అనంగము - అంగములేనిది, వి.1.ఆకాశము, 2.మనస్సు.
నిరాకారము - ఆకాశము, విణ.ఆకారము లేనిది.
ఆది నుంచి ఆకాశం మూగది..
అనాదిగా తల్లి ధరణి మూగది...
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకె మాటలు…ఇన్ని మాటలు.....
ఆకాశము - 1.విన్ను, మిన్ను, 2.భూతము లై దింటిలో ఒకటి, 3.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) ఉన్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space). ఆకాశం అందరికీ చోటిస్తంది.
విను - ఆకర్ణించు, వి.ఆకాశము, రూ.విన్ను.
ఆశావాదికి ప్రతి ఘోరమైన సన్నివేశంలోనూ ఒక అవకాశం కనిపిస్తే, నిరాశావాదికి ప్రతి అవకాశంలోనూ ఒక ఘోరం కనిపిస్తుంది. - ఒక సూక్తి
ద్వౌ దివౌ ద్వేస్త్రియా మభ్రం వ్యోమ పుష్కర మమ్బరమ్,
నభో అన్తరిక్షం గగన మనన్తం సురవర్మ్య ఖమ్.
వియద్విష్ణుపదం వా తు పుం స్యాకాశ విహాయసీ,
(విహాయసో అపి నాకో అపి ద్యురపి స్యాత్త దవ్యయం,
తారాపథ శ్శబ్దగుణో మేఘద్వారం మహాబిలమ్.)
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము - 1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
ద్యుపు - 1.ఆకాశము, 2.దినము, 3.స్వర్గము.
దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.
దివనము - 1.పగలు, 2.దినము, రోజు.
దినము - 1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
పగలు - పవలు, దినము.
రోజు - దినము.
రోజు - 24 గంటలు, దినము భూమి తన అక్షముపై పడమటనుండి తూర్పునకు తనచుట్టును 360 డిగ్రీలు తిరుగుటకు తీసికొను వ్యవధి, సం.రోచిః.
దినకరుఁడు - సూర్యుడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
లోకబాంధవుఁడు - సూర్యుడు. లోకబాంధవో లోకబాంధవః - లోకమునకుఁ చుట్టము, బంధువు.
ౙగముచుట్టము - సూర్యుడు.
ౙగముకన్ను - సూర్యుడు.
జగచ్చక్షువు - సూర్యుడు.
ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
భా|| ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.
అభ్రము - 1.మేఘము, 2.ఆకాశము, 3.అభ్రకము, 4.బంగారు, 5.హారతి కర్పూరము, 6.తుంగమస్త, 7.(గణి.) సున్న.
వ్యోమధూమము - మేఘము.
అమలము - 1.నిర్మలము, 2.దోషము లేనిది, 3.తెల్లనిది, వి.అభ్రకము.
అభ్రకము - (రసా.) కాకిబంగారము (రాసాయనికముగ ఇది మగ్నీషియమ్, ఇనుము, సోడియమ్, పొటాషియమ్‌తో కూడుకొనిన సిలికేట్ యౌగికము. ఇది పొరలుగా విదదీయబడ గలదు. దీనిని తాపవిద్యుత్ నిరోధకముగా వాడుదురు) (Mica).
కాకిబంగారము - పీతాభ్రకము.
బేగడ - కాకి బంగారు; ముచ్చెబంగారు - కాకి బంగారు.
అభ్రంకషము - ఆకాశమును ఒరయునది, మిక్కిలి ఎత్తైనది.
అభ్రమణి - సూర్యుడు.
నింగి - ఆకాశము.
నింగిచూలు - వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.
నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.
వ్యోమకేశుఁడు - శంకరుడు, వ్యు.ఆకాశము జూట్టుగా గలవాడు.
శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.
వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము.
పుష్కరము - 1.మెట్ట తామర దుంప, 2.తామర Lotus 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
పోషయతీతి పుష్కరం. పుష పుష్టౌ, - పోషించునది.
గండూషము - 1.పుక్కిలింత, 2.పుడిసిలి, 3.ఏనుగు తొండము చివర, 4.పుక్కిట పట్టిన నీరు.
కొణిదిలి - పుడిసిలి. చేర - చాచిన అరచేయి, పుడిసిలి.
కమి - 1.పంపబడిన వ్రేళ్ళుగల పుడిసిలి(కమికిలి), 2.కబళనము, 3.తృప్తి.
కమికిలి - పంపబడిన వ్రేల్ళుగల పుడిసిలి.
అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమ పువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.
కాశ్మీరము - 1.కుంకుమపువ్వు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీర దేశము. కాశ్మీరము నందు దేవీస్థానం మేధ.
అంబరు - ఒక పరిమళద్రవ్యము, సం.అంబరమ్.
అంబరీషము - 1.యుద్ధము, 2.మంగలము, 3.పశ్చాతాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.
వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా, పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధవహాత్మతా న్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా,
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చే ద్బాలేదు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే! స్వామిన్! త్రిలోకీ గురో. - 30శ్లో
తా. మస్తకంపై బాలచంద్రుడ్డి ధరించిన దేవా(పశుపతి - శివుడు) ! జగత్రయాలకు గురువైనవాడా ! అంబరాలను (బట్టలను) శుభ్రం చేసే విషయంలో సహస్రకరాలు కల సూర్యత్వాన్నీ, పువ్వులతో పూజించడంలో(వ్యాపకత్వం) విష్ణుత్వాన్నీ, సు గం ధా న్ని వ్యాపింపజేయడంలో వాయుత్వాన్నీ, ఆహారాన్ని పక్వం చెయ్యడంలో - ఇంద్రత్వాన్నీ, పాత్రలను శుభ్రం చెయ్యడంలో(సువర్ణత్వం) అంటే బ్రహ్మత్వాన్నీ నేను పొంది ఉంటే నీ సేవ చేయగలను. - శివానందలహరి
నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
నభస్వంతుఁడు - వాయువు.
అంతరిక్షము - ఆకాశము, రూ.అంతరిక్షము.
అంతరిక్షనౌక - ఖగోళయాత్రలో రాకెట్ చోదనముచే పయనించు విమానము (Space-Ship).
విమానము - వ్యోమయానము, వ్యు.ఆకశమున సంచరించునది, 2.చక్రవర్తి సౌధము, 3.ఓడ, గర్భగుడిపై గల గోపురము, (బౌతి.) గాలిలో ప్రయాణించు ఓడ, (Air-craft, Aeroplane).
వ్యోమయానము - ఆకాశమునందు తిరుగు విమానము.
వ్యోమగామి - గ్రహాంతరములకు అంతరిక్ష నౌకలో(Space ship) ప్రయాణము చేయు వ్యక్తి (Austronaut).
విమానవాహకము - (బౌతి.) విమానములు దిగుటకు ఎగిరిపోవుటకు అనువైన ప్రదేశము కలిగిన ఓడ (Air-craft carrier).
ఖగోళము - ఆకాశ మండలము.
ఖగోళశాస్త్రము - (ఖగో.) నక్షత్రములు, గ్రహములు మొ.గు వానిని గూర్చి తెలుపు శాస్త్రము (Astronomy).
గగనము - 1.ఆకాశము, 2.శూన్యము, సున్న, విణ.దుర్లభము.
గగన కుసుమము - (జాతీ.) ఆకాశ పుష్పము (అసంభవము, శూన్యము అను అర్థముల ప్రయుక్తము).
శూన్యము - (గణి.) సున్న = మూల్య రహితము (Null) గాలి తీసివేసిన చోటు (Vacuum) సం.వి.సున్న, విణ.పాడు.
సున్న - 1.శూన్యము, 2.అనుస్వారము, 3.అభావము.
అనుస్వారము - బిందువు, సున్న.
అభావము - 1.లేమి, 2.నాశము, విణ.1.లేనిది, 2.సత్యము కానిది.
పాడు - 1.పాటినేల, 2.శూన్యగ్రామము, క్రి.పాటపాడు.
పాటినేలలు - (వ్యవ.) పురాతన గ్రామ కంఠములందలి మన్నుతో నేర్పడిననేలలు (Old village site soils) (వీచేలో పొటాసియ నత్రితము (Kno3) కొంచె మెక్కువగా నుండును అందుకే పాటిమన్ను కూడ ఎరువుగా నుపయోగింపబడు చుండును.)
అంతరాళము - 1.ఎల్లదిక్కులకు నడిమిచోటు, 2.(దేశకాలముల) నడిమి భాగము, 3.సంకీర్ణజాతి, సంకరజాతి.
ఎడము - 1.చోటు(చోటు - తావు), 2.అవకాశము, 3.నడిమిభాగము.
సంకీర్ణము - ఒకటితో నొకటి కలిసినది.
సంకరము - బేధము తెలియని కూడిక.
ఆస్కారము - ఆధారము, అవకాశము.
అవకాశము - 1.తరుణము, వీలు, 2.దేశకాలముల ఎడము, 3.(భౌతి.) సకల రాసులను కలిసియుండి ఆద్యంతములు లేనిది (Space).
తరుణము - సమయము, సం.విణ. క్రొత్తది, యౌవనముగలది.
వీలు - అనుకూల్యము, క్రమము.
క్రమము - 1.విధము, 2.వరుస, సొరిది, 3.విధి, 4.క్రమాలంకారము.
ఒక మహాదవకాశం కొరకు వేచి చూడటం కంటె వచ్చే చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకుని లక్ష్యాన్ని చేరుకోవచ్చు. - హగ్ ఎలెన్
అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి.1.విష్ణుశంఖము, 2.మేఘము, 3.అభ్రకము, 4.(వృక్ష.) వావిలి, 5.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్దశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.
అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.
అమితము - విస్తారము, మితిలేని, మేరలేనిది.
నిరవధికము - మేరలేనిది.
అనంతశయనుఁడు - విష్ణువు.
భంబు - 1.ఆకాశము, 2.నక్షత్రము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది, (నక్షత్రము లిరువది యేడు).
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
రిక్కదారి - ఆకాశము.
ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
రవి - 1.సూర్యుడు(సూర్యుఁడు - వెలుగురేడు), 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
తొలుచదువులు - వేదములు; తొలిమినుకులు - వేదములు.
పరమము- పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము, 2.ఆద్యము, 3.ప్రధానము.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిరర్తువు. ధ్యానము - చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది.
గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
అద్వైతము - 1.అభేదము(సమరసము - అభేదము), 2.జీవేశ్వరుల ఐక్యమును బోధించు మతము, 3.పరబ్రహ్మము, విణ. భేదములేనిది.
యావ - (వ్యావ.)1.ధ్యానము, “నా పుత్రునిపై యావపాఱినది, 2.దృష్టి.
ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు. హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.
ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).
నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.
నాకౌకసుఁడు - 1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ. వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.
సురలు - వేలుపులు.
సురచార్యుఁడు - బృహస్పతి.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ఖంబు - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.శూన్యము, 4.సుఖము.
ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖగపతి - గరుడుడు.
గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
ఖచరము - 1.గాలి, 2.మేఘము, 3.పక్షి.
ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.
ఖద్యోతము - 1.మబ్బు, 2.మిణుగురు పురుగు, వ్యు.ఆకాశమున వెలుగునది.
ఖదోతుఁడు - సూర్యుడు.
ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు - వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమని, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.
అధ్వము - 1.దారి, 2.దూరము, 3.పయనము, 4.వేదశాఖ, 5.కాలము, 6.ఆకాశము, 7.పయనమునందు ఆగెడి స్థలము, 8.ఉపాయము.
అధ్వర్యము - 1.హింసారహితము, 2.సావధానము, వి.1.యజ్ఞము, 2.సోమయాగము, 3.ఆకాశము.
అధ్వరుఁడు - యాగమునందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, రూ.అధ్వర్యువు.
సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ధ్వని, ఆలోచన, ఏమి లేకుండుట(శూన్యము), భ్రమ, సందేహము; ఈ ఐదు ఆకాశం యొక్క గుణాలు.
1. ధ్వని - 1.శబ్దము, చప్పుడు, 2.వ్యంగప్రధానశబ్దము, 3.వ్యంగము,(భౌతి.) శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహింపపడు సంక్షోభము, (Sound).
శబ్దము - 1.ధ్వని, 2.వ్యాకరణ శిక్షితమైన పదము.
ౘప్పుడు - అచేతన వస్తువులు ఒకటితో నొకటి తాకుటచే కలుగుధ్వని, శబ్దము.
శబ్దశాస్త్రము - (వ్యాక.) వ్యాకరణ శాస్త్రము.
ఫణితము - వాక్కు, శబ్దము, విణ.చెప్పబడినది.
ఫణితి - 1.వాక్కు, 2.పాడెడు పద్దతి.
అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).
జీవితస్థాయి - (అర్థ.) వ్యక్తి తన జీవితావసరములను సమకూర్చుకొన గలుగు పరిమితి (Standard of Life).
అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామాతురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధాతురాణాం నరుచిర్నపక్వమ్||
తా. ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్షగలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలికొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. - నీతిశాస్త్రము
వృతము - 1.చీకటి, 2.కొండ, 3.శబ్దము, 4.మేఘము.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, త. మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
కొండ(ౘ)చూలి - పార్వతి.
కొండమల్లయ్య - శివుడు. కొండయల్లుఁడు - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు. గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక.
సద్దు - శబ్దము, చప్పుడు, సం.శబ్దః.
శబ్దగ్రహము - 1.చెవి, 2.శబ్దజ్ఞానము. ఆకాశము శబ్దము.
చెవి - 1.శ్రవణము, వినెడియింద్రియము, 2.రాట్నము మొదలగు వానియందుగల యొక భాగము, 3.తాళపుచెవి.
నిస్వనము - ధ్వని, మ్రోత, రూ.నిస్వానము.
నినదము - 1.ద్వని, 2.నినాదము.
ధ్వానము - ధ్వని. మ్రోత - ధ్వని.
స్వానము - ధ్వని, రూ.స్వనము.
నిర్ఘోషము - ధ్వని.
నాదము - ధ్వని; నాదు - నాదము, ధ్వని, సం.నాదః.
రావము - 1.రవము, 2.ధ్వని.
రవము - కంఠధ్వని.
స్వరము - 1.కంఠధ్వని, 2.ముక్కుగాలి, అచ్చు (అకారాది) ఉదాత్తాను దాత్త స్వరితములు (వేదములోని), 4.షడ్జాది సంగీత స్వరములు ఏడు, సం.వి. (భౌతి.) సంగీత ధ్వనులలో ఒక నియత ధ్వనిని సూచించు చిహ్నము (Note), సం.వి.(భౌతి.) ధ్వని యొక్క గుణము(Tone).
స్వరములు - (భౌతి.) వినుట కింపైన ధ్వనులు (Notes).
విద్యాశ్చతస్రో సాధ్యాస్స్యుర్జన్మతా సహసంభవాః|
గాంధర్వంచ కవిత్వంచ శూర్త్వం దానశీలతా||
తా. జనులకు సంగీతము, కవిత్వము, శౌర్యము, దానశీలత్వము, ఈ నాలుగువిద్యలు నుత్పత్తితోడ గలుగవలసినవి గాని నేర్పుచేత సాధింప దగినవి కావు. - నీతిశాస్త్రము
ఆరభటము - మ్రోత.
ఆరభటి - 1.మ్రోత, 2.నేర్పు, 3.(అలం.) ఒక కావ్యవృత్తి.
ఆరభట - 1.మ్రోత, 2.(అలం.) రౌద్రభీభత్సరసములలో వాడు ఒక కావ్యవృత్తి, రూ.ఆరభటము.
మేఘము - మబ్బు.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
అంబుదము - నీటినిచ్చునది, మేఘము, మబ్బు.
వారిమసి - మేఘము, వ్యు.నీరు(వారి - నీరు)ని మసివలె నల్లగ చేయును.
వారిదము - మేఘము, వ్యు.నీటి నిచ్చునది.
మొగులు - మేఘము, రూ.మొగిలు, మొయిలు.
మొగులుదారి - ఆకసము.
మొగులువిరి - జలము, మేఘ పుష్పము.
మేఘపుష్పము - 1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.
క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
మబ్బు - 1.మేఘము(మేఘము - మబ్బు), 2.చీకటి, 3.అజ్ఞానము.
శ్రవణము - 1.చెవి, 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
శ్రోతము - చెవి; శ్రవము - చెవి.
శ్రవ్యము - (భౌతి.) చెవి, గ్రహింప బడ గలది, (Audible).
వినికి - వినుట, రూ.వినుకలి.
ఆకర్ణనము - వినికి, శ్రవణము.
ఉపశ్రుతి - 1.ప్రసంగమున ఇతరులు పలికిన శుభాశుభసూచక మగువాక్యము, 2.సమ్మతి, 3.వినికి, అవ్య. చెవిదగ్గర.
ఉపశ్రుతము - 1.వినబడినది, 2.అంగీకరింపబడినది, సమ్మతింపబడినది.
శృతి - 1.వేదము, 2.చెవి, 3.వినికి.
శృతము - 1.వినికి, 2.శాస్త్రము, విణ.వినబడినది.
ప్రాఁగబ్బము - (ప్రాత+కబ్బము), వేదము.
ప్రాఁత - 1.భృత్యుడు, 2.జీర్ణవస్త్రము, వస్త్రము, విణ.1.బహుకాలము నాటిది, పూర్వము, పురాతనము, సం.భృత్యః, వస్త్రమ్, పురాతనమ్.
కబ్బము - ప్రబంధము(ప్రబంధము - కావ్యము.), సం.కావ్యమ్.
ప్రాఁౙదుల పెట్టె - సూర్యుడు.
వేద మూలమిదం జ్ఞానం, భార్యామూలమిదం గృహమ్|
కృషిమూల మిదంధాన్యం, ధనమూల మిదంజగత్||
తా. జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు భార్యయేమూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. - నీతిశాస్త్రము
2. ఆలోచన - 1.చూచుట, 2.ఆలోచించుట, యోచన, తలంపు.
ఆలోకనము - 1.చూచుట, 2.చూపు, 3.కాంతి.
అవలోకనము - 1.చూపు, 2.చూచుట, 3.కన్ను, 4.విచారణ.
ఏకతము - 1.ఆలోచన, 2.ఆలోచనకు దగినచోటు, సం.ఏకాంతః.
ఏకతమాడు - ఆలోచించు, తలంచు. సలహా - ఆలోచన.
ఆడదాని ఆలోచనలో హృదయం, మగవారి ఆలోచనలో తెలివి కనిపిస్తాయి. – బ్లెస్సింగన్
దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు. (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్దివాడు, 3.మంచికన్నులు కలవాడు.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది.
మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.
ధీ - బుద్ధి.
ధీంద్రియము - (ధీ+ఇంద్రియము) జ్ఞానేంద్రియము.
ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.
ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్ర్యము కలవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు; విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీఘ్రగ్రాహిత మైన అవయవము (Sense organ).
జ్ఞానతంతువులు - (గృహ.) ఈనరముల తంతువులు జ్ఞానేద్రియముల నుండి మెదడునకు వార్తలను గొంపోవును, (ఇవి చైతన్యము కలుగచేయును), (Sense nerves).
సంవేదకనాడులు - (జం.) జ్ఞానేద్రియముల (చర్మము, నాలుక, కన్ను, ముక్కు, చెవి) నుండి కేంద్ర నాడీమండలమునకు ప్రేరణలు పంపు నాడులు, జ్ఞాననాడులు, (Sensory nerves).
శ్రోతం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రూణమేవ చ |
అధిష్ఠాయ మనస్చాయం విషయానుప సేవతే || - 9శ్లో భగవద్గీత
జీవుడు చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియ పంచకమును, మనస్సును ఆశ్రయించి వాటిద్వారా విషయసుఖముల ననుభవించును. - పురుషోత్తమప్రాప్తి యోగః
వనకరి చిక్కెమైనసకు వాచవికిం జెడిపోయె మీను తా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేదుఁలు జెందెను లేళ్ళు తావిలో
మనికినశించెదేటి తరమా యిరుమాఁటిని గెల్వవైదు సా
ధనముల నీవె కావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ.
తా. దాశరథీ ! అడవిలో ఏనుఁగు ఆఁడుఏనుఁగును జూచియు(చర్మము, తోలు), చేఁప గాలమునందలి యెర చవికిని(నాలుక, రుచి), పాము పాములవాని ఊదుస్వరమును వినుటకును(చక్షుశ్శ్రవము - 1.పాము, కనువినికి.), లేడి కను పిచ్చిచేతను(చెవి), తుమ్మెద తామరలోని పూఁదేనె వాసనకు(ముక్కు)లోనయ్యి, చిక్కుకొనుచున్నవి. అయిదు ఇంద్రియములను గెలువ కష్టము గావున, పంచేద్రియముల నిన్నుగొల్చు పంచవిధ కైంకర్యముల చేత ఇంద్రియముల నడఁచి(అణచి) నన్ను కాపాడుము.
అక్షి - 1.కన్ను, 2.రెండు అను సంఖ్యకు సంకేతము.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.
లోచనము - నేత్రము.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.పలిపము.
(ౙ)జాడ - 1.అడుగుల గురుతు, 2.సైగ, 3.త్రోవ, 4.విధము.
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.
పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
పబ్బము - 1.పండుగ, ఉత్సవము, 2.అతిథ్యము, సం.పర్వమ్.
పండుగ - సంబరము, ఉత్సవము, సంక్రాంతి మొదలైనవి.
సంబరము - సంభ్రము, వేగిరపాటు, సంతోషము, పండుగ, రూ.సంబ్రము, సం.సంభ్రముః.
కణుపు - 1.బుడిపు, 2.వెదురు, చెరుకు మొ.ని కనుపు, 3.(వృక్ష.) కాండముపై ఆకు బయలుదేరిన స్థానము (Node).
కనుపుల విలుకాఁడు - చెరకు విలుకాడు, మన్మథుడు.
ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు - ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).
శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వీనికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).
దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దరిశనము - 1.దర్శనము, 2.పెద్దల చూడకొనిపోవు కానుక, సం.దర్శనము.
అద్దము - 1.సగము, సం.అర్థమ్, 2.దర్పణము, సం.అబ్దమ్.
దర్పణము - అద్దము, (భౌతి.) కాంతి కిరణమును క్రమపరావర్తనము నొందించు నునుపైన ఉపరితలము గల వస్తువు, (Mirror).
ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
అగ్రణి - శ్రేష్ఠుడు, మొదటివాడు.
అగ్రతస్సరుఁడు - 1.మొదటివాడు, 2.ముందునడుచువాడు.
అగ్రిముఁడు - మొదటివాడు.
అగ్రగామి - ముందు నడుచువాడు, (గృహ.) ఒక వస్తువుగా తయారగుటకు దానికి ముందున్నస్థితి. ఉదా. కెరోటిన్ శరీరములో విటమిన్ ' A ' గా మార్చబడును. కనుక విటమిన్ ' A ' కి అగ్రగామి కెరోటిన్.
కెరోటిన్ - (గృహ.) (Carotene) పసుపు పచ్చని పదార్థము ' ఏ ' విటమిన్ తయారగుటకు కావలసిన పదార్థము (ఇది కనుల బలహీనతను నిరోధించును.)
అగ్రసరుఁడు - అగ్రగామి; అగ్రేసరుఁడు - అగ్రగామి.
కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).
నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'A' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి, (Kerophthalmia.) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డి యగును).
బాహ్యత్వచాజాడ్యము - (గృహ.) కాచబింబము(Cornea) మెత్తనగు వ్యాధి, ఆహారములో వైటమిన్ "A", తక్కువైన ఈ వ్యాధి కలుగును.
అవిరి - 1.ఒకనేత్ర రోగము, కంటిలో పెరుగు దుర్మాంసపటలము, 2.నీలి మొక్క, రూ.అయిరి.
సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా. దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు(నయనము - 1.కన్ను, 2.పొందించుట)ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. - నీతిశాస్త్రము
నిబోధనము - చూపు.
నిమీలినము - 1.కనులుమూయుట, 2.చావు.
నిమీలకచ్ఛదము - (జం.) మూడవ కనురెప్ప (కప్ప) (Nictitatinga membrane). (దీనిని స్వేచ్ఛగా కదల్చుటకు వీలగును), కంటిపొర.
ఈక్షణము - 1.కన్ను, 2.చూపు, వీక్షణము.
ఈక్షితము - 1.చూడబడినది, 2.ఆలోచింపబడినది, వి.చూపు, దృష్టి. లోకనము - వీక్షణము.
తిలకించు - 1.ప్రకాశించు, 2.ప్రసన్నత నొందు, 3.చూచు.
కాంచు - 1.చూచు, వీక్షించు, 2.పొందు.
కలియు - పొందు.
పొందు - 1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి - 1.మిత్రభావము, స్నేహము, 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity).
ఏకదృష్టి - కాకి, ఏకాక్షము, వ్యు.ఒక చూపు కలది.
ఏకాక్షము - 1.కాకి, 2.ఒక కన్ను గలది.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
వాయసము - కాకి.
కాకాక్ష న్యాయము - న్యా. కాకి చూపు వలె ఏదేని ఒక ప్రక్కకు ఒరగుట.
"సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండితః,
అర్థేన కురుతే కార్యం సర్వనాశో హి దుర్భరః."
'సర్వము కోల్పోవు పరిస్థితి దాపురించినపుడు తెలివికలవాడు, సగము వీడి, తక్కిన సగము కాపాడుకొనును.' అన్న లోకనీతి ననుసరించి సర్వేంద్రియములలో ప్రధానములగు కన్నులు రెంటిలో ఒకదానిని ఆ కాకి వదలుకొనెను. కాకి కుడికంటిని విడిచిపెట్టి ప్రాణములు కాపాడుకొనెను(సీతోదిత కాకావన రామ! సీతాదేవిని బాధించినందుకు శ్రీరాముని కోపమునకు గురైంది). - సుందరకాండ
చక్షువు - కన్ను; చక్షుశ్శ్రవము - 1.పాము, కనువినికి.
సులోచనము - కంటియుద్ధము.
3. శూన్యము - (గణి.) సున్న = మూల్య రహితము (Null) గాలి తీసివేసిన చోటు (Vacuum) సం.వి.సున్న, విణ.పాడు.
శూన్య ప్రదేశము - (భౌతి.) ఏ వస్తువు లేని ప్రదేశము (Vacuum). సున్న - 1.శూన్యము, 2.అనుస్వారము, 3.అభావము.
శూన్యవాది - సర్వము నాస్తి యను వాడు.
అనుస్వారము - బిందువు, సున్న.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి సూత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు(తెలిగాము - శుక్రుడు), వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
(ౘ)చుక్కలదొర - చంద్రుడు.
అభావము - 1.లేమి, 2.నాశము, విణ.1.లేనిది, 2.సత్యము కానిది.
లేమి - దారిద్ర్యము, లేమిడి, ఉండమి.
దారిద్ర్యము - బీదతనము(నిప్పచరము - దారిద్ర్యము), లేమి.
ఎద్దడీ - (ఎత్తు + తడి), 1.దారిద్ర్యము, 2.శూన్యము, 3.కరవు.
దుర్గతి - 1.నరకము, 2.బీదతనము.
నరకము - దుర్గతి-పాపముచేసి అనుభవించునది.
సీదరము1 - దారిద్ర్యము. సీద్రము - వై.వి. చూ. సీదరము.
సీదరము2 - 1.పాము, 2.పాము కుబుసము, సం.శ్రీధరః.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము.
సప్పము - సర్పము, సం.సర్పః.
మాతానిందతి నాభిన దతిపితాభ్రాతాన సంభాషతే|
భృత్యుఃకుప్యతి నానుగచ్ఛతిసుతః కాంతాపినాలింగతే
అర్థప్రార్థవ శంకయానకురుతే నలాపమాత్రంసుహృ|
విత్తస్మాదర్థపార్జయ శ్రుణుసఖ్యేహ్యర్థేన సర్వేవశాః||
తా. దరిద్రుని(దరిద్రుఁడు - పేదవాడు, పేదవానిని)తల్లి నిందించును, తండ్రి సంతసింపడు, అన్నదమ్ములు (భ్రాత - తోడ బుట్టినవాడు)మాటలాడరు, పనివాఁడు(భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.)కోపగించు కొనును, కొడుకు(సుతుఁడు - కొడుకు) వెంటరాడు, ఆలు(కాంత - కోరతగిన స్త్రీ, స్త్రీ.)గౌగలించుకొనదు, తన్ను ద్రవ్యమడుగునను శంకచేత స్నేహితుఁడు(సుహృదుఁడు - మిత్రుడు) తుదకు పలుకరింపనొల్లఁడు. ధనమువలన నందరును స్వాధీను లగుదురు. కావున ధనమే (యా)ఆర్జింపవలెను. - నీతిశాస్త్రము
నివృత్తము - 1.మరలుట, 2.లేమి.
నివర్తనము - మరలుట.
ధ్వంసము - నాశము.
ధ్వంసితము - నాశనము చేయబడినది.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
వినాశము - చేటు.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము - పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సప్పము - సర్పము, సం.సర్పః.
కలుషము - పాపము. దురితము - పాపము.
కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.
దుష్టము - చెడ్దది; చెడ్డ -1.కీడు, విణ.దుష్టము.
చేరుగొండి - 1.దుష్టము, వి.పెండ్లి యాడకయే వచ్చిన భార్య.
పంచత్వము - మరణము.
విగమము - 1.నాశము, 2.విభజనము. విభజనము - వేరుచేయుట.
గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
లేబరము - 1.శూన్యము, వ్యర్థము. వయ్యము - వ్యర్థము.
చెనఁట - 1.కుత్సితము, 2.వ్యర్థము, 3.శూన్యము, రూ.చెన్నటి.
ఉత్త - 1.వట్టి, 2.కేవలము, 3.అసత్యము, 4.పనిలేనిది, 5.ఏహ్యము, సం.వ్యర్థమ్, రిక్తమ్.
వట్టి - 1.రిక్తము, ఉపయోగములేనిది, 2.అసత్యము.
రిక్తము - శూన్యము, వట్టిది.
రిత్త - 1.రిక్తము, 2.కల్ల, 3.కారణములేనిది, అవ్య. ఊరక, సం.రిక్తమ్. దోయిడి - శూన్యము, రిత్త.
కల్ల - 1.అసత్యము, 2.పరుషవచనము.
అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.
అసత్తు - 1.లేనిది, 2.చెడ్దది. అభూతము - 1.కల్లయైనది, 2.లేనిది, 3.జరుగనిది.
వ్యర్థము - వమ్ము, అప్రయోజకము.
వమ్ము - నాశము, విణ.వ్యర్థము, సం.వ్యర్థః.
సీ1 - అవ్య. జుగుసార్థమందు చెప్పుమాట.
సీ2 - శ్రీ.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
సిరి - 1.శ్రీ, లక్ష్మి 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః.
లక్ష్మి -1.రమాదేవి, 2.సంపద 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్టదామర.
శోభ - 1.వస్త్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్దులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.
ఔజ్జ్వల్యము - ఉజ్జ్వలత్వము, ప్రకాశము.
శ్రీకంఠుఁడు - శివుడు, కరకంఠుడు.
శ్రీధరుఁడు - విష్ణువు. శ్రియపతి - విష్ణువు, లక్ష్మిభర్త.
శ్రీపతి - 1.విష్ణువు, 2.రాజు.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
శ్రీదుఁడు - కుబేరుడు.
శ్రీమంతుఁడు - సంపదకలవాడు.
సిరిమంతుఁడు - శ్రీమంతుడు, సం.శ్రీమాన్.
శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి - మదనుడు; మదనుఁడు - మన్మథుడు; మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
దౌర్మంత్రానృపతి ర్వినశ్యతి యతిస్సంగా త్పుతోలాలనా
ద్వి పోనధ్యయనా త్కులం కుతవయాచ్చీలం ఖలోపాసనత్ |
హ్రీర్మద్యా దనవేక్షణాదపి కృషిః, స్నేహః ప్రవాసాశ్రయా
న్మైత్రిశ్చా ప్రణయా త్సమృద్ధి రనయాత్త్యాగా త్ప్రమాదాద్ధనం ||
తా. దుర్మంత్రి కలుగుటవలన రాజును, సంగమమువలన సన్న్యాసియును, లాలనవలన (బు)పుత్రుడును, వేదము చదవకపోవుట వలన బ్రాహ్మణుఁడును, దుష్టపుత్రుని వలన కులంబును, దుష్ట సాంగత్యము వలన సత్సభావమును, మద్యపానము వలన సిగ్గును, చూడకపోవుట వలన కృషియును, పరదేశగమనము వలన స్నేహమును, ప్రేమలేకపోవుట వలన మైత్రియును, నీతి(నీతి – న్యాయము)లేకపోవుట వలన సమృద్ధియును, మతిలేక యిచ్చుట వలనను హెచ్చరిక తప్పుట వలనను ధనంబును నశించును. - నీతిశాస్త్రము
4. భ్రమ - 1.మైకము, 2.భ్రాంతి, 3.సందేహము.
మైకము - మత్తు.
మత్తు - మంపు, మదము, సం.మత్తా, మదః.
మంపు - మత్తు, మైకము.
మదురువు - 1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.
మదిర - కల్లు.
గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
కల్లు1 - 1.బండికన్ను (చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.
అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.
హాల - సారాయి.
సారాయి - సుర, మద్యము, రూ.సారాయము, సం.సారః.
వారుణీ - 1.పడమట దిక్కు, 2.సారాయి.
మద్యసారము - 1.(రసా.) పిండి వస్తువుల పులియబెట్టుట వలన లభించు మత్తుకలిగించు ద్రవము, ఇది యొకకర్బన యౌగికము (Alcohol), 2.(గృహ.) మత్తునిచ్చు పానీయము, ఉదా. సారా, కల్లు, విస్కీ, (Alcohol).
మద్యార్కము - (రసా.) మద్యసారము (Spirits). మద్యపానము వలన సిగ్గు నశించును.
మద్యపానం:-
మొదలి పెక్కు జన్మముల పుణ్యకర్మముల్
పరగఁ బెక్కు సేసి పడయఁబడిన
యట్టి యెఱుక జనులకాక్షణ మాత్రాన
చెఱుచు మద్యసేవ సేయనగున్.
గంజ - 1.కల్లుపాక, 2.గని, 3.గంజాయి, 4.కల్లుకుండ, 5.గుడిసె.
గంజాయి - 1.గంజామొక్క, 2.దాని ఆకు, 3.ఆ ఆకుతో తయారు చేసిన మత్తు పదార్థము, కబళము, (వ్యవ.) ఉన్మాదక ద్రవ్యములలో ఒకటి (Hemp). (ఇది Cannabinaceae అను కుటుంబమునకు చెందిన Cannibis sativa (గంజాయి మొక్క) అను ఆడు మొక్కల పూవుల నుండి తయారుచేయుదురు. భంగు అనునది ఈ మొక్కలనుండియు, వాని కాడల నుండియు తయారుచేయబడును. గంజాయిలో 'కన్నబిన్ ' (Cannabin) అను ముఖ్యమైన క్షారాభము (Alkaioid) ఉండును.
గాంధారి - 1.గంజాయి, 2.దృతరాష్ట్రుని భార్య.
గాంధారేయుఁడు - దుర్యోధనుడు, గాంధారికొడుకు.
గజ్జా - 1.మదము, 2.మత్తు, సం.కచ్చూః.
మదము - 1.క్రొవ్వు, 2.రేతస్సు, 3.గర్వము, 4.కస్తూరి.
క్రొవ్వు - 1.మదము, కామము, 2.బలుపు, 3.శరీరధాతువులలో ఒకటియగు వస, బహు.గర్వోక్తులు, క్రి.1.మదించు, 2.మిక్కుటమగు.
మత్తుఁడు - మదించినవాడు.
మత్తకాశిని - మదముచే ప్రకాశించు స్త్రీ.
మత్తి - 1.కామము, 2.అవివేకము, సం.మదః.
కామము - 1.కోరిక, 2.మోహము, 3.రేతస్సు.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఇచ్చ(ౘ) - 1.కోరిక, 2.చిత్తము(చిత్తము - మనస్సు.), సం.ఇచ్ఛా.
మోహము - 1.అజ్ఞానము, 2.వలపు, 3.మూర్ఛ.
అజ్ఞానము - తెలివిలేనితనము.
అవివేకము - అజ్ఞానము, తెలివిలేమి, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమి, విణ.తెలివిలేనిది, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యము లేనిది.
కామం, క్రోధం తథా మోహం లజ్జా లోభంచ పంచమమ్|
నభః పంచగుణాః ప్రోక్తా బ్రహ్మజ్ఞానేన భాషితమ్||
కామం (కోరిక), క్రోధం, మోహం, లజ్జా, లోభములచే ఐదుగుణములు ఆకాశతత్త్వ గుణములని జ్ఞానులు తెలిపారు.
అరిషడ్వర్గము - అంతశ్శత్రువులు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు).
అరిందముఁడు - 1.శత్రువుల నణచువాడు, 2.అరిషడ్వర్గమును గెలుచువాడు, వి.1.శివుడు, 2.ఒకాఒక ఋషి.
కామి - 1.కాముకుడు, 2.పావురము, 3.జక్కవ.
కామిని - 1.ప్రియ సంగమమందు అధికేచ్ఛ గల స్త్రీ, 2.ఆడుజక్కవ, 3.ఆడుపావురము, 4.బదనిక, (కాముకి).
మాటీనంగ - కాముకి.
ప్రకామము - 1.ఇచ్చివచ్చినట్లు, 2.మిక్కిలి కామము గలది.
వలపు - చొక్కు, కామము, వి.వాసన, సం.వల్, వాంఛా.
వలపుకత్తె - కాముకుడు.
వలపుకాఁడు - కాముకి.
కశ్మలము - మలినము, వి.1.మూర్ఛ, 2.బోయపల్లె.
మలినము - 1.మాసినది, 2.నల్లనిది.
మాపుడు - మైల, మలినము.
మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.
మాపు - పోగొట్టు, వి.1.రాత్రి, 2.సాయంకాలము, 3.మైల.
రజని - రాత్రి.
రాత్రి - సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.
రాత్రిమణి - చంద్రుడు.
మోహనము - మూర్ఛ.
మోహము - 1.అజ్ఞానము, 2.వలపు, 3.మూర్ఛ.
మోహించు - 1.సొమ్మసిల్లు, 2.అజ్ఞానము పొందు, 3.వలచు.
వలచు - కోరు, కామించు, సం.వాంఛ్, క్రి.వాసనవేయు.
అరసావు - మూర్ఛ, మైమరుపు.
మూర్ఛ - రోగాదులచేత స్మృతితప్పుట, సొమ్మ.
మూర్ఛాలుఁడు - మూర్ఛరోగి.
సొమ్మ - మూర్ఛ, సం.శ్రమః.
సొమ్మగొను - మూర్ఛిల్లు, రూ.సొమ్ము వోవు, సొమ్మసిల్లు.
(ౘ)చొలయు - 1.మూర్ఛిల్లు, 2.వెనుదీయు, 3.వైముఖ్యమునొందు, 4.వైరస్యము నొందు, రూ.సొలయు.
సొలయు - 1.మూర్ఛిల్లు, 2.వెనుదీయు, 3.వైముఖ్యమందు, 4.వైరస్య మొందు.
సొలయిక - వైముఖ్యము, పారవశ్యము.
సొలపు - 1.పారవశ్యము, 2.విముఖత్వము.
పారవశ్యము - 1.విస్మృతి, 2.పరవశత్వము.
విస్మృతి - మరుపు; విస్మరణము - మరుపు.
వైముఖ్యము - విముఖత్వము, వ్యతిరేకత.
విముఖత్వము - వైముఖ్యము.
వ్యతిరేకము - (గణి.) ఏ విషయమున కైనను విరుద్ధము (Anti), సం.వి.వేరు వ్యతిరేకాలంకారము.
పరతంత్రము - పరాధీనము, వ్యతి.స్వతంత్రము.
పరవ్శము - 1.పరాధీనము, 2.ఒడలెరుగకుండుట.
మూర్ఛాతు కశ్మలం మోహో అపి -
మూర్ఛనం మూర్ఛా మోహసముచ్ఛ్రాయయోః. మోహముఁ బొందుట.
కశతి తనూకరోతి ఇంద్రియ ప్రచారమితి కశ్మలం. కశ గతిశాతనయోః. - ఇంద్రియప్రచారము నల్పముగాఁ జేయునది.
మోహనం మోహః. ముహ వైచిత్త్యై. - విమనస్కుఁ డౌట మోహము. ఈ 3 సొమ్మసిలుట (మైమరచుట)పేర్లు.
అపస్మారము - 1.దుఃఖాదులచే ఒడలు మరచుట, 2.మతి భ్రమించు రోగము, రూ.అపస్మృతి.
ఎపిలెప్సి - (Epilepsy) (వైద్య.) స్మారకము లేకపోవుట, స్పృహతప్పుట, కాకిసోమల, మూర్చరోగము, అపస్మార రోగము.
కాకిసోమల - (గృహ.) మూర్ఛ, సంధి, ఆపరాని ఉద్రేకముతో పట్టినట్లు కనబడు ఒకవ్యాధి (Hysteria).
కాకితీపు - ఒక రకపు మూర్ఛ వ్యాధి, ఈడ్చుకొని పడు మూర్ఛ రోగము. కాకిచావు - ఆకస్మిక మరణము.
దిమ్మ - 1.స్పృహ(స్పృహ – కోరిక), 2.భ్రమ, భ్రాంతి, వై.వి. 1.స్తంభము, 2.దిబ్బ, సం.ద్వీపః.
దిమ్మదిరుఁగు - స్పృహతప్పు.
దిమ్మరి - 1.భ్రమకలవాడు, 2.మత్తుకలవాడు, రూ.దిమ్మరీడు.
దిమ్మరీడు - దిమ్మరి.
దిమ్ము - 1.భ్రమము, 2.మత్తు, 3.పొగరు.
దిమ్ము - సమూహము.
విభ్రమము - 1.నివ్వెరపాటు, భ్రాంతి, 2.శ్రంగారచేష్ట.
నివ్వెఱ - (నిండు +వెఱ) 1.పారవశ్యము, 2.నిశ్చేష్టత, 3.భ్రాంతి, రూ.నివ్వెర, మిక్కిలిభయము, రూ.నివ్వెరగు.
నివ్వెఱపడు - 1.పారవశ్యము చెందు, 2.మిక్కిలి భయపడు.
పారవశ్యము - 1.విశ్మృతి, 2.పరవశత్వము.
పరవశము - 1.పరాధీనము, 2.ఒడలెరుగకుండుట.
నిశ్చేష్ట - చేష్టలుడుగుట.
బవిర - గుండ్రని కర్ణభూషణము, వై.వి. 1.వలయము, 2.భ్రమ.
కమ్మ - 1.తాటియాకు, 2.తాటంకము, స్త్రీల కర్ణభూషణము, 3.జాబు, 4.ఒక కులము, విణ.పుల్లనిది లేక కమ్మగా (ఇంపుగా) నుండునది.
వలయము - కడియము, వృత్తము, విణ.గుండ్రనిది.
కడియము1 - హస్తభూషణము, సం.కటకః, రూ.కడెము.
కడెము - కడియము.
కంకణము1 - 1.కడియము, చేతినగ, 2.తోరము, 3.జలబిందువు, (గణి.) అంగుళీయాకార క్షేత్రము, రెండు ఏక కేంద్రవృత్తముల మధ్యనున్న క్షేత్రము (Ring-shaped-regoin).
కంకణము2 - ఒకరకమగు జలపక్షి, కంకణాయి.
కడియము2 - వరికుప్ప నూర్పుచేయుచు చుట్టును వేయు గడ్డివామి.
వృత్తము - 1.నియత గణములకు యతిప్రాసములుగల పద్యము, 2.నడత, 3.జీవనము, విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే దూలములో చరించు బిందువు యొక్క పథము, (Circle).
నడత - ప్రవర్తనము.
ప్రవర్తన - (గృహ.) నడవడి, నడత (Behavior).
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
ఉపజీవిక - 1.బ్రతుకు, 2.జీవనోపాయము. వృత్తి - 1.జీవనోపాయము, 2.నడవడి, 3.సమానము, 4.వివరణ గ్రంథము.
బమ్మెర - 1.భ్రమము, 2.భ్రాంతి, సం.భ్రమః.
బ్రమము - 1.భ్రమించు, బమ్మెరవోవు.
బమ్మరించు - తిరుగు, భ్రమించు.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.
ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింసచేయువాడు.
భ్రమము - 1.భ్రాంతి, 2.తిరుగుడు, 3.నీటితూము.
భ్రాంతి - మిథ్యామతి, ఉన్నది లేనట్టును లేనిది ఉన్నటును తలచుట. మిథ్యామతి - భ్రాంతి.
భ్రాంతము - భ్రాంతి నొందినది.
తిరుగలి - పిండి విసురు శిలాసాధనము, ఘరట్టము, భ్రమము.
ఘరట్టము - తిరుగలి.
ౙక్కి - 1.గుఱ్ఱము, 2.తిరుగలి.
విపర్యయము - 1.మార్పు, 2.భ్రాంతి, సం.వి.(గణి.) ఒక దానికి విరుద్ధమైనది, (Converse). ఒక సిద్ధాంతములోని దత్తాంశము ఉపపాద్యముగాను ఉపపాద్యము దత్తాంశముగను గల మరి యొక సిద్ధాంతము.
వికల్పము - 1.భ్రాంతి, 2.మారుదల.
ఉద్భ్రాంతము - 1.తిరుగుడు పడినది, 2.భ్రాంతి నందినది (మనస్సు మొ.వి.)
భ్రాన్తిర్మిథ్యా మతిర్భ్రమః.
(సమౌ సఙ్కేత సమయౌ ప్రతిపత్తిర్విహ స్తథా.)
భ్రామ్యతే అనయేతి భ్రాన్తిః. ఇ.సీ. భ్రమశ్చ. భ్రము అనవస్థానే - దీనిచేత భ్రమింపఁజేయఁబడును.
మిథ్యాచాసౌ మతిశ్చ మిథ్యామతిః. - అసత్యమైన బుద్ధి. ఈ మూడు ఒకదానింజూచి మఱియొకటియని తలఁచుట పేర్లు.
మిథ్య - మృష, అసత్యము.
మృష - బొంకు; ముసి - బొంకు, సం.మృషా.
అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.
బొంకు - కల్లమాట, క్రి.కల్లలాడు.
బొంకరి - కల్లలాడువాడు.
మృషావాది - కల్లరి.
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమాన భంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు,
బొంకవచ్చు నఘము వొందఁ డధిప!
భా|| ఆడవారి విషయములోను, వివాహము(పెండ్లిండ్ల) విషయంలోను, ప్రాణానికీ, ధనానికీ, గౌరవానికీ, భంగం కలిగేటప్పుడు, భయపడిన గోవులను, బ్రాహ్మణులను ఆదుకోనేటప్పుడు అబద్ధం చెప్పవచ్చు దానివల్ల పాపం రాదు.
దబ్బఱ - 1.బొంకు, 2.మోసము, 3.విపత్తు, 4.తప్పు, రూ.దబ్బఱ.
దబ్బఱకాఁడు - 1.బొంకులాడు, 2.మోసగాడు.
కల్ల - 1.అసత్యము, 2.పరుషవచనము.
కల్లఁడు - చెవిటి, బధిరుడు.
చెవిటి - 1.చెవిటివాడు, బధిరుడు.
బధిరుఁడు - చెవిటివాడు.
బాధిర్యము - బధిరత్వము, చెవుడు.
చెవుడు - చెవులు వినని రోగము, బాధిర్యము.
మిథ్యాదృష్టి - నాస్తికత్వము, ఇహలోకమే కాని పరలోకము లేదనెడు బుద్ధి.
నాస్తిక్యము - నాస్తిక భావము, పర్యా. నాస్తికత.
నాస్తికుడు - దేవుడు లేడనువాడు.
మిథ్యాదృష్టి ర్నాస్తికతా -
మిథ్యా చాసా దృష్టిశ్చ మిథ్యాదృష్టిః. ఇ. సీ. - ఇహలోకమే కాని పరలోకము లేదనెడి దృష్టి.
నాస్తి పరలోక ఇతి మతి రస్యేతి నాస్తికః తస్య భవో నాస్తికతా - పరలోకము లేదనెడివాని భావము నాస్తికత.
ఈ రెండు పరలోకము లేదు అను బుద్ధికి పేర్లు.
నాస్తికవేదాంతము - (చరి.) వేదములను ప్రమాణముగా స్వీకరించని జైన, బౌద్ధ, లోకాయత, చార్వాక సిద్ధాంతములు.
జైనధర్మము - (చరి.) ప్రతివస్తువునందును ఆత్మ కలదని విశ్వసించు ధర్మము, అహింస, సత్యము, నిస్సంగము అనువాని ద్వారా మోక్షము పొందవచ్చునను ధర్మము, (జైనసిద్ధాంతముల ప్రకారము భగవంతుడు లేడు).
భగవంతుఁడు -1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
బౌద్ధధర్మము - (చరి.) గౌతమ బుద్ధునిచే (క్రీ. పూ. 566-486) బోధింపబడిన ధర్మము. గౌతమబుద్ధుని తరువాత అశోక చక్రవర్తి కాలములో ఈ ధర్మము ఒక్క భారతదేశముతోనే కాక విదేశములలో కూడ వ్యాపించెను. గౌతమబుద్ధుడు బోధించిన ధర్మము, ప్రపంచములోని సుఖదుఃఖములకు మానవుడు చేయుచున్న కర్మమే మూల కారణమని, సుఖదుఃఖములకు అతీతుడైన మానవుడు సన్మార్గము ద్వారాజ్ఞానియై, సంపూర్ణ నిర్వాణము పొంది జన్మరహితము పొందవచ్చునని బోధించిన ధర్మము.
బౌద్ధులు - బుద్ధమతస్థులు.
లోకాయతము - ఒక నాస్తిక మతము.
శ్రమణుఁడు - (చరి.) బౌద్ధ భిక్షువుగా బౌద్ధసంఘములో చేర్చుకొనక పూర్వము, బౌద్ధ ధర్మ సూత్రములను అభ్యసించుచున్న బాల సన్న్యాసి. క్షపణకుఁడు - బౌద్ధ సన్న్యాసి.
భిక్షువు - సన్న్యాసి, బ్రహ్మచారి, (చరి.) బౌద్ధ సన్న్యాసి.
బౌద్ధభిక్షుణి - (చరి.) బౌద్ధ సన్న్యాసిని.
తేరవాదము - (చరి.) 1.స్థావీరవాదము, 2.సనాతన బౌద్ధ ధర్మము.
తేరగాథ - (చరి.) బౌద్ధభిక్షువులచే రచింపబడిన కథలు.
తేరీగాథ - (చరి.) బౌద్ధభిక్షువులు రచించిన బౌద్ధమతమునకు చెందిన కథలు.
జాతక కథలు - (చరి.) బుద్ధుడు గౌతమబుద్ధుడుగా జన్మమెత్తక పూర్వము బోధిసత్వునిగా అనేకావతారము లెత్తెనని గౌతమ బుద్ధుని గురించియు, ఇతర బోధిసత్వులను గురించియు కథల రూపముగా తెల్పు బౌద్ధ గ్రంథము.
త్రిపీఠకము - (చరి.) బౌద్ధధర్మ గ్రంథములు - వినయ పీథకము, సూత్ర పీఠకము, అభిధర్మ పీఠకము, ఇవి పాళీభాషలో వ్రాయబడినది.
మిలిందపన్హ - (చరి.) పాలిభాషలో వ్రాయబడిన బౌద్ధధర్మ గ్రంథము. ఇండోగ్రీక్ రాజైన మిలిందునకును బౌద్ధమత గురువైన నాగసేనునకును జైరిన సంవాదము.
కన్ఫ్యూషియస్ - (చరి.) (Confucius) చైనాదేశపు గొప్ప వేదాంతి. (గౌతమబుద్ధుని సమకాలికుడు. ఈతని బోధనల ప్రభావము చైనా సాంఘిక వ్యవస్థలపై క్రీ.శ.1911 వరకు ఉండెను. క్రీ.శ.1948కి పూర్వము చైనా సంస్కృతి యీతని బోధనల ప్రకారము మలచ బడినది.)
ఉపోసధ - (చరి.) బౌద్ధసన్యాసులు పక్షమున కొకసారి జరుపు సమావేశము.
ఉపాసకులు - (చరి.) గృహస్థులుగా నుండి బౌద్ధధర్మ సూత్రముల ప్రకారము నడుచుకొను బౌద్ధ మతానుయాయులు.
ఉపాసకుఁడు - (చరి.) బౌద్ధమతా వలంబి యగు గృహస్థుడు.
ఉపాసకి - (చరి.) బౌద్ధమతమును అనుసరించుచు చున్న గృహిణి.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
మహాయానము - (చరి.) బౌద్ధధర్మము క్రీ. పూ. 1వ శతాబ్ధమున ఆంధ్ర దేశమున మొదటిసారిగా వెలువడి, 2వ సతాబ్దారంభములో ఆచార్యనాగార్గున, ఆర్యదేవ, అనంగ, వాసుబంధులచె ఉత్తర హిందూస్థానమున ప్రచారము చేయబడెను. బుద్ధుడు భగవంతుని అవతారమని, ప్రతిమానవునకు బోధిసత్వుడగుటకు అవకాశములు కలవని, విగ్రహారాధనన చేయవచ్చునని, విముక్తి పొందుటకై బుద్ధుడు చెప్పిన సన్మార్గముల వలననే కాక మంత్రోపదేశము వలనను విముక్తి పొందవచ్చునను వాదము. మహాయాస ధర్మము స్తూపములను బౌద్ధ విగ్రహములను ఆరాధించవచ్చునని ఆదేశించుచున్నది.
బౌద్ధము - బుద్ధుడు స్థాపించిన మతము.హీనయానము - (చరి.) బుద్ధుడు మొదట బోధించిన ప్రకారమే బౌద్ధదర్మము ఉండవలయుననియు, బౌద్ధధర్మములో మార్పులు తేరాదనియు వాదించు సనాతన బౌద్ధ ధర్మము (ప్రతి మానవుడు బొధిసక్వుడు కాలేదని హీనయాన వాదుల అభిప్రాయము.)
పరనిర్వాణము - (చరి.) బుద్ధుని మరణము.
ఆచారియవాదులు - (చరి.) గౌతమబుద్ధుని మరణానంతరము ఒక శతాబ్దము తరువాత బౌద్ధభిక్షువులు వైశాలీనగరములో సమావేశమై సంఘనియమములలో కొన్నిమార్పులు చేసిరి. ఆ సవరణలను ఆమోదించిన వారిని ఆచారియవాదులందురు.
మహాముని - 1.గొప్పముని, 2.బుద్ధుడు.
సర్వజ్ఞుఁడు - 1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు.
భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విన.సన్మానితుడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
భక్తుల ఇష్టాన్ని బట్టి ఒకే భగవంతుడు వేరువేరు రూపాలలో సాక్షాత్కరి స్తుంటాడు. ప్రతి భక్తుడు భగవంతుణ్ణి గురించి ప్రత్యేకమయిన భావాల్ను కలిగి ఉండవచ్చు. వాటికి తగినట్లుగానే పూజిస్తూ ఉండవచ్చు. ఆయన కొందరికి యజమానిగాను, కొందరికి తండ్రిగాను, కొందరికి తల్లిగాను, కొందరికి విధేయుడైన కొడుకుగాను భావించుకొనే అవకాశాన్ని కలుగ జేస్తాడు. - రామకృష్ణ పరమహంస
అర్కజుఁడు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు (కావున నీవ్యవహారము).
గౌతముడు - 1.గౌతమముని (గౌతమముని సంపూజిత రామ్|), 2.బుద్ధుడు.
గౌతమబుద్ధుడు - (చరి.) సిద్ధార్థుడు, (క్రీ. పూ. 566-486). బౌద్ధధర్మ స్థాపకుడు, తథాగతుడు, శాక్యముని.
సిద్ధర్థుఁడు - శాక్య బుద్ధుడు; శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
శాక్యసింహుఁడు - శాక్యముని, బుద్ధుడు.
అద్వయుఁడు - సాటిలేనివాడు, అద్వితీయుడు, వి.బుద్ధుడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.నేర్పరి. ౘదువరి - విద్వాంసుడు.
సర్వజ్ఞుఁడు - 1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు.
శంభువు-1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.
శాంభవి - పార్వతి.
నిందసి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతమ్,
సదయ హృదయదర్శిత పశుఘాతమ్|
కేశవ ! ధృత బుద్ధశరీర ! జయ జగదీస ! హరే !
ధర్మరాజు - 1.యుద్ధిష్ఠిరుడు, 2.యముడు, 3.బుద్ధదేవుడు.
కర్ణానుజుఁడు - యు ధి ష్ఠి రు డు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.
యుద్ధిష్ఠిరుఁడు - ధర్మరాజు అజాతశత్రువు.
అజాతశత్రువు - ధర్మరాజు, విణ.శత్రువులు లేనివాడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు. శని - నవగ్రహములలో ఏడవ గ్రహము(Saturn).
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమనుడు - యముడు.
సత్యం మాతాపితా జ్ఞానం ధర్మోభ్రాతా దయాసఖా|
శాంతిఃపత్నీ క్షమాపుత్ర స్షడైతే మమభాదవాః||
తా. సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము తోఁడబుట్టినవాఁడు, దయ(దయ - కనికరము)స్నేహితుఁడు, శాంతి భార్య, క్షమ కుమారుఁడు, ఈ యాఱును నాకు బాంధవులని ధర్మరాజు చెప్పెను. - నీతిశాస్త్రము
కంకుభట్టు - 1.కపటబ్రాహ్మణుడు, 2.కంకుభట్టు (అజ్ఞాతవాసమున ధర్మరాజు పెట్టుకొనిన మారుపేరు, 3.యముడు.
కర్మ మధికమయిన గడచిపోవగరాదు
ధర్మరాజు తెచ్చి తగనిచోట
గంకుభట్టుజేసెఁ గటకటా దైవంబు! విశ్వ.
తా|| పూర్వజన్మమున చేసినకర్మ అనుభవింపక తప్పదు, ధర్మరాజు వంటివాడు, ఒక సామాన్యమైన చిన్న రాజుదగ్గర కొంతకాలము కంకుభట్టుగా వుండెను.
జయుఁడు - 1.ఇంద్రుని కొడుకు, 2.ధర్మరాజు, 3.విష్ణువుయొక్క ద్వారపాలకుడు.
అనంతవిజయము - ధర్మరాజు శంఖము, విణ.అంతములేని జయము కలది.
5. సందేహము - సంశయము; సంశయము - సందేహము.
విచికిత్స - సంశయము; విశయము -1.వాసస్థానము, 2.సంశయము.
సందియము - సందేహము, సంశయము, సం.సందేహః.
ద్వాపరము - 1.మూడవ యుగము, 2.సందేహము.
ద్వాపరౌ యుగ సంశయౌ, -
ద్వాపరశబ్దము మూఁడవ యుగమునకును, సందేహమునకును పేరు. ద్వాభ్యాం కృతత్రేతాభ్యాం పరః, ద్వౌ పక్షౌ పరౌ యస్యేతిచద్వాపరః - కృతత్రేతా యుగముల రెంటికిని పరమయినదియు, రెండు పక్షములు ముఖ్యముగాఁ గలదియు ద్వాపరము.
అజ్ఞ శ్చాశ్రద్ధధాన శ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోస్తిన పరో న సుఖం సంశయాత్మనః || 40శ్లో
తా|| ఆత్మజ్ఞానము లేనివాడు, శ్రద్ధాశువు గా(కా)నివాడు, సంశయ చిత్తుడు నశింతురు. స్వయముగా విచారించి వస్తుతత్త్వమును తెలిసికొను తెలివి లేనట్టియు గురువాక్యమనుగాని, శాస్త్ర వాక్యమందుగాని నమ్మిక లేనట్టియు, అడుగడుగునకు శంకలే కలుగునట్టియు తమోగుణి ఇహము పరము లందు ఎట్టి సౌక్యమును లేక నశించును. సంశయచిత్తునకు ఇహ పర లోకముల యందు సుఖము గలుగదు. తమోగుణముగలవాడు అనుమానము, సందేహము అడుగడుగునకు వేధింప చిత్త, స్థైర్యములేక చెడిపోవును.
సత్త్వగుణి వివేక విచారములవలన సత్యమును గ్రహించును. రజోగుణి శ్రద్ధాభక్తులచే మనస్సమాధానము సాధించును. అజ్ఞానికంటెను, శ్రద్ధలేని వాని కంటెను, సంశయచిత్తుడే సర్వదా భ్రష్టు డగునని ఆశయము. - జ్ఞానయోగము, శ్రీభగవద్గీత
శంక - సందేహము, భయము, విచారము.
శంకించు - సందేహించు, భయపడు, రూ.శంకిల్లు.
శంకితుఁడు - సందేహ మందినవాడు, భయమందినవాడు. నిత్య శంకితుడు, జీవన్మృతుడు.
శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగ జేయువాడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరాభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో
నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే
అంతా నాంత శరీర శోషణమె దుర్వ్యాపారమే దేహికిన్
చింత న్నిన్ను దలంచి పొందరు నరుల్ శీకాళహస్తీశ్వరా!
తా|| ఈశ్వరా! ఈ ప్రపంచములో పుట్టిన మానవునికి అంతా సందేహమే. శరీరము ఎంతకాలమందునో సంశయమే! మన్సులో దారపుత్రాది బంధనముల నేర్పరచుకొన్నందువలన అంతా దుఃఖమే! శరీరమునకే రోగమెప్పుడు వచ్చునో యను భయమే. ఏ పని చేసినను అంతా శరీరమును కృశింపజేయునదియే! మనుజుడు చేయుచున్న పనుల న్నియు దుర్వ్యాపారములే! (అనగా భగవంతుని చేరుటకై చేయు పనులు సద్వ్యాపారములే.) అంతేకాక ఇవి యన్నియును కర్మ బంధములు గలిగించి పునర్జన్మములు గలిగించును గనుక కూడ దుర్వ్యాపారములే. వీనినన్నిటిని విడిచి నరులు నిన్నుచేరు ఉపాయము నాలోచింపరేమే?
అరగలి - జంకు, సందేహము.
అరవాయి - 1.వెనుదీయుట, జంకు, 2.శంక, 3.అధైర్యము, 3.కొరత. అరమర - 1.సందేహము, జంకు, 2.భేదము, 3.గుట్టు.
(ౙ)జంకు - 1.భయపడు, 2.సంకోచపడు, వి.1.భయము, 2.సంకోచము, శంక, సం.శంకా.
కొతుకు - 1.సంకుచితమగు, వర్ణలోపముగా మాటాడు, 2.జంకు, వెనుదీయు, వి.జంకు, సంకోచము, విణ.వర్ణలోపము గలది (మాట మొ.వి.)
సంకుచితము - సంకోచము నొందినది, ముడుచుకొన్నది.
సంకోచించు - 1.సంకోచమునొందు, 2.అనుమానించు, జంకు.
బిమ్మిటి - 1.వివశత్వము, 2.సంకోచము.
వివశుఁడు - వశము తప్పినవాడు.
వివ్వచ్ఛుఁడు - అర్జునుఁడు, సం.బీభత్సః.
బీభత్సుఁడు - అర్జునుడు, వివ్వచ్చుడు, విణ.వికారము గలవాడు.
బీభత్సము - అసహ్యమైనది, వి.నవరసములలో నొకటి.
అసహ్యము - సహింపరానిది, భరింపరానిది.
వివస్వంతుఁడు - సూర్యుడు.
దేవ సూర్వౌ వివస్వన్తౌ -
వివస్వచ్ఛబ్దము దేవతలకును, సూర్యునకు పేరు. వివస్తేజః, తదస్యాతీతి వివస్వాన్. త. పు. వస అచ్ఛాదనే. - తేజస్సుగలవాఁడు.
వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్. వస ఆచ్ఛాదనే - కాంతిచేత నన్నిటినిఁ గప్పెడువాఁడు.
భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం,
మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయు భయమ్|
శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాన్తా ధ్భయమ్,
సర్వం వస్తు భయాన్వితం భువినృణాం, వైరాగ్య మేవా భయమ్||
తా. సకల సంపదలు ఉన్నప్పటికీ వాటిని అనుభవించడం వల్ల రోగం వస్తుందన్న భయం. మంచిపేరు ప్రతిష్టలున్న వారికి జాగ్రత్తగా ప్రవర్తించకపోతే చెడ్దపేరు(చ్యుతి - 1.జారుట, 2.విడుపు.)వచ్చేస్తుందన్న భయం. ధనవంతులకు ఆ ధనాన్ని ఎలా కాపాడు కోవాలా అన్న(నృపాల - రాజు)భయం. అభిమానవంతులకు ఆత్మాభిమానం కాపాడుకోవాలన్న భయం. బలవంతులకు శత్రు(రిపువు - శత్రువు)భయం. అందమైనవానికి(రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.)లకు ముసలితనం(జర -ముసలితనము)వల్ల భయం. శాస్త్రజ్ఞులకు ప్రతివాదుల వల్ల భయం. మంచివారికి చెడ్దవారి వల్ల భయం. జీవులందరికీ మరణ భయం.
వివేకవంతుడు ముసలితనం, చావులేని వానిగా తలచి విద్యని, ధనాన్ని సంపాదించాలి. చావు ఎప్పుడు వచ్చి పడుతుందో ననే భయంతో ధర్మాన్ని మాత్రం వెంటనే ఆచరించాలి.
సందిగ్ధము - సందేహమైనది, (గణి.) కచ్ఛితముగా నిర్ధారణచేయుటకు వీలుపడనిది (Ambiguous).
అనుమానము - (తర్క.) 1.ప్రత్యక్షాది ప్రమాణములలో ఒకటి, 2.ఊహ, 3.సందేహము, 4.(అలం.) అర్థాలంకారములలో ఒకటి.
ఉత్ప్రేక్ష - 1.ఊహ, 2.హెచ్చరికలేమి, 3.(అలం.) ఒక అలంకారము.
ఊహ - 1.యోచన, భావము, 2.వితర్కము.
యోచన - ఆలోచన.
భావము - 1.అభిప్రాయము, 2.మనోవికారము, 3.పుట్టుక, 4.ధాత్వర్థ రూప క్రియ, 5.సత్తు, 6.స్వభావము, సం. (గృహ.) ఊహ, సామాన్యమైన ఊహ, భావన(Concept).
భావన - 1.తలపు, యోచన, 2.వాసనకట్టుట.
విత్కరము - ఊహ, తర్కించుట.
తనవారు లేనిచోటను
జనమించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువదగదు మహిలొ సుమతీ.
తా. తన బంధుజనము లేనిచోటను, లేశమైన పరిచయములేని ప్రదేశమునను, కలహమాడెడు తావునను, సందేహముగల తావునను మనుష్యుడు నిలువరాదు.
న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్కశాస్త్రము.
న్యాయము - న్యాయముతో కూడినది.
నీతి - న్యాయము. నీతి సురక్షిత జనపద రామ్|
తర్కము - 1.ఊహ, 2.అధాహారము, 3.ఒక శాస్త్రము.
తర్కించు - 1.ఊహించు, 2.చర్చించు, హేతువు చూపుచు వాదించు. తరకటించు - తర్కించు, వాదించు. తరకట - అసత్యము, సం.తర్కః.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము. (Property)
అనుభూతి - 1.అనుభుక్తి, అనుభవము, 2.(తర్క.)ప్రత్యవాది ప్రమాణ జన్యజ్ఞానము, 3.భావన (Feeling).
అనుభుక్తి - అనుభవము, అనుభూతి, అనుభోగము.
అనుభవము - 1.లౌకికజ్ఞానము (Experience), 2.అనుభవించుట, సుఖ దుఃఖాలను పొందుట.
అనుభోగము -1.అనుభవము, 2.చేసిన సేవకై యిచ్చెడు మాన్యక్షేత్రము.
లౌకికము - లోకవ్యవహార సిద్ధమైనది.
లౌక్యము - (వ్యావ.) లౌక్యము.
లోకయాత్రా భయంలజ్జా దాక్షిణ్యః ధర్మశీలతా|
పంచ యస్యన్న విద్యంతే నకుర్యా తేన సంగమమ్||
తా. లోకవ్యవహారము, వెఱుపు, సిగ్గు(సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.), దాక్షిణ్యము, ధర్మస్వభావమును, ఈ యైదుగుణములులేని మనుజుని సహవాసము చేయదగరు. - నీతిశాస్త్రము
No comments:
Post a Comment