Tuesday, March 20, 2012

నక్షత్రములు - మేషరాశి

నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు 27).
రిక్క -
నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ.ఋక్షమ్.
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.

ఉదకము నుండి చంద్రొత్పత్తి, సూర్యోత్పత్తి, అగ్ని ఉత్పత్తి, చంద్ర కళాత్మకములైన దివసముల ఉత్పత్తి, తదంశములైన నక్షత్రముల ఉత్పత్తి ప్రతిపాదింపబడినది.

దాక్షాయణ్యో శ్వినీత్యాది తారాః : అశ్వినీత్యాదితారా దాక్షాయణ్య ఇత్యుచ్యంతే - అశ్విన్యాది రేవత్యంత నక్షత్రములు దాక్షాయణు లనంబడును. దక్షస్య ప్రజాపతే రపత్యాని స్త్రియః దాక్షాయణ్యః - దక్షప్రజాపతి యొక్క కుమార్తెలు. అశ్వినిమొదలు నక్షత్రములకుఁ పేర్లు.

అశ్విని మొదలు రేవతి వరకు గల మొత్తం ఇరవైయేడు నక్షత్రాలకు మేషాది మీనాంతంగల పన్నెండు రాశులకు విభజిస్తే ఒక్కొక్క రాశికి సపాద నక్షత్రద్వయం వస్తుంది. (నక్షత్రానికి నాలుగుపాదాలుకాగా, అశ్విని, భరణి, కృత్తిక ప్రథమపాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ విధముగానే మిగతా నక్షత్రాల పంపకం, రాశుల ఏర్పాటూ చూసుకొనేది)

రాసులు - ఇవి పండ్రెండు. మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపురాశి
కన్నె నీరాశి కూటమి గలిగినరాశి...

ఈలాగు ఏర్పడే రాశులలో సూర్యుడు ఒక రాశినుంచి ఇంకొక రాశియందు ప్రవేశించడం సంక్రమణం అని సంజ్ఞ. (సూర్యుడు అశ్విని ప్రథమపాదముతో ఆరంభించి కృత్తిక మొదటి పాదముతో ఏర్పడినది మేషం. ఆ రాశియందు సూర్యుడు ప్రవేశించిననాడు మేష సంక్రమణం అని వ్యవహారం. ఈలాగే కర్కటక సంక్రమణం, మకర సంక్రమణం వగైరా గ్రహించేది.

లగ్నము - మేషాదిరాసుల ఉదయము, విణ. తగులుకొన్నది.

అశ్వినీ, భరణీ, కృత్తికలు నాగవీథి అనీ; రోహిణి, మృగశిర, ఆర్ద్ర గజవీథి అనీ; పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఐరావత వీథి అనీ; హస్త, చిత్త, స్వాతి గోవీథి అనీ; జ్యేష్ఠా, విశాఖా, అనూరాధలు జారద్గవ వీథి అనీ; మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ అజవీథి అనీ; శ్రవణ, ధనిష్ఠా శతభిషలు మృగవీథి అనీ; పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వైశ్వానరవీథి అనీ ప్రసిద్ధములు.

ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషరాశి.
ఋక్షరాజు -
చంద్రుడు, జాంబవంతుడు. బ్రహ్మదేవుని కుమారుడు, హరిభక్తుడు, చిరంజీవి.

ఎలుఁగు - 1.కంఠస్వరము, 2.ఎలుగుబంటి, రూ.ఎల్గు, ఎలువు.
అచ్ఛభల్లము -
ఎలుగుబంటి.
అచ్ఛము - అచ్చము, వి.1.ఎలుగుబంటి, 2.పటికపురాయి.
పటిక - స్పటిక, బంగారమునకు మెరుగునిచ్చు ఉప్పు, సం.స్ఫటికమ్. వై.వి. (రసా.) పొటాసియమ్ అల్యూమినియముల డబుల్ సల్ఫేటు (Alum).
భల్లము - 1.ఎలుగుగొడ్డు, 2.బల్లెము.
కొంతము - ఈటె, బల్లెము, సం.కుంతః.
కుంతము - 1.ఈటె, 2.బాణము.
బల్లెము - 1.ఆలుగులు గల బాణము, 2.ఈటె, సం.భల్లః.
భల్లుకము - 1.భల్లము, 2.ముల్లు, 3.కోతి, రూ.భల్లూకము.
కరి1 - 1.ఏనుగు, 2.కోతి.
కరి2 - 1.నిదర్శనము, 2.మేర, విణ.సాక్షి.
కరిముఖుఁడు - వినాయకుడు; గజవదనుడు - వినాయకుడు. 

వినాయకః సర్వా న్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు ణీఞ్ ప్రాపణే. 

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు -
వినాయకుడు.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాడు. నీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నానాం రాజ విఘ్నరాజః - విఘ్నములకు రాజు.

చంద్రుడు - నెల, చందమామ.
నెల -
1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు (Rahu).

నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు -
1.శివుడు, నెలతాలుపు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు. 

ముక్కంటిచెలి - కుబేరుడు.
కుబేరుఁడు -
ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత. దాత - ఇచ్చువాడు.
ధనాధిపుఁడు - కుబేరుడు.

అశ్వని 4, భరణి 4, కృత్తిక 1 పాదములు మేషము మేకరాశి.

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః,
సుఖప్రద స్సురూపాక్ష స్సర్వాభీష్ట ఫలప్రదః. - కుజుడు(Mars)

మేషము - 1.మేక, 2.గొఱ్ఱెపోతు, పొట్టేలు, 3.మేషరాశి (Aries).
మేఁక -
ఆడుమేక, సం.మేకః.
మేఁకరాసి - మేషరాశి. 

దేవానాంప్రియము - మేక, యజ్ఞములందు దేవతల కర్పింపబడును గాన.

ఆజకము - మేకలమంద, మేక.
లంబకర్ణము -
మేక, విణ.వ్రేలాడెది చెవులు కలది.
లంబ - దుర్గ, లక్ష్మి.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

ఆదిశక్తి రమేయాత్మా - పరమా పావనాకృతిః|
అనేకకోటి బ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా.

అజోరజః ఖరరజస్తథా జన్మార్జనీరజః|
స్త్రీణాంపాదరజశ్చైవ శక్రస్యాసి శ్రియం హరేత్|
తా.
మేకలకాలిదువ్వ, గాడిదకాలిదువ్వ, చీపురుకట్టదువ్వ, స్త్రీకాలిదువ్వ, ఇవి పైబడిన ఇంద్రునికైన ఐశ్వర్యము తొలగిపోవును. – నీతిశాస్త్రము

మేకతిండి - తోడేలు, వ్యు.మేకలు తిండిగా గలది.
తోడేలు -
జంతువులకు కీడు తలపెట్టునది, తిండిపోతు. తోడేలును గొర్రెమందకు కావలిపెట్టినట్లు. గొర్రె ఏడ్చునని తోడేలునకు కనికరమా?

తోఁడేలు - 1.వృకము(వృకము - 1.తోడేలు, 2.కుక్క), 2.అడవికుక్క, రూ.తోడెలు.

అజకము - 1.మగమేక, 2.మేషరాశి, 3.పుట్టుకలేనిది.
మేకపోఁతు - ఛాగము; ఛాగము - మేకపోతు, పద్యా.ఛగలము, ఛగల.
ఛగలము - 1.మేకపోతు, రూ.ఛాగము, 2.పిడకనిప్పు.
మేకము - ఛాగము.

మేకపోతుఁ గాంభీర్యము - జాతీ. మేకపోతు ధైర్యమువంటి ధైర్యము, లోపల పసలేకుండుట. 

వేఁట - 1.మృగయ, 2.పొట్టేలు, మేకపోతు.
మృగయ -
1.వేట, 2.వెదకుట.
మృగయుఁడు - బోయ.
చింబు - మేకపోతు.
చింబోతు - మేక.
బహురోమము - మేక.

అజాయుద్ధే ఋషిశ్రాద్ధే ప్రభాతే మేఘడంబరే|
దంపత్యో, కలహేచైన బహ్షారంభో లఘుక్రియా||
తా.
మేకపోతులు(ఎదటి పొట్టేలితోఁ బోరునది) యుద్ధమునందును, ఋషి శాద్ధమందును(శ్రాద్ధము - పితృకర్మము, వ్యు.శ్రద్ధతో కూడినది.), మేఘములు విజృంభణమున(డంబరము - విజృంభణము), భార్యాభర్తలు కలహమందును ఆరంభమధికము, క్రియ స్వల్పంబు. - నీతి శాస్త్రము

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః||
 

అజుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒకరాజు.
అజితుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, విణ.జయింపబడనివాడు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).         

అజా విష్ణు హర చ్ఛాగాః - అజశబ్దము విష్ణువునకు, శివునికిని, మేఁకకును పేరు. న జాయతే, అజతీతి చ అజః జనీ ప్రాదుర్భావే;అజగతౌ. పుట్టుకలేనివాఁడును, పోవునదియు అజుడు, అజమును.  

అజునకు దండ్రివయ్యు సనకాదులకుంబరతత్త్వమయ్యుం
సద్ద్విజమునికోటికెల్ల బరదేవతయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా
డ్ఢ్వజ మిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
బ్రహ్మకు తండ్రిగాను, సనకసనందనాది మహర్షులు ధ్యానము సేయు పరతత్త్వముగాను, విప్రముని సమూహములు కొలుచునట్టి పరదైవము గాను, సూర్యవంశ రాజుల(భూభుజుఁడు - రాజు)కు అధిపుడివి, ఇట్లు అన్ని లక్షణములును పరిపూర్తినొందిన వాడవై గరుడుఁడు ధ్వజముగా గలిగి ప్రకాశించు దయానిధీ ! నిన్ను మిక్కిలి ప్రస్తుతించెదను.    

అజమనుచు మేషమునునకుఁ బేరు
నిజకోరిక లేలా గీడేరు
అజుఁడని వాగీశ్వరునికిఁ బేరు 
విజయము గల్గును త్యాగరాజ నుతుని ||తెలిసి||

అజ - 1.ప్రకృతి, వ్యు.పుట్టుకలేనిది, శాశ్వతమైనది (శాశ్వతము - నాశనములేనిది.), 2.ఆడుమేక, ఎక్కువగా తిరుగునది.
ఛాగి -
మేక.

అజా ఛాగీ :
అజతీ త్యజా. అజ గతిక్షేపణయోః - తిరుగునది.
ఛ్యతి రోగానితి ఛాగీ. ఈ. సీ. ఛో ఛేదనే. - రోగములఁ జెఱుచునది. ఈ రెండు మేక పేర్లు.

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధ క్షిప్రప్రసాదినీ|
అంతర్ముఖ సమారధ్యా బహిర్ముఖ సుదుర్లభా||

ప్రకృతి - 1.ప్రత్యయము చేరక ముందటి శబ్ద రూపము, 2.సౌర వర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము(స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కొశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి, సప్త ప్రకృతులు).

స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము -
1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

అవ్యక్తము - స్పస్టముకానిది, వి.1.మూలప్రకృతి, 2.అజ్ఞానము, 3.సూక్ష్మశరీరము, 4.పరబ్రహ్మము, 5.(బీ.గణి.) తెలియబడని సంఖ్య.
అవ్యక్తుఁడు - 1.శివుడు, 2.విష్ణువు, 3.మన్మథుడు, విణ. మూఢుడు.

ప్రకృతి శాస్త్రములు - (జీవ.) వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, భూగర్భశాస్త్రము మొదలగునవి, ప్రకృతికి సంబంధించిన శాస్త్రములు (Natural Sciences).

మానవ మేధస్సు వైఫల్యం చెందినప్పుడు ప్రకృతి విలువ తెలిసి వస్తుంది.

కృ అనగా సృష్టి. సృష్టి - 1.సృజించుట 2.ప్రకృతి(సృజన) 3.స్వభావము. సృజన - సృష్టి. సృష్టికి మూలం శక్తి. శక్తి బహురూపములు గలది. ఆ శక్తికి రూపం స్త్రీ. సృష్టి అంతటిది తల్లి.

మార్పు ప్రకృతి లక్షణం; మార్పు వృద్ధే కావచ్చు, క్షయమూ కావచ్చూ. లోక క్షేమం కోసం నియమితమైన ధర్మాన్ని, న్యాయాన్నీ అతిక్రమిస్తే ప్రకృతి శక్తి నిర్వీర్యమవుతుంది.

సృష్టిలో అందాలున్నాయి. అందవికారాలూ (మానవ దృష్టిలో) ఉన్నాయి. ప్రకృతి మొత్తం ద్వంద్వ పూరితం. భిన్నత్వంలో ఏకత్వమే ప్రకృతి. రెంటి సమతుల్యమే సౌందర్యోత్పత్తి.

ప్రకృష్ట వాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టి వాచకః|
సృష్టౌ ప్రకృష్టా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా||

స్వామి యనఁగా రాజు; అమాత్యుఁడు మంత్రి; సుహత్తు చెలికాఁడు; కోశము భండారము; రాష్ట్రము దేశములతోఁ గూడిన పట్టణము; దుర్గము పర్వతోదక వృక్షములచేతఁ బోవ శక్యముగాని పట్టణము; బలము సైన్యము; ఒకఁడు ముఖ్యుఁడుగాఁ గలవారును సజాతీయులునునైన పురజనుల సమూహములు పౌరశ్రేణులు.

స్వం విద్యతే అస్యేతి స్వామీ - ధనముగలవాఁడు.
అమా సమీపే భవః అమాత్యః - సమీపమందుండు వాఁడు.
శోభనం హృదయమస్యేతి సుహృత్ - మంచి హృదయము గలవాఁడు.
కూయతే ఉత్కృష్ట ఇతికోశః - కోషమని మూర్థన్యాంతముగా గొందుఱు.
కుశబ్దే - ఉత్కృష్టమని పలుకఁబడునది.
రాజత ఇతి రాష్ట్రం - ప్రకాశించునది.
దుఃఖేన గమ్యత ఇతి దుర్గం - ప్రయాసముచేతఁ బొందఁబడునది.
బలంత్త్యనేన బలం, బల ప్రాణనే - దీనిచేత బ్రదుకుదురు.
ప్రక్రియతే రాజ్యమాభి రితి ప్రకృతయః - వీనిచేత రాజ్యము ప్రకృష్టముగాఁ జేయఁబడును.
శ్రయంత్తే పరస్పర మితి శ్రేణయః. శ్రిఞ్ సేవాయాం - పౌరులయొక్క శ్రేణులు పౌరశ్రేణులు.
స్వామిన్ శబ్దము మొదలు ను రాజ్యాంగములనంబడును. ఈ సప్తాంగములే ప్రకృతులనంబడును. పౌరశ్రేణులను ప్రకృతులనంబడును.

కోమలపు చేగురు మోవి కోమలికి మేషరాశి....

వృష్టి - 1.పొట్టేలు, 2.ఒక గొల్లవాడు, 3.కృష్ణుడు, 4.ఇంద్రుడు, 5. వహ్ని.
పొట్టేలు - మగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
మేండము - పొట్టేలు (మేండ్రించు - 1.భేదించు 2.నశింప చేయు.)

రోహిషము - కొండగొఱ్ఱె, ముత్యము.
రౌహిషము -
1.కామంచిగడ్డి (తృణ విశేషము), 2.కొండగొఱ్ఱె.
కామంచి - క త్తృణము, ఒక తెగగడ్డి, రూ.కామంచి, సం.కామంజికా.
కామంజిక - క త్తృణము.

గొఱ్ఱియ - గొఱ్ఱె, సం.కురరః, కురరీ.
కురరి - ఆడుగొఱ్ఱె.
ఏడక - గొఱ్ఱె. గొఱ్ఱె కసాయివాడినే నమ్ముతుంది.
ఏడకము - పొట్టేలు. 

ఊర్ణము - 1.నూలు, 2.కనుబొమల నడుమ సుడి, వి.ఉన్ని.
ఉన్ని -
గొఱ్ఱె మొ.ని బొచ్చు.
ఉన్ని అల్లిక - (గృహ.) ఊలును దుస్తులుగా అల్లుట (Knitting). ఊర్ణాయువు - 1.పొట్టేలు, 2.ఉన్ని కంబళి, 3.సాలెపురుగు, విణ.ఉన్నికలది.

తగిలిమదంబుచేనెదిరి దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుఁడై చెడుటింతెగాక తా
నెగడి జయొంపలేడఁది నిక్కము, తప్పదు, ధాత్రిలోపలన్
తెగియొక కొండతోఁదగరు ఢీకొని తాకిననేమి? భాస్కరా.
తా.
గొఱ్ఱె మూర్ఖతచే కొండతో నెదిరించి పోట్లాడిన అది ఆ కొండను జయింపగలదా? అట్లే మూర్ఖుడు యెదుటి వారి ఘనతనూ తన శక్తినీ తెలిసి కొనక విరోధించి మార్కొనుట ప్రయోజనము లేదు.

సాధు పృష్టం మహాభాగ సర్వలోక హితైషిణః,
మహతా మేష ధర్మశ్చ నాన్యేషా మితి మే మతిః

అజాజీవుడు - మేకలను మేపుకొని జీవించువాడు, గొల్లవాడు. అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు.
జాబాలుఁడు - 1.మేకల మేపువాడు, 2.ఒక ఋషి.

జాబాల స్స్యాదజాజీవి :
అజాః పాలయతీతి జాబాలః. - పాలరక్షణే. - మేఁకలఁ గాచువాఁడు.
అజాభి ర్జీవతీ త్యజాజీవీ. న. పు. జీవ ప్రాణధారనే. - మేఁకలచేత బ్రతుకువాఁడు. పా. అజాజీవః 'అజాపాల మజాజీవ' మని రత్నమాల. ఈ రెండు మేఁకలఁగాచువాని పేర్లు.  

దోగ్ధ - 1.గొల్లవాడు, 2.దూడ, 3.కవిత్వము చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
దోగ్ధ్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది.
వ్రేఁత - గొల్లది; మహాశూద్రి - గొల్లది; గోపి - గొల్లది (గోపిక).
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.

వ్రే - గొల్లకులము, సం.వృష్ణిః.
వ్రేపల్లియ - గొల్లపల్లె.
వ్రేఁడు - గొల్లడు, సం.వృష్ణః.
వల్లవుఁడు - గొల్లవాడు.

గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.  
గోస్వామి -
1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.

గోపుఁడు - రక్షించువాడు, వి.1.రాజు, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి, (అయిదింటిపైగాని, పదింటిపైగాని అధికారము కలిగి గ్రామములలోని భూముల ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల అర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్తవ్యములై యుండెను.) 
గొల్ల1-1.గొల్లజాతి, 2.పాడిపసరముల మేపి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.
ద్వారపాలకుఁడు - వాకిటి కావలివాడు.
ద్వార్థ్సికుఁడు - ద్వారపాలకుడు, రూ.ద్వార్థ్సుడు.
దర్శకుఁడు - ద్వారపాలకుడు, విణ.చూపెడువాడు, 2.నేర్పరి. 
ఉపదర్శకుఁడు - 1.తప్పునడవ కుండ చూచుకొను అధికారి, 2.చూచువాడు, చూపువడు, వి.ద్వారపాలకుడు.

కృష్ణుఁడు-1.విష్ణువు 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు(నల్లనివాడు).
వాసుదేవుడు -
కృష్ణుడు, వ్యు.వసుదేవ కుమారుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.  
కృష్ణమూర్తి - కృష్ణావతారము.
యాశోదేయుఁడు - యశోద కొడుకు, శ్రీకృష్ణుడు.

యాశోదేయుఁడు - యశోద కొడుకు, శ్రీకృష్ణుడు.
కంసారాతి - శ్రీకృష్ణుడు. (కంసుఁడు - కృష్ణుని మేనమామ.)

దైవాధీనం జగత్సర్వం - సత్యాధీనంతు దైవతమ్|
తత్సత్య ముత్తమాధీనం ఉత్తమో మమ దేవతా||
తా.
ఈలోకమంతయు దైవాధీనమై యున్నది, ఆ దైవము సత్యమున కాధీనమై యున్నది, ఆ సత్యము ఉత్తముల యందున్నది, కాబట్టి ఆయుత్తమ భక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను. - నీతిశాస్త్రము

వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
కృష్ణద్వైపాయణుఁడు -
వ్యాసుడు; బాదరాయణుఁడు - వ్యాసుడు.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.

పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.
నల్లని ద్వీపమునందు జన్మించి నందు వల్ల, కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడయినాడు. ద్వైపాయనుడైన వ్యాసమహర్షి అజ్ఞానం నుంచి రక్షించును.   

వ్యాసుడు వశిష్టుని మునిమనుమడు. శక్తికి పుత్రుడు-నిష్కల్మషుడు-పరాశరుని పుత్రుడు. శ్రీశుకుని తండ్రి, తపోధనుడు వ్యాస మహర్షి. కాలాంతరమున ఏకరాశిగా నున్న వేదాలను విడివిడిగా (నాలుగు వేదాలుగా విభజించుట) ఏర్పరచడం మూలాన వ్యాసుడు (వేదాల చిక్కు విడగొట్టేవాడు) లేక వేదవ్యాసుడు అనే పేరు పొందినాడు.

ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
భా.
ప్రతియుగంలో కాలం యొక్క ప్రభావంచేత అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారూ అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. వారు అపారమైన వేదరాశిని అధిగమించలేరు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి యుగధర్మానికి తగిన విధంగా ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.   

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్|

ఉపేంద్రుఁడు - 1.వామనుడు, విష్ణువు, 2.కృష్ణుడు.
వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు.
ఇంద్రావరజుఁడు - ఇంద్రునితమ్ముడు, ఉపేంద్రుడు, విష్ణువు.

ఉపేంద్రః ఇంద్ర ముపగతః అనుజత్వా దుపేంద్రః - ఇంద్రునికి తమ్ముడు గనుక ఉపేంద్రుడు.
ఇంద్రరక్షణాయ తత్సమీపే స్థితో వా - ఇంద్రుని రక్షించుటకై అతనియొద్ద నున్నవాఁడు.
ఇంద్రలోకా దుపరితిస్థతీతి వా ఉపేంద్రః - ఇంద్రలోకమున కంటె పైలోకమందుండువాఁడు.
ఇంద్రస్య అవరజః ఇంద్రావరజః - ఇంద్రుని దమ్ముడు.

ఛలయసి విక్రమనే బలిమద్భుతవామన,
పదనఖనీరజనిత జనపావన|
కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే! ||

గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.  

కంసారాతి - శ్రీకృష్ణుడు.
కంసుఁడు - కృష్ణుని మేనమామ.

కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
నల్లనయ్య -
కృష్ణుడు, కరివేల్పు. 
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.

కృష్ణః సర్వంకరీతీతి కృష్ణః - అన్నిటిని జేయువాడు.
డుకృఞ్ కరణే దైత్యాన్ కర్షతీతి వా - దైతులను నలిపివేయువాడు.
కృష్ణ విలేఖనే-కృష్ణవర్ణ త్వాద్వా - కృష్ణవర్ణుడు గనుక కృష్ణుడు.   

దాశార్హుఁడు - కృష్ణుడు, వ్యు.దాశార్హుని సంతతివాడు.
శౌరి - కృష్ణుఁడు, వ్యు.శూరుని మనుమడు.
శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు. ప్రవీణుఁడు – నిపుణుడు. వాసుదేవుడు - కృష్ణుడు, వ్యు.వసుదేవకుమారుడు. శూర ఇతి వసుదేవస్య పితారస్య గోత్రాపత్యం శౌరిః -ఇ.పు. శూరుడనగా వసుదేవుని తండ్రి, అతని మనుమఁడు.
మురారి - 1.కృష్ణుడు, 2.ఒకానొక సంస్కృతకవి.
దామోదరుఁడు - కృష్ణుడు.
దామోదరః ఉదరే దామయస్యేతి దామోదరః - ఉదరమందు తులసిమాలిక గలవాడు.
దామ్నా ఉదరే మాత్రా బద్దః - బాల్యమందు యశోదచేత పలుపున(ను) ఉదర మందుఁ గట్టబడినవాఁడు.

మునుపొనరించుపాతక, మమోఘము జీవుకెల్లబూనియా
వెనుకటి జన్మం దనుభవింపకదీరదు, రాఘవుండు వా
లిని బడవేసి తా మగుడ లీల యదూద్భువుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తనమేను, భాస్కరా.

తా. రఘురాముడు వాలిని వధించిన యనంతరము రామావతారము చాలించి తిరిగి యదుకుల సంభూతుడై పుట్టెను. ఆ కృష్ణావతారము(కృష్ణమూర్తి-కృష్ణావతారము)నందు యుగాంతమునకు దాపుగా శ్రీకృష్ణుడు అడవిలో తపము చేయుచుండగా నొక కిరాతు డాతనిని మృగముగా భావించి యొక వాడికోల నేయగా దానిచే కృష్ణుడు తనమేనుఁ బాసెను. కావున సమస్తజీవులకు పూర్వజన్మమున జేయు పాపఫల మేజన్మమందు ననుభవింపక తీరదు. 

నిందసి యజ్ఞధరేరహహ శ్రుతిజాతమ్,
సదయహృదయదర్శిత పశుఘాతమ్|
కేశవ! ధృత బుద్ధశరీర! జయ జగదీశ! హరే! |

ఇంద్రుఁడు-1.దేవతలరాజు 2.సమాసోత్తర పదమైన శ్రేష్ఠుడు, రాజేంద్రుడు. రాజు - 1.రేడు(రాట్టు - రేడు ), రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు.  క్షత్రియుఁడు - రాచవాడు.
రాజన్యుఁడు - క్షత్రియుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
నెల -1.మాసము 2.చంద్రుడు 3.పున్నమ 4.స్థానము 5.కర్పూరము. నెలకూన - 1.బాలచంద్రుడు(నెలవంక - బాలచంద్రుడు), 2.నఖిక్షతము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.

వత్సలము - వహ్ని, తృణాగ్ని.
వహ్ని -
అగ్ని; అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గితత్తడి -  అగ్నిదేవుని వాహనము, పొట్టేలు. 

ఉరభ్రము - ఉరణము, పొట్టేలు, తగరు.
ఉరణము -
పొట్టేలు, వ్యు.బిగ్గరగా మొరబెట్టునది.
పొట్టేలు - మొగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
తగరు - పొట్టేలు, సం.తగరః.
తగరురౌతు - అగ్ని.

విషధరము - 1.పాము, 2.మేషము, (విషము = నీరు, విషము).
విషస్య ధరః విషధరః - విషమును ధరించునది.
విషము - 1.గరళము, 2.జలము(నీరము - జలము).
గరళము - 1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు. 
అహిఫేనము - 1.నల్లమందు, అభిని, 2.గరళము, 3.పామునోటి చొంగ.
అభిని - నల్లమందు, సం.అహిఫేనమ్, అఫేనమ్. 
నల్లమందు - (వ్యవ.) అభిని, అహిఫేనము (Opium), (ఇది మాదక పదార్థముగను వైద్యమునందును ఉపయోగింపబడును. దీనిని Papaveraceae అను కుటుంబమునకు చెందిన Opium poppy (అభిని లేక గసగసా) అను మొక్క కాయలను గీయగా వచ్చిన పాలతో తయారుచేయుదురు. నల్లమందులో మార్ఫిన్ (Morphine) అను ముఖ్యమైన క్షారముండును.) 

గసగసాలు - ఒక దినుసు విత్తులు, (వ్యవ.) ఇవి సంబారద్రవ్యముగా వాడబడుచుండును. (ఇవి నల్లమందు మొక్క యొక్క గింజలు. వీనిలో సుమారు నూటికి 50 వంతులు చమురుండును), సం.గసకః.

మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.

మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.

విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితం|
ఆమిత్త్రాదపి సద్వృత్త మమేథ్యాదపి కాఞ్చనం||
తా.
విషము వలనైన నమృతంబును గ్రహింపవలయును, బాలునిచే నైనను మంచిమాటలను గ్రహింపవలయును. శత్రువులనైనను సత్స్వభావమును గ్రహింపవలయును, అమేధ్యము వలన నైనను బంగారమును గ్రహింపవలయును. - నీతిశాస్త్రము 

ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు -
(వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, pre-monsoon period.

ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.
ఆతపము -
1.ఎండ, 2.వెలుతురు.
ఎండరొర - సూర్యుడు.

ప్రకాశము - వెలుగు, విణ. బయలు పడినది.
వెలుఁగు -
1.కిరణము 2.ప్రకాశము. 
కిరణము - వెలుగు, మయూఖము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు. సూర్యుఁడు - వెలుగురేడు.      

ప్రకాశో ద్యోత ఆతపః :
ప్రకాశతే ప్రకాశః, కాశృదీప్తౌ - ప్రకాశించునది.
ద్యోతతే ద్యొతః, ద్యుతదీప్తౌ - ప్రకాశించునది.
ఆ సమంతాత్తపతీత్యాతపః, తప సంతాపే - అంతటఁ దపించునది. ఈ మూడు 3 ఎండ పేర్లు.

ఎండకాలంలో కొత్త కుండలో నీళ్ళు ఎంత రుచి! చల్లని నీరు నాలుకకు ఇంపు!

ఉష్ట్రము - 1.వేడి, 2.ఎండకాలము విణ.వేడిగలది 2.కోపోద్రేకము గలది.
వేఁడి -
1.తాపము, 2.చురుకు, 3.వాడిమి, 4.ప్రకాశము.
వేండ్రము - తాపము.
తాపము - 1.వేడిమి, 2.బాధ, సం.వి. (భౌతి.) వేడి (Hot).
వేఁడికంటి - ఉగ్రాక్షుడు, శివుడు.
వేఁడి వేలుపు - 1.వహ్ని, అగ్ని, 2.సూర్యుడు.

(ౘ)చురుకు - 1.వాడి, వాడిమి, 2.వేడిమి, 3.వేగము, 4.ఆయుధము నాటుట, 5.నిప్పు సోకుటయందగు అనుకరణము, రూ.చురుక్కు.

రౌద్రము - 1.భయంకరము, 2.తీక్ష్ణము, వి.1.ఎండ, 2.రౌద్రరసము, 3.దినము యొక్క మొదటిభాగము.
తీక్ష్ణము - వేడిమి, విణ.వాడియైనది, చురుకైనది.
గాఢత - (గృహ.) తీవ్రత, తీక్ష్ణత (Intensity).

రౌద్రం తూగ్రమ్ : రుద్రో దేవతాస్య రౌద్రం - రుద్రుఁడే అధిదేవతగాఁ గలిగింది.
ఉగ్రత్వా దుగ్రం - ఉగ్రమైనది.

చండిమ - వాడిమి, తీవ్రము.
చండించు -
క్రి. మిక్కిలి కోపించు.
చండుఁడు - 1.మిక్కిలి కోపము గలవాడు, 2.వాడిమిగలవాడు. 

చండము - 1.భయంకరము, 2.కోపము గలది, 3.తీవ్రమైనది, 4.ఘాటయినది, 5.వేడియైనది, వి.1.కోపము, 2.తీవ్రత, 3.వేడిమి.
తీవ్రము - 1.అధికము 2.వేడిమి గలది 3.కారముగలది (భౌతి.) గట్టిగా వినబడునది (ధ్వని.) (Loud).
తీవరము - తీవ్రము, త్వరితము, సం.తీవ్రమ్.
త్వరితము - శీఘ్రము, వడిగలది.
తీవరపాటు - తొందరపాటు. తొందరపాటు - త్వరపడుట.
తొందర - 1.మిక్కిలి త్వర, 2.బాధ.
తొందరచేయు - 1.బాధించు, 2.త్వరపడు. నెమ్మదిగా త్వరపడు.

తొందరపాటుతనం తక్కువ మందికే విజయాన్ని, ఎక్కువ మందికి దురదృష్టాన్ని చేకూరుస్తుంది. - ప్రూథాన్

భామ - స్త్రీ.
భామిని -
1.క్రీడాసమయమందు కోపము చూపెడు స్త్రీ, 2.స్త్రీ.

కోపనా సైవ భామినీ :
కోపశీలా కోపనా - కోపమే స్వభావముగాఁ గలిగినది.
భామ్యత్యవశ్యం కుప్యతి భామినీ. భామక్రోధే. - అవశ్యము కోపగించు కొనునది. ఈ రెండు కోపముగల స్త్రీ పేర్లు.

ఎండు - 1.నీరింకు, 2.తడియారు, 3.శుషించు, 4.తపించు.
ఎండుతెవులు - దేహమును శుష్కింప జేసెడి ఒక వ్యాధి.

క్తప్తము - తపింపచేయ బడినది, కాచబడినది.
వాడు - వాడుట, వాడిపోవుట, క్రి.ఉపయోగపరచు, మ్లానమవు.
కృశము - 1.బక్క 2.సన్నము 3.అల్పము.
కృశాంగి - స్త్రీ, విణ. బక్కపలుచని దేహము కలది.
కృశానువు - అగ్ని.

వహ్ని - అగ్ని.
వత్సలము -
వహ్ని, తృణాగ్ని.
వత్సలుఁడు - వాత్సల్యము(దయ) గలవాడు.

వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః ఇ-పు. వహ ప్రాపణే. - హవ్యమును దేవతలకుఁ జేర్చువాఁడు.

భాస్కరుఁడు - 1.సూర్యుడు 2.అగ్ని.
భాస్వంతుఁడు -
సూర్యుడు, విణ.ప్రకాశించువాడు.
భాసిల్లు - ప్రకాశించు. భాస్వరుడు - సూర్యుడు.

భా - 1.సూర్యకిరణము 2.సూర్యుని వెలుగు.
భానువు -
1.సూర్యకిరణము 2.సూర్యుడు.
భామము - 1.కోపము 2.రోషము 3.సూర్యకిరణము.
భాముఁడు - 1.సూర్యుడు 2.బావ.
సూర్యుఁడు - వెలుగు రేడు.
బావ - తోడ పుట్టిన దాని మగడు, సం.భావుకః. 

తపతీతి తపనః, తపసంతాపే - తపింపఁజేయువాడు, సూర్యుడు.

క్షీణించు - తరుగు, కృశించు.
క్షీణించుట -
(గృహ.)1.శుష్కించుట, 2.బలహీనమగుట, 3.సనంగిల్లుట.
క్షీణోపయుక్తి న్యాయము - (అర్థ.) ఒకే వస్తువును అనుభోగించునపుడు, రాను రాను ఆవ్యక్తికిని దానికిని గల ఉపయుక్తి తరుగుచుండు నను న్యాయము. 

సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడుకాక లేనిచో
మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుడఔ
నేని స్వభోజ్యముల్ గుడుచునేనియు బుష్టివహించులేనినా
డూని, విభూతిలో నడిగియుండడె తేజముదప్పి, భాస్కరా.
తా.
అగ్నిదేవు డయినను తాను తిండి మానినయెడల తన కాంతి గోల్పోయి బూడిదలో నణగియుండును, అట్లే, తనకు ఎక్కువ ప్రీతి అయిన ఆహారమును తిన్నచో మనుష్యుడు(ప్రాణులు) వృద్ధిపొందును, లేనిచో శరీరము కృశించును.

ఉష్ట్రము - ఒంటె వ్యు. ఎల్లప్పుడును ఎండచే తపింపబడునది.
ఒంటియ - ఉష్ట్రము, మహాంగము, లొట్టుపిట్ట రూ.ఒంటె.

అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః,
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. - భజగోవిందం

ఖరము - 1.గాడిద, 2.వాడిమి, 3.వేడిమి, విణ.1.వాడిమికలదు, 2.వేడిమి కలది.
గాడిద - ఖరము, గాలిగాడు, సం.గార్దభః.
గాలిగాఁడు - గాడిద; గార్దభము - గాడిద; బాలేయము - గాడిద, విణ.మెత్తనిది. 

హీను డెన్ని విద్య లభ్యసించినగాని
ఘనుడుగాడు హీన జనుడెగాని
పరిమళముల మోయ గాడిద గజమౌనె విశ్వ.
తా.
ఓ వేమా ! ఏ విధముగ గాడిద సుగంధ ద్రవ్యముల మోసి నంత మాత్రముచే (యే)నుఁగు(గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగములలో ఒకటి.) కాజాలదో, అట్లే యెన్ని శాస్త్రములు చదివిననూ దుర్మార్గుడు గొప్పవాడు కాలేడు.

ఘర్మము - 1.చెమట, 2.ఎండ, 3.వేడిమి, 4.వేసగి.
చెమట -
1.స్వేదము, రూ.చెమరు.
చెమరు - 1.చెమట, 2.చెమరుకాకి.
చెమటపట్టు - క్రి. చెమటపోయు.
చెమరించు - క్రి. చెమటపోయు.
చెమటగొట్టు - చెమట పట్టినవాడు.
చెమరుఁబోతు - మిక్కిలిచెమట గలవాడు.
చెమటకాయ - ఎండ వేడికి దేహమున లేచు చిన్న గుల్ల. 

స్వేదగ్రంధులు - (గృహ.) ఇవి శరీరమునుండి కేశినాళికలద్వారా మలిన పదార్థములను నీటితో సహా పీల్చుకొని చెమటరూపమున శరీరము మీదికి విడిచి పెట్టును (Sweat glands). 
స్వేదజము - చెమటవలన పుట్టినది (పేను మొదలగునవి).

స్వేదజాః కృమి దంశాద్యాః : స్వేదాత్ భౌమోష్మణో జాతా స్వేదజాః - ఉక్కవలనఁ బుట్టినవి. పురుగులు ఈఁగలు మొదలైనవాని పేరు. ఆది శబ్దము వలన ఉసుళ్ళు దోమలు మొదలైన వానికి పేరు.

ఈగ - మక్షికము; మక్షిక - ఈగ; ఈవ - ఈగ;ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత.
ఈపి - 1.తలయం దుండెడి అంటుపేను, పేనుగుడ్డు, 2.ఈగ పెట్టిన గ్రుడ్డు 3.ఈగ మలము.
ఈరు - అల్పము, వి.పేనుగ్రుడ్డు.
పేను - తలలో పెరుగు సూక్ష్మప్రాణి, యూకము.
యూకము - 1.చీరపోతు, 2.పేను.
చీరపేను - 1.చీరబోతు, 2.గుడ్డ నంటుకొని యుండు తెల్లపేను, 3.ధేనుకము(చీరపేను).
అంటు పేను - తల నంటుకొని యుండు చిన్నపేను.
అంట్లు - 1.వంటచేసిన పిదప తోమక యుండు పాత్రలు (ని. బహు.), 2.అంటు పేలు.  

చీఁదఱ - 1.ఉపద్రవము, 2.ఛిద్రము, 3.అసహ్యము. ఛిద్రపు రోజులలో చీడపేలేగాని సిరిసంపదలు కలుగవు. పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట.

క్షుద్ర - 1.ఈగ, 2.వేశ్య, 3.అంగహీనయగు స్త్రీ 4.నట్టువకత్తె, 5.గయ్యాళి.
ఈగ - మక్షికము. మక్షిక - ఈగ. ఈగకు శిరస్సునందు విషముండును.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
అంగహీనయగు స్త్రీ -
నట్టువకత్తె -
 
గయాళి - 1.దిక్కరించి మాటలాడునది, 2.వదరుబోతు, రూ.గయ్యాళి, వి.ధూర్త స్త్రీ. గట్టివాయి - గయాళి, ధూర్తురాలు. వదరు - ప్రేలు, సం.వక్తృ.

మక్షి కా మారుతో వేశ్యా యాచకో మూషక స్తధా|
గ్రామణీ ర్గణక శ్చైవ సప్తైతే పర బాధకాః||
తా.
ఈఁగలు, గాలి, భోగముది, బిచ్చగాడు, ఎలుక, గ్రామాధికారి, కరణము; వీర లేడుగు రెల్ల(ఎల్ల)ప్పుడు పరులను పీడించువారనుట. – నీతిశాస్త్రము

టైఫాయిడ్ - (Typhoid) అపాయకరమైన విషజ్వరము, (ఇది నీటి మూలమున, ఈగల మూలమున వ్యాపించును.) 

దోమ - చీకటీగ(చీకటి యీఁగ - చిన్నదోమ), మశకము.
మశకము -
దోమ; తీక్షతుండము - దోమ.
ఏనికదోమ - ఒక తెగ పెద్ద దోమ, ఘోణిక.
ఘోణి - ఏనుగు, దోమ, పంది.
దంశి - అడవిదోమ, చిన్న అడవియీగ.
దంశము - 1.అడవియీగ, 2.కాటు, 3.దంతము.
దంశనము - 1.కాటు, 2.కవచము, 3.పల్లు, రూ.దంసనము.
దంతము - పల్లు, కోర.  

మూఁగ - 1.మూగవాడు, విణ.మాటాడలేనిది (Dumb) 2.దోమ, సం.మూగః.
నోరుమెంగ - మూగ.

మలిమ్లుచము - 1.దోమ, 2.మల మాసము.
మలమాసము - అధిక మాసము.
అధిక మాసము - చాంద్రమానమున మూడేండ్ల కొకసారి వచ్చు పదమూడవ నెల. సూర్యసంక్రమణము లేని చాంద్రమాన మాసము.

హీన గుణమువాని నిలు సేర నిచ్చిన
ఎంత వానికైన నిడుము గలుగు
ఈగ లడుపుఁజొచ్చి యట్టట్టు సేయదా? విశ్వ.
తా.
ఓ వేమా! ఈగ (ఈగ, కీటకము - వ్యాధుల దెచ్చునది.) కడుపులో ప్రవేశించి యేవిధముగ బాధ కలిగించునో, ఆ విధముగనే చెడ్డవానిని ఇంటిలో చేర్చిన ఆపదలు కలుగ జేయును.

అనాఫిలిస్ - (Anophele) దోమలలో ఒక జాతి. (ఈ జాతి ఆడు దోమల ద్వారా అనాఫిలిస్ మలేరియా వ్యాపించును.)
మలేరియా - (గృహ.) (Malaria) చలిజ్వరము, (ఈ జ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)
గుణన పూర్వదశ - (జం.) మానవ రక్తకణములలో ప్రవేశించిన మలేరియా రోగజీవి అభివృద్ధి చెందుచు విభజనకు సిద్ధముగా నున్న దశ (Schizont).
ఖండగుణము - మానవ రక్త కణములలో జరుగు మలేరియా రోగజీవి యొక్క జీవిత దశలు (Schizogony).

ఉష్ణత - (భౌతి.) వేడిమి (Heat).
వేఁకి -
1.జ్వరము, 2.వేడిమి, 3.అగ్ని.
కాఁక - 1.జ్వరము 2.తాపము 3.కోపము విణ.వేడియైనది.
కాఁకవెలుగు - సూర్యుడు, ఉష్ణరశ్మి. ఉష్ణరశ్మి - సూర్యుడు.
ఉష్ణాః రశ్మియో యస్య ఉష్ట్రరశ్మిః ఇ.పు. - ఉష్ట్రములైన కిరణములు కలవాఁడు. 

టైఫాయడ్ - (Typhoid) అపాయకరమైన విషజ్వరము. (ఇది నీటి మూలమున ఈగల మూలమున వ్యాపించును.)

చింతాజ్వరో మనుష్యాణాం వస్త్రాణామాతపోజ్వరః|
అసౌభాగ్యంజ్వరః స్త్రీణా మశ్వానాం మెథునంజ్వరః||
తా.
ఎల్లపుడు ఏదైన చింతతో నుండుటయే మనుష్యులకు జ్వరము, వస్త్రములకు వేడిమియే జ్వరము, స్త్రీలకు సౌభాగ్యము(సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.)లేకపోవుటయే జ్వరము, గుఱ్ఱములకు మైధునం బొనర్చుటయే జ్వరము యెఱుంగ వలయును. - నీతిశాస్త్రము

త్వయి మయి చానత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః,
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్. - భజగోవిందం

ఇద్దము - 1.పరిశుద్ధము, 2.కాంతిమంతము, 3.కాల్పబడినది, 4.అడ్డులేనిది, వి.1.ఎండ, 2.ప్రకాశము, 3.ఆశ్చర్యము.

1. తొలురిక్క - అశ్విని, గుఱ్ఱము ముఖమును పోలి 3 నక్షత్రములు వుండును.

అశ్వయు గశ్వినీ : అశ్వం యునక్తి రూపేణ బధ్నాతీ త్యశ్వయుక్. యుజిర్ యోగే - రూపముచేత అశ్వసామ్యమును బొందునది. అశ్వరూప యోగా దశ్వినీ - అశ్వమువంటి రూపము గలది. అనునవి అశ్విని పేర్లు.

తదశ్వినావశ్వయుజోపయాతామ్ | సుభంగమిష్టౌ సుయమేభిరశ్వైః  |  స్వం నక్షత్రగ్ం హవిషా యజంతౌ | మధ్వాసంపృక్తౌ యజుషా సమక్తౌ | యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ | విశ్వస్య దూతా - వమృతస్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప యాతామ్ | నమోశ్విభ్యాం కృణుమోశ్వ - యుగ్భ్యామ్ ||28||  

అశ్విని - 27 నక్షత్రములలో మొదటిది (Aries), 2.అశ్వినీ దేవతల తల్లి, బడబ.

బడబ - 1.ఆడుగుఱ్ఱము, 2.బ్రహ్మణ స్త్రీ, 3.తార్పుకత్తె.
వామి -
ఆడు గుఱ్ఱము, వి.ప్రోగు, రాశి.
ప్రోఁగు - పోగు; పోఁగు - దారము, 2.చెవినగ.
రాశి - 1.రాసి 2.నికాయము, సమూహము. 2.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
నికురుంబము - సమూహము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, నూలు, 3.వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

నీరుచిచ్చు - బడబాగ్ని (నీటిలో మండు అగ్ని).
ఔర్వస్తు బాడబో బదబానలః :
ఉర్వస్య ఋషే రపత్యం ఔర్వః - ఉర్వుఁడను మునికి కొడుకు.
ఉర్వతీత్యౌర్వః, ఉర్వీ తుర్వీ ధుర్వీ దుర్వీ హింసాయాం - హింసించునది.
బడబాయాం భవః బాడబః, బడబానల శ్చ - బడబ యనఁగా ఆఁడు గుఱ్ఱము, దాని ముఖము నందుండునది బాడబము. బడబానలమును, ఈ మూడు బడబాగ్ని పేర్లు.

బాబా - గుఱ్ఱము, సం.బడబా, వాహః.
బాబారౌతు - కుబేరుడు.

బాడబము - 1.బడబా సమూహము, 2.బడబానలము.

బాడబాగ్నిరివాతృప్తో బాడబః - బడబాగ్ని వలెఁ దృప్తిలేనివాఁడు.
బడబా బ్రాహ్మణీ. తస్యా అపత్య మితివా బాడబః - బడబ యనఁగా బ్రాహ్మణస్త్రీ; దాని వలన బుట్టినవాఁడు, బ్రాహ్మణుడు. "కుంభదాస్యశ్వా స్త్రీవిశేషా ద్విజాంగనా" అని రభసుడు.

బ్రహ్మణ్యము - 1.బ్రాహ్మణులకు హితమైనది, 2.గంగరావి.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము. బ్రాహ్మణములు - వైదిక ధర్మగ్రంథములు, యజ్ఞతంత్రములను, పురాణగాథలను చెప్పు ధర్మ గ్రంథములు.

బ్రాహ్మణ్య బాడబ్యే తు ద్విజన్మనామ్ :
బ్రాహ్మణానాం సమూహో బ్రహ్మణ్యం; బాడబానాం సమూహో బాడబ్యం - బ్రహ్మణుల యొక్క సమూహము బ్రహ్మణ్యము, బాడబ్యమును. 

ఇంద్రుని గుఱ్ఱము ఉచ్చైశ్శ్రవము - భార్యబడబ, బడబ రూపంలో వున్న లక్ష్మీదేవి.

ఉచ్చైశ్శ్రవము - ఇంద్రుని గుఱ్ఱము, విణ. నిక్కిన చెవులు కలది.
నిక్కు వీనుల జక్కి - ఉచ్చైశ్శ్రవము. పాలసముద్రము నుండి అద్భుతమైనది, అశ్వములందు రత్నమైన ఉచ్చైశ్రవము ఉద్భవించింది.

హయ ఉచ్చైశ్శ్రవాః : ఉచ్చైఃశ్రవసీయస్య సః ఉచ్చైశ్రవః - ఉన్నతములైన చెవులు గలది. ఉచ్చైః శ్రవః కీర్తిర్యస్య - ఉన్నతమైన కీర్తి గలది.

అశ్వములలో ఉఛైశ్రవము (దేవతా లోకంలోని అశ్వము) నేనే! - భగవద్గీత

కర్కోటకుడు అను పాము తన తల్లి(కుద్రువ) శాపమునకు భయపడి, తెల్లనైన ఉచ్చైశ్శ్రవము తోకను, తన పడగతో కప్పి కాటుక కాంతి కలుగు నట్లుగా చేసెను. ఒక కృష్ణ సర్పం వెళ్ళి ఉచ్చైశ్శ్రవం తొకను అంటి పెట్టుకుని ఉంది. గుర్రం పారిపోతే తోక ఊడిపోతుందా?

కర్కోటకము - 1.మారేడు, 2.ఒక పాము.
మారేడు -
బిల్వము; బిల్వము - మారేడు; శ్రీఫలము - మారేడు.
బిలుపము - మారేడు పండు, సం.బిల్వః.
క్షేడము - కర్కోటము అను పాము
కాలసర్పము - కృష్ణసర్పము, నల్లత్రాచు.
కృష్ణసర్పము - నల్లత్రాచు.

ధేనుక - 1.లేగటి యావు, 2.ఆడేనుగు, 3.ఆడుగుఱ్ఱము, 4.చిన్నకత్తి, 5.పార్వతి(శివసన్నిధిని పార్వతి) రూ.ధేనువు.

ధేనుకా తు కరేణ్వాం చ :
ధేనుకా శబ్దము ఆఁడుఏనుగునకును, చకారము వలన క్రొత్తగా నీనిన యావునకును పేరు. దయంత్యేనా మితి ధేనుః, ధేనురేవ ధేనుకా. ధేట్ పానే. దీని క్షీరమును ద్రాగుదురు. "ధేనుకా త్వశ్వయోషితి, భవాన్యాం చ కృపాణ్యాం చ ప్రసూతాయాం పశౌ గవి" ఇతి శేషః.

ధేనువు - లేగటి యావు.
లేఁగడియావు -
లేతదూడగల యావు.
లేఁగ - (లేత+కానుపు) క్రొత్తగా బుట్టిన దూడ.
తర్ణకము - అప్పుడు పుట్టిన దూడ. పాలకొరకు లేగదూడ పరుగులెత్త సాగెను. 

ధేను స్స్యాన్న వసూతికా :
ధయ త్యేనాం వత్స ఇతి ధేనుః. ఉ.సీ. ధేట్ పానే. - దూడ దీని చన్నుఁ గుడుచును.
నవం సూతా నవసూతికా - క్రొత్తగా నీనినది. ఈ రెండు లేఁగటియావు పేర్లు. 

వలనుగ గానలందు ప్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలగను చూడనొక్కటి నిలంగను ధేనువు రెండుమూడునే
డులకటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం
దలుగడువృద్ధిజెందవె యధర్మము ధర్మముదెల్ప, భాస్కరా.

తా. ఆవు రెండు మూడేండ్లకొక దూడవంతున నీనినను అవి వృద్ధి జెంది మందలగు చున్నవి. పులి ప్రతి సంవత్సరము నాలుగైదు పిల్లలను ఈనినను నవి వృద్ధి పొందలేదు. అధర్మము నిలువకుండుటకు, ధర్మము నిలిచియుండుటకు ఇవియే తార్కాణము.

కరేణువు - ఆడేనుగు.
వశ - ఆడేనుగు.

గోడిగ - ఆడు గుఱ్ఱము, సం.ఘోటికా.
ఘోటకము -
గుఱ్ఱము, వి.గోడా.
గోడ - 1.భిత్తి, సం.కుడ్యమ్, 2.గుఱ్ఱము, రూ.గోడా, సం.ఘోటః. 
కుదరము - గుఱ్ఱము, వికృ.కుదిర.
కుదిర - గుఱ్ఱము, సం.కుడరః.

పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
గౌరి -
1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పంచమి - 1.పక్షమందు ఐదవ తిథి, 2.దౌపది.
పాంచాలి - 1.దౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.

చాకు - చిన్నకత్తి; బాగుదార - చిన్నకత్తి.

తార్పుకత్తె - తాపికత్తె; ఎడ కత్తియ - తార్పుకత్తియ, దూతి; దూతి - కుంటెనకత్తె, రూ.దూతిక. కుంటికత్తె - తార్చునట్టి స్త్రీ, రూ.కుంటినకత్తె, కుంటెనకత్తె; సంచారిక - కుంటెనకత్తె. విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 3.పసుపు.        

అశ్వర్థము -1.రావి చెట్టు, 2.అశ్వినీ నక్షత్రము, 3.ఆశ్వయుజ పూర్ణిమ.
రావి -
1.అశ్వర్థము, 2.రావిచెట్టు. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం.
అశ్వయుక్క - 1.అశ్వినీ నక్షత్రము, 2.ఆశ్వయుజ మాసము, విణ.1.గుఱ్ఱములను పూనుచువాడు, 2.గుఱ్ఱములను కట్టునది(రథము, బ్రహ్మ సూర్యుడికి ఇచ్చిన రథము), 3.అశ్వినీ నక్షత్రమున పుట్టినవాడు.
తొలురిక్క నెల - ఆశ్వయుజము.
కోజాగరము - ఆశ్వయుజ పూర్ణిమ. 

అశ్వని సుతులు - దేవతల వైద్యులు. అశ్వినీ దేవతలు - దేవ వైద్యులు; దస్రులు - అశ్వినీ దేవతలు; నా సత్యులు - అశ్వినీ దేవతలు; అశ్వులు - దేవవైద్యులు, సూర్యుని కొడుకులు; జీవదుడు - వైద్యుడు.

స్వర్వైద్యావశ్వినీ సుతా, నాసత్యా వశ్వినౌ దస్రా వాశ్వినేయౌ చ తా వుభౌ :
స్వః స్వర్గే వైద్యౌ స్వర్వైద్యౌ - స్వర్గమునందుండు వైద్యులు.
అశ్వరూప ధారిణ్యా స్సూరపత్న్యా స్సంజ్ఞాయా స్సుతౌ అశ్వినీ సుతౌ - అశ్వరూపమును ధరించిన సంజ్ఞయనుపేరు గల సూర్యుని భార్యకు సుతులు. సూర్యునిభార్య యగు సంజ్ఞాదేవి యశ్వరూపధారిణియై వీరలం గనె నని కథ గలదు.
న విద్యతే అసత్యం యయో స్తౌ నాసత్యౌ - అసత్యము లేనివారు.
అశ్విన్యాం జాతౌ అశ్వినౌ - అశ్వరూపము గల సంజ్ఞా దేవియందుఁ బుట్టినవారు.  
అశ్వినీ నక్షత్రే జాతావశ్వినౌ - అశ్వినీ నక్షత్రమందుఁ బుట్టినవారు.
ప్రశస్తాః అశ్వాః అనయౌః సంతీతి అశ్వినౌ సదా అశ్వారూఢత్వాత్ - గుఱ్ఱములు గలవారు.
దస్యతః క్షిపతో రోగానితి దస్రౌ. దసు ఉపక్షయే - రోగములను క్షయింపఁ జేయువారు.  
అశ్విన్యా అపత్యే అశ్వినేయౌ - అశ్వినీదేవీ కొడుకులు, అశ్వినీదేవతలు; వీరిద్దరు అమడలు.  

అశ్వర్థ వట నింబామ్ర కపిత్థ బదరీగతే|
వనసార్క కరీరాది క్షీరవృక్ష స్వరూపిణీ||

ధరలోఁ ద్వష్ట్రాహ్వయమును,
నిరవుగ ధరియించి ధాత్రి కింపు దలిర్పం
బరియించుచు నభమందున్,
సరసిజహితుఁ దాశ్వయుజము సయ్యనఁ గడపున్.
భా|| ఆశ్వయుజ మాసంలో సూర్యుడు త్వష్ట(త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.)అన్నపేరుతో భూమికి ప్రమోదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తుంటాడు.

అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య, 7number.
గుఱ్ఱము -
అశ్వము.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము.
సప్తి - గుఱ్ఱము.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.  

సప్త అశ్వాః యస్య సః సప్తాశ్వః - ఏడు గుఱ్ఱములు గలవాఁడు.
సప్తనామకః అశ్వో యస్యేతి వా సప్తాశ్వః - సప్తయనెడు ఒక గుఱ్ఱము గలవాఁడు. - సూర్యుడు.

సప్త - 1.మనుమరాలు, 2.మనుమడు, 3.మున్మనుమడు, రూ.సప్తి.
పౌత్రి - మనుమరాలు, (కొడుకు లేక కూతురు కూతురు).
పౌత్రుఁడు - కొడుకు కొడుకు.
దౌహిత్రి - దుహితకొమార్తె, మనుమరాలు.
దౌహిత్రుడు - దుహితకొడుకు, మనుమడు.
ఇనుమనుమఁడు - మునిమనుమడు, ప్రపౌత్రుడు.

ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
సంవత్సరము -
ఏడు; ఏడు - ఆరునొకటి.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సత్తా - సత, ఏడు, సం.సత్త,  వై.వి. శక్తి, సం.సత్వమ్.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సతనాల్కల జేజే - అగ్ని, సప్తజిహ్వుడు, ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు - అగ్ని.

రేవంతుఁడు - అశ్వశిక్షకుడు.
రౌతు -
రావుతు, రాహుత్తు రావుతు, సం.రాహుత్తః.
రాహుతు - గుఱ్ఱపు రౌతు, సం.రాహుత్తః.

గోడ - 1.భిత్తి, సం.కుడ్యమ్, 2.గుఱ్ఱము, రూ.గోదా, సం.ఘోటః.
భిత్తి -
1.గోడ, 2.భేదనము, 3.జుత్తలి.
కుడ్యము - 1.గోడ, 2.పూత. భిత్తిక - 1.పిడుగు, 2.గోడ.
గోదా - కుస్తీచేయు ప్రదేశము.
గోడిగ - ఆడు గుఱ్ఱము, సం.ఘోటికా.

హేష - గుఱ్ఱపు సకిలింత, హేష.
హ్రేషితము - హ్రేష.

కదను - ఒకరకపు అశ్వగతి.
రేచితము - వంకరలేక వేగముతో బోయెడి యశ్వగతి.

మందడి - గుఱ్ఱపుసాల, సం.మందురా.
మందురా - చంద్రుడు Moon.

నాగము - 1.సత్తు, 2.తగరము, 3.పాము, 4.ఏనుగు, 5.కొండ, 6.మేఘము, 7.తమలపాకుతీగ. Air in organs 
సత్తు -
సత్త్వము, సత్యము, సారము, వి.సీసము Lead, సం.విణ. (సత్) ఉన్నది 1.చదువరి (ౘదువరి - విద్వాంసుడు), 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
సత్త్వము -1.సత్త, బలము 2.స్వభావము 3.ఒక గుణము 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒకవస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
బలము - సత్తువ, సైన్యము.  
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ. 
జంతుశాస్త్రము - (జం.) జీవశాస్త్రపు శాఖలలో నొక శాఖ, జంతువుల జీవితములను గురించి తెలియచేయుశాస్త్రము, (Zoology).  

సత్తి - 1.శక్తి, 2.ఒక ఆయుధము, 3.కాళి, 4.బలము, 5.వశిష్టుని కుమారుడు, సం.శక్తిః.
శక్తి -
(గణి,. భౌతి) అచల స్థితిని గాని, ఒకేదిక్కుగా చలించెడి స్థితినిగాని కలుగజేయు బలము, (శక్తి వివిధ రూపములలో నుండును, ఉదా. యాంత్రిక, తేజః, విద్యుత, ఉష్ణ, అయస్కాంత, రసాయనిక, శబ్దశక్తులు మొదలైనవి, (Energy) సం.వి. 1.బలిమి 2.చిల్లకోల 3.పార్వతి ఇచ్ఛాది శక్తులు మూడు (జ్ఞాన, క్రియ, ఇచ్ఛ). ఉత్సాహాది శక్తిత్రయము (ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి) (సర్వదేహుల యందు దేవీస్థానం శక్తి).

సత్తితాలుపు - కుమారస్వామి, శక్తిధరుడు.
శక్తిధరుఁడు -
కుమారస్వామి.

కాళి - 1.గౌరి, పార్వతి(గణనాయిక - గౌరి, పార్వతి.), 2.ఆది శక్తులలో ఒకతె, 3.బొగ్గు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
బలము - సత్తువ (సత్తువ - దేహబలమ్, సం.సత్యమ్.) సైన్యము.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
కృత్యము -
యుగములు నాల్గింటిలో మొదటిది, విణ.చేయబడినది.  

ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి - క్రియాశక్తి స్వరూపిణీ|
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ. – 130శ్లో

తగరము - తవురము, ఒక తెల్లని లోహము, రూ.తవరము, సం.తమరమ్, వై.వి. (రసా.) వంగము, సులభముగా కరగు వెండివలె తెల్లనగు ధాతువు (Tin). (ఇది ఆవర్తక్రమ పట్టికలో నాల్గవ వర్గమున కననగును.) సం.వి. పొట్టేలు.

వినమ్రము - మిక్కిలి వంగినది, సం.వి.తగరము (వినమితము).
తమరము -
 1.తగరము, 2.సీసము. మహాబలము- సీసము.

వంగము - 1.తగరము, సత్తు, 2.వంగ, 3.వంగదేశము.
వంగ -
వంగచెట్టు, సం.వంగమ్.
వంకాయ - (వంగ+కాయ) వంగకాయ, వార్తాకము.
వార్తాకము - వంగ.
వంగలేపనము - (రసా.) ఇనుమునకు, ఇత్తడికి రాగికి తగరపు కళాయి పూయుట, (Tinning). కలాయి - పాత్రలకు తగరము పూయుట, రూ.కళాయి.

అదృశ్య విషజీవులు - (వ్యవ.) సూక్ష్మదర్శని సాయమునకూడ నిరూపించరాని కొన్ని అతిసూక్ష్మజీవులు. ఉదా. వంగ, సీమవంగ మొ. మొక్కలకు తెగులు కలిగించునట్టి జీవులు. అట్టి తెగుళ్ళను అదృశ్య విషరోగములు, (Virus disease) అందురు. 

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము -
పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
చక్రధరము - పాము.
చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్రవము. 
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః. 

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

కష్టము - 1.దుఃఖము(బాధ, చింత) 2.దోషము(తప్పు, పాపము) 3.పాపము(దుష్కృతము, కలుషము).
రుద్దు - పులుము, తోము.
పాములబిడారము - (వ్యావ.) పుట్ట. పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి.....

క్రిమిశైలము - పుట్ట, వల్మీకము.
క్రిములు -
(జం.) ఎముకలు, కాళ్ళు లేని బహుకణజీవులు (Worms). పుట్ట - 1.వల్మీకము, 2.చిన్నపొద, 3.స్థానము, ఉదా. "రోగముల పుట్ట ".
పుట్టచూలు - వాల్మీకి మహర్షి.

ఖేలకము - 1.శిశువు, 2.వల్మీకము, 3.కుళ్ళాయి.
శిశువు -
బిడ్డ.
బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు. కూఁతురు - కుమార్తె.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు, రూ.ప్రసూనుడు.
వల్మీకము - పుట్ట.
ఖోలకము - 1.కుల్లాయి, 2.పుట్ట, 3.పోకచిప్ప, 4.ఒకరకపు వంటపాత్ర, 5.స్వర్గము.

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవై నయట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశులపాల జేరు భువిలో సుమతీ.
తా.
చీమలు కష్టపడి వాల్మీకములు నిర్మించిన, అవి పాములకు తావైనట్లు, పామరులు కూడబెట్టిన బంగారం రాజుల పాలగును. 

భోగి - 1.పాము, 2.రాజు, 3.భోగిపండుగ, 4.మంగలి.
భోగిని -
1.ఆడుపాము, 2.వేశ్య, 3.పట్టాభిషిక్తురాలుకాని రాజు భార్య.
భోగ్యము - 1.ధనము, 2.ధాన్యము, విణ.భోగింపదగినది.
భోగించు - 1.సుఖించు, 2.అనుభవించు.

భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది:- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము). 

దాసీ భృత్య స్సుతో బంధుర్వస్తు వాహన మేవచ|
ధన ధాన్య సమృద్ధిశ్చా వ్యష్ట భోగాః ప్రకీ ర్తీతాః||
తా.
దాసీజనులు, భటులు, కొమారులు, చుట్టములు(ౘ)చుట్టము -  1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు), పదార్థములు, వాహనములు, ధనము, ధాన్యము ఇవి అష్టభోగములు. - నీతిశాస్త్రము

నాగువు - నాగము, త్రాచు, రూ.నాగుబాము, నాగులు, సం.నాగః.
నాగ -
1.పూజ్యము, (ఉదా. నాగ బెత్తము.) 2.పెద్ద (నాగగన్నేరు) సం.నాగః.
త్రాచు - నాగుబాము; మంచిపాము - నాగుపాము.
నాగిని - నాకిని; నాకిని - దేవత స్త్రీ.
నాగుఁడు - శేషుడు, సం.నాగః.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
శేషశయనుఁడు - విష్ణువు.

గజే పి నాగ మాతఙ్గా :
నాగ శబ్దము ఎనుగుఁనకున, అపిశబ్దము వలన పామునకును, సీసమునకును పేరు. మాతంగశబ్దము ఏనుఁగునకును, అపిశబ్దము వలన చండాలునకును పేరు. నగే భవో నాగః - పర్వమందుఁ బుట్టినది. మాతంగాదృషేర్జాతో మాతంగః - మతంగుఁడను ఋషివలనఁ బుట్టెను మాతంగము, మాతంగుఁడును.

గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగములలో ఒకటి.
గజయాన -
ఏనుగు నడకవంటి నడక గల స్త్రీ, స్త్రీ.

మాతంగము - ఏనుగు.
మతంగజము -
ఏనుగు.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏన్గు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
ఏనుఁగుకాలు - కాలు లావగు వ్యాధి, బోదకాలు (Elephantiasis).
పుట్టకాలు – బోదకాలు; బూరకాలు - బోదకాలు.
బోదకాలు - వ్యాధిచే వచ్చు ఏనుగు కాలు వంటి కాలు.
ఏనుఁగు గజ్జి - మూగగజ్జి (Eczema).
ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగా గలది.
ఏనుఁగు గొంగ - సింహము, వ్యు.ఏన్గులకు శత్రువు.

అగము - 1.చెట్టు, 2.కొండ, 3.పాము, 4.సప్త సంఖ్య.

చెట్టు - 1.గుల్మము 2.వృక్షము.
గుల్మము -
గుల్మరోగము, (ప్లీహము, పెద్దదగు రోగము), 2.ప్లీహము, Spleen ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలెని చెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6. 9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన 7.పల్లెయందలి ఠాణా.
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము + సేన-అందుండు వాడు.)
వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృఢమైన శాఖలుగల మొక్క(Tree).

అగచరము - కోతి, వ్యు.చెట్టు లేక కొండలపై తిరుగునది.

అద్రి - 1.కొండ, 2.చెట్టు, 3.సూర్యుడు.
నగము - 1.కొండ 2.చెట్టు రూ.అగము.
నగవైరి -
ఇంద్రుడు వ్యు.కొండలకు శత్రువు.

ఆఖండలుఁడు - ఇంద్రుడు, వేలుపురేడు, పర్వతములను భేదించువాడు.

కొండ - మల, పర్వతము.
మల -
పర్వతము, మలై.
కొండచూలి - పార్వతి. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కొండయల్లుఁడు - శివుడు. కొండమల్లయ్య - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.
కొండ పగతుఁడు - ఇంద్రుడు, కొండలకు శత్రువు.

అహార్యము - కొండ, విణ.హరింప శక్యముకానిది.

మేఘము - మబ్బు.
మబ్బు -
1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము(తెలివిలేనితనము).
చీఁకటి - అంధకారము.
చీఁకటిగాము - రాహువు.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.

నాగవల్లి - పెండ్లిలో తుది దినమున జరుపు శుభకార్యము, సం.వి. తములపాకు తీగ, సం.నాకబలిః.
నాకబలి -
నాగవలి.
తాంబూలవల్లి - తములపాకు తీగ, రూ.తాంబూలి.
తములపాకు - నాగవల్లి దళము, రూ.తములపుటాకు.
తమలపాకు - (వ్యవ.) ఈ ఆకులు తాంబూలమునకును, వైద్యమునకును ఉపయోగించును. (ఈ తీగ మిరియపు కుటుంబము (Piperaceae) నకు చెందిన Piper betle అను మొక్క.) రూ.తమలపాకు.  
కమ్మెరాకు - కారపు నల్ల తమలపాకు. తమలపాకు తీగ ఆధారం లేకుండా పెరగదు బ్రతకదు.

తాంబూవల్లీ తామ్బూలీ నాగవల్ల్యపి :
తాంబూలార్థం వల్లీ తాంబూలవల్లీ - తాంబూలము కొఱకైన తీఁగె.
తామ్యతి వివశోభవ త్యనయా జన ఇతి తాంబూలీ. సీ. తము గ్లానౌ. - దీనిచేత నరుఁడు వివశుఁ డగుచున్నాఁడు.
నాగస్త్యైరావణస్యాలానే జాతత్వాన్నాగవల్లీ. సీ. - ఐరావతము యొక్క కట్టుకంబమందుఁ బుట్టినది.
"నాగలోకాదానీతా వా వల్లీ నాగవల్లీ - నాగలోకము నుండి తేఁబడిన తీఁగె. ఈ మూడు 3 తమలపాకుతీఁగె పేర్లు.

ఆకుతోట - తమలపాకుల తోట.
ఆకుమడుపు -
తమలపుచుట్ట.
మావటము - తమలపాకుల కట్ట.
కన్నాకు - మేలుతరము, శ్రేష్ఠము, వి.1.ముఖ్యుడు, 2.తమలపాకు కట్టయందు పైననుండు పెద్ద ఆకు. 

ఆకులోకెల్ల మేలైన ఆకు - తమలపాకు.
ఇంతింతాకు - పచ్చని ఆకు - రాజులు మెచ్చిన రత్నాలాకు - తమలపాకు.

ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము. 

ఆకుతెగుళ్ళు - (వ్యవ.) మొక్కల ఆకులకు శిలీంద్రముల వలన సంభవించు తెగుళ్ళు (Leaf diseases). (ఇవి సామాన్యముగా 1.మచ్చతెగుళ్ళు (Leaf Spots), 2.చారతెగుళ్ళు (Rusts), 3.బూడిద తెగుళ్ళు (Mibdews) అని మూడు రకములుగా ఉండును).
మచ్చతెగులు - (వ్యవ.) ఆకులపై ఎరుపు, గోధుమ, నల్లని రంగు గల మచ్చలేర్పడు రోగము.

తములము-తాంబూలము, వక్కాకు, రూ.తమ్మలము, సం.తాంబూలమ్.
తాకబూలము - వక్కాకు, తములము.
కిళ్లి - పరిమళ ద్రవ్యములతో గూడిన తాంబూలము.
విడియము - తాంబూలము, రూ.విడియ, వీడెము, విడ్యము, వీడ్యము, సం.వీటికా.

అన్నదమ్ములం ముగ్గురం మేము - అయితే బుద్ధులు వేరు - నీళ్ళలో మునిగేవాడొకడు - తేలేవాడొకడు - కరిగేవాడొకడు, మేమెవవరం? – వక్క-ఆకు-సున్నం

సుదియ - తమలపాకుల బరువులో సగము, విన.తులువ.
తులువ -
తుంటరి; తుంటరి - దుష్టుడు; దుర్జనుఁడు - దుష్టుడు.
తులువకత్తి - వంపు చురకత్తి.    

తమ్మ - నమలిన తాంబూలము, సం.తాంబూలమ్.
తమ్మతనుకు - తమ్మపడిగ, తాంబూలముమియు పాత్రము.

నాగవసాని - నాగవల్లి నడుపు ముత్తైదువ, రూ.నాపసాని.
నాపసాని -
నాగపసాని, నాగవల్లి నడుపు పెద్ద మూత్తైదువ.
ముత్తయిదువ - సుమంగళి.
సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.పరలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ.

నాగవల్లి నిష్ఠురము - (జాతీ.) పెండ్లియైదవ నాటిదెప్పులు, పనియైన పిదప పోరాటము.

హడవము - అడపము, వక్కలాకులుంచుకొను బరణి. 
అడపము -
1.వక్కాకులు పెట్టుకొను సంచి, 2.మంగలి పొది.
కరతిత్తి - వట్రవు సంచి, తమలపాకులు మొ.వి ఉంచుకొను చేతిసంచి, సం.కరదృతిః.
వట్రము - కురుచ, హ్రస్వము, వి.వక్కాకు తిత్తి.
అడపకాఁడు - 1.మంగలి, 2.అడపము పట్టుకొనువాడు.
అడప - తాంబూలపు బరణి పట్టుకొను సేవకురాలు.
అడపకత్తె - వక్కలాకుల బరణిని మోయు స్త్రీ.  

వలవదు క్రూరసంగతి యవశ్యమొకప్పుడు సేయబడ్డచో
గొలదియెకాక యొక్కవలుగూడవు తమ్ములపాకులోపలన్
గలసిన సున్న మించుకయెగాక మఱించుక యెక్కువైనచో
నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాబుకపొక్కకయున్నె, బాస్కరా.

తా. తాంబూలములో కలియు సున్నము స్వల్పమయినచో బాధలేదు, ఎక్కువైనచో నాలుక మండును, అట్లే, దుర్మార్గులతో స్నేహము జేయరాదు, చేసిననూ అంత అధికముగా నుండరాదు.

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా|
మృగక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. - 114శ్లో

ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.

2. భరణి - రెండవ నక్షత్రము,  బరిణి, బరిణె. త్రిభుజమును పోలి మూడు నక్షత్రములు 3 దగ్గరగా నుండును.

త్రిభుజము - (గణి.) ఒక సమతలములో ఒకే సరళ రేఖలో లేని మూడు బిందువులను కలువగా నేర్పడిన క్షేత్రము. ఇది మూడు భుజములు మూడు కోణములు కలిగియుండును, (Triangle).
ముక్కోణము - మూడు కోణములు(త్రిభుజము).
బరణి - కరాటము, భరణి. దబ్బీ - బరణి. సంపుటము - 1.బరిణి 2.ముకుళనము. సముద్గకము - బరణి.

బరణిపురుగు కుటుంబము - (వ్యవ., కీట.) అక్షింతలపురుగు (Epitachna Punctata) తాటాకుతెగులు పురుగు (Rice hipsa-Hipsa armigera) గండకబరిణె పురుగు (Oryctes rhinoceros), ధాన్యపునుసి పురుగు (Sitophlus oryzae) మొదలగునవి (Coleoptera) కుటుంబమునకు చెందిన కీటకములు.
ధాన్యపు నుసిపురుగు - (వ్యవ.) నిలువ చేసిన వడ్లను దొలిచి పాడుచేయు పురుగు (Sitophilus oryzae Rice wevil). (ఇది బరిణె పురుగు కుటుంబములోనిది).

పరభక్షకములు - (వ్యవ.) ఇతర జారుల కీటకముల దిని జీవించు పురుగులు (predators), ఉదా. మిడత కుటుంబములోని గొల్లభామలు, చుక్కల బరిణె పురుగు (Lady bird bettle) మొదలగునవి.  
దొ(తొ)లుపు పురుగులు - (వ్యవ.) దుంపలు, వేళ్ళు, కాండము, తొలుచుకొనితిను పురుగులు: (Borers) ఉదా. గండక బరిణె పురుగు, మొ. బరిణె పురుగు కుటుంబము లోనివి.     

భరణి కార్తె భరించలేం (ఎండలు మెండుగా ఉంటాయి). భరణి ఎండకు బండలు పగులుతాయి. కృత్తిక ఎండకు కుత్తుకలు ఎండి పోతాయి.

మందన - మంజూష పెట్టె,  సం.మంజూషా.
మంజూష -
పెట్టియ, పెట్టె. బదరికము - పెట్టె.
మంజుశ్రీ - బుద్ధుడు.

భోషాణము - పెద్దపెట్టె.

అప పాప్మానం భరణీర్భరంతు | తద్యమో రాజా భగవాన్, విచస్టామ్ | లోకస్య రాజా మహతో మహాన్, హి | సుగం నః పంథామభయం కృణోతు| యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా | యస్మిన్నేన - మభ్యషించంత దేవాః | తదస్య చిత్రగ్ం హవిషా యజామ | అప పాప్మానం భరణీర్భవంతు ||29|| 

యామ్య - 1.దక్షిణపు దిక్కు, 2.భరణీ నక్షత్రము.
దక్కినము -
దక్షిణము, వలదెస, స.దక్షిణా.
దక్కినపురాయుఁడు - వై. యముడు, దక్షిణ దిగధిపతి.

యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ. జముడు.
కాలుఁడు -
యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమనుడు - యముడు.

యముడు - సూర్యుడికి సంజ్ఞదేవి అనే మారు పేరుగల పద్మినికి కలిగినవాడు. ౙమున(యమి, యమునానది) తోబుట్టువు యముడు. యముడు ధర్మబుద్ధి గలవాడవటంతో ధర్మరాజై లోకపాలురలో చేరాడు.

యమునానద్యాః భ్రాతా యమునాభ్రాతా - యమునానదికి తోడఁబుట్టిన వాఁడు. యమునయా సహ యమళత్వేన జాతత్వాద్యమః - యమున తోఁగూడ కవగాఁ బుట్టినవాఁడు.

వివస్వత స్సూర్యస్య అపత్యం వైవస్వతః - సూర్యుని కొడుకు. దేవ సురౌ వివస్వంత్తౌ - వివస్వచ్చబ్దము దేవతలకు ను, సూర్యునకు పేరు. వివస్తేజః; తదస్యాస్తీతి వివస్వాన్ - తేజస్సు గల వాడు.       

సావిత్రి తన భర్త సత్యవంతుని ప్రాణాలు అపహరించిన యముని దర్శించగలిగింది. యముణ్ని ప్రసన్నం చేసుకొని వరాలు సాధించగలిగింది.

ధర్మరాజు - 1.యుధిష్ఠిరుడు, 2.యముడు, 3.బుద్ధదేవుడు.
కర్ణానుజుఁడు -
యు ధి ష్ఠి రు డు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.
యుధిష్ఠిరుఁడు - ధర్మరాజు, అజాత శత్రువు.
అజాతశత్రువు - ధర్మరాజు, విణ.శత్రువులు లేనివాడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని Saturn, వికృ.జముడు.
జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు. 

ధర్మరాజౌ జినయమౌ -
ధర్మరాజ శబ్దము బుద్ధదేవతకును, యమునికి, యుద్ధిష్ఠిరునకును పేరు. ధర్మస్య రాజా ధర్మరాజః - ధర్మమునకు రాజు.

నేకవింశతి తమంబైన బుద్ధనామధేయంబునం గలియుగాద్యవనరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి తేజరిల్లు - ఇరవై ఒకటోసారి కలియుగము మొదలైన వాని అవసరాన్ని తీర్చటానికి "బుద్ధు"డై మధ్య గయా ప్రదేశంలో కలియుగ సమయంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి పరిజితులను చేసి జినుని(జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.)కుమారుడై ప్రవర్తిలాడు.

అనంతవిజయము - ధర్మరాజు శంఖము, విణ.అంతములేని జయము కలది.

సత్యం మాతాపితా జ్ఞానం ధర్మోభ్రాతా దయాసఖా|
శాంతిఃపత్నీ క్షమాపుత్ర స్షడైతే మమభాదవాః||
తా.
సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము తోఁడబుట్టినవాఁడు, దయ(దయ - కనికరము)స్నేహితుఁడు, శాంతి భార్య, క్షమ కుమారుఁడు, ఈ యాఱును నాకు బాంధవులని ధర్మరాజు చెప్పెను. - నీతిశాస్త్రము

అద్వయుఁడు - సాటిలేనివాడు, అద్వితీయుడు, వి.బుద్ధుడు.
గౌతముడు -
1.గౌతమముని, గౌతమముని సంపూజిత రామ్|, 2.బుద్ధుడు.
గౌతమబుద్ధుడు - (చరి.) సిద్ధార్థుడు, (క్రీ. పూ. 566-486). బౌద్ధధర్మ స్థాపకుడు, తథాగతుడు, శాక్యముని.
సిద్ధర్థుఁడు - శాక్య బుద్ధుడు. శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
శాక్యసింహుఁడు - శాక్యముని, బుద్ధుడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.నేర్పరి. ౘదువరి - విద్వాంసుడు.
సర్వజ్ఞుఁడు - 1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు. 
శంభువు-1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.  
శాంభవి - పార్వతి.

శంభుః ఉ-పు శం సుఖం భవ త్యస్మాత్ శంభుః - శ మ్మనఁగా సుఖము, అది యీయనవలనఁ గలుగుఁగాన శంభువు.
భూసత్తాయాం. శంప్రాప్తనానితి వా, పరమానందరూపో నిత్యం విద్యత ఇత్యర్థః - సుఖరూపియై యుండువాడు. భూప్రాప్తా వాత్మనేపదీ.

త్వయా హృత్వా వామం - వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో - రపరమపి శంకే హృతమభూత్|  
య దేత త్త్వద్రూపం - సకల మరుణాభం త్రినయనం   
కుచాభ్యా మానమ్రం - కుటిలశశి చూడాలమకుటమ్| - 23శ్లో
తా. హే భగవతీ(శాంభవీ)! నీవు శివుని శరీరమునందు వామభాగమును అపహరించినదానవు (యెడమ భాగముతో గ్రహించి)తృప్తినొందని మనస్సుతో అర్థనారీశ్వరుడి మిగిలిన కుడిభాగమును కూడ గ్రహించి యున్నావేమోనని శంకించుచున్నాను(శివతత్త్వాన్ని తనలో లయం చేసుకున్నదని భావము). ఏలనగా - నా హృదయములో ప్రకాశించు చున్న నీ రూపము వామ దక్షిణ భాగములతో కూడిన దంతయు, బాల భానుని లేత కెంజాయ కెంపు(ఇంచుక ఎరుపు)ఛాయలతో నొప్పుచు, త్రినేత్రములు కలదగా, స్తనమండల(కుచముల)భారమువలన యించుక ముందుకు వంగినట్లు కనబడుచూ, వంకల జాబిల్లిని చంద్రకళ(చంద్రవంక) శిరోమణిగా ఉన్నకిరీటంతో విరాజమానమై యున్నది. - సౌందర్యలహరి  

అర్కజుఁడు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు (కావున నీ వ్యవహారము). 

మహాముని - 1.గొప్పముని, 2.బుద్ధుడు.
సర్వజ్ఞుఁడు -
1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు.
భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విన.సన్మానితుడు. 
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.

భక్తుల ఇష్టాన్ని బట్టి ఒకే భగవంతుడు వేరువేరు రూపాలలో సాక్షాత్కరి స్తుంటాడు. ప్రతి భక్తుడు భగవంతుణ్ణి గురించి ప్రత్యేకమయిన భావాల్ను కలిగి ఉండవచ్చు. వాటికి తగినట్లుగానే పూజిస్తూ ఉండవచ్చు. ఆయన కొందరికి యజమానిగాను, కొందరికి తండ్రిగాను, కొందరికి తల్లిగాను, కొందరికి విధేయుడైన కొడుకుగాను భావించుకొనే అవకాశాన్ని కలుగ జేస్తాడు. - రామకృష్ణ పరమహంస     

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు. 

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి (వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

యమానిలేన్ద్ర చద్దృరార్క విష్ణు సింహాంశు వాజిషు.
శుకాహి కపి ఖేకేషు హరి ర్నా కపిలే త్రిషు, :
హరి శబ్దము యమునికిని, వాయువునకును, ఇంద్రునికిని, చంద్రునికిని, సూర్యునికిని, విష్ణువునకును, సింహునకును, కిరణమునకును, గుఱ్ఱమునకును, చిలుకకును, పామునకును, కోతికిని, కప్పకును పేరైనపుడు పు. కపిలవర్ణము గలదానికి పేరైనపుడు త్రి, కపిలవర్ణ మనఁగా బంగారు చాయ. హరతీతి హరిః హృఞ్ హరణే. - హరించును గనుక హరి.  

త్రిధాముడు - 1.అగ్ని, 2.విష్ణువు, 3.శివుడు, 4.యముడు. 
కృతాంతుఁడు -
యముడు. దుంతరౌతు - యముడు(దుంత - దున్న).

దక్కినము - దక్షిణము, వలదెస, సం.దక్షిణా.
దక్షిణ -
1.కుడిదిక్కు, 2.యజ్ఞము మున్నగు వానిలో ఋత్వికులు మొదలగు వారి కిచ్చు ధనము, రూ.దక్షిణము.

అవాచి - దక్షిణదిక్కు.
వలకడ -
(వలను + కడ) దక్షిణదిక్కు.
వలను - 1.పక్క, 2.ఉపాయము, నేర్పు, 3.శకునము, 4.ప్రదక్షిణము, 5.శుచిత్వము, 6.ఒప్పిదము, 7.అనుకూల్యము, విణ.1.కుడి, 2.యుక్తము.
వలనొప్పు - క్రి. అనుకూలించు.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము, వలపల.
అపసవ్యము - 1.ప్రతికూలము, 2.కుడిభాగము.

దిక్కు - 1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు. 
కడ -
1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.

అపసవ్యం తు దక్షిణే :
సవ్యా దపక్రాంత మపసవ్యం - ఎడమ దిక్కువలనఁ బాసినది.
దక్షతే బలవత్తయా వర్ధత ఇతి దక్షిణం. దక్ష వృద్ధౌ శీఘ్రార్థే చ. - బలము గలిగిన దగుట చేత వృద్ధిఁ బొందునది. ఈ రెండు కుడిదిక్కు పేర్లు.

దక్షిణుడు - 1.అనేక నాయికలందు సమముగా వర్తించువాడు, విణ.1.చక్కని మనస్సు కలవాడు, దాక్షిణ్యము కలవాడు, 2.నేర్పరి. దాక్షీణ్యము - 1.దయ(దయతో కూడిన మనస్సు) 2.నేర్పు, 3.సామర్థ్యము, 4.దక్షిణ నాయక భావము. సామర్థ్యము - 1.నేర్పు 2.యోగ్యత (భౌతి) పనిచేయురేటు(power) (గృహ)బలము, సత్తువ. మోమాటము - 1.దాక్షిణ్యము, కనికరము(అనుక్రోశము - కనికరము), 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.

కృప - దయ, కనికరము.
కృపాళువు -
దయాళువు, దయకలవాడు.
దయాళువు - కనికరము కలవాడు.

భక్తిహీనం హతందానం, హతంసైన్యమసాయకం|
హతో రూపవతీవంధ్యా హతో యజ్ఞ స్త్వదక్షిణః||
తా.
భక్తిలేక యిచ్చిన దానమును, నాయకుడు లేని సైన్యమును, సౌందర్యవతియైన గొడ్రాలును(వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.)పిల్లలు కలుగని స్త్రీని బాధించరాదు, దక్షిణలేని యజ్ఞంబును నిష్ప్రయోజనంబులు. - నీతి శాస్త్రము

హిమశైలకుమారీ చ శరణాగత రక్షిణీ,
సర్వాగమస్వరూపా చ దక్షిణా శంకరప్రియా.

దక్షిణాదేవి(లక్ష్మీదేవి అంశ): ఈమెకు దీక్ష అని ఇంకొకపేరు. ఈమె, పూర్ణ దీక్షాపరురాలు యజ్ఞ పురుషుని ఇల్లాలు. దక్షిణాహీనములైన కర్మలు నిష్పలములు. యజ్ఞే శానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ.

సాక్షా చ్ఛ్రీ  దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః. 

ఓం హ్రీంకారాధ్వర దక్షిణాయై నమః : హ్రీకారమనే యజ్ఞానికి దక్షిణా స్వరూపురాలైన దేవికి వందనాలు. యాగం చేసిన వారికి యజమానులు ఫలస్వరూపంలో దక్షిణలిస్తారు. ఇక్కడ హ్రీంకార రూప యాగం చేసిన భక్తులకు దక్షిణ రూపంలో పరదేవత దర్శన మిచ్చి అనుగ్రహిస్తుంది.

దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |
కౌళినీ కేవలా నర్ఝ్యా - కైవల్యపదదాయినీ. - 171శ్లో

వలపక్షము - (వ్యవ.) (వలను + పక్షము), పక్షపాతము.
ఏట -
పక్షము, ప్రక్క, విణ.అతిశయము(అధిక్యము), రూ.ఏటము.
పక్షము - 1.నెలయందు పదునైదు దినములు (శుక్లకృష్ణ పక్షములు) 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.
ప్రక్క యెముకలు -
(గృహ.) రొమ్ము ప్రక్క యెముకలు (Ribs).
ఏటవాలు - 1.పక్షపాతము, 2.వంపు.
పక్షపాతము - ఒక ప్రక్క కొరుగుట, పక్షపాత బుద్ధితో మెలగుట.
వంపు - వంగుట, విణ.వంగినది, సం.భంగః, వక్రః.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు, కొలువుకాడు.    

పక్షవాతము - శరీరము నొక ప్రక్క కొరగచేసెడి రోగము.(Paralysis
వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము. 

ద్రవిడము - 1.దక్షిణదేశము, 2.దక్షిణదేశ భాష, రూ.ద్రావిడము.
ద్రవిణము -
1.ధనము, 2.బంగారు, 3.బలము.
త్రాణ - 1.ద్రవిణము, 2.బలము, 3.సత్తువ, సం.ద్రవిణమ్.
అఱవము - ద్రవిడభాష.
ద్రావిడ ప్రాణాయామము - జాతీ. 1.సులభముగా కానిపని, 2.సూటిగా చెప్పక డొంకతిరుగుడుగా చెప్పెట.

దక్షిణావర్తము - (వృక్ష.) కుడి నుండి ఎడమ వైపునకు చుట్టుకొనునది.

దక్షిణాపథము - వింధ్య మొదలు సేతువు(నీటి కట్ట) వరకు గల దేశము.
ఆర్యావర్తము - ఆర్యులు తమ పశు సముదాయముతో చరించిన భూమి (వింధ్యాచల హిమాచల మధ్య భూమి.) పుణ్యభూమి.

కంచి - కాంచీనగరము, విణ.పెద్ద.
కాంచీ -
1.స్త్రీలు ధరించెడు ఒంటి పేట మొలనూలు, 2.కాంచీపురము, (పుణ్యనగరము లేండింటిలో ఒకటి). కామాక్షీ కంచికాపురీ శక్తిపీఠం| 
మొలనూలు - ఆడువారు అలంకారార్థము ధరించెడు కటి సూత్రము.
కంచిమేఁక - పెద్దపొదుగు గల మేక.

కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః.

క్వణత్కాంచీదామా - కరికలభకుంభ స్తననతా
పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా | 
ధనుర్బాణాన్ పాశం - సృణి మపి దదానా కరతలైః
పురస్తా దాస్తాం నః - పురమథితు రాహో పురుషికా || - 7శ్లో
తా.
మ్రోగుచున్న(చిరుగంటలతో కూడిన) బంగరు మొలనూలు గలదియు, గున్న యేనుగు కుంభస్థలముల వంటి స్తనములచే కాస్త వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుని వంటి ముఖము గలదీ, చేతులతో చెరుకు విల్లుని, పుష్పబాణాలను, పాశము అంకుశమును(సృణి - అంకుశము) ధరించినదియు నైన త్రిపురాంతకుని యహంకార రూపిణియగు దేవత మా యెదుట సుఖాసీనయై ప్రత్యక్షమగు గాక!  - సౌందర్యలహరి  

మహాపద్మాటవీసంస్థా - కదంబవనవాసినీ,
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ | - 23శ్లో 

కదంబారణ్యనిలయా వింధ్యాచలనివాసినీ,  
హరప్రియా కామకోటిపీఠస్థా వాంఛితార్థదా. - 7శ్లో

రామేశ్వరము - దక్షిణ దిశనున్న యొకానొక గొప్ప పుణ్యక్షేత్రము. రాగల శని రామేశ్వరమేగినా వెంటాడించేదే. 

పింగళ - 1.దక్షిణ దిక్కు నందలి ఆడేనుగు, 2.అరువది సంవత్సరములో నొకటి.
పింగళుఁడు -
1.అగ్ని, 2.శివుడు.
ఏకపింగళుఁడు - కుబేరుడు.

3. కృత్తిక - కొడవలి యాకారముగా 6 నక్షత్రములుండును.

దాత్రము - కొడవలి.
కొడవలి -
కోయు సాధనము, లవిత్రము, (వ్యవ.) చిన్న పిడితో వంపు తిరిగి, అంచునకు చిన్నరంపగరి యుండు కత్తి (Sickle).
లవిత్రము - కొడవలి, లిక్కి. లిక్కి - కొడవలి.

అగ్నిర్నః పాతు కృత్తికాః | నక్షత్రం దేవమింద్రియమ్ | ఇదమాసాం విచక్షనమ్| హవిరాసం జుహోతన | యస్య భాంతి రశ్మయో యస్య కేతవః | యస్యేమా విశ్వా భువనాని సర్వా | స కృత్తికాభిరభి సంవసానః | అగ్నిర్నో దేవస్సువితే దధాతు ||1||   

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలము -
1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనతి జీవంత్యనేన లోకా ఇత్యనలః అన ప్రాణనే - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాప్తి ర్నాస్త్యస్యేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేనివాఁడు.

బభ్రువు - 1.కపిలగోవు, 2.అగ్ని, 3.బట్టతలవాడు, విణ.1.పచ్చనిది, 2.రోగము వలన బట్టతల కలవాడు.
ఖర్వాటుఁడు -
బట్టతలవాడు, రూ.ఖల్వాటుడు.
నూలిగరను - బట్టతల, ఇంద్రలుప్తము.
చెంబుతల - బట్టతల.
ఇంద్రలు ప్తకము - 1.బట్టతల, 2.తల వెండ్రుకలూడిపోవు ఒక రోగము, రూ.ఇంద్రలుప్తము. 

కపిల - 1.ఆగ్నేయ దిశయందలి ఆడేనుగు, 2.పుల్లావు (కపిల గోవు).
పుల్లావు -
కపిలగోవు. మహాలింగము నందు దేవిస్థానం కపిల.
కపిల వర్ణత్వాత్కపిలా - కపిల వర్ణము గలిగినది.
కామ్యత ఇతి కపిలా - కోరఁబడునది. కపిలే కృష్ణపింగళే|   

పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె - ఐదోది "కపి"లావతారం. ఆయన సిద్ధులకు ప్రభువగు కపిలమహర్షిగా అవతరించి దేవహుతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహణునికి తత్త్వసముదాయమును విశేషంగా నిర్ధారించి చెప్పే సాంఖ్యాన్ని ఉపదేశించాడు.  

ధృతి : కపిలపత్ని, లోకాలకు ధైర్యరూపం. పిండాకరము నందు దేవిస్థానం ధృతి. దేవమాత సురేశానా వేదగర్భాంబికా ధృతిః.
ధృతి : ధృతిశబ్దము ధరించుటకును, ధైర్యమునకును పేరు. ధరణం, ధ్రియతే అనయాచ ధృతిః. సీ. ధృజ్ ధారణే. ధరించుట, దీనిచేత ధరింపఁ బడును ధృతి.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి -
నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గికంటి - శివుడు.
అగ్గితత్తడి -  అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.

అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు -
కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.

నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.

జాతవేదుఁడు - అగ్ని; నాలుగుకన్నుల వేలుపు - అగ్ని. నాల్గునేత్రములు రెంటికన్న బాగా చూడగలవు. 

అగ్నికి కాల్చుట స్వభావము. దానికి నాశమన్నది లేదు. అది సర్వకాలసర్వావస్థలలో దహనశక్తి కలది. అగ్ని అగ్నిని దహింపదు కదా! 

(ౙ)జంటమోము వేలుపు - అగ్నిదేవుడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.
ఊర్థ్వలోచనము - మీగండ్ల మెకము, శరభము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
దచ్చికాళ్ళ మెకము - శరభము, అష్టాపదము.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్.
అష్టాపదము - బంగారము.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము Gold. 

ఉష్ట్రము - ఒంటె, వ్యు.ఎల్లప్పుడును ఎండచే తపింపబడునది.

కపిలా క్షీరపానేన అన్యస్త్రీ సంగమేనచ |
వేదాక్షర విహీనేన ద్విదశ్చండాలతాం వ్రజేత్ ||
తా.
కపిల వర్ణముగల గోవుపాలను పానము చేయుటయు, ఇతర స్త్రీలతో భోగించు(భోగించు - సుఖించు, అనుభవించు)టయు, వేదాక్షరవిచారము లేక యుండుటయు, నిట్టికార్యములు బ్రాహ్మణులొనరించిన చండాల త్వము నొందించును. - నీతిశాస్త్రము

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీ పతిః|
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగ కృతాన్తకృత్||

ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.

కత్తెర - 1.వస్త్రాదులను కత్తిరించెడి సాధనము, 2.భరణి మూడు, నాలుగు పాదములందును, కృతిక యందును, రోహిణి మొదటి పాదమందును సూర్యుడుండు కాలము, 3.కృతికా నక్షత్రము.

కత్తెర నెల - కార్తీకమాసము; కార్తికము - కార్తిక మాసము.
కార్తికేయుఁడు - కుమారస్వామి, వ్యు.కృత్తికల కుమారుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.

బాహులము - 1.బాహుత్రాణము, 2.కార్తీక మాసము.
బాహులేయుడు -
కుమారస్వామి.

ఊర్జము - 1.కార్తికమాసము, 2.పూనిక, 3.ఉత్సాహము, 4.ఊపిరి వెలుపలికి విడుచుట విణ.బలము గలది.
పూనిక -
1.యత్నము, 2.సన్నాహము, 3.పట్టుదల.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
పట్టుదల - వదలనిపట్లు, చలము.

ఊర్జితము - ధృడము చేవగలది, వి.1.బలము, 2.ఉత్సాహము.
ఊర్జస్వలుఁడు - 1.మిక్కిలిబలము గలవాడు, 2.మిక్కిలి ఉత్సాహము కలవాడు, 3.గొప్పవాడు.
ఊర్జస్వి - మిక్కిలి బలవంతుడు, వి.ఒక అర్థాలంకారము. 

ఉత్సహించు - 1.యత్నించు, 2.ఉత్సాహపడు, రూ.ఉత్సాహించు.
ఉత్సాహించు - ఉత్సహించు.
ఉత్సాహకుఁడు - 1.ఇష్టకార్యసిద్ధికై ప్రయత్నించువాడు, 2.ఇష్టవస్తు ప్రాప్తికై తహతహపడువాడు.

ఉత్సాహం సాహసంధైర్యం బుద్ధి శ్శక్తిః పరక్రమః|
షడైతే యత్రతిస్టంతి తత్రదేవోపి తిష్టతి||
తా.
సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము; ఈ యారు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. - నీతిశాస్త్రము 

కృత్తి కాది భరణ్యంత నక్షత్రే ష్ట్యర్చితోదయా
గ్రహ విద్యాత్మికా జ్యోతి ర్జ్యోతి ర్విన్మతి జీవికా.

కృతి - 1.ప్రబంధము, సప్తసంతానములలో ఒకటి, 2.చదువరి(ౘదువరి – విద్వాంసుడు), విణ. నేర్పరి. అష్ట ప్రకృతి రష్టాష్ట విభ్రాజ ద్వి కృతాకృతిః.

కృతి - సప్త సంతానములలో నొకటి, 1.చర్మము, తోలు, 2.కృత్తికా నక్షత్రము, 3.కత్తెర. 

తను శబ్దము తోలునకును(చర్మము), శరీరమునకును పేరు. శరీరము వృద్ధి పొందుతుంది.

కృత్తిక - skin, తోలు, కత్తెర. కృత్తికా నక్షత్రానికి అగ్ని అథిదేవత. 

చర్మము - 1.తోలు, 2.కేడెము, డాలు.
తోలు -
పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
త్రోలు - క్రి.పశ్వాదులను తోలు, రూ.తోలు.
తోలుదాలుఁపు - శివుడు, చర్మాంబరుడు.

కృత్తిశ్చర్మ వాసో (అ)స్య కృత్తివాసాః. న-పు. - చర్మము వస్త్రముగా గలవాఁడు.

కృత్తివాసుఁడు - ముక్కంటి. కృత్తి వాసః ప్రియే.
ముక్కంటి -
త్రిలొచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.

కృత్తివాసా స్త్సుతః కృష్ణ తండినా శుభబుద్ధినా,
స్తవ మేతం భగవతో బ్రహ్మా స్వయ మధారయత్. - 170శ్లో

హరిగ - కేడెము, డాలు, రూ.అరిగ.
కేడేము -
డాలు, రూ.కేడియము, సం.కేటకమ్.
అడ్డలము - కేడెము, డాలు. అరిగ - డాలు, కేడెము.
డాలు - 1.కాంతి, 2.రంగు, 3.జెండా, టెక్కెము 4.కేడెము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.

గ్రహభేదే ధ్వజే కేతుః -
కేతు శబ్దము కేతుగ్రహమునకును, టెక్కెమునకును పేరు. కిత్యతే అనేనేతి కేతుః. కిత జ్ఞానే. దీనిచేత నెఱుఁగఁబడును, కేతుశబ్దము కాంత్యుత్పాత చిహ్నములకును పేరు. "పతాకాయాం ద్యుతౌ కేతుః గ్రహోత్పాతాది లక్ష్మసు" అని రుద్రుఁడు.  

ఖేటకము - 1.డాలు, రూ.ఖేటము, 2.ఒకరకపు గ్రామము, 3.శ్లేష్మము.
ఖేటము -
1.రైతులుండు పల్లె, 2.వర్తకు లుండు పేట, 3.సూర్యాది గ్రహము, 4.శ్లేష్మము, 5.బలరాముని గద, 6.వేట, 7.చర్మము, 8.గడ్డి, 9.డాలు, విణ.1.అధమము, 2.వడ్డీ బ్రదుకునది.

చర్మి - కేడెము ధరించినవాడు.
చర్మకారుడు - మాదిగవాడు.
మాదిగ - చెప్పులు కుట్టి జీవించు జాతి, కరటుడు, గోహింసకుడు, సం.మాతంగః.
గొడగరి - మాదిగవాడు, రూ.గొడారి(గొడారి - గొడగరి).
గూబరి - మాదిగవాడు. గొడగర - మాదిగజాతి.
ఆసాది - 1.మాదిగవాడు, మతంగుడు, 2.గ్రామదేవతను పూజించు పూజారి.

మతంగుఁడు - 1.ఋషి, 2.మాదిగవాడు.
ఋషి -
1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.

తనువు - 1.దేహము, 2.తోలు, విణ.1.చిన్న, 2.సన్న.
దేహము -
శరీరము, మేను.
కళవసము - తోలు, రూ.కళాసము. అజినము - తోలు.

చిన్న - 1.చిన్న, 2.మనోజ్ఞము.
మనోజ్ఞము -
1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
అందము - 1.సౌందర్యము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
చిట్టి - చిన్న, రూ.చిటి.
చిటి - 1.చిన్న, రూ.చిట్టి.
చిన్న - 1.అల్పము(చిడుగు - అల్పము), 2.కనిష్టము.
చిడిపి - 1.అల్పము, 2.పరుషము.
పరుషము - 1.నిష్టురము(నిష్ఠురము - కఠినము, పరుషము.), 2.నిష్టుర వాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు.

సన్న - సంజ్ఞ, సైగ, సం.సంజ్ఞా.
సంజ్ఞ -
1.సైస, 2.పేరు, 3.తెలివి, 4.పరిభాష, 5.సూర్యునిభార్య.
సంజ్ఞ - (గృహ.) 1.అభినయము, 2.చేష్ట, 3.చేష్టలచే అభిప్రాయమును తెల్పుట (Gesture).
సైగ - సంజ్ఞ, రూ.సయిగ, సం.సంజ్ఞా.

సంజ్ఞలు - (గణి.) రాసులు ధనరాసులో ఋణరాసులో తెలియజేయుట కుపయోగపడు గుర్తులు (+) అనునది ధనరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (-) అనునది ఋణరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (Signs). 

త్వగ్దాహము - (గృహ.) 1.చర్మదాహము, 2.కరకైన చర్మము, 3.చర్మవ్యాధి, 4.బొటిమలు పెరిగిన, పగిలిన చర్మము. (విటమిన్ ' ఎ ' లోపమువలన కలుగు వ్యాధి, (Der matitis).

త్వక్ - చర్మ నామక ధాతువు.
త్వక్కు -
1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము.
తొక్క - 1.చెట్టుపట్ట, 2.పండ్లమీది చర్మము, సం.త్వక్.
త్వచము - (వృక్ష.) బెరడు, బెండు (Cork).
బెరడు - చెట్టుబోదె పై కప్పు, బెరడు, (Bark).
బెండు - జిలుగు, విణ.నిస్సారము.
పట్ట - చెట్టు మీది తోలు, బెరడు, వై.వి. (వృక్ష.) వృక్షకాండము పై భాగమున నుండు దట్టమైన బెరడు, సం.పట్టమ్.
వల్కలము - చెట్టుమీది పట్ట.
వవ్కవము - పట్టనార, నారచీర.
రేషము - (వృక్ష.) నార, పీచు, పోగు (Fibre).
నార - చీల్చిన చెట్టుపట్టలోని పీచు, వల్కలము.
పీచు వేళ్ళు - వృక్ష.) తల్లివేరు ప్రత్యేకముగ లేకుండ అన్నియు నారవలె నుండు వేళ్ళు (Fibrous roots).
నార పంటలు - (వ్యవ.) నారనిచ్చు సస్యములు (Fibre crops) ఉదా. ప్రత్తి, గోగు జనుము, మొదలగునవి.
నారగోగు -  (వ్యవ.) ఇది ప్రత్తి కుటుంబము (Molvaceae)నకు చెందిన గోగు (Hibiscus Cannabinus) మొక్క. దీని కాండము నుండి తీయబడు నార 'గోగు నార '  అనబడును (Deccan hemp, Bombay hemp or Bhimilipatam Jute).

జూట్ - (వ్యవ.) (Jute) ఇది పలాస్త్రీ కుటుంబము (Tiliaceae) నకు చెందిన Corchorus capsularis Cholitorius మొక్కల కాండము నుండి తీయబడు నార.          

కార్పాసము - 1.ప్రత్తి, 2.నూలు, 3.వస్త్రము, కాగితము, విణ.నూలుతో సేయబడినది (వస్త్రము).
దూది -
ప్రత్తి. వస్త్రములు వేరు - దూది ఒకటే.
పత్తి - ప్రత్తి, సం.వి.1.గమనము, 2.ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు కాల్వురుగల సైనికదళము, 3.కాలిబంటు.
పింజ - 1.దూది, 2.పసుపు(హరిద్ర - పసుపు), 3.గుంపు.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

దూదేకుట (దూది+ఏకుట) - (గృహ.) ప్రత్తిని పింజలుగా చేయుట, ప్రత్తి నుండి గింజలను వేరుచేయుట (Carding).

పింజ-దగ్ధపద మార్జాలన్యాయము - న్యా. నలుగురు దూది వర్తకులు పిల్లిని పెంచిన కథ, అందు న్యాయాధికారి తీర్పురీతి. (కాలు కాలిన పిల్లి వలె).
దగ్ధపట న్యాయము - మడత పెట్టిన బట్ట కాలిపోయిన మడతలు మడతలుగాను నూలిపోగులు స్పష్టముగాను కంపించును, కాని చేత పట్టుకొనిన విడిపోవు ననురీతి. 

దగ్ధము - కాల్పబడినది. కొండంత దూదిని గాలుచుటకు కొండంత నిప్పు కావలెనా?

కొండంత దూది కూడా రవ్వంత నిప్పుతో కాలి బూడిద అయినట్లే పవిత్రమయిన భగవన్నామ స్వరణతో పాపపు రాశులన్నీ పటాపంచలవుతాయి.  - శ్రీ రామకృష్ణ పరమహంస    

ప్రత్తి రేవడి నేలలు - (వ్యవ.) కృష్ణ రేవడి నేలలు, ప్రత్తి సాగుచేయుట కుపయోగపడు ఒక విధమగు బంకనేలలు (Black cotton soils). 

బదరి - 1.రేగుచెట్టు, 2.ప్రత్తిచెట్టు, 3.ఒక పుణ్యక్షేత్రము.
మోచ -
1.అరటి, 2.బూరుగు(ఆయిటి - బూరుగు).
మోచనము - విణ.విడుచునది, వి.1.అరటి, 2.మునగ.
అనటి - అరటి, రూ.అంటి.
అంటివి - అరటి, రూ.అనటి.
కదళి - అరటి.
కదళీవంధ్య - ఒకసారి మాత్రమే ప్రసవించిన స్త్రీ. (అరటి చెట్టువలె, అరటిచెట్టు ఒకసారి మాత్రమే గెలవేయును).

రసదాడి - (వృక్ష.) 1.ఒకరకము చెరకు, 2.ఒకరకము అరటి, సం.రసదాళికా.
కాంచనకదళి - బంగారపుటరటి.
కదళీకుసుమము - అరటిపువ్వు. 

ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఓషదీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
ఓషధీశుఁడు - చంద్రుడు.

కావ్యపాకములు - (అలం.) ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళపాకము.

రంభ - 1.ఒకానొక అచ్చర, 2.అరటి చెట్టు.
అ(ౘ)చ్చర -
దేవవేశ్య, సం.అప్సరా.
అప్సరస - దేవవేశ్య, వికృ.అచ్చర. 
పొత్తి - 1.మెత్తని పలుచని పాతగుడ్డ, రూ.పొత్తిక, 2.బొమ్మచీర, 3.అరటిపట్ట ముడత, సం.పుత్రికా. మలయపర్వతము నందు దేవీస్థానం రంభ.  

పిలకలు - (వృక్ష.) అరటి మొదలగు మొక్కల కాండము చుట్టును బయలుదేరు చిన్న చిన్న మొక్కలు (Suckers). దుంప లేక ప్రకాండభాగమునుండి పుట్టి సహజముగ తొడిగి మొక్కలుగ నేర్పడి పెరుగు శాఖలు (Suckers), ఉదా.అరటి, రూ.పిలుక, పిల్క.
పిలక - 1.మొలక, 2.పిలకజుట్టు.
మొలక - 1.మొక్క, అంకురము, 2.వృణమునందు పెరుగు దుర్మాంసము, విణ.లేత, సం.మూలికా.
మొక్క - మొలక, రూ.మోక = చిన్నచెట్టు, (వ్యవ.) ఉద్భిజము, చెట్టు, వృక్షము (Tree).
మోక - మొలక, మొక్క.

మగ్నము - మునిగినది, వి (రసా.) నేల నుండి మొక్కలు తీసికొను మూలద్రవ్యములలో ఒకటి (Magnesium).

ఈరిక - 1.మొలక, 2.గుడ్దపేలిక.
ఈరికలెత్తు - అంకురించు, మొలకెత్తు, ఉదా.కోరిక లీరికలెత్తు. 

గిరిజ - 1.పార్వతి, 2.కొండయరటి, 3.మల్లెతీగ.
అత్తము -
1.అరటిపండ్ల గెల, 2.అరటిపండ్ల చీపు, 3.కాయ, పువ్వు, మొ.వి గుత్తి, 4.సమూహము, సం.హస్తః.
చీపు - 1.అరటిగెల యందలి యొక భాగము, 2.అత్తము.
అత్తెము - హస్తకవచము, హస్తత్రాణము, రూ.అత్తము.
గెల - పండ్లుకాయలు మొ.ని గుత్తి, ఉదా.అరటిగెల, రూ.గొల.
గొల - గెల, సం.గుళుచ్ఛః.
దూఁట - అరటియూచ, దవ్వు. విప్రకర్షము - దూరము, దవ్వు.
దవ్వు - దూరము(దూరము - దవ్వు), సం.దవీయః. 
దుర్దాంతము - 1.ఆడపరానిది, 2.గర్వించనిది, వి.1.పోరు, 2.దూట. 
బొందియ - అరటి ఊచ, దూట, రూ.బొందె.
ఊఁౘ - 1.జొన్న మొ.ని కంకికాడ, 2.అరటిదూట, 3.ఇనుము మొ.నిచే చేసిన కడ్డీ, 4.కంప(కంప - ముండ్లమండ).
ఊౘపడు - 1.కృశించు(ఊౘపోవు - కృశించు), 2.ఊఁచ(దూట)కలదియగు.     

కుటజము - కొండమల్లె.
మల్లిక - మల్లెతీగ.
మలె -
మల్లె పువ్వు, సం.మల్లీ, మల్లికా.

పూర్వోత్తరే పారలికాభిధానే - సదాశివం తం గిరిజాసమేతమ్|
సురా(అ)సురా (ఆ)రాధితపాదపద్మం - శ్రీవైద్యానాథం సతతం స్మరామి.

కంటకద్రుమము - 1.బూరుగుచెట్టు, 2.ముండ్లచెట్టు.
బూరుగు -
 శాల్మలీ వృక్షము, రూ.బూరువు.
శాల్మలి -
1.బూరుగుచెట్టు, 2.సప్త ద్వీపములలో నొకటి.
బూరుగు దూది - (గృహ.) పట్టుప్రత్తి (Kapok).
పట్టు - ఒక జాతి పురుగులవల్ల కలిగెడు ఒక దినుసు మేలు నూలు, సం.పట్టః.

దానము చేయనేరని యధార్మికు సంపద యుండియుండినన్
దానె పలాయనంబగుట తథ్యము, బూరుగు మ్రాను గాచినన్
దానిఫలంబు లూరక వృధాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన, నేమిటికిఁగాక యభోజ్యములౌట ! భాస్కరా.
తా.
బూరుగుచెట్టు బాగుగా ఫలించినను దాని ఫలములు తినరాని వగుటచే, అవి అడవిలో ఎవరికి ఉపయోగపడక ఎండిపోయి, గాలికి నేల రాలిపోవును. అట్లే ఒకరికి దానముచేయని వాని సంపద యొకప్పుడు న్నను మరి యొకప్పుడు తొలగిపోవును. 

కత్తెర చుక్క - కృత్తికా నక్షత్రము.
కత్తెర -
1.వస్త్రాదులను కత్తిరించెడు సాధనము, 2.భరణి మూడు, నాలుగు పాదములందు, కృత్తిక యందును రోహిణి మొదటి పాదమందును సూర్యుడుందు కాలము, 3.కృత్తికానక్షత్రము.

(ౘ)చుక్క - 1.శుక్రుడు(Venus), శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.

కృత్తికాసుతుఁడు - కుమారస్వామి. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించా లన్నది కుమారస్వామి బోధ.

కృపాణీ కర్తరీ సమే :
కల్పతే ఛేదనాయేతి కృపాణీ. ఈ. సీ. కృపూ సామర్థే - ఛేదించుట కొఱకు సమర్థమైనది.
కృత్యతే ఛిద్యతే నయేతి కర్తరీ. ఈ. సీ. కృతీచ్ఛేదనే. - దీనిచేత ఛేదింపఁబడును. ఈ రెండు 2 కత్తెర పేర్లు.

కృపాణి - 1.చురకత్తి, 2.కత్తెర.
క్షురము -
1.చురకత్తి, 2.మంగలికత్తి.
(ౘ)చురకత్తి - ఛురిక, చిన్నకత్తి, రూ.చురి(చురి - ఛురిక.), చురియ, చూరి, చూరీ, సురియ. 
ఛురి - చిన్నకత్తి, చురకత్తి, రూ.ఛురి.
ఛురి - చిన్నకత్తి. (చ)చూరకత్తి - చురకత్తి. 
సురియ - చురియ, చురకత్తి, సం.ఛురీ, ఛురికా.
అసి1 - అల్పము, కొంచెము.
అసి2 - కత్తి, ఖడ్గము. ఒకవరలో రెండుకత్తులు యిమడవు.
అసిపుత్రి - చురకత్తి, చిన్నకత్తి. బాగుదార - చిన్నకత్తి; చాకు - చిన్నకత్తి.   

కర్తరి - కత్తెర.
కర్తనము -
(గృహ.) కత్తిరించుట, గొఱ్ఱెబొచ్చు మొ.వి కత్తిరించుట (Shearing).
గండకత్తెర - 1.దాట శక్యముకాని కష్టము, 2.మెడను కత్తిరించు పెద్ద కత్తెర, 3.వాడియైన కత్తెర, సం.గండకర్తరీ.

ముఖం పద్మదళాకారం వచ శ్చందనశీతలమ్|
హృత్కర్త రీసమం చాతివినయం ధూర్తలక్షణమ్|
తా.
తామరరేకులవంటి ముఖ వర్చస్సును, శ్రీగంథమువలె చల్లనిమాటలును, కత్తెరతో సమానమగు హృదయమును, అతివినయమును ఇట్టివి మోసగాని లక్షణములు. - నీతిశాస్త్రము.

మంగలకత్తి రూపు - కృత్తికా నక్షత్రము.
మంగల1 -
క్షౌరముచేసి జీవించు జాతి.
మంగల2 - 1.పతివ్రత, 2.దుర్గ.
పతివ్రత - సాధ్వి; సాధ్వి - పతివ్రత.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.

మంగళ - పార్వతి.
మంగళదేవత - లక్ష్మి.

మంగళ - పార్వతి, (ప్రకృతి అంశతో మంగళాదేవి జన్మించింది, గయలో దేవిస్థానం మంగళ). దుర్గమములైన బాధలనుంచి కాపాడుతుంది కనుక ఈ దేవికి 'దుర్గ ' అనే పేరు సార్థక మయింది.

ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3.మంచపు కోడు.
గొరిజ -
పసువు కాలిగిట్ట, సం. ఖురః.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపు కోడు.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపు కోడు, క్రి. మండు. కాలికి జూటూకున్న పాము కరవక మానునా?
ఖట్వాంగపాణి -
ముక్కంటి, శివుడు వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు. 

ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా|
పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ.

గ్రామణి - 1.గ్రామాధిపతి, 2.శ్రేష్ఠుడు, వి.1.మంగలి, 2.వేశ్య, (చరి.) మౌర్యుల కాలమునాటి గ్రామపెద్ద.
మునుసబు -
1.గ్రామాధికారి, 2.న్యాయాధికారి.
పటేలు (మహారాష్ట్రము) - గ్రామాధికారి.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.  

గామిడీ - 1.శ్రేష్ఠుడు, 2.పీనము బలిసినది, 3.గయాళి, 4.దుష్టము, సం.గ్రామణీః.
గ్రామీణ - 1.వేశ్య, 2.పాలకూర, సం.విణ.ఊరి సంబంధమైన.

మంగలి - అంబష్టుడు; అంబష్ఠుఁడు - 1.మంగలి, 2.మావటి.
అడపకాఁడు -
1.మంగలి, 2.అడపము పట్టుకొనువాడు.
అడపము - 1.వక్కలాకులు పెటూకొను సంచి, 2.మంగలి పొది.
నాపితుఁడు - మంగలి; క్షురి - మంగలి, క్షౌరకుడు.
క్షురకర్మ - మంగలిపని, ముండనము. 
కోఁగుట - క్షౌరము, ముండనము, రూ.గోఁగట.
కోఁగు - క్షౌరముచేయు, గొరుగు. పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్లు.
గొఱుగు - క్షౌరముచేయు. 
ముండనము - 1.క్షౌరము 2.సంరక్షణము.
భద్రాకరణము - ముండనము.
వపనము - క్షౌరము, ఆయుష్కంత్మము.

ఆయుష్కరము - ఆయుర్వృద్ధికరమగు పని, క్షౌరము.

చూడాకర్మము - పుట్టువెండ్రుకలు తీయుట. 
చౌలము - వెండ్రుకలు తీయు నొకానొక కర్మ, చూడాకర్మ, పుట్టువెండ్రుకలు తీయు సంస్కారము.

మనుష్యులను పరిచయమువలనను, మంగలిని క్షౌరము వలనను, బంగారమును గీటుకాల్పులవలనను, నాణ్యము చేయవలెను. రాజు కూడా ఒకరిముందు(మంగలివాని ముందు) తల వంచాల్సిందే. మనుష్యులందరి తలపైన మంగలి చేయి.

మంగలికోళ్ళు - సన్నాయి, వ్యు.మంగలి ఊదు గొట్టము.
నాదస్వరము -
మేళగాండ్రు పాటలు పలికించు క్రోవి, సన్నాయి.

ఆగ్నేయము - అగ్నికి సంబంధించినది, 1.అగ్నిపర్వతము,  2.వివాహములో అరుంధతీ దర్శనాంతరము యజుర్వేదులు చేయు ఒక కర్మ (యజ్ - ఆరాధన) 3.కృత్తికా నక్షత్రము, 4.ఆగ్నేయాస్త్రము(అగ్ని దేవతాకమైన అస్త్రము).

అగ్నిపర్వతము - లోపల అత్యుష్టమై ఘనద్రవ పదార్ధములున్న కొండ. (అది జ్వాలా బిలము ద్వారా భూమి ఉపరితలముతో కలిసియుండును.) ఉజ్జు(ౙ)వకల్లు - అగ్నిపర్వతము నుండి బయలు పడిన రాయి. లావా - (భూగో.) (Lava) శిలాద్రవము, అగ్నిపర్వతముల నుండి రాయి కరిగి ప్రవహించు అత్యధికోష్ణోగ్రతకల ద్రవము. పగిలే అగ్ని పర్వతాన్ని అణచి వేయగలరా?

జ్వాలాబిలము - (భూగో.) అగ్ని పర్వతముపై గిన్నెవలె మండు పైభాగము. దీని ద్వార ఉపరితలమునకు గొట్టము వంటి దారి యుండును.

అరుంధతి - 1.వసిష్ఠుని భార్య(సతుల యందు దేవిస్థానం అరుంధతి), 2.ఒకానొక నక్షత్రము, 3.దక్షుని కూతురు వికృ.ఆరంజ్యొతి.
ఆరంజ్యోతి - 1.వసిష్ఠుని భార్య, 2.ఆ పేరుగల నక్షత్రము సం.అరుంధతీ.
మాతంగి - 1.పార్వతి, 2.వసిష్ఠుని భార్య. మాతంగి మధుశాలినీ.....

మాతంగీ మత్తమాతంగీ మహాదేవప్రియా సదా,
దైత్యహన్త్రీచ వారాహీ సర్వశాస్త్రమయీ శుభా|   

స్థూలారుంధతీ న్యాయము - అరుంధతీ నక్షత్రము చిన్నది, కావున దానిని, చూచుటకై పెద్ద నక్షత్రమొక దానిని చూపించి దాని సమీపమున నున్నదని చూపు నట్టిరీతి.

అక్షమాల - 1.అకారము మొదలు క్ష కారము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తాళవము, 3.అరుంధతి.
వర్ణము -
1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.
వర్ణుడు - కుమారుడు.
అక్షసరము - జపమాల; అక్షసూత్రము - జపమాల.
అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి.1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.  
అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.

ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.
ఓం -
1.పరబ్రహ్మార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క సారభూతము. వేదాంతగ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ + ఉ + మ), మంత్రముల కెల్ల శిరోమణి. ఓంకారము నందు సమస్త జగత్తును ఇమిడి యున్నదని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారేశ్వరుడు - శివుడు.

కావేరికా నర్మదయోః పవిత్రే - సమాగమే సజ్జన తారణాయ|
సదైవ మాన్ధాతృపురే వసన్త - మోంకార మీశం శివ మేక మీడే. 

ఉమ - ప్రకృతి; ఉకారము - విష్ణువు, మకారము - శివుడు. 
ఉమ - 1.పార్వతి వ్యు.తపము వలదని తల్లిచే(మేనకాదేవి) అడ్డు పెట్ట బడినది, 2.కాంతి, 3.పసుపు(హరిద్ర), 4.యశము (యశము - కీర్తి). ఉ - వర్ణమాలలో ఐదవ అక్షరము. ఉ - ఓ బాలికా! మా - వలదు, అని యట్లు తల్లి చేఁ తపస్సు కెళ్ళవద్దని వారించటం వలన పార్వతీదేవికి, ఉమ అని పేరు వచ్చింది.(సనాతనులైన ఉమామహేశ్వరులు).

ఉమాపతి - శివుడు. ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.   

త్య్రక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా.

కాంతి1 - 1.కోరిక 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ. అభీష్టము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
పసుపు - (వ్యవ.) ఇది ఒక దుంపజాతి సంబార ద్రవ్యము (Turmeric). అల్లపు కుటుంబము (Zingiberaceae) లోని curcuma longa అను మొక్కను వ్యవసాయదారులు పైరు చేయుదురు. ఈ మొక్కల దుంపలను ఎండబెట్టి పసుపు తయారు చేయుదురు.

అభివాదనశీలస్య నిత్యం వృద్ధోప సేవినః
చత్వారి సంప్రవర్థంతే కీర్తి రాయు ర్యశో బలమ్.
తా.
పూజనీయులను నమస్కరించు స్వభావము కలిగి, పెద్దల నెల్లపుడు సేవించువానికి కీర్తి, ఆయువు, యశస్సు, బలము అను నీ నాలుగు వృద్ధి నందును.

సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీ ర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ,
ఉమా భగవతీ దుర్గా చాంద్రీ దాక్షాయణీ శిఖా.

పుండరీకము - 1.తెల్లదామర, 2.అగ్నేయపు దిక్కునందలి యేనుగు, 3.శార్దూలము, పులి.
పంచనఖము -
పులి, శార్దులము; పులి - 1.నల్లని, 2.పులిసినది, వి.శార్దూలము.

పుణ్ణరీకం సితామ్భోజం :
పుణతి మంగళత్వా త్పుండరీకం. పుణ కర్మణి శుభే.
సితం చ అంభోజం చ సితాంభోజం - తెల్లనైన తామర. ఈ రెండు తెల్లతామర పేర్లు.

మేకవన్నె పులి - జాతీ. మేకవలె సాధువుగా గాన్పించుచు క్రూర స్వభావము కలది.

పుండరీకాక్షుఁడు - విష్ణువు.
పుండరీకాక్ష. పుండరీకే ఇవ అక్షిణీ యస్య సః - తెల్లదామరవంటి కన్నులు గలవాడు.
పుండరీకం హృత్కమలం అక్ష్ణోతి వ్యాప్నోతీతివా - హృదయకలమలమును వ్యాపించియుండువాఁడు. అక్షూ వ్యాప్తౌగా.

త్రివిక్రముఁడు - విష్ణువు, వ్యు. మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించినవాడు.

vamana

No comments:

Post a Comment