు పీడింపఁబడును.
కషము - (జం.) చలనమున కుపయోగించుచు, జీవకణమున కున్న పొడవైన కాడవంటి అవయవము (Flagellum).
ఒరగల్లు - బంగారమును ఒరపెట్టు రాయి, నికషము.
సాన - శాణము, మణుల ఎచ్చు తగ్గులు మొ.వి. పోవుటకై రాచెడిరాయి, కత్తులు నూరెడి రాయి, గంధము తీసెది రాయి, సం.శాణః.
చికిలిసాన - ఒరిపిడిరాయి, సానరాయి.
చికిలి - 1.తుడిచి చక్కచేయుట, విణ.1.నున్నని, 2.అందమైన.
గ్రావము - 1.కొండ, 2.రాయి, 3.మేఘము.
ఆత్పాదిభిన్తప్తస్సన్ జలం గిరతీతి గ్రావా, న, పు. గౄనిగరనే. - ఎండచేఁ గ్రాఁగినదై జలమును గ్రహించునది.
శిల - 1.రాయి,2.సెలయేరు, రూ.సిల.
శినోతి తనూకరోతి ఆయుధమితి శిలా, శిఞ్ నిశాతనే. - ఆయుధమును గృశింపఁజేయునది.
రాయి - శిల.
శిలాపుత్రము - పొత్రపురాయి, రుబ్బురాయి.
సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి, శిల.
దృశత్తు - రాయి, సన్నెకల్లు.
సృణాతీతి దృషత్, ద, సీ. దౄ హింసాయాం. - హింసించునది, పా, దృశత్.
సనె - నూరెడు రాయి, రూ.సనెకలు, సన్నె, సన్నెకలు.
మీఁగాలు - పాదోపరిభాగము, పాదము యొక్క పైభాగము.
ముంగాలు - ముందుకాలు.
పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి! విపదాం
కథం నీతం సద్భిః -కఠినకమఠీకర్పరతులాం,
కథం వా పాణిభ్యా - ముపయమనకాలే పుర భిదా
యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా| - 88శ్లో
తా. ఓ దేవీ! కీర్తులకు స్థానమైనది, ఆపదలకు అస్థానమైన నీ మీగాలిని సజ్జనులు తాబేటి చిప్పతో పోల్చుచున్నారు. అదెట్లగును. మఱియు నీ ముంగాలు వివాహ సమయమున శివుడు చేతితో పట్టుకొని రాతి (సన్నికల్లు) పై యెట్లుంచినాడో (సప్తపదియందు భర్త భార్య యెడమ కాలిని పట్టుకొని సన్నికల్లుపై త్రొక్కించుట ఆచారము). - సౌందర్యలహరి
భూరిభారధర కుండలీంద్ర మణిబద్ద భూవలయ పీఠికాం,
వారిరాశి; మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణీం.
వారిసారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం,
చారుచంద్ర రవి లోచనాం మనసి భావయామి పరదేవతాం. - 4శ్లో
మెలయు మీనాక్షి కిని మీనరాశి....
తెఱగంటి ఱేఁడు - ఇంద్రుడు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసో త్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
తెఱగంటి - 1.తెప్పపాటు లేనివాడు, దేవత, 2.చేప Fish.
అనిమీషము - 1.రెప్పపాటులేనిది, 2.జాగరూకము, 3.వికసించినది, వి.చేప.
రెప్పలు ముయ్యని జాణ. - చేప.
అనిమిషుఁడు - వేలుపు, దేవత.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు. సురలు - దేవతలు.
బుధుఁడు- 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి.కేతువు.
విగతః కచోబంధన మస్య వికచః కచ బంధనే. - విగతమైన బంధము గలిగినది.
కేతువు - 1.తిమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
సుర మత్స్యా వనిమిషా :
అనిమిష శబ్దము దేవతలకును, మత్యమునకును పేరు. న నిమిషత్య నిమిషః మిష నిమీలనే ఱెప్పపాటు లేనిది.
ఉన్మేషము - 1.కనువిచ్చుట, 2.వికాసము, 3.కాంతి, 4.స్ఫురణము.
ఉన్మీలనము - 1.వికసించుట, 2.(కన్ను మొ, వి) తెరచుట, 3.బయలు పరచుట, 4.రంగువేయుట.
ఉన్మీలించు - క్రి.వికసించు.
నిమిషోన్మేషాభ్యాం- ప్రళయ ముదయం యాతి జగతీ
తవేత్యాహు స్సంతో - ధరణిధరరాజన్య తనయే |
త్వదున్మేషాజ్జాతం - జగదిద మశేషం ప్రళయతః
పరిత్రాతుం శంకే- పరిహృతనిమేషా స్తవ దృశః || - 55శ్లో
తా. ఓ పర్వత(ధరణిధరము - 1.కొండ, 2.నేలతాలుపు.)రాజ కూతురా! నీ కనుఱెప్పలు మూతపడుటచేత(మూయుట) జగత్తునకు ప్రళయమైన నశించును. మఱల నీవు కన్నులు తెఱచుటచే సృష్టి జరుగుచున్నదని సత్పురుషులు చెప్పుచున్నారు. అందువలననే - నీ ఱెప్పలు వికసించుట వలన జనించిన ఈ సర్వజగత్తు నశింపకుండ కాపాడుటకు, నీవు నీ కనుఱెప్పలను మూయుటను పరిహరించితివి (అనగా ఱెప్పపాటు లేకుండ - మూత లేకుండ చూచుచున్నావని) మూయని నీ కన్నులే తగినవని యూహించుచున్నాను. - సౌందర్యలహరి
ఉన్మేషనిమిషోత్పన్న - విపన్నభువనావళిః|
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. - 66శ్లో
శఫరి - ఎగసిపడెడు చేప, రూ.శఫరము.
ఎగిసిపాటు - 1.గర్వము, 2.మిడిసిపాటు.
మిడిమేలము - గర్వము, అహంకారము.
గర్వో(అ)భిమానో(అ)హంకారో -
గర్వయనేనేతి గర్వః ఖర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
ఆత్మానముత్కృష్టం మానయతీత్యభిమానః - మను అవబోధనే తన్ను ఉత్కృష్టునిఁగాఁ దలఁపించునది.
అహమితి బుద్ధిం కరోతీత్యహంకార. డుకృఞ్ కరణే. - నేను ఉత్కృష్టుఁడ నను బుద్ధినిఁ జేయునది. ఈ 3 అహంకారము పేర్లు.
అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య దేహాత్మభ్రాంతి.
అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.అత్మాభిమానము (Egotism), 5.క్రోధము, (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది), రూ.అహంకృతి, అహంక్రియ.
మిడిసిపాటు - మిట్టిపాటు.
మిడి - మిట్టిపాట్టు, గర్వము, విన.1.మిడిసిపాటు గలది, 2.ఉన్నతము.
గరువము - 1.గర్వము, 2.గొప్పతనము, విన.1విస్తృతము, 2.పెద్దది, సం.గౌరవము.
ప్రోష్ఠీ తు శఫరీ ద్వయోః,
ప్రోష్ఠీ శఫరీ ద్వయం భక్షయితు రంతరుదర దాహక మత్స్యనామనీ - ప్రోష్ఠీ శఫరీశబ్దములు భక్షించిన వానికి పైత్యముఁ(పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.) జేసెడిపెను పేళ్ళు.
ప్రోష్ఠతి పిత్తకృత్త్వాత్ప్రోష్ఠీ ఈ. సీ. ప్రుషదాహే. - పైత్యకారి యగుటవలన దహించునది.
ప్రకృష్టః ఓష్ఠః అస్యా ఇతివా ప్రోష్ఠీ - పెద్దపెదవి గలిగినది.
శఫాన్ గతిసాధనావయవాన్ రిణాతి పీడయ తీతి శఫరీ. ఈ. ప్స. రి గతిశోషణయోః. - శఫములనఁగా గొరిసెలు, వానిని శీఘ్రగమనముచేతఁ బీడించునది - ఈ 2 మత్యవిశేషము పేర్లు.
అపర్ణ - పార్వతి.
తపసి పర్ణానామ ప్యసశనా దపర్ణా - పర్ణములైన భక్షింపక తపం బొనర్చినది.
ఆపగత మృణం యయేతివా - పోగొట్టబడిన ఋణము గలది.
తవాపర్ణే! కర్ణే - జపనయన - పైశున్య - చకితాః
నిలీయంతే తోయే - నియత మినిమేషా శ్శఫరికాః,
ఇయం చ శ్రీ ర్బద్ధ - చ్ఛదవుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే - నిశి చ విఘటయ్య ప్రవిశతి. - 56శ్లో
తా. ఓ అపర్ణా! పార్వతీదేవి ! ఱెప్పపాటులేని చేపలు చెవి దగ్గరనున్న నీ కనులు తమ రహస్యమును బయట పెట్టునని భయపడినవై శఫరితలు నీటిలో మునుగు చున్నవి.(దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా వుండటంవల్ల తమచేష్టలన్నీ అమ్మచేత గమనింప బడుతున్నాయని భయం.) ఇక నీ నేత్రలక్ష్మి రాత్రిసమయంలో కలువ యందు ఉండి, ఉదయాన(ప్రత్యూషము - వేగుజాము)దాని దళాలను మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి, రాత్రివేళ మరల కలువలు(కువలయము -1.భూమండలము, 2.నల్లకలువ, రూ.కువలము.) విప్పారగనే లోన ప్రవేశించు చున్నది. కనులు చేపలవలెను కలువలువలె నున్నవనుట. (అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరొపోల్చదగ్గ నేత్రలు అని భావము) - సౌందర్యలహరి
అమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్|
ఆకేకరస్థిత కనీనిక పక్ష్మ(పద్మ)నేత్రం
భూత్వై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః. - 4స్తో
అపర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ,
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా. - 52శ్లో
కంటకి - 1.రేగు, 2.ముండ్లు గల చెట్టు, 3.చేప, విణ. కంటకము గలది.
చేప(చేఁప)ముల్లు కుట్టు - (గృహ.) చేప వెన్నముకను పోలినకుట్టు (Fish bone stitch)).
కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూదిమొన, 5.కాకి, 6.తప్పు.
కంటకము2 - విరోధయుక్తి, విణ.విరుద్ధము.
విరుద్ధము - విరోధము కలది.
విరోధము - పగ, ఎడబాటు.
విరోధచర్య - (రాజ.) యుద్ధము ప్రకటించుటకు తగినంత కారణముగా నెంచదగినచర్య.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
విప్రలాపము - అసంబద్దమగు వచనము.
విప్రలాపో విరోధోక్తిః -
విరుద్ధ ప్రలాపః విప్రలాపః - విరుద్ధమైన ప్రలాపము. ఈ ఒకటి విరోధముతో బలుకుట పేరు.
రేఁగు - 1.విజృంభించు, 2.పైకిలేచు, 3.ఉద్రేకించు, 4.హుంకరించు, వి. బదరీ వృక్షము.
విజృంభణము - ఎగసిపాటు, ఉద్రేకము చెలెరేగుట.
ఉద్రేకము - 1.విజృంభించు, 2.అతిశయించు.
ఉద్రేకించు - 1.విజృంభించు, 2.అతిశయించు.
ఉద్రిక్తము - 1.ఉద్రేకించినది, 2.విదితము.
హుంకారించు - హుమ్మని ధ్వనించు, రూ.హూంకృతి.
ఏ(ౘ)చు - క్రి.1.అతిశయించు, 2.విజృంభించు, 3.పెరుగు, 4.ఏస రేగు.
ఏస - విజృంభణము, విణ.1.గ్రామ్యము, 2.వక్రము, రూ.ఏచ.
ఏౘ - 1.గ్రామ్యము, 2.వంకర, రూ.ఏవ.
గ్రామ్యము - 1.అశ్లీలము, 2.అ స భ్య మ గు మాట, 3.పామరజన వాక్యము, విన.1.ఊరియందు పుట్టినది, 2.తెలివిలేనిది, 3.నాగరికతలేనిది. అసభ్యము - 1.సభకు తగనిది, 2.అశ్లీలము.
అశ్లీలము - 1.(అలం.) ఒక అర్థదోషము, 2.ఒక శబ్దదోషము, 3.అసభ్యవచనము, ఏవగింపు పుట్టించినమాట, బూతు.
ఏౘకంకటిచుక్క - ఉ త్త రా షా ఢా నక్షత్రము.
ఉత్తరాషాఢ - ఇరువది యొకటవ(21వ) నక్షత్రము.
కావ్యదోషములు - (అలం.) పదదోషములు శ్లేషము 17:- 1.అప్రయుక్తము, అపుష్టార్థము, అ స మ ర్థ ము, ని ర ర్థ క ము, నేయార్థము, చ్యుత సంస్కారము, సంధిగ్ధము, అప్రయోజనము, క్లిష్టము, గూఢార్థకము, గ్రామ్యము మొ, వి.
పదరు - 1.త్వరపడు, 2.కోపించు, 3.చలించు, 4.అక్షేపించు, వి.త్వరితపు మాట.
చలనము - 1.కదులుట, 2.తిరుగుట, (భౌతి.) ఒక ప్రదేశము నుండి అన్య ప్రదేశమునకు ప్రయాణించుట. (Motion)
చరించు - 1.కదలు, 2.తిరుగు, 3.చేయు.
కొత్తనీటికి చేప లెదురెక్కినట్లు, వడిగా ప్రవహించు యేరులో ఎదురడుట మిక్కిలి ఆపదలు కలిగించును. గాలి గండమే కాని నీటి గండం లేనిది. - చేప.
చేప - ఈతగాడు, నీటిలో నివాసము గలది. ఈత చేతనైతే ఏంతలోతైనా ఒకటే. ఈత నేర్చిన వానికే, నీటి గండం.
మాత్సర్యము - చలము, మత్సర్యము.
మత్సరము - మచ్చరము, క్రోధము.
అంౘలము - 1.చలము, మాత్సర్యము 2.కోపము.
చలము - 1.చలించునది, 2.వణుకునది 3.వి.వణుకు.
కోపము - కినుక, క్రోధము.
మత్సరో (అ)న్యవుభద్వేషే తద్వత్కృపణయోస్త్రిషు,
మత్సరశబ్దము పరుల మేలు చూడఁజాలమికి పేర్గునపుడు పు. ఆమత్సరము గలవానికిని, కృపణునికిని పేరగునపుడు త్రి. మదేన సరతీతి మత్సరః, నృ గతౌ. - మదముచేత వర్తించును.
మాద్యతి పర క్లేశేన హృవ్యతీతి మత్సరః. మదీ హర్షగ్లేపనయోః. - పరుని దుఃఖము(దుఃఖము - 1.బాధ, 2.చింత.)చేత సంతోషించువాఁడు. మత్సరౌ మక్షిక క్రోధా' వితి శేషః.
ఖలము - 1.చోటు, 2.పాపము, 3.తెలకపిండి, 4.వెదురు, 5.ఉమ్మెత్త, 6.క్రూరము, 7.నీచము, వికృ. కళ్ళము.
ఫేనిలము - నురుగుకలది, వి.1.కుంకుడు, 2.రేగిపండు.
రేను - రేగు (బదరీ వృక్షము).
బదరి - 1.రేగుచెట్టు 2.ప్రత్తిచెట్టు 3.ఒక పుణ్యక్షేత్రము.
కోలము1 - 1.రేగుపండు, 2.పంది, 3.ఒడి, 4.కౌఁగిలి, 5.తెప్ప.
కోలము2 - ఒకవిధమైన నాట్యము.
కైవతము - 1.కపటము, 2.జూదము, 3.ఉమ్మెత్త, 4.వైడూర్యమణి.
వ్యాజ్యము - (వ్యాజము) తగవు, దావా.
వ్యాజనము - కపటము, నెపము.
దావా - 1వ్యాజ్యము, తగవు, 2.చౌర్యము.
తగాదా - తగవు, వ్యాజ్యెము.
నెపము - 1.వ్యాజము, కారణము, 2.తప్పు, రూ.నెపము, సం.నిభ, త.నిపమ్ , క, నెవ, నెవమ.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లికూతునకు తల్లితండ్రు లిచ్చు బహుమానము.
తగవుగోరి - సంధిచేయువాడు, మధ్యస్థుడు.
మథ్యస్థుఁడు - ఇ రు క క్ష ల కు న్యాయము చెప్పువాడు, నడుమనుండువాడు.
కౌడు - 1.మోసము, 2.ప్రమాదము, తప్పు, రూ.కవుడు, సం.కపటః.
జూదము - జూజము. జూజము - ద్యూతము, పందెము వేసి ఆడెడి ఆట, మోసము, రూ.జూదము, సం.ద్యూతమ్. ద్యూదము - జూదము.
వైడూర్యము - ఒక విధమగు రత్నము, పిల్ల కన్రతనము.
బేరిల్ - (భూగ.) (Beryl) వైడూర్యము.
కైపు - 1.సారాయి మత్తు, 2.అందము, 3.విజృంభణము.
పంచశరుఁడు - మన్మథుడు, ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనములను ఐదు బాణములు కలవాడు.
ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనాఖ్యాః పంచశరాః యస్యసః పంచశరః - ఉన్మాదన శోషణ స్తంభన సమ్మోహనములను (నై)ఐదు బాణములు గలవాఁడు.
వలవాక - మన్మథ తాపము.
వలవంత - 1.మన్మథవ్యథ, 2.సంతానము.
సోన్మాద స్తూ న్మదిష్ణు స్స్యాత్ :
ఉనాదేన సహితః సోన్మాదః - ఉన్మాదముతోఁ గూడుకొన్నవాఁడు. పా. సూన్మాదః ఉన్మదః.
ఉన్మాదశీలః ఉన్మదిష్ణుః. మదీ హర్షగ్లేపనయోః. - ఉన్మాద స్వభావము గలవాఁడు. ఈ రెండు భూతావేశాదులచేత నొడలెఱుఁగనివాని పేర్లు.
కంటకిఫలము - 1.పనస, 2.ఉమ్మెత్త, 3.పల్లేరు.
అస్య ఫలే మాతులపుత్రకః :
మాతులస్య పుత్రః ఫలం మాతుల పుత్రకః - మాతుల మనఁగా ఉమ్మెత్త; అందుఁ పుట్టినది. ఈ ఒకటి ఉమ్మెత్తకాయ పేరు.
పనసపండులో మామిడిపండు రసముండునా?
అలర్కరోగము - (గృహ.) వెఱ్ఱి కుక్క కరచినచో వచ్చు పచ్చి.
కుక్క వెఱ్ఱి - (గృహ.) వెఱ్ఱికుక్క కాటు వల్ల కలిగెడు ఒక రోగము, జలద్వేషము (Hydrophobia). యోగితము - పిచ్చికుక్క.
ఉదర్కము - 1.భావికాలము, 2.భావి ఫలము, 3.ఉమ్మెత్తముల్లు.
భావి - భవిష్యత్తు, కాగలది. భవిష్యత్తు - కాగలది.
సారము - 1.జవము, 2.ధనము, 3.న్యాయము, 4.బలిమి, 5.చేప, 6.మూలగ, విణ.శ్రేష్ఠము, వి.(గృహ.) ఫలత్వము, 7.ఫలించు శక్తి (Fertility).
సారో బలేస్థిరాంశే న్యాయ్యేక్లీబం వరే త్రిషు. : సార శబ్దము సత్తువకును, చేవకును పేరైనపుడు. పు. యుక్తమైనదానికి, పేరైనపుడు న. శ్రేష్ఠమైనదానికి పేరైనపుడు త్రి. సరతి స్థిరీభవతీతి సారః. సృ గతౌ. - స్థిరమైయుండునది.
నెప్పరము - వేగము, రూ.నెప్పళము.
నెప్పరించు - క్రి.మూదలించు, నిరూపించు.
మూదలించు - దట్టమగు మంచు.
నెప్పరి - ఉపాయశాలి.
జవము - వేగము; జవనము - వేగముకలది, వి.వేగము.
వేగము - జవము, త్వర, (గణి.) భౌతి.) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
త్వర - వేగిరపాటు. వేగిరము - వేగము, విణ.త్వరితము.
త్వరితము - శీఘ్రము, వడిగలది. శీఘ్రము - వడి, విణ.వడిగలది. తరస్సు - 1.బలిమి, 2.వడి.
ధనము - 1.విత్తము(విత్తము కొద్దీ వైభవము) 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది 2.తెలియబడినది.
న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్క శాస్త్రము.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లి కూతురునకు తల్లితండ్ర్రు లిచ్చు బహుమానము.
నాయము - 1.న్యాయము, 2.ధర్మము, సం.న్యాయః.
సమంజసము - న్యాయము, ఒప్పిదము.
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
తత్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి.(భౌతి.) మౌలికమైన, సారమైన విషయము. దేని మీద ఇతర సత్యములు ఆధారబడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).
పురుషుఁడు -1.మనుష్యుడు(మర్త్యుఁడు - మనుష్యుడు), 2.పరమాత్మ.
మనుష్యుఁడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
పస - 1.చాతుర్యము, 2.సారము, 3.సమృద్ధి.
చాతుర్యము - 1.నేర్పు, రూ.చాతురి. చాతురి - నేర్పు.
నేరమి - సామర్థ్యము, రూ.నేరువు, నేర్మి, నేర్పు.
సామర్థ్యము - 1.నేర్పు(విచక్షణత - నేర్పు), 2.యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు, (Power), (గృహ.) బలము, సత్తువ.
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి. నీతి(నీతి - న్యాయము)లేకపోవుట వలన సమృద్ధి నశించును.
నిక్కచ్చి - 1.నిర్బంధము, 2.సారము, 3.మోగమోటమి లేమి, సం.నిష్కర్షః.
చేవ - 1.చేగ, సారము 2.ధైర్యము, ధీరత్వము 3.(వృక్ష.) ద్వితీయ వృద్ధి చెందిన దారుకణ సంహతి. (Secondary xylem).
చేగ - 1.కొయ్య నడిమి నల్లని గట్టి భాగము, 2.సారము, 3.ధైర్యము, రూ.చేవ. చేవ చచ్చిందా! అన్నది ఒక రకమైన తిట్టు.
సంహతి - 1.సమూహము, గుంపు 2.కలయిక, 3.సత్తువ.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
మూలగ - ఎముకల మధ్యనుండు మాంససారము, మజ్జ, సం.మూలగః.
మజ్జ - 1.చెట్టుచేవ, 2.ఎముకల యందలి నేయి.
నెనడు - మజ్జ, మూలగ.
మజ్జారజ్జువు - (జం.) వెన్నుపాము, సుషుమ్న నాడి మొదలు నుండి వెన్నెముక గుండా దాని చివరవరకు గల నాడుల త్రాడు(Spinal cord). మైరవము - (జం.) వెన్నెముకకుగాని, వెన్నుపామునకుగాని, సంబంధించినది. మేరుపు = వెన్ను పాము, (Spinal).
వెన్నుబాము - (గృహ.) వెన్నుపూసలో పారు ముఖ్యమైన నరము.(Spinal cord).
మజ్జాసంస్థా హంసవతీ - ముఖ్యశక్తి సమన్వితా|
హరిద్రాన్నైకరసికా - హాకినీరూపధారిణీ.
ఎమ్మూట - (ఎమ్ము + ఊట) ఎముకల లోని క్రొవ్వు, మూలగ.
ఎముక - శల్యము, రూ.ఎమ్ము. (Bone)
ఊట - 1.ఊరగాయరసము, 2.చేప, 3.మూలగ, 4.భూమిలోపలి నుండి పీడనము వలన పైకి ఉబికివచ్చు జలము (Spring).
ఊట వెలుపడు గ్రంథులు - (గృహ.) లోపల ఊరిన రసమును నాళుల ద్వారా బయటకి పంపు గ్రంథులు (Exocrine glands).
మజ్జద్రవ్యము - (గృహ.) క్రొవ్వు పదార్థములు, నెయ్యి, వెన్న, నూనె మొ.వి.(Fats).
నూనియ - చమురు, రూ.నూనె.
ౘమురు - రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.
ౘమురు గింజల పైరులు - (వ్యవ.) నూనెనిచ్చు గింజల పైరులు, ఉదా. ఆముదము, వేరుసెనగ, కుసుమ, నూవు మొదలగునవి, (Oiled crops).
ౘమురు దినుసులు - (వ్యవ.) నూనెగింజల పైరులుగాక నూనె లభించు ఇతర ద్రవ్యములు, ఉదా.నిమ్మగడ్డ, చందనము, సీమబాదము, కొబ్బరి మొదలగునవి, (Oil stuffs).
యూకలిప్టస్ నూనె - (రసా.) (Eucalypatus oil) ఇది జామి కుటుంబము (Myrtaceae)నకు చెందిన Eucalyptus globulus, E. citriodora, అను చెట్ల యాకుల నుండి తీయబడు అస్థిరతైలము.
అస్థిర తైలము - (వ్యవ.) గాలి పారినచో వాయురూపము నంది శీఘ్రముగా హరించిపోవు నూనెలు. (Volatile or essential oils). ఉదా. నిమ్మగడ్డి నూనె, గులాబినూనె మొ,వి.
జంబీరము - 1.నిమ్మ(నిమ్మ - జంబీరము), 2.మరువము.
కమ్మనిమ్మ - తియ్యనిమ్మ.
మరువకము - మరువము, వాసన మొలక.
ముర - మరువము, వాసనగల మొక్క.
గజనిమ్మ - పెద్దనిమ్మ, లకుచము.
లకుచము - గజనిమ్మ, రూ.లికుచము.
లికుచము - 1.గజనిమ్మ, 2.గంగరేగు.
సిట్రికామ్లము - (రసా.) ఇది నిమ్మ, దబ్బ మొ. పులుపు పండ్లరసము లో నున్న సేంద్రియామ్ల ద్రవ్యము, "నిమ్మపువ్వు" అనునది దీని ఘన ద్రవ్యము.
కొఱ - 1.పాఠీనము, 2.చేప, 3.కొఱ్ఱ ధాన్యము, 4.కొరత, వెలితి 5.ప్రయోజనము, 6.శిల్పము.
సహస్రదంష్ట్రః పాఠీనః :
సహస్రదంష్ట్రము - పాఠీనము, వేయికోరలు గల చేప.
సహస్రం దంష్ట్రాః అస్య సహస్రదంష్ట్రః - వేయికోఱలు గలిగినది.
పాఠి - పఠించువాడు, వి.వీపు.
పాఠీం పృష్ఠ మున్నయతీతి పాఠీనః - పాఠీ అనఁగా వీఁపు; దాని నెత్తికొని యుండునది.
పాఠీనము - ఒక రకమైన చేప.
భక్ష్యతయా శాస్త్రే పఠ్యత ఇతివా పాఠీనః. పఠవ్యక్తాయాం వాచి. - శాస్త్రములయందు భక్యముగాఁ బఠింపఁబడినది. ఈ రెండు వేయికోఱలు గల మీను పేర్లు.
స్త్రియౌ కఙ్గు ప్రియఙ్గూద్వే -
కేన జలేన గచ్ఛ త్యుద్దచ్ఛతీతి కంగుః, ఉ. సీ. గం ఌ గతౌ. - ఉదకముచేత నెదుగునది.
ప్రియంగువు - 1.కొఱ్ఱధాన్యము, 2.నల్లావాలు, 3.కుంకుమము.
ప్రియాణ్యఙ్గాన్యస్య ప్రియఙ్గుః ఉ. సీ. - ప్రియమైన యంగములు గలిగినది. ఈ 2 కొఱ్ఱల పేర్లు.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
ఆవలు - ఆవగింజలు, రూ.ఆవాలు.
ఆవాలు - (వ్యవ.) సాసువులు, సంబార ద్రవ్యములలో ఒకటి Cruciferae అను కుటుంబమునకు చెందిన ఆవ మొక్క, గింజలు (Mustard).
సాసువులు - ఆవాలు; సర్షపము - ఆవాలు.
సరతి దేహం వ్యాప్నోతీతి సర్షపః, సృగతౌ. - దేహమును వ్యాపించునది, పా, సరిషపః, "సర్షపస్స్యాత్సరిషపః కుటస్నేహశ్చ తుంతుభః" ఇతి త్రికాండసేష.
ఆవ - 1.ఆవగింజ, 2.బాడువ, పల్లపునేల, 3.చీడ, 4.జ్ఞాపకము.
చీడ - పైరులను చెరిచెడి పురుగు.
ఆవపాఱు - క్రి.1.జ్ఞప్తికివచ్చు, 2.తోచు.
ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (Motive). (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).
శిల్పము - చిత్తరువు వ్రాయుట, శిల్పుల పని మొదలగునవి.
శిల్పి - శిల్పకారుడు, బొమ్మలు చెక్కువాడు. శిలకు రూపం శిల్పం. రాయికి(శిలకు) రూపం తెచ్చేవాడు శిల్పి.
మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదులు చెక్కు శిల్ప విద్య (Sculpture).
ఓజు(ౙ) - 1.కమసాలి, 2.శిల్పి, 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.
శ్రేష్ఠి - కులమందు శ్రేష్ఠుడైన శిల్పి, కోమట్ల బిరుదు, విణ.కులశ్రేష్ఠుడు, వికృ. చెట్టి.
బత్తుఁడు - కంసాలివారి పట్టపు పేరు, వై.వి. భక్తుడు, సం.భక్తః.
ఏల సమస్తవిద్యలు నొకించుక భాగ్యము కల్గి యుండినన్
జాలు ననేకమార్గముల సన్నుతికెక్కు నదెట్లొకో యన్
రాలకునేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు వెట్టరెవేయి విధాలు! భాస్కరా.
తా. రాళ్ళు విద్యలు నేర్వకున్నను, వానిని దేవతా విగ్రహముగా చేసినచో వాని పాదముల మీదబడి, పూవులతో వానిని మానవులు పూజింతురు. అటులనే కొంచెము(భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.)భాగ్యమైనను గల మానవుడు అనేక రీతులుగ పొగడబడు చుండును కాని, విద్యలు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నేర్చినందున కాదు.
కుంటముక్కు - ఒకానొక చేప.
కుంట - 1.కొలను, 2.పల్లము, రూ.గుంట, సం.కుండమ్.
కొలను - కొలఁకు.
మొట్టె - ఒకరకపు మత్స్యము.
మొప్పలు - చేప మెడ కిరు ప్రక్కల నుండు ద్వారములు.
పువ్వారలు - (జం.) మొప్పలు, నీటిలో నివసించు జంతువు (చేప మొ.) యొక్క శ్వాసావయములు (Gills).
రొయ్య - చిరుచేప, పొడవు మీసములుగల చేప.
కఱకంఠుఁడు - నీలకంఠుడు, శివుడు.
కఱ - 1.నలుపు, 2.మరక, సం.కాలః.
మఱక - 1.కఱ, 2.మేకపడ్డ, (రసా.) నూనె మొ.వానిచే కలుగుమచ్చ (Stain).
డాగు - 1.గురుతు, 2.కర, మరక.
పరిగె - 1.మత్యవిశేషము, 2.కోసిన చేనిలో దిగబడిపోయిన వెన్నులు.
అపిధానము - మరుగు, మూత, అచ్ఛాదనము, రూ.పిధానము.
పిధానము - (జీవ.) మూత, కొన్ని చేపల యొక్క పువ్వారములను మూసి యుంచు పైకవచము (Operculum).
మఱుఁగు - మఱుఁగు చోటు, క్రి.1.డాగు, చాటగు, 2.సంతాపించు.
ఛాదనము - (రసా.) మూత (Disc ).
మూఁత - 1.మూకుడు, 2.బిరడ, 3.కనురెప్ప మూత. మూతలేటివి?
పిహితము - 1.కనురెప్ప మూత, 2.(అలం.) ఒక అర్థాలంకారము, విణ.కప్పబడినది.
శరావము - 1.మూకుడు, 2.మూక.
శరం పతదుదకాదిక మవతీతి వరావః అ. ప్న. అవ రక్షణే. - పడునట్టినీళ్ళు మొదలయినదానిని రక్షించునది.
శీర్యత ఇతి శరావః, శౄ హింసాయాం. - నశించునది.
మూకుఁడు - మట్టిమూత, శరావము.
మూక - 1.సమూహము, 2.దండు.
ఉదంచనము - 1.మూకుడు, 2.చేద, 3.ఎగజిమ్ముట, విణ.ఎగజిమ్ముటకు సాధనమైనది.
దిబ్బడము - మూకుడు, రూ.దబ్బడము.
దబ్బడము - మూకుడు, సిబ్బి, రూ.దబ్బుడు.
సిబ్బి - ఇత్తడి మూకుడు.
మలక - 1.తురక, 2.మూకుడు.
తురక - తురుష్కుడు, మ్లేచ్ఛుడు, సం.తురుష్కః.
మొంౘ - తురక, సం.మ్లేచ్ఛః.
తుఱకఱాయి - బొంతరాయి.
గడము1 - కుండలోనగువాని మూత, గడి.
గడము2 - 1.తెర, 2.కంచె, 3.అగడ్త, 4.విఘ్నము, 5.గండ చేప, 6.ఒకానొక దేశము.
గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము, 3.పులిగోరు పదకము, 4.చేప పిల్ల, 5.ఒక సంఖ్య.
విఘ్నము - అంతరాయము, అడ్డు. విఘ్నరాజు - వినాయకుడు.
ఖడ్గము - 1.కత్తి 2.ఖడ్గమృగము, దాని కొమ్ము.
గండము - 1.ఏనుఁగు చెక్కిలి, 2.ఖడ్గమృగము, 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి, 6.ప్రాణాపాయము.
చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా? వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.
వజ్జీరము - 1.వజ్రము, 2.మత్స్యము.
మగఱాయి - వజ్రము.
మగమానికము - వజ్రము.
మూలఱాయి - వజ్రమణి.
నిర్ఘాతము - 1.పిడుగు, 2.వజ్రము.
వజ్రాన్ని కూరగాయల సంతలో అమ్మబోతే దానికి పలికేది వంకాయల ధరే! - కబీరు
వజ్రి - 1.ఇంద్రుడు, 2.బుద్ధుడు, 3.ఆకుజెముడు.
వజ్రో స్యాతివజ్రీ. న-పు. - వజ్రాయుధము గలవాడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
క్షత్త - 1.బ్రహ్మ, 2.సారథి, 3.దాసీపుత్రుడు, 4.శూద్రస్త్రీ యందు క్షత్రియునకుగాని, క్షత్రియస్త్రీ యందు శూద్రునికినిగాని పుట్టినవాడు 5.చేప, 6.రోకలి.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు. (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి).
క్షదతీతి క్షత్తా. ఋ. పు. క్షద గతిహింసనయాః - పీడించువాఁడు.
సారథి - 1.తేరునడుపువాడు 2.నియంత.
నియంత - తేరునడపువాడు, విణ.నడపువాడు, సం.వి.(చరి. రాజ.) సర్వాధికారి, అధినాయకుడు (Dictator).
తేరుపూన్పరి - సారథి.
తేరు - 1.కలుగు, వై.వి. 1.రథము 2.బండి, సం.రథః. అరదము - తేరు, సం.రథః.
చేప - Fish.
రోఁకలి - దంచుసాధనము, ముసలము-రోకలి, సం.గోకీలః. మామిడికర్ర తోనే రోకలి చేయడము.
అయోగ్రం ముసలో (అ)స్త్రీస్యాత్ -
అయః అగ్రే అస్య అయోగ్రం, ప్న, ఇనుము అగ్రమందు గలది.
ముస్యతే ధాన్య మనేన ముసలః, ప్న. ముస ఖండనే. - దీనిచేత ధాన్యము దంచఁబడును. ఈ 2 రోకలి పేర్లు.
అయోముఖము - ఇనుపమొన కలిగినది, వి.1.బాణము, 2.కఱ్ఱువేసిన నాగలిదుంప, 3.రోకలి.
ముసల మాయుధ మస్యాస్తీతి ముసలీ. న-పు. - రోఁకలి ఆయుధముగాఁ గలవాఁడు, బలరాముడు.
దృతి - 1.తిత్తి, 2.తోలు, 3.చేప.
తిత్తి - 1.చిన్నసంచి, 2.కొలిమి తిత్తి, 3.సుతితిత్తి, సం.దృతి.
తోలు - పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
దృతిక - (జం.) (Utriculus) చెవిలో మధ్య గుహ, (Vestibute) యొక్క పై భాగము.
శరారి రాటి రాతిశ్చ -
శరారి - బాతు Duck.
శరం నీరం హింసాం వా ఋచ్ఛతి శరారిః - నీటిని గాని హింసనుగాని పొందునది. ఋ గతౌ.
ఆటి - 1.ఒక జాతి బాతు, 2.ఆడేలు పిట్ట, 3.ఒక రకపు చేప.
అటతీత్యాటిః. సీ. అట గతౌ. - చరించునది.
ఆడి - ఆటి.
ఆడెలు - ఆడి, ఒక జాతి పక్షి, రూ.ఆడేలు.
అతతీత్యాతిః. సీ. అత సాతత్యగమనే. - ఎల్లప్పుడు తిరుగునది. ఈ మూడు 3 ఆఁడేలను పక్షి పేర్లు.
ఉల్లంకి - చేపలను, పురుగులను తిను ఒక జాతి పిట్ట.
టిట్టిభము - లకుముకి పిట్ట.
టిట్టితి నిష్ఠురం భాషతే టిట్టిభకః - టిట్టి యని నిష్ఠురముగాఁ బలుకునది.
లకుమిక - చేపలబట్టు పిట్ట, తిట్టిభము.
టిట్టీతి శబ్దేన భాతీతి టిట్టిభకః, భా దీప్తౌ. - టిట్టి యనెడు శబ్దముచేత నొప్పునది, లకుముకి పిట్ట.
ఆకాశంలో పక్షికి నీటిలోని చేప ఆహారం! చేప కనిపించే వరకు కొంగకు యోగదృష్టి అభాసమే. కొంగలు సరస్సులోని చేపలనీడను పట్టి రయ్యిన దిగి, చేపలను నోట కరచు కొని ఎగురుతాయి!
పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరు కాలము. February, March నెలలు, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు శిశిర ఋతువు.
26. పూరాభాద్ర, ఉత్తరాభాద్ర - రెండేసి 4 నక్షత్రములుండును.
పూర్వాభాద్ర - ఇరువదియైదవ(25వ) నక్షత్రము.
పూర్వ - తూర్పు; ప్రాచి - తూర్పు.
ప్రాక్ ప్రాచ్యాం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.
స్యుః ప్రోష్ఠపదా భాద్రపదాః స్త్రియః :
ప్రౌష్ఠపద - పూర్వాభద్రా నక్షత్రము.
ప్రోష్ఠోగౌః తస్యేవ పాదాయాసామితి ప్రోష్ఠపదాః. ఆ. సీ. - ప్రోష్ఠ మనఁగా నెద్దు(ఎద్దు), దానిపాదముల వంటి పాదములు గలవి.
భాద్రపద - 1.ఉత్తర భద్రపదా నక్షత్రము, 2.ఇరువది యారవది.
భద్ర పదం యాసా తాః - శుభకరములైన పాదముగలవి. ఈ రెండు 2 పూర్వభాద్ర ఉత్తరాభాద్రల పేర్లు.
అహిర్బుధ్నియః ప్రథమా న ఏతి | శ్రేష్ఠో దేవానాముత మానుషాణామ్ | తం బ్రాహ్మణా స్సోమపాస్సోమ్యాసః | ప్రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే | చత్వార ఏకమభి కర్మ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వదంతి | తే బుధ్నియం పరిషద్యగ్గ్ స్తువంతః | అహిగ్ం రక్షంతి నమసోపసద్య ||26||
అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
త్రీణిలోచనాని యస్యసః త్రిలోచః - మూడుకన్నులు గలవాఁడు.
త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః - మూఁడుకన్నులు గలవాఁడు.
త్ర్యంబకుఁడు - శివుడు, ముక్కంటి.
త్యంబక సఖుఁడు - కుబేరుడు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
మిక్కిలి కంటి వేల్పు - ముక్కంటి.
మిక్కిలి - విణ. 1.అధికము 2.శ్రేష్ఠము.
బేసికంటి - (బేసి + కన్ను) ముక్కంటి.
బేసి - విషమము, సమముకానిది, విణ.(గణి.) సరిగాని సంఖ్య(Odd). 1, 3, 5, 7 వంటివి, చూ. (ఆయుగ్మ సంఖ్య).
విషమము - సమము కానిది.
విషమాక్షుడు - శివుడు, వ్యు.బేసి కన్నులు కలవాడు.
బేసి కైదువుజోదు - అసమశరుడు, మన్మథుడు.
అసమశరుఁడు - మనమథుడు.
కైదువు - ఆయుధము.
(ౙ)జోదు - యోధుడు, యుద్ధముచేయువాడు, సం.యోధః.
ముక్కంటి చుక్క - ఉత్తరభాద్ర పదా నక్షత్రము, ఆర్థానక్షత్రమని కొందరు.
చుక్క- 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః 2.చుక్రః.
ఎదురుచుక్క - 1.అశుభప్రదము, 2.అనిష్టము, 3.కూడనిది. (శుక్ర నక్షత్రము ఎదురుగున్నప్పుడు ప్రయాణించుట కూడదందురు.)
ఎండదొర - సూర్యుడు Sun.
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరు కాలము. February, March నెలలు, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు శిశిర ఋతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకర్తె, స్వాతికార్తె, మొ.వి, విణ.క్రాంతిః.
పూషా రేవత్యన్వేతి పంథామ్ | పుష్టిపతీ పశుపా వాజబస్త్యౌ | ఇమాని హవ్యా ప్రయతా జుషాణా | సుగైర్నోయానైరుపయాతాం యజ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీ నః | గావో నో అశ్వాగ్ం అన్వేతు పూషా | అన్నగ్ం రక్షంతౌ బహుధా విరూపమ్ | వాజగ్ం సనుతాం యజమానాయ యజ్ఞమ్ ||27||
పూషుఁడు - సూర్యుడు Sun. సూర్యుఁడు - వెలుగురేడు.
పుష్ణాతీతి పుషా. న. పు. పుష పుష్టౌ - పోషించువాఁడు.
సూర్యతనయ - యమున.
సూర్యతనయుఁడు - 1.శని, 2.కర్ణుడు.
పూషదంత వినాసాయ భగనేత్రభిదే నమః
భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః |
రేవతీపతి - బలరాముడు.
రేవతీరమణః, రేవత్యారమణః పతిః - రేవతిదేవికి భర్త.
రేవతి - 1.ఇరువది ఏడవ నక్షత్రము (27వ), 2.బలరాముని భార్య.
27. రేవతి-చేపవలె 32 నక్షత్రములుండును.
మీనము - 1.చేప, 2.మీనరాశి (Pisces).
మీనకేతనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువదిసంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
మీనురూపు రిక్క - రేవతీ నక్షత్రము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, చుక్కలరాయుడు.
చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు Moon.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
కొనరిక్క - రేవతీ నక్షత్రము, అశ్వని మొ. వానిలో చివరి నక్షత్రము.
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపు జూలు.
చివర - 1.కొన, 2.అగ్రము.
అగ్రము - 1.ఎదురు, 2.సమీపము, 3.కొన, విణ.మొదటిది, (భూగో.) సముద్రములోనికి చొచ్చుకొని పోయిన నేలకొన.
కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కాష్ఠా - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది.
అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా -
అష్టాదశ నిమేషాః కాష్ఠేత్యుచ్యతే - పదునెనిమిది 18 ఱెప్పపాట్ల కాలము కాష్ఠ యనంబడును.
కాశతే కాష్ఠా, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. 18(Seconds) నిమేషములకాలము ఒకటి కాష్ఠ.
కడౘుక్క - రేవతీ నక్షత్రము.
ౘుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
ౘుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.
దిక్కు - 1.శరణము 2.దిశ, స్థానము, నెలవు.
దిశ - దిక్కు, దెస (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కులలో నొకటి.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా 2.దశా. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది.
శరణము - 1.రక్షకము, రక్షణము, 2.గృహము.
గృహము - 1.ఇల్లు 2.భార్య.
శరణం గృహరక్షిత్రోః :
శరణ శబ్దము ఇంటికిని, రక్షించువానికిని పేరు. శీర్యతే శృణాతి దుఃఖాదికమితి శరణం. శౄ హింసాయాం. నశించునది. దుఃఖాదులను జెఱుచువాఁడును గనుక శరణము. "ప్రతిశరణమశీర్ణ జ్యోతిరగ్న్యాహితానా" మితి గృహే ప్రయోగః. 'శర్ణం తరుణేందుశేఖర"' ఇతి రక్షకే ప్రయోగః.'"శరణం రక్షణే వధ"ఇతి విశ్వప్రకాశః.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
ఆశ - 1.కోరిక 2.దిక్కు. ఆశ కంతము లేదు, నిరాశకాదిలేదు.
ఆస - అపేక్ష 3.దిక్కు, సం.ఆశా.
అపేక్ష - కోరిక, కాంక్ష.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.
అంక - పార్శ్వము, ప్రక్క, రూ.అణక.అణక - ఎద్దు మెడమీద కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.
క్రేవ - పార్శ్వము.
పార్శ్వము - 1.ప్రక్క 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), విం. విణ. (జీవ.) క్రన్నులనుండి బయలు దేరినది (Latral).
బరి - పార్శ్వము.
బరికాఁడు - మావటివాడు.
మావటి - హరుడు, మల్లుడు, రూ.మావటీడు, మాస్టీడు, విన.శ్రేష్థుడు.
హరుఁడు - శివుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.
(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురుగురువు, వ్యు.తెల్లవివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
(ౘ)చుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.
మల్లు - 1.కోతి, 2.మల్లుడు, జెట్టి, సం.మల్లః.
కోఁతి - వానరము, రూ.క్రోఁతి.
వానరము - కోతి.
కిరీటి - 1.అర్జునుడు, వ్యు.ఇంద్ర దత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
కోఁతికొమ్మచ్చి - ఒకవిధమగు బాలక్రీడ.
మల్లుఁడు - జెట్టి.
జెట్టి - 1.మల్లుడు, 2.శూరుడు, విణ.శ్రేష్ఠుడు.
శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడవివాడు, ప్రౌఢుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
అంతకుఁడు - యముడు.
అంతం నాశం కరోతీత్యంతకః, డు కృఞ్ కరణే - నాశమును జేయువాఁడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - న వ గ్ర హ ము ల లో ఏడవ గ్రహము (Saturn).
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ|
అంతము - 1.తుద, 2.చావు, 3.స్వభావము, విణ.1.సమీపము, 2.రమ్యము.
అంత్యతేబధ్యతే (అ)త్ర అంతః, అతి అదిబంధనే. - దీనియందు పాశబద్ధుఁడౌను.
తుద - చివర, కడ, అంతము, రూ.తుది.
తుదిముట్టు - క్రి.1.చచ్చు, 2.నెరవేరు.
తుదితాకు - క్రి.నెరవేరు.
తుదిరేయి - క్రి.1.కల్పాంతము, 2.చివరిరాత్రి.
మృతి - చావు; (ౘ)చావు - మృతి.
మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.
మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మిత్తి(ౘ)చూలు - కేతువు Ketu.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
మిత్తిగొంగ - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ(గొంగ – శత్రువు), వ్యు.మృత్యువును జయించినవాడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
సహజము - స్వభావము, విణ.కూడ బెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది, (Normal).
రమ్యము - ఒప్పిదమైనది.
రమణ - 1.ఒప్పిదము, 2.ప్రీతి, సం.రమణమ్, రమ్యమ్. రామతీర్థము నందు రమణ|
సదేశము - సమీపము.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
చేవాటు - సమీపము. చేయలఁతి - సమీపము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము.
చేరుగడ - 1.సమీపము, 2.దిక్కు, 3.శరణము.
చేరువకాడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 3.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ద మప్పటి నిలుకడ.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువూన్నచోటు (Position).
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెలవుకొను - క్రి.1.నిలుకడయగు, 2.నిలుచుండు, రూ.నెలకొను. నెలకొను - క్రి.స్థిరపడు.
జీవనమింకఁ బంకమున జిక్కినమీను చలింప కెంతయున్
దాపుననిల్చి జీవనమె తద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనగాని గుఱి తప్పనివాఁడు తరించు వాఁడయా
తాపక భక్తియోగమున దాశరథీ కరుణాపయోనిథీ.
తా. చేఁప నీళ్ళు ఎండిపోయిన(పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.) బురదలో చిక్కుకొన్నను, ఆ చోటును విడిచి కదలక అందే నిలిచి నీళ్ళనే తుదకు గోరునట్లు, నీయందలి చింతనము నందే గుఱియుంచి ఎన్ని కష్టములు వచ్చినను దానిని వదలక యుండు వాడు. అట్లుండుటచే నీయెడల భక్తి (యు)ఉదయించి ఆ భక్తియోగమున సంసారము దాటునని తాత్పర్యము.
కా తే కాంతా కస్తే పుత్రః - సంసారో య మతీవ విచిత్రః,
కస్య త్వం వా కుత ఆయాతః - తత్వం చింతయ తదిహభ్రాతః. - భజగోవిందం
No comments:
Post a Comment