శ్రీ చక్రప్రియ వాసినీం భగవతీం శ్రీ రాజరాజేశ్వరీం
భక్తానా మభయ ప్రదాం పరనిధీమానంద సంధాయినీం
బ్రహ్మే శాచ్యుత వర్ణితాం మునిసుతాం గంధర్వ సంసేవితాం
త్వాం దేవీం త్రిపురాం పరాత్పరమయీం శ్రీబ్రహ్మవిద్యా భజే.
వినాయకుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, బృహస్పతి, ఇంద్రుడు ఈ ఆరుగురు మూలాధారము మొదలు ఆరు చక్రములుకు అధిస్థాన దేవతలు.
ఓం షడద్వాతీత రూపిణ్యై నమః : వర్ణ, పద, మంత్ర భువన తత్వ, కళాత్మ, లారూ షడధ్వ లనబడుతాయి. ఈ షట్కాతీత స్వరూపిణియై తేజరిల్లు మాతకు వందనాలు.
నీవే మన – ఆకాశ – వాయు(ప్రాణమున) – అగ్ని(ముఖము) – జల – భూ(భూమి) తత్త్వములుగ నగుచున్నావు.
వందలు - పద్మము - పరము.
వేలు - మహాపద్మము - పరార్ధము.
1. చతుర్దళమును హేమవర్ణమునగు మూలాధార చక్రమునందు - గణపతి కలడు. (భూతత్త్వమును)
గణపతి - వినాయకుడు.
వెనకయ్య - వినాయకుడు, సం.వినాయకః.
పుష్ఠి : గణపతి అర్థాంగి. (పుష్టి - 1.బలుపు, సమృద్ధి.)ఆమె లేకపోతే సృష్టిలో స్త్రీ పురుషులకు పుష్టినహి. దారువనమునందు దేవిస్థానం పుష్టిరూపిణి|
గాణాపత్యము - ఒక మతము (గణపతియే ముఖ్య దైవమని విశ్వసించు మతము).
గణము - 1.గుంపు, సమూహము, 2.సేనలో ఒక భాగము, వర్ణముల సమూహము, 4.గురులఘు వర్ణముల కూడిక కలది.
గణనాయిక - గౌరి, పార్వతి.
వినాయకుఁడు- 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
సుగతే చ వినాయకః
వినాయకశబ్దము బుద్ధదేవునియందును, చకారము వలన గణాధిపతి యందును, గర్త్మంతుని యందును, గురువునందును వర్తించును.
వినయతి శిక్షయతీతి వినాయకః, ణీఞ్ ప్రాపణే. - శిక్షించువాఁడు. "వినాయకస్తు హేరంబే గరుత్మతి గురావ" పీతి శేషః.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
వినాయకో విఘ్నరాజ ద్వైమాతుర గణాధిపాః,
అప్యేకదన్త హేరమ్బ లంబోదర గజాననాః.
విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
ద్వైమాతురుఁడు - 1.వినాయకుడు, 2.జరాసంధుడు, వ్యు.ఇద్దరు తల్లులు గలవాడు.
ద్వయో ర్మాత్రో రుమాగంగాయో రపత్యం ద్వైమాతురః - గంగా పార్వతుల కు నిద్దఱికినిఁ గుమారుడు.
గణానాం ప్రమథాదీనామధిపో గణాధిపః - ప్రమథాధిగణములకు నాయకుఁడు.
ఏకదంతుఁడు - వినాయకుడు; ఒంటికొమ్మువేలుపు - ఏకదంతుడు, గణపతి.
కార్తికేయోత్పాటితైక దంతత్వా దేకో దంతో యస్య స ఏకదంతః - కుమారస్వామిచే నొకదంతము పెఱికివేయఁబడెను గనుక నేకదంతుడు.
హేరంబుఁడు - విఘ్నేశ్వరుడు, విణ.శౌర్యముచే గర్వించినవాడు.
హేరుద్ర సమిపే రంబతే తిష్ఠతీతి హేరంబః - రుద్రునియొద్ద నుండువాఁడు. ఋ గతౌ. హేరతే వర్థయతి భక్తానితివా - భక్తుల వృద్ధిబొందించు వాఁడు. హేవృద్ధౌ.
లంబోదరుఁడు - వినాయకుడు.
బొజ్జదేవర - వినాయకుడు. (బొజ్జ(ౙ)- కడుపు)
లంబ ముదరం యస్య సః లంబోదరః - వ్రేలెడి బొజ్జగలవాడు.
గజవదనుడు - వినాయకుడు.
ఏనుఁగు మోముసామి - గజానునుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజస్యేవ ఆననం యస్య సః గజాననః - ఏనుఁగు మొగము వంటి మొగముగలవాడు. ఈ ఎనిమిది వినాయకుని పేర్లు.
ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.
తవాధారే మూలే - సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే - నవరస మాహాతాండవ నటమ్ |
ఉభాభ్యా మేతాభ్యా - ముదయవిధి ముద్దిశ్య దయయా
సనాథాభ్యాం జజ్ఞే - జనక జననీమజ్జగదిదమ్ || - 41శ్లో
తా. ఓ తల్లీ! నీయొక్క మూలాధార చక్రమునందు లాస్యరూపమైన నృత్యమునందు మిక్కిలి ఆసక్తురాలై సమయ అను పేరు గలదైన(చంద్రకళతో కూడిన) ఆనందభైరవి(భైరవి - 1.పార్వతి, 2.ఒకానొక రాగము)యను శక్తితో గూడి, నవరసములతో నొప్పు తాండవ నృత్యమును నటించు నటుడైన వానిని నవాత్ముడైన ఆనంద భైరవునిగా తలచెదను. ఏలననగా పుట్టుక నుద్దేశించి (దగ్దమైన లోకమును మరల పుట్టింపవలెనని దయచేత కూడియున్న ఆనందభైరవీ భైరవులను ఈ జగత్తు తల్లిదండ్రులుగ దలంచుచున్నాను.) - సౌందర్యలహరి
పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ గణపతి చేయుట, ఉన్నచోటనే ఈశ్వరుని ఆవిషరించుకోవాలన్నది గణపతి చాటిన సందేశం. గడ్డితో తృప్తిపడే దైవం వినాయకుడు.
మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ|
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదినీ. - 38శ్లో
మూలాధార పద్మానికి గల నాలుగు రేఖలయందు వరుసగా వ, శ, ష, స అనే అక్షరాలు ఉంటాయి. సుషుమ్నను అనుసరించి మూలాధార స్వాధిష్ఠాన మణిపూర కాలయందు ఇచ్ఛ, జ్ఞానం, క్రియ అనే శక్తిత్రయం వుంటుంది.
ఓం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి స్వరూపిణ్యై నమః : శక్తిత్రయ స్వరూపిణికి వందనాలు.
ఓం మూలాధారైకనిలయాయై నమః : మూలాధారపద్మంలో నాలుగుదశలుంటాయి. మూలాధార పద్మానికి గల నాలుగు రేఖలయందు వరుసగా వ, శ, ష, స, అనే అక్షరాలు ఉంటాయి. ఆ పద్మకర్ణికా మధ్యదేశంలో సర్వనిద్రాణస్థితిలో కుండలినీ శక్తిరూపాదేవి ఉంది. ఆ స్థానంలో ఏకాకిగా ఉండునట్టి శక్తి స్వరూపిణికి ప్రణామాలు.
ఊష్మధ్వనులు(శ, ష, స, హ) శీతల ప్రదము స వర్ణము, శీతకిరణః - స తేజో యుతమము హ వర్ణము, సూర్య జ్ఞాపకమగు హ వర్ణము. శివుడనగా హ కారము. ఆకాశబీజము హ కారము, హ కారం స్థూలదేహం. రవిః - హ, సూర్యుడు హకారాధిపతి. సహ - భూమి.
మూలాధారే హకారం చ - హృదయే చ రకారకం |
భ్రూమధ్యే తద్వదీకారం - హ్రీంకారం మస్తకే న్యసేత్ ||
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ. హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ. హిరణ్యరేతుడు. హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ, హిరణ్మయాండ సంభవుడు కనుక హిరణ్యగర్భుడు. ప్రజాపతిర్వై హిరణ్య గర్భః.
ఆరయనెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చి సుపకారి మనుష్యుడు లేక మేలుచే
కూఱ దదెట్లు? హత్తుగడగూడనె చూడఁబదారువన్నె బం
గారములో నైన వెలిగారము గూడకయున్న, భాస్కరా.
తా. భాస్కరా! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏవో నొక భూషణముగా, అనగా ఉపయోగ కరమగు వస్తువుగా తయారు కాదు అట్లే ఎంత విద్య గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తి లేక అతని గొప్పతనము రాణింపదు.
ప్రజాపతి రగ్నిః - అగ్ని వాయువుల కూడిక నలన భూమి ఆవిర్బవించినది. సత్యం, విశాలజలం, దీక్ష, ఉగ్ర తప్పస్సు, బ్రహ్మ, యజ్ఞం ఇవి భూమిని ధరిస్తున్నాయి.
భూమి నుండి అన్నం(అన్నం వై ప్రజాపతిః) - అన్నం నుంచి రక్తం - రక్తం నుంచి రేతస్సు - రేతస్సు నుండి సంతానం.
ఆధారము - 1.ఆదరవు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, 4.(యోగ.) మూలాధార చక్రము.
అధిష్ఠానము - 1.దగ్గర నుండుట, 2.వసించుట, 3.ఉనికి పట్టు, 4.ఆధారము, 5.చక్రము, 6.ప్రాభవము(ప్రాభవము - ప్రభుత్వము), ఏలుబడి, 7.ఒకానొక పట్టణము.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.
అధిపానదేవత - అధిదేవత.
ఆనిక - 1.ఆశ్రయము, ఆధారము, ప్రాపు, 2.దార్ఢ్యము, 3.పానము, రూ.అనువు.
ప్రాపు - ఆశ్రయము, సం.ప్రావణమ్ ప్రాపః.
ఆశ్రయము - 1.ఇల్లు, 2.ఆధారము, 3.శత్రువులచే పీడింపబడుచు వారి నాశ్రయించి యుండుట, సంశ్రయము, 4.ప్రాపు, 5.శరణాలయము.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
సంశ్రయము - ఆశ్రయము.
కుదురు - 1.అనుకూలమగు, 2.స్వస్థమగు, వి.1.పాదు, 2.నెమ్మది, 3.అగసాలె వానికుంపటి, 4.స్థానము, 5.ఆధారము, 6.చుట్టకుదురు.
పాదు - 1.కుదురు, ఆలవాలము, 2.నిలకడ, 3.ఆశ్రయము, సం.పాదః, పదమ్.
ఆలవాలము - పాదు. గడ్డిబొద్దు - చుట్టకుదురు.
నిలకడ - 1.ఉనికి, 2.స్థైర్యము(స్థిరత్వము), 3.విరామము, వి.(గణి. భౌతి.) నిశ్చలముగా నుండుట (Rest).
నిలక - నిలుపు, నిలకడ, స్థితి.
విరామము - 1.విశ్రాంతి, 2.యతిస్థానము.
ఉపాధి - 1.ధర్మచింత, 2.కపటము, 3.కుటుంబమున మిక్కిలి ఆసక్తిగలవాడు, 4.విశేషణము, 5.ఆధారము.
మూలము - 1.వేరు(root), ఊడ మఱ్ఱి, (ఊఢ- పెండ్లియైన స్త్రీ, భార్య). వేరు - చెట్టు యొక్క మూలము.
ఊడ - మఱ్ఱి మొ. వాని కొమ్మల నుండి క్రిందికి దిగెడివెరు శిఫ. (ఈ యూడల వేళ్ళవలననే చెట్టున కాహార మందును).
శిఫ - ఊడ, పడుగొమ్మ.
వేద మూల విందం జ్ఞానం, భార్యామూల మిందం గృహమ్|
కృషిమూల విందం ధాన్యం, ధనమూల మిదంజగత్||
తా. జ్ఞానమునకు వేదమేమూలము, గృహమునకు(గృహము - 1.ఇల్లు, 2.భార్య.) భార్యయే మూలము, ధాన్యమునకు కృషియేమూలము, జగత్తునకు ధనమేమూలము. – నీతిశాస్త్రము
ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3మంచపుకోడు.
గొరిజ - పశువు కాలిగిట్ట, సం.ఖురః.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.
భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ!
భూ ర్భూమి రచ లాసన్తా రసా విశ్వమ్భరా స్థిరా,
ధరా ధరిత్రీ ధరణిః క్షోణిర్జ్వా కాశ్యపీ క్షితిః.
సర్వంసహా వసుమతీ వసుధార్వీ వసున్ధరా,
గోత్రాకుః పృథివీ పృథీక్ష్మా అవని ర్మేదినీ మహీ,
(విపులా గహ్వరీ ధాత్రీ గౌరిలా కుమ్భినీ క్షమా,
జగతీ రత్నగర్భా చ భూతధా త్రబ్ధిమేఖలా.)
భవతీతి భూః ఊ.సీ భూమిశ్చ. ఇ. సీ. - ఇది (యు)ఉదకమువలనఁ బుట్టును.
భూ - భూమి.(సమాసములందే)
భూమి - నేల, చోటు(తావు), పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
ప్రదేశము - స్థలము, చోటు.
స్థలము - 1.మెట్టనేల, 2.చోటు.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
భువి - 1.భూమి, 2.స్థానము.
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
ఆకరము - 1.గని, 2.సమూహము, 3.ఉత్పత్తి స్థానము, 4.స్థానము, 5.వ్యాకరణ మహాభాష్యము మొ.ప్రమాణగ్రంథము.
గని - 1.బంగారు మొ. వి. పుట్టుచోటు, ధాతువులను త్రవ్వి తీసెడు భూభాగము, 2.బిలము, రంధ్రము, సం.ఖనిః.
ఖని - రత్నములు, లోహములు పుట్టెడుచోటు, వికృ.గని.
ఖనిజము - లోహము, వ్యు.గని యందు పుట్టినది, (రసా.) సమ్మేళనస్థితి యందు లభించులోహము (Ore) (భూగో,) గనులనుండి త్రవ్వి తీయబడిన లోహము (Mineral).
గనిమ - మడి చుట్టుగల చిన్నగట్టు, ఒక రకపు సేతువు.
ఖనిజ విజ్ఞానము - (రసా.) ఖనిజముల ప్రభవ స్థానములను, ధర్మములను ఉపయోగములను చర్చించు శాస్త్రము (Minerology).
ఇరవు - చోటు, స్థానము, విణ.స్థిరము.
ఇమ్ము - 1.స్థానము, 2.విరివి, 3.అనుకూల్యము, 4.ఇంపు, 5.ఉపాయము, 6.సుఖము, విణ.1.అనుకూలము, 2.ఆమూలము, 3.మనోజ్ఞము, 4.యుక్తము, 5.స్పష్టము.
ఇమ్ముదప్పు - (ఇమ్ము+తప్పు) ఇక్కట్టు, సంకటము.
ఇక్కట్టు - 1.ఆపద, సంకటము, విణ.ఇరుకైనది.
ఇక్కువ - 1.ఉనికి, 2.చోటు, 3.సంకేత స్థలము, 4.కళాస్థానము, 5.జాడ.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగము లకై పొంచియుండుట, రూ.ఉనుకువ (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).
స్థితి - 1.ఉనికి, 2.కూర్చుండుట, 3.నిలకడ, 4.మేర, సం.వి. (రసా.) 1.అవస్థ (Phase), 2.ఘన, ద్రవ, వాయు, ద్రవ్యావస్థలలో నొకటి, 1.ఒక వస్తువు యొక్క ఉనికి, రీతి (State), 2.అది ఆక్రమించిన స్థానము, (భౌతి.) ఏ వస్తువు అయినను ఉన్న విధము, అవస్థ (Mode of existence).
భూభృత్తు - 1.రాజు, 2.కొండ.
భూభుజుఁడు - రాజు.
భూజాని - 1.విష్ణువు, 2.రాజు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
నేలఱేఁడు - రాజు; భూభుజుఁడు - రాజు.
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు - భూసురుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.
అచల - భూమి.
న చలతీత్యచలా. చల కంపనే. - చలింపనిది.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది. నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ - సీత.
వరజు - నాగటి చాలు, సీత.
శీత - నాగటి చాలు.
భూమే భూమిప సర్వస్వే భూమిపాల పరాయణీ|
భూమిపానం సుఖకరే భూమిం దేహి చ భూమిదే||
అనంత - 1.భూమి, 2.పార్వతి, (వృక్ష) 1.ఎద్దునాలుక చెట్టు, 2.గరిక, 3.ఉసిరిక, 4.తిప్పతీగ, 5.జీలకఱ్ఱ, 6.పిప్పలి.
నాస్త్యంతో (అ)స్యాః అనంత – అంతము లేనిది.
పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|
కడవ్రేళ్లైనా భూమిలో మిగిలితే గరిక గడ్డి చిగర్చక మానదు. దైవబలం తలుచుకుంటే గడ్డి బ్రహాస్త్రం అవుతుంది.
అమలకము - 1.ఉసిరికాయ, 2.ఉసిరి చెట్టు.
అగ్నిమంథము - నెల్లిచెట్టు, ఉసిరిక.
ఉసిరిక - 1.అమలక వృక్షము, నెల్లిచెట్టు, 2.నేల ఉసిరిక.
మండ1 - ఉసిరిక; నెల్లి - ఉసిరిక.
మండ2 - 1.శాఖ, చిన్నకొమ్మ, 2.చీలమండ.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ.
కరతలామలకము - జాతీ. అరచేతి లోని ఉసిరికాయ, సులువుగా అధీన మగునది.
తిప్యఫలా త్వామలకీ త్రిషు, అమృతా చ వయస్థా చ :
తిప్యవచ్ఛుభఫలత్వాత్తిప్యఫలా - తిప్య నక్షత్రము వలె శుభప్రదమైన ఫలములు గలది.
తిప్యనక్షత్రయుక్తేకాలే ఫలం కరోతీతివా తిప్యఫలా - పుష్య నక్షత్ర కాల మందు ఫలించునది.
ఆమలతే గుణానామలకీ. త్రి. మల మల్ల ధారణే. - గుణములను ధరించునది.
రసాయనత్వాదమృతా - అమృతమువంటి రసము గలది.
వయో యౌవనం తిష్ఠతిస్థిరీభ వత్యనయేతి వయస్థా. ప్ఠా గతినివృత్తౌ. - యౌవనము దీని చేత స్థిరమగును. ఈ నాలుగు ఉసిరిక చెట్టు పేర్లు.
అభుక్వా అమలకం పథ్యం భుక్త్వాతు బదరీఫలమ్|
కపిత్థం సర్వదాపథ్యం కదళీ నకదాచన||
తా. పరగడుపున ఉసిరికాయయు, భోజనా నంతరము రేగుపండును భుజింప వచ్చును. ఎప్పుడును వెలగపండు పద్యకరము. అరటిపండును ఒకప్పుడు పద్యకరముగాదు. – నీతిశాస్త్రము
సీలమండ - చీలమండ.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.సీలమండ. (Ankle bone).
ఘుటిక - 1.గుళిక, చిన్నమాత్ర, 2.చీలమండ.
గుళిక - ఉండ, మాత్ర(రసగుళిక).
గులక - సన్ననిరాయి, సం.గుడికా, గుళికా.
ఉండ - గుళిక విణ.గుండ్రము.
ఉంట - 1.ఉండ, 2.ఉండుట, విణ.గుండ్రనిది.
ఉండు - 1.వసించు, 2.మిగులు.
ఉండ్రము1 - గుండ్రనిది, రూ.ఉండ్రస.
ఉండ్రము2 - వేడినీళ్ళతో తడిపిన పిండిని గుండ్రని ఉండలు చేసి ఆవిరిపై ఉడికించిన భక్ష్యము, మోదకము, సం.ఉండేరకః.
మోదకము - కుడుము లడ్డు. కుడుము - మొదకము. వినాయకుని మీద భక్తా, ఉండ్రాళ్ళ మీద భక్తా!
తత్ద్రంథీ ఘుటికే గుల్ఫౌ -
ఘోటతే పరివర్తతే ఘుటికా. ఘుట పరివర్తనే. - చుట్టువాఱియుండునది.
అభిఘాతాద్గుల్యతే రక్ష్యత ఇతి గుల్ఫాః. గుడ రక్షయాం. - అభిఘాతము వలన రక్షింపఁబడునది. ఈ 2 రెండు పాదముల పార్శ్వముల యందలి బుడుపుల పేర్లు(చీలమండ).
గుది - 1.ఆకులు మొ.ని గ్రుచ్చిన సరము, 2.చీలమండ, (తాటిచెట్టు మొ.ని ఎక్కుటకు కాళ్ళకు తగిలించికొను బందము).
గుత్తి - 1.పూగుత్తి, 2.చీలమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము. కుచ్చు(ౘ) - 1.గుత్తి, 2.పూగుత్తి, 3.ఏదేని చేర్చి కట్టినది, కొనచెవి నుంచు కొనెడి భూషణము, సం.గుచ్ఛః.
గుళుచ్ఛము - 1.గుత్తి, 2.పూగుత్తి. పుష్పమంజరి - (వృక్ష.) పూలగుత్తి (Inflorscence).
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
గుత్సము - 1.ముప్పది రెండు మణులు గుచ్చినహారము, 2.కంబము, 3.పరి మొ.ని దుబ్బ, 4.పూగుత్తి. స్తబకము - పూగుత్తి.
కంబము - గుంజ, సం.స్కంభః.
గుంజ - 1.స్తంభము, 2.కట్టుగొఱ్ఱు, సం.గుండ్రమ్.
స్తంభము - 1.కంబము, 2.మ్రానుపాటు, నిశ్చేష్టత, సం.వి. (భౌతి., రసా.) పాదరవముతో నింపిన భారమితి గొట్టములో నిలిచియున్న పాదరసోన్నతికి స్తంభమని పేరు (Column). అట్లే ధర్మామీటరులో కూడ నిది యుండును, సం.వి.(రసా.) వాయువుల తడిని ఆర్పుటకు ఉపయోగించు కాల్సియం క్లోరైడ్, కాల్సియం ఆక్సైడ్ మొదలైన ద్రవ్యములతో నింపిన గొట్టము (Tower).
స్తంభయిత - స్తంభించువాడు.
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.
జడత్వము - (భౌతి.) విశ్రాంత స్థితిలోగాని చలించుచున్న స్థితిలోగాని ఉన్నవస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము.
తటకా - నిశ్చేష్టత.
తటకాపడు - నిశ్చేష్టత నొందు; నిశ్చేష్ట - చేష్టలుడుగుట.
ఒక స్తంభాన్ని పట్టుకొని చిన్నపిల్లలు నిర్భయంగా దానిచుట్టూ గిరగిరా తిరుగుతారు. అలాగే భగవంతునిపై మనస్సు నిలిపి తన సంసారిక బాధ్యత లను నెరవేర్చే వ్యక్తికి ఏ అపాయమూ కలుగదు. - శ్రీ రామకృష్ణ పరమహంస
సోమలత - 1.తిప్పతీగ, 2.సోమరసము తయారుచేయు తీగ.
సోమము - పరాక్రమము, సం.వి.1.తిప్పతీగ, 2.జలము, 3.కర్పూరము, 4.సోమరసము.
సోమ- 1.శ్రమము, 2.పరాక్రమము, రూ.సోమము, సం.శ్రమః, స్తోమః.
పురోడాశము - 1.యజ్ఞార్థమైన అపూపము, సోమలతరసము, 2.హుతశేషము.
అనంతుడు - 1.శ్రేష్ఠుడు, 2.విష్ణువు, 3.వాసుకి, విణ.తుదిలేనివాడు.
అనంతశయనుఁడు - విష్ణువు. శేషతల్ప సుఖనిద్రిత రామ్|
అనంతుడు శ్రీమహా విష్ణువు యొక్క శయ్య, భూ భారమును దాల్చువాడు.
అనన్తో నవధావపి : అనంత శబ్దము అవధిలేని దానికి పేరైనపుడు త్రి. అపిశబ్దము వలన శేషునికిని, విష్ణువునకును పేరైనపుడు పు. ఆకాశము నకు పేరైనపుడు న. భూమికి పేరైనపుడు సీ. న విద్యతో అంతో యస్యే త్యనంతః కడలేనిది. "అనంత శ్శేషవిష్ణ్వోస్స్యా దనంతం సురవర్త్మని, అనంతా శారిబా దూర్వా విశాల్యా లాలీషుచ, అనంతా హైమవత్యాం చ గుడూచ్యాం చావనావ" పీతి విశ్వప్రకాశః.
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసా మహమ్ |
పితౄణా మర్యమా చాస్మి యమ స్సమ్యమతా మహమ్ || - 29శ్లో
తా|| నాగులలో అనంతుడను నాగరాజును, జలదేవతలలో వరుణుడనువాడను, పితృదేవత లలో అర్యముడను(అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు.), దండించువారిలో యముడను నేనే. - విభూతియోగము, భగవద్గీత
అనంతో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజో(అ)గ్రహః
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః| - 95స్తో
తుష్టి : అనంతుని భార్య. తుష్టిలేని జగాలు నష్టపోతాయి. విశ్వేశ్వరము నందు దేవిస్థానం తుష్టి.
తుష్టి - 1.తృప్తి, 2.సంతోషము. సుఖాల్లో గొప్పది సంతోషం. కొడుకును కౌగిలించుకోవడం వల్ల కలిగే సుఖాన్ని మించిన సుఖం లేదు.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
శేషాహి - విష్ణువు యొక్క పానుపు, వేయిపడగలు గల పాము.
అహిపతి - శేషుడు.
శేషో అనన్తో :
శేతే హరిరస్మిన్నితి శేషః శీజ్ స్వప్నే - హరి యతని మీఁద శయనించును.
కల్పంతే పి శిష్యత ఇతివా శేషః – కల్పాంతము నందును మిగిలియుండు వాఁడు.
న విద్యతే అంతో నాశో యస్య సః అనంతః - నాశము లేనివాడు. ఈ మూడు నాగులకు రాజైన ఆదిశేషుని పేర్లు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, వెలుగురేడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి, హరిప్రియ.
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
హరివాసరము - ఏకాదశి; ఏకాదశి - 1.పదునొకండవ తిథి, 2.పదునొకండు తంత్రులుగల పరివాదిని యను వీణ.
జీవలోకైకజీవాతు ర్భద్రోదారవిలోకనా,
తటిత్కోటిలసత్కాంతిస్తరుణీ హరిసుందరీ|
ఆశ్లేష - ఇది ఆదిశేషుని జన్మ నక్షత్రం.
ఆదిశేషుడు - సర్పరాజు. ఆదిశేషుడు పడగలు విప్పి పసిబాలుడైన శ్రీకృష్ణునికి గొడుగుగా పట్టినవాడు.
వాసుకి - 1.సర్పరాజు, 2.మృగపక్షి ధ్వని.
కద్రువ తన కుమారులైన శేషుడు, వాసుకి, తక్షక, కర్కోటకాదులతో గుర్రం తోక నల్లగా ఉండేట్టు వ్రేలాడాలని కోరింది. తల్లి అక్రమానికి శేషుడు మొదలైనవారు సహాయం చెయ్యలేమన్నారు. శేషుడు తపస్సుకి వెళ్ళి బ్రహ్మ వరంతో శ్రీమహావిష్ణువు పానుపుయై భూభారాన్ని వహించాడు.
లక్ష్మణుఁడు, శత్రుఘ్నుఁడు ఆశ్లేష నక్షత్రములో జన్మించారు.
లక్కుమనుఁడు - లక్ష్మణుడు, సం. లక్ష్మణః. హితకర లక్ష్మణసంయుత రామ్| లక్ష్మణాగ్రజ గోవిందా|
ఊర్మిళ - 1.లక్ష్మణుని భార్య, జనక మహారాజు కూతురు, 2.పెనిమిటి నెడబాసిన స్త్రీ.
త్రేతాయుగంలో ఆదిశేషుడు లక్ష్మణుఁడుగా జన్మించి, శ్రీరాముడుగా అవతరించిన విష్ణుమూర్తిని సేవించాడు. ద్వాపరయుగములో విష్ణువు, శ్రీకృష్ణుడిగా జన్మించి అన్న బలరాముడుగా అవతరించిన ఆదిశేషుడిని సేవించాడు.
కాశ్యాం నవీణరుద్రాణాం భూషాయై భోగిమండలే
ఆశేషే నిర్గ తే శేష శ్శేషోభూ న్న ఫణీశ్వరః|
తా. కాశికా నగరమందలి క్రొత్తరుద్రుల యలంకార్థమై పాతాళమునందలి సర్పసమూహ మంతయుం గదలిపోవ నాదిశేషుఁడు శేషుఁడే (మిగిలిన వాఁడే) యాయ్యెఁగాని ఫణీశ్వరుడు మాత్రము గాకపోయెను. సర్పము లుండినఁగదా శేషుఁడు ఫణీశ్వరుఁడగుట ? సర్పములన్నియుం బోయిన పిమ్మట శేషుఁడు శేషుడు మాత్రముగాక వేనికి రాజగును ? కాఁడనుట.
శేష వాసుకి సంసేవ్యా చపలా వరవర్ణీని,
కారుణ్యాకార సంపత్తిః కీలకృన్మంత్రకీలికా. - 96శ్లో
ఏకకుండలుఁడు - 1.బలరాముడు, 2.కుబేరుడు, 3.ఆదిశేషుడు.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
వైకుణ్ఠః పురుషః ప్రాణఁ ప్రాణదః ప్రణవః పృథుః|
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయు రధోక్షజః||
పుడమితాలుపు - శేషుడు, వ్యు.భూమిని ధరించినవాడు.
పుడమి - భూమి, సం.పృథివి.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమ ద్విజుడు.
ద్విజానాం బ్రాహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.
ధరణీశ్వరుఁడు - 1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు. ధరణీనాయక గోవిందా|
ధరణీశ్వరుఁడు - రాజు.
ధరణా - భూమి, రూ.ధారణి.
ధరణినురుఁడు - బ్రాహ్మణుడు.
నాగ స్తోత్రమ్ :
నమస్త్రే దేవ దేవేశ నమస్త్రే ధరణీధర|
నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమో స్తుతే||
తడవుల నిడుపడు-శేషుడు, వ్యు. చిరకాలము నుండి యుండు దీర్ఘమైన శరీరము కలవాడు.
తడవు - 1.చేతులతో ప్రాకు, దోగాడు, నిమురు, వెదకు 2.ప్రస్తావించు 3.విచారించు, వి.1.ఆలస్యము 2.చిరకాలము 3.సేపు.
దోఁగు - 1.క్రి.1.మేనితో లొలియు, 2.ప్రాకులాడు, రూ.దోఁగియాఁడు, దోఁదాడు.
నిమురు - క్రి.శరీరమును మెల్లగా తడుము, నివురు. నివురు - క్రి.నిమురు.
వెనకు - క్రి.వెదుకు; వెదకు - క్రి.గాలించు, అన్వేషించు.
గాలించు - క్రి.1.బియ్యము మొ.వి రాళ్ళు లేకుండ శోధించు, అన్వేషించు, వెదకు.
అన్వేషణ - వెదకుట, అన్వేష్ట - వెదకువాడు. తడవుడు - వెదకుట.
శోధనము - (రసా.) ఒక ద్రవ్యమును శుద్ధము చేయుట, (Purification), సం.వి. శుద్ధిచేయుట, పరిశోధించుట, వెదకుట.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త, 3.జాగు.
అజాగ్రత్త - జాగ్రత్తలేమి, మెలకువలేమి.
(ౙ)జాగు - ఆలస్యము.
లేటు - (Late) 1.వెనుకటిది, 2.మరణించినది, 3.ఆలస్యము.
సేపు - కాలము.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
దీర్ఘసూత్రుఁడు - ఆలసించి పనిచేయువాడు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
ౙమున - యమున.
తనకు ఫలంబులేదని యెదన్ దలపోయడు కీర్తిగోరు నా
ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుగొని పూను శేషుఁడు సహస్రముఖంబుల గాలిఁగ్రోలి
ననిశము మోయఁదేమఱి మహాభారమైన ధరిత్రి, భాస్కరా.
తా. మహా భారముతోఁ గూడిన (ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి)భూమిని, (విశ్వజనహితమని)ఆదిశేషుఁడు తన వేయి శిరస్సులతో గాలిని పీల్చుచూ మోయుచున్నాడు. అట్లే సజ్జనుఁడును(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)కీర్తినిగోరు వాడు అగునట్టి వాడు స్వార్ధము చింతింపక, లోకములోని జనుల కుపకరించు కార్యము ఎంత కష్టమైనను అది సుఖముగనే భావించి నేరనేర్చు పూనును.
అనన్తరూపో నన్తశ్రీః జితమన్యు ర్భయాపహః
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః| - 100స్తో
సంసారసర్ప విషదిగ్ధమహోగ్రతీవ్ర -
దంష్ట్రాగ్రకోటిపరిదష్ట వినష్టమూర్తేః|
నాగారివాహన! సుధాబ్ధినివాస! శౌరే!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
విశ్వ - భూమి.
విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి.(భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe).
విశ్వసృజుడు - బ్రహ్మ.
విశ్వం సృజతీతి విశ్వసృట్ జ-పు. - విశ్వమును సృజించువాడు, సృజ విసర్గే.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొం దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
విశ్వస్తము - విశ్వసింపబడినది.
విశ్వసనీయము - విశ్వసింపదగినది.
విశ్వజనీయము - సర్వజనులకు హితమైనది.
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభుః
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః| - 1సో
లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
లోకములు - సర్గమ ర్త్య పాతాళములు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము; ఈ ఏడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము; ఈ ఏడును అధోలోకములు.
విష్టపము - లోకము. సర్వ చరాచర పాలక రామ్|
లోకబాంధవుఁడు - సూర్యుడు; జగచ్చక్షువు – సూర్యుడు; జగముకన్ను - సూర్యుడు; ౙగము చుట్టము - సూర్యుడు Sun.
చరాచరము - 1.జగత్తు, 2.విణ.తిరుగునదియు, తిరుగనదియు.
జనము - ప్రజ; ప్రజ - జనము, సంతతి.
కుటుంబము - పెండ్లాము, బిడ్డలు మొ.వారు భార్యభర్తలు, వారి సంతానము. ఒక గృహములో నివసించు బంధువర్గము (Family).
కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
పురంధ్రి - కుటుంబిని, స్త్రీ(ఆడుది).
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
సంసారము - 1.ఆలుబిడ్డలతోడి యునికి, 2.ప్రపంచము.
సంసృతి - సంసారము.
సంసారి - సంసారము కలవాడు, గృహస్థుడు.
అసారే ఖలుసంసారే - సారం శ్వశుర మందిరమ్|
హిమాలయే హర శ్శేతే - హరి శ్శేతే మహోదధౌ||
తా. సంసారము సారము లేనిదైనను (శ్వశురులు - అత్తమామలు)శ్వశుర గృహంబు(మందిరము - 1.ఇల్లు, 2.పట్టణము, 3.దేవగృహము, 4.దేవపీఠము.)సారంబు గలది. గనుకనే శివుఁడు(హరుఁడు - శివుడు) హిమవత్పర్వతంబు నందు, విష్ణువు(హరి)సముద్రము నందును శయనించిరి. – నీతిశాస్త్రము
స్థిర - భూమి.
తిష్ఠతి సదా స్థిరా, ష్ఠా గతినివృత్తౌ. - ఎల్లప్పుడు నుండునది.
తిష్ఠతి సర్వమస్యామితి వా స్థిరా - సర్వము దీనియందుండునది.
స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది.
తిరము - స్థిరము.
స్థిరుఁడు - శని; శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
తిరుడు - స్థిరుడు.
తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
స్థిరాస్థి - ఒక చోటినుండి మరియొక చోటికి తీసుకొనిపోవుటకు వీలులేని(భూమి ఇల్లు, తోటలు మొ నవి)ఆస్తి (Immovable property).
ఆస్తిపరుఁడు - స్థితిమంతుడు, ధనవంతుడు.
ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.ని., సొత్తు
స్థిరవారము - శనివారము Saturday.
శనివారము - ఏడవ వారము (ఇది ఆదివారము మొదలుకొని).
ధర - భూమి.
ధరతి విశ్వం ధరా, ధరిత్రీ. ఈ. సీ. ధరణిశ్చ. ఇ.సీ. - విశ్వమును ధరించునది.
ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి.
ధరణా - భూమి, రూ.ధారణి.
ధారణి - భూమి, రూ.ధారుణి, ధరణి.
ధరణీనురుఁడు - బ్రాహ్మణుడు.
ధరణీశ్వరుఁడు - 1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు.
ధరణీశ్వరుడు - రాజు.
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియదాన శివ|
ధరము - 1.కొండ, 2.వెల.
ధరతి భువం ధరః. ధృఞ్ ధరణే. - భూమిని ధరించునది.
దర - ధర, వెల, సం.ధరా ధారణా.
దారణ - ధర, వెల, రూ.దర, సం.ధారణా.
వెల - (అర్థ.) ధర, ఖరీదు, నాణెములచే పదార్థములలోనుండు మూల్య పరిమాణమును నిర్ణయించుట.
వెల - కొనువస్తువులకిచ్చు విలువ, వస్తువులకు జెప్పుధర.
వెలకట్టుట - (గృహ.) విలువను స్థాపించుట, విలువ నిశ్చయించుట, మూల్యనిర్ణయము (Evaluation).
అవక్రయము - 1.బాడుగ, అద్దె rent, 2.వెల, 3.రాజునకు చెల్లించు పన్ను, 4.కూలి, జీతము.
బాడుగ - అద్దె, భాటకము, భూమిపై గాని, భవనములపైగాని, వస్తువుల పైగాని, వాటి ఉపయోగము కొరకై చెల్లించు ధనము.
అద్దె - అద్దియ; అద్దియ - ఇంటిబాడుగ, కిరాయి, రూ.అద్దె.
కిరాయి - బాడుగ, కూలి. బాడిగ - 1.కూలి, 2.అద్దె, సం.భాటకః.
కూలి - పనిచేసినందుల కిచ్చెడు ధనము.
భరణ్యము - 1.కూలి, 2.జీతము.
జీతము - వేతనము, సం.జీవితమ్.
వేతనము - భృతి, కూలి, చేసినపనికి ప్రతిఫలముగ నిచ్చు ద్రవ్యము, జీతము.
వేతనముల స్థాయి - (అర్థ.) వేతన ప్రమాణము.
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భృత్య - కూలి.
భరణము - 1.భరించుట, 2.జీతము, 3.కూలి.
భాటకము - 1.ఇంటిపన్ను, 2.బాడిగ.
బాడుగ నియంత్రణము - (అర్థ.) ఇంటి యజమానులు అద్దెకు ఇచ్చు ఇండ్లు, వానికి ఇచ్చు బాడుగను ప్రభుత్వము నియంత్రించుట.
భర్మము - 1.బంగారు, 2.జీతము.
జీతగాఁడు - జీతము గొని పనిచేయువాడు.
భృతకుఁడు - కూలివాడు; భరటుఁడు - 1.కూలివాడు, 2.కుమ్మరి.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు. సేవకుఁడు - కొలువుకాడు.
చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు గలది, 2.కుమ్మరి.
ఐద్దాయులు - (ఐదు+రాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.
క్రయము-1.ఖరీదు, వెల, 2.వెల ఇచ్చికొనుట.
క్రీతకుఁడు - తల్లిదండ్రుల యొద్ద వెలకు గొన్న కొడుకు.
అర్హము - తగినది, వి.వెల.
అర్ఘము - 1.వెల, 2.పూజావిధి, 3.చౌక, రూ.అర్ఘువు.
అర్ఘ్యము - 1.మిక్కిలి వెలగలది, 2.పూజకు తగినది, 3.పూజకోరకైనది.
అర్ఘువు - అర్ఘము.
వెలఁదుక - (వెలది+ఉక) ఆడుది, వెలది.
వెలది నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.
వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి.స్త్రీ.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషములేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి.
అమూల్యము - 1.వెలలేనిది, 2.మిక్కిలి వెలగలది.
గిరాకి - అధికమగు వెలగలది, (జాతీ.) ఒక సమయమందు ఒక నిర్ణీతమైన ధరకు కొనుగోలుదారులు కొనుటకు సిద్ధపడువస్తువుల లేక సేవల సౌకర్యముల రాశి.
గిరాకి సరఫరా వక్రరేఖలు - (అర్థ.) ఒక సమయమందు ఒక సరకు యొక్క వ్యాపారులకు నమ్మకమైన గరిష్ఠమైన అమ్మకపు మార్కెట్టు ధరలను చూపురేఖలు.
అగ్గువ - వెలతక్కువది, చౌక, విణ.వెల తక్కువైనది, రూ.అగ్గువ, సం.అఘిః.
(ౘ)చౌక - 1.అగ్గువ, 2.తక్కువ, 3.తేలిక.
చౌకబారు - (వ్యవ.) న్యూనమైనది, వెల తక్కువది.
తక్కువ - కొరత; వెలితి - తక్కువ.
తేలిక - చులకన, లఘుత్వము. లఘిమ - లఘుత్వము.
(ౘ)చులుకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
అనామయము - రోగములేనిది, వి.ఆరోగ్యము.
ఆరోగ్యము - రో గ ము లే మి, స్వాస్థ్యము.
స్వాస్థ్యము - 1.నెమ్మది, 2.స్వార్థత. హాయి - 1.సౌఖ్యము, 2.నెమ్మది. మదిమది - 1.నెమ్మది, 2.శాంతి, 2.అనాలోచనము.
శాంతి - శమనము.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యడగి యుండుట.
శాంతము - శాంతినొందినది, సం.1.కామ క్రోధాది రాహిత్యము, 2.ఉపశమనము, 3.తొమ్మిది రసాలలో నొకటి.
శమనము - శాంతి పదము, రూ.శామనము.
శామనము - 1.శమనము, 2.వధము.
శమించు - క్రి.అడగు.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.
ౙమ్మి - శమీ వృక్షము,సం.శమీ.
శమనుడు - యముడు; ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమయతి ప్రాణిన ఇతి శమనః, శము ఉపశమనే - ప్రాణులను శమింపఁజేయువాఁడు.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
వామనము - లేతది.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.
ధరనే వస్తువు లైనన్
దరుగుటకై వృద్ధినిందుఁ * దగఁ బొడ వెదుగున్
విరుగుటకై ; పాయుటకై
దరిఁజేరును ; వీని మదిని * దలఁపు కుమారా!
తా. లోకములో నే వస్తువులైనను వృద్ధిపొందుట నశించుటకే. పొడవుగా పెఁరుగుట విఱిగిపోవుటకే. దగ్గరఁజేరుట (పాయుట - క్రి.1.చిక్కెడలించు, 2.తొలగుట .)కొరకు, విడిపోవుటకే యగును. ఈ విషయముల నన్నింటిని మనస్సునందుంచు కొనవలయును.
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
మదించు - క్రి.వెలయూహించు, 2.సంకల్పించు.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,) 3.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
అంచనా- పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.
ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ|
లోకతీతా గుణాతీతా - సర్వాతీతా శమాత్మికా. - 176శ్లో
ధరాధరము - 1.కొండ, 2.తాబేలు.
కూర్మము - కమఠము, తాబేలు.
కమఠము - తాబేలు, భిక్షాపాత్రము.
కచ్ఛపము - తాబేలు, కమఠము.
తామేలు - తాబేలు.
కూర్మే కమఠ కచ్ఛపాః -
కుత్సితః ఊర్మిర్వేగః అస్యకూర్మః - ఊర్మియనఁగా వేగము; కుత్సితమైన వేగము గలది.
'ఊర్మిః స్త్రీపుంస యోర్వీచ్యాం ప్రకాశే వేగభంగయో' రితి రభసః. కం జలం ఊర్వతీతివా కూర్మః. ఊర్వీ హింసాయాం. - జలమును (ౙ)జెరుచునది.
కే ఉదకే మఠతీతి కమఠః. మఠ నివాసే. - జలమునందు వసించునది.
యజ్ఞార్థం కామ్యత ఇతివా కమఠః. కముకాంతౌ. - యజ్ఞార్థమై కాంక్షింపఁ బడునది.
కచ్ఛేన పుచ్ఛేన పిబతీతి కచ్ఛపః. పా పానే. - పుచ్ఛము(పుచ్ఛము – తోక) చేత పానము చేయునది.
కచ్ఛమనూపదేశం క్షుద్రజంతు భకణేన పాతీతి వా కచ్ఛపః - జలప్రాయ ప్రదేశమును క్షుద్ర జంతు భక్షణముచేత రక్షించునది. ఈ ఆరు తాఁబేటి పేర్లు.
కూర్మవత్ స్థితత్వాత్కచ్ఛపః - కూర్మము వలె నుండునది.
సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి నిర్మాణములు, ఊపిరితిత్తులు, రెండు బృహద్ధమన చాపములు గల పృష్ట వంశిక జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
కరమనురక్తిమందరముగవ్వముగా యహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధిమధించు చున్నచో
ధరనిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరధీ కరుణాపయోనిధీ.
తా. రామా! దేవతలును, రాక్షసులును, మందర పర్వతమును కవ్వముగాను, అహిరాజగు(అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.)అహిరాజగు వాసుకుని కవ్వపు త్రాడుగానుజేసి పాల సముద్రమును(పయోధి - సముద్రము) చిలుకు చుండగా, అపుడాకొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం జూచి కూర్మావతారము యెత్తి కొండను వీఁపుమీఁద దాల్చినవాడవు నీవేకదా!
గుహ్యము - 1.ఏకాంతము, 2.పురీషమార్గము, 3.వంచన, 4.తాబేలు, విణ.దాచదగినది.
సముద్ర మథన కాలంబునం బదునొకండవ(11వ) మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠ కర్పరంబున(కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium) నేరుపరియై నిలిపి; పదకొండో పర్యాయం సముద్ర మధన సమయం లో "కూర్మావతారం" స్వీకరించి మున్నిటిలో మునిగి పోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా తన వీపునగల పెంకుపై ధరించాడు.
ఎట్లుగఁ బాటుపడ్డనొకయించుక ప్రాప్తములేక వస్తువుల్
పట్టుపడంగనేరవు నిబద్ధి, సురావళిఁ గూడి రాక్షసుల్
గటుపెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించి రెంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు, భాస్కరా.
తా. రాక్షసులు దేవతలతో కలిసి మందర పర్వతమును పెకలించు దానిని తీసుకొనివచ్చి కవ్వముగా నుపయోగించి, పాలసముద్రము మధించిరి. తుదకు అమృత మందు జనిత మయ్యెను. కాని ప్రయాసపడిన రక్కసులు దానిని తామనుభవింపలేకపోయిరి. కావున యెవరెంత కష్టపడినను, వారికి అదృష్టములేనిచో తామాశించు ఫలమును పొందలేరు.
గిరిధరుఁడు - విష్ణువు, వ్యు.మందర పర్వతమును ధరించినవాడు.
దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
తాబేలు - A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.
కొండమోసెడి యయ్యకుఁ గూడ నణువు
కాని నేనె భారమ్మైతి నింక
నాదు గతి యేమొ తెల్పరా వాదమేల
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోక ధృత్|
సుమేధా మేధజో ధన్యః స్సత్య మేధా ధరాధరః|| - 80స్తో
కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మము - air in the eyes.
స్తూపపృష్టము - తాబేలు, వ్యు.దిబ్బవంటి వీపుకలది.
స్తూపము - మట్టి మొదలగువాని దిబ్బ.
క్షుబ్దాద్రౌ క్షుభితజలోదరే తదానీం దుగ్దాబ్దౌ గురుతరభారతో నిమగ్నే |
దేవేషు వ్యథితతమేషు తిత్ప్రియోషీ కమఠ తనుం కఠోరపృష్ఠామ్||
దేవా! సురాసురలు క్షీరసముద్రమును చిలుకు చుండగా మందర పర్వతము మిక్కిలి బరువుగా ఉండుటచే అది అల్లకల్లోలముగా నున్న ఆ జలములలో మునిగిపోయెను. అందులకు దేవతలు అందఱును చింతా క్రాంతులైరి. అప్పుడు వారికి ప్రీతిని గూర్చుటకై నీ కఠినమైన మూపుగల కూర్మ రూపమును ధరించితివి. – నారాయణీయము
పీవరము - బలిసినది, వి.తాబేలు.
పీనము - బలిసినది, వి.సంతోషము.
లప్ప - రాశి, విణ.కండకలది, బలిసినది.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.
వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో విస్తారాత్ పరిగతలక్షయోజననేన|
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నినేథ||
శ్రీ మహావిష్ణు! కూర్మ రూపముననున్న నీ యొక్క వెన్నుచిప్ప, వజ్రము కంటె మిక్కిలి కఠినముగా లక్షయోజనముల వైశాల్యమున ఉండెను. సముద్రము లోపల గుభిల్లుమను శబ్దముతో పడిపోయిన మందర పర్వతమును ఆ చిప్పపై ఉంచుకొని దానిని సముద్రముపైకి తెచ్చితివి. - నారాయణీయము
క్షితి రతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే, ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే|
కేశవ! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే! |
క్రోడపాదము - తాబేలు, వ్యు.రొమ్మున నిముడ్చుకొను పాదములు కలది.
Turtle - Tortoise with short legs, An animal of water covered with a hard shell, withdraws all its limbs in its body.
కచ్ఛపము - తాబేలు, కమఠము.
తామేలు - తాబేలు.
కూర్మీ వీణాభేదశ్చ కచ్ఛపీ,
కచ్చపీశబ్దము ఆఁడుతాఁబేటికిని, సరస్వతివీణకు ను పేరు.
కచ్చం పాతీతి కచ్ఛపీ. సీ. పా రక్షనే. – జలప్రాయ భూమిని బాలించునది.
డులి - ఆడుతాబేలు, రూ.డులి.
కమఠీ డులిః -
కమఠస్య స్త్రీ కమఠీ - కమఠముయొక్క స్త్రీ కమఠి.
ఢులతీతి ఢులిః పా. ఇ. సీ. ఢుల ఉతేక్ష పే. - జలమును జల్లునది. ఈ రెండు 2 ఆఁడుతాఁబేటి పేర్లు.
నిజసల్లాపమాధుర్య-వినిర్భర్త్సితకచ్ఛపీ|
మందస్మితప్రభాపూర-మధ్యత్కామేశ మానసా. – 11స్తో
మొగపిఱికి - మొగము (+పిఱికి) తాబేలు, వ్యు.మొగము చూచుటకు పిరికితనము కలది.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
మోము - మొగము, సం.ముఖమ్. మొకము - ముఖము, సం.ముఖమ్. ముఖః పాతు వరాలక్ష్మీ|
ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity).
ముఖశ్వసనము - (జం.) నోటితో గాలినిపీల్చి వదలివేయుట (Buccal respiration).
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము (Peristome).
ముఖపథము - (జం.) బహిశ్చర్మము లోనికి పెరుగుటచే ఏర్పడిన అన్నవాహిక యొక్క ముందరి భాగము, (Stomodaeum).
ముఖపాకము - (గృహ.) నాలుక పూత(Red-tongue) విటమిన్ 'B12' లేక 'డి' లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).
యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || - 58శ్లో
తా|| భయపడిన తాబేలు తలను, నాలుగు కాళ్ళను లోనికిముడుచు కొనునట్లు, ఆత్మారాముడగు యోగి రాగద్వేషాది దోష భయమున పంచేద్రియములను సర్వ విషయముల నుండి వెనుకకు మరల్చి స్థిత ప్రజ్ఞుడగుచున్నాడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. - సాంఖ్యయోగము, భగవద్గీత
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా,
గూఢగుల్భాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. - 18శ్లో
నిశ్చర(ల)ము - (గణి.) చలించనిది (Invaiant).
స్థావరము - (భౌతి.) కదలనిది, చలనము లేనిది, స్థిరము, మార్పులేనిది, (Stationary), సం.వి. 1.వింటినారి, 2.కొండ, 3.వృద్ధత్వము.
కాశ్యపి - భూమి, వ్యు.పరశురామునిచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నియ్యఁ బడినది.
కశ్యపస్యేయం కాశ్యపీ. ఈ.సీ. - పరశురామునిచేత కశ్యపునికొఱకు యజ్ఞ దక్షిణగా నియ్యఁబడినది.
తథాచోక్తం, – ' శ్లో. త్రిసప్తకృత్వః పృధివీం కృత్వానిః క్షత్రియాం తతః, దక్షిణా మశ్వమేధాంతే కశ్యపాయాదదాత్ప్రభు ' రితి.
అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య, 2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము.
ఋః - అదితి, ఋ అనఁగా అదితిదేవి. అదితి దేవజనని, ప్రకృతి కళ నుండి పుట్టిన స్త్రీ.
అదితియుఁ గశ్యపుఁడును నన,
విదితుల రగు మీకుఁ గుఱుచవేషంబున నే
నుదయించితి వామనుఁ డనఁ
ద్రిదశేంద్రానుజుఁడనై ద్వితీయభవమునన్|
భా|| రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో 'వామనుడు' అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రునికి నేను(అనుజుఁడు - తమ్ముడు)ను, నాకు ఇంద్రుడు అన్నగారు.
ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 2.సూర్యమండలాంతర్గత విష్ణువు.
ఆదితేరపత్యం ఆదిత్యః - అదితి కొడుకు.
ఆదిత్యవారము - వారములలో మొదటిరోజు, ఆదివారము, భానువారము Sunday.
అదితేయాః అదితే రపత్యాని అదితేయాః - అదితికొడుకులు.
ఆదిత్యాః - ఆదిత్యులు పన్నిద్దరు - ఇంద్రుఁడు, ధాత, పర్జన్యుఁడు, త్వష్ట, పూష, అర్యముఁడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుఁడు అనువారలు.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
బుధుఁడు - 1.ఒక గ్రహము Mercury, 2.విద్వాంసుడు, 3.వేలుపు.
వేల్పుటెంకి - స్వర్గము, వ్యు.దేవతలకు నివాసస్థానము.
వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుడు - బృహస్పతి.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
బృహస్పతివారము - గురువారము Thursday.
వేల్పుదాయ - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.
ఆదిత్యానా మహం విష్ణు ర్జ్యోతిషాం రవి రంశుమాన్ |
మరీచి ర్మరుతా మస్మి నక్షత్రాణా మహం శశీ||
తా|| నేను ద్వాదశ ఆదిత్యులలో విష్ణువను సూర్యుడను; ప్రకాశించెడి వారిలో రస్మిమంతుడను సూర్యుడను; సప్త మరుద్గణములలో మరీచిని(మరీచి-1.కిరణము, 2.వెలుగు, 3.ఎండమావులు, 4.ఒక ప్రజాపతి.), నక్షత్రము లలో చంద్రుడను. - 21శ్లో విభూతి యోగము, భగవద్గీత
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యగ్నిలోచనా,
అదితి ర్దేవమాతా చ అష్టపుత్రా ష్టయోగినీ. - 63శ్లో
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్తి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. గణనాయిక - గౌరి, పార్వతి.
ద్రొవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్త్రిక), 2.బొమ్మ.
బొమ్మ - 1.కనుబొమ, 2.బిరుద చిహ్నము, 3.అవమానచిహ్నము, 4.ప్రతిమ, 5.బ్రహ్మ, విణ.అల్పము, సం.1.భూ, 2.ప్రతిమా, 3.బ్రహ్మ.
బొమ - 1.కనుబొమ, 2.ప్రతిమ, రూ.బొమ్మ. భూణ - కనుబొమ్మ. ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలనము, వి. (భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).
ఆభాసము - 1.కాంతి, 2.ప్రతిబింబము, 3.వాస్తవము కాకపోయినను పైకి వాస్తవమైన దానివలె కనించునది, ఉదా.హేత్వాభాసము, రసాభాసము మొ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుఁడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
బొమ్మచుక్క - కానరానిచుక్క, అభిజిన్నక్షత్రము.
కానరానిచుక్క - అభిజిత్ నక్షత్రము.
అభిజిత్తు - 1.పగలు పదునాల్గు గడియలపై నుండు గడియల కాలము, 2.ఒక నక్షత్రము.
క్షితి - 1.భూమి, 2.ఉనికిపట్టు.
క్షితిధరము - కొండ.
క్షితిపతి - రాజు, భూమీశుడు.
క్షితిరుహము - చెట్టు.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉంకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).
క్షయ వాసావపి క్షితిః,
క్షితిశబ్దము నాశమునకును, ఉనికిని, అపిశబ్దము వలన భూమికిని పేరు.
క్షయః క్షియంతి నివసంత్యస్యామితి చ క్షితిః, క్షి క్లయే, క్షి నివాసగత్యోః. - నశించుటయు, ఉండుటయు దీనియందుందురు గనుకను క్షితి.
క్షైతిజము - (గణి.) క్షితిజ సంబంధమైనది, (ఆకాశము భూమి కలియు నట్లు కనబడు వలయమునకు క్షితిజమని పేరు), భూమితో సమానమైన లేదా సమాంతరమైన మట్టము గలది (Horizontal).
శ్లో. క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే
హుతాశే ద్వాషష్షి - శ్చతురధిక పంచాశ దనిలే,
దివి ద్వాష్షిట్త్రింశ - న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖా స్తేషామ - ప్యుపరి తవ పాదాంబుజయుగమ్. 14శ్లో
తా. భూతత్త్వ(క్షితి - 1.భూమి, 2.ఉనికిపట్టు)మందు ఏబదియాఱును, జల తత్త్వము(ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.)నందు ఏబది రెండును, అగ్ని(హుతాశనుఁడు - అగ్ని)తత్త్వ మందు ఎబదినాలుగును, ఆకాశతత్త్వ(దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.)మందు డెబ్బదిరెండు ను, మనస్వత్త్వమందు అరువదినాలుగును, ని ఈ రీతిగా ఏ (మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.)కాంతు లుండునో వానికి పై భాగమున నీ పాదపద్మయుగ మున్నది. (9వ దానిలో చక్రనియమము కలదు.) – సౌందర్యలహరి
మూలమాధార షట్కస్య మూలాధారం తతో విదుః |
స్వశబ్దేన పరం లింగం స్వాధిష్ఠానం తతో విదుః ||
సర్వంసహ - భూమి.
సర్వం సహత ఇతి సర్వంసహా, షహమర్షనే. - సర్వమును సహించునది.
సహ - భూమి.
సహధర్మణి - భార్య.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
సహచరుఁడు- మిత్రుడు, విణ.కూడదిరుగువాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.
సహజ - తోడ బుట్టినది. యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
వసుమతి - భూమి.
వసుధనమస్యామస్తీతి వసుమతీ. ఈ. సీ. - ధనము దీనియందుఁ గలదు.
గురుత్వం విస్తారం - క్షితిధరపతిః పార్వతి! నిజా
న్నితమ్బా దాచ్ఛిద్య - త్వయి హరణరూపేణ నిదధే|
అత స్తే విస్తీర్ణో - గురు రయ మశేషాం వసుమతీం
నితంబ ప్రాగ్భారః - స్థగయతి లఘుత్వం నయతి చః. - 81శ్లో
తా. తల్లీ! పార్వతీ! నీ తండ్రి హిమవంతుడు తన పర్వత ప్రదేశమునుండి (కొండ చరియనుండి) కొంత గురుత్వమును, వైశాల్యమును తీసి, వివాహ సమయమున తండ్రి కుమార్తెకిచ్చు కానుకగా హరణ రూపమున నీ యందు నిచ్చినాడు. ఈ కారణము చేత విశాలమగు నీ పిరుదుల అతిశయము, బరువు కలదియు విస్తీర్ణమము కలదియునగుచు ముందుకు వంగి, సమస్తమైన భూమిని నంతయు కప్పుచున్నది. భూమికి చులకన తనము(లఘుత్వమును) కూడ పొందించుచున్నది. – సౌందర్యలహరి
వసుధ - భూమి, వ్యు.వసువుని(బంగారమును) ధరించునది.
వసుధనమస్యామస్తీతి వసుమతీ. ఈ. సీ. - ధనము దీనియందుఁ గలదు.
వసు దధతీతి వసుధా. డుధాఞ్ ధారణ పోషణయోః - ధనమును ధరించునది.
వసువు - బంగారు, ధనము, రత్నము.
వాసవుఁడు - ఇంద్రుడు.
వసూని రత్నాన్యస్య సంతీతి వాసవః - రత్నములు గలవాడు.
అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్|
నమామి కమలాం కాంతాం కామాక్షీం క్రోధసంభవామ్|
వసుంధర - భూమి.
వసుంధరయతీతి వసున్ధరా. ధృ ధారణే. - ధనమును ధరించునది.
వసుంధర(వసుంధరాదేవి) సర్వాధార, సర్వసంపద్ధాత్రీ, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యమాన. "పృథివీ హేషా నిధిః" అన్నది వేదం. భూమి వసుంధర, వసువు అంటే బంగారం, రత్నం, ధనం, కిరణం, అగ్ని ఇవన్నీ భూమిలో ఉన్నాయి.
దేవభేదే (అ)నలే రశ్మౌ వసూ రత్నే ధనే వసు,
వసుశబ్దము అష్టవసువులకును, అగ్నికిని కిరణమునకును(రశ్మి - (భౌతి.) 1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.) పేరైనపుడు పు. రత్నమునకును, ధనమునకును పేరైనపుడు న. వసతీతి వసుః, పు. వస నివాసే. ఉండును గనుక వసువు. టీ. స. కిరణధనయోర్యథా_ 'నిరకాసయ ద్రవి మపేతవసుం వియదాలయా దపరదిగ్గణికా' ఇతి మాఘకావ్యే.
పైఁడిచూలాలు - వసుంధర, భూమి.
(ౘ)చూలాలు - గర్భవతి.
పైఁడిఱేఁడు - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావనుని అన్న.
పైఁడినెలఁత - లక్ష్మి.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ధన మగ్ని ర్థనం వాయుః ధనం సూర్యో ధనం వసుః |
ధన మింద్రో బృహస్పతి ర్వరుణో ధన మశ్నుతే ||
వసువులు - గణాధి దేవతలు, అష్టవసువులు.
వసవః, ఉ-పు. ఆహత్య వసంతీతి వసవః - కూడుకొని యుండువారు. వస నివాసే వారలెనమండ్రు(ఎనిమిది మంది). అవుడు, ధ్రువుఁడు, సోముఁడు, అధ్వరుఁడు, అనిలుఁడు, ప్రత్యూషుఁడు, అనలుఁడు, ప్రభాసుఁడు అనువారలు.
The eight vasus, వసిష్టుని శాపానికి మానవులై పుట్టవలసి వచ్చినది. వసువులు అగ్నికధిస్ఠాన దేవతలు.
1. అవుఁడు - క్రింది పెదవి, అధరము, పల్లు, దంతము, ఔడు.
అదరము1 - క్రిందిపెదవి, సం.అధరః
అదరము2 - 1.భయము లేనిది, 2.లోతులేనిది.
అధరము - క్రిందిపెదవి విణ.1.తక్కువైంది 2.క్రిందిది 3.నీచము. ఔడు - పెదవి క్రింద చోటు, సం.ఓష్ఠః.
దంతము - పల్లు, కోర. రదనము - దంతము.
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
' సి ' విటమిన్ - (గృహ.) Vitamin ‘ C’ 1.పళ్ళచిగుళ్ళ బలహీనతను తొలగించు విటమిన్, 2.శరీర కణజాలముల బంధనమునకు తోడ్పడు విటమిన్.
పయోరియా - (గృహ.) పంటిచిగురు రోగము, ఒక విధమైన పండ్ల వ్యాధి, పన్నుకుదురులలో నుండి చీమురక్తము స్రవించువ్యాధి,(Pyorrhoea). స్కర్వీ (సీతాదము) - (గృహ.) (Scurvy) 'సి' విటమిన్ Vitamin C, లోపము వలన కలుగువ్యాధి. చిగుళ్ళవాపు, పండ్ల నుండి రక్తము కారుట, (ఈ వ్యాధి ఖటిక (Calcium) లోపము వలన కూడ కలుగ వచ్చును.
2. ధ్రువుఁడు - ఉత్తర దిక్కులోనుండు నక్షత్రము, 1.ఉత్తానపాదుని కొడుకు 2.విష్ణువు 3.శివుడు(విష్ణు భక్తుడు).
3. సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
4. అధ్వరుఁడు - అధర్వా వై ప్రజాపతిః యాగము నందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, అధ్వర్యువు. అధ్వర్యము - 1.హింసా రహితము 2.సావధానము, విణ. 1యజ్ఞము 2.సామయాగము 3.ఆకాశము. (ఆకాశము కంటే ఉన్నతమైనవాడు కన్నతండ్రి).
5. అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు. అనిలము - గాలి దేహము నందలి వాతధాతువు, వాతరోగము. అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.
6. ప్రత్యుషుఁడు - వేగుజాము, ప్రభాతము.
7. అనలుఁడు- 1.అగ్నిదేవుడు 2.అష్టవసువులలో ఒకడు.
8. ప్రభాసుఁడు - Source, ప్రతాపము, తేజము, చర్మము యొక్క పైపొర Epidermis.
ప్రభాసిని - (జం.) చర్మము యొక్క పైపొర (Epidermis).
జవ్వు - 1.దుర్మద జలము, 2.చర్మము లోపలిపొర(Epidermis) 3.సొగసు, అందము.
అష్టవసువులలో అష్టమ వసువు భీష్ముడు. వసువు అంశతో భీష్ముడు గంగకి(గంగానది) పుట్టాడు. భీష్ముఁడు పితృభక్తి పరాయణుడు, రాజకీయ విద్యావిశారదుడు, ఇచ్ఛా మరణము పొందినవాడు.
ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.
జితేంద్రియుడు - ఇంద్రియములను జయించినవాడు. కామ క్రోధాలకు లొంగనివాడే జితేంద్రియుడు. జితేంద్రియులకు తప్ప సామాన్యులకు శాంతి కలుగదు. జితేంద్రియుడగు యోగి కర్మ ఫలములయం దపేక్షను వదలి శాశ్వతముగు ఆత్మశాంతి పొందును.
అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగువాడు, విష్ణువు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
భీష్ముఁడు - 1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
గంగాపుత్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
భ్రాజిష్టు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః||
స్త్రీయోరత్నాస్తధావిద్యా ధర్మశ్శౌచం సుభాషితం|
వివిధానిచ శిల్పాని సమాధేయాని సర్వతః||
తా. సద్గుణవంతులైన వనితలు, రత్నములు, విద్య(విద్య - చదువు, జ్ఞానము.), ధర్మము, పరిశుద్ధము(శౌచము - శుచిత్వము), సద్వాక్యము, నానావిధములయిన శిల్పము లివి యెచ్చట నున్నను గ్రహింపవలయును. - నీతిశాస్త్రము
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శ్శిల్పాది కర్మచ|
వేదాః శ్శస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్||
ఉర్వి - భూమి, వ్యు.విశాలమైనది.
ఉర్వర - ఎల్లపైరులు పండెడి నేల, భూమి.
ఉర్వీపతి - రాజు, భూమీశుడు.
ఉర్వీశుఁడు - రాజు, భూపతి.
భూపతి - నేలరేడు, రాజు. నేలరేఁడు - రాజు.
తప్పులెన్నువారు తండోపతండంబు
నుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వ.
తా. ఇతరుల, తప్పులను పట్టుకొనువారు, అనేకులుగలరు. కాని తమ తప్పును తెలుసుకొన లేరు.
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపా సాగరీ
నారీ నీలసమానకుంతలధరీ – నత్యాన్న దానేశ్వరీ|
సాక్షా న్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్న్నపూర్ణేశ్వరీ.
అద్రి - 1.కొండ, 2.చెట్టు, 3.సూర్యుడు.
నరాణా మువజీవనీయత్వాత్ అద్యత ఇత్యద్రిః. ఈ. పు. అదభక్షణే. - ఫలమూలద్వారమున నరులచేత భక్షింపఁబడునది.
కటకో(అ)స్త్రీ నితమ్బో(అ)ద్రేః -
కట త్యావృణోతీతి కటకః కటే వర్షావరణయోః - పర్వతము చుట్టువాఱి యుండునది.
పర్వతస్య నితంబప్రాయత్వాన్ని తంబః - పర్వతమును నడునువంటిది నితంబము. ఈ 2 కొండనడుము (మేఖల)పేర్లు.
కటకము1 - (భౌతి.) కాంతి కిరణములను కేంద్రాభి ముఖములుగగాని కేంద్రాభి సారులుగ గాని త్రిప్పగల పారదర్శక ఘనరూపము (Lens).
కటకము2 - 1.కడియము, 2.రాచవీడు(రాచవీఁడు - రాజధాని.), 3.నితంబము, 4.కొండ నడుము, 5.ఓంఢ్రదేశపు రాజధాని కటక్. ఉత్కళము - ఆంధ్ర దేశమునకు ఉత్తరమున నుండు ఒక దేశము, ఓఢ్రదేశము, రూ.ఉత్కలము.
ఓఢ్రదేశము - ఉత్కలము (ఒరిస్సా Orrissa).
ఉత్కలుఁడు - నిర్వాహకుడు, భారవాహకుడు, వి.1.ఉత్కల దేశస్థుడ్డు, 2.బోయవాడు.
భారవాహుఁడు - 1.భా ర ము మోయువాడు, 2.నిర్వాహకుడు.
నిర్వాహకుఁడు - నిర్వహించువాడు.
నిర్వాహము - 1.శక్తి, 2.జరుగుబాటు.
మేఖల - 1.స్త్రీలు ధరించు ఎనిమిది పేటల మొలనూలు, 2.కొండనడుము, 3.ఆయుధము జారకుండ మణికట్టున గట్టు కట్టు.
మేఖల కన్యక - నర్మదానది, వ్యు.మేఖల పర్వతమునుండి పుట్టినది.
గోత్రము - 1.వంశము, 2.పేరు, 3.కొండ.
గాం భువం త్రాయత ఇతి గోత్రః. తైఙ్ పాలనే. - భూమిని రక్షించునది.
గుట్ట - 1.చిన్నకొండ, 2.ప్రోవు, సం.గోత్ర, విణ.భీరువు.
గోత్రుఁడు - 1.గోవుల కాచువాడు, 3.భూమిమి రక్షించువాడు.
సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్యచేత విఱ్ఱవీగువాడు
పసిడిగలుగువాని బాసిసకొడుకులే విశ్వ.
తా|| మంచి కులగోత్రములు కలవారైనను, విద్యావంతులైనను, ధనము(పసిఁడి - 1.బంగారు, 2.ధనము.)గలవాని ముందు యెందుకూ కొరగారు.
ఆఖ్య - సంజ్ఞ, పేరు.
సంజ్ఞ - 1.సైస, 2.పేరు, 3.తెలివి, 4.పరిభాష, 5.సూర్యుని భార్య.
సంజ్ఞ - (గృహ.) 1.అభినయము, 2.చేష్ట, 3.చేష్టలచే అభిప్రాయమును తెల్పుట (Gesture).
సంజ్ఞలు - (గణి.) రాసులు ధనరాసులో ఋణరాసులో తెలియజేయుట కుపయోగపడు గుర్తులు (+) అనునది ధనరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (-) అనునది ఋణరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (Signs).
సన్న - సంజ్ఞ, సైగ, సం.సంజ్ఞా.
సైగ - సంజ్ఞ, రూ.సయిగ, సం.సంజ్ఞ.
అభినయము - నటనము; నటనము - 1.నాట్యము, 2.కపటవర్తనము.
నాట్యము - నృత్యము, నృత్యగీతవాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెది ఆట.
నృత్తము - నటనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తనప్రియము - నెమలి. నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
కృత్య - 1.ఒకానొకదేవత, 2.చేష్ట.
చేష్ట - 1.పని, 2.వ్యాపారము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
కార్యము - 1.పని, 2.హేతువు, 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది.
హేతువు - కారణము; కారణము - 1.హేతువు, 2.పనిముట్టు.
ప్రయోజనము - ఉద్దేశము, కారణము (Motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).
అభిఖ్య - 1.పేరు, 2.కీర్తి, 3.చెప్పుట, 4.కాంతి.
అభిధానము - 1.పేరు, 2.చెప్పుట, 3.నిఘంటువు, రూ.అభిధేయము.
అభిధేయము - పేర్కొనదగినది, వి.1.శబ్దార్థము, 2.గ్రంథ ప్రతిపాద్య విషయము, 3.నామధేయము.
సమాఖ్య - 1.కీర్తి, పేరు, 2.బందకుట్టు.
సమాహ్వయము - 1.పేరు, 2.ప్రాణి, 3.ద్యూతము, 4.యుద్ధము.
పేరు - 1.నామము, 2.కీర్తి, 3.దండ(కాసుల పేరు), క్రి.ముద్దకుట్టు.
నామధేయము - పేరు, నామము.
నామము - నొసట పెట్టుకొను బొట్టు, సం.వి. నామధేయము.
సమజ్య - 1.సభ, 2.కీర్తి.
సమజ్ఞ - కీర్తి, రూ.సమాజ్ఞ.
కీర్తన - 1.కీర్తి, యశస్సు, 2.పాట.
యశస్వి - కీర్తికలవాడు.
శరీరి - ప్రాణి.; జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురుగు, 2.గురుడు (Jupiter).
చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
పారీణుఁడు - పాదము ముట్టినవాడు, మిక్కిలి నేర్పరి.
పృథివి- పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్క చేయబడినది, విశాలమైనది.
ఋషులచేతఁ గోరంబడి తొమ్మిదవ జన్మంబునఁ బృథు చక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; తొమ్మిదో జన్మలో ఋషుల ప్రార్థనను మన్నించి "పృథు చక్రవర్తి" యై భూదేవిని గోవు గావించి ఔషధులను, సమస్త వస్తువులను పిదికాడు.
పృథువు - గొప్పది, వి.ఒక రాజు.
పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
పృథి వ్యా ఈశ్వరః పార్థివః - భూమికిఁ బ్రభువు.
పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము Horse.
పార్థివ - అరువది సంవత్సరములలో నొకటి (19వది).
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.కడచినది, 2.పొందబడినది.
శిఖరి - 1.కొండ, 2.చెట్టు.
శిఖరాణ్యన్యసన్తీతి శిఖరీ. న. పు. - శిఖరములు గలది.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
కొపురు - 1.కొండకొమ్ము, శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము - 1.కొండకొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది.
శిరో(అ)గ్రం శిఖరం నా నా -
శ్రయతి స్వాంగం శిరః న. న. – స్వాంగమందుండు నది.
అగ తీత్యగ్రం అగ కుటిలాయాం గతౌ. – కుటిలము గాఁ బోవునది,
శిఖాకారతాస్యాస్తీతి శిఖరం. అ. న్న. - శిఖవంటి ఆకారము దీనికిఁ గలదు. ఈ 3 చెట్టుకొన పేర్లు.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు. శిరోమే విష్ణుపత్నీచ|
సిరమము - శిర, తల, సం.శిరః.
ఉత్తమాఙ్గం శిర శ్శీర్షం మూర్ధా నా మ స్తకో(అ)స్తీయమ్,
ఉత్తమం చ తత్ అంగం ఉత్తమాంగం. - ఉత్తమమైన అంగము.
శీర్యతే శీరః స. న. శీర్షం చ శౄ హింసాయాం. - జర(జర - ముసలితనము)చేఁ బీడింపఁబడునది.
మూర్ఛత్యున్నతో భవతిమూర్ధా. న. పు. - మూర్ఛామోహ సముచ్ఛ్రాయయోః ఉన్నతమైనది.
మస్యతి కఠినత్వేన పరిణమతి మస్తః, మస్తే ఏవ మస్తకః. ప్న. మస పరిణామే. - కఠినమౌటచేత పరిణమించునది, మస్తము, మస్తమే మస్తకము. ఉత్తమాంగ శబ్దము మొదలు 4 తల పేర్లు.
ఉత్తమాంగము - తల.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్. వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
వరాంగము - 1.ఏనుగు Elephant, 2.తల.
శీర్షము - తల, (గణి.) భూమి కెదురుగా నుండు కోణబిందువు (Vertex).
శీర్షసంబంధము - (జం.) తలకు సంబంధించినది.
శిరీషము - దరిశెనము.
దరిసెనము - 1.దర్శనము, 2.పెద్దల చూడకొనిపోవు కానుక, సం.దర్శనము.
మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు - 1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు - 1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
మస్తకము - శిఖరము, రూ.మస్తము.
సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాంరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా. దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము
శీర్షోన్నత - (భూమి.) భూమినుండి శీర్షబిందువు యొక్క రూపము, (Altitude).
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడి కలవాడు.
శిఖి - 1.అగ్ని, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.
శిఖండి - 1.దృష్టద్యుమ్నుని అన్న, 2.నెమలి, 3.నెమలిపురి, 4.కోడి, 5.బాణము.
శిఖావళము - నెమలి. శిఖండము - నెమలిపురి, పిల్లిజుట్టు, రూ.శిఖండము.
శిఖివాహనుఁడు - కుమారస్వామి.
శిఖీమయూరో వాహనం యస్య నః శిఖివాహనః - నెమిలి వాహనముగాఁ గలవాఁడు.
క్ష్మా - భూమి, వ్యు.భారము నోర్చునది.
క్షమతే భారం క్ష్మా - భారము నోర్చునది.
క్ష్మాభృత్తు - 1.కొంగ, 2.ఱేడు, వ్యు.భూమిని మోయునది(వాడు).
క్ష్మాం బిభ ర్తీతి క్ష్మాభృత్, త. పు. డు భృఙ్ ధారణపోషణయోః. - భూమిని ధరించునది.
క్ష్మాం భువం బిభ ర్తీతి క్ష్మాభృత్ త. పు. భృఞ్ భరణే. - భూమిని భరించువాఁడు.
కొంగ - బకము, సం.క్రుజ్.
బకము - కొంగ, రూ.బకోటము.
క్రుఙ్ క్రౌఞ్చః -
క్రుఞ్చతి పఙ్క్తి రూపేణ గచ్ఛతీతి క్రుఙ్, చ. పు. క్రౌంచశ్చ, క్రుఞ్చ గతికౌటిల్యాల్పీ భావయోః. - పంక్తిరూపముగాఁ బోవునది. లేక కుటిలమై యుండునది. ఈ 2 కొంగ పేర్లు.
క్ష్మాజము - చెట్టు, వ్యు. భూమి నుండి జన్మించినది.
ధ్వాంక్షము - 1.కాకి crow, 2.కొక్కెర.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
వాయసము - కాకి.
కాకదంతపరీక్ష - న్యా. వ్యర్థమైనపని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.)
కొక్కెర - కొక్కరాయి; బలాక - పెద్ద కొక్కెర.
కొక్కరాయి - కొంగ, బకము, రూ.కొక్కెర, కొక్కెరాయి.
కోయష్ఠికము - చీకుకొక్కెర, గ్రుడ్డి కొంగ.
కాక మత్యత్ఖగౌ ధ్వాఙ్క్షౌ -
ధ్వాంక్షశబ్దము కాకికిని, కొక్కెరకును పేరు. ధ్వాంక్షతి మాంసమితిధ్వాంక్షః - ధ్వాక్షి కాక్షాయాం. - మాంసము నిచ్చయించునది. "ధ్వాంక్షౌ తు బక వాయసా" విత్యమరమాలా.
క్రౌంచము - 1.క్రౌంచపర్వతము, 2.ఒకానొక ద్వీపము, 3.ఒకరకపు కొంగ.
క్రొంచ - కొంచ, సం.క్రౌంచః.
కొంౘ - 1.క్రౌంచము, 2.ఒకానొక పర్వతము, సం.క్రౌంచః.
కొంౘగుబ్బలి - క్రౌంచపర్వతము. క్రౌంచదారణుడు - కుమారస్వామి, గుహుడు, వ్యు.క్రౌంచపర్వతమును భేదించినవాడు. క్రౌంచాఖ్యం పర్వతం దారితవాన్ క్రౌంచదారణః - క్రౌంచపర్వతమును వ్రక్కలించినవాఁడు. దౄ విదారణే. క్రౌంచదారీ పంచదశః|
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
గుహుఁడు - కుమారస్వామి, వ్యు.దేవసేనలను పొదివి రక్షించువాడు, 2.ఒక నిషాదరాజు.
సారవివేకవర్తనుల సన్నుతికెక్కిన వారి లోపలన్
జేరినయంత మూఢులకు జేపడదానడ యెట్లనగాఁ
సారములోన హంసముల సంగతినుండెడి కొంగ పిట్టకే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ ! భాస్కరా.
తా. హంసలతో(హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.)గలిసినంత మాత్రమున కొంగపిట్టకు రాయంచ గమన ప్రవర్తనములు ఏ విధముగా, కలుగును? (కలుగదు) రాదు. అట్లే, మంచి యోగ్యతలు(నిజమగు యుక్తాయుక్త విచక్షణ)గల వారి నాశ్రయించినంత మాత్రమున మూర్ఖులకా(మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.) గొప్పవారి పేరు ప్రతిష్ఠలు రావు.
అవని - 1.భూమి, 2.నేల.
అవతి ప్రజాః, అవ్యతే నృపైర్వా అవనిః, ఈ. సీ. - ప్రజలను రక్షించునదిః లేక రాజులచేత రక్షింపఁ బడునది అవని. అవనీతనయా కామిత రామ్| భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.
విదేహదేశేభవా వైదేహీ. సీ. - విదేహదేశ మందుఁ బుట్టినది. విదేహ మానస రంజక రామ్|
భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె
ట్లవగుణులై ననేమి? పనులన్నియుఁజేకురు వారిచేతనే
ప్రవిమల నీతిశాలియగు రామునికార్యము మర్కటంబులే
తవిలియొనర్పవే జలధిదాటి సురారుల ద్రుంచి, భాస్కరా.
తా. రాజనీతి విశారదు డగు రాముని యొక్క పనిని వానరులే పూనుకొని సముద్రమును దాటి రాక్షసు లను చంపి, నెరవేర్చి నవి. అట్లే రాజగు వాడు(విభుఁడు - 1.ప్రభువు, సర్వవ్యాపకుడు, 2.బ్రహ్మ, 3.శివుడు.)మిక్కిలి నిపుణతగా సంచరించినచో అతనిని గొల్చు సేవకులు మొదలుగు వా రాయన పనిని యధావిధిగా నెర వేర్చుదురు.
పూర్వగాథ :- రాము డరణ్య వాసము చేయు చుండగా నొకనాడు రావణుడు మాయవేషమున రామునికిఁ తెలియకుండగా సీతనుగొనిచని తన లంకయందుంచెను. రాజనీతి గల నీతి సురక్షిత జనపద రామ్| రాముడు సుగ్రీవాది వానరుల తోడనే సముద్రము దాటి, వానరసైన్య సమావృత రామ్| వారి సహాయముననే తిరిగి సీతనుకొని అయోధ్యకుఁ జని సుఖముగా నుండెను.
మేదిని - భూమి.
మెయి - తృతీయ విభక్తి యందు ఒకచో వచ్చు ప్రత్యయము, వి.1.విధము, 2.పార్శ్వము, 3.వెంబడి, 4.భూమి, మహి, 5.దేహము.
మెయితాలుపు - ప్రాణి, శరీరి; శరీరి - ప్రాణి.
పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువు యొక్క ఒక భాగము(Side), విం. విణ. (జీవ.) క్రక్కనుల నుండి బయలు దేరీనది.(Latral).
దేహము - శరీరము(దేహము), మేను.
మేను - 1.శరీరము, 2.జన్మము, పుట్టుక, 3.పార్శ్వము.
పరికర్మము - దేహమునందలి మురికి పోగొట్టుట.
నిలువు - 1.నిలుపు, నిలుచుట 2.చేయి మీది కెత్తుకొని నిలుచున్న మనుజునిపొడవు కొలది, 3.మీదియంతస్తు, 4.ఆకృతి, 5.ఒడలు.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా, భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము, (Shape).
ఒడలు - మేను, దేహము, రూ.ఒళ్ళు.
ఒడలిచూపొడయఁడు - ఇంద్రుడు.
మహి - పుడమి, భూమి.
మహ్యతే మహీ. ఈ. సీ. పా. మహిః. ఇ. సీ. మహ పూజాయాం. - పూజింపఁబడునది.
పుడమి - భూమి, సం.పృథ్వీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
పుడమితాలుపు - శేషుడు, వ్యు. భూమిని ధరించువాడు.
పూచిన పువ్వులు అన్నీకాయలే అయితే పుడమి భరించగలదా ?
సూక్ష్మో(అ)పి భారం నృపతే స్యందవో వై
శక్తో వోఢుం న తథాన్యే మహీజాః|
ఏవం యుకత భారసహా భవంతి
మహాకులీనా న తథా న్యే మనుష్యాః||
తా. రథం చిన్నదయినా పెద్ద బరువు మోస్తుంది. కాని చెట్లు అలా మోయలేవు. అలాగే(కులీనత - మంచి కులమున పుట్టుట.)మహాకుల సంజాతుల యిన వారు పెద్దభారం సహింపగలరు. అలా ఇతరులు మోయలేరు.
మహీజా కుచ్చ సంలగ్న కుంకుమారుణ వక్షసె,
నమః కల్యాణరూపాయ రామా.….
మాహేయి - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అఙ్గారకః కుజో భౌమో లోహితాఙ్గో మహీసుతః. :
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగాని అరయతి పీడయతీతి వా, అర పీడనే - శరీరములను పీడించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటి వర్ణము గలవాఁడు.
కౌ పృథివ్యాంజాతః కుజః, నీప్రాజదుర్భావే - భూమియందుఁ బుట్టినవాఁడు.
భూమేరపత్యం భౌమః - భూమికొడుకు.
లోహితమంగం యస్యసః లోహితాంగః - ఎఱ్ఱని శరీరకాంతిగలవాఁడు.
మహ్యాః సుతః మహీసుతః - భూమికొడుకు. ఈ ఐదు అంగారకుని పేర్లు.
అంగారకుడు - నవగ్రహములలో కుజుడు(Mars).
కుజుడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు 2.అంగారకుడు (Mars).
భౌముఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు, వ్యు.భూమికి పుత్రుడు.
భూమిజుడు - 1.అంగారకుడు 2.నరకాసురుడు.
నేలపట్టి(బిడ్డ) - 1.అంగారకుడు 2.నరకాసురుడు.
లోహితాంగుఁడు - అంగారకుడు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు. నరకఁడు - 1.దుష్టుడు, 2.దయలేనివాడు, సం.నరకగః.
కుజము - చెట్టు, వ్యు.భూమినుండి పుట్టినది.
కుధరము - కొండ.
మహీరుహము - వృక్షము.
మహ్యాం రోహతీతి మహీరుహః, రుహబీజజన్మని ప్రాదుర్భావేచ. - భూమియందు మొలచునది.
భూజము - వృక్షము.
వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాలా ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree).
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము - 1.గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలేనిచెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలిఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి.(జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen).
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము = సేన-అందుండు వాడు.)
సైనికుఁడు - సేనాపతి, విణ.సేనలోనివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
మహాసేనుఁడు - కుమారస్వామి.
మహేంద్రము - కుల పర్వతములలో ఒకటి.
మహీం కీలభూతో ధరతీతి మహీద్రః. దృఞ్ ధరణే. - భూమిని చీలవలె నుండి ధరించునది.
శ్లో. మహీం మూలాధరే - కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే - హృది మరుత మాకాశ ముపరి
మనో(అ)పి భ్రూమధే - సకల మపి భిత్త్వా కులపధం
సహస్రారే పద్మే - సహ రహసి పత్యా విహరసే. - 9శ్లో
తా. ఓ పరాశక్తీ! మూలాధార చక్రమందు భూతత్త్వమును, స్వాధిష్ఠాన చక్రమందు(హుతవహుఁడు - అగ్ని.)అగ్నితత్త్వమును, మణిపూర చక్రమందు జల తత్త్వమును, అనాహత చక్రమందు(మరుత్తు - వేలుపు, గాలి.)వాయు తత్త్వమును, దానిపై నున్న విశుద్ధ చక్రమం దా(ఆ)కాశ తత్త్వమును, ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రార పద్మమందు ఏకాంతమున, భర్తతో విహరించుచున్నవు. - సౌందర్యలహరి
విశేషము:- లింగ స్థానమందు(స్త్రీ పురుష భేదము) స్వాధిస్థాన చక్రము, నాభియందు మణిపూర చక్రము, హృదయమందు అనాహత చక్రము, అనాహత చక్రమునకు పై భాగమున విశుద్ధ చక్రము, భ్రూ మధ్యమందు ఆగ్నేయ చక్రము నున్నదని యెఱునునది.
దేహస్థషట్చక్రదేవీ దహరాకాశమధ్యగః,
యోగినీగుణసంసేవ్యా భృంగ్యాదిప్రమథావృతః.
శాభి - 1.వృక్షము, 2.వేదము, వ్యు.శాఖలు కలది.
శాఖాః అస్య సంతీతి శాభీ. న. పు. - కొమ్మలు గలిగినది.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ.
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి.
శాఖావిన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).
శాఖలేనిమంత్రి - (రాజ.) ప్రత్యేక పరిపాలన శాఖకు నిర్దేశింపబడని మంత్రి (Minister without Portfolio).
శాఖామృగము - కోతి, వ్యు.చెట్ల కొమ్మలపై తిరుగు మృగము.
కొమ్మ త్రిమ్మరి - కోతి.
విటపి - చెట్టు, వ్యు.విటపములు కలది.
విటపాః అస్య సంతీతి విటపీ. న. పు. – కొమ్మలు గలది.
విటపము - 1.చివురించిన కొమ్మ, 2.చిగురు, 3.కొమ్మ, 4.బోదెలేనిచెట్టు.
పాదపము - చెట్టు.
అంఘ్రిపము - చెట్టు, పాదపము.
పాదైర్మూలైః జలం పిబతీతి పాదపః. పా పానే. - పాదములనఁగావేళ్లు; వానిచే జలమును బానము చేయునది.
అంఘ్రి - 1.కాలు, 2.వేరు, 3.పద్యపాదము.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపుకోడు, క్రి.మండు.
పాదము - 1.పాదు, 2.కిరణము, 3.పద్యమందలి ఒక చరణము, 4.1/4 వంతు, 5.వేరు, సం.వి.(గణి.) సమతలములో అక్షద్వయముచే వేరు చేయబడిన నాలుగుభాగములలో ఒకటి (Quadrant).
వేరు - చెట్టు యొక్క మూలము.
పాదా రశ్మ్యఙ్ఘ్రి తుర్యాంశాః -
పాదశబ్దము కిరణమునకును, కాలికి, నాలవపాలికిని పేరు. పద్యంతే అనేనేతి పాదః పద గతౌ. - దీనిచేత పొందుదురు. "పాదస్స్యాద్బుధ్న పూజ్యయో" రితిశేషః.
అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ బీడించి, ప్రాణంబు బిగియఁబట్టి,
నాభితలముఁజేర్చి, నయముతో మెల్లన హృత్సరోజము మీఁది కెగయఁబట్టి,
యటమీఁద నురమందు హత్తించి, క్రమ్మఱఁ దాలు మూలమునకుఁ దఱిమి నిలిపి
మమతతో భ్రూయుగమధ్యంబు సేర్చి, దృ క్కర్ణనాసాస్య మార్గములు మూసి.
ఆ|| యిచ్చలేని యోగి యెలమి ముహూరార్ధ,
మింద్రి యానుషంగ మింత లేక
ప్రాణములను వంచి బ్రహ్మ రంధ్రము చంచి,
బ్రహ్మందుఁ గలయుఁ బౌరవేంద్ర !
భా|| రాజా(పరీక్షిన్మహారాజా) ! యోగి తన దేహత్యాగ సమయంలో బడలిక త్రోసిపుచ్చి, పాదమూలంతో మూలాధారచక్రాన్ని అనగా గుదస్థానము అదిమి పట్టి, ఆ పై ప్రాణవాయువును అనగా ప్రాణశక్తిని (పొత్తి కడుపు) బిగబట్టి తరువాత బొడ్డువద్ద ఉన్న మణిపూరక చక్రానికి తీసుకుపోతాడు. అక్కడ నుండి హృదయంలోని అనాహతచక్రానికి (గుండె) అందుండి వక్షంలో ఉన్న విశుద్ధ చక్రానికీ, (కంఠం) అటనుండి ఆ చక్రాగ్రముండే తాలుమూలానికీ, ఆ తాలుమూలం నుండి కనుబొమ్మల మధ్య నున్న అజ్ఞా చక్రానికీ ప్రాణవాయువును తరలిస్తాడు. అందుమీదట కండ్లు, చెవులు, ముక్కు, నోరు - ఇవి మూసుకొని ఏ కోరికలు లేనివాడై అర్థ ముహూర్తకాలం ఇంద్రియాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. పిమ్మట బ్రహ్మరంధ్రం (సహస్రారము)లనే ఆరు స్థానముల(చక్రముల)గుండా భేధించుకొని పరబ్రహ్మంలో లీనమవు తాడు. - శుకుడు, భాగవతము
గిరి-1.కొండ, 2.అచ్చనగాయ, 3.గుండురాయి.
గిరిజనులు - (వ్యవ.) కొండజాతులు, ఆదివాసులు.
ఆదిమవాసులు - కొండలందు,అడవులందు ఉండు అ నా గ ర కు లు (Aborigins).
గిరిజ - 1.పార్వతి, 2.కొండయరటి, 3.మల్లెతీగ.
మల్లిక - మల్లెతీగ.
మలె - 1.మల్లె పువ్వు, సం.మల్లీ, మల్లికా.
గిరిధన్వుఁడు - శివుడు, వ్యు.మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు.
గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గ, సం.దుర్గా.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకర సర్వజనేశశివ |
దూరగిరిన్యాయము - న్యా. దూరముగా నున్న పర్వతములు నునుపుగా కాన్పించును, దగ్గరకు పోవ గుట్టలు మిట్టలు ముండ్లుగా నుండునను రీతీ, దూరపు కొండలు నునుపు.
శ్రీమద్విశ్వేశ్వశ! కాళీ గిరివరతనయా సాచ గంగేతి త్రిసః
ప్రేయస్య, స్తత్రకాశ్యాం త్వమసి కృతరుచి, ర్నేతరత్రో భయోర్యత్
తత్రాద్యా త్వత్సరూపాన్ ధృతగరళగళాన్ ఫాలనేత్రాన్ ప్రసూతే
పుత్రా నర్ధేదుమౌళీ సహహ ! కథ ముభే తేగజాస్యం షడాస్యమ్|
తా. విశ్వనాథా ! నీకుఁ కాళియను నామెయు, గిరిరాజకుమారియగు పార్వతియు, గంగయు నిల్లాండ్రు. వారి మువ్వురలోఁ గాశీసతియందు మిగుల ననురాగయుక్తుఁడవై యుందువు. ఏలయన నమె నిన్నుఁబోలిన చంద్రశేఖరులను గరళ గ్రీవులను ఫాలనేత్రులను గనుచున్నది. గౌరియు గంగయు నన్నచో నీకు విరుద్ద స్వరూపులైన గజవదనుని(గజవదనుఁడు - వినాయకుడు), షడాననునిఁ(షడాననుఁడు - కుమారస్వామి, షణ్ముఖుడు, వ్యు.ఆరు ముఖములు కలవాడు.)గనివారలు. (కాశియం దెల్లరును శంకర స్వరూపులని భావము.)
ఘాతుక భంజన పాతకనాశన గౌరీసమేత గిరీశ శివ|
గ్రావము - 1.కొండ, 2.రాయి, 3.మేఘము.
శిల - 1.రాయి,2.సెలయేరు, రూ.సిల.
రాయి - శిల.
సెలయేఱు - నిర్ఝరము, కొండయేరు. కొండకాలువ - సెలయేరు.
నిర్ఝరము - సెలయేరు, రూ.ఝురము.
ఝురము - సెలయేరు, రూ.ఝురి.
నిర్ఝరణి - నది, River.
గండశైలము - 1.పెద్దరాయి, 2.కొండనుండి భూకంపాదులవలన జారిన పెద్దరాయి, 3.కోయిల.
కోకిలము - కోయిల.
ప్రస్తరము - 1.రాయి, 2.రత్నము, 3.చిగుళ్ళు మొదలగు వానిచే ఏర్పరచిన సెజ్జ.
వాఁగు - 1.సెలయేరు, 2.సేవ, సం.వాహః, వై.క్రి.ప్రేలు.
వాఁగులు - 1.అలలు, 2.సెలయేళ్ళు.
గంగ పారు నెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోద
పెద్దపిన్న తనము పేర్మి యీలాగురా, విశ్వ.
తా. ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశబ్దముగ పారుచుండును. మురికినీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. పెద్ద చిన్న, మంచి చెడ్ద వారితేడా (పేరిమి - 1.ప్రేమ, 2.గౌరవము, 3.అతిశయము.)ఆ విధముగనే ఉండును.
అహార్యము - కొండ, విణ.హరింప శక్యము కానిది.
హర్తుమశక్యః అహార్యః, హృఞ్ హరణే. - హరింప నశక్యమైనది.
ధర - భూమి.
దర - ధర, వెల, సం.ధరా ధారణా.
దారణ - ధర, వెల, రూ.దర, సం.ధారణా.
వెల - (అర్థ.) ధర, ఖరీదు, నాణెములచే పదార్థములలోనుండు మూల్య పరిమాణమును నిర్ణయించుట.
వెల - కొనువస్తువులకిచ్చు విలువ, వస్తువులకు జెప్పుధర.
వెలకట్టుట - (గృహ.) విలువను స్థాపించుట, విలువ నిశ్చయించుట, మూల్యనిర్ణయము (Evaluation).
అవక్రయము - 1.బాడుగ, అద్దె rent, 2.వెల, 3.రాజునకు చెల్లించు పన్ను, 4.కూలి, జీతము.
బాడుగ - అద్దె, భాటకము, భూమిపై గాని, భవనములపైగాని, వస్తువుల పైగాని, వాటి ఉపయోగము కొరకై చెల్లించు ధనము.
అద్దె - అద్దియ; అద్దియ - ఇంటిబాడుగ, కిరాయి, రూ.అద్దె.
కిరాయి - బాడుగ, కూలి. బాడిగ - 1.కూలి, 2.అద్దె, సం.భాటకః.
కూలి - పనిచేసినందుల కిచ్చెడు ధనము.
భరణ్యము - 1.కూలి, 2.జీతము.
జీతము - వేతనము, సం.జీవితమ్.
వేతనము - భృతి, కూలి, చేసినపనికి ప్రతిఫలముగ నిచ్చు ద్రవ్యము, జీతము.
వేతనముల స్థాయి - (అర్థ.) వేతన ప్రమాణము.
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భృత్య - కూలి.
భరణము - 1.భరించుట, 2.జీతము, 3.కూలి.
భాటకము - 1.ఇంటిపన్ను, 2.బాడిగ.
బాడుగ నియంత్రణము - (అర్థ.) ఇంటి యజమానులు అద్దెకు ఇచ్చు ఇండ్లు, వానికి ఇచ్చు బాడుగను ప్రభుత్వము నియంత్రించుట.
భర్మము - 1.బంగారు, 2.జీతము.
జీతగాఁడు - జీతము గొని పనిచేయువాడు.
భృతకుఁడు - కూలివాడు; భరటుఁడు - 1.కూలివాడు, 2.కుమ్మరి.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు. సేవకుఁడు - కొలువుకాడు.
చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు గలది, 2.కుమ్మరి.
ఐద్దాయులు - (ఐదు+రాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.
క్రయము-1.ఖరీదు, వెల, 2.వెల ఇచ్చికొనుట.
క్రీతకుఁడు - తల్లిదండ్రుల యొద్ద వెలకు గొన్న కొడుకు.
అర్హము - తగినది, వి.వెల.
అర్ఘము - 1.వెల, 2.పూజావిధి, 3.చౌక, రూ.అర్ఘువు.
అర్ఘ్యము - 1.మిక్కిలి వెలగలది, 2.పూజకు తగినది, 3.పూజకోరకైనది.
అర్ఘువు - అర్ఘము.
వెలఁదుక - (వెలది+ఉక) ఆడుది, వెలది.
వెలది నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.
వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి.స్త్రీ.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషములేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి.
అమూల్యము - 1.వెలలేనిది, 2.మిక్కిలి వెలగలది.
గిరాకి - అధికమగు వెలగలది, (జాతీ.) ఒక సమయమందు ఒక నిర్ణీతమైన ధరకు కొనుగోలుదారులు కొనుటకు సిద్ధపడువస్తువుల లేక సేవల సౌకర్యముల రాశి.
గిరాకి సరఫరా వక్రరేఖలు - (అర్థ.) ఒక సమయమందు ఒక సరకు యొక్క వ్యాపారులకు నమ్మకమైన గరిష్ఠమైన అమ్మకపు మార్కెట్టు ధరలను చూపురేఖలు.
అగ్గువ - వెలతక్కువది, చౌక, విణ.వెల తక్కువైనది, రూ.అగ్గువ, సం.అఘిః.
(ౘ)చౌక - 1.అగ్గువ, 2.తక్కువ, 3.తేలిక.
చౌకబారు - (వ్యవ.) న్యూనమైనది, వెల తక్కువది.
తక్కువ - కొరత; వెలితి - తక్కువ.
తేలిక - చులకన, లఘుత్వము. లఘిమ - లఘుత్వము.
(ౘ)చులుకన - 1.లాఘవము, 2.సౌలభ్యము, విణ.లఘువు.
లాఘవము - 1.లఘుత్వము, 2.ఆరోగ్యము.
అనామయము - రోగములేనిది, వి.ఆరోగ్యము.
ఆరోగ్యము - రో గ ము లే మి, స్వాస్థ్యము.
స్వాస్థ్యము - 1.నెమ్మది, 2.స్వార్థత. హాయి - 1.సౌఖ్యము, 2.నెమ్మది. మదిమది - 1.నెమ్మది, 2.శాంతి, 2.అనాలోచనము.
శాంతి - శమనము.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యడగి యుండుట.
శాంతము - శాంతినొందినది, సం.1.కామ క్రోధాది రాహిత్యము, 2.ఉపశమనము, 3.తొమ్మిది రసాలలో నొకటి.
శమనము - శాంతి పదము, రూ.శామనము.
శామనము - 1.శమనము, 2.వధము.
శమించు - క్రి.అడగు.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.
ౙమ్మి - శమీ వృక్షము,సం.శమీ.
శమనుడు - యముడు; ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమయతి ప్రాణిన ఇతి శమనః, శము ఉపశమనే - ప్రాణులను శమింపఁజేయువాఁడు.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
వామనము - లేతది.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.
ధరనే వస్తువు లైనన్
దరుగుటకై వృద్ధినిందుఁ * దగఁ బొడ వెదుగున్
విరుగుటకై ; పాయుటకై
దరిఁజేరును ; వీని మదిని * దలఁపు కుమారా!
తా. లోకములో నే వస్తువులైనను వృద్ధిపొందుట నశించుటకే. పొడవుగా పెఁరుగుట విఱిగిపోవుటకే. దగ్గరఁజేరుట (పాయుట - క్రి.1.చిక్కెడలించు, 2.తొలగుట .)కొరకు, విడిపోవుటకే యగును. ఈ విషయముల నన్నింటిని మనస్సునందుంచు కొనవలయును.
ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి.
ధరణా - భూమి, రూ.ధారణి.
ధారణి - భూమి, రూ.ధారుణి, ధరణి.
ధరణీనురుఁడు - బ్రాహ్మణుడు.
ధరణీశ్వరుఁడు - 1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు.
ధరణీశ్వరుడు - రాజు.
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియదాన శివ|
ధరము - 1.కొండ, 2.వెల.
ధరతి భువం ధరః. ధృఞ్ ధరణే. - భూమిని ధరించునది.
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
మదించు - క్రి.వెలయూహించు, 2.సంకల్పించు.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,) 3.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
అంచనా- పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.
ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ|
లోకతీతా గుణాతీతా - సర్వాతీతా శమాత్మికా. - 176శ్లో
ధరాధరము - 1.కొండ, 2.తాబేలు.
కూర్మము - కమఠము, తాబేలు.
కమఠము - తాబేలు, భిక్షాపాత్రము.
కచ్ఛపము - తాబేలు, కమఠము.
తామేలు - తాబేలు.
కూర్మే కమఠ కచ్ఛపాః -
కుత్సితః ఊర్మిర్వేగః అస్యకూర్మః - ఊర్మియనఁగా వేగము; కుత్సితమైన వేగము గలది.
'ఊర్మిః స్త్రీపుంస యోర్వీచ్యాం ప్రకాశే వేగభంగయో' రితి రభసః. కం జలం ఊర్వతీతివా కూర్మః. ఊర్వీ హింసాయాం. - జలమును (ౙ)జెరుచునది.
కే ఉదకే మఠతీతి కమఠః. మఠ నివాసే. - జలమునందు వసించునది.
యజ్ఞార్థం కామ్యత ఇతివా కమఠః. కముకాంతౌ. - యజ్ఞార్థమై కాంక్షింపఁ బడునది.
కచ్ఛేన పుచ్ఛేన పిబతీతి కచ్ఛపః. పా పానే. - పుచ్ఛము(పుచ్ఛము – తోక) చేత పానము చేయునది.
కచ్ఛమనూపదేశం క్షుద్రజంతు భకణేన పాతీతి వా కచ్ఛపః - జలప్రాయ ప్రదేశమును క్షుద్ర జంతు భక్షణముచేత రక్షించునది. ఈ ఆరు తాఁబేటి పేర్లు.
కూర్మవత్ స్థితత్వాత్కచ్ఛపః - కూర్మము వలె నుండునది.
సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి నిర్మాణములు, ఊపిరితిత్తులు, రెండు బృహద్ధమన చాపములు గల పృష్ట వంశిక జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
కరమనురక్తిమందరముగవ్వముగా యహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధిమధించు చున్నచో
ధరనిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరధీ కరుణాపయోనిధీ.
తా. రామా! దేవతలును, రాక్షసులును, మందర పర్వతమును కవ్వముగాను, అహిరాజగు(అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.)అహిరాజగు వాసుకుని కవ్వపు త్రాడుగానుజేసి పాల సముద్రమును(పయోధి - సముద్రము) చిలుకు చుండగా, అపుడాకొండ తటాలున మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం జూచి కూర్మావతారము యెత్తి కొండను వీఁపుమీఁద దాల్చినవాడవు నీవేకదా!
గుహ్యము - 1.ఏకాంతము, 2.పురీషమార్గము, 3.వంచన, 4.తాబేలు, విణ.దాచదగినది.
సముద్ర మథన కాలంబునం బదునొకండవ(11వ) మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠ కర్పరంబున(కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium) నేరుపరియై నిలిపి; పదకొండో పర్యాయం సముద్ర మధన సమయం లో "కూర్మావతారం" స్వీకరించి మున్నిటిలో మునిగి పోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా తన వీపునగల పెంకుపై ధరించాడు.
ఎట్లుగఁ బాటుపడ్డనొకయించుక ప్రాప్తములేక వస్తువుల్
పట్టుపడంగనేరవు నిబద్ధి, సురావళిఁ గూడి రాక్షసుల్
గటుపెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించి రెంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు, భాస్కరా.
తా. రాక్షసులు దేవతలతో కలిసి మందర పర్వతమును పెకలించు దానిని తీసుకొనివచ్చి కవ్వముగా నుపయోగించి, పాలసముద్రము మధించిరి. తుదకు అమృత మందు జనిత మయ్యెను. కాని ప్రయాసపడిన రక్కసులు దానిని తామనుభవింపలేకపోయిరి. కావున యెవరెంత కష్టపడినను, వారికి అదృష్టములేనిచో తామాశించు ఫలమును పొందలేరు.
గిరిధరుఁడు - విష్ణువు, వ్యు.మందర పర్వతమును ధరించినవాడు.
దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
తాబేలు - A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.
కొండమోసెడి యయ్యకుఁ గూడ నణువు
కాని నేనె భారమ్మైతి నింక
నాదు గతి యేమొ తెల్పరా వాదమేల
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోక ధృత్|
సుమేధా మేధజో ధన్యః స్సత్య మేధా ధరాధరః|| - 80స్తో
కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మము - air in the eyes.
స్తూపపృష్టము - తాబేలు, వ్యు.దిబ్బవంటి వీపుకలది.
స్తూపము - మట్టి మొదలగువాని దిబ్బ.
క్షుబ్దాద్రౌ క్షుభితజలోదరే తదానీం దుగ్దాబ్దౌ గురుతరభారతో నిమగ్నే |
దేవేషు వ్యథితతమేషు తిత్ప్రియోషీ కమఠ తనుం కఠోరపృష్ఠామ్||
దేవా! సురాసురలు క్షీరసముద్రమును చిలుకు చుండగా మందర పర్వతము మిక్కిలి బరువుగా ఉండుటచే అది అల్లకల్లోలముగా నున్న ఆ జలములలో మునిగిపోయెను. అందులకు దేవతలు అందఱును చింతా క్రాంతులైరి. అప్పుడు వారికి ప్రీతిని గూర్చుటకై నీ కఠినమైన మూపుగల కూర్మ రూపమును ధరించితివి. – నారాయణీయము
పీవరము - బలిసినది, వి.తాబేలు.
పీనము - బలిసినది, వి.సంతోషము.
లప్ప - రాశి, విణ.కండకలది, బలిసినది.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.
వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో విస్తారాత్ పరిగతలక్షయోజననేన|
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నినేథ||
శ్రీ మహావిష్ణు! కూర్మ రూపముననున్న నీ యొక్క వెన్నుచిప్ప, వజ్రము కంటె మిక్కిలి కఠినముగా లక్షయోజనముల వైశాల్యమున ఉండెను. సముద్రము లోపల గుభిల్లుమను శబ్దముతో పడిపోయిన మందర పర్వతమును ఆ చిప్పపై ఉంచుకొని దానిని సముద్రముపైకి తెచ్చితివి. - నారాయణీయము
క్షితి రతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే, ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే|
కేశవ! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే! |
క్రోడపాదము - తాబేలు, వ్యు.రొమ్మున నిముడ్చుకొను పాదములు కలది.
Turtle - Tortoise with short legs, An animal of water covered with a hard shell, withdraws all its limbs in its body.
కచ్ఛపము - తాబేలు, కమఠము.
తామేలు - తాబేలు.
కూర్మీ వీణాభేదశ్చ కచ్ఛపీ,
కచ్చపీశబ్దము ఆఁడుతాఁబేటికిని, సరస్వతివీణకు ను పేరు.
కచ్చం పాతీతి కచ్ఛపీ. సీ. పా రక్షనే. – జలప్రాయ భూమిని బాలించునది.
డులి - ఆడుతాబేలు, రూ.డులి.
కమఠీ డులిః -
కమఠస్య స్త్రీ కమఠీ - కమఠముయొక్క స్త్రీ కమఠి.
ఢులతీతి ఢులిః పా. ఇ. సీ. ఢుల ఉతేక్ష పే. - జలమును జల్లునది. ఈ రెండు 2 ఆఁడుతాఁబేటి పేర్లు.
నిజసల్లాపమాధుర్య-వినిర్భర్త్సితకచ్ఛపీ|
మందస్మితప్రభాపూర-మధ్యత్కామేశ మానసా. – 11స్తో
మొగపిఱికి - మొగము (+పిఱికి) తాబేలు, వ్యు.మొగము చూచుటకు పిరికితనము కలది.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
మోము - మొగము, సం.ముఖమ్. మొకము - ముఖము, సం.ముఖమ్. ముఖః పాతు వరాలక్ష్మీ|
ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity).
ముఖశ్వసనము - (జం.) నోటితో గాలినిపీల్చి వదలివేయుట (Buccal respiration).
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము (Peristome).
ముఖపథము - (జం.) బహిశ్చర్మము లోనికి పెరుగుటచే ఏర్పడిన అన్నవాహిక యొక్క ముందరి భాగము, (Stomodaeum).
ముఖపాకము - (గృహ.) నాలుక పూత(Red-tongue) విటమిన్ 'B12' లేక 'డి' లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).
యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || - 58శ్లో
తా|| భయపడిన తాబేలు తలను, నాలుగు కాళ్ళను లోనికిముడుచు కొనునట్లు, ఆత్మారాముడగు యోగి రాగద్వేషాది దోష భయమున పంచేద్రియములను సర్వ విషయముల నుండి వెనుకకు మరల్చి స్థిత ప్రజ్ఞుడగుచున్నాడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. - సాంఖ్యయోగము, భగవద్గీత
ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా,
గూఢగుల్భాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. - 18శ్లో
కొండ - పర్వతము.
కొండ(ౘ)చూలి - పార్వతి.
కొండమల్లయ్య - శివుడు.; కొండయల్లుఁడు - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక.
పర్వతారణ్యములు - (భూగో.) పర్వతముల యందు పెరుగు నడవులు,[కొండల యెత్తునిబట్టి అరణ్య వృక్షములు మారుచుండును].
కొండపగతుఁడు - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు.
సానుమంతము - కొండ, వ్యు.చరియలు కలది.
సానువు - 1.కొండనెత్తము, 2.కోన, త్రోవ, చరియ.
అధిత్యక - కండమీద నేల.
డెప్ప - కొండమీది సమమైన చోటు, నెత్తము.
నెత్తము - 1.పాచికలాట, 2.పందెము, 3.కొండమీద విశాల సమప్రదేశము.
అచలము - కొండ, విణ. కదలనిది.
చలతీత్యచలః, చల కంపనే. - చలింపనిది.
అచలసంధి - (జం.)కదలికకు వీలులేని ఎముకలసంధి, ఉదా. పుఱ్ఱెలోని ఎముకలు కదలని కీలు (Immovable joint).
కదలని కీళ్ళు - (జం.) కదల్చుటకు వీలుకాని కీళ్ళు, ఉదా. తల ఎముకలు (Immovable joints).
హరక్రోధజ్వాలా - వళిభి రవలేఢేన వపుషా
గభీరే తే నాభీ - సరసి కృతసంగో మనసిజః|
సముత్తస్థౌ తస్మా - రచలతనయే! ధూమలతికా
జన స్తాం జానీతే - తవ జనని! రోమావళి రితి|| - 76శ్లో
తా. అచలతనయా! హరుని(హరుఁడు - శివుడు)క్రోదాగ్ని జ్వాలా వళిచే ఆక్రమింపబడిన శరీరముతో మన్మథుడు(మనసిజుఁడు - మన్మథుడు)తన్ను తాను కాపాడుకొనుటకుగాను లోతైన(గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.) నీ నాభిసరస్సున చేరెను. కనుక జననీ! అందువలన మన్మథుని దేహబహిర్గతమైన ధూమ(లతిక-1.తీగ, 2.నూరు పేటల హారము.)జనులు నీ రోమావళిగా నెరుగుచున్నారు. - సౌందర్యలహరి
కామేశ్వరప్రేమరత్న-మణిప్రతిపణ స్తనీ|
నాభ్యాలవాలరోమాళి-లతాఫలకుచద్వయీ.
శైలము - కొండ, వ్యు.శిలలు దీనియందు గలవు, సం.వి.(భూగో.) నేల యందుండు (ఉవ) అధాతువులలో నిది నొకటి.
శిలా అత్ర సంతీతి శైలః - శిలలు దీనియందుఁ గలవు.
శిలోచ్ఛయము - కొండ.
శిలోచ్ఛయః - శిలలయొక్క సమూహము.
శైలాలి - నట్టువుడు, నటుడు.
శైలూషి - ఆటకత్తె, నటి.
శైలూషుఁడు - ఆటకాడు, నటుడు.
శైలూషవన్నట ఇవ నానారూపపరివర్తనాత్ శైలూషః - శైలూషుఁ డనఁగా నటుఁడు; దానివలె నానారూపముల ధరించునది.
వాణిని - 1.ఆటకత్తె, ముగ్ధ.
ముగుద - స్త్రీ, సం.ముగ్ధా.
ముదియ - స్త్రీ, ముద్దియ, సం.ముగ్ధా.
ముదిత - ముద్దియ, స్త్రీ. ముద్ధరాలు - ముగ్ధస్త్రీ.
శైలధన్వుఁడు - శివుడు, గట్టు విలుకాడు.
గట్టువిలుకాఁడు - శివుడు, వ్యు.మేరువు విల్లుగా గలవాడు.
నిసర్గక్షిణస్య - స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తే నాభౌ - నారీతిలక! శనకై స్త్రుట్యత ఇవ|
చిరం తే మధ్యస్య - త్రుటితతటినీతీర తరుణా
సమావస్థా స్థేమ్నో - భవతు కుశలం శైలతనయే| - 79శ్లో
తా. ఓ శైలతనయా! ఓ నారీ తిలకమా! (ర్నారీతిలక - నాభౌవలిషు) స్వాభావముచేతనే సన్ననిదీ, స్తనమండలము యొక్క భారముచేత బడలిపోయి క్రిందకువంగి తెగుతున్నదో అన్నట్లున్నది. ప్రవాహ వేగమున గట్టు మెల్లగ తెగిపోవు చున్నదో యనునట్లున్నదియు, యేటి గట్టుపైనున్న చెట్టుతోడ తుల్యమైన ఉనికియందు న్నదియు నగు, అట్టి నీ నడుము చిరకాలము సురక్షితంగా ఉండుగాక! - సౌందర్యలహరి
లక్ష్యరోమలతాధార-తాసమున్నే యమధ్యమా|
స్తనభారధళన్మధ్య-పట్టబన్ధవళిత్రయా.-15స్తో
విపుల - భూమి; విపులము - విస్తారమైనది.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ - 1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.
కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకు ను, వాక్కునకును పేరు.
ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు.
ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః - ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును.
ఇళాశబ్దో బుధభార్యాయామపి. యస్యాఃపుత్రః పురూరవాః. "ఊర్వశి అంభవ స్యాయమైన సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోశ్వశీయే.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.
గొస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటారావమున్ బిందు దీ
వ కళాశ్రేణి వివేక సాధనము లొప్పం బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్పూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్ర బంధ లతికన్ శ్రీకాళహస్తీశ్వరా !
తా|| ఈశ్వరా! నాదబిందు కళారూపిణియై, శ్రీచక్రాంతర వర్తియైన భువనేశ్వరీదేవి యందు మనస్సును సుస్థిరముగా నిలిపి, ఆ దుర్గాదేవి దయవలన మనసు యొక్క వేగచాలన గర్వమును బోగొట్టినట్టి యోగులకు(శ్రీవిద్యోపాసకులకు) సంసారబంధములు తొలగుపోవును గదా ! - ధూర్జటి(ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.)
కుంభిని - నేల.
మను - 1.జీవించు, 2.నర్తించు, వి.1.మన్ను, 2.నేల.
క్షమ - 1.ఓర్పు, Patience 2.నేల, 3.మన్నింపు.
ఓర్మి - క్షమ, సహనము, సహించుట, రూ.ఓరిమి (Tolerance).
ఓరిమి - క్షమ, శాంతము, ఓరుపు.
సహనము - ఓర్పు; ఓరుపు - ఓరిమి.
ఓపిక - 1.బలము, శక్తి, 2.ఓర్పు.
తితిక్ష - ఓర్పు; తితిక్షువు - ఓర్పరి.
తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి. తాల్మి - తాలిమి.
క్షితి క్షాన్త్యోః క్షమా యుక్తేక్షమం శకే హితే త్రిషు,
క్షమాశబ్దము భూమికిని, ఓర్పునకును పేరగునపుడు సీ. ఉచితమునకు పేరగునపుడు మకారాంతమైన యవ్యయమని కొందఱు. సమర్థునికిని, హితునికిని పేరగునపుడు త్రి, క్షమతే, క్షాంతిశ్చ క్షమా, క్షమూష్ సహనే, ఓర్చునది, ఓర్పువాడు, ఓర్చుట.
క్షాంతి - 1.ఓర్పు, 2.మన్నించుట. ఓర్పు కవచమువంటిది.
క్షాంతము - 1.ఓర్పు స్వభావము గలది, 2.మన్నింపబడినది.
క్షమ గలిగిన సిరి గలుగును,
క్షమ గలిగిన వాని గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును,
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
భా|| ఓ తండ్రీ! క్షమకలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.) శ్రీహరి సంతోషిస్తాడు. సూర్యప్రభలు కలిగిన క్షమా గుణమును అలవర్చు కొనుట బ్రాహ్మణుని ధర్మము.
క్షమస్వభగవత్యంబ క్షమాశీలే పరాత్పరే
శుద్ధ సత్వస్వరూపేచ కోపాది పరివర్జితే |
ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజతే
త్వయావినాజగత్సర్వం మృతతుల్యం చ నిష్పలమ్||
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
మృత్తిక - 1.మన్ను, 2.తొగరిమన్ను.
మన్ను1 - 1.మృత్తు, 2.నేల.
మన్ను2 - 1.ఒకజాతి జింక, 2.ఒక రకపు యుద్ధ సాధనము, 3. (భూగో.,వ్యవ.) రాళ్ళు విశ్లేషము నొందుట వలన ఏర్పడి, పల్లపు ప్రదేశములలో కూడుకొని కొంత సేంద్రియ పదార్థముతో గలసి, యిదివరకు పెక్కు మార్పులను పొంది, యింకను పెక్కు మార్పులను పొందుచున్న వివిధ పరిమాణములు గల శిలారేణు సంచయము. ఇట్టి మట్టిచే నాక్రమింప బడిన ప్రదేశము వ్యవసాయదారులచే 'నేల 'యన బడును. (భూమి, క్షేత్రము.)
మృత్స్న - మంచిమన్ను.
మను - క్రి.1.జీవించు, 2.వర్తించు, వి.1.మన్ను, 2.నేల.
నేలవేలుపు - భూసురుడు.
భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
కనకమృగము భువుని గద్దులేదనకను
తరుణివిడిచి చనియె దాశరథియు
తెలివీలేనివాడు దేవుడెట్లాయెరా విశ్వ.
తా||భూమిపై బంగారులేళ్ళు ఉన్నవో లేవో అని ఆలోచింపకయే శ్రీరాముడు భార్యను(తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.)విడచి ఆ లేడివెంట బడెను. ఆమాత్రము తెలుసు కొనలేవాడు దేవుడెట్లయ్యెను.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
రత్నగర్భ - భూమి.
రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వాడూర్యము.)
రత్నం మణిర్ధ్వయో రశ్మజాతౌ ముక్తాదికే పిచ :
రమతే స్మి న్ మన ఇతి రత్నం. రము క్రీడాయాం. - దీనియందు మనస్సు రమించును.
మణ్యతే స్తూయత ఇతి మణిః. ఇ. ప్స. - మణి శబ్దే స్తోత్రము చేయఁ బడునది. శిలాజాతు లయిన పద్మరాగ మరకత స్ఫటికాదులకును, మౌక్తిక విద్రుమాదులకును సామాన్యముగా పేర్లు.
మణి- 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు.
మణికారుఁడు - రత్నములను సానపెట్టువాడు.
మణిగము - అధికారము.
నేవడము - మణులు గ్రుచ్చిన హారము, రూ.నేవళము, నేహారము.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము - కెంపు; లోహితకము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
కురువిందము - ఎఱ్ఱని కెంపు, అద్దము (రసా.) గనులలో దొరకు ఎల్యూమినియం ఆక్సైడ్ (ద్విఎల్యూమినియమ్ త్ర్యామ్లజనిదము). (సర్ణకారులు బంగారు మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగింతురు) (Corundum).
మానికము - కెంపు, రత్నము, సం.మాణిక్యమ్.
మానికదారి - 1.వేశ్య, 2.మాణిక్యధారిణి.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
కెంపుసవతు - స్వాతీనక్షత్రము.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
సవతు - సమత, సామ్యము, సం.సమత్వమ్.
సామ్యము - సమత్వము, పోలిక; పోలిక - సామ్యము.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు కలది.
కెంపుగాము - అంగారకుడు, నవగ్రహములలో కుజుడు(Mars).
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
ప్రస్తరము - 1.రాయి, 2.రత్నము, 3.చిగుళ్ళు మొదలగు వానిచే ఏర్పరచిన సెజ్జ.
ధాత్రి - 1.భూమి 2.దాది 3.తల్లి, విణ.ధరించునది.
ధాత్రేయి - 1.దాది 2.భూమి.
దాది - 1.ధాత్రి 2.పాలిచ్చి పెంచు తల్లి, రూ.దాదిలి, సం.దాత్రీ.
ధన్య - దాది, విణ. ధన్యురాలు.
ధాత్రీ స్యాదు ప మాతాపి క్షితిరప్యా మలక్యపి :
ధాత్రీ శబ్దము దాదికిని, భూమికిని, ఉసిరికచెట్టునకును పేరు. రధతీతి ధాత్రీ. సీ. డు ధాఞ్ ధారణపోషణయోః, ధరించునది, పోషించునది ధాత్రి. టీ. స. ధయంత్యేనామితి ధాత్రీ. ధే ట్పానే.
పుట్టిన శిశువుకి ఆహారంగా తన పాలతో పెంచగల పోషకురాలు స్త్రీ. సంపన్నుల కుటుంబములో బిడ్డల ఆలనాపాలనా చూసుకొనేది దాది. బిడ్డలను సొంత పిల్లల మాదిరే ఆదరిస్తుంది. కాని ఆ బిడ్డల మీద తనకు ఏలాంటి హక్కు(హక్కు - బాధ్యత)లేదని, వుండదని ఆమెకు తెలుసు. ధాత్రి (రాజ కన్యలకు పెంపుడు తల్లి) తల్లిలేని శిశువుల్ని(శిశువు - బిడ్డ) కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నారు, వుంటారు.
మాతృక - 1.తల్లి, 2.దాది, 3.పార్వతి, 4.అసలు గ్రంథము.
తల్లి - జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.
జనని - 1.తల్లి, 2.దయ(దయ - కనికరము), 3.లక్క, 4.కోరిక.
తలి - జనని, తల్లి.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి.
జనయిత్రీ ప్రసూర్మాతా జననీ -
జనయతీతి జనయత్రీ; జననీ చ. సీ. జనీప్రాదుర్భావే. - కొడుకులఁ గనునది.
ప్రసూతే ప్రసూః. ఊ. సీ. షూఙ్ ప్రాణి ప్రసవే. - కొడుకులను గనునది.
మాతి వర్తతే గర్భో త్ర మాతా. ఋ. సీ. మామానేవర్తనే చ-గర్భ మీమెయం దిమిడియుండును. ఈ నాలుగు తల్లి పేర్లు.
చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదువన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభత్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
తరుణిమ - యౌవనము, రూ.తరుణ్యము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు 16 మొదలు ఏఁబది 50 సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ. సీ. తౄప్లవనర్తరణయోః. - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః. యు మిశ్రనే. పురుషునితోఁ గూడునది. ఈ ఒకటి జవ్వని పేరు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.
భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్ర యుతేనచ|
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృ వందనే||
తా. ఆరుమారులు భూప్రదక్షిణంబులు, పదివేల మారులు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున గలుగు ఫలము తమతల్లికి ప్రీతిపూర్వకముగా వందన మాచరించుట వలన గలుగును. – నీతిశాస్త్రము
యథా మాతా స్తనాం ధానాం శిశూనాం శైశవే సదా |
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ||
అంకపాళి - 1.తొడ, 2.తిన్నె, 3.కౌగిలి, 4.దాది, రూ. అంకపాళి, అంకపాలిక, అంకపాళిక.
తొడ - ఊరువు. ఊరూః నారాయణి|
ఊరువు - తొడ, వ్యు.వస్త్రముచే అచ్ఛాదింప బడునది.
ఊరుసంధి - (జం.) తుంటికీలు, పెల్విస్ (Pelvis), తొడ ఎముకతో కలియు భాగము (Hip-joint).
ఊర్వస్థి - (జం.) (ఊరు+అస్థి) తొడ ఎముక (Femur).
ఊర్వశి - ఒకానొక అప్సరస.
ఊరువ్యా ఊరుజా అర్యా వైశ్యా భూమిస్పృశో విసః
భ్రహ్మనః ఊర్వోర్భవాః ఊరవ్యాః ఊర్వోజాతా ఊరూజాః -
ఊరవ్యుఁడు - వైశ్యుడు, కోమటి, వ్యు.విరాట్పురుషుని తొడలనుండి పుట్టినవాడు.
బ్రహ్మదేవుని తొడలవలనఁ బుట్టినవారు గనుక ఊరవ్యులు, ఊరుజులును.
తొడపుట్టువు - వైశ్యుడు.
అరణీయ అర్యాః. ఋ. గతౌ. - అందఱిచేతఁ బొందఁదగినవారు.
విశుఁడు - 1.వైశ్యుడు, 2.మనుష్యుడు.
విశన్త్యా వనాదికమితి విసః. శ. వు. విస ఏవవైశ్యాః. విస ప్రవేశనే. - అంగళ్ళు మొదల్యినవానినిఁ బ్రవేశించువారు విశులు. విశులే వైశ్యులు.
వైశ్యుఁడు - కోమటి; కోమటి - వైశ్యుడు, సం.కార్పటికః.
కార్పటీకుఁడు - కోమటి.
మనుష్యుఁడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
పురుషా వాత్మ మానవౌ : పురుష శబ్దము జీవునికిని, మనుష్యునికిని పేరు. పిపర్తీతి పురుషః. పౄ పాలన పూరనయోః. - పాలించువాఁడు. సంపాసారి - కోమటి, సం.సంభార చారీ.
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనన్
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ.
తా|| పట్టణమునకు వైశ్యుడు(కోమటి - వైశ్యుడు, సం.కర్పటికః.), వరికి నీరు, గజమునకు(ఏనుగునకు) తొండము,ధన సంపదకు(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)వనితయు (మగువ - స్త్రీ) ప్రాణాధారముల వంటివి.
భూమిస్పృశుఁడు - కోమటి.
కేత్ర సంస్కారాయ లాంగలాదినా నిత్యం భూమిం స్పృశ న్తీతి భూమిస్పృశః. శ.వు. స్పృశ సంస్పర్శనే. - పొలమును జక్కఁజేయుట కొఱకు నాఁగేలు మొదలయిన వానిచేత భూమిని స్పృశించువారు.
తవిటి కరయ వోవ దండులంబులగంప
శ్వాన మాక్రమించు సామ్యమగును
వశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు! విశ్వ.
తా. తవుడును చూచుటకు బోవగా బియ్యముగంప కుక్క(శ్వానము - కుక్క)తిని వేసినట్టుగ, వైశ్యుని సొమ్ము(వసుధ - భూమి, వ్యు.వసువును(బంగారమును) ధరించునది)నీచులపాలగు చుండును.
జగతి - తిన్నె; ౙగిలె - తిన్నె, రూ.జగిలె.
తిన్నె - తిన్నియ.
తిన్నియ - అరుగు, వేదిక, రూ.తిన్నె, తీనియ, తీనె.
అరుఁగు - తిన్నె, రూ.అరఁగు. తీనియ - తిన్నియ.
వేది - 1.వేదిక, తిన్నె, 2.విద్వాంసుడు, విణ.తెలిసినవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు.
కౌగిఁలి - ఆలింగనము, రూ.కవుగిలి.
ఆలింగనము - కౌగిలింత.
కవుగిఁలి - 1.ఆలింగనము, 2.భుజాంతరము, రూ.కౌగిలి, సం.కోలః.
శ్లిష్టి - 1.కౌగిలింత, 2.అంటుకొని యుండుట.
భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది.
అబ్దిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.
కుటజము - కొండమల్లి.
కుటతి శాఖాదినా వక్రీ భవతీతి కుటః, కుటకౌటిల్యే. - శాఖలచేత వక్రమై యుండునది.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
పలాశ్యత్యేగ్రస్యతే పలాశం. పరపూర్వః అశ భోజన ఇతి ధాతుః రలయోరభేదః - వ్రతయుక్తులైన వారి చేత భక్షింపఁబడునది.
ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.
ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చ గుఱ్ఱము , 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.
పత్రహరితము - (వృక్ష.) ఆకులలో నుండు ఆకుపచ్చని పదార్థము, హరితము (Chlorophyll).
హరిత్తు - 1.దిక్కు, 2.ఆకుపచ్చవన్నె, 3.పచ్చగుఱ్ఱము Green horse.
హరిదశ్వుఁడు - సూర్యుడు Sun, వ్యు.పచ్చ గుఱ్ఱములు కలవాడు.
పలాశే కింశుకః పర్ణో వాతషోథః -
పుణ్యాని పాలశాని యస్య సః పలాసః - పుణ్యములైన ఆకులు గలది.
సంపుప్పైః పలం మాంసం అశ్నాతీవ తిష్ఠతీతి నా పలాశః - పుష్పములచేత మాంసమును భక్షించు దానివలె నుండునది.
కించిచ్ఛుకవన్నీలత్వాత్కింశుకః - ఇంచికంత పచ్చనై చిలుకవలె నుండునది.
ప్రశ స్తపర్ణ యోగాత్వర్ణః - మంచి ఆకులు గలది.
వాత రోగం పోథయతీతి వాతపోథ. పుథ హింసాయాం. - వాతరోగమును బోఁగొట్టునది. ఈ నాలుగు మోదుగచెట్టు పేర్లు.
కింశుకము - పలాశము, మోదుగు చెట్టు.
మోదుగు - కింశుక వృక్షము, రూ.మోదువు.
మంకెన - 1.బంధూకము, మోదుగు, 2.ఎద్దు మీద నీళ్ళబిందెలు ఆనుటకై వేయుబెత్తపు బుట్టల జత. మంకెనపువ్వు ఎరుపు.
బంధూకము - మోదుగ పూవు, మోదుగ.
శుకములు(శుకము - చిలుక) మోదుగ పూలు జూచి పండ్లని భ్రాంతిపడి వెళ్ళగా వానికి నిరాశయే మిగులును.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
పర్ణము - ఆకు, పత్రము.
పత్రము - 1.ఆకు, 2.రెక్క, 3.వ్యవహారము, చెల్లుబడికై వ్రాసికొను కాగితము, 4.వాహనము, 5.బాణము.
పతత్రము - 1.రెక్క, 2.పత్రము.
పతత్రి - పక్షి, వ్యు.రెక్కలుగలది.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
పక్షము - 1.నెలయందు బదునైదు దినములు(శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క.
రెక్క - రెక్క, పక్షివిరక.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.
పక్షపాతము - ఒక ప్రక్క కొరగుట, పక్షపాత బుద్ధితో మెలగుట.
పక్షవాతము - శరీరము నొక ప్రక్క కొరగచేసెడి రోగము.
రూపయౌవన సంపన్నా విశుద్ధ కులసంభందాః|
విద్యాహీనా నశోభంతే నిర్గంధా ఇవకింశుకాః||
తా. రూపము, ప్రాయము, సంపద, మంచికుల గోత్రములు, ఇవి గలవారై నను విద్య(విద్య - 1.జ్ఞానము, 2.చదువు.)లేనివారు ప్రకాశింపరు. అది యెట్లనిన, మోదుగ పువ్వులు ఎంత యెరుపు(ఎఱుపు) గలిగినవైనను పరిమళము లేనందు వలన ప్రకాశింపవు గదా. - నీతిశాస్త్రము
బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ|
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ. – 177శ్లో
అగము - 1.చెట్టు, 2.కొండ, 3.పాము, 4.సప్త సంఖ్య.
నగము - 1.కొండ 2.చెట్టు రూ.అగము.
నగవైరి - ఇంద్రుడు వ్యు.కొండలకు శత్రువు.
ఆఖండలుఁడు - ఇంద్రుడు, వేలుపురేడు, పర్వతములను భేదించువాడు.
కొండ పగతుఁడు - ఇంద్రుడు, కొండలకు శత్రువు.
అగమము - 1.చెట్టు, 2.కొండ, వ్యు.కదలనిది. అగౌకసము - 1.సింహము, 2.శరభమృగము, 3.పక్షి, వ్యు. కొండ లేక చెట్టు నివాస స్థానముగా గలది.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
శాక్యసింహుఁడు - శాక్యముని, బుద్ధుడు.
శాక్య సింహః శాక్యేషు సింహఃశ్రేష్ఠః - శాక్యులలో శ్రేష్టుడు.
శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
సర్వార్థసిద్ధుడు - శాక్య బుద్ధుడు.
పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁడిక్కఁడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబుర కేమి యొగ్గగన్
కొండొక కోతి చెట్టుకొన కొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహ నికరంబులు నుండవె, చేరి భాస్కరా.
తా. ఒక చెట్టుక్రింద గండభేరుండములు, సింహములు, ఏనుగులు గుంపులుగా నుండగా, ఆ చెట్టుపైకొక కోతి ఎక్కి కూర్చునంత మాత్రమున దానిచే వాటి కేయాపదయు ఘటిల్లదు, అట్లే పండితులొక్కప్పుడు తక్కువ స్థానములలో నుండగా ఒక నీచుడు(అల్పుఁడు - నీచుడు.)ఎక్కువ స్థాన మందున్నను యాతనివలన వారి కెట్టిలోపమును రాదు.
శరభమే సారమైనదో హరియె సార
వంతమో యననేల నీ కాంతి నీది
కాంతిమంతము లెందును గాంతి నింపు
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ|
2. మణిపూరకం - నాభిప్రదేశంలో ఉండే దశ దళచక్రం. (కుండలినీ యోగసాధన క్రమంలో ఒక స్థాయి). దళదళమును నీలవర్ణమునగు మణిపూరక చక్రము నందు - విష్ణువు కలడు. (జల తత్త్వమును)
మణిపూరే - మణి పూర చక్రము. ఆ చక్రమున అధిస్థాన దేవతగానున్న భగవతి మణికాంతులతో ఆప్రదేశమున పూరించునది కావున ఆ చక్రమునకు మణిపూర చక్రమని పేరు వచ్చినది.
మణి పూర చక్రము పదిదళములును ఎర్రని వర్ణము, దకారము మొదలు మకారము వరకు, అనాహత చక్రము పన్నెండు దళములను బంగారు వంటి వర్ణాన్ని కకారము మొదలు రకారము వరకు ఉండు వర్ణాలను కలిగి యుండును.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్నుః, ఉ-పు. విశ్వం వేవేష్ఠి వ్యాప్నోతీతి విష్నుః - విశ్వమును వ్యాపించి యుండువాడు. విష్ను వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణోః పదం విష్ణుపదం - విష్ణువునునకు స్థానము.
విష్ణుపది - గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగా గలది.
విష్ణుపదోద్భవా విష్ణుపదీ. ఈ. సీ.- విష్ణుపాదమునఁ బుట్టినది.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.
ఆకాశధార - ఆకసమునుండి కొండ పైకిని అచటినుండి క్రిందిని ప్రవహించు ధార.
సోమధార - ఆకాశ గంగ, పాలపుంత.
ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.
సీత - 1.శీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది - పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
ఆకాశ గంగ - మిన్నేరు 1.మందాకిని, 2.పాలవెల్లి(milky way).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ
భాగీరథి - గంగ (వ్యు.భగీరథునిచే భూమికి తేబడినది). (భగిరథుడు, సూర్యవంశపురాజు మందాకిని నదిని తెచ్చి ఈ భుమిని పరమ పవిత్రం గవించాడు). కేదార్నాథ్ లోంచి ప్రవహించే గంగ మందాకిని.
మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1. మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ. 2.వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ. 3.స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గమందుండెడి నది. 4.సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
చారలేరు - ఆకాశ గంగ; చదలేరు - ఆకాశ గంగ.
తెలియేఱు - ఆకాశ గంగ. తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము.
గంగానది విష్ణుపాదనఖము నుండి జన్మించుట వలననో శివుని శిరస్సు నందున్న చంద్రుని స్పర్శము వలననో మంచుకొండ శిఖరమునుండి పడుటవలననో దేని వలననోగాని స్పటికమణివలె స్వచ్ఛమైన జలము గలిగియున్నది.
మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మ్యై "మ"కారమహితాయ నమశ్శివాయ |
నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము లేక జనసమూహము(జనత - జనసమూహము) స్థానముగా గలవాడు.
నారాయణః నరన్యేదంనారం అవతారేషు నారం వపురయత ఇతి నారాయణః - నరసంబంధమైన శరీరము నారము. అవతారములయందు నర శరీరమును బొందినవాడు.
అయగతౌ. నారా ఆపః అయనం స్థానం యస్యసః - నారమనగా జలము అది స్థానముగా గలవాడు.
నరసమూహో నారం తస్యయనమితి వా, తదయ నమన్యేతివా - నర సమూహమునకు స్థానమయినవాడు. లేక నర సమూహము నివాసము గా గలవాడు.
రాశ్శబాః అయంతే నిర్గచ్ఛంతే యస్మా త్సనారాయణః. రాయణాదన్యః అరాయణః అరాయణోనభవతీతి నారాయణః - శబ్దగమ్య ఇత్యర్థః - ఎవనివలన శబ్దములు బయలు వెడలుచున్నవో అతడు రాయణుడు. రాయణుడు గానివాడు అరాయణుడు. అరాయణుడు గానివాడు నారాయణుడు. అనగా శబ్దగమ్యుడనుట. రైశబ్దే.
భూమి కన్న జలము - జలము కన్న వాయువు - వాయువు కన్న అగ్ని - అగ్ని కన్న ఆకాశము - ఆకాశము కన్న మనస్సు - మనసు కన్న బుద్ధి - బుద్ధి కన్న కాలము. ఒకదాని కన్న మరొకటి గొప్పది. అన్నింటి కన్న గొప్పవాడు విష్ణువు - నారాయణుడు.
నీరు అంతా నారాయణ స్వరూపమే. కాని అన్ని రకాల నీళ్ళని మనం త్రాగడానికి వాడలేము కదా! ఒక రకం నీళ్ళు కాళ్ళు కడుకుకొనడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరొక రకం నీరు స్నానానికి ఉపయోగ పడుతుంది. అదే విధంగా భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ అన్ని చోట్లకు మనం వెళ్ళకూడదు. కొన్ని ప్రదేశాలే చూడదగినవిగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు, మనం వాటి దగ్గరకు పోవడానికి కూడా వీలులేనివిగా ఉంటాయి. - శ్రీరామకృష్ణ పరమహంస
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి. సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి|
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది.
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రింకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో
నారము - 1.నరసమూహము 2.నీళ్ళు(నీరు).
నర - వెండ్రుకలయందు గలుగు తెలుపు, తెల్లబారిన వెండ్రుక, రూ.నరవు.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము. (Group)
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు.
గాంగేయుఁడు - గాంగుఁడు.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గంగి - పూజ్యము, (గంగెద్దు= గంగి+ఎద్దు), వి.సాధువైన ఆవు.
గంగెద్దు - (గంగి+ఎద్దు) దాసరులు వస్త్రాదులచే అలంకరించి భిక్షాటనము కై తీసుకొని వచ్చెడి ఎద్దు, రూ.గంగిరెద్దు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.
గంగమైలావు - (గంగమైల + ఆవు), 1.పసుపు, నలుపును కలిసిన వర్ణము కల ఆవు, 2.మిక్కిలినల్లని ఆవు.
మైలావు - పొగ చాయగల ఆవు.
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివడైననేల ఖరముపాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను జాలు విశ్వ.
తా. మంచిపాలు గరిటెడైనను త్రాగుటకు శ్రేష్ఠముగా నుండును. గాడిద పాలు కడవతో యిచ్చిననూ త్రాగలేముకదా. అట్లే ప్రేమతో బెట్టిన పిడికెడు భోజనమైనను సంతోషము గదా.
గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు - గంగాధరుఁడు, శివుడు, వ్యు.శిరస్సున భార్యకలవాడు.
గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వజనేశశివ |
నతీర్థం గంగాయాస్సమానః : గంగతో సరి సమానమైన జలము లేదు.
గంగాయాః పరమం నామ పాపారణ్యదవానలః
భవవ్యాధిహరీ గంగా తస్మా త్సేవ్యా ప్రయత్నతః|
గాంగము - 1.గంగ యందు పుట్టినది, 2.గంగకు సంబంధించినది
గాంగేయము - 1.బంగారము, 2.తామర, 3.ఉమ్మెత్త, 4. ఒకానొక చేప.
గఙ్గాయాం అగ్నినా న్యస్తస్య మాహేశ్వరవీర్యస్య హిరణ్యత్వేన భూతత్వ్వత్ గాంగేయం - గంగ యందు ఈశ్వరుని వీర్యము అగ్నిహోత్రుఁడు విడువఁగా సువర్ణ రూపమాయెను గనుక గాంగేయము.
వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమః.
నీరము - జలము.
నీటిఱేఁడు - 1.వరుణుఁడు, 2.సముద్రుడు.
ప్రచేతా వరుణః పాశీ యాదసాంపతి రప్పతిః :
ప్రకృష్టు చేతః యస్య సః ప్రచేతాః. స-పు. - మంచి మనస్సు గలవాఁడు.
వృణోతి వరా నముం లోక ఇతి వరుణః. వృజ్ వరణే. - జనము ఇతనిని వరము లడుగుచున్నది.
వృణోతి అరీ న్ పాశైరితి వా వరుణః - పాశముల(పాశము - త్రాడు)చేత శత్రువులఁ గట్టువాడు. పాశము బంధ హేతువు(కారణము).
పాశో స్యాస్తీతి పాశీ. న. పు. - పాశము ఆయుధము గాఁ గలవాఁడు.
యాదసాం జలజంతూనాం పతిః - యాదసాం పతిః. ఇ. పు. - యాదస్సు లనఁగా జలజంతువులు వానికి పతి, అలుక్సమాసము.
అపాం పతిః అప్పతిః. ఇ. పు. అప్పులనఁగా(అప్పు - ఋణము, సం.వి.జలము.)జలము, దానికి పతి. ఈ ఐదు 5 వరుణిని పేర్లు.
ప్రచేతసుఁడు - వాల్మీకిముని తండ్రి, విణ.గొప్పమనస్సు గలవాడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
పాశ్చాత్యుఁడు - 1.పడమటివాడు, 2.వరుణుడు.
పాశి - 1.వరుణుడు, 2.యముడు.
నాగపాశము - వరుణుని ఆయుధము.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - న వ గ్ర హ ము ల లో ఏడవ గ్రహము (Saturn)
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
ఋణం పర్యుదఞ్చనమ్, ఉద్దారః -
అర్యతే కాలాన్తర ప్రాప్యత ఇతి ఋణం. ఋ గతౌ. - కాలంతరమునఁ బొందఁబడునది.
పర్యుదఞ్చ్యతే పరిప్రాప్యత ఇతి పర్యుదఞ్చనం. అఞ్చు గతిపూజనయోః. - కాలాంతరమునఁ బొందఁబడునది.
ఉద్ద్రియతే గృహ్యత ఇతి ఉద్దారః. హృఞ్ హరణే. - పుచ్చుకొనఁబడునది. ఈ 3 అప్పు పేర్లు.
అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము - 1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బూ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విన.ఋణరాశి (Negative).
ఋణాత్మకము - (గణి.) శూన్యము కన్న తక్కువైనది, (Negative).
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము. నీళ్ళు - నీరు.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.
ఉత్తరము - 1.బదులు, 2.ఒక దిక్కు, 3.జాబు, (ఈ అర్థము తెనుగు నందు మాత్రమే కలదు, సంస్కృతమున లేదు), విణ.మీదిది.
బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి.
మారు - ప్రతి.
ప్రతి - 1.సమానము, 2.మారు, 3.ఒక్కొక్క.
ఉదీచ్యము - 1.ఉత్తర దిక్కున ఉన్నది, 2.ఉత్తర కాలమున ఉన్నది, వి.1.శరావతీ నదికి వాయవ్యమున ఉన్న దేశము, 2.కురువేరు.
ఉదక్ ఉత్తరస్యాం భవం ఉదీచీనం - ఉత్తరదిక్కునఁ బుట్టినది.
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.
హ్రీబేరము - కురువేరు. హ్రీ - సిగ్గు.
కేశము - 1.తలవెండ్రుక, 2.కురువేరు.
శిరోజము - తలవెండ్రుక; శిరోరుహము - తలవెండ్రుక.
వెండ్రుక - కేశము, రూ.వెంట్రుక.
కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు - చంద్రుడు Moon.
ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః|
ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||
తా. సకలజనులకు పశువులు, పెండ్లాము(పత్ని - భార్య), కొమాళ్ళు, ఇండ్లును(ఆలయము-1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.), జన్మాంతర ఋణసంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించు చున్నవి. కాబట్టి చింతించుట వలన లాభమేమి. - నీతిశాస్త్రము
జంబుకుఁడు - 1.వరుణుడు, 2.నీచుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
నీచుఁడు - అధముడు, రూ.నీచు. అల్పుఁడు - నీచుడు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు. కొంచెకాడు - అల్పుడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.
ఉద్దముఁడు - 1.స్వతంత్రుడు, 2.భయంకరుడు, 3.అధికుడు, వి. వరుణుడు.
స్వతంత్రుఁడు - ఒకరిపై ఆధారపడకుండ నుండువాడు, తన్నుతాను పోషించు కొనువాడు.
అధికుఁడు - గొప్పవాడు.
వినిఘ్నతి త్వయథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ |
భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే ||
తా. వరుణుడు వేదములయందు జంబుక నామధేయుడుగా ప్రసిద్ధుడు. కనుక నీవు జంబుకము(నక్క)ల రూపమున ఉన్న రాక్షసులను సంహరించుచుండుట చూచి 'జంబుక 'అను పేరు కల వరుణునకు కూడ భయము కలిగినది. ఆ భయముచేతనే తనయొక్క జంబుక నామ ధేయమును అతడు వేదములయందు మాత్రమే ప్రసిద్ధము చేసికొనెను, అని నేనందుకొందును. - నారాయణీయము
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3, భూమి, 4.వరుణుని భార్య. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|
కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణా|
శరధి - 1.విల్లు, 2.సముద్రము.
కంధి - సముద్రము, వ్యు.కం = నీటికి నిధి = స్థానము.
నీరధి - సముద్రము; సముద్రము - సాగరము. సాగరము1 - నేయి మొ నవి నింపిన సిద్దెల జోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
సముద్ర మథనే లేభే హరిర్లక్ష్మీం హరోవిషమ్|
భాగ్యం ఫలతి సర్వత్రన విద్యానచ పౌరుషమ్||
తా. సముద్రమును మధించినపుడు విష్ణువు(హరి) లక్ష్మీదేవిని, శివుడు (హరుఁడు - శివుడు)విషంబును (బొ)పొందిరి. గాన వారివారి భాగ్యాసు సారముగా ఫలంబు గలుగును. - నీతిశాస్త్రము
ముగ్ధా ముహు ర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాః ప్రణిహితాని గతాగతాని
మాలా దృశ్యో ర్మధుక రీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరాసమ్భవాయాః|
అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.
ఆపః ధీయంతే అస్మిన్నిత్యబ్ధిః. ఇ. పు. డుధాఞ్ ధారణపోషణయోః - జలములు దీనియందు ధరింపఁబడును.
అబ్ధిభవే త్రిషు సముద్రియమ్,
సముద్రే భవం సముద్రియం. అ. త్రి. సముద్రమునందుఁ బుట్టినది.
సముద్రియా ఆప; సముద్రియా ముక్తామణి; సముద్రియం లవణం. అని మూఁడు లింగములయందును వర్తించును. ఈ ఒకటి సముద్రమునఁ బుట్టిన వస్తువు పేరు.
అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.
అబ్దిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.
అబ్దిపల్లవము - పగడము.
అకూపారము - మేరలేనిది, 1.సముద్రము, 2.ఆదికూర్మము.
మర్యాదయా న కుం పృథివీం పృణాతీత్యకూపారః. వౄ పాలన పూరనయోః - మర్యాదచేతను భూమిని మింపినది.
అకుత్సితం పారమన్య అకూపారః - కుత్సితముగాని దరిగలిగినది.
అవిద్యమానా కుః పృథ్వీ పారే (అ)స్యేతి వా అకూపారః - దీని అవలి దరియందు భూమి లేదు.
పారావారము - 1.ఈవలిదరులు, 2.సముద్రము.
పారము - 1.అవతలిదరి, 2.సమీపము.
సదేశము - సమీపము.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
పారమావృణోతి పారావారః వృఞ్ వరనే. - దరిని గప్పునది, అనఁగాఁ దరిలేని దనుట.
పా. పార మపారమస్య పారావారః. - అపారమైన తీరము గలిగినది.
"సతమాస్సత మాలతయా పారాపారాయ యస్సదా వోదావ" ఇతి హరి ప్రబోధే సందిష్టయమకం.
పారావారే పరార్వాచీ తీరే -
పరంచ అర్వాక్చ పరార్వాచీ, తే తీరే పారావారే ఇత్యుచ్యేతే. - పార అవారశబ్దములు వరుసగా, ఈవలిదరికిని ఆవలిదరికిని పేర్లు.
పార్యతే తరనకర్మాత్ర పారం - దీనియందు దాఁటెడు వ్యాపారము ముగియును.
న విద్యతే వాః జల మత్ర అవారం - దీనియందు జలము లేదు. పా. అపారమిత్యపి పారముగానిది అపారము.
తవస్తన్యం మన్యే - ధరణిధరకన్యే! హృదయతః
పయఃపారావారః - పరివహతి సారస్వత మివ,
దయావత్యాదత్తం - ద్రవిడశిశు రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా - మజని కమనీయః కవయితా|| - 75శ్లో
తా. ఓ పర్వతపుత్రీ! తల్లీ! నీ చనుబాలను, నీ హృదయమందలి పాలకడలి పైకి సారస్వత రూపమై(సారస్వతము- సరస్వతీ సంబంధమైనది, వి.1.వాఙ్మయము, 2.భాష.)ప్రవహించుచున్న వాఙ్మయముగా నేను తలచెదను. కారుణ్యముతో నీచే ఇయ్యబడిన క్షీరాలను(పాలను) త్రావి యీ ద్రవిడ శిశువు(శ్రీ శంకర భగత్పాదులు) ప్రౌఢ కవులతో జగన్మోహనుడై కవిగా నెట్లయ్యెను? నీ స్తన్యము హృదయము నుండి క్షీర సముద్రమువలె భాషను విశేషంగా ప్రవహింప చేయుచున్నది. - సౌందర్యలహరి
కథా పారావార స్సజల జలద శ్రేణి రుచిరో
రమా వాణీ సౌమ స్ఫుర దమల పద్మోభవ ముఖైః
సురేంద్రై రారాధ్యః శ్రుతిగణ శిఖా గీత చరితో
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే|
సరిస్పతి - సముద్రుడు.
ఏటిఱేఁడు - (ఏరు + ఱేఁడు) సముద్రుడు, సరిస్పతి.
వహతి - 1.ఎద్దు, 2.నది, 3.గాలి.
వాహిని - 1.నది, 2.సేనావిశేషము: 81 రథములు, 81 ఏనుగులు, 243 గుఱ్ఱములు, 405 కాల్బలము గలది.
వాహినీపతి - 1.సముద్రుడు, 2.సేనాపతి.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
అథ నదీ సరిత్,
తరఙ్గిణీ శైవలినీ హ్రాదినీ ధునీ,
స్రోతస్వినీ ద్వీపవతీ స్రవన్తీ నిమ్నగాపగా -
(కూలంకకషా నిర్ఝరిణీ రోధోవక్రా సరస్వతీ)
ౙక్కర - నది.
ౙక్కరరాయఁడు - సముద్రుడు, సరిత్పతి.
సరిత్తు - నది.
సరితో న్యాశ్చ -
అన్యాశ్చ - ఇతరములైన కృష్ణ, వేణి, గోదావరి, సరయువు మొదలైన వియు సరిత్తు లనంబడును.
ఉదన్వంతము - సముద్రము; ఉదధి - సముద్రము.
సింధువు - 1.ఒకనది, అఖంఢ భారత్ లో పొడవయినది 2.సముద్రము, 3.ఏనుగు(మహామృగము - ఏనుగు), 4.నదము, 5.ఒకదేశము.
స్యందతే సింధుః. ఉ. పు. స్యందూ ప్రస్రవణే. - ప్రవహించునది.
దేశే నదవిశేషే బ్ధౌ సిన్ధు ర్నా సరితి స్త్రియామ్ :
సింధుశబ్దము దేశ విశేషమునకును, నద విశేషమునకును, సముద్రము నకును పేరైనపుడు పు. సామాన్యముగా నదికిని నదీ విశేషమునకును పేరైనప్పుడు సీ. స్యందత ఇతి సింధుః. స్యందూ ప్రస్రవణే. - ప్రవహించునది. "సింధు ర్గజమదే పిస్యా' దితి శేషః.
సర్వసంవత్స్వరూపాత్వం సంతుష్టా సర్వరూపిణి
రామేశ్వర్యధిదేవీత్వం త్వత్కళాస్సర్వయోషితః
కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధుకన్యకా
సర్గేచస్వర్గ లక్ష్మీస్త్వమర్త్యలక్ష్మీశ్చ భూతలే|| - 2స్తో
సైంధవము - గుఱ్ఱము, వ్యు.సింధుదేశమున పుట్టినది.
సింధుదేశే భవః సైంధవః - సింధు దేశమందుఁ బుట్టినది.
నదము - 1.పడమరగా పారెడు యేరు, 2.మడుగు, 3.సముద్రము, 4.మ్రోత.
బుసి - పశ్చిమ సముద్రము నడుమ నుండు వరుణోద్యాన నది.
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ -
మన్యేన సిన్ధుతనయా మవలమ్భ్య తిష్ఠన్|
వామేతరేణ వరదా(అ)భయపద్మచిహ్నం
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్భమ్.
సింధునది సముద్రంలో సంగమించే తీర్థానికి వరుణ తీర్థం అని పేరు. కుంభరాశిలో(గురుడు) ప్రవేశం సింధునది పుష్కరాలు.
మడుఁగు - క్రి.అడుగు, వంగు, వి.1.గుణము, 2.కొలను, 3. 8వీసెలు, రూ.మడువు, మడ్గు, మణుగు, మణువు.
అడుగు - 1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది అధమము.
అడువు - క్రి.1.ప్రశ్నించు, 2.కొట్టు, వి.అడుగు, పాదము.
అడుగుపుట్టువు - 1.గంగ, 2.శూద్రుడు.
రథారూఢో గచ్ఛ న్పథి మిళిత భూదేవ పటలైః
స్తుతి ప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసిన్ధు ర్భాను స్సకల జగతాం సింధుతనయా
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే|
మహాశయము - సముద్రము; మకరాలయము - సముద్రము.
మొగాళము - (వ్యావ.) నదీ సముద్రాదుల ముఖము.
సముద్ర సంగమము - (భూగో.)నదులు సముద్రమున కలియు స్థలము.
వేల్మోరి - (భూగో.) నదీసముద్ర సంగమము వద్ద వైశాల్యము తక్కువగు టచే నీరుగోడవలె లేచి కదలుట (Tidal-wave).
కురుతే గంగా సాగరగమనం ప్రతిపరిపాలన మథవా దానమ్|
జ్ఞాన విహీనః స్సర్వమతేన ముక్తిం న భవతి జన్మశతేన||భజ||
వృధావృష్టి స్సముద్రేచ - వృథా తృప్తేచ భోజనమ్|
వృధా ధనవంతౌ దానం - దరిద్రే యౌవనం వృథా||
తా. సముద్రమున(వృష్టి - వర్షము, వాన.)వర్షించుట, ఆఁకలి లేనివానికి భోజనము బెట్టుట, ధనవంతునకు దానము చేయుట, దరిద్రునకు(దరిద్రుఁడు - పేదవాడు,పేదవానికి)గల యౌవనము ఇవి(వృథ–వ్యర్థము)నిష్ప్రయౌజనములు. - నీతిశాస్త్రము
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రవాత్
మాఙ్గల్యభాజి మధుమాథిని మన్మథేన
మ య్యాపతే త్త ది హ మన్థర మీక్షణార్థం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయః|
రత్నాకరము - సముద్రము.
రత్నానామాకరః రత్నాకరః - రత్నములకెల్ల గనియైనది.
రత్నగర్భుఁడు - 1.సముద్రుడు, 2.కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.
ధనాధిపుఁడు - కుబేరుడు; దాత - ఇచ్చువాడు.
సంద్రుఁడు - సముద్రుడు, సం.సముద్రః.
సంద్రము - సందరము, సం.సముద్రః.
సందరము - సముద్రము, మున్నీరు, రూ.సంద్రము, సం.సముద్రః.
మున్నీరు - (మును+నీరు) సముద్రము.
మున్నీటిచూలి - క్షిరసాగర కన్యక, లక్ష్మి.
క్షీరాబ్ధేస్తనయా క్షీరాబ్ధితనయా – పాలకడలి కూఁతురు.
శ్రీ గల భాగ్యశాలిఁగడుఁ జేరగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన, నిల్వను
ద్యోగ్యముజేసి, రత్ననిలయుండగాదె సమస్త వాహినుల్
సాగరుఁజేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి, భాస్కరా.
తా. భాస్కరా! నదులన్నియు, సముద్రుడు రత్నములకు స్థానమైన వాడను నాశతో యాతని సమీపించుచున్నవి, అట్లె జనులెల్లరును ఐశ్వర్యవంతు డెక్కడ నుండిన యక్కడి కెంత దూరమునుండి యైనను శ్రమయని తలంపక తమంతమే ఓపికతో నతనిని జేరుటకు వచ్చెదరు.
All the rivers run into the sea; yet the sea is not full.
యాదోనాథుఁడు - సముద్రుడు.
యాదసాం జలజంతూనాంపతిః యాదఃపతిః. ఇ. పు. - యాదస్సు అలనఁగా జలజంతువులు, వానికి పతియైనది.
యాదస్సు - 1.క్రూరజంతువు, 2.నీటిదయ్యము, 3.నది, 4.నీరు.
అపాంపతి - సముద్రుడు.
అపాంజలానాంపతిః అపాంపతిః ఇ. పు. - జలమునకు పతియైనది.
ఆషాఢంబున వరుణం డను నాహ్వయంబు నొంది వశిష్ఠుండు రంభ(రంభ - 1.ఒకానొక అచ్చర, 2.అరటి చెట్టు.), సహజన్యుండు హూహువు శుక్రుండు చిత్రస్వనుండును సహచర సహితుం డై కాలక్షేపనంబు సేయుచుండు|
ఆషాఢమాసంలో సూర్యుడు(sun) వరుణుడు అనేపేరు పొందుతాడు. వశిష్ఠుడు, రంభ(రంభ - 1.ఒకానొక అచ్చర, 2.అరటి చెట్టు.), సహజన్యుడు, హూహువు, శుక్రుడు Venus, చిత్రస్వనుడు అనే వారు తనకు పరివారం కాగా కాలం గడుపుతుంటాడు.
ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువో థ హరిణో హరః,
వపు రావర్తమానేభో వసుశ్రేష్ఠో మహాపథః|
తొలునీటి రిక్క - పూర్వాషాడ (పూర్వ - తూర్పు).
నీటిరిక్క - పూర్వాషాడ.
ఆషాడము - 1.ఆషాడ నక్షత్రముతో గూడిన పున్నమ గలమాసము, చైత్రము మొదలు నాల్గవ నెల, 2.బ్రహ్మచారి ధరించు మోదుగు కోల.
చాతుర్మాస్యము - అషాఢ శుద్ధము మొదలు కార్తిక శుద్ధము వరకు అనగా నాలుగు మాసములు చేయు ఒక వ్రతము.
పాలశోదణ్డ ఆషాఢో వ్రతే : ఆషాఢాసు జాతః ఆషాఢః - పూర్వాషాఢాది నక్షత్రముల యందగు నట్టిది.
పాలాశః దణ్డః - బ్రహ్మచర్యాది వ్రతమందుఁ బుట్టు మోదుగు కోల.
శుచి స్త్వయమ్, ఆషాడే -
తాపేనశుగ్విద్యతే (అ)స్మిన్నితి శుచిః. ఇ. పు. శుచశోకే - తాపము వలననైన దుఃఖము దీనియందుఁ గలదు.
అయమిత్యనే నశుచేః పుంలింగతా నిర్ణయః - ఆయనమనెడు పదముచేత శుచిశబ్దము పుంలింగమని యెఱుంగునది.
ఆషాడానక్షత్రయుక్తాపూర్ణిమా అస్తిన్నిత్యాషాఢః - ఆషాఢానక్షత్రముతోఁగూడిన పున్నమ దీనియందుఁ గలదు. ఈ 2 ఆషాఢ మాసము పేర్లు.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శోచయతీతి శుచిః. ఇ. పు. శుచశోచనే - దుఖింపఁజేయువాఁడు.
శుచిత్వాచ్ఛుచిః - శుచియైనవాఁడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గికంటి - శివుడు.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడికలవాడు.
చిచ్ఛఱ - 1.అగ్ని, రూ.చిచ్చుఱ, సం.శుచిః.
చిచ్చుఱ - చిచ్ఛఱ. చిచ్ఛుఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్గితిత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
పీతాముత్పలధారిణీం శుచిసుతాం పీతాంబరాలంకృతాం|
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందారమాలాధరాం||
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు - చంద్రుడు Moon, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశనో యస్యసః శుభ్రాంశుః. ఉ-పు. - తెల్లని కిరణములు గలవాఁడు.
ఆపగ - నది, ఏరు, వ్యు.జలముతో పోవునది.
ఆపగేయుఁడు - గంగాపుత్త్రుడు, భీష్ముడు.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
భీష్ముఁడు - 1.శంత పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
కొమరసామి - స్కందుడు; స్కందుఁడు - కుమారస్వామి.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
తటిని - ఏరు, వ్యు.తటముకలది.
తటి - 1.ఏటియొడ్డు, 2.ప్రదేశము.
తటము - 1.ఏటియొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము.
తటిత్వంతము - మేఘము, వ్యు.తటిత్తు కలది.
తటిత్తు - మెరుపు.
క్షణప్రభ - మెరపు, వ్యు.అల్పకాలమే వెలుగునది.
శంప - మెరుపు, రూ.సంప.
శంపాలత - మెరుపు తీగ; ఘనవల్లి - మెరుపు తీగ.
మహాంశ్చాసౌ పద్మశ్చ మహాపద్మః - గొప్పదైన పద్మము.
తటిల్లేఖాతన్వీం - తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణా మ - ప్యుపరి కమలానాం తవ కలామ్|
మహాపద్మాటవ్యాం - మృదిత మలమాయేన మనసా
మహాన్తః పశ్యంతో - దధతి పరమాహ్లాద లహరీమ్|| - 21శ్లో
తా. తల్లీ! మెరపు తీగవంటిది(మయి - 1.దేహము, 2.విధము, 3.పార్శ్వము, 4.తడవ,రూ.మై.)కలిగియు, సూర్య చంద్రాగ్ని(తపనుఁడు - సూర్యుడు; శశాంకుఁడు - చంద్రుడు; వైశ్వానరుఁడు - అగ్ని.)మయమైనదియు, షట్కమల(షట్చ(క)ములకు పైన సహస్రార మందు మహాపద్మాటవిలో(నిషణ్ణము-1.ఉండినది, 2.కూర్చుండినది.)కూర్చున్న నీ కళను, మాయ తొలగిన విశుద్ధమైన మనస్సుతో (పశ్యన్తి - చూచు)మహాత్ములు పరమానందలహరి(లహరి-1.పెద్ద అల, 2.వీచి)ని ధారణ చేస్తున్నారు. - సౌందర్యలహరి
ఓం షట్చక్రో పరిస్థితాయై నమః : మూలాధార, స్వాధిస్థాన, మణిపూర, అన్నహత, విశుద్ధ, ఆజ్ఞా - నామ కాలైన షట్చక్రాలకూ ఉపరి భాగంలో - సహస్రార పద్మంలో భాసిల్లు నట్టి శ్రీదేవికి వందనాలు.
ఓం మహాపద్మాటవీ సంస్థాయై నమః : షట్చక్రాలు లేదా అసంఖ్యాక సహస్రనాడులే మహాపద్మాలన బడుతాయి! అగణితనాడీ నిలయమైన దేవరూప పద్మారణ్యంలో వసించు మాతకు ప్రణామాలు. పద్మాలతో పోల్చబడు కాళ్ళు, చేతులు, కన్నులు షట్చక్రములు.
నిత్యానిత్యవివేకదాననిపుణాం స్తుత్యాం ముకుందా దిభిః
యత్యాకార శశాంకమౌలివినుతాం సత్యాపితస్వా శ్రవాం|
నత్యా కేవలమేవ తుష్టహృదయాం త్యక్త్వా న్యదేవా నహం
భక్త్యా మే హృదయాంబుజే నవరతం వందే సదా శారదామ్.
తటిల్లతా సమరుచి - షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ. - 40శ్లో
వారి - నీరు.
వారిచరము - చేప మొ.
వారిజము - 1.తామర, 2.శంఖము, 3.ఉప్పు.
వారిధి - వారాశి, సముద్రము.
వారాశి - నీటికుప్ప, సముద్రము.
నీటికుప్ప - జలరాశి, రూ.నీరుకుప్ప.
వారిచరావతారమున వారధిలోఁ జొరబాణిఁ క్రోధవి
స్తారగుడైన యానిగమ తస్కరనీర నిశాచ నరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికిన్ మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! మత్స్యావతారమునందు సముద్రము లోపల వేగముగా చొచ్చి మిక్కిలి కోపాతిశయము గలిగిననా డవై, వేదములను దొంగిలించు కొనిపోయిన వీరుఁడైన మేటిరాక్షసుఁడగు సోమకాసురుని పట్టి చంపి వేదములచిక్కు విడఁదీసి బ్రహ్మకు మరల వానిని మిక్కిలి యౌదార్యముతో నిచ్చినవాఁడవు నీవే కాని మఱెవ్వరునుగారు. అట్టి నీవు నన్ను కాపాడఁ దగును.
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ|
వారిదము - మేఘము, వ్యు.నీటి నిచ్చునది.
వారిమసి - మేఘము, వ్యు.నీరుని మసివలె నల్లగ చేయును.
భూరిభారధర కుండలీంద్ర మణిబద్దభూవలయ పీఠికాం,
వారిరాశి; మణిమేఖలావలయ వహ్ని మండల శరీరిణీం.
వారిసారవహ కుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం,
చారుచంద్ర రవి లోచనాం మనసి భావయామి పరదేవతాం. - 4శ్లో
సలిలము - నీరు.
సలిలము - కొలువుడు కానిని కొలువు నుండి త్రోయుట, సం.చాలితమ్.
సరతీతి సలిలం. సృ గతౌ. రలయోరభేదః. - ప్రవహించునది.
సరతీతి సలిలం. షల గతౌ - పోవునది.
ఋతము - 1.సత్యమైనది, 2.పూజింప బడినది, 3.ప్రాప్తము, వి.1.జలము, 2.సత్యము, 3.మోక్షము, 4.యజ్ఞము.
ఋతంభరుఁడు - 1.సత్యపాలకుడు, 2.పరమేశ్వరుడు.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు(నల్లనివాడు).
కృష్ణః సర్వంకరీతీతి కృష్ణః - అన్నిటిని జేయువాడు.
డుకృఞ్ కరణే దైత్యాన్ కర్షతీతి వా - దైతులను నలిపివేయువాడు.
కృష్ణ విలేఖనే-కృష్ణవర్ణ త్వాద్వా - కృష్ణవర్ణుడు గనుక కృష్ణుడు.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
నలమేనిదొర - విష్ణువు.
నల - అరువది సంవత్సరములలో నొకటి, వై.విణ.నల్ల.
నల్ల - 1.నెత్తురు blood, వై. వి. నలుపు, 2.బొగ్గు, విణ.నలుపైనది.
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
యాశోదేయుఁడు - యశోద కొడుకు, శ్రీకృష్ణుడు.
కృష్ణమూర్తి - కృష్ణావతారము.
దైవాధీనం జగత్సర్వం - సత్యాధీనంతు దైవతమ్|
తత్సత్య ముత్తమాధీనం ఉత్తమో మమ దేవతా||
తా. ఈలోకమంతయు దైవాధీనమై యున్నది, ఆ దైవము సత్యమున కాధీనమై యున్నది, ఆ సత్యము ఉత్తముల యందున్నది, కాబట్టి ఆయుత్తమ భక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను. - నీతిశాస్త్రము
ఒక్కప్రక్కను దుఃఖ మింకొక్కప్రక్క
సుఖము గూచుచు నుండుట చోద్యమేమొ
నన్ను ముందైనఁ బ్రోవుము కన్నతండ్రి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
కానీనుఁడు - సం. విణ.కన్యకు పుట్టినవాడు వి.1.కర్ణుడు, 2.వ్యాసుడు.
కానీనః కన్యకాజాత స్సుతః : కన్యయాః పుత్రః కానీనః - కన్యక కొడుకు. పెండ్లిగాని పడుచు కొడుకు.
ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని(Saturn), 4.కర్ణుడు, 5.సుగ్రీవుడు.
ప్రొద్దు - 1.సూర్యుడు, 2.కాలము, 3.దినము, సం.బ్రధృః.
సూర్యతనయుఁడు - 1.శని, 2.కర్ణుడు.
సూర్యతనయ - యమున.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
యువరాజు - 1.చిన్నరాజు, రాజు తర్వాత రాజ్యమున కర్హుడైనవాడు, 2.కర్ణుడు.
యౌవరాజ్యము - (రాజ.) యువరాజు యొక్క దొరతనము.
యువరాజస్తు కుమారో భత్తృదారకః. -
యువా చాసౌ రాజా చ యువరాజః. - పిన్నఱేఁడు.
కుమారయతీతి కుమారః. - ఆడువాఁడు. కుమార క్రీడాయామ్.
ద్రియత ఇతి దారకః. - ఆదరింపఁబడువాఁడు.
భర్తుః దారకః భత్తృదారకః - దొరకొడుకు. ఈ 3 యువరాజు పేర్లు.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
భత్తృదారకుఁడు - (నాట్యపరిభాష యందు) యువరాజు.
దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విణ.చీల్చువాడు.
కర్ణుఁడు - కుంతి పెద్దకొడుకు.
కుంతి - పాండవులతల్లి, వికృ.గొంతి.
గొంతి - పాండురాజు పెద్దభార్య, సం.కుంతీ.
కర్ణానుజుఁడు - యుధిష్ఠిరుడు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.
కర్ణుఁడు పాండవుల అగ్రజుడు, యుద్ధమునందు మహావీరుడు, మహాదాత. కుంతీదేవి కన్యగా నున్నపుడు సూర్యుని వలన పుట్టినవాడు.
రాధేయుఁడు - కర్ణుడు.
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
కాలపృష్టము - 1.కర్ణునివిల్లు, 2.విల్లు.
విల్లు - ధనుస్సు.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
అథ కర్ణస్య కాలపృష్టం శరాసనమ్ -
కాలవర్ణ పృష్టో యస్య సః కాలపృష్ఠః - నల్లనైన వెనుకదిక్కుగలది.
కర్ణస్య శరాసనమ్- కర్ణుని విల్లు.
దీనహస్తే ధనంద్యాత్స్వ భార్యాయాంచ యౌవనమ్|
స్వామికార్యేషుచ ప్రాణం నిశ్చయో మమ మాధవ||
తా. ఓ కృష్ణా! మాధవా(మాధవుఁడు- లచ్చిమగడు, విష్ణువు.)! తాను సంపాదించిన సొమ్మును బీదలకు వినియోగము చేయ వలయును, తన యౌవనమును తనభార్య యందు వినియోగము చేయవలయును, తన ప్రాణమును స్వామి(స్వామి - 1.ఒడయడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.)కార్యముల యందు వినియోగ పరచవలయును అని, నా నిశ్చయమని కర్ణుడు చెప్పెను. - నీతిశాస్త్రము
కృష్ణద్వైపాయణుఁడు - వ్యాసుడు.
వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
బాదరాయణుఁడు - వ్యాసుడు.
నల్లని ద్వీపమునందు జన్మించి నందు వల్ల, కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడయినాడు. ద్వైపాయనుడైన వ్యాసమహర్షి అజ్ఞానం నుంచి రక్షించును.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - 1.ముని, తపస్వి.
యమి - 1.ముని, 2.హంస.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.
బదునేడవ(17వ)దియైన వ్యాసగాత్రంబున నల్పమతులయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; పదిహేడోసారి వేదవ్యాసుని రూపంలో అల్పప్రజ్ఞు లైన వారికోసం వేదము అనే వృక్షానికి శాఖలను విస్తరింపజేసాడు.
గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
వ్యాసుడు వశిష్టుని మునిమనుమడు. శక్తికి పుత్రుడు-నిష్కల్మషుడు-పరాశరుని పుత్రుడు. శ్రీశుకుని తండ్రి, తపోధనుడు వ్యాస మహర్షి. కాలాంతరమున ఏకరాశిగా నున్న వేదాలను విడివిడిగా (నాలుగు వేదాలుగా విభజించుట) ఏర్పరచడం మూలాన వ్యాసుడు (వేదాల చిక్కు విడగొట్టేవాడు) లేక వేదవ్యాసుడు అనే పేరు పొందినాడు.
ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
భా. ప్రతియుగంలో కాలం యొక్క ప్రభావంచేత అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారూ అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. వారు అపారమైన వేదరాశిని అధిగమించలేరు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి యుగధర్మానికి తగిన విధంగా ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.
వ్యాసం వసిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్.
భారతము - 1.వ్యాసభట్టారక ప్రోక్తమైన పంచమవేదము, 2.భరత ఖండము.
భరతము - 1.నాట్యము, 2.భరత పిట్ట, 3.భరత ఖండము.
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెడి ఆట.
నాటకము - 1.నర్తనము, 2.ప్రవర్తనము, సం.వి.నాట్య ప్రధానకావ్యము, (దశ విధ రుపకములలో నొకటి).
నృత్తము - నర్తనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తించు - క్రి.1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు.
నర్తనప్రియము - నెమలి; నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి Peacock.
జయ - 1.పార్వతి, 2.పార్వతిచెలి, 3.సంవత్సరములలో నొకటి, 4.మహాభారతము.
జయపెట్టు - క్రి. జయజయయని దీవించు.
జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె - వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము.
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.
దేవుఁడు - భగవంతుడు.
భగవంతుఁడు- 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
నిర్గుణుఁడు- భగవంతుడు, విణ.గుణరహితుడు.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
దైవికము - దైవము వలన కలిగినది.
జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము.
త్రయాణాం దేవానాం - త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా - తవ చరణయో ర్యా విరచితా |
తథహి త్వత్పాదో - ద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వ - న్ముకుళిత కరోత్తం స మకుటాః. - 25శ్లో
తా. ఓ పార్వతీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించినవారైన త్రిమూర్తులకు(బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు)చేసే పూజ కూడా, నీ పదములకు చేయబడినచో నదియే పూజ యగును. ఎట్లనగా ఈ మువ్వురును మణిమయ మగు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో శిరసున చేతులు జోడించుకొని యుండువారే గదా! భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం. – సౌందర్యలహరి
వైకుంఠుడు - 1.విష్ణువు, 2.ఇంద్రుడు.
వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.
వాసుకము - వైకుంఠము. కంఠం వైకుంఠ వాసినీ|
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. వైకుంఠాలయ సంస్థిత రామ్|
వైకుంఠేచమహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి
గంగాచతులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకగాః
కృష్ణప్రాణాధిదేవీత్వం గోలోకేరాధికాస్వయమ్
రాసేరాసేస్వరీ త్వంచబృందావనేవనే|| - 3స్తో
రామో విరామో విరజో మార్గనేయో నయో(అ)నయః
వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మవిదుత్తమః - 43శ్లో
విరజ - వైకుంఠము నందుండు నది(మోక్షం కలగాలంటే దీన్ని దాటాలి). పరమపదమున సమీపముగా నుండునది విరజానది, ఆ విరజా నదియే యమునగా మారి వచ్చినది - తిరుప్పవై.
విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా,
యస్యాః సందర్శనా న్మర్త్యాః పునాత్యాసప్తమం కులమ్ |
ఉత్కలదేశమున విరజయను క్షేత్రముకలదు. ఆ క్షేత్ర అధిస్ఠానదేవతకు విరజయను సంజ్ఞ కలదు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడిన ఈ దేవతా సందర్శనమున నేడుతరముల(ఏడు తరముల)వారిని పునీతుల చేయుదురని బ్రహ్మాండ పురాణమున తెలియుచున్నది.
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. - 149శ్లో
విష్టరశ్రవుఁడు - విష్ణువు, వ్యు.దర్భ పిడికిళ్ళవంటి చెవులు గలవాడు.
విష్టరశ్రవా, స-పు. విష్టరే ఇనశ్రవసీ కర్ణౌయస్యసః - దర్భముడి వంటి చెవులు గలవాడు.
విష్తరే అశ్వర్థతరౌ శ్రూయత ఇతివా – అశ్వర్థ వృక్షము నందు వినబడువాడు.
విష్టరాకారో రోమావర్తః శ్రవసి యస్యసః - విష్టరాకార మైనరోమావర్తము చెవియందుగలవాఁడు.
విష్టరం వ్యాపనశీలంశ్రవః కీర్తిర్యస్యసః – వ్యాపన శీలమైన కీర్తిగలవాడు.
విష్టరము - 1.ఆసనము, 2.మ్రాను, 3.దర్భ పిడికిలి.
దామోదరుఁడు - కృష్ణుడు.
దామోదరః ఉదరే దామయస్యేతి దామోదరః - ఉదరమందు తులసిమాలిక గలవాడు.
దామ్నోఉదరే మాత్రా బద్ధ; - బాల్యమందు యశోద చేత పలుపున నుదర మందుఁ గట్టబడినవాఁడు.
పాలును వెన్నయు మ్రుచ్చిల
ఱోటను మీ తల్లి కట్ట దోషముతోడన్
లీలావినోధి వైతివి
బాలుఁడవా? బ్రహ్మగన్నఁ ప్రభుఁడవు కృష్ణా.
తా. కృష్ణా! పాలు వెన్న (వెన్నముచ్చు - వెన్న దొంగ)దొంగిలించితివని మీతల్లి కోపముతో ఱోటికిగట్ట నీవు లీలావినోదివై యుంటివే కాని, నీవు బాలుఁడవు కావు. బ్రహ్మను(బమ్మ - నలువ, సం.బ్రహ్మ.) గన్నట్టి పరంధాముఁడవు.
ఆబంధము - 1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.
దామము - 1.పలుపు, 2.హారము, దండ.
హారము - 1.నూట ఎనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది ‘హారము ' (Denomination).హారి - 1.మనోజ్ఞము, 2.హరించువాడు, 3.హారము కలవాడు.
దండ - 1.దగ్గర, 2.ప్రాపు, ఆధారము, 3.చోటు.
సందానము - పసువులగట్టు దామెన.
న పుంసి దామ సందానమ్ -
ద్యతి పశుదౌష్ట్య మితి దామ,, స్న. దో అవఖండనే. - పసుల పొగరు బోతుతనమును బోఁగొట్టునది.
సందీయతే బంధ్యంతే అనేనేతి సందానం. డు దాఞ్ దానే. సంపూర్వో బంధనార్థః. - దీనిచేతఁ గట్టఁబడును. ఈ 2 ఉఱ్ఱుకట్టు (దాయఁగట్టు) త్రాడు పేర్లు.
దామని - దామెన త్రాడు.
దామెన - దామని, పెక్కు తలుగులు గల నిడివి తాడు, సం.దామనీ.
పశురజ్జుస్తు దామనీ,
బహుదామయోగత్ దామనీ - పెక్కుతలుగులు గలది.
పా. పసురజ్జుస్తు బంధనీ - పసులఁ గట్టు దామెన పేరు.
కుశము - 1.దర్భ, 2.పలుపు, 3.ఒక ద్వీపము, 4.నీరు.
అస్త్రీ కుశం కుథో ధర్భః పవిత్రం -
కౌశతే కుం శ్యతి నా కుశం. అ.ప్న శీఙ్ స్వప్నే; శోతసూకరణే. - భూమియందుండునది. లేక భూమి నల్పముగాఁ జేయునది కుశము.
విప్రపాణిషు కుథ్యత ఇతి కుథః కుథ శ్లేషణే. - బ్రాహ్మణ హస్తముల యందుఁ గూర్పఁబడునది.
దృణాతి కరాదికమితి దర్భః, దౄ విదారణే. - కరాదులను జీల్చునది.
పూయతే అ నేనేతి పవిత్రం. పూఞ్ పవనే. - దీనిచేతఁ బవిత్రము చేయఁబడును. ఈ 4 దర్భపేర్లు.
కుథము - 1.పవిత్రము, 2.దర్భ, 3.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.
పావనము - పవిత్రము.
పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.
ఉపవీతం యజ్ఞసూత్రం ప్రోద్ధృతే దక్షిణే కరే,
ఉపవీయతే వామస్కంధో (అ)నేనేతి ఉపవీతం. వ్యేఞ్ సంవరణే. - ఎడమ భుజము దీనిచేతఁ గప్పఁబడును.
కుడిచేయి తొడగఁబడుచుండఁగా నెడమభుజము మీఁద నుండు జన్నిదము.
ఉపవీతము - సవ్యముగా వేసికొన్న జందెము.
(ౙ)జందెము - జందియము.
జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.
సూత్రము - 1.నూలిపోగు, చంద్రునికో నూలిపోగు 2.జన్నిదము, 3.ఏర్పాటు, 4.శాస్త్రాది సూచక గ్రంథము, (గణి.) కొన్ని పదములతో నేర్పడు సమీకరణము (Formula), 6.కొన్ని ధర్మముల నుగ్గడించు ప్రవచనము.
ఏర్పాటు - ఏరుపాటు; ఏరుపాటు - 1.నిర్ణయము, 2.నియమము, 3.వివరణము, 4.భేదము, రూ.ఏర్పాటు.
అవధారణము - నిర్ణయము, నిశ్చయము.
నిర్ణయము - ఏర్పాటు; నిర్ణయించు - క్రి.ఏర్పాటుచేయు.
నిశ్చయము - నిర్ణయము; నిర్ధారణ - నిశ్చయము.
వ్యవసితము - నిశ్చయము, విణ.అనుష్ఠింపబడినది.
నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.
ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గఱి) విషయ విపులీకరణము (Exposition).
విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||
(ౙ)జూలు - 1.సింహము మొదలగు వాని మీద వెండ్రుకలు, 2.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.
బర్హము - నెమలిపురి.
దళే(అ)పి బర్హమ్ -
బర్హ శబ్దము ఆకునకును, అపిశబ్దమువలన నెమలిపురికిని పేరు.
బర్హతీతి బర్హం. బృహ వృద్ధౌ. - వృద్ధిఁ బొందునది.
'బర్హం మయూరపింఛే (అ)థ ప్రాధాన్యో ద్యోతవృద్ధిషు, పరివారే పుమా' నితి శేషః.
దబ్భ - 1.బద్ధ, 2.వెదురుబద్ద, 3.దర్భ, సం.ధర్భః.
బద్ద - 1.కాయ యొక్క ఖండము, 2.వెదురుబద్ద, 3.చీలిక, సం.భిత్తః.
కుశస్థలము - కన్యాకులబ్జ దేశము.
కుశస్థలి - ద్వారకానగరము, ఉదా. "కుశస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజింపగ నున్నవాడు".
కౌశాంబి - ఒక పట్టణము, వ్యు.కుశాంబునిచే నిర్మింపబడినది. కౌశాంబికేదేవి నారాయణి నమోస్తుతే|
హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకానా మింద్రియాణామీశః - ఇంద్రిలములకు నీశ్వరుఁడు.
హృషీకం విష యీన్ద్రియమ్,
హృష్యంత్యనేనేతి హృషీకం, హృషతుష్టౌ. - దీనిచేత సంతోషింతురు.
విషయో (అ)స్యాస్తీతి విషయి - విషయము గలిగినది.
ఇంద్రస్య అత్మనః లింగం ఇంద్రియం - ఇంద్రుఁడనఁగా నాత్మ; ఆత్మకు జ్ఞాపకముగనుక ఇంద్రియము. ఈ 3 ఇంద్రియముల పేర్లు.
హృషీకము - ఇంద్రియము.
ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు 5 అను శంఖ్య.
ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్షజ్ఞానము (Perception).
ఖ - ఒక అక్షరము, సం.వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
కేశవుఁడు - విష్ణువు. ద్వితీయం కేశవం తధా|
కేశవః, శోభనాః కేశాః యస్యసః - మంచి వెండ్రుకలు గలవాడు.
కేశిన మసురం హతవానితి - కేశి యను నసురుని జంపినవాఁడు.
కశ్చ ఈశశ్చ కేశౌ, తావస్మిన్ స్త ఇతి వా, తదుక్తం శ్లో,క ఇతి బ్రహ్మణో నామ ఈశో (అ)హం సర్వదేహినాం, ఆవాం తవాంగే నంభూతౌ తస్మా త్కేశవ నామవానితి హరివంశే - బ్రహ్మరుద్రులు ఈయనయందు జనించిరి గనుక కేశవుడు.
కశ్చ అశ్చ ఈశశ్చ కేశ్చాః, తే సంత్యస్మిన్నితి కేచిత్ – బ్రహ్మ విష్ణు రుద్రులు ఈయన యందుండుటవలనః గేశవుఁ డని కొందఱు.
కేశి - 1.ఒకానొక రాక్షసుడు, 2.సింహము, విణ.మంచి తలవెండ్రుకలు కలవాడు.
కేశి - హయశిరుఁడు.
కేశిసూదనుఁడు - శ్రీకృష్ణుడు, వ్యు.కేశియను రాక్షసుని చంపినవాడు.
కేళనః కేశికః కేశీ,
ప్రశస్తాః కేశా స్సన్తస్య కేశవః, కేశికః కేశీ, న్. మంచి వెండ్రుకలుగలవాడు. ఈ 3 మంచి వెండ్రుకలు గలవాని పేర్లు.
ఏకోదేవః కేశవోదా శివోదా, ఏకోవాసః పట్టణందా వనందా|
ఏకోమిత్త్రః భూపతిర్వా యతిర్వా, ఏకోనారీ సుందరీదా దరీదా||
తా. విష్ణువైన(కేశవుఁడు - విష్ణువు), శివుడైన నొకండే దేవుండని నమ్మ వలయును. పట్టణమైన, వనమైన నొండు వాసయోగ్యముగా నెంచ వలయు ను. రాజు(భూపతి - నేలరేడు, రాజు.)తోనైన సన్యాసితోనైన స్నేహము చేయవల యును. సౌందర్యముగలభార్య(నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.)తో గుడియై నను గుహయందైన నుండ వలయును – నీతిశాస్త్రము
శివునిఁ గేశవునిన్ నరున్ సింహము మది
బూని ప్రేమ సాలగ్రామమౌ నృసింహు
సేవ చేయుట మేలగు సిద్ధికాదె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః,
నారసింహవపు శ్శ్రీమాన కేశవః పురుషోత్తమః| – 3స్తో
మాధవుఁడు - లచ్చిమగడు, విష్ణువు.
మాధవః మాయాః లక్ష్మ్యాః ధవః - లక్ష్మీదేవికి భర్త.
యదోర్జ్యాయా స్పుత్రో మధుః, తద్వంశ జత్వాన్మాధవః - యదువనెడివాని పెద్దకొడుకు మధుఁడు; అతని వంశమునఁ బుట్టినవాఁడు.
మధూయతే శత్రూనితివా - శత్రువులఁ గంపింపఁ జేయువాఁడు. ధూఞ్ కంపనే.
సర్వకాలేషు మాధవం| మానవ సేవే మాధవ సేవ.
లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీర్హరిప్రియా,
(ఇందిరా లోకమాతా మా రమా మఙ్గళదేవతా, భార్గవీ లోకజననీ క్షీరసాగరకన్యకా.)
లచ్చి - లక్ష్మీ, సంపద, సం.లక్ష్మీః.
లక్కిమి - లచ్చి. లక్కి - లక్ష్మి, సం.లక్ష్మి.
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదులశోభ, 4.మెట్టదామర.
లక్ష్మీః ఈసీ. లక్ష్యతే సర్వో అనయేతి లక్ష్మీః - ఈమెచేత సర్వము చూడబడుఁగాన లక్ష్మి. లక్ష దర్శనాం కనయోః.
నీళ - విష్ణు భార్యలలో నొకతె.
స్వభువు - 1.విష్ణువు, 2.శివుడు, వ్యు.స్వయముగ పుట్టినవాడు.
స్వభూః ఉః-పు, స్వే నాత్మనా జాయత ఇతి స్వభూః - తనంతఁదానే పుట్టినవాఁడు.
దైత్యారి - విష్ణువు.
దైత్యానామరిః దైత్యారిః-ఇ-పు. - దైత్యులకు శత్రువు.
దైతేయుఁడు - దితికొడుకు, తొలివేల్పు, రూ.దైత్యుడు.
తొలువేలుపు - 1.బ్రహ్మ, 2.అసురుడు, 3.పూర్వదేవుడు.
పుండరీకాక్షుఁడు - విష్ణువు. పుండరీక కాక్ష గోవిందా|
పుండరీకాక్ష. పుండరీకే ఇవ అక్షిణీ యస్య సః - తెల్లదామరవంటి కన్నులు గలవాడు.
పుండరీకం హృత్కమలం అక్ష్ణోతి వ్యాప్నోతీతివా - హృదయకలమలమును వ్యాపించియుండు వాఁడు. అక్షూ వ్యాప్తౌగా. నవమం పుండరీకాక్షం|
పుండరీకము - 1.తెల్లదామర, 2.అగ్నేయ దిక్కునందలి యేనుగు, 3.శార్దూలము, పులి.
పుండరీకవర్ణత్వా త్పుండరీకః - తెల్లదామరవంటి కాంతి గలది. పుణతి శోభత ఇతి వా పుండరీకః, పుణ శుభకర్మణి.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱచెరకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
అనిక్షువు - నల్లచెరకు.
పుణ్ణరీకం సితామ్భోజం :
పుణతి మంగళత్వా త్పుండరీకం. పుణ కర్మణి శుభే.
సితం చ అంభోజం చ సితాంభోజం - తెల్లనైన తామర. ఈ రెండు తెల్లతామర పేర్లు.
శార్దూలము - పులి.
పులి - 1.నల్లని, 2.పులిసినది, వి.శార్దూలము.
పంచనఖము - పిలి, శార్దూలము.
వ్యాఘ్రము - వేగి, పులి.
వ్యాగ్రే (అ)పి పుండరీకో నా -
పుండరీక శబ్దము పులికిని, అపి శబ్దమువలన దిగ్గజమునకును పేరైనపుడు పులింగము. తెల్లదామరకును, తెల్లగొడుగునకును పేరైనపుడు నపుంసకము
పుణతీతి పుండరీకః, పుణ శుభకర్మణి. - శుభకర్మమును జేయునది.
"పుండరీకం సితచ్ఛత్రే సితాంభోజే (అ)పి కీర్తితం, పుండరీకో వ్యాఘ్రభేదే దిగ్గజే క్షుద్ర భేదయో'ది త్యజయః.
మేకవన్నె పులి - జాతీ. మేకవలె సాధువుగా గాన్పించుచు క్రూర స్వభావము కలది.
కుండల త్రివిధ కోణమండల విహారషడ్ద్రళ సముల్లసత్,
పుండరీకముఖ భేదినీం తరుణచండభాను తడిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీం,
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం|
పులిలో కూడా దేవుడు ఉంటాడు నిజమే! కాని మనం ఆ క్రూరజంతువుకు ఎదురుగా వెళ్ళి నిలబడవచ్చునా? అదే విధంగా పరమదుర్మార్గు లలో కూడా భగవంతుడు ఉన్నప్పటికీ మనం వారితో స్నేహం చేయడం మంచిది కాదు. - శ్రీరామకృష్ణ పరమహంస
ధర్మోమే చతురంఘ్రిక స్సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగళితాః కాలాస్సుఖా విష్కృతః
జ్ఞానానంత్య మహౌషధి స్పుఫలితా కైవల్య నాథె సదా
మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే| - 39
తా|| కైవల్యనాథుడైన చంద్రమౌళీశ్వరుడు - నా మానససరోజంలో ఉండగా ధర్మం పాద చతుష్టయంతో గమనం చేసింది. పాపం రూపు మాసిపోయింది. కామ క్రోథ మద మాత్సర్యాది దుర్విషయాలు దూరమయినాయి. కాలం పరమ సుఖంగా గడిచి పోయింది. ఆనంత జ్ఞానం అనే మహౌషధి విశేషంగా ఫలించింది. - శివానందలహరి
మహాయోగపీఠే తటే భీమరథ్యా పరం పుండరీకాయ ధాతుం మునీంద్రైః|
సమాగత్య తిష్ఠంతి మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్|
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
గోష్ఠాధ్యక్షే(అ)పి గోవిన్దః -
గోవింద శబ్దము ఆవుల నేలువానికి, అపిశబ్దమువలన శ్రీకృష్ణునికి, బృహస్పతికిని పేరు. గాః విందీతి గోవిందః. విద్ ఌ లాభే. ఆవులను బొందినవాడు, వాక్కులను బొందినవాఁడును గనుక గోవిందుఁడు.
సాత్వికౌదార్యశంకరాచార్య గురుఁడు
శ్రేయమును గోరి "లక్ష్మీనృసింహ దేహి
మమ కరావలంబన" మని స్మరణ చేసె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
నీవే తల్లివి దండ్రివి,
నీవే నాతోడునీడ * నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము,
నీవే నాపతియు గతియు, నిజముగ కృష్ణా.
తా. కృష్ణా ! నీవే నాతల్లివి, తండ్రివి, హితుఁడవు, సోదరుఁడవు, గురుఁడవు, దైవమువు, నా ప్రభుఁడవు నాకు ఆధారుఁడవు అని నిజముగ నమ్మితిని.
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా|
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.
గరుడధ్వజుఁడు - వెన్నుడు, విష్ణువు, వ్యు.గరుడ చిహ్నము ధ్వజము న కలవాడు.
గరుడధ్వజః గరుడః ధ్వజః యస్య సః - గరుత్మంతుఁడే ధ్వజముగాఁగలవాఁడు.
గరుడకంబము - 1.విష్ణ్వాలయము నందలి ధ్వజస్తంబము, 2.నేరముచేసిన వారిని బంధించుటకై కొత్వాలుచావడి ఎదుట పాతబడిన స్తంభము.
విరాట్టు - 1.ఆదిదేవుడు, 2.క్షత్రియుడు, 3.గరుత్మంతుడు.
గరుత్మాన్ గరుడ స్తారోక్ష్య వైనతేయః ఖగేశ్వరః,
నాగాంతకో విష్ణురథ స్సుపర్ణః పన్నగాశనః.
గరుతః పక్షా అస్య సంతీతి గరుత్మాన్. త-పు. ఱెక్కలు గలవాఁడు.
గరుద్భిః డయత ఇతి గరుడః - ఱెక్కలుచేత నెగసెడివాఁడు.
డీఙ్ విహాయసాగతౌ. గిరతి సర్పానితివా - సర్పములను భక్షించువాడు. గౄ నిగరణే.
తృక్షస్య ఋషే రపత్యం తా ర్ఖ్యః - తృక్షుఁడను మునికొడుకు.
వినతాయా అపత్యం వైనతేయః - వినతకొడుకు.
ఖగానా మీశ్వరః ఖగేశ్వరః - పక్షుల కీశ్వరుడు.
నాగానాముతకః నాగాంతకుః - సర్పములకు నాశకుఁడు.
విష్ణో రథః విష్ణురథః - విష్ణువునకు వాహనమైనవాఁడు.
శోభనాని పర్ణాని పక్షాయస్యసః సుపర్ణః - మంచిఱెక్కలు గలవాఁడు.
పన్నగా అశనం యస్య సః పన్నగాశనః - సర్పము(పన్నగము - పాము)లన్నముగా గలవాఁడు. ఈ 8 గరుత్మంతుని పేర్లు.
గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
గరుతః పక్షా యేషాం తే గరుత్మంతః త. పు. - ఱెక్కలుగలవి.
గరుత్తు - రెక్క, పక్షము.
ఱెక్క - పక్షము. రెక్క - రెక్క, పక్షివిరక.
పక్షము - 1.నెలయందు పదునైదు దినములు(శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.
సేవకుఁడు – కొలువుకాడు.
వజ్రతుండుఁడు - గరుడుడు, వ్యు.వజ్రము వంటి ముక్కుగలవాడు.
బొల్లిగ్రద్ద - గరుడుడు; బొల్లి - 1.తెల్లనిది, 2.తెల్లనివాడు.
తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు - తక్షకుడు.
వైనతేయుఁడు - గరుడుడు, వినతా తనయుడు, అనూరుడు.
అనూరుఁడు - తొడలులేనివాడు, వి.గరుత్మంతుని అన్న (సూర్యసారథి).
వినత - గరుత్మంతుని తల్లి.
ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖగపతి - గరుడుడు.
పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పులుఁగు - పిట్ట.
బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.
తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.
తూపురిక్కనెల - శ్రావణమాసము.
నాగాంతకుఁడు - గరుడుడు, వ్యు.పాములను చంపువాడు.
పెందిరువడి - గరుడుడు (వైష్ణవ పరిభాష యందు.)
పెందెరువు - రాజమార్గము.
పెరుమాళ్ళు - విష్ణువు, త. పెరుమాళ్.
ఆళువారు - 1.హరిభక్తుడు, 2.గరుత్మంతుడు, రూ.ఆళ్వారు.
వైష్ణవుఁడు - విష్ణుభక్తుడు.
వైష్ణవము - విష్ణుసంబంధమైనది, వి.ఒక మతము.
సుపర్ణుఁడు - గరుత్మంతుడు, వ్యు.మంచి రెక్కలు గలవాడు.
పక్షిణాం బలమాకాశం - మత్స్యానా ముదకం బలమ్|
దుర్బలస్య బలంరాజా - బాలానాం రోదనం బలమ్||
తా. పక్షులకు ఆకాశము బలము, చేపలకు నీళ్ళు(ఉదకము - నీరు, (వ్యు.)తడుపునది, రూ.ఉదము.)బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము(రోదనము - 1.శోకము, ఏడ్పు, 2.కన్నీరు.)బలము. – నీతిశాస్త్రము
The reason why birds can fly and we can’t is simply that they have perfect faith, for to have faith is to have wings. – J. M. Barrie, The Little White Bird
సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్ |
సూర్యసూతమనూమారుం చ కద్రూర్నాగాననేకశః |
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, గరుడ పురాణము(మజ్జ) 12000 శ్లోకములు గలది. గరుడదేవతాకమైన అస్త్రము.
గరుడ పచ్చ-ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ.
గారుత్మతం మరకత మశ్మగర్భో హరిస్మణిః -
గరుత్మతో జాతం గారుత్మతం – గరుత్మంతుని వలనఁ బుట్టినది.
మరం మరణం తకత్యనేనేతి మరకతం. తక హనహసనయోః - విషహరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.
అశ్మగర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగాఁ గలది.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి. ఈ 4 పచ్చల పేర్లు.
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.
ప(ౘ)చ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొడుచు పసరు రేఖ, సం.పలాశః.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ.
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
అద్భ్యో(అ)గ్ని ర్బ్రహ్మతః క్షత్రమ్ అశ్మనో లోహముత్ధితమ్ |
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శామ్యతి ||
నీటినుండి అగ్ని పుట్టింది. బ్రాహ్మణత్వం నుండి క్షత్రియత్వం పుట్టింది. రాతినుండి లోహం పుట్టింది. అంతటా ప్రసరించే వీటి తేజస్సు తమ జన్మ స్థలాల్లో మాత్రం అణగిపోతుంది.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 2.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
అంచనా - పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.
మందాళి - 1.పచ్చపట్టు చీర, 2.కృత్రిమ మరకతము.
మంజడి - 1.చిత్రవర్ణ వస్త్రము, నీల వస్త్రము, సం.మాంజిష్ఠమ్.
ఇంద్రనీలము - నీలమణి; కప్పుఱాయి - నీలమణి.
నీలము - ఒక విలువ గల రత్నము,(Sapphire). (ఇది రాసాయని కముగ ఎల్యూమినియమ్ ఆక్సైడ్ (Corundum). దీని నీలిరంగునకు కారణము అందులో అతిసూక్ష్మరాశిగా నుండు క్రోమియమ్ ఆక్సైడ్).
నీలము - 1.నీలిచెట్టు, Indigo plant, 2.నలుపు, 3.నల్లరాయి.
నీలి - నల్లనూలు Black wool, విణ.నల్లనిది, సం.నీలమ్. సం.వి.ఒకానొక చెట్టు, విణ.గారడము, సం.వి.(వ్యవ.) నీలిమందు (Indigo), రంగు ద్రవ్యములలో నొకటి, (Leguminose) అను కుటుంబములో Papilonaceae అను కుటుంబమునకు చెందిన Indigo feratinctoria అను మొక్క పట్తనుండి దీనిని తయారు చేయుదురు).
నీలీకరణము - (గృహ.) బట్టలకు నీలివేయుట, తెల్లబట్టలను ఉదికినప్పుడు తేట నిచ్చుటకై కొంచెము నీలి రంగు వేయుట (Bluing).
నీలలోహితము - (రసా.) బచ్చలి పండు రంగు గలది (Purple).
నీలలోహితుఁడు - శివుడు. నీలకంఠుఁడు – శివుడు.
కంఠేకాలుఁడు - శివుడు, వ్యు.కంఠము నందు నలుపు కలవాడు.
నీలకంఠము - 1.నెమలి, 2.పిచ్చుక, (నల్లని కంఠము కలది).
నిక్కమైన మంచినీల మొక్కటిచాలుదళుకు బెళుకురాళ్ళు తట్టెడేల
చాటుపద్యమిలను చాలదాయొక్కటి? విశ్వ.
తా|| శ్రేష్ఠమైన నీలము అనురత్నము ఒక్కటివున్ననూ చాలును. రత్నమువలె తళతళ మెఱయుచుండు రాళ్ళు తట్టెడువున్ననూ ప్రయోజనము లేదుగదా. ఆవిధముగనే యీలోకములో మంచి నీతిని బోధించు చాటు పద్యము(చాటువు - 1.ప్రియమైనమాట, 2.గ్రంథస్థము కాకున్నను లోకమున ప్రజాదరణ పొందిన పద్యము.)ఒక్కటైనను చాలును.
నీల - శ్యామ వర్ణము కలది purple, శివుడు, Indigo, పచ్చ, pearl.
పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.
పీతాంబరః, పీత మంబరం యస్యసః - పచ్చని వలువ గలవాఁడు.
పీతము - పసుపురంగు, విణ.త్రాగబడినది.
పీతాంబర పరిధాన సూరకల్యాణనిధాన నారాయణ|
అచ్యుతుఁడు - విష్ణువు.
అచ్యుతః నాస్తి చ్యుతం స్ఖలనం న్వపదాద్యన్యసః - తన చోటునుండి భ్రంశము నొందనివాఁడు.
అచ్యుతః ప్రధితః ప్రాణ ప్రాణదో వాసవానుజః
అపారం నిధి రధిష్ఠాన మప్రమత్తః ప్రతిష్ఠితః|
ఐశ్వర్యాశ్రమ చిన్పయచిద్ఘన అచ్యుతానంద మహేశశివ|
శార్ఙి - విష్ణువు, వ్యు.శార్ఙ్గము కలవాడు.
శృఙ్గస్య వికారః శార్ఙ్గీం ధనుః తదస్యాస్తీతి శార్ఙ్గీ మనెడి విల్లు గలవాఁడు.
శార్జము - విష్ణువు విల్లు, విల్లు, వ్యు.శృంగముతో జేయబడినది.
శృంగము - 1.కొమ్ము, 2.కొండ కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.
కూటో (అ)స్త్రీ శిఖరం శృఙ్గమ్ -
కూట్యతే దహ్యతే సూర్యదావాభ్యాం కూటః, అ. ప్న. కూటదా హే. - సూర్యదావాగ్నులచేత దహింపఁబడునది.
శిఖేవాగ్ర శిలా అస్యాస్తీతి శిఖరం. అ. ప్న. శిఖవంటి కొనఱాయిగలది. "సారాంధకార శిఖర సహస్రాంగారతోనా" ఇతి పున్నపుంసకాధికారే చంద్రగోమినా పఠితత్వాత్ శిఖరశబ్దస్య పుంస్త్వమపి.
శృణాని హినస్తీతి శృంగం. శౄ హింసాయాం. - హింసించునది. ఈ 3 పర్వతశిఖరము పేర్లు.
కూటము1 - 1.కొలువు కూటము, 2.చావడి.
కూటము2 - 1.అమ్ము, 2.కపటము, 3.కొఱ్ఱు, 3.దుఃఖము, 4.ప్రోగు, 6.బొంకు, 7.ఇల్లు, 8.కొండకొమ్ము, పర్వత శిఖరము.
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టుకొన, 3.కొన.
కొవురు - 1.కొండకొమ్ము, 2.శిఖరము, 2.ఉన్నతి, సం.గోపురమ్.
కొప్పరము - 1.కొండ కొమ్ము, 2.ఉన్నతి, 3.మూపు, 4.వికసించినది.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
గోపురము - 1.గవసు, పురద్వారము, వాకిలి, 2.గాలిగోపురము, దేవాలయ ముఖమున ఎత్తుగా కట్టినద్వారము, (గణి.) సూచ్యగ్ర స్తూపము (Pyramid).
పిరమిడ్లు - (చరి.) (Pyramids) ఈజిప్టులోని పెద్దరాతి కట్టడములు. ఇవి త్రికోణాకారములో ప్రాచీనకాలపు ఈజిప్టు చక్రవర్తులైన ఫారోలకు స్మారక చిహ్నములుగా కట్టబడినవి(వీనిలో కెల్ల పెద్ద పిరమిడు ' గిజే ' పిరమిడు 6 మైళ్ళ పొడవులో 484 అడుగుల ఎత్తు 13 1/4 ఎకరముల వైశాల్యముతో నైలునది Nile river యొద్ద నున్నది.)
కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ,వి. కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ,వి. ఎండిన గడ్ద, ఉదా.పసుపుకొమ్ము, శొంఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 6.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కోన, 10.ఉత్సాహము.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్మువాడు.
శృంగము - 1.కొమ్ము, 2.కొండ కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
సింగాణి - 1.కొమ్ములతోచేసిన విల్లు, 2.విల్లు, రూ.సింగిణి, సం.శార్జ్గమ్, శృంగిణీ.
శృంగిణి - ఆవు. ప్రద్యుమ్నే శృంగాళాదేవి శక్తిపీఠం|
శృంగయోగాత్ శృంగిణీ. ఈ. సీ. - కొమ్ములు గలది.
శృంగము క్తత్వాత్ శృఙ్గీ. సీ. - కొమ్ములు గలది.
ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
పీలుపు - 1.ఏనుగు, 2.అమ్ము, 3.పరిమాణువు, 4.గోగు, 5.టేకు.
పృషత్కము - అమ్ము, బాణము.
కుముద - 1.టేకు, 2.గుమ్మడు.
టేకు - శాక వృక్షము.
గుమ్మఁడు - అలంకరించుకొనువాడు, సొగసుకాడు.
సొగసుకాఁడు - విటకాడు, విణ.అందగాడు.
విటకాఁడు - విటుడు.
శృంగారి - 1.విటుడు, 2.ఏనుగు, విణ.శృంగారము కలవాడు, వి.సింగారి.
సింగారి - శృంగారవతి.
కూష్మాండము - 1.గుమ్మడి, 2.ఒక విధమగు పిశాచము.
గుమ్మడి - పెద్ద పెద్దకాయలు కాయు తీగ, సం. కూష్మాం(శ్మా)డః. కూష్మాండేతి చతుర్థకీ|
కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.
కూశ్మాణ్డకస్తు కర్కారుః -
కు ఈషత్ ఊష్మా అండేషు బీజేష్వస్యేతి కూశ్మాండకః - కుత్సితమైన ఉష్ణము బీజముల యందుఁ గలది. పా. కూషాండః.
తృప్తిం కరోతీతి కర్కః, ఇయర్తీతి అరుః, కర్కశ్చాసౌ అరుశ్చ కర్కారుః. పు. - తృప్తిని జేయునదియును వ్యాపించునదియును గనుక కర్కారువు. ఈ రెండు గుమ్మడి పేర్లు.
అర్ణము - 1.నీరు, 2.వర్ణము, అక్షరము, 3.టేకు, విణ.1.చలించునది, 2.కలతపడినది.
వర్ణము - 1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.
వర్ణుఁడు - కుమారుడు; కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
వర్ణో ద్విజాదౌ శుక్లాదౌ స్తుదౌ వర్ణం తు వాక్షరే :
వర్ణశబ్దము బ్రహ్మక్షత్ర వైశ్యశూద్ర జాతులకును, తెలుపు, నలుపు మొదలైన వన్నెలకును, స్తోత్రమునకును పేరైనపుడు పు. అక్షరమునకు పేరైనపుడు ప్న వర్ణ్యతే, వర్ణయతి వర్ణం. వర్ణ స్తుతౌ. - కొనియాడఁ బడునది, కొనియాడునది గనుక వర్ణము. "వర్ణస్తాల విశేషేస్యాద్ బ్రహ్మచర్యే విశేషనే, విలేపనే కుధాయాం"చేతి శేషః.
సంహిత - 1.వర్ణసంయోగము, 2.ధర్మశాస్త్రము, విణ.సంధింపబడినది.
వర్ణా స్స్యుర్బ్రాహ్మణాదయః :
వర్ణ్యంతే కపిలారుణ పీతకృష్ణవర్ణ్యేః నిరూప్యన్త ఇతి వర్ణాః. వర్ణ స్తుతౌ. - కపిలారుణ పీత నీల వర్ణములచేత స్తోత్రము చేయఁబడునది. "కపిలాశ్చారుణాః పీతాః కృష్ణా శ్చేతి పృథక్పృథక్, బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రా శ్చేతి వివక్షితాః" ఇతి శ్రీవిష్ణుపురాణే. - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులు.
(విప్ర క్షతియవిట్ఛూద్రా శ్చాతుర్వర్ణ్యమితి స్మృతమ్)
(బ్రహ్మక్షత్త్రవిట్ఛూద్ర వర్ణములు గూడి చాతుర్వర్ణ్య మనంబడును. చత్వారో వర్ణాః చాతుర్వర్ణ్యం. - నాలుగు జాతులు గనుక చాతుర్వర్ణ్యము.)
వేదాంతగో బ్రాహ్మణః స్స్వాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధః స్స్వాత్ శూద్రః స్సుఖమవాప్నుయాత్.
అ(ౘ)చ్చరము - అక్షరము, సం.అక్షరమ్.
అక్కరము - అచ్చరము, సం.అక్షరమ్.
అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి. 1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.
అక్షమాల - 1.అకారము మొదలు క్ష కారము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తావళము, 3.అరుంధతి.
అక్షసరము - జపమాల; అక్షసూత్రము - జపమాల. రుద్రాక్షమాల - అక్షమాల.
తావడము- రుద్రాక్షలు మొదలగునవి కూర్చిన హారము, రూ.తావళము.
అరుంధతి - 1.వసిష్ఠుని భార్య, సతుల యందు దేవీస్థానం అరుంధతి| 2.ఒకానొక నక్షత్రము, 3.దక్షుని కూతురు, వికృ. ఆరంజ్యోతి.
ఆరంజ్యోతి - 1.వసిష్ఠుని భార్య, 2. ఆ పేరుగల నక్షత్రము, సం.అరుంధతీ.
అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.
అ(ౘ)చ్చరము - అక్షరము, సం.అక్షరమ్.
అక్కరము - అచ్చరము, సం.అక్షరమ్.
అకారాది క్షకారాంత సర్వవర్ణ కృతస్థలా,
సర్వలక్ష్మీ స్సదానందా సారవిద్యా సదాశివా|
ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.
ప్రణవము - ఓంకారము.
ఓం - 1.పరబ్రహ్మార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క సారభూతము. వేదాంత గ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ + ఉ + మ). మంత్రముల కెల్ల శిరోమణి. ఓంకారము నందు సమస్తజగత్తును ఇమిడి యున్నదని వేదములు చెప్పుచున్నవి). ఓంకార మమలేశ్వరమ్ |
ఓంకారేశ్వరుడు - శివుడు.
ఓంకార ప్రణవౌ సమౌ :
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రకృష్టో నవః ప్రణవః, ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము. ప్రణూయతే ప్రస్తుయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయఁబడునది. ఈ రెండు ఓంకారము పేర్లు.
కావేరికానర్మదయోః పవిత్రే, సమాగమే సజ్జనతారణాయ|
సదైవ మాన్ధాతృపురే వసన్త, మోంకార మీశం శివ మేక మీడే||
శాకము - 1.కూర, 2.టేకు చెట్టు, 3.ఒక ద్వీపము.
శాకకృషి - (వృక్ష.) కూరగాయల తోటలను పెంచుట (Vegetable cultivation).
కూర - శాకము, వ్యంజనము, సం.కూరమ్.
వ్యంజనము - 1.కూర, దప్పళము(దప్పళము - పులుసు), 2.లేహ్యము.
కూరదినుసులు - (వ్యవ.) కూరగాయల నిచ్చు పైరులు, ఉదా. బెండ, బీర, తోటకూర, మొ.వి.(Vegetables).
ఆకులురాలు చెట్ల అడవులు - (భూగో.) వెడల్పు ఆకులుగల చెట్ల అడవులు. ఇవి సమశీతమండలమున పెరుగును. ఇవి ఉత్తరార్థగోళము నను, దక్షిణార్థగోళమునను 45 డిగ్రీలు(degrees) మొదలుకొని 55 డిగ్రీల వరకు ఉన్నవి. శీతకాలమున కలుగు మంచు శీతలత నుండి రక్షించుకొనుటకై శీతకాలము రాకపూర్వమే చెట్టు తమ ఆకులను రాల్చి వైచును. ఉదా. సుందూరము, టేకు(టేకు - శాక వృక్షము.) ఎల్మ మొ. వృక్షములు ఈ జాతికి చెందినవి.
ఋతుపవనారణ్యములు - (భూగో.) 40" మొదలు 80" వరకు వర్షము గల ప్రదేశములలో నున్న అడవులు (వెడల్పయిన ఆకులు గలిగి, వేసవిలో ఉష్ణము నుండి తప్పించుకొనుటకై ఆకులురాల్చును, వర్షకాల మందు పుష్పించి ఆకులు వేయు చెట్లుగల అడవులు. ఉదా. టేకు చెట్ల అడవి.)
చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదనుగ మంచికూర నలపాకముచేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టఁగనేర్చునటయ్య, భాస్కరా.
తా. కూరలో వేయవలసిన పదార్ధములన్నియువేసి బాగుగా వండినను అందు ఉప్పు(salt)మాత్రము వేయనిచో అది రుచిగాయుండదు. అట్లే సమస్త విద్యలను(ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.)అభ్యసించిన మానవునకు గూడ ఆ గ్రంధములోని సారము గ్రహింప లేనిచోవానిని సజ్జను లెవ్వరును మెచ్చరు. అప్పుడు వాని ౘదువు నిరర్థకముగా(నిరర్థకము-ప్రయోజనము లేనిది.)తలచ బడును.
విష్వక్సేనుఁడు - విష్ణు సేనాధిపతి.
విష్వక్సేనః విష్వక్సమంతతః వ్యాప్తౌ సేనాయస్య సః - అంతట వ్యాపించిన సేన గలవాఁడు.
విష్వక్సేనప్రియా ఘృష్టి ర్వారాహీ బదరేత్యపి
విష్వక్సేనప్రియత్వా ద్విష్వక్సేన ప్రియా - విష్ణువునకుఁ బ్రియమైనది.
వారాహైః ఘృష్యత ఇతి ఘృష్టిః సీ. ఘృషు సంఘర్షణే. - వరాహములచేత నొరయఁ బడునది.
వారాహైరాక్రాంతా వారాహీ. - అడవిపందులచేత నాక్రమింపఁ బడునది.
బదతి స్థిరీభవతీతి బదరా. బడస్త్యైర్యే. – స్థిరమై యుండునది. ఈ మూడు 3 పాఁచితీఁగె పేర్లు.
ఘృష్టి - 1.పాచితీగ, 2.పోటి, 3.పంది, 4.రాపిడి, 5.కిరణము.
పోటి - 1.స్పర్థ, 2.ఊతగానిల్చిన స్తంభాదికము.
ఒరపిడి - రాపిడి, రూ.ఒరయిక.
సమ్మర్దము - 1.రాయిడి, రాపిడి, 2.గుంపు.
ఘృణి - 1.కిరణము, 2.వెలుగు.
వారాహి - 1. ఒక మాతృక, 2.అడవి యాడుపంది. కటిం చ పాతు వారాహి|
వరారోహ - ఉత్తమ స్త్రీ, పెద్ద పిరుదులు గల స్త్రీ. సోమేశ్వరము నందు దేవీస్థానం వరారోహ|
వామ - ఉత్తమ స్త్రీ.
వామదేవుఁడు - శివుడు.
విశుక్రప్రాణహరణ - వారాహీ వీర్యనందితా|
కామేశ్వరముఖాలోక - కల్పితా శ్రీగణేశ్వరా.
బదర - 1.పగులు, 2.తునక.
పగులు - చీలిక, క్రి.భిన్నమగు.
చీలిక - చూ.చీలిక
చీరిక - 1.పాయ, రూ.చీలిక.
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, ఆఫ్రికా అస్త్రేలియా, ఐరోపాఖండములు), (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన ఘనరూపభాగము, (భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్న భిన్నముగ చేయబడిన భూభాగము.
ఇండె - 1.పూడంద, 2.ఎముక కీలు, 3.చీలిక.
భిన్నము - 1.పగిలినది, చీలినది, 2.వేరుపడినది, సం.వి.(గని.) ఒక రాశిలోని భాగము (Fraction).
చీలికలోయ - (భూగో.) రెండు రకముల భూభాగముల మధ్య పగులేర్పడి, భూకంపము లేక యితర కారణముల వలన భూమి దించుకొని పోయి లోయగా నేర్పడిన భూభాగము.
జనార్ధనుఁడు - విష్ణువు.
జనార్థనః సముద్రమధ్యవరినో జననామ్నో సురా నర్దితవానితి జనార్థనః - సముద్రమధ్యమం దుండెడు జనులనెడు నసురులఁ(అసురులను)బీడించువాఁడు.
ప్రళయకాలే స్సర్వానపి అరయతీతి వా జనార్దనః - ప్రళయకాలమం దెల్ల జనులను బీడించువాడు. అర్దపీడనే. దశమం తు జనార్ధనమ్|
అసృ గంగారకో (అ)వంతిదేశాధీశో జనార్థనః,
సూర్యయామ్యప్రదేశస్థో యౌవనో యామ్య దిఙ్ముఖః|
ఉపేంద్రుఁడు - 1.వామనుడు, విష్ణువు, 2.కృష్ణుడు.
ఉపేంద్రః ఇంద్ర ముపగతః అనుజత్వా దుపేంద్రః - ఇంద్రునికి తమ్ముడు గనుక ఉపేంద్రుడు.
ఇంద్రరక్షణాయ తత్సమీపే స్థితో వా - ఇంద్రుని రక్షించుటకై అతనియొద్ద నున్నవాఁడు.
ఇంద్రలోకా దుపరితిస్థతీతి వా ఉపేంద్రః – ఇంద్ర లోకమున కంటె పైలోక మందుండువాఁడు.
ఇంద్రావరజుఁడు - ఇంద్రునితమ్ముడు, ఉపేంద్రుడు, విష్ణువు.
ఇంద్రస్య అవరజః ఇంద్రావరజః - ఇంద్రునికి దమ్ముడు.
అవరజుఁడు - తమ్ముడు.
అవరస్మిన్ కాలే జాతుః అవరజః - తరువాతి కాలమందుఁ బుట్టినవాఁడు.
రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్
శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజి త్సంజ్ఞాత లగ్నంబునన్
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్య వ్రతోపేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.
భా|| నిర్మలమైన గొప్ప పుణ్యవ్రతమును ఆచరించినది గొప్ప పతివ్రతగా పేరు పొందినది అయిన దేవమాత అదితి(అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య, 2.పార్వతి, 3.భూమి, 4.పునరవసు నక్షత్రము.)గర్భంనుండి వామన రూపంతో మహావిష్ణువు శ్రావణమాస ద్వాదశి, శ్రవణా నక్షత్రం, అభిజిత్తు లగ్నం, పట్టపగలు సూర్యుడు(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.) ఆకాశం నట్టనడుమ ప్రకాశించుచుండగా, గ్రహాలు నక్షత్రాలు చంద్రుడు ఉచ్చదశలో ఉండగా సమస్త లోకాలకు అధిపతి దేవదేవుడు జన్మించాడు.
వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు.
టింగణా - పొట్టివాడు, వామనుడు.
కొట్ర1 - వామనుడు, సం.ఖటేరకః.
కొట్ర2 - పిండి మొ.వి ఉడుకబెట్టుటకు పెట్టిన ఎసరు.
పదునేనవదియైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించిమూడు లోకంబుల నాక్రమించెఁ; పదిహేనో అవతారంలో మాయా "వామనాతారు" డై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి(త్రివిక్రముడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించినవాడు.)ముల్లోకాలు ఆక్రమించాడు.
పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొ త్తమే
లొదవజగ త్తయంబుబురుహుతునకియ్య వటుండవై నచి
త్సదలమూర్తి నీవెకద దాశరథీ కరుణా పయోనిధీ.
తా. ఒక పాదము భూమియందును, మఱొకటి ఆకాశమునందును పెట్టి, యట్లు రెండు పాదము లచే లోకమాక్రమించి, మహాపరాక్రమవంతుఁడైన బలిచక్రవర్తి తలమీద నొక పాదము పెట్టి పాతళమునకు అణఁగ ద్రొక్కి మేలగునట్లు ముల్లోకములను ఇంద్రునకు(పురుహూతుఁడు - ఇంద్రుడు, వ్యు.యజ్ఞములం దెక్కువగ పిలువ బడువాడు.) ఇచ్చుటకై వటువుగాఁ(వటువు - బ్రహ్మచారి, బాలకుడు.)గా బుట్టిన సచ్చిదానంద మూర్తివి నీవెకాని మఱి యెవ్వరునుగారు కనుక నన్నుఁ గాపాడుమా !
పదనఖనీరజనిత జనపావన |
కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే!
సమయమును గాంచి ద్వేషవేషమును మార్చి
రాక్షసులమైత్రి చేసిరి శిక్ష కనిరి
గొడుగు వట్టిరి వలసిన యడుగు మాని
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
వామము - ధనము, విణ. 1.ఎడమ, 2.సుందరము, 3.హ్రస్వము.
దా - 1.ఎడము, 2.సవ్యము, డా యొక్క రూపాంతరము (దాపల - డాపల)క్రి. రమ్ము.
ఎడము - 1.చోటు, తావు, 2.అవకాశము, 3.నడిమిభాగము.
సవ్యము - 1.ఎడమ, 2.కుడి, 3.ప్రతికూలము.
ఎడమ - సవ్యము, వ్యతి.కుడి, వి.వాసుభాగము.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము వలపల.
అపసవ్యము - 1.ప్రతికూలము, కుడిభాగము.
వామౌ వల్గు ప్రతీపా ద్వౌ - వామశబ్దము మనోహరమైనదానికిని, ప్రతికూలమైనదానికిని పేరు. వాయతే వమ్యత ఇతిచ వామః, వా గతి గంధనయోః, టు వము ఉద్గిరనే. - పొందఁబడునది; విడువఁబడునదియును గనుక వామము. "వామ పుంసి హరే క్లీబం ద్రవినే స్త్రీతు యోషితి, వామీ సృగాలీ బడబా రాసభీ కరభీషుచే"తి శేషః.
కూబరము - మనోజ్ఞము, సుందరము, సం.వి.1.బొండినొగ, 2.మోచేయి.
హ్రస్వము - కురుచ, పొట్టి.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
వామ - ఉత్తమ స్త్రీ.
వామత్వేన వక్రస్వభావత్వేన రమ్యత్వేన వా వామా - వక్రశీలమైనదిగాని, రమ్యమైనదిగాని వామ.
వామదేవుఁడు - శివుడు.
వాముః శ్రేష్ఠ స్ప చాసౌ దేవశ్చ వామదేవః - శ్రేష్ఠుడైన దేవుఁడు.
వామపార్శ్వే ధృతా దేవీయస్య నః - ఎడమ ప్రక్కను ధరింపఁబడిన భార్య గలఁడు.
వామయా దీవ్యతీతి నా - స్త్రీచే బ్రకాశించువాఁడు.
దివ్ క్రీడావిజీగీషా వ్యవహార - ద్యుతి స్తుతిమోద మద స్వప్న కాంతిగతిషు. వక్రత్వాద్వామస్స చాసౌ దేవశ్చేతి వా - వక్రక్వము గల దేవుఁడు.
వామనము - లేతది.
వామనత్వా త్వామనః - పొట్టిదిగనుక వామనము. వామం వల్గు శరీర మస్యాస్తీతి వా వామనః - అందమైన శరీరము గలది.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.
ఖర్వము - 1.ఒక సంఖ్య (10,000,000,000), 2.కుబేరుని నిధులలో ఒకటి, విణ.1.అధమము, 2.పొట్టిది, 3.స్వల్పము.
అథ వామనే,
న్య ఙ్నీ చ ఖర్వ హ్రస్వా స్స్యుః -
వామో వల్గుత్వ మస్యాస్తీతి వామనః - ఒప్పిదము గలది.
నిమ్నమంచతీతి న్యఙ్. చ. నీచశ్చ. అఞ్చుగతిపూజనయోః - దిగువఁబొందునది.
ఖర్వత్యవయ పదార్ద్యేనేతి ఖర్వ గర్వ దర్పే. - అవయవ దార్ఢ్యముచేత గర్వించునది.
హ్రసతీతి హ్రస్వః. హ్రస హ్రాసే. - కొంచెమై యుండునది. ఈ 4 కుఱుచైనదాని పేర్లు.
అధమము - తక్కువైనది, నీచము.
హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).
హ్రస్వము - మిక్కిలి పొట్టిది.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
స్వల్పము - మిక్కిలి అల్పము.
హ్రస్వదృష్టి - (భౌతి.) దగ్గరనున్న వస్తువులే కనిపించుదృష్తి (Short-sight) దూరపు వస్తువులు సరిగా కనిపించక పోవుట.
హీనాంగా నతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయౌధి కాన్ |
రూపద్రవ్య విహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షి పేత్ ||
తా. కుఱచగల నిడుపులైన చేతులు, కాళ్ళు మొదలయిన అవయములుగల వారలను, విద్యావిహీనులను, వయసుచేత పెద్దనైన వారలను, సౌందర్యము(చక్కదనము), ద్రవ్యము(ద్రవ్యము - ధనము, వస్తువు), జాతి వీనిచే(హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.)దక్కువైన వారలను ఆక్షేపింపఁ గూడదు. - నీతిశాస్త్రము
వట్రము - కురుచ, హ్రస్వము, వి.వక్కాకు తిత్తి.
గిడస - హ్రస్వము, పొట్టి, గిటక.
హ్రస్వము - కురుచ, పొట్టి.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
గిటక - పొట్టి, పొట్టివాడు.
ఖర్వో హ్రస్వశ్చ వామనః,
ఖర్వతి వికలాఙ్పేక్షయా శ్రేష్ఠత్వేన దృప్యతి ఖర్వః కర్వ ఖర్వ గర్వ దర్పే. - వికలాంగునికంటె శ్రేష్ఠుఁ డౌటచేత గర్వించువాఁడు.
హ్రస్యతే హ్రస్వః హ్రసశ్బ్దే నవ్వఁబడువాఁడు.
వామత్వమస్యాస్తీతి వామనః - కుటిలత్వము గలవాఁడు. ఈ 3 పొట్టివానిపేర్లు.
వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు. చతుర్ధం వామనం తధా|
బురుక - బిడ్డ, విణ.పొట్టి.
బురుకఁడు - వామనుడు, పొట్టివాడు.
బుడుత - 1.బిడ్డ, బాలుడు, విణ.పొట్టి (బుడుతడు). చిన్నవాడు - బాలుడు.
బుడుతకీచులు - పోర్చుగీసు దేశస్థులు (Portuguese).
రణే జిత్వా దైత్యా - నపహృతశిరస్త్రైః కవచిభి
నివృతై శ్చణ్డాంశ - త్రిపురహర నిర్మాల్య విముఖైః|
విశాఖేంద్రో పేన్ద్రై - శ్శశి విశద కర్పూరశకలాః
విలీయంతే మాత - స్తవ వదనతాంబూల కబళాః| - 65శ్లో
తా. ఓ మాతా! రణరంగంలో రాక్షసుల జయించి వచ్చి, తలపాగాలను విడదీసి, కవచముల నింకను ధరించి యున్నవారై, చణ్డాంశ(చండుఁడు - 1.మిక్కిలి కోపము గలవాడు, 2.వాడిమి కలవాడు. )డను ప్రమథునిచే ననుభవింప దగిన శివుని(హరుఁడు - శివుడు)నిర్మాల్యము నొల్లని విశాఖుడు(విశాఖుఁడు - స్కందుడు), ఇంద్రుడు, ఉపేంద్రుడు మువ్వురు – చంద్రునివలె(విశదము - తెల్లనిది, స్పష్టమైనది.) నిర్మలము లైన కప్పురపు తునకలు గల, నీ వదన(వదనము - నోరు, ముఖము.)తాంబూలము యొక్క విడెము ను(కబళము - ముద్ద, కడి, గ్రాసము.)తినుట కుత్సాహించుచున్నారు అని భావము. - సౌందర్యలహరి
అతీంద్రః స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః| - 17స్తో
చక్రపాణి - విష్ణువు.
చక్రపాణిఁ ఈ-పు. చక్రం పాణౌ యస్యసః - చక్రము హస్తము నందు గలవాఁడు.
అధిస్ఠానము - 1.దగ్గర నుండుట, 2.వసించుట, 3.ఉనికి పట్టు, 4.ఆధారము, 5.చక్రము, 6.ప్రాభవము, ఏలుబడి, 7.ఒకానొక పట్టణము.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 6.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.
చక్రము - 1.శ్రీకృష్ణుని ఆయుధము, 2.బండికల్లు, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము, 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.
చక్రం సుదర్శనః
సుదర్శన, అ. ప్న. భక్తైస్సుఖేన దృశ్యత ఇతి సుదర్శనః - భక్తులచేత సుఖముగాఁ జూడఁబడు నట్టిది. శోభనం దర్శన మస్యేతి వా.
సుదర్శనము - విష్ణుచక్రము.
వేయం(ౘ)చులవాలు - విష్ణుచక్రము.
ప్రల్ల దనంబుచే నెఱుకపా టొకయింతయు లేక యెచ్చటన్
బల్లిదుడైన సత్ప్రభు నబ్బద్ధములాడిన గ్రుంగి పోదు, రె
ట్లల్ల సభాస్థలిన్ గుమతులై శిశుపాలుఁడు దంత వక్త్రుడున్
గల్లలు గృష్ణునిన్ బలికికాదె హతంబగుటెల్ల, భాస్కరా.
తా. వాచాలతకు లోబడి, గొప్పవాడు బలవంతుడు అయిన వానిని (ప్రల్లదము - 1.దుర్భాషణము, 2.దుష్కృత్యము.)చే నిందించడం వల్ల హాని కలుగుతుంది. శ్రీకృష్ణునంతటి వానిని నిందించుట వల్లనేగదా శిశుపాలాదుల శిరస్సులు తెగిపడినవి.
పూర్వగాథ :- హరి ద్వారపాలకు లగు జయ విజయులు సనకసనందనాదులచే శపింపబడి తృతీయజన్మమున శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. వీరి దుండగములకు హద్దు లేకుండెను. భగవంతుడైన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణావతారమై ద్వారక యం దప్పుడు వసించు చుండెను. శ్రీకృష్ణునకు బావమరదులగు పాండవు లొక సమయమున రాజసూయ యాగము చేసిరి. అందు యాగంతమునఁ ధర్మరాజాదులు శ్రీకృష్ణుని పూజింపగా శిశుపాలుడు క్రోధాధుడై శ్రీకృష్ణుడు గొల్లవాడనియు, దొంగయనియు, యనేక దుర్భాష లాడెను. అప్పుడు సకల రాజబృందమును దిలకించుచుండగనే కృష్ణుడు తన చక్రముచే నాతని మస్తకమును దునిమెను. మరి కొన్నాళకు దంతవక్రుడు కూడా శ్రీకృష్ణునితో విరోధించి పోరు సలిపి తనప్రాణములు గోల్పోయెను.
సుదర్శనో హేతిరాజ శ్చక్రరాజ స్త్రిలోచనః
షట్కోణాంతరసంవర్తీ సహస్రారో హరిప్రియః|
చక్రధరుఁడు - విష్ణువు.యుద్ధేచక్రధరం దేవం|
అరి1 - 1.చక్రము, 2.చక్రాయుధము, 3.చక్రవాకపక్షి, 4.శత్రువు, 5.(జ్యోతి.) లగ్నమునుండి ఆరవస్థానము, 6.చండ్రచెట్టు.
అరి2 - 1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.
అరి3 - అవ్య. కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా.కల్లరి, నేర్పరి (కల్ల+అరి, నేర్పు+అరి). సుడివాలు - చక్రాయుధము.
(ౘ)చుట్టలుఁగు - (చుట్టు+అలుగు) చక్రాయుధము, చుట్టుగైదువు, రూ.చుట్టలు. కంటివాలు - చక్రాయుధము.
రాష్ట్రము - 1.దేశము, 2.ఉపద్రవము.
రాయిడి - ఉపద్రవము, విపత్తు.
రాష్ట్రియుఁడు - నాట్య పరిభాషలో రాజు పెండ్లము తోడ బుట్టినవాడు.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ(పీడ - బాధ), 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
రావడి - ఉపద్రవము, విపత్తు.
రాయిడి - ఉపద్రవము, విపత్తు.
విపత్తు - ఆపద; వల్లడి - అకారాణమగు నాపద, విపత్తు.
ఆపద - విపత్తు, ఇడుమ. ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
విప్లవము - (వ్యావ.,చరి.,రాజ.,అర్థ.) తీవ్రపరివర్తనము, రాజ్యక్రాంతి, సం.వి.కొల్ల మొదలగు దేశోపద్రవము, విపత్తు.
విప్లవకారులు - (వ్యావ.) విప్లవము లేపినవారు.
రాష్ట్రపతి - (శాస., రాజ., చరి.,) భారత రాజ్యాధిపతి, అధ్యక్షుడు (President).
అధ్యక్షుఁడు - అధిష్ఠాత, ప్రధానాధికారి, విణ. 1.ఇంద్రియములకు గోచరించువాడు, 2.పనులు కనుపెట్టు చూచువాడు, 3.ప్రత్యక్షమైనవాడు.
అధిష్ఠాత - 1.అధిష్ఠించువాడు, ముఖ్యుడు, 2.అధిదేవత.
అధిపానదేవత - అధిదేవత.
అధిదేవత - 1.అధిష్ఠించి యుండు దేవత, 2.సర్వాధిపతియగు దేవుడు.
దేశములు అనేకము - భూమి ఒకటే.
అంతర్యుద్ధము - (చరి.) 1.ఒక దేశప్రజలలో జరుగు యుద్ధము, 2.అంత కలహము, 3.మనస్సులో జరుగు సంఘర్షణము.
త్యజే దేకం కులస్యార్థే గ్రామస్శార్థే కులంత్య జేత్|
గ్రామ జనపదసా ర్థే ఆత్మార్థే పృధివీం త్యజేత్||
తా. కులహాని కలుగునపు డందుకు హేతుభూతు డైన వానిని, గ్రామహాని కలుగు నపుడందుకు హేతుభూతమైన కులమును, దేశహాని కలుగు నపుడు దానికి హేతుభూతమగు గ్రామమును, తనకుపద్రవము వచ్చిన పుడు తానున్న భూమిని విడువవలయును ననుట. – నీతిశాస్త్రము
చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
చక్రధరము - పాము.
శిరసి చక్రయోగాచ్చక్రీ, న. పు. - శిరస్సునందు చక్రము గలిగినది.
చక్రం మండలాకారతా అస్యాస్తీతివా చక్రీ - మండలాకారమై యుండునది.
చక్రవాళము - 1.గుంపు, 2.మండలము, 3.లోకాలోక పర్వతము, 4.చుట్టుకొండ.
లోకాలోకము - 1.చక్రవాళ పర్వతము, భూమి చుట్టు కొనియుండు కొండ.
(ౘ)చుట్టుఁగొండ - చక్రవాళ పర్వతము, చుట్టుమల, చుట్టుగట్టు.
మండలము - 1.దేశము Country, 2.పరివేషము, 3.విలుకాడు రెండు కాళ్ళను మండలాకారముగ నుంచి నిలుచుండుట, 4.సూర్యచంద్ర బింబములు, 5.సమూహము.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము, (Group).
మాడెము - మండెము, సం.మండలము.
మండెము - మన్నెపు ప్రదేశము.
మన్నెము - 1.కొండల మధ్య గల భూమి, 2.సన్మానించి యిచ్చిన భూమి, రూ.మాన్యము, మన్యము, సం.మాన్యమ్.
మాన్యము - 1.పన్ను లేక అనుభవించునట్లు సన్మానించి యివ్వబడిన భూమి, 2.కొండల నడుమ అరణ్యముల మధ్య గల భూమి (రోగభూయిష్ట మగు భూమియని కొందరు,) రూ.మన్నియము, మన్నము.
మండలి - 1.సమూహము, 2.పరిషత్తు, 3.సూర్యుడు Sun, 4.పాము.
జిల్లా - మండలము, (చరి.) భారతదేశములో పరిపాలనా సదుపాయమునకై విభజించబడిన భూభాగము, (ఈ భూభాగముపై జిల్లా కలెక్టరు ప్రభుత్వాధికాదిగాను సెషస్సు జడ్జి న్యాయాధిపతి గాను నుందురు) District.
జిల్లాకలెక్టరు - (చరి, రజ.) జిల్లాలోని ముఖ్య రెవెన్యూ అధికారి District collector.
జిల్లాపరిషత్తు - (చరి, రజ.) జిల్లా స్థానిక పరిపాలనకై ఎన్నుకోబడిన సంస్థ. క్రీ.శ. 1949వ సంవత్సరపు చట్టము ప్రకారము ఆంధ్ర రాష్ట్రములో, తదితర ప్రదేశములలో జిల్లా బోర్డుల స్థానమున ప్రవేశపెట్టబడిన స్థానిక సంస్థలు.
జిల్లాబోర్డు - (రజ. చరి.) జిల్లస్థానిక పరిపాలనకై యెన్నుకొనబడిన మండలి.
జిల్లామేజిష్ట్రేటు - (చరి, రజ.) జిల్లా న్యాయాధికారి.
మండలిత రాజ్యములు - (రాజ.) రాజ్య మండలములో సభికత్వము గల రాజ్యములు.
మండలేశ్వరుఁడు - రాజు.
పరిషత్తు - సమితి, సభ.
సమితి - 1.సమూహము, 2.యుద్ధము.
సమిత్తు - యుద్ధము, పోరు.
సమీకము - యుద్ధము, వ్యు.పరస్పరము కదియించునది.
సభ - 1.కొలువుకూటము, 2.సమూహము, 3.జూదము.
దర్బారు - కొలువుకూటము; కొలువుకూటము - ఆస్థానమంటపము.
కొలువు - 1.ఓలగము, ఆస్థానము, 2.సేవ.
ఓలగము - 1.కొలువు, 2.కొలువుకూటము.
ఓలగించు - క్రి.1.కొలుచు, 2.సభతీర్చు.
ఆస్థానము - సభ, రాజసభ, సభామండపము.
సమఖ్య - సభ, కీర్తి.
సమజ్ఞ - కీర్తి, రూ.సమాజ్ఞ.
కొలువుకాఁడు - సేవకుడు; సేవకుఁడు - కొలువుకాడు.
సభ్యుఁడు - 1.సభయందుండువాడు, 2.మంచివాడు.
సభికుఁడు - 1.సభాసదుడు, 2.జూదమాడించువాడు.
సభాసదుఁడు - సభాస్తారుడు, సభ యందుండు ధర్మజ్ఞుడు.
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ.
తా|| తొండము లేకుండా కొండంత ఏనుగు ఉన్నను లాభం లేదు, అట్లే మండలాధిపతికి సమర్ధుడైన మంత్రి(ప్రధానమంత్రి - (రాజ, శాస,) మంత్రి వర్గనాయకుడు, కేంద్రమంత్రి వర్గనాయకుడు.)లేనిచో లాభముండదు.
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశశివ|
చక్రపక్షము - హంస.
చక్రాంగము - 1.హంస, 2.జక్కవ.
కోకము - 1.జక్కవ, 2.తోడేలు, 3.కప్ప, 4.బల్లి, 5.ఈత.
ౙక్కవ - చక్రవాక పక్షి, రూ.జక్కువ.
ౙక్కవఱేఁడు - సూర్యుడు; సూర్యుఁడు – వెలుగురేడు Sun.
ౙక్కవ గొంగ(శత్రువు) - చంద్రుడు Moon.
కోక శ్చక్ర శ్చక్రవాకో రథాఙ్గా హ్వయ నామకః,
తపతే ప్రియా వియోగాత్ రాత్రావితి కోకః కుఙ్ శబ్దే. - ప్రియా వియోగము చేత రాత్రియందు మొఱ పెట్టుచుండునది.
చకతే తర్పయతి ప్రియామితి చక్రః, చకతృప్తౌ - ప్రియురాలిని బ్రీతినొందించునది.
చక్రేన చక్రశబ్దేన ఉచ్యత ఇతి చక్రవాకః - చక్ర శబ్దముచేతఁ జెప్పఁబడునది.
రథాంగం చక్రం. తయ్సాహ్వయో నామాస్యేతి రథాంగాహ్వయ నామకః - రథాంగము చక్రము దాని పేర్లు గలది. 4 జక్కవపిట్ట పేర్లు.
ౙక్కవ - చక్రవాక పక్షి, రూ.జక్కువ.
ౙక్కువ - జక్కువపక్షి, సం.చక్రవాకః.
చక్రవాకము - జక్కవ.
రథాంగము - 1.రథచక్రము, 2.చక్రవాకము.
బండికల్లు - రథచక్రము.
ద్వికము - 1.రెండు, 2.కాకి, వ్యు.రెండు 'కా' లను గలది, 3.జక్కవ.
దుగ - ద్వికము, రెండు, రూ.దువ, సం.ద్వికమ్.
రెండు - 1.భేదము, వేరుపాటు, 2.ద్వయము.
ద్వయము - 1.జత, రెండు.
ద్వయి - దోయి, జత.
దోయి - ద్వయి, జత, సం.ద్వయీ.
ద్వందము - 1.జత, 2.స్త్రీపురుషుల జత, 3.ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధము, 3.రహస్యము, 4.శీతోష్ణాదులు.
ద్వితీయము - రెండు; రెంచ(ౘ) - (జూదమునందు) రెండు.
దోయికట్టు - జతగూడు.
అడవికుక్క - తోడేలు, అరణ్యశునకము.
ఈహామృగము - 1.తోడేలు, 2.ఒక విధమగు రూపకము (లేడివలె అలభ్యయగు స్త్రీకొరకు కథానాయకుడు వెన్నాడినట్టు వర్ణింపబడిన కథగల నాలు గంకముల నాటకము.)
తోఁడేలు - 1.వృకము, 2.అడవికుక్క, తూ.తోడేలు.
వృకము - 1.తోడేలు, 2.కుక్క.
కోక స్త్వీహా మృగో వృకః -
కోకతే వృకతేచ మాంసాదికం కోకః, వృకశ్చ. కుక వృకాదానే. - మాంసాదులను బుచ్చుకొనునది కోకము, వృకము.
మృగానీహతే ఈహామృగః ఈహ చేష్టాయాం. - మృగముల నిచ్ఛయించునది. ఈ మూడు తోఁడేలు పేర్లు.
మేకతిండి - తోడేలు, వ్యు.మేకలు తిండిగా గలది.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
అహిరము - 1.కప్ప, 2.గాలి, 3.ముంగిలి.
భేకే మణ్డూక వర్షాభూ శాలూర ప్లవ దర్దురాః,
బిభేతి సర్పేద్భేకః ఞిభీ భయే. - సర్పమువలన భయపడునది.
మందతె శోభతే తటాకాదౌ మండూకః మడి భూషాయాం. - తటాకాదులయం దొప్పునది.
వర్షాసు భవతీతి వర్షాభూః. ఊ - పు. భూ. సత్తాయాం. - వర్షాకాలమునఁ బుట్టునది.
శలతి ఉత్సుత్య గచ్ఛతీతి శాలువః, శలగతౌ. - గంతులువేయుచు చరించునది.
పా. సాదిరప్యస్తి. 'పరిసరకృకలాసన్వేదసాలూరసర్వాః' ఇతి ప్రయోగాత్.
ప్లవతే ప్లవః. ప్లుఙ్గతౌ. - గంతులు వేయుచుఁ బోవునది.
శబ్దేన కర్నే దృనాతీతి దర్దురః. దౄ విదారణే. - శబ్దముచేత చెవులను వ్రక్కలించునది. ఈ 5 కప్ప పేర్లు.
భేకము - 1.కప్ప, మండూకము, 2.మేఘము.
కప్ప - మండూకము; మండూకము - కప్ప.
ప్లవము - 1.తెప్ప, 2.కప్ప, 3.కోతి.
ప్లవంగము - 1.కోతి, 2.కప్ప, వ్యు.దాటుచు పోవునది.
ప్లవ - ముప్పదియైదవ(35వ) సంవత్సరము.
ప్లవంగ - నలుబది యొకటవ(41వ) సంవత్సరము.
దర్దురము -కప్ప.
ఉరోస్థి - (జం.) రొమ్ము యొక్క ఎముక, ఇది పూర్వోరుకాస్థి (Epesternum), పూర్వోరోస్థి (Omosteranum), మధ్యరోస్థి(Mesosternum), పశ్చోరోస్థి(Xiphisternum=Metasternum)అను నాలుగు భాగములుగ కలిసియుండును, ఉదా.కప్ప.
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తా. ఎంతపని చేసినను(ఎపుడు - ఎల్లప్పుడు, ఏకాలము, రూ.ఎప్పుడు, ఎప్డు.)తన యందు దోషమునే వెదకుచుండు ఆపురుషునియొక్క(పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.)కొలువును మానుకొన వలెను. లేని యెడల సర్పము పడగ క్రింద ఉన్న కప్ప రీతి ఆపదలకు గురికాగలడు.
అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
పుప్పసములు (కప్ప).
పప్పున - (జం.) ఊపిరితిత్తులకు సంబంధించినది (Pulmonary).
పప్పుస ధమని - (గృహ.) కుడి జఠరిక నుండి ఊపిరి తిత్తులోనికి చెడ్ద రక్తమును కొనిపోవు నాళములు (Pulmonary artery).
పుప్పుస సిరలు - (గృహ.) ఊపిరి తిత్తులలో నుండి శుభ్రపరచిన రక్తమును ఎడమ కర్ణికలోనికి గొంపోవు నాళములు (Pulmonary vein).
పుప్పుస ప్రసరణము - (గృహ.) రక్తము గుండె నుండి ఊపిరితిత్తులకు చేరి తిరిగి ఊపిరితిత్తుల నుండి గుండెకు చేరువరకు జరుగు రక్తప్రసరణము (Pulmonary circulation).
పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడి పోవును).
టర్ టరాయణము - (జం.) కప్ప అరుపులు (Croaking of frogs).
పుప్పుసము - (జం.) క్లోమము, ఊపిరి తిత్తి, (Lung).
క్లోమము1 - (జం.) 1.కడుపులోని నీరు తిత్తి.
క్లోమము2 - (గృహ.) సర్వకిణ్వము, (ఇది ఒక నాళగ్రంథి, ఇందులో పుట్టు మధుర రసము చిన్న ప్రేవులలో ఆహారము జీర్ణమగుటకు సహాయపడును), 2.తియ్యదబ్బ, (Pancreas).
తిలకం క్లోమ -
తిలతీతి తిలకం. తిల స్నేహనే. - మెఱుఁగై యుండునది.
క్లామ్యతి క్లోమ. న. న. క్లము. గ్లానౌ. - వాడునది. పా. క్లోమ.
ఈ రెండు కడుపులో నొక ప్రక్క నెఱ్ఱనైయుండు మాంస విశేషము పేర్లు. నీరుతిత్తి యని కొందరు.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహుత్కోళపు పొర క్రింద నుండు అంతస్స్రావగ్రంథి (Thymus gland).
అమైలాప్సిన్ - (జం.) (Amylopsin) క్లోమ (Pancreas) గ్రంధినుండి తయారగు సేంద్రియ ఖండము (Ferment), ఇది పిండి పదార్థమును చెక్కెరాగా మార్చును).
స్వాదుపిండము - (జం.) సర్వకిణ్వి కడుపు ఆంత్ర మూలముచే నేర్పడిన మడతలో నుండు గ్రంథి (Pancreas). (ఇది మధురసమును ఉత్పత్తి చేయును. దీనిలో సర్వకిణ్వములు ఉండ వచ్చును).
స్వాదువు - 1.ఇంపైనది, 2.తియ్యనిది, 3.మంచిది.
సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
స్వాదుధన్వుఁడు - తియ్యవిలుకాడు, మన్మథుడు.
యువాకోశము - (జం.) ఊపిరితిత్తి నిర్మాణములో నున్న ఒక్కొక్క సూక్ష్మమైన గాలిగది (Alveolus).
శ్వాసనాళము - (జం.) ముఖకుహరమునుండి ఊపిరితిత్తులలోనికి గాలిని తీసికొనుటకు వదులుటకు ఉపయోగించు గొట్టము, (Trachea).
క్లోమనాళము - (జం.) శ్వాసనాళము యొక్క శాఖ (Bronchus).
రొమ్ము పడిసెము - (వైద్య., గృహ) గుండె జలుబు, (Bronchitis).
రొంప - పడిసెము; పీనసము - పడిసెము.
విషపడిశెము - (గృహ.) శ్వాసనాళము నకు సంబంధించిన అంటు జ్వరములు, జలుబులు, (Influenza).
పీనజ్విరము - జలుబు పడిశముతో వచ్చు జ్వరము. (ఇది ఒక రకపు ఎలర్జీ వలన కలుగు జ్వరము). (Hay fever).
అ నా ఫి లి స్ - (Anophele) దోమలలో ఒక జాతి. (ఈజాతి ఆడు దోమల ద్వారా అనాఫిలిస్ మలేరియా వ్యాపించును.)
మలేరియా - (గృహ.) (Malaria), చలి జ్వరము, (ఈ జ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)
గుణనపూర్వదశ - (జం.) మానవ రక్త కణములలో ప్రవేశించిన మలేరియా రోగజీవి అభివృద్ధి చందుచు విభజనకు సిద్ధముగా నున్న దశ (Schizont).
ఖండ గుణము - (జం.) మానవరక్త కణములలో జరుగు మలేరియా రోగజీవి యొక్క జీవితదశలు (Schizogony).
బీజానుగుణనము - (జం.) దోమ శరీరములో జరుగు మలేరియా రోగజీవి జీవిత దశలు (Sporogany).
బీజఖండము - (జం.) మలేరియా వ్యాధికి కారణమగు రోగజీవి జీవన చక్రములో మనుష్యుని రక్తములో నగుపడు దశలలో నొకటి (Merozoite).
చలయుక్తము - (జం.) క్రిమివలె కదలుచుండు సంయుక్త బీజము. ఉదా:- మలేరియా రొగ జీవి యొక్క (Ookinite).
క్వినీన్ - (వ్యవ.) (Quinine) మలేరియా జ్వరమును పోగొట్టు మందు, (కాఫీ మొక్క కుటుంబము (Rubia ceae)నకు చెందిన (Cinchona offlcinalis) అను చిన్నచెట్టు యొక్క పట్టనుండి దీనిని తయారు చేయుదురు.)
అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
ఘోషన్యూనములు - (జం.) మగకప్ప గొంతునకు రెండు వైపుల గల సంచులు. (ఇవి శబ్దమును దీర్ఘముగా చేయుటకు ఉపయోగపడును) (Vocal sacs).
ముద్రాకాస్థి - (జం.) కప్పయొక్క స్వరపేటికలో ఉన్న రెండు మృదులాస్తి నిర్మాణములలో నిది యొకటి (Cricoid cartilage), రెండవది దుర్వీకాస్థీ (Arytenoid cartilage).
స్తంభాకారాధిచ్ఛదము - (జం.) నిలువుగా నొకటి ప్రక్క మరియొకటి స్తంభమువలె నమర్చబడిన పొడవైన జీవకణముల పొర (Columanar epithelium) (కప్ప ప్రేగు లోపల అస్తరుగా నున్న పొరలో దీనిని చూడనగును).
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు, రది యెట్లన్నన్
దెలుప్పగ చెఱువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తా. ఎప్పుడు మానవునికి సంపదలు కల్గునో, అప్పుడు వాని యింటికి లేక్కలేని బంధువులు పిలువకుండగనే వచ్చెదరు, అట్లుగానే చెఱువులు సమృద్ధిగా నిండియున్న తరుణమందు కప్పలు అనేకము అందు చేరుచున్నవు గదా!
పల్లి - 1.ప్రల్లె, 2.దేశము, 3.బల్లి.
దైవజ్ఞ - 1.సోదెకత్తె, 2.బల్లి Lizard. అందరికి శకునములు పలికిన బల్లి తాను కుడితి గోలెంలో పడినది.
యోగిని - 1.సోదెకత్తె, 2.యోగాభ్యాసము చేయు స్త్రీ, వికృ.జోగిణీ.
(ౙ)జోగిని - యోగిని, సోదెకత్తె, సం.యోగినీ.
సోదెకత్తె - సోదె చెప్పునది.
సోదె - రాగలమేలు కీడులను గూర్చిన ప్రశ్నయు, రూ.సోదియ, సం.చోద్యమ్.
సోదేము - చోద్యము, ఆశ్చర్యము, రూ.సోద్దెము, చోద్దెము, సం.చోద్యమ్. ఎదేమి చోద్దెమమ్మా!
విప్రశ్నికా త్వీషణీకా దైవజ్ఞా -
శుభాశుభ విషయే విశేషతః ప్రశ్నో అస్యా ఇతి విప్రశ్నికా - శుభా శుభ విషయమై విశేషముగా జనులచేతఁ జేయఁబడిన ప్రశ్న గలది.
ఈక్షణం శుభాశుభ దర్శనం. తదస్యా ఇతి ఈక్షణీకా. ఈక్ష దర్శనే. - శుభాశుభములను జూచునది.
దైవం శుభాసుభం జనాతి దైవజ్ఞా. జ్ఞా అవబోధనే. - దైవమనగా శుభా శుభము. దాని నెఱిఁగినది. ఈ మూడు 3 వేల్పుల సానిపేర్లు, సోదెకత్తె.
యస్మి దేశే నసమ్మానో నప్రీతిర్న చ బాంధవాః|
నవిద్యా నాస్తి ధనికో నతత్ర దివసంవ శత్||
తా. ఏ దేశమందు సమ్మానములు, ప్రియమును(ప్రీతి - 1.సంతొషము, 2.స్నేహము.), బంధువులును, విద్యయును, ధనికులును లేనందునో యచ్చట ఒకదినమైన వసింప గూడదు. - నీతిశాస్త్రము
ఈత - 1.ఈతచెట్టు, 2.ఈదుట, 3.ఈనుట.
ఈఁదు - 1.ఈతచెట్టు, 2.గాలి, 3.తడి, చల్లదనము, క్రి.ఈతకొట్టు, ఈదులాడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
అహితుఁడు - శత్రువు, విరోధి.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
శాత్రవుఁడు - శత్రువు.
శాత్రవము - 1.శత్రుత్వము, 2.శత్రుసమూహము.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
ప్రత్యర్థి - శత్రువు; విద్విషుఁడు - శత్రువు; అరాతి - శత్రువు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు).
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.
పగగొను - క్రి.విరోధపడు.
అరిందముఁడు - 1.శత్రువుల నణచువాడు, 2.అరిషడ్వర్గమును గెలుచువాడు, వి.1.శివుడు, 2.ఒకానొక ఋషి.
సనాభి - జ్ఞాతి, సమానుడు.
స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు. తొలఁగుబావ - శత్రువు, దాయ.
అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు.
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిగా...
దాయాదౌ సుత బాన్ధనౌ,
దాయాదశబ్దము కొడుకునకును, జ్ఞాతికిని పేరు.
దాయం విభజనీయం ధన మత్తీతి, ఆదత్త ఇతి వా దాయాదః అద భక్షణే, డు దాఞ్ దానే. - పాలిసొమ్మును భుజించువాఁడుగాని, పుచ్చుకొను వాఁడు గాని దాయాదుఁడు.
వైరిణం నోప సేవేత సహాయం చైవ వైరిణః,
అధార్శికం తస్కరంచ తథైవ పరయోషితం|
తా. శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ(తస్కరుఁడు - దొంగ), పరస్త్రీ(యోష - 1.బోటి, 2.ఆఁడుది, రూ.యోషిత, యోషిత్తు.), వీరలతో సహవాసము జేయరాదు. – నీతిశాస్త్రము
ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్డకేలు వేలుపు.
చతుర్భుజః చత్వారో భుజా యస్యసః - నాలుగు భుజములు గలవాఁడు.
ఉడ్డకేలు వేలుపు - చతుర్భుజుడు, విష్ణువు.
నలు - సమాసమందు నాలుగునకు వచ్చు రూపము, (నలుమోములు).
నలుగడ - నాలుగు ప్రక్కలు.
కొల్లారము - చతుశ్శాల నడుమ బయలును నాలుగుప్రక్కల కట్టడమును గల యిల్లు, రూ.కొలారము, కొల్లారు.
ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
(ౘ)చౌ - నాలుగు, రూ.చవు, (చౌకమునకు సమాంతరగత రూపము) సం.చతుః.
(ౘ)చౌకము - 1.చతుష్కము, నాలుగు, 2.చదరముగ నుండు తుండుగుడ్డ, రూ.చవుకము, సం.చతుష్కమ్.
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
ౘవికె - చతుష్కి, మండపము, రూ.చవిక, చవికము.
శృఙ్గాటక చతుష్పథే,
శృంగైరటంస్మిన్నితి శృంగాటకం, అటపట గతౌ. - కొమ్మలచేత దీని యందుఁ గ్రీడింతురు.
చతుర్ణాం పథాం సమాహార శ్చతుర్ప్పథం. - నాలుగు తెరువులు గూడినది. ఈ 2 నాలుగు త్రోవలుగూడిన చోటు పేర్లు.
శ్రంగాటకము - చదుకము, నాలుగు త్రోవల కూడలి.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
చతుష్పాద - 1.చతుష్పదము, 2.నాలుగు కాళ్ళ జంతువు.
పశువు - చతుష్పాదము, గొడ్డు.
పశుపతి - శివుడు.
పశూనాంజీవానాం పతిః పశుపతిః. ఈ-పు. - పశువులనగా ప్రమథులు, జంతువులు, వానికి ప్రభువు.
పశువః క్షేత్రజ్ఞాః తేషాం పతిఃత్రాతా సంసార బంధనాత్ - పశువులనఁగా జీవులు, వారిని సంసారబంధమువలన రక్షించువాడు.
పశుపాలనము - (వ్యవ.) ఉన్ని, పాలు, మాంసము, క్రొవ్వు మొదలగు వాని కొరకు పశువులను పెంచుట (Cattle rearing).
పశుగ్రాస సస్యములు - (వ్యవ.) పశువుల మేతకొరకు ఉపయోగపడు పైరులు (Fodder Crops), ఉదా. గినీగడ్డి, నేపియర్ గడ్ది, జనుము, లూస్ర్న్ మొ||
స్వస్తికము - 1.చదుకము, 2.మంగళ వస్తువు(స్వస్తి - శుభము), 3.పాముపడగ మీది నల్లనిరేఖ, 4.ఒక గుర్తు.
రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.
ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).
చతుర్థి - 1.పక్షమున నాల్గవ దినము, చవితి 2.నాల్గవది.
(ౘ)చౌతి - చతుర్ధి, పక్షమందు నాల్గవ తిధి రూ.చవుతి.
చతుష్టయము - నాలుగు, నలుగురు, 2.(వృక్ష.) సూక్ష్మబీజాణు మాతృకోశిలలో ఏర్పడు నాలుగు (పుప్పొడి రేణువులు) కణములు, (Tetrad) (ఇట్లే స్థూల బీజాణు మాతృకోశికలో గూడ నాలుగు జీవకణములు ఏర్పడును.)
తిగవంచ - నాలుగు.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
ఇద్దుగ - (ఇరు+దుగ) పాచికమీది రెండు బొట్లజత, నాలుగు.
అడ్డ - 1.గుంటక మొ.ని దిండువంటి కొయ్య, 2.కుంచములో సగము, ఆ కొలత పాత్ర, 3.నాలుగు.
పద్మనాభుఁడు - విష్ణువు.
పద్మనాభః పద్మం నాభౌ యస్యసః - పద్మము నాభియందు గలవాఁడు.
పద్మనాభో(అ)రవిందాక్షః పద్మగర్భ శరీరభృత్,
మహర్థిః ఋథ్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః| - 38స్తో
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
పద్యతే త్ర లక్ష్మీరితి పద్మం. అ. ప్న. పద్మగతౌ. - దీనియందు లక్ష్మి పొందును. ఇది వికల్పమునఁ బుంలింగంబును గలదు.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మవ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు.
తోయజాక్షి - తమ్మికంటి.
తమ్మిదొర - సూర్యుడు Sun.
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
తమ్మిపగతుఁడు - చంద్రుడు Moon.
తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.
పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.
పద్మనాభుఁడ వని నిన్నుఁ బల్కినాను
గట్టితనమేల మానరా కట్టులేదె
పలుకుపలుకున నగు కట్టుబాటు లరసి
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ |
పద్మాలయ - లక్ష్మి.
పద్మలయా, పద్మ మాలయో యస్యాస్సా - పద్మమే ఇల్లుగాఁగలది.
తమ్మియింటి గరిత - లక్ష్మి, పద్మాలయ.
గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.
పద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర. మెట్టతామర - స్థలపద్మము.
పద్మాసనము - ఆసనములలో నొకటి.
బాసికపట్టు - పద్మాసనము, (వ్యావ.) బాసీపట్టు.
నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్,
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్|
సహస్రపత్రము - కమలము, తామర.
సహస్రం పత్రాణ్యస్య సహస్రపత్రం వేయుఱేకులు గలది.
కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
కం జలం అలతి భూషయ తీతి కమలం, అల భూషణదౌ - జలమును భూషించునది.
కేన మల్యతే ధార్యత ఇతి వా కమలం. మలమల్ల ధారణే. - జలముచేత ధరింపఁబడునది.
కామ్యతే తృషార్తైరితి కమలం. కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరఁబడునది. కమలదళాక్ష గోవిందా|
కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 2.కమలాఫలము. కమలాలయము నందు దేవి స్థానం కమల.
కమలమస్యా అస్తీతి కమలా - కమలము చేతియందు గలిగినది.
స్యాత్కురజ్గే పి కమలః :
కమల శబ్దము ఇఱ్ఱికి పేరైనపుడు పు. అపిశబ్దము వలన తామరకును, నీళ్ళకును పేరైనపుడు న. మహాలక్ష్మికీ పేరైనపుడు సీ. కామ్యత ఇతి కమలః. కము కాంతౌ. కోరఁబడునది. 'కమలం సలిలే తామ్రే జలజే క్లోమ్ని భేషజే, మృగప్రభేదే కమలః కమలా శ్రీవరస్త్రియో' రితి విశ్వప్రకాశః.
మహాలక్ష్మి - 1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి. కొల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం|
కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.
కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
కమలాసనః, కమలం ఆసనం యస్య సః - కమలము ఆసనముగాఁ గలవాఁడు.
కమలుఁడు - బ్రహ్మ, ఇంద్రుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
కమలిని - 1.తామరకొలను, 2.తామరతీగ.
కమలు - క్రి.1.తపించు, 2.సంతాపించు, 3.కాలు.
కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
తా. తామరులు జలమును వదలినయెడల తమకాప్తులైన సూర్యుని కిరణం(రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు(నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.)దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువు లగుదురు.
దశవాయుజయాకారా కళాషోడశ సంయుతా,
కాశ్యపీ కమలా దేవీ నాదచక్ర నివాసినీ|
శతపత్రము - తామర. కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.
నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది. నీరజనాభ గోవిందా|
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
తామరసము - 1.తామర, 2.బంగారు, రాగి.
తామరతంపము - 1.తామరులసమూహము, 2.అభివృద్ధి, రూ.తామరతంపము.
తామరతంపర - తామరతంపము.
తామరతూపరి - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలొ ఇరువది తొమ్మిదవది(29va).
కోమలము - 1.నీరు, 2.హరిణము, విణ.1.మృదువైనది, 2.అందమైనది, 3.ఇంపైనది.
సుకుమారం తు కోమలం మృదులం మృదు,
సుష్ఠు కుమారయంత్యనేనేతి సుకుమారం, కుమర క్రీడాయాం. - దీనిచేత లెస్సగాఁ గ్రీడింతురు.
కామ్యతే జనైతి కోమలం, కముకాంతౌ. – జనుల చేత కోరఁబడునది. కామ్యము - కోరదగినది.
మృద్యత ఇతి మృదు. మృదక్షోదే. – మెదుపఁ బడునది.
మృదు మృదుత్వ మస్యాస్తీతి మృదులం. - మృదుత్వము గలిగినది. ఈ 4 మెత్తనిదాని పేర్లు.
సుకుమారము - కోమలము, (జం.) ఒబీలియా (Obelia) జలీయ కాభశిఫ, జలీయాకాభ స్తంభము దాని యొక్క వివిధ భాగములు కలిసినప్రాణి, హైడ్రాయిడ్ చెట్టు.
జలీయకాభశిఫ - (జం.) సుకుమారము (Obelia) అను జంతువు ఏదైన కఱ్ఱరాయి, సముద్రపు మొక్కకు అంటుకొని యుండు పాదభాగము (Hydrorhiza).
జలీయకాభ స్తంభము - (జం.) సుకుమారము యొక్క కాండమువంటి శరీరభాగము,(Hydroculus).
జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు (వృక్ష) నీటితో నుండునది, (Aquatic).
సుకుమారి - కోమలమైనది.
సుకుమారుఁడు - కోమలమైనవాడు.
కోమలాస్థి - (జం.) సంకోచన వ్యాకోచనశక్తిగల సున్నితమయిన(జంతు సంబంధమగు, ఎముకవంటి పదార్థము (Cartillage).
కోమలి - చక్కదనము గల స్త్రీ.
కోమలికము - చక్కదనము.
ఒప్పులాఁడీ - చక్కదనముగల స్త్రీ.
సౌందర్యము - చక్కదనము.
ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
అందము - 1.సౌందర్యము, 2.అలంకారము , 3.విధము, విణ.చక్కనిది, 2.తగినది.
అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.
మృదులము - మెత్తనిది, మృదువు; మృదువు - మెత్తనిది.
నౌరు - మృదువు, రూ.నవురు. ఇంపితము - ఇంపైనది.
అభిరామము - మనోహరము, ఇంపైనది, ఒప్పిదమైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
మనోజ్ఞత - (గృహ.) ఆకర్షించు శక్తి, 2.రంజింప జేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
ఒప్పిదము - 1.అందము, 2.అలంకారము, 3.విధము, విణ.1.మనోజ్ఞము, 2.తగినది.
రమ్యము - ఒప్పిదమైనది; రమణీయము - ఒప్పిదమైనది.
ౘక్క - 1.సుందరమైనది, 2.తిన్ననైనది.
ౘక్కనయ్య - 1.సుందరమైనవాడు, 2.వి.మన్మథుడు.
ౘక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.
ౘక్కాడు - క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
రూపకము - 1.నాటకము 2.ఆరక్షరముల కాలము గల తాళభేదము,3.రూపము,4.రూపకాలంకారము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవ నాశినీ,
కైవల్యపదవీరేఖా సూర్యమండల సంస్థితా| - 53శ్లో
హరిణము - జింక, విణ.తెల్లనిది.
హరిణి - ఆడుజింక, విణ.ఆకుపచ్చ వన్నెకలది. సీతా ప్రియహరిణానుగ రామ్|
హరిణీ స్యా న్మృగీ హేమప్రతిమా హరితా చ యా: హరిణీ శబ్దము లేడికిని, బంగారు ప్రతిమకును, పచ్చవన్నె(తెలుపు పసుపు కూడినది) గలదానికి ని పేరు.
హరతి మన ఇతి హరిణీ. సీ. హృఞ్ హరణే - మనస్సును హరించునది. "హరిణీవృత్తభేధే పి యూధికాసురయోషితో"రితి శేషః.
హర్షిణీ హరిణీ వృత్తహర్షముననొ
గాదొ చెప్పఁగా నేరరు గానరారు
నీదు నాకృతి నేరరు నీతి గనరు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
పిఱికి మెకము - జింక.
పిఱికి - భయశీలుడు, సం.భీరుకః.
పిరికిపంద - బెదురుపోతు, పిరికి(Coward).
పంద - పిరికి, సం.బంధః.
భీరుకుఁడు - వెరవరి, రూ.భీలుకుడు.
వెరవరి - నేర్పరి, ఉపాయశాలి.
భయం శీలమస్యా ఇతి భీరూః - వెఱపు స్వభావముగాఁ గలది.
కోఁచ - పిరికితనము, విణ.పిరికి, సం.కోచః.
కోఁౘవాఱు - క్రి.బెదురు, భయపడు.
బీ - భయము.
భీతి - భయము, బెదురు.
భీతము - భయము నొందినది, వి.వెరుపు.
మొగతప్పు - క్రి.పిరు తివియు, వెనుతీయు.
పిఱుతివియు - (పిరుదు+తివియు) వెనుదీయు, జంకు.
(ౙ)జంకు - క్రి.1.భయపడు, 2.సంకోచపడు, వి.1.భయము, 2.సంకోచము, శంక, సం.శంకః.
వనహరిణములు - అడవిలేళ్ళు, వీటికి అడవిలో క్రూరమృగముల వలన ప్రమాద మెక్కువ. అందుచేత ఇవి చిన్న అలికిడికే భయపడును. గ్రామ హరిణములు మనుష్యాది దర్శనమున భయపడవు.
ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చగుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.
హరిత్తు - 1.దిక్కు, 2.ఆకుపచ్చవన్నె, 3.పచ్చగుఱ్ఱము.
పసిరిక - 1.పసరువన్నె, 2.పచ్చపిట్ట.
పసరు - 1.ఆకు నలిపిన రసము, 2.ఆకుపచ్చన, విణ.ఆకు పచ్చనిది. గిజిగాడు - పచ్చపిట్ట.
పాలాశో హరితో హరిత్.
పలాశం పర్ణం తత్త్యుల్యవర్ణతయా పాలాశః - పలాశమనఁగా ఆకు, దానితో సమానమైన కాంతి గలది.
హరతి మన ఇతి హరితః - హరి చ్ఛ. త. హృఞ్ హరణే మనస్సును హరించునది. ఈ 3 ఆకుపచ్చవన్నె పేర్లు.
హరిదశ్వుఁడు - సూర్యుడు Sun, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.
హరితః హరిద్వర్ణా అశ్వాః యస్య హరిదశ్వః - పచ్చనికాంతి గల గుఱ్ఱము లు గలవాఁడు.
హృతి - హరణము, రూ.ఆహృతి.
హృతము - హరింపబడినది, రూ.ఆహృతము.
హ్రీంకారారణ్య హరిణీ హ్రీంకారావాలవల్లరీ,
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణ దీపికా|
ఓం హ్రీంకారారణ్య హరిణ్యై నమః : హ్రీంకార రూపారణ్యంలో పరమేశ్వరి హరిణి వంటిది. సాధారణంగా అరణ్యాలలో వ్యాఘ్ర సింహాది క్రూరమృగాలు వుంటాయి. కాని సహజాతభయ విహారిణులైన హరిణులున్న ప్రదేశంలో కౄరజంతువులుండవని తెలిసికోవాలి. అటులనే భవాటవిలో భీతిల్లిన భక్తజనులను దర్శనమాత్రంచే భయదూరులను చేయు సర్వేశ్వరికి వందనాలు.
తనుచ్ఛాయాభిస్తే - తరుణ తరణి శ్రీసరణిభిః
దివం సర్వాముర్వీ - మరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవన్త్యస్య త్రస్య - ద్వనహరిణ శాలీనా నయనాః
సహోర్వశ్యాః వశ్యాః - కతి కతి న గీర్వాణ గణికాః || - 18శ్లో
తా|| తల్లీ ! ఉదయవేళల బాలసూర్యుని కాంతి పుంజములను వెదజల్లు తున్న నీ నెమ్మేని కాంతి సౌభాగ్యముచేత భూమ్యాకాశాలు కెంపు జిలుగ(అరుణ వర్ణమునందు)మునిగిన దానినిగా - ఆ దివ్యతేజో రూపాన్ని ఎవ్వడు ధ్యానించుచున్నాడో(తలంచునో), వానికి బెదరిన అడవి జింకల వలె చక్కని కన్నులుగల ఎందఱెందరు అప్సరస కన్యలు, ఊర్వశి సైతం వశులవుతారు.(అమ్మ లోకాతీతమైన దివ్యమంగళ రూపాన్ని ధ్యానించు వారు సర్వ సమ్మోహనరూపాన్ని పొందుతారు. అందరూవారికి ఆకర్షితులవుతారని భావము). - సౌందర్యలహరి
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహా ర్హమణిహారిణీం ముఖసముల్లస ద్వారుణీమ్|
దయావిభవకారిణీం విశదలోచనీం తారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీ మాశ్రయే.
న్యంకువు - 1.ఇఱ్ఱి, 2.ఒక ముని.
ఇఱ్ఱి - జింక(జింక - ఇఱ్ఱి), హరిణము.
ఇఱ్ఱిగోఱౙము - కస్తూరి; మృగమదము.
జింకరౌతు - వాయువు.
మృగవాహనుఁడు - జింకరౌతు(వాయువు).
మృగనాభి - మృగమదము, కస్తూరి.
మృగమదము - కస్తూరి.
కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి.
మృగనాభి ర్మృగమదః కస్తూరీ చ -
మృగనాభిభవత్వా న్మృగనాభిః. ఇ. పు. - మృగము యొక్క నాభి వలనఁ బుట్టునది.
"ముఖ్యరాట్ క్షత్రయోః పుంసి నాభిః ప్రాణ్యం గకేద్వయోః" అను త్రికాండశేష వచనము వలన స్త్రీలింగంబును గలదు.
మృగస్య మదో మృగమదః. - మృగము యొక్క మదము.
కేస్తూ యతే కస్తూరీ. సీ. ష్టుఞ్ స్తుతౌ. - శిరస్సునందు స్తోత్రము చేయఁబడునది. ఈ 3 కస్తూరి పేర్లు.
కస్తూరీ తిలకోల్లస నిటలాయై నమో నమః.
అండజ - కస్తూరి, వ్యు.కస్తూరి మృగము యొక్క బొడ్డుతిత్తి నుండి పుట్టినది.
మృగమదంబుఁ జూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణము లీలాగురా, విశ్వ.
తా. ఓ వేమా! కస్తూరి చూచుటకు నల్లగా వుండును కాని, దాని సువాసన విశేషమైన గొప్పదిగ నుండును. గురువులైనవారిలో మంచిగుణములు గూడ ఆ విధముగనే చాలా గొప్పవిగా నుండును.
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభితా|
ముఖచంద్రకళంకాభ - మృగనాభివిశేషకా. -5స్తో
అండజ - కస్తూరి, వ్యు.కస్తూరి మృగము యొక్క బొడ్డుతిత్తి నుండి పుట్టినది.
బొడ్డు - 1.నాభి, 2.నూతిచుట్టు పెట్టిన గోడ. నాభిం భువనమాతృకా|
బొడ్దుచేరులు -(గృహ.) నాభిగొట్టము, బొడ్డుత్రాడు (Umbilical cord).
నాభిజన్ముఁడు - బ్రహ్మ, పొక్కిలిచూలి, వ్యు.బొడ్డునుండి జన్మించినవాడు. air that rises in the throat and navel.
నాభ్యంతరము - (భౌతి.) నాభి ధ్రువముల మధ్య దూరము (Focal length).
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ఉదానము - 1.బొడ్డు, 2.కంఠము నందలి గాలి, 3.ఒకానొక పాము.
ఉదానః కంఠదేశస్థః : ఉదానము, కంఠస్థానము నందుండి భాషణాదులఁ బుట్టించునది.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
ఉదానము కంఠ ప్రదేశమున నుండి దేహములో సగము భాగమును పెంచుట కుపయోగించును. కంఠస్థానం(ప్రదేశమును) నుండి ముఖమును, పెదవులను, కన్నులను అదురు నట్లు చేయుచు కామక్రోధాదులను ఉత్తేజపరచునది ఉదాన వాయువు.
సమానము - (సజాతీయము) (గణి.) ఒకే జాతికి సంబంధించినది, ఒకే ఘాతసంఖ్యకలిగినది (Like), వై.వి. సమ్మతి, సం.వి. నాభియందలి వాయువు, విణ.తుల్యము.
తుల్యము - సమానము, సాటి.
నాభిస్థానమైన మణిపూర చక్రమున డ - ఢ - ణ - త - థ - ద - ధ - న - ప - ఫ లను వర్ణపద్మములు పశ్యంతీవగ్రూపములు. పద్మం రేకులు పది అగ్నిరూపం.
ఢక్కారవృత ధిక్కారహిత
దిక్కాలామిత హిక్కాదిరహిత| |శరవణభవ|
ణకారతరుసుమ నికారరతిదమ
ణకారయుతమను జపవిహితాగమ| |శరవణభవ|
ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః : దశ దళాలలో భాసిల్లు మణిపూర కమలంలో విలసిల్లు దేవికి నమోవాకాలు.
ఓం విష్ణు గ్రంధి విభేదిన్యై నమః : మణి పూరక చక్రోపరి భాగానకల విష్ణు గ్రంధిని భేదించుకొని సాక్షాత్కరించునట్టి పరాశక్తికి ప్రణామాలు.
ఓం మణిపూరాంతరుదితాయై నమః : నాభిలో దశదళ కమలం ఉంది. దానికే మణిపూరకమని పేరు. అందులో రత్నాలంకృతయై భాసిల్లు శ్రీమాతకు ప్రణామాలు. (నాభియందు సమానవాయువు)
తటిత్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా
స్ఫురన్నానారత్నా భరణ పరిణద్దేంద్ర ధనుషమ్|
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్ || - 40శ్లో
తా. ఓ త్రిపురసుందరీ! మణిపూరచక్రమాధార ముగ గలదియు, చీకటిని తొలగించు శక్తితో మెఱుపులు గలదియు, ప్రకాశించు చున్న అనేక రత్నాభరణములు కూర్చబడిన ఇంద్రధనుస్సు వంటిదియు, శివుడను(హరుఁడు - శివుడు) సూర్యుడిచే(మిహిరుఁడు - 1.సూర్యుడు, 2.చంద్రుడు, 3.వాయువు, 4.వృద్ధుడు.)తపింప జేయబడిన, ముల్లోకములను వర్షధారచే తడుపు చున్నదియు, అనిర్వాచ్యముగ మేఘమును సేవింతును. - సౌందర్యలహరి
మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా|
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా. - 102శ్లో
మధురిపుఁడు - విష్ణువు.
మధో రసురస్య రిపుః మధురిపుః ఉ - పు. - మధు వనెడి రాక్షసునికి శత్రువు.
వాసుదేవుడు - కృష్ణుడు, వ్యు.వసుదేవ కుమారుడు.
వాసుదేవః వసుదేవ స్యాపత్యం పుమాన్ - వసుదేవుని కుమారుడు. సప్తమం వాసుదేవం చ|
వసంత్యస్మిన్ జగంతీతి వాసుః - వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవః - అన్ని జగములు తనయందు గల దేవుఁడు.
వస నివాసే. జగతి వస త్యయమితివా - జగమున నంతట నుండు దేవుఁడు.
తదుక్తం. శ్లో. వసత్యాత్మా జగత్య త్ర తస్మి న్వనతి వా జగత్, స వాసుదేవ ఇత్యాది.
వసుదేవుఁడు- కృష్ణునితండ్రి, ఆనక దుందుభి.
ఆనకదుందుభి - 1.శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు (భగవంతునికి తండ్రి కాబోవుచున్నాడని యీతని జన్మకాలమున దేవతలు ఆనకదుందుభులు మ్రోగించి నందువల్ల ఈ పేరు వచ్చెను), 2.పెద్ద డక్క.
దుంధుభి - 1.పాచిక యందలి ఆరు చుక్కలు గల పాచిక, ఇత్తిగ, 2.భేరి, 3.60 సంవత్సరము లలో నొకటి.
ఇత్తిగ - (ఇరు+తిగ) ఆరు, వి.పాచికల మీది మూడు బొట్లజత, దుందుభి(పాచికల ఆటలలోని పరిభాష).
భేరి - దుందుభి.
ఘనుఁడగునట్టివాఁడు నిజకార్య సముద్ధరణా ర్ధమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్ధనసేయుట తప్పుకాదుగా,
యనఘతఁ గృష్ణజన్మమున వసుదేవుడుమీఁది టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడకాళ్ళకుఁ మ్రొక్కఁడె నాడు, భాస్కరా.
తా. పూర్వము వసుదేవునకు దేవకీదేవి యందు 8 మంది సుతులు గల్గిరి. కాని దేవకీ దేవి యగ్రజుడగు కంసుడు, ఆమెకు పుట్టిన సంతానము చే తన కాపద గలుగనని యాకాశవాని పలికిన పలుకులను విశ్వసించి ఆమెను, ఆమె భర్తయగు వసుదేవుని కారాగార మందుంచి వారికి గలిగిన సంతానము నెప్పటికప్పుడు కడతేర్చు చుండెను. ఇట్లేడ్గురు(ఏడుగురు) శిశువుల నాతడు వధించెను. ఎనిమిదవ చూలు యాగు కృష్ణు నైనను వారు దక్కించుకొన దలచి, వసుదేవు డర్థరాత్రమున ఖైదు వెడలి శ్రీకృష్ణుని తీసికొని పోవుచుండగా నొకగాడిద వానిని గని ఓండ్ర పెట్టసాగెను. అందుచే తన రహస్యము బట్ట బయ లగునేమో నని వసుదేవుడు గాడిదను(గాలిగాఁడు - గాడిద)ను ప్రార్థించి, తన పనిని నెరవేర్చు కొనెను. కావున, ఎంత గొప్పవాడైనను(ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు.)తన కార్యము నిర్వహించు కొనుటకు నీచుని ప్రార్థించిననూ తప్పులేదు.
త్రివిక్రముఁడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించెను.
త్రివిక్రమః బలిబంధనకాలే త్రిషు లోకేషు త్రయో విక్రమాః పాదన్యాసాః యస్య సః - బలిబంధనకాలమందు మూఁడులోకములను మూఁడడుగులచేఁ గప్పినవాఁడు. క్రము పాదవిక్షేపే.
దేవక్యః నందనః దేవకీనందనః - దేవకీదేవి కొమారుఁడు.
నందనుఁడు - కొడుకు, విణ.సంతోషించువాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కున్నడు - బాలుడు, బిడ్దడు.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కూన - కున్న, కుర్ర, సం.కుణకః.
కుఱ - 1.కొడుకు, 2.బిడ్ద, 3.బాలుడు, రూ.కుఱఁడు.
కూనలమ్మ - సంతతినిచ్చు దేవత.
స్కందుఁడు - కుమారస్వామి.
కొమరసామి - స్కందుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 2.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొ మ రు ద న ము, కొ మ రు ప్రాయము=యౌవనము).
మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింపజేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా.
తా. కృష్ణా! పదునాలుగులోకములు(భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.) నీ కుక్షిలో గలవాడవు, విదితంబుగ(విదితము - తెలియ బడినది) నీతల్లియగు దేవకీదేవి ఉదరములో ఎట్లు అణగియుంటివో! చాలచిత్రము.
దేవకీనందన శ్శౌరి ర్హయగ్రీవో జనార్థనః,
కన్యాశ్రవణతా రేజ్యః పీతాంబరధరో నఘః|
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
శూర ఇతి వసుదేవస్య పితారస్య గోత్రాపత్యం శౌరిః- ఈ-పు. - శూరుడనగా వసుదేవునితండ్రి, అతని మనుమఁడు.
శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
హంవీరుఁడు - క్షత్రియుడు, విణ.శూరుడు.
వీరుఁడు - శూరుడు.
ఎక్కటి - 1.ఒకటి, 2.ఒంటరివాడు, విణ.శూరుడు, సం.ఏకః.
ఎక్కటీఁడు - అసహాయశూరుడు.
ఎక్కటి కయ్యము - ఒకనితో ఒక్కడే చేయు యుద్ధము, ద్వంద్వయుద్ధము, దండపోరు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
ప్రగల్భుఁడు - ప్రౌఢుడు.
ప్రోడ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రౌఢ - పదునెనిమిదేండ్లకు పైబడిన వయస్సుతోడి సంపూర్ణ యౌవనము గలది.
ప్రౌఢము - 1.పెరిగినది, 2.వయస్సు వచ్చినది, 3.నేర్పుగలది.
ప్రౌఢి - 1.సామర్థ్యము, 2.నేర్పు, 3.వృద్ధి, 4.గర్వము.
ప్రావీణ్యము - నేర్పు; పటిమ - నేర్పు, సామర్థ్యము.
ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion ).
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి.
సమర్థుఁడు - నేర్పరి; నిష్ణాతుఁడు - నేర్పరి; కలింగుఁడు - నేర్పరి.
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice).
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జనించిన వాడు.
ధవుడు - 1.పెనిమిటి, 2.రాజు.
నాధుడు - 1.పెనిమిటి, 2.రాజు.
జామాత - 1.అల్లుడు, 2.పెనిమిటి.
అల్లుఁడు - 1.కూతుమగడు, 2.మేనల్లుడు, రూ.అల్లువాడు.
అల్లువాఁడు - అల్లుఁడు.
సుదాయము - పెండ్లియందు అల్లుని కిచ్చెడు అరణము.
ధవః ప్రియః పతిర్భర్త -
ధునోతి స్త్రియం దవః ధూఞ్ కంపనే. - స్త్రీని కంపించువాఁడు.
ప్రీణాతి ప్రియః ప్రీఞ్ ప్రీణనే. - ప్రేమించువాడు.
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
బిభర్తీతి భర్తా. ఋ. వు. డు భృఞ్ ధారణపోషణయోః. - భరించువాఁడు. ఈ నాలుగు మగని పేర్లు.
ప్రియుఁడు - ప్రాణనాథుడు.
జీవితేశుఁడు - 1.ప్రాణనాథుడు, 2.యముడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ఇష్టుఁడు - 1.ప్రియుడు, 2.ఆప్తుడు, 3.విష్ణువు.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహుతుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.
దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.
దయిత - 1.భార్య, 2.స్త్రీ.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
ఏలిక - 1.రాజు, యజమానుడు.
ఏలినవాఁడు - ఏలిక, రాజు.
ఏలికసాని - దొరసాని, రాణి.
దొరసాని - రాణి; రాణి - రాజ్ఞి, భార్య.
రాజ్ఞి - రాణి.
దేవేరి - 1.దేవి, 2.దొరసాని, రూ.దేవేరి, సం.దేవేశ్వరి.
దేవి - 1.పార్వతి, 2.రాణి.
రాజు - 1.రేడు, రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు.
యజమానుఁడు - 1.గృహపతి, 2.యజ్ఞకర్త.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
భర్త - మగడు, విణ.ప్రోచువాడు.
పరిణేత - మగడు.
ప్రోచు - అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.
యజమానుఁడు - 1.గృహపతి, 2.యజ్ఞకర్త.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః. ఇలుదొర - గృహస్థు.
అల్లుని మంచితనమును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులునులేవు తెలియర సుమతీ!
తా. మామగారు ఎంతధనము పెట్టినను, గౌరవించినను, అల్లుడను వానికితృప్తి యుండదు. గొల్లవానికి సాహిత్యం తెలియదు. స్త్రీ(కోమలి - చక్కదనము గల స్త్రీ.)ఎప్పుడును నిజము చెప్పదు. వడ్లు దంచిన బియ్యం లభించునుగాని, ఏరిపారవేసెడి తరక(తఱక - 1.గింజ సరిగా పట్తని ధాన్యము.)లందుదంచిన బియ్యమును, తెల్లని కాకులులేవు. తెలియర - తెలిసికొనుము.
మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కులస్త్రీ.
సభత్తృక - మగనాలు, ముత్తైదువు.
యామి - 1.కులస్త్రీ, 2.తోడబుట్టినది.
ముత్తైదువ - ముత్తయిదువ; ముత్తయిదువ - సుమంగళి. సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.సురలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ.
సహజ - తోడ బుట్టినది.
అథ కులస్త్రీ కులపాలికా :
కులేన అవ్యభిచారేణ రక్షితాస్త్రీ కులస్త్రీ – ఒచ్చెము(న్యూనత, కొరత)లేని కులముచేత రక్షితయైనది.
కులం పాలయతీతి కులపాలికా. పాల రక్షణే. - కులమును రక్షించునది. వ్యభిచారము చేయక కులమును మానమును కాపాడుకొను స్త్రీ పేర్లు.
కులపాలిక - 1.తల్లిదండ్ర్లచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.
చిరంటి – 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపసుమీ
కలకంటి కంట కన్నీరొలికిన
సిరి యింటనుండ నొల్లదు సుమతీ.
తా. కులసతితో(సతి - పతివ్రత స్త్రీ, పార్వతి)కయ్యము, లేనిదోషాలు ఆరోపించుట మంచిది కాదు, ఏలయన స్త్రీ కన్నీరు విడిచిన, ఆ యింటి యందు(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)లక్ష్మి నివసించదు.
ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
సువాసిన్యర్చనప్రీతా శోభనా శ్శుద్ధమానసా|
బిందుతర్పణసంతుష్ఠా పూర్వజా త్రిపురాంబికా.
శ్రీపతి - 1.విష్ణువు, 2.రాజు.
శ్రియపతి - విష్ణువు, లక్ష్మీభర్త.
శ్రీపతిః ఇ - పు. శ్రియః లక్మ్యాః పతిః - లక్ష్మీదేవికి భర్త.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
పాతి స్వానుజీవిన మితి పతిః, పా రక్షణే. - తన యాశ్రితుని రక్షించువాఁడు.
స్త్రీలింగమందు రుచి శబ్దము వలెను, నపుంసకమందు వారి శబ్దమువలెను రూపము.
గేయం గీతా నామసహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ చ చిత్తం|| - 27
భగవద్గీతను, సహస్రనామాలను గానం చేస్తుండాలి. ఎల్లాప్పుడు శ్రీపతి రూపాన్నే ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి. సంపద (ఐశ్వర్యము) దీనజనులకు(దేయము - ఇయ్యదగినది)ఇస్తుండాలి. – భజగోవిందం
The Bhagavadgita and the Sahasranama should be sung; the form of the Lord of Lakshmi(Vishnu) should be always meditated on; the mind should be led to the company of the good; and wealth should be distributed among the indigent.
శ్రీ- 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
లక్ష్మి- 1.రమాదేవి, 2.సంపద 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్టదామర.
లక్కి - లక్ష్మి, సం.లక్ష్మీ. లక్కిమి - లచ్చి.
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః.
శోభ - 1.వస్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపద్యతే జనైరితి సంపత్. ద.సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. - జనులచేత పొందఁబడునది.
శ్రియతే జనైరితి శ్రీః ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది.
లక్ష్యతే లక్ష్మీః. ఈ. సీ. లక్ష దర్శనాంకనయోః. - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు 4 సంపద పేర్లు.
సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సమృద్ధమైనది.
శ్రీదుఁడు - కుబేరుడు.
శ్రియం దదాతీతి శ్రీదః - సంపద నిచ్చువాఁడు.
స్మరం యోనిం లక్ష్మీ - త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే! - నిరవధి మహాభోగ రసికాః|
భజంతి త్వాం చింతా - మణిగుణ నిబద్ధాక్ష వలయాః
శివాగ్నౌ జుహ్వన్తః - స్సురభిఘృత ధారాహుతి శతైః|| - 33శ్లో
తా. ఆద్యంతరహితయైన నిత్యయగు ఓ త్రిపుర సుందరీ! పరమయోగులు కొందఱు నీ మంత్రము నకు మొదటి కామ బీజమగు ‘ఐమ్’ ఐం శుద్ధ సాత్త్వికం, యోని బీజమగు ‘హ్రీమ్’ హ్రీం(హ్రీం -1.మాయా (శక్తి) బీజం, 2.దేవీ ప్రణవం.), లక్ష్మీ బీజమగు శ్రీం 'శ్రీమ్' అను వర్ణములను జేర్చి, చింతామణు(మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు)లచే సమగూర్చబడిన జపమాల(అక్షమాల)లను హస్తము లందు గలిగి, కామధేనువు సంబంధమగు నేతి ధారలచే శివాగ్ని యందు హోమము చేయుచు, నిన్నుకొలుచు చున్నారు. - సౌందర్యలహరి
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ,
శ్రీం బీజ జపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా| - 152శ్లో
తిరు - శ్రీ ప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము.
శేషశైలము - తిరుమల; శేషాచలము - తిరుమల; శేషాద్రి - తిరుమల.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీద తండ్రి.
తిమ్మ - స్వస్థము; స్వస్థము - నెమ్మదిగా నుండునది.
శ్రీఫలా శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా హరిప్రియా,
శ్రీకరీ భక్తానుకంపా శ్రీధరేశవరణ్యపి|
స్పురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే,
శ్రియా జుష్టకేకేయూరకం శ్రీనివాసమ్|
శివం శాంతమీడ్యం వరం లోకపాలం,
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్||
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః|
శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||
సిరి - 1.శ్రీ, లక్ష్మి 2.సంపద 3.శోభ, సం.శ్రీః. సిరిమంతుఁడు - శ్రీమంతుడు, సం.శ్రీమాన్.
శ్రీమంతుఁడు - సంపదకలవాడు.
శ్రీమంతము - 1.సంపదకలది, 2.ఒప్పిదముకలది.
శ్రీకరుఁడు - సంపత్కరుడు. మాఢ్యుడు - సిరితో గూడినవాడు.
లక్ష్మీవాం ల్లక్ష్మణ శ్శ్రీల శ్శ్రీమాన్ -
లక్ష్మీ రస్యాన్తేతి లక్ష్మీవాన్. త. లక్ష్మణశ్చ శ్రీరస్యాస్తీతి శ్రీలః శ్రీమాంశ్చత.- లక్ష్మియనినను సంపదయు, ఒప్పిదమును; అది గలవాఁడు.
శ్రియం లాత్యాదత్తే వా శ్రీలః. లా ఆదానే. - సంపదను బుచ్చుకొనువాఁడు. పా. శ్లీలః ఈ 4 సంపద గలవాని పేర్లు. ఒప్పిదము గలవాఁడు.
శ్లీలము - 1.సంపదగలది, 2.సభ్యత కలది.
శ్లీలుడు - అదృష్టవంతుడు. జాతకుఁడు - 1.పుట్టినవాడు, 2.అదృష్టవంతుడు.
శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి - మదనుడు; మదనుఁడు - మన్మథుడు; మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
జరాభీరువు - మదనుడు(జర - ముసలితనము). శృంగారయోని - మన్మథుడు.
సిరి చేర్చు బంధువుఁల నా
సిరియే శుభముల నొసంగు * చెలువులఁ గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించుగం మఁ * దలంపు కుమారా !
తా. కుమారా! సంపదయే చుట్టములను దగ్గరఁ జేరునట్లుచేయును, శుభములన్నింటిని యిచ్చును. అందముకూడ కలిగించును. ప్రపంచములో గుణవంతుఁడని పొగడునట్లు చేయును.
శోభ - 1.వస్త్రభూష్ణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
అన్నువు - 1.శోభ, 2.ఒడలెరుగమి, పారవశ్యము.
అన్ను - 1.ఒడలెరగమి, 2.శోభ, 3.స్త్రీ, క్రి.మత్తిల్లు, పరవశమగు.
అన్నుకొను - 1.అల్పము, సన్నము, 2.హీనుడు, దుర్బలుడు, కొంచెము తక్కువ, 4.చిన్నది, 5.మనోహరము, వి.స్త్రీ.
శోభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.
సుషమ - మిక్కిలిశోభ.
సుషమము - 1.మనోజ్ఞమైనది, 2.సమానమైనది.
సుషమా పరమా శోభా -
సుష్ఠు సమం సర్వ మస్యా స్సుషమా - దీనికి సర్వము లెస్సగ సమమై యుండును. ఒకటి శ్రేష్ఠమైన కాంతి.
వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ. అభీష్టము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.
తేజః పురీషయో ర్వర్చః :
వర్చ శబ్దము తేజస్సునకును, విష్ఠకును పేరు. వర్చతీతి వర్చః. స. స. వర్చదీప్తౌ. – ప్రకాశించునది.
'వర్చస్తురూపవ 'దితిశేషః. రూప ఇవేత్యర్థః.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).
అలంకారము - 1.అలంకరించుట, సింగారము 2.హారాది ఆభరణము 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ. సింగారము - శృంగారము, అలంకారము, సం.శృంగారః.
శృంగారము - 1.నవరసములలో నొకటి, 2.అలంకారము, వికృ.సింగారము.
సింగారి - శృంగారవతి.
పాటన - 1.అలంకారము, 2.ఆదరణము.
ఆదరణము - 1.సన్మానించుట, 2.మన్నించుట, 2.లక్ష్యముచేయుట, పాటించుట.
ఆదరణీయము - సన్మానింపదగినది.
అలంకరిష్ణువు - అలంకరించుకొను స్వభావము కలవాడు, అ లం కా ర ప్రియుడు.
అలంకర్త - అలంకరించువాడు.
శఙ్గార శ్శుచి రుజ్జ్విలః,
శృఙ్గం ప్రాధాన్యమియర్తీతి శృఙ్గారః. - ప్రాధాన్యము నొందు నది.
పరిశుద్ధత్వాచ్ఛుచిః. ఇ. పు. - జుగుప్సా విరహితమై పరిశుద్ధమైనది.
ఉజ్జలతి ప్రకాసత ఇత్యుజ్జ్వలః, జ్వల దీప్తౌ. - ప్రాకాశించునది. ఈ 3 శృంగారరసము పేర్లు.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్దులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.
ఔజ్జ్వల్యము - ఉజ్జ్వలత్వము, ప్రకాశము.
హవణిక - అలంకారము.
హవణించు - క్రి. 1.అలంకరించు, 2.ధరించు, 3.చక్కబరచు, 4.ఉంచు.
హవణిల్లు - క్రి. 1.ప్రకాశించు, 2.విజృంభించు.
శోభిల్లు - క్రి.ప్రకాశించు.
శోభితము - ప్రకాశమొందినది.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మజ - 1.కూతురు, బుద్ధి.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
వస్త్రముఖ్య స్వలంకారః - ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం - విద్యాముఖ్యస్తు పూరుషః||
తా. అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.) ముఖ్యములు. - నీతిశాస్త్రము
శుద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ|
శ్రీ లక్ష్మీ ర్వర లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా|
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము(నీటియిక్క).
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.
తామరతూపరి - మదనుడు.
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒకనిధి.
గుల్ల - 1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము), సం.క్షుల్లః.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
నత్త - గుల్ల యందుండు పురుగు.
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల.
శఙ్ఖో నిధౌ లలాటాస్థ్ని కమ్బౌన స్త్రీ -
శంఖ శబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖము నకును పేరు.
శమయతి దుఃఖమితి శంఖః శము ఉపశమమే. - దుఁఖమును శమింపఁ జేయునది.
శుక్తి - 1.ముత్తెపుచిప్ప, 2.శంఖము, 3.నత్తగుల్ల, 4.పుఱ్ఱెపెంచిక.
శుక్త్యంబు బిందున్యాయము - (న్యా.)ముత్యపు చిప్పలోబడ్డ నీటిబిందువు ముత్యమగు ననురీతి.
కంబువు - 1.శంఖము, 2.ఏనుగు, 3.కడియము, 4.నత్తగుల్ల.
కంబుగ్రీవ - 1.మూడు ముడుతలు గల మెడ, 2.శంఖము వంటి మెడగలది.
శ ఙస్స్యాత్కమ్బు రస్త్రియౌ :
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః ఖను అవధారనే. - సుఖమును బుట్టించునది.
కామ్యతే శుభార్థిభిరితికంబుః. ఉ-ప్న. కము కాంతౌ. - శుభర్థులైనవారిచేత కాంక్షింపఁబడునది. ఈ రెండు శంఖము పేర్లు.
శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతి యందు ధరించువాడు.
గుల్లకాఁడు - ఏమియు లేనివాడు, వ్యర్థుడు.
గుల్ల పడు - అవమానపడు, భంగపడు.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.
భంగము - 1.చెరుపు, 2.అవమానము, 3.అల, 4.రోగము, వ్యాధి.
ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. - 55శ్లో
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. – 157శ్లో
కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.
సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.
అల్లి1 - మందము.
అల్లి2 - 1.తెల్లకలువ, 2.కలువవంటి నీటిపువ్వు, 3.ఒకానొక చెట్టు, 4.ఒక రకమైన పిల్లలయాట.
మందము1 - యుద్ధకాలమున వాహన యోగ్యమైన గజజాతి.
మందము2 - దట్టము, స్థూలము.
అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.
తామరసము - 1.తామర, 2.బంగారు, 3.రాగి.
పయిఁడి - బంగారు; పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పసిఁడి - 1.బంగారు, 2.ధనము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
పైఁడినెలఁత - లక్ష్మి.
పైఁడిఱేఁడు - కుబేరుడు.
పైఁడిచూలాలు - వసుంధర, భూమి.
రాగి - ఒక విధమైన పైరు, వై.వి.తామ్రము, సం.విణ.1.అనురాగము కలది, 2.ఎరుపు గలది.
పిశంగము - (రసా.) రాగి రంగుగలది, (Brown) సం.వి.కపిలవర్ణము.
తామ్యతి వ్యధతే అగ్నిసంయోగాదితి తామ్రకం, తముగ్లావౌ,- అగ్ని సంయోగమువలన వ్యథ నొందునది అనఁగా కరఁగునది.
అథ తామ్రకమ్, శుల్బం మ్లేచ్ఛముఖం ద్వ్యష్టవరిష్ఠోదుమ్బరాణి చ,
తామ్రము - 1.రాగి, 2.ఎరుపు, సం.వి. (రసా.) (Copper) రాగి, పిశంగ (Brown) వర్ణము గల ధాతువు. (ఇది ఆవర్త క్రమపట్టికలో రెండవవర్గములో వెండి బంగారముతోపాటు అమర్చబడి యున్నది. మొక్కలకు కావలసిన సూక్ష్మమూల ద్రవ్యములలో నిది యొకటి).
శుల్భము - 1.రాగి, 2.త్రాడు.
శలతి అశుగచ్ఛతి ద్రవావస్థాయా మితి శుల్బం. శల అశుగమనే. - కరఁగినప్పుడు జాఱునది.
త్రాడు - 1.పేనినదారము, 2.పాశము, 3.కిరణము, వెలుగు.
త్రాడుపఁడు - 1.కృశించు, 2.దారమగు.
త్రాడుఁదాలుపు - వరుణుడు.
మ్లేచ్ఛముఖము - రాగితామ్రము, వ్యు.మ్లేచ్ఛజాతి వ్యక్తిముఖమువలె ఎఱ్ఱనైనది.
మ్లేచ్ఛుఁడు - 1.ఆచారహీనుడు, 2.పాపరతుడు, 3.నీచజాతివాడు.
మ్లేచ్ఛదేశే ముఖ్యత్యాత్ మ్లేచ్ఛముఖం - మ్లేచ్ఛదేశ మందు ముఖ్యమైనది.
చేసిన దుష్టచేష్ట నదిచెప్పక నేర్పున గప్పి పుచ్చి తా
మూసిన యంతటన్ బయలుముట్టకయుండద దెట్లు? రాగిపై
బూసిన బంగరున్ జెదరిపోవగడంగినవాఁడు నాటికిన్
దాసినరాగి గానఁబడదా పనులెల్ల నెఱుంగ, భాస్కరా.
తా. రాగిపై బంగారము ఒక పొరగా ఏర్పరచి దాని నంతను బంగారమని చెప్పినను కాలక్రమమును, ఆ పూయబడిన బంగారము తొలగిపోగానే ప్రజలందరికి అది ' రాగి ' యని తెలియును. అట్లే నీచుదొక దుర్మార్గమైన పని చేసి(చేసిన) దానిని యెవరికినీ చెప్పక, రహస్యముగా దాచియుంచినను కొన్నాళ్ళకది బయలుపడక మానదు.
అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
ద్వేహేమరూప్యే అశ్నుతే ద్వ్యష్టం. అశువ్యాప్తౌ. - వెండి బంగారములను రెంటిని వ్యాపించునది.
ద్వ్యష్టము - రాగి, తామ్రము.
స్పోటిత తామ్రము - (రసా.) రాగి ఖనిజము నుండి రాగిని సాధించు ప్రక్రియలో చివరదశలోని రాగి కరగియున్న ధాతువు నుండి సల్ఫర్ డైయాక్సైడ్ వాయువు పైకి ఉబుకుటచే బొబ్బలుగా ఏర్పడిన పైతలము గల రాగిముడి ధాతువు (Blister copper).
వరిష్ఠము - మిక్కిలి శ్రేష్ఠమైనది, వి.మిరియము.
శ్రేష్ఠత్వాత్ వరిష్ఠం - లోహములలో శ్రేష్ఠమైనది. మరిచము - మిరియము, రూ.మరీచము.
మిరియము - కారముగల సంబారు వస్తువు, రూ.మిరెము, సం.మరీచమ్, (వ్యవ.) Pepper piparaceac అనుకుటుంబమునకు చెందిన Piper nigrum అను తైగ యొక్క ఎండిన పండ్లు, (ఇవి సంబార ద్ర వ్య ము గ ను, ఓషధిగను ఉపయోగించుమ.)
శ్యామము - 1.మిరియము, 2.ఆకుపచ్చ, 3.నలుపు, 4.మబ్బు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
(ౘ)చామనము - శ్యామలము, నల్లనిది.
చామనచాయ - నల్లనిరంగు.
శ్యామిక - చీకటి, నలుపు.
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ. చామ.(ౘ)చామ - 1.యౌవనవతి, 2.నలుపు, 3.ఒకజాతి పైరు, సం.1.శ్యామా, 2.శ్యామాకః.
శ్యామాకము - 1.చామలు, 2.ఒక రకమైన ధాన్యము.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
కృష్ణము - 1.ఇనుము, 2.మిరియము, 3.నలుపు, 4.కాకి, 5.కోకిల, 6.కాలాగురువు, విణ.నల్లనిది.
అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
అర్కము - 1.జిల్లేడు, 2.రాగి, 3.(రసా.) ఒక ద్రవ్యమునుండి స్వేదనముచేగాని ద్రావణముచే గాని, లాగబడిన అంశము (Extract).
జిల్లెడు - అర్కవృక్షము, రూ.జిల్లేడు.
అహర్పతి- 1.సూర్యుడు, 2.శివుడు, 3.జిల్లేడు.
అహ్నపతిః అహర్పతిః, ఇ. పు. - పగటికిఁ బ్రభువు.
అర్కాహ్వ వసు కాస్ఫోట గనరూప వికీరనాః, మన్దార శ్చార్కపర్ణే. -
అర్కస్య అహ్వానామాస్యా స్తీతి అర్కాహ్వః - సూర్యుని యొక్క పేరుగలది.
వసత్యస్మిన్ తేజ ఇతి వసుకః వస నివాసే. - దీనియందు తేజస్సుండును.
ఆ స్ఫుట త్యాస్ఫోటః స్ఫుట వికసనే. - వికాసము గలిగినది. పా. ఆస్ఫోతః.
గణరూపాణి బహురూపాణ్యస్య గణరూపః - కాలక్రమమున ననేక రూపములు గలది.
పుష్పాణి వికిరతీతి వికీరణః. కౄ విక్షేపే. - పువ్వులఁ జల్లునది.
మందాన్ క్షుద్ర వ్యాధీన్ ఔషధత్వేన ఇయర్తీతి మందారః. - క్షుద్రవ్యాధులను బోఁగొట్టునది.
అర్కాభాని పర్ణా న్యస్య అర్కపర్ణః - సూర్యునివలె వేఁడిమి గల యాకులు గలది. ఈ ఆరు 6 జిల్లేడుచెట్టు పేర్లు.
అర్కుఁడు - 1.సూర్యుడు, 2.ఇంద్రుడు.
అర్చ్యత ఇత్యర్కః, ర్చపూజాయాం. – పూజింపఁ బడువాఁడు.
అర్కజుఁడు - 1.శని Saturn, 2.యముడు.
అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్క మనుచు జిల్లెడు తరుపేరు
మర్కట బుద్ధులెట్ల దీఱు
అర్కుడనుచు భాస్కరునికి పేరు కు
తర్కమనే అంధాకారము తీఱు ||తెలిసి||
ఔదౌంబరము - 1.ఒకలోహము, 2.రాగి, విణ.ఉదుంబర (మేడి) వృక్ష సంబంధమైనది. ఉదుంబరాభత్వా దుదుంబరం - మేడివంటి వన్నె గలది.
"ఔదుంబరం చ తామ్రం" అని యమర మాలయం దార్యావృత్తమునఁ జెప్పినాఁడు గనుక ఔదుంబరం మని ఔకారాదియుఁ గలదు.
ఉదుంబరక ఫలము - (వృక్ష.) పుష్పమంజరి అంతయు కలిసి ఏర్పడిన ఫలములలో నిది యొకటి. దీనిలో చుట్టును ఆవరించి యున్న పుష్పాసవము మాంసలమై యుండును, ఉదా.అత్తి మొ.వి.
అత్తి - (వృక్ష.) మేడి ఉదుంబరము, వై. వి. ఏనుగు, సం.హస్తిః.
మేడి - అంజూరు, అత్తిచెట్టు.
అం(ౙ)జూరు - 1.అత్తిపండు, 2.అత్తిచెట్టు.
ఉదుంబరము - 1.గడప, 2.అత్తిచెట్టు, 3.రావిచెట్టు.
కడప - దేహళి, రూ.గడప, వై. కదంబము (చెట్టు), సం.కదంబః.
దేహళి - గడప, కడప, రూ.గేహళి.
గేహళి - గడప, రూ.దేహళి.
దేహళీ దీపన్యాయము - న్యా. గడప మీద దీపము పెట్టిన నింటిలోన బైట గూడ ఉపయోగించు రీతి, దేహళీదత్త దీపన్యాయము.
ఉదుమ్బరో జన్తుఫలో యజ్ఞాజ్గో హేమదుగ్దకః,
ఉన్నతత్వా దుల్లంఘిత మంబరం అనే నేతి ఉదుంబరః - ఔనత్యముచేత నాకాశమును దాఁటునది.
జంతుయుక్తం ఫలమస్యేతి జంతుఫలః - జంతువు(జంతువు - చేతనము, ప్రాణముగలది)లతోఁ గూడిన ఫలములు గలిగినది.
యూపాదిరూపేణ యజ్ఞస్యాంగ మువకరణ మితి యజ్ఞాంగః – యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమైయుండునది.
హేమవర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః - బంగారువంటి పాలుగలది. ఈ నాలుగు 4 అత్తిచెట్లు పేర్లు.
గేహేశూరన్యాయము - న్యా.ఇంటిలో డంబములు కొట్టువాడే కాని పనికిరాని వాడనుట.
గేహేశూరుఁడు - ఇంటిలోనే డంబములు కొట్టువాడు, పిరికివాడు.(దంభము - 1.కపటము, 2.తప్పు, 3.గర్వము. అదరుగుండె - పిరికివాడు).
మేడిపండుచూడ మేలిమైయుండును
పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వ.
తా. ఓ వేమా! మేడిపండు చూచుటకు పైకిపచ్చగా బంగారమువలె కంటికింపుగా కనబడును కాని, దానిని బ్రద్దలుచేసి చూచినచో లోపల పురుగులు వుండును. చెడ్డవారుచూచుటకు పైకి బాగుగనే కన్పించు చున్ననూ, లోపల వారి(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)గుణములు (బింకము - 1.గర్వము, 2.నిక్కు, బిగువు.)మాత్రము చాలా చెడ్డవిగ వుండును.
పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు గలది.
పద్మం బిందుజాలక మస్యాస్తీతి పద్మీ.న్. పు. – పద్మమనఁగా దేహమందలి బొట్లు; అవి గలిగినది.
హస్తి - ఏనుఁగు వ్యు.హస్తము కలది.
చేగల మెకము - ఏనుగు, హస్తి.
కరటి - ఏనుగు, హస్తి.
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
హస్తిసఖుఁడు - మావటీడు.
మావటి - శూరుడు, మల్లుడు, రూ.మావటీడు, మాస్టీడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లుఁడు - జెట్టి; జెట్టి - 1.మల్లుడు, 2.శూరుడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లు - 1.కోతి, 2.మల్లుడు, జెట్టి, సం.మల్లః.
శూరుఁడు - సూర్యుడు, విన.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుఢు.
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
హస్తిని - 1.ఆడేనుగు, 2.ఒక స్త్రీజాతి, (శంఖినీ, పద్మినీ, చిత్రిణీ జాతు లితరములు).
గణిక - 1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ.
చిత్రిణి - చిత్తిని, ఒకజాతి స్త్రీ.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.
కడిమి1 - 1.అతిశయము, 2.పరాక్రమము; గోహరి - పరాక్రమము.
కడిమి2 - కడప (చెట్టు), సం.కదంబః.
నీపము - కడిమిచెట్టు.
కదంబరము - గుంపు, వై. విణ. మిశ్రము.
కదుపు - సజాతీయ పశు పక్ష్యాది సమూహము, సం.కదంబమ్.
ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్|
మత్స్యాపాదంజ లే పశ్యే న్ననారీ హృదయస్థితమ్||
తా. మేడిపువ్వులనైన గానవచ్చును, తెల్లని వాయసము-కాకి(ధూంక్ష్మము - తెల్లకాకి)నైనఁ గానవచ్చును, నీళ్ళలోపల(మత్స్యము - చేప)చేపల యడుగులనైనఁ గానవచ్చును, స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను. - నీతిశాస్త్రము
కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా|
కల్యాణీ జగతీకందా కరుణారససాగరా. – 73శ్లో
శ్రీకంఠుఁడు - శివుడు, కరకంఠుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈసరుఁడు - ఈశ్వరుడు. ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
ఈశ్వరి - పార్వతి; ఈసరి - పార్వతి.
నీలకంఠుఁడు - శివుడు.
శితికంఠుఁడు - శివుడు, వ్యు.నల్లని కంఠము గలవాడు.
శితి - 1.తెల్లనిది, 2.నల్లనిది.
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||
వైభవము - విభవము, సంపద.
విభవము - సంపద, ఐశ్వర్యము.
కలిమి - 1.అతిశయము(అతిశయము - అధిక్యము), 2.సంపద.
సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.
సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య – బంధమోక్షాను దర్శనమ్|
వివిక్తపదమజ్ఞాయ కిమసత్కర్మభిర్భవేత్ |
వనమాలి - విష్ణువు.
వనమాలీ, న. పు. శ్లో. అపాదపద్మం యామా లా వనమాలేతి సా మతా, ఇతి కళిఙ్గః. సా అస్యాస్తీతి వనమాలీ - పాదములదాక వ్రేలెడు పుష్పమాలిక గలవాఁడు.
మాల్యము - 1.పుష్పమాలిక, 2.పుష్పము.
రుచకము - 1.మాల్యము, 2.మంగళ ద్రవ్యము.
వనమాల - ఆకులు పువ్వులు చేర్చికట్టిన హారము.
తోటమాలియ - ఆకులు, పూవులు చేర్చి కట్టిన మాల, రూ.తోఁటమాలె, తోమాలియ, తోమాలె.
తోమాలె - తోటమాలియ. తోమాలెసేవ.
వైజయంతి - 1.టెక్కెము, 2.విష్ణుమాలిక, 3.విష్ణు ప్రాకారము.
టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జండా - టెక్కెము.
ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి. కేతువు, Ketu.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
స్యాత్ ప్రాసాదో వైజయంతః -
ప్రశస్తాః వైజయంత్యః పతాకా అస్మిన్ సంతీతి వైజయంతః. ఒకటి ప్రశస్తములైన టెక్కెములు గలది. ఇంద్రునిమేడ వైజయంత మనంబడును.
పతాకము - 1.పడగ, 2.టెక్కెము.
పతాకాధికారి - సైన్యములో జాతీయ ధ్వజమును మోయు సైనికోద్యోగి.
పతాకిని - సేన, వ్యు.పతాకములు కలది.
వనమాలా వై జయంతీ పంచదివ్యాయుధాత్మికా,
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ|
మాలిక - 1.పూదండ, 2.వరుస, 3.విరజాజి, 4.శంకరాభరణము, 5.కూతురు.
మాల1 - 1.పూదండ, 2.వరుస.
వరుస-1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
విరజాజి - నవమల్లికా కుసుమము; నవమాలిక - విరజాజి.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
నందన - 1.కూతురు, 2.అరువది సంవత్సరములలొ ఒకటి.
పుత్రిక - 1.కూతురు, 2.బంగారుబొమ్మ.
ఇండె - 1.పూదండ, 2.ఎముక కీలు, 3.చీలిక.
చీరిక - 1.పాయ, రూ.చీలిక.
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, ఆఫ్రికా అస్త్రేలియా, ఐరోపాఖండములు), (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన ఘనరూపభాగము, (భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్న భిన్నముగ చేయబడిన భూభాగము.
స్రజము - పూలదండ.
స్రగ్వి - పూదండగలవాడు.
సప్తలా నవమాలికా,
సప్తమనో బుద్ధ్యంతానీంద్రియాని లాతీతి. సప్తలా. లా ఆదానే. - మనోబుద్ధులతోఁ గూడిన పంచేద్రియములను అనఁగా నేడింటిని పరిమళము చేత స్వవశముగాఁ జేసికొనునది.
నవాస్తుత్యామాలా అస్యా ఇతి నవమాలికా - స్తోత్రము చేయఁదగిన దండ గలది. ఈ 3 విరజాజి పేర్లు.
హారము - 1.నూట ఎనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది ‘హారము ' (Denomination).
హారి - 1.మనోజ్ఞము, 2.హరించువాడు, 3.హారము కలవాడు.
మాల2 - చండాలుడు, సం.మాలః.
మాలెత - (మాల+ఎత) మాలది.
చండా లుఁడు - 1.మాలవాడు, రూ.చండాలుడు.
మాలఁడు - చండాలుడు, సం.మాలః.
తోటి - 1.మాల, చండాలుడు, 2.వేడుక
వేడుక - 1.సంతోషము, 2.వినోదము, 3.కుతూహలము.
పంచముఁడు - మాలడు, విణ.ఐదవవాడు.
అంత్యజుఁడు - చండాలుడు, హరిజనుడు.
అంతేవాసి - 1.శిష్యుడు, 2.హరిజనుడు, విణ.దగ్గరనుండువాడు, 2.ఎల్లయొద్ద నుండువాడు.
హరిజనుఁడు - అంటరానివాడు, (అస్పృశ్యులకు గాంధీ పెట్టిన పేరు.) సురియాళు - మాలవాడు, రూ.సులేయాళు.
నిషాదుఁడు - 1.బోయవాడు, 2.మాలవాడు.
పుల్కసుఁడు - 1.బోయ, 2.మాల, 3.అధముడు, రూ.పుల్కసుఁడు.
పుళిందుఁడు - బోయ (భాషాజ్ఞానమే లేక అడవిలో తిరుగు బోయ).
అర్జునకుఁడు - 1.బోయ, 2.తెల్లనివాడు. శబరుఁడు - 1.బోయ, 2.శివుడు.
గ్రామాంతము - మాలపల్లె.
వెలివాడ - మాలపల్లె.
కేతకి - 1.పచ్చపూవుల మొగిలి (ఇది శివపూజకు అర్హము కాదు), వికృ.గేదగి, 2.జాజి.
గేదఁగి - 1.పచ్చపూమొగిలి, 2.మొగిలిపూవు, సం.కేతకీ.
మొగలి - గేదంగి, కేతకి.
మాలతి - 1.ఒకానొక స్త్రీ, 2.జాజిచెట్టు.
జాతి1 - 1.కులము, 2.పుట్టుక, 3.సమానత్వము, 4.జాజికాయ(జాతికోశము - జాజికాయ), 5.మాలతి, 6.పద్యభేదము.
జాతి2 - (జీవ.) గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలిసి ఒక జాతిగా వర్గీకరింపబడినది (Genus).
జాతి3 - (చరి, రాజ.) ఒక దేశములో నివసించుచు సాధారనముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు.
జాతి స్సామాన్యజన్మనోః,
జాతిశబ్దము గోత్వాదిజాతులకును, పుట్టుటకును పేరు. జాయతేభిన్నే ష్వభిన్నాభిదాన ప్రత్యయా వనయేతి, జననం చ జాతిః. సీ. జనీ ప్రాదుర్భావే. భిన్నము లయిన వస్తువులయందు అభిన్నములైన నామ జ్ఞానములు దీనిచేతఁ బుట్టును గనుకను, పుట్టుట గనుకను జాతి.
జాతిచరిత్ర - (జీవ.) ఒక జాతి యొక్క పూర్వికుల వృత్తాంతము, (Phylogeny).
సజాతీయత - (చరి.,రాజ) భాష, మతము, ఆచారము, సాంప్రదాయములు, చరిత్ర యొక్క బంధముగల ప్రజలు (Nationality).
జాతము - సమూహము, విణ.పుట్టినది.
శ్రద్ధధానా శ్శుభాం విద్యా మాదదీ తా వరాద్రపి|
అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులా దపి||
తా. మంచివిద్యను జాత్యాదిహీనుని వలన నైనను శ్రద్ధాయుక్తులై గ్రహింప వచ్చును, సద్గుణవతియైన స్త్రీని దుష్కులము వలననైనను గ్రహింప వచ్చును. – నీతిశాస్త్రము
కృష్ణప్రియాత్వభాండీ రే చంద్రా చందన కాననే
విరజాచంపకవనే శతశృంగేచసుందరీ
పద్మావతీపద్మవనే మాలతీ మాలతీవనే
కుందదం తా కుందవనే సుశీలా కేతకీవనే| - 4
వనమాలీ పద్మనాభో మృగయాసక్తమానసః,
అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జనసముత్పుకః|
కంసారాతి - శ్రీకృష్ణుడు.
కంసారాతిః, ఇ-పు. కంసస్య అరాతిః - కంసుని శత్రువు.
కంసుఁడు - కృష్ణుని మేనమామ.
అష్టము రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకీకిన్
దుష్టుని కంసుఁ వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా.
తా. లోకమును ధర్మయుక్తముగాఁ బాలించుటకు దేవకీదేవికి(ప్రొద్దు - 1.సూర్యుడు, 2.కాలము, 3.దినము, సం.బృధృః.) రోహిణీ నక్షత్రముతో గూడిన అష్టమితిథినాడు, ఎనిమిదవ బిడ్డవైపుట్టి దుర్మార్గుఁడగు కంసుని చంపితివి. కృష్ణా! నీక్రియలు ధర్మాత్మకములు.
అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగు వాడు, విష్ణువు.
అధోక్షజః అధకృతాని అక్షాణీంద్రియాణి యస్మిన్ కర్మణి తర్యథా తథా జాతః తదుక్తం. శ్లో 'యస్యేద్రియం ప్రమథితుం ప్రమదా న శక్తా' ఇతి ఇంద్రియములను అధఃకరించి జనించినవాఁడు.
అధోక్షాణాం జితేంద్రియాణాం జాయతే ప్రత్యక్షీభవతీతి వా అధోక్షజః - జితేంద్రియులకు ప్రత్యక్ష మగువాఁడు.
అధఃకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం యనేతి వా – ఇంద్రియజన్యజ్ఞానమును అధఃకరించినవాడు.
ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.
జితేంద్రియుఁడు - ఇంద్రియములను జయించినవాడు.
గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు. గోపాలం చింతయే ద్బుధః|
గొల్ల1 - 1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.
గోపే గోపాల గోసంఖ్య గోధు గాభీర వల్లవాః,
గాః పాతీతి గోపః, గాః పాలయతీతి గోపాలః. పా రక్షణే; పాలరక్షణే. - ఆవులను రక్షించువాడు.
గా స్సంచష్టే గోసంఖ్యః. చక్షిఙ్ వ్యక్తాయాం వాచి. - ఆవులను విచారించువాఁడు.
గాః దోగ్ధీతి గోధుక్. హ.పు. దుహ ప్రపూరనే. - ఆవులను బితుకువాఁడు.
ఆసమంతాత్ భియం రాతీతి అభీరః. రా ఆదానే. - అంతట భయము గలవాఁడు.
బత్ స్థైర్యం లునాతీతి లవః బదః స్థైర్యస్యలవో వల్లవః, బద స్థైర్యే. లూఞ్ ఛేదనే. వబయోరభేదః - భయము నొంది మనస్థైర్యము వీడినవాఁడు.
గోమహిస్యాదికం వలమానాః సంవృణ్వంతో వాంతి గచ్ఛంతీతి వల్లవాః. వల సంవరణే. వా గతిగంధనయోః. - గోమహిష్యాదులను జుట్టుకొని పోవువాఁడు. ఈ ఆరు గొల్లవాని పేర్లు.
మహాశూద్రి - గొల్లది.
అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు.
వల్లవుఁడు - గొల్లవాడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రనక్షత్రమని కొందరు.
గొల్లవారి బ్రదుకు గొఱఁతన వచ్చునే,
గొల్లరీతిఁ బాలకుప్పఁ ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు,
చేటు లేని మందు సిరియుఁ గనిరి.
భా|| గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు. దేవతలు గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ శ్రీలక్ష్మినీ పొందగలిగాడు.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గంగాపుత్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
భీష్ముఁడు - 1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
అధోక్షకము - (జం.) భుజమునకును శరీరభిత్తిక కును సంబంధించినది (రకనాళము) (Subclavian).
పరసతుల గోష్టినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
గరిత సుశీలయైనను,
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ.
తా|| బ్రహ్మచారియైన భీష్మునంతటి వాడైనను ఇతర స్త్రీలతో (గోష్ఠి - 1.పరిషత్తు సభ, ఇష్టాగోష్ఠి.) సరస సంభాషణలు జరిపినచో లోకం అట్టి వానిని అనుమానించును. అట్లే యెంతటి సుశీలయైన స్త్రీ(గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.)అయినను అన్య పురుషుల(సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.)పోషణలో వున్న నిందలపాలగును.
విశ్వంభరుఁడు - విష్ణువు.
విశ్వంభరః విశ్వం బిభ్హరీతి విశ్వంభరః - విశ్వమును ధరించినవాఁడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుఁడు(వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
విశ్వంభరో ద్భుతో భవ్య శ్రీవిష్ణుః పురుషోత్తమః,
ఆనఘాస్త్రో నభాస్త్ర శ్చ సూర్యజ్యోతి స్సురేశ్వరః|
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.
కైటభజిత్. త-పు. కైటభమసురం జితవాన్ - కైటభుఁడనెడి యసురుని జయించినవాఁడు జి జయే. ప్రధమం తు హరిం విద్యాత్|
కాలామ్భుదాళి లలితోరసి కైటభారే
ర్ధారాధ రే స్పురతి యా తటిదఙ్గ నేవ
మాతు స్సమస్త జగతాం మహనీయమూ ర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవ నన్దనాయాః|| - 6
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి. కృష్ణ మేకాదశం|
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా. విష్ణువుచేత గాని, శివుని(హరుఁడు - శివుడు)చేత గాని, బ్రహ్మచేత గాని, ఇతరమైన దేవతలచేత గాని నొసట వ్రాయబడిన వ్రాత తుడిచివేయ నలవి కాదు (మనుష్యమాత్రుల కాగలదా.) - నీతిశాస్త్రము
అనుగ్రహప్రదాం బుద్ధి మనఘాం హరివల్లభామ్,
అశోకా మమృతాం దివ్యాం లోకశోక వినాశినీమ్|
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
విధుః ఉపు విధ్యతి ప్రత్యర్థినఁ ఇతి విధుః - శత్రువులను వ్యథపెట్టువాఁడు.
నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము.
తామర - 1.తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.) తామరచెలి - సూర్యుడు, పద్మ మిత్రుడు.
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మ వ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు 5.ముఖము పైగల చుక్కలు. కువేలము - 1.కలువ 2.పద్మము. ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పశువులను త్రోలుట.
పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ. ఎఱ్ఱనిది.
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒకనిధి.
గుల్ల - 1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము), సం.క్షుల్లః.
నత్త - గుల్ల యందుండు పురుగు.
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల.
కౌస్తుభవక్షుడు - విష్ణువు. వక్షస్తలే కౌస్తుభం|
కౌస్తుభో మణిః (చాప శ్శార్ఙ్గ మురారేస్తు శ్రీ వత్సో లాఞ్ఛానం మతమ్,)
కౌస్తుభః కుంస్తోభత ఇతి కుస్తుభో హరిః, తస్యాయం కౌస్తుభః - భూమిని నిలిపిన విష్ణుని సంబంధమైనది.
విష్ణుభస్తమ్భే కుంస్తుభ్నాతి వ్యాప్నోతీతి కుస్తుభస్సముద్రః - తత్ర భవతీతివా కౌస్తుభః - సముద్ర మందుఁ బుట్టినది. ఈ ఒకటి విష్ణువు యొక్క మణిపేరు. విష్ణువు ధనుస్సు శార్ఙ్గము. పుట్టుమచ్చ శీవత్సము.
కౌస్తుభము - విష్ణువక్షస్స్థలము నందలి మణి, వ్యు.కుస్తుభ = సముద్ర మందు పుట్టినది.
దేవమణి - 1.కౌస్తుభము, 2.గుఱ్ఱము మెడ మీది సుడి.
ఊరక వచ్చుఁ బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగఁగల్గువానికిఁ, బ్రయాసము నొందిన దేవ దానవుల్
వారలటుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగదె శృం
గారపుఁ బ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు, భాస్కరా.
తా. సురాసురలు అమృతమునకై మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి యను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభరత్నమును, కల్పవృక్షమును, కామధేనువు ను పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో "లక్ష్మియు, కౌస్తుభ రత్నము" అను నీ రెండును ప్రయాస పడకుండనే విష్ణువు(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.)నకు లభించెను. అదృష్టవంతున కభివృద్ధి కలుగబోవు నెడల నతడే ప్రయాసమును బడకుండ గనే అతనికి భాగ్యము కల్గును.
బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారాన ళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో (అ)పి కటాక్షమాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయాః| - 7
పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు - 1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
పోసనము - 1.క్షీరము, 2.పైపూత, 3.కాంతి.
క్షీరదము - (జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు.
క్షీరాన్నము - పరమాన్నము.
పారలౌకికము - పాయసము, పరమాన్నము, విణ.పరలోక సంబంధమైనది.
పాయసము - పరమాన్నము, వ్యు.పయస్సుతో వండినది; పాసెము, సం.వి. (రసా.) (Emulsion) ఒక ద్రవమును ఇంకొక దానితో కొల్లోయిడ్ స్థితిని పొందునట్లు చేయబడిన అవలంబితము (Suspension).
ఏకదేశము - అంశము, భాగము.
అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తుఁడు - భక్తి గలవాడు.
పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెరచుగావున
బాలినుడగు వానిపొందు వలదుర సుమతీ.
తా. తెలివిహీనుల(బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.)స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం.
పాయసాన్నప్రియా తక్ స్థా పశులోకభయంకరీ |
అమృతాదిమాహాశక్తి - సంవృతా డాకినీశ్వరీ. – 99శ్లో
కీలాలము - 1.నెత్తురు Blood, 2.నీరు.
కీలాన్ జ్వాలాన్ అలతి వారయతీతి కీలాలం. అల భూషణపర్యాప్తి శక్తివారణేషు. - అగ్నిజ్వాలలను వారించునది.
కీల్యతే బద్ద్యత ఇతివా కీలాలం. కీల బంధనే. - బంధింపఁబడునది.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
అమృతకరుఁడు - చంద్రుడు. లలాటం అమృతోత్భవ|
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
అమర్త్యాః నమ్రియంత ఇత్యమర్త్యాః - చావనివారు. మృఙ్ ప్రాణత్యాగే. అమృతాంధనః-న-వు. అమృత మంధో (అ)న్నమేషాం తే - అమృతము అన్నముగాఁ గలవారు.
అమృతం సద్గుణాభార్యా అమృతం బాల భాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మానభోజనమ్||
తా. గుణవతియైన యాలు(స్త్రీ, భార్య), బాలుని ముద్దుమాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము
దిగ్ఘస్తిభి కనకకుమ్భ ముఖావసృష్ట
స్వరాహినీ విమల చారుజల ప్లుతాన్గీమ్
ప్రాత ర్నమామి జగతాం జననీ మ శేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధిపుత్త్రిమ్|-20
పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను - 1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.
పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం - పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధుసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
చాలఁబవిత్రవంశమున సంజనితురిడగునేని యెట్టి దు
శ్శీలునినై నఁ దత్కులవిశేషముచే నొకపుణ్య పు డెంతయున్
దాలిమి నుద్ధరించును, సుధానిధిఁబుట్టగఁ గాదె, శంభుడా
హాలహలానంబు గళమందు ధరించుటఁబూని, భాస్కరా.
తా. మున్ను సురాసురలు పాల సముద్రము మధింపగా అందుండి పుట్టిన హాలాహలం (పాల సముద్రమున పుట్టిన విషము.)మనెడి యగ్నిని శివుడు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)తన కంఠ మందు ధరించెను. అది ఆ యగ్ని గొప్పతనముకాదు, అది పుట్టినట్టి పాల సముద్రము యొక్క గొప్పతనము చేతనే. అట్లే, మంచి వంశమందు బుట్టిన, వాడు నీచుడైనను వానిని ఆ కులము యొక్క ఔనత్యము ను దలంచియే సజ్జనులు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)తో కాపాడుదురు గాని ఆ నీచుని జూచికాదు.
ఫాలవిలోచన భానుకోటిప్రభ, హాలాహలధర అమృత శివ|
సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాకరుడు - చంద్రుడు.
సుధాంశువు - చంద్రుడు, అమృత కిరణుడు.
సుధారూపా అంశవో యస్య సః సుధాంశుః, ఉ-పు. - అమృతరూపములైన కిరణములుగలవాఁడు.
శుభ్రాంశువు - చంద్రుడు, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశవో యస్యసః శుభ్రాంశుః ఉ-పు. - తెల్లని కిరణములుగలవాఁడు.
సుధాసిన్ధో ర్మధ్యే - సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపో - పవనవతి చిన్తామణిగృహే |
శివాకారే మఞ్చే – పరమశివపర్యఙ్క నిలయామ్
భజన్తి త్వాం ధన్యాః - కతిచన చిదానంద లహరీమ్ || - 8శ్లో
తా. ఓ జననీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, చుట్టును కల్పవృక్షములు వరుసతో చుట్ట బడినదైన కదంబచెట్ల పూదోటలలో చెలువొందు చింతామణులతో నిర్మితమైన(చింతామణి)గృహంలో, శివరూపమగు మంచము నందు పరమశివుని పడుక యందుండు(పర్యంక నిలయమైన)జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను కొందఱు సేవించుచుందురు. (ధన్యా - దాది, ధన్యురాలు. అందరికీ సామాన్యముగా నీ సేవ లభించదని భావం.) – సౌందర్యలహరి
సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా,
సీతా సర్వాశ్రయా సంధ్యా సుఫలా సుఖదాయినీ |
ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః|
ఓం పంచ ప్రేతమంచాధి శాయిన్యై నమః : బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు - నాలుగు మంచంకొళ్ళును, సదాశివుడు ఫలక స్థానంలో విరాజిల్లునట్టి మంచంమీద శయనించు మహేశ్వరికి వందనాలు.
ఓం పంచబ్రహ్మాసన స్థితాయై నమః : బ్రహ్మ, విష్ణు, ఈశ, రుద్రులు మంచంకోళ్ళుగాను, సదాశివుడు ఫలకస్థానంతోనూ తేజరిల్లునట్టి ఆసనంపై విరాజిల్లు తల్లికి వందనాలు.
ధర్మార్థ కామ(కోరిక)మోక్షములనే నాలుగు కోళ్ళుగల కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య రూపమైన మంచము. ఎంచబోతే మంచమంతా కంతలే!
మహాపద్మావటీసంస్థా - కదంబవనవాసినీ|
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ. - 23శ్లో
ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు(నాల్గు దంతములు కలది), 2.అమృతము.
(ౘ)చౌదంతి - చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము; వెలిగౌరు - ఐరావతము
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.
పుంనాగే పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః,
పున్నాగ ఇవ పున్నాగః - పురుష శ్రేష్ఠునివలె పూజ్యమైనది.
పురుషవ దున్నతత్వాత్పురుషః తుంగశ్చ - పురుషునివలె ఉన్నతమైనది పురుషము, తుంగమును.
ప్రశస్తాః కేశరాస్సంత్యస్య కేసరః - మంచి ఆకరవులు గలది.
దేవానాం వల్లభః - దేవతలకు ప్రియమైనది. ఈ నాలుగు 4 సురపొన్న పేర్లు.
ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రునిఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.
తెల్లయేనుగు - ఐరావతము.
ఇరా ఆపః అస్మిన్ సంతీతి ఇరావాన్ సముద్రః తస్మిన్ జాతః ఐరావతః - సముద్రమునందుఁ బుట్టినది.
మువ్వన్నెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు - (భౌతి.) సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow).
శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.
శక్తుడు - శక్తికలవాడు.
ఇంద్రాయుధం శక్రధనుః -
ఇంద్రస్య ఆయుధం ఇంద్రాయుధం. - ఇంద్రుని యాయుధము.
శక్రస్య ధనుః శక్రధనుః. స-న. - శక్రుని ధనుస్సు. శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.
మేఘప్రతి ఫలిత నానావఋనస్య ధానురాకారేన దృశ్యమానస్య సూర్యరశ్మే ర్నామనీ - ఇది మేఘము నందు బ్రతిఫలించి, నానావర్ణమై ధనురాకారముగా నగపడుచున్న సూర్యరశ్మి. ఈ రెండు ఇంద్రుని ధనుస్సు పేర్లు.
ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
యమపత్ని - ఐరావతి.
అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
నభ్రమతి స్వం వల్లభం హిత్వా కుత్రచిన్న గచ్ఛతీ త్యభ్రముః. ఉ-సీ భ్రముచలనే - తన మగని విడిచి కదలనిది.
అభ్రేషు మాతివర్తత ఇత్యభ్రముః మాఙ్ మానే వర్తనేచ - మేఘముల యందుండునది.
గతై ర్మాణిక్యత్వం - గగనమణిభి స్సాంద్ర ఘటితం
కిరీటం తే హైమం - హిమగిరి సుతే! కీర్తయతి యః, |
స నీడేయచ్ఛాయా - చ్ఛురణ (పటలం) శబలం చంద్రశకలం
ధనుః శ్శౌనాసీరం - కిమతి న నిబధ్నాతి ధిషణామ్. - 42శ్లో
తా. ఓ హైమవతీ! హిమవంతుని కూతురా! ఆకాశంలో వెలుగొందుతున్న ద్వాదశాదిత్యులనే మాణిక్యాలచే(సూర్యకాంతమణులు) చక్కగా కూర్చ బడినదైన(పొదిగిన) నీ బంగారు కిరీటమును - ఎవడు కీర్తించుచున్నాడో(వర్ణిస్తున్నాడో) - ఆ కవీంద్రుడు - గోళాకారమైన ఆ కిరీటమునందు కుదుళ్ళయందు బిగింప బడిన మణులయొక్క కాంతులతో కలియుటచేత చిత్ర చిత్ర వర్ణములు గల చంద్రరేఖ(నీ పాపట బొట్టుగానున్న చంద్ర రేఖను)కాంచి అదినిజంగా ఇంద్రధనుస్సే అయి వుంటుందని ఎందుకు(తన చిత్తము నందు) స్థిరముగా భావించడు? (చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి ఇంద్రధనుస్సే అని నిశ్చయబుద్ధి కల్పించు కొనుచున్నాడని భావము.) - సౌందర్యలహరి
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
జీవంత్యనేనేతి జీవనం. జీవ ప్రాణధారణే. - దీనిచేత బ్రతుకుదురు.
వర్తనము - 1.నడవడి, 2.జీవనము.
నీళ్ళు - నీరు; సలిలము - నీరు.
ప్రవృత్తి - 1.నడక, 2.ప్రవేశము, 3.బ్రతుకుతెరువు.
వృత్తము - 1.నియత గణములును యతిప్రాసములుగల పద్యము, 2.నడత(నడత - ప్రవర్తనము), 3.జీవనము, విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే రూపములో చరించు బిందువు యొక్క పథము, (Circle).
జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic).
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము..
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
మూత్రము - ఉచ్చ, కాలుమడి.
ఉచ్ఛ(ౘ) - మూత్రము.
ఉచ్చబుడ్డ - మూత్రాశయము.
ఉచ్చమల్లి - 1.దిసమొల స్త్రీ, నగ్నిక, 2.రోత పుట్టించు స్త్రీ.
నగ్నిక - 1.కన్య, 2.దిసమొల ఆడది, రూ.నగ్నా.
దిసమొల(బిత్తల - దిసమొల), నగ్నత్వము, రూ.దిస్సమొల.
నగ్నికా కోటవీ స్యాత్ :
నజతే నగ్ని కా. ఓనజీ వ్రీడే. - లజ్జించునది.
కుటేన కౌటిలేన వేతి యాతీతి కోటవీ. సీ. వీ గతిప్రజనన కాంత్యసన ఖాదనేషు. - కౌటిల్యము(కౌటిల్యము - 1.వంకరతనము, 2.కాపట్యము.)చేత పోవునది. ఈ రెండు 2 దిసమొలతో నుండు స్త్రీ పేర్లు.
నాగ్నింముఖే నోపథ మే నగ్నాం నేక్షేతచ స్త్రీయం|
నామేధ్యం ప్రక్షి పేదగ్నౌ నచపాదౌ ప్రతాపయేత్ ||
తా. అగ్నిని నోటిచే నూదరాదు, దిగంబరియై యున్న(వివస్త్రయైయున్న)స్త్రీని జూడరాదు, అపిశుద్ధమైన వస్తువు అగ్నియందు వేయరాదు, అడుగులను గాచుకొన గూడదు. – నీతిశాస్త్రము
మనువు - 1.జీవనము 2.వర్తనము 3.మగడు 4.కాపురము 5.పెండ్లి.
జీవనము - 1.బ్రతుకు తెరువు(జీవిక) 2.నీళ్ళు(నీరు).
వర్తనము - 1.నడవడి, ప్రవర్తన, నడత (Behavior) 2.జీవనము.
మగడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ. పురుషో హి ప్రజాపతిః.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
పురుషా వాత్మ మానవౌ : పురుష శబ్దము జీవునికిని, మనుష్యునికిని పేరు. పిపర్తీతి పురుషః పౄ పాలన పూరణయోః - పాలించువాడు.
ఏడుగడ - 1.గురువు, 2.తల్లి, 3.తండ్రి, 4.పురుషుడు, 5.విద్య, 6.దైవము, 7.దాత అని ఏడు విధములైన రక్షణము రూ.ఏడ్గడ (ఏడు + కడ).
కాపురము - 1.నివాసము, 2.సంసారము.
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివసనము - ఇల్లు; నివసతి - ఇల్లు.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహమేధి - గృహస్థు, వ్యు.భార్యతో చేరియుండువాడు.
గృహిణి - ఇల్లాలు, భార్య.
వాసము - 1.వస్త్రము 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వస్త్రము - బట్ట, వలువ(సన్న వస్త్రము, బట్ట).
కాపు - 1.గృహస్థుడు 2.పంటపెట్టువాడు 3.శూద్రుడు 4.కాపురము.
ఇంటికాపు - గృహస్థుడు. ఇలుదొర - గృహస్థు.
సంసారము - 1.ఆలుబిడ్డలతోడి వునికి, 2.ప్రపంచము.
ప్రపంచము - 1.లోకము, 2.సంసారము, 3.విరివి.
లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
విరివి - విస్తృతి, విణ.విస్తృతము, వెడల్పైనది.
సంసరణము - 1.సంసారము, 2.బాట, 3.యుద్ధప్రారంభము.
పెండ్లి - వివాహము. వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్ట విధములు.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్యాటికుఁడు - భార్యమాత జవదాటనివాడు.
ఋతా మృతాభ్యాంజివేత్తు మృతేన ప్రమృతే సదా|
సత్యావృతాభ్యా మపిచం నశ్యవృత్యా కదాచన||
ఋణ ముఞ్ఛశీలం జ్ఞేయమమృతంస్యా దయాచితం|
మృతంతుయాచితంభై క్షంప్రమృతం కర్షణం స్మృతం||
సత్యానృతంతు వాణిజ్యం తేన సేవాపి జీవ్యతే|
అస్వవృత్తిర్న చాధ్యాసే త్తస్మాతాం పరివర్జ యేత్||
తా. ఇండ్లయందు కోళ్ల మొదటఁబడిన గింజల నేరుకతి జీవించుట ఉంఛము, ముళ్ళలోని యెన్నుల దెచ్చుకొని జీవించుట శీలము, ఈ రెండును ఋణమనంబడును. అమృతమనగా యాచింపక యదృచ్ఛా లబ్దమైన ద్రవ్యముచేత జీవించుట, ప్రమృతమనఁగా కృషి. సత్యావృత మనగా వర్తకం, అస్వవృత్తియనఁగా కొలువు గొలుచుట. ఇందు బ్రాహ్మణుని కి వెనుక చెప్పబడిన యొక్కొక్క వృత్తికంటె ముందు చెప్పఁబడిన యొక్కొక్క వృత్తి శ్రేష్ఠమయినది, కావున ఉంఛవృత్తి మొదలు వాణిజ్యము వరకుఁ జెప్పబడిన వృత్తులచే జీవించవచ్చును. కాని బ్రాహ్మణుం (అన్య) డన్యవృత్తిచేత నొకప్పుడును జీవింపరాదు. – నీతిశాస్త్రము
భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.
భవతి సర్వమనేనేతి భువనం, భూ సత్తాయాం. - దీనివలన నన్నియుఁ గలుగును.
జగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
ౙగ - గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద. గొప్ప - అధికము, పెద్దది.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
(ౙ)జాగా - 1.పెద్దది, 2.గొప్పది, 2.చోటు, రూ.జగ, జగా, జెగ, సం.జగత్.
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా,
భువన జ్ఞాన నిశ్శ్రేణిః భువనాకారవల్లరీ| - 124స్తో
దొడ్ద - గొప్ప, రూ.దొడ్డు.
దొడ్డువాఱు - 1.క్రి.గొప్పయగు, 2.లావగు.
లావు - 1.బలము, 2.అతిశయము, సామర్థ్యము, విణ.స్థూలము.
భువనేశ్వరము - చుట్టుబవంతి. ద్వాదశం భువనేశ్వరీ|
సదా సమ్మోహినీ దేవీ సుందరీ భువనేశ్వరీ
ఏకాక్షరీ పరాబ్రాహ్మీ స్థూల సూక్ష్మప్రవర్ధనీ|
విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి.(భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe). విశ్వము నందు దేవిస్థానం విశ్వేశ్వరి.
విశ్వసనీయము - విశ్వసింపదగినది.
విశ్వసృజుఁడు - బ్రహ్మ.
విశ్వతోముఖము - అంతట వ్యాపించినది, సర్వతోముఖము.
సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.
ఏకానేక స్వరూపవిశ్వేశ్వర యోగిహృదిప్రియవాసశివ |
లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
విష్టపము - లోకము. సర్వ చరాచర పాలక రామ్|
లోకములు - సర్గమ ర్త్య పాతాళములు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము; ఈ ఏడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము; ఈ ఏడును అధోలోకములు.
చరాచరము - 1.జగత్తు, 2.విణ.తిరుగునదియు, తిరుగనదియు.
జనము - ప్రజ; ప్రజ - జనము, సంతతి.
సంతతి - 1.కులము, 2.సంతానము, 3.పుత్రపౌత్ర పారంపర్యము, 3.వరుస.
కులము - 1.వంశము, 2.ఇల్లు, 3.తెగ, 4.సరీరము, 5.ఊరు.
సంతానము - 1.బిడ్ద, పుత్రపౌత్ర పారంపర్యము, కులము, 2.ఒక కల్పవృక్షము.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి.
కుటుంబము - పెండ్లాము, బిడ్డలు మొ.వారు భార్యభర్తలు, వారి సంతానము. ఒక గృహములో నివసించు బంధువర్గము (Family).
కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
పురంధ్రి - కుటుంబిని, స్త్రీ(ఆడుది).
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
చరాచరజగనాథా చక్రరాజనికేతనా|
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా. - 60స్తో
లోకబాంధవుఁడు - సూర్యుడు; జగచ్చక్షువు - సూర్యుడు Sun.
జగముకన్ను - సూర్యుడు; ౙగము చుట్టము - సూర్యుడు.
దృశ - చూపు; దృశ్యము - చూడదగినది.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృష్టించు - క్రి.చూచు. దృష్టము - చూడబడినది.
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగ్రుడ్డునకు సంబంధించినది, (Optic).
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve).
దృష్టిరేఖ - (భౌతి.) మనచూపు పరచు ఋజురేఖ, (line of vision).
దృక్పిండములు - (జం.) మధ్యసుప్తిష్కము యొక్క పార్శ్వములందు దట్టముగా నేర్పడిన భాగములు (Optic thalami).
వీక్ష్యము - ఆశ్చర్యము, విణ.చూడదగినది.
శలాకలు, శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (దీనిని శీఘ్ర గ్రహణశక్తి గలదు) (Rods and cones).
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాసి యందు విశాలాక్షి (సతీదేవి ముఖం పడిన చోట వారాణసి, అక్కడ వుండే గౌరికి విశాలాక్షి అనిపేరు).
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక(పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ).
భవ్య - పార్వతి, హైమవతి.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకర సర్వజనేశశివ |
కాంచు - క్రి.1.చూచు, వీక్షించు, 2.పొందు.
వీక్షణము - అవలోకము, ఈక్షిణము.
అవలోకనము - 1.చూపు, 2.చూచుట, 3.కన్ను, 4.విచారణ.
ఈక్షణము - 1.కన్ను, 2.చూపు, వీక్షణము.
ఈక్షితము - 1.చూడబడినది, 2.ఆలోచింపబడినది, వి.చూపు, దృష్టి.
చక్షువు - కన్ను. చక్షుసేతు విశాలాక్షి|
చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్డివాడు, 3.మంచికన్నులు కలవాడు.
పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు - 1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి -1.మిత్రభావము, స్నేహము(చెలిమి -స్నేహము.), 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity).
పొందుకాఁడు - స్నేహితుడు; స్నేహితుఁడు - చెలికాడు.
దృశా ద్రాఘ్రీయస్యా - దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం - స్నపయ కృపయా మామపి శివే!
అనేనా యం ధన్యో - భవతి నచ తే హానిరియతా
వనే వా హర్మ్యో వా - సమకరనిపాతో హిమకరః. - 57శ్లో
తా. తల్లీ! పార్వతీదేవీ! మిగుల దీర్ఘమైన(పొడవైనదియు) కొంచెము వికసించిన నల్లకలువల(నీలాబ్జము-నల్లకలువ)కాంతివంటి, కాంతి గలిగిన నీ కడగంటి చూపులోని కృపారసము చేత - కడు దూరమున నున్న దీనుడనగు నా యందు, దయతో నీ చూపును పడనిమ్ము. ఈ మాత్రము చేత నేను ధన్యుడనగు దును. ఇందుచే నీకేవిధమైన నష్టము లేదు. శీతకిరణుడైన చంద్రుడు(హిమకరుఁడు - చంద్రుడు) వనమున గాని, మేడలపైగాని తన కిరణములను సమానము గనే ప్రసరింపజేయు చున్నాడు కదా! -సౌందర్యలహరి
దృశ్యాదృశ్యవిభూతి పావనకరీ – బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ - విజ్ఞానదీపాంకురీ|
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ -మాతాన్నపూర్ణేశ్వరీ.
విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ|
ప్రగల్భా పరామోదారా పరామోదా మనోమయీ. - 174శ్లో
కంచి - కాంచీనగరము, విణ.పెద్ద.
కాంచీ - 1.స్త్రీలు ధరించెడు ఒంటి పేట మొలనూలు, 2.కాంచీపురము, (పుణ్యనగరము లేండింటిలో ఒకటి). కామాక్షీ కంచికాపురీ శక్తిపీఠం|
మొలనూలు - ఆడువారు అలంకారార్థము ధరించెడు కటి సూత్రము.
ఏకహారము - 1.ఒంటిపేటహారము, 2.(అలం.) ఒక అర్థాలంకారము.
కచ్యతే బధ్యతే కాంచీ. సీ. కచ దీప్తిబంధన దేవనేషు. - కట్టఁబడునది, ఒంటిసరము గలది.
కంచిమేఁక - పెద్దపొదుగు గల మేక.
కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః.
క్వణత్కాంచీదామా - కరికలభకుంభ స్తననతా
పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా |
ధనుర్బాణాన్ పాశం - సృణి మపి దదానా కరతలైః
పురస్తా దాస్తాం నః - పురమథితు రాహో పురుషికా || - 7శ్లో
తా. మ్రోగుచున్న(చిరుగంటలతో కూడిన)బంగరు మొలనూలు గలదియు, గున్న యేనుగు కుంభస్థలముల వంటి స్తనములచే కాస్త వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుని వంటి ముఖము గలదీ, చేతులతో చెరుకు విల్లుని, పుష్పబాణాలను, పాశము అంకుశము(సృణి - అంకుశము)ను ధరించినదియు నైన త్రిపురాంతకుని యహంకార రూపిణి యగు దేవత మా యెదుట సుఖాసీనయై ప్రత్యక్షమగు గాక! - సౌందర్యలహరి
కర్పూరగురుకుంకుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్ణోత్కృష్టకష్టకర్మదహనం కామేశ్వరీం కామినీమ్|
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవానీం భగవతీం శ్రీమాతరం భావయే.
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా|
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా. - 118శ్లో
కబంధము - 1.జలము, 2.మొండెము, 3.సముద్రము.
కం శరీరం బద్నాతీతి కబంధం - శరీరమును నిలుపునది.
పా. కమంధమితిపాఠే కం, అంధం ఇతి నామద్వయం. కామ్యత ఇతి కం. కముకంతౌ. - కోరఁబడునది.
అనంత్యనే నేతంధం. అనప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
కంబు1 - 1.జలము, 2.తల.
కంబు2 - సజ్జపైరు.
మొండెము - తలతెగిన కళేబరము, కబంధము, సం.వి.ముండమ్, (గృహ.) భుజము క్రింది తుంటిపై భాగము, కబంధము, ఊర్థ్వకాయము (Trunk).
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కసుఁడు - కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్| కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
ఉదకము - నీరు, (వ్యు. తడుపునది, రూ.ఉదము.
ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పశువులను త్రోలుట.
తామరసము - 1.తామర, 2.బంగారు, 3.రాగి.
తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.
నాళీకము - 1.తామర, 2.బాణము, 3.బాణపు ములికి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 2.కూతురు, సం.1.భేత్త్రీ, 2.పుత్త్రః, 3.పుత్రి.
రాజీవము - తామర. మాధవ మంత్రమునకు రాజీవము.
కృత్స్నము - 1.జలము, 2.కడుపు, విణ.సర్వము.
కృత్యతే వ్యప్రియతే (అ)నేనేతి కృత్స్నం, కీతీ వేష్టనే. - దీనిచేత వ్యపింపఁబడును.
కడుపు - ఉదరము, పొట్ట.
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట. పొట్ట పైరుకు పుట్టెడు నీరు.
పిచణ్డకుక్షీ జఠరోదరంతున్దమ్ -
పిచండము - కడుపు.
పిచండిలుఁడు - పెద్ద బొజ్జ కలవాడు.
పచతి ఆన్నం స్వగతాగ్నినా పిచండః - తనయందుండెడు అగ్నిచేత అన్నమును బక్వము సేయునది.
అపిచమత్యాహార మితివా పిచండః. చము అదనే. - ఆహారమును బక్షించునది.
బొజ్జ - కడుపు.
బొజ్జదేవర - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
తున్దిల స్తున్దిభ స్తున్దీ బృహత్కుక్షిః పిచణ్డిలః,
తుంది పిచండశబ్దౌ కుక్షిపర్యాయౌ తద్యోగాత్ తుందిలః, తుందిభః, పా, తుందికః, తుందీ,న్. పిచండిలశ్చ - తుంది పిచండశబ్దములు కుక్షివాచకములు; అది గలిగినవాఁడు. అనఁగా దొడ్డకడుపు గలవాఁడు.
బృహత్క్షిరస్యేతి బృహత్కుక్షిః, ఇ. దొడ్దకడుపువాఁడు. ఈ 4 పెద్దకడుపుగలవాని పేర్లు.
తుందము - కడుపు.
తుంది - 1.కడుపు, 2.ఉరుకుబొడ్డు, విణ.బొజ్జకడుపు కలవాడు.
తుందిభుఁడు - 1.బొజ్జకడుపు గలవాడు, 2.ఉరుకుబొడ్డు కలవాడు, రూ.తుందిలుడు.
తొంద - తుదిలుండు, బొజ్జకడుపువాడు, రూ.తొందు, సం.తుందీ.
తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండిభుఁడు - ఉరుకు బొడ్డువాడు, రూ.తుండిలుఁడు.
బృహత్కుక్షి - పెద్దకడుపువాడు.
దొడ్ద - గొప్ప, రూ.దొడ్డు.
దొడ్డువాఱు - 1.క్రి.గొప్పయగు, 2.లావగు.
లావు - 1.బలము, 2.అతిశయము, సామర్థ్యము, విణ.స్థూలము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుండుపడు - వై. క్రి. మోడువలెనగు, మొండియగు.
కుక్షి- కడుపు, జఠరము. కుక్షిం చ వైష్ణవీ పాతు|
కుప్యతే బహిప్క్రియతే మలమస్మాదితి కుక్షిః. పు. కుష నిష్కర్షే. - దీనివలన మలము బయలు వెల్లింపఁబడును.
జఠరము - కడుపు, విణ. 1.ముదిసినది 2.కఠినమైనది.
జన్యతే గర్భో అస్మిన్నితి జఠరం. జనీ ప్రాదుర్భావే - దీని యందు గర్భము పుట్టింపఁబడును.
జఠరః కఠినే పి స్యాత్ -
జఠర శబ్దము కఠినమయిన వస్తువునకు పేరు. అపిశబ్దమువలన కడుపునకు పేరగునపుడు ప్న. జాయతే అస్మిన్నితి జఠరః, జనీ ప్రాదుర్భావే. - దీనియందు పుట్టును గనుక జఠరము. "కుక్షౌ తు జఠరోన స్త్రీ త్రిషు వృద్ధ కఠోరయో" రితి రుద్రః.
గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్డ, 3.అగ్ని, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.
ఆపన్నసత్వా స్యా ద్గుర్విణ్యన్తర్వత్నీ చ గర్భిణీ,
ఆపన్నం గృహీతం సత్వం గర్భో (అ)నయే త్యాపన్నసత్త్వా - గ్రహింపఁబడిన గర్భముగలది.
గురు గర్భ శరీర మస్త్యస్యా మితి గుర్విణీ - బలువైన గర్భ శరీరము గలది.
ఉదరాంతర్గర్భో (అ)స్యా అంతర్వత్నీ - కడుపులో గర్భము గలది.
గర్భో (అ)స్యా ఇతి గర్భిణీ - గర్భము గలది.
ఆపన్న సత్వ గుర్వీస్యాదితి పాఠ ఇతి కేచిత్. ఈ 4 గర్భిణీ స్త్రీ పేర్లు.
ఆపన్నత్వ - గర్భిణి, వ్యు.లోపల ప్రాణిగలది.
గుర్వి - గర్భిణి; గర్భిణి - గర్భవతి.
అంతర్వత్ని - లోపల శిశువు కలది.
గర్భవతి - చూలాలు; (ౘ)చూలాలు - గర్భవతి.
ఆపన్నత్వ - గర్భిణి, వ్యు.లోపల ప్రాణిగలది.
(ౘ)చూలు - 1.గర్భము, 2.బిడ్డ.
గర్భస్రావము - (గృహ.) గర్భవిచ్చిత్తి, విచ్చిన్నము, నాలుగు మాసములలోపల గర్భము జారిపోవుట (Abortion).
బురుక - బిడ్డ, విణ.పొట్టి.
బురుకఁడు - వామనుడు, పొట్టివాడు.
బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు.
బిడ్డకుట్టు - ప్రసవవేదన.
అయోనిజ - గర్భమున పుట్టని స్త్రీ, వి.సీత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
అయోనిజుఁడు - గర్భమున పుట్తనివాడు, వి.1.విష్ణువు, 2.శివుడు.
గర్భకోశము - (జీవ.) గర్భాశయము, బిడ్డతిత్తి, పిండము పెరుగుసంచి.
ఫాలోఫియన్ గొట్టము - (గృహ.) గర్భకోశమునకు ఇరు ప్రక్కల గల నాళములు (Fallopian tube.) ఇందులో గర్భోత్పత్తియగును.
గర్భాశయో జరాయుః స్యాత్ -
గర్భ ఆశేతే త్ర గర్భాశయః శీజ్ స్వప్నే. - గర్భము దీని యందుండును.
గర్భనిష్క్రమణానన్తరం జరాం జీర్ణతా మేతి జరాయుః. ఉ. పు. ఇణ్. గతౌ. - గర్భము వెళ్ళినపిమ్మట జీర్ణత్వమును బొందునది. స. జరాయుః. ఈ రెండు 2 మావి పేర్లు.
గర్భాశయము - (జం.) మావి, గర్భమును చుట్టుకొనియుండు సంచి, అండాశయ నాళము చివర ఉబ్బియుండు భాగము (Utterus). (అండము అభివృద్ధి చెందుటకై దీనిలో నిలిచియుండును).
మావి - 1.గర్భస్థ పిండమునకు మీద కప్పికొని యుండు తోలు సంచి, జరాయువు, 2.మామిడి.
జరాయువు - 1.మావి, 2.జటాయువు, (వృక్ష.) అండాశయములో బీజాండము లమరియుండు దిమ్మ, (Placenta).
అండలంబనస్థానము - (వృక్ష.) జరాయువు, అండాశయములో బీజాండములు అమర్చబడిన దిమ్మ (Placenta).
మామిడి - మామిడిచెట్టు, రూ.మావి.
ఆమ్రము - 1.మామిడి, చూతము.
చూతము - మామిడిచెట్టు; మాకందము - మామిడి చెట్టు.
మాఁగాయ - మామిడికాయ.
రసాలము - 1.చెరకు, 2.మామిడి.
ఆమ్ర శ్చూతో రసాలః -
అమ్యతే అభిలష్యతే ఆమరః. అమగత్యాదిషు. - అభిలషింపఁబడునది.
అమయతి రోగయతివా ఆమ్రః. ఆమరోగే. - రోగమును గలిగించునది.
చ్యోతతి ధనం ప్రసతీతి చూతః. ద్యుతిర్ క్షరణే. - రసమును స్రవించునది.
రసం అలాతీతి రసాలః. లా దానే. - రసము నిచ్చునది.
రసమలతి భూషతివా రసాల. అల భూషణాదౌ. - రసము నలంకరించునది. ఈ 3 మామిడిచెట్టు పేర్లు.
ప్రియాలము - ఒక విధమగు మామిడిచెట్టు, రూ.ప్రియాళువు.
అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు Mango fruit.
సహకారము - వ్యష్టి, సమిష్ఠి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి. తియ్య మామిడి చెట్టు.
వ్యష్టి - ప్రయోజనము. ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చుశక్తి (Utility).
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధంతము, వి. (అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తినిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో మూల్యమధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
ఉద్దేశము - 1.గురి, 2.తలంపు, 3.నిశ్చయము, 4.ఎత్తైన ప్రదేశము.
ఉద్దేశించు - క్రి.1.గుర్తించు, 2.అనుకొను.
పుల్ల విరుగుడు తెగులు - (వ్యవ.) చెట్ల కొమ్మలు, రెమ్మలు నీరసించి ఆకులు రాలిపోయి యెండిపోవుట (Die back disease) ఉదా. నారింజ, మామిడి మొ. ఇది యొకజాతి శిలీంద్రము వలన కల్గును.
స్తంభసంయోగము - (వృక్ష.) అండాశయములో మధ్య నిలువుగా స్తంభమువలె నున్న జరాయువు (Placenta) పై బీజాండములు ప్రతి గదియందును అమర్చబడియుండు విధము ఊచకూర్పు, (Axile placentation).
గర్భాగారము- 1.శయనతృహము, 2.లోపలిది, 3.గర్భాశయము, 4.పురిటిల్లు, 5.దేవాలము లందు దేవతా విగ్రము లుండుచోటు, గర్భగుడి.
అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయింపుటాలిఁ బుట్టిన యింటం
దడ వుండ నిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ.
తా. ఎంత చెల్లుబడివున్న బలవంతుడైనను, తన యౌవనవంతురాలైన భార్యను తల్లిగారియింటనే దీర్ఘకాలము వుంచిన, ఆమె పతివ్రతా ధర్మము నకు కళంకము తెచ్చినవాడగును.
జటాయుషో దీనదశాం విలోక్య– ప్రియావియోగ ప్రభవం చ శోకమ్|
యో వై విసస్మార తమార్ద్రచిత్తం - శ్రీజానకీ జీవనమాసతోస్మి|
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రముల్లము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
గ్రహణి - 1.ఒక విధమైన రోగము, జఠరాగ్నికి అధిస్ఠానమగు నాడి, (ఇది చెడి పోయినచో గ్రహిణీరోగము కలుగును).
Dysentery – disorder of the bowels, గ్రహణి, అతిసారము.
విరేచనముల వ్యాధి - (గృహ.) అతిసారము (Diarrhoea).
కడుపుమంట - ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనము.
కడుపూద - ఈసు, కడుపుబ్బరించెడు పశురోగము.
దొమ్మ - 1.పశురోగము, 2.కడుపులోని ఒక అవయవము.
ఉదరము - 1.కడుపు (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).
ఉదయర్తిగర్భో అస్మాదితి ఉదరం. ఋ గతౌ. దీనివలన గర్భము ప్రకాశమౌను.
తుద్యతే అజీర్ణాదినాతుందం. తుద వ్యథనే. - అజీర్ణాదులచేత వ్యథ పెట్తఁబదునది. జఠరాది సబ్దములు 3 ను సమాహార ద్వందము కడుపు పేర్లు.
ఉదరంభరి - తనపొట్టను మాత్రమే పోషించు కొనువాడు.
కుక్షింభరి - తనకడుపు మాత్రము నింపుకొనువాడు, ఉదరంభరి.
ఆత్మంభరి - తనపొట్ట మాత్రము పూరించుకొను వాడు, కుక్షింభరి.
ఉభా వాత్మాంభరిః కుక్షింభరి స్స్వోదరపూరకే,
స్వోదర మేవ పూరయతీతి స్వోదరపూరకః - పోష్యవర్గమును నిడిచి తన కడుపు నింపుకొనువాఁడు స్వోదరపూరకుఁడు. వానియందు ఆత్మభరి కుక్షింభరి శబ్దములు వర్తించును.
అత్మానం స్వమేవ బిభర్తీతి ఆత్మంభరిః, స్వకుక్షిమేవ బిభర్తీతి కుక్షింభరి, డు భృఙ్ ధారణ పోషణయోః. - తన కడుపుమాత్రము నిండించుకొనువాఁడు.
విలగ్నము - సన్ననినడుము, విన.చక్కగా తగిలినది.
నడుము - 1.కౌను, 2.మధ్యభాగము, రూ.నడ్ము. కౌను - 1.నడుము, 2.వింటినడుము.
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము.
మధ్యభాగము -
ప్రసాదనము - 1.తేర్చుట, 2.అన్నము.
ప్రసాదము - 1.అనుగ్రహము(దయ, కరుణ), 2.ప్రసన్నత, 3.భగవంతునికి నివేదించిన అన్నము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
పాథస్సు - 1.జలము, 2.అన్నము.
పీయతే పాథః, స-న. పా పానే. - పానము చేయఁబడునది.
పాతి భూతానీతి పాథః, పా రక్షణే. - భూతములను రక్షించునది.
పాథేయము - అన్నము, బియ్యము లోనగు దారి బత్తెము.
పాథోధి - సముద్రము.
అంధస్సు - అన్నము, వంటకము.
వంటకము - అన్నము.
కూరము - అన్నము, వంటకము.
పచనము - వండుట.
వంట - పాకము. పాగు-చక్కెరపాకము, సం.పాకః.
పాకము - 1.పరిపక్వము, 2.పంట, (అలం.) కావ్యపాకము (కావ్యపాకములు: ద్రాక్షా కదళీ నారికేళ పాకములు).
పరిపక్వము - సంపూర్ణముగా నభివృద్ధి చెందినది (Mature).
పాకాన్నము - పెండ్లిలో మూడవ నాటి విందు, రూ.పాకెన, పాకెన్న.
పాచకము - (జం.) జఠరరసమందు కల సేంద్రియమండము (Pepsin).
చిమిడిక - చిమిడిన అన్నము.
చిముడు - క్రి.1.అన్నమధికముగ నుడికి ముద్దయగు, 2.పాకముచెడు.
విఱుగు - క్రి.1.తునియు, 2.పాకముచెడు, 3.వెనుతీయు.
పక్వము - 1.పరిపాకము పొందినది, 2.చేటుమాడినది.
పరిణతము - పరిపాకము పొందినది.
పక్వం పరిణతే -
పచ్యతే క్రమేణ పక్వం - కాలక్రమమున పరిపాకమును బొందినది. పక్వా బుద్ధిః, పక్వం ఫలం. అని.
పరిణమతే అవస్థాంతర అవస్థాంతర మా పద్యతే పరిణతం - వేఱొక యవస్థను బొందునది. ఈ 2 కాలవశమునఁ బరిపాకమును బొందిన బుద్ధి మొదలైనదాని పేర్లు.
పక్వమాంసకృత్తులు - (జం.) మాంసకృత్తులు, ' పాచకము ' అను సేంద్రియమండముచే ప్రసరణకు అనుకూలముగా నుండునట్లు మార్చబడిన పదార్థములు (Peptones).
పంట - 1.పండుట, 2.కృషి.
పంటవలఁతి - భూమి.
మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయూజన మాచరించుదో
గానక యల్పుడొక డదిగాదని పల్కిన వాని పల్కు కై
మానగఃజూడడాపని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిక వంటకంబు దినకుండుట నేర్పగు నోయి? భాస్కరా.
తా. వండిన వంటకముపై ఈగ వ్రాలిన యా వంటకమును విడుచుట మంచిదికాదు. అట్లే అల్పుడు(అల్పుఁడు - నీచుడు) మంచివాడు చేయు పనిని వలదన్నను మానివేయుట యుక్తము గాదు.
భిస్సస్త్రీ భక్త మన్ధో (అ)న్నమోదన్నో (అ)స్త్రీ స దీదివిః,
భిస్స - అన్నము.
భిస్సట - మాడన్నము.
భన్యతే భక్ష్యత ఇతి భిస్సా, సీ. భవభక్షణదీప్త్యాః - భక్షింపఁబడునది.
భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భజ్యత ఇతి భక్తం. భజసేవాయాం. ఆశ్రయింపఁ బడునది. అద్యత ఇత్యంధః, స. న. అదభక్షణే. - భక్షింపఁబడునది.
అన్నము - కూడు, బువ్వ, విణ.తినబడినది.
అనంత్యనేనేత్యన్నం, అన్నప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
కూడు - అన్నము, క్రి.1.ఒప్పు, 2.సాధ్యపడు, 3.కూడబెట్టు, 4.లెక్కకూడు, 5.కలుపు.
కూడు భెత్తిన వానిని - కూలద్రోయకు.
బువ్వ - అన్నము.
బువ్వము - 1.పెండ్లివారి సహభోజనము, 2.ఆహారము.
బువ్వముబంతి - వివాహము నందు నాల్గనాడు బంధువులు స్త్రీ పురుషాదులు ఒకటిగా కూర్చుండి భుజించుట.
హరిబువ్వము - వివాహమైన నాలవనాటి రాత్రి పెండ్లి వారందరు కలిసి వేడుకగా భుజించుట, బూజము బంతి అని వాడుక.
ఉందతిక్లిద్యతీత్యోదనః, అ. న్న. ఉందీక్లేదనే. - పాసినప్పుడు నీళ్ళు కాఱునది.
దిదీవి - 1.అన్నము, 2.బృహస్పతి, 3.స్వర్గము, దేవలోకము.
దీన్యంత్యనేనేతి దీదివిః. ఇ.న్న. దివు క్రీడాదౌ. - దీనిచేతఁ బ్రకాశింతురు. ఈ 6 వంటకము పేర్లు.
తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనముచేసి శరీరము పడకుండ కాపాడునది.
అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేని యెన్నఁ బోరు
అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వ.
తా. ఇతర దానములు యెన్ని చేసినను
అన్నదానముతో సాటిగా ఆలోచించినచో అన్నమె యీలోకములో జీవనాధారము.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - గురువు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్న తల్లికంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా! విశ్వ.
తా|| అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినది లేదు. గురువుల సేవకంటె గొప్పదిలేదు.
పాట్ లక్ - (గృహ.) (Pot-luck), ఒక స్థలము నకు మిత్రులు భోజనము లేదా వంటకములను తెచ్చుకొని కలసి వేడుకగా భుజించుట.
నాన్నోదకసమం దానం నద్వాదశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యాః పరం మంత్రం నమాతుర్దైవతం పరమ్||
తా. అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. – నీతిశాస్త్రము
దానం వల్లనే ఆకలి దప్పిక(దాహం) తీరుతుంది. ఆకలన్నవారికి అన్నము పెట్టువాడు, అంతటా సుఖముగా ఉండును. అన్నము ఎక్కువగా ఇచ్చువాడు ఆరోగ్యవంతుడు కాగలడు. నీరు సర్వజీవులకు ప్రాణాధారం. చల్లని నీరు నాలుకకు ఇంపు. నీరు దానము చేయువాడు మంచి రూపము పొందును.
లోభునకు ఇద్దరు ఇల్లాండ్రు. ఆకలి, దప్పి అని వారి పేర్లు. వారి మహిమ యింతా అంతాకాదు. వారి సేవతోనే ప్రపంచమంతా మునిగి తేలుతూ వుంటుంది.
'పరోపకారం మిదం శరీరం' దానం పుచ్చుకునేవారు వుంటేనే కదా దాతలయొక్క దానగుణానికి కీర్తివచ్చేది.
గాయత్రి త్రిమూర్త్యాత్మకము. గాయత్రి మంత్రం ఋగ్వేదం లోనిది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ముఖాలతో (వేద వదనమునందు గాయత్రి) శోభించే తల్లి వేదమాత గాయత్రి.
ఓం గాయత్ర్యై నమః : గానం చేయువారిని తరింపజేయునది గాయత్రి, వేదజననీయ గాయత్రి, అట్టి గాయత్రీ స్వరూపిణికి వందనాలు.
పుష్కరము - 1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ. పుష్కరమునందు దేవీస్థానం పురుహూత|
పోషయతీతి పుష్కరం. పుష పుష్టౌ, - పోషించునది.
మూలే పుష్కర కాశ్మీర పద్మపత్రాణి పొష్కరే,
స్థలపద్మినీ మూలత్వేన పుష్కరస్య మూల మిదం పుష్కరం. - నేలతామర దుంప.
కాశ్మీరదేశే భవం కాశ్మీరం - కాశ్మీరదేశమందుఁ బుట్టినది.
పద్మస్యేవ పత్రాణ్యస్య పద్మపత్రం – తామర పాకులవంటి ఆకులు గలది. ఈ 3 పుష్కరమూలము పేర్లు. కాశ్మీరదేశము నందలి మెట్టతామరదుంప.
పుష్కరిణి - 1.తామర కొలను, కోనేరు, 3.ఆడేనుగు.
కోనేఱు - (కోన + ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి.
తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
విమలాం విశ్వజననీం తుష్ఠిం దారిద్ర్య నాశినీమ్,
ప్రీతిం పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యంబరాం శ్రియామ్|
సర్వముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
అంబువు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము, (ఛం.) ఒకరకపు వృత్తము.
అంబతే అంబు. ఉ. న. అబిరబి లబి శబ్దే. - ప్రవహించునప్పుడు ధ్వనియుక్తమై యుండునది. అంబుదము - నీటినిచ్చునది, మేఘము, మబ్బు.
అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.
అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంభోజము - 1.తామర, (జం.)సారసపక్షి, బెగ్గురపక్షి.
అంభోరుహము - 1.తామరపువ్వు, 2.(జం.) బెగ్గురపక్షి.
కంజము - తామరపువ్వు.
కంజాతము - తామర, పద్మము.
కంజజుఁడు - నలువ, బ్రహ్మ.
కంజనుఁడు - మన్మథుడు, వ్యు.సుఖమును కల్గించువాడు.
"హరి" యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామమహత్త్వము
హరిహరి | పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా.
తా. అంబుజనాభా ! కృష్ణా ! సమస్త పాపములు పోగొట్టు ' హరి ' అను రెండక్షరముల మహిమను విష్ణువుకూడా పొగడఁజాలడు. నా బోటివానికి వీలగునా, కాదు.
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.
అంభోజిని - 1.తామరతీగ, 2.తామరకొలను, 3.పద్మసమూహము.
కోరకము - 1.మొగ్గ, 2.తామరతూడు, (వృక్ష.) మొగ్గ అల్పవికసిత కాండము (Bud).
మొగ్గ - 1.ముకుళము, వికసించని పుష్పము, 2.శిరముపాదములతో జేర విల్లువలె వెలికిల వంగుట, సం.ముకుళమ్.
కాఁడ - 1.తామరతూడు, 2.కూరాకులలోని కామ, 3.తొడిమ, సం.కాండః.
తొడిమ - కాడ.
కోరగించు - 1.మొగ్గతొడుగు, 2.ఎఱ్ఱనగు, 3.ఉదయించు, 4.మారాముచేయు, ముకుళించు. మొగుడు - వై.క్రి. ముకుళించు.
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు. పుట్టు - సంభవించు, జన్మించు.
మొగుచు - ముడుచు.
పద్మాకారము - కొలను; కొలను - కొలఁకు.
కొలఁకు - సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్.
సరసి - కొలను, రూ.సరసు, సరస్సు.
సరసు - క్రి.సరదు, సం.వి.సరసి.
సరదు - క్రి.సమముగా పంచు.
వనబంధము - సరస్సు, కోనేరు.
పద్మాకర స్తటాకో స్త్రీ -
పద్మానాం ఆకరః పద్మాకరః - పదములకు ఉనికిపట్టు.
తటాన్యకతీతి తటాకః. అ. ప్న. అక అగ కుటిలాయాం గతౌ. - గట్టును కుటిలముగాఁ బొందియుండునది.
పా. తడతీతి తడాగః. తడ ఆఘాతే. - గట్టును గొట్టునది. ఈ రెండు తామరులుగల చెఱువు పేర్లు.
నలినము - 1.తామర, 2.తామర కొలను, 3.తామర తీగ.
నల్యతే బద్ద్యతే చంద్రేణేతి నలినం. – చంద్రుని చేత ముకుళరూపమున బంధింపఁబడినది.
బిసము - తామర తూడు, తామర తీగ.
బిసిని - 1.తామర కొలను, 2.తామర తీగ.
తూడు - తామర కాడ, బిసము.
నళిన్యాం తు బిసినీ పద్మినీ ముఖాః :
నళం పద్మమస్యామ స్తీతి నళినీ. ఈ. సీ. - నళమనఁగా పద్మము; అదిగలిగినది. 'నళమబ్జే నళో నళ 'ఇతి రుద్రః.
బిసమస్యామస్తీతి బిసినీ. ఈ. సీ. - తామరసూండ్లు గలిగినది.
ముఖ మన్నందున కమలి న్యబ్జినీ సరోజిన్యాది శబ్దములు గ్రహింపఁబడుచున్నవి. పద్మములు గల దేశమునకుఁగాని పద్మ సమూహమునకుఁగాని తామరతీఁగెకుగాని పేర్లు.
ఓం బిసతంతు తనీయస్యై నమః : తామర తూడులోని దారమువలె సూక్ష్మమై సన్ననైనది (పీతాభాత్యణూపమా - అని శ్రుతి కూడా చెప్పుచున్నది అనగా పరమాణువువలె పీతవర్ణంతో భాసిల్లుచున్నదని భావము) అట్టి సూక్ష్మస్వరూపిణికి ప్రణామాలు.
సూక్ష్మ మధ్యాత్మమపి : సూక్ష్మశబ్దము పరమాత్మ కును, అపిశబ్దము వలన స్వల్పమైనదానికిని పేరు. సూచ్యత ఇతి సూక్ష్మం త్రి. సూచింపఁ బడునది.
పద్మిని - సూర్యుని భార్య.
పద్మిని - 1.తామర తీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతి స్త్రీ.
పద్మిన్యాః వల్లభః పద్మినీ వల్లభః - తామరతీఁగకుఁ బ్రియుఁడు Sun.
కళలు కలుగుఁగాక కమల తోడగుఁగాక!,
శివుని మౌళిమీఁద జేరుఁగాక!
నన్యు నొల్లఁ దపనుఁడైన మత్పతి యని,
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.
భా|| తాను కళలు కలిగినచంద్రుడే అగుగాక !(కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 3.కమలాఫలము.)లక్ష్మి తోబుట్టువు అగుగాక ! శివుని శిఖయందు చేరుకొన్నవాడై నిక్కుగాక ! (అన్యుఁడు-ఇతరుడు)అన్యుడైన చంద్రుడి పొత్తు మా కక్కరలేదు. తపింపజేసే డైనప్పటికీ(తపనుఁడు - సూర్యుడు)మా భర్త సూర్యుడే అని పతివ్రతవలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. అనగా పద్మములు సూర్యాస్తమయము కాగానే ముకుళించుకొని పోయినవి.
పద్మోద్భావాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం,
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్|
సరోజము - 1.తామర, 2.తామర కొలను.
సరసిజము - తామర, రూ.సరసీజము.
సరసిజాతము - తామర; సరసీరుహము - తామర.
సరసిజనాభుఁడు - విష్ణువు.
సరసిజభవుఁడు - బ్రహ్మ.
విద్య లేనివాడు విద్యాధికుల చెంత
నుండినత పండితుండు కాడు
కొలని హంసలకడఁ గొక్కెర యున్నట్లు విశ్వ.
తా. ఓ వేమా! విద్యలేనివాడు పండితులతో కలిసి తిరుగుచున్నను పండితుడు కాలేడు. హంసలు వుండుకొలనులో కొంగ కూడ వుండును. కాని, అంతమాత్రమునకు ఆ కొంగ హంస కాలేదు కదా.
మానసము - 1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
చేతము - మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
మానసౌక(స)ము - హంస.
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental-development).
సమున్మీలత్సంవి - త్కమల మకరందైక రసికం
భజే హంసద్వన్ద్వం - కిమపి మహతాం మానస చరమ్|
యదాలాపా దష్టా - దశగణిత విద్యా పరిణతిః
ర్యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ|| - 38శ్లో
తా. ఓ దేవీ! ఏ హంసల జంటల యొక్క కూతలు(ఆలాపనము-1.రాగాలాపనము, 2.మాటలాడుట.) పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటి నుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణములను గ్రహించునో, వికసించిన జ్ఞానపద్మ మందలి మకరందముచే ననందించు యోగీశ్వరుల యొక్క మనస్సు లనెది మానస సరస్సు నందు విహరించు నా హంస జంటను సేవించుదును. - సౌందర్యలహరి
అంబుధి - సముద్రము. శ్రవణే సాగరాంబుజా|
అంబువాహిని - 1.దోనె, 2.కొయ్య బొక్కెన, 3.నీళ్ళుమోయుస్త్రీ.
అంభోధి - సముద్రము.
అంభోరాశి - సముద్రము.
ఇందుఁడు - చంద్రుడు.
ఉనక్తి తుషాకణైరితి ఇందుః ఉ-పు. ఉందీ క్లేదనే - మంచుకిరణములచేత తడిపెడువాఁడు.
ఇందువారము - సోమవారము.
సోమవారము - వారములో రెండవ దినము.
ఇందుకళాధర ఇంద్రాది ప్రియ సుందరరూప సురేశశివ |
ఇందిర - లక్ష్మి; ఇంది - లక్ష్మి, రూ.ఇందిర.
అధికపాఠము. ఇందిరా లోకమాతా మా క్షీరాబ్ధితనయా రమా(రమ - లక్ష్మి) - ఇందతీ తీందిరా - పరమైశ్వర్యయుక్తురాలు. ఇది పరమైశ్వర్యై.
చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందుశీతలామ్,
ఆహ్లాదజననీం పుష్ఠిం శివాం శివకరీం సతీమ్|
ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామర.
నీలాబ్జము - నల్లకలువ.
ఇన్దీవరం చ నీలే (అ)స్మిన్ -
అంబుని జన్మ అస్యేత్యంబుజన్మ నీలం చ తత్ అంబుజన్మ, న. న. - నీటియందు జన్మము గలిగినది అంబుజన్మము; నీలమైన అంబుజన్మము నీలాంబుజన్మము.
ఇన్దతీతి ఇన్దీ ర్లక్ష్మీః, తయా వ్రియత ఇతి ఇన్దీ వరం. వృఞ్ వరనే. ఐశ్వర్యయుక్తురాలు గనుక ఇంది యనఁగా లక్ష్మి; ఆమెచేత వరింపఁబడినది.
ఇంద్రియాని వృణోతీతి వా ఇందీవరం. వృఞ్ వరణే. - ఇంద్రియములను సంతోషముచేతఁ గప్పునది. ఈ రెండు నల్లకలువ పేర్లు.
విశ్వామరేన్ద్రపద విభ్రమదానదక్ష
మానన్దహేతు రధితం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థ
మిన్దీవరోదరసహోదర మిన్దిరాయాః| - 4
అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.
తామరతంపము - 1.తామరల సమూహము, 2.అభివృద్ధి, రూ.తామరతంపర.
తామరతంపర - తామరతంపము.
తామరతూపరి - మదనుడు; మదనుఁడు - మన్మథుఁడు.
ఉత్పలము - కలువ, నల్లకలువ.
కలువ - ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.
కువేలము - 1.కలువ, 2.పద్మము.
కలువకంటి - కలువరేకుల వంటి కన్నులుగల స్త్రీ.
కలువరాయుఁడు - చందమామ. రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
కువలయము - 1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.
కువలేశుఁడు - విష్ణుమూర్తి.
తొగ - 1.కలువ, 2.సమూహము, 3.విధము, రూ.తొవ.
తొగకంటి - కలువకంటి, స్త్రీ.
కలువకంటి - కలువ రేకులవంటి కన్నులుగల స్త్రీ.
తొగచెలికాఁడు - చందుడు.
తొగఱేఁడు - చంద్రుడు; తొగవించు - చంద్రుడు Moon.
తొగసూడు - సూర్యుడు, వ్యు.కలువలకు శత్రువు.
కల్హారము - మిక్కిలి పరిమళము గల కలువ.
కలువడము - (కలువ+వడము) ఉత్సవములలో కట్టెడు బంగారు కలువ పూదండ, స.కైరవ వటః.
లోకమాత - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
లోకానాం మాతా లోకమాతా - ఎల్ల లోకములకు తల్లి. మా. అస్త్యైవ నామ్న ఏకదేశగ్రహణం మేతి - లోకమాత యను నామముననే మా అని యేక దేశగ్రహణము.
శ్రుతీనాం మూర్ధానో - దధతి తవ యౌ శేఖర తయా
మమా ప్యేతౌ మాత! - శ్శిరసి దయయా ధేహి చరణౌ|
యయోః పాద్యం పాథః - పశుపతి జటాజూట తటినీ
యయౌ ర్లాక్షాలక్ష్మీ - రరుణ హరి చూడామణి రుచిః|| - 84శ్లో
తా. ఓ! లోకమాతా! శ్రుతుల(వేదముల) శిరస్సులైన ఉపనిషత్తులు నీ సిగలో అలంకరించు కొన్న పుష్పములుగ(శిరోభూషణములుగ) నున్నవి. శివుని(పశుపతి - శివుడు)జటాజూటంలో వర్తించే గంగానది నీకు పాద్యము(పాద్యము - పాదము కొరకైన నీళ్ళు)అగు చున్నది. నీ పాదము లందలి లత్తుక రసము(చరణలత్తుక)ఎఱ్ఱనై హరికి కిరీట మాణిక్యములకు(చింతామణి - కోరికలొసగు దేవమణి)కాంతి నొసగు చున్నది. అట్టి నీ పాదము లను కృపతో కూడిన చిత్తం గలదానవై, నా శిరస్సు పై నుంచుము - సౌందర్యలహరి
ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా,
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ. - 9శ్లో
మా1 - 1.లక్ష్మి, 2.తల్లి.
మా2 - విణ. మిక్కిలి, సం.మహాన్.
తల్లి - జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.
తలి - జనని, తల్లి.
జనని - 1.తల్లి, 2.దయ(దయ - కనికరము), 3.లక్క, 4.కోరిక.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి.
జనయిత్రీ ప్రసూర్మాతా జననీ -
జనయతీతి జనయత్రీ; జననీ చ. సీ. జనీప్రాదుర్భావే. - కొడుకులఁ గనునది.
ప్రసూతే ప్రసూః. ఊ. సీ. షూఙ్ ప్రాణి ప్రసవే. - కొడుకులను గనునది.
మాతి వర్తతే గర్భో త్ర మాతా. ఋ. సీ. మామానేవర్తనే చ-గర్భ మీమెయం దిమిడియుండును. ఈ నాలుగు తల్లి పేర్లు.
సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
హిమానీహన్తవ్యం - హిమగిరినివాసైకచతురౌ
నిశాయాం నిద్రాణాం - నిశి చరమభాగే చ విశదౌ |
పరం లక్ష్మీపాత్రం - శ్రియ మతిసృజంతౌ సమయినాం,
సరోజం త్వత్పాదౌ - జనని! జయత శ్చిత్ర మిహ కిమ్ || - 87శ్లో
తా. ఓ జననీ ! హిమాలయము నందు నివసించుటకు సమర్థమైన వియు, రాత్రి వేకువన గూడ విశదములైనవి(విశదము - తెల్లనిది, స్పష్టమైనది.), భక్తులకు సంపదలను(లక్ష్మిని)కలిగించేవి అయిన నీ పాదములు, మంచుచే గొట్టబడినది రాత్రి(నిశ - 1.రేయి, 2.పసుపు.)యందు ముడుచుకొని పోవునదియు లక్ష్మీదేవికి ఆలవాలమైన పద్మము(సరోజము - 1.తామర, 2.తామరకొలను.)ను జయించు చున్నది ననుటలో ఆశ్చర్యం ఏమున్నది ? ఏమీ లేదు. - సౌందర్యలహరి
పద్మకాంతిపద పాణిపల్లవ పయోధరానన సరోరుహాం,
పద్మరాగమణి మేఖలావలయ నీవిశోభిత నితంబినీం|
పద్మ సంభవ సదాశివాంతమయ పంచరత్న పదపీఠికాం,
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం| - 7శ్లో
మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).
ధరణినాయకు రాణియు
గురురాణియు నన్నరాణి * కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁ * దలఁవుఁ గుమారా!
తా. రాజు భార్యయును(రాణి - రాజ్ఞి, భార్య), గురు భార్యయును, అన్న భార్యయును, భార్యతల్లి(అత్తయును), తన(తన - ఆత్మార్థకము)కన్నతల్లి; భూమిలో ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.
యథా మాతా స్తనాధానాం శిశూనాం శైశవే సదా|
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ||
God could not be everywhere and therefore he made mothers. - Jewish proverb
సిద్ధవనము నందు దేవీస్థానం మాత| కయావదోహణము నందు మాత|
రమ - లక్ష్మి.
లక్ష్మి- 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదులశోభ, 4.మెట్టతామర.
రమాభూమి సుతారాధ్య పదాద్జాయై నమః
అంతస్థము - (వ్యాక.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది.
అవ్యథా అతిచరా పద్మాచారణీ పద్మచారణీ :
న వ్యథతే అనయేత్యవ్యథా, వ్యథ భయచలనయోః - దీనిచేత వ్యథను బొందరు.
అత్యర్థం చరతి వ్యాప్నోతీతి అతిచరా. చర గతి భక్షణయోః - మిక్కిలి వ్యాపించునది.
పద్మాసాదృశ్యాత్పద్మా. - పద్మమువంటిది.
చరతి వ్యాప్నోతీతి చారటీ. సీ. - వ్యాపించునది.
పద్మమివ చరతీతి పద్మచారిణీ - పద్మమువలె వ్యాపించునది. ఈ నాలుగు 4 మెట్ట(కాశ్మీరదేశపు)తామర పేర్లు.
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ,
జ్యేష్టా కాష్టా ధనిష్ఠాంతా శరంగీ నిర్గుణప్రియా|
ప్రహ్లాదమానససరోజ విహారభృంగ!
గంగాతరంగ ధవళాంగ! రమాస్థితాంగ!
శృంగారసంగర కిరీటలస్వరాంగ
లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబంబమ్.
విశ్వంభరధరా ధారా నిరాధారా ధికస్వరా,
రాకా కుహూ రమావాస్యా పూర్ణిమా(అ)నుమతీ ద్యుతిః| – 22స్తో
రమణి - 1.ఇంపైన స్త్రీ, 2.నాయకుని రమింప జేయునట్టి స్త్రీ, 3.స్త్రీ.
రమయతి నాయక మితి రమణీ. సీ. రము క్రీడాయాం. - నాయకుని రమింపఁజేయునది.
రమణీయము - 1.ఒప్పినది, 2.మనోహరమైనది.
రమ్యము - ఒప్పిదమైనది.
చిలుక నొక రమణి ముద్దుల
చిలుకను "శ్రీరామ" యనుచు శ్రీపతిపేరం
బిలిచిన మోక్షము నిచ్చితి
నలరగ మిముఁదలచు జనుల కరుదా కృష్ణా.
తా. కృష్ణా! ఒక స్త్రీ ముద్దుగా ఒక చిలుకను ‘ శ్రీరామ ' అని పిలిచిన మాత్రమున ఆదరించి మోక్ష మిచ్చితివి. నిన్ను భక్తితో ధ్యానించు వారికి ముక్తి కలుగకుండునా ! (కలుగును)
కలికి - 1.ఆడుది, 2.మనోజ్ఞురాలగు స్త్రీ, విణ.మనోజ్ఞము.
పొన్నారి - మనోజ్ఞము.
కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా,
శ్రీ స్సౌమ్యలక్షణా(అ)తీత దుర్గా సూత్ర ప్రబోధికా. - 32శ్లో
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
చిన్నిదము - 1.చిన్నపువ్వు, 2.బంగారు.
చిన్నిపువు - 1.నమస్కృతి, 2.భూషావిశేషము, రూ.చిన్నపువ్వు.
పొన్ను - 1.బంగారు, 2.కట్టుగావేయు లోహవలయము.
తపనీయము - బంగారు. ఔజనము - బంగారు.
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ,
శాంభరీ మహాకోణా గరుడోపరిసంస్థితా. - 65శ్లో
మంగళదేవత - లక్ష్మి.
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి.
దాక్ష్యాత్తు కురుతే మూలం సంయమాత్ ప్రతితిష్ఠతి ||
శుభప్రవర్తన నుండి సంపద పుడుతుంది. ఆ సంపద నేర్పుతో పెరుగుతుంది. సామర్థ్యం వల్ల వేళ్ళూరుతుంది. సంయమనము వల్ల స్థిరపడు తుంది.
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదా స్థితా,
వ్యోమకేశాఖిల ప్రాణా పంచకోశవిలక్షణా. – 58శ్లో
లోకజనని - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.
ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే అడ్డు పెట్టబడినది 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉ - వర్ణమాలలో ఐదవ అక్షరము. ఉ - ఓ బాలికా! మా - వలదు, అని యట్లు తల్లి చేఁ తపస్సు కెళ్ళవద్దని వారించటం వలన పార్వతీదేవికి, ఉమ అని పేరు వచ్చింది.(సనాతనులైన ఉమామహేశ్వరులు).
ఉమాపతి - శివుడు. ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.)ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
కాంతికిరణపుంజము - (భౌతి.) కాంతికిరణములగుంపు, రూ.కిరణశలాక (Beam of light).
కిరణశలాక - (భౌతి.) సమాంతరముగ నున్న కిరణముల సమూహము (Pencil of rays).
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
పతింవర - తనంతట మగని వరించు నట్టి ఆడుది.
ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
ఈశ్వరి - పార్వతి.
హరిద్ర - పసుపు.
వరవర్ణిని - 1.భర్తయందనురాగము గల్గి యుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.
హరిద్ర - పసుపు.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ.
హారిద్రము - పసుపువన్నె.
అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.
పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.
పసుపు - (వ్యవ.) ఇది ఒక దుంపజాతి సంబార ద్రవ్యము (Turmeric), అల్లపు కుటుంబము (Zingiberaceae) లోని curcuma longa అను మొక్కను వ్యవసాయదారులు పైరు చేయుదురు. ఈ మొక్కల దుంపలను ఎండబెట్టి పసుపు తయారు చేయుదురు.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
వరవర్ణిని - 1.భర్త యందనురాగము గల్గియుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
పసుపు(ౘ)చుక్క - (గృహ.) కన్ను గ్రుడ్డులో ఈ చుక్క ఉన్నచోట ప్రతిబింబము పడిన అదిస్పష్టముగా కనబడును (Yellow-spot).
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు 16 మొదలు ఏఁబది 50 సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము. స్త్రీలకు భాగ్యమే యౌవ్వనము. ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
తరుణిమ - యౌవనము, రూ.తరుణ్యము.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ. సీ. తౄప్లవనర్తరణయోః. - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః. యు మిశ్రనే. పురుషునితోఁ గూడునది. ఈ ఒకటి జవ్వని పేరు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.
యశము - కీర్తి.
యశస్వి - కీర్తిగలవాఁడు.
అసము1 - 1.అహంకారము, దర్పము, 2.ఉత్సాహము, 3.చనవు, 4.అవకాశము, వీలు.
అసము2 - యశము, కీర్తి, సం.యశః.
ఖ్యాతి - యశస్సు, కీర్తి.
ఖ్యాతము - వాసికెక్కినది.
అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః
చత్వారి సంప్రవర్ధంతే కీర్తి రాయు ర్యశ్యో బలమ్|
తా. పూజనీయులను నమస్కరించు స్వభావము కలిగి, పెద్దల నెల్లపుడు సేవించువానికి కీర్తి, ఆయువు, యశస్సు, బలము అను నీ నాలుగు వృద్ధి నందును.
చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదువన్నెలు సుమంగళి చిహ్నములు). జీవభత్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
మున్నీటిచూలి - క్షీరసాగరకన్యక, లక్ష్మి.
క్షీరసాగరకన్యక - క్షీరాబ్ధేస్తనయా క్షీరాబ్ధితనయా - పాలకడలికూఁతురు.
రమతైతి(రమ - లక్ష్మి)రమా - క్రీడించునది. రము క్రీడాయాం. - ఈ నాలుగు 4 లక్ష్మికి నామములు.
పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే,
ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగర కన్యకే. – 145శ్లో
కడలి - సముద్రము.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలిమీఁగడ ముద్ద - చందమామ.
కడలివెన్న - 1.చంద్రుడు Moon, 2.అమృతము.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పా ల క డ లి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.సాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
కడలిఱేఁడు - వరుణుడు.
అంబుదము - నీటి నిచ్చునది, మేఘము, మబ్బు.
అర్ణోరాశి - 1.జలరాశి, సముద్రము.
నీరువాయి - జలరాశి; నీటికుప్ప - జలరాశి, రూ.నీరుకుప్ప.
అర్ణవము - 1.సముద్రము, 2.అల.
అల - తరంగము, విణ.1.ప్రసిద్ధిని తెలుపును, ఉదా. అలవైకుంఠపురంబు లో, 2.నిర్దేశమును తెలుపును, ఉదా.చోరుడల చంద్రుడు.
తరఁగ - తరంగము, అల, సం.తరంగః.
తరంగము - 1.అల, తరగ, 2.ఒక తరీతిగేయము, సం.వి.(భౌతి.) ఏదైన వస్తువు వేగముగా చలించుటచే గాలిలో సంపీడనము, విరశీకరణము. ఒకదాని వెంబడి ఒకటి సంభవించుటచే ఏర్పడిన చలనము (Wave).
ఊర్మి - 1.అల, 2.ఉమ్మి, 3.నొప్పి, 4.తహతహ, 5.వస్త్రపు ముడుత, 6.కడుపుమీద నుండు ముడుత, (ఆకలి, కోరిక, మోహము, దుఃఖము, ముసలితనము, మరణము - వీనిని షడూర్ములందురు).
ఊర్మిక - 1.అల, 2.ఉంగరము, 3.వస్త్రపు ముడుత.
అల - తరంగము, విణ.ప్రసిద్ధి తెలుపును, ఉదా.అలవైకుంఠపురంబులో.
తరంగము - 1.అల, తరగ, 2.ఒక రీతిగేయము, సం.వి. (భౌతి.) ఏదైన వస్తువు వేగముగా చలించుటచే గాలిలో సంపీడనము, విరశీకరణము, ఒకదాని వెంబడి ఒకటి సంభవించుటచే ఏర్పడిన చలనము, (Wave).
వీచి - తరంగము; తరఁగ - తరంగము, అల, సం.తరంగః.
లహరి - 1.పెద్ద అల, 2.వీచి. కరడు - కెరటము; కెరటము - కరడము.
భంగము - 1.చెరుపు, 2.అవమానము, 3.అల, 4.రోగము, వ్యాధి.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.
అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలలఁ గాంచు లక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో విశ్వ.
తా|| కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నసించును. కలలో కనబడు లక్ష్మిని పొందలేము. ఈ భూమిలో(ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.)భోగభాగ్యములు కూడా యిట్టివే కదా.
ఉమ్మి - ఉమి.
ఉమి - ఉమిసిన ఎంగిలి, రూ.ఉమ్మి.
ఉమియు - ఎంగిలి ఉమ్ము.
జుష్ఠము - ఎంగిలి.
గతుకు - క్రి. ఎంగిలితిను, వి.ఎంగిలి తినుట, బహు.ఎత్తుపల్లములు.
ఫేల - ఎంగిలి, రూ.ఫేలము, ఫేలి.
ఎంగిలి - 1.ఉచ్ఛిష్టము, 2.లాలాజలము.
ఉచ్ఛిష్టము - 1.ఎంగిలి, తినగా మిగిలినది, 2.పూర్వులు ఉపయోగించినది, వి.తేనె.
లాలాజలము - (జం.) నోటిలో ఊరెడి నీరు, ఉమ్మినీరు, (Saliva).
లాల జలగ్రంధులు - (జం.) ఉమ్మిని ఉత్పత్తిచేయు గ్రంధులు (Salivary glands) (ఇవి నోటికి ఇరుప్రక్కల దవడలలో ఉండును).
లాలాజలనాళము - (జం.) లాలాగ్రంధుల నుండి ఉమ్మినీటిని తీసికొనివచ్చు గొట్టము, (Salivary duct).
ఏంజైం - (జీవ.)(Enzyme) ఒక సేంద్రియ పదార్థము, ఫేనక ద్రవ్యము.
ఎన్జైమ్స్ - (Enzymes) (గృహ.) జీవకణములలో నుద్భవించెడు ప్రేరక ద్రవ్యములు, (ఇవి శరీరములో నేక రాసాయనిక ప్రక్రియలను జరుపు చుండును).
సేంద్రియ మండలములు - (వృక్ష.) చయాపచయ క్రియలకు ఉత్తేజమునిచ్చు నత్రజనిసంబంధమగు ప్రత్యేక రసాయన పదార్థములు (Enzymes) (ఇవి జీవరసముచే నుత్పత్తిచేయబడును, ఇవి నీటిలో కరగును.)
నిష్ఠీపనము - 1.ఉమియుట, 2.నిరసనము.
నిష్ఠూతము - 1.ఉమియబడినది, 2.త్రోయబడినది.
నిరసనము - 1.తిరస్కారము, ఆక్షేపము, 2.వధము, రూ.నిరాసనము.
నిరస్తము - తిర్కరింపబడినది, వెడలగ్రక్కబడినది, నిరాకృతము.
నిరాకృతము - న్యాయముచేత్రోయబడినది, నిరస్తము.
ఆక్షేపము - ఆక్షేపణము, 1.(అలం.) ఒక అ ర్థా లం కా ర ము, 2.అడ్డము, 3.విరోధము.
అక్షేపణము - 1.త్రోసివేయుట, 2.లాగుట, 3.అదల్పు, 4.అపవాదము, 5.అపహరించుట, 6.దోషములు ఎంచుట, 7.వణకురోగము.
అపవాదము - 1.నింద, దూఱు, 2.ఆజ్ఞ.
ఉపక్రోశము - నింద; నింద - దూరు, అపదూరు.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.
ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణము నకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశము.
ఆక్రోశించు - క్రి.1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.
ఆఘోషిం(ౘ)చు - క్రి.1.అరచు, 2.మ్రోయు, 3.చాటు.
నికారణము - వధము; వధము - చంపుట.
(ౘ)చంపు - క్రి.చావచేయు.
(ౘ)చంపుడుగట్టు - వధ్యస్థానము.
(ౘ)చావఁజూఁచు - క్రి.చంపు.
(ౘ)చక్కాడు - క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.
చక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.
ఆఘాతము - 1.కొట్టుట, 2.దెబ్బ, 3.చంపుట, 4.చంపుచోటు, 5.గాయము, 6.దుఃఖము, 7.మూత్రము అడ్దుపడుట, మూత్రాఘాతము.
ఆఘాతిం(ౘ)చు - చంపు. చంపుట ఏమి గొప్ప, ఏమి ఘనకార్యము ?
త్రుంచు - క్రి.1.తునకలుచేయు, 2.చంపు, 3.చించు.
చించు - క్రి.1.చినుగచేయు, రూ.చింపు.
ఆక్షేపకుఁడు - 1.ఆక్షేపించువాడు, 2.బోయవాడు.
వ్యాధుఁడు - బోయవాడు.
విరోధము - పగ, ఎడబాటు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
విశ్లేషము - ఎడబాటు.
కుతిల - 1.బాధ, 2.దుఃఖము.
కుతిలపడు - క్రి.గాసిచెందు, బాధపడు.
నొప్పి - 1.బాధ, 2.ఆపద.
నొవ్వి - 1.వేదన, 2.వ్యాధి, రూ.నొవ్వు, నోవి, నోవు.
నోవరి - నొవు, రూ.నొవ్వు.
వేదన - నొప్పి.
నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.
ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపన్నము - 1.ఆపదనొందినది, 2.లభించినది, 3.సంభవించినది.
ఆపన్నుఁడు - ఆపదనొందినవాడు.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
దుర్జనుల నైనఁ దిట్టకు;
వర్ణింపకు సుజనగోష్ఠి; వరులను నెల్లన్
నిర్జింతు ననుచుఁ ద్రుళ్ళకు;
దులనుఁడండ్రు నిను నిందఁ దోఁపఁ గుమారాః
తా. కుమారా! చెడ్డవారినైనప్పటికి(దుర్జనుఁడు - దుష్టుడు)ని ఎప్పటికి దూషింప వద్దు. సత్పురుషు లతో సంభాషణముచేయుట మానవలదు. గొప్పవారిని గెలుతు(నిర్జించు - క్రి.గెలుచు, జయమును పొందు.)నని చెప్పవలదు. నీయందే లోపము కనఁబడినను, చెడ్దవాఁడని యందురు.
నళినీదళగత జలమతి తరళం - తద్వత్ జీవిత మతిశయ చపలమ్,
విద్ధి, వ్యాధ్యభి మానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్. - భజగోవిందం
The water on the lotus leaf is very unsteady; so also is life extremely unstable. know that the entire world is devoured by disease and conceit, and smitten with sorrow.
తోయము - 1.విధము, 2.తెగ, 3.తడవ, 4.పరివారము, 5.సమయము, సం.వి.నీరు.
తాయతే పాలయతీతి తోయం. తాయ్య సంతాన పాలనయోః - రక్షించునది.
తోయరుహము - తామర, వ్యు.నీటియందు జన్మించినది.
తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయజాక్షి - తమ్మికంటి.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు.
తోయలి - తొయ్యలి, స్త్రీ.
తొయ్యలి - స్త్రీ, తోయలి, త.తయ్యల్.
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు.
తరవాయి - 1.సమయము, 2.అనుక్రమము, 3.పరిశిష్టము, 4.తడవ.
తరువాయి - అనంతరము.
అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి.వి.పిమ్మట, వి.సామీప్యము.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః| |
తా|| చిత్తశుద్ధి కలవాడు భక్తితో సమర్పించు ఆకుగాని, పువ్వుగాని, పండుగాని, నీరుగాని, నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. – రాజవిద్యారాజ గుహ్యయోగము, భగవద్గీత
తోయధి - సముద్రము.
తోయడము - 1.మేఘము, 2.నెయ్యి, వ్యు.నీటి నిచ్చునది.
నే - నేయి.
నేయి - నెయ్యి, సం.స్నేహః.
నేయము - నెయ్యము, సం.స్నేహః.
నెయ్యము - స్నేహము, చెలిమి, 2.ఇంపు, రూ.నెయ్యమి, నేయము, సం.స్నేహః.
నెయ్యమాడు - క్రి.స్నేహించు.
నెయ్యుఁడు - స్నేహితుడు, నెయ్యరి.
నెయ్యపుఱేఁడు - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్నువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
నెయ్యపుటలుక - ప్రణయకోపము.
ప్రేమా నా ప్రియతా షార్దం ప్రమ స్నేహః -
ప్రియస్య భావః ప్రేమా, న. పు. ప్రియతా చ - ప్రియము యొక్క భావము ప్రేమ ప్రియత.
హృదయే భవం హార్దం. - హృదయ మందుఁ బుట్తినది.
ప్రీణనం ప్రేమ. న. న. ప్రీఞ్ తర్పనే. - సంతోషింపఁజేయుట.
స్నిహ్యత ఇతి స్నేహః ప్ణిహప్రీతౌ, ప్రీతి. ఈ 4 స్నేహము పేర్లు.
హార్దము - స్నేహము, విణ.హృదయ సంబంధమైనది.
నెయి - ఘృతము, రూ.నెయ్యి, నేయి, సం.స్నేహః.
ఘృతము - 1.నెయ్యి, 2.నీరు.
ఘృతం - ఘృతంచ మధుచ ప్రజాపతి రా సీత్| నెయ్యి వేదంలో ఎంతో పవిత్రత సంతరించుకుంది. యజ్ఞంలో ఆవు నెయ్యి హవిస్సుగా దేవతలకు చేరి దేవతలను పోషిస్తోంది.
వాజము - 1.నెయ్యి, 2.నీరు, 3.రెక్క.
వాజపేయము - ఒకానొక యాగము.
వాజి - గుఱ్ఱము.
నీరము - జలము.
నిమ్నమీర్తే నీరం, ఈరగతౌ. - పల్లమును బొందునది.
నయతి సుఖమితి నీరం. నీఞ్ ప్రాపణే. - సుఖమును బొందునది.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరధి - సముద్రము.
నీరమునకుఁ బాలునకును దారి నీవు
కలుపఁగా విడఁదీయఁగాఁ గర్త వీవు
హంస సోహమ్మునందు మాహాత్మ్యమూను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
జిడ్డు - నేయి మొదలగు వాని యందలి మెరుగు.
జిడ్డుకడలి - పాలసముద్రము.
ఘృతేన వర్ధ తేబుద్ధిః, క్షీరేణా యుర్వి వర్థనమ్|
శాకేన వర్ధ తేవ్యాధి ర్మాంసం మాంసేన వర్ధతే||
తా. నేతిచేత బుద్ధియు, పాలచేత నాయువు(ఆయువు - జీవితకాలము, ఆయుస్సు), కూరగాయల చేత వ్యాధియు, మానసముచేత మాంసమును వృద్ధిపొందుచున్నవి. – నీతిశాస్త్రము
జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ. చతుర్థం హంసవాహనా|
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా.
తా. పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలను త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, పిల్లి అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)గలవాడు, తగవు యొక్క న్యాయ న్యాయములను విమర్శించి నిర్ణయించును, తెలివి లేనివా డట్లుచేయలేదు.
క్షత్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
విషము - 1.గరళము, 2.జలము.
విషధరము - 1.పాము, 2.మేషము, (విషము = నీరు, విషము).
విషస్య ధరః విషధరః - విషమును ధరించునది.
గరళము - 1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు.
అహిఫేనము - 1.నల్లమందు, అభిని, 2.గరళము, 3.పామునోటి చొంగ.
అభిని - నల్లమందు, సం.అహిఫేనమ్, అఫేనమ్.
నల్లమందు - (వ్యవ.) అభిని, అహిఫేనము (Opium), (ఇది మాదక పదార్థముగను వైద్యమునందును ఉపయోగింపబడును. దీనిని Papaveraceae అను కుటుంబమునకు చెందిన Opium poppy (అభిని లేక గసగసా) అను మొక్క కాయలను గీయగా వచ్చిన పాలతో తయారుచేయుదురు. నల్లమందులో మార్ఫిన్ (Morphine) అను ముఖ్యమైన క్షారముండును.)
గసగసాలు - ఒక దినుసు విత్తులు, (వ్యవ.) ఇవి సంబారద్రవ్యముగా వాడబడుచుండును. (ఇవి నల్లమందు మొక్క యొక్క గింజలు. వీనిలో సుమారు నూటికి 50 వంతులు చమురుండును), సం.గసకః.
మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.
మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.
విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితం|
ఆమిత్త్రాదపి సద్వృత్త మమేథ్యాదపి కాఞ్చనం||
తా. విషము వలనైన నమృతంబును గ్రహింప వలయును, బాలునిచే నైనను మంచిమాటలను గ్రహింపవలయును. శత్రువులనైనను సత్స్వ భావమును గ్రహింపవలయును, అమేధ్యము వలన నైనను బంగారమును గ్రహింపవలయును. - నీతిశాస్త్రము
మేఘ పుష్పము - 1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.
మొగులువిరి - జలము, మేఘ పుష్పము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
ఘనసారము - 1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
గ్లౌ - 1.చంద్రుడు Moon, 2.కర్పూరము.
మంత్ర వ్యాఖ్యాన నిపుణా జ్యోతిశ్శాస్త్రైక లోచనా,
ఇడా పింగళికా మధ్యా సుషుప్నా గ్రంథిభేదినీ.
క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.
జలదము - మేఘము, మొగులు.
మొగులు - మేఘము, రూ.మొగిలు, మొయిలు.
మొగులుదారి - ఆకసము; ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
కర్బురము - 1.జలము, 2.బంగారము, విణ.చిత్రవర్ణములు గలది.
బంగారము దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు.
3. షడ్దళమును విద్రుమాకారమునగు స్వాధిష్ఠాన చక్రమందు - బ్రహ్మ కలడు. (అగ్నితత్త్వమును)
స్వాధిష్ఠానచక్రము నందు బ - భ - మ - య - ర - ల అను వర్ణ పద్మములు పశ్యంతీవాగ్రూపములు. సూర్యుని వంటి వర్ణమును బ కారం మొదలు ల కారం వరకు ఉండు వర్ణాలు ఆరు దళములను కల్గియుండును.
అధారా హితపత్నీకా స్వాధిష్ఠాన సమాశ్రయా,
ఆజ్ఞాపద్మాసనాసీనా విశుద్ధస్థలసంస్థితా|
మ ఒక అక్షరము.
మకారమన్త్ర ముద్దిశ్య మన్త్రమూర్తిర్భవేద్భుధః |
సవిసర్గం ఫడంతం తత్ సర్వదిక్షు వినిర్దిశేత్ ||
మహాదేవం మహాత్మాతం మహా పాతక నాశనం
మహానటవరం వందే మకారాయ నమో నమః.
మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మ్యై "మ"కారమహితాయ నమశ్శివాయ |
అంతస్థము - (వ్యాక.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది.
య ఒక అక్షరము.
యత్రయత్రస్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః
యల్లింగం పూజయే న్నిత్యం యకారాయ నమోనమః.
ర ఒక యక్షరము, అవ్య, నీచ, మిత్రోద్దేశములయందు అగు అంతా గమము, ఏలర, ఏమిర మొ.
ల ఒక అక్షరము, ద్వితీయాది బహువచనముల వచ్చు ప్రత్యయము, ఉదా. పవములన్, గృహములన్.
వ ఒక అక్షరము.
రేఫము - ర వర్ణము, విణ.అధమము.
అంత్యము - 1.కడపటిది, 2.అధమము.
అధమము - తక్కువైనది, నీచము.
కిఱుదు - తక్కువైనది, కిఱుదు నేల.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మన్ద్రస్తు గమ్భీరే :
మన్యతే బుద్ధ్యతే అనేనేతి మంద్రః - దీనిచేత నెఱుఁగఁబడును.
మందతే శనైర్నిస్సరతీతి మంద్రః. మది స్తుతి మోద మద స్వప్న కాంతిగతిషు. - మెల్లగాఁ బలుకఁబడునది. ఈ ఒకటి గంభీరధ్వని పేరు.
మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.
స్వాధిష్ఠాన కమలము అగ్నితత్తోత్పత్తి స్థానము. భగవతి కుండలిని స్వాధిస్ఠాన చక్రమున స్వయముగ అధిష్టించి గ్రంధి కల్పనము చేయును. కాబట్టి స్వాధిస్ఠాన మని పేరు.
తవ స్వాధిస్ఠానే - హుతవహ మధిష్ఠాయ నిరతం
త మీడే సంవర్తం - జనని! మహతీం తాం చ సమయామ్|
యదాలోకే లోకాన్ - దహతి మహతి క్రోధకలితే
దయర్ద్రా యా దృష్టి - శ్శిశిర ముపచారం రచయతి|| - 39శ్లో.
తా. జనని ! ఓ తల్లీ! స్వాధిష్ఠానమందు అధిష్ఠించి నిరంతరము ప్రకాశించుచు ప్రసిద్ధుడైన (హుతవహుఁడు - అగ్ని)అగ్నిరూపముతో వెలుగు చున్న సమయమను ప్రళయాగ్నిని పొంది యున్నదో, యా సమయశక్తిని (సమయాకళాదృష్తి) స్తుతించుచున్నాను. ప్రచండమైన తన క్రోధాగ్నితో రుద్రుడు(ప్రళయకాలంలో విజృంభించే కాలాగ్ని రుద్రుడిని)మహాశక్తి స్వరూపము, లోకాలను సంవర్తమను(సంవర్తము-ప్రళయము)దహించునో, నీ చల్లని దయార్ద్ర దృష్టి(దృష్టి-1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)శీతలమైన ఉపచారము కావించు చున్నది. - సౌందర్యలహరి
స్వాధిస్ఠానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా|
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణా తిగర్వితా. - 104శ్లో
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
బ్రహ్మా న-పు. బృంహతి వర్ధయతి ప్రజా ఇతి బ్రహ్మా - ప్రజలను వృద్ధి బొందించువాడు.
బ్రహ్మ ముఖములందు సరస్వతి; సరస్వతి యందు దేవిస్థానం దేవమాత.
భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ. పూజ్యస్త్రీ.
సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రమునకును, నదీ విశేషము నకును, ఆవునకును పేరు. సరస్వతి శరీరవర్ణం తెలుపు, వాహనం హంస.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు(మనసి చంద్రః), 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః. ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి. నిశ్చయించేది బుద్ధి.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ, దేవతలలో పెద్దవాడు.
సురాణం జ్యేష్ఠః సుర జ్యేష్ఠః - దేవతలలోఁ బెద్దవాడు.
జ్యేష్ఠుడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రణి - శ్రేష్ఠుడు, మొదటివాడు.
అగ్రిముఁడు - మొదటివాడు.
అగ్రమస్తిష్కము - (జం.) మెదడులో మొదటిభాగము (Prodence phalona or forebrain).
అగ్రనరుఁడు - అగ్రగామి; అగ్రేసరుఁడు - అగ్రగామి.
అగ్రగామి - ముందు నదుచువాడు, (గృహ.) ఒక వస్తువుగా తయారగుటకు దానికి ముందున్నస్థితి, ఉదా.కెరొటిన్ శరీరములో విటమిన్ vitamin 'A' గా మార్పబడును, కనుక విటమిన్ vitamin 'A' కి అగ్రగామి కెరొటిన్.
కెరోటిన్ - (గృహ.) (Carotene) పసుపు పచ్చని పదార్థము 'ఏ' విటమిన్ తయారగుటకు కావలసిన పదార్థము (ఇది కనుల బలహీనతను నిరోధించును.)
అగ్రజుఁడు - 1.బ్రహ్మ, 2.బ్రాహ్మణుడు, 3.అన్న.
బ్రహ్మణో ముఖే అగ్రే జన్మాస్యేతి అగ్రజన్మా. న. పు. - బ్రహ్మయొక్క ముఖమందు మొదటి జన్మము గలవాడు.
పూర్వజ స్త్వగ్రియా (అ)గ్రజః,
పూర్వస్మిన్ కాలే జాతః పూర్వజః, 1. అగ్రే భవః అగ్రియః, 2. అగ్రేజాత అగ్రజః, జనీప్రాదుర్భావే. - తనకంటె ముందరఁ బుట్టినవాఁడు. ఈ 3 పెద్దయన్న పేర్లు.
బ్రహ్మవర్చస్సు - బ్రాహ్మణతేజము.
బ్రహ్మవర్చసము - సదాచారాధ్యయన సమృద్ధి.
భువి దివ్యతి బ్రహ్మవర్చసా భూదేవః దివు క్రీడాదౌ. - బ్రహ్మవర్చస్సుచేత భూమి యందుఁ బ్రకాశించువాఁడు.
విప్రుఁడు - బ్రాహ్మణుడు, పారుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు.
విశేషేణ పాపేభ్యః ఆత్మానం వరం చ పాతీతి విప్రః. పా. రక్షణే. - తన్నును పరునిని విశేషముగాఁ బాపమునుండి రక్షించువాఁడు.
బ్రహ్మహత్య - విప్రుని చంపుట (మహాపాతకము లలో నొకటి).
ధర్మాధారా ధనాధ్యక్షా ధనదాన్యవివర్ధినీ|
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ.
బ్రాహ్మణ్యము - 1.బ్రాహ్మణ కర్మము, 2.బ్రాహ్మణ భావము.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.
బ్రాహ్మణములు - వైదిక ధర్మ గ్రంథములు, యజ్ఞగ్రంధములను, పురాణగాథలను చెప్పు ధర్మగ్రంథములు.
బ్రహ్మణిః పరబ్రహ్మణి విష్ఠావత్త్వాత్ బ్రాహ్మణః పరబ్రహమందు నిష్ఠగలవాఁడు.
బ్రహ్మణః కులే భవత్వాద్వా బ్రాహ్మణః బ్రహ్మకుల మందుఁ బుట్టినవాఁడు.
బ్రహ్మణ్యము - 1.బ్రాహ్మణులకు హితమైనది, 2.గంగరావి.
అన1 - 1.అన్న, 2.చిగురు, 3.ఆనకట్ట.
అన2 - 1.అనుటకు, అనగా మొ.ని; ఉత్ప్రేక్షావాచకముగా ఉపయోగింప బడును.
అన్న - జ్యేష్ఠసోదరుడు.
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త. ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.వి., సొత్తు.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్.
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠం - క్షత్రియాణాంతు వీర్యంతః|
వైశ్యానాం ధాన్యధనత - శ్శూద్రాణా మేవ జన్మతః||
తా. బ్రాహ్మణులలో జ్ఞానము గలవాడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమవంతుఁడు పెద్ద, వైశ్యులలో ధనధాన్యము గలవాఁడు పెద్ద, శూద్రులలో వయోధికుఁడు పెద్దయని భావము. – నీతిశాస్త్రము
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||
చిగురు - 1.పల్లవము, విణ.లేత, రూ.చివురు.
పల్లవము - 1.చిగురు, 2.చిగురించిన కొమ్మ, 3.కోకచెరగు, 4.విరివి.
పల్లవించు - ఇగురొత్తు, చిగురుకొను.
పల్లవితము - 1.చిగురించినది, 2.విరివియైనది.
పల్లవుఁడు - విటుడు; విటకాఁడు - విటుడు.
ఇగురు - 1.చిగురు, పల్లవము, 2.పండ్ల చుట్టును మృదువుగా నుండెడి కండ. రూ.ఇవురు.
ఇగురుఁబోఁడి - చిగురువంటి మేనుగల స్త్రీ, చక్కని స్త్రీ.
చిగురించు - చిగుర్చు, పల్లవించు.
చిగురొత్తు - 1.చిగుర్చు, 2.అనురక్తమగు.
చిగురింత - 1.చిగుర్చుట, 2.తృణ విశేషము.
చిగురుఁబోడి - 1.చిగురువలె మనోజ్ఞురాలగు స్త్రీ, 2.స్త్రీ.
చిగురు విలుకాఁడు - మన్మథుడు.
ప్రబలము - చిగురు విణ. మిక్కిలి బలము గలది.
చిగురాకు దిండి - కోయిల, పల్లవఖాది. కోయిలలు రసాల శాఖలపై చిగురు పసరుతో గొంతు జీరతీరి సుతారంగా కూయ నారంభిస్తాయి.
విటపము - 1.చివురించిన కొమ్మ, 2.చిగురు, 3.కొమ్మ, 4.బోదెలేని చెట్టు.
విటపి - చెట్టు, వ్యు.విటపములు కలది.
తలిరు - చిగురు.
తలిరుదిండి - కోయిల; కోకిలము - కోయిల.
తలిరుఁబోడి - స్త్రీ.
తలిరువిలుకుఁడు - మదనుడు, రూ.తలిరువిల్తుడు, తలిరువిలుకాడు.
క్రొంజిగురు (క్రొత్త + చిగురు) - క్రొత్తచిగురు.
క్రొంజిగురువిల్కాఁడు - మన్మథుడు.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ - ఆడుది(స్త్రీ - ఆడుది), రూ.కొమ్మ.
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.
పోటకత్తి - (వ్యవ.) పొడవైన పిడితో వంపు తిరిగి యుండు చిన్నకత్తి, (ఇది కొమ్మలను నరకుటకు కుపయోగించును) (Bill-hook).
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.
వల్లరి - చిగురించిన లేతకొమ్మ, తీగ.
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
వల్లి - 1.తీగ, 2.సుబ్రమణ్యేశ్వరుని భార్య.
సుబ్రమణ్యుఁడు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ. కొమరుసామి. కొమరసామి - స్కందుడు; స్కందుఁడు - కుమారస్వామి.
వల్లరీ మఞ్జరీ స్త్రియా,
వల్లతే శాఖాంసంవృణోతీతి వల్లరీ. ఈ. సీ. వల వేల్ల సంవరణే. - కొమ్మను గప్పునది.
మన్యతే పికాదిభి ర్బహుమన్యతే మంజరీ. ఈ. సీ. మన అవబోధనే. - కోకిలాదులచేత నిక్షేపమువలెఁ దలఁచఁబడునది.
ఈ శబ్దములు ఇక్షారాంతములుం గలవు. పూవులగుత్తికిఁగాని పూచిన కొమ్మకుఁగాని పేర్లు.
అన్యోన్యేక్షణ సంయుతాం శరవణోర్భూస్య సక్యేస్థితాం|
గుజామాల్యథరాం ప్రవాళవసనాం వల్లీశ్వరీం భావయే||
లత - 1.తీగ, 2.ముత్యాలహారపు పేట, (వృక్ష.) తీగగా ఏదైన ఆధారమును ఊతగొని ప్రాకు మొక్క.
తీఁగ - లత, రూ.తీఁగియ, తీఁగె, తీవ, తీవియ, సం.దీర్ఘా.
తీవ - తీగ, రూ.తీవియ, తీవె. తీవియ - తీవ; తీవె - తీవ.
లతిక - 1.తీగ, 2.నూరు పేటల హారము.
లతకూన - లేత తీగవంటి స్త్రీ.
తీఁగబోఁడి - స్త్రీ; స్త్రీ - ఆడుది.
తీఁగవిలుకాఁడు - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
లతా కాపి తరుః కో(అ)పి కాశ్యా మాశ్చర్యదంపతీ
సా చాపర్ణా నచ స్థాణు ర్దదాతే వాంఛితం ఫలమ్||
భా|| వారణాసియం దొక్క లతకును నొక్క వృక్షమునకును విచిత్రమైన దాంపత్యము కలదు. ఆ లత యపర్ణ(ఆకులు లేనిది. అపర్ణ = పార్వతి. తపసి పర్ణానామ ప్యనశనా ద(అ)పర్ణా - పర్ణములైన భక్షింపక తపం బొనర్చినది.) ఆ భూరుహము స్థాణువు ఈశ్వరుడు (స్థాణువు = 1.మేకు, 2.శివుడు, 3.కొమ్మలులేని చెట్టు మ్రోడు, విణ.స్థిరమైనది.) కాని కోరిన కోర్కెల నన్నిటి నాదంపతు లొసంగుచుందురు. (వారణాసిలో ను(ఉ)మామహేశ్వరు లను దంపతులు భక్తులు కోరిన కోర్కెల నెల్ల సఫలము గావింతురని భావము.)
తీగకు పందిరి కావలెగాని తెలుసా నువ్వే పందిరని...
ప్రతతి - 1.సమూహము, 2.తీగ, 3.విరివి.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
విమోటనము - (భౌతి.) ఒక తీగను గాని కొంచెము నులిపినపుడు అది మరల తింటిస్థితిని తీసికొనుట కుపయోగించు బలము, (Torsion).
ముక్తా విద్రుమ హేమ నీల
ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణైః,
యుక్తా మిందు నిబద్ధ రత్న
మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్|
విద్రుమము - పగడము, పగడపు చెట్టు Coral.
పగడము - ప్రవాళము, పవడము, సం.ప్రవాళః.
ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణాదండము.
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.
అథ విద్రుమః పుంసి ప్రవాళం పుంసపుంసకమ్ :
విశిష్టో ద్రుమో విద్రుమః - విశేషమైన చెట్టు.
ప్రకృష్టం వలతే ప్రవాళం. అ. ప్న. వల సంచలనే - లతారూపమై యుండునప్పుడు ప్రకృష్టముగా చలించునది. ఈ రెండు పగడము పేర్లు.
ప్రవాళము - 1.పగడము, 2.చిగురు, 3.వీణా దండము. చిగురాకు రంగు (ప్రవాళ పద్మపత్రాభం).
పవడము - 1.పగడము, 2.ప్రవాళము, సం.ప్రవాళః.
ఒళగు - 1.మర్మము, 2.లోకువ, 3.వీణాదండము, రూ.ఒళవు.
ఒళవు - ఒళగు. నెఱకు - మర్మము, జీవస్థానము, రూ.నెరసు.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు.
లోఁకువ - అధీనము, తక్కువ. లోఁబడు - క్రి.అధీనమగు.
లొక్కు - (వ్యావ.) లోకువ.
లొజ్జు - తక్కువ, విణ.న్యూనము. న్యూనము - తక్కువైనది.
లొచ్చు - తక్కువ, విణ.న్యూనము.
నెళవు - 1.పరిచయము, 2.మర్మము, రూ.నెలవు.
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెళవరి - 1.పరిచయము కలవాడు, 2.మర్మజ్ఞుడు. ఒళవరి - మర్మజ్ఞుడు.
మంజరి - 1.చివురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
ప్రవాళ మఙ్కురే ప్యస్త్రీ :
ప్రవాళ శబ్దము చిగురునకును, అపిశబ్దము వలన పవడమునకును, వీణా దండమునకును పేరు. ప్రవలత ఇతి ప్రవాళం. ప్న. వల సంచలనే. - కదలునది. టీ. స. అంకురోహ త్ర నవకిసలయః.
పవడపు దీవులు - (భూగో.) పవడపు పురుగుల గుల్లలచే సముద్రపు అడుగు భాగమున నేర్పడిన దీవులు, (హిందూ మహాసముద్రములోని లక్షదీవులు, మలిదీవులు ఈ కోవకు చెందినవి).
హ్రీంకార శుక్తికా ముక్తామణిర్హీంకార బోధితా,
హ్రీంకారమయ సౌవర్ణస్తమ్భ విద్రుమపుత్రికా. - 57శ్లో
ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించిన అడ్డంకి.
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట.
వారధి - వంతెన, అడ్డకట్ట (ఈ అర్థము తెలుగునందే).
వంతెన - ఏటిపైకట్ట, వారధి.
కట్టుగొమ్మ - అడ్దకట్ట, సేతువు. సేతువు - నీటికట్ట.
బరాజ్ - (వ్యవ., అర్థ, భూగో.) (Baraz) నీటిపారుదల వసతులకై నదిలోని నీరును భద్రము చేయుటకై కట్టిన కట్టడము.
గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించినదానికై విచారించుట.
పగడపు రిక్క - ఆర్ద్రా నక్షత్రము.
పగడ - పాచికల మీద ఒకటి చుక్క, సర్వ.ఒకటి, సం.వటికా.
వంచ - 1.ముఖ్యము, 2.ఒకటి.
మెఱుఁగురిక్క - 1.ప్రవాళము, 2.కాంతిగల చుక్క.
మెఱుఁగు - 1.కాంతి, వెలుతురు Light, 2.కిరణము, 3.బంగారు, వెండి మొ.నగలకు పెట్టు తళుకు, 4.పొగరింపు (ఉబ్బుట).
మెఱుఁగుబోఁడి - (మెఱుఁగు + పోఁడి) మెరుపువలె మనోజ్ఞురాలగు స్త్రీ.
కాంతి1 - 1.కోరిక 2.(అలం) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది(Light). కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదనము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
ధర్ముని పత్ని కాంతి. ఆమె లేకపోతే లోకాలు ఆధార శూన్యములై చెడిపోతాయి.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలదొర - చంద్రుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు Moon.
పరమేష్ఠి - బ్రహ్మ.
పరమే ఉత్కృష్టే పదే బ్రహ్మ లోకాఖ్యే తిష్టతీతి పరమేష్టీ-న-పు. - ఉత్కృష్ట స్థానమం దుండెడువాఁడు. స్థా గతినివృత్తౌ.
పితామహుఁడు - 1.తండ్రికి తండ్రి, 2.బ్రహ్మ.
తాత - 1.తండ్రికి తండ్రి, 2.తల్లికి తండ్రి, వై.వి. విధాత, బ్రహ్మ, సం.వి.తండ్రి.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
పితామహః పితౄణాం పితా - పితౄణా మపి జనయి తేత్యర్థః - పిత(తండ్రుల) పుట్టించినవాడు, బ్రహ్మ.
తాతస్తు జనకః పితా :
తనోతి కులం తాతః. తను విస్తారే. - కులమును విస్తరింపఁజేయువాఁడు.
జనయతీతి జనకః. జనీ ప్రాదుర్భానే. - పుట్టించువాఁడు.
పాతీతి పితా. ఋ. పు. పా రక్షణే - రక్షించువాఁడు. ఈ మూడు 3 తండ్రి పేర్లు.
సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
విధధాతి సర్వం విధాతా-ఋ-పు. సర్వముఁ జేయువాఁడు. డు ధాఙ్ ధారణ పోషయో.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. విధి భవ ముఖ సురసంస్తుత రామ్|
విదధాతీతి విధిః- ఇ-పు. - సర్వముఁ జేయువాఁడు.
విధి ర్విధానే దైవే పి : విధి శబ్దము చేయుటకును, అపిశబ్దము వలన బ్రహ్మదేవునికిని, ప్రకారమునకును, విధాయక వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః, పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్థే పజాపతా"వితి శేషః.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము. (Property)
లెక్కపెట్టఁగానౌనె నీ లీల లరయ
బ్రహ్మయంతటివాఁడు నీ పట్టి యయ్యు
నేరలేఁ డయ్యె యో యయ్య నీ గుణములు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.
ప్రపితామహుఁడు - ముత్తాత.
ముత్తాత - వృద్ధ పితామహుడు, ప్రపితామహుడు.
ముత్తవ - వృద్ధ పితామహి, ముత్తవ్వ, ప్రపితామహి.
పైతామహము - పితామహ సంబంధమైనది.
పైతృకము - పితృసంబంధమైనది.
పైత్రము - పితృసంబంధమైనది.
పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింపబడినది.
పిత్రార్జితము - పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).
భూర్భువ స్త్వస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్యా యజ్ఞాంగో యజ్ఞవాహనః||
జనకుడు - 1.తండ్రి, 2.సీత యొక్క తండ్రి, విదేహరాజు(జనకర్షి).
జనయిత్రి - తండ్రి; జనయిత - తల్లి.
తండీరి - జనకుడు, రూ.తండ్రి.
తండ్రీ - తండిరి; నాయన - తండ్రి.
బాబు - 1.పూజ్యుడు, 2.తండ్రి, సం.భావ్యః.
ఠాకురు - 1.తండ్రి, 2.అధిపతి, 3.గురువు, రూ.ఠాగూరు, సం.టక్కురః.
అయ్య - తండ్రి, విణ.పూజ్యుడు, రూ.అయ, సం.ఆర్యః.
జనకసుతా ప్రతిపాల జయజయ సంస్కృతిలీల నారాయణా|
జానకి - జనకుని కూతురు, సీత.
సీత - 1.శ్రీ రాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు. చిత్రకూటము నందు దేవీస్థానం సీత|
జన్మనా జనకః సో అభూద్వైదేహస్తు విదేహజః|
మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా||
పితరుఁడు - తండ్రి, సం.పితా.
పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు - బ్రహ్మోపదేశం చేసినవాడు తండ్రి, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు) పితా జ్ఞానం. పితరః ప్రజాపతిః.
పితాధర్మః పితాస్వర్గః, పితాహి పరమం తపః|
పితరి ప్రీతి మాపన్నే, సర్వా ప్రియంతి దేవతాః|| (మహాభారతం శాంతి పర్వం 266-21)
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి సం.కృష్ణః.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు. వ్రాత్యుఁడు - ఉపనయనాది సంస్కారములు లేని బ్రాహ్మణుడు.
జనితా చోపనీతాచ యేన విద్యోపదిశ్యతే|
అన్నదాతా భయత్రాతా పంచె తే పితరస్మృతాః||
తా. కన్నతండ్రి, ఉపనయనము చేసినవాఁడు, విద్య(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)చెప్పినవాఁడు, అన్నము బెట్టినవాఁడు, భయము తీర్చిన వాఁడు. ఈ ఐదుగురును తండ్రులు. - నీతిశాస్త్రము
స్వధ: పితృపత్ని, ఆమెకి మన్నన ఈయకపోతే పితరులకు చేసే దాన ధర్మాలు వారికి తృప్తికరములు కావు.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యము - 1.బంగరు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హిరణ్యగర్భః, హిరణ్యమయో గర్భో యస్యసః హిరణ్యగర్భః - హిరణ్య మయమైన గర్భము గలవాడు.
హిరణ్యం గర్భే యస్యేతి వా - గర్భమందు హిరణ్యము గలవాడు.
హేమము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హేమించు - క్రి.బంగారగు.
హేమకారుఁడు - అగసాలెవాడు.
అగసాలి - కమసాలి, సర్ణకారుడు, బంగారుపనివాడు, రూ.అగసాలె.
హేమాద్రి - బంగారుకొండ, మేరువు.
కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
కపర్ధి - శివుడు.
హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హాటకగర్భుడు - బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
రై - 1.ధనము, 2.హిరణ్యము.
రైవతుఁడు - శివుడు.
హిరణ్మయము - బంగారుతో నిండినది.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యం రేతో యస్యసః హిరణ్య రేతాః. న.పు. - హిరణ్యమే రేతస్సుగాఁ గలవాఁడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
దచ్చికాళ్ళమెకము - శరభము, అష్టాపదము.
అష్టాపదము - బంగారము.
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్నిపుటంబు బెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మల త్రయం
బంచిత భక్తియోగదహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచన కుండలాభరణ దాశరథీ కరుణా పయోనిధీ.
తా. రామా! బంగారులోని మాలిన్యము అగ్నిపుటము వలన పోవునట్లు ఆత్మయందుగల మూఁడుమలములు నీయందలి భక్తియోగము చేతనే, నశించునుగాని మరొక విధమున నశింపవు.
ఉమెత్త - దుత్తురము, రూ.ఉమ్మెత్త, సం.ఉన్మత్త.
దుత్తురము - ఉమ్మెత్త; కితవము - ఉమ్మెత్త.
ఉన్మత్తః కితవో ధూర్తో ధుత్తూతః కనకాహ్వయః మాతులో మదనశ్చ :
ఉన్మాదయతీత్యున్మత్తః తథైవ కితవశ్చ. మదీ హర్షగ్లేపనయోః - ఉన్మాదమును జేయునది.
ధూర్వతి ఉన్మాదేన హిన స్తీతి ధూర్తః. దుర్వీ హింసాయాం. - ఉన్మాదముచేత హింసించునది.
వాతాదిరోగా న్ ధువతీతి ధుత్తూరః. ధూ విధూననే. - వాతాది రోగము లను కంపింపఁ జేయునది. పా. ధూస్తూరః.
కనకస్య ఆహ్వయోయస్య కనకాహ్వయః - బంగారు యొక్క పేరుగలది.
ఉన్మాదకద్ర వ్యేషు మానా స్తితు లాస్యేతి మాతులః - ఉన్మాదక ద్రవ్యము లలో సాటిలేనిది.
మదయతీతి మదనః. మదీహర్షగ్లేపనయోః. - మదింపఁ జేయునది. ఈ ఆరు ఉమ్మెత పేర్లు.
కైవతము - 1.కపటము, 2.జూదము, 3.ఉమ్మెత్త, 4.వైడూర్యమణి.
దుత్తూరము - కపటము, సం.ధూర్తతా.
కపటము - కవుడు, వ్యాజము.
కౌడు - 1.మోసము, 2.ప్రమాదము, తప్పు, రూ.కవుడు, సం.కపటః.
జూదము - జూజము. జూజము - ద్యూతము, పందెము వేసి ఆడెడి ఆట, మోసము, రూ.జూదము, సం.ద్యూతమ్. ద్యూదము - జూదము.
వైడూర్యము - ఒక విధమగు రత్నము, పిల్ల కన్రతనము.
బేరిల్ - (భూగ.) (Beryl) వైడూర్యము.
ఉదర్కము - 1.భావికాలము, 2.భావి ఫలము, 3.ఉమ్మెత్తముల్లు.
స్వయంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మదనుడు.
స్వయంభూః. ఊ-పు. స్వయం భవతీతి స్వయంభూః - తనంతతనే పుట్టినవాఁడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.
నలువ - చతుర్ముఖుడు.
చతురాననః చత్వారి ఆననాని యస్య నః - నాలుగుముఖములు గలవాఁడు.
ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
ధాతా. ఋ.పు. సర్వం దధాతీతి ధాతా - సమస్తమును ధరించినవాఁడు. దుధాఞ్ ధారణ పోషణయోః.
అబ్జయోని - బ్రహ్మ, తమ్మిచూలి.
అబ్జయోనిః ఇ.పు. అబ్జం విష్ణునాభికమలం యొని రుత్పత్తిస్థానం యస్యసః - విష్ణునాభికమలమే ఉత్పత్తి స్థానముగాఁ గలవాఁడు.
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుడు, వ్యు.అసురలను హింసజేయువాడు.
ద్రుహిణః ద్రుహ్యతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులకు హింసచేయువాఁడు. ద్రుహ జిఘాం సాయాం.
విరించి - బ్రహ్మ.
విరించిః ఇ-పు. విరచయతి భూతాని విరించిః - భూతములను సృజించువాఁడు.
విభిః హంసై రిచ్యతే ఉహ్యత ఇతి వా-వి శబ్దము పక్షి వాచకము గనుక హంసలచేత వహింపఁబడువాడు
కవీంద్రాణాం చేతః - కమలవన బాలాతప రుచిం
భజంతే యే సంతః - కతిచిదరుణా మేవ భవతీమ్|
విరించిప్రేయస్యా - స్తరల!తరశృంగారలహరీ
గభీరాభి ర్వాగ్భి - ర్విదధతి సతాం రంజన మమీ|| - 16శ్లో
తా. హే భగవతీ! ఏ సుజనులు కవుల మనస్సు లనెడి పద్మవనమునకు లే యండయైన ఎఱ్ఱనగు - అరుణా! ( అను పేరుగల లేక అరుణ వర్ణముగల)నిన్ను సేవింతురో - వారు బ్రహ్మయొక్క ప్రేయసి సర్వతీదేవియొక్క యౌవన శృంగార ప్రవాహముచే, గంభీరమైన వాగ్విలాసముచేత సత్పురుషుల హృదయాన్ని రంజింప చేయుచున్నారు. – సౌందర్యలహరి
అరుణారుణకౌసుంభ - వస్త్రభాస్వత్కటీతటీ|
రత్నకింకిణికారమ్య - రశనాదామభూషితా.
కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
కమలాసనఃః కమలం ఆసనం యస్య సః - కమలము ఆసనముగాఁ గలవాఁడు.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
స్రష్ట - బ్రహ్మ.
సృజతీతి స్రష్టా, ఋ-పు. - సృజించువాఁడు. సృజ విసర్గే.
సృజన - సృష్తి.
సృష్టి - 1.స్వభావము, 2.ప్రభృతి, 3.స్వభావము.
ప్రభృతి - మొదలు.
ప్రజాపతి - బ్రహ్మ, (చరి.) 1.యుద్ధ సమయములందు కులపతులపై నుండు సైన్యాధికారి, 2.గ్రామపెద్ద.
ప్రజానాం పతిః, ప్రజాపతిః. ఈ-పు. - ప్రజలకుఁ బ్రభువు.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
విధధాతి సర్వం విధాతా-ఋ-పు. సర్వముఁ జేయువాఁడు. డు ధాఙ్ ధారణ పోషయో.
వేధ - నలువ, బ్రహ్మ.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
విశ్వసృజుడు - బ్రహ్మ.
విశ్వం సృజతీతి విశ్వసృట్ - జ-పు. - విశ్వమును సృజించువాడు.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. విధి భవ ముఖ సురసంస్తుత రామ్|
విదధాతీతి విధిః- ఇ-పు. - సర్వముఁ జేయువాఁడు.
విధి ర్విధానే దైవే పి : విధి శబ్దము చేయుటకును, అపిశబ్దము వలన బ్రహ్మదేవునికిని, ప్రకారమునకును, విధాయక వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః, పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్థే పజాపతా"వితి శేషః.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము. (Property)
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
విధుః ఉపు విధ్యతి ప్రత్యర్థిన ఇతి విధుః - శత్రువులను వ్యథపెట్టువాఁడు.
శతానందుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు.
శతానందము - విష్ణురథము.
క్రతువు - యజ్ఞము.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజన్ము, మనుష్యయజన్ము, ఇవి పంచయజ్ఞములు), వికృ.జన్నము.
జన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజనః.
జన్నపుగొంగ(గొంగ - శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.
క్రతుధ్వంసి - శివుడు, వ్యు.దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.
జన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుఁదిండి, రూ.క్రతుభూక్కు.
త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు - వేలుపు; సుపర్వుఁడు - వేలుపు.
త్రిదివము - స్వర్గము.
జన్యువు - 1.జంతువు, 2.అగ్ని, 3.బ్రహ్మ.
జన్మి - జంతువు, శరీరధారి.
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
బ్రహ్మసువు - 1.మన్మథుడు, 2.మరీచి, 3.నారదుడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గికంటి - శివుడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.
వైశ్వానరుఁడు - అగ్ని.
విశ్వానరస్య ఋషే రపత్యం వైశ్వానరః - విశ్వానరుఁ డను ఋషికి కొడుకు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమా శ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 14శ్లో
తా|| నేను జఠరాగ్ని రూపమున ప్రాణుల దేహము నందుండి ప్రాణాపాన వాయువులతో కూడినవాడనై భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను నాల్గు విధము లగు పదార్థములను జీర్ణము చేయుచున్నాను. - పురుషోత్తమ ప్రాప్తియోగము, భగవద్గీత
వికృతి శాంకరీ శాస్త్రీ యక్షగంధర్వసేవితా,
వైశ్వనరీ మహాశీలా దేవసేనా గుహప్రియా|
వసిష్ఠ కుంభోద్భవగౌతమాది - మునీంద్ర దేవార్చిత శేఖరాయ|
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమశివాయ.
వృష్టి - 1.పొట్టేలు, 2.ఒక గొల్లవాడు, 3.కృష్ణుడు, 4.ఇంద్రుడు, 5. వహ్ని.
పొట్టేలు - మగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
మేండము - పొట్టేలు (మేండ్రించు - 1.భేదించు 2.నశింప చేయు.)
గొఱ్ఱియ - గొఱ్ఱె, సం.కురరః, కురరీ.
కురరి - ఆడుగొఱ్ఱె.
ఏడక - గొఱ్ఱె. గొఱ్ఱె కసాయివాడినే నమ్ముతుంది.
ఏడకము - పొట్టేలు.
రోహిషము - కొండగొఱ్ఱె, ముత్యము.
రౌహిషము - 1.కామంచిగడ్డి (తృణ విశేషము), 2.కొండగొఱ్ఱె.
కామంచి - క త్తృణము, ఒక తెగగడ్డి, రూ.కామంచి, సం.కామంజికా.
కామంజిక - క త్తృణము.
ఊర్ణము - 1.నూలు, 2.కనుబొమల నడుమ సుడి, వి.ఉన్ని.
ఉన్ని - గొఱ్ఱె మొ.ని బొచ్చు.
ఉన్ని అల్లిక - (గృహ.) ఊలును దుస్తులుగా అల్లుట (Knitting). ఊర్ణాయువు - 1.పొట్టేలు, 2.ఉన్ని కంబళి, 3.సాలెపురుగు, విణ.ఉన్నికలది.
ఉరభ్రము - ఉరణము, పొట్టేలు, తగరు.
ఉరణము - పొట్టేలు, వ్యు.బిగ్గరగా మొరబెట్టునది.
పొట్టేలు - మొగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
తగరు - పొట్టేలు, సం.తగరః.
తగరురౌతు - అగ్ని.
తగిలిమదంబుచేనెదిరి దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుఁడై చెడుటింతెగాక తా
నెగడి జయొంపలేడఁది నిక్కము, తప్పదు, ధాత్రిలోపలన్
తెగియొక కొండతోఁదగరు ఢీకొని తాకిననేమి? భాస్కరా.
తా. గొఱ్ఱె మూర్ఖతచే కొండతో నెదిరించి పోట్లాడిన అది ఆ కొండను జయింప గలదా? అట్లే మూర్ఖుడు(పామరుఁడు-1.మూర్ఖుడు, అజ్ఞుడు, 2.నీచుడు.)యెదుటి వారి ఘనతనూ తన శక్తినీ తెలిసి కొనక విరోధించి(పగ -విరోధము)తో మార్కొనుట ప్రయోజనము లేదు.
సాధు పృష్టం మహాభాగ సర్వలోక హితైషిణః,
మహతా మేష ధర్మశ్చ నాన్యేషా మితి మే మతిః
అజాజీవుడు - మేకలను మేపుకొని జీవించువాడు, గొల్లవాడు.
అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు.
జాబాలుఁడు - 1.మేకల మేపువాడు, 2.ఒక ఋషి.
జాబాల స్స్యాదజాజీవి :
అజాః పాలయతీతి జాబాలః. - పాలరక్షణే. - మేఁకలఁ గాచువాఁడు.
అజాభి ర్జీవతీ త్యజాజీవీ. న. పు. జీవ ప్రాణధారనే. - మేఁకలచేత బ్రతుకువాఁడు. పా. అజాజీవః 'అజాపాల మజాజీవ' మని రత్నమాల. ఈ రెండు మేఁకలఁగాచువాని పేర్లు.
దోగ్ధ - 1.గొల్లవాడు, 2.దూడ, 3.కవిత్వము చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
దోగ్ధ్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది.
వ్రేఁత - గొల్లది; మహాశూద్రి - గొల్లది; గోపి - గొల్లది (గోపిక).
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
వ్రే - గొల్లకులము, సం.వృష్ణిః.
వ్రేపల్లియ - గొల్లపల్లె.
వ్రేఁడు - గొల్లడు, సం.వృష్ణః.
వల్లవుఁడు - గొల్లవాడు.
దార్హుఁడు - కృష్ణుడు, వ్యు.దాశార్హుని సంతతివాడు.
మురారి - 1.కృష్ణుడు, 2.ఒకానొక సంస్కృతకవి.
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
కృష్ణః సర్వంకరీతీతి కృష్ణః - అన్నిటిని జేయువాడు.
డుకృఞ్ కరణే దైత్యాన్ కర్షతీతి వా - దైతులను నలిపివేయువాడు.
కృష్ణ విలేఖనే-కృష్ణవర్ణ త్వాద్వా - కృష్ణవర్ణుడు గనుక కృష్ణుడు.
మునుపొనరించుపాతక, మమోఘము జీవుకెల్లబూనియా
వెనుకటి జన్మం దనుభవింపకదీరదు, రాఘవుండు వా
లిని బడవేసి తా మగుడ లీల యదూద్భువుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తనమేను, భాస్కరా.
తా. రఘురాముడు వాలిని వధించిన యనంతరము రామావతారము చాలించి తిరిగి యదుకుల సంభూతుడై పుట్టెను. ఆ కృష్ణావతారము(కృష్ణమూర్తి-కృష్ణావతారము)నందు యుగాంతమునకు దాపుగా శ్రీకృష్ణుడు అడవిలో తపము చేయుచుండగా నొక కిరాతు డాతనిని మృగముగా భావించి యొక వాడికోల నేయగా దానిచే కృష్ణుడు తనమేనుఁ బాసెను. కావున సమస్తజీవులకు పూర్వజన్మమున జేయు పాపఫల మేజన్మమందు ననుభవింపక తీరదు.
ఇంద్రుఁడు-1.దేవతలరాజు 2.సమాసోత్తర పదమైన శ్రేష్ఠుడు, రాజేంద్రుడు.
రాజు - 1.రేడు(రాట్టు - రేడు ), రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు.
క్షత్రియుఁడు - రాచవాడు; రాజన్యుఁడు - క్షత్రియుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
నెల -1.మాసము 2.చంద్రుడు 3.పున్నమ 4.స్థానము 5.కర్పూరము.
నెలకూన - 1.బాలచంద్రుడు(నెలవంక - బాలచంద్రుడు), 2.నఖిక్షతము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
వహ్ని - అగ్ని.
వత్సలము - వహ్ని, తృణాగ్ని.
వత్సలుఁడు - వాత్సల్యము(దయ) గలవాడు.
వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః ఇ-పు. వహ ప్రాపణే. - హవ్యమును దేవతలకుఁ జేర్చువాఁడు.
భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాస్వంతుఁడు - సూర్యుడు, విణ.ప్రకాశించువాడు.
భాసిల్లు - ప్రకాశించు. భాస్వరుడు - సూర్యుడు.
భా - 1.సూర్యకిరణము 2.సూర్యుని వెలుగు.
భానువు - 1.సూర్యకిరణము 2.సూర్యుడు.
భామము - 1.కోపము 2.రోషము 3.సూర్యకిరణము.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.
సూర్యుఁడు - వెలుగు రేడు.
బావ - తోడ పుట్టిన దాని మగడు, సం.భావుకః.
భామ - స్త్రీ. భామలలో దేవీస్థానం తిలోత్తమ|
భామిని - 1.క్రీడాసమయమందు కోపము చూపెడు స్త్రీ, 2.స్త్రీ.
కోపనా సైవ భామినీ :
కోపశీలా కోపనా - కోపమే స్వభావముగాఁ గలిగినది.
భామ్యత్యవశ్యం కుప్యతి భామినీ. భామక్రోధే. - అవశ్యము కోపగించు కొనునది. ఈ రెండు కోపముగల స్త్రీ పేర్లు.
అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః,
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. - భజగోవిందం
వ్యవాహనుఁడు - అగ్ని, రూ.హవ్యవహుడు.
వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః. ఇ-పు. వహ ప్రాపణే - హవ్యమును దేవతలకుఁ జేర్చువాఁడు.
వీతిహోత్రుఁడు - అగ్ని.
వీతిః అశనం హోత్రం హవిః యస్యసః వీతిహోత్రః - వీతి యనఁగా అశనము హోత్ర మనఁగా హవిస్సు. ఆ యశనమే హవిస్సుగా గలవాఁడు.
హోత్రస్య హవిషోవీతి రశ్వ ఇవీ వహనాద్వా - హవిస్సును గుఱ్ఱమువలె మోచికొనిపోయి దేవతల కిచ్చువాఁడు.
వీతయః అశ్వాః హోత్రం హవ్య మశ్వమేధే యస్య సః - అశ్వమేధము నందు గుఱ్ఱములు హవిస్సుగాఁ గలవాఁడు.
ధనంజయ - 1.అగ్ని, 2.అర్జునుడు. air in the stomach.
ధనుజయతీతి ధనుంజయః జి జయే - ధనమును జయించువాఁడు.
ధనంజయః = రాజసూయయాగమునకు అనేక రాజులనుండి ధనమును సంపాదించి తెచ్చుట చేతను, లేక ధనమునుగూర్చిన ఆశను జయించిన వాడగుట చేతను అర్జునునకు ధనంజయుడని పేరు వచ్చింది.
ప్రాణఘోషయందు నిలుచును, ప్రాణము పోయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయ వాయువు. (చెవులు వ్రేళ్ళు పెటుకొన్నచో గుయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము).
కామదేవః కామపాలః కామీ కాన్త కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుః వీరో(అ)నన్తో ధనఞ్జయః || 83స్తో
కృపీటయోని - అగ్ని, వ్యు.నీటికి ఉత్పత్తిస్థానమైనది.
కృపీటము - 1.జలము, 2.కడుపు, 3.సమిధ.
కృపీట ముదకం యోనిః కారణం యస్య సః కృపీట యోనిః ఇ-పు. - కృపీటమనఁగా ఉదకము; అది కారణముగాఁ గలవాఁడు.
కృపీట స్యాంభసో యోనిః - ఉదకమునకు నుత్పత్తిస్థానము.
జాతవేదుఁడు - అగ్ని.
జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః న - పు. - ఇతనివలన వేదములు పుట్టినవి.
జాతేజాతే విద్యత ఇతి వా జాతవేదాః విద స్తాయాం - పుట్టిన దేహము(దేహము - శరీరము, మేను.)నందెల్ల నుండువాఁడు.
జాతం శుభాశుభం వేత్తీభం వేత్తీతివా, విద జ్ఞానే - పుట్టిన శుభాశుభము ల నెఱుంగువాఁడు.
వేదో హిరణ్య మస్మాజ్ఞాత ఇతివా - హిరణ్యము(హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.)వీనివలనఁ బుట్టినది.
తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనము(పచనము - వండుట)చేసి శరీరము పడకుండ కాపాడునది.
తనూం న పాతయతి ధారయతీతి తనూనపాత్. త.పు. వఌ గతౌ - శరీరమును నిలుపువాఁడు.
ఇంధనం వినా స్వతనుం నపాతీతివా. పా రక్షణే - ఇంధనము లేక తన్ను రక్షించుకొనఁజాలనివాఁడు.
భుజి - అగ్ని, వ్యు.సర్వమును భుజించువాడు.
సర్వభక్షకుఁడు - అగ్ని.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది. సర్వభక్షకుఁడు - అగ్ని.
అవసరమైనవాడు - ఆత్మబంధువు వాడు, బహుముఖంబులవాడు వాయు సఖుడు - అగ్ని. తెలియక స్పృశించినను అగ్ని కాల్చును అను న్యాయము. అంటరాని వేలుపు - అగ్ని.
సేనగ వాంచితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో
మేనులు డస్సియుంట, నిజమేకద దేహులకగ్ని హోత్రుడౌ
నేని స్వభోజ్యముల్ గుడుచునేనియు బుష్టి వహించులేని నా
డూని, విభూతిలో నడిగి యుండడి తేజము దప్పి, భాస్కరా.
తా. అగ్నిదేవుడయునను తాను తిను తిండి మానిన యెడల తన కాంతిని గోల్పోయి బూడిదలో నణగియుండును. అట్లే, తనకు ఎక్కువ ప్రీతి అయిన ఆహారమును తిన్నచో మనుష్యుడు వృద్ధి పొందును, లేనిచో కృశించును.
అగ్గి చూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
షోడశ శ్శిఖివాహనః : అన్ని చోట్ల ఈశ్వరుని సందర్శించాలన్నది కుమారస్వామి బోధ. శిఖివాహా ద్విషద్భుజ|
బర్హిస్సు - అగ్ని.
శుష్మము - 1.బలిమి, 2.తేజస్సు, 3.నిప్పు.
బర్హిః. స-పు బృంహతి వర్థతే అజ్యాదినేతి బర్హిః. బృహి వృద్ధౌ - అజ్యాదుల(ఆజ్యము - 1నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.)చేత వృద్ధిఁ బొందువాఁడు.
శుష్మా న-పు శోషయతి జలమితి శుష్మా, శుష శోషణే - ఉదకమును (ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.)శోషింపఁ జేయు వాఁడు. ప. బర్హిశ్శుష్మా. న-పు బర్హిషో దర్భాః శుష్మ బలమస్యేతి బర్హిశ్హుష్మేత్యే కంవాపదం - దర్భలు బలముగాఁ గలవాఁడు.
బర్హము - నెమలిపురి.
దళే(అ)పి బర్హమ్ -
బర్హ శబ్దము ఆకునకును, అపిశబ్దమువలన నెమలిపురికిని పేరు.
బర్హతీతి బర్హం. బృహ వృద్ధౌ. - వృద్ధిఁ బొందునది.
'బర్హం మయూరపింఛే (అ)థ ప్రాధాన్యో ద్యోతవృద్ధిషు, పరివారే పుమా' నితి శేషః.
తన సత్క ర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
ననలం బెంతైనఁ బెరుఁగు * నయ్యః కుమారా !
తా. తాను చేసిన మంచికార్యముల సాయము చేతనే అదృష్టము త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడపాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా ?
అగ్నికి కాల్చుట స్వభావము. దానికి నాశమన్నది లేదు. అది సర్వకాల సర్వావస్థలలో దహనశక్తి కలది. అగ్ని అగ్నిని దహింపదు కదా!
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము Rahu, దురాచారుడు.
కృష్ణం వర్త్మ మార్గోయస్యసః కృష్నవర్త్మాన - పు. నల్లనిజాడ గలవాఁడు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
సొరదోఁకీ - దురాచారుడు, సం.సురద్రోహి.
దురాచారుడు - చెడునడవడి కలవాడు.
ఖరువు - 1.గుఱ్ఱము horse, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము(రదనము - దంతము), 5.భర్తను వరించు కన్య, విణ.దురాచారుడు, 2.క్రూరము. క్రూరము - 1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది.
క్రూరుడు - దయలేనివాడు.
విధుంతుదుఁడు - రాహుగ్రహము.
గ్రహ కల్లోలము - రాహుగ్రహము.
దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా. అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయ(కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము
జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః. - భజగోవిందం
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్ని గుణము, 5.స్వభావము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపఱు - 1.చచ్చు(ౘచ్చు - క్రి.మరణించు), 2.అంగవిహీనమగు.
జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
(ౙ)జ్యోతి - జ్యోతి, కాంతి, దీపము, సం.జ్యోతిః.
త్విట్టు - 1.జిగి, కాంతి, 2.మంట, 3.వెలుగు, రూ.త్విష.
త్విషాంపతి - సూర్యుడు.
త్విషాం ప్రభాణాం పతిః త్విషాంపతిః, ఇ-పు. - కాంతులకు పతి. అలుక్సమానము.
అర్జునుఁడు - 1.పాడవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణో త్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణో త్సవః||
తా. సహజముగా బ్రాహ్మణులకుఁ(విప్రుడు - బ్రాహ్మణుడు, పారుడు.)పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రత(సాధ్వి - పతివ్రత)లకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము(రణము - 1.యుద్ధము, 2.మ్రోత.)నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. – నీతిశాస్త్రము
పావకుడు - అగ్ని. ఆహూతః పావకాత్మజః| పావకే జలశాయినం|
పునాతీతిపావకః పూణ్ పవనే - పవిత్రమును జేయువాఁడు.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శోచయతీతి శుచిః. ఇ. పు. శుచశోచనే - దుఖింపఁజేయువాఁడు.
శుచిత్వాచ్ఛుచిః - శుచియైనవాఁడు.
పావకే శుచిః. మాస్యమాత్యే చాత్యుపధే మధ్యే సితే త్రిషు. :
శుచి శబ్దము అగ్నికిని, ఆషాఢమాసమునకును, ధర్మాదిపరీక్షలచేతఁ పరిశుద్ధుఁడైన (య)అమాత్యునకును పేరైనపుడు పు. పవిత్రమైన దానికిని, తెల్లని వస్తువునకును పేరైనపుడు త్రి. శోచంత్యనేనేతి శుచిః శుచశోకే. దీనిచేత వ్యథనొందుదురు.
సితుఁడు - శుక్రుడు, విణ.తెల్లనివాడు.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
పీతాముత్పలధారిణీం శుచిసుతాం పీతాంబరాలంకృతాం|
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందారమాలాధరాం||
గ్రీష్మము - 1.వేడి, 2.వేసంగి.
గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్ఠాషాఢ మాసములు.)
ఊష్మము - 1.ఆవిరి, 2.వేసగి, 3.గ్రీష్మఋతువు, 3.(వ్యా.) ఊష్మ ధ్వనులు, (శ, ష, స, హ).
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు - చంద్రుడు Moon, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశనో యస్యసః శుభ్రాంశుః. ఉ-పు. - తెల్లని కిరణములు గలవాఁడు.
ఆవి1 - 1.శ్వాసము, ఊపిరి, 2.తాపము, 3.ఆవిరి, 4.చీడ.
ఆవి2 - 1.ప్రసవవేదన, 2.రజస్వల, 3.చూలాలు.
ఆమనస్యము - ప్రసవవేదన, బిడ్డకుట్టు; బిడ్డకుట్టు - ప్రసవవేదన.
ఆవిరి - బాగుగ కాచిన నీటి నుండి లేచు ఊష్మము, అవి (Steam).
ఊష్మలము - 1ఉమ్మగలది, 2.ఆవిరిగలది.
ఉమ్మ - ఉబ్బ. ఉబ్బ - ఉక్క, రూ.ఉమ్మ, ఉమ్మదము, సం.ఊష్మః.
ఉమ్మదము - ఉబ్బ, సం.ఊష్మదమ్.
ఉక్క - ఉమ్మ, తాపము, వేడి.
తాపము - 1.వేడిమి, 2.బాధ, సం.వి.(భౌతి.) వేడి (Hot).
తపన - తాపము, రూ.తపనము.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనతి జీవంత్యనేన లోకా ఇత్యనలః అన ప్రాణనే - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాప్తి ర్నాస్త్యస్యేతివా – కాష్ఠాదుల చేత చాలుననుట లేనివాఁడు.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యము - 1.బంగరు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
బభ్రువు - 1.కపిలగోవు, 2.అగ్ని, 3.బట్టతలవాడు, విణ.1.పచ్చనిది, 2.రోగము వలన బట్టతల కలవాడు.
ఖర్వాటుఁడు - బట్టతలవాడు, రూ.ఖల్వాటుడు.
నూలిగరను - బట్టతల, ఇంద్రలుప్తము.
చెంబుతల - బట్టతల.
ఇంద్రలు ప్తకము - 1.బట్టతల, 2.తల వెండ్రుకలూడిపోవు ఒక రోగము, రూ.ఇంద్రలుప్తము.
కపిల - 1.ఆగ్నేయ దిశయందలి ఆడేనుగు, 2.పుల్లావు (కపిల గోవు).
పుల్లావు - కపిలగోవు. మహాలింగము నందు దేవిస్థానం కపిల|
కపిల వర్ణత్వాత్కపిలా - కపిల వర్ణము గలిగినది.
కామ్యత ఇతి కపిలా - కోరఁబడునది. కపిలే కృష్ణపింగళే|
పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండయి యాసురి యను బ్రాహ్మణునకుఁ దత్త్వగ్రామ నిర్ణయంబు గల సాంఖ్యంబు నుపదేశించె - ఐదోది "కపి"లావతారం. ఆయన సిద్ధులకు ప్రభువగు కపిలమహర్షిగా అవతరించి దేవహుతి కర్దములకు జనించి ఆసురి అనే బ్రాహణునికి తత్త్వసముదాయమును విశేషంగా నిర్ధారించి చెప్పే సాంఖ్యాన్ని ఉపదేశించాడు.
ధృతి : కపిలపత్ని, లోకాలకు ధైర్యరూపం. పిండాకరము నందు దేవిస్థానం ధృతి. దేవమాత సురేశానా వేదగర్భాంబికా ధృతిః.
ధృతి : ధృతిశబ్దము ధరించుటకును, ధైర్యమునకును పేరు. ధరణం, ధ్రియతే అనయాచ ధృతిః. సీ. ధృజ్ ధారణే. ధరించుట, దీనిచేత ధరింపఁ బడును ధృతి.
కపిలా క్షీరపానేన అన్యస్త్రీ సంగమేన చ |
వేదాక్షర విహీనేన ద్విదశ్చండాలతాం వ్రజేత్| తా. కపిల వర్ణముగల గోవుపాలను పానము చేయుటయు, ఇతర స్త్రీలతో భోగించు(భోగించు - సుఖించు, అనుభవించు)టయు, వేదాక్షర విచారము లేక యుండుటయు, నిట్టికార్యములు బ్రాహ్మణులొనరించిన చండాలత్వము నొందించును. – నీతిశాస్త్రము
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీ పతిః|
త్రిపద స్త్రిదశాధ్యక్షః మహాశృంగ కృతాన్త కృత్||
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
శుక్రము - 1.రేతస్సు, 2.కంటిపువ్వు.
శోచయతీతి శుక్రః. శుచ శోకే - శోకింపఁజేయువాఁడు.
శుక్రంతేజః అస్యాస్తీతివాశుక్రః - శుక్రమనఁగా తేజస్సు, అదిగలవాఁడు.
శుచం రాతీతివా శుక్రః రాదానే - శత్రువులకు దుఃఖము నిచ్చువాఁడు.
శుక్రం రుద్రరేతో(అ)స్మిన్నితివా - రుద్రరేతస్సు ఇతనియందుః గలదు.
శుక్రశిష్యుడు - రాక్షసుడు.
రాకాసి - రాక్షసి, రక్కసి, సం.రాక్షసః.
రాక్షసి - రక్కసి.
రక్కసి - రాక్షసి, రాక్షసుడు, రక్కసీడు, సం.రక్షసః.
రక్కెన - 1.రాక్షస స్త్రీ, 2.రక్కెన చెట్టు, విణ.ఆయుక్తము, సం.రాక్షసః.
రాక్షస - అరువది సంవత్సరములలో 49వ దాని పేరు.
రాక్షసము - బలాత్కారమున కన్య నపహరించుకొనివచ్చి చేసికొనెడి పెండ్లి.
ఆసురము - ధన మిచ్చి కన్యన్య్ కొని చేసికొనెడి పెండ్లి. అష్టవిధ వివాహములలో ఒకటి, విణ.అసురులకు సంబంధించినది.
అసురుఁడు - నిరృతి, రాక్షసుడు.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.
అసురము - 1.ఏనుగు, 2.మాలకాకి.
చిత్రభానుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు.
చిత్రభాను - అరువది సంవత్సరములలో నొకటి.
చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః. ఉ-పు. - అనేకవిధ కాంతులు గల జిహ్వరూపము లయిన కిరణములు గలవాఁడు.
విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విభా ప్రభావసు ధనం యస్య సః విభావసౌః. ఉ. పు. - కాంతి ధనముగాఁ గలవాఁడు.
సూర్యవహ్నీ విభావసూ,
విభావసుశబ్దము సూర్యునికి, అగ్నికిని పేరు. విభైవ వసు ధనమ స్యేతి విభావసుః. పు. - ప్రభయే ధనముగాఁ గలవాఁడు. 'విభావసుర్హారభేద ' ఇతి శేషః.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శోచయతీతి శుచిః. ఇ. పు. శుచశోచనే – దుఖింపఁ జేయువాఁడు.
శుచిత్వాచ్ఛుచిః - శుచియైనవాఁడు.
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు - చంద్రుడు Moon, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశనో యస్యసః శుభ్రాంశుః. ఉ-పు. - తెల్లని కిరణములు గలవాఁడు.
చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
చిచ్చుఱ - చిచ్ఛఱ.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్ఛుఱ, సం.శుచిః.
చిచ్ఛుఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ. జుట్టు ముడికలవాడు.
శ్శిఖాజ్వాలా అస్య సంతీతి శిఖావాన్ త. పు. జ్వాలలు గలవాఁడు.
శిఖి - 1.అగ్ని, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.
శిఖివాహనుడు - కుమారస్వామి.
శోణము - 1.ఎరుపు, 2.ఒక నది, 3.నిప్పు.
శోణిమ - ఎరుపు, రూ.శోణిమము.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
శోణో హిరణ్యవామ స్స్యాత్ -
శోణతీతి శోణః. శోణృ వర్ణగత్యోః. - ప్రవహించునది.
శోణవర్ణత్వాద్వా శోణః - ఎఱ్ఱనికాంతి గలది.
హిరణ్యంవహతీతి హిరణ్యవాహః. వహ ప్రాపణే.- హిరణ్యము(హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.)ను వహించు నది. ఈ రెండు శోణ నదము పేర్లు.
పవిత్రీకర్తుం నః - పశుపతిపరాధీనహృదయే
దయామిత్రై ర్నేత్రై - రరుణధవళ శ్యామ రుచి భిః|
నద శ్శోణో గంగా - తపనతనయేతి ధ్రువ మముం
త్రయాణాం తీర్ణానా - ముపనయసి సమ్భేద మనఘమ్|| - 54శ్లో
తా. అజ్ఞానులైన ప్రాణులను కాపాడువాడైన పశుపతి(పశుపతి - శివుడు)యందు లగ్నమైన హృదయము గలిగిన తల్లీ! దయామిత్రములైన ఎఱ్ఱని, తెల్లని, నల్లని కాంతులుగల నీ కనులచే పాపహరమగు మూడు తీర్థములైన శోణనదము(ఎర్రని) గంగ(ధవళిమ - తెలుపు) యమున (నల్లని) నదుల సంగమ స్థానమును, మమ్ము పవిత్రులనుగా చేయుట కొఱకు తెచ్చు నట్లున్నది. ఇది నిజము. - సౌందర్యలహరి.
వారణాసి పట్టణము దాటి గంగానది బీహారు చేరిన తరువాత శోణభద్రానది వచ్చి చేరుతున్నది. దీనికి ప్రాంతీయ వ్యవహారము ' సోన్ ' అని.
గయ - ఫల్గునీ నదీ ప్రాంత నగరము, బీహారు రాష్ట్రము నందలి ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రము. గయా మాంగళ్యగౌరికా శక్తిపీఠం|
4. అనాహతం - పన్నెండు దళాలు కలిగి, హృదయ స్థానంలో ఉండే చక్రం (యోగవిద్య) అనాహత చక్రము. ద్వాదశ దళమును పింగళ వర్ణము నగు (అ)ననాహత చక్రము నందు - రుద్రుడు కలడు. (వాయుతత్త్వమును)
హృదయంలోని అనాహత చక్రం తెరుచుకోవాలంటే హృదయకుహరంలోనికి ప్రవేశాన్ని కల్గించే ద్వారం వంటిదైన భ్రూమధ్యము (అనగా స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశం) భగవన్మందిర ద్వారము! అది తెరుచుకుంటే తప్ప నుదుట జ్ఞానజ్యోతి వెలుగుగా కనిపించదు. ఆకుపచ్చ వంటి పంచరంగుల నవరత్నకాంతులతో ఆజ్ఞాచక్రము వెలుగుతూ వుంటుంది, దాని మధ్య ఓంకారం ప్రణవమే ఈ హృదయకవాటము.
దశ వాయు జయాకారా కళాషోడశ సంయుతా|కాశ్యపీ కమలాదేవి నాద చక్ర నివాసినీ||
అనాహత చక్రము పన్నెండు దళములను బంగారు వంటి వర్ణాన్ని కకారము మొదలు రకారం వరకు ఉండు వర్ణాలను కలిగి యుండును.
అనాహత చక్రము హృదయ స్థానమునందని ప్రసిద్ధము. హృదయపద్మ సూర్యతేజస్సమమై పన్నెండు రేకులతో, ఒక్కొక్క రేకున వరుసగా క, ఖ, గ, ఘ, ఙ్, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ అనే అక్షరాలు వుంటాయి. ఇది పురుషాధిష్ఠానము, అనందపదము అని ఒప్పుతూంది. దీనిపై పదారురేకుల పద్మం వుంటుంది. దీని రేకులపై అకారాది పదారు స్వరాలు వుంటాయి. దీనియందు జీవుడికి పరమాత్మ సంబంధం కలిగి జీవుడికి విశుద్ధత్వం కలుగుతుంది గనుక ఈ షోడశదళ పద్మానికి విశుద్ధం అని సంజ్ఞ. దీనికి స్థానం కంఠం. దీనియందు నాదం భిన్నమై వైఖరీ రూపాన సార్థకం అవుతుంది. దీనియందున్న స్వరాలూ, దాని క్రిందనున్న ముప్పైరెండు హల్లుల్ల్లు వర్ణత్వశుద్ధి కలుగుతుంది.
అనాహత చక్రమున క - ఖ - గ - ఘ - జ - చ - ఛ - జ - ఝ - ఞ్ - ట - ఠ - లను వర్ణ పద్మములు పశ్యంతీవాగ్రూపములు.
ఓం కకారరూపాయై నమః : "క" కారము (మంగళకరమగు క వర్ణము, తత్త్వజ్ఞాపకమగు క వర్ణము) ఆదియందుగల విద్యకు కాదివిద్య అనిపేరు. అట్టి కాదివిద్యాస్వరూపిణియగు పరమేశ్వరికి ప్రణతులు.
కకార రూపా కల్యాణీ కల్యాణ గుణశాలినీ,
కళ్యాణశైలనిలయా కమనీయా కళావతీ.
రుద్రుఁడు - శివుడు.
రోదయతి శత్రూన్ రుద్రః - శత్రువులను దుఖఃపెట్టువాఁడు.
స్వయం రురో దేతివా. రుదిర్ అశ్రువిమోచనే, ఏకదా బ్రహ్మానురోధేన ప్రాప్త జన పరిగ్రహో (అ)సౌరురో దేతి పురాణప్రసిద్ధిః - ఒకానొక్కప్పుడు బ్రహ్మవలన జన్మమును బొందినవాడై దుఖించెను గనుక రుద్రుఁడు.
రుదం రోదనం ద్రావయ తీతివా - దుఃఖమును బోఁగొట్టువాఁడు. ద్రు. గ్రతౌ.
రుద్రాణి - పార్వతి. రుద్రకోటయందు దేవిస్థానం రుద్రాణి. రుద్రుని భార్య నిద్ర. ఈమె యోగము అధారముగా రాత్రులందు లోకమును ఆవహిస్తుంది.
రుద్రాః రోదయంత్య సురానితి రుద్రాః - దుష్టుల దుఃఖింపఁజేయువారు.
రుదిర్ అశ్రువిమోచనే. రుజం దుఃఖం ద్రావయంతీతి వా - దుఃఖమును బోఁగోట్టువారు.
ద్రా కుత్సాయాం గతౌ. రుతం వేదాత్మకం శబ్దం కల్పాదౌ రువంతీతి వా - కల్పాదియందు వేదస్వరూపమైన శబ్దమును బలుకువారు.
రుశబ్దే వీరు. 11డ్రు, అజుఁడు, ఏకపాదుఁడు, అహిర్భుద్న్యుఁడు, త్వష్ట, రుద్రుడు, హరుడు, శంభుఁడు, త్ర్యంబకుఁడు, అపరాజితుఁడు, ఈశానుఁడు, త్రిభువనుఁడు అనువారలు.
అజుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒక రాజు.
అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశరుద్రు లలో ఒకడు.
త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ - దేవశిల్పి.
రుద్రుఁడు - శివుడు.
హరుఁడు - శివుడు.
శంభుఁవు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.
త్ర్యంబకుఁడు - శివుడు, ముక్కంటి.
త్ర్యంబక సఖుఁడు - కుబేరుడు.
ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.
ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా|
దంష్ట్రోజ్జ్వలా క్షమాలాది - ధరా రుధిరసం స్థితా. – 100శ్లో
పింగళ - 1.దక్షిణ దిక్కు నందలి ఆడేనుగు, 2.అరువది(60)సంవత్సర ములలొ నొకటి.
పింగళవర్ణత్వా త్పింగళా - పింగళవర్ణము గలిగినది.
పింగము - గోరోజనమువంటి వన్నె(కొంచెము నలుపు కలిసిన పసుపు వన్నె). పింగళ సూర్యరూపిణి, పమోక్ష్ణియందు దేవీస్థానం పింగళేశ్వరి. పింగళుఁడు - 1.అగ్ని, 2.శివుడు.
అనాహత మహాపద్మ మందిరాయై నమః
అనాహతము - కొట్టబడనిది, ఉత్తరింపబడనిది, చలువచేయబడనిది, (క్రొత్త వస్త్రము). (గణి.) గుణింపబడనిది, వి.1.దేహమందలి షట్చక్రములలో ఒకటి, 2.దౌడ మొ.ని స్పర్శలేకుండ పుట్టుధ్వని.
కారికము - చలువ చేయని క్రొత్తది (వస్త్రము). అనహూతము - పిలువబడనిది.
దౌడ - తాలుపు, రూ.దవుడ.
తాలుపు - దౌడభాగము (Palate).
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టినధ్వని, ఉదా. ౘ, ౙ.
సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బ లు సరళములు.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.నిష్కపటము.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
శుభదంతి - వాయువ్యదిశ(వాయుసంబంధి వాయవ్యము) యందున్న పుష్పదంతమను దిగ్గజమునకు భార్య, విణ. చక్కనిపండ్లు గలది, సుదతి.
సుదతి - స్త్రీ, వ్యు.చక్కని పలువరుస కలది.
శోభనౌదంతౌ యస్యాస్సా శుభ్రదంతీ. ఈ-సీ. - చక్కని దంతములు గలది
ప్రకృత్యా రక్తయా - స్తవ సుదతి! దంతచ్ఛదరుచేః
ప్రవక్షే సాదృశ్యం - జనయతు ఫలం విద్రుమలతా|
న బింబం తద్బింబ - ప్రతిఫలనరాగా దరుణితం
తులా మధ్యారోఢుం - కథమివ న లజ్జేత కలయాః|| - 62శ్లో
తా. చక్కని పలువరుసగల తల్లీ ! స్వభావముచేతనే యెఱ్ఱనైన నీ పెదవుల కాంతికి సామ్యమును చెప్పవలసియున్న నీ ప్రపంచమున నేమియు లేనే లేదు. ఎందుచేతననగా నీ అధరోష్టము సహజమైన కాంతి గలది. అట్టిది లబింపవలయునన్నచో ప్రవాళలత పండు పండినచో సామ్యము లభింపవచ్చును. (పవడపు తీగ ఫలింపదు. పగడపు తీగయని కవితా సమయమేగాని వాస్తవముగా పగడములు తీగలకు పుట్టుటలేదు. అవి పండ్లు పండుటయును లేదు.) దొండపండునకు సామ్యము చెపుదమన్న దానికి అధర కాంతి సహజము కాదు. దొండపండునకు బింబమని పేరు. ఆ దొండపండునకు బింబమని వ్యవహార మేర్పడినది. బింబము (దొండ) ఒక వస్తువునకు ప్రతిబింబమగుటచే నెఱ్ఱనిదయినను నీ పెదవికి పదునాఱవ పాలునకును సాటి రాదు. నీ అధర బింబము యొక్క ప్రతిబింబ అనుగ్రహమువలననే. కావున శ్రీదేవి అధరోష్టము నిరుపమాన మైనదని అతిశయోక్తి. - సౌందర్యలహరి
సుప్రకాశా సుఖాసీనా సుమతి స్సురపూజితా,
సుషుప్త్యవస్థా సుదతీ సుందరీ సాగరాంబరా|
సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
సూతే అమృతమితి సోమః, షూఞ్ ప్రాణిప్రసవే - అమృతమును బుట్టించువాఁడు.
సూయత ఇతివా సోమః - ప్రతిపక్షమునందును బుట్టింపఁబడువాఁడు.
సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
సోమోద్భవ - నర్మదానది.
చందురుమామ - చంద్రుడు, చందమామ.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుడు - చంద్రుడు.
చందయతీతి చంద్రః. చది ఆహ్లాదనే సంతోషింపఁజేయువాఁడు.
నీటితాత - వాయువు, (గాలి నుండి అగ్ని దీని నుండి నీరు పుట్టుటచే నీటికి తాత.)
శ్వసనః స్పర్శనో వాయు ర్మాత రిశ్వా సదాగతిః,
పృషదస్వో గంధవాహో గంధవాహాని లాశుగాః,
సమీర మారుత మరు జ్జగత్ప్రాణ ప్రభంజనాః,
(ప్రకంపన శ్చాతిబలో ఝుంఝూవాత స్సవృష్ణికః.)
శ్వసనము - శ్వాసము, వాయువు.
శ్వసితము - శ్వాసము.
అంతఃశ్వసనము - (జీవ.) ప్రాణవాయువును లోపలికి పీల్చుకొను క్రియ (Inspiration).
హీమోగ్లోబిన్ - (Haemoglobin) ప్రాణవాయువును గ్రహించి తీసికొని పోవు రక్తమునందలి ఎఱ్ఱనిపదార్థము.
ఆక్సీహీమోగ్లోబిన్ - (జం.) (Oxi-haemoglibin) హీమో గ్లోబిన్ ప్రాణవాయువుతో కలిసి ఏర్పడిన సమ్మిళిత ద్రవ్యము.
శ్వశన నియంత్రిక నాడిముడి - పుఱ్ఱెనుండి బయటికి వచ్చిన తరువాత ప్రాణేశనాడిపై నగుపడు ముడి, (Vagus ganglion).
స్పర్శనము - 1.తాకుడు, 2.ఈవి, 3.వాయువు.
స్పర్శము - 1.తాకుడు, 2.ఈవి, 3.వ్యాధి.
స్పృక్కు - స్పర్శము; స్పృష్టి - తాకుడు.
తాఁకుడు - తాకుట, సోకుడు, స్పర్శ.
సోఁకుడు - 1.స్పర్శము, 2.గ్రహావేశము, 3.పిశాచము, 4.రాక్షసుడు.
సోఁకు - 1.తగులు, 2.గ్రహమావేశించు, వి.1.స్పర్శము, 2.రాక్షసుడు.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడలనుండి కారు మదము, 3.చతురపాయములలో నొకటి, 4.ఛేదనము.
వితరణము - ఈవి; వితరణి - ఈవి; విశ్రాణము - ఈవి, దానము. వరము - కోరిక, వరించుట.
బహుమానము - (గృహ.) కానుక, బహుమానము.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
మోమాటము - 1.దాక్షిణ్యము, కనికరము(అనుక్రోశము - కనికరము), 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.
దాతృత్వం ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞ తా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా. ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిఁగి తెలివిగానుండుట, యీనాలుగు తనతోఁ గూడఁ బుట్టునవియే కాని నేర్చుకొనుటచే గలుగవు. - నీతిశాస్త్రము
వ్యాధి - తెవులు, రోగము; రోగము - వ్యాధి.
తెవులు - తెగులు; తెగులు - వ్యాధి, చీడ, రూ.తెవులు.
తాఁకుడువేఁకి - వరుసజ్వరము, పోవుచు వచ్చుచుండు జ్వరము.
సోఁకుదయ్యము - వాయువు.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి. ముఖ్యప్రాణుడు, శబ్దము, స్పర్శగలది. వాయువు దేహంతో ప్రవేశించి ఆయాదేహ విభాగములలో సంచరిస్తూ కూడా ఆసక్తి పొందదు. నింగిచూలు - వాయువు, ఆకాశము నుండి పుట్టినది.
గాలి1 - 1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒకవిధమైన పశువ్యాధి.
గాలి2 - 1.నింద, 2.శాపము.
ఉపక్రోశము - నింద; నింద - దూరు, అపదూరు.
దూఱు - నిందించు, వి.నింద.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
శాపము - 1.తిట్టు, 2.ఒట్టు.
తిట్టు - 1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
ఒట్టు - 1.కలుగు, 2.ఉంచు, 3.రగుల్చు అంటించు, వి.శపథము.
నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.
ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణము నకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశనము.
ఆక్రోశించు - 1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.
దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించు కన్య నిచ్చిచేయు వివాహము.
దేవుఁడు - భగవంతుడు; నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము. విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
దేవత - వేలుపు; వేలుపు - దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నిర్జరుఁడు - వేలుపు.
దైవికము - విణ. దైవము వలన కలిగినది.
అదృష్టం వహ్నితోయాది :
న దృష్టం అదృష్టం దైవకృతత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహ్నితోయాది - అగ్ని జలాదులవలన బుట్టిన భయము.
అదిశబ్దము చేత వ్యాధి, దుర్భిక్ష, మూషిక, శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.
జియ్య - 1.దేవుడు, 2.రాజు, సం.ఆచార్యః.
జియ్యరు - వైష్ణవ సన్న్యాసి, సం.ఆచార్యః.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
పసి - 1.పశ్వాదుల మీదగాలి, 1.పువ్వుల మీదిగాలి, విణ.లేత. వై.వి. గోగణము గోవులు, సం. పశుః.
గంగవెఱ్ఱి - 1.విశేషమైన మైమరుపుచే ఏమియు తోపకయుండు స్థితి, 2.పశువులకు వచ్చు ఒక విధమైన నరముల జబ్బు.
మాతరిశ్త్వుఁడు - గాలి, వ్యు.ఆకాశమున వృద్ధినొందువాడు.
సదాగతి - 1.వాయువు, 2.మోక్షము, 3.సూర్యుడు, 4.సర్వేశ్వరుడు.
సదాతనుఁడు - 1.విష్ణువు, 2.శాశ్వతుడు.
సనాతనుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, విణ.శాశ్వతుడు.
సదాశివుఁడు - శివుడు. (సదా - ఎల్లప్పుడు.)
సర్వము నీలోనిదిగా, సర్వాత్ముఁడ,
వాత్మవస్తు సంపన్నుఁడవై
సర్వమయుఁడ వగు నీకును,
సర్వేశ్వర! లేవు లోనుసంధులు వెలియున్.
భా|| సృష్టి అంతా నీలోనే ఉన్నది గనుక సర్వమునకూ ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులతో సర్వమునందు నిండి యున్న నీకు లోపల, బయట, మధ్య ఉండే మార్పులు అనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడవు.
పేరుప్రతిష్ఠలకై పాకులాడేవారు, అన్నీ తామే చేస్తున్నామనే భ్రమలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సర్వేశ్వరుడే అన్నింటినీ నడిపే కర్త అని వారు గమనించలేక పోతున్నారు. కాని బుద్ధిమంతులయిన వారు, ఆ సర్వేశ్వరుడే అన్నింటికీ కర్త అనీ, అన్నిటినీ నడిపించేవాడనీ భావిస్తారు. - శ్రీరామకృష్ణ పరమహంస
మోక్షము - 1.కైవల్యము 2.మోచనము, విడుపు 3.ముక్తి.
దుఃఖాదీనాం మోక్షణ మవసానం మోక్షః - దుఃఖాదులయొక్క వినాశము మోక్షము.
మహోదయము - 1.కన్యకుబ్జము, 2.అధిపత్యము, 3.అభివృద్ధి, 4.మోక్షము.
అక్షరము - 1.నాశము లేనిది, (జీవాత్మ, పరమాత్మ) 2.మారనిది, వి. 1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము(సత్ రూపము పరబ్రహ్మము), 5.మోక్షము.
అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.
అకార ఉకార మకారములతో ఏర్పడిన ప్రణవనాదము, దహరాకాశములో బుట్టినది. అది జీవులను తరింపజేయును. దాని ప్రభావము వలననే విశ్వమంతయు నడుచు చున్నది.
ఓమ్(ఓం) - 1.పరబ్రహ్మ్మర్థకము, 2.ప్రారంభార్థకము, (ఓం కారము వేదముల యొక్క సారభూతము. వేదాంత గ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ+ఉ+మ). మంత్రములకెల్ల శిరోమణి, ఓంకారమునందు సమస్త జగత్తును ఇమిడి యున్న దని వేదములు చెప్పుచున్నవి).
ఓంకారము - 1.ప్రణవము 2.ప్రారంభము.
ఓంకారేశ్వరుడు - శివుడు.
ఓంకార ప్రణవౌ సమౌ :
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రకృష్టో నవః ప్రణవః ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము.
ప్రణూయతే ప్రస్తూయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయుఁబడునది.
హృదయములో ప్రాణవాయువు : ప్రాణవాయువు హృదయస్థానమును ఆశ్రయించి యుండును. సర్వజీవులకూ హృదయస్థానమే భగవంతుని నిజవాసము. హృదయమందు స్వర్ణలోకము ఉండును.
ఓం రుద్రగ్రంధి విభేదిన్యై నమః : హృదయ స్థానంలో(హృదయం లలితాదేవి) అనాహాత చక్రస్థానంలోగల రుద్రగ్రంధిని(అగ్ని స్థానము) భేదించి తేజరిల్లు పరమేశ్వరికి వందనాలు. అనాహతము జ్యోతిర్లోకము.
త్రికము - 1.త్రయము, 2.ముడ్డి పూస, (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
టికము - ముడ్డిపూస, స,.త్రికమ్.
త్రికము - 1.త్రయము, 2.ముడ్డిపూస(ము(ౘ)చ్చ- ముడ్డిపూస), (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
ముయ్యెల గుట్ట - (మూడు+ఎల్ల+గుట్ట) 1.మూడు ఎల్లలు కలియు చోటు, 2.మూడుదారులు కలియుచోటు, 3.త్రికము (ఎల్ల శబ్దమున కిచట స్థానమని అర్థము).
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
త్రయి - 1.త్రయము, 2.మూడు వేదములు.
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.
పృషదశ్వుఁడు - వాయువు.
పృషతము - 1.దుప్పి, 2.నీటిబొట్టు, విణ.బ్రహ్మబిందువుతో కూడినది.
పృషత్కము - అమ్ము, బాణము.
గంధవాహుఁడు - వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొని పోవువాడు.
గంధము - 1.గర్వము, 2.గంధకము, 3.సంబంధము, 4.చందనాది లేపన ద్రవ్యము, (రసా.) వాసన (Odour).
గంధవహ - ముక్కు, రూ.గంధవాహ.
అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులతో నొకడు.
అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము. అనంత్యనేనేత్యనిలః అన ప్రాణనే - ఇతనిచేత బ్రతుకుదురు.
అనిలాః అన్యంతే ప్రాణ్యాంతే లోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణ యుక్తులుగాఁ జేయబడును గనుక అనిలులు, అన ప్రాణనే. ఇలా యాం న చరంతీతి వా - భూమియందున సంచరించనివారు. వారు 49 డ్రు.
సుడి - 1.జలావర్తము, నీటిసుడి(సుడిగుండము) 2.రోమావర్తము, వెండ్రుకలసుడి 3.అనిలావర్తము, గాలిసుడి(వాత రోగము).
అనిలో మృగనాభిరేణుగంధి ర్హరవామాంగకుచో త్తరీయ
హరతే మరణశ్రమం జనానా మథికాశి ప్రణవోపదేశకాలే|
భా|| మనోజ్ఞమైన (మృగనాభి - మృగమదము, కస్తూరి.) కస్తూరికా రేణుగంధిలమై శివుని వామాంగకుచోత్తరీయ సం జనితమైన పిల్లగాడ్పు కాశీపురమందుఁ బ్రణవోపదేశసమయమున దేహుల మరణ శ్రమ మపన యించును. (ఉత్క్రమణ సమయమున దేహునకు శంకరుఁడు(ఉ)మా సమేతుఁడై ప్రణవోపదేశము సేయునని భావము.)
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః
అహస్సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరః.
సమీరుఁడు - వాయువు.
సమ్యక్ ఈరతి గచ్ఛతీతి సమీరః. ఈగతౌ - లెస్సగా సంచరించువాఁడు.
మారుతము - వాయువు.
మరుదేవ మారుతః. వక్ష్యమాణంబగు మరుచ్ఛబ్దమునకుఁ గల యర్థమే మారుత శబ్దమునకును.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.
మరుత్తు - వేలుపు(దేవత-వేలుపు), గాలి.
కుపితేన అనేన మ్రియతే లోక ఇతి మరుత్. అ. పు. మృఙ్ ప్రాణత్యాగే - కుపితుఁడైన యితనిచేత లోకము మృతిఁబొందింపఁబడును.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
మరుతౌ పవనామరౌ : మరుచ్చబ్దము వాయువునకును, దేవతలకును పేరు. మ్రియతే అనేనేతి మరుత్. మృజ్ ప్రాణత్యాగే, దీనిచేత చత్తురు.
అనాహతమున మరుత్ - వాయుతత్త్వము. మరుత్తులు దితి(ప్రకృతి కళ నుండి పుట్టింది) దైత్యమాత పుత్రులు, వాయువుల కధిస్ఠాన దేవతలు.
దైతేయుఁడు - దితికొడుకు, తొలివేల్పు, రూ.దైత్యుడు.
దైత్యారి - విష్ణువు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
జగతాం ప్రాణః జగత్ప్రాణః - జగత్తునకు ప్రాణమైనవాఁడు. జగత్ - ప్రాణః ఇతి భిన్నపదం వా, గచ్ఛతీతి జగత్. త-పు గమ్ గతౌ - సంచరించువాఁడు.
ప్రాణా పాన వ్యానో దాన సమాన నాగ కృకర దేవదత్త ధనుంజయ కూర్మా ఇతి దశ వాయువః|
ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
అసువులు - ప్రాణములు.
ప్రాణంత్యనేన ప్రాణః. అన ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
ప్రకర్షేణానంతి జీవంత్యనేన ప్రాణః. అన. ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
ప్రాణవాయువు ప్రాణమును నిలబెట్టుచున్నది. హృదయ స్థానమున నుండి, ఉచ్ఛ్వాస నిశ్శ్వాసతో జీవనాధారమై యుండును. జీవిని ఇట్లు లోకములో ప్రయాణము చేయించుచున్నది కనుకనే ప్రాణమనబడును. ప్రాణవాయువు జీవాత్మను వృద్ధి నొందించు చుండును.
పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడిపోవును).
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, ప్రాణ, (జం.) గుండెకాయ, గుండె (Heart).
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.
గుండె - గుండియ.
గుండియ - హృదయము, రూ.గుండె.
కందనకాయ - గుండెకాయ.
డెందము - హృదయము.
హృదయ స్పందనము - (గృహ.) గుండె కొట్టుకొనుట(heart beat).
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సుకింపైనది.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు.
హృదయం హృత్ :
హ్రియత ఇతి హృదయం హృచ్చ. ద. స. హృఞ్ హరణే. - హరింప బడునది.
హృదయములో పద్మాకారమై యుండు మాంస విశేషము పేర్లు. గుండెకాయ, ఇదే హృదయకమలమందురు, వృక్కాదులు, గుండెకాయ వేళ్ళని కొందరు.
పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యదో ముఖం,
అధో నిష్ట్యా వితస్త్వాంతే నాభ్యా ముపరి తిష్టతి|
తా. మన శరీరంలోని గొంతుకు దిగువ, నాభికి పైనగల ప్రదేశంలో పన్నెండు అంగుళాలు ఎడంగా హృదయకమలం ఉంది. హృదయే నారాయణః అది విష్ణువు నివాస స్థానమని వేదం స్పస్టం చేస్తోంది.
అనైచ్చిక కండరములు - (జం.) అనిచ్ఛాపూర్వకముగ పనిచేయు కండరములు (Involuntary muscles), ఉదా. గుండెకాయ, పేగుల యొక్క కండరములు.
సమీరణుఁడు - 1.వాయువు, 2.బాటసారి, వ్యు.లెస్సగా చరించువాడు.
సమ్యక్ ఈరితం గంతుం శీలమస్య సమీరణః. ఈరగతౌ - లెస్సగా సంచరించు స్వభావము గలవాఁడు.
యాతువు - 1.బాటసారి, 2.యముడు, 3.రాక్షసుడు, 4.వాయువు.
నభస్వంతుఁడు - వాయువు.
నభఃకారణత్వాన్నభో స్యాస్తీతి నభస్వాన్. త-పు. - ఆకాశము ఉత్పత్తి స్థానముగాఁగలవాఁడు.
నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.
వాతీతి వారః. వా గతిగంధనయోః - వీచుచుండెడువాఁడు.
గాలి1 - 1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒకవిధమైన పశువ్యాధి.
గాలి2 - 1.నింద, 2.శాపము.
ఉపక్రోశము - నింద; నింద - దూరు, అపదూరు.
దూఱు - నిందించు, వి.నింద.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
శాపము - 1.తిట్టు, 2.ఒట్టు.
తిట్టు - 1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు.
ఒట్టు - 1.కలుగు, 2.ఉంచు, 3.రగుల్చు అంటించు, వి.శపథము.
నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.
ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణము నకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశనము.
ఆక్రోశించు - 1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.
గర్హణము - నింద, దూఱు.
గర్హించు - క్రి.నిందించు, దూఱు.
గర్హ్యము - నింద్యము.
కోరవాయువు - వాతరోగము.
వాతరోగము - (గృహ.) వాతము చేత నేర్పడు రోగము, (సాధారణముగ ఈ నొప్పులు శరీరము నందు కీళ్ళవద్ద, Joints వద్ద ఏర్పడును),(Rheumatism).
సంధివాతము - (గృహ.) సంధుల వాపులు, నొప్పులు దీర్ఘవ్యాప్తమగు కీళ్ళనొప్పులు, (Rheumatism).
ధనుర్వాతము - (గృహ.) ఇది అంటు వ్యాధి సంబంధమైన జబ్బు, 'టిటానస్ ' (Tetanus), అనెడి విషక్రిముల (poisonous insects) వలన ఈ వ్యాధి కలుగును. ఇది ప్రాణాపాయకరమైన వ్యాధి.
మహావాతము - 1.గాలితో గూడిన పెద్దవాన, 2.పెద్ద వాతరోగము.
వాతూలము - 1.గాలి, 2.సుడిగాలి.
వాత్య - సుడిగాలి.
సుడిగాలి - వాత్య, (భూగో.) మిక్కిలి వేగముతో గుండ్రముగా గిరగిర తిరిగెడు గాలి.
ఓరు1 - వై.విణ. పెద్ద, సం.ఉరుః.
ఓరు2 - 1.ఎఱ్ఱమట్టి వట్టె, 2.గాలి మొ.ని ధ్వని.
ఓరుగాలి - శబ్దముతో వీచుగాలి, రూ.హోరుగాలి.
వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
వాతవాఁడి - అప్రియంవదుఁడు, దురుసుగా మాటాడువాడు. (వ్రాత+ వాడి+కలవాడు).
దురుసు - 1.కాఠిన్యము, 2.శీఘ్రము, సం.ధృష్.
శీఘ్రము - వడి, విణ.వడిగలది.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వృకోదరుఁడు - భీముడు.
భీముఁడు - 1.ధర్మరాజు సోరరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
వృకోదరుఁడు - భీముడు.
తోఁడేటి మేటి కడుపు - వృకోదరుడు, భీముడు.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి. పద్యయతి, సం.వళిః.
వేగ - వడి, విణ.త్వరితము.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము 2.వికసింపనిది. ముడి మూరెడు సాగునా?
ముడిగిబ్బ - ఆబోతు.
నవిగర్హ్యకథాంకుర్యాద్యహి ర్మాల్యం నథారయేత్ |
గవాం చయానం వృష్ఠేన సర్వదైవ విగర్హితం ||
తా. నిందింపఁలగిన ప్రబంధకల్పన చేయరాదు, చిలువల(చిలువ -పాము)మాల్యము ధరింపరాదు, ఎద్దు (గవయము - 1.గురుపోతు, వన వృషభము, అడవియెద్దు.) నెక్కిపోవుట అన్నివిధంబులచేత నిషిద్ధమైనది. - నీతిశాస్త్రము
సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః.
కరువలి - గాలి.
కరువలిపట్టి - వి. (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.
గాలిని బంధించిన మొనగాడు లేడు! గాలిని బంధించి హసించి దాచిన పనిలేదు.
గాడుపు - గాలి, వాయువు రూ.గాడ్పు. గాడ్పు - గాడుపు.
గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపుసంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
గాడుపుమేపరి - పాము, పవనాశము.
జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముడు : పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.
బిభే త్యస్మాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లితనివలన భయపడును గనుక భీముఁడు. రుద్రులలో ఒకరైన భీముని భార్య పేరు దిశ.
దిశ - దిక్కు, దెస. (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కు లలో నొకటి.
దిక్కు - 1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, 2.దశా.
దశ - 1.అవస్థ, 2.వత్తి, 3.బద్దె. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది!
విధర్భరాజు అయిన భీముని కుమార్తె పేరు దమయంతి. దమయంతికి దముడు, దాంతుడు, దమనుడు అను ముగ్గురు సోదరులు. విదర్భరాజు కు దమన మహర్షి వరం వల్ల సంతానం కలిగింది.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
కీచకుఁడు - భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.
ప్రాణందాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు|
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్రతారకమ్||
తా. తనకు మానహానికరమైన (యా)ఆపద వచ్చినప్పుడు ప్రాణము నైన విడువవచ్చును. కాని మానమును రక్షించుకొనవలయును. అది యెందువలన ననఁగా ప్రాణము క్షణభంగురము. ప్రాణంకంటె మానం ఘనం. మానము చంద్రుడును నక్షత్రములు(తారకము - 1.కంటినల్ల గ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.)నుండు వరకుండు నని భీముఁడు చెప్పెను. - నీతిశాస్త్రము
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.
సామీరి - 1.హనుమంతుడు, 2.భీముడు.
హనుమంతుఁడు - ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
యోగచరుఁడు - ఆంజనేయుడు.
పవనాత్మజ - వాయుసుతుడు, ప్రభు భక్తికి హనుమంతుణ్ణి మించిన ఉదాహరణ లేదు.
హనుమంతుడు : అంజనీ సుతుండు, వాయుదేవుని వరమున బుట్టినవాడు. బ్రహ్మ, శివునియొక్క(రుద్రరూప) కలయిక వలన నేర్పడినవాడు. సూర్యుని శిష్యుడు. చిరంజీవి, వేదవిదుడు(నవవ్యాకరణ పండితుడు), మహాగాయకుడు, ఉత్తమ రామభక్తుడు.
బుద్ధిర్బలం యశో ధైర్యం మిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్|
తా. హనుమంతుని ధ్యానించుట వలన బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగము లేకుండుట, మాంద్యము తొలగుట, చక్కగ మాటలాడ గలుగుట సిద్ధించును.
ప్రభంజనుఁడు - గాలి, వ్యు.వృక్షాదులను బాగుగ విరుచువాడు.
మోటనము - 1.బ్రద్దలు చేయుట, 2.గాలి.
మృణాలము - 1.వట్టివేరు 2.తామర తాడు. ఇడా పింగళికా మధ్యే మృణాళీ తంతు రూపిణీ.
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా,
దారిద్ర్య ధ్వంసినీ దేవీ హృదయగ్రంథి భేదినీ.
చల - 1.లక్ష్మి, 2.మారుస్వభావము గల వాయువు యొక్క ఆయతనము దానిపై నుండు ఒత్తిడిని బట్టి ఉండును (తాపక్రమము మారనప్పుడు) అందుచే వాయువు యొక్క ఆయతనము ఒక చలము లేదా చలరాశి (Variable).
చరరాశి - (గణి.) అస్థిరరాశి (Variable).
ఆశుగము - 1.బాణము, 2.గాలి, వ్యు.వేగముగ పోవునది, రూ.అశుగామి.
5. షోడళ దళమును ధూమ్రవర్ణము నగు విశుద్ధ చక్రము నందు - జీవాత్మ కలడు. (ఖః - ఆకాశము, ఆకాశతత్త్వమును)
ధూమ్రవర్ణము - నలుపు(ఎక్కువ) ఎరుపు కలిసిన రంగు.– impurity(body).
అనంగము - అంగములేనిది, వి.1.ఆకాశము, 2.మనస్సు.
అనంగుఁడు - మన్మథుడు, విణ.అంగములేనివాడు.
ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
రవి - 1.సూర్యుడు(సూర్యుఁడు - వెలుగురేడు), 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోక మిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత || - 34శ్లో
తా|| భారతా! ఒకే సూర్యుడు ఈ నిఖిల లోకములను ప్రకాశింపచేయు చుండునట్లు, పరమాత్మ ఒక్కడే మహాభూతములు మొదలు ధృతి వరకు చెప్పబడిన క్షేత్రమును ప్రకాశింపచేయుచుండును. - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, శ్రీభగవద్గీత
ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.
హృషీకము - ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు. హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.
ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).
హంస - 1.అంౘ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము రూ.హంస
హంసుడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణములేని రాజు.
మానసము - 1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
చేతము - మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
మానసౌక(స)ము - హంస.
మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental development).
రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్టునికిని పేరు.
"నిర్లోభనృపతౌ విష్ణావంత రాత్మన్య మత్సరే, యతిభేదే చ హంసస్స్యా చ్చ్రేష్ఠే రాజాదిపూర్వక ' ఇతి. హంసో నిర్లోభనృపతౌ శరీర మరుదంతరే, హయభేదే యోగిభేదే మంత్రభేదే విమత్సరే, పరమాత్మని విష్ణౌ చ శ్రేష్ఠే రాజాదిపూర్వక 'ఇతి శేషః. హంతీతి హంసః హన హింసాగత్యోః - పోవును గనుక హంస.
ఓం హంసినై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులున్నాయి అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యాసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేదము.
తూరీయావస్థలోని - జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవునికి మూడు అవస్థలుండును. తూరీయావస్థ -(అనగా ధ్యానసమాధి) జీవాత్మ పరమాత్మయందు సమత్వబుద్ధి కలిగి వుండటం సమాధి.
ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదార్థాలు వున్నాయి. హంస - అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగువేళ వాయువు "హ"కారములో బహిర్గతమై "స"కారముతో లోపలికివస్తుంది అంటే హంసశబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉండి. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్రరూపిణీయైన దేవికి వందనాలు.
సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వన్ద్వం - కిమపి మహతాం మానసచరమ్|
యదాలాపా దష్టా - దశగణిత విద్యా పరిణతిః
ర్యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ|| - 38శ్లో
తా. ఓ దేవీ! ఏ హంసల జంటల యొక్క కూతలు(ఆలాపనము - 1.రాగాలాపనము, 2.మాటలాడుట.)పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించు నట్లు దోషముల నుండి గుణము లను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మ మందలి మకరందముచే ననందించు యోగీశ్వరుల యొక్క మనస్సు లనెది మానస సరస్సు నందు విహరించు నా హంస జంటను సేవించుదును. - సౌందర్యలహరి
మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
ఖంబు - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.శూన్యము, 4.సుఖము.
జీవాత్మ - దేహి, జీవుడు. దేహి - దేహము గలవాడు.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
శరీరి - ప్రాణి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - 1.గురువు, బృహస్పతి, (Jupiter).
ప్రాణా హి ప్రజాపతిః - ప్రాణ దేహాదులను ఆశ్రయించే వుండేది జీవుడు. దేహికి ప్రాణములు బలరూపములు.
పంచభూతాత్మము - దేహము, సర్వదేహులయందు దేవి శక్తి. ఏది సాధించాలన్నా దేహం ఉండాలి. ధర్మ సాధనకు తొలుత కావలసింది దేహమే కదా! మనోబలం అందరికీ ఉంటుంది. శక్తి మాత్రం సాధన మీద ఆధారపడి ఉంటుంది. దీక్ష, మనోబలం, పట్టుదల ఆకలిని, అన్నాన్ని జయించ గలవు.
అంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.
ఆంగిరస - 1.ప్రభవాది షష్ఠి సంవత్సరములలో ఒకటి, 2.పుష్యమీ నక్షత్రము.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.
చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు,(సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).
అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మ బుద్ధి స్సుఖ చైవ గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా. తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱుచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. - నీతిశాస్త్రము
అనంగము - అంగములేనిది, వి.1.ఆకాశము, 2.మనస్సు.
అనంగఁడు - మన్మథుడు, విణ.అంగములేనివాడు.
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము - 1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
ఊర్థ్వలోకము - స్వర్గలోకము, పైలోకము, భువర్లోకము.
స్వర్గము - దేవలోకము.
నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకౌకసుఁడు - 1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.
ఆకాశము - 1.విన్ను, మిన్ను, 2.భూతము లై దింటిలో ఒకటి, 3.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).
విను - క్రి. ఆకర్ణించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినుకెంపు - సూర్యుడు, వ్యు.విన్నునకు కెంపువంటివాడు, ద్యుమణి.
వినుచూలి - వాయువు.
వినుప్రోలు - స్వర్గము.
వినువాఁక - గంగ.(వాఁక - ఏరు, విన.వంకర.)
ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు - వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు Sun, ద్యుమణి, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.
ఆకాశ గంగ - మిన్నేరు 1.మందాకిని, 2.పాలవెల్లి(milky way - నక్షత్ర వీధి).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ
భాగీరథి - గంగ (వ్యు.భగీరథునిచే భూమికి తేబడినది). (భగిరథుడు, సూర్యవంశపురాజు మందాకిని నదిని తెచ్చి ఈ భుమిని పరమ పవిత్రం గవించాడు). కేదార్నాథ్ లోంచి ప్రవహించే గంగ మందాకిని.
మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1. మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ. 2.వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ. 3.స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గమందుండెడి నది. 4.సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.
సీత - 1.శీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
సోమధార - ఆకాశ గంగ, పాలపుంత.
మిన్నువాక - ఆకాశ గంగ, మిన్ను కొనలను.
ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
చారలేరు - ఆకాశ గంగ; చదలేరు - ఆకాశ గంగ.
తెలియేఱు - ఆకాశ గంగ. తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము.
పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది - పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
ఆకాశధార - ఆకసమునుండి కొండపైకిని అచటినుండి క్రిందికిని ప్రవహించుధార.
మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మ్యై "మ"కారమహితాయ నమశ్శివాయ |
నింగి - ఆకాశము.
నింగిచూలు - వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.
నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.
వ్యోమకేశుఁడు - శంకరుడు, వ్యు.ఆకాశము జూట్టుగా గలవాడు.
శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.
ఆకాశే తారకం లింగం పాతాళే హఠకేశ్వరః
భూలోకేచ మాహాకాలే లింగత్రయ నమోస్తుతే.
వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
విశుద్ధ చక్రము చంద్రలోకము. చంద్రుని వంటి కాంతి కలది నై విశుద్ధ చక్రమును పద్మము, హంస అను వర్ణాలు. విశుద్ధ చక్రము శుద్ధ స్పటిక సంకాశ మగుట వలన ఆ పేరు వచ్చినది.
విశుద్ధౌ తే శుద్ధ - స్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీ - మపి శివసమానవ్యవసితామ్,
యయోః కాంత్యా యాంత్యా - శ్సశికిరణసారూప్యసరణే
ర్విధూతాంతర్ధ్వాంతా - విలసతి చకోర జగతీ. - 37శ్లో
తా. ఓ జననీ! చీకటి తొలగిన చకోర పక్షివలె, జగత్తు ఏ పార్వతీ పరమేశ్వరుల యొక్క చంద్ర కిరణములవలె ప్రకాశించు మార్గమున వెలుగొందునో, అట్టి నీ విశుద్ధ చక్రమందు స్ఫటికమువలె నిర్మలమై, ఆకాశ తత్త్వమున కాధారమైన శివ తత్త్వమును, శివ సారూప్యమగు దేవిని గూడ సేవించుచున్నాను. - సౌందర్యలహరి
ఓం మహావజ్రేశ్వరైనమః : నిత్యతిధులలో శుక్లషష్టి తిధికి అధీశ్వరియై - పిండాండంలోని విశుద్ధచక్రానికి అధిస్ఠాత్రియై, శ్రీచక్రబిందు వికాసమందలి త్రికోణాకారంలోనీ అధిస్టాన దేవతయగు మహావజ్రేశ్వరీ దేవతకు ప్రణతులు.
విశుద్ధిచక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా|
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా. - 98శ్లో
పుష్కరము - 1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
పోషయతీతి పుష్కరం. పుష పుష్టౌ, - పోషించునది.
విష్ణువు(ప్రజాపతిర్వై మనః) మనస్సే పద్మమగును. ఆ పద్మమునకు ఆకాశము శిరస్సు. మేరువు(బంగారము) కాండము. మనస్సు మేరువువైనా చాటుతుంది కాని కాలు గడపదాటదు. ఆకాశము కన్న మనసు గొప్పది.
గండూషము - 1.పుక్కిలింత, 2.పుడిసిలి, 3.ఏనుగు తొండము చివర, 4.పుక్కిట పట్టిన నీరు.
కొణిదిలి - పుడిసిలి. చేర - చాచిన అరచేయి, పుడిసిలి.
కమి - 1.పంపబడిన వ్రేళ్ళుగల పుడిసిలి(కమికిలి), 2.కబళనము, 3.తృప్తి.
కమికిలి - పంపబడిన వ్రేల్ళుగల పుడిసిలి.
అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమ పువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.
కాశ్మీరము - 1.కుంకుమపువ్వు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీర దేశము. కాశ్మీరము నందు దేవీస్థానం మేధ.
అంబరు - ఒక పరిమళద్రవ్యము, సం.అంబరమ్.
అంబరీషము - 1.యుద్ధము, 2.మంగలము, 3.పశ్చాతాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.
వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా, పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధవహాత్మతా న్నపచనే బర్హిర్ముఖాద్యక్షతా,
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చే ద్బాలేదు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే! స్వామిన్! త్రిలోకీ గురో. - 30శ్లో
తా. మస్తకంపై బాలచంద్రుడ్డి ధరించిన దేవా(పశుపతి - శివుడు) ! జగత్రయాలకు గురువైనవాడా ! అంబరాలను (బట్టలను) శుభ్రం చేసే విషయంలో సహస్రకరాలు కల సూర్యత్వాన్నీ, పువ్వులతో పూజించడంలో(వ్యాపకత్వం) విష్ణుత్వాన్నీ, సు గం ధా న్ని వ్యాపింపజేయడంలో వాయుత్వాన్నీ, ఆహారాన్ని పక్వం చెయ్యడంలో - ఇంద్రత్వాన్నీ, పాత్రలను శుభ్రం చెయ్యడంలో(సువర్ణత్వం) అంటే బ్రహ్మత్వాన్నీ నేను పొంది ఉంటే నీ సేవ చేయగలను. - శివానందలహరి
అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి.1.విష్ణుశంఖము, 2.మేఘము, 3అభ్రకము, 4.(వృక్ష.) వావిలి, 7.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్దిశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.
6. సహస్ర దళమును కర్పూరవర్ణమునగు (ఆగ్నేయ)నాజ్ఞాచక్రము నందు - పరమాత్మ కలడు. పరమాత్మకు ఇది అధిస్ఠానం.
ఆజ్ఞాచక్రము - కనుబొమల నడుమ నుండెడి చక్రము, మొగము సహస్రార పద్మము. (సహస్రాక్షమందు దేవీస్థానం ఉత్సలాక్షి).
భ్రూ మధ్యమునందు ఆజ్ఞాచక్రం వుంటుంది. దీని దళాలు రెండు. హం, క్షం అనే అక్షరాలు వీటిపై వుంటాయి.
ఆజ్ఞ - 1.ఉత్తరువు, ఆదేశము, 2.దండనము, 3.(యోగ.) కనుబొమల నడుమ నుండెడి చక్రము, వికృ.ఆన.
ఆదేశము - 1.ఆజ్ఞ, 2.ఉపదేశము, 3.(వ్యాక.) ఒకదాని స్థానమున వచ్చు వేరొక వర్ణాదికము, ఉదా. గసడదవా దేశము.
ఉపదేశము - 1.హితవచనము, 2.మంత్రోపదేశము, 3.విధివాక్యము.
ఉత్తరువు - ఆజ్ఞ, అనుజ్ఞ, సెలవు, సం.ఉత్తరమ్.
అనుజ్ఞ - 1.అనుమతి, 2.ఉత్తరువు, ఆజ్ఞ.
అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
సెలవు - సెలగు, వి.1.ఆజ్ఞ, 2.ఉపయోగము.
ఆజ్ఞప్తి - ఉత్తరువు, ఆజ్ఞ, వికృ.ఆనతి.
ఆనతి1 - 1.మ్రొక్కు, 2.నమ్రత, 3.వంగుట.
ఆనతి2 - ఉత్తరువు, సం.ఆజ్ఞప్తిః.
ఆన - ఉత్తరువు, సం.ఆజ్ఞా.
అపవాస్తు నిర్దేశో నిదేశ శ్శాసనం చ సః శిష్టి శ్చాజ్ఞా చ -
అపవదన మపవాదః. పా. అవవాదః. వద వ్యక్తాయాం వాచి. - పనిఁబూని చెప్పుట.
నిర్దిశ్యతే అదిశక్యతే నిర్దేశః, నిదేశశ్చ, దిశ అతిసర్జనే. - ఉపదేశింపఁబడునది.
శాస్యతే అనేన శాసనం, శిష్టిశ్చ. ఇ. సీ. శాసు అనుశిష్టౌ. - దీనిచేత శిక్షింపఁబడును.
అజ్ఞాపనం అజ్ఞా - అజ్ఞాపించుట. ఈ ఐదు ఆజ్ఞ పేర్లు.
నిర్దేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట.
నిదేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట, 3.దాపు.
శిష్టి - ఆజ్ఞ. (ఆజ్ - ఈషదర్థః; జ్ఞా – జ్ఞానమ్)
శాసనము - 1.రాజుచేసిన దానముకై వ్రాసియిచ్చిన కవులు, చట్టము, 2.ఆజ్ఞ, 3.శిక్షించుట.
అనుశాసనము - 1.ఆజ్ఞ, 2.ఉపదేశము, 3.కలరూపు తెలుపుట.
శాసించు - 1.ఆజ్ఞాపించు, 2.శిక్షించు.
తవాజ్ఞా చక్రస్థం - తపన శశికోటి ద్యుతిధరం
పరం శంభుం వన్దే - పరిమిళితపార్శ్వం పరచితా|
యమారాధ్యన్ భక్త్యా - రవిశశి శుచీ నామవిషయే
నిరాలోకే లోకే - నివసతే హి భాలోకభువనే|| 36శ్లో
తా. తల్లీ ! ఎవనిని భక్తితో నారాధించి సూర్యచంద్రాగ్నులకు అగోచరమై చూడ శక్యము కానదియును, జనరహితమై ప్రకాశించు చంద్రికా మయమైన సహస్రార చక్రమునందు, శశికోటి సూర్యచంద్రుల కాంతిని ధరించినవాడును, సరియగు చిత్తుచేత ఆవరింపబడిన నిరుపార్శ్వముల నాక్రమించియున్న ఆ పరాత్పరుడగు శంభుని గూర్చి నమస్కరించు చున్నాను. – సౌందర్యలహరి
ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ|
సహస్రారంబుజారూఢా సుధాసారాభివర్షిణీ.
సహస్రారము - షట్చక్రములలో నొకటి (ఇది శిరస్సు నందుండును)షట్చక్రాలకు పైన, శిరస్సునకు నడుమ సహస్రారము - అదే బ్రహ్మరంద్రం అనే పేరుతో వుంది. బ్రహ్మరంధ్రము నందు సత్యలోకము ఉండును.
చోడు - బ్రహ్మరంధ్రము, రూ.సోడు. ఉచ్చి - బ్రహ్మరంధ్రము, నడితల, సోడు. ముచ్చిలి - ముచ్చిలిగుంట, పెడతల యందలి గుంట.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మా మనుస్మరన్|
యః ప్రయాతి త్యజ న్దేహం స యాతి పరమాం గతిమ్||
తా|| బ్రహ్మవాచకమగు 'ఓమ్' అను ఏకాక్షరమును ఉచ్ఛరించుచు, తదర్థ భూతమగు నన్ను స్మరించుచు, బ్రహ్మరంధ్రము ద్వారా ప్రయాణము చేయువాడు ఉత్కృష్టమైన గతి పొందును. - 13శ్లో అక్షర పరబ్రహ్మయోగము, భగవద్గీత
ఓం సహాస్రారాంబుజారూఢాయై నమః : బ్రహ్మ రంధ్రానికి అధోభాగంలో సహలసత దళాలతో తేజరిల్లు పద్మం భాసిల్లుతూంటుంది. ఆ సహస్రారకమ ఆలోపలిభాగాన ఆ రూఢయైన పరమేశ్వరికి అంజలులు.
సహస్ర పత్రము - కమలము, తామర. సహస్రదళ కమల కర్ణికా రూపము.
అన్నిటికీ పైన వుండే సహస్రారం బిందువునకు స్థానం. (బిందు చక్రమునందు చంద్రుఁడు, ప్రజాపతి ర్చన్దుః) పరబ్రహ్మ ప్రతిపాదకమైనవి సకల సకలవర్ణములు.
చంద్రము(ప్రజాపతిర్వై చంద్రమా) - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు. కర్పూరవర్ణము - ఘనసారము, cranium.
సహస్రదళ కమలమునందున్న చంద్రునికి వృద్ధి క్షయములు లేవు. చంద్రునిలో పదునారవ భాగము, పదునారవ చంద్రకళలు పదాఖ్యయై, సహస్రారస్థితమై యున్నది. అది నిత్యము జ్యోత్స్నామయ లోకము.
శుక్ల రక్తములకు ఆజ్ఞాచక్రము ద్విదళము. సత్త్వప్రధానము శుక్లము. రజః ప్రధానము రక్తము.
ఆగ్నేయము - అగ్నికి సంబంధించినది. 1.అగ్ని పర్వతము, 2.వివాహములో అరుంధతీ(సతులలో దేవిస్థానం అరుంధతి, వసిష్ఠుని భార్య) దర్శనానతరము యజుర్వేదులు చేయు ఒక శుభకర్మ(యజ్ – ఆరాధన), 3.కృత్తికా నక్షత్రము(కృత్తివాసుఁడు - ముక్కంటి, శివుడు. కృత్తి వాసః ప్రియే), 4.ఆగ్నేయాస్త్రము(అగ్ని దేవతాకమైన అస్త్రము).
దేహంలోని ఆయుః స్థానాలైన షట్చక్రాలకు ప్రతీక కృత్తికానక్షత్రం.
భ్రూ మధ్యమునందు ఆజ్ఞాచక్రం. ఇచ్చట మనస్తత్వము. దీని దళాలు రెండు. హం, క్షం అనే అక్షరాలు వీటిపై వుంటాయి. ఆజ్ఞాచక్రమున మనస్తత్త్వమనగా ఏకాదశేంద్రియ గణము.
ఇటుఫై యిలాగు చేయుము అని ఈశ్వరుని ఆజ్ఞా జీవునకు ఇక్కడ లభిస్తుంది. తండ్రి ఆజ్ఞని పాటించాలి. కనుక దీనికి అజ్ఞాచక్రం అని పేరు వచ్చింది. పరమాత్మకు ఇది అధిస్ఠానం.
ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రారపద్మమందు ఏకాంతమున భర్తతో విహరించు చున్నావు.
ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః : ద్విదళ పద్మంలో ఆజ్ఞాపరుడైన శ్రీగురువు భాసిల్లు చుండుటచే దానికి ఆజ్ఞాచక్రమని పేరు. అట్టి ఆజ్ఞాచక్రాంతరాళస్థయై తేజరిల్లు శ్రీమాతకు నమోవాకాలు.
ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః : భ్రూమధ్య ప్రదేశంలో తేజరిల్లు నట్టి ఆజ్ఞాన చక్రకమలం నిలయంగా గల దేవికి ప్రణతులు.
ఓం సహస్ర పద్మస్థాయై నమః : శిరోవరి మధ్య స్థానంలో సహస్రదళాలతో భాసిల్లు పద్మంలో నివసించు మాతకు ప్రణతులు.
పరమాత్మ – Absolute - వైకుంఠము
కేవలుడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
చేతనము - 1.ప్రాణముకలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8స్వభావము, 9హృదయము. ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు. తనకు తానే పుట్టినవాడు, 4.మన్మధుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
అభయము - భయములేనిది వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు(ఉశీరము).
పురుషుడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ. పురుషో హి ప్రజాపతిః
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది.
తను శబ్దము తోలునకును(చర్మము), శరీరమునకును పేరు.
తన - ఆత్మార్ధకము; తనయ - కూతురు; తనయుడు - కొడుకు; మనుషుని ఆత్మ కొడుకు. వర్ణుడు - కుమారుడు.
ఆత్మ అంటే తాను. నీళ్ళకంటే, నేలకంటే, ఆకాశం కంటే, గాలి(వాయువు)కంటే ఎక్కువగా వెలిగేది ఒకటే. అది ఆత్మ ఒకటే. ఆత్మ నిత్య చైతన్య స్వరూపమైనది. ఆత్మ ఎల్లప్పుడూ ప్రియమైనది ఎందువలన నంటే అదే ఆనందానికి మూలాధారం.
షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహా
షట్చరాన్తరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్|
షట్చక్రాచితపాదుకాం చితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీ శ్రీమాతరం భావయే.
No comments:
Post a Comment