Wednesday, January 25, 2017

తేజము

భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటినీ ధరించునది.
భూతాత్మము - దేహము.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము), 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.

తేజము - 1.ప్రకాశము, 2.ప్రభావము, 3.పరాక్రమము, 4.రేతస్సు, రూ.తేజస్సు.
తేజయతి తనూకరోతి స్రవణానంతరం తేజః, స. న. తిజ నిశాశనే. - ౙాఱినమీఁదట కృశునిగాఁ జేయునది.

తేజః ప్రభావే దీప్తౌ చ బలే శుక్రే (అ)పి -
తేజశబ్దము ప్రభావమునకును, కాంతికిని, బలిమికిని, రేతస్సునకును, అపిశబ్దము వలన తిరస్కారము నొర్వకుండుటకును పేరు. 'అధిక్షే పావమానాదేః ప్రయుక్తస్య పరేణ యత్, ప్రాణత్యయే (అ)వ్యవస్థానం తత్తేజ స్సముదాహృతం ' అని. తేజయతీతి తేజః, స. న. తిజ నిశాశనే. - కృశముగాఁ జేయునది. 

తేజస్వి - తేజము గలవాడు.  
తేజు - 1.తేజము, ప్రకాశము, 2.ప్రతాపము, సం.తేజః.

ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
వెలుఁగు -
1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - 1.వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.

ప్రకాశో అతి ప్రసిద్దే అపి -
ప్రకాశ శబ్దము మిక్కిలి ప్రసిద్ధమైనవానికి పేరగునపుడు త్రి. అపి శబ్దము వలన, ఎండ మొదలయిన వెలుఁగునకును పేరు. ప్రకాశతే, ప్రకాశం చ ప్రకాశః. కాశృ దీప్తౌ. ప్రకాశించునదియు, ప్రకాశించుటయు, ప్రకాశము. ' ప్రకాశః కాశవా నపి ' ఇతి శేషః.    

తేజః క్షమా ధృతి శ్సౌచ మద్రోహో నాతి మానితా |
భవన్తి సమ్పదం దైవీ మభిజాతస్య భారత || - 3శ్లో 
తా||
తేజము, క్షమ - 1.ఓర్పు Patience, 2.నేల, 3.మన్నింపు.), ధృతి - 1.ధైర్యము, 2.ధరించుట, 3.సంతోషము, 4.సౌఖ్యము.), శుచిత్వము, అసూయారాహిత్యము, అత్యంత గౌరవము పొందియు నమ్రత్వము గలిగి యుండుట, భారతా! ఈ దివ్య గుణములు శుద్ధసత్త్వమయ వాసనలతో దైవీసంపద్యోగ్యతతో జన్మించినవారికి కలుగును. - దైవాసుర సంపద్విభాగయోగము, భగవద్గీత

ద్యోతము - 1.ప్రకాశము, 2.ఎండ.
ద్యోతకము -
1.ప్రకాశింపచేయునది, 2.ప్రకాశించునది.
ద్యోతించు - ప్రకాశించు.
ద్యోతితము - 1.ప్రకాశితము, 2.స్ఫురింప చేయబడినది.

వెలుతురు - 1.ఎండ, 2.ప్రకాశము.
ఎండ -
సూర్యప్రకాశము, ఆతపము.
ఆతపము - 1.ఎండ, 2.వెలుతురు.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
ఎండదొర - సూర్యుడు.

ప్రకాశో ద్యోత ఆతపః -
ప్రకాశతే ప్రకాశః, కాశృదీప్తౌ - ప్రకాశించునది.
ద్యోతతే ద్యోతః, ద్యుతదీప్తౌ - ప్రకాశించునది.
ఆ సమంతాత్తపతీత్యాతపః, తప సంతాపే - అంతటఁ దపించునది. ఈ 3 ఎండ పేర్లు.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 2.సూర్యమండలాంతర్గత విష్ణువు. ద్వాదశాత్ముఁడు - సూర్యుడు.

అదితేరపత్యం ఆదిత్యః - అదితి కొడుకు.
ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా న. పు. – పండ్రెండు విధములైన మూర్తులుగలవాఁడు. 

నేక్షేతోత్యంత మాదిత్యంనా స్తంయాంతంకదాచన|
ప్రతిబింబం సనారిస్థం సమధ్యం నభసోగతం||
తా.
సూర్యు (డు)ఉదయించుచున్నప్పుడు, అస్తమయ మగు చున్నపుడు, ఆకాశమధ్యంబును బొందియున్నపుడు ప్రతిసూర్యుని (అనగా ఉదకమందలి సూర్య ప్రతిబింబమును) జూడగూడదు. – నీతిశాస్త్రము

భా - 1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు.
భానువు -
1.సూర్యకిరణము, 2.సూర్యుడు.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.
బావ - తోడపుట్టిన దాని మగడు, సం.భావుకః.
భావుకుఁడు - తోడపుట్టిన దాని మగడు, బావ.
భామ - స్త్రీ. భామలలో దెవీస్థానం తిలోత్తమ.
భామము - 1.క్రీడాసమయమందు కోపము చూపెడు స్త్రీ, 2.స్త్రీ.

ప్రభావము - 1.ప్రతాపము, 2.తేజము.
ప్రతాపము -
1.తేజము, 2.వేడిమి.
వేఁకి - 1.జ్వరము, 2.వేడిమి(తిగ్మము – వేడిమి), 3.అగ్ని.
జ్వరము - వేకి. జ్వరితుఁడు - జ్వరము కలవాడు.
వేఁడి - 1.తాపము, 2.చురుకు, 3.వాడిమి, 4.ప్రకాశము.
వేఁడికంటి - ఉగ్రాక్షుడు, శివుడు.
వేఁడివేలుపు - 1.వహ్ని, 2.సూర్యుడు.
వహ్ని - అగ్ని.

మహస్సు - 1.తేజము, 2.వెలుతురు, 3.యజ్ఞము, 4.ఉత్సవము.

అగ్నిహోత్రము - 1.అగ్ని, 2.హోమము, 3.హవిస్సు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
హోమము - వేల్మి, యజ్ఞము.
హవిస్సు - వేల్చుటకు ఇగురు బెట్టిన అన్నము.
హవ్యవాహనుఁడు - అగ్ని, రూ.హవ్యవహుఁడు.

శుష్మము - 1.బలిమి, 2.తేజస్సు, 3.నిప్పు.

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య స్వాహాదేవి.
స్వాహా -
అగ్నిభార్య. (మహేశ్వరీపురము నందు దేవీస్థానం స్వాహా.)

త్రేత - 1.రెండవయుగము, 2.గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అను మూడగ్నులు, త్రేతాగ్ని.
ముచ్చిచ్చు -  (మూడు+చిచ్చులు) త్రేతాగ్ని (గార్హస్పత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని).
గార్హపత్యము - 1.మూడు శ్రౌతాగ్నులలో ఒకటి, (మూడు శ్రౌతాగ్నులు గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని), 2.గార్హస్థ్యము.
ఆహవనీయము - హోమము చేయదగినది (హవిరాది), వి.త్రేతాగ్నులలో ఒకటి, (తక్కిన రెండు: 1.దక్షిణాగ్ని, 2.గార్హపత్యాగ్ని).
గార్హస్థ్యము - 1.గృస్థాశ్రమము, 2.గృహస్థధర్మము, 3.గృహస్థుడు ప్రతి దినము అనుష్ఠింపవలసిన పంచయజ్ఞములు మొ.వి.  

ఔపాసనము - గృహస్థుడగు బ్రాహ్మణుడు ప్రాతఃకాలమునందు చేయు అగ్ని ఉపాసన.

ప్రణీతము - మంత్రముచే సంస్కరింప బడిన అగ్ని.

అగ్నిహోత్రం గృహంక్షేత్రం గర్భిణీంవృద్ధ బాలకా|
రిక్త హస్తేన నోపేయాద్రాజానాం దైవతం గురుమ్||
తా.
అగ్ని హోత్రునకు మంత్ర పూర్వ కాహుతు లిచ్చునప్పుడును, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలురు, రాజులు, దేవుడు వీరలకడకు వట్టి చేతులతో బోరాదు, అనఁగా ఫలాదులు తీసికొని పోవలయును. - నీతిశాస్త్రము

అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
బ్రాహ్మణుఁడు -
పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.
బ్రహ్మవర్చస్సు - బ్రాహ్మణతేజము.

బాఁపడు - బ్రాహ్మణుడు, సం.బ్రాహ్మణః.
బాఁపత - బ్రాహ్మణి.

జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.

చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్చఱ, సం.శుచిః.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధుడైన మంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమినది.
చిచ్చఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.

శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టు ముడికలవాడు.

సెక - శిఖ, జ్వాల, వేడిమి, రూ.సెగ, సెవ, సం.శిఖా.
సెక కంటి -
శివుడు, చిచ్చుకంటి.
సెక వెలుగు - సూర్యుడు.
సెకఱేఁడు - అగ్ని, రూ.సెగఱేడు, వ్యు.మంటలు గలవాడు.

త్విట్టు - 1.జిగి, కాంతి, 2.మంట, 3.వెలుగు, రూ.త్విష.
త్విషాంపతి - సూర్యుడు.

హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.

జ్వాల - మంట, సం.వి. (రసా.) పరిశోధనాగారములో బున్సెన్ బర్నర్ (దాహిని) వంటి గొట్టముల ద్వారా పంపబడు బంధన వాయువును జ్వలింపచేసి నపుడు లభ్యమగు తేజోవంతమైన గాలుల ప్రవాహము, (Flame).
జ్వలనము - 1.మంట, 2.అగ్ని.
జ్వాలాజిహ్వుఁడు - అగ్ని.

శోచిస్సు - 1.సూర్యకిరణము, 2.మంట.
శోచిష్కేశుఁడు - అగ్ని, వ్యు.జ్వాలలే జుట్టుగా కలవాడు.

మంట - 1.రోషము, 2.జ్వాల, 3.చురుకుమను నొప్పి.
మంటమారి - జ్వలనశీలుడు, కోపశీలుడు.

ఉదర్చి - 1.శివుడు, 2.అగ్ని, విణ. పై కెగయు జ్వాలలు కలది. 

తపన - తాపము, రూ.తపనము.
తబము -
తపము, తపస్సు, సం.తపస్.
తబసి - తపసి, తపస్సు, సం.తపస్.
తపస్వి - తపస్సు చేయువాడు.
తపస్విని - తాపసురాలు.
తపనుఁడు - సూర్యుడు.

తపమున బ్రహ్మచర్యమున దానములన్ శమ సద్దమంబులన్
జపముల సత్యశౌచముల సన్నియమాది యమంబులన్ గృహ
నిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తను వాక్యజంపుఁ బా
పపు గుదిఁ ద్రుంతు రగ్ని శతపర్వ వనంబుల నేర్చుకైవడిన్.
భా||
వివేకము, ధర్మజ్ఞానము, శ్రద్ధ గలవారు తపస్సు, బ్రహ్మచర్యం, దానం, అంతరింద్రియ నిగ్రహం, బాహేంద్రియ నిగ్రహం, త్యాగము, జపం, సత్యం, శుచిత్వం, యమ (సత్యము, అహింస, పరధనం అపహరించాలనే తలపు లేక పోవడం (బ్రహ్మచర్యము, భోగసాధనము లను పోగుచేయకుండుట), నియమాలు (శౌచము, సంతుష్టి, తపస్సు, స్వధ్యాయము, ఈశ్వర శరణాగతి), మొదలైన ఉత్తమ గుణాలను అలవరచుకొని మనోవాక్కాయ కర్మలకు సంబంధించిన పాప సముద్రాన్ని అగ్నిదేవుడు వెదురు పొదలను దహించివేసినట్లు దహించివేస్తాడు. తేజస్సు కోరేవాడు అగ్నిని ఆరాధించాలి.

తాపత్రయము - మూడు విధములైన తాపములు - ఆధ్యాత్మికము, అధిదైవికము, ఆధిభౌతికము.

ఆధ్యాత్మికము - 1.మనశ్శరీరాదుల వలన కలిగినది, (శోక జ్వరాది దుఃఖము, ఇది తాపత్రయములలో ఒకటి).
ఆధిభౌతికము - వ్యాఘ్రసర్పాది భూతములవలన కలిగినది, (ఇది తాపత్రయములలో ఒకటి).

వేండ్రము - తాపము.
తాపము -
1.వేడిమి, 2.బాధ(పీడ – బాధ), సం.వి.(భౌతి.)వేడి(Hot). ఉష్ణము - 1.వేడి, 2.ఎండకాలము, విణ.1.వేడికలది, 2.కోపోద్రేకము గలది.
కాఁక - 1.జ్వరము, 2.తాపము, 3.కోపము, విణ.వేడియైనది.
కాఁకవెలుగు - సూర్యుడు, ఉష్ణ రశ్మి.
ఉష్ణ రశ్మి - సూర్యుడు. 

కందు - 1.తాపము, 2.నలుపు, ఉదా.చంద్రబింబములోని కందు, 2.శిశువు, క్రి.1తప్తమగు, 2.వాడు, 3.కృశించు.
కందుఁడు - కుమారస్వామి, సం.స్కందః.

చింతాజ్వరో మనుష్యాణాం వస్త్రాణామాతాపోజ్వరః|
అసౌభాగ్యంజ్వరః స్త్రీణామశ్వానాంమెథునం జ్వరః||
తా.
ఎల్లప్పుడు ఏదైన చింతతో నుండుటయే మనుష్యులకు జ్వరము, వస్త్రములకు వేడిమియే జ్వరము, స్త్రీలకు సౌభాగ్యములేక పోవుటయే జ్వరము, గుఱ్ఱములకు మైథునం (మైథునము - 1.గ్రామ్యధర్మము, 2.కూడిక, సంయోగము.)బొనర్చుటయే జ్వరమని యెఱుంగ వలయును. – నీతిశాస్త్రము. 

గోహరి - పరాక్రమము.
పరాక్రమము -
1.బలము, 2.శౌర్యము.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్త - సత్వము, శక్తి, రూ.సత్తువ.
శౌర్యము - శూరత్వము, ప్రౌఢిమము.
శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు(నిపుణుఁడు - నేర్పరి), 2.ప్రవృద్ధుడు.
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణత - కౌశలము, నేర్పరితనము (Skill).
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
సమర్థుఁడు - నేర్పరి. ప్రవణుఁడు - 1.నమ్రుడు, 2.సమర్థుడు.
నమ్రత - అణకువ, వినయము, అగర్వము.    

సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
ప్రాజ్ఞుఁడు -
1.సమర్థుడు(సమర్థుఁడు - నేర్పరి), 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (Inner voice).  

సంహతి - 1.సమూహము, 2.కలయిక, 3.సత్తువ.

విక్రమము - 1.అధిక బలము, 2.శౌర్యము.
విక్రముఁడు - 1.విక్రమార్కరాజు, 2.విష్ణువు.

హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.

పౌరుషము - 1.పురుషము, 2.పురుష ప్రయత్నము, పురుష వ్యాపారము, 3.పరాక్రమము.
పురుషకారము - పురుష ప్రయత్నము.

ద్యుమ్నము - 1.ధనము, 2.బలము, 3.పరాక్రమము.

నిద్రా క్షుధా తృషాచైవ క్లాంతిరాలస్య పంచమమ్|
తేజః పంచగుణాః ప్రోక్తా బ్రహ్మ జ్ఞానేన భాషితమ్||
నిద్ర, ఆకలి, దప్పిక, శ్రమచే అలసట, సోమరితనం; అనేవి అగ్ని యొక్క పంచగుణములు.

ఆకలి, దాహము, మందబుద్ధి, నిద్ర, కాంతి; ఈ ఐదు 5 తేజస్సు యొక్క గుణాలు

1. ఆఁకలి - క్షుత్తు, అన్నము తినవలెనను కోరిక.
క్షుత్తు -
ఆకలి.
బుభుక్ష - భుజింప నిచ్ఛ, ఆకలి.

అశనాయా బుభుక్షా క్షుత్ -
అశనేచ్ఛా అశనాయా - అశనమందలి యిచ్ఛ అశనాయ.
భుక్తుమిచ్ఛా బుభుక్షా - భోజనము చేయ నిచ్ఛ బుభుక్ష.
క్షుధ్యత్యనయాక్షుత్ ధ.సీ. క్షుధ బుభుక్షాయాం. - దీనిచేత బుభుక్షితు లౌదురు. ఈ మూడు 3 ఆఁకలి పేరు.

Who is the fit recipient of the gift of food?
The hungry.

గొద1 - ఆకలి, క్షుత్తు, సం.క్షుదా.
గొద2 - 1.అతిశయము, 2.త్వర.
బుధక్ష - భుజింప నిచ్ఛ, ఆకలి.    
ఋభుక్షా అస్య సంజాతి ఋభుక్షితః, క్షు దస్య సంజూ తేతి క్షుదితః - ఆకలి వీనికిఁ గలిగినది గనుక ఋభుక్షితుఁడు; క్షుధితుఁడును.  
గొదగొను1 - ఆకలిగొను; ఆఁకొను - ఆకలిగొను. 
గొదగొను2 - 1.అతిశయించు, 2.త్వరపడు, 3.తాల్పు.
జిఘత్స - ఆకలి.
అత్తుమిచ్చుః జిఘత్సుః - భక్షింప నిచ్చయించువాఁడు.
అశనము - 1.భోజనము, అన్నము, 2.వ్యాప్తి.
అశనాయా అస్యసంజాతా అశనాయితః - ఆకఁలిగొన్నవాఁడు. ఈ 4ఆకఁలిగొన్నవాని పేర్లు.
వ్యాప్తి - 1.ప్రసిద్ధికెక్కుట, 2.అభివ్యాప్తి.
రేంజ్ - (Range) వ్యాప్తి, వ్యాప్తి పరిమితి.
వ్యాప్తము - 1.వ్యాపించినది, 2.ప్రసిద్ధికెక్కినది. 

స్త్రీణాం ద్విగుణమాహారం బుద్ధిశ్చాపి చతుర్గుణమ్|
సాహసం షడ్గుణంచైవ కామో(అ)ష్టగుణము చ్యతేః||
తా.
స్త్రీలకు పురుషులకంటె (నా)ఆహారము రెండుపాళ్ళధికము, బుద్ధి - (గృహ.) తెలివి తేటలు(Intelligence) నాలుగు పాళ్లధికము, సాహసము - 1.తెగువ, 2.దండోపాయము. ఆరుపాళ్లధికము, కామము - 1.కోరిక, 2.మోహము, 3.రేతస్సు.)యెనిమిది పాళ్ళధికము. - నీతిశాస్త్రము 

స్త్రీగా పుట్టడంలో విశేషమేమిటంటే ఆమె తన పనులు చేసుకుంటూనే మరో మనిషికి తిండి, సుఖం అమరుస్తుంది. -  పెరల్ బక్   

సాపాటురాముడు - (వాడు) తిండిపోతు.
సాపాటు - భోజనము.
సాపడు - భుజించు.

భోజనము - ఆహారము, సాపాటు.
ఆహారము -
1.భోజనము, భోజనపదార్థము, 2.అపహరణము, 3.తెచ్చుట.    

జగ్ధి - భోజనము.     

భోజనపట్టి - (గృహ.) భోజన పదార్థములను తెలియజేయు జాబితా (Menu).

సాదము1 - అన్నము.
సాదము2 -
1.శ్రమ, 2.నాశము, 3.ప్రాపు.

ఓమటి - అన్నము, సాదము, ఓగిరము.
ఓదనము -
అన్నము.
ఓయిరము - అన్నము, రూ.ఓగిరము, సం.ఆహారః.
ఓగిరము - అన్నము, ఆహారము, రూ.ఓరెము, ఓయిరము, సం.ఆహారః.

ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణశివ|   

భుక్తి - 1.భోజనము, 2.అనుభవము.
భుక్తము -
1.తినబడినది, 2.అనుభవింపబడినది.
అనుభవము - 1.లౌకికజ్ఞానము (Experience), 2.అనుభవించుట, సుఖఃదుఖాలను పొందుట.

ఆరోగిణము - భోజనము, రూ.ఆరోగణము.

భోక్త - 1.భుజించువాడు, 2.బ్రాహ్మణార్థము చేయువాడు.
భోక్తవ్యము - 1.భుజింపదగినది, 2.అనుభవింపదగినది.
భోజ్యము - భుజింపదగినది.  

ఖాదనము - 1.తినుట, 2.ఆహారము, 2.పల్లు.
ఖాద్యము -
చిరుతిండి, తినుబండము, విణ.తినదగినది.
చిరుదిండి - 1.భక్ష్యము, 2.అల్పాహారము.

నాశ్నీయాద్భార్యయాసార్థంసై మాక్షేనత చాశ్నతీం
క్షుదతీంజృంభమాణాందానచాసీనాం యథా సుఖం|
నాంజయతీం స్వనేత్రేచ నచాభ్యంగా మనా వృతం| 
నవశ్వేత్ప్రసవతీ చా తేజస్కా మోనరో త్తమః ||

తా. భార్యతోఁగూడ భోజనము సేయఁగూడదు, భార్య భోజనము సేయు చుండఁగా, తుమ్ము చుండఁగా, నావలించుచుండఁగా, యథాసుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము.)సుఖముగా గూర్చుండి యుండఁగా, కన్నులకు కాటుకఁబెట్టు కొనుచుండఁ గా, అభ్యంగము - 1.తలంటు, 2.తైలము.)అభ్యంగ నము చేసుకొను చుండఁగా, దిగంబరియై యుండఁగా, ప్రసవించు చుండగా నిట్టి సమయముల యందు భార్యను తేజస్కాముఁ డగు నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి. చూడరాదు. - నీతిశాస్త్రము

భుజి - అగ్ని, వ్యు.సర్వమును భుజించువాడు.
సతనాల్కల జేజే - అగ్ని, సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.   

అగ్నిహోత్రము - 1.అగ్ని, 2.హోమము, 3.హవిస్సు.

సేనగ వాంచితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట, నిజమేకద దేహులకగ్ని హోత్రుడౌ
నేని స్వభోజ్యముల్ గుడుచునేనియు బుష్టి వహించులేని నా
డూని, విభూతిలో నడిగి యుండడి తేజము దప్పి, భాస్కరా.

తా. అగ్నిదేవుడయునను తాను తిను తిండి మానిన యెడల తన కాంతిని గోల్పోయి బూడిదలో నణగియుండును. అట్లే, తనకు ఎక్కువ ప్రీతి అయిన ఆహారమును తిన్నచో దేహము - శరీరము, మేను.)వృద్ధి పొందును, లేనిచో కృశించును. 

అంగద1 - 1.ఆకలి, 2.ఆపద, ఉపద్రవము, 3.కోపము, 4.దుఃఖము.
అంగద2 - దక్షిణ దిక్కునందలి వామనము అను దిగ్గజము యొక్క భార్య.
 

ఈఁతి - 1.ఉపద్రవము, 2.ఊరువిడిచిపోవుట, 3.మారి మొ. అంటువ్యాధి, 4.అతివృష్ట్యాది ఈతిబాధ (అతివృష్టి, అనావృష్టి, మిడుతల దండు, ఎలుకల దండు, చిలుకలదండు, చేరురాజులు అనునవి ఆరు ఈతిబాధలు.)

ఈతి ర్డిమ్బ ప్రవాసయోః,
ఈతిశబ్దము "అతివృష్టి రనావృష్టిః శలభా మూషికా శుకాః, అత్యాసన్నాస్చ రాజానష్షడేతా ఈతయః స్మృతాః" అను నాఱువిధములైన యుపద్రవములకును, ప్రవాసమునకును పేరు. అయన మీతిః, సీ. ఈఙ్ గతౌ. - పోవుట గనుక ఈతి.

అతివృష్టి - 1.మితిమీరిన వాన, 2.పైరులను పాడుచేయునట్టి పెద్ద వాన, ఈతిబాధ లారింటిలో ఒకటి, వ్యతి. అనావృష్టి.

ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపన్నము -
1.ఆపదనిందినది, 2.లభించినది, 3.సంభవించినది.
ఆపన్నుఁడు - ఆపద నొందినవాడు. 

ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.
ఇడుమ - 1.ఆపద, 2.అంతట.
విపత్తౌ విప దాపదౌ,
విపత్తు - ఆపద.
విపద్యతే విపత్తిః, ఈ. సీ. విపచ్చ, ద. సీ. - విపరీతముగాఁ బొందఁబడునది.
ఆపద -విపత్తు, ఇడుమ.
ఆపద్యతే ఆపత్, ద. సీ. - అంతటఁ బొందఁబడునది. ఈ 3 ఆపద పేర్లు.      

ఇజుకు - శ్రమము, సంకటము, ఇక్క్కట్టు, ఆపద.
సంకటము - ఇరుకు, రూ.కష్టము.
సంకటపడు - క్రి.ఇరుకుపడు, శ్రమపడు.
సంకటపాటు - ఇరుకుపాటు, సంకటపడుట.
సంకటములు - పలువిధములైన వ్యాధుల కూడిక, క్లిష్టపరిస్థితి, (Addisions' disease).  

నకనకలు - ఆకలి కల్గునపుడు కడుపులో కలుగు బాధ కనుకరణము.
నకనకలుపడు - 1.కృశించు, 2.ఆకలిచే బాధ నిందు.

నీతి- న్యాయము. నీతి సురక్షిత జనపద రామ్|
న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్కశాస్త్రము.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లి కూతునకు తల్లిదండ్రు లిచ్చు బహుమానము.
ప్రాడ్వివాకుఁడు - తగవరి, న్యాయము తీర్చువాడు.
తగవుగోరి - సంధిచేయువాడు, మధ్యస్థుడు.
మధ్యస్థుఁడు - ఇ రు క క్ష ల కు న్యాయము చెప్పువాడు, నడుమనుండువాడు.

తరహా - రీతి.  
మోళా - 1.రీతి , 2.తరగతి.
రీతి - 1.తెరగు, 2.మేర, 3.ఇత్తడి, 4.కావ్యశైలి పద్ధతి (కావ్య శైలి త్రివిధము, పాంచాలి, గౌడ, వైదర్భ.)
తెఱఁగు - 1.విధము, క్రమము, 2.చక్కన, 3.సంధి, రూ.తెఱవు.
తెఱఁగుపడు - క్రి.సంధియగు.
తరగతి - నిర్నయించిన పద్ధతి, ప్రమాణము, తరమును తెలుపు భాగము.

రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
రూపుమాపు - క్రి.చంపు, నాశనమొనర్చు.

విశారదుఁడు - విద్వాంసుడు, నేర్పరి.  
వ్యక్తుఁడు - విశారదుడు.
విద్వత్పు ప్రగల్భౌ విశారదౌ,
విశారదశబ్దము విద్వాంసునికి, ప్రౌఢునికి పేరు.
విశిష్టా శారదా అస్యేతి విశారదః - అధికమైన సరస్వతి గలవాఁడు.

ఈతి భయాపహ నీతి నయావహ
గీతిక లాఖిల రీతి విశారద| ||శరవణభవ||  

సంపన్నతరమేనాన్నం దరిద్రా భుజంతే సదా|
క్షుత్ స్వాదుతాం జనయతి సా చాఢ్యేషు సుదుర్లభా ||
పేదవాళ్ళెప్పుడూ రుచికరమైన భోజనమే చేస్తుంటారు. ఆకలి రుచిని పుట్టిస్తుంది. అటువంటి ఆకలి ధనవంతులకు లభించటం చాలా కష్టం. 

కష్టపడి పని చేసేవాడి గుమ్మంలోకి ఆకలి తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తుంది, కాని ధైర్యం చేసి లోపలికి రాదు. - బెంజమిన్ ఫ్రాంక్లిన్

ప్రాశనము - కడుపు, భోజనము.
ప్రాశితము - 1.భుజింపబడినది, 2.త్రాగబడినది.      

గోపుఁడు - రక్షించువాడు, 1.రాజు King, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి. (అయిదింటిపై గాని, పదింటిపై గాని అధికారము కలిగి గ్రామములోని భూములు ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్త్యవ్యము లై యుండును.)

గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గాః పాతీతి గోపః, గాః పాలయతీతి గోపాలః. పా రక్షణే; పాలరక్షణే. - ఆవులను రక్షించువాడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.

గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు. గోపాలం చింతయే ద్బుధః|       

గోసంఖ్య -
గా స్పంచష్టే గోసంఖ్యః, చక్షిఙ్ వ్యక్తాయాం వాచి. - ఆవులను విచారించువాఁడు.

గొల్ల1 - 1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.

తొఱ్ఱుపట్టు - 1.ఆవులమంద, 2.గోవులసాల, 3.గొల్లపల్లె.
తొఱ్ఱు - ఆవు; ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి Earth, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

దోగ్ద - 1.గొల్లవాడు, 2.దూడ, 3.కవిత్వము చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
గాః దోగ్ధీతి గోధుక్. హ.పు. దుహ ప్రపూరణే. - ఆవులను బితుకువాఁడు.
దోగ్ద్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది.
దోహనము - పాలు పిదుకుట.

పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము. దూడలేని పాడి దుఃఖపుపాడి. 

అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు. ఆసమంతాత్ భియం రాతీతి అభీరః. రా ఆదానే. - అంతట భయము గలవాఁడు.

అభీరుఁడు - 1.గొల్లవాడు, వ్యు.మిక్కిలి పిరికివాడు, 2.అభీరదేశవాసి.
గాః అభితః, ఈరయతీతి అభీరః, ఈర ప్రేరణే. - అంతట (ఆవు)నావులఁ దోలువాఁడు.   
అభీరి - 1.గొల్లది, 2.గొల్లవాని భార్య, 3.గొల్లలభాష. 
అభీరస్య గోపస్య భార్యా తజ్జాతీయా వా అభీరీ. - అభీరుడనఁగా గొల్లవాఁడు, వాని భార్యయు, ఆ గొల్లజాతి స్త్రీయును.
అభీరపల్లి - గొల్లపల్లె, వ్రేపల్లె.
ఆబిభ్యతి; అభితః గాః ఈరయంతీతివా అభీరాః గోపాః, తేషాం పల్లీ ఆభీరవల్లీ, ఈ. సీ. ఞి భీ భయే, ఈర ప్రేరణే. వెఱచువారుగాని గోవులనంతట ప్రేరేపించువారుగాని ఆభీరులు, అనఁగా గొల్లలు వారి పల్లె.

ఘోష అభీరపల్లి స్యాత్ -
ఘోషము - 1.గొల్లపల్లె, 2.ఆవులమంద.
ఘోషంతి గావో (అ)త్ర ఘోషః, ఘుషిర్ అవిశబ్దనే శబ్దే చ. - దీనియందు గోవులు ఘోషించును.

మందప్రోయాలు - గొల్లది.
మంద - 1.ఊరిబయట పసులుండుచోటు, 2.గొల్లపల్లె, 3.పశు సమూహము. 
ౙంగిలి - గో సమూహము, పశుసమూహము. 

వ్రేఁడు - గొల్లడు, సం.వృష్టిః.
వ్రే - గొల్లకులము, సం.వృష్టిః.
వ్రేఁత - గొల్లది. 
వ్రేపల్లియ - గొల్లపల్లె.

జీవవృత్తి - గోవులు మున్నగు వానిని కాచుకొని జీవించుట.  

గోదుమ - గోధుమ, ఒకరకపు ధాన్యము Wheat, సం.గోధూమః.

గోధూమ స్సుమన స్సమౌ,
గుధ్యతే పరివేష్ట్య ఇతి గోధూమః, గుధ పరివేష్టనే. - విసరఁబడునది.
శోభనం మన్యతే సుమనః, అ. పు. మనజ్ఞానే. - మంచిదిగాఁదలఁపఁబడునది. గోదుమల పేర్లు.

‘ఇ’  విటమిన్ - (గృహ.) (Vitamin E) సంతానోత్పత్తికి తోడ్పడు విటమిన్. ఇది గోధుమ మొలకలలో ఉండును.

మహాశూద్రి - గొల్లది.
మహాశూద్రస్య భార్యా తజ్జాతీయా వా మహాశూద్రీ, సీ. - మహాశూద్రుఁడనఁగా గొల్లవాఁడు, వాని భార్యయు, తజ్జాతీయము. - ఒకటి గొల్లవాని భార్యకును, తజ్జాతి స్త్రీకిని పేరు.
గోపి - గొల్లది (గోపిక).
అతిసారరోగిణం గోపయతీతి గోపీ, సీ. గువూ రక్షణే. - అతిసారరోగము గలవానిని రక్షించునది.
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి. 

రాసము - గోపికల క్రీడ.

గొల్లభామ - 1.గొల్లజాతికి చెందిన స్త్రీ, 1. (వ్యవ, కీట.) సన్నగానుండు మిడత కుటుంబములోని పురుగు. కొన్ని గొల్లభామలు ఇతర కీటకములను దినుచుండును) (Mantis). 

కిలారి - గొల్లడు.
కిలారము - పసులమంద, రూ.కిలారము.

గొల్లవారి బ్రదుకు గొఱఁతన వచ్చునే,
గొల్లరీతిఁ బాలకుప్పఁ ద్రచ్చి 
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు,
చేటు లేని మందు సిరియుఁ గనిరి.

భా|| గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు. దేవతలు(సురలు -వేలుపులు)గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః)శ్రీలక్ష్మినీ పొందగలిగాడు.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

కమలాసనపాణినా లలాతే
లిఖితామక్షరపంకిమస్య జంతోః|
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనికద్వారనివాస దుఃఖదోగ్ధ్రీమ్ || – 23

పాథోధి - సముద్రము.
పాధస్సు - 1.జలము, 2.అన్నము. 
పీయతే పాథః, స-న. పా పానే. - పానము చేయఁబడునది.
పాతి భూతానీతి పాథః, పా రక్షణే. - భూతములను రక్షించునది. 
పాథేయము - అన్నము, బియ్యము లోనగు దారి బత్తెము.

అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేని యెన్నఁ బోరు
అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వ.
తా.
ఇతర దానములు యెన్ని చేసిననూ అన్నదన్నముతో సాటిగా ఆలోచించినచో అన్నమె యీలోకములో జీవనాధారము.   

తొలుకుడుపు - అన్న ప్రాశనము.

భిస్సస్త్రీ భక్త మన్ధో (అ)న్నమోదన్నో (అ)స్త్రీ స దీదివిః,
భిస్స - అన్నము.
భన్యతే భక్ష్యత ఇతి భిస్సా, సీ. భవభక్షణదీప్త్యాః - భక్షింపఁబడునది. 
భిస్సట - మాడన్నము.
మాడు - క్రి.దగ్ధమగు, వి.1.ఇంటి యొక భాగపు కప్పు, 2.అడుగంటి మాడిన అన్నము మొ.వి.
అడుగంటు - క్రి.(అడుగు+అంటు) 1.వట్టిపోవు, 2.అన్నము మొ. అడుగున మాడు.
భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భజ్యత ఇతి భక్తం. భజసేవాయాం. ఆశ్రయింపఁ బడునది. అద్యత ఇత్యంధః, స. న. అదభక్షణే. - భక్షింపఁబడునది.
అన్నము - కూడు, బువ్వ, విణ.తినబడినది.
అనంత్యనేనేత్యన్నం, అన్నప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
కూడు - అన్నము, క్రి.1.ఒప్పు, 2.సాధ్యపడు, 3.కూడబెట్టు, 4.లెక్కకూడు, 5.కలుపు.
కూడుదల - లాభము. కూడు బెట్టిన వానిని  కూలద్రోయకు.
బువ్వ - అన్నము.
బువ్వము - 1.పెండ్లివారి సహభోజనము, 2.ఆహారము.
బువ్వముబంతి - వివాహము నందు నాల్గనాడు బంధువులు స్త్రీ పురుషాదులు ఒకటిగా కూర్చుండి భుజించుట.
హరిబువ్వము - వివాహమైన నాలవనాటి రాత్రి పెండ్లి వారందరు కలిసి వేడుకగా భుజించుట, బూజము బంతి అని వాడుక. 
ఉందతిక్లిద్యతీత్యోదనః, అ. న్న. ఉందీక్లేదనే. - పాసినప్పుడు నీళ్ళు కాఱునది.

సాదము1 - అన్నము.
సాదము2 - 1.శ్రమ, 2.నాశము, 3.ప్రాపు.

ఆకొన్న కూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ!

తా. మంచి ఆకలి ఆఁకొను - క్రి.ఆకలిగొను సమయమున లభించిన పదార్థమే అమృతము, యాచించి నంతనే నిరాటకంగా దానమొసంగు వాడే దాత. శ్రమను సహించువాడే మానవుడు, తేఁకువ - 1.ధైర్యము, 2.భయము, 3.మెలకువ, 4.సందేహము, 5.వివేకము.)ధైర్యముగా ప్రవర్తించువాడే వంశోద్ధారకుడు.

కూరము - అన్నము, వంటకము. 
కూర - శాకము, వ్యంజనము, సం.కూరమ్.
కూరదినుసులు - (వ్యవ.) కూరగాయల నిచ్చు పైరులు, ఉదా. బెండ, బీర, తోటకూర, మొ వి. (Vegetables).

సూపకారాస్తు వల్లవాః ఆరాళికా ఆన్ధసికా స్సూదా ఔదనికా గుణాః,
సూపకారుఁడు - వంటవాడు, రూ.సూపుడు.
సూపం వ్యఙ్జనం కుర్వన్నీతి సూపకారాః, డు కృఞ్ కరణే. - కూరలు చేయువారు.
సువారము - వంట, సం.సూపకార్యమ్.
సూపము - వండినపప్పు.

వల్లవుఁడు - గొల్లవాడు.
బత్ స్థైర్యం లునాతీతి లవః బదః స్థైర్యస్యలవో వల్లవః, బద స్థైర్యే. లూఞ్ ఛేదనే. వబయోరభేదః - భయము నొంది మనస్థైర్యము వీడినవాఁడు.
గోమహిస్యాదికం వలమానాః సంవృణ్వంతో వాంతి గచ్ఛంతీతి వల్లవాః. వల సంవరణే. వా గతిగంధనయోః. - గోమహిష్యాదులను జుట్టుకొని పోవువాఁడు. ఈ 6 గొల్లవాని పేర్లు.

వల్లవుఁడు - గొల్లవాడు.
వల్లన్తి భోక్తుః ప్రీతి ముత్పాదయంతీతి వలావాః, వల్లప్రీతౌ. - భోజనము చేయువానికి ప్రీతిగలుగఁ జేయువారు, పా. వర్ణవాః.
అరాళకుటిలం చరంతీతి ఆరాళికాః - కుటిలముగా సంచరించువారు.
అంధస్సు - అన్నము, వంటకము. 
అంధః అన్నం తత్సాధనం శిల్పమేషాంతే ఆంధసికాః. - అంధస్సనఁగా నన్నము; దాని జేయు నేర్పుగలవారు.
సూదుఁడు - వంటవాడు. 
సూదయంతి తండులానితి సూదాః షూద క్షరణే. - తండులములను పక్వముచేయువారు.
సూదము- వండినపప్పు; సూపము-వండినపప్పు.
బేడలు - కాయధాన్యముల పప్పు.
పప్పు - పొట్టుపోయి బ్రద్దలైన కాయధాన్యము, సూపము.
పప్పుదినుసులు - (గృహ.) కందులు, పెసలు, అనుములు, బటాణీలు మొదలగు నవి, కాయధాన్యములు, శింబీధాన్యములు,(Legumes).  

పప్పుగుత్తి - (గృహ.) వండిపప్పును లేదా కాయగూరలను మెదుపుటకు ఉపయోగించు కఱ్ఱకాడ బంతి (Smasher).  

రుచి - (రసా.) నాలుకతో గుర్తించ పడు వస్తుగుణము, ఉదా.పులుపు, తీపి, చేదు.

ఉప్పులేని కూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేని వాడె అధిక సంపన్నుడు విశ్వ.

తా. ఉప్పులేని ఉప్పిఁడి - ఉప్పులేనిది కూర - శాకము, వ్యంజనము, సం.కూరమ్. రుచిగా వుండదు. పప్పులేని తిండి - ఆహారము మంచిది కాదు. అప్పులేనివాడె ధనవంతుడు. 

ఔదనికుఁడు - వంటవాడు.
ఓదనం ప్రయోజనమేషాం తే ఔదనికాః - అన్నము ప్రయోజనముగాఁ గలవారు.
ఔదరికుఁడు - 1.తిండియందే ఆసక్తి గలవాడు, 2.ఏమియు పనిలేకుండ నున్నవాడు.
ఓదనము - అన్నము.
గుణయంతి పాకం పునరావర్తయంతీతి గుణాః, గుణ అభ్యాసే. - పాకమైనదానిని తిరుగఁబోసి వండువారు. ఈ 6 వంటవాని పేర్లు.

ఆద్యూన స్స్యాదౌదరికో విజగీషా వివర్జితే,
విజిగీష యనఁగా నైషికాముష్కిక - సాధనమైన యుద్యోగము ఉద్యోగము - 1.యత్నము, 2.పని, 3.కొలువు, 4.పాటుపడు.)అదిలేక, పొట్టపోసి కొనువాని యందు ఆద్యూన ఔదరిక శబ్దములు వర్తించును.
ఆదీవ్యతి ఈషత్(ఈషత్ - అవ్య. కొంచెము, రూ.ఈషతు.)క్రీడతి అన్యత్రాసక్తత్వాత్ ఆద్యూనః, దిపు క్రీడాదౌ. - ఉద్యోగము లేక క్రీడించువాఁడు.
ఉదరే ఆసక్తః ఔదరికః - ఉదరమందే ఆసక్తి గలవాఁడు.   

ఉదరము - 1.కడుపు, (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువుగా నుండు భాగము (Abdomen). 

ప్రోౘు - క్రి.అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.

అన్నదానాత్పరం దానం నభూతం న భవిష్యతి| 
నాత్ర పాత్ర పరీక్షా స్స్యాన్న కాలనియమః క్వచిత్||
తా.
అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. ఇది అందరూ(తరతరముగా), అందరికీ అన్నివేళలా చెయ్యదగిన ఉత్తమోత్తమ దానం.

పంటవలఁతి - భూమి Earth.     
పంట - 1.పండుట, 2.కృషి.

పాచకి - వంటలక్క.
వంట - పాకము. పాగు-చక్కెరపాకము, సం.పాకః. 
పచా పాకే -
పచనము - వండుట.
పచనం పచా, పాకశ్చ, డు పచ్ ష్ పాకే. ఈ 2 వండుట పేర్లు.
పాకము - 1.పరిపక్వము, 2.పంట, (అలం.) కావ్యపాకము (కావ్యపాకములు: ద్రాక్షా కదళీ నారికేళ పాకములు).
పచేళితము - తనంతట పక్వమైనది, అనగా చెట్టుమీదనే పండినది. 
పరిపక్వము - సంపూర్ణముగా నభివృద్ధి చెందినది (Mature).  
పాకాన్నము - పెండ్లిలో మూడవ నాటి విందు, రూ.పాకెన, పాకెన్న.
పాచకము - (జం.) జఠరరసమందు కల సేంద్రియమండము (Pepsin).

గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
గుణ్యతే అభ్యస్యత ఇతి గుణః. గుణ అభ్యాసే. - అభ్యసింపఁబడునది.
గుణ్యతే అభ్యస్యతే బంధనాయేతి గుణః, గుణ అభ్యాసే. - బంధనము కొరకభ్యసింపఁబడునది.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.    
ప్రకృతేర్గుణాః సత్త్వరజస్తమాంసీత్యుచ్యంతే - ప్రకృతియొక్క గుణములు సత్త్వరజస్తమంబు లనంబడును.
గుణయంతి పాకం పునరావర్తయంతీతి గుణాః, గుణ అభ్యాసే. - పాకమైనదానిని తిరుగఁబోసి వండువారు (వంటవారు). ఈ 6 వంటవాని పేర్లు. 

మృష్టము - కడుగుట మొ, వానిచేత శుద్ధమైనది (మృష్టాన్నము).  

చిమిడిక - చిమిడిన అన్నము.
చిముడు - క్రి.1.అన్నమధికముగ నుడికి ముద్దయగు, 2.పాకముచెడు.

విఱుగు - క్రి.1.తునియు, 2.పాకముచెడు, 3.వెనుతీయు.

పక్వం పరిణతే -
పక్వము - 1.పరిపాకము పొందినది, 2.చేటుమాడినది.      
పచ్యతే క్రమేణ పక్వం - కాలక్రమమున పరిపాకమును బొందినది. పక్వా బుద్ధిః, పక్వం ఫలం. అని.
పరిణతము - పరిపాకము పొందినది.
పరిణమతే అవస్థాంతర అవస్థాంతర మా పద్యతే పరిణతం - వేఱొక యవస్థను బొందునది. ఈ 2 కాలవశమునఁ బరిపాకమును బొందిన బుద్ధి మొదలైనదాని పేర్లు. 
పక్వమాంసకృత్తులు - (జం.) మాంసకృత్తులు, ' పాచకము ' అను సేంద్రియమండముచే ప్రసరణకు అనుకూలముగా నుండునట్లు మార్చబడిన పదార్థములు (Peptones).

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము. 

మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయోజన మాచరించుదో
గానక యల్పుడొక డదిగాదని పల్కిన వాని పల్కు కై
మానగఃజూడడాపని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిక వంటకంబు దినకుండుట నేర్పగు నోయి? భాస్కరా.
తా.
వండిన భోజనము - ఆహారము, సాపాటు వేళ ఈగ-మక్షికము వ్రాలిన యా వంటకము - అన్నమును విడుచుట మంచిది కాదు. అట్లే అల్పుఁడు - నీచుడు, మంచివాడు చేయు పనిని వలదన్నను మానివేయుట యుక్తము గాదు. 

పాట్ లక్ - (గృహ.) (Pot-luck), ఒక స్థలము నకు మిత్రులు భోజనము లేదా వంటకములను తెచ్చుకొని కలసి వేడుకగా భుజించుట.

దిదీవి - 1.అన్నము, 2.బృహస్పతి, 3.స్వర్గము, దేవలోకము.
దీన్యంత్యనేనేతి దీదివిః. ఇ.న్న. దివు క్రీడాదౌ. - దీనిచేతఁ బ్రకాశింతురు. ఈ 6 వంటకము పేర్లు. 

బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఈ,పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు లనంబడును, వారలకై నను వానికైనను ప్రభువు.  
సురాచార్యుఁడు - గురువు. 
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

బృహస్పతివారము - గురువారము Thursday.

గోవు - 1.ఆవు, 2.భూమి Earth, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు Sun.
గచ్ఛతి స్వస్థానమితిగోః, ఓ. సీ. - ఉనికిపట్టునకుఁ బోవునది.
గచ్ఛతి గమ్యత ఇతి వా గౌః, గమ్ ఌ గతౌ. - పోవునది గనుకనైనను, పొందఁబడునది గనుకనైనను గోవు.

భూమిజ- సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్న తల్లికంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా! విశ్వ.

తా|| అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినది లేదు. గురువుల సేవకంటె గొప్పదిలేదు.

గురుచరణాంబుజ నిర్భరభక్తః, సంసారాదచిరా ద్భవ ముక్తః |
సేంద్రియమానవ నియమాదేవం, ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం || - 31

గురుచరణ కమలములందు మిక్కిలి భక్తిగల ఓ సాధకుడా! ఈ సంసార బంధనాలనుండి శీఘ్రముగనే ముక్తి పొందుదువుగాక! నీ ఇంద్రియ మనస్సులను నియమించి (అదుపులో పెట్టి)న వాడవై నీ హృదయంలోనే ఉంటున్న దేవుని దర్శించెదవు గాక! - భజగోవిందం 

Being devoted  completely to the lotus-feet of the Master, become released soon from the transmigratory process. Thus, though the discipline of sense and mind-control, you will behold the deity that resides in your heart.

యన్మాయయార్జితవపుః ప్రచురప్రవాహ
మగ్నార్తమర్త్య నివహేషు కరావలంబమ్,
లక్ష్మీ నృసింహచరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ| - 24
  

పాటవము - 1.ఆరోగ్యము, 2.శక్తత.  
ఆరోగ్యము - రో గ ము లే మి, స్వాస్థ్యము.
ఆరోగ్యరక్షణము - (గృహ.) రోగము రాకుండుటకై శుభ్రత నవలింబించుట (Sanitation).

శక్తిజనక పదార్థములు - (గృహ.) 1.శక్తి జనకాహారము, 2.వేడిమి పుట్టించు ఆహారము, 3.కాకనిచ్చు ఆహారము, (Energy giving foods).

సాత్త్విక(సాత్త్వికము - సత్త్వగుణము వలన కలిగినది) ఆహారము, మితాహారము, దైవార్పితాహారము, న్యాయార్జితాహారము.

కెటబోలిసమ్ - (గృహ.) (Ketabolism) అపచయము, ఆహార పదార్థములు విభజన.
అపచయక్రియ - ఆహారమును సామాన్యపదార్థములుగా విడదీసి వానిలో నున్న శక్తి విడుదలచేయుట, ఆహార విశ్లేషణ క్రియ (Ketabolism).
విశ్లేషణ క్రియ - (జీవ.) అపచయక్రియ, ఉదా.శ్వసనక్రియ (Katabolism - analysis).

బేసల్ మెట బోలిజమ్ - (గృహ.) (Basal metabolism) శరీరము కదలికలేని సమయమున కావలసిన పోషణ శక్తి, జీవధారణ మూలక చయాపచయ క్రియ.

పాలగొట్టములు - (గృహ.) సూక్ష్మ రక్తనాళములు. ఇవి శృంగముల మధ్యలో నుండును (క్రొవ్వు ఆహారము జీర్ణమైన తరువాత వీనిచే రక్తములోనికి తీసుకొన బడును) (Lacteals).  

వ్యాధి నిరోధకాహారము - (గృహ.) రోగములను దూరముచేయు ఆహారము జీవితమును కాపాడు ఆహారము, ఆరోగ్యమును పెంపొందించు ఆహారము (Protective foods).

పోషణ - (గృహ.) తిన్న ఆహారము ఒంటికి పట్టుట (Nourishment).
పోషాహారము - (జీవ.) శరీరపోషణ నిచ్చు ఆహారము (Nutrition).

సమతులితాహారము - (గృహ.) సక్రమాహారము, ఉచితాహారము, శరిరము పెరుగుటకు తగు ఆహారపదార్థము, మిశ్రాహారము (Balanced diet).

మితం భుంక్తే సంవిభజ్యారితేభ్యః మితం స్వపిత్యమితం కర్మ కృత్వా |
దదత్యమిత్రేష్వపి యాచితస్సన్ తమాత్మవంతం వ్రజహాత్యనర్థాః ||
తనను ఆశ్రయించిన వాళ్ళకు పంచి ఇచ్చి మితంగా తింటాడు. ఎక్కువ పనిచే తక్కువ నిద్రిస్తాడు. అడిగితే శత్రువులకైనా ఇస్తాడు. అలాంటి ఆత్మగుణ సంపన్నుణ్ణి అనర్థాలు విడిచి పెడతాయి. 

తిండికాఁడు - ఎక్కువ తిను స్వభావము కలవాడు.
తిండిపోతు - తిండీడు, తిండికాడు.
తిండి - ఆహారము.

భక్షణము - తిండి.
భక్ష్యము -
భక్షణీయము, తినుబండము, (పంచభక్ష్యములు:- భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయము.)

భక్షకో ఘస్మరో అద్మరః,
భక్షయ త్యధికమితి భక్షకః. భక్ష అదనే - అధికముగా భక్షించువాఁడు.
ఘస్మరుఁడు - 1.భక్షకుడు, తిండిపోతు, 2.చంపినవాడు.
ఘసం తాచ్ఛీల్యేన ఘస్మరః, అత్తి తాచ్ఛీల్యేన అద్మరః, ఘస్ ఌ అదనే. అద భక్షణే. - భక్షించుస్వభావము గలవాఁడు. ఈ 3 తిండిపోతు పేర్లు.

భక్షక కణములు - (జం.) శ్వేత కణములు (Phagocytes) సూక్ష్మజీవులు తినివేయు జీవకణములు (Leucocytes).

ఆబూతికాఁడు - తిండిపోతు.
ఆభుక్తి - ఆబూతి.
ఆబూతి - పెనుతిండి, సం.ఆభుక్తిః.  

అనుచితాహారము - (గృహ.) అపోషకాహారము (Malnutrition).
విషమాహారము - (గృహ.) తగుపాళ్ళలో లేని ఆహారము, అనుచితాహారము, బలము నీయని ఆహారము (Ill-balanced diet).

వశ్యత - (గృహ.) సరిపడకపోవుట, కొంతమందికి కొన్ని వస్తువులు అనుకూలముగావు, అట్టి ఆహారము తినునప్పుడు లేదా వస్తువులను ధరించినప్పుడు దాని వలన అవగుణములు కనబడును (Allergy).

గ్లస్తము - 1.భక్షింపబడినది, 2.గ్రస్తము.
గ్రస్తము -
1.తినబడినది, 2.మ్రింగబడినది, 3.లోపించిన వర్ణములు గలది (మాట).

యచ్ఛక్యం గ్రసితం గ్రస్యం గ్రస్తం పరిణమేచ్ఛ యత్ |
హితం చ పరిణామే యత్ తదాద్యం భూతి మిచ్ఛతా ||
తినటానికి వీలైనదే తినాలి, తింటే జీర్ణమయ్యేదే తినాలి, జీర్ణమైన తర్వాత మేలు చేసే దాన్నే, తినాలి.

అపథ్యము - 1.తినరానిది, 2.హితము కానిది, తగనిది.
అవపథ్యము - హితముకానిది, తినరానిది, రూ.అపథ్యము.
అపచారము - 1.పెద్దలయెడ చేయు తప్పు, 2.లోపము, 3.అపథ్యము, 4.అపథ్య పదార్థము.
లోపము - 1.తక్కువ, 2.మరుగుపాటు.
తగ్గుదల - తక్కువ.
తగ్గు - క్రి.1తక్కువగు, 2.వెనుదీయు, 3.తెగిపడు, వి.తక్కువ.
లోకువ - అధీనము, తక్కువ.
అధీనము - ఆయత్తము, స్వాధీనము, అగ్గము.
ఆయత్తము - 1.సంసిద్ధము, 2.అధీనము, 3.ప్రయత్నించునది.
అగ్గము - 1.అధికము, 2.దుస్సహము.
అధికము - ఎక్కువది, పెద్దది, వి. (అలం.) ఒక అర్థాలంకారము.
దుస్సహము - సహింపరానిది.

ముఖ్యావసరమైన అమినో ఆసిడ్స్ - (గృహ.) ఇప్పటికి 22 అమినో ఆసిడ్స్ కనుగొనబడినవి. వీనిలో 8 మానవునకు భోజనము ద్వారా ముఖ్యముగా లభించవలెను. ఇవి శరీరములో తయారగును. కనుక వాని వలన లోపము కలుగదు (Essential amino acids).  
అమినో యాసిడ్స్ - (జీవ. రసా.) (Amino acids) జీర్ణమైన మాంస కృత్తుల నుండి జనించు అమినో గుణములుగల ఆమ్లములు.

అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనలము -
1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.)చిత్రముల్లము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య(3).
మందాగ్ని - అగ్నిమాంద్యము, జఠరాగ్ని సన్నగిల్లుట.
అగ్నిమాంద్యము - మందాగ్ని (గృహ.) ఆకలి లేకలోవుట (Anorexia).

అఱ్ఱీయము - అజీర్తి, అజీర్ణవ్యాధి, రూ.అఱ్ఱెము.  
అఱకము -
అజీర్తి.
అఱకువ - అజీర్తి, అజీర్ణవ్యాధి.
అజీర్ణము - అన్నాదులు అరుగక పోవుట, విణ.జీర్ణముకానిది.
అఱ్ఱెము - అఱ్ఱియము, బ్రతుకమ్మ పండుగ దినములందు, ఆరవదినము (ఈనాడు బ్రతుకమ్మలాదరు). 

జిగట విరోచనములు - (గృహ.) మలము చీము రక్తముతో కలిసి పడుచుండుట, (దీనికి బొడ్దు దగ్గర కూడ నొప్పి యుండును). (Dysentery).
జిగట - 1.బంక, 2.బందన.
బందన - జిగట, గోదు, సం.బంధనమ్.
బంక - 1.చెట్లయందు కలుగు జిగట వస్తువు, 2.గ్రహణి.
గ్రహణి - 1.ఒక విధమైన రోగము, జఠరాగ్నికి అధిష్ఠానమగు నాడి, (ఇది చెడి పోయినచో గ్రహిణీరోగము కలుగును).  

అరోచకము - 1.ప్రకాశింపనిది, 2.ఏవకలిగించునది, వి.ఆహారము ఇతవు కాకుండుట, ఒక వ్యాధి.

నియాసిన్ - (గృహ.) (Niacine) నికోటినిక్ ఆమ్లము (Nicotinic acid) ఇది విటమిన్ Vitamin B2, (ఆహారములో నిది తక్కువైన పెల్లగ్రాయను వ్యాధి కల్గును.)

దేహయాత్ర - 1.తిండి, 2.జీవనము, 3.చావు.

తడిసిన పాదములు చేతులు, ముఖముతో కలిగి భుజించిన అతడు ఎక్కువ కాలము జీవించడు.

కుచేలినం దంతమలాపహారిణం |
బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషిణమ్|
సూర్యోదయే చా స్తమయేచశాయినం, విముంచతి శరీరసి చక్రపాణినమ్||
తా.
మలినవస్త్రము ధరించినవానిని, పండ్లు తోమనివానిని, తిండిపోతు ను, నిష్ఠురోక్తులు కలవానిని, ప్రాతస్సాయంకాలముల యందు నిద్రించు వానిని, ఇతర గుణములచేత విష్ణు చక్రపాణి - విష్ణువు సమానులై యున్నను వీరిని లక్ష్మి పరిత్యజించును. - నీతిశాస్త్రము 

సిరిసంపదలను కోరేవాడు నిద్ర, భయ, క్రోధ, అలసత్వ, దీర్ఘ సూత్రత్వ, తంద్రాది దుర్గుణాలను విడిచిపెట్టాలి.

కృపీటయోని - అగ్ని, వ్యు.నీటికి ఉత్పత్తి స్థానమైనది.
కృపీట ముదకం యోనిః కారణం యస్య సః కృపీట యోనిః ఇ-పు. - కృపీటమనఁగా ఉదకము; అది కారణముగాఁ గలవాఁడు.
కృపీట స్యాంభసో యోనిః - ఉదకమునకు నుత్పత్తిస్థానము.

కృపీటము - 1.జలము, 2.కడుపు, 3.సమిధ.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జలతి జడీభవతీతి జలం, జల ఘనే. - జడీభవించునది.
కడుపు - ఉదరము, పొట్ట.
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట. పొట్ట పైరుకు పుట్టెడు నీరు.    

ఇన్ధనం త్వేధ ఇధ్మ మేఢ స్సమిత్ స్తియామ్,
ఇంధనము - వంట చెరకు, (రసా.) 1.నిప్పుచేయుటకు ఉ ప యో గిం చు ద్రవ్యము (Fuel), ఉదా. కఱ్ఱలు, బొగ్గు మొ.వి. 2.(Fuel) నుండి వేడి నిచ్చెడి పదార్థము.       
ఇంధే అగ్నిరనేన ఇంధనం ఇధ్మస్చ, ఞ్ ఇంధీ దీప్తౌ. - దీనిచేత నగ్ని ప్రకాశించును.
ఇధ్మము - 1.సమిధ, 2.చిదుగు, వంటచెరుకు.    
ఏధతే అగ్నిరనేనే ఏధః, స. న. ఏధశ్చ. అ. పు. ఏధవృద్ధౌ. - దీనిచేత అగ్ని వృద్ధిఁబొందును.
చిదుగు - 1.ఎండిన సన్నపుల్ల, 2.సమిధ.  
సమిధ - చిదుగు, వంటచెరకు. 
సమిధ్యతే అగ్ని రనయేతి సమిత్, ధ. సీ. - దీనిచే నగ్ని మిక్కిలి ప్రకాశించును. ఈ 5 సమిధ పేర్లు.     

అట్టము - 1.వంటకము, 2.వంటచెరకు, 3.మేడ వెనుకటిల్లు, 3.అతిశయము.
వంటకము - అన్నము.

వంటచెఱకు - వంటకట్టియలు.
వంటచెఱకు చెట్టు - (వ్యవ.) వంటకట్టెల నిచ్చు వృక్షములు, ఉదా. సరుగుడు మొదలగునవి (Fuel trees).

నొగిలిన - క్రి.1.వికలమగు, నొచ్చు, వి.1.వికలమగుట, 2.నొప్పి.
నొచ్చు - క్రి.1.నొప్పిచెందు, 2.దారిద్య్రాదులచే పీడనొందు, రూ.నోయు.
నొచ్చుకొను - క్రి.సంతాపమొందు, స్రుక్కు.
నొచ్చుకోలు - పరితాపము.     

స్రుక్కు - క్రి.1.వెనుదీయు, 2.భయపడు, 3.ముడుగు, 4.ముడతపడు, 5.తగ్గు, 6.దుఃఖించు, 7.చింతించు, 8.మూర్ఛిల్లు, 9.సంకోచించు, వి.1.చిక్కు, 2.దుఃఖము, 3.శోకము, సం.వి.మిల్లివంటి యజ్ఞోప కరణము. 

నొగిలినవేళ నెంతటిఘనుండు దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రొదిసేయక తనంతట బల్మికిరాఁడు నిక్కమే
జగమున నగ్నియైనఁ గడుసన్నగిల్లంబడి యున్న నింధనం
బెగయఁగద్రోచి యూదక మెఱెట్లురవుకొననేర్పు, భాస్కరా|

తా. అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు. కొంచెము నున్నప్పుడు దానిపై శుష్కము - వంటచెరకు, విణ.ఎండినది, వట్టి.)ఎండుపుల్లలు వేసి నూదకుండగా నదిమండ నేరదు. అట్లే ఘనుఁడు -గొప్పవాడు, వి.మేఘుడు.)గొప్పవానికి పేదఱికము వచ్చినప్పుడు యొంకొక ఉపాయముచే తనని ప్రోదిగొను-క్రి.పోషించు, కాపాడు.)పోషింపకున్న నతడు తనంత తాను అభివృద్ధి కాజాలడు.

జాతరూపము - బంగారము.
జాతం ప్రసస్తం రూపం యస్య జాతరూపం - ప్రశస్తమైన రూపము గలది.
జాతవేదుఁడు - అగ్ని.
జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః, స - పు. - ఇతనివలన వేదములు పుట్టినవి.
జాతేజాతే విద్యత ఇతి వా జాతవేదాః, విద సత్తాయాం - పుట్టిన దేహము(దేహము - శరీరము, మేను.)నం దెల్లనుండువాఁడు.
జాతం శుభాశుభం వేత్తీతివా, విద జ్ఞానే - పుట్టిన శుభాశుభముల నెఱుంగువాఁడు.
వేదో హిరణ్య మస్మాజ్ఞాత ఇతివా. - హిరణ్యము వీనివలనఁ బుట్టినది.

సదాతనుఁడు - 1.విష్ణువు, 2.శాశ్వతుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణుః, ఉ-పు, విశ్వం వేవేష్ట వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని+అంటు) = కృష్ణుని మిత్రము.           

తనువు - 1.దేహము, 2.తోలు, విణ.1.చిన్న, సన్న.
తన్యతే ఆహారేన తనుః, ఉ. సీ. తనూశ్చ, ఊ. సీ. తనువిస్తారే. - ఆహారముచేత విస్తారము చేయఁబడునది.
తను శబ్దము నకారాంత నపుంసకంబును గలదు, 'తను షేతను షేక ' మితి వాసవదత్తా.
తను కోశములు - (జం.) పునరుత్పత్తి క్రియ కాక శరీరములో తక్కిన జీవిత వ్యాపారములతో సంబంధము కల జీవ కణములు (Somatic or body cells.)
తనుజుఁడు - కుమారుడు, రూ.తనుజుఁడు, తనూభవుడు.

తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనము(పచనము - వండుట)చేసి శరీరము పడకుండ కాపాడునది.
తనూం న పాతయతి ధారయతీతి తనూనపాత్. త.పు. వఌ గతౌ - శరీరమును నిలుపువాఁడు.
ఇంధనం వినా స్వతనుం నపాతీతివా. పా రక్షణే - ఇంధనము లేక తన్ను రక్షించుకొనఁజాలనివాఁడు.

ప్రోౘు - క్రి.అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.

తనుజులనుం గురువృద్ధుల
జననీ జనకులను సాధు * జనుల నెఁవడు దా
ఘనుఁడయ్యుఁ బ్రోవఁడో యా
జనుఁడే జీవస్మృతుండు * జగతిఁ గుమారా!

తా. కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లితండ్రులను, సాదు- సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.)జనులను, ఎవఁడు తాను గొప్పవాఁడుగా నుండియు రక్షింపకయుండునో అట్టివాడు లోకములో జీవన్మృతుఁడు - బ్రతికి యుండియు చచ్చిన వానితో సమానుడు.)బ్రతికియుఁ జచ్చినవాఁడువలె నుండువాఁడు.     

గంగా సంభవ గిరిశ తనూభవ
రంగపురోభవ తుంగ కుచాధవ||శరవణభవ||

బర్హి - 1.నెమలి, 2.దర్భ.
బర్హమస్యాస్తీతి బర్హిణః అర్హీ చ. న. పు. - పింఛము కలది. 
కలాపో భూషణే బర్హే తూణీరే సంహతావపి,
కలాపశబ్దము భూషణమునకును, నెమలిపురికిని, అమ్ములపొదికిని, సమూహమునకును పేరు.
కలాః ఆప్నోతీతి కలాపః ఆప్ ఌ వ్యాప్తౌ. - కళలఁ బొందునది.
బర్హము - నెమలిపురి.
బర్హతే నృత్తేన బర్హం, బృహవృద్ధౌ. - నృత్యము చేత వృద్ధిఁబొందునది. 

దళే(అ)పి బర్హమ్ -
బర్హ శబ్దము ఆకునకును, అపిశబ్దమువలన నెమలిపురికిని పేరు.
బర్హతీతి బర్హం. బృహ వృద్ధౌ. - వృద్ధిఁ బొందునది.
'బర్హం మయూరపింఛే (అ)థ ప్రాధాన్యో ద్యోత వృద్ధిషు, పరివారే పుమా' నితి శేషః.

మందారగంధసంయుక్తం, చారుహాసం చతుర్భుజమ్|
బర్హిపింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుమ్| - 4

బ్రుషి - వ్రతస్థులు కూర్చుండు దర్భాసనము, రూ.బ్రుసి. 
స్థాండీలుఁడు - స్థండిల భూమియందు శయనించినవాడు, రూ.స్థండిలశాయి.
సమే స్థణ్డిల చత్వరే,
స్థండిలము - వ్రతనియమమున నున్నవాడు పండుకొనుటకు దర్భాదులు పరచిన భూమి. అగ్నిహోత్ర ముంచుటకై సంస్కరించిన భూమి.
తిష్ఠన్త్యగ్న యో (అ)స్మిన్నితి స్తండిలం ష్ఠా గతినివృత్తౌ. అగ్నిలు దీనియందుండును.
చత్వరము - ముంగిలి; ముంగిలి - (ముంగల+ఇల్లు), 1.అంగణము, 2.బయలు.
చతన్తే యాగఫలమత్రేతి చత్వరం, చతే యాచనే. - దీని యందు యాగఫలము నదుగుదురు. ఈ 2 అగ్నిహోత్రము నుంచుటకై సంస్కరింపఁబడిన స్థానము పేర్లు. 

కుశస్థలము - కన్యాకులబ్జ దేశము.
కుశస్థలి - ద్వారకానగరము, ఉదా. "కుశస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజింపగ నున్నవాడు".
కౌశాంబి - ఒక పట్టణము, వ్యు.కుశాంబునిచే నిర్మింపబడినది. కౌశాంబికేదేవి నారాయణి నమోస్తుతే|  

అస్త్రీ కుశం కుథో ధర్భః పవిత్రం -
కుశము - 1.దర్భ, 2.పలుపు, 3.ఒక ద్వీపము, 4.నీరు.
కౌశతే కుం శ్యతి నా కుశం. అ.ప్న శీఙ్ స్వప్నే; శోతసూకరణే. - భూమియందుండునది. లేక భూమి నల్పముగాఁ జేయునది కుశము.
కుథము - 1.పవిత్రము, 2.దర్భ, 3.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.  
విప్రపాణిషు కుథ్యత ఇతి కుథః కుథ శ్లేషణే. - బ్రాహ్మణ హస్తముల యందుఁ గూర్పఁబడునది.
దబ్బ - ఒక తెగ నారింజ.
దబ్భ - 1.బద్ధ, 2.వెదురుబద్ద, 3.దర్భ, సం.ధర్భః. 
బద్ద - 1.కాయ యొక్క ఖండము, 2.వెదురుబద్ద, 3.చీలిక, సం.భిత్తః.
దర్భ - కుశ, చూ.దబ్బ.
దృణాతి కరాదికమితి దర్భః, దౄ విదారణే. - కరాదులను జీల్చునది.

దాతకాని వాని దరచగా వేడిన
వాడు దాతనె వసుధయౌలోన
అవురు దర్భయౌనె యబ్ధిలోముంచినా విశ్వ.

తా|| దాతృత్వము లేనివానిని ఎన్నిసార్లు అడిగినను యేమియు లాభములేదు. అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య)సముద్రములో ముంచినను అవురుగడ్ది దర్భగాదు.    


పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.   
పూయతే అ నేనేతి పవిత్రం. పూఞ్ పవనే. - దీనిచేతఁ బవిత్రము చేయఁబడును. ఈ 4 దర్భపేర్లు.

పావనము - పవిత్రము.

ఉపవీతం యజ్ఞసూత్రం ప్రోద్ధృతే దక్షిణే కరే,
ఉపవీయతే వామస్కంధో (అ)నేనేతి ఉపవీతం. వ్యేఞ్ సంవరణే. - ఎడమ భుజము దీనిచేతఁ గప్పఁబడును.
కుడిచేయి తొడగఁబడుచుండఁగా నెడమభుజము మీఁద నుండు జన్నిదము.

ఉపవీతము - సవ్యముగా వేసికొన్న జందెము.
(ౙ)జందెము - జందియము.    
జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.

బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.

సూత్రము - 1.నూలిపోగు, చంద్రునికో నూలిపోగు 2.జన్నిదము, 3.ఏర్పాటు, 4.శాస్త్రాది సూచక గ్రంథము, (గణి.) కొన్ని పదములతో నేర్పడు సమీకరణము (Formula), 6.కొన్ని ధర్మముల నుగ్గడించు ప్రవచనము. 
ఏర్పాటు - ఏరుపాటు; ఏరుపాటు - 1.నిర్ణయము, 2.నియమము, 3.వివరణము, 4.భేదము, రూ.ఏర్పాటు.

అవధారణము - నిర్ణయము, నిశ్చయము. 
నిర్ణయము - ఏర్పాటు; నిర్ణయించు - క్రి.ఏర్పాటుచేయు.
నిశ్చయము - నిర్ణయము; నిర్ధారణ - నిశ్చయము.  
వ్యవసితము - నిశ్చయము, విణ.అనుష్ఠింపబడినది.  

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.

ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గఱి) విషయ విపులీకరణము (Exposition).

విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ || 

బర్హిస్సు - అగ్ని.     
బర్హిః. స-పు బృంహతి వర్థతే అజ్యాదినేతి బర్హిః. బృహి వృద్ధౌ - అజ్యాదుల(ఆజ్యము - 1నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.)చేత వృద్ధిఁ బొందువాఁడు.
శుష్మా న-పు శోషయతి జలమితి శుష్మా, శుష శోషణే - ఉదకమును (ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.)శోషింపఁ జేయు వాఁడు.
ప. బర్హిశ్శుష్మా. న-పు బర్హిషో దర్భాః శుష్మ బలమస్యేతి బర్హిశ్హుష్మేత్యే కంవాపదం - దర్భలు బలముగాఁ గలవాఁడు.

బర్హిర్ముఖాః బర్హిరగ్నిర్ముఖం యేషాంతే - అగ్నియే ముఖముగాఁగలవారు. (అనఁగా నగ్నియందు హోమము చేయఁబడిన హవిరాజ్యాదులవలనఁ దృప్తిఁ జెందువారు.)  

కిరీటోజ్జ్వలత్పరదిక్ప్రాంత భాగం,
సురైరర్చితం దివ్యరత్నైరవర్ష్యైః |
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం,
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ || - 6 

కందర్పుఁడు - మరుడు, వ్యు.కుత్సితమగు దర్పము కలవాడు.
కందర్పః, కం కుతితే (అ)వ్యయం. - కుత్సితో దర్పోయస్యసః కందర్పః - కుత్సితమైన దర్పము గలవాఁడు.
కం సుఖం తద్వత్సు దర్పో యస్యసః - సుఖవంతులయందు దర్పించువాఁడు.
కేబ్రహ్మణ్యపి దృప్తవాన్ కందర్పః - బ్రహ్మమీఁదను గూడ దర్పించినవాఁడు.

సుప్రజాతా సువీర్యా చ సుపోషా సుపతి శ్సివా,
సుగృహా రక్తబీజాంతా హరకందర్ప జీవికా|
   

మరుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది (29వ).

సముత్పత్తిః పద్మరమణ పదపద్మామల నఖా
న్నివాసః కందర్ప ప్రతిభటజటాజూటభవనే|
అథాయం వ్యాసంగో హత పతిత నిస్తారణ విధౌ
న కస్మాదుత్కర్షః తవ జనని జాగర్తి జగతి ||

తా. ఓ! జనని! అమ్మా! గంగామాతా! నీవు అందరికంటె శ్రేష్ఠురాలవుగా వెలుగొందుతున్నావు. ఎందుకంటే నీవు లక్ష్మీవల్లభుడైన శ్రీమహావిష్ణువు పాదపద్మములయొక్క స్వచ్ఛమైన నఖాలనుండి పుట్టావు. మన్మథుని శత్రువైన పరమశివుని జటాజూటమునందు నీనివాసం. ఇక వ్యాసంగం అనగా చేసే పని పతితులను పావనులను చేసి, ఉద్దరించుట. ఆహా! ఉత్తమజననం, ఉత్తమోత్తమ స్థావరం, అత్యుత్తమ కార్యనిర్హహణ, అనే మూడూ నిన్ను వరించాయి. ఇటువంటి ఉత్తమగతి మరెవరికి ఉంది. కాబట్తి నీవు అందరికంటె గొప్పదానవు.

కందర్ప విద్యా కందర్ప జనకాపాంగవీక్షణా,
కర్పూరవీటీ సౌరభ్యకల్లోలిత కకుప్తటా| - 3   

కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము, దురాచారుడు.
కృష్ణం వర్త్మ మార్గోయస్యసః కృష్నవర్త్మాన - పు. నల్లనిజాడ గలవాఁడు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
దురాచారుడు - చెడునడవడి కలవాడు. 

ఖరువు - 1.గుఱ్ఱము horse, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము, 5.భర్తను వరించు కన్య, విణ.దురాచారుడు, 2.క్రూరము.

దర్పకుఁడు - మన్మథుడు, వ్యు.దర్పింప చేయు.
దర్పయతీతి దర్పకః - గర్వింపఁ జేయువాఁడు.
దర్పము - 1.గర్వము, 2.కస్తూరి.
దర్పించు - క్రి.గర్వించు.

ఆలోక్య యస్యాతిలలామలీలాం
సద్భాగ్యభాజౌ పితరౌ కృతార్థౌ |
తమర్భకం దర్పకదర్పచౌరం
శ్రీజానకీజీవనమానతోస్మి| - 1
  

రదనా దశనా దన్తా రదాః -
రదనము - దంతము.
రదీన్తే భక్ష్యా ణ్యేభి రితి రదనాః, రదాశ్చ - రద విలేఖనే, వీనిచేత భక్ష్యములు తునకలుగాఁ జేయఁబడును.
దంశము - 1.అడవియీగ, 2.కాటు, 3.దంతము. 
కాటు - 1.మాడి అడుగంటుట, 2.కరచుట, 3.కరచిన గాయము.
దంశనము - 1.కాటు, 2.కవచము, 3.పల్లు, రూ.దంశనము.
దశతి శరీర మితి దంశనము, దంశ దశనే, పా, దంశనం. - శరీరమును కదసియుండునది.
దంసనము - దంశనము.
దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును. 
పలు - దంతము, విణ.అనేకము, విస్తారము.
కోఱ - పందికోఱ, పాముకోఱ, దంష్ట్ర, సం.ఖరుః. ఈ 4 పుల్లింగములు పండ్లపేర్లు.

కాటు - 1.మాడి అడుగంటుట, 2.కరచుట, 3.కరచిన గాయము.    

విధుంతుదుఁడు - రాహుగ్రహము.
గ్రహ కల్లోలము -
రాహుగ్రహము.    

దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా.
అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము

జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః. - భజగోవిందం

అర్జునుఁడు - 1.పాడవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.    

కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).

అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణో త్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణోత్సవః||

తా. సహజముగా బ్రాహ్మణులకుఁ(విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, సాధ్వి - పతివ్రత)లకు దేశాంతరము పోయిన తమ భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)యుద్ధము నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. - నీతిశాస్త్రము 

శోచిష్కేశుఁడు - అగ్ని, వ్యు.జ్వాలలే జుట్టుగా గలవాడు.
శోచీమ్షి జ్వాలాః కేశాః యస్య సః శోచిష్కేసః - శోచిస్సు లనఁగా జ్వాలలు; అవి కేశములుగా గలవాఁడు.
శోచిస్సు - 1.సూర్యకిరణము, 2.మంట.
శోచయతీతి శోచిః, స.న శుచ శోకే - తీవ్రమైనది గనుక దుఃఖపెట్టునది.  

తొలుగట్టు - ఉదయాద్రి.
ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.    

ఉదయః పూర్వపర్వతః,
ఉత్యన్ని స్సూర్యాదయ అస్మాత్ ఉదయః, ఇణ్ గతౌ. - దీనియందు సూర్యాదులు ఉదయింతురు.
పూర్వాశ్చాసౌ పర్వతశ్చ పూర్వపర్వతః - తూర్పు దిక్కున నుండెడు పర్వతము. ఈ 2 ఉదయపర్వతము పేర్లు.

ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.

ఉత్పన్నము - 1.పుట్టినది, 2.ఒనగూడినది.
ఉపపన్నము - 1.పుట్టినది, 2.పొందబడినది, 3.యుక్తయుకతము, 4.తగినది.

ఉపపత్తి - 1.కలిమి, 2.పుట్టుక, 3.కారణము, 4.(గణి.) ఒక సిద్ధాంతమును స్థాపించుటకు లేదా రుజువు చేయుటకు కల్పించబడు సబబు.    
కలిమి - 1.అతిశయము, 2.సంపద.
అతిశయము - అధిక్యము.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

తనకలిమి యింద్రభోగము
తనదుఃఖమె సర్వలోక దారిద్యంబౌఁ
దనచావు జలప్రళయము
తనువలచిన యదియె రంభ తధ్యము సుమతీ!

తా|| తన(తన - ఆత్మార్థకము)ఐశ్వర్యమే దేవేంద్ర పదవిగాను, తనదుఃఖము - బాధ, చింత సర్వలోక దారిద్ర్యముగాను, తనమృతి - చావు యుగ ప్రళయముగాను, తను వలచిన(అది - ఆ వస్తువు, ఆమె.)స్త్రీ రంభ - 1.ఒకానొక అచ్చర, 2.అరటి చెట్టు.)గానుతోచుట తధ్యము. 

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ. 

అరుణోదయము - సూర్యోదయమునకు ముందు నాలుగు గడియలకాలము, వేకువజాము.

ప్రత్యూషము - వేగుజాము.
ప్రత్యూషతి నిశాం ప్రత్యూషః, ఊష రుజాయాం - రాత్రిని బోఁగొట్టునది.
పా, ప్రత్యుషః, అ. పు. ఓషత్యంధకారమితి ప్రత్యుషః - చీఁకటిని బోఁగొట్టునది.
తథాచ ప్రయోగః_ 'ప్రత్యుషః పారిజాత ' ఇతి సూర్యశతకే.
అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
అహ్నః ముఖమారంభః అహర్ముఖం - అహస్సుయొక్క ప్రారంభము.
కల్యము - 1.వేకువ, 2.ఉపాయము.
కల్యంతే ప్రతిబుధ్యంతే (అ)త్ర కల్యం, కలగతౌ. - ఇందు జనులు ప్రబోధింపఁబడుదురు.
కలయతి మంగళంకల్యం, కలశబ్ద సంఖ్యానయోః - శుభమును జేయునది. పా, కాలే సాధు కాల్యమితి వా - కాలమందు యోగ్యమైనది.
కల్యవ ఠ్తము - ప్రాతఃకాల భోజనము.
స్త్రీఘోషము - వేకువ; వేకువ - వేగుజాము.
వ్యుష్టము - వేగుజాము. 

విశ్వకేతువు - అనిరుద్దుడు, వ్యు. పెక్కు ధ్వజములు కలవాడు.
విశ్వకేతుః-అనుపాఠమునందు - విశ్వవ్యాపీకేతు ర్ద్యుతిర్యస్యసః - విశ్వవ్యాపకమైన తేజస్సు గలవాఁడు, మన్మథుడు.
అనురుద్ధ ఉషాపతిః,
అనిరుద్దుఁడు - 1.అడ్డగింప బడనివాడు, 2.లొంగనివాడు, వి.1.గూఢచారుడు, 2.ప్రద్యుమ్నుని కొడుకు, 3.విష్ణువు, 4.శివుడు.
అనిరుద్ధః న నిరుద్ధ్యతే పరైరిత్యనిరుద్ధః – పరుల చేత నడ్డగింపబడనివాఁడు. రుధిర్ ఆవరణే.
ఉషాపతిః, ఇ - పు, ఉషా బాణసుతా, తస్యాః పతిః - బాణాసురుని కూఁతురైన ఉషకు మగఁడు. ఈ 2 అనిరుద్ధుని పేర్లు.

ఉష - 1.రేయి, 2.రాత్రివిశేషము, 3.బాణాసురుని కూతురు.

ఉషా రాత్రే రవసానే -
ఉషా - ఇది ప్రాతఃకాలమందును, ఉ, 'ఉషా జనాః ప్రతి బుధ్యంతే', 'ఉషా తమో వాయు రుపైతి మందం' పా, ఉషః, 'ఉషా స్యా ద్రజనీశేషే ఉష ఇత్యపి దృశ్యతే' అని రభసుడు.

ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.
ఉషసి ప్రభాతే బుధ్యతే జ్వలతే త్యుషద్బుధః, బుధ అవగమనే - ప్రభాతకాలమునందు జ్వలించువాఁడు.

ఉషస్సు -  సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.
ఔషసి - వేకువ, ఉషఃకాలము.
ఓషతి అర్కకరై రిత్యుషః ప్రత్యుషశ్చ, స. న. ఉషదాహే - సూర్యకిరణములచేత దహింపఁజేయునది, వ్రతిరుపసర్గాంతర వ్యావర్తకః.
విభాతము - ప్రభాతము, వేకువ.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
భాతం ప్రవృత్తం ప్రభాతం, భా దీప్తౌ - ప్రకాశింపఁ బ్రవర్తించునది. 
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః. 
రేపకడ - ప్రాతఃకాలము.

శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
కృష్ణవర్ణత్వాత్ శ్యామా - నల్లనిది.

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||

తా. ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి.)చూచుకొని పోవలయునని బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు Jupiter చెప్పెను. ఎపుడు బయలు దేరిన కార్యము సఫల మగునని నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా)మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్థనుఁడు - విష్ణువు చెప్పెను. - నీతిశాస్త్రము

వామదేవుఁడు - శివుడు.
వాముః శ్రేష్ఠ స్ప చాసౌ దేవశ్చ వామదేవః - శ్రేష్ఠుడైన దేవుఁడు. 
వామపార్శ్వే ధృతా దేవీయస్య నః - ఎడమ ప్రక్కను ధరింపఁబడిన భార్య గలఁడు.
వామయా దీవ్యతీతి నా - స్త్రీచే బ్రకాశించువాఁడు.
దివ్ క్రీడావిజీగీషా వ్యవహార - ద్యుతి స్తుతిమోద మద స్వప్న కాంతిగతిషు. వక్రత్వాద్వామస్స చాసౌ దేవశ్చేతి వా - వక్రక్వము గల దేవుఁడు.

వామ - ఉత్తమ స్త్రీ.     
వామత్వేన వక్రస్వభావత్వేన రమ్యత్వేన వా వామా - వక్రశీలమైనదిగాని, రమ్యమైనదిగాని వామ.
వామనము - లేతది.
వామనత్వా త్వామనః - పొట్టిదిగనుక వామనము. వామం వల్గు శరీర మస్యాస్తీతి వా వామనః - అందమైన శరీరము గలది.    

వామము - ధనము, విణ. 1.ఎడమ, 2.సుందరము, 3.హ్రస్వము.
దా - 1.ఎడము, 2.సవ్యము, డా యొక్క రూపాంతరము (దాపల - డాపల)క్రి. రమ్ము.
ఎడము - 1.చోటు, తావు, 2.అవకాశము, 3.నడిమిభాగము.
సవ్యము - 1.ఎడమ, 2.కుడి, 3.ప్రతికూలము.
ఎడమ - సవ్యము, వ్యతి.కుడి, వి.వాసుభాగము.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము వలపల.
అపసవ్యము - 1.ప్రతికూలము, కుడిభాగము.

వామౌ వల్గు ప్రతీపా ద్వౌ - వామశబ్దము మనోహరమైనదానికిని, ప్రతికూలమైనదానికిని పేరు. వాయతే వమ్యత ఇతిచ వామః, వా గతి గంధనయోః, టు వము ఉద్గిరనే. - పొందఁబడునది; విడువఁబడునదియును గనుక వామము. "వామ పుంసి హరే క్లీబం ద్రవినే స్త్రీతు యోషితి, వామీ సృగాలీ బడబా రాసభీ కరభీషుచే"తి శేషః.

కూబరము - మనోజ్ఞము, సుందరము, సం.వి.1.బొండినొగ, 2.మోచేయి.

అథ వామనే,
న్య ఙ్నీ చ ఖర్వ హ్రస్వా స్స్యుః -

వామము - ధనము, విణ. 1.ఎడమ, 2.సుందరము, 3.హ్రస్వము. 
వామో వల్గుత్వ మస్యాస్తీతి వామనః - ఒప్పిదము గలది.
నిమ్నమంచతీతి న్యఙ్. చ. నీచశ్చ. అఞ్చుగతిపూజనయోః - దిగువఁబొందునది. 
ఖర్వము - 1.ఒక సంఖ్య (10,000,000,000), 2.కుబేరుని నిధులలో ఒకటి, విణ.1.అధమము, 2.పొట్టిది, 3.స్వల్పము.
ఖర్వత్యవయ పదార్ద్యేనేతి ఖర్వ గర్వ దర్పే. - అవయవ దార్ఢ్యముచేత గర్వించునది.
హ్రస్వము - మిక్కిలి పొట్టిది.
హ్రసతీతి హ్రస్వః. హ్రస హ్రాసే. - కొంచెమై యుండునది. ఈ 4 కుఱుచైనదాని పేర్లు. 
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.

నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము). 

స్వల్పము - మిక్కిలి అల్పము.

హ్రస్వదృష్టి - (భౌతి.) దగ్గరనున్న వస్తువులే కనిపించుదృష్తి (Short-sight) దూరపు వస్తువులు సరిగా కనిపించక పోవుట.

హీనాంగా నతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయౌధి కాన్ |
రూపద్రవ్య విహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షి పేత్ ||

తా. తొంటచేయి- ఈచపోయిన చేయి,కుఱచగల నిడుపులైన చేతులు, కాళ్ళు మొదలయిన అవయములుగల వారలను, విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)విద్యావిహీనులను, వయోజనులు - ఈడుదాటిన వ్యక్తులు, వయస్సు వచ్చిన వారు(Adults).వయసుచేత పెద్దనైన వారలను, సౌందర్యము(చక్కదనము), ద్రవ్యము - ధనము, వస్తువు), జాతి వీనిచే(హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది. దక్కువైన వారలను ఆక్షేపింపఁ గూడదు. - నీతిశాస్త్రము

మహాదేవుఁడు - శివుడు.
మహాం శ్చాసో దేవశ్చ మహాదేవః - శ్రేష్ఠుఁడైన దేవుడు.    

బృహత్భానువు - అగ్ని.
బృహంతః భానవోయస్య సః బృహత్భాను, ఉ. పు. - అధికము లైన కిరణములు గలవాఁడు.

విరూపాక్షుఁడు - శివుడు.
విరూపాణి రవిచంద్రాగ్ని రూపత్వా త్రివిథాని అక్షిణి - యస్య సః విరూపాక్షః సూర్యచంద్రాగ్ని రూపము లగుటవలన మూడువిధములైన కన్నులు గలవాఁడు.
విరూపితము - (భౌతి.) రూపము వికారముగా చేయబడినది. 
వికృతము - వికారము నొందినది, రోతయైనది.
కార్మ్యాదినా పూర్వావస్థా పేక్షయా విరుద్ధః వికృతః. - కార్మ్యాదులచేత పూర్వావస్థకంటె వికృతమై యుండువాఁడు.
వికృతి - 1.ఇరువది నాల్గవ(24వ) సంవత్సరము, 2.వికారము, 3.విస్మృతి, సం.వి.(భౌతి.) బలప్రయోగము వలన ఒక వస్తువు ఆకారమందు తేబడిన మార్పు, (Strain) ఒక ప్రతిబలముచే ఒక వస్తువులో గోచరించు విరూపత యొక్క విస్తారము, (Strain), బహిర్మలముల కారణముగ ఒక ఘనపదార్థమునకు సంభవించు వికార రూపము.

వికారము - 1.మారురూపు, 2.తెవులు.
వికారి - వికారముగలది, వి.ముప్పది మూడవ(33వ) సంవత్సరము.

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ|
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ ||

ప్రతిబలము - (భౌతి.) ఒక వస్తువు పై ప్రయోగించిన బలముల ఫలముగ ఆ వస్తువులో ప్రాదుర్భవించిన అంతర బలములు (Stress).

వంగడము - వంశము, రూ.వంగనము, వై (వ్యవ.) పశుజాతి నుండి గాని, వృక్షజాతి నుండిగాని యెంచబడిన ప్రత్యేక లక్షణములు గల తరగతి(వంశము) (Strain) ప్రత్యేక లక్షణములను కలిసియున్న ఉపజాతిలోని రకము.

మిక్కిలికంటివేల్పు - ముక్కంటి.
మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము.
మిక్కటము - మిక్కిలి, అతిశయము, రూ.మిక్కుటము. 

ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమోనమః| 

త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
త్రీణిలోచనాని యస్యసః త్రిలోచనః - మూడుకన్నులు గలవాఁడు.
ముక్కంటి - త్రిలొచనుడు, శివుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.

లోచనము - నేత్రము.
లోచ్యతే అనేనేతి లోచనం. లోచృ దర్శనే. - దీనిచేత చూడఁబడును.    

ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః|  

కృశానరేతసుఁడు - శివుడు, వ్యు.అగ్నిలో పడిన వీర్యము కలవాడు.
కృశానురగ్నిః రేతోయస్య సః కృశానురేతాః, స-పు. - అగ్నిరూపమైన రేతస్సు గలవాడు.    

కృశానువు - అగ్ని.
కృశ్యతి తనూ కరోతి స్వసంబద్ధమితి కృశానుః, ఉ - పు. కృశ తనూకరణే - తన్నంటిన దానినిఁ గృశింపఁజేయువాఁడు.
కృశో (అ)ప్యతివర్ధతే కృశానుః - కృశుఁడైనను వృద్ధిఁబొందువాఁడు.

కృశాంగి - స్త్రీ, విణ.బక్కపలుచని దేహము కలది.

కృశము - 1.బక్క, 2.సన్నము, 3.అల్పము.
కృశ్యతీతి కృశం, కృశ తనూకరణే. - సన్నమైయుండునది.
బక్క - కృశించినది, శుష్కము.
శుష్కము - వంటచెరకు, విణ.ఎండినది, వట్టి.
శుష్కించు - క్రి.1.ఎండు, 2.ఇంకు.
ఎండు - క్రి.1.నీరింకు, 2.తడియారు, 3.శుషించు, 4.తపించు. 
శుష్కపరీక్షణ - (రసా.) గుణాత్మక రాసాయనిక విశ్లేషణప్రక్రియయందు, జరిగించు ప్రథమాంకము, (Dry test). 

ఇంకు - క్రి.1.నేల మున్నగు వానిలో (ద్రవపదార్థములు) ఇగిరిపోవు, 2.వట్టిపోవు, ఎండు, 3.నశించు, 4.కృశించు, రూ.ఇసుకు.  

క్షీణము - క్షయించినది, కృశించినది.
క్షీణించు -
క్రి.తరుగు, కృశించు.
క్షీణించుట - (గృహ.) 1.శుషించుట, 2.బలహిన్నమగుట, 3.సన్నగిల్లుట.
క్షీణోపయుక్తి న్యాయము - న్యా. (అర్థ.) ఒకే వస్తువును అనుభోగించు నపుడు, రాను రాను ఆవ్యక్తికి దానికిని గల ఉపయుక్తి తరుగుచుండు నను న్యాయము.

డయ్యు - క్రి.బలహీనమగు, 2.కృశించు.
దయ్యు - క్రి.డయ్యు.

పేలవం విరళం తను,
పేలవము - పలుచనిది, కోమలమైనది.
పిల్యతే క్షిప్యత ఇతి పేలవం, పిల క్షేపే. - ద్రొబ్బఁబడునది.
విరళము - ఎడమైనది.
విశేషేణ రత్యంతరమితి విరళం, రా ఆదానే. - విశేషముగా నవకాశము నగీకరించునది.
అబల - స్త్రీ; స్త్రీ - ఆడుది.
అల్పం బలమస్యా అబలా, అల్పార్థేనఞ్. - అల్పమైన బలము గలిగినది.
తని - 1.అల్పము, 2.సూక్షము, సం.తనుః.
తన్యతే విస్తీర్యత ఇతి తను, తను విస్తారే. - విస్తరింపఁబడునది. ఈ 3 పలుచనిదాని పేర్లు.

క్షత్రియం చైవసర్పంచ బ్రాహ్మణంచ బహు శ్రుతం,
నామ మశ్యేత వైభూష్ణుః కృశానపి కదాచనః ||

తా. అభివృద్ధిగాఁ గల నరుఁడు రాజును, సర్పము - పాము, సప్పము.)పామును, అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.)బ్రాహ్మణుని, పండితుని, కృశించినవారలను వీరల నొకప్పుడు అవమానించ రాదు. – నీతిశాస్త్రము

పావకుఁడు - అగ్ని. పావకే జలశాయినం..
పునాతీతి పావకః, పూఙ్ పవనే - పవిత్రమును జేయువాఁడు.
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.

అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్ట వసువులలో ఒకడు.
అనంతి జీవంత్యనేన లోకా ఇత్యనలః, అన ప్రాణనే. - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాపి ర్నాస్త్యస్యేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేనివాఁడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3. (వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య. 

తన సత్క ర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైనఁ బెరుఁగు * నయ్యః కుమారా !
తా.
తాను చేసిన మంచికార్యముల సాయము చేతనే భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.) త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడపాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా ?  

అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.

అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము.
అనంత్యనేనేత్యనిలః, అన ప్రాణనే - ఇతనిచేత బ్రతుకుదురు.
అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్ట వసువులలో ఒకడు.  

అనిలాః అన్యంతే ప్రాణ్యంతేలోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణయుక్తములుగాఁ జేయఁబడును గనుక అనిలులు, అన ప్రాణనే, ఇలా యం న చరంతీతి వా - భూమియందు సంచరించనివారు, వారు 19డ్రు.

మహావాతము - 1.గాలితో గూడిన పెద్దవాన, 2.పెద్ద వాతరోగము.
వాతూలము -
 1.గాలి, 2.సుడిగాలి.
వాత్య -
సుడిగాలి.
సుడిగాలి - వాత్య, (భూగో.) మిక్కిలి వేగముతో గుండ్రముగా గిరగిర తిరిగెడు గాలి.

సుడి - 1.జలావర్తము, నీటిసుడి(సుడిగుండము) 2.రోమావర్తము, వెండ్రుకలసుడి 3.అనిలావర్తము, గాలిసుడి(వాత రోగము). 

వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
గంధర్వ మృగవిశేషస్య భూతవిశేషస్య వా హస్త ఇవ పత్రమస్య గంధర్వహస్తకః - గంధర్వమనఁగా మృగ విశేషముగాని భూతవిశేషముగాని, దానిచేతివలె నుండెడు ఆకులుగలది.  

అనిలో మృగనాభిరేణుగంధి ర్హరవామాంగకుచో త్తరీయ
హరతే మరణశ్రమం జనానా మథికాశి ప్రణవోపదేశకాలే|
భా||
మనోజ్ఞమైన (మృగనాభి - మృగమదము, కస్తూరి.) కస్తూరికా రేణుగంధిలమై శివుని వామాంగకుచోత్తరీయ సం జనితమైన పిల్లగాడ్పు కాశీపురమందుఁ బ్రణవోపదేశసమయమున దేహుల మరణ శ్రమ మపన యించును. (ఉత్క్రమణ సమయమున దేహునకు శంకరుఁడు(ఉ)మా సమేతుఁడై ప్రణవోపదేశము సేయునని భావము.)

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః|

సర్వజ్ఞుఁడు - 1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు.
సర్వ్జః, సర్వంజానాతీతి సర్వజ్ఞః - సమస్తము నెఱింగినవాఁడు. జ్ఞా అవబోధనే.
సర్వం జానా తీతి సర్వజ్ఞ - సర్వము నెఱింగినవాఁడు.

పాలసుకైన యాపద
జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞనకుం
దేలగ్నిబడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ.

తా|| తేలు - క్రి.1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము Scorpion. అగ్ని - 1.నిప్పు fire, 2.అగ్నిదేవుడు.)అగ్నిలో పడనున్న సమయంలో, జాలిపడి దానిని తప్పించినచో అది మనం చేసిన ఉపకృతి - మేలును, గ్రహింపక వెంటనే మీటు - 1.పొడుచు, 2.కుట్టు, 3.ఎగజిమ్ము, వి.1.పెంపు, 2.ఉద్రేకము, విణ.అధికము. అట్లే సర్వజ్ఞుఁడు లోకంలో అన్నియు తెలిసిన వాడైనను, పాలసుఁడు - బాలిశుడు, మూర్ఖుడు, సం.బాలిశః.నికి కల్గిన ఆపదకు కనికరించి తీర్చుటకు పూనుకోరాదు, దుష్టుడగువాడు మనం చేసిన మేలును గ్రహింపక మనకే అపకారం చేయును.  

సుగతుఁడు - బుద్ధుడు.
సుగతః శోభనం గతం జ్ఞానమస్య సుగతః - మంచి జ్ఞానము గలవాఁడు.
సుష్టు అపునరావృత్త్యా మోక్షం గతః - లెస్సగా పునరావృత్తి లేక మోక్షమును బొందినవాడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుద్ధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు. 

ధర్మరాజు - 1.యుధిష్ఠిరుడు, 2.యముడు, 3.బుద్ధదేవుడు. 
యథాపరాధ దండదానేన ధర్మస్య రాజా ధర్మరాజః - అపరాధమునకుఁ దగినట్లు శిక్షించుటచేత ధర్మమునకు రాజు.

జయుఁడు - 1.ఇంద్రుని కొడుకు, 2.ధర్మరాజు, 3.విష్ణువుయొక్క ద్వారపాలకుడు.

ధర్మరాజౌ జినయమౌ -
ధర్మరాజ శబ్దము బుద్ధదేవతకును, యమునికి, యుద్ధిష్ఠిరునకును పేరు. ధర్మస్య రాజా ధర్మరాజః - ధర్మమునకు రాజు.

యుధిష్ఠిరుఁడు - ధర్మరాజు, అజాత శత్రువు.
అజాతశత్రువు -
ధర్మరాజు, విణ.శత్రువు లేనివాడు.
కర్ణానుజుఁడు - యు ధి ష్ఠి రు డు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి) గుణము (Property).   

జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.
జినః జయతి భవం జినః - సంసారమును జయించెడివాఁడు, జి జయే.  

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి, (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).
మాతి వర్తతే (అ)త్ర మాతా, ఋ. సీ. మామానేవర్తనే చ - గర్భ మీమెయం దిమిడి యుండును.

సత్యం మాతాపితా జ్ఞానం ధర్మోభ్రాతా దయా సఖా|
శాంతిఃపత్నీ క్షమాపుత్ర స్షడైతే మమభాదవాః||

తా. సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము భ్రాత - తోఁడబుట్టినవాఁడు, దయ - కనికరము స్నేహితుఁడు, శాంతి - శమనము)భార్య, క్షమ - 1.ఓర్పు, 2.నేల, మన్నింపు.)కుమారుఁడు, ఈ యాఱును నాకు బాంధవులని ధర్మరాజు చెప్పెను. – నీతిశాస్త్రము 

పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు:- ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు).   

సంయమని - యముని పట్టణము.
ప్రేతపురము - యమపట్టనము.  

అనంతవిజయము - ధర్మరాజు శంఖము, విణ.అంతములేని జయము కలది.

అనన్తవిజయం రాజా కున్తీ పుత్రో యుధిష్ఠిర|
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ|| -16శ్లో

తా|| కుంతీపుత్రుడగు ధర్మరాజు అనంతవిజయమను శంఖమును, నకులుడు సుఘోషమను శంఖమును, సహదేవుడు మణిపుష్పకమను శంఖమును పూరించిరి. - అర్జునవిషాదయోగము, భగవద్గీత

గౌతమబుద్ధుడు - (చరి.) సిద్ధార్థుడు, (క్రీ. పూ. 566-486). బౌద్ధధర్మ స్థాపకుడు, తథాగతుడు, శాక్యముని.
తథాగతఁ యథా పునరావృత్తిర్నభవతి తథా మోక్షం గతః - ఎట్లు పునరావృత్తి గలుగదో అట్లు మోక్షమునొందినవాడు.
తథా సమ్యగ్గతం జ్ఞాన మస్యేతి తథాగతః – మంచి జ్ఞానముగలవాఁడు.
యథామునయో మోక్షం గతా స్తథా మోక్షం గత ఇతివా - మునులెట్లు మోక్షమును బొందిరో అట్లు మోక్షమును బొందినవాడు.

సిద్ధర్థుఁడు - శాక్య బుద్ధుడు.      

సమంతభద్రః సమంతతః పుణ్యసంభారాత్ జ్ఞాన సంభారాచ్చ భద్రః శ్రేష్ఠః - పుణ్యసంభారము వలనను జ్ఞాన సంభారము వలనను శ్రేష్ఠుడు.
సమంతం సంపూర్ణం భద్రం మంగళమస్యేతి వా - సంపూర్ణమైన శుభము గలవాఁడు.    

శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
శాక్యమునిః, ఇ-పు. శాకవనవాసిత్వాచ్ఛాక్యః - శాక్యశ్చాసౌ మునిశ్చ శాక్యమునిః, శాకావృక్షప్రతిచ్ఛన్నం, వాసం యస్మాచ్చ చక్రిరే, తస్మాదిక్షాకు వంశ్యాన్తే శాక్యా ఇతి భువి స్మృతాః. - శాకవనమందుందువాడు.  
శకదేశేషు జాతో మునిః - శకదేశములయందుఁ బుట్టిన ముని.
శాక్యసింహుఁడు  శాక్యముని, బుద్ధుడు. 
శాక్యసింహః, శాక్యేషు సింహఃశ్రేష్టః - శాక్యులలో శేష్ఠుడు.    

సర్వార్థసిద్ధుఁడు - శాక్య బుద్ధుడు.
సర్వార్థసిద్ధః సర్వార్థేషు సిద్ధో నిష్పిన్నః - అన్నిపనులయందు గృతార్థుడైనవాడు.  

గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు.
గౌతమః గౌతమస్య శిష్యాశ్శాక్యా గౌతమా ఇత్యుచ్యతే, తద్వంశావతీర్థత్వా ద్బుద్ధో (అ)పి - గౌతమముని శిష్యులు గనుక శాక్యులు గౌతములు, ఆ వంశమందుఁ బుట్టినవాఁడు. గౌతమముని సంపూజిత రామ్|

గంగలు - కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి, భాగీరథి - వీనినే పంచ గంగ లందురు.  

గోదవరి - గౌతమినది. గౌతమముని భార్య, అహల్య. శ్రీమ దహల్యోద్ధార్క రామ్|
గోదారి - 1.వెన్నకాచిన మడ్డి, 2.గోదవరి. గోదావరి యందు త్రిసంధ్య|

ధార - 1.నీటిచాలు, 2.ఆయుధముల వాదర, 3.చిల్లి, 4.అశ్వగతి విశేషము, 5.ప్రవాహము, 6.పరంపర.

దార - 1.ధార, 2.నీటిచాలు, 3.దానము, 4.క్రమము, సం.ధారా.
దార - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
ధారపోయు - క్రి.చేతనీరుగొని దత్తముచేయు.

దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విణ.చీల్చువాడు.
ద్రియత ఇతి దారకః. - ఆదరింపఁబడువాఁడు.

క్రూరమనస్కులౌ పతులఁగొల్చివసించిన మంచి వారికిన్ 
వారిగుణంబుపట్టి చెడువర్తనవాటిలుఁ, మాధురీ జలో   
ధారలు గౌతమీముఖమాహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁజెందవే మొదలి కట్టడలన్నియుఁదప్పి భాస్కరా.

తా. గోదావరీ మొదలగు మహా నదులలోని తియ్యని నీళ్ళు అంబుధి - సముద్రమున కలసి నంతనే, వాని మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు. తీయదనమును పోగొట్టుకొని ఉప్ప దనమునే పొందును. అట్లే దుర్మార్గులగు యజమానులను సేవించు వారికి వారి దుర్మార్గతయే పట్టుబడును.

క్షారము - 1.గాజు, 2.బూడిద, 3.కారము, (రసా.) చేతికి జిడ్డుగ తగులునది, ఆమ్లములతో లవణముల నిచ్చునది, ఎఱ్ఱలిట్ మస్ ను నీలిరంగుగ మార్చునది (Alkali). 

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయాణ| 

అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్కవంశత్వాత్ అర్కబంధుః, ఉ-పు. - సూర్యవంశమున జనించుటవలన అర్కబంధువు.    

ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.
ధూర్భారతా జటిః జటా యస్యేతి ధూర్జటిః ఈ-పు. - భారమైన జడలు గలవాఁడు.

దురమునఁ దాటకందునిమి ధూర్జటివిల్ దనుమాడి సీతనుం
బరిణయమంది తండ్రి పనుపన్ ఘనకానన భూమి కేఁగిదు
స్తరపటుచుండ కాండకులి శాహతి రావన కుంభకర్ణ భూ
ధరములఁ గూల్చితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ|

తా. రామా! యుద్ధమున తాటకను చంపి, శివుని విల్లు విఱచి, సీతను పెండ్లాడి, తండ్రి పంపఁగా కాఱడవికి పోయి వజ్రాయుధము చేత కొండలను గూల్పునట్లు వారింపరాని వాఁడి బాణమున రావణ కుంభకర్ణులను గూల్చినవాఁడవు నీవె యగుదువు.       

ఊర్జిత శాసన మార్జిత భూషణ
స్ఫూర్జథుఘోషణ ధూర్జటి తోషణ|| శరవణభవ||

వార్ధక్యే చేంద్రియాణాం వికలగతి మత - శ్చాధిదై వాదితా పైః
ప్రాప్తై ర్యోగై ర్వియోగై ర్వ్యసనకృతనుం జ్ఞప్తిహీనం చ దీనమ్|
మిథ్యామోహాభిలాషై ర్భ్రమతి మమ మనో ధూర్జటే ర్ధ్యానశూన్యం
క్షంతవ్యో మే(అ)పరాధ శ్సివ! శివ! భో! శ్రీమహాదేవ! శంభో! - 4

నీలలోహితుఁడు - శివుడు.
నీలలోహితః జుహ్వతో బ్రహ్మణో లలాతస్వేదనం తేజో (అ)గ్నౌ నిపత్య నీలం సల్లోహిత మభూత్. తతో (అ)యం జాత ఇతి నీలలోహితః - బ్రహ్మహోమము చేయునపుడు లలాటస్వేదము వలనఁ గలిగిన తేజము అగ్నియందుందుఁబడి నీల వర్ణమై పిమ్మట రక్తవర్ణమాయెను. అందు వలనఁ బుట్టినవాఁడు గనుక నీలలోహితుఁడు.
నీలలోహితము - (రసా.) బచ్చలిపండు రంగు గలది (Purple).   

2. దాహము - 1.కాలుట, 2.దప్పి.

ఉదన్యాతు పిపాసాతృట్తర్షః -
ఉదకేచ్ఛా ఉదన్యా - ఉదకమందలి యిచ్ఛ ఉదన్య.
పిపాస - దప్పిక.
పాతు మిచ్ఛా పిపాసా, పాపానే.
తృట్టు - 1.దప్పి, 2.ఇచ్ఛ, రూ.తృష, తృష్ణ.
తృష - తృట్టు.
తర్షణం తృట్, ష.సీ. తర్షస్చ, తృష పిపాసాయాం. 
పానము సేయు నిచ్ఛ పిపాస, తృట్టు, తర్షము. ఈ 4 దప్పి పేర్లు.

మనిషికో స్నేహం మనసుకో దాహం......

తర్షము - 1.దప్పి, 2.ఇచ్ఛ, రూ.తృష్ణ, 3.పడవ.
దప్పి - 1.నీరువట్టు, పిపాస, 2.శ్రమము, రూ.దప్పిక, సం.తాపః.
నీరువట్టు - దప్పిక.

తృష్ణే స్పృహా పిపాసే ద్వే -
తృష్ణాశబ్దము ఆశకును, దప్పికిని పేరు. తర్షణం తృష్ణా. తృష పిపాసాయామ్. పానముచేయు కోరిక.

దగ - 1.దాహము, 2.తాపము, 3.దప్పి, సం.దాహః.
దూప -
దప్పి.
దూపటిల్లు - 1.దప్పిగొను, 2.పరితపించు. విదాహము - మిక్కిలి దప్పిక.

నీరే ప్రాణాధారము,
నోరే రసభరితమైన నుడవుల కెల్లన్
నారే నరులకు రతనము
చీరే శృంగారముండ్రు సిద్ధము సుమతీ.
తా||
సమస్త జీవులకు నీరే ముఖ్యాధారం, సంభాషణకు నోరే కేంద్రం, మానవులకు స్త్రీ రత్నంవంటిది, చీరయే స్త్రీకి అలంకారం.

శ్రమము - 1.అలసట, 2.అలవాటు, 3.సాము.
అలసట -
అలవు, ఆయాసము, బడలిక, గ్లాని.
అలవు - 1.బలము, శక్తి, 2.ఉపాయము, నేర్పు, 3.శ్రమము, 4.విధము.
ఆయాసము - 1.శ్రమము, 2.ఉత్సాహము, 3.పరితాపము.
అలవాటు - 1.అభ్యస్తము, 2.సిద్ధము, వి.అభ్యాసము, వాడుక.
సాము - 1.సగము, 2.వ్యాయామము, సం.1.సామి, 2.శ్రమః.
సామి - 1.స్వామి, 2.రాజు, 3.పెనిమిటి, 4.కుమారస్వామి, సం.స్వామీ.  
సాముకంటిచుక్క - పుబ్బనక్షత్రము.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

శ్రమదానము - సాఘికాభివృద్ధి కార్య క్రమములలో నిస్స్వార్థముగ కాయ కష్టము చేయుట.

స్వామి - 1.ఒడయడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.
ఒడయఁడు -
1.మగడు, 2.ప్రభువు, రూ.ఒడయుఁడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి. స్కందుఁడు - కుమారస్వామి. 
స్వామిని - అధికారిణి.

తడవోర్వక యొడలోర్వక
కడవేగం బడచిపడినఁ గార్యంబగునే
తడవొర్చిన నోడలోర్చిన
జెడిపోయిన గార్యల్లఁ జేకుఱు సుమతీ.
తా.
ఆలస్యమునకు శరీరశ్రమకును ఓపనియెడల ఏ కార్యమును నెఱవేరదు. అదియే ఆలస్యము నకును శరీరశ్రమకును ఓర్చిన యెడల చెడిన కార్యముగూడ సాఫల్యత నొందును.  

లంబోదరుఁడు - వినాయకుడు.
లంబ ముదరం యస్య సః లంబోదరః - వ్రేలెడి బొజ్జగలవాడు. లంబోదరం పంచమం చ, 
బొజ్జ - కడుపు.
బొజ్జదేవర - వినాయకుడు. 
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter. 
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
వీఞ్ ప్రాపణే, విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్రత్వాత్ - స్వతంత్రుఁడౌటవలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు. 

గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

పరిత్యక్తా దేవా వివిధవిధి సేవాకులతయా
మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి |
ఇదానీం చేన్మాతః తవ యది కృపా నాపి భవితా
నిరాలంబో లంబోదరజనని! కం యామి శరణమ్| - 5
  

మన్దస్తు తున్ద పరిమృజ ఆలస్య శ్శీతకో అలసో అనుష్ణః : 
3. మందుఁడు- శని Saturn, విణ.1.అల్పుడు, 2.మూర్ఖుడు, 3.వ్యాధిగ్రస్తుడు.
ఆలస్యేన మందతే - స్వపితీవేతి మందః. మది స్తుత్యాదౌ. - ఆలస్యము చేత నిద్రపోవువానివలె నుండువాఁడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn). 

మన్దగామీ తు మన్దరః,
మందం గచ్ఛతీతి మందగామీ నాంతః, గమ్ ఌ గతౌ. - మెల్లగా నడుచువాఁడు.
మథ్నాతి చరణా వితి మథరః, మంథ విలోడనే. - నడవలేక కాళ్ళను బిగుసుకొనువాఁడు. ఈ 2 మెల్లగా నడుచువాని పేర్లు.

మందుఁడ నే దురితాత్ముఁడ
నిందల కొడిగట్టి నట్టి నీచన్నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర ! నిన్ను నమ్మితి కృష్ణా.

తా. కృష్ణా ! నేను మందుఁడను, నీచుఁడను, దురితాత్ముడను, నన్ను సందేహింపక కాపాడుము, నిన్నే నమ్మితిని.

తుందము - కడుపు.
తుద్యతే అజీర్ణాదినాతుందం తుద వ్యథనే. - అజీర్ణాదులచేత వ్యథ పెట్టఁబదునది.
తుంది - 1.కడుపు, 2.ఉరుకుబొడ్డు, విణ.బొజ్జ కడుపు కలవాడు.
పునః పునస్తుందం పరిమార్ష్టీతి తుందపరిమృజః. మృజూ శుద్ధౌ.- పలుమాఱు కడుపు నిమురు కొనువాఁడు.  
తుందిభుఁడు - 1.బొజ్జకడుపు గలవాడు, 2.ఉరుకుబొడ్డు కలవాడు, రూ.తుందిలుడు.
తుంది పిచండశబ్దౌ కుక్షిపర్యాయౌ తద్యోగాత్ తుందిలః, తుందిభః, పా, తుందికః, తుందీ,న్.
తొంద - తుదిలుండు, బొజ్జకడుపువాడు, రూ.తొందు, సం.తుందీ.
దొద్దు - తుందిలుడు, పెద్దబొజ్జ కలవాడు.

వృద్ధోనాభౌ తుణ్డిల తుణ్డిభౌ,
వృద్ధో నాభిరన్యేతి వృద్ధనాభిః, పు. - పొడవైన బొడ్దు గలవాఁడు.
తుండిభుఁడు - ఉరుకు బొడ్డువాడు, రూ.తుండిలుఁడు.
తుండి రున్నతనాభి స్తద్యోగాత్తుండిలః, తుండిభశ్చ - తుండి యనఁగా పొడవైన బొడ్దు; అది గలవాఁడు. ఈ 3 పొడవైన బొడ్డుగలవాని పేర్లు.   

తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుడ్యతే హింస్యతే ఖాద్యమనే నేతి తుణ్డం, తుడి తోడనే. - భక్ష్య వస్తువు దీనిచేత పీడింపఁబడును. 
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
తుండుపడు - వై. క్రి. మోడువలెనగు, మొండియగు. 

ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, అఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా ఖండములు). (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన వృత్త భాగము, ఒక ఘనతలముచే ఛేదింపబడిన ఘనరూపభాగము.
(భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్నభిన్నముగ చేయబడని భూభాగము.

నచ్చుకాఁడు - అలసుడు, బాధకుడు.
సుస్తి - 1.సోమరితనము 2.జబ్బు, సం.అస్వాస్థ్యం. 
ౙబ్బు - అలసము, వి.రోగము. 

మసలిక - మాంద్యము, విణ.అలసము.
అలసము - 1.మందమైనది, సోమరి, 2.శ్రమచెందినది, వి.1.బురదలో తిరుగుటచే కాలివ్రేళ్ళనడుమ వచ్చు పుండు, బురదపుండు, 2.ఒకరకపు అజీర్ణవ్యాధి, 2.విషముగల ఎలుక.

శీతము - 1.చల్లనిది, 2.అలసమైనది.
శీతం మందం కరోతీతి శీతకః - మందముగా కార్యమును జేయువాఁడు.
శీతము - (జం.) అలలవలె కదులు యుండుపొర (Undulating membrane).
శీతకము - చలికాలము, సం.వి. (రసా.) ద్రవబాష్పములను శీతకలించి ద్రవముగా మార్చుట కుపయోగించు పరికరము (Condenser), రూ.స్వేదనము.

శీతస్వానము - (జం.) చలనము లేని స్థితిలో చలికాలమును గడుపుట (Hibernation). 

పరిమృతప్రాణులు - (జీవ.) పూర్వ మెప్పుడో యుండి ఇప్పుడు లేని ప్రాణులు (Extinct organisms).

అలసుఁడు - సోమరి, చురుకుదనము లేనివాడు.
నలసతీ త్యలసః అలస ఏవాలస్యః - ప్రకాశించువాఁడు కాఁడు గనుక అలసుఁడు, అలసుఁడే ఆలస్యుఁడు. 
సోమరి - అలసుడు, మందుడు.
అలుౘు - అలసుడు, సోమరి, అలసః. 
అలసః ఉక్తః. నవిద్యతే ఉష్ణం తేజో అస్యేతి అనుష్ట్ణః - ప్రకాశము లేనివాడు. ఈ ఆరు అలసుని పేర్లు.
ధీహరుఁడు - మందుడు. (ధీ - బుద్ధి)
బయ్యఁడు - మందుడు.

Whoa is the foe?
It is but idleness.

మాంద్యము - 1.ఆలస్యము, 2.జాడ్యము.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త, 3.జాగు. అజాగ్రత్త కొంచెమైన కీడు అధికం.
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము.
జడత్వము - (భౌతి.) విశ్రాంతిస్థితిలో గాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.

విళంబము - విలంబము, ఆలస్యము. 
విళంబి - విలంబము చేయువాడు, వి.ముప్పదిరెండవ(32వ) సంవత్సరము.

నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.
నొప్పి - 1.బాధ, 2.ఆపద.
నోవరి - నొప్పి, కుంటి.  
నొవ్వి - 1.వేదన, 2.వ్యాధి, రూ.నొవ్వు, నోవి, నోవు.  

జాడ్యంధియో హరతినిఞ్చతివాచి సత్యం, మానోన్నతిం 
దిశతిపాపమపాకరోతి | చేతః ప్రసాదయతి దిక్షుతనోతి
కీర్తిం, సత్సంగతిః కథయ కిం నకరోతి పుంసాం ||

తా. సత్సాంగత్యము బుద్ధి జాడ్యమును బోగొట్టును, వాక్కునందు సత్యము గలుగఁజేయును, గౌరవము నిచ్చును, పాపములబోగొట్టును, మనస్సును స్వచ్ఛముగాజేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింప జేయును, మఱియు నెట్టి శుభముల నైనను గలుగజేయును. - నీతిశాస్త్రము

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్|
నిర్మోహత్వే నిశ్చలత్తత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. -  9

సత్ సంగము వలన నిస్సంగం (సంగరాహిత్యము) ఏర్పడుతుంది. నిస్సంగత్వం వలన దేనియందు వ్యామోహం కలుగకుండా ఉంటుంది. వ్యామోహం లేని మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా వుంటుంది. ఇలాంటి నిశ్చలతత్త్వమే సత్యశోధనకు అనువైన స్థితి అయి, జీవన్ముక్తిని సాధిస్తుంది. – భజగోవిందం

Through the company of the good, there arises non-attachment; through non-attachment, there arises freedom from delusion; through delusionlessness, there arises steadfastness; through steadfast ness, there arises liberation in life.

మన్దాయ మన్దచేష్టాయ మహనీయగుణాత్మనే,
మర్త్యపావన పాదాయ మహేశాయ నమోనమః|

కృత్స్నము - 1.జలము, 2.కడుపు, విణ.సర్వము.
కృత్యతే వ్యప్రియతే (అ)నేనేతి కృత్స్నం, కీతీ వేష్టనే. - దీనిచేత వ్యపింపఁబడును.

ప్రాశనము - కడుపు, భోజనము.
ప్రాశితము -
1.భుజింపబడినది, 2.త్రాగబడినది.

బృహత్కుక్షి - పెద్దకడుపువాడు.
బృహత్కుక్షిరస్యేతి బృహత్కుక్షిః, ఇ. - దొడ్దకడుపుగలవాఁడు.   

దొడ్ద - గొప్ప, రూ.దొడ్డు.
దొడ్డువాఱు - 1.క్రి.గొప్పయగు, 2.లావగు.
లావు - 1.బలము, 2.అతిశయము, సామర్థ్యము, విణ.స్థూలము.

పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
పెరుఁగు - క్రి. వృద్ధిచెందు, ఎదుగు, వి.దధి, విణ.వృద్ధుడు.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).     

పిచండము - కడుపు.
పచతి ఆన్నం స్వగతాగ్నినా పిచండః - తనయందుండెడు అగ్నిచేత అన్నమును బక్వము సేయునది.
అపిచమత్యాహార మితివా పిచండః. చము అదనే. - ఆహారమును బక్షించునది.
పిచండిలుఁడు - పెద్ద బొజ్జ కలవాడు.
పిచండిలశ్చ - తుంది పిచండశబ్దములు కుక్షివాచకములు; అది గలిగినవాఁడు. అనఁగా దొడ్డకడుపు గలవాఁడు.
కుక్షి- కడుపు, జఠరము. కుక్షిం చ వైష్ణవీ పాతు|
కుప్యతే బహిప్క్రియతే మలమస్మాదితి కుక్షిః. పు. కుష నిష్కర్షే. - దీనివలన మలము బయలు వెల్లింపఁబడును.

జఠరము - కడుపు, విణ. 1.ముదిసినది 2.కఠినమైనది.
జన్యతే గర్భో అస్మిన్నితి జఠరం. జనీ ప్రాదుర్భావే - దీని యందు గర్భము పుట్టింపఁబడును.

జఠరః కఠినే పి స్యాత్ -
జఠర శబ్దము కఠినమయిన వస్తువునకు పేరు. అపిశబ్దమువలన కడుపునకు పేరగునపుడు ప్న. జాయతే అస్మిన్నితి జఠరః, జనీ ప్రాదుర్భావే. - దీనియందు పుట్టును గనుక జఠరము. "కుక్షౌ తు జఠరోన స్త్రీ త్రిషు వృద్ధ కఠోరయో" రితి రుద్రః.

జఠరరసము - (గృహ.) ఈరసము అన్నకోశములో పుట్టి, ఆమ్ల సహాయ్యముచే కొంత పిండిపదార్థము ను చెక్కెరగా మార్చును, (Gastric juice).
జఠర సంబంధము - (జం.) కడుపునకు సంబంధించినది, (Gastric).  

కౌక్షేయము - కత్తి, ఖడ్గము, వ్యు.కుక్షికి దగ్గరగా ఉంచుకొన బడినది.
కుక్షౌ చర్మ నిర్మితకోశే భవః కౌక్షేయకః - చర్మ నిర్మితమై కుక్షిప్రాయమైన యొరలో నుండునది. అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి.1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.

కడుపు - ఉదరము, పొట్ట.
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట. పొట్ట పైరుకు పుట్టెడు నీరు.  

ఉదరంభరి - తనపొట్టను మాత్రమే పోషించు కొనువాడు.
స్వోదర మేవ పూరయతీతి స్వోదరపూరకః - పోష్యవర్గమును నిడిచి తన కడుపు నింపుకొనువాఁడు స్వోదరపూరకుఁడు. వానియందు ఆత్మభరి కుక్షింభరి శబ్దములు వర్తించును.
కుక్షింభరి - తనకడుపు మాత్రము నింపుకొనువాడు, ఉదరంభరి.
ఆత్మంభరి - తనపొట్ట మాత్రము పూరించుకొను వాడు, కుక్షింభరి.
అత్మానం స్వమేవ బిభర్తీతి ఆత్మంభరిః, స్వకుక్షిమేవ బిభర్తీతి కుక్షింభరి, డు భృఙ్ ధారణ పోషణయోః. - తన కడుపుమాత్రము నిండించు కొనువాఁడు.

ఉదరకుహరధమని - (జం.) ఊదర కుహరమునకు రక్తమును పంపు శుభ్ర రక్తనాళము (Coeliac artery).

తలోదరి - స్త్రీ, వ్యు.పలుచని ఉదరము కలది.

ఉదరము - 1.కడుపు (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).

ఉదయర్తిగర్భో అస్మాదితి ఉదరం. ఋ గతౌ. - దీనివలన గర్భము ప్రకాశమౌను.
తుద్యతే అజీర్ణాదినాతుందం. తుద వ్యథనే. - అజీర్ణాదులచేత వ్యథ పెట్టఁడునది. జఠరాది శబ్దములు 3 ను సమాహార ద్వందము కడుపు పేర్లు.

నడుము  - 1.కౌను, 2.మధ్యభాగము, రూ.నడ్ము.
కౌను - 1.నడుము, 2.వింటినడుము.
నడుమంతరము - 1.కౌను, 2.మధ్యకాలము, విణ.మధ్యకాలమున కలిగినది, రూ.నడుమంత్రము.
నడుమంత్రపుసిరి - మధ్యకాలమున వచ్చిన ఐశ్వర్యము, మిడిసిపాటు కలిగించునది.

విలగ్నము - సన్ననినడుము, విణ.చక్కగా తగిలినది.

మధ్యమం చావలగ్నం చ మ ధ్యో(అ)స్త్రీ,
మధ్యమము - నడుము, (గణి.) రెండు పదముల మధ్య చొప్పించబడిన పదము (Mean). 
మధ్యేభవం మద్యం, మధ్యమం చ. - శరీరము నడుమఁ బుట్టినది.
అవలగ్నము - న డు ము, విణ.తగులుకొనినది.
అవలగ్యత ఇతి అవలగ్నం లగే సఙ్గే. - పూర్వాపరములతోఁ గలియునది. ఈ 3 నడుము పేర్లు. 

న్యాయ్యే (అ)పి మధ్యమ్,
మధ్యశబ్దము ఉచితమయినదానికిని, అపిశబ్దము వలన నడుమునకును, అవకాశమునకును, అధమునికిని పేరు. "న్యాయ్యావలగ్నయోర్మధ్య మంతరే చాధమే త్రిషు" అని రభసుడు. మన్యత ఇతి మధ్యం, మన జ్ఞానే. - తలపఁబడునది.

నెన్నడుము - (నెఱి+నడుము) అందమైన నడుము.

నడుముకట్టుకొను - క్రి.సిద్ధమగు.

యుద్ధము - 1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము.
మధ్యభాగము -

ప్రాశనము - కడుపు, భోజనము.
ప్రాశితము-
1.భుజింపబడినది, 2.త్రాగబడినది.

అడ - 1.ముద్ద, 2.ఆకృతి, త.అడై.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.

గ్రాసస్తు కబళః పుమాన్,
గ్రాసము - 1.కబళము, తిండి, 2.గ్రహణము.
గ్రస్యత ఇతి గ్రాసః, గ్రసు అదనే. - భక్షింపఁ బడునది.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
భక్షణ సమయేకే తాలుని వలత ఇతి కబళః, వలసంచలనే. - భక్షణ సమయమందు దౌడ యందు కదలునది.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.
గ్రాసశబ్దము కబళము యొక్క అర్థము గలది గనుక కబళార్థకము. రెండు పర్యాయములు. ఈ 2 కడి పేర్లు  
పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద(కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.), 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
పిండ్యతే పిండీక్రియత ఇతి పిండం, పిడి సంఘాతే. - ముద్దగాఁ జేయఁబడునది.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిడుచ - 1.ముద్ద, 2.కబళము.

ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).

కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.
కూయతే పితృభిః స్తూయత ఇతి కవ్యం, కు శబ్దే. - పితృదేవతలచేత స్తోత్రము చేయఁబడునది.

క్షామము - కరవు, విణ.తక్కువైనది.
నిట్టు - 1.ఉపవాసము, 2.క్షామము, విణ.శుష్కము, రూ.నిట్రు, సం.నిష్ఠా, నిష్ఠురమ్.
నిట్రు - ఉపవాసము, విణ.శుష్కము, రూ.నిట్టు.
ఉపవాసము - పస్తు(నుంకు - పస్తు), భోజనము చేయకుండుట.
ఉపోషణము - పస్తు, ఉపవాసము.
పస్తు - లంకణము, ఉపవాసము, సం.పత్రస్థః.
లంకణము - రోగాకాలమం దుపవాసము, రూ.కంకనము, సం.లంఘనమ్. 
లంఘనము - దాటు, 2.లాగు, 3.గుఱ్ఱపు దూకుడు, సం.(గృహ.) తిండి లేక మాడుట (Starvation).  

అడిత్రాగుడు - 1.కరవు, దుర్భిక్షము, 2.చాలీచాలని తిండి.
దుర్భిక్షము - కరవు.
కాటకము - కరవు, దుర్భిక్షము. 
అఱ్ఱాఁకలి - 1.మిక్కిలి ఆకలి, (ఆకలి+ఆఁకలి), 2.సగము ఆఁకలి, ఆఁకలి పూర్తిగ తీరమి (అఱ్ఱు+ఆకఁలి).   

కరువు1 - 1.పోతపోసెడి అచ్చు, 2.మూస.
మూష - మూస.
మూస - (రసా.) ద్రవ్యములను వేడిచేయుటకు ఉపయోగించు (పింగాణితో గాని, ఇనుము, రాగి, ప్లాటినమ్ వంటి ధాతువులతో గానిచేయబడిన) కుటకవంటిపాత్ర (Crucible).  
కరువు2 -  గర్భము, సం.గర్భః.
గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్ద, 3.అగ్ని Fire, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.
మాతృభుక్తాన్న రసం గిరతీతి గర్భః, గౄ నిగరణే. - తల్లి భుజించిన యన్నపానాదుల మ్రింగునది.  

తద్విఘాతే వగ్రహావగ్రహౌ సమౌ,
తద్విఘాతే వృష్టి హ్గాతే వగ్రహావగ్రహశబ్దౌ వర్తేతే, అవగృహ్ణాతి ప్రతిబధ్యాతి వర్ష మితి వగ్రహ అవగ్రహశ్చ గ్రహ ఉపాదానే - వర్షమును ప్రతిబంధించునట్టిది గనుక వగ్రహము - కరవు(అవగ్రహము). ఈ 2 ను గ్రహవిరోధముచేత సంభవించిన వర్షప్రతిబంధము, వాన కఱవు పేర్లు.

వేఁకటి - గర్భము.   
వే - పదినూఱులు, వేలు, సహస్రము, విణ.ఆదేశము, వై.వి. వేగముగ.
వేలు - వ్రేలు యొక్క రూపాంతరము. 
సహస్రము - వేయి. 

దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షే చ హిరణ్య దమ్|
చతురోహం నమస్యామి రణేధీరమృణే శుచమ్||

తా. దుర్భిక్షము - కరవు)దుర్భిక్షకాలమందు అన్నదానము చేయువానిని, సుభిక్షము - 1.సులభభిక్షము గలది, 2.కరవు లేనిది.)సుభిక్ష కాలమందు ధనము దానము చేయువానిని,  రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)రణమందు ధైర్యము గలవానిని, ఋణమందు శుచిగలవానిని(అనఁగా నప్పులేని వానిని) ఈ నలుగురిని గూర్చి నేను నమస్కరించెద నని శ్రీకృష్ణుడు చెప్పెను. - నీతిశాస్త్రము

షడేవ తు గుణాః పుంసా న హాతవ్యాః కదాచన|
సత్యం దాన మనాలస్య మనసూయా క్షమా ధృతిః||
తా.
మనుజు డెన్నటికి విడువరాని గుణములు ఆరు. అవి సత్యము, దానము, సోమరితనము లేకుండుట, అసూయ లేకుండుట, ఓర్పు, ధైర్యమును. 

4. సుప్తి - 1.నిద్ర, 2.తిమ్మిరి.
నిదుర -
నిద్ర, కునుకు, కూరుకు, రూ.నిద్దుర.
నిద్ర - కూరుకు; కూరుకు - నిద్దుర, క్రి.నిద్రించు.
తిమిరి - స్పర్శము తెలియని రోగము, రూ.తిమ్మిరి.

సుషుప్తి - ఒడలెరుగని నిద్ర.
సుషుమ్న - ఒక నాడి.

పెక్కుజనులు నిద్రింపఁగ
నొక్కండయ్యెడను నిద్ర * నొందకయున్నన్
గ్రక్కున నుఓద్రవం బగు
నక్కర్మమునందుఁ జొరకు * మయ్య కుమారా!
తా.
అందఱును నిద్రఁబోవుచుండఁగా ఒంటరిగా నచ్చట మేలుకొని యుండ రాదు. ఏదైన నొక (యా)ఆపద కలుగును. కాఁబట్టి యట్టిపని యందు ప్రవేశింపవలదు.   

శూన్యగృహము నందొక్కఁడు నిద్రింపఁకూడదు, నిద్రించు వారిని లేపఁగూడదు. తడిసిన పాదములతో నిద్రపోరాదు.

కౌసీద్యము - 1.ఆలస్యము, 2.కునికిపాటు, 3.వడ్డీవలన జీవించుట.
ప్రమీల -
 1.కునికిపాటు, 2.మళయాళదేశపు రాణి.
ఘూర్జరము -
1.తిరుగుడు, 2.కునికిపాటు. ముచ్చిలిపాటు - కునికిపాటు.

సంధ్యనిద్ర - (గృహ.) 1.చీకటి పడెడి సమయమందు నిద్రపోవుట, 2.ప్రసూతి సమయమున గలుగజేయు మైకము, (ఇందుకై మార్ఫిన్, స్కోపోలమిస్ ఆల్కాలాయిడ్ల మిశ్రమము నిత్తురు) (Twilight sleep). 

స్వాపము - 1.శయనము, 2.అజ్ఞానము.
స్వపితం స్వాపః; స్వప్నశ్చ, ఞిస్వప్ శయే - శయనించుట స్వాపము, స్వప్నంబును.
శయనము - శయ్య, నిద్ర.
శయనీయము - శయ్య, వ్యు.శయనింపదగినది.

సౌప్తికము - 1.నిద్రించుటలోనగు(నిద్రించు నపుడు) సమయములందు శత్రువుల పైబడి చంపుట, 2.భారతము నందొక పర్వనామము. ముచ్చిలిపోటు - నిద్రించుచుండగా పైబడి చేయు యుద్ధము.

శయము - 1.శయ్య, 2.చెయి, 3.పాము.
శయ్య - 1.పడక, 2.పదగంఫనము, 3.విధము.
శయాళువు - పెనుబాము, విణ.నిద్రపోతు, రూ.శయతుడు.
బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.

నిదురపోతు - నిద్రాళువు, రూ.నిద్దురపోతు.
నిద్రాళువు - నిదురపోతు, నిద్రించు స్వభావము గలవాడు.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవు చున్నట్టు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement). 

నిర్నిద్రము - జాగరూకత గలది. 

నిద్రపోయిన మానవుడు ఏమీ వినలేడు, తెలుసుకోలేడు, చెయ్యలేడు. మెలకువగా ఉన్నప్పుడు అన్నీ చేస్తాడు. అన్నీ తెలుసుకుంటాడు. నిద్రలోకూడా చిత్తానికి కదలికలుంటాయి. అవే స్వప్నచలనాలు. అవన్నీ మనోభావాలు, రకరకాల మనోభావాలు.

పడకపుండు - (గృహ.) ఎక్కువ జబ్బుతో కదలలేకుండ పండుకొని యున్న వారికి మంచమువేడివల వచ్చుపుండ్లు (Bedsore).
పడక తడుపుకొనుట - (గృహ.) పడకలో మూత్రము విడుచుట (Enuresis).

అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత -
తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.

నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్నసంభావాః |
నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః ||

పెద్దనిద్దుర - మరణము, దీర్ఘనిద్ర.
దీర్ఘనిద్ర - చావు.
(ౘ)చావు - మృతి; మృతి - చావు.

మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.
మిత్తి -
1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మిత్తి(ౘ)చూలు - కేతువు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

విభాకరుఁడు - 1.సూర్యుడు, వెలుగురేడు, 2.అగ్ని(నిప్పు, అగ్నిదేవుడు). విశేషేణభాం కరోతీతి విభాకరః - మిక్కిలి కాంతినిఁ గలుగఁ జేయువాడు.

5. ఈశానుఁడు - 1.కాంతి, 2.శివుని ఐదు(5)ముఖములలో ఒకటి, 3.పదునొకొండు అను సంఖ్య(11), 4.ఆర్ద్రా నక్షత్రము.

"ఈశానః సర్వ విద్యానాం" అని శృతి.

మేని - కాంతి.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కామ్యత ఇతి కాంతిః, ఈ-సీ. కము కాంతౌ - ఇది కోరఁబడుచున్నది గనుక కాంతి.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).   

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కాంతికిరణపుంజము - (భౌతి.) కాంతికిరణముల గుంపు, రూ.కిరణశలాక (Beam of light).
కిరణశలాక - (భౌతి.) సమాంతరముగ నున్న కిరణముల సమూహము (Pencil of rays).

కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఇచ్ఛ - అభిలాష, కోరిక.
ఇ(ౘ)చ్చ - 1.కోరిక, 2.చిత్తము(చిత్తము - మనస్సు), సం.ఇచ్ఛా.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.

ధర్ముని పత్ని కాంతి. ఆమె లేకపోతే లోకాలు ఆధార శూన్యములై చెడిపోతాయి.

వెలుతురు - 1.ఎండ, 2.ప్రకాశము.
ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.
ఆతపము - 1.ఎండ, 2.వెలుతురు.
ఎండదొర - సూర్యుడు; సూర్యుడు - వెలుగురేడు.    

ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
వెలుఁగు -
1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు. 

ప్రకాశానుర్తి - (వృక్ష.) వెలుతురు వచ్చు దిక్కునకే పెరుగు స్వభావము కలది, (Positively heliotropic).
ప్రకాశానువర్తనము - (వృక్ష.) వెలుతురు వచ్చు దిక్కునకు తిరుగుట, (Heliotropism).    

అభిరుచి - 1.అత్యాసక్తి, 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినచవి (Taste).

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః|

ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే అడ్డుపెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉమాపతి - శివుడు.

అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః
చత్వారి సంప్రవర్ధంతే కీర్తి రాయు ర్యశ్యో బలమ్|
తా. పూజనీయులను నమస్కరించు స్వభావము కలిగి, పెద్దల నెల్లపుడు సేవించువానికి కీర్తి, ఆయువు, యశస్సు, బలము అను నీ నాలుగు వృద్ధి నందును.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

వర్ఛస్సు - 1.కాంతి, 2.రూపము.
రూపము -
1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగిణము, 5.స్వభావము.
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక(పోలిక - సామ్యము), (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
ఒడలు - మేను, దేహము, రూ.ఒళ్ళు. 
దేహము - శరీరము, మేను.
ఇంగితము - 1.హృద్గతాభిప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విన.కదలినది.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
సౌందర్యము - చక్కదనము.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము. 

ప్రతిభా విశేషము - (గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్|
విద్యారూపం విరూపాణాం క్షమారూప తపస్వినామ్| 
తా.
కోకిలకు(కోయిలేమో నల్లనిది) స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము, కురూపునకు విద్యయే రూపము, యతులకు(కర్మంది - యతి) శాంతమే రూపము. - నీతిశాస్త్రము     

శోభా కా న్తిర్ద్యుతి శ్ఛవిః -
శోభయతీతి శోభా, శుభ శుంభ శోభార్థే - ప్రకాశింపఁజేయునది.
కామ్యత ఇంతి కాంతిః ఇ-సీ. కము కాంతౌ - ఇది కోరఁబడుచున్నది గనుక కాంతి.
ద్యోత ఇతి ద్యుతిః ఇ-సీ. ద్యుత దీప్తౌ - ప్రకాశించునది.
ఛ్యత నాశయత్యంధ కారమితి-ఛవిః. ఇ - సీ. ఛోఛోదనే - అంధకారమును పోఁగొట్టునది.
చ్యతి నాశయత్యశోభా మితివా - అశోభను పోఁగోట్టునది.
శోభాసాహచర్యా త్కాంత్యదయః స్త్రీలింగాః - శోభా శబ్దముతోడి కూటమి వలన కాంత్యాది శబ్దములు 4 స్త్రీలింగములు. ఈ నాలుగు 4 కాంతి పేర్లు.

శోభ - 1.వస్త్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
శోభితము -
ప్రకాశమొందినది.
శోభిల్లు - ప్రకాశించు. శోభిల్లు సప్తస్వర.....

అలరు - 1.వికసించు, 2.సంతోషించు, 3.శోభిల్లు, 4.ఒప్పు, కలుగు, వి.1.పుష్పము, 2.సంతోషము, 3.శోభ.
అలరుఁబోఁడి - పుష్పమువలె మనోజ్ఞురాలగు స్త్రీ, రూ.అలరుఁబోణి.

అలరువిలుకాఁడు - మన్మథుడు.
అలరువిల్తుఁడు - మన్మథుడు.

ప్రోది - 1.పోషణము, 2.వైభవము, 3.శోభ.
ప్రోదిగొను - పోషించు, కాపాడు.

సుషమ - మిక్కిలిశోభ.
సుషమము - 1.మనోజ్ఞమైనది, 2.సమానమైనది.

రుక్కు - 1.కాంతి, 2.సూర్యకిరణము, 3.ఇచ్ఛ.
రుచి -
1.ఇచ్ఛ, 2.చవి, 3.కాంతి, 4.సూర్యకిరణము.
రుచి - (రసా.) నాలుకతో గుర్తించబడు వస్తుగుణము, ఉదా.పులుపు, తీపి, చేదు.

ద్యుతి - 1.కాంతి, 2.కిరణము.
జిగి - కాంతి; జిగిలి - చక్కనైనది.
కిరణము - వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు.
సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి. 

తుఱఁగలి - ప్రకాశము.
తుఱఁగలించు -
1.ప్రకాశించు, 2.అతిశయించు.
తులకరింపు - 1.ప్రకాశము, 2.కుతూహలము.
తులకరింపు - 1.ప్రకాశించు, 2.కుతూహలపడు.

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.

రశ్మి - (భౌతి.) 1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.
పృశ్ని -
కిరణము, విణ.1.పొట్టిది, 2.చిన్నది.

ఒకే సూర్యరశ్మి భూమిమీద అనేక ప్రదేశాలలో పడుతుంది. కానీ ఆ కాంతి అద్దము(ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది)మీద కానీ, మెరుగు పెట్టిన లోహాల మీద కానీ, నీటిమీద కానీ పడినప్పుడే చక్కగా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా భగవంతుని తేజస్సు అందరి హృదయాల మీద సమానంగా ప్రసరిస్తుంది. కానీ మంచివారు, సాధువులు మాత్రమే తమ నిర్మల హృదయాలతో ఆ తేజస్సును స్వీకరించి ఆ వెలుగును తిరిగి అందరికీ పంచగలుగుతారు. - శ్రీరామకృష్ణ పరమహంస  

మీ ముఖాన్ని సూర్యరశ్మికేసి తిప్పుకుంటే మీరు నీడను గమనించలేరు. - హెలెన్ కెల్లర్   

అంశువు - 1.కిరణము, 2.కాంతి, 3.కొస, 4.అణువు, 5.దారము.
అంశుమంతుఁడు -
1.సూర్యుడు, 2.సగరచక్రవర్తి మనుమడు, 3.ధనవంతుడు.
అంశుమాలి - సూర్యుడు.

రోచిస్సు - 1.కాంతి, 2.సూర్యకిరణము.
రోచనము - ప్రకాశించునది.
రోచిష్ణువు - ప్రకాశించువాడు.

ప్రభ - 1.వెలుగు, 2.సూర్యుని భార్య, 3.కుబేరుని నగరము. (సూర్య బింబము నందు దేవీస్థానం ప్రభ.)

ఛవి - 1.కాంతి, 2.కిరణము, 3.చర్మము, 4.రంగు.
చర్మము -
1.తోలు, 2.కేడెము, డాలు.
తోలు - పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
తోలుదాలుఁపు - శివుడు, చర్మాంబరుడు.
కేడెము - డాలు, రూ.కేడియము, సం.ఖేటకమ్.
డాలు - 1.కాంతి, 2.రంగు, 3.జెండా, 4.కేడెము.
జెండా -
టెక్కెము; జండా - టెక్కెము, రూ.జెండా.
టెక్కెము - టెక్కియము; టెక్కియము - జండా, రూ.టెక్కెము.
టెక్కెముగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.
మిత్తిచూలు - కేతువు.
మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్ది, సం.1.మృత్యుః, 2.మితిః.
మిత్తిగొంగ(గొంగ - శత్రువు) - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు.

తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
వడ్డి -
వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః. కుత్సీరము - వడ్డీబ్రతుకు.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి. 

పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు -
(గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy). 

బాలాజి - శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలా.  

రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.
(ౘ)చాయ -
1.ఛాయ, 2.కాంతి, 3.సూర్యునిభార్య, 4.నీడ, 5.పోలిక, 6.రంగు, 7.వైపు, 8.జాడ, 9.సమీపము, 10.చక్కన, 11.(జీవ.) జీవపదార్థములకు సహజమైన రంగు నిచ్చు పదార్థములు (Pigment).
చాయపట్టి(పట్టి - బిడ్డ) - శనైశ్చరుడు.
చాయమగఁడు - సూర్యుడు.
ఛాయ - 1.నీడ, 2.కాంతి, 3.రంగు, 4.ప్రతిబింబము, 5.సూరునిభార్య, 6.లంచము, 7.వరుస, 8.కొంచెము, 9.చీకటి, (భౌతి.) ఒక కాంతి నిరోధకమైన వస్తువునకు వెనుకవైపున నుండు కాంతి విహీన చిత్రము (Shadow).
ఛాయాపుత్రుఁడు - శని.
ఛాయాకరుఁడు - గొడుగు పట్టువాడు, విణ.నీడను కలుగచేయువాడు.
సొంపు - 1.సమృద్ధి, 2.సంతోషము, 3.ప్రసన్నత, 4.సుఖము, 5.సౌందర్యము. సౌందర్యము - చక్కదనము. 
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి.
సంతోషము - సంతసము, ముదము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము.

హ్యూ - (గృహ.) (Hue)1.వన్నె, చాయ, 2.కేక, అరుపు.
వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.
వన్నెకత్తియ - వన్నెకత్తె; వన్నెలాడి - వన్నెకత్తె; వన్నెకత్తె - విలాసవతి.
వన్నెకాఁడు - విలాసవంతుడు; వన్నెలాఁడు - వన్నెకాడు.

స్పూర్తి - 1.అదరుట, 2.తోచుట, 3.వన్నె, 4.కాంతి.
స్ఫురణము -
1.అదరుట, 2.తోచుట.
స్ఫురించు - 1.అదరు, 2.తోచు.
స్ఫురితము - 1.అదిరినది, 2.తోచినది. 

ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశ్శక్తిః పరాక్రమః|
షడై తే యత్రతిష్టంతి తత్ర దేవోపి తిష్టతి||
తా.
సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము, ఈ యారు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. - నీతిశాస్త్రము

Bhavad-Gita