Tuesday, March 20, 2012

వృషభరాశి

కృత్తిక 3, రోహిణి 4, మృగశిర 2 పాదములు వృషభరాశి.

తులా వృషభ రాశీశో దుర్ధరో ధర్మపాలకః,
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశ విమోచకః. - శుక్రుడు(Venus)

ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.

ఎండకాలంలో కొత్త కుండలో నీళ్ళు ఎంత రుచి! చల్లని నీరు నాలుకకు ఇంపు!

కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె, మొ.వి. సం.క్రాంతిః.
కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు, 4.నస, 5.ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons). 

భరణి ఎండకు బండలు పగులుతాయి. కృత్తిక ఎండకు కుత్తుకలు ఎండి పోతాయి. రోహిణి కార్తె ఎండ ఱోళ్ళు బద్దలు కొడుతుంది. (సూర్యుడుండే నక్షత్రము, భయంకరమైన ఎండలు). సంవత్సరానికి రెండు వేసవులు రావు, ఉండవు.

కృత్తిక - ఇరువదియేడు నక్షత్రములలో మూడవది, కత్తెర.
కృత్తి -
1.చర్మము, తోలు, 2.కృత్తికానక్షత్రము.

కృత్తివాసుఁడు - ముక్కంటి.
కృత్తిశ్చర్మవాసో (అ)స్య కృత్తివాసాః. స-వు. - చర్మము వస్త్రముగాఁ గలవాఁడు.

ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు -
శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు. 

ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.

కృత్తిక ప్రథమ భాగమున సూరుడున్నప్పుడు, విశాఖా చతుర్థ పాదమున చంద్రుడు ఉండును. విశాఖా చతుర్థపాదమున చంద్రుడు ఉన్నప్పుడు, కృత్తికా శిరస్సున సూర్యుడు ఉండును.

దేహంలోని ఆయుః స్థానాలైన షట్చక్రాలకు ప్రతీక కృత్తికా నక్షత్రము.

కృత్తికాసుతుఁడు - కుమారస్వామి.
కార్తికేయుఁడు - కుమారస్వామి, వ్యు.కృత్తికల కుమారుడు.

కృత్తికానా మపత్యం కార్తికేయః - షట్కృత్తికల కొడుకు.
బహులానాం కృత్తికానా మపత్యం బాహులేయః - కృత్తికల కొడుకు.

షాణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.
షడాననుడు - కుమారస్వామి, షణ్ముఖుడు, వ్యు.ఆరు ముఖములు కలవాడు.

కృత్తికాదీని నక్షత్రాణీందోః పత్న్యస్తు భారత|
దక్షశాపాత్ సో అనపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః|

వేసఁగి - వేసవి, సం.వైశాఖః.
వేసవి -
వేసవికాలము.
వైశాఖము - 1.వైశాఖమాసము, 2.కవ్వము, 3.వీలుకాని స్థానము.
మాధవము - 1.వైశాఖమాసము, 2.వసంత ఋతువు. 

వైశాఖో మాధవో రాధో -
విశాఖానక్షత్రయుక్తా పూర్ణిమా వైశాఖీ, సా(అ)స్థిన్నితి వైశాఖః, - విశాఖా నక్షత్రముతో గూడిన పున్నమ దీనియందుఁ గలదు.
కుసుమసంభృతం మధు ప్రచురం అస్మిన్నస్తీతి మాధవః - కుసుమ సంభృతమైన మధువు విస్తారముగలది. మధుః వసంతః అస్మిన్నితివా మాధవః - మధువనఁగా వసంతుఁడు, అతఁడు దీనియందుఁ గలఁడు.
రాధా విశాఖా, త్యుక్తాపూర్ణిమా (అ)స్త్యస్మిన్నితి రాధః - రాధ యనఁగా విశాఖ, దానితోఁ గూడిన పున్నమ గలది. - ఈ 3 వైశాఖ మాసము పేర్లు. 

వసంతము - 1.చైత్రవైశాఖ మాసములు, 2.ఒకానొక రాగము, వి.పసుపును సున్నమును కలిపిన యెఱ్ఱనీళ్ళు.
మధువు - 1.నీరు, 2.పాలు, 3.తేనె, 4.కల్లు, 5.వసంతర్తువు, 6.చైత్రమాసము.    

మధురివుఁడు - విష్ణువు.
మధో రసురస్య రిపుః మధురిపుః - ఉ- పు. మధు వనెడి రాక్షసునికి శత్రువు.

రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.

వసంతం యౌవనంవృక్షాః, పురుషా ధనయౌవనమ్|
సౌభాగ్యం యౌవనానార్యో, యౌవనావిద్యయా బుధాః||
తా.
వృక్షములకు వసంతఋతువు యౌవనము, పురుషులకు ధనము యౌవనము, స్త్రీలకు భాగ్యమే యౌవనము, పండితులకు విద్యయే యౌవనము. - నీతిశాస్త్రము

వైశాఖము - 1.వైశాఖమాసము, 2.కవ్వము, 3.వీలుకాని స్థానము.
మంథరము -
1.చొరవలేనిది, 2.మెల్లగా పోవునది, 3.వంకరైనది, వి.కవ్వము. 
మంథానము - కవ్వము; కవ్వము - పెరుగు చిలుకు సాధము. 
మంథనము - 1.త్రచ్చుట, 2.కవ్వము.
దధిచారము - కవ్వము. తరిగోల - కవ్వము. క్షుబ్ధము - కలత పెట్ట బడినది, వి.చల్ల కవ్వము.
దండాహతము - మజ్జిగ, వ్యు.కవ్వముచే త్రచ్చ బడినది.
రసాయనము - 1.జరావ్యాధులను పోగొట్టెడి మందు 2.మజ్జిగ.
చల్ల - మజ్జిగ, శీతము.

వైశాఖ మన్థ మన్థాన మన్థానో మన్థదణ్డకే,
విశాఖయాం భవో వైశాఖః - విశాఖయందుఁ బుట్టినది.
విశాఖస్య కాష్ఠ స్యాయమితి వైశాఖః - కొమ్మ సంబంధమైనది.
మథ్యతే అనేనేతి మంథః, మంథాన. అ. పు. మంథాశ్చ. న. పు. మంథ విలోడనే. - దీనిచేత మథింపఁబడును.
మంథనార్థం దండః మంథదండకః - మంథనార్థమైన దండము. ఈ నాలుగు 4 కవ్వము పేర్లు.    

దందవిష్కంబము - తరిగంబము, చల్ల చిలుకుట కాధారమైన స్తంభము.
తరిగంబము -
పెరుగు చిలుకు స్తంభము.
తరిగొండ - మంధాద్రి.

గుత్తి - 1.పూగుత్తి, 2.చీలిమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.

మందరము - 1.కవ్వపు కొండ, 2.మందారమును కల్ప వృక్షము, విణ.అలసము.
కవ్వపుఁగొండ -
(కవ్వము+కొండ) మంథరగిరి.
మందారము - 1.జిల్లేడు, 2.పారిజాతము.

గిరిధరుఁడు - విష్ణువు, వ్యు.మందర పర్వతమును ధరించినవాడు.

ఉరుగుణవంతుడొడ్లు దనకొండపకారము చేయునప్పుడున్
బరహితమే యునర్చు నొకపట్టుననైనను గీడుఁజేయఁగా
నెఱుఁగడునిక్కమేకదా యదెట్లనఁ గవ్వముఁబట్టియెంతయున్
దరువఁగజొచ్చినన్ బెరుంగు తామినీయదెవెన్న, భాస్కరా.
 
తా. పెరుగును కవ్వముతో నెంత తరచిన నంత వెన్న నిచ్చును. అట్లే గుణవంతుడు తనకు పరు లపకారము చేసినను, వాని సన్నిటిని సహించి వారికి ఉపకారమునే చేయును.     

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా|
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా. - 148శ్లో

సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
కామధేనువు -
వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు.
కామదుఘ - కామధేనువు; వెలిగిడ్డి - కామధేనువు.
ఈవులమొదవు - కామధేనువు.

సురభి గోలోకంలో వుండే పరమపావనమూర్తి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.

చంపేయము - 1.బంగారము 2.సంపెంగ.
జాతరూపము - బంగారము; అష్టాపదము - బంగారము.
చంపకము - సంపెంగ, సంపెగ.
సంపగియ - చంపకము, రూ.సంపగి, సంపెంగ, సంపగి, సం.చంపకః.
కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
హేమము - 1.బంగారు, 2.ఉమెత్త. తపనీయము - బంగారు.  
క్షౌద్రము - 1.తేనె, 2.ఉదకము, 3.సంపెంగ.
తేనెదిండి - తుమ్మెద.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెద కంటు గల్గించునది.

అథ చామ్పేయ శ్చమ్పకో హేమపుష్పః.
చంపాఖ్యదేశే భవః చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చమ్యతే అశిభిరితి చంపకః. చము అదనే. - తుమ్మెదలచే నాస్వాదింపఁ బడునది.
హేమవర్ణం పుష్యమన్యేతి హేమ పుష్పకః - బంగారు వన్నెగల పువ్వులు గలది. ఈ 3 సంపెంగ చెట్టు పేర్లు.

పూనూనె - సంపెంగనూనె.
కమ్మనూనియ -
సంపెంగ, మొ.వి చేర్చి చేసిన తైలము, రూ.కమ్మనూనె. మింగమెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అన్నట్లు.

గంధఫలి - సంపెంగ మొగ్గ, రూ.గంధఫలి.

సమూహఫలము - (వృక్ష.) ఒకే పుష్పములోని విభక్తాండ కోశము నుండి తయారైన ఫలసమూహము (Etacrio), ఉదా. సీతాఫలము, సంపంగి. పేర్లు
పుంజఫలము - (వృక్ష.) ఒకేపుష్పము నందు బయలుదేరి, విభక్తకమైన అండాశయము నుండి తయారైన పండు (Aggregate fruit), ఉదా. సీతాఫలము), చూ. సమూహఫలము.

దుర్జనం కాంచనం భేరీ దుష్టస్త్రీ దుష్టవాహ మ్|
ఇక్షుం తిలా నౌషధాకాశ్చ మర్దయేడ్గుణ వృద్ధమ్||
తా.
దుర్జనులను, బంగారమును, భేరిని, దుష్ట స్త్రీని, చెడుగుఱ్ఱమును, చెఱుకుగడలను, నువ్వులను, మందును గుణవృద్ధి కొరకు మర్దింప వలయును. - నీతిశాస్త్రము     

చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచా|
కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా.

ఆవు - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.

ధవళ - ఆవు వ్యు.పరిశుద్ధమైనది
ధవళము -
ఆబోతు విణ. 1.తెల్లనిది 2.చక్కనిది.
తెలుపు - 1.ఎరింగించు 2.మేలుకొలుపు 3.తేర్చు వై.వి.1.ధావళ్యము 2.పరిశుద్ధి (purity).
ఆఁబోతురౌతు - శివుడు వ్యు.ఆబోతునెక్కువాడు.

భూ - భూమి; భువి - 1.భూమి, 2.స్థానము.
భూమి -
నేల, చోటు, పృథివి. (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరముని భార్య, 2.నాగటి చూలు, 3.ఆకాశ గంగ.

పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది.

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథివీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.

భూపతి - నేల రేడు, రాజు.
నేలఱేఁడు -
రాజు.
భూభుజుఁడు - రాజు.
భూభృత్తు - 1.రాజు, 2.కొండ.
నేల వేలుపు - భూసురుడు.
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః|
అనిరుద్ధః స్సురానన్దో గోవిందో గోవిదాం పతిః||

మాహేయి - గోవు.
మాహేయుఁడు -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.

పృశ్ని - కిరణము, విణ.1.పొట్టిది, 2.చిన్నది.
కిరణము -
వెలుగు, మయూఖము.
వెలుగు - 1.కిరణము, 2.ప్రకాశము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు.
జ్వాలాజిహ్వుఁడు - అగ్ని.

అంటరాని వేలుపు - అగ్ని. అగ్ని అంటరానిది. తెలియక సృశించినను అగ్ని కాల్చును అను న్యాయము. నిప్పు ముట్టుకుంటేగాని కాలదు. నిప్పుకు చెదలంటవు.

అగ్ని - 1నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్నిముఖుఁడు -
1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
అగ్నిభువు - కుమారస్వామి.

అవసరమైనవాడు - ఆత్మబంధువువాడు - బహుముఖంబులవాడు - వాయుసఖుడు. - అగ్ని.

శోణము - 1.ఎరుపు, 2.ఒకనది, 3.నిప్పు.
నిప్పు -
అగ్ని, అగ్నికణము. రూ.నిప్పుక.
నిప్పుకోడి - ఉష్ట్రపక్షి.

కురువిందము - ఎఱ్ఱని కెంపు, అద్దము. అద్దము మంగళకర వస్తువు. కర్కము - 1.అందము 2.అద్దము 3.అగ్ని.
అందము- 1.సౌందర్యము 2.అలంకారము 3.విధము. విణ.1.చక్కనిది 2.తగినది.

ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము. దర్శము - 1.అమావాస్య, 2.చూపు.

తెలియని కార్యమెల్ల గడదేర్చుటకొక్క వివేకిజేకొనన్
వలయు, దానదిద్దికొననచ్చు, బ్రయోజనమాంద్యమేమయిన్
గలుఁగదు, ఫాలమందుఁ దిలకంబిడునప్పుడు చేతనద్దమున్
గలిగినఁ జక్కఁజేసికొనుఁగాదె నరుండది చూచి, భాస్కరా.
తా.
చేతిలో అద్దము గలవాడు అది చూచి బొట్టు(కురువము - తిలకము)చక్కగా పెట్టుకొనును, అట్లే తనకు తెలియనిపనిని చేయవలసి వచ్చినట్లయతే, ఆ పని నెరింగిన మంచివారి నాశ్రయించి నెరవేర్చుకొన వలెను.

ఆదర్శగజ న్యాయము - పెద్ద ఏనుగు చిన్న అద్దములో కనిపించుట అను న్యాయము.

అగ్గి - నిప్పు, అగ్ని సం.అగ్ని.
అగ్గికంటి - శివుడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పు నుండి పుట్టినది.

గంగి - పూజ్యము, (గంగెద్దు= గంగి+ఎద్దు), వి.సాధువైన ఆవు.
గంగెద్దు -
(గంగి+ఎద్దు) దాసరులు వస్త్రాదులచే అలంకరించి భిక్షాటనము కై తీసుకొని వచ్చెడి ఎద్దు, రూ.గంగిరెద్దు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.

గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.

స్వర్గము - దేవలోకము; సురలోకము - స్వర్గము.
సురలు -
వేలుపులు; దేవత - వేలుపు.
సురపతి - ఇంద్రుడు.
సురతాణి - 1.ఇంద్రుడు, 2.ఇంద్రాణి, సం.సురత్రానః.
అమరావతి - 1.ఇంద్రుని పట్టణము, 2.స్వర్గము, 3.గుంటూరు జిల్లాలోని ప్రాచీన పట్టణము.
సురాచార్యుఁడు - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు. 
సవిత్రి -
1.తల్లి, 2.ఆవు.  

ఆముకొను నొరవుల మెరయు నతివకు వృషభరాశి.....

ఉక్షా భద్రో బలీవర్ద ఋషభో వృషభో వృషః, అనడ్వాన్ సౌరభేయో గౌః -
ఉక్షతి రేత స్సించతీతి ఉక్షా. న.పు. ఉక్షసేచనే. - ఆవుల యందు రేతస్సును విడుచునది.
భన్దత ఇతి భద్రః, భది కల్యాణే. - కల్యాణ స్వరూపమైనది.
వలీః కంఠప్రదేశేస్త్ర వృణుతే స్వీకరోతీతి బలీవర్దః. వృఞ్ వరణే. వబయోరభేదః - కంఠమందు వళులు గలది.
ఋష తిగాం ప్రతి గచ్ఛతీతి ఋషభః, వృషశ్చ. వృషు సేచనే. - రేతస్సును విడుచునది గనుక వృషభము, వృషము.
అనో వహతీ త్యనడ్వాన్. హ.పు. - బండిని వహించునది.
సురభే రపత్యం సౌరభేయః - ఆవునకుఁ బుట్టినది.
గచ్ఛతి సుచిరమితి గౌః. ఓ.పు. - తిన్నగా నడుచునది.
అనడుహ్, సౌరభేయ - గో శబ్దములు ఆవులకు పేర్లు. అప్పుడు అనడుహీ, సౌరభేయీ అని యీకారంతములుగా నుండును. గోశబ్దమునకు రూపము తుల్యము. ఈ ఎనిమిది 8 ఎద్దు పేర్లు. 

ఉక్షము - ఎద్దు.
బలీవర్థము - ఎద్దు.

భద్రుఁడు - వీరభద్రుడు, విణ.మేలుకొని యుండువాడు.
వీరభద్రుఁడు -
1.వీరభద్రుడను ప్రథముడు, 2.ఏకాదశ రుద్రులలో నొకడు, 3.శివుని కొడుకు.
పదిలుఁడు - 1.మేలుకొని యుండువాడు, 2.స్థిరుడు.
జాగరూకుఁడు - మేలుకొని యుండువాడు.
తిరుడు - స్థిరుడు; స్థిరుఁడు - శని.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).         

బలీవర్థము - ఎద్దు.
ఎద్దు -
వృషము, (బహు, ఎడ్లు).
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము. (Property)

ధర్మము - ధర్మము నుండి తొలగనిది.
ధర్మి -
ధర్మము గలది.
దమ్మము - ధర్మము, సం.ధర్మః.
దమ్మఁడు - 1.ధర్ముడు, 2.కపటము లేనివాడు, సం.ధార్మికః.
ధర్ముఁడు - 1.యముడు, 2.సోమయాజి.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
సోమాసి - సోమయాజి, సోమయాగము చేసినవాడు, సం.సోమయాజీ.
సోమసీథి - 1.సోమపానము చేయువాడు, 2.సోమయాజి, యజ్ఞము చేసినవాడు.
సోమిదమ్మ - సోమయాజి భార్య, సోమిసాని. 

ధర్మస్తు తద్విధిః :
ధరతి లోకానితి ధర్మః - లోకములను ధరించునది.
ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేఁ బూనఁబడునది. ఈ ఒకటి వేదవిహితమైన కర్మ పేరు.

శర్వరీ దీపక శ్చంద్రః - ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపికః||
తా.
చంద్రుఁడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు పగటినిఁ ప్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము

వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః||

ఋషభము -1.ఎద్దు, 2.మదించిన ఏనుగు, 3.సప్తస్వరములలో ఒకటి. ఆబోతుసొరము(స్వరము) - వీణయందును, కంఠము నందును బుట్టు ఒక స్వరము, సప్తస్వరములలో రెండవది(రి), ఋషభము. ఋషభధ్వజుఁడు - శివుడు. వృషభధ్వజ విజ్ఞాన భావనానై నమో నమః.

వృషభము - 1.ఎద్దు, బసవన్న, 2.వృషభరాశి.
ఆలఱేఁడు -
ఎద్దు, ఆబోతు, బసవడు.
బసవఁడు - వృషభము.
బసివి - శివునకు పరిచర్య చేయుటకై చిన్నతనమునందే యర్పింపబడిన స్త్రీ, సం.పశుపీ.

శివ ! తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ! మమగుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే
సకల భువన బంధో ! సచ్చిదానంద సింధో !
సదయ ! హృదయ గేహే సర్వదా సంవసత్వమ్. - 84శ్లో
తా.
సమస్త భువనాలకూ బంధువైనవాడా ! సచ్చిదానంద సాగరా ! దయాహృదయా ! గౌరీసమేతుడవగు(భవుఁడు - శివుడు) నిన్ను సేవించడానికి - నా బుద్ధిరూప కన్యను నీకు సమర్పించు చున్నాను. నువ్వు నా హృదయ(గేహము - గృహము, ఇల్లు.)సదనంలో సదా వసించెదవు గాక ! - శివానందలహరి

పాలిచ్చే గోవులకు పసుపు కుంకం(కుంకుమ), పనిచేసే బసవడికి పత్రిపుష్పం...

నంది - 1.శివుని వాహనమైన వృషభము, 2.వృషభము. శైలపుత్రి వాహనం నంది. శివునికి, నందికి మధ్య నడవకు, చేసిన పుణ్యాలు పోగొట్టుకోకు.

పుంగవము - వృషభము.
పుంగవుఁడు -
(సమాసమున ఉత్తర పదమైనచో) శ్రేష్ఠుడు.

నందివర్ధనము - 1.ఒక జాతి పూలచెట్టు, 2.అమావాస్య లేక పున్నమ.
నంద్యానర్తము -
1.పడమట తక్క, తక్కిన మూడు దిక్కుల వాకిళ్ళు గల రాజగృహము, 2.నందివర్ధన వృక్షము.
అపీతము - 1.త్రాగబడినది, 2.కొంచెము పసుపువన్నె కలది, వి.1.ఇంచుక పసుపువన్నె, 2.పద్మకేశరములు, 3.నందివృక్షము.  

కుణిః కచ్ఛః కాన్తలకో నన్దివృక్షః -
తుద్యతే హస్త్యాదిభిరితి తున్నః తుద వ్యథనే. - గజాదులచేఁ బీడింపఁ బడునది.
కుత్సీంబేరమస్యాస్తీతి కుబేరకః - కుత్సితమైన శరీరముగలది.
శాఖాభంగాత్కౌతీతి కుణిః పు. కు శబ్దే. - కొమ్మలు విరుగునప్పుడు మ్రోయునది.
కవ్యతే గజైః కచ్ఛః కష హింసాయాం. - గజములచేఁ బీడింపఁబడునది.
కస్య జలస్య అంతం గచ్ఛంతీతి కాంతాగజాః తైర్లక్యత ఇతి కాంతలకః. లకి ఆస్వాదనే. - జలసమీపమును బొందునవి గనుక కాంతము లనఁగా గజములు; వానిచేత నాస్వాదింపఁబడునది.
నన్దయతీతి నన్దీ, నన్దిసమ్జకో వృక్షః నందివృక్షః - సంతోషపెట్టునది గనుక నన్ది; నందియను పేరు గల వృక్షము. ఈ ఐదు5 నందివృక్షము పేర్లు.

నిమిత్తస్థో నిమిత్తం చ నంది ర్నాందికరో హరిః,
నందీశ్వరశ్చ నందీ చ నందనో సంధివర్థనః.
- 76శ్లో

గోద1 - 1.విష్ణుచిత్తుని పుత్త్ర్రిక, గోదాదేవి, 2.గోదావరి.
గోద2 - ఎద్దు, వృషభము, (వ్యవ.) గొడ్డు గోద.
గోదావరి - గౌతమీనది.
గోదారి - 1.వెన్న కాచినమడ్డి, 2.గోదావరి.

గొడ్డు - ఈనని పశువు, గొడ్రాలు, విణ.శూన్యము. 
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పడిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక.
శూద్రి - శూద్రుని భార్య.   

పశువు - చతుష్పాదము, గొడ్డు.
పశుపతి - శివుడు.

విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||
తా.
లోకమునందు గొడ్రాలు, సహింపగూడని ప్రసవవేదన నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము

గోణి1 - ఎద్దు, సం.గోనీః.
గోణి2 - పెద్దగోతము, వి.గోనె.
గోతము - 1.జనుపనార సంచి, 2.ఒకానొక మల్లసాధనము, రూ.గోతాము.

అనడ్వాహము - ఎద్దు, వృషభరాశి.
సౌరభేయము -
ఎద్దు; సౌరభేయి - ఆవు.
సౌరభము - 1.తావి, వాసన, 2.ఎద్దు, 3.కుంకుమము.
సౌరభ్యము - 1.వాసన, 2.ఒప్పిదము, 3.గుణగౌరము.

తావి - పరిమళము. తావి లేక పూవు నిలువ లేదులే...
పరిమళము -
మంచుతావి.
తావిమోపరి - గాలి, గంధవహుడు.
గంధవాహుఁడు - వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొనిపోవువాడు.

ఆమోదము - 1.సంతోషము, 2.పరిమళము.
మోదము -
1.వాసన, 2.సంతోషము.
వాసన - 1.గంధము, 2.సంస్కారము, (రసా.) ముక్కుచే గ్రహింపబడు జ్ఞానము (Odour).
గంధము - 1.గర్వము, 2.గంధకము, 3.సంబంధము, 4.చందనాది లేపన ద్రవ్యము, (రసా.) వాసన (Odour).
సంస్కారము - 1.చక్క జేయుట, 2.శవమును దహించుట, 3.అనుభూతార్థ స్మృతిపాకము, రూ.సంస్క్రియ.
సంస్క్రియ - సంస్కారము. సగంధుఁడు - స్నేహితుడు.

గంధకము - పసుపురంగు గల ఖనిజ వస్తువు, (రసా.) ధాతువు కాని పసుపు రంగుగల ఒక మూల పదార్థము (Sulpher). చెట్టుచేనులకు కావలసిన ప్రధాన మూలద్రవ్యములలో ఒకటి, ఒక మందు దినుసు.
సంబంధము - 1.చుట్టరికము, 2.కూడిక. సాంగత్యము - కూడిక. 
చుట్టరికము - బంధుత్వము, సంబంధము.
కూడిక - సంయోగము, చేరిక, (Addition).

గంధవహ - ముక్కు, రూ.గంధవాహ.
గంధవహుఁడు -
వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొని పోవువాడు.

మారుతము - వాయువు.
మారుతి -
1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు. వృకోదరుఁడు - భీముడు. 
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.

మరుత్తు - వేలుపు, గాలి.
గాలిచూలి -
1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని. అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.  

బంధుర సద్గుణాఢ్యుఁ డొకపట్టున లంపటమొందియైన దు
స్సంధిఁదెలంపఁ డన్యులకుఁ జాలహితం బొనరించుఁగాక, శ్రీ
గంధముఁజెక్క రాగిలుచు గాదె, శరీరులకుత్సవార్ధమై
గంధములాత్మబుట్టఁ దఱుంగంబడి యుండుటయెల్ల, భాస్కరా.
తా.
మంచి గంధపుచెక్క సానరాపి చేత తరుగబడియును, తనయందు గల పరిమళము వ్యాపించునట్లు జనులకు వేడుక కలిగించును. అట్లే గుణవంతు డొక సమయమున కష్టపడియైనను ఇతరులను సంతృప్తి పరచును.

వంశకము - అదురుచెక్క, అగరు గంధము. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్ని చెడ త్రాగుతుంది. అరుగ తీసిన గంధపు చెక్క తరుగును కాని వాసన కోల్పోవునది కాదు.

పూఁత - 1.చందనము, 2.పాలగచ్చు.
విచ్చిత్తి -
1.ఎడబాటు(ఎడఁబాటు - వియోగము.), 2.వస్త్రభూషణాదుల కొలది యైనను ఒప్పిదము గలగజేయు స్త్రీల శ్రంగారాచేష్ట, 2.పూత, 4.నరకుడు.
విచ్ఛేదము - 1.ఎడబాటు(ఎడయిక - ఎడబాటు), 2.నరకుడు.
విచ్ఛిన్నము - 1.ఎడబడినది, నరకబడినది, 2.పూయబడినది. నికృత్తము - నరకబడినది.

నికృంతనము - ఖండనము, నరకుడు.
ఖండనము -
నరకుట.
నరకఁడు - 1.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు), 2.దయలేనివాడు, సం.నరకగః.
మొత్తు - దెబ్బ, క్రి.మోదు, కొట్టు(అడుచు – కొట్టు), నరకు; తెగవేయు - నరకు.

అతిపరచయాదవజ్ఞః - సంతత గమాదనాదరః భవతి !
మలయేభిల్లీ పురంధ్రీ - చందన తరూన్ ఇంధనం కురుతే ||
తా.
ఎవరితోనైనా అతిపరిచయం వల్ల అవమానం, ఎప్పుడూ వెళ్ళడం వల్ల అనాదరణ జరుగుతుంది. అరుదైన విలువైన చందన వృక్షం మలయ పర్వతంలో అతిగా దొరకడం వల్ల - అక్కది గిరిజన స్త్రీలు వంట వండేందుకు ఇంధనంగా వాటిని వాడతారు కదా!  

తనను కొట్టిన గొడ్డలికే పరిమళం ప్రసాదిస్తుంది చందన తరువు!

మలయజము - చందనము.
భద్రశ్రీ -
చందనము, గంధము.
సిరిగంధము - శ్రీచందనము, సం.శ్రీగంధః.
శ్రీఖండము -
చందనము.
చందనము - 1.కుంకుమపువ్వు, 2.గంధము, (ఇది Santalaceae అను కుటుంబమునకు చెందిన Santalum album అను మొక్క యొక్క కఱ్ఱ (Sandal wood) ముదిరిన కఱ్ఱ నుండి చందన తైలమును తీయుదురు.)
కుంకుమపువ్వు - అగ్నిశిఖయను అంగడిదినుసు, కాశ్మీరము, (వ్యవ.) 'ఇరిడేసి '(Iridacease) అను కుటుంబమునకు చెందిన Crocus sativus అను మొక్క యొక్క పుష్పములలోని కీలాగ్రములు, ఇవి నారింజపర్ణముతో గూడిన ఎరుపు రంగు కలిగి యుండును. ఇది పరిమళ ద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగింప బడుచుండును (Saffron).

అంగరాగము - 1.చందనాది ద్రవ్యము, 2.చందనాదుల పూత, 3.మేని యెరుపు.

శిలాస్థో గంధలేపశ్చ మార్జాలోచ్చిష్ట భోజనమ్|
ప్రతిబంబే క్షనమ్నీరే శక్రస్యాపి శ్రియమ్‌హరేత్||
తా.
ఱాతిమీఁద బెట్టిన గంధము పూసికొనుట, పిల్లి తాకిన (య)అన్నము భుజించుట, నీళ్ళలో నీడఁ జూచుకొనుట, ఈ పనులు ఇంద్రున(శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.)కైనను (యై)ఐశ్వర్యమును పోగొట్టును. - నీతిశాస్త్రము

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము(వస్త్రము - బట్ట, వలువ), 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూత్యాది వ్యసనము.

బాహ్లికము - 1.ఇంగువ, 2.కుంకుమపువ్వు, 3.ఒకదేశము.
రామఠము - ఇంగువ. 

ఘుసృణము - కుంకుమపువ్వు; అగ్నిశిఖము - కుంకుమపువ్వు. వహ్నిశిఖము - కుంకుమపువ్వు. వహ్ని - అగ్ని.

కాశ్మీరము -1.కుంకుమపువ్వు,2.మెట్టతామరదుంప, 3.కాశ్మీరదేశము. (కాశ్మీరము నందు దేవీస్థానం మేధ)

పుష్కరము - 1.మెట్టతామర దుంప, 2.తామర, 3.ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పడ్రెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ. పుష్కరము నందు దేవిస్థానం పురుహూత.

శ్రాన్తం పుష్నాతీతి పుష్కరం. పుక్ష పుష్టౌ - బడలినవానిని బోషించునది.

తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring Worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
తామరసము -
1.తామర, 2.బంగారు, 3.రాగి.
తామ్రము - 1.రాగి, 2.ఎరుపు, సం.వి. (రసా.) (Copper) రాగి, పిశంగ (Brown) వర్ణము గల ధాతువు. (ఇది ఆవర్త క్రమపట్టికలో రెండవవర్గములో వెండి బంగారముతోపాటు అమర్చబడి యున్నది. మొక్కలకు కావలసిన సూక్ష్మమూల ద్రవ్యములలో నిది యొకటి).
పిశంగము - (రసా.) రాగి రంగుగలది, (Brown) సం.వి.కపిలవర్ణము.
స్పోటిత తామ్రము - (రసా.) రాగి ఖనిజము నుండి రాగిని సాధించు ప్రక్రియలో చివరదశలోని రాగి కరగియున్న ధాతువు నుండి సల్ఫర్ డైయాక్సైడ్ వాయువు పైకి ఉబుకుటచే బొబ్బలుగా ఏర్పడిన పైతలము గల రాగిముడి ధాతువు (Blister copper).

ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పశువులను త్రోలుట. కంకము - 1.రాబందు, 2.పద్మము.
రాబందు -
రాపులుగు; రాపులుఁగు - రాబందు.

తమ్మి కెంపు - పద్మరాగము వ్యు. తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
పద్మరాగము -
మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము - కెంపు; శోణరత్నము - కెంపు.

మానికదారి - 1.వేశ్య, 2.మాణిక్యధారణి.

తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మవ్యూహము, రూ.తామర, తామరసమ్.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, 5.ముఖము పైగల చుక్కలు.
పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము. తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు. 

సహస్రపత్రము - కమలము, తామర.
కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
శతపత్రము - తామర.

కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
కమలుఁడు -
1.బ్రహ్మ, 2,ఇంద్రుడు.
కమలిని - 1.తామరకొలను, 2.తామరతీగ.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.నిధి, 3.ఒకానొక మణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

కమలములు నీటబాసిన
గమలాప్తున్ రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
తా.
తామరలు జలమును వదలిన యెడల తమకాప్తుడైన సూర్యుని కిరణం(రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు దప్పిన తమ స్నేహితులే తమకు శత్రులగుదురు.

తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయజాక్షి -
తమ్మికంటి.

తమ్మికంటి - 1.స్త్రీ, ఆడుది, 2.విష్ణువు.
తమ్మిచూలి -
బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
తమ్మిదొర - సూర్యుడు.
తమ్మి పగతుడు - చంద్రుడు.
తమ్మి యింటిగరిత - లక్ష్మి, పద్మాలయ. పద్మాలయ - లక్ష్మి.
గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.
పద్మ - 1.లక్ష్మి(రమ - లక్ష్మి) 2.మెట్టదామర.
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్ట దామర(మెట్టతామర - స్థలపద్మము).

కువేలము - 1.కలువ, 2.పద్మము.
కలువకంటి -
కలువరేకుల వంటి కన్నులుగల స్త్రీ.
కలువరాయుఁడు - చందమామ.
కలువ - ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.
ఉత్పలము - కలువ, నల్లకలువ.
కువలయము - 1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.
కువలేశుఁడు - విష్ణుమూర్తి.

శుభాంగ శ్శాన్తిద స్స్రస్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||

కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 2.కమలాఫలము. కమలాలయము నందు దేవిస్థానం కమల.
కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.

మహాలక్ష్మి - 1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి.

స్యాత్కురజ్గే పి కమలః :
కమల శబ్దము ఇఱ్ఱికి పేరైనపుడు పు. అపిశబ్దము వలన తామరకును, నీళ్ళకును పేరైనపుడు న. మహాలక్ష్మికీ పేరైనపుడు సీ. కామ్యత ఇతి కమలః. కము కాంతౌ. కోరఁబడునది. 'కమలం సలిలే తామ్రే జలజే క్లోమ్ని భేషజే, మృగప్రభేదే కమలః కమలా శ్రీవరస్త్రియో' రితి విశ్వప్రకాశః.

దశవాయుజయాకారా కళాషోడశ సంయుతా,
కాశ్యపీ కమలా దేవీ నాదచక్ర నివాసినీ|

అంగుళి - 1.వ్రేలు, 2.తొండము చివర.
కరశాఖ - వ్రేలు; వ్రేలు - క్రిందికి ఊగాడు, వి.అంగుళి.

అంగుళము - 1.వ్రేలు, 2.బొటన వ్రేలు, 2.అడుగులో పండ్రెండవ భాగము.
అంగుష్టము -
బొటన వ్రేలు, (గృహ.) బట్టలు చేతితో కట్టునపుడు వ్రేలికి పెట్టుకొను చిన్నటోపీవంటి గొట్టము (Timble).
అంగుటము - బొటన వ్రేలు, అంగుష్ఠము, సం.అంగుష్ఠః.
బొటనవ్రేలు - అంగుష్ఠము, రూ.బొటమన వ్రేలు, బొటవ్రేలు, బొట్టనవ్రేలు, బొట్టవ్రేలు.
(ౘ)చూపుడువ్రేలు - జుట్టనవ్రేలు, తర్జని.
(ౙ)జుట్టానవ్రేలు - తర్జని, రూ.జుట్టనవ్రేలు, జుత్తనవ్రేలు.
తర్జని - జుట్టనవ్రేలు, చూపుడువ్రేలు. 
జుత్తనవ్రేలు - జుట్టవ్రేలు.
జుట్టలి - 1.ప్రాదేశము, 2.చాపబడిన బొట్టనవ్రేలు, చూపుడువ్రేలి నడిమి కొలత, రూ.జుత్త(జుత్త - జుట్టిలి), జుత్తలి.
అంగుళిముద్ర - 1.ముద్రగల ఉంగరము, ముద్దుటుంగరము, 2.బొటనవ్రెలి ముద్ర.
ముద్రిక - ముద్దుటుంగరము; ముద్దుటుంగరము - అక్షరములు చెక్కిన, ఉంగరము, చక్కని, ఉంగరము, సం.ముద్రాంగుళీయకమ్.
ముద్ర - 1.సంజ్ఞాక్షరములు చెక్కిన ఉంగరము, 2.అందలి అక్షరములు, 3.అచ్చు.

స్ఫురతరకీర్తిమంతులగు పుత్రులగాంచిగాక మూఢము
షర్కులఁ గనంగ తేజములు గల్గవుగా మణికీలితాంగుళా
భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినగాక గాజుటుం
గరముల పెట్టినందున వికాసము గల్గునటయ్య, భాస్కరా.
తా.
మణులచే కూర్చబడిన ఉంగరములను వ్రేళ్ళకు పెట్టినచో అందముగా కనబడునుగాని, లేనిచో గాజు టుంగరములను పెట్టినచో అందముగా ప్రకాశింపవు కదా!  అట్లే, సజ్జనులగు బిడ్డలను గన్నవారికి వారివలన కీర్తి హెచ్చును గాని, దుర్జనులను గన్నచో ఉన్న కీర్తిగూడా పోవును.

షండము - 1.తామర లోనగువాని సమూహము, 2.ఆబోతు.
గోపతి -
 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.

షణ్డో గోపతి రిట్చరః :
సన్యతే ఉత్సృజ్యత ఇతి షండః షణు దానే. - విడువఁబడునది.
గవా పతివద్గర్భాధానకారిత్వాద్యోగపతిః. ఇ.పు. - ఆవులకు పతివలె గర్భాధానముఁజేయునది.  
ఇషా స్వేచ్ఛయా చరతీతి ఇట్చరః - స్వేచ్ఛ చేతఁ జరించునది. ఈ 3 ఆఁబోతు పేర్లు.

ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

రాజు - 1.రేడు(రాట్టు - రేడు), రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
రాజన్యుఁడు -
క్షత్రియుడు; క్షత్రియుఁడు - రాచవాడు.

చంద్రుఁడు - నెల, చందమామ.
నెల -
1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ(పౌర్ణమాసి – పున్నమ), 4.స్థానము, 5.కర్పూరము.  
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ముడిగిబ్బ - ఆబోతు.
ముడి -
1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము(కలహము - సమరము, వికృ.కయ్యము), విన.1.అఖండము, 2.వికసింపనిది.

గిబ్బ - 1.అచ్చుటెద్దు, అచ్చువేసి విడిచిన యెద్దు, ఆబోతు(ఢంకము - అచ్చుపోసిన ఆబోతు), 2.బుడ్దకొట్టని కోడె, 3.ఎద్దు, 4.సమాసోత్తర పరమైనపుడు శ్రేష్ఠ వాచకము, ఉదా. జక్కవ గిబ్బలు మొ.వి.
గిబ్బరౌతు - శివుడు, వృషభవాహనుడు.

ౙన్నియ - 1.దేవతాదుల నుద్దేశించి యెత్తియుంచిన వస్తువు, 2.మీదు, 3.వ్రతము.
ౙన్నియవిడుచు - అచ్చుపోసి ఆబోతును విడుచు.

ఉత్సర్గము - 1.దానము, 2.వృషాదులను విచ్చలవిడిగా తిరుగ విడుచుట, 3.సామాన్యవిధి (వ్యతి, అపవాదము-విశేషవిధి), 4.(వ్రతాదుల) సమాప్తి, రూ.ఉత్సర్జనము.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడల నుండి కారు మదము, 3.చతురపాయములలో ఒకటి, 4.ఛేదనము.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
వితరణము - ఈవి.
వరము - కోరిక, వరించుట. కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
వరణము - 1.వరించుట, 2.చుట్టుకొనుట, ప్రహరి (గృహ) ఎన్నిక ఎంచుట, ఎన్నుకొనుట (Selection).
బహుమానము - (గృహ) కానుక, ప్రతి ఫలము (Reward).
ఏనుఁగుపాఁడి - అమితమైన ఈవి.

వృషభమును దానం ఇచ్చువాడు లక్ష్మీవంతుడు కాగలడు.

కృంతనము - ఛేదనము, కత్తిరించుట.
ఛేదనము -
ఛేదించుట, (వ్యవ.) వేళ్ళను, కొమ్మలను, ఆకులను కత్తిరించుట, (Prunning).
అవఛేదము - 1.ఛేదనము, 2.మితిఏర్పరచుట, 3.హద్దు(హద్దు - మేర, ఆజ్ఞ), 4.వేరుపాటు, 5.నిర్ణయించుట, 6.(గణి.) ఒక వస్తువును ఒక సమతలమును ఉపయోగించి అడ్డుగా కోయుటవలన లభించు సమతల ఖండము.

దాతృత్వం ప్రియన కృత్వం ధీరత్వ ముచితజ్ఞతా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా.
ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిఁగి తెలివిగానుండుట, యీ నాలుగు తనతోఁ గూడఁ బుట్టునవియే కాని నేర్చుకొనుటచే గలుగవు. - నీతిశాస్త్రము  

ఒఱ్ఱియ - 1.సాధువుకాని ఆవు, 2.వక్రస్వభావము కలవాడు, విణ.వక్రము, రూ.బఱ్ఱె.  
ఎనుమ -  మహిషి, బఱ్ఱె, గేదె.
మహిషి - 1.పట్టపుదేవి, 2.బఱ్ఱె.
గౌడిగేదె - పొట్టికొమ్ముల పెద్దబఱ్ఱె.

దున్న - మహిషము, దున్నపోతు.
మహిషము -
ఎనుబోతు.
మాహిషము - దున్నపోతు, బఱ్ఱెలకు సంబంధించినది, పెరుగు మొ.వి.
దుంత - దున్న; దుంతరౌతు - యముడు.
ౙమునెక్కిరింత - దున్నపోతు, యముని వాహనము.  

పోతు - 1.పశుపక్ష్యాదులలో పురుషజాతి, 2.ఆబోతు, 3.ఎనుబోతు, 4.ఎద్దు. పోతురౌతు - యముడు.

చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటియై ధరఁజెల్లు విశ్వ.
తా||
ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదెపాలు వారికి హితవుగా నుండును. ఈ ప్రపంచములో పదిమంది ఆడుమాటనే గౌరవింతురు.

ఏనుగుకు ఒకసీమ, గుర్రానికొక గ్రామము, బర్రెకొక బానిస వుంటేగాని జరుగదు.

గిడ్డి - ఆవు, పొట్టియావు, సం.గృష్టిః.
నఱవ -
అరవ, సాధువుకాని యావు.
అరవ - తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
నఱ్ఱ - 1.ప్రయాసచే పిదుకదగిన యావు, 2.ప్రయాసముచే బండికి గట్టబడిన యెద్దు. 

ఎద్దుకైనగాని యేడాది తెలిపిన
మాటఁ దెలిపి నడచు మర్మమెరిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన!
తా.
ఓ వేమా! వొకయేడాది శిక్షణ నిచ్చినచో యెద్దువంటి పశువైననూ క్రమశిషణతో చెప్పినమాట వినును. కాని ముప్పది సంవత్సరములు, నూరిపోసిననూ మూర్ఖుడు మంచిని తెలుసుకొనలేడు.

ఆబోతుల కలహము దూడలకు ప్రాణభయము. ఆవులు ఆవులు కలహించి లేగలకాళ్ళు విరుగద్రొక్కును.

గవయము - 1.గురుపోతు, వనవృషభము, అడవియెద్దు.

దురంధరము - బరువు మోసెడి ఎద్దు.
దూర్వహము -
బరువు మోసెడి ఎద్దు.
మోటబరి - బరువు మోసెడి ఎద్దు.

కకుత్తు - 1.ఎద్దు మూపురము, కకుదము, 2.శ్రేష్ఠము.
కకుద్మంతము - గొప్ప మూపురము గల ఎద్దు.

ఒంటెద్దుకాడి - (వ్యవ.) ఒక యెద్దు మాత్రమే నాగలి దున్నునపుడు అమర్చుకాడి (One bullock yoke).

ఆడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగలం యెద్దుల గట్టుక
మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.
తా.
ప్రపంచంలో కష్టసుఖము లెరుగని అహంకారి వద్ద పనిచెసి బాధపడుట కంటె, జవసత్తవముగల రెండు యెద్దుల సాయంతో పొలము దున్నుకొని జీవించుట మంచిది.

రోహిణీ నక్షత్ర వదభ్యుదయ హేతు త్వాత్ రోహిణీ. రోహిణీ నక్షత్రమువలె శుభహేతువైనది ఆవు.

ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.

4. రోహిణి - తొమ్మిదేండ్ల కన్యక, బలరాముని తల్లి, 4th star.

రౌహిణేయో బుధ స్సామ్యః :
రోహిణ్యాః అప్యతం రౌహిణేయః - రోహిణీదేవి కొడుకు.
బుధ్యతే సర్వమితి బుధః - బుధ అవగమనే - సర్వము నెరింగినవాఁడు.
సోమస్యాపత్యం సౌమ్యః - చంద్రుని కొడుకు. ఈ మూడు బుధుని పేర్లు.

రౌహిణేయుడు - 1.బలరాముడు, 2.బుధుడు.
బలుఁడు -
బలరాముడు, విణ.బలము గలవాడు.
హలాయుధుఁడు - బలరాముడు.
హలి - 1.నాగలి, 2.బలరాముడు, 3.పొలముదున్నువాడు.
హలము - నాగలి, రూ.హాలము.
నాగఁటిజోదు - బలరాముడు, హలాయుధుడు.

నాఁగటి (ౘ)చాలు యతివ(అతివ - స్త్రీ) - సీత. 

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.

బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
సౌమ్యుఁడు - బుధుడు, విణ.1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.
విబుధుఁడు - విద్వాంసుడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు; బుద్ధుడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు. 
వేలుపు - దేవత(దేవత -వేలుపు), దేవతాస్త్రీ, 2.జ్యోస్యము. 

రోహిణి చంద్రుని ప్రియపత్ని, ప్రకృతి కళ వల్ల అవతరించినది. అసమాన్య అందగత్తె అయిన రోహిణి పట్ల చంద్రుడు పరమప్రీతి గలవాడు.

రోహిణి - నందుని చెల్లెల్లు, వసుదేవుని పత్ని. కద్రువ కశ్యపులు రోహిణీ వసుదేవులుగా జన్మించి దంపతులైనారు. ఈ రోహిణికే బలరాముడు, శేషాంశలో జన్మించాడు.

రోహిణీ రేవతీ రమ్యా రంభా రావణవందితా,
శతయజ్ఞమయీ సత్త్వా శతక్రతువరప్రదా.

కద్రువ - పాములతల్లి, కశ్యపుని భార్య. కశ్యప మహాముని భార్యలు కద్రువ, వినత. కశ్యపుని భార్య కద్రువకు నాగవంశం జన్మించింది. కద్రువకు జన్మించినవారు నాగులు. నాగమాత కద్రువ, ప్రకృతి కళ నుండి పుట్టిన స్త్రీ.

కాద్రవేయుఁడు - కద్రువ కొడుకు, పాము.

నాగాః కాద్రవేయాః -
నాగకాద్రవేయ శబ్దౌ మానుషాకారేషు ఫణాలాంగులాది యుక్తేషు దేవయోనిషు భోగిషు వర్తేతే. - నాగకాద్ర వేయశబ్దములు పడిగలు తోఁకలు గలిగి, మనుష్యరూపులును దేవయోనులునునైన పాముల పేర్లు.
నగే పర్వతే చందనతరౌ వా భవాఁ నాగాః. అ. వు. - పర్వతమునందుఁ గాని చందనవృక్షమునందుఁ గాని పుట్టినవి.
పద్బ్యాంనాంగంతీతి వా నాగాః. అగి గతౌ. పాదములచేత సంచరింపనివి.
కద్ర్వాః అపత్యాని కారవేయాః. అ. పు. ఈ రెండు కుద్రువు కొడుకుల పేర్లు.  

ప్రజాపతే రోహిణీవేతు పత్నీ | విశ్వరూపా బృహతీ చిత్రభానుః | సా నో యజ్ఞస్య సువితే దధాతు | యథా జీవేమ శరదస్సవీరాః | రోహిణీ దేవ్యుదగాత్సురస్తాత్ | విశ్వా రూపాణి ప్రతిమోదమానా | ప్రజాపతిగ్ం  హవిషా వర్ధయంతీ | ప్రియా దేవానా-ముపయాతు యజ్ఞమ్ ||2||  

ప్రజాపతి - బ్రహ్మ, (చరి.) 1.యుద్ధ సమయములందు కులపతులపై నుండి సైనికాధికారి, 2.గ్రామపెద్ద.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

పట్టుగ నిక్కుచున్ మదముఁబట్టి మహాత్ముల దూలనాడినన్
బట్టినకార్యముల్ చెడును బ్రాణముపోవు నిరర్ధదోషముల్
పుట్టు, మహేశుగాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్
ముట్తకపోయి దక్షునికి మోసమువచ్చెఁగదయ్య, భాస్కరా.
తా.
దక్ష ప్రజాపతి ఒకప్పుడు శివు నవమాన పరచుట కొక యాగము సంకల్పించి, ఈశ్వరునిఁదక్క దక్కిన మరల నాహ్వానించెను. ఆ యజ్ఞమం దీశ్వరుని కీయవలన హవిర్భాగ మీయలేదు. పైగా శివనింద చేసినాడు. అందుచే యీశ్వరుడు కోపించి వీరభద్రుడను వానిచే నాయజ్ఞమును పాడు చేయించి యాతని చంపించెను. కాబట్టి తానెంత గొప్పవాడైనను మహాత్ములగు వారిని దూషింపరాదు. అట్లు దూషించినచో పాపములు కలుగుటయేగాక ప్రాణములు గూడా గోల్పోనగును.

పూర్వ కథ :- దక్ష ప్రజాపతి ఒకప్పుడు శివుని నవమాన పరచుటకై ఒక యాగమును తలపెట్టి, బ్రహ్మాది దేవతల నందరిని పిలిచి ఈశ్వరుని పిలచుట మానెను. ఆ యాగము చూచుటకు పిలువని పేరంటముగా తన కుమార్తెయు మహేశ్వర పట్టమహిషియగు సతీదేవి, తన తండ్రియేకదా యజ్ఞము చేయుచున్నాడని శివుడు వలదన్నను న్నెట్లో నాతని అంగీకరింపజేసి, చూడరాగా దక్షుడామెను గౌరవింపలేదు. కుమార్తెపై యెంతప్రేమ చూపవలెనో నంత అగౌరము చేసినాడు. అట్లు తండ్రి తనయందు వాత్సల్యత లేనివాడయ్యెను, పతి మొగమేగతిని చూతును? అని పరిపరి విధముల తలపోసి యామె అగ్నిలో పడి ప్రాణములు బాసెను. అది తెలిసి శివుడు వీరభద్రుని(వీరభద్రుఁడు - 1.వీరభద్రుడను ప్రథముడు, 2.ఏకాదశ రుద్రులలో నొకడు, 3.శివుని కొడుకు.) సృజించి యతనిచే దక్షుని చంపించి, యజ్ఞమును నాశము చేయించెను.    

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా|
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ.

దాక్షాయణి - పార్వతి, రోహిణి నక్షత్రము (దక్షప్రజాపతి సుత సతీదేవి).
పార్వతి -
1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుర్గ - పార్వతి(శివుని సన్నిధిని దేవీస్థానం పార్వతి), రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.

దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమోనమః.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు. 

సతి - 1.పతివ్రత స్త్రీ, (పతివ్రతా దాక్షాయణి స్వరూపిణి) 2.పార్వతి.  (చరి.) చనిపోయిన భర్త చితిలో ప్రవేశించి ప్రాణముల విడుచు హైందవ స్త్రీ.
పతివ్రత - సాధ్వి; సాధ్వి - పతివ్రత.

సుచరిత్రాతు సతీ సాధ్వీ పతివ్రతా :
శోభనం చరిత్ర మస్యా ఇతి సుచరిత్రా - శుభకరమైన చరిత్రము గలది.
దర్శనాదేవ పాపం స్యతీతి సతీ. సీ.షో అన్తకర్మణి. - దర్శన మాత్రముననే పాపమును బోఁగొట్టునది.
సాధుగుణయోగాత్సాధ్వీ. సీ. - మంచిగుణములు గలది.
పతినేనైవ వ్రత మస్యా ఇతిపతి వ్రతా - పతిసేవయే వ్రతముగాఁ గలది. ఈ నాలుగు 4 పతివ్రత పేర్లు.

కళత్రం వైధాత్రం - కతి కతి భజన్తే న కవయః
శ్రియో దేవ్యాః కోవా - న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా - తవ సతి! సతీనామచరమే !
కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్యసులభః || - 96శ్లో
తా.
ఓ సతీమతల్లీ ! ఏందరెందరు కవులు సరస్వతీదేవిని భజించి ఆమె కృపకు పాత్రులవడంలేదు ? శ్రీదేవిని ప్రార్థించి ఎందరు ఆమె కటాక్షంవల్ల లక్ష్మీపతులవడంలేదు ? ఓ పతివ్రతలలో అగ్రగణ్యా ! మహాదేవుణ్ణి వీడి నీ హృదయాన్ని దోచుకోవడం, కరువక తరువునకు(యెఱ్ఱగోరింటకు) సైతం లభ్యం కాదుకదా! అనగా విద్యా ధనములు పెక్కురకు లభించును. కవి సరస్వతీ పతి అవుతాడు. ధనికుడు లక్ష్మీపతి అవుతాడు. పార్వతీపతి మాత్రం మహాదేవు(మహాదేవుడు - శివుడు)డొక్కడే. పార్వతి యెవరికి వశముగాదు.  ఆమె పాతివ్రత్యం అవాఙ్మానసగోచరం అని భావము. - సౌందర్యలహరి        

కామకోటిసు పీఠస్థా కాశీక్షేత్రసమాశ్రయః,
దాక్షాయణీ దక్షవైరీ శూలినీ శూలధారకః.

బండిరిక్క - రోహిణీ నక్షత్రము. శకటము(బండి)వలె నక్షత్రములుండును. రోహిణీ నక్షత్రాన్నే బ్రహ్మీ నక్షత్రం పేరుతో పిలిస్తారు.
బండి - 1.శకటము, 2.రథము, (రథం క్షత్రియుడికి వజ్రం. బ్రాహ్మణుని శరీరంలో కుడిచేయు భాగాన్ని వజ్రమని అన్నారు).
శకటము - 1.బండి, 2.శకట వ్యూహము. భారతంలో శకట పద్మవ్యూహం ద్రోణాచార్యుడు రచించాడు.
వ్యూహము - 1.మిక్కిలి ఊహ, మొగ్గరము, (ఊహపోహలు ఎక్కువైతే అపార్థాలు ఎక్కువౌతాయి) 2.సమూహము, గుంపు.
మొగ్గరము - వ్యూహము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group). 
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

సగటు - చదరంగమున శకటము, (గణి.) రాసుల మొత్తము, రాసుల సంఖ్య మధ్యగల నిష్పత్తి (గణి.) సరాసరి (Average), సం.శకటః, సంఘాతః.
సరాసరి - సరసి చూడగానైన సమత్వము.
సంఘాతము - 1.సమూహము, 2.దట్టి దిబ్బ.

రథ్యము - 1.రథసమూహము, 2.రాజమార్గము, 3.మార్గము.
రాజమార్గము -
రథములు పోదగిన విశాల మార్గము.

శతానందము - విష్ణురథము.
శతానందుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు.

డయనము - బాలకాదుల క్రీడా శకటము.

తేరు - 1.కలుగు, వై.వి. 1.రథము, 2.బండి, సం.రథః.
రథము -
1.అరదము, 2.శరీరము.
అరదము - తేరు, సం.రథః.
బండి - 1.శకటము, 2.రథము. ఱ - ఒక అక్షరము, శకటరేఫము.

శరీరము - దేహము; దేహము - శరీరము, మేను.
మేను -
1.శరీరము, 2.జన్మము(జన్మము - పుట్టుక), 3.పార్శ్వము. పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), విం.విణ. (జీవ.) క్రన్కులనుండి బయలుదేరీనది, (Latral).  క్రేవ - పార్శ్వము. 
అంక - పార్శ్వము, ప్రక్క, రూ.అణక.
అణక - ఎద్దు మెడమీద కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.
సదేశము - సమీపము. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది. సనీడము - సమీపము, విణ.నీడముతో గూడినది.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
చేవాటు - సమీపము. చేయలఁతి - సమీపము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము. సాంగత్యము - కూడిక.
చేరుగడ - 1.సమీపము, 2.దిక్కు, 3.శరణము.
చేరువకాడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.

మెయి - తృతీయ విభక్తి యందు ఒకచో వచ్చు ప్రత్యయము, వి.1.విధము, 2.పార్శ్వము, 3.వెంబడి, 4.భూమి, మహి, 5.దేహము.
విధము -
ప్రకారము, విధి.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ(సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.), 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

వెంబడి - వెంట; వెంట - 1.దారి, 2.వేట, 3.విధము, అవ్య.వెంబడి.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

భూమిజుఁడు - అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథివీ.
పుడమితాలుపు - శేషుడు, వ్యు. భూమిని ధరించువాడు.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు. 

పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.

భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.కడచినది, 2.పొందబడినది.
భూతేశుఁడు - శివుడు.

పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్క చేయబడినది, విశాలమైనది.
పృథువు - గొప్పది, వి. ఒక రాజు.

భూతాత్మము - దేహము.
దేహము -
శరీరము, మేను.
శరీరము - దేహము. 
మేను - 1.శరీరము, 2.జన్మము(జన్మము - పుట్టుక), 3.పార్శ్వము. ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా, భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము, (Shape).

మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్తీకళ -
(చరి.) విగ్రహాదుల చెక్కు శిల్పవిద్య (Sculpture). 

మెయితాలుపు - ప్రాణి, శరీరి; శరీరి - ప్రాణి.
జీవి -
జీవించువాడు, వి.ప్రాణి.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

శరణము - 1.రక్షకము, 2.రక్షణము, 2.గృహము.
గృహము -
1.ఇల్లు, 2.భార్య.
గృహిణి - ఇల్లాలు, భార్య.

ఏడుగడ - (ఏడు + కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.  

సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము -
రిక్క, వ్యు.నశింపనిది(నక్షత్రము లిరువది యేడు).
రిక్కదారి - ఆకాశము.

చాతురికుఁడు - బండితోలువాడు(చాతురి - నేర్పు).
తేరుకాఁడు -
రథికుడు. రథి - రథము నెక్కువాడు.
తేరుపూన్పరి - సారథి.
సారథి - 1.తేరునడుపువాడు, 2.నియంత. 
నియంత - తేరునడుపువాడు, విణ.నడపువాడు, సం.వి. (చరి. రాజ.) సర్వాధికారి, అధినాయకుడు (Dictator).  

రథ్యము - రథము నీడ్చు గుఱ్ఱము.  

శకటంపంచ హస్తేషు దశహస్తేషు వాజినమ్|
గజం హస్తేసహస్రేషు దుర్జనం దూరవర్జయేత్||

తా. బండిని జూచిన (నై)ఐదుమూరల దూరము తొలగిపోవలెను. గుఱ్ఱమును జూచిన పది మూరల దూరము తొలగి పోవలెను. ఏనుగును జూచిన వేయి మూరల దూరము తొలగి పోవలెను. దుర్జనునిఁ(దుర్జనుఁడు - దుష్టుడు)ని జూచిన మిక్కిలి దూరము తొలగి పోవలయును. - నీతిశాస్త్రము

కంౘరము - ఒక రకపు శకటము, సం.కంచరః.
కంచర -
కంచుపనిచేసి బ్రతుకుజాతి, సం.కంౘరి, సం.కాంస్యకారః.
కంౘరి - కంచర.
కం(ౘ)చు - ఒక విధమగు లోహము, సం.కంసమ్ (Bronze).
కంౘరగాడిద - కంచరము లాగు గాడిద, అశ్వతరము.
అశ్వతరము -  1.కంచరగాడిద, 2.పాతాళలోకము నందలి ఒకసర్పము, 3.కోడెదూడ, 4.గంధర్వులలో ఒక తెగ.
వేసడము - కంచరగాడిద, రూ.వేసరము, సం.వెసరః.
ప్రఖరము - 1.గుఱ్ఱపు కవచము, 2.కంచరగాడిద, విణ.మిక్కిలి వాడియైనది. 
మయము - 1.ఒంటె, 2.కంచరగాడిద.
ఒంటె - ఒంటియ; ఒట్టియ - ఒంటె, Camel.
ఒంటియ - ఉష్ట్రము, మహాంగము, లొట్టుపిట్ట, రూ.ఒంటె.
ఉష్ట్రము - ఒంటె, వ్యు.ఎల్లప్పుడు ఎండచే తపింపబడునది.
మహాంగము - 1.లొట్టిపిట్ట, 2.పందికొక్కు.

పందికొక్కు - మూషికము; మూషికము - 1.ఎలుక, 2.పందికొక్కు.
ఎలుక - మూషికము. కొక్కు - పందికొక్కు.
ఆఖువు - ఎలుక, పందికొక్కు. 
కొక్కురౌతు - వినాయకుడు.
ఆఖువాహనుఁడు - వినాయకుడు, వ్యు.ఎలుక వాహనముగా గలవాడు.

ద్విధాతుకము - (రసా.) రెండు ధాతువులు కలిసియున్నది (Bimetallic), ఉదా రాగి, తగరము అను రెండు ధాతువుల మిశ్రమము కంచు, ద్విధాతుక మిశ్రము.
కం(ౘ)చుకొమ్ము - ఒక రకపు వాద్యము.

గోకర్ణము - 1.కడితిమృగము, 2.పాము, 3.కంచరగాడిద, 4.ఆవు చెవి ఆకారము గల పాత్రము, 5.దక్షిణ దేశమందలి ఒక శివక్షేత్రము.
(గోకర్ణము నందు దేవీస్థానం భధ్రకర్ణిక).  

గుజ్జు(ౙ) - 1.పొట్టిదనము, 2.కోడెదూడ, 3.పాపట, 4.దూలము మీది గురుజు, 5.క్రొవ్వు, విణ.1.పొట్టివాడు, సం.కుబ్జః.
కుబ్జ - పొట్ల.
కుబ్జము - 1.గజ విశేషము, 2.ఒకానొక చెట్టు, విణ.మరుగుజ్జు.
గుజ్జువేలుపు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter .
విఘ్నరాజు - వినాయకుడు. 

సీమంతము - 1.పాపట, 2.గర్భిని స్త్రీలకు చేయు ఒక శుభకర్మము.
సీమంతిని -
స్త్రీ.

సేన - 1.అక్షత, 2.సేనప్రాలు, 3.పాపట, సం.శీర్షమ్.
సేనవ్రాఁలు - తలబ్రాలు.

కోడియ - కోడెదూడ, గిత్త, రూ.కోడె.
కోడె -
1.కాడి మరపదగిన దూడ, 2.విటుడు. 
గిత్త - కోడె, పొట్టియెద్దు.  
కోడెకాడు - 1.యుక్తవయసువాడు, 2.విటుడు. 
కోడెరౌతు - వృషభవాహనుడు, శివుడు.

అల్పు డెపుడు పల్కు నాదంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వ.

తా. నీచుడు(అల్పుఁడు - నీచుడు) డంభములు చెప్పుచుండును, మంచివారు(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)మెల్లగ మాటలాడుచుందురు. తక్కువఖరీదైన లోహము అయినను కంచు Bronze దడదదమని మ్రోగునట్లు యెక్కువఖరీదైన బంగారము అనులోహము మ్రోగదుగదా!

ఇరుసు - బండి చక్రములకు అడ్డముగ వేయు ఇనుపకడ్డి, అక్షము.
అక్షము1 -
(భూగో.) ఉత్తర దక్షిణ ధ్రువము లనెడి స్థిరబిందువులను కలుపు 'ఊహరేఖ', (గణి.) గణించుటకు వీలైన ఒక స్థిరరేఖ, (Axis).
అక్షము2 - 1.జూదము, 2.పాచిక, 3.రుద్రాక్షము, 4.వాజ్యము, 5.పదునారు మాషముల ఎత్తు, 6.తులాదండము, 7.రథము, 8.బండికన్ను, 9.ఇరుసు, 10.సర్పము, 11.కణత క్రిందిభాగము, 12.ఇంద్రియము, 13.కన్ను, 14.సౌవర్చలమనెడి ఉప్పు, 15.మైలుతుత్తము.

కరముల ననుసరింపక
విరసంబున దిన్నతిండి వికటించుసుమీ
యిరుసనఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైన బాఱదు సుమతీ.
తా.
దేవుని వాహనమైనను ఇరుసునకు కందెనపూయనిదే నడువనట్లు కరణములను ఆశ్రయించనివారు వారి స్వభోజనమే ఆరగించిననూ అది దేహానికి పట్టదు. 

కందెన - బండి ఇరుసునకు పూసెడు మసి, ఒక విధమగు చమురు, ఉదా. "ఇరుసునఁ గందెనఁబెట్టక పరమేశ్వరుబండి యైన బాఱదు సుమతీ",(Lubricant).  
స్నేహనము - (భౌతి.) కందెనవేయుట ఘన వస్తువుల మధ్య రాపిడిని తగ్గించుటకు నూనెలవంటి ద్రవ్యముల పూయుట (Lubrication).  

కట్టుబండీ - సకల పరికరసహితమైన బండి.
బండిగిల్లు -
1.కడగండ్లుపడు, 2.బండి తలక్రిందుగ బొల్తాకొట్టు.
కడగండ్లు - కష్టములు, ఇకట్లు.

బంధకవిత్వము - చక్రము, ఖడ్గము, రథము మొదలగు వాని యాకృతులగ పద్యములు వ్రాయుట. 

కృష్ణమూర్తి - కృష్ణావతారము. ద్వాపరయుగములో, అష్టమి తిథి(శ్రావణ బహుళాష్టమి) రోహిణీ నక్షత్రం అర్థరాత్రి వ్యాపించిన సమయంలో దేవకిదేవి అష్టమ గర్బాన శ్రీకృష్ణుడు జన్మించాడు.

అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకీకిన్
దుష్టుని కంసుఁ వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా.
తా.
లోకమును ధర్మయుక్తముగాఁ బాలించుటకు దేవకిదేవికి ఎనిమిదవ బిడ్డవైబుట్టి దుర్మార్గుఁడగు కంసును(కంసుఁడు - కృష్ణుని మేనమామ) చంపితివి. కృష్ణా ! నీక్రియలు ధర్మాత్మకములు.

5. మృగశిర - ఐదవ నక్షత్రము, మృగము తలవలె 3 నక్షత్రముండును. ఆకృత్యా మృగస్యేవ శీర్షం యస్య తత్ మృగశీర్షం, మృగశిరశ్చ - ఆకృతిచేత మృగము యొక్క శిరమువంటి శిరము గలిగినది.

మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.
జింకతలచుక్క -
మృగశీర్షము. 
మృగశిర - అయిదవ నక్షత్రము. 5th star.
(ౙ)జాబిలిరిక్క -  మృగశీర్ష నక్షత్రము.

పశవో పి మృగాః : మృగశబ్దము పసులకును, అపిశబ్దమువలన లేళ్ళకును, మృగశీర్ష నక్షత్రమునకును, ఏనుఁగుజాతి విశేషమునకును, వెదకుటకును పేరు. మృగ్యంత ఇతి మృగాః. మృగ అన్వేషణే వెదకఁబడునవి.  

సోమో రాజా మృగశీర్షేణ ఆగన్న్ | శివం నక్షత్రం ప్రియమస్య ధామ | ఆప్యాయమానో బహుధా జనేషు | రేతః ప్రజాం యజమానే దధాతు | యత్తై నక్షత్రం మృగశీర్ష మస్తి | ప్రియగ్ం రాజన్ ప్రియతమం ప్రియాణామ్ | తస్మై తే సోమ హవిషా విధేమ | శన్న ఏధి ద్విపదే శం చతుప్పదే ||3||

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
చంద్రుడు -
నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురిగింజలయెత్తు.
మినుము - మినుపపైరు, మాషము.

నెలకూన - 1.బాలచంద్రుడు, 2.నఖిక్షతము.
నెలవంక - బాలచంద్రుడు.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

చందురుమామ - చంద్రుడు, చందమామ.
(ౘ)చందమామ -
చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుడు - చంద్రుడు. 
(ౙ)జాబిలి - చందమామ, రూ.జాబిల్లి.
(ౙ)జాబిలితాలుపు -
శివుడు, చంద్రధరుడు.
(ౙ)జాబిలిరిక్క -  మృగశీర్షనక్షత్రము.

జాబిలి మేపరి - రాహువు; నెలమేపరి - రాహువు.
రాహువు -
ఒక ఛాయగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
కృష్ణవర్త్మ - 1.అగ్ని, 2.రాహుగ్రహము, విణ.దురాచారుడు. 

తమస్తు రాహుస్స్వర్భాను స్సైంహికేయో విధుంతుదః :
సూర్యచంద్రమసౌ అనేన తామ్యత ఇతి తమః. అ. పు. తము గ్లానౌ - ఇతనిచేత సూర్యచంద్రులు వ్యథను బొందుదురు.
తమస్కారిత్వత్తమః స. న. తమస్సును జేయువాఁడు.
తమ ఆకృతి రస్య తమః - స. న. చీఁకటి రూపముగాఁ గలవాఁడు.
రహతి భుక్త్వా త్యజతి సూర్యచంద్రమసా వితి రాహుః. ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాడు.
స్వః స్వర్గే భాతీతిస్వర్భానుః ఉ. పు. భాదీప్తౌ - స్వర్గమునందు ప్రకాశించువాఁడు.
సింహికాయాః - సింహిక హిరణ్యకశిపుని చెల్లెల్లు, ఆమె కొడుకు.
విధుం తుదతీతి విధుంతుదః, తుద వ్యథనే - విదు వనఁగా చంద్రుఁడు వానిని వ్యథఁ బెట్టువాడు. రాహువు పేర్లు. (కేతుః శిఖి. కేతువు పేర్లు.)     

విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
విధాత -
1.బ్రహ్మ, 2.మన్మథుడు.

సకలజనప్రియత్వము నిజంబుగల్గిన పుణ్యసాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగన్
టకటక మానియుండడె దృఢస్థితినెప్పటియట్ల ! భాస్కరా.

తా. చంద్రుడు తన్ను రాహువు మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికిని ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము భాధించదు, అతిత్వరలోనే అతడు కోలుకొనును.

(ౙ)జాబిలిరిక్క -  మృగశీర్ష నక్షత్రము.

బ్రహ్మ రూపమైన మృగశీర్ష అను పేరుగల నక్షత్రమును, ఆర్థ నక్షత్రమును ధరించి శివుడు, అతడిని(బ్రహ్మను) వెంటాడెను. నేటికి మృగములను వేటాడు వ్యాధుని రూపంలో శివుడు (అజ్ఞాన మృగాలను వేటాడే వానిగా శివుడు ఆదికిరాతకుడు) మృగశీర్ష నక్షత్ర సమీపంలో ఆకాశంలో, ఆరుద్ర స్పష్టముగా కనిపించుచుండును. 

హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు, హేమంతఋతువు.
మార్గశీర్షము -
తొమ్మిదవ నెల.

మృగశిర - అయిదవ నక్షత్రము. 5th star.
మీసర -
మృగశిర (మీసరము - శ్రేష్ఠము, మేలైనది)
శీర్షము - తల (గణి) భూమి కెదురుగా నుండు కోణ బిందువు(vertex)శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలము, తలమ్. వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.  
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టు కొన, 3.కొన. 

సిరమము - శిర, తల, సం.శిరః.
శిర -
1.నరము(నరము - నాడి), ఈనె.
ఈన - ఆకులలోని నరము, చీపురుపుల్ల, ర్రొ.ఈనియ, ఈనె.
సిర - 1.నాడి, 2.ఈనె (జం.) శరీరమునుండి గుండెకు రక్తము తీసికొనిపోవు రక్తనాళము. (Vein)
ఉత్తమాంగము - తల. 

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

తలగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

రంగము - 1.సత్తు, 2.యుద్ధభూమి, 3.నాట్యస్థానము, 4.శ్రీరంగము, 5.రంగు.
సత్తు -
సత్త్వము, సత్యము, సారము, వి.సీసము, సం.విణ. (సత్) ఉన్నది 1.చదువరి, 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.నక్షత్రము, 2.సత్యము.
సిరంగము - శ్రీరంగము.
సిరంగఁడు - శ్రీరంగనాథుడు, సం.శ్రీరంగః.
రంగఁడు - 1.శ్రీరంగడు, 2.నంబెరుమళ్ళు.
రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.
నంబెరుమాళ్ళు - శ్రీరంగనాయకుడు.
నంబి - విష్ణుపూజకుడు.     

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణామ్రసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నింటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము

చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.  
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.  

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు -
1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.

మృగము - జింక, అడవియందు తిరిగెడు ఏనుగు, మృగశీర్ష నక్షత్రము.

మృగయ - 1.వేట, 2.వెదకుట.
మృగణ - వెదుకుట.
మృగ్యము - వెదుకదగినది.

వేఁట - 1.మృగయ, 2.పొట్టేలు, మేకపోతు.
వేఁటగిరి -
వేటకాడు.

అన్వేషణ - వెదకుట.
అన్వేష్ట -
వెదకువాడు.

అఖేటము - వేట, మృగయ.
అఖేటకుడు -
వేటకాడు.
ఖట్టికుఁడు - 1.వేటకాడు, 2.పక్షులను వేటాడువాడు, పర్యా. మృగయుడు, వ్యాధుడు, వికృ.కటికవాడు.
కటిక - 1.కటికవాడు, 2.బెత్తము పట్టియుండువాడు, 3.మాంసము అమ్మువాడు.

వ్యాధో మృగవధాజీవో మృతయు ర్లుబ్ధకశ్చ సః,
విధ్యతి మృగానితి వ్యాధః. వ్యధ తాడనే. - మృగములను జంపువాఁడు.
మృగవధే నాజీవతీతి మృగవధజీవః. జీవ ప్రాణధారణే. - మృగవధచేత బ్రతుకువాడు.
మృగాన్ వధార్థం యాతీతి మృగయుః. ఉ. పు. యా ప్రాపణే. - వధార్థ మయి మృగములను దఱుముకొనిపోవువాఁడు.
లుభ్యతి మృగేష్వితి లుబ్ధకః - లుభ గార్ధ్న్యే మృగముల యందాస గొనువాఁడు. ఈ నాలుగు 4 బోయవాని పేర్లు.

వ్యాధుఁడు - బోయవాడు.
నిషాదుఁడు -
1.బోయవాడు, 2.మాలవాడు.
మృగయుఁడు - బోయ.
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
లుబ్ధకుఁడు - 1.పిసినిగొట్టు, లోభి, 2.బోయవాడు.
లోభి - లుబ్ధుడు. భిల్లుఁడు - బోయవాడు.

పుల్కసుఁడు - 1.బోయ, 2.మాల, 3.అధముడు, రూ.పుల్కశుఁడు.
పుళిందుఁడు -
బోయ (భాషాజ్ఞానమే లేక అడవిలో తిరుగు బోయ).
కోయ - ఒకజాతి బోయ.
బోయ - కిరాతుడు, కైవర్తుడు.
కిరాతుఁడు - అటవికుడు, అడవియందు తిరిగెడు బోయ.
అటవికుఁడు - అడవులలో నివసించు అనాగరిక మానవుడు.
కైవర్తుఁడు - 1.జాలరి, 2.పడవ నడుపువాడు, 3.నీటిలో వర్తించువాడు.
(ౙ)జాలరి - చేపల పట్టువాడు. నావికుఁడు - ఓడ నడుపువాడు.  శబరుఁడు - 1.బోయ, 2.శివుడు. 

కర లగ్న మృగః కరీంద్ర భంగో
ఘన శార్దూల విఖండనో-స్త జంతుః
గిరిశో విశదాకృతిశ్చ చేతః
కుహరే పంచముఖో-స్తి కుతో భీః? - 44శ్లో
తా.
కరమందు చిక్కుకున్న జింకయును, గజ రాక్షస హింసయును వ్యాఘ్రాసురుని సంహారమును, ప్రాణి నాశమును, గిరి నివాసమును నిర్మల స్వరూపమును కలిగి పంచ వదనాల(పంచముఖుఁడు - శివుడు, (ఐదు మోముల వేలుపు.)తో భాసిల్లే సదాశివుడు, సింహమై మనోరూప గుహలో ఉండగా భయం ఎక్కడుంటుంది? - శివానందలహరి

బోయవాని వేణుగానానికి మురిసిపొయిన లేడి, పరుగెట్టి అతని వలలో చిక్కి శ్రవణేంద్రియం(శ్రోతు, చెవి) చేత మోసపోతుంది. శబ్దాది విషయాలకు చింతించే మనిషి, నిగ్రహం కోల్పోయి నశిస్తున్నాడు.

శివునికి, ఏనుగు తోలన్నను(గజ చర్మాంబరధారి), కిరాత వేషమన్నను(బాణము వేసిన కిరాతుని పేరు జర, ముసలితనము), పాముల నగలన్నను చాల అభిమానము.

మృగము - జింక, అడవియందు తిరిగెడు ఏనుగు, మృగశీర్ష నక్షత్రము.

జింక - ఇఱ్ఱి.
జింకతలచుక్క -
మృగశీర్షము.
జింకతలచుక్కనెల - మార్గశిరము.

మృగే కురఙ్గ వాతాయు హరిణాజినయోనయః,
మృగ్యతే లుబ్ధకైరితి మృగః, మృగ అన్వేషణే. - వేటకాండ్రచే వెదకఁబడునది.
కౌరఙ్గతీతి కురంగః. రగి గతౌ. - భూమియందుఁ (జ)చరించునది.
వాతం అయతే వాతాయుః. ఉ. పు. అయ గతౌ. - వాయువును బొందునది.
హ్రియతే హరిణః. హృఞ్ హరణే. - హరింపఁబడునది.
అజిసస్య చర్మణః యోనిః కారణం అజినయోనిః. పు. - చర్మమునకుఁ గారణమైనది.
పా. జినో బుద్ధః రురూపః యోనిరుత్పత్తి స్థాన మేషామితి జినయోనయ ఇతి కశ్చిత్. - ఇఱ్ఱి రూపముగల బుద్ధదేవుఁడు ఉత్పత్తిస్థానముగా గలది.  ఈ నాలుగు 4 ఇఱ్ఱి పేర్లు.      

జింక - ఇఱ్ఱి.
జింకతలచుక్క -
మృగశీర్షము.
జింకతాలుపరి - 1.శివుడు, 2.చంద్రుడు.
జింక పొక్కిలి - 1.కస్తూరి, 2.మృగనాభి.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.  

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్నిముఖుఁడు -
1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
కృష్ణవర్త్మ - 1.అగ్ని, 2.రాహుగ్రహము, విణ.దురాచారుడు.

ఇల్వలా స్తచ్చిరోదేశే తారకా నివసన్తియాః :
తస్య మృగశీర్షస్య శిరోదేశే యాస్తారకా నివసంతితాః ఇల్వలా ఇత్యుచ్యంతే - మృగశీర్ష నక్షత్రమునకు మీఁద నున్న నక్షత్రములు ఇల్వలా లనబడును.
ఇలంతి గఛ్చంచి నక్షత్రాణాం మూర్థ్నీతి ఇల్వలాః ఇలప్రేరణే - నక్షత్రముల మీఁద సంచరించునవి.
శివబాణేన ఇల్యంతే ప్రేర్యంతే ఇల్వలాః - శివుని బాణముచేత ప్రేరేపింపఁ బడునవి. ఇన్వకాః - మృగశీర్షపై నుండు చిన్న చుక్కలకు పేర్లు.

మృగం అంటే లేడి. శిరం అంటే తల. ఈ రెండు పదాల సమాహారమే - మృగశిర. లేడి తలలాగ మూడు కోణాలతో ఉండే నక్షత్రం కాబట్టి దీనికీ పేరు. మృగశీర్ష, ఇల్వలా నక్షత్రమనీ నామాంతరాలు.

లేడి - జింక, రూ.లేటి. లేడికి(జింక) లేచినదే(ఉషఃకాలం) ప్రయాణం. లేళ్ళు, చెంగున దూకే జింకలు - కుందేళ్ళు గంతులు వేస్తూ ఉరకలు పెడుతాయి. సింగారెద్దును కాయనూ లేరూ - పట్టుకోనూ లేరు. - లేడి

మృగాంకుడు - చంద్రుడు, వ్యు.లేడి గుర్తుగా గలవాడు.
మృగః అంకో యస్య సః మృగాంకః - మృగము చిహ్నముగాఁ గలవాఁడు, చంద్రుడు.

కురంగము - 1.జింక, 2.కోతి, రూ. కురంగమము.
కురంగమము -
జింక; జింక - ఇఱ్ఱి.
కురంగనాభి - కస్తూరి.
కురంగపాణి - ముక్కంటి, శివుడు.

కళంకః కస్తూరీ - రజనికరబింబం జలమయం
కళాభిః కర్పూరై - ర్మరకతకరండం నిబిడితమ్,
అత స్త్వద్భోగేన - ప్రతిదిన మిదం రిక్తకుహరం
విధి ర్భూయోభూయో - నిబిడయతి నూనం తవ కృతే. - 94శ్లో
తా.
ఓ త్రిలోకసుందరీ! చంద్రుని కళంకము, కస్తూరి; చంద్రబింబము జలముతోను, కళలతోను, కర్పూరముతోను నింపిన పెట్టె. మరకత మాణిక్యము ఈ చంద్రుడు. అందువలన బ్రహ్మ ప్రతిదినమును నీవు ఉప్యోగించుటచే శూన్యమైన ఈ పెట్టెను మాటిమాటికి నీకై పై వస్తువులచే నింపుచున్నాడు నిజము. - సౌందర్యలహరి  

కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే
మరాలే మదేభే మహోక్షే(అ)ధిరూఢామ్|
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం
భజే శారదాంబా మజస్రం మదంబామ్.

వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.
వాతవాఁడి -
అప్రియంవదుఁడు, దురుసుగా మాటాడువాడు. (వ్రాత+ వాడి+కలవాడు).
దురుసు - 1.కాఠిన్యము, 2.శీఘ్రము, సం.ధృష్.
శీఘ్రము - వడి, విణ.వడిగలది.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వృకోదరుఁడు - భీముడు.
భీముఁడు - 1.ధర్మరాజు సోరరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.

మారుతము - వాయువు.
మారుతి -
1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు. వృకోదరుఁడు - భీముడు. 
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.

అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము.
అనిలుఁడు -
వాయుదేవుడు, 2.అష్ట వసువులతో ఒకడు.

అనిలో మృగనాభిరేణుగంధి ర్హరవామాంగకుచో త్తరీయ
హరతే మరణశ్రమం జనానా మథికాశి ప్రణవోపదేశకాలే|

భా|| మనోజ్ఞమైన కస్తూరికా రేణుగంధిలమై శివుని వామాంగకుచోత్తరీయ సం జనితమైన పిల్లగాడ్పు కాశీపురమందుఁ బ్రణవోపదేశసమయమున దేహుల మరణ శ్రమమపనయించును. (ఉత్క్రమణ సమయమున దేహునకు శంకరుఁడు(ఉ)మాసమేతుఁడై ప్రణవోపదేశము సేయునని భావము.)

వహతి - 1.ఎద్దు, 2.నది, 3.గాలి.
వాహిని -
1.నది, 2.సేనావిశేషము; 81 రథములు, 81 ఏనుగులు, 243 గుఱ్ఱములు, 405 కాల్బలము గలది.
గాలి1 - 1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒక విధమైన పశువ్యాధి.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
పసి - 1.పశ్వాదుల మీదగాలి, 2.పువ్వుల మీదిగాలి, లేత, వై.వి. గోగణము, గోవులు, సం.పసుః.
గాలి2 - 1.నింద, 2.శాపము, గాలి పీడించునది.
నింద - దూరు, అపదూరు.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషనము.
అపవాదము - 1.నింద, దూరు, 2.ఆజ్ఞ. 

కరువలి - గాలి.
కరువలిపట్టి - (గాలిచూలి), 1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

మరుత్తు - వేలుపు, గాలి.
గాలిచూలి -
1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని.   

నవిగర్హ్యకథాంకుర్యాద్యహి ర్మాల్యం నథారయేత్ |
గవాం చయానం వృష్ఠేన సర్వదైవ విగర్హితం ||
తా.
నిందింపఁలగిన ప్రబంధకల్పన చేయరాదు, చిలువల(పాము)మాల్యము ధరింపరాదు, ఎద్దు నెక్కిపోవుట అన్నివిధంబులచేత నిషిద్ధమైనది. - నీతిశాస్త్రము  

జింకరౌతు - వాయువు (ముఖ్యప్రాణుఁడు, నిత్య సన్నిహితుడు).
మృగవాహనుఁడు -
జింకరౌతు (వాయువు, పంచభూతములలో నాల్గవది, శబ్దము స్పర్శగలది). శబ్దము లేకుంటే జగత్తు అంతా చీకటే.

న్యంకువు - 1.ఇఱ్ఱి, 2.ఒక ముని.
ఇఱ్ఱి -
జింక(జింక - ఇఱ్ఱి), హరిణము.
ఇఱ్ఱిగోఱౙము - కస్తూరి; మృగమదము.

మృగమదంబుఁ జూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణము లీలాగురా, విశ్వ.
తా.
ఓ వేమా! కస్తూరి చూచుటకు నల్లగా వుండును కాని, దాని సువాసన విశేషమైన గొప్పదిగనుండును. గురువులైనవారిలో మంచిగుణములు గూడ ఆ విధముగనే చాలా గొప్పవిగా నుండును.

హరిణము - జింక, విణ.తెల్లనిది.
హరిణి -
ఆడుజింక, విణ.ఆకుపచ్చ వన్నెకలది.
కోమలము - 1.నీరు, 2.హరిణము, విణ.1.మృదువైనది, 2.అందమైనది, 3.ఇంపైనది.
కోమలి - చక్కదనము(కోమలికము - చక్కదనము)గల స్త్రీ.
మృదులము - మెత్తనిది, మృదువు; మృదువు - మెత్తనిది.
నౌరు - మృదువు, రూ.నవురు. ఇంపితము - ఇంపైనది.

ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
హరితము -
1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చగుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.

అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.

హరిణీ స్యా న్మృగీ హేమప్రతిమా హరితా చ యా: హరిణీ శబ్దము లేడికిని, బంగారు ప్రతిమకును, పచ్చవన్నె(తెలుపు పసుపు కూడినది) గలదానికి ని పేరు.
హరతి మన ఇతి హరిణీ. సీ. హృఞ్ హరణే - మనస్సును హరించునది. "హరిణీవృత్తభేధే పి యూధికాసురయోషితో"రితి శేషః.

ఓం హ్రీంకారారణ్య హరిణ్యై నమః : హ్రీంకార రూపారణ్యంలో పరమేశ్వరి హరిణి వంటిది. సాధారణంగా అరణ్యాలలో వ్యాఘ్ర సింహాది క్రూరమృగాలు వుంటాయి. కాని సహజాతభయ విహారిణులైన హరిణులున్న ప్రదేశంలో కౄరజంతువులుండవని తెలిసికోవాలి. అటులనే భవాటవిలో భీతిల్లిన భక్తజనులను దర్శనమాత్రంచే భయదూరులను చేయు సర్వేశ్వరికి వందనాలు.

తనుచ్ఛాయాభిస్తే - తరుణ తరణి శ్రీసరణిభిః
దివం సర్వాముర్వీ - మరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవన్త్యస్య త్రస్య - ద్వనహరిణ శాలీనా నయనాః
సహోర్వశ్యాః వశ్యాః - కతి కతి న గీర్వాణగణికాః || - 18శ్లో
తా||
తల్లీ ! ఉదయవేళల బాలసూర్యుని కాంతి పుంజములను వెదజల్లుతున్న నీ నెమ్మేని కాంతి సౌభాగ్యముచేత భూమ్యాకాశాలు  కెంపు జిలుగ(అరుణ వర్ణమునందు)మునిగిన దానినిగా - ఆ దివ్యతేజో రూపాన్ని ఎవ్వడు ధ్యానించుచున్నాడో(తలంచునో), వానికి బెదరిన అడవిజింకల వలె చక్కని కన్నులుగల ఎందఱెందరు అప్సరస కన్యలు, ఊర్వశి సైతం వశులవుతారు. (అమ్మ లోకాతీతమైన దివ్యమంగళ రూపాన్ని ధ్యానించువారు సర్వ సమ్మోహనరూపాన్ని పొందుతారు. అందరూవారికి ఆకర్షితులవుతారని భావము). - సౌందర్యలహరి      

కస్తూరీ తిలకోల్లస నిటలాయై నమో నమః.

వనహరిణములు - అడవిలేళ్ళు, వీటికి అడవిలో క్రూరమృగముల వలన ప్రమాద మెక్కువ. అందుచేత ఇవి చిన్న అలికిడికే భయపడును. గ్రామ హరిణములు మనుష్యాది దర్శనమున భయపడవు.

పిఱికి మెకము - జింక.
పిఱికి -
భయశీలుడు, సం.భీరుకః.
పంద - పిరికి, సం.బంధః. పిరికివాడు మానసిక బలహీనుడు.   
భీ - భయము. భయమంటే ఆత్మానాత్మీయ భంగత. 
భీరుకుఁడు - వెరవరి, రూ.భీలుకుడు.
వెరవరి - నేర్పరి, ఉపాయశాలి.

ఐహికసుఖాలు - బంధాలు అడవి జింకలవంటివి. వీటిని వేటాడితే స్వార్థం, సంసారం అను రెండు ఘోరారణ్యాల మధ్యన చిక్కుబడుట తథ్యము.

హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవ నాశినీ,
కైవల్యపదవీరేఖా సూర్యమండల సంస్థితా| - 53శ్లో

కృష్ణసారము - నల్లయిఱ్ఱి.
ఏణము -
పెద్ద కన్నులుగల నల్లజింక.
ఏణీ - పెద్దకన్నులు గల నల్ల ఆడులేడి, జింక.

ఐణము - ఏణము (ఇఱ్ఱి) యొక్క తోలు(అజినము - తోలు), మాంసము మొ. వి. (జింక మాంసము, లేడిమాంసము, దుప్పి మాంసము ఐణము లనబడును)(Venison).
ఐణేయము - ఏణి యొక్క తోలు, మాంసము మొ. కి సంబంధించినది.

సురమందిర తరుమూల నివాసః - శయ్యా భూతలమజినం వాసః,
సర్వపరిగ్రాహ భోగత్యాగః - కస్య సుఖం న కరోతి విరాగః - 18శ్లో
Living in temples or at the foot of trees, sleeping on the ground, wearing deer-skin, renouncing all possessions and their enjoyment – to whom will not dispassion bring happiness? 

రాన్ డీర్ - (భూగో.) (Ran-deer) ధ్రువపుజింక, ఉత్తర దక్షిణ ధ్రువములలో ప్రయాణ సౌకర్యములకై ఉపయోగింప బడు జింక.
కెరిబో - (భూగో.) (Caribow) మంచు ఎడారులలో నుండు 'రాన్ డీర్ ', (Rein deer) అను జింక. 

పృషకము - 1.దుప్పి, 2.నీటిబొట్టు, విణ. బ్రహ్మబిందువుతో కూడినది.
దుప్పి - పొడలుగల అడవిమృగము, చమూరువు.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం. (గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
బొట్టు - 1.తిలకము, 2.చుక్క, సున్న 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సఅం. 1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.

దుప్పి - పొడలుగల అడవిమృగము, చమూరువు.
కుచ్చుల బఱ్ఱె -
జడల బఱ్ఱె, చమరీ మృగము.
ౙడబఱ్ఱె - చమరీమృగము.
చమరీ - ఆడు చమరీమృగము.
చమరము - 1.వింజామరము, రూ.చామరము, 2.సవరము, 3.చమరీ మృగము.
వింజామరము - (వెల్ల + చామరము) తెల్లని చామరము, సురటి.
చామరము - వింజామరము, రూ.చమరము.
సురఁటి - వట్రువ విసనకఱ్ఱ.
వీవన - సురటి, రూ.వీవెన, సం.వ్యజనమ్, వీజనమ్.
వ్యజనము - విసకఱ్ఱ, వీవన.
వీజనము - సురటి, విసనకఱ్ఱ.
వీచోపులు - (వీచు+ చోపులు) వింజామరలు.
వీచు - గాలి విసరు. వీవరి - వాయువు.
ప్రకీర్ణము - 1.విరివి, విసృతము, 2.వింజామరము, 3.గుఱ్ఱము.  

ధవిత్రము - జింకతోలు, విసనకఱ్ఱ.
సింగినాదము -
1.పొడ, దుప్పి కొమ్ములతో చేసిన సుషిరవాద్యము, 2.హేళనాదులయందు ఉపయోగించు వాడుకపదము (సింగినాదము జీలకఱ్ఱ).

పృషదశ్వుఁడు - వాయువు.
వాయువు -
(భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.

గంధమృగము - 1.పునుగుపిల్లి, 2.కస్తూరీ మృగము.
కమ్మపిల్లి -
పునుగు పిల్లి.
పునుఁగు - పునుగుపిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము.

వీణియ - 1.కస్తూ మృగముయొక్క బొడ్దు కాయ, 2.వీణ, సం.వీణా.
వీణ -
విపంచి, తంత్రీవాద్యము, రూ.వీణాము, వీణె, వీణియ.
విపంచి - వీణః (విపంచిక).

బై సణ - వీణసొరకాయ యొక్క బంధనము, రూ.బయిసణ.

ఏడ ననర్హుఁడుండు నటకేగు ననర్హుఁడు నర్హుడున్నచోఁ
జూడఁగనొల్ల డెట్లన, నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడినపుంటిపై నిలువఁ గోరినయట్టులు నిల్వనేర్చునే,
సూడిదవెట్టు నెన్నుదుటి చొక్కపుఁగస్తురిమీఁద, భాస్కరా.
తా.
ఈగ, చీముతో కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడునట్లుగా కస్తూరిబొట్టుపై నుండుటకు ఇష్టపడదు. అట్లే నీచుడెందుగలడో అచ్చటకే నీచుడగువాడు పోయి నిల్వఁజూచును. సజ్జనుడన్నచో ఆ నీచునకు గిట్టదు. 

చిట్టడవుల్లో కస్తూరి మృగం ఉంటుంది. కస్తూరి(కస్తూరి తిలకం లలాట ఫలకే)వలపు కప్పి వుంచితే దాగేవి కావు. ఈగ, చీముతో కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడునట్లుగా కస్తూరి బొట్టుపై నుండుటకు ఇష్టపడదు.

మృగనాభి - మృగమదము, కస్తూరి.
మృగమదము -
కస్తూరి.
కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి.

మృగనాభి ర్మృగమదః కస్తూరీ చ -
మృగనాభిభవత్వా న్మృగనాభిః. ఇ. పు. - మృగము యొక్క నాభి వలనఁ బుట్టునది.
"ముఖ్యరాట్ క్షత్రయోః పుంసి నాభిః ప్రాణ్యం గకేద్వయోః" అను త్రికాండశేష వచనము వలన స్త్రీలింగంబును గలదు.
మృగస్య మదో మృగమదః. - మృగము యొక్క మదము.
కేస్తూ యతే కస్తూరీ. సీ. ష్టుఞ్ స్తుతౌ. - శిరస్సునందు స్తోత్రము చేయఁబడునది. ఈ 3 కస్తూరి పేర్లు. 

అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభితా|
ముఖచంద్రకళంకాభ - మృగనాభివిశేషకా. - 5శ్లో

అండజ - కస్తూరి, వ్యు.కస్తూరి మృగము యొక్క బొడ్డుతిత్తి నుండి పుట్టినది.

నాభి - 1.కస్తూరి, 2.బొడ్డు, 3.బండి చక్రపు నడిమితూము, 4.విష విశేషము. 1.(గణి.) ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువునకు గల దూరము. ఆ శంకుచ్ఛేద సంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనివృత్తిలో నుండునట్టి స్థిర బిందువు (Focus). 2.(భౌతి.) పరావర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence)ను చెందునో యట్టి బిందువు. ముఖ్యాక్షమునకు సమాంతరముగా నుండు కిరణములు పరావర్తనము చెంది కేద్రీకరించెడి బిందువు. లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus).
బొడ్డు - 1.నాభి, 2.నూతిచుట్టు పెట్టిన గోడ.
నాభిజన్ముఁడు -బ్రహ్మ, పొక్కిలి చూలి, వ్యు.బొడ్డునుండి జన్మించినవాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

సనాభి - జ్ఞాతి, సమానుడు. 
స్వజనుఁడు -
తనవాడు, జ్ఞాతి.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు. తొలఁగుబావ - శత్రువు, దాయ.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
ప్రత్యర్థి - శత్రువు; విద్విషుఁడు - శత్రువు; అరాతి - శత్రువు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు).
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు. 
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి. 
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిగా...     

అహితుఁడు - శత్రువు, విరోధి.
విరోధి -
1.పగవాడు, 2.ఇరువది మూడవ సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.  

దాయాదౌ సుత బాన్ధనౌ,
దాయాదశబ్దము కొడుకునకును, జ్ఞాతికిని పేరు.
దాయం విభజనీయం ధన మత్తీతి, ఆదత్త ఇతి వా దాయాదః అద భక్షణే, డు దాఞ్ దానే. – పాలిసొమ్మును భుజించువాఁడుగాని, పుచ్చుకొను వాఁడు గాని దాయాదుఁడు.

వైరిణం నోప సేవేత సహాయం చైవ వైరిణః,
అధార్శికం తస్కరంచ తథైవ పరయోషితం|
తా.
శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ, పరస్త్రీ, వీరలతో సహవాసము జేయరాదు. - నీతిశాస్త్రము

మృత్తిక - 1.మన్ను, 2.తొగరిమన్ను.
మన్ను1 -
1.మృత్తు, 2.నేల.
మన్ను2 - 1.ఒకజాతి జింక, 2.ఒక రకపు యుద్ధ సాధనము, 3. (భూగో.,వ్యవ.) రాళ్ళు విశ్లేషము నొందుట వలన ఏర్పడి, పల్లపు ప్రదేశములలో కూడుకొని కొంత సేంద్రియ పదార్థముతో గలసి, యిదివరకు పెక్కు మార్పులను పొంది, యింకను పెక్కు మార్పులను పొందుచున్న వివిధ పరిమాణములు గల శిలారేణు సంచయము. ఇట్టి మట్టిచే నాక్రమింప బడిన ప్రదేశము వ్యవసాయదారులచే 'నేల 'యన బడును. (భూమి, క్షేత్రము.)
మృత్స్న - మంచిమన్ను. 

నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూ - భూమి; భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
స్థలము - 1.మెట్టనేల, 2.చోటు.
ప్రదేశము - స్థలము, చోటు.
పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథుచక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది.

నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars). 

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

నేలవేలుపు - భూసురుడు.
భూసురుఁడు -
నేలవేలుపు, బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.

నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ -
సీత, వ్యు.భూమి నుండి జన్మించినది. 

కనకమృగము భువుని గద్దులేదనకను
తరుణివిడిచి చనియె దాశరథియు
తెలివీలేనివాడు దేవుడెట్లాయెరా విశ్వ.
తా||
భూమిపై బంగారులేళ్ళు ఉన్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను(తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.)విడచి ఆ లేడివెంటబడెను. ఆమాత్రము తెలుసు కొనలేవాడు దేవుడెట్లయ్యెను.    

సారంగము - 1.జింక, 2.ఏనుగు, 3.తుమ్మెద, 4.వానకోయిల. 
సారాణ్యంగాని యస్య సః సారంగః - మంచి (య)అవయవములు గలది. 

వానకోయిల - 1.చాతక పక్షి, 2.ఒక రకము పాము.
చాతకము - వానకోయిల.  
ఘనతాళము - 1.వానకోయిల, 2.తాళభేధము.
ధారాటము - 1.గుఱ్ఱము, 2.వానకోయిల.  
స్తోకకము - 1.ఒక రకమైన విషయము, 2.వాన కోయిల, విణ.అల్పము వ్యు. వాన బొట్టును కోరునది.

అథ సారఙ్గః స్తోకక శ్చాతక స్సమాః :
సంహత్య అరం గచ్ఛతీతి సారంగః - తన జాతిపక్షులతోఁగూడి త్వరగాః బోవునది. పా. శారంగః.
స్తోక్తం అల్పం కాయతీతి స్తోకకః. కై శబ్దే. - మెల్లగా గూయునది.
స్తోక మల్పం కం శిరో హ్ స్యేతివా స్తోకకః. - అల్పమైన శిరస్సు గలది.
వర్షోదకం చతతీతి చాతకః. చతే యాచనే. - వర్షోదకమును యాచించునది. ఈ మూడు 3 వానకోయిల పేర్లు (చాతకము)     

ఖరువు - 1.గుఱ్ఱము, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము, 5.భర్తను వరించు కన్య, విణ.1.దురాచారుడు, 2.క్రూరము.
గుఱ్ఱము -
అశ్వము.
దర్పము - 1.గర్వము, 2.కస్తూరి.
దర్పకుఁడు - మన్మథుడు, వ్యు.దర్పింపచేయు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
దంతము -
పల్లు, కోర. రదనము - దంతము.
పలు - దంతము, విణ.అనేకము, విస్తారము.
కోఱ - పందికోఱ, పాముకోఱ, దంష్ట్ర, సం.ఖరుః.
పతింవర - తనంతట మగని వరించునట్టి ఆడుది.
కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము, దురాచారుడు.
క్రూరము -
1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది. అరపూస - గుగ్గిలము (Rosin). అగ్గి మీద గుగ్గిలము.

వాహము - 1.గుఱ్ఱము, ఎద్దు, 3.భుజము.
గుఱ్ఱము -
అశ్వము; అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
భుజము - (గణి.) సమతల క్షేత్రములో వరుసగానున్న రెండు కోణబిందువుల కలువగావచ్చు సరళరేఖ (Side) సం.వి.చేయి.
భుజసంధి - (జం.) భుజపు కీలు, చెయ్యి ఎముక భుజపు ఎముక కలిసిన భాగము (Shoulder joint).
ౙబ్బ - 1.భుజము, 2.తొడ వెలుపలి మీది భాగము, సం.భుజా.
రెట్ట - 1.పక్షిమలము, 2.భుజము.
బాజు(ౙ)బందు - 1.భుజబంధము, 2.భూషణము, జం.బాహుబంధః.
దో - బాహువు; బాహువు - భుజము.
బాహులేయుఁడు - కుమారస్వామి; కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.

బాహ్వస్థి - (జం.) దండయెముక, మోచేతిపై యెముక, భుజపు టెముక (Humerus).

దోష - 1.భుజము, 2.రాత్రి.
దోర్మధ్యము -
1.పిడికిలిపోటు, 2.భుజముల నడిమి ప్రదేశము. 
దోర్యుగము - రెండు బాహువులు. ఎగుభుజము - ఉన్నత భుజము.

భుజంగము - పాము, వ్యు.భుజముతో పాకిపోవునది.
భుజం కుటిలం గచ్ఛతీతి భుజగః భుజంగ; భుజనమశ్చ. గమ్ ఌ గతౌ. - కుటిలముగాఁ బోవునది గనుక భుజగము, భుజంగము, భుజంగమము. 
భుజంగభుక్కు - నెమిలి, వ్యు.పాములను తినునది.

భుజంగము - పాము, వ్యు.భుజముతో పాకిపోవునది.
భుజంగభుక్కు -
నెమిలి, వ్యు.పాములను తినునది.

చిలువ - పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు. 
చిలువతాలుపు - శివుడు, భుజంగభూషణుడు.
చిలువతిండి - 1.గరుడపక్షి, 2.నెమలి.
చిలువరేఁడు - సర్పరాజు, శేషుడు.

ఉపకారేణ నీచానా మపకారోహి జాయతే|
పయఃపానం భుజంగానాం కేవలం విష్వర్థనమ్||
తా.
పాముకు పాలుపోయుటచేత మిక్కిలి విషవృద్ధి యెట్లుకలుగునో(పాములు పాలు త్రాగవు), యారీతిగా నీచుల(ఉ)కుపకారము చేయ నపకారమే సంభవించును. - నీతిశాస్త్రము  

భుజకీర్తి - బాహుపురి, కేయూరము.
బాహుపురి -
కేయూరము.
కేయూరము - భుజకీర్తులు, వ్యు.భుజాగ్రమున నుండునది.
సందలిదండ - కేయూరము, బాహుపురి.

స్కన్ధో భుజశిరో అంసో (అ)స్త్రీ -
కం శిరో దధాతీతి స్కంధః డు ధాఞ్ ధారణపోణయోః. - శిరస్సును ధరించునది.
భుజస్య శిరో అగ్రం భుజశిరః. స. న. - భుజము యొక్కకొన.
అమ్యతే భారణే అంసః. అ. ప్న. అమరోగే. - భారముచేఁ బీడింపఁబడునది. ఈ 3 మూఁపు పేర్లు.   

స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
ప్రకాండము -
చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా.పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము(రామాయణమునందు షట్కాండములు గలవు), 2. సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.  

అంసము - 1.మూపు, భుజాగ్రము, 2.అంశము.
మూపు - భుజ శిరస్సు, అంసము.
అంసకూటము - ఎద్దుమూపురము.
అంసలుఁడు - మంచిమూపు గలవాడు, బలవంతుడు.

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
వంతు -
1.భాగము, 2.వరుస, 3.సామ్యము, 4.పోటీ.
విషయము - గ్రంథాదులందు దెలియు నంశము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాలసముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 -
1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.

సహస్రాంశువు - సూర్యుడు, వేవెలుగు.
సహస్రపాదుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు.

వరాంగము - 1.ఏనుగు, 2.తల.
ఒగ్గము -
 అవపాతము, ఏనుగులను పట్టుటకై త్రవ్వబడిన గోయి.
ఓదము -
ఏనుగును బట్టుటకై త్రవ్విన పల్లము (గుంట) అవపాతము.
అవపాతము - 1.క్రిందికి పడుట, 2.పడత్రోయుట, 3.దిగుట, 4.పక్షి తటాలునవ్రాలుట, 5.గోయి, 6.ఏనుగును పట్టుటకై త్రవ్వబడిన పల్లము ఓదము, (భౌతి.) క్రిందికి వంగుట, ఒక ప్రదేశములోని సమస్ఫుటము నకును అయస్కాంత సూచి అక్షమునకును మధ్యగల కోణము.  

భేరుండము - భేరుండము, గజములను తన్నుకొని పోవు పక్షి.
భేరుండము - ఒక పెద్ద పక్షి.
గండభేరుండము - ఒకానొక పెద్ద పక్షి అని చెప్పెదరు, కాని ప్రయోగము లందు మృగపర్యాయముగ కానవచ్చు చున్నది.

ఏనుగు స్పర్శేంద్రియం, వృక్(శరీరం) చర్మం వల్ల నశిస్తుంది. చర్మనేత్రము లేనివాడు అంధుడు.

మహామృగము - ఏనుగు.
ఏనుగు,
గజము - మదము గలది. 
మదము -
1.క్రొవ్వు, 2.రేతస్సు, 3.గర్వము, 4.కస్తూరి.
క్రొవ్వు - 1.మదము, కామము, 2.బలుపు, 3.శరీర ధాతువులలో ఒకటి యగు వస. బహు. గర్వోక్తులు క్రి.1.మదించు, 2.మిక్కుటమగు.

మాదో మదే :
మదనం మాదః, మదశ్చ. మదీ హర్షే. - మదించుట మాదము, మదమును. ఇవి విద్యాధాదుల వలన వచ్చిన గర్వము పేర్లు.

ఆమిక - 1.కావరము, 2.మదము, రూ.ఆము, సం.అహమహమికా.
ఆము - మదము, అవ్య.1.అధికముగా, 2.దట్టముగా, సం.అహమ్.
ఆముకొను - 1.అలముకొను, వ్యాపించు, 2.పైకొను, 3.క్రొవ్వు.

ఒడలి యందు క్రొవ్వు కండ్లను కప్పివేయును. అంధులుకాని అంధులు మధాంధులు.

అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.ఆత్మాభిమానము (Egotism), 5.క్రోధము (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది), రూ.అహంకృతి, అహంక్రియ.

క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతి విభ్రమః |
స్మృతి భ్రంశా ద్భుద్ధినాశః బుద్ధినాశాత్ప్రణశ్యతి ||
తా.
క్రోధంవలన మోహం కలుగుతుంది. మోహం ఆలోచనను భ్రమింప చేస్తుంది. ఆలోచనాభ్రంశం బుద్ధిని నాశనం చేస్తుంది. బుద్ధినాశంవల్ల నశిస్తాడు. - భగవద్గీత 

మత్తి - 1.కామము 2.అవివేకము, సం.మదః.
కామము -
  1.కోరిక 2.మోహము 3.రేతస్సు.
దర్పము - 1.గర్వము 2.కస్తూరి.

కామానికి కన్నుల యందు విషముండును. కామము మనుజులకు ప్రతికూలమైనది. ఎవరియం దా కామ మేర్పడునో, వారియందు దయ, ప్రేమయు కలుగును. – సుందరాకాండ

సముద్రం, అగ్ని, అల్లుడు, ఉదరము, కామం మొదలగునవి తృప్తినొందించుటకు వీలుకానివి. - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

చేట చెవుల మెకము - ఏనుగు. ఏనుగు చెవులు అతి చంచలము.
ఏనుఁగు పాఁడి -
అమితమైన ఈవి.
ఏనుఁగు రాకాసి గొంగ - గజాసురవైరి, శివుడు.

చంచరీకము - తుమ్మెద, వ్యు.చరించు చుండునది.
తుమ్మెద -
భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
షట్పదము - తుమ్మెద, వ్యు.ఆరు కాళ్ళుకలది.

తుమ్మెద కుటుంబము - తుమ్మెదలు, చీమలు, తేనెటీగలు, కందురీగలు మొదలగు పురుగులీ కుటుంబమునకు చెందినవి.

హీర - 1.లక్ష్మి, 2.చీమ.
చీమ - పిపీలిక. చీమకు చిప్పెడు నీళ్ళే సముద్రము. చీమ గంగా యాత్ర. కొండచీమ -
పిపీలిక, ఒకరకమైన చీమ.

చీమల నుంచి మనం అహార నిలువలు నేర్చుకున్నాం. చీమ బారు తప్పదు. తప్పించండి. తనువు ఉన్నంత సేపు చీమల బారును చేరుకునే ప్రయత్నం చేస్తుంది! చీమలు ఒక్కొక్క రవ్వ - ఒక్కొక్క గింజ మోసుకు పోతాయి! చీమ తన జాతి జీవనం కోసం నిలువ చేస్తుంది.

గచ్ఛన్ పీపిలికో యాతి, యోజనానాం శతాన్యపి|
అగచ్ఛన్ వైనతే యోపి, పదమేకం న గచ్ఛతి||
తా.
"నడిస్తే చీమైనా వంద యోజనాలు కూడా ప్రయాణించగలదు. నడవకుండా ఉన్నప్పుడు గరుత్మంతుడు సైతం ఒక్క అడుగు కూడా పయనించలేడు." ప్రయత్నమంటూ చేస్తే ఎవరైనా, దేనినైనా సాధించగలరు. ప్రయత్నమే లేనప్పుడు ఎంత గొప్పవాడైన దేనినీ సాధించలేరు. ప్రయత్నం శక్తి అంతటి గొప్పది.  

కండచీమ - పెద్దచీమ, రూ.గండుచీమ.
గండ్ర1 -
1.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు.), 2.ధృష్టుడు, 3.బోయడు, 4.పెద్దది, ఉదా. గండ్రచీమ, బహు. పరుషవచనములు. నరకఁడు - 1.దుష్టుడు, 2.దయలేనివాడు, సం.నరకగః.
దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్దజాతి. మృగయుఁడు - బోయ.
గండ్ర2 - తునక, ముక్క, సం.ఖండః.
గండ్రలు - పరుషవచనములు, వై.వి. తునుకలు.
పరుషము - 1.నిష్ఠురము, 2.నిష్ఠుర వాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు. నిష్ఠురము - కఠినము, పరుషము.

సరఘ - తేనెటీగ.
తేఁటి -
తుమ్మెద, తేనెటీగ.
మధుపము - తుమ్మెద; మధులిహము - మధుపము, తుమ్మెద.

సరఘా మధుమక్షికా :
సరంతీతిసరాః స్వవిషయం ప్రాప్తాః, తాన్. హంతీతి సరఘా. హన హింసాగత్యోః - తననుగూర్చి వచ్చువారిని హింసించునది.
మధుని సక్తా మక్షికా మధుమక్షికా - తేనెయం దాసక్తమైన యీఁగె. ఈ రెండు జుంటీగ, తేనెటీఁగ పేర్లు.

గండోలి - 1.ఎఱ్ఱతుమ్మెద, కణుదురీగ, 2.ఆడుహంస, 3.భద్రానది. ఇంటిలో కణుదురీగ దూరితే ఇల్లు కాల్చుకుంటారా!
కందురీఁగ - కందురు.
వరట - ఆడుహంస, వి.పేడ యెండిన చెక్క.  
హంసి - ఆడుహంస.

గణ్డోలీ వరటా ద్వయోః :
గణ్డం కపోలం ఉలతి ఆవృణోతీతి గణ్డోలీ. ప్స. ఉల సంవరణే. - చెక్కిలి మీఁద ముసురునది.
పా, గన్ధయ త్యర్దయతి గన్ధోలీ. గన్ధ అర్ధనే. - పీడించునది.
వృణోతీతి వరటా. ప్స. వృఞ్ వరణే. - అంతట వ్యాపించునది. ఈ మూడు  కణుఁదురీగ(ఎఱ్ఱతుమ్మెద) పేర్లు.

సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు తొలకరి వానలు ప్రారంభమవుతాయి. దీనినే మృగశిర కార్తె అంటారు. వర్షాకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు.

తొలకరి - చైత్రవైశాఖములందలివాన. వర్షర్తువు. రూ.తొల్కరి. తొలకరి వాన, మెలకువ తల్లి. కార్యదీక్ష కన్న తల్లి. తొలకరిని చెరువునిండినా తొలిచూలు కొడుకు పుట్టినా లాభం.  
తొలకరిసూడు - హంస వ్యు.వర్షాకాల విరోధి.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.

56-4d8b958077

No comments:

Post a Comment