మృగశిర 2, ఆరుద్ర 4, పునర్వసు 3 పాదములు, మిధునరాశి, మిధునం, దంపతులు.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము, (Quantity).
అశ్నుత ఇతి రాసిః, పు, అసూ వ్యాప్తౌ. - వ్యాపించునది.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
సమ్య గూహ్యతే ఏకత్రేతి సమూహః, ఊహ వితర్కే. - ఒకదిక్కున నన్నియు లెస్సగా నూహింపఁ బడును.
రాసులు - ఇవి పండ్రెండు, మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుద్ధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః.
తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.
జింకతలచుక్క - మృగశీర్షము.
మృగశిర - అయిదవ నక్షత్రము. 5th star.
(ౙ)జాబిలిరిక్క - మృగశీర్ష నక్షత్రము.
తొలకరి - చైత్ర వైశాఖములందలి వాన, వర్షర్తువు, రూ.తొల్కరి.
తొల్కరి - తొలుకరి.
తొలుకారు - మొదటికారు, వర్షర్తువు ముక్కారు పంటలలో మొదటికారు పంట.
తొలుకు - క్రి. కురియు. కురియు - క్రి.1.గుప్పించు, 2.వర్షించు.
గుప్పించు(ౘ) - క్రి. 1.(అధికముగా)ఇచ్చు, 2.బాణాదులను(అధికముగా) ప్రయోగించు, 3.కురియు.
తొలకరించు - క్రి.వానకురియు, పుట్టు, రూ.తొల్కరించు.
పుట్టు - క్రి. సంభవించు, జన్మించు.
ఉదయించు - క్రి. 1.పుట్టు, కలుగు, 2.సూర్యాదులు పొడుచు.
తొలకరిసూడు - హంస, వ్యు.వర్షాకాల విరోధి.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
సూడు - 1.పగ, 2.పగవాడు.
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ 23వ సంవత్సరము.
పగతుఁడు - (పగ+అతడు) శత్రువు(శత్రువు - పగతుడు), పగవాడు.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
అరి1 - 1.చక్రము, 2.చక్రాయుధము, 3.చక్రవాకపక్షి, 4.శత్రువు, 5.(జ్యోతి.) లగ్నమునుండి ఆరవస్థానము, 6.చండ్రచెట్టు.
అరి2 - 1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.
అరి3 - అవ్య. కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా.కల్లరి, నేర్పరి (కల్ల+అరి, నేర్పు+అరి).
సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు తొలకరి వానలు ప్రారంభమవుతాయి. దీనినే మృగశిర కార్తె అంటారు. వర్షాకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు.
ఆరబము - 1.తొలకరిపైరు, 2.పైరు, సం.ఆరంభః.
ఆరంబము - 1.మొదలు పెట్టుట, ఉపక్రమము, 2.ప్రయత్నము, 3.కార్యము, 4.త్వర, సం.ఆరంభః, 5.పైరు (ఇది తెనుగున మాత్రము కానవచ్చును), రూ.ఆరబము.
ఆరంభించు - యత్నించు, మొదలు పెట్టు.
ఆరకాఁడు - కృషీవలుడు, రైతు.
పైరు - సస్యము; సస్యము - పైరు, రూ.శస్యము. పైరుకు ముదురు, పనికి లేత కావాలి.
పైరుల యెకిమీఁడు - 1.చంద్రుడు, 2.ఓషధీశుడు.
ఓషధీశుఁడు - చంద్రుడు Moon.
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్ఠాషాడ మాసములు.)
ఊష్మము - 1.ఆవిరి, 2.వేసగి, 3.గ్రీష్మ ఋతువు, 3.ఊష్మధ్వనులు (శ, ష, స, హ).
గ్రీష్మము - 1.వేడి, వేసంగి.
గ్రీష్మ - Summer; శుచి, అగ్ని(నీరు బిడ్డగా కలది).
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస - 1.అంౘ, 2.యోగి, యోగాభ్యాసము జేయు పురుషుడు 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము రూ.హంసము.
మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః. - బుధుడు
వైజననము - ప్రసవమగు నెల.
విజననం గర్భమోచనం త దస్మిన్నస్తీతివైజననః - విజనన మనఁగా గర్భోత్పత్తి; అది దీనియందుఁ గలదు.
స్త్రీగర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె?
ప్రసవపూర్వము - (గృహ.) కాన్పుకు ముందున్నది (Antinatal or prenatal).
స్యాదుత్పాదే ఫలే పుష్పే ప్రసవో గర్భమోచనే,
ప్రసవము - 1.కానుపు, 2.పుష్పము, 3.పుట్టుక, 4.పండు, 5.బిడ్డ.
ప్రసవశబ్దము పుట్టుటకును, ఫలమునకును, పుష్పములకును, ప్రసూతికిని పేరు. ప్రసవనం, ప్రసూయతే చ ప్రసవః, షూఙ్ ప్రాణిప్రసవే. - పుట్టుటయు, పుట్టునదియు ప్రసవము.
టీ, స, ఉత్పద్యత ఇత్యుత్పాదః, అపత్యం, యథా _ 'అహో పశునామపి ప్రసవవాత్సల్యా మితి మురారిః, అయ మనుజ్ఞాయామపి "భగవతః ప్రసవే."
ప్రసూతి - కానుపు, పుట్టుక.
కానుపు - 1.వీక్షణము, 2.ప్రసూతి, రూ.కాన్పు.
ప్రసూతిః ప్రసవే -
ప్రసవనం ప్రసూతి, సీ, ప్రసవశ్చ, షూఞ్ ప్రాణిప్రసవే. - కనుట ప్రసూతి, ప్రసవమును. ఈ 2 బిడ్దలను గనుట పేర్లు.
సంధ్యనిద్ర - (గృహ.) 1.చీకటి పడెడి సమయమందు నిద్రపోవుట, 2.ప్రసూతి సమయమున గలుగజేయు మైకము, (ఇందు కై మార్ఫిన్, స్కోపోలమిస్ అల్కాలాయడ్ల మిశ్రమమునిత్తురు) (Twilight sleep).
జిడ్డుకడలి - పాలసముద్రము.
జిడ్డు - నేయి మొదలగు వాని యందలి మెరుగు. లలాటం అమృతోభవ|
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాల కడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
న మ్రియంతే అనేనేత్యమృతం, మృఙ్ ప్రాణ త్యాగే. - దీనిచేత మరణమును బొందరు, నీరు.
నమృతా భవం త్యనేనేత్యమృతం - దీనిచేత మృతులు గారు, అమృతము.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీయతే క్షీరం, క్షి నివాసగత్యోః. - ప్రవహించునది.
పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము White horse, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
హంసి - ఆడుహంస.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్థుడు, మరీచి). చతుర్థం హంసవాహనా|
క్షీరాబ్ధి లోపల క్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ.…
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.అత్మము.
మోక్షము - 1.కైవల్యము, 2.మోచనము, విడుపు, ముక్తి.
నాస్తిమృతం మరణమస్మిన్నిత్యమృతం - మరణము దీనియందు లేదు, మోక్షము.
రసాయనత్వాదమృతా - అమృతమువంటి రసము గలది, ఉసిరిక చెట్టు.
న మ్రి యత ఇత్యమృతా, మృఙ్ ప్రాణత్యాగే. - నాశములేనిది, తిప్పతీఁగె.
నాస్తి మృతిః మరణ మస్యా ఇత్యమృతా - దీనివలన మరణము లేదు, కరకచెట్టు.
ప్రేమవేంకటపతిఁగలసె ప్రియ మిథునరాశి.....
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.
గురతే వివాహాయ ఉద్యతతే గౌరీ, సీ. గురీ ఉద్యమనే. - వివాహమున కుద్యోగించునది.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
స్త్రీపుంసా మిథునం ద్వన్ద్వం :
మిథునము - 1.ఆలుమగల జత, 2.ద్వయము, 3.మిథునరాశి.
మేథతే సంగచ్ఛ ఇతి మిథునం. మేథృ సంగమే - కూడియుండునది.
ద్వంద్వము - 1.జత, 2.స్త్రీపురుషుల జత, 3.ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధము, 3.రహస్యము, 4.శీతోష్ణాదులు.
ద్వౌ సహవర్తే ద్వంద్వం - రెండును గలసియుండునది. ఈ స్త్రీపురుషులజంట పేర్లు.
ౙత - 1.జంట, 2.సామాన్యము, (గణి.)రెండు వస్తువుల గుంపు(Pair).
దంపతీ జంపతీ జాయాపతీ భార్యాపతీ చ తౌ,
దమితి జమితి మంత మవ్యయద్వయం జాయాశబ్దపర్యాయం, జాయ - భార్య)జాయా చ పతిశ్చ దంపతీ, జంపతీ, జాయాపతీ చ భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.)భార్యా చ పతిశ్చ భార్యాపతి - ఆలుమగము దంపతులు, జంపతులు, జాయాపతులు, భార్యాపతులు ననం బడుదురు. ఈ 4 ఆలుమగలు.
దంపతులు - ఆలుమగలు, రూ.జంపతులు.
జంపతులు - ఆలుమగలు రూ.దంపతులు.
దాంపత్యము - దంపతి భావము, భార్యాభత్తృ భావము.
ఆలు1 - 1.స్త్రీ (ఉదా.బాలెంతరాలు, గుణవంతురాలు మొ వి.) 2.భార్య.
స్త్రీ - ఆడుది.
స్త్యాయతి సంఘాతో భవత్యస్యాం గర్భ ఇతి స్త్రీ స్త్యై స్త్యై శబ్దసంఘాతయో. - దీనియందు గర్భము కూర్చఁబడును.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయ మాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
భ్రియత ఇతి భార్యా, భృఞ్ భరణే. - భరింపఁ బడునది.
భార్యాటికుఁడు - భార్యమాట జవదాటనివాడు.
ఆలు2 - వి. బహు. ఆవులు.
ఆవు - గోవు Cow.
గోవు - 1.ఆవు Cow, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు Sun.
గచ్ఛతి స్వస్థానమితిగోః, ఓ. సీ. - ఉనికిపట్టునకుఁ బోవునది.
గచ్ఛతి గమ్యత ఇతి వా గౌః, గమ్ ఌ గతౌ. - పోవునది గనుకనైనను, పొందఁబడునది గనుక నైనను గోవు.
ఆలు3 - హిం.వి. బంగాళదుంప, ఉర్లగడ్ద.
కాండకందము - (వృక్ష.) భూమిలో నున్న కాండపుశాఖ చివర ఆహార పదార్థముతో ఉబ్బిన గడ్ద, ఉదా. ఆలుగడ్డ.
పిష్టద్రవ్య సస్యములు - (వ్యవ.) పిండి పదార్థమునిచ్చు పైరులు (Starch crops), ఉదా. ఆలుగడ్డ, కఱ్ఱపెండలము మొదలగునవి.
భూమిజ- సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
కిరణమాలి - సూర్యుడు Sun.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరతి తమ ఇతి కిరణః, కౄ విక్షేపే - తమస్సును పోఁగొట్టునది.
కిరణశలాక - (భౌతి.) సమాంతరముగ నున్న కిరణముల సమూహము (Pencil of rays).
సూర్యుఁడు - వెలుగురేడు.
సువతి ప్రేరయతి వ్యాపారేప్వితి సూర్యః-షూఞ్ ప్రేరణే - వ్యాపారములయందుఁ బ్రేరేపించువాఁడు.
సూర్యగ్రహణము - రాహు కేతువులలో నేదైన ఒక బిందువు భూమికి వెనుకగా వచ్చినచో సూర్యకిరణములు భూమిపై సోకక సూర్యగ్రహణము కలుగును.
సూర్యదృశ్యగతి - (భూగో.) సూర్యుడు పోవుచునట్లు కనబడు మార్గము.
సూర్యతనయ - యమున.
సూర్యస్య తనయా సూర్యతనయా - సూర్యుని కూఁతురు.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
జాతాపత్యా ప్రజాతా చ ప్రసూతా చ ప్రసూతికా,
జాతాపత్య - బాలెంత.
జాతామపత్య మస్యాః జాతాపత్యా - పుట్టిన బిడ్డ గలది.
ప్రజాత - బాలెంత.
ప్రకర్షేణ జాయంతే అపత్యా న్యస్యాః ప్రజాతా - మిక్కిలి బిడ్డలు దీని యందుఁ బుట్టుదురు.
బాలెంత - బిడ్డను గన్నది, ప్రసూత, (బాలెంతరాలు).
ప్రసూత - బాలెంతరాలు.
ప్రసూయతే పుత్రాన్ ప్రసూతా; ప్రసూతికా చ - బిడ్దలను గనునది. ఈ 4 బిడ్దలఁ గనుదాని పేర్లు.
కాయకము - బ్రతుకు, జీవనము.
బ్రతుకు - 1.జీవనము, 2.జీవనోపాయము.
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
జీవంత్యనేనేతి జీవనం, జీవ ప్రాణధారణే. - దీనిచేత బ్రతుకుదురు.
స్వల్పాఙ్గుళ్యోర్మూలే కాయమ్,
స్వలాంగుళ్యోర్మూలే = చిటికెనవ్రేలు దర్భవ్రేలు వీని మొదట, కాయం = ఋషితీర్థ ముండును. కః ప్రజాపతిర్దేవతా (అ)స్యకాయం, పులస్త్యాది ప్రజాపతులు దేవతలుగాఁ గలిగినది. పులస్త్యాది ప్రజాపతులు ఋషులు గనుక ఆ ప్రదేశముల వలననే ఋషితర్పణము సేయవలె ననుట.
కాయజుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
కాయము1 - 1.మేను, శరీరము, 2.స్వభావము.
చీయతే అవయవైరితి కాయుః, చిఙ్ చయనే. - అవయములచేత కూర్చఁబడునది.
మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.
శరీరము - దేహము.
శీర్యత ఇతి శరీరం, శౄ హింసాయాం. - నశించునది.
కాయము2 - బాలెంతకిచ్చు మందు, స్పర్శ్య.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.అత్మము.
బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.
వలతే భువనం మూలబాహుళ్యా ద్బాలం, వబయోరభేదః, వలసంవరణే. - భూమిని వేళ్ళ చేతఁ జుట్టుకొనునది.
బాలా స్సూక్ష్మాః పత్రాత్మకా స్తనయా యస్యసః బాలతనయః - సూక్ష్మములైన పత్రరూపములైన కొమాళ్ళు గలది.
బాలాజి - శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలా.
భాషితము - మాట.
భాష్య తే స్మ భాషితం, భాష వ్యక్తాయాం వాచి.
భాష్యత ఇతి భాషితం, భాష వ్యక్తాయాం వాచి-భాషింపఁబడునది.
సత్క్రారము - సమ్మానము, రూ.సత్కృతి, సత్క్రియ.
సమ్మానము - గౌరవము, సన్మానము.
సన్మానము - గౌరవము, రూ.సమ్మానము.
సత్కరించు - క్రి.సమ్మానించు; సన్మానించు - క్రి.గౌరవించు, రూ.సమ్మానించు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.అత్మము.
ఆత్మానాం మానయతీతి మానః, మాన పూజాయాం. - తన్ను బూజించుకొనః జేయునది.
భోజనము - ఆహారము, సాపాటు.
భుక్తిః భోజనం బుజపాల నాభ్యవహారయోః.
ఆహారనాళిక - (జం.) ఆహారపు గొట్టము, గొంతునకును అన్నకోశమునకును మధ్యనున్న గొట్టము (Aesophagus).
అమృతం సద్గుణాభార్యా అమృతం బాల భాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్||
తా. గుణవతియైన యాలు(ఆలు), భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.)బాలుని మాటలు, రాజ సన్మానము - గౌరవము, రూ.సమ్మానము, ప్రియయుక్త భోజనము - ఆహారము, సాపాటు ఇవియన్నియు నమృత సమానములు. – నీతిశాస్త్రము
ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణశివ|
ౙత - 1.జంట, 2.సామాన్యము, (గణి.)రెండు వస్తువుల గుంపు(Pair).
ద్వంద్వము - 1.జత, 2.స్త్రీపురుషుల జత, 3.ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధము, 3.రహస్యము, 4.శీతోష్ణాదులు.
ద్వౌ షవర్తేతే ద్వందం. - రెండును గలసియుండునది.
దొందు - దొందుదొందే! (జత.) సం.ద్వంద్వమ్.
దొందము - రోగము, వాత పిత్త శేష్మములలో ఏ రెండిటి చేతనైనను కల్గు రోగము, సం. ద్వంద్వమ్.
ద్వన్ద్వం కలహ యుగ్మయోః : ద్వంద్వశబ్దము యుద్ధమునకును, జతకును పేరు. మఱియు మిథునమునకును, రహస్యమునకును పేరు. ద్వయో రిదం, ద్వౌ ద్వౌచ ద్వంద్వం - ఇద్దరి సంబంధమైనది, రెండును గనుక ద్వంద్వము. కలహే 'బాహుద్వంద్వః ప్రవృత్తయో' రితి. మిథునే - ద్వంద్వాని భావం క్రయయా వివవ్రు రితి. "ద్వంద్వం రహస్యమర్యాదా యజ్ఞపాత్ర ప్రయోజన"ఇతి శేషః.
ఎక్కటి కయ్యము - ఒకనితో ఒక్కడే చేయు యుద్ధము, ద్వంద్వ యుద్ధము, దండపోరు.
ద్వయము - 1.జత, రెండు.
ద్వయి - దోయి, జత (సంబంధము).
దోయి - ద్వయి, జత, సం.ద్వయీ.
దోయికట్టు - జతగూడు.
ద్వితయము - రెండు.
ద్వితీయ - 1.భార్య, 2.విదియ, 3.రెండవది (స్త్రీ), 4.(వ్యాక.) ద్వితీయా విభక్తి.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
మిథో న్యోన్యం రహస్యపి :
మిథః - ఇది తమలోఁ దా మను నర్థమందును, ఏకాంతమందును వర్తించును. ఉ. తమలోఁ దా మను నర్థమునకు - 'వాసిష్ట కౌండిన్య మైత్రావరుణానా మిథో న వివాహ్యాః'. ఏకాంతమునకు - మిథస్త్వదాభాషణ లోలుపం మనః', 'మిథః కృతే మమ్మథ ఏవ సాక్షీ'.
రహస్యము - ఏకాంతము, దాచదగినది.
రహ్యంతే అనుపయోగినో జనా అత్రేతి రహః స. వ. రహ త్యాగే. - అనుపయుక్తులైన జనులు దీనియందు విడువఁబడుదురు.
రమంతే (అ)త్రేతి వా రహ, రము క్రీడాయాం. - దీనియందు రమింతురు. 4 రహః అవ్యయము.
ఏకాంతము - 1.మిక్కిలి, 2.ఇద్దరు కంటె ఎక్కువ జనము లేనిది (చోటు) 3.రహస్యము.
ఏకః అంతః నిశ్చయో యత్ర తదేకాంతం - ముఖ్యమైన నిశ్చయము గలది.
రహస్యం తద్భవే త్రిషు,
రహసి భవం రహస్యం, త్రి. - ఏకాంతస్థలమందుఁ బుట్టినది. ఈ ఒకటి అవిజనస్థలమందు బుట్టిన మాట పేరు.
మంతనము - 1.ఆలోచన, 2.ఏకాంతము, 3.రహస్యము, సం.మంత్రః.
ఆలోచన - 1.చూచుట, 2.ఆలోచించుట, యోచన, తలంపు.
మంత్రణము - రహస్యాలోచనము, వికృ.మంతనము.
ఉపనిషత్తు - 1.బ్రహ్మజ్ఞానము, 2.వేదాంతము, ఛాందోగ్యము, మొ.వి. 3.ధర్మము, 3.ఏకాంతము.
ధర్మే రహ స్యుపనిషత్ -
ఉపనిషచ్చబ్దము ధర్మమునకును, రహస్యమునకును పేరు. సర్వే అర్థా ఉపనిషీదంత్యస్యామితి ఉపనిషత్, ద. సీ. షద్ ఌ విశరణ గత్యవసాదనేషు. - దీనియందన్ని యర్థములు నుండును.
రహస్యములలో పరమసత్యమును నేనే! సూనృతం అహమేవ! ప్రియవచన స్వరూపుడను. - భగవద్గీత
దంటమోముల దేవర - అగ్ని.
దంట - జంట.
యుగ్మము - జంట, (భౌతి., గణి.) స్థితిశాస్త్రము నకు చెందిన పదము. ఒకే వస్తువు మీద సమానాంతరముగను, విరుద్ధ దిశలలోను పనిచేయు సమాన బలముల జంట, ఒకే వస్తువుపై విరుద్ధ దిశలలో పనిచేయు సమానాంతర బలములు.(Couple)
ౙంట - జత, సం.యుగళమ్, అవ్య.1.వెంట, 2.సమీపమునకు, రూ.జమట.
ౙమట - జంట.
ౙత - 1.జంట, 2.సామాన్యము, (గణి.)రెండు వస్తువుల గుంపు(Pair).
యుగ్మంతు యుగళం యుగమ్ : యుజ్యతే యుగ్మం, యుగళం, యుగం చ. యుజిర్ యోగే. పరస్పరము - కూడుకొని యుండునది యుగ్మము, యుగళము, యుగము. ఈ మూడు 3 సామాన్యముగా రెండు జోడై యుండుటకు పేర్లు.
సామాన్యము - సామ్యము, విణ.సాధారణము, (గణి.) కొన్ని రాసుల న్నింటికి సంబంధించినది (Common).
సమానానాం భవః 'సామాన్యం, సమానములైన పదార్థములయొక్క భావము.
సదృశం 'మానమస్యేతి సమానం, సమానమేవ సామాన్యం - సమానమే సామాన్యము.
సామ్యము - సమత్వము, పోలిక. సాధర్మ్యము - పోలిక.
యమళము - 1.జంట, 2.యుగళము.
యుగళ శిశువులు - యమళ శిశువులు, జంటపిల్లలు.
యమళశిశువులు - 1.జంటశిశువులు, 2.కవలపిల్లలు.
కవ - 1.జత, 2.కవలలు.
కవలు - జంటగా పుట్టినవారు, అమడలు (కుశలవులు, నకుల సహదేవులు). స్వతనయ కుశలవ పండిత రామ్|
అమడలు - కవలు, జంటబిడ్డలు.
యుగము - 1.జత, 2.బార, 3.కాడి, 4.యుగములు నాలుగు 1.కృత, 2.త్రేతా, 3.ద్వాపర, 4.కలియుగములు.
యానాద్యఙ్గే యుగః పుంసి యుగం యుగ్మే కృతాదిషు,
యుగశబ్దము కాఁడికిఁ బేరైనపుడు పు జతకును, కృతత్రేతా ద్వాపర కలియుగములకును పేరైనపుడు న యుజ్యత ఇతియుగః, యుగం చ, యుజిర్ యోగే, కూర్చఁబడునది. "యుగంహస్త చతుర్ష్కే స్యా దౌషణే వర్షపంచక" ఇతిశేషః.
ౙత - 1.జంట, 2.సామాన్యము, (గణి.)రెండు వస్తువుల గుంపు(Pair).
సామాన్యము - సామ్యము, విణ.సాధారణము, (గణి.) కొన్ని రాసుల న్నింటికి సంబంధించినది (Common).
సమానానాం భవః 'సామాన్యం, సమానములైన పదార్థములయొక్క భావము.
సదృశం 'మానమస్యేతి సమానం, సమానమేవ సామాన్యం - సమానమే సామాన్యము.
సామ్యము - సమత్వము, పోలిక. సాధర్మ్యము - పోలిక.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
ఆలుమగల కలహాలు అద్దముపై ఆవగింజ తుళ్ళు తున్నంతసేపు.
(ౙ)జోక - 1.సామ్యము, 2.బాగు, 3.జత, 4.విధము, 5.ఉత్సాహము, 6.మొత్తము, విణ.యుక్తము.
జోకపడు - జతపడు.
జోకచేయు - సంపాదించు, సిద్ధపరచు.
బాగు - క్షేమము, విణ.యోగ్యమైనది.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
శుభము - మంగళము; మంగళము - శుభము, క్షేమము.
విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
మొత్తము - సమూహము, వెరసి, టోకు (గణి.) అసలు వడ్డీలు కలుపగా వచ్చు మొత్తము (Amount) దత్త రాసులను కలుపగా వచ్చు మొత్తము (Total) రాసులు మొత్తము (Sum).
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.
సమన్వితము - కూడుకొన్నది; సనాథము - కూడుకొన్నది.
దంటమోముల దేవర - అగ్ని.
దంట - జంట.
ద్వికము - 1.రెండు, 2.కాకి, వ్యు.రెండు 'కా' లను గలది, 3.జక్కవ.
రెండు - 1.భేదము, వేరుపాటు, 2.ద్వయము.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.
ౙక్కవ - చక్రవాక పక్షి(చక్రవాకము - జక్కవ), రూ.జక్కువ.
ౙక్కువ - జక్కువపక్షి, సం.చక్రవాకః.
ౙక్కవగొంగ(గొంగ - శత్రువు) - చంద్రుడు.
ౙక్కవలఱేఁడు - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.
రాష్ట్రపతి - (శాస., రాజ., చరి.,) భారత రాజ్యాధిపతి, అధ్యక్షుడు (President).
రాష్ట్రము - 1.దేశము, 2.ఉపద్రవము.
రాజత ఇతి రాష్ట్రం - ప్రకాశించునది.
అథ రాష్ట్రో (అ)స్త్రీ విషయే స్యా దుపద్ర వే,
రాష్ట్రశబ్దము దేశమునకును, ఉపద్రవమునకును పేరు. ఉదా_పరరాష్ట్రభయం రాజత ఇతి రాష్ట్రం ప్న, రాజ్యదీప్తౌ. - ప్రకాశించునది.
ఉపనర్జనము - అప్రధానము, వి.1.ఉపద్రవము, 2.త్యాగము.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపద్యతే ఆపత్, ద. సీ. - అంతటఁ బొందఁబడునది.
బాధ -
బాధ - బాద్యంతే అవయేతి బాదా, బాదృ విలోడనే. - దీనిచేఁ గలియఁబెట్టఁబడుదురు.
విప్లవము - (వ్యావ.,చరి.,రాజ.,అర్థ.) తీవ్రపరివర్తనము, రాజ్యక్రాంతి, సం.వి.కొల్ల మొదలగు దేశోపద్రవము, విపత్తు.
విప్లవకారులు - (వ్యావ.) విప్లవము లేపినవారు.
పీడ - బాధ.
పీడ్యంతే అనయేతి పీడా, పీడ అవగాహనే. - దీనిచేత జనులు పీడింపఁబడుదురు.
విప్లవాలు అల్ప విషయాల కొరకే కాదు. కాని, అన్నీ స్వల్ప విషయాల నుంచే ఉత్పన్న మవుతాయి. - అరిస్టాటిల్.
అంతర్యుద్ధము - (చరి.) 1.ఒక దేశప్రజలలో జరుగు యుద్ధము, 2.అంత కలహము, 3.మనస్సులో జరుగు సంఘర్షణము.
రావడి - ఉపద్రవము, విపత్తు.
రాయిడి - ఉపద్రవము, విపత్తు.
వల్లడి - అకారాణమగు నాపద, విపత్తు.
విపత్తు - ఆపద.
విపద్యతే విపత్తి, ఈ. సీ. విపచ్చ, ద, సీ. - విపరీతముగాఁ బొందఁబడునది.
ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపద్యతే ఆపత్, ద. సీ. - అంతటఁ బొందఁబడునది.
ఆపన్నము - 1.ఆపదనొందినది, 2.లభించినది, 3.సంభవించినది.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.
ఆపన్న జన రక్షైకదీక్షా యామితతేజసే,
నమోస్తు విష్ణవే తుభ్యం రామా యాపన్నివారణే…..
ఎక్కటి కయ్యము - ఒకనితో ఒక్కడే చేయు యుద్ధము, ద్వంద్వ యుద్ధము, దండపోరు.
దొందము - రోగము, వాత పిత్త శేష్మములలో ఏ రెండిటి చేతనైనను కల్గు రోగము, సం. ద్వంద్వమ్.
దొందు - దొందుదొందే! (జత.) సం.ద్వంద్వమ్.
శ్లేష్మలః శ్లేష్మణః కఫీ,
శ్లేష్మలుఁడు - కఫరోగము గలవాడు, శ్లేష్మణుడు.
శ్లేష్మాస్యా స్తీతి శ్లేష్మలః శ్లేషణశ్చ. - శ్లేష్మము గలవాఁడు.
కఫో (అ)స్యాస్తీతి కఫీ, న. వు. - కఫముగలవాఁడు. ఈ 3 శ్లేష్మవ్యాధిగల వాని పేర్లు, తెమడతెవులు.
కఫః శ్లేష్మా -
కఫము - తెమడ, శ్లేష్మము.
కే శిరసి, కేన జలేన వా ఫలతి కఫః. నిప్బత్తౌ. - శిరస్సు నందుఁగాని జలము చేతఁగాని పుట్టునది.
శ్లేష్మము - కఫము.
శ్లిప్యతి హృదయాదౌ శ్లేష్మా. న. పు శ్లిష ఆలింగనే. - హృదయము మొదలైన దానిం బొందునది కఫము.
శ్లేష్మకళ - (జం.) ప్రేగులోపలి భాగమున నుండు అస్తరు (Mucous membrane), ఈ పొర యందలి జీవకణములు శ్లేష్మమును ఉత్పత్తి చేయును, సం. (జం.) ప్రేగుయొక్క గోడలలో నున్న నాలుగు పొరలలో లోపల నుండు మొదటి పొర(Mucosa) ఉపశ్లేష్మకళ = రెండవపొర (Sub-mucosa).
ఖేటకము - 1.డాలు, రూ.ఖేటము, 2.ఒకరకపు గ్రామము, 3.శ్లేష్మము.
ఖేటము - 1.రైతులుండు పల్లె, 2.వర్తకు లుండు పేట, 3.సూర్యాది గ్రహము, 4.శ్లేష్మము, 5.బలరాముని గద, 6.వేట, 7.చర్మము, 8.గడ్డి, 9.డాలు, విణ.1.అధమము, 2.వడ్డీ బ్రదుకునది.
గళ్ళ - కళ్ళ, శ్లేష్మము.
తెమడ - శ్లేష్మము.
క్లేదము - 1.తడి, 2.ఉపద్రవము, (జీవ.) చిక్కని నీరు ఎక్కువగా నుండి జారుడు లక్షణములు గల శ్లేష్మసంబంధమగు పదార్థము, తెమడ, (Mucilage).
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
మలము - 1.పేడ, రెట్ట, విష్ట, 2.ముఱికి, 3.పాపము, 4.దోషము, (వస., శుక్లము, రక్తము, మజ్జము, మూత్రము, విష్ఠ, పింజూషము, నఖము, శ్లేష్మము, అశ్రువు, దూషిక, స్వేదము, అని 12 రకములు.)
నిమోనియా - (గృహ.) (Pneumonia) ఊపిరితిత్తి వాపుతో కూడిన జాడ్యము, శ్వాసకోశమునకు సంబంధించిన విషజ్వరము, కఫజ్వరము, శ్లేష్మజ్వరము, పప్పుసదాహము.
సాంపరాయము - 1.యుద్ధము, 2.ఆపద, 3.రాగలకాలము, రూ.సంపరాయము.
సాంపరాయికము - యుద్ధము, రూ.సంపరాయికము.
నీవృత్తు - 1.దేశము, 2.గ్రామము.
నియమేవ వర్తంతే జనా అస్మిన్నితి నీవృత్, త. పు. - ఇందు జనులు నియమముగా వర్తింతురు.
గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.)షడ్జాది స్వరము.
గ్రస్యతే భుజ్యత ఇతి గ్రామః, గ్రసు అదనే. - ప్రాణులచేత భుజింపఁబడునది.
గ్రామత - 1.గ్రామముల సమూహము, 2.తాళ్ళ సమూహము.
గ్రామాణాం సమూహో గ్రామతా - గ్రామముల యొక్క సమూహము.
త్యజే దేకం కులస్యార్థే - గ్రామస్శార్థే కులంత్య జేత్|
గ్రామ జనపదసా ర్థే - ఆత్మార్థే పృధివీం త్యజేత్||
తా. కులహాని కలుగునపు డందుకు హేతుభూతుడైన వానిని, గ్రామహాని కలుగునపు డందుకు హేతుభూతమైన కులమును, దేశహాని కలుగునపుడు దానికి హేతుభూతమగు గ్రామమును, తనకు(ఉ)పద్రవము వచ్చినపుడు తానున్న పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది. విడువ వలయును ననుట. - నీతిశాస్త్రము
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ప్రజాపతిస్సభగవాన్ రుచిస్తస్యామజీజనత్|
మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా| - శ్రీమద్భాగవతం
ప్రజాపతి - బ్రహ్మ. (చరి.) 1.యుద్ధ సమయములందు కుల పతులపై నుండు సైనికాధికారి, 2.గ్రామపెద్ద.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు(నవ బ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుఁడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి.)
అజుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒక రాజు.
మిధునములలో ప్రజాపతిని! అజుడను! - భగవద్గీత
స్థాణువు - 1.మేకు, 2.శివుడు, 2.కొమ్మలులేని చెట్టు మ్రోడు, విణ.స్థిరమైనది.
ప్రళయే (అ)పి తిష్ఠతీతి స్థాణుః - ప్రళయమందు నుండువాఁడు, ష్ఠా గతి నివృత్తౌ.
స్థాణు శ్శర్వే (అ)పి చ -
స్థాణుశబ్దము శివునకును, అపిశబ్దమువలన మొద్దునకును పేరు. తిష్ఠతీతి స్థాణుః, పు, ష్ఠా నివృత్తౌ. - స్థిరమైయుండునది.
మ్రోడు - 1.మొద్దు, స్థాణువు, 2.మూర్ఖుడు.
మొద్దు - మ్రానిమోడు, విణ.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.
స్థాణు రస్త్రీ ధ్రువ శ్శఙ్కుః -
వాయునా నిహతో (అ)పి తిష్ఠతీతి స్థాణుః, ఉ.ప్న. ష్ఠా గతినివృత్తౌ. - వాయువుచేఁ గొట్టఁబడియు నిలచియుండునది.
చలనాభావత్ ధ్రువతీతి ధ్రువః, ధ్రువ స్థైర్యే . - చలనము లేకుండుటవలన స్థిరమైయుండునది.
శంకతే అస్మాత్పురుషయా శంకుః, ఉ. పు. శకి శంకాయాం. - పురుష బుద్ధిచేత దీనియందు శంకింతురు. ఈ 3 మోడు పేర్లు.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
ముహతీతి మూఢః, మూర్ఖశ్చ ముహ వైచిత్యే. - మోహమును బొందువాఁడు.
అపర్ణ - పార్వతి.
తపసి పర్ణానామ ప్యనశనా దపర్ణా - పర్ణములైన భక్షింపక తపం బొనర్చినది.
ఆపగత మృణం యయేతివా - పోగొట్టబడిన ఋణము గలది.
లతా కాపి తరుః కో(అ)పి కాశ్యా మాశ్చర్య దంపతీ
సా చాపర్ణా నచ స్థాణు ర్దదాతే వాంఛితం ఫలమ్||
భా|| వారణాసియం దొక్క లతకును నొక్క వృక్షమునకును విచిత్రమైన దాంపత్యము కలదు. ఆ లత యపర్ణ(ఆకులు లేనిది. అపర్ణ = పార్వతి.) ఆ భూరుహము స్థాణువు. (మొద్దు, స్థాణువు = ఈశ్వరుడు) కాని కోరిన కోర్కెల నన్నిటి నాదంపతు లొసంగుచుందురు. (వారణాసిలో ను(ఉ)మామహేశ్వరు లను దంపతులు భక్తులు కోరిన కోర్కెల నెల్ల సఫలము గావింతురని భావము.)
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః
అమృత శ్శశ్వత స్థ్సాణుః వరారోహో మహాతపాః. - 13స్తో
తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
ఆరుద్రపురుగు - వర్షాకాలమున ఆరుద్ర కార్తెలో కన్పించెడి పట్టువంటి దేహముగల ఒక ఎఱ్ఱని పురుగు, ఇంద్రగోపము.
ఇంద్రగోపము - ఆరుద్రపురుగు.
పట్టుపురుగు - ఒక రకపు పురుగు, ఇంద్రగోపము.
జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేగుఱు - ఎరుపు red, రూ.జేవురు.
జేగుఱుఁబురువు - ఆరుద్రపురుగు.
ధుంధుమారము - 1.కరదూపము, 2.పట్టుపురుగు.
దూగఱ - కరధూపము, ధ్యానాదులలోని దుమ్ము.
పట్టుకృషి - (వ్యవ.) పట్టు పురుగులను వృద్ధిచెసి పట్టు నుత్పత్తిచేయుట (Seri-culture).
కౌశేయము - పట్టుది, (చీర), వి.కౌశేయమను బాణము, సం.వి. (గృహ.) పట్టు. పట్టుపురుగులలో నుండి వచ్చు జిగురు పదార్థముతో తయారైన నూలు (ఈ నూలుతో బట్టలను నేయుదురు).
కౌశేయం క్రిమికో శోత్థమ్ -
క్రిమికోశ భవతంతు నిర్మితం వస్త్రం కౌశేయ మిత్యుచ్యతే. - పురుగులచేతఁ గలిగిన బుఱ్ఱలవలనఁ బుట్టిన నూలుచేతనైన పట్టుచీర మొదలైనవి కౌశేయ మనంబడును. కోశనిర్మిత తత్వాత్కౌశేయం, కోశ మనఁగా క్రిములచేతనైన బుఱ్ఱ; అందువలనఁ బుట్టిన నూలుచేత నైన చీర.
తాపిత - మేలైన పట్టుగుడ్డ.
పట్టు - ఒక జాతిపురుగులవల్ల కలిగెడు ఒక దినుసు మేలు నూలు, సం.పట్టః.
దసలి - 1.వదలు, 2.ఒకరకపుపట్టు, 3.పట్టువస్త్రము, రూ.దసలీ.
పట్టుకుట్టు - (గృహ.) పువ్వులు ఆకులు మొదలగు నమోనాలను ఏటవాలుకుట్లతో నింపినది (Satin stich).
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా,
గూఢగుల్భాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. - 18శ్లో
ఆరుద్ర కార్తెలో అడ్డెడు వేసిన పుబ్బలో పుట్టెడు పండును.
తూర్పువానలు - (వ్యవ.) ఈశాన్య వర్షవాయువుచే వచ్చు వానలు, (Eastern rains).
ఈశాన్య వ్యాపార పవసములు - (భూగో.) భూమధ్యరేఖకును, కర్కాటక రేఖకును, మధ్య వీచు పవనములు.
ఈశాన్యము - తూర్పునకు, ఉత్తరమునకు నడుమగల దిక్కు North-east.
పూర్వోత్తర(ము) - 1.ఈశాన్య దిగ్భాగము, 2.ముందు వెనుక.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.
ఐశాని - ఈశాన్యదిక్కు north-east.
ఐశుఁడు - ఈశ్వరుని కుమారుడు.
6. ఆర్ద్ర - 27 నక్షత్రములలో ఆరవది. పగడమును పోలి ఒకటి యుండును.
ఆర్ద్రయా రుద్రః ప్రథమా న ఏతి | శ్రేష్ఠో దేవానాం పతిరఘ్ని- యానామ్ | నక్షత్రమస్య హవిషా విధేమ | మా నః ప్రజాగ్ం రీరిషన్మోత వీరాన్ | హేతీ రుద్రస్య పరిణో వృణక్తు | ఆర్ద్రా నక్షత్రం జుషతాగ్ం హవిర్నః | ప్రముంచ మానౌ దురితాని విశ్వా | అపాఘశగ్ం సన్నుదత్తా-మరాతిమ్ ||4||
హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
హినోతి ఇతిస్తతో గచ్ఛతి-వర్ధతే వా హేతిః, ఇ-సీ, హిగతౌ వృద్ధౌ చ - ఇట్టట్టు చలించునది; లేక వృద్ధిఁబొందునది.
హన్యతే అనయేతిహేతిః, హనహింసాగత్యో - దీనిచేత హింసింపఁబడును.
రవేరర్చి శ్చ శస్త్రం చ వహ్నిజ్వాలా చ హేతయః,
హేతిశబ్దము సూర్యుని కిరణములకు, ఆయుధమునకును, అగ్నిజ్వాలకును పేరు. హంతి తమ ఇతి, హన్యతే (అ)నయేతి చ హేతిః, సీ. హన హింసాగత్యో, చీకటిని బోఁగొట్టునది. దీనిచేత హింసింపఁబడును గనుక హేతి. శస్త్ర వాచియైనప్పుడు పుంలింగమును గలదు. 'నిమార్ష్య సౌ నీతి మయేనహేతి ' నేతి కప్పుణాభ్యుదయః, 'మేతిభిశ్చేతనావద్భి రుదీరితి జయస్వన ' మితి రఘువంశ దశమసర్గే కాళిదాసః.
రుద్రుఁడు - శివుడు.
రోదయతి శత్రూన్ రుద్రః - శత్రువులను దుఖఃపెట్టువాఁడు.
స్వయం రురో దేతివా, రుదిర్ అశ్రువిమోచనే, ఏకదా బ్రహ్మాసురోధేన ప్రాప్త జన్మ పరిగ్రహ్ణో (అ)సౌరురో దేతి పురాణప్రసిద్ధిః - ఒకానొక్కప్పుడు బ్రహ్మవలన జన్మమును బొందినవాడై దుఖించెను గనుక రుద్రుఁడు.
రుదం రోదనం(రోదనము-శోకము, ఏడ్పు, 2.కన్నీరు.)ద్రావయ తీతివా - దుఃఖమును బోఁగొట్టువాఁడు, ద్రు గ్రతౌ. రుద్రపుత్రాయ|
రుద్రాః రోదయంత్య సురానితి రుద్రాః - దుష్టుల దుఃఖింపఁజేయువారు.
రుదిర్ అశ్రువిమోచనే, రుజం(రుజ-1.రోగము, 2.చెరుపు.)దుఃఖం ద్రావయంతీతి వా - దుఃఖమును బోఁగొట్టువారు.
ద్రా కుత్సాయాం గతౌ, రుతం వేదాత్మకం శబ్దం కల్పాదౌ రుపంతీతి వా-కల్పాదియందు వేదస్వరూపమైన శబ్దమును బలుకువారు.
రుశబ్దే వీరు 11 డ్రు అజుఁడు ఏకపాదుఁడు, అహిర్బుధ్న్యుఁడు, త్వష్ట, రుద్రుఁడు, హరుఁడు, శంభుఁడు, త్ర్యంబకుఁడు, అపరాజితుఁడు, ఈశానుఁడు, త్రిభువనుఁడు అనువారలు.
రుద్రాణి - పార్వతి.
రుద్రస్య పత్నీ రుద్రాణీ - రుద్రునిభార్య. రుద్రాణీ రుద్రశ్చెవేశ్వరీశ్వరః| రుద్రకోట యందు రుద్రాణి|
ప్రథమము - 1.ముఖ్యము, 2.మొదటిది.
ప్రథత ఇతి ఫ్రథమః, ప్రథ ప్రఖ్యానే. - ప్రసిద్ధమగునది. ప్రథమో జ్ఞానశక్త్యాత్మా|
అదౌ ప్రధానే ఫ్రథమః త్రిషు,
ప్రథమశబ్దము మొదటిదానికిని, శ్రేష్ఠమైనదానికిని పేరు. ప్రథత ఇతి ప్రథమం, ప్రథప్రఖ్యానే. - ప్రసిద్ధమైనది. ఇది మొదలు మాంతసమాప్తి పర్యంతము గల శబ్దములు మూఁడులింగముల యందు వర్తించును.
హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.
హేరుద్ర సమిపే రంబతే తిష్ఠతీతి హేరంబః – రుద్రునియొద్ద నుండువాఁడు, ఋ గతౌ.
హేరతే వర్ధయతి భక్తానితివా - భక్తుల వృద్ధి బొందించువాఁడు, హేవృద్ధౌ. హేరంబః స్కందపూర్వజః|
రుద్రో నర ఉమానారీ తస్మైతస్మై నమోనమః|
రుద్రకుమారాయ| రుద్రపుత్రాయ|
యోగీ రామకథాలోల స్సీతాన్వేషణపండితః,
వజ్రదంష్ట్రో వజ్రనాభో రుద్రవీర్యసముద్భవః|
రుద్రాక్షము - రుద్రాక్షపూస.
రుద్రాక్షమాల - అక్షమాల.
అక్షమాల - 1.అకారము మొదలు క్ష కరము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తావళము, 3.అరుంధతి.
అజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగంథివిభేదినీ|
సహస్రాంబుజారూడా సుధాసారాభివర్షిణీ. - 39స్తో
రుద్రవాతము - (వైద్య, గృహ,) మెదడులో రక్తనాళములు పగిలి రక్తస్రావము వలన కలుగు వ్యాధి (Apoplexy).
రక్తస్రావము - (జీవ.) రక్తము వెలుపడుట, (Hemorrhage) (ఇది శరీరములో జరిగిన చాల అపాయకరము.)
రౌద్రము - 1.భయంకరము, 2.తీక్షము, వి.1.ఎండ, 2.రౌద్రరసము, 3.దినముయొక్క మొదటి భాగము.
రుద్రో దేవతాస్య రౌద్రం.- రుద్రుఁడే అధిదేవతగాఁ గలిగినది. రౌద్రాస్త్రం|
రౌద్రి - ఏబది నాలగవ(54వ)సంవత్సరము.
ఎండదొర - సూర్యుడు Sun.
ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.
వెలుతురు - 1.ఎండ, 2.ప్రకాశము.
ఎండఁగట్టు - క్రి.ఆరగట్టు.
ఎండఁగొట్టు - క్రి.ఎండజేయు.
ప్రకాశానుర్తి - (వృక్ష.) వెలుతురు వచ్చు దిక్కునకే పెరుగు స్వభావము కలది, (Positively heliotropic).
ప్రకాశానువర్తనము - (వృక్ష.) వెలుతురు వచ్చు దిక్కునకు తిరుగుట, (Heliotropism).
సూర్యుఁడు - వెలుగు రేడు Sun.
సూర్యగ్రహణము - రాహు కేతువులలో నేదైన ఒక బిందువు భూమికి వెనుకగా వచ్చినచో సూర్యకిరణములు భూమిపై సోకక సూర్యగ్రహణము కలుగును.
సూర్యదృశ్యగతి - (భూగో.)సూర్యుడు Sun పోవుచునట్లు కనబడు మార్గము.
సూర్యతనయ - యమున.
సూర్యస్య తనయా సూర్యతనయా - సూర్యుని కూఁతురు.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
పాలాశ పుష్ప సంకాశం నారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమా మ్యహమ్|
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని fire, 5.కాంతి.
"రుద్రాధ్యాయీ వసే ద్యత్ర గ్రామే వా నగరేపి వా
న తత్ర క్షుత్పిపాసాద్యా దుర్భిక్షవ్యాధయో(అ)పి చ" అని సూక్తి.
రుద్రా ధ్యాయమును (నమకమును)పారాయణ చేయుపుణ్యాత్ముడు ఒక నగరము-పట్తణము, రూ.నగరి.)లోగాని, గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.)షడ్జాది స్వరము.)లో గాని యున్నచో అక్కడ క్షుత్తు-ఆకలి, పిపాస-దప్పికలతో బాధపడువారుండరు, దుర్భిక్షము-కరవు, వ్యాధి-తెవులు, రోగము.)ఏవ్యాధులును ఆచుట్టుప్రక్కలకు రావు అని దీని యర్థము. మరి భక్తుడైన వాని కేమిలోటు వచ్చును?
రుద్రస్య సూనుం సురసైన్యనాధం
గుహం సదా శరణమహం ప్రపద్యే||
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని fire, 5.కాంతి.
అగ్గికంటి - శివుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతి కుటిలం ఊర్థ్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఈ-పు, అగ కుటిలాయాం గతౌ - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః, ఊ-పు. - అగ్నివలనఁ బుట్టినవాఁడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
ఈశానము - 1.కాంతి, 2.శివుని ఐదు(5)ముఖములలో ఒకటి, 3.పదునొకొండు అను సంఖ్య(11), 4.ఆర్ద్రా నక్షత్రము.
ఈష్టే ఈశానః - ఐశ్వర్యముగలవాఁడు. "ఈశానః సర్వ విద్యానాం" అని శృతి.
ధ్యాయే దభీష్టసిద్ధ్యర్థ మహర్నిశ ముమాపతిం
ఈశానం సర్వవిద్యానా మీశ్వరేశ్వర మవ్యయమ్|
ఈశానుఁడు -1.శివుడు, 2.రాజు.
ఈష్టే ఈశానః - ఐశ్వర్యము గలవాఁడు.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈష్ట ఇతీశ్వరః - ఐశ్వర్యయుక్తుఁడు, (ప్రభుత్వము గలవాఁడు). ఈశ్వర తనూజః|
ఈష్టే తాచ్ఛీల్యేనే తీశ్వరః, ఈస ఐశ్వర్యే. - స్వభావైశ్వర్యము గలవాఁడు. స్త్రీలింగమందు ఈశ్వరా, ఈశ్వరి శబ్దము 'అశూ వ్యాప్తౌ' అనుధాతువు మీఁద నిష్పన్నము.
ఈశ్వరి - పార్వతి.
ఈశ్వరస్య పత్నీ ఈశ్వరీ, ఈ-సీ. - ఈశ్వరుని భార్య.
ఈశ్వర - ప్రభవాది అరువది సంవత్సరములలొ పదునొకండవది(11వ).
ఈశ్వరస్యభావ ఐశ్వర్యం, అ-న. - ఈశ్వరభావము.
ఈశసు రేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తిశివ |
ఉమాపతి - శివుడు.
ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
పాతి స్వానుజీవిన మితి పతిః, పా రక్షణే. - తన యాశ్రితుని రక్షించువాఁడు.
స్త్రీలింగమందు రుచి శబ్దము వలెను, నపుంసకమందు వారి శబ్దమువలెను రూపము. పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు. పతింవర - తనంతట మగని వరించునట్టి ఆడుది.
పతిం వృణత ఇతి పతింవరా - పతిని వరించునది.
ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే అడ్డు పెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉమా, ఆ-సీ. ఉ ఇత్యనేన సంబోధ్య మా ఇత్యనేన తపసో మాత్రా నిషిద్ధత్వాదుమా, ఉ = ఓ బిడ్డా, మా = వలదు. అని యట్లు తల్లి చేఁ దపస్సువలన నిషేధింపఁబడెను గనుక ఉమ, అవతీత్యుమా - రక్షించునట్టిది.
మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కులస్త్రీ.
సభతృక - మగనాలు, ముత్తైదువు.
పతిపత్నీ సభర్తృకా,
జీవన్ పతి రస్యా అస్తీతి భర్తా సహితా సభర్తృకా - బ్రతికియుండు పెనిమిటిగలది. ఈ 2 మగనాలి పేర్లు.
మేని - కాంతి.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కామ్యత ఇతి కాంతిః, ఈ-సీ. కము కాంతౌ - ఇది కోరఁబడుచున్నది గనుక కాంతి.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
కాంతి శాస్త్రము - (భౌతి.) చాక్షుష శాస్త్రము, కాంతి స్వభావమును గురించి చర్చించు శాస్త్రము (Optics).
కాంతి సంవత్సరము - (ఖగో.) ఒక సంవత్సరకాలములో కాంతి ప్రయాణించు దూరము (సుమారు 5,880, 000, 000, 000 (మైళ్ళు) నక్షత్రముల దూరము కొలుచుటకు వాడు ప్రమాణము (Light year).
కాంతి చూషణము - (భౌతి.) కాంతిని మ్రింగి వేయుట (Light absorption).
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
కాంతికిరణపుంజము - (భౌతి.) కాంతికిరణముల గుంపు, రూ.కిరణశలాక (Beam of light).
కిరణశలాక - (భౌతి.) సమాంతరముగ నున్న కిరణముల సమూహము (Pencil of rays).
అభిరుచి - 1.అత్యాసక్తి, 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినచవి (Taste).
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఇచ్ఛ - అభిలాష, కోరిక.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
ఈషణము - త్వరపెట్టునది, వి.త్వర, ఇచ్ఛ (ఈషణత్రయము దారేషణ, విత్తేషణ, పుత్త్రేషణ.)
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి.కేతువు.
విగతః కచోబంధన మస్య వికచః కచ బంధనే. - విగతమైన బంధము గలిగినది.
కూచి - 1.యుద్ధయాత్రకై వాద్యము మ్రోగించుట, 2.ఆడుది(స్త్రీ - ఆడుది), విణ.1.వాడియైనది, 2.వికసించినది.
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అధిపాతీతి అధిపః, పా రక్షణే. - అధిక్యమున రక్షించువాఁడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అదిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.
ధర్ముని పత్ని కాంతి. ఆమె లేకపోతే లోకాలు అధార శూన్యములై చెడి పోతాయి.
హరిద్ర - పసుపు.
హరిద్వర్ణం, భ్రాతీతి హరిద్రా, ద్రా కుత్సాయాం గతౌ. - పచ్చనివన్నె గలది.
పసుపు - (వ్యవ.) ఇది ఒక దుంపజాతి సంబార ద్రవ్యము (Turmeric), అల్లపు కుటుంబము (Zingiberaceae) లోని curcuma longa అను మొక్కను వ్యవసాయదారులు పైరు చేయుదురు. ఈ మొక్కల దుంపలను ఎండబెట్టి పసుపు తయారు చేయుదురు.
వరము - కోరిక, వరించుట.
వ్రియత ఇతి వరః, వృఞ్ వరణే - వరింపఁ బడునట్టిది.
వర్రో వృతౌ,
వరణము వరః, వృతిశ్చ, సీ, వృఞ్ వరణే. - వరించుట వరము, వృతియును. ఈ 2 కన్యాదులను వరించుట పేర్లు.
వరవర్ణిని - 1.భర్త యందనురాగము గల్గియుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
వరశ్రేషో వర్ణో రూపమస్యా ఇతి వరవర్దినీ - శ్రేష్ఠమైన రూపము గలది. "శేతే సుఖోష్ణస్ర్వాంగీ గ్రీష్మే తు సుఖశీతలా, భర్తృరక్తాచ యనారీ సా భవేద్వర్వర్ణినీ" ఇతి రుద్రః.
శ్రేష్ఠవర్ణత్వాత్ వరవర్ణినీ, ఈ. సీ. - మంచివన్నె గలది, పసుపు.
పసుపుౘుక్క - (గృహ.) కన్ను గ్రుడ్డులో ఈ చుక్క ఉన్నచోట ప్రతిబింబము పడిన అదిస్పష్టముగా కనబడును (Yellow-spot).
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
పుంసా యౌతీతి యువతిః, యు మిశ్రణే. - పురుషునితోఁ గూడునది.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్ల(16సం.)కుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50సం.) సంవత్సరముల వఱకు గల ప్రాయము, జవ్వనము.
చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
చిరేణాటతి పితృగేహాద్భర్తృ గేహం చిరంటీ - చాలకాలమునకు నత్తింటికిఁ బోవునది.
పా, చిరిణోతి హినస్తి అమంగళాని చిరంటీ, సీ. చిరి హింసాయాం. - అమంగళములను జెఱుచునది.
చిరతీతి చరణ్టీత్యేకే - తిరుగునది.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
యౌవతము - యువతీ సమూహము.
యువతీనాం సమూహః యౌవతం, పా. యౌవనము - యువతుల యొక్క సమూహము.
"సురోప మతినైపథ్యం కళాకుశలయౌవనం, యస్య పుణ్యకృతః ప్రేష్యం స్ఫలం తస్య యౌవన" మితి.
త్య్రక్షరీ దివ్యగంధాఢ్యా సిందూర తిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా|
యశము - కీర్తి.
అశ్నుతే దిశ ఇతి యశః, స - న, అశూ వ్యాప్తౌ. - దిక్కులకు వ్యాపించునది.
యాతి దేశాంతరమితి వా యశః, యా ప్రాపణే. - దేశాంతరమును బొందునది.
యశస్వి - కీర్తిగలవాఁడు.
కీర్తన - 1.కీర్తి, యశస్సు, 2.పాట.
కీర్తనము - స్తోత్రము, పొగడ్త.
జిహ్వ నీ కీర్తనల్ చేయ గోరు...
కీర్తి - 1.యశస్సు, (వికృ.) కీరితి, 2.పేరు, 3.తేట, 4.అడుసు, 5.విరివి.
కీర్త్యత ఇతి కీర్తిః, ఈ. సీ. కౄత సంశబ్దనే. - కీర్తింపఁబడునది.
పేరు - 1.నామము, 2.కీర్తి, 3.దండ (కాసుల పేరు), క్రి.ముద్దకుట్టు.
నామధేయము - పేరు, నామము.
నామము - నొసట పెట్టుకొను బొట్టు, సం.వి.నామధేయము.
నామకరణము - బిడ్దలకు పేరుపెట్టుట.
అసము1 - 1.అహంకారము, దర్పము, 2.ఉత్సాహము, 3.చనవు, 4.అవకాశము, వీలు.
అసము2 - యశము, కీర్తి, సం.యశః.
హోళీపండుగ - కామదహనము (ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు జరుగు పండుగ Holi festival).
దర్పకుఁడు- మన్మథుడు, వ్యు.దర్పింపచేయు.
దర్పయతీతి దర్పకః - గర్వింపఁ జేయువాఁడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
దర్పము - 1.గర్వము, 2.కస్తూరి.
గర్వత్యనేనేతి గర్వః ఖర్వ గర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి.
కేస్తూ యతే కస్తూరీ, సీ.ష్టుఞ్ స్తుతౌ. - శిరస్సు నందు స్తోత్రము చేయఁబడునది.
దర్పించు - క్రి.గర్వించు. దశగ్రీవస్య దర్పహా|
దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగమ్,
రావణదర్పవినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగమ్| - 2
ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది - సంవత్సరాది.
ఆయు ర్జీవిత కాలః -
ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.
ఏతీత్యాయుః, స. న. ఇణ్ గతౌ. - పోవునది.
జీవితకాలము - ఆయువు.
జీవితస్య కాలః జీవితకాలః - బ్రతికియుండు కాలము. ఈ 2 ఆయుస్సు పేర్లు.
ఆయము1 - 1.జీవస్థానము, ఆయువుపట్టు, 2.మర్మము, సం.ఆయుః.
ఆయము2 - 1.రాక, 2.లాభము, 3.రాబడి, 4.పన్ను.
రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము.
రాతి దదాతి సుఖమితి రాకా. రా దానే - సుఖము నిచ్చునది. అన్ని కళలతో నిండిన చంద్రుఁడు గలది. రాకాచంద్ర సమానన రామ్|
ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁదెలుప * నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడేడు మాడ్కిఁ దిరుగు * మెలమిఁ గుమారా!
తా. ఎన్నడు - (ఏ+కాలము), 1.ఏకాలము, ఎప్పుడు, 2.ఎల్లప్పుడు.)ఎప్పుడైనను నీవు రహస్యము ఉండినప్పటికిని, లేకపోయినప్పటికి మర్మము - జీవస్థానము, ఆయుస్సు చెప్పుటకై పోవద్దు, అనగా రహస్యము తెలిసినదైనను నీవు మాత్రము వెలిబుచ్చవలదు. నీ కన్న - ప్రత్య. 'కంటె' అను అర్థమున వచ్చు ప్రత్యయము.)తల్లిదండ్రుల యశము-కీర్తి మెచ్చుకొనునట్లుగా నడచుకొనుము.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ. ఏడ్గడ.
ఆలోక్య యస్యాతిలలామలీలాం
సద్భాగ్యభాజౌ పితరౌ కృతార్థౌ|
తమర్భకం దర్పకదర్పచౌరం
శ్రీజానకీజీవనమానతో(అ)స్మి| - 1
ఖ్యాతము - వాసికెక్కినది.
ఖ్యాయత ఇతి ఖ్యాతః, ఖ్యా ప్రథనే. - అందఱిచేతఁ గొనియాడఁబడువాఁడు.
ఖ్యాతి - యశస్సు, కీర్తి.
ప్రథా ఖ్యాతౌ-
ప్రథనం ప్రథా, ప్రథ ఖ్యానే, ఖ్యానం ఖ్యాతిః, సీ. ఖ్యాప్రకథనే. ఈ 2 ప్రసిద్ధి పేర్లు.
సమజ్య - కీర్తి, రూ.సమాజ్ఞ.
సమ్యక్ జ్ఞాయతే పురుషో (అ)నయేతి సమ్జా, సమాజ్ఞేతి వా పాఠః, జ్ఞా అవబోధనే. - దీనిచేత పురుషుఁడు లెస్సగా నెఱుగఁబడును.
సమాఖ్య - 1.సభ, 2.కీర్తి.
పా, సమ్యగాఖ్యాయత ఇతి సమాఖ్యా ఖ్యాప్రకథనే. - లెస్సగాఁ గీర్తింపఁబడునది. ఈ 3 కీర్తి పేర్లు.
సమాఖ్య రాజ్యాంగము - (రాజ.,చరి) సంఘ రాజ్యము తమ శాశ్వత శ్రేయసుకై కొన్ని రాజ్యములు ఒక కేంద్ర ప్రభుత్వము క్రింద సంఘముగా నేర్పడి, కేంద్రమునకు ఆర్థిక విదేశాంగ వ్యవహారములు, రాకపోకలు, దేశ రక్షణాధికారములు మాత్రము ఇచ్చి అంతరంగికముగ స్వతంత్రముగా నుండు రాజ్యముల రాజకీయ సమ్మేళము (Federal Governmnt).
అన్యేషాం సమాజః
సమాజము - 1.మనుష్యుల గుంపు, 2.సభ, 3.ఏనుగు.
సమజంత్యత్ర సమజః, అజ గతిక్షేపణయోః - దీని యందుఁగూడుదురు, పశువులుగాక తక్కినవాని గుంపు పేరు.
సభికుఁడు - 1.సభాసదుడు, 2.జూదమాడించువాడు.
సభాసదుఁడు - సభాస్తారుడు, సభ యందుండు ధర్మజ్ఞుడు.
సభ - 1.కొలువుకూటము, 2.సమూహము, 3.జూదము.
సహభాన్తి అత్రేతి సభా, భాదీప్తౌ. - కూడుకొని దీనియందుఁ బ్రకాశింతురు.
సమాజ వికాసకార్యక్రమము - (పౌర.) గ్రామీణ ప్రజల సర్వతోముఖాభి వృద్ధికి భారత ప్రభుత్వము ప్రజల సహకారముతో వ్యవసాయమును రవాణా సౌకర్యములను కల్పించుటకు సాగించుచున్న కార్యక్రమము (Community Development Corporation).
అధ్యక్ష ప్రజాప్రభుత్వము - (రజ.,పౌర.) రాజ్యాధ్యక్షుడు సరాసరి ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల పట్లనే బాధ్యత వహించుట (ఈపద్ధతి ప్రకారము ప్రభుత్వ వివిధశాఖలను పరిపాలించు టకు శాసనసభకు బాధ్యులైన మంత్రులుగాక అధ్యక్షునిచే నియమింపబడి, అధ్యక్షునికే బాధ్యులైన కార్యదర్శులు ఉందురు. ఈ పద్ధతి అ, సం, రా, లందున్నది.)
అధ్యక్షుఁడు - అధిష్ఠాత, ప్రధానాదికారి, విణ.ఇంద్రియములకు గోచరించువాడు, 2.పనులు కనుపెట్టి చూచువాడు, ప్రత్యక్షమైనవాడు.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
సదర్ (చరి.) - 1.అధ్యక్షుడు, 2.మొగలు చక్రవర్తుల కాలములో ధర్మాదాయముల విషయములలోను మతవ్యవహాములందును సలహాలిచ్చు ఉద్యోగి.
సదము - సభ, రూ.సదసు, సదస్సు.
సదస్సు - 1.రాజసభ, 2.సభ.
సీదన్త్యస్యాం సదః స,న్న, షద్ ఌ విశరణాదౌ. - దీనియందుందుదురు. ఈ 9 సభపేర్లు. ఆస్థానీ శబ్దము మొదలు ఈ 3ను దొరలున్న సభపేర్లని కొందఱు.
సదస్యా విధి దర్శినః,
సదస్యము - పెండ్లి మూడవనాటి బ్రాహ్మణుల మహదాశీర్వాద సభ.
సదసి సధనః సదస్యాః - సభయందు మంచివారు.
సదస్యుఁడు - 1.సభ్యుడు యజ్ఞవిధి, 2.పరీక్షాధికారి.
విధిం విధివిహితం పశ్యన్తీతి విధి దర్శనః, న. పు. దృశిర్ ప్రేక్షణే. - విధివిహితమును జూచువ్చారు. 2 యాగవిధియందు న్యూనాతిరిక్తములు రాకుండఁ జూచుటయందు తత్పరులయిన పేర్లు.
పారిషదుఁడు - 1.శివభటుడు, 2.రాజున కనుచరుడు, 3.సభ్యుడు.
సభ్యుఁడు - 1.సభయందుండువాడు, మంచివాడు.
సభలోపల నవ్వినయెడ
సభవా ర్నిరసింతు రెట్టి * జనుని; న్నెఱి నీ
కభయం బొసంగె నేనియుఁ
బ్రభు కరుణను నమ్మి గర్వ * పడకు కుమారా!
తా. సభలో నవ్వరాదు. నవ్వినయెడల ఎంత గొప్పవాఁడయినను నిరసనము - 1.తిరస్కారము, ఆక్షేపము, 2.వధము, రూ.నిరాసనము. తిరస్కరింపబడును. ఎట్టి - ఎటువంటి, ఎట్టిడు, ఎట్టివాడు, (బహు.ఎట్టివారు) తనకు ఎంత అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు.)నొసంగినప్పటికిని, పబువు - ప్రభువు, సం.ప్రభు. కరుణ- 1.కనికరము, 2.దయ.)నమ్ముకొని గర్వింపఁ గూడదు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షణము, రూ.ఏడ్గడ.
చదువు లెస్సగ నేర్పి సభలో గరిష్ఠాది
కార మొందించెడి ఘనుఁడ నీవె...
అభిఖ్య - 1.పేరు, 2.కీర్తి, 3.చెప్పుట, 4.కాంతి.
అభిధానము - 1.పేరు, 2.చెప్పుట, 3.నిఘంటువు, రూ.అభిధేయము.
అభిధేయము - పేర్కొనదగినది, వి.1.శబ్దార్థము, 2.గ్రంథ ప్రతిపాద్య విషయము, 3.నామధేయము.
అభివాదనము - తన గోత్ర నామములచెప్పి పాదము లంటి నమస్కరించుట, నమస్కారము.
అభివాదనయత ఇత్యభివార్కః, వద వ్యక్తాయాం వాచి. - మ్రొక్కువాఁడు, పా. అభివాదుకః.
అభివాదనశీలస్య నిత్యం వృద్ధోప సేవినః
చత్వారి సంప్రవర్థంతే కీర్తి రాయు ర్యశో బలమ్|
తా. పూజనీయులను నమస్కరించు శీలము - 1.స్వభావము, 2.మంచినడత కలిగి, నిత్యము - ఎల్లప్పుడు, ఎడతెగనిది.)పెద్దల సేవించువానికి యశము-కీర్తి, ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.)యశస్సు, బలము - 1.సత్తువ, 2.సైన్యము అను నీ నాలుగు వృద్ధి నందును.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.అత్మము.
న యావత్ ఉమానాథ పాదారవిందం
భజంతీహ లోకే పరే వా నరాణామ్ ,
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం
ప్రసీద ప్రభో! సర్వభూతాధివాసమ్|
ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
ఈష్టే ఈశః - ఐశ్వర్య యుక్తుఁడు, ఈశ ఐశ్వర్యే.
ఈష్ట ఇ తీశి తా, ఋ ఐశ్వర్యము గలవాఁడు.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అధిపాతీతి అధిపః, పా రక్షణే. - అధిక్యమున రక్షించువాఁడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
లాలాటికుఁడు - ప్రభుహృదయము కనిపెట్టువాడు.
ఈశ - 1.ఏడి కోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.
ఏడికోల - (వ్యవ.) నాగలిలో నాగటి దుంపను మేడిని కలిపియుంచు పొడవైన భాగము (Shaft).
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
ఇడ - 1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
కూబరస్తు యుగంధరః,
కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
కవతే శబ్దాయతే కూబరః, కూఙ్ శబ్దే. - మ్రోయునది.
కుం మహీం వృణోతి అచ్ఛాదయతీతి వా కూబరః, వృఙ్ వరణే. - భూమిని గప్పియుండునది.
యుగంధరము - పోలుకఱ్ఱ.
యుగం ధరతీతి యుగంధరః, ధృ థారణే. - యుగ మనఁగా కాఁడి; దాని ధరించునది. ఈ 2 కాఁడిని గట్టుటకుఁ జేసిన మ్రాని పేర్లు, నొగ.
యుగము - 1.జత, 2.బార, 3.కాడి, 4.యుగములు నాలుగు 1.కృత, 2.త్రేతా, 3.ద్వాపర, 4.కలియుగములు.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సుకింపైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము; శేషాచలము - తిరుమల; శేషశైలము - తిరుమల.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి.
తిమ్మ - స్వస్థము.
స్వస్థము - నెమ్మదిగా నుండునది.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
భస్మాంగుఁడు - శివుడు.
భస్మము - బూడిద; భసితము - భస్మము.
బూడిద - 1.కఱ్ఱలు మొదలగునవి కాలగా మిగిలిన భస్మము, 2.గోమయ భస్మము, సం.భూతిః.
నీఱు - భస్మము, రూ.నిగురు, నివురు.
నిగుఱు - కట్టెల నిప్పుమీది బూడిద, రూ.నివురు, నీరు. నివుఱు - నిగురు, బూడిద. బుగ్గి - బూడిద. బూడిదలో పోసిన పన్నీరు.
తిరునీఱు - బూది, విభూతి.
విభూతి ర్భూతి రైశ్వర్య మణిమాదిక మష్టధా,
(అణిమ మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాస్టభూతయః)
విభూతి - 1.తిర్యక్సుండ్రధారులు ధరించెడు భస్మము, 2.ఒక ఐశ్వర్యము.
విశేషేణ భవతీతిః, విభూతిః, భూతిశ్చ ఈ-సీ. - విశేషముగాఁ గలుగునట్తిది.
వెలిబూది - విభూతి.
సముదూళించు - (విబూది) పూసికొను.
త్రిపుండ్రము - నొసట నుంచుకొను విబూతి మూడు రేఖలు, (నామము ఊర్ధ్వపుండ్రము.)
భూతి - 1.ఐశ్వర్యము, సంపత్తి 2.పుట్టుక, 3.భస్మము.
సా భూతి రణిమాదిభేదే నాష్టదా - ఆ యైశ్వర్యము అణిమాది భేదముచేత నెనిమిది విధములు.
అణిమా, అణుత్వం సూక్ష్మతయా యా లభ్య తే సా అణిమా, మహత్వేన మహిమా, గురుత్వేన గరిమా, లఘుత్వేన లఘిమా, యయా ఇష్టప్రాప్త్సా ప్రాప్తిః, ఇచ్ఛయా నిర్విఘ్న సంచారశక్తిర్యేన తత్ప్రాకామ్యం, సర్వాతిశాయిత్వ మీశ్వత్వం, స్వాధీనేంద్రి యత్నం వశిత్వం. ఇవి అష్టైశ్వర్యములు.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
సంపత్తి - ఈశ్వరుని యిల్లాలు. ఈమె దయలేకపోతే జగమంతా పేదరికముతో బాధపడుతుంది.
భవము - 1.బాము, పుట్టుక, 2.ప్రాప్తి, 3.సంసారము.
బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక.
జననము - 1.పుట్టుక, 2.వంశము.
జననవిద్య - (జీవ.) అనువంశమును గూర్చి తెలియు శాస్త్రము(Genetics).
శ్రీచూర్ణము - తిరుచూర్ణము.
తిరుచూర్ణము - ఎఱ్ఱబొట్టుపొడి.
అణిమ - 1.అణుత్వము, 2.ఒక ఐశ్వర్యము, అష్టసిద్ధులలో ఒకటి, రూ.అణిమము.
మహిమా - 1.గొప్పతనము, 2.ఐశ్వర్యము.
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.)పురుషవాచక శబ్ద సంజ్ఞ.
మహాత్మ్యము - గొప్పతనము. మహిమ యుండిన భూషణము పనిలేదు.
గరిమ - 1.గొప్పదనము, 2.బరువు, 3.అణిమాద్యష్టైశ్వర్యములలో ఒకటి, 4.విధము (ఈయర్థము తెలుగున మాత్రమే కలదు.)
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.
లఘిమ - లఘుత్వము.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
తేలిక - చులకన, లఘుత్వము.
చులకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
ఆరోగ్యము - రోగము లేమి, స్వాస్థ్యము. ససి - 1.బాగు, 2.ఆరోగ్యము, 3.సిగ్గు.
వశీకరణము - మందు మ్రాకులచేత లోకువగాచేసికొనుట.
వశక్రియ - వశీకరణ యంత్రము, వశము చేసికొనెడు మంత్ర తంత్రాది కర్మము.
వశ్యత - (గృహ.) సరిపడకపోవుట కొంతమందికి కొన్ని వస్తువులు అనుకూలముగావు అట్టి ఆహారముతినునప్పుడు లేదా వస్తువులను ధరించినప్పుడు దాని వలన అవగుణములు కనబడును (Allergy).
వశము - స్వాధీనము.
వశంవదుడు - లోకువయగునట్లు మాటాడువాడు.
వశము చేసుకుంది, అది వాడికి ఏ మందో మాకోపెట్టి వశముచేసేసుకుంది అని దెప్పుతుంటారు. ఎంత నవ్వొస్తుందో!
స్వాధీనుఁడు - తనకు లోకువైనవాడు.
స్వాధీనపతిక - స్వాధీనుడైన పెనిమిటి గల నాయిక.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
మెఱుఁగురిక్క - 1.ప్రవాళము, 2.కాంతిగల చుక్క.
మెఱుఁగు - 1.కాంతి, వెలుతురు Light, 2.కిరణము, 3.బంగారు, వెండి మొ.నగలకు పెట్టు తళుకు, 4.పొగరింపు (ఉబ్బుట).
మెఱుఁగుబోఁడి - (మెఱుఁగు + పోఁడి) మెరుపువలె మనోజ్ఞురాలగు స్త్రీ.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
ౘుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
ౘుక్కలదొర - చంద్రుడు.
ౘుక్కలఱేఁడు - చంద్రుడు Moon.
ఒళగు - 1.మర్మము, 2.లోకువ, 3.వీణాదండము, రూ.ఒళవు.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు.
ఒళవు - ఒళగు.
ఒళవరి - మర్మజ్ఞుడు.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః, ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాఁడు.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ, దేవతలలో పెద్దవాడు.
సురాణం జ్యేష్ఠః సుర జ్యేష్ఠః - దేవతలలోఁ బెద్దవాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ద్విజా త్యగ్రజన్మ భూదేవ బాడబాః,
విప్రశ్చ బ్రహ్మణః -
ద్విజరాజు - 1.చంద్రుడు Moon, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమ ద్విజుడు.
ద్విజానాం బ్రాహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు Moon.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.
దేహోత్పత్త్యుపనయనాది లక్షణే ద్వే జాతీ జన్మనీ అస్యేతి ద్విజాతిః, ఇ. పు. - దేహోత్పత్త్యుపనయనాది సంస్కారము లనెడు రెండు జన్మములు గలవాఁడు.
ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి.
ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.
హీనజాతి స్త్రియం మోహాదుద్వహంతో ద్విజా తయః|
కులాన్వేన నయంత్యాశు ససంతానాం శూద్రతా||
తా. బ్రాహ్మణులు తక్కువజాతి(హీనము - 1.తక్కువైనది, 2.దూరతగినది, 3.విడువ బడినది.) స్త్రీని మోహమువలన పరిగ్రహించిరేని, వారికి గలిగెడి సంతానములతోఁ గూడి వారి కులములు శూద్రత్వమును బొందును. – నీతిశాస్త్రము
ద్విజము - 1.పక్షి bird, 2.పాము snake, 3.దంతము, 4.చేప fish, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
అండరూపేణ పక్షిరూపేణ చ ద్విర్జాయతితి ద్విజః, జనీ ప్రాదుర్భావే. - గ్రుడ్డుగాను పక్షిగాను రెండుమార్లుగాఁ బుట్టునది bird.
ద్విర్జాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.
దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతము నకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
సర్పి - 1.నేయి, 2.జలము, 3.రోగవిశేషము.
సర్పతీతి అర్పిః, సృప్ ఌ గతౌ. - వ్యాపించునది.
దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును.
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
'సి' విటమిన్ - (గృహ.) Vitamin ‘ C’ 1.పళ్ళచిగుళ్ళ బలహీనతను తొలగించు విటమిన్, 2.శరీర కణజాలముల బంధనమునకు తోడ్పడు విటమిన్.
పయోరియా - (గృహ.) పంటిచిగురు రోగము, ఒక విధమైన పండ్ల వ్యాధి, పన్నుకుదురులలో నుండి చీమురక్తము స్రవించువ్యాధి,(Pyorrhoea).
స్కర్వీ (సీతాదము) - (గృహ.) (Scurvy) 'సి' విటమిన్ Vitamin C, లోపము వలన కలుగువ్యాధి. చిగుళ్ళవాపు, పండ్ల నుండి రక్తము కారుట, (ఈ వ్యాధి ఖటిక (Calcium) లోపము వలన కూడ కలుగ వచ్చును.
ఆకాదము - (జం.) దంతము యొక్క కిరీటములో క్రింది భాగముపై కప్పి యుండు గట్టిపొర యొక్క పదార్థము (Enamel).
చేఁప - మత్స్యము; మత్స్యము - చేప Fish.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః, మదీ హర్షే. -మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.
చేప(చేఁప) ముల్లు కుట్టు - (గృహ.) చేపవెన్నెముకను పోలినకుట్టు (Fish bone stitch).
గణిక - 1.ఆడేనుగు, 2.వేద్య.
గణికావచ్చిక్తకర్షణాద్గణికా - వేశ్యవలె మనస్సును హరించునది.
విటగణో (అ)స్యా అస్తీతి గణికా - విట సమూహము గలది.
గణయతి ధనికా నితి గణికా, గణసంఖ్యానే. - ధనికులు నెంచునది.
గణికాదేస్తు గాణిక్యం,
గణికాదేర్గణే గాణిక్యాదీని వర్తంతే - గణికాది సమూహమందు గాణిక్యాది శబ్దములు వర్తించును.
గాణిక్యము - వేశ్యాసమూహము.
గణికానాం సమూహో గాణిక్యం - వేశ్యల యొక్క సమూహము.
అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||
తా. తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.), సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియముగల గణిక - 1.ఆడేనుగు, 2.వేద్య., సిగ్గిడి - సిగ్గులేనిది, సిగ్గులేని ఇల్లాలు చెడుదురు నష్టము - నశించినది. - నీతిశాస్త్రము
నష్టము - నశించినది.
నశ్యతేస్మ నష్టః, త్రి,ణక అదర్శనే. - కానరానివాఁడు.
ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
అగ్రజుఁడు - 1.బ్రహ్మ, 2.బ్రాహ్మణుడు, 3.అన్న.
బ్రహ్మణో ముఖే అగ్రే జన్మాస్యేతి అగ్రజన్మా. న. పు. - బ్రహ్మయొక్క ముఖమందు మొదటి జన్మము గలవాడు.
పూర్వజ స్త్వగ్రియా (అ)గ్రజః,
పూర్వస్మిన్ కాలే జాతః పూర్వజః, 1. అగ్రే భవః అగ్రియః, 2. అగ్రేజాత అగ్రజః, జనీప్రాదుర్భావే. - తనకంటె ముందరఁ బుట్టినవాఁడు. ఈ 3 పెద్దయన్న పేర్లు.
జ్యేష్ఠుడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రణి - శ్రేష్ఠుడు, మొదటివాడు.
అగ్రిముఁడు - మొదటివాడు.
అగ్రమస్తిష్కము - (జం.) మెదడులో మొదటిభాగము (Prodence phalona or forebrain).
అగ్రనరుఁడు - అగ్రగామి; అగ్రేసరుఁడు - అగ్రగామి.
అగ్రగామి - ముందు నడుచువాడు, (గృహ.) ఒక వస్తువుగా తయారగుటకు దానికి ముందున్నస్థితి, ఉదా.కెరొటిన్ శరీరములో విటమిన్ vitamin 'A' గా మార్పబడును, కనుక విటమిన్ vitamin 'A' కి అగ్రగామి కెరొటిన్.
కెరోటిన్ - (గృహ.) (Carotene) పసుపు పచ్చని పదార్థము 'ఏ' విటమిన్ తయారగుటకు కావలసిన పదార్థము (ఇది కనుల బలహీనతను నిరోధించును.)
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
వదినె - అన్నభార్య, మగని తోబుట్టువు, మేనత్త మేనమామలకూతురు, భార్యాక్క, సం.వధూని.
జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త.
ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.వి., సొత్తు.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్.
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠం - క్షత్రియాణాంతు వీర్యంతః|
వైశ్యానాం ధాన్యధనత - శ్శూద్రాణా మేవ జన్మతః||
తా. బ్రాహ్మణులలో జ్ఞానము గలవాడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమవంతుఁడు పెద్ద, వైశ్యులలో ధనధాన్యము గలవాఁడు పెద్ద, శూద్రులలో వయోధికుఁడు పెద్దయని భావము. - నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||
భూ - భూమి, (సమాసములందే).
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
భువి దివ్యతి బ్రహ్మవర్చసా భూదేవః, దివు క్రీడాదౌ. - బ్రహ్మవర్చస్సుచేత భూమి యందుఁ బ్రకాశించువాఁడు.
నేలవేలుపు - భూసురుడు.
బ్రహ్మవర్చస్సు - బ్రాహ్మణతేజము.
బ్రహ్మవర్చసము - సదాచారాధ్యయన సమృద్ధి.
భువి దివ్యతి బ్రహ్మవర్చసా భూదేవః దివు క్రీడాదౌ. - బ్రహ్మవర్చస్సుచేత భూమి యందుఁ బ్రకాశించువాఁడు.
బాబారౌతు - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్య సః కుబేరః - బేరమనఁగా శరీరము, కుత్సితమైన శరీరము గలవాఁడు.
బాబా - గుఱ్ఱము, సం.బడబా, వాహః.
వా మ్యశ్వా బడబా -
వామి - ఆడు గుఱ్ఱము, వి.ప్రోగు, రాశి.
వమతి గర్భం వామీ, ఈ. సీ. టు వము ర్ద్గిరనే - గర్భమును వెళించునది
ప్రోఁగు - పోగు; పోఁగు - 1.దారము, 2.చెవినగ.
రాశి - 1.రాసి 2.నికాయము, సమూహము. 2.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
బడబ - 1.ఆడుగుఱ్ఱము, 2.బ్రహ్మణ స్త్రీ, 3.తార్పుకత్తె.
వలతే బదబా, వల సంచలనే. - వబయోర్లళయోశ్పైకత్వం. - చలించునది. ఈ 3 గోడిగె పేర్లు, ఆఁడుగుఱ్ఱము.
బడబాయాం భవః బాడబః, బడబానలశ్చ - బడబ యనఁగా ఆఁడు గుఱ్ఱము, దాని ముఖము నందుండునది బాడబము.
అశ్వని - 1.27 నక్షత్రములలో మొదటిది (Aries), 2.అశ్వినీ దేవతలతల్లి, బడబ.
బాడబం గణే,
బడబానాం సమూహో బాడబం. - గొడిగల మూక.
తార్పుకత్తె - తాపికత్తె.
కుంటెన - తార్చెడువాడు, రూ.కుంటె నీఁడు, సం.కుట్టనీ.
కుంటెన ముడి - తాటాకుల పుస్తకమునకు నడుమ నుంచు దారముముడి.
మాధవి - 1.పూల గురివెంద, 2.కల్లు, 3.తెనె, 4.లక్ష్మి, 5.కుంటెనకత్తె.
మధౌ చైత్రే పుష్పవతీతి మాధవీ, ఈ. సీ. - చైత్ర మాసమందుఁ బుష్పించునది.
కుట్టనీ శమ్భళీ సమే,
కుంటికత్తె - తార్చునట్టి స్త్రీ, రూ.కుంటినకత్తె, కుంటెనకత్తె.
విటస్య కుటుంబం అర్థమరణేన కుట్టయతి నాశయతీతి కుట్టనీ, కుట్ట ఛేదన భర్త్పనయో. - విటుని కుటుంబము నర్థహరణముచేతఁ జెఱుచునది.
సంభళి - కుంటెనకత్తె, రూ.శంభళి.
శంభళి - కుంటెనకత్తె.
శంశ్రేయః భాలయతి హినస్తి శంభళీ, భల భల్ల పరిభాషణ హింసాదానేషు. - శ్రేయస్సును జెఱుచునది. ఈ 2 కుంటెనకత్తె పేర్లు.
విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ - చంద్రాదులచేతఁ ప్రకాశించునది.
బాడబము - 1.బడబాసమూహము, 2.బడబానలము.
బాడబాగ్నిరివాతృప్తౌ బాడబః, బడబాగ్ని వలెఁ దృప్తిలేనివాఁడు.
బాడబా బ్రాహ్మణీ, తస్యా అపత్య మితివా బాడబః - బడబ యనఁగా బ్రాహ్మణస్త్రీ; దానివలనఁ బుట్తినవాఁడు. "బడబా కుంభదాస్యశ్వా స్త్రీవిశేషా ద్విజాంగనా" అని రభసుఁడు.
వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ||
విప్రవినోది - వినోదవృత్తిచే జీవించు బ్రాహ్మణులలో నొకతెగ.
వినోదము - విలాసము, క్రీడాదుల చేత పొద్దుపుచ్చుట.
విలాసము - 1.ఒయ్యారము, సొగసు, 2.జాబుమీదవ్రాయు చిరునామా.
విశేషేణ లసనం విలాసః, లసశ్లేషణ క్రీడనయోః. - ప్రియునియొక్క దర్శనము చేతనైన కటాక్ష భ్రూవికారాదులు విలాసము.
వినోదక్రీడ - (గృహ.) మనోరంజనమును కలుగజేయు సాధనము (Recreation).
విలాసిని - 1.విలాసవతియైన స్త్రీ, 2.వేశ్య.
విప్రుఁడు - బ్రాహ్మణుడు, పారుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు; పారుఁడు - బ్రాహ్మణుడు.
విశేషేణ పాపేభ్యః ఆత్మానం వరం చ పాతీతి విప్రః. పా. రక్షణే. - తన్నును పరునిని విశేషముగాఁ బాపమునుండి రక్షించువాఁడు.
అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణో త్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణో త్సవః||
తా. సహజముగా విప్రుఁడు - బ్రాహ్మణుడు, పారుడు.)లకుఁ పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రతలకు దేశాంతరము పోయిన తమ భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము
బ్రహ్మహత్య - విప్రుని చంపుట (మహాపాతకము లలో నొకటి).
ధర్మాధారా ధనాధ్యక్షా ధనదాన్యవివర్ధినీ|
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని fire, 5.కాంతి.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
బ్రాహ్మణుఁడు - పారుడు; పారుఁడు- బ్రాహ్మణుడు.
బ్రహ్మణి పరబ్రహ్మణి నిష్ఠావత్త్వాత్ బ్రహ్మనః. పరబ్రహ్మయందు నిష్ఠగలవాఁడు.
బ్రహ్మనః కులే భవత్వాద్వా బ్రహ్మనః. - బ్రహ్మ కులమందుఁ బుట్టినవాఁడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
సర్వం బుధ్యతే బుధః, బుధ అవగమనే. - అన్నిటి నెఱిఁగినవాఁడు.
దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
బ్రాహ్మణ్యము - 1.బ్రాహ్మణ కర్మము, 2.బ్రాహ్మణ భావము.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.
బ్రాహ్మణములు - వైదిక ధర్మ గ్రంథములు, యజ్ఞగ్రంధములను, పురాణగాథలను చెప్పు ధర్మగ్రంథములు.
బ్రహ్మణిః పరబ్రహ్మణి విష్ఠావత్త్వాత్ బ్రాహ్మణః పరబ్రహమందు నిష్ఠగలవాఁడు.
బ్రహ్మణః కులే భవత్వాద్వా బ్రాహ్మణః బ్రహ్మకుల మందుఁ బుట్టినవాఁడు.
బ్రహ్మణ్యము - 1.బ్రాహ్మణులకు హితమైనది, 2.గంగరావి.
బ్రహ్మభూయము - బ్రహ్మత్వము.
అబ్రహ్మణ్యము - బ్రాహ్మణునికి తగనిది (వధాదులు) వి.చంపవలదు అని (బ్రాహ్మణుఁడు) పెట్టుమొర.
అబ్రహ్మణ్య మవధ్యోక్తౌ -
బ్రహ్మణే హితం బ్రహ్మణ్యం శాంతతా, తన్నభవతీ త్యబ్రహ్మణ్యం. - బ్రాహ్మణునికి హితముకానిది. ఈ ఒకటి చంపఁదగనివాఁడనుమాట పేరు.
అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||
తా. బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకల భూతములకు ద్రోహము(ద్రోహము - 1.కీడుతలపు, 2.చంపు నిచ్చ.)గలుగని వృత్తిచేత జీవించ వలయును. లేక భూతములకు స్వల్పపీడసేయు నట్టి వృత్తి చేతనైనను జీవింపవచ్చును. - నీతిశాస్త్రము
అన1 - 1.అన్న, 2.చిగురు, 3.ఆనకట్ట.
అన2 - 1.అనుటకు, అనగా మొ.ని; ఉత్ప్రేక్షావాచకముగా ఉపయోగింప బడును.
అన్న - జ్యేష్ఠసోదరుడు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
వదినె - అన్నభార్య, మగని తోబుట్టువు, మేనత్త మేనమామలకూతురు, భార్యాక్క, సం.వధూని.
కోశము - 1.కత్తియోర, 2.గ్రుడ్డు, 3.పుస్తకము, 4.బొక్కసము, (పంచకోశములు:- అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు).
అన్నకోశము - (జం.) అహారపు గొట్టమునకు క్రిందిభాగములో ఉన్న సంచివంటి ఒక అంగము (Stomach).
అన్నగృహము - (జం.) ముఖ్యముగా కీటకముల లోను, పక్షులలోను అన్న వాహికలో ఉబ్బి యుండు ముందు భాగము (Crop).
క్రమాకుంచనము - (గృహ.) అన్నకోశములో కెరటములవలె చలనమువలన ఆహారము ముందుకు త్రోయబడుట (Peristalitic Movement).
ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణా దండము.
ప్రవాళ మఙ్కురే ప్యస్త్రీ :
ప్రవాళ శబ్దము చిగురునకును, అపిశబ్దము వలన పవడమునకును, వీణా దండమునకును పేరు. ప్రవలత ఇతి ప్రవాళం. ప్న. వల సంచలనే. - కదలునది. టీ. స. అంకురోహ త్ర నవకిసలయః.
అబ్ధిపల్లవము - పగడము.
అథ విద్రుమః పుంసి ప్రవాళం పుంసపుంసకమ్-
విద్రుమము - పగడము, పగడపు చెట్టు Coral.
విశిష్టో ద్రుమో విద్రుమః - విశేషమైన చెట్టు.
పగడము - ప్రవాళము, పవడము, సం.ప్రవాళః.
ప్రకృష్టము - ప్రకర్షము గలది, శ్రేష్ఠమైనది.
ప్రకృష్టం వలతే ప్రవాళం. అ. ప్న. వల సంచలనే - లతారూపమై యుండునప్పుడు ప్రకృష్టముగా చలించునది. ఈ రెండు పగడము పేర్లు.
పగడపు రిక్క - ఆర్ద్రా నక్షత్రము.
పగడ - పాచికల మీద ఒకటి చుక్క, సర్వ.ఒకటి, సం.వటికా.
రత్నము - 1.మణి, 2.స్వజాతియందు శ్రేష్ఠమైనది (నవరత్నములు:- మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)
పవడపు దీవులు - (భూగో.) పవడపు పురుగుల గుల్లలచే సముద్రపు అడుగు భాగమున నేర్పడిన దీవులు, (హిందూ మహాసముద్రములోని లక్షదీవులు, మలిదీవులు ఈ కోవకు చెందినవి).
చిగురాకుదిండి - కోయిల, పల్లవఖాది.
కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణాతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
చిగురు - 1.పల్లవము, విణ.లేత, రూ.చివురు.
పల్లవించు - ఇగురొత్తు, చిగురుకొను.
పల్లవితము - 1.చిగురించినది, 2.విరివియైనది.
పల్లవో (అ)స్తీకిసలయమ్ -
పల్లవము - 1.చిగురు, 2.చిగురించిన కొమ్మ, 3.కోకచెరగు, 4.విరివి.
పలతి వాయువశాచ్చలతీతి పల్లవః, అ. ప్న. పల గతౌ. - వాయువశమునఁ గదలునది.
కిసలయము - చిగురు, రూ.కిసలయము, కిసాలము, కిసాలయము.
కించిచ్చలతీతి కిసలయం, షల గతౌ. - ఇంచుకంత చలించునది. ఈ 2 చిగురుపేర్లు, ఆకులతోఁ గూడిన కొమ్మ పేర్లని కొందఱు.
ప్రబలము - చిగురు విణ. మిక్కిలి బలము గలది.
ఇగురు - 1.చిగురు, పల్లవము, 2.పండ్ల చుట్టును మృదువుగా నుండెడి కండ. రూ.ఇవురు.
ఇగురుఁబోఁడి - చిగురువంటి మేనుగల స్త్రీ, చక్కని స్త్రీ.
చిగురించు - చిగుర్చు, పల్లవించు.
చిగురొత్తు - 1.చిగుర్చు, 2.అనురక్తమగు.
చిగురింత - 1.చిగుర్చుట, 2.తృణ విశేషము.
చిగురుఁబోడి - 1.చిగురువలె మనోజ్ఞురాలగు స్త్రీ, 2.స్త్రీ.
చిగురు విలుకాఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
పల్లవుఁడు - విటుడు; విటకాఁడు - విటుడు.
హ్రీంకార శుక్తికా ముక్తామణిర్హీంకార బోధితా,
హ్రీంకారమయ సౌవర్ణస్తమ్భ విద్రుమపుత్రికా. - 57శ్లో
క్రొంజిగురు (క్రొత్త + చిగురు) - క్రొత్తచిగురు.
క్రొంజిగురువిల్కాఁడు - మన్మథుడు.
తలిరువిలుకుఁడు - మదనుడు, రూ.తలిరువిల్తుడు, తలిరువిలుకాడు.
మదనుఁడు - మన్మథుడు.
మదనః మదయతీతి మదనః మదింప జేయువాఁడు, మదీ హర్షగ్లేపనయోః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
తలిరు - చిగురు.
తలిరుఁబోడి - స్త్రీ; స్త్రీ - ఆడుది.
తలిరుదిండి - కోయిల; కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక అదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
పైకము - ధనము, సం.వి.కోకిల గుంపు.
చిగురు విలుకాఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట.
ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించిన అడ్డంకి.
కట్టుఁగొమ్మ - అడ్డకట్ట, సేతువు.
కట్ట - 1.అడ్దకట్ట, 2.మోపు, అవ్య. సంతాపమును దెలుపును.
సేతు రాళౌ స్త్రియాం పుమాన్,
సేతువు - నీటికట్ట. పర్వతసేతు నిబంధక రామ్|
పుమాన్ సేతుః స్త్రియామాళౌ వర్తతే, సిన్వంతి బధ్నంతి మృత్పాషాణాదిభిరేన మిద సేతుః, ఉ. పు. షిఞ్ బందనే. - మృత్పాషాణాదులచేత దీనిఁ గట్టుదురు.
ఆలి - శుద్దంతఃకరణము గలది. వి. 1.తేలు, 2.తుమ్మెద, 3.శ్రేణి, 4.చెలికత్తె, 5.ఆనకట్ట.
అల్యతే నివార్యతే జలమనయేత్యాళిః, ఈ-సీ. అల భూషణపర్యాప్తి వారనేషు. దీనిచేత జలము నిలువఁబడును. ఈ 2 కట్ట పేర్లు.
ఆళి - 1.పంక్తి, 2.చెలికత్తె, 3.తేలు, 4.సముదాయము, 5.ఆనకట్ట.
ఆలతి పుష్పాణి ఆళి. ఇ. పు. అల భూషణాదౌ. - పుష్పముల నలంకరించునది.
అళి ద్రోణౌ తు వృశ్చికే :
అళి - 1.తుమ్మెద, 2.తేలు, రూ.అలి.
అలయోగాత్ అళీ - అలమనఁగా దోఁక, అది గలది.
ఆళిః, "అలం వృశ్చికలాంగుల ద్రోణ ఆలీ తు వృశ్చిక" ఇతి హలాయుధః, "భృంగవృశ్చికయోరళి" రితి రభసశ్చ.
ద్రూణము - ఎఱ్ఱతేలు, తేలు రూ.ద్రుణము.
ద్రుణతీతి ద్రోణః, ద్రుణ హింసాగతి కౌటిల్యేషు - హింసించునది.
ద్రూణమని కొందరు. వృశ్చిక శబ్దమునకు పూర్వమువలె వ్యుత్పత్తి. ఈ 3 ఎఱ్ఱతేలు పేర్లు.
ద్రుణము - 1.కత్తి, 2.విల్లు, 3.తేలు, 4.తుమ్మెద.
కత్తి - 1.ఖడ్గము, 2.మంగలి కత్తి, సం.కర్త్రీ.
కత్తియ - స్త్రీ ప్రత్యయము, ఉదా.చెలికత్తియ, సొగసుకత్తియ.
విల్లు - ధనుస్సు.
తేలు - 1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.
అలి - 1.తుమ్మెద, 2.తేలు, 3.కోకిల, 4.కాకి, రూ.అళి.
అలివేణి - 1.తుమ్మెదల బారువంటి జడగల స్త్రీ, 2.స్త్రీ.
పుచ్ఛము - తోక.
పుచ్ఛసంబంధి - (జం.) తోకకు సంబంధించినది, (Caudal).
తోఁక - తొంక.
తొంక - పుచ్ఛము, వ్యు.తొంగునది, వంగియుండునది, రూ.తోఁక.
పూయతే దంశాదీ నుత్సారయతీతి పుచ్ఛః, అ. ప్న. వూయీ విశరణే. - ఈగలు మొదలయిన వానిని బోఁగొట్టునది.
లాంగూలము - తోక.
లఙ్గతి చలతీతి లాంగూలం, లగిగతౌ. - కదలునది.
లాంగూలతరణ న్యాయము - న్యా. కుక్క తోక పట్టుకొని గోదావరి యీదె ననురీతి.
వాలము - 1.తోక, 2.కత్తి.
వాలా ధీయంతే (అ)స్మిన్నితి వాలధిః ఈ. పు. డు ధాఞ్ ధారణ పోషణయోః. - వాలము దీనియందు ధరింపఁబడును.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతి కుటిలం ఊర్థ్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఈ-పు, అగ కుటిలాయాం గతౌ - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
ఆలిమాటలు విని యన్నదమ్ముల బాసి
వేరే పోవు వాడు వెర్రివాడు
కుక్కతోక బట్టి గోదావరీదునా విశ్వ.
టీ|| ఆలి మాటలు విని అన్నదమ్ములని వదిలి వేరేపోవువాడు(వేఱిఁడి - అవివేకి, రూ.వీఱిడి.)అవివేకము, కుక్కతోక బట్టుకొని పెద్దనది యయిన గోదావరి - గౌతమీనది నీదుట అసాధ్యము అని తెలుసు కొనుము.
తన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ
బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత….
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
వంతెన - ఏటిపైకట్ట, వారిధి.
వారిధి - వంతెన, అడ్దకట్త (ఈ అర్థము తెలుగునందే).
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలి పురికన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.
బరాజ్ - (వ్యవ., అర్థ, భూగో.) (Baraz) నీటిపారుదల వసతులకై నదిలోని నీరును భద్రము చేయుటకై కట్టిన కట్టడము.
గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించిన దానికై విచారించుట.
భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రం యుతేనచ|
సేతుస్స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృ వందనే||
తా. ఆరుమారులు భూప్రదక్షిణంబులు, కాశి - 1.వారణాసి, 2.ప్రకాశము, 3.సూర్యుడు Sun, 4.అలసట.)పదివేలమారలు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున కలుగు ఫలము తమ తల్లికి ప్రీతిపూర్వకముగా వందనము - 1.పూజ, 2.స్తోత్రము 3.నమస్కారము)మాచరించుటవలన కలుగును. – నీతిశాస్త్రము
రుద్రో వృక్ష ఉమావల్లీ తస్మైతస్మై నమోనమః|
పుడమితాలుపు - శేషుడు, వ్యు.భూమిని ధరించినవాడు.
పుడమి - భూమి, సం.పృథివి.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
మహి - పుడమి, భూమి.
మహ్యతే మహీ. ఈ. సీ. పా. మహిః. ఇ. సీ. మహ పూజాయాం. - పూజింపఁబడునది.
పుడమి - భూమి, సం.పృథ్వీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
మహీరుహము - వృక్షము.
మహ్యాం రోహతీతి మహీరుహః, రుహబీజజన్మని ప్రాదుర్భావేచ. - భూమియందు మొలచునది.
మహిళ - స్త్రీ.
మహ్యత ఇతి మహిళా, మహపూజాయాం. - ఆదరింపఁ బడునది.
పూచిన పువ్వులు అన్నీకాయలే అయితే పుడమి భరించగలదా ?
సూక్ష్మో పి భారం నృపతే స్యందవో వై
శక్తో వోఢుం న తథాన్యే మహీజాః|
ఏవం యుకత భారసహా భవంతి
మహాకులీనా న తథా న్యే మనుష్యాః||
తా. రథం చిన్నదయినా పెద్ద బరువు మోస్తుంది. కాని చెట్లు అలా మోయలేవు. అలాగే(కులీనత - మంచి కులమున పుట్టుట.)మహాకుల సంజాతుల యిన వారు పెద్దభారం సహింపగలరు. అలా ఇతరులు మోయలేరు.
మహీజా కుచ సంలగ్న కుంకుమారుణ వక్షసె,
నమః కల్యాణరూపాయ రామా.….
మాహేయి - గోవు.
మాహాగౌః, తస్యా అపత్యం మాహేయీ, ఈ. సీ. - మాహయనఁగా ఆవు, దానికి పుట్టినది.
మాహేయుఁడు - 1.అంగారకుడు Mars, 2.నరకాసురుడు.
మహ్యాః సుతః మహీసుతః - భూమికొడుకు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
శాఖి - 1.వృక్షము, 2.వేదము, వ్యు.శాఖలు కలది.
శాఖాః అస్య సంతీతి శాభీ. న. పు. - కొమ్మలు గలిగినది.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ.
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి.
శాఖలేనిమంత్రి - (రాజ.) ప్రత్యేక పరిపాలన శాఖకు నిర్దేశింపబడని మంత్రి (Minister without Portfolio).
శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).
శాఖామృగము - కోతి, వ్యు.చెట్ల కొమ్మలపై తిరుగు మృగము.
కొమ్మత్రిమ్మరి - కోతి monkey.
శాఖాచారీ మృగః శాఖామృగః - కొమ్మలయందుఁ జరించు మృగము.
అన్యస్తు యన్మూల నగరాత్పురమ్, త చ్ఛాఖా నగరమ్ -
గృహ్య - శాఖానగరము, పేట.
మూలనగరే అసమాన్మిత జనౌఘస్య సరిదంకే సరో అంకే వాకల్పితంపురం శాఖానగర మిత్యుచ్యతే - మూలనగరమనఁగా రాజధాని; అందు జనులకు చోటుచాలక నదీసమీపమందుఁ గాని సరస్సమీపమందుఁగాని కట్టఁబడిన వేఱొకపట్టణము శాఖానగర మనంబడును.
పేఁట - 1.శాఖానగరము, నగరము, 3.నగరములోని భాగము, సం.పింఠా.
పేట - హారములో నొక సరము
శాఖానగరము - ఉపనగరము, పేట.
మూలనగరస్య తరుస్థానీయస్య శాఖాసదృశత్వాత్ శాఖానగరం - తరుస్థానీయమైన ప్రధానపట్టనమునకు కొమ్మవలె నుండునది. ఈ 1 శాఖానగరము పేరు.
సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. - 8స్తో
విటపి - చెట్టు, వ్యు.విటపములు కలది.
విటపాః అస్య సంతీతి విటపీ, న. పు. - కొమ్మలుగలది.
విటపము - 1.చివురించిన కొమ్మ, 2.చిగురు, 3.కొమ్మ, 4.బోదెలేని చెట్టు.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ - ఆడుది(స్త్రీ - ఆడుది), రూ.కొమ్మ.
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.
సమే శాఖలతే -
శాఖతి దిశో వ్యాప్నోతీతి శాఖా, శాఖృ వ్యాప్తౌ. - దిక్కులను వ్యాపించునది.
లాతి వేష్టనార్థం యప్ట్యాదికమితి లతా, లా దానే. ప్రాఁకుటకొఱకు గడలు మొదలైనవానినిని జుట్టుకొనునది. 2 కొమ్మల పేర్లు.
An old Chinese saying, the branch which does not bend in the wind will break.
పోటకత్తి - (వ్యవ.) పొడవైన పిడితో వంపు తిరిగి యుండు చిన్నకత్తి, (ఇది కొమ్మలను నరకుటకు కుపయోగించును) (Bill-hook).
తీఁగ - లత, రూ.తీఁగియ, తీఁగె, తీవ, తీవియ, సం.దీర్ఘా.
తీవ - తీగ, రూ.తీవియ, తీవె. తీవియ - తీవ; తీవె - తీవ. తీఁగబోఁడి - స్త్రీ; స్త్రీ - ఆడుది.
మూలా చ్చాగ్రం గతా లతా,
లతా మూలాత్ అగ్రం గతా - చెట్టుమొదటి నుండి కొనవరకు నల్లిన తీగె పేరు.
లతిక - 1.తీగ, 2.నూరు పేటల హారము.
లత - 1.తీగ, 2.ముత్యాలహారపు పేట, (వృక్ష.) తీగగా ఏదైన ఆధారమును ఊతగొని ప్రాకు మొక్క.
లతా రూపత్వాల్లతా - లతారూపమైనది.
లతారూపత్వాత్పముద్రాంతా - దవ్వుగా వ్యాపించునది.
దూరప్రసరాల్లతా - దూరముగా వ్యాపించునది.
లాతి ఆదత్తే జనమనాంసి సుగంధిత్వాల్లతా, లా ఆదానే. - మంచి పరిమళము గలది గనుక జనుల మనస్సుల నాకర్షించునది.
లతకూన - లేత తీగవంటి స్త్రీ.
లాతి వేష్టనార్థం యష్ట్యాదికమితి లతా. లాదానే. ప్రాఁకుటకొఱకు గడలు మొదలైనవానిని బట్టుకొనునది.
తీగకు పందిరి కావలెగాని తెలుసా నువ్వే పందిరని...
తీఁగవిలుకాఁడు - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మదనః మదయతీతి మదనః - మదింప జేయువాఁడు, మదీ హర్షగ్లేపనయోః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
విమోటనము - (భౌతి.) ఒక తీగను గాని కొంచెము నులిపినపుడు అది మరల తొంటిస్థితిని తీసికొనుట కుపయోగించు బలము, (Torsion).
వల్లరీ మఞ్జరీ స్త్రియా,
వల్లరి - చిగురించిన లేతకొమ్మ, తీగ.
వల్లతే శాఖాంసంవృణోతీతి వల్లరీ. ఈ. సీ. వల వేల్ల సంవరణే. - కొమ్మను గప్పునది.
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
మన్యతే పికాదిభి ర్బహుమన్యతే మంజరీ. ఈ. సీ. మన అవబోధనే. - కోకిలాదులచేత నిక్షేపమువలెఁ దలఁచఁబడునది.
ఈ శబ్దములు ఇక్షారాంతములుం గలవు. పూవులగుత్తికిఁగాని పూచిన కొమ్మకుఁగాని పేర్లు.
రుద్రో వృక్ష ఉమావల్లీ తస్మైతస్మై నమోనమః|
వల్లి - 1.తీగ, 2.సుబ్రమణ్యేశ్వరుని భార్య.
వలతే వేష్టతే యష్ట్యాదికమితి వల్లీ - ఈ. సీ. వల వేల సంవరనే. - కఱ్ఱ మొదలగువానిని జుట్టుకొని యుండునది.
సుబ్రమణ్యుఁడు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ. కొమరుసామి.
కొమరసామి - స్కందుడు; స్కందుఁడు - కుమారస్వామి.
కొమరు-1.మనోజ్ఞత, అందము, 3.కుమారస్వామి, 4.పైదూలము మీది గుజ్జు, (కొ మరుదనము, కొమరు ప్రాయము=యౌవనము).
వల్లీశః రుద్ర తేజస్వీ వినాయక ప్రియానుజః|
వల్లీ దేవ సేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నే నమః||
ప్రతతి - 1.సమూహము, 2.తీగ, 3.విరివి.
ప్రకృష్ఠా తతిర్విస్తారో (అ)స్యాః ప్రతతి ఇ.సీ. తను విస్తారే. - మిక్కిలి విస్తారము దీనికిఁ గలదు.
పా. ప్రతతీ. ఈ. సీ. తథా చ._ "ప్రస్థస్సానుని మానే చ ప్రతితిస్తతివీరుధో" రితి పకారాదా వజయః. "ధరాధరేంద్రం ప్రతతీతతీరివ" ఇతి మాఘః.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
సమ్య గూహ్యతే ఏకత్రేతి సమూహః, ఊహ వితర్కే. - ఒకదిక్కున నన్నియు లెస్సగా నూహింపఁ బడును.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నదుమ నడుమ వచ్చెడి ఉండ.
సుప్రతీప స్సుతామ్రాక్ష స్సుబ్రహ్మణ్య స్సుఖప్రదః,
వక్ర స్తంభాదిగమనో వరేణ్యో వరద స్సుఖీ|
విరివి - విస్తృతి, విన.విస్తృతము, వెడల్పైనది.
విస్తరము - 1.విరివి, 2.పీఠము, 3.సమూహము.
పీఠము - 1.ఇల్లుకట్టుటకు వేసిన పునాది స్థానము (Plinth), 2.పీట.
విసర్ణము - సమూహము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
విస్తరణ - (గణి.) ఒక సమాసమును విప్పి శ్రేణిగా వ్రాయుట (Expansion).
విస్తీర్ణ - విరివియైనది.
గరి - 1.అతిశయము(అతిశయము - అధిక్యము), 2.వరినారు తలెత్తి విస్తరిల్లు పచ్చటి భాగము, (వృక్ష.) పర్ణాంగము యొక్క పత్రము (Frond).
హ్రీంకార శుక్తికా ముక్తామణిర్హీంకార బోధితా,
హ్రీంకారమయ సౌవర్ణస్తమ్భ విద్రుమపుత్రికా|
ఆర్ద్రత - మెత్తదనము, స్నిగ్ధత, (భౌతి.) గాలిలోని తేమ, తడి (Humidity, Moisture).
క్లిన్నము - ఆర్ద్రము, తడిసినది.
ఆర్ద్రము - (భౌతి.,రసా.) తడిసినది, తడిగా నున్నది (Damp).
చెమ్మగిలు - 1.తడిగలదియగు, 2.చెమ్మగిల్లు, 3.చెమ్మయురుకు.
చెమ్మగొట్టు తెగులు - (వ్యవ.) సామాన్యముగా మడియందు తేమ హెచ్చుగానుండుటచే, కొన్ని జాతుల నారు మొక్కల మొదళ్ళకు ఒక విధమగు బూజు తెగులు పట్టి అవి చీకి వాని తలలు వడలిపోవుట (Damping off).
ద్రవము - 1.తడి, 2.పరిహాసము, 3.పరుగు, 4.యుద్ధమునుండి పారుట, 5.వేగము.
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ|
నిత్యషోడశికారూపా - శ్రీకంఠార్ధ శరీరిణీ. - 85శ్లో
(ౘ)చొదుగు - చెమ్మ, తడి.
చెమ్మ - తడి, ఆర్ద్రత, సం.సృమరః, శ్రమః.
తడియు - ఆర్ద్రమగు.
ఈకువ - తడి, తేమ, ఆర్థ్రత.
తేమ - తడి, రూ.తెమ్మ.
తేమగిల్లు - తడియగు, రూ.తేమగిలు.
తేమనము - 1.మజ్జిగపులుసు(మజ్జిగ – చల్ల, సం.మార్జికా), 2.తడియుట, రూ.తేమము.
తిమ్మనము - 1.తేమనము, 2.మజ్జిగ పులుసు, 3.పాలు, బెల్లము, పిండి ఉడికించి చేసిన పదార్థము, సం.తేమనమ్.
శిఖరణీ - 1.చల్లపులుసు, 2.ఉత్తమ స్త్రీ, 3.రోమావళి, 4.సిగరి, 5.వృత్త విశేషము.
సిగర - శిఖరిణి, చల్లపులుసు, రూ.గరి.
కొమ్ము - 1.ఉకారము యొక్క రుపాంతరనామము, 2.ఎద్దు మొవి. ని కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ.ని ఎండిన గడ్డ, ఉదా. పసుపుకొమ్ము, శింఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 8.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.
కందరము - 1.అల్లము, 2.అంకుశము 3.బిలము.
అర్దకము - అల్లము Ginger.
అల్లము - పచ్చి సొంటి, సం.అర్దకమ్.
ఆర్ద్రాయాం భవం ఆర్ద్రకం - ఆర్ద్రానక్షత్ర మందుఁ బుట్టినది.
శృంగబేరము - అల్లము.
శృంగవద్భేరం వపు రస్య శృంగబేరం - కొమ్ములవంటి యాకృతి గలిగినది.
ప్రకందము - (వృక్ష.) అల్లము, పసుపు మొదలగు మొక్కలకు భూమిలో నుండు కాండము (Rhizome).
మురబ్బ - (మురబ్బా) 1.అల్లపు మురబ్బయను లేహ్యము, 2.పెంకితనము.
పెంకితనము - చెప్పినమాట వినకుండుట, మూర్ఖత.
పెడసగము - మౌర్ఖ్యము, మూడత్వము.
ముకురుతనము - మౌర్ఖ్యము.
మూర్ఖము - మౌర్ఖ్యము(మౌర్ఖ్యము - మూర్ఖత్వము)గలది.
మారాము - 1.మర్మము, 2.గారాబము, 3.పెంకిపట్టు.
మామిడల్లము - (వ్యవ.) పచ్చిమామిడి కాయ వాసనగలిగి అల్లమువలె నుండు దుంప (ఇది పసుపు కుటుంబము (Zingi-beraceac)నకు చెందిన Curcuma amada అను మొక్క యొక్క దుంప) (Mango ginger).
శుంఠి - సొంటి
శుణ్ఠతి శుప్యతీతి శుణ్ఠీ, ఈ. సీ. శుఠిశోషణే. - ఎండినది.
సొంటి - శుంఠి, ఎండిన అల్లము, సం.శుంఠీ.
శొంఠి - వ్యవ. ఎండిన అల్లము, సొంటి (Dried ginger).
మహౌషధము - 1.శొంఠి, 2.గొప్పఔషధము.
మహచ్చత దౌషధం, మహౌషధం - దొడ్డ యౌషధము.
మహచ్చ తదౌషదంచ మహౌధం - మహత్తైన ఔషధము.
మహచ్చ తత్ ఔషధం మహౌషధం - గొప్ప యౌషధము.
కొమ్ము - 1.ఉకారము యొక్క రుపాంతరనామము, 2.ఎద్దు మొవి. ని కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ.ని ఎండిన గడ్డ, ఉదా. పసుపుకొమ్ము, శింఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 8.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.
ఓల్లము - 1.అల్లము, 2.కంద.
అర్శో హంతీతి అర్శోఘ్నః. హన హింసాగత్యోః. - మూలవ్యాధిని హరించునది.
సూరణము - కందగడ్డ.
సూర్యత ఇతి సూరణః - భక్షించఁబడునది. సూరీ హింసాయాం. పా. శూరణః.
కంద - కందగడ్ద.
కంద్యతే రోగో అ నేనేతి కందః. కది అహ్వానే రోదనే చ. - దీనిచేత రోగము పీడింపఁబడును.
కంద్యతే రోగి భిరన్వీక్ష్యత ఇతి వా కందః - రోగులచేత వెదుకఁబడునది.
కందకు లేని దురద, కత్తిపీట కొచ్చిందిట. కందకు లేని దురద బచ్చలికా?
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
బిల్యతే భిద్యత ఇతి బిలం, బిల భేదనే.- భేదింపఁబడునది.
రంధ్రము - 1.క్రంత, సందు 2.దూఱు(దూఱు - నిందించు, వి.నింద).
కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము - (జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)
క్రంత1 - పెండ్లి కొడుకువారు పెండ్లి కూతురునకు తీసుకొని పోయెడు ప్రధాన ద్రవ్యము, రూ.కంత.
క్రంత2 - 1.సందురోవ, 2.రాజ వీధి, రాజ మార్గము 3.రచ్చ, 4.రంధ్రము, సం. గర్తః.
సందు - 1.సంది, 2.ఇరుకువీధి, 3.సొరంగము, 4.ఎడము, 5.సందర్భము, సం.సంధిః.
సంది - 1.సందు, 2.దండచేయి, సం.సంధిః.
సందలి - దండచేయి.
గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కందము.
స్కందము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
మూఁపు - భుజ శిరస్సు, అంసము.
స్వాంతము - 1.మనస్సు, 2.గుహ.
స్వనతీతి స్వాన్తం, స్వనశబ్దే, తద్ద్యోగాభావే వాగ్వ్యాపారాభావాద త్రోవచారః. - పలుకునది. మనస్సంబంధము లేనపుడు వాగ్వ్యాపారము గలుగదు గనుక పలుకునది యని చెప్పుట ఔపచారికము. ప్రియ గుహవిని వేదిత పద రామ్|
గవి1 - ఆవు Cow.
గవి2 - 1.గుహ, 2.గుంట.
కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము - (జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
సుప్రతికము - ఈశాన్యదిక్కు నందలి ఏనుగు.
శోభనాః ప్రతీకా అవయవా యస్యసః సుప్రతీకః - మంచి అవయములు గలిగినది.
అంజనావతి - ఈశాన్య దిక్కునందలి సుప్రతీకమను దిగ్గజము యొక్క భార్య.
అంజనిక - 1.నలికండ్ల పాము, 2.ఒక జాతిబల్లి, 2.చుంచు, 4.సుప్రతీక మను దిగ్గజము యొక్క భార్య.
బ్రహ్మ సర్పము - నలికండ్ల పాము.
నలికండ్ల పాము - రక్త పుచ్ఛిక, రూ.నలికిరి, నలికీచు.
నల్లిక - నలికండ్ల పాము; మీద్ద - నలికండ్ల పాము.
చుంచు - 1.చుంచు, రూ.చుందరి.
ౘుంచు - 1.కంపెలుక, సం.చుచుందరీ.
చుచున్దరీ గన్ధమూషీ -
చుచుందరి - 1.చుంచు, రూ.చుందరి.
ఛ్యతీతి చుచుందరీ. సీ. ఛో చ్ఛేదనే. - ధాన్యములను ఛేదించునది.
ౘుంచెలుక - 1.చుచుందరి, చుందరి, 2.కంపెలుక, రూ.చుండెలుక.
గంధమూషికము - చుంచు.
గంధవతీ మూషీ గంధమూషీ - వాసన గల యెలుక. ఈ రెండు చుంచు పేర్లు.
తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
పునాసలు - పునర్వసు నక్షత్రమందు సూర్యు డుండినపుడు చల్లిన ధాన్యము.
పునాసపంట - (వ్యవ.) మే నెల మొదలు ఆగష్టు నెలలోపల చేయు పునాసరకముల వరిసాగు (paddy third crop).
7. పునర్వసు - ధనుస్సు వంటి యాకారమును పోలి 5 నక్షత్రములుం డును.
పునర్నో దేవ్యదితి స్పృణోతు | పునర్వసూనః పునరేతాం యజ్ఞమ్ | పునర్నో దేవా అభియంతు సర్వే | పునః పునర్వో హవిషా యజామః | ఏవా న దేవ్యదితిరనర్వా | విశ్వస్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా | పునర్వసూ హవిషా వర్ధయంతీ | ప్రియం దేవానా - మప్యేతు పాథః ||5||
అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య, 2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము.
పునర్వసు - ఒక నక్షత్రము.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్తి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
గౌరి- 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణునిభార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించింది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
No comments:
Post a Comment