Wednesday, February 8, 2012

తిధులు

ఓం ప్రతిపన్ముఖ్య రాకాంత తిధి మండల పూజితాయై నమః : పాడ్యమీ ప్రభృతి పూర్ణిమా పర్యంత విశేష విధులచే పూజించ దగిన మాతకు (లలితాదేవి) ప్రణతులు. ప్రయాగమునందు దేవిస్థానం లలిత.

దేవేశీ దండనీతిస్థా - దహరాకాశ రూపిణీ|
ప్రతిపనుముఖ్యరాకాంత - తిథిమండలపూజితా.

తేది - తిథి, దినము, రూ.తేదీ, సం.తిథిః.
తిథి -
1.పాడ్యమి మొదలగునవి, 2.శ్రాద్ధదినము.

తదాద్యా స్థిథయో ద్వయోః,
తన్యతే షష్టిఘటికాభిరితి తిథిః, ఇ. ప్స. తనువిస్తారే - అఱువది 60 గడియలచేఁ బెంపొందునది. 

ద్యుపు - 1.ఆకాశము, 2.దినము, 3.స్వర్గము.

దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.

ఘస్రో దినాహనీ వా తు క్లీబే దివస వాసరౌ,
ఘన త్యన్ధకారమితి ఘస్రః, ఘ స్డ్ అదనే - అంధకారమును దినివేయునది.
1. ద్యుతి అంధకారమితి దినం. దో అవఖండనే - అంధకారమును ఖండించునది.
2. న జహాతి ప్రత్యాగమనమిత్యహః. స. న. ఓహాక్ త్యాగే – తిరిగి వచ్చుటను విడువనిది.
సూర్యేణ న హీయత ఇత్యహః - సూర్యునిచే విడువఁబడనిది.
3.దీవ్యంతి జనా అస్మిన్నితి దివనః. ప్న. దివు క్రీడాదౌ - దీనియందు జనులు ప్రకాశింతురు.
వసంత్య స్మిన్నితి వాసర్థః. ప్న. వస నివాసే - దీనియందు వసింతురు.  
వాసయతి స్థాపయతి జదితి వాసరః - లోకమును నిలుపునది.
4.దివసవాసర శబ్దౌ వికల్పేన నపుంసకలిఙ్గే వర్తేతే - దివసము, వాసరము ఇవి యొక పక్షమున నపుంసకలింగములు నగును. ఈ నాలుగు 4 పగలు పేర్లు.

ఘస్రము - దినము, విణ.కర్కశము.
దినము -
1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
పగలు - పవలు, దినము.
దినకరుఁడు - సూర్యుడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
లోకబాంధవుఁడు -
సూర్యుడు. లోకబాంధవో లోకబాంధవః - లోకమునకుఁ చుట్టము, బంధువు.
ౙగముచుట్టము - సూర్యుడు.
ౙగముకన్ను - సూర్యుడు.
జగచ్చక్షువు - సూర్యుడు. 

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.   
భా||
ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. 

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. 

దివసము - 1.పగలు, 2.దినము, రోజు. 
వాసరము -
దినము.
రోజు - దినము.
రోజు -
24 గంటలు, దినము భూమి తన అక్షముపై పడమటనుండి తూర్పునకు తనచుట్టును 360 డిగ్రీలు తిరుగుటకు తీసికొను వ్యవధి, సం.రోచిః.

దినరేఖ - (భూగో.) 180 డిగ్రీలు రేఖాంకముతో సరిపోవు రేఖ. (పశ్చిమముగ పయనించువాడు ఈ రేఖ దాటినప్పుడు తేదీకి ఒక రోజు కలుపుకొనవలెను. అట్లే తూర్పుగ పయనించువాడు ఒక రోజు తీసివేసి కొనవలెను. ఈ ఊహారేఖ తూర్పునకు అలాస్కా పశ్చిమమునకు దక్షిణ సముద్ర ద్వీపములు (South Sea Islands) కలవు. 

వాసరము - దినము.
వాసవుఁడు -
ఇంద్రుడు.
ఇంద్రుఁడు - 1.దేవతరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

అహము - 1.దినము, రేయింబవలు, 2.పగలు, రూ.అహస్సు, 3.గర్వము.  
అహస్సు -
అహము. అహమ్మతి - అజ్ఞానము.
అహస్కరుఁడు - సూర్యుడు.
అహర్పతి - 1.సూర్యుడు, 2.శివుడు, 3.జిల్లేడు.

అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
ఔషసి -
వేకువ, ఉషఃకాలము.
ఉషస్సు - తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము, ప్రత్యూషము, వేకువ.
ప్రత్యూషము - వేగుజాము; వేకువ - వేగుజాము.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః.
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1.రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగుఁ(ౙ)జుక్క - శుక్రుడు Venus.     

ఆహ్నికము - 1.పగలు చేయదగినది, 2.పగలు జరుగునది, వి.1.పగలు చేయదగిన కర్మము, 2.మహాభాష్య ప్రకరణము.

రోచిస్సు - 1.కాంతి, 2.సూర్యకిరణము.
రోచనము -
ప్రకాశించునది.
రోచిష్టువు - ప్రకాశించువాడు.

మధ్యాహ్నము - పట్టపగలు, దినము నడిమి భాగము.
మధ్యాహ్న రేఖలు - (భూగో.) రేఖాంశములు, ఉత్తర, దక్షిణ ధ్రువముల గుండా పోవు వృత్తములు.

రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
సూర్యుఁడు -
వెలుగురేడు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి(Jupiter).
శరీరి - ప్రాణి; జీవి - జీవించువాడు, వి.ప్రాణి.

త్రిద్యుస్పృక్కు - మూడు దినములు వ్యాపించిన తిథి; అవమము.

దర్శ, ద్రష్ట, దర్శతా, విశ్వరూపా(భూమిరూపం), సుదర్శనా (విష్ణు చక్రము), ఆప్యాయమానా, అప్యాయమానా, ఆప్యాయా, సూవృతా, ఇరా, అపూర్వమాణా, ఆపూర్వమాణా, పూరయంతీ, పూర్ణా, పౌర్ణమాసీ అని ఈ నామములు వేదములందు చెప్పబడినది.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.  
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది. 
సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ. 

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో  

ఉరస్సు - పక్షము.
పక్షము -
 1.నెలయందు పదునైదు దినములు (శుక్ల కృష్ణ పక్షములు) 2.రెక్క. 

మూలే తు పక్షతిః పక్ష భేదయోః :
పక్ష భేదము లనఃగా శుక్ల కృష్ణపక్షములును, పక్షిఱెక్కలును; వాని యొక్క మూలమనఁగా పాడ్యమియును, ఱెక్కలమొదలును. ఈ రెంటికిని పక్షతి యని పేరు. పక్షయో ర్మూలం పక్షతిః. సీ. పక్షముల మొదలు గనుక పక్షతిః.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చః మానద |

ఏట - పక్షము, ప్రక్క, విన.అతిశయము, రూ.ఏటము.
ఏటవాలు - 1.పక్షపాతము, 2.వంపు.

పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు(కొలువుకాడు).
చంద్రుడు -
నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము(నెలకువ - స్థానము), 5.కర్పూరము.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురమామ, సం.చంద్రమాః. 

సూయత ఇతివా సోమః - ప్రతి పక్షము నందును బుట్టింపఁబడువాడు.
ప్రతిమాసం గ్లాయతిక్షయతీతిగ్లౌం. ఔ. పు. గ్లేంలేహర్షక్షయే - ప్రతిమాసము క్షయించువాడు.

పక్షౌ పూర్వా పరౌ శుక్ల కృష్ణా - పూర్వాపరౌ పక్షౌ శుక్ల కృష్ణా విత్యుచ్యేతే, ఇందు పూర్వపక్షము శుక్ల మనియు, అపరపక్షము కృష్ణ మనియుఁ జెప్పఁబడును. మొదటిది శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము.

అధవా - అట్లుకాకున్న, పక్షాంతరమున.
పక్షాంతరము -
మరియొక విధము.   
ఏని - అవ్య. పక్షాంతరమును అనిశ్చయమును తెలుపును.
పక్షాంతరస్థాపన - (గణి) ఒక పక్షము నుండి మరొయొక పక్షమునకు రాసులను కొనిపోవు ప్రక్రియ (Transposition). 

ప్రతి నెలయందు మొదటి 15 దినములకు శుక్లపక్షము, లేక శుద్ధపక్షము అనియు 2వ భాగముగల 15 దినములకు కృష్ణపక్షము లేక బహుళపక్షము అనియు పేర్లు కలవు. శుక్లపక్షము నందు వెన్నెల వృద్ధియగును. కృష్ణపక్షము నందు చీకటి వృద్ధియగును.

తొలుపక్కము - శుక్లపక్షము.
తొలుత -
1.ముందు, 2.మొదట.

తెలిపక్కము - శుక్లపక్షము.
తెలి -
1.తెల్లనిది, నిర్మలము.
తెల్ల - ధవళము, 2.స్పస్టము.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషము లేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి.

ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ధవళిమ -
తెలుపు.

సిత పక్షము - శుక్లపక్షము.
సిత -
1.చెక్కర, 2.తెల్లగంక
సితము - 1.తెల్లనిది 2.కట్టబడినది
సితాభము - కర్పూరము రూ.సితాభ్రాము

సితుఁడు - శుక్రుడు, అంతశుద్ధికి శుక్రుడు విణ.తెల్లనివాడు.

శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
చంద్రబీజము -
వెండి. 
వెండి - రజతము, అవ్య. మరియు (వెండియు).
రజతము - 1.వెండి, 2.హారము, విణ.తెల్లనిది (భూగ.) ఒక లోహము (Silver) సం.వి. (రసా.) వెండి ధాతువు లలో నొకటి. (Argentum). నాణెములలో ఉపయోగపడు ధాతువు.
రజతాద్రి - 1.వెండి కొండ, 2.కైలాసము.
కైలాసము - కుబేరుని ఉనికిపట్టు, 2.శివుడుండు వెండికొండ.

ఉత్తరపక్షము - 1.సిద్ధాంతము (వ్యతి. పూర్వపక్షము), 2.కృష్ణపక్షము.
సిద్ధాంతము -
1.స్థిరమైన పక్షము, 2.నవవిధ జ్యోతిష గ్రంథములు (గణి.) గణిత ప్రవచనము నందలి సత్యమును నిరూపణ చేయ నుద్దేశించినది. నిరూపణ చేయ వీలైన ప్రాథమిక స్వీకృతముకాని గణిత ప్రవచనము (Theorem) (గణి., భౌతి., రసా.,) నిరూపించబడవలసిన తత్త్వము లేదా ఉపయుక్తులచే రుజువుచేయ బడవలసిన ప్రమేయము.
రాద్ధాంతము - సిద్ధాంతము, స్థిరమైన పక్షము.
సిద్ధాంతి - 1.జ్యోతిషము తెలిసినవాడు, 2.తత్త్వ శాస్త్రము తెలిసినవాడు.

రాద్ధాంతము - సిద్ధాంతము, స్థిరమైన పక్షము.

బహుళము - 1.ఆకాశము, 2.కృష్ణపక్షము, విణ.1.అధికము, 2.తరచు, (వ్యాక.) ఒకప్పుడు కలుగుట ఒకప్పుడు కలుగ కుండుట, ఒకప్పుడు వైకల్పితముగా నుండుట, ఒకప్పు డొంకొక విధముగా నుండుట.

పెల్లు - హెచ్చు, విణ.అత్యంతము, సం.బహుళమ్.
హెచ్చు -
అధికమగు, రూ.ఎచ్చు.
ఎచ్చు(ౘ) - అధికము, విణ.అధిక్యము, క్రి.అధికమగు.
అధికము - ఎక్కువైనది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
వలదు - అధిక్యము, అవ్య.వద్దు.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము. 
నితాంతము - పెల్లు, అధికము. నిర్భరము - పెల్లు, అధికము. 

తరుచు - త్రచ్చు.
త్రచ్చు -
చిలుకు, మధించు, రూ.తరుచు, సం.ధర్ష్, తక్ష్. 
త్రచ్చన - 1.చిలుకుట(చిలుకుడు - చిలుకుట), 2.చెక్కుట.
మథనము - త్రచ్చుట.

అపరపక్షము - బహుళ పక్షము, కృష్ణపక్షము.
బహుళ పక్షము -
చీకటి పక్షము, వ్యతి.శుద్ధపక్షము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

శబ్దం లేకుంటే జగత్తు అంతా చీకటే. చీకటియే మాయ - అజ్ఞానం. చీకటి శాశ్వతము కాదు.

1. ప్రతిపత్తు - పాడ్యమి.

అథ పక్షతిః, ప్రతిపద్ద్వే ఇమే స్త్రీత్వే :
పక్షస్య మూలం ప్రారంభః - శుక్ల కృష్ణ పక్షములయొక్క ప్రారంభము.
ప్రతిపద్యతే చంద్రస్య ఉదయః క్షయో వా అస్యాం ప్రతిపత్ - దీనియందు చంద్రుని యొక్క ఉదయముగాని క్షయముగాని తెలియఁబడును. ఈ రెండు పాడ్యమికిఁ పేర్లు.

పాడ్యమి - మొదటి తిధి, ప్రథమా.  ప్రథమశబ్దము మొదటిదానికిని, శ్రేష్ఠమైనదానికిని పేరు.

ప్రభృతి - మొదలు.
ప్రథమము -
1.ముఖ్యము, 2.మొదటిది.
ముఖ్యము - ప్రధానము.
ప్రధానము - 1.ముఖ్యము, 2.ముందిచ్చుసొమ్ము, 3.వివాహా త్పూర్వము వధువున కలంకారాదుల నిచ్చినిశ్చయించుకొనుట, 4.పరమాత్మ. 

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా; ప్రథమం భారతీనామ; ప్రథమం శైల పుత్రీతి.

ఉదయే ధిగమే ప్రాప్తిః : ప్రాప్తి శబ్దము పుట్టుటకును, లాభమునకును పేరు. ప్రాపణం ప్రాప్తిః. సీ ఆప్ ఌ వ్యాప్తౌ పొందుట ప్రాప్తి.

దర్శ - అనగా అమావాస్య తరువాత వచ్చు ప్రతిపత్తి (పాడ్యమి).

ప్రత్తిపత్తు మొ||లుగా శుక్లపక్ష కృష్ణపక్షములందలి తిథుల స్వరూపము లగుట చేత క్రమముగా వృద్ధి క్షయములు కలవగు చున్నది. మరల అవే కృష్ణ ప్రతిపత్తు నుండి అమావాస్య వరకు తిధులను ప్రవర్తింప జేయు నవియు 15 కాగా వృద్ధి క్షయములు యీ 15 వరకే.

చంద్రుని ప్రథమ కళకు ప్రతిపత్తు అని నామము తో వ్యవహారము. ఆ ప్రతిపత్తే కళా స్వరూపమున సూర్య మండలమునుండి బయలు వెడలి వచ్చియున్నదగును. కృష్ణపక్షమున ఆ ప్రథమ కళ సూర్యమండలమును ప్రవేశించు చున్న దగును. – సౌందర్యలహరి

2. విదియ - రెండవ తిధి  సం.ద్వితీయా (ద్వితీయా బ్రహ్మచారిణీ)
ద్యతీయ -
1.భార్య, 2.విదియ, 3.రెండవది స్త్రీ, 4.(వ్యక) ద్వితీయా విభక్తి.

దయిత - 1.భార్య, 2.స్త్రీ.
దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.

భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు. భరింపదగినది. పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.

భ్రియత ఇతి భార్యా. భృఞ్ భరణే. - భరింపఁబడునది.
యజ్ఞాధికార ఫలభాగినో ర్జాయాపత్యో రన్యతరత్వేన ద్వితీయా - యజ్ఞాధికార మందు ఫలమును బొందునప్పుడు పతితోఁ గూడ తాను రెండవది.

ద్వితీయుఁడు – కొడుకు, విణ.రెండవవాడు.

ని - ద్వితీయా విభక్తి ప్రత్యయము.
ను -
1.ద్వితీయా విభక్తి ప్రత్యయము, 2.క్రియాప్రత్యయము, ఉదా.తద్ధర్మాదు లందు ప్రథమ పురుషైక వచనమున చేరు ప్రత్యయము, సూర్యుడు తూర్పున ఉదయించును, 2.సముచ్ఛయార్థకము, ఉదా.వాడును నీవును రండు.
తద్ధర్మము - (వ్యాక.) 1.మూడు కాలములను బోధించు క్రియాపదము, ఉదా.సూర్యుడుదయించును, 2.దాని యొక ధర్మము, 3.స్వభావము.

కార్తీకశుద్ధ విదియ(యమ ద్వితీయ)నాడు ఎవడు తన సోదరి యింట భోజనం చేస్తాడో, అతనికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుభయం కాని సంభవించని విధంగా యమునకు వరం ప్రసాదించాడు.

సోదరుణ్ని తనఇంటికి అహ్వానించి, మనఃపూర్వకంగా తన చేతి వంటకాలను వడ్డించి, తృప్తిపరిచే చెల్లెల్లు(స్త్రీ) వైధవ్యం పొందక చిరకాలం 'సువాసిని' గానే ఉంటుంది, అన్నాడు యమధర్మరాజు, తన చెల్లెల్లు యమునతో. పసుపు-కుంకుమ స్త్రీకి పుష్టి కలిగిస్తుంది.

లలాటం లావణ్య ద్యుతి - విమల మాభూతి తవ యత్
ద్వితీయం తన్మన్యే - మకుట ఘటితం చంద్రశకలమ్|
విపర్యాసన్యాసా దుభయమపి - సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః - పరిణమతి రాకాహిమకరః.|| - 46శ్లో
తా.
తల్లీ! లావణ్యమను వెన్నెల చేత స్వచ్ఛముగ ప్రకాశించుచున్న నీ లలాటమును కిరీటమందున్న రెండవ చంద్రకళ(నెలపాలు - చంద్రకళ)గా భావించుచున్నాను. ఈ రెండును  క్రిందు మీదుగ(తలక్రిందులుగా) నుండుటవలన పరస్పరము కలిసి, అమృతము పూసిన పూర్ణిమ చంద్రుని వలె మారుచున్నది.  - సౌందర్యలహరి          

ద్వితీయ (విదియ) చంద్రుని దర్శించునపుడు :
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర|
హిరణ్య మకుటా భాస్వదాచల చంద్ర నమోస్తుతే||

విదియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడు.

3. తదియ - తృతీయ, పక్షమునందు  మూడవ తిథి. సం.తృతీయా.  
తృతీయ -
1.పక్షమునందు మూడవ దినము, తదియ.

తద్దె - తదియ, తద్దియ, అట్లతద్దె ఉండ్రాళ్ళ తద్దె. తద్దికి అట్లు బలం అన్నారు.

తిగ - మూడు, రూ.తివ, సం.త్రికమ్.
తివ -
తిగ.
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస, (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.         

త్రయీధర్మము - వేదవిహిత ధర్మము.

మూఁడు - రెండు నొకటి, క్రి.1.సంభవించు, 2.ముగియు.
సంభవించు - క్రి.సంభవిల్లు.
ముగియు - క్రి.మరణించు, అయిపోవు.

ముఖ్య సంఖ్యలు - (గణి.) ఎన్ని? అను ప్రశ్నకు సమాధానము నిచ్చు 1, 2, 3, 4 వంటి అంకెలు (Cardinal numbers) (చూ. క్రమిక = Ordinal) 
బేసి - విషమము, సమముకానిది, విణ. (గని.) సరిగాని సంఖ్య (Odd), 1, 3, 5, 7, వంటివి, చూ. (ఆయుగ్మ సంఖ్య).
విషమము - సమము కానిది.
బేసికంటి - (బేసి+ కన్ను) ముక్కంటి.   
విషమాక్షుడు - శివుడు, వ్యు.బేసి కన్నులు కలవాడు.

తిగంటి - శివుడు, వ్యు.మూడు కన్నులు కలవాడు.

ముగురు - (మూడు+గురు) మువ్వురు, రూ.ముగ్గురు, మువురు, మూగురు, మూవురు.
మూగురు - ముగ్గురు.

తృతీయకము - (గృహ.) మూడవది, రూ.తృతీయము.
తృతీయము - తృతీయకము. తృతీయం శారదా దేవీ |

త్రింశత్తు - ముప్పది.
త్రింశము - ముప్పదవది.

అహస్సూతే సవ్యం - తవ నయన మర్కాత్మకతయా
త్రియామాం వామం తే - సృజతి రజనీనాయకతయా, |
తృతీయా - తే దృష్టి ర్దరదళిత హేమామ్భుజరుచిః
సమాధత్తే సంధ్యాం - దివసనిశయో రన్తరచరీమ్ || - 48శ్లో
తా.
ఓ భగవతీ ! నీ కుడికన్ను(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)సూర్యాత్మకమైన పగటిని సృజిస్తోంది, నీ యెడమ కన్ను చంద్రుడు అధిదేవతగాగల రాత్రి(రజని - రాత్రి)ని కలిగిస్తుంది. ఇంచుక వికసించిన సువర్ణకమలాన్ని(పుష్పించిన బంగారు పద్మపు కాంతిని)పోలిన నీ మూడవ నేత్రం(దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)దివారాత్రాల నడుమ కలిగే సంధ్యలను ఏర్పరుస్తోంది.(రాత్రిం బగళ్ళకు మధ్యనున్న సాయం సమయమును చేయుచున్నది) - సౌందర్యలహరి    

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని -
1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.   

ఓం నిత్యాక్లిన్నాయై నమః : శుక్ల పక్ష తృతీయాతిధి, తృతీయం శారదాదేవి దేవతయగు నిత్యక్లిన్నా దేవికి వందనాలు. (తృతీయా చిన్న ఘంటేతి) 

దుష్ట విద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ,
శారదా శరసంధానా సర్వశస్త్ర స్వరూపిణీ. - 24శ్లో

4. చతుర్థి - 1.పక్షమున నాల్గవ దినము, చవితి 2.నాల్గవది. 
(ౘ)చౌతి
  - చతుర్ధి, పక్షమందు నాల్గవ తిధి  రూ.చవుతి.(కూష్మాండేతీ చతుర్థకీ; చతుర్థం హంసవాహనా)

ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు -
మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. 

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్దకేలు వేలుపు.
ఉడ్డకేలు వేలుపు -
చతుర్భుజుడు, విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).

5. పంచమి - 1.పక్షము నందు ఐదవ తిథి, 2.ద్రౌపది.

ఏను - 1.అయిదు, 2.నేను యొక్క రూపాంతరము.

అరపది - అయిదు, పదిలోసగము, సం.అర్థపంక్తిః.
ౘవ్వంచ -
అయిదు; అయిదు - ఐదు (సంఖ్యావాచకము).
పంచకము - అయిదు; ఐదు - నాలుగునొకటి, అయిదు.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు - ఈ ఐదువన్నెలు, సుమంగళి చిహ్నములు), జీవభర్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

పంచముఖుఁడు - శివుడు (ఐదుమోముల వేలుపు.)
ఐదుమోముల వేలుపు -
పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.

ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు అను సంఖ్య.

ఓం పంచమ్యై నమః : పంచమీ తిథి దేవతా రూపిణికి ప్రణామాలు. పంచ తిధి రూపత్వ ముండుట వలన శ్రీవిద్యకు చంద్రకలా విద్య అని నామాంతరము కలదు.

పంచమీ పంచభూతేశీ - పంచసంఖ్యోపచారిణీ|
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా - శర్మదా శంభుమోహినీ. - 175శ్లో    

ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి -
1ద్రౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.
పార్వతి - 1.గౌరి(పర్వత పుత్రి) 2.ద్రౌపది(పాండవుల భార్య, ధీరురాలు).
గౌరి - దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌరుఁడు - చంద్రుడు Moon. 

దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుర్గ -
పార్వతి, రూ.దుర్గి.
కాళి - పార్వతి అవతారము, రౌద్రమూర్తి, భయంకరరూపం 1.గౌరి, పార్వతి, ఆది శక్తులలో ఒకటె 2.బొగ్గు. 
కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి శివుని భార్య, మంగళగౌరి, 5.క్రొత్త మబ్బు.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

ఎప్పుడదృష్టతా మహిమయించుక పాటిలునప్పుడింపుసొం
పొప్పుచునుండుగాక యదియొప్పనిపిమ్మట రూపుమాయుగా
నిప్పుననంటియున్న యతినిర్మలినాగ్నిగురు ప్రకాశముల్
దప్పిననట్టి బొగ్గునకుఁదా నలుపెంతయుబుట్టు, భాస్కరా.
తా.
బొగ్గు అగ్నితో చేరియున్నపుడు దానియందలి స్వచ్ఛమైన కాంతులతో ప్రకాశించును, అగ్ని సంబంధము తప్పిపొయినచో, అది ముందు తనకున్న కాంతిని బాసి నల్లగా నగును. అట్లే అదృష్టమున్న దినములలో మానవుడు ప్రభ కలిగి యుండును, లేనిచో తొల్లింటి ప్రభ నశించును.    

6. షష్ఠీ - పక్షమందు ఆరవ తిధి విణ.అరవది. శుక్లపక్షపు షష్ఠి సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైనరోజు. 

షష్టి - అఱువది.
షష్టము - అరవది.
షష్ఠ్యంకపద్ధతి - (గణి.) లంబకోణము 90 డిగ్రీలగను, డిగ్రీని 60 మినిట్లగను, మినిట్ ను 60 సెకెండ్లుగను పరిగణించెడి పద్ధతి (Sexagesimal system).  

సేగి - సష్ఠి, కీడు.
కీడు -
1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.

ఒప్పమి - 1.తప్పు, 2.కీడు, 3.అనంగీకారము.
తప్పు -
1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, తప్పిదము, క్రి.చిక్కు.
తప్పిదము - దోషము; దోసము - దోషము; దోషము - 1.తప్పు, 2.పాపము.
దోషాచరుడు - 1.చంద్రుడు, 2.రాక్షసుడు, వ్యు.నిసియందు తిరుగువాడు. 
దొషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు).
దోషజ్ఞుడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోషమెరిగినవాడు. 

అఱజాతి - 1.హీనకులుడు, 2.దుష్టుడు.   

పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము -
పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సప్పము - సర్పము, సం.సర్పః.
కలుషము - పాపము.

అపకారము - 1.కీడు, 2.ద్రోహము, 3.చెడ్డపని, రూ.అపకృతి.
ద్రోహము -
1.కీడుతలపు, 2.చంపునిచ్ఛ.
ద్రోహి - ద్రోహము చేయువాడు.
అపకృతి - అపకారము.
హాని - 1.తక్కువగుట, 2.కీడు.  
అపకరించు - క్రి.హానిచేయు.
అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
అపనోదము - తొలగించుట, పోగొట్టుట.
అపకర్ష్ణ - 1.తొలగించుట, 2.తగ్గించుట, 3.అవమానపరచుట, (భౌతి.) ఒక వస్తువు ఇంకొకదానిని మళ్ళగొట్టు గుణము (Repultion). 

ఉపకారికి నుపకారము
విపరీతము కాదుసేయ, వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
తా.
మేలుచేసినవానికి మేలుచేయుట గొప్పతనముకాదు. తనకు హాని చేసినవానికి వాని తప్పులను గణింపక మేలు(మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.)చేయువాడె గొప్ప బుద్ధిమంతుడు.      

కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.

ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు -
శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

షష్ఠం వాగీశ్వరీ తథా : నిత్య తిధులలో శుక్లషష్ఠీ తిధికి అధీశ్వరి - దేవి. ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ.

ఓం మహా వజ్రేశ్వర్యై నమః : శుద్ధ షష్ఠి తిధికి అధిష్ఠాన దేవత అయిన మహా వజ్రేశ్వరీ నామక దేవికి ప్రణతులు.

(షష్ఠా కాత్యాయి నీతి చ) కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి, కావిచీర కట్టిన విధవ. కాత్య అనే ఋషి తనకు పార్వతీదేవి కుమార్తెగా జన్మించాలని తపస్సు చేసాడు. అతనికి కూతురుగా(పార్వతి) ఆమె జన్మించింది కనుక కాత్యాయిని అనే పేరు వచ్చింది.

ప్రకృతిదేవి యొక్క షష్ఠాంశ (ఆరవ కళ) వల్ల బ్రహ్మ మానససృష్టిగా అవతరించింది. స్కందుని(కుమారస్వామి) పత్ని పేరు దేవసేన, షష్ఠీదేవి. షష్ఠీదేవి కుమారస్వామి ప్రియురాలు, శిశురక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఆ దేవి దివ్యమాత.

శిశువు మానవుడి తండ్రి(తల్లి). - వర్డ్స్ వర్త్  

7. సప్తమి - పక్షము నందు ఏడవతిధి విణ.ఏడవది.
సప్తమము -
ఏడవది.
సప్తకము - ఏడు, విణ.ఏడవది.

అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య, 7number.
గుఱ్ఱము -
అశ్వము.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.  

సప్త అశ్వాః యస్య సః సప్తాశ్వః - ఏడు గుఱ్ఱములు గలవాఁడు.
సప్తనామకః అశ్వో యస్యేతి వా సప్తాశ్వః - సప్తయనెడు ఒక గుఱ్ఱము గలవాఁడు. - సూర్యుడు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

సప్తి - గుఱ్ఱము.
సప్త -
1.మనుమరాలు, 2.మనుమడు, 3.మున్మనుమడు, రూ.సప్తి.
పౌత్రి - మనుమరాలు, (కొడుకు లేక కూతురు కూతురు).
పౌత్రుఁడు - కొడుకు కొడుకు.
దౌహిత్రి - దుహితకొమార్తె, మనుమరాలు. 
దౌహిత్రుడు - దుహితకొడుకు, మనుమడు.
ఇనుమనుమఁడు - మునిమనుమడు, ప్రప్రౌత్రుడు.
ప్రపౌత్రి - ము మ్మ ను మ రా లు, పౌత్రుని కూతురు. 

ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
సంవత్సరము -
ఏడు; ఏడు - ఆరునొకటి.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సత్తా - సత, ఏడు, సం.సత్త,  వై.వి. శక్తి, సం.సత్వమ్.

సతనాల్కల జేజే - సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు -
అగ్ని.

రేవంతుఁడు - అశ్వశిక్షకుడు.
రౌతు -
రావుతు, రాహుత్తు రావుతు, సం.రాహుత్తః.
రాహుతు - గుఱ్ఱపు రౌతు, సం.రాహుత్తః.

అక్కరకు రానిచుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున, తా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
తా.
అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించినను కోరిక తీర్పని దైవమును, తానధిరోహించినప్పుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును బుద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచి పెట్టును.

8. అష్టమి - ఎనిమిదవతిథి. అష్టమా చాతి భైరవీ; (మ)అష్టమం బ్రహ్మచారిణీ.

లాఘువేల ప్రవాహము - (భూగో.) శుద్ధ బహుళ పక్షములందలి అష్టమీ తిథుల యందు సముద్రపు నీటిమట్టమును సూర్యుడొక వైపు, చంద్రుడు మరియొక వైపు ఆకర్షించుటచే కలిగిన అధికమైనపాటు.

అష్టమము - ఎనిమిదవది.
అష్టకము -
1.ఎనిమిదింటి సమూహము, 2.ఎనిమిది, 3.ఋగ్వేద మందలి ఒక భాగము, అట్టము, రూ.అష్టము.
అట్టము - ఎనిమిది పన్నములుగల వేదభాగము, సం.అష్టకమ్.
అష్టము - (భౌతి.) 1.ఎనిమిదింటి సమూహము, 2.ఒక క్రింది స్వరమునకు ఎనిమిదవ మీదిస్వరము (Octave).
ఎనిమిది - ఏడు నొకటి.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్. 
దచ్చికాళ్ళమెకము - శరభము, అష్టాపదము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
అష్టాపదము - బంగారము.
బంగారము -
దుర్లభము, వి.స్వర్ణము.
బంగరు - బంగారము, సం.భృంగారః.

(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.

ఎనబండ్రు - ఎనిమిదిమంది. 
ఎనుబది -
ఎనిమిదిపదులు, అశీతి.
అశీతి - ఎనుబది. 

అష్టమూర్తి - శివుడు, (పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు - అష్టమూర్తులు).
శివుఁడు -
ఈశ్వరుఁడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
పుష్పవంతులు - సూర్యచంద్రులు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
స్త్రీ - ఆడుది.
భటుఁడు - బంటు, సేవకుడు, పనివాడు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు.    

అష్టమూర్తికి నీకును న్యాయమునను
భేదమే లేదు గద యష్టవాద మేల
పాంచభౌతిక రవిచంద్ర భవభవముర
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

అష్టమీ చంద్ర విభ్రాజ - దళికస్థల శోభితా|
ముఖచంద్ర కళంకాభ - మృగనాభి విశేషకా. - 5శ్లో

ఓం అష్టమీ చంద్ర విబ్రాజ దళిక స్థలశోభితాయై నమః : సమానార్థభాగమై నఖోసీమను ప్రకాశింప జేయునట్టి అష్టమీ చంద్ర శోభలతో రాజిల్లు లలాటసీమ గలిగిన తల్లికి(లలితకు) నమస్కారాలు. 

అష్టమ్యం చతుర్థశ్యం నవమ్యాం భృగువాసరే|
పౌర్ణమాస్యా మమాయాం చ పర్వకాలే విశేషతః|| - లక్ష్మీసహస్రనామం

అష్టమీ నవమీ చైవ దశమ్యేకాదశీ తథా|
పౌర్ణమాసీ కుహూరూపా తిథీ రాత్రిస్వరూపిణీ|| - శ్రీ భువనేశ్వర్యస్టోత్తర శతనామ స్తోత్రము

9. నవమి - పక్షమందు తొమ్మిదవ తిధి విణ.తొమ్మిదవది.
నవమము -
తొమ్మిదవది, నవమి. (నవమం బుద్ధిదాత్రీ చ; నవమా సర్వసిద్ధిశ్చాత్, నవ దుర్గా ప్రకీర్తితాః)

నవకము - మృదుత్వము, సం.వి.తొమ్మిది.
తొమ్మిది -
ఎనిమిదియు నొకటి.
ముత్తిగ - (మూడు+తిగ) తొమ్మిది.
తొమ్మండ్రు - తొమ్మిదిమంది.

నవతి - తొంబది.  
తొంబది -
తొమ్మిది పదులు.
తొంబనూఱు - తొంబదు నూర్లు.
తొమ్మన్నూఱు - తొమ్మిది నూరులు, రూ.తొమ్మనూఱు. 

10. దశమి - 1.పక్షమున పదియవ తిధి, 2.పదియవది. (స్మృతో దశ| దశమం వరదాయినీ).  యంతి భ్రామ్యంత్యనయేతి ఇరా. ఇణ్ గతౌ. దీనిచేతఁ తిరుగుదురు.

దశాంశపద్ధతి -  (గణి.) పదులను పదుల వర్గములను ఉపయోగించి సంఖ్యలను వ్రాయుపద్ధతి, (Decimal system).
దశాంశభాగము - (గణి.) సంవర్గ భాగములోని దశాంశభాగము. దశకము యొక్క దశాంశ బిందువు తరువాతి భాగము (Mantissa) ఉదా. 30 అను అంకెకు 10 అధారముగా గ్రహించ బడినపుడు లఘు గణకము 1.2010 ఇందులో 2010 అను భాగము దశాంశ భాగము. ఒకటి 1 అనునది పూర్ణాక భాగము.  

ధోరణి - 1.పద్ధతి, 2.పంక్తి.

దశకము - పది.
పది  - దశకము, సం.పంక్తిః.
పంక్తి - 1.వరుస, 2.పది.

బంతి - చెండు, కందుకము, వై.వి.1.పంక్తి, 2.పది, సం.పంక్తిః. 
కండుకము -
బంతి, చెందు, రూ.కందుకము.  
కందుకము - బంతి, చెండు.
గేందుకము - చెండు, బంతి, రూ.గేండుకము.
చెండు - క్రి. ఖండించు, వి.1.కందుకము, బంతి, 2.పూబంతి.
చెండాడు - క్రి. ఖండించు. 

నఱకు - క్రి.ఖండించు.
నఱకుఁడు - ఖండనము.

ఈరేను - (ఇరు+ఏను) పది.

11. ఏకాదశి - 1.పదునొకండవ తిధి, 2.పదునొకండు తంత్రులుగల పరివాదిని యను వీణ.
ఏకాదశము -
పదునొకండు, విణ.పదునొకండవది.

శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఏకాదశీ వ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. 

దేవ నీ దయ యున్నచోఁ దేజమందు
నదియె ముక్కోటి పండుగ ముదము నొసగు
నిదియె యేకాదశీసేవ వృద్ధికరము
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.

అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనస్సు; మొత్తం పదకొండింటినీ భగవంతుని యందు నిలుపుటయే పదకొండవ తిధి అయిన ఏకాదశిలోని అంతరార్థం. 

పరితోవదతి సప్తస్వరానితి పరివాదినీ - తంతులతోఁ గూడిన వీణ, అంతటను సప్తస్వరములఁ బలుకునది.

కాయమీద మ్రాను కడురమ్యమైయుండు, మ్రాను మీద లతలు అలరుచుండు, లతలమీద వేళ్ళు నాట్య మాడుచు చుండు - వీణ.
తీగల బుర్ర - తీరైన బుర్ర - తనవారి చేతిలో పలికేటి బుర్ర - వీణ.

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి.(వాసరము - దినము.)
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా,
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ.

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ|
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణ జీవనీ||

ఏకాదశం క్షుద్ర ఘంటా : ఏకాదశి, పౌర్ణమి అమావాస్య మొదలగు పుణ్యదినములలో స్త్రీలతో (పరస్త్రీలతో) కలిసి తిరుగకుము.

12. ద్వాదశి - పక్షమందు పండ్రెండవ తిథి, దోదసి.
దోదసి -
ద్వాదశి, ఒకానొక తిథి.
బారసి - ద్వాదశి, సం.ద్వాదశీ, ద్వాదశాహః

ద్వాదశకము - పండ్రెండు.
పండ్రెండు -
(పది+ రెండు) ద్వాదశ సంఖ్య.
ద్వాదళము - పండ్రెండవది.
పరక - 1.రెండి వీసములు, 2.పండ్రెండ్రు, 3.గడ్డిపోచ.
ముచ్చౌకము - 1.పండ్రెండు (3x4), 2.మూడు చౌకములు.  
ఈరాఱు - (ఈరు + ఆఱు) రెండు ఆర్లు అనగా పండ్రెండు.

ద్వాదశాత్ముఁడు - సూర్యుడు.     
ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా. న. పు. - పండ్రెండు విధములైన మూర్తులుగలవాఁడు.

నాన్నోదకసమం దానం న ద్వాదశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యః పరం మంత్రం సమాతుర్ద్యైవతం పరమ్||
తా.
అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతి శాస్త్రము 

ఆరిరాధయిషుః కృష్ణం మహిష్యా తుల్యశీలయా|
యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతమ్||

13. త్రయోదశము - పదుమూడవది, వి.త్రయోదశి.
త్రయోదశి -
1.పదుమూడవది, 2.తిథులలో నొకటి, 3.పరివాదిని; పదుమూడు తీగలు గల వీణ.
సప్త - ఏడు తంతులు గల వీణ, పరివారిది. 

14. చతుర్దశి - 1.పక్షమున పదునాల్గవదినము, 2.పరివారిది యన వీణ, 3.పదునాల్గవది.
సప్త -
ఏడు తంతులుగల వీణ, పరివాదిని.  

ఈరేడు - (ఈరు+ఏడు) పదు నాలుగు, ఉదా.ఈరేడు జగంబులు.

బహుళ చతుర్థిని, సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుణ్ని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయంటారు. గుప్పెడు గరికతో పూజించినా గంపెడు సంపదలిస్తాడు గణనాథుడు.

బూదె - చతుర్దశి తిథి, సం.భూతః.
భూతము -
1.పృధివ్యాధి భూతములు (ఇవి:- పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.)2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.

దెత్తి - (వ్యావ.) భూతము.
బూతము -
భూతము, పిశాచము, సం.భూతః.
బూచి - భూతము, సం.భూతః.
బూ(ౘ)చులఱేఁడు - శివుడు. శివతేజ శ్చతుర్దశః.
భూతేశుఁడు - శివుడు. 

అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||
తా.
బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకలభూతములకు ద్రోహము గలుగని వృత్తిచేత జీవించవలయును. లేక భూతములకు స్వల్పపీడ సేయునట్టి వృత్తిచేతనైనను జీవింపవచ్చును. – నీతిశాస్త్రము

శర్వుఁడు - శివుడు, వ్యు.ప్రళయకాలమున భూతముల హింసించువాడు.   

ప్రణిహితము - పొందబడినది.
భావితము -
పొందబడినది.
ఆత్తము - 1.పొందబడినది, లబ్ధము, 2.హరింపబడినది, ఉదా.ఆత్తగర్వుడు.
ఆప్తము - 1.పొందబడినది, 2.నమ్మదగినది, 3.యథార్థజ్ఞానము కలది, 4.నిండినది, 5.యుక్తయుక్తమైనది, 6.(గణి.) భాగహారముచేయగా ఏర్పడిన సంఖ్య, లబ్ధము. 
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీసంయోగము, 3.లాభము, 4.చెలిమి, 5.రాబోవుకాలము, ఆయతి.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

లబ్ధము -పొందబడినది, వి.(గణి.)భాగహారము చేయగా నేర్పడు సంఖ్య. 
లబ్ధము - (గణి.) అంకగణిత ప్రక్రియలో నొకటి (Product).    
అధిగతము - 1.పొందబడినది, 2.చదువ బడినది, చక్కగా నేర్చుకొన బడినది.
ఇతము1 - 1.పొందబడినది, 2.పొందినది, 3.పోయినది(అపగతము – పోయినది), సం.వి.1.గతి, 2.జ్ఞానము.  
ఇతము2 - 1.కోరిక, 2.ఇంపు, రూ.ఇతవు(ఇతవు - ఇతము), సం.హితమ్.
హితము - 1.వెనుకటికి మేలుచేయునది, 2.ధరింపబడినది, 5.తగినది, 6.ఇష్టము.
హితవు - హితము, ఇతవు, మంచి.
హితవరి - ఇతవుచెప్పువాడు.
ఇతవరి - (ఇతవు+ అరి) హితము చెప్పువాడు, మేలుకోరువాడు. 
హితైషి - మంచికోరువాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.

గతి - 1.పోక, 2.విధము(ప్రకారము), 3.త్రోవ, 3.స్థానము, 5.ప్రమాణము, 6.ఆధారము, 7.ఉపాయము, (భౌతి.) చలనము(Motion).
జ్ఞానము - 1.తెలివి, 2.ఎరుక. విద్య - 1.చదువు, 2.జ్ఞానము.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదాశాహాని శుక్లః కృష్ణశ్చ మానద ||

భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది.
పృథివి -
పృథ్వి, భూమి. వ్యు.పృథుచక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది. పృథివీ హ్యేషా నిథిః సర్వాధార, సర్వసంపద్దాత్రి, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యమాన. 

పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
క్షత్రియుఁడు - రాచవాడు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.  
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.

పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
అర్జునుఁడు -
1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

నృనతి - రాజు, రూ.నరపతి.
నృపుఁడు -
రాజు; నృపాలుఁడు - రాజు.
నరపాలుఁడు - రాజు.
నృపలక్ష్యము - రాజునకు పట్టెడి తెల్లగొడుగు.
లోకసమ్మతము - చంద్రుని గొడుగు.

స్థానవృద్ధిక్షయజ్ఞస్య షాడ్గుణ్యవిదితాత్మనః |
అనవజ్ఞాతశీలస్య స్వాధీనా పృథివీ నృప ||

భా|| తనస్థితి యొక్క వృద్ధి క్షయాలు, షాడ్గుణ్యమూ తెలిసిన వానికి, అవమానింపబడని శీలం(శీలము - 1.స్వభావము, 2.మంచినడత.)కలవానికి ఈ భూమి అంతా స్వాధీన మవుతుంది. 

అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము -
1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బూ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విన.ఋణరాశి (Negative).
ఋణాత్మకము - (గణి.) శూన్యము కన్న తక్కువైనది, (Negative).
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము. జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః|
ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||
తా.
సకలజనులకు పశువులు, పెండ్లాము(పత్ని- భార్య), కొమాళ్ళు(సుతుఁడు - కొడుకు), ఇండ్లును(ఆలయము-1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి), జన్మాంతర ఋణసంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించు చున్నవి. కాబట్టి చింతించుటవలన లాభమేమి. - నీతిశాస్త్రము    

మహస్సు - 1.తేజము, 2.వెలుతురు, 3.యజ్ఞము, 4.ఉత్సవము.
తేజము -
1.ప్రకాశము 2.ప్రభావము 3.పరాక్రమము 4.రేతస్సు, రూ.తేజస్సు.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
ప్రభావము - 1.ప్రతాపము 2.తేజము.
పరాక్రమము - 1.బలము 2.శౌర్యము.
రేతము - 1.వీర్యము, శుక్లము 2.పాదరసము, రూ.రేతస్సు.

బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః| బుద్ధి మనస్సు కంటే శ్రేష్ఠమైనది.

వాయువు - ముఖ్యప్రాణుడు, (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.  వాయువు నిత్య సన్నిహితుడు. ప్రతిజీవిలోను వాయువు ప్రథాన రూపం శ్వాస.

నింగిచూలు - వాయువు వ్యు.ఆకాశము నుండి పుట్టినది. ఆకాశము నుండి జలము, జలము నుండి అగ్ని, వాయువు ఉద్భవించినది.

బహుళము - 1.ఆకాశము, 2.కృష్ణపక్షము, విణ.1.అధికము, 2.తరచు, (వ్యక) ఒకప్పుడు కలుగుట ఒకప్పుడు కలుగకుండుట ఒకప్పుడు వైకల్పితముగా నుండుట ఒకప్పుడు డింకొక విధముగా నుండుట.

బహుళపక్షము - చీకటిపక్షము, వ్యతి.శుద్ధపక్షము.

ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి, 2.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళ ద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.       

పంచభూత మహాగ్రాసా పంచభూతధి దేవత
సర్వప్రమాణా సంపత్తి స్సర్వరోగ ప్రతిక్రియా.

కళాహీనే సానుమతిః :
నిశాకరే కళాహీనే సతి సా పూర్ణిమా అనుమతి రిత్యుచ్యతే. చతుర్దశీ యుక్తేతి భావః - చంద్రుఁడు కళాహీనుఁడైనపుడు ఆ పున్నమ అనుమతి యనంబడును. అనఁగా జతుర్దశితోఁ గూడినదని భావము. ఒక కళ తక్కువగాఁగల చంద్రునితో గూడిన పున్నమ.

అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
అనుమోదము -
1.సంతోషము, 2.అంగీకారము, సమ్మతి.
సమ్మదము - సంతోషము; ప్రహ్లాదము - సంతోషము.
హ్లాదనము - సంతోషించుట, సంతోషము, రూ.హ్లాదము.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ. ఇచ్ఛ - అభిలాష, కోరిక.
సమ్మతము - ఇష్టమైనది, అంగీకృతమైనది, సం.వి. (గృహ.) స్వీకరణ, అంగీకారము, (Acceptance).
అంగీకారము - 1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
స్వీకారము - అంగీకారము.

ఉపగతి - 1.ప్రాప్తి, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.అంగీకారము.
ఉపగమము -
1.అంగీకారము, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.ప్రాప్తి, 5.కలియుట.

శర్వరీదీపక శ్చంద్రః ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ స్సుపుత్రః కులదీపకః||
తా.
చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ బ్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును బ్రకాశింపఁ జేయును. - నీతిశాస్త్రము

పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
పండుగ - సంబరము, ఉత్సవము, సంక్రాంతి మొదలైనవి.
సంబరము -
సంభ్రము, వేగిరపాటు, సంతోషము, పండుగ, రూ.సంబ్రము, సం.సంభ్రమః.
సంభ్రమము - (గృహ.) 1.సంబరము, 2.వేగిరపాటు, 3.భయము, 4.ఆదరము.  
సమ్రంభము - 1.వేగిరపాటు, 2.ఆటోపము. దడబడ - ఆటోపము.
ఆటోపము - 1.వే గి ర పా టు, 2.గర్వము, 3.వ్యాపించుట.
సంభ్రమించు - వేగిరపడు; వేగిరపాటు - వేగపాటు.
సంతోషము - సంతసము, ముదము.  
పబ్బము - 1.పండుగ, ఉత్సవము, 2.అతిథ్యము, సం.స్వరమ్.   
ఉత్సవము - 1.ఊరేగింపు, 2.పండుగ, 3.కోపము, 4.గర్వము.
సంవేగము - సంభ్రమము, వేగిరపాటు, సం.(జీవ.) ప్రేరేపణ (Impulse).
సంవేగాత్మకము - (గృహ.) సులభముగా మనోవికారము పొందు నట్టిది, (Emotional).
సంవేదకనాడులు - (జం.) జ్ఞానేద్రియముల (చర్మము, నాలుక, కన్ను, ముక్కు, చెవి) నుండి కేంద్ర నాడీమండలమునకు ప్రేరణలు పంపు నాడులు, జ్ఞాననాడులు, (Sensory nerves).
జ్ఞానతంతువులు - (గృహ.) ఈనరముల తంతువులు జ్ఞానేద్రియముల నుండి మెదడునకు వార్తలను గొపోవును, (ఇవి చైతన్యము కలుగచేయును), (Sensory nerves).
జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీగ్రాహియైన అవయవము (Sensory organ).   

ఆతిథ్యము - ఆతిథేయము, విణ.అతిథికొరకైనది.
ఆతిధేయము - అతిథి సత్కారము, విణ.అతిథికి యోగ్యమైనది.

పర్వముల సతుల గలియకు,
ముర్వీశుల కరుణనమ్మి యుబ్బకు మదిలో
గర్వింప నాలి బెంచకు,
నిర్వాహము లేనిచోట నిలువకు సుమతీ.
తా||
ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య మొదలగు పర్వదినములందు(సతుల గలియకు……సతి - 1.పతివ్రత స్త్రీ, 2.పార్వతి.) స్త్రీలోలుడై తిరుగకుము, మనస్సులో రాజులయొక్క(ఉర్వీశుఁడు - రాజు, భూపతి)దయను నమ్మి సంతోషించకుము, అహంకారం పొందునట్లుగా భార్యను(ఆలి)పోషించకు, ఏస్థలము నందైనను తనకు (నిర్వాహము - 1.శక్తి, 2.జరుగుబాటు)లేని యెడల ((తన మాటకు విలువలేని యెడ)ఉండుట మంచిదికాదు.       

సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు -
1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ వచ్చెడి ఉండ.

గ్రంథి - 1.బుడిపి, గడ్డవలె పుట్టు రోగము, 2.చెట్టు మొ.ని ముడి, 3.కీలు (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
జీవకణ సంహతి - (వృక్ష.) జీవకణ సమూహము, (Tissue).
బుడిపి - 1.మ్రాని యందలి ముడి, కనుపు, 2.బొప్పి. బొప్పి - బుడిపి. 
కణుపు - 1.బుడిపి, 2.వెదురు, చెరకు మొ.ని కనుపు, 3.(వృక్ష.) కాండముపై ఆకు బయలుదేరిన స్థానము (Node).
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు. 
గంటు - 1.కనుపు, బుడిపి, 2.గాయము, 3.వెండ్రుకలముడి, 4.రూకలముడి, క్రి.గాయపరచు.
గాయము - కత్తి మొ.వానితాకున గలుగు దెబ్బనరకు, క్షతి.
క్షతి - 1.గాయము, 2.నాశము. ధ్వంసము - నాశము.
ముడి - 1.గ్రంథి 2.చెట్టు మొ.ని. ముడి, 3.దారము ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.
గ్రంథికుఁడు - 1.జోస్యుడు(కాలజ్ఞుఁడు - జ్యోస్యుడు.), 2.సహదేవుడు.
జ్యోతిషికుఁడు - జోస్యుడు, (Astrologer).   

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము -
గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు.

అనిత్యాని శరీరాని విభవో నైవశాశ్వతః|
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః||
తా.
శరీర మనిత్యము, సంపద శాశ్వతము కాదు, మృత్యువెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగిన దని సహదేవుఁడు వచించెను. - నీతిశాస్త్రము 

పర్వవేలా తరంగము - (భూగో.) అధికమైన పోటు, అమావాస్యనాడు పౌర్ణమినాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో నుండు నప్పుడు సూర్యచంద్రుల ఆకర్షణ శక్తిచే సముద్రపు నీటి మట్టములో గలిగిన అధికమైన పోటు.

ఆటుపోటు - 1.సముద్రతరంగములు ముందుకు వచ్చుటకు పోటనియు, వెనుకకు పోవుటకు ఆటనియు అందురు. (దుఃఖము తెరలు తెరలుగా వచ్చుటకును దీనిని వాడుదురు), 2.బాధ, 3.దుఃఖము.

ఆటు - 1.అడువు, దెబ్బ, 2.తగ్గుట.
పోటు  - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 3.పెద్ద అల.
పాటు - 1.కష్టము, 2.శ్రమము, 3.పడుట, 4.అలయడగుట, 5.అల హెచ్చగుట, సం.పత్, పాతమ్, (అర్థ,) శ్రమ, వాంఛించిన ఏ వస్తువు నైనను ఉత్పత్తిచేయుటకు చేయబడు యత్నము (Labour).

సముద్రపు పోటుపాటులు - (భూగో.) సూర్యచంద్రుల ఆకర్షణశక్తిచే సముద్ర మందలి నీటిమట్టము ప్రతిదినము రెండు సార్లు హెచ్చును, రెండు సార్లు తగ్గుట. (పాటు = సముద్రపు నీరు హెచ్చుట; పోటు = సముద్రపు నీరు తగ్గుట.)

పూర్ణిమ - పున్నమ, అఖండ చంద్రుడు గలది.
పున్నమ - పూర్ణిమ సం.పూర్ణిమా, ప్రా.పుణ్ణమా.

పార్ణమాసీ తు పూర్ణిమా :
మీయతే తిథిరనేన మాః చంద్రః పూర్ణశ్చాసౌ మాశ్చ పూర్ణిమాః, తస్యేయం పుర్ణమాసీ. ఇతనిచేత తిథి లెక్క పెట్టఁబడును గనుక మాః అనఁగా చంద్రుఁడు. అతఁ డిందు పూర్ణుడుగాఁ దోఁచును. పూర్ణోమాసో స్యామితావా, మాసము ఇందు పూర్ణమౌను. చంద్రస్య పూర్ణతయా నిర్వృత్తా పూర్ణిమా, చంద్రునియొక్క నిండుటచేత నిర్వృత్తమైనది. పూర్ణఃమాశ్చంద్రో స్యామితివా పూర్ణిమా, అఖండచంద్రుఁడు గలిగినది.

పూర్ణేందు బింబ వదనాం రత్నాభరణ భూషితాం,
వరదాభయ హస్తాభ్యాం ధ్యాయే చ్చంద్ర సహోదరీమ్.

పౌర్ణమి - సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని అర్థభాగము పై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.

రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము.  రాకాచంద్ర సమానన రామ్|
ఆగమనము -
1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
అవాప్తి - ప్రాప్తి, పొందుట. 
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది, వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి.   

నిశాకరుఁడు - చంద్రుడు; నిశాపతి - చంద్రుడు.
నిశ -
1.రేయి, 2.పసుపు.

పూర్ణే రాకా నిశాకరే :
తస్మిన్ పూర్ణే సతి సా రాకేత్యుచ్యతే శుద్ధేతిభావః - చంద్రుఁడు పూర్ణుఁడై యున్నపుడు ఆ పున్నమ రాక యనంబడును. అనఁగాఁ చతుర్దశి వేధ లేనిది. అసుమన్యంతే దేవాః పితృసహితా అస్యామిత్యనుమతిః. దీని యందు దేవతలు పితృసహితులై సేవకొఱకు తలఁపఁబడుదురు. రాతి దదాతి సుఖమితి రాకా. రా దానే - సుఖము నిచ్చునది. అన్ని కళలతో నిండిన చంద్రుఁడు గలది.  

నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.  
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు, మాషపరిమాణము.
చంద్రుడు - నెల, చందమామ. 
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుడు - చంద్రుడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.

నెలమేపరి - రాహువు.
రాహువు -
ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
కృష్ణవర్త్మ - 1.అగ్ని, 2.రాహుగ్రహము, విణ.దురాచారుడు.

పంచదశి - 1.అమవస, 2.పున్నమ.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.

పక్షాంత్తౌ పఞ్చదశ్చౌ ద్వే - పక్షయోః అంతౌ పక్షాంత్తౌ, శుక్ల కృష్ణపక్షములయొక్క తుదలు. పంచదశానాం తిథీనాం పూరణ్యౌ పంచదశ్యౌ, పంచదశ తిథులను నిండించునవి. పూర్ణిమకును అమావాస్యకును పేర్లు. 

నందివర్ధనము - 1.ఒక జాతి పూలచెట్టు, 2.అమావాస్య లేక పున్నమ.
నంద్యానర్తము - 1.పడమట తక్క, తక్కిన మూడు దిక్కుల వాకిళ్ళు గల రాజగృహము, 2.నందివర్ధన వృక్షము.

అపీతము - 1.త్రాగబడినది, 2.కొంచెము పసుపువన్నె కలది, వి.1.ఇంచుక పసుపువన్నె, 2.పద్మకేశరములు, 3.నందివృక్షము.

దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
అమావాస్య -
(భూగో.) చంద్రుడు తన మార్గములో సూర్యునికిని భూమికిని మధ్య వచ్చినపుడు చంద్రునిపై సూర్యుని వెలుగుపడిన భాగము కనిపించని దినము. కృష్ణపక్షమున కడపటిదినము, వికృ.అమవస, అమాస.
అమవస - చంద్రుడు ప్రకాశింపని దినము, రూ.అమాస సం.అమావాస్యా.

అమావాస్యా త్వమావస్యా దర్శ స్సూర్యేందు సంగమః :
అమాశబ్దస్సహార్థే అవ్యయం. అమా సహ తిష్ఠతః రవిచంద్రావస్యామిత్య మావాస్యా. అమావస్యా చ. వస నివాసే - దీనియందు సూర్యచంద్రులు కూడుకొనియుండురు.
దృశ్యేతే సూర్యచంద్రావత్రేతి దర్శః, దృశిర్ ప్రేక్షణే - దీనియందు సూర్య చంద్రులు కూడుకొని యగపడుదురు.
సూర్యేంద్వోః సంగమః మేళనమత్ర సూర్యేందుసంగమః - దీనియందు సూర్యచంద్రులకు సంగమము కలదు గనుక సూర్యేందు సంగమము.

అమావాస్యరోజు చెట్లు పూలు కాయలు, కోయరాదు తాకరాదు. సూర్యచంద్రులు అమావాస్యనాడు చెట్లకి అహారము, వెలుగు, ఇచ్చేరోజు.

అమావాస్య యనగా కృష్ణపక్షము. పంచదశి(పదునైదవ) కళయందు - ఎప్పుడు - సూర్యచంద్రులకు అత్యంత సంయోగము కులుగునో అప్పుడు అమావాస్య అగుచున్నది.

అమావాస్యనాడు చంద్రుడు కనిపించనంత మాత్రాన చంద్రుడు లేడనటం అజ్ఞానము. అయ్య రాక పోతే అమావాస్య ఉండిపోతుందా?

సా వష్టేందుకళా కుహూః :
కుహయతి విస్మాపయతి తమసేతి కుహూః - తమస్సుచేత నాశ్చర్యము ను గలుగఁ జేయునది. చంద్రకళ గానరాని యమావాస్య పేరు. రాకా కుహూ రమా వాస్యా పూర్ణిమాను మతీ ద్యుతిః.

(ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దృష్టి -
1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.

ఇక్కడ చూచి అక్కడ చూశామంటే ఆమడ పరుగెత్తుతుంది. - దృష్టి.

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు 2.గుడ్డివాడు 3.మంచి కన్నులు కలవాడు.

చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వినికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).

కన్నులు పెద్దవైన కనుపాపలు చిన్నగానే ఉంటాయి. కన్ను ఎరింగింప కున్నను కడుపు ఎరింగించును. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది.

దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దరిసెనము -
1.దర్శనము, 2.పెద్దల చూడకొనిపోవు కానుక, సం.దర్శనము.
దరిసించు - 1.దర్శించు, చూచు, 2.కానుక యిచ్చు.
ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
ఆదర్శము - 1.పరమోత్కృష్ట స్థితి, మేలు బంతి, 2.అద్దము, విణ. అనుసరింప దగినది. అద్దము పగులకొడితే, అసలు రూపం నశిస్తుంది.

నయనము - 1.కన్ను, 2.పొందించుట.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు -
ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.

కంటికి చూడడం లక్షణం. దానికి అంతే తెలుసు. చూసేవి చెప్పలేవు. చెప్పే లక్షణం నోటిది. చూడడం చేత కానిది. చెప్పేది చూడలేదు. చూసేది చెప్పేది కాదు, చెప్పేది చూసేది కాదు.

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణంతరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము

ఇద్దరు వ్యక్తులు అదే కటకటాల వెనుక నుంచి చూస్తారు. ఒకరికి బురద కనిపిస్తే, మరొకరికి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. - యప్. లాంగ్ బ్రిడ్జ్

అసలు - 1.బురద, (వాణి) అప్పుగా తీసుకొని న సొమ్ము(principal)
వండ - 1.ఆపద, 2.చెరువులోనగు వాని యడుగున నుండెడి యెండిన బురద. రొచ్చు - 1.అడుసు, 2.మాలిన్యము, 3.అపవాదము.

సినీవాలి - 1.చంద్రకళ కానవచ్చెడి అమావాస్య, 2.పార్వతి(శివుని సన్నిధి నందు దేవిస్థానం పార్వతి). సినీవాలీ శివావశ్యా వైశ్వదేవీ పిశంగిలా.

సా దృష్టేంధు స్సినీవాలీ :
అః విష్ణుః తేన సహవర్తత ఇతి సా లక్ష్మీః సా అస్యామితి సినీ చంద్రకళా సా బాలా అస్యామితి సినీవాలి. అ  అనఁగా విష్ణువు. అతనితోఁగూడినది గనుక సా అనఁగా లక్ష్మి. ఆలక్ష్మి గలది గనుక సిని అనఁగా జంద్రకళ. ఆ చంద్రకళ దీనియందు లేఁతదైయుండును గనుక సినీవాలి. వబయోరభేదః. చంద్రకళతోఁ గూడిన యమావాస్య పేరు.

చంద్రుడు అమావాస్య నుండి ఎదుగుతూ పూర్ణిమనాడు పరిపూర్ణుడు అవుతాడు. అక్కణ్ణుంచి కృష్ణపక్షంలో తరగడం ప్రారంభిస్తాడు. చల్లని వెన్నెలనిచ్చే చంద్రుడు క్షీణిస్తుంటాడు. అమావాస్యనాడు లోపిస్తాడు. అదే పునరావృతం అవుతూ ఉంటుంది.

ఉ|| సంతత పుణ్యశాలి కొకజాడను సంపద వాసిపోవ తా
నంతటఁబోక నెట్టుకొని అప్పటి యట్ల వసించుచుండు మా
సాంతము ననదుఁజందురుని పన్నికళల్ వెడబాసిపోయినన్
గాంతి వహింపడెట్లు, తిరుగంబడి దేహమునిండ, భాస్కరా.
తా.
చంద్రుడ(అ)మావాస్య యగు నప్పటికి, తన కళలన్నియు పోయి తిరిగి మరల సంపూర్ణ చంద్రుడై వెలుగొందును. అట్లే, పుణ్యాత్ముని(సుకృతుని) కొకప్పుడు లేమి గలిగినను వెంటనే తిరిగి సంపదలు కల్గును.

రాహువు, కేతువుల గ్రహబాధల వల్ల సూర్యచంద్రునికి గ్రహణాలు వున్నాయి. చంద్రునికి వృద్ధిక్షయాలు వున్నాయి.

చంద్రుడు వృద్ధిపొందే పక్షమునందలి కళలచే దేవతలకు, క్షీణ కళలచే పితృదేవతలకు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. చంద్రుఁడు వృద్ధిక్షయాలకు చలించని తత్త్వాన్ని బోధించాడు.

3.Moon

Wednesday, January 25, 2012

షట్చక్రాలు

వినాయకుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, బృహస్పతి, ఇంద్రుడు ఈ ఆరుగురు మూలాధారము మొదలు ఆరు చక్రములుకు అధిస్థాన దేవతలు.

ఓం షడద్వాతీత రూపిణ్యై నమః : వర్ణ, పద, మంత్ర భువన తత్వ, కళాత్మ, లారూ షడధ్వ లనబడుతాయి. ఈ షట్కాతీత స్వరూపిణియై తేజరిల్లు మాతకు వందనాలు.

నీవే మన – ఆకాశ – వాయు(ప్రాణమున) – అగ్ని(ముఖము) – జల – భూ(భూమి) తత్త్వములుగ నగుచున్నావు. 

మహాపద్మావటీసంస్థా - కదంబవనవాసినీ|
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ. - 23శ్లో

వందలు - పద్మము - పరము.
వేలు - మహాపద్మము - పరార్ధము.

మహాంశ్చాసౌ పద్మశ్చ మహాపద్మః - గొప్పదైన పద్మము.

తటిల్లేఖా తన్వీం - తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణా మ - ప్యుపరి కమలానాం తవ కలామ్,
మహాపద్మాటవ్యాం - మృదిత మలమాయేన మనసా
మహాన్తః పశ్యంతో - దధతి పరమాహ్లాద లహరీమ్. - 21శ్లో
  
తా. తల్లీ! భగవతీ! మెఱపు తీగవంటి శరీరము గలిగియు, సూక్ష్మమై దీర్ఘమై అజ్ఞాది ద్వాదశాంతమువరకు క్షణ విలసనము కలదియు, సూర్య చంద్రాగ్ని(కళారూపము) ప్రభసమానమైనది, షట్చ్రాకాలలో ఉపరిదైనది యైన సహస్రార మహాపద్మాటవిలో కూర్చున్న నీ సదాఖ్య (శివ శక్తుల సాయుజ్యం; ప్రకృతి పురుషుల కలయిక) కళను  మహాత్ములు, పరిపక్వ చిత్తులు మూల(అరిషడ్వర్గముల)మాయ తొలగిన మనసు(చిత్తము)తో పరమహ్లాద లహరిగా అనుభూతి నొందుతున్నారు. అంటె నిరతిశయా నందాన్ని సదా పొందుతున్నారని భావం. - సౌందర్యలహరి

ఓం షట్చక్రో పరిస్థితాయై నమః : మూలాధార, స్వాధిస్థాన, మణిపూర, అన్నహత, విశుద్ధ, ఆజ్ఞా - నామ కాలైన షట్చక్రాలకూ ఉపరి భాగంలో - సహస్రార పద్మంలో భాసిల్లు నట్టి శ్రీదేవికి వందనాలు.

ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః : షట్చక్రాలు లేదా అసంఖ్యాక సహస్రనాడులే మహాపద్మాలన బడుతాయి! అగణితనాడీ నిలయమైన దేవరూప పద్మారణ్యంలో వసించు మాతకు ప్రణామాలు. పద్మాలతో పోల్చబడు కాళ్ళు, చేతులు, కన్నులు షట్చక్రములు.

తటిల్లతా సమరుచి - షట్చక్రోపరిసంస్థితా |
మహాసక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ. - 40శ్లో

1. చతుర్దళమును హేమవర్ణమునగు మూలాధార చక్రమునందు - గణపతి కలడు. (భూతత్త్వమును)  

అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య,  2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము.
ఋః - అదితి, ఋ అనఁగా అదితిదేవి. అదితి దేవజనని, ప్రకృతి కళ నుండి పుట్టిన స్త్రీ.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 2.సూర్యమండలాంతర్గత విష్ణువు. ఆదితేరపత్యం ఆదిత్యః - అదితి కొడుకు. సూర్యుడు అదితి పుత్రుఁడు, ఆదిత్యుఁడు. ద్వాదశాదిత్యులు క్షత్రియులు.

ఆదిత్యాః - ఆదిత్యులు పన్నిదరు - ఇంద్రుఁడు, ధాత, పర్జన్యుఁడు, త్వష్ట, పూష, అర్యముఁడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుఁడు అనువారలు.

అదితి కశ్యపులకు విష్ణువు వామనుడై(వామనావతారము) శ్రవణానక్షత్రములో బుట్టెను. పుట్టగానే జ్ఞానవంతు డయ్యెను. 

శ్రీరంజితా మహాకాయా సోమసూర్యగ్నిలోచనా,
అదితి ర్దేవమాతా చ అష్టపుత్రా ష్టయోగినీ. - 63శ్లో

పార్వతి - 1.గౌరి (పర్వతపుత్తి), 2.ద్రౌపది.
గౌరి -
1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. గణనాయిక - గౌరి, పార్వతి.
ద్రొవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్త్రిక), 2.బొమ్మ.
బొమ్మ - 1.కనుబొమ, 2.బిరుద చిహ్నము, 3.అవమానచిహ్నము, 4.ప్రతిమ, 5.బ్రహ్మ, విణ.అల్పము, సం.1.భూ, 2.ప్రతిమా, 3.బ్రహ్మ.
బొమ - 1.కనుబొమ, 2.ప్రతిమ, రూ.బొమ్మ. భూణ - కనుబొమ్మ. ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలనము, వి. (భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).

ఆభాసము - 1.కాంతి, 2.ప్రతిబింబము, 3.వాస్తవము కాకపోయినను పైకి వాస్తవమైన దానివలె కనించునది, ఉదా.హేత్వాభాసము, రసాభాసము మొ.

బొమ్మచుక్క - కానరానిచుక్క, అభిజిన్నక్షత్రము.
కానరానిచుక్క -
అభిజిత్ నక్షత్రము.
అభిజిత్తు - 1.పగలు పదునాల్గు గడియలపై నుండు గడియల కాలము, 2.ఒక నక్షత్రము.
 
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుఁడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.  

కాశ్యపి - భూమి, వ్యు.పరశురామునిచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నియ్యఁ బడినది.  
జీవులకు ఆధారం భూమి. అందుకే ఆమెను తల్లితో పోలుస్తారు. భూమిపై తిరిగే మానవులకేకాక పశుపక్ష్యాదులకు, చెట్టుచేమలకు, రాయిరప్పలకూ కూడా ఆమె తల్లే!

భూమి - నేల, చోటు(తావు), పృథ్వి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి 2.ప్రదేశము 3.దేశము.
పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది. 

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథివీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించింది.
నేలచూఁలి - సీత, భూపుత్రి. చిత్రకూటము నందు దేవీస్థానం సీత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ. 

కానుపు - 1.వీక్షణము, 2.ప్రసూతి, రూ.కాన్పు.
వీక్షణము -
అవలోకము, ఈక్షణము.
అవలోకనము - 1.చూపు, 2.చూచుట, 3.కన్ను, 4.విచారణ.
ఈక్షణము - 1.కన్ను, 2.చూపు, 3.వీక్షణము.
ఈక్షితము - 1.చూడబడినది, 2.ఆలోచించబడినది, వి.చూపు, దృష్టి.
ప్రసూతి - కానుపు, పుట్టుక. జనువు - పుట్టుక. 

మహీరుహము - వృక్షము; భూజము - వృక్షము.
వృక్షము -
చెట్టు, సం.(వృక్షః) చాలా ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree). 
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము - 1.గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలేనిచెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలిఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి.(జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen).
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము = సేన-అందుండు వాడు.)
సైనికుఁడు - సేనాపతి, విణ.సేనలోనివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
మహాసేనుఁడు - కుమారస్వామి.  

శ్లో. మహీం మూలాధరే - కమపి మణిపూరే హుతవహం
     స్థితం స్వాధిష్ఠానే - హృది మరుత మరుత మాకాశ ముపరి
     మనోపి భ్రూమధే - సకల మపి భిత్త్వా కులపధం
     సహస్రారే పద్మే - సహ రహసి పత్వా విహరసే. - 9శ్లో
తా.
ఓ పరాశక్తీ! మూలాధార చక్రమందు భూతత్త్వమును, స్వాధిష్ఠాన చక్రమందు అగ్నితత్త్వమును, మణిపూర చక్రమందు జల తత్త్వమును, అనాహత చక్రమందు వాయు తత్త్వమును, దానిపై నున్న విశుద్ధ చక్రమం దా(ఆ)కాశ తత్త్వమును, ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రార పద్మమందు ఏకాంతమున, భర్తతో విహరించుచున్నవు. – సౌందర్యలహరి

విశేషము:- లింగ స్థానమందు(స్త్రీ పురుష భేదము) స్వాధిస్థాన చక్రము, నాభియందు మణిపూర చక్రము, హృదయమందు అనాహత చక్రము, అనాహత చక్రమునకు పై భాగమున విశుద్ధ చక్రము, భ్రూ మధ్యమందు ఆగ్నేయ చక్రము నున్నదని యెఱునునది.

దేహస్థషట్చక్రదేవీ దహరాకాశమధ్యగః,
యోగినీగుణసంసేవ్యా భృంగ్యాదిప్రమథావృతః.

గణపతి - వినాయకుడు.
పుష్ఠి :
గణపతి అర్థాంగి. (పుష్టి - 1.బలుపు, సమృద్ధి.)ఆమె లేకపోతే సృష్టిలో స్త్రీ పురుషులకు పుష్టినహి. దారువనమునందు దేవి పుష్టిరూపిణి. వెనకయ్య - వినాయకుడు, సం.వినాయకః.

గాణాపత్యము - ఒక మతము (గణపతియే ముఖ్య దైవమని విశ్వసించు మతము).

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
బుద్ధుఁడు -
1.ఒక గ్రహము, (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుక గలవాడు.
వేలుపు - దేవత(దేవత - వేలుపు), దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.

వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
నీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుత్యస్య స్వతంత్ర త్వాత్ - స్వతంత్రుఁ డౌటవలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.

వినాయకో విఘ్నరాజ ద్వైమాతుర గణాధిపాః,
అప్యేకదన్త హేరమ్బ లంబోదర గజాననాః.

విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
ద్వైమాతురుఁడు - 1.వినాయకుడు, 2.జరాసంధుడు, వ్యు.ఇద్దరు తల్లులు గలవాడు.
ద్వయో ర్మాత్రో రుమాగంగాయో రపత్యం ద్వైమాతురః - గంగా పార్వతులకు నిద్దఱికినిఁ గుమారుడు. 
గణానాం ప్రమథాదీనామధిపో గణాధిపః - ప్రమథాధిగణములకు నాయకుఁడు.
ఏకదంతుఁడు - వినాయకుడు.
కార్తికేయోత్పాటితైక దంతత్వా దేకో దంతో యస్య స ఏకదంతః - కుమారస్వామిచే నొకదంతము పెఱికివేయఁబడెను గనుక నేకదంతుడు.
హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.
హేరుద్ర సమిపే రంబతే తిష్ఠతీతి హేరంబః - రుద్రునియొద్ద నుండువాఁడు. ఋ గతౌ. హేరతే వర్థయతి భక్తానితివా - భక్తుల వృద్ధిబొందించువాఁడు. హేవృద్ధౌ.
లంబోదరుఁడు - వినాయకుడు.
బొజ్జదేవర -
వినాయకుడు. (బొజ్జ(ౙ)- కడుపు)
లంబ ముదరం యస్య సః లంబోదరః - వ్రేలెడి బొజ్జగలవాడు.
గజవదనుడు - వినాయకుడు.
ఏనుఁగు మోముసామి -
గజానునుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజస్యేవ ఆననం యస్య సః గజాననః - ఏనుఁగు మొగము వంటి మొగముగలవాడు. ఈ ఎనిమిది  వినాయకుని పేర్లు.

ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.

తవాధారే మూలే - సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే - నవరస మాహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా - ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే - జనక జననీమజ్జగదిదమ్ || - 41శ్లో
తా. ఓ తల్లీ! నీయొక్క మూలాధార చక్రమునందు లాస్యరూపమైన నృత్యమునందు మిక్కిలి ఆసక్తురాలై సమయ అను పేరు గలదైన(చంద్రకళతో కూడిన) ఆనందభైరవి(భైరవి - 1.పార్వతి, 2.ఒకానొక రాగము)యను శక్తితో గూడి, నవరసములతో నొప్పు తాండవ నృత్యమును నటించు నటుడైన వానిని నవాత్ముడైన ఆనంద భైరవునిగా తలచెదను. ఏలననగా పుట్టుక నుద్దేశించి (దగ్దమైన లోకమును మరల పుట్టింపవలెనని దయచేత కూడియున్న ఆనందభైరవీ భైరవులను ఈ జగత్తు తల్లిదండ్రులుగ దలంచుచున్నాను.) - సౌందర్యలహరి

పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ గణపతి చేయుట, ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిషరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. గడ్డితో తృప్తిపడే దైవం వినాయకుడు.

మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ|
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదినీ. - 38శ్లో

మూలాధార పద్మానికి గల నాలుగు రేఖలయందు వరుసగా వ, శ, ష, స అనే అక్షరాలు ఉంటాయి. సుషుమ్నను అనుసరించి మూలాధార స్వాధిష్ఠాన మణిపూర కాలయందు ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనే శక్తిత్రయం వుంటుంది.

ఓం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి స్వరూపిణ్యై నమః : శక్తిత్రయ స్వరూపిణికి వందనాలు.

ఓం మూలాధారైకనిలయాయై నమః : మూలాధారపద్మంలో నాలుగుదశలుంటాయి. మూలాధార పద్మానికి గల నాలుగు రేఖలయందు వరుసగా వ, శ, ష, స, అనే అక్షరాలు ఉంటాయి. ఆ పద్మకర్ణికా మధ్యదేశంలో సర్వనిద్రాణస్థితిలో కుండలినీ శక్తిరూపాదేవి ఉంది. ఆ స్థానంలో ఏకాకిగా ఉండునట్టి శక్తి స్వరూపిణికి ప్రణామాలు.

ఊష్మధ్వనులు(శ, ష, స, హ) శీతల ప్రదము స వర్ణము, శీతకిరణః - స తేజో యుతమము హ వర్ణము, సూర్య జ్ఞాపకమగు హ వర్ణము. శివుడనగా హ కారము. ఆకాశబీజము హ కారము, హ కారం స్థూలదేహం. రవిః - హ, సూర్యుడు హకారాధిపతి. సహ – భూమి.  

మూలాధారే హకారం చ హృదయే చ రకారకం |
భ్రూమధ్యే తద్వదీకారం హ్రీంకారం మస్తకే న్యసేత్ ||

వసుధ - భూమి వ్యు. వసువును(బంగారమును) ధరించునది. వసు అనే ధాతువును కప్పి పుచ్చడం లేదా రహస్యంగా ఉంచడమని అర్థం. 
వసువు -
బంగారు, ధనము, రత్నము.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పైడిచూలాలు - వసుంధర, భూమి. వసుంధర - భూమి.
పైఁడిఱేఁడు - కుబేరుడు; ; పైడినెలత - లక్ష్మి. నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వాడూర్యము.)
రత్నగర్భ - భూమి.
రత్నగర్భుఁడు - 1.సముద్రుడు, 2.కుబేరుడు. 

వసుంధర(భూమి) సర్వాధార, సర్వసంపద్ధాత్రీ, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యమాన. "పృథివీ హేషా నిధిః" అన్నది వేదం. భూమి వసుంధర, వసువు అంటే బంగారం, రత్నం, ధనం, కిరణం, అగ్ని ఇవన్నీ భూమిలో ఉన్నాయి.

స్త్రీయోరత్నాస్తధావిద్యా ధర్మశ్శౌచం సుభాషితం|
వివిధానిచ శిల్పాని సమాధేయాని సర్వతః||
తా.
సద్గుణవంతులైన వనితలు, రత్నములు, విద్య, ధర్మము, పరిశుద్ధము, సద్వాక్యము, నానావిధములయిన శిల్పము లివి యెచ్చట నున్నను గ్రహింపవలయును. - నీతిశాస్త్రము  

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శ్శిల్పాది కర్మచ|
వేదాః శ్శస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్||

వసువులు - గణాధి దేవతలు, అష్టవసువులు. వసువులు అగ్నికధిస్ఠాన దేవతలు. The eight vasus, వసిష్టుని శాపానికి మానవులై పుట్టవలసి వచ్చినది.

ధన మగ్ని ర్థనం వాయుః ధనం సూర్యో ధనం వసుః |
ధన మింద్రో బృహస్పతి ర్వరుణో ధన మశ్నుతే ||

వసవః, ఉ-పు. ఆహత్య వసంతీతి వసవః - కూడుకొని యుండువారు. వస నివాసే వారలెనమండ్రు(ఎనిమిది మంది). ఆపుఁడు, ధ్రువుఁడు, సోముఁడు, అధ్వరుఁడు, అనిలుఁడు, ప్రత్యూషుఁడు, అనలుఁడు, ప్రభాసుఁడు అనువారలు. 

1. అవుఁడు - క్రింది పెదవి, అధరము, పల్లు, దంతము, ఔడు.
అదరము1 - క్రిందిపెదవి, సం.అధరః
అదరము2 - 1.భయము లేనిది, 2.లోతులేనిది.
అధరము - క్రిందిపెదవి విణ.1.తక్కువైంది 2.క్రిందిది 3.నీచము.    ఔడు - పెదవి క్రింద చోటు, సం.ఓష్ఠః.
దంతము - పల్లు, కోర.   రదనము - దంతము.
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
' సి ' విటమిన్ - (గృహ.) Vitamin ‘ C’ 1.పళ్ళచిగుళ్ళ బలహీనతను తొలగించు విటమిన్, 2.శరీర కణజాలముల బంధనమునకు తోడ్పడు విటమిన్.
పయోరియా - (గృహ.) పంటిచిగురు రోగము, ఒక విధమైన పండ్ల వ్యాధి, పన్నుకుదురులలో నుండి చీమురక్తము స్రవించువ్యాధి,(Pyorrhoea). స్కర్వీ (సీతాదము) - (గృహ.) (Scurvy)  'సి' విటమిన్ Vitamin C, లోపము వలన కలుగువ్యాధి. చిగుళ్ళవాపు, పండ్ల నుండి రక్తము కారుట, (ఈ వ్యాధి ఖటిక (Calcium) లోపము వలన కూడ కలుగవచ్చును.  
2. ధ్రువుఁడు - ఉత్తర దిక్కులోనుండు నక్షత్రము,1.ఉత్తానపాదుని కొడుకు 2.విష్ణువు 3.శివుడు(విష్ణు భక్తుడు).
3. సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
4. అధ్వరుఁడు - అధర్వా వై ప్రజాపతిః యాగము నందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, అధ్వర్యువు.  అధ్వర్యము - 1.హింసా రహితము 2.సావధానము,  విణ. 1యజ్ఞము 2.సామయాగము 3.ఆకాశము. (ఆకాశము కంటే ఉన్నతమైనవాడు కన్నతండ్రి).
5. అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.      అనిలము - గాలి దేహము నందలి వాతధాతువు, వాతరోగము.    అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.   
6. ప్రత్యుషుఁడు - వేగుజాము, ప్రభాతము.
7. అనలుఁడు - 1.అగ్నిదేవుడు 2.అష్టవసువులలో ఒకడు.
8. ప్రభాసుఁడు - Source, ప్రతాపము, తేజము, చర్మము యొక్క పైపొర Epidermis.
ప్రభాసిని - (జం.) చర్మము యొక్క పైపొర (Epidermis).
జవ్వు - 1.దుర్మద జలము, 2.చర్మము లోపలిపొర(Epidermis) 3.సొగసు, అందము. 

అష్టవసువులలో అష్టమ వసువు భీష్ముడు. వసువు అంశతో భీష్ముడు గంగకి(గంగానది) పుట్టాడు. భీష్ముఁడు పితృభక్తి పరాయణుడు, రాజకీయ విద్యావిశారదుడు, ఇచ్ఛా మరణము పొందినవాడు. 

ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.

జితేంద్రియుడు - ఇంద్రియములను జయించినవాడు. కామ క్రోధాలకు లొంగనివాడే జితేంద్రియుడు. జితేంద్రియులకు తప్ప సామాన్యులకు శాంతి కలుగదు. జితేంద్రియుడగు యోగి కర్మ ఫలములయం దపేక్షను వదలి శాశ్వతముగు ఆత్మశాంతి పొందును.
అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగువాడు, విష్ణువు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
భీష్ముఁడు -
1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.

పరసతుల గోష్టినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
గరిత సుశీలయైనను,
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ.
తా||
బ్రహ్మచారియైన భీష్మునంతటి వాడైనను ఇతర స్త్రీలతో సరస సంభాషణలు జరిపినచో లోకం అట్టి వానిని అనుమానించును. అట్లే యెంతటి(గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.)సుశీలయైన స్త్రీ అయినను అన్యపురుషుల పోషణలోవున్న నిందల పాలగును.        

భ్రాజిష్టు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||

హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ. హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ. హిరణ్యరేతుడు. హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ, హిరణ్మయాండ సంభవుడు కనుక హిరణ్యగర్భుడు. ప్రజాపతిర్వై హిరణ్య గర్భః. 

ఆరయనెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చి సుపకారి మనుష్యుడు లేక మేలుచే
కూఱ దదెట్లు? హత్తుగడగూడనె చూడఁబదారువన్నె బం
గారములో నైన వెలిగారము గూడకయున్న, భాస్కరా.
తా.
భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏవో నొక భూషణముగా, అనగా ఉపయోగ కరమగు వస్తువుగా తయారు కాదు అట్లే ఎంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తి లేక అతని గొప్పతనము రాణింపదు.  

ప్రజాపతి రగ్నిః - అగ్ని  వాయువుల కూడిక నలన భూమి ఆవిర్బవించినది. సత్యం, విశాలజలం, దీక్ష, ఉగ్ర తప్పస్సు, బ్రహ్మ, యజ్ఞం ఇవి భూమిని ధరిస్తున్నాయి. 

భూమి నుండి అన్నం(అన్నం వై ప్రజాపతిః) - అన్నం నుంచి రక్తం - రక్తం నుంచి రేతస్సు - రేతస్సు నుండి సంతానం.

మూలము -1.వేరు(root), ఊడ మఱ్ఱి, (ఊఢ- పెండ్లియైన స్త్రీ, భార్య). వేరు - చెట్టు యొక్క మూలము.
ఊడ - మఱ్ఱి మొ. వాని కొమ్మల నుండి క్రిందికి దిగెడివెరు శిఫ. (ఈ యూడల వేళ్ళవలననే చెట్టున కాహార మందును).
శిఫ - ఊడ, పడుగొమ్మ.

వేద మూల విందం జ్ఞానం, భార్యామూలమిందం గృహమ్|
కృషిమూల విందం ధాన్యం, ధనమూల మిదంజగత్||
తా.
జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు భార్యయేమూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. – నీతిశాస్త్రము

ఆధారము - 1.ఆదరవు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, 4.(యోగ.) మూలాధార చక్రము. 
అధిష్ఠానము - 1.దగ్గర నుండుట, 2.వసించుట, 3.ఉనికి పట్టు, 4.ఆధారము, 5.చక్రము, 6.ప్రాభవము(ప్రాభవము - ప్రభుత్వము), ఏలుబడి, 7.ఒకానొక పట్టణము.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.
అధిపానదేవత - అధిదేవత.

ఆనిక - 1.ఆశ్రయము, ఆధారము, ప్రాపు, 2.దార్ఢ్యము, 3.పానము, రూ.అనువు.
ప్రాపు -
ఆశ్రయము, సం.ప్రావణమ్ ప్రాపః.
ఆశ్రయము - 1.ఇల్లు, 2.ఆధారము, 3.శత్రువులచే పీడింపబడుచు వారి నాశ్రయించి యుండుట, సంశ్రయము, 4.ప్రాపు, 5.శరణాలయము.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
సంశ్రయము - ఆశ్రయము. 
కుదురు - 1.అనుకూలమగు, 2.స్వస్థమగు, వి.1.పాదు, 2.నెమ్మది, 3.అగసాలె వానికుంపటి, 4.స్థానము, 5.ఆధారము, 6.చుట్టకుదురు.  
పాదు - 1.కుదురు, ఆలవాలము, 2.నిలకడ, 3.ఆశ్రయము, సం.పాదః, పదమ్. 
ఆలవాలము - పాదు. గడ్డిబొద్దు - చుట్టకుదురు.
నిలకడ - 1.ఉనికి, 2.స్థైర్యము(స్థిరత్వము), 3.విరామము, వి.(గణి. భౌతి.) నిశ్చలముగా నుండుట (Rest).
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position). 
స్థితి - 1.ఉనికి, 2.కూర్చుండుట, 3.నిలకడ, 4.మేర, సం.వి. (రసా.) 1.అవస్థ (Phase), 2.ఘన, ద్రవ, వాయు, ద్రవ్యావస్థలలో నొకటి, 1.ఒక వస్తువు యొక్క ఉనికి, రీతి (State), 2.అది ఆక్రమించిన స్థానము, (భౌతి.) ఏ వస్తువు అయినను ఉన్న విధము, అవస్థ (Mode of existence). నిలక - నిలుపు, నిలకడ, స్థితి. 
విరామము - 1.విశ్రాంతి, 2.యతిస్థానము.  

ఉపాధి - 1.ధర్మచింత, 2.కపటము, 3.కుటుంబమున మిక్కిలి ఆసక్తిగలవాడు, 4.విశేషణము, 5.ఆధారము. 

శ్లో. క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే 
    హుతాశే ద్వాషష్షి – శ్చతురధిక పంచాశ దనిలే, 
    దివి ద్వాష్షిట్త్రింశ - న్మనసి చ చతుష్షష్టి రితి యే
    మయూఖా స్తేషామ - ప్యుపరి తవ పాదాంబుజయుగమ్. 14శ్లో
తా.
భూతత్త్వమందు ఏబదియాఱును, జల తత్త్వమునందు ఏబది రెండును, అగ్ని తత్త్వమందు ఎబదినాలుగును, ఆకాశ తత్త్వమందు డెబ్బదిరెండును, మనస్వత్త్వమందు అరువదినాలుగును, ని ఈ రీతిగా ఏ కాంతు లుండునో వానికి పై భాగమున నీ పాదపద్మయుగ మున్నది. (9వ దానిలో చక్రనియమము కలదు.) - సౌందర్యలహరి  

అంఘ్రి - 1.కాలు, 2.వేరు, 3.పద్యపాదము.
కాలు -
1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపుకోడు, క్రి.మండు.
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4 వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములో అక్షద్వయముచే వేరు చేయబడిన నాలుగుభాగములలో ఒకటి (Quadrant).
వేరు - చెట్టు యొక్క మూలము.

పాదా రశ్మ్యఙ్ఘ్రి తుర్యాంశాః -
పాదశబ్దము కిరణమునకును, కాలికి, నాలవపాలికిని పేరు. పద్యంతే అనేనేతి పాదః పద గతౌ. - దీనిచేత పొందుదురు. "పాదస్స్యాద్బుధ్న పూజ్యయో" రితిశేషః.

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.

ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3మంచపుకోడు.
గొరిజ - పశువు కాలిగిట్ట, సం.ఖురః.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.

పారీణుఁడు - పాదము ముట్టినవాడు, మిక్కిలి నేర్పరి.

అంఘ్రిపము - చెట్టు, పాదపము.
పాదపము - చెట్టు.

అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ బీడించి, ప్రాణంబు బిగియఁబట్టి,
నాభితలముఁజేర్చి, నయముతో మెల్లన హృత్సరోజము మీఁది కెగయఁబట్టి,
యటమీఁద నురమందు హత్తించి, క్రమ్మఱఁ దాలు మూలమునకుఁ దఱిమి నిలిపి
మమతతో భ్రూయుగమధ్యంబు సేర్చి, దృ క్కర్ణనాసాస్య మార్గములు మూసి.
  
ఆ|| యిచ్చలేని యోగి యెలమి ముహూరార్ధ,
      మింద్రి యానుషంగ మింత లేక
      ప్రాణములను వంచి బ్రహ్మ రంధ్రము చంచి,
      బ్రహ్మందుఁ గలయుఁ బౌరవేంద్ర !

భా|| రాజా(పరీక్షిన్మహారాజా) ! యోగి తన దేహత్యాగ సమయంలో బడలిక త్రోసిపుచ్చి, పాదమూలంతో మూలాధారచక్రాన్ని అనగా గుదస్థానము అదిమి పట్టి, ఆ పై ప్రాణవాయువును అనగా ప్రాణశక్తిని (పొత్తి కడుపు) బిగబట్టి తరువాత బొడ్డువద్ద ఉన్న మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయంలోని అనాహతచక్రానికి (గుండె) అందుండి వక్షంలో ఉన్న విశుద్ధ చక్రానికీ, (కంఠం) అటనుండి ఆ చక్రాగ్రముండే తాలుమూలానికీ, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మల మధ్య నున్న అజ్ఞా చక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కండ్లు, చెవులు, ముక్కు, నోరు - ఇవి మూసుకొని ఏ కోరికలు లేనివాడై అర్థ ముహూర్తకాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రం (సహస్రారము) లనే ఆరుస్థానముల (చక్రముల) గుండా భేధించుకొని పరబ్రహ్మంలో లీనమవుతాడు. - శుకుడు, భాగవతము     

మూలమాధార షట్కస్య మూలాధారం తతో విదుః |
స్వశబ్దేన పరం లింగం స్వాధిష్ఠానం తతో విదుః ||

2. షడ్దళమును విద్రుమాకారమునగు స్వాధిష్ఠాన చక్రమందు - బ్రహ్మ కలడు. (అగ్నితత్త్వమును)

ముక్తా విద్రుమ హేమ నీల
ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణైః,
యుక్తా మిందు నిబద్ధ రత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్|

విద్రుమము - పగడము, పగడపు చెట్టు Coral.
పగడము -
ప్రవాళము, పవడము, సం.ప్రవాళః.
ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణాదండము.
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.

అథ విద్రుమః పుంసి ప్రవాళం పుంసపుంసకమ్ :
విశిష్టో ద్రుమో విద్రుమః - విశేషమైన చెట్టు.
ప్రకృష్టం వలతే ప్రవాళం. అ. ప్న. వల సంచలనే - లతారూపమై యుండునప్పుడు  ప్రకృష్టముగా చలించునది. ఈ రెండు పగడము పేర్లు.

అబ్దిపల్లవము - పగడము.

ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణా దండము. చిగురాకు రంగు (ప్రవాళ పద్మపత్రాభం).
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.

ఒళగు - 1.మర్మము, 2.లోకువ, 3.వీణాదండము, రూ.ఒళవు.
ఒళవు -
ఒళగు. నెఱకు - మర్మము, జీవస్థానము, రూ.నెరసు.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు.
లోఁకువ - అధీనము, తక్కువ. లోఁబడు - క్రి.అధీనమగు.
లొక్కు - (వ్యావ.) లోకువ.
లొజ్జు - తక్కువ, విణ.న్యూనము. న్యూనము - తక్కువైనది. 
లొచ్చు - తక్కువ, విణ.న్యూనము.
నెళవు - 1.పరిచయము, 2.మర్మము, రూ.నెలవు.
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము. 
నెళవరి - 1.పరిచయము కలవాడు, 2.మర్మజ్ఞుడు. ఒళవరి - మర్మజ్ఞుడు. 

మంజరి - 1.చివురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.

ప్రవాళ మఙ్కురే ప్యస్త్రీ :
ప్రవాళ శబ్దము చిగురునకును, అపిశబ్దము వలన పవడమునకును, వీణా దండమునకును పేరు. ప్రవలత ఇతి ప్రవాళం. ప్న. వల సంచలనే. - కదలునది. టీ. స. అంకురోహ త్ర నవకిసలయః. 

హ్రీంకార శుక్తికా ముక్తామణిర్హీంకార బోధితా,
హ్రీంకారమయ సౌవర్ణస్తమ్భ విద్రుమపుత్రికా. - 57శ్లో 

పగడపు రిక్క - ఆర్ద్రా నక్షత్రము.
మెఱుఁగురిక్క -
1.ప్రవాళము, 2.కాంతిగల చుక్క.
మెఱుఁగు - 1.కాంతి, వెలుతురు Light, 2.కిరణము, 3.బంగారు, వెండి మొ.నగలకు పెట్టు తళుకు, 4.పొగరింపు (ఉబ్బుట).
మెఱుఁగుబోఁడి - (మెఱుఁగు + పోఁడి) మెరుపువలె మనోజ్ఞురాలగు స్త్రీ.

కాంతి1 - 1.కోరిక 2.(అలం) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది(Light). కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదనము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

ధర్ముని పత్ని కాంతి. ఆమె లేకపోతే లోకాలు ఆధార శూన్యములై చెడిపోతాయి. దీపము దానము చేయువాడు నిర్మలమైన నేత్రములు కలవాడు కాగలడు.

పగడ - పాచికల మీద ఒకటి చుక్క, సర్వ.ఒకటి, సం.వటికా.

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము -
రిక్క, చూ.ఋక్షము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలదొర -
చంద్రుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు.

స్వాధిష్ఠాన కమలము అగ్నితత్తోత్పత్తి స్థానము. భగవతి కుండలిని స్వాధిస్ఠాన చక్రమున స్వయముగ అధిష్టించి గ్రంధి కల్పనము చేయును. కాబట్టి స్వాధిస్ఠాన మని పేరు.

తవ స్వాధిస్ఠానే - హుతవహ మధిష్ఠాయ నిరతం
త మీడే సంవర్తం - జనని! మహతీం తాం చ సమయామ్|
యదాలోకే లోకాన్ - దహతి మహతి క్రోధకలితే
దయర్ద్రా యా దృష్టి - శ్శిశిర ముపచారం రచయతి|| - 39శ్లో.
తా.
తల్లీ! స్వాధిష్ఠానచక్రమందు అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరము ప్రకాశించుచు ప్రసిద్ధుడైన సంవర్త(సంవర్తము - ప్రళయము)మను అగ్నిరూపముతో వెలుగుచున్న పరమేశ్వరుని స్తుచించెదను. అధిష్ఠాన, అవస్థాన, అనుష్ఠాన, నామరూపములందు సమానమగుటచే సమవైన నిన్నును స్తుతింతును. సంపరాగ్ని స్వరూపుడైన పరమేశ్వరుని అతిక్రోధ కలిత వీక్షణము లోకములను దహించుచుండగా, కృపచేత నీ దయార్ద్ర దృష్టి శీతలమైన ఉపచారము కావించుచున్నది. - సౌందర్యలహరి   

స్వాధిస్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా|
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణా తిగర్వితా.

స్వాధిష్ఠానచక్రము నందు బ - భ - మ - య - ర - ల  అను వర్ణ పద్మములు పశ్యంతీవాగ్రూపములు.   సూర్యుని వంటి వర్ణమును బ కారం మొదలు ల కారం వరకు ఉండు వర్ణాలు ఆరు దళములను కల్గియుండును.

మ కారము - సుషుప్తికి. సుషుప్తి - ఒడలెరుగని నిద్ర. సుషుప్తి - ఒక నాడి.

మ కారము శివుడు. మ కారం సుషుప్తికి, లయకు సంకేతం. ర కారం సూక్ష్మం. ప్రతిభోద్దీపకమగు ల వర్ణము, భూ ప్రతిపాదకము ల వర్ణము.

అంతస్థము - (వ్యాక.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది. 

అధారా హితపత్నీకా స్వాధిష్ఠాన సమాశ్రయా,
ఆజ్ఞాపద్మాసనాసీనా విశుద్ధస్థలసంస్థితా|

రేఫము - ర వర్ణము, విణ.అధమము.
అంత్యము -
1.కడపటిది, 2.అధమము.
అధమము - తక్కువైనది(తక్కువ - కొరత), నీచము.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము -
1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.  

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). బ్రహ్మా న-పు. బృంహతి వర్ధయతి ప్రజా ఇతి బ్రహ్మా - ప్రజలను వృద్ధి బొందించువాడు.

ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు(మనసి చంద్రః), 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః. ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాడు.

ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి. నిశ్చయించేది బుద్ధి.

సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.
సురాణం జ్యేష్ఠః సుర జ్యేష్ఠః - దేవతలలోఁ బెద్దవాడు.
పరమేష్ఠి - బ్రహ్మ.
పరమే ఉత్కృష్టే పదే బ్రహ్మ లోకాఖ్యే తిష్టతీతి పరమేష్టీ-న-పు. - ఉత్కృష్ట స్థానమం దుండెడువాఁడు. స్థా గతినివృత్తౌ.  

బ్రహ్మ -  నాభిజన్ముఁడు, ప్రజలను వృద్ధి పొందించువాడు. బ్రహ్మ స్తోత్రప్రియుడు. బ్రహ్మ ముఖములందు సరస్వతి; సరస్వతి యందు దేవిస్థానం దేవమాత. సరస్వతిని మున్ముందు సేవించినవాడు బ్రహ్మ.

భగవతి - 1.సరస్వతి,  2.పార్వతి,  3.గంగ,  విణ. పూజ్యస్త్రీ.

సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రమునకును, నదీ విశేషము నకును, ఆవునకును పేరు. సరస్వతి శరీరవర్ణం తెలుపు, వాహనం హంస.

ప్రథమం భారతీ నామ(సరస్వతి, వాక్కు) - ద్వితీయం చ సరస్వతీ|
తృతీయం శారదాదేవీ(సరస్వతి, పార్వతి) - చతుర్థం హంసవాహనా||

ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
ఆంగీరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.

క్రతువు - యజ్ఞము.
యజ్ఞము -
1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజన్ము, మనుష్యయజన్ము, ఇవి పంచయజ్ఞములు), వికృ.జన్నము.
జన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజనః.
జన్నపుగొంగ(గొంగ - శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.
క్రతుధ్వంసి - శివుడు, వ్యు.దక్షయజ్ఞమును నాశము చేసినవాడు. 

జన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుఁదిండి, రూ.క్రతుభూక్కు.   

త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు -
వేలుపు; సుపర్వుఁడు - వేలుపు.
త్రిదివము - స్వర్గము.

జన్యువు - 1.జంతువు, 2.అగ్ని(నీటిచూలి - అగ్ని), 3.బ్రహ్మ.
జన్మి -
జంతువు, శరీరధారి.
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి -
నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గికంటి - శివుడు.
అగ్గితత్తడి -  అగ్నిదేవుని వాహనము, పొట్టేలు Aries.

అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు -
కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.

అగ్నికి కాల్చుట స్వభావము. దానికి నాశమన్నది లేదు. అది సర్వకాల సర్వావస్థలలో దహనశక్తి కలది. అగ్ని అగ్నిని దహింపదు కదా!

భుజి - అగ్ని, వ్యు.సర్వమును భుజించువాడు.
సర్వభక్షకుఁడు -
అగ్ని. 
ధనంజయ - 1.అగ్ని, 2.అర్జునుడు. air in the stomach.
ధనుజయతీతి ధనుంజయః జి జయే - ధనమును జయించువాఁడు.

ధనంజయః = రాజసూయయాగమునకు అనేక రాజులనుండి ధనమును సంపాదించి తెచ్చుటచేతను, లేక ధనమునుగూర్చిన ఆశను జయించిన వాడగుట చేతను అర్జునునకు ధనంజయుడని పేరు వచ్చింది.

ప్రాణఘోషయందు నిలుచును, ప్రాణము పోయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయ వాయువు. (చెవులు వ్రేళ్ళు పెటుకొన్నచో గుయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము).

కృపీటయోని - అగ్ని, వ్యు.నీటికి ఉత్పత్తిస్థానమైనది.
కృపీటము -
1.జలము, 2.కడుపు, 3.సమిధ.
కృపీట ముదకం యోనిః కారణం యస్య సః కృపీట యోనిః ఇ-పు. - కృపీటమనఁగా ఉదకము; అది కారణముగాఁ గలవాఁడు.
కృపీట స్యాంభసో యోనిః - ఉదకమునకు నుత్పత్తిస్థానము.

జాతవేదుఁడు - అగ్ని.
జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః న - పు. - ఇతనివలన వేదములు పుట్టినవి.
జాతేజాతే విద్యత ఇతి వా జాతవేదాః విద స్తాయాం - పుట్టిన దేహము నందెల్ల నుండువాఁడు.
జాతం శుభాశుభం వేత్తీభం వేత్తీతివా, విద జ్ఞానే - పుట్టిన శుభాశుభము ల నెఱుంగువాఁడు.
వేదో హిరణ్య మస్మాజ్ఞాత ఇతివా - హిరణ్యము వీనివలనఁ బుట్టినది.

తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనము(పచనము - వండుట)చేసి శరీరము పడకుండ కాపాడునది.
తనూం న పాతయతి ధారయతీతి తనూనపాత్. త.పు. వఌ గతౌ - శరీరమును నిలుపువాఁడు.
ఇంధనం వినా స్వతనుం నపాతీతివా. పా రక్షణే - ఇంధనము లేక తన్ను రక్షించుకొనఁజాలనివాఁడు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు -
1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది. సర్వభక్షకుఁడు - అగ్ని.

అవసరమైనవాడు - ఆత్మబంధువు వాడు, బహుముఖంబులవాడు వాయు సఖుడు - అగ్ని. తెలియక స్పృశించినను అగ్ని కాల్చును అను న్యాయము. అంటరాని వేలుపు - అగ్ని.

సేనగ వాంచితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట, నిజమేకద దేహులకగ్ని హోత్రుడౌ
నేని స్వభోజ్యముల్ గుడుచునేనియు బుష్టి వహించులేని నా
డూని, విభూతిలో నడిగి యుండడి తేజము దప్పి, భాస్కరా.
తా.
అగ్నిదేవుడయునను తాను తిను తిండి మానిన యెడల తన కాంతిని గోల్పోయి బూడిదలో నణగియుండును. అట్లే, తనకు ఎక్కువ ప్రీతి అయిన ఆహారమును తిన్నచో మనుష్యుడు వృద్ధి పొందును, లేనిచో కృశించును.

అగ్గి చూలి - 1.కుమారస్వామి, 2.నీరు,  వ్యు.నిప్పునుండి పుట్టినది.

షోడశ శ్శిఖివాహనః : అన్ని చోట్ల ఈశ్వరుని సందర్శించాలన్నది కుమారస్వామి(సుబ్రహ్మణ్యుని) బోధ. శిఖివాహా ద్విషద్భుజ.

అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.

తన సత్క ర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైనఁ బెరుఁగు * నయ్యః కుమారా !
తా.
తాను చేసిన మంచికార్యముల సాయముచేతనే అదృష్టము త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడపాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా?   

బర్హిస్సు - అగ్ని.
బర్హి -
1.నెమలి Peacock, 2.దర్భ.
బర్హము - నెమలిపురి.
బర్హిః. స-పు బృంహతి వర్థతే అజ్యాదినేతి బర్హిః. బృహి వృద్ధౌ - అజ్యాదుల చేత వృద్ధిఁబొందివాఁడు.
శుష్మా న-పు శోషయతి జలమితి శుష్మా, శుష శోషణే - ఉదకమును శోషింపఁజేయువాఁడు.
ప. బర్హిశ్శుష్మా. న-పు బర్హిషో దర్భాః శుష్మ బలమస్యేతి బర్హిశ్హుష్మేత్యే కంవాపదం - దర్భలు బలముగాఁ గలవాఁడు.

కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము, దురాచారుడు.
కృష్ణం వర్త్మ మార్గోయస్యసః కృష్నవర్త్మాన - పు. నల్లనిజాడ గలవాఁడు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
దురాచారుడు - చెడునడవడి కలవాడు.

ఖరువు - 1.గుఱ్ఱము, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము(రదనము - దంతము), 5.భర్తను వరించు కన్య, విణ.దురాచారుడు, 2.క్రూరము.

విధుంతుదుఁడు - రాహుగ్రహము.
గ్రహ కల్లోలము -
రాహుగ్రహము.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.

దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా.
అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయ(కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము

జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః. - భజగోవిందం

రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్ని గుణము, 5.స్వభావము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపఱు - 1.చచ్చు(ౘచ్చు - క్రి.మరణించు), 2.అంగవిహీనమగు.

జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
(ౙ)జ్యోతి -
జ్యోతి, కాంతి, దీపము, సం.జ్యోతిః.

విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విభా ప్రభావసు ధనం యస్య సః విభావసౌః. ఉ. పు. - కాంతి ధనముగాఁ గలవాఁడు.

అర్జునుఁడు - 1.పాడవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
కఱ్ఱి -
అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time). 

అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణోత్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||
తా. సహజముగా బ్రాహ్మణులకుఁ(విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రత(సాధ్వి - పతివ్రత)లకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము

పావకుడు - అగ్ని.
పావకో - పునాతీతిపావకః పూఙ్ పవనే - పవిత్రమును జేయువాఁడు.

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అనలుఁడు -
1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనతి జీవంత్యనేన లోకా ఇత్యనలః అన ప్రాణనే - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాప్తి ర్నాస్త్యస్యేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేనివాఁడు.

బభ్రువు - 1.కపిలగోవు, 2.అగ్ని, 3.బట్టతలవాడు, విణ.1.పచ్చనిది, 2.రోగము వలన బట్టతల కలవాడు.
ఖర్వాటుఁడు -
బట్టతలవాడు, రూ.ఖల్వాటుడు.
నూలిగరను - బట్టతల, ఇంద్రలుప్తము.
చెంబుతల - బట్టతల.
ఇంద్రలు ప్తకము - 1.బట్టతల, 2.తల వెండ్రుకలూడిపోవు ఒక రోగము, రూ.ఇంద్రలుప్తము. 

కపిల - 1.ఆగ్నేయ దిశయందలి ఆడేనుగు, 2.పుల్లావు (కపిల గోవు).
పుల్లావు -
కపిలగోవు. మహాలింగము నందు దేవిస్థానం కపిల.
కపిల వర్ణత్వాత్కపిలా - కపిల వర్ణము గలిగినది.
కామ్యత ఇతి కపిలా - కోరఁబడునది. కపిలే కృష్ణపింగళే|

పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె - ఐదోది "కపి"లావతారం. ఆయన సిద్ధులకు ప్రభువగు కపిలమహర్షిగా అవతరించి దేవహుతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహణునికి తత్త్వసముదాయమును విశేషంగా నిర్ధారించి చెప్పే సాంఖ్యాన్ని ఉపదేశించాడు.  

ధృతి : కపిలపత్ని, లోకాలకు ధైర్యరూపం. పిండాకరము నందు దేవిస్థానం ధృతి. దేవమాత సురేశానా వేదగర్భాంబికా ధృతిః.
ధృతి : ధృతిశబ్దము ధరించుటకును, ధైర్యమునకును పేరు. ధరణం, ధ్రియతే అనయాచ ధృతిః. సీ. ధృజ్ ధారణే. ధరించుట, దీనిచేత ధరింపఁ బడును ధృతి.

కపిలా క్షీరపానేన అన్యస్త్రీ సంగమేనచ |
వేదాక్షర విహీనేన ద్విదశ్చండాలతాం వ్రజేత్ ||
తా.
కపిల వర్ణముగల గోవుపాలను పానము చేయుటయు, ఇతర స్త్రీలతో భోగించు(భోగించు - సుఖించు, అనుభవించు)టయు, వేదాక్షరవిచారము లేక యుండుటయు, నిట్టికార్యములు బ్రాహ్మణులొనరించిన చండాల త్వము నొందించును. - నీతిశాస్త్రము

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీ పతిః|
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగ కృతాన్తకృత్||

3. దళదళమును నీలవర్ణమునగు మణిపూరక చక్రము నందు - విష్ణువు కలడు. (జల తత్త్వమును)

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు -
విష్ణువు, సం.విషుః.

నీల - శ్యామ వర్ణము కలది purple, శివుడు, Indigo, పచ్చ, pearl.
నీలకంఠుఁడు - శివుడు; నీలలోహితుడు - శివుడు.
కంఠేకాలుఁడు - శివుడు, వ్యు.కంఠము నందు నలుపు కలవాడు. 

మణిపూరే - మణి పూర చక్రము. ఆ చక్రమున అధిస్థాన దేవతగానున్న భగవతి మణికాంతులతో ఆప్రదేశమున పూరించునది కావున ఆ చక్రమునకు మణిపూర చక్రమని పేరు వచ్చినది.

మణి పూర చక్రము పదిదళములును ఎర్రని వర్ణము, దకారము మొదలు మకారము వరకు, అనాహత చక్రము పన్నెండు దళములను బంగారు వంటి వర్ణాన్ని కకారము మొదలు రకారము వరకు ఉండు వర్ణాలను కలిగి యుండును.

నాభిస్థానమైన మణిపూర చక్రమున  డ - ఢ - ణ - త - థ - ద - ధ - న - ప - ఫ లను వర్ణపద్మములు పశ్యంతీవగ్రూపములు.  పద్మం రేకులు పది అగ్నిరూపం. 

ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః : దశ దళాలలో భాసిల్లు మణిపూర కమలంలో విలసిల్లు దేవికి నమోవాకాలు.
ఓం విష్ణు గ్రంధి విభేదిన్యై నమః : మణి పూరక చక్రోపరి భాగానకల విష్ణు గ్రంధిని భేదించుకొని సాక్షాత్కరించునట్టి పరాశక్తికి ప్రణామాలు.

ఓం మణిపూరాంతరుదితాయై నమః : నాభిలో దశదళ కమలం ఉంది. దానికే మణిపూరకమని పేరు. అందులో రత్నాలంకృతయై భాసిల్లు శ్రీమాతకు ప్రణామాలు. (నాభియందు సమానవాయువు)

మణిపూర చక్రమందు బృహస్పతి. బృహస్పతి వేదశాస్త్ర పారంగతుడు. బుద్ధికి బృహస్పతి, దేవతల గురువు మిక్కిలి బుద్ధిమంతుడు, తన మేధాశక్తితో ఇతరులకు మేలుచేసే ఆదర్శవాది(గురుడు). గురువు త్రిమూర్తి స్వరూపుడు. 

శ్లో. తటిత్త్వస్తం శక్త్యా - తిమిరపరిపంథి స్ఫురణయా
    స్ఫురన్నానారత్నా- భరణ పరిణద్దేంద్ర ధనుషమ్ | 
    తవ శ్యామం మేఘం - కమపి మణిపూరైక శరణం
    నిషేవే వర్షన్తం - హరమిహిర తప్తం త్రిభువనమ్ || 40శ్లో
తా.
అమ్మా! ఓ భగవతీ! మణిపూరచక్ర మాధారముగ  గలదియు,  చీకటి (తిమిరము - చీకటి)ని తొలగించు శక్తితో మెఱుపులు గలదియు, ప్రకాశించుచున్న అనేక రత్నాభరణాల కాంతిచే  ఏర్పడిన  ఇంద్రధనుస్సుతో(జ్ఞానదీప్తి) వంటిదియు,  ప్రళయకాల(హరుఁడు - శివుడు)శివుడను సూర్యుడిచే(దుఃఖం)  తపింపజేయబడిన ఈ ముల్లోకాలను(కృపామృత) వర్షధారచే తడుపుతూ, అనిర్వచనీయమైనది, శివశక్త్యాత్మకమైన నీ  నీలి మేఘాన్ని(దయాస్వరూపం) సేవింతును. - సౌందర్యలహరి 

మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా|
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. - 102శ్లో

పాథస్సు - 1.జలము, 2.అన్నము.
అన్నము -
కూడు, బువ్వ, విణ.తినబడినది.
కూడు - అన్నము, క్రి.1.ఒప్పు, 2.సాధ్యపడు, 3.కూడబెట్టు, 4.లెక్కచూడు, 5.కలుపు.
బువ్వ - అన్నము.

భక్తము - విణ. భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.

ప్రసాదనము - 1.తేర్చుట, 2.అన్నము.
ప్రసాదము - 1.అనుగ్రహము(దయ, కరుణ), 2.ప్రసన్నత, 3.భగవంతునికి నివేదించిన అన్నము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.

ఋతము - 1.సత్యమైనది, 2.పూజింపబడినది, 3.ప్రాప్తము, వి.1.జలము, 2.సత్యము, 3.మోక్షము, 4.యజ్ఞము.
ఋతంభరుఁడు -
1.సత్యపాలకుడు, 2.పరమేశ్వరుడు.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.

దైవాధీనం జగత్సర్వం సత్యాధీనంతు దైవతమ్|
తత్సాత్య ముత్తమాధీనం ఉత్తమో మను దేవతా||
తా.
ఈలోకమంతయు దైవాధీనమైయున్నది, ఆదైవము సత్యమున కాధీనమై యున్నది, ఆ సత్యము ఉత్తముల యందున్నది, కాబట్టి ఆ(ఉ)యుత్తమభక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను. - నీతిశాస్త్రము 

మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు. 
మరకతము -
(రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్ సిలికేట్ (Emerald). (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.) ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొడుచు పసరు రేఖ, సం.పలాశః.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు. 
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు). 
ఇంద్రనీలము - నీలమణి. తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
కిరీటపచ్చ - మరకతము, గరుడపచ్చ.
గరుడపచ్చ(ౘ) - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము. 
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, 12000 శ్లోకములు గలది, గరుడదేవతాకమైన అస్త్రము.

అశ్మగర్భము - మరకతము, పచ్చ.
కప్పుఱాయి -
నీలమణి, నీలము - ఒక విలువ గల రత్నము, శ్రేష్ఠమైన నీలము అనురత్నము ఒకటి వున్ననూ చాలును.

అద్భ్యో(అ)గ్ని ర్బ్రహ్మతః క్షత్రమ్ అశ్మనో లోహముత్ధితమ్ |
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శామ్యతి ||

నీటినుండి అగ్ని పుట్టింది. బ్రాహ్మణత్వం నుండి క్షత్రియత్వం పుట్టింది. రాతినుండి లోహం పుట్టింది. అంతటా ప్రసరించే వీటి తేజస్సు తమ జన్మ స్థలాల్లో మాత్రం అణగిపోతుంది.

పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.

కర్బురము - 1.జలము 2.బంగారము  విణ.చిత్రవర్ణములు గలది. బంగారము దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు.

ద అంటే ఇచ్చేది అని అర్థం. దానం అంటే ఇవ్వబడేది. దాత అంటే ఇచ్చేవాడు, ప్రదాత అంటే విశేషంగా ఇచ్చేవాడు. ' న ' అంటే దాస్యం.

కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
సహస్రపత్రము -
కమలము, తామర.
శతపత్రము - తామర. కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.
జలము - 1.నీరు 2.జడము 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు),  రూ.జలము  విణ.తెలివిలేనిది.

కామ్యతే తృషార్తైరితి కమలం. కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరఁబడునది.   

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
కమలుఁడు - 1.బ్రహ్మ, 2.ఇంద్రుడు.

కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 3.కమలాఫలము.
కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
తా.
తామరులు జలమును వదలినయెడల తమకాప్తులైన సూర్యుని కిరణం(రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువు లగుదురు.  

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. - 157శ్లో

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు -
విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

జీవో వినయితాసాక్షీ ముకుందో(అ)మిత విక్రమః
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. - 55శ్లో

జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు. 
నీరు - 1.నీరము, జలము 2.మూత్రము, ఊరినె సం.నీరమ్.
జలము - 1.నీరు 2.జడము 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు, రూ.జలము విణ.తెలివిలేనిది.

నారము - 1.నరసమూహము, 2.నీళ్ళు. 
జనత -
జనసమూహము.
నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము(జడధి - సముద్రము) లేక జన సమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.
నారాయణాజ్ఞాతా నారాయణీ - నారాయణునివలనఁ బుట్టినది.

భూమి కన్న జలము - జలము కన్న వాయువు - వాయువు కన్న అగ్ని - అగ్ని కన్న ఆకాశము - ఆకాశము కన్న మనస్సు - మనసు కన్న బుద్ధి - బుద్ధి కన్న కాలము. ఒకదాని కన్న మరొకటి గొప్పది. అన్నింటి కన్న గొప్పవాడు విష్ణువు - నారాయణుడు.

ఓం హరి సోదర్యై నమః : హరి-అంటే నారాయణుడు హరికి సహోదరీ స్వరూపిణియైన నారాయణికి వందనాలు. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వ ప్రవర్తినీ. సుపార్శ్వమునందు దేవీస్థానం నారాయణి.

జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
వర్తనము -
1.నడవడి, 2.జీవనము.
నీళ్ళు - నీరు; సలిలము - నీరు.
ప్రవృత్తి - 1.నడక, 2.ప్రవేశము, 3.బ్రతుకుతెరువు.
వృత్తము - 1.నియత గణములును యతిప్రాసములుగల పద్యము, 2.నడత(నడత - ప్రవర్తనము), 3.జీవనము, విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే రూపములో చరించు బిందువు యొక్క పథము, (Circle).

జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic).

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ అర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గాందిని -
గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి.

గంగి - పూజ్యము, (గంగెద్దు= గంగి+ఎద్దు), వి.సాధువైన ఆవు.
గంగెద్దు -
(గంగి+ఎద్దు) దాసరులు వస్త్రాదులచే అలంకరించి భిక్షాటనము కై తీసుకొని వచ్చెడి ఎద్దు, రూ.గంగిరెద్దు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.

గంగమైలావు - (గంగమైల + ఆవు), 1.పసుపు, నలుపును కలిసిన వర్ణము కల ఆవు, 2.మిక్కిలినల్లని ఆవు.
మైలావు - పొగ చాయగల ఆవు.

గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివడైననేల ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వ.
తా.
మంచిపాలు గరిటెడైనను త్రాగుటకు శ్రేష్ఠముగా నుండును. గాడిద పాలు కడవతో యిచ్చిననూ త్రాగలేముకదా. అట్లే ప్రేమతో బెట్టిన పిడికెడు భోజనమైనను సంతోషము గదా. 

నతీర్థం గంగాయాస్సమానః : గంగతో సరి సమానమైన జలము లేదు.

గంగాయాః పరమం నామ పాపారణ్యదవానలః
భవవ్యాధిహరీ గంగా తస్మా త్సేవ్యా ప్రయత్నతః| 

పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
పోషయతీతి పుష్కరం. పుష పుష్టౌ, - పోషించునది.   

అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.

నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము.

పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
నీళ్ళు - నీరు; నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.  
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.  

క్షీరదము - (జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు.

పోసనము - 1.క్షీరము, 2.పైపూత, 3.కాంతి.

పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెరచుగావున  
బాలిసుడగు వానిపొందు వలదుర సుమతీ.
  
తా. తెలివిహీనుల(బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.)స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం.

నీరమునకుఁ బాలునకును దారి నీవు
కలుపఁగా విడఁదీయఁగాఁ గర్త వీవు
హంస సోహమ్మునందు మాహాత్మ్యమూను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

సర్వముఖము - 1.ఆకాశము, 2.జలము. 
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.

నాన్నోదకసమం దానం నద్వాదశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యాః పరం మంత్రం నమాతుర్దైవతం పరమ్||
తా.
అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. – నీతిశాస్త్రము

దానం వల్లనే ఆకలి దప్పిక(దాహం) తీరుతుంది. ఆకలన్నవారికి అన్నము పెట్టువాడు, అంతటా సుఖముగా ఉండును. అన్నము ఎక్కువగా ఇచ్చువాడు ఆరోగ్యవంతుడు కాగలడు. నీరు సర్వజీవులకు ప్రాణాధారం. చల్లని నీరు నాలుకకు ఇంపు. నీరు దానము చేయువాడు మంచి రూపము పొందును.

లోభునకు ఇద్దరు ఇల్లాండ్రు. ఆకలి, దప్పి అని వారి పేర్లు. వారి మహిమ యింతా అంతాకాదు. వారి సేవతోనే ప్రపంచమంతా మునిగి తేలుతూ వుంటుంది.

'పరోపకారం మిదం శరీరం' దానం పుచ్చుకునేవారు వుంటేనే కదా దాతలయొక్క దానగుణానికి కీర్తివచ్చేది.

గాయత్రి త్రిమూర్త్యాత్మకము. గాయత్రి మంత్రం ఋగ్వేదం లోనిది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ముఖాలతో (వేద వదనమునందు గాయత్రి) శోభించే తల్లి వేదమాత గాయత్రి.

ఓం గాయత్ర్యై నమః : గానం చేయువారిని తరింపజేయునది గాయత్రి, వేదజననీయ గాయత్రి, అట్టి గాయత్రీ స్వరూపిణికి వందనాలు.

అన్ని ప్రేమలకన్న మిన్నమైన ప్రేమ - తల్లి ప్రేమ. ప్రేమకు ప్రతిఫలాపేక్ష ఉండదు. కన్నతల్లి కంటె ఘనము లేదు.

పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.
(ౙ)జందెము -
జందియము.
జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము. 
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము 

సూత్రము - 1.నూలిపోగు, చంద్రునికో నూలిపోగు 2.జన్నిదము, 3.ఏర్పాటు, 4.శాస్త్రాది సూచక గ్రంథము, (గణి.) కొన్ని పదములతో నేర్పడు సమీకరణము (Formula), 6.కొన్ని ధర్మముల నుగ్గడించు ప్రవచనము. 
ఏర్పాటు - ఏరుపాటు; ఏరుపాటు - 1.నిర్ణయము, 2.నియమము, 3.వివరణము, 4.భేదము, రూ.ఏర్పాటు.

అవధారణము - నిర్ణయము, నిశ్చయము. 
నిర్ణయము -
ఏర్పాటు; నిర్ణయించు - క్రి.ఏర్పాటుచేయు.
నిశ్చయము - నిర్ణయము; నిర్ధారణ - నిశ్చయము.
వ్యవసితము - నిశ్చయము, విణ.అనుష్ఠింపబడినది.  

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.

ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గఱి) విషయ విపులీకరణము (Exposition).

విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||

క్షత్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.

క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.   

మంత్ర వ్యాఖ్యాన నిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా,
ఇడా పింగళికా మధ్యా సుషుప్నా గ్రంథిభేదినీ.

4. ద్వాదశ దళమును పింగళ వర్ణము నగు (అ)ననాహత చక్రము నందు - రుద్రుడు కలడు. (వాయుతత్త్వమును) హృదయాకాశమున అనాహత చక్రము.

పింగళ - 1.దక్షిణ దిక్కు నందలి ఆడేనుగు, 2.అరువది(60)సంవత్సర ములలొ నొకటి.
పింగళవర్ణత్వా త్పింగళా - పింగళవర్ణము గలిగినది.
పింగము - గోరోజనమువంటి వన్నె(కొంచెము నలుపు కలిసిన పసుపు వన్నె). పింగళ సూర్యరూపిణి, పమోక్ష్ణియందు దేవీస్థానం పింగళేశ్వరి.

అనాహత మహాపద్మ మందిరాయై నమః 

పింగళుఁడు - 1.అగ్ని, 2.శివుడు.

రుద్రుడు - శివుడు - Solitude, మనసు చెడినపుడు(హతుడు). రుద్రాణి - పార్వతి.

రుద్రకోటయందు దేవిస్థానం రుద్రాణి. రుద్రుని భార్య నిద్ర. ఈమె యోగము అధారముగా రాత్రులందు లోకమును ఆవహిస్తుంది.

అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా|
దంష్ట్రోజ్జ్వలా క్షమాలాది - ధరా రుధిరసంస్థితా. – 100శ్లో

అనాహతము - కొట్టబడనిది, ఉత్తరింపబడనిది, చలువచేయబడనిది, (క్రొత్త వస్త్రము). (గణి.) గుణింపబడనిది, వి.1.దేహమందలి షట్చక్రములలో ఒకటి, 2.దౌడ మొ.ని స్పర్శలేకుండ పుట్టుధ్వని.
కారికము - చలువ చేయని క్రొత్తది (వస్త్రము). అనహూతము - పిలువబడనిది.  

దౌడ - తాలుపు, రూ.దవుడ. 
తాలుపు - దౌడభాగము (Palate).

దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టినధ్వని, ఉదా. ౘ, ౙ.
సరళము -
ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బ లు సరళములు.   
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.నిష్కపటము.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.

దశ వాయు జయాకారా కళాషోడశ సంయుతా|
కాశ్యపీ కమలాదేవి నాద చక్ర నివాసినీ||

అనాహతమున మరుత్ - వాయుతత్త్వము. మరుత్తులు దితి(ప్రకృతి కళ నుండి పుట్టింది) దైత్యమాత  పుత్రులు, వాయువుల కధిస్ఠాన దేవతలు.

మరుత్తు - వేలుపు(దేవత - వేలుపు), గాలి.
వేలుపు -
1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.

దైతేయుఁడు - దితికొడుకు, తొలివేల్పు, రూ.దైత్యుడు.
దైత్యారి - విష్ణువు.

మరుతౌ పవనామరౌ : మరుచ్చబ్దము వాయువునకును, దేవతలకును పేరు. మ్రియతే అనేనేతి మరుత్. మృజ్ ప్రాణత్యాగే, దీనిచేత చత్తురు.

ప్రాణా పాన వ్యానో దాన సమాన నాగ కృకర దేవదత్త ధనుంజయ కూర్మా ఇతి దశ వాయువః|

వాయువు - (భూగో.)గాలి యొక్క చలనము, సం.వి.గాలి. ముఖ్యప్రాణుడు, శబ్దము, స్పర్శగలది. వాయువు దేహంతో ప్రవేశించి ఆయాదేహ విభాగములలో సంచరిస్తూ కూడా ఆసక్తి పొందదు. నింగిచూలు - వాయువు, ఆకాశము నుండి పుట్టినది.

అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులతో నొకడు.
అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము.

అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.  

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః. 

నీటితాత - వాయువు, (గాలి నుండి అగ్ని దీని నుండి నీరు పుట్టుటచే నీటికి తాత.)

కరువలి - గాలి.
కరువలిపట్టి -
వి. (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

గాలిని బంధించిన మొనగాడు లేడు! గాలిని బంధించి హసించి దాచిన పనిలేదు.

గాడుపు - గాలి, వాయువు రూ.గాడ్పు. గాడ్పు - గాడుపు.
గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపుసంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.

గాడుపుమేపరి - పాము, పవనాశము. 

మారుతము - వాయువు.
మారుతి -
1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.

వృకోదరుఁడు - భీముడు.
తోఁడేటి మేటి కడుపు -
వృకోదరుడు, భీముడు.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి. పద్యయతి, సం.వళిః.
వేగ - వడి, విణ.త్వరితము.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము 2.వికసింపనిది. ముడి మూరెడు సాగునా?
ముడిగిబ్బ - ఆబోతు.

సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః.

జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముడు :
పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.

బిభే త్యస్మాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లితనివలన భయపడును గనుక భీముఁడు. రుద్రులలో ఒకరైన భీముని భార్య పేరు దిశ.

దిశ - దిక్కు, దెస. (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కు లలో నొకటి.
దిక్కు - 1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, 2.దశా.
దశ - 1.అవస్థ, 2.వత్తి, 3.బద్దె. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది!

విధర్భరాజు అయిన భీముని కుమార్తె పేరు దమయంతి. దమయంతికి దముడు, దాంతుడు, దమనుడు అను ముగ్గురు సోదరులు. విదర్భరాజు కు దమన మహర్షి వరం వల్ల సంతానం కలిగింది.

భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు. 
శివుఁడు -
ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.

కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
కీచకుఁడు -
భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.

ప్రాణందాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు|
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్రతారకమ్||
తా.
తనకు మానహానికరమైన (యా)ఆపద వచ్చినప్పుడు ప్రాణము నైన విడువవచ్చును. కాని మానమును రక్షించుకొనవలయును. అది యెందువలన ననఁగా ప్రాణము క్షణభంగురము. ప్రాణంకంటె మానం ఘనం.  మానము చంద్రుడును నక్షత్రములు(తారకము - 1.కంటినల్ల గ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.)నుండు వరకుండు నని భీముఁడు చెప్పెను. - నీతిశాస్త్రము 

పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.

సామీరి - 1.హనుమంతుడు, 2.భీముడు.
హనుమంతుఁడు -
ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
యోగచరుఁడు - ఆంజనేయుడు.

పవనాత్మజ - వాయుసుతుడు, ప్రభు భక్తికి హనుమంతుణ్ణి మించిన ఉదాహరణ లేదు.

హనుమంతుడు : అంజనీ సుతుండు, వాయుదేవుని వరమున బుట్టినవాడు. బ్రహ్మ, శివునియొక్క(రుద్రరూప) కలయిక వలన నేర్పడినవాడు. సూర్యుని శిష్యుడు. చిరంజీవి, వేదవిదుడు(నవవ్యాకరణ పండితుడు), మహాగాయకుడు, ఉత్తమ రామభక్తుడు.  

బుద్ధిర్బలం యశో ధైర్యం మిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్|
తా.
హనుమంతుని ధ్యానించుట వలన బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగము లేకుండుట, మాంద్యము తొలగుట, చక్కగ మాటలాడ గలుగుట సిద్ధించును.

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు. స్పర్శనము - 1.తాకుడు 2.ఈవి 3.వాయువు.
స్పర్శము - 1.తాకుడు 2.ఈవి 3.వ్యాధి.

అక్షరము - 1.నాశము లేనిది, (జీవాత్మ, పరమాత్మ) 2.మారనిది, వి. 1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము(సత్ రూపము పరబ్రహ్మము), 5.మోక్షము. 

అక్షరుఁడు -  1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.

అకార ఉకార మకారములతో ఏర్పడిన ప్రణవనాదము, దహరాకాశములో బుట్టినది. అది జీవులను తరింపజేయును. దాని ప్రభావము వలననే విశ్వమంతయు నడుచు చున్నది.

ఓమ్(ఓం) - 1.పరబ్రహ్మ్మర్థకము, 2.ప్రారంభార్థకము, (ఓం కారము వేదముల యొక్క సారభూతము. వేదాంత గ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ+ఉ+మ). మంత్రములకెల్ల శిరోమణి, ఓంకారమునందు సమస్త జగత్తును ఇమిడి యున్న దని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారము - 1.ప్రణవము 2.ప్రారంభము.
ఓంకారేశ్వరుడు - శివుడు.  

ఓంకార ప్రణవౌ సమౌ :
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రకృష్టో నవః ప్రణవః ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము.
ప్రణూయతే ప్రస్తూయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయుఁబడునది.

హృదయములో ప్రాణవాయువు : ప్రాణవాయువు  హృదయస్థానమును ఆశ్రయించి యుండును. సర్వజీవులకూ హృదయస్థానమే భగవంతుని నిజవాసము. హృదయమందు స్వర్ణలోకము ఉండును.

ఓం రుద్రగ్రంధి విభేదిన్యై నమః : హృదయ స్థానంలో(హృదయం లలితాదేవి) అనాహాత చక్రస్థానంలోగల రుద్రగ్రంధిని(అగ్ని స్థానము) భేదించి తేజరిల్లు పరమేశ్వరికి వందనాలు. అనాహతము జ్యోతిర్లోకము.

హృదయంలోని అనాహత చక్రం తెరుచుకోవాలంటే హృదయకుహరంలోనికి ప్రవేశాన్ని కల్గించే ద్వారం వంటిదైన భ్రూమధ్యము (అనగా స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశం) భగవన్మందిర ద్వారము! అది తెరుచుకుంటే తప్ప నుదుట జ్ఞానజ్యోతి వెలుగుగా కనిపించదు. ఆకుపచ్చ వంటి పంచరంగుల నవరత్నకాంతులతో ఆజ్ఞాచక్రము వెలుగుతూ వుంటుంది, దాని మధ్య ఓంకారం ప్రణవమే ఈ హృదయకవాటము.

అనాహత చక్రము పన్నెండు దళములను బంగారు వంటి వర్ణాన్ని  కకారము మొదలు రకారం వరకు ఉండు వర్ణాలను కలిగి యుండును.

అనాహత చక్రము హృదయ స్థానమునందని ప్రసిద్ధము. హృదయపద్మ సూర్యతేజస్సమమై పన్నెండు రేకులతో, ఒక్కొక్క రేకున వరుసగా క, ఖ, గ, ఘ, ఙ్, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ అనే అక్షరాలు వుంటాయి. ఇది పురుషాధిష్ఠానము, అనందపదము అని ఒప్పుతూంది. దీనిపై పదారురేకుల పద్మం వుంటుంది. దీని రేకులపై అకారాది పదారు స్వరాలు వుంటాయి. దీనియందు జీవుడికి పరమాత్మ సంబంధం కలిగి జీవుడికి విశుద్ధత్వం కలుగుతుంది గనుక ఈ షోడశదళ పద్మానికి విశుద్ధం అని సంజ్ఞ. దీనికి స్థానం కంఠం. దీనియందు నాదం భిన్నమై వైఖరీ రూపాన సార్థకం అవుతుంది. దీనియందున్న స్వరాలూ, దాని క్రిందనున్న ముప్పైరెండు హల్లుల్ల్లు వర్ణత్వశుద్ధి కలుగుతుంది.

అనాహత చక్రమున క - ఖ - గ - ఘ - జ - చ - ఛ - జ - ఝ - ఞ్ - ట - ఠ - లను వర్ణ పద్మములు పశ్యంతీవాగ్రూపములు. 

ఓం కకారరూపాయై నమః : "క" కారము (మంగళకరమగు క వర్ణము, తత్త్వజ్ఞాపకమగు క వర్ణము) ఆదియందుగల విద్యకు కాదివిద్య అనిపేరు. అట్టి కాదివిద్యాస్వరూపిణియగు పరమేశ్వరికి ప్రణతులు.   

త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస(ము(ౘ)చ్చ - ముడ్డిపూస), (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు. 
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.   

సదాగతి - 1.వాయువు, 2.మోక్షము, 3.సూర్యుడు, 4.సర్వేశ్వరుడు.
సదాతనుఁడు -
1.విష్ణువు, 2.శాశ్వతుడు.
సనాతనుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, విణ.శాశ్వతుడు.
సదాశివుఁడు - శివుడు. (సదా - ఎల్లప్పుడు.)

సర్వము నీలోనిదిగా, సర్వాత్ముఁడ,
వాత్మవస్తు సంపన్నుఁడవై
సర్వమయుఁడ వగు నీకును,
సర్వేశ్వర! లేవు లోనుసంధులు వెలియున్.
భా||
సృష్టి అంతా నీలోనే ఉన్నది గనుక సర్వమునకూ ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులతో సర్వమునందు నిండి యున్న నీకు లోపల, బయట, మధ్య ఉండే మార్పులు అనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడవు.

పేరుప్రతిష్ఠలకై పాకులాడేవారు, అన్నీ తామే చేస్తున్నామనే భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సర్వేశ్వరుడే అన్నింటినీ నడిపే కర్త అని వారు గమనించలేక పోతున్నారు. కాని బుద్ధిమంతులయిన వారు, ఆ సర్వేశ్వరుడే అన్నింటికీ కర్త అనీ, అన్నిటినీ నడిపించేవాడనీ భావిస్తారు. - శ్రీరామకృష్ణ పరమహంస

మోక్షము - 1.కైవల్యము 2.మోచనము, విడుపు 3.ముక్తి.
దుఃఖాదీనాం మోక్షణ మవసానం మోక్షః - దుఃఖాదులయొక్క వినాశము మోక్షము. 

మహోదయము - 1.కన్యకుబ్జము, 2.అధిపత్యము, 3.అభివృద్ధి, 4.మోక్షము.

జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా,
దారిద్ర్య ధ్వంసినీ దేవీ హృదయగ్రంథి భేదినీ.

మృణాలము - 1.వట్టివేరు 2.తామర తాడు. ఇడా పింగళికా మధ్యే మృణాళీ తంతు రూపిణీ.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము). 
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||

తా. విష్ణువుచేత గాని, శివుని(హరుఁడు - శివుడు)చేత గాని, బ్రహ్మచేత గాని, ఇతరమైన దేవతలచేత గాని నొసట వ్రాయబడిన వ్రాత తుడిచివేయ నలవి కాదు (మనుష్యమాత్రుల కాగలదా.) - నీతిశాస్త్రము

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి(వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.

5. షోడళ దళమును ధూమ్రవర్ణము నగు విశుద్ధ చక్రము నందు - జీవాత్మ కలడు. (ఖః - ఆకాశము, ఆకాశతత్త్వమును)

ధూమ్రవర్ణము - నలుపు(ఎక్కువ) ఎరుపు కలిసిన రంగు.– impurity(body).

ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.    
రవి - 1.సూర్యుడు(సూర్యుఁడు - వెలుగురేడు), 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోక మిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత || - 34శ్లో
తా||
భారతా! ఒకే సూర్యుడు ఈ నిఖిల లోకములను ప్రకాశింపచేయు చుండునట్లు, పరమాత్మ ఒక్కడే మహాభూతములు మొదలు ధృతి వరకు చెప్పబడిన క్షేత్రమును ప్రకాశింపచేయుచుండును. - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, శ్రీభగవద్గీత 

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.

హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు -
విష్ణువు. హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception). 

హంస - 1.అంౘ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము రూ.హంస
హంసుడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణములేని రాజు.

మానసము - 1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
చేతము -
మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
మానసౌక(స)ము - హంస. 
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental development).

రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్టునికిని పేరు.
"నిర్లోభనృపతౌ విష్ణావంత రాత్మన్య మత్సరే, యతిభేదే చ హంసస్స్యా చ్చ్రేష్ఠే రాజాదిపూర్వక ' ఇతి. హంసో నిర్లోభనృపతౌ శరీర మరుదంతరే, హయభేదే యోగిభేదే మంత్రభేదే విమత్సరే, పరమాత్మని విష్ణౌ చ శ్రేష్ఠే రాజాదిపూర్వక 'ఇతి శేషః. హంతీతి హంసః హన హింసాగత్యోః - పోవును గనుక హంస.  

ఓం హంసినై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులున్నాయి అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యాసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేదము.

తూరీయావస్థలోని - జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుండును. తూరీయావస్థ -(అనగా ధ్యానసమాధి) జీవాత్మ పరమాత్మయందు సమత్వబుద్ధి కలిగి వుండటం సమాధి.

ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదార్థాలు వున్నాయి. హంస - అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగువేళ వాయువు "హ"కారములో బహిర్గతమై "స"కారముతో లోపలికివస్తుంది అంటే హంసశబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉండి. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్రరూపిణీయైన దేవికి వందనాలు.      

సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వన్ద్వం - కిమపి మహతాం మానసచరమ్| 
యదాలాపా దష్టా - దశగణిత విద్యా పరిణతిః
ర్యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ|| - 38శ్లో
తా.
ఓ దేవీ! ఏ హంసల జంటల యొక్క కూతలు(ఆలాపనము - 1.రాగాలాపనము, 2.మాటలాడుట.)పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించు నట్లు దోషముల నుండి గుణము లను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మ మందలి మకరందముచే ననందించు యోగీశ్వరుల యొక్క మనస్సు లనెది మానస సరస్సు నందు విహరించు నా హంస జంటను సేవించుదును. - సౌందర్యలహరి     

మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ! 

ఖంబు - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.శూన్యము, 4.సుఖము.

జీవాత్మ - దేహి, జీవుడు. దేహి - దేహము గలవాడు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
శరీరి - ప్రాణి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - 1.గురువు, బృహస్పతి, (Jupiter).

ప్రాణా హి ప్రజాపతిః - ప్రాణ దేహాదులను ఆశ్రయించే వుండేది జీవుడు. దేహికి ప్రాణములు బలరూపములు.

పంచభూతాత్మము - దేహము, సర్వదేహులయందు దేవి శక్తి. ఏది సాధించాలన్నా దేహం ఉండాలి. ధర్మ సాధనకు తొలుత కావలసింది దేహమే కదా! మనోబలం అందరికీ ఉంటుంది. శక్తి మాత్రం సాధన మీద ఆధారపడి ఉంటుంది. దీక్ష, మనోబలం, పట్టుదల ఆకలిని, అన్నాన్ని జయించ గలవు.

అంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.
ఆంగిరస - 1.ప్రభవాది షష్ఠి సంవత్సరములలో ఒకటి, 2.పుష్యమీ నక్షత్రము. 
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. 
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.

చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
చిత్రశిఖండీ -
సప్తర్షులలో నెవరైనను ఒకడు,(సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ -
(వేదాం.) 1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఆత్మ బుద్ధి స్సుఖ చైవ గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా.
తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱుచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. - నీతిశాస్త్రము

అనంగము - అంగములేనిది, వి.1.ఆకాశము, 2.మనస్సు.
అనంగఁడు -
మన్మథుడు, విణ.అంగములేనివాడు.

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ఊర్థ్వలోకము - స్వర్గలోకము, పైలోకము, భువర్లోకము.
స్వర్గము -
దేవలోకము.

నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకౌకసుఁడు -
1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు. 

ఆకాశము - 1.విన్ను, మిన్ను, 2.భూతము లై దింటిలో ఒకటి, 3.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).

విను - క్రి. ఆకర్ణించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినుకెంపు -
సూర్యుడు, వ్యు.విన్నునకు కెంపువంటివాడు, ద్యుమణి.
వినుచూలి - వాయువు.
వినుప్రోలు - స్వర్గము.
వినువాఁక - గంగ.(వాఁక - ఏరు, విన.వంకర.)

ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు -
వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు Sun, ద్యుమణి, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.

ఆకాశ గంగ - మిన్నేరు 1.మందాకిని, 2.పాలవెల్లి(milky way - నక్షత్ర వీధి).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ
భాగీరథి - గంగ (వ్యు.భగీరథునిచే భూమికి తేబడినది). (భగిరథుడు, సూర్యవంశపురాజు మందాకిని నదిని తెచ్చి ఈ భుమిని పరమ పవిత్రం గవించాడు). కేదార్నాథ్ లోంచి ప్రవహించే గంగ మందాకిని.     

మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1. మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ. 2.వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ. 3.స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గమందుండెడి నది. 4.సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.  

సీత - 1.శీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.   

సోమధార - ఆకాశ గంగ, పాలపుంత.
మిన్నువాక - ఆకాశ గంగ, మిన్ను కొనలను.
ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
చారలేరు - ఆకాశ గంగ; చదలేరు - ఆకాశ గంగ.
తెలియేఱు - ఆకాశ గంగ. తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము. 

పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది -
పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).

తరణికులేశ నా నుడులఁ దప్పులుగల్గిన నీదు నామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచు వంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్వముం
దరమె గఱింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.

తా. సూర్యవంశమున జన్మించినవారిలో శ్రేష్ఠుడైనవాడా ! నా మాటల యందు దోషము లెన్నియున్నను, నీయొక్క నామముతోడ శ్రేష్టమయి నదియు రచింపఁబడినదియు, కావ్యము పవిత్రమయినది కదా ? (అగు ననుట) అనగా ఆకాశగంగ యొక్క నీరు ప్రవహించుచు, వంకరగా పాఱినను ముఱికిగల ఆకారములో ప్రవహించినను, దాని మహత్మ్యము ఎన్నుటకు శక్యమా. (కాదనుట)

ఆకాశే తారకం లింగం పాతాళే హఠకేశ్వరః
భూలోకేచ మాహాకాలే లింగత్రయ నమోస్తుతే.

నింగి - ఆకాశము.
నింగిచూలు -
వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.
నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.
వ్యోమకేశుఁడు - శంకరుడు, వ్యు.ఆకాశము జూట్టుగా గలవాడు.
శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు. 

వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
ఆకసము -
మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.

విశుద్ధ చక్రము చంద్రలోకము. చంద్రుని వంటి కాంతి కలది నై విశుద్ధ చక్రమును పద్మము, హంస అను వర్ణాలు. విశుద్ధ చక్రము శుద్ధ స్పటిక సంకాశ మగుట వలన ఆ పేరు వచ్చినది.

విశుద్ధౌ తే శుద్ధ - స్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీ - మపి శివసమానవ్యవసితామ్,
యయోః కాంత్యా యాంత్యా - శ్సశికిరణసారూప్యసరణే
ర్విధూతాంతర్ధ్వాంతా - విలసతి చకోర జగతీ. - 37శ్లో
తా.
ఓ జననీ! చీకటి తొలగిన చకోర పక్షివలె, జగత్తు ఏ పార్వతీ పరమేశ్వరుల యొక్క చంద్ర కిరణములవలె ప్రకాశించు మార్గమున వెలుగొందునో, అట్టి నీ విశుద్ధ చక్రమందు స్ఫటికమువలె నిర్మలమై, ఆకాశ తత్త్వమున కాధారమైన శివ తత్త్వమును, శివ సారూప్యమగు దేవిని గూడ సేవించుచున్నాను. - సౌందర్యలహరి

ఓం మహావజ్రేశ్వరైనమః : నిత్యతిధులలో శుక్లషష్టి తిధికి అధీశ్వరియై - పిండాండంలోని విశుద్ధచక్రానికి అధిస్ఠాత్రియై, శ్రీచక్రబిందు వికాసమందలి త్రికోణాకారంలోనీ అధిస్టాన దేవతయగు మహావజ్రేశ్వరీ దేవతకు ప్రణతులు.

విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా|
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా. - 98శ్లో

పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
పోషయతీతి పుష్కరం. పుష పుష్టౌ, - పోషించునది.   

విష్ణువు(ప్రజాపతిర్వై మనః) మనస్సే పద్మమగును. ఆ పద్మమునకు ఆకాశము శిరస్సు. మేరువు(బంగారము) కాండము. మనస్సు మేరువువైనా చాటుతుంది కాని కాలు గడపదాటదు. ఆకాశము కన్న మనసు గొప్పది.

గండూషము - 1.పుక్కిలింత, 2.పుడిసిలి, 3.ఏనుగు తొండము చివర, 4.పుక్కిట పట్టిన నీరు.
కొణిదిలి - పుడిసిలి. చేర - చాచిన అరచేయి, పుడిసిలి.
కమి - 1.పంపబడిన వ్రేళ్ళుగల పుడిసిలి(కమికిలి), 2.కబళనము, 3.తృప్తి.
కమికిలి - పంపబడిన వ్రేల్ళుగల పుడిసిలి. 

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమ పువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.
కాశ్మీరము -
1.కుంకుమపువ్వు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీర దేశము. కాశ్మీరము నందు దేవీస్థానం మేధ.
అంబరు - ఒక పరిమళద్రవ్యము, సం.అంబరమ్.
అంబరీషము - 1.యుద్ధము, 2.మంగలము, 3.పశ్చాతాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.

వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా, పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధవహాత్మతా న్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా,
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చే ద్బాలేదు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే! స్వామిన్! త్రిలోకీ గురో. - 30శ్లో
తా.
మస్తకంపై బాలచంద్రుడ్డి ధరించిన దేవా(పశుపతి - శివుడు) ! జగత్రయాలకు గురువైనవాడా ! అంబరాలను (బట్టలను) శుభ్రం చేసే విషయంలో సహస్రకరాలు కల సూర్యత్వాన్నీ, పువ్వులతో పూజించడంలో(వ్యాపకత్వం) విష్ణుత్వాన్నీ, సు గం ధా న్ని వ్యాపింపజేయడంలో వాయుత్వాన్నీ, ఆహారాన్ని పక్వం చెయ్యడంలో - ఇంద్రత్వాన్నీ, పాత్రలను శుభ్రం చెయ్యడంలో(సువర్ణత్వం) అంటే బ్రహ్మత్వాన్నీ నేను పొంది ఉంటే నీ సేవ చేయగలను. - శివానందలహరి   

అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి.1.విష్ణుశంఖము, 2.మేఘము, 3అభ్రకము, 4.(వృక్ష.) వావిలి, 7.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్దిశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.

6. సహస్ర దళమును కర్పూరవర్ణమునగు (ఆగ్నేయ)నాజ్ఞాచక్రము నందు - పరమాత్మ కలడు. పరమాత్మకు ఇది అధిస్ఠానం.

ఆజ్ఞాచక్రము - కనుబొమల నడుమ నుండెడి చక్రము, మొగము సహస్రార పద్మము. (సహస్రాక్షమందు దేవీస్థానం ఉత్సలాక్షి).

ఆజ్ఞ - 1.ఉత్తరువు, ఆదేశము, 2.దండనము, 3.(యోగ.) కనుబొమల నడుమ నుండెడి చక్రము, వికృ.ఆన.
ఆదేశము -
1.ఆజ్ఞ, 2.ఉపదేశము, 3.(వ్యాక.) ఒకదాని స్థానమున వచ్చు వేరొక వర్ణాదికము, ఉదా. గసడదవా దేశము.
ఉపదేశము - 1.హితవచనము, 2.మంత్రోపదేశము, 3.విధివాక్యము.
ఉత్తరువు - ఆజ్ఞ, అనుజ్ఞ, సెలవు, సం.ఉత్తరమ్.   
అనుజ్ఞ - 1.అనుమతి, 2.ఉత్తరువు, ఆజ్ఞ.
అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
సెలవు - సెలగు, వి.1.ఆజ్ఞ, 2.ఉపయోగము.
ఆజ్ఞప్తి - ఉత్తరువు, ఆజ్ఞ, వికృ.ఆనతి.
ఆనతి1 - 1.మ్రొక్కు, 2.నమ్రత, 3.వంగుట.
ఆనతి2 - ఉత్తరువు, సం.ఆజ్ఞప్తిః.
ఆన - ఉత్తరువు, సం.ఆజ్ఞా. 

అపవాస్తు నిర్దేశో నిదేశ శ్శాసనం చ సః శిష్టి శ్చాజ్ఞా చ -
అపవదన మపవాదః. పా. అవవాదః. వద వ్యక్తాయాం వాచి. - పనిఁబూని చెప్పుట.
నిర్దిశ్యతే అదిశక్యతే నిర్దేశః, నిదేశశ్చ, దిశ అతిసర్జనే. - ఉపదేశింపఁబడునది.
శాస్యతే అనేన శాసనం, శిష్టిశ్చ. ఇ. సీ. శాసు అనుశిష్టౌ. - దీనిచేత శిక్షింపఁబడును.
అజ్ఞాపనం అజ్ఞా - అజ్ఞాపించుట. ఈ ఐదు ఆజ్ఞ పేర్లు.       

నిర్దేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట.
నిదేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట, 3.దాపు.
శిష్టి - ఆజ్ఞ. (ఆజ్ - ఈషదర్థః; జ్ఞా – జ్ఞానమ్)

శాసనము - 1.రాజుచేసిన దానముకై వ్రాసియిచ్చిన కవులు, చట్టము, 2.ఆజ్ఞ, 3.శిక్షించుట.
అనుశాసనము - 1.ఆజ్ఞ, 2.ఉపదేశము, 3.కలరూపు తెలుపుట.
శాసించు - 1.ఆజ్ఞాపించు, 2.శిక్షించు. 

తవాజ్ఞా చక్రస్థం - తపన శశికోటి ద్యుతిధరం
పరం శంభుం వన్దే - పరిమిళితపార్శ్వం పరచితా|
యమారాధ్యన్ భక్త్యా - రవిశశి శుచీ నామవిషయే
నిరాలోకే లోకే - నివసతే హి భాలోకభువనే|| 36శ్లో
తా.
తల్లీ ! ఎవనిని భక్తితో నారాధించి సూర్యచంద్రాగ్నులకు అగోచరమై చూడ శక్యము కానదియును, జనరహితమై ప్రకాశించు చంద్రికా మయమైన సహస్రార చక్రమునందు, శశికోటి సూర్యచంద్రుల కాంతిని ధరించినవాడును, సరియగు చిత్తుచేత ఆవరింపబడిన నిరుపార్శ్వముల నాక్రమించియున్న ఆ పరాత్పరుడగు శంభుని గూర్చి నమస్కరించు చున్నాను. – సౌందర్యలహరి

ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ|
సహస్రారంబుజారూఢా సుధాసారాభివర్షిణీ.

సహస్రారము - షట్చక్రములలో నొకటి (ఇది శిరస్సు నందుండును)షట్చక్రాలకు పైన, శిరస్సునకు నడుమ సహస్రారము - అదే బ్రహ్మరంద్రం అనే పేరుతో వుంది. బ్రహ్మరంధ్రము నందు సత్యలోకము ఉండును.

చోడు - బ్రహ్మరంధ్రము, రూ.సోడు. ఉచ్చి - బ్రహ్మరంధ్రము, నడితల, సోడు. ముచ్చిలి - ముచ్చిలిగుంట, పెడతల యందలి గుంట.

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మా మనుస్మరన్|
యః ప్రయాతి త్యజ న్దేహం స యాతి పరమాం గతిమ్||
తా||
బ్రహ్మవాచకమగు 'ఓమ్' అను ఏకాక్షరమును ఉచ్ఛరించుచు, తదర్థ భూతమగు నన్ను స్మరించుచు, బ్రహ్మరంధ్రము ద్వారా ప్రయాణము చేయువాడు ఉత్కృష్టమైన గతి పొందును. - 13శ్లో  అక్షర పరబ్రహ్మయోగము, భగవద్గీత

ఓం సహాస్రారాంబుజారూఢాయై నమః : బ్రహ్మ రంధ్రానికి అధోభాగంలో సహలసత దళాలతో తేజరిల్లు పద్మం భాసిల్లుతూంటుంది. ఆ సహస్రారకమ ఆలోపలిభాగాన ఆ రూఢయైన పరమేశ్వరికి అంజలులు.

సహస్ర పత్రము - కమలము, తామర. సహస్రదళ కమల కర్ణికా రూపము.

అన్నిటికీ పైన వుండే సహస్రారం బిందువునకు స్థానం. (బిందు చక్రమునందు చంద్రుఁడు, ప్రజాపతి ర్చన్దుః) పరబ్రహ్మ ప్రతిపాదకమైనవి సకల సకలవర్ణములు.

చంద్రము(ప్రజాపతిర్వై చంద్రమా) - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు. కర్పూరవర్ణము - ఘనసారము, cranium.

సహస్రదళ కమలమునందున్న చంద్రునికి వృద్ధి క్షయములు లేవు.  చంద్రునిలో పదునారవ భాగము, పదునారవ చంద్రకళలు పదాఖ్యయై, సహస్రారస్థితమై యున్నది. అది నిత్యము జ్యోత్స్నామయ లోకము.

శుక్ల రక్తములకు ఆజ్ఞాచక్రము ద్విదళము. సత్త్వప్రధానము శుక్లము. రజః ప్రధానము రక్తము.

ఆగ్నేయము - అగ్నికి సంబంధించినది. 1.అగ్ని పర్వతము, 2.వివాహములో అరుంధతీ(సతులలో దేవిస్థానం అరుంధతి, వసిష్ఠుని భార్య) దర్శనానతరము యజుర్వేదులు చేయు ఒక శుభకర్మ(యజ్ – ఆరాధన), 3.కృత్తికా నక్షత్రము(కృత్తివాసుఁడు - ముక్కంటి, శివుడు. కృత్తి వాసః ప్రియే), 4.ఆగ్నేయాస్త్రము(అగ్ని దేవతాకమైన అస్త్రము).

దేహంలోని ఆయుః స్థానాలైన షట్చక్రాలకు ప్రతీక కృత్తికానక్షత్రం.

భ్రూ మధ్యమునందు ఆజ్ఞాచక్రం. ఇచ్చట మనస్తత్వము. దీని దళాలు రెండు. హం, క్షం అనే అక్షరాలు వీటిపై వుంటాయి. ఆజ్ఞాచక్రమున మనస్తత్త్వమనగా ఏకాదశేంద్రియ గణము.

ఇటుఫై యిలాగు చేయుము అని ఈశ్వరుని ఆజ్ఞా జీవునకు ఇక్కడ లభిస్తుంది. తండ్రి ఆజ్ఞని పాటించాలి. కనుక దీనికి అజ్ఞాచక్రం అని పేరు వచ్చింది. పరమాత్మకు ఇది అధిస్ఠానం.

ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రారపద్మమందు ఏకాంతమున భర్తతో విహరించు చున్నావు.

ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః : ద్విదళ పద్మంలో ఆజ్ఞాపరుడైన శ్రీగురువు భాసిల్లు చుండుటచే దానికి ఆజ్ఞాచక్రమని పేరు. అట్టి ఆజ్ఞాచక్రాంతరాళస్థయై తేజరిల్లు శ్రీమాతకు నమోవాకాలు. 
ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః : భ్రూమధ్య ప్రదేశంలో తేజరిల్లు నట్టి ఆజ్ఞాన చక్రకమలం నిలయంగా గల దేవికి ప్రణతులు.
ఓం సహస్ర పద్మస్థాయై నమః : శిరోవరి మధ్య స్థానంలో సహస్రదళాలతో భాసిల్లు పద్మంలో నివసించు మాతకు ప్రణతులు.

పరమాత్మ – Absolute - వైకుంఠము
కేవలుడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
చేతనము - 1.ప్రాణముకలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8స్వభావము, 9హృదయము.  ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు. తనకు తానే పుట్టినవాడు, 4.మన్మధుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.

అభయము - భయములేనిది వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు(ఉశీరము).
పురుషుడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ. పురుషో హి ప్రజాపతిః

ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది.

తను శబ్దము తోలునకును(చర్మము), శరీరమునకును పేరు.
తన - ఆత్మార్ధకము; తనయ - కూతురు; తనయుడు - కొడుకు; మనుషుని ఆత్మ కొడుకు. వర్ణుడు - కుమారుడు.

ఆత్మ అంటే తాను. నీళ్ళకంటే, నేలకంటే, ఆకాశం కంటే, గాలి(వాయువు)కంటే ఎక్కువగా వెలిగేది ఒకటే. అది ఆత్మ ఒకటే. ఆత్మ నిత్య చైతన్య స్వరూపమైనది. ఆత్మ ఎల్లప్పుడూ ప్రియమైనది ఎందువలన నంటే అదే ఆనందానికి మూలాధారం.

షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహా
షట్చరాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్|
షట్చక్రాచితపాదుకాం చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీ శ్రీమాతరం భావయే. 

parvati