Saturday, March 24, 2012

మిథునరాశి

మృగశిర 2, ఆరుద్ర 4, పునర్వసు 3 పాదములు, మిధునరాశి, మిధునం, దంపతులు.

5. మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.
జింకతలచుక్క - మృగశీర్షము. 
మృగశిర - అయిదవ నక్షత్రము. 5th star.
(ౙ)జాబిలిరిక్క -  మృగశీర్ష నక్షత్రము.

మృగశిర - మృగము తలవలె 3 నక్షత్రములుండును.

తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.

తొలకరి - చైత్ర వైశాఖములందలి వాన, వర్షర్తువు, రూ.తొల్కరి.
తొల్కరి - తొలుకరి.
తొలుకారు - మొదటికారు, వర్షర్తువు ముక్కారు పంటలలో మొదటికారు పంట.
తొలుకు - క్రి. కురియు. కురియు - క్రి.1.గుప్పించు, 2.వర్షించు.
గుప్పించు(ౘ) - క్రి. 1.(అధికముగా)ఇచ్చు, 2.బాణాదులను(అధికముగా) ప్రయోగించు, 3.కురియు.
తొలకరించు - క్రి.వానకురియు, పుట్టు, రూ.తొల్కరించు.   
పుట్టు - క్రి. సంభవించు, జన్మించు.
ఉదయించు - క్రి. 1.పుట్టు, కలుగు, 2.సూర్యాదులు పొడుచు.

తొలకరిసూడు - హంస, వ్యు.వర్షాకాల విరోధి.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము. 

సూడు - 1.పగ, 2.పగవాడు.
పగ -
విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ 23వ సంవత్సరము.
పగతుఁడు - (పగ+అతడు) శత్రువు(శత్రువు - పగతుడు), పగవాడు.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.

అరి1 - 1.చక్రము, 2.చక్రాయుధము, 3.చక్రవాకపక్షి, 4.శత్రువు, 5.(జ్యోతి.) లగ్నమునుండి ఆరవస్థానము, 6.చండ్రచెట్టు.
అరి2 -
1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.
అరి3 - అవ్య. కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా.కల్లరి, నేర్పరి (కల్ల+అరి, నేర్పు+అరి). 

సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు తొలకరి వానలు ప్రారంభమవుతాయి. దీనినే మృగశిర కార్తె అంటారు. వర్షాకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు.

ఆరబము - 1.తొలకరిపైరు, 2.పైరు, సం.ఆరంభః.
ఆరంబము -
1.మొదలు పెట్టుట, ఉపక్రమము, 2.ప్రయత్నము, 3.కార్యము, 4.త్వర, సం.ఆరంభః, 5.పైరు (ఇది తెనుగున మాత్రము కానవచ్చును), రూ.ఆరబము.
ఆరంభించు - యత్నించు, మొదలు పెట్టు.
ఆరకాఁడు - కృషీవలుడు, రైతు.

పైరు - సస్యము; సస్యము - పైరు, రూ.శస్యము.
పైరుల యెకిమీఁడు -
1.చంద్రుడు, 2.ఓషధీశుడు.
ఓషధీశుఁడు - చంద్రుడు Moon.
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.

గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్ఠాషాడ మాసములు.)
ఊష్మము -
1.ఆవిరి, 2.వేసగి, 3.గ్రీష్మ ఋతువు, 3.ఊష్మధ్వనులు (శ, ష, స, హ). 
గ్రీష్మము - 1.వేడి, వేసంగి. 
గ్రీష్మ - Summer; శుచి, అగ్ని(నీరు బిడ్డగా కలది).
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది. 
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు - చంద్రుడు, రూ.శుభ్రాంకుడు. 

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస -
1.అంౘ, 2.యోగి, యోగాభ్యాసము జేయు పురుషుడు 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము రూ.హంసము.

అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్థుడు, మరీచి).

అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః. - బుధుడు

మిథునము - 1.ఆలుమగల జత, 2.ద్వయము, 3.మిథునరాశి.
దాంపత్యము -
దంపతి భావము, భార్యాభత్తృ భావము.

స్త్రీపుంసా మిథునం ద్వన్ద్వం :
మేథతే సంగచ్ఛ ఇతి మిథునం. మేథృ సంగమే - కూడియుండునది.
ద్వౌ సహవర్తే ద్వంద్వం - రెండును గలసియుండునది.

ప్రేమవేంకటపతిఁ గలసె ప్రియ మిథునరాశి.....

దంపతులు - ఆలుమగలు, రూ.జంపతులు.
జంపతులు - ఆలుమగలు రూ.దంపతులు. 
ఆలు1 -1. స్త్రీ (ఉదా.బాలెంతరాలు, గుణవంతురాలు మొ వి.) 2.భార్య.
ఆలు2 - వి. బహు. ఆవులు(ఆవు - గోవు). స్త్రీ - ఆడుది.
ఆలు3 -  హిం.వి. బంగాళదుంప, ఉర్లగడ్ద.
కాండకందము - (వృక్ష.) భూమిలో నున్న కాండపుశాఖ చివర ఆహార పదార్థముతో ఉబ్బిన గడ్ద, ఉదా. ఆలుగడ్డ.
పిష్టద్రవ్య సస్యములు - (వ్యవ.) పిండి పదార్థమునిచ్చు పైరులు (Starch crops), ఉదా. ఆలుగడ్డ, కఱ్ఱపెండలము మొదలగునవి.

ప్రజాత - బాలెంత; జాతాపత్య - బాలెంత.
బాలెంత - బిడ్డను గన్నది, ప్రసూత, (బాలెంతరాలు).
ప్రసూత - బాలెంతరాలు.

సహధర్మిణి - భార్య.
భార్య -
అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.

ద్వయము - 1.జత, రెండు.
ద్వయి -
దోయి, జత (సంబంధము).
దోయి - ద్వయి, జత, సం.ద్వయీ.
దోయికట్టు - జతగూడు.

ద్వితయము - రెండు.
ద్వితీయ -
1.భార్య, 2.విదియ, 3.రెండవది (స్త్రీ), 4.(వ్యాక.) ద్వితీయా విభక్తి.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.

వధూవరులు - పెండ్లి దంపతులు.
వధువు -
పెండ్లాము, పెండ్లికూతురు, కోడలు, సం.వి.(గృహ.) పెండ్లికొమారితె, క్రొత్తగా పెండ్లియైన యువతి (భ్రిదె).
వరుఁడు - 1.పెండ్లికొడుకు, 2.రాజు, విణ. శ్రేష్ఠుడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon. 

అమృతం సద్గుణాభార్యా అమృతం బాలభాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మానభోజనమ్||
తా.
గుణవతియైన యాలు(ఆలు), బాలుని ముద్దుమాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు (న)అమృత సమానములు. – నీతిశాస్త్రము     

ద్వంద్వము - 1.జత, 2.స్త్రీపురుషుల జత, 3.ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధము, 3.రహస్యము, 4.శీతోష్ణాదులు. 

ద్వన్ద్వం కలహ యుగ్మయోః : ద్వంద్వశబ్దము యుద్ధమునకును, జతకును పేరు. మఱియు మిథునమునకును, రహస్యమునకును పేరు. ద్వయో రిదం, ద్వౌ ద్వౌచ ద్వంద్వం - ఇద్దరి సంబంధమైనది, రెండును గనుక ద్వంద్వము. కలహే 'బాహుద్వంద్వః ప్రవృత్తయో' రితి. మిథునే - ద్వంద్వాని భావం క్రయయా వివవ్రు రితి. "ద్వంద్వం రహస్యమర్యాదా యజ్ఞపాత్ర ప్రయోజన"ఇతి శేషః.

యుగము - 1.జత, 2.బార, 3.కాడి, 4.యుగములు నాలుగు 1.కృత, 2.త్రేతా, 3.ద్వాపర, 4.కలియుగములు.

ౙత -1.జంట, 2.సామాన్యము, (గణి.)రెండు వస్తువుల గుంపు(Pair).
(ౙ)జంట - జత, సం.యుగళమ్, అవ్య.1.వెంట, 2.సమీపమునకు, రూ.జమట.
ౙమట - జంట. జంటని విడదీయుట మహాపాపము.
సామాన్యము - సామ్యము, విణ.సాధారణము, (గణి.) కొన్ని రాసుల న్నింటికి సంబంధించినది (Common).
సామ్యము - సమత్వము, పోలిక. సాధర్మ్యము - పోలిక.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

యుగ్మము - జంట, (భౌతి., గణి.) స్థితిశాస్త్రమునకు చెందిన పదము. ఒకే వస్తువు మీద సమానాంతరముగను, విరుద్ధ దిశలలోను పనిచేయు సమాన బలముల జంట, ఒకే వస్తువుపై విరుద్ధ దిశలలో పనిచేయు సమానాంతర బలములు.(Couple)

ద్వయము - 1.జత, రెండు.
ద్వయి -
దోయి, జత (సంబంధము).
దోయి - ద్వయి, జత, సం.ద్వయీ.
దోయికట్టు - జతగూడు.

ద్వితయము - రెండు.
ద్వితీయ - 1.భార్య, 2.విదియ, 3.రెండవది (స్త్రీ), 4.(వ్యాక.) ద్వితీయా విభక్తి.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.

మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు -
1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జనించిన వాడు.

ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ. 

ధవుఁడు - 1.పెనిమిటి, 2.రాజు.
ప్రియుఁడు -
ప్రాణనాథుడు; జీవితేశుఁడు -1.ప్రాణనాథుడు 2.యముడు.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
ఏలిక - 1.రాజు, 2.యజమానుడు.
రాజు - 1.రేడు, రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు.
యజమానుఁడు - 1.గృహపతి, 2.యజ్ఞకర్త.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
భర్త - మగడు(పరిణేత - మగడు), విణ.ప్రోచువాడు.
ప్రోచు - అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.

ధవః ప్రియః పతిర్భర్త -
ధునోతి స్త్రియం దవః ధూఞ్ కంపనే. - స్త్రీని కంపించువాఁడు.
ప్రీణాతి ప్రియః ప్రీఞ్ ప్రీణనే. - ప్రేమించువాడు.
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
బిభర్తీతి భర్తా. ఋ. వు. డు భృఞ్ ధారణపోషణయోః. - భరించువాఁడు. ఈ నాలుగు మగని పేర్లు.  

శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
వీరుఁడు -
శూరుడు. ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
ప్రగల్భుఁడు - ప్రౌఢుడు.
ప్రోడ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రౌఢ - పదునెనిమిదేండ్లకు పైబడిన వయస్సుతోడి సంపూర్ణ యౌవనము గలది.
ప్రౌఢము - 1.పెరిగినది, 2.వయస్సు వచ్చినది, 3.నేర్పుగలది. 
ప్రౌఢి - 1.సామర్థ్యము, 2.నేర్పు, 3.వృద్ధి, 4.గర్వము.
ప్రావీణ్యము - నేర్పు; పటిమ - నేర్పు, సామర్థ్యము. 
ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion ). 

ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి.
సమర్థుఁడు - నేర్పరి; నిష్ణాతుఁడు - నేర్పరి; కలింగుఁడు - నేర్పరి. 
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice).

శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు. 
కన్నఁడు -
కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 2.శ్రీకృష్ణ భగవానుడు.

మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కులస్త్రీ.
సభత్తృక -
మగనాలు, ముత్తైదువు.
యామి - 1.కులస్త్రీ, 2.తోడబుట్టినది. సహజ - తోడ బుట్టినది. కులపాలిక - 1.తల్లిదండ్ర్లచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.

అథ కులస్త్రీ కులపాలికా :
కులేన అవ్యభిచారేణ రక్షితాస్త్రీ కులస్త్రీ – ఒచ్చెము(న్యూనత, కొరత)లేని కులముచేత రక్షితయైనది.
కులం పాలయతీతి కులపాలికా. పాల రక్షణే. - కులమును రక్షించునది. వ్యభిచారము చేయక కులమును మానమును కాపాడుకొను స్త్రీ పేర్లు.

కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపసుమీ
కలకంటి కంట కన్నీరొలికిన
సిరి యింటనుండ నొల్లదు సుమతీ.
తా.
కులసతితో(సతి - పతివ్రత స్త్రీ, పార్వతి)కయ్యము, లేనిదోషాలు ఆరోపించుట మంచిది కాదు, ఏలయన స్త్రీ కన్నీరు విడిచిన, ఆ యింటి యందు లక్ష్మి నివసించదు.

ఆలుమగల కలహాలు అద్దముపై ఆవగింజ తుళ్ళు తున్నంతసేపు.

(ౙ)జోక -1.సామ్యము, 2.బాగు, 3.జత, 4.విధము, 5.ఉత్సాహము, 6.మొత్తము, విణ.యుక్తము.
సామ్యము - సమత్వము, పోలిక.
బాగు - క్షేమము, విణ.యోగ్యమైనది.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
శుభము - మంగళము; మంగళము - శుభము, క్షేమము.
విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
మొత్తము - సమూహము, వెరసి, టోకు (గణి.) అసలు వడ్డీలు కలుపగా వచ్చు మొత్తము (Amount) దత్త రాసులను కలుపగా వచ్చు మొత్తము (Total) రాసులు మొత్తము (Sum). 
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.  
సమన్వితము - కూడుకొన్నది; సనాథము - కూడుకొన్నది. 

జోకపడు - జతపడు.
జోకచేయు -
సంపాదించు, సిద్ధపరచు.

యుగ్మంతు యుగళం యుగమ్ : యుజ్యతే యుగ్మం, యుగళం, యుగం చ. యుజిర్ యోగే. పరస్పరము - కూడుకొని యుండునది యుగ్మము, యుగళము, యుగము. ఈ మూడు 3 సామాన్యముగా రెండు జోడై యుండుటకు పేర్లు.

యమళము - 1.జంట, 2.యుగళము.
యుగళ శిశువులు -
యమళ శిశువులు, జంటపిల్లలు.
యమళశిశువులు - 1.జంటశిశువులు, 2.కవలపిల్లలు.

యమునయా సహ యమళత్వేన జాతత్వాద్యమః - యమునతోఁగూడ కవగా బుట్టినవాఁడు, యముడు. 

కవ - 1.జత, 2.కవలలు.
కవలు -
జంటగా పుట్టినవారు, అమడలు (కుశలవులు, నకుల సహదేవులు). స్వతనయ కుశలవ పండిత రామ్!
అమడలు - కవలు, జంటబిడ్డలు.  

దంట - జంట.
దంటమోముల దేవర - అగ్ని.

ద్వికము - 1.రెండు, 2.కాకి, వ్యు.రెండు 'కా' లను గలది, 3.జక్కవ.
రెండు -
1.భేదము, వేరుపాటు, 2.ద్వయము.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.
ౙక్కవ - చక్రవాక పక్షి(చక్రవాకము - జక్కవ), రూ.జక్కువ.
ౙక్కువ - జక్కువపక్షి, సం.చక్రవాకః.
ౙక్కవగొంగ(గొంగ - శత్రువు) - చంద్రుడు. 
ౙక్కవలఱేఁడు - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.

దొందము - రోగము, వాత పిత్త శేష్మములలో ఏ రెండిటి చేతనైనను కల్గు రోగము, సం. ద్వంద్వమ్.  
దొందు - దొందుదొందే! (జత.) సం.ద్వంద్వమ్.

కఫము - తెమడ, శ్లేష్మము.
తెమడ -
శ్లేష్మము; శ్లేష్మము - కఫము.
గళ్ళ - కళ్ళ, శ్లేష్మము.
క్లేదము -1.తడి, 2.ఉపద్రవము, (జీవ.) చిక్కని నీరు ఎక్కువగా నుండి జారుడు లక్షణములు గల శ్లేష్మసంబంధమగు పదార్థము, తెమడ, (Mucilage).
శ్లేష్మలుఁడు - కఫరోగము గలవాడు, శ్లేష్మణుడు.

కఫః శ్లేష్మా -
కే శిరసి, కేన జలేన వా ఫలతి కఫః. నిప్బత్తౌ. - శిరస్సు నందుఁగాని జలము చేతఁగాని పుట్టునది.
శ్లిప్యతి హృదయాదౌ శ్లేష్మా. న. పు శ్లిష ఆలింగనే. - హృదయము మొదలైన దానిం బొందునది కఫము. 

ఉపనర్జనము - అప్రధానము, వి.1.ఉపద్రవము, 2.త్యాగము. 

రాష్ట్రము - 1.దేశము, 2.ఉపద్రవము.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ(పీడ - బాధ), 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
రావడి - ఉపద్రవము, విపత్తు.
రాయిడి - ఉపద్రవము, విపత్తు.
విపత్తు - ఆపద; వల్లడి - అకారాణమగు నాపద, విపత్తు.
ఆపద - విపత్తు, ఇడుమ. ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
విప్లవము - (వ్యావ.,చరి.,రాజ.,అర్థ.) తీవ్రపరివర్తనము, రాజ్యక్రాంతి, సం.వి.కొల్ల మొదలగు దేశోపద్రవము, విపత్తు.
విప్లవకారులు - (వ్యావ.) విప్లవము లేపినవారు.

విప్లవాలు అల్ప విషయాల కొరకే కాదు. కాని, అన్నీ స్వల్ప విషయాల నుంచే ఉత్పన్నమవుతాయి. - అరిస్టాటిల్.

అంతర్యుద్ధము - (చరి.) 1.ఒక దేశప్రజలలో జరుగు యుద్ధము, 2.అంత కలహము, 3.మనస్సులో జరుగు సంఘర్షణము.

సాంపరాయము - 1.యుద్ధము, 2.ఆపద, 3.రాగలకాలము, రూ.సంపరాయము.  
సాంపరాయికము - యుద్ధము, రూ.సంపరాయికము.
సంయుగము - యుద్ధము. 
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము.
కయ్యము - జగడము, యుద్ధము.
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
కలహము - సమరము, వికృ.కయ్యము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది. 

త్యజే దేకం కులస్యార్థే గ్రామస్శార్థే కులంత్య జేత్|
గ్రామ జనపదసా ర్థే ఆత్మార్థే పృధివీం త్యజేత్||
తా.
కులహాని కలుగునపు డందుకు హేతుభూతుడైన వానిని, గ్రామహాని కలుగునపు డందుకు హేతుభూతమైన కులమును, దేశహాని కలుగునపుడు దానికి హేతుభూతమగు గ్రామమును, తనకు(ఉ) పద్రవము వచ్చినపుడు తానున్న భూమిని విడువవలయును ననుట. - నీతిశాస్త్రము 

ఎక్కటి కయ్యము - ఒకనితో ఒక్కడే చేయు యుద్ధము, ద్వంద్వ యుద్ధము, దండపోరు. 
ఎక్కటి - 1.ఒకటి, 2.ఒంటరివాడు, విన.శూరుడు, సం.ఏకః.
ఏకాంగి - విరక్తుడగు విష్ణుభక్తుడు, విణ.ఒంటివాడు.
ఏకాకి - 1.అసహాయుడు, 2.ఒంటరి, 3.ఏకాంగి.

ప్రజాపతిస్సభగవాన్ రుచిస్తస్యామజీజనత్|
మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా| - శ్రీమద్భాగవతం

ప్రజాపతి - బ్రహ్మ. (చరి.) 1.యుద్ధ సమయములందు కుల పతులపై నుండు సైనికాధికారి, 2.గ్రామపెద్ద.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు(నవ బ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుఁడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి.)
అజుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒక రాజు.  

మిధునములలో ప్రజాపతిని! అజుడను! - భగవద్గీత

రహస్యము - ఏకాంతము, దాచదగినది.
ఏకాంతము -
1.మిక్కిలి (మిక్కిలి - 1.అధికము 2.శ్రేష్ఠము), 2.ఇద్దరు కంటె ఎక్కువ జనము లేనిది (చోటు) 3.రహస్యము.
వివిక్తము - ఏకాంతము, రహస్యము.
మంతనము - 1.ఆలోచన, 2.ఏకాంతము, 3.రహస్యము, సం.మంత్రః.
ఆలోచన - 1.చూచుట, 2.ఆలోచించుట, యోచన, తలంపు. 
మంత్రణము - రహస్యాలోచనము, వికృ.మంతనము. 

మిథో న్యోన్యం రహస్యపి :
మిథః - ఇది తమలోఁ దా మను నర్థమందును, ఏకాంతమందును వర్తించును. ఉ. తమలోఁ దా మను నర్థమునకు - 'వాసిష్ట కౌండిన్య మైత్రావరుణానా మిథో న వివాహ్యాః'. ఏకాంతమునకు - మిథస్త్వదాభాషణ లోలుపం మనః', 'మిథః కృతే మమ్మథ ఏవ సాక్షీ'. 

ఉపనిషత్తు - 1.బ్రహ్మజ్ఞానము, 2.వేదాంతము, ఛాందోగ్యము, మొ.వి. 3.ధర్మము, 3.ఏకాంతము.

ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁదెలుప * నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడేడు మాడ్కిఁ దిరుగు * మెలమిఁగుమారా!
తా.
ఎప్పుడైనను నీవు రహస్యము ఉండినప్పటికిని, లేకపోయినప్పటికి బయట చెప్పుటకై పోవద్దు, అనగా రహస్యము తెలిసినదైనను నీవు మాత్రము వెలిబుచ్చవలదు. నిన్నుగన్న తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను మెచ్చుకొనునట్లుగా నడచుకొనుము. రహస్యమును భద్రపర్చుకొను తావు నీ మనస్సే. 

రహస్యములలో పరమసత్యమును నేనే! సూనృతం అహమేవ! ప్రియవచన స్వరూపుడను. - భగవద్గీత

6. ఆర్ద్ర - నక్షత్రములలో ఆరవది, పగడమును పోలి ఒకటి యుండును.

ఆర్ద్రయా రుద్రః ప్రథమా న ఏతి | శ్రేష్ఠో దేవానాం పతిరఘ్ని- యానామ్ | నక్షత్రమస్య హవిషా విధేమ | మా నః ప్రజాగ్ం రీరిషన్మోత వీరాన్ | హేతీ రుద్రస్య పరిణో వృణక్తు | ఆర్ద్రా నక్షత్రం జుషతాగ్ం హవిర్నః | ప్రముంచ మానౌ దురితాని విశ్వా | అపాఘశగ్ం సన్నుదత్తా-మరాతిమ్ ||4||   

రుద్రుఁడు - శివుడు.
రుద్రాణి - పార్వతి. రుద్రకోట యందు దేవీస్థానం రుద్రాణి.

రోదయతి శత్రూన్ రుద్రః - శత్రువులను దుఖఃపెట్టువాఁడు.
స్వయం రురో దేతివా. రుదిర్ అశ్రువిమోచనే, ఏకదా బ్రహ్మానురోధేన ప్రాప్త జన పరిగ్రహో (అ)సౌరురో దేతి పురాణప్రసిద్ధిః - ఒకానొక్కప్పుడు బ్రహ్మవలన జన్మమును బొందినవాడై దుఖించెను గనుక రుద్రుఁడు.
రుదం రోదనం ద్రావయ తీతివా - దుఃఖమును బోఁగొట్టువాఁడు. ద్రు. గ్రతౌ. 

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు -
1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు -
కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.  

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మభువు -
1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.

ఆరుద్ర : సాక్షాత్తూ శివుని జన్మనక్షత్రం ఆరుద్ర.

ఈశానుఁడు - 1.కాంతి, 2.శివుని ఐదు(5)ముఖములలో ఒకటి, 3.పదునొకొండు అను సంఖ్య(11), 4.ఆర్ద్రా నక్షత్రము. "ఈశానః సర్వ విద్యానాం" అని శృతి.

వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
కాంతి1 -
1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఇచ్ఛ - అభిలాష, కోరిక.
ఇ(ౘ)చ్చ - 1.కోరిక, 2.చిత్తము(చిత్తము - మనస్సు), సం.ఇచ్ఛా.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.

కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అదిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.

అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.

కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుబడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
వెలుతురు - 1.ఎండ, 2.ప్రకాశము.
ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.
ఆతపము - 1.ఎండ, 2.వెలుతురు.
ఎండదొర - సూర్యుడు; సూర్యుడు - వెలుగురేడు.

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.    

ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
మరీచి - 1.కిరణము, 2.వెలుగు, 3.ఎండమావులు, 4.ఒక ప్రజాపతి.  కిరణమాలి - సూర్యుడు. 

జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.

ప్రకాశానుర్తి - (వృక్ష.) వెలుతురు వచ్చు దిక్కునకే పెరుగు స్వభావము కలది, (Positively heliotropic).
ప్రకాశానువర్తనము - (వృక్ష.) వెలుతురు వచ్చు దిక్కునకు తిరుగుట, (Heliotropism).    

కేతువు - 1.తొమ్మిదవ గ్రహము ఖెతు, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము -
1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.
కూచి - 1.యుద్ధయాత్రకై వాద్యము మ్రోగించుట, 2.ఆడుది(స్త్రీ - ఆడుది), విణ.1.వాడియైనది, 2.వికసించినది.

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని -
1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.   

అభిరుచి - 1.అత్యాసక్తి, 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినచవి (Taste).

ౘవి - 1.రుచి, 2.రసము.
రుచి - 1.ఇచ్ఛ, 2.చవి, 3.కాంతి, 4.సూర్యకిరణము.
రుక్కు - 1.కాంతి, 2.సూర్యకిరణము, 3.ఇచ్ఛ.

స్వాదనము - 1.పానము, 2.రుచి చూచుట.
పానము -
1.త్రాగుడు, 2.త్రాగుడు గిన్నె, వై.వి.పానపట్టము, లింగపీఠము, సం.పానీయవృత్తమ్.
త్రాగుడు - త్రాగుట, రూ.త్రావుడు.
త్రాగు - క్రి.పానముచేయు, రూ.త్రావు. త్రావు - క్రి. త్రాగు. 
తాగు - క్రి.పానముచేయు, రూ.త్రాగు. 
లింగపీఠము - పానపట్టము.
స్వాదుముకుళములు - (జం.) రుచిని గ్రహించు జీవకణములు గుంపులు (Taste buds).

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః|
 

ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే అడ్డు పెట్టబడినది 2.కాంతి, 3.పసుపు(హరిద్ర) 4.యశము(యశము - కీర్తి).    
ఉ -
వర్ణమాలలో ఐదవ అక్షరము. ఉ - ఓ బాలికా! మా - వలదు, అని యట్లు తల్లి చేఁ తపస్సు కెళ్ళవద్దని వారించటం వలన పార్వతీదేవికి, ఉమ అని పేరు వచ్చింది.(సనాతనులైన ఉమామహేశ్వరులు).
ఉమాపతి - శివుడు. ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

ధర్ముని పత్ని కాంతి. ఆమె లేకపోతే లోకాలు అధార శూన్యములై చెడి పోతాయి. 

ఈశానుఁడు -1.శివుడు, 2.రాజు. ఈష్టే ఈశానః - ఐశ్వర్యము గలవాఁడు.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు
ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.

ఈశసు రేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తిశివ | 

ఈశ్వరి - పార్వతి.
ఈశ -
1.ఏడి కోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.
ఏడికోల - (వ్యవ.) నాగలిలో నాగటి దుంపను మేడిని కలిపియుంచు పొడవైన భాగము (Shaft).
ఇడ - 1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.

కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
మనోజ్ఞము -
1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సుకింపైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.

గణనాయిక - గౌరి, పార్వతి.
పార్వతి -
1.గౌరి (పర్వత పుత్రి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

భూ - భూమి; భూమి - నేల, చోటు, పృథివి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars). భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.  

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||

ఈష్టే ఈశః - ఐశ్వర్య యుక్తుఁడు, ఈశ ఐశ్వర్యే(శివుడు). 

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. ఐశ్వర్యమునకు అంతము లేదు.

విభూతి - 1.తిర్యక్సుండ్రధారులు ధరించెడు భస్మము, 2.ఒక ఐశ్వర్యము.
త్రిపుండ్రము -
నొసట నుంచుకొను విబూతి మూడు రేఖలు, (నామము ఊర్ధ్వపుండ్రము.) 
భూతి - 1.ఐశ్వర్యము, సంపత్తి 2.పుట్టుక, 3.భస్మము.
భూతేశుఁడు - శివుడు.

భవము - 1.బాము, పుట్టుక, 2.ప్రాప్తి, 3.సంసారము.
బాము -
1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక.
జననము - 1.పుట్టుక, 2.వంశము.
జననవిద్య - (జీవ.) అనువంశమును గూర్చి తెలియు శాస్త్రము(Genetics).

భవుఁడు - శివుడు; అభవుఁడు - శివుడు, విన.పుట్టుక లేనివాడు.

భస్మము - బూడిద; భసితము - భస్మము.
బూడిద - 1.కఱ్ఱలు మొదలగునవి కాలగా మిగిలిన భస్మము, 2.గోమయ భస్మము, సం.భూతిః.
నీఱు - భస్మము, రూ.నిగురు, నివురు. 
నిగుఱు - కట్టెల నిప్పుమీది బూడిద, రూ.నివురు, నీరు.
నివుఱు - నిగురు, బూడిద. బుగ్గి - బూడిద.
వెలిబూది - విభూతి. సముదూళించు - (విబూది) పూసికొను. 
భస్మాంగుఁడు - శివుడు. 

తిరునీఱు - బూది, విభూతి.
తిరు -
శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.

శ్రీచూర్ణము - తిరుచూర్ణము.
తిరుచూర్ణము -
ఎఱ్ఱబొట్టుపొడి.

తనీయాంసం పాంసుం - తవ చరణపంకేరుహభవం
విరించిః స్సంచిన్వన్ - విరచయతి లోకా నవికలామ్|
వహ త్యేనం శౌరిః - కథమపి సహస్రేణ శిరసాం
హరః స్సంక్షుద్యైనం - భజతి భసితోద్ధూళనవిధిమ్|| - 2శ్లో
 
తా. తల్లీ! బ్రహ్మ(విరించి - బ్రహ్మ) నీ యొక్క పాదపద్మముల తగిలి యున్న ధూళినే అణుమాత్రము సాధనముగా గ్రహించుచున్నవాడై చరాచర సహితమైన సకల లోక సృష్టిని సమగ్రముగా గావించుచున్నాడు. ఆ పరాగ కణమునే వేయి శిరస్సులచే నతి కష్టముగా అనంతరూపుడైన(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు)విష్ణువు మోయుచున్నాడు. దానినే ఈశ్వరుడు చక్కగా మెదిపి శరీరముననంతటను విబూదిగా(భస్మము)ధరించుచున్నాడు.  - సౌందర్యలహరి

(అనగా శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టి స్థితి లయ శక్తులను అనుగ్రహించుచున్నది. మహమాయా గుణములైన రజస్సత్త్వతమోగుణములైన త్రిగుణములే త్రిమూర్తుల కృత్యముల కాధారములు).        

ఆయురారోగ్య సంపత్తి రష్టైశ్వర్యం త్వమేవ హి,
పదమేవ విభూతిశ్చ సూక్ష్మాత్పూక్ష్మతరాగతిః| - 149శ్లో

అణిమ - 1.అణుత్వము, 2.ఒక ఐశ్వర్యము, అష్టసిద్ధులలో ఒకటి, రూ.అణిమము.
మహిమా -
1.గొప్పతనము, 2.ఐశ్వర్యము.
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.)పురుషవాచక శబ్ద సంజ్ఞ. మహిమ యుండిన భూషణము పనిలేదు.
మహాత్మ్యము - గొప్పతనము.
గరిమ - 1.గొప్పదనము, 2.బరువు, 3.అణిమాద్యష్టైశ్వర్యములలో ఒకటి, 4.విధము (ఈయర్థము తెలుగున మాత్రమే కలదు.) 
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.  
లఘిమ - లఘుత్వము; తేలిక - చులకన, లఘుత్వము.
(ౘ)చులకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
ఆరోగ్యము - రోగము లేమి, స్వాస్థ్యము.

ఆగమనము - 1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
రాక -
1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది, వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి;పొసఁగుడు - 1.ప్రాప్తి, 2.స్నేహము. అవాప్తి - ప్రాప్తి, పొందుట.

ఉపగతి - 1.ప్రాప్తి, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.అంగీకారము.
ఉపగమము -
1.అంగీకారము, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.ప్రాప్తి, 5.కలియుట.

స్వదేహోద్భూతాభి - ర్ఘృణిభి రణిమాద్యాభి రభితో
నిషేవ్యే! నిత్యే! త్వా - మహమితి సదా భావయతి యః|
కి మాశ్చ్యర్యం తస్య - త్రినయన సమృద్ధిం తృణయతః
మహా సంవర్తాగ్ని - ర్వరచయతి నీరాజన విధిమ్|| - 30శ్లో
తా.
శాశ్వతమైనదానా! ఆదంత్యంతములు లేని తల్లీ! లోకముచేత సేవింపదగిన జగన్మాతా! నీ చరణకమలముల నుండి పుట్టిన కాంతులచేత అణిమాది అష్టసిద్ధులతోను(అష్టైశ్వరస్వ రూప నిత్యలగు అష్టశక్తులతో) చుట్టును కూడికొని, నిత్యము నిన్ను ఏ సాధకుడు 'అహం' భావనతో  నిరంతరము ధ్యానించుచున్నాడో, వాడు త్రినయనుని సమృద్ధిగల ఐశ్వర్యమును సైతము తృణీకరించువాడై యుండగా వానికి  ప్రళయ కాలాగ్ని నీరాజన విధి చేయుచున్నది. ఈశ్వర సంపదను గణింపని వానికి సంవర్త మను ప్రళయాగ్ని నీరాజనమిచ్చుటలో నాశ్చర్యము లేదు. ఇందుకు ఆశ్చర్యమేమి?(ఏ ఆశ్చర్యమును లేదు.) శ్రీదేవితో తాదాత్మ్యము పొందిన సాధకుడు శ్రీదేవియే. ఆమె ప్రళయాగ్ని నీరాజనము. - సౌందర్యలహరి  

సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.
శ్రీ -
1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము. శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
సంపత్తి - సంపద, సంవృద్ధి. సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
శోభ - 1.వస్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.

సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు -
ఐశ్వర్యము, రూ.సంపద. 
సంపన్నము - సంపదతో గూడినది, సంవృద్ధమైనది.

సంపత్తి - ఈశ్వరుని యిల్లాలు. ఈమె దయలేకపోతే జగమంతా పేదరికముతో బాధపడుతుంది.

శ్రీదుఁడు - కుబేరుడు; శ్రీమంతుఁడు - సంపదకలవాడు. 
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
శ్రీధరుఁడు - విష్ణువు (శ్రీధరం ప్రియ సంగమే).
శ్రీపతి - 1.విష్ణువు, 2.రాజు. శ్రియపతి - విష్ణువు, లక్ష్మీభర్త.
శ్రీపతిః ఇ - పు. శ్రియః లక్మ్యాః పతిః - లక్ష్మీదేవికి భర్త. 

శ్రీద శ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్శ్రీవిభావనః|
శ్రీధర శ్శ్రీకర శ్ర్వేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||

శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. మారుఁడు - మన్మథుడు.
జరాభీరువు - మదనుడు(జర - ముసలితనము).    

శ్రీకంఠుడు - శివుడు, కరకంఠుడు.
శ్రీకంఠః కాలకూటభరణజా శ్రీ శ్శోభా కంఠే యస్య సః - కాలకూటమును భరించుటవలనఁ గలిగిన శ్యామశోభ కంఠమందుఁ గలవాడు.

కలిమి - 1.అతిశయము, 2.సంపద.
అతిశయము -
అధిక్యము.
ప్రభుత్వము - (రాజ.)పరిపాలనము, రాజ్యము యొక్క ఆదర్శములను అమలులో పెట్టుట కై ఏర్పడిన సంస్థ, సర్కారు (Government).
పరిపాలనము - ప్రభుత్వనిర్వహణము, పరిపాలనా నియంత్రణ, పరిపాలన అదువులు, పరిపాలకుడు = ప్రభుత్వపరిపాలనా నిర్వాహకుడు, ప్రబంధకుడు.
సర్కారు - 1.ప్రభుత్వము, 2.జిల్లా, పరగణా, ప్రభుత్వమువారు. 
ప్రాభవము - ప్రభుత్వము.

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు, రది యెట్లన్నన్
దెలుప్పగ చెఱవు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.
తా.
ఎప్పుడూ మానవునికి సంపదలు కల్గునో, అప్పుడు వాని యింటికి లెక్కలేని బంధువులు పిలువకుండగనే వచ్చెదరు, అట్లాగనే చెఱవులు సమృద్ధిగా నిండియున్న తరుణమందు కప్పలు అనేకము అందు చేరుచున్నవి గదా! 

నానాదిక్కుల నరులెల్లా వానలలోననె వత్తురు గదలి.....

పగడపు రిక్క - ఆర్ద్రా నక్షత్రము.
పగడ -
పాచికల మీద ఒకటి చుక్క, సర్వ.ఒకటి, సం.వటికా.

విద్రుమము - పగడము, పగడపు చెట్టు Coral.
పగడము -
ప్రవాళము, పవడము, సం.ప్రవాళః.
ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణాదండము.
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.

అథ విద్రుమః పుంసి ప్రవాళం పుంసపుంసకమ్ :
విశిష్టో ద్రుమో విద్రుమః - విశేషమైన చెట్టు.
ప్రకృష్టం వలతే ప్రవాళం. అ. ప్న. వల సంచలనే - లతారూపమై యుండునప్పుడు  ప్రకృష్టముగా చలించునది. ఈ రెండు పగడము పేర్లు.

హ్రీంకార శుక్తికా ముక్తామణిర్హీంకార బోధితా,
హ్రీంకారమయ సౌవర్ణస్తమ్భ విద్రుమపుత్రికా. - 57శ్లో 

మెఱుఁగురిక్క - 1.ప్రవాళము, 2.కాంతిగల చుక్క.
మెఱుఁగు -
1.కాంతి, వెలుతురు Light, 2.కిరణము, 3.బంగారు, వెండి మొ.నగలకు పెట్టు తళుకు, 4.పొగరింపు (ఉబ్బుట).
మెఱుఁగుబోఁడి - (మెఱుఁగు + పోఁడి) మెరుపువలె మనోజ్ఞురాలగు స్త్రీ.

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము -
రిక్క, చూ.ఋక్షము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలదొర -
చంద్రుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు.

అబ్దిపల్లవము - పగడము.
ప్రవాళము -
1.పగడము, 2.చిగురు, 3.వీణా దండము. చిగురాకు రంగు (ప్రవాళ పద్మపత్రాభం).
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.

ఒళగు - 1.మర్మము, 2.లోకువ, 3.వీణాదండము, రూ.ఒళవు.
మర్మము -
జీవస్థానము, ఆయుస్సు.
ఒళవు - ఒళగు.
ఒళవరి - మర్మజ్ఞుడు.  

ప్రవాళ మఙ్కురే ప్యస్త్రీ :
ప్రవాళ శబ్దము చిగురునకును, అపిశబ్దము వలన పవడమునకును, వీణా దండమునకును పేరు. ప్రవలత ఇతి ప్రవాళం. ప్న. వల సంచలనే. - కదలునది. టీ. స. అంకురోహ త్ర నవకిసలయః. 

మంజరి - 1.చివురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.

పవడపు దీవులు - (భూగో.) పవడపు పురుగుల గుల్లలచే సముద్రపు అడుగు భాగమున నేర్పడిన దీవులు, (హిందూ మహాసముద్రములోని లక్షదీవులు, మలిదీవులు ఈ కోవకు చెందినవి).

చిగురు - 1.పల్లవము, విణ.లేత, రూ.చివురు.
పల్లవము -
1.చిగురు, 2.చిగురించిన కొమ్మ, 3.కోకచెరగు, 4.విరివి.
పల్లవించు - ఇగురొత్తు, చిగురుకొను.
పల్లవితము - 1.చిగురించినది, 2.విరివియైనది.
పల్లవుఁడు - విటుడు; విటకాఁడు - విటుడు.

ఇగురు - 1.చిగురు, పల్లవము, 2.పండ్ల చుట్టును మృదువుగా నుండెడి కండ.  రూ.ఇవురు.  
ఇగురుఁబోఁడి - చిగురువంటి మేనుగల స్త్రీ, చక్కని స్త్రీ.

చిగురించు - చిగుర్చు, పల్లవించు.
చిగురొత్తు - 1.చిగుర్చు, 2.అనురక్తమగు.
చిగురింత - 1.చిగుర్చుట, 2.తృణ విశేషము.
చిగురుఁబోడి - 1.చిగురువలె మనోజ్ఞురాలగు స్త్రీ, 2.స్త్రీ.
చిగురు విలుకాఁడు - మన్మథుడు.

ప్రబలము - చిగురు విణ. మిక్కిలి బలము గలది.
చిగురాకు దిండి -
కోయిల, పల్లవఖాది. కోయిలలు రసాల శాఖలపై చిగురు పసరుతో గొంతు జీరతీరి సుతారంగా కూయ నారంభిస్తాయి.

విటపము - 1.చివురించిన కొమ్మ, 2.చిగురు, 3.కొమ్మ, 4.బోదెలేని చెట్టు.
విటపి -
చెట్టు, వ్యు.విటపములు కలది.

తలిరు - చిగురు.
తలిరుదిండి -
కోయిల; కోకిలము - కోయిల.
తలిరుఁబోడి - స్త్రీ.
తలిరువిలుకుఁడు - మదనుడు, రూ.తలిరువిల్తుడు, తలిరువిలుకాడు.

క్రొంజిగురు (క్రొత్త + చిగురు) - క్రొత్తచిగురు.
క్రొంజిగురువిల్కాఁడు - మన్మథుడు.

కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
శాఖ -
1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ - ఆడుది(స్త్రీ - ఆడుది), రూ.కొమ్మ. 
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి. 
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె. బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.

పోటకత్తి - (వ్యవ.) పొడవైన పిడితో వంపు తిరిగి యుండు చిన్నకత్తి, (ఇది కొమ్మలను నరకుటకు కుపయోగించును) (Bill-hook).

వల్లరి - చిగురించిన లేతకొమ్మ, తీగ.
మంజరి -
1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
వల్లి - 1.తీగ, 2.సుబ్రమణ్యేశ్వరుని భార్య.
సుబ్రమణ్యుఁడు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ. కొమరుసామి. కొమరసామి - స్కందుడు; స్కందుఁడు - కుమారస్వామి. 

వల్లరీ మఞ్జరీ స్త్రియా,
వల్లతే శాఖాంసంవృణోతీతి వల్లరీ. ఈ. సీ. వల వేల్ల సంవరణే. - కొమ్మను గప్పునది.
మన్యతే పికాదిభి ర్బహుమన్యతే మంజరీ. ఈ. సీ. మన అవబోధనే. - కోకిలాదులచేత నిక్షేపమువలెఁ దలఁచఁబడునది.
ఈ శబ్దములు ఇక్షారాంతములుం గలవు. పూవులగుత్తికిఁగాని పూచిన కొమ్మకుఁగాని పేర్లు.

తీగకు పందిరి కావలెగాని తెలుసా నువ్వే పందిరని... 

లత - 1.తీగ, 2.ముత్యాలహారపు పేట, (వృక్ష.) తీగగా ఏదైన ఆధారమును ఊతగొని ప్రాకు మొక్క.
తీఁగ - లత, రూ.తీఁగియ, తీఁగె, తీవ, తీవియ, సం.దీర్ఘా.
తీవ - తీగ, రూ.తీవియ, తీవె. తీవియ - తీవ; తీవె - తీవ. 
లతిక - 1.తీగ, 2.నూరు పేటల హారము.
లతకూన - లేత తీగవంటి స్త్రీ.
తీఁగబోఁడి - స్త్రీ; స్త్రీ - ఆడుది.
తీఁగవిలుకాఁడు - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. 

లతా కాపి తరుః కో(అ)పి కాశ్యా మాశ్చర్యదంపతీ
సా చాపర్ణా నచ స్థాణు ర్దదాతే వాంఛితం ఫలమ్||
భా||
వారణాసియం దొక్క లతకును నొక్కవృక్షమునకును విచిత్రమైన దాంపత్యము కలదు. ఆ లత యపర్ణ(ఆకులు లేనిది. అపర్ణ = పార్వతి. తపసి పర్ణానామ ప్యనశనా ద(అ)పర్ణా - పర్ణములైన భక్షింపక తపం బొనర్చినది.) ఆ భూరుహము స్థాణువు ఈశ్వరుడు (స్థాణువు = 1.మేకు, 2.శివుడు, 3.కొమ్మలులేని చెట్టు మ్రోడు, విణ.స్థిరమైనది.) కాని కోరిన కోర్కెల నన్నిటి నాదంపతు లొసంగుచుందురు. (వారణాసిలో ను(ఉ)మామహేశ్వరు లను దంపతులు భక్తులు కోరిన కోర్కెల నెల్ల సఫలము గావింతురని భావము.) 

ప్రతతి - 1.సమూహము, 2.తీగ, 3.విరివి.
సమూహము -
గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
విమోటనము - (భౌతి.) ఒక తీగను గాని కొంచెము నులిపినపుడు అది మరల తింటిస్థితిని తీసికొనుట కుపయోగించు బలము, (Torsion).

అన1 - 1.అన్న, 2.చిగురు, 3.ఆనకట్ట.
అన2 -
1.అనుటకు, అనగా మొ.ని; ఉత్ప్రేక్షావాచకముగా ఉపయోగింప బడును.
అన్న - జ్యేష్ఠసోదరుడు.
జ్యేష్ఠుడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రజుఁడు - 1.బ్రహ్మ(పరమేష్ఠి - బ్రహ్మ), 2.బ్రాహ్మణుడు, 3.అన్న.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ, దేవతలలో పెద్దవాడు.
విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు. బ్రాహ్మణుఁడు - పారుడు.
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః. 

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్థుడు, మరీచి).   

జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త. ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.వి., సొత్తు.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్. 
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.  
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle). 
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు. 

విప్రానాం జ్ఞానతో జ్యేష్ఠం, క్షత్రియాణాంతు వీర్యంతః|
వైశ్యానాం ధాన్యధనత, శ్శూద్రాణా మేవ జన్మతః||
తా.
బ్రాహ్మణులలో జ్ఞానము(జ్ఞానము - తెలివి, ఎరుక.)గలవాడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమవంతుఁడు పెద్ద, వైశ్యులలో ధనధాన్యము గలవాఁడు పెద్ద, శూద్రులలో వయోధికుఁడు పెద్దయని భావము. - నీతిశాస్త్రము

వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||

ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించిన అడ్డంకి.
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట. 
వారధి - వంతెన, అడ్డకట్ట (ఈ అర్థము తెలుగునందే). 
వంతెన - ఏటిపైకట్ట, వారధి. 
కట్టుగొమ్మ - అడ్దకట్ట, సేతువు. సేతువు - నీటికట్ట. 

బరాజ్ - (వ్యవ., అర్థ, భూగో.) (Baraz) నీటిపారుదల వసతులకై నదిలోని నీరును భద్రము చేయుటకై కట్టిన కట్టడము. 

గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించినదానికై విచారించుట.  

ఆర్ద్రత - మెత్తదనము, స్నిగ్ధత, (భౌతి.) గాలిలోని తేమ, తడి (Humidity, Moisture).

క్లిన్నము - ఆర్ద్రము, తడిసినది.
ఆర్ద్రము -
(భౌతి.,రసా.) తడిసినది, తడిగా నున్నది (Damp).
చెమ్మగిలు - 1.తడిగలదియగు, 2.చెమ్మగిల్లు, 3.చెమ్మయురుకు.
చెమ్మగొట్టు తెగులు - (వ్యవ.) సామాన్యముగా మడియందు తేమ హెచ్చుగానుండుటచే, కొన్ని జాతుల నారు మొక్కల మొదళ్ళకు ఒక విధమగు బూజు తెగులు పట్టి అవి చీకి వాని తలలు వడలిపోవుట (Damping off).

నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ|
నిత్యషోడశికారూపా - శ్రీకంఠార్ధ శరీరిణీ. - 85శ్లో

(ౘ)చొదుగు - చెమ్మ, తడి.
చెమ్మ -
తడి, ఆర్ద్రత, సం.సృమరః, శ్రమః.
తడియు - ఆర్ద్రమగు.

ఈకువ - తడి, తేమ, ఆర్థ్రత.
తేమ -
తడి, రూ.తెమ్మ.
తేమగిల్లు - తడియగు, రూ.తేమగిలు.
తేమనము - 1.మజ్జిగపులుసు(మజ్జిగ – చల్ల, సం.మార్జికా), 2.తడియుట, రూ.తేమము. 
తిమ్మనము - 1.తేమనము, 2.మజ్జిగ పులుసు, 3.పాలు, బెల్లము, పిండి ఉడికించి చేసిన పదార్థము, సం.తేమనమ్.
శిఖరణీ - 1.చల్లపులుసు, 2.ఉత్తమ స్త్రీ, 3.రోమావళి, 4.సిగరి, 5.వృత్త విశేషము.
సిగర - శిఖరిణి, చల్లపులుసు, రూ.గరి.  

వామ - ఉత్తమస్త్రీ.
వామదేవుఁడు - శివుడు.
వాముః శ్రేష్ఠ స్స చాసౌ దేవశ్చ వామదేవః - శ్రేష్ఠుడైన దేవుఁడు.
వామపార్శ్వే ధృతా దేవీయన్య సః - ఎడమ ప్రక్కను ధరింపఁబడిన భార్య గలవాఁడు.
వామయా దీవ్యతీతి వా - స్త్రీచే బ్రకాశించువాఁడు.
దివ్ క్రీడావిజీషా వ్యవహార-ద్యుతి స్తుతిమోద మద స్వప్న కాంతిగతిషు. వక్రత్వాద్వామస్స చాసౌ దేవశ్చేతి వా - వక్రత్వము గల దేవుఁడు.  

గరి - 1.అతిశయము(అతిశయము - అధిక్యము), 2.వరినారు తలెత్తి విస్తరిల్లు పచ్చటి భాగము, (వృక్ష.) పర్ణాంగము యొక్క పత్రము (Frond).

ద్రవము - 1.తడి, 2.పరిహాసము, 3.పరుగు, 4.యుద్ధమునుండి పారుట, 5.వేగము.

అర్దకము - అల్లము Ginger;  అల్లము - పచ్చి సొంటి, సం.అర్దకమ్. శృంగబేరము - అల్లము.

ఆర్ద్రక శృఙ్గబేరం స్యాత్ :
ఆర్ద్రాయాం భవం ఆర్ద్రకం - ఆర్ద్రానక్షత్ర మందుఁ బుట్టినది.
శృంగవద్భేరం వపు రస్య శృంగబేరం - కొమ్ములవంటి యాకృతి గలిగినది. ఈ రెండు అల్లము పేర్లు.

ప్రకందము - (వృక్ష.) అల్లము, పసుపు మొదలగు మొక్కలకు భూమిలో నుండు కాండము (Rhizome).

మురబ్బ - (మురబ్బా) 1.అల్లపు మురబ్బయను లేహ్యము, 2.పెంకితనము.  
పెంకితనము - చెప్పినమాట వినకుండుట, మూర్ఖత.
పెడసగము - మౌర్ఖ్యము, మూడత్వము. 
ముకురుతనము - మౌర్ఖ్యము.
మూర్ఖము - మౌర్ఖ్యము(మౌర్ఖ్యము - మూర్ఖత్వము)గలది.
మారాము - 1.మర్మము, 2.గారాబము, 3.పెంకిపట్టు.   

మామిడల్లము - (వ్యవ.) పచ్చిమామిడి కాయ వాసనగలిగి అల్లమువలె నుండు దుంప (ఇది పసుపు కుటుంబము (Zingi-beraceac)నకు చెందిన Curcuma amada అను మొక్క యొక్క దుంప) (Mango ginger).

మహౌషధము - 1.శొంఠి, 2.గొప్పఔషధము.
శొంఠి -
వ్యవ. ఎండిన అల్లము, సొంటి (Dried ginger).
సొంటి - శుంఠి(శుంఠి - సొంటి), ఎండిన అల్లము, సం.శుంఠీ.

కొమ్ము - 1.ఉకారము యొక్క రుపాంతరనామము, 2.ఎద్దు మొవి. ని కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ.ని ఎండిన గడ్డ, ఉదా. పసుపుకొమ్ము, శింఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 8.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.

ఓల్లము - 1.అల్లము, 2.కంద.
సూరణము -
కందగడ్డ; కంద - కందగడ్ద.
సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు(సమర్థుఁడు - నేర్పరి), 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (Inner voice).  

కందకు లేని దురద, కత్తిపీట కొచ్చిందిట. కందకు లేని దురద బచ్చలికా?

అర్శోఘ్న స్సూరణః కన్దః -
అర్శో హంతీతి అర్శోఘ్నః. హన హింసాగత్యోః. - మూలవ్యాధిని హరించునది.
సూర్యత ఇతి సూరణః - భక్షించఁబడునది. సూరీ హింసాయాం. పా. శూరణః.
కంద్యతే రోగో అ నేనేతి కందః. కది అహ్వానే రోదనే చ. - దీనిచేత రోగము పీడింపఁబడును.
కంద్యతే రోగి భిరన్వీక్ష్యత ఇతి వా కందః - రోగులచేత వెదుకఁబడునది. ఈ 3 కంద పేర్లు. 

కందరము - 1.అల్లము ginger, 2.అంకుశము (ఏనుగును నడుపుటకు కుంభ స్థలమున పొడుచు ఆయుధము), 3.బిలము.
అంకుశము - ఏనుగును నడుపుటకు కుంభస్థలమున పొడుచు ఆయుధము.
సృణి - అంకుశము; తోత్రము - బరిగోల, అంకుశము, మునికోల.
బరిగోల - 1.బాణము, 2.ఏనుగును పొడిచి బెదిరించుటకైన ఉక్కు వేణుదండము.
మునికోల - ములుకోల, ఎద్దుల నదిలించు కోల, రూ.ములుకోల.
ములుకోల - ఎడ్లను పొడిచెడి మునికోల. 

బిలము - 1.రంధ్రము, 2.గుహ.
వివరము - రంధ్రము.
రంధ్రము - 1.క్రంత, సందు 2.దూఱు(దూఱు - నిందించు, వి.నింద).  క్రంత1 - పెండ్లి కొడుకువారు పెండ్లి కూతురునకు తీసుకొని పోయెడు ప్రధాన ద్రవ్యము, రూ.కంత.
క్రంత2 - 1.సందురోవ, 2.రాజ వీధి, రాజ మార్గము 3.రచ్చ, 4.రంధ్రము, సం. గర్తః.
సందు - 1.సంది, 2.ఇరుకువీధి, 3.సొరంగము, 4.ఎడము, 5.సందర్భము, సం.సంధిః.
సంది - 1.సందు, 2.దండచేయి, సం.సంధిః.
సందలి - దండచేయి.

గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కందము.
స్కందము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk). 
మూఁపు - భుజ శిరస్సు, అంసము.  

కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము -
(జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)

లాఁగ - రంధ్రము, బొరియ.
లాఁగదాఁగుడు - సర్పము, వ్యు.బొరియ లందు దాగుకొనునది.

గుహ -1.కొండబిలము 2.పల్లము 3.దాగుట 4.హృదయము 5.బుద్ధి. కందర - కొండబిలము, గుహ. దరి - గుహ.
స్వాంతము - 1.మనస్సు, 2.గుహ.
అంతఃకరణము - 1.మనస్సు, 2.దయ.
గూఢపథము - 1.అంతఃకరణము, హృదయము, 2.రహస్య మార్గము. 

గుహుఁడు - కుమారస్వామి, వ్యు.దేవసేనలను పొదివి రక్షించువాడు, 2.ఒక నిషాదరాజు.
గుహలోకి భయస్తులు పోజాలరు. ధైర్యంతో గుహలో ప్రవేశించగలవారు, సింహంపంజాతో కొట్టగా పడిన రతనాలను పొంద గలుగుతారు.

దాఁగు - మరుగుపడు, రూ.డాఁగు.
దండసిల్లు -
మరుగుపడు, అణగు, రూ.దండసిలు.
తాఱు - అడగు, మరుగుపడు.
మఱుఁగు - మఱుఁగుచోటు, క్రి.1.డాగు, చాటగు, 2.సంతాపించు.
అపవారణము - మరుగు.  మఱుకువ - సంతాపించు.
ఓలమానగొను - 1.శరీరము రక్షించుకొను, 2.మరుగుపడు, 3.వెనుదీయు.   

హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె (Heart).
గుండె -
గుండియ; గుండియ - హృదయము, రూ.గుండె.
కందనకాయ - గుండెకాయ.

ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
బుద్ధి -
 బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి -
(గృహ.) తెలివితేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది.
మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి. ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.

ఆత్మబుద్ధి స్సుఖ చైవ - గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ - స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా.
తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. - నీతిశాస్త్రము   

ఈశాన్యము - తూర్పునకు, ఉత్తరమునకు నడుమగల దిక్కు.
పూర్వోత్తర(ము) -
1.ఈశాన్య దిగ్భాగము, 2.ముందు వెనుక.

తూర్పువానలు - (వ్యవ.) ఈశాన్య వర్షవాయువుచే వచ్చు వానలు, (Eastern rains).
ఈశాన్య వ్యాపార పవసములు - (భూగో.) భూమధ్యరేఖకును, కర్కాటక రేఖకును, మధ్య వీచు పవనములు.

ఐశాని - ఈశాన్యదిక్కు.
ఐశుఁడు - ఈశ్వరుని కుమారుడు.

సుప్రతికము - ఈశాన్యదిక్కు నందలి ఏనుగు.
శోభనాః ప్రతీకా అవయవా యస్యసః సుప్రతీకః - మంచి అవయములు గలిగినది.
అంజనావతి - ఈశాన్య దిక్కునందలి  సుప్రతీకమను దిగ్గజము యొక్క భార్య.
అంజనిక - 1.నలికండ్ల పాము, 2.ఒక జాతిబల్లి, 2.చుంచు, 4.సుప్రతీక మను దిగ్గజము యొక్క భార్య.
బ్రహ్మ సర్పము - నలికండ్ల పాము.
నలికండ్ల పాము - రక్త పుచ్ఛిక, రూ.నలికిరి, నలికీచు. 
నల్లిక - నలికండ్ల పాము; మీద్ద - నలికండ్ల పాము.
చుంచు - 1.చుంచు, రూ.చుందరి.
(ౘ)చుంచు -1.కంపెలుక, సం.చుచుందరీ; గంధమూషికము - చుంచు. (ౘ)చుంచెలుక - 1.చుచుందరి, చుందరి, 2.కంపెలుక, రూ.చుండెలుక.
చుచుందరి - 1.చుంచు, రూ.చుందరి.

చుచున్దరీ గన్ధమూషీ -
ఛ్యతీతి చుచుందరీ. సీ. ఛో చ్ఛేదనే. - ధాన్యములను ఛేదించునది.
గంధవతీ మూషీ గంధమూషీ - వాసన గల యెలుక. ఈ రెండు చుంచు పేర్లు.

తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).

పునాసలు - పునర్వసు నక్షత్రమందు సూర్యు డుండినపుడు చల్లిన ధాన్యము.
పునాసపంట - (వ్యవ.) మే నెల మొదలు ఆగష్టు నెలలోపల చేయు పునాసరకముల వరిసాగు (paddy third crop).

సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు తొలకరి వానలు ప్రారంభమవుతాయి. దీనినే మృగశిర కార్తె అంటారు. వర్షాకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు.

పైరుకు ముదురు, పనికి లేత కావాలి. ఆరుద్ర కార్తెలో(సూర్యుడుండు నక్షత్రము) అడ్డెడు వేసిన పుబ్బలో పుట్టెడు పండును.

ఆరుద్రపురుగు - వర్షాకాలమున ఆరుద్ర కార్తెలో కన్పించెడి పట్టువంటి దేహముగల ఒక ఎఱ్ఱని పురుగు, ఇంద్రగోపము.
ఇంద్రగోపము - ఆరుద్రపురుగు; పట్టుపురుగు - ఒక రకపు పురుగు, ఇంద్రగోపము; జేగుఱుఁబురువు - ఆరుద్రపురుగు. ధుంధుమారము - 1.కరదూపము, 2.పట్టుపురుగు. 

పట్టుకృషి - (వ్యవ.) పట్టు పురుగులను వృద్ధిచెసి పట్టు నుత్పత్తిచేయుట (Seri-culture).

కౌశేయము - పట్టుది, (చీర), వి.కౌశేయమను బాణము, సం.వి. (గృహ.) పట్టు. పట్టుపురుగులలో నుండి వచ్చు జిగురు పదార్థముతో తయారైన నూలు (ఈ నూలుతో బట్టలను నేయుదురు).
పట్టు - ఒక జాతిపురుగులవల్ల కలిగెడు ఒక దినుసు మేలు నూలు, సం.పట్టః. తాపిత - మేలైన పట్టుగుడ్డ.

పట్టుకుట్టు - (గృహ.) పువ్వులు ఆకులు మొదలగు నమోనాలను ఏటవాలుకుట్లతో నింపినది (Satin stich).

ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా,
గూఢగుల్భాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. -
18శ్లో

7. పునర్వసు - ధనుస్సు వంటి యాకారమును పోలి 5 నక్షత్రములుం డును.

పునర్నో దేవ్యదితి స్పృణోతు | పునర్వసూనః పునరేతాం యజ్ఞమ్ | పునర్నో దేవా అభియంతు సర్వే | పునః పునర్వో హవిషా యజామః | ఏవా న దేవ్యదితిరనర్వా | విశ్వస్య భర్త్రీ జగతః ప్రతిష్ఠా | పునర్వసూ హవిషా వర్ధయంతీ | ప్రియం దేవానా - మప్యేతు పాథః ||5||       

అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య,  2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 2.సూర్యమండలాంతర్గత విష్ణువు. ఆదితేరపత్యం ఆదిత్యః - అదితి కొడుకు. సూర్యుడు అదితి పుత్రుఁడు, ఆదిత్యుఁడు. ద్వాదశాదిత్యులు క్షత్రియులు.

ఆదిత్యాః - ఆదిత్యులు పన్నిదరు - ఇంద్రుఁడు, ధాత, పర్జన్యుఁడు, త్వష్ట, పూష, అర్యముఁడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుఁడు అనువారలు.

ఋః - అదితి, ఋ అనఁగా అదితిదేవి. అదితి దేవజనని, ప్రకృతి కళ నుండి పుట్టిన స్త్రీ.

అదితి కశ్యపులకు విష్ణువు(వామనావతారము) వామనుడై శ్రవణానక్షత్రములో బుట్టెను. పుట్టగానే జ్ఞానవంతు డయ్యెను. 

శ్రీరంజితా మహాకాయా సోమసూర్యగ్నిలోచనా,
అదితి ర్దేవమాతా చ అష్టపుత్రా ష్టయోగినీ. - 63

పార్వతి - 1.గౌరి (పర్వతపుత్తి), 2.ద్రౌపది.
గౌరి -
1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. గణనాయిక - గౌరి, పార్వతి.
ద్రొవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్త్రిక), 2.బొమ్మ.
బొమ్మ - 1.కనుబొమ, 2.బిరుద చిహ్నము, 3.అవమానచిహ్నము, 4.ప్రతిమ, 5.బ్రహ్మ, విణ.అల్పము, సం.1.భూ, 2.ప్రతిమా, 3.బ్రహ్మ.
బొమ - 1.కనుబొమ, 2.ప్రతిమ, రూ.బొమ్మ. భూణ - కనుబొమ్మ. ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలనము, వి. (భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).

ఆభాసము - 1.కాంతి, 2.ప్రతిబింబము, 3.వాస్తవము కాకపోయినను పైకి వాస్తవమైన దానివలె కనించునది, ఉదా.హేత్వాభాసము, రసాభాసము మొ.

బొమ్మచుక్క - కానరానిచుక్క, అభిజిన్నక్షత్రము.
కానరానిచుక్క -
అభిజిత్ నక్షత్రము.
అభిజిత్తు - 1.పగలు పదునాల్గు గడియలపై నుండు గడియల కాలము, 2.ఒక నక్షత్రము. 

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుఁడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.

కాశ్యపి - భూమి, వ్యు.పరశురామునిచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నియ్యఁ బడినది.  
జీవులకు ఆధారం భూమి. అందుకే ఆమెను తల్లితో పోలుస్తారు. భూమిపై తిరిగే మానవులకేకాక పశుపక్ష్యాదులకు, చెట్టుచేమలకు, రాయిరప్పలకూ కూడా ఆమె తల్లే!

భూమి - నేల, చోటు(తావు), పృథ్వి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల -
1.భూమి 2.ప్రదేశము 3.దేశము.
పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది. 

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

పుడమి - భూమి, సం.పృథివి.
పుడమికానుపు -
1.సీత, 2.చెట్టు.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించింది.
నేలచూఁలి - సీత, భూపుత్రి. చిత్రకూటము నందు దేవీస్థానం సీత.
సీత -
1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

వసుధ - భూమి వ్యు. వసువును(బంగారమును) ధరించునది. వసు అనే ధాతువును కప్పి పుచ్చడం లేదా రహస్యంగా ఉంచడమని అర్థం. 
వసువు - బంగారు, ధనము, రత్నము.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పైడిచూలాలు - వసుంధర, భూమి. వసుంధర - భూమి.
పైఁడిఱేఁడు - కుబేరుడు; ; పైడినెలత - లక్ష్మి. నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వాడూర్యము.)
రత్నగర్భ - భూమి.
రత్నగర్భుఁడు - 1.సముద్రుడు, 2.కుబేరుడు. 

స్త్రీయోరత్నాస్తధావిద్యా ధర్మశ్శౌచం సుభాషితం|
వివిధానిచ శిల్పాని సమాధేయాని సర్వతః||
తా.
సద్గుణవంతులైన వనితలు, రత్నములు, విద్య, ధర్మము, పరిశుద్ధము, సద్వాక్యము, నానావిధములయిన శిల్పము లివి యెచ్చట నున్నను గ్రహింపవలయును. - నీతిశాస్త్రము  

యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శ్శిల్పాది కర్మచ|
వేదాః శ్శస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్||

వసువులు - గణాధి దేవతలు, అష్టవసువులు. వసువులు అగ్నికధిస్ఠాన దేవతలు. The eight vasus, వసిష్టుని శాపానికి మానవులై పుట్టవలసి వచ్చినది.

వసవః, ఉ-పు. ఆహత్య వసంతీతి వసవః - కూడుకొని యుండువారు. వస నివాసే వారలెనమండ్రు(ఎనిమిది మంది). ఆపుఁడు, ధ్రువుఁడు, సోముఁడు, అధ్వరుఁడు, అనిలుఁడు, ప్రత్యూషుఁడు, అనలుఁడు, ప్రభాసుఁడు అనువారలు. 

ధన మగ్ని ర్థనం వాయుః ధనం సూర్యో ధనం వసుః |
ధన మింద్రో బృహస్పతి ర్వరుణో ధన మశ్నుతే ||

1.అవుఁడు - క్రింది పెదవి, అధరము, పల్లు, దంతము, ఔడు.
అదరము1 - క్రిందిపెదవి, సం.అధరః
అదరము2 - 1.భయము లేనిది, 2.లోతులేనిది.
అధరము - క్రిందిపెదవి విణ.1.తక్కువైంది 2.క్రిందిది 3.నీచము.    ఔడు - పెదవి క్రింద చోటు, సం.ఓష్ఠః.
దంతము - పల్లు, కోర.   రదనము - దంతము.
పలు -
దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
' సి ' విటమిన్ - (గృహ.) Vitamin ‘ C’ 1.పళ్ళచిగుళ్ళ బలహీనతను తొలగించు విటమిన్, 2.శరీర కణజాలముల బంధనమునకు తోడ్పడు విటమిన్.
పయోరియా - (గృహ.) పంటిచిగురు రోగము, ఒక విధమైన పండ్ల వ్యాధి, పన్నుకుదురులలో నుండి చీమురక్తము స్రవించువ్యాధి,(Pyorrhoea). స్కర్వీ (సీతాదము) - (గృహ.) (Scurvy)  'సి' విటమిన్ Vitamin C, లోపము వలన కలుగువ్యాధి. చిగుళ్ళవాపు, పండ్ల నుండి రక్తము కారుట, (ఈ వ్యాధి ఖటిక (Calcium) లోపము వలన కూడ కలుగవచ్చును.  
2.ధ్రువుఁడు - ఉత్తర దిక్కులోనుండు నక్షత్రము,1.ఉత్తానపాదుని కొడుకు 2.విష్ణువు 3.శివుడు(విష్ణు భక్తుడు).
3. సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
4.అధ్వరుఁడు - అధర్వా వై ప్రజాపతిః యాగము నందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, అధ్వర్యువు.  అధ్వర్యము - 1.హింసా రహితము 2.సావధానము,  విణ. 1యజ్ఞము 2.సామయాగము 3.ఆకాశము. (ఆకాశము కంటే ఉన్నతమైనవాడు కన్నతండ్రి).
5.అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.      అనిలము - గాలి దేహము నందలి వాతధాతువు, వాతరోగము.    అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.   
6. ప్రత్యుషుఁడు - వేగుజాము, ప్రభాతము.
7. అనలుఁడు - 1.అగ్నిదేవుడు 2.అష్టవసువులలో ఒకడు.
8. ప్రభాసుఁడు - Source, ప్రతాపము, తేజము, చర్మము యొక్క పైపొర Epidermis.
ప్రభాసిని - (జం.) చర్మము యొక్క పైపొర (Epidermis).
జవ్వు - 1.దుర్మద జలము, 2.చర్మము లోపలిపొర(Epidermis) 3.సొగసు, అందము. 

అష్టవసువులలో అష్టమ వసువు భీష్ముడు. వసువు అంశతో భీష్ముడు గంగకి(గంగానది) పుట్టాడు. భీష్ముఁడు పితృభక్తి పరాయణుడు, రాజకీయ విద్యావిశారదుడు, ఇచ్ఛా మరణము పొందినవాడు.      

ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.

జితేంద్రియుడు - ఇంద్రియములను జయించినవాడు. కామ క్రోధాలకు లొంగనివాడే జితేంద్రియుడు. జితేంద్రియులకు తప్ప సామాన్యులకు శాంతి కలుగదు. జితేంద్రియుడగు యోగి కర్మ ఫలములయం దపేక్షను వదలి శాశ్వతముగు ఆత్మశాంతి పొందును.

అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగువాడు, విష్ణువు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
భీష్ముఁడు - 1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.

పరసతుల గోష్టినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
గరిత సుశీలయైనను,
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ.
తా||
బ్రహ్మచారియైన భీష్మునంతటి వాడైనను ఇతర స్త్రీలతో సరస సంభాషణలు జరిపినచో లోకం అట్టి వానిని అనుమానించును. అట్లే యెంతటి(గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.) సుశీలయైన స్త్రీ అయినను అన్యపురుషుల పోషణలోవున్న నిందల పాలగును.

భ్రాజిష్టు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||

Lord-Shiva-58

1 comment:

  1. వ్యాసాల్లాగా లేవు.. ప్రతిపదార్థాల్లాగా ఉన్నాయండీ పోస్టులు.
    కావలసింది విశ్లేషణలు. ప్రతి పదానికి అర్థాలు కావు. దయచేసి విశ్లేషణలు రాయగలరు !!

    ReplyDelete