Monday, March 5, 2012

రావి - మఱ్ఱి

ఉద్భిజము - భూమిని చేదించుకొని పుట్టునది(చెట్లు, తీగలు మొ.వి) రూ.ఉద్భిజము.

మహి - పుడమి, భూమి.
పుడమి - భూమి, సం.పృథ్వీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

కుజము - చెట్టు, వ్యు.భూమినుండి పుట్టినది.
పాదపము - చెట్టు.

చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము -
గుల్మరోగము, (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలేనిచెట్టు, 5.పురాభి ముఖ రాజమార్గము, 6. 9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలిఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం. వి. (జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంధి (Spleen).
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము = సేన-అందుండు వాడు.)

ద్రుమము - వృక్షము.
వృక్షము -
చెట్టు, సం. (వృక్ష.) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క, (Tree). 

మహీరుహము - వృక్షము.
భూజము -
వృక్షము.
భూజాని - 1.విష్ణువు, 2.రాజు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.

శాభి - 1.వృక్షము, 2.వేదము, వ్యు.శాఖలు కలది.
1.వృక్షము నందు పుష్పముల వంటి పరిమళ పదార్థములు పుట్టు చున్నందున భూమి రూపమగును.
2.వృక్షము వేరుల చేతను - ఆకుల చేతను జలమును త్రాగుచుండుట వలన జలరూపము అగును.
3.వృక్షము వాడుట - కదులుట వాయురూపములగును.
4.వృక్షము వృద్ధి బొందుట అగ్ని రూపమగును. వృక్షములందు ఉన్న అగ్ని కంటికి కనిపించదు. బుద్ధి బలమున మధించగా కనిపించును.
జమ్మిచెట్టులో మొలచిన రావిచెట్టు కర్రనుండే అగ్నిని మధిస్తారు. 5.వృక్షము ఆకాశ రూపమని నిరూపింప బడినది. పిడుగుపాటును చెట్టు కూలుచున్నది, అనిన పిడుగుపాటును(శబ్దము) చెట్టు వినుచున్నది. శ్రోతము, వినుట చెవి పని.

మ మాద్య దేవో వటమూలవాసీ, కృపావిశేషాత్కృత సన్నిధానః|
ఓంకార రూపా ముపదిశ్యవిద్యా, మవిద్య కధ్వాన్త మపాకరోతు.

ఆమ్నాయము - 1.వేదము, 2.శాస్త్రము 3.సంప్రదాయము 4.వంశము 5.సముదాయము.

శ్రుతిఃస్తీ వేద ఆమ్నాయ స్త్రయీ - శ్రూయతే ధర్మాధర్మాదికమనయేతి శ్రుతిః. శ్రుశ్రవణే - దీనిచేత ధర్మాధర్మాదులు వినఁబడును. విదంత్యనేన ధర్మా ధర్మావితి వేదః విద జ్ఞానే - దీనిచేత ధర్మాధర్మముల నెఱుఁగు దురు. ఆమ్నాయతే పారంపర్యే ణేత్యామ్నాయః మ్నా అభాసే - పారంపర్యము చేత నభ్యసింపఁబడునది - వేదము.

కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణమునందు షట్కాండములు గలవు) 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము,(తెలివి, ఎరుక), 2.కర్మ, 3.ఉపాసన.
ఉత్స్వేదనము - (వృక్ష.) ఆకుల నుండికాని, కాండమునుండి కాని నీరు ఆవిరిరూపమున బయటికిపోవుట (Transpiration).

ఉపాసతే యం మునయ శ్శుకాద్యా
నిరాశిషో నిర్మమతాధివాసాః
తం దక్షిణామూర్తి తనుం మహేశ
ముపాస్మహే మోహమహా ర్తిశాన్త్యై.

బోధి - 1.రావి, 2.సమాధి విశేషము (భోదము - తెలివి).
రావి -
1.అశ్వర్ధము, 2.రావి చెట్టు. అశ్వర్థము నందు దేవీస్థానం వందనీయ.
అశ్వర్ధము - 1.రావి చెట్టు, 2.అశ్వనీ నక్షత్రము, 3.ఆశ్వయుజ పూర్ణిమ.  

ఉపాసకానాం యదుపాసనీయ ముపాత్తవాసం వటశాఖమూలే
తద్ధామదాక్షిణ్యజుషాస్వమూర్త్యా జూగర్తిచిత్తే మమబోధ రూపమ్.

బోధిద్రుమ శ్చల్దళః పిప్పలః కుఞ్జరాశనః : అశ్వర్థే - రావిచెట్టు.
బుద్ధ్యతే అనేనేతి బోధిః, బోధినామా ద్రుమో బోధిద్రుమః - దీనిచేత సర్వమెఱుంగఁబడును గనుక బోధిద్రుమము. పిప్పలే బోధిరశ్వథః అని రత్నమాల.  
నిత్యం చలతి దళాని యస్య సః చలదళః - ఎల్లప్పుడు కదులుచుండెడు ఆకులుగలది.  
భక్తాన్ పాతీతి పిప్పలః - తనను సేవించువారిని రక్షించునది.
కుంజరాణాం ఆశనం కుంజరాశనః - ఏనుఁగులకు భక్షణమగునది.
అశ్వరూపేణాగ్ని రస్మిన్ తిష్ఠతీత్యశ్వర్థః  స్ఠా గతినివృత్తౌ - అశ్వరూపమున దీనియందగ్ని యుండును. 

విద్రావితా శేష తమోగణేన
ముద్రావిశేషణ ముహు ర్మునీనామ్
నిరస్య మాయాం దయయా విథత్తే
దేవో మహాం స్తత్త్వమసీతి బోధమ్.

విష్ఠరశ్రవుఁడు - విష్ణువు, వ్యు.ధర్భ పిడికిళ్ళవంటి చెవులు గలవాడు.
విష్ఠరే అశ్వర్థతరౌ శ్రూయత ఇతివా - అశ్వర్థవృక్షము నందు వినబడు వాడు, విష్ణువు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః
గుణప్రవృద్ధా విషయప్రవాళాః |
అధశ్చ మూలాన్యనుసన్త తావి
కర్మానుబన్దీని మనుష్యలోకే || – 2శ్లో

ఈ వృక్షముయొక్క శాఖలు పైకి, క్రిందికికూడ వ్యాపించినవి. ఇవి ప్రకృతిగుణములచే పుష్టినొందుచున్నవి. విషయ సుఖములే వీటి లేచిగుళ్ళు(లేత చిగుళ్ళు). ఈ వృక్షముయొక్క వేళ్ళు మనుష్యలోక మందు పుణ్యపాపకర్మబంధముల వలన క్రిందకుకూడ వ్యాపించినవి.   

ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వర్థం ప్రాహురవ్యయం|
చందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్|| - భగవద్గీత

సంసారమును అశ్వర్థవృక్షముతో పోల్చనగును. కాని ఈవృక్షమునకు వేళ్ళు పైనను, కొమ్మలు క్రిందికిని ఉండును. ఇది నాశములేనిదని చెప్పుదురు. వేదములే ఈచెట్టు యొక్క ఆకులు. ఈవృక్షతత్త్వమును చక్కగా నెరిగినవాడు వేదవిదుడే. - పురుషోత్తమప్రాప్తి యోగః  

భౌమ్యానువర్తనము - (వృక్ష.) భూమి వైపునకే పెరుగు స్వభావము (Geotrophism).
భౌమ్యాపవర్తి - (వృక్ష.) భూమినుండి విముఖముగా పెరుగు స్వభావము కలది (Negatively geotrophism).

'అశ్వర్థః స్సర్వ వృక్షాణామ్' చెట్లన్నిటియందును రావిచెట్టు చాల శ్రేష్ఠమై, పవిత్రమై యున్నది. వృక్షములలో అశ్వర్థవృక్షము(రావిచెట్టు) తానని శ్రీకృష్ణ పరమాత్మ భాగవద్గీత 10 అధ్య - 26శ్లో||న చెప్పెను.

మూలే విష్ణుఁ స్థితో నిత్యం స్కన్ధే కేశవ ఏవచ|
నారాయణస్తు శాఖాను పత్రేషు భగవాన్హరిః ||
ఫలే అచ్యుతో న సందేహః సర్వదేవైః సమన్వితః|

స ఏవ విష్ణుర్ద్రుమ ఏవ మూర్తో
మహాత్మభిః సేవితపుణ్యమూలః
యస్యాశ్రయః పాపసహస్ర హన్తా
భవేన్నృణాం కామదుఘో గుణాఢ్యః||

తా|| రావిచెట్టు మూలమందు విష్ణువు, బోదెయందు కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, ఫలములందు అచ్యుతుడు, సమస్తదేవతలతో గూడి విరాజిల్లుచుందురు. ఇవ్విషయమున సందేహము లేదు. ఇది సాక్షాత్ ఆకారమును ధరించివచ్చిన విష్ణువే అయియున్నది. దీని మూలమును మహనీయులు సేవించుచుందురు. దీని నాశ్రయించు వారి యొక్క పాపజాలమునంతను అది నశింపజేయును. మఱియు నిది మనుజుల కోరికలను నెరవేర్చునదియు, సద్గుణములను, పుణ్యమును ఒసంగునదియు అయియున్నది.   

అశ్వర్థ వట నింబామ్ర కపిత్థ బదరీగతే|
వనసార్క కరీరాది క్షీరవృక్ష స్వరూపిణీ||

అశ్వర్ధ వృక్షమందు సమస్త ఓషధులు, అధిష్ఠాన దేవతలు గలరని వేద ప్రమాణము(అధర్వణవేదం), విష్ణుమూర్తి యవతారమని ప్రసిద్ధి.

రావిచెట్టు ప్రదక్షిణ సంతాన హేతువు కూడా. రావి, వేప చెట్లు కలిసి యుండిన, ఆ స్థానమున నిత్యం వాటికి ప్రదక్షిణము చేస్తే సర్పదోషము, సంతాన దోషము, అంగవైకల్య దోషములు కలుగవు. రావిచెట్టును నాటి మంత్రపూర్వముగా ప్రతిష్ఠ చేస్తే ఆయుతవర్షాలు(సంవత్సరాలు) తపోలోక నివాసం కలుగుతుంది.

సమస్త చరాచర జగత్తులో పరమాత్మను దర్శించుటయే మన ఆధ్యాత్మిక శక్తి ఔన్నత్యము.

రావిచెట్టు - విష్ణువు అంశ, రావి చెట్టు. శని దృష్టి(శని వక్రదృష్టి కలవాడు) సంబంధితమైన కారణంగా - శనివారము నాడు మాత్రమే పూజనీయమైనది. ఇతరవారాలలో రావిచెట్టును తాకరాదు. శనివారమునాడు మాత్రమే ఈ వృక్షరాజమును తాకవలెను.   

రావిచెట్టు - దరిద్రదేవత: విష్ణువు - ఉద్దాలకుడనే మునికి జ్యేష్టాదేవిని, సమర్పించాడు. స్థూలవదన, శుభ్రరదన, అరుణనేత్రి, కటినగాత్రి, బిరుసు శిరోజాలూ గలిగిన జ్యేష్టాదేవిని, ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. - కార్తీక పురాణము

భ్రష్టున కర్ధవంతులగు బాంధవు లేందఱుగలిగినన్, నిజా
దృష్టములేదుగావున దరిద్రతఁ బాపగలేరు సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల తతిస్థిరసంపదలిచ్చు లక్ష్మి
జ్యేష్ట కదేటికిం గలుగ జేయదు తొడనెపుట్టి, భాస్కరా.
తా.
అందరకును భాగ్యమిచ్చు లక్ష్మి తన తోబుట్టువైన జేష్టాదేవికి సంపద నీయజాలక పోయెను. అట్లే పనికిమాలిన వానికి భాగ్యవంతులగు చుట్టము లెందరున్నను అతని క(అ)దృష్ట రేఖ లేనిచో బీదవాడై యుండును.

జెష్ట - 1.దారిద్ర్యదేవత, 2.పెద్దమ్మ, సం.జ్యేష్ఠా.
జ్యేష్ఠ -
1.ఒక నక్షత్రము, 2.పెద్దమ్మ.
పెద్దమ్మ - 1.జ్యేష్ఠాదేవి, 2.పెద్దతల్లి.

దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు: నిరంతర హోమధూమ సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ - ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేదీ, అతిథి పూజా సత్కారాలు జరిగేవీ, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోనానురాగం గల భార్యాభర్తలు వున్న చోటగాని, పిత్రుదేవతలు పూజింపబడేచోటగాని, ఉద్యొగస్థుడు, - నీతివేత్త, - ధర్మిష్టుడు, - ప్రేమగా మాటలాడేవాడు, గురు పూజా దురంధరుడూ, వుండే స్థలాలలోగాని నేను ఉండను.

ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడు కుంటూ వుంటారో, ఏ యింట్లో అతిధులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూంటాయో! ఎక్కడయితే దురాచారాలూ, పరద్రవ్య, పరభార్యాపహరణశీలురైన వారుంటారో - అలాటి చొటులోనయితేనే నేను ఉంటాను. కల్లు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులూ యెక్కడ వుంటారో నే నక్కడ వుంటానికే యిష్టపడతాను"అంది జ్యేష్ఠాదేవి. 

అన్నీ విపరీత లక్షణాలే!        

రావి చెట్టు మొదట్లో - జ్యేష్ఠావాసం: ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై - 'ఓ జ్యేష్టా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదల కుండా కూర్చో"అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్టాదేవి రావిచెట్టు మొదలులో అలాగే వుండిపొయింది.  
ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ, పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి - తన అప్పగారి(అక్క) నూరడించవలసినదిగా విష్ణువును కోరింది.

విష్ణువు కమలా సమేతుడై జ్యేష్టాదేవి ఎదుట ప్రత్యక్షమయి, ఆమెని ఊరడించుతూ - 'ఓ జ్యేష్టాదేవీ! ఈ రావి చెట్టు నా అంశతో కూడి వుంటుంది కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరవాసం ఏర్పరుచుకుని వుండిపో. ప్రతియేడా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ వుంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగానూ, అక్కడ షోడశోపచార విధిని అర్చించే స్త్రీలపట్ల శ్రీదేవి అమిత కరుణకలితయై అనుగ్రహించే టట్లున్నూ ఏర్పరచాడు - శ్రీహరి.  

ముదితాయ ముగ్ధశశినా వతంసినే
భసితావలేప రమనీయ మూర్తయే
జగదిన్గ్రజాల రచనా పటీయసే
మహసే నమోస్తు వటమూలవాసినే.

ఉదుంబరము - 1.గడప, 2.అత్తిచెట్టు, 3.రావిచెట్టు.
అత్తి -
(వృక్ష.) మేడి, ఉదుంబరము, వై.వి.ఏనుగు, సం.హస్తిః.
మేడి - అంజూరు, అత్తిచెట్టు.
అం(ౙ)జూరు - 1.అత్తిపండు, 2.అత్తిచెట్టు.
కడప - దేహళి, రూ.గడప, వై.కదంబము (చెట్టు), సం.కదంబః.
దేహళి - గడప, కడప, రూ.గేహళి.
గేహళి - గడప, రూ.దేహళి. 

దేహళీ దీపన్యాయము - న్యా. గడప మీద దీపము పెట్టిన నింటిలోన బాట గూడ ఉపయోగించు రీతి, దేహళీదత్త దీపన్యాయము.

ఉదుమ్బరో జన్తుఫలో యజ్ఞాజ్గే హేమదుగ్దకః,
ఉన్నతత్వా దుల్లంఘిత మంబరం అనే నేతి ఉదుంబరః - ఔనత్యముచేత నాకాశమును దాఁటునది.
జంతుయుక్తం ఫలమస్యేతి జంతుఫలః – జంతువు(జంతువు- చేతనము, ప్రాణము)లతోఁ గూడిన ఫలములు గలిగినది.
యూపాదిరూపేణ యజ్ఞాస్యాంగ ముపకరన మితి యజ్ఞాంగః – యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమైయుండునది.
హేమవర్ణం దుగ్దం క్షీరమస్య హేమదుగ్ధకః - బంగారువంటి పాలుగలది. ఈ నాలుగు 4 అత్తిచెట్టు పేర్లు.

గేహేశూరన్యాయము - న్యా.ఇంటిలో డంబములు కొట్టువాడే కాని పనికి రాని వాడనుట.
గేహేశూరుఁడు - ఇంటిలోనే డంబములు కొట్టువాడు, పిరికివాడు.(దంభము - 1.కపటము, 2.తప్పు, 3.గర్వము. అదరుగుండె - పిరికివాడు).

మేడిపండుచూడ మేలిమైయుండును
పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వ.
తా.
ఓవేమా! మేడిపండు చూచుటకు పైకి పచ్చగా బంగారమువలె కంటికింపుగా కనబడును కాని, దానిని బ్రద్దలుచేసి చూచినచో లోపల పురుగులు వుండును. చెడ్డవారు చూచుటకు పైకి బాగుగనే కంపించు చున్ననూ, లోపల వారి గుణములు మాత్రము చాలా చెడ్డవిగ వుండును.

ఔదౌంబరము - 1.ఒకలోహము, 2.రాగి, విణ.ఉదుంబర (మేడి) వృక్ష సంబంధమైనది. 

ఉదుంబరక ఫలము - (వృక్ష.) పుష్పమంజరి అంతయు కలిసి ఏర్పడిన ఫలములలో నిది యొకటి. దీనిలో చుట్టును ఆవరించి యున్న పుష్పాసవము మాంసలమై యుండును, ఉదా.అత్తి మొ.వి.

కడిమి1 - 1.అతిశయము, 2.పరాక్రమము; గోహరి - పరాక్రమము.
కడిమి2 - కడప (చెట్టు), సం.కదంబః.
నీపము - కడిమిచెట్టు.
కదంబము - గుంపు, వై.వి.మిశ్రము.
కదంబరము - గుంపు, వై.విణ. మిశ్రము.
కదుపు - సజాతీయ పశు పక్ష్యాది సమూహము, సం.కదంబమ్.

గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకున పుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).

ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్|
మత్స్యాపాదంజ లే పశ్యే న్ననారీ హృదయస్థితమ్||
తా.
మేడిపువ్వులనైన గానవచ్చును, తెల్లని కాకి(ధూంక్ష్మము - తెల్లకాకి)నైనఁ గానవచ్చును, నీళ్ళలోపల చేపల యడుగులనైనఁ గానవచ్చును, స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను. - నీతిశాస్త్రము  

హత్తి - ఏనుగు, రూ.అత్తి, సం.హస్తి.
హస్తి -
ఏనుగు, వ్యు.హస్తము గలది.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఎన్గు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః. అనేకపము - ఏనుగు.
దంతి - ఏనుగు, విణ.కోరపండ్లవాడు.
దంతావళము - ఏనుగు, వ్యు.ప్రశస్తమైన దంతములు గలది. 
ఏనుఁగుపాడి - అమితమైన ఈవి.
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర. 
చే - 1.హస్తము, 2.తొండము.
చేయి - 1.చేయి, హస్తము, 2.కిరణము, 3.తొండము, 4.పక్షము.

దాతృత్వము ప్రియకృత్వం ధీరత్వజ్ఞతా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజాగుణాః||
తా.
ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిఁగి తెలివిగానుండుట, యీ నాలుగు తనతోఁ గూడఁ బుట్టునవియే కాని నేర్చుటచే (గ)కలుగవు. - నీతిశాస్త్రము   

ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగాగలది.
ఏనుఁగుగొంగ(గొంగ - శత్రువు) -
సింహము, వ్యు.ఏన్గులకు శత్రువు. ఏనుఁగురాకాసిగొంగ - గజాసుర వైరి, శివుడు.

ప్లక్షము - 1.జువ్వి చెట్టు, 2.రావి చెట్టు, 3.ఒకద్వీపము.
(ౙ)జువ్వి -
ప్లక్షవృక్షము, ఒకచెట్టు.
జువ్విదీవి - ప్లక్షద్వీపము.

హైపాన్ ధోడియం - (వృక్ష.) (Hypan thodium) ఇది ఒక ప్రత్యేక పుష్పమంజరి. పుష్పదండము యొక్క పీనాక్షము (Swollen receptacle) ఒక కుహరమువలె నేర్పడి దాని లోపలి భిత్తికకు పుష్పము లుండును. పుష్పమంజరి పైభాగమున నొక రంధ్రముండును, ఉదా. అత్తి, రావి, మఱ్ఱి.  

ఒక చిన్న మఱ్ఱి బీజంలో మహత్తరమైన అంకుర శక్తి వేంచేసి ఉన్నది.

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువకాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత విశ్వ. - వేమన పద్యం
తా.
మంచి మనసుతో చేసిన పుణ్యము కొంచెమైనను అది తక్కువగా భావింపరాదు, అట్టిది విశేష ఫలితము నిచ్చును. మర్రి చెట్టు యొక్క విత్తనము చాలా చిన్నదైనను, దాని విత్తనంలో నుండి ఉద్భవించిన మొక్క పెద్దదై అనేక శాఖలతో పెరుగును.

కాకము వల్లఁ బుట్టదా ఘనమైన యశ్వర్థము - పెద్దదైన రావిచెట్టు కాకి విసర్జించిన రెట్టలోని చిన్నదైన విత్తనం నుండి పుట్టడం లేదా?

ఊడ - మఱ్ఱి మొ. వాని కొమ్మల నుండి క్రిందికి దిగెడీవేరు శిఫ (శిఫ - ఊడ, పడుగొమ్మ, ఈ యూడల వేళ్ళ వలననే చెట్టున కాహార మందును). శిఫ - ఊడ, పడుగొమ్మ.

శిఫా జటే - శినోతి వృక్షమూలమితి శిఫా.
శిఞ్ నిశాతనే - చెట్టుమొదలు నల్పముగాఁ జేయునది. జటతి సమూహీ భవతీతి జటా, జట సంఘాతే - సమూహముగా నుండునది. ఈ వృక్షమూలమున జడవలె నుండునట్టి ఊడలు.

జట - 1.జడ, 2.ఊడ.
జటాలము -
జడలుగలది, రూ.జటిలము.
జటిలము - జటాలము, వి.సింహము.
ౙడలమెకము - సింహము, చమరము.     

మూలము - 1.వేరు, 2.ఊడ, 3.మూలమట్టము మొదలు, 4.(గణి.) ఒక రాశిని అదే రాశిచే కొన్ని తడవలు గుణించగా లభించు లబ్ధము. దత్తరాశికి సమానముకాగా మొదటిరాశిని దత్తరాశికి మూలమందురు (Root), ఉదా. (Root) x=a అను సమీకరణమును సంతృప్తి చేయు x యొక్క విలువ.
వేరు - చెట్టుయొక్క మూలము.
ఊఢ - 1.పెండ్లియైన స్త్రీ, 2.భార్య. 

మూలే లగ్నకచే జటా :
జటా శబ్దము ఊడకు, జడకును పేరు. జటతీతి జటా. జట సంఘాతే. - గుంపై యుండునది.

కచము - జుట్టు, కేశము.
కంచబంధము - జుట్టుముడి.

వృక్షము (చెట్టు) ఎంత ఎత్తు ఆకాశానికి ఎదిగినా, ఆ అనంతాకాశంలొని వాయువు తరంగాలకు ఆనందంగా తల ఊపినా, తన వేరు (మూల) సంబంధాన్ని తెంచుకోకూడదు. ఆ బంధం తెగితే క్రమంగా పతనమే తప్ప మరో పధం లేదు. 

వేద మూలమిదం జ్ఞానం, భార్యా మూలమిదం గృహమ్|
కృషి మూలమిదం ధాన్యం, ధన మూలమిదం జగత్ ||
తా.
జ్ఞానమునకు వేదమే మూలము, గృహమునకు భార్యయే మూలము, ధాన్యమునకు కృషియే మూలము, జగత్తునకు ధనమే మూలము. - నీతిశాస్త్రము

న్యగ్రోధము - 1.మఱ్ఱి, 2.జమ్మి. మఱ్ఱిచెట్టు భారతీయుల జాతీయ వృక్షం. శివుడు మఱ్ఱిచెట్టు క్రింద ఉంటాడు.

న్యగ్రోధో బహుపా ద్వటః :
న్యక్ రుణద్ధి మార్గమితి న్యగ్రోధః. రుధిర్ ఆవరణే - మార్గము నడ్డముగాఁ గప్పునది.
బహవః పాదాః మూలాని సన్యన్యే బహుపాత్ - విస్తారమైన యూడలు గలది.
వటతిమూలైః స్వస్తానం వేష్టయతి వటః వట వెష్టనే - ఊడలచేత స్వస్థానమును జుట్టుకొని యుండునది.

వటము - 1.త్రాడు, 2.మఱ్ఱి, 3.గవ్వ.
వటి -
1.త్రాడు, 2.వటము.
బహుపాదము - మఱ్ఱి చెట్టు.

కాన్త్యానిన్దిత కుంద కందలవపు ర్న్యగ్రోధమూలే వస
న్కారుణ్య మృతవారిభి ర్మునిజనం సంభావయ న్వీక్షణైః

శ్వేత - 1.గవ్వ, 2.స్ఫటికము.
గవ్వ - 1.గాజువంటి ఒకానొక పురుగు చిప్ప, పరాటిక, 2.ఒకానొక చిన్న నాణెము.
కపర్ధము - 1.గవ్వ 2.శివుని జటాజూటము.
కపర్ధి - శివుడు.

వటమూల తటావాసీ వటపత్ర పుటే శయః,
మహాలింగసముద్భూతః సభాస్తంభ సముద్భవః.

ఉ. వట్టుచుఁ దండ్రి యత్యధమ వర్తను డైననుగాని వానికిం
    బుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్డ ధన్యుడౌ
    నెట్లన మఱ్ఱివిత్తుమును పెంతయు గొంచెము దానబుట్టునా
    చెట్టుమహోన్నతత్త్వమును జెందదె శాఖలనిండి, భాస్కరా.

తా. మఱ్ఱి విత్తనము చిన్నదైనను దాని విత్తనములో నుండి ఉద్భవించిన మొక్క పెద్దదై అనేక శాఖలతో పెరుగును. అట్లే నీచున కుదయించిననూ వారు తమ పుణ్యఫలముచే ఘనత గాంచవచ్చును.

కానరాని విత్తనం-ఘనమైన వృక్షం - మర్రి చెట్టు.
ఆకులోడు గాడమ్మ ఆకులుంటవి-పోకలోడు గాడమ్మ పోకలుంటవి-బాలింతగాదమ్మ పాలుంటవి - సన్నాసోడు గాడమ్మ జడలుంటవి – మర్రి చెట్టు.
బాలింత అవునోకాదో పాలైతే వున్నాయి(ప్రతి భాగం నుంచి తుంచితే పాలు వస్తాయి) -ముక్కంటి అవునో కాదో జడలైతే వున్నయి - మర్రి చెట్టు.
సాములవారికి జడలు లావు. - మర్రి చెట్టు.

ౙడ - 1.వెండ్రుకల యల్లిక, 2.జూలు, సం.1.జటా, 2.సటా.
ౙడదారి -
జడలు ధరించిన సన్యాసి, సం.జటాధారీ.
ౙడముడి - 1.కపర్దము, ఈశ్వరుని జటాజూటము, 2.జడలుగంటు.
కపర్దము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
ౙడముడిజంగము - శివుడు, కపర్ది.
కపర్ది - శివుడు.   

అవరోహణము - 1.దిగుట, 2.చెట్టును అల్లుకొని ప్రాకుతేగ, 3.మఱ్ఱి  మొ.ని ఊడ,  4.స్వర్గము, దేవలోకము,  రూ.అవరోహణము.

శాఖాశిఫా వరోహ స్వ్యాత్ - అవరోహతే లంబత ఇత్యవరోహః రుహ బీజజన్మని ప్రాదుర్భావేచ. వ్రేలుచుండునది. మఱ్ఱిచెట్టు మొదలైనవాని కొమ్మలయందుండునట్టి ఊడలు.

కొమ్మల నుంచి ఊడలు వచ్చి భూమికి తగలగానే వేళ్ళుతన్ని కాండం లాగా మారుతుంది. ఈ విధంగానే ఈ మొక్క ఎన్నో ఎకరాలు ఆక్రమించగలదు.

ౙమ్మి - శమీ వృక్షము, సం.శమీ.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యడిగి యుండుట.
శాంతి - శమనము.
శమనము - శాంతి పథము, రూ.శామనము.
శామనము - 1.శమనము, 2.పధము.
శమనుడు - యముడు; ౙముడు - యముడు, శమనుడు, సం.యమః.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.   

శమీసక్తుఫలా శివా,
శమయతి దోషాన్ శమీ. ఈ. సీ. శము ఉపరమే. - దోషములను శమింపఁజేయునది.
సక్తువత్స్వాదూని ఫలాన్యస్య సక్తుఫలా - సక్తువువలె స్వాదువైన ఫలములు గలది.
దోషశమనాచ్చివా - దోషశమనము వలన శుభస్వరూపమైనది. ఈ మూడు 3 జమ్మిచెట్టు పేర్లు.  

అశ్వర్ధవృక్షమునకు నమస్కరించునపుడు:
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణీ|
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః||

గిట్టుట కేఁడ గట్టడలిఖించిన నచ్చట గాని యుండుచోఁ
బుట్టదుచావు, జానువులపున్కలనూడిచి కాశిఁజావఁ గా
ల్గట్టిన శూద్రకున్ భ్రమలఁగప్పుచుఁ దద్విధిగుఱ్ఱముమౌచునా
పట్టునఁగొంచుమఱ్ఱికడఁ బ్రాణముతీసెగదయ్య, భాస్కరా.
తా.
శూద్రక మహారాజు తానెక్కదకునూ పోకుండ కాశిపుర మందే మృతి నొంద దలచి, తన మోకాటి చిప్పల నూడదీయించుకొని, నచ్చటనే యుండవలెనని నిశ్చయము చేసికొనగా, నా రాజునకు దైవమొక గుఱ్ఱమై వచ్చి ఆ సమయమున నాతని నొక మఱ్ఱిచెట్టు కడకు గొనిపోయి అచ్చట వాని ప్రాణమును పోగొట్టెను. కావున, దైవ విధానమును భ్రమసేయుట కెంత యత్నించినను సఫలము కాదని యెఱుంగ వలెను. తనకు చావు ఒక దగ్గఱ లిఖింపబడి యుండగా వేఱొకచోట నెవ్వడును చావడు.    

శివ కేశవ రూపాలు - రావి, మఱ్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. రావి - మఱ్రి, వృక్షాలకు గోబ్రాహ్మణతుల్య పావిత్రత పొందాయి.

tumblr_l8hjajogPY1qzuvjbo1_500

No comments:

Post a Comment