Saturday, May 19, 2012

ధనురాశి

మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము - ధనుస్సు, విల్లు.

వింటిరాశి - ధనూరాశి.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
విల్లు -
ధనుస్సు.

భ్రువౌ భుగ్నే కించి-ద్భువన భయభంగవ్యసనిని!
త్వదీయే నేత్రాభ్యాం - మధుకరరుచిభ్యాం ధృత గుణమ్|
ధను ర్మన్యే సవ్యే-తర - కరగృహీతం రతిపతేః 
ప్రకోష్ఠే ముష్టౌ చ - స్థగయతి నిగూఢాన్తర ముమే|| - 47శ్లో
తా.
ఉమాదేవీ! జగముల(భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.)భయమును దొలగించ నాసక్తిగల తల్లీ! కొంచెము వంపుగ నున్న నీ కనుబొమ్మలు, తుమ్మెదల వలె ప్రకాశించు కనులు - ముడిబడిన నీ కనుబొమల జంట -  నారిని పట్టుకొన్న మన్మథుని(రతీదేవి భర్తయైన మన్మథుని) కుడిచేతియందలి ముంజెయి పిడికిలిని గప్పుచుండగా (మణికట్టును, పిడికిలియు కప్పుచుండగా చూచుటకు) కనుపింపని మధ్యభాగము(నారియు, వింటి కఱ్ఱయు)గల ధనుస్సుగ తలచుచున్నాను. దేవి కనులు మన్మథుని కుడిచేతియందలి ధనుస్సువలె ప్రకాశించుచున్న వనుట. - సౌందర్యలహరి      

కలికి బొమవిండ్లు గల కాంతకును ధనురాశి...

అథస్త్రియౌ, ధను శ్చాపా ధన్వ శరాసన కోదణ్డ కార్ముకమ్, ఇష్వాసో అపి :
ధన్యతే ప్రార్థతే ధనుః స. న. - ప్రార్థింపఁబడునది. "ధనుర్వంశ విశుద్ధో అపి నిర్గుణః కిం కరిష్యతి" యని ఉకారాంత పులింగ ప్రయోగమును గలదు. "శరావహీ ధనూః స్త్రీ స్యాత్ "అని, త్రికాండశేష మందు ఊకారాంత స్త్రీలింగముగాః జెప్పఁ,బడియున్నది.
చపస్యవేణో ర్వృక్ష విశేషస్య వా వికారశ్చాపః - చప మనఁగా వేణు విశేషము, లేక వృక్ష విశేషము. దానిచేతఁ జేయఁబడునది.
దన్యతే ధన్వ. న. న. ధన ధాన్యే ప్రార్థనాయాం చ. - ప్రార్థింపఁబడునది.
శరాఁ అస్యంతే అనేన శగాసనం. అసుక్షేపణే. - బాణములు దీనిచేత వేయఁబడును.
కుర్ధంతే అనేనేతి కోదండం. కుర్ద క్రీడాయాం. - దీనిచేత వేఁటాడుదురు.
కర్మణే ప్రభవతి కార్ముకం - యుద్ధకర్మ కొఱకు సమర్థమైనది.
ధన్వశబ్దము మొదలు నాలుగు 4 నపుంసకములు. ఇషవఁ అస్యంతే అనేనేతి ఇష్వాసః. అసు క్షేపణే. - బాణములు దీనిచేత వేయఁబడును. ఈ ఆరు 6 వింటి పేర్లు.

అస్త్రము - 1.మంత్రపూర్వకముగ ప్రయోగింపబడు ఆయుధము 2.విల్లు, 3.కత్తి.
విల్లు -
ధనుస్సు.

చంద్రహాసము - 1.కత్తి, 2.రావణాసురుని ఖడ్గము.
కత్తి -
1.ఖడ్గము, 2.మంగలికత్తి, సం.కర్త్రీ.
ఖడ్గము - 1.కత్తి, 2.ఖడ్గమృగము, దాని కొమ్ము.
కరవీరము - 1.కత్తి(కరవాలము - కత్తి), 2.గన్నేరు.
గన్నెరు - ఒకరకపు పూలచెట్టు, రూ.గన్నెర, గన్నేరు. 

చాపము - 1.ధనుస్సు, విల్లు, 2.(భౌతి.) ఒకవక్రరేఖ యొక్కగాని వృత్తము యొక్కగాని భాగము (Arc).
చాపరేఖ -
(గణి.) పరిధిలోని భాగము (Arc).

కమాను - 1.విల్లు(విల్లు - ధనుస్సు), 2.పయనము, 3.ఫిడేలు వాయించు కొడుపు, 4.ఆర్చి (Arch). మాను గాని మాను. - కమాను
పయనము - ప్రయాణము, Journey సం.ప్రయాణమ్.
ప్రస్థానము - 1.ప్రయాణము, 2.శాస్త్రము.

దౌ - దూరము, విన.దూరముగా, సం.దూర్, రూ.దవు, దవ్వు, దౌవు.
దౌవు - దౌ, రూ.దవ్వు.
దవ్వు - దూరము, సం.దవీయః.

అధ్వము - 1.దారి, 2.దూరము, 3.పయనము, 3.వేదశాఖ, 5.కాలము, 6.ఆకాశము, 7.పయనమునందు ఆగెడి స్థలము, 8.ఉపాయము.
అధ్వనీనుఁడు - 1.ప్రయాణము చేయుటకు సమర్థుడు, వేగముగా పయనము చేయువాడు, 2.బాటసారి.
అధ్వగుఁడు - బాటసారి, వి.సూర్యుడు Sun.

వాటచారి - బాటసారి, పాంధుడు.
పంథుఁడు -
పథికుడు, తెరువరి, బాటసారి.
పథికుఁడు - పాంథుడు, బాటసారి.

తెలిగొను - క్రి. ప్రయాణము చేయించు.

నగ చ్ఛేద్రాజయుగ్మంచ నగ చ్ఛద్బ్రాహ్మణత్రియం|
చతుశ్శూఁదానగచ్ఛేయుర్నగ చ్ఛే ద్వైశ్యపంచకం||
తా.
ఒకానొక కార్యమునకుఁ బోవునపుడు ఇద్దరు క్షత్రియులు, ముగ్గురు బ్రాహ్మణులు, నలుగురు శూద్రులు, ఐదుగురు వైశ్యులు పోరాదు. పోయిన నా(ఆ)పని కానేరదు. - నీతిశాస్త్రము  

బాణాగ్ర రూపము - (వృక్ష.) బాణము యొక్క కొనవలె నుండునది (ఆకు) (Sagittate).
బాణాసనము - విల్లు.

ధన్వము - 1.మెట్టనేల, 2.విల్లు, 3.నిర్జలనేల.
జాంగలము -
మెరకనేల; మెరక - మెట్ట నేల.
స్థలము - 1.మెట్ట నేల, 2.చోటు.
జాగా - చోటు; ప్రదేశము - స్థలము, చోటు. 
మెట్ట - నీరాస లేక పండెడు చేను, మెరక పొలము.
ఎగుడు - మిట్ట, (వ్యతి. దిగుడు, పల్లము).
ఎడవు - నిర్జలప్రదేశము, విణ.దూరము.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

మిట్ట - ఉన్నత భూమి, విణ.ఉన్నతము.
గాధము -
1.లోతులేనిచోటు, మిట్ట, 2.సంపాదింపకోరిక, విణ.1.లోతులేనిది, 2.దాటుటకు యోగ్యమైనది, వ్యతి.అగాధము. దంతురము - 1.ప్రక్కలణగి నడుము పొడువైనది, 2.మిట్టపల్లమైనది.

నంజనేలలు - (వ్యవ.) మెట్ట లేక మెరక నేలలు, వర్షాధారముననే సాగు చేయబడు నేలలు. (Dry lands.) దేవమాతృకము - వర్షాధారమున పండెడు పైరు గల దేశము. 

పోడుసాగు - (వ్యవ.) ఇది మెట్ట సేద్యములో నొక అనాగరిక పద్ధతి, అడవి నరకి, కంపలను, ఆకులను, అలములను అచటనే కాల్చి, నేలను దున్నకుండ విత్తులను చల్లి పైరుచేయుట. ఏటేట క్రొత్త యడవి నరకి విత్తులను చల్లుచుందురు. (Shifting cultivation)

భౌతికశోష - (వృక్ష.) నిర్జల స్థలములలో మొక్కలకు నీరు లభించని స్థితి (Physical drought).
నిర్జలీకరణము - (రసా.) నీరులేకుండ చేయుట (Dehydration).
నిర్జల స్థలోద్భిదము - (వృక్ష.) నీరు లభించని స్థలములో పెరుగు మొక్క (Xerophyte).

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము.(Property)

ధర్మశాస్త్రములు - (చరి.) భారతీయ సామాజిక వ్యక్తిగత జీవితములను శాసించు గ్రంథాలు. (బౌద్ధాయన, ఆపస్తంబ విశిష్ట ధర్మ సూత్రములు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి స్మృతులు, దేవన్నిభట్టు రచించిన స్మృతి చంద్రిక. క్రీ.శ. 12వ శతాబ్దము, నీలకంఠుడు రచించిన వ్యవహార ముఖము ధర్మశాస్త్రములుగా గుర్తించబడినవి).

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాంతి రుత్తమా,
విద్యైకా పరమా తృప్తి రహిం సైకా సుఖావహా|
తా.
ధర్మ మొక్కటే ఉత్తమ శ్రేయము (ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు), ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతి, విద్య యొక్కటే గొప్ప తృప్తి, అహింస యొక్కటే(ధర్మాలలో గొప్పది అహింస)సుఖము కలిగించునది.  

ధార్మికుఁడు - 1.పుణ్యాత్ముడు, 2.విలుకాడు.
ధనుష్మంతుఁడు -
విలుకాడు; ధనుర్ధరుఁడు - విలుకాడు.
ధన్వి - 1.విలుకాడు, 2.నేర్పరి.
కృతహస్తుఁడు - 1.నేర్పరి, 2.గురితప్పక వేయువాడు.
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
విజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.మిక్కిలి తెలిసినవాడు.
సమర్థుఁడు - నేర్పరి. ప్రవరుఁడు - 1.నమ్రుడు, 2.సమర్థుడు.   
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు. 
వినగ్ధుడు - నేర్పరి, చొరవవాడు. నిష్ణాతుఁడు - నేర్పరి.
చతురిమ - నేర్పరి. చంగము - 1.నేర్పరి, 2.చక్కనిది. 

ఓం కారమే ధనుస్సు. ధనుస్సు కదలి పోతూవుంటే, విలుకాడు గురి చూసి కొట్టలేడు. చంచలమైన మనసును స్థిర సంకల్పంగా మలుచుకోమని ఈ ధనుస్సు మనకు తెలియ జేస్తుంది. 

విల్లు సంధించేవాడు బాణం లక్ష్యాన్ని చేదించాలంటే, విలుకాడు ఎంతో ఏకాగ్రతను కలిగి ఉండాలి. విషయ వాంచలను తృణీకరించగల ఏకాగ్రతకు ప్రతీక 'బాణం' ప్రాణశక్తి బాణం.

శరధి - 1.విల్లు, 2.సముద్రము.
మహాశయము -
సముద్రము; మకరాలయము - సముద్రము.
సముద్రము - సాగరము.
సాగరము1 - నేయి మొ నవి నింపిన సిద్దెల జోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.
రత్నాకరము - సముద్రము.

సింధువు - 1.ఒకనది, 2.సముద్రము, 3.ఏనుగు, 4.నదము, 5.ఒకదేశము.
సింధురము - ఏనుగు, వ్యు.కణతల నుండి మదము కారుచుండునది.

అబ్ది - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.
అబ్దిజ -
1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.
అబ్దిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.

వృధాపృషి స్సముద్రేచ వృథా తృ ప్తేరభోజనమ్|
వృధా ధనవంతౌ దానం దరిద్రే యౌవన్నం వృథా||
తా. సముద్రము(మహాశయము - సముద్రము)న వర్షించుట, ఆఁకలి లేనివానికి భోజనము బెట్టుట, ధనవంతునకు దానము చేయుట, దరిద్రునకు(దరిద్రుఁడు - పేదవాడు, పేదవానికి)గల యౌవనము ఇవి నిష్ప్రయౌజనములు. – నీతిశాస్త్రము

కోదండము1 - 1.విల్లు (నాలుగు మూరలు గలది), 2.వెదురువిల్లు, వ్యు.కుత్సితమైన దండము గలది.
కోదండము2 - బాలురను దండిచుటకై పట్టుకొని వ్రేలాడునట్లు మీద గట్టెడి త్రాడు. మౌర్వీ రహిత (అల్లెత్రాడులేని) కోదండము - ధనుస్సు.

నడువుల నేర్పుచాలని మనుష్యుడెఱుంగక తప్పునాడినన్
కడుఁగృపతోఁ జేలంగుదురుగాని యదల్పరు తజ్ఞులెల్లద
ప్పడుగులు పెట్టుచున్నప్పుడు బాలుని ముద్దు సేయఁగాఁ
దొడగుదు రెంతకాని పడద్రోయుదురే యెవరైన భాస్కరా.
తా.
ఎట్టి కఠిన మనస్సు గల వారైనను పిల్లవాడు తప్పటడుగులు పెట్టి నడుచుచున్నప్పుడు వానిని ముద్దు పెట్టుకొందుగాని వానిని కసిరి త్రోసివేయరు, అట్లే తెలిసినవారు తెలియనివారిని కృప(కృప - దయ, కనికరము.)తో తీర్చిదిద్దురురేగాని వారిపై కోపించరు.     

కార్ముకము - 1.విల్లు, 2.వెదురు, వ్యు.కర్మకారునిచే చేయబడినది.
త్వక్సారము -
వెదురు, రూ.త్వచిసారము.
త్వక్కు - 1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము. 

వెదురు - వేణువు, సం.వేనుకః.
వేణువు -
వెదురు, పిల్లనగ్రోవి. కరతలే వేణుమ్.....
మురళి - 1.పిల్లనగ్రోవి, 2.ఒక విధమైన గుఱ్ఱపునడక.  
మైలక్రోవి - మురళి.
మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.  
మాలిన్యము - మలినత. మలినము - మాసినది, నల్లనిది.
ముఱికి - కల్మషము, మాలిన్యము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.
తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
అంధకరిపుఁడు - శివుడు.(రిపువు - శత్రువు).

కర్మకారుఁడు - ఇనుప పని చేయువాడు, వికృ.కమ్మరి. 
కమ్మర -
ఇనుప పనిచేసి బ్రతుకుజాతి కమ్మరి, సం.కర్మారః.
కమ్మరీఁడు - బాణములు చేయువాడు, సం.కర్మారః.
లోహకారకుఁడు - కమ్మరి.

సింగాణి - 1.కొమ్ములతో చేసిన విల్లు, 2.విల్లు, రూ.సింగాణి, సం.శార్జమ్, శృంగిణీ.
కొమ్ము -
1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ,వి. కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ,వి. ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శొంఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 6.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.  

కొవురు - 1.కొండకొమ్ము, 2.శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము -
1.కొండ కొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు. 
గోపురము - 1.గవసు, పురద్వారము, వాకిలి, 2.గాలిగోపురము, దేవాలయ ముఖమున ఎత్తుగా కట్టినద్వారము, (గణి.) సూచ్యగ్ర స్తూపము (Pyramid).

పిరమిడ్లు - (చరి.) (Pyramids) ఈజిప్టులోని పెద్దరాతి కట్టడములు. ఇవి త్రికోణాకారములో ప్రాచీనకాలపు ఈజిప్టు చక్రవర్తులైన ఫారోలకు స్మారక చిహ్నములుగా కట్టబడినవి(వీనిలో కెల్ల పెద్ద పిరమిడు ' గిజే ' పిరమిడు 6 మైళ్ళ పొడవులో 484 అడుగుల ఎత్తు 13 1/4 ఎకరముల వైశాల్యముతో నైలునది Nile river యొద్ద నున్నది.)   

శృంగిణి - ఆవు. శృంగయోగాత్ శృంగిణీ. ఈ. సీ. - కొమ్ములు గలది.

శార్జము - విష్ణువు విల్లు, విల్లు, వ్యు.శృంగముతో జేయబడినది.
శృంగము -
1.కొమ్ము, 2.కొండ కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
శార్జి - విష్ణువు, వ్యు.శార్జము కలవాడు.  

వనమాలీ గదీ శార్ఙీ శంఖీ చక్రీ చ నందకీ
శ్రీమాన్నారాయణో విష్ణుఃర్వాసుదేవో భిరక్షతు.

ఇష్వాసము - విల్లు; విల్లు - ధనుస్సు.
సెలవిల్లు -
సెలసు బద్దలతో చేసిన విల్లు, రూ.సెలసు విల్లు.
సెలసు - ఒకానొక చెట్టు.

పినాకము - 1.శివునివిల్లు, 2.త్రిశూలము.
అజగవము -
శివుని విల్లు, రూ.అజీగవము, అజీగావము, అజకవము, అజీకవము.
అజీగవము - అజగవము, రూ.అజీగావము.

పినాకో జగవం ధనుః :
పినాకః త్రిపుత దాహకాలే శరజ్వాలాజాలైర్నాకం పిహితవాన్ పినాకః తదా మేరుధనుస్త్వాత్ - త్రిపుర దహనకాలమందు శరజ్వాలలచేత స్వర్గమును గప్పినది గనుక పినాకము.
అజగవాస్థి వికారత్వా దజగవం. అ-న. - అజగవము యొక్క అస్థివికారమైనది. ఈ రెండు శివుని విల్లు పేర్లు.

పెన్న - పినాకినీ నది, సం.పినాకినీ.

పినాకి - శివుడు.
పినాక ఇతి ధనురస్యా స్తీతి పినాకీ, న-పు.- పినాక మనెడి విల్లు గలవాఁడు.
అథ పినాకో స్త్రీ శూలంశంకరధన్వనోః : పినాక శబ్దము శూలమునకును, ఈశ్వరుని వింటికిని పేరు.
పాతీతి పినాకః. అ. ప్న. పా రక్షణే. - రక్షించునది.

మహితము - శివుని త్రిశూలము, విణ.గొప్పది, పూజ్యము. 
త్రిశిఖము -
1.త్రిశూలము, 2.సిగదండ.
త్రిశూలము - ముమ్మొనవాలు.
ముమ్మొనవాలు - (మూడు+మొనవాలు) త్రిశూలము.
శూలము - 1.మొమ్మొనవాలు, 2.టెక్కెము, 3.ఒక రోగవిశేషము.

శేఖరము - సిగదండ, (ఉత్తరపదమైనచో) శ్రేష్ఠము.
సిగరము -
శిఖరము, సం.శేఖరమ్.
సిగబంతి - శేఖరము, సికదండ.
వతంసము - సిగబంతి, పూగమ్మ, రూ.అవతంపము.
అవతంసము - 1.పూగమ్మ, 2.సిగబంతి (పండితావతంసుడు మొ. చోట్ల శ్రేష్ఠవాచకము), రూ.వతంసము.

శూలి - శూలపాణి.
శూలపాణి -
శివుడు, వ్యు.శూలము చేతి యందు గలవాడు.  

మేకు - 1.శూలము, 2.చీల.
చీల -
1.మేకు, 2.కీలము, రూ.సీల. సీల - చీల.
శివకము - 1.పసులగట్టు గూటము, 2.మేకు.
కీల - 1.మోచేతిదిబ్బ, 2.మేకు, 3.మంట, జ్వాల.
కీలము - 1.మేకు, 2.మంట, 3.లేశము, 4.మోచేయి, (వృక్ష.) అండకోశములో అండాశయముపై నున్న కాడ (Style).
కీలాగ్రము - (వృక్ష.) కీలము యొక్క కొన (Stigma).
కీలి - అగ్ని, వ్యు.కీలలు కలది. 

కంకటము - 1.కవచము, 2.శివుని త్రిశూలము.
కవచము -
1.బొందలము, తనుత్రాణము, 2.తప్పెట, 3.ఒక రకమైన మంత్రము.
బొందడము - కవచము, రూ.బొందళము.
తనుత్రాణము - కవచము.
తనుత్రము - కవచము, వ్యు.దేహమును రక్షించునది.
కంకటీకుఁడు - ముక్కంటి, శివుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ.  

వర్మము - కవచము.
కంచుకము -
1.రవిక, 2. చొక్కాయ, 3.కవచము.
(ౘ)చొకా - కంచుకము, చొక్కాయ, రూ.చొకాయ, చొక్కా, చొగాని.
చొక్కాయ - చొక్కా Shirt.
అంగరకా - చొక్కాయ, సం.అంగరక్షా, వ్యు.అంగములను రక్షించునది.

నివాతము-1.బాణాములచే భేదింపరానిది (కవచము), 2.గాలిలేనిది.  

గవ్యము - 1.వింటినారి, 2.పసులు మేయు పొలము, విణ.1.గోహితవైనది, 2.గోసంబంధమైనది, 3.గోవికారమైనది (పాలు మొ.వి).
గవ్యములు - గోసంబంధమైనవి, (పంచగవ్యములు:- గోమయము, గోమూత్రము, గోఘృతము, గోదధి, గోక్షీరము. ఇవి పవిత్రములు, పాపహరములు).

గొబ్బి - 1.ధనుర్మాసమున బాలికలు చేతులు చరచుచు గుండ్రముగా తిరుగుచు పాటలు పాడువేడుక, 2.ఇక్షురకము, గొలిమిడి, మొగబీర.
గొబిళ్ళు - 1.గొబ్బి, 2.నమస్కార భేదము, 3.బాలక్రీడ, 4.గొబ్బిపాట.

నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి. స్త్రీ.
నరము -
నాడి nerve.
నాడి - 1.నరము, రూ.నాడు, సం.వి. గడియకాలము, 3.ఈనె, 4.కాడ.
నాడీక - దేశము, రూ.నాడు, సం.వి. గడియకాలము, రూ.నాడి.
నాడు - క్రి. నాటు, వి.1.దేశము, 2.గ్రామము.

మౌర్వీ జ్యూ శిఞ్జనీ గుణః -
మూర్వా వృక్ష విశేషః తద్వికారో మౌర్వీ. ఈ. సీ. - మూర్వయనఁగా చాఁగ దానిచేతఁ జేయఁబడునది.
జినాతి కాలే శిథలీ భవతీతి జ్యా. జ్యా వయోహానౌ. - కాలక్రమమున శిథిలమౌనది.
శిఞ్జతి అవ్యక్తం స్వనతీతి శింజనీ. ఈ. సీ. శిజి అవ్యక్తే శబ్దే. - అవ్యక్తముగా మ్రోయునది (తాలవ్యాది).
గుణ్యతే అభ్యస్యత ఇతి గుణః. గుణ అభ్యాసే. - అభ్యసింపఁబడునది. ఈ నాలుగు 4 వింటినారి పేర్లు.

మౌర్వీ - అల్లెత్రాడు.
అల్లియ -
వింటినారి, మౌర్వి, రూ.అల్లె.
అల్లె - అల్లియ.

జ్యూ - 1.వింటినారి, 2.భూమి, (గణి.) వృత్త పరిధిలోని రెండు బిందువు లతో నంతమగు సరళ రేఖ (Chord).

భూ - భూమి; భూమి - నేల, చోటు, పృథివి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
ప్రదేశము - స్థలము, చోటు. స్థలము - 1.మెట్టనేల, 2.చోటు.
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
ఇరవు - చోటు, స్థానము, విణ.స్థిరము.
స్థాని - స్థానము కలది.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
నిర్వాతము - చలింపనిగాలి, విణ.గాలిలేనిది (చోటు).

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
నేలచూఁలి -
సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

భూపతి - నేలరేడు, రాజు.
నేలఱేఁడు -
రాజు. భూభృత్తు - 1.రాజు, 2.కొండ. 

భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు -
భూసురుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు; పాఱుడు - బ్రాహ్మణుడు. 

భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

శింజిని - 1.వింటినారి, 2.కాలియందె.
హంసకము -
కాలియందె.
పాయపట్టము - కాలియందె(కాలి అందె), సం.పాదపట్టమ్.   
శింజ - 1.వింటినారి మ్రోత, 2.అందెల చప్పుడు.
టంకారము - 1.వింటినారి ధ్వని, 2.ఆశ్చర్యము, 3.ఆశ్చర్యము కల్గించు శబ్దము. 

మోపు - 1.మోయచేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్దిమోపు, 2.వింటినారి, విణ.అధికము.
ఆరోపము -
1.(నిందాదులు) మోపుట, 2.నిఘంటువులలో అకారాదిగ ఇచ్చిన పదము, 3.ఒకదాని ధర్మములు అవిలేని వేరొకదాని యందు ఉన్నట్లు చెప్పుట, రూ.ఆరోపణము. 

గొనము - 1.సౌశీల్యాది గుణము, 2.వింటినారి, సం.గుణః.
సౌశీల్యము -
సుశీలత్వము, మంచి ప్రవర్తన.
గొనయము - 1.వింటినారి, 2.వింటికొప్పు, సం.గుణః.
స్థావరము - (భౌతి.) కదలనిది, చలనము లేనిది, స్థిరము, మార్పులేనిది(Stationary), సం.వి.1.వింటినారి, 2.కొండ, 3.వృద్ధత్వము.
స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది. 
అచరము - కదలనిది, స్థావరము.
తావరము - స్థావరము, తిరమైనది, సం.స్థావరమ్. 

మనం ప్రదర్శించే గుణాలనుబట్టి మనుషులను ఆకర్షిస్తాం. మనలోని గుణాలనుబట్టి నిలుపుకుంటాం. - స్వార్ట్ 

గుణి - గుణము గలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.
గుణము -
1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము. కులము కంటె గుణము గొప్పది, ముఖ్యమైనది.  
శీలము -1.స్వభావము, 2.మంచి నడత. సుఖానికి ఆధారము. - శీలం
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కను గుణమైనది.
ఇలువడి - 1.మంచినడత, 2.కులీనత.
కులీనత - మంచి కులమున పుట్టుట.
ఆర్జవము - 1.మంచినడత, 2.సరళత్వము.
నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ. 
దారము - పేనినత్రాడు, నూలు, పోగు. (Yarn)
పోఁగు - 1.దారము, 2.చెవినగ.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థ దీపనము, ఔదార్యము(ఉదారత్వము, దాతృత్వము), కాంతి, ఓజము, సమాధి(మనోలయము, నియమము), సౌకుమార్యము.

షడేవ తు గుణాః పుంసా న హాతవ్యాః కదాచన,
సత్యం దాన మనాలస్య మనసూయా క్షమా ధృతిః|
తా||
మనుజు డెన్నటికి విడువరాని గుణము లారు(ఆరు గుణములు). అవి సత్యము(Truth), దానము, సోమరితనము లేకుండుట, అసూయ లేకుండుట, ఓర్పు(క్షమ -1.ఓర్పుPatience, 2.నేల, 3.మన్నింపు.)కలిగివుండుట, ధైర్యము(ధృతి-1.ధైర్యము, 2.ధరించుట, 3.సంతోషము, 4.సౌఖ్యము.)   

అనేక సుగుణాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. వాటిని జీవితానికి అన్వయించుకోవాలి కదా! - రోచ్ ఫకాల్ట్

ఎక్కుడు - 1.ఆరోహణము, 2.వాహనము, 3.వింటినారి, విణ.అధికము.
ఆరోహణము -
1.(అశ్వాదులను) ఎక్కుట, 2.నిచ్చెన, 3.మొలకెత్తుట, 4.నర్తనమునకై ఎత్తుగ కట్టిన రంగ స్థలము.
అధిరోహణము - 1.ఎక్కుట, ఆరోహణము, 2.ఎక్కించుట, ఎత్తుట.
ఆరోహణ - (గణి.) క్రమముగా వృద్ధిచెందుట (Ascent).
ఆరోహణక్రమము - (గణి.) వరుసగ పెరుగుచుపోవు క్రమము (Ascending order).
అసులోపము - ఆరోహణ క్రమము గలది.
అధిరోహణి - నిచ్చెన, మెట్లవరుస.
తాప -
1.నిచ్చెన, 2.మెట్టు Step; సోపానము - మెట్టు.
సోపనము - సోపానము, మెట్టు, సం.సోపానమ్.
మెటిక - 1.సోపానము, 2.వ్రేలిగనుపు, రూ.మెట్టు, మెట్టిక.
వాహనము - ఎక్కదగిన ఏనుగులోనగునది; ధోరణము - వాహనము.
ఎక్కు - వింటినారి, క్రి.1.అతిశయించు, 2.ఆరోహించు, 3.ఇష్టమగు.  వలియ - వింటినారి, సం.వల్లిక.  

రోహము - 1.ఎక్కుట, 2.మొలక.
రోహణము - 1.ఎక్కుట, 2.ఒక కొండ.

సౌధసోపానన్యాయము - న్యా. మెట్లన్నియు నెక్కకుండ నొకసారిగ మేడ(సౌధము - 1.రాజగృహము, 2.మేడ.)నెక్కుట కష్టమను రీతి.

ఆరూఢము - 1.ఎక్కినది, 2.ఎక్కబడినది (చెట్టు మొ.) 3.పొందినది, వి.ఆరోహణము, 2.పెంపు, అధికము.
ఆరురుక్షువు - 1.ఎక్కనిచ్చకలవాడు, 2.ఉచ్ఛదశను పొందనిచ్చ గలవాడు. 

ఎక్కుడు మెకము - మహామృగము, ఏనుగు.
మహామృగము - ఏనుగు
Elephant.

లోచకము - 1.దీపపుకొణుదురు, 2.బొట్టు, 3.వింటియల్లెత్రాడు.
బొట్టు -
1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళ సూత్రమున కూర్చు సర్ణాభరణము, సం. 1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱచెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
వృత్తము - 1.నియత గణములును యతిప్రాసములుగల పద్యము, 2.నడత(నడత - ప్రవర్తనము), 3.జీవనము(జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.), విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే రూపములో చరించు బిందువు యొక్క పథము, (Circle).

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు Moon.

విస్ఫారము - వింటిమ్రోత, విణ.మిక్కిలి అధికమైనది.
అధిజ్యము -
ఎక్కుపెట్టబడినది (విల్లు).
ప్రహితము - విణ.వింటినుండి విడువబడినది.  
స్వానము - ధ్వని, రూ.స్వనము.
స్వనము - శబ్దము, నిస్వనము.
నిస్వనము - ధ్వని, మ్రోత, రూ.నిస్వానము.

విస్ఫారో ధనుషాం స్వానః -
విస్ఫురతి అరిహృదయ మితి విస్ఫారః స్ఫుర స్ఫురణే. - శత్రు హృదయము దీనిచేత చలించును. పా. విస్ఫారః. - ఈ ఒకటి విండ్లమ్రోఁత పేరు.    

మువ్వన్నెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు -
(భౌతి.) సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow).
శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.
శక్తుడు - శక్తికలవాడు. 

ఇంద్రాయుధం శక్రధనుః -
ఇంద్రస్య ఆయుధం ఇంద్రాయుధం. - ఇంద్రుని యాయుధము.
శక్రస్య ధనుః శక్రధనుః. స-న. - శక్రుని ధనుస్సు. శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.
మేఘప్రతి ఫలిత నానావఋనస్య ధానురాకారేన దృశ్యమానస్య సూర్యరశ్మే ర్నామనీ - ఇది మేఘము నందు బ్రతిఫలించి, నానావర్ణమై ధనురాకారముగా నగపడుచున్న సూర్యరశ్మి. ఈ రెండు ఇంద్రుని ధనుస్సు పేర్లు. 

ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రునిఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.  
తెల్లయేనుగు - ఐరావతము.   

గతై ర్మాణిక్యత్వం - గగనమణిభి స్సాంద్రఘటితం
కిరీటం తే హైమం - హిమగిరి సుతే! కీర్తయతి యః, |
స నీడేయచ్ఛాయా - చ్ఛురణ (పటలం) శబలం చంద్రశకలం
ధనుః శ్శౌనాసీరం - కిమతి న నిబధ్నాతి ధిషణామ్. - 42శ్లో
తా.
ఓ హైమవతీ ! ఆకాశంలో వెలుగొందుతున్న ద్వాదశాదిత్యులనే మాణిక్యాలచే(సూర్యకాంతమణులు) చక్కగా కూర్చబడినదైన(పొదిగిన) నీ బంగారు కిరీటమును - ఎవడు కీర్తించుచున్నాడో(వర్ణిస్తున్నాడో) - ఆ కవీంద్రుడు- గోళాకారమైన ఆ కిరీటమునందు కుదుళ్ళయందు బిగింప బడిన(ద్వాదశాదిత్యులను) మణులయొక్క కాంతులతో కలియుటచేత చిత్ర చిత్ర వర్ణములు గల చంద్రరేఖ(నీ పాపట బొట్టుగానున్న చంద్రరేఖను) కాంచి అదినిజంగా ఇంద్రధనుస్సే అయివుంటుందని ఎందుకు(తన చిత్తము నందు) స్థిరముగా భావించడు? (చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి ఇంద్రధనుస్సే అని నిశ్చయబుద్ధి కల్పించు కొనుచున్నాడని భావము.) - సౌందర్యలహరి   

శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.

19. మూల : చెంబును పోలి 5 నక్షత్రములుండును.

చెంబు - చిన్నలోహ పాత్రము.
సగ్గెడ - చెంబు.

మూలం ప్రజాం వీరపతీం విదేయ | పరాచ్యేతు నిర్ఋతిః పరాచా | గోభిర్నక్షత్రం పశుభిస్సమక్తమ్ | అహర్భూయాద్యజమానాయా మహ్యమ్ | అహర్నో అద్య సువితే దధాతు | మూలం నక్షత్రమితి యద్వదంతి | పరాచీం వాచా నిర్ఋతిం సుదామి | శివం ప్రజాయై శివమస్తు మహ్యమ్ ||18||

మూల1 - మూలానక్షత్రము.
మూల2 - 1.విదిక్కు, 2.కోణము, 3.గొంది, 4.కొప్పు.

వీరుఁడు - శూరుడు.
వీరపత్నీ - వీరుని భార్య.
వీర - పెనిమిటి, పుత్రులుగల స్త్రీ.

మూల మాద్యే శిఫా భయోః :
మూలశబ్దము మొదటికిని, ఊడకును, మూలానక్షత్రమునకును పేరు. మూలతీతి మూల. మూల ప్రతిష్ఠాయాం. - నిలుకడ గలిగియుండునది.
"మూల మంతిక కుంజయో"రితి శేషః.

మొదలు - 1.ఆది, 2.పూర్వము, 3.మూలము, 4.మూలధనము, 5.ప్రభృతి.
ఆది1 - (గృహ.) 1.నగలుచేయుటకు, దుస్తులు కుట్టుటకు ఇచ్చు కొలత (Measurement); ఆ కొలత దెల్పెడి వసువు, 2.మొదలు, 3.మూలము, 3.ప్రమాణము, సం.విణ.మొదటిది, 2.మొదలుగాగల, 3.సదృశ్యము.
ఆది2 - గురి.
ఆదికొను - క్రి.1.కన్నువేయు, 2.ఎదుర్కొను.

పూర్వము - మొదటిది, (జం.)ముందుగా నున్న(Anterior).
మొదటి -
1.ప్రథమము, 2.ముఖ్యమైనది, 3.ఆదిమము(Primary) ప్రాథమికము, ఆదికాలికము (Primitive).
ప్రథమము - 1.ముఖ్యము, 2.మొదటిది.
ప్రాథమికము - ముఖ్యమైనది, ప్రధానమైనది, మొదటిది (Primary).
అగ్రిమము - ప్రధానము; ముఖ్యము - ప్రధానము; ప్రధానము - 1.ముఖ్యము, 2.ముందిచ్చు సొమ్ము, 3.వివాహాత్పూర్వము, వధువున కలంకారాదుల నిచ్చి నిశ్చయించు కొనుట, 4.పరమాత్మ.

పరమము - పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము, 2.ఆద్యము, 3.ప్రధానము.  

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
శీర్షము - తల, (గణి.) భూమి కెదురుగా నుండు కోణబిందువు, (Vertex).
తలకాయ - శిరస్సు.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు.
ఉత్తమాంగము - తల.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన. 
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు. 

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదుల కంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. - నీతిశాస్త్రము

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

ముందర - 1.మునుపు, 2.మొదలు, 3.ఎదురు.
ముందఱికాళ్ళకుఁ బందెములు వేయుట -
జాతీ. రాబోవు దానికి అడ్డు చెప్పుట.

మూలము - 1.వేరు, 2.ఊడ, 3.మూలమట్టము మొదలు, 4.(గణి.) ఒక రాశిని అదే రాశిచే కొన్ని తడవలు గుణించగా లభించు లబ్ధము. దత్తరాశికి సమానముకాగా మొదటిరాశిని దత్తరాశికి మూలమందురు (Root), ఉదా. (Root) x=a అను సమీకరణమును సంతృప్తి చేయు x యొక్క విలువ.
వేరు - చెట్టుయొక్క మూలము.
ఊడ - మఱ్ఱి మొ. వాని కొమ్మల నుండి క్రిందికి దిగెడివేరు శిఫ. (ఊడ, పడుకొమ్మ, ఈ యూడల వేళ్ళవలననే చెట్టున కాహార మందును). శిఫ - ఊడ, పడుగొమ్మ.

ఊఢ - 1.పెండ్లియైన స్త్రీ, 2.భార్య.

కచము - జుట్టు, కేశము.
కంచబంధము - జుట్టుముడి.

జట - 1.జడ, 2.ఊడ.
జటాలము -
జడలుగలది, రూ.జటిలము.
జటిలము - జటాలము, వి.సింహము.
ౙడలమెకము - సింహము, చమరము.     

మూలే లగ్నకచే జటా :
జటా శబ్దము ఊడకు, జడకును పేరు. జటతీతి జటా. జట సంఘాతే. - గుంపై యుండునది.

వృక్షము (చెట్టు) ఎంత ఎత్తు ఆకాశానికి ఎదిగినా, ఆ అనంతాకాశంలొని వాయువు తరంగాలకు ఆనందంగా తల ఊపినా, తన వేరు (మూల) సంబంధాన్ని తెంచుకోకూడదు. ఆ బంధం తెగితే క్రమంగా పతనమే తప్ప మరో పధం లేదు. 

వేద మూలమిదం జ్ఞానం, భార్యా మూలమిదం గృహమ్|
కృషి మూలమిదం ధాన్యం, ధన మూలమిదం జగత్ ||
తా.
జ్ఞానమునకు వేదమే మూలము, గృహమునకు భార్యయే మూలము, ధాన్యమునకు కృషియే మూలము, జగత్తునకు ధనమే మూలము. – నీతిశాస్త్రము

మూలధనము - పెట్టుబడి (Capital) (అర్థ.) ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యక్రమము కొనసాగుటకు అవసరమైన ధనము, దీనిని కంపెనీ వాటాల వలనగాని ఋణ పత్రముల వలన కాని, అప్పువలనకాని, గత సంవత్సరములలో కలిగిన లాభాంశముల వలన కాని సేకరింపవచ్చును.

బండవలము - 1.సామర్థ్యము, 2.సంచి మొదలు, మూలధనము, సం.భాండ బలమ్.
సామర్థ్యము - 1.నేర్పు, 2.యోగ్యత (భౌతి.) పనిచేయు రేటు, (Power), (గృహ.) బలము, సత్తువ.
నేరిమి - సామర్థ్యము, రూ.నేరుపు, నేర్మి, నేర్పు. ప్రావీణ్యము - నేర్పు.
ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.
యోగ్యత - అర్హత, eligibility.
ఔచిత్యము - యోగ్యత; ఔచితి - 1.ఉచితత్వము, 2.యోగ్యత.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
లావు - 1.బలము, 2.అతిశయము, 3.సామర్థ్యము, విన.స్థూలము.
లావరి - (లావు+అరి) బలవంతుడు. 

ప్రావీణ్యము - నేర్పు; విచక్షణత - నేర్పు.
చాతుర్యము -
1.నేర్పు, రూ.చాతురి. చాతురి - నేర్పు.
చమత్కారము - 1.నేర్పు, రూ.చమత్కృతి.
చమత్కృతి - చమత్కారము.
విన్ననువు - నేర్పు, సాధనము, సం.విజ్ఞానమ్.
విన్నాణము - నేర్పు, ఇప్పిదము, సం.విజ్ఞానమ్. 

నీవి - 1.సంచి మొదలు (మూల ధనము), 2.పోకముడి, 3.పందెపు సొమ్ము, 4.చెరసాల.
సంచి మొదలు -
మూల ధనము.
పోఁకముడి - నీవి, స్త్రీల కట్టుకోక ముడి.
పోఁక - వక్క, సం.పూగః.
వక్క - ఉడకబెట్టిన పోకచెక్క, సం.వల్కః.
పూగము - పోక; క్రముకము - పోక.
ముప్పోకలాఁడు - (మూడు + పోకలు + ఆఁడు) త్రిగుణాత్మకుడు, భగవంతుడు.   

బాగములు - పూగములు, పోకచెక్కలు, వక్కపొడి.
చిక్కణము -
1.చాయవక్క, విణ.1.నునుపైనది, 2.తరచైనది, 3.చిక్కనైనది, రూ.చికినము.  
చికినము - 1.చిక్కణము, 2.చాయవక్క, రూ.చికిని.
చిక్కన - 1.చిక్కణము, 2.తరచు, 3.దార్ధ్యము, 4.బలము.
చికిని - చికినము.

ఉచ్చయము - 1.సమూహము, 2.పోకముడి, 3.పూలు మొ.వి కోయుట, 4.అతిశయము.

పందెము - 1.ఒడ్డనము, 2.జూదములో ఒడ్డు ధనము, రూ.పందియము, సం.పణితమ్. కార - చెరసాల, బంధనాలయము.

ప్రభృతి - మొదలు; లగాయతు - మొదలు.
సుత1 -
మొదలుకొని, ప్రభృతి, ఉదా. అదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు; కూఁతురు - కొమార్తె.

సదృశ్యము - (గణి.) అనురూపము, సం.విణ. సమానము, తగినది, (Corresponding).
అనురూపము - 1.తగినది, 2.అనుగుణము, 3.సాటియైనది, 4.(గణి.) ఒక దాని కొకటి అనుగుణముగా నున్నది, అనుగుణ్యము కలది, (Corresponding).

మూల1 - మూలానక్షత్రము.
మూల2 -
1.విదిక్కు, 2.కోణము, 3.గొంది, 4.కొప్పు.
విదిక్కు - రెండు దిక్కుల నడుమ.
కోణము - మూల, అంచు.
అం(ౘ)చు1 - 1.కొన, 2.చీరచెరగు, 2.విధము, (గణి.) రెండు సమతలములు కలియు రేఖ, ముఖములు కలియు ప్రదేశము (Edge).
అం(ౘ)చు2 - క్రి. 1.ఆజ్ఞాపించు, 2.పంపించు, రూ.అనుచు.
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు. 
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.

గొల - 1.గొంది, 2.బిలము, 3.మూల, సం.గుహా.
గొంది -
1.మూల, 2.కొండయొక్క చిన్న మరుగుచోటు, 3.చిన్న సందు, 4.స్థానము.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
రంధ్రము - 1.క్రంత, సందు, 2.దూఱు.
గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహ వేగముచే వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కంధము.
స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk). 
ప్రకాండము - చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా. పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు. 
బోదియ - 1.ప్రకాండము, 2.మిరపచేల యందు కాలువ లేర్పరిచి కట్టిన కట్ట 3 స్తంభముల మీది దూలముల క్రింద నుండు పీట.       
ప్రకాండవ్యూహము - (వృక్ష.) మొక్కకు భూమిపై నున్న కాండము, కొమ్మలు, ఆకుల మొదలగు భాగముల సముదాయము (Shoot system).  

శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).  

గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము , మొ.వి విణ.గుహా యందుండునది.  

గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.

ఉపాంతము - 1.సమీపము, చేరువ, 2.కొన, 3.మూల.
సదేశము -
సమీపము; సమీపము - చేరువ. 
కొన - 1.చివర, 2.చెట్టు కొమ్మ చివర, 3.గుఱ్ఱపుజూలు.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.

గవి1 - ఆవు.
గవి2 - 1.గుహ 2.గుంట.

ధమ్మిల్లము - కొప్పు.
కొప్పు -
1.దోపిన వెండ్రుకలముడి, 2.వింటికొన, 3.కోపు, 4.ఇంటి నడికొప్పు.   
మౌళి - 1.కొప్పు, 2.కిరీటము, 3.సిగ (ఉత్తర పదమైనచో శ్రేష్ఠార్థకము).
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన. శిఖను దారిలో విప్పరాదు.
సిగ - సిక, సం.శిఖా; సిక - శిఖ, జుట్టు రూ.సిగ.
కేశబంధము - 1.కొప్పు(కబరి - కొప్పు), 2.ముడి. కొరివితో కొప్పు గోకికొనినట్లు.  

ఆర్తి - 1.దుఃఖము, 2.రోగము, 3.ఆపద, 4.వింటికొప్పు.

(ౙ)జుట్టు - సిగ, సం.చూడా.
జుట్టుపిట్ట -
నెమలి శిఖ.
చూడ - 1.నెమలిజుట్టు, 2.జుట్టు, 3.చూరు, 4.బాహుపురి.
(ౘ)చూరు - 1.ఇంటిమీది కప్పు చివర, సం.చూడా, 2.ఏదేని వస్తువు యొక్క పొడి, సం.చూర్ణమ్. క్రి.పొగతగులు.
బాహుపురి - కేయూరము.
కేయూరము - భుజకీర్తులు, వ్యు.భుజాగ్రమున నుండునది.
భుజకీర్తి - బాహుపురి, కేయూరము.
బాహులేయుఁడు - కుమారస్వామి. 

ఘృణిజ్వాలే అపి శిఖే : శిఖా శబ్దము కిరణమునకును, అగ్నిజ్వాలకును, అపి శబ్దమువలన సిగకును పేరు.
శేతే ఇతి శిఖా. శీఞ్ స్వప్నే. ధాతూనా మనే కార్థత్వాదత్ర వ్యాప్తిరర్థః. – వ్యాపించునది.

శిఖావంతుఁడు - అగ్ని, సం.వి. జుట్టు ముడికలవాడు.

ముడి - 1.గ్రంథి 2.చెట్టు మొ.ని. ముడి, 3.దారము ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.
గ్రంథి - 1.బుడిపి, గడ్దవలె పుట్టు రోగము, 2.చెట్టు మొ.ని ముడి, 3.కీలు (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
బుడిపి - 1.మ్రాని యందలి ముడి, కనుపు, 2.బొప్పి.
కణుపు - 1.బుడిపి, 2.వెదురు, చెరకు మొ.ని కనుపు, 3.(వృక్ష.) కాండముపై ఆకు బయలుదేరిన స్థానము (Node).
గంటు - 1.కనుపు, బుడిపి, 2.గాయము, 3.వెండ్రుకలముడి, 4.రూకలముడి, క్రి.గాయపరచు.
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.
పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
గ్రంథికుఁడు - 1.జోస్యుడు, 2.సహదేవుడు.
కాలజ్ఞుఁడు - జ్యోస్యుడు; జ్యోతిషికుఁడు - జోస్యుడు, (Astrologer).  
దైవజ్ఞుఁడు - 1.జ్యోస్యుడు, 2.గణకుడు.  

అనిత్యాని శరీరాణి విభవో నైవశాశ్వతః|
నిత్యంసన్నిహితో మృత్యుః కర్తవ్యోధర్మసంగ్రహః||
తా.
శరీర మనిత్యము, సంపద శాశ్వతము కాదు, మృత్యువెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగినదని సహదేవుడు వచించెను. - నీతిశాస్త్రము 

గ్రంథులసిరలు - (జం.) హెచ్చు తగ్గులుగా ఉబ్బిన సిరలు (ఎక్కువ కాలము నిలిచి పనిచేసినచో సిరలు పైకుబికి ఉండును (Vericose veins). 

అస్రము - 1.కన్నీరు, 2.నెత్తురు, 3.మూల, 4.వెండ్రుక.
అశ్రము -
1.కన్నీరు, అశ్రువు, 2.నెత్తురు, రూ.అస్రము.
అశ్రువు - కన్నీరు, బాష్పము.
కన్నీరు - హర్ష శోకముల వలన కన్నుల నుండి కారెడు నీరు.
బాష్పము - 1.కన్నీరు 2.ఆవిరి, వి.(భౌతి.) ఘన, ద్రవ ద్రవ్యముల ఆవిరి, సంధిగ్ధ తాపక్రమము క్రిందనుండి ప్రేషము వలన ద్రవీభవించుటకు వీలుగా నున్న వాయువు (Vapour). 

అశ్రు నేత్రామ్బురోదనం చాస్ర మస్రుచ. -
అశ్నుతే కపోలం అశ్రు. ఉ. న. అశూ వ్యాప్తౌ - కపోలముల యందు వ్యాపించునది.
నేత్రయో రంబు నేత్రాంబు - కన్నీరు.
రుద్యతే అ నేన రోదనం. రుదిర్ అశ్రువిమోచనే. - దీనిచే దుఃఖింతురు.
అస్యతే అస్రం. అస్రుచ. ఉ.న. అసు క్షేపణే. - చేత మీటఁబడునది.
పా. అశ్రం. ప్రావర్తయన్నదీర స్రైర్ద్విషతాం యోషితాం చ సః' అని మాఘమందు రుధిర వాచకముతోఁ గూడ శ్లేషగా జెప్పుట వలన సకారయుక్తము.
'శమశ్శీలే అ జగరే చాశ్రమశ్రుణి ' అనిశాంతమున రుద్రుఁడు - ఈ ఐదు 5 కన్నీరు పేర్లు.       

అశ్రుగ్రంధి - (జం.) కన్నీటి గ్రంధి (ఈ గ్రంధులు ముక్కుకు ఇదుప్రక్కల, కండ్లకు చేరువుగా ఉండును.)
ఉపాశ్రుగ్రంధి -
(జం.) కన్నీరు ఉత్పత్తి చేయుగ్రంథులకు సహాయకారిగా నుండు గ్రంధి. (ఇది నేత్ర శుక్లమును తడిగా నుంచుచుండును,) (Harderian gland).   
నేత్ర రసము - (జం.) నేత్రరస వేశ్మములో నుండు నీటివంటి ద్రవము, కన్నీరు (Aqueous humour).
ఆక్వియస్ హ్యూమర్ - (Aqueous humour) కంటిగ్రుడ్డులో ముందు భాగమున గల స్వచ్ఛమైన ద్రవము, జలాకార రసము.  జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic). 

రుదితము - రోదనము.
రోదనము -
1.శోకము, ఏడ్చు, 2.కన్నీరు.
శోకము - దుఃఖముచే తపించుట, వగపు.
ఏడుపు - రోదనము, రూ.ఏడ్పు.
ఏడుచు(ౘ) - దుఃఖించు, రోదనము చేయు, రూ.ఏడ్చు.
ఏడ్చు - ఏడుచు; ఏడ్పు - ఏడుచు.
వాపోవు - అరచు, ఏడ్చు.
వాపోక - ఏడ్చుట, అరచుట. 
క్రోశము - 1.ఏడ్పు, 2.పిలుపు(ఆహ్వానము – పిలుపు), 3.కూత వినిపించు నంతదూరము, కోసు.
ఆకారణ - పిలుపు, ఆహ్వానము, రూ.ఆకారణము.
కోసు1 - రెండు వేల విండ్ల పట్టుకొలది, సం.క్రోశః. 
కోసు2 - దీర్ఘము(దీర్ఘము - నిడుద), పొడుగైనది. 

తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 2.శోకము, రూ.తమస్సు.
తమస్సు -
తమము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి. 
చీఁకటిగొంగ(గొంగ - శత్రువు) - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
అంధకరిపుఁడు(రిపువు - శత్రువు) - శివుడు.  

ఇరులు - (ని. బహు.) చీకటి.
ఇరులుగొంగ - సూర్యుడు, వ్యు.చీకటులకు శత్రువు.

కన్ను(ఎఱగన్ను - శివుని అగ్నినేత్రము) ఎర్రనైనా మిన్ను(ఆకాశము) యెర్రనైనా నీరే (కన్నీరు, వర్షం). చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలురావు. - కన్నీరు.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

తమ అందమైన పలువరుసను ప్రదర్శించడానికి కొందరు నవ్వితే, తమ సహృదయాన్ని ప్రకటించడానికి కొందరు రోదిస్తారు. - జోసఫ్ రాక్స్

రుదిరము - 1.నెత్తురు, 2.సిందూరము.
నెత్తురు -
రక్తము, రూ.నెత్రు. రక్తము నీటికన్న చిక్కగా నుండునది. సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.

చికురము - 1.వెండ్రుక, 2.కొండ, 3.ఒక జాతిపక్షి, 4.పాము, 5.ముంగిస, విణ.కదలునది.
వెండ్రుక -
కేశము, రూ.వెంట్రుక.
కేశము - 1.తలవెండ్రుక, 2.కురువేరు.
కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
కురుళము - ముంగురులు.

కచము - జుట్టు, కేశము.
కంచబంధము -
జుట్టుముడి.

కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, త. మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
కొండ(ౘ)చూలి - పార్వతి. (చూలు - 1.గర్భము, 2.బిడ్డ.)
కొండమల్లయ్య - శివుడు; కొండయల్లుడు - శివుడు.
కొండఱేఁడు- హిమవంతుడు. గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
కొండపగతుఁడు - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు. 

శైలము - కొండ, వ్యు.శిలలు దీనియందు గలవు. సం.వి. (భూగ.) నేల యందుండు(ఉప) అధాతువులలో నిది యొకటి.
కొండ - మల, పర్వతము.కొండ తలక్రింద నుంచుకొని రాళ్ళకై వెదకినట్లు. 
శైలాలి - నట్టువుడు, నటుడు. ఏడ్వక ఏడ్చును - నవ్వక నవ్వును.   వైదేహి - 1.సీత, చిత్రకూటము నందు దేవీస్థానం సీత 2.నర్తకురాలు.
శైలూషి - ఆటకత్తె, నటి.

శైలూషవన్నట ఇవ నానారూప పరివర్తనాత్ శైలూషః - శైలూషుఁ డనగా నటుఁడు; వానివలె నానారూపముల ధరించునది.

శిఖరి - 1.కొండ, 2.చెట్టు. కొండల పక్కన లోయలుంటేనే అందం.
శిఖరము -
1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
కోన1 - 1.అడవి, సం. కాననమ్ 2.కొండల యందలి మరిగిచోటు లోయ 3.దేశభేదము, 4.కొన, మూల సం.కోణః.
కోన2 - గోసమూహము.
గవ్యా గోత్రా గవామ్ : గవాం సమూహః గవ్యా, గోత్రాచ - ఆవుల యొక్క సమూహము గవ్య, గోత్రమును.

ప్రాకృతిక గోత్రము - (వృక్ష.) ముఖ్యమగు కొన్ని సమానలక్షణములు గల కొన్ని కుటుంబముల సమూహము, స్వాభావిక గోత్రము.
గోత్రము - 1.వంశము, 2.పేరు, 3.కొండ.
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 2.భూమిని రక్షించువాడు.

ప్రాంతరము - 1.అడవి, 2.తొఱ్ఱ, 3.ఎడారిత్రోవ, 4.పొలిమేర.
అడవి - అరణ్యము, సం.అటవీ.
అరణ్యము –
అడవి; అడవికాపు - వానప్రస్థుడు.
గహనము - అడవి, విణ.1.ఎరుగరానిది, 2.చొరరానిది.
గహ్వరము - 1.కొండగుహ, 2.అడవి, 3.గాంభీర్యము, విణ.1.గాంభీర్యముకలది-లోతైనది, 2.చొరరానిది.

నఱవ - అరవ, సాధువుకాని యావు.
అరవ -
తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
త్రోవ - మార్గము.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
అన్వేషణ - వెదకుట; అన్వేష్ట్ణ - వెదకువాడు.
తెరవు - దారి, రూ.తెర్వు.
దారి - 1.ద్వారము, 2.మార్గము, 3.గతి, సం.ద్వారమ్.
ద్వారము - 1.వాకిలి, 2.ఉపాయము.
గతి - 1.పోక, 2.విధము, 3.త్రోవ, 4.స్థానము, 5.ప్రమాణము, 6.ఆధారము, 7.ఉపాయము, (భౌతి.) చలనము (Motion).
గతిశక్తి - (భౌతి.) వస్తు చలనము నకు తోడ్పడు శక్తి (Kinetic energy).
గతిశాస్త్రము - (భౌతి.) వస్తువుల చలనమును గురించి చర్చించు భౌతికశాస్త్ర భాగము (Dynamics), వస్తువుల చలన రూపములకు చెందిన నియమముల చర్చించు శాస్త్రము (Kinetics). 

సధార్మికే వసేద్గ్రామే నవ్యాధి బహుళే భృశం|
నైకః ప్రపద్యే తాధ్వానం నచికం పర్వతేవసేత్||
తా.
ధార్మికులులేని యూరియందును, మిగుల వ్యాధిగల ఊరి(గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.)షడ్జాది స్వరము.) యందును నుండరాదు, ఒంటరిగా త్రోవ నడువరాదు, కొండల యందుఁ చిరకాలంబు నివసింపరాదు. – నీతిశాస్త్రము 

చక్రధరము - పాము.
పాము -
1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - అశ్లేష.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః. 

చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి -
పాము, చక్షుశ్రవము. 
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.  
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
లేలిహాసము - సర్పము, వ్యు.మాటిమాటికి నాలుక చాచునది.

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

కాకోదరము - 1.పాము, 2.గుడ్లగూబ.
గుడ్లగూబ -
పెద్దగుడ్లుగల పక్షి, దివాంధము.
దివాంధము - గుడ్లగూబ; దివాభీతము - గుడ్లగూబ.  

కౌశికము - 1.గుడ్లగూబ, 2.ముంగిస.
గూబ1 - చెవిగూబ, కర్ణమూలము.
గూబ2 - గుడ్లగూబ, సం.ఘూకః.
పేచకము - 1.గుడ్లగూబ, 2.ఏనుగు తోకమొదలు. ఘూకము - గుడ్లగూబ.
ఘోరదర్శనము - 1.పులి, 2.గూబ.

గూండ్ర - 1.గుడ్లగూబకూత, 2.కడుపులో కలుగు వికారము.

కుంజరము - 1.ఏనుగు, వ్యు.కుంజము కలది, 2.వెండ్రుక, కేశము.
కుంజరుఁడు - 1.సూర్యుడు, 2.బ్రహ్మ.

లక్ష్యము - 1.గురి, 2.లెక్క.
లచ్చనము - 1.లక్షణము, 2.గురుతు, 3.వ్యాకరణశాస్త్రము.
లక్కనము - లక్షణము, గురుతు, సం.లక్షణమ్.
శరవ్యము - గురి, లక్ష్యము.

గుఱి - 1.లక్ష్యము, 2.గుర్తు, 3.నిదర్శనము, 4.నమ్మిక, నమ్మకము  4.సాక్షి, 6.నిర్ణయము, 7.యుక్తి, 8.పరిమితి, 9.కళంకము.

లక్ష్యం లక్షం శరవ్యం చ :
లక్ష్యత ఇతి లక్ష్యం. లక్ష్య. చ. లక్ష దర్శనాంక నయోః - చూఁబడునది గనుక లక్ష్యము, లక్ష్యమును.
శరైః వీయత ఇతి శరవ్యం. వ్యేఞ్ సంవరణే. - బాణములచేతఁ గప్పఁబడునది. ఈ మూడు గుఱి పేర్లు.

వేధ్యము - గురి, విణ.తొలగించదగినది.

లక్షణము1 - గురి, గురుతుశాస్త్రము.
లక్షణము2 - (రసా., భౌతి.) ఒక వస్తువునకు లేదా ద్రవ్యమునకు నియతముగా నుండి, ఆవస్తువును (ద్రవ్యమును) గుర్తించుటకు అవశ్యక మైన ధర్మము, (Characteristic).
లక్షణము3 - (గృహ.) 1.గుణము, 2.స్వభావము (Trait).

నిమిత్తము - 1.కారణము, 2.శకునము, 3.గురి.
కారణము -
1.హేతువు(హేతువు - కారణము), 2.పనిముట్టు.
శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి (పక్షములు గలది).

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||
తా.
ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము చూచుకొని పోవలయునని బృహస్పతి చెప్పెను. ఎపుడు బయలుదేరిన కార్యము సఫలమగునని నిస్సంశయముగా (నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా) మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్దనుండు(జనార్థనుఁడు - విష్ణువు) చెప్పెను. - నీతిశాస్త్రము

అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
గుఱుతు -
1.చిహ్నము, 2.మేర, 3.కీర్తి, 4.పరిమితి, 5.స్థానము, 6.విధము, 7.మచ్చ, 8.సాక్షి, రూ.గుర్తు.

లలామము - 1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొట్టు, 5.తోక, 6.గుఱ్ఱము (ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

మచ్చ - 1.గాయపుగుర్తు, 2.పుట్టుమచ్చ.
కళంకము -
మచ్చ.

సోఁకుఁజుక్క - మూలానక్షత్రము.
సోఁకు -
1.తగులు, 2.గ్రహమావేశించు, వి.1.స్పర్శము, 2.రాక్షసుడు.
తగులు - క్రి.1.చిక్కు, 2.పట్టు, 3.తాకు, 4.సక్తమగు, 5.అంటు, 9.పొసగు, 7.వెంబడించు, వి.1.ఆసక్తి, అభిలాష, 2.తగులాటము, రూ.తవులు, తౌలు.
చిక్కు - 1.కృశించు, 2.తక్కు, 3.తగులు, 4.దొరకు, 5.మిగులు, 6.మెలి, 7.సంకటము. 
పట్టు - 1.చెల్లు, 2.ప్రారంభించు, 3.కలుగు, 4.గ్రహించు, వి.1.గ్రహణము, 2.స్థానము, 3.అవలంబము.
తాఁకు - స్పృశించు, అంటు.
సక్తము - ఒకదాని యందు లగ్నమైనది (మనసు).
అంటు - (వృక్ష.) 1.చెట్టురెమ్మను వంచి నేలలో పాతుటవలన పుట్టిన మొక్క, 2.ఒక మొక్కను వేరొక చెట్టురెమ్మను అంట గట్టి పెంచబడిన మొక్క. ఉదా.మామిడి అంటు, నిమ్మ అంటు మొ||వి. 3.స్పర్శ 4.ముట్టు, మైల 5.మిత్రుడు, స్నేహము,  క్రి.1.తాకు, 2.(నూనె మొ||వి.)రాచు, 3.అతుకు.
పొసఁగు - 1.అంకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.
వెంబడించు - వెంటబడు.

అంటువ్యాధి - ఒకరి నుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిముల వలన లేక స్పర్శవలన) వ్యాపించు వ్యాధి (విషూచి, మశూచి మొ.) (Infectious disease). 

కిసరు - 1.కోపవికారము, 2.అంటు సోకుటచే పసిబిడ్డలకు గలుగు దోషము.

అంటుగట్టు - (వ్యవ.) క్రొత్తజాతి మొక్కలను సృష్టించుటకై ఒక జాతి రెమ్మను వేరొక జాతి మొక్క కాంటముతో అంటగట్టి పెంచుట, (Graft).

శ్రద్ధ - 1.అక్కర, 2.ఆసక్తి; హాళి - ఆసక్తి .
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
తగులాటము - 1.బంధము, తగులు 2.తొడుసు, సంబంధము.
ఆసంగము - 1.ఆసక్తి, 2.పట్టుదల, 3.సంబంధము, 4.ఆశ్రయము.

శ్రద్ధా సంప్రత్యయః స్పృహా : శ్రద్ధా శబ్దము భక్త్యాతిశయమునకును, ఇచ్ఛకును పేరు. శ్రద్ధధతే అనయేతి శ్రద్ధా, డుధాఞ్ ధారణ పోషణయోః, దీనిచేత విశ్వసింతురు.

శ్రద్ధ, భక్తి అనే ఇద్దరూ వైరాగ్య పత్నులు. మోక్షానికి మార్గాలు.         

అంటసిల్లు - అంటు, తాకు (అంటసిలబడు-నేలకూలబదు.).
అంటరానివేలుపు - అగ్ని.

తగులుడు - తగులు; సిలుగు - చిక్కు.
చిక్కుపడు - 1.మెలిపడు, 2.సంకటపడు, 3.చిక్కగు.
తగులఁబడు - క్రి.1.తగులు, 2.చిక్కు, 3.కాలు, దగ్ధమగు.
అంటుకొను - 1.అగ్ని రగులుకొను, 2.ముట్టుకొను.
దాపము - 1.దవము, కార్చిచ్చు, అడవిలో మ్రాకులు ఒకటితో నొకటి ఒరసికొనగా పుట్టి అడవిని దహించెడి అగ్ని, 2.అడవి 3.బాధ.
దవము - 1.కార్చిచ్చు, దవానలము, 2.అడవి, రూ.దావము.
అడవిలో వెదురు పొదలలో పెద్దగాలి కొట్టినపుడు ఒక వెదురు మరియొక్క వెదురుతో రాపిడి చేసుకొని నిప్పుపుట్టును. ఆ నిప్పుతో అరణ్యమంతా దగ్ధమగును. 

బలయుతుఁడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
బలముదొలంగెనేని, తనపాలిటశత్రు వదెట్లు, పూర్ణుడై
జ్వలనుడు కానగాల్చుతరి వాయువు సఖ్యము జూపుగానినా
బలయుడు సూక్మదీపమున నున్న పుడార్పునుగాదె! భాస్కరా.
తా.
అగ్ని గొప్పమంటలతో నొక అడవిని దహించుచున్నపుడా అగ్నికి వాయువు సహాయకారునివలె నుండును కాని, ఆ అగ్నే ఒక చిన్నదీపము రూపమున ప్రకాశించునప్పుడా వాయువు దానికి శత్రువై ఆ దీప మార్పును. అట్లే బలము గలిగి నప్పుడు తన బంధువులందరు స్నేహితులగుదురు. తన బలము తగ్గినప్పుడా చుట్టములే శత్రువు లగుదురు.

సోకుడు - 1.స్పర్శము, 2.గ్రహావేశము, 3.పిశాచము, 4.రాక్షసుడు.
స్పర్శము -
1.తాకుడు, 2.ఈవి, 3.వ్యాధి.
తాఁకుడు - తాకుట, సోకుడు, స్పర్శ.
స్పర్శనము - 1.తాకుడు, 2.ఈవి, 3.వాయువు.

తాఁకుడువేఁకి - వరుస జ్వరము, పోవుచు వచ్చుచుండు జ్వరము.

ఈవి -1.దానము, వితరణము 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి. వరము - కోరిక, వరించుట.
వరవర్ణిని - 1.భర్త యందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.

ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
మోమాటము -
1.దాక్షిణ్యము, కనికరము, 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.

దాతృత్వము ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞాతా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా.
ఈవి యిచ్చుట, విననింపుగా బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడులెఱిగి తెలివిగానుండుట, ఈ నాలుగు తనతోఁ గూడఁ పుట్టునవి యే కాని నేర్చుటచే గలుగవు. - నీతిశాస్త్రము

స్వస్తి(స్వస్తి - శుభము) - వాయుపత్ని. ఈమెను విడిచి చేసే దాన విధులు ఫలించవు.

వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలి1 -
1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒకవిధమైన పశువ్యాధి.
గాలి2 - 1.నింద, 2.శాపము.

పసి - 1.పశ్వాదుల మీదగాలి, 1.పువ్వుల మీదిగాలి, విణ.లేత. వై.వి. గోగణము గోవులు, సం. పశుః.
హిస్టీరియా - (గృహ.) (Hysteria) సూతికా(సూతిక - బాలెంతరాలు) వాయువుమనో వికారముచే అన్ని విధములైన నాడులు, అక్రమముగా పనిచేయుటచే కలుగు వికారపు చేష్టలు, (ఇవి సాధారణము గా బలహీనము చేతను ఆశాభంగము చేతను యువతులకు వచ్చు వ్యాధి.)

గంగవెఱ్ఱి - 1.విశేషమైన మైమరుపుచే ఏమియు తోపకయుండు స్థితి, 2.పశువులకు వచ్చు ఒక విధమైన నరముల జబ్బు.

వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము. 
కోరవాయువు -
వాతరోగము.
వాతరోగము - (గృహ.) వాతము చేత నేర్పడు రోగము, (సాధారణముగ ఈ నొప్పులు శరీరము నందు కీళ్ళవద్ద, Joints వద్ద ఏర్పడును),(Rheumatism).
సంధివాతము - (గృహ.) సంధుల వాపులు, నొప్పులు దీర్ఘవ్యాప్తమగు కీళ్ళనొప్పులు, (Rheumatism).
ధనుర్వాతము - (గృహ.) ఇది అంటు వ్యాధి సంబంధమైన జబ్బు, 'టిటానస్ ' (Tetanus), అనెడి విషక్రిముల (poisonous insects) వలన ఈ వ్యాధి కలుగును. ఇది ప్రాణాపాయకరమైన వ్యాధి.

నిర్వాతము - చలింపనిగాలి, విణ.గాలిలేనిది (చోటు).   

వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
గంధర్వహస్తకము -
ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.

దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించు కన్య నిచ్చిచేయు వివాహము.
దేవుఁడు - భగవంతుడు.
భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము. విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
దేవత - వేలుపు;  వేలుపు - దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నిర్జరుఁడు - వేలుపు.
దైవికము - విణ. దైవము వలన కలిగినది.      

అదృష్టం వహ్నితోయాది :
న దృష్టం అదృష్టం దైవకృతత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహ్నితోయాది - అగ్ని జలాదులవలన బుట్టిన భయము.
అదిశబ్దము చేత వ్యాధి, దుర్భిక్ష, మూషిక, శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును. 

జియ్య - 1.దేవుడు, 2.రాజు, సం.ఆచార్యః.
జియ్యరు - వైష్ణవ సన్న్యాసి, సం.ఆచార్యః.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత -
1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.

విధి ర్విధానే దైవే పి : విధి శబ్దము చేయుటకును, అపిశబ్దము వలన బ్రహ్మదేవునికిని, ప్రకారమునకును, విధాయక వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః, పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్థే పజాపతా"వితి శేషః.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును.

కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు(చావు - మృతి).
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు.

శ్యామిక - చీకటి, నలుపు.
శ్యామలము -
నలుపు, విణ.నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.

కృతాంతాన్తానే హసోః కాలః : కాలశబ్దము యమునికిని, కాలమునకును పేరు. కలయతి ప్రాణిన ఇతి కాలః కల కిల క్షేపే. ప్రాణులను పోఁ ద్రొబ్బువాఁడు.  
కాలయతి మన ఇతి కాలః కల కిల క్షేపే. - మనస్సును ప్రేరేపించునది.

చేయుట - 1.ఒనర్చుట 2.నిర్వహించుట.
నిర్వహించు - నడిపించు, చేయు (Transact).
ఆచరణము - 1.చేయుట, అనుష్ఠానము, 2.ప్రవర్తనము, 3.ఆచారము.
ఆచారము - 1.అనుష్ఠానము, 2.సంప్రదాయము, పరంపరగా వచ్చు వాడుక, 3.ప్రవర్తనము.
ప్రవర్తన - నడవడి, నడత (Behavior).
నడవడి - ప్రవర్తనము, నడత, చరిత్రము, రూ.నడవడిక.
భాగ్యము - అదృష్టము, సుకృతము. విణ.భాగింపదగినది.

అదృష్టవంతుడు అరణ్యంలో ఉన్నా, ఘోర సంగ్రామంలో చిక్కుకున్నా, పురాకృత పుణ్య విశేష ఫలాన తన ప్రయత్నం లేకుండానే బయట పడతాడని భావావ్వయం.
అదృష్టవంతుని చెరచలేరు - దురదృష్టవంతుని బాగుపరచలేరు! అన్నది ఏవరూ కాదనలేని అనుభవసత్యం.

కాలము ప్రబలులకును బలి,
కాలాత్ముం డీశ్వరుం డగుణ్యుఁడు జనులం
గాలవశులుగాఁ జేయును,
గాలము గడవంగలేరు ఘను లెవ్వరున్.
భా||
కాలం లోకములోని మహా బలవంతుల కంటె బలమయినది. భగవంతుడే కాలస్వరూపుడు. అత డిట్టివాడని  నిరూపింప శక్యంకాదు. ఆ కాలస్వరూపుడైన భగవంతుడు అందరు జనులను కాలానికి అధీనులుగా చేస్తాడు, కనుక ఎంత దొడ్డ(దొడ్డ - గొప్ప)వారయినా కాలాన్ని దాటలేరు.

మోహిని - 1.మోహింపజేసెడు స్త్రీ, 2.దేవత(దేవత - వేలుపు), 3.పిశాచ స్త్రీ.

పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము.
అపదేవత -
పిశాచము; కాలియ - పిశాచము, సం.కాళికా.
కొఱివి తాల్పు - పిశాచము (కొఱవి దయ్యము). వ్యావృతి - కొరివి దయ్యము.
డాకిని - ఆడు దయ్యము; శాకిని - ఒక తెగ పిశాచ స్త్రీ.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
భూతాత్మము - దేహము.    

మాతృవ త్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్ఠవత్ |
ఆత్మవత్సర్వభూతాని యః వశ్యతి సవశ్యతిః ||
తా.
పరస్త్రీని తల్లివలెను, పరద్రవ్యమును మట్టిపెళ్ళవలెను, సకల భూతములను తనవలెను, నెవడు చూచునో, అతఁడు బ్రహ్మజ్ఞాని యగునని నకులుడు చెప్పెను. - నీతిశాత్రము  

యో డాకినీశాకిని కా సమాజే - నిషేవ్యమాణః పిశితాశనైశ్చ|
సదైవ భీమాది పద ప్రసిద్దం - తం శంకరం భక్తహితం నమామి.

గాము - 1.సుర్ర్యాది గ్రహము, 2.పిశాచము సం.గ్రహః.
అవేశము - 1.ప్రవేశము, 2.పిశాచాదుల సోకుట, 3.వేగిరపాటు, 4.చలము, 5.గర్వము, 6.కోపము, 7.(భౌతి.) ఒక వస్తువు పై ప్రోగైన విద్యుద్రాశి (Charge).

బేతాళము - పిశాచము, భూతావిష్టమృత శరీరము.
బేతాళుఁడు - యమకుంకరుడు.

ఆవేశము అన్ని విధముల అనర్థము. కోపము వల్ల అధికశక్తి ఖర్చువుతుంది. కనుక కోపాన్ని తొలగించుకొని శక్తిని యుక్తిగ వాడుకోవాలి. - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

కూష్మాండము - 1.గుమ్మడి, 2.ఒక విధమగు పిశాచము.
గుమ్మడి -
పెద్ద పెద్దకాయలు కాయు తీగ, సం. కూష్మాం(శ్మా)డః. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.

కూశ్మాణ్డకస్తు కర్కారుః -
కు ఈషత్ ఊష్మా అండేషు బీజేష్వస్యేతి కూశ్మాండకః - కుత్సితమైన ఉష్ణము బీజములయందుఁ గలది. పా. కూషాండః.
తృప్తిం కరోతీతి కర్కః, ఇయర్తీతి అరుః, కర్కశ్చాసౌ అరుశ్చ కర్కారుః. పు. - తృప్తిని జేయునదియును వ్యాపించునదియును గనుక కర్కారువు. ఈ రెండు గుమ్మడి పేర్లు.

గాలి2 - 1.నింద, 2.శాపము.
ఉపక్రోశము -
నింద; నింద - దూరు, అపదూరు.
దూఱు - నిందించు, వి.నింద.
నిందితుఁడు - దూరబడినవాడు; నింద్యుఁడు - దూరదగినవాడు.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
శాపము - 1.తిట్టు, 2.ఒట్టు. శపథము - ఒట్టు, రూ.శపథము.   శపించు - తిట్టు; తిట్టు - 1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
ఒట్టు - 1.కలుగు, 2.ఉంచు, 3.రగుల్చు అంటించు, వి.శపథము.

ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణమునకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశనము.
ఆక్రోశించు - 1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.

మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.

అధోముఖము - 1.దిగుముఖము గలది, ముఖము వంచినది 2.తలక్రిందైనది. వి.(జ్యొతి.) 1.మూలాది నక్షత్ర గణము, 2.ఒకానొక నరకము.

పుణ్యజనుఁడు - 1.నైరృతి, 2.రాక్షసుడు, 3.పుణ్యపురుషుడు.
సోఁకులఱేడు -
నైరృతి.
నిరృతి - (నిర్ + ఋతి)1.అలక్ష్మి, 2.ఒక దిక్పాలుడు, విణ. ఉపద్రవము లేనిది.  
విరుద్ధలక్షణయా పుణ్యవాన్ జనః - విపరీత లక్షణముచేత పుణ్యము గలవాఁడు.

స్యా దలక్ష్మీ స్తు నిరృతిః :
లక్ష్మీర్న భవతీత్య లక్ష్మిః. ఈ. సీ. - సంపత్తుగానిది అలక్ష్మి.
ఋతేస్య స్మార్థా న్నిష్క్రాంతా నిరృతిః - సన్మార్గము వలనఁ బాసినది. ఈ రెండు నరకసంబంధమైన యభాగ్యము పేర్లు.

నీలాంబరుఁడు - 1.బలరాముడు, 2.నైరృతి, 3.శని(కోణుఁడు - శని).
నీలాంబరః నీల మంబరం వాసో యస్యసః - నల్లని వలువ గలవాఁడు.

నిరృతి నిరృతే ర్దిక్పాలస్య అపత్యం నైరృతిః - నిరృతి యనెడి దిక్పాలుని కొడుకు.

అసూరుడు - నిరృతి, రాక్షసుడు.
నైరృతి -
నిరృతి.
నైరృతుఁడు - నాలవ దిక్కు నేలువాడు, నిరృతి.
కోణఁపుడు - నైరృతుడు; మూలఱేఁడు - నిరృతి, కోణపుడు.

మూలఱాయి - వజ్రమణి.
హీరము -
వజ్రమణి, రవ్వ.
లోహజిత్తు - వజ్రము; నిర్ఘాతము - 1.పిడుగు, 2.వజ్రము.
రవ - 1.తునక, 2.అణువు, 3.వజ్రము, 4.వేశము, సం.రవః, లవః.
వజ్జీతము - 1.వజ్రము, 2.మత్స్యము.

శుక్రశిష్యుఁడు - రాక్షసుడు. 
అసుర -
1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.
రాత్రి - సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.
అస్రపుఁడు - 1.రాక్షసుడు, వ్యు.నెత్తురు త్రాగువాడు, 2.నైరృతుడు.
నెత్తురు ద్రావుడు - రక్కసుడు; రాక్షసి - రక్కసి.
అస్రప - 1.జలగ, 2.పిశాచస్త్రీ, వ్యు.నెత్తురు త్రావునది.
జలగ - (జం.) జంతువుల రక్తాన్ని పీల్చుకొని నీళ్ళలో జీవించు పరాన్న జీవి, (Leech), రూ.జెలగ.

దనుజుఁడు - రాక్షసుడు, వ్యు.దనువు నందు జన్మించినవాడు. క్రవ్యాదుఁడు - 1.మాంసము తినువాడు, 2.రక్కసుడు రూ.క్రవ్యాత్తు.
క్రవ్యాత్తు - రాక్షసుడు, వ్యు.మాంసము తినువాడు.
సక్తంచరుఁడు - రాక్షసుడు, రేద్రిమ్మరి.

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుమణుఁడు, వ్యు.అసురలను హింస చేయువాడు.  ద్రుహిణ ముఖసదనే శారదా|

శుక్రుడు - 1.అసురగురువు వ్యు. తెల్లనివాడు, అగ్ని. వ్యు.తేజస్సు కలవాడు నవగ్రహములలో నొకటి(Venus).
సోకుఁబొజ్జ -
శుక్రుడు. వేగుఁచుక్క - శుక్రుడు.

పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుకృతము -
1.పుణ్యము 2.శుభము.
సుకృతి - 1.పుణ్యుడు 2.శుభుడు.
సుక్కురుఁడు - వై.వి. శుక్రుడు, సం.శుక్రః.

వనే రణే శత్రు జలాగ్ని మధ్యే - మహార్ణవే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్త విషమ స్థితంవా రక్షంతి పుణ్యాని పురాకృతాని.

పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినములఁ గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ.
తా.
మన పూర్వజన్మ సుకృతంవల్ల పలువిధములైన సంపదలు మనకు నట్టడవులలో ఉన్నను లభించును, గత జన్మలోని దుష్కర్మల వలన, బంగారుకొండ ఎక్కినను ఫలముండదుగదా !

నైఋతి వర్షవాయువు - (వ్యావ.) జూన్ June నుండి సెప్టెంబరు September వరకు నైఋతి మూలనుండి వీచు వాయువు (South-west monsoon). 

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  
కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము, చంద్రుడు Moon.  

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు -
విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
మోక్షము - 1.కైవల్యము, 2.మోచనము, విడుపు, 3.ముక్తి.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

జీవో వినయితాసాక్షీ ముకుందో(అ)మిత విక్రమః
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. – 55శ్లో

శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.

20. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ - రెండు రెండు నక్షత్రములుండును.

తొలునీటి రిక్క - పూర్వాషాడ (పూర్వ - తూర్పు).
నీటిరిక్క - పూర్వాషాడ.

రిక్క - నక్షత్రము సం. ఋక్షమ్.
రిక్కదారి - ఆకాశము.

యా దివ్యా ఆపః పయసా సంబభూవుః | యా అంతరిక్ష ఉత పార్థివీర్యాః | యాసా-మషాఢా అనుయంతి కామమ్ | తా న ఆపః శగ్గ్ స్యోనా భవంతు | యాశ్చ కూప్యా యాశ్చ నాద్యాస్సముద్రియాః | యాశ్చ వైశంతీరుత ప్రాసచీర్యాః | యాసామషాఢా మధు భక్షయంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భవంతు ||19||   

ఆపగ - నది, ఏరు, వ్యు.జలముతో పోవునది.
ఆపగేయుఁడు -
గంగాపుత్త్రుడు, భీష్ముడు.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
భీష్ముఁడు - 1.శంత పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
కొమరసామి -
స్కందుడు; స్కందుఁడు - కుమారస్వామి.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి. 

పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది. 
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.  

పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెãచుగావున
బాలినుడగు వానిపొందు వలదుర సుమతీ.
తా. తెలివిహీనుల స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం.

భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి -
1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తుఁడు - భక్తి గలవాడు.

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.   

పోసనము - 1.క్షీరము, 2.పైపూత, 3.కాంతి.
క్షీరదము -
(జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు. 

క్షీరాన్నము - పరమాన్నము.
పారలౌకికము -
పాయసము, పరమాన్నము, విణ.పరలోక సంబంధమైనది.
పాయసము - పరమాన్నము, వ్యు.పయస్సుతో వండినది; పాసెము, సం.వి. (రసా.) (Emulsion) ఒక ద్రవమును ఇంకొక దానితో కొల్లోయిడ్ స్థితిని పొందునట్లు చేయబడిన అవలంబితము  (Suspension). 

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు - చంద్రుడు, అమృత కిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు.
అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.  

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్ 
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా. 
తా.
పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలను త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, పిల్లి అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)గలవాడు, తగవు యొక్క న్యాయ న్యాయములను విమర్శించి నిర్ణయించును, తెలివి లేనివా డట్లుచేయలేదు.   

పాయసాన్నప్రియా తక్ స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమాహాశక్తి - సంవృతా డాకినీశ్వరీ. - 99శ్లో

ఆషాడము - 1.ఆషాడ నక్షత్రముతో గూడిన పున్నమ గలమాసము, చైత్రము మొదలు నాల్గవ నెల, 2.బ్రహ్మచారి ధరించు మోదుగు కోల. చాతుర్మాస్యము - అషాఢ శుద్ధము మొదలు కార్తిక శుద్ధము వరకు అనగా నాలుగు మాసములు చేయు ఒక వ్రతము.

పాలశోదణ్డ ఆషాఢో వ్రతే : ఆషాఢాసు జాతః ఆషాఢః - పూర్వాషాఢాది నక్షత్రముల యందగునట్టిది.  
పాలాశః దణ్డః - బ్రహ్మచర్యాది వ్రతమందుఁ బుట్టు మోదుగు కోల.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
మోదుగు - కింశుక వృక్షము, రూ.మోదువు.
కింశుకము - పలాసము, మోదుగు చెట్టు.

ఆతురే నియమో నాస్తి బాలేవృద్ధే తధైవచ |
సదాచార రతౌచైవ హ్యేషధర్మ స్సనాతనః||
తా.
అత్యాశ(లాలూచి - 1.అత్యాశ, 2.నైచ్యము.) గలవానికి, బాలునికి, వృద్ధునికి, సదాచార రతునికి వీరలకు వ్రతంబు పనిలేదు. - నీతిశాస్త్రము

ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువో థ హరిణో హరః,
వపు రావర్తమానేభో వసుశ్రేష్ఠో మహాపథః|

ఆషాఢంబున వరుణం డను నాహ్వయంబు నొంది వశిష్ఠుండు రంభ సహజన్యుండు హూహువు శుక్రుండు చిత్రస్వనుండును సహచర సహితుం డై కాలక్షేపనంబు సేయుచుండు|
ఆషాఢమాసంలో సూర్యుడు వరుణుడు అనేపేరు పొందుతాడు. వశిష్ఠుడు, రంభ, సహజన్యుడు, హూహువు, శుక్రుడు Venus, చిత్రస్వనుడు అనే వారు తనకు పరివారం కాగా కాలం గడుపుతుంటాడు. 

ప్రచేతా వరుణః పాశీ యాదసాంపతి రప్పతిః :
ప్రకృష్టు చేతః యస్య సః ప్రచేతాః. స-పు. - మంచి మనస్సు గలవాఁడు.
వృణోతి వరా నముం లోక ఇతి వరుణః. వృజ్ వరణే. - జనము ఇతనిని వరము లడుగుచున్నది.
వృణోతి అరీ న్ పాశైరితి వా వరుణః - పాశముల(పాశము - త్రాడు)చేత శత్రువులఁ గట్టువాడు. పాశము బంధ హేతువు(కారణము).
పాశో స్యాస్తీతి పాశీ. న. పు. - పాశము ఆయుధము గాఁ గలవాఁడు. 
యాదసాం జలజంతూనాం పతిః - యాదసాం పతిః. ఇ. పు. - యాదస్సు లనఁగా జలజంతువులు వానికి పతి, అలుక్సమాసము.
అపాం పతిః అప్పతిః. ఇ. పు. అప్పులనఁగా(అప్పు - ఋణము, సం.వి.జలము.)జలము, దానికి పతి. ఈ ఐదు 5 వరుణిని పేర్లు. 

ప్రచేతసుఁడు - వాల్మీకిముని తండ్రి, విణ.గొప్పమనస్సు గలవాడు.

వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.
నీరు -
1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమః.
నీరము - జలము.
నీటిఱేఁడు - 1.వరుణుఁడు, 2.సముద్రుడు. 
వరుణుఁడు - 1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.

పాశ్చాత్యుఁడు - 1.పడమటివాడు, 2.వరుణుడు.
పాశి -
1.వరుణుడు, 2.యముడు.
నాగపాశము - వరుణుని ఆయుధము.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - న వ గ్ర హ ము ల లో ఏడవ గ్రహము (Saturn)

యాదస్సు - 1.క్రూరజంతువు, 2.నీటిదయ్యము, 3.నది, 4.నీరు.
యాదోనాథుఁడు -
సముద్రుడు.

అప్పతి - వరుణుఁడు, వ్యు.నీటికి అధిపతి. 
అపాంపతి -
సముద్రుడు.
పారావారము - 1.ఈవలావలిదరులు, 2.సముద్రము.
పారము - 1.అవతలిదరి, 2.సమీపము.

జంబుకుఁడు - 1.వరుణుడు, 2.నీచుడు.
వరుణుఁడు -
1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
నీచుఁడు - అధముడు, రూ.నీచు. అల్పుఁడు - నీచుడు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు. కొంచెకాడు - అల్పుడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.
ఉద్దముఁడు - 1.స్వతంత్రుడు, 2.భయంకరుడు, 3.అధికుడు, వి. వరుణుడు.
స్వతంత్రుఁడు - ఒకరిపై ఆధారపడకుండ నుండువాడు, తన్నుతాను పోషించు కొనువాడు.
అధికుఁడు - గొప్పవాడు.

వినిఘ్నతి త్వయథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ |
భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే ||
తా.
వరుణుడు వేదములయందు జంబుక నామధేయుడుగా ప్రసిద్ధుడు. కనుక నీవు జంబుకము(నక్క)ల రూపమున ఉన్న రాక్షసులను సంహరించుచుండుట చూచి 'జంబుక 'అను పేరు కల వరుణునకు కూడ భయము కలిగినది. ఆ భయముచేతనే తనయొక్క జంబుక నామ ధేయమును అతడు వేదములయందు మాత్రమే ప్రసిద్ధము చేసికొనెను, అని నేనందుకొందును. - నారాయణీయము  

కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణా|

కడలిఱేఁడు - వరుణుడు.
కడలి -
సముద్రము.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలిమీఁగడ ముద్ద - చందమామ.
కడలివెన్న - 1.చంద్రుడు Moon, 2.అమృతము.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము. 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.

సుధ - 1.అమృతము 2.పాలు 3.సున్నము 4.ఇటుక.

అమృతకరుఁడు - చంద్రుడు.
సుధాంశువు -
చంద్రుడు, అమృతకిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు. 

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3, భూమి, 4.వరుణుని భార్య.

భూ - భూమి. భూమి - నేల, చోటు, పృథివి (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల. భూమికి - కుః, క్షితిః, భూమిః, అవనిః.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.

21. ఉత్తరాషాడ - ఇరువది యొకటవ నక్షత్రము.

ఏౘకంకటి చుక్క - ఉత్తరాషాడా నక్షత్రము.
ఏౘ -
1.గ్రామ్యము, 2.వంకర, రూ.ఏవ.
కంకటి - మంచము రూ.కంగటి సం.ఖట్టికా, ఖట్వా.
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః. 
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). 

ఏౘ - 1.గ్రామ్యము, 2.వంకర, రూ.ఏవ.
ఏస -
విజృంభణము విణ.1.గ్రామ్యము 2.వక్రము రూ.ఏచ. 
గ్రామ్యము - 1.అశ్లీలము 2.అసభ్యమగు మాట 3.పామరజన వాక్యము విణ.1.ఊరియందు పుట్టినది, 2.తెలివిలేనిది, 3.నాగరికత లేనిది.  
అశ్లీలము - 1.(అలం.) ఒక అర్థ దోషము, 2.ఒక శబ్దదోషము, 3.అసభ్య వచనము, ఏవగింపు(ఏవగింపు - రోత)పుట్టించుమాట, బూతు. 
ఏవ - రోత, విణ.రోతయైనది, రూ.ఏవము.
ఏవము - ఏవ. ఏహ్యము - ఏవము, విణ.రోత పుట్టించునది, సం.హేయమ్.
హేయము - 1.రోతయైనది, 2.విడువదగినది.
ఏవగించు - క్రి.1.రోతపడు, 2.నిందించు, 3.విడుచు.
బూతు - 1.కుత్సితపు తిట్టు, 2.బట్టువాడు.

గ్రామ్యము - గ్రామ్య మశ్లీలమ్:
గ్రామే భవం గ్రామ్యం - గ్రామమందుఁ బుట్టినది.
శ్రీఃచారుతా సా నాస్త్త్యస్మిన్నిత్య శ్లీల - శ్రీ యనఁగా నొప్పిదము; అది లేనిది గనుక అశ్లీలము. 

అసభ్యము - 1.సభకు తగనిది, 2.అశ్లీలము.
అసభ్యపరవర్తన -
(శాస.) పార్లమెంటు సభామర్యాదకు విరుద్ధముగా ప్రవర్తించుట.

కావ్యదోషములు - (అలం.) పదదోషములు 17 :- అప్రయుక్తము, అపుష్టార్థము, అసమర్థము, నిరర్థకము, నేయార్థము, చ్యుత సంస్కారము, సంధిగ్థము, అప్రయోజనము, క్లిష్టము, గూఢార్థకము, గ్రామ్యము మొ.వి.

విజృంభణము - ఎగిసిపాటు, ఉద్రేకము చెలరేగుట.
ఎగిసిపాటు -
1.గర్వము, 2.మిడిసిపాటు.
మిడిసిపాటు - మిట్టిపాటు.
మిడి - మిట్టిపాటు, గర్వము, విణ.1.మిడిసిపాటు గలది, 2.ఉన్నతము.
మిడినాగు - ఎగిరి ఎగిరిపడు పాము, రూ.మిడినాగు.
ఉద్రేకము - 1.అతిశయము, 2.విజృంభణము.

వెగడు - తడబాటు, సం.వికటః
వెడఁగు - 1.వికారము 2.అవివేకము సం.వికటః.

అవివేకము - అజ్ఞానము, తెలివిలేమి, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమి, విణ.తెలివిలేనిది, మంచిచెడులను విభజించి తెలిసికొను సామర్థ్యము లేనిది.

వక్రము - వంకి, వంకర, విణ.క్రూరమైనది.
వంకి - బాకు, సం.వక్రీ.
బాఁకు - 1.బాణము, 2.కటారి.
కటారి - 1.కత్తి, బాకు, రూ.కటారు, సం.కఠారః.
వంకర - వక్రత్వము.
వక్తము - (గణి.) వంకరగా ఉన్నది (Curved).
వక్రతమములు - "ఐ, ఔ"లు. (ఎ, ఏ, ఒ, ఓ లు వక్రములు)
వక్రములు - ఎ, ఏ, ఒ, ఓ, లు (వంకరగా నుండునవి).
వక్రోక్తి - 1.ఒక అలంకారము, 2.అన్యార్థకల్పన మొనర్చుట, 3.వంకర మాట.  

వక్కరము - వక్రము, స.వక్రమ్.
వక్కురాలు - కుటిలస్త్రీ. (కుటిలము - వంకరైనది.) 

ప్రతీపం వక్రం ద్రుష్టుం శీలమస్యా ఇతి ప్రతీపదర్శినీ. సీ. - వక్రముగా నాలోచించునది.
వామత్వేన వక్రస్వభావత్వేవ రమ్యత్వేన వా వామా - వక్ర శీలమైనదిగాని రమ్యమైనది(ఒప్పిదమైనది) గాని వామ(వామ - ఉత్తమ స్త్రీ).

వామదేవుఁడు - శివుడు.
వాముః శ్రేష్ఠ స్ప చాసౌ దేవశ్చ వామదేవః - శ్రేషుడైన దేవుడు.
వామపార్శ్వే ధృతా దేవీయస్య సః - ఎడమ ప్రక్కను ధరింపఁబడిన భార్య గలవాఁడు.
వామయా దీవ్యతీతి వా - స్త్రీచే ప్రకాశించువాఁడు.
దివ్ క్రీడావిజీగీషా వ్యవహార - ద్యుతి స్తుతిమోద మద స్వప్న కాంతిగతిషు.
వక్రత్వాద్వామస్స చాసౌ దేవశ్చేతి వా - వక్రత్వము గల దేవుఁడు.    

వక్రుడు - శని, అంగారకుడు.

వంవ - 1.వంకర 2.వాగు సం.వక్రః.
వాఁగు -
1.సెలయేరు, 2.సేవ(శుశ్రూష, కొలువు), సం.వాహః వై.క్రి. ప్రేలు.
సెలయేఱు - నిర్ఘరము కొండయేరు.
నిర్ఘరము - సెలయేరు, రూ.ఝరము.
నిర్ఝరణి - నది.

గంగ పారు నెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్న తనము పేర్మి యీలాగురా, విశ్వ.
తా.
ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగ పారుచుండును. మురికి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. మంచి చెడ్ద వారితేడా ఆ విధముగనే ఉండును.

కంకటి - మంచము రూ.కంగటి సం.ఖట్టికా, ఖట్వా.
ఖట్టిక -
1.గద్దియ, సింహాసనము, 2.మంచము.
ఖట్వ - మంచము.
గద్దియ - 1.సింహాసనము, 2.పీఠము, 3.పువ్వులలోని దుద్దు, రూ.గద్దె, సం.ఖటికా, 4.బంగారునాణెము, వరహా, రూ.గద్దె, సం.గద్యాణమ్.
గద్దె - గద్దియ, సోదె.
గద్యాణము - గద్దియ.
సింహాసనము - సింహ ముఖమేర్పరచిన స్వర్ణ రత్నమయోన్నత పీఠము.
పీఠము - 1.ఇల్లు కట్టుటకు వేసిన పునాది స్థానము (Plinth), 2.పీట.

పలకము - చిన్నమంచము, కుక్కి, సం.పల్యంకః.
కుక్కి -
1.పల్లము, 2.త్రాళ్ళు సడలి పల్లముపడిన మంచము, విణ.లోతుగలది.  
పల్యంకము - 1.పాలకి, 2.మంచము, 3.యతులు లోనగువారి యానము.

పర్యంకము - మంచము.
పానుపు -
1.పడక, మంచము,  2.పరుపు.

సుధాసిన్ధో ర్మధ్యే - సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపో - పవనవతి చిన్తామణిగృహే |
శివాకారే మఞ్చే - పరమశివపర్యఙ్కనిలయామ్  
భజన్తి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ || - 8శ్లో
   
తా. ఓ జననీ! పాలకడలి(అమృతసముద్ర మధ్యమున) నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, చుట్టును కల్పవృక్షములు వరుసతో చుట్టబడిన దైన కదంబచెట్ల పూదోటలలో చెలువొందు చింతామణులతో నిర్మితమైన(చింతామణి)గృహంలో, శివరూపమగు మంచమందు పరమశివుని పడుక యందుండు(పర్యంకనిలయమైన), నిరతిశయానంద ప్రవాహస్వరూపిణివైన(జ్ఞానానంద ప్రవాహమైన)నిన్ను కొందరు ధన్యులు సేవిస్తున్నారు. (అందరికీ సామాన్యముగా నీ సేవ లభించదని భావం.) - సౌందర్యలహరి         

ఓం పంచ ప్రేతమంచాధి శాయిన్యై నమః : బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు - నాలుగు మంచంకొళ్ళును, సదాశివుడు ఫలక స్థానంలో విరాజిల్లునట్టి మంచంమీద శయనించు మహేశ్వరికి వందనాలు.  

ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః : బ్రహ్మ, విష్ణు, ఈశ, రుద్రులు మంచంకోళ్ళుగాను, సదాశివుడు ఫలకస్థానంతోనూ తేజరిల్లునట్టి ఆసనంపై విరాజిల్లు తల్లికి వందనాలు.

ధర్మార్థ కామ(కోరిక) మోక్షములనే నాలుగు కోళ్ళుగల కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య రూపమైన మంచము. ఎంచబోతే మంచమంతా కంతలే!

కంకటీకుఁడు - ముక్కంటి, శివుడు.
ఖట్వాంగపాణి -
ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతి యందు గలవాడు.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.

కొంచెపు నరు సంగతి చే
సంచితముగ గీడువచ్చునది యెట్లన్నన్
గొంచిత్తు నల్లి కుట్టిన
మంచమునకు పెట్లువచ్చు మహిలో సుమతీ|
తా.
నల్లి కఱచిన యెడల దాని నివాసమగు మంచమున దెబ్బలు తగలు నట్లుగా అల్పుని(సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.)చే స్నేహం కూడా(సంచితము - కూడబెట్టినది, ప్రోగుచేయ బడినది.)గ చెరుపు(కీడు-1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.)కలిగించును.  

వజ్రభిదువు - నల్లి.
మత్కుణము -
1.నల్లి 2.కొమ్ములు లేని యేనుగు.
మత్కుణుఁడు - గడ్డము మీసము లేనివాడు.
నల్లి - మత్కుణము. నల్లి రక్తము త్రాగునది, హింసించునది. నల్లులు పట్టితే మంచమునకు దెబ్బలు.   

తన్నో విశ్వే ఉప శృణ్వంతు దేవాః | తదషాఢా అభిసంయంతు యజ్ఞమ్ | తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః | కృషిర్వృష్టి - ర్యజమానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా యువతయస్తుపేశసః | కర్మకృత్ - స్సుకృతో విర్యావతీః | విశ్వాన్ దేవాన్, హవిషా వర్ధయంతీః | అషాఢాః కామ-ముపయాంతు యజ్ఞమ్ ||20||  

visnudurga

No comments:

Post a Comment