Saturday, May 12, 2012

వృశ్చికరాశి

విశాఖ 1, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదములు వృశ్చికం, తేలురాశి.

అష్టపాద వర్గము - సంధిపాద జంతు వర్గములోని ఒక తరగతి, (ఈ తరగతికి చెందిన జంతువులను ఎనిమిది కాళ్ళుండును) ఉదా - సాలీడు, తేలు మొ.వి.

సాలీఁడు - 1.సాలెవాడు, 2.సాలెపురుగు. ఏడు కాళ్ళ పురుగు-సాలీడు.
సాలెవాఁడు -
తంతువాయుడు, నేతరి.
తంతువాయుఁడు - సాలెవాడు.
నేఁతరి - నేతకాడు; నేఁతకాడు - నేయువాడు, తంతువాయుడు.
సాలె - శాలిక నేతనేసి జీవించు ఒక జాతి, సం.శాలికః.
సాలెపురుగు - ఒకజాతి పురుగు, సం.జాలపటః.
క్రిమి - 1.కీటకము, పురుగు, 2.లక్క, 3.సాలెపురుగు.
కృమి - 1.పురువు, 2.లక్క; అలక్తము - లక్క, లత్తుక.

లూతా స్త్రీ తన్తువాయోర్ణనాభ మర్కటకా మర్కటకా స్సమాః :
లూయతే లూతా, లూఞ్ చేదనే - ఛేదింపఁబడునది.
తంతూన్వయతి తంతువాయః, వేఞ్ తంతుసంతానే - నూలును నేయునది.
ఊర్ణ నాభావస్య ఊర్ణనాభః - ఊర్ణమనఁగా నూలు; అది నాభియందుఁ గలది.
తంతుమవలంబ్య మర్కటవ దారోహణా న్మర్కటః - నూలు పట్టుకొని మర్కటమువలె నెక్కునది. ఈ నాలుగు సాలెపురుగు పేర్లు. 

ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్ సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొరచెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా? కావు; నీపాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
తా||
ప్రాణికోటులకు మోక్షము గలుగుటకు నీ పాదములు సేవించు భక్తి యొక్కటియే కారణమగును గాని, చదువులెన్ని చదివినను జ్ఞానమును, మోక్షమును గలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికిని జ్ఞానము గలిగినదా? మోక్షము కలిగినదా? నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివినది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? ఎరుకవాడే(తిన్నడు) మంత్రజపము చేసినాడు? వీరందరును ముక్తినొందుటకు చదువులే కారణమైనవా? - ధూర్జటి మహాకవి(ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.)

లూత - 1.సాలెపురుగు, 2.రోగము(రోగము - వ్యాధి).
లూషిక - సాలెపురుగు.
తంతునాభము - సాలెపురుగు.
సాలెపురుగు - వై.వి. ఒక జాతి పురుగు, సం.జాలపటః.
దూషిక - 1.కంటి పుసి, 2.సాలెపురుగు.
నేత్రే దూషయతీతి దూషికా. ధుష వైకృత్యే - కన్నులను వికృతముగాఁ జేయునది.

కండ్ల కలక - ఒక రకపు నేత్రవ్యాధి, కనులు వాచి పుసులు కట్టు వ్యాధి (Sore eyes).

సాలెపురుగు : తన హృదయము నుండి ముఖము ద్వారా దారమును వ్యాపింప జేస్తుంది. ఆ దారములో తానే విహారాలు జేస్తుంది. తన నోటిలో వున్న ఉమ్మినుంచే దారాన్ని వెలికి తీసి గూడును నిర్మిస్తుంది, అవసరం లేనప్పుడు ఆదారాన్ని తానే మళ్ళీ మింగేస్తుంది.    

నేఁతపురుగు - సాలెపురుగు.
నేఁత -
నేయుట; పురుగు - క్రిమి, పురువు, సం.పులకః
వాయుదండము - 1.సాలెవాడు 2.నేత, సరికట్టెడు పలక.
మగ్గరి - సాలెవాడు; కువిందుడు - సాలెవాడు.
మగ్గము - సాలెవాడు నేసెడు యంత్రము.

దేండ్ర - నేతనేసి జీవించు ఒక జాతి, రూ.జేండ్ర.
జేండ్ర -
దేండ్ర; దేవాంగులు - జేండ్రవారు. 

పటకారుఁడు - సాలెవాడు, వ్యు.పటముల(వస్త్రముల) తయారు చేయువాడు.
పటము - 1.వస్త్రము, 2.చిత్తరువు వ్రాయు వస్త్రాదికము.

ఆసు1 - నేతపనిలో వడుగుతోడుటకు ఉపయోగించు చట్టము, సాలెవాని ఉపకరణము.
ఆసు2 - (Ace) పేకాటలో ఒకముక్క.
ఆసుపోయు - క్రి. పోగువాటించు, నూలు ఆసునతోడు.

శలకము - సాలెపురుగు.
శాలికుఁడు -
సాలెవాడు.
శాలీసుఁడు - దిట్టదనము లేనివాడు.

ఊర్ణనాభము - సాలెపురుగు, రూ.ఊర్ణనాభి.
ఊర్ణాయువు -
1.పొట్టేలు, 2.ఉన్నికంబళి, 3.సాలెపురుగు, విణ.ఉన్నికలది.
ఊర్ణము - 1.నూలు, 2.కనుబొమల నడుమ సుడి, వి.ఉన్ని.

ఊర్ణా మేషాదిలోమ్ని స్యాదావర్తే చాన్తరా భ్రువౌ : ఊర్ణాశబ్దము గొఱ్ఱె, కుందేలు, ఎలుక మొదలయినవాని రోమములకును, కనుబొమ్మల నడుమనుండు మహాపురుష లక్షణమైన సుడికిని పేరు. ఊర్ణోతీ త్యూర్ణా. ఊర్ణుఞ్ ఆచ్ఛాదనే. కప్పియుండునది.

కంబళ భోజన న్యాయము - గొంగళిలో భోజనము చేయుచు వెండ్రుక లేరు పద్దతి.
కంబళము - 1.జలము, 2.కంబడి, గొంగడి(రల్లకము - కంబళి), 3.కంబళిపురుగు, 4.ఏనుగుపై పరిచెడి రత్నకంబళము.

ఊర్ణనాభిరివాద్యాహం జాలేన స్వకృతేన వై |
దద్దోహ్ స్మి సుడృఢేనాత్ర కిం కర్తవ్యమితః పరమ్ ||

నూలు - 1.ప్రత్తి వడికిన పోగు, 2.తంతువు, నూలుపోగు.
తంతువు - నూలుపోగు. చంద్రుని కొక నూలు పోగు.
దారము - పేనిన త్రాడు, నూలు, పోగు (Yarn).
తాడు - దారము, రూ.త్రాడు.
త్రాడు - 1.పేనినదారము, 2.పాశము, 3.కిరణము, వెలుగు.
త్రాడుఁదాలుపు - వరుణుడు. చిత్తమందు అజ్ఞానమున్నచో త్రాడును అది పాముగ చెయును. 

ఈఁగపులి - సాలెపురుగు.
పులికోచ -
ఒక విషజాతి సాలెపురుగు.
చిరు సాలెపురుగులు - (వ్యవ.కీట.) కీళ్ళు కలిగి, ఎనిమిది 8 కాళ్ళతో నుండు నొక విధమైన సాలెపురుగులు, (ఇవి బెండ, ఆముదము, ప్రత్తి మొదలగు మొక్కలను పాడు చేయును.) (Mites).

కృపణము - కీటకము, విణ.కుటిలమైనది.
కీటకము -
పురుగు, రూ.కీటము.
కీటము - కీటకము.
కీటకములు - (జం.) ఆరు కాళ్ళుగల చిన్న ప్రాణులు (పురుగులు) (Insects).
కీటకశాస్త్రము - (జం.) పురుగుల జీవితమును గూర్చి తెలియజేయు శాస్త్రము (Entomology).

స్పర్శసూత్రములు - (జం.) కొన్ని కీటకముల తల ముందు భాగమున నుండు పొడవైన సూత్రములవంటి అవయవములు (Antennae) (వీనితోనవి స్పృశించి వస్తువులను తెలిసికొనగలవు).

ప్రశ్వాసరంధ్రము - (జం.) కీటకముల శరీరములలో నుండు శ్వాసనాళికలు బయటికి తెరచుకొను ఒక రంధ్రము. ఉభయ చర జంతువులలో మొప్పుల చీలిక లుండుగది బయటికి తెరచుకొను రంథ్రము (Spiracle).

గ్లోసా - (జం.) (Glossa) కీటకముల నోటి భాగములో నొకటి, జిహ్వ.
జిహ్వ - నాలుక, (Lingua) కీటకముల క్రింది పెదవి, (Labium)లో గల మూడు భాగములలో నొకటి. చిబుకము (Mentum) (Sub-mentum) అనునవి తక్కిన రెండు భాగములు.
నాలుక - నాలిక; నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వచాపల్యము - తినవలెననెడి కోరిక.

ఉష్ఠీషము1 - (జం.) అంతర్జిహ్వ, Galea, lacinia అను రెండును కీటకముల నోటి భాగములలో మొదటి ఉత్తర హనువునకు జెందిన భాగములు.
ఉష్ఠీషము2 - తలపాగ, కిరీటము, వ్యు.వేడిని తగలకుండ చేయునది.

అధోవ్భంతము - (జం.) కీటకముల హనువు (Maxilla)లో ఉండు మొదటి తునక.
ఉద్వృంతము - (జం.) కీటకముల హనువు (Stipes maxilla)లో అధోవృంతము తర్వాత నున్న తునక. 

ఉదోష్ఠము - (జం.) కీటకముల పై పెదవి (Labrum).
ఓష్ఠమృశములు - (జం.) కీటకముల నోటి భాగములలో ఒకవిధమైన భాగములు (Labial palps).

పృష్ఠఫలకము - (జం.) కీటకముల ఉరఃపంజరము యొక్క ప్రతిభాగము నకు గల బాహ్యకంకాళములో పృష్ఠభాగమున నుండు కైటిన్ పట్టము (Tergum).

పరిక్లోమములు - (జం.) కీటకములు ఉరఃపంజరమునకు గల బాహ్య కంకాళములో ప్రక్కలనున్న కైటిన్ పట్టములు ఉరః పంజరములో నుండు రెండు పొరలు గల అస్తరు ఒక పొర ఊరిరితిత్తులపైన, మరియొకపొర ఉరః కుహరము చుట్టును ఉండును (Pleura).  

అగ్రోరము - (జం.) కీటకముల రొమ్ము భాగములో తల తరువాత నున్న భాగము (Prothorax).
ఉరఃపంజరము - (జం.) (కీటకముల) శరీరము ఏర్పడిన మూడు భాగములలో మధ్యభాగము, పాలిచ్చు జంతువులలో రొమ్ముభాగము (Thorax).
ఉరోమధ్యము - (జం.) కీటకము యొక్క రొమ్మునకు గల మూడు భాగములలో మధ్యభాగము (Mesothorax).
ఉరఃపశ్చము - (జం.) (కీటకముల) రొమ్ముభాగములో క్రిందివైపున నున్న భాగము  (Meta-thorax).  

ఉరగము - 1.పాము, వ్యు.రొమ్ముతో ప్రాకునది, 2.ఆశ్లేష నక్షత్రము.

యకృత ఉణ్డుకములు - (జం.) కీటకముల అన్నవాహికలో అంతర్జఠరము తర్వాత భాగముపై నుండు వేళ్ళవంటి నిర్మాణములు (Hepatic caecae).

కక్షాంగము - (జం.) కీటకముల కాలి భాగములలోనిది మొదటిది (Coxa).
ఉదూరువు - (జం.) కీటకముల కాలి భాగములలో ఇది రెండవది (Trochanter).

తిన్ననివాఁడి గోళ్ళసతికి వృశ్చికరాశి..…

వృశ్చికము - 1.తేలు(పొట్టియ - తేలు.) 2.వృశ్చికరాశి.
తేలురాశి -
వృశ్చికము.
తేలు - 1.నీళ్ళలో మునగక పైకి వచ్చు, 2.నీటిలో క్రీడించు(ఆటలాడు చోట అలుక పూనరాదు.), 3.తేలగిల్లు, 4.పొడ చూపు, వి.వృశ్చికము.

ఉపప్లవము - 1.ఉత్పాతము, 2.ఉపద్రవము, 2.నీటిపై తేలుట.
ఉత్పాతము -
1.ఉల్కాపాతము మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
అజన్యము - ఉత్పాతము, విణ.జన్యము కానిది.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.

ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.
దుమగతికేతు -
ధూమకేతువు, అరిష్ట సూచకమగు తోకచుక్క.
తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో,) సూర్యునిచుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగుచున్న తోక గలిగిన ఒక గ్రహము, (Comet).

ఉల్కశ్మలోహము - (రసా.) ఆకాశమునుండి అప్పుడప్పుడు భూతలము పైబడు ఉల్కలలో నుండు ఇనుము (Meteoric iron).
ఉల్క - 1.కొఱివికట్టె, 2.కాగడా, 3.ఆకాశమునుండి పడు తేజపుంజము, 4.అగ్ని కణము (Meteor).
మిడుఁగు - అగ్నికణము; విస్ఫులింగము - అగ్నికణము.   

తేలగిల్లు - 1.పైకి తేలు, 2.పరవశమగు, రూ.తేలగిల్లు.
(ౘ)చొక్కు -
క్రి. పరవశమగు, వి.1.పారవశ్యము, చొక్కుపొడి, 2.మూర్ఛ, 3.మోహము, వై.విణ.శుష్కము, ఎండినది.
పారవశ్యము - 1.విస్మృతి(విస్మృతి - మరుపు), 2.పరవశత్వము.
పరవశము - 1.పరాధీనము, 2.ఒడలెరుగకుండుట.
పరతంత్రము - పరాధీనము, వ్యతి. స్వతంత్రము.
పారతంత్రము - పరాధీనత, వ్యతి.స్వాతంత్ర్యము.
అదంత్రము - 1.నడుమ భగ్నమైనది, సగములో చెడినది, 2.స్వాతంత్రము లేనిది, పరాధీనము.
మూర్ఛ - రోగాదులచేత స్మృతి తప్పుట, సొమ్మ.
సొమ్మ - మూర్ఛ, సం.శ్రమః.
మోహము - 1.అజ్ఞానము, 2.వలపు, 3.మూర్ఛ.  

వృశ్చిక కీటే చ వృశ్చికః : వృశ్చిక శబ్దము కణుఁదురు నందును, చకారము వలన తేలు నందును, తేలు మందు చెట్టునందును, వృశ్చికరాశి యందును వర్తించును. వ్రశ్చతీత వృశ్చికః. ఓవ్రశ్ఛూ ఛేదనే. పీడించునది. "వృశ్చిక స్త్వౌషధేరాశా" వితి శేషః.

వృశ్చికస్య విషంపుచ్ఛని మక్షికస్య విషఁశిర|
తక్షకస్య విషందంష్ట్రః, సర్వాంగం దుర్జనేవిషమ్||
తా.
తేలునకు తోక(పుచ్ఛము - తోక)యందును, ఈఁగకు శిరస్సు నందును, పామునకు కోఱలయందును, దుర్జను(దుర్జనుఁడు – దుష్టుడు)నకు సర్వాంగములందును విషముండును. - నీతిశాస్త్రము

ద్రుతము -1.త్వరితము, 2.కరగనిది, 3.జారినది(భ్రష్టము - జారినది.), సం.వి.1.వ్యాకరణము నందు న కారము, 2.తేలు, 3.చెట్టు.
ఆకు తేలు -
ఆకుల మీద తేలువలె ఉండు పచ్చని పురుగు.
త్వరితము - శీఘ్రము, వడిగలది.
శీఘ్రము - వడి, విణ.వడిగలది.
వేగ - వడి, విణ.త్వరితము.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి.పద్యయతి, సం.వళిః.
వేగము - జవము, త్వర, (గణి., భౌతి.) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
జవము - వేగము. వేగిరము - వేగము, విన. త్వరితము.
త్వర - వేగిరపాటు; వేగిరపాటు - వేగపాటు.
వళి - కడుపు మీద ముడుత.   

కుజము - చెట్టు, వ్యు.భూమినుండి పుట్టినది.
పాదపము -
చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము - గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద(పొద - చిన్న చెట్ల గుంపు), 4.బోదెలేనిచెట్టు, 5.పురాభి ముఖ రాజమార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలి ఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి. (జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen). 
వృక్షము - చెట్టు, సం. (వృక్ష.) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క, (Tree). ద్రుమము- వృక్షము.

పుట్ట - 1.వల్మీకము, 2.చిన్నపొద, 3.స్థానము, ఉదా. "రోగముల పుట్ట ".
వల్మీకము - పుట్ట; పాములబిడారము - (వ్యవ.) పుట్ట.

మండ్రగబ్బ- A large black scorpion, పుట్టతేలు, నల్లని పెద్దతేలు.
షడ్భిందువు - మండ్రగబ్బ.

వృశ్చిక శ్శూక కీట స్స్యాత్ :
వ్రశ్చతి శూకాగ్రేణ వృశ్చికః - మొనచేత కుట్టునది.
శూకయుక్తః కీటః శూకకీటః - ముల్లుగల పురుగు. ఈ రెండు నల్లతేలు పేర్లు, కణుఁదురని కొందరు.

శూకము - 1.తేలుకొండి, 2.వరిముల్లు, 3.కనికరము, సం.వి. కొన్ని రకముల ధాన్యగొంజల చివర నుండు ముల్లు వంటి అంగము (Awn). అనుక్రోశము - కనికరము; కనికరము - 1.దయ, 2.శోకము.

శూకో స్త్రీ శ్లక్ష్ణ తీక్ష్ణాగ్రే -
శ్యతి స్వాపగమేన ధాన్యం తనూకరోతీతి శూకః. ప్న. శోతనూకరణే. - తాఁబోయిన వెనుక ధాన్యమును సూక్ష్మముగాఁ జేయునది.
ఈ ఒకటి 1 సన్నముక్క గల ధాన్యము పేరు. సూక్ష్మమై వాఁడియునైన వరిముల్లు, తేలుముల్లు మొదలైవది.

అలము1 - 1.తేలుకొండి, తేలుకొండి ముల్లు 2.అరిదళము.
ఆలము2 -1.తేలుకొండి, 2.అరిదళము, విణ.1.చాలినది, 2.అధికము, 3.శ్రేష్ఠమైనది.  
అరిదళము - పసుపు రంగుగల ఒక ఖనిజము, సం.హరితాళః.
హరితాళము - పసుపు రంగుగల ఒక ఖనిజము, వి.హరిదళము.
హరిదళము - హరితాళము, రూ.అరిదళము.
అధికము - ఎక్కువది, పెద్దది వి.(అలం.) ఒక అర్థాలంకారము. 

కొండి - 1.తేలు తోక, 2.తలుపుల కమరించు ఇనుప గొళ్ళెము.
కొండెము -
కొండెయము. (ౘ)చాడీ - కొండెము రూ.చాడి.    
కొండియము - చాడి, లేని నేరము చెప్పుట రూ.కొండెము.
కొండియుఁడు -  1.చాడీలు చెప్పువాడు, కొండెకాడు, 2.పిసిని గొట్టు.
చాడీకొట్టు - కొండెకాఁడు, చాడీకోరు.
ద్విజిహ్వుఁడు - కొండెగాడు.  

మాత్ర1 - 1.కొండెము, 2.అక్షరావయవము, 3.కొలది, 4.త్రుటి.
మాత్ర2 - 1.చిన్నమందుండ, 2.బాటసారుల సామానుసంచి.

ముల్లు - ములు.
ములు -
1.కంటకము, 2.త్రాసుముల్లు, 3.వరి మొ. వాని ముల్లు, రూ.ముల్లు (బహు.) ముళ్ళు.
ముళ్ళు - మారాముళ్ళు, చిక్కులు. 
కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూదిమొన, 5.కాకి, 6.తప్పు.
కంటకము2 - విరోధయుక్తి, విణ.విరుద్ధము.
విరుద్ధము - విరోధము గలది.

కర్ణేజప స్సూచక స్స్యాత్ పిశునో -
రాజాదీనాం కర్ణేజపతి వ్యక్తం వదతి పరకీయదోషా నితి కర్ణే జపః జపవ్యక్తాయాం వాచి. - రాజాదులయొక్క చెవియందు ఇతరుల దోషము(దోషము - 1.తప్పు, 2.పాపము.)లను జెప్పువాఁడు.
సూచేయతీతి సూచకః. సూచ పైశున్యే. - సూచించువాఁడు.
పింశత్యనృతస్యావయవో భవతీతి పిశునః పిశ అవయవే. - అసత్యము(అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.)నకు అవయమయిన వాఁడు. ఈ 3 కొండెముఁ జెప్పువాని పేర్లు.

కొండెము చెప్పుట కలిగియున్న నితర పాపము లేదు. తాళము(నోటికి తాళము) వేసితిని గొళ్ళెము(కొండి) మరిచితిని. గొప్పమాటలు గోడలు దాటవు కాని చెడ్డమాటలు జగమంతా ప్రాకును.

రళము - 1.తలుపు గడియ, 2.ప్రతిరోధము, అడ్డంకి 3.పెద్ద అల.
గొళ్ళెము - తలుపు చిలుకు, రూ.గొండెము .
గొండెము - తలుపు చిలుకు, రూ.గొళ్ళెము, గొండ్లెము. 
విష్కంభము - 1.అడ్డంకి, 2.గ్రహ యోగము, 3.గొళ్ళెము, అలం.నాటకాంగము.
ఎడ్డము - అడ్డంకి, అడ్డము.
అడ్దము - 1.నిరోధము, అడ్దంకి, 2.చాటు, 3.తాకట్టు, 4.పూట, విణ.విరోధకము, అడ్దునది.
అడ్దంకి - అడ్డి, అడ్డు, నిరోధము.
అడ్డి - అడ్దంకి, నిరోధము. నిరోధము - 1.అడ్దు, 2.చేటు, సం.వి.(భౌతి.) ఒక వస్తువు యొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్డంకి (Resistance).

నివారణము - అడ్డగింత.
నివారణీయము - అడ్దగింపదగినది, రూ.నివార్యము.  

అరికట్టు - 1.అడ్దగించు, నిరోధించు, 2.చుట్టుకొను, వి.1.అడ్దు, నిరోధము, 2.దుప్పటి మెలిపెట్టి రెండు భుజముల యందును జందెపువాటుగవైచి కట్టినకట్టు, వేటకట్టు.     

దగ్గర గొండెను సెప్పెడు
ప్రెగ్గెడ పలకులకు రాజప్రియుడై మఱి తా
నెగ్గు ప్రజ కాచరించుట
బొగ్గుల కై కల్పతరువుఁ బొడుచుట సుమతీ.
తా.
ప్రజాపాలకుడగు వాడు దుర్మంత్రి చెప్పెడు కొండెపు మాటలకు తలయొగ్గి (ప్రియుడై, వసుడై) తాను ప్రజలకు అపకారం చేయునది(ట) ఎట్లన, బొగ్గుల కోరకై వరముల నొసగే కల్పవృక్షమును నఱకుట వంటిది. దుర్మంత్రి కలుగుటవలన రాజును నశించిపోవును.

తంట - 1.కలహము, 2.చాడీ, 3.శ్రమము, 4.మోసము, రూ.తంటా.
అంగడుదుడిపి -
తంటాలమారి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పువాడు, చాడీకోరు, రూ.అంగడు దుడుపు. 

చెప్పుడుమాట - ఒకరు చెప్పినది తాను వినినమాట, చాడీ.

సూచకము - 1.సూది, 2.నక్క, 3.కుక్క, 4.కాకి, 5.పిల్లి, (రసా.)  అమ్ల క్షారములతో రాసాయనికముగా కలిసిన మిశ్రమము యొక్క అమ్లధర్మమునుగాని క్షారధర్మమునుగాని సూచించు పదార్థము (Indicator).
సూచి - సూది, రూ.సూచిక, సూచిని (గణి.) ఘాతమును సూచించు సంఖ్య, (Index), (భూగో.) సూచిక, (భౌతి.) 1.ఏవైన కొలుచు పరికరముల కొలత గుర్తులను చూపు సూదివంటి సాధనము, 2.దిక్కును సూచించుసూది (Needle). ఏసూదికీ రెండు మొనలుండవు.
సూది - సూచి, గుడ్దలుకుట్టు సాధనము, సం.సూది.
సూచకుఁడు - 1.కొండెగాడు, 2.బోధచేయువాడు.  

జంబుకము - నక్క; కయ్యాలమెకము - జంబుకము.
భూరిమాయము -
నక్క, వ్యు.పెక్కుమాయలు గలది. 
మృగధూర్తకము - నక్క.
సృగాలము - నక్క, రూ.శృగాలము.
వంచకము - నక్క, విణ.మోసము(వంచన - మోసము)చేయునది.
ఊళమెకము - నక్క, జంబుకము. ఊళ - 1.నక్కకూత, 2.ఈల.
నక్కకూత దానిపిల్లలకే చేటుదెచ్చును. నక్కపిల్లకు అరవడం నేర్పక్కర లేదు.
నరియఁడు - నక్క; క్రోష్టువు - నక్క; ఫేరవము - నక్క, ఫేరువు.  
నక్క - జంబుకము, క్షుద్రము. క్షుద్రము - కొంచెము, స్వల్పము.

నక్కజిత్తులు - మోసపు పనులు.
నక్కపుట్టి నాలుగువారాలు కాలేదు, ఇంత ఉప్పెన యెప్పుడూ చూడలే దందిట. నక్క యెక్కడ నాగలోక మెక్కడ ? నక్కలెరుగని బొక్కలు నాగు లెరుగని పుట్టలుండునా ? 
నక్కను తరిమిన వారందరును వేటకాండ్రేనా ? మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు. నక్క వచ్చి, కుక్క తోక సరిచేసిందట.
నక్కవినయము - జాతీ. కపటముతో కూడిన వినమ్రత.
నక్కను త్రొక్కుట - జాతీ. శుభసకునములు.

ఓతువు - పిల్లి, మార్జాలము.
మార్జాలము -
మార్జారము; మార్జారము - పిల్లి, రూ.మార్జాలము. 
మార్జాల కబళ న్యాయము - న్యా. పిల్లి భోజనముచేయు వాని వద్ద కూర్చుండువాడు తీసికొను కబళములన్నియు తన నిమిత్తమేయని తలచెడు రీతి.

బిడాలము - 1.పిల్లి, 2.కనుగుడ్డు.
బిడాలకము - 1.పునుగు చట్టము, 2.కంటిమందు, 3.పిల్లి.
త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి, 3.మిడత.

వృషదంశకము - మార్జాలము, పిల్లి, రూ.వృషదంశకము.
ఆఖుభుక్కు - పిల్లి, వ్యు.ఎలుకలను తినునది.
ఆఖువు -
ఎలుక, పందికొక్కు.

మది యొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగన్
అది చిలుక బిల్లిపట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.
తా.
చిలుక పంజరములో పిల్లిని ప్రవేశపెట్టిన చిలుక(ౘదువుల పులుగు - చిలుక)వలె మాటలు మాటలాడనట్లు, ఒకని మదిలో కోరియున్న వనితను మరియొకరు(వదలక తిరిగినను-ఆ తిరుగుడు వ్యర్థం) స్వాధీన పరచుకొనలేరు.

క్రూరదృక్కు - 1.పిశునుడు, లోభి 2.శని, 3.అంగారకుడు, 4.రాహువు, 5.క్రూరదృష్టి కలవాడు.
పిశినుఁడు - 1.కొండెగాడు, 2.హీనుడు, వి.నారదుడు.
కయ్యపుదిండి - (కయ్యము + తిండి) కలహభోజనుడు, నారదుడు. సూచకుఁడు - 1.కొండెగాడు, 2.బోధచేయువాడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు. కుజుఁడు - 1.నరకాసుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

పిశున శబ్దము దుర్జనునికిని, కొండెగానికిని పేరు. పిశ్యతీతి పిశునః శో తనూకరణే. - పీడించువాఁడు.

ఒరుదల - కొండెములు చెప్పుట, పై శున్యము.
ఓరుదలకాఁడు - కొండీడు, పిశునుడు.

కృపణుఁడు - 1.పిసినిగొట్టు, లోభి, 2.కుత్సితుడు.
లోభి -
లుబ్ధుడు. లోభికి ఖర్చెక్కువ.
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
లుబ్ధకుడు - 1.పిసినిగొట్టు, లోభి 2.బోయవాడు.
ఆక్షేపకుఁడు - 1.అక్షేపించువాడు, 2.బోయవాడు.

క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.
అధముఁడు -
తక్కువైనవాడు, నీచుడు.    

లోష్టమర్దీ త్రుణచ్ఛేదీ నఖఖాదీచ యోషరిః|
సవినాశం వజ్రత్యాశు సూచకో అశుచి రేవచ||
తా.
మట్టిపెళ్ల(లోష్టము - మట్టిగడ్ద)లను నలుపువాడును, తృణంబును ఛేదించువాఁడును, గోళ్ళను గొఱుకువాడును, కొండెము జెప్పువాఁడును, అపరిశుద్ధుఁడైన వాఁడును, వీరలు వృద్ధినొందరు. కావున నీ పనులు చేయరాదు. - నీతిశాస్త్రము 

భయానకము - 1.పులి, 2.రాహువు, 3.భయానకరసము.
రాహువు -
ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.
అహిభయము -
1.పాములవలని భయము, 2.రాజులకు స్వపక్షము వారి వలని భయము.
వృతహుఁడు - ఇంద్రుడు, వ్యు.వృత్రాసురుని చంపినవాడు.

పృదాకువు - 1.పులి, 2.పాము, 3.తేలు.
పులి -
కౄరజంతువు, ధైర్యశాలి.1.నల్లని 2.పులిసినది, వి.శార్దూలము.

శార్దూల ద్వీపినౌ వ్యాఘ్రే. -
శృణాతీతి శార్దూలః. శృ హింసాయాం. - హింసించునది.
నివాసత్వేన ద్వీపమస్యేతి ద్వీపీ. న. పు. ద్వీప మునికిపట్టుగాఁ గలది. ద్వీప శ్చర్మాస్యా స్తీతి వా ద్వీపీ - ద్వీపమనఁగా చర్మము. అది గలది.
వ్యాజిఘ్రతీతి వ్యాఘ్రః. ఘ్రా గంధోపాదానే. - చంపునప్పుడు వాసనఁ జూచునది.
(అధికపాఠము. పుండరీకః పఞ్చానఖశ్చిత్ర కాయ మృగద్విషౌ, పుండం మాంసం రీకతి హరతీతి పుండరీకః - మాంసమును హరించునది.
పంచనఖాః యస్య నః పంచనఖః - ఐదుగోళ్ళు గలది.
చిత్రః కాయః యస్య చిత్రకాయః - పొడలచేత నానావర్ణములగల శరీరము గలిగినది.
మృగాణాం ద్విట్ మృగద్విట్. ష. పు. మృగములకు శత్రువు. ఈ నాలుగు 4 పెద్దపులి పేర్లు.   

శార్దూలము - పులి.
ద్వీపి -
1.పులి, 2.చిరుతపులి, 3.సముద్రము.
ద్వీపము - 1.పులితోలు, 2.లంకదీవి నలువైపుల నీటిచే చుట్టబడిన భూమి.
ద్వీపపుంజము - (భూగో.) సముద్ర మధ్యమున లేక నీటి మధ్యమున నున్న ద్వీప సమూహము.
వ్యాఘ్రము - వేగి, పులి. వేఁగి - పులి, సం.వ్యాఘ్రః.    
పంచనఖము - పులి, శార్ధూలము.  
చిత్రకాయము - చిఱుతపులి. పొన్నాడ - ఒక తెగ చిరుతపులి.
చిత్రకము - 1.చిరుతపులి, 2.బొట్టు.
చిఱుత - 1.చిన్న, వి.చిన్నజాతి పులి.

పర్దతీతి పృదాకుః ఉ. పు. పర్ద కుత్సితేశబ్దే. - కుత్సితముగా బలుకునది.

(ౘ)చాఱల మెకము - పెద్దపులి.
కోల్పులి -
పెద్దపులి, రూ.క్రోల్పులి, క్రోలుపులి.
గాండ్ర - కాండ్రుమన శబ్దము (పెద్దపులి) 'కాండ్రు ' మనును.
గాండ్రించు - క్రి.1.ఉబ్బు, 2.పెద్దగా అరచు. 

పెద్దపులి చుట్టానికి పెడుతుందా? పులి అయినా తనపిల్లల జోలికి పోదు. పులిపిల్ల అయితే గోళ్ళుండవా యేమిటి.పిల్లి పులికి మేనమామో, మేనత్తో. పులి కడుపున చలిచీమలు పుట్టునా?

దువ్వు -1.దువ్వెనతో తల వెండ్రుకల చిక్కుదీయు, 2.నిమురు, 3.పులి. నిమురు-శరీరమును మెల్లగా తడుము, నివురు, నివురు గప్పిన నిప్పు. 
పుల్లసిలు - భయాదులచే వివర్ణమగు, భయపడు. రూ.పుల్లసిల్లు.

భీమము - భయానకరసము.
భీకరము -
భయంకరము.
భీషణము - భీమము, విణ.భయంకరము.
భీష్మము - భయానకరసము గలది, విణ.భయంకరమైనది.
ఉగ్రము - 1.క్రూరమైనది, భయంకరమైనది, 2.మిక్కుటమైనది.
ఉగ్రుఁడు -
1.శివుడు, 2.క్షత్రియునకు శూద్ర స్త్రీయందు పుట్టినవాడు. విణ.భయంకరుడు. ఉగ్రత్వా దుగ్రః - భయంకరుఁడు.               ౘల్లజంపు - 1.భయంకరుడు, 2.చల్లగా చంపువాడు.  

రౌద్రము - 1.భయంకరము, 2.తీక్ష్ణము, వి.1.ఎండ, 2.రౌద్రరసము, 3.దినముయొక్క మొదటి భాగము.
రౌరవము -
నరక విశేషము, విణ.భయంకరము.
రౌద్రి - ఏబది నాల్గవ సంవత్సరము.

క్రూరౌ కఠిన నిర్దయౌ : క్రూరశబ్దము కఠినమయినదానికిని, (నిర్దయుఁడు - దయలేనివాడు)దయలేని వానికిని పేరు. మఱియు, భయంకరమైన దానికిని పేరు.
కృణాతీతి క్రూరః. కృఞ్ హింసాయం. - హింసించునది. 

క్రౌర్యము - క్రూరస్వభావము, క్రూరత్వము.
క్రూరము -
1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది. 
చెడగరము - 1.క్రూరము, 2.క్రూరుడు.
క్రూరుఁడు - దయలేనివాడు.
కూళ - 1.కుత్సితుడు, 2.క్రూరుడు, సం.క్రూరః.  

వ్యాళము - 1.పాము, 2.పులి, విణ.క్రూరమైనది, రూ.వ్యాడము.
వ్యాళగ్రాహి -
పాములవాడు.

పులిపాలు దెచ్చి యిచ్చిన
నలవడగా గుండెకోసి యఱచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి గూర్మిలేదు వినరా సుమతీ.
తా||
వ్యాఘ్రపు పాలను దెచ్చినను, గుండెనుకోసి అరిచేతియందు ఉంచినను, తలయెత్తు ద్రవ్యరాశి పోసినను, వేశ్యకు(వెలయాలు - (వెల+ఆలు)వేశ్య.)నిజమయిన ప్రేమ యుండదు.

పులిలో కూడా దేవుడు ఉంటాడు నిజమే! కాని మనం ఆ క్రూరజంతువుకు ఎదురుగా వెళ్ళి నిలబడవచ్చునా? అదే విధంగా పరమదుర్మార్గులలో కూడా భగవంతుడు ఉన్నప్పటికీ మనం వారితో స్నేహం చేయడం మంచిది కాదు. - శ్రీరామకృష్ణ పరమహంస

ఆధిభౌతికము - వ్యాఘ్ర సర్పాది భూతముల వలన కలిగినది. (ఇది తాపత్రయములలో ఒకటి).

పుల్లరీకము - 1.ఒకానొక దేశము, 2.పాము.
పాము -
1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు. 
సర్పము - పాము, సప్పము; సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
దుష్కృతము - పాము. కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము. దురితము - పాపము.
కస్తి - 1.కష్టము, 2.వగ, 3.దుఃఖము, 4.విపత్తు.
రుద్దు - పులుము, తోము.

ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః. 
తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి -
పాము, చక్షుశ్రవము.
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.  
ద్విరస్వనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.

ద్విజిహ్వ శబ్దము సర్పమునకును, కొండెగానికిని పేరు. ద్వేజిహ్వే అస్యేతి ద్విజిహ్వః - రెండు నాలుకలు గలిగిన (వాఁడు)ది.

దంతశూకము - పాము, వ్యు.కుత్శితముగా కరచునది.
దంతశూకుఁడు -
ఒక రాక్షసుడు.

ఫణి - సర్పము, వ్యు.ఫణము గలది.
ఫణము -
పాము పడగ. 

తలనుండు విషము ఫణికిని
వెలయంగ దోకనుండు వృశ్చికమునకు
దలతోక యనక యుండును
ఖలుని నిలువెల్ల విషము గదరా సుమతీ.
తా.
పామునకు శిరస్సునందు, తేలునకు తోకయందు మాత్రమే విషముండును, దుష్టునకు(ఖలుఁడు - 1.దుర్జనుడు, నీచుడు, అధముడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున నుండువాడు.) దలతోక యనక నిలువెల్ల విషముందును.

స్ఫటి - పాము, వ్యు.పడగ గలది.
స్ఫట -
పాముపడగ.
స్ఫుటము - 1.స్పష్టమైనది, 2.వికసించినది, సం.వి.పాముపడగ.
పడగ - 1.పాముపడగ, 2.టెక్కము, సం.1.స్పుటం 2.పతాకా. 

టెక్కెము - టెక్కియము.
టెక్కియము -
జండా, రూ.టెక్కెము.
జెండా - టెక్కెము.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

స్ఫుటనము - భేదించుట.
స్ఫోటము - భేదించుట.

భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది :- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).

స్వస్తికము - 1.చదుకము, 2.మంగళ వస్తువు(స్వస్తి - శుభము), 3.పాముపడగ మీది నల్లనిరేఖ, 4.ఒక గుర్తు.
ౘదుకము -
1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
శృంగాటకము - చదుకము, నాలుగు త్రోవల కూడలి.
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, 3.నాల్గు.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతుష్పదము.
చతుష్టయము - నాలుగు, నలుగురు, 2.(వృక్ష.) సూక్ష్మబీజాణు మాతృకోశిలలో ఏర్పడు నాలుగు (పుప్పొడి రేణువులు) కణములు, (Tetrad) (ఇట్లే స్థూల బీజాణు మాతృకోశికలో గూడ నాలుగు జీవకణములు ఏర్పడును.)  
చతుష్పాద - 1.చతుష్పదము, 2.నాలుగు కాళ్ళ జంతువు.

భోగవతి - 1.పాతాళము, 2.పాతాళమందలి నది, విణ.భోగము గలది. అధోభువనము - పాతాళలోకము; పాతాళము - క్రిందిలోకము. పాపౙగము - నాగలోకము. రసాతలము - పాతాళలోకము, అధోలోకము. నాగలోకము - పాతాళము; పాతాళము నందు దేవీస్థానం పరమేశ్వరి.

అధోభువన పాతాళ బలిసద్మ రసాతలమ్, నాగలోకః -
అధః స్థితం భువన మధోభువనం - క్రిందనుండు లోకము.
పతం త్యస్మిన్ పాపాత్పాతాళం. పత్ ఌ గతౌ. - పాపమువలన దీనియందుఁ బడుదురు.
బలేరసురస్య సద్మ నివాసః బలిసద్మ. న. న. - బలిచక్రవర్తికి నివాసము.
రసాయాః భూమేః తల మధోభాగః రసాతలం - భూమి యొక్క అధోభాగము.
నాగానాం సర్పాణాం లోకః నాగలోకః - సర్పములుయొక్క లోకము. ఈ ఐదు 5 పాతాళలోకనామములు.

నాగవాసము - గొండ్లెము తగిలించెడు రెండు కొనలు వంచిన యినుప కమ్మి, వై.వి.1.వేశ్యాసమూహము, 2.ఆటమేళము,సం.వి.నాగలోకము.

దర్శనా చ్చిత్తవైకల్యం స్పర్శనాచ్చ ధనక్షయమ్|
సంభోగాత్కిల్బిషం పణ్యస్త్రీణాం ప్రత్యక్షరాక్షసామ్||
తా.
వారస్త్రీ(వారకాంత - వేశ్య.) యొక్క దర్శనమువలన మనస్సునకు వికల్పము పుట్టును, స్పర్శమువలన ధనక్షయమగును, సంభోగము వలన బాపము సంభవించును. కావున వేశ్యలు ప్రత్యక్ష రాక్షసులు. - నీతిశాస్త్రము

దుర్వి - 1.గరిట, అబక, 2.పాము పడగ. దుర్వీకరము - పాము.
గరిట - కఱ్ఱతో లేక ఇనుముతో చేసిన తెడ్డు, రూ. గరిఁటె, గంటె, (రసా.) ద్రవ్యము లను గ్రహించు సాధనము (Ladle).
అబక – అగప; అగప - 1.టెంకాయ చిప్ప, కొయ్య గరిటె, 2.ఓడల మురికిని గోకి శుభ్రము చేయు కొయ్యగుద్దలి, రూ.అపక, అబక.
దుర్వీపాకరస న్యాయము - న్యా. గరిటె పాకమున ఉన్నను ఆ రుచి దానికి తెలియదను రీతి.

ఎడ్డెమనుష్యుడేమెఱుఁగు నెన్నిదినంబులు గూడియుండినన్
దొడ్డగుణాఢ్యునందుగల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే
ర్వడ్డ వివేకిరీతి? రుచిపాకము నాలుక గాకెఱుంగునే
తెడ్డదికూరలోఁ, గలయ ద్రిమ్మరుచుండిననైన, భాస్కరా.
తా.
కూరలో నుండి గరిటె నటునిటు ఎన్నిసార్లు త్రిప్పినను అది దాక రుచిని తెలిసికొనలేదు. ఆ రుచి ఎట్లున్నదో నాలుకకే తెలియును. అట్లే యొని గుణవంతుని వద్ద అవివేకి యెక్కడెన్ని దినములు కలిసియండి నను అతని గొప్ప(గుణము) ప్రవర్తనము తెలిసికొనలేడు. వివేకియైన వాడు గుణవంతునితో కలిసి నట్లయినచో నతడే యా గుణవంతుని ప్రవర్తనమును గ్రహించును. 

హాస్యాగానికి తేలుకుడితే హాస్యం క్రిందకు పోతుంది. హాస్యము - 1.నవ్వు, 2.గేలి 3.(అలం.)ఒక రసము.
నవ్వు -
క్రి.1.హసించు, 2.వికసించు, 3.పరిహసించు, 4.అపహసించు, రూ.నవు, నగు, వి.1.హాసము, 2.వికాసము, 3.పరిహాసము, అపహాసము, రూ.నవు, నౌ.
హసించు - నవ్వు. నౌ - నవు, నవ్వు.

గేలి - పరిహాసము, సంకేళీ.
పరియాచకము -
పరిహాసము, ఎగతాళి, సం.పరిహాసకః.
ఎగతాళి - గేలి, పరిహాసము.
అపహాసము - గేలి, ఎగతాళి, రూ.అపహాస్యము.
అపహసించు - క్రి. గేలిచేయు, నవ్వు.
క్రేణి - 1.పరిహాసము, 2.అధికారము, 3.ఉన్నతపదవి. 

ఎకసకియము - 1.వికటపుమాట, 2.అవమానము, 3.వంచన, 4.అపహాస్యము, విణ.వికటము, రూ.ఎకసకెము.    
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము. 

నవ్వు బాధను హరించును. హాస్యము అర్హత మీరకుండా నుంచినంత సేపు రుచికరమే. అన్ని వేళలయందూ నవ్వరాదు. సంతోష సమయమున విరగబడి నవ్వరాదు.

కారణములేని నగవును
బేరణము లేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణములేని బూరెయు
వీరణములు లేని పెండ్లి వృధరా సుమతీ.
తా.
కారణములేని నవ్వు, నాట్యమెరుగని స్త్రీ(లేమ - స్త్రీ, సం.రామా.), పూర్ణములేని బూరె, వాయిద్యములేని పెండ్లి యీ భూమియందు వ్యర్థములు.

ఆఖర్న నవ్వేవాడు చాలా బాగా నవ్వగలడు. - పాత ఇంగ్లీషు సామెత

1. తేలు కుట్టినందుకు చింతించవద్దు, పాము కరవనందుకు సంతొషించు.
2. పాము కరచినందుకు చింతించవద్దు, ప్రాణము పోలేదని సంతోషించు.
3. ప్రాణము పోవునని చింతించుటకంటే, పరిప్రాణికి మేలు చేయలేదని చింతించు. - శ్రీ విద్యాప్రకాశా నందగిరి స్వాములవారు.

గోడ మీద బొమ్మ గొలుసులబొమ్మ, వచ్చేపోయే వారికి వడ్డించే బొమ్మ.

వృశ్చిక చోర న్యాయము - దొంగవాడు రహస్యముగ కన్నము వేయుచుండ, తేలుకుట్టినచో నోరు మూసికొని చప్పుడు చేయక తిరిగి పోవునను రీతి. దొంగను తేలు కుట్టినట్లు.
తస్కరుఁడు - దొంగ; దివాభీతుఁడు - దొంగ.
తస్కరించు - దొంగిలించు.
ఖనకుఁడు-1.ఉప్పరవాడు(ఉప్పరి),2.కన్నపుదొంగ,విణ.1.త్రవ్వెడువాడు 2.తప్పులెన్నువాడు.   
గంది దొంగ - కన్నపుదొంగ. అన్నము పెట్టినవారి యింటికి కన్నము వేయువాడు.

వృశ్చిక వానర న్యాయము - అసలే కోతి, దాని వికార చేష్టలతో పాటు, తేలు కుట్టినచో మరింత వికారముగ గంతులు వేయునను రీతి. కోతి - అల్లరి చేయునది, సాహసించునది.

కరణము సాదై యున్నను
కరి మదముడిగినను బాము కఱవయున్నన్
ధర తేలు మీటకున్నను
గరమదుగ లెక్కగొనరు కదరా సుమతీ.
తా.
గ్రామకరణం సాధువుగానున్నను(బాధించని కరణమును), మదము లేని కరిని(కరి - 1.ఏనుగు 2.కోతి, నీతిలేనివాడు కోతి కన్న పాడు.), పాము కాటువేయక యున్నను, వృశ్చికము కుట్టక యున్నను ఈ లోకములో జనులు లక్ష్యపెట్టరు.

ఖర్జూరము - 1.వెండి, 2.తేలు, 3.ఖర్జూరపుచెట్టు, ఖర్జూరపు పండు. శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.  
శ్వేతము - 1.వెండి, 2.తెలుపు, 3.కైలాసము, 4.ఒక ద్వీపము.
శ్వేతవాహనుడు - 1.చంద్రుడు, 2.అర్జునుడు.

చంద్రబీజము - వెండి.
వెండి -
రజతము, అవ్య. మరియు (వెండియు).
తారము - 1.వెండి, 2.పులుగడిగిన ముత్తెము.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము,(పులుగడిగిన ముత్యము).   

దుర్వర్ణం రజతం రూప్యం ఖర్జూరం శ్వేత మిత్యపి :
కనకాపేక్షయా నికృష్టవర్ణత్వా దుర్వర్ణం - బంగారము కంటె నికృష్టమైన వర్ణము గలది.
రజ్యతే తామ్రాదిక మేనేనేతి రజతం. రంజరాగే. - తామ్రము మొదలైనది దీనిచేత రంజింపఁజేయఁబడును.
ప్రశస్తం రూపమస్యేతి రూప్యం - ప్రశస్తమైన రూపముగలది.
ఖర్జ్యతే పీడ్యతే ఇతి ఖర్జూరం. ఖర్జు వ్యథనే. - అగ్నిసంతాపాదులచేతఁ బీడింపఁబడునది.
శ్వేతవర్ణత్వాత్ శ్వేతం - తెల్లనివన్నె గలది. ఈ నాలుగు వెండి పేర్లు.  

కలధౌతము - 1.వెండి, 2.బంగారము.
బులియను -
(అర్థ.) (Bullion), మేలిమి బంగారము లేక వెండి. రజతము - 1.వెండి(మడికాసు - వెండి), 2.హారము, విణ.తెల్లనిది (భూగ.) ఒక లోహము (silver) సం.వి.(రసా.) వెండి ధాతువులలో నొకటి. (Argentum) నాణెములలో ఉపయోగపడు ధాతువు.

శ్రేష్ఠధాతువు - (రసా.) వాతావరణ పరిస్థితిలకు చెక్కు చెదరని గుణములు గల ధాతువు, (Nobel metal) ఉదా. వెండి, బంగారము. 

ఊఁదువెండి - శుద్ధమైన వెండి, ఊదిన వెండి.

పుత్తడి - అపరంజి, సం.పురటమ్.
అపరంజి -
  మేలిమి బంగారము, కుందనము.
కుందనము - అపరంజిలోహము, మేలిమి బంగారము.
ఉదిరి - అపరంజి, మేలిమి బంగారము.
మేలిమి - 1.అపరంజి, 2.అధిక్యము. 
(ౙ)జాలువా - అపరంజి, రూ.జాళువ, జాళ్వ. 
(ౙ)జాళువ - జాలువా.     

నిష్కము - 1.మాడ, టంకము, 2.పతకము, 3.బంగారము, 4.వెండి.
పలము -
1.నిష్కము, మూడు తులములు, 2.మాంసము.
మాడ - అరవరా, పదిరూకలు.
టంకము - ప్రాచీన కాలపు బంగారు నాణెము, దీనారము, సం.వి.1.వెలిగారము, 2.కత్తి, 3.కోపము, సం.వి.(రసా.) ధాతువును ధాతువునకు కలుపుటకు వాడుకలో నున్న సులభముగా కరగు ధాతు మిశ్రము (Solder). గవ్వచౌకము - నాలుగు గవ్వల మొత్తము, వెలిగారము.
దీనారము - బంగారు నాణెము. దినారి - దీనారము, ఒక బంగారు నాణెము, సం.దీనారః. టంకకము - వెండినాణెము.
పతకము - హారము నడుమ నుండు రతనపు బిళ్ళ, సం.పదకమ్.

అరయనెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చి నుపకారి మనుష్యుడు లేక మేలుచే
కూఱ దదెట్లు? హత్తుగడగూడునె చూడఁబదారువన్నె బం
గారములో నైన వెలిగారము గూడయున్న, భాస్కరా.
తా.
భాస్కరా ! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏవో నొక భూషణముగా, అనగా ఉపయోగ కరమగు వస్తువుగా తయారు కాదు అట్లే ఎంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తి లేక అతని గొప్పతనము రాణింపదు.

విశేషము :- ఒక వస్తువునకు గాని ఒక వ్యక్తికిగాని సహజముగా నున్న గొప్పతనమును, బాహాటము చేయు వ్యక్తిగాని, మరి యే పదార్థము గాని లేక ఆ యా వ్యక్తులు గాని వస్తువులు గాని కీర్తిని బొంద(పొంద) నేరవు.

రజతాద్రి - 1.వెండికొండ, 2.కైలాసము.
కైలాసము -
1.కుబేరుని ఉనికిపట్టు 2.శివుడుండు వెండికొండ.
కైలాసనాథుఁడు -1.కుబేరుడు 2.శివుడు.
ముక్కంటి చెలి - కుబేరుడు. ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు. 

గిరేః కైలాసస్యేశః గిరీశః - కైలాసమున కీశ్వరుడు.
గిరౌ శేతే గిరిశః - కైలాస మందు శయనించువాఁడు.

కైలాసః స్తానం :
కేళీనాం సమూహః కైలం తేన ఆస్యతే స్థీయత ఇతి కైలాసః. ఆస ఉపవేశనే - కేళిసమూహము కైలము, దానిచేత నుండఁబడునది.
కే శిరసి శివయో ర్లాసో నృత్య మస్మిన్నితి వా కైలాసః - శిఖరభాగ మందు పార్వతీపరమేశ్వరుల నాట్యము గలది.
కేలయోర్జలభూమ్యోః ఆసనం స్థితి ర్యస్య కేలాసః స్పటికం - తస్యాయం కైలాసః - జలభూముల యందుండునది గనుక కేలాసము; అనగా స్పటికము, దాని సంబంధమైనది. - కుబేరుని దేశము

తేలునకు ఎవ్వరు అపకారము చేసిరి. తేలుకు అపకారం చేయనివారెవరు? 

పాలసుకైన యాపద
జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞనకుం
దేలగ్నిబడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ.
తా.
తేలు అగ్నిలో పడనున్న సమయంలో, జాలిపడి దానిని తప్పించినచో అది మనం చేసిన మేలును, గ్రహింపక వెంటనే కుట్టును. అట్లే లోకంలో అన్నియు తెలిసిన వాడైనను, దుష్టునికి కల్గిన ఆపదకు కనికరించి తీర్చుటకు పూనుకోరాదు, దుష్టుడగు వాడు మనం చేసిన మేలును గ్రహింపక మనకే అపకారం చేయును.

కజ్జారము - ఖర్జూరము. ఖర్జ్యతే పీడ్యత ఇతి ఖర్జూరం. ఖర్జు వ్యథనే. - అగ్ని సంతాపాదులచేతఁ బీడింపఁబడునది.

పూరిత సద్గుణంబుఁగలపుణ్యున కించుక రూపసంపదల్
దూరములైన వానియెడ దొడ్డగఁజూతురు బుద్ధిమంతులెట్లా
రయ గొగ్గులైన మఱి యందుల మాధురిఁజూచికాదె ఖ
ర్జూర ఫలంబులన్ బ్రియముజొప్పిల లోకులుగొంట, భాస్కరా.

తా. ఖర్జూరపు పండ్లు ముడతలు పడి కంటికింపుగా గానబడకున్నను జనులా పండునందు గల తీయదనమునకు మిక్కిలి యిష్టముతో కొందురు. అట్లే మంచిగుణములు గల వానికి ఒకప్పుడు భాగ్య రేఖయు, రూపును చెడిపోయి నప్పటికీ వానిని బుద్ధిమంతులగు వారు తొంటి(పూర్వపు) విధముగనే చూతురు.

ముఖం మీద ముడతలు ఇదివరకు చిరునవ్వులుండే చోట్లను సూచిస్తాయి. - మార్క్ ట్వేన్

16. చేటరిక్క - విశాఖనక్షత్రము.

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము -
రిక్క, చూ. ఋక్షము.
ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి.
ఋక్షరాజు - 1.చంద్రుడు, 2.జాంబవంతుడు.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.

పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ | ఉన్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ | తస్యాం దేవా అధిసంవసంతః | ఉత్తమే నాక ఇహ మాదయంతామ్  | పృథ్వీ సువర్చా యువతిః సజోషాః | పొర్ణమాస్యుదగాచ్చోభమానా | ఆప్యాయయంతీ దురితాని విశ్వా | ఉరుం దుహాం యజమానాయ యజ్ఞమ్ ||15||

ఉద్భటము - అధికము, వి.1.చేట, 2.తాబేలు.
అధికము -
ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.

ప్రస్పోటనం శూరో మస్త్రీ -
ప్రస్ఫోట్యతే బహిర్నిష్క్రియతే తుషాది రనేనేతి ప్రస్ఫోటనం. స్ఫుటిర్ విశరణే. - దీనిచేత పొట్టు మొదలయినవి నిరసింపఁబడును.
శీర్యతే తుషాది రనేనేతి శూర్పం. అ. ప్న. శౄ హింసాయాం. - దీనిచేత పొట్టు మొదలైనవి చెరుగఁబడును.
శూర్ప్యతే అనేన్ శూర్పం. శూర్పమానే. - దీనిచేత కొలవఁబడును. ఈ రెండు చేట పేర్లు.   

ప్రస్పోటనము - 1.చేట 2.దెబ్బ.
ప్రహరము -
1.దెబ్బ, 2.జాము, ప్రహరి, వై.వి.ప్రాకారము, సం.ప్రాకారః. దెబ్బ - తాడనము, కొట్టు.

కోఁడు - క్రి. ధాన్యము చేటలో పోసి ప్రక్కవాటుగా ఇటునటు త్రిప్పు.

ఎగురఁబోతు - (వ్యవ.) నూర్చిన ధాన్యములో పొట్టు, దుమ్ము మొ.వి లేకుండ చేయుటకు ధాన్యమును గాలి వీచునపుడు కొంత ఎత్తుననుండి చేటలో మెల్లగా క్రిందికి విడుచుచుండుట, తూర్పారపట్టుట (Winnowing).
తూరుపాఱఁబట్టు - పొల్లుగింజలు దూరముగ పోవునట్లు గాలి కెత్తిపోయు, రూ. తూరుపెత్తు, తూర్పెత్తు, తూర్పాఱఁబట్టు. 

మేలురాసి - తూర్పెత్తిన ధాన్యపుప్రోవు.
మొరుములు -
(వ్యావ.) చేటచే తనపైవు కోడగా వచ్చిన పెద్ద గింజలు, గుండ్రలు.

నిరుపయోగమైన తేలిక పదార్థాలను విడిచిపెట్టి, ఉపయోగపడే బరువైన పదార్థాలనే తనలో నిలుపుకొనే 'చేట' లాగా ఉత్తమభక్తులు కూడా మంచి చెడులపట్ల తగిన విచక్షణ(విచక్షణ - నేర్పు)తో ప్రవర్తిస్తారు. - శ్రీ రామకృష్ణ పరమహంస

చేట - చెరిగెడి సాధనము, శూర్పము.
శూర్పము - చేట.
శూర్పణఖ - రావణుని చెల్లెలు. చేటంత నఖాలు(గోళ్ళు) కలది, కాబట్టి 'శూర్పణఖ '. శూర్పణఖార్తి విధాయక రామ్|

(ౘ)చుప్పనాక - శూర్పణఖ, రావణుని చెల్లెలు, రూ.చుప్పనాతి.

రాముడిని కోరుకుని, సీతను వద్దన్న శూర్పణక ముక్కు చెవులు కోయించుకుంది(స్త్రీ హత్య మహాపాపం కనుక లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి వదిలిపెట్టాడు). సీతను కోరిన రావణాసురుడు(దశకంఠుఁడు - రావణుడు)వినాశనాన్ని కోరుకున్నాడు. సీతారాములను విడదీసి చూడాల నుకున్న వారు ఇద్దరు నాశనమైనారు. - శ్రీమద్ రామాయణం            

ఆస్ఫోటనము - 1.పోటు, 2.చీలిక, 3.జీవస్థానము నందు పొడుచు పోటు, 4.భుజము లప్పించుట, 5.బయలుపరచుట, 6.వికసించుట, 7.ధాన్యములు పొట్టుపోవునట్లు చెరుగుట.
పోటు - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 4.పెద్ద అల.
ఊటు - 1.పొడుచు, 2.నొవ్వునాటు, వి.పోటు.

ఉపహతి - 1.దెబ్బ, 2.ఉపద్రవము, 3.నాశము, 4.అడ్దగింపు.
హతి -
దెబ్బ, ఉపహతి.
హతుఁడు - విణ. 1.కొట్టబడినవాడు, 2.మనసు చెడినవాడు.

గొహారు - 1.ఉపద్రవము, 2.తాపము, 3.పెద్దమ్రోత.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
నొప్పి - 1.బాధ 2.ఆపద. నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
ఆఘాతము - 1.కొట్టుట, 2.దెబ్బ, 3.చంపుట, 4.చంపుచోటు, 5.గాయము, 6.దుఃఖము, 7.మూత్రము అడ్డుపడుట, మూత్రాఘాతము.

అబ్రహ్మణ్యము - బ్రాహ్మణునికి తగనిది (వధాదులు) వి.చంపవలదు అని బ్రాహ్మణుఁడు పెట్టు మొర.

గాయము - కత్తి మొ.వానితాకున గలుగు దెబ్బనరకు, క్షతి.
గంటి - 1.గాయము, క్షతి, 2.దుఃఖము, 3.కన్నము.
ఎన్నో వ్రణములు కోసితిని కాని నాకురుపు కోసినప్పటి బాధ ఎవ్వరికి కలుగలేదు అన్నట్లు. కత్తి చేసిన గాయము మానుతుంది, కాని పరుషవాక్కులు చేసిన గాయము మానదు.

క్షతి - 1.గాయము, 2.నాశము.
క్షతము -
1.గాయబడినది, 2.చీలచబడినది, 3.నాశమైనది, సం.వి.1.గాయము, 2.చీల్చుట, 3.దెబ్బ.

భేదనము - భేదించుట, (గృహ) విడదీయుట, చీల్చుట, విభజన(వేరుచేయుట), బద్దలు చేయుట (splitting).

స్ఫుటనము - భేదించుట.
స్ఫోటము - భేదించుట.

శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ,
సర్వస్మిన్నపి పశ్యాత్మానాం సర్వత్రోథ సృజ, భేదా జ్ఞానమ్.- భజగోవిందం

తల్లిపిల్లలను విడదీయటం, భార్యాభర్తలను ఎడబాపడం, నిద్రాభంగం కలిగించుట, పుణ్యకధలకు విఘ్నం కలిగించడం మహాపాపం. విడదీసి చూసే వాళ్ళ దగ్గర విడిపోయి ఎడముగా దూరంగా వుండటమే సరియైన నిర్ణయం. సుఖం మనశ్శాంతి ఉంటుంది.

విషాదము - భేదము, దుఃఖము.
ఖేదము - దుఃఖము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
దుః అనే శబ్దానికి వీలుకానిది, భరించలేనిది అని అర్థం. భూమ్మీద దుఃఖం లేని సుఃఖం లేదు. ఏదైనా సరే, ఉన్నా బాధే, లేక పోయినా బాధే. మనిషంటే మనస్సు. మనస్సుంటే చింత. చింత అనగా మానసిక క్లేశము.

మూత్రకృచ్ఛము - 1.ఉబ్బరము, నీరుకట్టు తెవులు 2.అతి మూత్రము.
నీరుకట్టు - మూత్ర బంధరోగము(Dys’uria). నీరుడి - అతిమూత్రము.
ఉబ్బరము - 1.కడుపుబ్బు, సం.ఉబ్బణమ్ 2.నివ్వెరచూటు, సం.ఉద్భ్రమః.
ఉబ్బరపోవు - క్రి.(ఉబ్బరము + పోవు) 1.నివ్వెరపడు 2.బాధనొందు. నివ్వెఱ - (నిండు+వెఱ) 1.పారవశ్యము, 2.నిశ్చేష్టత, 3.భ్రాంతి, రూ.నివ్వెర, మిక్కిలిభయము, రూ.నివ్వెరగు.

జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.
జడత్వము - (భౌతి.) విశ్రాంతి స్థితిలోగాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము (Inertia).

నెఫ్రైటిస్ - (గృహ.) (Nephritis), మూత్ర పిండములు చెడిపోవుట. (ఈ వ్యాధికి సూచనలు లేవు. ఇది చాల అపాయకరమైన వ్యాధి.)

అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.
సముద్రము -
సాగరము. సగరి పుత్త్రైః ఖాతస్సాగరః - జలములు గలిగినది.
సాగరము1 - నేయి మొ.నవి నింపిన సిద్దెల జోదు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.

ధరాధరము - 1.కొండ(మల, పర్వతము), 2.తాబేలు.
కూర్మము -
కమఠము, తాబేలు.
కచ్ఛపము - తాబేలు, కమఠము.
కమఠము - తాబేలు, భిక్షాపాత్రము.
తామేలు - తాబేలు.  

మొగపిఱికి - మొగము (+పిఱికి) తాబేలు, వ్యు.మొగము చూచుటకు పిరికితనము కలది.

డులి - ఆడుతాబేలు, రూ.డులి.
కమఠీ డులిః -
కమఠస్య స్త్రీ కమఠీ - కమఠముయొక్క స్త్రీ కమఠి.
ఢులతీతి ఢులిః పా. ఇ. సీ. ఢుల ఉతేక్ష పే. - జలమును జల్లునది. ఈ రెండు 2 ఆఁడుతాఁబేటి పేర్లు.   

స్తూపపృష్టము - తాబేలు, వ్యు.దిబ్బవంటి వీపుకలది.
స్తూపము -
మట్టి మొదలగువాని దిబ్బ.
కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మము - air in the eyes.

పీవరము - బలిసినది, వి.తాబేలు.
పీనము - బలిసినది, వి.సంతోషము.

లప్ప - రాశి, విణ.కండకలది, బలిసినది.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).

క్షితి రతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే, ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే|
కేశవ్! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే! |

కూర్మే క్మఠ కచ్ఛపాః -
కుత్సితః ఊర్మిర్వేగః అస్యకూర్మః - ఊర్మియనఁగా వేగము; కుత్సితమైన వేగము గలది.
'ఊర్మిః స్త్రీపుంస యోర్వీచ్యాం ప్రకాశే వేగభంగయో' రితి రభసః. కం జలం ఊర్వతీతివా కూర్మః. ఊర్వీ హింసాయాం. - జలమును (ౙ)జెరుచునది.
కే ఉదకే మఠతీతి కమఠః. మఠ నివాసే. - జలమునందు వసించునది.
యజ్ఞార్థం కామ్యత ఇతివా కమఠః. కముకాంతౌ. - యజ్ఞార్థమై కాంక్షింపఁ బడునది.
కచ్ఛేన పుచ్ఛేన పిబతీతి కచ్ఛపః. పా పానే. - పుచ్ఛముచేత పానము చేయునది.
కచ్ఛమనూపదేశం క్షుద్రజంతు భకణేన పాతీతి వా కచ్ఛపః - జలప్రాయ ప్రదేశమును క్షుద్ర జంతు భక్షణముచేత రక్షించునది. ఈ ఆరు తాఁబేటి పేర్లు.

కూర్మవత్ స్థితత్వాత్కచ్ఛపః - కూర్మము వలె నుండునది.

తాబేలు – A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.

క్రోడపాదము - తాబేలు, వ్యు.రొమ్మున నిముడ్చుకొను పాదములు కలది. Turtle – Tortoise with short legs, An animal of water covered with a hard shell, withdraws all its limbs in its body.

దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
దాసరి -
విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.
దాసుడు - 1.పనివాడు; సేవకుడు, 2.భక్తుడు(భక్తిగలవాడు), 3.జ్ఞాని.
దాసేయుఁడు - పనివాడు, విణ.దాసికి పుట్టినవాడు, రూ.దాసేరుడు.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
దాసరిపాము - చారలుగల పెద్దపాము.  

తలమేల కులమేల తపమే కారణము
యెలమి హరిదాసులు యేజాతియైన నేమి……

దాసి - పనికత్తె, పరిచారిక
చేటి -
1.పనికత్తె, రూ.చేటిక.
చేటిక - చేటి; చేడియ - చేటి స్త్రీ, రూ.చేదె, సం.చేటీ.
పరిచారిక - సేవకురాలు.
భుజిష్యు -
1.పరిచారిక, 2.వేశ్య. 
భుజిష్యుఁడు - పరిచారికుడు, విణ.స్వతంత్రుడు.
ఊడిగము - పరిచర్య, సేవ, రూ.ఊడెము, ఉడిగము, ఊళిగము, ఉళిగము.
గోప్యుఁడు - 1.ఊడిగపువాడు, 2.దాసీపుత్త్రుడు, విణ.కావదగినవాడు.

దాసీమానథనంహంతి - హంతివేశ్యా ఢనాధికమ్|
ఆయూ క్షీవిధవాహంతి - సర్వ హంతిపరాంగనా||
తా.
దాసీసంగమము మానమునుబోఁగొట్టును, వేశ్యాసంగమము ధనాదులను బోగొట్టును, విధవాసంగమ మాయుస్సు(ఆయువు)ను క్షీణింప జేయును, పరాంగనా(పరస్త్రీ)సంగమ మన్ని సుగుణములను పోగొట్టును. – నీతిశాస్త్రము  

వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||
 

గుహ్యము - 1.ఏకాంతము, 2.పురీషమార్గము, 3.వంచన(వంచన- మోసము), 4.తాబేలు, విణ.దాచదగినది.

ఏకాంతము - 1.మిక్కిలి, 2.ఇద్దరు కంటె ఎక్కువ జనములేనిది (చోటు), 3.రహస్యము.  
రహస్యము - ఏకాంతము, విణ.దాచదగినది.

ఆతతి - 1.బిగువు (Tension), 2.సాగదీసిన స్థితి, 3.వాయువుల యొక్కగాని బాష్పముల యొక్కగాని ప్రేషము, 4.విద్యుచ్ఛాలకలలము (రసా., భౌతి.) 1.బిగి, 2.బిగిసినస్థితి, భౌతిక శాస్త్రదృష్టిలో ఇదియొక బలరూపము. 

మోడి - 1.బిగువు, 2.బింకము, 3.గణికాదులు మొగ్గవాలి పాద సమీప మందుంచిన వస్తువు నెత్తుట, 4.వ్రాత వైఖరి, గొలుసుకట్టు, వ్రాత.
బింకము -
1.గర్వము, 2.నిక్కు, బిగువు.
నిక్కు - 1.ఉన్నతమగు, 2.అతిశయించు, 3.గర్వించు, 4.వర్ధిల్లు, వి.1.ఉన్నతి, 2.గర్వము.
నిక్కుఁబోతు - గర్వ స్వభావము గలవాడు.
ఉన్నతి - 1.ఎత్తు, 2.ఉచ్ఛస్థితి, 3.గరుడుని భార్య.

గుత్తము - బిగువు, విణ.1.ఎచ్చు తక్కువలు లేక సరిగా నుండునది, కచ్చితము(రైక మొ.వి), 2.గట్టిది. 3.రహస్యము, గూఢము, సం.గుప్తమ్.
బిగువు - బిఱ్ఱు బిగిసి (Tension). బిఱ్ఱబిగియు - మిక్కిలి బిగిసికొను.
బిగి - 1.బిగువు, 2.గర్వము. లవణి - బిగువు.
గట్టి - ధృఢము, కఠినము, కర్కశము, బిగువైనది, సడలనిది, గుల్లకానిది, సం.ఘట్టః.
గూఢము - 1.రహస్యమైనది, 2.దాచదగినది.
గుప్తము - 1.దాచదగినది, 2.కావబడినది.
గూఢపాత్తు - సర్పము, వ్యు.కానరాని పాదములు కలది. 

దాఁపరికము - గోపనము.
దాఁపు - దాచు, చూ.దాఁగు.
దాఁపురము - 1.మరుగుపుచ్చుట, గోపనము, 2.దాచిన సొమ్ము.
గోపనము - 1.దాటుట, 2.కాపాడుట, 3.గుప్తపరచుట, రహస్యముగా నుంచుట, గూఢ పరచుట, దాచిపెట్టు, మరుగు చేయుట (Concealment).
గోప్యము - రక్షింపదగినది, (వ్యవ.) రహస్యమైనది.

నిహ్నవము - 1.అవిశ్వాసము, 2.కపటము, 3.తిరస్కారము, 4.దాపరికము, 5.నమ్మిక(నమ్మిక - నమ్మకము), 6.మరుగుమాట.
నిహ్నవించు - మరుగువెట్టు, దాచు.
నిహ్నుతి - మరుగుపుచ్చుట.

యాపనము- 1.కాలాయాపనము, కాలము గడుపుట, 2.తిరస్కారము.
కాలాయాపనము - కాలక్షేపము.
కాలక్షేపము - 1.వృథాగా చేయు ఆలస్యము, విలంబము, 2.ఉబుసు పోక.
విలంబము - జోగు, వ్రేలుట.
అధిక్షేపము - 1.అక్షేపము, నింద, 2.త్రోసిపుచ్చుట, తిరస్కారము, 3.స్థాపనము.
తిరస్కృతి - తిరస్కారము; అలను -తిరస్కారము, లోకువ, రూ.అలుసు.
లోఁకువ - అధీనము, తక్కువ. తక్కువ - కొరత.
స్థాపనము - 1.నిలుపుట, 2.సమాధిచేయుట, 3.స్థాపించుట.

గొలుసుమోడి - కలిపి వ్రాసిన వ్రాత (గొలుసుకుట్టు వ్రాత).
తీఁగమోడి - 1.వ్రాతపని, 2.గొలుసుకుట్టు వ్రాత.
జిలుగు - 1.గొలుసువ్రాత, 2.చిక్కు.

విశాఖము - విలుకాడు రెండు పాదముల నడుమ జేరెడెడముగ నిలుచుట విణ.శాఖలులేనిది.

అభిమానము - 1.గర్వము, 2.ప్రేమ, 3.ఆత్మగౌరవము, 4.హింస, 5.జ్ఞానము, 6.పగతీత్చుకొనుట, 7.అజ్ఞానము(తెలివిలేనితనము). అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య, దేహాత్మభ్రాంతి.

బ్రాతి - ప్రేమ, విణ.1.అధికము, 2.దుర్లభము.
మమత - ప్రేమము, అభిమానము.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను అభిమానము.  

ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ(దయ - కనికరము), 4.తృప్తి.
ఆదట2  - అనంతరము, పిమ్మట. అనుక్రోశము - కనికరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content). 

అభిమానో ర్థాది దర్పే జ్ఞానే ప్రణయ హింసయోః : అభిమాన శబ్దము ధనరూప కులాదులచే వచ్చిన గర్వమునకు, జ్ఞానమునకు, ప్రార్థనకు, హింసకును పేరు. అభిమాననం, అభిమననం చ, అభిమానః. మాన పూజాయాం, మనజ్ఞానే. మీఞ్ హింసాయాం, గర్వించుట జ్ఞానము, హింసయును, అభిమానము.

హింసను విడనాడు - అహింసను పాటించు. ప్రాణి హింసను చేయరాదు. మేలు చేసిన వారికి - కీడుచేయకు. కూడు బెట్టిన వానిని - కూలద్రోయకు.

హింస - 1.చంపుట, 2.బాధించుట.
ప్రతిఘాతనము -
చంపుట. విశసనము - 1.చంపుట, 2.కత్తి.
విశరఘాతము - చంపుట, బాధించి చంపుట. 

హింసా చౌర్యాదికర్మ చ : హింసా శబ్దము దొంగతనమునకును, ఆదిపదము చేత కొట్టుట మొదలయిన దానికిని, చకారము వలన చంపుటకును పేరు. హింసనం. హింసా. హిసి హింసాయాం. చంపుట గనుక హింస.

అహింస పరమో ధర్మః. జీవితాన్ని ప్రేమించే వాడు హింసకు దిగలేడు. అన్యుల ప్రాణాలు తీయలేడు.

వైరశుద్ధి - ప్రతీకారము, పగతీర్చుకొనుట.
ప్రతీకారము -
(గృహ.) ప్రతిఘాతము (Reaction).
ప్రాయశ్చిత్తము - 1.పాప పరిహారమునకై చేయుకర్మము, 2.ప్రతీకారము. 

వైరశుద్ధిః ప్రతీకారో వైరనిర్యాతనం చసా :
వైర్స్య శుద్ధిః వైరశుద్ధిః - వైరము పోఁగొట్టుకొనుట.
ప్రతికరణం ప్రతీకారః - చేసినదానికి బదులు చేయుట ప్రతీకారము.
వైరస్య నిర్యాతనం వైరనిర్యాతనం - వైరముఁ బోఁగొట్టుట. ఈ మూడు 3 పగ దీర్చుకొనుట పేర్లు.

వైరము - విరోధము; పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
పగగొను -
విరోధపడు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ సంవత్సరము.
ఈరస - 1.అసూయ, 2.పగ, 3.కోపము, రూ.ఈరసము, సం.ఈర్ష్యా.
ఈరసించు - 1.అసూయచెందు, 2.పగగొను, 3.కోపించు.

అసూయ - 1.గుణము లందు దోషమును ఆరోపించుట, ఓర్వలేనితనము, 2.కోపము.

పగ ప్రతీకారం స్వభావముగా ఉన్నవారికి ఎప్పుడూ దూరంగా ఉండటం శ్రేయస్కరం. పగ తీర్చుకోవాలను కోవడం మానిపోయే తన గాయాల్ని రేపుకోవడమే. - బేకన్

అసూయా తు దోషారోపో గుణేప్వపి. :
గుణేషు సత్స్వపి పరెషు దోషారోపః అసూయా. - మంచిగుణములు గలిగియున్నను చెడుగుణముల నారోపించుట అసూయ యనంబడును.
అస్యతీత్యసూయా. అసు క్షేపణే. - మంచియున్నను పరునియందు దుర్గుణముల నారోపించుట పేరు.

శుష్కవైరం వివాదంచ నకుర్యా తైనచికిత్సా|
తా.
ఎవనితోనైనను నిష్ప్రయోజనమైన విరోధమును, వివాదమును జేయరాదు. - నీతిశాస్త్రము

కోపము వచ్చినవానికి కొంచెంసేపు దూరంగా ఉండు. అసూయాపరులకు మాత్రం ఎల్లప్పుడూ దూరంగా ఉందటం అవసరం. - ఒక సామెత

17. అనూరాధ : అనూరాధ, జ్యేష్ఠ - (ఛత్రాకారము) గొడుగునుపోలి 6 నక్షత్రములు వుండును.

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period). 
అనూరాధ వర్షోదకము - Rain water that falls in Anuradha karti. సమస్తజంతువులకు అన్ని సస్యములకు మిక్కిలి ఆరోగ్యకరమైన దిగ నుండును.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ, వి. సం.క్రాంతిః.

ఛత్రము - గొడుగు.
గొడుగు - ఎండ వానల కడ్దము పెట్టుకొను సాధనము, ఆతపత్రము, ఛత్రము.
ఆతపత్రము - గొడుగు, వ్యు.ఆతపము (ఎండ) నుండి రక్షించునది.
ఉష్ణవారణము - గొడుగు; పులోటపము - గొడుగు. ఏ ఎండకా గొడుగు పట్టాలన్నారు.

ఛత్రం త్వాతపత్రమ్ :
ఛాద్యతే పురుషో నేనేతి ఛత్రం. ఛద అపహరణే. - దీనిచేతఁ పురుషుఁడు కప్పఁబడును.
ఆతపాత్ త్రాయత ఉతి ఆతపత్రం. త్రైఙ్ పాలనే. - ఎండవలన రక్షించునది. ఈ రెండు గొడుగు పేర్లు.

ఛత్రభంగము - 1.రాజ్యనాశము, 2.స్వాతంత్ర్యము, 3.వైధవ్యము.

ఎల్లి - 1.రేపు, 2.గొడుగు.
తొంగలి -
1.వాలునది, 2.స్రవించునది, వి.1.వన్నె, 2.గొడుగు.
తొంగలించు - 1.అతిశయించు, 2.ప్రకాశించు, 3.వికసించు, 4.వర్థిల్లు, 5.నిక్కు, 6.స్రవించు, రూ.తొంగలిగొను.
తొంగలిపాట్లు - నమస్కారము. 

వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.
వన్నెకత్తియ -
వన్నెకత్తె. వన్నెలాడి - వన్నెకత్తె.
వన్నెకత్తె - విలాసవతి.
వన్నెకాఁడు - విలాసవంతుడు. వన్నెఁలాడు - వన్నెకాడు.

లోకసమ్మతము - చంద్రుని గొడుగు.
నృపలక్ష్యము -
రాజునకు పట్టెడి తెల్ల గొడుగు.
నృపతి - రాజు, రూ.నరపతి.
నరపాలుఁడు - రాజు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.

ఆభోగము - 1.పరిపూర్ణత, సంపూర్ణత, 2.వైశాల్యము, 3.ప్రాంతదేశము, 4.ప్రయత్నము, 5.సుఖాద్యనుభవము, 6.విప్పిన పాముపడగ, 7.వరుణుని గొడుగు.

కులమున నక్కడక్కడ కుంఠిత ధార్మికుఁ డొక్కడొక్కడే
కలిగెడుఁగాక పెందఱుచు గల్గఁగనేరరు, చెట్టుచెట్టునన్
గలుఁగగనేర్చునే గొడుగుకామలు, చూడఁగనాడనాడ నిం
పలకఁగనొక్కటొక్కటి నయంబునఁ చేకుఱుఁగాక, భాస్కరా.
తా.
గొడుగున (కు)ఉపయోగించు తాటి కమ్మలు ప్రతి చెట్టునను దొరకవు. యెక్కడో ఒక్కొక్కటి క్రమముగా దొరుకును. అట్లే ధర్మ బుద్ధి గలవాడు ఏ వంశమందైనను యొక్కడో నూటికి ఒకడు మాత్రమే యుండును కాని, ప్రతి వ్యక్తియు ధర్మబుద్ధి గలవాడై యుండడు.

ఋద్ధ్యాస్మ హవైర్నమసోపసద్య | మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు | అనురాధన్, హవిషా వర్ధయంతః | శతం జీవేమ శరదః సవీరాః | చిత్రం నక్షత్రముదగాత్పురస్తాత్ | అనూరాధా స ఇతి యద్వదంతి | తన్మిత్ర ఏతి పథిభిర్దేవయానైః | హిరణ్యయై - ర్వితతై-రంతరిక్షే ||16|| 

దోరణపు సాటి రిక్క - అనూరాధ, తోరణము వలెనుండు నక్షత్రము.
రిక్క -
నక్షత్రము, ఋక్షమ్
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.

దోరణ - తోరణము, మామిడాకులు మొదలగునవి గ్రుచ్చిన సరము, రూ.దోరణము, సం.తోరణమ్.
తోరణము - 1.పుష్పమాలాదులు కట్టుటకై గృహమునకు వెలుపల రెండు స్తంభాలచే ఏర్పరుపబడిన ద్వారము, 2.ద్వారమునకు కట్టు  మామిడా కుల దండ, రూ.తోరణ. 

మైత్రి - మిత్రభావము, స్నేహము, అనూరాధ, యతిమైత్రి, affinity. బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship).

ఎచట మైత్రి యుండునో దానిని వృద్ధిచేయుము. స్వార్థంలేని స్నేహం పవిత్రమైనది. అదే సృష్టిలో తీయని స్నేహం.

ఐక్యము - ఏకీభావము, మైత్రి.
ఏకీభావము - ఐక్యము, ఒకటియగుట.

పొందు - 1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
పొందుతనము - (పొందు + తనము), 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందుకాఁడు - స్నేహితుడు.

ఒంటింపు - 1.అనుకూల్యము, 2.పనుల యేర్పాటు, 3.మైత్రి, 4.సహాయము.

పొసఁగుడు - వి.1.ప్రాప్తి, 2.స్నేహము.
పొసఁగు - క్రి.1.అనుకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.

మిత్ర సంగ్రహేణ బలం సంపద్యతే |
'మిత్రులని సంపాదించడం వల్ల బలం చేకూరుతుంది.'

శ్లో|| మైత్రీం భజతాఖిల హృద్ జైత్రీం, ఆత్మ వదేవ పరానపి పశ్యత|
     యుద్ధం త్యజత స్పర్థాం త్యజత, త్యజత పరేష్వ క్రమ మాక్రమణమ్||
తా. అందరి హృదయములను జయించు మైత్రిని పెంచుము. ఇతరుల నందరిని నీ వలెనే చూచుకొనుము. యుద్ధమును స్పర్థను త్యజించుము. ఇతరులపై అక్రమ ఆక్రమణను వదలి పెట్టుము. - శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి, కంచి. 

వాసనలు చతుర్విధాలు : 1.మైత్రి, 2.కరుణ, 3.ముదిత, 4.ఉపేక్ష. 

నిత్యతృప్తా భక్తనిధి - ర్నియంత్రీ నిఖిలేశ్వరీ|
మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ.

స్నేహము - 1.చెలిమి, 2.చమురు.
చెలిమి -
స్నేహము.
నూనియ - చమురు, రూ.నూనె.
ౘమురు - రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.  చమురులేని దీపపువత్తి చరచర కాలిపోతుంది.

చమురు గ్రంథులు - (జీవ.) చమురును అందచేసి శరీరముమీద రోమములు పెరుగుటకు సహాయపడు గ్రంథులు(Sebacous glands).

చము రింకిబోయినను దీ
పము శమియించిన విధంబు, పౌరుషము విహీ
నమె యగును; దైవ మనుకూ
లము గాకుండినను భూత, లమునఁ గుమారా!
తా.
చమురు తగ్గిపోఁగా దీపమేరీతిగా, దగ్గిపోవునో అట్లే పురుషుని ప్రయత్నమంతయు దైవమనుకూలము కాక యుండిన నశించును.

ౘమురు గింజల పైరులు - (వ్యవ.) నూనెనిచ్చు గింజల పైరులు, ఉదా. ఆముదము, వేరుసెనగ, కుసుమ, నూవు మొదలగునవి, (Oiled crops).

నువు - తిల, రూ.నువ్వు, నూవు.
నూవు -
నువు, రూ.నువ్వు, నూగు.
నూగు - నువ్వు, తిలసస్యము. నువ్వు - ఒకరకపు పంట.
తెలికలు - తిలలు, నువ్వులు, సం.తిలకః.
తిలలు - నువ్వులు.
తిలఘాతకుఁడు - గాండ్లవాడు, తెలికవాడు.
తెలికవాఁడు - గాండ్లవాడు.
గాండ్ల - నూనె ఆడి అమ్మి జీవించువారి కులము, తెలికలకులము.

తెలకపిండి - గానుగపిండి. 
గానుఁగ -
నూనె, చెరకురసము మొ.వి. తీసెడియంత్రము, పరంజము, రూ.గానిగ, గానుఁగు.

స్థిరతైలములు - (వ్యవ.) గాలి పారినను ఆరి, హరించిపోకుండ స్థిరముగానుండు నూనెలు (Fixed oils), ఉదా. నూవులనూనె, ఆముదము.
తైలము - తిలలనుండి లభ్యమగు నూనె, (ఏ నూనెనైన తైలమనుట పరిపాటియైనది, (రసా.) తైలములు కార్బన్, ఉదజని, ఆక్సిజన్ గల రాసాయనిక యౌగికములు.)  
అశోషకతైలములు - (వ్యవ.) గాలి పారినను చాలకాలము జిడ్డుగా నుండు నూనెలు. ఉదా. నూవులనూనె, వేరు సెనగనూనె మొ.వి (Non- drying oils).
కుసుమ - 1.ఒకరకపు ధాన్యము, (వడ్లలో పెద్ద కుసుమ, చిన్న కుసుమ, గుత్తికుసుమ మొ.వి. 2.(వ్యవ.) గింజల నుండి 'కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower). 

హైడ్రోజనేషన్ - (గృహ.) (Hydrogenation) నూనెలను నెయ్యివలె పేరుకొనునట్లు చేయుటకు ఉదజనిని తగుపాళ్ళలో కలుపుట (Dalda).
ఉదజనీకరణము - (రసా.) ఒక యౌగికమునకు ఉదజనిని రాసాయనిక ముగా కలుపుట, ఉదా. ద్రవరూప తైలమునకు ఉదజనిని కలుపుటవలన గడ్డకట్టు తైలములుగా మారును (డాల్డా వేరుసెనగ నూనెనుండి తయారు చేయుటలో).
ఉదజని - (రసా.) ఆమ్లజనితో సంయోగించి ఉదకము నిచ్చుటచే ఈ మూలద్రవ్యమునకు ఉదజని అను పేరు వచ్చినది (Hydrogen).

విస్పరీకరణము - (రసా.) నూనెలు, క్రొవ్వు మొదలగు వానిలోనున్న కర్బనామ్లముల సంయోగింపజేసి లవణముల వంటి సంయోగ ద్రవ్యములుగా మార్చుట (Esterification).

తడవగరాదు దుష్టగుణుఁ దత్త్వ మెఱుంగక నెవ్వరైన నా
చెడుగుణ మిట్లు వల్వ దనిచెప్పిన గ్రక్కునఁగోపచిత్తుడై
కడుఁదెగఁజూచుఁగా, మరుఁగగాగినతైలము నీటిబొట్టు పైఁ
బడునెడ నాక్షణం బెగసి, భగ్గినమండకయున్నె? భాస్కరా.
తా.
సలసల క్రాగుచున్న నూనెలో నొక నీటి బిందువు పడినచో తక్షణమే పైకిలేచి (మంటలు)మండును, అట్లే దుర్మార్గుని దుష్ప్రవర్తనమును మార్చుకొనమని చెప్పినచో వారు యెవ్వరైనను, ఆ దుష్టుడు వారి మీదకి తక్షణమే లేచును.    

తైలపాయిక - గబ్బిలము  వ్యు. నూనె త్రాగునది.
గబ్బిలము -
తైలపాయిక, ఇంటికప్పు మొ. నుండి తలక్రిందులుగా వ్రేలాడు ఒక రకపు పక్షి. రూ.గుబ్బిడా, గబ్బిడాయి, గబ్బిలాయి. జిబ్బటీ - గబ్బిలము, రూ.జిబ్బడాయి. 

చికురువాయి - 1.ఒక తెగ గబ్బిలము, 2.ఋషిపక్షి, 3.జతుక, రూ.చీకురాయి.
జతుక -
లక్క, రూ.జతువు, ఇంగువ.
ఇంగువ - ఇది Umbelliferac అను కుటుంబమునకు చెందిన (Fertula alliacea, F. foetida అను) మొక్కల వేళ్ళ నుండి తీయబడు జిగురు ద్రవ్యము. ఇది సంబారపు వస్తువుగను, ఔషధముగను ఉపయోగపడుచున్నది, సం.హింగుః.
హింగువు - ఇంగువ.

కట్టడయైనయట్టి నిజకర్మము జుట్టుచువచ్చి యేగతిన్
బెట్టునొ, పెట్టిన ట్లనుభవింపక తీరదు, కళ్ళు, మీఁదుగాఁ
గిట్టక వ్రేలుఁడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబుకుఁ చేసిన కర్మముగాక, భాస్కరా.
తా.
గబ్బిలములను ఇతరు లెవ్వరును తల క్రిందుగా చెట్టునకు వ్రేలాడ గట్టకున్నను, వానికి చుట్టుకున్న కర్మముచే నవి అట్లు వ్రేలాడ వలసి వచ్చెను. అట్లే, ఎవరికైనను విధి విధానమును దప్పించు కొనుటకు వీలులేదు, అది యనుభవించియే తీర వలెను.     

ప్రేముడి - స్నేహము, సం.ప్రేమన్.
ప్రేయసి -
ప్రియురాలు; ప్రియ - ప్రియురాలు.

హార్దము - స్నేహము, విణ.హృదయ సంబంధమైనది.   

గాదిలి - 1.ప్రేమము, ముద్దు, 2.చుట్టము, 3.ప్రియుడు, 4.భర్త, 5.భార్య, విణ.ప్రేమపాతము.
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్. 

ప్రణయము - 1.ప్రేమము, 2.వినయము.
ప్రణయని - ప్రియురాలు.

ప్రేమా నా ప్రియతా సార్దం ప్రేమ స్నేహః :
ప్రియస్య భావః ప్రేమా, న. పు. ప్రియతా చ.- ప్రియము యొక్క భావము, ప్రేమ ప్రియత.
హృదయే భవం హార్దం - హృదయ మందుఁ బుట్టినది.
ప్రీణనం ప్రేమ. న. న. ప్రీఞ్ తర్పణే - సంతోషింపఁజేయుట.
స్నిహ్యత ఇతి స్నేహః. ష్ణిహప్రీతౌ. ప్రీతి. ఈ నాలుగు 4 స్నేహము పేర్లు. 

ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చువెలగలది.
ఇష్టము -
1.యజ్ఞ కర్మము, 2.సంస్కారము, 3.యజ్ఞము, 4.కోరిక, విణ.1.కోరబడినది, 2.ప్రియమైనది, 3.పూజింపబడినది.
ఇష్టుఁడు - 1.ప్రియుడు, 2.ఆప్తుడు, 3.విష్ణువు.   
ప్రియుఁడు - ప్రాణనాథుడు.

ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

చుట్టము - 1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు.
(ౘ)చుట్టఱికము - బంధుత్వము, సంబంధము.

వావి - బంధుత్వము. తగిన అవసరము వచ్చినపుడు బంధువు లొకరి నొకరు కాపాడుకొనుట మిత్రత్వమునకు మిక్కిలి మంచిది. మిత్రుడు దుఃఖించు నపుడు చూపని స్నేహమేమి స్నేహము? ఆపదలలో ఆదుకునేవాడే - ఆత్మబంధువు.

విందు - 1.ఆతిథ్యము, చుట్టములులోనగు వారికిడు భోజనము, 2.చుట్టము, అతిథి.
ఆతిథ్యము -  ఆతిథేయము, విణ.అతిథికొరకైనది. 
అతిథేయము - అతిథి సత్కారము, విణ.అతిథికి యోగ్యమైనది.
ఆగంతుకుఁడు - అతిథి, విందు.
ఆగంతువు - అకస్మాత్తుగ వచ్చునది, అకస్మికముగ సంభవించునది, వి.అతిథి, విందు.

పరదేశా గమనము వలన స్నేహమును, ప్రేమ లేకపోవుట వలన మైత్రియును నశించును.

నేస్తము - స్నేహము, నెయ్యము.
నెయ్యము -
1.స్నేహము, చెలిమి, 2.ఇంపు, నెయ్యమి, నేయము, సం.స్నేహః.
ఇంపు - 1.ఇచ్ఛ, 2.ఆనందము, 3.మనోజ్ఞత, విణ.ఇష్టము, ప్రియము.
ఇచ్చ - 1.కోరిక, 2.చిత్తము, (చిత్తము - మనస్సు) సం. ఇచ్ఛా.
ఆనందము - సంతోషము, సుఖము.
మనోజ్ఞత - (గృహ.)1.ఆకర్షించు శక్తి, 2.రంజింపజేయు శక్తి, 3.సౌందర్యము(Charm), చక్కదనము.

ప్రియంవదుఁడు - ఇచ్చక మాడువాడు, ప్రియవాది.

సఖ్యము - చెలిమి, స్నేహము.
చెలిమి -
స్నేహము.
చెలికారము - స్నేహము, రూ.చెలిమి.
చెలిమికాఁడు - మిత్రుడు; సహృదుఁడు - మిత్రుడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు. 

ఉద్ది - 1.జత, జట్టు, 2.చెలిమి, విణ.1.సమానము, 2.ప్రతిస్పర్ధి.
ఉద్ధీఁడు - 1.జతకాడు, 2.మిత్రుడు, రూ.ఉద్ధికాఁడు. 

అనుఁగు - 1.చెలికాడు, 2.ప్రేమ, 3.ముఖ్యుడు, విణ.1.ప్రియుడు, 2.ప్రియురాలు, 3.మనోజ్ఞము, 4.సహాయుడు, 5.మొదటిది.
అనుఁగుకాఁడు - చెలికాడు; అనుఁగుఁగత్తె - చెలికత్తె.

ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ(దయ - కనికరము), 4.తృప్తి.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను భావము. 
ఆదట2  - అనంతరము, పిమ్మట. అనుక్రోశము - కనికరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content). 

సాప్తదీనము - చెలిమిరి, వ్యు.ఏడు మాటలలో లేక ఏడు అడుగులలో కలుగునది.
చెలిమిరి - 1.చెలికాడు, 2.చెలికత్తె.

వయస్య - చెలికత్తె; వయస్యుఁడు - చెలికాడు.
చెలికాఁడు - స్నేహితుడు; స్నేహితుడు - చెలికాడు.

సహవాసము - 1.కూడనుండుట, 2.స్నేహము.
సాహాయ్యము -
1.తోడుపాటు, 2.సహాయత్వము, 3.స్నేహము.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.

సార్థః ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః
ఆతురస్య భిషక్ మిత్రం దానం మిత్రం మరిష్యతః.
తా.
ప్రవాసికి ప్రవాసుల గుంపు మిత్రుడగును, ఇంటిలో నున్న వానికి భార్యయే మిత్రము, రోగికి వైద్యుడే మిత్రుడు, చావనున్న వానికి దానమే మిత్రుడు.

ప్రీతి - 1.సంతోషము, 2.స్నేహము.
సంతోషము -
సంతసము, ముదము.
ముదము - సంతోషము. సంతోసము - సంతసము.

పొత్తు - 1.స్నేహము, సంగతి, 2.అవిభక్తత.
సంగతము -
స్నేహము, చేరిక, విణ.యుక్తము.
సంగాతము - చెలిమి, సంగతము, సం.సంగతమ్.
సంగాతకత్తె - చెలికత్తె.
సంగాతకాఁడు - చెలికాడు, సంగాతి. 
సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము. సమీపము - చేరిక.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
జ్ఞానము - తెలివి, ఎరుక.
సమాచారము - 1.చక్కగా నడుపుట, 2.వృత్తాంతము.

నిద్ధము - 1.నిగ్ధము, నునుపైనది, 2.స్నేహము, రూ.నిద్ధా, సం.స్నిగ్ధము.
స్నిగ్థము - 1.స్నేహముగలది, 2.నునుపుగలది, 3.చక్కనిది.
స్నిగ్ధుఁడు - స్నేహితుడు. స్నేహితుడు దివ్యౌషధము వంటివాడు.

విస్రభము - 1.నమ్మకము, స్నేహము, 2.జగడము.
విస్రబ్దము - 1.నమ్మబడినది, 2.అణిగినది, 3.శాంతినొందినది, 4.అత్యంతము.
విశ్వస్తము - విశ్వసింపబడినది.
నమ్మకము - విశ్వాసము, నచ్చిక, రూ.నమ్మిక, నమ్మిగ.
నచ్చిక - విశ్వాసము, రూ.నచ్చిగ, నచ్చికము.నమ్మిక - నమ్మకము.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము. 

స్తబ్ధము - 1.అడగినది, ముడిగినది, 2.కదలలేనిది.
నిష్క్రియము - (గృహ.) స్తబ్ధముగా నుండునది (Passive).
నిష్క్రియ -(గృహ.)ఏమియు చేయ లేకపోవుట, ఊరక కూర్చుండుట.    

తనవారు లేనిచోటను
జనమించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువదగదు మహిలో సుమతీ.
తా.
తన బంధుజనము లేనిచోటను, లేశమైన పరిచయములేని ప్రదేశమునను, కలహమాడెడు తావునను, సందేహంగల తావునను మనుష్యుడు నిలువరాదు. యే స్థలమందైనను తనకు లాభములేని యెడల (తన మాటకు విలువలేని యెడ) ఉండుట మంచిదికాదు.

తెలివైన వాళ్ళు వెళ్ళడానికి సందేహించే ప్రదేశానికి మూర్ఖులు పరుగులు పెడతారు. - శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి 

అమాత్యుఁడు - 1.మంత్రి, 2.సహచరుడు, రాజుతో నుండువాడు.
మంత్రి -
1.ధీసచివుడు(ధీ - బుద్ధి), 2.సహాయుడు.
వ్యావహారికుఁడు - మంత్రి, సచివుడు. 
సచివుఁడు - 1.మంత్రి, 2.స్నేహితుడు, 3.సహాయుడు.
మంతిరి - మంత్రి, ప్రధానుడు, సం.మంత్రీ.
నియోగి - 1.మంత్రి, 2.నియోగి, బ్రాహ్మణులలో నొక తెగ.
నియోగీ - నొయోగి, సం.నియోగీ.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు. 
సహకారి - సహాయుడు. అంతరంగుడు - స్నేహితుడు.

ప్రెగడ - 1.మంత్రి, 2.ప్రధాన పురుషుడు, రూ.ప్రెవడ, ప్రెగ్గడ, పెగడ, సం.ప్రఘనః, ప్రకృష్టః, ప్రధానః.
ప్రగడ -
ప్రధాని, రూ.ప్రగ్గడ, ప్రెగడ, ప్రెగ్గడ, సం.ప్రఘనః., ప్రాజ్ఞః ప్రధానః.  
ప్రధానమంత్రి - (రాజ, శాస.) మంత్రి వర్గనాయకుడు, కేంద్రమంత్రి వర్గనాయకుడు.  

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలుడినట్లు జరుగదు సుమతీ.
తా||
మంత్రిగలవాని రాజ్యం చెడిపోక సుస్థిరంగా ఉండును, యంత్రపు ఇరుసు విరిగిన పనికిరానట్లు, మంత్రిలేని రాజ్యం యొక్క పాలన సాగనేరదు.

చెలిచుక్క - అనూరాధ.
చెలి - స్త్రీ, స్నేహితురాలు. భార్య శ్రేష్ఠమైన స్నేహితురాలు.
చుక్క -
1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు.  శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

ఉగ్మలి - 1.స్త్రీ(స్త్రీ - ఆడుది), 2.స్నేహితురాలు, 3.ఇల్లాలు.
ఇల్లాలు -
భార్య, ఇంటియజమానురాలు.
గృహిణి - ఇల్లాలు, భార్య.

నాస్తి భర్యాసమో బంధు, ర్నాస్తి భార్యాసమాగతిః,
నాస్తి భార్యాసమో లోకే సహాయోధర్మా సంగ్రహే.
- మహాభారతం

సఖి - 1.సకి, చెలికత్తె, 2.స్నేహితుడు, సహాయుడు, సఖుడు.
సకి - సఖి, చెలి, స్త్రీ(స్త్రీ - ఆడుది), రూ.సకియా, సం.సఖి.
ఆఁడది - ఆఁటది ఆఁటది, రూ.ఆడుది. 
ఆఁటది - ఆడుది, ఇంతి, రూ.ఆఁడది, ఆఁడుది.
ఇంతి - 1.స్త్రీ, 2.భార్య, 2.చెలికత్తె, సం.స్త్రీ, ప్రా. ఇత్థీ, ఇత్థియ.
చెలియ - స్త్రీ; సహధర్మిణి - భార్య; అనుఁగుఁకత్తె - చెలికత్తె.
జన్య - 1.తల్లి, చెలికత్తె, 2.తోడ పెండ్లికూతురు, 3.సుఖము.  

స్త్రీగా పుట్టడంలో విశేషమేమిటంటే ఆమె తన పనులు చేసుకుంటూనే మరో మనిషికి తిండి, సుఖం అమరుస్తుంది. - పెరల్ బక్

ఆలి - శుద్దంతఃకరణము గలది. వి. 1.తేలు, 2.తుమ్మెద, 3.శ్రేణి, 4.చెలికత్తె, 5.ఆనకట్ట.

అళి స్స ఖ్యావళీ అపి : అళి శబ్దము చెలికత్తెకును, పఙ్క్తికిని, అపిశబ్దము వలన కట్టకును పేరు. అలతీ త్యాళిః. సీ. అల భూషణాదౌ. – అలంకరించు ను గనుక ఆళి.

ఆళి - 1.పంక్తి, 2.చెలికత్తె, 3.తేలు, 4.సముదాయము, 5.ఆనకట్ట.
అళిని -
1.ఆడుతుమ్మెద, 2.తుమ్మెదల సముదాయము.

ఆళి స్సఖీ వయస్యా చ -
అలతి అనురూప సంబంధినీవ భూషయతి ఆళిః - అనురూప సంబంధిని వలె భూషించునది.
గుణాదినా సమానా ఖ్యాతి రస్యా ఇతి సఖీ - గుణాదులచేత సమానమైన ఖ్యాతి గలది.
వయసా తుల్యా వయస్యా - వయస్సు చేత సమానయైనది. ఈ మూడు 3 చెలికత్తె పేర్లు.

ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించున ఆడ్డంకి.
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట.
డామ్ - (భూగో. అర్థ.) (Dam) నీటిపారుదల, విద్యుచ్ఛక్తి తయారు చేయుటకుకై నది లోని నీరు వృథాకాకుండ నిలుచుటకై కట్టిన ఆనకట్ట. 
జలవిద్యుచ్ఛక్తి - (భూగో. అర్థ.) నీరు ఎత్తు నుండి లోతునకు పడునపుడు ఉత్పత్తియగు శక్తినుండి సేక్రించు విద్యుచ్ఛక్తి.  
వారధి - వంతెన, అడ్డకట్ట (ఈ అర్థము తెలుగునందే). 
వంతెన - ఏటిపైకట్ట, వారధి.
సేతువు - నీటికట్ట.

గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించినదానికై విచారించుట.  

అళి - 1.తుమ్మెద, 2.తేలు, రూ.అలి.
అలి - 1.తుమ్మెద, 2.తేలు, 3.కోకిల, 4.కాకి, రూ.అళి.
అలివేణి -
1.తుమ్మెదల బారువంటి జడగల స్త్రీ, 2.స్త్రీ.

అళి ద్రోణౌ తు వృశ్చికే :
అలయోగాత్ అళీ - అలమనఁగా దోఁక, అది గలది.
ఆళిః, "అలం వృశ్చికలాంగుల ద్రోణ ఆలీ తు వృశ్చిక" ఇతి హలాయుధః, "భృంగవృశ్చికయోరళి" రితి రభసశ్చ.
ద్రుణతీతి ద్రోణః, ద్రుణ హింసాగతి కౌటిల్యేషు - హింసించునది.
ద్రూణమని కొందరు. వృశ్చిక శబ్దమునకు పూర్వమువలె వ్యుత్పత్తి. ఈ 3 ఎఱ్ఱతేలు పేర్లు.

ద్రోణము - వి. ద్రోణము, సం.వి.1.తూము, 2.తేలు, 3.మాలకాకి.
తూము -
1.నీరుపోవుటకు కట్టిన కాలువ, 2.నాలుగు కుంచముల కొలత.
నీరుగండి - తూము.
తేలు - 1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.
తేలగిల్లు - 1.పైకితేలు, 2.పరవశమగు, రూ.తేలగిలు.
ఐంద్రము - 1.మాలకాకి, 2.(జ్యోతి.) ఒకానొక పంచాంగ యోగము, విణ.ఇంద్రునకు సంబంధించింది.
అసురము - 1.ఏనుగు, 2.మాలకాకి; బొంతకాకి - మాలకాకి.
కాకోలము - 1.ఒకవిధమగు నరకము, 2.బొంతకాకి, 3.ఎఱ్ఱని పాము, 4.విషము.

ద్రోణకాకస్తు కాకోలో :
ద్రుణాతీతి ద్రోణః, ద్రోణశ్చాసౌ కాకశ్చ ద్రోణకాకః. ద్రూ హింసాయాం. - హింసించెడు కాకి.
కాకేషు కోలతి స్థూలో భవతీతి కాకోలః. కుల సంస్త్యానే. - కాకులలో గొప్పది. ఈ రెండు మాలకాకి పేర్లు.

విషము - 1.గరళము, 2.జలము.
గరళము -
1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు.
విషధరము - 1.పాము, 2.మేషము, (విషము = నీరు, విషము).
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు. 
సర్పము - పాము, సప్పము.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి. (గణి.) కొలతలలోని తప్పులు.
పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము - పాము snake.
కలుషము - పాపము; దురితము - పాపము. 
కస్తి - 1.కష్టము, 2.వగ, 3.దుఃఖము, 4.విపత్తు.
రుద్దు - పులుము, తోము. తోము - రుద్దు.

దోషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు.
దొషాచరుడు -
1.చంద్రుడు, 2.రాక్షసుడు, వ్యు.నిసియందు తిరుగువాడు.

శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః|
పరోపకారః పుణ్యాయ - పాపాయ పరపీడనమ్||
తా.
అనేక గ్రంథములయందు జెప్పబడిన విషయమును నేనర్థ శ్లోకమందు దేటపఱచెద(విశదమగునది). అదెట్లనిన, పరులకు ఉపకారము జేయుట పుణ్యముకొఱకును, పరులను పీడించుట పాపముకొఱకు నగును. - నీతిశాస్త్రము   

ద్రుణము - 1.కత్తి, 2.విల్లు, 3.తేలు, 4.తుమ్మెద.
ద్రూణము - ఎఱ్ఱతేలు, తేలు రూ.ద్రుణము.

కత్తి - 1.ఖడ్గము, 2.మంగలి కత్తి, సం.కర్త్రీ.

కరవాలము - కత్తి.
కరవీరము - 1.కత్తి, 2.గన్నేరు. కత్తియ - స్త్రీ ప్రత్యయము, ఉదా.చెలికత్తియ, సొగసుకత్తియ.

వాలము - 1.తోక, 2.కత్తి.
వాలము -
బెబ్బులి. తోఁక - తొంక. లాంగూలము - తోక.
తొంక - పుచ్ఛము, వ్యు.తొంగునది, వంగియుండునది, రూ.తోఁక.
పుచ్ఛము - తోక. 
పుచ్ఛసంబంధి - (జం.) తోకకు సంబంధించినది, (Caudal). 

తోకఁచిచ్చు - 1.నిప్పు రగిల్చిన పిడకల వరుస, 2.ఒక దాని నుండి మరొకటి అంటు కొనుచు వ్యాపించు అగ్ని.
అంటుకొను - క్రి. 1.అగ్ని రగులుకొను, 2.ముట్టుకొను.
క్రమము - విణ.ఇంపైనది, వి.పిడక నిప్పు.  

అంటించు - 1.అతికించు, 2.చేర్చు, 3.(తేలు) కుట్టు.
అతుకు1 -
చేర్చి కుట్టుట(అతుకు-కుట్టు), కత్తిరిచిన వానినిదగ్గర చేర్చికుట్టిన భాగము (Seam).
అతుకు2 - క్రి. 1.అతికించు, కలిసిపోవునట్లు చేయు, 2.అంటుకొను, 3.సరిపడు, వి.అతుకుట, 2.అతికినభాగము, రూ.అదుకు.
అదుకు - క్రి. అతుకు.
చేరుచు - క్రి. చేర చేయు, రూ.చేర్చు.
కుట్టు - 1.శూల రోగము (Chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు. సూల - శూలరోగము, సం.శూలా.

విల్లు - ధనుస్సు.
తేలు - 1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.

తుమ్మెద - భ్రమరము.
భ్రమరము -
1.తుమ్మెద, 2.ముంగురులు.
భ్రమణము - 1.తిరుగుట, 2.తుమ్మెద, సం.వి. (భౌతి., గణి.) పరిభ్రమణమునకు విరుద్ధముగ ఒక వస్తువు ఇంకొకదాని చుట్టు ఒక కక్ష్యలో తురుగుట (Revolution), ఉదా.భూమి సూర్యునిచుట్టు తిరుగును, సం. (గణి.) ఏదైన బిందువు చుట్టుగాని సరళరేఖ చుట్టుగాని తిరుగుట (Rotation).
భ్రమి - (భౌతి.) శరీర కేంద్రమం దొక కుహరమును(కుహరము - 1.గుహ, 2.రంధ్రము.)కల్పించుకొని ఒక ప్రవాహి గ్రహించుభ్రమణము (Vorten motion), (పర్యాయ పదము, భ్రమరకము).
భ్రమరకము - 1.తుమ్మెద, 2.బొంగరము.
బొంగరము - త్రాడుచుట్టి యాడెడు ఆటవస్తువు, సం.భ్రమరకమ్. 

కురుళము - ముంగురులు.
కురులు -
ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
ముంగురులు - (ముందు+కురులు) నొసటిపైన గునిసి యాడెడు ఉంగరపు వెండ్రుకలు. 

భ్రమర కీటన్యాయము - న్యా. ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లే తాననురీతి (తుమ్మెద పురువుం దెచ్చి తన గూటిలో నుంచి దాని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగు నను రీతి).

మధుప్రతో మధుకరో మధులిణ్మధు పాళినః
ద్విరేఫ పుప్పలి ద్భృఙ్గ షట్పద భ్రమ రాళయః. (ఇన్దిన్దిర శఞ్చరీకో రోలమ్బో బమ్భరశ్చసః.) :
మధు పుప్పర సం వ్రతయతి భుజ్క్తే మధువ్రతః. వృతు వర్తనే. - పూఁదేనను భుజించునది.
మధు కరోతీతి మధుకరః. దు కృఞ్ కరణే. - పూఁదేనెను జేయునది.
మధు లేఢీతి మధు లిట్. హ. పు. లిహ ఆస్వాదనే. - పూఁదేనెను ఆస్వాదించునది.
మధు పిబతీతి మధుపః పా. పానే. - పూఁదేనెను బానము సేయునది.
అలతి భూషయతి పద్మాదిక మితి అళీ. న. పు. అల భూషణాదౌ. - పద్మాదుల నలకరించునది.
అస్య భ్రమర ఇతి నామ్నిద్వౌ రేఫా స్త ఇతి ద్విరేఫః - భ్రమర మను తన పేరునందు రెండు రేఫలు గలది.
పుష్పం లేఢి ఆస్వాదయతీతి పుష్పలిట్. హ. పు. లిహ ఆస్వాదనే. - పుష్పము నాస్వాదించునది.
కార్ష్యం భరతీతి భృఅంగః. భృఞ్ భరణే. - నలుపును భరించునది.
షట్పదా న్యస్యేతి షట్పదః - ఆఱుకాళ్ళు గలది.
భ్రమతీతి భ్రమరః భ్రము అనవస్థానే. - తిరుగు చుండునది.
ఆలతి పుష్పాణి ఆళి. ఇ. పు. అల భూషణాదౌ. - పుష్పముల నలంకరించునది.  
(ఇందతి ఇందిరయా ఇందిందిరః ఇది పరమైశ్వర్యే. - పద్మ సంపదతోఁ గూడినది.  
చరతీతి చంచరీకః. చర గతి భక్షణయోః - చరించు చుండునది.
రౌతీతి రోలంబః. రు శబ్దే. - మ్రోయునది. పా. రలయోర భేదా ల్లోలంబః.
బమితి శబ్దం బిభర్తీతి బంభరః – బం అనెడు శబ్దమును భరించునది.  - తుమ్మెద పేర్లు. ఇందిందిరాదులు నాలుగు అధికనామములు).  

మధుకము - తుమ్మెద.
మధుకరము - 1.భిక్షాన్నము, 2.తుమ్మెద.

బంభరము - తుమ్మెద.
తేటి - తుమ్మెద, తేనెటీగ; తేనెదిండి - తుమ్మెద. తియ్యని తేనెనిండిన నోటితోనే, తేనెటీగ కుట్టేది.

ఉచ్ఛిష్టము - 1.ఎంగిలి, తినగా మిగిలినది 2.పూర్వులు ఉపయోగించి నది, వి. తేనె.
ఎంగిలి - 1.ఉచ్ఛిష్టము 2.లాలాజలము (Saliva).

తుమ్మిపూవులు తెచ్చినీకు తుష్టుగా పూచేదమంటే  ఓ...….
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.....ఏమి సేతురా|

లోలంబము - తుమ్మెద, రోలంబము.
రోలంబము -
తుమ్మెద.

లంబ - దుర్గ, లక్ష్మి. 
లోల -
1.నాలుక, 2.లక్ష్మి, విణ.1.కదలునది 2.మిక్కిలి యిచ్ఛకలది. ఉత్పలావర్తనము నందు దేవిస్థానం లోల. 
లోలతీతి లోలః. లుల సంచలనే - కదలునది. 
లోలశ్చల సతృష్ణయోః : లోల శబ్దము కదలుదానికిని, ఆశ గలవానికిని పేరు. 

ద్విరేఫము - భ్రమరము, వ్యు.రెండు రేఫలు కలది.
రేఫము -
ర వర్ణము, విణ.అధమము. 
పుష్పదయము - తుమ్మెద.

భృంగము - తుమ్మెద, షట్పదము. 
షట్పదము -
తుమ్మెద, వ్యు.ఆరు కాళ్ళుకలది.

భృంగరాజము - 1.గండుతుమ్మెద 2.గుంట గలిజేరు.
భృంగారము - 1.బంగారు పాత్రము 2.గుంట గలిజేరు.

భ్రమరాంబ - 1.అంబ, పార్వతి. భ్రామరి - పార్వతి. శ్రీశైలే భ్రమరాంబికా|

భ్రమర కీటన్యాయము - ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లే తాననురీతి (తుమ్మెద పురువుం దెచ్చి తన గూటిలో నుంచి దాని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగు నను రీతి).

ఓం హ్రీంకారాంభోజ భృంగికాయై నమః : హ్రీంకార రూపమైన పద్మము నందు లలితాదేవి భ్రమరము వంటిది. పరాగ, పరిమళాదులు విశేషంగా ఉండునట్టి పద్మంలో విశేషాసక్తితో భ్రమరం ఉంటుంది.

ఇందిందిరము - తుమ్మెద.
ఇందిర -
లక్ష్మి; ఇంది - లక్ష్మి, రూ.ఇందిర.

చంచరీకము - తుమ్మెద, వ్యు.చరించు చుండునది.
చరించు -
1.కదులు, 2.తిరుగు, 3.చేయు. 
తిరుగు - 1.సంచరించు, పరిభ్రమించు, 2.వెనుకకు మరలు, 3.పరివేష్టించు, రూ.తిరువు, తిర్గు.
తిరుగు - తిరుగుట. 
భ్రమించు - క్రి. తిరుగు, పరిభ్రమించు.
తిరుగుడుపడు - పరిభ్రమించు.
చేయు - 1.ఒనర్చు, 2.నిర్వహించు.

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెద...నీ ఒల్లు జాగరతె తుమ్మెద...  

తుమ్మెదలు ఘ్రాణీద్రియం(ఘ్రాణం, ఘోణ-ముక్కు) వల్ల నశిస్తున్నాయి. తుమ్మెదలు ఒకదాని నొకటి కలిసి యుండవు - వీడియుండును.

నాన - ముక్కు, రూ.నస, నాసిక.
ఘ్రూణము -
ముక్కు, విణ,మూర్కొన బడినది.
ఘ్రాతి - 1.ముక్కు, 2.వాసన, 3.వాసనచూచుట.

ముకు - నాసిక, రూ.ముక్కు.
నాన - ముక్కు, రూ.నస, నాసిక. ముక్కుతో చూడగలం-వాసన; కంటితో చూడలేము.

నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి |
తత్ర వాయుర్గంధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః ||

తా ననుభవింప నర్థము  
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగల గూర్చిన      
తేనియ తేరుజేరునట్లు తిరముగ సుమతీ.
తా.
అడవియందు తేనెటీగలు కష్టపడి కూడబెట్టిన తేనె ఇతరుల పాలయినట్లు, తాననుభవింపని ధనం భూమీశుల పాలగును, మఱికొంత భూమిపాలును అగును.

తేనె సేకరించే వాడు క్రింద చూడకుండా పడిపోతూ ఉంటాడని జూదం జరుగుతున్నప్పుడు, విదురుడు దృతరాష్ట్రుడుతో, దుర్యోధనుడు గురించి చెప్పాడు. ఇది శుక్రాచార్యుడు చెప్పిన నీతి అని కూడా చెప్పాడు.

గోల - 1.వట్రువయగు నీటికాగు, 2.గుండ్రని పదార్థము, 3.మణిశిల, 4.చెలికత్తె, 5.గోదావరీనది, వి.1.ముగ్ధ, ముగ్ధుడు, 2.కలకలము.
గోదారి -
1.వెన్న కాచినమడ్డి, 2.గోదావరి. గోదావరి - గౌతమీనది.
బేల - 1.మూఢురాలు, 2.ముగ్ధ, 3.మూఢుడు, 4.గోల, 5.అమాయకుడు, సం.భేలః.
భేల - పేల, ముగ్ధ; భేలుఁడు - 1.మూర్ఖుడు, 2.చలించువాడు.
ముగ్ధ - 1.ముదిత, 2.ఒక నాయిక, వికృ.ముగుద. 
ముదిత - ముద్దియ, స్త్రీ; ముగుద - స్త్రీ, సం.ముగ్ధా.
ముదియ - స్త్రీ, రూ.ముద్దియ, సం.ముగ్ధా.
వాణీని - ఆటకత్తె, ముగ్ధ. 

కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
మూఢుఁడు -
1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
మొఱటు – మోటు; మోటు - 1.మొద్దు, 2.తట్టువ గుఱ్ఱము, 3.పంది కెదుట మనుష్యా కారముగ నిల్చిన కపటలక్ష్యము, విణ.మూర్ఖుడు, సం.మూఢః.
మొద్దు - మ్రానిమోడు, విణ.1.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః. 
అమాయకుఁడు - మాయ, కపటము మొ. వి. ఎరుగనివాడు, రూ.అమాయకుడు.
గోసన - 1.చాటించుట, 2.గోల, కలకలము, సం.ఘోషణా.
(ౘ)చాటువ - చాటించుట. ఘోషణ - చాటింపు.
కలకలము - గుంపున పుట్టిన పెద్ద మ్రోత; గొలక - కలకలము.

దొండోర - చాటింపు, రూ.తండోరా, దండురా.
(ౘ)చాటు -
1.విశదపరచు, 2.ఎల్గెత్తి చెప్పు, వి.మరుగు, రహస్యము. అతిరహస్యము బట్టబయలు, ముగ్గురుకు తెలిసిన రహస్యము మూడు లోకాలా ప్రాకినదే. ఆరు చెవులలో పడినది అసలే రహస్య మనిపించు కోదు. 

ఉత్త - 1.వట్టి, 2.కేవలము, 3.అసత్యము, 4.పనిలేనిది, 5.ఏహ్యము, సం.వ్యర్ధమ్, రిక్తమ్.  
వట్టి - 1.రిక్తము, ఉపయోగములేనిది 2.అసత్యము.
రిత్త - 1.రిక్తము 2.కల్ల 3.కారణములేనిది అవ్య.ఊరక, సం.రిక్తం.
కల్ల - 1.అసత్యము 2.పరుషవచనము.
రిత్తవోవు - వ్యర్థమగు. ప్రవాదము -కారణము లేకయే వ్యాపించిన మాట.
రిత్తిక - మరదలు, తమ్ముని భార్య.
కేవలము - 1.నిర్ణయము, అవధారణము, విణ.1.అంత, సమస్తము 2.అచ్చము, ఒకటి 3.ప్రధానము.
అసత్యము - బొంకుమాట విణ.సత్యముకానిది.
ఏహ్యము - ఏవను, విణ.రోత పుట్టించునది  సం.హేయము.
హేయము - 1.రోతయైనది 2.విడువదగినది.
అటమట - 1.వంచన, 2.దుఃఖము, విణ.1.వ్యర్ధము, 2.అసత్యము. చూసేది (కన్ను) చెప్పదు. చెప్పేది (నోరు) చూడదు.

అళీకం త్వప్రియే నృతే : అళీక శబ్దము అప్రియమునకును,  అసత్యమునకును పేరు. అల్యతే వార్యత ఇత్యళీకం. అల భూషణాదౌ. వారింపఁబడునది. "ఆళీకం తు లలాటే స్యా"దితి శేషః.

ఎంతటి శక్తినైనా క్రుంగదీసేది - అసత్యం.

మాటకు ప్రాణంబు సత్యము
కోటకు ప్రాణము సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.
తా||
మాటకు సత్యం, కోటకు మంచి సైన్యం, స్త్రీకి శీలం(బోటికి - 1.స్త్రీ, 2.చెలికత్తె), పత్రమునకు సంతకం జీవనాధారములు. 

సత్యం ఎంత చిన్న స్థలం లోనైన ఇమిడి పోతుంది. అసత్యానికే ఎక్కువ చోటు కావాలి. - హెన్రీ సెంట్ జాన్(1678-1751)

హింసకు దారితీసేది కీడు కలిగించేది అయితే, అది సత్యమైనా సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. మనిషికి ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానేకాదు.

అళీకము - 1.అప్రియమైనది, 2.అసత్యమైనది, వి.1.అప్రియము, 2.బొంకు, 3.నొసలు, (నోటి శమింపులకు నొసలు అనుకూలి).

వ్యళీకము - 1.అప్రియము, 2.అసత్యము, 3.బాధ, 4.సిగ్గు, 5.అచ్చెరు పాటు, 6.మోసపుచ్చుట, 7.కామినీ జనాపరాధము.

మభ్యపెట్టు - 1.మోసపుచ్చు, 2.ఉపాయముగ దాటవేయు. 

పీడార్థే పి వ్యళీకం స్యాత్ :
వ్యళీకశబ్దము దుఃఖమునకు, ఆపి శబ్దమువలన అప్రియమునకును, అకార్యమునకును, సిగ్గునకును, కామినీ జనాపరాధమునకును పేరు. విశేషేణ అల్యకే వార్యత ఇతి వ్యళీకం - విశేషముగా వారింపఁ బడునది. "వ్యళీక మప్రియా కార్యవైలక్ష్యానృత కామజే" ఇతి శేషః కామజః కామావేశ కృతో హ్ పరాధః లజ్జాయాం. "వ్యళీక నిశ్వాసమివోత్ససర్జ" ఇతి "సత్రాంతే సచివసఖః పురస్త్రియాభిః గుర్వీభిశ్శమిత పరాజయవ్య్ళికా"ఇతి, కుమారసంభవే, రఘువంశే చ ప్రయోగః.

ఆలము1 - 1.యుద్ధము 2.ఆగడము.
యుద్ధము -
1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము.
కయ్యము - జగడము, యుద్ధము. పొరిగింటి కలహము వినవేడుక.
కలహము - సమరము, వికృ. కయ్యము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది. 
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
ౙగడగొండి - కలహశీలుడు, కలహశీలురాలు. 
ఆగడము - 1.చెడ్దపని, 2.దుష్కార్య చిహ్నము, 3.దౌష్ట్యము(దౌష్ట్యము – దుష్టత్వము), 4.వంచన(వంచన - మోసము), 5.అనాదరము, 6.అన్యాయము, 7.ఉత్పాతము, విణ.1.వంచకుడు(వంచకుఁడు – మోసకాడు), 2.అపరాధి, సం.ఆగస్.
తీఁపురము - ఆగడము.
అపకారము - 1.కీడు, 2.ద్రోహము, 3.చెడ్దపని, రూ.అపకృతి.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
ద్రోహము - 1.కీడుతలపు, 2.చంపు నిచ్చ.  
అపకృతి - అపకారము. అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
అపకర్షము - 1.తొలగించుట, 2.తగ్గించుట, 3.అవమానపరచుట, (భౌతి.) ఒక వస్తువు ఇంకొకదానిని మళ్ళ గొట్టు గుణము (Repultion).
దుర్నయము - 1.అన్యాయము, 2.దుర్నీతి.  అన్నెము - పాపము, సం.అన్యాయః.
నీళ్ళుతోడు - జాతీ. ద్రహముచేయు, కీడు తలపెట్టు. దుష్టబుద్ధికి ద్రోహచింతకు మందులులేవు. 

ఉత్పాతము - 1.ఉల్కాపాతము, మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.

ఆగడకాఁడు - (ఆగడము + కాడు) అకార్యముల చేయువాడు, దుండగీడు, దుష్ఠుడు.
ఆగడీఁడు - అకార్యము చేయువాడు, దుండగీడు, దుష్టుడు.
దుండగీఁడు - 1.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు), 2.కొంటె.
కొంటె - అకార్యశీలుడు, తులువ.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు.  

జాడ్యం హ్రీమలిగణ్యతే వ్రతరతే దంభ శ్శుచౌకై తనం, 
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని|
తేజస్వి న్యవలి ప్తతా ముఖరతా వక్తవ్య శక్తిస్థిరే,
తత్కోనామగుణో భవేత్సుగుణినాం యా దుర్జనై ర్నాంకితః||
తా.
దుర్జనుఁడు సజ్జనుల యందుగల సద్గుణములను దుర్గుణములుగా నెంచును. అవియెట్లనిన, లజ్జావంతునిజూచి జడుఁడని చెప్పును, వ్రతశీలుని డాంభికుఁడని చెప్పును, ఆచారవంతుని కపటుఁడని చెప్పును, శూరుని కనికరములేనివాఁడని చెప్పును, తేజస్సుగలవానిని గర్వించు వాఁడని చెప్పును, సద్వర్తనుని వాచాలునిగా నెంచును, కావున దుర్జనునికి సకల జనులయందలి సద్గుణ మొకటియైనను కనుపడదు. - నీతిశాస్త్రము

అలము2 - 1.వ్యాపించు, 2.ఆక్రమించు, 3.చుట్టుకొను, 4.కౌగలించు, 5.కప్పు, 6.అదుము, 7.పట్టుకొను, 8.పూయు, వి.నేలపై ప్రాకుతీగ.

ఒలయు - 1.వ్యాపించు, 2.కలుగు, 3.ప్రవేశించు, 4.చుట్టుకొను, 5.కలయు, 6.చేరు. తిరువులుగట్టు - వ్యాపించు.
ఆక్రమణము - 1.క్రమ్ముట, ఆక్రమించుట, 2.బలిమిచే వశపరచు కొనుట.
ఒత్తరించు - 1.మించు, 2.ఆక్రమించు, సం.ఉత్తరణమ్.
మొగరించు - 1.ఆక్రమించు, 2.ఎదిరించు.
అఱుము- 1.ఎదుర్కొను, 2.బాధించు, 3.ఆక్రమించుకొను, 4.ప్రతిఘటించు, 5.తెగించు, 6.విజృంభించు, వి.ఆక్రమణము.
చుట్టుకొను - క్రి. పరివేష్టించు.
కౌగిఁలి - ఆలింగనము, కవుగిలి.
కప్పు - 1.అచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు, 4.చీకటి, క్రి.1.క్రమ్ము 2.మూయు.
అదుము - క్రి. అణుచు, నొక్కు.
పూయు - క్రి. అలదు, మెత్తు; అలదు - పూయు.

మొత్తు - దెబ్బ, క్రి.మోదు, కొట్టు, నరకు.
మోఁదు -
కొట్టు, వి.దెబ్బ.
దెబ్బ - తాడవము, కొట్టు. తాడించు – కొట్టు; అడుచు - కొట్టు.
తాడనము - కొట్టుట.
ప్రహరణము - 1.ఆయుధము, 2.బాణము, 3.కొట్టుట. 
కొట్టు1 - కొట్తడి.
కొట్టు2 - ప్రహరించు.
వేటు - వేయుట, దెబ్బ రూ.వ్రేటు.
అభిఘాతము - 1.దెబ్బ, 2.కొట్టుట 3.సమూలనాశము.

చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.

చీకటింట్లోకి వెళ్ళరాదు - చిక్కుముళ్ళు త్రొక్కరాదు - తేలుకొండె. తేలుకు పెత్తన మిస్తే తెల్లవార్లు అంటబొడిచినదట.

ముర్మురము - 1.కుమ్ము, 2.సూర్యుని గుఱ్ఱము.
ముర్మురుఁడు -
మన్మథుడు, వ్యు.అందర నావహించువాడు.

కుమ్ము - 1.నలియగొట్టు, 2.పొడుచు, రూ.క్రుమ్ము వి.1.పొట్టునిప్పు, 2.పోటు, 3.జగడము.
నలుచు -
క్రి. నలియచేయు, నలుపు.
మీటు - క్రి.1.పొడుచు, 2.కుట్టు, 3.ఎగజిమ్ము, వి.1.పెంపు, 2.ఉద్రేకము, విణ.అధికము.
క్రుమ్ము - కొమ్ములపోటు, క్రి.పొడుచు. పోటు పొడవటము వదలాలి.
కుకూలము -
1.పసినాటిన గుంట, 2.కుమ్ము, పొట్టునిప్పు.
పోటు - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 4.పెద్ద అల.
వాడి - 1.పదును, 2.శౌర్యము, విణ.తీక్షము, క్రూరము. 
పోతుకరడు - పెద్ద అల. కల్లోలము - 1.పెద్ద అల, 2.ఆనందము. 

ఊతి - 1.కుట్టు, 2.నేత, 3.రక్షణము, 4.క్రీడ.
కుట్టు -
1.శూల రోగము (chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు. సూల - శూలరోగము, సం.శూలా.

నేఁత - ప్రభువు.
రక్షణము -
క్రీడ -
1.ఆట, 2.ప్రియుల పరిహాసము, 3.అనాదరము, 4.వినోదము, 5.విహారము, 6.గంతులువేసి ఎగురుట.

క్రీడి - అర్జునుడు, సం.కిరీటి.
క్రీడించు - ఆటలాడు, విహరించు.

సేవనము - 1.కొలువు, 2.కుట్టు.
కొలువు - ఓలగము, అస్థానము 2.సేవ.

నేవ కార్థ్యను జీవినః :
సేవతే సేవకః షేవృ సేవనే. - సేవించువాఁడు.
అర్థనమర్థః. సో స్యాస్తీతి అర్థీ. న.పు. - అడుగుట గలవాఁడు.
ప్రభుమనుసృత్య జీవతీతి అనుజీవీ. న.పు. - ప్రభువు ననుసరించి బ్రతుకువాఁడు. 3 కొలువువాఁడు. 

ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ.
తా.
ఎంతపని చేసినను అతని యందు దోషమునే వెదకుచుండు యజమాని యొక్క కొలువును మానుకొనవలెను, లేని యెడల సర్పము పడగ క్రింద ఉన్న కప్పరీతి ఆపదలకు గురికాగలరు.

ఎచ్చటనైనను అవసరము కంటే అధికముగా చేసిన పని కష్టములకే కారణ మగును. శ్రమ తెలిసికొనలేని యజమాని యొక్క సేవయు, చెడ్దవాని వద్ద కొలువును మిక్కిలి ఆపదలు కలిగించును.

ఆలము3 -ఉపేక్ష, 1.ఉపేక్షితము, అనాదరింపబడినది, 2.అసత్యమైనది.
ఉపేక్ష - 1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము.
అశ్రద్ధ - 1.ఆసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి, (కడపటి రెండర్థములును తెనుగునందు మాత్రమే గలవు).
అసడ్ద - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
కక్కుఱితి - 1.లోభము, 2.అశ్రద్ధ. 
లోభము - 1.కక్కురితి, 2.పితలాటకము, 3.పిసినితనము.
పితలాటము - మోసము(వంచన - మోసము), రూ.పితలాటకము.
నిర్లక్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దైవాధీనమైనది, (Casual), వి.అశ్రద్ధ.     

బొంకు - కల్లమాట, క్రి.కల్లలాడు.
బొంకరి - కల్లలాడువాడు.
అలికము - నొసలు, లలాటము, రూ.అళికము.
నొసలు - నుదురు; లలాటము - నుదురు; నుదురు - నొసలు.
నిటలము - నొసలు, రూ.నిటాలము.
నిటలాక్షుఁడు - శివుడు.

ఫాలము - 1.నెత్తి(నెత్తి – తల), లలాటము.
ఫాలనేత్రుఁడు -
ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.  

ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్ష మెత్తఁగ వలసెన్
దనవారి కెంతగల్గిన
దనభాగ్యమె తనకుఁగాక తధ్యము సుమతీ.
తా.
కుబేరుడంతటి ధనవంతుడే స్నేహితుడుగా ఉన్నను, ఫాలాక్షునకు భిక్షాటన తప్పలేదు. కాబట్టి తనవారి కెనలేని సంపద యున్నను, తనకెంత ప్రాప్తమో అంతే లభించును. కాని ఎక్కువ కల్లనేరదు. 

శీతకారు - (వ్యవ.) డిసెంబర్, జనవరి నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ౠతువు.    

18. జ్యేష్ఠ - 1.ఒక నక్షత్రము, 2.పెద్దమ్మ.
పెద్దమ్మ -
1.జ్యేష్ఠాదేవి, 2.పెద్దతల్లి.
మూదేవి - (వ్యవ.) పెద్దమ్మ. 
జెష్ఠ - 1.దారిద్ర్యదేవత, 2.పెద్దమ్మ, సం.జ్యేష్ఠా. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం. 

భ్రష్టున కర్ధవంతులగు బాంధవు లెందఱుగల్గినన్, నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపగలేరు సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి
జ్యేష్ఠ కదేటికిం గలుగ జేయదు తోడనెబుట్టి, భాస్కరా.
తా.
అందరకును భాగ్యమిచ్చు లక్ష్మి తన తోబుట్టువైన జ్యేష్ఠాదేవికి సంపద నీయజాలక పోయెను. అట్లే పనికిమాలిన వానికి భాగ్యవంతులగు చుట్టము లేందరున్నను అతని (క)అదృష్ఠరేఖ లేనిచో బీదవాడై యుండును. 

కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా,
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ.

అక్క1 - 1.తనకంటె పెద్దది అగు తోడబుట్టువు, జేష్ఠభగిని, అప్ప, 2.పూజ్య స్త్రీ, 3.వంటలక్క.
అక - అక్క, పూజ్యస్త్రీ.
ఆయక - (ఆ+అక) 1.ఆపూజ్యస్త్రీ, 2.అకె, ఆ యక్క.
ఆకె - ఆమె(ఆమె - స్త్రీ), ఆయమ.
ఆయమ - (ఆ+ఆమె) ఆమె, ఆపె, ఆకె.
ఆపె - ఆమె, రూ.ఆకె.
ఆబిడ - (ఆ+బిడ్ద) ఆపె, రూ.అబిడె.
అంతిక - 1.అక్క, 2.పొయ్యి, 3.(వృక్ష). సాతల మనెడు ఓషధి. 
అవంతి - 1.ఉజ్జయిని, 2.అక్క. 

అత్తా మాతా సైవ అత్తికా. - తల్లియే అత్తిక యనఁబడును. పా. అన్తికా 'అత్తికా చాన్తికా తథా' ఇతి ద్విరూపకోశాత్. ఈ ఒకటి అక్క పేరు. 

ఆఁడుతోడు - సోదరి, తోడబుట్టువు.
భగిని -
సహోదరి; సహోదరి - తోడబుట్టినది; సహజ - తోడబుట్టినది.
స్వస - తోడబుట్టునామె. 

భగినీ స్వసా,
భగః కల్యాణం శ్రేయః వివాహే అస్యా ఇతి భగినీ - వివాహ మందిలి శ్రేయస్సు గలది.
సుష్ఠు అస్య సోద రాయాసమితి స్వసా. ఋ. సీ. అసు క్షేపణే. - సోదరుని (యా)ఆయాసమును బోఁగొట్టునది. ఈ రెండు తోడఁ బుట్టిన స్త్రీ పేర్లు.

అక్క2 - తల్లి.
తల్లి -
జనని, రూ.తల్లి, విణ.మొదటిది, సం.వి. జవరాలు, తరుణి.
జనని - 1.తల్లి, 2.దయ, కనికరము, 3.లక్క, 4.కొరిక.
రక్ష - 1.రక్షణము, 2.లక్క(క్షతఘ్నము - లక్క).
అలక్తము - లక్క, లత్తుక. లత్తుక - లక్క, సం.లాక్షా.

ౙవరాలు - యౌవనవతి. ౙవ్వని - యౌవనవతి.
తరుణి - యువతి, స్త్రీ (స్త్రీ - ఆడుది), రూ.తలుని.
యువతి - 1.జవరాలు, యువతి 2.పసుపు (హరిద్ర- పసుపు).

తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ, సీ, తౄప్లవన తరణయోః - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః, యు మిశ్రణే. - పురుషునితోఁ గూడునది. ఈ రెండు జవ్వని పేర్లు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.

బాలస్తావత్ క్రీడాసక్తః - తరుణస్తావత్ తరుణీసక్తః,
వృద్ధస్తావత్ చితాసక్తః - పరమే బ్రహ్మణి కోపి న సక్తః. - భజగోవిందం
 

అప్ప - అప1.
అప1 -
  అవ్య. సమాసపూర్వ పదముగా నుండి క్రింది అర్థముల నిచ్చును, 1.విపరీతము ఎక్ష్త్రెమె, ఉదా.అపకీర్తి (అపప్రధ – చెడ్డపేరు; అపకీర్తి - చెడుపేరు, దుర్యశము. అపకీర్తి కలిగిన మరణము పనిలేదు.) 2.అపగతము(అపగతము - పోయినది), ఉదా.అపక్రమము = క్రమము తప్పినది, క్రమములేనిది, 3.చెడ్దది, ఉదా.అపక్రమము = చెడ్డపని.
అప2 - 1.తల్లి, 2.తండ్రి, 3.అక్క, రూ.అప్ప.
అయ్య - తండ్రి, విణ.పూజ్యుడు, రూ.అయ, సం.ఆర్యః.
అయ - 1.తండ్రి, 2.పూజ్యతను తెలుపు పదము, 3.పురుషనామము లకు అనుప్రయుక్తము, రూ.అయ్య, సం.ఆర్యః.
ఆర్య - 1.పదునారెండ్ల కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద.) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట.) నటుడు భార్యను పిల్చునపుడు వాడెది మాట.

అవ్వ - అవ1.
అవ1 -
1.తల్లి తల్లి, 2.తండ్రి తల్లి, 3.తల్లి, 4.పూజ్యస్త్రీ, 5.వృద్ధురాలు, రూ.అవ్వ.  
అవ2 - ఇది సమాసపూర్వపదమై క్రింది అర్థముల తెలుపును, 1.వంగినది, ఉదా. అవాగ్రము = వంగిన అగ్రముకలది, 2.విరుద్ధము, ఉదా.అవమానము(అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము), 3.అనాదరమును సూచించునది, ఉదా.అవకర్ణనము = అనాదరముతో వినుట.
మాతామహి - తల్లి తల్లి, అమ్మమ్మ. 
పితామహి - తండ్రితల్లి.  

అప్పం దన తల్లిగ మే
లొప్పం గని జరుపవలయు * నుర్వీస్థలిఁ జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడఁతియు మాతృతుల్య * యండ్రు కుమారా!

తా. తోడఁబుట్టిన అక్కచెల్లెండ్రను గౌరముగాఁజూచి సంతోషించునట్లు వారికి క్షేమము కలుగ చేయవలెను. బాల్యమునఁ జనుపాలనిచ్చి పెంచిన స్త్రీని కూడ తల్లితో సమానురాలని మర్యాద చేయవలెనని పెద్దలు చెప్పుదురు.  

అమ - 1.తల్లి, 2.పూజ్యురాలు, రూ.అమ్మ, సం.అంబా.
అమ్మ -
1.తల్లి, 2.పూజ్యురాలు, సం.అంబా. అవ్య. ఆశ్చర్యాది వాచకము, ఔర.
అంబ - 1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.
అమ్లము - 1.పులుపు, 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ, 3.పులిసిన పెరుగు, 4.పులిచింత, 5.దబ్బ.
అంబరీషము - 1.యుద్దము, 2.మంగలము, 3.పశ్చాత్తాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అంబిష్ట - (వృక్ష.) 1.అడవి మొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి.
భ్రమరాంబ - అంబ, పార్వతి. భ్రామరి - పార్వతి. శ్రీశైలే భ్రమరాంబికా|  

అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.

అంబిక - 1.తల్లి, 2.మేనత్త, 3.పార్వతి, 4.దృతరాష్ట్రుని తల్లి.
అమ్మిక -
పార్వతి, దుర్గ, సం.అంబికా. సంతానము నందు దేవీస్థానం అంబిక.
ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.

అత్త - 1.భర్తతల్లి, 2.భార్యతల్లి, 3.తండ్రికి సోదరి, 4.మేనమామ భార్య.
మాతుల - మేనమామ భార్య, రూ.మాతులి, మాతులాని.
మాతులాని - మాతుల.
మామ - 1.తల్లిసోదరుడు, మేనమామ, 2.ఆలుమగల తండ్రి, శ్వశురుడు, 3.తండ్రి తోబుట్టువుభర్త, సం.మామకః.
శ్వశురుఁడు - మామగారు; శ్వశ్రువు - అత్తగారు.
శ్వశురులు - అత్తమామలు. 

శ్వశ్రూభిక్షా న్యాయము - న్యా. కోడలు లేదనినదాని కడ్డుతగిలి అత్త స్వతంత్రురాలై తానులేదనినరీతి.    

అశ్మంతము - 1.పొయ్యి, 2.పొలము, 3.చావు, 4.అశుభము, 5.మేరలేనిది, విణ.మేరలేనిది.  
అధిశ్రయణి - ప్రొయ్యి; ప్రొయ్యి - పొయ్యి.
ఛుల్లి - చుల్లి, ప్రొయ్యి.
చుల్లి - 1.ప్రొయ్యి, 2.సొద, రూ.ఛుల్లి.
సొద - చితి, పీనుగు కాల్చుటకు పేర్చిన కట్టెల ప్రోగు, సం.చితా.
చిత - 1.సొద, 2.ప్రోవు, రూ.చితి.
చితి - 1.సొద, 2.ప్రోగు.
ప్రోఁగు - పోగు; పోఁగు - 1.దారము, 2.చెవినగ. 

ఎత్తుగడలు - ప్రొయ్యిగడలు.
గడ్డప్రొయ్యి -
గడ్డలతో నేర్పరచిన పొయ్యి.

ఇంటింటా ఒక పొయ్యి మా ఇంట్లో మరో పొయ్యి. కర్రవంకరని పొయ్యి తీస్తుందట. పొరుగు పచ్చగా వుంటే, పొయ్యిలో నీళ్ళు పోసికొన్నారుట.

పాచకి - వంటలక్క. వంటలక్క - వంటకత్తె.
వంటరి - (వంట + అరి) వంటవాడు, వంటలక్క. వండుకొన్నమ్మకి ఒకటే కూర, దండుకున్నమ్మకి అన్నీ కూరలే.

అద్దగోడ - 1.సగముగోడ, వంట యింటిలో వడ్దన పదార్థముల మరుగుకై అమర్చిన పొట్టిగోడ, మరుగుగోడ, సం.అర్ధకుడ్యమ్. 

పొలము - 1.పైరు పెట్టునేల, 2.ఊరు, 3.జాడ, 4.విధము.
ఊరు -
1.లోపలనుండి నీరు బయటికి వచ్చు, 2.నాను, 3.పుట్టు, 4.పెద్దది యగు, వి.1.గ్రామము, 2.ఏడికోల లేని నాగలి, 3.దేశము.
నాను - జలాదులందు చాలకాలముండు, వి.హారము.
తేలువాఱు - పుట్టు; పుట్టు - సంభవించు, జన్మించు.
గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.) షడ్జాది స్వరము.
కుప్పము - గ్రామము. పరివసధము - ఊరు.
(ౙ)జాడ - 1.అడుగుల గురుతు, 2.సైగ, 3.త్రోవ, 4.విధము.
విధము - ప్రకారము, విధి.
పొలమరి - పొలముకాపు; పొలమరి - జాడతెలిసినవాడు. 

గ్రామణి - 1.గ్రామాధిపతి, 2.శ్రేష్ఠుడు, వి.1.మంగలి, 2.వేశ్య, (చరి.) మౌర్యులకాలమునాటి గ్రామపెద్ద.
గ్రామీణ - 1.వేశ్య, 2.పాలకూర, సం.వి.ఊరి సంబంధమైన.

గ్రామ్యము - 1.అశ్లీలము,, 2.అసభ్యమగు మాట, 3.పామర జనవాక్యము, విణ.1.ఊరియందు పుట్టినది, 2.తెలివిలేనిది, 3.నాగరికతలేనిది.
అశ్లీలము - 1. (అలం.) ఒక అర్థ దోషము, 2.ఒక శబ్దదోషము, 3.అసభ్య వచనము, ఏవగింపు పుట్టించినమాట, బూతు.
బూతు - 1.కుచ్చితపు తిట్టు, 2.బట్టువాడు.   

గ్రామ్య మశ్లీలమ్-
గ్రామే భవం గ్రామ్యం - గ్రామమందుఁ బుట్టినది.
శ్రీఃచారుతా సా నాస్యస్మిత్యశ్లీల - శ్రీ యనఁగా నొప్పిదము; అది లేనిది గనుక అశ్లీలము. ఈ రెండు పామరజను లాడెడి పలుకుల పేర్లు.

నీవృత్తు - 1.దేశము, 2.గ్రామము.
నాడు -
1.నాటు, వి.1.దేశము, 2.గ్రామము.
నాటు - 1.గ్రుచ్చు, 2.గ్రుచ్చుకొను, వి.1.నాటుట, 2.గడ్దపార మున్నగు వానితో పోడిచిన రంధ్రము.
గ్రుచ్చు - 1.గాఢముగా పట్టుకొను, 2.నాటించు, 3.భేదించు, 4.పెల్లగించు.
గాఢత - (గృహ.) తీవ్రత, తీక్ష్ణత (Intensity). తీక్ష్ణణ - తీవ్రత.  

ఆద్వా రేణచ నాతీయాద్గ్రామందా వేశ్మనావృతం|
రాత్రౌ చ వృక్షమూలాని దూరతః పరివర్జ యేత్||
 
తా. గ్రామమునకుగాని, యింటికిగాని వాకిలివిడిచి తప్పుత్రోవలో పోరాదు, రాత్రియందు వృక్షమూలమును పరిత్యజింప వలయును. - నీతిశాస్త్రము

(ౘ)చావు - మృతి; మృతి - చావు.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.

అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.

ఒప్పమి - 1.తప్పు, 2.కీడు, 3.అనంగీకారము.
అపనయము - 1.కీడు, 2.తొలగించుట.

చెడగు - 1.అశుభకార్యము, విన.1.క్రూరము, 2.దుష్టము.
చెడగరము -
1.క్రూరము, 2.క్రూరుడు.

చెడ్ద - 1.కీడు, విణ.దుష్టము.
దుష్టము -
చెడ్దది.
చేరుగొండి - 1.దుష్టము, వి.పెండ్లి యాడకనే వచ్చిన భార్య.  

గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
ఆముదము -
ఏరండ వృక్షము, ఏరండ తైలము, ఏరండ బీజములు, సం.ఆమండః. 
ఏరండము - ఆముదపు చెట్టు.
ద్విలింగి - (వృక్ష.) ఆడు పువ్వులు మగ పువ్వులు ఒకే మొక్క పైనున్నట్టిది (Monoecious), ఉదా. ఆముదపు మొక్క.
వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.

రెగ్మా - (వృక్ష.) (Regma) ఇది వేశ్మస్ఫోట ఫలములలో నొకటి. ఈ ఫలము ఒక్కొక్క గింజ కల భాగములుగా ఎండిన తరువాత విడిపోవును, ఉదా. ఆముదపు కాయ.

పిణ్యాకములు - (వ్యావ.) పిండి యెరువులు (oil cakes), ఉదా. ఆముదపు పిండి, వేరుసెనగ పిండి మొదలగునది.

పుచ్చు - 1.అజ్ఞాపించు, 2.గ్రహించు, 3.పుప్పిపట్టు, 4.పంపించు, వి.ఆముదపు మడ్డి. 

దోషము - 1.తప్పు, 2.పాపము.
తప్పు -
1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, తప్పిదము, క్రి.చిక్కు.
తప్పిదము - దోషము; దోసము - దోషము.
దోషాచరుడు -1.చంద్రుడు, 2.రాక్షసుడు, వ్యు.నిసియందు తిరుగువాడు.
దొషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు). 
దోషజ్ఞుడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోషమెరిగినవాడు.  

తప్పులెన్నువారు తండోపతండంబు
నుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వ.

తా. ఇతరుల, తప్పులను పట్టుకొనువారు, అనేకులుగలరు, కాని తమ తప్పును తెలుసుకొనలేరు.
ఇతరుల దోషాలు - ఎప్పుడూ మానవుడి కళ్ళముందే ఉంటాయి. కాని తన దోషాలు మాత్రం - అతడి వెనకే ఉంటాయి. పదిమంది అవినీతిపరుల మధ్యనున్న నిజాయతీ పరుడు దొంగగా నిరూపింపబడుతాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు.   

పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము -
పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సప్పము - సర్పము, సం.సర్పః.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
కలుషము - పాపము; దురితము - పాపము.
కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు. 

చితాచింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసీ|
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుత వపుః||
తా.
సొదకంటె చింత అధికమైంది, ఎట్లనిన సొద ప్రాణంబు పోయి పిమ్మట శరీరమును దహించును. చింత ప్రాణంబుతో గూడిన శరీరమును దహించును, గావున చింతగూడదని భావము. - నీతి శాస్త్రము

అకూపారము - మేరలేనిది, 1.సముద్రము, 2.ఆదికూర్మము.
అమితము -
విస్తారము, మితిలేని, మేరలేనిది.

జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
తాటి రిక్కనెల -
జ్యేష్ఠమాసము; పెద్దనెల - జ్యేష్ఠమాసము.

జ్యేష్ఠా నక్షత్రయుక్తా స్మిన్నితి జ్యేష్ఠః - జ్యేష్ఠా నక్షత్రముతోఁగూడిన పున్నమ దీనియందు గలదు.
శోచ యతి ప్రాణిన ఇతి శుక్రః శుచ శోకే - తాపము చేత ప్రాణులను దుఃఖింపఁ జేయునది.  

గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్ఠాషాడ మాసములు.)
గ్రీష్మము - 1.వేడి, వేసంగి. 
గ్రీష్మ - Summer; శుచి, అగ్ని(నీరు బిడ్డగా కలది).
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది. 

హంస - 1.అంౘ, 2.యోగి, యోగాభ్యాసము జేయు పురుషుడు 3.పరమాత్మ, 4.గుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము రూ.హంస.
శ్వేతగరుత్తు -
శ్వేతపత్రము, హంస

కందాయము - సంవత్సరమున మూడవ భాగము, జ్యేష్ఠాది మాస చతుష్టయము.  
ఆయతి1 -
1.రాబడి, 2.నిడుపు, 3.రాగలకాలము, 4.కోశ దండముల వలన రాజునకు గలుగుశక్తి, ప్రభావము, 5.ఫలము గలుగు సమయము, 6.ప్రాపణము, 7.కూడిక, 8.పని, 9.సంయమము.
ఆయతి2 - జేష్టాది మాసచతుష్టయము, కందాయము.
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీ సంయోగము, 3.లాభము, 4.చెలిమి, 5.రాబోవుకాలము, ఆయతి. 

కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలలకాలము 2.వర్షకాలము, 3.వయసు.
వయసు - ప్రాయము, యౌవనము.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
ప్రాయము - 1.వయస్సు, 2.బాహుళ్యము, 3.చావు. 
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు.

కారు2 - వి. 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు, 4.నస, ముదిమి.
ఉప్పు - క్రి. ఆవిరిపోకుండ ఉడక బెట్టు వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.

ఉప్పులేని కూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేని వాడె అధిక సంపన్నుడు విశ్వ.
తా.
ఉప్పులేని కూర రుచిగా వుండదు. పప్పులేని భోజనము మంచిది కాదు. అప్పులేనివాడె ధనవంతుడు.

లక్ష్మీదేవి పుట్టకముందు ఆకులేని పంట పండింది - ఉప్పు. లక్షాధికారియైన లవణ మన్నమెకాని, మెఱుగు బంగారంబు మ్రింగఁబోఁడు. ఉప్పు అధికము తినేవారు నీరు ఎక్కువ త్రాగువాడు.

అడవి - అరణ్యము, సం.అటవీ. అడవికాపు - వానప్రస్థుడు. 

శ్యామిక - చీకటి, నలుపు. 
శ్యామలము -
నలుపు, విణ.నల్లనిది.

కఱ - 1.నలుపు, 2.మఱక, సం. కాలః.
నల్ల -
నెత్తురు, వై.వి. నలుపు, 2.బొగ్గు, విణ.నలుపైనది.
మఱక - 1.కఱ, 2.మేకపడ్డ, (రసా.) నూనె మొ.వానిచే కలుగుమచ్చ (Stain).

శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
కాలిక -
1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి, 5.కొత్తమబ్బు. 
పార్వతి - 1.గౌరి (పర్వత పుత్త్రి) 2.ద్రౌపది.
గౌరి - దుర్గ, పార్వతి 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి రూ.దుర్గి సం.దుర్గా.  
కాత్యాయిని - 1.గౌరి(కన్యాకుబ్జమునందు దేవీస్థానం గౌరి), పార్వతి (శివసన్నిధిని దేవిస్థానం పార్వతి), 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ.

మేఘజాలే చ కాళికా : కాళికా శబ్దము మేఘ సమూహమునకును, చకారము వలన పార్వతీదేవికిని, యోగినికిని, మర్యాదకును పేరు.
కాళవర్ణత్వత్ కాళికా - నల్లనిది.

నల్ల - 1.నెత్తురు, వై.వి. నలుపు, 2.బొగ్గు, విణ.నలుపైనది.
నెత్తురు -
రక్తము, రూ.నెత్రు.
బొగ్గు - మండి చల్లారిన కఱ్ఱతునక, అంగారము.
అంగారము - 1.నిప్పు 2.బొగ్గు. ఒక బొగ్గు రగులుకొనదు. మసి బొగ్గు చల్లగా ఉన్నపుడు ముట్టుకుంటే చేతికి మసి అవుతుంది. కాలుతున్న ప్పుడు ముట్టుకుంటే మన చేతినీ కాలుస్తుంది.

అడవిలో పుట్టాను నల్లగా మారాను-మీ ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను- కుప్పలో పడ్డాను తెల్లగా మారాను. - బొగ్గు.

ఎప్పుడదృష్టతామహిమయించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుగాక యదియొప్పని పిమ్మట రూపుమాయగా
నిప్పుననంటియున్న యతినిర్మలినాగ్నిగురు ప్రకాశముల్
దప్పిననట్టి బొగ్గునకుఁదా నలుపెంతయుబుట్టు, భాస్కరా.
తా.
బొగ్గు అగ్నిలో చేరియున్నపుడు దానియందలి స్వచ్చమైన కాంతులతో ప్రకాశించును, అగ్ని సంబంధము తప్పిపోయినచో, అదిముందు తనకున్న కాంతిని బాసి నల్లగా నగును. అట్లే అదృష్టమున్న దినములలో మానవుడు ప్రభ కలిగి యుండును. లేనిచో తొల్లింటి(పూర్వము) ప్రభ నశించును.

నస - 1.నాశము 2.ద్రవ్యనాశము 3.(వ్యవ.)వాగుడు, 4.దురద, 5.ఉపద్రవము సం.వి. ముక్కు రూ.నాసిక.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
వినాశము - చేటు. పంచత్వము - మరణము.   
విగమము - 1.నాశము, 2.విభజనము. విభజనము - వేరుచేయుట.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.
పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము - పాము. సర్పము - పాము, సప్పము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
కలుషము - పాపము; దురితము - పాపము. 
దుష్టము - చెడ్దది; చెడ్డ - 1.కీడు, విణ.దుష్టము.
చేరుగొండి - 1.దుష్టము, వి.పెండ్లి యాడకయే వచ్చిన భార్య.  

ద్రవ్యనాశము - ద్రవ్యము - 1.ధనము 2.వస్తువు.

దానం భోగో నాశస్తి స్రోగతయో భవంతి విత్తస్య,
యోనదదాతి నభుక్తేతస్య తృతీయాగతి ర్భవతి|
తా.
ధనమునకు దానము, అనుభవము, నాశము అను నీ మూడు విధములైన గతులుగలవు. ఏ ధనికుండు యెవరికి నియ్యక తా నను భవించక యున్నాఁడో వాని ధనం దొంగలపాలగును. – నీతిశాస్త్రము

* బ్రాహ్మణుల సొమ్ము దూదిలో అగ్నిహోత్రం.
* రాజుల సొమ్ము రాళ్ళ పాలు.  
* వైశ్యుల సొమ్ము నీచుల పాలగును.
* దొంగలకు తలుపు తెఱచి దొరలను లేపినట్లు. దొంగల సొమ్ము దొరలపాలు.

నసగూఁటి - కామోద్రేకము గలది - గలవాడు.
నసగూఁడు -
కామోద్రేకము.

నసుకు-అసత్యవచనము, విణ.అసత్యము, క్రి.అస్పష్టముగా మాటలాడు.

నసిమిరి - దురద; దురద - 1.జిల, 2.కసరు, 3.తీట.
జిల - దురద.
కసరు - కోపించు, వానగాలి.
తీఁట - గజ్జి(పామ - గజ్జి.), దురద.
గజ్జి - తీటకురుపులు, సం.కచ్ఛూః, ఖర్జూః. 

ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.

ముదిమి - ముసలితనము. వయస్సు పడమరకు తిరిగింది.
ముది -
వార్ధకము, ముదిమి, ముసలితనము.
వార్థకము - వృద్ధత్వము.
వృద్ధత్వము - ముసలితనము, (Senility) వృద్ధాప్యము బలమైన శత్రువు.
విస్రస - జర, ముసలితనము; జర - ముసలితనము.
జరఠము - 1.ముసలిది(వృద్ధ - ముసలిది), 2.గట్టియైనది. స్థవిర - ముసలిది.

జాని - 1.ముదిమి, 2.భార్య, 3.స్త్రీ, ఆడుది.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

అరగడము - ముసలి, వృద్ధు.
ముసలి -
1.ఉడుము, 2.బలరాముడు, విణ.వృద్ధుడు.
వృద్ధు - 1.ముసలివాడు, 2.తెలిసినవాడు.
స్థవిరుఁడు - ముసలివాడు.
పన్న - 1.వృధుడు, 2.అనామధేయుడు.

వృద్ధ ప్రశస్యయో ర్జ్యాయాన్ : జ్యాయశ్శబ్దము మిక్కిలి వృద్ధునికిని, మిక్కిలి శ్రేష్ఠునికిని పేరు. అతిశయేన వృద్ధః ప్రశస్తశ్చ జ్యాయాన్. స. - మిక్కిలి వృద్ధుఁడును మిక్కిలి ప్రశస్తమైనవాఁడును.

అసభ్యాసే విషం శాస్త్ర - అజీర్ణే భోజనం విషమ్|
దరిద్రస్య విషం గోష్ఠీ - వృద్ధస్య తరుణీ విషమ్||
తా.
అభ్యాసము లేనివారికి శాస్త్రము విషము, జీర్ణముకాక యున్నపుడు భోజనము విషము, దరిద్రునికి(పేదవానికి) వినోదగోష్ఠి విషము, ముసలివానికి వయసు పెండ్లాము విషము. - నీతిశాస్త్రము

బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
ఉడుము -
బల్లి వంటి పెద్ద జంతువు, గోధ, రూ.రూ.ఉఱుము.
గోధ - 1.ఉడుము, 2.అల్లెతాటి దెబ్బ తగులకుండ (ఉడుము తోలుతో చేసి) వ్రేలికి తొడుకుకొను కవచము.

ముసలీ గృహగోధికా :
ముస్యతి క్రిమీనితి ముసలీ. సీ. ముస ఖండనే - పురుగులను ఖండించునది. పా. ముషలీ.
గృహే గోధికేవ తిష్ఠతీతి గృహగోధి కా. - గృహమందు ఉడుమువలె నుండునది. ఈ రెండు బల్లి పేర్లు.

ఉఱుము1 - ఉడుము.
ఉఱుము2 - గర్జించు, వి.మేఘధ్వని, 2.వీరహుంకారము.  
ఘర్ఝరము - 1.కొండదారి, 2.ఉరుము, 3.వాకిలి, 4.గుడ్లగూబ, 5.హాస్యము.

ఉడుముండదె నూఱేండ్లును
పడియుండదె ప్రేర్మిబాము పదునూఱేండ్లును
మడువున గొక్కెర యుండదె
కడునిల పురుషార్థపరుడు కావలె సుమతీ.
తా.
ఉడుము నూరెండ్లు, పాము వెయేండ్లు, చెరువులో కొంగ చాలాకాలం జీవించును కాని, భావి జీవితములో లోకానికి ప్రయోజనము లేదు. మానవుడు వాటివలెగాక, వీని జన్మమెత్తినందుకు ఫలితంగా లోక హితార్థమై  ధర్మార్థగామి కావలెను.

శీతకారు - (వ్యవ.) డిసెంబరు, జనవరి నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, అను కార్తెలు, హేమంత ఋతువు (Winter season).
మం(ౘ)చుకారు - హేమంత ఋతువు.
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు హేమంత ఋతువు.
మిహిక - మంచు.
మిహిరాణుఁడు - శివుడు. 

ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి | యస్మిన్ వృత్రం వృత్ర తూర్యే తతార | తస్మిన్వయ-మమృతం దుహానాః | క్షుధంతరేమ దురితిం దురిష్టిమ్ | పురందరాయ వృషభాయ ధృష్ణవే | అషాఢాయ సహమా-నాయ మీఢుషే | ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా | ఉరుం కృణోతు యజమానాయ లోకమ్ ||17||   

ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రునిభార్య, 4.జ్యేష్ఠా నక్షత్రము, 5.తూర్పు.
ఐంద్రుడు -
ఇంద్రపుత్రుడు వి.1జయంతుడు, 2.అర్జునుడు, 3.వాలి.
జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
భీముడు : పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.

బిభే త్యస్వాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లతని వలన భయపడును గనుక భీముఁడు. ఒక బ్రాహ్మణ బాలుని రక్షించేందుకు బకాసురుడికి తానే అహారమయ్యేందుకు సిద్ధపడిన వ్యక్తి. - భీముడు

పాకశాశని - 1.అర్జునుడు, 2.జయంతుడు, వ్యు.పాకశాసనుని కొడుకు.
పాకశాసనుఁడు - ఇంద్రుడు, వ్యు.పాకుడను రాక్షసుని పరిమార్చిన వాడు.    

సన్నుతకార్యదక్షుఁ డొకచాయ, నిజప్రభప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొకమేలొనరించు, సత్త్వసం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణముకావడె యేకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపునరూపడగించి, భాస్కరా.
తా.
పూర్వము పాండవు లజ్ఞాతవాసము చేయునప్పుడు ఏకచక్రపురమగు గ్రామములో బ్రాహ్మణ వేషధారులై యున్నప్పుడు, ఆ పురమందు భీముడు బకాసురుడను రాక్షసుని జంపి, ఆ గ్రామవాసుల(ద్విజుఁడు -1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.)యాదరమునకు పాత్రుడయ్యెను. సజ్జనుడగువాడు తనకు విభవము కోరవోయిననూ గుణశక్తితో లోకులకు మేలుచేసి కీర్తిని పొందును.   

అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|
జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః||

జిష్ణువు -1.ఇంద్రుడు, 2.అర్జునుడు, విణ.జయశీలుడు, రూ.జిష్ణుడు.
జిత్వరుఁడు -
జయశీలుడు.

అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
అర్జునుఁడు :
పాండవ మధ్యముడు, యుద్ధరంగమున అపజయము ఎరుగనివాడు. రెండు చేతులతో యుద్ధము చేయువాడు, నరోత్తముడు. నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.
నరనారాయణులు - కృష్ణార్జునులు.

ఫల్గునుఁడు - అర్జునుడు; పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
గెలుపు పేరుగలఁవాడు -
పార్థుడు, అర్జునుడు, విజయు డను పేరు గలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణుద్వారపాలకులలో నొకడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి(కపి - కోతి)చిహ్నము ధ్వజమందు కలవాడు.
కిరీటి - 1.అర్జునుడు, వ్యు.ఇంద్రదత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి.
క్రీడి - అర్జునుడు, సం.కిరీటి. 
శ్వేతవాహనుఁడు - 1.చంద్రుడు, 2.అర్జునుడు. 
బీభత్సుఁడు - అర్జునుడు, వివచ్చుడు, విణ.వికారము గలవాడు.
వివచ్ఛుఁడు - అర్జునుడు, సం.బీభత్సః.
ధనంజయుఁడు - 1.అగ్ని, 2.అర్జునుడు.  

గుడాకేశుడు - 1.అర్జునుడు, 2.శివుడు, వ్యు.జెముడువలె గుబురుగా పెరిగిన జుట్టు కలవాడు.
నరుఁడు -
1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.
బృహన్నల - అజ్ఞాతవాసము నందలి అర్జునుని పేరు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు -
1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.

కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 -
1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).

కఱకంఠుఁడు - నీలకంఠుడు, శివుడు.
కఱివేలుపు -
కృష్ణుడు, నల్లనయ్య.

భుజబలశౌర్యవంతులగు పుత్రులఁగాంచిన వారికెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కముచేకురు కుంతిదేవికిన్
విజయబలాఢ్యునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమునుదెచ్చి తల్లివ్రతకార్యముఁదీర్పడె తొల్లి భాస్కరా.

తా. కుంతీదేవికి వీరుడును, పరాక్రమ వంతుడును యగు (న)అర్జునుడు కుమారుడగుట చేతనే తల్లివ్రతమును సఫలము చేయుటకు ఐరావతము ను సైతము తీసికొని వచ్చి ఆ పనిని నెరవేర్చెను. పరాక్రమవంతులగు పుత్రులనుగన్న తల్లితండ్రులకు కావలసిన కోర్కెలన్నియు సమకూరును గదా.   

అర్జునుని భార్య ఉలూచి. ఉలూచి నాగరాజు కుమార్తె, జలంలో ఎల్లప్పుడూ అర్జునుడు అజేయుడుగా ఉండగలడని ఉలూచి వరమిచ్చింది.

ఉలుచ - వై.వి. మిక్కిలి చాపల్యముగల చేప సం.ఉలూపిః  
ఉలూపి - 1.ఒక నాగకన్య, 2.ఉలుచ చేప.

నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.
మనుష్యుఁడు -
మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ(ఆడుది), 4.భటుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మర్త్యుఁడు - మనుష్యుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
మనువులు - స్వాయంభువుడు (స్మృతి కర్త.) స్వారోచిషుడు, ఉత్తముడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు (పదు నాల్గురు).
స్వయంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మదనుడు.
వైవస్వతుఁడు - 1.యముడు, శని Saturn.
కృతకము - మనుష్యులచే చేయబడునది, కృత్రిమము.
కృత్రిమము - మనుష్యులచే చేయబడినది, (భౌతి. రసా,) ప్రకృతిలో దొరకునదికాక మానవునిచే నిర్మితమైనది (Artificial).

అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణోత్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||
తా.
సహజముగా బ్రాహ్మణులకుఁ(విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రత(సాధ్వి - పతివ్రత)లకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము  

గాండీవము - అర్జునుని విల్లు, రూ.గాండీవము.
గాండీవి -
అర్జునుడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపిచిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

కపిధ్వజస్య గాణ్డీవ గాణ్డివౌ పుంనపుంసకౌ,
గాండీకృతం అశ్లక్షీ కృతం పర్వస్థాన మస్యేతి గాండీవః, గాండివశ్చ. ప్న. - నునుపుగాఁ జేయఁబడని గణుపులు గలది. ఈ ఒకటి అర్జునుని వింటి పేరు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).

భూరిబలాఢ్యుడైనఁ దలపోయగ విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవుగా దతడొక్కడె మోసపోవుగా
వీరవరేణ్య డర్జునుడు వింటికి నే నధికుండనంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగనోపడు కృష్ణుడులేమి, భాస్కరా.
తా.
అర్జునుడు జగదేక వీరుఁడనని గర్వించి, తానే తన గాండీవమునకు దగినవాడనని తలంచుచు శ్రీకృష్ణ నిర్యాణానంతరము ఆ విల్లు నెక్కుపెట్టుట కైనను చాలని వాడాయెను. అట్లే మనుష్యుడు(మనుష్యుడు - మానిసి, మానవుడు.)తనకు భుజబల మున్నదని గర్వించి, తానే గొప్పవాడనని చెప్పుకొనరాదు. అట్లగునేమి నొకప్పుడు మోసపోవును. 

సురతాణి - 1.ఇంద్రుడు, 2.ఇంద్రాణి, సం.సురత్రాణః.
ఇంద్రుఁడు - 1.దేవతలర్రాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు. 

పులోమజ - శచీదేవి, వ్యు.పులోముని కూతురు.
పౌలోమి -
శచీదేవి.
ఇంద్రాణీ - ఇంద్రుని భార్య, శచీదేవి. దేవ లోకమందు దేవీస్థానం ఇంద్రాణి.

పులోమజా శ చీంద్రాణీ :
పులోమ్నో మునేర్జాతా పులోమజా - పులోముఁడను ముని వలనఁ బుట్టినది.
తస్మా జ్ఞాతేతివా - విస్తారమైన రోమములు గలవాఁడు పులోముడు. అతని కూతురు. జనీ ప్రాదుర్భావే.
శచతి హంసవద్గచ్ఛతీతి శచీ - హంసవలె నడచునది. శచి శ్వచి గతౌ.
ఇంద్రస్య పత్నీ ఇంద్రాణీ. ఈ.సీ. - ఇంద్రుని భార్య. ఈ మూడు 3 శచీదేవి పేర్లు.

అమరావతి - 1.ఇంద్రుని పట్టణము, 2.స్వర్గము, 3.గుంటూరుజిల్లాలోని ప్రాచీన పట్టణము. 

స్వారాజ్యము - స్వర్గలోకపు దొరతనము.
స్వారాట్టు - ఇంద్రుడు. శచ్యాః పతి శ్శ్చీపతిః - శచీదేవికి భర్త.
పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రుపురముల నాశమొనర్చువాడు.
పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు. 

శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.
శక్తుడు -
శక్తికలవాడు.
(ౘ)చాలువాఁడు - శక్తుడు. 

పురంధ్రి - కుటుంబిని, స్త్రీ. 
కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.

వృషాకపాయి - 1.లక్ష్మి, 2.పార్వతి, 3.శచి, 4.స్వాహా.
వృషాకపి -
1.విష్ణువు, 2.శివుడు, 3.అగ్ని.
గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
స్వాహా - అగ్నిభార్య.

తాటిరిక్క - జ్యేష్ఠా నక్షత్రము. (రిక్క - నక్షత్రము, ఋక్షమ్.)

బొంద - 1.రంధ్రము, 2.తాటి మొదలగు చిన్న చెట్టు, 3.గుంట.
తూఁటు - రంధ్రము, చిల్లి.
తూఁటాడు - క్రి. 1.వేధించు, 2.రంధ్రము చేయు.
తూఁటుకట్టు - క్రి. రంధ్రముపడు.

పాల నీడిగింటన గ్రోలుచునుండెనా
మనుజులెల్ల గూడి మద్యమండ్రు
నిలువఁదగనిచోట నిలువ నిందలువచ్చు విశ్వ.

తా. కల్లుపాకలో కూర్చుండి పాలు త్రాగినను, కల్లుత్రాగుచున్నాడందురు. ఉండకూడని ప్రదేశములో వున్నచో చెడ్డపేరు వచ్చును.

తాటి పడగవాఁడు - 1.బలరాముడు, 2.భీష్ముడు.

తాలాంకుఁడు - బలరాముడు. తాలాంకః తాల వృక్షాకృతి ఠంకో ధ్వజో యస్యనః - తళవృక్షాకారమైన ధ్వజము గలవాఁడు.
అచ్యుతాగ్రజః అచ్యుత స్యాగ్రజో జ్యేష్ఠః - అచ్యుతునికి(అచ్యుతుఁడు – విష్ణువు) అన్న.  
రౌహీణేయః రోహిణ్యా అపత్యం - రోహిణీదేవికి కొడుకు.
రేవతీరమణః రేవత్యాఃరమణః పతిః - రేవతిదేవికి భర్త.
కామం స్మరం పాలయతి ఆత్మజత్వాత్కామపాలః - కుమారుఁ డగుట వలన మన్మథుని పాలించినవాడు.

హలాయుధుఁడు - బలరాముడు.
హలి -
1.నాగలి, 2.బలరాముడు, 3.పొలము దున్నువాడు.
హలము - నాగలి, రూ.హాలము.
హాలము - నాగలి, రూ.హలము.
హలికుఁడు - పొలము దున్నువాడు, రూ.హాలికుడు.

నాగలి చేతి నుండి వదిలితే నాయుడుగారికి నాగరికం ముదురుతుందికాని భోజన సౌఖ్యముండదు.

నాగఁటిజోదు - బలరాముడు, హలాయుధుడు.
దుక్కివాలు తాలుపు - బలరాముడు.
దుక్కివాలు - నాగలి; లాంగులము - నాగలి.
నాగఁటి (ౘ)చాలు పేరి యతివ(అతివ - స్త్రీ) - సీత. చిత్రకూటము నందు దేవిస్థానం సీత.

కాళిందీం యమునాం హలేన భినత్తీతి కాళిందీ భేదనః : హలముచేతఁ కాళిందీ నదిని భేదించినవాడు.
కాళిందీ బోధసుఁడు - బలరాముడు.

పూర్వ - తూర్పు; ప్రాచి - తూర్పు.
తూరుపు -
సూర్యుడుదయించు దిక్కు, ప్రాగ్దిశ, రూ.తూర్పు.
తూరుపుఁఱేడు - ఇంద్రుడు.
ప్రాచీనబర్హి - ఇంద్రుడు.

పూర్వత్వాత్పూర్వా - మొదటిదిక్కు.
ప్రాక్ ప్రాచ్యం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.
ప్రాక్ ప్రథమం అంచత్యస్యాం రవి రితి ప్రాచీ. ఈ-సీ. - ప్రథమమున సూర్యుఁడు ఈదిక్కున బొడమును గనుక ప్రాచి.

నేక్షేతోత్యంత మాదిత్యం నాస్తంయాతం కదాచన,
ప్రతిబింబం సదారిస్థం సమధ్యం నభసోగతం|
తా.
సూర్యు డుదయించుచున్నప్పుడు, అస్తమయ మగుచున్నపుడు, ఆకాశమధ్యంబును బొందియున్నపుడు ప్రతిసూర్యుడు, (అనఁగా ఉదకమందలి సూర్య ప్రతిబింబమును) జూడగూడదు. – నీతిశాస్త్రము

సూర్యుడు తూర్పు దిక్కున మాత్రమే ఉదయిస్తాడు. సూర్యుని ఎవరు - ఉదయించమన్నారు?

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి. హరివాసరము - ఏకాదశి.

ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రుని ఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.

మువ్వన్నెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు - (భౌతి.) సూర్య కిరణములు(మువ్వన్నెకాఁడు - సూర్యుడు) నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow).

ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు(నాల్గు దంతములు కలది), 2.అమృతము.
(ౘ)చౌదంతి -
చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము. 
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.

పుంనాగే పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః,
పున్నాగ ఇవ పున్నాగః - పురుష శ్రేష్ఠునివలె పూజ్యమైనది.
పురుషవ దున్నతత్వాత్పురుషః తుంగశ్చ - పురుషునివలె ఉన్నతమైనది పురుషము, తుంగమును.
ప్రశస్తాః కేశరాస్సంత్యస్య కేసరః - మంచి ఆకరవులు గలది.
దేవానాం వల్లభః - దేవతలకు ప్రియమైనది. ఈ నాలుగు 4 సురపొన్న పేర్లు. 

ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
అభ్రమువు -
తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య. 
యమపత్ని - ఐరావతి.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలివెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదు పదార్థము, 7.బంగారు, 8.పాదరసము(Mercury), 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.

పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం - పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.

పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను -
1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.  

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు -
చంద్రుడు, అమృతకిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు.

అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధుసుఁడు -
వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.

ఎట్లుగఁ బాటుపడ్డనొకయించుక ప్రాప్తములేకవస్తువుల్
పట్టుపడంగనేరవు నిబద్ధి, సురావళిఁ గూడి రాక్షసుల్
గటుపెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించిరెంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు, భాస్కరా.
తా.
రాక్షసులు దేవతలతో కలిసి మందరపర్వతమును పెకలించు దానిని తీసుకొనివచ్చి కవ్వముగా నుపయోగించి, పాలసముద్రము మదించిరి. తుదకు అమృత మందు జనితమయ్యెను. కాని ప్రయాసపడిన రక్కసులు దానిని తామనుభవింపలేకపోయిరి. కావున యెవరెంత కష్టపడినను, వారికి అదృష్టములేనిచో తామాశించు ఫలమును పొందలేరు. 

Kurma Avatar

మంధరధారే మోక్షము రారే…

1 comment:

  1. అతి ఓపికగా ఇన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలను తాత్పర్య సహితంగా టైపు చేసి అందరికోసం అంతర్జాలం లో ఉంచినందుకు ధన్యవాదాలు రమాదేవి గారు!

    ReplyDelete