చిత్త 2, స్వాతి 4, విశాఖ 3 పాదములు తులారాశి (త్రాసు).
తులా వృషభ రాశీశో దుర్ధరో ధర్మపాలకః,
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశ విమోచకః. – శుక్రుడు (Venus)
వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ. వి, సం. క్రాంతిః.
క్రాంతి - 1.ఆక్రమణము, 2.తిరుగుట, 3.అడుగిడుట, 4.మీరుట, 5.సూర్యమార్గము, 6.రేఖ.
క్రాంతివృత్తము - సంవత్సరమున కొకసారి సూర్యుడు ఆకాశమందు ప్రయాణము చేయు వలయాకార మార్గము.
సూర్యదృశ్యగతి - (భూగో.) సూర్యుడు పోవుచునట్లు కనబడు మార్గము.
రేఖ - 1.దగ్గరదగ్గరగా నున్న వృక్షాదుల పంక్తి, 2.పాణి పాదతలము లందలి గీర, గీర, (గణి.) స్థితి, పొడవుమాత్రము కల్గి వెడల్పుమందములేని ఆకృతి (line) పొడవు కలిగి మందము వెడల్పు లేనిది, (Curve). రాజి - 1.పంక్తి, 2.రేఖ.
(ౘ)చాఱ - గీర, రేఖ, రూ.చారిక.
చాఱిక - చాఱ.
గీటు1 - గీత, రేఖ.
గీత - (వేదా.) అధ్యాత్మిక తత్త్వ విషయమై ప్రశ్నోత్తరమున ఉండు గ్రంథము, ఉదా.భగవత్గీత, రామగీత మొ.వి. వి.రేఖ.
భగవద్గీత - మహాభారతములోని అంతర్గ్భాగమైన వేదాంత గ్రంథము.
జీర - రేఖ, సం.చీరమ్.
గీటు2 - 1.అనాదరము, 2.ఉపేక్ష.
గీటునఁబుచ్చు - క్రి.1.అనాదరించు, తృణీకరించు, 2.పోగొట్టు.
తప్పఁజూచు - క్రి.1.అనాదరించు, 2.ఉపేక్షించు.
తృణీకరించు - క్రి.అలక్షముచేయు.
అవమతి - 1.అవమానము, 2.తిరస్కారము, 3.అనాదరము.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.
కన్నడ - 1.ఉపేక్ష, 2.రాగములలో ఒకటి.
కన్నడము - 1.కర్ణాటదేశము, 2.కర్ణాటభాష.
కన్నడీఁడు - (కన్నడ+ఈడు) ఉపేక్షించువాడు, వి.(కన్నడము+ఈఁడు) కన్నడదేశపువాడు.
ఉపేక్ష - 1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము.
అశ్రద్ధ - 1.ఆసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి, (కడపటి రెండర్థములు ను తెనుగునందు మాత్రమే గలవు).
అసడ్డ - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
నిర్లక్ష్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దై వా ధీ న మై న ది(Casual), వి.అశ్రద్ధ.
ఒప్పరికము - ఉపేక్ష, ఒప్పరికించు విధము.
ఔదాసీన్యము - ఉపేక్షగా నుండుట, మిత్రశత్రు భావములు లేకుండుట.
స్వాతి వాన(వర్షం) - Rain that falls in Swati (about october) గంగానది ఉదకమువలె నిర్మలముగను సమస్త ప్రాణులకు హితవుగ నుండును. ఆరోగ్యము నిచ్చును.
చిత్త చిత్తగించి స్వాతి చల్లచేసి విశాఖ విసిరికొడితే చేనుకంకిలో కావలినన్ని ధాన్యము పండును.
శరత్తు - 1.ఒక ఋతువు(ఆశ్వయుజ కార్తీక మాసములు) వెన్నెలకాలము, 2.సంవత్సరము, రూ.శరద.
శారదము - సంవత్సరము, విణ.శరత్కాలమున బుట్టినది.
సంవత్సరము - ఏడు; ఏఁడాది - సంవత్సరము.
ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
ఎవ్వడు - ఎవడు; ఏవాఁడు - ఎవ్వడు.
సమ - సంవత్సరము.
శరత్ దారువు - (వృక్ష.) కాండములో శరత్కాలమున ఉత్పత్తియైన దారువు, (Autumn wood).
శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయి మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీకాళస్తీశ్వరా!
తా|| సంపదలనెడి మెఱుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన, పాపములనెడి నీటిధారలచేత నామనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయయను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటచే కాదు సర్వసమృద్ధులు గలవాడనై నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతము లగును.)
శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః|
భ్రష్టానామివ చేతాంసి పునర్యోగనిషేవయా |
శారద - 1.సరస్వతి, 2.పార్వతి. శివసన్నిధిని దేవీస్థానం పార్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది. బ్రహ్మ ముఖములందు సరస్వతి. సరస్వతి యందు దేవమాత.
శారదా శబ్దనిలయా సాగరా సరిదంబరా|
శుద్ధా శుద్ధతను స్సాధ్వీ శివధ్యానపరాయణా||
దశరా - 1.దశరాత్రము, 2.దేవీ నవరాత్రము, సం.దశరాత్రమ్.
విజయదశమి - ఆయుధములు పూజించెడు ఆశ్వయుజ శుద్ధదశమి.
మహాలయము - మహాలయామావాస్య. మహాలయము నందు దేవీస్థానం మహాభాగ.
విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ సంవత్సరము.
గౌరి - దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి.
గయిరమ్మ - పార్వతి, రూ.గౌరమ్మ, గవురమ్మ, సం.గౌరంబా.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి. శివసన్నిధిని దేవీస్థానం పార్వతి.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు. కాలంజరము నందు దేవీస్థానం కాళి.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
శరజ్జ్యోత్స్నాశుద్ధాం - శశియుత జటాజూటమకుటాం
వరస్త్రాసత్రాణ - స్ఫటికఘు(ఘ)టికా పుస్తకకరామ్,
సకృన్నత్వా న త్వా - కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా - మధురిమధురీణాః ఫణితయః. - 15శ్లో
తా. శరత్కాల చంద్రికవలె శుభ్రమై చంద్రునితో గూడిన జడల ముడి శిరస్సున(జటాజూటరూప కిరీటంతో), హస్తాలలో వర అభయ ముద్రలను దాల్చి, స్ఫటిక మణిమాల పుస్తకములు ధరించిన నిన్ను, ఒక్కసారి యైనను నమస్కరింపని యెడల(ప్రణమిల్లకపోతే) - మధు క్షీర, ద్రాక్షా సదృశ్యమైన మధుర వచనాలు సత్పురుషుల(కవులకు) ఎలా సిద్ధిస్తాయి తల్లీ! - సౌందర్యలహరి
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరఛ్ఛంద్రనిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా. - 43శ్లో
కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందురుమామ - చంద్రుడు, చందమామ.
చంద్రము - చందురము, సం.చంద్రః.
(ౙ)జాబిల్లి - చందమామ, రూ.జాబిల్లి.
జాబిలితాలుపు - శివుడు, చంద్రధరుడు.
జాబిలిమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
వనచంద్రికా న్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెల యనురీతి, నిష్ప్రయోజన మని యర్థము).
దృశా ద్రాఘ్రీయస్యా - దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం - స్నపయ కృపయా మామపి శివే!
అనేనా యం ధన్యో - భవతి నచ తే హానిరియతా
వనే వా హర్మ్యో వా - సమకరనిపాతో హిమకరః. - 57శ్లో
తా. తల్లీ! పార్వతీదేవీ! మిగుల దీర్ఘమైన(పొడవైనదియు) కొంచెము వికసించిన నల్లకలువల కాంతివంటి, కాంతి గలిగిన నీ కడగంటి చూపులోని కృపారసముచేత - కడు దూరమున నున్న దీనుడనగు నా యందు, దయతో నీ చూపును పడనిమ్ము. ఈ మాత్రము చేత నేను ధన్యుడనగు దును. ఇందుచే నీకేవిధమైన నష్టము లేదు. శీతకిరణుడైన చంద్రుడు వనమున గాని, మేడలపైగాని తన కిరణములను సమానము గనే ప్రసరింపజేయుచున్నాడు కదా! - సౌందర్యలహరి
హరిచందనము - 1.చెందిరము, 2.వెన్నెల, 3.కల్పవృక్షము.
చెందిరము - 1.సింధూరము, 2.కుంకుమ, రూ.చెంద్రము, చందురము.
సిందురము - 1.సిందూరము, 2.కుంకుమ, 3.వావిలిచెట్టు, సం.సిందూరమ్.
సిందూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
కాంతరజము - కుంకుమము. చెంద్రము - చెందిరము.
శ్రీచూర్ణము - తిరుచూర్ణము.
తిరుచూర్ణము - ఎఱ్ఱబొట్టుపొడి.
గాంధారము - 1.(సంగీ.) ఒకవిధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార్ అను ఒకానొక దేశము.
మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.
చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక. హరిశ్చంద్రము నందు దేవీస్థానం చంద్రిక.
వెన్నెల - (వెలి+నెల), చంద్రిక.
చెంద్రిక - చెందిరిక.
చంద్రశాల - 1.పైమేడ, 2.వెన్నెల; ఓవరి - 1.లోపలిగది, 2.చంద్రశాల.
శిరోగృహము - చంద్రశాల.
చంద్రతాపము - వెన్నెల; చాంద్రి - వెన్నెల; నెలవెలుగు - వెన్నెల.
చన్ద్రికా కౌముదీ జ్యోత్స్నా -
చంద్రో స్త్యస్యామితి చంద్రికా - చంద్రయుక్తమైనది.
కు ముదానా మియం కౌముదీ, తద్వికాస హేతుత్వాత్ - కలువలు పుష్పించుటకు హేతువైనది గనుక కౌముది.
జ్యోతి రస్యామస్తీతి జ్యోత్స్నా - ప్రకాశము గలిగినది. ఈ మూడు వెన్నెల పేర్లు.
కౌముది - 1.వెన్నెల, వ్యు.కుముదములను వికసింపజేయునది, భూజాను(భూజాని - 1.విష్ణువు, 2.రాజు)లను సంతోషపెట్టునది, 2.ఉత్సవము, పండుగ, 3.కార్తీక పూర్ణిమ.
కౌమోదకి - విష్ణుమూర్తి గద.
కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.
కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము, చంద్రుడు Moon.
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. - 157శ్లో
ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
జీవో వినయితాసాక్షీ ముకుందో(అ)మిత విక్రమః
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. - 55శ్లో
జ్యోత్స్న - వెన్నెలరేయి, రూ.జ్యోత్స్ని.
జ్యోత్స్ని- వెన్నెలరేయి. చంద్రుడికి వెన్నెలకి అభేదము
వెన్నెలగతి - చంద్రుడు; చంద్రుడు - నెల, చందమామ.
స్మితజ్యోత్స్నా జాలం - తవ వదనచన్ద్రస్య పిబతాం
చకోరాణా మాసీ - దతిరసతయా చంచుజడిమా, |
అత స్తే శీతాంశో - రమృతలహరీ మామ్లరుచయః
పిబన్తి స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజిక ధియా || - 63శ్లో
తా. అమ్మా! ఓ భగవతీ, అతిమధురమైన నీ ముఖచంద్రబింబ మందస్మితము(చిఱునవ్వు-స్మితము)వనెడి వెన్నెలను గ్రోలుతున్న(త్రాగుచున్న)చకోరపక్షుల నాలుకలు మొద్దుబారినవైనవి. చకోరములకు మిక్కుటమగు తీపిని ఆస్వాదించుటచే ముక్కులు రుచి నెఱుగ జాలకున్నవి. అందువల్ల నా పక్షులు తమ జిహ్వలు తిరిగి రుచిని పొందుటకై పులుపును గోరినవై అవి ప్రతి రాత్రులయందును స్వేచ్ఛగ, చంద్రుడి అమృతపు వెల్లువను, అన్నపు గంజి అనేభ్రాంతితో త్రాగుచున్నవి. - సౌందర్యలహరి
రాకామలజ్యోత్స్న ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ...
తుల - 1.త్రాసు, 2.పోలిక, 3.రాసులలో ఒకటి.
త్రాసు - తరాసు, తరాజు. రాజు గాని రాజు - తరాజు.
తరాజు - తూచెడి సాధనము, రూ.తరాసు, త్రాసు.
తులలేని ధనము చేతుల తూగనది ఏది? – తుల
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
ఉపమానము - పోలిక, దేనితోపోలచుచున్నామో అది. అపకృతము (చంద్రుడు మొ.వి.), రూ.ఉపమితి.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
తౌల్యము - సామ్యము, పోలిక. సాధర్మ్యము - పోలిక.
పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు - 1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి - 1.మిత్రభావము, స్నేహము, 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity).
పొందుకాఁడు - స్నేహితుడు.
స్నేహితుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు.
అంతరంగుడు - స్నేహితుడు.
అనుకారము - పోలిక, అనుకరణము, రూ.అనుకృతి.
అనుకృతి - అనుకారము.
అనుకరణము - 1.ఇతరులు చేసినట్లు చేయుట, 2.ధ్వన్యాదులను అనుకరించు నపుడు వాడుపదము, (పెళపెళ, పటపట మొ.వి.)
అనుకరించు - క్రి. ఇతరులు చేసినట్లు చేయు.
అనుకరిం(ౘ)చుట - ఒకరు చేసినట్లు చేయుట.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
సామాన్యము - సామ్యము, విణ.సాధారణము, (గణి.) కొన్ని రాసులన్ని టికి సంబంధించినది (Common).
సామాన్య(పు)త్రాసు - (భౌతి.) దండముచే చేయబడి సామాన్యముగా వాడుకలో నున్న త్రాసు (Common balance).
తరము - 1.పురుషాంతరము, 2.మానము, 3.సామ్యము, 4.వరుస, 5.దినుసు, 6.శక్యము, సం.అంతరమ్, సం.వి.దాటుట.
తరగతి - నిర్ణయించిన పద్ధతి, ప్రమాణము, తరమును తెలుపు భాగము.
తరణము - 1.దాటుట, 2.తరించుట.
తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.
మానము - 1.త్రాసు, 2.కొలది, (ఇది త్రివిధము: తులామానము. అంగుళీమానము, ప్రస్థమానము). 2.చిత్తౌన్నత్యము, 3.గర్వము, 4.స్త్రీలకు పురుషుల యెడ కలుగు కోపము, 5.(గణి.) 1.కొలత, 2.స్కేల్, కొలబద్ద (Measure) 3.రాసుల పరిమాణములను కొలుచు పద్ధతి.
తూనిక - 1.తూచుట, 2.పోలిక(పోలిక - సామ్యము), 3.బలము.
తూకము - 1.తూనిక, 2.పూనిక, రూ.తూకు.
పూనిక - 1.యత్నము, 2.సన్నాహము, 3.పట్టుదల.
తూఁచు - తూనికవేయు; తూనికవేయు - తూచు.
తూకు - 1.ప్రమాణము, కొలది, 2.బరువు.
సరితూఁగు - క్రి. సమానమగు.
సరిపోవు - 1.సమానమగు, 2.సమాధానమగు, 3.అయిపోవు, 4.నశించు.
మొగ్గు - గౌరవము, క్రి.బరువు వైపు వంగు.
అలవి - 1.కొలది, పరిమితి, 2.సామర్థ్యము, 3.విధము, విణ.శక్యము.
కొలఁది - 1.పరిమితి, 2.బలము, 3.స్థితి, 4.విధము, విణ.1.పరిమాణము కలది, 2.సమానమైనది, 3.అల్పము, 4.శక్యము.
కొద్ది - 1.పరిమితి, 2.శక్తి, విణ.1.అల్పము, 2.ప్రమాణము కలది, ఉదా.పిండికొద్ది రొట్టె, రూ.కొలఁది, కొల్ది.
సామర్థ్యము - 1.నేర్పు, 2.యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు (Power), (గృహ.) బలము, సత్తువ.
బలము - సత్తువ, సైన్యము. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
విధము - ప్రకారము, విధి. శక్యము - సాధ్యము, అలవి.
అలఁతి - 1.సూక్ష్మము, 2.పలుచనిది, 3.అల్పుడు, 4.శక్యము, వి.1.అల్పయత్నము, 2.పరిమితి, కొలది.
విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
మన్మథుడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మైవడి - 1.విధము, 2.సమ్మతి, 3.సౌమ్యత.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా. అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
వేళ - సమయము, కాలము.
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
విధానము - 1.చేయుట, 2.ఆజ్ఞ.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము. శుభము - మంగళము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
అలక1 - విణ. సూక్ష్మము, పలుచనిది.
అలక2 - (అలకము - అలకి2) నెరికురులు, ముంగురులు (ఇది. ని. బహు.) 2.కుబేరుని పట్టణము.
అలకన - సూక్ష్మత, విణ.సూక్ష్మము.
సూక్ష్మగ్రాహకము - (భౌతి, రసా.) బయటి ప్రభావములకు చురుకుగా, నిశిరముగా ప్రతీకరించునది, (Sensitive).
సూక్ష్మగ్రాహ్య(హి)త - (భౌతి.) ఎంత చిన్న విషయములనైన తెలిసి కొనుట (Sensibility).
సున్నితపు త్రాసు - (భౌతి.) ప్రయోగశాలలో ఉపయోగించెడి సున్నితమైన త్రాసు, (Physical balance).
సున్నితము - 1.మిక్కిలి కోమలమైనది, 2.కచ్చితము, సం.సునిహితము.
కచ్ఛితము - పూర్తిగా సరియైనది, (Exact).
వర్ష్మము - 1.శరీరము, 2.మిక్కిలి చక్కని రూపము, 3.కొలత.
శరీరము - దేహము. దేహము - శరీరము, మేను.
మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.
కొలత - 1.కొలుచుట, 2.పరిమాణము, (గణి.) ఒక వస్తువు పొడవు, వెడల్పు, ఎత్తు, మొ.వి కొలత 2.రాశిపరిమాణము(Measurement). సమ్మితము - 1.సమానము, 2.సమానమైన పరిమితి గలది.
ప్రమాణము - 1.ప్రత్యక్షాది జ్ఞానకారణము, 2.సత్యము, 3.మేర, 4.కొలత, 5.శాస్త్రము, వి. (భౌతి.) కొలతకు ఆధారమగునది (Standard), ఉదా. సెవర్స్ లో సంరక్షింపబడుచున్న మీటర్ దండము తక్కిన ప్రపంచములో వాడుకలోనున్న మీటర్ బద్దలకు ప్రమాణము, వి (గణి.) ఏంకాంకము. కొలతల కుపయోగించు మూలప్రమాణము (Unit).
ప్రమాణములు - నియమిత పద్ధతులు (Norms).
ప్రమాణీకృతము - (భౌతి.) ప్రమాణముగా చేయబడినది(Standardised).
సమతులితాహారము - (గృహ.) సక్రమాహారము, ఉచితాహారము, శరీరము పెరుగుటకు తగు ఆహారపదార్థము, మిశ్రాహారము (Balanced diet).
సమతులితము - (గృహ.) సరిసమానమైనది, చలించనిది, నిర్మలమైనది, నిదానము గలది, (Balanced) సం.వి. (రసా,) రెండువైపుల సమాన భావము గలది (Counterporsid).
సమానము - (సజాతీయము) (గణి.) ఒకే జాతికి సంబంధించినది, ఒకే ఘాతసంఖ్యకలిగినది (Like), వై.వి. సమ్మతి, సం.వి. నాభియందలి వాయువు, విణ.తుల్యము.
తుల్యము - సమానము, సాటి.
ఈలువు - 1.మంచినడవడిక, 2.మానము, 3.పాతివ్రత్యము.
ఈలపుటాలు - 1.మంచినడవడికగల స్త్రీ, 2.పతివ్రత(పతివ్రత - సాధ్వి).
ప్రతిష్ఠ - 1.గౌరవము, 2.చోటు, వి.(గృహ.) 1.గౌరవము (Prestige), 2.మానము, 3.ప్రతిభ, వి.(వాణి.) ప్రజల దృష్టిలో ఒక వ్యాపార సంస్థకు గల ఖ్యాతి (status). ఆ సంస్థయొక్క లాభములు దీనిపై చాలవరకు ఆధారపడి యుండును. కనుక దాని మిగత ఆస్తులతో పాటు దీనిని కూడ లెక్క చూచుకొనుట పరిపాటియైనది.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పతనము, 3.మన్నన.
మర్యాద - 1.కట్టుబాటు, 2.తీరము, 3.సమ్మనము.
మన్నన - సమ్మానము, గౌరవము, సం.మాననమ్.
సన్మానము - గౌరవము, రూ.సమ్మానము.
సమ్మనము - గౌరవము, సత్కారము.
సత్కారము - సమ్మానము, రూ.సత్కృతి, సత్ర్కియ.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
ఇరువు - చోటు, స్థానము, విణ.స్థిరము.
ప్రతిభ - అప్పటికప్పుడు వికసించు బుద్ధి; అపారప్రజ్ఞ - ప్రతిభ, మహాబుద్ధి కుశలత (Genius).
ప్రతిభా విశేషము - (గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).
విత్తం బంధు ర్వయః కర్మ విద్యా భవతివఞ్చమీ|
ఏతాని మాన్యస్థానాని గరీయా యద్యదుత్తరం||
తా. ధనము, బంధుత్వము, వయస్సు, కర్మ, విద్య, ఈ యైదును సన్మానింపదగిన స్థానములు. ఇందు ముందు చెప్పబడిన దానికంటె వెనుక చెప్పబడిన శ్రేష్ఠ స్థానములు. అది ఎట్లనిన, ధనికునికంటె బంధువు శ్రేష్ఠుడు, బంధువులకంటె వయోధికుడు శ్రేష్ఠుడు, వయోధికునికంటె (ను)ఉత్తమ క్రియావంతుఁడు ముఖ్యుఁడు, వీనికంటె విద్యావంతుఁడు మిక్కిలి శ్రేష్ఠుడు. - నీతిశాస్త్రము
ఇతరులకు కష్టసాధ్యమైనదాన్ని సులభంగా చేయడం విద్య. విద్యకు అసాధ్యమైన దాన్ని చేయడం ప్రతిభ. - ఏమియర్.
వన్నెమైఁ పైడిఁమలఁ దూఁగు వనితకు తులారాశి.....
పొన్నుగట్టు - (పొన్ను+గట్టు) మేరుగిరి.
పొన్ను - 1.బంగారు, 2.కట్టుగావేయు లోహవలయము.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పయిఁడి - బంగారు.
పసిఁడి - 1.బంగారు, 2.ధనము.
తులకింపు - 1.ప్రకాశము, 2.కుతూహలము.
తులకింపు - క్రి. 1.ప్రకాశించు, 2.కుతూహలపడు.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.
ఆభ - 1.కాంతి, వెలుగు, 2.పోలిక.
ఇద్దము - 1.పరిశుద్ధము, 2.కాంతిమంతము, 3.కాల్పబడినది, 4.అడ్డులేనిది, వి.1.ఎండ, 2.ప్రకాశము, 3.ఆశ్చర్యము.
నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.
కుతూహలము - 1.కోరిక, 2.ఆనందము, 3.నాయికకు మనోజ్ఞమైన వస్తువును చూచుటయందుగల లోలత్వము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము. ఇచ్ఛ - అభిలాష, కోరిక.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము.
ఆనందము - సంతోషము, సుఖము. సౌఖ్యము - సుఖము.
కలికి - 1.ఆడుది, 2.మనోజ్ఞురాలగు స్త్రీ, విణ.మనోజ్ఞము.
పొన్నారి - మనోజ్ఞము.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సు కింపైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
చిన్నిదము - 1.చిన్నపువ్వు, 2.బంగారు.
చిన్నిపువు - 1.నమస్కృతి, 2.భూషావిశేషము, రూ.చిన్నపువ్వు.
సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచి వర్ణము కలది.
బిస్తము - మాడ(మాడ - అరవరా, పదిరూకలు), సువర్ణము.
తపనీయము - బంగారు. ఔజనము - బంగారు.
శాతకుంభము - బంగారు, వ్యు.శతకుంభ పర్వతమున పుట్టినది.
సువర్ణబిస్తా హేమ్నో క్షే :
సువర్ణమత్రాస్తీతి సువర్ణః - సువర్ణము దీనియందుఁ గలదు.
బిస్యతి తులాకోటిం నీచైః ప్రేరయతీతి బిస్తః బిసప్రేరణే - త్రాసును క్రిందికి వంచునది. పా. విస్తః. అక్షమెత్తు బంగారు పేర్లు.
మొగ్గు - గౌరవము, క్రి.బరువు వైపు వంగు.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృత్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచెష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
దేహము - శరీరము, మేను; శరీరము - దేహము.
దేహి - దేహము గలవాడు. శరీరి - ప్రాణి.
ఇంగితము - 1.హృ ద్గ తా భి ప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విణ.కదలినది.
అనుభావము - 1.ప్రభావము, 2.ప్రతాపము, 3.భావమును తెలిపెడి ముఖవికాసాది.
సదృశ్యము - (గణి.) అనురూపము, సం.విణ. సమానము, తగినది, (Corresponding).
అనురూపము - 1.తగినది, 2.అనుగుణము, 3.సాటియైనది, 4.(గణి.) ఒక దాని కొకటి అనుగుణముగా నున్నది, అనుగుణ్యము కలది, (Corresponding).
అనుగుణము - 1.సమానగుణము కలది, 2.అనుకూలమైనది, తగినది. యోగ్యము - 1.తగినది, 2.నేర్పుగలది.
అందము - 1.సౌందర్యము, 2.అలంకారము, 3.విధము, విణ.చక్కనిది, 2.తగినది.
పొంకము - 1.పొందిక, 2.సౌందర్యము. సౌందర్యము - చక్కదనము. సోయగము - చక్కదనము. ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
కోమలికము - చక్కదనము.
కోమలి - చక్కదనము గల స్త్రీ.
ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.
మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింపచేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉప్మాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
సింగారము - శృంగారము, అలంకారము, సం.శృంగారః.
శృంగారము - 1.నవరసములలో నొకటి, 2.అలంకారము, వికృ.సింగారము.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది(శుభ్రము - 1.తెల్లనిది, 2.ప్రకాశించునది), 3.అడ్డులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
ప్రతిభా విశేషము - (గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).
బాలెన్సు - (Balance)1.తుల, త్రాసు, తక్కెడ 2.శేషము, 3.మిగిలినది.
బ్యాలెన్సు - (అర్థ.) (Balance) అవశేషము, కాతానిల్వ జమాఖర్చుల తౌల్యానంతరమున కనబడు ఆస్తి లేక ఋణశేషము.
దూలము - 1.తుల, స్తంభపీఠము, 2.ఇంటికుగుజుల కాదరువుగా నమర్చు మ్రాను, తలాబి. (వ్యవ.) పెద్ద యినుప నాగలిలోని ఒక భాగము (Beam).
దంతియ - 1.మిద్దెటింటికి అడ్డముగా వేసెడుపట్టె, దూలము, 2.వ్యవసాయపు పనిముట్టు, చూ.దంతె, రూ.దంతె.
దంతెన - (వ్యవ.) నీరు పెట్టి గట్లు, మళ్ళు ఏర్పరుచుటకును మిక్కల మధ్యమట్టిని కదల్చుటకును ఉపయోగించు చేతి పనిముట్టు, రూ.దంతె, (Tooth harrow).
శేషము - మిగులు, (గణి.) ఒక రాశిని మరియొక రాశిచే భాగింపగా మిగులు రాశి. (Remainder) (రసా.) వడబోత కాగితముపై నిలిచి యుండు ఘన పదార్థము (Residue).
నిలువ - శేషము, రూ.నిల్వ. మిగత - శేషము; మివులు - మిగులు.
మిగులు - 1.అతిశయించు, 2.శేషించు, 3.మట్టుమీరు, రూ.మివులు. అవశిష్టము - మిగిలినది, వి.శేషము.
అవక్షేపము - 1.తప్పుపెట్టి త్రోసివేయుట, 2.నిందించుట, 3.ఎగతాళి సేయుట, (రసా.) రెండు పదార్థముల మధ్య జరుగు రాసాయనికమైన మార్పు ఫలితముగా ఏర్పడిన కరగనట్టి వేరొక పదార్థము (Residue).
ఏషణీ - 1.నారాచి, 2.త్రాసు, 3.వ్రణములోని చీము, మొ.ని పైకి తీయు సాధనము.
నారాజి - నరాజి, కత్తి, స.నారాచః.
నారసము - నారాచము, బాణము.
చీము - చెడి తెల్లనైన నెత్తురు, పూయము.
నారాచీ స్యాదేషణికా :
నారం నరసమూహ నుఞ్చతీతి నారాచీ. ఈ. సీ. అంచు గతిపూజనయోః - జన సమూహమును బొందునది.
ఇష్యతే వ్యవహారిజనైరితి ఏషణికా. ఇషు ఇచ్ఛాయాం. - బేరులచే నిచ్ఛయింపఁ బడునది. ఈ రెండు త్రాసు పేర్లు.
రాగసూత్రము - త్రాసు, త్రాడు.
త్రాసు - తరాసు, తరాజు.
ధటః - త్రాసు. వాని తలదీయ తక్కెడ జానుమీరు - తరాజు
త్రాడు - 1.పేనినదారము, 2.పాశము(పాశము - త్రాడు), 3.కిరణము, వెలుగు.
త్రాడుఁదాలుపు - వరుణుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.
నీటిఱేఁడు - 1.వరుణుడు, 2.సముద్రుడు.
తక్కెడ - త్రాసు, రూ.తక్కెడ, సం.త్ర్యంకటము్.
ఒకటి పట్టుకుంటే రెండు ఊగులాడతాయి. - త్రాసు
తక్కిడి - 1.మోసము, 2.త్రాసు రూ.తక్కెడ.
వంచన - మోసము. వంచకుఁడు - మోసకాడు.
వంచకము - నక్క, విణ.మొసము చేయునది.
భూరిమాయము - నక్క, వ్యు.పెక్కు మాయలు గలది.
మొసము - 1.దొంగతనము, 2.ప్రమాదము, 3.వంచన, సం.మోషః.
మొష - దొంగతనము. మొషకుఁడు - దొంగ.
ప్రమాదము - (గృహ.) హఠాత్తుగా కలిగిన కష్టము (Casuality).
ప్రగ్రహము - 1.చెరసాల, 2.త్రాసు, త్రాడు 3.పగ్గము.
కారాగారము - చెరసాల; బంధిఖానా - చెరసాల (బందిగము).
కార - చెరసాల, బంధనాలయము.
కృష్ణజన్మస్థానము - బంధనాలయము, చెరసాల, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన స్థలము.
చెఱ - 1.కారగృహము, 2.నిర్బంధము, సం.చారః.
బంది - నిర్భంధము, చెర, సం.బంధీ.
నిర్బంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
బంధకము - 1.చెరసాల, 2.మార్పు, 3.కుదువ, 4.ప్రతిజ్ఞ, 5.ఆనకట్ట.
కుశ - 1.త్రాడు, 2.గుఱ్ఱపు కళ్ళెము.
పగ్గము - పశువుల లాగిపట్టెడు త్రాడు, సం.ప్రగ్రహః.
కళ్ళెము - కళ్యము, నా. చిక్కుల గుఱ్ఱమునకు కక్కుల కళ్ళెము.
కళ్యము - గుఱ్ఱమునకు నోట దగిలించు కళ్ళెము, రూ.కళ్ళియము, కళ్ళెము, సం.ఖలీనః.
ఖలినము - గుఱ్ఱపు కళ్ళెము, రూ.ఖలీనము.
చుంబకము - 1.త్రాసుముల్లు, 2.సూదంటురాయి.
మొల - 1.కటి ప్రదేశము, 2.చీల, 3.త్రాసుముల్లు.
సూదంటురాయి - అయస్కాంతము.
అయస్కాంతము - (భౌతి.) సూదంటురాయి, లోహమును ఆకర్షించునది (Magnet). అంటురాయి - సూదంటురాయి, అయస్కాంతము.
అయస్కాంతపు దిక్సూచి ఎల్లప్పుడు ఉత్తర దిశను చూపించడంవల్ల ఓడ దారి తప్పిపోకుండా ప్రయాణిస్తుంది. అలాగే మనిషి హృదయం భగవంతుని వైపు త్రిప్పబడి ఉన్నంతవరకు అతడు సంసార సాగరంలో దారి తప్పకుండా ముందుకు సాగిపోగలుగుతాడు. - శ్రీ రామకృష్ణ పరమహంస
కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూదిమొన, 5.కాకి, 6.తప్పు.
పత్రసూచి - ముల్లు; ముల్లు - ములు. ములు - 1.కంటకము, 2.త్రాసుముల్లు, 3.వరి, మొ.వానిముల్లు రూ.ముల్లు(బహు)ముళ్ళు.
రోమాచము - రోమములు గగుర్పొడుచుట, పులకరము.
పులకరము - 1.జ్వరము, 2.గగుర్పాటు, సం.పులకః.
గగ్గురుపాటు - రోమాంచము కలుగుట.
వెదురు - వేణువు, సం.వేణుకః.
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి. కరతలే వేణుమ్...
కంటకము2 - విరోధయుక్తి విణ.విరుద్ధము.
విరుద్ధము - విరోధము గలది.
విరోధము - పగ(పగ - విరోధము), ఎడబాటు.
విప్రపత్తి - 1.కలత, సంతాపము, 2.విరోధము.
కాకి - వాయసము; వాయసము - కాకి.
కాకాక్ష న్యాయము - కాకి చూపు ఏదేని ఒక ప్రక్కకు ఒరగుట.
ములుచూపు -1.అతిశయించు, 2.మీఱు, 3.త్రాసుముల్లు, బరువువైపు ఒరుగు.
మితిమీఱుట (హేతువు)కారణమగునా! కాలిలో ముల్లు గుచ్చుకొన్నదని చింతించవద్దు. కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. ముల్లుతీయుటకు ముల్లే ప్రయోగించ వలెను.
త్రాసులో ఎక్కువ బరువుగల పళ్ళెం క్రిందికి వంగి, తేలికైన పళ్ళెం పైకిలేస్తుంది. అలాగే నిపుణుడు, సమర్థుడు అయిన వ్యక్తి అణుకువ, వినయం కలిగి ఉంటాడు. మూర్ఖుడు అహంకారంతో మిడిసిపడుతు ఉంటాడు. - శ్రీ రామకృష్ణ పరమహంస
దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.
ఆయుష్మంతుడు - దీర్ఘకాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి - 1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.
చిరంజీవి రామభక్తో దైత్యకార్యవిఘాతకః,
అంక్షహంతా కాంచనాభః పంచవక్త్రో మహాతపాః.
ఉచ్ఛయము - 1.పొడవు, 2.గొప్పతనము, 3.గ్రహాదుల ఉదయము, 4.అతిశయము, రూ.ఉచ్ఛాయము.
పొడవు - (గణి.) రెండు బిందువుల మధ్య దూరము (Length).
మాహాత్మ్యము - గొప్పతనము
మహిమా - 1.గొప్పతనము, 2.ఐశ్వర్యము.
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.) పురుషవాచక శబ్దసంజ్ఞ.
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
అతిశయము - అధిక్యము.
ధరనే వస్తువు లైనన్
దరుగుటకై వృద్ధినిందుఁ * దగఁ బొడ వెదుగున్
విరుగుటకై ; పాయుటకై
దరిఁజేరును ; వీని మదిని * దలఁపు కుమారా!
తా. లోకములో నే వస్తువులైనను వృద్ధిపొందుట నశించుటకే. పొడవుగా పెఁరుగుట విఱిగిపోవుటకే. దగ్గరఁజేరుట విడిపోవుటకే యగును. ఈ విషయముల నన్నింటిని మనస్సునందుంచు కొనవలయును.
సృష్టిలో దేనికీ నిశ్చితత్వం, శాశ్వతత్వం లేవు. పుట్టింది పెరగాలి, విరగాలి. సాగదీసినదే చిరుగునది పొడవైనదే విరుగునది. విరుగుట కన్న వంగుట మంచిది.
(ౙ)జంపు - 1.ఆలస్యము, 2.జాలరు, 3.గుంపు, 4.సన్నదనము 5.పొడవు. ఆలస్యముగా చేసేదే అందమైనపని.
మాంద్యము - 1.ఆలస్యము 2.జాడ్యము.
జాడ్యము - 1.జడత్వము 2.ఆలస్యము.
జడత్వము - (భౌతి.) విశ్రాంతి స్థితిలోగాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము.(Inertia)
జడత - నిశ్చేస్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము. మనస్సును జడప్రాయంగ చేసేది బద్ధకం.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త, 3.జాగు.(ౙ)జాగు - ఆలస్యము. అజాగ్రత్త కొంచెమైన కీడు అధికము. పోగొట్టు కొనుటవలన జాగ్రత్త నేర్చుకొనవలెను.
జాడ్యంధియో హరతినిఞ్చతివాచి సత్యం, మానోన్నతిం
దిశతిపాపమపాకరోతి| చేతః ప్రసాదయతి దిక్షురినోతి
కీర్తిం, సత్సంగతిః కథయ కిం నకరోతి పుంసాం||
తా. సత్సాంగత్యము బుద్ధి జాడ్యమును బోగొట్టును, వాక్కునందు సత్యము గలుగఁజేయును, గౌరవము నిచ్చును, పాపములబోగొట్టును, మనస్సును స్వచ్చముగాజేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింప జేయును, మఱియు నెట్టి శుభముల నైనను గలుగజేయును. - నీతిశాస్త్రము
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్|
నిర్మోహత్వే నిశ్చలత్తత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. - భజగోవిందం
సుద - 1.కొన, 2.తుల.
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు.
చివర - 1.కొన, 2.అగ్రము.
అగ్రము - 1.ఎదురు, 2.సమీపము, 3.కొన, విణ.మొదటిది, (భూగో.) సముద్రములోనికి చొచ్చుకొని పోయిన నేలకొన.
మొన - 1.అగ్రము, 2.దండు, 3.సేనాముఖము.
ఎదురు - ఎదురించు, వి.1.ముందు, 2.వలపుకత్తె వలపుకాని కిచ్చు ధనము, విణ.1.అన్యుడు(అన్యుఁడు - ఇతరుడు), 2.సాటి, 3.బదులు(బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి), క్రి. విణ. 1.అభిముఖముగా, 2.సమానముగా.
ముందర - 1.మునుపు, 2.మొదలు, 3.ఎదురు.
అంచలము - కొంగు, అంచు, కొన.
కొంగు - చెంగు, చెరగు.
చెంగు - 1.తొలగు, 2.వెనుదీయు, వి.చెరగు.
చెఱఁగు - 1.అంచు, 2.కొంగు, 3.దిక్కు.
కొంగుపసిడి - జాతీ. కొంగుబంగారము విణ.సులభసాధ్యము, వశమైనది.
అంచు(ౘ)1 - 1.కొన, 2.చీరచెరగు, 3.విధము, (గణి.) రెండు సమతలములు కలియు రేఖ, ముఖములు కలియు ప్రదేశము (Edge).
అంచు2 - క్రి.1.అజ్ఞాపించు, 2.పంపించు, రూ.అనుచు.
అంచులవాడు - చిత్రకారుడు, చిత్తరవులు వ్రాయువాడు, ముచ్చి.
చిత్రకారుడు - 1.చిత్తరువు వ్రాయువాడు, 2.ముచ్చి. ముచ్చి - చిత్రకారుడు.
కోటి1 - 1.అంచు, 2.వింటికొన, 3.చివర, 4.కోటిసంఖ్య, నూరులక్షలు, 100,00,000 (గణి.) త్రిభుజ క్షేత్రమున భుజకర్ణము, లకు భిన్నమగు అవయవరేఖ.
కోటి2 - వేగు, చారుడు.
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగరి - వేగువాడు, చారుడు. వేగువాడు - చారుడు.
వేగుఁజుక్క - శుక్రుడు (venus).
కోటిజిత్తు - కాళిదాసకవి. భోజునిలాంటి రాజుంటే కాళిదాసు వంటి కవియుంటాడు.
కొట్టికాఁడు - వేగరి, వేగువాడు, రూ.కోటికాఁడు.
యదార్థవర్ణుఁడు - 1.చారుడు, 2.వేగువాడు.
యాథార్థము - 1.సత్యము, 2.ఉన్నరూపు.
ఉన్నరూపు - యథార్ధము, కలరూపు.
కలరూపు - యథార్థ్యము, నిజము.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
నిజము - స్వభావము, విణ.1.తనది, 2.శాశ్వతమైనది.
నిజము - సత్యము, విణ.1.శాశ్వతమైనది, 2.సత్యమైనది. సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది. సత్యము గలిగియున్న వేరు తపస్సు పనిలేదు.
అవితథము - 1.యథార్థము, 2.వ్యర్థము కానిది, వి.సత్యవచనము.
సత్యం బ్రూయాత్ప్రియంబూయాన్న బ్రూయాత్సత్య మప్రియం |
ప్రియంచనానృతంబ్రూయా దేషధర్మస్సనాతనః |
భద్ర భద్రమితి బూయాద్భద్రమి త్యేవనావదేత్ ||
తా. సత్యము నిష్టముగాఁ బలుకవలయును, సత్యమెన దైనను అప్రియముఁ బలుకరాదు, ప్రియమైనదైనను అసత్యముఁ బలుకరాదు. భద్రమనఁగా శుభము. కావున ప్రియమును(ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చు వెలగలది.)బలుకునపుడు భద్రము భద్రమని పలుక వలయును. - నీతిశాస్త్రము
సత్యం న సత్యం ఖలు యత్ర హింసా, దయాన్వితం చానృతమేవ సత్యమ్|
హితం సరాణాం భవ తీహ యేన, తదేవ సత్యం న తథాన్యధైవ||
హింసకు దారి తీసేది కీడు కలిగించేది అయితే, అది సత్యమైన సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. మనిషికి ఏది హితమో అది సత్యం తప్ప మరొకటి కానేరదు.
వారిజాక్షు లందు వైవాహికము లందు
ప్రాణ విత్త మాన భంగ మందు
చకిత గోకులాగ్రజన్మ రక్షణ మందు
బొంక వచ్చు నఘము పొందడధిప|
పజ్జ - 1.సమీపము(సదేశము - సమీపము), 2.వెనుక, సం.పశ్చాత్.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సేన - దండు, విణ.అధికము, చాల.
దండు - 1.దండము, 2.సేన, 3.గుంపు, సం.దండః.
దండధరుఁడు - యముడు.
వెనుక - 1.పశ్చాద్భాగము, 2.పడమర, 3.పిమ్మట, 4.ఉపేక్ష, అవ్య. వెంబడి. పశ్చాద్భవా పశ్చిమా - వెనుక దిక్కు.
పడమర - పశ్చిమ దిక్కు. ప్రతీచి - పడమర (West).
ప్రతీచీ. ఈ-సీ. ప్రతి పశ్చాద్గివసావసానే అస్యాం అంచతి సూర్యో అస్తమేతీతి ప్రతీతి, అఞ్చు గతి పూజనయోః - సాయంకాలమందు సూర్యుఁడు ఈదిక్కున అస్తమించును గనుక ప్రతీచి.
అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి. వి. పిమ్మట, వి.సామీప్యము.
వెనుకటి ఆధారము - (గృహ.) పుట్టు పూర్వోత్తరములు వంశ పారంపర్యము, (Back ground).
పశ్చము - (జీవ.) వెనుక నున్నది, (Posterier).
పడమటి వంక గ్రుంకఁ జను భాస్కర బింబముఁ దూర్పుకొండపై
బొడిచిన చంద్రమండలముఁ బోల్పెసలారె ! బయోజ సంభవుం
డెడపక రాసిమాప గతులెక్కువ తక్కువ లైన కాలముల్
తడఁబడు నంచు దూంచునెడఁ ద్రాసున దేలెడు చిప్పలో యనన్.
పింగలి - 1.వెనుకటిది, 2.వెనుకటివాడు.
వెనుకటివాఁడు - తమ్ముడు.
వెనుకయ్య - వినాయకుడు, సం.వినాయకః.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
విఘ్నరాజు - వినాయకుడు.
అవతల - 1.పిమ్మట, 2.అవలిప్రదేశము.
ఆతల - ఆవలిప్రదేశము, ఆవలికాలము, రూ.అవతల.
అవల - 1.పిమ్మట, అనంతరము (తర్వాతి కాలమున), 2.అవతల (తరువాతి ప్రదేశమున), 3.వేరుచోట, విణ.1.అవతలిది, 2.ఇతరము, రూ.అవ్వల, ఆవల, ఔలా(ఔల - అవల).
పిమ్మట - 1.మునుపు 2.పరోక్షమందు, వి.మనోవ్యధ.
అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి.వి. పిమ్మట, వి.సామీప్యము.
అవ్వల - అవల; ఆవల - 1.ఆప్రక్క, 2.(దేశకాలము లందు) అనంతరము.
ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ(దయ - కనికరము), 4.తృప్తి.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను భావము.
ఆదట2 - అనంతరము, పిమ్మట. అనుక్రోశము - కనికరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content).
కన్నడ - 1.ఉపేక్ష, 2.రాగములలో ఒకటి.
కన్నడము - 1.కర్ణాటకదేశము, 2.కర్ణాటకభాష.
కన్నడీఁడు - (కన్నడ+ఈడు) ఉపేక్షించువాడు, వి.(కన్నడము+ ఈఁడు), కన్నడదేశపువాడు.
ఉపేక్ష - 1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము.
అశ్రద్ధ - 1.అసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి(కడపటి రెండర్థము లును తెనుగునందు మాత్రమే కలవు).
నిర్లక్ష్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దైవాధీనమైనది (Casual), వి.అశ్రద్ధ.
అసడ్డ - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
ఒప్పరికము - ఉపేక్ష, ఒప్పరికించు విధము.
ఔదాసీన్యము - ఉపేక్షగా నుండుట, మిత్రశత్రు భావములు లేకుండుట.
అపరదిక్కు - పడమటి దిక్కు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటిరేడు.
పాశ్చాత్యుఁడు - 1.పడమటివాడు, 2.వరుణుడు.
పాశి - 1.వరుణుడు, 2.యముడు.
తెల్లదొర - 1.శివుడు, 2.బలరాముడు, 3.ఆంగ్లేయుడు, పాశ్చాత్యుడు.
వేధాస్వాంగో జితః కృష్ణో ధృఢః స్సంకర్షణో చ్యుతః|
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః||
వారుణీ - 1.పడమటి దిక్కు, సారాయి.
సారాయి - సుర, మద్యము, రూ.సారాయము, సం.సారః.
హాల - సారాయి.
సుర1 - 1.గాలిసుడి, 2.గాలి.
సుర2 - కల్లు, విణ. పెద్ద.
చారవాయువు - పడమటిగాలి.
అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.
సురా ప్రత్యక్చ వారుణీ :
వారుణీ శబ్దము మద్యమునకును, పడమటి దిక్కునకును పేరు.
వరుణా జ్జాతా, వరుణ స్యేయ మితి చ వారుణీ. సీ. - వరుణుని వలనఁ బుట్టినది. వరుణుని సంబంధమయినది గనుక వారుణి.
వారిధిఁ దరువఁగ నంతట,
వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్
వారిజలోచను సమ్మతి,
వారై కైకొనిరి దాని వారిజనేత్రన్.
భా|| పాలసముద్రాన్ని ఆతరువాత తిరిగి చిలికారు. అప్పుడు వారుణి అనే అందగత్తె అయిన కన్య పుట్టింది. ఆ కన్యను పద్మలోచనుడైన విష్ణువు యొక్క అనుమతితో రాక్షసులు తీసుకొన్నారు.
బ్రహ్మ సంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ,
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ.
గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
ఆసవము - 1.కల్లు, 2.పూదేనె, 3.ద్రాక్షాసవము, మొ. పానీయములు. మదిర - కల్లు.
మదురువు - 1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.
కల్లు1 - 1.బండికన్ను (చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్. మద్యపానము వలన సిగ్గు నశించి పోతుంది.
మద్యపానం :-
మొదలి పెక్కు జన్మముల పుణ్యకర్మల్
పరగఁ బెక్కు సేసి పడయఁ బడిన
యట్టి యెఱుక జనులకాక్షన మాత్రాన
చెఱుచు మద్యసేవ సేయనగున్.
మద్యం లోపలికి పోయి, వివేకాన్ని బయటకి తరిమి వేస్తుంది. - థామస్ బేకన్ (1512 -1567)
అంజన - 1.హనుమంతుని తల్లి, 2.పడమటి దిక్కునందలి ఏనుగు.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
వానరః కేసరిసుతః సీతాశోకనివారణః,
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః.
అంజనము - 1.కాటుక, 2.మంత్రగాడు నిక్షేపాదులను కనిపెట్టుటకు వాడు కాటుక, 3.సిరా, 4.పశ్చిమ దిగ్గజము, 5.ఒక పర్వతము, 6.ఒకజాతి బల్లి, 7.(అలం.) వ్యంగ్యార్థమును బోధించు శబ్దవృత్తి, 8.నిప్పు.
ఆంజనము - కాటుక, విణ.అంజనము నకు సంబంధించినది.
కాటుక - 1.అంజనము, 2.జొన్న ఎన్నునకు గల్గువ్యాధి.
అంజని - చందన కుంకుమాదులచే అలంకరించుకొను స్త్రీ, (వృక్ష.) కటుక రోహిణి, కాలాంజని అనెడి ఓషధులు.
కటుకరోహిణి - ఒక ఓషధి, (వ్యావ.) కటకరాణి.
కజ్జలము - 1.మేఘము, 2.కాటుక, 3.(రసా.) దీపాంగారము, దీపపుమసి (Camp black).
మేఘము - మబ్బు; మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
అంజనకాడు - అంజనమువేసి నిక్షేపాదులను కనుగొనువాడు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి. అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
కాటుకపిట్ట - ఖంజరీటము.
ఖంజనము - కాటుక పిట్ట.
వర్తి - 1.వత్తి, 2.కంటికాటుక, విణ.వర్తించువాడు.
వత్తి - దీపపు వత్తి; దీపవల్లి - దీపపు వత్తి.
విభక్తత్రైవర్ణ్యం - వ్యతికరిత లీలాఞ్జన తయా
విభాతి త్వన్నేత్ర - త్రితయ మిద మీశానదయితే, |
పునస్స్రష్టుం దేవాన్ - ద్రుహిణహరిరుద్రానుపరతాన్
రజ స్సత్వం బిభ - త్తమ ఇతి గుణానాం త్రయమివ || - 53శ్లో
తా. ఓ ఈశాన ప్రియురాలా(దయిత-1.భార్య, 2.స్త్రీ.)! నీ నేత్రత్రయాలు మూడు వర్ణాలైన తెలుపు, ఎరుపుతోనూ మరియు అందంకోసం అర్ధవలయాకారముగా తీర్చినదైన కాటుక నల్లరంగుతో, ఒకేసారి మూడువర్ణాలతో ఒప్పారుతూ, మహాప్రళయకాలంలో నీలో లీనమై పోయివున్న బ్రహ్మ విష్ణు రుద్రులను తిరిగి సృష్టించుటకై సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణత్రయాన్ని ధరించిన వాటివలె ప్రకాశించుచున్నవి. - సౌందర్యలహరి
నిరంజనము - 1.కాటుకలేనిది, 2.దోషములేనిది.
నదము - 1.పడమరగా పారెడు యేరు, 2.మడుగు, 3.సముద్రము, 4.మ్రోత(మ్రోత - ధ్వని).
హ్రదము - ఏటినడుమ లోతుగల చోటు, మడుగు.
మడుఁగు - అడుగు, వంగు(వంగు - ముందటికి వాలు), వి.1.గుణము, 2.కొలను, 3. 8 వీసెలు, రూ.మడువు, మడ్గు, మణుగు, మణువు.
అడుగు - 1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.
గుణము - 1.శీలము(శీలము - 1.స్వభావము, 2.మంచి నడత.), 2.అల్లత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
కొలను - కొలఁకు; కొలఁకు - సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్. కాసారము - కొలను, వ్యు.జలము కలది.
ఘనబల సత్త్వమచ్చువడ గల్గిన వానికి హానిలేనిచోఁ
దనదగు సత్త్వమే చెఱుచుఁదన్ను నదెట్లన? నీరులాపుగాఁ
గనుపసియించినన్ చెఱువుకట్తకు సత్త్వముచ్గాలకున్నచోఁ
గనుములు పెట్టి నట్టనడిగకడితె గండకన్నె, భాస్కరా.
తా. భాస్కరా ! చెరువు గట్టు బలము గలదిగా నున్నను ఆ చెరువు నిండా నీరు వచ్చి పడినప్పుడు దాని సందుల ద్వారా గాని, మధ్యకు గట్టు తెగినగాని ఆ నీరు పోవును. అట్లే ఎంత గొప్ప బలము కల వానికైనను ఇతరులచే కీడు సంభవింపక పోయినను, తన, బలమే తుదకు నశింపఁజేసిన దగును.
అంౙ - 1.అడుగు, 2.సమీపము.
అడుగుపుట్టువు - 1.గంగ, 2.శూద్రుడు.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
శూద్రుఁడు - నాలవజాతివాడు. సచ్ఛూద్రుఁడు - మంచియాచారము గల శూద్రుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక (పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ).
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాసి యందు విశాలాక్షి (సతీదేవి ముఖం పడిన చోట వారాణసి, అక్కడ వుండే గౌరికి విశాలాక్షి అనిపేరు).
భవ్య - పార్వతి, హైమవతి.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ|
ప్రగల్భా పరామోదారా పరామోదా మనోమయీ. - 174శ్లో
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు.
గాంగేయుఁడు - గాంగుఁడు.
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్యకలవాడు.
గాంగము - 1.గంగయందు పుట్టినది, గంగకు సంబంధించినది.
గాంగేయము - 1.బంగారము, 2.తామర, 3.ఉమ్మెత్త, 4.ఒకానొకచేప.
హిమాద్రిపార్శ్వే ద్రి తటే రమన్తం - సంపూజ్యమానం సతతం మునీన్ద్రైః |
సురాసురై ర్యక్షమహోరగాద్యైః - కేదారసంజ్ఞం శివ మీశ మీడే. - 11శ్లో
15. స్వాతి - మాణిక్యాకారముగా ఒకటే నక్షత్రము.
స్వాతి - 1.సంజ్ఞాదేవి, 2.నక్షత్రములలో నొకటి.
త్రసరేణువు - 1.సంజ్ఞాదేవి, 2.ముప్పది పరమాణువుల కొలది.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
కెంపుసవతు - స్వాతీనక్షత్రము.
కెంపుసవతు - స్వాతీనక్షత్రము.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
సవతు - సమత, సామ్యము, సం.సమత్వమ్.
సామ్యము - సమత్వము, పోలిక; పోలిక - సామ్యము.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము - కెంపు; లోహితకము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
కురువిందము - ఎఱ్ఱని కెంపు, అద్దము (రసా.) గనులలో దొరకు ఎల్యూమినియం ఆక్సైడ్ (ద్విఎల్యూమినియమ్ త్ర్యామ్లజనిదము). (సర్ణకారులు బంగారు మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగింతురు) (Corundum).
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు కలది.
కెంపుగాము - అంగారకుడు, నవగ్రహములలో కుజుడు(Mars).
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
మానికము - కెంపు, రత్నము, సం.మాణిక్యమ్.
మానికదారి - 1.వేశ్య, 2.మాణిక్యధారిణి.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)
రత్నం మణిర్ధ్వయో రశ్మజాతౌ ముక్తాదికే పిచ :
రమతే స్మి న్ మన ఇతి రత్నం. రము క్రీడాయాం. - దీనియందు మనస్సు రమించును.
మణ్యతే స్తూయత ఇతి మణిః. ఇ. ప్స. - మణి శబ్దే స్తోత్రము చేయఁ బడునది. శిలాజాతు లయిన పద్మరాగ మరకత స్ఫటికాదులకును, మౌక్తిక విద్రుమాదులకును సామాన్యముగా పేర్లు.
ప్రస్తరము - 1.రాయి, 2.రత్నము, 3.చిగుళ్ళు మొదలగు వానిచే ఏర్పరచిన సెజ్జ.
రాయి - శిల; శిల - 1.రాయి, 2.సెలయేరు, రూ.సిల.
సెలయేఱు - నిర్ఝరము, కొండయేరు. కొండకాలువ - సెలయేరు.
నిర్ఝరము - సెలయేరు, రూ.ఝురము. ఝురము - సెలయేరు, రూ.ఝురి.
నిర్ఝరణి - నది, River.
నేవడము - మణులు గ్రుచ్చిన హారము, రూ.నేవళము, నేహారము.
రత్నగర్భ - భూమి. ప్రకృతి అంశవల్ల భూదేవి ఉద్భవించి సమస్తాన్ని భరిస్తుంది. రత్నాలన్నీ ఇందు ఉండడంతో దీనికి రత్నగర్భ అని పేరు.
రత్నగర్భుఁడు - 1.సముద్రుడు, 2.కుబేరుడు.
రత్నాకరము - సముద్రము. సముద్రము - సాగరము.
అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.
సాగరము1 - నేయి, మొ నవి నింపిన సిద్దెల జోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవి యందలి మదము.
మహాశయము - సముద్రము; మకరాలయము - సముద్రము.
మున్నీరు - (మును+నీరు) సముద్రము.
మున్నీటిచూలి - క్షీరసాగరకన్యక, లక్ష్మి.
శ్రీ గల భాగ్యశాలిఁగడుఁ జేరగ వత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన, నిల్వను
ద్యోగ్యముజేసి, రత్ననిలయుండగాదె సమస్త వాహినుల్
సాగరుఁజేరుటెల్ల మునిసన్నుత మద్గురుమూర్తి, భాస్కరా.
తా. భాస్కరా! నదులన్నియు, సముద్రుడు రత్నములకు స్థానమైన వాడను నాశతో యాతని సమీపించుచున్నవి, అట్లె జనులెల్లరును ఐశ్వర్యవంతు డెక్కడ నుండిన యక్కడి కెంత దూరమునుండి యైనను శ్రమయని తలంపక తమంతమే ఓపికతో నతనిని జేరుటకు వచ్చెదరు.
ఉరుముంజి - ముత్తెములకు ప్రసిద్ధమైన ఒకదేశము, రూ.హురుముంజి.
సముద్రంలో గల ముత్యాలను సంపాదించాలని నిశ్చయించుకొంటే ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా అట్టడుగుకు మునిగి వెదకాలి. ఒకసారి మునిగి ప్రయత్నించిన వెంటనే అవి లభించకపోతే ఇక ముత్యాలే లేవని నిర్ధారించలేము కదా! అలాగే అన్నిచోట్లా ఉండే భగవంతుణ్ణి కనుగొనడంలో ఒక ప్రయత్నం విఫలమైనా నిరుత్సాహపడక పట్టుదలతో మరల మరల ప్రయత్నిస్తే భగద్ధర్శనం తప్పక లభిస్తుంది. - శ్రీ రామకృష్ణ పరమహంస
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
పచ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరు రేఖ. సం.పలాశః.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ.
కావేరి - 1.కావేరీనది, 2.పసుపు. హరిద్ర - పసుపు.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.
రేఫము - ర వర్ణము, విణ.అధమము.
అంత్యము - 1.కడపటిది, 2.అధమము.
అధమము - తక్కువైనది(తక్కువ - కొరత), నీచము.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము.)లోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.
మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది (స్వరము), రూ.గంభీరము.
మన్ద్రస్తు గమ్భీరే :
మన్యతే బుద్ధ్యతే అనేనేతి మంద్రః - దీనిచేత నెఱుఁగఁబడును.
మందతే శనైర్నిస్సరతీతి మంద్రః. మది స్తుతి మోద మద స్వప్న కాంతిగతిషు. - మెల్లగాఁ బలుకఁబడునది. ఈ ఒకటి గంభీరధ్వని పేరు.
కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ.
కిరీటి - 1.అర్జునుడు, వ్యు. ఇంద్ర దత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి. గరుడ పచ్చ - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, గరుడ పురాణము(మజ్జ) 12000 శ్లోకములు గలది. గరుడదేవతాకమైన అస్త్రము.
మందాళి - 1.పచ్చ పట్టుచీర, 2.కృత్రిమ మరకతము.
చిప్ప ముత్తెము - కృత్రిమ మౌక్తికము, చేత ముత్తెము.
ఉమ్మాయ ముత్తెము - కృతక మౌక్తికము, మాయాముత్యము.
కయ్యర - తక్కువజాతి ముత్తెము.
రోహిషము - కొండగొఱ్ఱె, ముత్యము.
రౌహిషము - 1.కామంచిగడ్డి (తృణవిశేషము), 2.కొండగొఱ్ఱె.
కామంచి - కత్తృణము, ఒక తెగగడ్డి, రూ.కావంచి, సం.కామంజికా.
కామంజిక - కత్తృణము.
ముత్యము - నవరత్నములలో ఒకటి. రంగు తెలుపు పవిత్రమైనది.
చినుకుఁబూస - ముత్తెము.
సుపాణి - 1.ముత్తెమందలి శుభ్రమైన నీరు, 2.శుభ్రమైన నీరు, 3.ముత్తెము, రూ.సుప్పాణి, సం.సుపానీయమ్.
ముత్యము - ముత్తియము.
ముత్తియము - ముత్యము, సం.మౌక్తికమ్, ముక్తా.
మౌక్తికము - ముత్తియము.
ముక్త - 1.ముత్తెము, 2.రంకుటాలు, విణ.ముక్తి నొందినది.
ముత్యాలమ్మ - ఒక గ్రామదేవత.
ముక్త కణ నిర్మాణము - (వృక్ష.) ఒక జీవకణ సంహతిలో విడివిడిగా జీవకణము లేర్పడి యుండుట (Free cell formation).
శ్రుతి సీమంత సిందూరీ - కృత పాదాబ్జ ధూళికా|
సకలాగమ సందోహ - శుక్తి సంపుట మౌక్తికా.
ముక్తా :
ముచ్యతే శుక్తి సంపుటాదితి ముక్తా, ముక్త్తైవమౌక్తికం. ముచ్ఌమోక్షణే - ముత్యపుచిప్పల వలన విడువఁబడునది గనుక ముక్తః ముక్తయే మౌక్తికము(నాసాగ్రే నవ మౌక్తికం), ముత్యము.
శ్లో. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్.
స్వాతి వానకు ముత్యపు చిప్పలు ఎదురు చూచినట్లు. నత్తగుల్లలన్నీ ఒక రేవునకు ముత్యాలన్నీ ఒక రేవుకు చేరును. రత్నాలన్నీ యొకచోట నత్తగుల్లలన్నీ ఒకచోట.
శుక్తి - 1.ముత్తెపు చిప్ప, 2.శంఖము, 3.నత్తగుల్ల, 4.పుఱ్ఱేపెంచిక.
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
వెలిగుల్ల - శంఖము.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతియందు ధరించువాడు.
సలాపము - సముద్రములో ముత్తెపుచిప్ప లేరుట.
చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు చిప్ప, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.
నత్తగుల్ల ఎండలో మెరుస్తూ వెండి లాగ కనిపిస్తుంది. ముత్యపు చిప్పను వెండిగా భావించుట మిథ్య.
కాకిచిప్ప - ముత్తెపు చిప్పవంటి గుల్ల, శంబూక.
శంబూకము - 1.కప్పచిప్ప, 2.ఆనూక, రూ.శంబుకము.
శుక్త్యంబు బిందు న్యాయము - ముత్యపు చిప్పలోబడ్ద నీటి బిందువు ముత్యమగు ననురీతి.
చిప్పబడ్ద స్వాతిచినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగలుగుచోట ఫలమేల తప్పురా విశ్వ.
తా|| స్వాతికార్తిలో ముత్యపుచిప్పలో బడినచినుకు ముత్యమగును, నీటబడినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.
నీటిలో పుట్టాను - చిప్పలో పెరిగాను - నేలపై కొచ్చాను - స్త్రీలలో కలిసాను.
తామర పత్రంపై పడిన వర్షపు నీటిబిందువులు ముత్యాలవలె ప్రకాశిస్తాయి. అవే జల బిందువులు ముత్యపుచిప్పలో పడినపుడు ఆణిముత్యాలుగా మారతాయి.
ఆణి -1.ఒక జాతి ముత్తెము, 2.ముత్తెము గుండ్రదనము విణ.మేలైనది.
ఆణిపూస - ముత్తెము, గుండ్రని ముత్తెము.
కట్టాణీ - (కడు + ఆణి) మిక్కిలి గుండ్రనితనము (గల ముత్యము).
మంజరి - 1.చివురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము - మనల్ని మురిపించే ఆణిముత్యాలు అల్చిప్పలలో పుడుతున్నాయి కదా!
తారాహారము - ముత్యాలసరము.
ముత్తెసరము - మత్యాలహారము.
ముక్తావళి - ముత్యాలదండ.
కోవ - 1.గోపురాకారముగ నుండు పుట్ట చివర, 2.హారము, 3.ముత్యము, 4.హారమందలిపేట, 5.వంశానుక్రమము.
దామము - 1.పలుపు, 2.హారము, దండ.
సరి - హారము, గుచ్ఛము, విణ.1.సమము, యుక్తము, 2.సమాప్తి, పూర్ణముగా, అవ్య.అంగీకార్థము, సం.సరః.
హారము - 1.నూట యెనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది 'హారము' (Denomination).
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము.
సరిగ - 1.హారము, 2.జరీ, సం.సరికా, స్రక్.
ౙరి - జరీ, వెండి బంగారములతో మొలాము చేసిన నూలిపోగు.
ౙరత - జతారు, సరిగ, రూ.జరతారు.
ౙలతారు - జరత; మాతాబి - జలతారు.
సమము - 1.సమానము, 2.సాధువు.
సమానము - (సజాతీయము) - (గణి.) ఒకే జాతికి సంబంధించినది, ఒకే ఘాతసంఖ్య కలిగినది (Like), వై.వి.సమ్మతి, సం.వి.నాభియందలి వాయువు, విణ.తుల్యము.
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.
మంజరి - 1.చిగురించిన లేత కొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్ద ముత్తెము.
మాల1 - 1.పూదండ, 2.వరుస.
మాలిక - 1.పూదండ, 2.వరుస, 3.విరజాజి, 4.శంకరాభరణము, 5.కూతురు.
వరుస -1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
విరజాజి - నవమల్లికా కుసుమము; నవమాలిక - విరజాజి.
ఆత్మజ - 1.కూతురు(కూతురు - కొమార్తె), 2.బుద్ధి.
ఇండె - 1.పూదండ, 2.ఎముక కీలు, 3.చీలిక.
చీరిక - 1.పాయ, రూ.చీలిక.
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ.
స్రజము - పూలదండ.
స్రగ్వి - పూదండగలవాడు.
సప్తలా నవమాలికా,
సప్తమనో బుద్ధ్యంతానీంద్రియాని లాతీతి. సప్తలా. లా ఆదానే. - మనోబుద్ధులతోఁ గూడిన పంచేద్రియములను అనఁగా నేడింటిని పరిమళము చేత స్వవశముగాఁ జేసికొనునది.
నవాస్తుత్యామాలా అస్యా ఇతి నవమాలికా - స్తోత్రము చేయఁదగిన దండ గలది. ఈ 3 విరజాజి పేర్లు.
వైజయంతి - 1.టెక్కెము, 2.విష్ణుమాలిక, 3.విష్ణు ప్రాకారము.
వనమాల - ఆకులు పువ్వులు చేర్చికట్టిన హారము.
తోటమాలియ - ఆకులు, పూవులు చేర్చి కట్టిన మాల, రూ.తోఁటమాలె, తోమాలియ, తోమాలె. తోమాలె - తోటమాలియ.
వనమాలి - విష్ణువు.
మాల2 - చండాలుడు, సం.మాలః.
మాలెత - (మాల+ఎత) మాలది.
చండాలుఁడు - 1.మాలవాడు, రూ.చండాలుడు.
మాలఁడు - చండాలుడు, సం.మాలః.
తోటి - 1.మాల, చండాలుడు, 2.వేడుక
వేడుక - 1.సంతోషము, 2.వినోదము, 3.కుతూహలము.
పంచముఁడు - మాలడు, విణ.ఐదవవాడు.
అంత్యజుఁడు - చండాలుడు, హరిజనుడు.
అంతేవాసి - 1.శిష్యుడు, 2.హరిజనుడు, విణ.దగ్గరనుండువాడు, 2.ఎల్లయొద్ద నుండువాడు.
హరిజనుఁడు - అంటరానివాడు, (అస్పృశ్యులకు గాంధీ పెట్టిన పేరు.)సురియాళు - మాలవాడు, రూ.సులేయాళు.
నిషాదుఁడు - 1.బోయవాడు, 2.మాలవాడు.
పుల్కసుఁడు - 1.బోయ, 2.మాల, 3.అధముడు, రూ.పుల్కసుఁడు.
పుళిందుఁడు - బోయ (భాషాజ్ఞానమే లేక అడవిలో తిరుగు బోయ).
అర్జునకుఁడు - 1.బోయ, 2.తెల్లనివాడు. శబరుఁడు - 1.బోయ, 2.శివుడు.
గ్రామాంతము - మాలపల్లె.
వెలివాడ - మాలపల్లె.
శ్రద్ధధానా శ్శుభాం విద్యా మాదదీ తా వరాద్రపి|
అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులాదపి||
తా. మంచివిద్యను జాత్యాదిహీనుని వలన నైనను శ్రద్ధాయుక్తులై గ్రహింప వచ్చును, సద్గుణవతియైన స్త్రీని దుష్కులము వలననైనను గ్రహింప వచ్చును. – నీతిశాస్త్రము
వాయుర్నక్షత్ర మభ్యేతి నిష్ట్యామ్ | తిగ్మశృంగో వృషభో రోరువాణః | సమీరయన్ భువనా మాతరిశ్వా | అప ద్వేషాగ్ంసి సుదతామరాతీః | తన్నో వాయుస్తదు నిష్ట్యా శృణోతు | తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యమ్ | అన్నో దేవాసో అనుజాసంతు కామమ్ | యథా తరేమ దురితాని విశ్వా ||13||
అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులతో ఒకడు.
అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము.
సమీరుఁడు - వాయువు.
సమీరణుఁడు - 1.వాయువు, 2.బాటసారి, వ్యు.లెస్సగా చరించువాడు.
మాతరిశ్వుఁడు - గాలి, వ్యు.ఆకాశమున వృద్ధినొందువాడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
మరుత్తు - వేలుపు(దేవత - వేలుపు), గాలి.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
కరువలి - గాలి.
కరువలిపట్టి - వి. (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.
గాడుపు - గాలి, వాయువు రూ.గాడ్పు. గాడ్పు - గాడుపు.
గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపుసంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
గాడుపుమేపరి - పాము, పవనాశము.
మారుతము - వాయువు.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.
సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః.
వృకోదరుఁడు - భీముడు.
తోఁడేటి మేటి కడుపు - వృకోదరుడు, భీముడు.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి. పద్యయతి, సం.వళిః.
వేగ - వడి, విణ.త్వరితము.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము 2.వికసింపనిది. ముడి మూరెడు సాగునా?
ముడిగిబ్బ - ఆబోతు.
జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముడు : పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.
బిభే త్యస్మాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లితనివలన భయపడును గనుక భీముఁడు. రుద్రులలో ఒకరైన భీముని భార్య పేరు దిశ.
దిశ - దిక్కు, దెస. (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కు లలో నొకటి.
దిక్కు - 1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, 2.దశా.
దశ - 1.అవస్థ, 2.వత్తి, 3.బద్దె. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది!
విధర్భరాజు అయిన భీముని కుమార్తె పేరు దమయంతి. దమయంతికి దముడు, దాంతుడు, దమనుడు అను ముగ్గురు సోదరులు. విదర్భరాజుకు దమన మహర్షి వరం వల్ల సంతానం కలిగింది.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
కీచకుఁడు - భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.
ప్రాణందాపి పరిత్యజ్య మానమేవాభి రక్షతు|
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్రతారకమ్||
తా. తనకు మానహానికరమైన (యా)ఆపద వచ్చినప్పుడు ప్రాణము నైన విడువవచ్చును. కాని మానమును రక్షించుకొనవలయును. అది యెందువలన ననఁగా ప్రాణము క్షణభంగురము. ప్రాణంకంటె మానం ఘనం. మానము చంద్రుడును నక్షత్రములు(తారకము - 1.కంటినల్ల గ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.)నుండు వరకుండు నని భీముఁడు చెప్పెను. - నీతిశాస్త్రము
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుఁడు, విణ.పవిత్రురాలు.
పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.
(ౙ)జందెము - జందియము.
జందియము - యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము
సూత్రము - 1.నూలిపోగు, చంద్రునికో నూలిపోగు 2.జన్నిదము, 3.ఏర్పాటు, 4.శాస్త్రాది సూచక గ్రంథము, (గణి.) కొన్ని పదములతో నేర్పడు సమీకరణము (Formula), 6.కొన్ని ధర్మముల నుగ్గడించు ప్రవచనము.
ఏర్పాటు - ఏరుపాటు; ఏరుపాటు - 1.నిర్ణయము, 2.నియమము, 3.వివరణము, 4.భేదము, రూ.ఏర్పాటు.
అవధారణము - నిర్ణయము, నిశ్చయము.
నిర్ణయము - ఏర్పాటు; నిర్ణయించు - క్రి.ఏర్పాటుచేయు.
నిశ్చయము - నిర్ణయము; నిర్ధారణ - నిశ్చయము.
వ్యవసితము - నిశ్చయము, విణ.అనుష్ఠింపబడినది.
నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.
ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గఱి) విషయ విపులీకరణము (Exposition).
విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||
సామీరి - 1.హనుమంతుడు, 2.భీముడు.
హనుమంతుఁడు - ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
యోగచరుఁడు - ఆంజనేయుడు.
పవనాత్మజ - వాయుసుతుడు, ప్రభు భక్తికి హనుమంతుణ్ణి మించిన ఉదాహరణ లేదు.
హనుమంతుడు : అంజనీ సుతుండు, వాయుదేవుని వరమున బుట్టినవాడు. బ్రహ్మ, శివునియొక్క(రుద్రరూప) కలయిక వలన నేర్పడినవాడు. సూర్యుని శిష్యుడు. చిరంజీవి, వేదవిదుడు(నవవ్యాకరణ పండితుడు), మహాగాయకుడు, ఉత్తమ రామభక్తుడు.
బుద్ధిర్బలం యశో ధైర్యం మిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్|
తా. హనుమంతుని ధ్యానించుట వలన బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగము లేకుండుట, మాంద్యము తొలగుట, చక్కగ మాటలాడ గలుగుట సిద్ధించును.
స్వాతి - 1.సంజ్ఞాదేవి, 2.నక్షత్రములలో నొకటి.
త్రసరేణువు - 1.సంజ్ఞాదేవి, 2.ముప్పది పరమాణువుల కొలది.
సంజ్ఞదేవి దేవశిల్పి యగు విశ్వకర్మ(ప్రజాపతిర్వై విశ్వకర్మ) కూతురు, ప్రకృతి అంశకళవల్ల అవతరించింది.
త్రసరేణు త్రికం భుంక్తే యః కాలస్య తృటిస్మృతః |
శతభాగస్తు వేధస్స్యాత్ తైస్త్రిభిస్తు లవః స్మృతః ||
త్రస్స - 1.వేద్యాధ్యయనవేళ రాలునోటి తుంపర, 2.బ్రహ్మ బిందువు, సం.త్రస్సా.
బ్రహ్మబిందువు - వేదపాఠ మందలి నోటితుంపర.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనక్షత్రము 3.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు సం.1.శుక్రః, 2.చుక్రః.
పాఠే విప్రుషో బ్రహ్నబిన్దవః : బ్రహ్మణి వేదపాఠే బిందవః బ్రహ్మబిందవః ఉ.పు. - వేదపాఠ మందలి తుంపురులు. వేదము చదువునప్పుడు నోట వెడలెడు తుఁపురులు పేరు.
సృష్టిలో అతి సూక్ష్మపదార్థం పరమాణువు. రెండు 2 పరమాణువులు - ఒక 1 అణువు. మూడు 3 అణువులు - ఒక త్రసరేణువు.
జ్ఞానం పొందగోరేవారు పరమాత్మ ముందు మనం పరమాణువంత అల్పుల మన్న సత్యం గుర్తుంచుకోవాలి. అల్పత్వం నుంచి అనంతత్వాన్ని గ్రహించడమే ఆధ్యాత్మిక వికాసం. ఏది అజ్ఞానమో తెలుసుకోవడమే జ్ఞానము. ఆత్మచే కోరబడునది జ్ఞానము. నిజమైన జ్ఞాని ఎవరికి హాని కలిగించడు.
అణువు - 1.స్వల్పమైనది, అల్పము, వి.లేశము, 2.జగత్కారణమగు సూక్ష్మ ద్రవ్యము, సహజ ధర్మమును కోల్పోకుండ విభజింపబడు సూక్ష్మాంశము (Molecule).
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
సూక్ష్మము - అణువు, విణ.సన్నము.
తని - 1.అల్పము(దోనము - అల్పము), 2.సూక్ష్మము, సం.తనుః.
స్వల్పము - మిక్కిలి అల్పము.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).
అనతి - కొంచెము, అల్పము.
లేశము - కొంచెము దనము, విణ.కొంచెము.
జిలిబిలి - 1.అల్పము, 2.సూక్ష్మము, 3.శృంగారయుక్తము.
జినుఁగు - 1.సూక్ష్మము, 2.అల్పము, 3.మృదువు, రూ.జిలుగు, జిలువు, సం.జాలికా.
మృదువు - మెత్తనిది; మృదులము - మెత్తనిది, మృదువు.
సన్నము - సూక్ష్మత్వము, విణ.సూక్ష్మము.
సూక్ష్మము - అణువు, విణ.సన్నము.
సన్నగిల్లు - సన్నమగు, క్షీణించు, తగ్గు రూ.సన్నగిలు, సన్నవారు.
దభ్రము - సం.వి. సన్నము వి.1.సముద్రము 2.బొంకు.
నఱుజు - అణువు, రూ.నజ్జ.
నజ్జు(ౙ) - అణువు, విణ.1.మిక్కిలి నలిగినది, 2.చిన్నముక్క, రూ.నరుజు, సం.నష్టమ్.
నలినము - మిక్కిలి నలిగినది.
విను ప్రాణ రక్షణమునన్
ధనమంతయు మునిగిఁపోవు * తఱి బరిణయమం
దున గురుకార్యమున వధూ
జన సంఘములందు బొంకఁ * జనును గుమారా!
తా. ప్రాణమును గాపాడుటయందును, ధనము పోవునపుడును, వివాహమునందును, గురువుల పనులయందును, స్త్రీల సమూహము నను అబద్ధమాడవచ్చును దాన దోషము కలుగదు.
కొంత - కొంచెము, స.కించిత్.
కించిత్తు - ఇంచుక కొంచెము.
కొండొక - 1.కొంచెము, 2.చిన్నది, 3.చిన్నవాడు, 4.ఒక, క్రి.విణ.1.కొంచెముగా, 2.కొంచెముసేపు, 3.కొంచెము దూరము, రూ.కొండిక.
కొండిక - 1.చిన్నది, 2.అల్పము, వి.1.చిన్నవాడు, 2.బాలుడు, 3.బాలిక, సం.కుణకః.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).
చిన్నవాఁడు - బాలుడు.
కింగిరి - అల్పము, స్వల్పము.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
స్కందుఁడు - కుమారస్వామి.
కణము - 1.కొంచెము, 2.నూక, 3.సూక్ష్మాంశము, విణ.సూక్ష్మమైనది, సం.వి.1.(భౌతి.) అత్యంతల్ప ప్రమాణము కల ద్రవ్యశకలము (Particle), 2.(జీవ.) జీవకణము (Cell).
జీవకణము - (వృక్ష.) జీవరసముతో నిండి యున్నగది. శరీర నిర్మాణమునకు, శరీరధర్మములు నిర్వర్తించుటకును ఇది ప్రమాణము, (Cell).
కణాభములు - (జీవ.) జీవకణకోశరసములో సూక్ష్మమైన కడ్డీలవలెను, పోగులవలెను, రేణువులవలెను ఉండు ఒక విధమగు పదార్థములు (Chondriosomes or mitochondria).
జీవరసము - (జీవ.) ప్రోటో ప్లాసం (Protoplasm), జీవకణములో నుండు కోశరసము, (Cytoplasm). అష్ఠి రెండును కలిసి జీవరసము లనబడును, (ఇది ద్రవ ఘన రూపములకు మధ్యస్థముగా (శ్లేషాభము (Colloid) నుండును. దీనిరసాయనిక సంఘట్టనము క్లిష్టముగా నుండును. ప్రాణి యొక్క ప్రాణమునకు ఇది మూలాధారము.
కొశరసము - (జీవ.) జీవకణములో నుండు జీవరసము (Cytoplasm). Proto-Plasmలో అష్ఠి (Nucleus)ని మినహా యించినచో మిగిలిన ద్రవపదార్థము.
తారాకేంద్రము - (జం.) జీవకణరసములో కేంద్రికతో నేర్పడు ఒక ప్రత్యేక మైన భాగము (Centrosome).
త్రసము - 1.తిరుగునది, జంగమము, 2.అడవి.
జంగమము - తిరుగునది.
జంగముఁడు - జంగమువాఁడు, జంగము.
లింగఁడు - జంగమయ్య, శివభక్తుడు. ఇల్లుకాలుతూ వుంది జంగమయ్య అంటే నా చంకజోలె చేతిగంట నా దగ్గర వున్నవన్నట్లు.
త్రస్యతీతి త్రసం. త్రసీ ఉద్వేగే - భయపడినది. (త్రస్తము - భయపడినది)
భృశం గచ్ఛతీతి జంగమం. గమ్ ఌ గతౌ - మిక్కిలి తిరుగునది.
అడవి - అరణ్యము, సం.అటవీ.
అరణ్యము - అడవి; విపినము - అడవి.
గహనము - అడవి విణ. 1.ఏరుగరానిది 2.చొరరానిది.
కాంతారము - 1.పోరాని మార్గము, 2.అడవి, 3.చెరుకు, ఇక్షువు, 4.దైవికముగ వచ్చు ఆపద.
గహ్వరము - 1.కొండగుహ, 2.అడవి, 3.గాంభీర్యము, విణ. 1.గాంభీర్యము కలది - లోతైనది, 2.చొరరానిది.
తిరుగకు దుర్మార్గులతో;
జరగకు గహనాంతర స్థ * లాదుల కొంటిన్;
జరుగకు శత్రుల మ్రోల;
నర్మువకు మేన్ హితులయెడల * మదినిగుమారా!
తా. చెడ్దవారితో తిరుగకు, ఒంటరిగా అడవులకుఁబోవద్దు, శత్రువుల దగ్గరఁ చేరవద్దు, మనసులో మిత్రుల ఉపకారములను మరచిపోవద్దు.
జీవితంలో దారి తప్పదం - పిల్లదారి పట్టడం తప్పులు కావు. సంశయారణ్యములో తప్పుదారులలో పోవుట, దారిమరవడం మహాతప్పు. ఒంటరిగా త్రోవ నడువరాదు, పోరాని తావునకు పోతే రారాని నిందలు రాకమానవు.
అడవిలో(భయంకరమగు తావులలోకి) ప్రయాణం చేయునప్పుడు తోడు లేకుండా బయలు దేరకుము. దారి తప్పితే బాట ప్రారంభమునకు తిరిగి రావలసినదే. కొండలయందుఁ చిరకాలము నివసించరాదు.
ఇక్షుధన్వుఁడు - చెరకు విలుకాడు, మన్మథుడు.
చెఱకు విలుకాఁడు - మన్మథుడు.
చెఱుకు శుభానికి గుర్తు. చెఱుకుగడలో అక్కడక్కడ కణుపులు ఉంటాయి. ఒక్కో కణుపు దగ్గర ఒక్కో రకమైన తీయదనం ఉన్నట్లుగా - మనసూలో కూడా ఒక్కొక్క కోరిక తీరితీరకుండానే మరో కోరిక మనస్సు ఊరిస్తూ ఉంటుంది.
లలితాదేవి ఎడమ హస్తము నందు చెఱుకు విల్లు(గడ) ఉంటుంది.
చెరకు వ్యవసాయము పెదవులపైనే చేయుటా? చెరుకు పండినచోట చీమలు అవే చేరుకుంటాయి. చెరుకు తీపి అని వ్రేళ్ళు సహా మ్రింగుదురా?
రేణువు - 1.చూర్ణము, ధూళి, 2.నలుసు, నలక.
చూర్ణము - 1.గంధపొడి, 2.సన్నము, 3.దుమ్ము, 4.పొడి.
తుమురు - 1.చిన్న తునక, 2.చూర్ణము, పొడి, ధూళి.
ధూళి - దుమ్ము; దుము - దుమ్ము, సం.ధూమః
ధూళిధ్వజుఁడు - గాలి, వ్యు.దుమ్ము జెండాగా కలవాడు.
రజస్సు - 1.రజోగుణము, 2.దుమ్ము, 3.స్త్రీ రజస్సు, 4.పుప్పొడి.
పుష్పపరాగము - (వృక్ష.) పుప్పొడి (Pollen), పరాగ రేణువులు = Pollen grains.
పరాగము - 1.పుప్పొడి, దుమ్ము.
బుక్కాము - పుప్పొడి, సుమనోరజము.
రేణువాసము - తుమ్మెద, పుప్పొడిలో నుండునది.
పుష్పందయము - తుమ్మెద; తుమ్మెద - భ్రమరము.
నలుసు - రేణువు; నలఁక - 1.వ్యాధి, 2.శ్రమము, 3.బాధ.
నలి - 1.రోగము, 2.పొడి, విణ.1.నలఁగినది, 2.సన్నము అవ్య.1.అత్యంతము 2.యోగ్యము.
వ్యాధి - తెవులు, రోగము.
తెవులు - తెగులు; తెగులు - వ్యాధి, చీడ, రూ.తెవులు.
వ్యాధితుఁడు - తెవులుగంటు.
తెగులుకొను - క్రి. రోగపడు.
తెగులుగొట్టు - వ్యాధికలవాడు.
రోగము - వ్యాధి.
రోగ నిరోధకశక్తి - (జీవ.) రోగము నెదుర్కొని దానిని జయించుశక్తి.
రోగ నిర్భయత - (జీవ.) రక్షణశక్తి, శరీరములో రోగమును కలిగించు జీవులు ప్రవేశించి రోగములు కలుగజేయకుండ నిరోధించుశక్తి, (Immunity).
గుండ1 - వస్త్రము; వస్త్రము - బట్ట, వలువ.
గుండ2 - పొడి, సం.గుండకః.
స్నాయువు - సన్ననరము, సం. (జం.) ఎముకలను కలిసియుంచు ఆధారకణజాలములో నేర్పడిన పట్టి, సంధి, బంధనము. (Ligament). కండరము - స్నాయువు, మాంసరజ్జువు.
న్నస - సన్ననరము; వన్నన - సన్ననినరము.
సంధి - 1.కూడిక, 2.శత్రువుల తోడి పొందు, 3.సందు, 4.సొరంగము, 5.రూపకముల యొందొక అంగము, (వ్యాక.) ముందరిపదము యొక్క చివర యక్షరము, ఒకదానితో నొకటి కూడుకొనుట. ఉదా. వాడు + అన్నము తినెను = వాడన్నము తినెను.
సంధి - (జం.) కీలు, వేరుగానున్న రెండు ఎముకలు గాని గట్టిపడిన భాగములుగాని కలియుచోటు (Joint).
బంధనము - 1.కట్టు, 2.చెర, 3.తొడిమ(తొడిమ - కాడ), 4.కట్టెడు సాధనము.
స్నాయుః స్త్రియామ్ -
వస్తేఛాదయతి దేహం వస్నసా. వస ఆచ్ఛాదనే. - దేహమును గప్పుకొని యుండునది. పా. స్నసా. "స్నసా స్నాయుశ్చ కథితా"ఇత్య మరమాలాయాం.
స్నాతి సదా ఆర్ద్రీభవతి స్నాయుః. సీ. ప్ణా శౌచే. - ఎప్పుడును ఆర్ద్రమై యుండునది. ఈ రెండు సన్నపు నరముల పేర్లు.
వహనము - 1.పడవ, ఓడ, 2.స్నాయువు.
పడవ - మిక్కిలి పల్లమైనది.
ఓడ - నావ(నావ - ఓడ), తరణి, హోడః.
హోడము - నావ, ఓడ.
తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.
రోకము - 1.ఓడ, 2.రంథ్రము, 3.వెలుగు, 4.కదలిక, 5.రొక్కపు టమ్మకము.
తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.
అక్కరపాటువచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడలబండ్లు బండ్లనోడలున్
దక్కన వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా.
తా. భాస్కరా ! ఒక్కొక్కప్పుడు నీటిలో నడుచు ఓడలమీద బండ్లును, నేలమీద నడచు బండ్లమీద ఓడలును వచ్చుచుండుట నందఱును చూచున్నదియే గదా. అట్లే, తగిన అవసరము వచ్చినపుడు బంధువు లొకరి నొకరు కాపాడుకొనుట మిత్రత్వమునకు మిక్కిలి మంచిది.
సంజ్ఞ - 1.సైస, 2.పేరు, 3.తెలివి, 4.పరిభాష, 5.సూర్యుని భార్య.
సన్న - సంజ్ఞ, సైగ, సం.సంజ్ఞా.
సైగ - సంజ్ఞ, రూ.సయిగ, సం.సంజ్ఞ.
సంజ్ఞ - (గృహ.) 1.అభినయము, 2.చేష్ట, 3.చేష్టలచే అభిప్రాయమును తెల్పుట (Gesture).
సంజ్ఞలు - (గణి.) రాసులు ధనరాసులో ఋణరాసులో తెలియజేయుట కుపయోగపడు గుర్తులు (+) అనునది ధనరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (-) అనునది ఋణరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (Signs).
అభినయము - నటనము; నటనము - 1.నాట్యము, 2.కపటవర్తనము.
నాట్యము - నృత్యము, నృత్యగీతవాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెది ఆట.
నృత్తము - నటనము.
నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తనప్రియము - నెమలి. నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
కృత్య - 1.ఒకానొకదేవత, 2.చేష్ట.
చేష్ట - 1.పని, 2.వ్యాపారము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
కార్యము - 1.పని, 2.హేతువు, 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది.
హేతువు - కారణము; కారణము - 1.హేతువు, 2.పనిముట్టు.
(ౙ)జాడ - 1.అడుగుల గురుతు, 2.సైగ, 3.త్రోవ, 4.విధము.
అడపొడ - జాడ; త్రోవ - మార్గము.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
పద్ధతి - 1.మార్గము, 2.వరుస, సం.వి. (గణి. భౌతి. రసా.) సమకూర్చబడిన అవయములు (భాగములు) కలిగి క్రమసహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడినది (System) లేదా ఒక పూర్ణముగా పరిగణింపబడు వస్తువుల సమూహము.
పదవి - మార్గము, వై. వి. ఉన్నతస్థితి, సం.పదమ్.
ఏకపది - 1.మార్గము, 2.ఒకడే నడువదగ్గ మార్గము.
ఆఖ్య - సంజ్ఞ, పేరు.
సమాఖ్య - 1.కీర్తి, పేరు, 2.బందకుట్టు.
పేరు - 1.నామము, 2.కీర్తి, 3.దండ(కాసుల పేరు), క్రి.ముద్దకుట్టు. నామము - నొసట పెట్టుకొను బొట్టు, సం.వి. నామధేయము.
నామధేయము - పేరు, నామము.
కీర్తి -1.యశస్సు, (వికృ.) కీరితి, 2.పేరు, 3.తేట, 4.అడుసు, 5.విరివి. సమజ్య - 1.సభ, 2.కీర్తి. సమజ్ఞ - కీర్తి, రూ.సమాజ్ఞ.
కీర్తన - 1.కీర్తి, యశస్సు, 2.పాట. యశస్వి - కీర్తికలవాడు.
తేట - నైర్మల్యము, ప్రసన్నత.
అడుసు - బురద. అడుసు త్రొక్కనేల, కాలు కడుగనేల?
విరివి - విసృతి, విణ.విసృతము, వెడల్పైనది.
గడ్డకుట్టు - ముద్దకుట్టు.
సమాహ్వయము - 1.పేరు, 2.ప్రాణి, 3.ద్యూతము, 4.యుద్ధము.
శరీరి - ప్రాణి.; జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురుగు, 2.గురుడు (Jupiter).
అభిఖ్య - 1.పేరు, 2.కీర్తి, 3.చెప్పుట, 4.కాంతి.
అభిధానము - 1.పేరు, 2.చెప్పుట, 3.నిఘంటువు, రూ.అభిధేయము.
అభిధేయము - పేర్కొనదగినది, వి.1.శబ్దార్థము, 2.గ్రంథ ప్రతిపాద్య విషయము, 3.నామధేయము.
చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
పారీణుఁడు - పాదము ముట్టినవాడు, మిక్కిలి నేర్పరి.
చైతన్యము - 1.తెలివి, 2.ప్రాణము.
అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
తెలివి - 1.వివేకము, 2.ప్రకాశము, 3.కాంతి, వికాసము, 4.తేరుట, 5.తెలుపు.
వివేకము - జ్ఞానము, విచారము. జ్ఞానమును కట్టిపెట్ట నియంత లేడు! చర్చ - 1.విచారము, 2.చింత, 3.గంధములోనగు వాని పూత.
మీమాంస - (వేదాం,) 1.విచారణ, 2.కర్మబ్రహ్మ ప్రతిపాదక శాస్త్రము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
వికాసము - తెలివి. జ్ఞానము - తెలివి, ఎరుక.
తేఱుట - 1.తేటపడు, 2.ప్రసన్నత నొందు, 3.ఊరడిల్లు, 4.స్వస్థతనొందు, 5.ముగియు.
తెలుపు - 1.ఎరిగించు(తెలుపుడుచేయు - ఎరిగించు), 2.మేలుకొలుపు, 3.తేర్చు, వై.వి.1.ధావళ్యము, 2.పరిశుద్ధి.
ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ధవళిమ - తెలుపు.
ధామము - 1.ఇల్లు, 2.చోటు, 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము, 6.మేను, 7.పుట్టువు.
ధామనిధి - సూర్యుడు Sun.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
ఉన్మేషము - 1.కనువిచ్చుట, 2.వికాసము, 3.కాంతి, 4.స్పురణము.
ఎలమి - 1.ఆనందము, 2.వికాసము, 3.ధైర్యము.
ఆనందము - సంతోషము, సుఖము.
వికాసము - తెలివి; జ్ఞానము - తెలివి, ఎరుక.
దైర్యము - ధీరత్వము.
ఆడదాని ఆలోచనలో హృదయం, మగవారి ఆలోచనలో తెలివి కనిపిస్తాయి. – బ్లెస్సింగన్
తెలివి లోపించిన మంచితనము, మంచితనము లోపించిన తెలివి వ్యర్థమైపోతుంది. మంచితనము బలహినము కాకూడదు.
దమము - 1.క్లేశమునొర్చుగుణము, 2.బాహేంద్రియ నిగ్రహము, 3.అణచుట, 4.అడుసు.
దమనము - 1.అణచుట, 2.దవనము.
దవనము - దమనము, సువాసనగల ఒకతెగ మొక్క, సం.దమనః.
దమ్మఁడు - 1.ధర్ముడు, 2.కపటము లేనివాడు, సం.ధార్మికః.
ధర్ముఁడు - 1.యముడు, 2.సోమయాజి.
యముఁడు - 1.కాలుడు, 2.శని(Saturn), వికృ.జముడు.
కాలుఁడు - యముడు; ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
సోమాసి - సోమయాజి, సోమయాగము చేసినవాడు, సం.సోమయాజీ.
సోమసీథి - 1.సోమపానము చేయువాడు, 2.సోమయాజి, యజ్ఞము చేసినవాడు.
దమ్మము - ధర్మము, సం.ధర్మః.
ధర్మము - ధర్మమునుండి తొలగనిది.
ధర్మి - ధర్మముగలది.
ఉపసమము - 1.అడగుట(శమించు - అడగు), 2.రోగాదుల బాధ తగ్గుట, 3.ఇంద్రియ నిగ్రహము, 4.ఓర్పు, రూ.ఉపసాంతి.
ఉపశాంతి - ఉపశమము. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతి.
శాంతము - శాంతిబొందినది, సం.వి.1.కామ క్రోధాది రాహిత్యము, 2.ఉపశమనము, 3.తొమ్మిది రసాలలో నొకటి.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యదగి యుండుట.
శాంతి - శమనము; శమనము - శాంతి పథము, రూ.శామనము.
శామనము - 1.శమనము, 2.పధము.
మదిమది - 1.నెమ్మది, శాంతి, 2.అనాలోచనము.
శమనుడు - యముడు; యముఁడు - 1.కాలుడు, 2.శని(Saturn), వికృ.జముడు.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.
ౙమ్మి - శమీ వృక్షము, సం.శమీ.
అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం|
అస్థిరం దారపుత్త్రాద్యాః ధర్మ కీర్తి ద్వయంస్థిరమ్|
తా. జీవితకాలము, యౌవనము, ధనము, దారాపుత్త్రాదులు ఇవి అస్థిరములు, తాను చేసిన ధర్మము, దానివలన కలిగెడు కీర్తియు రెండును శాశ్వతములు. - నీతిశాస్త్రము
కర్దమము - అడుసు, పంకము, బురద.
అడుసు - బురద. బాడె - బురద, అడుసు, సం.పంకమ్.
పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.
అసలు - 1.బురద, హిం.వి.(వాణి.) అప్పుగా తీసికొనిన సొమ్ము(Principal). పలలము - 1.మాంసము, 2.బురద.
అసలుఁబుట్టువు - తామర, పంకజము.
పంకజము - తామర, వ్యు.బురదలో పుట్టినది.
పంకేరుహము - పంకజము, తామర.
పంకరుహము - తామర; రాజీవము - తామర.
శ్వేత పంకజ వర్ణాభాం శరచ్చంద్ర నిభాననామ్|
చందనోక్షిత సర్వాగీం రత్నభూషణ భూషితామ్||
తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయరుహము - తామర, వ్యు.నీటియందు జన్మించినది.
సరోజము - 1.తామర(నీటి పుట్టువు - తామర), 2.తామర కొలను.
నలినము - 1.తామర, 2.తామర కొలను, 3.తామర తీగ.
బిసము - తామర తూడు, తామర తీగ.
బిసిని - 1.తామర కొలను, 2.తామర తీగ.
తూడు - తామర కాడ, బిసము.
నళిన్యాం తు బిసినీ పద్మినీ ముఖాః :
నళం పద్మమస్యామ స్తీతి నళినీ. ఈ. సీ. - నళమనఁగా పద్మము; అదిగలిగినది. 'నళమబ్జే నళో నళ 'ఇతి రుద్రః.
బిసమస్యామస్తీతి బిసినీ. ఈ. సీ. - తామరసూండ్లు గలిగినది.
ముఖ మన్నందున కమలి న్యబ్జినీ సరోజిన్యాది శబ్దములు గ్రహింపఁబడుచున్నవి. పద్మములు గల దేశమునకుఁగాని పద్మ సమూహమునకుఁగాని తామరతీఁగెకుగాని పేర్లు.
ఓం బిసతంతు తనీయస్యై నమః : తామర తూడులోని దారమువలె సూక్ష్మమై సన్ననైనది (పీతాభాత్యణూపమా - అని శ్రుతి కూడా చెప్పుచున్నది అనగా పరమాణువువలె పీతవర్ణంతో భాసిల్లుచున్నదని భావము) అట్టి సూక్ష్మస్వరూపిణికి ప్రణామాలు.
సూక్ష్మ మధ్యాత్మమపి : సూక్ష్మ శబ్దము పరమాత్మకును, అపిశబ్దము వలన స్వల్పమైనదానికిని పేరు. సూచ్యత ఇతి సూక్ష్మం త్రి. సూచింపఁబడునది.
అంభోజిని - 1.తామరతీగ, 2.తామరకొలను, 3.పద్మసమూహము.
పద్మిని - సూర్యుని భార్య.
పద్మిని - 1.తామర తీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతి స్త్రీ.
కోరకము - 1.మొగ్గ, 2.తామరతూడు, (వృక్ష.) మొగ్గ అల్పవికసిత కాండము (Bud).
మొగ్గ - 1.ముకుళము, వికసించని పుష్పము, 2.శిరముపాదములతో జేర విల్లువలె వెలికిల వంగుట, సం.ముకుళమ్.
కాఁడ -1.తామరతూడు, 2.కూరాకులలోని కామ, 3.తొడిమ, సం.కాండః.
తొడిమ - కాడ.
కోరగించు - 1.మొగ్గతొడుగు, 2.ఎఱ్ఱనగు, 3.ఉదయించు, 4.మారాముచేయు, ముకుళించు.
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టు - సంభవించు, జన్మించు.
మొగుచు - ముడుచు.
మొగుడు - వై.క్రి. ముకుళించు.
కళలు కలుగుఁగాక కమల తోడగుఁగాక!,
శివుని మౌళిమీఁద జేరుఁగాక!
నన్యు నొల్లఁ దపనుఁడైన మత్పతి యని,
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.
భా|| తాను కళలు కలిగినచంద్రుడే అగుగాక ! లక్ష్మి తోబుట్టువు అగుగాక ! శివుని శిఖయందు చేరుకొన్నవాడై నిక్కుగాక ! అన్యుడైన చంద్రుడి పొత్తు మా కక్కరలేదు. తపింపజేసే వాఁడైనప్పటికీ మా భర్త సూర్యుడే అని పతివ్రతవలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. అనగా పద్మములు సూర్యాస్తమయము కాగానే ముకుళించుకొని పోయినవి.
పూర్వం సూర్యుడు(వివస్వంతుడు) సంజ్ఞ అనే మారు పేరుగల పద్మినిని వివాహమాడి, ఆమె యందు వైవస్వతుడు, యముడు అనే కుమారులను, యమి(యమున, యమునానది) అనే కుమార్తెను పొందాడు.
వైవస్వతుఁడు - 1.యముడు 2.శని.
యముఁడు - 1.కాలుడు 2.శని, వికృ. జముడు.
యమున - 1.యమునానది 2.పార్వతి, వికృ. జమున.
మనువు కాని మనువు - వైవస్వత మనువు.
విశ్వకర్మణా వికృతి ఇతి వావికర్తనః - పూర్వ మితఁడు (సూర్యుడు) సహింపఁగూడని తేజస్సుగలవాడై యుండఁగా విశ్వకర్మ చేత నితని కాంతి సానపట్టి తగ్గించఁ బడినది.
పద్మిన్యాః వల్లభః పద్మినీ వల్లభః (పద్మినీవల్లభో హరిః) - తామరతీఁగకుఁ ప్రియుఁడు.
పుష్కరిణి - 1.తామరకొలను, కోనేరు, 2.ఆడేనుగు.
కోనేఱు - (కోన+ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి.
తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
తిరు - శ్రీ పదము, పూజ్యమైన, సం.శ్రీః.
కట్టుదొన - కోనేరు.
ఖాతము - 1.గాతము, 2.అగడ్త(కందకము - అగడ్త), 3.పుష్కరిణి.
గాతము - పల్లము, గుంత, సం.ఖాతమ్.
దవంత్రి - అగడ్త, పరిఖ.
అగడ్త - అగడిత; పరిఖ - అగడ్త.
అగదిత - కోటచుట్టు త్రవ్వబడిన కందకము, రూ.అగడత, అగడ్త.
ఖేయము - 1.అగడ్త, 2.ఆనకట్ట, సేతువు, విణ.త్రవ్వదగినది.
గణిక - 1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
నిమ్నము - పల్లము. విణ.లోతైనది, (విణ.) అధస్థ్సితము(Inferior).
గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము.
నిమ్నం గభీరం గమ్భీరమ్ :
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.
పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా|
మధ్యమా వైఖరీరూపా భక్తమానస హంసికా.
అబ్ది - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.
పద్మాకారము - కొలను.కొలఁకు - సరస్సు, చెరువు, రూ.కొలను, సం.కూలమ్.
సరస్సు - సరసి; తటాకము - చెరువు, రూ.తటాగము.
సరసి - కొలను, రూ.సరసు, సరస్సు.
సరసు - సరదు, సం.వి. సరసి.
వనబంధము - సరస్సు, కోనేరు.
సరిజనాభుఁడు - విష్ణువు.
సరసిజభవుడు - బ్రహ్మ.
సరసిజాతము - తామర; సరీరుహము - తామర.
తామర చెలి - సూర్యుడు, పద్మ మిత్రుడు.
నీరజము - 1.తామర, 2.ముత్యము విణ.దుమ్ములేనిది.
మానసము - 1.ఒక కొలను (మానవ సరస్సు), 2.మనస్సు.
మానసౌక(స)ము - హంస.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.
చేతము - మానసము.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
వంచ యింతలేక నెటువంటిమహాత్ముల నాశ్రయించినన్
కొంచెమె కాని యేలు సమగూడ దదృష్టములేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ నవిశంబును వీఁపునమోయునట్టి రా
యంచకుఁదమ్మి తూండ్లు దిననాయె కదాఫలమేమి, భాస్కరా.
తా. సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సంచితబుద్దితో వీపున మోసెడి రాజహంసకు బ్రహ్మనుమోయు ఫలితము లేదాయెను. అది తామరతూండ్లనే తినవలసి వచ్చెను. మోసగించక సేవ చేయువారి కావంతయు లాభ ముండదు. (ఈ పద్య మందుపమానమున్నను రాయంచ లోపమేమియు వ్యక్తీకరించలేదు. అందుచే సమభావము పారమార్ధికనిమిత్తముగా నుండునుగదా, అందు తప్పేమున్నది.)
తూఁడు దిండి - హంస, వ్యు. తూడే భోజనముగా కలది.
మృణాలము - 1.వట్టివేరు, 2.తామరతూడు.
లాజము - 1.వట్టివేరు, 2.నాన బియ్యము.
ఉశీరము - వట్టివేరు.
ఉశనుఁడు - శుక్రుడు, రూ.ఉశనసుడు.
వట్టివేళ్ళు - ఇవి తృణ కుటుంబము Graminae నకు చెందిన Vetiveria zizanoides అను మొక్కల వేళ్ళు (Cus cus) (ఇవి చాల పరిమళము నిచ్చును, వీనినుండి అత్తరువు, సుగంధతైలము కూడ తీయుదురు.)
మృణాళం బిసం -
మృణ్యతే భక్ష్యత ఇతి మృణాళం. అ. ప్న. మృణహింసాయాం. – భక్షింపఁబడునది.
బిస్యంతే ఉత్సృజ్యంతే భక్షణసమయే తంతవో త్ర బిసం. బిస ఉత్సర్గే. - భక్షణ సమయమున దీనియందుఁ గల తంతువులు విడువఁబడును. ఈ రెండు తామరతూఁడు పేర్లు.
ఔశీరము - చామరము, సురటి, విణ.వట్టివేళ్ళతో చేయబడిన మందు.
చామరము - వింజామరము, రూ.చమరము.
సురఁటి - వట్రువ విసనకఱ్ఱ.
నానబియ్యము - నానబ్రాలు; పచ్చిబియ్యము - నానబ్రాలు.
నానఁబ్రాలు - నీట నానిన బియ్యము.
అవదాహము - 1.వేడిమి, 2.కాల్చివేయుట, 3.వట్టివేరు.
లయము - 1.నాశము, 2.ఆలింగనము, 3.నీటి వట్టివేరు.
అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము(పరిత్రాణము - రక్షణము), 5.వట్టివేరు.
16. విశాఖ - (సారిక) కుమ్మరి చక్రమును పోలియుండును, 5 ఐదు నక్షత్రములు.
దూరమస్మచ్ఛత్రవో యంతు తాః | తదింద్రాగ్నీ కృణుతాం తద్వి- శాఖే | తన్నో దేవా అనుమదంతు యజ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభయన్నో అస్తు | నక్షత్రాణామధిపత్నీ విశాఖే | శ్రేష్ఠావింద్రాగ్నీ భువనస్య గోపౌ | విషూచ శ్శత్రూనపబాధమానౌ | అపక్షుధన్నుదత్తామరాతిమ్ |14||
కుమ్మరసారె చుక్క - విశాఖా నక్షత్రము.
కుమ్మర - కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
సారె1 - 1.కూతురు నత్తగారింటికి పంపు నపుడు ఇచ్చెడు వస్తువులు, 2.కుమ్మర వాని చక్రము. (గృహ.) వధువు అత్తగారింటికి పోవునపుడు తీసికొనిపోవు సామగ్రి, వధువు స్వగృహమును నిర్మించుకొనుటకై తలిదండ్రులు సహాయార్థ మిచ్చు గృహసామగ్రి.
సారె2 - 1.శారి, 2.పగడశాల కాయ, 3.పాచిక, 4.గోరువంక.
శారి - గోరువంక, రూ.1.శారిక, 2.జూదపుసారె.
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనక్షత్రము 3.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు సం.1.శుక్రః, 2.చుక్రః. శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు Moon.
చక్రము - 1.శ్రీకృష్ణుని ఆయుధము(కైదువు - ఆయుధము), 2.బండికల్లు, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము, 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.
కంటివాలు - చక్రాయుధము.
బిల్లవాలు - చక్రాయుధము.
(ౘ)చుట్టలుగు - (చుట్టు+అలుగు) చక్రాయుధము, చుట్టుగైదువు, రూ.చుట్టలు.
చక్రధరుఁడు - విష్ణువు; చక్రపాణి - విష్ణువు.
సుదర్శనము - విష్ణు చక్రము.
వేయం(ౘ)చులవాలు - విష్ణుచక్రము.
బండికల్లు - రథచక్రము.
రథాంగము - 1.రథచక్రము, 2.చక్రవాకము.
చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
చక్రాంగము - 1.హంస, 2.జక్కవ.
చక్రపక్షము - హంస; చక్రవాకము - జక్కవ.
చక్రధరము - పాము.
చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్భుదంబు ద్బుదంబు గాక!
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగముతోడి పశువు గాక!
జోడు వేల్పుల రిక్క - విశాఖానక్షత్రము.
జోడు(ౙ) - 1.జత, 2.చెప్పులజత, 3.సమానము, విణ.సమూహము సం.జోడః.
జోడుకోడె - 1.సమానుడు, 2.జత.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ 2.జోస్యము.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
విశాఖా నక్షత్ర చతుర్థ పాదమున చంద్రుడు ఉన్నప్పుడు కృత్తికా శిరస్సున సూర్యుడు ఉండును.
పాదుక - పావకోళ్ళు, చెప్పులు.
సమ్మాళికలు - పాదరక్షలు, సం. సంవాహికః.
సమ్మితము - 1.సమానము, 2.సమానమైన పరిమితి గలది.
మలఁకవాలు - పాదరక్ష.
ఉపానహము - చెప్పు, పాదరక్ష, వ్యు.పాదములందు కట్టబడినది.
చెప్పు - పాదరక్ష, క్రి.వచించు, అను.
పాదూ రూపానత్ స్త్రీ :
పద్యన్తే అనయేతి సాదూః. ఉ.సీ. పద్ ఌ గతౌ. - దీనిచేత నడచి పోవుదురు.
పాదూ రేవ పాదుకా - పాదువే పాదుక.
ఉపాహ్యతే పాదయో రితి ఉపానత్. హ. సీ. ణహ బంధనే. - పాదము యందుఁ గట్టఁబడునది. ఈ మూడు 3 చెప్పుల పేర్లు.
ఉపానహౌచ వాసశ్చ ధృతమన్యైర్న థారయేత్|
ఉపవీత మలంకార వ్రజం కరక మేవచ||
తా. ఒకని చేత ధరింపబడిన పాదరక్షలు, వస్త్రము, యజ్ఞోపవీతము, అలంకార పుష్పమాలిక, కమండలం వీనిని మఱియొకరు ధరింపరాదు. – నీతిశాస్త్రము
వాక్రుచ్చు - 1.పేరుచెప్పు, 2.చెప్పు, 3.శబ్దించు.
అను1 - 1.చెప్పు, వచించు, 2.అనుకరణ శబ్దములకు అనుప్రయుక్త మగును. వాచ్యము - చెప్పదగినది.
అను2 - అవ్య. ఈ క్రింది అర్థములనిచ్చు ఉపసర్గ : 1.ఆశ్రయము, 2.ప్రాప్తము, 3.పోలిక(పోలిక - సామ్యము), 4.తరువాత, 5.తగినది, 6.క్రమము, 7.సామీప్యము, 8.సహార్థము, 9.అనుకూల్యము.
అనుఁగు - 1.చెలికాడు, 2.ప్రేమ, 3.ముఖ్యుడు, విణ.1.ప్రియుడు, 2.ప్రియురాలు, 3.మనోజ్ఞము, 4.సహాయుడు, 5.మొదటిది.
అనుఁగుకాఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు.
స్నేహితుఁడు - చెలికాడు; అంతరంగుడు - స్నేహితుడు.
అనుఁగుఁగత్తె - చెలికత్తె.
చెలిమిరి - 1.చెలికాడు, 2.చెలికత్తె.
చెలిమికాఁడు - మిత్రుడు.
ఉజ్జి - జత, విణ.సాటి, రూ.ఉజ్జీ, ఉద్ది.
ఉద్ది - 1.జత, జట్టు, 2.చెలిమి, విణ.1.సమానము, 2.ప్రతిస్పర్ధి.
ఉద్ధీఁడు - 1.జతకాడు, 2.మిత్రుడు, రూ.ఉద్ధికాఁడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.
పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు - 1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి -1.మిత్రభావము, స్నేహము(చెలిమి -స్నేహము.), 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity).
పొందుకాఁడు - స్నేహితుడు.
స్నేహితుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు.
అంతరంగుడు - స్నేహితుడు.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
ఆశ్రయము - 1.ఇల్లు, 2.ఆధారము, 3.శత్రువులచే పీడింపబడుచు వారి నాశ్రయించి యుండుట, సంశ్రయము(సంశ్రయము - ఆశ్రయము), 4.ప్రాపు, 5.శరణాలయము.
ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
గృహిణి - ఇల్లాలు, భార్య.
ఇలుదొర - గృహస్థు. గృహమేధి - గృహస్థు, వ్యు.భార్యతో చేరియుండు వాడు.
ప్రాపు - ఆశ్రయము, సం.ప్రాపణమ్, ప్రాపః.
ఆసరా - ప్రాపు, ఆశ్రయము, అండ, సం.ఆశ్రయః.
అండ - 1.సమీపము, 2.ఆశ్రయము, 3.ప్రాపు, 4.మట్టిపెళ్ళ.
మద్దతు - ప్రోత్సాహము, అండ (Support). సమీపము - చేరువ. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
ఆధారము - 1.ఆదరవు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, (యోగ.) మూలాధారచక్రము.
ధామము - 1.ఇల్లు, 2.చోటు, 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము, 6.మేను, 7.పుట్టువు.
ధామనిధి - సూర్యుడు Sun.
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వ.
తా|| చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, కంటిపాపలో పడిన నలుసు, కాలిలో విరిగిన ముల్లు, యింటిలో పోరు భరించుట అసాధ్యము.
చెప్పులు తొడిగినవానికి అంతా తోలు కప్పబడినట్లుండును. కరిచే కాలిజోడుతోకన్న వట్టికాళ్ళతో నడుచుట సుఖము.
విశాఖుఁడు - షణ్ముఖుడు. (విశాఖ శ్శంకరాత్మజః)
షడాననుడు - కుమారస్వామి, షణ్ముఖుడు, వ్యు.ఆరు ముఖములు కలవాడు.
షణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.
విశాఖానక్షత్రే జాతః విశాఖః - విశాఖ నక్షత్రమందుఁ బుట్టినవాఁడు.
వినా పక్షిణా మయూ రేణ శాఖతి వ్యాప్నోతీతి విశాఖః - పక్షియైన నెమిలి చేతఁ దిరుగువాడు. – కుమారస్వామి
అగ్ని పత్నీనాం షణ్ణాం స్తన్య పానార్థం షట్ ఆననాని యస్య సః షడాననః - అగ్ని భార్యలైన షట్కృత్తికలత్తి స్తన్యపానముఁ జేయుటకై యాఱు ముఖముల ధరించినవాఁడు.
స్కందశ్చ కృత్తికాపుత్త్రో యే విశాఖాదయస్తతః |
దోషస్య శర్వరీపుత్రః శిశుమారో హరేఃకలాః |
రాధా విశాఖా -
రాధ్నోతి కార్యమనయా రాధా, రాధ సంసిద్దౌ - దీనిచేఁ గా(కా)ర్యము సిద్ధించును.
విశాఖతే కాంత్యా వ్యాప్నోతీతి విశాఖా శాఖృ వ్యాప్తౌ - కాంతి చేత వ్యాపించునది. విశాఖ పేర్లు. రాధ యనఁగా విశాఖ.
రాధ - ఒక గొల్ల స్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
రాధేయుఁడు - కర్ణుడు.
బృందావనము నందు దేవీస్థానం రాధ(రాధ అయిదవ శక్తి) పంచప్రాణాలను రక్షించే దివ్యశక్తి.
No comments:
Post a Comment