ఉత్తరాషాఢ 3పాదములు, శ్రవణము 4పాదములు, ధనిష్ఠ 2పాదములు మకరరాశి, మొసలి.
శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు హేమంతఋతువు.
మంచు(ౘ)కారు - హేమంత ఋతువు.
గ్రాహము - 1.పంది, 2.చెర, 3.మొసలి, 4.గ్రహణము, 5.గ్రహించుట.
పంది - సూకరము.
వరాహ స్సూకరో ఘృష్టిః కోలః పోత్రీ కిరిః కిటిః,
దంష్ట్రీ ఘోణీ స్తబ్ధరోమా క్రోణోభూదార ఇత్యపి. -
తొలుపంది - ఆదివరాహము.
వరాహము - 1.పంది, 2.వరహా, 3.కోతి, 4.కొండ.
ఏకలీఁడు - అడవిపంది, వరాహము.
ఏకచరము - 1.ఒంటరిగాడు, 2.అడవిపంది, విణ.ఏకాంతమైనది.
ఒంటరికాడు - 1.ఒంటియై తిరుగువాడు, ఏకాకి, 2.పంది, ఏకచరము.
ఒంటరి - 1.ఏకాకి, 2.అసహాయుడైన బంటు, రూ.ఒంటరీఁడు.
ఏకాకి - 1.అసహాయుడు, 2.ఒంటరి(ఒంటరీఁడు - ఒంటరి), 3.ఏకాంగి.
ఏకలము - అసహాయ, వి.అడవిపంది (ఇది దేశ్యపదముగాగూడ వాడ బడుచున్నది. కాని పూర్వక విప్రయోగము మృగ్యము.)
ఒంటికాఁడు - పంది, విణ.1.వియోగి, 2.ఏకాకి, 3.సన్యాసి.
సన్న్యాసి - సన్న్యసించినవాడు.
ఏకాంగి - విరక్తుడగు విష్ణుభక్తుడు, విణ.ఒంటరివాడు.
వరాహము - 1.పంది, 2.వరహా, 3.కోతి, 4.కొండ.
వరహా - వరాహముద్రగల బంగారు నాణెము, సం.వరాహః.
నాణెము - 1.సొగసు, 2.అలకారము, 3.నాగరికత, రూ.నాడెము, సం.నాణకమ్.
నాన - సిగ్గు, సం.జ్ఞానమ్, త.నాన్, క. నాణ.
బిడియము - సిగ్గు; సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.
లజ్జ - సిగ్గు.
అయం తు కథితః కల్పో ద్వితీయస్యాపి భారత |
వరాహ ఇతి విఖ్యాతో యత్రాసీత్ సూకరో హరిః |
వారాహి -1. ఒక మాతృక, 2.అడవి యాడుపంది. సోమేశ్వరము నందు దేవీస్థానం వరారోహ.
వరారోహ - ఉత్తమ స్త్రీ, పెద్ద పిరుదులు గల స్త్రీ.
వామ - ఉత్తమ స్త్రీ.
వామదేవుఁడు - శివుడు.
విశుక్రప్రాణహరణ - వారాహీ వీర్యనందితా|
కామేశ్వరముఖాలోక - కల్పితా శ్రీగణేశ్వరా.
కరి1 - 1.ఏనుగు, 2.కోతి.
కరి2 - 1.నిదర్శనము, 2.మేర, విణ.సాక్షి.
కరిముఖుడు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు(Jupiter).
కరణీప్రసవ న్యాయము - న్యా. పందికి పదిపిల్లలు పుట్టుక కన్న ఏనుగుకు ఒక పిల్ల పుట్టుట మేలు అను భావము. (కరణి - విధము, రీతి.).
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలలితము భంగిన్
సిరి దా బోయిన పోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిన్ సుమతీ.
తా. కొబ్బరికాయలో ఏరీతిగా నీరుచేరునో ఆవిధంగా సిరివచ్చిన వచ్చును. అట్లే సిరిపోయినపుడు ఏనుగు విసర్జించిన వెలగపండులో గుజ్జు మాయ మయిన రీతిగా పోవును.
గోపుచ్ఛము - 1.కోతి, 2.ఆవుతోక.
క్రోఁతి - వానరము, రూ.కోతి. వానరము - కోతి; వనచరము - కోతి; మర్కటము - కోతి.
కపి - కోతి; తిమ్మఁడు - కోతి; కొండత్రిమ్మరి - కోతి.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి చిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు(జయుడు, శాపం వల్ల మొసలిగా జన్మించిన విజయుడు).
కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, త. మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
కొండ(ౘ)చూలి - పార్వతి. (చూలు - 1.గర్భము, 2.బిడ్ద.)
కొండయల్లుఁడు - శివుడు; కొండమల్లయ్య - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.
కొండపగతుఁడు - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
శతవిష్కో ధనాఢ్యశ్చ శతగ్రామే నభూపతిః|
శతాశ్వః క్షత్రియోరాజా శతశ్లోకేన పండితః||
తా. నూరు వరహాలు (వరహా - వరాహముద్ర గల బంగారు నాడెము, సం.వరాహః.)కలిగినవాఁడు ధనికుఁడనిపించుకొనును, నూరు గ్రామముల కధిపతియైనవాఁడు రాజనిపించుకొనును, నూరు శ్లోకములు(శ్లోకము - 1.సంస్కృత పద్యము, 2.కీర్తి.)రచించినవాఁడు పండితుఁడని యనిపించు కొనును. - నీతిశాస్త్రము
సూకరము - పంది, రూ.శూకరము.
శూకరము - సం.వి. రక్షింపబడని దుష్టాశ్వము.
ఘృష్టి - 1.పాచితీగ, 2.పోటి, 3.పంది, 4.రాపిడి, 5.కిరణము.
పోటి - 1.స్పర్థ, 2.ఊతగానిల్చిన స్తంభాదికము.
ఘృణి - 1.కిరణము, 2.వెలుగు.
విష్వక్సేనప్రియా ఘృష్టి ర్వారాహీ బదరేత్యపి -
విష్వక్సేనప్రియత్వా ద్విష్వక్సేన ప్రియా - విష్ణువునకుఁ బ్రియమైనది.
వారాహైః ఘృష్యత ఇతి ఘృష్టిః సీ. ఘృషు సంఘర్షణే. - వరాహములచేత నొరయఁ బడునది.
వారాహైరాక్రాంతా వారాహీ. - అడవిపందులచేత నాక్రమింపఁ బడునది.
బదతి స్థిరీభవతీతి బదరా. బడస్త్యైర్యే. - స్థిరమైయుండునది. ఈ మూడు 3 పాఁచితీఁగె పేర్లు.
విష్వక్సేనుఁడు - విష్ణు సేనాధిపతి.
కోలము1 - 1.రేగుపండు, 2.పంది, 3.ఒడి, 4.కౌఁగిలి, 5.తెప్ప.
కోలము2 - ఒకవిధమైన నాట్యము.
పోత్రము - 1.పందిమూతి, 2.నాగటి దుంప మొన.
కిరము - పంది, రూ.కిరి, వ్యు.ముఖము(ముట్టె)చే భూమిని త్రవ్వునది.
ముట్టె - పశ్వాదుల మూతి, పంది ముక్కు, సం.ముఖమ్.
కిటి - పంది సూకరము.
పంది - సూకరము; సూకరము - పంది, శూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
కిరిచక్ర రథారూఢ - దండనాథా పురస్కృతా|
జ్వాలామాలిని కాక్షిప్త - వహ్ని ప్రాకారమధ్యగా. - 27శ్లో.
స్థూలనాసము - పంది.
అసహాయాశూరుఁడు - ఒంటరిగా నిలిచి పోరు యోధుడు.
దంష్ట్రి - పంది, వ్యు.దంష్ట్రలుకలది.
దంష్ట్ర - కోరపల్లు.
దంష్ట్రాయుధము - పంది, వ్యు.దంష్ట్రలే ఆయుధముగా కలది.
అవిద్యానా మంత - స్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య - స్తబక మకరందస్రుతిఘురీ,
దరిద్రాణాం చింతా - మణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా - మురరిపు వరాహస్య భవతి. - 3శ్లో
తా. అమ్మా! నీ పాద రజము(పాదకమల పరాగరేణువు), లోపల అజ్ఞాన మను చీకటితో నున్నవారికి సూర్యుడు(ద్వాదశాదిత్యులు) దయించెడు భూమియందు నగరము వంటిది. మూఢులకు చైతన్యమనెడు కల్పవృక్ష పుష్పగుచ్ఛము యొక్క తేనె జాలు. దారిద్ర్యమువలన బాధ పడుచున్న దీనులకు చింతామణి గుణముల ప్రోవు. సంసార సముద్రము న తేలిరాలేక మునిగిన వారలకు యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు యొక్క దంష్ట్రము అగుచున్నది. - సౌందర్యలహరి
మురరిపు వరాహస్య దంష్ట్రాః : విష్ణురూపాది వరాహము దంష్ట్ర - ఉద్దారకారి. జనన మరణ సంసార సముద్రమున మునిగిన వారికి యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు యొక్క దంష్ట్రము.
ఘోణి - ఏనుగు, దోమ, పంది.
స్తబ్ధరోమము - పంది.
రోమశము - 1.పంది, 2.గొఱ్ఱె, విణ.ఒడలిపై నెక్కువ వెండ్రుకలుకలది.
క్రోడము - 1.రొమ్ము, 2.పంది, 3.ఒడి.
క్రోడాడు - 1.(ఎద్దు మో.వి) కొమ్ములతో నేలను పొడిచి దుమ్మెగజల్లు, 2.(పంది) ముట్టెతో నేలను కెల్లగించు.
కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ, వి కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ, వి ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శింఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 8.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.
క్రోడుఁడు - శనిగ్రహము.
ఆఖనికము - 1.పంది, 2.ఎలుక, 3.గుద్దలి, 4.గడ్దపార.
ఆఖువు - ఎలుక, పందికొక్కు.
గడ్డపార - నేల పెల్లగించు సాధనము, గునపము.
గడ్డపలుగు - గుంటకపలుగు, గునపము.
గునపము - త్రవ్వుట కుపయోగించు ఇనుపకడ్డీ, (వ్యవ.) గడ్డపార (Crow-bar).
ఆఖనికుఁడు - 1.కన్నపుదొంగ, 2.ఉప్పరి.
మోటు - 1.మొద్దు, 2.తట్టువ గుఱ్ఱము, 3.పందికెదుట మనుష్యా కారముగ నిల్చిన కపటలక్ష్యము, విణ.మూర్ఖుడు, సం.మూఢః.
మొద్దు - మ్రానిమోడు, విణ.1.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
తట్టువ - గుఱ్ఱము, రూ.తట్టువము.
ఊరఁబంది - (ఊరు+పంది)ఊరియందు తిరుగు పంది, గ్రామసూకరము.
ఇబ్బంది - (ఇరు+పంది) 1.అడవిపందికి ఊరపందికి పుట్టిన పంది, 2.ఇక్కట్టు, 3.నిర్భంధము.
నిర్భంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
నిక్కచ్ఛి - 1.నిర్భంధము, 2.సారము, 3.మొగమాటమి లేమి, సం.నిష్కర్షః.
చెర, చెఱ - 1.కారాగృహము 2.నిర్బంధము, సం.చారః.
ఒగు నోగుమెచ్చు నొనరాంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు బరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా? విశ్వ.
తా|| ఒక దుర్మార్గుని మరియొక దుర్మార్గుడు మెచ్చుకొనును. అజ్ఞాని పరమలుబ్ధు(లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.)ని మెచ్చు కొనును. పంది బురదనే మెచ్చుగాని పన్నీటి(పన్నీరు - చల్లనినీరు, సం.పన్నీరమ్)ని మెచ్చదు.
గ్రాహి - వెలగ, విణ.1.గ్రహించునది, 2.మలబంధనము కలిగించునది.
వెలఁగ - కపిత్థము.
కపిత్థము - వెలగచెట్టు.
ఒగరు - పచ్చివెలగ, పచ్చిదానిమ్మ కాయలవంటి రుచి, సం.తువరః.
తువరము - వగరు.
శింశుమారము - 1.మొసలి, 2.నీరుకోతి.
విష్ణువు శింశుమార రూపమున (మొసలి రూపమున) ఊర్థ్వలోకములైన భూః మొదలగు లోకములను ధరించుచున్నాడు.
సర్వైర్ద్రువాదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ, పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్!
తా. క్షీరసాగరమున శయనించియున్న శ్రీమన్నారాయణా! శింశుమార రూపమున నున్న నీ యొక్క పుచ్ఛము మొదలైన అవయములందు ధ్రువాది నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహములునట్లు కల్పించబడుచున్నవి. ఆ శింశుమార రూపమునున్న నిన్నుమహాత్ములు మూడు సంధ్యా సమయములందు ఉపాసించుచున్నారు. అట్టి శింశుమారరూపా! పాపములను దూరమొనర్చి, నాకు నరకము కలుగకుండునట్లు అనుగ్రహింపుము. - నారయణీయము
గ్రహణము - 1.రాహు కేతువులు సూర్యచంద్రులను పట్టుట, 2.గ్రహించుట, 3.బుద్ధి, (భౌతి.) గ్రహమునకు వేరు గ్రహము అడ్డువచ్చి కన్పించకుండుట(Eclipse), (భూగో.) భూమియొక్క కక్ష్య, చంద్రుని యొక్క కక్ష్య, రెండు బిందువుల (రాహుకేతువుల)లో కలియును. ఆ రెండింటిలో ఏదైన ఒక బిందువు భూమికి తిన్నగా వెనుకగాని ముందుగాని, వెనుకగాని వచ్చినచో గ్రహణము కలుగును.
పట్టు - 1.చెల్లు, 2.ప్రారంభించు, 3.కలుగు, 4.గ్రహించు, వి.1.గ్రహణము, 2.స్థానము, 3.అవలంబము.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః (గృహ.) తెలివితేటలు (Intelligence).
కక్ష్య - (భూగో.) భూమి సూర్యుని చుట్టు పూర్తిగా తిరుగుట.
గ్రహము - 1.రాహుగ్రహము, 2.అనుగ్రహము(అనుగ్రహము - దయ, కరుణ), 3.చెర, 4.యుద్ధయత్నము, 5.పిశాచము, 6.సూర్యాది నవగ్రహములు (సూర్యుడు, చంద్రుడు(నెల, చందమామ), అంగారకుడు(అంగారక గ్రహము పెనుమొసలిగా), బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు), (భౌతి.) ఆకాశములో సూర్యునిచుట్టు తిరుగుచు స్థిరముగా కాంతిని వెదచల్లెడు ఖగోళరాశి (Planet).
గ్రహీత - గ్రహించువాడు (గ్రహిశుడు).
నిర్బన్ధో పరాగార్కాదయో గ్రహాః :
గ్రహశబ్దము నిర్బంధమునకును, సూర్యచంద్ర గ్రహణములకును, సూర్యాది నవగ్రహములకును పేరు. నిర్బంధమనగా పట్టుట యని కొందఱు.
గృహ్ణాతీతి గ్రహణం, గృహ్యత ఇతి చ గ్రహః. గ్రహ ఉపాదానే. - పట్టును గనుకను, పట్టుటగనుకను, పట్టఁబడును గనుకను గ్రహము. "గ్రహో నుగ్రహ నిర్బంధ గ్రహణేషు రణోద్యమే, సూర్యాదౌ పూతనాదౌ చ సైహింకేయోపరాగయో"రితి శేషః.
సకలజన ప్రియత్వము నిజంబుగల్గిన పుణ్యసాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకలుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగగన్
టకటక మానియుండడె దృఢస్థితి నెప్పటియట్ల ! భాస్కరా.
తా. చంద్రుడు తన్ను రాహువు మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికినీ ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము బాధింపదు. అతిత్వరలోనే అతడు కోలుకొనును.
గ్రహరాజు - 1.సూర్యుడు, 2.చంద్రుడు. గ్రహపతి - సూర్యుడు.
గ్రాసము - 1.కబళము, తిండి, 2.గ్రహణము.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద(కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.), 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
పిడుౘ - 1.ముద్ద, 2.కబళము.
గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్డ, 3.అగ్ని, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.
కడుపు - ఉదరము, పొట్ట.
ఉదరము - 1.కడుపు, (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట.
ఉదరంభరి - తనపొట్టను మాత్రమే పోషించుకొనువాడు.
గాసము - 1.ఆహారము, తిండి, 2.బత్తెము, సం.గ్రాసః.
తిండి - ఆహారము; భక్షణము - తిండి.
ఆహారము - 1.భోజనము, భోజన పదార్థము, 2.అపహరణము, 3.తెచ్చుట.
భోజనము - ఆహారము, సాపాటు.
సాపాటు – భోజనము; సాపాటురాయుఁడు - (వాడు) తిండిపోతు.
అపహరణము - మోసగించి కొనిపోవుట, రూ.అపహృతి.
ఆహరించు - 1.అపహరించు, 2.ఆకర్షించు, 3.భుజించు.
తెచ్చుట - తీసికొని వచ్చుట.
భుక్తి - 1.భోజనము, 2.అనుభవము.
భుక్తము - 1.తినబడినది, 2.అనుభవింపబడినది.
గ్రస్తము - 1.భక్షింపబడినది, 2.గ్రస్తము.
గ్రస్తము - 1.తినబడినది, 2.మ్రింగబడినది, 3.లోపించిన వర్ణములు గలది (మాట).
మకరరేఖ - (భూగో.) భూమధ్య రేఖకు దక్షిణమున 23 1/2 డిగ్రీలలో ఉన్న రేఖ (Tropic of Capricorn).
మొసలి - నక్రము, మకరము.
కుంభీరము - మొసలి.
నక్రము - 1.అడ్డకమ్మి, 2.త్రొక్కుడుకమ్మి, 3.మొసలి.
నక్రస్తు కుమ్భీరః :
నక్రామతీతి నక్రః క్రము పాదవిక్షేపే. - భూమియందు పాదవిక్షేపము చేయనిది.
కుంభినో(కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు గలది, 2.కుమ్మరి.)గజాన్ రాతీతి కుంభీరః రా ఆదానే. - గజములను గ్రహించునది. ఈ రెండు ఏనుఁగును బట్టి యీడ్చుకొనిపోవు జలజంతువు పేర్లు.
మొసలివాయి - మొసలికాటు.
మొసలికాటు - మొసలి గల నోరు గల కత్తిపిడికొన.
నీళ్ళలోన మొసలి నిగడి యేనుఁగు బట్టు
బైట కుక్క చేత భంగపడును
స్థానబల్మి గాని తనబల్మి కాదయా! విశ్వ.
తా. మొసలి నీటిలో(మొసలికి నీళ్ళే తనయునికి పట్టు) వున్నప్పుడు, ఏనుగు(మహామృగము-ఏనుగు)నైనను పట్టుకొన గలుగును, బైట కుక్కను యేమిచేయలేక లొంగిపోవును. అది స్థానబలమే కాని, దాని స్వంత బలము కాదు.
అడ్డకమ్మి - ద్వారబంధపు పైకమ్మి, లచ్చికమ్మి, నాస.
దోరణపుఁగమ్మి - ద్వారము మీది అడ్దకమ్మి.
కమ్మి - ఇనుము మొ.గు లోహపు కడ్డీ.
కంబి - 1.వెదురుకమ్మి, 2.గరిటె.
గడియ - 24 నిమిషముల కాలము, సం.ఘటికా, వి.తలుపునకు అడ్డుగ వైచు కఱ్ఱ, రూ.గడెయ.
ఘటిక - 1. 24 నిమిషముల కాలము, గడియ, 2.చిన్నకుండ, 3.ముహూర్తము, 4.ఒకానొక విద్యాసంస్థ.
విగడియ - గడియలో అరవదవభాగము, 24 సెకనులు, సం.వి.ఘటికా.
ముహూర్తము - 1.పండ్రెండు క్షణముల కాలము(12 seconds), 2.రెండు గడియల కాలము.
విష్కంభము - 1.అడ్డంకి, 2.గ్రహయోగము, 3.గొళ్ళెము, (అలం.) నాటకాంగము.
గొళ్ళెము - (వ్యవ.) తలుపు చిలుకు, రూ.గొండెము.
గొండెము - తలుపు చిలుకు, రూ.గొళ్ళెము, గొండ్లెము.
నాస - ముక్కు, రూ.నస, నాసిక.
ముకు - నాసిక, రూ.ముక్కు.
నాసికాసంబంధము - (జం.) ముక్కుతో సంబంధము గలది (Nasal).
నాసావివరములు - (జం.) బయటికి తెరచుకొను ముక్కుకొన నుండు రంధ్రములు (Nostrils).
క్లీబే ఘ్రూణం గన్ధవహా ఘోణా నాసా చ నాసికా,
జిఘ్రతి అనేన ఘ్రూణం. న. ఘ్రూ గన్ధోపాదానే. - దీనిచేత వాసన గ్రహింతురు.
గంధం వహతీతి. గంధవాహా. వహ ప్రాపణే. - గంధమును వహించునది.
ఘుణతి భ్రమతి గంధగ్రహణాయ ఘోనా. ఘుణుభ్రమణే. - భ్రమించునది.
నాసతే శబ్దాయతే నాసా. నాసికా చ. నాసృసబ్ధే. - ధ్వనిచేయునది. ఈ 5 ఐదు ముక్కు పేర్లు.
ఘ్రూణము - ముక్కు, విణ.మూర్కొనబడినది.
ఘోణ - ముక్కు.
ఘ్రూతి - 1.ముక్కు, 2.వాసన, 3.వాసనచూచుట.
ఘ్రూణించు - క్రి.మూర్కొను, వాసనచూచు.
గంధవహ - ముక్కు, రూ.గంధవాహ.
గంధవహుఁడు - వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొనిపోవువాడు.
నాసామణి - ముక్కర, ముంగర.
ముంగర - ముక్కర, అడ్డబాస.
ముక్కఱ - ముంగర; ముంగర - అడ్డబాస.
అడ్డబాస - బులాకి, ముంగర.
బేసరి - ఒక రకము ముక్కర, అడ్దబాస.
అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి!
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, |
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తామణిధరః || - 61శ్లో
తా. హిమవంశమునకు పతాకవంటి(జండాయైన) ఓ తల్లీ! నీ ముక్కు అనెడి వెదురు మాకు చేరికయైన తగిన ఫలము నొసగు గాక, ఏ నాసిక లోపల చంద్రనాడి యనెడి నిటూర్పు నుండి(శ్వాస వదలేటప్పుడు) జారిన ముత్తెములను ధరించుచున్నదో ఆ నాసిక వెలుపలను గూడ ముత్తెము లను ధరించుచున్నది - సౌందర్యలహరి
ఇల్లి ముక్క - నెత్తురు కారు ముక్కు రోగము.
దిబ్బడ - శైత్యాధికముచే ముక్కుచెవులు మూసికొని పోవుటవల్ల కలుగు బాధ.
మొసలి దోరణము - మకర తోరణము.
మకరతోరణము - మొసలి రూపము గల తోరణము.
మకరకుండలము - మొసలి ముఖ మేర్పడ జేసిన కర్ణభూషణము.
మొసలివాపోఁగులు - మకర కుండలములు.
కుండలము - 1.యజ్ఞము చేసినవారు ధరించు కర్ణభూషణము, గుండ్రనితనము. తమ్మంటు - కుండలము, ఆభరణ విశేషము.
మకరిక - మకరికాపత్రము, స్త్రీలకు చెక్కిళ్ళపై లత్తుకతో వ్రాయు మకర రూపమగు రేఖ.
మకరము - 1.మొసలి, 2.ఒక నిధి, 3.ఒక రాశి.
మొసలిరాశి - మకరరాశి.
మీనరము - మొసలి, మకరము.
మకర మొకటి రవిఁ జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు * మాటున డాఁగెన్
మకరాలయమునఁ దిరిగెడు
మకరంబులు కూర్మ రాజు * మఱువున కరిగెన్.
భావ|| మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ దృశ్యాన్ని చూసి ..... అ భయానకమైన సుదర్శనము(విష్ణు చక్రము) తన పైకి వస్తుందేమోనని భయపడి రాశులలో ఒకటయిన మకరం సూర్యుని వెనుక చేరింది. నిధులలో ఒక రకమయిన మకరం కుబేరుని శరణు కోరి, ఆయన వెనుక దాక్కుంది. సముద్రంలో ఉన్న మొసళ్ళన్నీ ఆదికూర్మం అయిన తాబేలు కిందకు దూరిపోయాయి.
*మకరము + ఒకటి అంటే పన్నెండు రాశులలో ఒకటి అయిన మకరం. రవి జొచ్చెన్ అంటే సూర్యుని(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)దగ్గరకు చేరింది.
*మకరము మరి యొకటి అంటే మరొక మకరం (కుబేరుని ధనరాశులలో ఒకటి అయిన మకరం). ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత. ధను మాటున అంటే కుబేరుని చాటున డాగెన్ అంటే దాకుంది.
*తిరిగెడు అంటే తిరుగుతున్నటువంటి, మకరంబులు అంటే మొసళ్ళన్నీ, కూర్మరాజు మరువునకు అంటే (ఆదికూర్మావతార మెత్తిన విష్ణువు) ఆదికూర్మం అయిన తాబేలు కిందకు, అరిగెన్ అంటే మఱుఁగున జేరెను. *మకరం అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. నక్షత్రమండలంలో మనకున్న పన్నెండు రాశులలో మకరం అనేది ఒక రాశి పేరు. ధనదుడు - కుబేరుడు, విణ.దాత. అంటే ధనాన్ని ఇచ్చేవాడు. ఆ ధన్నాన్ని ఇచ్చే కుబేరుని దగ్గర ఉన్న అపారమైన నిధులు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు మకరం. మామూలుగా మకరం అంటే మొసలి అనే అర్థం.
మకర ఇవ గ్రహీతు మశక్యత్వాన్మకరః - మొసలివలె గ్రహింప నశక్యమైనది.
లిబ్బి - 1.పాతర, 2.రాశి, 3.నిధి, 4.ప్రోగు(ప్రోఁగు - పోగు), ధనము.
నేలమాళిగ - 1.నేలలోపలిగది, 2.పాతర, 3.నేలమాణ్యము (Cellar).
నిధానము - 1.ఉంచుట, నిలువజేయుట, 2.పాతర.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు, (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము, (Quantity).
నిధి - పూడ్చి యుంచిన ధనము, పాతర. (అర్థ.) ఒక యవసరము కొరకు ప్రత్యేకముగ నిలుపచేసిన ధనము. (ఏ యవసరమునకై నిథి ఉపయోగింపబడునో ఆ పేరు దానికి పెట్టబడును, ఉదా. రక్షణ నిధి.)శేవధి - నిధి, రూ. సేవధి.
ధనము - 1.విత్తము 2.ఆలమంద, వి. (గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
లిబ్బిదొర - శ్రీదుడు, కుబేరుడు; శ్రీదుఁడు - కుబేరుడు; వైశ్రవణుఁడు - కుబేరుడు.
లిబ్బిపడఁతి - లక్ష్మి. పడఁతి - స్త్రీ(స్త్రీ - ఆడుది), రూ.పణఁతి.
మకరకేతసుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.
మకరధ్వజః మకరోధ్వజోయస్య సః - మకరము ధ్వజముగాఁ గలవాడు, మన్మథుడు.
మకరాలయము - సముద్రము; మహాశయము - సముద్రము.
సముద్రము - సాగరము. సగరిపుత్రైః ఖాతస్సాగరః - జలములు గలిగినది.
సాగరము1 - నేయి మొ. నవి నింపిన సిద్దెల జోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.
సముద్ర నవనితము - చంద్రుడు. చంద్రుఁడు తాను పుట్టిన సముద్రమును వర్థిల్ల జేయును.
సందరము - సముద్రము, మున్నీరు, రూ.సంద్రము, సం.సముద్రః.
సంద్రము - సందరము, సం.సముద్రః.
సంద్రుఁడు - సముద్రుడు, సం.సముద్రః.
మున్నీరు - (మును + నీరు) సముద్రము.
మున్నీటిచూలి - క్షీరసాగరకన్యక, లక్ష్మి.
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రవాత్
మాఙ్గల్యభాజి మధుమాథిని మన్మథేన
మ య్యాపతే త్త ది హ మన్థర మీక్షణార్థం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయః.
చిన్ని మకరాంకపుఁ బయ్యెద చేడెకు మకరారాశి....
ఝషము - 1.చేప, 2.మొసలి.
ఝషకేతుఁడు - మన్మథుడు.
ఝషతి హినస్తి బాలమస్త్యానితి ఝషః ఝష హింసాయాం - పిల్ల చేఁపలను (ౘ)చంపి తినునది.
శిశుకము - 1.శిశువు, 2.ఉలుచ మీను, 3.మొసలి.
పసిబిడ్డ - (గృహ.) శిశువు, చంటిబిడ్డ (Infant child).
చేతిబిడ్ద - పసిబిడ్ద. నెత్తురుపాప - జొత్తుపాప, పసిబిడ్డ.
పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయము, వి.బిడ్డ.
(ౙ)జొత్తుపాప - నెత్తురుకందు, మిక్కిలి పసిబిడ్డ.
శిశువు - బిడ్డ; బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు, రూ.ప్రసూనుడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
సూనువు - 1.కొడుకు, 2.కూతురు.
తమ్ముఁడు - వెనుక పుట్టినవాడు, అనుజుఁడు, రూ.తమ్మువాడు.
అనుజుఁడు - తమ్ముడు; తమ్మువాఁడు - తమ్ముడు.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కున్నడు - బాలుడు, బిడ్డడు.
చిన్నవాడు - బాలుడు.
స్కందుఁడు - కుమారస్వామి; కొమరసామి - స్కందుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
బురక - బిడ్డ, విణ.పొట్టి.
బురుకఁడు - వామనుడు, పొట్టివాడు.
వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు.
శిశుసంరక్షణ - (గృహ.) చంటిబిడ్దను జాగ్రత్తగా పెంచుట (Child care).
శిశుసంరక్షణశాల - (గృహ.) పసిబిడ్డలకు కావలసిన సంరక్షణలు చేయు వైద్యశాల, (Baby Clinic).
కిసరు - 1.కోపవికారము, 2.అంటు సోకుటచే పసిబిడ్డలకు గలుగు దోషము.
ఉలుౘ - మిక్కిలి చాపల్యముగల చేప, సం.ఉలూపిః.
ఉలూపి - 1.ఒక నాగకన్య, 2.ఉలుచ చేప.
ఉలూపీ శిశుకస్సమౌ :
ఉత్ ఊర్థ్వం ఉంపతి భ్రమతీతి ఉలూపీ. లుప్ ఌ చేదనే. - ఊర్థ్వముగా భ్రమించునది.
చాపల్యాచ్చిశురివ శిశుకః - చాపల్యము వలన శిశువువంటిది. ఈ రెండు శిశువువలె చపలమైన ఉలసమీను పేర్లు.
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి ప్రొతసామస్మి జాహ్నవీ || - 31శ్లో
పావనమొనర్చువాటిలో వాయువును, శస్త్రధారులలో రాముడును, జలచరములలో మొసలియు, నదులలో గంగయు(జాహ్నవి - గంగ) నావిభూతులే. రామబాణమఘోఘమైనది కావుననే శత్రధారులలో అతడగ్రేసరుడు.
త్రిలోకపావనియగు గంగ విష్ణుపాదమునుండి పుట్టినది. వైజ్ఞానికులు గంగా జలములు ఎంతకాలముంచినను చెడిపోవనియు, వీనియందు రోగక్రిములు జీవింప జాలవనియు ఋజువు చేసిరి. హిందువులు గంగను పూజించుటచే సర్వపాపములు నశించి ముక్తికలుగునని విశ్వసింతురు. - భగవద్గీత విభూతియోగః
సంక్రాంతి - మేషాది సంక్రమణము.
సంక్రమణము - సూర్యుడొక రాశి నుండి మరియొక రాశికి ప్రవేశించుట. సం.వి.(భౌతి.) ఒక చోటగల స్థితి, దశ, రీతి విషయము అను వానినుండి మరొకచోట గలస్థితి, దశ, రీతి విషయము అనువానికి మార్పు, (Transition), సం.వి.(రసా.) దాటుట (Transition), ఉదా.రాంబిక్ గంధకము 96 డిగ్రీల యొద్ద మోనోక్లినిక్ రూపమునకు సంక్రమణము చేయును.
యస్మిన్ బ్రహ్మాభ్యజయత్సర్వమేతత్ | అముంచ లోక - మిదమూచ సర్వమ్ | తన్నో నక్షత్ర - మభిజిద్విజిత్య | శ్రియం దధాత్వహృణీయ మానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మణా సంజితేమౌ | తన్నో నక్షత్ర - మభిజిద్విచష్టామ్ | తస్మిన్వయం పృతనాస్సంజయేమ | తన్నో దేవాసో అనుజానంతు కామమ్ ||21||
అభిజిత్తు - 1.పగలు పదునాల్గు గడియలపై రెండు గడియల కాలము, 2.ఒక నక్షత్రము.
బొమ్మచుక్క - కానరానిచుక్క, అభిజిన్నక్షత్రము.
కానరానిచుక్క - అభిజిత్ నక్షత్రము.
శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు హేమంతఋతువు.
మంచు(ౘ)కారు - హేమంత ఋతువు.
తుహినము - మంచు.
తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.
22. శ్రవణము - ఒకే పంక్తిగా వేణువువలె 8 నక్షత్రములుండును.
అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి. 1.విష్ణు శంఖము, 2.మేఘము, 3.అభ్రకము(Mica), 4.(వృక్ష.)వావిలి, 5.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్దశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.
అనంతుఁడు - విష్ణువు.
మలయమున జందనము క్రియ,
వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిలలో నభవుఁడు హరి యదు
కులమున నుదయించె నండ్రు గొంద ఱనంతా!
భా|| అనంతా! ధర్మనందనుని యశస్సు నలుదెసలా ప్రసరింప జేయుటానికి మలయపర్వతం మీద చందనవృక్షం చందాన, పుట్టుక ఎరుగని పురుషోత్తముడు యదువంశములో జన్మించాడని కొందరంటారు.
అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.
అమితము - విస్తారము, మితిలేని, మేరలేనిది.
నిరవధికము - మేరలేనిది.
పాంచజన్యము - విష్ణువు శంఖము.
వలమురి - దక్షిణావర్త శంఖము. దక్షిణావర్తము - (వృక్ష.) కుడి నుండి ఎడమ వైపునకు చుట్టుకొనునది. శంఖధ్వని వినిపించే చోటు లక్ష్మీదేవి ఉంటుంది.
వలమురి తాలుపు - విష్ణువు.
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
వెలిగుల్ల - శంఖము.
గుల్ల - 1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము.) సం.క్షుల్లః.
క్షుల్లకము - 1.నత్తగుల్ల, 2.పేదరికము, 3.నూలుపోగు.
శంఖనఖము - నత్తగుల్ల.
శంఖపాణి - విష్ణువు వ్యు.శంఖము చేతి యందు ధరించువాడు.
శంఖో లక్ష్మీపతేః పాంచజన్యః :
పాంచజన్యః సముద్రే తిమిరరూపచారిణః పరచజనాఖ్యస్యా సురస్య అస్థిజత్వా త్పాంచజన్యః - సముద్రమందు తిమిర(తిమిరము - చీకటి) రూపుఁడై సంచరించు చున్న పంచజనుఁ డనెడు(పంచజనుఁడు - 1.మనుజుడు, 2.ఒక రాక్షసుని పేరు.)రాక్షసుని యొక్క అస్థివలనఁ బుట్టినది.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
నభస్వంతుఁడు - వాయువు.
అభ్రము - 1.మేఘము, 2.ఆకాశము, 3.అభ్రకము, 4.బంగారు, 5.హారతి కర్పూరము, 6.తుంగముస్త, 7.(గణి.) సున్న.
అభ్రమణి - సూర్యుడు Sun.
అభ్రంకషము - ఆకాశమును ఒరయునది, మిక్కిలి ఎత్తైనది.
ఆకాశమును మేఘములు ఆవరించినా - ఆవరించక పోయినా సూర్యునికి ఎటువంటి హాని వృద్ధులు ఉండవు కదా!
అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
నభ్రమతి స్వం వల్లభం హిత్వా కుత్రచిన్న గచ్ఛతీ త్యభ్రముః. ఉ-సీ భ్రముచలనే - తన మగని విడిచి కదలనిది.
అభ్రేషు మాతివర్తత ఇత్యభ్రముః మాఙ్ మానే వర్తనేచ - మేఘముల యందుండునది.
అమలము - 1.నిర్మలము, 2.దోషము లేనిది 3.తెల్లనిది, వి. అభ్రకము.
అభ్రకము - (రసా.) కాకిబంగారము, (రాసాయనికముగ ఇది మగ్నీషియమ్, ఇనుము, సోడియమ్, పొటాషియమ్‌తో కూడుకొనిన సిలికేట్ యౌగికము. ఇది పొరలుగా విడదీయబడ గలదు. దీనిని తాపవిద్యుత్ నిరోధకముగా వాడుదురు) (Mica).
కాకిబంగారము - పీతాభ్రకము.
బేగడ - కాకి బంగారు; ముచ్చెబంగారు - కాకి బంగారు.
అభ్రకం గిరిజామలే :
అభ్రసదృశత్వాత్ అభ్రకం - మేఘమువంటి వర్ణము గలది.
గిరౌయత ఇతి గిరిజం. జనీ ప్రాదుర్భావే. - పర్వతమునఁ బుట్టినది.
న విద్యతే మల మత్రేతి అమలం - దీనియందు కల్మషము లేదు.
గిరిజామలమని యొకపేరుగాఁ గొందఱు చెప్పుదురు. ఈ 3 మూడు అభ్రకము పేర్లు.
శాతకుంభము - బంగారు, వ్యు.శతకుంభ పర్వతమున పుట్టినది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము 2.అందము.
బంగరు - బంగారము, సం.భృంగారః.
హృద్యము - మనసు కింపైనది, మదికి హితమైనది.
అందము - 1.సౌందర్యము 2.అలంకారము 3.విధము, విణ.1.చక్కనిది 2.తగినది.
సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
సొన్నారి - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.
గీటురాయి బంగారాన్ని పరీక్షించినట్టు మనిషిని పరీక్షిస్తుంది బంగారం - చిలో
స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి.(రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ పర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.
బంగారము - వై.వి. దుర్లభము, వి.స్వర్ణము.
జాతరూపము - బంగారము.
అష్టాపదము - బంగారము.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశగంగ.
అబ్దము - 1.సంవత్సరము, 2.మేఘము, 3.తుంగమస్త, 4.ఒక కొండ, 5.అద్దము, విణ.నీటి నిచ్చునది.
అంభోదము - 1.మేఘము, 2.(వృక్ష) తుంగమస్త.
అంభోదరము - 1.మేఘము, వ్యు.నీటిని ధరించునది, 2.(వృక్ష.) ముస్త.
జీమూతము - 1.మేఘము, 2.కొండ.
జీమూతౌ మేఘపర్వతౌ : జీమూతశబ్దము మేఘమునకును, పర్వతము నకును పేరు.
జీవనం ముఞ్చతీతి జీమూతః - జీమూతమును (నీళ్ళను) ఇచ్చును.
జీవన ముదకం మూయతే బద్ధ్యతే త్ర జీమూతః, మూజ్ బందహనే – ఉదకము, నీరు దీనియందు బంధింపఁబడును.
ఆకాశంలో కదిలే మేఘాలు ఆకాశాన్ని మలినం చేయడం లేదు. మేఘములు నలుపైనా కురిసే వాన తెలుపే. మేఘములను ఎవరు - ఘర్జించమన్నారు? మేఘముల రాక - పోకలతో ఆకాశం దోషం పొందుతోందా?
పర్జన్యము - 1.ఉరిమెడు మేఘము, 2.ఉరుము.
మేఘనాదము - ఉరుము.
పర్జన్యుఁడు - వర్షాధిపతి.
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మదలంచియుగ్రవా
క్పరుషతజూపినన్ ఫలముగల్గుట తద్మముగాదె, యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున (న)అశేషజనంబులెఱంగ, భాస్కరా.
తా. మేఘము భయంకరముగా నురిమి తుదకు జనులను రక్షించుటకై వర్షము కురియును, అట్లే కనికరించు స్వభావము కలవాడు సమయము కొలది కఠినముగా మాట్లాడినను తుదకు మేలునే చేయును.
అంబుదము - నీటి నిచ్చునది, మేఘము, మబ్బు.
మొగులు - మేఘము, రూ.మొగిలు, మొయిలు.
మొగులుదారి - ఆకసము. ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
వారిదము - మేఘము, వ్యు.నీటి నిచ్చునది.
వారిమసి - మేఘము, వ్యు.నీరు(వారి - నీరు)ని మసివలె నల్లగ చేయును.
క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
పాదోదకము - మేఘము.
పాద్యము - పాదము కొరకైన నీళ్ళు.
మొగులువిరి - జలము, మేఘ పుష్పము.
మేఘ పుష్పము - 1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.
మేఘము - మబ్బు.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
బలాహకము - మబ్బు. చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధకరిపుఁడు(రిపువు - శత్రువు) - శివుడు.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
తమస్సు - తమము.
తమి - రాతిరి, చీకటి.
రాత్రి - సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాత్రిమణి - చంద్రుడు Moon. చంద్రుడు - నెల, చందమామ.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
చీకటిగాము - రాహువు Rahu. తలగాము - రాహువు.
పిబంతి నద్య స్స్వయ మేవనాపః, ఖాదంతి నస్వాదు ఫలానివృక్షాః|
పయోధ రాస్సస్యమ దంతినైవ, పరోపకారాయ సతాం విధూతయః||
తా. నదులు తమ జలమును తాము త్రాగవు, వృక్షములు తమయందు ఫలించిన ఫలములను తాము భక్షింపవు. మేఘములు(మేఘాలచే విడువబడినది) వర్షించుటచే పండిన పైరులు నా మేఘములు భక్షింపవు. కావున లోకమందు ధర్మాత్ములైన సత్పురుషులు సంపాదించిన ధనమును పరోపకారము సేయుదురు. - నీతిశాస్త్రము
మాపు - పోగొట్టు, వి.1.రాత్రి, 2.సాయంకాలము, 3.మైల.
శార్వరి - 1.రాత్రి, 2.అరువది సంవత్సరములలో నొకటి.
శర్వరి - రాత్రి. రాత్రిమణి - చంద్రుడు Moon.
రాత్రి - (రజని - రాత్రి) సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకు గల కాలము.
రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.
సాయంకాలము - మునిమాపు; మునిమాపు - (మును+మాపు) ప్రదోషము, సంజ. మఱుసంౙ - సాయం సంధ్య. అసుర సంధ్య - రాక్షసవేళ, సాయంసంధ్య. ప్రదోషము - 1.మునిమాపు, 2.మిక్కిలి దోషము.
మాపుడు - మైల, మలినము(మాసినది, నల్లనిది).
మైలావు - పొగ ఛాయగల ఆవు.
నెత్తురుపొద్దు - సంధ్యాకాలము.
నీరుకాళ్ళు - సాయంకాలములందు దోచు ఎఱ్ఱని పచ్చని కిరణములు.
సాయము1 - సాహాయ్యము.
సాహాయ్యము - 1.తోడుపాటు, 2.సహాయత్వము, 3.స్నేహము.
తోడ్పాటు - తోడుపాటు; తోడుపాటు - సాహాయ్యము, రూ.తోడ్పడు.
తోడ్పడు - తోడుపడు; తోడుపడు - సహాయపడు, రూ.తోడ్పడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
సాయము2 - 1.సాయంకాలము, 2.బాణము.
సాయంతనము - సాయంకాల సంబంధమైనది.
అజిహ్మగము - బాణము, వ్యు.వంకరగా పోనిది, తిన్నగా పోవునది.
తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.
నాళీకము - 1.తామర, 2.బాణము, 3.బాణపు ములికి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 2.కూతురు, సం.1.భేత్త్రీ, 2.పుత్త్రః, 3.పుత్రి.
వృద్ధార్కో హోమధూపశ్చ బాలస్త్రీ నిర్మలోదకమ్|
రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిః దినేదినే||
తా. సాయంకాలమునం దెండ(ఎండ)కాచుకొనుట, హోమము(వేల్మి, యజ్ఞము)సేయు పొగ యొడలిమీఁదఁ బాఱుట, తనకంటె చిన్నదానితో సంగమము చేయుట, మంచినీళ్ళు త్రాగుట, రాత్రుల యందు క్షీరాన్న భోజనము చేయుట; ఇవి దినదినమున ఆయుస్సును వృద్ధి పొందించును. - నీతిశాస్త్రము
సిందువారము - వావిలిచెట్టు.
సిందురము - 1.సింధూరము, 2.కుంకుమ, 3.వావిలిచెట్టు, సం.సిందూరం, సిందువారః.
సిందూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగ ద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
కాంతరజము - కుంకుమము.
సిన్దువా రేంద్రసురసా నిర్గు ణ్డీన్ద్రాణి కేత్యపి :
రసం స్యన్దతే సిన్దుకః స్యన్దూ ప్రసరణే. - రసమును స్రవించునది.
సిన్దుం స్యన్దనం త్వగాదినా వృణోతీతి సిన్దువారః. వృఙ్ వరణే. - స్రవించుటను పట్ట మొదలైనవానిచేతఁ గప్పునది.
ఇంద్రస్యసురసః ప్రియః ఇంద్రసురసః - ఇంద్రునికి ప్రియమైనది.
గుడాత్పరివేష్టనాన్నిష్క్రాంతా నిర్గుండీ. గుడవేష్టవే. - గుడమనఁగా జుట్టుకొనుట; అందువలనఁ బాసినది.
ఇంద్రస్య ప్రియా ఇంద్రాణికా - ఇంద్రునికిఁ ప్రియమైనది. ఈ ఐదు వావిలిచెట్టు పేర్లు.
కురువము - తిలకము.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
బొట్టు - 1.తిలకము, 2.చుక్కసున్న, 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
లోహితము - 1.రక్తచందనము, ఎఱ్ఱ చందనము, 2.సింధూరము, 3.నెత్తురు.
రక్తచందనము - ఎఱ్ఱ చందనము, (రక్త) ద్రవపదార్థము సం.వి. (జం.) సామాన్యముగా రక్తములోనున్న ద్రవపదార్థ భాగము, (Plasma) రసకళ, Plasma membrane.
ఎఱ్ఱగందము - రక్తచందనము.
రుధిరము - 1.నెత్తురు, రక్తము, 2.సిందూరము.
లోహితాంగుఁడు - అంగారకుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు. (Mars)
శ్రుతిసీమంత సిందూరీ - కృతపాదాబ్జ ధూళికా|
సకలాగమ సందోహ - శుక్తిసంపుట మౌక్తికా.
తూపు రిక్క - శ్రవణ నక్షత్రము.
తూపు - బాణము.
శణము - 1.జనము(జనము - ప్రజ), 2.బాణము.
నారసము - వై. వి. నారాచము, బాణము.
ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము.
రక్తస్రావము - (జీవ.) రక్తము వెలుపడుట. (Hemorrhage) (ఇది శరీరములో జరిగిన చాల అపాయకరము.)
అజిహ్మగము - బాణము, వ్యు.వంకరగా పోనిది, తిన్నగా పోవునది.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్క రాయుడు.
కనుము - 1.శరము, 2.తృణము, 3.మకర సంక్రమణమునకు తరువాతి రోజు.
శరము - 1.బాణము, 2.రెల్లు, 3.జలము.
బాణము - అమ్ము. పృషత్కము - అమ్ము, బాణము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - క్రి. విక్రయించు, వెలకు ఇచ్చు.
కంకపత్రము - అమ్ము, బాణము. విశిఖము - బాణము
అంబు - బాణము, రూ.అమ్ము, సం.అంబకమ్.
అంబకము - 1.కన్ను, 2.బాణము.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలి పురికన్ను, 7.చూపు(నిబోధనము - చూపు), 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
చక్షువు - కన్ను.
కను - క్రి.1.చూచు, 2.ప్రసవించు, 3.తెలియు, వి.నేత్రము.
కంట - 1.కనుట, 2.నాట్యబంధము.
దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు; (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్దివాడు, 3.మంచికన్నులు కలవాడు.
ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు - ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వీనికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).
పత్రము - 1.ఆకు, 2.రెక్క, 3.వ్యవహారము చెల్లుబడికై వ్రాసికొను కాగితము, 4.వాహనము, 5.బాణము.
పత్తిరి - పూజకుపయోగించు ఆకులు, సం.పత్రమ్.
పతత్రము - 1.రెక్క, 2.పత్రము.
పతత్రి - పక్షి, వ్యు.రెక్కలుగలది.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
పత్రభంగము - మకరికాపత్రము, పత్రరేఖ.
మకరిక - మకరికాపత్రము, స్త్రీలకు చెక్కిళ్ళపై లత్తుకతో వ్రాయు మకర రూపమగు రేఖ.
కాశము - 1.రెల్లు, 2.ప్రకాశము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
ఱెల్లు - తృణవిశేషము, శరము.
ఱెల్లు(ౘ)చూలి - కుమారస్వామి, శరజన్ముడు.
శరజన్ముఁడు - కుమారస్వామి.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండవవరుస.
అరవ - 1.తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వత మార్గము, కనుమ.
తూపురిక్క నెల - శ్రావణమాసము.
శ్రావణము - 1.వినిపించుట, 2.ఒక మాసము, 3.పట్టుగఱ్ఱవంటి చిన్న పనిముట్టు (Forceps).
శ్రావణే తు స్యాన్నభాః శ్రావణికశ్చసః :
శ్రవణనక్షత్ర యుక్తా పూర్ణిమా స్మిన్నితి శ్రావణః, శ్రావణికశ్చ. - శ్రవణనక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁగలదు.
ప్రవంత్యస్మిన్ మేఘా ఇతి శ్రావణః. స్రుప్ర స్రవణే. - దీనియందు మేఘములు వర్షించుచున్నవి.
న భాసతే మేఘచ్ఛన్న త్వాత్ నభాః స. పు. భాసృ దీప్తౌ. - మేఘచ్ఛన్నమై ప్రకాశింపనిది. ఈ మూడు శ్రాణమాస నామములు. రిక్కదారి - ఆకాశము.
పక్షీణాం బలమాకాశం మత్స్యానా ముదతఁ బలమ్|
దుర్బలస్య బలంరాజా బాలానాం రోదనం బలమ్||
తా. పక్షులకు ఆకాశము బలము, చేపలకు (ఉదకము - నీరు, వ్యు. తడుపునది, రూ.ఉదము.)నీళ్ళు బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము(కన్నీరు) బలము. - నీతిశాస్త్రము
శృణ్వంతి శ్రోణా - మమృతస్య గోపామ్ | పుణ్యామస్యా ఉపశృణోమి వాచమ్ | మహీం దేవీం విష్ణుపత్నీ- మజూర్యామ్ | ప్రతీచీ మేనాగ్ం హవిషా యజామః | త్రేధా విష్ణు - రురుగాయో విచక్రమే | మహీం దివం పృథివీ - మంతరిక్షమ్ | తచ్ఛ్రోణైతి శ్రవ - ఇచ్ఛమానా | పుణ్యగ్గ్ శ్లోకం యజమానాయ కృణ్వతీ ||22||
శ్రవణము - 1.చెవి, Ear 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
శ్రుతి - 1.వేదము, 2.చెవి, 3.వినికి.
సుతి - శ్రుతి, కంఠస్వరాదులకు సహాయమగు తంత్రి, మొ. వాని ధ్వని, సం.శ్రుతిః.
ఆకర్ణము - వినికి, శ్రవణము. శ్రవణము తో మనశ్శుద్ధి కలుగుతుంది. వీను - 1.ప్రసిద్ధి, 2.చెవి. Ear is your teacher.
దేవకీనందన శ్శౌరి ర్హయగ్రీవో జనార్దనః,
కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరో(అ)నఘః |
తూపు రిక్క - శ్రవణ నక్షత్రము (తూపు - బాణము).
వావిలి - శ్రవణ నక్షత్రము.
శ్రీహరి యగు వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణం.
కర్ణ శబ్దగ్రహౌ శ్రోత్రం శ్రుతిః స్త్రీ శ్రవణం శ్రవః :
కరోతి శబ్దగ్రహణం కర్ణః డుకృఞ్ కరణే. - శబ్దగ్రహణమును జేయునది.
కీర్యతే శబ్దో త్రేతి వాకఋనః. కౄ విక్షేపే. - శబ్దము దీనియందుఁ జల్లఁబడును.
గృహతే అనేన గ్రహః. శబ్దస్య గ్రహః. శబ్దగ్రహః. గ్రహ ఉపాదానే. - శబ్దము దీనిచేతఁ గ్రహింపఁబడును.
శృణోత్యనేన శ్రోత్రం. శ్రుతిః. సీ. శ్రవణ శ్రవశ్చ. స. న. శ్రు శ్రవణే. - దీని చేత విందురు. కనుక శ్రోత్రము, శ్రుతి, శ్రవణము, శ్రవస్సు.
భవములకు మందు, చిత్త, శ్రవణానందము
ముముక్షుజన పదము, హరి
స్తవము పశుఘ్నుఁడు, దక్కను,
జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁదే.
భా|| శ్రీహరియైన విష్ణువుయొక్క స్తోత్రం సంసార బాధలకు ఔషధం వంటిది. అది చెవులకు మనస్సుకు ఆనందం కలిగిస్తుంది, మోక్షం అర్థించే జనులు కోరే స్థానం అది. అటువంటి హరిస్తోత్రం(స్తవము - స్తోత్రము) విని కసాయివాడు అయితే తప్ప ' నాకు తృప్తి కలిగింది చాలు ' అనే మూర్ఖుడు ఎవ్వడూ ఉండడు.
స్నాత్వా తులార్కే కావేర్యాం మహాత్మ్యశ్రవణం కురు,
గవాశ్వవస్త్ర ధాన్యాన్న భూమికన్యాప్రదో భవ|
కర్ణము1 - 1.చెవి, 2.చుక్కాను.
కర్ణము2 - (గణి.) లంబకోణ త్రిభుజములో లంబకోణమునకు ఎదురుగా నున్న భుజము (Hypotenuse).
కర్ణసంబంధము - చెవికి సంబంధించినది (Auditory).
కర్ణసాయనము - (జాతీ.) చెవుల కింపైనది, కర్ణపేయము.
కర్ణికలు - (జం.) 1.హృదయము లోపల జఠరికల పైభాగమున నున్న రెండు కుహరములు, 2.బయటి చెవులు.
జఠరిక - (జం.) గుండెకాయలో నుండి రక్తమును బయటికి పంపునది, (Ventricle).
జఠరికలు - (గృహ.) గుండెలోని క్రింది గదులు (Ventricles).
శష్కులి - చక్కిలము, బయటచెవి.
కర్ణభేరి - 1.(శారీ) చెవి యొక్క మధ్యభాగము, మధ్య కర్ణకుహరమును బయటిదాని నుండి వేరుచేయు పొర (Ear-Drum), 2. (జం.) శబ్దములను వినుట కుపయోగించు కంపనశక్తి గల పొర, చెవిలో నుండు డోలువంటి నిర్మాణము (Tympanum).
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోశపు పొర క్రింద నుండు అంతస్రావగ్రంథి (Thymus gland).
పురఃకర్ణాస్థి - (జం.) శ్రవణ ప్రావరములో నున్న ఎముకభాగము (Pro-otic).
స్తంభిక - (జం.) శ్రవణ ప్రావరములో నున్న చిన్న కడ్డీ వంటి ఎముక (Columella).
రికాబు - (జం.) మధ్య చెవి భాగములో నున్న స్తంభికకు ఒకవైపున అంటియుండు చిన్న కోమలాస్థి బొడిపె (Stapes).
కర్ణాశ్మములు - (జం.) అంతర్లసికములో నుండు స్పటికాకారమైన నున్నపు సంబంధమగు రేణువులు (Ototiclas, ear Stones).
తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా
ఓగు నేర మెంచు నొరులఁగాంచి
చక్కిలంబు గాంచి జంతిక నగినట్లు విశ్వ.
తా|| తనయందు అనేక(పెక్కు - అనేకము, సం.పుష్కలమ్.)తప్పులు పెట్టుకొని, యితరుల(ఓగు - 1.అశుభము, 2.కీడు(బాగోగులని వాడుదురు బాగు+ఓగు)తప్పులను(నేరము-తప్పు)యెన్నుచిందురు. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!
చుక్కాను - 1.మేక, 2.సంతాపము నందు కలిగించు ధ్వని.
మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.
గాంధారము - 1.(సంగీ.) ఒక విధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార్ అను ఒకానొకదేశము.
అరిత్రము - 1.చుక్కాని, 2.ఓడ తెడ్డు.
తండువు - 1.త్రెడ్డుకొయ్య, 2.నందికేశ్వరుడు.
పీలికాఁడు - చుక్కాను పట్టువాడు.
కర్ణకారుఁడు - ఓడవాడు, సరంగు.
కర్ణధారుడు - సరంగు; సరంగు - నావికుడు.
ఓడంగి - ఓడవాడు, నావికుడు.
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్ల మీద నొప్పుగవచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ.
తా. ఓడలమీద బండ్లువచ్చును, బండ్లుమీద ఓడలు వచ్చుచుండును. అట్లే ఈ భూమియందు సుఖమున్న వారికి కష్టము, దారిద్ర్యమున్నవారికి సంపద వచ్చుచుండును.
శబ్దగ్రహము - 1.చెవి Ear, 2.శబ్దజ్ఞానము.
శ్రవ్యము - (భౌతి.) చెవి, గ్రహింప బడ గలది, (Audible).
శ్రవము - చెవి; శ్రవణీయము - వినదగినది.
శ్రోత్రము - చెవి; శ్రోతవ్యము - వినదగినది.
చెవి - 1.శ్రవణము, వినెడి యింద్రియము, 2.రాట్నము మొదలగు వాని యందుగల యొక భాగము, 3.తాళపుచెవి.
ఆకర్ణము - వినికి, శ్రవణము. శ్రవణము తో మనశ్శుద్ధి కలుగుతుంది.
వినికి - వినుట, రూ.వినుకలి.
బైనోరల్ - (Binoral),1.వినుట, 2.వినిపించుట.
శ్రోత - వినువాడు. Ear is your teacher. చెప్పేవాడికి వినేవాడు లోకువ.
శ్రవణ ప్రావరములు - (జం.) శబ్దమును గ్రహించు ముఖ్యావయములను కప్పియుంచి రక్షించు సాధనములు, శబ్దమును గ్రహించు బరిణులు (Auditory capsules).
ఆలకించు - క్రి.1.విను, 2.ఆదరించు, రూ.ఆలించు.
ఆలించు - క్రి.విను, ఆలకించు.
విను - ఆకర్ణించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినుకెంపు - సూర్యుడు, వ్యు.విన్నునకు కెంపువంటివాడు, ద్యుమణి.
ద్యుమణి - సూర్యుడు Sun, చదలుమానికము.
ౘదలుమానికము - సూర్యుడు Sun, ద్యుమణి, నభోమణి.
దివః ఆకాశస్య మణిః ద్యుమణిః. - ఆకాశమునకు మణివంటివాఁడు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్|
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్||
అంకుటము - కుంచెకోల, తాళపుచెవి.
కుంచిక - 1.తాళముచెవి, 2.కుంచెకోల, 3.చిత్రములు వ్రాయు తూలిక.
కుంచియ - 1.కుచ్చు, సం.గుచ్ఛః 2.చామరము, వింజామరము, 3.చిత్రములు వ్రాయు తూలిక, 4.గోడకు సున్నము కొట్టుడు, మట్ట స.కుంచికా.
శ్రుతి - 1.వేదము, 2.చెవి, 3.వినికి.
శ్రవణము - 1.చెవి, Ear 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
ఆకర్ణము - వినికి, శ్రవణము. శ్రవణము తో మనశ్శుద్ధి కలుగుతుంది.
సుతి - శ్రుతి, కంఠస్వరాదులకు సహాయమగు తంత్రి, మొ. వాని ధ్వని, సం.శ్రుతిః.
వేదే శ్రవసి చ శ్రుతిః :
శ్రుతిశబ్దము వేదములకును, చెవికిని, చకారమువలన వినుటకును, వార్తకును పేరు. శ్రూయతే, శృణో త్యనయా - శ్రవణం చ శ్రుతిః సీ. శ్రు శ్రవణే. - వినఁబడునది. దీనిచేత విందురు, వినుటయును గనుక శ్రుతి.
వేదముతో సమానమైన శాస్త్రము లేదు. వేదానికి 'శ్రుతి'అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది-విన్నది.
వేదం శృతి - విన్నది - వినసొంపైనది. వేదం వినిపించడంలో ఆనందం ఉంది. వేదం వినడంలో అమృతం అందుతుంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యం - మహిమాన్వితం.
విశ్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసినీ|
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ.
అమ్నాయము - 1.వేదము, 2.శాస్త్రము, 3.సంప్రదాయము, గురుపారంపర్యము, 4.వంశము, 5.సముదాయము.
వేదము - దీనిచేత ధర్మాధర్మములు నెరుగుదురు, తొలిచదువులు. ఇవి నాల్గు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. ప్రాచీన భారత ఆర్య (ఇండో - ఇరానియనుల) ధర్మ గ్రంథములు.
1. ఋక్ వేదము :- 1017 వేద మంత్రముల సంహితము, వేదము లన్నిటిలోను పురాతనమైనది. ఋక్ వేదమంత్రములకు, పారశీక (ఇరానియనుల ధర్మగ్రంథమయిన) ధ్యాన శ్లోకములకు సన్నిహిత సంబంధము గలదు.
ఋగ్వేదము - నాలుగు వేదములలో ఒకటి.
ఋక్ - 1.ఛందోబద్ధమగు వేదమంత్రము, 2.ఋగ్వేదము, 3.స్తుతి.
హోత - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు, రూ.హోత్రి.
స్తుతి - స్తోత్రము; వర్ణనము - స్తోత్రము, వస్తుగుణము లను వివరించుట. స్తోత్రము - పొగడ్త; పొగడ్త - స్తుతి, మెప్పు. ప్రశస్తి - 1.ప్రసిద్ధి, 2.పొగడ్త.
స్తవము - స్తోత్రము; నవము - స్థోత్రము, విణ. క్రొత్త.
ప్రస్తుతి - స్తోత్రము. నవీనము - క్రొత్త.
ప్రశంస - మెప్పు, స్తుతి ప్రస్తావించుట.
మెప్పు - 1.మెచ్చు, 2.వరము, 3.ప్రీతి.
మెచ్ఛు - 1.శ్లాఘన, 2.ప్రేమము, క్రి.శ్లాఘించు.
వరము - కోరిక, వరించుట. ప్రీతి - 1.సంతోషము, 2.స్నేహము.
స్తోమము - 1.సమూహము, 2.స్తోత్రము, 3.యజ్ఞము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతతవైభవా |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః. - 172శ్లో
శాభి - 1.వృక్షము, 2.వేదము, వ్యు.శాఖలు కలది.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
పనస - 1.వేదభాగము, ఏబది పదముల సమూహము (పంచాశత్) అనబడును, సం.పంచాశత్, 2.ఒక ఫలవృక్షము, సం.పనసః.
పన్నము - వేదమందలి అట్టమునకు అవయవము, వేదపరిచ్ఛేదము, సం.ప్రశ్నః, సం.విణ. జారినది.
అట్టము - ఎనిమది పన్నములుగల వేద భాగము, సం.అష్టకమ్.
అష్టకము - 1.ఎనిమిదింటి సమూహము, 2.ఎనిమిది 8, 3.ఋగ్వేద మందలి ఒక భాగము, అట్ఠము, రూ.అష్టము.
అష్టము - (భౌతి.) 1.ఎనిమిదింటి సమూహము, 2.ఒక క్రింది స్వరము నకు ఎనిమిదవ మీదిస్వరము (Octave).
ఎనిమిది - ఏడు నొకటి.
అజ్జము - కొన్ని పనసలుగల వేదభాగము, రూ.అఘము, సం.అధ్యాయ.
కంటకిఫలము - 1.పనస, 2.ఉమ్మెత్త, 3.పల్లేరు.
తండ్రి గరగర తల్లి పీచుపీచు బిడ్డలు రత్నమాణిక్యాలు. - పనసపండు
పనసపండును ఒలవడానికి ముందు చేతులకు నూనె రాసుకుంటే, (తొనలు తీసేటప్పుడు) ఒలిచేటప్పుడు దాని జిగురు చేతికి అంటదు కదా! అదే విధంగా భక్తిజ్ఞానా లను రక్షగా పొందినప్పుడు సిరిసంపదలు, సంసార వ్యామోహం నిన్నెంత మాత్రమూ బాధించలేవు. - శ్రీ రామకృష్ణ పరమహంస
అఘమర్షణము - సర్వపాపములు పోవుటకై జపించు మంత్రము, (ఋగ్వేదము 10-190).
2. యజుర్వేదము :- వైదిక తంత్రములను గురించిచెప్పు సంహిత.
3. సామవేదము :- వేద మంత్రములకు స్వరములు కల్పించి గాన రూపమును చూపు సంహిత.
సామము - 1.ఒక వేదము, 2.మంచిమాట, 3.అనుకూలోపాయము.
సామజము - ఏనుగు, వ్యు.సామ వేదమువలన పుట్టినది.
స్వాంతము - 1.సామోపాయము 2. దాక్షిణ్యము.
సామ సాన్త్వమ్ -
స్యతి వైరం సామ. న. న. షో అన్తకర్మణి. - వైరమును జెఱుచునది.
స్వాంత్వయంత్యసేన సాంత్వం. సాంత్వ సామప్రయోగే. - దీని చేత నూరడింతురు. ఈ రెండు సామోపాయము పేర్లు.
దాక్షిణ్యంస్వజనే దయాపరిజనే శాఠ్యంసదా దుర్జనే
ప్రీతిస్సాధుజనే వయోనృపజనే విధ్వజ్జనే చార్జవం|
శౌర్యంశత్రుజనే క్షమాగురుజనే కాంతాజనే ధృష్టతా
యేచైవంపురుషాః కలాసు కుశలాస్తే ష్వేవలోకస్థితిః||
తా. బంధుజనులయందు దాక్షిణ్యమును, భృతులయందు(భృత్యుఁడు - సేవకుడు, పనివాడు)దయయును దుర్జనులయందు (గ)కపటమును, సజ్జనులయందు ప్రీతియు, రాజులయందు నీతియును, విద్వజ్జనుల యందు నిష్కాపట్యమును, శత్రువులయందు శౌర్యమును, గురువుల యందు తాల్మియును, స్త్రీలయెడల దిట్టతనమును గలిగి ప్రవర్తించునట్టి విద్యా ప్రావీణ్యమును గల పురుషులయందు లోకము నిలుచును. – నీతిశాస్త్రము
ఉద్గాత - యజ్ఞమందు సామవేద తంత్రమును నడుపు వ్యక్తి.
గిష్ణుఁడు - 1.వేదాంతి, 2.గాయకుడు, 3.సామదానవేత్త.
బ్రహ్మవాది - వేదాంతి; వేదాంతి - వేదాంతము తెలిసినవాడు.
గాయకుఁడు - 1.పాటపాడువాడు, 2.నర్తకుడు, నటుడు, 3.ప్రౌఢుడు, నేర్పరి, చతురుడు.
సీకారి - పాటపాడువాడు, గాయకుడు, సం.శ్రీకారీ.
గాయనుఁడు - 1.పాటపాడువాడు, 2.గానము వృత్తిగా గలవాడు.
గాయని - పాటకత్తె.
గేష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు, విణ.పాడెడివాడు (అనికొందఱు.)
గీష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు.
గీష్పతి - 1.బృహస్పతి, 2.పండితుడు.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice).
శతవిష్కో ధనాఢ్యశ్చ శతగ్రామే నభూపతిః|
శతాశ్వః క్షత్రియోరాజా శతశ్లోకేన పండితః||
తా. నూరువరహాలు కలిగినవాఁడు ధనికుఁ డనిపించుకొనును, నూరు గ్రామములు కధిపతియైనవాడు భూపాలుఁడని యనిపించుకొనును, నూఱుగుఱ్ఱములు గలవాఁడు, రాజనిపించుకొనును, నూరుశ్లోకములు రచించినవాఁడు పండితుఁడని యనిపించుకొనును. - నీతిశాస్త్రము
నర్తకుఁడు - 1.నట్టువుడు, 2.పాములవాడు, విన.ఆడెడువాడు.
ఆటకాఁడు - ఆటయాడువాడు, నటుడు, నర్తకుడు.
నృత్తము - నర్తనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నటనము - 1.నాట్యము, 2.కపట వర్తనము.
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్త నేత్రాభినయముల్చే భావములను తెలుపుచు ఆడెడి ఆట.
ఆట - (ఆడు+ట) 1.క్రీడ, 2.నృత్యము, 3.విహారము, ఉదా.ఆటతోట, 4.స్నానముచేయుట, 5.చెరుకు, నువ్వులు మొ.వి గానుగలో వేసి త్రిప్పుట, 6.పలుకుట, 7.నింద, 8.పరిహాసము.
ఆటకత్తియ - ఆటయాడునది, నటి, నర్తకి, రూ.ఆటకత్తె.
నటి - 1.వేశ్య, 2.నట్టువుని భార్య.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు.
నర్తించు - 1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.
నటించు - 1.నర్తించు, వర్తించు, 2.కపటముగా వర్తించు.
జాయాజీవుఁడు - 1.వేషగాడు, 2.నాట్యము చేయువాడు, 3.భార్య వలన జీవించువాడు.
జాయ - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు - నేర్పరి; చతురిమ - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు.
ప్రోఢ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
చతురుఁడు - నేర్పరి తనము; కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.
తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమార్థస్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ. - 168శ్లో
4. అధర్వణ వేదము :- వేద సంహితలలో చివరిది. ఈ సంహిత భూతప్రేత మంత్రములతోను చారిత్రిక విషయములతోను కూడి యున్నది.
మంత్రము1 - 1.గాయత్రి, మొ.వి. 2.రహస్యము, 3.అధర్వణ వేదము.
త్రిపది - 1.ఏనుగు కాలి సంకెల, 2.గాయత్రి.
గాయత్రి - 1.సంధ్యావందన సమయమున జపించు ఒకానొక మంత్రము, 2.సంధ్యావందన సమయమున ఉపాసింపబడు దేవత, 3.పాదమునకు ఆరేసి అక్షరములు గల ఒక వైదిక చ్ఛందస్సు.
చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా. - 90శ్లో
తొలుచదువులు - వేదములు.
తొలుమినుకులు - వేదములు.
అధ్యయనము - 1.గురుముఖమున వేదము చదువుట, 2.చదువుట.
అధ్యాయము - 1.చదువుట, 2.వేద పఠనార్హ కాలము, వ్యతి.అనధ్యాయము, 3.వేదపాఠము, 4.గ్రంథభాగము.
ఘనా(న)పాఠి - వేదధ్యయన సంపన్నుడు.
ౘదువు - పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.
పఠనము - చదువు; విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
ౘదువుల పడఁతి - సరస్వతి; ౘదువుల వేలుపు - బ్రహ్మ.
విద్యానామ నరస్యరూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం
విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాంగురుః|
విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరా దేవతా|
విద్యారాజసుపూజ్యతే నహిధనం విద్యావిహీనఃపశుః.
తా. విద్య పురుషునికి శ్రేష్ఠమైన రూపము, రహస్యముగా దాచిన ధనము, భోగమును కీర్తిని సుఖమును గలుగఁజేయునది, గురువుల కందఱికి పూజ్యమైనది, దేశాంతర గమనమున బంధుజనములవలె రక్షించునది. ఉత్తమమయిన దైవమువలె నభీష్టముల నిచ్చునది, ప్రభువులవలనఁ పూజింపఁబడునది. ఇట్టి విద్యకు సర్యైన ధనము లేదు(మంచి విద్య గలిగిన ధనము పనిలేదు), గావున విద్యలేనివాఁడు పశుప్రాయుఁడు. - నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
స్వాధ్యాయము - 1.వేదాధ్యయనము, 2.వేదము, 3.జపము.
స్వాధ్యాయి - వేదాధ్యయనము చేయువాడు.
జపము - 1.మంత్రావృత్తి, 2.వేదాధ్యయనము, రూ.జపము.
శ్రుతిః స్త్రీ ఆమ్నాయ స్త్రయీ :
శ్రూయతే ధర్మాధర్మాదికమనయేతి. ఇ. సీ. శ్రుశ్రవణే - దీనిచేత ధర్మాధర్మాదులు వినఁబడును.
విదంత్యనేన ధర్మాధర్మావితి వేదః. విదజ్ఞానే - దీనిచేత ధర్మాధర్మముల నెఱుఁగుదురు.
ఆమ్నాయతే పారంపర్యే ణేత్యామ్నాయః మ్నా అభ్యాసే - పారంపర్యము చేత నభ్యసింపఁబడునది. ఈ మూడు 3 వేదము పేర్లు.
ఋగ్వేదస్త్వం యజుర్వేద స్సామ వేద స్త్వథర్వచ|
శిక్షా కల్పోనిరుక్తంచ ఛన్దో జ్యోతిష మేవచ ||
పెనుమినుకులు - వేదము.
ప్రామినుకులు - (బహు.) వేదము.
మినుకు - 1.కిరణము, 2.తాలిబొట్టు, 3.మినుకు మినుక్కు మను కాంతు, 4.వేదము.
కిరణము - వెలుగు, మయూఖము.
తాలిబొట్టు - మంగళసూత్రపు బొట్టు, రూ.తాళిబొట్టు.
కంఠసూత్రము - పుస్తె, తాళిబొట్టు, మంగళ సూత్రము.
పుస్తె - తాళిబొట్టు; మంగళసూత్రము - మాంగల్యము, పుస్తె.
శతమానము - 1.నూటికొలది, 2.పుస్తె, మంగళసూత్రము.
మాంగల్యము - 1.మంగళత్వము 2.తాళిబొట్టు.
మినుకుఁ జేడియ - సరస్వతి. వేదములు నిత్యములు గనుక వేద రూపయగు సరస్వతియు నిత్యమే. ఆమె సమస్త విజ్ఞానములకును మూలము.
మినుకుల బరణి - సూర్యుడు, వ్యు.కాంతులకు బరణివంటివాడు.
ప్రాఁగబ్బము - (ప్రాత+కబ్బము), వేదము.
ప్రాఁత - 1.భృత్యుడు, 2.జీర్ణవస్త్రము, వస్త్రము, విణ.1.బహుకాలము నాటిది, పూర్వము, పురాతనము, సం.భృత్యః, వస్త్రమ్, పురాతనమ్.
కబ్బము - ప్రబంధము(ప్రబంధము - కావ్యము.), సం.కావ్యమ్.
ప్రాఁౙదుల పెట్టె - సూర్యుడు.
ముయ్యెలగుట్ట - (మూడు+ఎల్ల+గుట్ట) 1.మూడు ఎల్లలు కలియు చోటు, 2.మూడుదారులు కలియుచోటు, 3.త్రికము (ఎల్ల శబ్దమున కిచట స్థానమని అర్థము).
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస(ము(ౘ)చ్చ - ముడ్డిపూస), (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.
వేదమూల మిదంజ్ఞానం - భార్యామూల మిదంగృహమ్|
కృషిమూల మిదంధాన్యం - ధనమూల మిదంజగత్||
తా. జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు భార్యయేమూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. - నీతిశాస్త్రము
శ్రుతము - 1.వినికి, వినుట 2.శాస్త్రము(Science) విణ.వినబడినది. ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గణి.) విషయ విపులీకరణము (Exposition).
ఉపశ్రుతి - 1.ప్రసంగమున ఇతరులు పలికిన శుభాశుభసూచక మగు వాక్యము, 2.సమ్మతి, 3.వినికి, అవ్య. చెవిదగ్గర.
ఉపశ్రుతము - 1.వినబడినది, 2.అంగీకరింపబడినది, సమ్మతింప బడినది. మిడియ - వేదవాక్యము.
వైదికుఁడు - వేదము తెలిసినవాడు.
వైదికము - వేదము నందు చెప్పబడినది.
విద్యాదానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ |
ఆశ్రమాంశ్చ యథాసంఖ్యమసృజత్సహ వృత్తిభిః |
శ్రుతం శాస్త్రావ ధృతయోః : శ్రుత శబ్దము శాస్త్రామునకు పేరైనపుడు న. వినఁబడినదానికి పేరైనపుడు త్రి. శ్రూయత ఇతి శ్రుతం. శ్రు శ్రవణే. – వినబడునది.
శాస్త్రము - నియమన గ్రంధము, సం.వి. (గణి., భౌతి., రసా.,) గమనించిన విషయములను క్రోడీకరించి విషయతత్వ నిర్ణయముచేసి సూత్రముల నిర్మించి ధర్మముల నుగ్గడించినది (Science).
శాస్త్రీయము - శాస్త్రసంబంధమైనది.
శాస్యము - శాసింపదగినది.
శాస్త్రవిదుఁడు - శాస్త్రము తెలిసినవాడు.
శాస్త్రి - శాస్త్రము తెలిసినవాడు.
నిదేశ గ్రస్థయో శ్శాస్త్రమ్ : శాస్త్ర శబ్దము ఆజ్ఞకును, వ్యాకరణాది గ్రంథము లకును పేరు. శాసనం, శిష్యతే అనేనేతి శాస్త్రం. శాసు అనుశిష్టౌ. - శిక్షించుటయు, దీనిచేత శిక్షింపఁబడును గనుకను శాస్త్రము. శాస్త్రానికి రూపం ధర్మం.
ప్రామాణికుఁడు - 1.సత్యము తప్పనివాడు, 2.మేర మీరనివాడు, 3.శాస్త్రము నెరిగినవాడు.
విజ్ఞాన శాస్త్రము - శాస్త్రీయ పద్ధతులతో వస్తుతత్త్వమును గురుంచి సహేతుకముగా తెలిసికొన్న జ్ఞానరాశి (Science).
విజ్ఞానము - శాస్త్రాదుల యందలి విశేష జ్ఞానము.
ప్రత్యవేక్షణ - (భౌతి., రసా.) జాగ్రత్తతో చూచుట, ఇట్టి సావధానమైన చూపు విజ్ఞానశాస్త్రములకు మూలాధారము. ప్రకృతిలో జరుగు సంఘటనల యథాతథముగ గుర్తించుట (Observation).
ఛాందసుఁడు - 1.వేదము చదివినవాడు, 2.శ్రోత్రియుడు, 3.లౌకికజ్ఞాన రహితుడు.
శ్రోత్రియుఁడు - వేదము చదివిన బ్రాహ్మణుడు.
ఛాందసము - 1.తెలివితక్కువ, 2.అమాయకత్వము, విణ.ఛందస్సునకు సంబంధించినది.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
అమాయకుఁడు - మాయ, కపటము, మొ.వి. ఎరుగనివాడు, రూ.అమాయకుడు.
లౌకికము - లోకవ్యవహార సిద్ధమైనది; రహితము - విడువబడినది.
అగ్నిహోత్ర ఫలావేదా విత్తభుక్త ఫలంధనమ్|
రతిపుత్త్ర ఫలా దారాః శీలవృత్తి ఫలంశ్రుతమ్||
తా. వేదము చదవినందు (క)అగ్నిహోత్రము చేయుటయును, ధనము గలిగి నందుకు దాన భోగములును, భార్యయున్నందుకు సంగమ సంతానములును, శాస్త్రమును విన్నందు (కా)ఆచారవంతుడగుటయు ఫలము. – నీతిశాస్త్రము
తంత్రము - 1.ఉభయార్థసాధకమైన ఉపాయము, 2.స్వరాష్ట్ర చింత, 3.కారణము, 4.గుంపు, 5.శాస్త్రము.
పంచతంత్రము - జంతువుల కథల ద్వారా మానవునకు నీతి బోధించు సంస్కృత కథాగుచ్ఛము :- 1.మిత్రలాభము, 2.మిత్రభేదము, 3.సంధి విగ్రహము, 4.లబ్ధనాశము(లబ్ధము - పొందబడినది), 5.అసంప్రేక్ష కారిత్వము అనునవి యందలియైదు తంత్రములు.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
ఆగమనము - 1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది, వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి.
రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒకయేఱు, వి.ఆగమనము.
లబ్ధి - లాభము; లాభము - (అర్థ.) పరిశ్రమలవలన కాని వ్యాపారము వలన కాని ఖర్చులుపోను మిగిలిన నికరపు ఆదాయము. విక్రయించుటకు కావలసిన అన్ని వ్యయములుపోగ మిగిలిన సొమ్ము, సం.వి. క్రయ విక్రయములందు వచ్చు హెచ్చు ధనము అధికముగా పొందబడినది.
రాబడి - ఆదాయము; వసూలు - ఆదాయము, జమ.
ఆదాయము1 - 1.గ్రహించుట, 2.లాభము, లబ్ధద్రవ్యము, రాబడి.
ఆదాయము2 - (అర్థ.) ఆస్తి వలనగాని, కృషివలనగాని మానవుడు ఆర్జించు సంపాదన.
ఆదాయపుపన్ను - (అర్థ.) వ్యక్తి యొక్క ఆదాయమునుబట్టి ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పన్ను, రాబడిపై పన్ను, (ఇది వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లింప వలసి యున్నది. ఇది సంవత్సరాది కాదాయముపై విధింపబడును. దీనిని మన దేశములో కేంద్రప్రభుత్వము(Central Government) వసూలు చేయుచున్నది, (Income-tax).
నిగమము - 1.వేదము, 2.అంగడి మార్గము, 3.పట్టణము, 4.వర్తక సంఘము.
అంగడి - 1.దుకాణము, 2.రచ్చ, న్యాయసభ, 3.అగసాలె మొ.వారు పనిచేయు చోటు.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
పట్టణము - కోటచేతను, అగడ్త చేతను దుర్గమైన ప్రధాన నగరము.
వర్తకము - వాణిజ్యము, వ్యాపారము, బేహారము.
సంఘము - 1.ప్రాణి సమూహము 2.గుంపు.
రచ్చ - 1.కలకల ధ్వని, 2.గోష్ఠి, 3.కలహము, 4.మండపము(జనాశ్రయము - మండపము), 5.మొగసాల, సం.రాజమార్గము, 7.బాధ. ఇంట గెలిచి రచ్చ గెలువు.
గాలిమాట - 1.లోకప్రమాదము, 2.ఆధారము లేనిమాట, జనశ్రుతి.
జనశ్రుతి - నానుడి, కింవదంతి.
నానుడి - (నాను+ నుడి) కింవదంతి, సామెత.
కింవదంతి - జను లాడుకొను మాట.
సామెత - లోకోక్తి, నానుడి, సం.సామ్యోక్తి.
ప్రవాదము - కారణము లేకయే వ్యాపించిన మాట.
మహాపథము - 1.ప్రాణాంతము, 2.రాజమార్గము.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో సుమతీ.
తా. ప్రపంచములో యెవరేమి చెప్పినను శ్రద్ధతో వినవలెను. విన్నంత మాత్రాన తొందరపడరాదు, విచారించవలెను. నిజానిజాలను తెలుసుకొని నడుచు కొనువాడే నీతిపరుడైన మానవుడు.
గ్రామముఖము - అంగళ్ళవీధి, బజారు.
అంగడివాడ - బజారు, అంగడివీధి.
ఆపణము - 1.అంగడి, 2.బజారు.
అపణికుఁడు - వర్తకుడు, బేహారి, వణిజుడు.
వాణిజ్యము - (అర్థ.) వ్యాపారము, వర్తకము, సరకులను లాభముల కొఱకు అమ్ము వృత్తి.
వర్తకము - వ్యాపారము, బేహారము.
బేహారము - వ్యాపారము, రూ.బెహారము.
బేహారి - వ్యాపారము తెలిసినవాడు, వణిజుడు.
వాణిజుఁడు - సార్థవాహుడు.
సార్థవాహుఁడు - వర్తకుడు, విణ.ముఖ్యుడు.
వర్తకుఁడు - వ్యాపారి.
వ్యాపారి - మాధ్వబ్రాహ్మణుడు, విణ.వ్యాపారము గలవాడు.
వినీతుఁడు - 1.జితేంద్రియుడు, 2.గురువు చేత శిక్షింపబడినవాడు, 3.విధేయుడు, వి.వర్తకుడు, వ్యాపారి.
వ్యావృతి - వ్యాపారము.
వ్యాపారము - 1.పని, 2.ఉద్యోగము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
ఉద్యొగము - 1.యత్నము, 2.పని, 3.కొలువు, 4.పాటుపడుట.
దీర్ఘసూత్రుఁడు - ఆలసించి పనిచేయువాడు.
శ్రమకము - (గృహ.) పాటుపడెడు స్వభావము కలది, పనిచేసెడు స్వభావము గలది, (Industrious).
సక్రియము - (గృహ.) 1.చురుకుదనముగలది, 2.పనిచేయ సమర్థమగునది (Active).
చేటి - 1.పనికత్తె, రూ.చేటిక.
చేడియ - 1.చేటి, స్త్రీ, రూ.చేడె, సం.చేటీ.
చేటిక - చేటి.
బూర్జువా - (రాజ., అర్థ) మధ్య తరగతి ప్రజలు సామంత తంత్రపు కాలములో ఉన్నత ప్రభు వంశమునకు చెందిన కాయ కష్టముచేసి జీవించెడి ప్రజలను (దీనిలో వర్తకులు, శిల్పులు, వైద్యులు న్యాయవాదులు కూడ చేర్చబడిరి) ఇట్లు సంబోధించుచుండిరి.
కార్యము-1.పని, 2.హేతువు, 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది.
కృత్యము - పని, వ్యాపారము, విణ.చేయదగినది.
కృత్య - 1.ఒకానొక దేవత 2.చేష్ట.
చేష్ట - 1.పని, 2.వ్యాపారము.
చెయిదము - 1.పని, చేష్ట, రూ.చెయిది, చెయ్ది, చెయువు.
చెయిది - చెయిదము, చేష్ట.
చెయ్ది - చెయిదము; చెయ్దము - చెయిదము.
చెయ్వు - చెయువు; చెయువు - చెయిదము.
చెయువుల సాకిరి(సాకిరి - సాక్షి) - 1.కర్మసాక్షి, సూర్యుడు.
కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలకు సాక్షియైనవాడు.
ఉపయోగము - 1.అనుకూల్యము, 2.వాడుక, 3.ప్రయోజనము.
ఉపయుక్తి - (అర్థ.) ఉపయోగము, ఉపయోగిత, అక్కరగల వస్తువు యొక్క అనుభవసౌఖ్యము.
ఉపయుక్తి - (అర్థ.) ఉపయోగిత, వస్తువు యొక్క ఉపయోగము, వ్యక్తి యొక్కవాంఛలను తీర్చగలశక్తి, ప్రయోజనము. (ఏదేని పదార్థమును అనుభోగించుట మొదలిడిన వెంటనే ఆ పదార్థ రాశి వలన వచ్చు ఉపయోగిత ఎక్కువగు చుండును. అటుపై ఇంకను అదే పదార్థమును అనుభోగించిన ఉపయోగిత స్థిరముగ నుండును. అటు పిమ్మట క్రమముగ తగ్గిపోవుచుండును.)
ఉపయుక్తము - 1.అనుకూలమైనది, సరిపడినది, 2.ఉపయోగింప బడినది, 3.న్యాయమైనది.
వాడుక - 1.ఉపయోగము, 2.పాడి, 3.రివాజు, 4.అభ్యాసము.
వాడుక - (గృహ.) క్రమము, పరిపాటి, నియతచర్య (Routine).
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము.
అభ్యాసము - 1.అలవాటు, 2.ఆవృత్తి, సాధన, 3.(గణి.) గుణించుట, విణ.దాపైనది.
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధాంతము వి.(అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తి నిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో ముల్య మధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
రాజీనామా -1.ఒప్పందము, 2.ఉద్యోగాదులను ఇష్టము మీద విడుచుట.
ఒప్పందము - 1.వ్యాపారుల ఒడంబడిక, 2.అంగీకారము.
గ్రాట్యుటీ - (Gratuity) ఉద్యోగము నుండి విరమించిన వ్యక్తికి లభించు ఉచితార్థ పారితోషికము.
ప్రావిడెంటు ఫండు - (శాస.) (Provident fund) భవిష్యన్నిధి, ఆపదర్థనిధి. ముందు జాగ్రతకోరకు ఏర్పాటు చేయబడిన నిధి. ఉద్యోగి ఉద్యోగము నుండి విరమించునప్పుడు పారితోషికముగా ప్రభుత్వముగాని సంస్థగాని ఇచ్చు నిధి. ఈ నిధికి ఉద్యోగికూడ ఉద్యోగములో నున్నంత కాలము ప్రతిమాసము తన వేతనములో కొంత శతాంశము ఇయ్యవలసి యుండును.
పింఛను - (వ్యావ., రాజ.) ఉపకార వేతనము, ఉద్యోగము చేసిపనినుండి తొలగిన తరువాత ప్రభుత్వము నుండి దొరకు భరణము (Pension).
అభ్యాసానుత రీవిద్యా బుద్ధిః కర్మానుసారిణీ|
ఉద్యొగసారణీ లక్ష్మీ ఫలం భాగ్యానుసారిణీ||
తా. అభ్యాసము నను సరించి విద్యవచ్చును, కర్మానుసారముగా బుద్ధి గలుగును, ఉద్యోగానుసారముగా ఐశ్వరము వచ్చును, భాగ్యాను సారముగా ఫలము గలుగును. - నీతిశాస్త్రము
ఉద్యోగము పురుష లక్షణం. ఉద్యోగపత్ని క్రియ : క్రియ శూన్యమైన కర్మ(పని) వ్యర్థం.
వంశము - 1.కులము, 2.వాసము (వెదురు), 3.పిల్లనగ్రోవి, 4.వెన్ను గాడి, 4.సమూహము, 6.ఒక పురాణ లక్షణము.
కులము - 1.వంశము, 2.ఇల్లు, 3.తెగ, 4.శరీరము, 5.ఊరు.
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వాస - వాసము (వెదురు). వాసకము - ఇల్లు; భవనము - ఇల్లు.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
తెగ - 1.సజాతీయ సమూహము, 2.సమూహము, రూ.తెవ, 3.పక్షము, 4.విధము, 5.అల్లెత్రాడు ఎక్కుపెట్టుట, 6.నిడుపుడు, అవ్య. 1.నిశ్శేషముగా, 2.ఖండితముగా.
శరీరము - దేహము; దేహము - శరీరము, మేను.
ఊరు - 1.లోపలనుండి నీరు బయటికి వచ్చు, 2.నాను, 3.పుట్టు(సంభవించు, జన్మించు), 4.పెద్దది యగు, వి.1.గ్రామము, 2.ఏడికోల లేని నాగలి, 3.దేశము.
నివసథము - గ్రామము.
గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.) షడ్జాది స్వరము.
గ్రామత - 1.గ్రామముల సమూహము, 2.త్రాళ్ళ సమూహము.
గోత్రము - 1.వంశము, 2.పేరు, 3.కొండ.
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 2.భూమిని రక్షించువాడు.
ద్వౌ వంశౌ కుల మస్కరౌ. -
వంశ శబ్దము కులమునకును, వెదురునకును పేరు. వన్యత ఇతి వంశః. వన షణ సంభక్తౌ. - ఆశ్రయింపఁబడునది.
"పృష్ఠాస్థి గేహోర్ధ్వకాష్ఠే వంశే వేణౌ గణేకుల"ఇతి విశ్వప్రకాశః.
సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడిగలుగువాని బాసిసకొడుకులే విశ్వ.
తా|| మంచి కులగోత్రములు కలవారైనను, విద్యావంతులైనను, ధనము(పసిఁడి - 1.బంగారు, 2.ధనము.)గలవాని ముందు యెందుకూ కొరగారు.
కొలము - 1.వంశము, సజాతీయ ప్రాణిసమూహము, సం.కులమ్.
జననము - 1.పుట్టుక(జన్మము - పుట్టుక), 2.వంశము.
జాత్యము - 1.మంచి కులమున పుట్టినది, 2.మేలైనది, 3.చక్కనిది.
కులపాలిక - 1.తల్లిదండ్రులచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.
కార్యేషుదాసీ కరణేషుమంత్రీ | రూపేచలక్ష్మీ క్షమయాధరిత్రీ |
భుక్తేషుమాతా శయనేతు వేశ్యా షట్కర్మయుక్తా కులధర్మపత్నీ |
తా. ఇంటి కార్యములయందు పనికత్తెవలెను, కార్యాలోచనయందు మంత్రివలెను, రూపమునందు లక్ష్మివలెను, ఓర్పునందు భూమివలెను, ఆహారమునందు తల్లివలెను, పడకయందు వేశ్యవలెను, ఈరీతిగా బ్రతివిషయమునను బ్రవర్తించునది కులస్త్రీ యనబడును. - నీతిశాస్త్రము
వంశము - 1.కులము, 2.వాసము(వెదురు), 2.పిల్లనగ్రోవి, 3.వెన్నుగాడి, 4.సమూహము, 5.ఒక పురాణ లక్షణము.
వాస - వాసము (వెదురు).
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వాసకము - ఇల్లు; ఆవాసము - ఇల్లు.
వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి. కరతలే వేణుమ్.
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి.
వెదురు - వేణువు, సం.వేణుకః.
తృణధ్వజము - వెదురు.
త్వక్సారము - వెదురు, రూ.త్వచిసారము.
త్వక్కు - 1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము.
బొంగు - ఏండిన లావు బోలు వెదురు.
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు…అల్లన మోవికి(పెదవికి) తాకితే గేయాలు(పాటలు).....
మురళి - 1.పిల్లనగ్రోవి, 2.ఒక విధమైన గుఱ్ఱపు నడక.
మైలక్రోవి - మురళి. మురళికి అందని పలుకులివీ.....
మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.
మాలిన్యము - మలినత. మలినము - మాసినది, నల్లనిది.
ముఱికి - కల్మషము, మాలిన్యము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
అంధకరిపుఁడు - శివుడు. (రిపువు - శత్రువు.)
మంగు - 1.మాలిన్యము, 2.మొగము నందు పుట్టు నల్ల పొడ, రూ.మాఁగు, మంగుఁడు, మాఫుఁడు, 3.మిగులపండుట.
మాఁగు - క్రి.కమియబండు, వి.మాలిన్యము.
మాగుఁడు - కసటు, నలుపు.
మాపుడు - మైల, మలినము.
అశౌచము - అశుచిత్వము, అంటు, మైల, ఉదా. (జాతశౌచము, మృతాశౌచము).
అశౌచము - 1.మురికి, 2.పురుడు, 3.మృతశౌచము, మైల.
మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు మురికితోడ నుండనేని
అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు విశ్వ.
తా|| మాసిన చీరతోను(కోక - వలువ, చీర.), మాసిన తలతోను, మురికిగాయున్న శరీరముతోను వున్నచో గొప్పకులము నందు పుట్టినవారి నయినను హీనముగా చూతురు. (బట్టలు మురికిగానియ్యని శుభ్రత యెవ్వరికి వుండదు)
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
క్రోవి - 1.తామరనాళము, 2.గొట్టము, 3.తుపాకి, 4.బుడ్డి, 5.భూమిలోపల నీళ్లు వచ్చుటకు ఏర్పరచిన తూము, 6.మూస(మూష - మూస), 7.ఊదుక్రోవి.
చిమ్మన గ్రోవి - జలక్రీడలయందు నీళ్ళు చెమ్మెడు గొట్టము.
గొట్టము - క్రోవి, (భౌతి.) ఒక చోటు నుండి మరియొక చోటికి, ద్రవ్యము లను గాని, వాయువులను గాని, కొనిపోవు పరికరము (Tube).
ఊఁదుఁగ్రోవి - 1.అగసాలివాడు కుంపటిని ఊదెడి గొట్టము, 2.పిల్లనగ్రోవి.
తూఁతకొమ్ము - పిల్లనగ్రోవి. వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి.
ధమని - 1.అవయములకు గుండె నుండి నెత్తురు తీసికొనిపోవునరము, 2.మెడ, neck 3.అగసాలెవాని ఊదుగొట్టము, సం.వి. (జం.) మంచి రక్తమును తీసికొని పోవు రక్తనాళము (Artery).
కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్త నాళములు(ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries).
ఈ పిల్లనగ్రోవికి వెల యెంత అర్థరూపాయి..... ఇందులో ఉన్నాయమ్మా రాగాలు ఒక వేయి.....
జాతి1 - 1.కులము, 2.పుట్టుక, 3.సమానత్వము, 4.జాజికాయ(జాతికోశము - జాజికాయ), 5.మాలతి, 6.పద్యభేదము.
జాతి2 - (జీవ.) గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలిసి ఒక జాతిగా వర్గీకరింపబడినది.
జాతి3 - (చరి, రాజ.) ఒక దేశములో నివసించుచు సాధారనముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు.
సజాతీయత - (చరి.,రాజ) భాష, మతము, ఆచారము, సాంప్రదాయములు, చరిత్ర యొక్క బంధముగల ప్రజలు (Nationality).
జాతము - సమూహము, విణ.పుట్టినది.
గణము - 1.గుంపు, సమూహము, 2.సేనలో ఒక భాగము, వర్ణముల సమూహము, 4.గురులఘు వర్ణముల కూడిక కలది.
గణనాయిక - గౌరి, పార్వతి(శివుని సన్నిధి నందు దేవిస్థానం పార్వతి).
గణపతి - వినాయకుడు; విఘ్నరాజు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
సంఘము - 1.ప్రాణిసమూహము, 2.గుంపు.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ. నివహము - గుంపు.
అభిజనము - 1.కులము, 2.జన్మభూమి, 3.పరిజనము, 4.కులాంగత మైన టెక్కెము మొ.బిరుదు.
జాత్యైకీకరణ సమితి - కులమత వైషమ్యములను రూపుమాపి భారత జాతిని సుసంఘిటితముగ చేయుటకై క్రీ.శ.1962 సంవత్సరములో భారత ప్రభుత్వము అధ్వర్యములో భారత నాయకుల సమావేశము (National Integration Samiti).
వర్గము - (రసా.) సమాన ధర్మములు గల ద్రవముల సమూహము (Group) సం. (జీవ.) తరగతి (Class) సం. (గణి.) ఒక రాశిని ఆ రాశిచేతనే గణించగా లభించు లబ్ధము (Square) సం. 1.వి.సజాతీయ సమూహము, 2.తెగ, 3.అధ్యాయము, 4.కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనునవి అరిషడ్వర్గము లన బడును.
త్రివర్గములు - 1.ధర్మార్థకామములు, 2.సత్త్వరజస్తమములు, 3.క్షయ స్థాన వృద్ధులు.
వర్గయుక్కులు - ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ధ, థ, ఫ, భ లు.
అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
రవి - 1.సూర్యుడు(సూర్యుఁడు - వెలుగురేడు), 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.
నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకౌకసుఁడు - 1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.
ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.
హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు. హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.
ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).
తురీయము - బ్రహ్మము, విణ. నాల్గవది, రూ.తుర్యము.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు(జీవుఁడు -1.ప్రాణి, 2.బృహస్పతి.), 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
పరమము - పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము 2.ఆద్యము 3.ప్రధానము.
కేవలుఁడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిర్తువు.
ధ్యానము - చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామాతురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధాతురాణాం నరుచిర్నపక్వమ్||
తా. ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్షగలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలికొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. - నీతిశాస్త్రము
తుర్యే ధర్మకలాసర్గే నరనారాయణావృషీ |
భూతాత్మోవశమోపేత మకరోద్దుశ్చరం తపః |
మోక్షము - 1.కైవల్యము 2.మోచనము, విడుపు 3.ముక్తి.
కైవల్యము - ముక్తి, మోక్షము. అపవర్గము - మోక్షము.
మోచనము - 1.విడుపు 2.మోక్షకాలము.
ముగితి - 1.ముక్తి, 2.విడుదల, సం.ముక్తిః.
ముక్తి - మోక్షము, విడుపు, విమోచనము.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
మహోదయము - 1.కన్యాకుబ్జము, 2.అధిపత్యము, 3.అభివృద్ధి, 4.మోక్షము.
ముక్తిచతుష్టయము - సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము.
సామీప్యము - సమీపత్వము, దగ్గర.
సాలోక్యము - 1.సమానలోకత్వము, 2.ఒక విధమగు ముక్తి.
సారూప్యము - 1.సమానరూపత్వము, 2.ఒక విధమైన ముక్తి.
సాయుజ్యము - 1.సహయోగము, 2.ఒక విధమైన మూర్తి.
పరము - 1.మోక్షము, 2.కేవలము, విణ.1.ఇతరము, 2.దూరము, 3.మీదిది, 4.శ్రేష్ఠము.
పరమేష్ఠి - బ్రహ్మ.
కేవలము - 1.నిర్ణయము, అవధారణము, విణ. 1.అంత, సమస్తము 2.అచ్చము, ఒకటి 3.ప్రధానము.
కేవలుఁడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
అవ్యయము - 1.పరబ్రహ్మము, 2.శుభము, అభ్యుదయము, 3.(వ్యాక.)లింగవచన విభక్తి శూన్యపదము, విణ.1.నాశరహితము, 2.మార్పులేనిది, 3.వ్యయము, లేనిది.
అవ్యయుఁడు - 1.విష్ణువు, 2.శివుడు.
అద్వైతము - 1.అభేదము, 2.జీవేశ్వరుల ఐక్యమును బోధించు మతము, 3.పరబ్రహ్మము, విణ. భేదములేనిది.
సమరసము - అభేదము.
అభేదము - భేదములేమి, ఏకీభావము.
ఏకీభావము - ఐక్యము, ఒకటియగుట.
ఐక్యము - ఏకీభావము, మైత్రి.
చెడుఁ గరులు హరులు ధనములు
చెడుదురు నిజసతులు * చెడుఁచెనఁటులకున్
జెడక మను నెఱసుగుణులకుఁ
జెడని పదార్థములు విష్ణు * సేవానిరతుల్.
తా. నిత్యానిత్యవస్తు వివేకము లేనిమూఢులు భగవంతునియందుఁ గించి త్తయినను మనంబుంచక, సదా సంసారచక్రమందుఁ దిరుగుచు, తనచుట్టు నున్న పశువాహనాదులు, ధనధాన్యాదులు, పుత్త్రమిత్త్ర కళత్ర బాంధ వాదులు శాశ్వతంబులను నమ్మియుందురు. అవి యెన్నటికిని స్థిరంబులు గావు. ఎవరు సంసారధర్మమునందున్నను, ఫలాపేక్షమాని భగదర్పణబుద్ధితో సత్కార్యములను జేయుచు, భగవంతుని విడువక ధ్యానము చేయుచుందురో, వారు ఇహమున పుత్రమిత్ర కళత్ర బాంధవ పరివారాది సమేతులయి, ధనకనకవస్తువాహనాది సమృద్ధి గలిగియుండి, కడపట శాశ్వతం బగు మోక్షపదంబు(మోక్షము) నొందుచున్నారు. (విష్ణుభక్తి చిత్త వృత్తులెప్పటికిని నుండు పదార్థములు.)
స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది.
అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమ పువ్వు, 5.అంబరు అనెడి పరిమళ ద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.
అంబు - 1.ఆకాశము,2.స్వర్గము, 3.శూన్యము, 4.సుఖము.
ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి 3.అభ్రకము 4.బ్రహ్మము 5.(గణి.) సున్న, శూన్యము 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు అక్రమించుచోటు(Space)మిన్ను - ఆకాశము, రూ.మిను. మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
వినుప్రోలు - స్వర్గము. వినువాఁక - గంగ.
వినుచూలి - వాయువు. మినుచూలు - వాయువు.
మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.
గగనము - 1.ఆకాశము, 2.శూన్యము, సున్న విణ.దుర్లభము.
సున్న - 1.శూన్యము, 2.అనుస్వారము, 3.అభావము.
శూన్యము - (గణి.) సున్న = మూల్య రహితము(Null) గాలి తీసివేసిన చోటు (Vacuum), సం.వి. సున్న, విణ.పాడు.
అనుస్వారము - బిందువు, సున్న.
అభావము - 1.లేమి, 2.నాశము, విణ.1.లేనిది 2.సత్యము కానిది. బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం. (గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెదల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు(Venus), శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
అంతరాళము - 1.ఎల్లదిక్కులకు నడిమిచోటు, 2.(దేశకాలముల)నడిమి భాగము, 3.సంకీర్ణజాతి, సంకరజాతి.
అవకాశము - 1.తరుణము, వీలు, 2.దేశకాలముల ఎడము, 3.(భౌతి.) సకల రాసులను కలిగియుండి అద్యంతములు లేనిది (Space).
తరుణము - సమయము, Time సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
వీలు - అనుకూల్యము, శ్రమము.
ఆశావాదికి ప్రతి దురదృష్ట సంఘటనలో(ఘోరమైన సన్నివేశంలోనూ) ఒక అవకాశం కనిపిస్తే, నిరాశావాదికి ప్రతి అవకాశంలోనూ ఒక దురదృష్టము (ఘోరం, చెడు) కనిపిస్తుంది. - ఒక సూక్తి
భువనము - 1.జగము 2.ఆకాశము 3.ఉదకము.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
లోకము - 1.చరాచరము 2.జనము 3.కుటుంబము.
ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.
లోకమాత - 1.జగము తల్లి 2.లక్ష్మి 3.గంగ.
లోకజనని - 1.జగము తల్లి 2.లక్ష్మి 3.గంగ.
భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికా పీతా,
సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్య యమేవ న చర్చా. – భజగోవిందం
జగచ్చక్షువు - సూర్యుడు.
లోకబాంధవుఁడు - సూర్యుడు.
ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమమ్ |
లోకబంధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః ||
అనంత - 1.భూమి, 2.పార్వతి, (వృక్ష.) 1.ఎద్దు నాలుక చెట్టు, 2.గరిక(గఱిక - తృణము), 3.ఉసిరిక, 4.తిప్పతీగ, 5.జీలకర్ర, 6.పిప్పలి.
భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.,) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి ధృడమైన పదార్థము, నేల.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
మహి - పుడమి, భూమి.
పుడమి - భూమి, సం.పృథివీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
కానుపు - 1.వీక్షణము, 2.ప్రసూతి, రూ.కాన్పు.
వీక్షణము - అవలోకము, ఈక్షణము.
అవలోకనము - 1.చూపు, 2.చూచుట, 3.కన్ను, 4.విచారణ.
ఈక్షణము - 1.కన్ను, 2.చూపు, 3.వీక్షణము.
ఈక్షితము - 1.చూడబడినది, 2.ఆలోచించబడినది, వి.చూపు, దృష్టి.
ప్రసూతి - కానుపు, పుట్టుక. జనువు - పుట్టుక.
మహీరుహము - వృక్షము; భూజము - వృక్షము.
వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాలా ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree).
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము - 1.గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలేనిచెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలిఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి.(జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen).
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము = సేన-అందుండు వాడు.)
సైనికుఁడు - సేనాపతి, విణ.సేనలోనివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
మహాసేనుఁడు - కుమారస్వామి.
చెట్టుఁద్రిమ్మరి - కోతి, వృక్షచరము.
కోఁతి - వానరము, రూ.క్రోఁతి.
క్రోఁతి - వానరము, రూ.కోతి.
వానరము - కోతి.
కోఁతికొమ్మచ్చి - ఒకవిధమగు బాలక్రీడ.
భూమి దేవల పక్షం తల్లి దేవల పక్షం. కడవ్రేళ్లైనా భూమిలో మిగిలితే గరికగడ్డి చిగర్చక మానదు. దైవబలం తలుచుకుంటే గడ్డి బ్రహాస్త్రం అవుతుంది.
భూ - భూమి; భువి - 1.భూమి, 2.స్థానము.
భూమిక - 1.మారువేషము, 2.రచన.
బూమియ - 1.మారువేషము, 2.మాయ, వంచన, సం.1.భూమికా, 2.భ్రామకః.
వేషము - వేసము, వస్త్రభూషణాద్యలంకారము, మారువేషము.
వేడబము - వేషము, మాయ, వంచన, సం.విడంబః.
విడంబనము - 1.అనుకరించుట(అనుకరించుట - ఒకరు చేసినట్లు చేయుట), 2.వేడబము, మోసపుచ్చుట.
వాలకము - 1.రూపు, 2.వంచన(వంచన - మోసము), 3.వేషము.
రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచెష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
ప్రతిభా విశేషము - (గృహ.)వ్యక్తిత్వము, ఆకారము Personality).
రచన - నిర్మాణము, రచనము, సం.వి. (రసా.) పరమాణువుల స్వభావము, సంఖ్యయేకాక, అవి యౌగికమందు అమరియున్న తీరును తెలుపు విన్యాసము, (Contitution), సం.వి. (భౌతి.) ఒక వస్తువు యొక్క అవయవ విన్యాసము, (Structure), సం.వి. (రసా.) యౌగికముల విషయములో రచన యనగా వాని ఘటకాంగ విన్యాసము, (Structure).
రచనాత్మకము - (రసా.) రచనా సంబంధమైనది (Structural).
నిర్మణాత్మకము - (గృహ.) కట్టడము సంబంధమైనది (Structural).
నిర్మాణము - (గణి.) నిరూపణకు సహాయపడు నిర్మాణము (Construction) సం.వి. (రసా.) వస్తువులను, పారిశ్రామికముగా తయారుచేయుటకు (Manufacture), సం.వి.1.నిర్మితి, 2.యోగ్యత.
నిర్మితి - నిర్మాణము, సృష్టి.
సృష్తి - 1.సృజించుట, 2.ప్రకృతి, 3.స్వభావము.
నిర్మాత - నిర్మించువాడు, రూ.నిర్మాయి.
ఉపయోజనము - (జీవ.) నిర్మాణము నందును, శరీర ధర్మముల యందును ప్రాణి ఒక ప్రత్యేక పర్యావరణమునకు తగియుండు క్రమము (Adaptation).
చెత్త - 1.తృణము, గడ్ది, 2.పనికిరానిది.
చెత్తనేలలు - (వ్యవ.) అడవులలో ఆకులు అలములు రాలి క్రుళ్ళుట వలన సేంద్రియ పదార్థములు ఎక్కువగా నుండు నేలలు, (Organic or peaty Soils).
తృణము - గడ్డి, చామలోనగు పైరు.
గడ్డి - తృణము, కసవు. తుంగ - ఒక విధమైన గడ్డి.
గఱిక - తృణము. కసవు - గడ్డి, తృణము, సం.ఘాసః.
ఘాసము - తృణము, లేబచ్చిక, కసవు.
పూరి - 1.తృణము, 2.మృగాదుల చనుపాలు.
తృణధ్వజము - వెదురు.
వెదురు - వేణువు, సం.వేణుకః.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము, (పులుగడిగిన ముత్యము).
శష్పము - 1.లేతకసవు, 2.ప్రతిభా హాని.
లేఁగసువు - బాలతృణము.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 2.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
అంచనా - పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
అశ్మగర్భము - మరకతము, పచ్చ. (అశ్మము - రాయి.)
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
పచ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరు రేఖ. సం.పలాశః.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు.
కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ.
గరుడ పచ్చ - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, గరుడ పురాణము(మజ్జ) 12000 శ్లోకములు గలది. గరుడదేవతాకమైన అస్త్రము.
మందాళి - 1.పచ్చపట్టు చీర, 2.కృత్రిమ మరకతము.
మంజడి - 1.చిత్రవర్ణ వస్త్రము, నీల వస్త్రము, సం.మాంజిష్ఠమ్.
ఇంద్రనీలము - నీలమణి; కప్పుఱాయి - నీలమణి.
నీలము - ఒక విలువ గల రత్నము,(Sapphire). (ఇది రాసాయని కముగ ఎల్యూమినియమ్ ఆక్సైడ్ (Corundum). దీని నీలిరంగునకు కారణము అందులో అతిసూక్ష్మరాశిగా నుండు క్రోమియమ్ ఆక్సైడ్).
నీలము - 1.నీలిచెట్టు, Indigo plant, 2.నలుపు, 3.నల్లరాయి.
నీలి - నల్లనూలు Black wool, విణ.నల్లనిది, సం.నీలమ్. సం.వి.ఒకానొక చెట్టు, విణ.గారడము, సం.వి.(వ్యవ.) నీలిమందు (Indigo), రంగు ద్రవ్యములలో నొకటి, (Leguminose) అను కుటుంబములో Papilonaceae అను కుటుంబమునకు చెందిన Indigoferatinctoria అను మొక్క పట్తనుండి దీనిని తయారు చేయుదురు).
నీలీకరణము - (గృహ.) బట్టలకు నీలివేయుట, తెల్లబట్టలను ఉదికినప్పుడు తేట నిచ్చుటకై కొంచెము నీలి రంగు వేయుట (Bluing).
నీలలోహితము - (రసా.) బచ్చలి పండు రంగు గలది (Purple).
నీలలోహితుఁడు - శివుడు.
నిక్కమైన మంచినీల మొక్కటిచాలు
దళుకు బెళుకురాళ్ళు తట్టెడేల
చాటుపద్యమిలను చాలదాయొక్కటి? విశ్వ.
తా|| శ్రేష్ఠమైన నీలము అనురత్నము ఒక్కటివున్ననూ చాలును. రత్నమువలె తళతళ మెఱయుచుండు రాళ్ళు తట్టెడువున్ననూ ప్రయోజనము లేదుగదా. ఆవిధముగనే యీలోకములో మంచి నీతిని బోధించు చాటు పద్యము(చాటువు - 1.ప్రియమైనమాట, 2.గ్రంథస్థము కాకున్నను లోకమున ప్రజాదరణ పొందిన పద్యము.) ఒక్కటైనను చాలును.
అసితము - నల్లనిది, వి.నలుపు(నీలిమ - నలుపు), నీలవర్ణము.
అసితుఁడు - నల్లనివాడు, వి.1.శనైశ్చరుడు, 2.దేవలుడు అనుముని.
శనైశ్చరుఁడు - శని, వ్యు.మెల్లగా నడుచువాడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
దేవలుఁడు - తంబళవాడు, నంబివాడు, పూజారి.
పూజారి - పూజచేయువాడు, అర్చకుడు.
తంబళ - శివార్చన చేసి బ్రతికెడు ఒక జాతి.
నంబి - విష్ణు పూజకుడు.
నంబెరుమాళ్ళు - శ్రీరంగనాయకుడు.
రంగఁడు - 1.శ్రీరంగడు, 2.నంబెరుమాళ్ళు.
సిరంగఁడు - శ్రీరంగనాథుడు, సం.శ్రీరంగః.
సిరంగము - శ్రీరంగము.
రంగము - 1.సత్తు, 2.యుద్ధభూమి, 3.నాట్యస్థానము, 4.శ్రీరంగము, 5.రంగు.
రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి, 3.రంపము.
అశ్మజము - 1.సిలాజిత్తు, 2.ఇనుము, విణ.రాతినుండి పుట్టినది.
కృష్ణము - 1.ఇనుము, 2.మిరియము, 3.నలుపు, 4.కాకి, 5.కోకిల, 6.కాలాగురువు, విన.నల్లనిది.
రుక్మము - 1.బంగారు, 2.లోహము.
రుక్మకారుఁడు - స్వర్ణకారుడు.
లోహము - బంగారు, వెండి, ఇనుము మొదలగునవి, ఖనిజము (రసా.) ఇనుము, (మానవులకు మిక్కిలి ఉపయోగము గల ధాతువు. ఇది ఆవర్తక్రమమందు నికిల్ కొబాల్టులతో పాటు 8వ వర్గములో నుండును).
లోహము - (భౌతి.) పారదర్శకము కాని ఉష్ణవాహకము, విద్యుద్వాహకము, మరి కొన్ని ధర్మములు కలిగిన మూలద్రవ్యము.
ఖనిజము - లోహము, వ్యు.గని యందు పుట్టునది, (రసా.) సమ్మేళనస్థితి యందు లభించులోహము (Ore), (భూగ.) గనులనుండి త్రవ్వి తీయబడిన లోహము (Mineral).
ఖనిజ విజ్ఞానము - (రసా.) ఖనిజముల ప్రభవస్థానములను, ధర్మములను ఉపయోగములను చరించు శాస్త్రము (Minerology).
లోహకారకుఁడు - కమ్మరి.
ఇనుము - ఒక లోహము, కాలాయానము.
కాంతము - 1.ఇనుము, 2.లోహము, 3.చంద్ర సూర్య పర్యాయ శబ్దములకు తరువాత వచ్చినచో రాయి(అశ్మము - రాయి)అను అర్థము నిచ్చును, చంద్రకాంతశిల, సూర్యకాంతశిల మొ.ని, 4.కాంతభస్మము, ఔషధములలో ఒకటి.
శస్త్రము - ఆయుధము, ఇనుము.
ఆయసము - ఇనుపది, వి.1.ఇనుప వస్తువు, 2.ఇనుము.
అయస్సు - ఇనుము, రూ.అయము.
ఉక్కు - చచ్చు, నలగు, మ్రగ్గు, వి.1.కాచి శుభ్రము చేసిన ఇనుము, 2.శౌర్యము, 3.బలము, 4.గౌరవము, 5.స్థైర్యము, 6.సాహసము, 7.2% మొదలు 1.5% వరకు కర్బనము(Carbon) కలిసి యుండు ఇనుము (Steel).
ౘచ్చు - మరణించు; సమయు - చచ్చు, నశించు. నలియు - నలగు. నలఁగు - 1.నలియగు, 2.పీడితమగు, 3.చెడు, 4.శ్రమపడు.
మ్రగ్గు - 1.చచ్చు, 2.నష్టమగు, 3.విహ్వలించు. దుర్మరణము - చెడు. మలీమసము - విణ.మాసినది, వి.ఇనుము.
ఉల్కశ్మలోహము - (రసా.) ఆకాశమునుండి అప్పుడప్పుడు భూతలము పైబడు ఉల్కలలో నుండు ఇనుము (Meteoric iron).
ఉల్క - 1.కొఱివికట్టె, 2.కాగడా, 3.ఆకాశమునుండి పడు తేజపుంజము, 4.అగ్ని కణము (Meteor). మిడుఁగు - అగ్నికణము.
తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో.) సూర్యునిచుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగుచున్న తోక కలిగిన ఒక గ్రహము, (Comet).
ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.
ఉత్పాతము - 1.ఉల్కాపాతము, మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేషాది వికారము.
అయోగము - సంబంధము లేనిది, వి.1.కూడికలేమి, ఎడబాటు, 2.పొసగమి, 3.(జ్యోతి.) తిథివారాదుల దుష్ట యోగము, 4.గట్టి పూనిక, 5.ఇనుప సుత్తె, 6.వమనముచే ఉపశమింపదగు రోగము.
అయోమయము - 1.ఇనుముతో చేయబడినది, 2.కఠినము, వి.ముందు వెనుకలు తోపమి.
కఠినము - 1.పరుషము, 2.నిష్ఠురము, 3.క్రూరము, వి.వంటకుండ.
అయోమార్గము - ఇనుపదారి.
సుత్తె - లోహములను సాగగొట్టు సాధనము, రూ.సుత్తియ.
సమ్మెట - పెద్దసుత్తె, ముద్గరము, వై.వి.కశ.
ప్రఘణము - 1.తలవాకిలి ప్రక్కనుండు చిన్నగది, 2.ఇనుపగుదియ, రూ.ప్రఘాణము. ముద్గరము - ఇనుప గుదియ, సమ్మెట.
వమనము - డోకు, వమధువు.
డోఁకు - వాంతి, ఓకర(ఓకలింత), క్రి.ఓకిలించు.
వాంతి - డోకు; వమధువు - వమనము, వాంతి.
ఓకర - 1.ధ్వనిపూర్వకమగు వాంతి, డోకు, 2.అసహ్యించు.
ఓకరించు - 1.ఓకర (డోకు) వచ్చి ఉమియు, 2అస్యహించు.
వమనేచ్ఛ- (గృహ.)వికారము, వాంతివచ్చునట్లుండుట(Nausea).
అనఘునికైనఁ జేకుఱు ననర్హునిఁగూడి చరించినంతలో
మనమెరియంగ నప్పుడవమానముఁగీడు ధరిత్రియందునే
యనువుననై నదప్పవు యదార్థము తానది యెట్టులన్నచో
నినుమునుఁగూర్చి యగ్నినలయింపదె సమ్మెట పెట్టు, భాస్కరా.
తా. ఇనుము కాలినప్పుడే, సమ్మెట దెబ్బలకి లొంగుతుంది. ఇనుమును గూడిన వేడివేలుపు(వేఁడివేలుపు - 1.వహ్ని, 2.సూర్యుడు.)నకు సమ్మెట పోట్లబ్బెను. అట్లే హీనుని గూడిన(అనఘుఁడు - నిర్దోషి, పాపరహితుడు.) మాననీయునకు లఘుత్వము గలుగును గదా! అనగా కలుగునని భావము.
భారీపరిశ్రమలు - ఇనుము, ఉక్కు మొ, వానికి సంబంధించిన పెద్దపరిశ్రమలు (Large Scale Industries).
టాటానగరము - (చరి. భూగో.) జమ్ షేడ్ పూర్, బీహారులోని ముఖ్య పారిశ్రామిక స్థానము. (జమ్షెడ్జి టాటా అను పార్శీ పారిశ్రామికుని పేరిట నీ పట్టణము వెలసినది. ఇచ్చటికి సమీపమున ఇనుము, బొగ్గు గనులు కలవు. అందుచే టాటా ఉక్కుపరిశ్రమ కేంద్రము ఇచ్చట అభివృద్ధి నొందెను. ఆసియా లోనికెల్ల పెద్ద యంత్రాగార మిచ్చట కలదు.)
ఏకస్పర్శ పద్ధతి - (భౌతి.) ఉక్కుకడ్డీని అయస్కాంతముగా మార్చు పద్దతులలో ఒకటి, (Single touch method).
ద్విస్పర్శ పద్ధతి - (భౌతి.) ఉక్కుకడ్డీని అయస్కాంతముగా మార్చు పద్ధతులలో నిది యొకటి, (Double-touch method).
ఇనుప ఊపిరితిత్తి - (గృహ.) కృత్రిమమైన ఊపిరితిత్తి, దీనిని శస్త్రచికిత్సలో ఉపయోగింతురు (Iron lung).
ఇనుము విగిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విగిగెనేని మరి (య)అంట నెర్చునా విశ్వ.
తా|| ఇనుము విరిగిన కాల్చి, రెండుమూడుసార్లు అతుకవచ్చునుగాని, మనసు విరిగిన అతుకదు. మరల అంటించుట యెవరివల్ల సాధ్యము గాదు.
పదును - 1.తడి, 2.ఉక్కును వేడిచేసి నెమ్మదిగా చల్లార్చిన వచ్చు కాఠిన్యము (Temper).
దుంప ఇనుము - (రసా.) దుక్క ఇనుము కొలిమి నుండి పైకి వచ్చిన వెంటనే కడ్డీల రూపములో తయారుచేయబడిన ఇనుము, (Pig Iron).
పోఁత యినుము - (రసా.) బ్లాస్టు ఫర్నేసు నుండి సూటిగా ఘనీభవింప చేసిన యినుము (Cast iron).
చేత ఇనుము - (రసా.) పోత యినుమును కరగించి మలినములను పోగొట్టగా మిగిలిన యినుము, (Wrought iron).
నిష్క్రియత - (రసా.) గాఢ నైట్రికామ్లములోగాని, క్రోమి కామ్లములోగాని ఒకసారి ముంచి తీసివేసిన యినుము దాని రాసాయనిక ప్రవృత్తిని కోలుపోవుట (Passivity).
సంక్షారణము - (రసా.) మెల్లమెల్లగా తినివేయుట (Corrosion), ఉదా. గాలిలో పెట్టిన ఇనుము క్రమముగా త్రుప్పగును, ఆమ్లము సంపర్కముతో ఎల్యూమినియమ్ మెల్లగా తినివేయబడును. క్షార జలము ఇనుమును తినివేయును. ఇనుమును చెడగొట్టేది త్రుప్పు.
త్రుప్పు - (రసా.) 1.బయటపడవేసిన ఇనుముపై వాతావరణ ప్రభావము వలన ఏర్పడిన ధూసరవర్ణము గల చూర్ణము, (Rust). ఇది రాసాయనికముగ ద్విలోహ త్ర్యామ్ల జనిదము), వి.అరుచి.
అరుచి - 1.రోత, 2.నోటికి రుచి కాకుండుట.
రోఁత - 1.ఏవము, 2.ఎబ్బెరికము. ఎబ్బెఱికము - రోత.
ఏవము - ఏవ; ఏవ - రోత, విణ.రోతయైనది, రూ.ఏవము.
ఏవగించు - 1.రోతపడు, 2.నిందించు, 3.విడుచు.
ఏహ్యము - ఏవము, విణ.రోత పుట్టించునది, హేయమ్.
హేయము - 1.రోతయైనది, 2.విడువదగినది.
ఎబ్బెట్టు - వికటము, జుగుప్సు, రోత.
ఎబ్బెరాసి - రోతకలవాడు. ఎబ్బె - అసహ్యసూచకము.
అసహ్యము - సహింపరానిది, భరింపరానిది.
చిట్టియము - ఇనుము కాచునప్పుడు వచ్చు మురికి, రూ.చెట్టెము.
చిట్టెము - చిట్టియము.
శింఘాణము - 1.ఇనుప చిట్టెము, 2.చీమిడి, రూ.సింహాణము.
మండూరము - ఇనుప చిట్టెము.
చీమిడి - నాసామలము, శింఘాణము.
శిరస్త్రము - శిరస్త్రాణము, ఇనుప తోపి.
గొగ్గి - 1.ఎచ్చుతక్కువైనది, వి.1.ఎచ్చుతగ్గులుగా నుండుట, 2.శిరస్త్రాణము, 3.ఎచ్చుతగ్గులు గల ముత్తెము. అరగని ముత్యాలకు మెరుగుండదు.
తారతమ్యము - (భౌతి.) రెండు రాసుల మధ్యనున్న పరస్పర సంబంధము (Relative), సం.వి.తరతమ భావము, ఎచ్చుతక్కువలు.
అంతరువు - 1.తారతమ్యము, 2.కొంచెముదూరము, 3.మరుగుచోటు, సం.అంతరమ్.
అయము - 1.శుభకర్మము, మేలు చేకూర్చునది, 2.శుభము, మేలు, 3.ఇనుము.
శుభము - మంగళము; మంగళము - శుభము, క్షేమము.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.
ఉపకారము - మేలు, రూ.ఉపకృతి; ఉపకృతి - మేలు.
క్షేమంకరుఁడు - శుభంకరుఁడు, వ్యు.క్షేమమును కలిగించువాడు.
శుభంకరుఁడు - శుభమును చేయువాడు.
శుభంయువు - శుభముతో గూడుకొన్నవాడు.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము; సుకృతము - 1.పుణ్యము, 2.శుభము. సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది.
భావుకము - శుభము; భవికము - మేలు, శుభము.
స్వస్తి - శుభము; భవిష్యము - 1.శుభము, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విన.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఁఖ నిమిత్త మైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదుసేయ, వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
తా. మేలు చెసినవానికి మేలుచేయుట గొప్పతనముకాదు. తనకు హానిచేసినవానికి వాని తప్పులను గణింపక మేలు చేయువాడె గొప్ప బుద్ధిమంతుడు.
శ్రేయము - 1.శుభము, 2.ధర్మము, రూ.శ్రేయస్సు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
వరిష్ఠము - మిక్కిలి శ్రేష్ఠమైనది, వి.మిరియము.
కేవలద్రవ్యము - మిరియము.
మిరియము - కారముగల సంబారు వస్తువు, రూ.మిరెము, సం.మరీచమ్. (వ్యవ.) Pepper piparaceae అను కుటుంబము నకు చెందిన Pipper nlgrum అను తీగ యొక్క ఎండిన పండ్లు, (ఇవి సంబార ద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగించును.)
మరిచము - మిరియము, రూ.మరీచము.
తోఁక మిరియము - చలువ మిరియము.
శ్యామము - 1.మిరియము, 2.ఆకుపచ్చ, 3.నలుపు, 4.మబ్బు.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
అమలకము - 1.ఉసిరికాయ, 2.ఉసిరి చెట్టు.
అగ్నిమంథము - నెల్లిచెట్టు, ఉసిరిక.
ఉసిరిక - 1.అమలక వృక్షము, నెల్లిచెట్టు, 2.నేల ఉసిరిక.
మండ1 - ఉసిరిక; నెల్లి - ఉసిరిక.
మండ2 - 1.శాఖ, చిన్నకొమ్మ, 2.చీలమండ.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేద భాగము, 3.చేయి.
కరతలామలకము - జాతీ. అరచేతి లోని ఉసిరికాయ, సులువుగ అధీనమగునది.
తిప్యఫలా త్వామలకీ త్రిషు, అమృతా చ వయస్థా చ :
తిప్యవచ్ఛుభఫలత్వాత్తిప్యఫలా - తిప్య నక్షత్రమువలె శుభప్రదమైన ఫలములు గలది.
తిప్యనక్షత్రయుక్తేకాలే ఫలం కరోతీతివా తిప్యఫలా - పుష్య నక్షత్ర కాల మందు ఫలించునది.
ఆమలతే గుణానామలకీ. త్రి. మల మల్ల ధారణే. - గుణములను ధరించునది.
రసాయనత్వాదమృతా - అమృతమువంటి రసము గలది.
వయో యౌవనం తిష్ఠతిస్థిరీభ వత్యనయేతి వయస్థా. ప్ఠా గతినివృత్తౌ. - యౌవనము దీని చేత స్థిరమగును. ఈ నాలుగు ఉసిరిక చెట్టు పేర్లు.
అభుక్వా అమలకం పథ్యం భుక్త్వాతు బదరీఫలమ్|
కపిత్థం సర్వదాపథ్యం కదళీ నకదాచన||
తా. పరగడుపున ఉసిరికాయయు, భోజనానంతరము రేగుపండును భుజింపవచ్చును. ఎప్పుడును వెలగపండు పద్యకరము. అరటిపండును ఒకప్పుడు పద్యకరముగాదు. – నీతిశాస్త్రము
సీలమండ - చీలమండ.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.సీలమండ. (Ankle bone).
ఘుటిక - 1.గుళిక, చిన్నమాత్ర, 2.చీలమండ.
గుళిక - ఉండ, మాత్ర(రసగుళిక).
గులక - సన్ననిరాయి, సం.గుడికా, గుళికా.
ఉండ - గుళిక విణ.గుండ్రము.
ఉంట - 1.ఉండ, 2.ఉండుట, విణ.గుండ్రనిది.
ఉండు - 1.వసించు, 2.మిగులు.
ఉండ్రము1 - గుండ్రనిది, రూ.ఉండ్రస.
ఉండ్రము2 - వేడినీళ్ళతో తడిపిన పిండిని గుండ్రని ఉండలు చేసి ఆవిరిపై ఉడికించిన భక్ష్యము, మోదకము, సం.ఉండేరకః.
మోదకము - కుడుము లడ్డు. కుడుము - మొదకము. వినాయకుని మీద భక్తా, ఉండ్రాళ్ళ మీద భక్తా!
తత్ద్రంథీ ఘుటికే గుల్ఫౌ -
ఘోటతే పరివర్తతే ఘుటికా. ఘుట పరివర్తనే. - చుట్టువాఱియుండునది.
అభిఘాతాద్గుల్యతే రక్ష్యత ఇతి గుల్ఫాః. గుడ రక్షయాం. - అభిఘాతము వలన రక్షింపఁబడునది. ఈ 2 రెండు పాదముల పార్శ్వముల యందలి బుడుపుల పేర్లు(చీలమండ).
గుది - 1.ఆకులు మొ.ని గ్రుచ్చిన సరము, 2.చీలమండ, (తాటిచెట్టు మొ.ని ఎక్కుటకు కాళ్ళకు తగిలించికొను బందము).
గుత్తి - 1.పూగుత్తి, 2.చీలమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము. కుచ్చు(ౘ) - 1.గుత్తి, 2.పూగుత్తి, 3.ఏదేని చేర్చి కట్టినది, కొనచెవి నుంచు కొనెడి భూషణము, సం.గుచ్ఛః.
గుళుచ్ఛము - 1.గుత్తి, 2.పూగుత్తి. పుష్పమంజరి - (వృక్ష.) పూలగుత్తి (Inflorscence).
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
గుత్సము - 1.ముప్పది రెండు మణులు గుచ్చినహారము, 2.కంబము, 3.పరి మొ.ని దుబ్బ, 4.పూగుత్తి. స్తబకము - పూగుత్తి.
కంబము - గుంజ, సం.స్కంభః.
గుంజ - 1.స్తంభము, 2.కట్టుగొఱ్ఱు, సం.గుండ్రమ్.
స్తంభము - 1.కంబము, 2.మ్రానుపాటు, నిశ్చేష్టత, సం.వి. (భౌతి., రసా.) పాదరవముతో నింపిన భారమితి గొట్టములో నిలిచియున్న పాదరసోన్నతికి స్తంభమని పేరు (Column). అట్లే ధర్మామీటరులో కూడ నిది యుండును, సం.వి.(రసా.) వాయువుల తడిని ఆర్పుటకు ఉపయోగించు కాల్సియం క్లోరైడ్, కాల్సియం ఆక్సైడ్ మొదలైన ద్రవ్యములతో నింపిన గొట్టము (Tower).
స్తంభయిత - స్తంభించువాడు.
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.
జడత్వము - (భౌతి.) విశ్రాంత స్థితిలోగాని చలించుచున్న స్థితిలోగాని ఉన్నవస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము.
తటకా - నిశ్చేష్టత.
తటకాపడు - నిశ్చేష్టత నొందు; నిశ్చేష్ట - చేష్టలుడుగుట.
ఒక స్తంభాన్ని పట్టుకొని చిన్నపిల్లలు నిర్భయంగా దానిచుట్టూ గిరగిరా తిరుగుతారు. అలాగే భగవంతునిపై మనస్సు నిలిపి తన సంసారిక బాధ్యతలను నెరవేర్చే వ్యక్తికి ఏ అపాయమూ కలుగదు. - శ్రీ రామకృష్ణ పరమహంస
సోమలత - 1.తిప్పతీగ, 2.సోమరసము తయారుచేయు తీగ.
సోమము - పరాక్రమము, సం.వి.1.తిప్పతీగ, 2.జలము, 3.కర్పూరము, 4.సోమరసము.
సోమ - 1.శ్రమము, 2.పరాక్రమము, రూ.సోమము, సం.శ్రమః, స్తోమః.
పురోడాశము - 1.యజ్ఞార్థమైన అపూపము, సోమలతరసము, 2.హుతశేషము.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
జీలకఱ్ఱ - జీలకర, జీలకఱ్ఱ, సం.జీరకః, (వ్యవ.) ఇది సంబారపు ద్రవ్యములలో నొకటి, (Cumin). ఇది umbelliferae అను కుటుంబమునకు చెందిన Cuminum Ciminumఅను మొక్క యొక్క పండ్లు.
అజాజీ - జీలకఱ్ఱ; జీరకము - జీలకఱ్ఱ, రూ.జరగము.
జీవాతువు - జీవగఱ్ఱ, బ్రతుకు.
జీవగఱ్ఱ - జీవనౌషధము, జీవనాధారము.
బ్రతుకు - 1.జీవనము, 2.జీవనోపాయము.
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు(నీళ్ళు - నీరు).
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి (వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
పుదీనాపువ్వు - (వ్యవ.) (Spear-mint) తులసి కుటుంబము (Labiatae)నకు చెందిన (Mentha viridis) అను పుదీనా మొక్క ఆకునుండి దీనిని తయారు చేయుదురు. ఇది ఒక పరిమళద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగింపబడుచుండును. ఈ మొక్క ఆకులతో పచ్చడి చేసికొని తినుచుందురు.
పెప్భర్మింటు - (వ్యవ.) (Peppar-mint). తులసి కుటుంబమునకు చెందిన Mentha piperata అను మొక్క ఆకుల నుండి దీని తయారు చేయుదురు. (ఇది పరిమళద్రవ్యముగను ఓషధిగను ఉపయోగపడును.)
భ్రమయుగ్మమంజరి - (వృక్ష.) ఇది ఒక ప్రత్యేక పుష్పమంజరి, ద్విశాఖీయమధ్యా రంభ మంజరి, సంక్షిప్తముకాబడి ఇది ఏర్పడును. దీని పుష్పములకు వృతంతములుండవు. తులసి కుటుంబము మిక్కల కిది కాననగును (Verticil-Laster).
లవండరు - (వ్యవ.) (Lavender) ఇది పరిమళము నిచ్చు అస్థిర తైలములలో నొకటి. దీనిని తులసి కుటుంబము (Labiatae)నకు చెందిన Lavendal Sp. అను మొక్కల పూవులనుండి తీయుదురు.
కళయా తులసీరూపం ధర్మధ్వజసుతా సతీ|
భుక్త్వా కదా లభిష్యామి త్వత్పాదాంబుజమచ్యుత||
శీతకారు - (వ్యవ.) డిసెంబర్, జనవరి నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ౠతువు.
23. ధనిష్ఠ - మద్దెల యాకారముగా 5 నక్షత్రములుండును.
మద్దెల - పాటకు తోడుగ వాయించు చర్మవాద్యము, సం.కల్లు. గంగయందును కల్లునందును ప్రతిఫలించు సూర్యబింబమునకు భేదమేమి కలదు?
మురజము - మృదంగము. మర్దలము - మద్దెల.
మృదంగము - 1.మద్దెల, 2.తప్పెట, 3.సద్దు.
పూర్ణానకము - 1.తప్పెట, 2.పూర్ణపాత్రము.
పటాహము - 1.తప్పెట, 2.యుద్ధవాద్యపు మ్రోత.
మృదఙ్గా మురజాః :
మృద్యత ఇతి మృదంగః మృద మర్దనే. - కొట్టఁబడునది.
మృత్ అంగమస్యేతి వా మృదంగః - మృత్తిక అంగముగాఁగలది.
మురతీతి మురః వేష్టనం. ముర వేష్టనే. చర్మపట్టికాసం వేష్టనా జ్ఞాతఃమురజః. - మురమనఁగా చర్మవలయము. అందువలనఁ గలిగినది. ఈ రెండు మద్దెల పేర్లు.
మార్దంగికుఁడు - మృదంగము వాయించువాడు.
తోలువాయిదము - ఆనర్ధము, తోలుకప్పిన వాద్యము.
ఆనద్ధము - మృదంగాది చర్మవాద్యము, విణ.కట్టబడినది (కేశభూషణాదికము).
ఆహతము - 1.కొట్టబడినది, 2.వాయించబడినది (మద్దెల మొ.వి.), 3.(గణి.) గుణింపబడినది (సంఖ్య.) వి.1.ఢక్క 2.కొత్తవస్త్రము, 3.ప్రాతవస్త్రము, 4.(సంగీ.) గమకభేదము.
ఉదాత్తము - 1.వేదమందలి ఊర్థ్వస్వరము (వ్యతి, అనుదాత్తము) 2.దానము, 3.పెద్ద మద్దెల, 4.(అలం.) ఒక అలంకారము విణ.1.ఎత్తైనది, 2.గౌరవము కలది, 3.ధారాళము, అడ్డుపాటులేనిది.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడలనుండికారు మదము, 3.చతురపాయములలో నొకటి, 4.ఛేదనము.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
వితరణము - ఈవి.
వరము - కోరిక, వరించుట.
బహుమానము - (గృహ.) కానుక, ప్రతి ఫలము (Reward).
బహుమతి - కానుక, బహుమానము. పారితోషికము - బహుమతి.
ఉపాయనము - 1.కానుక, 2.గుర్వాదుల సమీపమునకు పోవుట, 3.పొందుట.
కానుక - కానిక; కానిక - ఉపహారము, రూ.కానుక, కాంక.
ఉపహారము - 1.కానుకగా నిచ్చు ద్రవ్యము, 2.సత్కారము.
సత్కారము - సమ్మానము, రూ.సత్కృతి, సత్ర్కియ.
సమ్మానము - గౌరవము, సత్కారము.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, ఇచ్చువాడు 3.మనోజ్ఞుఁడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
అధికుఁడు - గొప్పవాడు.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత. దాత - ఇచ్చువాడు.
గొనబు - మనోజ్ఞత, విణ.1.మంజులము, 2.మధురము, 3.శ్రావ్యము, 4.పరిమళించు, సం.గుణః.
గొనబుకాఁడు - అందగాడు, సుందరుడు. సుందరుఁడు - చక్కనివాడు.
నిష్ణాతుఁడు - నేర్పరి.
ఏడుగడ - 1.గురువు, 2.తల్లి, 3.తండ్రి, 4.పురుషుడు, 5.విద్య(చదువు, జ్ఞానము) 6.దైవము, 7.దాత అని ఏడు విధములైన రక్షణము రూ.ఏడ్గడ(ఏడు+కడ).
ఉదారము - 1. గొప్పది, 2.ఊదరలు ఒక రకపు ధాన్యము.
ఉన్నతము - 1.పొడవైనది, ఎత్తైనది 2.గొప్పది. బృహత్తు - గొప్పది.
ఉన్నతి - 1.ఎత్తు 2.ఊచ్ఛస్థితి 3.గరుడుని భార్య.
ఉదారతా వాదము - (రాజ, చరి.) వ్యక్తికి స్వాతంత్యము, సమాన అర్థిక అవకాశములు ఉండవలె నను వాదము (Liberalism).
ఢక్క - ఢంకా, రాజులు బయలు దేరునపుడు ముందు వాయించు వాద్యము.
డంకా - నగారా, డక్క, సం.డక్కా.
నగారా - పెద్ద డంకా.
డవిణ - డంకా, ఒకానొక చర్మవాద్యము.
యశః పటహము - డంకా, ఒక రకమైన వాద్యము.
పంబ - చర్మవాద్యము(పంబలవాడు.) సం.పణవః.
అనాహతము - కొట్టబడనిది, ఉత్తరింపబడనిది, చలువచేయబడనిది, (క్రొత్త వస్త్రము). (గణి.) గుణింపబడనిది, వి.1.దేహమందలి షట్చక్రములలో ఒకటి, 2.దౌడ మొ.ని స్పర్శలేకుండ పుట్టుధ్వని.
కారికము - చలువ చేయని క్రొత్తది (వస్త్రము).
అనహూతము - పిలువబడనిది.
దౌడ - తాలుపు, రూ.దవుడ.
తాలుపు - దౌడభాగము (Palate).
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టినధ్వని, ఉదా. ౘ, ౙ.
సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బ లు సరళములు.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
లంబము - (గణి.) ఒక సరళరేఖతో సంకోణముచేయు సరళరేఖ (Perpendicular).
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.నిష్కపటము.
అభిదిశ - (గణి.) సరళ రేఖయొక్క దిక్కు (Serse).
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
చిమట - 1.వస్త్రాదుల పాడుచేయు పురుగు, 2.ఝిల్లి, రూ.చిమ్మట. చిమ్మట - చిమట.
జిల్లి - 1.ఈలపురుగు, 2.ఈలపురుగు కూత, రూ.ఝిల్లిక, ఝీరుక.
ఈలపురుగు - ఈలవలె ధ్వని చేయుపురుగు ఇలకోడి, చిమ్మట, ఝిల్లి.
ఇలకోడి - ఈలపురుగు.
ఊరక సజ్జనుం డొదిగియుండిననైన దురాత్మకుండు ని
షారణమోర్వలేక యపకారముచేయుట వానివిద్యగా
చీరెలు నూరుటంకములు చేసెడివైనను బెట్టెనుండగా
జేరి చినింగిపోఁగొఱుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా.
తా. పెట్టెయందు ఒక్కొక్కటి 100 మొహరీల విలువగల చీరెలు ఉన్న యెడల చిమ్మట అందు ప్రవేశించి దానికి లాభము లేకున్నను, అవి పాడగుచున్న వని తలంపక ఆ చీరలను కొరికి పాడుచేయును. అట్లే దుర్మార్గుడగువాడు(దురాత్ముఁడు - చెడుమనస్సు కలవాడు.) సజ్జను లెంత ఓర్పుగలవారైనను వారియండజేరి వారి కపకారము చేయుటయే వాని లక్షణము.
ఊరక - 1.అప్రయత్నముగ, 2.వ్యర్థముగ, 3.విడువక, 4.ప్రతీకారము పొందక, 5.అడుగకుండ, 6.వివరణముచేయక, 7.మాటాడక, రూ.ఉరక.
ప్రాత - 1.భృత్యుడు, 2.జీర్ణవస్త్రము, వస్త్రము, విణ.1.బహుకాలము నాటిది, పూర్వము, పురాతనము, సం.భృత్యః, వస్త్రమ్, పురాతనమ్.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
అనుజీవి - సేవకుడు, విణ.ఆశ్రయించి బ్రతుకువాడు.
అనుచరుఁడు - 1.సహాయుడు, 2.భృత్యుడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు.
అనుజీవి - సేవకుడు, విణ.ఆశ్రయించి బ్రతుకువాడు.
వరాళి - 1.చందమామ Moon, 2.ముతకబట్ట.
వరాట - ముతకవస్త్రము. రెట్టు - ముతకబట్ట.
సహకారి - సహాయుడు.
సహచరుఁడు - మిత్రుడు, విన.కూడ దిరుగువాడు.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
అంతరంగుడు - స్నేహితుడు; స్నేహితుఁడు - చెలికాడు.
అనుఁగు - 1.చెలికాడు, 2.ప్రేమ, 3.ముఖ్యుడు, విణ.1.ప్రియుడు, 2.ప్రియురాలు, 3.మనోజ్ఞము, 4.సహాయుడు, 5.మొదటిది.
అనుఁగుకాడు - చెలికాడు. చెలికాఁడు - స్నేహితుడు.
అనుఁగుకత్తె - చెలికత్తె.
ముడుతలు - (గృహ.) నలుగుట, సాపులేక పోవుట, చర్మము లేదా బట్టలు ముడుతలు (Wrinkles).
కుంచించుకొని పోవుట - (గృహ.) ముడుచుకొని పోవుట, క్రొత్త బట్టను నీటిలో ముంచినచో లేదా ఉదికినప్పుడు అది ముడుచుకొనుటచే చిన్నదిగనగుట (Shrinkage).
పూర్వము - మొదటిది, (జం.) ముందుగానున్న (Anterior).
పటచ్చరము - ప్రాతగుడ్డ.
జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము.
పురాతనము - ప్రాతది; మెదుగుడు - ప్రాతవస్త్రము.
ప్రాఁబడు - క్రి.1.అలవడు, సిద్ధించు, 2.పాతగిల్లు, మాయు.
మాయు - క్రి.1.మలినమగు, 2.నశించు.
కుచేలము - 1.చినిగిన వస్త్రము, 2.సముద్రము.
పరువు - 1.వెదురుగనుపు, 2.సముద్రము. పాథోధి - సముద్రము.
నక్తకము - 1.చినిగిన వస్త్రము, 2.మాసిన వస్త్రము(బట్ట, వలువ).
చింపి - చినిగినది (వస్త్రము). చినుఁగు - క్రి. వస్త్రాదులు చిన్నమగు.
పికులు - (వ్యావ.) చినుగు, రూ.పిగులు. చించు - క్రి. 1.చినుగచేయు, రూ.చింపు.
చింపు - 1.చించు, 2. వి.చినిగినవస్త్ర ఖండము.
పటచ్చరం జీర్ణవస్త్రమ్ -
పటదితిచరతి స్ఫుటతీతి పటచ్ఛరం. - పట్టని చినుఁగునది.
పూర్వంపటభూతం పటచ్చరం పూర్వము మంచికోకయై యుండినది.
జీర్ణంచతత్ వస్త్రంచజీర్ణ వస్త్రం. - చినిఁగిన కోక. ఈ రెండు చినిఁగిన చీర పేర్లు. పాఁతవస్త్రము.
శిధిలము - సంధులు వదలినది, శ్లథము.
శ్లథము - శిధిలమైనది, వదులైనది.
వదులు - క్రి.శిధిలమగు, పట్టువీడు. వదులు - బిగుతుకానిది.
అఱగుళ్ళు - శిథిలము, వి.తునకలు.
రినోవేషన్ - (గృహ.) (Renovation) ప్రాతవానిని క్రొత్తవిగా చేయుట.
వాసాంసి జీర్ణాని యథా విహాయ - నవాని గృహ్ణాతి నరో పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నావాని దేహీ || - 22శ్లో
తా|| మనుజుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచి ఇతరములగు నూతన వస్త్రములను ధరించినట్లు, జీవాత్మయు, నిరుపయోగములైన జీర్ణ శరీరములను వదలి ఇతరములగు నూతన శరీరములను ధరించు చుండును. - భగవద్గీత, సాంఖ్యయోగము
కడలి - సముద్రము.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలిమీఁగడ ముద్ద - చందమామ.
కడలివెన్న - 1.చంద్రుడు 2.అమృతము.
అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.
మాసి1 - మానిసి, సం.మానుషః.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానుషి - మనుష్య స్త్రీ.
మాసి2 - 1.మసి, 2.మురికి.
మంగు - 1.మాలిన్యము, 2.మొగము నందు పుట్టు నల్ల పొడ, రూ.మాఁగు, మంగుఁడు, మాగుఁడు, 3.మిగులపండుట.
మాఁగు - క్రి. కమియబండు, వి.మాలిన్యము.
మాగుఁడు - కసటు, నలుపు.
అశౌచము - అశుచిత్వము, అంటు, మైల, ఉదా. (జాతశౌచము, మృతాశౌచము).
అశౌచము - 1.మురికి, 2.పురుడు, 3.మృతశౌచము, మైల.
మురికి - కల్మషము, మాలిన్యము. మాలిన్యము - మలినత.
మలినము - 1.మాసినది, 2.నల్లనిది.
కుచేలినం దంతమలాపహారిణం |
బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషిణమ్|
సూర్యోదయే చా స్తమయేచశాయినం, విముంచతి శ్ర్రీరసి చక్రపాణినమ్||
తా. మలినవస్త్రము ధరించినవానిని, పండ్లు తోమనివానిని, తిండిపోతు ను, నిష్ఠురోక్తులు కలవానిని, ప్రాతస్సాయంకాలముల యందు నిద్రించు వానిని, ఇతర గుణములచేత విష్ణు సమానులై యున్నను వీరిని లక్ష్మి పరిత్యజించును. - నీతిశాస్త్రము
అష్టౌ దేవా వసవస్సోమ్యాసః | చత్రస్రో దేవీ - రజరాః శ్రవిష్ఠాః | తే యజ్ఞం పాంతు రజసః పురస్తాత్ | సంవత్సరీణ - మమృతగ్గ్ స్వస్తి | యజ్ఞం నః పాంతు వసవః పురస్తాత్ | దక్షిణతోభియంతు శ్రవిష్థాః | పుణ్యన్నక్షత్రమభి సంవిశామ | మా నో అరాతి - రఘశగ్ంసాగన్న్ ||23||
ధనిష్ఠ - నక్షత్రములయం దొకటి.
శ్రవిష్ట - ధనిష్ఠ.
శ్రవిష్ఠయా, సమా ధనిష్ఠా :
శ్రూయతే శుభకర్మణీతి శ్రవిష్ఠా, శ్రు శ్రవణే - శుభకర్మము నందు మంచిదని వినఁబడునది.
ధనతి ధనం కరోతీతి ధనిష్ఠా, ధనధాన్యే - సంపదను జేయునది. ఈ రెండు ధనిష్ఠ పేర్లు.
విష్టరశ్రవుఁడు - విష్ణువు, వ్యు.దర్భ పిడికిళ్ళవంటి చెవులు గలవాడు.
విష్టరము - 1.ఆసనము, 2.మ్రాను, 3.ధర్భ పిడికిలి.
విష్టరశ్రవాః. స-పు. విష్టరే ఇవశ్రవసీ కర్ణౌయస్యసః - దర్భముడి వంటి చెవులు గలవాడు.
విష్టరే అశ్వర్థతరౌ శ్రూయత ఇతివా - అశ్వర్థవృక్షము నందు వినబడువాడు.
విష్టరాకారో రోమావర్తః శ్రవసి యస్యసః - విష్టరాకార మైన రోమావర్తము చెవియందు గలవాఁడు.
విష్టరం వ్యాపనశీలంశ్రవః కీర్తిర్యస్యసః - వ్యాపన శీలమైన కీర్తిగలవాడు.
సుభజో దుర్దరో వాగ్మీ మహేన్ద్రో వసుదో వసుః|
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః||
వైభవము - విభవము, సంపద.
విభవము - సంపద, ఐశ్వర్యము.
కలిమి - 1.అతిశయము(అతిశయము - అధిక్యము), 2.సంపద.
సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.
సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి.
సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపద్యతే జనైరితి సంపత్. ద. సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. – జనులచేత పొందఁబడునది.
శ్రియతే జనైరితి శ్రీః. ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది.
లక్ష్యతే లక్ష్మీః ఈ.సీ. లక్ష దర్శనాంకనయోః - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు సంపద పేర్లు.
శ్లీలము - 1.సంపదగలది, 2.సభ్యత కలది.
శ్లీలుడు - అదృష్టవంతుడు. జాతకుఁడు - 1.పుట్టినవాడు, 2.అదృష్టవంతుడు.
సిరి చేర్చు బంధువుఁల నా
సిరియే శుభముల నొసంగు * చెలువులఁ గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించుగం మఁ * దలంపు కుమారా !
తా. కుమారా! సంపదయే చుట్టములను దగ్గరఁ జేరునట్లుచేయును, శుభములన్నింటిని యిచ్చును. అందముకూడ కలిగించును. ప్రపంచములో గుణవంతుఁడని పొగడునట్లు చేయును.
సిరి - 1.శ్రీ, లక్ష్మి 2.సంపద 3.శోభ, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము. శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
సంపత్తి - సంపద, సంవృద్ధి. సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
శోభ - 1.వస్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః.
లక్ష్మి -1.రమాదేవి, 2.సంపద 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్టదామర.
అలంకారము - 1.అలంకరించుట, సింగారము 2.హారాది ఆభరణము 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
పాటన - 1.అలంకారము, 2.ఆదరణము.
ఆదరణము - 1.సన్మానించుట, 2.మన్నించుట, 2.లక్ష్యముచేయుట, పాటించుట.
ఆదరణీయము - సన్మానింపదగినది.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్దులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.
ఔజ్జ్వల్యము - ఉజ్జ్వలత్వము, ప్రకాశము.
వర్చస్సు - 1.కాంతి 2.రూపము.
కాంతి1 - 1.కోరిక 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ. అభీష్టము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
రూపము - 1.ఆకారము 2.చక్షురింద్రియ గోచరము 3.సౌందర్యము 4.అగ్నిగుణము 5.స్వభావము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
తేజః పురీషయో ర్వర్చః :
వర్చ శబ్దము తేజస్సునకును, విష్ఠకును పేరు. వర్చతీతి వర్చః. స. స. వర్చదీప్తౌ. – ప్రకాశించునది.
'వర్చస్తురూపవ 'దితిశేషః. రూప ఇవేత్యర్థః.
శుద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ|
శ్రీ లక్ష్మీ ర్వర లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా|
శ్రీదుఁడు - కుబేరుడు; శ్రీమంతుఁడు - సంపదకలవాడు.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
శ్రీధరుఁడు - విష్ణువు ((శ్రీధరం ప్రియ సంగమే)
శ్రీపతి - 1.విష్ణువు 2.రాజు. శ్రియపతి - విష్ణువు, లక్ష్మీభర్త.
శ్రీపతిః ఇ - పు. శ్రియః లక్మ్యాః పతిః - లక్ష్మీదేవికి భర్త.
శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. మారుఁడు - మన్మథుడు.
జరాభీరువు - మదనుడు(జర - ముసలితనము).
వస్త్ర ముఖ్య స్వలంకారః ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం విద్యాముఖ్యస్తు పూరుషః||
తా. అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము) ముఖ్యములు. – నీతిశాస్త్రము
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః|
శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||