Monday, July 9, 2012

మీనరాశి

పూర్వాభాద్ర 1 పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు - మీనం, చేప.

మగ మీనమవై జలనిధి
పగతుని సొమకునిఁజంపి పద్మభవునకు
నిగమములుఁ దెచ్చియిచ్చితి
సుగుణాకర మమ్ముఁగరుణఁ జూడుము కృష్ణా.
తా.
కృష్ణా! మత్స్యావతారమెత్తి, సముద్రములో దాఁగిన సోమకుని (ౘ)జంపి, వేదములు బ్రహ్మకొసంగిన దేవా! వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి…

నీరిలోన తల్లడించి, మోత నీటి మడుగులో ఈత గఱచినవాడు - ప్రళయాంబుధిలో మీనమై సోమకాసురుడు దొంగిలించిన వేదాలను తెచ్చినవాడు.

ప్రళయపయోధిజలే ధృతవానసి వేదమ్,
విహితవహిత్ర చరిత్ర మఖేదమ్|
కేశవ! ధృత మీనశరీర! జయ జగదీశ! హరే!

మత్స్యావతారమై మడుగులోపలఁ జొచ్చి,
సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను;
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల,
బ్రహ్మకిచ్చితి వీవు భళి యనంగ;
నా వేదముల నంది యాచారనిష్ఠల,
ననుభవించుచు నుంచు రవనిసురులు;
సకల పాపంబులు సమసిపోవు నటంచు,
మనుజులందఱు నీదు మహిమఁ దెలియ.

కుందు, రరవిందనయన ! నీ యునికిఁ దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ ! భూ.

తా. ఓ, నరసింహా ! చేపపుట్టుకనెత్తి మడుగులోనికి బోయి సోమకాసురుఁ జంపి చిత్రముగ వేదములదెచ్చి బ్రహ్మదేవునకు మెచ్చగా నిచ్చితివి. ఆ వేదముల నిచ్చుటచే సత్ప్రవర్తనము, నియమముల బ్రాహ్మణులను భవించుచున్నారు. మనుష్యులందరు సన్నిపాపములను నీ మహిమచే నశించిపోవునని దెలియకుందురు. అనగా నీ వుండుట నెఱింగినవారికి వెంటనే మోక్షము వచ్చును.

చాక్షుష మన్వంతర సంప్లవంబున దశమంబయిన మీనావతారంబు నొంది మహీరూపంబగు నావ నెక్కించి వైవస్వత మనువు నుద్ధరించె - చాక్షుష మన్వంతరంలో నావరూపంలో ఉన్న భూమిపై పదవదైన "మత్యావతారం" దాల్చి వైవస్వత మనువును(వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.)ని కాపాడాడు.     

మీనము - 1.చేప, 2.మీనరాశి (Pisces).
చేఁప -
మత్స్యము; మత్స్యము - చేప. 
మీనోతి క్షిపతి జలమితి వామీనః, డుమిఞ్ ప్రక్షేపణే. - జలము చల్లునది.

చేప - ఈతగాడు, నీటిలో నివాసము గలది. ఈత చేతనైతే ఏంతలోతైనా ఒకటే. ఈత నేర్చిన వానికే, నీటి గండం.

కొత్తనీటికి చేప లెదురెక్కినట్లు, వడిగా ప్రవహించు యేరులో ఎదురడుట మిక్కిలి ఆపదలు కలిగించును. గాలి గండమే కాని నీటి గండం లేనిది, చేప.

మీనకేతనుఁడు - మన్మథుడు.
మీనకేతనః మినః కేతనం ధ్వజో యస్య సః - మత్స్యము టెక్కెముగాఁ గలవాఁడు.

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.

అథ కేతనం కృత్యే కేతా పుపనిమన్త్రణే :
కేతన శబ్దము చేయఁదగిన పనికిని, టెక్కెమునకును, బ్రాహ్మణుల నియంత్రణము చేయుటకును పేరు.
కేతం త్యనేనేతి కేతనం. కిత జ్ఞానే. - దీనిచేత నెఱుఁగుదురు.
టీ. స. అవశ్యకర్తవ్యే _ "నివాపాంజలి దానేన కేతనై శ్శ్రాద్ధకర్మభి"ధ్వజే _ 'మీనకేతనః' నిమంత్రణే _ "కృతకేతనం బ్రాహ్మణం నాతిక్రామే" దితి.        

కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెము -
టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జెండా - టెక్కెము.

లలామము - 1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొటు, 5.తోక, 6.గుఱ్ఱము(ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).

టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.
మిత్తిచూ(ౘ)లు - కేతువు. 
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని Fire.  

కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కనుఁడు - కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్.

ప్రకట మకర వరుణ పాశంబులందుల,
జలములందు నెందుఁ బొలయ కుండఁ
గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డైనట్టి
మత్యమూర్తి విద్యామానకీర్తి.
భా||
ప్రళయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపమాన కీర్తితో ప్రకాశించే మత్యావతారమూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణపాశములు అగు జలజంతువుల బారిన పడకుండా జలాలయందు సర్వదా సంరక్షించు గాక !  

ఝషము - 1.చేప, 2.మొసలి.
ఝషకేతుఁడు -
మన్మథుడు.
ఝషతి హిదస్తి బాల మస్త్యా నితి ఝషః ఝష హింసాయాం - పిల్ల చేఁపలను (ౘ)చంపి తినునది.

పృథురోమా ఝుషో మత్సో మీనో వైసారిణో (అ)ణ్దజః విసార శ్సకులీ చ -
ముఖదేశే పృథూని రోమాణ్యస్య పృథురోమా. న. పు. - ముఖమునందు పొడుగు రోమములుగలది.
మత్య సామాన్యమునకు పేరుగనుక నీపృథురోమ శబ్దము రోమములేని మత్స్యమునందును వర్తించును.

క్షుద్రాక్షేణేవ జాలేన ఝుషావపిహితావురూ |
కామాశ్చ రాజన్ క్రోధశ్చ తౌ ప్రజ్ఞానం విలుంపతః ||
రాజా! రెండు పెద్దచేపలు సన్నని చిల్లులు గల వల(వల- కామము, సం.వల్.)చే కప్పబడి దానిని ఎలా కొరుకుతాయో, కామక్రోధాలు రెండూ అలాగే(అదుపు చెయ్యబడక) వివేకాన్ని(వివేక - జ్ఞానము, విచారము.)లోపింప చేస్తాయి. 
(కామక్రోధాలు చేపవలె శత్రువులు - కాని అవి వలలో పడినపుడు మిత్రభావంతో కలిసి వలను కొరుకుతాయి. - అలాగే కామక్రోధాలు రెండూ కలిసి వివేకాన్ని కొరికేస్తాయి).      

మాత్స్య న్యాయము - పెద్ద చేప చిన్న చేపను తినునను న్యాయము. హెచ్చు బలము కలిగిన పెద్ద చేపలు బలహీనమైన చిన్న చేపలను బలవంతంగా, మింగుతుంటాయి.

శిశుకము - 1.శిశువు, 2.ఉలుచ మీను, 3.మొసలి.
పసిబిడ్డ -
(గృహ.) శిశువు, చంటిబిడ్డ (Infant child).
చేతిబిడ్ద - పసిబిడ్ద.
శిశువు - బిడ్డ; బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు, రూ.ప్రసూనుడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
సూనువు - 1.కొడుకు, 2.కూతురు.
తమ్ముఁడు - వెనుక పుట్టినవాడు, అనుజుఁడు, రూ.తమ్మువాడు. 
అనుజుఁడు - తమ్ముడు; తమ్మువాఁడు - తమ్ముడు.

శిశుసంరక్షణ - (గృహ.) చంటిబిడ్దను జాగ్రత్తగా పెంచుట (Child care).
శిశుసంరక్షణశాల - (గృహ.) పసిబిడ్డలకు కావలసిన సంరక్షణలు చేయు వైద్యశాల, (Child Clinic).

ఉలుచ - మిక్కిలి చాపల్యముగల చేప, సం.ఉలూపిః.
ఉలూపి - 1.ఒక నాగకన్య, 2.ఉలుచ చేప.

ఉలూపీ శిశుకస్సమౌ :
ఉత్ ఊర్థ్వం లుంపతి భ్రంతీతి ఉల్లూపీ. లుప్ ఌ చేదనే. - ఊర్థ్వముగా భ్రమించునది.
చాపల్యచ్ఛిశురివ శిశుకః - చాపల్యము వలన శిశువువంటిది. ఈ రెండు శిశువు వలె చపలమైన ఉలసమీను పేర్లు.  

(ౘ)చోఱ - ఒక తెగ చేప, రూ.చోర.
చోఱ -
చోర, విణ. బాలుడు. పోఱఁడు - బాలుడు.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు. 
చోఱబుడుత - 1.చోరమీనుపిల్ల, 2.చేపలవంటి కన్నులు గల స్త్రీ.    
మచ్ఛె కంటి - (మచ్చెము + కన్ను) చేపల వంటికన్నులు గల స్త్రీ.
మచ్ఛెము - చేప, సం.మత్స్యః.

గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము, 3.పులిగోరు పదకము, 4.చేప పిల్ల, 5.ఒక సంఖ్య.
విఘ్నము -
అంతరాయము, అడ్డు. విఘ్నరాజు - వినాయకుడు.
ఖడ్గము - 1.కత్తి 2.ఖడ్గమృగము, దాని కొమ్ము.
గండము - 1.ఏనుఁగు చెక్కిలి, 2.ఖడ్గమృగము, 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి, 6.ప్రాణాపాయము.

చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా? వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.

నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరడైన బారలేదు
స్థానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వ.
తా.
చేప నీళ్ళలో చాలా వేగముగా పోవును, బైట మూరెడు దూరమైననూ పోలేదు. అందు చేత అది స్థానబలిమేగాని దానిబలముగాదు.

వాలుగ - ఒక రకము చేప.
వాలుగంటి -
స్త్రీ, దీర్ఘములైన కన్నులు గల స్త్రీ.
వాలుచూపు - ఓరచూపు.

శఫరి - ఎగసిపడెడు చేప, రూ.శఫరము.
తెఱగంటి -
1.తెప్పపాటు లేనివాడు, దేవత, 2.చేప.
తెఱగంటి ఱేఁడు - ఇంద్రుడు. 

అనిమిషుఁడు - వేలుపు, దేవత. దేవత - వేలుపు.
అనిమీషము -
1.రెప్పపాటులేనిది, 2.జాగరూకము, 3.వికసించినది, వి.చేప. రెప్పలు ముయ్యని జాణ. - చేప.

సుర మత్స్యా వనిమిషా :
అనిమిష శబ్దము దేవతలకును, మత్యమునకును పేరు. న నిమిషత్య నిమిషః మిష నిమీలనే ఱెప్పపాటు లేనిది.

మెలయు మీనాక్షి కిని మీనరాశి.... 

తవాపర్ణే! కర్ణే - జపనయన - పైశున్య - చకితాః
నిలీయంతే తోయే - నియత మినిమేషా శ్శఫరికాః,
ఇయం చ శ్రీ ర్బద్ధ - చ్ఛదవుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే - నిశి చ విఘటయ్య ప్రవిశతి. - 56శ్లో
తా.
ఓ అపర్ణా! పార్వతీదేవి ! ఱెప్పపాటులేని చేపలు చెవి దగ్గరనున్న నీ కనులు తమ రహస్యమును బయట పెట్టునని భయపడినవై శఫరితలు నీటిలో మునుగు చున్నవి.(దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా వుండటంవల్ల తమచేష్టలన్నీ అమ్మచేత గమనింప బడుతున్నాయని భయం.) ఇక నీ నేత్రలక్ష్మి రాత్రిసమయంలో కలువ యందు ఉండి, ఉదయాన దాని దళాలను మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి, రాత్రివేళ మరల కలువలు విప్పారగనే లోన ప్రవేశించుచున్నది. కనులు చేపలవలెను కలువలువలె నున్నవనుట. (అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరొపోల్చదగ్గ నేత్రలు అని భావము) - సౌందర్యలహరి   

అపర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ,
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా. - 52శ్లో 

వారిచరము - చేప మొ.
వారి - నీరు.
వారిజము - 1.తామర, 2.శంఖము, 3.ఉప్పు.

వారిచరావతారమున వారధిలోఁ జొరబాణిఁ క్రోధవి
స్తారగుడైన యానిగమ తస్కరనీర నిశాచ నరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
రామా! మత్స్యావతారమునందు సముద్రము లోపల వేగముగా చొచ్చి మిక్కిలి కోపాతిశయము గలిగిననా డవై, వేదములను దొంగిలించు కొనిపోయిన వీరుఁడైన మేటిరాక్షసుఁడగు సోమకాసురుని పట్టి చంపి వేదములచిక్కు విడఁదీసి బ్రహ్మకు మరల వానిని మిక్కిలి యౌదార్యముతో నిచ్చినవాఁడవు నీవే కాని మఱెవ్వరునుగారు. అట్టి నీవు నన్ను కాపాడఁదగును.

గాంగేయము - 1.బంగారము, 2.తామర, 3.ఉమ్మెత్త, 4.ఒకానొకచేప. గఙ్గాయాం అగ్నినా న్యస్తస్య మాహేశ్వరవీర్యస్య హిరణ్యత్వేన భూతత్వ్వత్ గాంగేయం - గంగ యందు ఈశ్వరుని వీర్యము అగ్నిహోత్రుఁడు విడువఁగా సువర్ణ రూపమాయెను గనుక గాంగేయము.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గాంగేయుఁడు - గాంగుఁడు.
గాంగము - 1.గంగ యందు పుట్టినది, 2.గంగకు సంబంధించినది.

కశేరు హేమ్నోర్గాజ్గేయమ్ :
గాంగేయ శబ్దము కమ్మరేఁగున(ఒక రకము చేఁప)కును, బంగారము నకును పేరు. కుశేరువనఁగా కొందఱు తామర, కలువ మొదలయినవాని దుంపయనియును, కొందఱు తృణ విశేషమనియు నందురు. గంగాయాం భవం గాంగేయం - గంగ యందుఁ బుట్టినది. '......షడాననే, గాంగేయః పుంసి భీష్మేచ గాంగేయం ముక్తకే భవే'ఇతి శేషః.

కుశేశయము - తామరపువ్వు, వ్యు.నీటియం దుండునది. కుశే జలే శేత ఇతికుశేశయం. శీఙ్ స్వప్నే. - నీళ్ళ యందు వుండునది. 
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.) తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.

తమఃప్రకర్షో రసో స్య తామరసం - ప్రకృష్టమైన రసము గలిగినది.
తామ్యద్భిః రస్యత ఇతి వా తామరసం. రస అస్వాదే. - బడలినవారిచే నాస్వాదింపంబడునది. 

హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హాటకగర్భుడు -
బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.

కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
కపర్ధి - శివుడు. 

హేమము - 1.బంగారు 2.ఉమ్మెత్త.
ఉమెత్త -
దుత్తురము, రూ.ఉమ్మెత్త, సం.ఉన్మత్త.
ధుత్తురము - ఉమ్మెత్త.  వేఁదురు - ఉన్మాదము.
ఉన్మాదము - 1.వెఱ్ఱి, పిచ్చి 2.(అలం.) సంచారీభావములలో ఒకటి.
ఉన్మత్తము -1.వెఱ్ఱియెత్తినది 2.కై పక్కినది 3.గర్వించినది 4.పిశాచా ద్యావేశము కలది, వి.ఉమ్మెత్త చెట్టు.

శీల ధర్మపత్నులు - త్రప(లజ్జ), శాంతి అని ఇద్దరు. వీరు లేకపోతే లోకం ఉన్మత్తం అవుతుంది.

ఉన్మత్త ఉన్మాదవతి : ఉన్మద్యతే ఉన్మత్తః. మదీ హర్షగ్లపనయోః. - మిక్కిలి మదించినవాఁడు. వెఱ్ఱియెత్తినవాని పేరు.

కైపు - 1.సారాయి మత్తు, 2.అందము, 3.విజృంభణము.
కితపుఁడు -
జూదరి, విణ.మత్తుడు, మోసగాడు.
కితవము - ఉమ్మెత్త.
రిమ్మ - ఉన్మాదము, చూ.రింబ. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు.
రింబ - రిమ్మ, పిచ్చి. ఎవరి పిచ్చి వారికి ఆనందము.

మాయువు - పైత్యరోగము.
పిచ్చ -
తక్కువ, కొరత (పిచ్చకుంచము), వై. వి. 1.వెఱ్ఱి 2.వృషణము(బీజము), సం.1.పిత్తమ్ 2.పిచ్ఛా.
పిత్తము -ఒక ధాతువు (వాత పిత్త శ్లేష్మము లనునవి త్రివిధధాతువులు.)
పిత్తకోశము - (గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువజేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువ చేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).

మాయుః పిత్తమ్ -
మీనోతి శిరో భ్రమణేన బువి క్షేపయతీతి మాయుః. ఉ. పు. దు మిఞ్ ప్రక్షేపణే. శిరోభ్రమణముచేత జనమును బడఁద్రొబ్బునది.
పతతి పిత్తం పత్ ఌ గతౌ. ద్రవరూపమై పడునది. ఈ రెండు 2 పైత్యము పేర్లు. 

వెఱ్ఱి - పిచ్చి, అవివేకము, విణ.పిచ్చివాడు.
తిక్క - పిచ్చి, రూ.త్రిక్క.
తిక్కకొను - పిచ్చియెత్తు.

అలర్కరోగము - (గృహ.) వెఱ్ఱి కుక్క కరచినచో వచ్చు పచ్చి.
కుక్క వెఱ్ఱి - (గృహ.) వెఱ్ఱికుక్క కాటు వల్ల కలిగెడు ఒక రోగము, జలద్వేషము (
Hydrophobia). (యోగితము - పిచ్చికుక్క.)

పంచశరుఁడు - మన్మథుడు, ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనములను ఐదు బాణములు కలవాడు.
ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనాఖ్యాః పంచశరాః యస్యసః పంచశరః - ఉన్మాదన శోషణ స్తంభన సమ్మోహనములను (నై)ఐదు బాణములు గలవాఁడు.

వలవాక - మన్మథ తాపము.
వలవంత - 1.మన్మథవ్యథ, 2.సంతానము.

సోన్మాద స్తూ న్మదిష్ణు స్స్యాత్ :
ఉనాదేన సహితః సోన్మాదః - ఉన్మాదముతోఁ గూడుకొన్నవాఁడు. పా. సూన్మాదః ఉన్మదః.
ఉన్మాదశీలః ఉన్మదిష్ణుః. మదీ హర్షగ్లేపనయోః. - ఉన్మాద స్వభావము గలవాఁడు. ఈ రెండు భూతావేశాదులచేత నొడలెఱుఁగనివాని పేర్లు. 

నశ్యత్య నాయకం కార్యం తదైవ శిశునాయకమ్|
స్త్రీ నాయకం తధోన్మత్త నాయకం బహునాయకమ్||
తా.
యజమానుఁడు లేని కార్యమును, బాలురు, స్త్రీలు, ఉన్మత్తులు, అనేకులు(పెక్కుమంది); ఈ ఐదుగురు విచారించగల కార్యములు చెడిపోవును. – నీతిశాస్త్రము

పార్షి - 1.ఉన్మత్తురాలు, 2.మడమ(గుదికాలు, చీలమండ అడుగు భాగము) 3.దండు వెనుక. 

ఉన్మత్తః కితవో ధూర్తో ధుత్తూతః కనకాహ్వయః మాతులో మదనశ్చ :
ఉన్మాదయతీత్యున్మత్తః తథైవ కితవశ్చ. మదీ హర్షగ్లేపనయోః - ఉన్మాదమును జేయునది.
ధూర్వతి ఉన్మాదేన హిన స్తీతి ధూర్తః. దుర్వీ హింసాయాం. – ఉన్మాదము చేత హింసించునది.
వాతాదిరోగా న్ ధువతీతి ధుత్తూరః. ధూ విధూననే. - వాతాది రోగములను కంపింపఁ జేయునది. పా. ధూస్తూరః.
కనకస్య ఆహ్వయోయస్య కనకాహ్వయః - బంగారు యొక్క పేరుగలది.
ఉన్మాదకద్ర వ్యేషు మానా స్తితు లాస్యేతి మాతులః - ఉన్మాదక ద్రవ్యములలో సాటిలేనిది.
మదయతీతి మదనః. మదీహర్షగ్లేపనయోః. - మదింపఁ జేయునది. ఈ ఆరు ఉమ్మెత పేర్లు.

ఉదర్కము - 1.భావికాలము, 2.భావి ఫలము, 3.ఉమ్మెత్తముల్లు.
భావి - భవిష్యత్తు, కాగలది. భవిష్యత్తు - కాగలది.

కంటకిఫలము - 1.పనస, 2.ఉమ్మెత్త, 3.పల్లేరు. పనసపండులో మామిడిపండు రసముండునా?

అస్య ఫలే మాతులపుత్రకః :
మాతులస్య పుత్రః ఫలం మాతుల పుత్రకః - మాతుల మనఁగా ఉమ్మెత్త; అందుఁ పుట్టినది. ఈ ఒకటి ఉమ్మెత్తకాయ పేరు.

కైవతము - 1.కపటము, 2.జూదము, 3.ఉమ్మెత్త, 4.వైడూర్యమణి.

కౌడు - 1.మోసము, 2.ప్రమాదము, తప్పు, రూ.కవుడు, సం.కపటః.
కపటము - కవుడు, వ్యాజము.
జూదము - జూజము. జూజము - ద్యూతము, పందెము వేసి ఆడెడి ఆట, మోసము, రూ.జూదము, సం.ద్యూతమ్. ద్యూదము - జూదము.
వైడూర్యము - ఒక విధమగు రత్నము, పిల్ల కన్రతనము.  
బేరిల్ - (భూగ.) (Beryl) వైడూర్యము.

ఖలము - 1.చోటు, 2.పాపము, 3.తెలకపిండి, 4.వెదురు, 5.ఉమ్మెత్త, 6.క్రూరము, 7.నీచము, వికృ. కళ్ళము.

విసారము - 1.చేప, 2.కొయ్య.
వసరతీతి విసారీ విసార్యేవ వైసారిణః. సృగతౌ. - చరించునది గనుక విసారి. విసారియే వైసారణము. 

కొయ్య - కఱ్ఱ, మ్రాను.
కాష్ఠము - కఱ్ఱ, కొయ్య.  
కఱ్ఱ - కొయ్య, పుల్ల, దండము.
పుల్ల - పులుపు గలది, వి.పుడక. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగాని పోదట.
మ్రాను - మాఁకు; మాకు - మ్రాను; మ్రాఁకు - మాను, చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము. 
దారువు - 1.కొయ్య, 2.ఇత్తడి.    
దారు పురుష న్యాయము - కఱ్ఱ మొద్దును చూచి మనుష్యుడని భ్రమపడిన రీతి.

ధటము - కొయ్య త్రాసు.

రీతి - 1.తెరగు, 2.మేర, 3.ఇత్తడి, 4.కావ్యశైలి పద్దతి (కావ్య శైలి త్రివిధము., పాంచాలి, గౌడ, వైధర్భి.)
తెఱఁగు -
1.విధము, క్రమము, 2.చక్కన, 3.సంధి, రూ.తెఱవు.
విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక. 
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య.సర్వశబ్దర్థకము.
పొలిమేర - 1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు, ఎల్ల.
వఱ - మేర, హద్దు.
వఱగొడ్దము - 1.వంకరమాట, 2.మర్యాద నతిక్రమించుమాట.

ఇత్తడీ - అరకూట మను లోహము, రూ.ఇత్తమ్, సం.పిత్తళమ్. (రసా.) రాగి జింకుల కలయిక గల ఒక ధాతుమిశ్రమము. 
ఆరకూటము - ఇత్తడి; పిత్తలము - ఇత్తడి, Brass.  

రీతిః స్త్రియా మారకూటో న స్త్రియామ్ -
రీయతే స్రవత్యగ్ని సమయోగాదితి రీతిః. ఈ. సీ. రి. గతౌ. - అగ్ని సంయోగము వలనఁ గరఁగునది.
ఆరస్య సువర్ణస్య కూటః మాయా రూపమివ భాసత ఇతి ఆరకూటః. అ. ప్న. - ఆర మనఁగా బంగారు; దాని మాయారూపమువలె నుండునది. ఈ రెండు ఇత్తడి పేర్లు. 

ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱగున గలుగు నేర్చు నెయ్యెడలందా
నెత్తిచ్చి కరగపోసిన
నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ!
తా.
నీచుడు మంచివారి యొక్క చెలిమి చెసినను, వారియొక్క మంచి గుణములు గ్రహింపజాలడు. యెట్లనగా బంగారంతో సమానమగు ఇత్తడిని తూచి, గరగించి (బంగారం కరిగించిపోసిన మూసలోపోసినను) అది బంగారం కాజాలదు కదా! ఇత్తడి ప్రక్కనవున్నప్పుడే, బంగారం విలువ తెలుస్తుంది.

కిలుము - (గృహ.) ఇత్తడి లేక రాగిమీద ఏర్పడు మాలిన్యము, (ఇది ఒకవిధమైన విషము), రూ.చిలుము, (Veradigris).
చిలుము - 1.రాగి మొదలగు లోహము లందలి మురికి, 2.విషము, 3.పొగ పీల్చుట కుపయోగించు గొట్టము.   
బ్రాస్సో - (గృహ.) (Brasso) అలంకారపు ఇత్తడి సామానులను పాలిష్ (Polish) చేయుటకు ప్రయోగించుద్రవము లేక పొడి. 

సారము - 1.జవము, 2.ధనము, 3.న్యాయము, 4.బలిమి, 5.చేప, 6.మూలగ, విణ.శ్రేష్ఠము, వి.(గృహ.) ఫలత్వము, 7.ఫలించు శక్తి (Fertility).

సారో బలేస్థిరాంశే న్యాయ్యేక్లీబం వరే త్రిషు. : సార శబ్దము సత్తువకును, చేవకును పేరైనపుడు. పు. యుక్తమైనదానికి, పేరైనపుడు న. శ్రేష్ఠమైనదానికి పేరైనపుడు త్రి. సరతి స్థిరీభవతీతి సారః. సృ గతౌ. - స్థిరమైయుండునది.

అసారే ఖలుసంసారే - సారం శ్వశురమందిరమ్|
హిమాలయే హర శ్శేతే - హరి శ్శేతే మహోదధౌ||
తా.
సంసారము సారము లేనిదైనను శ్వశురగృహంబు (శ్వశురులు - అత్తమామలు) సారంబు గలది. గనుకనే శివుఁడు హిమవత్పర్వతంబు నందు, విష్ణువు సముద్రము(మహాశయము - సముద్రము)నందును శయనించిరి. - నీతిశాస్త్రము    

జవము - వేగము; జవనము - వేగముకలది, వి.వేగము.
వేగము - జవము, త్వర, (గణి.) భౌతి.) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
త్వర - వేగిరపాటు. వేగిరము - వేగము, విణ.త్వరితము.
త్వరితము - శీఘ్రము, వడిగలది. శీఘ్రము - వడి, విణ.వడిగలది.  తరస్సు - 1.బలిమి, 2.వడి.

రై - 1.ధనము, 2.హిరణ్యము.
రైవతుఁడు -
శివుడు; శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.

క్షత్త్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము(శరీరము - దేహము), 3.ధనము, 4.నీరు. 

ధనము - 1.విత్తము(విత్తము కొద్దీ వైభవము) 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ  (Positive).
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది 2.తెలియబడినది.   

యస్యాస్తి విత్తం సనరః కులీన, స్సపండితః సశ్రుత ణాన్వివిజ్ఞః|
సవీవవక్తా స చదర్శనీయ, స్సర్వేగుణాః కాంచన మాశ్రయన్తి||
తా.
ధనముగలవాఁడే సత్కులవంతుఁడు, వాడే పండితుఁడు, వాఁడే శాస్త్రజ్ఞుఁడు, వాఁడే కర్తవ్యా కర్తవ్య విధిజ్ఞుఁడును, వాడే పలుక నేర్చినవాఁడు, వాడే చూడదగినవాఁడు గనుక సకల గుణంబులు ధనము నాశ్రయించి యున్నవి. - నీతిశాస్త్రము  

యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః,
పశ్చాత్ జీవతి, జర్జరదేహే వార్తాం కో పి న పృచ్ఛతి గేహే. -
భజగోవిందం

న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్క శాస్త్రము.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లి కూతురునకు తల్లితండ్ర్రు లిచ్చు బహుమానము. 
నాయము - 1.న్యాయము, 2.ధర్మము, సం.న్యాయః.
సమంజసము - న్యాయము, ఒప్పిదము.
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).   

తత్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి.(భౌతి.) మౌలికమైన, సారమైన విషయము. దేని మీద ఇతర సత్యములు ఆధారబడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).
పురుషుఁడు -1.మనుష్యుడు(మర్త్యుఁడు - మనుష్యుడు), 2.పరమాత్మ.
మనుష్యుఁడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
పస - 1.చాతుర్యము, 2.సారము, 3.సమృద్ధి.
చాతుర్యము -
1.నేర్పు, రూ.చాతురి. చాతురి - నేర్పు.
నేరమి - సామర్థ్యము, రూ.నేరువు, నేర్మి, నేర్పు.
సామర్థ్యము - 1.నేర్పు(విచక్షణత - నేర్పు), 2.యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు, (Power), (గృహ.) బలము, సత్తువ.
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి. నీతి(నీతి - న్యాయము)లేకపోవుట వలన సమృద్ధి నశించును.

నిక్కచ్చి - 1.నిర్బంధము, 2.సారము, 3.మోగమోటమి లేమి, సం.నిష్కర్షః.

చేవ - 1.చేగ, సారము 2.ధైర్యము, ధీరత్వము 3.(వృక్ష.) ద్వితీయ వృద్ధి చెందిన దారుకణ  సంహతి.  (Secondary xylem).  
చేగ - 1.కొయ్య నడిమి నల్లని గట్టి భాగము, 2.సారము, 3.ధైర్యము, రూ.చేవ. చేవ చచ్చిందా! అన్నది ఒక రకమైన తిట్టు.
సంహతి -
1.సమూహము, గుంపు 2.కలయిక, 3.సత్తువ.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.

మూలగ - ఎముకల మధ్యనుండు మాంససారము, మజ్జ, సం.మూలగః.
మజ్జ -
1.చెట్టుచేవ, 2.ఎముకల యందలి నేయి.
నెనడు - మజ్జ, మూలగ.
మజ్జారజ్జువు - (జం.) వెన్నుపాము, సుషుమ్న నాడి మొదలు నుండి వెన్నెముక గుండా దాని చివరవరకు గల నాడుల త్రాడు(Spinal cord). మైరవము - (జం.) వెన్నెముకకుగాని, వెన్నుపామునకుగాని, సంబంధించినది. మేరుపు = వెన్ను పాము, (Spinal). 
వెన్నుబాము - (గృహ.) వెన్నుపూసలో పారు ముఖ్యమైన నరము.(Spinal cord).

మజ్జాసంస్థా హంసవతీ - ముఖ్యశక్తి సమన్వితా|
హరిద్రాన్నైకరసికా - హాకినీరూపధారిణీ.

ఎమ్మూట - (ఎమ్ము + ఊట) ఎముకల లోని క్రొవ్వు, మూలగ.
ఎముక -
శల్యము, రూ.ఎమ్ము. (Bone)
ఊట - 1.ఊరగాయరసము, 2.చేప, 3.మూలగ, 4.భూమిలోపలి నుండి పీడనము వలన పైకి ఉబికివచ్చు జలము (Spring).
ఊట వెలుపడు గ్రంథులు - (గృహ.) లోపల ఊరిన రసమును నాళుల ద్వారా బయటకి పంపు గ్రంథులు (Exocrine glands).

మజ్జద్రవ్యము - (గృహ.) క్రొవ్వు పదార్థములు, నెయ్యి, వెన్న, నూనె మొ.వి.(Fats).

నూనియ - చమురు, రూ.నూనె.
ౘమురు -
రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.
ౘమురు గింజల పైరులు - (వ్యవ.) నూనెనిచ్చు గింజల పైరులు, ఉదా. ఆముదము, వేరుసెనగ, కుసుమ, నూవు మొదలగునవి, (Oiled crops).
ౘమురు దినుసులు - (వ్యవ.) నూనెగింజల పైరులుగాక నూనె లభించు ఇతర ద్రవ్యములు, ఉదా.నిమ్మగడ్డ, చందనము, సీమబాదము, కొబ్బరి మొదలగునవి, (Oil stuffs). 

యూకలిప్టస్ నూనె - (రసా.) (Eucalypatus oil) ఇది జామి కుటుంబము (Myrtaceae)నకు చెందిన Eucalyptus globulus, E. citriodora, అను చెట్ల యాకుల నుండి తీయబడు అస్థిరతైలము.
అస్థిర తైలము -  (వ్యవ.) గాలి పారినచో వాయురూపము నంది శీఘ్రముగా హరించిపోవు నూనెలు. (Volatile or essential oils). ఉదా. నిమ్మగడ్డి నూనె, గులాబినూనె మొ,వి.

జంబీరము - 1.నిమ్మ(నిమ్మ - జంబీరము), 2.మరువము.
కమ్మనిమ్మ -
తియ్యనిమ్మ.
మరువకము - మరువము, వాసన మొలక.
ముర - మరువము, వాసనగల మొక్క.

గజనిమ్మ - పెద్దనిమ్మ, లకుచము.
లకుచము -
గజనిమ్మ, రూ.లికుచము.
లికుచము - 1.గజనిమ్మ, 2.గంగరేగు.

సిట్రికామ్లము - (రసా.) ఇది నిమ్మ, దబ్బ మొ. పులుపు పండ్లరసము లో నున్న సేంద్రియామ్ల ద్రవ్యము, "నిమ్మపువ్వు"అనునది దీని ఘన ద్రవ్యము.

అండజము - 1.పక్షి, 2.చేప, 3.పాము, 4.తొండ(తొండ - సరటము), వ్యు. గుడ్డు నుంచి పుట్టినది.

అండాత్ జాయత ఇత్యండజః. జనీప్రాదుర్భావే. - గ్రుడ్డువలనఁ బుట్టునది.
విచిత్రం సరతీతి విసారః, సృ గతౌ. - విచిత్రముగాఁ జరించునది.

పక్షి - (పక్షములు గలది) పులుగు. పక్కి - పక్షి, పులుగు, సం. పక్షీ. చేఁప - మత్స్యము.

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము -
పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
చక్రధరము - పాము.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.

చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి -
పాము, చక్షుశ్రవము. 
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.  
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
లేలిహాసము - సర్పము, వ్యు.మాటిమాటికి నాలుక చాచునది.

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము(దంతము - పల్లు, కోర.), 4.చేప, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి. ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.

ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమద్విజుడు.
ద్విజానాం బ్రహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు. 
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః. - చంద్రుడు

దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతమునకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.

అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||
తా.
తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు రాజు, సిగ్గుగల వేశ్య(గణిక - 1.ఆడేనుగు, 2.వేశ్య.), సిగ్గులేని(సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.)లేని ఇల్లాలు చెడుదురు. - నీతిశాస్త్రము

ద్వితీయ స్వపరార్ధస్య వర్తమానస్య వైద్విజ
వారాహ ఇతి కల్పోయం ప్రథమః పరికీర్తితః. - మత్స్యపురాణం 

కొఱ - 1.పాఠీనము, 2.చేప, 3.కొఱ్ఱ ధాన్యము, 4.కొరత, వెలితి 5.ప్రయోజనము, 6.శిల్పము.

సహస్రదంష్ట్రము - పాఠీనము, వేయికోరలు గల చేప.
పాఠీనము -
ఒక రకమైన చేప.

సహస్రదంష్ట్రః పాఠీనః :
సహస్రం దంష్ట్రాః అస్య సహస్రదంష్ట్రః - వేయికోఱలు గలిగినది.
పాఠీం పృష్ఠ మున్నయతీతి పాఠీనః - పాఠీ అనఁగా వీఁపు; దాని నెత్తికొని యుండునది.
భక్ష్యతయా శాస్త్రే పఠ్యత ఇతివా పాఠీనః. పఠవ్యక్తాయాం వాచి. - శాస్త్రములయందు భక్యముగాఁ బఠింపఁబడినది. ఈ రెండు వేయికోఱలు గల మీను పేర్లు. 

చేప రసనేద్రియం జిహ్వ(నాలుక) వల్ల : ఇంద్రియ నిగ్రహం లేక నశించిపోతుంది.

రసజ్ఞా రసనా జిహ్వా :
రసం జానాతీతి రసజ్ఞా. జ్ఞా అవబోధనే. - రసము నెఱుఁగునది.
రస్యతే అనయా రసనా. రస అస్వాదనే. - దీనిచేత నాస్వాదింపఁబడును.
హ్వయతి రసవద్వస్తు జిహ్వా. హ్వేఞ్ స్వర్థాయాం శబ్దే చ. - రసయుక్తమైన వస్తువుల నిచ్ఛయించునది. ఈ మూడు నాలుక పేర్లు.

రసజ్ఞుఁడు - పండితుడు, విణ.రుచి నెరిగినవాడు, కళాసౌందర్యవేత్త.    రస - 1.నాలుక, 2.రసాతలము(పాతాళలోకము, అధోలోకము.).
రసన - నాలుక; నాలుక - నాలిక.
నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వ - నాలుక. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
జిహ్వాచాపల్యము - తినవలెననెడి కోరిక.

ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12 లేక ' డి ' లోపము వలన కలుగు వ్యాధి (Stomattis).  

లోల - 1.నాలుక, 2.లక్ష్మి, విణ. 1.కదలునది, 2.మిక్కిలి యిచ్ఛగలది.
మిక్కిలి -
విణ. 1.అధికము 2.శ్రేష్ఠము. ఇచ్ఛ - అభిలాష, కోరిక. అభిరుచి - 1.అత్యాసక్తి (మితిమీరిన ఆసక్తి) 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినవి (Taste).

రుచి - 1.ఇచ్ఛ 2. చవి, 3.కాంతి 4.సూర్యకిరణము.(లోకో భిన్నరుచిః) 
ౘవి -
1.రుచి, 2.రసము. ౘప్పరించు (నాలిక) - చవిచూచు.
రుచి - (రసా.) నాలుకతో గుర్తించ బడు వస్తుగుణము, ఉదా. పులుపు, తీపి, చేదు.

వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
భాతి -
1.కాంతి, 2.రీతి. 
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి. 
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
భా -
1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు.
భానువు - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు.
భామము - 1.కోపము, 2.రోషము, 3.సూర్యకిరణము.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్త్రబాంధవాః|
జిహ్వాగ్రే బంధసంప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం||
తా.
నాలుకవలన సంపద (గ)కలుగును, నాలుకవలన చుట్టాలు స్నేహితులు వత్తురు, నాలుకవలన సంకెళ్ళు ప్రాప్తమగును, నాలుకవలన చావును కలుగును. – నీతిశాస్త్రము

నరములేని నాల్క నాల్గువిధముల పల్కులు పల్క గలదు. 'జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి' లక్ష్మి నాలుక చివరన వసిస్తుంది. తీయని మాటకు లక్ష్మి నిలుస్తుంది. చేదు మాటకు పారిపోతుంది.

ముఖతస్తాలునిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే|
తతో నానారసో జజ్ఞే జిహ్వయా యో ధిగమ్యతే||

ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (Motive). (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).
శిల్పము - చిత్తరువు వ్రాయుట, శిల్పుల పని మొదలగునవి.
శిల్పి - శిల్పకారుడు, బొమ్మలు చెక్కువాడు. శిలకు రూపం శిల్పం. రాయికి(శిలకు) రూపం తెచ్చేవాడు శిల్పి.

స్థపతి - 1.శిల్పి, 2.అంతఃపురపు కావలివాడు, విణ.శ్రేష్ఠుడు. 
మూర్తీకళ -
(చరి.) విగ్రహాదులు చెక్కు శిల్ప విద్య (Sculpture).
మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
వాస్తుశాస్త్రము - శిల్పి, వాస్తుశాస్త్రము తెలిసినవాడు.
వాస్తుశాస్త్రము - దేవాలయములు, గృహములు, సౌధములు నిర్మించుట యందు యుక్తాయుక్తములదెలియుజేయు శాస్త్రము, వాస్తుకళ, శిల్ప శాస్త్రము, కట్టడములలో నేర్పరితనము (Architecture).
వాస్తుపతి - వాస్తోష్పత్తి, ఇంద్రుడు. 

ఓజు(ౙ) - 1.కమసాలి, 2.శిల్పి, 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.
శ్రేష్ఠి - కులమందు శ్రేష్ఠుడైన శిల్పి, కోమట్ల బిరుదు, విణ.కులశ్రేష్ఠుడు, వికృ. చెట్టి.
బత్తుఁడు - కంసాలివారి పట్టపు పేరు, వై.వి. భక్తుడు, సం.భక్తః.

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపసః|
బుద్ధఃస్సష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశు ర్భాస్కరద్యుతిః||

కలాదుఁడు-1.స్వర్ణకారుడు, 2.చంద్రుఁడు, 3.గురువు, ఉపాధ్యాయుడు.
పంచాణుఁడు -
1.స్వర్ణకారుడు, 2.శిల్పి.
స్వర్ణకారుఁడు - కమసాలి; కమ్మటీఁడు - కమసాలి. 
సొన్నారి - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.
సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
తట్ర - బంగారు పనిచేసి బ్రతుకుజాతి, అగసాలె, సం.త్వష్టా.
అగసాలి - కమసాలి, స్వర్ణకారుడు, బంగారు పనిచేయువాడు, రూ.అగసాలె. బంగారం లేనిదే కంసాలి ఆభరణాలు చెయ్యలేడు.

పశ్యలోహరుఁడు - కమసాలె, పచ్చెకాడు(పచ్చెకాఁడు – పచ్చిదొంగ), వ్యు.చూచుచుండగనే దొంగిలించువాడు.  
పచ్చియము -
చూచుచుండగ దొంగిలుట, సం.పశ్యతో హరణమ్.
పశ్యత్పాలుడు - శివుడు, ముక్కంటి. 

ఏల సమస్తవిద్యలు నొకించుక భాగ్యము కల్గియుండినన్
జాలు ననేకమార్గముల సన్నుతికెక్కు నదెట్లొకోయన్
రాలకునేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు వెట్టరెవేయివిధాలు! భాస్కరా.
తా.
రాళ్ళు విద్యలు నేర్వకున్నను, వానిని దేవతా విగ్రహముగా చేసినచో వాని పాదముల మీదబడి, పూవులతో వానిని మానవులు పూజింతురు. అటులనే కొంచెము భాగ్యమైనను గల మానవుడు అనేక రీతులుగ పొగడ బడుచుండును కాని, విద్యలు నేర్చినందున కాదు.      

రోహితము - 1. కుంకుడు పువ్వు, 2.నెత్తురు, 3.ఎరుపు, 4.ఎఱ్ఱచేప.
రాజి -
1.పంక్తి, 2.రేఖ.
బేడిస - ఒక రకము చేప. శకులము - బేడిస చేప.
తిమి - సముద్రమందలి ఒక చేప.
తిమింగిలము - తిమిని మ్రింగెడు చేప Whale.

రోహితో మద్గుర శ్శాలో రాజీవ శ్శకుల స్తిమిః, తిమింగిలాదయశ్చ :
రోహితత్వాత్ రోహితః - ఎఱ్ఱనై యుండునది.
జలే మజ్జతీతి మద్గురః. టుమస్ మజ్జనే. - జలమందు మునిఁగి యుండునది.
శలతిశీఘ్రం గచ్ఛతీతి శాలః. శల అశుగమనే. - శీఘ్రముగాఁ బోవునది. అరబు మీను.
రాజిః పఙ్తిరస్త్యస్య రాజీవః - మత్స్యముల వరుస గలిగినది. కొలువాసములను మీను.
శక్నోతి గంతుం శకులః. శక్ల శక్తౌ. - వేగిరముగాఁ బోవుటకు శక్తమయినది. బేడిసమీను.
తిమ్యతీతి తిమిః. ఇ. పు. తిమి ష్టిమ ఆర్ద్రీభావే. - ఆర్ధ్రమైయుండునది. నూఱుయోజనముల నిడుపుగల మీను.
తిమింగిలతీతి తిమింగిలః. గౄ నిగరణే. - తిమిని మ్రింగునది.
ఆదిశబ్దము చేత తిమింగిల గిలాదులును గ్రహింప బడుచున్నవి. తరుక్తం రామాయణే -  ' తిమింగిలగిలో ప్యస్తి తద్గిలో ప్యస్తి రాఘవ ' ఇతి. ఈ ఏడును వేర్వేరుగా నొక్కొక్క మత్స్య విశేషము పేర్లు.

శకులము - బేడిస చేప.
బేడిస -
ఒక రకము చేప.

మస్త్యానాం కవచప్రాయా స్థూలా శకులః, తద్యోగాచ్ఛకులీ. న. పు. పా. శకలీ - మత్స్యములకు కవచప్రాయమై స్థూలమైఉండు చర్మము శకులము; అది గలిగినది శకులి.

అదృష్టవంతుడిని సముద్రంలో పారేస్తే నోట చేప కరచుకుని పైకి వస్తాడు. - అరబ్ సామెత

శల్యపృష్ఠము - (జం.) వీనిచర్మములపై ముండ్లు అధికముగా నుండును. ఇవి సముద్రములో నుండు జంతువులు. ఈ జంతువులలో ప్రత్యేకమైన రక్తప్రసరణ మండలముగాని, విసర్జకమండలము గాని లేదు (Echinodermata), ఉదా. శల్యతారక. (Star-fish)    

మత్స్యపాలనము - (వ్యవ.) ఆహారము కొరకు వివిధ జాతుల చేపలను పెంచి అభివృద్ధి చేయుట (Pisici culture).      

కుంటముక్కు - ఒకానొక చేప.
కుంట -
1.కొలను, 2.పల్లము, రూ.గుంట, సం.కుండమ్.
కొలను - కొలఁకు.

మొట్టె - ఒకరకపు మత్స్యము.

రొయ్య - చిరుచేప, పొడవు మీసములుగల చేప.

వజ్జీరము - 1.వజ్రము, 2.మత్స్యము.
మగఱాయి - వజ్రము.
మగమానికము - వజ్రము.
మూలఱాయి - వజ్రమణి.
నిర్ఘాతము - 1.పిడుగు, 2.వజ్రము.

వజ్రాన్ని కూరగాయల సంతలో అమ్మబోతే దానికి పలికేది వంకాయల ధరే! - కబీరు

వజ్ర్రి - 1.ఇంద్రుడు, 2.బుద్ధుడు, 3.ఆకుజెముడు.

వజ్రో స్యాతివజ్రీ. న-పు. - వజ్రాయుధము గలవాడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.

(ౘ)చోఱ - ఒక తెగ చేప, రూ.చోర.
చోఱ -
చోర, విణ. బాలుడు.
చోఱబుడుత - 1.చోరమీనుపిల్ల, 2.చేపలవంటి కన్నులు గల స్త్రీ.     మచ్ఛె కంటి - (మచ్చెము + కన్ను) చేపల వంటికన్నులు గల స్త్రీ.
మచ్ఛెము - చేప, సం.మత్స్యః.
మత్స్యము - చేప.

చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా? వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.

పువ్వారలు - (జం.) మొప్పలు, నీటిలో నివసించు జంతువు (చేప మొ.) యొక్క శ్వాసావయములు (Gills).
మొప్పలు - చేప మెడ కిరు ప్రక్కల నుండు ద్వారములు.
పరిగె - 1.మత్యవిశేషము, 2.కోసిన చేనిలో దిగబడిపోయిన వెన్నులు.

పిధానము - (జీవ.) మూత, కొన్ని చేపల యొక్క పువ్వారములను మూసి యుంచు పైకవచము (Operculum).
అపిధానము - మరుగు, మూత, అచ్ఛాదనము, రూ.పిధానము.
మఱుఁగు - మఱుఁగు చోటు, క్రి.1.డాగు, చాటగు, 2.సంతాపించు.
డాగు - 1.గురుతు, 2.కర, మరక.
కఱ - 1.నలుపు, 2.మరక, సం.కాలః.
మఱక - 1.కఱ, 2.మేకపడ్డ, (రసా.) నూనె మొ.వానిచే కలుగుమచ్చ (Stain). కఱకంఠుఁడు - నీలకంఠుడు, శివుడు.
మూఁత -
1.మూకుడు, 2.బిరడ, 3.కనురెప్ప మూత.
మూఁకుడు - మట్టిమూత, శరావము.
శరావము - 1.మూకుడు, 2.మూత.
ఉదంచనము - 1.మూకుడు, 2.చేద, 3.ఎగజిమ్ముట, విణ.ఎగజిమ్ముటకు సాధనమైనది.
పిహితము - 1.కనురెప్ప మూత, 2.(అలం.) ఒక అర్థాలంకారము, విణ.కప్పబడినది.   

గడము1 - కుండలోనగువాని మూత, గడి.
గడము2 - 1.తెర, 2.కంచె, 3.అగడ్త, 4.విఘ్నము(అంతరాయము, అడ్డు), 5.గండె చేప, 6.ఒకానొక దేశము.
గడి - 1.ఎల్ల, సీమ, పొలిమేర, మేర, 2.చదరంగపు బల్లమీదిగడి, 3.సమీపము, 4.దుర్గము, కోట, 5.కోడెదూడ. 

కంటకి - 1.రేగు, 2.ముండ్లు గల చెట్టు, 3.చేప, విణ. కంటకము గలది. రేను - రేగు (బదరీ వృక్షము).

బదరి - 1.రేగుచెట్టు 2.ప్రత్తిచెట్టు 3.ఒక పుణ్యక్షేత్రము.

రేఁగు - 1.విజృంభించు, 2.పైకిలేచు, 3.ఉద్రేకించు, 4.హుంకరించు, వి. బదరీ వృక్షము.  
విజృంభణము - ఎగసిపాటు, ఉద్రేకము చెలెరేగుట.
ఉద్రేకించు - 1.విజృంభించు, 2.అతిశయించు.
హుంకారించు - హుమ్మని ధ్వనించు, రూ.హూంకృతి.

పదరు - 1.త్వరపడు, 2.కోపించు, 3.చలించు, 4.అక్షేపించు, వి.త్వరితపు మాట.

చలనము - 1.కదులుట, 2.తిరుగుట, (భౌతి.) ఒక ప్రదేశము నుండి అన్య ప్రదేశమునకు ప్రయాణించుట. (Motion)
చరించు - 1.కదలు, 2.తిరుగు, 3.చేయు.

మాత్సర్యము - చలము, మత్సర్యము.
మత్సరము -
మచ్చరము, క్రోధము.
అంౘలము - 1.చలము, మాత్సర్యము 2.కోపము.
చలము - 1.చలించునది, 2.వణుకునది 3.వి.వణుకు.
కోపము - కినుక, క్రోధము.

క్షత్త - 1.బ్రహ్మ, 2.సారథి, 3.దాసీపుత్రుడు, 4.శూద్రస్త్రీ యందు క్షత్రియునకుగాని, క్షత్రియస్త్రీ యందు శూద్రునికినిగాని పుట్టినవాడు 5.చేప, 6.రోకలి.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు. (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, మరీచి).

తేరు - 1.కలుగు, వై.వి. 1.రథము 2.బండి, సం.రథః.
తేరుపూన్పరి -
సారథి.
సారథి - 1.తేరునడుపువాడు 2.నియంత.
నియంత - తేరునడపువాడు, విణ.నడపువాడు, సం.వి.(చరి. రాజ.) సర్వాధికారి, అధినాయకుడు (Dictator).  
క్షత్తా స్యాత్సారథౌ ద్వార్ స్థే క్షత్రియాయం చ శూద్ర జే : క్షత్తృ శబ్దము సారథికిని, వాకిలిఁ గాచువానికిని, శూద్రుని వలన క్షత్రియ స్త్రీ యందుఁ బుట్టినవానికిని పేరు.  
క్షదతీతి క్షత్తా. ఋ. పు. క్షద గతిహింసనయాః - పీడించువాఁడు.
చేప - Fish. 
రోఁకలి - దంచుసాధనము, ముసలము-రోకలి, సం.గోకీలః. మామిడికర్ర తోనే రోకలి చేయడము.

ఉలూఖలము - రోలు, రూ.ఉదూఖలము.
కక్కు -
 క్రి. 1.కడుపులోనిది వెలిపుచ్చు, వి.విసురురాయి, రోలు మొ.కి కలుగుజేసెడు గరుకు. రోట్లో తలపెట్టి, రోకలిపోటుకు వెరుస్తే ఎలా?

ముసల మాయుధ మస్యాస్తీతి ముసలీ. న-పు. - రోఁకలి ఆయుధముగాఁ గలవాఁడు, బలరాముడు.   

దృతి - 1.తిత్తి, 2.తోలు, 3.చేప.
తిత్తి -
1.చిన్నసంచి, 2.కొలిమి తిత్తి, 3.సుతితిత్తి, సం.దృతి.
తోలు - పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
దృతిక - (జం.) (Utriculus) చెవిలో మధ్య గుహ, (Vestibute) యొక్క పై భాగము.

ఆటి - 1.ఒక జాతి బాతు, 2.ఆడేలు పిట్ట, 3.ఒక రకపు చేప.
శరారి -
బాతు.
ఆడెలు - ఆడి(ఆడి - ఆటి.), ఒక జాతి పక్షి, రూ.ఆడేలు.

శరారి రాటి రాతిశ్చ -
శరం నీరం హింసాం వా ఋచ్ఛతి శరారిః - నీటిని గాని హింసనుగాని పొందునది. ఋ గతౌ.
అటతీత్యాటిః. సీ. అట గతౌ. - చరించునది.
అతతీత్యాతిః. సీ. అత సాతత్యగమనే. - ఎల్లప్పుడు తిరుగునది. ఈ మూడు 3 ఆఁడేలను పక్షి పేర్లు.

మీనవల్లంకి - ఒకానొకపిట్ట, రూ.మీనవల్లఁకి, సం.మీనవల్లికా.

లకుమిక - చేపలబట్టు పిట్ట, తిట్టిభము.
ఉల్లంకి - చేపలను, పురుగులను తిను ఒక జాతి పిట్ట.

ఆకాశంలో పక్షికి నీటిలోని చేప ఆహారం! చేప కనిపించే వరకు కొంగకు యోగదృష్టి అభాసమే. కొంగలు సరస్సులోని చేపలనీడను పట్టి రయ్యిన దిగి, చేపలను నోట కరచు కొని ఎగురుతాయి!

బెస్త - 1.ఒక తెగ బోయ (చేపలు పట్టుట, పల్లకి మోయుట వీరి వృత్తి).
మాలుగు -
1.బెస్తల భుజముల మీది తడిమడత, 2.సోమరితనము.
ధీవరుఁడు - జాలరి. (ౙ)జాలరి - చేపల పట్టువాడు.
కైవర్తుఁడు - 1.జాలరి, 2.పడవ నడుపువాడు, 3.నీటిలో వర్తించువాడు.
నావికుఁడు - ఓడ నడుపువాడు.   

పొల - 1.మాంసము, 2.దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.ఫలమ్.
పొలను -
1.మాంసము, 2.మాంసపు దుర్గంధము, 3.చేపమీది పొట్టు, సం.ఫలమ్.
ఎఱచి - పొల, మాంసము. దుర్గంధము - చెడువాసన.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీద పొలుసు, 8.తునక, విణ.అల్పము.

మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః. మదీ హర్షే. - మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.
మీయతే ధీవరేణమీనః. మీఙ్ హింసాయాం. – జాలరి వానిచేత హింసింపఁ బడునది.

నీళ్ళలోన మీను నెరమాంస మాశించి
గాలమందుఁజిక్కు కరణి భువిని  
ఆశదగిలి నరిడు అల్లగె చెడిపోవు విశ్వ.
తా.
నీటిలో చేప ఎర్రయొక్క మాంసమునకు ఆశపడి(మత్స్యము ఆకలిగొని గాలముచే)గాలమునకు చిక్కుకున్నట్లుగ నరుడు(నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.)ఆశచేత ఆ చేప రీతిగనే చెడిపోవు చున్నాడు.

ఊఁత1 - 1.ఊనిక, అవలంబము 2.చేపలు పట్టు సాధనము.
ఊఁత2 - (భౌతి.) దేనికైన ఆధారమగు నట్టిది (Support).
ఊఁతకోల - ఊనుకొనెడి కఱ్ఱ, ఆధారముగ పట్టుకొను కఱ్ఱ 2.రక్షణము. దండగోల - 1.ఊత, 2.ఊతగఱ్ఱ.
ఊఁదు - 1.వాచు, 2.నిప్పు మొ. వానిని రగులజేయు, 3.శంఖము మొ. వానిని శబ్దింపజేయు, 4.ఉంచు, 5.ఊఁతతో చేపలుపట్టు.

వల - 1.చేపలుపట్టు జాలము, 2.సమూహమునందు వలను శబ్దపు రూపము, ఉదా. వలను+కడ = వలకడ.
వల - వై.వి. కామము, సం.వల్.
(ౙ)జాల - 1.జాలము, చేపలపట్టు, 2.కిటికీ, సం.జాలమ్.
(ౙ)జాలము - చాగు, ఆలస్యము.
(ౘ)చాగు - 1.పోవు, 2.ప్రవర్తిల్లు, 3.యత్నించు, రూ.సాగు.
(ౘ)చాఁగు - 1.దీర్ఘమగు, 2.దండాకారముగ నేలకు వ్రాలు, అవ్య.ప్రశంసార్థకము, రూ.సాగు.
(ౙ)జాలరి - చేపల పట్టువాడు. 

Fish for a person, you feed him a meal; teach him how to fish, and you feed him for a lifetime.

బడిశము - గాలము.
గాలము -
1.చేపలను పట్టు వంపు గల కొక్కిబడిశము, 2.నూతిలో పడిపోయిన చేద మొ.వి.తీయు సాధనము.
ద్రొబ్బుడుపటము - చేపలను పట్టుటకు కుపయోగించు సాధనము.
ద్రొబ్బు - క్రి.పడద్రోయు.

బడిశం మత్స్యబన్ధనమ్ :
బలినః మత్స్యా న్ శ్యతీతి బడిశం. శో తనూకరణే. - బలముగల మత్స్యములను కృశముగాఁ జేయునది. లడయోరభేదః.
మత్స్యాః బధ్యంతే అనేన మత్స్య బంధనం. బన్ధ బంధనే. - మత్స్యములు దీనిచే బంధింపఁబడును.
పా. మత్స్యాః విధ్యంతే యేన తత్ మత్స్యవేధనం వ్యధతాడనే. - మత్స్యములఁ బీడించునది. ఈ మూడు గాలము పేర్లు.

భక్ష్యోత్తమప్రతిచ్ఛన్నం మత్స్యో బడిశమాయసమ్ |
లోభాభిపాతీ గ్రసతే నానుబంధమవేక్షతే ||

చప చక్కని తినుబండారంలాగా కనపడే ఇనుపగాలాన్ని దురాశకు లోనై మింగుతుంది. దానివల్ల జరుగబోయే అనుబంధాన్ని/కీడును గమనించదు.

సంసారజాలపతితస్య జగన్నివాస!
సర్వేన్ద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య!
ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. 

వస్తాడు పోతాడు నాకోసం - వచ్చి కూర్చున్నాడు నీ కోసం, సగంచచ్చి వున్నాను నీ కోసం పూర్తిగా చస్తావు నాకోసం. – ఎర-చేప  

రావణుడు సీతను 'వింద' నామకమను ముహూర్తమున అపహరించి నందుకు ఎర తగిలించు కొక్కెము పట్టుకొనిన మత్స్యం వలె నశించును అని జటాయువు పలికెను.

పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరు కాలము. February, March నెలలు, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు శిశిర ఋతువు. 

26. పూరాభాద్ర, ఉత్తరాభాద్ర - రెండేసి 4 నక్షత్రములుండును.

భాద్రపద - 1.ఉత్తరభద్ర పదా నక్షత్రము, 2.ఇరువది యారవది.

స్యూర్నభస్య ప్రౌష్ఠపద భాద్ర భాద్రపదా స్సమాః :
నభాంసి మేఘాః తేషుసాధు ర్నభస్యః. - నభస్సులనఁగా మేఘములు, వాని యందు సమర్థమైయుండును.
ప్రోష్ఠపదా నక్షత్రయుక్తా పూర్ణిమా స్మిన్నితి ప్రోష్ఠపదః - ప్రోష్ఠపదా నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁగలదు.
భాద్రపదైన భాద్రా, 'నామైక దేశేనామ గ్రహణ ' మితిన్యాయత్. - భీమోభీమసేన ఇతివత్. భాద్రయుక్తా పూర్ణిమా స్మిన్నితి భాద్రః. భాద్రపదశ్చ - భాద్రపద నక్షత్రమే భాద్రము, భాద్రనక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు. ఈ నాలుగు 4 భాద్రపద మాసము పేర్లు.

అహిర్బుధ్నియః ప్రథమా న ఏతి | శ్రేష్ఠో దేవానాముత మానుషాణామ్ | తం బ్రాహ్మణాస్సోమపాస్సోమ్యాసః | ప్రోష్ఠపదాసో అభిరక్షంతి సర్వే | చత్వార ఏకమభి కర్మ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వదంతి | తే బుధ్నియం పరిషద్యగ్గ్ స్తువంతః | అహిగ్ం రక్షంతి నమసోపసద్య ||26|| 

అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.

త్రీణిలోచనాని యస్యసః త్రిలోచః - మూడుకన్నులు గలవాఁడు.
త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః - మూఁడుకన్నులు గలవాఁడు.

త్ర్యంబకుఁడు - శివుడు, ముక్కంటి.
త్యంబక సఖుఁడు -
కుబేరుడు.

ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు -
కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.

మిక్కిలి కంటి వేల్పు - ముక్కంటి.
మిక్కిలి -
విణ. 1.అధికము 2.శ్రేష్ఠము.

బేసికంటి - (బేసి + కన్ను) ముక్కంటి.
బేసి -
విషమము, సమముకానిది, విణ.(గణి.) సరిగాని సంఖ్య(Odd). 1, 3, 5, 7 వంటివి, చూ. (ఆయుగ్మ సంఖ్య).
విషమము - సమము కానిది.
విషమాక్షుడు - శివుడు, వ్యు.బేసి కన్నులు కలవాడు.

బేసి కైదువుజోదు - అసమశరుడు, మన్మథుడు.
అసమశరుఁడు -
మనమథుడు. 
కైదువు - ఆయుధము.
(ౙ)జోదు - యోధుడు, యుద్ధముచేయువాడు, సం.యోధః.

ముక్కంటి చుక్క - ఉత్తరభాద్ర పదా నక్షత్రము, ఆర్థానక్షత్రమని కొందరు. 

చుక్క- 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః 2.చుక్రః.

శుక్రో దైత్యగురుః కావ్య ఉశనా భార్గవః కవిః :
శుక్ల వర్ణత్వా చ్ఛుక్రః - శ్వేతవర్ణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేణ నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రుని రేతస్సు వలనఁ బుట్టినవాఁడు.
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రదానే - దేవతలను దుఃఖము నిచ్చువాఁడు.
దైత్యగురుః. ఉ-పు. - దైత్యులకు గురువు.
కవే రపత్యం కావ్యః. - కవియను ఋషి కొడుకు.
వష్టి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః. న పు. వరకాంతౌ - అసురుల శ్రేయస్సు నిచ్ఛయించువాఁడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు.
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యము చేత వర్ణించువాఁడు. ఈ ఎనిమిది శుక్రుని పేర్లు.      

శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని వ్యు.తేజస్సు కలవాడు నవగ్రహములలో నొకటి (Venus). అంతఃశుద్ధికి శుక్రుడు.
ఒంటికంటి గాము -
శుక్రుడు. కావ్యుఁడు - శుక్రుడు. 
భృగువు - 1.ఒక ముని, భృగు మహాముని  భార్య పులోమ, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు. భార్గవదర్ప వినాశక రామ్.
భార్గవి -
1.లక్ష్మి 2.పార్వతి. భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.
పరశురాముడు - జమదగ్ని మహర్షికిని రేణుకకును పుట్టినవాడు.
ఖండ పరశువు - 1.శివుడు, 2.పరశురాముడు.
ఖండపరశుః ఉ-పు. ఖణ్డయతీతి ఖణ్డః ఖణ్డః పరశుర్యస్య సః ఖణ్డపరశుః - ఖండించెడు గండ్రగొడ్డలి గలవాఁడు. ఖండపర్శుః అని రూపాంతరము.
ఖండ భేదనే. ఖండః ఖండితః పరశురిత్యసురో నేనేతివా - పరశు వనెడు రాక్షసుఁడు ఇతనిచే ఖండింపఁబడెను. 
కదాచిత్ఖండితో స్య పరశురితి వా - ఒకానొకప్పుడు ఈయన పరశువు(గండ్ర గొడ్డలి) ఖండిత మాయెను.
రేణుక - 1.గంధ ద్రవ్యము, 2.జమదగ్ని భార్య.
కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటి కాకి.   
కుశీలవుఁడు - 1.చారణుడు, 2.నానాదేశ  సంచారియైన నట్టువుడు, 3.వాల్మీకి 4.బట్టువాడు.
చారణుఁడు - 1.నానాదేశ  సంచారకుడైనట్టి నటకుడు, 2.దేవతలలో చారణ తెగకు చెందినవాడు.

సుధన్యా ఖణ్ణ పరుశుః దారుణో ద్రవిణః ప్రదః|
దివిద్పృక్ సర్వ దృగ్వ్యసో వాచస్పతి రయోనిజః||

ఎదురుచుక్క - 1.అశుభప్రదము, 2.అనిష్టము, 3.కూడనిది. (శుక్ర నక్షత్రము ఎదురుగున్నప్పుడు ప్రయాణించుట కూడదందురు.)

ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.

27. రేవతి - చేపవలె 32 నక్షత్రములుండును.
రేవతి -
1.ఇరువది ఏడవ నక్షత్రము, 2.బలరాముని భార్య.

రేవతి ప్రకృతి కళవల్ల పుట్టింది. పితృదేవతల మానస పుత్రియై హిమగిరి పత్నియైన మేనక, ప్రకృతి కళవల్ల పుట్టిన స్త్రీ.

మీనురూపు రిక్క - రేవతీ నక్షత్రము.
కడ చుక్క - రేవతీ నక్షత్రము.

పూషా రేవత్యన్వేతి పంథామ్ | పుష్టిపతీ పశుపా వాజబస్త్యౌ | ఇమాని హవ్యా ప్రయతా జుషాణా | సుగైర్నోయానైరుపయాతాం యజ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ రక్షతు రేవతీ నః | గావో నో అశ్వాగ్ం అన్వేతు పూషా | అన్నగ్ం రక్షంతౌ బహుధా విరూపమ్ | వాజగ్ం సనుతాం యజమానాయ యజ్ఞమ్ ||27||    

పూషుఁడు - సూర్యుడు. సూర్యుఁడు - వెలుగురేడు.
పుష్ణాతీతి పుషా. న. పు. పుష పుష్టౌ - పోషించువాఁడు.

మేన1 - మేనక. ఒక పేరుంది - అ పేరుకు మధ్య అక్షరం తీసేస్తే నాలుగు కాళ్ళ జంతువు పేరొస్తుంది - మే(న)క.
మేనకాయాః ఆత్మజా మేనకాత్మజా - మేనక కూతురు, పార్వతీదేవి.    
మేన2 - తోడబుట్టిన దాని యొక్కయు, తల్లిదండ్రుల తోడబుట్టిన వారి యొక్కయు దేహసంబంధము, ఉదా. మేనకోడలు, మేనత్త.

మైనాకుఁడు - హిమవంతుని కొడుకు, మైనకాత్మజుడు.

వ్రతినీ మేనకా దేవి బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ,
ఏకాక్షరపరా తారా భవబంధ వినాశినీ.

అంబిక - 1.తల్లి, 2.మేనత్త, 3.పార్వతి, 4.ధృతరాష్ట్రుని తల్లి.
జగన్మాతృత్వా దంబికా -
లోకముల తల్లి. అంబతే జనయతి సర్వ మంబికా - సమస్తమును జనింపఁజేయునది. అంబ జననే.       అమ్మిక - పార్వతి, దుర్గ, సం. అంబికా.

పురుషార్థ ప్రదా పూర్ణా భొగినీ భువనేశ్వరీ,
అంబికా నాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా. -
69శ్లో

ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.

భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రం యుతేనచ|
సేతుస్స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృ వందనే||
తా.
ఆరుమారులు భూప్రదక్షిణంబులు, పదివేలమారలు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున కలుగు ఫలము తమ తల్లికి ప్రీతిపూర్వకముగా వందన (వందనము - 1.పూజ, 2.స్తోత్రము 3.నమస్కారము)మాచరించుటవలన కలుగును. - నీతిశాస్త్రము       

కొనరిక్క - రేవతీ నక్షత్రము, అశ్వని మొ. వానిలో చివరి నక్షత్రము.
కొన -
1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపు జూలు. 
చివర - 1.కొన, 2.అగ్రము.
అగ్రము - 1.ఎదురు, 2.సమీపము, 3.కొన, విణ.మొదటిది, (భూగో.) సముద్రములోనికి చొచ్చుకొని పోయిన నేలకొన.

కడ(ౘ)చుక్క - రేవతీ నక్షత్రము.
కడ -
1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కాష్ఠ - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర. 

దిక్కు - 1.శరణము 2.దిశ, స్థానము, నెలవు.
దిశ -
దిక్కు, దెస (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కులలో నొకటి.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా 2.దశా. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది.
శరణము - 1.రక్షకము, రక్షణము, 2.గృహము. 
గృహము - 1.ఇల్లు 2.భార్య.

శరణం గృహరక్షిత్రోః :
శరణ శబ్దము ఇంటికిని, రక్షించువానికిని పేరు. శీర్యతే శృణాతి దుఃఖాదికమితి శరణం. శౄ హింసాయాం. నశించునది. దుఃఖాదులను జెఱుచువాఁడును గనుక శరణము. "ప్రతిశరణమశీర్ణ జ్యోతిరగ్న్యాహితానా" మితి గృహే ప్రయోగః. 'శర్ణం తరుణేందుశేఖర"' ఇతి రక్షకే ప్రయోగః.'"శరణం రక్షణే వధ"ఇతి విశ్వప్రకాశః.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

ఆశ - 1.కోరిక 2.దిక్కు. ఆశ కంతము లేదు, నిరాశకాదిలేదు.
ఆస - అపేక్ష 3.దిక్కు, సం.ఆశా.
అపేక్ష - కోరిక, కాంక్ష.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.

మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.

అంక - పార్శ్వము, ప్రక్క, రూ.అణక.
అణక - ఎద్దు మెడమీద కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.
క్రేవ - పార్శ్వము.
పార్శ్వము - 1.ప్రక్క 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), విం. విణ. (జీవ.) క్రన్నులనుండి బయలు దేరినది (Latral).

అంతము -1.తుద, 2.చావు, 3.స్వభావము, విణ.1.సమీపము, 2.రమ్యము. 
తుద - చివర, కడ, అంతము, రూ.తుది.
చివర - 1.కొన, 2.అగ్రము.

మృతి - చావు.
మృత్యువు -
1.చావు, 2.మరణాధిదేవత.
మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మిత్తిగొంగ(గొంగ - శత్రువు) - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు.

స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము. 
సహజము - స్వభావము, విణ.కూడ బెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది, (Normal). 

రమ్యము - ఒప్పిదమైనది.
రమణ - 1.ఒప్పిదము, 2.ప్రీతి, సం.రమణమ్, రమ్యమ్. రామతీర్థము నందు దేవీస్థానం రమణ.

సదేశము - సమీపము.
సమీపము -
చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
చేవాటు - సమీపము. చేయలఁతి - సమీపము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము.
చేరుగడ - 1.సమీపము, 2.దిక్కు, 3.శరణము.
చేరువకాడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.

తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 3.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).  

స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ద మప్పటి నిలుకడ.
ఉనికి -
1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువూన్నచోటు (Position).
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెలవుకొను - క్రి.1.నిలుకడయగు, 2.నిలుచుండు, రూ.నెలకొను.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు -
చంద్రుడు, చుక్కలరాయుడు.
చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు. 

చుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.

జీవనమింకఁ బంకమున జిక్కినమీను చలింపకెంతయున్
దాపుననిల్చి జీవనమె తద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తాపక భక్తియోగమున దాశరథీ కరుణాపయోనిథీ.
తా.
చేఁప నీళ్ళు ఎండిపోయిన బురదలో చిక్కుకొన్నను, ఆ చోటును విడిచి కదలక అందే నిలిచి నీళ్ళనే తుదకు గోరునట్లు, నీయందలి చింతనము నందే గుఱియుంచి ఎన్ని కష్టములు వచ్చినను దానిని వదలక యుండు వాడు. అట్లుండుటచే నీయెడల భక్తి (యు)ఉదయించి ఆ భక్తియోగమున సంసారము దాటునని తాత్పర్యము.

కా తే కాంతా కస్తే పుత్రః - సంసారో య మతీవ విచిత్రః,
కస్య త్వం వా కుత ఆయాతః - తత్వం చింతయ తదిహభ్రాతః. - భజగోవిందం

   26936_399119006400_312220151400_4408057_3145113_a

Wednesday, June 20, 2012

కుంభరాశి

ధనిష్ఠ 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 3 పాదములు - కుంభరాశి, కడవ.

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

కుంభము - 1.కుండ, 2.ఏనుగు నెత్తి మీద గుబ్బ, 3.పదునొకండవ రాశి (Convex - కుంభకార).
కుండ -
1.మట్టిపాత్ర, 2.ఇరుసు తగిలించెడి బండి కంటి నడుమ గుబ్బ, 3. ఏనుగు కుంభస్థలము, 4.స్పోటకపు పొక్కు, సం.కుండమ్.
కుండరాశి - కుంభరాశి Aquarius.

కుమ్భౌ ఘటేభ మూర్ధాంశౌ : కుంభశబ్దము కడవకును, ఏనుగు కుంభస్థలమునకును పేరు.
కుంభతీతి కుంభః. కుభి ఆచ్ఛాదనే. - కప్పియుండునది.
"కుంభస్స్యా త్కుంభకర్ణస్య పుత్రే వారాంగనాపతౌ, రాశిభేదే మానభేదే గుగ్గులు త్రివృతోరపి, కుంభీతు పాటలా వారిపర్ణీ పిఠరకట్ఫలే"ఇతి శేషః.

కుంభాకార - (భౌతి.) గోళకేంద్రమునకు వెలుపల నున్న తలము, విణ.పరావర్తన తలముగా పనిచేయు (దర్పణము) (Convex). కుమ్భౌతు శిరసః పిణ్డౌ :
కుంభాకృతి యోగాత్కుంభౌ. అ. పు. - కుంభముల వంటి యాకారము గలవి.
శిరసః పిణ్డౌ - ఏనుఁగుతల మీఁద నుండు మాంసపుంజములు రెండును కుంభము లనంబడును. కుంభస్థలము.

సమ దేవి ! స్కంద - ద్విపవదన పీతం స్తనయుగం
త వేదం నః ఖేదం - హరతు సతతం ప్రస్నుతముఖమ్|
య దాలోక్యా శంకా కులితహృదయో హాసజనకః
స్వకుమ్భౌ హేరంబః - పరిమృసతి హస్తేన ఝడితి|| - 72శ్లో
తా.
ఓ దేవీ! పాలుకారుచున్న నీ స్తనద్వయమును జూచి, స్తనముల యొక్క స్తన్యపానం చేస్తున్న వినాయకుడు,(ద్విపము - ఏనుగు, వ్యు.రెంటితో త్రాగునది.)తన తలమీద కుంభము లేమో యని(యిక్కడకు వచ్చినవేమో యని)సంశయచిత్తుడై నవ్వును గలిగించుచు వినాయకుడు(హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.)తన కుంభములను తడవుకొనుచున్నాడు. సమముగ  కుమారస్వామి(స్కందుఁడు - కుమారస్వామి)చేతను, వినాయకుని(ద్విపవదనుడు)(వదనము - నోరు, ముఖము)చేతను త్రాగబడిన నీ కుచయుగము మా దుఃఖములను తొలగించుగాక! - సౌందర్యలహరి

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్|
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం
భజే శారదాంబా మజస్రం మదంబామ్.

కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి....

బాండువ - కుండ, సం.భాండః.
బాన -
కడవ, సం.భాండః.
భాండము - 1.తొడవు, 2.మట్టి పాత్రము, 3.ప్రస్తువు.
తొడవు - భూషణము; భూష - భూషణము, తొడవు.
మండనము - 1.భూషణము, 2.అలంకరించుకొనుట. 
ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ - భూషణము; భూషణము - అలంకరణము. 
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది. 

ఆబంధము - 1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.

కుండమార్పు - ఒక టిచ్చి మరియొకటి పుచ్చుకొనుట.

ఘటము - 1.ఎళనీరుకాయ, 2.కడవ, 3.కుంభస్థలము.
కలశము -
ఘటము, కుండ.
ఘటోద్భవుఁడు - అగస్త్య మహర్షి. 

సృష్టి మొత్తంలో బరువైనవాడు. - అగస్త్యుడు.

ఎళనీరు - ఎడనీరు.
ఎడనీరు -
లేతటెంకాయలోని నీరు, రూ.ఎలెనీరు, ఎళనీరు.
ఎలనీరు - లేత టెంకాయలోని నీరు, రూ.ఎడనీరు, ఎళనీరు. 

రాజమందిరం చినదానా - రాజావారికి నచ్చే జాణా - చేద వేయకుండా - నీళ్ళు తోడకుండా చేయి తడపకుండా దాహానికి నీళ్ళు తేవే. - కొబ్బరి బొండం   
బావినిండా నీరే పిట్టకందదు - ఎలుకకందదు. - కొబ్బరిబొండం  

ముక్కంటిపండు - కొబ్బరికాయ. 
టెంకాయ -
కొబ్బరికాయ, (తెన్ = దక్షిణము, అచట, ఎక్కువగా దొరుకుకాయ.)
తెంకాయ - టెంకాయ.
బొండము - పెచ్చుతో కూడిన టెంకాయ, కొబ్బరి బొండము, రూ.బొండాము, బొండలము, బొండ్లము, బొండ్లాము.
నారికడము - నారికేళము, కొబ్బరికాయ, రూ.నారికేడము, సం.నారికేళః.
నారికేడము - నారికడము; కరరీఫలిని - నారికేళము.

గళ్ళెము - పాలమీగడవంటి లేత కొబ్బెర.
ఒంటి స్తంభంమీద చలువ పందిరి - చలువపందిరిలోన చలువ నీటికుండ - చలువ నీటికుండలోన చవులూర మీగడ. - టెంకాయ లేతకొబ్బరి 

కదళీపాకములు - (అలం.) ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళపాకము.

ఇందీవరాక్ష ! నీ ఇల్లెక్కడన్న
తలనీరుమోసెన త్తరువు క్రిందనియె - కొబ్బరి చెట్టుక్రింద  

ఆజగామ యదాలక్ష్మీ ర్నారికేళ ఫలాంబువత్|
నిర్జగామ యదాలక్షీ ర్గజభుక్త కపిత్థవత||
తా.
సంపద వచ్చునపుడు టెంకాయ(కొబ్బరికాయ)యందలి జలమువలె తనంతట వచ్చును. పోవునపుడు (డే)ఏనుఁగు(గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగములలో ఒకటి.)భక్షించిన వెలగపండు వలె పోవును. - నీతిశాస్త్రము

కురుడి - లోపలి నీరింకిన కొబ్బెర.
కుడుక -
తక్కెడ తట్ట.
కొబ్బెర - చిప్ప తీసిన టెంకాయ, టెంకాయ లోని పేళము. 

కంబరత్రాఁడు - కొబ్బరి పీచుతో పేనిన త్రాడు.
కీతు - కొబ్బరియాకుల చాప.
మట్ట - 1.కొబ్బరి, తాటి మొ. వాని ఆకులకొమ్మ, 2.మొ. ఆవు వానితోక.

బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.
అసలు నీకు బుఱ్ఱ లేదా! బుర్ర లేకుండా మాట్లాడకు. బుఱ్ఱ వున్నవాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు(తెలివితక్కువ తనానికి కోప్పడే మాట). 
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయ చిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీదిపోలుసు, 8.తునక, విణ.అల్పము.
అగప - 1.టెంకాయ చిప్ప, కొయ్య గరిటె, 2.ఓడల మురికిని గోకి శుభ్రము చేయు కొయ్యగుద్దలి, రూ.అవక, అబక. అబక - అగప. 

అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు.   

తేఁజెట్టు - టెంకాయచెట్టు, రూ.తేమ్రాను, తెన్+చెట్టు = దక్షిణచేశపు చెట్టు. 
తృణరాజము -
1.తాటిచెట్టు, 2.కొబ్బరిచెట్టు, 3.గిరకతాడిచెట్టు.
తృణద్రుమము - కొమ్మలు లేని తాటి, కొబ్బరిచెట్ట్లు మొదలగునది. 

వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజః చర్మాంగధారీ నచసోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణిః జలంచ బిభ్రన్న ఘటోన మేఘః. - కొబ్బరికాయ   
చెట్టుపైన నివాసం - పక్షిగాని - చర్మధారినిగాని సోమయాజిగాను - ముక్కంటిని నేను త్రినేత్రుడనుగాను - నీరు గల్గియుంటి - మేఘుడను కాను. - కొబ్బరికాయ
ఆకాశాన అంబు-అంబుకులో చెంబు-చెంబులో చారెడునీళ్ళు. - టెంకాయ
సూర్యుడు చూడని గంగ - చాకలి ఉతకని మడుగు. - టెంకాయ
చెక్కని స్తంభం - చేయనికుండ పోయనినీరు వెయ్యనిసున్నం. - కొబ్బరికాయ
చెయ్యనికుండ - కురియనినీరు - వెయ్యనిసున్నం తియ్యగనుండు. - కొబ్బరికాయ     
చెట్టుకొమ్మలో పిట్ట - పిట్టకు మూడుకళ్ళు - పొట్టనిండా కడవెడు నీళ్ళు. - కొబ్బరికాయ   
నిటారు నిలువలు - పటాకు బయళ్ళు - మజ్జిగ ముంతలు - మాణిక్యాలు. - కొబ్బరికాయలు
మంచమంత ఆకు - ముంతంత కాయ. - టెంకాయ
కొప్పుందిగానీ జుట్టులేదు - కళ్ళున్నాయిగాని చూపులేదు. - టెంకాయ 
మూడు కండ్లవాడు ముక్కంటి మరికాడు - తలకు పిలకయుండు తాతగాడు - తాత గుడికిపోవ తలకాయ పగెలెరా ! - కొబ్బరికాయ    
బొచ్చుకాయ. - కొబ్బరికాయ
గుండ్రాయికి గుప్పెడంత పిలక - మూడు కళ్ళు. - టెంకాయ  
చుట్టూకంప - కంపలో పెంకు - పెంకులో శంఖు - శంఖులో తీర్థం. - టెంకాయ    
గుడిలో నీళ్ళు - గుడికి తాళం. - కొబ్బరికాయ
సన్నని నూతికి దారులు లేవు. - కొబ్బరికాయ    

కంచుక పత్రాధారము - (వ్యవ.) కొబ్బరి మొ.మొక్కల ఆకుల మొదళ్ళు కనుపులచుట్టును ఒరవలె అమరి యుండునది (Sheathing leaf base).

గండిక బరిణె పురుగు - (వ్యవ.) కొమ్ము పురుగు, ఎన్నెమ్మ పురుగు, (ఇది బరిణె పురుగు కుటుంబములోనిది, కొబ్బరిచెట్ల మొవ్వులను కొట్టివేయును (Oryctes rhinoceros).
ఎన్నెమ - పురిటిపురుగు, రూ.ఎన్నెమ్మ, ఎనెమ్మ.

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలముభంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుధావహమునగును భువిలో సుమతీ.
తా.
నారికేళ వృక్షమునకు ఎంత నీరిపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళములిచ్చును. అటులనే శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారం అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగ జేయును.  

ఆరక్షము - రక్షించునది, సం.1.రక్షణము, 2.ఏనుగు కుంభముల క్రింది చోటు, 3.సైన్యము.
కాపు -
1.కాపుగడ, రక్షణము, 2.కాయలు కాచుట. 
రక్షణ - (గృహ.) కాపాడుట, (Protection).
సైన్యము - 1.సేనతో కూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరిగుఱ్ఱములలో నొకటి.
మేఘపుష్పము -
1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.

నీరుమోపరి - 1.కడవ 2.మేఘము, మబ్బు.

దానమున్ చేయఁ గోరిన వద్యాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైన (బ)పరోపకారమునకై యొకదిక్కునఁ దెచ్చియైన నీఁ
బూనును, మేఘు డంబుధికిఁబోయి జలంబుల దెచ్చి యీఁయడే
వాన, సమస్తజీవులకు వాంఛిత మింపెసలార, భాస్కరా.
తా.
మబ్బు సముద్రమందలి నీటిని తెచ్చి అన్ని ప్రాణులను సంతృప్తి కరమగు వర్షము నిచ్చునట్లే, దాత తనవద్ద ధనములేకున్నను యొంకొకచోటి నుండి తెచ్చి యైనను దానము చేయును.

ఱంపు - కలశము, రచ్చ.
రచ్చ -
1.కలకల ధ్వని, 2.గోష్ఠి, 3.కలహము, 4.మండపము, 5.మొగసాల, సం. 6.రాజమార్గము, 7.బాధ.

పూర్ణానకము - 1.తప్పెట, 2.పూర్ణపాత్రము.
తప్పట -
ఒక వాద్యవిశేషము, సం.తమ్మటః.
పూర్ణపాత్రము - 1.దోపు, 2.ఉత్సవ సమయమున సంతోషముచే వస్త్రాభరణాదిక నుపహరించుట, 2.వస్తు సంపూర్ణపాత్రము.

భద్రకుమ్భః పూర్ణకుమ్భః :
భద్రార్థం కుంభః భద్రకుంభః - మంగళార్థమైన కుంభము.
పూర్ణశ్చాసౌ కుంభశ్చ పూర్ణకుంభః - పూర్ణమైన కుంభము.
ఈ రెండు రాజద్వారాదులయందుఁ బెట్టఁబడిన పూర్ణ కలశము పేర్లు.

కుంభాభిషేకము - క్రొత్తగా గుడిలో ప్రతిష్ఠించిన విగ్రహముకునకు కుంభము నందు ఉదకము నింపి అభిషేక మొనర్చుట.

తుడుము - 1.తప్పెట, 2.తుటుము, 3.గుంపు.
తుటుము - సమూహము, రూ.తుడుము.

మఱువ - కుండ.
మఱువకందు - కుంభ సంభవుడు, అగస్త్యుడు. అగస్త్యానుగ్రహ వర్థిత రామ్.

కుంభసంభవుఁడు - 1.అగస్త్యుడు, 2.ద్రోణుడు(బృహస్పతి అంశ).
కుంభజుఁడు - 1.అగస్త్యుడు 2.ద్రోణుడు. ప్రజా పతిర్వై ద్రోణ కలశః.

ఆచార్యుఁడు - 1.వేదవ్యాఖ్యానము చేయువాడు, 2.వేదాధ్యయనము చేయించువాడు, 3.మతస్థాపకుడు, 4.యజ్ఞాదులందు కర్మోపదేశికుడు, 5.ఉపాధ్యాయుడు, గురువు, 6.ఏదైన ఒక విషయమున నిశిత పాండిత్యము గలవాడు, 7.ద్రోణుడు.
ఆచార్య - 1.వేదార్థమును వ్యాఖ్యానించెడి స్త్రీ, 2.ధర్మోపదేశికురాలు.
ఆచార్యాని - ఆచార్యుని భార్య.
కృపి - ద్రోణుని భార్య.

మైత్రావరుణి - అగస్త్యుడు, వ్యు.మిత్రావరుణుల వలన గలిగినవాడు.

మైత్రావరుణిః :
అగం వింధ్వం స్త్యాయతి స్తంభయతి త్యగస్త్యః. స్త్యైప్ట్యై శబ్దసంఘాతయోః - అగ మనఁగా పర్వతము వింధ్యపర్వతము, దాని నణఁచినవాఁడు. అగస్తి రితిపాఠాంతరం.
కుంభే సంభవో యస్య సః కుంభసంభవః - కలశమునందుఁ బుట్టినవాఁడు.
మిత్రావరుణయో రపత్యం మైత్రావరుణిః. ఇ. పు. - మిత్రావరుణుల కొడుకు. ఈ మూడు 3 అగస్త్యుని పేర్లు.

అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్| అగస్త్య మహర్షికి గురుదేవుడైన హయగ్రీవుడు ఉపదేశించినది, లలితా సహస్రనామము.

కటాహము - 1.కడవ, బాన 2.తాబేటి వెన్నుచిప్ప, 3.కప్పెర.
గూన - పెద్దకుండ.  ముంత - చిన్న మాని పాత్రము. చల్లకొచ్చి ముంత దాయడమెందుకు? మబ్బులో నీళ్ళు చూసుకొని ముంతలో నీళ్ళు పారపోసుకొనుట, తెలివితక్కువతనము.

కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.
గాబు -
మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.
కప్పెర - 1.పుఱ్ఱె, 2.భిక్షాపాత్రము, సం.కర్పరః.
కమఠము - 1.తాబేలు, 2.భిక్షాపాత్రము. అక్షయపాత్ర - భిక్షాపాత్ర.
భవనాసి - (వ్యావ.) 1.బిచ్చగాని గిన్నె, 2.అక్షయపాత్ర. 
కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium).

ఆదిభిక్షువు - శివుడు.

కపాలము - 1.తలపుఱ్ఱె, 2.సమూహిము, 3.కుండపెంకు, (జం.) 1.పుఱ్ఱె, 2.పృష్ఠ వంశీక జంతువుల తలలోనున్న ఎముకల సముదాయము. కపాల మొచనము నందు దేవీస్థానం శుద్ధి.   
పునక - తలపుఱ్ఱె, తలయెముక.
బొచ్చె - 1.కుండలోనగు వాని పెంకు, 2.తలపుఱ్ఱె.
కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (cranial nerves). 

శ్వసన నియంత్రిక నాడిముడి - పుఱ్ఱెనుండి బయటికి వచ్చిన తరువాత ప్రాణేశ నాడిపై నగుపడు ముడి, (Vagus ganglion).

న్రస్థిమాలి - శివుడు, వ్యు.పుఱ్ఱెల దండ ధరించినవాడు. 

బోలె - 1.తలపుఱ్ఱె, 2.ఓటికుండ, 3.కుండబొచ్చె.
బోఁకి - 1.పాత్రము (నిందార్థమున), 2.తలపుఱ్ఱె, 3.జలగడుగు దోనె.

చేతులో నున్నంతసేపు కుండ చెయ్యి జారితే పెంకులు. అత్త చెయ్యి జారినది అడుగు ఓటికుండ; కోడలు చెయ్యి జారినది క్రొత్తకుండ. అత్త ఒక ఇంటి కోడలేగా మరి! 

కమండలువు - సన్యాసు లుంచుకొను గిండి వంటి పాత్ర. 
కుండి - కమండలువు, వికృ.గిండి.
గిండి - సన్నని మెడగల చిన్నచెంబు, సం.కుండీ.
కరకము - 1.ఎముకలగూడు, 2.కమండలువు, 3.దానిమ్మ, 4.పక్షి, 5.వడగల్లు.
దాడినిమ్మ - దాడిమము, ఒక ఫల వృక్షము, రూ.దానిమ్మ, దాడిమ్మ, దాళిమ్మ.

అస్త్రీ కమణ్డలుః కుణ్డీ -
కం జలం అండే మధ్యే లాతీతి కమండలుః ఉ.ప్న.లా ఆదానే. - ఉదకమును మధ్యమందు గ్రహించునది.
కుండవద్వృత్తత్వాత్ కుండీ. ఈ. సీ. కుండవలె వట్రువుగా నుండునది. ఈ రెండు కమండలువు పేర్లు.

కుసుంభము - 1.కుసుంభపువ్వు, 2.కమండలువు.
కుసుంభరాగము - బయటికి కనబడుచు అంతఃకరణమందు లేనిప్రేమ.

అస్థిపంజరము - కంకాళము, ఎముకలగూడు.
కంకాళము -
ఎముకలగూడు.
కరంకము - 1.పుఱ్ఱె, 2.లోపల నెమియు లేని  బొండ్లపు చిప్ప, 3.తల, 4.కంకాళము.
పుఱ్ఱె - (గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium). 
బుఱ్ఱ - 1.కొబ్బెరకాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

ఆత్మశుద్ధిలేని యాచార మదియెల ?
భాండశుద్ధిలేని పాకమేల ?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా ? విశ్వ!
తా.
వేమా! నిర్మలమైన మనస్సుతో చేయని ఆచారము వలన ప్రయోజనము లేదు. వంటచేసుకొను కుండను తోమకనే(పరిశుభ్రము చేయని పాత్రలో), వంటచేసిన ఆ పదార్థము తినుటకు మంచిదికాదు గదా, అట్లే నిశ్చలమైన మనస్సుతో చేయని శివపూజ వలన పుణ్యము లభింపదు.   

అనికి - 1.మూతి వెడల్పుగల కుండ, 2.అల్లిక.
అల్లిక -
1.(చాప మొ.ని) అల్లుట, 2.(పదముల) కూర్పు, 3.నేత.
అల్లు - (జడ, చాప, మాటలు మొ.వి) 1.కూర్చు, 2.నేయు, 3.అల్లుకొను, 4.పెనుగొను.
కూర్పు - 1.కూరుపు, 2.ముద్రణము.
కూర్చు - కూరుచు; కూరుచు - 1.సంబంధించు, 2.ప్రియపడు, 3.కూడబెట్టు, 4.సంగ్రహించు, 6.రచించు, రూ.కూర్చు.
నేత - ప్రభువు; పబువు - ప్రభువు, సం.ప్రభు.

వీరభద్ర పళ్ళెరము - మిక్కిలి పెద్ద పళ్ళెము, హరివాణము.
హరివాణము -
1.పళ్ళెము, తట్టు.
పళ్యము - పళ్ళెము, పళ్ళేరము, భోజనపాత్రము, తాంబాళము, స.బిలకా.
తాంబాళము - పెద్దలోహపు పళ్ళెము.
తట్ట - 1.వెదురుబద్దలు మొదలగువానితో నల్లిక వల్లిక, 2.లోహముతో చేసిన తబుకు, పళ్ళెము.
తట్ట - 1.కంచము, 2.తెర, 3.తడక.
స్థాలము - కంచము; కంచము - భోజన పాత్రము, సం.కంసమ్.
తట్టు - 1.కలుగు, 2.తోచు, 3.చరుచు, హిం.వి.పొట్టిగుఱ్ఱము, వై.వి.దరి, పార్శ్వము.
తట్టువ - గుఱ్ఱము, రూ.తట్టువము.

తక్కటి - మూడు ముఖములు గల దీపా రాత్రికపు తట్ట, త్రిముఖదీపిక.

సానిక - మట్టికంచము, మల్ల.
మల్ల -
మట్టికంచము.
మల్లము - మల్ల.

తలియ - భోజనపాత్రము, సం.స్థాలికా.
తళిగ - 1.స్థానము, భోజన పాత్రము, 2.దేవునికి నివేదించు అన్నము, రూ.తళియ, సం.స్థాలికా.

పసటి - 1.కుండ, 2.వంటకుండ.
ప్రవ్వ -
కుండ.
ప్రవజితుఁడు -
సన్యాసి.
సన్యాసి - సన్యసించినవాడు.
యతి - 1.పద్య విశ్రమస్థానము, 2.సన్యాసి.

చరువు - 1.హవ్యము, 2.హవ్యము వండెడికుండ.
హవ్యవాహనుఁడు -
అగ్ని, రూ.హవ్యవహుడు.

ఇగిరిక - 1.హవిస్సు, 2.అత్తెసరు, రూ.ఇగిరిక.
అత్తెసరు -
గంజి వార్చకుండ అన్నములో ఇగిరి పోవునట్లు పెట్టెడు ఎసరు.
ఎసరు - 1.వంటకై కాగబెట్టిన నీరు, అత్తెసరు, 2.కవోష్టజలము, క్రి.మీరు, అతిశయించు.
ఎసలారు - క్రి. అతిశయించు, (ఇంపెసలారు).

స్థాలీవులాకన్యాయము - ఉడుకుచున్న కుండెడు అన్నమునకు ఒక మెతుకునుబట్టి చూచుటవలె ఒక దానినిబట్టి పూర్ణవిషయ మెరుగుట.

లోవి - వంటకుండ, స్థాలి, పచనపాత్ర.
లోహుండి -
వంటకుండ; వెసల - వంటకుండ. 
స్థాలి - వంటకుండ.
కుండము - 1.వంటకుండ, 2.గుడిలోని గుంట, 3.నిప్పుల గుండము, 4.కొండ. కొండము - నిప్పుకుండము, సం.కుండమ్.

కుండక బ్రాహణులు - మహారాష్ట్ర బ్రాహ్మణులలో ఒక తెగ.

పిఠరః స్థాల్యుఖా కుణ్డమ్:
పచ్యతే న్నమత్రేతి పిఠరః డు పచ్ ష్ పాకే. - దీనియం దన్నము వండఁబడును.
తిష్ఠన్తి పదార్థా అస్మిన్నితి స్థాలీ. ఈ. సీ. ష్ఠా గతి నివృత్తౌ. - పదార్థములు దీనియందుండును.
ఓఖతీ భోజనస్థానం గచ్ఛతీత్యుఖా. ఉఖ గతౌ. - భోజనస్థానమును బొందునది.
కుణ్డ్యతే స్మిన్నితి కుండం. కుడిదాహే. - దీనియందు వండఁబడును. ఈ నాలుగు 4 కుండ పేర్లు.

కఠినము - 1.పరుషము, 2.నిష్ఠురము, 3.క్రూరము, వి.వంటకుండ.
పరుషము -
1.నిష్ఠురము, 2.నిష్ఠురవాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు.
నిష్ఠురము - కఠినము, పరుషము.
క్రూరము -1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది. అరపూస - గుగ్గిలము (Rosin).
గుగ్గిలము - (వ్యవ.) ధూపద్రవ్యముగ నుపయోగించబడు ఒక పదార్థము (Burseraceae) అను కుటుంబమునకు చెందిన "Boswllia serata"అను చిన్నచెట్టు నుండి స్రవించు జిగురుపదార్థము (Indian balsam).
గట్టి - ధృఢము, కఠినము, కర్కశము, బిగువైనది, సడలనిది, గుల్ల కానిది సం.ఘట్టః.
దృఢము - (భౌతి.) వంగనిది, చిన్న దెబ్బలకు వికారము చెందనిది, గట్టిది. (Rigid) ఉదా.దృఢవస్తువు (Rigid body).
గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువుకట్ట, పర్వతము, సం.ఘట్టః.

బిరుసు - కాఠిన్యము.
తుటారము -
1.దిట్టతనము, 2.పురుషవచనము.
తుటారి - 1.దిట్టతనముగలది, 2.పారుష్యముగలది. 

పలుచని హీనమానవుఁడు పాటిఁదలఁపక నిష్ఠురోక్తులన్
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణ ప్రపూర్ణుడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగనెట్లన వెల్తికుండదాఁ
దొలుఁకుచునుండుఁగాని, మఱితొల్కునె నిండు ఘటంబు భాస్కరా.
తా.
వెల్తికుండలోని నీరు తొణకును గాని, నీరునిండుగా గల కుండ తొణకదు. అట్లే చులకన తనము గల నీచుడు న్యాయము తెలియక కఠినమైన మాటలు మాట్లాడును, సద్గుణములచే ప్రకాశించు బుద్ధిమంతుడు(బుద్ధిమంతుఁడు-బుద్ధికలవాడు)ఆవిధముగా మాట్లాడడు.

పల్లెటూళ్ళలోని యువతులు నాలుగైదు కుండలను ఒకదానిమీద ఒకటి దొంతరగా తలమీద పెట్టుకొని నీళ్ళు తెచ్చుకుంటూ దోవలో తమ కష్టసుఖాలు ముచ్చటించు కొంటారు. అయినా, ఆ కుండలనుండి ఒక్క నీటిచుక్క కూడా తొణకదు.

ధర్మమార్గంలో జీవించేవ్యక్తి కూడా అదే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితులలోనూ అతడి మనస్సు ధర్మమార్గాన్ని తప్పకుండా చూసుకోవాలి. అందుకోసం అతడు ఎల్లప్పుడూ మెలకువగాను, అప్రమత్తంగానూ ఉండాలి. - శ్రీ రామకృష్ణ పరమహంస   

స్పోటకము - ముశూచికము, అమ్మవారు.
మశూచకము -
(గృహ.)స్పోటకము, అమ్మవారు,(Small pox) (ఇది అంటువ్యాధి, నీటి ద్వారా వ్యాపించును). మశూచిక - స్పోటకము. పోటకము - స్ఫోటకము, పెద్దమ్మవారు, ఒడలెల్ల పోటకత్తి బొబ్బలు లేచు వ్యాధి, సం.స్ఫోటకః.
అమ్మవారు - 1.స్త్రీ దేవత, గ్రామదేవత 2.పూజ్యస్త్రీ 3.స్పోటకము 4.స్ఫోటకాధిష్ఠాన దేవత.

టీకాలువేయు - (గృహ.) మశూచి రాకుండుటకై దానికి విరుగుడును శరీరము లోనికి ఎక్కించు (Vaccination).

వ్విస్ఫోటము - బొబ్బ, పొక్కు.
బొబ్బ -
1.పొక్కు 2.సింహనాదము.
పొక్కు - 1.బొబ్బ 2.ఎండి లేచిన పెల్ల 3.జనశ్రుతి, క్రి. 1.దుఃఖించు 2.బొబ్బలేచు.
విస్పోటః పిటక స్ర్తిషు :
విస్ఫుటతి విస్ఫోటః. స్ఫుట భేదనే. - వ్రక్కలౌనది.
పిటతి సంశ్లిప్యతి పిటకః. అ. త్రి. పిట సంశ్లేషణే. - వ్రక్కలై కూడుకొనునది. ఈ రెండు పొక్కుల పేర్లు, బొబ్బలు.

అంటువ్యాధి - ఒకరినుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిముల వలన లేక స్పర్శవలన) వ్యాపించు వ్యాధి (విషూచి, మశూచి మొ.)విషూచి - (గృహ.) పమన విరేచన వ్యాధి (కలరా).
కలరా - (గృహ.) (Cholera) వాంతి భేది. (ఇది నీటి ద్వారా వ్యాపించు ప్రాణా పాయకరమైన జాడ్యము.) (Infectious disease).
ధూము - వాంతి భేది జాడ్యము, కలరా.
వమధువు - వమనము, వాంతి. వమనము - డోకు, వమధువు.
వమనేచ్ఛ - (గృహ.) వికారము (వికారము - 1.మారురూపు, ఆకృతి 2.తెవులు, తెగులు), వాంతివచ్చునట్లుండుట(Nausea).

మారకము1 - 1.అంటువ్యాధి, 2.డేగ, వ్యు. చంపునది.
ఎపిడమిక్ -
(Epidemic) (గృహ.) అంటువ్యాధి, ఊరంతయు వ్యాపించెడి వ్యాధి. 

పత్రి - 1.డేగ, 2.పక్షి, 3.బాణము, 4.కొండ, 5.మ్రాను, వై.వి.పత్తిరి.

డేగ - శ్యేనము. డేగకన్ను - నిశితదృష్టి.

శ్యేనము - డేగ, వ్యు.వేగముగా బోవునది.

కడసరము - ఒకానొక జాతిడేగ; కడు(ౙ)జు - ఒకజాతి డేగ. శశాదనము - డేగ, వ్యు.కుందేళ్ళను చంపునది.

మారకుడు - చంపువాడు. మారణము - చంపుట.

పక్కి - పక్షి, పులుగు, సం.పక్షీ.
పక్షి - (పక్షములు గలది) పులుగు. పులుగు - పిట్ట.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
బాణము - అమ్ము; విశిఖము - బాణము.

పత్రిణౌ వర పక్షిణౌ :
పత్రి న్ శబ్దము అమ్మునకును, పక్షికిని పేరు. పత్రాణి పక్షాః. అస్య సంతీతి పత్రి. న. పు. ఱెక్కలు గలది.

కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, మలై.
మ్రాను - మాఁకు; మ్రాఁకు - మాను, చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
మ్రానిపోటు పులుగు - వడ్రంగి పిట్ట, మ్రానుగోయిల.

నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ,
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరంగీ నిర్గుణప్రియా|

24. శతభిషము - చూచుటకు విందుగా, వరుసగా పది10 నక్షత్రము లుండును. 

పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరుకాలము ఫిబ్రవరి February, మార్చి March నెలలు, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు, శిశిర ఋతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
పయర - దక్షిణపుగాలి, వాయువు, రూ.పయ్యెర.
పయరగాలి - (భూగో.) వేసవి చలికాలముల యందు అగ్నేయదిశ నుండి సముద్రమునుండి భూమికి వీచుగాలి, (South-east sea breeze). 

తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిర్తువు.
ధ్యానము -
చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
తబము - తపము, తపస్సు, సం.తపస్.
తపస్వి - తపస్సుచేయువాడు.
తబిసి - తపసి, ముని, సం.తపస్వీ.
తపస్విని - తాపసురాలు.

దినయామిన్యౌ సాయం ప్రాతః - శిశిరవసంతౌ పునరాయాతః,
కాలఃక్రీడతి గచ్ఛత్యాయుః - తదపి న ముంచత్యాశావాయుః.- భజగోవిందం

ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
ఋషి -
1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.
మౌని - మౌనవ్రతుడు, ముని. మౌనము - మాటాడకుండుట.
అవిసియ - అగిసె, రూ.అవిసె, స.అగస్త్యః.
అగస్త్యము - అవిసెచెట్టు. అగిసె - అగస్త్యము. అగినియ - అగిసె.

బాసవాలు - 1.వేలుపు, 2.ఋషి, వ్యు.పలుకే ఆయుధమైన వాడు.

శోషకతైలములు - (గృహ.) ఏ వస్తువున కైనను పూసినచో గాలిపారి త్వరలో నారి(ఆరిపోయి), పొరకట్టిపోయి ఆ వస్తువునకు జిడ్డు లేకుండ చేయు నూనెలు, (Drying oils) ఉదా.సీమ అవిసెనూనె (Linseed oil).

భూసుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనన్
మాని చరింపరో యనుచు మానవులట్లు చరింపఁబోవ దం
(అం)బోనిధులన్నియున్ తనదు పుక్కిటబట్టె నగస్తుడంచునా
పూనిక నెవ్వడోపు నదిపూర్వమహత్త్వముగాక! భాస్కరా.
తా.
లోకులచే ఆరాధింపబడు దేవతాదులు కొందరు, వావివరుసలు లేకుండా ప్రవర్తించినారని, మనుష్యులు సైతము వారివలె ప్రవర్తించుట తగనిపని, ఎట్లనిన మునిశిరోరత్నమైన అగస్త్య మహర్షి – సప్త సముద్రములను అవలీలగా త్రాగివైచినాడని - సామాన్యులట్టి పనికి పూనుకొనలేరు గదా! కావున వారి మహత్త్వవంతులే(గొప్పదనము) తప్ప యితరులు వారి నెన్నడనూ అనుసరింపరాదు.

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

శతభిషము - ఒక నక్షత్రము.
నీటిఱేని రిక్క -
శతభిషము (వరుణుడు అధిదేవతగా గలది).
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము -
రిక్క, చూ.ఋక్షము.
ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి.
ఋక్షరా(ౙ)జు - 1.చంద్రుడు, 2.జాంబవంతుడు.

క్షత్రస్య రాజా వరుణోధిరాజః | నక్షత్రాణాగ్ం శతభిష గ్వసిష్ఠః | తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః | శతగ్ం సహస్రా భేషజాని ధత్తః | యజ్ఞన్నో రాజా వరుణ ఉపయాతు | తన్నో విశ్వే అభి సంయంతు దేవాః | తన్నో నక్షత్రగ్ం శతభిష గ్జుషాణమ్ | దీర్ఘమాయుః ప్రతిరద్భేషజాని ||24||    

క్షత్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
క్షత్రియుఁడు - రాచవాడు. రాజన్యుఁడు - క్షత్రియుడు.

రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
రావు -
అధిపతి, రాజు, సం.రాజా. యదా రాజా తథా ప్రజ.
రాజు -
1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
రావు -
అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
అధిపుడు - 1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
నవాబ్ - 1.ప్రభువు, 2.రాజు ప్రతినిధి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు.
అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.  

నాయకుఁడు - 1.అధిపతి, 2.నాటకమందలి ప్రధానపాత్ర. నాయకులు కావ్య నాటకాదుల యందు నలుగురు, 3.శృంగార రసాలంబన పురుషులు నలుగురు, విణ.శ్రేష్ఠుడు.

నీఁడు - కుమ్మరివారి బిరుదు పేరు, రూ.నాయుడు (ఉదా. అంకినీడు), సం.నాయకః.
నాయఁకుఁడు - 1.అధిపతి, 2.పన్నిద్దరు భటుల కధిపతి, సం.నాయకః. 
నాయఁడు - 1.ప్రభువు, 2.బలిజలుమున్నగు వారి పట్టపు పేరు, వై. విణ. శ్రేష్ఠుడు, సం. నాయకః. 

కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు కలది 2.కుమ్మరి.
కుమ్మర -
కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
కులాలుఁడు - కుమ్మరవాడు; ఘటికారుఁడు - కుమ్మరి.

కుమ్భకారః కులాల స్స్యాత్ -
కుంభం కరోతీతి కుంభకారః. డు కృఞ్ కరణే. - కడవలు చేయువాడు.
కుం భూమిం లడతి మృదర్థ మితికులాలః. లడ మర్దనే. - లడయో రభేదః. - మంటికొరకు భూమిని మర్దించువాఁడు. ఈ రెండు కుమ్మరవాని పేర్లు.

ఐద్దాయులు - (ఐదు+కాయలు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.

నవశిలాయుగము - (చరి.) కొత్త రాతియుగము, (ఈ కాలములోని మానవులచే రాతి పనిముట్లు, నాణెములు వాడబడుచుండెను. వీరికి వ్యవసాయము, నూలు వడుకుట, కుండలుచేయుట, అగ్నిని ఉపయోగించు విధము తెలియును. వీరు స్థిరనివాసము లేర్పరచుకొని, పండిన పదార్థములు తినుచుండిరి).

చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
విష్ణువు -
విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
రారాజు - 1.చక్రవర్తి, సార్వభౌముడు, 2.దుర్యోధనుడు, 3.చంద్రుడు.
చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు. సమ్రాట్టు - చక్రవర్తి.
సార్వభౌముడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.
గాంధారేయుఁడు - దుర్యోధనుడు, గాంధారికొడుకు.

భరటుఁడు - 1.కూలివాడు, 2.కుమ్మరి.
భరణ్యము -
1.కూలి, 2.జీతము.
భరణము - 1.భరించుట, 2.జీతము, 3.కూలి.
వేతనము - భృతి, కూలి, చేసినపనికి ప్రతిఫలముగ నిచ్చు ద్రవ్యము, జీతము.
వేతనముల స్థాయి - (అర్థ.) వేతన ప్రమాణము.
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భృత్య - కూలి; కూలి - పనిచేసినందుల కిచ్చెడు ధనము.
జీతము - వేతనము, సం.జీవితమ్.
జీతగాడు - జీతము గొని పనిచేయువాడు.  
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు. జీవిక - బ్రతుకు తెరువు. భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
సేవకుఁడు - కొలువుకాడు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.

దొంతి - 1.ఒకటి మీద నొకటిగా నుంచిన కుండలులోనగు వాని వరుస, 2.వరుస.
దొంతర - పరంపర, దొంతి.

కుమ్మరి ఆవములో కుండలేగాని బొందెలు దొరకవు. కుమ్మరి కష్టమంతా ఒక్క దెబ్బకు లోకువ.

కుమ్మరివాడు గాలి ఊది కొలిమిలో నిప్పును మరింత రగిలించినట్లే, మనం కూడ మన మనస్సును సత్సాంగత్యం ద్వారా నిర్మలంగాను, ప్రశాంతం గాను ఉంచుకోవాలి. సత్సాగత్యం ఆత్మవికాసానికి ఎంతో అవసరం. - శ్రీ రామకృష్ణ పరమహంస 

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
చక్రపక్షము - హంస. మానసౌక(స)ము - హంస.
యమి - 1.ముని, 2.హంస.
మౌని -
మౌనవ్రతుఁడు, ముని.
అంౘ - హంస, సం.హంసః.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.

తెలిపిట్ట - హంస.(తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.) 
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్
బాలనసేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాల మెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా.
తా.
పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలను త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, పిల్లి అట్లు పాలను నీళ్ళ నుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పు గలవాడు, తగవు యొక్క న్యాయా న్యాయములను విమర్శించి నిర్ణయించును, తెలివి లేనివా డట్లుచేయలేడు.

చక్రధరము - పాము; చక్షుశ్శ్రవము - పాము, కనువినికి(చక్షువు - కన్ను).  

స్వగృహేపూజ్యతే మూర్ఖః - స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా - విద్వాన్ సర్వత్రపూజ్యతే||
తా.
మూర్ఖుఁడు తన యింటియందును, ప్రభువు స్వగ్రామమందును, రాజు తన రాజ్యమందును (గొ)కొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశముయందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము

చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్భుదంబు ద్బుదంబు గాక!
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగముతోడి పశువు గాక!

మృత్తు నుండి ఘటముగా ఏర్పడు సామర్థ్యమే - శక్తి. మన్ను లేకుండా కుండ ఏర్పడనట్టుగానే అహంకారము లేని పదార్థం వుండదు. కుండ (ఘటము) తనయొక్క రూపము నిశ్శేషము (లేకుండ పొయినపుడు) – కాగా - నామము కూడ పోగొట్టుకొని మృత్తు - మన్నులో కలసి పోవుచున్నది కదా!

అగ్ని - కుండ - నీటికి సంబంధించింది. కుండలో నీరు ఆత్మ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము(దేహం అస్థిరం, దహించుకు పోతుంది) 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఆత్మ (ఆత్మాహ్య యం ప్రజాపతిః) శబ్దము (ప్ర)యత్నమునకు, ధైర్యమునకు, బుద్ధికి, స్వభావమునకు, పరమాత్మకు, దేహమునకు, చకారము వలన జీవునికి పేరు.

ప్రధానం పరమాత్మా ధీః :
ప్రధాన శబ్దము పరమాత్మకును, ప్రజ్ఞకును, మఱియు ప్రకృతికిని, ప్రధానికిని, ముఖ్యునికిని, పేరు.
ప్రకర్షేణ దధాతీతి ప్రధానం. డు ధాఞ్ ధారణపోషణయోః. - ప్రకర్షము చేత నన్నిటిని ధరించునది. "ప్రధానం ముఖ్యమంత్రిణో"రితి శేషః.

ముఖ్యమంత్రి - (శాస., రాజ., పౌర.) మంత్రివర్గ నాయకుడు, రాష్ట్రప్రధాని, రాష్ట్ర మంత్రివర్గ నాయకుడు.

మృత్పిండమేకో బహుభాండరూపం, సువర్ణమేకం బహుఘూషణాని|
గోక్షీర మేకం బహుధేనుజాతం, ఏకఃపరాత్మా బహు దేహవర్తీ||
తా.
కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము వేర్వేరు బంగార మొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే శరీరములు వేర్వేరు పరమాత్మ యొక్కటే. - నీతిశాస్త్రము

చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
చైతన్యము - 1.తెలివి, 2.ప్రాణము.
తెలివి - 1.వివేకము, 2.ప్రకాశము, 3.కాంతి, వికాసము 4.తేరుట 5.తెలుపు.
ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.

జీవి - జీవించువాడు, వి.ప్రాణి. ప్రాణులలో మెలిగే - జీవి ఎవరు?
లోకములో సామాన్యముగాఁ ప్రాణులు దేహాత్మ బద్ధిగలవారై యుందురు. దేహము ఘటమువలె రూపము గలది, జాతి గలది. జీవుఁడు నిర్మలుడు. జీవునకు పరమాత్మకు భేదం లేదు. ఆత్మను మించి ఉత్తమస్నేహితుడు – లేడు.

జీవాత్మ - దేహి, జీవుడు.
దేహి -
దేహము గలవాడు.
జీవుఁడు - 1.ప్రాణి 2.బృహస్పతి. జీవజాతులు వేరు - జీవుడు ఒక్కటే.
బృహస్పతి - 1.సురగురువు 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులముపెద్ద, 3.తండ్రి, జనకుడు 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, జ్యేష్ఠసోదరుడు, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

గురుచరణాంబుజ నిర్భరభక్త - సంసారాదచిరాభవ ముక్తః,
సేంద్రియమానస నియమాదేవం - ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్. –భజగోవిందం

కలాదుఁడు - 1.స్వర్ణకారుడు, కంసాలి 2.చంద్రుఁడు 3.గురువు, ఉపాధ్యాయుడు.

తాత - 1.తండ్రికి తండ్రి 2.తల్లికి తండ్రి వై.వి.విధాత, బ్రహ్మ, సం.వి.తండ్రి.
మామ - 1.తల్లిసోదరుడు, మేనమామ 2.ఆలుమగల తండ్రి, శ్వసరుడు 3.తండ్రి తోబుట్టువు భర్త, సం.మామకః.
రాజు - 1.రేడు, రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు.

భూతాత్మము - దేహము.
దేహము -
శరీరము, మేను.
శరీరము - దేహము. ఏది సాధించాలన్న దేహం ఉండాలి.
మేను - 1.శరీరము, 2.జన్మము, పుట్టుక 3.పార్శ్వము. పార్శ్వము - 1.ప్రక్క 2.సమీపము (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము(Side).విం.విణ.(జీవ.) క్రన్కలనుండిబయలుదేరీనది(Latral)

ప్రాదుర్భావము - పుట్టుక. జననము - 1.పుట్టుక 2.వంశము. జన్మము - పుట్టుక. జనువు – పుట్టుక.
జని - 1.స్త్రీ, ఆడుది 2.భార్య 3.కోడలు(కుమారుని భార్య), పుట్టుక. భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.

జాయతే స్యాం పతిః పుత్రరూపేణేతి జాయా. జనీ ప్రాదుర్భావే. – ఈమె యందు పతి పుత్రరూపమున జనించును.
బ్రియత ఇతి భార్యా. బృఞ్ భరణే. - భరింపబడునది.

సమాః స్నుషా జనీ వధ్వాః :
గృహవ్యాపారాయ జలంస్నౌతీతి స్నుషా. స్నుప్రప్రవణే. - గృహవ్యాపారము కొఱకు నీల్లు చల్లునది.
జాయతే స్యాం పౌత్ర ఇతిజనీ. సీ. జనీ ప్రాదుర్భావే. - దీనియందు పౌత్రుఁడు పుట్టును.
ఊహ్యతే పుత్రేణేతి వధూః. ఊ. సీ. - పుత్రునిచేత వహింపఁబడునది. ఈ మూడు 3 కోడలి పేర్లు.

ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు -
1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి 2.వడ్డి.
పొడుపు కొండ -
సృష్టి -
1.సృజించుట, 2.ప్రకృతి, 3.స్వభావము. సృజన - సృష్టి.
ఫలసిద్ధి -
వడ్డి -
వృద్ధి, సం.వృద్ధిః. అసలు కన్నా వడ్డీ ముద్దు.

అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
వేకువ -
వేగుజాము.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః.
రేపకడ - ప్రాతఃకాలము.

ఉషఃకాలము - ఉషస్సు, సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.

బాలార్కః ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినదినే||
తా.
ఉదయకాలమందు ఎండగాచుకొనుటయు, పీనుగు కాలెడి పొగ తనమీదఁ బాఱుటయు, (వృద్ధ - ముసలిది)తనకంటె పెద్దదానితో సంగమము చేయుటయు, ఆకులు మురిన నీళ్ళను ద్రావుటయు, రాత్రి పెరుగన్నము భోజనము చేయుటయు నివి దినదినమున (కా)ఆయుస్సును తరుగ జేయును. - నీతిశాస్త్రము

మిత్తి - మృత్యుదేవత, చావు(మృతి) 2.వడ్డి, సం1.మృత్యుః 2.మితిః. మృత్యువు - 1.చావు 2.మరణాధి దేవత.
మిత్తిచూలు(ౘ) - కేతువు. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
టెక్కెపుగాము - వి.1.కేతుగ్రహము, మిత్తిచూలు.
మిత్తిగొంగ - (గొంగ - శత్రువు) - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించిన వాడు. శివుడు అభిషేక ప్రియుడు.

తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
వడ్డి -
వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః. కుత్సీరము - వడ్డీబ్రతుకు.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి. 

పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు - (గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy). 

స్వరూపము - 1.స్వభావము 2.రూపము.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము(Charm), 4.అగ్నిగుణము, అగ్ని కాల్చును 5.స్వభావము. వర్చస్సు - 1.కాంతి, మేని 2.రూపము.

మంచి స్వభావము, సౌందర్యం తాలూకు లోటును ఎప్పుడూ భర్తీ చేస్తుంది. కాని, సౌందర్యం మంచి స్వభావమనే లోటును భర్తీ చేయలేదు. - ఎడిసన్

ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
ఆకృతి - 1.రూపము 2.దేహము 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము 4.పోలిక, (రసా, భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape). హృదయమునకు అలంకారము సత్ప్రవర్తన.

మనం ప్రదర్శించే గుణాలను అట్టి మనుషులను ఆకర్షిస్తాం. మనలోని గుణాలను బట్టి నిలుపుకుంటాం. - స్వార్ట్

అంతరాత్మ - (వేదాం.) జీవాత్మతో గూడియుండు పరమాత్మ 2.మనస్సు.
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతఃకరణము -
1.మనస్సు 2.దయ. ధర్మానికి అధారం దయ.

మనిషికి నిలబడటం తేలిక - పరుగెత్తడము కష్టము.
కాని మనస్సుకు పరుగెత్తడం తేలిక - నిలబడటం కష్టం.

మన యేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః - మనస్సును అదుపులో ఉంచుకొని, బంధానికైనా, మోక్షానికైనా మనస్సే కారణమవుతుంది. గృహస్తుయైనను, సన్యాసియైనను బంధమోక్షము లకు మనస్సే కారణము.

మానవ స్వభావాన్ని తెలుసుకోవాలంటే విశాలమైన ప్రపంచానుభవం అవసరం లేదు - విశాల హృదయం ఉంటే చాలు. - బల్వర్

యతనము - యత్నము, వికృ.జతనము.
ధైర్యము -
ధీరత్వము.
ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్ర్యము కలవాడు.

ధీ - బుద్ధి.
ధీంద్రియము -
(ధీ + ఇంద్రియము), జ్ఞానేంద్రియము.
ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.

ధీర - 1.వ్యంగముగా కోపప్రకాశము చేయునాయిక, 2.ధీరురాలు.
ధీరాదీర - వ్యంగ్యాన్యంగముగా కోపప్రకాశము చేయు నాయిక.

ఆత్మజ - 1.కూతురు 2.బుద్ధి.
బుద్ధి -
బుద్ధి, మతి సం.బుద్ధి. మతి చెడిన - గతి చెడును.

బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Inteligence).
మతి - 1.తలపు 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది. మది - బుద్ధి, మనస్సు. సం. మతిః. మతిని బట్టియే గతి. ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.

ప్రజ్ఞాయతే అనయేతి ప్రజ్ఞా. జ్ఞా అవబోధనే. - దీనిచేత లెస్సగా నెఱుఁగ బడును.
మన్యతే అనయేతి మతిః. ఇ. సీ. మనజ్ఞానే. - దీనిచేత నెఱుఁగఁబడును.
బుధ్యతే అనయేతి బుద్ధిః. ఇ-సీ. బుధ అవగమనే - దీనిచేత నెఱుఁగఁ బడును.

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

బుద్ధి కొద్ది సుఖం. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది. సంకల్పించేది మనస్సు. మనస్సు మహామేరువైనా చాటుతుంది కాని కాలు గడపదాటదు.

అంతరంగము - 1.హృదయము, 2.ఉల్లము, మనస్సు.
ఉల్లము -
1.హృదయము, కోరిక. కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె (Heart). గుండియ - హృదయము, రూ.గుండె.

పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే,
ఇందిరేందిందిరాభాక్షీ క్షీరసాగర కన్యకే.

25. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర - రెండేసి 4 నక్షత్రములుండును.

ప్రౌష్ఠపద - పూర్వాభద్రా నక్షత్రము.
పూర్వ -
తూర్పు; ప్రాచి - తూర్పు.

ప్రాక్ ప్రాచ్యాం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.

స్యుః ప్రోష్ఠపదా భాద్రపదాః స్త్రియః :
ప్రోష్ఠోగౌః తస్యేవ పాదాయాసామితి ప్రోష్ఠపదాః. ఆ. సీ. - ప్రోష్ఠ మనఁగా నెద్దు(ఎద్దు), దానిపాదముల వంటి పాదములు గలవి.
భద్ర పదం యాసా తాః - శుభకరములైన పాదముగలవి. ఈ రెండు 2 పూర్వభాద్ర ఉత్తరాభాద్రల పేర్లు.

భన్దత ఇతి భద్రః. భది కల్యాణే. - కల్యాణ స్వరూపమైనది.

అజ ఏకపాదుదగాత్పురస్తాత్ | విశ్వా భూతాని ప్రతి మోదమానః | తస్య దేవాః ప్రసవం యంతి సర్వే | ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః | విభ్రాజ మానస్సమిధా న ఉగ్రః | ఆంతరిక్షమరుహదగంద్యామ్| తగ్ం సూర్యం దేవ - మజమేకపాదమ్ |  ప్రోష్ఠపదాసో అనూయంతి సర్వే ||25||

అజ - 1.ప్రకృతి, వ్యు.పుట్టుకలేనిది, శాశ్వతమైనది, 2.ఆడుమేక, వ్యు.ఎక్కువగా తిరుగునది.
మేఁక - ఆడుమేక, సం.మేకః.
ప్రకృతి - (వ్యాక.) 1.ప్రత్యయము చేరకముందటి శబ్ద రూపము, 2.సౌరవర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము, (స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి సప్త ప్రకృతులు).

కుంభిని - నేల; నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూ - భూమి. భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృడమైన పదార్థము, నేల.
ప్రదేశము - స్థలము, చోటు.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
జానకి - జనకుని కూతురు, సీత.     

భూపతి - నేలరేడు, రాజు.
నేలఱేఁడు -
రాజు.

మను - 1.జీవించు, 2.నర్తించు, వి.1.మన్ను, 2.నేల.
క్షమ -
1.ఓర్పు, patience 2.నేల, earth 3.మన్నింపు.
ఓర్మి - క్షమ, సహనము, సహించుట, రూ.ఓరిమి (Tolerance).
ఓరిమి - క్షమ, శాంతము, ఓరుపు.
సహనము - ఓర్పు; ఓరుపు - ఓరిమి.
ఓపిక - 1.బలము, శక్తి, 2.ఓర్పు.
తితిక్ష - ఓర్పు; తితిక్షువు - ఓర్పరి.
తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి. తాల్మి - తాలిమి.

క్షాంతి - 1.ఓర్పు, 2.మన్నించుట.
క్షాంతము - 1.ఓర్పు స్వభావము గలది, 2.మన్నింపబడినది.

భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు -
భూసురుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు. 

నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు -
నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

క్షమ గలిగిన సిరి గలుగును,
క్షమ గలిగిన వాని గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును,
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
భా||
ఓ తండ్రీ! క్షమకలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి సంతోషిస్తాడు. సూర్యప్రభలు కలిగిన క్షమా గుణమును అలవర్చుకొనుట బ్రాహ్మణుని ధర్మము.

ప్రపంచములో బలమైనది క్షమ. తాలిమి తన్నుగాచి ఎదుటివారిని కూడా రక్షించును. ధైర్యమే సహనశక్తిని ఇస్తుంది.

ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, గోవు 4.మాట, రూ.ఇళ.
ఇడ -
1.(యోగ.) ఒక నాడి (ఇడ - చంద్ర రూపిణి తెలుపు, చంద్రుని తేజస్సు) 2.మైత్రావరుణి యనుపేరుగల బుధుని భార్య 3.గోవు 4.వాక్కు 5.హవిరన్నము 6.దుర్గాదేవి.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.    

గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకు ను, వాక్కునకును పేరు.
ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు.
ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః - ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును.
ఇళాశబ్దో బుధభార్యాయామపి. యస్యాఃపుత్రః పురూరవాః. "ఊర్వశి అంభవ స్యాయమైన సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోశ్వశీయే.

వాచాం పతిః వాచస్పతిః - వాక్కులకు పతి, బృహస్పతి.

మాట - 1.పలుకు, వచనము 2.నింద, వృత్తాంతము.
పలుకు - మాటాడు, అను, వి.1.వచనము, మాట 2.నింద(నింద - దూరు, అపదూరు), 3.విద్య(విద్య - చదువు, జ్ఞానము), 4.తునక.  వృత్తాంతము - 1.వర్తమానము 2.కథ 3.ప్రస్తావము.
వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుచున్నది.
కథ - తొల్లింటికత, వాస్తవార్థము కలది.

వాజ్మయము - భాష.
భాష -
1.మాట 2.ప్రతిజ్ఞ 3.ప్రమాణము 4.వ్యవహారయోగ్యమైన వాక్యాదికము 5.సంస్కృతాది భాష, వి.బాస. భాష ఏదైన భావమొక్కటే!
భాషితము - మాట.

ప్రస్తావ సదృశంవాక్యం స్వభావ సదృశక్రియామ్|
ఆత్మశక్తి సమంకోపం యోజానాతి సపండితః||
తా.
ప్రస్తావమునకుఁ దగినమాట, పరుల స్వభావమునకుఁ దగిన కార్యము, తన శక్తికి దగిన కోపము ఎవండెఱుంగునోవాఁడు వివేకియగును. – నీతిశాస్త్రము

మాట్లాడవలసిన అవసరం వున్నపుడు మాట్లాడకుండా వూరుకోవడం, మాట్ల్లడక పోవడం మంచిదైనపుడు మాట్లాడడం, ఇవి రెండూ మనిషి బలహీనతకు నిదర్శనాలు. - పర్షియన్ సామెత.

పలుకుఁజెలి - సరస్వతి.
వాణి -
1.పలుకు 2.సరస్వతి.
భారతి - 1.సరస్వతి 2.వాక్కు.
ౘదువుల పడఁతి - సరస్వతి. సరస్వతి బ్రహ్మ నాలుక యందు నివసిస్తుంది. ఆమె వాహనం హంస.

పలుకుఁ దత్తడి - చిలుక.
ౘదువుల పులుఁగు -
చిలుక.
మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
చిలుక - కీరము, శుకము, రూ.చిల్క.
కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము. చిలుకరౌతు - మదనుడు.
శుకము - చిలుక; చిలుకలకొలికి - స్త్రీ. శుకవాహుఁడు - మన్మథుడు.

మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.

వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ. యుక్తయుక్తముగా మాటాడువాడు.
వక్త -
1.విశేషముగ మాటలాడువాడు, వాచాటుడు, 2.పండితుడు.
వచత్నువు - 1.వక్త, సభలో నిర్భయముగా మాటాడు నతడు, 2.బ్రాహ్మణుడు.
మాటకారి - 1.వాగ్మి, 2.వాచాటుడు; మాటలమారి - వాచాటుడు.

రాకొమరుల్ రస్జుని దిరంబుగ మన్నననుంచినట్లు భూ
లోకమునందు మూఢుఁదమలోపలనుంపరు, నిక్కమేకదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక, పెంతురే
కాకము నెవ్వరైన, శుభకారణ సన్ముని సేవ్య! భాస్కరా.
తా. చిలుకను చూచినా, దాని పలుకులను ఆలకించినా మానవులకు ఆనందం కలుగుతుంది. ఎవ్వరైనను మనుష్యులు భూమిమీద చిలుకను పెంచుదురు గాని కాకి(కాకము - కాకి, వాయసము.)ని పెంచరు. అట్లే, ప్రభువులు ఒక రసజ్ఞుని(పండితుని) పోషించిన విధముగా మూర్ఖునితన ఇంటిలో నుంచి కొనరుగదా.

త్రివళ్యాది సుపుష్టాంగా భారతీ భరతాశ్రితా,
నాదబ్రహ్మమయీ విద్యా జ్ఞానబ్రహ్మమయీ పరా.

6.19.11Vishnu_and_Lakshmi