మఘ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదములు సింహరాశి Leo.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
బృందము - సమూహము.
వ్రియతేబృందం, వృఞ్ సంభక్తౌ, వబయోరభేదః కూర్చఁబడునది.
బృందారకుఁడు - వేలుపు, విణ.మనోజ్ఞుడు.
బృందారకాః, శోభనం బృందం యేషాం తే - మంచి సమూహము గలవారు.
సింహము - 1.కేసరి, సింగము, 2.ఒక రాశి, 3.శ్రేష్ఠము, (సమాసోత్తర పదమైనచో).
హిన్స్తి హస్త్యాదికమితి సింహ హిసి హింసాయాం - ఏనుఁగులు మొదలైన మృగముల హింసించునది. హింసి 'ధాతువు నుండి సింహ శబ్దము.
ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగా గలది.
ఏనుఁగు గొంగ(శత్రువు) - సింహము, వ్యు.ఏనుగు తిండిగాగలది.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
దంతి - ఏనుగు, విణ. కోరపండ్ల వాడు.
దంతావస్యస్త ఇతి దంతీ, న. పు. దంతావళశ్చ - దంతములు గలది.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏన్గు.
అనేకపము - ఏనుగు.
దంతావళము - ఏనుగు, వ్యు.ప్రసస్త దంతములు గలది.
దంతావస్యస్త ఇతి దంతీ, న. పు. - దంతవళశ్చ - దంతములు గలది.
దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును.
దంతగోర్దము - (జం.) దంతము యొక్క లోపలి భాగమున మధ్యలో నున్న తొఱ్ఱలో నుండు రక్తనాళములు ఆధారకణజాలము, నాడిపోచలు అన్నియు కలిసిన భాగము, (Pulp of the tooth).
దంతశిఖరము - (జం.) పంటి యొక్క పైభాగము, దంతకిరీటము, (Crown of tooth), (ఇది డెన్ టిన్ (dentine) అను పదార్థముతో నిర్మింపబడును. దీనిని ఎనామెల్ (enamel) అను పదార్థము కప్పి యుండును).
దంతము - పల్లు, కోర.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టుధ్వని, ఉదా. ౘ, ౙ.
దంతాస్థి - (జం.) (కప్ప) క్రింది దవడ ఎముకలలో ఒకటి (Dentary).
ఏనుఁగు మోముసామి - గజాననుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజవదనుడు - వినాయకుడు.
గజస్యేవ ఆననం యస్య సః గజాననః - ఏనుఁగు మొగము వంటి మొగముగలవాడు.
విఘ్నరాజు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
సింహమును పంజాపట్టి పోల్చవచ్చును. గొప్పవారి మైత్రి సింహముతో సోదరత్వము వంటిది.
మృగరాజు - సింహము.
మృగాణామధిపః మృగాధిపః - మృగములకు దొర.
మృగాణా మింద్రః శ్రేష్ఠః మృగేంద్రః - మృగములలో శ్రేష్ఠమైనది.
మహామృగము - ఏనుగు.
మృగము - 1.జింక, 2.అడవియందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్షనక్షత్రము.
తెల్లడాలుమెకము - సింహము, వ్యు,.తెలుపు వన్నెకల మెకము.
తెల్ల - 1.ధవళము, 2.స్పష్టము.
తెల - తెల్ల, సం.ధవళః.
తెలుపు - క్రి.1.ఎరిగించు, 2.మేలుకొలుపు, 3.తేర్చు, వై.వి.1.ధావళ్యము, 2.పరిశుద్ధి.
తెలుపుడుచేయు - క్రి.ఎరిగించు.
బాకినోటి మెకము - సింహము.
తెఱనోటిమెకము - సింహము, వ్యు.విస్తారమగు నోరు గల మృగము.
తెఱ - 1.తెరపయైనది, మరుగులేనిది, రూ.తెఱ్ఱ.
తెఱప - 1.తెరచుట, 2.ఉపశమము, విణ.మరుగులేనిది.
తెఱచు - క్రి. 1.తెరపచేయు, 2.బయటపడు.
తెఱవ - స్త్రీ, వ్యు.తెరపు + వా(యి)కలది, రహస్యము దాగని నోరుకలది.
ఉపశమము - 1.అడగుట, 2.రోగాదులబాధ తగ్గుట, 3.ఇంద్రియ నిగ్రహము, 4.ఓర్పు, రూ.ఉపశాంతి.
ఉపశాంతి - ఉపశమము.
నరుఁడవో సింహమవొ నీదు నామమేమొ
నోరుతెరచుటఁ గల్గు వినోదమేమొ
నిన్నుఁజూచుట చిత్రంబు నీరజాక్ష
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
కంబమయ్య - కంబము(స్తంభము)నందు ఉద్భవించిన నృసింహస్వామి.
కంబము - గుంజ, సం.స్కంభః.
గుంజ - 1.స్తంభము, 2.కట్టుగొఱ్ఱు, సం.గుండ్రమ్. కట్టుగొఱ్ఱు - పసులను కట్టుటకు పొలములో పాతినకొయ్య.
స్తమ్భౌ స్థూణా జడీభావౌ -
స్తంభశబ్దము కంబమునకును, మ్రాను పడియుండుటకును పేరు.
స్థభ్నాతి గృహం చేస్టితం చేతి స్తంభః స్తంభు రోధనే. - గృహమును వ్యాపారమును నడ్దగించునది.
స్థూణ - 1.స్తంభము, 2.ఇనుప ప్రతిమ.
స్తంభము - 1.కంబము, 2.మ్రానుపోటు, నిశ్చేష్టత, సం.వి.(భౌతి., రసా.) పాదరసముతో నింపిన భారమితి గొట్టములో నిలిచియున్న పాదరసోన్నతికి స్తంభమని పేరు (Column). అట్లే ధర్మామీటరులో కూడ నిది యుండును, సం.వి.(రసా.) వాయువుల తడిని ఆర్పుటకు ఉపయోగించు కల్సియం క్లోరైడ్, కాల్సియం ఆక్సైడ్ మొదలైన ద్రవ్యములతో నింపిన గొట్టము (Tower).
స్తంభయిత - స్తంభించువాడు.
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.
జడత్వము - (భౌతి.) విశ్రాంత స్థితిలోగాని చలించుచున్న స్థితిలోగాని ఉన్నవస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము.
తటకా - నిశ్చేష్టత.
తటకాపడు - నిశ్చేష్టత నొందు; నిశ్చేష్ట - చేష్టలుడుగుట.
కుంద - గుంజ, స్తంభము, సం.గుంధః.
మేధి - పశువులను కట్టునట్టి స్తంభము.
గెడ1 - 1.జత, 2.దగ్గర, 3.పోలిక, పగిది, 4.వేటకు తగినె సాధనము.
గెడ2 - వెదురు, చెరుకు, మొ.వి.కాండము, రూ.గడ, సం.కాండః.
గెడగూడు - క్రి.1.జతగాడు, 2.వెన్నంటు.
పగిది - 1.ప్రకృతి, 2.విధము, రీతి, సం.ప్రకృతిః.
గడన - 1.ఎన్నిక, 2.స్తోత్రము, 3.సంపాదనము, 4.లెక్క, సం.ఘటనా, గణనా.
గృహస్థూణము - నిట్రాడు, ఇంటి నడిమి కంబము.
నిట్టరాడు - గుడిసె యింటి నడుమ నిలువు పొడవుకంబము, కహారము, మొకరము, రూ.నిట్రాడు,, నిట్రాడి.
మొకరము - స్తంభము, గడెమ్రాను.
ఒక స్తంభాన్ని పట్టుకొని చిన్నపిల్లలు నిర్భయంగా దానిచుట్టూ గిరగిరా తిరుగుతారు. అలాగే భగవంతునిపై మనస్సు నిలిపి తన సాంసారిక బాధ్యతలను నెరవేర్చే వ్యక్తికి ఏ అపాయము కలుగదు. - శ్రీరామకృష్ణ పరమహంస
ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జెండా - టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.
నరసింహుడు - 1.దశావతారములలో ఒకటి, 2.నరశ్రేష్ఠుడు.
నృసింహుఁడు - నరసింహుడు, నరశ్రేష్టుడు.
నృహరి - నరసింహుడు. సింహంకాని సింహం. – నరసింహం
నరునకును సింహమునకు నే వరుసమైత్రి
గలుగు రెండురూపములును గలుగునట్టు
లవతరించుట నిక్కమే యయినయెడల
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః,
ఉగ్రసింహో మహాదేవ స్త్సంభజ శ్చోగ్రలోచనః|
రోతయైన పేగుల పేరులగలవాడు - హిరణ్యకశిపుని చీల్చి చెండాడి, ప్రేగులను హారమాలికగా ధరించినవాడు, నరసింహావతారం.
ఆదరమింతలేక నరుఁడాత్మబలోన్నతి మంచి వారికిన్
ఖేదముచేయుటల్, దనదుపేర్మికి గీడగు, మూలమెట్ల మ
ర్యాద హిరణ్యకశ్యపుఁడునా దనుజుఁడు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదునకెగ్గుసేసి ప్రళయంబును బొందఁడె మున్ను, భాస్కరా.
తా. పూర్వము దుష్టవర్తియై హిరణ్యకశిపుడను రాక్షసుడు(దనుజుఁడు - రాక్షసుడు, వ్యు.దనువు నందు జన్మించినవాడు.)అతని కుమారుడైన ప్రహ్లాదుని సద్గుణములను సహింపలేక యాతని బాధించి తాను చివరకు నాశన మయ్యెను. అట్లే మనుష్యు డెంత గొప్పవాడైనప్పటికీ(తనకుగల అధికబలము చేత)సజ్జను(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)లను నిర్దయుడై బాధించినచో నశించును.
తవ కరకమలవరే నఖమద్భుతశృంగమ్,
దళితహిరణ్యకశిపు తనుభృంగమ్|
కేశవ! ధృత నరహరిరూప! జయ జగదీశ! హరే! ||
నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతివక్షసే,
నమో నృసింహరూపాయ రామా.....
పర తత్త్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః,
లక్ష్మీనృసింహ స్సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః
పూర్వగాధ :- హిరణ్య కశిపుడు శివుని పూజించుట యందును, బ్రహ్మను పూజించుటయందును భక్తిగలవాడే అయినను విష్ణుభక్తులను జూచి విష్ణువుని గొల్వ రాదనియు తన మతమే ముఖ్యమైన దనియు, అహింభావము గలిగి యుండుటచే నాతని కావిధముగా నాశనము సంభవించెను. కావున నెట్టివారికైనను అహంభావము పనికిరాదు. ఇచ్చట ప్రహ్లాదుడు సర్వ దైవములను సమ దృష్టితోఁ జూచుటచే యోగ్యుడని చెప్ప వలెను. (ఈ పై వ్రాసినది విశేషమని భావింప వలెను.)
మనసు సరిచేయ నీవంటి ఘనులు లేరు
రక్కసుల పిల్లలైన నీ ప్రక్కనంద్రు
దుష్టశిక్షనుదెల్పు నీ శిష్టతనము
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
నాలుగు కాళ్ళు-కొమ్ములు కోఱలు మొ.నవి గల జంతువులలో సింహమును నేనే. - భగవద్గీత
పదునాలుగవదియైన నరసింహరూపంబునం గనక కశిపుని సంహరించెఁ – పద్నాలుగో (14వ) సారి "నరసింహమూర్తి" యై ధుర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపు మాపాడు.
వైశాఖశుక్ల భూతోత్థ శ్శరణాగతవత్సలః,
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః|
సంసారసాగర నిమజ్జనముహ్యమానం
దీనం విలోకయ విభో! కరుణానిధే మామ |
ప్రహ్లాదఖేదపరిహార కృతావతార!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. - 10స్తో
ఒక స్తంభాన్ని పట్టుకొని చిన్నపిల్లలు నిర్భయంగా దానిచుట్టూ గిరగిరా తిరుగుతారు. అలాగే భగవంతునిపై మనస్సు నిలిపి తన సంసారిక బాధ్యత లను నెరవేర్చే వ్యక్తికి ఏ అపాయమూ కలుగదు. - శ్రీ రామకృష్ణ పరమహంస
కరభీరము - సింగము.
సింగము - సింహము, సం.సింహః
సింగఁడు - 1.నృసింహుడు, 2.ఎరుకువాడు, సం.సింహః.
ఎఱుకవాఁడు - బోయవాడు.
బొబ్బ మెకము - సింహము, గర్జించు మృగము.
బొబ్బ - 1.పొక్కు 2.సింహనాదము. క్వేడ - సింహనాదము. క్ష్వేళితము - సింహనాదము రూ.క్ష్వేళి.
సింహనాదము - వీరుల గర్జనము.
క్ష్వేడా తు సింహనాద స్స్యాత్ -
క్ష్వేఅడనం క్ష్వేడా. క్ష్వడృ అవ్యక్తే శబ్దే. - బొబ్బ పెట్టుట. పా.క్ష్వేళా.
సింహనాం నాద ఇవ నాదః సింహనాదః - సింహముల యొక్క నాదమువంటి నాదము. ఈ రెండు శత్రు భంగార్థమైన యోధులు సేయు బొబ్బరింత పేర్లు.
రౌద్ర స్సర్వాద్భుత శ్రీమా న్యోగానంద స్త్రివిక్రమః,
హరి కోలాహల శ్చక్రీ విజయీ జయువర్ధనః|
భద్రాసనము - రాజపీఠము.
భద్రం చ తత్ ఆసనం చ భద్రాసనము - శుభమైన యాసనము.
నృపాసనం -
నృపస్యాసనం నృపాసనం - రాజుయొక్క యాసనము నృపాసనము.
సింహాసనము - సింహ ముఖమేర్పరచిన స్వర్ణ రత్నమయోన్నత పీఠము.
సంహాకృతి యుక్త మాసనం సింహాసనం - సింహాకృతితోఁ గూడిన యాసనము సింహాసనము. మనులు మొదలగువానితోఁ జేసిన రాజాసనము భద్రాసనము. బంగారుతోఁ జేసినది సింహాసనము.
సింగపుఁబీట - సింహాసనము.
గద్దియ - 1.సింహాసనము, 2.పీఠము, 3.పువ్వులలోని దుద్దు, రూ.గద్దె, సం.ఖట్టికా, 4.బంగారునాణెము, వరహా, రూ.గద్దె, సం.గద్యాణమ్.
గద్యానము - గద్దియ.
భౌరకుఁడు - బంగారు నాణెపు కోశమున కధికారి.
సివఁగి - చివగి, సివ్వంగి, సింహికః. కృత శౌచం నందు దేవిస్థానం సింహిక|
చివఁగి - 1.ఒక తెగ వేట కుక్క, రూ.చివ్వంగి, చివ్వగి, సివగి, సివంగి.
చివ్వంగి - సివంగి; చివ్వఁగి - సివంగి.
చివ్వలాడి - కలహశీలురాలు, పోట్లాడు స్వభావము కలది.
తరక్షుస్తు మృగాదనః. -
తరన్ ప్లవన్ క్షిణోతీతి తరక్షుః. పు. క్షిణు హింసాయాం. - దుమికి చంపునది. మృగా నత్తీతి.
మృగాదనః అద భక్షణే. - మృగముల(మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.)భక్షించునది. ఈ రెండు 2 సివంగి పేర్లు.
చిక్కి యున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వ.
తా. బలము లేనప్పుడు సింహమునైనను బక్క కుక్క(గ్రామమృగము - కుక్క(గ్రామసింహము.)కరచి బాధ పెట్టును, శక్తిలేనప్పుడు పంతము (పంతము-1.స్పర్ధ, పోటీ, 2.విధము, సం.స్పర్ధా.)లకు పోక తలవంచు కొని తిరుగుట మంచిది.
సింహాలు లేని అడవీ, అడవి లేని సింహాలు నాశనంకాక తప్పదు.
సింహం ఆకలితో అలమటిస్తున్నా, చావనైనా చస్తుంది గాని, గడ్డి మాత్రం తినదు(మేయదు). శునకములు తిని విడిచినదానిని సింహములు తినునా?
నారసింహీ మహూగ్రాస్యా భక్తానా మార్తినాశినీ,
అంతర్బలా స్థిరా లక్ష్మీ ర్జరామరణనాశినీ.
ఋతంభరుఁడు - 1.సత్యపాలకుడు, 2.పరమేశ్వరుడు.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.
ఋతము - 1.సత్యమైనది, 2.పూజింపబడినది, 3.ప్రాప్తము, వి.1.జలము, 2.సత్యము, 3.మోక్షము, 4.యజ్ఞము.
యజతే యజ్ఞః యజ దేవపూజాసంగతి కరణదానేషు. - పూజించుట.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
నిజము - సత్యము, విణ.1.శాశ్వతమైనది, 2.సత్యమైనది.
నిజము - స్వభావము, విణ.1.తనది, 2.శాశ్వతమైనది.
నిజమరి - సత్యశీలుడు.
దైవాధీనం జగత్సర్వం సత్యాధీనంతు దైవతమ్|
తత్సాత్య ముత్తమాధీనం ఉత్తమో మను దేవతా||
తా. ఈలోకమంతయు దైవాధీనమైయున్నది, ఆదైవము సత్యమున కాధీనమై యున్నది, ఆ సత్యము ఉత్తముల యందున్నది, కాబట్టి ఆ ఉత్తమభక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను. – నీతిశాస్త్రము
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.
కృష్ణః సర్వంకరోతీతి కృష్ణః - అన్నిటిని జేయువాడు.
డుకృఙ్ కరణే, దైత్యాన్ కర్ష్తీతి వా - దైత్యులను నలిపివేయువాడు.
కృష్ణ విలేఖనే-కృష్ణవర్ణ త్వాద్వా - కృష్ణవర్ణుడు గనుక కృష్ణుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్ఠి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు. విష్ణు వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
కృష్ణజన్మస్థానము - బంధనాలయము, చెరసాల, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన స్థలము.
కృష్ణద్వైపాయణుఁడు - వ్యాసుడు.
వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
బాదరాయణుఁడు - వ్యాసుడు.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.
బదునేడవ(17వ)దియైన వ్యాసగాత్రంబున నల్పమతులయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; పదిహేడోసారి వేదవ్యాసుని రూపంలో అల్పప్రజ్ఞు లైన వారికోసం వేదము అనే వృక్షానికి శాఖలను విస్తరింపజేసాడు.
నల్లని ద్వీపమునందు జన్మించి నందు వల్ల, కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడయినాడు. ద్వైపాయనుడైన వ్యాసమహర్షి అజ్ఞానం నుంచి రక్షించును.
గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
వ్యాసుడు వశిష్టుని మునిమనుమడు. శక్తికి పుత్రుడు-నిష్కల్మషుడు-పరాశరుని పుత్రుడు. శ్రీశుకుని తండ్రి, తపోధనుడు వ్యాస మహర్షి. కాలాంతరమున ఏకరాశిగా నున్న వేదాలను విడివిడిగా (నాలుగు వేదాలుగా విభజించుట) ఏర్పరచడం మూలాన వ్యాసుడు (వేదాల చిక్కు విడగొట్టేవాడు) లేక వేదవ్యాసుడు అనే పేరు పొందినాడు.
ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించి నట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
భా|| ప్రతియుగంలో కాలం యొక్క ప్రభావంచేత అల్పబుద్ధులు, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారూ అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. వారు అపారమైన వేదరాశిని అధిగమించలేరు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి యుగధర్మానికి తగిన విధంగా ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.
వైకుంఠుడు - 1.విష్ణువు, 2.ఇంద్రుడు.
వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.
ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా
కార పిశాచసంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వారకవాటభేది నిజ దాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! నీ తారకనామము భయంకరులయిన యమదూతలను(కృతాంతుఁడు - యముడు)గుండెలదరజేయును. దరిద్రత అనెడి పిశాచమును బోగొట్టును. ఎల్లప్పుడును నీ దాసజనులు పరమ పదమునకుఁ బోవుటకుగల యుడ్డములను తొలగించును.
వాసుకము - వైకుంఠము. కంఠం వైకుంఠ వాసినీ|
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. వైకుంఠాలయ సంస్థిత రామ్|
విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణోః పదం విష్ణుపదం - విష్ణువునునకు స్థానము.
విష్ణుపది - గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగా గలది.
విష్ణుపదోద్భవా విష్ణుపదీ. ఈ. సీ.- విష్ణుపాదమునఁ బుట్టినది.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.
పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది - పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
వైకుంఠేచమహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి
గంగాచతులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకగాః
కృష్ణప్రాణాధిదేవీత్వం గోలోకేరాధికాస్వయమ్
రాసేరాసేస్వరీ త్వంచబృందావనేవనే|| - 3స్తో
విరజ - వైకుంఠము నందుండు నది. (మోక్షం కలగాలంటే దీన్ని దాటాలి) పరమపదమున సమీపముగా నుండునది విరజానది, ఆ విరజా నదియే యమునగా మారి వచ్చినది - తిరుప్పవై.
విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా,
యస్యాః సందర్శనా న్మర్త్యాః పునాత్యాసప్తమం కులమ్ |
ఉత్కలదేశమున విరజయను క్షేత్రముకలదు. ఆ క్షేత్ర అధిస్ఠానదేవతకు విరజయను సంజ్ఞ కలదు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడిన ఈ దేవతా సందర్శనమున నేడుతరముల(ఏడు తరముల)వారిని పునీతుల చేయుదురని బ్రహ్మాండ పురాణమున తెలియుచున్నది.
రామో విరామో విరజో మార్గనేయో నయో(అ)నయః
వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మవిదుత్తమః – 43శ్లో
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. - 149శ్లో
జహ్నువు - 1.ఒక ముని, 2.విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
జహ్నుతనయ - గంగ.
జహ్నోస్తనయా జాహ్నవీ - జహ్ను మహామునియొక్క చెవియందుఁ బుట్టినది.
జాహ్నవి - గంగ.
జహ్నువు యజ్ఞశాలను గంగ ముంచెత్తగా కోపముచే కన్నెఱ్ఱచేసి, భగవంతుని యజ్ఞపురుషు(యజ్ఞపురుషుఁడు- విష్ణువు)ని పరమ సమాధి చేత ఆత్మారోహణము చేసుకొని, గంగనెల్ల త్రావి వైచెను. అప్పుడు దేవర్షులు ప్రసన్నుని కావించి, గంగను మునికి కుమార్తెను కావించిరి.
పతితోద్ధరిణి జాహ్నవి గఙ్గే ఖణ్డితగిరివర మణ్డితభఙ్గే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువనధన్యే ||
పతితులను ఉద్దరించే జహ్ను పుత్రి గంగా! నీ తరంగముల హిమగిరులను ఖండిస్తూ సుశోభితంగా ప్రవహిస్తుంటాయి. నీవు మునివర జహ్ను పుత్రికవు, భీష్ముని జననివి. పతితులను పావనం చేసి, త్రిభువనాలలో ధన్యత నొందుతావు. - 5శ్లో
శాస్త్రీ శాస్త్రమయీ నిత్యా శుభా చంద్రార్థ మస్తకా|
నమోజహ్ను కన్యేనమన్యే త్వదన్యై - ర్ని సర్గేందు చిహ్నాది భిల్లోకభర్తుః
అతో హం నతో హంస్వతో గౌరతోయే - వసిష్టాది భిర్గీయమానా భిదేయే.
ఆకంఠం సలిరే నిమజ్జ్య పులినాభోగోపధానే శిరః
కృత్వా శైలసుతాపతే ! పురరిపో ! గంగాధరే త్యాలపన్
గృహ్ణన్ కర్ణపుటే శివేన కృపయా ప్రత్యాహృతం తారకం
తీరే జాహ్నవి ! జహ్నునందని ! కదా మోక్షే శరీరం ముదా|
గంగా ! నీజలములం దాకంఠము మునింగి శిరంబున నీసంబంధములగు నిసుక తిన్నెలను తలగడయందుఁ జేర్చుకొని శంభూ ! పార్వతీ రమణా! పురహరా ! గంగాధరా! యని వాకొనుచుఁ గృపతోడ శివుండు గర్ణపుటము నందు సూచించు మహనీయమగు తారకమంత్రమును గ్రహించి సంతృప్తుఁడనై యెన్నఁడీ దేహమును ద్యజియించెదనో కదా ?
నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా,
చిత్రఘంటా సునందా శ్రీ ర్మానవీ మనుసంభవా. – 38శ్లో
యజ్ఞపురుషుఁడు - విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్ఠి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు. విష్ణు వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఇవి పంచ యజ్ఞములు, వికృ. జన్నము.
యజతే యజ్ఞః యజ దేవపూజాసంగతి కరణదానేషు. - పూజించుట.
నేడవ(7వ) విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండనఁ బ్రకాశమానుండై యమాది దేవతలం గూడి స్వాయంభువ మన్వంతరంబు రక్షించె; ఏడవ(7వ) పర్యాయం రుచికి, ఆకూతికి కుమారుడై, "యజ్ఞు" డనే నామంతో యమాది దేవగణములతో కూడి స్వాయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు.
హోమము - వేల్మి, యజ్ఞము.
వ్రేల్మి - వేలిమి, హోమము, యజ్ఞము.
వేలిమి - హోమము రూ.వ్రేల్మి, వేల్మి.
ఆహవనము - 1.యజ్ఞము, 2.హోమము.
హవనము - హోమము. మంత్రంతో హవిస్సును అగ్నిలో ఆహుతి చేయించాలి.
హవము - 1.ఆజ్ఞ, 2.పిలుపు(ఆహ్వానము - పిలుపు), 3.యజ్ఞము.
హూతి - పిలుపు, రూ.ఆహూతి.
స్థండిలము - వ్రతనియమమున నున్నవాడు పండుకొనుటకు దర్భాదులు పరచిన భూమి. అగ్నిహోత్ర ముంచుటకై సంస్కరించిన భూమి.
స్థాండీలుఁడు - స్థండిల భూమియందు శయనించినవాడు, రూ.స్థండిలశాయి.
అగ్నిహోత్రము - 1.అగ్ని, 2.హోమము, 3.హవిస్సు. అగ్నిహోత్రం వేదాలకు ఫలము.
అగ్నిహోత్రుడు - ప్రజాపతి రగ్నిః పరిశుద్ధుడు, సర్వభక్షకుడు, పంచ భూతములలో నొకడు.
అగ్నిచిత్తు - అహితాగ్ని, నిత్యాగ్ని, హోత్రి.
హోత - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు, రూ.హోత్రి.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతె కుటిలం ఊర్ధ్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఈ-పు. అగ కుటిలాయాం గతౌ - ఊర్ధ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః, ఊ-పు. అగ్నివలనఁ బుట్టినవాఁడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.
జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
స్వాహా : అగ్ని భార్య(మహేశ్వరి యందు దేవీస్థానం స్వాహా). ఆమె దయవల్లనే దేవతలకు హవిర్భాగాలు అందుతున్నాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు చేసే యజ్ఞములకు సంబంధించిన హవ్యము దేవతల ఆహారమై ఆకలిని పోగొట్టుతుంది.
స్వాహా అనే ఆమె పేరు చేర్చకుండా యిచ్చే ఆహుతులను అగ్ని స్వీకరించడు.
అగ్నిదేవునకు దక్షుని కూతురయిన స్వాహాదేవి అను భార్యవల్ల హవిస్సులే భోజనంగాగల పావకుడు(పావకుడు - అగ్ని), పవనుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
గభస్తి నేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః|
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః||
స్వాహా - ముగ్గురు కొడుకులు (ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అని పేర్లు.)
ఆహవనీయము - హోమము చేయదగినది (హవిరాది) వి. త్రేతాగ్నులలో ఒకటి. (తక్కిన రెండు 1.దక్షిణాగ్ని, 2.గార్హ పత్యాగ్ని).
గార్హపత్యము - 1.మూడు శ్రౌతాగ్నులలో ఒకటి, (మూడు శ్రౌతాగ్నులు గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని) 2.గార్హస్థ్యము.
గార్హస్థ్యము - 1.గృహస్థాశ్రమము 2.గృహస్థధర్మము 3.గృహస్థుడు ప్రతి దినము అనుషింప వలసిన పంచయజ్ఞములు మొ.ని.
ఔపాసనము - గృహస్థుడగు బ్రాహ్మణుడు ప్రాతఃకాలమునందు చేయు అగ్ని ఉపాసన.
ముచ్చిచ్చు - (మూడు+చిచ్చులు) త్రేతాగ్ని (గార్హస్పత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని).
త్రేత - 1.రెండవ యుగము, 2.గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అను మూడగ్నులు, తేతాగ్ని.
త్రేతా త్వగ్నిత్రయే యుగే :
త్రేతా శబ్దము గార్హపత్యము మొదలైన మూఁడగ్నులకును, యుగమునకును పేరు. త్రిత్వమితా ప్రాప్తా త్రేతా. ఇణ్ గతౌ. త్రిత్వ సంఖ్యను బొందినది. టీ. స. త్రీ న్ ధర్మపాదాన్ ఇతా త్రేతా. తదుక్తం. "త్రేతాయుగే తు సంప్రాప్తే దర్మః పాదోనతాం గత"ఇతి.
త్రేతాయాం వర్తమానాయాం కాలః కృతసమో భవత్ |
రామే రాజని ధర్మజ్ఞే సర్వభూత సుఖావహే |
పూర్ణాహుతి - హోమాంతమందు ప్రీతికై పరిమళద్రవ్యాలతో చేయు హోమము.
అగ్ని హోత్రం గృహంక్షేత్రం గర్భిణీంవృద్ధ బాలకా|
రిక్త హస్తేన నోపే తో ద్రాజానందైవతం గురుమ్||
తా. అగ్ని హోత్రునకు మంత్ర పూర్వ కాహుతు లిచ్చునపుడును, గృహము(గృహము - 1.ఇల్లు, 2.భార్య.), పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలురు, రాజులు, దేవుడు వీరుల కడకు వట్టి చేతులతో బోరాదు, అనఁగా ఫలాదులు తీసికొని పోవలయును. - నీతిశాస్త్రము.
విహాయ సగతిర్జ్యోతిః స్సురుచిః హుతభుగ్విభుః
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః – 94శ్లో
వైశ్వానరుఁడు - అగ్ని.
విశ్వానరస్య ఋషే రపత్యం వైశ్వానరః - విశ్వానరుఁ డను ఋషికి కొడుకు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమా శ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 14శ్లో
తా|| నేను జఠరాగ్ని రూపమున ప్రాణుల దేహము నందుండి ప్రాణాపాన వాయువులతో కూడినవాడనై భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను నాల్గు విధము లగు పదార్థములను జీర్ణము చేయుచున్నాను. - పురుషోత్తమ ప్రాప్తియోగము, భగవద్గీత
వికృతి శాంకరీ శాస్త్రీ యక్షగంధర్వసేవితా,
వైశ్వనరీ మహాశీలా దేవసేనా గుహప్రియా|
వసిష్ఠ కుంభోద్భవగౌతమాది - మునీంద్ర దేవార్చిత శేఖరాయ|
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమశివాయ.
మహాంశ్చాసౌ పద్మశ్చ మహాపద్మః - గొప్పదైన పద్మము.
తటిల్లేఖాతన్వీం - తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణా మ - ప్యుపరి కమలానాం తవ కలామ్|
మహాపద్మాటవ్యాం - మృదిత మలమాయేన మనసా
మహాన్తః పశ్యంతో - దధతి పరమాహ్లాద లహరీమ్|| - 21శ్లో
తా. తల్లీ! మెరపు తీగవంటి శరీరము గలిగియు, సూర్యచంద్రాగ్ని(తపనుఁడు - సూర్యుడు; శశాంకుఁడు - చంద్రుడు; వైశ్వానరుఁడు - అగ్ని.)మయమై నదియు, షట్కమల (షట్చ(క)ములకు పైన సహస్రారమందు మహాపద్మాటవిలో(నిషణ్ణము - 1.ఉండినది, 2.కూర్చుండినది.)కూర్చున్న నీ కళను, మాయ తొలగిన విశుద్ధమైన మనస్సుతో (పశ్యన్తి - చూచు)మహాత్ములు పరమానందలహరిని ధారణ చేస్తున్నారు. - సౌందర్యలహరి
వైశ్వనరీ మహాశీలా దేవసేనా గుహప్రియా|
తవవిమలేన్దుకలం వదనేన్దు మలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీసుముభీభి రసౌ విముఖీక్రియతే|
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే| - 20
తటిల్లతా సమరుచి - షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ.
ధనంజయ - 1.అగ్ని, 2.అర్జునుడు. air in the stomach.
ధనుజయతీతి ధనుంజయః జి జయే - ధనమును జయించువాఁడు.
ధనంజయః = రాజసూయయాగమునకు అనేక రాజులనుండి ధనమును సంపాదించి తెచ్చుట చేతను, లేక ధనమునుగూర్చిన ఆశను జయించిన వాడగుట చేతను అర్జునునకు ధనంజయుడని పేరు వచ్చింది.
ప్రాణఘోషయందు నిలుచును, ప్రాణము పోయినను శరీరమును దహనమగు వరకును అంటిపెట్టుకొని యుండునది ధనంజయ వాయువు. (చెవులు వ్రేళ్ళు పెటుకొన్నచో గుయి మను శబ్దము వినబడును. అదే ప్రాణఘోషము).
కామదేవః కామపాలః కామీ కాన్త కృతాగమః |
అనిర్దేశ్యవపుర్విష్ణుః వీరో(అ)నన్తో ధనఞ్జయః || 83స్తో
కృపీటయోని - అగ్ని, వ్యు.నీటికి ఉత్పత్తిస్థానమైనది.
కృపీట ముదకం యోనిః కారణం యస్య సః కృపీట యోనిః ఇ-పు. - కృపీటమనఁగా ఉదకము; అది కారణముగాఁ గలవాఁడు.
కృపీట స్యాంభసో యోనిః - ఉదకమునకు నుత్పత్తిస్థానము.
కృపీటము - 1.జలము, 2.కడుపు, 3.సమిధ.
జ్వలనము - 1.మంట, 2.అగ్ని.
జ్వలతీతి జ్వలనః, జ్వల దీప్తౌ - జ్వలించుఁవాడు.
జ్వాల - మంట, సం.వి. (రసా.) పరిశోధనాగరములో బున్సెన్ బర్నర్ (దాహని) వంటి గొట్టముల ద్వారా పంపబడు ఇంధన వాయువును జ్వలింపచేసి నపుడు లభ్యమగు తేజోవంతమైన గాలుల ప్రవాహము, (Flame).
జ్వలించు - క్రి.మండు.
జ్వలితము - 1.మండినది, 2.ప్రకాశించినది.
జ్వాలాజిహ్వుఁడు - అగ్ని.
మంట - 1.రోషము, 2.జ్వాల, 3.చురుకుమను నొప్పి.
మంటమారి - జ్వలశీలుడు, కోపశీలుడు.
జాతవేదుఁడు - అగ్ని.
జాతాః వేదాః యస్మాత్సః జాతవేదాః, స - పు. - ఇతనివలన వేదములు పుట్టినవి.
జాతేజాతే విద్యత ఇతి వా జాతవేదాః, విద సత్తాయాం - పుట్టిన దేహము(దేహము - శరీరము, మేను.)నం దెల్లనుండువాఁడు.
జాతం శుభాశుభం వేత్తీతివా, విద జ్ఞానే - పుట్టిన శుభాశుభముల నెఱుంగువాఁడు.
వేదో హిరన్య మస్మాజ్ఞాత ఇతివా - హిరణ్యము(హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.)వీనివలనఁ బుట్టినది.
జాతతరూపము - బంగారము.
జాతం ప్రసస్తం రూపం యస్య జాతరూపం - ప్రశస్తమైన రూపము గలది.
తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనము(పచనము - వండుట)చేసి శరీరము పడకుండ కాపాడునది.
తనూం న పాతయతి ధారయతీతి తనూనపాత్. త.పు. వఌ గతౌ - శరీరమును నిలుపువాఁడు.
ఇంధనం వినా స్వతనుం నపాతీతివా. పా రక్షణే - ఇంధనము లేక తన్ను రక్షించుకొనఁజాలనివాఁడు.
దామోదరుఁడు - కృష్ణుడు.
దామోదరః ఉదరే దామయస్యేతి దామోదరః - ఉదరమందు తులసిమాలిక గలవాడు.
దామ్నోఉదరే మాత్రా బద్ధ; - బాల్యమందు యశోద చేత పలుపున నుదర మందుఁ గట్టబడినవాఁడు.
పాలును వెన్నయు మ్రుచ్చిల
ఱోటను మీ తల్లి కట్ట దోషముతోడన్
లీలావినోధి వైతివి
బాలుఁడవా? బ్రహ్మగన్నఁ ప్రభుఁడవు కృష్ణా.
తా. కృష్ణా! పాలు వెన్న (వెన్నముచ్చు - వెన్న దొంగ)దొంగిలించితివని మీతల్లి కోపముతో ఱోటికిగట్ట నీవు లీలావినోదివై యుంటివే కాని, నీవు బాలుఁడవు కావు. బ్రహ్మను(బమ్మ - నలువ, సం.బ్రహ్మ.) గన్నట్టి పరంధాముఁడవు.
దామోదర! గుణమందిర! సుందరవదనారవింద! గోవింద!
భవజలధిమథనమందర! పరమం దరమపనయ త్వం మే| - 6
ఆబంధము - 1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.
దామము - 1.పలుపు, 2.హారము, దండ.
హారము - 1.నూట ఎనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది ‘హారము ' (Denomination).
హారి - 1.మనోజ్ఞము, 2.హరించువాడు, 3.హారము కలవాడు.
దండ - 1.దగ్గర, 2.ప్రాపు, ఆధారము, 3.చోటు.
సందానము - పసువులగట్టు దామెన.
న పుంసి దామ సందానమ్ -
ద్యతి పశుదౌష్ట్య మితి దామ,, స్న. దో అవఖండనే. - పసుల పొగరు బోతుతనమును బోఁగొట్టునది.
సందీయతే బంధ్యంతే అనేనేతి సందానం. డు దాఞ్ దానే. సంపూర్వో బంధనార్థః. - దీనిచేతఁ గట్టఁబడును. ఈ 2 ఉఱ్ఱుకట్టు (దాయఁగట్టు) త్రాడు పేర్లు.
దామని - దామెన త్రాడు.
దామెన - దామని, పెక్కు తలుగులు గల నిడివి తాడు, సం.దామనీ.
పశురజ్జుస్తు దామనీ,
బహుదామయోగత్ దామనీ - పెక్కుతలుగులు గలది.
పా. పసురజ్జుస్తు బంధనీ - పసులఁ గట్టు దామెన పేరు.
కుశము - 1.దర్భ, 2.పలుపు, 3.ఒక ద్వీపము, 4.నీరు.
అస్త్రీ కుశం కుథో ధర్భః పవిత్రం -
కౌశతే కుం శ్యతి నా కుశం. అ.ప్న శీఙ్ స్వప్నే; శోతసూకరణే. - భూమియందుండునది. లేక భూమి నల్పముగాఁ జేయునది కుశము.
విప్రపాణిషు కుథ్యత ఇతి కుథః కుథ శ్లేషణే. - బ్రాహ్మణ హస్తముల యందుఁ గూర్పఁబడునది.
దృణాతి కరాదికమితి దర్భః, దౄ విదారణే. - కరాదులను జీల్చునది.
పూయతే అ నేనేతి పవిత్రం. పూఞ్ పవనే. - దీనిచేతఁ బవిత్రము చేయఁబడును. ఈ 4 దర్భపేర్లు.
దాతకాని వాని దరచగా వేడిన
వాడు దాతనె వసుధయౌలోన
అవురు దర్భయౌనె యబ్ధిలోముంచినా విశ్వ.
తా|| దాతృత్వము లేనివానిని ఎన్నిసార్లు అడిగినను యేమియు లాభములేదు. సముద్రములో(అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ శంఖ్య)ముంచినను అవురుగడ్ది దర్భగాదు.
కుశస్థలము - కన్యాకులబ్జ దేశము.
కుశస్థలి - ద్వారకానగరము, ఉదా. "కుశస్థలీ పురమున యాదవ ప్రకరముల్ భజింపగ నున్నవాడు".
కౌశాంబి - ఒక పట్టణము, వ్యు.కుశాంబునిచే నిర్మింపబడినది. కౌశాంబికేదేవి నారాయణి నమోస్తుతే|
కుథము - 1.పవిత్రము, 2.దర్భ, 3.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.
పావనము - పవిత్రము.
(ౙ)జూలు - 1.సింహము మొదలగు వాని మీద వెండ్రుకలు, 2.ఏనుగుపై పరచెడి ఎఱ్ఱకంబళి.
పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.
ఉపవీతం యజ్ఞసూత్రం ప్రోద్ధృతే దక్షిణే కరే,
ఉపవీయతే వామస్కంధో (అ)నేనేతి ఉపవీతం. వ్యేఞ్ సంవరణే. - ఎడమ భుజము దీనిచేతఁ గప్పఁబడును.
కుడిచేయి తొడగఁబడుచుండఁగా నెడమభుజము మీఁద నుండు జన్నిదము.
ఉపవీతము - సవ్యముగా వేసికొన్న జందెము.
(ౙ)జందెము - జందియము.
జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.
సూత్రము - 1.నూలిపోగు, చంద్రునికో నూలిపోగు 2.జన్నిదము, 3.ఏర్పాటు, 4.శాస్త్రాది సూచక గ్రంథము, (గణి.) కొన్ని పదములతో నేర్పడు సమీకరణము (Formula), 6.కొన్ని ధర్మముల నుగ్గడించు ప్రవచనము.
ఏర్పాటు - ఏరుపాటు; ఏరుపాటు - 1.నిర్ణయము, 2.నియమము, 3.వివరణము, 4.భేదము, రూ.ఏర్పాటు.
అవధారణము - నిర్ణయము, నిశ్చయము.
నిర్ణయము - ఏర్పాటు; నిర్ణయించు - క్రి.ఏర్పాటుచేయు.
నిశ్చయము - నిర్ణయము; నిర్ధారణ - నిశ్చయము.
వ్యవసితము - నిశ్చయము, విణ.అనుష్ఠింపబడినది.
నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.
ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గఱి) విషయ విపులీకరణము (Exposition).
విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||
బ్రుషి - వ్రతస్థులు కూర్చుండు దర్భాసనము, రూ.బ్రుసి.
దబ్భ - 1.బద్ధ, 2.వెదురుబద్ద, 3.దర్భ, సం.ధర్భః.
బద్ద - 1.కాయ యొక్క ఖండము, 2.వెదురుబద్ద, 3.చీలిక, సం.భిత్తః.
బర్హిస్సు - అగ్ని.
బర్హిః. స-పు బృంహతి వర్థతే అజ్యాదినేతి బర్హిః. బృహి వృద్ధౌ - అజ్యాదుల(ఆజ్యము - 1నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.)చేత వృద్ధిఁ బొందువాఁడు.
శుష్మా న-పు శోషయతి జలమితి శుష్మా, శుష శోషణే - ఉదకమును (ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.)శోషింపఁ జేయు వాఁడు.
ప. బర్హిశ్శుష్మా. న-పు బర్హిషో దర్భాః శుష్మ బలమస్యేతి బర్హిశ్హుష్మేత్యే కంవాపదం - దర్భలు బలముగాఁ గలవాఁడు.
బర్హిర్ముఖాః బర్హిరగ్నిర్ముఖం యేషాంతే - అగ్నియే ముఖముగాఁగలవారు. (అనఁగా నగ్నియందు హోమము చేయఁబడిన హవిరాజ్యాదులవలనఁ దృప్తిఁ జెందువారు.)
శుష్మము - 1.బలిమి, 2.తేజస్సు, 3.నిప్పు.
బర్హి - 1.నెమలి, 2.దర్భ.
బర్హతే నృత్తేన బర్హం, బృహవృద్ధౌ. - నృత్యము చేత వృద్ధిఁ బొందునది.
కలాపో భూషణే బర్హే తూణీరే సంహతావపి,
కలాపశబ్దము భూషణమునకును, నెమలిపురికిని, అమ్ములపొదికిని, సమూహమునకును పేరు.
కలాః ఆప్నోతీతి కలాపః ఆప్ ఌ వ్యాప్తౌ. - కళలఁ బొందునది.
బర్హము - నెమలిపురి.
బర్హమస్యాస్తీతి బర్హిణః అర్హీ చ. న. పు. - పింఛము కలది.
దళే(అ)పి బర్హమ్ -
బర్హ శబ్దము ఆకునకును, అపిశబ్దమువలన నెమలిపురికిని పేరు.
బర్హతీతి బర్హం. బృహ వృద్ధౌ. - వృద్ధిఁ బొందునది.
'బర్హం మయూరపింఛే (అ)థ ప్రాధాన్యో ద్యోతవృద్ధిషు, పరివారే పుమా' నితి శేషః.
మందారగంధసంయుక్తం, చారుహాసం చతుర్భుజమ్|
బర్హిపింఛావచూడాంగం, కృష్ణం వందే జగద్గురుమ్| - 4
తిరుముడి - 1.వైష్ణవుడు, 2.జడలు కట్టిన జుట్టు.
వైష్ణవుఁడు - విష్ణుభక్తుడు.
వైష్ణవము - విష్ణుసంబంధమైనది, వి.ఒక మతము.
మడిచేఱు - (మడిచిన+చేఱు) వైష్ణవ స్త్రీలు ముందునుండి యెత్తి వెనుకకు పెట్టుకొను కోక చేఱు.
తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమాళిగ - 1.గృహము, 2.వైష్ణవుల పూజాగృహము, 3.పూజ్యులుండు గృహము.
ౙడలమెకము - సింహము, చమరము.
జటిలము - జటాలము, వి.సింహము.
జటాలము - జడలుగలది, రూ.జటిలము.
ౙడ - 1.వెండ్రుకల యల్లిక, 2.జూలు, సం.1.జటా, 2.సటా.
(ౙ)జూలు - 1.సింహము మొదలగు వాని మీది నెండ్రుకలు, 2.ఏనుగు పై పరచు ఎఱ్ఱ కంబళి.
జట - 1.జడ, 2.ఊడ.
సట - కపటము, మోసము, సం.వి.1.సన్న్యాసుల జడ, 2.జూలు.
వ్రతినస్తు జటా సటా,
జటతి సంఘీభవతీతి జటా, జట ఝట సంఘాతే. - కూడుకొనియుండునది.
సటతీతి సటా, షట అవయవే. - వ్రతమునకు అంగమగునది. ఈ 2 వ్రతియొక్క జడ పేర్లు.
చమరము - 1.వింజామరము, రూ.చామరము, 2.సవరము, 3.చమరీ మృగము.
చమతి తృణం చమరః, చము అదనే. - తృణమును భక్షించునది, చమరీమృగము.
కుచ్చుల బఱ్ఱె - జడల బఱ్ఱె, చమరీ మృగము.
ౙడబఱ్ఱె - చమరీమృగము.
చమరీ - ఆడు చమరీమృగము.
చామారం తు ప్రకీర్ణకమ్,
చమరమృగ సంబంధి చామరం - చమరమృగ సంబంధమైనది.
ప్రకీర్యతే రాజసమీప ఇతి ప్రకీర్నకం, కౄ విక్షేపే. - రజ సమీపమందు విసరఁబడునది. ఈ 2 వింజామర పేర్లు.
చామరము - వింజామరము, రూ.చమరము.
వింజామరము - (వెల్ల + చామరము) తెల్లని చామరము, సురటి.
వీచోపులు - (వీచు+ చోపులు) వింజామరలు.
వీచు - గాలి విసరు. వీవరి - వాయువు.
సీవిరి - 1.వింజామరము, 2.ఆలపట్టము.
ఆలపట్టము - 1.వస్త్రముతో చేయబడిన గుండ్రని విసనకఱ్ఱ, 2.గుండ్రని విసనకఱ్ఱ వలె నుండి రాజులకు ఎండ తగులకుండ పట్టు సాధనము, సం.ఆలావర్తమ్.
లగ్న చామరహస్త శ్రీ శారదా పరివీజితా,
లజ్జా పద సమారాధ్యా లంపటా లకులేశ్వరీ|
ప్రకీర్ణము - 1.విరివి, విసృతము, 2.వింజామరము, 3.గుఱ్ఱము.
ఔశీరము - చామరము, సురటి, విణ.వట్టివేళ్ళతో చేయబడిన మందు.
చామరము - వింజామరము, రూ.చమరము.
సురఁటి - వట్రువ విసనకఱ్ఱ.
సచామర రమా వాణీ విరాజితాయై నమో నమః
గుడాకేశుడు - 1.అర్జునుడు, 2.శివుడు, వ్యు.జెముడువలె గుబురుగా పెరిగిన జుట్టు కలవాఁడు.
ధర్మధ్వజే లిఙ్గవృత్తిః -
ధర్మస్య ధ్వజ శ్చిహ్న మస్యేతి ధర్మధ్వజీ, స. పు. - ధర్మము యొక్క చిహ్నము గలవాఁడు.
లింగం చిహ్నం వీత్తిర్జీవన మస్యేతి లింగవృత్తిః, ఈ. పు. - చిహ్నమే జీవనముఁ గలవాఁడు. ఈ ఒకటి డంభార్థమై జటాదిచిహ్నములు(చిహ్నము - 1.గురుతు, టెక్కెము.)ధరించుకొని దానివలన బ్రతుకువాని పేర్లు.
ధర్మధ్వజి - జీవనార్థము సన్న్యాసి వేషము ధరించినవాడు.
ౙడదారి - జడలు ధరించిన సన్న్యాసి, సం.జటాధారీ.
జటి - జడలుగల సన్న్యాసి.
కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము, దురాచారుడు.
కృష్ణం వర్త్మ మార్గోయస్యసః కృష్నవర్త్మాన - పు. నల్లనిజాడ గలవాఁడు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
దురాచారుడు - చెడునడవడి కలవాడు.
దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా. అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర. దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము
జటిలో ముండీ లుంచితకేశః, కాషాయాంబర బహుకృతవేషః |
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృతవేషః || - 14
జడలు కట్టిన జుట్టు కలవాడైనను, గుండుగా గీయబడిన తలగలవాడైనను, వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా పీకివేయబడిన తల గలవాడైనను, కాషాయ వస్త్రం ధరించిన వాడైనను, ఇలాంటి అనేకమైన వేషాలు వేసినవాడైనను, చుస్తూ కూడా, ఏమి చూడనట్టి మూఢుడే, ఏలనన, ఈ వేషాలన్నీ కేవలం ఉదరపోషణకోసం వేసినవే గనుక. - భజగోవిందం
The ascetic with matted looks, the one with his head shaven, the one with hairs pulled out one by one, the one who disguises himself variously with the ochre-coloured robes – such a one is a fool who, though seeing, does not see. Indeed, this varied disguise is for the sake of the belly. – 14
శోచిష్కేశుఁడు - అగ్ని, వ్యు.జ్వాలలే జుట్టుగా గలవాడు.
శోచీమ్షి జ్వాలాః కేశాః యస్య సః శోచిష్కేసః - శోచిస్సు లనఁగా జ్వాలలు; అవి కేశములుగా గలవాఁడు.
శోచిస్సు - 1.సూర్యకిరణము, 2.మంట.
శోచయతీతి శోచిః, స.న శుచ శోకే - తీవ్రమైనది గనుక దుఃఖపెట్టునది.
బృహత్భానువు - అగ్ని.
బృహంతః భానవోయస్య సః బృహత్భాను, ఉ. పు. - అధికము లైన కిరణములు గలవాఁడు.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు – ఆగస్ఠు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
నడి - నడుము అను శబ్దమునకు సమాసము నందు వచ్చు రూపము, ఉదా. 1.నడితల, 2.నడిరేయి, 2.మధ్యము, రూ.నడు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.
10. మఘ - పల్లకీ ఆకారముగా 8 నక్షత్రములుండును.
మేనా - (వ్యావ.) పల్లకి , సవారి.
పల్యంకిక - పాలకి, పల్లకి.
సవారి - ప్రశ్న, యుక్తిప్రశ్న.
కైపదము - కవి కిచ్చుసమస్య, చిక్కుప్రశ్న, సం.కవిపదమ్.
(ౘ)చౌతా - డోలి.
చతురంత యానము - పల్లకి; శిబిక - పల్లకి.
అందలము - 1.పల్లకి, ఆందోళిక; 2.ఒకరకపు బాలక్రీడ, సం.ఆందోళః.
ఆందోళిక - ఆందోళము.
ఆందోళము - 1.పల్లకి, 2.ఉయ్యెల, రూ.ఆందోళిక, వికృ.అందలము.
అందరు అందలం(పల్లకీ)ఎక్కే వారే ఐతే, మోసే వారెవ్వరు ? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి(సవారీ) మోత.
ఆందోళము - 1.పల్లకి, 2.ఉయ్యెల, రూ.ఆందోళిక, వికృ.అందలము.
ఆందోళనము - 1.డోలి ఊగుట, 2.(వింజామరము మొ.వి.) విసరుట, 3.ఉయ్యెల, 4.(వ్యావ.) కలత.
ఆందోళించు - క్రి.1.ఊగులాడు, చంచలమగు, 2.డోలాయమానమగు, సంశయించు.
ఉయ్యలపులుఁగు - సారసపక్షి.
సారసము - 1.తామర, 2.బెగ్గురుపక్షి.
లాలి - ఉయ్యెల.
ఉయ్యెల - ఉయ్యాల; ఉయ్యల - ఉయాల; ఉయ్యేల - ఉయ్యాల.
ఊయల - (గృహ.) చంటిబిడ్డలను పరుండబెట్టు తొట్టె, బట్టతోగాని, వలతోగాని కట్టిన ఊయెల, రూ.చూ.ఉయాల, (Cradle).
ఉయాల - డోల, రూ.ఉయేల, ఉయ్యల, ఉయ్యెల, ఉయ్యేల, ఊయల, ఊయేల.
ఉయ్యాల - ఊగెడి డోల, రూ.ఊయెల.
దోల - డోల, ఉయ్యాల.
దోల - డోల, ఉయ్యాల.
డోల - ఉయ్యాలవంటి అందలము, తొట్ల, ఉయ్యాల.
తొట్టియల - బిడ్డల పరుండబెట్టు ఉయ్యెల, రూ.తొట్టెల, తొట్ల, తొట్టియ, తొట్టె.
తొట్టె - తొట్టియ; తొట్టియ - 1.నేయువాడు నూలుకండె నుంచుకొనునాడె, 2.ఉయ్యాలతొట్టె.
ప్రేంఖ - 1.డోల, 2.పర్యటనము, 3.నృత్యము, 4.అశ్వగతి.
ఫ్రేంఖనము - 1.ఊగుట, 2.పర్యటనము, 3.ఒకేపాత్రము గల రూపము.
ఫ్రేంఖితము - ఊగింపబడినది.
రింఖ - 1.గుఱ్ఱపుడెక్క, 2.అశ్వగతి విశేషము, 3.నృత్యము.
రింఖణము - జారుట, స్ఖలనము, రూ.రింగణము.
ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు - ప్రేక్షకుడు, చూచువాడు.
సామాజికుఁడు - 1.సమాజమందుండువాడు, 2.సభ్యుడు, 3.ప్రేక్షకుడు.
ప్రాశ్నికుఁడు - సభ్యుడు, విణ.ప్రశ్నచేయువాడు.
యజ్ఞపురుషుఁడు - విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఇవి పంచ యజ్ఞములు, వికృ. జన్నము.
యజతే యజ్ఞః యజ దేవపూజాసంగతి కరణదానేషు. - పూజించుట.
ఇష్టి - 1.యజ్ఞము, 2.యజ్వ, 3.కోరిక, 4.(వ్యాక.) పతంజలి అభిప్రాయమును తెలుపు వాక్యము, 5.సంగ్రహ శ్లోకము.
ఇష్టము - 1.యజ్ఞ కర్మము, 2.సంస్కారము, 3.యజ్ఞము, 4.కోరిక, విణ.1.కోరబడినది, 2.ప్రియమైనది, 3.పూజింపబడినది.
ఇష్టుఁడు - 1.ప్రియుడు, 2.ఆప్తుడు, 3.విష్ణువు.
ప్రియుఁడు- ప్రాణనాథుడు. జీవితేశుఁడు - 1.ప్రాణనాథుడు, 2.యముడు.
ఆప్తుఁడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.
ఆప్తప్రత్యయితౌ సమౌ,
ఆప్నోతి రహస్య మిత్యాప్తః, ఆప్ ఌ వ్యాప్తౌ. - రహస్యమును బొందువాఁడు.
పు. ప. త్రి. ప్రత్య విశ్వాసో (అ)స్య సంజాతః, ప్రత్యయితః. - విశ్వాసము ఇతనియందుఁ బుట్టును. ఈ 2 ఆప్తుని పేర్లు.
ప్రియో భవతి దానేన ప్రియవాదేన చాపరః |
మంత్రమూలబలేనాన్యః యః ప్రియః ఏవ సః ||
ఒకడు దానం చేసి ప్రియుడవుతాడు. మరొకడు ప్రియంగా మాట్లాడి ప్రియుడవుతాడు. ఇంకొకడు మంత్రబలంచేతకాని మూలబలంచేతకాని ప్రియు డవుతాడు. కాని సహజంగా ప్రియమైనవాడు ఎప్పుడు ప్రియుడే.
2. సవము - యజ్ఞము, జన్నము.
సూయతే సోమో స్మిన్నితి సవః. షుఞ్ అభిషవే. - దీనియందు సోమము తడపబడును.
సవనము - యజ్ఞము.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజనః.
ౙన్నపుఁజుక్క - మఘా నక్షత్రము, పదియవ(10వ) నక్షత్రము.
ౙన్నపుగొంగ(గొంగ - శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.
క్రతుధ్వంసి - శివుడు, వ్యు.దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.
జన్నపుఁబొజ్జ - ఋత్విజుడు.
ఋత్విజుడు - ఋత్విక్కు.
ఋత్విక్కు - యజ్ఞకర్త(యష్ట - యజ్ఞకర్త)వలన ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు, యాజకుడు, రూ.ఋత్విజుడు.
యాజకుఁడు - యాజ్ఞికుడు.
యాజ్ఞికుఁడు - 1.పురోహితుడు, 2.యజ్ఞమును నడుపువాడు.
పురోహితుఁడు - 1.యాజ్ఞికుడు, 2.పౌరోహిత్యము చేయు బ్రాహ్మణుడు.
స్తేయుఁడు - 1.తీర్పరి, 2.పురోహితుడు, విణ.మిక్కిలి స్థిరుడు.
తీర్పరి - న్యాయధిపతి.
దక్షిణ - 1.కుడిదిక్కు, 2.యజ్ఞము మున్నగు వానిలో ఋత్వికులు మొదలగు వారి కిచ్చు ధనము, రూ.దక్షిణము.
సవము - సగము, సం.సామి.
సవము - యజ్ఞము, జన్నము.
వల్లభుఁడు - ప్రియుడు, స్వామి.
వల్లభము - మేలుజాతి గుఱ్ఱము, విణ.ప్రియమైనది.
వల్లతి ప్రీణాతీతి వల్లభం, వల్ల ప్రీతౌ. - ప్రీతిని గలుగఁజేయునది.
త్రి ప్వధ్వక్షే (అ)పి వల్లభః,
వల్లభశబ్దము అధ్యక్షునికిని, అపిశబ్దమువలన ప్రియమైనదానికిని పేరు. వల్లతీతివల్లభః త్రి, వల్లప్రీతౌ. - సౌత్రో (అ)యం ధాతుః, ప్రియమును జేయునది, "వల్లభస్తు ప్రధానాశ్వ" ఇతి శేషః.
సామి - 1.స్వామి, 2.రాజు, 3.పెనిమిటి, 4.కుమారస్వామి, సం.స్వామి.
స్వ మైశ్వర్య మస్యాస్తీతి స్వామీ, నాంతః - సొమ్ము గలవాఁడు.
స్వామి - 1.ఒడయడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.
ఒడయఁడు - 1.మగడు, 2.ప్రభువు, రూ.ఒడయుఁడు.
స్వామిని - అధికారిణి.
స్వామినో దేవృదేవరో :
భ్రాతృజాయాభిస్సహ పరిహాసేన దీవ్యతి క్రీడతే దేవా. ఋ. పు. దేవరవ్చ - అన్నదమ్ములభార్యలతో పరిహాసముచేఁ గ్రీడించువాఁడు.
ఈ ఒకటి మగనితోఁబుట్టినవారు, బావలు, మఱఁదులును(మరుదులు).
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్రుడు, దేవసేనాపతి. వికృ.కొమరసామి.
స్కందుఁడు - కుమారస్వామి.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు, కుమారస్వామి. సదా బాలత్వాత్ కుమారః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాడు.
స్వామిమలై క్షేత్రంలో కుమారస్వామిని గురునాథుడని పిలుస్తారు.
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః|
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||
3. అధ్వర్యము - 1.హింసారహితము, 2.సావధానము, వి.1.యజ్ఞము, 2.సోమయాగము, 3.ఆకాశము.
అధ్వానం వైదికమార్గం రాతి అధ్వరః. రా దానే. - వైదిక మార్గము నిచ్చునది.
అధ్వరుఁడు - యాగమునందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, రూ.అధ్వర్యుడు.
4. యాగము - యజ్ఞము.
యజనం యాగః. యజదేవ పూజాదౌ - పూజించుట.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతు రాజము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచ యజ్ఞములు). వికృ.జన్నము.
ఐకాహికము - 1.ఇకేదినమున సాధ్యమైనది (యాగము), 2.ఒకదిన ముండునది.
యజ్వ - విధ్యుక్తముగా యజ్ఞము చేసినవాడు.
యాగము - యజ్ఞము; యియక్షువు - యాగము చేయకోరువాఁడు.
దేవానాంప్రియము - మేక, యజ్ఞము లందు దేవతల కర్పింపబడును గాన.
శసనము - యజ్ఞమందలి పశువధము. యజ్ఞయాగాది క్రతువులకు కలియుగంలో అంత ప్రాధాన్యత లేదు. జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు...
యూపము - యజ్ఞ మునందు పశుబంధనార్థము నాటిన పై పట్టలలేని పాలకొయ్య.
చషాలము - యూప స్తంభమూందలి కొయ్య కడియము.
కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మక్షర సముద్భవమ్ |
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ || - 15శ్లో కర్మయోగః
భూతజాలములు అన్నమునుండి ఉత్పన్నమగుచున్నవి (అన్నము రక్తమై యీ రక్తమే స్త్రీ పురుషులయందు శుక్రశోణితములుగా పరిణమించి వాటి సంయోగమువలన భూతములు జనించును). అన్నము వర్షమువలన లభించును. వర్షముకురియుటకు యజ్ఞము కారణము. కర్మకాండ యజ్ఞములకాధారము. వేదము కర్మకాండ నాదేశించును. వేదము పరబ్రహ్మము నుండి వెలుబడినది. కావున నిత్యము చేయబడు యజ్ఞక్రియలయందు సర్వవ్యాపకుడగు పరమాత్మ సుప్రతిష్ఠుడై యున్నాడు.
అనగా ప్రతి యజ్ఞకర్మము స్వార్థరాహిత్యమలపచుటచే పరమేశ్వర స్థితికి సన్నిహితమొనర్చును. - భగవద్గీత
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || – 14శ్లో
క్రతు రాజము - రాజసూయ యాగము.
రాజసూయము - ఒక రాజు తక్కిన రాజుల గెలిచి చేసెడు యజ్ఞము. రాజసూయ యాగంలో ప్రధాన దేవత వరుణుడు.
రత్నిన్ - ప్రాచీనార్యుల కాలమున రాజసూయ యాగము చేయునపుడు రాజుతో సమానముగా కొన్ని యజ్ఞ విధులందు పాల్గొను అధికారులు. (సేనాని, గ్రామణి, భాగదూఘ, క్షత్రియ, గోవి కరతనుడు, పాలగాలుడు, తక్షుడు, రథకారుడు మొ||) ఆహవము - 1.యుద్ధము, 2.యజ్ఞము.
బ్రహ్మయజ్ఞము - వేదపాఠము.
పాఠము - 1.చదువు, 2.వేదపాఠము.
ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.
పఠనము - చదువు.
విద్దె - చదువు, విద్దియ, సం.విద్యా.
విద్య - 1.చదువు, 2.జ్ఞానము. మంచి విద్య గలిగిన ధనము పనిలేదు.
జ్ఞానము - 1.తెలివి(వివేకము, ప్రకాశము), 2.ఎరుక. (జాతీ. ఎరుక పిడికెడు ధనము - దాచుకొన్న సొమ్ము.)
సంత - 1.నిర్ణయింపబడిన దినమున నుంచెడుబజారు, 2.వేదపాఠము, వి.చెంత. చెంత - చేరువ, సమీపము.
తొలిచదువులు - వేదములు.
పాఠో హోమ శ్చాతి థీనాం సపర్యా తర్పణం బలిః,
ఏతే పఞ్చ మహాయజ్ఞా బ్రహ్మయజ్ఞాది నామకాః. :
పాఠదయః బ్రహ్మయజ్ఞాదినామకాః పంచ మహాయజ్ఞాస్స్యుః. - వేదపాఠము, వైశ్వదేవాది హోమము, అతిధిపూజ, పితృతర్పణము, భూతబలి అను నీ ఐదు(5)ను పంచమహా యజ్ఞము లనంబడును.
మహాఫలయజ్ఞ త్యాన్మహాయజ్ఞాః. పంచచ తే మహాయజ్ఞాశ్చ పంచమహాయజ్ఞాః. - గొప్ప ఫలముగలవి పంచ మహా యజ్ఞములు 'పూజా, సప, ర్యాధ్యయనం, బ్రహ్మ, యజ్ఞస్తు, తర్పణమ్, హోమో, దైవోబలి, ర్భౌతో, నృ యజ్ఞఓ తిథిపూజన ' మితి స్మృతిః.
ఇవి పంచమహాయజ్ఞములు - వేదపాఠము, బ్రహ్మయజ్ఞము, హోమము, దేవయజ్ఞము, అతిథిపూజనము, మనుష్యయజ్ఞము, పితృతర్పణము, పితృయజ్ఞము, భూతబలి, భూతయజ్ఞము ఇవి.
ౘదువులవేలుపు - బ్రహ్మ.
ౘదువుల ముదకుఁడు - బ్రహ్మ.
ౘదువులపడతి - సరస్వతి. పడఁతి - స్త్రీ, రూ.పణఁతి.
ౘదువులయ్య - ఉపాధ్యాయుడు.
ఉపాధ్యాయుఁడు - చదువు చెప్పువాడు.
చదువు పేదవానికి పెన్నిధి, సంపన్నునికి గౌరవం, యువతకు బలం, ముసలివారికి ఆసరా. - లావెటర్
అధ్యాపనము - వేదమును చదివించుట.
అధ్యాయము - 1.చదువుట, 2.వేదపఠనార్హ కాలము, వ్యతి.అనధ్యాయము, 3.వేదపాఠము, 4.గ్రంథభాగము.
అధ్యయనము - 1.గురుముఖమున వేదము చదువుట, 2.చదువుట.
అధ్యాపకుఁడు - 1.వేదములను చదివించువాడు, 2.చదువు చెప్పువాడు, గురువు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
బ్రహ్మణ్యము - వేదపాఠభూమి.
బ్రహ్మాంజలి - వేదాధ్యయమున కాలమందలి మ్రొక్కు.
బ్రహ్మబిందువు - వేదపాఠమందలి నోటితుంపర.
బ్రహ్మభూయము - బ్రహ్మత్వము.
బ్రాహ్మ్యము - 1.ఒక తరగతి వివాహము, 2.బ్రహ్మత్వము.
బ్రాహ్మ్యము - బ్రహ్మ సంబంధమైనది, వి.విద్యయు నాచారమును గల వరుని పిలిచి వధూసహితముగ వస్త్రాదులచే నలంకరించి పూజించి, కన్య నిచ్చి చేయు వివాహము.
అగ్నిహోత్ర ఫలావేదా విత్తభుక్త ఫలంధనమ్|
రతిపుత్త్ర ఫలా దారాః శీలవృత్తి ఫలం శ్రుతమ్||
తా. వేదము చదివినందు కగ్నిహోత్రము చేయుటయును, ధనము కలిగినందుకు దాన భోగములును, భార్య(దార-భార్య)యున్నందుకు సంగమ సంతానములును, శాస్త్రమును విన్నందు కాచారవంతుడగుట యు ఫలము. - నీతిశాస్త్రము
చదువు వలననె జ్ఞానము కుదురుగాదు
సాధనం బున్న మాత్రనే చక్కనౌనె
మనసు నిలుపంగ నన్నియు ననువు గనును
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడు విధములైన రక్షకము, రూ.ఏడ్గడ.
ఉద్వాహుఁడు - 1.పైకెత్తువాడు, 2.మోయువాడు, 3.పితృదేవతలను నరకము నుండి రక్షించువాడు, కుమారుడు.
పుత్రకామేషి - పుత్రునికోరి చేయు యాగము.
పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు:- ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు).
పున్నమ్నో నరకాత్త్రాయత ఇతి పుత్రః, త్రైఙ్ పాలనే. - పుంఅనెడి నరకముల వలన రక్షించువాఁడు.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుండు జన్మించి నపుడు పుట్టదు జనులా
పుత్రుని గనుకొని పొగడగ
బుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తా. నీతిమంతుడు తనపుత్త్రుడు జన్మించగా ఆనందం పొందడు, ప్రజలు ఆ కుమారుని ఉత్తమగుణములు చూచి పొగడు దినమున ఆతండ్రి పుత్రోత్సాహమును పొందును.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మజ -
ఆత్మనః జాయతే ఆత్మజః, జనీ ప్రాదుర్భావే. – తనవలన బుట్టిన వాఁడు.
ఆత్మ్యైవ పుత్రత్వేన జాయత ఇత్యాత్మజః - తానే పుత్రరూపముగా జనించువాఁడు.
అతనుఁడు - మన్మథుడు, విణ.అధికుడు, గొప్పవాడు.
గృత్సుఁడు - మన్మథుడు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మని మనసి భవ్తి త్యాత్మభూః ఊ-పు. - మనస్సున బుట్టినవాఁడు.
ఆత్మనా స్వయమేవ భవతీతివా - తనంతతనే పుట్టువాఁడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం, మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మారుఁడు - మన్మథుడు.
మారయతి విరహిజనం మారః - విరహిజనులను జంపువాడు, మృఙ్ ప్రాణత్యాగే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
స్మేరచారు ముఖమండలాం విమలగండలంబి మణికుండలాం
హారదామపరిశోభమాన కుచభార భీరు తను మధ్యమాం
వీరగర్వహరనూపురాం వివిధకారణేశ వరపీఠికాం
మారవైరి సహచారిణీం మనసిభావయామి పరదేవతాం| - 3
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివి తేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ. మది.
మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
సదాతనుఁడు - 1.విష్ణువు, 2.శాశ్వతుడు.
బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు Sun, రూ.ప్రసూనుడు.
మాతా ఏనం సూయతే సూనుః, పు. షూఙ్ ప్రాణిప్రసవే. - తల్లి వీనిని గనును.
సూనువు - 1.కొడుకు, 2.కూతురు.
యవీయసుఁడు - 1.తమ్ముడు, 2.చిన్నవాడు.
యవీయసి - చెల్లెలు.
తనయుఁడు - కొడుకు.
కులం ముదం వా తనోతీతి తనయః, తను విస్తారే. - కులముగాని సంతోషమునుగాని(ముదము - సంతోషము)విస్తరింపఁజేయువాఁడు.
తనయ - కూతురు.
తన - ఆత్మార్థకము.
పార్థివే తనయే సుతః,
సుతశబ్దము రాజునకును, కొడుకునకును పేరు. సౌతీతి సుతః, షుప్రసవైశ్వర్యయోః. - ఐశ్వర్యమును బొందించువాఁడు, పుట్టినవాఁడును గనుక సుతుడు.
సుతుఁడు - కొడుకు.
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును.
సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు.
తనువు - 1.దేహము, 2.తోలు, విణ.1.చిన్న, సన్న.
తన్యతే ఆహారేన తనుః, ఉ. సీ. తనూశ్చ, ఊ. సీ. తనువిస్తారే. - ఆహారముచేత విస్తారము చేయఁబడునది.
తను శబ్దము నకారాంత నపుంసకంబును గలదు, 'తను షేతను షేక ' మితి వాసవదత్తా.
తను కోశములు - (జం.) పునరుత్పత్తి క్రియ కాక శరీరములో తక్కిన జీవిత వ్యాపారములతో సంబంధము కల జీవ కణములు (Somatic or body cells.)
తనుజుఁడు - కుమారుడు, రూ.తనుజుఁడు, తనూభవుడు.
తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనముచేసి శరీరము పడకుండ కాపాడునది.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
సదా బాలత్వాత్ కుమరః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాఁడు.
కుత్సితాన్ మారయతీతి వా - కుత్సితుల సంహరించువాఁడు.
మృఙ్ప్రాణత్యాగే, కౌ పృథివ్యాం మార్యతి మన్మథవ దాచరతీతి వా - భూమియందు మన్మథునివలె సుందరుఁడైనవాఁడు.
కౌ పృథివ్యాం మాం లక్ష్మీం రాతి దదాతీతి వా - భూమి యందు సంపద నిచ్చువాఁడు.
రాదానే, సదా బ్రహ్మచారిత్వా ధ్వా - ఎల్లప్పుడు బ్రహ్మచారి గనుక కుమారుఁడు.
స్కందుఁడు - కుమారస్వామి.
స్కందయతి శత్రూన్ శోషయతీతి స్కందః - శత్రువుల శోషింపజేయువాఁడు.
దేవస్త్రీదర్శదీశ్వర రేతసః స్కందతీతి స్కందః - దేవస్త్రీ దర్శనమువలనఁ వదలిన యీశ్వర రేతస్సువలనఁ బుట్టినవాఁడు. స్కదిర్ గతిశోషణయోః. ద్వితీయః స్కంద ఏవ చ|
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
కొమరసామి - స్కందుడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
దేవసేనాం నయతి ప్రాపయతి సేనానీః, ఈ-పు. - దేవసేనను నడిపించువాఁడు.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కున్నడు - బాలుడు, బిడ్డడు.
చిన్నవాడు - బాలుడు.
ఔరసుఁడు - ధర్మపత్ని యందు పుట్టిన కొడుకు.
ముద్దయ్య- (ముద్దు + అయ్య)కుమారస్వామి.
ముద్దు - 1.ప్రేమము, ఆదరము, 2.మనోజ్ఞత, 3.చుంబనము.
లాలనము - బుజ్జగము, ముద్దుచేయుట.
లాలనము - అధికేచ్చ, ఔత్సుక్యము. ఔత్సుక్యము - ఉత్సకత్వము.
బు(ౙ)జ్జగము - ఇచ్ఛకము, ఉపలాలనము.
ఉపలాలనము - బుజ్జగించుట.
ఇచ్చ(ౘ)కము - 1.ముఖప్రీతి, ముఖస్తుతి, 2.ప్రియవచనము, విణ.ప్రియము, ప్రీతికరము.
ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చువెలగలది.
ప్రియంవదుఁడు - ఇచ్చక మాడువాడు, ప్రియవాది.
ఇచ్చకాలమారి - ఇచ్చకాలాడువాడు, ముఖస్తుతి చేయు స్వభావము కలవాడు.
ఇచ్చగొండి - ఇచ్చకాలమారి.
ముద్దాడు - చుంబనాది పూర్వకముగా లాలనచేయు, ఆదరించు.
చుంబనము - ముద్దు. లాలిత్యభావము - లలిత భావము.
లాలన వలన పుత్త్రుడును, దుష్టపుత్రుని వలన కులంబును నశించును.
వాత్సల్యము - (గృహ.) పుత్రాదులందు గల ప్రేమము, మాలిమి.
మాలిమి - 1.ప్రేమము, వాత్సల్యము, 2.ఓడనడుపు శాస్త్రము.
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |
టకము - 1.ఇష్టము, 2.కౌమారము.
ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చు వెలగలది.
ఇష్తము - 1.యజ్ఞకర్మము, 2.సంస్కారము, 3.యజ్ఞము, 4.కోరిక, విణ.1.కోరబడినది, 2.ప్రియమైనది, 3.పూజింపబడినది.
ఇష్టి - 1.యజ్ఞము, 2.యజ్వ, 3.కోరిక, 4.(వ్యాక.) పతంజలి అభిప్రాయమును తెలుపు వాక్యము, 5.సంగ్రహశ్లోకము.
ఇష్టి ర్యాగేచ్ఛయోః -
ఇష్టిశబ్దము యాగమునకును ఇచ్ఛకును, పేరు. ఇజ్యత ఇతి ఇచ్ఛాచ ఇష్టి, సీ. యజ దేవపూజాసంగతికరణదానేషు, ఇషు ఇచ్ఛాయాం. - యజించుటయును, ఇచ్ఛయించుటయు గనుక ఇష్టి.
వాంఛ - కోరిక.
వాంఛితము - కోరబడినది.
కౌమారము - మూడవయేడు మొదలు పదునారేండ్ల(3-16వ) వరకునైన ప్రాయము.
యుక్తవయస్కుఁడు - (గృహ.) పదుమూడు పందొమ్మిది(13-19) సంవత్సరములకు నడుమ వయస్సు గలవాడు, (Adolsecent).
యువ - 60 సంవత్సరములలో తొమ్మిదవది, విణ.వయసువాడు.
మెజారిటి - (Majority) 1.అధికభాగము, అధిక సంఖ్య, అధిక సంఖ్యాక పక్షము, 3.యుక్తవయస్సు.
మెజారిటీ వయస్సు - (శాస.) వ్యవహార యోగ్యమైన వయస్సు, తనకు సంబంధించిన వ్యవహారముల విషయములలో శాసనరీత్యా వ్యవహరింపగల వయస్సు.
రాజవత్సంచ వర్షాణి, దశవర్షాణి దాసవత్ |
ప్రాప్తేతు షోడశేషవర్షే పుత్త్రంమిత్త్ర సదాచరేత్ ||
తా. పుత్త్రుని యైదేండ్ల(5సం.) పర్యంతము రాజు వలెను, పిమ్మట పదేండ్ల(10సం.)పర్యంతము దాసుని వలెను, పదియాఱేండ్లు(16సం.) మొదలు కొని స్నేహితుని(మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు.)వలెను చూడ వలయును.- నీతిశాస్త్రము
5. సప్తతంతువు - యజ్ఞము.
సప్తభిశ్ఛందో భిస్తన్యత ఇతి సప్తతంతుః, ఉ. పు. తను విస్తారే. - ఏడు ఛందస్సులచేత విస్తరింపఁ బడునది.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ, దేవతలలో పెద్దవాడు.
సురాణం జ్యేష్ఠః సుర జ్యేష్ఠః - దేవతలలోఁ బెద్దవాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
జ్యేష్ఠుడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రణి - శ్రేష్ఠుడు, మొదటివాడు.
అగ్రిముఁడు - మొదటివాడు.
అగ్రమస్తిష్కము - (జం.) మెదడులో మొదటిభాగము (Prodence phalona or forebrain).
అగ్రనరుఁడు - అగ్రగామి; అగ్రేసరుఁడు - అగ్రగామి.
అగ్రగామి - ముందు నదుచువాడు, (గృహ.) ఒక వస్తువుగా తయారగుటకు దానికి ముందున్నస్థితి, ఉదా.కెరొటిన్ శరీరములో విటమిన్ vitamin 'A' గా మార్పబడును, కనుక విటమిన్ vitamin 'A' కి అగ్రగామి కెరొటిన్.
కెరోటిన్ - (గృహ.) (Carotene) పసుపు పచ్చని పదార్థము 'ఏ' విటమిన్ తయారగుటకు కావలసిన పదార్థము (ఇది కనుల బలహీనతను నిరోధించును.)
అగ్రజుఁడు - 1.బ్రహ్మ, 2.బ్రాహ్మణుడు, 3.అన్న.
బ్రహ్మణో ముఖే అగ్రే జన్మాస్యేతి అగ్రజన్మా. న. పు. - బ్రహ్మయొక్క ముఖమందు మొదటి జన్మము గలవాడు.
పూర్వజ స్త్వగ్రియా (అ)గ్రజః,
పూర్వస్మిన్ కాలే జాతః పూర్వజః, 1. అగ్రే భవః అగ్రియః, 2. అగ్రేజాత అగ్రజః, జనీప్రాదుర్భావే. - తనకంటె ముందరఁ బుట్టినవాఁడు. ఈ 3 పెద్దయన్న పేర్లు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త.
ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.వి., సొత్తు.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్.
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠం - క్షత్రియాణాంతు వీర్యంతః|
వైశ్యానాం ధాన్యధనత - శ్శూద్రాణా మేవ జన్మతః||
తా. బ్రాహ్మణులలో జ్ఞానము గలవాడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమవంతుఁడు పెద్ద, వైశ్యులలో ధనధాన్యము గలవాఁడు పెద్ద, శూద్రులలో వయోధికుఁడు పెద్దయని భావము. – నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||
అన్న - జ్యేష్ఠసోదరుడు.
అన్నకోశము - (జం.) అహారపు గొట్టమునకు క్రిందిభాగములో ఉన్న సంచివంటి ఒక అంగము (Stomach).
అన్నగృహము - (జం.) ముఖ్యముగా కీటకముల లోను, పక్షులలోను అన్న వాహికలో ఉబ్బి యుండు ముందు భాగము (Crop).
క్రమాకుంచనము - (గృహ.) అన్నకోశములో కెరటములవలె చలనమువలన ఆహారము ముందుకు త్రోయబడుట (Peristalitic Movement).
బ్రహ్మవర్చస్సు - బ్రాహ్మణతేజము.
బ్రహ్మవర్చసము - సదాచారాధ్యయన సమృద్ధి.
భువి దివ్యతి బ్రహ్మవర్చసా భూదేవః దివు క్రీడాదౌ. - బ్రహ్మవర్చస్సుచేత భూమి యందుఁ బ్రకాశించువాఁడు.
విప్రుఁడు - బ్రాహ్మణుడు, పారుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు.
విశేషేణ పాపేభ్యః ఆత్మానం వరం చ పాతీతి విప్రః. పా. రక్షణే. - తన్నును పరునిని విశేషముగాఁ బాపమునుండి రక్షించువాఁడు.
అమంత్రణోత్సదావిప్రాః - గావో వనతృణో త్సవాః|
భర్తాగమోత్సవానార్యః - సోహంకృష్ణ రణో త్సవః||
తా. సహజముగా బ్రాహ్మణులకుఁ పరులయింటి భోజనము సంతోషకరము, గోవులకు పచ్చిగడ్డి సంతోషకర ము, పతివ్రతలకు దేశాంతరము పోయిన తమ పురుషుడు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు.)వచ్చుట సంతోషకరము, యుద్ధము నాకు సంతోషకరమని అర్జునుడు చెప్పెను. – నీతిశాస్త్రము
బ్రహ్మహత్య - విప్రుని చంపుట (మహాపాతకము లలో నొకటి).
ధర్మాధారా ధనాధ్యక్షా ధనదాన్యవివర్ధినీ|
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ.
బ్రాహ్మణ్యము - 1.బ్రాహ్మణ కర్మము, 2.బ్రాహ్మణ భావము.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.
బ్రాహ్మణములు - వైదిక ధర్మ గ్రంథములు, యజ్ఞగ్రంధములను, పురాణగాథలను చెప్పు ధర్మగ్రంథములు.
బ్రహ్మణిః పరబ్రహ్మణి విష్ఠావత్త్వాత్ బ్రాహ్మణః పరబ్రహమందు నిష్ఠగలవాఁడు.
బ్రహ్మణః కులే భవత్వాద్వా బ్రాహ్మణః బ్రహ్మకుల మందుఁ బుట్టినవాఁడు.
బ్రహ్మణ్యము - 1.బ్రాహ్మణులకు హితమైనది, 2.గంగరావి.
బ్రహ్మభూయము - బ్రహ్మత్వము.
అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||
తా. బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకల భూతములకు ద్రోహము(ద్రోహము - 1.కీడుతలపు, 2.చంపు నిచ్చ.)గలుగని వృత్తిచేత జీవించ వలయును. లేక భూతములకు స్వల్పపీడసేయు నట్టి వృత్తి చేతనైనను జీవింపవచ్చును. – నీతిశాస్త్రము
అబ్రహ్మణ్యము - బ్రాహ్మణునికి తగనిది (వధాదులు) వి.చంపవలదు అని (బ్రాహ్మణుఁడు) పెట్టుమొర.
అబ్రహ్మణ్య మవధ్యోక్తౌ -
బ్రహ్మణే హితం బ్రహ్మణ్యం శాంతతా, తన్నభవతీ త్యబ్రహ్మణ్యం. - బ్రాహ్మణునికి హితముకానిది. ఈ ఒకటి చంపఁదగనివాఁడనుమాట పేరు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, రూ.గురుఁడు.
అన1 - 1.అన్న, 2.చిగురు, 3.ఆనకట్ట.
అన2 - 1.అనుటకు, అనగా మొ.ని; ఉత్ప్రేక్షావాచకముగా ఉపయోగింప బడును.
అన్న - జ్యేష్ఠసోదరుడు.
ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించిన అడ్డంకి.
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట.
వారధి - వంతెన, అడ్డకట్ట (ఈ అర్థము తెలుగునందే).
వంతెన - ఏటిపైకట్ట, వారధి.
కట్టుగొమ్మ - అడ్దకట్ట, సేతువు. సేతువు - నీటికట్ట.
బరాజ్ - (వ్యవ., అర్థ, భూగో.) (Baraz) నీటిపారుదల వసతులకై నదిలోని నీరును భద్రము చేయుటకై కట్టిన కట్టడము.
గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించినదానికై విచారించుట.
పరమేష్ఠి - బ్రహ్మ.
పరమే ఉత్కృష్టే పదే బ్రహ్మ లోకాఖ్యే తిష్టతీతి పరమేష్టీ-న-పు. - ఉత్కృష్ట స్థానమం దుండెడువాఁడు. స్థా గతినివృత్తౌ.
వలితండ్రి - ఆకసము. ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
మిను(ౘ)చూలు - వాయువు.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
వలి - 1.కంపము, 2.శైత్యము, సం.వి.కడుపుమీది ముడుత, ముడుత.
వళి - కడుపుమీది ముడుత.
వలిముఖము - వానరము.
శ్లథం చర్మవళీ, సా ముఖే (అ)స్య వలీముఖః - తఱులు గల ముఖము గలది, లళయోద భేదః.
తఱుల మెకము - కోతి monkey, వలీముఖము, రూ.తఱుల మోర మెకము, (ముడుతలు మొగమున గల జంతువు).
వలినో వలిభ స్సమౌ,
వళయః అస్య సంతీతి వలినః, వలిభశ్చ - తఱులు గలవాఁడు. ఈ 2 తఱులుగలవాని పేర్లు. ముదిమిచేత వదలి ముడతలుపడిన చర్మము గలవాఁడు.
వలిమొలక - భీమసేనుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.
మారుతి - 1.స్వాతీ నక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
11. శ్రాద్ధదేవుఁడు - యముడు.
శ్రాద్ధస్య దేవః శ్రాద్ధదేవః - పితృకర్మమునకు దేవుఁడు.
శ్రాద్ధము - పితృకర్మము, వ్యు.శ్రద్ధతో కూడినది. విరచిత నిజపితృకర్మక రామ్|
పలపైతృకము - శ్రాధమున మాంసము నుపయోగించు పూర్వకాలపు కర్మ.
పలము - 1.నిష్కము, మూడు తులములు, 2.మాంసము.
శ్రాద్ధం తత్కర్మ శాస్త్రతః,
శ్రద్ధయో దీయతే శ్రాద్ధం. - శ్రద్ధచేత నియ్యఁబడునది. ఈ ఒకటి శాస్త్రోక్తమైన దేశకాలపాత్రాది నియమముచేత నా పితృదేవతలను గూర్చి చేయఁబడు బ్రాహ్మన భోజనాదికము, తద్దినము.
తద్దినము - 1.ఆదినము, 2.మృతి పొందిన దినము, 3.అబ్ధికము పెట్టుదినము.
శ్రాద్ధం పితృభ్యో న దదాతి దైవతాని న చార్చతి |
సుహృన్మిత్రం న లభతే తనూహుర్మూఢ చేతసమ్ ||
పితరులకు శ్రాద్ధం పెట్టడు. దేవతల్ని పూజించడు. మంచి హృదయం గల మిత్రుణ్ణి పొందడు. అలాంటివాణ్ణి మూడబుద్ధి అంటారు.
తతో మమః శ్రాద్ధదేవః సంజ్ఞాయామాన భారత|
శ్రద్ధయాం జనయామాన దశ పుత్రాన్ స ఆత్మవాన్|
పితృయజ్ఞము - తల్లితండ్రులకు చేయు అంత్యకర్మ.
తర్పణము - 1.తృప్తి, 2.పితృయజ్ఞము.
ప్రీణనము - తృప్తి పుటించుట.
అవనము - 1.కాపాడుట, 2.తృప్తి పరచుట, 3.తృప్తి, 4.కోరిక. విరచిత నిజపితృకర్మక రామ్|
తర్పణం ప్రీణనావనే,
తృప్యతే (అ)నేన భోక్తేతి తర్పణం. తృప ప్రీణనే. ప్రీయతే అనేన ప్రీణనం ప్రీఞ్ తర్పణే. అవ్యతే అనేన అవనం. అవ రక్షనాదౌ. - దీనిచేత భోక్త తృప్తిఁ బొందింపఁబడును గనుక తర్పణము, ప్రీణనము, అవనమును. ఈ 3 తృప్తి బొందించుట పేర్లు.
ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ, 4.తృప్తి.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను భావము.
అపేక్ష - కోరిక, కాంక్ష.
కాంక్ష - కోరిక, వాంఛ.
కాంక్షితము - కోరబడినది.
అనుక్రోశము - కనికరము. దయ - కనికరము.
ఆదట2 - అనంతరము, పిమ్మట.
అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి.వి. పిమ్మట, వి.సామీప్యము.
అవ్వల - అవల; ఆవల - 1.ఆప్రక్క, 2.(దేశకాలము లందు) అనంతరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content).
ఔర్థ్వదేహికము - చచ్చినవారికి చేయబడు కర్మకు సంబంధించినది.
అపరక్రియ - చచ్చినవారికై చేయు కర్మము.
దశాహము - మృతినొందిన వానికి పదియవనాడు చేయు శ్రాద్ధము.
ఏకాహము - 1.ఒకదినము, 2.మృతి నొందిన వానికి పదునొకండవ దినమున జేయు శ్రాద్ధము, 3.ఒక రోజున జేయు ఉత్సవము.
సాంవత్సరీకము - ఆబ్దికము, విణ.సంవత్సరాంతమున జరుగునది.
ఏఁడుది - చనిపోయినవారికి మొదటి సంవత్సరము జరుపు ఆబ్దికము.
ఆబ్ధికము - తద్దినము, మరణించిన వారికి ప్రతి సంవత్సరము అతిథియందు చేయు కర్మము, వ్యు.అబ్దమున కొకసారి చేయబడునది.
తద్దినము - 1.ఆదినము, 2.మృతి పొందిన దినము, 3.అబ్ధికము పెట్టుదినము.
పొత్తర - 1.ఆకులు పూలు లోనగు వాని కట్ట, 2.పితృకార్యము లందు బ్రాహ్మణుల కిచ్చు బియ్యము మొ.వి గల విస్తరి, సం.పత్రమ్.
ఆమద్రవ్యములు - పొత్తర యందుంచు కాయగూరలు, బియ్యము, తాంబూలము మొ. వస్తుసముదాయము.
పలపైతృకము - శ్రాద్ధమున మాంసము నుపయోగించు పూర్వకాలపు కర్మ.
బ్రాహ్మణార్థము - పితృకార్యము లందు భోజనమునకు పోవుట.
భోక్త - 1.భుజించువాడు, 2.బ్రాహ్మణార్థము చేయువాడు.
భుజి - అగ్ని, వ్యు.సర్వమును భుజించువాడు.
సుకలుఁడు - దాతయు భోక్తయు నైనవాడు.
వికిరము - 1.ఖండము, 2.పక్షి, 3.శ్రాద్ధకాల మందు నిమంత్రికులు భుజించిన పిదప విస్తరికి ముందు వేసెడు అన్నాదికము, 4.నూయి.
వికిరతి భక్ష్యమితి వికిరః, విష్కిరశ్చ, కౄవిక్షేపే. - మేతఁకు యోగ్యమైన పదార్థములను జల్లునది.
ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను
అంటనియ్యక శని వెంట దిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వ.
తా|| ఎన్నిచోట్ల తిరిగి యెన్ని కష్టములుబడినను, లాభము కలుగ నీయక శని(Saturn) వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైన తినువారు క్రొత్తవారు కాదు గదా.
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయంచిత్తుడు, జ్ఞాతిరేతుడు).
సపిండీకరణము - చచ్చిన పండ్రెవ దినమున చేయు శ్రాద్ధము.
సపిణ్డాస్తు సనాభయః,
సమానః ఏకః పిండః పిండప్రదాన మేషామితి సపిండాః - సమానమైన పిండప్రదానము గలవారు.
సమానః ఏకః పిండః శరీరమేషామితి వా సపిండాః - ఒక్కటైన శరీరము గలవారు.
సమాన నాభిః మూలకారణం కూటస్థపురుషో యేషామితి సనాభయః, ఈ-పు. - సమానమైన కూటస్థ పురుషుఁడు గలవారు. ఈ 2 ఏడు తరములకు లోఁబడిన జ్ఞాతుల పేర్లు.
సనాభి - జ్ఞాతి, విణ.సమానుడు.
స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.
తార్వణము - పిండప్రదానము, విణ.సర్వసంబంధమైనది.
నివాపము - పితరుల నుద్దేశించిన తిల తర్పణాది కర్మము, సం.వి. (జం.) మస్తిషములో దృక్ స్వాస్తికము వెనుక మధ్య మస్తిష్కము యొక్క అడుగు భాగము రెండు తమ్మెలు సొట్టపడి యుండు భాగము (Infundibulum).
నివాపరూపము - (జం.) గరాటు వలె నుండునది (Infundibuli form).
ప్రాచీనవీతము - కుడిభుజము మీదుగా ఎడమపార్శ్వమున వ్రేలాడు జందెము (పితృ కర్మలలో ఇట్లు వేసికొందురు).
బద్దె - 1.వస్త్రము మొదలు, 2.అపరకర్మము చేయునపుడు జందెము వలె వేసికొను వస్త్ర ఖండము (బద్దియ), సం.వస్తిః, పట్టికా.
వస్తి - 1.బద్దె, 2.పొత్తికడుపు.
కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.
కూయతే పితృభిః స్తూయత ఇతి కవ్యం, కు శబ్దే. - పితృదేవతలచేత స్తోత్రము చేయఁబడునది.
పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద, 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్డ, 3.అగ్ని, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.
గర్భాశయో జరాయుః స్యాత్ -
గర్భ ఆశేతే త్ర గర్భాశయః శీజ్ స్వప్నే. - గర్భము దీని యందుండును.
గర్భనిష్క్రమణానన్తరం జరాం జీర్ణతా మేతి జరాయుః. ఉ. పు. ఇణ్. గతౌ. - గర్భము వెళ్ళిన పిమ్మట జీర్ణత్వమును బొందునది. స. జరాయుః. ఈ రెండు 2 మావి పేర్లు.
గర్భాశయము - (జం.) మావి, గర్భమును చుట్టుకొనియుండు సంచి, అండాశయ నాళము చివర ఉబ్బియుండు భాగము (Utterus). (అండము అభివృద్ధి చెందుటకై దీనిలో నిలిచియుండును).
జరాయువు - 1.మావి, 2.జటాయువు, (వృక్ష.) అండాశయములో బీజాండము లమరియుండు దిమ్మ, (Placenta).
అండలంబనస్థానము - (వృక్ష.) జరాయువు, అండాశయములో బీజాండములు అమర్చబడిన దిమ్మ (Placenta).
మామిడి - మామిడిచెట్టు, రూ.మావి.
ఆమ్రము - 1.మామిడి, చూతము.
చూతము - మామిడిచెట్టు; మాకందము - మామిడి చెట్టు.
మాఁగాయ - మామిడికాయ.
రసాలము - 1.చెరకు, 2.మామిడి.
ఆమ్ర శ్చూతో రసాలః -
అమ్యతే అభిలష్యతే ఆమరః. అమగత్యాదిషు. - అభిలషింపఁబడునది.
అమయతి రోగయతివా ఆమ్రః. ఆమరోగే. - రోగమును గలిగించునది.
చ్యోతతి ధనం ప్రసతీతి చూతః. ద్యుతిర్ క్షరణే. - రసమును స్రవించునది.
రసం అలాతీతి రసాలః. లా దానే. - రసము నిచ్చునది.
రసమలతి భూషతివా రసాల. అల భూషణాదౌ. - రసము నలంకరించునది. ఈ 3 మామిడిచెట్టు పేర్లు.
ప్రియాలము - ఒక విధమగు మామిడిచెట్టు, రూ.ప్రియాళువు.
అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు Mango fruit.
సహకారము - వ్యష్టి, సమిష్ఠి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి. తియ్య మామిడి చెట్టు.
వ్యష్టి - ప్రయోజనము. ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చుశక్తి (Utility).
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధంతము, వి. (అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తినిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో మూల్యమధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
ఉద్దేశము - 1.గురి, 2.తలంపు, 3.నిశ్చయము, 4.ఎత్తైన ప్రదేశము.
ఉద్దేశించు - క్రి.1.గుర్తించు, 2.అనుకొను.
పుల్ల విరుగుడు తెగులు - (వ్యవ.) చెట్ల కొమ్మలు, రెమ్మలు నీరసించి ఆకులు రాలిపోయి యెండిపోవుట (Die back disease) ఉదా. నారింజ, మామిడి మొ. ఇది యొకజాతి శిలీంద్రము వలన కల్గును.
ఫాలోఫియన్ గొట్టము - (గృహ.) గర్భకోశమునకు ఇరు ప్రక్కల గల నాళములు (Fallopian tube.) ఇందులో గర్భోత్పత్తియగును.
స్తంభసంయోగము - (వృక్ష.) అండాశయములో మధ్య నిలువుగా స్తంభమువలె నున్న జరాయువు (Placenta) పై బీజాండములు ప్రతి గదియందు ను అమర్చబడియుండు విధము ఊచకూర్పు, (Axile placentation).
గర్భాగారము - 1.శయనతృహము, 2.లోపలిది, 3.గర్భాశయము, 4.పురిటిల్లు, 5.దేవాలములందు దేవతా విగ్రము లుండుచోటు, గర్భగుడి.
అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
జటాయుషో దీనదశాం విలోక్య - ప్రియా వియోగప్రభవం చ శోకమ్|
యో వై విసస్మార తమార్ద్రచిత్తం - శ్రీజానకీ జీవనమాసతో స్మి| - 3
స్వధ: పితృపత్ని. ఆమెకి మన్నన ఈయకపోతే పితరులకు చేసే దాన ధర్మాలు వారికి తృప్తికరములు కావు.
అంగం గళితం, పలితం ముండం, దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం, తదపి సముంచత్యాశాపిండం || - 15
శరీరం శిథిలమైపోయినది, తల నెరిసిపోయింది, దంతాలు లేని నోరు బోసిపోయింది, వృద్ధుడు కర్ర పట్టుకొని తిరుగుతాడు. అయినా, అతడు తన కోరికల మూటను విడిచిపెట్తడు కదా! - భజగోవిందం
The body has become decrepit; the head has turned grey; the mouth has been rendered toothless; grasping a stick the old man moves about. Even then, the mass of desires does not go.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు - ఆగస్టు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె, మొ,వి. సం.క్రాంతిః.
10. మఘ - పల్లకీ ఆకారముగా 8 నక్షత్రములుండును.
మేనా - (వ్యావ.) పల్లకి , సవారి.
పల్యంకిక - పాలకి, పల్లకి.
సవారి - ప్రశ్న, యుక్తిప్రశ్న.
కైపదము - కవి కిచ్చుసమస్య, చిక్కుప్రశ్న, సం.కవిపదమ్.
(ౘ)చౌతా - డోలి.
చతురంత యానము - పల్లకి; శిబిక - పల్లకి.
అందలము - 1.పల్లకి, ఆందోళిక; 2.ఒకరకపు బాలక్రీడ, సం.ఆందోళః.
ఆందోళిక - ఆందోళము.
ఆందోళము - 1.పల్లకి, 2.ఉయ్యెల, రూ.ఆందోళిక, వికృ.అందలము.
అందరు అందలం(పల్లకీ)ఎక్కే వారే ఐతే, మోసే వారెవ్వరు ? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి(సవారీ) మోత.
ఆందోళము - 1.పల్లకి, 2.ఉయ్యెల, రూ.ఆందోళిక, వికృ.అందలము.
ఆందోళనము - 1.డోలి ఊగుట, 2.(వింజామరము మొ.వి.) విసరుట, 3.ఉయ్యెల, 4.(వ్యావ.) కలత.
ఆందోళించు - క్రి.1.ఊగులాడు, చంచలమగు, 2.డోలాయమానమగు, సంశయించు.
ఉయ్యలపులుఁగు - సారసపక్షి.
సారసము - 1.తామర, 2.బెగ్గురుపక్షి.
లాలి - ఉయ్యెల.
ఉయ్యెల - ఉయ్యాల; ఉయ్యల - ఉయాల; ఉయ్యేల - ఉయ్యాల.
ఊయల - (గృహ.) చంటిబిడ్డలను పరుండబెట్టు తొట్టె, బట్టతోగాని, వలతోగాని కట్టిన ఊయెల, రూ.చూ.ఉయాల, (Cradle).
ఉయాల - డోల, రూ.ఉయేల, ఉయ్యల, ఉయ్యెల, ఉయ్యేల, ఊయల, ఊయేల.
ఉయ్యాల - ఊగెడి డోల, రూ.ఊయెల.
దోల - డోల, ఉయ్యాల.
దోల - డోల, ఉయ్యాల.
డోల - ఉయ్యాలవంటి అందలము, తొట్ల, ఉయ్యాల.
తొట్టియల - బిడ్డల పరుండబెట్టు ఉయ్యెల, రూ.తొట్టెల, తొట్ల, తొట్టియ, తొట్టె.
తొట్టె - తొట్టియ; తొట్టియ - 1.నేయువాడు నూలుకండె నుంచుకొనునాడె, 2.ఉయ్యాలతొట్టె.
ప్రేంఖ - 1.డోల, 2.పర్యటనము, 3.నృత్యము, 4.అశ్వగతి.
ఫ్రేంఖనము - 1.ఊగుట, 2.పర్యటనము, 3.ఒకేపాత్రము గల రూపము.
ఫ్రేంఖితము - ఊగింపబడినది.
రింఖ - 1.గుఱ్ఱపుడెక్క, 2.అశ్వగతి విశేషము, 3.నృత్యము.
రింఖణము - జారుట, స్ఖలనము, రూ.రింగణము.
ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు - ప్రేక్షకుడు, చూచువాడు.
సామాజికుఁడు - 1.సమాజమందుండువాడు, 2.సభ్యుడు, 3.ప్రేక్షకుడు.
ప్రాశ్నికుఁడు - సభ్యుడు, విణ.ప్రశ్నచేయువాడు.
మఘవుడు - ఇంద్రుడు, మఘవంతుడు.
మఖపంతుఁడు - ఇంద్రుడు.
మహ్యతే పూజ్యతే మఘవా, న-పు. - పూజింప బడువాఁడు.
మహపూజాయాం. పా. మఖః యాగో (అ)స్యాస్తీతి మఖవాన్. త-పు. - యాగము గలవాఁడు.
మఖము - యజ్ఞము; మఘము - యజ్ఞము.
మఖన్తి దేవా అత్రేతి మఖః. మఖి గతౌ. - దీనికి దేవతలు వత్తురు.
మఘ - పదియవ(10వ) నక్షత్రము.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతు రాజము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచ యజ్ఞములు). వికృ.జన్నము.
మఖము సేయ వజ్రి మది సంతసించును,
వజ్రి సంతసింప వాన గురియు
వాన గురియఁ గసవు వసుమతిఁ బెరుఁగును,
గసవు మేసి ధేనుగణము బ్రదుకు.
భా|| యజ్ఞం చేస్తే వజ్రయుధుడైన దేవేంద్రుడు వజ్రి-1.ఇంద్రుడు, 2.బుద్ధుడు, 3.ఆకుజెముడు. సంతోషిస్తాడు. ఆయన హర్షిస్తే మేఘం(మేఘము - మబ్బు)వర్షిస్తుంది. వాన(వాన - వర్షము)కురిస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది. గడ్డిమేసి మన ఆలమందలు బ్రతుకుతాయి. గడ్డిమేసి ఆవులు పాలుయిస్తాయి.
అనిర్వణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః|
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః స్సమీహనః||
8. ఉపహూతాః పితరో యే మఘాసు | మనోజవ సస్సుకృతస్సుకృత్యాః | తే నో నక్షత్రే హవమాగమిష్ఠాః | స్వధాభిర్యజ్ఞం ప్రయతం జుషంతామ్ | యే అగ్నిదగ్ధా యేనగ్నిదగ్ధాః | యే ముల్లోకం పితరః, క్షియంతి యాగ్‌శ్చ విద్మ యాగ్ం ఉ చ స ప్రవిద్మ | మఘాసు యజ్ఞగ్ం సుకృతం జుషంతామ్ ||
పితరుల చుక్క - మఘా నక్షత్రము.
పితరులు - పితృదేవతలు, రూ.పితాళ్ళు.
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనకత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
పితామహుఁడు - 1.తండ్రికి తండ్రి, 2.బ్రహ్మ.
పితామహః పితౄణాం పితా - పితౄణా మపి జనయి తేత్యర్థః - పిత(తండ్రుల) పుట్టించినవాడు, బ్రహ్మ.
పితామహః పితృపితా -
పితుః పితా పితామహః. ఈ ఒకటి తండ్రితండ్రి-తాత.
తాత - 1.తండ్రికి తండ్రి, 2.తల్లికి తండ్రి, వై.వి. విధాత, బ్రహ్మ, సం.వి.తండ్రి.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
తాతస్తు జనకః పితా :
తనోతి కులం తాతః. తను విస్తారే. - కులమును విస్తరింపఁజేయువాఁడు.
జనయతీతి జనకః. జనీ ప్రాదుర్భానే. - పుట్టించువాఁడు.
పాతీతి పితా. ఋ. పు. పా రక్షణే - రక్షించువాఁడు. ఈ మూడు 3 తండ్రి పేర్లు.
జనకుడు - 1.తండ్రి, 2.సీత యొక్క తండ్రి, విదేహరాజు (జనకర్షి).
తండ్రీ - తండిరి.
తండీరి - జనకుడు, రూ.తండ్రి.
అధావుకః, జనకో
అవతీత్యావుతః అవరక్షణే. - రక్షించువాఁడు. ఈ ఒకటి తండ్ర పేరు.
జనకసుతా ప్రతిపాల జయజయ సంస్కృతి లీల నారాయణా|
జానకి - జనకుని కూతురు, సీత.
సీత - 1.శ్రీ రాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ. చిత్రకూటము నందు దేవీస్థానం సీత|
వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.
విదేహదేశేభవా వైదేహీ. సీ. - విదేహదేశ మందుఁ బుట్టినది. విదేహ మానస రంజక రామ్|
జన్మనా జనకః సో అభూద్వైదేహస్తు విదేహజః|
మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా||
ఆలోక్య యస్యాతిలలామలీలాం సద్భాగ్యభాజౌ పితరౌ కృతార్థౌ|
తమర్భకం దర్పకదర్పచౌరం శ్రీజానకీజీవనమానతో స్మి| - 1
నాయన - తండ్రి.
బాబు - 1.పూజ్యుడు, 2.తండ్రి, సం.భావ్యః.
అయ్య - తండ్రి, విణ.పూజ్యుడు, రూ.అయ, సం.ఆర్యః.
ఠాకురు - 1.తండ్రి, 2.అధిపతి, 3.గురువు, రూ.ఠాగూరు, సం.టక్కురః.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
పితరుఁడు - తండ్రి, సం.పితా.
పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు - బ్రహ్మోపదేశం చేసినవాడు తండ్రి, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు) పితరః ప్రజాపతిః|
Who is the preceptor to be honored?
Father
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.
వ్రాత్యుఁడు - ఉపనయనాది సంస్కారములు లేని బ్రాహ్మణుడు.
జనితా చోపనీతాచ యేన విద్యోపదిశ్యతే|
అన్నదాతా భయత్రాతా పంచె తే పితర స్మృతాః||
తా. కన్నతండ్రి, ఉపనయనము చేసినవాఁడు, విద్య(విద్య-1.చదువు, 2.జ్ఞానము.)చెప్పినవాఁడు, అన్నము బెట్టినవాఁడు, భయము తీర్చిన వాఁడు. ఈ ఐదుగురును తండ్రులు. - నీతిశాస్త్రము
పితాధర్మః పితాస్వర్గః, పితాహి పరమం తపః|
పితరి ప్రీతి మాపన్నే, సర్వా ప్రియంతి దేవతాః|| (మహాభారతం శాంతి పర్వం 266-21)
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
విధధాతి సర్వం విధాతా-ఋ-పు. సర్వముఁ జేయువాఁడు. డు ధాఙ్ ధారణ పోషయో.
సనత్కుమారో వైధాత్రః -
సనత్ సనాతనో బ్రహ్మతస్య కుమారః సనత్కుమారః - బ్రహ్మకుఁ గుమారుఁడు.
సనత్ నిత్యం కుమారావస్థత్వాద్వా - ఎల్లప్పుడు(సదా - ఎల్లప్పుడు)కుమారావస్థయం దుండువాఁడు. విథాతు రపత్యమః-వైధాత్రః - విధాత కొమారుఁడు. ఈ 2 బ్రహ్మకొడుకు పేర్లు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.
నలువ - చతుర్ముఖుడు.
చతురాననః చత్వారి ఆననాని యస్య నః - నాలుగుముఖములు గలవాఁడు.
ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు. ధాతా, ఋ.పు. సర్వం దధాతీతి ధాతా - సమస్తమును ధరించినవాడు, డుధాఞ్ ధారణ పోషణయోః.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ప్రపితామహుఁడు - ముత్తాత.
ముత్తాత - వృద్ధ పితామహుడు, ప్రపితామహుడు.
ముత్తవ - వృద్ధ పితామహి, ముత్తవ్వ, ప్రపితామహి.
పైతామహము - పితామహ సంబంధమైనది.
పైతృకము - పితృసంబంధమైనది.
పైత్రము - పితృసంబంధమైనది.
మాతరపితలు - మాతాపితలు, తల్లిదండ్రులు.
మాకాపితలు - తల్లిదండ్రులు, కన్నవారు (Parents).
మాతాపితరౌ పితరౌ మాతరపితరౌ ప్రసూజనయితారౌ,
మాతా చ పితా చ మాతాపితరౌ, పితరౌ, మాతరపితరౌచ, ఋ. పు. ప్రసూశ్చ జనయితా చ ప్రసూజనయితారః, ఋ. పు. తల్లితండ్రులు మాతాపితలు, పితలు, మాతరపితరులు, ప్రసూజనయితలు ననంబడుదురు. మాతరపితర శబ్దము అకారాంతం బని కొందఱు, తల్లిదండ్రులపేర్లు.
జనయిత్రి - తండ్తి.
జనయిత - తల్లి.
పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింపబడినది.
పిత్రార్జితము - పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).
పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః|
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || - 17శ్లో
తా|| ఈ జగత్తునకు తండ్రియు, తల్లియు, కర్మఫల ప్రదాతము, తాతయు, తెలిసికొన దగినదియు, పరిశుద్ధ హేతువులగు ప్రాయశ్చిత్త, గంగాస్నాన, గాయత్రీ జపాదులును, బ్రహ్మజ్ఞాన సాధనమగు ఓంకారము, ఋగ్యజుస్సామాధర్వణ వేదములును, అన్నియు నేనే. - రాజవిద్యారాజ గుహ్యయోగము, భగవద్గీత
లెక్కపెట్టఁగానౌనె నీ లీల లరయ
బ్రహ్మయంతటివాఁడు నీ పట్టి యయ్యు
నేరలేఁ డయ్యె యో యయ్య నీ గుణములు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు. ముఖ్య పితరు లేడుగురిలో అర్యముడు పెద్ద.
ౙన్నపుఁజుక్క - మఘా నక్షత్రము, పదియవ నక్షత్రము.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి సం.యజ్ఞః.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతు రాజము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచ యజ్ఞములు). వికృ.జన్నము. యజ్ఞః ప్రజాపతిః.
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనకత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
(ౘ)చుక్కలదొర - చంద్రుడు; చుక్కలఱేఁడు - చంద్రుడు Moon.
మాఘము - మాఘమాసము.
జన్నపుఁరిక్కనెల - మాఘమాసము.
మాఘమాసంబునఁ బూషాహ్వయంబు వహించి ధనంజయుండు వాతుండు సుషేణుండు సురుచి హృతాచి గౌతముం డను పరిజన పరివృతుండై చరియించుచు నుండు;
మాఘ మాసంలో సూర్యుడు Sun పూషుడన్న(పూషుఁడు - సూర్యుడు) పేరుతో వ్యవహరింప బడుతూ ధనంజయుడు(ధనంజయుఁడు - 1.అగ్ని, 2.అర్జునుడు.), వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు(గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు.)అనేవారు పరిజనం కాగా సంచరిస్తూ ఉంటాడు.
ధనంజయ - 1.అగ్ని, 2.అర్జునుడు. air in the stomach.
ధనుజయతీతి ధనుంజయః జి జయే - ధనమును జయించువాఁడు.
పూషుఁడు - సూర్యుడు Sun.
పుష్ణాతీతి పుషా. న. పు. పుష పుష్టౌ - పోషించువాఁడు.
సూర్యతనయ - యమున.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు.
సబంధుర్యో హితేషుస్స్యా త్సపితాయస్తు పోషకః|
సఖాయత్ర విశ్వానస్స- భార్యాయత్ర నిర్వృతిః||
తా. హితముగోరువాఁడే(హితైషి- మంచికోరువాడు)బంధువు, పోషించిన వాఁడే(పితరుఁడు - తండ్రి, సం.పితా.)తండ్రి, విశ్వాసము గలవాఁడే(సఖీ - 1.సకి, చెలికత్తె, 2.స్నేహితుడు, సహాయుడు, రూ.సఖుడు.)స్నేహితుఁడు, సుఖింప జేయునదే భార్య యగును. – నీతిశాస్త్రము
దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును.
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము.
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
పూషదంత వినాసాయ భగనేత్రభిదే నమః
భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః |
సర్పశ్చాగ్నిశ్చ సింహశ్చ కులపుత్రశ్చ భారత |
నావజ్ఞాయా మనుష్యేణ సర్వే హ్యేతే (అ)తి తేజసః ||
పాము Snake, అగ్ని Fire, సింహం Lion, జ్ఞాతి ఇవన్నీ మిక్కిలి తేజస్సు కలవి. మానవుడు వీనిని చులకన చేయకూడదు.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు – ఆగస్ఠు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
నడి - నడుము అను శబ్దమునకు సమాసము నందు వచ్చు రూపము, ఉదా. 1.నడితల, 2.నడిరేయి, 2.మధ్యము, రూ.నడు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.
మఖా పంచకం సదా వంచకం. మఖ ఉరిమితే మదురుమీద కర్రైనా పండుతుండి. మఖ యురిమితే మదురుమీద మొక్కకూడ కాస్తుంది. మఖ పుబ్బ వొరుపైతే మహాక్షామము సిద్ధము.
పుబ్బ పుట్టెడు ధాన్యం చల్లడంకంటె మఖలో మానెడు గింజలు చల్లడం మేలు. పుబ్బలో చల్లడంకంటె దిబ్బలమీద వేయడం మేలు. పుబ్బలో పుట్టి మఖలో మాడినటులు.
పుబ్బరేగినా భూతురేగినా ఊరుకోదు. పుబ్బ కెరలితే భూతం కెరలి నటులు.
ఉత్తర ఉరిమి వర్షించినా పాముకరచినా ఊరికేపోదు. ఉత్తర చూసి ఎత్తరా గంప (అప్పటికీ వర్షం కురవకపోతే వలస వెళ్ళిపో). వర్షములు కురియక దుఃఖించి, తమకు తాము చత్తురు. కన్నకడుపున చిచ్చు రగిలిన కరవున పాలవును దేశం.
వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరద పారు
వరద కరవు రెండు వరుసతో నెరుగుడీ విశ్వ.
తా|| వాన కురియనిచో కరువువచ్చును, వాన కురిసిన వరద వచ్చును. వరదా కరువు రెండునూ వచ్చిన నష్టము సంభవించును కదా.
11. పుబ్బ, ఉత్తర - రెండేసి చొప్పున చతురస్రాకారముగా నాలుగు 4 నక్షత్రము లుండును.
పుబ్బ - వి. పూర్వఫల్గుణీ నక్షత్రము, కి. పుబ్బె.
సాముకంటి చుక్క - పుబ్బనక్షత్రము.
గవాం పతిః ఫల్గునీనామసి త్వమ్ | తదర్యమన్ వరుణమిత్ర చారు | తం త్వా పయగ్ం సనితారగ్ం సనీతామ్ | జీవా జీవంతముప సంవిశేషు | యేనేమా విశ్వా భువనాని సంజితా | యస్య దేవా అనుసంయంతి చేతః | అర్యమా రాజా జరస్తు విష్మాన్ | ఫల్గునీనామృషభో రోరవీతి ||9||
గవయము - 1.గురుపోతు, వనవృషభము, అడవియెద్దు.
గా మయతే సదృశత్వాత్ గవయః, అయ గతౌ. - గోవును బోలునది, గురుపోతు.
గవి1 - ఆవు.
గవి2 - 1.గుహ, 2.గుంట.
స్వాంతము - 1.మనస్సు, 2.గుహ.
గోవ - 1.యౌవనము, 2.పురుష గవయము, గురుషోతరి, 3.పశ్చిమ సముద్రమందలి యొక పట్టణము.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది సంవత్సరముల(16-50)వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
పుబ్బ - పూర్వఫల్గుణీ నక్షత్రము, కి. పుబ్బె.
పూర్వ - తూర్పు East.
ప్రాచి - తూర్పు.
తూరుపు - సూర్యుడుదయించు దిక్కు, ప్రాగ్దిశ, రూ.తూర్పు.
ప్రాచ్యము - తూర్పుదిక్కు నందలిది.
ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రుని భార్య, 4.జ్యేష్ఠానక్షత్రము, 5.తూర్పు.
సవము - సగము, సం.సామి.
సవము - యజ్ఞము, జన్నము.
స్వ మైశ్వర్య మస్యాస్తీతి స్వామీ, నాంతః - సొమ్ము గలవాఁడు.
కంటిపాప - కంటి నల్లగ్రుడ్డులోని చుక్క, (ఈ ద్వారముననే వెలుగు లోపలికి ప్రవేశించును) (Pupil).
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని Fire, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహము లలో నొకటి (Venus).
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువరి యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్కరాయుడు.
సామి - 1.స్వామి, 2.రాజు, 3.పెనిమిటి, 4.కుమారస్వామి, సం.స్వామి.
స్వ మైశ్వర్య మస్యాస్తీతి స్వామీ, నాంతః - సొమ్ము గలవాఁడు.
స్వామి - 1.ఒడయడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.
ఒడయఁడు - 1.మగడు, 2.ప్రభువు, రూ.ఒడయుఁడు.
స్వామినో దేవృదేవరో :
భ్రాతృజాయాభిస్సహ పరిహాసేన దీవ్యతి క్రీడతే దేవా. ఋ. పు. దేవరవ్చ - అన్నదమ్ములభార్యలతో పరిహాసముచేఁ గ్రీడించువాఁడు.
ఈ ఒకటి మగనితోఁబుట్టినవారు, బావలు, మఱఁదులును(మరుదులు).
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్రుడు, దేవసేనాపతి. వికృ.కొమరసామి.
స్కందుఁడు - కుమారస్వామి.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు, కుమారస్వామి. సదా బాలత్వాత్ కుమారః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాడు. స్వామిమలై క్షేత్రంలో కుమారస్వామిని గురునాథుడని పిలుస్తారు.
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః|
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||
సవము - సగము, సం.సామి.
సవము - యజ్ఞము, జన్నము.
సాము - 1.సగము, 2.వ్యాయామము, సం.1.సామి, 2.శ్రమః.
సగము - 1.స్వామి, 2.అర్ధము, రూ.సవము, సాము, సం.సామి.
సామి త్వర్ధే జుగుప్సితే,
సామి - ఇది సగమను నర్థమందును, నిందింపఁబడినదానియందును వర్తించును. ఉ. సగమునకు - సామి నిమీలితాక్షీ, నిందింపఁ బడినదానికి - 'సామ్యధ్యయన మనధ్యాయే.'
సాముకంటి చుక్క - పుబ్బనక్షత్రము.
సా - సగము, సమాసమునందు 'సాము' శబ్దము నకు అన్యక్షరశేషము లోపింపగా మిగిలిన రూపము, ఉదా.సామేను, సం.సామి.
సామేను - సగము మేను.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, అఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా ఖండములు).
(గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన వృత్త భాగము, ఒక ఘనతలముచే ఛేదింపబడిన ఘనరూపభాగము.
(భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్నభిన్నముగ చేయబడని భూభాగము.
తుంట - 1.తునక, 2.చెరకు, రూ.తూఁట వై.విణ. దుష్టుడు, తుంటరి.
తుంటవిలుకాఁడు - మన్మధుడు, రూ. తుంటవిలుకాడు, తుంటవిల్తుఁడు.
బిల్ల - 1.ఖండము, 2.సూర్యచంద్రుల బింబము, 3.గుండ్రని తలగడ, 4.మెడ లోనగుచోట్ల లేచు నెత్తురుగడ్డ, 5.తపాలుబిళ్ళ.
బిల్లిక - సూర్యచంద్రుల బింబము.
భిత్తం శకలఖణ్డే వా పుంస్యర్దః :
భిత్తము - తునక, శకలము.
భిద్యత ఇతి భిత్తం, భిదిర్ విదారణే - వ్రక్కలింపఁ బడునది.
శకలము - 1.చెట్టుపట్ట, నార, 2.ఖండము.
శక్తతే భేత్తుమితి శకలం ! ప్న. శక్ శక్తౌ - భేదింప శక్యమైనది.
ఖండ్యత ఇతి ఖండం. ప్న. ఖడి ఖండనే - త్రుంచఁబడునది.
అర్ధము - 1.సగము, 2.తునక, విణ.అసంపూర్ణము, ఖండము.
అర్ధతి భేదం గచ్ఛతీత్యర్ధః. పు. అర్ధగతౌ - భేదమును బొందునది.
ఋద్ధము - 1.సమృద్ధము పెరిగినది, 2.నూర్చి తూర్పెత్తుటకు సిద్ధముగా నుంచినది(ధాన్యము), వి.1.వృద్ధి, 2.సిద్ధాంతము.
ఋద్యతే సముదాయో నేనేతి అర్ధః, ఋధి వృద్దౌ - దీనిచేత సముదాయము విభజింపఁబడును. తునక పేర్లు.
అర్ధము - 1.సగము, 2.తునక, విణ.అసంపూర్ణము, ఖండము.
అద్ద - 1.సగము, 2.అరసోల, 3.నూర్చక వేసిన కుప్పయొక్క క్రింది సగము భాగము, సం.అర్థమ్.
అర - 1.సగము, 2.కొంచెము, 3.గది, 4.పెట్తె మొ.వి లోపలి గది, సం.అర్ధమ్.
అఱ1 - 1.గది, 2.హస్తతలము, 3.పెట్టె మొ.ని లోనిది.
అఱ్ఱ - 1.అఱ, గది, 2.ప్రయాసముచే పాలు పిదుకదగిన ఆవు.
అఱ2 - 1.కొరత, 2.కీడు, 3.కపటము, 4.సందేహము, 5.చినుగు, విణ.కొంచెము, సగము, క్రి. విణ.కొంచెముగా సం.అర్థమ్.
అసంపూర్ణము - (గణి.) సంపూర్ణముకానిది (Partial).
అసంపూర్ణసంధి - (జం.) రెండు ఎముకలు కలిసినచోట మధ్య ఒకపొర మృదులాస్థి ఉండుటచే కొంచుముగా కదల్చుటకు అవకాశము గల కీలు, ఉదా.అంసచక్రము, నితంబమేఖలము లందలి ఎముకలు (Imperfect joint).
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షి ముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుండి - 1.ఉరుకు బొడ్డు రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
ముఖపాకము - (గృహ.) నాలుక పూత(Red-tongue) విటమిన్ బి 'B12 లేక విటమిన్ డి 'D లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).
ప్రతిబంధము చేయు వ్యాధులు - (గృహ.) వ్యాధులు రాకుండ తప్పించుట, ఆహారలోపము వలన కలుగు వ్యాధులు రాకుండ తప్పించుకొనుట (Preventable diseases) ఉదా.(Deficience diseases) ఎఱ్ఱనాలుక, కండ్లజబ్బు మొదలగునవి.
నోరు - 1.ముఖద్వారము, 2.వదనము.
వదనము - నోరు, ముఖము.
మొకము - ముఖము, సం.ముఖమ్.
లననము - 1.ముఖము, 2.నోరు, 3.మాట.
మాట - 1.పలుకు, వచనము, 2.నింద, వృత్తాంతము.
వా - నోరు, వాదర, రూ.వాయి, సం.వాక్.
వాదర - (వాడి+దార) కత్తి యొక్క పదునుగల అంచు.
వాయి - 1.నోరు, ముఖము, 2.ఖడ్గధార, సం.వాక్.
వాతప్పు - (వాయి+తప్పు) నోట వెలుబడిన తప్పుమాట.
నోరు మంచిదైతే ఊరు మంచిదే. నోరుంటే తల గాస్తుంది. ముఖమునకు అలంకారము సత్య వాక్కు.
మోము - మొగము, సం.ముఖమ్.
వ్యాయామము - 1.క్రమము, 2.సాము, 3.నిలువు, 4.బార.
క్రమము - 1.విధము, 2.వరుస, సొరిది, 3.విధి, 4.క్రమాలంకారము.
వాదిరి - క్రమము, ఉత్కర్షము విణ.అధికము.
ఉత్కర్షము - 1.మేలు, 2.అతిశయము, 3.అభివృద్ధి.
మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.
శరీరానికి వ్యాయామము ఎలాంటిదో మనసుకి చదవడం అలాంటిది.
శ్రాంతి - ఊరట, విశ్రాంతి, అలసట.
ఊరట - 1.విశ్రాంతి, విరామము 2.ఊరడించుట, 3.స్వస్థి చిత్తత, విణ.విశ్రాంతి నిచ్చునది.
విశ్రాంతి కొరకు ఆరాటపడి మానవులు అలసిపోతూ వుంటారు. - లారెన్స్ స్టెరెన్
మహస్సు - 1.తేజము, 2.వెలుతురు, 3.యజ్ఞము, 4.ఉత్సవము.
ఆయాసము - 1.శ్రమము, 2.ఉత్సాహము, 3.పరితాపము.
శ్రమము - 1.అలసట, 2.అలవాటు, 3.సాము.
సేద - శ్రమము, బడలిక(బడలిక – అలసట), సం.స్వేదః.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసస్థాయి, 6.ఆస్థ.
ఉత్సవము - 1.ఊరేగింపు, 2.పండుగ, 3.కోపము, 4.గర్వము.
పబ్బము - 1.పండుగ, ఉత్సవము, 2.అతిథ్యము.
శ్రమదానము - సాంఘికాభివృద్ధి కార్య క్రమములలో నిస్ప్వార్థముగ కాయ కష్టము చేయుట.
ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే శత్రు నిగ్రహే,
రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠంతి సబాంధవః|
తా. సంతోషంతో పండుగలు చేసుకుంటున్న సమయంలో, దుఃఖంలో ఉన్నపుడు, కరువు వచ్చినపుడు, శత్రువులతో యుద్ధంలో పోరునపుడు, రాజద్వారంలో(ద్వారము - 1.వాకిలి 2.ఉపాయము), శ్మశానంలో ఎవరైతే తోడుగా ఉంటారో వారే నిజమైన బంధువులు.
కాశి - 1.వారణాసి, 2.ప్రకాశము, 3.సూర్యుడు, 4.అలసట.
వారణాసి - కాశి, కాశివిశ్వేశ్వరుడు.
వారణాసి యందు దేవీస్థానం విశాలాక్షి (సతిదేవి ముఖం పడిన చోటు వారణాసి. అక్కడ ఉండే గౌరికి విశాలాక్షి అని పేరు).
విశ్వనాథుడు - కాశీక్షేత్ర వాసియగు శంకరుడు.
సానన్ద మానన్దవనే వసన్త - మానన్దకన్దం హతపాప బృన్దమ్|
వారాణసీనాథ మనాథనాథం - శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.
పెనుమసనము - (పెనువు+మనసము) కాశి, వారణాసి(హిందువుల పుణ్యక్షేత్రము).
పెనువు - పెంపు, అధిక్యము, వృద్ధి.
పెంపు - 1.సమృద్ధి, 2.నాళము, 3.గౌరవము, 4.మహత్త్వము, 5.నాశముచేయు, సం.1.వృధ్, 2.భంజ్.
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనక్రోవి.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పతనము, 3.మన్నన.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
వడ్ది - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరివద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చెల్లించు అధికద్రవ్యము (Interest).
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్దితో జీవనము చేయుట.
ఆఢ్యుడు - ధనికుడు, సమృద్ధికలవాడు.
వడ్డికాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
బాలాజీ - శ్రీ తిరుపతి వేకంటేశ్వరస్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలా.
క్షత్రియం చైవసర్పంచ బ్రాహ్మణంచ బహు శ్రుతం,
నామ మశ్యేత వైభూష్ణుః కృశానపి కదాచనః ||
తా. అభివృద్ధిగాఁ గల నరుఁడు రాజును, పామును, బ్రాహ్మణుని, పండితుని, కృశించినవారలను వీరల నొకప్పుడు అవమానించ రాదు. - నీతిశాస్త్రము
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టుముడి కలవాడు.
శిఖాజ్వాలా అస్య సంతీతి శిఖావాన్ త. పు. - జ్వాలలు గలవాఁడు.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శాఖతే వ్యాప్నోతీతి శిఖా, శాఖృ వ్యాప్తౌ - వ్యాపించునది.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యగర్భః హిరణ్యమయో గర్భో యస్యసః హిరణ్యగర్భః - హిరణ్యమైన గర్భము గలవాడు.
హిరణ్యం గర్భే యస్యేతి వా - గర్భమందు హిరణ్యము గలవాడు.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హయ్యతి గచ్ఛతీతి హిరణ్యం, హయ్య గతికాంత్యోః - పోవునది.
హేమకారుఁడు - అగసాలెవాడు.
హేమము - 1.బంగారు, 2.ఉమెత్త.
హినోతి వర్ధత ఇతి హేమ, న, న, హి గతౌ వృద్ధౌ చ - లోహాంతరమును గూడి వృద్ధిఁబొందునది.
హేమించు - క్రి.బంగారగు.
హాటకగర్భుడు - బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హటతి దీప్యత ఇతి హాటకం, హత దీప్తౌ. - ప్రకాశించునది.
ఠాకృతి రాజిత హాటక కుండల
స్వాకృతిరేజిత ఘోటక మండల| ||శరవణభవ||
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ|
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యం రేతో యస్యసః హిరణ్య రేతాః, న.పు. - హిరణ్యమే రేతస్సుగాఁ గలవాఁడు.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హిరణ్యశబ్ద వ్యుత్పత్తి చెప్పఁబడెను.
కాకిణి - 1.కాణి, కర్షము నందు నాల్గవ పాలు, 2.గవ్వ, 3.కొలతకోల.
కాసు - దుగ్గానిలో నాల్గవ భాగము, అరపైసా, విత్తము, సం.కాకిణీ, కాచః.
యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పసవః స్త్రియః |
నాలమేక్స్య తత్పర్వమ్ ఇతి పశ్యన్న ముహ్యతి ||
భా|| భూమి మీద ఉన్న ధాన్యం అంతా, బంగారం, పశు సంపద, స్త్రీ సంపద అన్నీ కలిపినా ఒక్కడికి చాలవు. దీన్ని తెలిసిన మానవుడు మోహపడడు. (అందుచేత మానవునకు ముందుగా కావలసినది తృప్తి అని భావం).
ద్రవిడము - 1.దక్షిణదేశము, 2.దక్షిణదేశ భాష, రూ.ద్రావిడము.
ద్రవిణము - 1.ధనము, 2.బంగారు, 3.బలము.
ద్రవతి గచ్ఛతీతి ద్రవిణం, ద్రు గతౌ. - వెచ్చ పోవునది.
త్రాణ - 1.ద్రవిణము, 2.బలము, 3.సత్తువ, సం.ద్రవిణమ్.
ద్రవత్యనేన శత్రుం ప్రతి ద్రవిణం, ద్రుగతౌ. - దీనిచేత శత్రువును గూర్చి పోవును.
అఱవము - ద్రవిడభాష.
ద్రవిణం తు బలం ధనమ్,
ద్రవిణశబ్దము బలిమికిని, ధనమునకును పేరు. ద్రవంత్య సేన, ద్రవతీతి చ ద్రవిణం, ద్రు గతౌ. దీనిచేత యుద్ధాదులకుఁ బోవుదురు గనుకను, కరఁగునది గనుకను ద్రవిణము.
ద్రావణీయము - కరగునట్టిది (Soluble).
ద్రావిడ ప్రాణాయామము - జాతీ. 1.సులభముగా కానిపని, 2.సూటిగా చెప్పక డొంకతిరుగుడుగా చెప్పుట.
దద్యద్దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్ అకించనవిహంగశిశౌ విషణ్ణే|
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయనీ నయనాంబువాహః|| - 9
ద్రుమ్నము - 1.ధనము, 2.బలము, 3.పరాక్రమము.
ద్యూయతే అభిగమ్యత ఇతి ద్యుమ్నం, ద్యూభిగమనే. - పొందఁబడునది.
దివి మ్నాయత ఇతి ద్యుమ్నం. మ్నా అభ్యాసే. - స్వర్గమందును గోరఁబడునది.
రైవతుఁడు - శివుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
రై - 1.ధనము, 2.హిరణ్యము.
రాన్త్యేన మితి రాః, ఐ, పు, రా ఆదానే. - దీనిఁబుచ్చుకొందురు.
హుతభుక్కు - అగ్ని.
హుతం భుఙ్కే హుతభుక్, జ.పు. భుజ పాలనాభ్యవ్యవహారయోః - హుతమును భుజించువాఁడు.
హుతవహుఁడు - అగ్ని.
హుతాసనుఁడు - అగ్ని.
దహనుఁడు - అగ్ని.
దహతీతి దహనః, దహ భస్మీకరణే. - దహించువాఁడు.
దహనము - కాల్చుట, సం.వి. (రసా.) పదార్థములు గాలిలోని ఆక్సిజన్(Oxygen)తో కలిసి మండుట (Combustion).
దహించు - క్రి.కాల్చు.
దహనాధారము - (రసా.) ఒక వస్తువునును తనలో మండనిచ్చునది, (Supporter of Combustion) ఉదా. గాలి.
దహనోష్ణత - (రసా.) ఒక అణుభారము దాహ్యరాసాయన ద్రవ్యము కాల్చబడినపుడి వెలికి వచ్చు తాపరాశి, (Heat of combustion).
దహననాళము - (రసా.) ఒక ద్రవ్యమును పెట్టి కాల్చుట కుపయోగించుగాజు గొట్టము, (Combustion tube).
దహనకరణి - (రసా.) ఏదేని ఘనద్రవమును గొట్టములో పెట్టి వేడి చేయుట కుపయోగించు చిన తెప్పవంటి పాత్ర, (Combustion boat).
హవ్యవాహనుఁడు - అగ్ని, రూ.హవ్యవహుడు.
హవ్యం వహతీతి హవ్యవాహనః వహ ప్రాపణే - హవిస్సును వహుంచువాఁడు.
హవ్యే హవ్య విషయే వహతే వా, వాహృ ప్రయత్నే - హవ్యవిషయమై ప్రయత్నము చేయువాఁడు.
హవిస్సు - వేల్చుటకు ఇగుర భెత్తిన అన్నము.
హవో హూతౌ -
హ్వానం హవః, హూతిశ్చ, సీ. హ్వేఞ్ స్పర్ధాయాం, శబ్దే చ. - పిలుచుట హవము, హూతియును. ఈ 2 పిలుచుట పేర్లు.
హవము - 1.ఆజ్ఞ, 2.పిలుపు, 3.యజ్ఞము.
హూతి - పిలుపు, రూ.ఆహుతి.
హుతము - వేలబడినది.
ఆజ్ఞాహ్వానాధ్వారా హవాః,
హవసబ్దము ఆజ్ఞకును, పిలుచుటకును, యజ్ఞమునకును పేరు. హూయతే (అ)స్మిన్ హూతిః, హూయంతే (అ)స్మిన్నాజ్యూదీని చ హవః, హ్వేఞ్ స్పర్ధాయాం శబ్దే చ. హూదానాదనయోః. - దీనియం దాజ్యాదులు వేల్వఁబడును గనుక హవము.
కీలాలము - 1.నెత్తురు Blood, 2.నీరు.
కీలాన్ జ్వాలాన్ అలతి వారయతీతి కీలాలం, అల భూషణపర్యాప్తి శక్తివారణేషు. - అగ్నిజ్వాలలను వారించునది.
కీల్యతే బద్ద్యత ఇతివా కీలాలం, కీల బంధనే. - బంధింపఁబడునది.
శోణితే(అ)మ్భసి కీలాలమ్ -
కీలాలశబ్దము నీళ్ళకును, నెత్తురునకును పేరు. కీలా నగ్నిజ్వాలా నలతీతి కీలాలం, అల భూషణ పర్యాప్తి వారణేషు. - అగ్నిజ్వాలల నడ్దగించునది. టీ. స, కీల్యతే మాంసే బధ్యతే, అల్యతే త్వచా వార్యత ఇతి కీలాలం - శోణితం, కీల బంధనే, అల భూషణాదౌ.
కీలి - అగ్ని, వ్యు.కీలలు కలది.
కీల - 1.మోచేతిదిబ్బ, 2.మేకు, 3.మంట, జ్వాల.
కీలతి పక్ష్యాదిగతిం నిరుణద్ధీతి కీలః, ప్స. కీలబంధనే. - పక్ష్యాదులయొక్క గతిని నిరోధించునది.
ఉదర్చి - 1.శివుడు, 2.అగ్ని, విణ. పై కెగయు జ్వాలలు కలది.
సప్త అర్చీమ్షి కాళీ, కరాళీ, మనోజవా, ధూమవర్ణా, స్సులింగినీ, విశ్వవదాదినామ్న్యః జిహ్వారూపాః జ్వాలాయస్య నః సప్తార్చిః, న. వు. - జిహ్వరూపములైన కాళి, కరాళి మొదలయిన యేడు జ్వాలలు గలవాఁడు.
అర్చి - 1.అగ్నిజ్వాల, 2.కిరణము, 3.కాంతి, వెలుగు, రూ.అర్చిస్సు.
అర్చ్యత ఇత్యర్చిః, స-స్న, అర్చపూజాయాం - అర్చింపఁబడునది.
హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
హినోతి ఇతస్తతో గచ్ఛతి - వర్ధతే వా, హేతిః, ఈ-సీ, హిగతౌ వృద్ధౌ చ - ఇట్టట్టు చలించునది; లేక వృద్ధిఁబొందునది.
హన్యతే అనయేతిహేతిః, హనహింసాగత్యోః - దీనిచేత హింసింపఁబడును.
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||
బృహత్భానువు - అగ్ని.
బృహంతః భానవోయస్య సః బృహత్భాను, ఉ. పు. - అధికము లైన కిరణములు గలవాఁడు.
లోకేశుఁడు - బ్రహ్మ.
లోకేశః, లోకానాం చతుర్దశలోకానా మీశ - పదునాల్గులోకములకు ప్రభువైనవాఁడు.
లోకములు - సర్గమ ర్త్య పాతాళములు: భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఈ యేడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము, ఈ ఏడును అధో లోకములు.
స్వయంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మదనుడు.
స్వయంభూః ఊ-పు, స్వయం భవతీతి స్వయంభూః - తనంతటనే పుట్టినవాఁడు, భూసత్తాయాం.
కందర్పుఁడు - మరుడు, వ్యు.కుత్సితమగు దర్పము కలవాడు.
కందర్పః, కం కుతితే (అ)వ్యయం. - కుత్సితో దర్పోయస్యసః కందర్పః - కుత్సితమైన దర్పము గలవాఁడు.
కం సుఖం తద్వత్సు దర్పో యస్యసః - సుఖవంతులయందు దర్పించువాఁడు.
కేబ్రహ్మణ్యపి దృప్తవాన్ కందర్పః - బ్రహ్మమీఁదను గూడ దర్పించినవాఁడు.
సుప్రజాతా సువీర్యా చ సుపోషా సుపతి శ్సివా,
సుగృహా రక్తబీజాంతా హరకందర్ప జీవికా|
మరుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది (29వ).
సముత్పత్తిః పద్మరమణ పదపద్మామల నఖా
న్నివాసః కందర్ప ప్రతిభటజటాజూటభవనే|
అథాయం వ్యాసంగో హత పతిత నిస్తారణ విధౌ
న కస్మాదుత్కర్షః తవ జనని జాగర్తి జగతి ||
తా. ఓ! జనని! అమ్మా! గంగామాతా! నీవు అందరికంటె శ్రేష్ఠురాలవుగా వెలుగొందుతున్నావు. ఎందుకంటే నీవు లక్ష్మీవల్లభుడైన శ్రీమహావిష్ణువు పాదపద్మములయొక్క స్వచ్ఛమైన నఖాలనుండి పుట్టావు. మన్మథుని శత్రువైన పరమశివుని జటాజూటమునందు నీనివాసం. ఇక వ్యాసంగం అనగా చేసే పని పతితులను పావనులను చేసి, ఉద్దరించుట. ఆహా! ఉత్తమజననం, ఉత్తమోత్తమ స్థావరం, అత్యుత్తమ కార్యనిర్హహణ, అనే మూడూ నిన్ను వరించాయి. ఇటువంటి ఉత్తమగతి మరెవరికి ఉంది. కాబట్తి నీవు అందరికంటె గొప్పదానవు.
కందర్ప విద్యా కందర్ప జనకాపాంగవీక్షణా,
కర్పూరవీటీ సౌరభ్యకల్లోలిత కకుప్తటా| – 3
పంచశరుఁడు - మన్మథుడు, ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనములను ఐదు బాణములు కలవాడు.
ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనాఖ్యః పంచశరాః యస్యసః పంచశరః - ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనములను నైదు బాణములు గలవాఁడు.
విషమము - సమము కానిది.
బేసికంటి - (బేసి + కన్ను) ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ఓజము - 1.బేసి, విషమము(సమముకానిది) 2.జ్యోతి, రూ.ఓజస్సు.
బేసి - విషమము, సమముకానిది, విణ. (గణి.) సరిగాని సంఖ్య(Odd), 1, 3, 5, 7 వంటివి, చూ (అయుగ్మ సంఖ్య).
ఆయుగ్మము - బేసి, ఉదా. రెండుచే నిశ్సేషముగా భాగింపబడని అంకె 3, 7, 9 మొ, వి.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
(ౙ)జ్యోతి - జ్యోతి, కాంతి, దీపము, సం.జ్యోతిః.
జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
వెలుగు - 1.కిరణము 2.ప్రకాశము(వెలుగు, విణ. బయలు పడినది). నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు, 27). అగ్ని - 1.నిప్పు(అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక) 2.అగ్నిదేవుడు. అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
సూర్యుడు - వెలుగురేడు. సూర్యుని ఎవరు - ఉదయించమన్నారు?సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి, శిల.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.
మయూఖము - 1.కిరణము 2.కాంతి 3.జ్వాల, మంట Flame.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది (Light).
దీప్తి - కాంతి, స. (భౌతి.) ప్రకాశము, (Luminosity), కాంతి యొక్క తీక్ష్ణత, (Brightness). జ్వాలాజిహుఁడు - అగ్ని.
దివియ - 1.దీపము, 2.దివ్వటీ, రూ.దివె, దివ్వె, దివ్వియ, దీవియ, దీవె, సం.దీపికా. దీపముండగనే యిల్లు చక్కబర్చుకోవలెను.
దీపము - లాంతరు, రూ.దీపిక.
దబ్బెము - దీపము, సం.దీపః.
దీవియ - దివియ, సం.దీపికా.
గృహమణి - దీపము; దీపవల్లి - దీపపువత్తి.
దీపకము - 1.ఓమము, 2.దీపము, 3.దీమము, 4.(అలం.) సాహిత్యమున నొక యలంకారము.
ఓమము - జీలకఱ్ఱవలె నుండు ఒకరకపు వాసనగింజలు, దీప్యము, రూ.వాము.
దీమము - 1.దీపకము 2.వేటాడుటకై వేటకాడు పెంచు పక్షి, మృగము, రూ.దీపము.
మాయించు - క్రి.1.సంహరించు, 2.కాంతి హీనముచేయు.
మాయు - క్రి.1.మలినమగు, 2.నశించు.
తక్కటి - మూడు ముఖములు గల దీపా రాత్రికపు తట్ట, త్రిముఖదీపిక.
దీపము పేరు చెబితే చీకటిపోతుందా? దీపము దానము చేయువాడు, నిర్మలమైన నేత్రములు కలవాడు కాగలడు.
జ్యోతి ర్ఖ ద్యోత దృష్టిషు :
జ్యొతి శ్శబ్దము నక్షత్రమునకును, తేజస్సునకును, దృష్టికిని పేరు. ద్యోతత ఇతి జ్యోతిః. స. న. ద్యుత దీప్తౌ, ప్రకాశించునది. సూర్యునికిని, అగ్నికిని పేర్గునపుడు పుల్లింగమును గలదు. 'జ్యోతి ర్నా భాస్కరే గ్నౌచ క్లీబం ఖద్యోత దృష్టిషు' ఇతి రుద్రః 'జ్యోతిః ప్రకాశేతారాయాం వేదాంగాంతర నేత్రయో' రిత్యజయశ్చ. 'జ్యోతిః పుంస్యత్ని సూర్యయోః, చంద్రే చ' ఇతి శేషః.
ఓజస్సు -1.తేజము 2.ఉత్సాహము 3.బలము 4.వెలుతురు 5.పటిమ.
తేజము - 1.ప్రకాశము 2.ప్రభావము 3.పరాక్రమము 4.రేతస్సు, రూ.తేజస్సు. తేజి - గుఱ్ఱము.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము(శర్మము - సంతోషము) 3.కోరిక 4.ప్రభు భక్తి 5.(అలం.)వీరరసమునకు స్థాయి 6.ఆస్థ.
బలము - 1.సత్తువ(దేహబలము, సం.సత్యమ్.) 2.సైన్యము.
సైన్యము - 1.సేనతోకూడినది 2.సేన 3.కృష్ణుని తేతి గుఱ్ఱము లోనొకటి.
వెలుతురు - 1.ఎండ (ఎండదొర - సూర్యుడు) 2.ప్రకాశము.
పటిమ - నేర్పు, సామర్థ్యము.
ఓజు(ౙ) - 1.కమసాలి 2.శిల్పి 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపసః|
బుద్ధఃస్సష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశు ర్భాస్కరద్యుతిః||
3. యక్షుఁడు - 1.కుబేరుడు, 2.ఒక దేవ జాతివాడు.
యక్షేషు రాజతే యక్షరాట్. జ-పు. రాజృదీప్తౌ - యక్షులకుఁ బ్రభువై ప్రకాశించువాఁడు.
4. గుహ్యకేశ్వరుఁడు - కుబేరుడు.
గుహ్యకా నిధిగో పకాః తేషామీశ్వరః గుహ్యకేశ్వరః - గుహ్యకులు నిధి రక్షకులు, వారికిఁ బ్రభువు.
గుహ్యకుఁడు - గుహ్యక జాతివాడు, యక్షులలో నొగతెగవాడు.
గుహుఁడు - కుమారస్వామి, వ్యు. దేవసేన లను పొదివి రక్షించువాడు, 2.ఒక నిషాదరాజు. గుహో ద్వాదశ ఏవ చ|
గుహలోకి భయస్తులు పోజాలరు. ధైర్యంతో గుహలో ప్రవేశించగలవారు, సింహంపంజాతో కొట్టగా పడిన రతనాలను పొంద గలుగుతారు.
గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము Lion, మొ.వి. విణ. గుహా యందుండునది.
తత్త్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి.(భౌతి.) మౌలికమైన, సారమైన విషయము. దేని మీద ఇతర సత్యములు ఆధారపడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈష్ట ఇతీశ్వరః ఐశ్వర్యయుక్తుఁడు, (ప్రభుత్వము గలవాఁడు).
ఈశ్వరి - పార్వతి.
ఈశ్వరస్య పత్నీ ఈశ్వరీ, ఈ-సీ. - ఈశ్వరుని భార్య.
అక్షయము - 1.తరుగనిది, నాశముకానిది, 2.ఇల్లులేనిది, వి.పరమాత్మ.
సింహము - 1.కేసరి, సింగము, 2.ఒకరాశి, 3.శ్రేష్ఠము, (సమాసోత్తరపదమైనచో).
సింగము - సింహము, సం.సింహః.
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.
దరీ తు కందరో వాస్త్రీ -
దరి - గుహ.
దీర్యతే దరీ. ఈ. సీ. దౄ విదారణే – భేదింపఁ బడినది.
కందర - కొండబిలము, గుహ.
కేన జలేన దీర్యత ఇతి కందరః, ప్స. దౄ విదారణే. జలముచేత వ్రక్కలింపఁబడునది.
కృతిమమైన (మనుజులు ద్రవ్విన)గృహాకారమైన పర్వత బిలము పేర్లు.
కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము - (జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)
దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్.
తీరము - దరి, సం.వి. (భూగో.) అంచువలె సముద్రపు నీటికి తగిలియున్న భూమి.
కర2 - తీక్షణము, సం.ఖరమ్.
గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువు కట్ట, పర్వతము, సం.ఘట్టః.
గట్టుతాలుపు - విష్ణువు, వ్యు.మందరగిరి నెత్తినవాడు.
ఒడ్డు1 - క్రి.1.పందెమువేయు, 2.చాచు, 3.ఉంచు, 4.అడ్దగించు, వి.1.తీరము, 2.పందెము, 3.వ్యూహము, 4.పూనిక, విణ.స్థూలము, 2.అధికము, 3.విశాలము.
ఓడ్దు2 - అన్యుడు; అన్యుఁడు - ఇతరుడు.
ఒడ్దణము1 - 1.పందెము, 2.వ్యూహము.
ఒడ్దనము2 - బెత్తము మొ.చే చేయబడిన కేడేము, సం.అందనమ్.
ఒడ్డుగండ్లు - (భూగో.) గండశైలములు, కొండనుండి దొర్లు పెద్ద రాళ్ళు.
గండశైలము - 1.పెద్దరాయి, 2.కొండనుండి భూకంపాదులవలన జారిన పెద్దరాయి, 3.కోయిల.
దేవఖాతబిలే గుహా, గహ్వరమ్ -
ఖాతము - 1.గాతము, 2.అగడ్త, 3.పుష్కరిణి.
గాతము - పల్లము, గుంత, సం.ఖాతమ్.
దేవైః ఖాతం - దేవతలచే ద్రవ్వఁబడినది.
నిమ్నము - పల్లము, విణ.లోతైనది, విణ.(వృక్ష.)అధస్ద్సితము (Inferior).
నిమ్నోన్నత రేఖలు - (భూగో.) సముద్రమునకు పైని ఒకే ఎత్తున ఉన్న ప్రదేశముల నన్నిటిని కలుపు ఊహారేఖలు.
నిమ్నం గభీరం గమ్భీరమ్ :
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము. మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
దాఁగు - మరుగుపడు, రూ.డాఁగు.
దండసిల్లు - మరుగుపడు, అణగు, రూ.దండసిలు.
తాఱు - అడగు, మరుగుపడు.
మఱుఁగు - మఱుఁగుచోటు, క్రి.1.డాగు, చాటగు, 2.సంతాపించు.
అపవారణము - మరుగు. మఱుకువ - సంతాపించు.
ఓలమానగొను - 1.శరీరము రక్షించుకొను, 2.మరుగుపడు, 3.వెనుదీయు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె (Heart).
గుండె - గుండియ; గుండియ - హృదయము, రూ.గుండె. కందనకాయ - గుండెకాయ.
హ్రియతే విషయైరిరి హృదయం, హృచ్ఛ, ద. న. హృఞ్ హరణే - విషయాదులచేత హరింపఁ బడునది.
స్వాంతము - 1.మనస్సు, 2.గుహ.
స్వనతీతి స్వాన్తం, స్వనశబ్దే, తద్ద్యోగాభావే వాగ్వ్యాపారాభావాద త్రోవచారః. - పలుకునది. మనస్సంబంధము లేనపుడు వాగ్వ్యాపారము గలుగదు గనుక పలుకునది యని చెప్పుట ఔపచారికము. ప్రియ గుహవిని వేదిత పద రామ్|
అహంకారీతరజన స్వాంత సౌధ విహరణే,
నమోస్తు చిత్వరూపాయ రామా.....
గవి1 - ఆవు Cow.
గవి2 - 1.గుహ, 2.గుంట.
గర్తము - 1.గుంట, 2.క్రంత, 2.త్రిగర్త దేశము.
క్రంత1 - పెండ్లి కొడుకువారు పెండ్లి కూతురునకు తీసుకొని పోయెడు ప్రధాన ద్రవ్యము, రూ.కంత.
క్రంత2 - 1.సందురోవ, 2.రాజ వీధి, రాజ మార్గము 3.రచ్చ, 4.రంధ్రము, సం. గర్తః.
పెందెరువు - రాజమార్గము.
అంతరంగము - 1.హృదయము, 2.ఉల్లము, మనస్సు.
ఉల్లము - 1.హృదయము, 2.కోరిక. స్పృహ - కోరిక.
చిత్తము - మనస్సు. చిత్తము నందు దేవీస్థానం బ్రహ్మకళ|
సక్తము - ఒకదానియందు లగ్నమైంది(మనసు).
ఆత్మనిగ్రహము - ఆత్మస్వాధీనత, మనస్సును వశమునం దుంచుకొనుట (Self-control).
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుఁడు, వ్యు.మనస్సు నుండి పూట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు,మరీచి).
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది.
మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.
అంతఃకరణము - 1.మనస్సు, 2.దయ.
గూఢపథము - 1.అంతఃకరణము, హృదయము, 2.రహస్య మార్గము.
స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి. ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.
ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion).
ఆత్మబుద్ధి స్సుఖ చైవ - గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ - స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా. తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. – నీతిశాస్త్రము
5. మనుష్యాణాం ధర్మ ఇవ ధర్మః ఆచారో యస్య సః మనుష్యధర్మా, న. పు. - మనుష్యులయొక్క ఆచారమువంటి ఆచారము కలవాఁడు.
6. ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.
ధనం దదాతీతి ధనదః డుదాఞ్ దానే - ధనము నిచ్చువాఁడు.
దనం దయతే రక్షతీతివా ధనదః దేజ్ రక్షణే - ధనమును రక్షించువాఁడు.
దాత - ఇచ్చువాడు; దాని - 1.మదముకలది, 2.దాత.
దాయి - దాకలి, సం.విణ.ఇచ్చువాడు.
దాకలి - లోహము కాచి సాగగొట్టుటకు క్రింద ఊతముగా నుంచుకొను ఇనుముదిమ్మె, విఘాతక, రూ.దాకలి, దాగలి.
దాగలి - దాకలి.
విడిముడి - ధనము, (విడియు+ముడి).
విడువరి - పరిత్యాగశీలుడు.
వితరణి - దాత.
వదాన్యుఁడు - మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉదారుఁడు- 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.
ఉత్తంసుఁడు - గొప్పవాడు.
మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.
మహనీయుఁడు - గొప్పవాడు.
అధికుఁడు - గొప్పవాడు; అలఘుఁడు - గొప్పవాడు.
ద్రవ్యము - 1.ధనము 2.వస్తువు.
ద్రవణీయ మితి ద్రవ్యం, ద్రుగతౌ. - పొందఁదగినది.
దాతాదరిద్రః కృపణోధానాఢ్యః, పాపీ చిరాయుస్సు కృతీగతాయుః |
రాజాకులీన స్సుకలీనసేవ్యః, కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి||
తా. దాతయైనవాఁడు దరిద్రుఁడౌట, కృపణుఁడు- 1.పిసినిగొట్టు, లోభి, 2.కుత్సితుడు.ధనాఢ్యుడౌట, పావి - పాపి, సం.పాపీ.)దీర్ఘాయుష్మ తుండౌట, పుణ్యాత్ముఁడు అల్పాయుష్కుండౌట, హీనకులుడు రాజౌట, శ్రేష్ఠకులుడు సేవకుడౌట, ఈ యాఱు గుణములు కలియుగమునందు కలిగియున్నవి. - నీతిశాస్త్రము
మూర్దాభిషిక్తుఁడు - 1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).
రాజ్యారోపణకాలే మూర్ధ్ని అభిషిక్తో మూర్ధాభిషిక్తః ఫ్రథమః క్షత్రియః తత్ప్రభవతయా అనభిషిక్తా అపి మూర్ధాభిషిక్తాఖ్యాః, యథా బ్రహ్మబహుజస్య వంశ్యా బాహుజా స్తథై వేతి జ్ఞేయం. - రాజ్యమున బట్టముఁ గట్టునపుడు శిరస్సున నభిషేకము చేయఁబడు పట్టభద్రుఁడు మూర్ధాభిషిక్తుఁడు. ఇది ఆ వంశ మందుఁ బుట్టిన మూర్ధాభిషిక్తుఁడు కాని క్షత్రియ మాత్రునియందును వర్తించును. ఏప్రకారముగా బ్రహ్మ బాహుజుని వంశమందుఁ బుట్టినవారు బాహుజు లనంబడుదురో, అలాగుననేయని తెలియఁదగినది.
మూర్దము - తల.
మూర్ఛత్యున్నతో భవతిమూర్ధా, న. పు. మూర్ఛామోహ సముచ్ఛాయయోః - ఉన్నతమైనది.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్. వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందు భాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.
మూర్ధాభిషిక్తో భూపే(అ)పి -
మూర్ధాభిషిక్త శబ్దము రాజమాత్రునకును, అపిశబ్దమువలన పట్టభిషిక్తునికిని పేరు.
మూర్ద్ని అభిషిచ్యతే స్మ మూర్ధాభిషిక్తః, షిచిర్ క్షరనే. - శిరస్సునందు అభిషేకము చేయఁబడువాఁడు.
చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు.
సార్వభౌముఁడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.
సర్వభూమ్యాం విదితః సార్వభౌమః - సమస్తభూమియందు నెఱుఁగఁబడినది.
సమ్రాట్టు - చక్రవర్తి.
సాంబ్రాణి1 - (వ్యవ.) ఇది Styrax benzoin అను చెట్టు యొక్క కాండమునుండి లభించు చమురు పదార్థము. ఇది ధూప ద్రవ్యముగ ఉపయోగములోనున్నది. ఒక విధమైన ధూపద్రవ్యము, రూ.సామ్రాణి.
సాంబ్రాణి2 - ఉత్తమాశ్వము, విణ.సామ్రాట్.
రాజరాజు - 1.చక్రవర్తి, సార్వభౌముడు, 2.దుర్యోధనుడు, 3.చంద్రుడు Moon.
8. ధనాధిపుఁడు - కుబేరుడు.
ధనస్య అధిపః ధనాధిపః - ధనమునకు అధిపతి.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోష పెట్టునది. 'ధన ధాన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
విత్తము - ధనము, సం.విణ.1.విచారింప బడినది, 2.తెలియబడినది.
విద్యతే లభ్యత ఇతి విత్తం, విద్ ఌ లాభే. - పొందఁబడునది.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).
రొక్కపుదొర - కుబేరుడు.
రొక్కము - 1.నగదు, 2.చేతివెల, 3.సమూహము, సం.ఋక్షమ్.
నగదు - నాణెము రూపమైన సొమ్ము, (అర్థః.) రొక్కము, సొమ్ము, పైకము, ద్రవ్యము.
సొమ్ము - 1.స్వము, 2.ధనము, 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీనవస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు. ధనము - విత్తము, 1.ఆలమంద, వి. (గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది, 2.తెలియబడినది.
దనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).
ద్రవ్యము - 1.ధనము 2.వస్తువు.
ద్రవణీయ మితి ద్రవ్యం, ద్రుగతౌ. - పొందఁదగినది.
ద్రవ్యము - (అర్థ.) 1.క్రయవిక్రయ కార్యములలో వినిమయమునకు ఉపయుక్తమగునట్టిది (Money), 2.ప్రభుత్వామోదము కలిగిన ఏదైన వస్తువు, 3.(భౌతి.) పదార్థము (Matter).
గమి1 - పోవువాడు (తెరువరి).
గమి2 - సమూహము, విణ.తరచైనది.
వాతము - సమూహము, గుమి.
గమికత్తె - 1.అంతఃపురమున కావలియుండు స్త్రీ, 2.అంతఃపుర పరిచారిక లలో ముఖ్యురాలు.
గమికాఁడు - 1.అధిపతి, 2.అల్పసేనాధిపతి, సేనాపతి, 3.ముఖ్యజనుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒకభాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
దానం భోగో నాశస్తి స్రోగతయో భవంతి విత్తస్య,
యోనదదాతి నభుక్తేతస్య తృతీయాగతి ర్భవతి|
తా. ధనమునకు దానము, అనుభవము, నాశము అను నీ మూడు విధములైన గతులుగలవు. ఏ ధనికుండు యెవరికి నియ్యక తా నను భవించక యున్నాఁడో వాని ధనం దొంగలపాలగును. – నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
పుష్పకము - 1.కుబేరుని విమానము, 2.రత్నకంకణము, వి.(వృక్ష.) ముండక పుష్పమంజరిలోని పూవు (Floret).
ఘోటకే వీతి తురగ తురంగాశ్వ తురంగమాః,
వాజి వాహ్వర్వ గన్ధర్వ హయ సైన్ధవ సప్తయః,
ఘోటకము - గుఱ్ఱము, వి.గోడా.
భూమౌ ఘుటతి పరివర్తన ఇతి ఘోటః స ఏవ గోటకః. ఘుటపరివర్తనే. - భూమియందు పొర్లాడునది.
గోడ - 1.భిత్తి, సం.కుడ్యమ్, 2.గుఱ్ఱము, రూ.గోడా, సం.ఘోటః.
ఘోటక బ్రహ్మచర్యము - (జాతీ.) ఎవ్వరును కన్యక నీయక పోవుటచే, గతిలేక బ్రహ్మచర్యము చేయుట, బూటకపు బ్రహ్మ చర్యము (నక్క వినయము, బక కొంగ ధ్యానము మొ.వి ఇట్టివే అసత్యములు).
భిత్తి - 1.గోడ, 2.భేదనము, 3.జుత్తలి.
భిత్తిక - 1.పిడుగు, 2.గోడ.
కుడ్యము - 1.గోడ, 2.పూత.
ఇడుపు - 1.గోడ, 2.చీలిక, 3.గోడ ఇరుపార్శ్వముల మీదిచోటు. గోడ మీద పిల్లి వాటము.
అర్వతియాతి అర్వా. న. పు. అర్వగతౌ. - వేగముగాఁ బోవునది. తకారాంతరంబును గలదు. "శ్లధీకృతప్రగ్రహ మర్వతాం వ్రజాః" అని మాఘము.
వీతిహోత్రుఁడు - అగ్ని.
వీతిః అశనం హోత్రం హవిః యస్యసః వీతిహోత్రః - వీతి యనఁగా అశనము.
హోత్ర మనఁగా హవిస్సు, ఆ యశనమే హవిస్సుగా గలవాఁడు.
హోత్రస్య హవిషోవీతి రశ్వ ఇవ వహనాద్వా - హవిస్సును గుఱ్ఱమువలె మోచికొనిపోయి దేవతల కిచ్చువాఁడు.
వీతయ అశ్వాః హోత్రం హవ్య మశ్వమేధే యస్య సః - అశ్వమేధమునందు గుఱ్ఱములు హవిస్సుగాఁ గలవాఁడు.
వీతి - 1.పరుగు, 2.తిండి, 3.జిగి, 4.గుఱ్ఱము.
వీతం త్వసారం హస్త్వశ్వమ్-
వేతి యుద్ధాదికర్మణ ఇతి వీతం, వీ.గత్వాదౌ. - వెళ్ళునది.
అసారము - బలములేనిది, యుద్ధమునకు సమర్థము కాని యేనుఁగు, గుఱ్ఱము వీతి యనంబడును.
కిన్నరేశుఁడు - కుబేరుడు.
కిన్నరాణా మీశః కిన్నరేశః - కిన్నరులకుఁ బ్రభువు.
కిన్నరుఁడు - నరముఖమును, అశ్వ శరీరమును గల దేవజాతికి చెందినవాడు.
అశ్వముఖత్వాత్కుత్ప్తా నరాః కింనరాః - గుఱ్ఱపుమోము గలవారుగాన ఏవగింపఁదగినవారు కిన్నరులు.
స్యా త్కిం నరః కుంపురుష స్తురంగవదనో మయుః,
కించిన్నరః కిన్నరః - ఇతని శరీరము కొంచెము నరాకారమై యుండును.
కుత్సితో నరో వా కిన్నరః - అశ్వముఖవత్త్వము విజాతీయము గనుక కుత్సితమైన నరుఁడు.
కించిత్పురుషః కొంపురుషః - ఇంచుకంత పురుషా కృతి గలవాఁడు.
తురంగస్యేవ వదనం యస్య సః తురంగవదనః - గుఱ్ఱముయొక్క ముఖము వంటి ముఖము గలవాఁడు.
మయతే వినిమయుత ఇతి మయుః, ఉ-పు. మేఙ్ ప్రణిధానే - కామరూపి గనుక రూప వినిమయము చేసికొనువాఁడు.
కింపురుషుఁడు - అశ్వముఖమును, నర శరీరమును గల ఒక దేవజాతికిచెందినవాడు.
మావుమోముకాఁడు - కింపురుషుడు.
మావు - 1.గుఱ్ఱము, 2.అశ్వసంగమము.
తురంగమము - గుఱ్ఱము, రూ.తురంగము, తురగము.
తురం త్వరితం గచ్ఛతీతి తురగః, తురఙ్గః తురఙ్గమశ్చ, - వేగిరముగాఁ బోవునది.
తురికి - తురుష్కదేశపు గుర్రము, రూ.తురికి, తుర్కి, సం.తురుష్కః.
తురక - తురుష్కుడు, మ్లేచ్ఛుడు, సం.తురుష్కః.
తత్తడి - 1.గుర్రము, 2.వాహనము.
తత్తఱ - సంభ్రమము, రూ.తత్తరము.
సంభ్రమము - (గృహ.) 1.సంబరము, 2.వేగిరపాటు, 3.భయము, 4.ఆదరము.
సంబరము - సంభ్రము, వేగిరపాటు, సంతోషము, పండుగ, రూ.సంబ్రము, సం.సంభ్రము.
సంవేగము - సంభ్రమము, వేగిరపాటు, సం.(జీవ.) ప్రేరణ (Impulse).
ప్రచోదనము - (భౌతి.) హఠాత్తుగా క్షణికముగా నారోపింపబడిన బలము (Impulse), చూ.అఘాతము.
సంభ్రమము - (గృహ.) 1.సంబరము, 2.వేగిరపాటు, 3.భయము, 4.ఆదరము.
సంభ్రమించు - క్రి.వేగిరపడు. త్వరపడు - వై.వి. వేగిరపడు.
సంవేగాత్మకము - (గృహ.) సులభముగా మనోవికారము పొందు నట్టిది, (Emotional).
వేగి - గుఱ్ఱము, విణ.వడిగలది.
వేగ - వడి, విణ.త్వరితము.
తురితము - త్వరితము, శీఘ్రము, రూ.తురీవ, సం.త్వరితమ్, ద్రుతమ్.
త్వరితము - శీఘ్రము, వడిగలది.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము(శౌర్యము - శూరత్వము, ప్రౌడిమము.), 4.దారముపిడి, వై.వి.పద్యయతి, సం.వళిః.
వేగము - జవము, త్వర, (గణి. భౌతి) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
జవము - వేగము.
జవనము - వేగముకలది, వి.వేగము.
త్వర - వేగిరపాటు; వేగిరపాటు - వేగపాటు; వేగపాటు - సంభ్రమము.
జుహూరాణము - గుఱ్ఱము, రూ.జుహూరాణము.
ఖేంభాణము - గుఱ్ఱము.
రేవంతుఁడు - అశ్వశిక్షకుడు.
రౌతు - రావుతు, రాహుత్తు రావుతు, సం.రాహుత్తః.
రాహుతు - గుఱ్ఱపు రౌతు, సం.రాహుత్తః.
సరదారు - శూరుడు, రౌతు, సం.శరధారీ.
శూరుఁడు - సూర్యుడు, వ్యు.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు.
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీ కృష్ణ భగవానుడు.
అక్కరకు రానిచుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున, తా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
తా. అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించినను కోరిక తీర్పని(దేవత - వేలుపు)దైవమును, తానధిరోహించినప్పుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును బుద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచి పెట్టును.
సంపత్కరీసమారూఢ - సింధుర వ్రజసేవితా|
అశ్వారూఢాధిష్ఠితాశ్వ - కోటికోటిభిరావృతా. – 25శ్లో
తురంగమము - గుఱ్ఱము, రూ.తురంగము, తురగము.
తురం త్వరితం గచ్ఛతీతి తురగః, తురఙ్గః తురఙ్గమశ్చ, - వేగిరముగాఁ బోవునది.
తురికి - తురుష్కదేశపు గుర్రము, రూ.తురికి, తుర్కి, సం.తురుష్కః.
తురక - తురుష్కుడు, మ్లేచ్ఛుడు, సం.తురుష్కః.
విష్టరశ్రవుఁడు - విష్ణువు, వ్యు.దర్భ పిడికిళ్ళవంటి చెవులు గలవాడు.
విష్టరశ్రవా, స-పు. విష్టరే ఇనశ్రవసీ కర్ణౌయస్యసః - దర్భముడి వంటి చెవులు గలవాడు.
విష్తరే అశ్వర్థతరౌ శ్రూయత ఇతివా - అశ్వర్థ వృక్షము నందు వినబడువాడు.
విష్టరాకారో రోమావర్తః శ్రవసి యస్యసః - విష్టరాకార మైనరోమావర్తము చెవియందుగలవాఁడు.
విష్టరం వ్యాపనశీలంశ్రవః కీర్తిర్యస్యసః – వ్యాపన శీలమైన కీర్తిగలవాడు.
విష్టరము - 1.ఆసనము, 2.మ్రాను, 3.దర్భ పిడికిలి.
రావి - 1.అశ్వర్థము, 2.రావిచెట్టు.
అశ్వర్థము - 1.రావిచెట్టు, 2.అశ్వినీ నక్షత్రము, 3.ఆశ్వయుజ పూర్ణిమ. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం.
వట్టుచుఁ దండ్రి యత్యధమవర్తను డైననుగాని వానికిం
బుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్ద ధన్యుడౌ
నెట్లన మఱ్ఱివిత్తుమును పెంతయు గొంచెము దానబుట్టునా
చెట్టుమహోన్నతత్త్వమునుజెందదె శాఖ నుండి, భాస్కరా.
తా. మఱ్ఱి విత్తనము చిన్నదైనను దాని విత్తనము లో నుండి ఉద్భవించిన మొక్క పెద్దదై అనేక శాఖలతో(శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.)లతో పెరుగును. అట్లే నీచున కుదయించినను వారు(పుత్రుడు) తమ పుణ్య ఫలముచే(ధన్యుఁడు - పుణ్యవంతుడు)ఘనత గాంచవచ్చును.
అశ్వమేథము - అశ్వమును బలిపశువుగా చక్రవర్తి చేయు యజ్ఞము.
యాయావరము - 1.ధాన్యయాచన, 2.అశ్వమేధ పశువు.
యయు రశ్వో (అ)శ్వమేధీయః -
విసృస్టో దేశే దేశే యాతీతి యయుః, ఉ-పు. యా ప్రాపణే. - విడువఁబడినదై ప్రతి దేశమునకుఁ బోవునది. ఈ ఒకటి అశ్వమేధమునకు నర్హమైన యశ్వము.
అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
అశ్నుతే గమనేనే త్యశ్వ. అశూ వ్యాప్తౌ. - గమనముచేత వ్యాపించునది.
గుఱ్ఱము - అశ్వము Horse.
అశ్వసామర్థ్యము - (భౌతి.) ఒక గుఱ్ఱము చేయగల పనిని చూపు సామర్థ్యము, (భౌతికశాస్త్ర నిర్వచన ప్రకారము)33,000 పౌన్లు ఒక నిమిషము లో ఒక అడుగు ఎత్తునకు ఎత్తుటకు సరిపోవు సామర్థ్యము. (ఇది యాంత్రిక శాస్త్ర మందు ఇంజనులు పనిచేయు శక్తిని లేక సామర్థ్యమును కొలుచు ప్రమాణము (Horse-power).
వీతిహోత్రుఁడు - అగ్ని.
వీతిః అశనం హోత్రం హవిః యస్యసః వీతిహోత్రః - వీతి యనఁగా అశనము హోత్ర మనఁగా హవిస్సు. ఆ యశనమే హవిస్సుగా గలవాఁడు.
హోత్రస్య హవిషోవీతి రశ్వ ఇవీ వహనాద్వా - హవిస్సును గుఱ్ఱమువలె మోచికొనిపోయి దేవతల కిచ్చువాఁడు.
వీతయః అశ్వాః హోత్రం హవ్య మశ్వమేధే యస్య సః - అశ్వమేధము నందు గుఱ్ఱములు హవిస్సుగాఁ గలవాఁడు. అశ్వమేధక్రతు దీక్షిత రామా!
దరిద్రాయకృతందానం శూన్యలింగస్య పూజనమ్|
అనాధ ప్రేతసంస్కారం అశ్వమేధ సమం విదుః||
తా. దరిద్రుని కొఱకుఁ జేయఁబడిన దానము, పూజలేని లింగమునకు పుజ గలుగజేయుట, దిక్కులేని పీనుగునెత్తి కాల్చుట(సంస్కారము - 1.చక్క జేయుట, 2.శవమును దహించుట, 2.అనుభూతార్థ స్మృతిపాకము, రూ.సంస్క్రియ.) ఈ మూడును అశ్వమేధ యాగమునకు సమానములు. – నీతిశాస్త్రము
వాజి - గుఱ్ఱము.
వాజో వేగస్తద్యోగా ద్వాజీ. న. పు. వజ గతౌ. - వాజ మనఁగా వేగము; అది గలది.
వాజినో (అ)శ్వేషు పక్షిణః,
వాజిన్ శబ్దము గుఱ్ఱమునకును, అమ్మునకును, పక్షికిని పేరు.
వాజాః పక్షాస్సంత్యస్యేతి వాజీ, న. పు. - ఱెక్కలు గలిగినది.
మందడి - గుఱ్ఱపుసాల, సం.మందురా.
వాజిశాలా తు మందురా,
వాజినాం శాలా - గుఱ్ఱముల చావడి.
మందంతే అశ్వా అత్ర మందురా, మది స్తుత్యాదౌ. - దీనియందు గుఱ్ఱములు మదించును. ఈ 2 గుఱ్ఱపు చావడి పేర్లు.
వాజపేయము - ఒకానొక యాగము.
వాజము - 1.నెయ్యి, 2.నీరు, 3.రెక్క.
వామి - ఆడు గుఱ్ఱము, వి.ప్రోగు, రాశి.
వమతి గర్భం వామీ, ఈ. సీ. టు వము ర్ద్గిరనే - గర్భమును వెళించునది
ప్రోఁగు - పోగు; పోఁగు - 1.దారము, 2.చెవినగ.
రాశి - 1.రాసి 2.నికాయము, సమూహము. 2.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
బాబారౌతు - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
బాబా - గుఱ్ఱము, సం.బడబా, వాహః.
బడబ - 1.ఆడుగుఱ్ఱము, 2.బ్రహ్మణ స్త్రీ, 3.తార్పుకత్తె.
వలతే బదబా, వల సంచలనే. - వబయోర్లళయోశ్పైకత్వం. - చలించునది. ఈ 3 గోడిగె పేర్లు, ఆఁడుగుఱ్ఱము.
అశ్వని - 1.27 నక్షత్రములలో మొదటిది (Aries), 2.అశ్వినీ దేవతలతల్లి, బడబ.
బాడబం గణే,
బడబానాం సమూహో బాడబం. - గొడిగల మూక.
వారువము - గుఱ్ఱము, రూ.వార్వము, సం.వారః.
వాపురము - గుఱ్ఱము, రూ.వారువము, వార్వము, సం.వారః.
వారము - 1.సూర్యాది వాసరము, 2.తడవ, 3.సమూహము, వి.వారు, వావము, గుఱ్ఱము (కొందరీ యర్థమందును వారశబ్దము, సం.వి.గనే గ్రహించిరి).
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
కాంభోజము - 1.ఒకానొక దేశము, 2.కాంభోజ దేశపు గుఱ్ఱము.
కాంభోజ దేశే భవాః కాంభోజాః - కాంభోజ దేశమందుఁ బుట్టినవి.
వైశ్రవణుఁడు - కుబేరుడు.
విశేషేన శృణోతీతి విశ్రవాః తస్యాపత్యం వైశ్రవణః - విశేషముగా వినెడు వాఁడు గనుక విశ్రవస్సు, అతనికొడుకు వైశ్రవణుఁడు.
యస్యాతివీర్యాంబుధివీచిరాజౌ వంశ్యైరహో వైశ్రవణో విలీనః |
తం వైరివిధ్వంసనశీలలీలం శ్రీజానకీజీవన మానతో స్మి | - 6
పౌలస్త్యుఁడు-పులస్త్య బ్రహ్మ వంశమువాడు, 1.కుబేరుడు, 2.రావణుడు.
పుల్లస్త్యస్య గోత్రాపత్యం పౌలస్త్యః - పులస్తుని వంశమునందుఁ బుట్టినవాఁడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
దశకంఠుఁడు - రావణుడు. రావణ నిధనప్రస్థిత రామ్|
మండోదరి - రావణుని భార్య, రూ.మండోదరి.
ఇంద్రజిత్తు - మేఘనాథుడు, రావణుని కొడుకు, వ్యు.ఇంద్రుని జయించినవాడు.
మేఘనాథుఁడు - రావణుని కొడుకు.
శూర్పణఖ - రావణుని చెల్లెలు.
(ౘ)చుప్పనాక - శూర్పణఖ, రావణుని చెల్లెలు, రూ.చుప్పనాతి. శూర్పణఖార్తి విధాయక రామ్|
చంద్రహాసము-1.కత్తి, 2.రావణాసురుని ఖడ్గము.
చంద్రవత్ హసతిప్రకాశతే చంద్రహాసః - చంద్రునివలెఁ బ్రకాశించునది.
కట్టడఁదప్పితాము చెడుకార్యముఁ జేయుచు నుండిరేని తోఁ
బుట్టినవారినైన విడిచిపోవుటకార్యము, దౌర్మదాంధ్యమున్
దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణా ఖ్యుఁడా
పట్టున రాముఁజేరి చిరపట్టముఁగట్టుకొనండె, భాస్కరా.
తా. దుర్మాదాంధుడగు రావణాసురుడు, విభీషణుడను పేరు గల తన సోదరుని ధర్మ బోధనలు పాటింపక యాతనిని చంపనుంకించెను. అందులకా విభీషణుడట నుండి విభీషణా భయదాయక రామ్| రాముని సన్నిధి కేగి కొన్నాళ్ళకు లంకాధిపతి యయ్యెను. అట్లే ధర్మ విషయమై సహోదరులైనవా (తోఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోబుట్టుగు, తోబుట్టువు, తోడబుట్టువు.)రొకరితో నొకరు కలహించుట కంటే విడిపోవుట మంచిది. అట్లు చేసిన మేలగును.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
రాముడిని కోరుకుని, సీతను వద్దన్న శూర్పణక ముక్కు చెవులు కోయించుకుంది(స్త్రీ హత్య మహాపాపం కనుక లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి వదిలిపెట్టాడు). సీతను కోరిన రావణాసురుడు వినాశనాన్ని కోరుకున్నాడు. సీతారాములను విడదీసి చూడాల నుకున్న వారు ఇద్దరు నాశనమైనారు. - శ్రీమద్ రామాయణం
నరవాహనుఁడు - కుబేరుడు.
నరోవాహం యస్యసః నరవాహనః - నరుఁడు వాహనముగాఁ గలవాఁడు.
నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ఋషి.
నృణంతి నయంతి సర్వం స్వవశమితి నరాః, నృనయే. - అన్నియుఁ దమ వశముఁ బొందించు కొనువారు.
నయంతతి నరః, ఋ. పు. ణీఞ్, ప్రాపణే. - అన్నిటిని స్వవశముఁ బొందించుకొనువారు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చెటికినేగు విశ్వ.
తా|| ఓ వేమా! మనుష్యుడు జన్మించినపుడు తనవెంట యేమియు తేడు. చనిపోవునపుడు(గిట్టు - క్రి.1.గిట్టుబడియగు, 2.చచ్చు, 3.నశించు, 4.లాభించు, 5.చాలు.)కాలమున యేమియు తీసుకొనిపోలేడు. తానెచ్చటికిబోవునో తన ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive) మెచ్చటికి బోవునో యెవరును తెలుసుకొనలేరు.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మనోరవత్యాని మనుష్యాః, మానుషాశ్చ - మనువుకొడుకులు గనుక మనుష్యులు, మానవులు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మర్త్యుఁడు - మనుష్యుడు.
మ్రియంత ఇతి మర్త్యాః, మృఙ్ ప్రాణత్యాగే. - మృతిని బొందువారు.
మర్తో భూలోకః తత్రభవా మర్త్యాః. - మర్త మనఁగా భూలోకము అచటఁ బుట్టినవారు.
మనోర్జాతా మనుజాః, జనీ ప్రాదుర్భావే. - మనువువలనఁ బుట్టినవారు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.
మనోరిమే మానవాః - మనువు సంబంధమైనవారు.
మానవశాస్త్రము - మానవుని శారీరక మానసిక నిర్మాణ వర్ణనాశాస్త్రము(Anthropology).
మనువులు - స్వాయంభువుడు (స్మృతి కర్త.) స్వారోచిషుడు, ఉత్తముడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు (పదు నాల్గురు).
కృతకము - మనుష్యులచే చేయబడునది, కృత్రిమము.
కృత్రిమము - మనుష్యులచే చేయబడినది, (భౌతి. రసా,) ప్రకృతిలో దొరకునదికాక మానవునిచే నిర్మితమైనది (Artificial).
యక్షుఁడు - 1.కుబేరుడు, 2.ఒక దేవ జాతివాడు.
యక్షేషు రాజతే యక్షరాట్. జ-పు. రాజృదీప్తౌ - యక్షులకుఁ బ్రభువై ప్రకాశించువాఁడు.
యుక్షరాట్టు - 1.జక్కులరేడు, 2.కుబేరుడు.
ౙక్కులఱేఁడు - కుబేరుడు.
రాజ్ఞం యక్షాణాం రాజా రాజరాజః - జక్కులఱేఁడు.
ౙక్కులు - యక్షులు, దేవతలలో నొక తెగ.
యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిషృత చారువామకళేబరమ్
క్ష్వేనీలగళం పరశ్వథధారణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| – 4
ౙక్కినీఁడు - కుబేరుడు.
ౙక్కిమోర వేలుపు - కింపురుషుడు.
కింపురుషుఁడు - అశ్వముఖమును నర శరీరమును గల ఒక దేవజాతికి చెందినవాడు.
మావుమోముకాఁడు - కింపురుషుడు.
మావు - 1.గుఱ్ఱము, 2.అశ్వసంగమము.
మాలీషు - గుఱ్ఱమును తోముట.
ౙక్కి - 1.గుఱ్ఱము, 2.తిరుగలి.
ౙక్కించు - క్రి.కట్టుపడు.
గురుజు - (వ్యవ.) తిరుగలికి కొట్టు కొయ్య.
గురుసు - 1.మర్మము, ఆయువుపట్టు, 2.మేర, 3.కుదురు, మూలము, 4.ఒక రకమైన పశురోగము, 5.తిరుగలి త్రిప్పుటకు ఆధారమగు కొయ్య.
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ|
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్త్మె యకారాయ నమ శ్శివాయ.
ౙక్కిణి - 1.యక్షిణి, 2.కుబేరుని భార్య, 3.లోకాంతర మొంది దేవత్వము పడసిన ముత్తైదువ.
యక్షిణి - 1.గతించిన వృత్తాంతములదెల్పు విద్య, 2.కుబేరుని భార్య, 3.యక్షుని భార్య.
ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము 5.కుబేరుని భార్య.
వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
కుత్సీరము - వడ్డీబ్రతుకు.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.
ఉత్కర్షము - 1.మేలు, 2.అతిశయము, 3.అభివృద్ధి.
మేలు - 1.క్షేమము, శుభము 2.వలపు 3.పుణ్యము, సుకృతము 4.లాభము.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
సేమము - క్షేమము, శుభము, సం.క్షేమమ్.
శుభము - మంగళము.
మంగళము - శుభము, క్షేమము.
శుభంకరుఁడు - శుభమును చేయువాడు.
క్షేమంకరుఁడు - శుభంకరుడు, వ్యు.క్షేమమును కలిగించువాడు.
శుభంయువు - శుభముతో గూడుకొన్నవాడు.
శుభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.
మంగళ - పార్వతి; సర్వమంగళ - పార్వతి.
మంగళదేవత - లక్ష్మి.
శ్రేయము - 1.శుభము 2.ధర్మము, రూ.శ్రేయస్సు.
పుణ్యము - 1.ధర్మము 2.సుకృతము.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు - (గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy).
మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.
మృతు - చావు.
మిత్తిచూలు(ౘ) - కేతువు Ketu. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెపుగాము - వి.1.కేతుగ్రహము, మిత్తిచూలు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు.), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 4.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
గోపుచ్ఛము - 1.కోతి, 2.ఆవుతోక.
క్రోఁతి - వానరము, రూ.కోతి. వానరము - కోతి; వనచరము - కోతి; మర్కటము - కోతి.
కపి - కోతి; తిమ్మఁడు - కోతి; కొండత్రిమ్మరి - కోతి.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి చిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
బిడౌజుఁడు - ఇంద్రుడు.
వేష్టీతి విడం, వబయోరభేధా ద్బిడం వ్యాపనశీలం ఓజో యస్య సః బిడౌజాః స-పు. - వ్యాపనశీలమైన తేజస్సు గలవాఁడు.
బిడతీతి బిడం శత్రుభేదక మాక్రోశనం వా ఓజో యస్య సః - శత్రువుల భేదించునట్తి లేక ఆక్రోశింపఁ జేయునట్టి తేజస్సుగలవాఁడు. బిడ ఆక్రోశభేదనయోః.
పాకశాసనుఁడు - ఇంద్రుడు, వ్యు.పాకుడను రాక్షసుని పరిమార్చిన వాడు.
పాకం వృత్రాసురభ్రాతరం శాసితవాన్ పాకశాసనః - వృత్రాసురుని సోదరుఁడైన పాకాసురునిఁ జంపినవాఁడు.
పాకం గర్భం శిక్షితవాన్ - గర్భమును శిక్షించినవాఁడు. శాసు అనుశిష్టౌ.
పాకశాశని - 1.అర్జునుడు, 2.జయంతుడు, వ్యు.పాకశాసనుని కొడుకు.
ఐంద్రుడు - ఇంద్రపుత్రుడు, వి.1.జయంతుడు, 2.అర్జునుడు, 3.వాలి. జయంతుఁడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రుని భార్య, 4.జ్యేష్ఠానక్షత్రము, 5.తూర్పు East.
వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ|
వాలిశుఁడు - విష్ణువు.
వాలిఁడి - (వాలు+ఇఁడి)1.తోకలేని కోతి, 2.తోకలేనిది. గర్విత వాలిసంహారక రామ్|
మునుపొనరించుపాతక, మమోఘము జీవుకెల్ల బూనియా
వెనుకటి జన్మం దనుభవింపకదీరదు, రాఘవుండు వా
లిని బడవేసి తా మగుడ లీల యదూద్భువుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తనమేను, భాస్కరా.
తా. రఘురాముడు వాలిని వధించిన యనంతరము రామావతారము చాలించి తిరిగి యదుకుల సంభూతుడై పుట్టెను. ఆ కృష్ణమూర్తి - కృష్ణావతారము)నందు యుగాంతమునకు దాపుగా శ్రీకృష్ణుడు అడవిలో తపము చేయుచుండగా నొక కిరాతు (కిరాతుఁడు - ఆటవికుడు, అడవియందు తిరిగెడు బోయ.)డాతనిని మృగముగా భావించి యొక వాడికోల నేయ గా దానిచే కృష్ణుడు తన మేనుఁ బాసెను. కావున సమస్తజీవులకు పూర్వ జన్మమున జేయు పాపఫల మేజన్మమందు ననుభవింపక తీరదు.
యో వాలినా ధ్వస్తబలం సుకంఠం న్యయోజద్రాజపదే కపీనామ్|
తం స్వీయసంతాపసుతప్తచిత్తం శ్రీజానకీజీవనమానతో స్మి| - 4
శ్రీధరుఁడు - విష్ణువు.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః, ఈసీ, శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది, శ్రిఞ్ సేవాయాం.
సీ1 - జుగుప్సార్థమందు చెప్పుమాట.
సీ2 - శ్రీ. శ్రీధరం ప్రియ సంగమే|
సీకారీ - పాట పాడువాడు, గాయకుడు, సం.శ్రీకారీ.
సీమాటి - భాగ్యశాలియగు ఆడుది, సం.శ్రీమతీ.
శ్రీఫలా శ్రీమతీ శ్రీశా శ్రీనివాసా హరిప్రియా,
శ్రీకరీ భక్తానుకంపా శ్రీధరేశవరణ్యపి|
సీదరము1 - దారిద్ర్యము.
దారిద్ర్యము - బీదతనము, లేమి.
లేమి - దారిద్ర్యము, లేమిడి(లేవడి - లేమిడి), ఉండమి.
అభావము - 1.లేమి, 2.నాశము, విణ.1.లేనిది, 2.సత్యము కానిది.
లేమి - దారిద్ర్యము, లేమిడి, ఉండమి.
దారిద్ర్యము - బీదతనము, లేమి.
ఎద్దడీ - (ఎత్తు + తడి), 1.దారిద్ర్యము, 2.శూన్యము, 3.కరవు.
నిప్పచ్చరము - దారిద్ర్యము.
భీతుఁడు - 1.పేద, 2.భయపడినవాడు.
పేద - 1.దరిద్రుడు, 2.భటుడు, 3.అశక్తుడు, సం.వ్యర్థః.
బీద - దరిద్రుడు, రూ.పేద, సం.భీతః.
దరిద్రుఁడు - బీదవాడు.
దరిద్రాతి దుర్గతిం ప్రాప్నోతి దరిద్రః, దరిద్రా దుర్గతౌ. - దుర్గతిని బొందినవాఁడు.
దుర్గతి - 1.నరకము, 2.బీదతనము.
దురవస్థాం గతో దుర్గతః, గమ్ ఌ గతౌ. - దురవస్థను బొందినవాఁడు.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, దశా.
అవస్థ - 1.కా లా ను సా ర స్థి తి, 2.దురవస్థ, 3.బాధ.
దరిబేసి - 1.దీనుడు, 2.లోభి, 3.దేబె, హిం.దర్ నేష్.
దీనుఁడు - 1.ఖిన్నుడు, 2.దరిద్రుడు.
దీయత ఇతి దీనఃం, దీఙ్ క్షయే. క్షయించువాఁడు.
ఖిన్నుఁడు - ఖేదము నొందినవాడు.
ఖిన్నము - 1.ఖేదము నొందినది.
ఖేదము - దుఃఖము.
దేబె - దేవురుగొట్టు, దీనుడు. దేబె ముఖం వేసుకొను ఎలా వుందో! ఎలా ఉన్నాడో! చూడు అంటుంటారు.
భటుఁడు - బంటు, సేవకుడు, పనివాడు.
బంటు - (భటుడు) 1.సేవకుడు, 2.భక్తుడు, 3.శూరుడు, సం.భటః.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
భక్తుఁడు - భక్తికలవాడు.
శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
ప్రోడ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి.
పిఱికిమెకము - జింక.
పిఱికిపంద - బెదురుపోతు, పిరికి (Coward)
పిఱికి - భయశీలుడు, భీరుకః.
భీరుకుఁడు - వెరవరి, రూ.భీలుకుడు.
భీతము - భయము నొందినది, వి.వెరపు.
భీతి - భయము, బెదురు.
భ్యం శీలస్యా ఇతి భీరూః - వెఱుపు స్వభాముగాఁ గలది.
పిఱుతివియు - (పిరుదు+తివియు) వెనుదీయు, జంకు.
కాతరుఁడు - భయశీలుడు, పిరికి.
కాతరము - అధీరము, పిరికి.
అనర్థము - 1.వ్యర్థమైనది, 2.అర్థములేనిది, 3.పేద, వి.1.కీడు, 3.ప్రయోజనములేమి, 3.పేదరికము, 4.అర్థములేకుండుట.
మామురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ|
సీదరము2 - 1.పాము, 2.పాము కుబుసము, సం.శ్రీధరః. ద్వాదశం శ్రీధరం తధా|
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
ఆశ్లేష - ఇరువదియేడు నక్షత్రములలో తొమ్మిదవది.
తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.
మాతానిందతి నాభిన దతిపితాభ్రాతాన సంభాషతే|
భృత్యుఃకుప్యతి నానుగచ్ఛతిసుతః కాంతాపి నాలింగతే
అర్థప్రార్థవ శంకయానకురుతే నలాపమాత్రం సుహృ|
విత్తస్మాదర్థపార్జయ శ్రుణుసఖ్యేహ్యర్థేన సర్వే వశాః||
తా. దరిద్రుని (మాత)తల్లి నిందించును, తండ్రి(పిత)సంతసింపడు, అన్నదమ్ములు(భ్రాత - తోడ బుట్టినవాడు)మాటలాడరు, భృత్యుఁడు - సేవకుడు, పనివాడు. కోపగించు కొనును, సుతుఁడు - కొడుకు)వెంటరాడు, కాంత - కోరతగిన స్త్రీ, స్త్రీ. గౌగలించు కొనదు, తన్ను ద్రవ్యమడుగునను శంకచేత సుహృదుఁడు - మిత్రుడు తుదకు పలుకరింప నొల్లఁడు. ధనము(విత్తము - ధనము, సం.వి.1.విచారింపబడినది, 2.తెలియబడినది.)వలన నందరును స్వాధీను లగుదురు. కావున ధనమే (యా)ఆర్జింప వలెను. – నీతిశాస్త్రము
ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ - శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ - విశ్వేశ్వరీ శ్రీధరీ |
స్వర్గద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరి
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ. – 6
గౌతమబుద్ధుడు - (చరి.) సిద్ధార్థుడు, (క్రీ. పూ. 566-486). బౌద్ధధర్మ స్థాపకుడు, తథాగతుడు, శాక్యముని.
తథాగతఁ యథా పునరావృత్తిర్నభవతి తథా మోక్షం గతః - ఎట్లు పునరావృత్తి గలుగదో అట్లు మోక్షమునొందినవాడు.
తథా సమ్యగ్గతం జ్ఞాన మస్యేతి తథాగతః - మంచిజ్ఞానముగలవాఁడు.
యథామునయో మోక్షం గతా స్తథా మోక్షం గత ఇతివా - మునులెట్లు మోక్షమును బొందిరో అట్లు మోక్షమును బొందినవాడు.
సిద్ధర్థుఁడు - శాక్య బుద్ధుడు.
సమంతభద్రః సమంతతః పుణ్యసంభారాత్ జ్ఞాన సంభారాచ్చ భద్రః శ్రేష్ఠః - పుణ్యసంభారము వలనను జ్ఞాన సంభారము వలనను శ్రేష్ఠుడు.
సమంతం సంపూర్ణం భద్రం మంగళమస్యేతి వా - సంపూర్ణమైన శుభము గలవాఁడు.
శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
శాక్యమునిః, ఇ-పు. శాకవనవాసిత్వాచ్ఛాక్యః - శాక్యశ్చాసౌ మునిశ్చ శాక్యమునిః, శాకావృక్షప్రతిచ్ఛన్నం, వాసం యస్మాచ్చ చక్రిరే, తస్మాదిక్షాకు వంశ్యాన్తే శాక్యా ఇతి భువి స్మృతాః. - శాకవనమందుందువాడు.
శకదేశేషు జాతో మునిః - శకదేశములయందుఁ బుట్టిన ముని.
శాక్యసింహుఁడు శాక్యముని, బుద్ధుడు.
శాక్యసింహః, శాక్యేషు సింహఃశ్రేష్టః - శాక్యులలో శేష్ఠుడు.
సర్వార్థసిద్ధుఁడు - శాక్య బుద్ధుడు.
సర్వార్థసిద్ధః సర్వార్థేషు సిద్ధో నిష్పిన్నః - అన్నిపనులయందు గృతార్థుడైనవాడు.
గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు.
గౌతమః గౌతమస్య శిష్యాశ్శాక్యా గౌతమా ఇత్యుచ్యతే, తద్వంశావతీర్థత్వా ద్బుద్ధో (అ)పి - గౌతమముని శిష్యులు గనుక శాక్యులు గౌతములు, ఆ వంశమందుఁ బుట్టినవాఁడు. గౌతమముని సంపూజిత రామ్|
గోదవరి - గౌతమినది. గౌతమముని భార్య, అహల్య. శ్రీమ దహల్యోద్ధార్క రామ్|
గోదారి - 1.వెన్నకాచిన మడ్డి, 2.గోదవరి. గోదావరి యందు దేవీస్థానం త్రిసంధ్య|
క్రూరమనస్కులౌ పతులఁగొల్చివసించిన మంచి వారికిన్
వారిగుణంబుపట్టి చెడువర్తనవాటిలుఁ, మాధురీ జలో
ధారలు గౌతమీముఖమాహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁజెందవే మొదలి కట్టడలన్నియుఁదప్పి భాస్కరా.
తా. గోదావరీ మొదలగు మహా నదులలోని తియ్యని నీళ్ళు అంబుధి - సముద్రమున కలసి నంతనే, వాని మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు.)తీయదనమును పోగొట్టుకొని ఉప్ప దనమునే పొందును. అట్లే దుర్మార్గులగు యజమానులను సేవించు వారికి వారి దుర్మార్గతయే పట్టుబడును.
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయాణ|
అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్కవంశత్వాత్ అర్కబంధుః, ఉ-పు. - సూర్యవంశమున జనించుటవలన అర్కబంధువు.
కోలము1 - 1.రేగుపండు, 2.పంది, 3.ఒడి, 4.కౌఁగిలి, 5.తెప్ప.
కోల్యాః ఫలం కోలం. - కోలియనఁగా రేఁగు చెట్టు; దానియొక్క ఫలము.
కోలతి నిబిడావయవత్వాత్ కోలీ, ఈ సీ. కులసంస్త్యానే. - దట్టమై యుండునది.
కోలతి సమ్హతాంగో భవతీతి కోలః కుల సంస్త్యానే. - ఘనమైన శరీరము గలది.
కోలము2 - ఒకవిధమైన నాట్యము.
కోలాటము - చేతులతో కోలలుంచుకొని ఆడెడి ఆట.
కోలతి సంస్త్యాయతి కోలః కుల సంస్త్యానే. - తెలుచుండునది, తెప్ప.
సూకరము - పంది, శూకరము.
పంది - సూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.
పోత్రము - 1.పందిమూతి, 2.నాగటి దుంప మొన.
దీర్ఘం పోత్రం ముఖాగ్రమస్యేతి పోత్రీ, న. పు. - అధికమైన మోరగలది.
మోర - పశ్వాదుల ముఖము, ముట్టె.
ముట్టె - పశ్వాదుల మూతి, పంది ముక్కు, సం.ముఖమ్.
ముటెతోఁపు - (వ్యావ.) నిదానములేని తొందర.
మొర - పశ్వాదుల దీర్ఘ ముఖము, రూ.మోర, మొరచ.
మోరత్రోపు - వైముఖ్యము.
వైముఖ్యము - విముఖత్వము, వ్యతిరేకత.
విముఖత్వము - వైముఖ్యము.
స్థూలనాసము - పంది.
అసహాయాశూరుఁడు - ఒంటరిగా నిలిచి పోరు యోధుడు.
కిరము - పంది, రూ.కిరి, వ్యు.ముఖము(ముట్టె)చే భూమిని త్రవ్వునది.
క్షితిం కిరతీతి కిరిః, వు. కౄ విక్షేపే. - ముఖము చేత భూమిని ద్రవ్వునది. పా, కిరః 'వరాహశ్చకిరః కిరి ' రితి యాదవః.
ముట్టె - పశ్వాదుల మూతి, పంది ముక్కు, సం.ముఖమ్.
సూకరము - పంది, శూకరము.
పంది - సూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.
కిరంతీ మంగేభ్యః - కిరణనికురంబా(అ)మృతరసం
హృది త్వా మాధత్తే - హిమకరశిలామూర్తిమివ యః,
స సర్పాణాం దర్పం - శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్వా - ముఖయతి సుధాధారా సిరయా. - 20శ్లో
తా. ఓ తల్లీ! ఎవడు నీ యవయముల నుండి(నికురుంబము - సమూహము)చిమ్ముచున్న కాంతిసుధను చంద్రకాంతమణివలె(హిమకరుఁడు - చంద్రుడు)వలె మనస్సున ధ్యానించునో, వాడు గరుడుని వలె సర్పముల గర్వము నణచును. జ్వర బాధితులను(సుధ- 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.)అమృతమును స్రవించు తన దృష్టిచే(దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)చే సుఖింపజేయును. – సౌందర్యలహరి
కిరిచక్ర రథారూఢ - దండనాథా పురస్కృతా|
జ్వాలామాలిని కాక్షిప్త - వహ్నిప్రాకారమధ్యగా.
తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.
అరిగోలు - నదిని దాటించు సాధనములలో ఒకటి, తెప్ప.
ఉడువము - తెప్ప, పుట్టి.
ఉడవః ఆపః తాభ్యః పాతీత్యుడుపం, పా రక్షనే. - ఉడువు లనఁగా దూకములు; దాని వలన రక్షించునది.
ప్లవము - 1.తెప్ప, 2.కప్ప, 3.కోతి.
ప్లవంత్యనేనేతి ప్లవః, ప్లవగతౌ. - దీనిచేత దాఁటుదురు.
కట్టుమ్రాను - తెప్ప.
తెప్ప - 1.నీటిపై పడవవలె తేలగట్టిన కొయ్యలు, 2.రాశి, రూ.తేప.
తెప్పలఁదేలు - ఓలలాడు.
ఓలలాడు - క్రి.1.స్నానముచేయు, 2.ఓల ఓల యనుచు నీటిలో ఆడు.
ఈదుకొయ్య - ఈదుటకు సాయపడు కొయ్య, తెప్పకొయ్య.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైనను పతితులైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!
తా. కప్పకు కుంటికాలయినను, సర్పము- పాము, సప్పము.నకు రోగము వచ్చినను, పతితుఁడు - 1.పడినవాడు, 2.పదవిచెడినవాడు. లైనను, ముసలితనములో(ముప్పు - 1.వార్థకము, 2.విపత్తు.)దారిద్యము సంభవించిననూ మిక్కిలి కష్ట దాయకములు.
అహిరము - 1.కప్ప, 2.గాలి, 3.ముంగిలి.
భేకము - 1.కప్ప, మండూకము, 2.మేఘము.
బిభేతి సర్పాద్భేకః, ఞి భయే. - సర్పమువలన భయపడునది.
భేకి - ఆడుకప్ప.
భేకీ వర్షాభ్వీ -
భేకస్య స్త్రీ భేకీ - భేకముయొక్క స్త్రీ భేకీ.
వర్షాభ్వాః స్త్రీ వర్షాభ్వీ, ఈ. సీ. - వర్షాభువుయొక్క స్త్రీ వర్షాభ్వి. ఈ 2 ఆఁడుకప్ప పేర్లు.
భేకశిశువు - (జం.) చిరుకప్ప, కప్ప యొక్క జీవితదశలలో చేపవలె నుండు మొదటి డింభ దశ (Tadpole).
ద్విచాపము - (జం.) భేక శిశువు యొక్క కపోలము క్రిందనున్న జలక్లోమ చాపములకు ముందున్న ఒక నిర్మాణము (Hyoid-arch) ఇది క్రమముగా ద్వితసాధనము (Hyoid apparatus)గా మారును.
శృంగద్వితము - (జం.) భేక శిశువు యొక్క శ్వాసనాలికా చాపములకు ఎదుట నుండు ద్వితచాపములోనిది, ఒక భాగము (Gerotophyl).
దంతాస్థి - (జం.) (కప్ప) క్రింది దవడ ఎముకలలో ఒకటి (Dentary).
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టుధ్వని, ఉదా. ౘ, ౙ.
మెంటో మెకిలియన్ - (జం.) (Mento meckelian) భేకశిశువు యొక్క క్రింది దవుడలో దంతాస్థి ప్రక్కనున్న చిన ఎముక.
మెకెల్స్ కార్టిలేజ్ - (Meckel's cartilage,) భేకశిశువు యొక్క క్రింది దవుడలోనున్న మృదులాస్థి భాగము.
మేరుపుచ్ఛము - (జం.) భేకశిశువు తోకలోనున్న కీకసలు కలసిపోయి పొడవైన కడ్డీవలె ఏర్పడు ఎముక (Unostyle).
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
తా. ఎంతపని చేసినను(ఎపుడు - ఎల్లప్పుడు, ఏకాలము, రూ.ఎప్పుడు, ఎప్డు.)తన యందు దోషమునే వెదకుచుండు ఆపురుషునియొక్క పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ. కొలువును మానుకొన వలెను. లేని యెడల సర్పము - పాము, సప్పము. పడగ క్రింద ఉన్న కప్ప రీతి ఆపదలకు గురికాగలడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కప్ప - మండూకము; మండూకము - కప్ప.
మండతె శోభతే తటాకాదౌ మండూకః, మడి భూషాయాం. - తటాకాదులయం దొప్పునది.
వర్షాసు భవతీతి వర్షాభూః. ఊ - పు. భూ. సత్తాయాం. - వర్షాకాలమునఁ బుట్టునది.
శలతి ఉత్సుత్య గచ్ఛతీతి శాలువః, శలగతౌ. - గంతులువేయుచు చరించునది.
పా. సాదిరప్యస్తి. ‘పరిసరకృకలాసన్వేద సాలూరసర్వాః' ఇతి ప్రయోగాత్.
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు, రది యెట్లన్నన్
దెలుప్పగ చెఱువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తా. ఎప్పుడు మానవునికి సంపదలు కల్గునో, అప్పుడు వాని యింటికి లేక్కలేని బంధువులు పిలువకుండగనే వచ్చెదరు, అట్లుగానే చెఱువులు సమృద్ధిగా నిండియున్న తరుణమందు కప్పలు అనేకము అందు చేరుచున్నవు గదా!
అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
చిప్ప - 1.కప్ప చిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపు చిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విన.అల్పము.
ఉరోస్థి - (జం.) రొమ్ము యొక్క ఎముక, ఇది పూర్వోరుకాస్థి (Epesternum), పూర్వోరోస్థి (Omosteranum), మధ్యరోస్థి(Mesosternum), పశ్చోరోస్థి(Xiphisternum=Metasternum)అను నాలుగు భాగములుగ కలిసియుండును, ఉదా.కప్ప.
నిమీలకచ్ఛదము - (జం.) మూడవ కనురెప్ప (కప్ప) (Nicitating membrane)). (దీనిని స్వేచ్ఛగా కదల్చుటకు వీలగును), కంటిపొర.
నిమీలనము - 1.కనులుమూయుట, 2.చావు.
అధికాశి మహచ్చిత్ర మహీనా కబలీకృతః
మండూక స్తేన బధ్నాతి కపర్థం దృఢ మాత్మనః|
భా|| కాశీ నగరమునం దొక విచిత్రము కలదు. అచటఁ బాముచే మ్రింగఁబడిన కప్ప తిరిగి తన జటాజూటము నా పాముచేతనే కట్టి బిగించుకొను చున్నది. (కాశిలో మరణించిన తిర్యగ్జంతువులు సైతము శివస్వభావమును బొందునని భావము.)
పుప్పసములు (కప్ప).
పప్పున - (జం.) ఊపిరితిత్తులకు సంబంధించినది (Pulmonary).
పప్పుస ధమని - (గృహ.) కుడి జఠరిక నుండి ఊపిరి తిత్తులోనికి చెడ్ద రక్తమును కొనిపోవు నాళములు (Pulmonary artery).
పుప్పుస సిరలు - (గృహ.) ఊపిరి తిత్తులలో నుండి శుభ్రపరచిన రక్తమును ఎడమ కర్ణికలోనికి గొంపోవు నాళములు (Pulmonary vein).
పుప్పుస ప్రసరణము - (గృహ.) రక్తము గుండె నుండి ఊపిరితిత్తులకు చేరి తిరిగి ఊపిరితిత్తుల నుండి గుండెకు చేరువరకు జరుగు రక్తప్రసరణము (Pulmonary circulation).
పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి ఈ నాడి పోవును).
పుప్పుసము - (జం.) క్లోమము, ఊపిరి తిత్తి, (Lung).
క్లోమము1 - (జం.) 1.కడుపులోని నీరు తిత్తి.
క్లోమము2 - (గృహ.) సర్వకిణ్వము, (ఇది ఒక నాళగ్రంథి, ఇందులో పుట్టు మధుర రసము చిన్న ప్రేవులలో ఆహారము జీర్ణమగుటకు సహాయపడును), 2.తియ్యదబ్బ, (Pancreas).
తిలకం క్లోమ -
తిలతీతి తిలకం. తిల స్నేహనే. - మెఱుఁగై యుండునది.
క్లామ్యతి క్లోమ. న. న. క్లము. గ్లానౌ. - వాడునది. పా. క్లోమ.
ఈ రెండు కడుపులో నొక ప్రక్క నెఱ్ఱనైయుండు మాంస విశేషము పేర్లు. నీరుతిత్తి యని కొందరు.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహుత్కోళపు పొర క్రింద నుండు అంతస్స్రావగ్రంథి (Thymus gland).
అమైలాప్సిన్ - (జం.) (Amylopsin) క్లోమ (Pancreas) గ్రంధినుండి తయారగు సేంద్రియ ఖండము (Ferment), ఇది పిండి పదార్థమును చెక్కెరాగా మార్చును).
స్వాదుపిండము - (జం.) సర్వకిణ్వి కడుపు ఆంత్ర మూలముచే నేర్పడిన మడతలో నుండు గ్రంథి (Pancreas). (ఇది మధురసమును ఉత్పత్తి చేయును. దీనిలో సర్వకిణ్వములు ఉండ వచ్చును).
స్వాదువు - 1.ఇంపైనది, 2.తియ్యనిది, 3.మంచిది.
సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
స్వాదుధన్వుఁడు - తియ్యవిలుకాడు, మన్మథుడు.
యువాకోశము - (జం.) ఊపిరితిత్తి నిర్మాణములో నున్న ఒక్కొక్క సూక్ష్మమైన గాలిగది (Alveolus).
శ్వాసనాళము - (జం.) ముఖకుహరమునుండి ఊపిరితిత్తులలోనికి గాలిని తీసికొనుటకు వదులుటకు ఉపయోగించు గొట్టము, (Trachea).
క్లోమనాళము - (జం.) శ్వాసనాళము యొక్క శాఖ (Bronchus).
రొమ్ము పడిసెము - (వైద్య., గృహ) గుండె జలుబు, (Bronchitis).
రొంప - పడిసెము; పీనసము - పడిసెము.
విషపడిశెము - (గృహ.) శ్వాసనాళము నకు సంబంధించిన అంటు జ్వరములు, జలుబులు, (Influenza).
పీనజ్విరము - జలుబు పడిశముతో వచ్చు జ్వరము. (ఇది ఒక రకపు ఎలర్జీ వలన కలుగు జ్వరము). (Hay fever).
అ నా ఫి లి స్ - (Anophele) దోమలలో ఒక జాతి. (ఈజాతి ఆడు దోమల ద్వారా అనాఫిలిస్ మలేరియా వ్యాపించును.)
మలేరియా - (గృహ.) (Malaria), చలి జ్వరము, (ఈ జ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)
గుణనపూర్వదశ - (జం.) మానవ రక్త కణములలో ప్రవేశించిన మలేరియా రోగజీవి అభివృద్ధి చందుచు విభజనకు సిద్ధముగా నున్న దశ (Schizont).
ఖండ గుణము - (జం.) మానవరక్త కణములలో జరుగు మలేరియా రోగజీవి యొక్క జీవితదశలు (Schizogony).
బీజానుగుణనము - (జం.) దోమ శరీరములో జరుగు మలేరియా రోగజీవి జీవిత దశలు (Sporogany).
బీజఖండము - (జం.) మలేరియా వ్యాధికి కారణమగు రోగజీవి జీవన చక్రములో మనుష్యుని రక్తములో నగుపడు దశలలో నొకటి (Merozoite).
చలయుక్తము - (జం.) క్రిమివలె కదలుచుండు సంయుక్త బీజము. ఉదా:- మలేరియా రొగ జీవి యొక్క (Ookinite).
క్వినీన్ - (వ్యవ.) (Quinine) మలేరియా జ్వరమును పోగొట్టు మందు, (కాఫీ మొక్క కుటుంబము (Rubia ceae)నకు చెందిన (Cinchona offlcinalis) అను చిన్నచెట్టు యొక్క పట్టనుండి దీనిని తయారు చేయుదురు.)
అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.
ఘోషన్యూనములు - (జం.) మగకప్ప గొంతునకు రెండు వైపుల గల సంచులు. (ఇవి శబ్దమును దీర్ఘముగా చేయుటకు ఉపయోగపడును) (Vocal sacs).
ముద్రాకాస్థి - (జం.) కప్పయొక్క స్వరపేటికలో ఉన్న రెండు మృదులాస్తి నిర్మాణములలో నిది యొకటి (Cricoid cartilage), రెండవది దుర్వీకాస్థీ (Arytenoid cartilage).
స్తంభాకారాధిచ్ఛదము - (జం.) నిలువుగా నొకటి ప్రక్క మరియొకటి స్తంభమువలె నమర్చబడిన పొడవైన జీవకణముల పొర (Columanar epithelium) (కప్ప ప్రేగు లోపల అస్తరుగా నున్న పొరలో దీనిని చూడనగును).
ప్లవంగము - 1.కోతి, 2.కప్ప, వ్యు.దాటుచు పోవునది.
ప్లవంగ - నలుబది యొకటవ(41వ) సంవత్సరము.
ప్లవ - ముప్పదియైదవ(35వ) సంవత్సరము. ప్లవతే ప్లవః. ప్లుఙ్గతౌ. - గంతులు వేయుచుఁ బోవునది.
టర్ టరాయణము - (జం.) కప్ప అరుపులు (Croaking of frogs).
ఉత్తరించు1 - క్రి.ఖండించు.
ఉత్తరించు2 - క్రి.దాటు.
ఉఱుకు - క్రి.1.దుముకు, 2.పరుగెత్తు, 3.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప.
దర్దురము - కప్ప.
శబ్దేన కర్ణే దృణాతీతి దర్దురః దౄ విదారణే. - శబ్దముచేత చెవులను వ్రక్కలించునది.
సరసునిమానసంబు సరసజ్ఞుఁడెఱుగును ముష్కరాధముం
డెఱిఁగి గ్రహించువాఁడెకొలనేక నివాసముగాఁగ దుర్ధురం
బరయఁగ నేర్చునెట్లు వికచాబ్జమరంద రసైక సారభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! కప్ప సరస్సులోనే యెప్పుడు నివాసము చేయుచిండున దైనను అందుండిన తామరల యందలి పూదేనె వాసనలను( తెలియఁ జాలడు. మిళిందము - తుమ్మెద దానిని తెలిసి యనుభవించును. అట్లే రసికుని మానసము - 1.ఒక కొలను(మానస సరస్సు), 2.మనస్సు. లోని భావమును రసికుడే తెలిసికొని యానందింప కలడుగాని ముష్కరుఁడు - మొక్కలుడు, కుటిలుడు. అధముడు తెలిసికొన జాలఁడు.
సునాసరుఁడు - ఇంద్రుడు, రూ.శూనాశీరుడు, వ్యు.గొప్ప సేనకలవాడు.
శోభనం నాసీరం యస్యసః సువసీరః - శ్రేష్ఠమైన సేనాగ్రభాగముగలవాఁడు.
శవర్ణాది పాఠమునందు శునంతీతి శునాః, శున గతౌ, శునాస్సీరా లాంగలాని యేన సః - వరప్రదుఁడైన యెవనిచేత నాఁగేళ్ళు కదలుచున్నవో అతఁడు శునాసీరుఁడు.
శునా స్సమృద్ధా స్సీరా యేనేతి వా - ఎవనిచేత నాఁగేళ్ళు సముద్దములగుచున్నవో అతఁడు.
శునాసీరౌ వాయుసూర్యా వస్యస్త ఇతి వా - వాయుసూర్యులు గలవాఁడు.
పురుహూతుఁడు - ఇంద్రుడు, వ్యు.యజ్ఞము లం దెక్కువగ పిలువ బడువాడు.
పురు ప్రభూతం హూతం యజ్ఞేస్వాహ్వానం యస్య సః పురుహూతః - యజ్ఞములందుఁ బ్రచురమైన పిలుపు గలవాఁడు.
పురు భూయిష్టం హూయతే యజ్ఞేషు – యజ్ఞముల యందు మిక్కిలి పిలువబడువాఁడు.
హు దానాదనయోః పురునామాన మసురం హతవానితివా - పురువనెడి రాక్షసునిఁ జంపినవాఁడు.
వైశ్వానరుఁడు - అగ్ని.
విశ్వానరస్య ఋషే రపత్యం వైశ్వానరః - విశ్వానరుఁ డను ఋషికి కొడుకు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమా శ్రితః|
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్|| 14శ్లో
తా|| నేను జఠరాగ్ని రూపమున ప్రాణుల దేహము నందుండి ప్రాణాపాన వాయువులతో కూడినవాడనై భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములను నాల్గు విధము లగు పదార్థములను జీర్ణము చేయుచున్నాను. - పురుషోత్తమ ప్రాప్తియోగము, భగవద్గీత
వికృతి శాంకరీ శాస్త్రీ యక్షగంధర్వసేవితా,
వైశ్వనరీ మహాశీలా దేవసేనా గుహప్రియా|
వసిష్ఠ కుంభోద్భవగౌతమాది - మునీంద్ర దేవార్చిత శేఖరాయ|
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమశివాయ.
మహాంశ్చాసౌ పద్మశ్చ మహాపద్మః - గొప్పదైన పద్మము.
తటిల్లేఖాతన్వీం - తపన శశివైశ్వానరమయీం
నిషణ్ణాం షణ్ణా మ - ప్యుపరి కమలానాం తవ కలామ్|
మహాపద్మాటవ్యాం - మృదిత మలమాయేన మనసా
మహాన్తః పశ్యంతో - దధతి పరమాహ్లాద లహరీమ్|| - 21శ్లో
తా. తల్లీ! మెరపు తీగవంటి శరీరము గలిగియు, సూర్యచంద్రాగ్ని(తపనుఁడు - సూర్యుడు; శశాంకుఁడు - చంద్రుడు; వైశ్వానరుఁడు - అగ్ని.)మయమై నదియు, షట్కమల (షట్చ(క)ములకు పైన సహస్రారమందు మహాపద్మాటవిలో(నిషణ్ణము - 1.ఉండినది, 2.కూర్చుండినది.)కూర్చున్న నీ కళను, మాయ తొలగిన విశుద్ధమైన మనస్సుతో (పశ్యన్తి - చూచు)మహాత్ములు పరమానందలహరిని ధారణ చేస్తున్నారు. - సౌందర్యలహరి
వైశ్వనరీ మహాశీలా దేవసేనా గుహప్రియా|
తవవిమలేన్దుకలం వదనేన్దు మలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీసుముభీభి రసౌ విముఖీక్రియతే|
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే| - 20
తటిల్లతా సమరుచి - షట్చక్రోపరిసంస్థితా |
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ.
పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రుపురముల నాశమొనర్చువాడు.
పురాణి అరీణాం దారయతీతి పురందరః - శత్రుపురముల వ్రక్కలించినవాఁడు. దౄవిదారణే.
పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.
వీడు - 1.పురము, 2.కట్నము, 3.దండు విడిసినచోటు, 4.దొమ్మరగుంపు, క్రి.వదలు, సడలు, భేదమగు, విసర్జించు, విడిపోవు.
విడు - క్రి. వీడు.
జిష్ణువు - 1.ఇంద్రుడు, 2.అర్జునుడు, విణ.జయశీలుడు, రూ.జిష్ణుడు.
జయశీలో జిష్ణుః ఉ-పు. - జయించు శీలము గలవాఁడు.
జిత్వరుఁడు - జయశీలుడు.
జేతా జిష్ణుశ్చ జిత్వరః,
జయతి తాచ్ఛీత్యేనజేతా, ఋ. జిష్ణుః,, ఉ. జిత్వరశ్చ, జి జయే. - స్వభావముననే గెలుచువాఁడు గనుక జేత, జిష్ణువు, జిత్వరుఁడును. ఈ 3 గెలుచు స్వభావము గలవాని పేర్లు.
'భవాని! త్వం దాసే - మయి వితర దృష్తిం సకరుణాం'
ఇతి స్తోతుం వాంఛన్ - కథయతి ' భవాని! త్వ ' మితి యః
తదైవ త్వం తస్మై - దిశసి నిజసాయుజ్య పదవీం
ముకుందబ్రహ్మేంద్ర - స్ఫుటమకుటనీరాజిత పదామ్| - 22శ్లో
తా. ఓ పార్వతీ! నీకు దాసుడనైన నా యందు దయా దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి. పఱపుము. భవాని - పార్వతీ అని స్తుతించుచు నీవే దిక్కని యెవడు పల్కునో, అట్టి వానికి నీవు అప్పుడే విష్ణు(ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.)బ్రహ్మేంద్రుల కిరీటములు సోకిన పాదములు గల నీ సామీప్యపదవి(సాయుజ్యము - 1.సహయోగము, 2.ఒక విధమైన మూర్తి.)నిచ్చుచున్నావు. – సౌందర్యలహరి
భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా|
భద్రప్రియా భద్రమూర్తి ర్భక్తసౌభాగ్యదాయినీ.
లేఖర్షభుఁడు - ఇంద్రుడు.
లేఖానాం దేవానా మృషభః లేఖర్షభః - దేవతలలో శ్రేష్ఠుడు.
లేఖుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
లేఖాః, గ్రీవాహస్తపాదే ప్రశస్తా లేఖా యేషాం తే లేఖాః - కంఠహస్త పాదములయందు మంచి రేఖలు గలవారు.
లిఖ్యంతే ధ్యానార్ధం పటదౌ వా లేఖాః - ధ్యానముకొఱకు పటాదులయందు వ్రాయబడువారు.
లిఖి విలేఖనే, ప్రాణినాం శుభా శుభ ఫలం లిఖంతీతి - వాప్రాణుల శుభాశుభ ఫలమును వ్రాసెడువారు.
లేఖగము - ఆకసము.
లే - (లేత) అల్పము, (వ్యాక.) లేత శబ్దమునకు మీదివర్ణము లోపింపగా మిగిలిన రూపము.
లిఖితుఁడు - 1.సాక్షి, 2.ఒక ముని.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
సాక్ష్యము - సాక్షి కనివిని చెప్పినది.
లిఖితము - వ్రాయబడినది, వి.అక్కరము.
మునిషీ -1.చదువుచెప్పువాడు, 2.లేఖకుడు.
లేఖరి - లేఖకుడు.
లేఖనము - లిపి, వ్రాత.
లిపి - వ్రాత.
లిఖించు - క్రి.వ్రాయు.
లేఖని - వ్రాయుకలము, రూ.లేఖిని.
లేఖ్యము - వ్యవహార విషయమైన వ్రాత.
లేఖనికుఁడు - 1.జాబుకొనిపోవువాడు, 2.తన గురుతిడి యొకనిచే వ్రాయించువాడు.
కాయస్థుఁడు - 1.లెక్క వ్రాయువాడు, 2.పరమాత్ముడు, 3.కాయస్థ తెగకు చెందినవాడు.
వ్రాయనము - వ్రాత, లేఖ.
వ్రాఁత - దస్తూరి, లేఖనము.
దస్తూరి - 1.చేవ్రాత, 2.సంతకము.
సంతకము - చేవ్రాలు.
వ్రాలు - (వ్రాయి బహువచనము) సంతకము (చేవ్రాలు), క్రి.1.క్రిందికి దిగు, 2.తగ్గు, 3.ఒరగు.
"చిన్నపిల్లలు దస్తూరీ నేర్చుకొనే సమయంలో మొదట అక్షరాలను వంకరటింకరగా, పెద్దవిగా వ్రాస్తారు. ఆ తరువాత అభ్యాసం చేయగాచేయగా దస్తూరీ మెరుగుపడి చక్కగా వ్రాయగలుగుతారు. అలాగే విగ్రహంపై మనస్సు నిలిపి ముందు ఏకాగ్రత సంపాదించాలి. ఆ తరువాత నిరాకార బ్రహ్మంపై మనస్సు తేలికగా నిలుపవచ్చును." - శ్రీరామకృష్ణ పరమహంస
(ౙ)జాబు - లేఖ, కమ్మ, ఉత్తరము.
లేఖ -1.మిక్కిలి చేరిక యగు వృషాదుల పంక్తి, 2.లిపి, వ్రాత 3.జాబు.
లేక - 1.జాబు, 2.మిక్కిలి చేరిక గల వృక్షాదుల వరుస, 3.సమూహము సం.లేఖా.
శక్రుఁడు - ఇంద్రుడు, వ్యు.దుష్టజయమందు శక్తుడు.
శక్తుఁడు - శక్తిగలవాడు.
శక్నోతి దుష్టజయ ఇతి శక్రః - దుష్టజయమందు శక్తుడు, శక శక్తౌ.
ఇంద్రాయుధం శక్రధమః -
ఇంద్రస్య ఆయుధం ఇంద్రాయుధం - ఇంద్రుని యాయుధము.
శక్రస్య ధనుః శక్రధనుః, స-న. - శక్రుని ధనుస్సు.
మేఘప్రతిఫలిత నానావర్ణస్య ధానురాకారేణ దృశ్యమానస్య సూర్యరశ్మే ర్నామనీ - ఇది మేఘమునందు బ్రతిఫలించి, నానావర్ణమై ధనురాకారముగా నగపడుచున్న సూర్యరశ్మి. ఈ 2 ఇంద్రుని ధనుస్సు పేర్లు.
శిలాస్థో గంధ లేపశ్చ మార్జాలోచ్చిష్ట భోజనమ్|
ప్రతిబిం బే క్షణంనీ రే శక్రస్యాపి శ్రియమ్ హరేత్||
తా. ఱాతిమీఁద బెట్టిన గంధము పూసికొనుట, పిల్లి Cat తాకిన అన్నము భుజించుట, నీళ్ళలో నీడఁ జూచుకొనుట, ఈ పనులు ఇంద్రున(శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.)కైనను ఐశ్వర్యమును పోగొట్టును. - నీతిశాస్త్రము
మువ్వనెకాఁడు - సూర్యుడు Sun.
వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.
మువ్వనెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు - (భౌతి.) సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow)
ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రుని ఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.
ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు(నాల్గు దంతములు కలది), 2.అమృతము.
(ౘ)చౌదంతి - చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము. వెలిగౌరు - ఐరావతము
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.
పుంగవుఁడు - (సమాసమున ఉత్తరపదమైనచో) శ్రేష్ఠుడు.
పుంగవము - వృషభము.
కేసరము - 1.ఆకరువు, 2.ఇంగువ, 3.జూలు, 4.పొగడ, 5.పొన్న, రూ.కేశరము.
పుంనాగే పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః,
పున్నాగ ఇవ పున్నాగః - పురుష శ్రేష్ఠునివలె పూజ్యమైనది.
పురుషవ దున్నతత్వాత్పురుషః తుంగశ్చ - పురుషునివలె ఉన్నతమైనది పురుషము, తుంగమును.
ప్రశస్తాః కేశరాస్సంత్యస్య కేసరః - మంచి ఆకరవులు గలది.
దేవానాం వల్లభః - దేవతలకు ప్రియమైనది. ఈ నాలుగు 4 సురపొన్న పేర్లు.
ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
యమపత్ని - ఐరావతి.
అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
నభ్రమతి స్వం వల్లభం హిత్వా కుత్రచిన్న గచ్ఛతీ త్యభ్రముః. ఉ-సీ భ్రముచలనే - తన మగని విడిచి కదలనిది.
అభ్రేషు మాతివర్తత ఇత్యభ్రముః మాఙ్ మానే వర్తనేచ - మేఘముల యందుండునది.
పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను - 1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.
పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం- పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
అమృతకరుఁడు - చంద్రుడు. లలాటం అమృతోత్భవ|
అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
అమర్త్యాః నమ్రియంత ఇత్యమర్త్యాః - చావనివారు. మృఙ్ ప్రాణత్యాగే. అమృతాంధనః-న-వు. అమృత మంధో (అ)న్నమేషాం తే - అమృతము అన్నముగాఁ గలవారు.
వేల్పుబోనము - అమృతము.
అమృతం సద్గుణాభార్యా అమృతం బాల భాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్||
తా. గుణవతియైన యాలు(స్త్రీ, భార్య), బాలుని బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.)ముద్దు మాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము
సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా,
సీతా సర్వాశ్రయా సంధ్యా సుఫలా సుఖదాయినీ |
సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
చాలఁబవిత్రవంశమున సంజనితురిడగునేని యెట్టి దు
శ్శీలునినై నఁ దత్కులవిశేషముచే నొకపుణ్య పు డెంతయున్
దాలిమి నుద్ధరించును, సుధానిధిఁబుట్టగఁ గాదె, శంభుడా
హాలహలానంబు గళమందు ధరించుటఁబూని, భాస్కరా.
తా. మున్ను సురాసురలు పాల సముద్రము మధింపగా అందుండి పుట్టిన హాలాహలం (పాల సముద్రమున పుట్టిన విషము.)మనెడి యగ్నిని శివుడు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)తన కంఠ మందు ధరించెను. అది ఆ యగ్ని గొప్పతనముకాదు, అది పుట్టినట్టి పాల సముద్రము యొక్క గొప్పతనము చేతనే. అట్లే, మంచి వంశమందు బుట్టిన, వాడు నీచుడైనను వానిని ఆ కులము యొక్క ఔనత్యము ను దలంచియే సజ్జనులు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)తో కాపాడుదురు గాని ఆ నీచుని జూచికాదు.
ఫాలవిలోచన భానుకోటిప్రభ, హాలాహలధర అమృత శివ|
సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధారూపా అంశవో యస్య సః సుధాంశుః, ఉ-పు. - అమృతరూపములైన కిరణములుగలవాఁడు.
సుధాకరుడు - చంద్రుడు.
నెల మేపరి - రాహువు.
సోపపవుఁడు - రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు).
రాహుగ్రస్తే త్విన్దౌ చ పూష్టి చ సోపప్లవోప రక్తౌ ద్వౌ -
ఉపప్లవేన ఆకులతయా సహవత్త ఇతి సోపప్లవః - ఉపప్లవముతోఁ గూడినవాఁడు.
ఉపరజ్యతే ఉపరమతే వ్యాపారాదిత్యువరక్తః – వ్యాపారము వలన నుపరతుఁ డైనవాఁడు, ఉపరజ్యత ఇత్యువరక్తః - రాహువుచేత తమోయుక్తుఁడుగాఁ జేయఁబడినవాఁడు. ఈ రెండు రాహుగ్రస్తులైన సూర్యచంద్రుల పేర్లు.
సకలజన ప్రియత్వము నిజంబు గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగగన్
టకటక మానియుండడె దృఢస్థితి నెప్పటి యట్ల ! భాస్కరా.
తా. చంద్రుడు తన్ను రాహువు(రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము Rahu) మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికినీ ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము బాధింపదు, అతిత్వరలోనే అతడు కోలుకొనును.
శతమన్యువు - ఇంద్రుడు, వ్యు.నూరు యజ్ఞములు చేసినవాడు.
శతం మన్యనో యస్య శతమన్యుః- ఉ-పు. - నూఱు క్రతువులు గలవాఁడు.
మన్యువు - 1.క్రోధము, 2.శోకము, 3.యజ్ఞము.
క్రోధము - 1.కోపము, రోషము 2.రౌద్రరస స్థాయిభావము.
కోపము - కినుక, క్రోధము.
కోపనం కోపః కుప ద్రోధే. - కోపించుట.
క్రోధేనం క్రోధః. క్రుధ క్రోధే - క్రోధించుట క్రోధము.
శోకము - దుఃఖముచే తపించుట, వగవు; వగవు - శోకము.
మన్యు శోకౌ తు శుక్ స్త్రియామ్,
మన్యతే అనేనేతి మన్యుః, ఉ. పు. మనజ్ఞానే. - దీనిచేత నెఱుఁగఁబడును.
విరుద్ధలక్షణచేత నేమియు నెఱుఁగబడని యర్థము.
శోచనం శోకః, శుక్ చ. చ-సీ. చ. చ-సీ శుచ శోకే. - శోచించుట శోకము శుక్. ఈ 3 శోకము పేర్లు
తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
క్రోధన - అరువది సంవత్సరములలో ఏబది తొమ్మిదవది(59వ).
క్రోధి - అరువది సంవత్సరములలో ఒకటి.
అమర్షము - 1.కోపము, 2.ఒర్వలేమి, విణ.ఒర్వనిది.
న మర్షణమమర్షః మృషు సహనే - ఒర్వకుండుట అమర్షము.
ఒర్వమి - ఓర్వలేనితనము.
ఈర్ష్యాశువు - అసహనుడు, అసూయాగ్రస్తుడు, ఒర్వలేని తనము స్వభావముగా గలవాడు.
ఈసు - 1.ఒర్వలేనితనము, 2.కోపము, 3.ద్వేషము, సం.ఈర్ష్యా.
అక్షాన్తిరీర్ష్యా -
న క్షాంతి అక్షాంతిః ఈ-సీ, క్షాంతి ఒర్పు; అదిగానిది అక్షాంతి.
ఈర్ష్యతీతి ఈర్ష్యా, ఈర్ష్య ఈర్ష్యాయాం. - ఓర్వలేకుండుట ఈర్ష్య. ఈ 2 పరుల సంపదను సహించలేకుండుట పేర్లు.
అక్షాంతి - 1.అసూయ, ఒర్పులేనితనము, 2.ఒర్పులేమి.
ఈర్ష్య - ఒర్వలేనితనము, అసూయ.
అసూయా తు దోషారోపో గుణేప్వపి. :
గుణేషు సత్స్వపి పరెషు దోషారోపః అసూయా. - మంచిగుణములు గలిగియున్నను చెడుగుణముల నారోపించుట అసూయ యనంబడును.
అస్యతీత్యసూయా. అసు క్షేపణే. - మంచియున్నను పరునియందు దుర్గుణముల నారోపించుట పేరు.
ఈరస - 1.అసూయ, 2.పగ, 3.కోపము, రూ.ఈరసము, సం.ఈర్ష్యా.
ఈరసించు - 1.అసూయచెందు, 2.పగగొను, 3.కోపించు.
అసూయ - 1.గుణము లందు దోషమును ఆరోపించుట, ఒర్వలేనితనము, 2.కోపము. jealousy is an emotion that has roots in a basic insecurity.
కోపం వచ్చినవానికి కొంచెంసేపు(కొంచెము)దూరంగా ఉండు. అసూయాపరులకు మాత్రం ఎల్లప్పుడూ దూరంగా ఉండడం అవసరం. - ఒక సామెత
ఆగ్రహము - 1.కోపము, రోషము, 2.అనుగ్రహము, 3.ఆక్రమణము, 4.ఆసక్తి.
అనుగ్రహము - దయ, కరుణ.
దయ - కనికరము; అనుక్రోశము - కనికరము.
దయచేయు - క్రి. 1.కరుణించు, 2.విచ్చెయు, 3.ఇచ్చు.
కరుణించు - క్రి.కనికరించు.
దయాళువు - కనికరము కలవాడు.
ఆఁకరము - 1.ఆగ్రహము, 2.మదము,సం.అహంకారః, ఆగ్రహః.
కింక - 1.రోగము(పశ్వాదులకు వచ్చు నట్టిది), 2.కోపము, రూ.కినుక.
కినుక - అలుక, కోపము.
కినియు - క్రి.కోపించు, రోషించు.
రోషము - 1.కినుక, రోసము.
లుప్యతే అనేనేతి రోషః రుష హింసాయాం - దీనిచేత హింసింపఁ బడును.
కినుక - అలుక, కోపము.
అలుక - 1.కోపము, 2.ద్వేషము, 3.ద్రోహచింత, విణ.1.అల్పుడు(అల్పుడు-నీచుడు), 2.గౌరవహీనుడు, రూ.అలుకవ.
సపత్నుఁడు - శత్రువు.
సప్త్నీవ దుఃఖ హేతుత్వాత్ సపత్నః. - సవతివలె దుఃఖహేతువైనవాఁడు.
సమానపతిత్వాద్వా సపత్నః. - సమానపతిత్వ గలవాడు.
ద్విషత్తు - శత్రువు, రూ.ద్విషుఁడు.
ద్వేష్టీతి ద్విషత్, త. పు. ద్వేషణశ్చ, ద్విశ అప్రీతౌ. - ద్వేషించువాఁడు.
ద్వేషుఁడు - పగవాడు, విణ.పగగొనదగినవాడు.
ద్వేషి - ద్వేషము కలవాడు.
ద్వేష్ట - ద్వేషించువాడు.
ద్వేష్టి ద్విట్, ష. పు. - ద్వేషించువాఁడు.
ద్వేషము - పగ; పగ - విరోధము.
ద్వేషించు - క్రి.పగవహించు.
కంటకుఁడు - నీచబుద్ధి గల శత్రువు.
కంటగింపు - 1.రోత, అసహ్యము, 2.ద్వేషము.
కంటగించు - 1.విరోధించు, 2.నొచ్చు, 3.రొతపడు.
సూచ్యగ్రే క్షుద్రశత్రౌ చ రోమహర్షే చ కణ్డకః,
కంటకశబ్దము సూదిమొనకును, క్షుద్రశత్రువు నకును, రోమాంచమునకును పేరు. కణంత్యనేన కంటకః, కణ శబ్దే. - దీనిచేత మొఱపెట్టుదురు. (ఈశ్లోకము ప్రక్షిప్తము).
ఒడ్డారము - 1.ద్వేషము, 2.మారొడ్డుట, 3.మౌర్ఖ్యము, రూ.విడ్డూరము.
ఒడ్డారించు - క్రి.1.ప్రతిఘటించు, 2.ద్వేషించు.
మార్కొను - క్రి.ప్రతిఘటించు, ఎదుర్కొను.
క్విస్లింగ్ - (రాజ., చరి.) (Quisling) శత్రుపక్షావలంబి, ద్రోహి.
ద్రోహి - ద్రోహము చేయువాడు.
ద్రోహము - 1.కీడుతలపు, 2.చంపునిచ్ఛ.
నీళ్ళుతోడు - క్రి. జాతీ. ద్రోహముచేయు, కీడు తలపెట్టు.
వ్యాపాదనము - చంపుట, ద్రోహము తలచుట.
వ్యాపాదితము - చంపబడినది.
అహితుఁడు - శత్రువు, విరోధి.
న హితః అహితః. - హితుఁడు గానివాఁడు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
దస్యుఁడు - 1.దొంగ, 2.శత్రువు.
దస్యతి ఉపక్షయం కరోతీతి దస్యుః, ఉ.పు. దసు ఉపక్షయే. - ఉపక్షయమును జేయువాఁడు.
శాత్రవము-1.శత్రుత్వము, 2.శత్రుసమూహము.
శాదయతీతి శత్రుః, ఉ. పు. శత్రురేవ శాత్రవః శద్ ఌ శాతనే. - కృశముగాఁ జేయువాఁడు శత్రువు, శత్రువే శాత్రవుఁడు.
శాత్రవుఁడు - శత్రువు; శత్రువు - పగతుడు.
మిత్రముఁ జేసినను గాని * మే లనవచ్చును,
శాత్రవుఁడు ముద్దు గొన్నను,
ధాత్రిన్ దన కదియె కీడు * తలఁపఁ గుమారా!
తా. మిత్రుఁడు తనకు సంపూర్ణముగాఁ గీడుచేసి నను మేలుచేసిన వాఁడే యగును. శత్రువు తన్ను (శాత్రవుఁడు - శత్రువు)ఎంత ప్రేమించినను కీడు చేసిన వాఁడుగనే యెంచ బడును.
హంత - హింసించువాడు.
ప్రియతే హన్తుమితి పరః, పృఞ్ వ్యాయామే. - హింసించుటకై తిరుగువాఁడు.
అరాతి - శత్రువు.
ఇయర్తి అరాతిః, ఇ.పు. ఋ గతౌ. - సంహరించువాఁడు.
ప్రత్యర్థి - శత్రువు.
ప్రతికూలమర్థయతే ప్రత్యర్థీ, స. పు. - ప్రతికూలముగాఁ గోరువాఁడు.
పరిపంధి - 1.శత్రువు, 2.దారి గొట్టుదొంగ.
పరిపథయతీతి పరిపంథీ, న. పు. - బంధించువాఁడు.
రుట్టు - కోపము, రోషము.
రుప్యత ఇతి రుట్. ష-సీ. - రుష రోష రోషించుట.
రుష - రోషము.
క్రుద్ధుఁడు - కోపము నొందినవాడు.
క్రుథ - క్రోధము, రోషము.
క్రోధః. క్రుధ్. ధ. సీ. క్రుధరోషే - క్రోధించుట.
క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.
కోపము - Anger, పైత్యమును హెచ్చించును; వాతము నణచును; రక్తమునకు వేడి బుట్టించును; శిరస్సునకు విస్తారముగ రక్తమును ప్రవహింపజేయును; క్షయ, కాస, శ్వాస, మొదలగు ననేకరోగములను బుట్టించును; అన్నిరోగములను బలపరచును; బుద్ధినిదానమును తగ్గించును; ఆయుక్షీణము జేయును.
గొట్టు1 - 1.కఠినము, 2.దుర్లభము, 3.భయంకరము, 4.విరోధి, వి.1.దౌష్ట్యము, 2.అల్లరి, 3.గాలి, సం.కటుః.
గొట్టు2 - ప్రత్య. తాచ్ఛీల్యాద్యర్థమున వచ్చు ప్రత్యయము, ఉదా. (తాచ్ఛీల్యమున) గొడవగొట్టు, (స్వార్థమున) పిసినిగొట్టు.
దౌష్ట్యము - దుష్టత్వము.
ప్రకోపము - హెచ్చు ముమ్మరము.
ఒత్తరము - 1.ముమ్మరము, 2.ఉద్రేకము.
ముర్మురము - 1.కుమ్ము, 2.సూర్యుని గుఱ్ఱము.
ఉత్తమేక్షణ కోపన్స్యా న్మధ్య ఓ ఘటికా ద్వయమ్|
ఆధమేస్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతరమ్||
తా. కోప ము(ఉ)త్తమునియందు క్షణకాల ముండును, మధ్యముని యందు రెండు ఘడియలుండును, అధముని(అధముఁడు - తక్కువైన వాడు, నీచుడు)యందు నొక యహోరాత్ర ముండును(అహోరాత్రము - రేపగలు, ఎల్లప్పుడు), పాపిష్ఠియందుఁ జచ్చెడు(మరణించు)పర్యంత ముండును. – నీతిశాస్త్రము
గోత్రాన్ పర్వతాన్ భినత్తీతి గోత్రభిత్, ద-పు. - పర్వతముల భేదించినవాఁడు.
సుత్రాముఁడు - ఇంద్రుడు.
సుష్టు త్రాయత ఇతి సుత్రామా న-పు. - లోకముల లెస్సగా రక్షించువాఁడు. త్రైజ్ పాలనే.
శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.
శంభుః ఉ-పు శం సుఖం భవ త్యస్మాత్ శంభుః - శ మ్మనఁగా సుఖము, అది యీయనవలనఁ గలుగుఁగాన శంభువు.
భూసత్తాయాం. శంప్రాప్తనానితి వా, పరమానంద రూపో నిత్యం విద్యత ఇత్యర్థః - సుఖరూపియై యుండువాడు. భూప్రాప్తా వాత్మనేపదీ.
శాంభవి - పార్వతి.
శంభూ బ్రహ్మ త్రిలోచనౌ,
శంభుశబ్దము బ్రహ్మకును, శివునికిని పేరు. శం సుఖం భవ త్యస్మాదితి శంభుః, భూ సత్తాయాం. - ఇతనివలన సుఖము గలుగును. టీ. స. విష్ణావపి శంభుశబ్ద ఇతి ఛంద్రః.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసుష్ఠుడు, మరీచి).
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్ఠి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు. విష్ణు వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుద్ధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.
త్వయా హృత్వా వామం - వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో - రపరమపి శంకే హృత మభూత్|
య దేత త్త్వద్రూపం - సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యా మానమ్రం - కుటిలశశి చూడాల మకుటమ్| - 23శ్లో
తా. లోకమాతా! శాంభవి ! ఏ కారణమున సకలమగు నీ యాకృతి యెఱ్ఱగను త్రినేత్రములు గలదిగా, కుచములచే వంగినదిగా, వంకల జాబిల్లిని చంద్రకళ(చంద్రవంక) శిరోమణిగా నయినదో అదిచూచి, యిదివరకు గ్రహించిన శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.) శరీరము నందు వామభాగమును అపహరించినదానవు(యెడమ భాగముతో)తృప్తి నొందని మనస్సుతో మిగిలిన కుడిభాగమును కూడ గ్రహించి యున్నావేమోనని శంకించుచున్నాను (శివతత్త్వాన్ని తనలో లయం చేసుకున్నదని భావము). - సౌందర్యలహరి
ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు. ధాతా, ఋ.పు. సర్వం దధాతీతి ధాతా - సమస్తమును ధరించినవాడు, డుధాఞ్ ధారణ పోషణయోః.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
జగత్సూతే ధాతా - హరి రవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్ - స్వమపి వపు రీశ స్తిర యతి|
సదాపూర్వ స్సర్వం - తదిద మనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా మాలంబ్య - క్షణచలితయో ర్బ్రూలతి కయోః|| - 24శ్లో
తా. హే భగవతి! సృష్టికర్తయైన బ్రహ్మ సృష్టించు చున్నాడు. విష్ణువు(హరి) రక్షించుచున్నాడు. రుద్రుడు - శివుడు హరించుచున్నాడు. ఈశ్వరుడు(ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.) ఈ కార్యములను దిరస్కరించి తన శరీరమున కప్పిపుచ్చుచున్నాడు. ఆ (త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) సదాశివుడు త్రిమూర్తి కృతమగు ఇదంతటిని చలించుచున్న నీ కనుబొమ్మల కదలికయే (అజ్ఞాస్వరూపమగును) యాజ్ఞను పొంది యనుగ్రహించు చున్నాడు. – సౌందర్యలహరి
వాసవుఁడు - ఇంద్రుడు.
వసూని రత్నాన్యస్య సంతీతి వాసవః - రత్నములు గలవాఁడు.
చిలువతాలుపు - శివుడు, భుజంగభూషణుడు.
చిలువఱేఁడు - సర్పరాజు, శేషుడు.
చిలువ - పాము.
బట్టకాఁడు - 1.చిలువ, 2.గోరువంక, వ్యు.పలుకు నేర్పు గలది.
చిలువ - 1.కొంచెముగ చేరి నిలచిన నీరు, 2.జందెవలె చుట్టిన నూలుచుట్టు, విణ.అల్పము.
గోర - గోరంకిపిట్ట, సం.గోరంకుః, గోరికా.
చిలువతిండి - 1.గరుడపక్షి, 2.నెమలి.
భుజంగభుక్కు - నెమిలి, వ్యు.పాములను తినునది.
భుజంగాన్ బుఙ్తే; భుజంగభుక్, జ. పు. భుజపాలనాభ్య వహారయోః. - సర్పములను భుజించునది.
భుజంగము - పాము, వ్యు.భుజముతో పాకి పోవునది.
భుజం కుటిలం గచ్ఛతీతి భుజగః భుజంగ; భుజనమశ్చ. గమ్ఌ గతౌ. - కుటిలముగాఁ బోవునది గనుక భుజగము, భుజంగము, భుజంగమము.
అహిపతి - శేషుడు.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
నాగుఁడు - శేషుడు, సం.నాగః. శేషతల్ప సుఖనిద్రిత రామ్|
అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.
అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృత్రాసురుడు.
అంహతీత్యహిః. అహి గతౌ. - చరించునది.
అహి ర్వృత్రే పి :
అహిశబ్దము వృత్రాసురునికిని, అపిశబ్దమువలన పామునకును పేరు. హంతీ త్యహిః. పు. హన హింసాగత్యోః హింసించును గనుక అహి.
అంహతి లోకాన్ వ్యాప్నోతీతి అహిః. అహి గతౌ. వృత్రేయథా _ "ధృతం దనుష్ఖండ మివాహివిద్విష"ఇతి భారవిః. "సర్పే వృత్రాసురే ప్యహి" రితి రభసః.
వృతహుఁడు - ఇంద్రుడు, వ్యు.వృత్రాసురుని చంపినవాడు.
వృత్రాం హతవాన్ వృత్రహా, న-పు. - వృత్రాసురునిఁ జంపినవాఁడు.
త్వాష్ట్రుడు - 1.విశ్వరూపుడు, 2.వృతాసురుడు, 3.పనికిమాలినవాడు.
ధ్వాంతరి దానవా వృత్రాః -
వృత్రశబ్దము చీఁకటికిని, శత్రువునకును, వృత్రాసురునికిని పేరు. వృణోతీతి వృత్రః, వృఞ్ వరణే. - ఆవరించునది. 'శైలేచక్రఘనేవృత్ర ' ఇతి శేషః, చక్రాకారో మేఘ శ్చక్రఘనః.
ద్వనంత్యత్ర మార్గ మపస్యంత ఇతి ధ్వాన్తం, ధ్వన సద్బే. - మార్గమును గాననివారలై దీనియందు మొఱపెట్టుదురు.
వృతము - 1.చీకటి, 2.కొండ, 3.శబ్దము, 4.మేఘము.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధం హతదృష్టిసక్తికం లోకం కరోతీత్యంధకారః, అ. ప్న. డుకృఞ్ కరనే. - లోకులను అంధులుఁగా జేయునది.
చీఁకటిగొంగ-సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
కొండఱేఁడు - హిమవంతుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
విశాలాక్షి - హైమవతి, పార్వతి.
భవ్య - పార్వతి, హైమవతి.
కొండపగతుఁడు - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు.
అహిభయము - 1.పాములవలని భయము, 2.రాజులకు స్వపక్షము వారి వలని భయము.
రాజులకు మూలబలము మొదలగు నేడు విధము లైన స్వపక్షముల వలనఁ బుట్టిన భయము అహిభయము మనంబడును.
అహేరివ భయం అహిభయం - సర్ప భయము వంటి భయము.
అహితుఁడు - శత్రువు, విరోధి.
న హితః అహితః, హితుఁడు గానివాఁడు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23va) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు.
అనిష్టము - 1.ఇష్టముకానిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.
అహిద్విషుఁడు - 1.గరుడుడు, 2.ఇంద్రుడు.
అహిభుక్కు - 1.గరుడుడు, 2.ముంగిస, 3.నెమలి peacock.
కేకి తార్థ్యా వహిభుఙౌ -
అహిభుక్ఛశబ్దము నెమలికిని, గరుత్మంతునకును పేరు. అహీన్ భుఙ్త్కే అహిభుక్, జ. పు. భుజ పాలనాభ్య వహారయోః. - పాములఁ దినునది.
అహిద్విషము - 1.నెమలి, 2.గ్రద్ధ, 3.ముంగిస.
కౌశికము - 1.గుడ్లగూబ, 2.ముంగిస. కౌశిక మఖ సంరక్షక రామ్|
కౌశికుఁడు - 1.విశ్వామిత్రుడు, వ్యు.కుశికపుత్రుడు, 2.ఇంద్రుడు, 3.నిఘంటువు తెలిసినవాడు, 4.పాములవాడు.
గాధేయుఁడు - విశ్వామిత్రుడు, గ్రాధిపుత్త్రుడు. విశ్వామిత్ర ప్రియతమ రామ్|
నరేంద్రుడు - 1.రాజు, 2.పాములవాడు.
పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
అర్జుఁనుడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
అహితుండికుఁడు - పాములవాడు.
అహి తుణ్ణేన జీవతీత్యహి తుణ్ణికః - సర్పముఖము చేత బ్రతుకువాఁడు.
బరిజోగి - పాములవాడు.
నవిగర్హ్యకథాంకుర్యాద్యహి ర్మాల్యం నథారయేత్ |
గవాం చయానం వృష్ఠేన సర్వదైవ విగర్హితం ||
తా. నిందింపఁలగిన ప్రబంధకల్పన చేయరాదు, చిలువల మాల్యము(అహి - 1.పాము, 2.రాహు గ్రహము, 3.వృత్రాసురుడు.)ధరింపరాదు, ఎద్దు(గవయము - 1.గురుపోతు, వన వృషభము, అడవియెద్దు.)నెక్కిపోవుట అన్నివిధంబులచేత నిషిద్ధమైనది. - నీతిశాస్త్రము
వృషుఁడు - 1.వీర్యవృద్ధి గలవాడు, 2.ఇంద్రుడు.
వర్షతీతి వృషా, న-పు. - వర్షించువాఁడు, వృషు నేచనే.
వృష్టి - వర్షము, వాన.
వర్షము - 1.వాన, 2.పేడితము, 3.ద్వీపము, 4.సంవత్సరము.
వాన - వర్షము.
వానకాళ్ళు - వర్ష ధారలు.
వృష్టి ర్వషం -
వర్షతీతి వృష్టిః ఈ - సీ, వర్షం చ, వృషు సేచనే - తడుపునట్టిది గనుక వృష్టి, వర్షము. ఈ 2 వాన పేర్లు.
వృష్టి - 1.పొట్టేలు, 2.ఒక గొల్లవాడు, 3.కృష్ణుడు, 4.ఇంద్రుడు, 5. వహ్ని.
పొట్టేలు - మగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
మేండము - పొట్టేలు
మేండ్రించు - 1.భేదించు 2.నశింప చేయు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.
వత్సలము - వహ్ని, తృణాగ్ని.
వత్సలుఁడు - వాత్సల్యము(దయ) గలవాడు.
వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః ఇ-పు. వహ ప్రాపణే. - హవ్యమును దేవతలకుఁ జేర్చువాఁడు.
హవిస్సు - వేల్పుటకు ఇగురు పెట్టిన అన్నము.
ప్రసాదనము - 1.అనుగ్రహము(అనుగ్రహము - దయ, కరుణ), 2.ప్రసన్నత, 3.భగవంతునికి నివేదించిన అన్నము.
ప్రసాదనము - 1.తేర్చుట, 2.అన్నము.
పసదనము - కృతజ్ఞతతో నిచ్చు పారితోషకము, సం.ప్రసాదనమ్.
వషటృకృతము - విణ.అగ్నియందు వేల్వబడునట్టిది (హవిస్సు).
వషట్కారము - అగ్నియందు చేయు హవిరాదిత్యాగము.
త్రయాణాం దేవానాం - త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా - తవ చరణయో ర్యా విరచితా |
తథహి త్వత్పాదో - ద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వ - న్ముకుళిత కరోత్తం సమకుటాః. - 25శ్లో
తా. ఓ పార్వతీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించినవారైన త్రిమూర్తులకు(త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.)చేసే పూజ కూడా, నీ పదములకు చేయబడినచో నదియే పూజ యగును. ఎట్లనగా ఈ మువ్వురును మణిమయ మగు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో శిరసున చేతులు జోడించుకొని యుండువారే గదా! భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం. – సౌందర్యలహరి
కాటిపాఁపడు - 1.గొల్లవాడు, 2.కాటికాపరి.
కాటిఱేఁడు - శివుడు, రూ.కాట్రేడు.
కాడు - 1.వల్లకాడు, శ్మశానము, 2.అడవి, 3.నాశము, సం.కటః.
వల్లకాడు - శ్మశానము, నానావిధముల పాడు చేయునది.
మసనము - శ్మశానము, సం.శ్మశానమ్.
శ్మశానము - మసనము, ప్రేతభూమి.
శవానాం శయనం శ్మశానం, పృషోదరాదిః - శవములకు శయనము.
ప్రేతవనము - శ్మశానము, ఒలికిమిట్ట.
పితౄన్ ప్రేతాన్ వనతీతి పితృవనం, వన షన సంభక్తౌ. - శవములను బొందునది. ఈ 2 శ్మశానము పేర్లు ఒలికిమిట్ట.
రుద్రభూమి - శ్మశానము.
శ్మశానవైరాగ్యము - (జాతీ.) శ్మశానమున నిలిచినప్పుడు కలుగు వైరాగ్యము(ఆ వైరాగ్యము తరువాత నిలువదు. ఇట్లే ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము అను వానిని చెప్పుదురు).
ఒలుకులమిట్ట - శ్మశానము, కాడు.
ఒలికి - సొదపెర్చుచోటు, శ్మశానము.
కాడుచేయు - వై.వి. నాశముచేయు.
కాడుపడు - క్రి.1.కలతపడు, 2.కనపడకపోవు, 3.నశించు.
చంద్రకళావతంసుకృప చాలనివాడు, మహాత్ముడైనఁ దా
సాంద్రవిభూతిఁబాసియొక్క, జాతిహీనుని గొల్చియుంట యో
గీంద్రనుతాంఘ్రిపద్మ మతిహీనతనొందుట కాదు యా హరి
శ్చంద్రుడు వీరబాహుని నిజంబుగ గొల్వడెనాడు, భాస్కరా|
తా. పూర్వము హరిశ్చంద్రుడనురాజు దైవకృపలేక కాటకాపరియైన వీరబాహుని సేవింపవలసి వచ్చెను. కావున ఎంతగొప్పవారి(మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)కైనను భగవంతుని యనుగ్రహము లేనప్పుడు హీనుని గొలువ వలసి వచ్చును, అటుల కొలుచుట తప్పుకాదు.
ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
కోశేషు పఞ్చస్వధిరాజమానా - బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహమ్,
సాక్షి శివః సర్వగతోన్తరాత్మా - సా కాశికాహం నిజబోధరూపా|
విరించి - బ్రహ్మ.
విరంచిః-ఇ-పు, విరచయతి భూతాని విరంచిః - భూతములను సృజించినవాఁడు.
విభిః హంసైః రిచ్యతే ఉహ్యత ఇతి వా-వి శబ్దము పక్షి వాచకము గనుక హంసలచేత వహింపఁ బడువాడు.
పంచత్వము - మరణము.
పంచానాం భూతానాం పృథగ్భావః పంచతా - శరీరము పంచ భూతాత్వ్మకము గనుక పోవునపు డాయా యంశము లాయాభూతముల యందుఁ గలియును గాన పంచత యనఁగా మరణము.
ప్రాప్తం పంచత్వం యేన సః ప్రాప్తపంచత్వం - పొందఁబడిన మరణము గలవాఁడు.
పెద్దనిద్దుర - మరణము, దీర్ఘనిద్ర.
దీర్ఘనిద్ర - చావు.
పంచనామా - జాతీ. శాస. అనుమాన పరిస్థితులలో మరణము కలిగిన యెడల విచారించు సంఘము.
కీనాశుఁడు - 1.యముడు, 2.రాక్షసుడు, విణ.1.పేద, 2.పిసినిగొట్టు, 3.కటికవాడు.
కటిక - 1.కటికవాడు, 2.బెత్తము పట్టియుండువాడు, 3.మాంసము అమ్మువాడు. కీకటుఁడు - లోభి, పేదవాడు.
వినాశము - చేటు.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
వినాశ స్స్యా దదర్శనమ్,
వినశనం వినాశః, అదృష్టి రదర్శనం, ణశ అదర్శనే, దృశిర్ ప్రేక్షణే. - కానరాకుండుట వినాశము, అదర్శనమును. ఈ 2 కానరాకుండుట పేర్లు.
విరించి పంచత్వం - వ్రజతి హరి ర్నాప్నోతి విరతం,
వినాశం కీనాశో - భజతి ధనదో యాతి నిధనమ్,
వితంద్రీ మాహేంద్రీ - వితతిరపి సమ్మీలిత దృశా,
మహాసమ్హారే(అ)స్మిన్ - విహరతి సతి! త్వత్పితిరసౌ. - 26శ్లో
తా. ఓ సతీదేవీ! బ్రహ్మ మరణించును, విష్ణువు(హరి) విశ్రాంతి నొందును, యముడు నశించును, కుబేరుడు మరణించును, ఇంద్రాది దేవత్లును కనుమూయుదురు. ఈ పెద్ద సంసారమును ఈ నీ భర్త యగు (సదాశివుడు - శివుడు) విహరించును. - సౌందర్యలహరి
వాస్తుపతి - వాస్తోష్పతి, ఇంద్రుడు.
వాస్తోః గృహక్షేత్రాదేః పతి రధిదేవతా వాస్తోప్పతిః - గృహ క్షేత్రాదులకు నధిదేవత.
వాస్తుశాస్త్రజ్ఞుఁడు - శిల్పి, వాస్తుశాస్త్రము తెలిసినవాడు.
వాస్తుశాస్త్రము - దేవాలయములు, గృహములు, సౌధములు నిర్మించుట యందు యుక్తా యుక్తముల దెలియజేయు శాస్త్రము, వాస్తుకళ, శిల్పశాస్త్రము, కట్టడములలో నేర్పైతనము (Architecture).
వాస్తుకుఁడు - వాస్తుపురుషుఁడు.
వాస్తువు - 1.ఇండ్లు మొదలైనవి ఏర్పరుపదగిననేల, 2.ఇల్లు.
కలప - ఇల్లు కట్టుటకు ఉపయోగపడు దూలములు వాసములు మొ.వి.
కలపజాతి వృక్షములు - (వ్యవ.) గృహ నిర్మాణమునకు గాని కఱ్ఱ సామగ్రిని గాని ఉపయోగపడు కలప నిచ్చు చెట్లు (Timber trees), ఉదా. తాడి, టేకు, మద్ది, సాల, ఛండ్ర మొ.వి.
జపో జల్పశ్శిల్పం - సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య - క్రమణ మశనాద్యా హుతి విధిః|
ప్రణామ స్సంవేశ - స్సుఖ మఖిల మాత్మార్పణ దృశా
సపర్యా పర్యాయ - స్తవ భవతు యన్మే విలసితమ్ || - 27శ్లో
తా. తల్లీ! నేను పలికిన పలుకులెల్ల(జల్పము - ఉపయుక్తముకాని మాట.) మాతృకా నిర్మితములే కావున అది నీ మంత్ర జపమే(జపము - 1.మంత్రా వృత్తి, 2.వేదాధ్యయనము, రూ.జపము.), అన్ని పనులును(శిల్పము - చిత్తరువు వ్రాయుట, శిల్పుల పని మొదలగు నవి.), గమనము ప్రదక్షిణము, భోజనాదులు ఆహుతి విధి, నాకు ప్రాప్తించిన శబ్దము(స్తవము - స్తోత్రము), సుఖము(సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము.) వీటన్నిటి యందు బ్రహ్మార్పణ దృష్టి(దృశ - చూపు)తో నాకు సుళువుగా చేయదగినదేదో, అట్టిది నీ ఆరాధనకు(సపర్య - 1.పూజ, 2.సేవ.)మారుగ నగుగాక! – సౌందర్యలహరి
పరంజ - పరంజా, గోడకట్టుటకు ఎత్తుగ కట్టిన కట్టడము.
"భవనం నిర్మాణం చేసే సమయంలో కర్రలతో కట్టిన పరంజా ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత నిరుపయోగమవుతుంది. అలాగే ఒక సాధకునికి విగ్రహారాధన చెయ్యడం ప్రారంభదశలో మాత్రమే అవసరం. దైవసాక్షాత్కారం లభించిన తరువాత దాని అవసరం ఉండదు." - శ్రీరామకృష్ణ పరమహంస
లేఖ్యపత్రకము - తాటి చెట్టు.
రేక - తాటాకు మట్టతో గట్టిన దొప్ప, వై. వి.గీరబాబు, పంక్తి, సం.రేఖా, లేఖః.
తాటిరిక్క నెల - జ్యేష్ఠమాసము.
తాటిరిక్క - జ్యేష్ఠా నక్షత్రము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
రిక్క - నక్షత్రము, ఋక్షమ్.
రిక్షము - రిక్క, రూ.ఋక్షము.
రిక్కదారి - ఆకాశము.
తాటి పడగవాఁడు - 1.బలరాముడు, 2.భీష్ముడు.
భీష్ముఁడు - 1.శంతన పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
కోఁదాడు - ఒకరకపు తాటిచెట్టు, సం.కంతాళః.
తాలధ్వజుఁడు - బలరాముడు.
తాలాంకః తాల వృక్షాకృతి ఢంకో ధ్వజో యస్యసః - తాళవృక్షాకారమైన ధ్వజము గలవాఁడు.
తాలాంకుఁడు - బలరాముడు.
తాడు - తాటిచెట్టు, సం.తాళీ.
తాలము - తాటిచెట్టు, రూ.తాళము.
తాళము - 1.బీగము, 2.పాడునపుడు చేతులతో చరచుచరపు, 3.తాటిచెట్టు, 4.తాళమువేయు కంచువాద్యము.
తృణరాజాహ్వయ స్తాళః -
తృణానాం రాజా ముఖ్యః తృణరాజః, తృణరాజ ఇత్యాహ్వయో యస్యేతి తృణరాజాహ్వయః. - తృణములలో ముఖ్యమైనది. తృణరాజము, తృణరాజమను పేరుగలది తృణరాజహ్వయము.
తలతి ప్రతిష్ఠతే ధృఢమూలత్వాత్తాళః, తలప్రతిష్ఠాయాం. - దృడమైన మొదలు గలదౌటచేత ప్రతిష్ఠ గలది. ఈ 2 తాటిచెట్టు పేర్లు.
కాకతాళీయము - న్యా. కాకి వ్రాలినంతనే తాటిపండు పడిన విధము, దైవికముగా రెండు పనులు ఏకకాలమున జరుగుట వంటిది.
తృణరాజము - 1.తాటిచెట్టు, 2.కొబ్బరిచెట్టు, 3.గిరకతాడిచెట్టు.
హింతాలము - గిరక తాటిచెట్టు.
హినోతి వర్ధతే తలతి ప్రతిష్ఠతీతి హింతాలః, హిగతౌ వృద్ధౌ చ. - వృద్ధిఁ బొందునది; ప్రతిష్ఠ గలది, హింతాళము-గిఱకతాటి పేరు.
బొంద - 1.రంధ్రము, 2.తాటి మొదలగు చిన్న చెట్టు, 3.గుంట.
తూఁటు - రంధ్రము, చిల్లి.
తూఁటాడు - క్రి.వేధించు, 2.రంధ్రము చేయు.
తూఁటుకట్టు - క్రి.రంధ్రముపడు.
ౙపట - తాటిమట్టకు అడుగున నుండు పంగ.
కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము - (జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)
గవి1 - ఆవు Cow.
గవి2 - 1.గుహ, 2.గుంట.
కానివానితోడఁ గలసి మెలఁగుచునున్న
గానివానివలెను కాంతు రవని
తాటిక్రిందఁ బాలుత్రాగిన చందమౌ విశ్వ.
తా. దుర్మార్గునితో కలసి తిరిగినచో, వానినికూడ దుర్మార్గుడనే జూతురు. తాటిచెట్టు క్రింద కూర్చుండి పాలు త్రాగినను, కల్లు త్రాగుచున్నాడందురు.
గఱి - 1.గరుకుతనము, 2.తాటికమ్మ, 3.పక్షి, బాణము మొ,ని ఱెక్క, ఈక, సం.కరుత్.
ఆకు - 1.చెట్టునందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని వారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.
మడత్రొక్కు - తాటాకులు, దొంతిగా అడగ ద్రొక్కు, (మడగన్ +త్రొక్కు).
రామబాణము - తాటాకులోనగు పుస్తకములు తొలిచెడి పురుగు.
కుంటెనముడి - తాటాకుల పుస్తకమునకు నడుమ నుంచు దారపుపిడి.
కమ్మ - 1.తాటియాకు, 2.తాటంకము, స్త్రీల కర్ణభూషణము 3.జాబు, 4.ఒక కులము, విణ. పుల్లనిది లేక కమ్మగా (ఇంపుగా) నుండునది.
కమ్మపంజులు - రత్నతాటంకము, కమ్మ పువ్వు.
తాటంకము - చెవికమ్మ.
చెవ్వాకు - చెవియాకు, కమ్మ.
చెవియాకు - లక్కాకు, కమ్మ, రూ.చెవ్వాకు.
కర్ణికాతాళపత్త్రం స్యాత్ -
కర్ణయోః అలంకారః కర్ణికా - చెవులకు నలంకారమైనది.
తాళస్య పత్త్రం తాళపత్త్ర తాటాకు. ఈ 2 చెవులకమ్మల పేర్లు.
కర్ణిక - 1.చెవికమ్మ, 2.తామరదుద్దు.
తాళపత్రము - 1.తాటియాకు, 2.చెవ్వాకు; చెవికమ్మ.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు, ఈ ఐదువన్నెలు సుమంగళి చిహ్నములు). జీవ భర్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
కమ్మగాడుపు - మలయమారుతము.
మలయ మారుతము - కమ్మగాడ్పు.
కమ్మవిలుకాఁడు - మరుడు, కమ్మవిల్తుడు.
కమ్మవిల్తుఁడు - మన్మధుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివిషదః - స్వర్గమునందుండువారు, పద ఌ విశరణ గత్యవసారనేషు.
క్ష్వళము - విషము.
క్ష్వేళతే మోహయతీతి క్షేళః, ఞి క్ష్విదా స్నేహనమోహనయోః. - మోహమును బొందించునది.
సుధా మప్యాస్వాద్య - ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యన్తే విశ్వే - విధిశత మఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేళం కబళితవతః కాలకలనా
న శమ్భో స్తమ్మూలం - తవ జనని! తాటఙ్క మహిమా || - 28శ్లో
తా. ఓ జనని ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు. దేవతలు భయంకరమైన జర మృత్యువు- 1.చావు, 2.మరణాధిదేవత.)లను హరించు అమృతమును త్రావియు నాపద లందుచున్నారు. భయంకరమగు క్ష్వళము - విషము)మ్రింగిన శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)నకు మరణ భయము లేదు. ఇందుకు కారణము నీ చెవికమ్మల ప్రభావమేకదా! - సౌందర్యలహరి
సురపతి - ఇంద్రుడు.
సురాణాం పతి స్సురపతి - దేవతలకుఁ బ్రభువు.
సురలు - వేలుపులు.
అమర్త్యుఁడు - దేవత, వేల్పు, విణ.చావు లేనివాడు.
అమరుఁడు - 1.దేవత, 2.అమర సింహుడు (సంస్కృత నిఘంటు కర్త.), విణ.మరణము లేనివాడు.
త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు - వేలుపు; సుపర్వుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
దేవానాంప్రియము - మేక, యజ్ఞము లందు దేవతల కర్పింపబడును గాన.
శసనము - యజ్ఞమందలి పశువధము. యజ్ఞయాగాది క్రతువులకు కలియుగంలో అంత ప్రాధాన్యత లేదు. జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు...
యూపము - యజ్ఞ మునందు పశుబంధనార్థము నాటిన పై పట్టలలేని పాలకొయ్య.
చషాలము - యూప స్తంభమూందలి కొయ్య కడియము.
హర త్వం సంసారం ద్రుతతర మసారం సురపతే
హరత్వం పాపానాం వితతం మపరాం యాదవపతే
అహో దీనానాథం నిహిత మచలం నిశ్చితపదం
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతి మే|
బలసూదనుఁడు - ఇంద్రుడు.
బలాఖ్యస్యాసురస్య అరాతి ర్బలరాతిః - బలాసురునికి శత్రువు.
అరాతి - శత్రువు.
ఇయర్తి అరాతిః, ఇ.పు. ఋ గతౌ. - సంహరించువాఁడు.
శచీపతి - ఇంద్రుడు.
శచ్యాః పతి శ్శచీపతిః ఇ-పు. - శచీదేవికి భర్త.
పులోమజా శ చీంద్రాణీ :
పులోమజ - శచీదేవి, వ్యు.పులోముని కూతురు.
పులోమ్నో మునేర్జాతా పులోమజా - పులోముఁడను ముని వలనఁ బుట్టినది.
పౌలోమి - శచీదేవి.
తస్మా జ్ఞాతేతివా - విస్తారమైన రోమములు గలవాఁడు పులోముడు. అతని కూతురు. జనీ ప్రాదుర్భావే.
శచి - ఇంద్రుని భార్య.
శచతి హంసవద్గచ్ఛతీతి శచీ - హంసవలె నడచునది. శచి శ్వచి గతౌ.
ఇంద్రాణీ - ఇంద్రుని భార్య, శచీదేవి.
ఇంద్రస్య పత్నీ ఇంద్రాణీ. ఈ.సీ. - ఇంద్రుని భార్య. ఈ మూడు 3 శచీదేవి పేర్లు.
సురతాణి - 1.ఇంద్రుడు, 2.ఇంద్రాణి, సం.సురత్రాణః.
ఇంద్రుఁడు - 1.దేవతలర్రాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు. దేవలోక మందు దేవీస్థానం ఇంద్రాణి|
పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా|
పులోమజార్చితా బంధ-మోచనీ బర్బరాలకా.
జంభారి - ఇంద్రుడు; జంభభేది - ఇంద్రుడు.
జంభఖ్య మసురం భిన్తతీతి జంభభేదీ, న-పుః. - జంభాసురుని భేదించినవాఁడు. భిదరే విదారణే.
కిరీటం వైరించం - పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే - స్ఖలసి జహి జంభారి మకుటమ్|
ప్రణమ్రేష్వేతేషు - ప్రసభ ముపయాతస్య భవనం
భవస్యా(అ)భ్యుత్థానే - తవ పరిజనోక్తి ర్విజయతే|| - 29శ్లో
తా. ఓ జగన్మాతా! ఇంటికి(భవనము - ఇల్లు)నకు వచ్చుచున్న శివుని చూచి నీవు గౌరవముచే శీఘ్రముగా లేచి కెదురు వెళ్ళేవేళ - నీకు బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు ప్రణమిల్లుతుండగా – నీ ముందు భాగమున బ్రహ్మ కిరీటమున్నది, దానికి తగులకుండ తొలగి రమ్ము. ఇదిగో తరువాత కైటభ దైత్య మర్దనుని కఠోరమైన(కోటీరము - 1.కిరీటము, 2.జటజూటము.)కిరీట మున్నది, దానికొన కాలికి తగిలిన కాలు జాఱునేమో! ఆ తరువాత జంభు డను రాక్షసుని వధించిన ఇంద్రుని (కిరీటము - రాజు ధరించు శిరోభూషణము, మకుటము)కిరీటమున్నది, దానిని తొలగి రమ్ము" అనుచు పలుకుచున్న నీ పరిజనుల(పరిజనము - పరివారము)వాక్కులు సర్వోత్కర్షతో ప్రబలు చుండును. - సౌందర్యలహరి
డింభాకృతియుత రంభానటరత
జంభారివినుత కుంభోద్భవనుత| ||శరవణభవ||
అయి జగదంబ కదంబవన ప్రియవాసవిలాసిని వాసరతే
శిఖరిశిరోమంఇ తుంగహిమాలయశృంగ నిజాలయ మధ్యగతే
మధుమధురే మధు కైటభగంజని కైటభభంజని రాసరతే
జయజయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే| – 3
హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకానా మింద్రియాణామీశః - ఇంద్రిలములకు నీశ్వరుఁడు.
హృషీకం విష యీన్ద్రియమ్,
హృష్యంత్యనేనేతి హృషీకం, హృషతుష్టౌ. - దీనిచేత సంతోషింతురు.
విషయో (అ)స్యాస్తీతి విషయి - విషయము గలిగినది.
ఇంద్రస్య అత్మనః లింగం ఇంద్రియం - ఇంద్రుఁడనఁగా నాత్మ; ఆత్మకు జ్ఞాపకముగనుక ఇంద్రియము. ఈ 3 ఇంద్రియముల పేర్లు.
హృషీకము - ఇంద్రియము.
ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు 5 అను శంఖ్య.
ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్షజ్ఞానము (Perception).
ఖ - ఒక అక్షరము, సం.వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).
జీవితస్థాయి - (అర్థ.) వ్యక్తి తన జీవితావసరములను సమకూర్చుకొన గలుగు పరిమితి (Standard of Life).
అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామా తురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వమ్||
తా. ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్ష గలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలి కొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. – నీతిశాస్త్రము
పంచముఖుఁడు - శివుడు, (ఐదు మోముల వేలుపు).
పంచాననుఁడు - శివుడు, వ్యు.ఐదు మొగాలు కలవాడు.
ఐదుమోముల వేలుపు - పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.
పంచాననము - సింహము వ్యు.విశాలమగు ముఖము గలది.
పంచ ఇతి పంచం, పచి విస్తారే, పంచం విస్తృమాస్యమస్యేతి పంచాస్యః - విస్తీర్ణమైన ముఖము గలది.
పంచాననః పరం బ్రహ్మ చాఘోరో ఘోరవిక్రమః,
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః|
అహోబిలం(గరుడాచలంలో అహోబలం, అక్కడ నృసింహస్వామి దేవేరి అమృతవల్లి), సింహాచలం(సింహాద్రి అప్పన్న), వేదాద్రి, మంగళగిరి, యాదగిరిగుట్ట(లక్ష్మినరసింహస్వామి)నరసింహస్వామి క్షేత్రములు మొ.వి.
పంచనారసింహ క్షేత్రభావ మరసి
యున్నఁ జాలును మేలు మహోత్సవంబు
పంచభూతంబు లరచేత సంచరించు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
కేశవుఁడు - విష్ణువు. ద్వితీయం కేశవం తధా|
కేశవః, శోభనాః కేశాః యస్యసః - మంచి వెండ్రుకలు గలవాడు.
కేశిన మసురం హతవానితి - కేశి యను నసురుని జంపినవాఁడు.
కశ్చ ఈశశ్చ కేశౌ, తావస్మిన్ స్త ఇతి వా, తదుక్తం శ్లో,క ఇతి బ్రహ్మణో నామ ఈశో (అ)హం సర్వదేహినాం, ఆవాం తవాంగే నంభూతౌ తస్మా త్కేశవ నామవానితి హరివంశే - బ్రహ్మరుద్రులు ఈయనయందు జనించిరి గనుక కేశవుడు.
కశ్చ అశ్చ ఈశశ్చ కేశ్చాః, తే సంత్యస్మిన్నితి కేచిత్ – బ్రహ్మ విష్ణు రుద్రులు ఈయన యందుండుట వలనః గేశవుఁ డని కొందఱు.
కేశిసూదనుఁడు - శ్రీకృష్ణుడు, వ్యు.కేశియను రాక్షసుని చంపినవాడు.
కేళనః కేశికః కేశీ,
ప్రశస్తాః కేశా స్సన్తస్య కేశవః, కేశికః కేశీ, న్. మంచి వెండ్రుకలుగలవాడు. ఈ 3 మంచి వెండ్రుకలు గలవాని పేర్లు.
కేశి - 1.ఒకానొక రాక్షసుడు, 2.సింహము, విణ.మంచి తలవెండ్రుకలు కలవాడు.
కేశి - హయశిరుఁడు.
కేసరి - 1.సింహము, 2.గుఱ్ఱము, వ్యు.కేసరములు గలది, 3.ఒక విధమగు వరి పైరు విణ.శ్రేష్ఠుడు.
కే శిరసి సరంతీతి కేసరాః సటాః, తా అస్యసంతీతి కేసరీ, న.పు. - జూలుగలది.
కేసరము - 1.ఆకరవు, 2.ఇంగువ, 3.జూలు, 4.పొగడ, 5.పొన్న, రూ.కేశరము. కేసరిసుతాయ, కేసరినందన - హనుమ.
ఏకోదేవః కేశవోదా శివోదా, ఏకోవాసః పట్టణందా వనందా|
ఏకోమిత్త్రః భూపతిర్వా యతిర్వా, ఏకోనారీ సుందరీదా దరీదా||
తా. విష్ణువైన(కేశవుఁడు - విష్ణువు), శివుడైన నొకండే దేవుండని నమ్మ వలయును. పట్టణమైన, వనమైన నొండు వాసయోగ్యముగా నెంచ వలయు ను. రాజు(భూపతి - నేలరేడు, రాజు.)తోనైన సన్యాసితోనైన స్నేహము చేయవల యును. సౌందర్యముగలభార్య(నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.)తో గుడియై నను గుహయందైన నుండ వలయును – నీతిశాస్త్రము
శివునిఁ గేశవునిన్ నరున్ సింహము మది
బూని ప్రేమ సాలగ్రామమౌ నృసింహు
సేవ చేయుట మేలగు సిద్ధికాదె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః,
నారసింహవపు శ్శ్రీమాన కేశవః పురుషోత్తమః| - 3స్తో
హరిహయుఁడు - ఇంద్రుడు.
హరయో హరితవర్ణాః హయా యస్య సః హరిహయః - పచ్చని గుఱ్ఱములు గలవాఁడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరతి గజాదికం హరిః, పు. హృఞ్ హరణే. - గజాదులను హరించునది.
యమానిలేన్ద్ర చద్దృర్క విష్ణు సింహాంశు వాజిషు,
శుకాహి కపి ఖేకేషు హరి ర్నా కపిలే త్రిషు,
హరిశబ్దము యమునికిని, వాయువునకును, ఇంద్రునికిని, చంద్రునికిని, సూర్యునికిని, విష్ణువునకును, సింహునకును, కిరణమునకును, గుఱ్ఱమునకును, చిలుకకును, పామునకును, కోతికిని, కప్పకును, పేరైనపుడు పు. కపిలవర్ణముగలదానికి పేరైనపుడు త్రి. కపిలవర్ణ మనఁగా బంగారు చాయ, హరతీతి హరిః హృఞ్ హరనే. హరించును గనుక హరి.
చెలఁగు హరిమధ్యకును సింహరాశి…..
గజానాం రిపుః, పు - ఏనుఁగులకు శత్రువు.
పింగే దృష్టీ యస్య సః పింగదృష్టిః పు. - పచ్చనిచూపులు గలది.
మృగాణామధిపః మృగాధిపః - మృగములకు దొర.
కంఠీరవము - 1.సింహము, 2.మదపుటేనుగు, 3.పావురము.
కంఠే రవో యస్య సః కంఠీరవః - కంఠమందు ధ్వనిగలది.
సింహము - 1.కేసరి, సింగము, 2.ఒక రాశి, 3.శేష్ఠము. (సమానోత్తరపదమైనచో).
సింగము - సింహము, సం.సింహః.
మదకలము - మత్తుచేత అవ్యక్త మధురమైనది, వి.మదపుటేనుగు.
మత్తు - మంపు, మదము, సం.మత్తా, మదః.
మంపు - మత్తు, మైకము.
మంపుగొను - క్రి.మత్తిల్లు.
మత్తుఁడు - మదించినవాడు.
మదోత్క్టో మదకలః -
మదేన ఉత్కటో మదోత్కటః - మదముచేత వ్యాప్తమైనది.
మదేన కలో మనోజ్ఞః మదకలః - మదముచేత మనోజ్ఞమైనది. ఈ 2 మదముపట్టిన ఏనుఁగు పేర్లు.
మత్తేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః|
పావురాయి - పావురము, సం.పారవతః.
పారావతము - పావురము.
కలరవము - పావురము.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
కాపోతము - 1.బూడిద రంగు గలది, 2.కపోత సంబంధమైనది.
పారావతః కలరవః కపోతః :
పారేన బలేన అవతీతి పారావతః అవ రక్షణాదౌ. - పారమనఁగా బలము. దానిచేతః బోవునది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని గలది.
శీఘ్రగామిత్వేన కస్య వాయోః పోత ఇవ కపోతః - వేగముచేత వాయువు కొదమ వలె నుండునది. ఈ మూడు పావురము పేర్లు.
చిత్రకంఠము - 1.కపోతము, 2.గువ్వ.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
గువ్వ - 1.అడవిపావురము, 2.పక్షి.
కంఠము - 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము.
కంఠ్యము - కంఠమందు పుట్టినది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.
కాపోతము - 1.బూడిద రంగు గలది, 2.కపోత సంబంధమైనది.
కపోతానాం సమూహః కాపోతం - గువ్వలయొక్క సమూహము.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ. చతుర్థం హంసవాహనా|
ఏగతిఁ బాటుపడ్డఁగలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము, భాగ్యరేఖగల పుణ్యున కుంబలె? భూరిసత్త్వసం
యోగమదేభకుంభ యుగళోత్థిత మాంసము నక్కకూన కే
లాగుఘటించు, సింహము తలంచినఁ జేకుఱుఁ గాక, భాస్కరా.
తా. ఎవరెన్ని విధముల కష్టపడినను అల్పునకు సమ్యగ్‌భోగము లబ్బవు, ఏనుగు(మహామృగము-ఏనుగు)కుంభస్థలమందలి మాంసము సింహము నకు ప్రాప్త మగునుగాని, ఎన్నిపాట్లు పడిననూ నక్కపిల్లకు లభించదుగదా! మదపుటేనుంగుల కుంభస్థలముల జీల్చి చెండాడెడు మృగేంద్రము క్షుద్రజంతువులను లెక్కింపదు.
14. హర్యక్షుడు - కుబేరుడు.
ఏకపింగళుఁడు - కుబేరుడు.
ఏకం చక్షుః గౌరీశాపాత్పింగళవర్ణం జాతం యస్య స ఏకపింగః - పార్వతీదేవి(గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.)శాపము వలన పచ్చనైన యొక కన్ను గలవాఁడు.
గుడ్డికన్ పాదుషా - కుబేరుడు.
హర్యక్షము - సింహము, వ్యు.పచ్చని కన్నులు కలది.
హరిణీ కపిలవర్ణే అక్షిణీ అస్య, హర్యక్షః - కపిలమైన కన్నులుగలది.
హయారూఢా సేవితాంఘ్రి ర్హయమేధ సమర్చితా,
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా|
15. ఐలబిలుఁడు - 1.ఇలబిలకోడుకు, కుబేరుడు, 2.దిలీపుడు.
ఇలబిల యనెడు స్రీ యొక్క కొడుకు. లడయో రభేదాత్ ఇడబిట్ భ్రాతా అస్యేతి ఐడబిడః - ఇడబిట్టనెది తమ్ముఁడు గలవాఁడు.
మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.
ఐలబిలాది దిగీశ బలావృత
కైలాసాచల లీలా లాలస| ||శరవణభవ||
16. శ్రీదుఁడు - కుబేరుడు.
శ్రియం దదాతీతి శ్రీదః - సంపద నిచ్చువాఁడు.
లిబ్బిదొర - శ్రీదుడు, కుబేరుడు.
లిబ్బిపడఁతి - లక్ష్మి. పడఁతి-స్త్రీ, రూ.పణఁతి.
లిబ్బి - 1.పాతర, 2.రాశి, 3.నిధి, 4.ప్రోగు(ప్రోఁగు - పోగు), ధనము.
నేలమాళిగ - 1.నేలలోపలిగది, 2.పాతర, 3.నేలమాణ్యము (Cellar).
నిధానము - 1.ఉంచుట, నిలువజేయుట, 2.పాతర.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు, (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము, (Quantity).
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
నికరము - 1.పోవలసినదిపోగా మిగిలినది, 2.శ్రేష్ఠము, సం.వి.1.సమూహము, 2.నిధి.
మేలుతరము - శ్రేష్ఠము; శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.
మేలిమి - 1.అపరంజి, 2.అధిక్యము.
అపరంజి - మేలిమి బంగారము, కుందనము.
నిధి - పూడ్చి యుంచిన ధనము, పాతర. (అర్థ.) ఒక యవసరము కొరకు ప్రత్యేకముగ నిలుపచేసిన ధనము. (ఏ యవసరమునకై నిథి ఉపయోగింప బడునో ఆ పేరు దానికి పెట్టబడును, ఉదా. రక్షణ నిధి.)
నితరాం ధీయతే అస్ఠిన్నితి నిధిః, ఈ-పు డుధాఙ్ ధారణపోషనయోః - మిక్కిలి రక్షింపఁబడునది.
శేవధి - నిధి, రూ. సేవధి. కుబేరాగారమందు దేవీస్థానం నిధి|
శేవం స్థాన్య ధనం ధీయతే అస్మిన్నితి శేవధిః, ఈ-పు. శేవమనఁగా స్థాన్యధనము - అది దీనియందు ఉంపఁబడును. నా = పుల్లింగము ఇది కాకాషిన్యాయముచేత నిధి శేవధిశబ్దములు రెంటియందును అన్వయించుచున్నది. ఈ 2 నిధి పేర్లు.
విడిముడి - ధనము, (విడియు + ముడి).
ధనము - 1.విత్తము, 2.ఆలమంద వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోషపెట్టునది, 'ధన ధన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది (Positive).
పైఁడిఱేఁడు - కుబేరుడు.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పైఁడినెలఁత - లక్ష్మి. నెలఁత - స్త్రీ, రూ. నెలఁతుక.
అర్థాగృహేనివర్తంతే శ్మశానే మిత్ర బంధవాః|
సుకృతం దుష్కృతం చవగచ్ఛంత మను గచ్ఛతి||
తా. ద్రవ్యమును సంపాదించి ధర్మము సేయక దాచినను లోకాంతర గతుండౌనపు డాద్రవ్యము గృహము-1.ఇల్లు, 2.భార్య. గృహమందుండును, వాని వెంటరాదు. పుత్త్ర మిత్రుడు - 1.హితుడు, 2.సూర్యుడు. బాంధవులు శ్మశాన పర్యంతము వత్తురు కాని వెంటరారు, సుకృతము-1.పుణ్యము, 2.శుభము.)పాపములు(దుష్కృతము - పాము)రెండును వెంట వచ్చును. కనుక ధర్మమే చేయ వలెయును. - నీతిశాస్త్రము
రిక్థము - 1.ధనము, 2.హిరణ్యము, (శాస.) మరణ సమయమున విడిచిన ఆస్తి (లెగసీ Legacy బిక్వెష్టు bequest).
రిచ్యతే విభజ్యత ఇతి రిక్థం, రిచెర్ పృథగ్భావే. - విభజింపఁబడునది.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).
రైవతుఁడు - శివుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
రై - 1.ధనము, 2.హిరణ్యము.
రాన్త్యేన మితి రాః, ఐ, పు, రా ఆదానే. - దీనిఁబుచ్చుకొందురు.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
హిరణ్యగర్భః హిరణ్యమయో గర్భో యస్యసః హిరణ్యగర్భః - హిరణ్యమైన గర్భము గలవాడు.
హిరణ్యం గర్భే యస్యేతి వా - గర్భమందు హిరణ్యము గలవాడు.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హయ్యతి గచ్ఛతీతి హిరణ్యం, హయ్య గతికాంత్యోః - పోవునది.
హేమము - 1.బంగారు, 2.ఉమెత్త.
హినోతి వర్ధత ఇతి హేమ, న, న, హి గతౌ వృద్ధౌ చ - లోహాంతరమును గూడి వృద్ధిఁబొందునది.
హాటకగర్భుడు - బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హటతి దీప్యత ఇతి హాటకం, హత దీప్తౌ. - ప్రకాశించునది.
హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యం రేతో యస్యసః హిరణ్య రేతాః, న.పు. - హిరణ్యమే రేతస్సుగాఁ గలవాఁడు.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హిరణ్యశబ్ద వ్యుత్పత్తి చెప్పఁబడెను.
కాకిణి - 1.కాణి, కర్షము నందు నాల్గవ పాలు, 2.గవ్వ, 3.కొలతకోల.
కాసు - దుగ్గానిలో నాల్గవ భాగము, అరపైసా, విత్తము, సం.కాకిణీ, కాచః.
యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పసవః స్త్రియః |
నాలమేక్స్య తత్పర్వమ్ ఇతి పశ్యన్న ముహ్యతి ||
భా|| భూమి మీద ఉన్న ధాన్యం అంతా, బంగారం, పశు సంపద, స్త్రీ సంపద అన్నీ కలిపినా ఒక్కడికి చాలవు. దీన్ని తెలిసిన మానవుడు మోహపడడు. (అందుచేత మానవునకు ముందుగా కావలసినది తృప్తి అని భావం).
ఠాకృతి రాజిత హాటక కుండల
స్వాకృతిరేజిత ఘోటక మండల | ||శరవణభవ||
హుతభుక్కు - అగ్ని.
హుతం భుఙ్కే హుతభుక్, జ.పు. భుజ పాలనాభ్యవ్యవహారయోః - హుతమును భుజించువాఁడు.
హుతవహుఁడు - అగ్ని.
హుతాసనుఁడు - అగ్ని.
ఆత్మాహుతి - అన్యాయమునకు నిరసనగా శరీరమును దహించుకొనుట.
దహనుఁడు - అగ్ని.
దహతీతి దహనః, దహ భస్మీకరణే. - దహించువాఁడు.
దహనము - కాల్చుట, సం.వి. (రసా.) పదార్థములు గాలిలోని ఆక్సిజన్(Oxygen)తో కలిసి మండుట (Combustion).
దహించు - క్రి.కాల్చు.
దహనాధారము - (రసా.) ఒక వస్తువునును తనలో మండనిచ్చునది, (Supporter of Combustion) ఉదా. గాలి.
దహనోష్ణత - (రసా.) ఒక అణుభారము దాహ్యరాసాయన ద్రవ్యము కాల్చబడినపుడి వెలికి వచ్చు తాపరాశి, (Heat of combustion).
దహననాళము - (రసా.) ఒక ద్రవ్యమును పెట్టి కాల్చుట కుపయోగించుగాజు గొట్టము, (Combustion tube).
దహనకరణి - (రసా.) ఏదేని ఘనద్రవమును గొట్టములో పెట్టి వేడి చేయుట కుపయోగించు చిన తెప్పవంటి పాత్ర, (Combustion boat).
హవ్యవాహనుఁడు - అగ్ని, రూ.హవ్యవహుడు.
హవ్యం వహతీతి హవ్యవాహనః వహ ప్రాపణే - హవిస్సును వహుంచువాఁడు.
హవ్యే హవ్య విషయే వహతే వా, వాహృ ప్రయత్నే - హవ్యవిషయమై ప్రయత్నము చేయువాఁడు.
హవిస్సు - వేల్చుటకు ఇగుర భెత్తిన అన్నము.
హవో హూతౌ -
హ్వానం హవః, హూతిశ్చ, సీ. హ్వేఞ్ స్పర్ధాయాం, శబ్దే చ. - పిలుచుట హవము, హూతియును. ఈ 2 పిలుచుట పేర్లు.
హవము - 1.ఆజ్ఞ, 2.పిలుపు, 3.యజ్ఞము.
హూతి - పిలుపు, రూ.ఆహుతి.
హుతము - వేలబడినది.
ఆజ్ఞాహ్వానాధ్వారా హవాః,
హవసబ్దము ఆజ్ఞకును, పిలుచుటకును, యజ్ఞమునకును పేరు. హూయతే (అ)స్మిన్ హూతిః, హూయంతే (అ)స్మిన్నాజ్యూదీని చ హవః, హ్వేఞ్ స్పర్ధాయాం శబ్దే చ. హూదానాదనయోః. - దీనియం దాజ్యాదులు వేల్వఁబడును గనుక హవము.
ఆహవము - 1.యుద్ధము, 2.యజ్ఞము.
ఆహవనము - 1.యజ్ఞము, 2.హోమము.
ఆహవనీయము - హోమము చేయ దగినది (హవిరాది), వి.త్రేతాగ్నులలో ఒకటి, (తక్కిన రెండు: 1.దక్షిణాగి, 2.గార్హపత్యాగ్ని).
బృహత్భానువు - అగ్ని.
బృహంతః భానవోయస్య సః బృహత్భాను, ఉ. పు. - అధికము లైన కిరణములు గలవాఁడు.
స్వయంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మదనుడు.
స్వయంభూః ఊ-పు, స్వయం భవతీతి స్వయంభూః - తనంతటనే పుట్టినవాఁడు, భూసత్తాయాం.
స్వారాట్టు - ఇంద్రుడు.
స్వః స్వర్గేరాజ త ఇతి స్వరాట్. జ-పు. - స్వర్గమందుఁ బ్రకాశించువాఁడు. రాజృ దీప్తౌ.
సురలోకము - స్వర్గము.
స్వర్గము - దేవలోకము.
స్వర్భానుఁడు - రాహువు Rahu.
స్వః స్వర్గే భాతీతిస్వర్భానుః. ఉ. పు. భాదీప్తౌ - స్వర్గమునందు ప్రకాశించువాడు.
అమరావతి - 1.ఇంద్రుని పట్టణము, 2.స్వర్గము, 3.గుంటూరుజిల్లాలోని ప్రాచీన పట్టణము.
నగరీ త్వమరావతీ,
అమరా అస్యాం సంతీ త్యమరావతీ, ఈ-సీ. - దేవత లిందు నివసించి యుందురు. ఈ ఒకటి ఇంద్రగిరి అమరావతి యనంబడు.
స్వారాజ్యము - స్వర్గలోకపు దొరతనము.
నముచిసూదనుఁడు - ఇంద్రుడు.
నముచిం సూదితవాన్ నముచిసూదనః - నముచి యను రాక్షసుని హింసించినవాఁడు, సూద హింసాయాం.
సంక్రందనుఁడు - ఇంద్రుడు.
సంక్రందయతి రిపూనితి సంక్రందనః - శత్రువుల మొఱపెట్టించువాఁడు, కది క్క్రది ఆహ్వానేరోదనే చ.
మాధవుఁడు - లచ్చిమగడు, విష్ణువు.
మాధవః మాయాః లక్ష్మ్యాః ధవః - లక్ష్మీదేవికి భర్త.
యదోర్జ్యాయా స్పుత్రో మధుః, తద్వంశ జత్వాన్మాధవః - యదువనెడివాని పెద్దకొడుకు మధుఁడు; అతని వంశమునఁ బుట్టినవాఁడు.
మధూయతే శత్రూనితివా - శత్రువులఁ గంపింపఁ జేయువాఁడు. ధూఞ్ కంపనే. సర్వకాలేషు మాధవం|
స్వభువు - 1.విష్ణువు, 2.శివుడు, వ్యు.స్వయముగ పుట్టినవాడు.
స్వభూః ఉః-పు, స్వే నాత్మనా జాయత ఇతి స్వభూః - తనంతఁదానే పుట్టినవాఁడు.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః, ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాఁడు.
దైత్యారి - విష్ణువు.
దైత్యానామరిః దైత్యారిః-ఇ-పు. - దైత్యులకు శత్రువు.
దైతేయుఁడు - దితికొడుకు, తొలివేల్పు, రూ.దైత్యుడు.
తొలువేలుపు - 1.బ్రహ్మ, 2.అసురుడు, 3.పూర్వదేవుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
సురద్విషుఁడు - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
సురాన్ ద్విషంతీతి సురద్విషః - ష-పు. దేవతలను ద్వేషించువారు.ద్విష అప్రీతౌ.
వేల్పుదాయ - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
ఆసురాః, న విద్యతే సురా యేషాం తే అమృతము లేనివారు.
సురేభ్యో (అ)న్యే వా - దేవతలు గానివారు.
యజ్ఞభాగాన్ని రస్యంత ఇతి వా - యజ్ఞభాగము వలనఁ ద్రోయఁబడినవారు.
అసు క్షేపనే, అసూన్ ప్రాణాన్ రాంతి గృహ్ణంతీతివా - ప్రాణముల గొనువారు, రా ఆదానే.
ఆసురుఁడు - నిరృతి, రాక్షసుడు.
అశృణాతి హీన స్తీత్యాశరః శౄ హింసాయాం - హింసించువాఁడు.
పా, అసురః-అసూన్ రాతీత్యసురః అసుర ఏవ అసురః, రా ఆదానే - ప్రాణముల నపహరించువాఁడు - అసురుఁడు , వాఁడే అసురుఁడు.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.
పూర్వం దేవపదేస్థితాః పూర్వదేవాః - పూర్వకాలమందు దేవపదమునందున్నవారు.
పుండరీకాక్షుఁడు - విష్ణువు. పుండరీక కాక్ష గోవిందా|
పుండరీకాక్ష. పుండరీకే ఇవ అక్షిణీ యస్య సః - తెల్లదామరవంటి కన్నులు గలవాడు.
పుండరీకం హృత్కమలం అక్ష్ణోతి వ్యాప్నోతీతివా - హృదయకలమలమును వ్యాపించియుండు వాఁడు. అక్షూ వ్యాప్తౌగా. నవమం పుండరీకాక్షం|
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱచెరకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
అనిక్షువు - నల్లచెరకు.
పుణ్ణరీకం సితామ్భోజం :
పుణతి మంగళత్వా త్పుండరీకం. పుణ కర్మణి శుభే.
సితం చ అంభోజం చ సితాంభోజం - తెల్లనైన తామర. ఈ రెండు తెల్లతామర పేర్లు.
పుండరీకము - 1.తెల్లదామర, 2.అగ్నేయ దిక్కునందలి యేనుగు, 3.శార్దూలము, పులి.
పుండరీకవర్ణత్వా త్పుండరీకః - తెల్లదామరవంటి కాంతి గలది. పుణతి శోభత ఇతి వా పుండరీకః, పుణ శుభకర్మణి చ - ప్రకాశించునట్టిది.
భయానకము - 1.పులి, 2.రాహువు Rahu, 3.భయానకరసము.
భయంకరోతీతి భయంకరం, డుకృఞ్ కరణే. - భయమును గలుగఁజేయునది.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
భీషణము - భీమము, విణ.భయంకరము.
భీకరము - భయంకరము.
భీమము - భయానకరసము.
భీష్మము - భయానకరసము గలది, విణ.భయంకరమైనది.
భీష్ముఁడు - 1.శంత పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
భీరుకుఁడు - వెరవరి, రూ.భీలుకుడు.
భీతము - భయము నొందినది, వి.వెరపు.
భీతుఁడు - 1.పేద, 2.భయపడినవాడు.
పులిలో కూడా దేవుడు ఉంటాడు నిజమే! కాని మనం ఆ క్రూరజంతువుకు ఎదురుగా వెళ్ళి నిలబడవచ్చునా? అదే విధంగా పరమదుర్మార్గు లలో కూడా భగవంతుడు ఉన్నప్పటికీ మనం వారితో స్నేహం చేయడం మంచిది కాదు. - శ్రీరామకృష్ణ పరమహంస
పృదాకువు - 1.పులి, 2.పాము, 3.తేలు.
పర్దతీతి పృదాకుః ఉ. పు. పర్ద కుత్సితేశబ్దే. - కుత్సితముగా బలుకునది.
పుల్లరీకము - 1.ఒకానొక దేశము, 2.పాము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము; సర్పతీతి సర్పః.
సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
పులి - 1.నల్లని, 2.పులిసినది, వి.శార్దూలము.
శార్దూలము - పులి.
శృణాతీతి శార్దూలః. శృ హింసాయాం. - హింసించునది.
ద్వీపి - 1.పులి, 2.చిరుతపులి, 3.సముద్రము. నివాసత్వేన ద్వీపమస్యేతి ద్వీపీ. న. పు. ద్వీప మునికిపట్టుగాఁ గలది. ద్వీప శ్చర్మాస్యా స్తీతి వా ద్వీపీ - ద్వీపమనఁగా చర్మము. అది గలది.
ద్వీపపుంజము - (భూగో.) సముద్ర మధ్యమున లేక నీటి మధ్యమున నున్న ద్వీప సమూహము.
ద్వీపవతి - నది river.
ద్వీపాః అస్యాం సంతీతి ద్వీపవతీ - ద్వీపములు గలిగినది.
తిప్ప - 1.చిన్నకొండ, 2.కొండ, 3.దిబ్బ, సం.ద్వీపః.
నడుదిన్నె - ద్వీపము.
దిబ్బ - 1.ఎత్తైననేల, కుప్ప, 2.దీవి, సం.ద్వీపః.
కుప్ప - ధాన్యము మొ. ని రాశి.
కుప్పట - ధాన్యము వలన ధనము.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి,) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము, (Quantity).
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
ద్వీపో (అ)స్తియా మన్తరీపం యదన్త ర్వారిణస్తటమ్,
వారిణోంతః వారిమధ్యే యత్తలం, తస్మిన్ ద్వీప్పంతరీవశబ్దౌ వర్తేతే – ద్వీపాంతరీవ శబ్దములు రెండు నీళ్ళనడుమనున్న దిన్నె పేళ్ళు.
ద్వీపము - 1.పులితోలు, 2.లంకదీవి నలువైపుల నీటిచే చుట్టబడిన భూమి.
దీవి - 1.ద్వీపము, నీటినడిమి భూభాగము, సం.ద్వీపః.
ద్విధాగతాః ఆపః అస్మిన్నితి ద్వీవః. అ. న్న. - దీనియందు జలము రెండు భాగములుగా నిరు వ్రక్కల ప్రవహించును.
అంతరీవము - ద్వీపము, నీటి నడిమి దిబ్బ, లంక. లంకాయాం శాంకరీదేవి శక్తిపీఠం|
అపామంతః మధ్య మంతరీవం - జలమధ్యము అంతరీపము. అంతర్గతౌ ఆపః అస్మిన్ని తివా - దీనియందు జలము అంతర్గతమై యుండును.
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరత్చంద్రనిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా.
లంక - 1.లంకాదేవి, 2.ఒకానొక రాక్షసి, 3.రావణుని పట్టణము, 4.రంకులాడి, వి.దీవి. గుడిసెవాటు - (వ్యవ.) రంకులాడి, కులట, రూ.గుడిసేటు.
ఱాఁగ - జారిణి, విణ.1.ధూర్తుడు, 2.ఉద్దతుడు, సం.లంకా.
జారిణి - రంకుటాలు.
ధూర్తస్తు వఞ్కః,
ధూర్వతి హినస్తీతి ధూర్తః, ధుర్వీ హింసాయాం. - పీడించువాఁడు.
వఞ్చయతీతి వఞ్చకః, వఞ్చు విప్రలంభే. - మోసపుచ్చువాఁడు. ఈ 2 మోసపుచ్చువాని పేర్లు.
ధూర్తుఁడు - 1.జూదరి, 2.మోసకాడు, రూ.ధూర్తు.
దురోదరము - 1.జూదము, 2.పందెము, వ్యు.చెడ్దతో నిండియున్నది.
వఱడు - పెద్దజాతి నక్క.
వంచకము - నక్క, విణ.మోసము చేయునది.
వంచన - మోసము.
వంచకుఁడు - మోసకాడు.
జారుఁడు - వ్యభిచరించెడి పురుషుడు, ఉపపతి.
ఉపపతి - రంకు మగడు.
జార స్తూపపతి స్సమా,
జరయతి పరస్త్రియమితి జారః జౄష్ వయోహానౌ. - పరస్త్రీని శిధిలముగాఁ జేయువాఁడు.
పత్యా ఉపమితః ఉపపతిః. పు. - పతితో సరిపోల్చఁ బడువాఁడు. ఈ 2 ఱంకుమగని పేర్లు.
జారులతో జోరులతోఁ
గ్రూరులతో నెపుడు పొత్తుఁ * గోరక మది స
త్పూరుష సదాంబుజాతా
ధారుఁడవై బ్రతుకు, కీర్తి * తనరుఁ గుమారా!
తా. దొంగలతోడను, ఱంకుబుద్ధిగలవారితోడను, క్రూరుఁడు - దయలేనివాడు)కఠినులతోడను ఏ సమయమునఁగాని(పొత్తు - 1.స్నేహము, సంగతి, 2.అవిభక్తత.)స్నేహముచేయవలదు. మనస్సులో(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)నెల్లప్పుడు సజ్జనుల పాదసేవ చేయుటయే ముఖ్యముగా నెంచుకొని చేయుము.
ఉపపతి రివకృత వల్లీ సంగమ
కుపిత వనేచర పతిహృదయంగమ| ||శరవణభవ||
పుంశ్చలి - రంకులాడి.
పుమాంసం ప్రలోభ్య చలతి గచ్ఛతి పుంశ్చలీ. సీ. చల గతౌ. - పురుషుని మోహింపఁజేసి పొందునది.
పుంసః పరిణేతుః, చలతీతి పుంశ్చలీ - తన (పరిణేత - మగడు.)భర్తను విడచి కదలునది.
ధర్షణి - రంకుటాలు.
ధర్షయతి ప్రగల్భతే దర్షణీ సీ. ఞ్ దృషాప్రాగల్భ్యే - దిట్టదనము గలిగియుండునది. పా, కామోద్దీపనాత్ పుమాంసం దూరం వ్యాకర్షతీతి కర్షణీ, కృష విలేఖనే. - కామోద్దీ పనము వలనఁ(బు)పురుషుని దూరమున కీడ్చుకొనిపోవునది.
ధర్షణము - 1.తిరస్కరించుట, 2.బెదిరించుట.
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్బిషమోషిణి ఘోషరతే|
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. - 2
బంధకి - 1.రంకులాడి, 2.ఆటకత్తె, 3.ఆడేనుగు.
బద్నాతి ఉదాసీనమపి పురుషంస్వ వసం కరోతీతి బంధకీ, సీ. - ఉదాసీనుఁడైన పురుషునిగూడ స్వవశము చేసికొనునది.
బాంధకినేయుఁడు - రంకులాడి కొడుకు.
బంధక్యాః పత్యం బాంధకినేయః – ఱంకులాడి యొక్క కొడుకు.
బంధుర - వేశ్య.
బంధులుఁడు - 1.రంకుటాలికొడుకు, 2.వేశ్య యింటి సేవకుడు.
అసతి - కులట, రంకుటాలు.
నసతీ అసతీ, సీ. - పతివ్రత కానిది.
ౙరభి - ఱంకుటాలు, అసతి.
కులట - రంకుటాలు.
విటకులమతతి కులటా, ఆటపటగతౌ. - విటసమూహముగూర్చి పోవునది.
రంకుటాలు - వ్యభిచరించు స్త్రీ.
చడీప - రంకుటాలు.
ముక్త - 1.ముత్తెము, 2.రంకుటాలు, విణ.ముక్తి నొందినది.
చపల - 1.లక్ష్మి, 2.మెరుపు, 3.రంకుటాలు.
అస్థిరత్వాచ్చపలః - ఒక దిక్కున నిలువనిది.
చోపతీతి చపలా, చుప మందాయాం గతౌ - మెల్లఁగాఁ బోవునది.
నిశాచరి - 1.రక్కసి, 2.రంకుటాలు, 3.పైడికంటి పక్షి.
సీత పుట్టుక లంకకుచేటు. సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ. లంక మేత గోదావరి యీత. లంకలోని గుట్టు రాక్షసులకు చేటు. లంకలో పుట్టిన నలుగురు రాక్షసులేనట.
వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.
విదేహదేశేభవా వైదేహీ. సీ. - విదేహదేశ మందుఁ బుట్టినది. విదేహ మానస రంజక రామ్|
కండిక - లంకపొలము.
లక్ష్మియేలినట్టి లంకాధిపతి పురము
పిల్లకోతిపౌజు కొల్ల పెట్టె
జేటుకాలమయిన జెరుప నల్పులె చాలు
విశ్వదాభిరామ వినుర వేమ!
తా. గొప్ప ధనవంతుడైన రావణుని లంకను లంకాయాం శాంకరీదేవి శక్తిపీఠం| సామాన్యమైన కోతులు నాశనము చేసెను. (చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.)చెడ్డకాలము వచ్చినపుడు సామాన్యులైనను(అల్పుఁడు - నీచుడు)చాలు అపకారము చేయుదురు.
మహావంశము - సింహళ దేశపు చరిత్రను గురించి తెలుపు పాళీగ్రంధము (క్రీ.శ. 5వ శతా.)దీపవంశము - (చరి.) సింహళదేశ చరిత్రను గూర్చి తెలుపు పాళీ గంధము.
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరత్చంద్రనిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా.
వ్యాఘ్రము - వేగి, పులి.
వేఁగి - పులి, సం.వ్యాఘ్రః.
వ్యాజిఘ్రతీతి వ్యాఘ్రః. ఘ్రా గంధోపాదానే. - చంపునప్పుడు వాసనఁ జూచునది.
(అధికపాఠము. పుండరీకః పఞ్చానఖశ్చిత్ర కాయ మృగద్విషౌ, పుండం మాంసం రీకతి హరతీతి పుండరీకః - మాంసమును హరించునది.
వ్యాగ్రే (అ)పి పుండరీకో నా -
పుండరీక శబ్దము పులికిని, అపి శబ్దమువలన దిగ్గజమునకును పేరైనపుడు పులింగము. తెల్లదామరకును, తెల్లగొడుగునకును పేరైనపుడు నపుంసకము
పుణతీతి పుండరీకః, పుణ శుభకర్మణి. - శుభకర్మమును జేయునది.
"పుండరీకం సితచ్ఛత్రే సితాంభోజే (అ)పి కీర్తితం, పుండరీకో వ్యాఘ్రభేదే దిగ్గజే క్షుద్ర భేదయో'ది త్యజయః.
ధర్మోమే చతురంఘ్రిక స్సుచరితః పాపం వినాశం గతం
కామక్రోధమదాదయో విగళితాః కాలాస్సుఖా విష్కృతః
జ్ఞానానంత్య మహౌషధి స్పుఫలితా కైవల్య నాథె సదా
మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే| - 39
తా|| కైవల్యనాథుడైన చంద్రమౌళీశ్వరుడు - నా మానససరోజంలో ఉండగా ధర్మం పాద చతుష్టయంతో గమనం చేసింది. పాపం రూపు మాసిపోయింది. కామ క్రోథ మద మాత్సర్యాది దుర్విషయాలు దూరమయినాయి. కాలం పరమ సుఖంగా గడిచి పోయింది. ఆనంత జ్ఞానం అనే మహౌషధి విశేషంగా ఫలించింది. - శివానందలహరి
మహాయోగపీఠే తటే భీమరథ్యా పరం పుండరీకాయ ధాతుం మునీంద్రైః|
సమాగత్య తిష్ఠంతి మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్|
పంచనఖము - పులి, శార్దూలము.
పంచనఖాః యస్య నః పంచనఖః - ఐదుగోళ్ళు గలది.
శ్వాపదము - 1.పులి, 2.వన్యమృగము.
పులి అయినా తనపిల్లల జోలికి పోదు. పులిపిల్ల అయితే గోళ్ళుండవా యేమిటి. పిల్లి పులికి మేనమామో, మేనత్తో. పెద్దపులి చుట్టానికి పెడుతుందా? పులి కడుపున చలిచీమలు పుట్టునా?
ఏకై కాగౌ స్త్రయస్సింహాః పంచవ్యాఘ్రాః ప్రసూఃతిభిః
అధర్మో నష్ఠసంతానో - ధర్మ స్సంతానవర్థనః|
తా. గోవు ఒక్కొకటియే కనును, సింహము మూడేసి మూఁడేసిగాకనును, పులి అయిదయిదుగా కనును గాని పులి(Tiger) సింహముల(Lion) యొక్క ధర్మంబు దాని సంతతిని నశింపజేయుచుండును. గోవు(Cow)యొక్క ధర్మంబు దాని సంతానమును వృద్ధిజేయుచుండును. కావున నెల్లపుడు ధర్మముగాఁ ప్రవర్తింపవలయును. – నీతిశాస్త్రము
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).
దువ్వి - ద్వీపి, పులి, చిరుతపులి, రూ.దువ్వు, సం.ద్వీపీ.
చిత్రకాయము - చిఱుతపులి.
చిత్రః కాయః యస్య చిత్రకాయః - పొడలచేత నానావర్ణములగల శరీరము గలిగినది.
చిత్రకము - 1.చిరుతపులి, 2.బొట్టు.
బొట్టు - 1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళసూత్రమున కూర్చు సర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
కురువము - తిలకము.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
మచ్చ - 1.గాయపుగుర్తు, 2.పుట్టుమచ్చ.
కళంకము - మచ్చ.
పొన్నాడ - ఒక తెగ చిరుతపులి.
చిఱుత - 1.చిన్న, వి.చిన్నజాతి పులి.
చిటి - చిన్న, రూ.చిట్టి.
చిట్టు - చిన, రూ.చిటి.
చిన - చిన్న.
చిటిబొట్టు - ముత్తైదువు లుంచుకొను బొట్టు.
దువ్వు -1.దువ్వెనతో తల వెండ్రుకల చిక్కుదీయు, 2.నిమురు, 3.పులి.
నిమురు - శరీరమును మెల్లగా తడుము, నివురు, నివురు గప్పిన నిప్పు.
పుల్లసిలు - భయాదులచే వివర్ణమగు, భయపడు. రూ.పుల్లసిల్లు.
ఆధిభౌతికము - వ్యాఘ్ర సర్పాది భూతముల వలన కలిగినది. (ఇది తాపత్రయములలో ఒకటి).
మేకవన్నె పులి - జాతీ. మేకవలె సాధువుగా గాన్పించుచు క్రూర స్వభావము కలది.
పులిపాలు దెచ్చి యిచ్చిన
నలవడగా గుండెకోసి యఱచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికి గూర్మిలేదు వినరా సుమతీ.
తా|| వ్యాఘ్రపు పాలను దెచ్చినను, గుండెనుకోసి అరిచేతియందు ఉంచినను, తలయెత్తు ద్రవ్యరాశి పోసినను, వేశ్యకు(వెలయాలు - (వెల+ఆలు)వేశ్య.)నిజమయిన ప్రేమ యుండదు.
(ౘ)చాఱల మెకము - పెద్దపులి.
కోల్పులి - పెద్దపులి, రూ.క్రోల్పులి, క్రోలుపులి.
వాలము - బెబ్బులి.
గాండ్ర - కాండ్రుమన శబ్దము (పెద్దపులి) 'కాండ్రు ' మనును.
గాండ్రించు - క్రి.1.ఉబ్బు, 2.పెద్దగా అరచు. మృగాణాం ద్విట్ మృగద్విట్. ష. పు. మృగములకు శత్రువు.
ఘాతుకమొనరించు బెబ్బులి గాదురోరి
రాజసింహాసనమునందుఁ గ్రాలుచుండు
సింహ మూర్తిమంతము గాన జీవమునకె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
ధార్తరాష్ట్రా వనం రాజన్ వ్యాఘ్రాః పాండుసుతా మతాః |
మా వనం ఛిన్ది సవ్యాఘ్రం మావ్యాఘ్రాన్నీ వశన్ వనాత్ ||
న స్యాద్వనమృతే వ్యాఘ్రాన్ వ్యాఘ్రా న స్యురృతే వనమ్ |
వనం హి రక్ష్యతే వ్యాఘ్రైః వ్యాఘ్రాన్ రక్షతి కాననమ్ ||
భా|| పులులు లేకపోతే అడవి forest నిలవదు (నరికివేస్తారు) అడవి లేకపోతే (బయటకు వస్తే) పులులు బ్రతకవు. అనగా పులులు అడవిని నిలబెడతాయి. అడవి పులుల్ని రక్షిస్తుంది.
When a man wants to murder a tiger he calls it sport; when a tiger wants to murder him he calls it ferocity. – Bernard shaw
కుండల త్రివిధ కోణమండల విహారషడ్ద్రళ సముల్లసత్,
పుండరీకముఖ భేదినీం తరుణచండభాను తడిదుజ్జ్వలాం
మండలేందు పరివాహితామృత తరంగిణీ మరుణ రూపిణీం,
మండలాంత మణిదీపికాం మనసి భావయామి పరదేవతాం| - 5
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
గోష్ఠాధ్యక్షే(అ)పి గోవిన్దః -
గోవింద శబ్దము ఆవుల నేలువానికి, అపిశబ్దమువలన శ్రీకృష్ణునికి, బృహస్పతికిని పేరు. గాః విందీతి గోవిందః. విద్ ఌ లాభే. ఆవులను బొందినవాడు, వాక్కులను బొందినవాఁడును గనుక గోవిందుఁడు.
సాత్వికౌదార్యశంకరాచార్య గురుఁడు
శ్రేయమును గోరి "లక్ష్మీనృసింహ దేహి
మమ కరావలంబన" మని స్మరణ చేసె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోచారము - సూర్యాదిగ్రహముల సంచారము.
గావః ఇంద్రియాణి చరం త్యేప్వితి గోచరాః, అ. పు. చరగతి భక్షణయోః - గోవులనఁగా నింద్రియములు, అవి వీనియందు చరించును.
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా|
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.- 63
గరుడధ్వజుఁడు - వెన్నుడు, విష్ణువు, వ్యు.గరుడ చిహ్నము ధ్వజము న కలవాడు.
గరుడధ్వజః గరుడః ధ్వజః యస్య సః - గరుత్మంతుఁడే ధ్వజముగాఁగలవాఁడు.
గరుడకంబము - 1.విష్ణ్వాలయము నందలి ధ్వజస్తంబము, 2.నేరముచేసిన వారిని బంధించుటకై కొత్వాలుచావడి ఎదుట పాతబడిన స్తంభము.
విరాట్టు - 1.ఆదిదేవుడు, 2.క్షత్రియుడు, 3.గరుత్మంతుడు.
గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
గరుతః పక్షా యేషాం తే గరుత్మంతః త. పు. - ఱెక్కలుగలవి.
గరుత్తు - రెక్క, పక్షము.
ఱెక్క - పక్షము. రెక్క - రెక్క, పక్షివిరక.
పక్షము - 1.నెలయందు పదునైదు దినములు(శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.
సేవకుఁడు - కొలువుకాడు.
ఆళువారు - 1.హరిభక్తుడు, 2.గరుత్మంతుడు, రూ.ఆళ్వారు.
వైష్ణవుఁడు - విష్ణుభక్తుడు.
వైష్ణవము - విష్ణుసంబంధమైనది, వి.ఒక మతము.
పెరుమాళ్ళు - విష్ణువు, త. పెరుమాళ్.
పెందిరువడి - గరుడుడు (వైష్ణవ పరిభాష యందు.)
పెందెరువు - రాజమార్గము.
వజ్రతుండుఁడు - గరుడుడు, వ్యు.వజ్రము వంటి ముక్కుగలవాడు.
బొల్లిగ్రద్ద - గరుడుడు.
గరుద్భిః డయత ఇతి గరుడః - ఱెక్కలుచేత నెగసెడివాఁడు.
బొల్లి - 1.తెల్లనిది, 2.తెల్లనివాడు.
దూరదర్శి - 1.విద్వాంసుడు, 2.గ్రద్ధ, విణ.దూరపు టాలోచనకలవాడు.
దూరదర్శీ దీర్ఘదర్శీ -
అప్రత్యక్షమపి ఊహేన పస్యతీతి దూరదర్శీన, పు. దీర్ఘంపశ్యతీతి దీర్ఘదర్శీ, న. పు. - ప్రత్యక్షగాని దూరమైన యర్థములను బుద్ధిచేతఁ జూజువాఁడు.
దేశకాల వ్యవహితములైన యర్థములను బుద్ధిచేతఁ జూచువానిపేర్లు. ఇవియును విద్వాంసుని పేర్లు యని కొందఱు.
దూరదర్శిని - (భౌతి.) దూరమున నున్న వస్తువులను పెద్దవిగను, దగ్గరగను అగుపడునట్లు చేయు పరికరము, (టెలెస్చొపె).
దక్షాయ్యము - గ్రద్ధ, వ్యు.దూరదూరమునకు పోవునది, హింసించునది.
గద్ద - ఒకరకపు పక్షి, గరుడపక్షి, రూ.గ్రద్ధ, సం.గృధ్రః. గృద్రాధిప సంసేవిత రామ్|
గృధ్రము - గ్రద్ద. గృధ్రాధిప గతిదాయక రామ్|
దాక్షాయ్య గృద్ధౌ -
దక్షతే శీఘ్రం గచ్ఛతి దాక్షాయ్యః, దక్షవృద్ధౌ శీఘ్రార్థే చ. - శీఘ్రముగాఁ బోవునది.
గధ్నోతి మాంసామితి గృద్ధ్రః, గృధు అభికాంక్షాయాం. - మాంసమును గాంక్షించునది. ఈ 2 గ్రద్ధ పేర్లు, బోరువ.
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్తి పెరికి తినును పరగ గ్రద్ద
గ్రద్దవంటివాడు గజపతి కాడికొ విశ్వ.
తా|| గ్రద్ద చనిపోయిన పశువు(పశువు - చతుష్పాదము, గొడ్డు.)యొక్క చర్మమును, కండలను ఊడబెరికి తినును. ఈ రాజులును ఆ గ్రద్దవంటివారే కదా.
ఇది ఆనాటి రాజకీయ ననుసరించి గజపతుల్ని నిందించుచూ చెప్పిన పద్యం.
దీర్ఘ దర్శి - విద్వాంసుడు, విణ.దూరపు యోచన గలవాడు.
దీర్ఘదృష్టి - (భౌతి.) దూరమున నున్న వస్తువులే కనిపించు దృష్టి (Long sight) (గృహ.) దగ్గర వస్తువులు సరిగా కనిపించకపోవుట, చత్వారము.
త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ - దేవశిల్పి; మయుఁడు - అమర శిల్పి.
విశ్వకర్మన్ శబ్దము సూర్యునికిని, దేవశిల్పికిని పేరు. విశ్వం కర్మాస్యేతి విశ్వకర్మా. న. పు. - సకలమైన క్రియలు గలవాఁడు. టీ. స. విశ్వస్య కర్మాణి యస్మాదితి విశ్వకర్మేతి సూర్యపక్షే.
తక్షుడు - తక్షకుడు.
తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
డీఙ్ విహాయసాగతౌ. గిరతి సర్పానితివా - సర్పములను భక్షించువాడు.
గౄ నిగరణే, తృక్షస్య ఋషే రపత్యం తా ర్ఖ్యః - తృక్షుఁడను మునికొడుకు.
పాఁపఱేఁడు - నాగరాజు.
స్కల్ ప్ణర్ - (చరి.) (Sculptor) తక్షకుడు, విగ్రహములు చెక్కు శిల్పి.
రథకారుఁడు - తేరుచేయువాడు, వడ్లవాడు.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్యపని చేయువాడు, 2.పక్షివిశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.
వర్థకి - వడ్రంగి, Carpenter.
సూత్రధారుఁడు - 1.నాటకము లాడించు ముఖ్యనటుడు, 2.నడుపువాడు, 3.వడ్రంగి.
కీలుకాఁడు - 1.సూత్రధారుఁడు, 2.యంత్రము త్రిప్పువాడు.
కీలు - 1.మర, 2.మర్మము, 3.ఉపాయము, 4.కఱ్ఱలకు పూసెడు నల్లని చమురు.
ఉలి - వడ్రంగి సాధనము, విణ.అల్పము, రూ.నులి.
నులి - 1.ప్రేగులలో నొప్పి, 2.చిక్కు, విణ.అల్పము.
ఐద్దాయులు - (ఐదు+ దాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె కాసెకులస్థుల పనులు.
ధృతరాష్టుఁడు - 1.దుర్యోధనుని తండ్రి, 2.ఒక సర్పరాజు, 3.రాజు.
విదురుఁడు - దృతరాష్ట్రుని తమ్ముడు, విణ.తెలిసినవాడు.
దుర్జనః పరిహర్తవ్యో విద్యాయాలంకృతోపినన్|
మణినా భూషిత స్సర్పః కినుసౌసః భయంకరః|
తా. మాణిక్యము(మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు.)కలిగి యుండిన నైనను సర్ప మెట్లు భయంకరమైనదో, ఆ రీతిగనే దుర్జనుఁడు - దుష్టుడు)విద్యచేత నలంకరింపఁ బడిన వాఁడై యుండినను దూరముగా వర్జింపఁ దగినవాడు. - నీతిశాస్త్రము
వైనతేయుఁడు - గరుడుడు, వినతా తనయుడు, అనూరుడు.
వినతాయా అపత్యం వైనతేయః-వినతకొడుకు.
వినత - గరుత్మంతుని తల్లి.
అనూరుఁడు - తొడలు లేనివాడు, వి.గరుత్మంతుని అన్న(సూర్యసారథి). గరుడస్య అగ్రజః - గరుడునికి అన్న.
పిచ్చికకుంటు - అనూరుడు, విణ.కాళ్ళు లేనివాడు.
కుంటి - 1.కాలు విరిగినవాడు, ఖంజుడు, 2.పుట్టుకతో కాలుచెడినవాడు, పంగువు.
కుదుపు - క్రి.కదలించు ఇటునటు ఊపు, వి.కదలిక, విణ.పంగువు.
కుంటు - క్రి.చక్కగా కాలూనక నడుచు.
కుంటుపడు - క్రి.1.తగ్గు, 2.సొట్టపడు, 3.చెడు.
దుర్మరణము - చెడు.
శ్రోణుడు - పిచ్చుకకుంటు, కుంటివాడు.
పంగువు - శని Saturn, విణ.కుంటివాడు.
పంగు - భయము.
శ్రోణః పఙ్గా -
శ్రోణతి సంహతో భవతి శ్రోనః, శోణృ సంఘాతే. - కరచరణాదులచేత ముద్దయయి యుండువాఁడు.
వనతి పంగుః. ఉ. పన గతౌ. - మెల్లఁగా బోవువాఁడు. ఈ రెండు పిచ్చుకకుంటువాని పేర్లు.
ఖోడుఁడు - శనిగ్రహము, విణ.కుంటివాడు.
కుంటిగాము - శనిగ్రహము Saturn.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
ఖోడే ఖఞ్జః -
ఖోదతి హతగతిర్భవతి ఖోడః, ఖుడ ప్రతిఘాతే - (ప్రతీకారము - (గృహ.) ప్రతిఘాతము (Reaction)కొట్టబడిన గమనము గలవాఁడు.
ఖంజతి గతివైకల్యం ప్రాప్నోతి ఖంజః - ఖజిగతి వైక్లబ్యే నడకలేమిని బొందినవాఁడు. ఈ 2 కుంటికాలివాని పేర్లు.
వైకల్యము - వికలత్వము.
వికలము - విచ్ఛేధము నొందినది.
విచ్ఛేదము - 1.ఎడబాటు, 2.నరకుడు.
విచ్ఛిత్తి - 1.ఎడబాటు, 2.వస్త్ర భూషణాదులు కొలది యైనను ఒప్పిదము గలగజేయు స్త్రీల శృంగారచేష్ట, 3.పూత, 3.నరకుడు.
విచ్చన్నము - విణ.1.ఎడబడినది, నరకబడినది, 2.పూయబడినది.
విచ్ఛిన్నఖండములు - (వ్యవ.) ఒక ఖండముగా లేక విడివిడిగానున్న భూభాగములు, (Scattered holdings).
వికలాఙ్గస్తు పోగణ్డః -
వికలాంగుడు - అంగహీనుడు. వికలాన్యఙ్గాన్యస్య వికలాఙ్గః - వికలమైన అంగములు గలవాఁడు.
పోగంఁడుడు - వికలమైన శరీరము గలవాడు. అపకృష్టో గణ్యత ఇతి పోగండః, గణ సంఖ్యానే. - అపకృష్టుఁడు లెక్కపెట్టఁబడువాఁడు.
పా. అపోగండః "పోగండో వికలాఙ్గస్స్యాత్" అని హలాయుధుఁడు.
"వికలాఙ్గస్త్వపోగణ్డః" అని అకారాదిగాను కొందఱు "అపోగండస్తువళిభిర్వ్యాప్తదేహ ఉదాహృతః, శిశుర్దశ సమాయావదపోగణ్డఃస్తృతో బుద్ధైః" అని ధరణి. ఈ 2 అంగహీనుని పేర్లు.
అవయవహీనుని సౌంద
ర్యవిహీను దరిద్రు విద్య * రాని యతని సం
స్తవనీయు దేవ శ్రుతులన్
భువి నిందింపఁ దగదండ్రు * బుధులు కుమారా!
తా. అంగములు లోకములో లేనివానిని, కురూపిని
(కుడిపి - వికృతరూపుడు, సం.కురూపీ.), బీదను దరిద్రుఁడు - బీదవాడు), విద్య - 1.చదువు, 2.జ్ఞానము.రాని వానిని, పొగడఁదగిన గుణములు సంస్తవము - 1.పరిచయము, 2.స్తుతి. గలవానిని, భగవంతుని, వేదములను నిందింప రాదని పెద్దలు చెప్పుదురు.
అపకృష్టము - 1.అధమము, వ్యతి. ఉత్కృష్టము, 2.తొలగింపబడినది, 3.ఆకర్షింపబడినది, 4.(వ్యాక.) పరసూత్రము నుండి అన్వయముకొరకు పూర్వ సూత్రమున గ్రహింపబడినది, వ్యతి.అనువర్తనము.
అధమము - తక్కువైనది, నీచము.
అపకర్షణ - 1.తొలగించుట, 2.తగ్గించుట, 3.అవమానపరచుట, (భౌతి.) ఒక వస్తువు ఇంకొకదానిని మళ్ళ గొట్టు గుణము (Replution).
ఖంజ - కుంటిది, వి.1.పసుపు, 2.దూది.
ఖంజము - ఒక కాలు కుంటియైనది.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. ౙవరాలు - యౌవనవతి.
చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
ఈ లోకంబునఁ బూర్వము,
నాలుగు పాదముల నీవు నడతువు నేఁడా
శ్రీలలనేశుఁడు లేమిని,
గాలముచే నీకు నొంటి కాలయ్యెఁ గదే!
భా|| ధర్మదేవతాస్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈ నాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేనందు వల్లనే కదా కాలప్రభావానికి లోబడిన నీవు ఒంటి కాలితో నడుస్తున్నావు
ఖగపతి - గరుడుడు.
ఖగానా మీశ్వరః ఖగేశ్వరః - పక్షుల కీశ్వరుడు.
ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖే గచ్ఛతీతి ఖగః గమ్ఌగతౌ. - ఆకాశమందుఁ బోవునది.
పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పులుఁగు - పిట్ట.
బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.
తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.
నాగాంతకుఁడు - గరుడుడు, వ్యు.పాములను చంపువాడు.
నాగానాముతకః నాగాంతకుః - సర్పములకు నాశకుఁడు.
శతానందుడు - 1.బ్రహ్మ, విష్ణువు.
శతానందము - విష్ణురథము.
విష్ణో రథః విష్ణురథః - విష్ణువునకు వాహనమైనవాఁడు.
సుపర్ణుఁడు - గరుత్మంతుడు, వ్యు.మంచి రెక్కలు గలవాడు.
శోభనాని పర్ణాని పక్షాయస్యసః సుపర్ణః - మంచి ఱెక్కలు గలవాఁడు.
పక్షిణాం బలమాకాశం - మత్స్యానా ముదకం బలమ్|
దుర్బలస్య బలంరాజా - బాలానాం రోదనం బలమ్||
తా. పక్షులకు ఆకాశము బలము, చేపలకు నీళ్ళు(ఉదకము - నీరు, (వ్యు.)తడుపునది, రూ.ఉదము.)బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము(రోదనము - 1.శోకము, ఏడ్పు, 2.కన్నీరు.)బలము. – నీతిశాస్త్రము
The reason why birds can fly and we can’t is simply that they have perfect faith, for to have faith is to have wings. – J. M. Barrie, The Little White Bird
సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్ |
సూర్యసూతమనూమారుం చ కద్రూర్నాగాననేకశః|
సాలము - 1.వృక్షము, 2.ప్రాకారము, 3.మద్దిచెట్టు.
సల్యతే గమ్యతే జనై రితిసాలః, సల గతౌ. - జనులచేత పొందఁబడునది.
ప్రాకారో వరణఁ సాలః -
ప్రకర్షేణ క్రియత ఇతి ప్రాకారః, డు కృఞ్ కరణే. - లెస్సగాఁ జేయఁబడునది.
వ్రియతే వేష్ట్యతే నగరమనేన వరణః, వృఞ్ వరణే. - దీనిచేత పట్టనము చుట్టఁబడును.
స్యతి పర్యంతం కరోతీతి సాలః - పట్టణమునకు కడను జేయునది.
సలతి నగరమితి వా సాలః, షల గతౌ. - పట్టనమును గ్రమ్ముకొని యుండునది. ఈ 3 కోట పేర్లు.
అజేయము - గెలువరానిది, వి.మద్ధిచెట్టు.
సర్జము - (వృక్ష.) సాధారణముగా శంక్వాకార వృక్షముల కాండములో నుండు పసుపురంగు గల ఘనపదార్థము, (ఇది నీటిలో కరుగదు. సారాయము టర్పెంటైన్లలో కరుగును), (Resin), సం.వి.మద్ది.
అరాళము - వంకరైనది, వి.1.మదపుటేనుగు, 2.మద్దిజిగురు, 3.ఒకరకపు అభినయహస్తము.
అర్యతే ప్రీత్యా అరాళః ఋ గతౌ ప్రీతితోఁ గూడియుండునది, పా రాతి ప్రీతిం రాళః. - ప్రీతి నిచ్చునది.
అరాః వేష్టనాని సంత్యస్యే త్యరాళం - చుట్లు గలది.
మత్తవారణము - 1.ఒరుగుదిండు, 2.మదపుటేనుగు.
మత్తు - మంపు, మదము; సం.మత్తా, మదః.
మంపు - మత్తు, మైకము.
మంపుగొను - క్రి.మత్తిల్లు.
మత్తి - 1.కామము, 2.అవివేకము, సం.మదః.
మదము - 1.క్రొవ్వు, 2.రేతస్సు, 3.గర్వము, 4.కస్తూరి.
మదో దానమ్,
మాద్యతే (అ)నేనేతి మదః, మదీ హర్షగ్లేపనయోః. - దీనిచేత మదించును.
ద్యతి ఖండయతీతి దానం, దో అవఖండనే. - ఏనుఁగును పీడించునది. ఈ 2 మదము పేర్లు.
మత్తకాశిని - మదముచే ప్రకాశించుస్త్రీ.
మధుపానం వినా మత్తేవ కాశత ఇతిమత్తకాశినీ, సీ. కాస్ర్ దీప్తౌ. - మధుపానము లేకయే మత్తురాలివలెఁ బ్రకాశించునది. పా, శ్రోణీగౌరవత్ మత్తగజవత్ మందం కసతీతి మత్తకాసినీ, సీ. కసగతౌ. - గొప్ప పిఱుఁదులు గలదౌటవలన మదపుటేనుఁగువలె మెల్లఁగా నడచునది.
ఏపె1 - నల్లమద్ధి.
ఏపె2 - (ఏ+ఆపె) ఏయమ, ఏస్త్రీ.
ఏకె - ఏయమ, ఏమె.
ఏమె - సర్వ. ఏ పూజ్యురాలు.
మత్తవారణముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం
దేవసింధుతరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| – 3
ఎర - 1.తిండి, 2.బలి, 3.వ్యసనము.
తింట - తినుట. తిను - భుజించు; భోజ్యము - భుజింపదగినది.
గ్రాసము - 1.కబళము, తిండి, 2.గ్రహణము.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
ముద్ద - కబళము, పిండము, పిడుచ. పిడుౘ - 1.ముద్ద, 2.కబళము.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద(కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.), 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్డ, 3.అగ్ని, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.
గర్భకోశము - (జీవ.) గర్భాశయము, బిడ్డతిత్తి, పిండము పెరుగుసంచి.
ఎర - 1.తిండి, 2.బలి, 3.వ్యసనము.తింట - తినుట. తిను - భుజించు; భోజ్యము - భుజింపదగినది.
తిండి - ఆహారము.
ఆహారము - 1.భోజనము, భోజన పదార్థము, 2.అపహరణము, 3.తెచ్చుట.
భోజనము - ఆహారము, సాపాటు.
సాపాటు - భోజనము.
సాపాటురాముఁడు - తిండిపోతు.
తిండిపోతు - తిండీడు, తిండికాడు.
తిండికాఁడు - ఎక్కువ తిను స్వభావము కలవాడు.
కడుపు - ఉదరము, పొట్ట.
ఉదరము - 1.కడుపు, (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట.
ఉదరంభరి - తనపొట్టను మాత్రమే పోషించుకొనువాడు.
గాసము - 1.ఆహారము, తిండి, 2.బత్తెము, సం.గ్రాసః.
తిండి - ఆహారము; భక్షణము - తిండి.
ఆహారము - 1.భోజనము, భోజన పదార్థము, 2.అపహరణము, 3.తెచ్చుట.
భోజనము - ఆహారము, సాపాటు.
సాపాటు - భోజనము; సాపాటురాయుఁడు - (వాడు) తిండిపోతు.
అపహరణము - మోసగించి కొనిపోవుట, రూ.అపహృతి.
ఆహరించు - 1.అపహరించు, 2.ఆకర్షించు, 3.భుజించు.
తెచ్చుట - తీసికొని వచ్చుట.
భుక్తి - 1.భోజనము, 2.అనుభవము.
భుక్తము - 1.తినబడినది, 2.అనుభవింపబడినది.
గ్రస్తము - 1.భక్షింపబడినది, 2.గ్రస్తము.
గ్రస్తము - 1.తినబడినది, 2.మ్రింగబడినది, 3.లోపించిన వర్ణములు గలది (మాట).
ఉపరాగము - 1.సూర్యాదిగ్రహణము, 2.వ్యసనము, దుర్వ్యసనము, 3.అన్యాయము.
వ్యసనం విపది భ్రంశే దోషే కామజ కోపజే :
వ్యసనశబ్దము ఆపదకును, పడుటకును, కామక్రోధములవలనఁ బుట్టిన స్త్రీ ద్యూతాది సప్త వ్యసననములకును పేరు. వ్యస్యతే శ్రేయో మార్గాత్ప్రచ్యావ్యతే పురుషో నేనేతి వ్యసనం. అసు క్షేపణే. దీనిచేత పురుషుఁడు శ్రేయోమార్గము నుండి తొలగఁద్రోయఁబడును.
దుర్నయము - 1.అన్యాయము, 2.దుర్నీతి. అపాడి - అన్యాయము.
వ్యసనము - 1.ఆపద, 2.ఆసక్తి, 3.పాపము, 4.కుతూహలము, వేడుట, 5.కామక్రోధాదులవలన బుట్టిన దోషము. వ్యసనము విషపు చుక్కలాంటిది. చిన్నదైనా ప్రాణాలమీదకు తెస్తుంది.
ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపతీ - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి, కలుగుట 3.(తర్క) అయథార్థ జ్ఞానము.
ఆసంగము - 1.ఆసక్తి 2.పట్టుదల 3.సంబంధము 4.ఆశ్రయము.
పాపము - దుషృతము, కలుషము.
కుతూహలము - 1.కోరిక 2.ఆనందము 3.నాయికకు మనొజ్ఞమైన వస్తువును చూచుట యందుగల లోలత్వము.
అమ్లము - 1.పులుపు, 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ, 3.పులిసిన పెరుగు, 4.పులిచింత 5.దబ్బ.
ఆమ్లము1 - 1.చింతపండు పులుసు, 2.చింతచెట్టు, 3.ఆరు రసములలో ఒకటి, 4.పులిత్రేపు విణ.పుల్లనిది. (Acid)
ఆమ్లిక - 1.చింతచెట్టు, 2.పులిత్రేపు.
పులిత్రేపు - అజీర్ణపుత్రేపు.
అజీర్ణము - అన్నాదులు అరుగక పోవుట, విణ.జీర్ణముకానిది.
ఆమ్లపిత్తము - (గృహ.) ఒక రోగము, (ఇది అగ్నిమాద్యము వలన జనించు కడుపులోని అమ్లములచే కలుగును) (Heart burn).
Dyspep’sia - అజీర్ణ రోగము.
Dyspep’sy - indigestion.
అమ్లశ్చ : ఆమయతీత్యమ్లః. అమరోగే. - రోగమును జేయునది.
పా. అమ్బతే ముఖశబ్దహేతుర్భవతీత్యమ్బ్లః. అబి శబ్దే. - చవిగొను నపుడు సీత్కారశబ్దమును బుట్టించునది.
చింత - 1.తలపు, 2.వ్యసనము, 3.వై.వి. చింత చెట్టు, సం.చింతా.
చింతన - పలుమారు తలచుట.
చింతించు - క్రి.1.తలంచు, 2.వగరు.
చింతనీయము - చింతింపదగినది, ఆలోచింపదగినది.
చింత్యము - చింతంపదగినది.
చింతితము - చింతింపబడినది.
నస్యా చ్చిన్తాస్పృతి రాధ్యానమ్-
చిన్త్యాతే చిన్తా, చితి స్పృత్యాం - చింతించుట చింత.
స్మరణం స్పృతిః. స్మృఅధ్యానే. - స్మరించుట స్మృతి.
అధ్యాయతే అధ్యానం. ధ్యైచింతాయాం. - చింతించుట అధ్యానము. ఈ 3 చింతించుట పేర్లు.
మననము - చింతన.
చింతన - పలుమారు తలచుట.
స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 3.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.
స్మరణము - తలంపు, జ్ఞప్తి.
స్మర్త - స్మరించువాడు.
తలఁపు - 1.తలచుట, 2.కోరిక, 3.ఆలోచనము, 4.జ్ఞప్తి, 5.హృదయము, 6.అభిప్రాయము, 7.ఊహించుట.
తలఁచు - 1.ఎంచు, 2.ధ్యానించు, రూ.తల్చు.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఆలోచన - 1.చూచుట 2.ఆలోచించుట, యోచన, తలంపు.
తలంపు - 1.ఊహించుట 2.ఆలోచనము, రూ.తలఁపు.
జ్ఞప్తి - 1.తెలివి 2.తలపు.
అభిప్రాయము - 1.తలపు 2.భావము, తాత్పర్యము 3.అభిలాష, కోరిక 4.వైఖరి, రీతి, సంస్థితి (Attitude).
భావము - 1.అభిప్రాయము 2.మనోవికారము 3.పుట్టుక 4.ధాత్వర్థ రూప క్రియ 5.సత్తు 6.స్వభావము, సం.(గృహ.) ఊహ, సామాన్యమైన ఊహ, భావన (Concept).
ఆంతర్యము - 1.అభిప్రాయము, 2.మిక్కిలి సన్నిహిత సంబంధము, 3.అక్షరములకు స్థానప్రయత్నాదులచే కలుగు పరస్పర సాదృశ్యము, 4.గుట్టు, 5.హృదయము.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె(Heart). హృదయం ఒకటైనా..... భావాలెన్నో..…
అభిప్రాయాన్ని చెప్పడానికి నీరసులు వణుకుతారు. తెలివి తక్కువవారు దాన్ని వ్యతిరేకిస్తారు. బుద్ధిమంతులు విషయ నిర్ణయం చేస్తారు. చతురులు దాని గమనాన్ని నిర్దేశిస్తారు. - మదాం జిన్నెరోలండ్
ఆశయము - 1.తలపు, 2.మనస్సు, 3.పడుక, 4.మృగములను పట్టుటకై వేటకాండ్రు త్రవ్వుగోయు, 5.ఆధారము, 6.స్థానము, 7.(వైద్య.) దేహము నందలి శ్లేష్మాదుల స్థానము, ఉదా. పిత్తాశయము, మూత్రాశయము , మొ.వి.
తలఁపుచూలి - మన్మథుడు, భావజుడు.
భావజుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.
తింతిడి - చింతచెట్టు, తింత్రిణి.
తింతిడికము - చింతచెట్టు, తింతిడి.
తింత్రిణి - తింతిడి.
వృక్షామము - చింతపండు.
తింత్రిణీకము - చింతపండు.
చుక్రము - 1.చింతపండు, 2.పులుసు.
చింతచెట్టు చింత కలిగిస్తుంది. చింత గడ్డి కంటేను ఎక్కువగా అంతటను కనబడుతుంది. చింతకు చితకు మధ్య సున్న మాత్రమే అంతరం. కాబట్టి చింత నీడన ఉండ రాదు. చింతచెట్టు క్రింద, చింతపుల్లల మంటలో వండుకు తినరాదు. చింతచెట్టు నీడన పడుకో రాదు.
చితా చింతా ద్వయోర్మధ్యే చింతానాం గరీయసీ|
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుత వపుః||
తా. సొద(చిత - 1.సొద, 2.ప్రోవు, రూ.చితి.)కంటె చింత యధికమైనది, ఎట్లన సొద ప్రాణంబు పోయి పిమ్మట శరీరమును దహించును. చింత ప్రాణంబుతో గూడిన శరీరమును దహించును, గావున చింత కూడదని భావము. – నీతిశాస్త్రము
వాహము - 1.గుఱ్ఱము, 2.ఎద్దు, 3.భుజము.
వహతి నరంవాహః. వహప్రాపణే. - నరుని వహించునది.
దోష - 1.భుజము, 2.రాత్రి.
దోర్మధ్యము - 1.పిడికిలిపోటు, 2.భుజముల నడిమి ప్రదేశము.
దోర్యుగము - రెండు బాహువులు. ఎగుభుజము - ఉన్నత భుజము.
బాహ్వస్థి - (జం.) దండయెముక, మోచేతిపై యెముక, భుజపు టెముక (Humerus).
భుజము - (గణి.) సమతల క్షేత్రములో వరుసగానున్న రెండు కోణబిందువుల కలువగావచ్చు సరళరేఖ (Side) సం.వి.చేయి.
భుజసంధి - (జం.) భుజపు కీలు, చెయ్యి ఎముక భుజపు ఎముక కలిసిన భాగము (Shoulder joint).
ౙబ్బ - 1.భుజము, 2.తొడ వెలుపలి మీది భాగము, సం.భుజా.
రెట్ట - 1.పక్షిమలము, 2.భుజము.
బాజు(ౙ)బందు - 1.భుజబంధము, 2.భూషణము, జం.బాహుబంధః.
దో - బాహువు; బాహువు - భుజము.
బాహులేయుఁడు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.
స్కన్ధో భుజశిరో అంసో (అ)స్త్రీ -
కం శిరో దధాతీతి స్కంధః డు ధాఞ్ ధారణపోణయోః. - శిరస్సును ధరించునది.
భుజస్య శిరో అగ్రం భుజశిరః. స. న. - భుజము యొక్కకొన.
అమ్యతే భారణే అంసః. అ. ప్న. అమరోగే. - భారముచేఁ బీడింపఁబడునది. ఈ 3 మూఁపు పేర్లు.
స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
ప్రకాండము - చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా.పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము(రామాయణమునందు షట్కాండములు గలవు), 2. సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.
అంసము - 1.మూపు, భుజాగ్రము, 2.అంశము.
మూపు - భుజ శిరస్సు, అంసము.
అంసకూటము - ఎద్దుమూపురము.
అంసలుఁడు - మంచిమూపు గలవాడు, బలవంతుడు.
అంసచక్రము - (జం.) భుజవలయము, మొండెమునకు ముందు భాగమును వర్తులాకారముగ ఆవరించి చేతులకు ఆధారముగ నుండు ఎముకల కూర్పు (Pectoral girdle).
అంస ఫలకభాగము - (జం.) అంసచక్రములో అంస సంధి కూపము చుట్టును ఉన్న ఎముకలలో నిదియొకటి. వెడల్పుగా నున్న దీని పైభాగము ఉదంసఫలక (Supra scapula) మనియు సన్నగా నున్న క్రింది భాగము అంసఫలక (Scapula) మనియు అందురు (Scapular portion).
అంస ఫలకము - (జం.) భుజపు వెనుక ఎముక (Scapula or shoulder blade). పెడ కేలు - వెనుకకు త్రిప్పిన భుజము.
ఆకృషి - (జం.) భుజాస్థి యొక్క క్రిందికొన, (ఇది స్పంజి ఎముకలతో ఏర్పడినది) (Trochlea).
అంససంధికూపము - (జం.) భుజపుకీలునకుండు గిన్నెవంటి భాగము. బంతి గిన్నె కీలు - (జం.) ఒక ఎముక యొక్క గుండ్రని తల మరియొక ఎముకకు గల గిన్నెలో నమిరి అన్ని వైపులకు కదుపుటకును చక్రము వలె తిరుగుటకును వీలుగా నుండు కీలు (Ball and socket joint).
ఉలూఖలసంధి - (జం.) బంతిగిన్నె కీలు, గిన్నెవంటి భాగమునందు బంతివలె నుండు ఎముక భాగము ఇమిడి కదలునది, ఉదా.భుజముకీలు (Ball and socket joint), తొడ ఎముక సంధి.
సంధిరసము - (జం.) బంతిగిన్నె కీలువంటి కీలులో ఎముకల మధ్య నుండు రసము (Synovial fluid).
దట్టము - 1.పావడ, 2.గుఱ్ఱము, విణ.తరచు, విరళము, రూ.దళము.
పావడ - 1.పరికిణి, 2.ధౌతవస్త్రము. అంగదట్టము - పావడ, పరికిణి.
దడము - దట్టము, రూ.దళము.
దణా - దళము, సేన, సం.దళః.
దళము - 1.అధిక్యము, విణ.2.దట్టము, 3.తరచు, రూ.దడుము.
దళము - 1.ఆకు, 2.దండు.
దణాయుఁడు - దళనాయకుడు, సేనాపతి, సం.దళనాయకః.
దళవాయి - 1.సేనాధిపతి, 2.సుంకరికి సహాయుడైన యుద్యోగి.
దణి - 1.ప్రభువు, 2.సేనాని, సం.ధనీ.
సేన - దండు, విణ.అధికము, చాల.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
వీతాన్యనిగృహీతాని వ్యాపాదయితుమప్యలమ్ |
అవిధేయా ఇవాదాంతాః హయాః పథి కుసారథిమ్ ||
భా|| శిక్షణపొందని అదుపులోకిరాని గుర్రాలు మూర్ఖుడైన సారథి(సారథి - 1.తేరునడుపువాడు, 2.నియంత.)ని మార్గమధ్యంలో కూలదోసినట్లు అదుపుచేయబడని ఈ ఇంద్రియాలు, మనస్సు మానవుని చంపివేయ గలవు.
ఉత్తరము - 1.బదులు, 2.ఒక దిక్కు, 3.జాబు, (ఈ అర్థము తెనుగు నందు మాత్రమే కలదు, సంస్కృతమున లేదు), విణ.మీదిది.
బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి. అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము - 1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బీ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విణ.ఋణరాశి (Negative).
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
నీరము - జలము.
టపా - 1.ఉత్తరము, 2.ఉత్తరముల సంచి.
ఖత్తు - 1.విధము 2.ఉత్తరము.
విధము - ప్రకారము, విధి.
ప్రకారము - 1.విధము 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
మన్మథుఁడు - మారుడు, వ్యు.విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలముచేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటలనల మధ్య దొరలు కాలము (Time).
కాలంతకుఁడు - శివుడు, (వ్యవ.) అసాధ్యుడు.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామలము - నలుపు, విణ. నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
జీవితంలో మరలిరానిది - కాలం. కాలం దేనినీ పట్టించు కోకుండా దాని ధర్మం అది పాటించుకుంటూ వెళ్ళిపోతుంది. కాలమును బోలిన ఘనుడగు బోధకు డుండబోడు.
కాలమే సృషిస్తుంది. కాలమే రక్షిస్తుంది. కాలమే కల్లోలాలు కలిగిస్తుంది. కాలానికి కళ్ళూ నోరూ ఉంటే ఎన్ని వాస్తవాలు వెల్లడించగలదో? కాలానికి నిలకడలేదు. కాలం నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాలమే సర్వాన్నీ అంతం చేస్తుంది. కాలాన్ని జయించినవాడు లేడు. కాలం అజేయం.
కాలము ఎవరినీ నరకదు. అది కేవలం అన్ని విషయాలలోనూ మనిషి బుద్ధిని తప్పు దారికి మళ్ళిస్తుంది. - సంజయుడు, మహాభారతం
విధానము - 1.చేయుట, 2.ఆజ్ఞ.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
గవయము - 1.గురుపోతు, వనవృషభము, అడవియెద్దు.
గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహ వేగముచే వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కంధము.
స్కందుఁడు - కుమారస్వామి. ద్వితీయః స్కంద ఏవ చ|
స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
మూఁపు - భుజ శిరస్సు, అంసము.
ప్రకాండము - చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా. పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
బోదియ - 1.ప్రకాండము, 2.మిరపచేల యందు కాలువ లేర్పరిచి కట్టిన కట్ట, 3 స్తంభముల మీది దూలముల క్రింద నుండు పీట.
ప్రకాండవ్యూహము - (వృక్ష.) మొక్కకు భూమిపై నున్న కాండము, కొమ్మలు, ఆకుల మొదలగు భాగముల సముదాయము (Shoot system).
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ.
శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).
శాఖామృగము - కోతి, వ్యు.చెట్ల కొమ్మలపై తిరుగు మృగము.
కొమ్మత్రిమ్మరి - కోతి.
శాఖాచారీ మృగః శాఖామృగః - కొమ్మలయందుఁ జరించు మృగము.
సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. – 8స్తో
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
బిల్యత ఇతి బిలం, బిల భేదనే - భేదింపఁ బడునది.
దేవఖాతం చ త ద్బిలం చ దేవ ఖాతబిలం, తస్మిన్ గుహా గుహ్వరసబ్దౌ వర్తేతే. - అని రెండవ పక్షమందు. గుహత్యంధకారమితి గుహా. గుహూ సంవరణే. అంధకారము(అంధకారము - చీకటి)నాక్రమించియుండునది.
గతిం హ్వరతీతి గహ్వరం. హ్వృకౌటిల్యే - శైల గమనమును కుటిలముగాఁ జేయునది. ఈ 3 ఆకృతిమయమైన (దేవతలచే ద్రవ్వఁబడిన) కొండ యొక్క బిలము పేర్లు.
వివరము - రంధ్రము.
రంధ్రము - 1.క్రంత, సందు 2.దూఱు(దూఱు - నిందించు, వి.నింద).
క్రంత1 - పెండ్లి కొడుకువారు పెండ్లి కూతురునకు తీసుకొని పోయెడు ప్రధాన ద్రవ్యము, రూ.కంత.
క్రంత2 - 1.సందురోవ, 2.రాజ వీధి, రాజ మార్గము 3.రచ్చ, 4.రంధ్రము, సం. గర్తః.
సందు - 1.సంది, 2.ఇరుకువీధి, 3.సొరంగము, 4.ఎడము, 5.సందర్భము, సం.సంధిః.
సంది - 1.సందు, 2.దండచేయి, సం.సంధిః.
సందలి - దండచేయి.
బొక్క - 1.బిలము, కన్నము, 2.శవమునుపూచెడు గొయ్యి, సం.భూకః.
భూకము - 1.బొక్క, 2.కాలము.
లొటారము - 1.బొక్క, 2.శూన్యత. పైన పటారము లోన లొటారము.
లొత్త - లొట్ట. లొట్ట - పల్లము, విణ.అణగినది.
కన్నము - రంధ్రము, సం.ఖననమ్.
రంధ్రము - 1.క్రంత, సందు, 2.దూఱు.
రంద్రాన్వేషణము - రంధ్రములను అన్వేషించుట (తప్పులు వెదకుట యని వాడుకలోని యర్థము.)
రంధ్రముల కుట్టు - (గృహ.) అలంకారపు కుట్టులో రంధ్రముల నేర్పరుచు కుట్టు (Eyelet-stitch).
లాఁగ - రంధ్రము, బొరియ.
లాఁగదాఁగుడు - సర్పము, వ్యు.బొరియ లందు దాగుకొనునది.
గహ్వరము - 1.కొండగుహ, 2.అడవి, 3.గాంభీర్యము, విణ.1.గంభీర్యము కలది-లోతైనది, 2.చొరరానిది.
అటవ్యరణ్యం విపినం గహనం కాననం వనమ్,
అటవి - అరణ్యము, వికృ.అడవి.
అరణ్యము - అడవి.
అటం త్యస్యాం మృగయార్థ మిత్యటవీ. ఈ. సీ. - దీనియందు వేఁటకొరకు సంచరింతురు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
ఇల్లు - ఇలు; ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహిణి - ఇల్లాలు, భార్య.
గేహము - గృహము, ఇల్లు.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
గృహమేధి - గృహస్థు, వ్యు.భార్యతో చేరియుండువాడు.
ఇలుదొర - గృహస్థు.
ఇంటిపట్టు - 1.గృహస్థు ధర్మము, 2.స్వగృహము, 3.నివేశన స్థలము, 4.ఇంటి దగ్గర.
ఇంటికాఁపు - గృహస్థుడు.
ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.
గుహాయాం గేహే వా బహి రపి వనే వా(అ)ద్రిశిఖరే
జలేవా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్|
సదా యస్యైవాంతఃకరణ మపి శంభో తవ పదే
స్థితం చే ద్యోగోసౌ స చ పరమయోగీ స చ సుఖీ|| - 12శ్లో
తా|| కొండగుహ యందుగాని, గృహము(గేహము - గృహము, ఇల్లు.)నందుగాని, బయటగాని, తోటయందుగాని, పర్వతశిఖరము నందుగాని, నీటియందుగాని, అగ్ని(వహ్ని - అగ్ని)యందుగాని ఉండుగాక ! అందువల్ల నేమి ఫలమున్నది? ఓ శంకరా!(శంభువు- 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభువు.)ఎవని హృదయము నీ చరణాలను ఆశ్రయించి ఉండునో అదియే శివయోగము. అలాంటి వాడు ఉత్తమయోగి. అతడే పరమానందము గలవాడు(సుఖీ - సుఖము గలవాడు). - శివానందలహరి
కొండగుహలోన దాగియె యుండుటేల
చాటుదారులతో నేమి చాటఁగలవొ
నేమమును గాంచియుంటయే ప్రేమమౌనె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
అడవికుక్క - తోడేలు.
తోఁడేలు - 1.వృకము, 2.అడవికుక్క, రూ.తోఁడెలు.
వృకము - 1.తోడేలు, 2.కుక్క.
అడవి తిరుగుడు - కోతి.
మృగయ - 1.వేట, 2.వెదకుట.
మృగ్యము - వెదుకదగినది.
మృగయుఁడు - బోయ; రేపుఁడు - బోయ.
అడవి - అరణ్యము, సం.అటవీ.
ఇయర్తి మృగాదిరత్ర అరణ్యం. ఋ గతౌ. - మృగాదులు దీనియందుఁ దిరుగుదురు.
మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.
మృగధూర్తకము - నక్క; నక్క - జంబుకము, విణ.క్షుద్రము.
జంబుకము - నక్క; నక్కజిత్తులు - మోసపు పనులు.
ధూర్తుఁడు - 1.జూదరి, 2.మోసకాడు, రూ.ధూర్తు.
తిరుగకు దుర్మార్గులతో ;
జరగకు గహనాంతర స్థ * లాదుల కొంటిన్;
జరుగకు శత్రుల మ్రోల ;
నర్మువకు మేన్ హితులయెడల * మదిని గుమారా!
తా. చెడ్దవారితో తిరుగకు, ఒంటరిగా అడవులకుఁబోవద్దు, శత్రువుల దగ్గరఁ చేరవద్దు, మనసులో మిత్రుల(మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు.) ఉపకారములను మరచిపోవద్దు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
విపినము - అడవి.వేపంతే భయాదత్రేతి పిపినం. టు వేపు కంపనే. - భయముచేత దీనియందు వడఁకుదురు.
కాననము - 1.అడవి, 2.విపినము, 3.ఇల్లు.
కాన1 - 1.కనుక, 2.సంబోధనార్థకము, ఉదా. "తల్లికాన, సామికాన". కాననే నారసింహంచ|
కాన2 - అడవి, సం.కాననమ్. పితృవాక్యాశ్రిత కానన రామ్|
కోన1 - 1.అడవి, సం.కాననమ్, 2.కొండల యందలి మరుగుచోటు లోయ, 3.దేశభేదము, 4.కొన, మూల, సం.కోణః.
కోన2 - గోసమూహము.
త్రసము - 1.తిరుగునది, జంగమము, 2.అడవి.
జంగమము - తిరుగునది.
జంగముఁడు - జంగమువాఁడు, జంగము.
లింగఁడు - జంగమయ్య, శివభక్తుడు. ఇల్లుకాలుతూ వుంది జంగమయ్య అంటే నా చంకజోలె చేతిగంట నా దగ్గర వున్నవన్నట్లు.
త్రస్యతీతి త్రసం. త్రసీ ఉద్వేగే - భయపడినది. (త్రస్తము - భయపడినది)
భృశం గచ్ఛతీతి జంగమం. గమ్ ఌ గతౌ - మిక్కిలి తిరుగునది.
గహనము - అడవి, విణ.1.ఎరుగరానిది, 2.చొరరానిది.
గహ్యత ఇతి గహనం. గాహూ విలోడనే. - దుష్టమృగములచేఁ గలఁచఁబడునది.
తిరుగకు దుర్మార్గులతో ;
జరగకు గహనాంతర స్థ * లాదుల కొంటిన్;
జరుగకు శత్రుల మ్రోల ;
నర్మువకు మేన్ హితులయెడల * మదిని గుమారా!
తా. చెడ్దవారితో తిరుగకు, ఒంటరిగా అడవులకుఁబోవద్దు, శత్రువుల దగ్గరఁ చేరవద్దు, మనసులో మిత్రుల(మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు.) ఉపకారములను మరచిపోవద్దు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
కాంతారము - 1.పోరాని మార్గము, 2.అడవి, 3.చెరుకు, 4.దైవికముగ వచ్చు ఆపద.
కాన్తారం వర్త్మ దుర్గమమ్,
కాంశ్పిన్న తారయతీతి కాంతారం, తౄప్లవనతరణయో. - ఎవ్వరిని చొచ్చి దాఁటనీయనిది.
దుష్టోగమో యస్య తఘుర్గమం - దుష్టమైన గమనము గలిగినది. చోరకంటకాదులచే బోవ శక్యముగాని మార్గము పేరు.
వర్ష్మము - 1.శరీరము, 2.మిక్కిలి చక్కని రూపము, 3.కొలత.
వృవ్యత ఇతి వర్ష్మ, న, న. వృషు సేచనే. - తడుపఁబడినది.
వర్త్మనేత్రచ్ఛ దే (ఆ)ధ్వని,
వర్త్మన్ శబ్దము ఱెప్పకును, తెరువునకును పేరు. వర్తయతీతి, వర్తంతే (అ)స్మిన్నితి చవర్త్మ వృతు వర్తనే. - వర్తింపఁజేయునది. దీనియందు అవర్తింతురు గనుకను వర్త్మము.
దుర్గమము - 1.పోవుటకు కష్టతరమైనది, 2.సులువుగా పొందరానిది.
కాంతారే వనదుర్గేషు కృఛ్ఛ్రాస్వాపత్సు సంభ్రమే |
ఉద్యతేషు చ శస్త్రేషు నాస్తి సత్త్వవతాం భయమ్ ||
అడవుల్లో కాని, దుర్గమస్తలాల్లో కాని, ఘోరమైన ఆపదల్లో కాని, క్లిష్ట సమయాల్లోకాని, ఆఖరికి (శస్త్రి - చురకత్తి, మాదిగకత్తి, విణ.శస్త్రముగలవాడు.)కత్తి మీద పడుతున్నాకాని సత్త్వ గుణం కలవారికి భయం ఉండదు.
దవము - 1.కార్చిచ్చు, దవానలము, 2.అడవి, రూ.దావము.
దాపము - 1.దవము, కార్చిచ్చు, అడవిలో మ్రాకులు ఒకటితో నొకటి ఒరసికొనగా పుట్టి అడవిని దహించెడి అగ్ని, 2.అడవి 3.బాధ.
అడవిలో వెదురు పొదలలో పెద్దగాలి కొట్టినపుడు ఒక వెదురు మరియొక్క వెదురుతో రాపిడి చేసుకొని నిప్పుపుట్టును. ఆ నిప్పుతో అరణ్యమంతా దగ్ధమగును.
అరణ్యరోదనము - 1.అడవిలోని ఏడ్పు, (దానివలె నిష్ఫలమైనదని యర్థము).
కారుచిచ్చు - దవానలము, రూ.కార్చిచ్చు.
ఎరగలి - కార్చిచ్చు, అడవిలో మ్రాకులు ఒకటితో నొకటి ఒరసికొనగాపుట్టి అడవిని దహించెడి అగ్ని.
బలయుతుఁడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే
బలముదొలంగెనేని, తనపాలిటశత్రు వదెట్లు, పూర్ణుడై
జ్వలనుడు కానగాల్చుతరి వాయువు సఖ్యము జూపుగానినా
బలయుడు సూక్మదీపమున నున్న పుడార్పును గాదె! భాస్కరా.
తా. అగ్ని గొప్పమంటలతో(జ్వలనము - 1.మంట, 2.అగ్ని.)నొక అడవిని దహించు చున్నపుడా అగ్నికి వాయువు(వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.) సహాయకారునివలె నుండును కాని, ఆ అగ్నే ఒక చిన్నదీపము(దీపము - లాంతరు, రూ.దీపిక.) రూపమున ప్రకాశించునప్పుడా వాయువు దానికి శత్రువై ఆ దీప మార్పును. అట్లే బలము గలిగి నప్పుడు తన బంధువులందరు(తోడ్పడు - క్రి.తోడుపడు.)స్నేహితు లగుదురు. తన బలము తగ్గినప్పుడా చుట్టములే శత్రువు లగుదురు.
సంసార ఘోరగహనే చరతో మురారే!
మారోగ్రభీకర మృగప్రచురార్ధితస్య|
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య
లక్ష్మీనృసింహ! మమం దేహి కరావలమ్బమ్. –11స్తో
కర్కశము - 1.కరకు, 2.ఇక్షువు, విణ.1.గట్టిది, 2.నొప్పించునది, 3.కనికరములేనిది.
మొప్పె - 1.మూర్ఖుడు, 2.కరకు.
కక్కరము - కర్కశము, గట్టిది, కరకైనది, సం.కర్కతః.
రూక్షమ్ - 1.కరకైనది, 2.ప్రేమలేనిది.
రుటము - 1.రూఢము, 2.గట్టిది, సం.రూఢమ్ .
రూఢము - 1.ప్రసిద్ధికెక్కినది, 2.నిశ్చయింపబడినది, 3.మొలకెత్తినది.
గడుసు - 1.కాఠిన్యము, 2.ధైర్యము, 3.మొండితనము, విణ.1.అసాధ్యము, 2.కఠినము, గట్టిది, 3.గాఢము, 4.అధికము.
అసాధ్యము - 1.సాధ్యము కానిది, 2.కారణము లచే సమర్థింపరానిది, 3.నెరవేర్చరానిది.
గడుసరి- 1.అసాధ్యుడు, 2.కఠినుడు, 3.దుష్టుడు.
కాలాంతకుఁడు - శివుడు, (వ్యవ.)అసాధ్యుడు.
కఠోరుఁడు - కఠినుడు.
దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్డజాతి.
దుర్జనుఁడు - దుష్టుడు.
కఠినము - 1.పరుషము, 2.నిష్ఠురము, 3.క్రూరము, వి.వంటకుండ.
క్రూరము - 1.గుగ్గిలము, 2.విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది.
క్రూరుఁడు - దయలేనివాడు.
గట్టి - ధృఢము, కఠినము, కర్కశము, బిగువైనది, సడలనిది, గుల్లకానిది, సం.ఘట్టః.
గట్టివాడు - నేర్పరి, సమర్థుడు.
సమర్థుఁడు - నేర్పరి; నిపుణుఁడు - నేర్పరి.
ప్రవీణుఁడు - నిపుణుడు. క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
ఇంచు(ౘ)1 - క్రి.1.ఇంపగు ప్రియమగు, మనోజ్ఞమగు, 2.సంతోషించు, 3.ఒప్పు, అతిశయించు, 4.అభిలషించు.
ఇంచు2 - 1.చెరకు, సం.ఇక్షుః, 2.ప్రేమము, ప్రణయము.
ఇంచుఁబోడి - స్త్రీ, ఇంపగుస్త్రీ.
రసాల ఇక్షుః -
రసాలము - 1.చెరకు, 2.మామిడి.
రస్యతే రసాలః రస అస్వాదనే. – ఆస్వాదింపఁ బడునది.
రసేన అలత ఇతి వా రసాలః, అల భూషణాదౌ - రసముచేత నలంకరింపఁ బడునది.
ఇక్షువు - చెరకు; చెఱకు - ఇక్షువు.
ఇప్యతే సర్వైరితి ఇక్షుః ఇషు ఇచ్ఛాయాం. - అందఱిచేత కోరఁబడునది. ఈ రెండు చెఱకు పేర్లు.
ఉపమింప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదగకును గడపట
గడపట దుర్గతిపొంచును గదరా సుమతీ.
తా. చెఱకు మొట్టమొదట తీపిగా(తియ్య - మధురము, రూ.తీయ.)నుండి మధ్యమధ్య తీపి(తీపి - 1.మాధుర్యము, 2.ఇచ్ఛ.)లేక చప్పగా ఉండును. అదే విధంగా మోసగాని స్నేహం మొదట మంచిగా కనబడినను చివరకు మరుగున నుండి కనిపెట్టియుండు దుర్గతి - 1.నరకము, 2.బీదతనము.)ఆపద చేకూరును. కపటపు దుర్జాతి పొందు.
కన్నులమ్రాను - చెరకు.
కన్నుల మ్రాని విలుకాఁడు - మన్మథుడు.
ఇక్షూదము - చెరకు సముద్రము.
ఇక్షుశర్కర - (రసా,) చెరకునుండి తయారైన చెక్కెర (Sucrose).
చెఱకు చెక్కెర - (వ్యవ.) చెరకు రసము నుండి తయారైన చక్కెర, (Cane Sugar).
ౘక్కెర - శర్కర, పంచదార Sugar, సం.శర్కరా.
పంచదార - చక్కెర, సం.పంచసారః.
ౘక్కెరతిండి - చిలుక; చిలుక - కీరము, శుకము, రూ.చిల్క. కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
ౘక్కెర విలుకాఁడు - మదనుడు, ఇక్షుధన్వుడు.
ఇక్షుధన్వుఁడు - చెరకు విలుకాడు, మన్మథుడు.
చెఱకు విలుకాఁడు - మన్మథుడు. మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మారుఁడు - మన్మథుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథ - అరువది సంవత్సరములలో (29వ)ఇరువది తొమ్మిదవది.
మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
అల్ప జాతివాని కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల దొలగఁ జేయు
జెప్పుఁదినెడి కుక్క చెఱకుతీ పెరుగునా! విశ్వ.
తా. దుష్టునకు అధికారము నిచ్చినయెడల (దొడ్డ - గొప్ప, సం.దొడ్డు.)మంచివారి నందరినీ వెడల గొట్టును. చెప్పుతిను కుక్క(కుక్క – శునకము dog, సం.కర్కురః.)చెరకుతీపి యెరుగదు.
రసిక - చరకుపాలు, రసికురాలు.
రసదాడి - (వృక్ష.) 1.ఒకరకము చెరకు, 2.ఒకరకము అరటి, సం.రసదాళికా.
చెరకు వ్యవసాయము పెదవులపైనే చేయుటా? చెరుకు పండినచోట చీమలు అవే చేరుకుంటాయి. చెరుకు తీపి అని వ్రేళ్ళు సహా మ్రింగుదురా?
సరసదయాగుణంబుగలజాడ మహింగడు నొప్పి యుండినన్
దఱుచగ వానికాసపడి డాయగవత్తురు లోకు లెట్లనన్
జెఱకురసంబుగానుగను జిప్పిలిపోయినమీద బిప్పియై
ధరబడియున్నజేరవె ముదంబునజీమలు పెక్కు, భాస్కరా.
తా. చెఱకు గానుగలో నుంచిన రసము అంతయు పోయి వట్టి పిప్పి యుండును, దానిని పారవేయగా ఆ పిప్పికి, సంతోషమున చీమ లనేకములు వచ్చి చేరును. అట్లే, భూమి యందు దయాస్వభావము గల దాత దరిద్రుడై బాధ పడుచున్ననూ ప్రజలు వాని మీద నాశచే నతనిని సమీపించుచునే యుందురు.
ఇక్షువనము - చెరకుతోట.
ౘక్కెర పంటలు - (వ్యవ.) చక్కెర లభించు పైరులు, ఉదా.చెరకు, బీటుదుంప మొదలగు నవి. (Sugar Crops).
చెఱఁకు ఈగ - (వ్యవ.) చెఱకు తోట నొక్కొక్కప్పుడు అధికముగ బాధించు నొక రకపు బొళ్ళ పురుగు, (Sugar cane flypyrilla Perpurilla).
చెఱకు ఎఱ్ఱకళ్ళు - (వ్యవ.) చెరకు గడలపి ఎఱ్ఱని మచ్చలేర్పదు తెగులు, (ఇది ఒక విధమగు బూజు తెగులు) (Sugar Cane red rot). ఎఱ్ఱకళ్ళు - (వ్యవ.) ఇది మొక్కల కాండమునకు పట్టు తెగుళ్ళలో ఒకటి. సామాన్యముగా చెఱకుగడలకు ఎఱ్ఱని డాగులవలె ఈ తెగులు పట్టు చుండును (Red rot).
క్యాష క్రాప్స్ - (వ్యవ.) (cash crops) ధనదాయ మిచ్చు పంటలు, (చెరకు, పొగాకు మొ.వి.).
ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాఁడె చెఱచు వాని వంశ మెల్ల
జెఱకు వెన్ను పుట్టి చెరపదా తీపెల్ల! విశ్వ.
తా. ఓ వేమా! చెఱకుకర్రలో వెన్నుపుట్టి, ఆ కర్రయందలి తీపి అంతయు యెట్లు చెరుపుచున్నదో, అట్లే(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.) కడుపున చెడ్డవాడు(ఓగు-1.అశుభము, 2.కీడు (బాగోగులని వాడుదురు బాగు+ఓగు)పుట్టిన ఆ వంశమునకే అపకీర్తి తెచ్చును.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
అరిష్టము - 1.హింసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము, 5.మరణచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
బెల్లము - చెరుకుపాలు కాచగా నగు ముద్ద, గుడము.
గుడము - 1.ఉండ, గోలి, 2.బెల్లము, 3.ఏనుగు కవచము, 4.పొగడచెట్టు.
గుళిక - ఉండ, మాత్ర, (రసగుళిక). ఉండ - గుళిక, విణ.గుండ్రము.
గోలీ - పిల్ల లాడుకొను గోలీకాయ, సం.గోలకః.
గోలి1 - ఉడుము.
ఉడుము - బల్లివంటి పెద్ద జంతువు, గోధ, రూ.ఉఱుము.
గోధ - 1.ఉడుము, 2.అల్లెత్రాటి దెబ్బ తగులకుండ(ఉడుము తోలుతో చేసి)వ్రేలికి తొడుకుకొను కవచము.
గోలి2 - కొండముచ్చు, సం.గోలాంగూలమ్, (అని కొందరు).
గోలాంగూలము - 1.కొండముచ్చు, 2.కోతి.
కొండముచ్చు - నల్లని మూతిగల కోతి.
కోఁతి - వానరము, రూ.క్రోఁతి. వానరసైన్య సమావృత రామ్|
వానరము - కోతి; క్రోఁతి - వానరము, రూ.కోతి.
ఉఱ్ఱు - కోతి ఉఱ్ఱు మని చేయు ధ్వని.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపిచిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
కాపేయము - 1.కోతిబుద్ధి, 2.కోతి చేష్ట.
కోతి నొనర దెచ్చి క్రొత్తపుట్టము గట్టి
కొండముచ్చు లెల్లఁ గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యుడుండుట విశ్వ.
తా|| కొండముచ్చులు కోతినిదెచ్చి, క్రొత్తవస్త్రముగట్టి పూజించి నట్లే నిర్భాగ్యులు(నిర్భాగ్యుఁడు - భాగ్యము లేనివాడు.)గుణములేని వారిని చేరి కొలుచుచుందురు.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు)కలది.
గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః|
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః||
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు – ఆగస్ఠు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
నడి - నడుము అను శబ్దమునకు సమాసము నందు వచ్చు రూపము, ఉదా. 1.నడితల, 2.నడిరేయి, 2.మధ్యము, రూ.నడు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.
పుబ్బ - ఉత్తర రెండేసి చొప్పున చతురస్రాకారముగా నాలుగు 4 నక్షత్రము లుండును.
12. ఉత్తరఫల్గుని - పండ్రెండవ నక్షత్రము.
ఉత్తర - 1.ఉత్తర ఫల్గునీ నక్షత్రము, 2.ఉత్తరదిక్కు, 3.విరటుని కూతురు.
వడదెస - ఉత్తరదిక్కు.
ఉప ర్యుదీచ్య శ్రేష్ఠే ప్వ ప్యుత్తర స్స్యాత్ :
ఉత్తర శబ్దము మీఁదికిని, ఉత్తరదేశము మొదలయినదానికిని, శ్రేష్ఠునికిని పేరు. అపిశబ్దము వలన ప్రత్యుత్తరమునకును పేరు. ఉదా. మీఁదికి-'ఇత ఉత్తరం.' ఉత్తరదేశమునకు - 'ఉత్తరే కుబేరః' అని. అతిశయే నోద్గత ముత్తరం - మిక్కిలి కనిపించునది. "ది శ్యుత్తరా స్త్రియాం పుంసి విరాటనయే పి చ, ఉత్తరం ప్రతివాక్యే స్యా"దితి శేషః.
దుర్భర బాణము రాఁగా
గర్భములో నుండి యభవ ! గావు మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.
తా. కృష్ణా ! వచ్చిన బాణమునకు భీతిల్లి ఉత్తర గర్భమందుండి 'కృష్ణా కావుమని' వేడగా, అభిమన్యుని కుమారుఁడగు పరీక్షిత్తుని గాపాడితివి, నీవు(అచ్త్యుతుఁడు - విష్ణువు.)ఆర్తత్రాణ పరాయణుఁడవు.
శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి | తత్త్వా విదుః ఫలునీస్తస్య విత్తాత్ | అస్మభ్యం క్షత్రమజరగ్ం సువీర్యమ్ | గోమదశ్వవదుపసన్నుదేహ | భగోహ దాతా భగ ఇత్ప్రదాతా | భగో దేవీః ఫల్గునీరావివేస | భగస్యేత్తం ప్రసవం గమేమ | యత్ర దేవైస్సధమాదం మదేమ ||10||
ఫల్గునుఁడు - అర్జునుడు. హిమాలయ శిఖరం మీద ఉత్తరఫల్గుని నక్షత్రంలో అర్జునుడు జన్మించాడు. ఫల్గుణసఖః, హనుమంతుడు|
అర్జునుఁడు - 1.పాడవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
గయ - ఫల్గునీ నదీ ప్రాంత నగరము, బీహారు రాష్ట్రము నందలి ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రము. గయా మాంగళ్యగౌరికా శక్తిపీఠం| గయలో దేవీస్థానం మంగళ|
ఫాల్గునము - పండ్రెండవ మాసము.
స్యాత్తపస్యః ఫాల్గునికః :
తపసి సాధుః తపస్యః - తపస్సునందును యోగ్యమైనది.
ఫల్గునీ నక్ష్త్రయుక్తా పౌర్ణమాసీ ఫాల్గునీ. సా స్మిన్నితి పాల్గునః - ఉత్తర ఫల్గునీ నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు గనుక ఫాల్గునము.
ఫాల్గునికశ్చ - ఫాల్గునికము.
క్రియతే బ్రాహ్మణాదిభిరితి క్రతుః. ఉ. పు. డుకృఞ్ కరణే - బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులచేతఁ జేయఁ బడునది.
క్రతునామంబు ధరించియుఁ
జతురతఁబలించుచుండుఁ జాతుర్య కళా
రతుఁడై సహస్ర కిరణుఁడు,
మతియుతు లౌననఁ దపస్యమాసము లీలన్.
అందు వర్చసుండు భరద్వాజుండు పర్జ్యనుండు సేనజిత్తు విశ్వుం డైరావతుం డనువారలతో నెనసి కాలయాపనంబు సేయుచుండు.
భా|| ఫాల్గుణ మాసంలో సహస్ర కిరణుడైన (సహస్రాంశువు - సూర్యుడు, వే వెలుగు.)సూర్యుడు చాతుర్యకళా కేళీలోలుడై బుద్ధిమంతులు ప్రశంసించు నట్లుగా క్రతు(క్రతువు-యజ్ఞము)వన్న పేరు పెట్టుకుని కాలాన్ని పరిపాలిస్తాడు.
ఆ సమయంలో వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు(పర్జన్యుఁడు - వర్షాధిపతి), సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు అనేవారు అతనిని పరిచరిస్తుంటారు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుదిండి, రూ.క్రతుభుక్కు.
ౙన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
క్రతుభుజః జ-పు, క్రతౌ భుజంత ఇతి క్రతుభుజః - యజ్ఞమందు భుజించువారు, భుజ పాలనభ్య వహారయోః.
నల్లచ్చిగాఁడు - (నల్ల=లచ్చనము+కాఁడు) 1.భరద్వాజపక్షి, 2.ఒక చిన్న పిట్ట.
నల్ల - నెత్తురు, వై.వి.1.నలుసు, 2.బొగ్గు, విణ.నలుపైనది.
నల - అరువది సంవత్సరములలో నొకటి, వై.వి.నల్ల.
ఏటిరింత - భరద్వాజపక్షి, రూ.ఏట్రింత. భరద్వాజ ముఖానందక రామ్|
ఏట్రింత - ఏటిరింత.
వ్యాఘ్రాటస్తు భరద్వాజః -
వ్యాఘ్రవ దటతీతి వ్యాఘ్రాటః, అట గతౌ. - పులివలె తిరుగునది.
వ్యాజిఘ్రన్నటతీతి వ్యాఘ్రాటః, ఘ్రాగంధోపాదానే. - ఆఘ్రాణించుచుఁ బోవునది.
భరద్వాజెన సృష్టః భరద్వాజః - భరద్వాజులచేత సృజింపఁబడినది. ఈ 2 భరద్వాజము, ఏట్రింత.
భారద్వాజీ తు సా వన్యా -
భరద్వాజ సృష్టత్వాత్ భారద్వాజీ, సీ. - భరద్వాజమునిచేఁ బుట్టింపఁబడినది. ఈ ఒకటి అడవిప్రత్తి.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
అహం క్రతు రహం యజ్ఞ స్ప్వధాహ మహమౌషధమ్|
మన్త్రోహ మహమేవాజ్య మహమగ్ని రహం హుతమ్|| – 16శ్లో
తా|| అగ్నిష్టోమాది శ్రౌతయజ్ఞము, పంచమహా యజ్ఞాది స్మార్తయజ్ఞము, పితృపిండ ప్రదానము, ఓషధులనుండి కలుగు అన్నము, దేవపితృ యజ్ఞములందు యజమాన పురోహితాదుల వాక్యరూపమగు మంత్రము, ఆజ్యాది సర్వహవిస్సులు, ఆహవనీయాది అగ్నులు, హవన కర్మము, ఇవన్నియు నేనే. - భగవద్గీత, రాజవిద్యారాజగుహ్యయోగము
ఉత్తరుఁడు - శ్రేష్టుడు, 1.శివుడు, 2.విష్ణువు, 3.విరటుని కొడుకు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్య సః కుబేరః - బేరషునఁగా శరీరము, కుత్సితమైన శరీరము గలవాఁడు.
ఇమ్ము దప్పువేళ నెమ్మెలెన్నియు మాని
కాల మొక్కరీతి గడపవలయు
విజయు డిమ్ము దప్పి విరటుని గొల్వడా విశ్వ.
తా. చెడ్దకాలము(ఇమ్ముదప్పు - (ఇమ్ము+తప్పు) ఇక్కట్టు సంకటము.)వచ్చినప్పుడు భోగము లన్నియు వదలుకొని సామాన్యముగ కాలము గదుపవలయును. (విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.)రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో జేరెను గదా!
ఉదీచి - ఉత్తర దిక్కు; డాకడ - ఎడమ వైపు, ఉత్తరదిక్కు(డా - ఎడమ)ఉత్తరతి మేర్వాదిభ్య ఇత్యుత్తరా. తౄ ప్లవన తరణయోః - మేర్వాదులను (మేరు పర్వతములను) దాఁటియుండునది.
వామము - ధనము, విణ. 1.ఎడమ, 2.సుందరము, 3.హ్రస్వము.
దా - 1.ఎడము, 2.సవ్యము, డా యొక్క రూపాంతరము (దాపల - డాపల)క్రి. రమ్ము.
ఎడము - 1.చోటు, తావు, 2.అవకాశము, 3.నడిమిభాగము.
సవ్యము - 1.ఎడమ, 2.కుడి, 3.ప్రతికూలము.
ఎడమ - సవ్యము, వ్యతి.కుడి, వి.వాసుభాగము.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము వలపల.
అపసవ్యము - 1.ప్రతికూలము, కుడిభాగము.
వామౌ వల్గు ప్రతీపా ద్వౌ - వామశబ్దము మనోహరమైనదానికిని, ప్రతికూలమైనదానికిని పేరు. వాయతే వమ్యత ఇతిచ వామః, వా గతి గంధనయోః, టు వము ఉద్గిరనే. - పొందఁబడునది; విడువఁబడునదియును గనుక వామము. "వామ పుంసి హరే క్లీబం ద్రవినే స్త్రీతు యోషితి, వామీ సృగాలీ బడబా రాసభీ కరభీషుచే"తి శేషః.
కూబరము - మనోజ్ఞము, సుందరము, సం.వి.1.బొండినొగ, 2.మోచేయి.
హ్రస్వము - కురుచ, పొట్టి.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
ఖర్వము - 1.ఒక సంఖ్య (10,000,000,000), 2.కుబేరుని నిధులలో ఒకటి, విణ.1.అధమము, 2.పొట్టిది, 3.స్వల్పము.
అథ వామనే,
న్య ఙ్నీ చ ఖర్వ హ్రస్వా స్స్యుః -
వామో వల్గుత్వ మస్యాస్తీతి వామనః - ఒప్పిదము గలది.
నిమ్నమంచతీతి న్యఙ్. చ. నీచశ్చ. అఞ్చుగతిపూజనయోః - దిగువఁబొందునది.
ఖర్వత్యవయ పదార్ద్యేనేతి ఖర్వ గర్వ దర్పే. - అవయవ దార్ఢ్యముచేత గర్వించునది.
హ్రసతీతి హ్రస్వః. హ్రస హ్రాసే. - కొంచెమై యుండునది. ఈ 4 కుఱుచైనదాని పేర్లు.
అధమము - తక్కువైనది, నీచము.
హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).
నిమ్నం గభీరం గమ్భీరమ్ :
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.
నిమ్నము - పల్లము. విణ.లోతైనది, (విణ.) అధస్థ్సితము(Inferior).
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము.
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
హ్రస్వము - మిక్కిలి పొట్టిది.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
స్వల్పము - మిక్కిలి అల్పము.
హ్రస్వదృష్టి - (భౌతి.) దగ్గరనున్న వస్తువులే కనిపించుదృష్తి (Short-sight) దూరపు వస్తువులు సరిగా కనిపించక పోవుట.
హీనాంగా నతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయౌధి కాన్ |
రూపద్రవ్య విహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షి పేత్ ||
తా. కుఱచగల నిడుపులైన చేతులు, కాళ్ళు మొదలయిన అవయములుగల వారలను, విద్యావిహీనులను, వయసుచేత పెద్దనైన వారలను, సౌందర్యము(చక్కదనము), ద్రవ్యము - ధనము, వస్తువు), జాతి వీనిచే(హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.)దక్కువైన వారలను ఆక్షేపింపఁగూడదు. – నీతిశాస్త్రము
ఉత్తరధ్రువము - (భూగో.) భూమధ్య రేఖకు 90 డిగ్రీల దూరమున నున్న బిందువు (North pole).
సుమేరుజ్యోతి - (భూగో.) ఉత్తర ధ్రువమువద్ద కనిపించు ఎఱ్ఱని ఉషః కిరణములు.
సుమేరువు - మేరుపర్వతము, వ్యు.శిఖరములచే నక్షత్రాదులను వహించునది.
మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుండెడి మణి, 3.హార మధ్యమునందు వ్రేలెడు మణి.
కనకాచలము - బంగారుకొండ, మేరువు.
ధ్రువనక్షత్రము - ఉత్తరదిక్కులో నుండు నక్షత్రము (Pole star).
ధ్రువుఁడు - 1.ఉత్తానపాదుని కొడుకు, 2.విష్ణువు, 3.శివుడు.
ఔత్తానపాది - ధ్రువుడు, వ్యు.ఉత్తానపాదుని కొడుకు.
ఔత్తరాహుఁడు - ఉత్తరదేశపువాడు.
ఔత్తరేయుఁడు - పరీక్షిన్మహారాజు.
ధ్రువ ఔత్తానపాదిః స్యాత్ :
ధ్రువతీతి ధ్రువః, ధ్రువస్థైర్యే - స్థిరమైనవాడు.
ఉత్తానపాదస్య అపత్యం ఔత్తానపాదిః - ఉత్తానపాదుని కొడుకు. ఈ రెండు2 ధ్రువుని పేర్లు.
కారణమైన కర్మములుకాక దిగంబడ వెన్నిగొందులన్
మాఱిన నెంతవారలకుఁ, దొల్లిపరీక్షిఁతు శాపభీతుఁడై
వారధినొప్పు నుప్పరిగపైఁ బదిలంబుగ దాగియుండినన్
గ్రూరభుజంగదంతహతిగూలఁడె లోకులెరుంగ, భాస్కరా.
తా. పూర్వము పరీక్షిన్మహారాజు మునిశాపముచే తనకు కీడుకల్గునని తలంచి సముద్రమందు మేడను నిర్మింపజేసి అందు దాగియుండినను, విధివిధానము యెవ్వరికిని నతిక్రమింప వీలు కానిదగుటచే నతడు తుదకు (భుజంగమము - పాము, వ్యు.భుజముతో పాకిపోవునది.) పాము కాటుచే మరణించెను. ఎంత గొప్పవాడైనను దైవ విధానమునకు ప్రతి విధానము చేసి ఆ యాపదలను తొలగించుకొంద మన్నను, నవి యపాధ్యములు గాక, సాధ్యములగునా?
ఉదీచ్యము - 1.ఉత్తర దిక్కున ఉన్నది, 2.ఉత్తర కాలమున ఉన్నది, వి.1.శరావతీ నదికి వాయవ్యమున ఉన్న దేశము, 2.కురువేరు.
ఉదక్ ఉత్తరస్యాం భవం ఉదీచీనం - ఉత్తరదిక్కునఁ బుట్టినది.
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.
హ్రీబేరము - కురువేరు. హ్రీ - సిగ్గు.
కేశము - 1.తలవెండ్రుక, 2.కురువేరు.
శిరోజము - తలవెండ్రుక; శిరోరుహము - తలవెండ్రుక.
వెండ్రుక - కేశము, రూ.వెంట్రుక. తలవెండ్రుకలు పెరిగినకొలది తలచిన్నదియే.
కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు - చంద్రుడు Moon.
సార్వభౌమము - ఉత్తర దిక్కున నుండు ఏనుగు.
సర్వభూమ్యాం విదితః సార్వభౌమః - సమస్త భూమి యందు నెఱుఁగఁ బడునది.
అంగన - 1.ఉత్తర దిక్కునందలి సార్వభౌమము అను దిగ్గజము యొక్క భార్య, 2. స్త్రీ(స్త్రీ - ఆడుది).
ప్రశస్తాన్యంగా న్యస్యా ఇతి అంగనా - మంచి అవయవములు గలది.
కరము1 - 1.చేయి, 2.కిరణము, 3.తొండము, 4.కప్పము.
కరము2 - మిక్కిలి, కడు, అత్యంతము.
అంగననమ్మరాదు తన యంకెకురాని మహాబలాఁఢ్యు వే
భంగులమాయలొడ్డి చెఱుపం దలపెట్టు, వివేకియైన సా
రంగధరుం బదంబులుఁ గరంబులఁ గోయగ జేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడవరాని కుయుక్తము లుఁబన్ని, భాస్కరా.
తా. భాస్కరా ! పూర్వము చిత్రాంగి యను నామె తన కామోద్రేకముచే బుద్ధి మంతుడ(వివేకము - జ్ఞానము, విచారము.)మగు సారంగధరుని తన కామము తీర్చుమని కోరగా, నత డందులకు నిరాకరించగా, నామె యెన్నో(చెప్పరాని)దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు(కాళ్ళు చేతులు)ఖండింప జేసెను, స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపని వాడెంత బలాఢ్యుడైనను వానిని పాడుచేయుట తలపెట్టు- క్రి.1.ఆరంభించు, 2.ప్రస్తావించు.)దురు, కాన, స్త్రీలను నమ్మరాదు.
కేదారము - 1.వరిమడి, 2.కొండ, 3.కేదార ఘట్టము(కాశీలో నొక పుణ్య స్థలము) 4.పాదు, 5.శివలింగ భేదము. కేదారపీఠము నందు దేవిస్థానం సన్మార్గదాయిని|
క్షేత్రము - 1.వరిమడి, 2.భూమి, 3.శరీరము, దేహము 4.భార్య, (భౌతి.) అయస్కాంతము చుట్టు అయస్కాంత శక్తి ప్రసించు ప్రదేశము (Field) (గణి.) కొన్ని రేఖల మధ్యనున్న ప్రదేశము (Figure) (భౌతి. గణి) కొన్ని రేఖల మధ్యనున్న క్షేత్రము (Figure) (భౌమి) బలములు (Forces) పనిచేయుచున్న ఆకాశభాగము (చోటు, Field).
క్షేత్రజ్ఞుఁడు - 1.జీవుడు, 2.పరమాత్మ.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. (Jupiter)
జీవితేశుఁడు - 1.ప్రాణనాథుడు, 2.యముడు.
క్షత్త్రము - 1.క్షత్త్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
క్షత్త్రియాణి - క్షత్త్రియ స్త్రీ, రూ.క్షత్త్రియ, క్షత్త్రియిక.
క్షత్త్రియి - క్షత్త్రియుని భార్య.
వలజము - 1.వరిమడి(వరి - వడ్లు, శాలిధాన్యము), 2.పైరు(సస్యము), 3.యుద్ధము, 4.పుర ద్వారము.
కొండ - మల, పర్వతము; మల - పర్వతము, మలైః.
పాదు - 1.కుదురు, ఆలవాలము 2.నిలకడ 3.ఆశ్రయము, సం. పాదః పదమ్.
ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక -
వ్యాసాదిభాగవత పుంగవహృన్నివాస!
భక్తానురక్త పరిపాలన పారిజాత!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
No comments:
Post a Comment