Wednesday, February 8, 2012

తిధులు

ఓం ప్రతిపన్ముఖ్య రాకాంత తిధి మండల పూజితాయై నమః : పాడ్యమీ ప్రభృతి పూర్ణిమా పర్యంత విశేష విధులచే పూజించ దగిన మాతకు (లలితాదేవి) ప్రణతులు. ప్రయాగమునందు దేవిస్థానం లలిత.

దేవేశీ దండనీతిస్థా - దహరాకాశ రూపిణీ|
ప్రతిపనుముఖ్యరాకాంత - తిథిమండలపూజితా.

తేది - తిథి, దినము, రూ.తేదీ, సం.తిథిః.
తిథి -
1.పాడ్యమి మొదలగునవి, 2.శ్రాద్ధదినము.

తదాద్యా స్థిథయో ద్వయోః,
తన్యతే షష్టిఘటికాభిరితి తిథిః, ఇ. ప్స. తనువిస్తారే - అఱువది 60 గడియలచేఁ బెంపొందునది. 

ద్యుపు - 1.ఆకాశము, 2.దినము, 3.స్వర్గము.

దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.

ఘస్రో దినాహనీ వా తు క్లీబే దివస వాసరౌ,
ఘన త్యన్ధకారమితి ఘస్రః, ఘ స్డ్ అదనే - అంధకారమును దినివేయునది.
1. ద్యుతి అంధకారమితి దినం. దో అవఖండనే - అంధకారమును ఖండించునది.
2. న జహాతి ప్రత్యాగమనమిత్యహః. స. న. ఓహాక్ త్యాగే – తిరిగి వచ్చుటను విడువనిది.
సూర్యేణ న హీయత ఇత్యహః - సూర్యునిచే విడువఁబడనిది.
3.దీవ్యంతి జనా అస్మిన్నితి దివనః. ప్న. దివు క్రీడాదౌ - దీనియందు జనులు ప్రకాశింతురు.
వసంత్య స్మిన్నితి వాసర్థః. ప్న. వస నివాసే - దీనియందు వసింతురు.  
వాసయతి స్థాపయతి జదితి వాసరః - లోకమును నిలుపునది.
4.దివసవాసర శబ్దౌ వికల్పేన నపుంసకలిఙ్గే వర్తేతే - దివసము, వాసరము ఇవి యొక పక్షమున నపుంసకలింగములు నగును. ఈ నాలుగు 4 పగలు పేర్లు.

ఘస్రము - దినము, విణ.కర్కశము.
దినము -
1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
పగలు - పవలు, దినము.
దినకరుఁడు - సూర్యుడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
లోకబాంధవుఁడు -
సూర్యుడు. లోకబాంధవో లోకబాంధవః - లోకమునకుఁ చుట్టము, బంధువు.
ౙగముచుట్టము - సూర్యుడు.
ౙగముకన్ను - సూర్యుడు.
జగచ్చక్షువు - సూర్యుడు. 

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.   
భా||
ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. 

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. 

దివసము - 1.పగలు, 2.దినము, రోజు. 
వాసరము -
దినము.
రోజు - దినము.
రోజు -
24 గంటలు, దినము భూమి తన అక్షముపై పడమటనుండి తూర్పునకు తనచుట్టును 360 డిగ్రీలు తిరుగుటకు తీసికొను వ్యవధి, సం.రోచిః.

దినరేఖ - (భూగో.) 180 డిగ్రీలు రేఖాంకముతో సరిపోవు రేఖ. (పశ్చిమముగ పయనించువాడు ఈ రేఖ దాటినప్పుడు తేదీకి ఒక రోజు కలుపుకొనవలెను. అట్లే తూర్పుగ పయనించువాడు ఒక రోజు తీసివేసి కొనవలెను. ఈ ఊహారేఖ తూర్పునకు అలాస్కా పశ్చిమమునకు దక్షిణ సముద్ర ద్వీపములు (South Sea Islands) కలవు. 

వాసరము - దినము.
వాసవుఁడు -
ఇంద్రుడు.
ఇంద్రుఁడు - 1.దేవతరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

అహము - 1.దినము, రేయింబవలు, 2.పగలు, రూ.అహస్సు, 3.గర్వము.  
అహస్సు -
అహము. అహమ్మతి - అజ్ఞానము.
అహస్కరుఁడు - సూర్యుడు.
అహర్పతి - 1.సూర్యుడు, 2.శివుడు, 3.జిల్లేడు.

అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
ఔషసి -
వేకువ, ఉషఃకాలము.
ఉషస్సు - తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము, ప్రత్యూషము, వేకువ.
ప్రత్యూషము - వేగుజాము; వేకువ - వేగుజాము.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః.
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1.రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగుఁ(ౙ)జుక్క - శుక్రుడు Venus.     

ఆహ్నికము - 1.పగలు చేయదగినది, 2.పగలు జరుగునది, వి.1.పగలు చేయదగిన కర్మము, 2.మహాభాష్య ప్రకరణము.

రోచిస్సు - 1.కాంతి, 2.సూర్యకిరణము.
రోచనము -
ప్రకాశించునది.
రోచిష్టువు - ప్రకాశించువాడు.

మధ్యాహ్నము - పట్టపగలు, దినము నడిమి భాగము.
మధ్యాహ్న రేఖలు - (భూగో.) రేఖాంశములు, ఉత్తర, దక్షిణ ధ్రువముల గుండా పోవు వృత్తములు.

రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
సూర్యుఁడు -
వెలుగురేడు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి(Jupiter).
శరీరి - ప్రాణి; జీవి - జీవించువాడు, వి.ప్రాణి.

త్రిద్యుస్పృక్కు - మూడు దినములు వ్యాపించిన తిథి; అవమము.

దర్శ, ద్రష్ట, దర్శతా, విశ్వరూపా(భూమిరూపం), సుదర్శనా (విష్ణు చక్రము), ఆప్యాయమానా, అప్యాయమానా, ఆప్యాయా, సూవృతా, ఇరా, అపూర్వమాణా, ఆపూర్వమాణా, పూరయంతీ, పూర్ణా, పౌర్ణమాసీ అని ఈ నామములు వేదములందు చెప్పబడినది.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.  
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది. 
సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ. 

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో  

ఉరస్సు - పక్షము.
పక్షము -
 1.నెలయందు పదునైదు దినములు (శుక్ల కృష్ణ పక్షములు) 2.రెక్క. 

మూలే తు పక్షతిః పక్ష భేదయోః :
పక్ష భేదము లనఃగా శుక్ల కృష్ణపక్షములును, పక్షిఱెక్కలును; వాని యొక్క మూలమనఁగా పాడ్యమియును, ఱెక్కలమొదలును. ఈ రెంటికిని పక్షతి యని పేరు. పక్షయో ర్మూలం పక్షతిః. సీ. పక్షముల మొదలు గనుక పక్షతిః.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చః మానద |

ఏట - పక్షము, ప్రక్క, విన.అతిశయము, రూ.ఏటము.
ఏటవాలు - 1.పక్షపాతము, 2.వంపు.

పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు(కొలువుకాడు).
చంద్రుడు -
నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము(నెలకువ - స్థానము), 5.కర్పూరము.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురమామ, సం.చంద్రమాః. 

సూయత ఇతివా సోమః - ప్రతి పక్షము నందును బుట్టింపఁబడువాడు.
ప్రతిమాసం గ్లాయతిక్షయతీతిగ్లౌం. ఔ. పు. గ్లేంలేహర్షక్షయే - ప్రతిమాసము క్షయించువాడు.

పక్షౌ పూర్వా పరౌ శుక్ల కృష్ణా - పూర్వాపరౌ పక్షౌ శుక్ల కృష్ణా విత్యుచ్యేతే, ఇందు పూర్వపక్షము శుక్ల మనియు, అపరపక్షము కృష్ణ మనియుఁ జెప్పఁబడును. మొదటిది శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము.

అధవా - అట్లుకాకున్న, పక్షాంతరమున.
పక్షాంతరము -
మరియొక విధము.   
ఏని - అవ్య. పక్షాంతరమును అనిశ్చయమును తెలుపును.
పక్షాంతరస్థాపన - (గణి) ఒక పక్షము నుండి మరొయొక పక్షమునకు రాసులను కొనిపోవు ప్రక్రియ (Transposition). 

ప్రతి నెలయందు మొదటి 15 దినములకు శుక్లపక్షము, లేక శుద్ధపక్షము అనియు 2వ భాగముగల 15 దినములకు కృష్ణపక్షము లేక బహుళపక్షము అనియు పేర్లు కలవు. శుక్లపక్షము నందు వెన్నెల వృద్ధియగును. కృష్ణపక్షము నందు చీకటి వృద్ధియగును.

తొలుపక్కము - శుక్లపక్షము.
తొలుత -
1.ముందు, 2.మొదట.

తెలిపక్కము - శుక్లపక్షము.
తెలి -
1.తెల్లనిది, నిర్మలము.
తెల్ల - ధవళము, 2.స్పస్టము.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషము లేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి.

ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ధవళిమ -
తెలుపు.

సిత పక్షము - శుక్లపక్షము.
సిత -
1.చెక్కర, 2.తెల్లగంక
సితము - 1.తెల్లనిది 2.కట్టబడినది
సితాభము - కర్పూరము రూ.సితాభ్రాము

సితుఁడు - శుక్రుడు, అంతశుద్ధికి శుక్రుడు విణ.తెల్లనివాడు.

శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
చంద్రబీజము -
వెండి. 
వెండి - రజతము, అవ్య. మరియు (వెండియు).
రజతము - 1.వెండి, 2.హారము, విణ.తెల్లనిది (భూగ.) ఒక లోహము (Silver) సం.వి. (రసా.) వెండి ధాతువు లలో నొకటి. (Argentum). నాణెములలో ఉపయోగపడు ధాతువు.
రజతాద్రి - 1.వెండి కొండ, 2.కైలాసము.
కైలాసము - కుబేరుని ఉనికిపట్టు, 2.శివుడుండు వెండికొండ.

ఉత్తరపక్షము - 1.సిద్ధాంతము (వ్యతి. పూర్వపక్షము), 2.కృష్ణపక్షము.
సిద్ధాంతము -
1.స్థిరమైన పక్షము, 2.నవవిధ జ్యోతిష గ్రంథములు (గణి.) గణిత ప్రవచనము నందలి సత్యమును నిరూపణ చేయ నుద్దేశించినది. నిరూపణ చేయ వీలైన ప్రాథమిక స్వీకృతముకాని గణిత ప్రవచనము (Theorem) (గణి., భౌతి., రసా.,) నిరూపించబడవలసిన తత్త్వము లేదా ఉపయుక్తులచే రుజువుచేయ బడవలసిన ప్రమేయము.
రాద్ధాంతము - సిద్ధాంతము, స్థిరమైన పక్షము.
సిద్ధాంతి - 1.జ్యోతిషము తెలిసినవాడు, 2.తత్త్వ శాస్త్రము తెలిసినవాడు.

రాద్ధాంతము - సిద్ధాంతము, స్థిరమైన పక్షము.

బహుళము - 1.ఆకాశము, 2.కృష్ణపక్షము, విణ.1.అధికము, 2.తరచు, (వ్యాక.) ఒకప్పుడు కలుగుట ఒకప్పుడు కలుగ కుండుట, ఒకప్పుడు వైకల్పితముగా నుండుట, ఒకప్పు డొంకొక విధముగా నుండుట.

పెల్లు - హెచ్చు, విణ.అత్యంతము, సం.బహుళమ్.
హెచ్చు -
అధికమగు, రూ.ఎచ్చు.
ఎచ్చు(ౘ) - అధికము, విణ.అధిక్యము, క్రి.అధికమగు.
అధికము - ఎక్కువైనది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
వలదు - అధిక్యము, అవ్య.వద్దు.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము. 
నితాంతము - పెల్లు, అధికము. నిర్భరము - పెల్లు, అధికము. 

తరుచు - త్రచ్చు.
త్రచ్చు -
చిలుకు, మధించు, రూ.తరుచు, సం.ధర్ష్, తక్ష్. 
త్రచ్చన - 1.చిలుకుట(చిలుకుడు - చిలుకుట), 2.చెక్కుట.
మథనము - త్రచ్చుట.

అపరపక్షము - బహుళ పక్షము, కృష్ణపక్షము.
బహుళ పక్షము -
చీకటి పక్షము, వ్యతి.శుద్ధపక్షము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

శబ్దం లేకుంటే జగత్తు అంతా చీకటే. చీకటియే మాయ - అజ్ఞానం. చీకటి శాశ్వతము కాదు.

1. ప్రతిపత్తు - పాడ్యమి.

అథ పక్షతిః, ప్రతిపద్ద్వే ఇమే స్త్రీత్వే :
పక్షస్య మూలం ప్రారంభః - శుక్ల కృష్ణ పక్షములయొక్క ప్రారంభము.
ప్రతిపద్యతే చంద్రస్య ఉదయః క్షయో వా అస్యాం ప్రతిపత్ - దీనియందు చంద్రుని యొక్క ఉదయముగాని క్షయముగాని తెలియఁబడును. ఈ రెండు పాడ్యమికిఁ పేర్లు.

పాడ్యమి - మొదటి తిధి, ప్రథమా.  ప్రథమశబ్దము మొదటిదానికిని, శ్రేష్ఠమైనదానికిని పేరు.

ప్రభృతి - మొదలు.
ప్రథమము -
1.ముఖ్యము, 2.మొదటిది.
ముఖ్యము - ప్రధానము.
ప్రధానము - 1.ముఖ్యము, 2.ముందిచ్చుసొమ్ము, 3.వివాహా త్పూర్వము వధువున కలంకారాదుల నిచ్చినిశ్చయించుకొనుట, 4.పరమాత్మ. 

ప్రథమో జ్ఞానశక్త్యాత్మా; ప్రథమం భారతీనామ; ప్రథమం శైల పుత్రీతి.

ఉదయే ధిగమే ప్రాప్తిః : ప్రాప్తి శబ్దము పుట్టుటకును, లాభమునకును పేరు. ప్రాపణం ప్రాప్తిః. సీ ఆప్ ఌ వ్యాప్తౌ పొందుట ప్రాప్తి.

దర్శ - అనగా అమావాస్య తరువాత వచ్చు ప్రతిపత్తి (పాడ్యమి).

ప్రత్తిపత్తు మొ||లుగా శుక్లపక్ష కృష్ణపక్షములందలి తిథుల స్వరూపము లగుట చేత క్రమముగా వృద్ధి క్షయములు కలవగు చున్నది. మరల అవే కృష్ణ ప్రతిపత్తు నుండి అమావాస్య వరకు తిధులను ప్రవర్తింప జేయు నవియు 15 కాగా వృద్ధి క్షయములు యీ 15 వరకే.

చంద్రుని ప్రథమ కళకు ప్రతిపత్తు అని నామము తో వ్యవహారము. ఆ ప్రతిపత్తే కళా స్వరూపమున సూర్య మండలమునుండి బయలు వెడలి వచ్చియున్నదగును. కృష్ణపక్షమున ఆ ప్రథమ కళ సూర్యమండలమును ప్రవేశించు చున్న దగును. – సౌందర్యలహరి

2. విదియ - రెండవ తిధి  సం.ద్వితీయా (ద్వితీయా బ్రహ్మచారిణీ)
ద్యతీయ -
1.భార్య, 2.విదియ, 3.రెండవది స్త్రీ, 4.(వ్యక) ద్వితీయా విభక్తి.

దయిత - 1.భార్య, 2.స్త్రీ.
దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.

భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు. భరింపదగినది. పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.

భ్రియత ఇతి భార్యా. భృఞ్ భరణే. - భరింపఁబడునది.
యజ్ఞాధికార ఫలభాగినో ర్జాయాపత్యో రన్యతరత్వేన ద్వితీయా - యజ్ఞాధికార మందు ఫలమును బొందునప్పుడు పతితోఁ గూడ తాను రెండవది.

ద్వితీయుఁడు – కొడుకు, విణ.రెండవవాడు.

ని - ద్వితీయా విభక్తి ప్రత్యయము.
ను -
1.ద్వితీయా విభక్తి ప్రత్యయము, 2.క్రియాప్రత్యయము, ఉదా.తద్ధర్మాదు లందు ప్రథమ పురుషైక వచనమున చేరు ప్రత్యయము, సూర్యుడు తూర్పున ఉదయించును, 2.సముచ్ఛయార్థకము, ఉదా.వాడును నీవును రండు.
తద్ధర్మము - (వ్యాక.) 1.మూడు కాలములను బోధించు క్రియాపదము, ఉదా.సూర్యుడుదయించును, 2.దాని యొక ధర్మము, 3.స్వభావము.

కార్తీకశుద్ధ విదియ(యమ ద్వితీయ)నాడు ఎవడు తన సోదరి యింట భోజనం చేస్తాడో, అతనికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుభయం కాని సంభవించని విధంగా యమునకు వరం ప్రసాదించాడు.

సోదరుణ్ని తనఇంటికి అహ్వానించి, మనఃపూర్వకంగా తన చేతి వంటకాలను వడ్డించి, తృప్తిపరిచే చెల్లెల్లు(స్త్రీ) వైధవ్యం పొందక చిరకాలం 'సువాసిని' గానే ఉంటుంది, అన్నాడు యమధర్మరాజు, తన చెల్లెల్లు యమునతో. పసుపు-కుంకుమ స్త్రీకి పుష్టి కలిగిస్తుంది.

లలాటం లావణ్య ద్యుతి - విమల మాభూతి తవ యత్
ద్వితీయం తన్మన్యే - మకుట ఘటితం చంద్రశకలమ్|
విపర్యాసన్యాసా దుభయమపి - సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః - పరిణమతి రాకాహిమకరః.|| - 46శ్లో
తా.
తల్లీ! లావణ్యమను వెన్నెల చేత స్వచ్ఛముగ ప్రకాశించుచున్న నీ లలాటమును కిరీటమందున్న రెండవ చంద్రకళ(నెలపాలు - చంద్రకళ)గా భావించుచున్నాను. ఈ రెండును  క్రిందు మీదుగ(తలక్రిందులుగా) నుండుటవలన పరస్పరము కలిసి, అమృతము పూసిన పూర్ణిమ చంద్రుని వలె మారుచున్నది.  - సౌందర్యలహరి          

ద్వితీయ (విదియ) చంద్రుని దర్శించునపుడు :
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర|
హిరణ్య మకుటా భాస్వదాచల చంద్ర నమోస్తుతే||

విదియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడు.

3. తదియ - తృతీయ, పక్షమునందు  మూడవ తిథి. సం.తృతీయా.  
తృతీయ -
1.పక్షమునందు మూడవ దినము, తదియ.

తద్దె - తదియ, తద్దియ, అట్లతద్దె ఉండ్రాళ్ళ తద్దె. తద్దికి అట్లు బలం అన్నారు.

తిగ - మూడు, రూ.తివ, సం.త్రికమ్.
తివ -
తిగ.
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస, (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.         

త్రయీధర్మము - వేదవిహిత ధర్మము.

మూఁడు - రెండు నొకటి, క్రి.1.సంభవించు, 2.ముగియు.
సంభవించు - క్రి.సంభవిల్లు.
ముగియు - క్రి.మరణించు, అయిపోవు.

ముఖ్య సంఖ్యలు - (గణి.) ఎన్ని? అను ప్రశ్నకు సమాధానము నిచ్చు 1, 2, 3, 4 వంటి అంకెలు (Cardinal numbers) (చూ. క్రమిక = Ordinal) 
బేసి - విషమము, సమముకానిది, విణ. (గని.) సరిగాని సంఖ్య (Odd), 1, 3, 5, 7, వంటివి, చూ. (ఆయుగ్మ సంఖ్య).
విషమము - సమము కానిది.
బేసికంటి - (బేసి+ కన్ను) ముక్కంటి.   
విషమాక్షుడు - శివుడు, వ్యు.బేసి కన్నులు కలవాడు.

తిగంటి - శివుడు, వ్యు.మూడు కన్నులు కలవాడు.

ముగురు - (మూడు+గురు) మువ్వురు, రూ.ముగ్గురు, మువురు, మూగురు, మూవురు.
మూగురు - ముగ్గురు.

తృతీయకము - (గృహ.) మూడవది, రూ.తృతీయము.
తృతీయము - తృతీయకము. తృతీయం శారదా దేవీ |

త్రింశత్తు - ముప్పది.
త్రింశము - ముప్పదవది.

అహస్సూతే సవ్యం - తవ నయన మర్కాత్మకతయా
త్రియామాం వామం తే - సృజతి రజనీనాయకతయా, |
తృతీయా - తే దృష్టి ర్దరదళిత హేమామ్భుజరుచిః
సమాధత్తే సంధ్యాం - దివసనిశయో రన్తరచరీమ్ || - 48శ్లో
తా.
ఓ భగవతీ ! నీ కుడికన్ను(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)సూర్యాత్మకమైన పగటిని సృజిస్తోంది, నీ యెడమ కన్ను చంద్రుడు అధిదేవతగాగల రాత్రి(రజని - రాత్రి)ని కలిగిస్తుంది. ఇంచుక వికసించిన సువర్ణకమలాన్ని(పుష్పించిన బంగారు పద్మపు కాంతిని)పోలిన నీ మూడవ నేత్రం(దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)దివారాత్రాల నడుమ కలిగే సంధ్యలను ఏర్పరుస్తోంది.(రాత్రిం బగళ్ళకు మధ్యనున్న సాయం సమయమును చేయుచున్నది) - సౌందర్యలహరి    

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని -
1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.   

ఓం నిత్యాక్లిన్నాయై నమః : శుక్ల పక్ష తృతీయాతిధి, తృతీయం శారదాదేవి దేవతయగు నిత్యక్లిన్నా దేవికి వందనాలు. (తృతీయా చిన్న ఘంటేతి) 

దుష్ట విద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ,
శారదా శరసంధానా సర్వశస్త్ర స్వరూపిణీ. - 24శ్లో

4. చతుర్థి - 1.పక్షమున నాల్గవ దినము, చవితి 2.నాల్గవది. 
(ౘ)చౌతి
  - చతుర్ధి, పక్షమందు నాల్గవ తిధి  రూ.చవుతి.(కూష్మాండేతీ చతుర్థకీ; చతుర్థం హంసవాహనా)

ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు -
మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. 

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్దకేలు వేలుపు.
ఉడ్డకేలు వేలుపు -
చతుర్భుజుడు, విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).

5. పంచమి - 1.పక్షము నందు ఐదవ తిథి, 2.ద్రౌపది.

ఏను - 1.అయిదు, 2.నేను యొక్క రూపాంతరము.

అరపది - అయిదు, పదిలోసగము, సం.అర్థపంక్తిః.
ౘవ్వంచ -
అయిదు; అయిదు - ఐదు (సంఖ్యావాచకము).
పంచకము - అయిదు; ఐదు - నాలుగునొకటి, అయిదు.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు - ఈ ఐదువన్నెలు, సుమంగళి చిహ్నములు), జీవభర్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

పంచముఖుఁడు - శివుడు (ఐదుమోముల వేలుపు.)
ఐదుమోముల వేలుపు -
పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.

ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు అను సంఖ్య.

ఓం పంచమ్యై నమః : పంచమీ తిథి దేవతా రూపిణికి ప్రణామాలు. పంచ తిధి రూపత్వ ముండుట వలన శ్రీవిద్యకు చంద్రకలా విద్య అని నామాంతరము కలదు.

పంచమీ పంచభూతేశీ - పంచసంఖ్యోపచారిణీ|
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా - శర్మదా శంభుమోహినీ. - 175శ్లో    

ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి -
1ద్రౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.
పార్వతి - 1.గౌరి(పర్వత పుత్రి) 2.ద్రౌపది(పాండవుల భార్య, ధీరురాలు).
గౌరి - దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌరుఁడు - చంద్రుడు Moon. 

దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుర్గ -
పార్వతి, రూ.దుర్గి.
కాళి - పార్వతి అవతారము, రౌద్రమూర్తి, భయంకరరూపం 1.గౌరి, పార్వతి, ఆది శక్తులలో ఒకటె 2.బొగ్గు. 
కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి శివుని భార్య, మంగళగౌరి, 5.క్రొత్త మబ్బు.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

ఎప్పుడదృష్టతా మహిమయించుక పాటిలునప్పుడింపుసొం
పొప్పుచునుండుగాక యదియొప్పనిపిమ్మట రూపుమాయుగా
నిప్పుననంటియున్న యతినిర్మలినాగ్నిగురు ప్రకాశముల్
దప్పిననట్టి బొగ్గునకుఁదా నలుపెంతయుబుట్టు, భాస్కరా.
తా.
బొగ్గు అగ్నితో చేరియున్నపుడు దానియందలి స్వచ్ఛమైన కాంతులతో ప్రకాశించును, అగ్ని సంబంధము తప్పిపొయినచో, అది ముందు తనకున్న కాంతిని బాసి నల్లగా నగును. అట్లే అదృష్టమున్న దినములలో మానవుడు ప్రభ కలిగి యుండును, లేనిచో తొల్లింటి ప్రభ నశించును.    

6. షష్ఠీ - పక్షమందు ఆరవ తిధి విణ.అరవది. శుక్లపక్షపు షష్ఠి సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైనరోజు. 

షష్టి - అఱువది.
షష్టము - అరవది.
షష్ఠ్యంకపద్ధతి - (గణి.) లంబకోణము 90 డిగ్రీలగను, డిగ్రీని 60 మినిట్లగను, మినిట్ ను 60 సెకెండ్లుగను పరిగణించెడి పద్ధతి (Sexagesimal system).  

సేగి - సష్ఠి, కీడు.
కీడు -
1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.

ఒప్పమి - 1.తప్పు, 2.కీడు, 3.అనంగీకారము.
తప్పు -
1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, తప్పిదము, క్రి.చిక్కు.
తప్పిదము - దోషము; దోసము - దోషము; దోషము - 1.తప్పు, 2.పాపము.
దోషాచరుడు - 1.చంద్రుడు, 2.రాక్షసుడు, వ్యు.నిసియందు తిరుగువాడు. 
దొషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు).
దోషజ్ఞుడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోషమెరిగినవాడు. 

అఱజాతి - 1.హీనకులుడు, 2.దుష్టుడు.   

పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము -
పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సప్పము - సర్పము, సం.సర్పః.
కలుషము - పాపము.

అపకారము - 1.కీడు, 2.ద్రోహము, 3.చెడ్డపని, రూ.అపకృతి.
ద్రోహము -
1.కీడుతలపు, 2.చంపునిచ్ఛ.
ద్రోహి - ద్రోహము చేయువాడు.
అపకృతి - అపకారము.
హాని - 1.తక్కువగుట, 2.కీడు.  
అపకరించు - క్రి.హానిచేయు.
అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
అపనోదము - తొలగించుట, పోగొట్టుట.
అపకర్ష్ణ - 1.తొలగించుట, 2.తగ్గించుట, 3.అవమానపరచుట, (భౌతి.) ఒక వస్తువు ఇంకొకదానిని మళ్ళగొట్టు గుణము (Repultion). 

ఉపకారికి నుపకారము
విపరీతము కాదుసేయ, వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
తా.
మేలుచేసినవానికి మేలుచేయుట గొప్పతనముకాదు. తనకు హాని చేసినవానికి వాని తప్పులను గణింపక మేలు(మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.)చేయువాడె గొప్ప బుద్ధిమంతుడు.      

కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.

ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు -
శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

షష్ఠం వాగీశ్వరీ తథా : నిత్య తిధులలో శుక్లషష్ఠీ తిధికి అధీశ్వరి - దేవి. ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ.

ఓం మహా వజ్రేశ్వర్యై నమః : శుద్ధ షష్ఠి తిధికి అధిష్ఠాన దేవత అయిన మహా వజ్రేశ్వరీ నామక దేవికి ప్రణతులు.

(షష్ఠా కాత్యాయి నీతి చ) కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి, కావిచీర కట్టిన విధవ. కాత్య అనే ఋషి తనకు పార్వతీదేవి కుమార్తెగా జన్మించాలని తపస్సు చేసాడు. అతనికి కూతురుగా(పార్వతి) ఆమె జన్మించింది కనుక కాత్యాయిని అనే పేరు వచ్చింది.

ప్రకృతిదేవి యొక్క షష్ఠాంశ (ఆరవ కళ) వల్ల బ్రహ్మ మానససృష్టిగా అవతరించింది. స్కందుని(కుమారస్వామి) పత్ని పేరు దేవసేన, షష్ఠీదేవి. షష్ఠీదేవి కుమారస్వామి ప్రియురాలు, శిశురక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఆ దేవి దివ్యమాత.

శిశువు మానవుడి తండ్రి(తల్లి). - వర్డ్స్ వర్త్  

7. సప్తమి - పక్షము నందు ఏడవతిధి విణ.ఏడవది.
సప్తమము -
ఏడవది.
సప్తకము - ఏడు, విణ.ఏడవది.

అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య, 7number.
గుఱ్ఱము -
అశ్వము.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.  

సప్త అశ్వాః యస్య సః సప్తాశ్వః - ఏడు గుఱ్ఱములు గలవాఁడు.
సప్తనామకః అశ్వో యస్యేతి వా సప్తాశ్వః - సప్తయనెడు ఒక గుఱ్ఱము గలవాఁడు. - సూర్యుడు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

సప్తి - గుఱ్ఱము.
సప్త -
1.మనుమరాలు, 2.మనుమడు, 3.మున్మనుమడు, రూ.సప్తి.
పౌత్రి - మనుమరాలు, (కొడుకు లేక కూతురు కూతురు).
పౌత్రుఁడు - కొడుకు కొడుకు.
దౌహిత్రి - దుహితకొమార్తె, మనుమరాలు. 
దౌహిత్రుడు - దుహితకొడుకు, మనుమడు.
ఇనుమనుమఁడు - మునిమనుమడు, ప్రప్రౌత్రుడు.
ప్రపౌత్రి - ము మ్మ ను మ రా లు, పౌత్రుని కూతురు. 

ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
సంవత్సరము -
ఏడు; ఏడు - ఆరునొకటి.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సత్తా - సత, ఏడు, సం.సత్త,  వై.వి. శక్తి, సం.సత్వమ్.

సతనాల్కల జేజే - సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు -
అగ్ని.

రేవంతుఁడు - అశ్వశిక్షకుడు.
రౌతు -
రావుతు, రాహుత్తు రావుతు, సం.రాహుత్తః.
రాహుతు - గుఱ్ఱపు రౌతు, సం.రాహుత్తః.

అక్కరకు రానిచుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున, తా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
తా.
అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించినను కోరిక తీర్పని దైవమును, తానధిరోహించినప్పుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును బుద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచి పెట్టును.

8. అష్టమి - ఎనిమిదవతిథి. అష్టమా చాతి భైరవీ; (మ)అష్టమం బ్రహ్మచారిణీ.

లాఘువేల ప్రవాహము - (భూగో.) శుద్ధ బహుళ పక్షములందలి అష్టమీ తిథుల యందు సముద్రపు నీటిమట్టమును సూర్యుడొక వైపు, చంద్రుడు మరియొక వైపు ఆకర్షించుటచే కలిగిన అధికమైనపాటు.

అష్టమము - ఎనిమిదవది.
అష్టకము -
1.ఎనిమిదింటి సమూహము, 2.ఎనిమిది, 3.ఋగ్వేద మందలి ఒక భాగము, అట్టము, రూ.అష్టము.
అట్టము - ఎనిమిది పన్నములుగల వేదభాగము, సం.అష్టకమ్.
అష్టము - (భౌతి.) 1.ఎనిమిదింటి సమూహము, 2.ఒక క్రింది స్వరమునకు ఎనిమిదవ మీదిస్వరము (Octave).
ఎనిమిది - ఏడు నొకటి.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్. 
దచ్చికాళ్ళమెకము - శరభము, అష్టాపదము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
అష్టాపదము - బంగారము.
బంగారము -
దుర్లభము, వి.స్వర్ణము.
బంగరు - బంగారము, సం.భృంగారః.

(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.

ఎనబండ్రు - ఎనిమిదిమంది. 
ఎనుబది -
ఎనిమిదిపదులు, అశీతి.
అశీతి - ఎనుబది. 

అష్టమూర్తి - శివుడు, (పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు - అష్టమూర్తులు).
శివుఁడు -
ఈశ్వరుఁడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
పుష్పవంతులు - సూర్యచంద్రులు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
స్త్రీ - ఆడుది.
భటుఁడు - బంటు, సేవకుడు, పనివాడు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు.    

అష్టమూర్తికి నీకును న్యాయమునను
భేదమే లేదు గద యష్టవాద మేల
పాంచభౌతిక రవిచంద్ర భవభవముర
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

అష్టమీ చంద్ర విభ్రాజ - దళికస్థల శోభితా|
ముఖచంద్ర కళంకాభ - మృగనాభి విశేషకా. - 5శ్లో

ఓం అష్టమీ చంద్ర విబ్రాజ దళిక స్థలశోభితాయై నమః : సమానార్థభాగమై నఖోసీమను ప్రకాశింప జేయునట్టి అష్టమీ చంద్ర శోభలతో రాజిల్లు లలాటసీమ గలిగిన తల్లికి(లలితకు) నమస్కారాలు. 

అష్టమ్యం చతుర్థశ్యం నవమ్యాం భృగువాసరే|
పౌర్ణమాస్యా మమాయాం చ పర్వకాలే విశేషతః|| - లక్ష్మీసహస్రనామం

అష్టమీ నవమీ చైవ దశమ్యేకాదశీ తథా|
పౌర్ణమాసీ కుహూరూపా తిథీ రాత్రిస్వరూపిణీ|| - శ్రీ భువనేశ్వర్యస్టోత్తర శతనామ స్తోత్రము

9. నవమి - పక్షమందు తొమ్మిదవ తిధి విణ.తొమ్మిదవది.
నవమము -
తొమ్మిదవది, నవమి. (నవమం బుద్ధిదాత్రీ చ; నవమా సర్వసిద్ధిశ్చాత్, నవ దుర్గా ప్రకీర్తితాః)

నవకము - మృదుత్వము, సం.వి.తొమ్మిది.
తొమ్మిది -
ఎనిమిదియు నొకటి.
ముత్తిగ - (మూడు+తిగ) తొమ్మిది.
తొమ్మండ్రు - తొమ్మిదిమంది.

నవతి - తొంబది.  
తొంబది -
తొమ్మిది పదులు.
తొంబనూఱు - తొంబదు నూర్లు.
తొమ్మన్నూఱు - తొమ్మిది నూరులు, రూ.తొమ్మనూఱు. 

10. దశమి - 1.పక్షమున పదియవ తిధి, 2.పదియవది. (స్మృతో దశ| దశమం వరదాయినీ).  యంతి భ్రామ్యంత్యనయేతి ఇరా. ఇణ్ గతౌ. దీనిచేతఁ తిరుగుదురు.

దశాంశపద్ధతి -  (గణి.) పదులను పదుల వర్గములను ఉపయోగించి సంఖ్యలను వ్రాయుపద్ధతి, (Decimal system).
దశాంశభాగము - (గణి.) సంవర్గ భాగములోని దశాంశభాగము. దశకము యొక్క దశాంశ బిందువు తరువాతి భాగము (Mantissa) ఉదా. 30 అను అంకెకు 10 అధారముగా గ్రహించ బడినపుడు లఘు గణకము 1.2010 ఇందులో 2010 అను భాగము దశాంశ భాగము. ఒకటి 1 అనునది పూర్ణాక భాగము.  

ధోరణి - 1.పద్ధతి, 2.పంక్తి.

దశకము - పది.
పది  - దశకము, సం.పంక్తిః.
పంక్తి - 1.వరుస, 2.పది.

బంతి - చెండు, కందుకము, వై.వి.1.పంక్తి, 2.పది, సం.పంక్తిః. 
కండుకము -
బంతి, చెందు, రూ.కందుకము.  
కందుకము - బంతి, చెండు.
గేందుకము - చెండు, బంతి, రూ.గేండుకము.
చెండు - క్రి. ఖండించు, వి.1.కందుకము, బంతి, 2.పూబంతి.
చెండాడు - క్రి. ఖండించు. 

నఱకు - క్రి.ఖండించు.
నఱకుఁడు - ఖండనము.

ఈరేను - (ఇరు+ఏను) పది.

11. ఏకాదశి - 1.పదునొకండవ తిధి, 2.పదునొకండు తంత్రులుగల పరివాదిని యను వీణ.
ఏకాదశము -
పదునొకండు, విణ.పదునొకండవది.

శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఏకాదశీ వ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. 

దేవ నీ దయ యున్నచోఁ దేజమందు
నదియె ముక్కోటి పండుగ ముదము నొసగు
నిదియె యేకాదశీసేవ వృద్ధికరము
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.

అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనస్సు; మొత్తం పదకొండింటినీ భగవంతుని యందు నిలుపుటయే పదకొండవ తిధి అయిన ఏకాదశిలోని అంతరార్థం. 

పరితోవదతి సప్తస్వరానితి పరివాదినీ - తంతులతోఁ గూడిన వీణ, అంతటను సప్తస్వరములఁ బలుకునది.

కాయమీద మ్రాను కడురమ్యమైయుండు, మ్రాను మీద లతలు అలరుచుండు, లతలమీద వేళ్ళు నాట్య మాడుచు చుండు - వీణ.
తీగల బుర్ర - తీరైన బుర్ర - తనవారి చేతిలో పలికేటి బుర్ర - వీణ.

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి.(వాసరము - దినము.)
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా,
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ.

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ|
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణ జీవనీ||

ఏకాదశం క్షుద్ర ఘంటా : ఏకాదశి, పౌర్ణమి అమావాస్య మొదలగు పుణ్యదినములలో స్త్రీలతో (పరస్త్రీలతో) కలిసి తిరుగకుము.

12. ద్వాదశి - పక్షమందు పండ్రెండవ తిథి, దోదసి.
దోదసి -
ద్వాదశి, ఒకానొక తిథి.
బారసి - ద్వాదశి, సం.ద్వాదశీ, ద్వాదశాహః

ద్వాదశకము - పండ్రెండు.
పండ్రెండు -
(పది+ రెండు) ద్వాదశ సంఖ్య.
ద్వాదళము - పండ్రెండవది.
పరక - 1.రెండి వీసములు, 2.పండ్రెండ్రు, 3.గడ్డిపోచ.
ముచ్చౌకము - 1.పండ్రెండు (3x4), 2.మూడు చౌకములు.  
ఈరాఱు - (ఈరు + ఆఱు) రెండు ఆర్లు అనగా పండ్రెండు.

ద్వాదశాత్ముఁడు - సూర్యుడు.     
ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా. న. పు. - పండ్రెండు విధములైన మూర్తులుగలవాఁడు.

నాన్నోదకసమం దానం న ద్వాదశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యః పరం మంత్రం సమాతుర్ద్యైవతం పరమ్||
తా.
అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతి శాస్త్రము 

ఆరిరాధయిషుః కృష్ణం మహిష్యా తుల్యశీలయా|
యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతమ్||

13. త్రయోదశము - పదుమూడవది, వి.త్రయోదశి.
త్రయోదశి -
1.పదుమూడవది, 2.తిథులలో నొకటి, 3.పరివాదిని; పదుమూడు తీగలు గల వీణ.
సప్త - ఏడు తంతులు గల వీణ, పరివారిది. 

14. చతుర్దశి - 1.పక్షమున పదునాల్గవదినము, 2.పరివారిది యన వీణ, 3.పదునాల్గవది.
సప్త -
ఏడు తంతులుగల వీణ, పరివాదిని.  

ఈరేడు - (ఈరు+ఏడు) పదు నాలుగు, ఉదా.ఈరేడు జగంబులు.

బహుళ చతుర్థిని, సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుణ్ని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయంటారు. గుప్పెడు గరికతో పూజించినా గంపెడు సంపదలిస్తాడు గణనాథుడు.

బూదె - చతుర్దశి తిథి, సం.భూతః.
భూతము -
1.పృధివ్యాధి భూతములు (ఇవి:- పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.)2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.

దెత్తి - (వ్యావ.) భూతము.
బూతము -
భూతము, పిశాచము, సం.భూతః.
బూచి - భూతము, సం.భూతః.
బూ(ౘ)చులఱేఁడు - శివుడు. శివతేజ శ్చతుర్దశః.
భూతేశుఁడు - శివుడు. 

అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||
తా.
బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకలభూతములకు ద్రోహము గలుగని వృత్తిచేత జీవించవలయును. లేక భూతములకు స్వల్పపీడ సేయునట్టి వృత్తిచేతనైనను జీవింపవచ్చును. – నీతిశాస్త్రము

శర్వుఁడు - శివుడు, వ్యు.ప్రళయకాలమున భూతముల హింసించువాడు.   

ప్రణిహితము - పొందబడినది.
భావితము -
పొందబడినది.
ఆత్తము - 1.పొందబడినది, లబ్ధము, 2.హరింపబడినది, ఉదా.ఆత్తగర్వుడు.
ఆప్తము - 1.పొందబడినది, 2.నమ్మదగినది, 3.యథార్థజ్ఞానము కలది, 4.నిండినది, 5.యుక్తయుక్తమైనది, 6.(గణి.) భాగహారముచేయగా ఏర్పడిన సంఖ్య, లబ్ధము. 
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీసంయోగము, 3.లాభము, 4.చెలిమి, 5.రాబోవుకాలము, ఆయతి.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

లబ్ధము -పొందబడినది, వి.(గణి.)భాగహారము చేయగా నేర్పడు సంఖ్య. 
లబ్ధము - (గణి.) అంకగణిత ప్రక్రియలో నొకటి (Product).    
అధిగతము - 1.పొందబడినది, 2.చదువ బడినది, చక్కగా నేర్చుకొన బడినది.
ఇతము1 - 1.పొందబడినది, 2.పొందినది, 3.పోయినది(అపగతము – పోయినది), సం.వి.1.గతి, 2.జ్ఞానము.  
ఇతము2 - 1.కోరిక, 2.ఇంపు, రూ.ఇతవు(ఇతవు - ఇతము), సం.హితమ్.
హితము - 1.వెనుకటికి మేలుచేయునది, 2.ధరింపబడినది, 5.తగినది, 6.ఇష్టము.
హితవు - హితము, ఇతవు, మంచి.
హితవరి - ఇతవుచెప్పువాడు.
ఇతవరి - (ఇతవు+ అరి) హితము చెప్పువాడు, మేలుకోరువాడు. 
హితైషి - మంచికోరువాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.

గతి - 1.పోక, 2.విధము(ప్రకారము), 3.త్రోవ, 3.స్థానము, 5.ప్రమాణము, 6.ఆధారము, 7.ఉపాయము, (భౌతి.) చలనము(Motion).
జ్ఞానము - 1.తెలివి, 2.ఎరుక. విద్య - 1.చదువు, 2.జ్ఞానము.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదాశాహాని శుక్లః కృష్ణశ్చ మానద ||

భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది.
పృథివి -
పృథ్వి, భూమి. వ్యు.పృథుచక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది. పృథివీ హ్యేషా నిథిః సర్వాధార, సర్వసంపద్దాత్రి, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యమాన. 

పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
క్షత్రియుఁడు - రాచవాడు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.  
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.

పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
అర్జునుఁడు -
1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

నృనతి - రాజు, రూ.నరపతి.
నృపుఁడు -
రాజు; నృపాలుఁడు - రాజు.
నరపాలుఁడు - రాజు.
నృపలక్ష్యము - రాజునకు పట్టెడి తెల్లగొడుగు.
లోకసమ్మతము - చంద్రుని గొడుగు.

స్థానవృద్ధిక్షయజ్ఞస్య షాడ్గుణ్యవిదితాత్మనః |
అనవజ్ఞాతశీలస్య స్వాధీనా పృథివీ నృప ||

భా|| తనస్థితి యొక్క వృద్ధి క్షయాలు, షాడ్గుణ్యమూ తెలిసిన వానికి, అవమానింపబడని శీలం(శీలము - 1.స్వభావము, 2.మంచినడత.)కలవానికి ఈ భూమి అంతా స్వాధీన మవుతుంది. 

అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము -
1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బూ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విన.ఋణరాశి (Negative).
ఋణాత్మకము - (గణి.) శూన్యము కన్న తక్కువైనది, (Negative).
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము. జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః|
ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||
తా.
సకలజనులకు పశువులు, పెండ్లాము(పత్ని- భార్య), కొమాళ్ళు(సుతుఁడు - కొడుకు), ఇండ్లును(ఆలయము-1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి), జన్మాంతర ఋణసంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించు చున్నవి. కాబట్టి చింతించుటవలన లాభమేమి. - నీతిశాస్త్రము    

మహస్సు - 1.తేజము, 2.వెలుతురు, 3.యజ్ఞము, 4.ఉత్సవము.
తేజము -
1.ప్రకాశము 2.ప్రభావము 3.పరాక్రమము 4.రేతస్సు, రూ.తేజస్సు.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
ప్రభావము - 1.ప్రతాపము 2.తేజము.
పరాక్రమము - 1.బలము 2.శౌర్యము.
రేతము - 1.వీర్యము, శుక్లము 2.పాదరసము, రూ.రేతస్సు.

బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః| బుద్ధి మనస్సు కంటే శ్రేష్ఠమైనది.

వాయువు - ముఖ్యప్రాణుడు, (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.  వాయువు నిత్య సన్నిహితుడు. ప్రతిజీవిలోను వాయువు ప్రథాన రూపం శ్వాస.

నింగిచూలు - వాయువు వ్యు.ఆకాశము నుండి పుట్టినది. ఆకాశము నుండి జలము, జలము నుండి అగ్ని, వాయువు ఉద్భవించినది.

బహుళము - 1.ఆకాశము, 2.కృష్ణపక్షము, విణ.1.అధికము, 2.తరచు, (వ్యక) ఒకప్పుడు కలుగుట ఒకప్పుడు కలుగకుండుట ఒకప్పుడు వైకల్పితముగా నుండుట ఒకప్పుడు డింకొక విధముగా నుండుట.

బహుళపక్షము - చీకటిపక్షము, వ్యతి.శుద్ధపక్షము.

ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి, 2.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళ ద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.       

పంచభూత మహాగ్రాసా పంచభూతధి దేవత
సర్వప్రమాణా సంపత్తి స్సర్వరోగ ప్రతిక్రియా.

కళాహీనే సానుమతిః :
నిశాకరే కళాహీనే సతి సా పూర్ణిమా అనుమతి రిత్యుచ్యతే. చతుర్దశీ యుక్తేతి భావః - చంద్రుఁడు కళాహీనుఁడైనపుడు ఆ పున్నమ అనుమతి యనంబడును. అనఁగా జతుర్దశితోఁ గూడినదని భావము. ఒక కళ తక్కువగాఁగల చంద్రునితో గూడిన పున్నమ.

అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
అనుమోదము -
1.సంతోషము, 2.అంగీకారము, సమ్మతి.
సమ్మదము - సంతోషము; ప్రహ్లాదము - సంతోషము.
హ్లాదనము - సంతోషించుట, సంతోషము, రూ.హ్లాదము.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ. ఇచ్ఛ - అభిలాష, కోరిక.
సమ్మతము - ఇష్టమైనది, అంగీకృతమైనది, సం.వి. (గృహ.) స్వీకరణ, అంగీకారము, (Acceptance).
అంగీకారము - 1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
స్వీకారము - అంగీకారము.

ఉపగతి - 1.ప్రాప్తి, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.అంగీకారము.
ఉపగమము -
1.అంగీకారము, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.ప్రాప్తి, 5.కలియుట.

శర్వరీదీపక శ్చంద్రః ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ స్సుపుత్రః కులదీపకః||
తా.
చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ బ్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును బ్రకాశింపఁ జేయును. - నీతిశాస్త్రము

పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
పండుగ - సంబరము, ఉత్సవము, సంక్రాంతి మొదలైనవి.
సంబరము -
సంభ్రము, వేగిరపాటు, సంతోషము, పండుగ, రూ.సంబ్రము, సం.సంభ్రమః.
సంభ్రమము - (గృహ.) 1.సంబరము, 2.వేగిరపాటు, 3.భయము, 4.ఆదరము.  
సమ్రంభము - 1.వేగిరపాటు, 2.ఆటోపము. దడబడ - ఆటోపము.
ఆటోపము - 1.వే గి ర పా టు, 2.గర్వము, 3.వ్యాపించుట.
సంభ్రమించు - వేగిరపడు; వేగిరపాటు - వేగపాటు.
సంతోషము - సంతసము, ముదము.  
పబ్బము - 1.పండుగ, ఉత్సవము, 2.అతిథ్యము, సం.స్వరమ్.   
ఉత్సవము - 1.ఊరేగింపు, 2.పండుగ, 3.కోపము, 4.గర్వము.
సంవేగము - సంభ్రమము, వేగిరపాటు, సం.(జీవ.) ప్రేరేపణ (Impulse).
సంవేగాత్మకము - (గృహ.) సులభముగా మనోవికారము పొందు నట్టిది, (Emotional).
సంవేదకనాడులు - (జం.) జ్ఞానేద్రియముల (చర్మము, నాలుక, కన్ను, ముక్కు, చెవి) నుండి కేంద్ర నాడీమండలమునకు ప్రేరణలు పంపు నాడులు, జ్ఞాననాడులు, (Sensory nerves).
జ్ఞానతంతువులు - (గృహ.) ఈనరముల తంతువులు జ్ఞానేద్రియముల నుండి మెదడునకు వార్తలను గొపోవును, (ఇవి చైతన్యము కలుగచేయును), (Sensory nerves).
జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీగ్రాహియైన అవయవము (Sensory organ).   

ఆతిథ్యము - ఆతిథేయము, విణ.అతిథికొరకైనది.
ఆతిధేయము - అతిథి సత్కారము, విణ.అతిథికి యోగ్యమైనది.

పర్వముల సతుల గలియకు,
ముర్వీశుల కరుణనమ్మి యుబ్బకు మదిలో
గర్వింప నాలి బెంచకు,
నిర్వాహము లేనిచోట నిలువకు సుమతీ.
తా||
ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య మొదలగు పర్వదినములందు(సతుల గలియకు……సతి - 1.పతివ్రత స్త్రీ, 2.పార్వతి.) స్త్రీలోలుడై తిరుగకుము, మనస్సులో రాజులయొక్క(ఉర్వీశుఁడు - రాజు, భూపతి)దయను నమ్మి సంతోషించకుము, అహంకారం పొందునట్లుగా భార్యను(ఆలి)పోషించకు, ఏస్థలము నందైనను తనకు (నిర్వాహము - 1.శక్తి, 2.జరుగుబాటు)లేని యెడల ((తన మాటకు విలువలేని యెడ)ఉండుట మంచిదికాదు.       

సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు -
1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ వచ్చెడి ఉండ.

గ్రంథి - 1.బుడిపి, గడ్డవలె పుట్టు రోగము, 2.చెట్టు మొ.ని ముడి, 3.కీలు (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
జీవకణ సంహతి - (వృక్ష.) జీవకణ సమూహము, (Tissue).
బుడిపి - 1.మ్రాని యందలి ముడి, కనుపు, 2.బొప్పి. బొప్పి - బుడిపి. 
కణుపు - 1.బుడిపి, 2.వెదురు, చెరకు మొ.ని కనుపు, 3.(వృక్ష.) కాండముపై ఆకు బయలుదేరిన స్థానము (Node).
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు. 
గంటు - 1.కనుపు, బుడిపి, 2.గాయము, 3.వెండ్రుకలముడి, 4.రూకలముడి, క్రి.గాయపరచు.
గాయము - కత్తి మొ.వానితాకున గలుగు దెబ్బనరకు, క్షతి.
క్షతి - 1.గాయము, 2.నాశము. ధ్వంసము - నాశము.
ముడి - 1.గ్రంథి 2.చెట్టు మొ.ని. ముడి, 3.దారము ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.
గ్రంథికుఁడు - 1.జోస్యుడు(కాలజ్ఞుఁడు - జ్యోస్యుడు.), 2.సహదేవుడు.
జ్యోతిషికుఁడు - జోస్యుడు, (Astrologer).   

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము -
గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు.

అనిత్యాని శరీరాని విభవో నైవశాశ్వతః|
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః||
తా.
శరీర మనిత్యము, సంపద శాశ్వతము కాదు, మృత్యువెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగిన దని సహదేవుఁడు వచించెను. - నీతిశాస్త్రము 

పర్వవేలా తరంగము - (భూగో.) అధికమైన పోటు, అమావాస్యనాడు పౌర్ణమినాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో నుండు నప్పుడు సూర్యచంద్రుల ఆకర్షణ శక్తిచే సముద్రపు నీటి మట్టములో గలిగిన అధికమైన పోటు.

ఆటుపోటు - 1.సముద్రతరంగములు ముందుకు వచ్చుటకు పోటనియు, వెనుకకు పోవుటకు ఆటనియు అందురు. (దుఃఖము తెరలు తెరలుగా వచ్చుటకును దీనిని వాడుదురు), 2.బాధ, 3.దుఃఖము.

ఆటు - 1.అడువు, దెబ్బ, 2.తగ్గుట.
పోటు  - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 3.పెద్ద అల.
పాటు - 1.కష్టము, 2.శ్రమము, 3.పడుట, 4.అలయడగుట, 5.అల హెచ్చగుట, సం.పత్, పాతమ్, (అర్థ,) శ్రమ, వాంఛించిన ఏ వస్తువు నైనను ఉత్పత్తిచేయుటకు చేయబడు యత్నము (Labour).

సముద్రపు పోటుపాటులు - (భూగో.) సూర్యచంద్రుల ఆకర్షణశక్తిచే సముద్ర మందలి నీటిమట్టము ప్రతిదినము రెండు సార్లు హెచ్చును, రెండు సార్లు తగ్గుట. (పాటు = సముద్రపు నీరు హెచ్చుట; పోటు = సముద్రపు నీరు తగ్గుట.)

పూర్ణిమ - పున్నమ, అఖండ చంద్రుడు గలది.
పున్నమ - పూర్ణిమ సం.పూర్ణిమా, ప్రా.పుణ్ణమా.

పార్ణమాసీ తు పూర్ణిమా :
మీయతే తిథిరనేన మాః చంద్రః పూర్ణశ్చాసౌ మాశ్చ పూర్ణిమాః, తస్యేయం పుర్ణమాసీ. ఇతనిచేత తిథి లెక్క పెట్టఁబడును గనుక మాః అనఁగా చంద్రుఁడు. అతఁ డిందు పూర్ణుడుగాఁ దోఁచును. పూర్ణోమాసో స్యామితావా, మాసము ఇందు పూర్ణమౌను. చంద్రస్య పూర్ణతయా నిర్వృత్తా పూర్ణిమా, చంద్రునియొక్క నిండుటచేత నిర్వృత్తమైనది. పూర్ణఃమాశ్చంద్రో స్యామితివా పూర్ణిమా, అఖండచంద్రుఁడు గలిగినది.

పూర్ణేందు బింబ వదనాం రత్నాభరణ భూషితాం,
వరదాభయ హస్తాభ్యాం ధ్యాయే చ్చంద్ర సహోదరీమ్.

పౌర్ణమి - సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని అర్థభాగము పై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.

రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము.  రాకాచంద్ర సమానన రామ్|
ఆగమనము -
1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
అవాప్తి - ప్రాప్తి, పొందుట. 
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది, వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి.   

నిశాకరుఁడు - చంద్రుడు; నిశాపతి - చంద్రుడు.
నిశ -
1.రేయి, 2.పసుపు.

పూర్ణే రాకా నిశాకరే :
తస్మిన్ పూర్ణే సతి సా రాకేత్యుచ్యతే శుద్ధేతిభావః - చంద్రుఁడు పూర్ణుఁడై యున్నపుడు ఆ పున్నమ రాక యనంబడును. అనఁగాఁ చతుర్దశి వేధ లేనిది. అసుమన్యంతే దేవాః పితృసహితా అస్యామిత్యనుమతిః. దీని యందు దేవతలు పితృసహితులై సేవకొఱకు తలఁపఁబడుదురు. రాతి దదాతి సుఖమితి రాకా. రా దానే - సుఖము నిచ్చునది. అన్ని కళలతో నిండిన చంద్రుఁడు గలది.  

నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.  
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు, మాషపరిమాణము.
చంద్రుడు - నెల, చందమామ. 
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుడు - చంద్రుడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.

నెలమేపరి - రాహువు.
రాహువు -
ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
కృష్ణవర్త్మ - 1.అగ్ని, 2.రాహుగ్రహము, విణ.దురాచారుడు.

పంచదశి - 1.అమవస, 2.పున్నమ.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.

పక్షాంత్తౌ పఞ్చదశ్చౌ ద్వే - పక్షయోః అంతౌ పక్షాంత్తౌ, శుక్ల కృష్ణపక్షములయొక్క తుదలు. పంచదశానాం తిథీనాం పూరణ్యౌ పంచదశ్యౌ, పంచదశ తిథులను నిండించునవి. పూర్ణిమకును అమావాస్యకును పేర్లు. 

నందివర్ధనము - 1.ఒక జాతి పూలచెట్టు, 2.అమావాస్య లేక పున్నమ.
నంద్యానర్తము - 1.పడమట తక్క, తక్కిన మూడు దిక్కుల వాకిళ్ళు గల రాజగృహము, 2.నందివర్ధన వృక్షము.

అపీతము - 1.త్రాగబడినది, 2.కొంచెము పసుపువన్నె కలది, వి.1.ఇంచుక పసుపువన్నె, 2.పద్మకేశరములు, 3.నందివృక్షము.

దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
అమావాస్య -
(భూగో.) చంద్రుడు తన మార్గములో సూర్యునికిని భూమికిని మధ్య వచ్చినపుడు చంద్రునిపై సూర్యుని వెలుగుపడిన భాగము కనిపించని దినము. కృష్ణపక్షమున కడపటిదినము, వికృ.అమవస, అమాస.
అమవస - చంద్రుడు ప్రకాశింపని దినము, రూ.అమాస సం.అమావాస్యా.

అమావాస్యా త్వమావస్యా దర్శ స్సూర్యేందు సంగమః :
అమాశబ్దస్సహార్థే అవ్యయం. అమా సహ తిష్ఠతః రవిచంద్రావస్యామిత్య మావాస్యా. అమావస్యా చ. వస నివాసే - దీనియందు సూర్యచంద్రులు కూడుకొనియుండురు.
దృశ్యేతే సూర్యచంద్రావత్రేతి దర్శః, దృశిర్ ప్రేక్షణే - దీనియందు సూర్య చంద్రులు కూడుకొని యగపడుదురు.
సూర్యేంద్వోః సంగమః మేళనమత్ర సూర్యేందుసంగమః - దీనియందు సూర్యచంద్రులకు సంగమము కలదు గనుక సూర్యేందు సంగమము.

అమావాస్యరోజు చెట్లు పూలు కాయలు, కోయరాదు తాకరాదు. సూర్యచంద్రులు అమావాస్యనాడు చెట్లకి అహారము, వెలుగు, ఇచ్చేరోజు.

అమావాస్య యనగా కృష్ణపక్షము. పంచదశి(పదునైదవ) కళయందు - ఎప్పుడు - సూర్యచంద్రులకు అత్యంత సంయోగము కులుగునో అప్పుడు అమావాస్య అగుచున్నది.

అమావాస్యనాడు చంద్రుడు కనిపించనంత మాత్రాన చంద్రుడు లేడనటం అజ్ఞానము. అయ్య రాక పోతే అమావాస్య ఉండిపోతుందా?

సా వష్టేందుకళా కుహూః :
కుహయతి విస్మాపయతి తమసేతి కుహూః - తమస్సుచేత నాశ్చర్యము ను గలుగఁ జేయునది. చంద్రకళ గానరాని యమావాస్య పేరు. రాకా కుహూ రమా వాస్యా పూర్ణిమాను మతీ ద్యుతిః.

(ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దృష్టి -
1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.

ఇక్కడ చూచి అక్కడ చూశామంటే ఆమడ పరుగెత్తుతుంది. - దృష్టి.

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు 2.గుడ్డివాడు 3.మంచి కన్నులు కలవాడు.

చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వినికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).

కన్నులు పెద్దవైన కనుపాపలు చిన్నగానే ఉంటాయి. కన్ను ఎరింగింప కున్నను కడుపు ఎరింగించును. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది.

దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దరిసెనము -
1.దర్శనము, 2.పెద్దల చూడకొనిపోవు కానుక, సం.దర్శనము.
దరిసించు - 1.దర్శించు, చూచు, 2.కానుక యిచ్చు.
ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
ఆదర్శము - 1.పరమోత్కృష్ట స్థితి, మేలు బంతి, 2.అద్దము, విణ. అనుసరింప దగినది. అద్దము పగులకొడితే, అసలు రూపం నశిస్తుంది.

నయనము - 1.కన్ను, 2.పొందించుట.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు -
ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.

కంటికి చూడడం లక్షణం. దానికి అంతే తెలుసు. చూసేవి చెప్పలేవు. చెప్పే లక్షణం నోటిది. చూడడం చేత కానిది. చెప్పేది చూడలేదు. చూసేది చెప్పేది కాదు, చెప్పేది చూసేది కాదు.

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణంతరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము

ఇద్దరు వ్యక్తులు అదే కటకటాల వెనుక నుంచి చూస్తారు. ఒకరికి బురద కనిపిస్తే, మరొకరికి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. - యప్. లాంగ్ బ్రిడ్జ్

అసలు - 1.బురద, (వాణి) అప్పుగా తీసుకొని న సొమ్ము(principal)
వండ - 1.ఆపద, 2.చెరువులోనగు వాని యడుగున నుండెడి యెండిన బురద. రొచ్చు - 1.అడుసు, 2.మాలిన్యము, 3.అపవాదము.

సినీవాలి - 1.చంద్రకళ కానవచ్చెడి అమావాస్య, 2.పార్వతి(శివుని సన్నిధి నందు దేవిస్థానం పార్వతి). సినీవాలీ శివావశ్యా వైశ్వదేవీ పిశంగిలా.

సా దృష్టేంధు స్సినీవాలీ :
అః విష్ణుః తేన సహవర్తత ఇతి సా లక్ష్మీః సా అస్యామితి సినీ చంద్రకళా సా బాలా అస్యామితి సినీవాలి. అ  అనఁగా విష్ణువు. అతనితోఁగూడినది గనుక సా అనఁగా లక్ష్మి. ఆలక్ష్మి గలది గనుక సిని అనఁగా జంద్రకళ. ఆ చంద్రకళ దీనియందు లేఁతదైయుండును గనుక సినీవాలి. వబయోరభేదః. చంద్రకళతోఁ గూడిన యమావాస్య పేరు.

చంద్రుడు అమావాస్య నుండి ఎదుగుతూ పూర్ణిమనాడు పరిపూర్ణుడు అవుతాడు. అక్కణ్ణుంచి కృష్ణపక్షంలో తరగడం ప్రారంభిస్తాడు. చల్లని వెన్నెలనిచ్చే చంద్రుడు క్షీణిస్తుంటాడు. అమావాస్యనాడు లోపిస్తాడు. అదే పునరావృతం అవుతూ ఉంటుంది.

ఉ|| సంతత పుణ్యశాలి కొకజాడను సంపద వాసిపోవ తా
నంతటఁబోక నెట్టుకొని అప్పటి యట్ల వసించుచుండు మా
సాంతము ననదుఁజందురుని పన్నికళల్ వెడబాసిపోయినన్
గాంతి వహింపడెట్లు, తిరుగంబడి దేహమునిండ, భాస్కరా.
తా.
చంద్రుడ(అ)మావాస్య యగు నప్పటికి, తన కళలన్నియు పోయి తిరిగి మరల సంపూర్ణ చంద్రుడై వెలుగొందును. అట్లే, పుణ్యాత్ముని(సుకృతుని) కొకప్పుడు లేమి గలిగినను వెంటనే తిరిగి సంపదలు కల్గును.

రాహువు, కేతువుల గ్రహబాధల వల్ల సూర్యచంద్రునికి గ్రహణాలు వున్నాయి. చంద్రునికి వృద్ధిక్షయాలు వున్నాయి.

చంద్రుడు వృద్ధిపొందే పక్షమునందలి కళలచే దేవతలకు, క్షీణ కళలచే పితృదేవతలకు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. చంద్రుఁడు వృద్ధిక్షయాలకు చలించని తత్త్వాన్ని బోధించాడు.

3.Moon

No comments:

Post a Comment