Saturday, April 9, 2016

పుణ్యక్షేత్రములు

పరమేశ్వర ప్రార్థన :

శ్లో. ప్రాతః స్మరామి పరమేశ్వర మిందుగౌరం!
    కైలాస శైలనిలయం కరుణాలవాలమ్
    కాత్యాయనీ విమలమానస రాజహంసమ్
    శ్రీశంకరం పరశివం తరుణేందు చూడమ్.

పుణ్యక్షేత్రము - దివ్యక్షేత్రము.
ఆక్షేత్రము -
దివ్యక్షేత్రము, పుణ్యక్షేత్రము.
దివ్యము - 1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.

తీర్థము - 1.పుణ్యనది, 2.రేవు, 3.పుణ్యక్షేత్రము, 4.నూతి యొద్ద కట్టిన తొట్టి.

పంచక్షేత్రములు : శ్రీశైలము, కాశి, కేదారము, కాళహస్తి, పట్టిసము.

పూర్వే పశుపతిః పాతు - దక్షిణే పాతు శంకరః |
పశ్చిమే పాతు విశ్వేశో - నీలకణ్ఠస్తథోత్తరే ||  
ఈశాన్యాం పాతు మాం శర్వో - హ్యగ్నేయ్యాం పార్వతీపతిః |
నైరృత్యాం పాతు మాం రుద్రో - వాయవ్యాం నీలలోహితః ||

పంచముఖుఁడు - శివుడు (ఐదుమోముల వేలుపు.)
ఐదుమోముల వేలుపు -
పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.
ఊర్ధ్వవక్త్ర(మీదిది) - ఈశానః, ప్రాగ్వక్త్ర(East)- మహాదేవుడు, పశ్చిమవక్త్ర(West)- సద్యోజాతాయః, ఉత్తరవక్త్ర(North)- వామదేవాయ, దక్షిణవక్త్ర(South) - అఘోర రుద్రరూపేభ్యః.     

ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.
ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
ఈశానము - 1.కాంతి, 2.శివుని(5)ముఖములలో ఒకటి, 3.పదునొకండు అను సంఖ్య, 4.అర్ద్రానక్షత్రము.
మహాదేవుఁడు - శివుడు; వామదేవుఁడు - శివుడు.
అఘోరము - మిక్కిలి భయంకరమైనది, వి.శివుని శిరస్సులలో ఒకటి భయంకరముకానిది. రుద్రుఁడు - శివుడు. 

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు -
1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

ముక్కంటిచెలి - కుబేరుడు.

శ్రీశైలేశు భజింతునో? అభవుఁ గాంచీనాథు సేవింతునో?
కాశీవల్లభుఁ గొల్వ బోదునొ? మహాకాళేశుఁ బూజింతునో?
నాశీలం బణువైన మేరు వనుచున్ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వరా!
తా||
ఈశ్వరా! నీ కరుణగలుగుటకై అనేక క్షేత్రములలో అనేక రూపములతో నున్న నిన్ను సేవింపవలెనేమో! అయితే, శ్రీశైలములో మల్లికార్జునుని సేవింతునా? కాంచీపురములో ఏకాంబరేశుని పూజింతునా? కాశీలో విశ్వేశ్వరుని భజింతునా? ఉజ్జయినిలో  మహాకాళుని పూజింతునా? ఏమి చేయుమన్నను చేసెదను. నన్ను నీ దయాపూర్ణములైన చిరునవ్వులతో కాపాడుచుండుము.

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.         

1. శ్రీశైలము - పవిత్ర శివక్షేత్రము, సిరిగట్టు, (కర్నూల్ జిల్లాలోనిది).
సిరిగట్టు -
శ్రీశైలము. దేశమంతటిలో ప్రసిద్ధమైన శివక్షేత్రము.

శ్లో. శ్రీశైలం శిఖరేశ్వరం గణపతిం శ్రీహాటకేశం పునః
    సారంగేశ్వర బిందు మమలం ఘంటార్క సిద్ధేశ్వరం
    గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతా మారామ వీరేశ్వరం
    శంఖం చక్రవరాహతీర్థ మనిశం శ్రీశైలనాథం భజే.

శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగాలలో నొకటి. అష్టాదశ శక్తి పీఠములలో నొకటి. శివుడు ఎల్లపుడూ నివసించునది, నాలుగు దిక్కుల ద్వారములు కలది, వివిధములైన తీర్థములతో కూడియున్నది, శ్రీశైలము.

శ్రీశైల మల్లికార్జున స్వామి : చంద్రావతి అనే మహారాణి పూజించడంతో మల్లికార్జునుడిగా ప్రసిద్ధికెక్కింది. ఇది ఆంద్రప్రదేశ కర్నూల్ జిల్లాలో ఉంది. శ్రీశైల శిఖర సందర్శనము సుసాధ్యము, దర్శించిన పునర్జన్మ లేదు. 

భ్రమరాంబ - అంబ, పార్వతి. భ్రామరి - పార్వతి. శ్రీశైలే భ్రమరాంబికా|
అంబ -
1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.       

సంధ్యారంభ విజృంభితం శ్రుతి శిరస్థ్సానాంతరాధిష్ఠితం
స ప్రేమ భ్రమరాభిరామ మసకృ త్సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ || 
తా.
సాయం సమయంలో వికసించేదీ ఉపనిషత్తు లలో వర్ణింపబడినది, ప్రేమతో నిండిన భ్రమరాంబా దేవిచే రమణీయమైనదీ, నిరంతర సజ్జన సాంగత్యం కారణంగా భాసిల్లేదీ నాగాభరణం కలదీ, అమరులందరి వందనాలను అందుకొన దగినదీ, సద్గుణాలను ప్రకాశింప జేసేదీ పార్వతీ దేవిచే ఆలింగనం చేసికోబడినదీ అయిన మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను. - శివానంద లహరి    

శ్రీశైలశ్రంగే వివిధ ప్రసఙ్గే - శేషాద్రిశృఙ్గే పి సదా వసన్తమ్|
త మర్జునం మల్లికపూర్వ మేనం - నమామి సంసారసముద్రసేతుమ్.

  

సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.   

గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువు కట్ట, పర్వతము, సం.ఘటః.
ఘట్టము - 1.గట్టు, తీరము, 2.సుంకము వసూలుచేయుచోటు, 3.నద్యాదుల రేవు, 4.కదల్చుట, 5.రాపిడి.

కర1 - తీరము.
కర2 - తీక్ష్ణము, సం.ఖరమ్.

తీరము - దరి, సం.వి. (భూగో.) అంచువలె సముద్రపు నీటికి తగిలియున్న భూమి.

వప్రము - 1.కోటకొరడు, కోట, 2.కొండనెత్తము, 3.తీరము.

దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్.
దరి -
గుహ. మర్యాద - 1.కట్టుపాటు, 2.తీరము, 3.సమ్మానము.
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.
గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము మొవి. విణ.గుహ యందుండునది.

గట్టువాలు - 1.సైరంధ్రి, 2.సుగంధ ద్రవ్యములను అమ్ము స్త్రీ.
సైరంధ్రి -
1.గట్టువాలు, 2.అంతఃపురపు కావలికత్తె, 3.సుంకరజాతి స్త్రీ, సం.వి.(గృహ.) దేహమును అలంకరించుకొనుట, అలకార ఉపకరణముల నైపుణ్యము (Toilet).

అద్రి - 1.కొండ, 2.చెట్టు, 3.సూర్యుడు.
నగము -
1.కొండ 2.చెట్టు రూ.అగము.
నగవైరి - ఇంద్రుడు వ్యు.కొండలకు శత్రువు.

అహార్యము - కొండ, విణ.హరింప శక్యముకానిది.

                                  

కొండ - మల, పర్వతము.
మల -
పర్వతము, త. మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
కొండ(ౘ)చూలి - పార్వతి. చూలు - 1.గర్భము, 2.బిడ్ద.
కొండయల్లుఁడు - శివుడు; కొండమల్లయ్య - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు; గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.

పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.

ఏష్య త్యేషజనిం మనోన్య కఠినం తస్మి న్నటానీతి మ
ద్రాక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః
నోచే ద్దివ్యగృహాంతరేషు సుమన స్తల్పేషు వేద్యాదిషు
ప్రాయ స్సత్సు శిలాతలేషు నటనం శంభో! కిమర్ధం తవ?
తా.
శంభో మహాదేవా! వీడు పుడతాననీ, వీడి మనస్సు కఠినమైనదీ వీడి విషయంలో ఎలా ప్రవర్తించాలని భావించి నన్ను రక్షించడం కోసం నీ మృదు పాదాలను ముందే పర్వత స్థానాలలో ఉంచుకోవడానికి అలవాటు చేసుకున్నావా స్వామీ ! అలా కాకపోతే దివ్య భవనాలూ, పుష్పశయ్యలూ విశేషంగా ఉండగా నువ్వు పర్వత భూములలోనే ఎందుకుంటావు ? - శివానందలహరి 

దూరగిరిన్యాయము - న్యా. దూరముగా నున్న పర్వతములు నునుపుగా కాన్పించును, దగ్గరకు పోవ గుట్టలు మిట్టలు ముండ్లుగా నుండునను రీతీ, దూరపు కొండలు నునుపు.

స్కందం దృష్ట్వా యయౌ రామః శ్రీశైలమ్ గిరిశాలయమ్ |
ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వాద్రిం వేంకటేశం ప్రభుః |

తిప్ప - 1.చిన్నకొండ, 2.కొండ, 3.దిబ్బ, సం.ద్వీపః.
గుట్ట -
1.చిన్నకొండ, 2.ప్రోవు, సం.గోత్ర, విణ.భీరువు.
దిబ్బ - 1.ఎత్తైననేల, కుప్ప, 2.దీవి, సం.ద్వీపః.
దీవి - 1.ద్వీపము, నీటినడిమి భూభాగము, సం.ద్వీపః.
నడుదిన్నె - ద్వీపము. కుప్ప - ధాన్యము మొ.రాశి.  

ఆఖండలుఁడు - ఇంద్రుడు, వేలుపురేడు, పర్వతములను భేదించువాడు.
కొండ పగతుఁడు -
ఇంద్రుడు, కొండలకు శత్రువు.

భృంగీచ్ఛా నటనోత్కటః కరిమద గ్రాహీ స్ఫురన్మాధవా
హ్లాదో నాదయుతో మహా సితవపు పంచే షుణాచాదృతః
సత్సక్ష స్సుమనో వనేషు స పునస్సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ||
తా.
భృంగి అనువాడు ఒక ప్రమధుడు(భృంగి - శివభృత్యులలో నొకడు).   భ్రంగీశ్వరుని యిచ్ఛ ననుసరించి నాట్య మందు ఆసక్తి కలవాడై, గజాసురాహంకారాన్ని అణచినవాడై, జగన్మోహినీ స్వరూపుడైన శ్రీహరికి ఆనందాన్ని కలిగించే వాడై, ఓంకార నాదంతో కూడినవాడై, శ్వేత శరీరుడై, మన్మథునిచే ఆరాధింపబడినవాడై, దేవతలను సంరక్షించ డంలో ఆసక్తి కలవాడై, శ్రీశైలంలో నివసించునట్టి శక్తి సర్వస్వ సముపేతుడై భ్రమరాంబా మనోనాథుడైన మహాదేవుడు నా మనస్సరోజమందు సంచరించును గాక! - శివానంద లహరి    

గంగాసహోదరీ గంగాధరో గౌరీ త్రియంబకః,
శ్రీశైల భ్రమరాంబాఖ్యా మల్లికార్జున పూజితః| - 35శ్లో  

శైలధన్వుఁడు - శివుడు, గట్టు విలుకాడు.
గట్టువిలుకాఁడు - శివుడు, వ్యు.మేరువు విల్లుగా గలవాడు.
గట్టు - ఒడ్దు, తీరము, చెఱువు కట్ట, పర్వతము, సం.ఘట్టః. 

గట్టుద్రిమ్మరి - కోఁతి, వానరము, వ్యు.గట్టులందు తిరుగునది.
వానరము - కోతి monkey.
నర ఇవ వానరః - నరునివలె నుండునది.
క్రోఁతి - వానరము, రూ.క్రోఁతి. 

మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుండెడి మణి, 3.హార మధ్యమునందు వ్రేలెడు మణి.
మినాత్యసురానితి మేరుః, ఉ-పు. - అసురుల హింసించునది, మీఙ్ హింసాయాం.
మినోతి క్షిపతి శిఖరైర్జ్యోతీంషీతి మేరుః - శిఖరములచే నక్షత్రాదుల వహించునది, డు మిఞ్ ప్రక్షేపణే.

శైలము - కొండ, వ్యు.శిలలు దీనియందు గలవు, సం.వి.(భూగో.) నేల యందుండు (ఉవ) అధాతువులలో నిది నొకటి.
శిలా అత్ర సంతీతి శైలః - శిలలు దీనియందుఁ గలవు.

శిలోచ్ఛయము - కొండ.
శిలోచ్ఛయః - శిలలయొక్క సమూహము.

శైవలిని - ఏరు, నది.
శైవలమస్య అస్తీతి శైవలినీ - నాచు కలిగినది.
శైవలము - నీటిపాచి, రూ.శైవాలము, శేవలము.
శైవలములు - (వృక్ష.) నీటిలో పెరుగు మొదటితరగతి ఉద్భిజములు (Algae).

సముద్ర శైవాలము - (వృక్ష.) సముద్రపు నీటిలో పెరుగు నాచువంటి మొక్కలు (Sea weeds).

ఓడిక1 - నీవారధాన్యము, ఒకరకము వడ్లు.
ఓడిక2 - 1.ప్రవాహము, 2.తూము.
నీరుగండి - తూము. 

ప్రస్థము - 1.తూము, 2.కొండనెత్తము.
ప్రతిష్ఠంతే (అ)స్మి స్సమ భూభాగత్వా త్ప్రస్థః, అ. ప్న. ష్ఠా గతినివృత్తౌ. - సమభూమియౌటవలన మిక్కిలి దీనియందు వసింతురు.
సానుమంతము - కొండ, వ్యు.చరియలు కలది.
సానువు - 1.కొండనెత్తము, 2.కొన, 3.త్రోవ, చరియ.
సనోతి సుఖం దదాతీతి సానుః, ఉ. ప్న. షణుదానే. - సుఖము నిచ్చునది. 

ౘఱి - సంచరింప నశక్యమగు పర్వత శిఖరము క్రిందిచోటు, రూ.చఱియ.
జాఱువు - 1.కొండచఱి, 2.జారుట.  
ౙారుఁడు - జారుట. 
(ౙ)జాఱు - క్రి.1.జరుగు, 2.ఉరుకు, 3.వదలు, 4.స్రవించు, వి.1.స్ఖలనము, 2.జారుట.
ౙరుగు - క్రి.1.రొమ్ముతో ప్రాకు, జారు, 2.జీవనము నడుచు, 3.కడచు, 4.పోవు, రూ.జరుగు.

ఉఱుకు - క్రి.1.దుముకు, పరుగెత్తు, 2.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప.  

ప్రపాతస్తు తటో భృగుః,
ప్రవతంత్యస్మాదితి ప్రాపాతః, పత్ ఌ గతౌ. - దీనినుండి పడుదురు.    

తటిని - ఏరు, వ్యు.తటముకలది.
తటమస్యా అస్తీతి తటినీ - దరులు గలిగినది.
తటము - 1.ఏటి యొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము. 
తటి - 1.ఏటి యొడ్డు, 2.ప్రదేశము.
తటతీతి తటం త్రి, తట ఉచ్ఛ్రాయే - ఉన్నత మయినది. 
తటతీతి తటః, తట ఉచ్ఛ్రాయే. - ఉన్నతమైనది.
ప్రదేశము - స్థలము, చోటు.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు Venus, 4.శివుడు.
కొండౘఱియ - కొండపార్శ్వభాగము. 
భ్రజ్యతే తప్యతే సూర్యాగ్ని తేజసా భృగుః, ఉ పు. భ్రస్జ పాకే. - సూర్యాగ్ని తేజస్సులచేతఁ దపింపఁ జేయఁబడునది. ఈ 3 కొండచఱియ పేర్లు.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
శుక్లవర్నత్వా చ్ఛుక్రః - శ్వేతవ్రణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేన నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రునిరేతస్సు వలనఁ బుట్టినవాఁడు.
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రాదానే - దేవతలకు దుఃఖము నిచ్చువాఁడు.

శుక్రవారము - భృగువారము, వారములలో నొక దినము Friday.      

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ఉపత్యక - కొండచేరువ నేల (వ్యతి. అధిత్యక.)

పొంత - 1.తీరము, 2.సమీపము, సం.ప్రాంతః.
ప్రాంతము - 1.తీరము, 2.సమీపము, సం.వి. (భూగో.) పెద్ద భూభాగము, ప్రత్యేక నైసర్గిక లక్షణములు కలిగి ప్రత్యేక శీతోష్ణస్థితి, జంతు వృక్ష సంపదలు గల భూభాగము, (రాజ.) పరిపాలనా సదుపాయమునకై విభజింపబడిన రాజకీయ భాగము.
సమీపము - చేరువ.
సంగతా ఆపో (అ)స్మిన్నితి సమీపః - సమగతమైన జలమును గలది, లక్షణచేత సమీపమందు వర్తించును.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

నిసర్గము - స్వభావము.
నిసృజ్యతే అనేనేతి నిసర్గః, సృజ నిసర్జే. - పదార్థమును దీనిచేత మిక్కిలి సృజింపఁబడును.

నైజము - 1.తనది, స్వాభావికము.
నైసర్గికము - స్వాభావికము.
స్వాభావికము - స్వభావముచేత కలిగినది. 
నైసర్గికలక్షణము - (భూగో.) ఒక ప్రదేశపు సహజగుణము, ఉదా. ఒక ప్రాంతము చెట్లలోగాని, కొండలలోగాని, నదులలోగాని నిండియుండు స్థితి.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము, (Property).

మధ్య - పదుమూడేండ్ల నుండి పదునెనిమిది(13-18వ) వరకు గల కన్య.     
వేస్ట లైన్ - (గృహ.) (Waist line)నడుము, మధ్యము, కడుపు దగ్గర సన్నని భాగము.

న్యాయ్యే (అ)పి మధ్యమ్,
మధ్యశబ్దము ఉచితమయినదానికిని, అపిశబ్దమువలన నడుమునకును, అవకాశమునకును, అధమునికిని పేరు. "న్యాయ్యావలగ్నయోర్మధ్య మంతరే చాధమే త్రిషు" అని రభసుడు. మన్యత్త ఇతి మధ్యం, మన జ్ఞానే. - తలపఁబడునది.
మధ్యమం చావలగ్నం చ మ ధ్యో(అ)స్త్రీ,
మధ్యమము - నడుము, (గణి.) రెండు పదముల మధ్య చొప్పించబడిన పదము (Mean). 
మధ్యేభవం మద్యం, మధ్యమం చ. - శరీరము నడుమఁ బుట్టినది. 
అవలగ్నము - న డు ము, విణ.తగులుకొనినది.
అవలగ్యత ఇతి అవలగ్నం లగే సఙ్గే. - పూర్వాపరములతోఁ గలియునది. ఈ 3 నడుము పేర్లు.

చిరము - బహుకాలము.
కుశలము - 1.క్షేమము, శుభము, 2.(వ్యావ.) చిన్నది, ఉదా. "మాయిల్లు కుశలము" = ఇరుకైనది, 3.తనివి, 4.పుణ్యము.

తనయ - కూతురు; కూతురు - కుమార్తె. 
తన - ఆత్మార్థకము.  
తనయుఁడు - కొడుకు.
కులం ముదం వా తనోతీతి తనయః, తను విస్తారే. - కులముగాని సంతోషమునుగాని(ముదము - సంతోషము)విస్తరింపఁ జేయువాఁడు.

నిసర్గక్షీణస్య - స్తనతటభరేణ క్లమజుషో 
నమన్మూర్తే ర్నాభౌ - వళిషు! శనకై స్త్ర్యుట్యత ఇవ|    
చిరం తే మధ్యస్య - త్రుటిత తటినీతీర తరుణా   
సమావస్థా స్థేమ్నో - భవతు కుశలం శైలతనయే! - 79శ్లో

తా. ఓ శైలతనయా! శైలజ! నారీతిలకమా!  స్వాభావము చేతనే సన్ననిదియు, స్తనభారము చేత బడలిపోయి వళి - కడుపుమీది ముడుత కృశించునదియు, మెల్లగ జారుచు వంపుగలది, విఱిగిన యొడ్దు వలె నున్న నీ నడుము చిరము - బహుకాలము శాశ్వతముగ స్థేమము-శరీరబలము, సత్తువ. క్షేమముగ నుండుగాక! - సౌందర్యలహరి

త్ర్యక్షరీ దివ్యగాందాఢ్యా సిందూర తిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా. - 126

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గంగలు -
కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి - వీనినే పంచ గంగ లందురు.

త్ర్యంబకుఁడు - శివుడు, ముక్కంటి.
త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః - మూఁడుకన్నులు గలవాఁడు.
త్రయాణాం లోకనామంబకః పితా - ముల్లోకము లకుఁ దండ్రి. త్ర్యంబకం గౌతమీతటే|

ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందఱు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్య సః కుబేరః - బేరమనఁగా శరీరము, కుత్సితమైన శరీరము గలవాఁడు. 

క్షరాక్షరాత్మికా సర్వ - లోకేశీ విశ్వధారిణీ|
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా. - 46స్తో
 

2. త్ర్యంబక సఖుఁడు - కుబేరుడు.
త్ర్యంబకస్య శివస్యసఖా త్ర్యంబక శఖః - శివుని సఖుఁడు.

ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్ష మెత్తఁగ వలసెన్
దనవారి కెంతగల్గిన
దనభాగ్యమె తనకుఁగాక తధ్యము సుమతీ.

తా. కుబేరుడంతటి ధనవంతుడే స్నేహితుడుగా ఉన్నను, శివుడు నకు భిక్షాటన తప్పలేదు. కాబట్టి తనవారి కెనలేని సంపద యున్నను, తనకెంత భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.)అంతే లభించును. కాని ఎక్కువ కల్లనేరదు.   

సహ్యాద్రిపార్శ్వే(అ)బ్ది తటే రమన్తం గోదావరీ తీర పవిత్రదేశే|
యద్దర్శనా త్పాతకజాతనాసః ప్రజాయతే త్ర్యమ్బక మీశ మీడే. - 10

ముక్కంటిపండు - కొబ్బరికాయ.
మూడు కండ్లవాడు ముక్కంటి మరికాడు - తలకు పిలకయుండు తాతగాడు - తాత గుడికిపోవ తలకాయ పగెలెరా ! - కొబ్బరికాయ
కరీరఫలిని - నారికేళము.     
నారికడము - నారికేళము, కొబ్బరికాయ, రూ.నారికేడము, సం.నారికేళః.
నారికేడము - నారికడము.

నాళికేరస్తు లాఙ్గలీ,
నాళ్యాక ముదక మీరయతీతి నాళికేరః, ఈరక్షేవే. - రంధ్రములచేత ఉదకములను బీల్చునది.
నాళీకాని నాళ యుక్తాని పుష్పఫలాని ఈరయతీతి వా నాళికేరః - కాఁడలతోఁ గూడిన పుష్పఫలాదులఁ బ్రేరేపించునది. పా, నారికేళః.
లాంటలాకారపత్త్రత్వాల్లాగలీ, న.పు. నాఁగేఁటివంటి యాకులుగలది. ఈ 2 నాళికేరవృక్షము (టెంకాయ చెట్టు).    

కదళీపాకములు - (అలం.) ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళపాకము.

ఇందీవరాక్ష ! నీ ఇల్లెక్కడన్న
తలనీరుమోసెన త్తరువు క్రిందనియె - కొబ్బరి చెట్టుక్రింద  

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలముభంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుధావహమునగును భువిలో సుమతీ.

తా. నారికేళ వృక్షమునకు ఎంత సలిలము - నీరుపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళము లిచ్చును. అటులనే ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము కలవాడు.)శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారము - మేలు, రూ.ఉపకృతి.)అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగ జేయును. 

అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా. కొబ్బరికాయ, మామిడిపండు.   

తేఁజెట్టు - టెంకాయచెట్టు, రూ.తేమ్రాను, తెన్+చెట్టు = దక్షిణచేశపు చెట్టు.
టెంకాయ - కొబ్బరికాయ, (తెన్ = దక్షిణము, అచట, ఎక్కువగా దొరుకుకాయ.)
తెంకాయ - టెంకాయ.
బొండము - పెచ్చుతో కూడిన టెంకాయ, కొబ్బరి బొండము, రూ.బొండాము, బొండలము, బొండ్లము, బొండ్లాము.

రాజమందిరం చినదానా - రాజావారికి నచ్చే జాణా - చేద వేయకుండా - నీళ్ళు తోడకుండా చేయి తడపకుండా దాహానికి నీళ్ళు తేవే. - కొబ్బరి బొండం   
బావినిండా నీరే పిట్టకందదు - ఎలుకకందదు. - కొబ్బరిబొండం       

తృణరాజము - 1.తాటిచెట్టు, 2.కొబ్బరిచెట్టు, 3.గిరకతాడిచెట్టు.
తృణానాం రాజా ముఖ్యః తృణరాజః, తృణరాజ ఇత్యాహ్వయో యన్యేతి తృణరాజాహ్వయః. - తృణములలో ముఖ్యమైనది తృణరాజము, తృణరాజమను పేరుగలది తృణరాజాహ్వయము. 
తృణద్రుమము - కొమ్మలు లేని తాటి, కొబ్బరిచెట్ట్లు మొదలగునది.

కీతు - కొబ్బరియాకుల చాప.    

మట్ట - 1.కొబ్బరి, తాటి మొ. వాని ఆకులకొమ్మ, 2.మొ. ఆవు వానితోక.

గళ్ళెము - పాలమీగడవంటి లేత కొబ్బెర.
ఒంటి స్తంభంమీద చలువ పందిరి - చలువపందిరిలోన చలువ నీటికుండ - చలువ నీటికుండలోన చవులూర మీగడ. - టెంకాయ లేతకొబ్బరి 

కురుడి - లోపలి నీరింకిన కొబ్బెర.
కుడుక -
తక్కెడ తట్ట.    

కంబరత్రాఁడు - కొబ్బరి పీచుతో పేనిన త్రాడు.
కీతు - కొబ్బరియాకుల చాప.    

బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.    

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయ చిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీదిపోలుసు, 8.తునక, విణ.అల్పము.

అగప - 1.టెంకాయ చిప్ప, కొయ్య గరిటె, 2.ఓడల మురికిని గోకి శుభ్రము చేయు కొయ్యగుద్దలి, రూ.అవక, అబక. అబక - అగప. 

వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజః చర్మాంగధారీ నచసోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణిః జలంచ బిభ్రన్న ఘటోన మేఘః. - కొబ్బరికాయ   
చెట్టుపైన నివాసం - పక్షిగాని - చర్మధారినిగాని సోమయాజిగాను - ముక్కంటిని నేను త్రినేత్రుడనుగాను - నీరు గల్గియుంటి - మేఘుడను కాను. - కొబ్బరికాయ
ఆకాశాన అంబు-అంబుకులో చెంబు - చెంబులో చారెడునీళ్ళు. - టెంకాయ
సూర్యుడు చూడని గంగ - చాకలి ఉతకని మడుగు. - టెంకాయ
చెక్కని స్తంభం - చేయనికుండ పోయనినీరు వెయ్యనిసున్నం. - కొబ్బరికాయ
చెయ్యనికుండ - కురియనినీరు - వెయ్యనిసున్నం తియ్యగనుండు. - కొబ్బరికాయ     
చెట్టుకొమ్మలో పిట్ట - పిట్టకు మూడుకళ్ళు - పొట్టనిండా కడవెడు నీళ్ళు. - కొబ్బరికాయ   
నిటారు నిలువలు - పటాకు బయళ్ళు - మజ్జిగ ముంతలు - మాణిక్యాలు. - కొబ్బరికాయలు
మంచమంత ఆకు - ముంతంత కాయ. - టెంకాయ
కొప్పుందిగానీ జుట్టులేదు - కళ్ళున్నాయిగాని చూపులేదు. – టెంకాయ  
బొచ్చుకాయ. - కొబ్బరికాయ
గుండ్రాయికి గుప్పెడంత పిలక - మూడు కళ్ళు. - టెంకాయ  
చుట్టూకంప - కంపలో పెంకు - పెంకులో శంఖు - శంఖులో తీర్థం. - టెంకాయ    
గుడిలో నీళ్ళు - గుడికి తాళం. - కొబ్బరికాయ
సన్నని నూతికి దారులు లేవు. - కొబ్బరికాయ    

కంచుక పత్రాధారము - (వ్యవ.) కొబ్బరి మొ.మొక్కల ఆకుల మొదళ్ళు కనుపులచుట్టును ఒరవలె అమరి యుండునది (Sheathing leaf base).

గండిక బరిణె పురుగు - (వ్యవ.) కొమ్ము పురుగు, ఎన్నెమ్మ పురుగు, (ఇది బరిణె పురుగు కుటుంబములోనిది, కొబ్బరిచెట్ల మొవ్వులను కొట్టివేయును (Oryctes rhinoceros).
ఎన్నెమ - పురిటిపురుగు, రూ.ఎన్నెమ్మ, ఎనెమ్మ.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, ఘరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకమ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. 

ఆజగామ యదాలక్ష్మీ ర్నారికేళ ఫలాంబువత్|
నిర్జగామ యదాలక్షీ ర్గజభుక్త కపిత్థవత||
తా.
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్ర భూషణాదులశోభ, 4.మెట్టదామర.) వచ్చునపుడు నారికేడము - నారికడము(కొబ్బరికాయ)యందలి జలమువలె తనంతట వచ్చును. పోవునపుడు గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగము లలో ఒకటి.)భక్షించిన కపిత్థము - వెలగచెట్టు వెలగపండు వలె పోవును. - నీతిశాస్త్రము

2. కాశి - 1.వారణాసి, 2.ప్రకాశము, 3.సూర్యుడు, 4.అలసట.

వారణాశి - కాశీ (ఉత్తరప్రదేశ్, గంగానది తీరం.). వారణాసీపురపతే! మణికర్ణికేశ! విశేశ్వర జ్యోతిర్లింగం.

కాశీలో మణికర్ణిక తీర్థం చాలా పుణ్యస్థలం - వ్యాసులవారు(వ్యాసుఁడు) వచ్చి రోజూ(ఈ రోజుకి అక్కడికి వచ్చి) మధ్యాహ్నం 12గంటలకు స్నానం చేస్తారని ప్రతీతి. ఇది పురాణాల ప్రమాణం అని పెద్దలమాట.  

కేదరాది సమస్త తీర్థములు కోర్కిం జూడ బోనేటికిన్?
కాదా ముంగిలి వారణాసి? కడుపే కైలాస శైలంబు? నీ
పాద ధ్యానము సంభవించు నపుడే భావింపగా, జ్ఞాన ల
క్ష్మీ దారిద్ర్యులు గారె లోకు లకటా! శ్రీకాళహస్తీశ్వరా!
తా||
ఈశ్వరా! నిశ్చలమైనభక్తి నీ యందు కుదిరినచో కేదారాది పుణ్య తీర్థములు సేవించుటకు పోనేల? మన యింటి ముందు వాకిలియే కాశి యైపోదా? మన కడుపే కైలాసమైపోదా? ఈ లోకులు అజ్ఞానవశము చేత గ్రహింపలేకున్నారు.  

వరణ - కాశీనగరమునకు త్తరమున గల ఏఱు(నది).

వరణ అసి అను రెండు నదుల మధ్య ఉన్న నగరం వారణాసి, మహాపుణ్యక్షేత్రం! ప్రపంచమంతా బతకడం కోసం అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే కొంతమంది భక్తులు మాత్రం ఈ వారణాసిలో మరణించి మోక్షాన్ని పొందాలని తాపత్రయపడుతుంటారు. కాశీలో మరణించినవారు సరాసరి ఈశ్వర సాన్నిధ్యాన్ని చేరుకుంటారని ప్రతీతి. సప్తమోక్ష కేత్రాలలో ఒకటైన కాశీ నగరమందు పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వరుడు.   

కాశీ క్షేత్రానికి వారణాసి, మహాశ్మశానం, ఆనందకాననం, అవిముక్తం, రుద్రవాసం, ముక్తిభూమి, శివపురి, క్షేత్రపురి మొదలైన పేర్లు ఉన్నవి.  కాశియందు మరణించుట ఎంతటి పుణ్యాత్ములకో సాధ్యమగును, మరణించిన వారికి పునర్జన్మ లేదు.

విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.
శంకరుఁడు -
శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.

గచ్ఛామి కాశీం శివరాజధానీం
స్నాస్యామి గంగాసలిలే శుభావహే
ద్రక్ష్యామి విశ్వేశ్వర మాదిదైవం
యస్యామి ముక్తిం సుకృతైస్త్వలభ్యామ్|
భా||
మహేశ్వరుని నగరమైన కాశీపట్టణమునకుఁ బోవుదును. మంగళ కరమైన గంగాతోయమునందు స్నానము సేయుదును. అద్యుని శివుని  గన్నుల గఱవుదీఱఁ గనుగొందును. సకల సుకృతములచేతను దుర్లభ మైన ముక్తిని జూఱఁ గొందును.

సావన్ద మానమ్దవనే వసన్తం - మానన్దకన్దం హతపాపబృన్దమ్|
వారాణసీనాథ మనాథనాథం - శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.

విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షీ శక్తిపీఠం| వారాణసి యందు దేవీస్థానం విశాలాక్షి. ( సతీదేవి ముఖం పడిన చోట వారాణసి, అక్కడ వుండే గౌరికి విశాలాక్షి అనిపేరు). విశాలాక్షీ విశ్వనాథః |
హైమవతి -
1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక (పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ).
భవ్య - పార్వతి, హైమవతి.(శివసన్నిధిని దేవీస్థానం పార్వతి)
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు. 

గమిష్యామః కాశీనగర మగరాజన్య తనయా
కరాందోలద్దర్వీతల సులభభిక్ష్యామృతరసమ్
యదంతర్వాస్తవ్యై స్సతత ముపనిద్రై స్సుకృతిభి
ర్నిశాసు శ్రూయంతే హరవృషభఘంటాఘణఘణాః| 
తా.
ఏ పట్టణమునం దాకొనియున్న వారలకు నగాత్మజాత దర్విచే మనోహరమైన హస్తముతో సుధారసభిక్షను బెట్టుచున్నదో యే పురవరంబున సుకృతవశంబున ననారతము (హరుఁడు - శివుడు)శంభు వాహనమైన నదీశ్వరుని ఘంటానాదము శ్రవణపేయముగ విననగు చున్నదో యట్టి కాశీపురమున కేగెదము.

విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ|
ప్రగల్భా పరామోదారా పరామోదా మనోమయీ. - 174శ్లో

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గంగలు -
కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి(గోదావరి), భాగీరథి - వీనినే పంచ గంగ లందురు.    

గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వజనేశశివ |

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
గంగాయాః ధరః గంగాధరః - గంగను ధరించినవాఁడు.    

కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్యకలవాడు.

కళత్ర సంసర్గ నితాంతభీతాః కశీంగతాః కాలవశా న్మనుష్యాః|
కళత్రిన స్తేపి కళేబరార్ధే వహం త్యహో ! వారినిధేః కళత్రమ్||
తా.
నరుఁ డొకభార్య సంసర్గమువలన తీవ్రమైన భీతిచేతఁ (గా)కాశీ నగరమున కేగి యచ్చట మరణించి సగముశరీరమునం దొక భార్యను ధరించి పైఁగా సముద్రునిభార్య(శంతనునిభార్య గంగ) నౌఁదల వహించు చునాఁడు. ఔరా! ఏంత చోద్యము! (శంకరుఁ డగుచున్నాడని భావము.) 

విశాలాక్షీ విశ్వనాథః పుష్పాస్త్రా విష్ణుమార్గణః,
కౌసుంభవసనో పేతా వ్యాఘ్రచర్మాబరావృతః| - 10శ్లో  

పెనుమసనము - (పెనువు+మనసము) కాశి, వారణాసి(హిందువుల పుణ్యక్షేత్రము).
పెనువు -
పెంపు, అధిక్యము, వృద్ధి.
పెంపు - 1.సమృద్ధి, 2.నాళము, 3.గౌరవము, 4.మహత్త్వము, 5.నాశముచేయు, సం.1.వృధ్, 2.భంజ్.
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనక్రోవి.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పతనము, 3.మన్నన.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి. 
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
వడ్ది - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్దితో జీవనము చేయుట.   

ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము, 5.కుబేరుని భార్య. అష్టలక్ష్ములలో ఉత్తర దిశలో ధనలక్ష్మి ఉంటుంది.

క్షత్రియం చైవసర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం,
నామ మశ్యేత వైభూష్ణుః కృశానపి కదాచనః ||

తా. అభివృద్ధిగాఁ గల నరుఁడు రాజును, పామును, బ్రాహ్మణుని, పండితుని, కృశించినవారలను వీరల నొకప్పుడు అవమానించ రాదు. (బ్రాహ్మణులను అవమానము చేసిన ఆయుస్సు నశించును, నీతి లేకపోవుట వలన సమృద్ధి నశించిపోవును.) - నీతిశాస్త్రము. 

కాటిఱేఁడు - శివుడు, రూ.కాట్రేడు.  
కాటిపాఁపడు - 1.గొల్లవాడు, 2.కాటికాపరి.  

కాడు - 1.వల్లకాడు, శ్మశానము, 2.అడవి, 3.నాశము, సం.కటః.
వల్లకాడు - శ్మశానము, నానావిధముల పాడు చేయునది.

శ్మశానం స్యా త్పితృ వనమ్ -
మసనము - శ్మశానము, సం.శ్మశానమ్.
శ్మశానము - మసనము, ప్రేతభూమి.
శవానాం శయనం శ్మశానం, పృషోదరాదిః - శవములకు శయనము.
ప్రేతవనము - శ్మశానము, ఒలికిమిట్ట.
పితౄన్ ప్రేతాన్ వనతీతి పితృవనం, వన షన సంభక్తౌ. - శవములను బొందునది. ఈ 2 శ్మశానము పేర్లు ఒలికిమిట్ట. 

రుద్రభూమి - శ్మశానము.
శ్మశానవైరాగ్యము - (జాతీ.) శ్మశానమున నిలిచినప్పుడు కలుగు వైరాగ్యము(ఆ వైరాగ్యము తరువాత నిలువదు. ఇట్లే ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము అను వానిని చెప్పుదురు).

ఒలుకులమిట్ట - శ్మశానము, కాడు.
ఒలికి - సొదపెర్చుచోటు, శ్మశానము.

కాడుచేయు - వై.వి. నాశముచేయు.
కాడుపడు - క్రి.1.కలతపడు, 2.కనపడకపోవు, 3.నశించు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

చంద్రకళావతంసు కృప చాలనివాడు, మహాత్ముడైనఁ దా
సాంద్రవిభూతిఁబాసియొక్క, జాతిహీనుని గొల్చియుంట యో
గీంద్రనుతాంఘ్రిపద్మ మతిహీనతనొందుట కాదు యా హరి
శ్చంద్రుడు వీరబాహుని నిజంబుగ గొల్వడె నాడు, భాస్కరా|

తా. పూర్వము హరిశ్చంద్రుడనురాజు దైవకృప కృప - దయ, కనికరము.)లేక కాటకాపరియైన వీరబాహుని సేవింపవలసి వచ్చెను. కావున ఎంత మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)కైనను భగవంతుని యనుగ్రహము లేనప్పుడు హీనుని గొలువ వలసి వచ్చును, అటుల కొలుచుట తప్పుకాదు.

ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.  

కోశేషు పఞ్చస్వధిరాజమానా - బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహమ్,
సాక్షి శివః సర్వగతోన్తరాత్మా - సా కాశికాహం నిజబోధరూపా|

ప్రకాశము - వెలుగు, విణ.బయలుబడినది.
వెలుఁగు -
1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు. సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి.  

ప్రకాశో తిప్రసిద్ధే పి :
ప్రకాశ శబ్దము మిక్కిలి ప్రసిద్ధమైనవానికి పేరగునపుడు త్రి. అపి శబ్దము వలన, ఎండ మొదలయిన వెలుఁగునకును పేరు. ప్రకాశతే, ప్రకాశనం చ ప్రకాశః. కాశృ దీప్తౌ. ప్రకాశించునదియు, ప్రకాశించుటయు, ప్రకాశము. 'ప్రకాశః కాశవా నపి 'ఇతి శేషః. 

వారణాసీతు భువనత్రయ సారభూతా
రమ్యానృణాం సుగతి దాకిల సేవ్యమానా
అత్రగతా వివిధ దుషృత కారిణోపి
పాపక్షయే విరజః సూమన ప్రకాశాః|

మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఇచ్ఛ - అభిలాష, కోరిక.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుతురు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
జ్వాల - మంట, సం.వి. (రసా.) పరిశోధనాగారములో బున్సెన్ బర్నర్  (దాహని) వంటి గొట్టముల ద్వారా పంపబడు ఇంధన వాయువును జ్వలింపచేసినపుడు లభ్యమగు తేజోవంతమైన గాలుల ప్రవాహము, (Flame).
మంట - 1.రోషము, 2.జ్వాల, 3.చురుకుమను నొప్పి.
రోషము - 1.కినుక(కినుక - అలుక, కోపము), 2.రోసము. రుట్టు - కోపము, రోషము. కోపము - కినుక, క్రోధము. క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము.

ఇద్దము - 1.పరిశుద్ధము, 2.కాంతిమంతము, 3.కాల్పబడినది, 4.అడ్డులేనిది, వి.1.ఎండ, 2.ప్రకాశము, 3.ఆశ్చర్యము.    

ఉత్తమేక్షణ కోపన్న్యా న్మధ్య ఓ ఘటి కాద్వయమ్|
అధమేస్యాదహోరాత్రిం - పాపిష్టే మరణాంతరమ్||
తా.
కోప (ము)ఉత్తమునియందు క్షణకాల ముండును, మధ్యముని యందు రెండు ఘడియలుండును, అధమునియందు నొక యహోరాత్ర ముండును, పాపిష్టియందుఁ జజ్జెడు పర్యంతముండును. – నీతిశాస్త్రము 

సెక - శిఖ, జ్వాల, వేడిమి, రూ.సెగ, సెవ, సం.శిఖా.
సెకకంటి -
శివుడు, చిచ్చుకంటి.
సెకవెలుగు - సూర్యుడు. సెకరేఁడు - అగ్ని, రూ.సెగఱేడు, వ్యు.మంటలు గలవాడు. జ్వాలాజిహ్వుఁడు - అగ్ని.

శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
(ౙ)జుట్టు -
సిగ, సం.చూడా.
సిగ - సిక, సం.శిఖా.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడి కలవాడు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
(ౙ)జంటమోము వేలుపు -
అగ్నిదేవుడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు. 
నాలుగు కన్నుల వేలుపు - అగ్ని.

అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గికంటి -
శివుడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.  
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు(మగగొఱ్ఱె).

అగ్నిహోత్రము - 1.అగ్ని, 2.హోమము, 3.హవిస్సు.

హోమము - వేల్మి, యజ్ఞము.
యజ్ఞము -
1.యాగము, 2.వ్రేలిమి, 3.కృతరాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, ఇవి పంచ యజ్ఞములు), వికృ.జన్నము.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజ్ఞః.
వేలిమి - హోమము, వ్రేల్మి, వేల్మి.
హవనము - హోమము.
హవిస్సు - వేల్చుటకు ఇగురు జెట్టిన యజ్ఞము.
హవ్యవాహనుఁడు - అగ్ని, రూ.హవ్యవహుడు.

స్వాహా - అగ్ని భార్య. ఆమె దయవల్లనే దేవతలకు హవిర్భాగాలు అందుతున్నాయి. మహేశ్వరీపురి యందు దేవీస్థానం స్వాహా.

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
వృషాకపాయి -
1.లక్ష్మి, 2.పార్వతి, 3.శచి(ఇంద్రుని భార్య), 4.స్వాహా.
ఇంద్రాణి - ఇంద్రుని భార్య, శచీదేవి(దేవలోకము నందు దేవీస్థానం ఇంద్రాణి).
వృషాకపి - 1.విష్ణువు, 2.శివుడు, 3.అగ్ని.

అ థాగ్నాయీ స్వాహా చ హుతభుక్ప్రియా :
అగ్నేః స్త్రీ ఆగ్నాయీ. ఈ.సీ. - అగ్నియొక్క పెండ్లాము.
సుష్ఠు ఆహూయంతే దేవాః అనయేతి స్వాహా. - లెస్సగా దీనిచేత దేవతలు పిలువఁబడుదురు.
హుతభుజః ప్రియ(హుతవహుఁడు - అగ్ని) హుతభుక్ప్రియా(హుతభుక్కు - అగ్ని) - అగ్ని యొక్క పెండ్లాము. ఈ 3 అగ్నిహోత్రుని పెండ్లాము పేర్లు. 

అగ్నిహోత్రం గృహంక్షేత్రం గర్భిణీంవృద్ధబాలకా|
రిక్తహస్తేన నోపేముద్రాజానం దైవతం గురుమ్||

తా. అగ్నిహోత్రునకు మంత్ర పూర్వ కాహుతు లిచ్చునపుడును, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీస్త్రీలు, వృద్ధులు, బాలురు, రాజులు, దేవుడు వీరలకడకు వట్టి చేతులతో బోరాదు, అనగా ఫలాదులు తీసుకొని పోవలయును. – నీతిశాస్త్రము

అలసట - అలవు, ఆయాసము, బడలిక(అలసట), గ్లాని.
అలవు -
1.బలము, శక్తి, 2.ఉపాయము, నేర్పు, 3.శ్రమము, 4.విధము. 
ఆయాసము - 1.శ్రమము, 2.ఉత్సాహము, 3.పరితాపము. 
గ్లాని - 1.శ్రమచే కల్గిన దౌర్బల్యము, 2.అశక్తి, 3.రోగము, 4.నాశము.

సోమ - 1.శ్రమము, 2.పరాక్రమము, రూ.సోమము, సం.శ్రమః, స్తోమః.
సోమము -
పరాక్రమము, సం.వి.1.తిప్పతీగ, 2.జలము, 3.కర్పూరము, 4.సోమరసము.
సోమలత - 1.తిప్పతీగ, 2.సోమరసము తయారుచేయు తీగ.
స్తోమము - 1.సమూహము,, 2.స్తోత్రము, 3.యజ్ఞము.
సోమధార - ఆకాశగంగ, పాలపుంత.

బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ -
దేహబలము, సం.సత్యమ్.
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ.
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒకగుణము, 4.జంతువు.
సత్తి - 1.శక్తి, 2.ఒక ఆయుధము, 3.కాళి, 4.బలము, 5.వసిష్ఠుని కుమారుడు, సం.శక్తిః.
సత్తితాలుపు - కుమారస్వామి, శక్తిధరుడు.
శక్తిధరుఁడు - కుమారస్వామి.

శక్తి - (గణి. భౌతి.) అచల స్థితినిగాని, ఒకేదిక్కుగా చలించెడి స్థితిగాని కలుగజేయు బలము, (శక్తి వివిధ రూపములలో నుండును ఉదా. యాంత్రిక, తేజః, విద్యుత్, ఉష్ణ, అయస్కాంత, రసాయనిక, శబ్దశక్తులు మొదలైనవి, (Energy) సం.వి. 1.బలిమి, 2.చిల్లకోల, 3.పార్వతి ఇచ్ఛాది శక్తులు మూడు (జ్ఞాన, క్రియ, ఇఛ్ఛ), ఉత్సాహాది శక్తిత్రయము (ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి).

సైన్యము -1.సేనతోకూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరిగుఱ్ఱములలో నొకటి.
సేన -
దండు, విణ.అధికము, చాల.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
మహాసేనుఁడు - కుమారస్వామి.

ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశ్శక్తిః పరాక్రమః|
షడై తే యత్రతిష్టంతి తత్రదేవోపి తిష్టతి||
తా.
సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము; ఈ (యా)ఆరు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. – నీతిశాస్త్రము

శాంకరుఁడు -1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు. వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు - వినాయకుడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు. 
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బృహస్పతి - 1.సురుగురువు, 2.గురుడు.

కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
స్కందుఁడు – కుమారస్వామి; సుబ్రహ్మణ్యుఁడు - కుమారస్వామి. షడాననుడు - కుమారస్వామి, షణ్ముఖుఁడు, వ్యు. ఆరు ముఖములు కలవాడు.
షాణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.

భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్ర యుతేనచ|
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే||
తా.
ఆరుమారులు భూ(భూ - భూమి)ప్రదక్షిణంబులు, పదివేలమారులు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున గలుగు ఫలము తమతల్లికి ప్రీతిపూర్వకముగా వందన మాచరించుట వలన గలుగును. – నీతిశాస్త్రము

 

ఖనిః స్త్రియా మాకర స్స్యాత్ -
ఖని - రత్నములు, లోహములు పుట్టెడిచోటు, వికృ.గని.
ఖన్యతే రత్నాదికమత్రేతి ఖనిః, ఈ - సీ. ఖను అవదారణే. - రత్నములు మొదలైనవి దీనియందుఁ ద్రవ్వఁబడును.    
ఆకరము - 1.గని, 2.సమూహము, 3.ఉత్పత్తిస్థానము, 4.స్థానము, 5.వ్యాకరణ మహాభాష్యము మొ. ప్రమాణగ్రంధము.
ఆకీర్యంతే లోహాదయో (అ)త్ర ఆకరః, కౄ విక్షేపే. - లోహాదులు దీనియందుఁ జల్లఁబడును. ఈ 2 జేగుఱు, లోహము, రత్నములు మొదలైనవి పుట్టుగని పేర్లు.

స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థాని - స్థానము కలది.
స్థానాంతరీకరణము - (భౌతి.) ఒక వస్తువును ఒక చోటునుండి ఇంకొకచోటికి మార్చుట, (గతిశాస్త్రము,) ఇంకొక చోటికి తరలించుట (Translocation).

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.       

స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికించుట, (Dislocation). 

గని - 1.బంగారు మొ.వి. పుట్టు చోటు, ధాతువులను త్రవ్వి తీసెడు భూభాగము, 2.బిలము, రంధ్రము, సం.ఖని.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
బిల్యతే భిద్యత ఇతి బిలం, బిల భేదనే. - భేదింపఁబడునది.

రంధ్రాన్వేషణము - రంధ్రములను అన్వేషించుట (తప్పులు వెదుకుట యని వాడుకలోని యర్థము.)

రంథ్రముల కుట్టు - (గృహ.) అలంకారపు కుట్టులో రంథ్రముల నేర్పరుచు కుట్టు (Eyelet-stitch).

గఞ్జాతు మదిరాగృహమ్,
గంజ - 1.కల్లుపాక, 2.గని, 3.గంజాయి, 4.కల్లుకుండ, 5.గుడిసె. 
గఞ్జంతి శబ్దాయంతే (అ)స్యామితి గంజ, గజి శబ్దే. - దీనియందు కూఁతలు పెట్టుదురు.
మదిరాయా స్సంధానగృహం మదిరాగృహం - మద్యమును చేసియిచ్చునట్టి ఇల్లు. ఈ 2 మద్యముచేయు నింటి పేర్లు.  

గాంధారి - 1.గంజాయి, 2.ధృతరాష్ట్రుని భార్య.
గంజాయి - 1.గంజామొక్క, 2.దాని ఆకు, 3.ఆ ఆకుతో తయారు చేసిన మత్తు పదార్థము, కబళము, (వ్యవ.) ఉన్మాదక ద్రవ్యములలో ఒకటి (Hemp). (ఇది Cannabinaceae అను కుటుంబమునకు చెందిన Cannibis sativa (గంజాయి మొక్క) అను ఆడు మొక్కల పూవుల నుండి తయారుచేయుదురు. భంగు అనునది ఈ మొక్కలనుండియు, వాని కాడల నుండియు తయారుచేయబడును. గంజాయిలో 'కన్నబిన్ ' (Cannabin) అను ముఖ్యమైన క్షారాభము (Alkaioid) ఉండును. తులసివనములో గంజాయి మొక్క.

గాంధారేయుఁడు - దుర్యోధనుడు, గాంధారికొడుకు.

గుడుసుకయిదువు - విష్ణుచక్రము, పర్యా. గుడుసువాలు.
గుడుసు-గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకారచిహ్నము. 

గుడిసె - గుండ్రని చిన్న ఆకుటిల్లు, సం.కుటీరః.    

ఆవు - గోవు. 
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు Sun. 

సౌరసంవత్సరము - (భూగో., చరి,) 365 రోజులు, భూమి సూర్యుని చుట్టు తిరిగి వచ్చు కాలము.

సౌరి - 1.శని Saturn, 2.యముడు, వ్యు.సూర్యుని కుమారుడు.
సూరస్యాపత్యం సౌరిః - పా. సౌరో వా సూర్యుని కొడుకు.
సౌరికుడు - కల్లమ్మువాడు. 

శౌణ్డికో మణ్డహారకః,
శౌండికుఁడు - కల్లు అమ్మువాడు.
శుండా పానస్థానం తాత్ధ్యత్ సురాపిశుండా, సా పణ్యమస్యేతి శౌండికః. - శుండ యనఁగా పానస్థానము; అందుండునది గనుక సురయుశుండ యనిపించు కొనును, దాని నమ్మువాఁడు.
కబ్బిలి - కల్లమ్మువాడు, శౌండికుడు.
మండ మచ్చసురాంహరతీతి మందహారకః హృఞ్ హరణే. - కల్లుమీఁది తేటను అమ్ముటకై తీయువాఁడు. ఈ 2 కల్లమువాని పేళ్ళు.

సురోదము - కల్లు సముద్రము.
సుర1 - 1.గాలిసుడి, 2.గాలి.
సుడి - 1.జలావర్తము, నీటిసుడి, 2.రోమావర్తము, వెండ్రుకలసుడి, 3.అనిలావర్తము, గాలిసుడి.
సుర2 - కల్లు, పెద్ద.  
సుష్ఠు రాంత్యేనాతి సురా, రా ఆదానే. - లెస్సగా దీనిం బుచ్చుకొందురు.

వాతూలము - 1.గాలి, 2.సుడిగాలి.
వాత్య - సుడిగాలి.      

సురగాలి - సుడిగాలి.
సుడిగాలి - వాత్య (భూగో.) మిక్కిలి వేగముతో గుండ్రముగా గిరగిర తిరిగెడు గాలి.
సుడిగొట్టు - గాలి.    

గవుండ్లవాడు - కల్లు, సారాయి అమ్మువాడు, రూ.గౌండ్లవాడు, గౌఁడు, సం.గొండః.
గౌండ్లవాడు - గమళ్ళవాడు, గవుండ్లవాడు, సురాజీవి, సం.గొండః.

ఈండ్ర - కల్లుగీచి జీవించు ఒకజాతి, ఈడిగ.   
ఈడిగ - ఈండ్ర.

తత్తెర - సారాయి పోసెడుతిత్తి.

వారుణీ - 1.పడమటి దిక్కు, సారాయి.
సారాయి -
సుర, మద్యము, రూ.సారాయము, సం.సారః.

సురా ప్రత్యక్చ వారుణీ :
వారుణీ శబ్దము మద్యమునకును, పడమటి(West) దిక్కు నకును పేరు.
వరుణా జ్జాతా, వరుణ స్యేయ మితి చ వారుణీ. సీ. - వరుణుని వలనఁ బుట్టినది. వరుణుని సంబంధ మయినది గనుక వారుణి.

చారవాయువు - పడమటిగాలి.

కైపు - 1.సారాయి మత్తు, 2.అందము, 3.విజృంభణము.

హాల - సారాయి.
హీయతే లజ్జా అనయేతి హాలా, ఓహాక్ త్యాగే. - దీనిచేత సిగ్గు విడువఁబడును.

వారిధిఁ దరువఁగ నంతట,
వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్
వారిజలోచను సమ్మతి,
వారై కైకొనిరి దాని వారిజనేత్రన్.
భా||
పాలసముద్రాన్ని ఆతరువాత తిరిగి చిలికారు. అప్పుడు వారుణీ - 1.పడమటి దిక్కు, సారాయి. అనే అందగత్తె అయిన కన్య పుట్టింది. ఆ కన్యను పద్మలోచనుడైన విష్ణువు యొక్క అనుమతితో రాక్షసులు తీసుకొన్నారు.

బ్రహ్మ సంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ,
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ.

కల్లు1 - 1.బండికన్ను(చక్రము), 2.శిల, 3.కన్ను.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురి కన్ను, 3.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.    

శౌండుఁడు - 1.కల్లు త్రాగుట లోనగువానిచే మత్తిలినవాడు, 2.నేర్పరి.
శుండా పానాగారం, సురా వా, తత్ర స్థితః ఆసక్తో వా శౌండః. - మద్యపానగృహమందునికి గలవాడు గాని మద్యమందాసక్తి గలవాఁడు గాని శౌండుఁడు.
దానే శౌండస్సక్త ఇతిదాన శౌండః - దానమందాసక్తుఁడైనవాఁడు.  
శుండాలము - ఏనుగు Elephant.    
శుణ్డా పానం మదస్థానమ్ -
శుండ - 1.తొండము, 2.కల్లు, 3.వేశ్య. 
శునంత్యేనాం పానార్థమితి శుండా, శున గతౌ. - పానముసేయుట కొఱకు దీనిఁగూర్చి పోవుదురు.
పానము - 1.త్రాగుడు, 2.త్రాగుడు గిన్నె, వై.వి.పానపట్టము, లింగపీఠము, సం.పానీయవృత్తమ్.
పిబంత్యస్మిన్నితి పానం, పా పానే. - దీనియందు కల్లు ద్రాగుదురు.
మదస్య స్థానం మదస్థానం - మదమునకు నునికిపట్టైనది. ఈ 3 కల్లుపాక పేర్లు.

ౙల్లేరి - పానపట్టము, లింగపీఠము.
లింగపీఠము - పానపట్టము.

తాగు - క్రి.పానముచేయు, రూ.త్రాగు.
త్రాగుడు - త్రాగుట, రూ.త్రావు.
త్రాగు - క్రి.పానముచేయు, రూ.త్రావు.
త్రావు - క్రి.త్రావు.

చషకము - 1.గిన్నె, 2.కల్లుత్రాగు పాత్ర, మధుపాత్ర.
చషంతి పిబంతి సురా మత్రేతి చషకః అ. ప్న. చష భక్షణే. - దీనియందు పానముసేయుదురు.

మన్మథ నాశన మధుపానప్రియ సుందర పర్వతవాస ||శివ||    

ౘొక్కునీరు - కల్లు.
చిప్ప -  1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపు చిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.   

స్వాదనము - 1.పానము, 2.రుచి చూచుట.
స్వాదుముకుళములు - (జం.) రుచిని గ్రహించు జీవకణములు గుంపులు (Taste buds).

సుముఖాయ సుశుండాగ్రోత్క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యా సుఖదాయాస్తు మంగళమ్ |
   

ఆపానము - 1.అనేకులు గూడి కల్లు త్రాగుచోటు, 2.కల్లు అంగడి.
అపిబన్త్యస్మిన్ని త్యాపానం - దీనియందు మద్యపానము సేయుదురు.    

లొట్టిముచ్చు - త్రాగుబోతు.
లొట్టి - కల్లుదీసెడి ముంత.

తాగుబోతు - అమితముగ మద్యము సేవించినవాడు.
తాగు - క్రి.పానముచేయు, రూ.త్రాగు.
మత్తుఁడు - మదించినవాడు.
మాద్యత్తి స్మ మత్తః మదీ హర్షగ్లేపనయోః - మదించినవాఁడు.
మత్తు - మంపు, మదము, సం.మత్తా, మదః.    

బొళ్ళపాయి - కల్లుత్రాగు తాటాకువాయ.
బొళ్ళ - శూన్యము, ఉత్తది. 

అంకపాళి- 1.తొడ, 2.తిన్నె, 3.కౌగిలి, 4.దాది, రూ. అంకపాళి, అంకపాలిక, అంకపాళిక.
అంకపాళిక - అంకపాళి.

ఉత్సంగము - 1.తొడ, 2.ఒడి, 3.ఆలింగనము.
ఒడి - 1.తొడ పైభాగము, ఉత్సంగము, 2.బట్టముంగొంగు, 3.పశుయోని.
ఒడికట్టు - క్రి.1.యత్నించు, 2.పాల్పడు, వి.1.ఒడ్డాణము, 2.ఒడిపై ధరించిన వస్త్రము.
ఒడ్డాణము - నడుమునకు ధరించు నగ, సం.ఓఢ్యాణమ్.
ఓఢ్యాణము - ఒడ్డానము. ఓఢ్యాయాం గిరిజాదేవీ శక్తిపీఠం|

ఒడిబ్రాలు - పెండ్లికూతురి ఓడిలోపోసెడి బియ్యము.  

ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ|
రహోయాగక్రమారాధ్య రహ స్తర్పణ తర్పితా.
 

సక్థి క్లీబే పుమా నూరుః -    
సక్ఠి - తొడ; తొడ - ఊరువు.
సజతే సంగచ్ఛతీతి సక్ఠి, షంజ సంగే. - కూడుకొని యుండునది.
ఊరువు - తొడ, వ్యు.వస్త్రముచే అచ్ఛాదింప బడునది.
ఊర్ణూయతే వస్త్రేణేతి ఊరుః, పు. ఊర్ణుఙ్ ఆచ్ఛాదనే. - వస్త్రముచేఁ గప్పఁబడునది. ఈ 2 తొడ పేర్లు. 
ఊరుసంధి - (జం.) తుంటికీలు, పెల్విస్ (Pelvis), తొడ ఎముకతో కలియు భాగము (Hip-joint).
ఊర్వస్థి - (జం.) (ఊరు+అస్థి) తొడ ఎముక (Femur).

ఉలూఖలసంధి - (జం.) బంతిగిన్నె కీలు, గిన్నెవంటి భాగమునందు బంతివలె నుండు ఎముక భాగము ఇమిడి కదలునది, ఉదా.భుజము కీలు (Ball and socket joint), తొడ ఎముక సంధి.
బంతి గిన్నె కీలు - (జం.) ఒక ఎముక యొక్క గుండ్రని తల మరియొక ఎముకకు గల గిన్నెలో నమిరి అన్ని వైపులకు కదుపుటకును చక్రము వలె తిరుగుటకును వీలుగా నుండు కీలు (Ball and socket joint).

ఉర్వి - భూమి, వ్యు.విశాలమైనది.
ఉర్వీపతి - రాజు, భూమీశుడు.
ఉర్వీశుఁడు - రాజు, భూపతి.
భూపతి - నేలరేడు, రాజు. నేలఱేఁడు - రాజు. 

ఉర్వరా సర్వసస్యాఢ్యా -
ఉర్వతి క్షుధం హినస్తీత్యుర్వరా. ఉర్వీ హింసాయాం. - ఆఁకలిని బోఁగొట్టునది
ఉరుం మహాంతం వృణోతి తదర్హత్వా దుర్వరా - అధికమును వరించునది. ఈ ఒకటి సమస్తమైన పైర్లతోఁ గూడియున్న భూమి పేరు. 

భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

తప్పులెన్నువారు తండోపతండంబు
నుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వ.

తా. ఇతరుల, తప్పులను పట్టుకొనువారు, అనేకులుగలరు. కాని తమ తప్పు - క్రి.1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.)లను తెలుసుకొన లేరు.    

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ - నత్యాన్నదానేశ్వరీ|
సాక్షా న్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్న్నపూర్ణేశ్వరీ. - 7
                    

ఊర్వశి - ఒకానొక అప్సరస.
ఊర్వశీ ఈ, సీ. ఉరు అధికం వ్ష్టి ప్రకాశత ఇతి ఊర్వసీ, వస కాంతౌ. - మిక్కిలి ప్రకాశించునది. (పా, ఊర్వసీ నారాయణస్య ఊరౌ ఉషితా ఊర్వసీ.) వస నివాసే - విష్ణువు తోడలయందు న్నది. నారాయణస్య ఊర్వో ర్భత్వాద్య్వా - విష్ణువు తొడలయందుఁ బుట్టినది, సా ముఖం ఆదిత్యసాం తాః.  

జగతీ జగతిచ్ఛన్దో వశేషే(అ)పి క్షితావపి,
జగతీశబ్దము లోకమునకును, పండ్రెండక్షరముల పాదముగల ఛంధస్సునకును, భూమికిని పేరు. గచ్ఛతీతి జగతీ, గమ్ ఌ గతౌ. పోవునది. 

జగతి - తిన్నె; ౙగిలె - తిన్నె, రూ.జగిలె.
తిన్నె - తిన్నియ; తిన్నియ - అరుగు, వేదిక, రూ.తిన్నె, తీనియ, తీనె.
తీనియ - తిన్నియ.
అరుఁగు - తిన్నె, రూ.అరఁగు.
వితర్ది - వేదిక, అరుగు.
శ్రమం వితర్దయతీతి వితర్ధిః, ఈ-సీ, తర్ద హింసాయాం. - బడలికను జెఱచునది.
వేది - 1.వేదిక, తిన్నె, 2.విద్వాంసుడు, విణ.తెలిసినవాడు.
విదంత్యస్యామితి వేదికా, విదజ్ఞానే. - దీని యందుండి అన్నిటిని నెఱుఁగుదురు. పథికై ర్విద్యతే లభ్యతేవా వేదికా, విద్ ఌ లాభే. - తెరువరులచేఁ బొందఁబడునది. ఈ 2 అరఁగు పేర్లు.

మాతృక - 1.తల్లి, 2.దాది, 3.పార్వతి, 4.అసలు గ్రంథము.
తలి - జనని, తల్లి. 
తల్లి - జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి. జవరాలు, తరుణి.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
కన్యావస్థాం తరతీతి తరుణీ. సీ. తౄప్లవనర్తరణయోః. - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.    
ధాత్రి - 1.భూమి earth, 2.దాది, 3.తల్లి, విణ.ధరించునది.
దాది - 1.ధాత్రి 2.పాలిచ్చి పెంచు తల్లి, రూ.దాదిలి, సం.దాత్రీ.
ధన్య - దాది, విణ. ధన్యురాలు.
ధాత్రేయి - 1.దాది 2.భూమి earth.
భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది. 
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ. 

ధాత్రీ స్యాదు ప మాతాపి క్షితిరప్యా మలక్యపి :
ధాత్రీ శబ్దము దాదికిని, భూమికిని, ఉసిరికచెట్టు నకును పేరు. రధతీతి ధాత్రీ. సీ. డు ధాఞ్ ధారణపోషణయోః, ధరించునది, పోషించునది ధాత్రి. టీ. స. ధయంత్యేనామితి ధాత్రీ. ధే ట్పానే.

పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
కవతే శబ్దాయతే కూబరః, కూఙ్ శబ్దే. - మ్రోయునది.
కుం మహీం వృణోతి అచ్ఛాదయతీతి వా కూబరః, వృఙ్ వరణే. - భూమిని గప్పియుండునది.

కపోణిస్తు కూర్పరః,  
కపోణి - మోచేయి.
కం సుఖం పుణతి కరోతి కపోణిః, ఈ. పు. పుణ శుభకర్మణి చ, సుఖమును జేయునది. పా. కపోణీ, సీ. 'కపోణిరనపుంసకం' అని రభసుడు. కపోణిశబ్దము నుకారమధ్యముగాఁ గొందఱు చెప్పుదురు.
మోఁచేయి - (మోపు+చేయి) కూర్పరము. 
కపోణ్యగ్రప్రవర్థము - (జం.) మోచేతికీలులో రేడియో అల్నాకు పైకి పొడుచుకొని వచ్చిన భాగము (Ocecanon process).
మడత బందుకీలు - (జీవ.) తలుపువలె ముడుచుటకు వీలగు కీలు, ఉదా.మోచేతికీలు (Hinge - joint).
కూర్పసము - 1.మోచేయి, 2.మోకాలు.
పదార్థకర్షనే హఠాత్ కురతి కూర్పరః కుర శబ్దే పదార్థములను గొబ్బునతీయునపు డించుక ధ్వనించునది, ఋ. కుర్పరః, మోచేతి పేర్లు.

అరత్ని - 1.చిటికెనవ్రేలు చాచిన మూరకొలత, 2.మోచేయి.
అల్నా - (జం.) (Ulna) మోచేతి క్రింది ఎముకలలో ఎడమప్రక్కది, అరత్నిక.
అల్నేర్ - (జం.) (Ulanare) అరత్నిక క్రిందనున్న మణికట్టు ఎముక. 

ప్రణతి - 1.వినమ్రత, 2.నమస్కారము.
ప్రణిపత్తి - అభివాదము, మ్రొక్కు.
అభివాదనము - తనగోత్ర నామములచెప్పి పాదము లంటి నమస్కరించుట, నమస్కారము.

మోఁకరించు - క్రి. మోకాళ్ళు నేలనూని ముందరికొరగు, మోకరిలు.
మ్రొగ్గు -
క్రి.మోకరిల్లు, వి.ఎక్కువ, రూ.మొగ్గు.
మ్రొగ్గబఁడు - క్రి.మోకరించు, 2.మ్రొగ్గతిలబదు, 3.మ్రొగ్గుతిలు, 4.ముందునకుపడు.

గిఱి - వలయాకారపు రేఖ, వృత్తము, వలయము.  

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు; కూతుఁరు - కుమార్తె.
సుతుఁడు - కొడుకు. 
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును.

జానూ రుప ర్యాష్ఠీవ దస్త్రియామ్,
(ౙ)జాను - అందము, రూ.జానువు. 
మోకాలు - (మోపు+కాలు) జానువు.   
జానువు - మోకాలు. జానునీ చంద్ర సోదరి|
జాయతే అంఘోరుసంధిభాగ ఇతి జానుః, ఉ. స, ప. పుం. జనీ ప్రాదుర్భావే. - తొడపిక్కలనందునఁ బుట్టునది. 'జాను మప్యస్య మృద్నియాత,' అని సుశ్రుతప్రయోగము.
ఊరుపర్వము - మోకాలు, జానువు, వ్యు.తొడకు కణుపు వంటిది.
ఊర్వోః పర్వ ఊరుపర్వః, న, స. - తోడల యొక్క కనుపు.
అష్ఠి - (జీవ.) జీవకణస్థానము, జీవకణములో వర్ణిద్రవ్యముతో నిండి గుండ్రముగా ఉండు భాగము (Nucleus).
అస్థ్యత్రాస్తీతి అష్ఠీవత్, త. ప్న. - ఎముకగలది. ఈ 3 మోఁకాలి పేర్లు. 

అష్ఠికవచము - (జీవ.) జీవకణములో అష్ఠిచుట్టును ఉండు పలుచనిపొర, అష్ఠికళ (Nuclear membrane).
అష్టికళ - (జీవ.) చూ. అష్ఠికవచము.

కామేశజ్ఞాతసౌభాగ్య-మార్దవోరుద్వయాన్వితా |
మాణిక్యమకుటాకార-జానుద్వయ విరాజితా.

జాను ఫలకము - (గృహ.) మోకాటి చిప్ప, తొడ ఎముక, మోకాలి ఎముక కీలుపై గల బిళ్ళ, (Knee-cap).    

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపు చిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.

విబుధుఁడు - విద్వాంసుడు.
విబుధ్యంత ఇతి విబుథాః - విశేషముగా నెఱింగినవారు గనుక విబుధులు, బుధ అవగమనే.

కరీంద్రాణాం శుండాన్ - కనకకదళీకాండ పటలీం
ఉభాభ్యా మూరుభ్యా - ముభయ మపి నిర్జత్య భవతీ,
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే!
విధిజ్జే! జానుభ్యాం - విబుధకరికుంభద్వయ మపి|| - 82శ్లో

తా. శాస్త్రముల నెఱిగిన ఓ గౌరీ! నీవు నీ తొడలచే నేనుగుల తొండములను, కాంచన కదళి - బంగారపుటరటి స్థంభములను జయించితివి. మఱియు గుండ్రనివియు పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.)భర్తకు నమస్కరించుటచే గట్టిపడినవియు నగు మోకాళ్ళచే దేవగజముల కుంభస్థలములను జయించు చున్నావు. - సౌందర్యలహరి

దిగ్ఘస్తిభి కనకకుమ్భ ముఖావసృష్ట
స్వరాహినీ విమల చారుజల ప్లుతాన్గీమ్
ప్రాత ర్నమామి జగతాం జననీ మ శేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధిపుత్త్రిమ్| - 20

నిర్ఝరణి - నది.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
నిర్ఝరము - సెలయేరు, రూ.ఝురము.
జలపాతము - (భూగో.) నిర్ఝరము, కొండ కాలువ, సెలయేరు, కొండమీద నుండి నిటారుగా క్రిందికి తీవ్ర వేగముతో ప్రవహించు నీరు (Water fall).
సెలయేఱు - నిర్ఝరము, కొండయేరు.
కొండకాలువ - సెలయేరు.
ఝురము - సెలయేరు, రూ.ఝురి.    

వారిప్రవాహో ని ర్ఝీ రో ఝరః,
నిర్ఝ ర్యతే కాలేన స్వల్పో భవతీతి నిర్ఝరః, ఝరశ్చ, ఝౄష వయోహానౌ. - కాలక్రమముచేత స్వల్పమైపొవునది, పా. ఝరీ.
కొండలయందుఁ బుట్టిన జలప్రవాహము (సెలయేరు) పేర్లు.  ఈ 2 ను పర్యాయములని కొందఱు.

గ్రావము - 1.కొండ, 2.రాయి, 3.మేఘము.
ఆత్పాదిభిన్తప్తస్సన్ జలం గిరతీతి గ్రావా, న, పు. గౄనిగరనే. - ఎండచేఁ గ్రాఁగినదై జలమును గ్రహించునది.
రాయి - శిల.
శిల - 1.రాయి,2.సెలయేరు, రూ.సిల. 
శినోతి తనూకరోతి ఆయుధమితి శిలా, శిఞ్ నిశాతనే. - ఆయుధమును గృశింపఁజేయునది.

ప్రొద్దుగల్లు - సూర్యకాంత శిల.
సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి, శిల.

వాగు - 1.సెలయేరు, 2.సేవ, సం.వాహః, వై.క్రి.ప్రేలు. 
వాఁగులు - 1.అలలు, 2.సెలయేళ్ళు.

సెల - 1.సెలయేరు, 2.బాణపుములికి, 3.శల్యము, 4.ఏదుపందిములు, 5.మునిలోల యందలి ఇముపముల్లు, 6.బాణము, 7.వ్రణము నుండి చీము వ్యాపించు రంథ్రము, సం.1.ఝురీ, 2.కల్యమ్.

ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము.

నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పారు వేగఁ బొర్లి
అల్పుడాడురీతి నదికుండు నాడునా? విశ్వ.

తా. ఓ వేమా నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి పారుచుండును. చిన్న సెలయేరులు పైకిపొర్లి వేగముగ ప్రవహించు చుండును. అల్పుఁడు - నీచుడు మాటలాడి నంతటి తొందరగా, మంచి గుణములు కలవారు అధికుఁడు - గొప్పవాడు)మాట్లాడరు.

పాషాణము - 1.రాయి, 2.విషద్రవ్యము.
వస్తూని పినష్టి చూర్ణయతీతి పాషాణః, పిష్ ఌ సంచూర్ణణే. - వస్తువులను చూర్ణము చేయునది.
ప్రస్తరము - 1.రాయి, 2.రత్నము, 3.చిగుళ్ళు మొదలగు వానిచే ఏర్పరచిన సెజ్జ.
స్తృణాతి అచ్ఛాదయతి భువమితి ప్రస్తరః, స్తృఞ్ అచ్ఛాదనే. - భూమిని గప్పునది.
మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.) 

రత్నం మణిర్ధ్వయో రశ్మజాతౌ ముక్తాదికే పిచ :
రమతే స్మి న్ మన ఇతి రత్నం. రము క్రీడాయాం. - దీనియందు మనస్సు రమించును.
మణ్యతే స్తూయత ఇతి మణిః. ఇ. ప్స. - మణి శబ్దే స్తోత్రము చేయఁ బడునది. శిలాజాతు లయిన పద్మరాగ మరకత స్ఫటికాదులకును, మౌక్తిక విద్రుమాదులకును సామాన్యముగా పేర్లు.

అశ్మము - రాయి.
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
అశ్మా గర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగాఁ గలది.
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి, 3.రంపము.
అశ్మనస్సారః అశ్మసారః - ఱాతియొక్క సారము. ఈ 7 ఇనుము పేర్లు 
అశ్మజము - 1.సిలాజిత్తు, 2.ఇనుము, విణ.రాతినుండి పుట్టినది.

తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).

మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.  

శాణస్తు నికషః కషః,
శాణము - సానరాయి, రూ.శాణి.
శ్యతి స్వర్ణం తనూకరోతీతి శానః, శో తనూకరణే. - బంగారు నఱుగఁ దీయునది.
నికషము - 1.ఒరగల్లు, 2.సాన.
నికష్యతే స్వర్ణ మత్రేతి నికషః, కషశ్చ, కషహింసాయాం. - బంగారు దీనియందు పీడింపఁబడును. 
టీకము - ఒరగల్లు, నికషోపలము.   
ఒరగల్లు - బంగారమును ఒరపెట్టు రాయి, నికషము. ఈ 3 ఒరగల్లు పేర్లు.
సాన - శాణము, మణుల ఎచ్చు తగ్గులు మొ.వి. పోవుటకై రాచెడిరాయి, కత్తులు నూరెడి రాయి, గంధము తీసెది రాయి, సం.శాణః.

నిక షా న్తికే,
నికషా - ఇది సమీపమందు వర్తించును, ఉ. 'విలంఘ్య లంకామ్నికషా హనిష్యతీ.

కషము - (జం.) చలనమున కుపయోగించుచు, జీవకణమున కున్న పొడవైన కాడవంటి అవయవము (Flagellum).    

చికిలిసాన - ఒరిపిడిరాయి, సానరాయి.
చికిలి - 1.తుడిచి చక్కచేయుట, విణ.1.నున్నని, 2.అందమైన.

పడవ - మిక్కిలి పల్లమైనది.
పడవ - 1.ఎక్కటి కయ్యము చేయు భూమి, 2.ప్రళయము, వై.వి. చిన్నదోనె, సం.ప్లవః.
ప్రళయము - 1.కల్పాంతము, 2.అపాయము, 3.మృత్యువు, 4.మూర్ఛ.
పళయనం ప్రళయః లీఙ్ శ్లేషణే. - పంచభూతములు కలియుట ప్రళయము.    

గొండోల - (Gondola) వెనిస్ నగరములో నీటి కాలవలందు ఉపయోగించు చిన్నపడవ. 

ద్రోణీ కాష్ఠామ్బువాహినీ,
ద్రోణి - 1.చిన్నపడవ, 2.దోనె, 3.పసులు మేయు కంచె, 4.కొండపల్లము.
ద్రవత్యస్యాం జలమితి ద్రోణీ, ఈ.సీ. ద్రుగతౌ - దీనియందు జలము కాఱిపోవును.
అంబువాహిని - 1.దోనె, 2.కొయ్య బొక్కెన, 3.నీళ్ళుమోయుస్త్రీ.
అంబు వహతీత్యంబువాహినీ; కాష్ఠకృతా అంబువాహినీ కాష్ఠాబువాహినీ, ఈ. సీ. కాష్ఠముచేఁ జేయఁబడిన అంబువాహిని. ఈ 2 దోనెపేర్లు.

దోనె - ద్రోణి, చిన్నపడవ.
దోని - ద్రోణి, దొన, కాలువతూము.
దొన్నియ - ద్రోణి, దొప్ప, డొప్ప.
దొన - 1.తూణము, అమ్ములపొది, 2.ద్రోణి, కొండమీదిపల్లము, 3.చెరువు, సం.1.తూణమ్, 2.ద్రోణీ.

తరకసము - అమ్ములపొది, రూ.తరకషా. బత్తళిక - అమ్ములపొది, రూ.బత్తడిక, బత్తళి.

తూణోపాసఙ్గ తూణీర నిషఙ్గా ఇషుధిర్ద్వయోః తూణ్యమ్ -
తూణము - అమ్ములపొది, రూ.తూణీరము, తూణి.
తూణ్యతే కరీరితి తూణః, తూనీరః, తూనీ చ తూణ పూరణే. - బాణములచేత పూరింపఁబడునది గనుక తూణము, తూణీరము, తూనియును తూణతూణీర శబ్దములు పుంలింగములు. తూణీశబ్దము ఈకారాంత స్త్రీలింగము, ఆకారాంత స్త్రీలింగమని కొందఱు. 
నిషంగము - అమ్ములపొది.
ఉపాసజ్జంతే శరా అత్ర ఉపాసంగ నిషంగశ్చ, షంజ సంగే. - బాణములు దీనియందు కూర్చఁబడును, గనుక ఉపాసంగము నిషంగమును.   
ఇషుది - అమ్ములపొది.
ఇషవోధీయంతే (అ)త్రేతి ఇషుధిః, ఇ.పు. దు ధాఞ్ ధారణపోషణయోః. - బాణములు దీనియందు ధరింపఁబడును.  
ఇషువు - బాణము.
ఇష్యతి గచ్ఛతీతి ఇషుః, ఉ.ప్స. ఇష గతౌ. - లక్ష్యమును గూర్చి పోవునది.

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము - గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు; తీఁగయిల్లు - పొదరిల్లు.
కుంజము - 1.పొదరిల్లు, 2.ఏనుగు కొమ్ము.
కుడుంగము - పొదరిల్లు.

మంజులము - 1.పాచి, శైవలము, 2.పొదరిల్లు, విణ.ఒప్పిదమైనది.

కుటీర పరిశ్రమలు - (వ్యవ.) కుటుంబ వృత్తులు, కర్మాగారముల అవసరము లేకుండ, వ్యవసాయదారు ఊత్పత్తిచేయు దినుసులనుగాని, గ్రామ పరిసరములలో లభ్యమగు ముడిపదార్థము లనుగాని ఉపయోగార్హముగ జేయు పరిశ్రమలు గృహపరిశ్రమలు. (ఇట్టి పరిశ్రమలలో ముఖ్యముగ కుటుంబములోని వారే పనిచేయుదురు. ఇతరులను ఇట్టి పరిశ్రమలలో నియమించుట అసాధారణము.) ఉదా. బుట్టలు అల్లుట, (Cottage industries).

ఆకుటిల్లు - (ఆకు + ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.
పర్ణశాల - ఆకుటిల్లు.

గుడి - 1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.   

కోవెల - గుడి, వై.వి. కోకిలము.
కోకిలము - కోయిల.

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో... దీపముంది.. అదియే దైవం...

కైలాసనాథుఁడు - 1.కుబేరుడు, 2.శివుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్య సః కుబేరః - బేరమనఁగా శరీరము, కుత్సితమైన సరీరము గలవాఁడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

కైలాసః స్థానం :
కేళీనాం సమూహః కైలం తేన ఆస్యతే స్థీయత ఇతి కైలాసః. ఆస ఉపవేశనే - కేళిసమూహము కైలము, దానిచేత నుండఁబడునది.
కే శిరసి శివయో ర్లాసో నృత్య మస్మిన్నితి వా కైలాసః - శిఖరభాగ మందు పార్వతీపరమేశ్వరుల నాట్యము గలది.
కైలాసము - 1.కుబేరుని ఉనికిపట్టు, 2.శివుడుండు వెండికొండ.
కేలయోర్జలభూమ్యోః ఆసనం స్థితి ర్యస్య కేలాసః స్పటికం - తస్యాయం కైలాసః - జలభూముల యందుండునది గనుక కేలాసము; అనగా స్పటికము, దాని సంబంధమైనది. - ఈ ఒకటి కుబేరుని దేశము

వజ్రాలయము - వెండి కొండ.
వెండి - రజతము, అవ్య. మరియు (వెండియు).
రజ్యతే తామ్రాదిక మేనేనేతి రజతం. రంజరాగే. - తామ్రము మొదలైనది దీనిచేత రంజింపఁ జేయఁబడును.

వెలిగొండ - కైలాసము.
వెలి - 1.బహిఃప్రదేశము, 2.వెలివేయుట, విణ.బాహ్యము, వై.వి. తెలుపు, విణ.తెల్లనిది, సం.వళక్షుః.

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ|

దుర్వర్ణం రజతం రూప్యం ఖర్జూరం శ్వేత మిత్యపి :
కనకాపేక్షయా నికృష్టవర్ణత్వా దుర్వర్ణం - బంగారము కంటె నికృష్టమైన వర్ణము గలది.

రజతాద్రి - 1.వెండికొండ, 2.కైలాసము.
రజతము - 1.వెండి, 2.హారము, విణ.తెల్లనిది (భూగ.) ఒక లోహము (Silver) సం.వి.(రసా.) వెండి ధాతువులలో నొకటి. (Argentum) నాణెములలో ఉపయోగపడు ధాతువు.
రజ్యతె తామ్రాదిక మనేనేతి రజతం; మహచ్చతద్రజతం. - తామ్రము మోలైనది దీనిచేత రజింపఁబడును గనుక రజతము; మహత్తైన రజతము మహారజతము.   
రజతోత్సవము - సంస్థలకు 25 సంవత్సరములు నిండిన సందర్భముగ చేయు ఉత్సవము (Silver jublii).

ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమో నమః|

కలధౌతము - 1.వెండి, 2.బంగారము.
శ్రేష్ఠధాతువు - (రసా.) వాతావరణ పరిస్థితిలకు చెక్కు చెదరని గుణములు గల ధాతువు, (Nobel metal) ఉదా. వెండి, బంగారము.  

కలధౌతం రూప్య హేమ్నోః -
కలధౌతశబ్దము వెండికిని, బంగారమునకును పేరు. కలం కాలుష్యం ధౌత మస్యేతి కలధౌతం, ధావు గతిశుద్ధ్యోః. - పోగొట్టబడిన కాలుష్యము గలది.

ఊఁదువెండి - శుద్ధమైన వెండి, ఊదిన వెండి. బులియను - (అర్థ.) (Bullion), మేలిమి బంగారము లేక వెండి.

రూక - 1.ధనము, 2.చిన్న మెత్తు, 3.వెండి బంగారముల నాణెము, సం.రూక్మమ్.

అడ్డుగ - రూకలో సగము.

రూపాయ - (అర్థ.)పదహారు అణాల నాణెము, సం.రూప్యమ్. 
ప్రశస్తం రూపమస్యేతి రూప్యం - ప్రశస్తమైన రూపముగలది.  
 
రూప్యం ప్రశస్తే రూపే (అ)పి,
రూప్యశబ్దము మంచిసౌందర్యము గలవానికి పేరైనపుడు త్రి, అపి శబ్దమువలన ముద్ర గల వెండికిని, బంగారునకును, పేరైనపుడు త్రి. ప్రశస్తమాహతం చ రూప మస్యేతి రూప్యం - మంచిరూపమును, ఆహతమైనరూపమును గలది గనుక రూప్యము.

షరాబు - 1.వెండి బంగారు నగలు వ్యాపారము, 2.డబ్బు వసూలుచేయువాడు, రూ.షరావు. 

మెఱుగురాయి - వెండికి మెరుగు పెట్టు రాయు.

పైఁడిఱేఁడు - కుబేరుడు.
పైఁడిచూలాలు -
వసుంధర, భూమి.

పయిఁడి - బంగారు; పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పసిఁడి - 1.బంగారు, 2.ధనము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
పైఁడినెలఁత - లక్ష్మి.  

అపరంజి -  మేలిమి బంగారము, కుందనము.
కురదనము - అపరంజిలోహము, మేలిమి బంగారము. 
ఉదిరి - అపరంజి, మేలిమి బంగారము.
పుత్తడి - అపరంజి, సం.పురటమ్.
మేలిమి - 1.అపరంజి, 2.అధిక్యము. 
ౙాలువా - అపరంజి, రూ.జాళువ, జాళ్వ. 
ౙాళువ - జాలువా.

పలము - 1.నిష్కము, మూడుతులములు, 2.మాంసము.
స్యాచ్చామిషే పలమ్,
పలశబ్దము మాంసమునకును, 320 గురిగింజల యెత్తునకును పేరు. పల్యత ఇతి పలం పల గతౌ. - పొందఁబడునది.

నిష్కము - 1.మాడ, టంకము, 2.పతకము, 3.బంగారము, 4.వెండి.
మాడ - అరవరా, పదిరూకలు.
టంకము - ప్రాచీన కాలపు బంగారు నాణెము, దీనారము, సం.వి.1.వెలిగారము, 2.కత్తి, 3.కోపము, సం.వి.(రసా.) ధాతువును ధాతువు నకు కలుపుటకు వాడుకలో నున్న సులభముగా కరగు ధాతు మిశ్రము (Solder).
దీనారము - బంగారు నాణెము.
దినారి - దీనారము, ఒక బంగారు నాణెము, సం.దీనారః. 
టంకకము - వెండినాణెము.
టంకసాల - నాణెములు ముద్రించు చోటు, సం.టంకశాలా.

టంకాధ్యాయుథ ధారణ సత్వర హ్రీకారాది సురేశ శివ|

పతకము - హారము నడుమ నుండు రతనపు బిళ్ళ, సం.పదకమ్.

గవ్వచౌకము - నాలుగు గవ్వల మొత్తము, వెలిగారము.
వెలిగారము - గవ్వచౌకము, టంకము, సం.ధవళఃక్షారః, (గృహ, రసా.) టంకణము, సిల్కు బట్టలను తేటగా చేయుటకును బట్టల మీద మచ్చలు తీయుటకును ఉపయోగించెడి రాసాయనిక ద్రవ్యము, (ఇదిబోరిక్లామము యొక్క సోడియపు లవణము, (Borax).
టంకణము - వెలిగారము, (రసా.) వెలిగారము, (రాసాయనికనామము: సోడియమ్ టెట్రోబోరెట్), (వ్యవ.) వెలిగారము లేక సోడియటంకణితము, (Na2 B2 O7 + 10 H2 O)లో నున్న (ఉప) ధాతువు, మొక్కలకు సూక్ష్మపరిమాణములో కావలసిన మూలద్రవ్యములలో నిది యొకటి.   
బోరాన్ - (రసా.) (Boron) ఒక మూల ద్రవ్యము, (ఆధాతు స్వభావము కలది, వెలిగారమందు ఘటకముగా నుండును. ఆవర్త క్రమ పట్టికలో 3వ వర్గము లోనిది. అత్యల్పప్రమాణములో మొక్కలకు కావలసిన మూలద్రవ్యములలో నిది యొకటి. పరిమాణు సంఖ్య 5గా గల ఒక ఆలోహ మూలకము.) 

తారము - 1.వెండి, 2.పులుగడిగిన ముత్తెము.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము,(పులుగడిగిన ముత్యము).

కైలాచలకందరాలయకరీ-గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ - ఓంకారబీజాక్షరీ|
మోక్షద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్నేశ్వరీ. - 4

ఖర్జూరము - 1.వెండి , 2.తేలు, 3.ఖర్జూరపుచెట్టు, ఖర్జూరపు పండు.
వెండి-రజతము, అవ్య. మరియు (వెండియు).
ఖర్జ్యతే పీడ్యత ఇతి ఖర్జూరం. ఖర్జు వ్యథనే. - అగ్ని సంతాపాదులచేతఁ బీడింపఁబడునది.వెండి.
తేలు - క్రి.1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము Scorpion.
కజ్జారము - ఖర్జూరము.
ఖర్జయతి రక్తపిత్తమితి ఖర్జూరః, ఖర్జ వ్యథనే. - రక్తపిత్తాదులను బోఁగొట్టునది,  ఖర్జూరము పేరు.
ఖర్జయతి రోగం ఖర్జూరీ, సీ. ఖర్జ వ్యథనే. - రోగమును బోఁగొట్టునది.  

పూరిత సద్గుణంబుఁగలపుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వానియెడ దొడ్డగఁజూతురు బుద్ధిమంతులెట్లా
రయ గొగ్గులైన మఱి యందుల మాధురిఁజూచి కాదె ఖ
ర్జూర ఫలంబులన్ బ్రియముజొప్పిల లోకులు గొంట, భాస్కరా.

తా. ఖర్జూరపు పండ్లు ముడతలు పడి కంటికింపుగా గానబడకున్నను జనులా పండునందు గల మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు. తీయదనము నకు మిక్కిలి యిష్టముతో కొందురు. అట్లే మంచి గుణములు గల వానికి ఒకప్పుడు భాగ్య రేఖయు, రూపును చెడిపోయి నప్పటికీ వానిని బుద్ధిమంతు లగు వారు తొంటి(పూర్వపు) విధముగనే చూతురు.

ముఖం మీద ముడతలు ఇదివరకు చిరునవ్వులుండే చోట్లను సూచిస్తాయి. - మార్క్ ట్వేన్ 

శ్వేతవాహనుడు - 1.చంద్రుడు, 2.అర్జునుడు.
చందిరుఁడు - చంద్రుడు.
చంద్రముఁడు - చంద్రుడు.
చంద్రుడు - నెల, చందమామ.
నెల చూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
చంద్రబీజము - వెండి; మడికాసు - వెండి. 

శ్వేతము - 1.వెండి, 2.తెలుపు, 3.కైలాసము, 4.ఒక ద్వీపము.
శ్వేతవర్ణత్వాత్ శ్వేతం- తెల్లనివన్నె గలది, వెండి.
శ్వేతతే శ్వేతః, శ్వేత వర్ణే. - వర్ణమును జేయునది.
శ్వ యతి వర్దతే మనో (అ)స్మిన్నితివా శ్వేతః, టు ఓశ్వ గతివ్యద్ధ్యోః. - దీనియందు మనస్సుండును గనుకనైన, వృద్ధిఁబొందును గనుకనైన శ్వేతము.  

శ్వేతం రూప్యే (అ)పి -
శ్వేతశబ్దము వెండికి పేరైనపుడు న. అపిశబ్దము వలన తెల్లనె వస్తువునకు పేరైనపుడు త్రి, శ్వేతత ఇతి శ్వేతం, శ్వితా వర్నే. - తెల్లనిది. "ద్వీపాద్రి కుష్టునాగేషు శ్వేతో నాస్త్రీ వరాటకే" ఇతి శేషః.  

తెలిపక్కము - శుక్లపక్షము.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.   
శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
శోకతి గచ్ఛతి మనః అస్మిన్నితి శుక్లః, శుక గతౌ. - మనస్సు దీనియందుఁ బ్రవర్తించును. 

తారము - 1.వెండి, 2.పులుగడిగిన ముత్తెము.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము,(పులుగడిగిన ముత్యము).    

ఉపకర్త - మేలు చేయువాడు, రూ.ఉపకారి.
ఉపకారి - 1.ఉపకరము చేయువాడు, 2.బండినొగల క్రింద ఆధారముగ నుంచ బడినది.   

నకీబు - వెండి బెత్తమువాడు.   

అరయనెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చి నుపకారి మనుష్యుడు లేక మేలుచే
కూఱ దదెట్లు? హత్తుగడగూడునె చూడఁ బదారు వన్నె బం
గారములో నైన వెలిగారము గూడకయున్న, భాస్కరా.
 
తా. భాస్కరా ! వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.)బంగారములోనై నను గవ్వచౌకము - నాలుగు గవ్వల మొత్తము, వెలిగారము.)కలియక అది ఏవో నొక భూషణముగా, అనగా ఉపయోగ కరమగు వస్తువుగా తయారు కాదు అట్లే ఎంత విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు మనుష్యుఁడు - మానిసి, మానవుడు లేక అతని గొప్పతనము రాణింపదు.

విశేషము :- ఒక వస్తువునకు గాని ఒక వ్యక్తికిగాని సహజముగా నున్న గొప్పతనమును, బాహాటము చేయు వ్యక్తిగాని, మరి యే పదార్థము గాని లేక ఆ యా వ్యక్తులు గాని వస్తువులు గాని కీర్తిని బొంద(పొంద) నేరవు.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.

మహాకైలాసనిలయా మృణాళమృదుదోర్లతా|
మహనీయా దయామూర్తి - ర్మహాసామ్రాజ్య శాలినీ.  

టంక - 1.పిక్క, జంఘ, 2.వెలిగారము.  
వెలిగారము - గవ్వచౌకము, టంకము, సం.ధవళక్షారః. (గృహ.,రసా.) టంకణము, సిల్కు బట్టలకు తేటగా చేయుటకును బట్టల మీది మచ్చలు తీయుటకును ఉపయోగించెడి రాసాయనిక ద్రవ్యము, (ఇది బోరికామ్లము యొక్క సోడియపు లవణము). (Borax).
గవ్వచౌకము - నాలుగు గవ్వల మొత్తము, వెలిగారము.
టంకసాల - నాణెములు ముద్రించు చోటు, సం.టంకశాలా. 

టంకారాగత కంకాత్తహిత
ఝంకారాఢ్యా లంకారావృత| ||శరవణభవ||

చిఱుదొడ - పిక్క.
ౙంగ - పిక్క, 2.దాటు, సం.జంఘా. 
ౙంగగొను - 1.దాటు, 2.దుముకు.  

జఙ్ఘాతు ప్రసృతా -
జంఘ - పిక్క.
జాయత ఇతి జంఘా. జనీ ప్రాదుర్భావే. - పుట్టునది.
పిక్క - 1.చిరుతొడ, జంఘ, 2.గింజ, సం.1.పిండికా, 2.స్పృక్కా. 
ప్రసరతీతి ప్రసృతా - సృగతౌ, వృద్ధిఁబొందునది. ఈ ఒకటి పిక్క పేర్లు.

గింౙ - విత్తు; విత్తనము - గింజ.

జఙ్ఘాలో (అ)తిజవ స్తూల్యౌ-
జంఘాలుఁడు - మిక్కిలి వేగముగా నడచువాడు.
ప్రశస్తే జంఘే అస్యస్త ఇతి జంఘాలః - మంచి పిక్కలుగలవాఁడు.
అతిశయము - అధిక్యము. అతిశయితో జవో వేగో యస్య సః అతిజవఁ - అతిశయమైన వేగము గలవాఁడు.

పిక్కచెదురు - 1.చెదురు, 2.భయపడు.
చెదురు - 1.నీళ్ళలోనగునవి ఎగిరిపడు, 2.వ్యాపించు, 3.చెదరుట.

ప్రజంఘ కండరము - (జం.) పిక్క ఎముకపై నుండు బలమైన కండరము (Gastrocnemius muscle).   

జానుక - (జం.) అనుజంఘాస్థి, పిక్క ఎముకలలో బయటివైపున నున్న ఎముక (Fibula).
జంఘిక - (జం.) పిక్క యెముకలలో రెండవది, అనుజంఘాస్థి, (Fibula).
జంఘానుజంఘాస్థి - (జం.) జంఘాస్థి అనుజంఘాస్థి కలసియున్న యెముక (Tiblo-fibula).
జంఘాస్థి - (జం.) పిక్క ఎముకలలో లోపలివైపున నున్న ఎముక, (Tiblo).

రుద్రుఁడు - శివుడు.
రోదయతి శత్రూన్ రుద్రః - శత్రువులను దుఖఃపెట్టువాఁడు.
స్వయం రురో దేతివా, రుదిర్ అశ్రువిమోచనే, ఏకదా బ్రహ్మాసురోధేన ప్రాప్త జన్మ పరిగ్రహ్ణో (అ)సౌరురో దేతి పురాణప్రసిద్ధిః - ఒకానొక్కప్పుడు బ్రహ్మవలన జన్మమును బొందినవాడై దుఖించెను గనుక రుద్రుఁడు.
రుదం రోదనం ద్రావయ తీతివా - దుఃఖమును బోఁగొట్టువాఁడు, ద్రు గ్రతౌ.
రుద్రాణి - పార్వతి.
రుద్రస్య పత్నీ రుద్రాణీ - రుద్రునిభార్య. రుద్రాణీ రుద్రశ్చెవేశ్వరీశ్వరః| రుద్రకోట యందు రుద్రాణి|

రెట్టి - 1.రెటింపు, ద్విగుణము, 2.గుణము, 3.మణుగు.
ఇనుమడి - రెట్టింపు, ద్విగుణము, రూ.ఇన్మడి, ఇమ్మడి, ఇబ్బడి.
ఇన్మడి - ఇనుమడి.
ఇబ్బడి - ఇనుమడి.

ద్విపాద్యో ద్విగుణో దణ్డః -
ద్వౌ పాదౌ ప్రమాణమస్మిన్నితి ద్విపాద్యః - రెండుభాగములు ప్రమాణముగాఁ గలది.
దుగుణము - ద్విగుణము రెండు, రెండింతలు, సం.ద్విగుణమ్.
ద్విగుణః దణ్డః - రెట్టింపు దండుగ. ఉచితమైనదానికంటె నినుమడిగా దండుగఁ గొనుట. 
ద్విగుణ - (జీవ.) తయారైన అండము, శుక్రకోశము తప్ప శరీరమున మిగిలిన జీవకణము లన్నిటిలోను క్రోమోసోములు రెండు వర్గములుగా నుండుట (Diploid). 
ద్విగుణాధిస్ఫురితము - (వ్యవ.) సామాన్యమగు అధిస్ఫురితము (Super phosphate) లలోకంటె స్ఫురత్పంచామ్ల జనితము సుమారు రెట్టింపు ఉండునది (Double super phosphate).

తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మకరతము -
మరకతమణి, రూ.మరకతము.

గిరి-1.కొండ, 2.అచ్చనగాయ, 3.గుండురాయి.
కాలేన గీర్యత ఇతి గిరి, ఈ, పు, గ్రావా చ న, పు గౄ నిగరణే. - కాలముచేతఁ జెఱుపఁబడునది.
గిరిజ- 1.పార్వతి, 2.కొండయరటి, 3.మల్లెతీగ.
గిరే ర్జాతా గిరిజా - పర్వతమువలనఁ బుట్టినది.
సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత. 
సుత2 - కూతురు; కూతురు - కుమార్తె.  
సుతుఁడు - కొడుకు.
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును.

పాణివడము - అమ్ములపొది, సం.బాణపాత్రమ్.

శాణము - సానరాయి, రూ.శాణి.
శృతి స్వర్ణం తనూకరోతీతి శాణః, శో తనూకరణే. - బంగారు నఱుగఁ దీయునది.
శాణీ - సాన; సాన - శాణము, మణుల ఎచ్చు తగ్గులు మొ, ని పోవుటకై రాచెడిరాయి, కత్తులు నూరెడి రాయి, గంధము తీసెడి రాయి, సం.శాణ. నిశాతము - మిక్కిలి వాడిచేయబడినది, రూ.నిశితము.
నిశాయతేస్మ నిశితం, శాతం చ, శో తనూకరణే. - అరగఁదీయఁబడినది, గనుక నిశితము, శాతమును.  

పరాజేతుం రుద్రం - ద్విగుణశరగర్భౌగిరిసుతే!
నిషంగే జంఘే తే-విషమవిశిఖో బాఢ మకృత,
యదగ్రే దృశ్యంతే-దశ శరఫలాః పాదయుగళీ 
నఖాగ్రచ్ఛద్మాన - స్సురమకుటశాణైకనిశితాః| - 83శ్లో
 
తా. ఓ గిరిజా! మన్మథుడు రుద్రుఁడు - శివుడు శివుని జయించుటకై నీ పిక్కలను రెండింతలు బాణములుగల నిషంగము - అమ్ములపొదిలుగ జేసియుండును. నీ పిక్కల కొనల కాళ్ళ గోళ్ళనెడి విశిఖము - బాణములు దేవతల కిరీట మాణిక్యముల యందు సానబెట్టబడిన పది బాణములుగ దోచుచున్నది.- సౌందర్యలహరి    

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.

వైకుంఠుడు - 1.విష్ణువు, 2.ఇంద్రుడు.
వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.

ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా
కార పిశాచసంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వారకవాటభేది నిజ దాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.

తా. రామా! నీ తారకనామము భయంకరులయిన యమదూతలను(కృతాంతుఁడు - యముడు)గుండెలదరజేయును. దరిద్రత అనెడి పిశాచమును బోగొట్టును. ఎల్లప్పుడును నీ దాసజనులు పరమ పదమునకుఁ బోవుటకుగల యుడ్డములను తొలగించును.      

వాసుకము - వైకుంఠము. కంఠం వైకుంఠ వాసినీ|   
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. వైకుంఠాలయ సంస్థిత రామ్|   

విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణోః పదం విష్ణుపదం - విష్ణువునునకు స్థానము.  
2. విష్ణుపది - గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగా గలది.
విష్ణుపదోద్భవా విష్ణుపదీ. ఈ. సీ.- విష్ణుపాదమునఁ బుట్టినది.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను. 

మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.

పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది - పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.  

వైకుంఠేచ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి
గంగాచతులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకగాః
కృష్ణప్రాణాధిదేవీత్వం గోలోకేరాధికాస్వయమ్
రాసేరాసేస్వరీ త్వంచబృందావనేవనే|| - 3స్తో

విరజ - వైకుంఠము నందుండు నది. (మోక్షం కలగాలంటే దీన్ని దాటాలి) పరమపదమున సమీపముగా నుండునది విరజానది, ఆ విరజా నదియే యమునగా మారి వచ్చినది - తిరుప్పవై.

విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా,
యస్యాః సందర్శనా న్మర్త్యాః పునాత్యాసప్తమం కులమ్ |

ఉత్కలదేశమున విరజయను క్షేత్రముకలదు. ఆ క్షేత్ర అధిస్ఠానదేవతకు విరజయను సంజ్ఞ కలదు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడిన ఈ దేవతా సందర్శనమున నేడుతరముల(ఏడు తరముల)వారిని పునీతుల చేయుదురని బ్రహ్మాండ పురాణమున తెలియుచున్నది.   

శ్రీరమ సీతగాఁగ నిజ సేవకబృందము వీర వైష్ణవా
చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్రశైల శిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధారకు డన విష్ణుఁడవు దాశరథీ కరుణా పయోనిధీ.
తా.
దశరథరామా ! నీవు పరమపదమందున్న లక్షీదేవిని ఇచట సీతగాఁ జేసికొని, అందలి పరివారము ఇచట వీరవైష్ణవజనులుగా వచ్చి కొలుచు చుండగా, అచ్చట విరజానది ఇచట గోదావరిగా ప్రవహింపగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రగిరి కొమ్మకొనయై రాణింపగా వేంచేసి చేతనులను ఉద్దరించుచున్న శ్రీవిష్ణుదేవుండవే కాని వేఱుకావు.

రామో విరామో విరజో మార్గనేయో నయోనయః
వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మవిదుత్తమః - 43శ్లో
 

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. – 149శ్లో

జహ్నువు - 1.ఒక ముని, 2.విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ. 
3. జహ్నుతనయ - గంగ; జాహ్నవి - గంగ.     
జహ్నోస్తనయా జాహ్నవీ - జహ్ను మహామునియొక్క చెవియందుఁ బుట్టినది.

పతితోద్ధరిణి జాహ్నవి గఙ్గే ఖణ్డితగిరివర మణ్డితభఙ్గే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువనధన్యే ||

పతితులను ఉద్దరించే జహ్ను పుత్రి గంగా! నీ తరంగముల హిమగిరులను ఖండిస్తూ సుశోభితంగా ప్రవహిస్తుంటాయి. నీవు మునివర జహ్ను పుత్రికవు, భీష్ముని జననివి. పతితులను పావనం చేసి, త్రిభువనాలలో ధన్యత నొందుతావు. - 5శ్లో  

సుజయా జయభూమిస్థా జాహ్నవీ జనపూజితా,
శాస్త్రీ శాస్త్రమయీ నిత్యా శుభా చంద్రార్థ మస్తకా|

నమోజహ్ను కన్యేనమన్యే త్వదన్యై - ర్ని సర్గేందు చిహ్నాది భిల్లోకభర్తుః
అతో హం నతో హంస్వతో గౌరతోయే - వసిష్టాది భిర్గీయమానా భిదేయే.

ఆకంఠం సలిరే నిమజ్జ్య పులినాభోగోపధానే శిరః
కృత్వా శైలసుతాపతే ! పురరిపో ! గంగాధరే త్యాలపన్
గృహ్ణన్ కర్ణపుటే శివేన కృపయా ప్రత్యాహృతం తారకం
తీరే జాహ్నవి ! జహ్నునందని ! కదా మోక్షే శరీరం ముదా|

గంగా ! నీజలములం దాకంఠము మునింగి శిరంబున నీసంబంధములగు నిసుక తిన్నెలను తలగడయందుఁ జేర్చుకొని శంభూ ! పార్వతీ రమణా! పురహరా ! గంగాధరా! యని వాకొనుచుఁ గృపతోడ శివుండు గర్ణపుటము నందు సూచించు మహనీయమగు తారకమంత్రమును గ్రహించి సంతృప్తుఁడనై యెన్నఁడీ దేహమును ద్యజియించెదనో కదా ?   

నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా,
చిత్రఘంటా సునందా శ్రీ ర్మానవీ మనుసంభవా. – 38శ్లో                

ౙగముకన్ను - సూర్యుడు Sun.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

జగచ్చక్షువు - సూర్యుడు Sun.
జగతశ్చక్షురివ జగచ్చక్షుః, స.పు - జగత్తునకు నేత్రమువంటివాఁడు.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
గమ్య తేజనైరితి జగతీ, ఈ. సీ. జగచ, త. న. గమ్ ఌ గతౌ. - జనులచేత బొందఁబడునది.
ప్రళయకాలే గచ్చతీతి జగతీ జగచ్ఛ - ప్రళయకాల మందు లయమైపోవునది.
ౙగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద.

జగతీ జగతిచ్ఛన్దో వశేషే(అ)పి క్షితావపి,
జగతీశబ్దము లోకమునకును, పండ్రెండక్షరముల పాదముగల ఛంధస్సునకును, భూమికిని పేరు. గచ్ఛతీతి జగతీ, గమ్ ఌ గతౌ. పోవునది.

Who is the protector of the World?
The Sun

ఏవం మాల్యవచ్ఛిఖారాన్నిష్పతంతీ తతో అనుపరతవేగా కేతుమాలమభి చక్షుః ప్రతీచ్యాం దిశి సరిత్పతిం ప్రవిశతి |       

చక్షువు - కన్ను. చక్షు సేతు విశాలాక్షీ|
చష్టే వస్తు స్వరూపం వక్తి చక్షుః. స. న. చక్లిఙ్ వ్యక్తాయాం వాచి. - వస్తు స్వరూపమును చెప్పునది.

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్దివాడు, 3.మంచికన్నులు కలవాడు. 

చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

మూర్తీ పటము - (జం.) కనుగ్రుడ్డు పొరలలో అన్నిటి కంటె లోపలనున్న పొర. (ఇది పలుతురును శీఘ్రముగా గ్రహించును. అందుచే నిది దృష్టికి అవసరమగు ముఖ్యావయవము (Retina).
శలాకలు, శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (దీనిని శీఘ్ర గ్రహణశక్తి గలదు) (Rods and cones).

ఐచ్చిక కండరములు - (జం.) ఇచ్ఛాకండరములు ఇష్టము వచ్చినప్పుడు పనిచేయు కండరములు, ఉదా.చేయి, కన్ను, కాలు మొ, వాని కండరములు (Voluntary muscles). 

చక్షుశ్శ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్శ్రవము.

చక్షుర్భ్యాం శృణోతీతి చక్షుశ్శ్రవాః. స. పు. శ్రు శ్రవణే. - కన్నులవలన వినునది. 

ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
లోకమాత - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
లోకానం మాతా లోకమాతా - ఎల్ల లోకములకు తల్లి.      
లోకజనని - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
లక్కి - లక్ష్మి, సం.లక్ష్మి.
లక్ష్మీః, ఈసీ, లక్ష్యతే సర్వో (అ)నయేతి లక్ష్మీః - ఈమెచేత సర్వము చూడబడుఁగాన లక్ష్మి, లక్ష దర్శనాంకనయోః.  
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు). 

పాదోదకము - మేఘము.
పాద్యము -
పాదము కొరకైన నీళ్ళు.    

నెత్తికెక్కిన ఆడది చిత్తం స్వామీ అంటూ కాళ్ళు కడుగుతోంది.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.
అరుణవర్ణత్వాదరుణా - ఎఱ్ఱనివన్నెగలది.
అవ్యక్తరాగ స్త్వరుణః -
ఇయర్తీత్యరుణః ఋ గతౌ. - మనస్సును బొందునది. ఈ ఒకటి వ్యక్తము కాని యెఱుపు పేరు.    

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

శ్రుతీనాం మూర్ధానో - దధతి తవ యౌ శేఖరతయా
మమా ప్యేతౌ మాత! - శ్శిరసి దయయా ధేహి చరణౌ|
యయోః పాద్యం పాథః - పశుపతి జటాజూట తటినీ
యయౌ ర్లాక్షాలక్ష్మీ - రరుణ హరి చూడామణి రుచిః|| - 84శ్లో 
తా.
ఓ! లోకమాతా! శ్రుతుల(వేదముల) శిరస్సులైన ఉపనిషత్తులు నీ సిగలో అలంకరించు కొన్న పుష్పములు శిరోభూషణములుగ నున్నవి. పశుపతి - శివుడు జటాజూటంలో వర్తించే గంగానది నీకు పాద్యము- పాదము కొరకైన నీళ్ళు అగు చున్నది. ఎఱ్ఱనై హరికి శిరోభూషణమైన మణిమయకిరీటం చింతామణి - కోరికలొసగు దేవమణి యొక్క కాంతులే లాక్ష - లక్క)లాక్షారస(చరణలత్తుక)కాంతి గాగలవియు నగు నీదు పాదములు, కృపతో కూడిన చిత్తంగల దానవై, నా శిరస్సు మీదకూడ ఉంచు. -  సౌందర్యలహరి

గంగాయాః పరమం నామ పాపారణ్యదవానలః
భవవ్యాధిహరీ గంగా తస్మా త్సేవ్యా ప్రయత్నతః|

త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి cat, 3.మిడత.

ఓతు ర్బిడాలో మార్జారో వృషదంశక అఖుభుక్,
ఓతువు - పిల్లి, మార్జాలము.
అవతి మూషకబాధయాః ఓతుః, పు. అవరక్షణాదౌ. - మూషక బాధవలన రక్షించునది.

పిల్లి పిల్లల్నిపెట్టి పదహారు చోట్లకి తిప్పుతుండట ! 

బిడాలము - 1.పిల్లి Cat, 2.కనుగుడ్డు.
బిడతి మూషికాన్ బిడాలః, బిడ భేదనే. - మూషికములను భేదించునది.
బిడాలకము - 1.పునుగు చట్టము, 2.కంటిమందు, 3.పిల్లి.

ఆక్వియస్ హ్యూమర్ - (Aqueous humour) కంటుగ్రుడ్డులో ముందు భాగమున గల స్వచ్ఛమైనద్రవము, జలాకార రసము.   

When I play with my cat, who knows whether I do not make her more sport than she makes me?   

గంధమృగము - 1.పునుగుపిల్లి, 2.కస్తూరీ మృగము.
కమ్మపిల్లి -
పునుగు పిల్లి.
పునుఁగు - పునుగుపిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము.

సంకువు - జివ్వాజి పిల్లి.
సంకుమదము - జివ్వాజి. సాంకవము - సంకుమదము, జివ్వాజి.

ఏడ ననర్హుఁడుండు నటకేగు ననర్హుఁడు నర్హుడున్నచోఁ
జూడఁగనొల్ల డెట్లన, నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడినపుంటిపై నిలువఁ గోరినయట్టులు నిల్వ నేర్చునే,
సూడిదవెట్టు నెన్నుదుటి చొక్కపుఁగస్తురిమీఁద, భాస్కరా.

తా. ఈగ,  చీము - చెడి తెల్లనైన నెత్తురు, పూయము. చీముతో(పూయము - 1.చీము, 2.పీనుగు.)కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడునట్లుగా కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి.బొట్టుపై నుండుటకు ఇష్టపడదు. అట్లే అపాత్రము - అనర్హుడు, అనర్హము.)నీచుడెందు గలడో అచ్చటకే నీచుడగు వాడు పోయి నిల్వఁ జూచును. అరుహుఁడు-తగినవాడు, రూ.అర్హుడు, సం.అర్హః.)న్నచో ఆ నీచునకు గిట్టదు.

ౙంగుపిల్లి - అడవి పిల్లి. 
బావురుఁబిల్లి - బావు రని కూసెడు పెద్ద గండుపిల్లి.
బావురు - ఏడ్చుట యందలి ధ్వని.

అస్తమానము అరిచేపిల్లి ఎలుకలను పట్టేదికాదు.

నాసి - పిల్లి.

పిల్లికి కలలో కనుపించేవి పాలకుండలే. పిల్లి కళ్ళుమూసుకుని పాలుతాగుతూ, తన్నెవరూ చూడటం లేదనుకుంటుందిట. పిల్లి పాలగిన్నెవంచి పాలు వలకపోయగలదు, కాని గిన్నెని తిరిగి నెలబెట్టలేదుగా.

పిల్లిమెళ్ళో గంట కట్టెదెవరాని! పిల్లిశాపానికి ఉట్టు తెగదుగా!

కానివానిచేత గాసు వీసం బిచ్చి
వెంట దిరుగువాడె వెఱ్ఱివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వ.

తా|| దుర్మార్గుని చేతికి కాసు - దుగ్గానిలో నాల్గవ భాగము, అరపైసా, విత్తము, సం.కాకణీ, కాచః. వీసము - రూకలో పదునారవభాగము.)యిచ్చి, దానికై మరల అతని వెంట దిరుగుట వెఱ్ఱి-పిచ్చి, అవివేకము, విణ.పిచ్చివాడు. పిల్లి cat మ్రింగిన కోడి - అజ్జవాలు, సం.కుక్కుటః. పిల్లి తిన్న కోడి)పిలిచిననూ పలుకదు కదా.   

మార్జాలము - మార్జారము.
ఆఖుగ్ర హణేన గృహం మార్జీతి మార్జారః, పా. మార్జాలః, మృజూ శుద్ధౌ. - మూషక గ్రహణముచేత గృహమును శుద్ధిచేయునది.
మార్జారము - పిల్లి cat, రూ.మార్జాలము.

మార్జాల కబళ న్యాయము - న్యా. పిల్లి భోజనము చేయువాని వద్ద కూర్చుండువాడు తీసికొను కబళములన్నియు తన నిమిత్తమేయని తలచెడు రీతి.

గ్రాసస్తు కబళః పుమాన్,
గ్రాసము - 1.కబళము, తిండి, 2.గ్రహణము.
గ్రస్యత ఇతి గ్రాసః, గ్రసు అదనే. - భక్షింపఁ బడునది.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
భక్షణ సమయేకే తాలుని వలత ఇతి కబళః, వలసంచలనే. - భక్షణ సమయమందు దౌడ యందు కదలునది.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.
గ్రాసశబ్దము కబళము యొక్క అర్థము గలది గనుక కబళార్థకము. రెండు పర్యాయములు. ఈ 2 కడి పేర్లు
పిండము - 1.బ్రదుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద, 3.గర్భము, 4.సమూహము.
పిండ్యతే పిండీక్రియత ఇతి పిండం, పిడి సంఘాతే. - ముద్దగాఁ జేయఁబడునది.
పిడుచ - 1.ముద్ద, 2.కబళము.
దొబ్బ - 1.మాంసఖండము, 2.ముద్ద.   

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్ 
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా.
 
తా. పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలు- 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు. త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, మార్జారము - పిల్లి, రూ.మార్జాలము. అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పుగలవాడు తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.తో, తగవు యొక్క న్యాయ న్యాయము లను విమర్శించి నిర్ణయించును, తెలివి రసజ్ఞత లేనివా డట్లుచేయలేదు.

సింజానమణిమంజీర-మండిత శ్రీపదాంబుజా|
మరాళీమందగమనా - మహాలావణ్యశేవధిః.

వృషదంశకము - మార్జాలము, పిల్లి cat, రూ.వృషదంశకము.
వృషాన్ మూషకాన్ దంసతీతి వృషదంశకః, దంశ దంశనే. - మూషకమును గొఱుకునది, పా. పృషదంశకః. 

ఉన్దురు మూషికో (అ)ప్యాఖుః -
ఉందురము - 1.ఎలుక, 2.పందికొక్కు, రూ.ఉదురువు, ఉందురువు.
ఉదయతి ముఖస్పృష్టం వస్త్విత్యుందురుః. ఉ. పు. ఉందీ క్లేదనే. - తన ముఖముచేత ముట్టఁబడిన వస్తువును ద్రవింపఁజేయునది. అకారాంత మును గలదు.
మూషికము- 1.ఎలుక, 2.పందికొక్కు.
ఎలుక - మూషికము.
ముష్ణాత్యన్నాదికం మూషికః పా, మూషకః, ముషస్తేయే. - అన్నము మొదలైనవానిని దొంగిలించునది.

దీర్ఘదేహీ తు మూషికా,
దీర్ఘో దేహో (అ)స్యా ఇతి దీర్ఘ దేహీ, సీ. - నిడుపైన శరీరము గలది.
ముష్ణాతి ధాన్యాదికం మూషికా. - ధాన్యాదులను మ్రుచ్చిలించునది. ఈ 2 చుచుందరి అనెడు అర్ధపాదము ప్రక్షిప్తమని కొందఱు, పందికొక్కు పేర్లు.

అఖువాహనుఁడు - వినాయకుడు, వ్యు.ఎలుక వాహనముగా గలవాడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ – స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.

ఆఖుభుక్కు - పిల్లి, వ్యు.ఎలుకలను తినునది.
అఖూన్ భుఙ్క్తే అఖుభుక్, జ. పు. భుజ పాలనాభ్యవహారయోః. - ఎలుకలను భక్షించునది.

ఆఖువు - ఎలుక, పందికొక్కు.
ఖనకము - 1.ఎలుక, 2.పందికొక్కు, 3.త్రోవ.
ఆ సమంతాత్ ఖనతీ త్యాబుః ఉ. పు. ఖను అవదారణే. - అంతట త్రవ్వునది. ఈ 3 ఎలుక పేర్లు.

పిల్లికి ఎలుక సాక్ష్యము. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణసంకటము.

కొక్కురౌతు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
కొక్కు - పందికొక్కు; పందికొక్కు - మూషికము.
మూషికము - 1.ఎలుక, 2.పందికొక్కు.
ఎలుక - మూషికము rat.

బోను - మృగాదులను పట్టు కృత్రిమ యంత్రము, ఏలుకలబోను.

గృహపీడకములు - (గృహ.) ఇంటిలో బాధించు కీటకములు మొ,వి. ఉదా. ఎలుకలు, బొద్దింకలు, పెంకిపురుగులు మొ,వి. (Household pests).

ఈఁతి - 1.ఉపద్రవము, 2.ఊరువిడిచిపోవుట, 3.మారి మొ. అంటువ్యాధి, 4.అతివృష్ట్యాది ఈతిబాధ (అతివృష్టి, అనావృష్టి, మిడుతల దండు, ఎలుకల దండు, చిలుకలదండు, చేరురాజులు అనునవి ఆరు ఈతిబాధలు.)  

కానకచేరఁబో దలతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినన్
దా నదినమ్మి వానికడ డాయఁగబోయిన హాని వచ్చున
చ్చోనదియెట్లనన్ గొరుకచూపుచు నొడ్డనబోను మేలుగా
బోనవి కానకాసపడిపోవుచుఁ గూలదెకొక్కు, భాస్కరా.

తా. బోనులోని యాహారమును చూచి అది ఒక బండగు - బోను, సం.బంధకః.)బోననియు, తనకక్కడ పోయినచో ఆపద కలుగు ననియు తెలిసి కొనక, కొక్కు - పందికొక్కు అందలి యెర కైనేగి యందు చిక్కుకొని మృతి నొందును. అట్లే, దుర్మార్గుల మోసమును తెలిసి కొనక వారాచరించు పను లన్నియు మంచివే నమ్మిక - నమ్మకము యని తలచి, దాయు-క్రి.సమీపించు, రూ.డాయు. వారి యొద్దఁ జేరినచో హాని-1.తక్కువగుట, 2.కీడు కలుగుట నిశ్చయము.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.   

విఘ్నరాజు - వినాయకుడు. 
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
గురువు - 1.ఉపాద్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).    

ఎలుకతోలుఁ దెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టినఁ బలుకునా విశ్వ.

తా. ఓ వేమా! యెలుకతోలు యెంతకాలము వుతికినను దాని నలుపు రంగు పోయి తెలుపు రాదు. కొయ్య - కఱ్ఱ, మ్రాను.)బొమ్మను తెచ్చి యెంత కొట్టిననూ అది మాటలాడదు. అట్లే దుర్మార్గుడు తన చెడ్దగుణములు వదలడు. 

త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి, 3.మిడత.

పతంగము - 1.మిడుత, 2.పక్షి bird, 3.బాణము, 4.పాదరసము.
పత త్యగ్నౌ పతఙ్గః పత్ ఌ గతౌ. - అగ్నియందుఁ బడునది.

పతఙ్గా పక్షి సూర్యౌ చ -
పతంగ శబ్దము పక్షికిని, సూర్యునకును Sun, చకారము వలన మిడుతకును పేరు. పతతీతి పతంగః, పత్ ఌ గతౌ. - పోవునది.

యథా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశన్తి నాశాయ సమృద్ధవేహాః |
తథైవ నాశాయ విశన్తి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః| - 29శ్లో

తా|| మిడతలు తమ నాశనమునకై ప్రదీప్తాగ్నిలో జ్వలనము - 1.మంట, 2.అగ్ని.)లో తొందరగా ప్రవేశించునట్లు, ఈ ప్రాణులు వినాశము కొరకే అతి వేగముగా నీ ముఖ గహ్వారములలో ప్రవేశించు చున్నారు. - భగవద్గీత, విశ్వరూప సందర్శనయోగము

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్ష్యా వస్యస్త ఇతి పక్షీ, న. పు. - ఱెక్కలు గలిగినది.
పులుగు - పిట్ట.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పతన్ గచ్ఛతీతి పతగః - ఎగురుచుఁ బోవునది.

దురితలతానుసార భవదుఃఖ కదంబము రామ నామ భీ
కరతర హేతిచేఁ దెగిఁనకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాదికీటకో
త్కరము విలీనమై చనదె దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
రామా! పాపము పయివడిరాఁగా దానితోఁగూడ సాఁగు దుఃఖాత్మకమైన జన్మపరంపర, కత్తిచేత హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.)చేత, తీఁగ త్రెంపఁబడునట్లు, నీ నామ నామముచేత నశించి పటాపంచలై, రగిలి మండుతున్న శిఖి - 1.అగ్ని fire, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.)అగ్నియందుబడిన శలభము - మిడుతలు మొదలైన పురుగులవలె రూపుమాసి పోవును.

త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి, 3.మిడత.

సమౌ పతఙ్గ శలభౌ -
పత త్యగ్నౌ పతఙ్గః పత్ ఌ గతౌ. - అగ్నియందుఁ బడునది.
మిడుత - శలభము; శలభము - మిడుత.
శలత్యాశు గచ్ఛ త్యగ్నిం శలభః, శల అశుగమనే. - అగ్నిని గూర్చి శీఘ్రముగాఁ బోవునది. ఈ 2 మిడత పేర్లు. దివ్యాఱుపుఁ బ్రువ్వు అని కొందఱు.  

దహనుం గప్పగఁ జాలునే శలభ సంతానంబు?
మిడుతలదండు అగ్నిని ఆవరింపలేదని గ్రహింప లేకున్నారేమి?

ఈఁతి - 1.ఉపద్రవము, 2.ఊరువిడిచిపోవుట, 3.మారి మొ. అంటువ్యాధి, 4.అతివృష్ట్యాది ఈతిబాధ (అతివృష్టి, అనావృష్టి, మిడుతల దండు, ఎలుకల దండు, చిలుకలదండు, చేరురాజులు అనునవి ఆరు ఈతిబాధలు.)

ఆకుమిడుత - పచ్చని పెద్దమిడుత. 

మిడుత కుటుంబము - (వ్యవ., కీట.) వరి మిడతలు, జొన్న మిడతలు, జట్టి మిడుతలు మొ. కీటకములు ఈకుటుంబమునకు చెందినవి.  

గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణ నామంబు ప్ర
త్యహముం బేర్కొను నుత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే?
దహనుం గప్పగఁ జాలునే శలభ సంతానంబు? నీ సేవఁ జే
సి హతక్లేశులు గారుగాక మునుజుల్ శ్రీకాళహస్తీశ్వరా!

తా|| ఈశ్వరా! విషమస్థానములోనుండి గ్రహములు కలిగించు బాధలుగాని, అపశకునము గాని, నీ నామస్మరణము చేయు పుణ్యపురుషులను కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానములో బడి నిన్ను సేవింపక దుఃఖములనుభవించు చున్నారుగాని, మిడుతల దండు దహనుఁడు - అగ్నిని ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి? ఇదెంత చిత్రమైన విషయము?     

పతంగము - 1.మిడుత, 2.పక్షి, 3.బాణము, 4.పాదరసము.

పారదము - (రసా.) సాధారణముగ ద్రవస్థితిలో నుండి వెండివలె తెల్లగా ప్రకాశించు ధాతువు (Mercury). ఇది ఆవర్త కర్మ పట్టికలో రెండవ 2వ వర్గములోనిది).
పారదీయము - (రసా.) పారద(పాదరస) సంబంధమైనది (Mercurial).
పారభానకము - (భౌతి.) అదృష్టముగ పార దర్శకమైనది (Translucent).

అథ చపలో రస స్సూతశ్చ పారదే,
అస్థిరము - 1.నిలుకడలేనిది, అశాశ్వతము, 2.నిశ్చితము కానిది.
అస్థిరత్వాచ్చపలః - ఒక దిక్కున నిలువనిది.
రసము - 1.పాదరసము, 2.నీరు, 3.పండ్లరసము, (శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము, నవరసములు).
రస్యతే ఔషధత్వేనేతి రసః రస ఆస్వాదనే. - ఔషధమౌటచేత నాస్వాదింపఁబడునది.
రస్యతే ఆస్వాద్యత ఇతి రస, పా, శశః, రస ఆస్వాదనే. - ఆస్వాదింపఁబడునది. 
సూతే హేమాదిక మితి సూతః షూఙ్ ప్రాణిప్రసవే. - బంగారు మొదలయిన దానిఁ గలిగించునది.
పాదరసము - పారదము, రసము, సం.పాదరసః. 
రోగస్య పారం దదాతీతి పారదః డు రాఙ్ దానే. - రోగముయొక్క తుద నిచ్చునది.
పా, పారతః, "రసేంద్ర సారతః ప్రోక్తః పారదశ్చని గద్యతే" అని తారపాలుఁడు. కొందఱు పారద పారతములకు భేదమును జెప్పుదురు. "పారతస్తు మనాక్పాండు స్సూతస్తురహితో మలాత్, పారదస్తు మనాక్శీత స్సర్వే తుల్యగుణాస్కృతాః" అని శబ్దార్ణవము. ఈ 4 పాదరసము పేర్లు.

రసమిశ్రమము - (రసా.) పాదరసముతో కలిసిన మిశ్రమము, రసమిశ్ర లోహము (Amalagam). 

రేతము - 1.వీర్యము, శుక్లము, 2.పాదరసము, రూ.రేతస్సు.
రియతి స్రవతి రేతః, స. న. రి గతౌ. - స్రవించునది.

కజ్జలి - (రసా.) పాదరసము, గంధకము కలిపి నూరిన లభ్యమగుయోగికము (Black sulphide or mercury).

వఞ్జుళో అ శోకే,
వంజులము - అశోక వృక్షము.
వన్యతే అర్థ్యత ఇతి వంజుళః, వను యాచనే - ప్రార్థింపబడునది. 
వన్యతే యాచ్యతే వఞ్జుళః. వను యాచనే. - అడుగఁబడునది. 
అశోకము - 1.పొగడచెట్టు, 2.కంకేళివృక్షము, 3.పాదరసము, విణ.దుఃఖము లేనిది.
అశ్నుతే అశోకః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది,
శోకనా శకత్వాద్వా అశోకః - శోకమును చెఱుచునది. ఈ రెండు అశోకచెట్టు పేర్లు.
కంగేళి - అశోకము, సం.అశోకము.
పొగడ - వకుళ వృక్షము, సం.వకుళః.    

వంజుల - ఎక్కువగా పాలిచ్చు ఆవు.

వేల్పుబోనము - అమృతము.
నమ్రియంతే అనేనేత్యమృతం, మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేతఁజెడరు. 
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము. 
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.

ప్రమద - యౌవనాది మదముగలస్త్రీ.
ప్రమదావనము - అంతఃపురస్త్రీలు విహరించు ఉద్యానవనము.
ప్రమదావనం వనం ప్రమదావనం - స్త్రీలయొక్క వనము, పా, ప్రమదావనం, ప్రమదవనోపకంఠ నలినీషు లతాభవనేషు భూయః' 'చార కర్మణి నిష్ణాతః ప్రవిష్టః ప్రమదావనా మిత్యుభయత్రో దాహరణం. ఈ 1 రాజుయొక్క అంతఃపురస్త్రీలు మాత్రము విహరించుతోఁట పేరు.
ఆటతోట - విహారార్థ మేర్పరచిన తోట, ఉద్యానవనము, ప్రమదవనము. 

నయనము - 1.కన్ను, 2.పొందించుట.
నీయతే అనేన నయనం.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.

ద్వంద్వము - 1.జత, 2.స్త్రీపురుషుల జత, 3.ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధము, 3.రహస్యము, 4.శీతోష్ణాదులు.
ద్వౌ సహవర్తే ద్వంద్వం - రెండును గలసియుండునది.
దొందు-దొందుదొందే! (జత.) సం.ద్వంద్వమ్.
ౙత - 1.జంట, 2.సామాన్యము, (గణి.)రెండు వస్తువుల గుంపు(Pair).

నమోవాకం బ్రూమో - నయనరమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ - స్పుటరుచిరసా లక్తక వతే! 
అసూయత్యత్యంతం - యదభిహననాయ స్పృహయతే 
పశూనా మీశానం - ప్రమదవనకంకేళితరవే|- 85శ్లో
       
తా. తల్లీ ! నీ పాద తాడనము నభిలషించుచున్న ప్రమదావనము - అంతఃపుర స్త్రీలు విహరించు ఉద్యానవనము మందలి కంగేళి - అశోకము, సం.అశోకము.)వృక్షమునుజూచి, పశుపతియగు ఈశానము - 1.కాంతి Light, 2.శివుని 5 ముఖము లలో ఒకటి, 3.పదకొండు అను సంఖ్య, 4.ఆర్ద్రానక్షత్రము.)అసూయ చెందుతున్నాడో, అత్యంతము-మిక్కిలి చూడనింపగు పారాణిగల నయన రమణీయము-1.ఒప్పినది, 2.మనోహర మైనది)తడి లత్తుకతో ప్రకాశించుచున్న, నీ పాద ద్వయమునకు నమస్కరించుచున్నాను.  - సౌందర్యలహరి 

4. సురనిమ్నగ - దేవగంగ.
సురాణాం నిమ్నగా సురనిమ్నగా - సురలయొక్క నది.
సురదీర్ఘిక - గంగ.

గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.

ౘలిగొండ - హిమాద్రి, చలిచట్టు, చలిమల.
హేమమయో (అ)ద్రిర్హేమాద్రిః, ఇ-పు. - బంగారు కొండ.

తనుపార్శ్వము - (జం.) బాహ్యస్తరము, ప్రాచీరస్తరము కలిసి ఏర్పడిన పొర (Somato-pleure), అన్తఃపార్శ్వము, అంత స్తరము, అన్త స్త్యపొర కలిసి ఏర్పడిన పొర, (Splanchno-pleure).
పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), సం.విణ. (జీవ.) క్రవ్కలనుండి బయలుదేరినది, (Latral).

కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కాష్ఠా - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది.   

అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా -
అష్టాదశ నిమేషాః కాష్ఠేత్యుచ్యతే - పదునెనిమిది 18 ఱెప్పపాట్ల కాలము కాష్ఠ యనంబడును. 
కాశతే కాష్ఠా, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. 18(Seconds) నిమేషములకాలము ఒకటి కాష్ఠ.

ప్రాణేశ్వరీ ప్రాణరూపా ప్రధానపురుషేశ్వరీ,
సర్వశక్తిః కలా కాష్ఠా జ్యోత్న్యేందుమ హిమాస్పదా|

హిమవంతము - చలిమల, హిమాలయము.
హిమమస్యాస్తీతి హిమాన్ త. పు. - మంచు గలిగినది. ఇది కింపురుష వర్షమునకు దక్షిణ మందు మేరయై యుండునది.   
హిమశిఖరము - (భూగో.) ధ్రువముల వద్ద ఎల్లప్పుడు మంచు కరడు గట్టి యున్న ప్రదేశము.
హినోతి వర్ధత ఇతి హిమః, హిగతౌ వృద్ధౌ చ - వృద్ధిఁబొందునది.

హిమపవనము - (భూగో.) తీవ్రమైనమంచు తుఫాను.  

హిమరేఖ - (భూగో.) ఎన్నటికిని మంచుకరగని పర్వతపు మట్టము.

అథ హిమానీ హిమసంహతిః,
హిమాని - హిమసమూహము. 
అథ హిమానీ హిమసంహతిః,
మహ ద్ధిమం హిమానీ, ఈ-సీ. - అధికమైన మంచు.
హిమస్య సంహతిః, హిమసంహతిః, ఇ - సీ మంచు సమూహము. ఈ 2 దట్టమైన మంచు.

హిమాంబువు - పన్నీరు.
పన్నీరు - చల్లనినీరు, సం.పన్నీరమ్.
పూనీరు - పన్నీరు, సం.పుష్పనీరమ్. 
గొౙ్జంగినీరు - పన్నీరు, రూ.గొజ్జేఁగ నీరు, గొజ్జఁగినీరు, గొజ్జిగనీరు. 

హిమానీనదము - కదలుచున్న మంచు నది. (ఈ నదులు కొండలోయలో నేర్పడును. ఇవి చాల పొడవుగా నుండి సంవత్సరమునకు కొద్ది అడుగులు మాత్రమే ఎత్తు ప్రదేశమునుండి దిగువగా పారును. ఉష్ణోగ్రత హెచ్చు అగుకొలది ప్రవాహ వేగము హెచ్చును.)

హైమనము - మార్గశీర్షము, విణ.మంచుచే కలిగినది, 2.బంగారుచే కలిగినది.
హైమము - వేకువను మంచుచే కలిగిన జలము, విణ.బంగారుచే కలిగినది.

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
హిమవద్గిరౌ ప్రచురా హైమవతీ – హిమవత్పర్వత మందుఁ బ్రచురమైనది. 
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం| 

భవ్యము - 1.శుభమైనది, 2.యోగ్యమైనది, వి.ఎముక.

ౘదురుఁడు - 1.చతురుడు, 2.సమర్థుడు, సం.చతురః.
చతతే కాంక్షతే ప్రయోజనమితి చతురః, చతే చదే యాచనే చ. - ప్రయోజనమును గాంక్షించువాఁడు.
చతురుఁడు - నేర్పరి తనము.
ౘదుర 1.చతుర, 2.సమర్థురాలు, రూ.చదురా, సం.చతురా.
ౘదురాలు - చతుర, సమర్థురాలు.
ౘదురు - 1.చతురము, నేర్పు, సం.చతురమ్, 1.ఆటకచ్చేరి, 3.సభ, సం.సదస్. 
చతురిమ - నేర్పరి.

నిద్దుర - నిదుర, సం.నిద్రా.
నిద్ర - కూరుకు; కూరుకు - నిద్దుర, క్రి.నిద్రించు.  
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవు చున్నటు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).

మిహి - 1.శ్రేష్ఠము, 2.నున్ననిది, 3.క్రొత్తది.
మిహిక - మంచు.
మేహతి భువనమితి మిహీకా, మిహ సేచనే. - భూమిని దడుపునది.
పా, మిహికా మహ్యతే రాగిభిరతి మహికా, మహ పూజాయాం - కాముకులచేత పూజింపఁబడునది.
హిమిక - మంచు.
పా, హిమికా హిమోతి వర్థతే హిమికా, హి గతౌ వృద్ధౌ చ - వృద్ధిఁబొందునది.

సిరానెవార - (భూగో.) మంచుకొండలు, ఉత్తర అమెరికాలోని మధ్య పర్వత శ్రేణులు.  

హిమశిలలు - (భూగో.) సముద్రము పై తేలియాడు ఆర్కిటిక్ ప్రాంతపు మంచు గడ్డలు.     

ౘలిపిడుగు - చెడగరవు, మంచుగడ్డ.

హిమప్రపాతము - (భూగో.) తీవ్రవేగముచే పెద్దమంచు శిలలు కరిగి కొట్టుకొని పోవుట (Avalanche).

వైచిత్ర్యము - విచిత్రత, వింత.
విచిత్రము - ఆశ్చర్యము, సం.విణ.చిత్రవర్ణము కలది.
వింత - అబ్బురము, అశ్చర్యము, విణ.1.చిత్రము, 2.అరుదు, 3.అన్యము, 4.క్రొత్త.
చిత్రము - 1.ఆశ్చర్యము, 2.పటమున వ్రాసిన రూపము, 3.చతుర్విధ కవిత్వములలో నొకటి, 4.విణ.నానా వర్ణములు గలది.
చీయన్తే వర్ణ అత్రేతి చిత్రం, చిఞ్ చయనే - దీనియం దన్నివర్ణములుఁ గూర్చఁబడును.
చిత్రయతీతి చిత్రం చిత్రచిత్రకరణే. - ఆశ్వ్చర్యమును జేయునది.
కత్తరి - నానావర్ణములు గలది. 

హిమానీహన్తవ్యం - హిమగిరినివాసైకచతురౌ  
నిశాయాం నిద్రాణాం - నిశి చరమభాగే చ విశదౌ |
పరం లక్ష్మీపాత్రం - శ్రియ మతిసృజంతౌ సమయినాం, 
సరోజం త్వత్పాదౌ - జనని! జయత శ్చిత్ర మిహ కిమ్ || - 87శ్లో

తా. ఓ జననీ ! హిమాలయము నందు నివసించుటకు సమర్థమైన వియు, వేకువనుగూడ విశదము - తెల్లనిది, స్పష్టమైనది.)లైనవియు, భక్తులకు సంపదలను(లక్ష్మిని)కలిగించేవి అయిన నీ పాదములు మంచుచే గొట్టబడినది, నిశ - 1.రేయి, 2.పసుపు.)యందు ముడుచుకొని పోవునది లక్ష్మీదేవికి ఆలవాల మైన సరోజము - 1.తామర, 2.తామరకొలను.)జయించు చున్నది ననుటలో ఆశ్చర్యం ఏమున్నది ? ఏమీ లేదు. - సౌందర్యలహరి   

హిమాద్రిపార్శ్వే ద్రి తటే రమన్తం - సంపూజ్య మానం సతతం మునీన్ద్రైః |
సురాసురై ర్యక్షమహోరగాద్యైః - కేదారసంజ్ఞం శివ మీశ మీడే. - 11 

గంగలు - కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి - వీనినే పంచ గంగ లందురు.

5. భాగీరథి - గంగ (వ్యు. భగీరథునిచే భూమికి తేబడినది.)
భగీరథేన రాజ్ఞా భూలోకమవతారితేతి భాగిరథీ. ఈ. సీ. - భగీరథుఁడను రాజుచేత భూలోకమునకుఁ దేఁబడినది.

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

గంతవ్యా మదనాంతకస్య నగరీ దేవస్య వారణాసీ
స్నాతవ్యం జనఘోరపాపమధనే భాగీరథీ పాథసి
కర్త వ్యం గృహమేదినాం పతకుటీవాటిషు బిక్షాటనం
మర్తవ్యం మణికర్ణి కాతబభువి ప్రా ప్తవ్య మాద్యం మహః|

భా|| మహేశ్వరుని రాజధానియైన కాశీనగరమునకే పోవలయును, సర్వ జనుల మహాపాతకముల నెల్ల నూఁచముట్టుగ హరించు భాగీరథీ పవిత్రోదకముల యందే మునుంగవలయును. కాశీక్షేత్రమునందు నివసించు గృహమేధి - గృహస్థు,, వ్యు.భార్యతో చేరియుండువాడు.) ముంగిశుల యందే బిక్షాటనము నలుపవలయును. మహా మహిమోపేతమగు మణికర్ణికా తటమునందే మేను దొరంగవలయును. జగద్రక్షాదక్షమును బ్రసన్నతా పూర్తిచే భక్తజనుల ననుసరించియున్న భవ తాపమును దావఁజాలునదియును నైన యాది తేజమునే కన్నుల కఱవుదీఱఁ గాంచ వలయును. (ఇయ్యవియే జన్మమునకు ఫలము లని భావము.)       

Bhagirathi river where blood and beauty are represented in equal measure.

భాగీరథీ సుఖదాయిని మాతః తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ||

ఓ భాగీరథీ ! నీవు సుఖప్రదాయినివి. వేదశాస్త్రాలలో నీ జలమహత్యము కీర్తించబడినది. దయామయి! నీ మహిమలు తెలియని అజ్ఞానినైన నన్ను కృపతో రక్షించు.

గంగానదీ ప్రాశస్త్యం, హిమాలయ పర్వతాలలో పుట్టి 13,800 అడుగులు ఎత్తున గల గంగోత్రికి ఉత్తరాన జన్మస్థలం. గంగోత్రికి మరోపేరు భగీరథి. భగీరథుడు గంగను భూమికి తీసుకు రావడానికి తపస్సు చేసిన ప్రాంతం, గంగోత్రికి దక్షిణంగా సుమారు 2 మైళ్ళ దూరాన ఉన్న ప్రాంతాన్ని బిందుసారమని అంటారు.  

కపాలభృత్తు - శివుడు.
కపాలం బిభర్తీతి కపాలభృత్. త-పు. - కపాలమును భరించినవాడు. భృఞ్ భరణే.  

స్యా త్కర్పరః కపాలో (అ)స్త్రీ -
కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium). 
భారధారణాయ కల్పతే సమర్ధో భవతి కర్పరః, కృపూ సామర్థే. - భారమును ధరించుట కొఱకు సమర్థమైనది.
కపాలము - 1.తలపుఱ్ఱె, 2.సమూహిము, 3.కుండపెంకు, (జం.) 1.పుఱ్ఱె, 2.పృష్ఠ వంశీక జంతువుల తలలోనున్న ఎముకల సముదాయము.
కం శిరః పాలయతి కపాలః. అప్న. - శిరస్సును రక్షించునది. ఈ 2 తలయెముక తునక పేర్లు. కపాల మొచనము నందు శుద్ధి|

పునక - తలపుఱ్ఱె, తలయెముక.
పుఱ్ఱె - (గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium).

బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (cranial nerves).

ఆకృషినాడి - (జం.) కపాలము నుండి బయలుదేరి కనుగ్రుడ్డు యొక్క కండరములకు బో వు నా డి (Pathetic nerve).

లలామాంకపాలం లసద్గానలోలాం
స్వభక్తైకపాలం యశఃశ్రీకపోలామ్|
కరే త్వక్షమాలాం కనద్రత్నలోలాం
భజే శారదాంబా మజస్రాం మదంబామ్. - 3 

సహస్రపాదుఁడు-1.విష్ణువు, 2.సూర్యుడు Sun.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు. 
విష్ణుః, ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
పాదు - 1.కుదురు, ఆలవాలము, 2.నిలకడ, 3.ఆశ్రయము, సం.పాదపదమ్.

6. త్రిపధగ - 1.గంగ, 2.ముత్త్రోవ ద్రిన్మురి.స్వర్ణమర్త్యపాతాళ మార్గేషు త్రిషు గచ్ఛతీతి త్రిపథగా. గ ఌ గతౌ. - సర్గ, మర్త్య, పాతాళ మార్గములయందు మూఁటియందును బోవునది.
ముయ్యేఱు - త్రిపథగ, గంగ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).

త్రివేణి - గంగ, వ్యు.గంగ, యమున, సరస్వతి అను మూడు నదులు గలది.    

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు. 

అౙ్జ - 1.పాదము, 2.సమయము, అవ్య.బళీ.
హజ్జ - పాదము, రూ.అజ్జ. 
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు. 

పాదము - (గణి.) త్రిభుజ శీర్షముల నుండి భుజములకు గీయబడిన లంబముల పాదములకు సంబంధించినది (Pedal). 

పాదః పదఙ్ఘ్రిశ్చరణో (అ)స్త్రియామ్,
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యము నందలి ఒక చరణము, 4.1/4 వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములలో అక్షద్వయముచే వేరు చేయబడిన నాలుగు భాగములలో నొకటి (Quardrant).
పద్యతే అనేనేతి పాదః పచ్చ, ద. పు. పద గతౌ. - దీనిచేతఁ బోదురు.

పాదా రశ్మ్యఙ్ఘ్రి తుర్యాంశాః -
పాదశబ్దము కిరణమునకును, కాలికి, నాలవ పాలికిని పేరు. పద్యంతే అనేనేతి పాదః పద గతౌ. - దీనిచేత పొందుదురు. "పాదస్స్యాద్బుధ్న పూజ్యయో" రితిశేషః.

పాదములాస్థి - (జం.) మడమ ఎముకల కూటము (Tarsus).
పాదశలాకులు - (జం.) పాదముల కుండు ఎముకలు (Meta-tarsals).

పదము - 1.కాలు, 2.పద్యమందలి నాలవ చరణము, 3.చిహ్నము, 4.స్థానము, 5.శబ్దము, సం.వి. (గణి.) 1.ఒక సమాసములోగాని సమీకరణములోగాని ఉండు నొక రాశి (Term) ax2+bx+c= 0 అందుమూడు పదము లున్నవి, 2.ఒక లెక్కచేయుటలో కనబరచిన క్రమము (Step).

పదం వ్యవసిత త్రాణ స్థాన లక్షాఙ్ఘ్రిన స్తుషు,
పదశబ్దము ఉద్యోగమునకును, రక్షించుటకును, స్థానమునకును, చిహ్నమునకును అడుగుటకును, వస్తువునకును పేరు. పద్యతే అనే నేతి పదం, పద్ ఌ గతౌ. - దీనిచేత పొందుదురు.

దేవీ కృతాభిషేకాయామ్ -
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దివ్యతీతి దేవి, ఈ. సీ. దివుక్రీ డాదౌ. - ప్రకాశించునది.
దీవ్యతీతి దేవీ, దివు క్రీడాయాం. - క్రీడించునది. ఈ ఒకటి పట్టభిషిక్తురాలైన రాజభార్య (రాణి) పేరు.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

నీతము - నియతము, నియమము, సం.నియతమ్, సం.విణ.1.తేబడినది, 2.పొందబడినది.
నియతము - 1.నియమముగలది, 2.నిత్యమైనది, (గణి.) నియత పరిమాణము గలది, (Definite). 
నియతి - 1.నియమము, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది. 

కమఠము - తాబేలు, భిక్షాపాత్రము.
కే ఉదకే మఠతీతి కమఠః, మఠ నివాసే. - జలమునందు వసించునది.
యజ్ఞార్థం కామ్యత ఇతివా కమఠః, కముకాంతౌ - యజ్ఞార్థమై కాంక్షించునది.
కమఠీ డులిః -
కమఠీ - ఆడుతాబేలు.
కమఠస్య స్త్రీ కమఠీ - కమఠముయొక్క స్త్రీ కమఠి. 
డులి - ఆడుతాబేలు, రూ.డులి. 
ఢులతీతి ఢులిః పా. ఇ. సీ. ఢుల ఉతేక్ష పే. - జలమును జల్లునది. ఈ రెండు 2 ఆఁడుతాఁబేటి పేర్లు. 
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.
కర్పరము - 1.వెడల్పు ముఖముగల పాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.)కపాలము, పుఱ్ఱె (Cranium).
భారధారణాయ కల్పతే సమర్థో భవతి కర్పరః, కృపూ సామర్థే; - భారమును ధరించుట కొఱకు సమర్థమైనది.

మీఁగాలు - పాదోపరిభాగము, పాదము యొక్క పైభాగము.
ముంగాలు - ముందుకాలు.

పాదాగ్రం ప్రపదమ్ -
పాదస్య అగ్రం పాదాగ్రం - పాదముకొన. 1 పదస్య ప్రారంభః ప్రపదం పదముయొక్క ప్రారంభము. ఈ 2 మీఁగాళ్ళు.  

పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిగ్రహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.
పాణిః గృహీతో (అ)స్యా ఇతి పాణిగృహీతీ, సీ. - దీనిహస్తము గ్రహింపఁబడును.
పాణిశలాకులు - (జం.) అరచేతికుండు ఎముకలు (Meta-carpals). 

ఉపయమము - పెండ్లి, రూ.ఉపయామము.
వహ ప్రాపణే, ఉపయమనం ఉపయామః, యమ ఉపరమే.
పెండిలి - వివాహము, రూ.పెండ్లి.
పెండ్లి - వివాహము; వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము,పైశాచము అని వివాహములు అష్ట విధములు).

కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణము నందు షట్కాండములు గలవు), 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.
వేళ - సమయము, కాలము.
సమ్యగయతే సమయః, అయగతౌ - లెస్సగా నెఱుఁగఁబడునది.  

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

న్యస్త నిసృష్టే -
విన్యస్తము - ఉంచబడినది; న్యస్తము - ఉంచబడినది.
న్యస్యతే స్మ న్యస్తం; నిసృజ్యతే స్మ నిసృష్టం, అసు క్షేపణే; సృజ విసర్గే. - పెట్టఁబడినది గనుక న్యస్తము, నిసృష్టమును. ఈ 2 ఉంచఁబడినదాని పేర్లు.   

దృశత్తు - రాయి, సన్నెకల్లు.
సృణాతీతి దృషత్, ద, సీ. దౄ హింసాయాం. - హింసించునది, పా, దృశత్.
పేషణి - సన్నెకల్లు.
సనె - నూరెడు రాయి, రూ.సనెకలు, సన్నె, సన్నెకలు.
రాయి - శిల.    
శిలాపుత్రము - పొత్రపురాయి, రుబ్బురాయి.    

పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి! విపదాం
కథం నీతం సద్భిః -కఠినకమఠీకర్పరతులాం,
కథం వా పాణిభ్యా - ముపయమనకాలే పుర భిదా
యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా| - 88శ్లో

తా. ఓ దేవీ! కీర్తులకు స్థానమైనది, ఆపదలకు అస్థానమైన నీ మీగాలిని సజ్జనులు తాబేటి చిప్పతో పోల్చుచున్నారు. అదెట్లగును, మఱియు నీ ముంగాలు ఉపయమము - పెండ్లి, రూ.ఉపయామము.)సమయమున శివుడు చేతితో పట్టుకొని రాతి (సన్నికల్లు) పై యెట్లుంచి నాడో (సప్తపది యందు భర్త భార్య యెడమ కాలిని పట్టుకొని సన్నికల్లుపై త్రొక్కించుట ఆచారము). - సౌందర్యలహరి

సాప్తపదీనము - చెలిమి, వ్యు.ఏడు మాటలలో లేక ఏడు అడుగులలో కలుగునది.
సప్తభిః పదైః ప్రాప్యతే సాప్తదీనం, ఏడడుగు (ఏడుమాట) లచేతః బొందఁబడునది.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4..స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).  

అంగుళులు - (జం.) 1.చేతివేళ్ళు, 2.కాలివేళ్ళు (Digits).
అంగుళ్యస్థులు - (జం.) వేళ్ళ ఎముకలు, అంగుళీ శలాకులు (Phalanges).
అంగుళీశలాకులు - (జం.) చేతి వ్రేళ్ళకు కాలి వ్రేళ్ళకు ఉండు ఎముకలు (Phalanges).

అంఘ్రి - 1.కాలు, 2.వేరు, 3.పద్య పాదము.
అఙ్గతి గచ్ఛత్యనేన అంఘ్రిః, పు, అఘి గతౌ. - దీనిచేఁ బోవుదురు.
వేరు - చెట్టుయొక్క మూలము.
అంఘ్రిపము - చెట్టు, పాదపము.
పాదపము - చెట్టు. 
పాదైర్మూలైః జలం పిబతీతి పాదపః, పా పానే. - పాదములనఁగా వేళ్ళు; వానిచే జలమును బానము చేయునది.

చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
వృక్షము - చెట్టు, సం. (వృక్షః) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క, (Tree).
వృశ్చ్యతే ఛిద్యత ఇతి వృక్షః, ఓవ్రశ్చూ చ్ఛేదనే. - ఛేదింపఁబడునది.

వడలుతెగులు - (వ్యవ.) మొక్కవేళ్ళకు పట్టు బూజు తెగులు (ఇది పట్టుటచే మొక్క వాడిపోవును) (Wilt disease).
వడలు - స్రుక్కు, వాడు.
వాడు - వాడుట, వాడిపోవుట, క్రి.ఉపయోగపరచు, మ్లానమవు.    

కొరకు పురుగులు - (వ్యవ.) మొక్కల ఆకులు, చిగుళ్ళు, పూవులు, మొగ్గలు మొ, ని యొక్క లేతభాగములను కొరికి తిను పురుగు జాతులు (Biting insects).

పీల్పుపురుగులు - (వ్యవ.) చెట్టుచేమల వివిధ భాగముల నుండి రసమును పీల్చుకొను పురుగు జాతులు, ఉదా. నల్లి కుటుంబమునందలి బిళ్ళపురుగులు, పిండి పురుగులు, మొక్కచేను, కొన్ని పొలుసు పురుగులు మొదలగునవి (Sucking insects).

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
చరత్యనేన చరణః, ఆ. ప్న. చర గతిభక్షణయోః. - దీనిచేత సంచరింతురు.

లాఁతి - 1.ఇతరము, 2.వేరు.
ఇతరము - 1.అన్యము, 2.నీచము.

తలనట్టు - 1.వేరుపురుగు కొరుకుటచే మొవ్వు లెండుట, 2.చెట్లు, పైరులకు పట్టు తెగులు.

చెఱపరి - నాశకుడు; వేరువిత్తు - నాశకుడు.
చెఱుచు - క్రి.చెరచు.
చెఱుపు - క్రి.చెరచు, వి.కీడు.   
చెఱచు - క్రి.చెడచేయు, 2.పోగొట్టు, రూ.చెరుచు.

బేరజము - కుత్సితపు నడక, విణ.1.కుత్సితుడు, 2.కుత్సితురాలు. 

కాపురుషుఁడు - కుత్సిత పురుషుడు, దుష్ట ప్రవర్తన గల పురుషుడు.
కుజనుఁడు - కుత్సిత పురుషుడు.
అడిగొట్టు - కుత్సితుడు, కుజనుడు.
ఏతరి - దుర్ణయపరుడు, కుజనుడు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4..స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).

గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
గుణ్యతే అభ్యస్యత ఇతి గుణః. గుణ అభ్యాసే. - అభ్యసింపఁబడునది.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.   
ప్రకృతేర్గుణాః సత్త్వరజస్తమాంసీత్యుచ్యంతే - ప్రకృతియొక్క గుణములు సత్త్వరజస్తమంబు లనంబడును.

వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడ పురుగు జేరి చెట్టు జెఱచు
కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా విశ్వ.

తా. ఓ వేమా! వేరుపురుగు - వేరునుపట్టి చెట్టును నాశనము చేయునట్టి పురుగు.)చేరి చెట్టును పాడుచేయును. చీడ-పైరులను చెరిపెడి పురుగు)చేరి చెట్టు మొవు - మొవ్వు, లేత ఆకు.)ఆకులను పాడుచేయును. ఆ రీతిగనే కాపురుషుఁడు - కుత్సిత పురుషుడు, దుష్ట ప్రవర్తన గల పురుషుడు.)చేరి గుణవంతుని పాడుచేయును.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

7. త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది. త్రీణిస్రోతాంసి యస్యాస్సా త్రిస్రోతాః. స. సీ. - మూఁడు ప్రవాహములు గలది.

స్రోతస్విని - నది, వ్యు.ప్రవాహము కలది.
స్రోతః అస్యా అస్తీతి స్రోతస్వినీ - తనంతటఁ బ్రవహించునది.

స్రోతస్సు - 1.ప్రవాహము, 2.ఏరు, 2.నీరువచ్చు తూము. 

స్రోత ఇన్ద్రియ నిమ్నగారయే,
స్రోతశ్శబ్దము చెవులు మొదలయిన ఇంద్రియ ద్వారములకును, నదీ వేగమునకును పేరు. స్రువతీతి స్రోతః, స్రు ప్రస్రవణే. స్రవించునది గనుక స్రోతస్సు, టీ. స. - ఇంద్రియ మింద్రియ స్థానగతం ద్వారం. 'స్త్రోతోభిస్త్రిదశజా మదం క్షరంత ' ఇతి భారవిః, రయశబ్దేనాత్ర ప్రవాహః, యథా - తీవ్రస్రోతాః.

నిమ్నగ - ఏరు, వ్యు.పల్లమునకు పారునది.
నిమ్నం గచ్ఛతీతి నిమ్నగా, గమ్ గతౌ. - పల్లమునకు గూర్చి పోవునది. 

సరణి - 1.త్రోవ, 2.వరుస, 3.విధము.
సరంత్యనేనసృతి, ఈ-సీ. సరణిశ్చ, ఈ. సీ. సృగతౌ. - దీనిచేత సంచరింతురు.

స్రోతో (అ)మ్బుసరణం స్వతః,
స్వతః అంబుసరణం స్రోత ఇత్యుచ్యతే - తనంతట పాఱుచున్న ప్రవాహము ప్రోతస్సనంబడును.
స్వతః సరతీతి స్రోతః, స. న. సృగతౌ - తనంతటఁ బోవునది. ఈ ఒకటి తనంతటపాఱునదాని పేరు.  
 
సరడు - 1.సరండము, స్త్రీల మెడకు ధరించు బంగారు అల్లిక తీగ, 2.నూలు దారము, సం.సరండః.
సరణశ్రేణి - (గణి.) ఒకదానిపైన ఒకటి జారుటకు వీలుగా నమర్చిన రెండు లఘుఘటక చిహ్నిత మాపక శ్రేణులుగల కొలుచుయాంత్రిక పరికరము,(Sliderule).

అమ్మా ! నినుఁ జూచిన నరుఁ,
బొమ్మాయని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్
లెమ్మా నీ రూపముతో,
రమ్మా నా కెదుర గంగ ! రమ్యతరంగా
భా||
అమ్మా ! గంగమ్మా ! రమణీయ తరంగాలు కలిగినదానా ! ఉన్నావమ్మా ! నిన్ను దర్శించిన వారిని 'పో' అని అంటూ మోక్షానికి పంపిస్తావని విన్నాను. కదలి లేచి రావమ్మా ! నీ రూపంలో కనికరించి నాకు ఎదుట నిలిచి దర్శన మీయవమ్మా ! గంగాసహోదరీ గంగాధరో|

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
గంగాయాః ధరః గంగాధరః - గంగను ధరించినవాఁడు.
కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్య కలవాడు.

కేదారము - శివక్షేత్రము. కేదారపీఠము నందు  సన్మార్గదాయిని|

కేదారనాథ్ - కేదారేశ్వరాలయం (శైవక్షేత్రం) ఉత్తరప్రదేశ్(UP). హిమాలయాలలో వెలసిన  కేదారినాథ్ పవిత్ర యాత్రాస్థలం. భారతదేశంలోని శివాలయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. కేదారనాథ్ గంగోత్రి నుంచి బదరీనాథ్ వెళ్ళే దారిలో ఉంది. ప్రక్కనే మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఇక్కడే సిద్ధి పొందారని కూడా అంటారు.          

భూదరతా ముదవహ ద్యదపేక్షయా శ్రీ
భూదార ఏవ కి మత స్సుమతే! లభస్వ
కేదార మాకలిత ముక్తి మహౌహ్సధీనాం
పాదారవింద భజనం పరమేశ్వరస్య ||
తా.
ఓ సుమతీ! శ్రీదేవీ, భూదేవీ పత్నులుగా కల శ్రీహరియే వరహత్వాన్ని ఏ వాంఛతో పొందాడో కదా! సదాశివ సేవార్ధమే హరి వరాహత్వాన్ని పొందాడు. అభిలష ణీయమైన ముక్తి రూప మహత్తర ఓషదులకు కేదారమైన (పంటభూమి) సదాశివ పాదకమలాలను చేరుము. - శివానందలహరి

3. కేదారము - 1.వరిమడి, 2.కొండ, 3.కేదారఘట్టము (కాశీలో నొక పుణ్య స్థలము), 4.పాదు, 5.శివలింగభేదము.
కేజలే దార్యత ఇతి కేదారః, దౄ విదారణే. - నీల్లుగట్టి దున్నఁబడునది. హిమాలయే తు కేదారం|
క్షేత్రము - 1.వరిమడి, 2.భూమి Earth, 3.శరీరము, 4.భార్య, (భౌతి.) అయస్కాంతము చుట్టు అయస్కాంతశక్తి ప్రసరించు ప్రదేశము (Field), (గణి.) కొన్ని రేఖలు మధ్యనున్న ప్రదేశము (Figure), (భౌతి. గణి.), కొన్ని రేఖల మధ్య నున్న క్షేత్రము (Figure). (భౌతి.) బలములు (Forces) పనిచేయుచున్న అకాశభాగము (చోటు, Field).
క్షియతే ధాన్యై రస్మిన్నితి క్షేత్రం, క్షినివాసగత్యోః. - దీనియందు ధాన్యములచేత నుండఁబడును, భూమి పేర్లు. వరిపండు నేల.

క్షేత్రం పత్నీ శరీరయోః,
క్షేత్రశబ్దము పత్ని - భార్య)పెండ్లామునకు, శరీరమునకును పేరు. మఱియు వరిమడికిని, సిద్ధస్థానమునకును పేరు. కీయత ఇతి క్షేత్రం, క్షి నివాస గత్యోః. పొందఁబడునది.
"కేత్రం కళత్రే కేదారే సిద్ధస్థాన శరీరయోః, కేత్రం గణితశాస్త్రే" చేతి ప్రతాపః. 

వలజము - 1.వరిమడి, 2.పైరు, 3.యుద్ధము, 4.పురద్వారము.
కలమము - 1.కలము, వరిపైరు.

క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ|
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా.
 

క్షేత్రకృషి - (వ్యవ.) భూమిని సాగుచేసి పైరులను పెంచు వ్యవసాయశాఖ. (ఈ శాఖలో సామాన్యకృషి, ఉద్యానకృషి, తరుకృషి అను ఉపశాఖలు గలవు) (Arable farming).

క్షేత్రజీవః కర్షకశ్చ కృషకశ్చ కృషీవలః,
కేరేణ ఆజీవతీతి క్షేత్రాజీవః, జీవ ప్రాణధారణే. - భూమిచేత బ్రతుకువాడు.
కర్షకుఁడు 1.దున్నుకొని బ్రతుకువాడు 2.ఈడ్చువాడు, సం.వి.కుజుడు Mars.
కర్షతీతి కర్షకః, కృషకశ్చ, కృషవిలేఖనే. - దున్నువాఁడు గనుక కర్షకుఁడు.
కర్షణము - 1.ఈడ్చుట, 2.దున్నుట, 3.ఒరిపిడి.
కృషికుఁడు - దున్నువాడు, వ్యవసాయి.  
కృషకుడును, కార్షకుఁడనియుఁ గలదు.
ఆరకాఁడు - కృషీవలుడు, రైతు.  
కృషిరస్యాస్తీతి కృషీవలః - కృషి గలవాడు. ఈ 4 దున్ని బ్రదుకువాని పేర్లు.  
ఆరబము - 1.తొలకరిపైరు, 2.పైరు, సం.ఆరంభః.
ఆరంబము -
1.మొదలు పెట్టుట, ఉపక్రమము, 2.ప్రయత్నము, 3.కార్యము, 4.త్వర, సం.ఆరంభః, 5.పైరు (ఇది తెనుగున మాత్రము కానవచ్చును), రూ.ఆరబము.
ఆరంభము - ఆరంబము.
ఎత్తనగోలు - ఆరంభము, మొదలు.
ఆరంభించు -
యత్నించు, మొదలు పెట్టు.

ఆరబ్ధము - ఆరంభింపబడినది.

పైరు - సస్యము; సస్యము - పైరు, రూ.శస్యము.
సస్యపరివర్తనము - (వ్యవ.) ఆయా పైరులను తగినరీతిని మార్చుచు సేద్యము చేయుట Rotation of crop).
సస్యసంగ్రహణము - (వ్యవ.) పైరు పంటకు వచ్చిన తర్వాతచేయు పనులు (Harvest etc., of crops). 

కార్షుఁడు - దున్నుకొని బ్రతుకువాడు.    
కృషీవలుఁడు - కృషికుడు, వ్యవసాయము చేయువాడు, వ్యవసాయ దారుడు, రైతు, కర్షకుడు, సేద్యగాడు (Cultivator).
రైతు - సేద్యకాడు; సేద్యకాఁడు - కృషీవలుడు.

అనృతము కృషిః -
అనృతము - అసత్యమైనది, వి.1.అసత్యము, 2.సేద్యము.
అనృతవ త్పాపమేతుత్వా దనృతం - అనృతమువలెఁ బాపహేతువు గనుక అనృతము, పా, ప్రమృతం కృషి, "ఋత ముంఛశిలం జ్ఞేయ మనృతం స్యా దయాచితం, మృతం తు యాచితం భైక్షం ప్రమృతం కర్షణం స్కృతం, సత్యానృతం తు వాణిజ్యం తేనాపి ఖలు జీవ్యతే, సేవాశ్వవృత్తీ రాఖ్యాతా తస్మాత్తాం పరివర్జయేతి" అని మనుస్కృతి. ఈ 2 కృషిపేర్లు, దున్ని పైరు పెట్టుట.  
కృషి - సేద్యము, వ్యవసాయము.
సేద్యము - కృషి, వ్యవసాయము, సం.సేత్యమ్. ఉత్సాహో వ్యవసాయ స్స్యాత్ -
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.)వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
ఉద్గతం సహనం ఉత్సాహః షహ మర్షణే. - ప్రయాసము నోర్చుట.
ఉత్సాహించు - క్రి. చూ. ఉత్సహించు. 
వ్యవసాయము - ప్రయత్నము, కృషి.
వ్యవసీయత ఇతి వ్యవసాయః, షో (అ)న్తకర్మణి - విశేషముగా నిశ్చయించుట వ్యవసాయము, పా, అథ్యవసాయః.    

ఆస్థ - 1.ఉనికి, 2.ప్రయత్నము, 3.కోరిక, 4.శ్రద్ధ, 5.సభ.
ఆస్థానము - సభ, రాజసభ, సభా  మండపము.

పంటవలతి - భూమి Earth.
పంట - 1.పండుట, 2.కృషి.

కృషితో సమానమైన ధర్మము, వ్యవసాయముతో సమానమైన వాణిజ్యము లేదు. చూడకపోవుట వలన కృషి కూడ నశించిపోవును.

కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

కృషితోనాస్తి దుర్భిక్షం - జపతోనాస్తి పాతకం|
మౌనేన కలహంనాస్తి-నాస్తిజాగరతో భయమ్||

తా. కృషి చేసుకొనువానికి దుర్భిక్షము - కరవు  లేదు, జపము - 1.మంత్రావృత్తి, 2.వేదాధ్యయనము, రూ.జపము.)జేసికొనువానికి పాతకం-మహాపాపము(పంచ మ హా పాతకములు: స్వర్ణపేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము)లేదు, మౌని - మౌనవ్రతుడు, ముని. మౌనముతో నున్నవానికి కలహము - సమరము, వికృ. కయ్యము.)లేదు, మేల్కొని యున్నవానికి భయము లేదు. - నీతిశాస్త్రము

శుకాదిమౌనివందితం గకారవాచ్య మక్షరం
ప్రకామ మిష్టదాయినం సకామనమ్రపంక్తయే|
చకాసతం చతుర్భుజై ర్వికాసిపద్మపూజితం
ప్రకాశితాత్మత త్త్వకం నమా మ్యహం గణాధిపమ్|| - 3 

"వంశపారపర్యంగా వ్యవసాయం చేసే రైతు పన్నెండేళ్ళు అనావృష్టి వచ్చినా తన వ్యవసాయాన్ని మానుకోడు. కానీ ఏ వర్తకుడో కొత్తగా వ్యవసాయం చేపడితే ఒక ఏటి కరవుకే బెంబేలెత్తి, 'ఇది మనకు అచ్చిరాదు!' అని మానుకొంటాడు. నిజమైన భక్తుడు జీవితమంతా భగవంతుని కోసం సాధన చేస్తూనే ఉంటాడు. ఆయన కనబడక పోయినా సాధన మానడు." - శ్రీరామకృష్ణ పరమహంస 

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః|
పరర్థిః పరమస్పటః తుష్టః పుష్ట శ్శుభేక్షణః||
 

క్షేత్రజ్ఞ ఆత్మా పురుషః -
క్షేత్రజ్ఞుడు - 1.జీవుడు, 2.పరమాత్మ.
క్షీయత ఇతి క్షేత్రం శరీరం, తజ్ఞానాతీతి క్షేత్రజ్ఞః, జ్ఞా అవబోధనే. - కేత్రమనగా నశ్వరమైన యీశరీరము దాని నెఱింగినవాఁడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
అతతి సంసరతీత్యాత్మా అత సాతత్యగమనే. - సంసారమునందే యెప్పుడును చరించువాఁడు.
అత్తిస్వకర్మ ఫలమితివా ఆత్మా. అద భక్షణే. - స్వకర్మఫలమును భుజించువాఁడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.  
పురిశరీరే శేత ఇతి పురుషః, శీఙ్ స్వప్నే. - పురమనఁగా శరీరము, అందుండువాఁడు గనుక పురుషుఁడు.
పురిదేహే సీదతీతివా పురుషః షద్ విశరణగత్య వదనేషు. - శరీరమందుండువాఁడు. ఈ 3 ఆత్మ పేర్లు.

పురుషా వాత్మ మానవౌ,
పురుషశబ్దము జీవునికిని, మనుష్యునికిని పేరు. పిపర్తీతి పురుషః, పౄ పాలన పూరణయోః. - పాలించువాఁడు. 

పురుషార్థములు - ధర్మార్థకామ మోక్షములు.
పురుషకారము - పురుషప్రయత్నము.
పౌరుషము - 1.పురుషము, 2.పురుష ప్రయత్నము, పురుష వ్యాపారము, 3.పరాక్రమము.
పొరుషేయము - పురు షుడు చేసినది (వేదములు పౌరుషేయములు కావు).    

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రజ్ఞయోర్ ర్ఙానం యత్తద్ జ్ఞానం మతం మమ || - 3శ్లో

తా|| సర్వక్షేత్రములయందు వెలయు క్షేత్రజ్ఞుడను, నేనేయని తెలిసికొనుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులను గురించిన జ్ఞానమే మోక్షదాయక మగు సమ్యక్ జ్ఞానమని పరమేశ్వరుడ నగు నా అభిప్రాయము. - శ్రీమద్భగవద్గీత, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము

క్షేత్రజుఁడు - 1.పుత్త్రుడు, 2.దేవరాది న్యాయము ననుసరించి భర్తచే నియమింపబడిన ఇతరుని వలన భార్య యందు కలిగిన పుత్త్రుడు.

పుత్త్రుడు - కొడుకు, పున్నామ నరకము నుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూడోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, సౌవర్భవుడు, స్వయంచిత్తుడు, జ్ఞాతివేతుడు). 

ఔరసుఁడు - ధర్మపత్ని యందు బుట్టిన కొడుకు.

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుండు జన్మించి నపుడు పుట్టదు జనులా
పుత్రుని గనుకొని పొగడగ
బుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.

తా. నీతిమంతుడు తనకుపుత్రుడు జన్మించగా ఆనందంపొందడు. ప్రజలు ఆ కుమారుని ఉత్తమగుణములు చూచి పొగడు దినమున, ఆ తండ్రి పుత్రోత్సాహమును పొందును.

హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
హంతి తమ ఇతి హంసః హన హింసాగత్యోః - తమస్సును బోఁగొట్టువాఁడు.

రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 -
హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ. చతుర్థం హంసవాహనా|

బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడి యుండు పరమాత్మ, 2.మనస్సు.

తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది, రూ.తుర్యము.

ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.    

హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

హృషీకము - ఇంద్రియము.

ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.      

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception)

స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.

నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకౌకసుఁడు -
1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు. 

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).

అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామా తురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వమ్||
తా.
ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్ష గలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలి కొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. – నీతిశాస్త్రము

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మజ్ఞుఁడు - తన్ను తానెరిగినవాడు, ఆత్మజ్ఞానముకలవాడు.

ఆత్మా యత్నో ధృతి ర్బుద్ధి స్వభావో బ్రహ్మ వర్ష్మ చ,
ఆత్మన్ శబ్దము యత్నమునకు, ధైర్యమునకు, బుద్ధికి, స్వభావమునకు, పరమాత్మకు, దేహమునకు, చకారము వలన జీవునికిని పేరు.
అతతీత్యా తా.న. పు. అత సాతత్యగమనే. ఎడతెగక తిరుగునది. టీ. స. యత్నే_ 'ఆత్మానురూపం ఫల ' మితి. యత్నానురూప మిత్యర్థః, ధైర్యే_ ఆత్మ వాన్నైవ ముహ్యతి, బుద్ధౌ__ స్యాత్మవేదో యమర్థః స్వబుద్ధివేద్య ఇత్యర్థః, స్వభావస్సహజో ధర్మః, తత్ర_ దుష్టాత్మా క్రోధాత్మా, పరమాత్మని__ఆత్మైవేదం సర్వం, శరీరే - స్థూలాత్మా కృశాత్మా జీపే - నావాత్మానోవ్యవస్థాత ఇతి. "ఆత్మేంద్రియే (అ)నిలే జీవ" ఇతి శేషః.    

ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః, ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాఁడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మని మనసి భవ్తి త్యాత్మభూః ఊ-పు. - మనస్సున బుట్టినవాఁడు.
ఆత్మనా స్వయమేవ భవతీతివా - తనంతతనే పుట్టువాఁడు.

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ). 

ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ -
సీత; వరజు - నాగటి చాలు, సీత.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి మంతముగ కనిపించు మార్గము, అకాశగంగ (Milky way).

కేదారక్షేత్రము నకు తూర్పున అలకనంద, పడమట మందాకిని ప్రవహించుచుండును. హిమవత్పర్వతమున నున్న కేదార క్షేత్రము నందలి పావన గంగను గ్రోలుట కష్టసాధ్యము.  

శరీరము - దేహము.
దేహము -
శరీరము, మేను.
మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.

అభవుఁడు - శివుడు, విణ.పుట్టుక లేనివాడు.
భవుఁడు -
శివుడు.
భవాని - పార్వతి.

పాదు -1.కుదురు, ఆలవాలము, 2.నిలకడ, 3.ఆశ్రయము, సం.పాదః, పదమ్.
కుదురు - 1.అనుకూలమగు, 2.స్వస్థమగు, వి.1.పాదు, 2.నెమ్మది, 3.అగసాలె వానికుంపటి, 4.స్థానము, 5.ఆధారము, 6.చుట్టకుదురు.  
ఆలవాలము - పాదు. గడ్డిబొద్దు - చుట్టకుదురు.
నిలకడ - 1.ఉనికి, 2.స్థైర్యము(స్థిరత్వము), 3.విరామము, వి.(గణి.భౌతి.) నిశ్చలముగా నుండుట (Rest).
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position). 
స్థితి - 1.ఉనికి, 2.కూర్చుండుత, 3.నిలికడ, 4.మేర, సం.వి. (రసా.) 1.అవస్థ (Phase), 2.ఘన, ద్రవ, వాయు, ద్రవ్యావస్థలలో నొకటి, 1.ఒక వస్తువు యొక్క ఉనికి, రీతి (state), 2.అది ఆక్రమించిన స్థానము, (భౌతి.) ఏ వస్తువు అయినను ఉన్న విధము, అవస్థ (Mode of existence). నిలక - నిలుపు, నిలకడ, స్థితి.
విరామము - 1.విశ్రాంతి, 2.యతిస్థానము.   
ఆశ్రయము - 1.ఇల్లు, 2.ఆధారము, 3.శత్రువులచే పీడింపబడుచు వారి నాశ్రయించి యుండుట, సంశ్రయము, 4.ప్రాపు, 5.శరణాలయము.
ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
సంశ్రయము - ఆశ్రయము.
ప్రాపు - ఆశ్రయము, సం.ప్రావణమ్ ప్రాపః.  
ఆనిక - 1.ఆశ్రయము, ఆధారము, ప్రాపు, 2.దార్ఢ్యము, 3.పానము, రూ.అనువు.

ఆధారము - 1.ఆదరవు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, 4.(యోగ.) మూలాధార చక్రము. 
అధిష్ఠానము -
1.దగ్గర నుండుట, 2.వసించుట, 3.ఉనికి పట్టు, 4.ఆధారము, 5.చక్రము, 6.ప్రాభవము(ప్రాభవము - ప్రభుత్వము), ఏలుబడి, 7.ఒకానొక పట్టణము.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.
అధిపానదేవత - అధిదేవత.

పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4వ వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములలో అధద్వయముచే వేరుచేయబడిన నాలుగుభాగములలో నొకటి (Quadrant).
ఆలవాలము - 1.పాదు.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు. 

ఉపాధి - 1.ధర్మచింత, 2.కపటము, 3.కుటుంబమున మిక్కిలి ఆసక్తిగలవాడు, 4.విశేషణము, 5.ఆధారము.

వేద మూల విందం జ్ఞానం, భార్యామూల మిందం గృహమ్|
కృషిమూల విందం ధాన్యం, ధనమూల మిదంజగత్||
తా.
జ్ఞానమునకు వేదమేమూలము, గృహము - 1.ఇల్లు, 2.భార్య.)నకు భార్యయే మూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. - నీతిశాస్త్రము

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ|
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదినీ|| – 38శ్లో 

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
గంగాయాః ధరః గంగాధరః - గంగను ధరించినవాఁడు.
కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్య కలవాడు.

అడుగు - క్రి.1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.

అడుగుపుట్టువు - 1.గంగ, 2.శూద్రుడు.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
హరిచరణాత్ గాం భూమింగతా గంగా, గమ్ ఌ గతౌ. - హరిపాదము వలన భూమిని బొందినది;
హరోత్తమాంగాద్భూమిం గతా గంగా - హర శిరస్సువలన భూమిని బొందినది.   

సచ్చూద్రుఁడు - మంచియాచారము గల శూద్రుడు.    

కాపు - 1.గృహస్థుడు 2.పంటపెట్టువాడు 3.శూద్రుడు 4.కాపురము.

శూద్రాశ్చ వర వర్ణాశ్చ వృషలాశ్చ జఘన్యజాః, 
శూద్రుఁడు - నాలవజాతివాఁడు.
శోచంతి ఖద్యన్త ఇతి శూద్రాః, శుచ క్లేశపడువారు.
అవరః అధమః వర్ణో యేషాం తే అవరవర్ణాః - అధమమైన వర్ణము గలవారు.

శూద్రాతజ్జాతి రఙ్గనా, 
శూద్ర - శూద్రజాతి స్త్రీ.
శూద్రజాతౌ భావాస్త్రీ శూద్రా - శూద్రజాతియందుఁ బుట్టినది. శూద్రజాతి యందుఁ బుట్టి శూద్రునికిఁగాని మఱియొకనికిఁగాని పెండ్లామైనది.        

వృషలుఁడు - 1.పాపాత్ముడు, 2.శూద్రుడు, 3.చంద్రగుప్తుడు.
వృషం ధర్మం లునన్తీతి వృషలాః, లూఞ్ ఛేదనే. - ధర్మమును జెఱుచువారు.
బ్రహ్మణః జఘన్యాఙ్గేజాతాః జఘన్యజాః, జనీ ప్రాదుర్భావే. - బ్రహ్మయొక్క జఘన్యాంగమందుఁ బుట్టినవారు. ఈ 4 శూద్రుల పేర్లు.

వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక.
శూద్రి - శూద్రుని భార్య.
శూద్రీ శూద్రస్య భార్యాస్యాత్ -
శూద్రస్య స్త్రీ శూద్రీ - శూద్రుని భార్య. ఒకటి శూద్రజాతిదియైనను గాకపోయినను శూద్రునకు భార్యయైనదాని పేరు.

వంజ - వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పరచిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది.
స్వగతవైగుణ్యేన ఫలాని బధ్నాతీతి వంధ్యః, బధ బంధనే. - తన యందలి వైగుణ్యము చేత ఫలముల నడ్డపెట్టునది, వబయోరభేదః.    

వంధ్యకేసరము - పుప్పొడి తిత్తిలేని పుంకేసరము (Staminod). 
స్వయంవంధ్యత - (వృక్ష.) పుష్పములోని పుంకేసరములుగాని, స్త్రీ కేసరములుగాని అదే పుష్పములో ఫలదీకరణమునకు పనికిరాకుండుట (Self-sterility).

గొడ్డేరు - 1.నీరులేనిఏరు, 2.ఒక అడవి చెట్టు, క్రి.గుత్తకు తీసుకొను, విణ.వ్యర్థము.

మొదలారి - అరవ శూద్రులలో ఒక తెగ (ముదలియార్, మొదలియార్).

వంద్యుఁడు - నమస్కరింప దగినవాడు.

వనార్దు రభివాదకే,
వందరువు - గోత్రనామములు చెప్పి పాదములు సోక మ్రొక్కువాడు.
వందతే తాచ్ఛీల్యేనేతి వందారుః, వది అభివానస్తుత్యోః. - మ్రొక్కు స్వభావము గలవాఁడు.
అభివాదనము - తన గోత్ర నామములచెప్పి పాదము లంటి నమస్కరించుట, నమస్కారము.
అభివాదనయత ఇత్యభివార్కః, వద వ్యక్తాయాం వాచి. - మ్రొక్కువాఁడు, పా. అభివాదుకః. ఈ 2 మ్రొక్కు స్వభావముగలవానికి పేర్లు. 

విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||

తా. లోకమునందు గొడ్రాలు, సహింపగూడని గుర్వి - గర్భిణి)ప్రసవవేదన(బిడ్డకుట్టు - ప్రసవవేదన)నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ-1.శ్రమము, 2.కర్మాగారము మొ.నవి (Industry)నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము

విజయా విమలా వంద్యా వందారుజన వత్సలా|
వాగ్వాదినీ వామకేశీ వహ్ని మండలవాసినీ. - 77స్తో

వసుదేవుఁడు- కృష్ణునితండ్రి, ఆనక దుందుభి.
ఆనకదుందుభి - 1.శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు (భగవంతునికి తండ్రి కాబోవుచున్నాడని యీతని జన్మకాలమున దేవతలు ఆనకదుందుభులు మ్రోగించి నందువల్ల ఈ పేరు వచ్చెను), 2.పెద్ద డక్క.

నాన్దీవాదీ నాన్దీకర స్సమౌ,
నాందీం వదతీతి నాందీవాదీ, నాంతః, వద వ్యక్తాయాం వాచి, 'దేవద్విజ నృపాదీనాం స్తుతి ర్యస్మాత్ప్రవర్తతే, ఆశీర్వచనసంయుక్తా సా నాదీ పరికీర్తితా, సాస్యాత్పాదైర్ద్వాద శభిగప్దర్వాప్యలంకలంకృతా' ఇత్యాదినా కోవాలాదిభిరుక్తలక్షనః పద్యవిశేషా నాందీకృత్యుచ్యతే, యత్కించి మంగళసూచకం వచొమాత్రం - ఆశీర్వచనయుక్తమయిన దేవద్విజ నృపాదులయొక్క స్తుతుగాని మంగళ సూచకమయిన వచనముగాని నాంది యనంబడును, అట్టినాందిని జేయువాఁడు.    
నాందీకరుఁడు - 1.ఆశీర్వాదము చేయువాడు, 2.భేరి వాయించువాడు, రూ.నాందీవాది.
నాందీం కరోతీతి నాందీకరః, డు కృఞ్ కరనే. - నాందిని చేయువా డు. ఈ 2 ఆశీర్వాదముతోఁ గూడిన దేవతాదులయొక్క స్తోత్రము చేయు మంగళ పాఠకుని పేర్లు.
నాంది - 1.పెద్దలు చేయు ఆశీర్వాదము, 3.నాటక ప్రారంభమున జరుపు మంగళము, 3.భేరి.

భేరీ స్త్రీ దున్దుభిః పుమన్,
భేరి - దుందుభి.
బిభ్యతి శత్రవో (అ)స్యా ఇతి భేరీ, ఈ. సీ. ఞి భీ భయే. - దీనివలన శత్రువులు భయపడుదురు.
దుంధుభి - 1.పాచిక యందలి ఆరు చుక్కలు గల పాచిక, ఇత్తిగ, 2.భేరి, 3.60 సంవత్సరము లలో నొకటి.
దుందుశబ్దేన భాతీతి దుందుభిః, ఈ, పు. భాదీప్తౌ. - దుందువను శబ్దముచేత ప్రకాశించునది.
ఓభనం ఉభిః పూరణం, ఉభ పూరణే. దుందుశబ్దేన ఉభిరత్రేతి దుందుభిః. - ఉభి యనఁగా నిండుట. దుందు అనెడి ధ్వనిచేత నిండుట దీనియందుఁ గలదు. భేరి పేర్లు.

ఇత్తిగ - (ఇరు+తిగ) ఆరు, వి.పాచికల మీది మూడు బొట్లజత, దుందుభి(పాచికల ఆటలలోని పరిభాష).

ఘనుఁడగునట్టివాఁడు నిజకార్య సముద్ధరణా ర్ధమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్ధనసేయుట తప్పుకాదుగా,
యనఘతఁ గృష్ణజన్మమున వసుదేవుడుమీఁది టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడకాళ్ళకుఁ మ్రొక్కఁడె నాడు, భాస్కరా.

తా. పూర్వము వసుదేవునకు దేవకీదేవి యందు 8 మంది సుతులు గల్గిరి. కాని దేవకీ దేవి యగ్రజుడగు కంసుడు, ఆమెకు పుట్టిన సంతానము చే తన కాపద గలుగనని యాకాశవాని పలికిన పలుకులను విశ్వసించి ఆమెను, ఆమె భర్తయగు వసుదేవుని కారాగార మందుంచి వారికి గలిగిన సంతానము నెప్పటికప్పుడు కడతేర్చు చుండెను. ఇట్లేడ్గురు(ఏడుగురు)శిశువుల నాతడు వధించెను. ఎనిమిదవ చూలు యాగు కృష్ణునైనను వారు దక్కించుకొన దలచి, వసుదేవు డర్థరాత్రమున ఖైదు వెడలి శ్రీకృష్ణుని తీసికొని పోవుచుండగా నొక గాడిద వానిని గని ఓండ్ర పెట్టసాగెను. అందుచే తన రహస్యము బట్ట బయ లగునేమో నని వసుదేవుడు గాలిగాఁడు - గాడిదను ప్రార్థించి, తన పనిని నెరవేర్చు కొనెను. కావున, ఎంత గొప్పవాడైనను ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు.)తన కార్యము నిర్వహించు కొనుటకు నీచుని ప్రార్థించిననూ తప్పులేదు.

వాసుదేవుడు - కృష్ణుడు, వ్యు.వసుదేవ కుమారుడు.
వాసుదేవః వసుదేవ స్యాపత్యం పుమాన్ - వసుదేవుని కుమారుడు. వసుదేవతనయా గోవిందా|
వసంత్యస్మిన్ జగంతీతి వాసుః - వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవః - అన్ని జగములు తనయందు గల దేవుఁడు. సప్తమం వాసుదేవం చ|
వస నివాసే. జగతి వస త్యయమితివా - జగమున నంతట నుండు దేవుఁడు.
తదుక్తం. శ్లో. వసత్యాత్మా జగత్య త్ర తస్మి న్వనతి వా జగత్, స వాసుదేవ ఇత్యాది.

ధిమి ధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుమ ఘుమ ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శ యుతే
జయ జయహే మధుసూదన కామిని ధనలక్ష్మీ రూపేణ పాలయమాం|| - 8

కస్త్వం, కో(అ)హం, కుత ఆయాతః, కామే జననీ, కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం, విశ్వం త్యక్త్వా స్వప్నవిచారం || - 23

నీ వెవరవు, నేనెవరిని, ఎక్కడినుండి వచ్చావు, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఈ విధంగా శోధించు. నిస్సరామైన, స్వప్నంలాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్టిపెట్టి, తత్త్వవిచారణ చెయ్యి (అన్నారు శ్రీయోగానందులు) - భజగోవిందం  

Who are you? Who am I? Where have I come? Who is my mother? Who, my father? Thus enquire, leaving aside the entire world which is comparable to a dream, and is essenceless.

త్రివిక్రముఁడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించెను.
త్రివిక్రమః బలిబంధనకాలే త్రిషు లోకేషు త్రయో విక్రమాః పాదన్యాసాః యస్య సః - బలిబంధనకాల మందు మూఁడులోకములను మూఁడడుగులచేఁ గప్పినవాఁడు. క్రము పాదవిక్షేపే.

విక్రముఁడు - 1.విక్రమార్కరాజు, 2.విష్ణువు.
విక్రమ - పదునారవ(16వ) సంవత్సరము.
వి క్రమము - 1.అధిక బలము, 2.శౌర్యము.
విక్రాంతి - విక్రమము.

విక్రమ స్త్వతిశక్తితా,
విశేషేణ క్రమతే (అ)నేన విక్రమః - దీనిచేత విశేషముగా నాక్రమించును. ఈ ఒకటి అధికమైన శక్తి పేరు. 

ఉపక్రమము - 1.ప్రారంభించుట, 2.విక్రమము, 3.చికిత్స, 4.సమీపించుట, 5.మంతులు మొ. వారిని పరీక్షించుట.

పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొ త్తమే
లొదవజగ త్తయంబుబురుహుతునకియ్య వటుండవై నచి
త్సదలమూర్తి నీవెకద దాశరథీ కరుణా పయోనిధీ.

తా. ఒక పాదము భూమియందును, మఱొకటి ఆకాశమునందును పెట్టి, యట్లు రెండు పాదము లచే లోకమాక్రమించి, మహాపరాక్రమవంతుఁడైన బలిచక్రవర్తి తలమీద నొక పాదము పెట్టి పాతళమునకు అణఁగ ద్రొక్కి మేలగునట్లు ముల్లోకములను పురుహూతుఁడు - ఇంద్రుడు, వ్యు.యజ్ఞములం దెక్కువగ పిలువ బడువాడు.)ఇంద్రునకు ఇచ్చుటకై వటువు - బ్రహ్మచారి, బాలకుడు.)వటువుగాఁ బుట్టిన సచ్చిదానంద మూర్తివి నీవెకాని మఱి యెవ్వరునుగారు కనుక నన్నుఁ గాపాడుమా !

త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః, వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం, వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం || - 24

నీలోను, నాలోను, ఇతరులందరిలోను, అంతటను వ్యాపించియున్నది ఆ విష్ణువు మాత్రమే. ఈ పరమసత్యాన్ని అవగాహన చేసుకోలేని నీవు, పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపిక లేని నీవు, అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావుగాని, ఇది మాత్రం సత్యం. నీవు విష్ణుపదాన్ని త్వరగా పొందదలచుకుంటే, అన్ని పరిస్థితులందూ సమచిత్తత్వాన్ని కలిగియుండాలి. - భజగోవిందం 

In you, in me, and elsewhere too, there but one Vishnu (God). Vainly do you get angry with me, being impatient. See the Self in all things, and leave off everywhere ignorance which is the cause of difference.

నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
భవబంధనహర వితతమతే పాదోదక విహతాఘతతే
వటుపటువేషమనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మామ్.

శ్రీపతి - 1.విష్ణువు, 2.రాజు.
శ్రీపతిః ఇ - పు. శ్రియః లక్మ్యాః పతిః - లక్ష్మీదేవికి భర్త.
శ్రియపతి - విష్ణువు, లక్ష్మీభర్త. 
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు, విశ్వం వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.  
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః. 

పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు. 
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
పాతి స్వానుజీవిన మితి పతిః, పా రక్షణే. - తన యాశ్రితుని రక్షించువాఁడు.
స్త్రీలింగమందు రుచి శబ్దము వలెను, నపుంసకమందు వారి శబ్దమువలెను రూపము. పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
పతింవర - తనంతట మగని వరించునట్టి ఆడుది. 
పతిం వృణత ఇతి పతింవరా - పతిని వరించునది. 

తిరు - శ్రీ పదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము.

సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపత్తి - సంపద, సంవృద్ధి.  
సంపద్యతే జనైరితి సంపత్. ద.సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. - జనులచేత పొందఁబడునది.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.     
శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
శ్రియతే జనైరితి శ్రీః ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది, సంపద.
లక్కి - లక్ష్మి, సం.లక్ష్మీ. లక్కిమి - లచ్చి. 
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః.
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదులశోభ, 4.మెట్టదామర.    
లక్ష్యతే లక్ష్మీః. ఈ. సీ. లక్ష దర్శనాంకనయోః. - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు 4 సంపద పేర్లు.

శ్రీఫలము - మారేడు.
శ్రీప్రదం శ్రీప్రియం వా ఫలమన్యేతి శ్రీఫలః - లక్ష్మీప్రదముగాని, లక్ష్మీ ప్రియముగాని అయిన ఫలముగలది. 

సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సమృద్ధమైనది.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

దివ్యధునీ మకరందే పరిమళపరిభోగ సచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే| - 2

మేని - కాంతి.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కామ్యత ఇతి కాంతిః, ఈ-సీ. కము కాంతౌ - ఇది కోరఁబడుచున్నది గనుక కాంతి.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).   

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపాతీతి అధిపః, పా రక్షణే. - అధిక్యమున రక్షించువాఁడు.

శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి-మదనుడు; మదనుఁడు-మన్మథుడు.
మదనః మదయతీతి మదనః – మదింప జేయువాఁడు, మదీ హర్ష గ్లేపనయోః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మనమం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది (29వ)తొమ్మిదవది.     

అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమానాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.

విషము - 1.గరళము, 2.జలము.
దేహం వేవేష్టీతి విషం, విష్ ఌ వ్యాప్తౌ. - దేహమును వ్యాపించునది.

విష మప్సు చ,
విషశబ్దము నీళ్ళకును, చకారమువలన విషమునకును పేరు.
వేవేష్టీతి విషయం, విష్ ఌ వ్యాప్తౌ. - వ్యాపించునది.

నవిష విషమిత్యాహుః  భక్తవం విషముచ్యతే|
విష మేకాకిసంహంతి  ర్భక్తస్వం పుత్రపౌత్రకమ్||

తా. విషము విషముగాదు, భక్తులసొమ్ము విషము, విషమువలన నొక్కడే చచ్చును, భక్తులసొమ్ము నపహరించిన వాని పుత్రపౌత్రాదులు నాశన మొందుదురు. – నీతిశాస్త్రము

గేయం గీతా నామసహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ చ చిత్తం|| - 27

భగవద్గీతను, సహస్రనామాలను గానం చేస్తుండాలి. ఎల్లాప్పుడు శ్రీపతి రూపాన్నే ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి. సంపద (ఐశ్వర్యము) దీనజనులకు(దేయము - ఇయ్యదగినది)ఇస్తుండాలి. - భజగోవిందం

The Bhagavadgita and the Sahasranama should be sung; the form of the Lord of Lakshmi(Vishnu) should be always meditated on; the mind should be led to the company of the good; and wealth should be distributed among the indigent. 

పురుషోత్తముఁడు - శ్రీకృష్ణుడు.
పురుషే షూత్తమః పురుషోత్తమః - పురుషుల యం దుత్తముఁడు. 
పురాణపురుషుఁడు - విష్ణువు.
పురాణము - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అను నైదు లక్షణములు గల గొప్ప గ్రంథము. పురాణములు పదునెనిమిది(18), అవి - బ్రహ్మ ఫద్మ విష్ణుభాగవత నారదీయ మార్కాండే యాగ్నేయ భవిష్యత్ బ్రహ్మవైవర్త లింగ వరాహ వాయు స్కాంద వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండములు. పురాణ పురుషా గోవిందా|

పౌరాణికుఁడు - పురాణము తెలిసినవాడు, పురాణము చెప్పువాడు.

పురాణించు - క్రి.1.వర్ధిల్లు, 2.విజృంభించు, సం.పురాణమ్, సం.క్రి.పురాణము చెప్పు.

పురాణ ప్రతన ప్రత్న పురాతన చిరంతనాః,
పురా భవతీతి పురాణః, పురాతనము - ప్రాతది. పురాతనశ్చ, ప్రాఁగబ్బము - (ప్రాత+కబ్బము), వేదము. ప్రాగ్భవ ఇతి ప్రతనః, ప్రతశ్చ, చిరంతనము - 1.బహుదినములది, 2.ప్రాతది, రూ.చిరత్నము. చిరంభవతీతి చిరంతనః - పూర్వమందుఁ బుట్టినది గనుక పురాణము, పురాతనము, ప్రతనము, ప్రత్నము, చిరంతనము. ఈ 5 ప్రాఁతదాని పేర్లు. 
ప్రాక్తనజన్మ - పూర్వజన్మ.   
ప్రాక్తనము - 1.ప్రాతది, 2.పురాతనము.
చిరత్నము - చిరంతనము.
చిరలగ్నము - (వృక్ష.) కొన్ని ఏండ్లవరకు ఉండునట్టిది (Persistent).

పరిమృతప్రాణులు - (జీవ.) పూర్వ మెప్పుడో యుండి ఇప్పుడు లేని ప్రాణులు (Extinct organisms).

కబ్బము - ప్రబంధము, సం.కావ్యమ్. 
ప్రబంధము - కావ్యము.

పురాణములు - (చరి.) ప్రాచీనేతి హాసములతో కూడిన పదునెనిమిది(18) మహాకావ్యములు. సూ ర్య చం ద్ర వంశపు రాజుల వంశావళులు, మహర్షుల వంశావళులు చెప్పు హైందవ ధర్మకావ్యములు. వీనికిని మహాభారతమునకును సన్నిహిత సంబంధము కలదు. పురారణములలో ముఖ్యమైనవి గరుడ, కూర్మ, మత్స్య - అగ్ని మార్కండేయ ఫద్మ బ్రహ్మవైవర్త విష్ణు భాగవత స్కాంద శివ లింగ భవిష్యత్ పురాణములు.  

అశరీరవాణి - పురాణములలో అశరీరి పలికెడి మాటలు, ఆకాశవాణి.
అకాశవాణి - 1.ఆకశమునుండి వినబడుమాట, అశరీరవాక్కు, 2.భారతీయ రేడియోసంస్థ పేరు.

ప్రకరణము - 1.ప్రస్థావము, 2.గ్రంథభాగము, 3.ఒక తెగ రూపకము.
ప్రకృతము - 1.చక్కగా చేయబడినది, 2.ప్రకరణము వలన పొందబడినది.

ప్రస్తావన - (నాట) 1.నాటకము లందు నాంది తరువాత వచ్చు సూత్రధారుడు, నటి గావించు సంభాషణము. (ఇందు కవి, నాటకేతివృత్తము ప్రస్తావింప బడును), 2.వృత్తంతము.
వృత్తాంతము - 1.వర్తమానము, 2.కథ, 3.ప్రస్తావము.
వృత్త అనువర్తనీయః అంతః సమాప్తిరస్యేతి వృత్తాన్తః - అనువర్తించి వచ్చునట్టి సమాప్తిగలిగినది.
వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుచున్నది.

కథ - తొల్లింటికత, వాస్తవార్థము కలది.

సదృశము - (గణి.) అనురూపము, సం.విణ.సమానము, తగినది, (Corresponding).
సదృశ సమ్మేళనములు - (వాణి.) ఒకే పారిశ్రామిక ప్రక్రియ లేక దశలలో పని చేయుచున్న సంస్థలు ఒకటిగ వ్యవహరించుట.

స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వస్య భావః స్వభావః - తనయొక్క భావము స్వభావము.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ప్రస్తావ సదృశంవాక్యం స్వభావ సదృశ క్రియామ్|
ఆత్మశక్తి సమంకోపం యోజానాతి సపండితః||

తా. ప్రస్తావమునకుఁ దగిన వాక్యము - భావముగల పదసముదాయము)మాట, పరుల స్వభావము నకుఁ దగిన కార్యము, తన శక్తికి దగిన కోపము - కినుక, క్రోధము.)ఎవం డెఱుంగు నోవాఁడు వివేకియగును. - నీతిశాస్త్రము

మాట్లాడవలసిన అవసరం వున్నపుడు మాట్లాడకుండా వూరుకోవడం, మాట్ల్లడక పోవడం మంచిదైనపుడు మాట్లాడడం, ఇవి రెండూ మనిషి బలహీనతకు నిదర్శనాలు. - పర్షియన్ సామెత. 

కాననము - 1.అడవి, 2.విపినము, 3.ఇల్లు.
కంజుల మననం ప్రానన మస్య కాననం, అనప్రాణనే. - జలమే ప్రాణముగాఁ గలది.
కన్యతే గమ్యత ఇతి వాకాననం, కన దీప్తికాంతి గతిషు. - పొందఁబడునది. 
కాన1 - 1.కనుక, 2.సంబోధనార్థకము, ఉదా. "తల్లికాన, సామికాన". కాననే నారసింహంచ| 
కాన2 - అడవి, సం.కాననమ్. పితృవాక్యాశ్రిత కానన రామ్|    

కోన1 - 1.అడవి, సం.కాననమ్, 2.కొండల యందలి మరుగుచోటు లోయ, 3.దేశభేదము, 4.కొన, మూల, సం.కోణః.
కోన2 - గోసమూహము.

భువనము- 1.జగము 2.ఆకాశము 3.ఉదకము.
భవత్యస్మిన్నితి భువనం. - దీనియందు సర్వము గలుగును.
భవతి సర్వమనేనేతి భువనం, జీవ ప్రాణధారణే. - దీనివలన నన్నియు గలుగును.

భువి - 1.భూమి, 2.స్థానము.
భువం దారయతీతి భూదారః దౄవిదారణే. - భూమిని వ్రక్కలించునది.
భువనేశ్వరము - చుట్టులవంతి.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థాని - స్థానము కలది.
స్థానాంతరీకరణము - (భౌతి.) ఒక వస్తువును ఒక చోటునుండి ఇంకొకచోటికి మార్చుట, (గతిశాస్త్రము,) ఇంకొక చోటికి తరలించుట (Translocation). 

స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికించుట, (Dislocation). 

కనకమృగము భువిని గద్దులేదనకను
తరుణివిడిచి చనియె దాశరథియు 
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా ? విశ్వ.

తా|| భూమిపై బంగారులేళ్ళు ఉన్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను(తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.)విడచి ఆ లేడి వెంటబడెను. ఆమాత్రము తెలుసు కొనలేవాడు దేవుఁడు - భగవంతుడెట్లయ్యెను.?

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.  

కడలిరేఁడు - వరుణుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.
వృణోతి వరా నముం లోక ఇతి వరుణః, వృఙ్ వరణే.- జనము ఇతనిని వరము లడుగుచున్నది.
వృణోతి అరీన్ పాశైరితి వా వరుణః – పాశముల చేత శత్రువులఁ గట్టువాఁడు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.  

కడలిరేఁడు - వరుణుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.

వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.

వనధి - కడలి; కడలి - సముద్రము.
సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్మదం రాతీతి వా సముద్రః రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది. 
కడలికాలువ - సముద్రపుపాయ.  
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
లక్కిమి - లచ్చి; లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః. 
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు. 
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.  
విష్ణుః, ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
కడలిమీఁగడముద్ద - చందమామ Moon.
కడలివెన్న- 1.చంద్రుడు Moon, 2.అమృతము.

అమృతకరుఁడు - చంద్రుడు Moon.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పా ల క డ లి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

వనచంద్రికాన్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెలయనురీతి, నిష్ప్రయోజనము.

ద్వైతము - 1.జీవాత్మ పరమాత్మలకు భేదము తెల్పెడి మతము, 2.ఒక వనము.

వనపు - వనలు.
వనసంబంధము - సరస్సు, కోనేరు.
వన్యతే యాచ్యత ఇతివనం, వను యాచనే, అడుగఁబడునది.
వనీతివా వనం, వన సంభక్తౌ. - లెస్సగాఁ గూడియుండునది. 

వనే సలిల కాననే,
వనశబ్దము నీళ్ళకును, అడవికిని పేరు. వన్యత ఇతి వనం, వనుయాచనే. - అడుగఁబడునది వనము.

అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.  

వన్యము - వనమునందు పుట్టినది.
వనజము - తామర, వ్యు.నీటియందు పుట్టినది.

వన్యా వనసమూహే స్యాత్ -
వనానాం సమూహో వన్యా - వనములయొక్క సమూహము. ఈ 1 వన సమూహము పేరు.

వనే రణే శత్రు జలాగ్ని మధ్యే - మహార్ణవే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్త విషమ స్థితంవా రక్షంతి పుణ్యాని పురాకృతాని.

పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
పుస్తకము - పొత్తము book.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి. 
ఐందవి - పల్కుజెలి, సరస్వతి.  
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ.

వనిత - స్త్రీ, మిక్కిలి అనురాగముగల స్త్రీ.
వనతి పురుషమితి వనితా, వన షణ సంభక్తౌ. – పురుషునిఁ(పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.)బొందునది.
స్త్రీ - ఆడుది; స్త్రీలింగము - (వ్యాక.) స్త్రీత్వబోదక శబ్దము, ఉదా.లక్ష్మి, సీత మొ.
స్త్రీఘాషము - వేకువ; వేకువ - వేగుజాము.

వనితా జనితాత్యర్థానురాగాయాం చ యోషితి,
వనితాశబ్దము మిక్కిలి యనురాగము పుట్టించునట్టి స్త్రీకిని, చకారమువలన స్త్రీమాత్రమునకును పేరు.
వన్యత ఇతి వనితా, వసుయాచనే, వన షణ సంభక్తౌ. - అడుగఁబడునది గనుకనైన, కూడఁ బడునది గనుకనైనను వనిత. 

ఉత్పన్నము - 1.శిథిలమైనది, 2.ప్రచారములో లేనిది,(గ్రంథము మొ,వి.), 3.ఉబికినది, 4.పెల్లగింపబడినది.

వనప్రియ - కోకిల.
వనం ప్రియమస్య వనప్రియః - వనమే ప్రియముగాఁగలది.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.   

స్త్రీధనము - పెండ్లి మున్నగు సమయములలో స్త్రీ కిచ్చిన ధనము.
విడిముడి - ధనము, (విడియు + ముడి).
విత్తము - ధనము, సం.విణ.1.విచారింప బడినది, 2.తెలియబడినది.
విద్యతే లభ్యత ఇతి విత్తం, విద్ ఌ లాభే. - పొందఁబడునది.  

గతము - 1.పోయినది, 2.జరిగినది, 3.చచ్చినది, 4.ప్రాప్తము, 5.గ్రహింపబడినది, వి.1.పోవుట, 2.నడక, 3.ప్రకారము.    

పుస్తకం వనితా విత్తం పరహస్తం గతంగతం|
అధవా పునరాయాతం జీర్ణం భ్రష్టాచ ఖండశః||

తా. పుస్తకము, వనిత, విత్తము - ధనము, సం.విణ.1.విచారింపబడినది, 2.తెలియబడినది. ఒకరిచేతికి పోయిన పోయినదియే యగును. అధవా - అవ్య.అట్లుకాకున్న, పక్షాంతరమున  ఒక వేళ తిరుగవచ్చినను పుస్తకము book జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము.)జీర్ణమె వచ్చును, వనిత భ్రష్టురాలై వచ్చును, ధనము కొంచెముగా వచ్చును. - నీతిశాస్త్రము  

భ్రష్టము - జారినది.
భ్రస్యతే స్మ భ్రష్టం. - పడినది గనుక భ్రష్టము.
జాఱెడికీలు - (జం.) వరుసగా అమర్చిన ఎముకలు ఒకదాని మీదికి ఒకటి జరుగు కీలు, ప్రసరసంధి, (Gliding joint).
ప్రసరసంధి - (జం.) జారుడుకీలు, వరుసగా నమర్చిన చిన్న ఎముకలు ఒకదానిపై నొ క టి జరుగుచుండు కీలు (Gliding joint), ఉదా. అరచేతి ఎముకలు.      

శ్రుత్వైవ యో భూపతిమాత్తవాచం వనం గతస్తేన న నోదితో పి|
తం లీలయాహ్లాదవిషాదశూన్యం శ్రీజానకీ జీవనమానతో స్మి| - 2 

వనమహోత్సవము - (వ్యవ.) చెట్ల పండుగ. సంవత్సరమున కొకసారి క్రొత్త వృక్షములను నాటు పండుగ. (ఇది మన దేశములో ఇటీవల సుమారు 15 ఏండ్ల నుండి ఆచారములోనికి తీసికొని రాబడినది, వనములను పెంపొందించుటకై వృక్షములు నాటు ఉత్సవము. ఈ ఉత్సవము భారతదేశములో మొదటిసారిగా శ్రీ కనయ్యాలాల్ మున్షీచే క్రీ.శ.1950లో ప్రారంభింపబడెను.

వన్నాన్ని ఒకరెవరో పుట్టిస్తే మిగతావారు దానిని పెంచి పెద్ద చేస్తారు.     

వనపాలుడు - తోటకాపు; తోటీఁడు - వనపాలుడు.
తోఁటకాపు - 1.తోటవాడు, 2.తోటమాలి.
తోఁటమాలి - తోటను సంరక్షించువాడు.  

వైఖాననుఁడు - 1.వానప్రస్థుడు, 2.విష్ణ్వర్చకులలో నొకడు.   

వనభోజనము - (గృహ.) క్రీడకై వేరే స్థలమునకు కొంతమంది కలిసి ఆహారపదార్థములను తీసికొనిపోయి లేదా వండుకొని భుజించుట. 

వనాటము - వనమునందు చరించు జంతువు.
వనచరము - కోతి; వనౌకసము - వానరము.
వన మోకః స్థానం అస్య వనౌకాః, స. పు. - వనము నివాసముగాఁ గలది.
వనేచరము-వానరము;వానరము-కోతి monkey.
నర ఇవ వానరః - నరునివలె నుండునది. తాచెడ్ద కోతి వనమెల్లా చెరిచిందట. 

ఆదిమవాసులు - కొండలందు, అడవులందు ఉండు అ నా గ ర కు లు (Aborigines).

సురక్షితారణ్యములు - ఈ అరణ్యములపై ప్రభుత్వమునకేకాక ప్రజలకు కూడ హక్కులుండును.  

వనచరాదులకు భోజన మెవ్వఁడిప్పించెఁ… ? 

కుపితుఁడు - కోపించినవాడు.
వనేచర పతి - హనుమ; హనుమంతుఁడు - ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హృదయంగమము - మనస్సుకింపైనది.
హృదయం గచ్ఛతీతి హృదయం గమం. - మనస్సును బొందునది.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఉపపతి రివకృత వల్లీ సంగమ
కుపిత వనేచర పతిహృదయంగమ | ||శరవణభవ||
   

వనమాలి - విష్ణువు.
వనమాలీ, న. పు. శ్లో. అపాదపద్మం యామా లా వనమాలేతి సా మతా, ఇతి కళిఙ్గః. సా అస్యాస్తీతి వనమాలీ - పాదములదాక వ్రేలెడు పుష్పమాలిక గలవాఁడు.

వనమాల - ఆకులు పువ్వులు చేర్చికట్టిన హారము. తులసీ వనమాల గోవిందా|
తోటమాలియ - ఆకులు, పూవులు చేర్చి కట్టిన మాల, రూ.తోఁటమాలె, తోమాలియ, తోమాలె.
తోమాలె - తోటమాలియ. తోమాలెసేవ.  

మాల్యము - 1.పుష్పమాలిక, 2.పుష్పము.
రుచకము - 1.మాల్యము, 2.మంగళ ద్రవ్యము.
మాల్యం మాలా స్రజౌ మూర్ధ్ని -
మాల్యతే ధార్యత ఇతి మాల్యం, మల మల్ల ధారణే. - ధరింపఁబడునది.

"అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియనిగ్రహః
సర్వభూతదయా పుష్పం - క్షమా పుష్పం విశేషతః
శాంతిః పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ
సత్య మష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్"
  - ఈ పరిశుద్ధ పుష్పములు ఎమినిటియు కలిగి యుండుటయే పరమేశ్వరికి పుష్పపూజ యగును.

భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడు వెల, (భోగములు ఎనిమిది; గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).

వనమాలా వై జయంతీ పంచదివ్యా యుధాత్మికా,
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ|

ఇండె - 1.పూదండ, 2.ఎముక కీలు, 3.చీలిక. 
చీరిక - 1.పాయ, రూ.చీలిక.  
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ. 

ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, ఆఫ్రికా అస్త్రేలియా, ఐరోపాఖండములు), (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన ఘనరూపభాగము, (భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్న భిన్నముగ చేయబడిన భూభాగము.

మాల1 - 1.పూదండ, 2.వరుస.
మాం లక్ష్మీ లాతీతి మాలా, లా దానే. - ఒప్పిదము నిచ్చునది. 
మాల2 - చండాలుడు, సం.మాలః.
మాలెత - (మాల+ఎత) మాలది.

మాలిక  - 1.పూదండ, 2.వరుస, 3.విరజాజి, 4.శంకరాభరణము, 5.కూతురు.
మాల1 - 1.పూదండ, 2.వరుస.
వరుస - 1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు. సీతార్పిత వరమాలిక రామ్| 

ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
కూఁతురు - కుమార్తె.    
పుత్రిక - 1.కూతురు, 2.బంగారుబొమ్మ.

విరజాజి - నవమల్లికా కుసుమము; నవమాలిక - విరజాజి.

సప్తలా నవమాలికా,
సప్తమనో బుద్ధ్యంతానీంద్రియాని లాతీతి. సప్తలా. లా ఆదానే. - మనోబుద్ధులతోఁ గూడిన పంచేద్రియములను అనఁగా నేడింటిని పరిమళము చేత స్వవశముగాఁ జేసికొనునది.
నవాస్తుత్యామాలా అస్యా ఇతి నవమాలికా - స్తోత్రము చేయఁదగిన దండ గలది. ఈ 3 విరజాజి పేర్లు. 

స్రగ్వి - పూదండగలవాడు.
స్రజము - పూలదండ.
సృజ్యతే  స్రక్, జ. సీ. - సృజ విసర్గే. - విడువఁ బడునది.  
శిరస్సు నందలి పువ్వులదండ పేర్లు. కంఠాదుల యందలి పువ్వులదండయును.

సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు.   
సుమన సః-సాంతః-పు. సుష్ఠు మన్వత ఇతి సుమనసః - లెస్సగా నెఱిఁగినవారు గనుక సుమనస్సులు.
మన జ్ఞానే, శోభనం మనో యేషాం తే మంచి మనస్సు గలవారు.

సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు.    
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

సుమనా మాలతీ జాతిః
సుష్ఠు మన్యతే సుమనాః, స. సీ. మన జ్ఞానే. - లెస్సగా తలంపఁబడునది.    

మాలతి - 1.ఒకానొక స్త్రీ, 2.జాజిచెట్టు.
మల్యతే ఆమోదైర్మాలతీ, మల మల్ల ధారణే. - పరిమళముచేత ధరింపఁబడునది.
ౙాజి - 1.జాతి, మాలతీవృక్షము, ఒక తెగమల్లె, 2.జాజికాయ, రూ.జాది, సం.జాతీ.
ౙాది - జాజి.

కేతకి - 1.పచ్చపూవుల మొగిలి (ఇది శివపూజకు అర్హము కాదు), వికృ.గేదగి, 2.జాజి.
కిత్యతే జ్ఞాయతే గంధో (అ)నేనేతి కేతకీ, సీ. కితజ్ఞానే. - దీనిచేత పరిమళము తెలియఁబడును. 
గేదఁగి - 1.పచ్చపూమొగిలి, 2.మొగిలిపూవు, సం.కేతకీ. 
మొగలి - గేదంగి, కేతకి. 

కావారి - మొగలియాకులతో ఏర్పరచిన గొడుగు.

కైతకము - కేతకీ పుష్పమునకు సంబంధించినది.

వర్ణము - 1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.
వర్ణ్యతే చిత్రవర్ణత్వేనేతి వర్ణః వర్ణస్తుతౌ. - చిత్రమౌటచేత స్తోత్రము చేయఁబడునది.

జాతి1 - 1.కులము, 2.పుట్టుక, 3.సమానత్వము, 4.జాజికాయ, 5.మాలతి, 6.పద్యభేదము.
జాయతే అనయా సుఖం జాతిః, ఇ. సీ. జనీ ప్రదుర్భావే. - సుఖము దీనిచేతఁబుట్టును. ఈ 3 జాజి పేళ్ళు.   

జాతి స్సామాన్యజన్మనోః,
జాతిశబ్దము గోత్వాదిజాతులకును, పుట్టుకకును పేరు. జాయేతేభిన్నే ష్వభిన్నాభిధాన ప్రత్యయా వనయేతి, జననం చ జాతిః, సీ. జనీ ప్రాదుర్భావే. - భిన్నము లయిన వస్తువులయందు అభిన్నములైన నామ జ్ఞానములు దీనిచేతఁ బుట్టును గనుకను, పుట్టుట గనుకను జాతి.  

జాతికోశము - జాజికాయ.
జాజికాయ - (వ్యవ.) (Nutmeg) ఇది (Myristaceae) అను కుటుంబమునకు చెందిన Myristica fragransఅనుమొక్క యొక్క గింజ, ఇది పరిమళ ద్రవ్యముగ నుపయోగపడు చుండును. (జాపత్రియను పరిమళ ద్రవ్యము జాజికాయపై నుండు బీజ పుచ్ఛము.)

అథ జాతీకోశ జాతీఫలే సమే,
జాత్యాః లతావివేషస్య కోశం జాతీకోశం, జాత్యాః ఫలం జాతీఫలం. - జాతీలత యోక్క ఫలము. 1, 2, జాజికాయ పేర్లు.

జాతి2 - (జీవ.) గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలిసి ఒక జాతిగా వర్గీకరింపబడినది (Genus).
జాతి3 - (చరి, రాజ.) ఒక దేశములో నివసించుచు సాధారనముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు.  

జాతి స్సామాన్యజన్మనోః,
జాతిశబ్దము గోత్వాదిజాతులకును, పుట్టుటకును పేరు. జాయతేభిన్నే ష్వభిన్నాభిదాన ప్రత్యయా వనయేతి, జననం చ జాతిః. సీ. జనీ ప్రాదుర్భావే. భిన్నము లయిన వస్తువులయందు అభిన్నములైన నామ జ్ఞానములు దీనిచేతఁ బుట్టును గనుకను, పుట్టుట గనుకను జాతి.

జాత్యైకీకరణ సమితి - కులమత వైషమ్యములను రూపుమాపి భారత జాతిని సుసంఘిటితముగ చేయుటకై క్రీ.శ.1962 సంవత్సరములో భారత ప్రభుత్వము అధ్వర్యములో భారత నాయకుల సమావేశము (National Integration Samiti). 

జాతిపత్రి - జాపత్రి.
ౙాపత్తిరి - జాతిపత్రి, రూ.జాపత్రి, సం.జాతిపత్రమ్.

జాతిచరిత్ర - (జీవ.) ఒక జాతి యొక్క పూర్వికుల వృత్తాంతము, (Phylogeny).
సజాతీయత - (చరి.,రాజ) భాష, మతము, ఆచారము, సాంప్రదాయములు, చరిత్ర యొక్క బంధముగల ప్రజలు (Nationality).

జాత్యము - 1.మంచి కులమున పుట్టినది, 2.మేలైనది, 3.చక్కనిది. 

జాతము - సమూహము, విణ.పుట్టినది.

జాతి ర్జాతం చ సామాన్యమ్ -
జాయత ఇతి జాతిః, ఈ-సీ. జాతం చ ప్రాదుర్భవించునది. 1, 2, సమానానాం భావః సామాన్యం, సమానములైన పదార్థములయొక్క భావము. ఈ 3 ఘటత్వాది జాతికి పేర్లు.

మాలికుఁడు - 1.మాలకరి, 2.తోటమాలి, 3.చిత్రకారుడు.  

మాలకరి - 1.దండలు కట్టువాడు, 2.తోటమాలి, సం.మాలకారీ.
తోఁటమాలి - తోటను సంరక్షించువాడు.
తోఁటీఁడు - వనపాలకుడు; వనపాలుఁడు - తోటకాపు. 

జయా జయ న్తీ తర్కారీ నాదేయీ వైజయన్తికా,
జయ - 1.పార్వతి, 2.పార్వతిచెలి, 3.సంవత్సరములలో నొకటి, 4.మహాభారతము.
జయతి రోగాన్ జయా, జయన్తీచ, ఈ.సీ. - రోగములను జయించునది.
జయతి రోగానితి జయా జి జయే. - రోగములను జయించునది.
జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము.
తర్కము - 1.ఊహ, 2.ఆధాహారము, 3.ఒక శాస్త్రము.
తర్కమియర్తీతి తర్కారీ, ఈ. సీ. ఋ గతౌ. - ఊహను బొందించునది.
తర్కించు - 1.ఊహించు, హేతువు చూపుచు వాదించు.
తర్కురూపము - (వృక్ష.) నూలు కండె ఆకారముగా నున్నది, (ముల్లంగి దుంప ఆకారము), (Fusiform).
నాదేయము - నదీ సంబంధమైనది.
నద్యాం భవ నాదేయీ, ఈ. సీ. నది యందుఁ బుట్టినది.
వైజయంతి - 1.టెక్కెము, 2.విష్ణు మాలిక, 3.విష్ణు ప్రాకారము.
విజయతాం సంబంధినీ వైజయంతీ, ఈ. సీ. - గెలుపుగలవారిది. వైజయంతిమాల గోవిందా|
వియయతి శోభాదిక మితి వైజయంతికా - శోభాదులను గెలుచునది. ఈ 4 తక్కిలిచెట్టు పేర్లు.

టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జండా - టెక్కెము.

వైజయంతము - ఇంద్రుని నగరు.

స్యాత్ ప్రాసాదో వైజయంతః -
ప్రశస్తాః వైజయంత్యః పతాకా అస్మిన్ సంతీతి వైజయంతః. ఒకటి ప్రశస్తములైన టెక్కెములు గలది. ఇంద్రునిమేడ వైజయంత మనంబడును. 

పతాకము - 1.పడగ, 2.టెక్కెము.
పతాకాధికారి - సైన్యములో జాతీయ ధ్వజమును మోయు సైనికోద్యోగి.
పతాకిని - సేన, వ్యు.పతాకములు కలది.

పతాకీ వైజయన్తికః,
పతాకా (అ)స్యాస్తీతి పతాకీ, నాంతః. - టెక్కెము గలవాఁడు.
వైజయంత్యా చరతీతి వైజయంతికః - టెక్కెము చేత చరించువాఁడు. ఈ 2 టెక్కెము గలవాని పేర్లు.

టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.
మిత్తిౘూలు - కేతువు Ketu.   
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.

వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి. కేతువు, Ketu.    

హారము - 1.నూట ఎనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది ‘హారము ' (Denomination).
హారి - 1.మనోజ్ఞము, 2.హరించువాడు, 3.హారము కలవాడు. 

పంచముఁడు - మాలడు, విణ.ఐదవవాడు. 
సురియాళు - మాలవాడు, రూ.సులేయాళు.

మాల2 - చండాలుడు, సం.మాలః.
మాలఁడు - చండాలుడు, సం.మాలః.
చండతే కుప్యతీతి చండాలః, చడి కోపే. - కోపగించుకొనువాఁడు. 
మాలెత - (మాల+ఎత) మాలది.

స్యాచ్ఛణ్ణాలస్తు జనితో బ్రాహ్మణ్యాం వృషలేన యః,
చండతే కుప్యతి క్రూరకర్మవత్త్వేనేతి చండాలః, చడి కోపే. - క్రూరకర్ముఁడౌటచేత కోపగించు కొనువాఁడు. ఈ ఒకటి శూద్రుని వలన బ్రహ్మణ స్త్రీయందు బుట్టినవాని పేర్లు.

ప్లవుఁడు - అంత్యజాతివాడు.
ప్లవతే ఉగ్రకర్మణ ఇతి ప్లవః, ప్లుఙ్ గతౌ. క్రూరకర్మ కొఱకు పోవువాఁడు.

నిషాదుఁడు - 1.బోయవాడు, 2.మాలవాడు.
నిషీదతి పాప మస్మిన్నితి నిషాదః, షద్ ఌ విశరణ గత్యవసాదనేషు. - వీనియందు పాప ముండును.
పావి - పాపి, సం.పాపీ.
పాపమన్యేతి పాపః - పాపముగలవాఁడు. ఈ 4 పరులకు బాధచేయు స్వభావము గలవాని పేర్లు.

పాపము - దుష్కృతము, కలుషము.
పాతి రక్ష్యత స్మాదాత్మానమితి పాపం, పా రక్షణే. - దీనివలన జనము తన్ను రక్షించుకొనును.
పిబతి పాపిష్ఠమితి పాపం, పాపానే. - పాపిష్ఠుని గ్రహించునది.

ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః |
భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే ||

భా|| ఒకడు పాపాలు చేస్తాడు. చాలామంది ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అనుభవించినవారు విడుదలౌతారు. కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు. చేసిన వాణ్ణి మాత్రం ఆ దోషం అంటుకునే ఉంటుంది.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొదించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

శ్వపచుఁడు - చండాలుడు, వ్యు.కుక్కను వండుకొనువాడు.
శ్వానం పచతీతి శ్వపచః, డు పచ్ ష్ పాకే. - కుక్కను వండుకొనువాఁడు.
శ్వానము - కుక్క.
శ్వయతి గచ్ఛతీతిశ్వా, న. పు, టుఓశ్వి గతివృద్ధ్యోః - తిరుగుచుండునది.

వారణసీ మీశ్వరరాజధానీం వసంతు విశ్వేశ్వర మర్చయంతు
శ్వపాచకా నాహుతి పాచకాస్వా ముక్తాంగనా యత్ర సమం వృణితే|

భా|| ఏ పురమునందు యాయజాతులతో సమముగ శ్వపచులను (చందాలుడును) సైతము ముక్తికాంత వరించుచున్నదో యట్టి ఈశ్వరుని పురమైన వారణాశి - కాశీ)కాశీక్షేత్రము నందే నివసింపుడు. పాపరహితులారా! విశ్వేశ్వరుని భక్తి మైఁ బూజింపుఁడు.

అంత్యజుఁడు - చండాలుడు, హరిజనుడు.
హరిజనుడు - అంటరానివాడు, (అస్పృశ్యులకు గాంధీ పెట్టిన పేరు).
అన్తేగ్రామాన్తే వసతీతి-అంతేవాసీ, న. పు. వస నివాసే. - గ్రామము కడపట నుండువాఁడు.

ౘట్టు - 1.చాపరాయి, 2.రాయి, వై.వి.శిష్యుడు, సం.ఛాత్రః.
ౘట్రాయి - చాపరాయి.
ౘాపఱాయి - విశలమైన బండ. 

ఛాత్రాన్తేవాసినౌ శిష్యే -
ఛాత్రుఁడు - శిష్యుడు.
గురోరసచ్చరిత్రం ఛాదయతీతి ఛాత్రః. ఛద అపవారణే. - గురువుయొక్క అనచ్చరిత్రమును గప్పువాఁడు.
అంతేవాసి - 1.శిష్యుడు, 2.హరిజనుడు, విణ.దగ్గరనుండువాడు, 2.ఎల్లయొద్ద నుండువాడు.
గురోరన్తే నికటే వసతీ త్యన్తేవాసీ. స. పు. వస నివాసే. - గురువు యొక్క సమీపమందుండెడు వాఁడు.
శిష్యుఁడు - విద్యకొరకుచేరి సేవించుచు శిక్షింప బడువాడు.
శాసనీయః శిష్యః. శాసు అనుశిష్టా. – శిక్షింపఁదగిన వాఁడు. ఈ 3 శిష్యుని పేర్లు.

వెలివాడ - మాలపల్లె.
గ్రామాన్త ముపశల్యం స్యాత్ -
గ్రామాంతము - మాలపల్లె.
గ్రామస్య అంతం గ్రామాంతం - గ్రామముయొక్క సమీపము.
ఉప్గతః శల్యః కీలకో యస్య ఉపశల్యం - నేల గుఱుతు దెలియటకుఁగాను సమీపమందు శిలగలిగినది. ఈ 2 గ్రామసమీప ప్రదేశము పేర్లు.    

హరిధ్యానము సేయువేళ
అంత్యజువాడకుఁ బోయినట్లున్నది...

చండాలుఁడు - 1.మాలవాడు, రూ.చాండలుడు.
చండాల ఏవ చాణ్డాలః - చండాలుఁడే చాండాలుఁడు.
పులస్కుఁడు - 1.బోయ, 2.మాల, 3.అధముడు, రూ.పుల్కశుఁడు.
పులంతీతి పులాః మహాంతః, తాన్ స్పర్శనేనత్త శాతయతీతి పుల్కసః, పుల మహత్వే, కనగతి శాతనయోః. - పెద్దలను స్పర్శచేతఁ జెఱుచువాఁడు. ఈ 10 మాలవాని పేర్లు. పుళిందుఁడు - బోయ (భాషాజ్ఞానమే లేక అడవిలో తిరుగు బోయ).

తోటి - 1.మాల, చండాలుడు, 2.వేడుక
వేడుక - 1.సంతోషము, 2.వినోదము, 3.కుతూహలము.

శ్రద్ధధానా శ్శుభాం విద్యా మాదదీ తా వరాద్రపి|
అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులా దపి||

తా. మంచివిద్యను జాత్యాదిహీనుని వలన నైనను శ్రద్ధాయుక్తులై గ్రహింప వచ్చును, సద్గుణవతియైన స్త్రీని దుష్కులము వలననైనను గ్రహింప వచ్చును. - నీతిశాస్త్రము

కృష్ణప్రియాత్వభాండీ రే  - చంద్రా చందన కాననే
విరజాచంపకవనే - శతశృంగేచసుందరీ
పద్మావతీపద్మవనే - మాలతీ మాలతీవనే
కుందదం తా కుందవనే - సుశీలా కేతకీవనే|

శబరుఁడు - 1.బోయ, 2.శివుడు. 
శవతి గచ్ఛతి వన మితి శబరః, శు గతౌ. - అడవిని దిరుగువాఁడు.
శబరసంబధిత్వాచ్ఛాబరః - శబరి సంబంధమైనది, పా. సాబరః "సాబరాఖ్యాపరాధే చలోధ్రేపాపేచ పక్వత" ఇతి సకారాదావజయః. శబరీదత్త ఫలాశన రామ్|

కశ్మలము - మలినము, వి.1.మూర్ఛ, 2.బోయపల్లె. 
కశతి తనూకరోతి ఇంద్రియ ప్రచారమితి కశ్మలం. కశ గతిశాతనయోః. - ఇంద్రియప్రచారము నల్పముగాఁ జేయునది.

శబరి యే కులమందు జన్మ మొందె?  
అడవిలో శబరి తియ్యని ఫలాలందియ్యఁ
జేతులొగ్గితివేల సిగ్గుపడక!  

కబంధము - 1.జలము, 2.మొండెము, 3.సముద్రము.
కం శరీరం బద్నాతీతి కబంధం - శరీరమును నిలుపునది.
పా. కమంధమితిపాఠే కం, అంధం ఇతి నామద్వయం. కామ్యత ఇతి కం. కముకంతౌ. - కోరఁబడునది.
అనంత్యనే నేతంధం. అనప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.

కబన్ధో స్త్రీ క్రియాయు క్త మపమూర్ధ కళేబరమ్,
క్రియాయుక్తం = నర్తనక్రియతోఁగూడిన అపమూర్ధకళేబరం = తల పోయిన శరీరము, కబన్ధః = కబంధ మనంబడును.
కం శిరో (అ)స్యబధ్యతే (అ)త్రేతి కబంధః, అ. ప్న. బంధ బంధనే. క మనఁగా శిరస్సు; అది దీనియందు బంధింపఁబడును.
ఇక్కడ బంధన మనఁగా విరుద్ధ లక్షణచేత ఛేదనము. ఈ 2 మొండెము పేర్లు.

రుండము - మొండెము.
మొండెము - తలతెగిన కళేబరము, కబంధము, సం.వి.ముండమ్, (గృహ.) భుజము క్రింది తుంటిపై భాగము, కభంధము, ఊర్థ్వకాయము (Trunk).

సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.

కళేబరము - మేను, శరీరము.
ఆదానాద్యుపయోగితయా కళే కరేబరం వరం కళేబరం, రళయోర్వ బయోశ్చాభేదః - పుచ్చుకొనుట మొదలైన క్రియల కుపయోగించుటచేత హస్తమందు శ్రేష్టమైనది.
కల్యతే ఆద్రియత ఇతి వా కళేబరం, కల సంఖ్యానే. - ఆదరింపఁబడునది.

అంతకాలే చ మామేవ స్మర న్ముక్త్త్వా కలేబరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || - 5

తా|| మరణ సమయమున పరమేశ్వరుడనగు నన్నే స్మరించుచు శరీరమును విడచి వెళ్ళునట్టివాడు, పరమేశ్వరతత్త్వమును పొందును. ఈ విషయమున ఎంతమాత్రము సంశయము లేదు. - అక్షరపరబ్రహ్మ యోగము, భగవద్గీత

కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కసుఁడు - కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్|

కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

కళత్ర సంసర్గ నితాంతభీతాః కాశీంగతాః కాలవశా న్మనుష్యాః,
కళత్రీన స్తేపి కళే బ రా ర్ధే వహం త్యహో ! వారిని ధేః కళత్రమ్|
 
భా|| నరుఁ డొకభార్య సంసర్గము-సంబంధము, చేరిక వలన మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.)తీవ్రమైన భీతిచేతఁ గాశీనగరమున కేగి యచ్చట మరణించి సగముశరీరమునం దొక భార్యను ధరించి పైఁగా సముద్రునిభార్య(గంగ) నొఁదల వహించు చున్నాఁడు. ఔరా! ఎంతచోద్యము ! (శంకరుఁడగు చున్నాడని భావము.)  

దాంతకయాకర కాంత కళేబర
భ్రాంతంమాంతర శాన్త హృదయవర| ||శరవణభవ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగాతరంగైర్విశాలం
శివం శంకరం శంభు మీశానమీడే|| - 2  

సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతః ముఖాన్యన్న సర్వతోముఖం - ప్రవహించునప్పుడు  అంతట ముఖములు గలది. 

సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

అంబుధి - సముద్రము. శ్రవణే సాగరాంబుజా| సముద్ర నవనితము - చంద్రుడు Moon.

అంబువు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము, (ఛం.) ఒకరకపు వృత్తము.
అంబతే అంబు, ఉ. న. అబిరబి లబి శబ్దే. ప్రవహించునప్పుడు ధ్వనియుక్తమై యుండునది. అమతి గచ్ఛతీత్యంభః స-న, అమగత్యాదిషు. - పోవునది. 

అంభోరాశి - సముద్రము. 
అంభోధి - సముద్రము.

అంబుదము - నీటినిచ్చునది, మేఘము, మబ్బు.
అంబు బిభర్త తయంబుభృత్, త-పు, భృఞ్ భరణే. - ఉదకమును భరించునది.

నీరుమోపరి - 1.కడవ, 2.మేఘము.

చేగలవాడు - ఈవికాడు, వదాన్యుడు.
వదాన్యుఁడు - మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.

వదాన్యో వలువాగపి,
వదాన్యశబ్దము లెస్సగా మాటలాడువానికిని, అపిశబ్దమువలన దాతకును పేరు. వద వక్తాయాం వాచి. - మంచిమాటలాడువాడు.   

దానమున్ చేయఁ గోరిన వద్యాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైన బరోపకారమునకై యొకదిక్కునఁ దెచ్చి యైన నీఁ
బూనును, మేఘు డంబుధికిఁబోయి జలంబుల దెచ్చి యీఁయడే
వాన, సమస్తజీవులకు వాంఛిత మింపెసలార, భాస్కరా.

తా. మబ్బు అంబుధి - సముద్రము మందలి నీటిని తెచ్చి అన్ని ప్రాణులను సంతృప్తి కరమగు వాన - వర్షము నిచ్చునట్లే, వదాన్యుఁడు - మిక్కిలి యిచ్చువాడు, ఉదాత్తుడు. తనవద్ద ధనము లేకున్నను యొంకొక చోటి నుండి తెచ్చి యైనను దానము చేయును.  

కంసారాతి - శ్రీకృష్ణుడు.
కంసారాతిః. ఇ-పు. కంసస్య అర్తాతిః - కంసుని శత్రువు.
కంసుఁడు - కృష్ణుని మేనమామ.

అరాతి - శత్రువు.
ఇయర్తి అరాతిః, ఇ.పు. ఋ గతౌ. - సంహరించువాఁడు.

చేరి బలధికుం డెఱిఁగిచెప్పినకార్యము చేయ కుండినన్
పారము ముట్టలే డొకఁనెపంబున, దాఁజెడు నెట్టి ధన్యుడున్,
బోరకపాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టమన్న గం
సారిని గాకుచేసి చెడడాయెనె కౌరవభర్త భాస్కరా.

తా. గొప్పవాడగు కంసారాతి - శ్రీకృష్ణుడు      జరగబోవు కౌరవలు - కురువంశపు వారు.)నాశన మెఱింగి, దుర్యోధనునితో చెప్పగా వాడా తనిని మోసగించి కాకుచేయు-క్రి.1.అవమానించి, 2.అపహరించు, 3.ఆక్రమించు, 4.బాధపట్టు.)తుదకు తానే నశించెను. అట్లే గొప్పవారు రాబోవు ఉపద్రవము తెలిసికొని అది తప్పించుకొను నుపాయము చేరువకు పారము - 1.అవతలిదరి, 2.సమీపము.)వచ్చి చెప్పినను ఎటువంటి ధన్యుఁడు - పుణ్యవంతుడు)డైనను వానిని ఏదో ఒకనెపమున లెక్కచేయక తుదకు నశింతురు.

అఘబకక్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణా|

కృష్ణమూర్తి - కృష్ణావతారము.
ద్వాపరయుగములో, అష్టమి తిథి(శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన)రోహిణీ నక్షత్రం అర్థరాత్రి వ్యాపించిన సమయంలో దేవకిదేవి అష్టమ గర్బాన శ్రీకృష్ణుడు జన్మించాడు.

అష్టము రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకీకిన్
దుష్టుని కంసుఁ వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా.
తా.
లోకమును ధర్మయుక్తముగాఁ బాలించుటకు దేవకీదేవికి(ప్రొద్దు - 1.సూర్యుడు Sun, 2.కాలము, 3.దినము, సం.బృధృః.) రోహిణీ నక్షత్రముతో గూడిన అష్టమితిథినాడు, ఎనిమిదవ బిడ్డవైపుట్టి దుర్మార్గుఁడగు కంసుని చంపితివి. కృష్ణా! నీక్రియలు ధర్మాత్మకములు.

నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
కృష్ణానంత కృపజలధే కంసారే కమలేశ హేరే
కాళియమర్దన లోకగొరో భక్తం తే పరిపాలయ మామ్. - 8

కంౘరము - ఒక రకపు శకటము, సం.కంచరః.
కంచర - కంచుపనిచేసి బ్రతుకుజాతి, సం.కంౘరి, సం.కాంస్యకారః.    

కాంస్యకారుఁడు - కంచర.
కంౘరి - కంచర.
కం(ౘ)చు - ఒక విధమగు లోహము, సం.కంసమ్ (Bronze).

కంసో (అ)స్త్రీ పానభాజనమ్,
కామ్యతే పానార్థమితి కలసః, అ, ప్న, కము కాంతౌ. - పానార్థమై కాంక్షింపఁ బడునది.
పానస్య భాజనం పాన భాజనం - పానము యొక్క పాత్రము. ఈ 2 గిన్నె పేర్లు.

కంసము - 1.కంచు, 2.కంచుపాత్రము. 
కాంస్యము - 1.కంచు, 2.లోహపాన పాత్ర.

ద్విధాతుకము - (రసా.) రెండు ధాతువులు కలిసియున్నది (Bimetallic), ఉదా రాగి, తగరము అను రెండు ధాతువుల మిశ్రమము కంచు, ద్విధాతుక మిశ్రము.
కం(ౘ)చుకొమ్ము - ఒక రకపు వాద్యము.

గిన్నియ - 1.లోహాది పాత్రము, 2.పానపాత్రము, రూ.గిన్నె.
గిన్నె - గిన్నియ.

అల్పు డెపుడు పల్కు నాదంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వ.

తా. అల్పుఁడు - నీచుడు) డంభములు చెప్పుచుండును, సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు,2.మంచివాడు.) మెల్లగ మాటలాడుచుందురు. తక్కువఖరీదైన లోహము అయినను కంచు Bronze దడదదమని మ్రోగునట్లు యెక్కువఖరీదైన కనకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.)అనులోహము మ్రోగదు గదా!          

8. గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి. 
భీషం సూత ఇతి భీష్మసూ. ఊ. సీ. షూజ్ ప్రాణిప్రసవే. - భీష్మునిఁ గన్నది.    

అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగు వాడు, విష్ణువు.
అధోక్షజః అధకృతాని అక్షాణీంద్రియాణి యస్మిన్ కర్మణి తర్యథా తథా జాతః తదుక్తం. శ్లో 'యస్యేద్రియం ప్రమథితుం ప్రమదా న శక్తా' ఇతి ఇంద్రియములను అధఃకరించి జనించినవాఁడు.
అధోక్షాణాం జితేంద్రియాణాం జాయతే ప్రత్యక్షీభవతీతి వా అధోక్షజః - జితేంద్రియులకు ప్రత్యక్ష మగువాఁడు. 
అధఃకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం యనేతి వా - ఇంద్రియజన్యజ్ఞానమును అధఃకరించినవాడు.

అధోక్షకము - (జం.) భుజమునకును శరీరభిత్తిక కును సంబంధించినది (రకనాళము) (Subclavian).

ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.

జితేంద్రియుఁడు - ఇంద్రియములను జయించినవాడు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రనక్షత్రమని కొందరు.

గాంగేయుఁడు - గాంగుడు. 
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.    
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.   

భీష్ముఁడు - 1.శంతను పుత్త్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
భీష్మము - భయానక రసముగలది, విణ.భయంకరమైనది.
భీషణము - భయానక రసముగలది, విణ.భయంకరమైనది.
భీ - భయము; భీతి - భయము, బెదురు.
బిభేత్యస్మాదితి భీషణం, భీష్మం, భీమం, భయానకము చ. - అధీరుఁడు దీనిచేత వెఱపుఁజెందును గనుక భీషణము, భీష్మము, భీమము, భయానకము.

కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
కొమరుసామి - స్కందుడు; స్కందుఁడు - కుమారస్వామి.
కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొమరుదనము, కొమరు ప్రాయము+ యౌవనము).

పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
పురంతి ప్రాణినామగ్రే గచ్ఛంతీతి పురుష, పూర్షాశ్చ, పుర అగ్రగమనే. - ప్రాణులకెల్ల అగ్రేసరులు గనుక పురుషులు, పూరుషులు.
పూరుషుఁడు - మనుష్యుడు.
మనుష్యుఁడు - మానిసి, మానవుడు.   

భువి - 1.భూమి, 2.స్థానము. 

పరసతుల గోష్టినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
గరిత సుశీలయైనను,
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ.

తా|| బ్రహ్మచారియైన గాంగేయుఁడు - గాంగుడు భీష్మునంతటి వాడైనను ఇతర స్త్రీలతో గోష్ఠి - 1.పరిషత్తు, సభ, 2.ఇష్టాగోష్ఠి.)జరిపినచో అట్టి వానిని అనుమానించును. అట్లే యెంతటి గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.)సుశీలయైన స్త్రీ అయినను అన్య పురుషుల సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.)పోషణలోవున్ననింద - దూరు, అపనిందల పాలగును. 

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||

విశ్వంభరుఁడు - విష్ణువు.
విశ్వంభరః, విశ్వం బిభర్తీతి విశ్వంభరః - విశ్వమును భరించువాఁడు.
విశ్వ - భూమి.
విశ్వం బిభర్తీతి విశ్వంభరా, భృఞ్ భరణే. - విశ్వమును భరించునది.
విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి. (భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe).
విశతి సర్వత్ర విశ్వం, విశ ప్రవేశనే. - అంతటఁ బ్రవేశించునది.
విశతి రోగిణః హృదయే విశ్వా, విశ ప్రవేశనే. - రోగిహృదయమందు ప్రవేశించునది. విశ్వము నందు విశ్వేశ్వరి|

విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.

లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
లోక్యతే సర్వ మస్సిన్నితి లోకః, లోకృ దర్శనే - సర్వము దీనియందుఁ గానఁబడును.   
లోకములు - స్వర్గమర్త్య పాతాళములు, భూలోకము, భువలోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఈ యేడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, మతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము, ఈ యేడును అధోలోకములు.

ఏకానేక స్వరూపవిశ్వేశ్వర యోగిహృది ప్రియవాసశివ |

విష్టపము - లోకము.
విశం త్యస్మిన్నితి విష్టపం, విస ప్రవేశనే. - దీనియనుఁ బ్రవేశింతురు.
త్రివిష్టపము - స్వర్గము.
తృతీయం విష్టపం = భువనం-త్రివిష్టపమ్, అ-న. మూఁడవలోకము గనుక త్రివిష్టపము. 

ప్రపంచము - 1.లోకము, 2.సంసారము, 3.విరివి.
సంసారము - 1.ఆలుబిడ్డలతోడి వునికి, 2.ప్రపంచము.
ప్రపంచించు - క్రి.విరివిచేయు.  

విపర్యానే విసరే చ ప్రపఞ్చః -
ప్రపంచశబ్దము వైపరీత్యమునకును, విరివికిని పేరు. ప్రపంచ్యత ఇతి ప్రపంచః పచ విస్తారే. - విస్తరింపఁబడునది, విస్తరించుటగనుక ప్రపంచము. ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం|

దేవీ కృతాభిషేకాయామ్ -
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దేవపుత్రీసంజ్ఞకత్వాద్దేవి, సి, దేవపుత్రి యను పేరుగలది(దేవి).
దివ్యతీతి దేవి, ఈ. సీ. దివుక్రీ డాదౌ. - ప్రకాశించునది. 
దీవ్యతీతి దేవీ, దివు క్రీడాయాం. - క్రీడించునది. ఈ ఒకటి పట్టభిషిక్తురాలైన రాజభార్య (రాణీ) పేరు.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

విశ్వసృజుఁడు - బ్రహ్మ.
విశ్వం సృజతీతి విశ్వసృట్ జ-పు. - విశ్వమును సృజించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింసచేయువాడు.
ద్రుణినః ద్రుహతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులకు హింసచేయువాఁడు, ద్రుహ జిఘాం సాయాం.
దుగినుఁడు - ద్రుహిణుఁడు, బ్రహ్మ, సం.దుహిణః. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహ్ణాతి పురుషేణార్జితం ధనమితి గృహం, గేహం చ గ్రహ ఉపాదానే. - పురుషునిచే సంపాదింపఁ బడిన ధనమును గ్రహించునది.
గృహిణి - ఇల్లాలు, భార్య.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
మహిమా - 1.గొప్పదనము, 2.ఐశ్వర్యము.
మహత్వేన మహిమా|
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.) పురుషవాచక శబ్ద సంజ్ఞ.
మహ్యతే పూజ్యత ఇతి మహత్, త. మహ పూజాయాం. - పూజింపఁబడునది.

తురీయము - బ్రహ్మము, విణ.నాలగవది, రూ.తుర్యము.

గిరా మాహు ర్దేవీం - ద్రుహిణగృహిణీ మాగమ విదో
హరేః పత్నీం పద్మాం - హరసహచరీ మద్రిత నయామ్,
తురీయా కా(అ)పి త్వం - దురధిగమనిస్సీమ మహిమా
మాహామాయా విశ్వం - భ్రమయసి పరబ్రహ్మ మహిషి! - 97శ్లో

తా. ఓ పరబ్రహ్మ స్వరూపిణీ! వేదాంతవేత్తలు నిన్ను బ్రహ్మ భార్యయగు సరస్వతిగను, (హరి)విష్ణుపత్ని-భార్య ఫద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర.)గను, హరుఁడు - శివుడు భార్య సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.)పార్వతిగా చెప్పుచున్నారు. నీవా మువ్వురిని మించినదానవై పొందరాని అంతులేని మహిమగల గొప్ప మాయాప్రకృతివై ప్రపంచమును భ్రమింప చేయు చున్నావు. - సౌందర్యలహరి

పద్మినీవల్లభుఁడు - సూర్యుడు.
పద్మిన్యాః వల్లభః పద్మినీ వల్లభః - తామరతీఁగకుఁ బ్రియుఁడు.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ.  

కైటభజిత్తు - వెన్నుడు, హరి.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు. 
కైటభజిత్. త-పు. కైటభమసురం జితవాన్ - కైటభుఁడనెడి యసురుని జయించినవాఁడు జి జయే. ప్రధమం తు హరిం విద్యాత్|

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు,  3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.    
బృంద - తులసి(తొళసి-తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి. కృష్ణ మేకాదశం| 
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.

గోవు - 1.ఆవు cow, 2.భూమి earth, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు Sun.
గచ్ఛతి స్వస్థానమితిగోః, ఓ. సీ. - ఉనికిపట్టునకుఁ బోవునది.
గచ్ఛతి గమ్యత ఇతి వా గౌః, గమ్ ఌ గతౌ. - పోవునది గనుకనైనను, పొందఁబడునది గనుక నైనను గోవు.

భూమిజ- సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ. 

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు,మరీచి).

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||

తా. విష్ణువు చేతగాని, హరుఁడు - శివుడుచేతగాని, బ్రహ్మ చేతగాని, ఇతరమైన దేవతల చేతగాని నొసట లిఖితము-వ్రాయబడినది, వి.అక్కరము.)వ్రాత తుడిచివేయ నలవిగాదు (మనుష్య మాత్రుల చేత కాగలదా!) - నీతిశాస్త్రము

విధువు - 1.చంద్రుడు Moon, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
దేవా ఏనం విశేషేన ధయంతి పిబంతీతి విదుః, ఉ. పు. ధేట్పానే - వేల్పు లీతని మిక్కిలి పానము చేయుదురు. 
విధుః ఉపు విధ్యతి ప్రత్యర్థిన(ప్రత్యర్థి - శత్రువు) ఇతి విధుః - శత్రువులను వ్యథపెట్టువాఁడు.

విధు ర్విష్ణా చన్దమసి -
విధుశబ్దము విష్ణువునకును, చంద్రునకును పేరు. వ్యధత ఇతి విధుః వ్యధతాడనే. అసురులను అంధకారమును బోఁగొట్టువాఁడు.

విదుంతుదుఁడు - రాహుగ్రహము Rahu.
విధుం తుదతీతి విధుంతుదః, తుద వ్యథనే - విదు వనఁగా చంద్రుఁడు వానిని వ్యథఁ బెట్టువాడు. వ్యథ - బాధ, క్లేశము, ఆయాసము.
విథ్యంతే అనయేతి వ్యథా, వ్యథ భయచలనయో. - దీనిచేఁ జనులు భయపడుదురు లేక చలింతురు గనుక వ్యథ.

సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి.
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ. 

విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
విధధాతి సర్వం విధాతా-ఋ-పు. సర్వముఁ జేయువాఁడు. డు ధాఙ్ ధారణ పోషయో.

సనత్కుమారో వైధాత్రః -
సనత్ సనాతనో బ్రహ్మతస్య కుమారః సనత్కుమారః - బ్రహ్మకుఁ గుమారుఁడు.
సనత్ నిత్యం కుమారావస్థత్వాద్వా - ఎల్లప్పుడు(సదా - ఎల్లప్పుడు)కుమారావస్థయం దుండువాఁడు. విథాతు రపత్యమః-వైధాత్రః - విధాత కొమారుఁడు. ఈ 2 బ్రహ్మకొడుకు పేర్లు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు,మరీచి).

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు. 
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విదధాతీతి విధిః- ఇ-పు. - సర్వముఁ జేయువాఁడు.
విధీయతే అనేనేతి విధిః, ఈ-పు. - దీనిచేత విధింపఁబడును.  
విధి ర్విధానే దైవే పి : విధి శబ్దము చేయుటకును, అపిశబ్దము వలన బ్రహ్మదేవునికిని, ప్రకారమునకును, విధాయక వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః, పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్థే పజాపతా"వితి శేషః.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును. విధి భవ ముఖ సురసంస్తుత రామ్|

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి. 

సపత్నుఁడు - శత్రువు.
సప్త్నీవ దుఃఖ హేతుత్వాత్ సపత్నః. - సవతివలె దుఃఖహేతువైనవాఁడు.
సమానపతిత్వాద్వా సపత్నః. - సమానపతిత్వ గలవాడు.    

సరస్వత్యా లక్ష్మ్యా - విధిహరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం - శిథిలయతి రమ్యేణ వపుషా| 
చిరం జీవన్నేవ - క్షపితపశుపాశ వ్యతికరః
పరానందాభిఖ్యం - రసయతి రసం త్వద్భ జనావాన్|| - 99శ్లో

తా. తల్లీ! భగవతీ! నిన్ను భజించు నీ భక్తుడు సరస్వతీదేవితోను, లక్ష్మీదేవితోను చిరంజీవియై విహరించువాడై, బ్రహ్మకు విష్ణువుకును నసూయ పుట్టించును. రమ్యేణ వపుషా - అతి రమ్యమైన తనువుచే మన్మథుని సౌందర్యముతో తుల్యమైన కాంతి సౌందర్యము పుట్టించి శాంబరి - 1.మాయ, 2.రతీదేవి.) పాతివ్రత్యము సడలించువాడగును - ఆమె పాతివ్రత్యమునకు శిథిలము - సంధులు వదలినది, శ్లథము.)కలిగించు వాడగును. చాలా కాలము బ్రతికియు అవిద్య నశించిన జీవునితో గలసి(జీవన్ముక్తుడై సదా శివతత్త్వాత్మకుడై) బ్రహ్మానంద రసమును పానము చేయు చున్నాడు. - సౌందర్యలహరి   

సరస్వతితో విహరించుట బ్రహ్మకు అసూయ, ఆయనకు శత్రువు.  
లక్ష్మీదేవితో చిరంజీవియై విహరించుటచేత విష్ణువునకు అసూయ, ఆయనకు శత్రుత్వము. 
సరస్వతీ దేవితో విహరించుట యనగా సకల విద్యాపతియగుటయని, లక్ష్మీదేవితో విహరించుట యనగా సిరిసంపదలతో తులతూగుట యనియు భావము.

కౌస్తుభవక్షుడు - విష్ణువు. వక్షస్తలే కౌస్తుభం|
శ్రీవత్సలాంఛనః శ్రీవత్స్సోనామ వక్షఃస్థలే మహాపురుష లక్షణో రోమావర్ణ విశేషః స ఏవ లాఞ్చనం యస్యసః - వక్షః స్థలమందు మాహాపురుషలక్షణమైన శ్రీవత్స మనెడు మచ్చ గుఱుతుగాఁ గలవాఁడు.    

కౌస్తుభో మణిః (చాప శ్శార్ఙ్గ మురారేస్తు శ్రీ వత్సో లాఞ్ఛానం మతమ్,)
కౌస్తుభః కుంస్తోభత ఇతి కుస్తుభో హరిః, తస్యాయం కౌస్తుభః - భూమిని నిలిపిన విష్ణుని సంబంధమైనది.
కౌస్తుభము - విష్ణువక్షస్స్థలము నందలి మణి, వ్యు.కుస్తుభ = సముద్ర మందు పుట్టినది. 
విష్ణుభస్తమ్భే కుంస్తుభ్నాతి వ్యాప్నోతీతి కుస్తుభస్సముద్రః - తత్ర భవతీతివా కౌస్తుభః - సముద్ర మందుఁ బుట్టినది.
దేవమణి - 1.కౌస్తుభము, 2.గుఱ్ఱము మెడ మీది సుడి.
ఈ ఒకటి విష్ణువు యొక్క మణిపేరు. విష్ణువు ధనుస్సు శార్ఙ్గము. పుట్టుమచ్చ శీవత్సము. 

నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము.

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః, ఈసీ, శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది, శ్రిఞ్ సేవాయాం.

ఊరక వచ్చుఁ బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగఁగల్గువానికిఁ, బ్రయాసము నొందిన దేవ దానవుల్
వారలటుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగదె శృం
గారపుఁ బ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు, భాస్కరా.

తా. సురాసురలు అమృతమునకై మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి యను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభము, కల్పవృక్షము, కామధేనువు పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో "లక్ష్మియు, కౌస్తుభ రత్నము" అను నీ రెండును ప్రయాస పడకుండనే శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.)నకు లభించెను. అదృష్టవంతున కభివృద్ధి కలుగబోవు నెడల నతడే ప్రయాసమును బడకుండ గనే అతనికి భాగ్యము కల్గును. 

4. శ్రీ కాళహస్తి - శ్రీకాళహస్తి క్షేత్రమునకు పడమరగా స్వర్ణముఖి నది వుంది.  

చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి యందు శ్రీకాళహస్తిశ్వరుడు, వాయులింగము.

వాయులింగం : ఆంధ్రప్రదేశ్ లో తిరుపతికి అతి దగ్గరలోని శ్రీకాళహస్తిలో ఉంది. భక్తకన్నప్ప సేవించి, తరించిన ఈ వాయులింగం గర్భగుడిలో చిన్న కన్నంగాని, మరే ఇతరప్రదేశాల నుంచి గాలి, వెలుతురు వచ్చే అవకాశం లేదు. అయినా కాంతి వుంటుంది. అందువల్లే దీన్ని వాయులింగ మంటారు. 

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీకంఠుఁడు - శివుడు, కరకంఠుడు.

పూర్వము ఒక అడవిలో ఒక శివలింగం వుంది. ఏనుగు ఒకటి రోజు సువర్ణముఖి నది(మొగలేఱు - సువర్ణముఖినది)లోస్నానంచేసి కొంత నీరు పుక్కిలిపట్టి తెచ్చి, ఆ నీటితో లింగానికి అభిషేకం చేసి, పూలు పత్రి తెచ్చి పూజ చేసేది. ఏనుగు వెళ్ళిపోగానే ఒక పామువచ్చి ఆ ఆకులూ, పూలూ పక్కకు జరిపి రత్నాలతో పూజించేది. ఒక సాలెపురుగు కూడా స్వామిచుట్టూ గూడు అల్లి సేవించేది. అయితే ఒకరిపూజ మరొకరికి నచ్చేది కాదట. పత్రి, పూలు తొలగించి ఎవరో రాళ్ళు తెచ్చి స్వామిపై వేశారని ఏనుగు బాధ పడితే, రత్నాలు నెట్టివేసి ఆకులలములు కప్పారెవరో అని పాము కోపగించేదట. చివరకు ముగ్గురూ స్వామి అనుగ్రహంతో ముక్తి పొందటతో కధ సుఖాంతమైంది. ఆ శివలింగమే శ్రీకాళహస్తీశ్వరుడుగా (శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అర్ధం ఏనుగు) అను పేరు పొందింది.     

సలిలమ్మున్ జుళుక ప్రమాణ, మొకపుష్పమ్మున్, భవన్మౌళి ని
శ్చల భక్తిప్రతిపత్తిచే నరుడు పూజల్ సేయగా ధన్యుడౌ
నిల గంగానదిఁ జంద్రఖండమును దా నిందుం దుదిం గాంచు నీ
చెలువం బంతయు నీమహత్త్వముదిగా! శ్రీకాళహస్తీశ్వరా!
తా||
ఈశ్వరా! ఒక భక్తుడు నీయందలి పరమభక్తితో నీ లింగముపై అరచేతి గుంటెడు నీళ్ళుపోసి, దానినే గంగానదిగాను, ఒకపుష్పమునుంచి దానిచే చంద్రరేఖగాను భావించి అమందానందము నుందును. అది నీ మహత్వము వలననే కదా! అనగా ఈశ్వరుని దయ సంపాదించినవారు ఏ స్వల్పము చేసినను దాని నాయన ఘనముగానే స్వీకరించి యను గ్రహించునని భావము. కొండంత దేవునకు మరి 'కొండతయు పత్రియిడెది కుశలులు గలరే?’

మరియొక అర్థము : శంకరా! కొంచెము నీళ్ళును, ఒక పుష్పమును పరమభక్తితో నీ శిరస్సున నుంచినవాడు ధన్యుడై, జీవన్ముక్తుడై నీ దర్శన భాగ్యమును బొంది, నీతలపై గంగను, చంద్రరేఖను గూడ చూడగల్గును.   

మును నీచే నపవర్గ రాజ్య పదవీ మూర్ధభిషేకంబుఁ గాం
చిన పుణ్యాత్ములు నేను నొక్కసరివో! చింతించి చూడంగ నె
ట్లనినన్ గీట ఫణీంద్రపోత మదవేదం డ్రొగ హింసా విచా
రినిఁ గాగా, నినుఁ గాన గాక మదిలో శ్రీకాళహస్తీశ్వరా!
తా||
శంకరా! ఇదివరలో నీవల్ల మోక్షము నొందిన పుణ్యాత్ములును నేను సమానులమే. ఎట్లందువా? సేవా విషయములో సాలెపురుగు, పాము, ఏనుగు, కిరాతకుడైన తిన్నడును, నేనును సమానులమే కదా! వారు నిన్ను ఆత్మలో దర్శించినవారు, నేను దర్శింపలేదు; అంతే, చిన్న భేదము గదా! వారికిచ్చినట్లు నాకు గూడ మోక్షమీయరాదా? - ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్రకవి.)

5. పట్టిసము - 1.అడ్డకత్తి, 2.ఒక దివ్యక్షేత్రము.
మొహదా -
అడ్డకత్తి, పట్టిసము.
అడ్డకత్తి - (అడ్డము+కత్తి) పట్టాకత్తి, పట్టిసము.

పట్టాకత్తి - రెండువైపుల పదను గల కత్తి.
పాటకము -
1.పట్టాకత్తి, 2.సేనా నివేశము.
దోదుమి - పట్టకత్తి, రూ.దోదుమ్మి.
తరవరి - తరవారి, పట్టాకత్తి, రూ.తరవలి, హిం.తల్వార్.
తరవారి - తరవరి.
పట్టసః - ఆయుధవిశేషము. 

తలవరి - ఊరికావలివాడు, రూ.తలారి, సం.స్థలవారః.

అశని శతఘ్నీ ఖడ్గీ పట్టసీ చాయుధీ మహాన్,
స్రువహస్త స్సురూపశ్చ తేజ స్తేజస్కరో నిధిః| – 44శ్లో

 shiva_dream

No comments:

Post a Comment