Friday, June 3, 2016

కుంభరాశి

ధనిష్ఠ 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 3 పాదములు - కుంభరాశి, కడవ.

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

బృందము - సమూహము.
బృందారకుఁడు -
వేలుపు, విణ.మనోజ్ఞుఁడు. 

కుంభము - 1.కుండ, 2.ఏనుగు నెత్తి మీద గుబ్బ, 3.పదునొకండవ రాశి (Convex - కుంభకార).
కుండ -
1.మట్టిపాత్ర, 2.ఇరుసు తగిలించెడి బండి కంటి నడుమ గుబ్బ, 3. ఏనుగు కుంభస్థలము, 4.స్పోటకపు పొక్కు, సం.కుండమ్.
కుండరాశి - కుంభరాశి Aquarius.

కుమ్భౌ ఘటేభ మూర్ధాంశౌ : కుంభశబ్దము కడవకును, ఏనుగు కుంభస్థలమునకును పేరు.
కుంభతీతి కుంభః. కుభి ఆచ్ఛాదనే. - కప్పియుండునది.
"కుంభస్స్యా త్కుంభకర్ణస్య పుత్రే వారాంగనాపతౌ, రాశిభేదే మానభేదే గుగ్గులు త్రివృతోరపి, కుంభీతు పాటలా వారిపర్ణీ పిఠరకట్ఫలే"ఇతి శేషః.

కుంభాకార - (భౌతి.) గోళకేంద్రమునకు వెలుపల నున్న తలము, విణ.పరావర్తన తలముగా పనిచేయు (దర్పణము) (Convex). కుమ్భౌతు శిరసః పిణ్డౌ :
కుంభాకృతి యోగాత్కుంభౌ. అ. పు. - కుంభముల వంటి యాకారము గలవి.
శిరసః పిణ్డౌ - ఏనుఁగుతల మీఁద నుండు మాంసపుంజములు రెండును కుంభము లనంబడును. కుంభస్థలము.

ఘటము - 1.ఎళనీరుకాయ, 2.కడవ, 3.కుంభస్థలము.
కలశము -
ఘటము, కుండ.
ఘటోద్భవుఁడు - అగస్త్య మహర్షి. 

సృష్టి మొత్తంలో బరువైనవాడు. - అగస్త్యుడు.

మఱువ - కుండ.
మఱువకందు - కుంభ సంభవుడు, అగస్త్యుడు. అగస్త్యానుగ్రహ వర్థిత రామ్.

కుంభసంభవుఁడు - 1.అగస్త్యుడు, 2.ద్రోణుడు(బృహస్పతి అంశ).
కుంభజుఁడు - 1.అగస్త్యుడు 2.ద్రోణుడు. ప్రజా పతిర్వై ద్రోణ కలశః.

ఆచార్యుఁడు - 1.వేదవ్యాఖ్యానము చేయువాడు, 2.వేదాధ్యయనము చేయించువాడు, 3.మతస్థాపకుడు, 4.యజ్ఞాదులందు కర్మోపదేశికుడు, 5.ఉపాధ్యాయుడు, గురువు, 6.ఏదైన ఒక విషయమున నిశిత పాండిత్యము గలవాడు, 7.ద్రోణుడు.
ఆచార్య - 1.వేదార్థమును వ్యాఖ్యానించెడి స్త్రీ, 2.ధర్మోపదేశికురాలు.
ఆచార్యాని - ఆచార్యుని భార్య.
కృపి - ద్రోణుని భార్య.

మైత్రావరుణి - అగస్త్యుడు, వ్యు.మిత్రావరుణుల వలన గలిగినవాడు.

మైత్రావరుణిః :
అగం వింధ్వం స్త్యాయతి స్తంభయతి త్యగస్త్యః. స్త్యైప్ట్యై శబ్దసంఘాతయోః - అగ మనఁగా పర్వతము వింధ్యపర్వతము, దాని నణఁచినవాఁడు. అగస్తి రితిపాఠాంతరం.
కుంభే సంభవో యస్య సః కుంభసంభవః - కలశమునందుఁ బుట్టినవాఁడు.
మిత్రావరుణయో రపత్యం మైత్రావరుణిః. ఇ. పు. - మిత్రావరుణుల కొడుకు. ఈ మూడు 3 అగస్త్యుని పేర్లు.

అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్| అగస్త్య మహర్షికి గురుదేవుడైన హయగ్రీవుడు ఉపదేశించినది, లలితా సహస్రనామము.

ఎళనీరు - ఎడనీరు.
ఎడనీరు -
లేతటెంకాయలోని నీరు, రూ.ఎలెనీరు, ఎళనీరు.
ఎలనీరు - లేత టెంకాయలోని నీరు, రూ.ఎడనీరు, ఎళనీరు. 

రాజమందిరం చినదానా - రాజావారికి నచ్చే జాణా - చేద వేయకుండా - నీళ్ళు తోడకుండా చేయి తడపకుండా దాహానికి నీళ్ళు తేవే. - కొబ్బరి బొండం   
బావినిండా నీరే పిట్టకందదు - ఎలుకకందదు. - కొబ్బరిబొండం  

ముక్కంటిపండు - కొబ్బరికాయ. 
టెంకాయ -
కొబ్బరికాయ, (తెన్ = దక్షిణము, అచట, ఎక్కువగా దొరుకుకాయ.)
తెంకాయ - టెంకాయ.
బొండము - పెచ్చుతో కూడిన టెంకాయ, కొబ్బరి బొండము, రూ.బొండాము, బొండలము, బొండ్లము, బొండ్లాము.
నారికడము - నారికేళము, కొబ్బరికాయ, రూ.నారికేడము, సం.నారికేళః.
నారికేడము - నారికడము; కరరీఫలిని - నారికేళము.

గళ్ళెము - పాలమీగడవంటి లేత కొబ్బెర.
ఒంటి స్తంభంమీద చలువ పందిరి - చలువపందిరిలోన చలువ నీటికుండ - చలువ నీటికుండలోన చవులూర మీగడ. - టెంకాయ లేతకొబ్బరి 

కదళీపాకములు - (అలం.) ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళపాకము.

ఇందీవరాక్ష ! నీ ఇల్లెక్కడన్న
తలనీరుమోసెన త్తరువు క్రిందనియె - కొబ్బరి చెట్టుక్రింద  

ఆజగామ యదాలక్ష్మీ ర్నారికేళ ఫలాంబువత్|
నిర్జగామ యదాలక్షీ ర్గజభుక్త కపిత్థవత||
తా.
సంపద వచ్చునపుడు టెంకాయ(కొబ్బరికాయ)యందలి జలమువలె తనంతట వచ్చును. పోవునపుడు (డే)ఏనుఁగు(గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగములలో ఒకటి.)భక్షించిన వెలగపండు వలె పోవును. - నీతిశాస్త్రము

కురుడి - లోపలి నీరింకిన కొబ్బెర.
కుడుక -
తక్కెడ తట్ట.
కొబ్బెర - చిప్ప తీసిన టెంకాయ, టెంకాయ లోని పేళము. 

కంబరత్రాఁడు - కొబ్బరి పీచుతో పేనిన త్రాడు.
కీతు - కొబ్బరియాకుల చాప.
మట్ట - 1.కొబ్బరి, తాటి మొ. వాని ఆకులకొమ్మ, 2.మొ. ఆవు వానితోక.

బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.
అసలు నీకు బుఱ్ఱ లేదా! బుర్ర లేకుండా మాట్లాడకు. బుఱ్ఱ వున్నవాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు(తెలివితక్కువ తనానికి కోప్పడే మాట).

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయ చిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీదిపోలుసు, 8.తునక, విణ.అల్పము.

అగప - 1.టెంకాయ చిప్ప, కొయ్య గరిటె, 2.ఓడల మురికిని గోకి శుభ్రము చేయు కొయ్యగుద్దలి, రూ.అవక, అబక. అబక - అగప. 

అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు.   

తేఁజెట్టు - టెంకాయచెట్టు, రూ.తేమ్రాను, తెన్+చెట్టు = దక్షిణచేశపు చెట్టు. 
తృణరాజము -
1.తాటిచెట్టు, 2.కొబ్బరిచెట్టు, 3.గిరకతాడిచెట్టు.
తృణద్రుమము - కొమ్మలు లేని తాటి, కొబ్బరిచెట్ట్లు మొదలగునది. 

వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజః చర్మాంగధారీ నచసోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణిః జలంచ బిభ్రన్న ఘటోన మేఘః. - కొబ్బరికాయ   
చెట్టుపైన నివాసం - పక్షిగాని - చర్మధారినిగాని సోమయాజిగాను - ముక్కంటిని నేను త్రినేత్రుడనుగాను - నీరు గల్గియుంటి - మేఘుడను కాను. - కొబ్బరికాయ
ఆకాశాన అంబు-అంబుకులో చెంబు-చెంబులో చారెడునీళ్ళు. - టెంకాయ
సూర్యుడు చూడని గంగ - చాకలి ఉతకని మడుగు. - టెంకాయ
చెక్కని స్తంభం - చేయనికుండ పోయనినీరు వెయ్యనిసున్నం. - కొబ్బరికాయ
చెయ్యనికుండ - కురియనినీరు - వెయ్యనిసున్నం తియ్యగనుండు. - కొబ్బరికాయ     
చెట్టుకొమ్మలో పిట్ట - పిట్టకు మూడుకళ్ళు - పొట్టనిండా కడవెడు నీళ్ళు. - కొబ్బరికాయ   
నిటారు నిలువలు - పటాకు బయళ్ళు - మజ్జిగ ముంతలు - మాణిక్యాలు. - కొబ్బరికాయలు
మంచమంత ఆకు - ముంతంత కాయ. - టెంకాయ
కొప్పుందిగానీ జుట్టులేదు - కళ్ళున్నాయిగాని చూపులేదు. - టెంకాయ 
మూడు కండ్లవాడు ముక్కంటి మరికాడు - తలకు పిలకయుండు తాతగాడు - తాత గుడికిపోవ తలకాయ పగెలెరా ! - కొబ్బరికాయ    
బొచ్చుకాయ. - కొబ్బరికాయ
గుండ్రాయికి గుప్పెడంత పిలక - మూడు కళ్ళు. - టెంకాయ  
చుట్టూకంప - కంపలో పెంకు - పెంకులో శంఖు - శంఖులో తీర్థం. - టెంకాయ    
గుడిలో నీళ్ళు - గుడికి తాళం. - కొబ్బరికాయ
సన్నని నూతికి దారులు లేవు. - కొబ్బరికాయ    

కంచుక పత్రాధారము - (వ్యవ.) కొబ్బరి మొ.మొక్కల ఆకుల మొదళ్ళు కనుపులచుట్టును ఒరవలె అమరి యుండునది (Sheathing leaf base).

గండిక బరిణె పురుగు - (వ్యవ.) కొమ్ము పురుగు, ఎన్నెమ్మ పురుగు, (ఇది బరిణె పురుగు కుటుంబములోనిది, కొబ్బరిచెట్ల మొవ్వులను కొట్టివేయును (Oryctes rhinoceros).
ఎన్నెమ - పురిటిపురుగు, రూ.ఎన్నెమ్మ, ఎనెమ్మ.

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలముభంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుధావహమునగును భువిలో సుమతీ.
తా.
నారికేళ వృక్షమునకు ఎంత నీరిపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళములిచ్చును. అటులనే (ధీరుఁడు-విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు,2.స్వాతంత్యము కలవాడు.)శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారం అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగ జేయును.

స్పోటకము - ముశూచికము, అమ్మవారు.
మశూచకము -
(గృహ.)స్పోటకము, అమ్మవారు,(Small pox) (ఇది అంటువ్యాధి, నీటి ద్వారా వ్యాపించును). మశూచిక - స్పోటకము. పోటకము - స్ఫోటకము, పెద్దమ్మవారు, ఒడలెల్ల పోటకత్తి బొబ్బలు లేచు వ్యాధి, సం.స్ఫోటకః.
అమ్మవారు - 1.స్త్రీ దేవత, గ్రామదేవత 2.పూజ్యస్త్రీ, 3.స్పోటకము 4.స్ఫోటకాధిష్ఠాన దేవత.

టీకాలువేయు - (గృహ.) మశూచి రాకుండుటకై దానికి విరుగుడును శరీరము లోనికి ఎక్కించు (Vaccination).

వ్విస్ఫోటము - బొబ్బ, పొక్కు.
బొబ్బ -
1.పొక్కు 2.సింహనాదము.
పొక్కు - 1.బొబ్బ 2.ఎండి లేచిన పెల్ల 3.జనశ్రుతి, క్రి. 1.దుఃఖించు 2.బొబ్బలేచు.

విస్పోటః పిటక స్ర్తిషు :
విస్ఫుటతి విస్ఫోటః. స్ఫుట భేదనే. - వ్రక్కలౌనది.
పిటతి సంశ్లిప్యతి పిటకః. అ. త్రి. పిట సంశ్లేషణే. - వ్రక్కలై కూడుకొనునది. ఈ రెండు పొక్కుల పేర్లు, బొబ్బలు.

అంటువ్యాధి - ఒకరినుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిముల వలన లేక స్పర్శవలన) వ్యాపించు వ్యాధి (విషూచి, మశూచి మొ.)విషూచి - (గృహ.) పమన విరేచన వ్యాధి (కలరా).
కలరా - (గృహ.) (Cholera) వాంతి భేది. (ఇది నీటి ద్వారా వ్యాపించు ప్రాణా పాయకరమైన జాడ్యము.) (Infectious disease).
ధూము - వాంతి భేది జాడ్యము, కలరా.
వమధువు - వమనము, వాంతి. వమనము - డోకు, వమధువు.
వమనేచ్ఛ - (గృహ.) వికారము (వికారము - 1.మారురూపు, ఆకృతి 2.తెవులు, తెగులు), వాంతివచ్చునట్లుండుట(Nausea).

పత్రి - 1.డేగ, 2.పక్షి, 3.బాణము, 4.కొండ, 5.మ్రాను, వై.వి.పత్తిరి.

డేగ - శ్యేనము. డేగకన్ను - నిశితదృష్టి.

శ్యేనము - డేగ, వ్యు.వేగముగా బోవునది.

కడసరము - ఒకానొక జాతిడేగ; కడు(ౙ)జు - ఒకజాతి డేగ. శశాదనము - డేగ, వ్యు.కుందేళ్ళను చంపునది.

మారకుడు - చంపువాడు. మారణము - చంపుట.

మారకము1 - 1.అంటువ్యాధి, 2.డేగ, వ్యు. చంపునది.
ఎపిడమిక్ -
(Epidemic) (గృహ.) అంటువ్యాధి, ఊరంతయు వ్యాపించెడి వ్యాధి. 

పక్కి - పక్షి, పులుగు, సం.పక్షీ.
పక్షి - (పక్షములు గలది) పులుగు. పులుగు - పిట్ట.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
బాణము - అమ్ము; విశిఖము - బాణము.

పత్రిణౌ వర పక్షిణౌ :
పత్రి న్ శబ్దము అమ్మునకును, పక్షికిని పేరు. పత్రాణి పక్షాః. అస్య సంతీతి పత్రి. న. పు. ఱెక్కలు గలది.

కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, మలై.
మ్రాను - మాఁకు; మ్రాఁకు - మాను, చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
మ్రానిపోటు పులుగు - వడ్రంగి పిట్ట, మ్రానుగోయిల.

పసటి - 1.కుండ, 2.వంటకుండ.
ప్రవ్వ -
కుండ.
ప్రవజితుఁడు -
సన్యాసి; సన్యాసి - సన్యసించినవాడు.
యతి - 1.పద్య విశ్రమస్థానము, 2.సన్యాసి. కర్మంది - యతి.

లోవి - వంటకుండ, స్థాలి, పచనపాత్ర.
లోహుండి -
వంటకుండ; వెసల - వంటకుండ. 
స్థాలి - వంటకుండ.
కుండము - 1.వంటకుండ, 2.గుడిలోని గుంట, 3.నిప్పుల గుండము, 4.కొండ. కొండము - నిప్పుకుండము, సం.కుండమ్.

కుండక బ్రాహణులు - మహారాష్ట్ర బ్రాహ్మణులలో ఒక తెగ.

పిఠరః స్థాల్యుఖా కుణ్డమ్:
పచ్యతే న్నమత్రేతి పిఠరః డు పచ్ ష్ పాకే. - దీనియం దన్నము వండఁబడును.
తిష్ఠన్తి పదార్థా అస్మిన్నితి స్థాలీ. ఈ. సీ. ష్ఠా గతి నివృత్తౌ. - పదార్థములు దీనియందుండును.
ఓఖతీ భోజనస్థానం గచ్ఛతీత్యుఖా. ఉఖ గతౌ. - భోజనస్థానమును బొందునది.
కుణ్డ్యతే స్మిన్నితి కుండం. కుడిదాహే. - దీనియందు వండఁబడును. ఈ నాలుగు 4 కుండ పేర్లు.

చరువు - 1.హవ్యము, 2.హవ్యము వండెడికుండ.
హవ్యవాహనుఁడు -
అగ్ని, రూ.హవ్యవహుడు.

ఇగిరిక - 1.హవిస్సు, 2.అత్తెసరు, రూ.ఇగిరిక.
అత్తెసరు -
గంజి వార్చకుండ అన్నములో ఇగిరి పోవునట్లు పెట్టెడు ఎసరు.
ఎసరు - 1.వంటకై కాగబెట్టిన నీరు, అత్తెసరు, 2.కవోష్టజలము, క్రి.మీరు, అతిశయించు.
ఎసలారు - క్రి. అతిశయించు, (ఇంపెసలారు).

స్థాలీవులాకన్యాయము - ఉడుకుచున్న కుండెడు అన్నమునకు ఒక మెతుకునుబట్టి చూచుటవలె ఒక దానినిబట్టి పూర్ణవిషయ మెరుగుట.

కఠినము - 1.పరుషము, 2.నిష్ఠురము, 3.క్రూరము, వి.వంటకుండ.
పరుషము -
1.నిష్ఠురము, 2.నిష్ఠురవాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు.
నిష్ఠురము - కఠినము, పరుషము.
క్రూరము -1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది. అరపూస - గుగ్గిలము (Rosin).
గుగ్గిలము - (వ్యవ.) ధూపద్రవ్యముగ నుపయోగించబడు ఒక పదార్థము (Burseraceae) అను కుటుంబమునకు చెందిన "Boswllia serata"అను చిన్నచెట్టు నుండి స్రవించు జిగురుపదార్థము (Indian balsam).
గట్టి - ధృఢము, కఠినము, కర్కశము, బిగువైనది, సడలనిది, గుల్ల కానిది సం.ఘట్టః.
దృఢము - (భౌతి.) వంగనిది, చిన్న దెబ్బలకు వికారము చెందనిది, గట్టిది. (Rigid) ఉదా.దృఢవస్తువు (Rigid body).
గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువుకట్ట, పర్వతము, సం.ఘట్టః.

బిరుసు - కాఠిన్యము.
తుటారము -
1.దిట్టదనము, 2.పరుషవచనము.
తుటారి - 1.దిట్టదనముగలది, 2.పారుష్యముగలది.
తుటారించు - క్రి.1.అలక్ష్యపరుచు, 2.తిరస్కరించు.
తుటారించు - క్రి.1.అలక్ష్యపరచు, 2.నిరసించు.  

పలుచని హీనమానవుఁడు పాటిఁదలఁపక నిష్ఠురోక్తులన్
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణ ప్రపూర్ణుడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగనెట్లన వెల్తికుండదాఁ
దొలుఁకుచునుండుఁగాని, మఱితొల్కునె నిండు ఘటంబు భాస్కరా.
తా.
వెల్తికుండలోని నీరు తొణకును గాని, నీరునిండుగా గల కుండ తొణకదు. అట్లే చులకన తనము గల నీచుడు న్యాయము తెలియక కఠినమైన మాటలు మాట్లాడును, సద్గుణములచే ప్రకాశించు బుద్ధిమంతుడు(బుద్ధిమంతుఁడు-బుద్ధికలవాడు)ఆవిధముగా మాట్లాడడు.

పల్లెటూళ్ళలోని యువతులు నాలుగైదు కుండలను ఒకదానిమీద ఒకటి దొంతరగా తలమీద పెట్టుకొని నీళ్ళు తెచ్చుకుంటూ దోవలో తమ కష్టసుఖాలు ముచ్చటించు కొంటారు. అయినా, ఆ కుండలనుండి ఒక్క నీటిచుక్క కూడా తొణకదు.

ధర్మమార్గంలో జీవించేవ్యక్తి కూడా అదే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల లోనూ అతడి మనస్సు ధర్మమార్గాన్ని తప్పకుండా చూసుకోవాలి. అందుకోసం అతడు ఎల్లప్పుడూ మెలకువగాను, అప్రమత్తంగానూ ఉండాలి. - శ్రీ రామకృష్ణ పరమహంస   

బాండువ - కుండ, సం.భాండః.
బాన -
కడవ, సం.భాండః.
భాండము - 1.తొడవు, 2.మట్టి పాత్రము, 3.ప్రస్తువు.
తొడవు - భూషణము; భూష - భూషణము, తొడవు.
మండనము - 1.భూషణము, 2.అలంకరించుకొనుట. 
ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ - భూషణము; భూషణము - అలంకరణము. 
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది. 

ఆబంధము - 1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.

కటాహము - 1.కడవ, బాన 2.తాబేటి వెన్నుచిప్ప, 3.కప్పెర.
గూన - పెద్దకుండ.  ముంత - చిన్న మాని పాత్రము.

చల్లకొచ్చి ముంత దాయడమెందుకు? మబ్బులో నీళ్ళు చూసుకొని ముంతలో నీళ్ళు పారపోసుకొనుట, తెలివితక్కువతనము.

కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.
గాబు -
మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.
కప్పెర - 1.పుఱ్ఱె, 2.భిక్షాపాత్రము, సం.కర్పరః.
కమఠము - 1.తాబేలు, 2.భిక్షాపాత్రము.

కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium).
కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.
కప్పెర - 1.పుఱ్ఱె, 2.భిక్షాపాత్రము, సం.కర్పరః.
గాబు - మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.
అక్షయపాత్ర - భిక్షాపాత్ర.
భవనాసి - (వ్యావ.) 1.బిచ్చగాని గిన్నె, 2.అక్షయపాత్ర.

కపాలము - 1.తలపుఱ్ఱె, 2.సమూహిము, 3.కుండపెంకు, (జం.) 1.పుఱ్ఱె, 2.పృష్ఠ వంశీక జంతువుల తలలోనున్న ఎముకల సముదాయము. కపాల మొచనము నందు దేవీస్థానం శుద్ధి.    
పునక -
తలపుఱ్ఱె, తలయెముక.
బొచ్చె - 1.కుండలోనగు వాని పెంకు, 2.తలపుఱ్ఱె.
కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (cranial nerves).

ఆకృషినాడి - (జం.) కపాలము నుండి బయలుదేరి కనుగ్రుడ్డు యొక్క కండరములకు బో వు నా డి (Pathetic nerve).

ఆదిభిక్షువు - శివుడు.

కమండలువు - సన్యాసు లుంచుకొను గిండి వంటి పాత్ర. 
కుండి -
కమండలువు, వికృ.గిండి. (ౙ)జారీ - గిండి, కమండలువు.
గిండి - సన్నని మెడగల చిన్నచెంబు, సం.కుండీ.
కరకము - 1.ఎముకలగూడు, 2.కమండలువు, 3.దానిమ్మ, 4.పక్షి, 5.వడగల్లు.
దాడినిమ్మ - దాడిమము, ఒక ఫల వృక్షము, రూ.దానిమ్మ, దాడిమ్మ, దాళిమ్మ.

అస్త్రీ కమణ్డలుః కుణ్డీ -
కం జలం అండే మధ్యే లాతీతి కమండలుః ఉ.ప్న.లా ఆదానే. - ఉదకమును మధ్యమందు గ్రహించునది.
కుండవద్వృత్తత్వాత్ కుండీ. ఈ. సీ. - కుండవలె వట్రువుగా నుండునది. ఈ రెండు కమండలువు పేర్లు.

కుసుంభము - 1.కుసుంభపువ్వు, 2.కమండలువు.
కుసుంభరాగము -
బయటికి కనబడుచు అంతఃకరణమందు లేనిప్రేమ.

వడగండ్లు - (భూగో.) మంచు ముక్కలు ఆవిరియై పైకెగసిన నీరు చాల త్వరిత గతిని చల్లబడి వానగా భూతలముపై బడుటకుముందే నీరు మంచుగ మారి భూమిపై బడును.
వడగల్లు - (వడ+కల్లు) వానరాయి.

కరక1 - వడగల్లు.
కరక2 - ఒకానొక అడవిచెట్టు, హరీతక. 

పలుమాఱుసజ్జనుండు ప్రియభాషలెపల్కుఁ గఠొరవాక్యముల్
పలుకడొకానొకప్పు డవి పల్కినఁగీడునుఁగాదు, నిక్కమే
చలువకువచ్చి మేఘుడొక జాడనుదా వడగండ్లురాల్చినన్
శిలలగు నేమె వెగిరమె శీతలనీరముగాక ! భాస్కరా.
తా.
మేఘము కురియుటకై వచ్చి ఒకమారు వడగండ్లను రాల్చినను అవి యెట్లు రాళ్ళు గాకుండా(శీతలము - చల్లనిది)నీరగునో అట్లే సజ్జను డొక (సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)నొకప్పుడు కఠినపు మాట లుచ్చరించినను వానివలన నెవ్వరికిని కీడు గలుగదు.   

అస్థిపంజరము - కంకాళము, ఎముకలగూడు.
కంకాళము -
ఎముకలగూడు.
కరంకము - 1.పుఱ్ఱె, 2.లోపల నెమియు లేని  బొండ్లపు చిప్ప, 3.తల, 4.కంకాళము.
పుఱ్ఱె - (గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium). 
బుఱ్ఱ - 1.కొబ్బెరకాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

న్రస్థిమాలీ - శివుడు, వ్యు.పుఱ్ఱెల దండ ధరించినవాడు.

అనికి - 1.మూతి వెడల్పుగల కుండ, 2.అల్లిక.
అల్లిక -
1.(చాప మొ.ని) అల్లుట, 2.(పదముల) కూర్పు, 3.నేత.
అల్లు - (జడ, చాప, మాటలు మొ.వి) 1.కూర్చు, 2.నేయు, 3.అల్లుకొను, 4.పెనుగొను.
కూర్పు - 1.కూరుపు, 2.ముద్రణము.
కూర్చు - కూరుచు; కూరుచు - 1.సంబంధించు, 2.ప్రియపడు, 3.కూడబెట్టు, 4.సంగ్రహించు, 6.రచించు, రూ.కూర్చు.
నేత - ప్రభువు; పబువు - ప్రభువు, సం.ప్రభు.

వీరభద్ర పళ్ళెరము - మిక్కిలి పెద్ద పళ్ళెము, హరివాణము.
హరివాణము -
1.పళ్ళెము, తట్టు.
పళ్యము - పళ్ళెము, పళ్ళేరము, భోజనపాత్రము, తాంబాళము, స.బిలకా.
తాంబాళము - పెద్దలోహపు పళ్ళెము.
తట్ట - 1.వెదురుబద్దలు మొదలగువానితో నల్లిక వల్లిక, 2.లోహముతో చేసిన తబుకు, పళ్ళెము.
తట్ట - 1.కంచము, 2.తెర, 3.తడక.
స్థాలము - కంచము; కంచము - భోజన పాత్రము, సం.కంసమ్.
తట్టు - 1.కలుగు, 2.తోచు, 3.చరుచు, హిం.వి.పొట్టిగుఱ్ఱము, వై.వి.దరి, పార్శ్వము.
తట్టువ - గుఱ్ఱము, రూ.తట్టువము.

తక్కటి - మూడు ముఖములు గల దీపా రాత్రికపు తట్ట, త్రిముఖదీపిక.

సానిక - మట్టికంచము, మల్ల.
మల్ల -
మట్టికంచము.
మల్లము - మల్ల.

తలియ - భోజనపాత్రము, సం.స్థాలికా.
తళిగ - 1.స్థానము, భోజన పాత్రము, 2.దేవునికి నివేదించు అన్నము, రూ.తళియ, సం.స్థాలికా.

ఆత్మశుద్ధిలేని యాచార మదియెల ?
భాండశుద్ధిలేని పాకమేల ?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా ? విశ్వ!
తా.
వేమా! నిర్మలమైన మనస్సుతో చేయని ఆచారము వలన ప్రయోజనము లేదు. వంటచేసుకొను కుండను తోమకనే(పరిశుభ్రము చేయని పాత్రలో), వంటచేసిన ఆ పదార్థము తినుటకు మంచిదికాదు గదా, అట్లే నిశ్చలమైన మనస్సుతో చేయని శివపూజ వలన పుణ్యము లభింపదు.   

ఆరక్షము - రక్షించునది, సం.1.రక్షణము, 2.ఏనుగు కుంభముల క్రింది చోటు, 3.సైన్యము.
కాపు -
1.కాపుగడ, రక్షణము, 2.కాయలు కాచుట. 
రక్షణ - (గృహ.) కాపాడుట, (Protection).
సైన్యము - 1.సేనతో కూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరిగుఱ్ఱములలో నొకటి.
మేఘపుష్పము -
1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.

నీరుమోపరి - 1.కడవ 2.మేఘము, మబ్బు.

అలకి - కుండ, సం.అలుకా.
కుండమార్పు - ఒక టిచ్చి మరియొకటి పుచ్చుకొనుట. 

దానమున్ చేయఁ గోరిన వద్యాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైన (బ)పరోపకారమునకై యొకదిక్కునఁ దెచ్చియైన నీఁ
బూనును, మేఘు డంబుధికిఁబోయి జలంబుల దెచ్చి యీఁయడే
వాన, సమస్తజీవులకు వాంఛిత మింపెసలార, భాస్కరా.
తా.
మబ్బు సముద్రమందలి(అంబుధి - సముద్రము)నీటిని తెచ్చి అన్ని ప్రాణులను సంతృప్తి కరమగు వర్షము నిచ్చునట్లే, దాత(వదాన్యుఁడు - మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.) తనవద్ద ధనములేకున్నను యొంకొక చోటి నుండి తెచ్చి యైనను దానము చేయును .

కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి....

సమ దేవి ! స్కంద - ద్విపవదన పీతం స్తనయుగం
త వేదం నః ఖేదం - హరతు సతతం ప్రస్నుతముఖమ్|
య దాలోక్యా శంకా కులితహృదయో హాసజనకః
స్వకుమ్భౌ హేరంబః - పరిమృసతి హస్తేన ఝడితి|| - 72శ్లో
తా.
ఓ దేవీ! పాలుకారుచున్న నీ స్తనద్వయమును జూచి, స్తనముల యొక్క స్తన్యపానం చేస్తున్న వినాయకుడు,(ద్విపము - ఏనుగు, వ్యు.రెంటితో త్రాగునది.)తన తలమీద కుంభము లేమో యని(యిక్కడకు వచ్చినవేమో యని)సంశయచిత్తుడై నవ్వును గలిగించుచు వినాయకుడు(హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.)తన కుంభములను తడవుకొనుచున్నాడు. సమముగ  కుమారస్వామి(స్కందుఁడు - కుమారస్వామి)చేతను, వినాయకుని(ద్విపవదనుడు)(వదనము - నోరు, ముఖము)చేతను త్రాగబడిన నీ కుచయుగము మా దుఃఖములను తొలగించుగాక! - సౌందర్యలహరి

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్|
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం
భజే శారదాంబా మజస్రం మదంబామ్.

నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ,
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరంగీ నిర్గుణప్రియా|

పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరుకాలము ఫిబ్రవరి February, మార్చి March నెలలు, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు, శిశిర ఋతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
పయర - దక్షిణపుగాలి, వాయువు, రూ.పయ్యెర.
పయరగాలి - (భూగో.) వేసవి చలికాలముల యందు అగ్నేయదిశ నుండి సముద్రమునుండి భూమికి వీచుగాలి, (South-east sea breeze). 

కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
చినుకు - క్రి.1.కారు, 2.కురియు, 3.కార్చు, వి.వానబొట్టు.
వయసు - ప్రాయము, యౌవనము.
ప్రాయము - 1.వయస్సు, 2.బాహుళ్యము, 3.చావు. 
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది సంవత్సరముల(16-50)వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు; స్నేహితుఁడు - చెలికాడు.
కారు2- వి. 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, ముదిమి. ముదిమి - ముసలితనము.   
ఉప్పు - క్రి. ఆవిరిపోకుండ ఉడక బెట్టు వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).

24. శతభిషము - చూచుటకు విందుగా, వరుసగా పది10 నక్షత్రము లుండును. 

శతభిషము - ఒక నక్షత్రము.
నీటిఱేని రిక్క -
శతభిషము (వరుణుడు అధిదేవతగా గలది).

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము -
రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు.)
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి. 
ఋక్షరా(ౙ)జు - 1.చంద్రుడు, 2.జాంవంతుడు.
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్క రాయుడు. 

క్షత్రస్య రాజా వరుణోధిరాజః | నక్షత్రాణాగ్ం శతభిష గ్వసిష్ఠః | తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః | శతగ్ం సహస్రా భేషజాని ధత్తః | యజ్ఞన్నో రాజా వరుణ ఉపయాతు | తన్నో విశ్వే అభి సంయంతు దేవాః | తన్నో నక్షత్రగ్ం శతభిష గ్జుషాణమ్ | దీర్ఘమాయుః ప్రతిరద్భేషజాని ||24||    

క్షత్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
క్షత్రియుఁడు - రాచవాడు. రాజన్యుఁడు - క్షత్రియుడు.

రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
రావు -
అధిపతి, రాజు, సం.రాజా. యదా రాజా తథా ప్రజ.
రాజు -
1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon.

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
పబువు - ప్రభువు, సం.ప్రభుః.
అధిపుడు - 1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
నవాబ్ - 1.ప్రభువు, 2.రాజు ప్రతినిధి.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.  

ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.
ఈశుఁడు -
1.శివుడు, 2.ప్రభువు.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈశ్వరి - పార్వతి. 

నాయకుఁడు - 1.అధిపతి, 2.నాటకమందలి ప్రధానపాత్ర. నాయకులు కావ్య నాటకాదుల యందు నలుగురు, 3.శృంగార రసాలంబన పురుషులు నలుగురు, విణ.శ్రేష్ఠుడు.

నీఁడు - కుమ్మరివారి బిరుదు పేరు, రూ.నాయుడు (ఉదా. అంకినీడు), సం.నాయకః.
నాయఁకుఁడు - 1.అధిపతి, 2.పన్నిద్దరు భటుల కధిపతి, సం.నాయకః. 
నాయఁడు - 1.ప్రభువు, 2.బలిజలుమున్నగు వారి పట్టపు పేరు, వై. విణ. శ్రేష్ఠుడు, సం. నాయకః. 

చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
విష్ణువు -
విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
రారాజు - 1.చక్రవర్తి, సార్వభౌముడు, 2.దుర్యోధనుడు, 3.చంద్రుడు.
చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు. సమ్రాట్టు - చక్రవర్తి.
సార్వభౌముడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.
గాంధారేయుఁడు - దుర్యోధనుడు, గాంధారికొడుకు.

కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు కలది 2.కుమ్మరి.
కుమ్మర -
కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
కులాలుఁడు - కుమ్మరవాడు; ఘటికారుఁడు - కుమ్మరి.

కుమ్భకారః కులాల స్స్యాత్ -
కుంభం కరోతీతి కుంభకారః. డు కృఞ్ కరణే. - కడవలు చేయువాడు.
కుం భూమిం లడతి మృదర్థ మితికులాలః. లడ మర్దనే. - లడయో రభేదః. - మంటికొరకు భూమిని మర్దించువాఁడు. ఈ రెండు కుమ్మరవాని పేర్లు.

ఐద్దాయులు - (ఐదు+కాయలు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.

నవశిలాయుగము - (చరి.) కొత్త రాతియుగము, (ఈ కాలములోని మానవులచే రాతి పనిముట్లు, నాణెములు వాడబడుచుండెను. వీరికి వ్యవసాయము, నూలు వడుకుట, కుండలుచేయుట, అగ్నిని ఉపయోగించు విధము తెలియును. వీరు స్థిరనివాసము లేర్పరచుకొని, పండిన పదార్థములు తినుచుండిరి).

భరటుఁడు - 1.కూలివాడు, 2.కుమ్మరి.
భరణ్యము -
1.కూలి, 2.జీతము.
భరణము - 1.భరించుట, 2.జీతము, 3.కూలి.
వేతనము - భృతి, కూలి, చేసినపనికి ప్రతిఫలముగ నిచ్చు ద్రవ్యము, జీతము.
వేతనముల స్థాయి - (అర్థ.) వేతన ప్రమాణము.
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భృత్య - కూలి; కూలి - పనిచేసినందుల కిచ్చెడు ధనము.
జీతము - వేతనము, సం.జీవితమ్.
జీతగాడు - జీతము గొని పనిచేయువాడు.  
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు. జీవిక - బ్రతుకు తెరువు. భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
సేవకుఁడు - కొలువుకాడు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.

దొంతి - 1.ఒకటి మీద నొకటిగా నుంచిన కుండలులోనగు వాని వరుస, 2.వరుస.
దొంతర - పరంపర, దొంతి.

కుమ్మరి ఆవములో కుండలేగాని బొందెలు దొరకవు. కుమ్మరి కష్టమంతా ఒక్క దెబ్బకు లోకువ.

కుమ్మరివాడు గాలి ఊది కొలిమిలో నిప్పును మరింత రగిలించినట్లే, మనం కూడ మన మనస్సును సత్సాంగత్యం ద్వారా నిర్మలంగాను, ప్రశాంతం గాను ఉంచుకోవాలి. సత్సాగత్యం ఆత్మవికాసానికి ఎంతో అవసరం. - శ్రీ రామకృష్ణ పరమహంస 

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము. సమీపము - చేరువ. 
అంౘల - ప్రక్క, సమీపము. సదేశము - సమీపము.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ , వ్యు. ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు. చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.

చతురాననసమ్రాజ్ఞీ బ్రహ్మవిష్ణుశివాత్మికా,
హంసాసనా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ|

యోగి - యోగాభ్యాసము జ్యేయు పురుషుడు.
యోగాభ్యాసము -
(యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.

అంతరాత్మ - (వేదాం.) జీవాత్మతో గూడియుండు పరమాత్మ 2.మనస్సు.

రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్ఠునికిని పేరు.

వంచ యింతలేక నెటువంటిమహాత్ముల నాశ్రయించినన్
కొంచెమె కాని యేలు సమగూడ దదృష్టములేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ నవిశంబును వీఁపునమోయునట్టి రా
యంచకుఁదమ్మి తూండ్లు దిననాయె కదాఫలమేమి, భాస్కరా.
తా.
సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సంచితబుద్దితో వీపున మోసెడి రాజహంసకు బ్రహ్మనుమోయు ఫలితము లేదాయెను. అది తామర తూండ్లనే(తూఁడు దిండి - హంస, వ్యు.తూడే భోజనముగా కలది.)తిన వలసి వచ్చెను.మోసగించక సేవ చేయువారి కావంతయు లాభ ముండదు.(ఈ పద్య మందుపమానమున్నను రాయంచ లోపమేమియు వ్యక్తీకరించలేదు. అందుచే సమభావము పారమార్ధిక నిమిత్తముగా నుండునుగదా, అందు తప్పేమున్నది.)

హిరణ్యగర్భ శ్శిశిరా స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్త్ర శ్శంఖ శ్శిశిరనాశనః| 

అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు.

హంసాస్తు శ్వేతగరుత శ్చక్రాఙ్గా మానసౌకసః,
హంతి గచ్ఛతీతి హంసః హన హింసాగత్యోః. - చరించునది.
శ్వేతీగరుతః పక్షా అస్యేతి శ్వేతగరుత్. త. పు. - తెల్లని ఱెక్కలు గలది.
చక్రవత్ వృత్తమంగ మస్యేతి చక్రాంగః. - చక్రము వలె వట్రువయైన అంగముగలది.
మానససరః ఓకః స్థానమస్య మాన సౌకః. స. పు. - మానససరస్సు స్థానముగాఁ గలది. - ఈ 3మూడు సామాన్యముగా హంసల పేర్లు.

శ్వేతగరుత్తు - శ్వేతపత్రము, హంస. 
చక్రపక్షము -
హంస.
చక్రాంగము - 1.హంస, 2.జక్కవ. చక్రవాకము - జక్కవ.
చక్రపక్షము - హంస; తెలిపిట్ట - హంస.(తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.) క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
ఋషి -
1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు(వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము).
అగస్త్యము - అవిసెచెట్టు.
అవిసియ - అగిసె, రూ.అవిసె, అగస్త్యః.
అగిసియ - అగిసె; అగిసె - అగస్త్యము. 

యమి - 1.ముని, 2.హంస.
సంయమి -
ముని, వ్యు.సంయమము కలవాడు.
సంయమము - హింసాదులవలన విరమించుట, రూ.సంయమము.
వాచంయముఁడు - మౌని (ముని).
మౌని - మౌనవ్రతుడు, ముని. మౌనము - మాటాడకుండుట.
నిరాహారి - మౌని, సం.నిరాహారీ.

వాచంయమో మునిఁ,
వాచం నియచ్ఛతీతి వాచంయమః. యమ ఉపరమే. - వాక్కును నిలుపువాఁడు.
మన్యత్తే మునిః ఇ. పు. మనజ్ఞానే. - జ్ఞానము గలవాఁడు. ఈ 2 మౌనవత్రము గలవాని పేర్లు. ఈ రెండు యు సన్న్యాసి పేర్లని కొందరు.

బాసవాలు - 1.వేలుపు, 2.ఋషి, వ్యు.పలుకే ఆయుధమైన వాడు.

శోషకతైలములు - (గృహ.) ఏ వస్తువున కైనను పూసినచో గాలిపారి త్వరలో నారి(ఆరిపోయి), పొరకట్టిపోయి ఆ వస్తువునకు జిడ్డు లేకుండ చేయు నూనెలు, (Drying oils) ఉదా.సీమ అవిసెనూనె (Linseed oil).

తబిసి - తపసి, ముని, సం.తపస్వీ.
తపస్వి -
తపస్సుచేయువాడు.
తపస్విని - తాపసురాలు.
తబము - తపము, తపస్సు, సం.తపన్.

తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిరర్తువు.
ద్యానము -
చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
ధ్యానీయము - 1.ధ్యానింపదగినది, 2.కోరదగినది.
ధ్యాతవ్యము - 1.ధ్యానింపదగినది, 2.ధ్యేయము.
ధ్యేయము - ధ్యానింపదగినది.
ధ్యాతము - ధ్యానింపబడినది.
ధ్యాత - ధ్యానించువాడు.

తపః కృచ్ర్ఛాదికర్మ చ. :
తపశబ్దము సాంతపనము, చంద్రాయణము మొదలయిన కృచ్ర్ఛము లకును, చకారమువలన ధర్మమునకును పైరైనపుడు న. శిశిరర్తువు నకును, మాఘమాసమునకును పేరైనపుడు పు. తపంత్యత్రేతి తపః, తపాశ్చ. స. తప సంతాపే. దీనియందు తపింతురు. 'తపౌ లోకే ధర్మమాత్రే క్లేశే శిశిర మాఘయో'రితి శేషః.

భూసుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనన్
మాని చరింపరో యనుచు మానవులట్లు చరింపఁబోవ దం
(అం)బోనిధులన్నియున్ తనదు పుక్కిటబట్టె నగస్తుడంచునా
పూనిక నెవ్వడోపు నదిపూర్వమహత్త్వముగాక! భాస్కరా.
తా.
లోకులచే ఆరాధింపబడు దేవతాదులు కొందరు, వావివరుసలు లేకుండా ప్రవర్తించినారని, మనుష్యులు సైతము వారివలె ప్రవర్తించుట తగనిపని, ఎట్లనిన మునిశిరోరత్నమైన అగస్త్య మహర్షి – సప్త సముద్రములను అవలీలగా త్రాగివైచినాడని - సామాన్యులట్టి పనికి పూనుకొనలేరు గదా! కావున వారి మహత్త్వవంతులే(గొప్పదనము) తప్ప యితరులు వారి నెన్నడనూ అనుసరింపరాదు.

ఓం భక్త హంస పరీ ముఖ్య వియోగాయై నమో నమః|

సత్యము గలిగియున్న వేరు తపస్సు పనిలేదు. చిత్తశుద్ధి లేనివాని జపము, తపము, దానము, ధర్మము, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలూ, దివ్యక్ష్యత్ర దర్శనాలూ కాలక్షేపం కోసం చేసేవే అవుతాయి, కాని సత్ఫలము నిచ్చేవికావు. భూతదయలేని తపస్సు వ్యర్థము.

దినయామిన్యౌ సాయం ప్రాతః - శిశిరవసంతౌ పునరాయాతః,
కాలఃక్రీడతి గచ్ఛత్యాయుః - తదపి న ముంచత్యాశావాయుః.- భజగోవిందం

మానసౌక(స)ము - హంస.
మానసము -
1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
చేతము - మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము(Mental-development).

మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.

ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదర్ధాలున్నయి. 1) హంస-అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగు వేళ వాయువు "హ" కారములో బహిర్గతమై "స" కారములో లోపలికి వస్తుంది అంటే హంస శబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉంది. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్ర రూపిణీయైన దేవికి వందనాలు. - శ్రీ లలితా త్రిశతీ నామావళిః  

సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వంద్వం - కిమపి మహతాం మానసచరమ్
యదాలాసా దష్టా - దశగుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్బ్యః పయ ఇవ. - 38శ్లో
తా.
ఓ దేవీ! ఏ హంసల జంటల కూతలు పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణము లను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి మకరందముచే ఆనందించు మహాత్ముల యొక్క మనస్సు లనెడి మానస సరస్సునందు విహరించు నా హంసల జంటను సేవించుదును. - సౌందర్యలహరి   

మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ! 

మహాయోగీ మహామౌనీ మౌనీశ శ్శేయసాంపతిః
హంసః పరమహంసశ్చ విశ్వగోప్తా విరాట్ స్వరాట్.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

చక్రధరము - పాము; చక్షుశ్శ్రవము - పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్శ్రవము.

స్వగృహేపూజ్యతే మూర్ఖః - స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా - విద్వాన్ సర్వత్రపూజ్యతే||
తా.
మూర్ఖుఁడు తన యింటియందును, ప్రభువు స్వగ్రామమందును, రాజు తన రాజ్యమందును (గొ)కొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశముయందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము

చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్భుదంబు ద్బుదంబు గాక!
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగముతోడి పశువు గాక!

మృత్తు నుండి ఘటముగా ఏర్పడు సామర్థ్యమే - శక్తి. మన్ను లేకుండా కుండ ఏర్పడనట్టుగానే అహంకారము లేని పదార్థం వుండదు. కుండ (ఘటము) తనయొక్క రూపము నిశ్శేషము (లేకుండ పొయినపుడు) – కాగా - నామము కూడ పోగొట్టుకొని మృత్తు - మన్నులో కలసి పోవుచున్నది కదా!

అగ్ని - కుండ - నీటికి సంబంధించింది. కుండలో నీరు ఆత్మ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము(దేహం అస్థిరం, దహించుకు పోతుంది) 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఆత్మ (ఆత్మాహ్య యం ప్రజాపతిః) శబ్దము (ప్ర)యత్నమునకు, ధైర్యమునకు, బుద్ధికి, స్వభావమునకు, పరమాత్మకు, దేహమునకు, చకారము వలన జీవునికి పేరు.

ప్రధానం పరమాత్మా ధీః :
ప్రధాన శబ్దము పరమాత్మకును, ప్రజ్ఞకును, మఱియు ప్రకృతికిని, ప్రధానికిని, ముఖ్యునికిని, పేరు.
ప్రకర్షేణ దధాతీతి ప్రధానం. డు ధాఞ్ ధారణపోషణయోః. - ప్రకర్షము చేత నన్నిటిని ధరించునది. "ప్రధానం ముఖ్యమంత్రిణో"రితి శేషః.

ముఖ్యమంత్రి - (శాస., రాజ., పౌర.) మంత్రివర్గ నాయకుడు, రాష్ట్రప్రధాని, రాష్ట్ర మంత్రివర్గ నాయకుడు.

ధీ - బుద్ధి.
ధీంద్రియము -
(ధీ + ఇంద్రియము), జ్ఞానేంద్రియము.
ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.
ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్ర్యము కలవాడు.

ధీర - 1.వ్యంగముగా కోపప్రకాశము చేయునాయిక, 2.ధీరురాలు.
ధీరాదీర - వ్యంగ్యాన్యంగముగా కోపప్రకాశము చేయు నాయిక.

ధిషణ - బుద్ధి.
ధిషణుఁడు -
బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
బృహస్పతివారము - గురువారము. 

ఆత్మజ - 1.కూతురు 2.బుద్ధి.
బుద్ధి -
బుద్ధి, మతి సం.బుద్ధి. మతి చెడిన - గతి చెడును.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Inteligence).
మతి - 1.తలపు 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది. మది - బుద్ధి, మనస్సు. సం. మతిః. మతిని బట్టియే గతి. ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.

ప్రజ్ఞాయతే అనయేతి ప్రజ్ఞా. జ్ఞా అవబోధనే. - దీనిచేత లెస్సగా నెఱుఁగ బడును.
మన్యతే అనయేతి మతిః. ఇ. సీ. మనజ్ఞానే. - దీనిచేత నెఱుఁగఁబడును.
బుధ్యతే అనయేతి బుద్ధిః. ఇ-సీ. బుధ అవగమనే - దీనిచేత నెఱుఁగఁ బడును.

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

బుద్ధి కొద్ది సుఖం. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది. సంకల్పించేది మనస్సు. మనస్సు మహామేరువైనా చాటుతుంది కాని కాలు గడపదాటదు.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతఃకరణము -
1.మనస్సు 2.దయ. ధర్మానికి అధారం దయ.

మనిషికి నిలబడటం తేలిక - పరుగెత్తడము కష్టము.
కాని మనస్సుకు పరుగెత్తడం తేలిక - నిలబడటం కష్టం.

అంతరంగము - 1.హృదయము, 2.ఉల్లము, మనస్సు.
ఉల్లము -
1.హృదయము, కోరిక. కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె (Heart).
గుండియ - హృదయము, రూ.గుండె.

మానవ స్వభావాన్ని తెలుసుకోవాలంటే విశాలమైన ప్రపంచానుభవం అవసరం లేదు - విశాల హృదయం ఉంటే చాలు. - బల్వర్

చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
చైతన్యము -
1.తెలివి, 2.ప్రాణము.
తెలివి - 1.వివేకము, 2.ప్రకాశము, 3.కాంతి, వికాసము 4.తేరుట 5.తెలుపు.
ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.

జీవాత్మ - దేహి, జీవుడు.
దేహి - దేహము గలవాడు.
జీవుఁడు - 1.ప్రాణి 2.బృహస్పతి. జీవజాతులు వేరు - జీవుడు ఒక్కటే.
బృహస్పతి - 1.సురగురువు 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులముపెద్ద, 3.తండ్రి, జనకుడు 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, జ్యేష్ఠసోదరుడు, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

జీవి - జీవించువాడు, వి.ప్రాణి. ప్రాణులలో మెలిగే - జీవి ఎవరు?
లోకములో సామాన్యముగాఁ ప్రాణులు దేహాత్మ బద్ధిగలవారై యుందురు. దేహము ఘటమువలె రూపము గలది, జాతి గలది. జీవుఁడు నిర్మలుడు. జీవునకు పరమాత్మకు భేదం లేదు. ఆత్మను మించి ఉత్తమస్నేహితుడు – లేడు.

మృత్పిండమేకో బహుభాండరూపం, సువర్ణమేకం బహుభూషణాని|
గోక్షీర మేకం బహుధేనుజాతం, ఏకఃపరాత్మా బహు దేహవర్తీ||
తా.
కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము వేర్వేరు బంగార మొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే శరీరములు(దేహము- శరీరము, మేను.)వేర్వేరు  పరమాత్మ యొక్కటే. - నీతిశాస్త్రము

గురుచరణాంబుజ నిర్భరభక్త - సంసారాదచిరాభవ ముక్తః,
సేంద్రియమానస నియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్. –
భజగోవిందం

పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే,
ఇందిరేందిందిరాభాక్షీ క్షీరసాగర కన్యకే.

కుంభిని - నేల; నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూ - భూమి. భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృడమైన పదార్థము, నేల.
ప్రదేశము - స్థలము, చోటు.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
జానకి - జనకుని కూతురు, సీత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, ఆకాశ గంగ.   

భూపతి - నేలరేడు, రాజు.
నేలఱేఁడు -
రాజు.

మను - 1.జీవించు, 2.నర్తించు, వి.1.మన్ను, 2.నేల.
క్షమ -
1.ఓర్పు, patience 2.నేల, earth 3.మన్నింపు.
ఓర్మి - క్షమ, సహనము, సహించుట, రూ.ఓరిమి (Tolerance).
ఓరిమి - క్షమ, శాంతము, ఓరుపు.
సహనము - ఓర్పు; ఓరుపు - ఓరిమి.
ఓపిక - 1.బలము, శక్తి, 2.ఓర్పు.
తితిక్ష - ఓర్పు; తితిక్షువు - ఓర్పరి.
తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి. తాల్మి - తాలిమి.

క్షాంతి - 1.ఓర్పు, 2.మన్నించుట.
క్షాంతము - 1.ఓర్పు స్వభావము గలది, 2.మన్నింపబడినది.

భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు -
భూసురుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు. 

నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు -
నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

క్షమ గలిగిన సిరి గలుగును,
క్షమ గలిగిన వాని గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును,
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
భా||
ఓ తండ్రీ! క్షమకలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. సూర్యప్రభలు కలిగిన క్షమా గుణమును అలవర్చుకొనుట బ్రాహ్మణుని ధర్మము.

ప్రపంచములో బలమైనది క్షమ. తాలిమి తన్నుగాచి ఎదుటివారిని కూడా రక్షించును. ధైర్యమే సహనశక్తిని ఇస్తుంది.

ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ -
1.(యోగ.) ఒక నాడి (ఇడ - చంద్ర రూపిణి తెలుపు, చంద్రుని తేజస్సు), 2.మైత్రావరుణి యనుపేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.    

గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకు ను, వాక్కునకును పేరు.
ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు.
ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః - ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును.
ఇళాశబ్దో బుధభార్యాయామపి. యస్యాఃపుత్రః పురూరవాః. "ఊర్వశి అంభవ స్యాయమైన సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోశ్వశీయే.

ఆవు - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు. 

మాట - 1.పలుకు, వచనము 2.నింద, వృత్తాంతము.
పలుకు - మాటాడు, అను, వి.1.వచనము, మాట 2.నింద(నింద - దూరు, అపదూరు), 3.విద్య(విద్య - చదువు, జ్ఞానము), 4.తునక.  వృత్తాంతము - 1.వర్తమానము 2.కథ 3.ప్రస్తావము.
వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుచున్నది.
కథ - తొల్లింటికత, వాస్తవార్థము కలది.

ప్రస్థావన - (నాట,) 1.నాటకము లందు నాంది తరువాత వచ్చు సూత్రధారుడు, నటి గావించు సంభాషణము (ఇందు కవి, నాటకేతి వృత్తము ప్రస్తావింప బడును), 2.వృత్తాంతము.  

వాచస్పతి - సు రా చా ర్యు డు, బృహస్పతి.
వాచాం పతిః వాచస్పతిః - వాక్కులకు పతి, బృహస్పతి.

వాజ్మయము - భాష.
భాష -
1.మాట 2.ప్రతిజ్ఞ 3.ప్రమాణము 4.వ్యవహారయోగ్యమైన వాక్యాదికము 5.సంస్కృతాది భాష, వి.బాస.
బాస - 1.భాష, 2.ప్రతిజ్ఞ, 3.ఒట్టు, 4.సంకేతము, సం.భాషా.
భాషితము - మాట. భాష ఏదైన భావమొక్కటే. భావానికి రూపం తెచ్చేవాడు భాష.

ప్రస్తావ సదృశంవాక్యం స్వభావ సదృశక్రియామ్|
ఆత్మశక్తి సమంకోపం యోజానాతి సపండితః||
తా.
ప్రస్తావమునకుఁ దగినమాట, పరుల స్వభావమునకుఁ దగిన కార్యము, తన శక్తికి దగిన కోపము(కోపము - కినుక, క్రోధము.)ఎవం డెఱుంగునోవాఁడు వివేకియగును. - నీతిశాస్త్రము  

మాట్లాడవలసిన అవసరం వున్నపుడు మాట్లాడకుండా వూరుకోవడం, మాట్ల్లడక పోవడం మంచిదైనపుడు మాట్లాడడం, ఇవి రెండూ మనిషి బలహీనతకు నిదర్శనాలు. - పర్షియన్ సామెత.

సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.
పలుకుఁజెలి -
సరస్వతి. కాశ్మీరేయా సరస్వతీ శక్తిపీఠం|  
వాణి - 1.పలుకు 2.సరస్వతి.
భారతి - 1.సరస్వతి 2.వాక్కు.
ౘదువుల పడఁతి - సరస్వతి. 

పలుకుఁ దత్తడి - చిలుక.
ౘదువుల పులుఁగు -
చిలుక.
మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
చిలుక - కీరము, శుకము, రూ.చిల్క.
కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము. చిలుకరౌతు - మదనుడు.
శుకము - చిలుక; చిలుకలకొలికి - స్త్రీ. శుకవాహుఁడు - మన్మథుడు.

మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.

వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ. యుక్తయుక్తముగా మాటాడువాడు.
వక్త -
1.విశేషముగ మాటలాడువాడు, వాచాటుడు, 2.పండితుడు.
వచత్నువు - 1.వక్త, సభలో నిర్భయముగా మాటాడు నతడు, 2.బ్రాహ్మణుడు.
మాటకారి - 1.వాగ్మి, 2.వాచాటుడు; మాటలమారి - వాచాటుడు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

రాకొమరుల్ రస్జుని దిరంబుగ మన్నననుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁదమలోపలనుంపరు, నిక్కమేకదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక, పెంతురే
కాకము నెవ్వరైన, శుభకారణ సన్ముని సేవ్య! భాస్కరా.
తా. చిలుకను చూచినా, దాని పలుకులను ఆలకించినా మానవులకు ఆనందం కలుగుతుంది. ఎవ్వరైనను మనుష్యులు భూమిమీద చిలుకను పెంచుదురు గాని కాకి(కాకము - కాకి, వాయసము.)ని పెంచరు. అట్లే, ప్రభువులు ఒక రసజ్ఞుని(పండితుని) పోషించిన విధముగా మూర్ఖునితన ఇంటిలో నుంచి కొనరుగదా.

త్రివళ్యాది సుపుష్టాంగా భారతీ భరతాశ్రితా,
నాదబ్రహ్మమయీ విద్యా జ్ఞానబ్రహ్మమయీ పరా.

పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరుకాలము ఫిబ్రవరి February, మార్చి March నెలలు, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు, శిశిర ఋతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.

25. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర - రెండేసి 4 నక్షత్రములుండును.

ప్రౌష్ఠపద - పూర్వాభద్రా నక్షత్రము.
పూర్వ -
తూర్పు; ప్రాచి - తూర్పు.
ప్రాక్ ప్రాచ్యాం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.

స్యుః ప్రోష్ఠపదా భాద్రపదాః స్త్రియః :
ప్రోష్ఠోగౌః తస్యేవ పాదాయాసామితి ప్రోష్ఠపదాః. ఆ. సీ. - ప్రోష్ఠ మనఁగా నెద్దు(ఎద్దు), దానిపాదముల వంటి పాదములు గలవి.
భద్ర పదం యాసా తాః - శుభకరములైన పాదముగలవి. ఈ రెండు 2 పూర్వభాద్ర ఉత్తరాభాద్రల పేర్లు.

భన్దత ఇతి భద్రః. భది కల్యాణే. - కల్యాణ స్వరూపమైనది.

ప్రౌష్ఠపదము - భాద్రపదమాసము.
భాద్రపదము - భాద్రపద మాసము.

పూర్ణానకము - 1.తప్పెట, 2.పూర్ణపాత్రము.
తప్పట -
ఒక వాద్యవిశేషము, సం.తమ్మటః.
పూర్ణపాత్రము - 1.దోపు, 2.ఉత్సవ సమయమున సంతోషముచే వస్త్రాభరణాదిక నుపహరించుట, 2.వస్తు సంపూర్ణపాత్రము.

ద్రకుమ్భః పూర్ణకుమ్భః :
భద్రార్థం కుంభః భద్రకుంభః - మంగళార్థమైన కుంభము.
పూర్ణశ్చాసౌ కుంభశ్చ పూర్ణకుంభః - పూర్ణమైన కుంభము.
ఈ రెండు రాజద్వారాదులయందుఁ బెట్టఁబడిన పూర్ణ కలశము పేర్లు.

కుంభాభిషేకము - క్రొత్తగా గుడిలో ప్రతిష్ఠించిన విగ్రహముకునకు కుంభము నందు ఉదకము నింపి అభిషేక మొనర్చుట.

తుడుము - 1.తప్పెట, 2.తుటుము, 3.గుంపు.
తుటుము - సమూహము, రూ.తుడుము.

ఱంపు - కలశము, రచ్చ.
రచ్చ -
1.కలకల ధ్వని, 2.గోష్ఠి, 3.కలహము, 4.మండపము, 5.మొగసాల, సం. 6.రాజమార్గము, 7.బాధ.

ఋషిపంచమి - భాద్రపదశుద్ధ పంచమి, ఒక వ్రతము.
ఋషి -
1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.

భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాలచి యుగ్రసేనుండు వ్యాఘ్రుం డాసారణుండు భృగు వనుమ్లోచ శంఖపాలుండు లోను గాగల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయుచు నుండు  -  భాద్రపద మాసంలో సూర్యుడు వివస్వంతు(వివస్వంతుఁడు - సూర్యుడు)డన్నపేరు తో విరాజిల్లుతూ ఉగ్రసేనుడు(కంసుని తండ్రి), వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు(భృగువు - 1.ఒకముని, 2.కొండ చరియ, 3.శుక్రుడు Venus, 4.శివుడు.), అనుమ్లోచ, శంఖపాలుడు అనే వారు ఆవరించి ఉండగా సమయ పాలనం చేస్తుంటాడు.  

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు(అక్షయ గోదానాలు చేసినవాడు), పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

భద్రుఁడు - వీరభద్రుడు, విణ.మేలుకొని యుండు వాడు.
వీరభద్రుఁడు -
1.వీరభద్రుడను ప్రమథుడు, 2.ఏకాదశ రుద్రులలో నొకడు, 3.శివుని కొడుకు. భద్రకాళీ వీరభద్రో|

జాగరూకుఁడు - మేలుకొని యుండువాడు.
(ౙ)జాగారము -
జాగరము, రాత్రి మేల్కనియుండుట, సం.జాగరః.
జాగరము - మేలుకొని యుండుట.
జాగరిత - మేలుకొని యుండునది.
జాగ్రత్త - జాగరూకత.

భద్రకాళీపతి ర్భద్రో భద్రాక్షాభరణాన్వితః,
భానుదంతభి దుగ్రశ్చ భగవాన్ భావగోచరః|

అజ ఏకపాదుదగాత్పురస్తాత్ | విశ్వా భూతాని ప్రతి మోదమానః | తస్య దేవాః ప్రసవం యంతి సర్వే | ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః | విభ్రాజ మానస్సమిధా న ఉగ్రః | ఆంతరిక్షమరుహదగంద్యామ్| తగ్ం సూర్యం దేవ - మజమేకపాదమ్ |  ప్రోష్ఠపదాసో అనూయంతి సర్వే ||25||

అజ - 1.ప్రకృతి, వ్యు.పుట్టుకలేనిది, శాశ్వతమైనది (శాశ్వతము - నాశనములేనిది.), 2.ఆడుమేక, ఎక్కువగా తిరుగునది.
ఛాగి - మేక; మేఁక - ఆడుమేక, సం.మేకః Goat.

అజా ఛాగీ :
అజతీ త్యజా. అజ గతిక్షేపణయోః - తిరుగునది.
ఛ్యతి రోగానితి ఛాగీ. ఈ. సీ. ఛో ఛేదనే. - రోగములఁ జెఱుచునది. ఈ రెండు మేక పేర్లు.

మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.
గాంధారము -
1.(సంగీ.) ఒకవిధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార అను ఒకానొకదేశము.

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధ క్షిప్రప్రసాదినీ|
అంతర్ముఖ సమారధ్యా బహిర్ముఖ సుదుర్లభా||

ప్రకృతి - 1.ప్రత్యయము చేరక ముందటి శబ్ద రూపము, 2.సౌర వర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము(స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కొశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి, సప్త ప్రకృతులు).

సృష్టి - 1.సృజించుట, 2.ప్రకృతి, 3.స్వభావము.
సృజన -
సృష్టి.

సంసిద్ధి ప్రకృతీ సమే, స్వరూపం చ స్వభావశ్చ నిసర్గశ్చ -
1.
సమ్యక్ సిద్ధిః సంసిద్ధిః ఇ. సీ. షిధు గత్యాం. - పదార్థమును లెస్సగా పొందునది.
2.ప్రకృష్టం కరోతీతి ప్రకృతిః ఇ. సీ. డు కృఙ్ కరణే. - పదార్థమును ప్రకృష్టముగాఁ జేయునది.
ప్రకృష్టము - ప్రకర్షము గలది, శ్రేష్ఠమైనది.
ప్రకర్షము - 1.మేలు, 2.అతిశయము. అతిశయము - అధిక్యము.
మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.
క్షేమము - కలిగిన శుభము చెదకుండుట, వికృ.సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
శివము - 1.శుభము, 2.సుఖము, 3.మోక్షము.
బాగు - క్షేమము, విణ.యోగ్యమైనది, సం.భగః. స్వస్తి - శుభము. శుభము - మంగళము; మంగళము - శుభము, క్షేమము.
మంగళ - పార్వతి; మంగళదేవత - లక్ష్మి.
క్షేమంకరుఁడు - శుభంకరుడు, వ్యు.క్షేమమును కలిగించువాడు.
శివంకరుఁడు - శుభకరుడు; శుభంకరుఁడు - శుభమును చేయువాడు.
శుభంయువు - శుభముతో గూడుకొన్నవాడు.
శుభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.
3.సమే, అనెడు విశేషముణముచేత సంసిద్ధి ప్రకృతిశబ్దములు స్త్రీ లింగములు.  
స్వస్య రూపం స్వరూపం - తనయొక్క రూపము స్వరూపము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగిణము, 5.స్వభావము.
4.స్వస్య భావః స్వభావః - తనయొక్క భావము స్వభావము.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత. 
5.నిసృజ్యతే అనేనేతి నిసర్గః సృజ విసర్గే. - పదార్థము దీనిచేత మిక్కిలి సృజింపఁబడును. ఈ 5 స్వభావము పేర్లు.

ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః|

తత్త్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి.(భౌతి). మౌలికమైన, సారమైన విషయము, దేనిమీద ఇతర సత్యములు ఆధారబడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

సర్గము - 1.అధ్యాయము, 2.విసర్జనము, 3.నిశ్చయము, 4.స్వభావము, 5.సృష్టి.

ప్రకృష్ట వాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టి వాచకః|
సృష్టౌ ప్రకృష్టా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా||

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము, (Property).
ధర్మములు - (భౌతి.) వస్తువుల గుణములు, (Properties).

సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
సహజజ్ఞానము -
(జం.) వివేకముతో గాని అనుభవముతో గాని నిమిత్తము లేనట్లు జంతువులు తమ సహజమైన ప్రేరేపణ సాయముతో ప్రవర్తించుట, (Instinct).

మంచి స్వభావము, సౌందర్యం తాలూకు లోటును ఎప్పుడూ భర్తీచేస్తుంది. కాని, సౌందర్యం మంచి స్వభావమనే లోటును భర్తీ చేయలేదు. - ఎడిసన్

ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదామ్,
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్|

పగిది - 1.ప్రకృతి, 2.విధము, రీతి(తరహా - రీతి.), సం.ప్రకృతిః.
(ౘ)చందు -
1.విధము, 2.అందము, 3.చంద్రుడు Moon.
విధము - ప్రకారము, విధి. విధికి, నదికి ఎదురీదలేము !
భాతి - 1.కాంతి, రీతి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. 
విధాత  - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  

భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.

అంగము1 - 1.రీతి, విధము, 2.అందము.
అంగు - 1.అందము, 2.రీతి, విధము, 3.అంగబలము, 4.ఇంటిలొని సామగ్రి, రూ.హంగు.
అందము - 1.సౌందర్యము, చక్కదనము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
అంగము2 - 1.అవయవము, దేహము, 2.ఉపాయము, 3.ఒక దేశము, విణ.1.అవయవముగలది, 2.సమీపించినది, వి.(గణి.) ఏదేని వస్తువుయొక్క ముఖ్యభాగము, మూలధర్మము, మూలకము (Element).
అంగభవుడు - 1.మన్మథుడు, 2.పుత్రుడు.

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు -
మన్మథుడు.
మన్మథ - అరువది సంవత్సరములలో (29సం.)ఇరువది తొమ్మిదవది.

పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌవర్భవుడు, స్వయందిత్తుడు, జ్ఞాతిరేతుడు.

అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయ న్తీ
భృంగాఙ్గ నేవ ముకుళాభరణం తమాలమ్
అఙ్గీకృతాఖిలవిభూతి రపాఙ్గలీలా
మాంగల్యదా(అ)స్తు మమ మఙ్గలదేవతాయాః|
      

గాత్రము1 - 1.దేహము (శరీరము, మేను), 2.అవయవము. 
గాత్రము2 - స్థూలము. శారీరము - కంఠస్వరము.
స్థూలము - గుడారము, విణ.బలిసినది, (గణి.) యథార్థమునకు దగ్గరగా నుండునది, అందాజు.
స్థూలలక్ష్యుఁడు - 1.మిక్కిలి యీవికాడు, 2.మిక్కిలి తెలివిగలవాడు.

అవయవము - అంగము, (జీవ.) ఇంద్రియము, శరీరములో కొన్ని రకముల జీవకణజాలముతో ఏర్పడిన ఒక ప్రత్యేక భాగము.
అంగహారము -
వి.అవయముల కదలిక, అంగ విశేషము.

ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.   
రవి - 1.సూర్యుడు, 2.జీవుడు. 
సూర్యుఁడు - వెలుగురేడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.

బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు -
1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
వేదము - దీనిచేత ధర్మాధర్ముల నెరుగుదురు, తొలిచదువులు(తొలిచదువులు - వేదములు). ఇవి నాల్గు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము.
పరమము - పరమాత్మ, విణ.ఉత్కృష్టము, 1.ఆద్యము, 2.ప్రధానము.
తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది, రూ.తుర్యము. 

ఓం హంసిన్యై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులూన్నయి. అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేధము.

ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
హృషీకము -
ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము; సురలోకము - స్వర్గము.  

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).

అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామాతురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధాతురాణాం నరుచిర్నపక్వమ్||
తా.
ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్షగలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలికొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. - నీతిశాస్త్రము  

రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
రూపుమాపు - క్రి.చంపు, నాశనమొనర్చు.

రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగిణము, 5.స్వభావము.

ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
ఇంగితము - 1.హృద్గతాభిప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విన.కదలినది.
స్వామ్యము - సమత్వము, పోలిక.

రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపఱు -
1.చచ్చు(ౘచ్చు - క్రి.మరణించు), 2.అంగవిహీనమగు.
రూపడఁగు - క్రి.1.చచ్చు, 2.నశించు. 

భూతాత్మము - దేహము.
దేహము -
శరీరము, మేను.
శరీరము - దేహము. ఏది సాధించాలన్న దేహం ఉండాలి.
మేను - 1.శరీరము, 2.జన్మము, పుట్టుక 3.పార్శ్వము.
పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము(Side).విం.విణ.(జీవ.) క్రన్కలనుండిబయలుదేరీనది(Latral) వర్చస్సు - 1.కాంతి, మేని 2.రూపము. 

ప్రతిభా విశేషము -(గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

రూపనిర్మాణశాస్త్రము - (జీవ.) శరీరము, దానిరూపము, ఏయే అవయములతో నిర్మింపబడినదో, అవిచేయు పనులేవో తెలియజేయు శాస్త్రము (Morphology).
ఆకారవిజ్ఞానము - (జీవ.) ఒక ప్రాణియొక్క ఆకారము, వివిధమగు అవయవములు, అవి చేయుపనులు అను వానిని గూర్చిన జ్ఞానము (Morphology).

భూమి రాపో(అ)నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా || - 4శ్లో
తా|| భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఎనిమిది విధములుగ నా ప్రకృతి విభజింపబడినది. - జ్ఞాన విజ్ఞానయోగము, భగవద్గీత   

ప్రకృతి శాస్త్రములు - (జీవ.) వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, భూగర్భ శాస్త్రము మొదలగునవి, ప్రకృతికి సంబంధించిన శాస్త్రములు (Natural Sciences).

వహత్యంబ! స్తమ్భే - రమదనుజకుంభ ప్రకృతిభిః 
సమారబ్దాం ముక్తా - మణిభి రమలాం హారలతికామ్ |
కుచాభోగో బింబా - ధరరుచిభి రంత శ్శబలితాం   
ప్రతాపవ్యామిశ్రాం - పురదమయితుః కీర్తిమివ తే || - 74శ్లో
 
తా. అంబా! గజాసురుని(దానవుఁడు - దనుజుడు, రాక్షసుడు.)కుంభ స్థలమే జన్మభూమిగా గలిగిన, దోషరహితమైన ముక్తామణి(లతిక - 1.తీగ, 2.నూరు పేటల హారము.)హారమును, నీవు విశాలమగు నీ స్తనమండలమున అలంకారముగా ధరించుచున్నావు -  నీ అధరోష్ఠపు కాంతిచేత ఆ ముత్యాలహారము చిత్రవర్ణము(శబలము - చిత్రవర్ణము)అంత శ్శబలితమై, పురదమయితుః(త్రిపురాణామంతక స్రిపురాంతకః - త్రిపురములకు నాశకుఁడు, త్రిపురాంతకుడు) పరాక్రమాతిశయముతో  కీర్తివలె వహించుచునట్లుగా విరాజిల్లు చున్నది. - సౌందర్యలహరి 

నానారత్నవిచిత్ర భూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిండబమానవిలస - ధ్వక్షోజకుంభాంతరీ |
కాశ్మీరాగరువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ.

గజకుంభేషు వంశేషు ఫణాసు జలదేషు చ
శుక్తికాయా మిక్షుదండే షోఢా మౌక్తిక సంభవః||
గజముల కుంభస్థలములందు, వెదురుబొంగులయందు, సర్పముల ఫణములందు, జలదములందు, ముత్తెపుచిప్పలందు, ఇక్షుదండము లందు - ఆఱు విధములుగా ముక్తామణులు(మౌక్తికము)పుట్టుచున్నవి.

గజకుంభజనిత ముక్తామణులు చిత్ర విచిత్రవర్ణములు గలవి. అందును గజాసురుని కుంభమున బుట్టినవి మరింత శోభగలవి.

అవ్యక్తము - స్పస్టముకానిది, వి.1.మూలప్రకృతి, 2.అజ్ఞానము, 3.సూక్ష్మశరీరము, 4.పరబ్రహ్మము, 5.(బీ.గణి.) తెలియబడని సంఖ్య.
అవ్యక్తుఁడు - 1.శివుడు, 2.విష్ణువు, 3.మన్మథుడు, విణ. మూఢుడు.

స్వామ్యమాత్య సుహృత్కోశ రాష్ట్ర దుర్గ బలాని చ,
రాజ్యాఞ్గా ప్రకృతయః పౌరాణాం శ్రేణయో (అ) పి చ,

స్వామి యనఁగా రాజు; అమాత్యుఁడు మంత్రి; సుహత్తు చెలికాఁడు; కోశము భండారము; రాష్ట్రము దేశములతోఁ గూడిన పట్టణము; దుర్గము పర్వతోదక వృక్షములచేతఁ బోవ శక్యముగాని పట్టణము; బలము సైన్యము; ఒకఁడు ముఖ్యుఁడుగాఁ గలవారును సజాతీయులునునైన పురజనుల సమూహములు పౌరశ్రేణులు.

1.స్వం విద్యతే అస్యేతి స్వామీ - ధనముగలవాఁడు.
స్వము - 1.ధనము, 2.తాను, విన.తనది.
2.అమా సమీపే భవః అమాత్యః - సమీపమందుండు వాఁడు.
అమాత్యుఁడు - 1.మంత్రి, 2.సహచరుడు, రాజుతో నుండువాడు.
మంతిరి - మంత్రి, ప్రధానుడు, సం.మంత్రి.
మంత్రి - 1.ధీసచివుడు, 2.సహాయుడు.
సహకారి- సహాయుడు; సహాయుఁడు- 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
3.శోభనం హృదయమస్యేతి సుహృత్ - మంచి హృదయము గలవాఁడు.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు. 
సుహృదుఁడు - మిత్రుడు; మిత్రుడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.
సహచరుఁడు - మిత్రుడు, విణ.కూడ దిరుగువాడు.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
4.కూయతే ఉత్కృష్ట ఇతికోశః - కోషమని మూర్థన్యాంతముగా గొందుఱు.
కుశబ్దే - ఉత్కృష్టమని పలుకఁబడునది. 
5.రాజత ఇతి రాష్ట్రం - ప్రకాశించునది. 
6.దుఃఖేన గమ్యత ఇతి దుర్గం - ప్రయాసముచేతఁ బొందఁబడునది.
7.బలంత్త్యనేన బలం, బల ప్రాణనే - దీనిచేత బ్రదుకుదురు.
ప్రక్రియతే రాజ్యమాభి రితి ప్రకృతయః - వీనిచేత రాజ్యము ప్రకృష్టముగాఁ జేయఁబడును.
8.శ్రయంత్తే పరస్పర మితి శ్రేణయః. శ్రిఞ్ సేవాయాం - పౌరులయొక్క శ్రేణులు పౌరశ్రేణులు.
స్వామిన్ శబ్దము మొదలు ను రాజ్యాంగములనంబడును. ఈ సప్తాంగములే ప్రకృతులనంబడును. పౌరశ్రేణులను ప్రకృతులనంబడును.

అష్టప్రకృతి రష్టాష్ట విభ్రాజద్వికృతాకృతిః,
దుర్భిక్ష ధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ| 64స్తో

ఆజకము - మేకలమంద, మేక.
లంబకర్ణము - మేక, విణ.వ్రేలాడెది చెవులు కలది.
లంబ - దుర్గ, లక్ష్మి.

దేవానాంప్రియము - మేక, యజ్ఞములందు దేవతల కర్పింపబడును గాన.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

అజోరజః ఖరరజస్తథా జన్మార్జనీరజః|
స్త్రీణాంపాదరజశ్చైవ శక్రస్యాసి శ్రియం హరేత్|
తా.
మేకలకాలిదువ్వ, గాడిదకాలిదువ్వ, (మార్జని - చీపురుకట్ట)చీపురు కట్టదువ్వ, స్త్రీకాలిదువ్వ, ఇవి పైబడిన ఇంద్రునికైన ఐశ్వర్యము తొలగి పోవును. - నీతిశాస్త్రము

ఆదిశక్తి రమేయాత్మా - పరమా పావనాకృతిః|
అనేకకోటి బ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా.

ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు -
1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి 2.వడ్డి.
పొడుపు కొండ -
ఫలసిద్ధి -
వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః. అసలు కన్నా వడ్డీ ముద్దు.

వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
కుత్సీరము - వడ్డీబ్రతుకు.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.   

ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము 5.కుబేరుని భార్య.

పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు -
(గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy).

వైమనస్యము - 1.దుఃఖమనస్కుని భావము, 2.పొదుపు, 3.అభిప్రాయ భేదము.

మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మృత్యువు -
1.చావు, 2.మరణాధిదేవత.
మృతు - చావు.
మిత్తిచూలు(ౘ) - కేతువు Ketu. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెపుగాము - వి.1.కేతుగ్రహము, మిత్తిచూలు.  

మిత్తిగొంగ(గొంగ-శత్రువు) - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు -
శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు. మృత్యుం జయతీతి మృత్యుంజః - మృత్యువును గెలిచినవాఁడు. జి జయే. 

అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
వేకువ -
వేగుజాము; ఔషసి - వేకువ, ఉషఃకాలము.
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః.
రేపకడ - ప్రాతఃకాలము.
విభాతము - ప్రభాతము, వేకువ. ప్రభాతము - వరువాత, వేగుజాము.
ప్రత్యూషము - వేగుజాము.
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1.రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగుఁ(ౙ)జుక్క - శుక్రుడు Venus.

ఉషస్సు -  సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.

ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.

నిశాంతము - 1.వేకువ, 2.ఇల్లు.
నితరాం శామ్యతి దుఃఖమత్రేతి నిశాంతం. శము ఉపశమే. - దీనియందు దుఃఖము మిక్కిలి శమించును.
అవశ్యం నిశాయా మమ్యతే గమ్యత ఇతి నిశాంతం. అమ గతౌ. - అవశ్యముగా రాత్రియందు పొందఁబడునది. 
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.

అనేకార్కకోటి ప్రభావజ్జ్వలం తం |
మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తం |
శ్రితానా మభీష్టం నిశాంతం నితాంతం |
భజే షణ్ముఖం తం శరచ్చంద్ర కాంతమ్ ||

The house of every one is to him his castle and fortress, as well for his defence against injury and violence, as for his respose. - Sir Edward Coke, Semayne’s Case (1605)

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||
తా.
ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము(శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి.)చూచుకొని పోవలయునని బృహస్పతి(బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు Jupiter.)చెప్పెను. ఎపుడు బయలుదేరిన కార్యము సఫల మగునని నిస్సంశయముగా(నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా)మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు(బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.)చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్దనుండు(జనార్థనుఁడు - విష్ణువు)చెప్పెను. - నీతిశాస్త్రము 

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

ఉష - 1.రేయి, 2.రాత్రిశేషము, 3.బాణాసురుని కూతురు.

అథ శర్వరీ
నిశా నిశీధినీ రాత్రి స్త్రియామ క్షణదా క్షపా
విభావరీ తమస్విన్యౌ రజనీ యామినీ తమీ. -

శర్వరి - రాత్రి.
శృణతి వ్యాపారం దినం వా శర్వరీ. ఈ. సీ. శౄ హింసాయాం - వ్యాపారమునుగాని దినమునుగాని చెఱుచునది.

శర్వరీ దీపక శ్చంద్రః - ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపికః||
తా.
చంద్రుఁడు రాత్రిని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)పగటినిఁ ప్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము  

క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - విశ్వేశ్వరీ శర్వరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ. 

శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ,
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా| - 71స్తో

నిశ - 1.రేయి, 2.పసుపు.
నితరాం శ్యతి సర్వవ్యాపారన్ నిశా. శో తనూకరణే - అన్ని వ్యాపారము లను మిక్కిలి స్వల్పముగాఁ జేయునది.
నిశీధిని - రేయి, (నడురేయి కలది.)
నిశీధము - నడురేయి; అపరాతిరి - నడురేయి, అర్థరాత్రము. 
నడికిరేయి - అర్ధరాత్రము, రూ.నడురేయి.
నిశీథః అస్యామస్తీతి నిశీథినీ. ఈ.సీ. - నిశీథమనఁగా, అది దీని యందుఁ గలదు.
నిశాపతి - చంద్రుడు Moon.
నిశాయాః పతిః నిశాపతిః. ఇ - పు. - రాతిరికి ఱేడు. 
నిశాకరుఁడు - చంద్రుడు.  

రాత్రి - సూర్యాస్తసమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాతి సుఖమితిరాత్రిః ఇ. సీ. రాదానే. - సుఖము నిచ్చునది.
రాత్రిమణి - చంద్రుడు Moon.
రే - రేయి, యొక్క రూపాంతరము, రాత్రి.
రేకంటు - (రేయి+కంటు) సూర్యుడు Sun, రాత్రికి శత్రువు.
రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.  

త్రియామ - 1.రాతిరి, 2.పసుపు, 3.యమున. 
యామము -
జాము, మూడు గంటల కాలము.  
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.
త్రయో యామాః ఊస్యాంసాత్రియామా - యామమనఁగా జాము, మూఁడు జాములు గలది, రాత్రియందు ప్రథమయామము చేష్టాకాలముగనుకను, అంత్యయామము విబోధకాలము గనుకను నీ రెండు యామములందు సగము దివసముగా వునఁ ద్రియామ యనంబడును.  

క్షణద - 1.రాత్రి, 2.పసుపు, వ్యు.తీరికను వేడుకను కలిగించునది.
క్షణమవ్యాపారస్థితిం యూనాముత్సవం వాదదాతీతి క్షణదా, డుదాఞ్ దానే - వ్యాపారశూన్యమైన స్థితినిగాని యౌవనవంతులకు నుత్సవము నుగాని యిచ్చునది.
క్షపాకర్వుఁడు - చంద్రుడు Moon, వ్యు.రాత్రిని కలిగించువాడు.
క్షపాం కరోతీతి క్షపాకరః. డు కృఞ్ కరణే - రాత్రిని జేయువాఁడు.
క్షపాచరుఁడు - రక్కసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు. 
క్షపాటుఁడు - 1.రాక్షసుడు, 2.యమదూత.    

క్షపయతి సర్వచేష్టా ఇతిక్షపా. క్ష్యైక్షయే - సర్వవ్యాపారములను క్షయింపఁజేయునది.

విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ - చంద్రాదులచేతఁ ప్రకాశించునది.
విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని. 

తమి - రాతిరి, చీకటి.
తమస్విని -
రాతిరి.
తమః అస్యామ స్తీతి తమస్వినీ. ఈ. సీ. - చీఁకటి గలిగినది.
తమిస్ర - 1.చీకటిరేయి, చిమ్మచీకటి.
తమిస్రము - 1.చీకటి, 2.కోపము, 3.పసుపుపొడి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ(గొంగ-శత్రువు) - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
తామిస్రము -
1.చీకటి, 2.చీకటి మయమైన నరకము. 

ఇరులు - (వి. బహు.) చీకటి.
ఇరులుగొంగ - సూర్యుడు, వ్యు.చీకటులకు శత్రువు.

తాపింఛము - చీకటి మ్రాను, తమాలము.
తమాలము -
1.బొట్టు, 2.కత్తి, 3.చీకటిచెట్టు.
బొట్టు - 1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తము.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 3.కూతురు, సం.1.భేత్రీ, 2.పుత్రః, 3.పుత్రిః.
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోళపు పొర క్రింద నుండు అంతస్రావగ్రంథి (Thymus gland).
తిరుచూర్ణము - ఎఱ్ఱబొట్టుపొడి.

పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
పుండరీకము -
1.తెల్లదామర, 2.అగ్నేయపు దిక్కునందలి యేనుగు, శార్దూలము.
పుండరీకాక్షుఁడు - విష్ణువు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.

రజని - రాత్రి.
రంజంతి కామినో త్ర రజనీ. ఈ.సీ. రంజ రాగే - దీనియందు కాముకులు రాగయుక్తులగుదురు.
రజనిజలము - మంచు.

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్దర నారాయణా|

యామిని - రాత్రి.
యామా అస్యాం సంతీతి యామిని  - యామములు గలిగినది.
యామము - జాము, మూడు గంటలకాలము.
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.

యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
మగనాలు -
(మగని+ఆలు) పతిపత్ని, కుల స్త్రీ. 

జని - 1.స్త్రీ, ఆడుది 2.భార్య, 3.కోడలు(కుమారుని భార్య), పుట్టుక.
జననము -
1.పుట్టుక 2.వంశము. 
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక; ప్రాదుర్భావము - పుట్టుక. 
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.

జాయతే స్యాం పతిః పుత్రరూపేణేతి జాయా. జనీ ప్రాదుర్భావే. - ఈమె యందు పతి పుత్రరూపమున జనించును.
బ్రియత ఇతి భార్యా. బృఞ్ భరణే. - భరింపబడునది.

ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.

బాలార్కః ప్రేతధూమశ్చ- వృద్ధ స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినదినే||
తా.
ఉదయకాలమందు ఎండగాచుకొనుటయు, పీనుగు కాలెడి పొగ తనమీదఁ బాఱుటయు, (వృద్ధ - ముసలిది)తనకంటె పెద్దదానితో సంగమము చేయుటయు, ఆకులు మురిన నీళ్ళను ద్రావుటయు, రాత్రి (రాత్రి - సూర్యాస్తసమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.)పెరుగన్నము భోజనము చేయుటయు నివి దినదినమున (కా)ఆయుస్సును తరుగ జేయును. - నీతిశాస్త్రము

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

6.19.11Vishnu_and_Lakshmi_thumb3

No comments:

Post a Comment