Saturday, February 25, 2017

జలము - నీరు

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు Sun, 3.చంద్రుడు Moon, 4.శివుడు, 5.అగ్ని Fire, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జన సమూహము స్థానముగా గలవాడు.
నారాయణః నరన్యేదంనారం అవతారేషు నారం వపురయత ఇతి నారాయణః - నరసంబంధమైన శరీరము నారము. అవతారములయందు నర శరీరమును బొందినవాడు.
నారము - 1.నరసమూహము 2.నీళ్ళు.  
అయగతౌ. నారా ఆపః అయనం స్థానం యస్యసః - నారమనగా జలము అది స్థానముగా గలవాడు.
నరసమూహో నారం తస్యయనమితి వా, తదయ నమన్యేతివా - నర సమూహమునకు స్థానమయిన వాడు. లేక నర సమూహము నివాసముగా గలవాడు.
రాశ్శబాః అయంతే నిర్గచ్ఛంతే యస్మా త్సనారాయణః. రాయణాదన్యః అరాయణః అరాయణోనభవతీతి నారాయణః - శబ్దగమ్య ఇత్యర్థః - ఎవనివలన శబ్దములు బయలు వెడలుచున్నవో అతడు రాయణుడు. రాయణుడు గానివాడు అరాయణుడు. అరాయణుడు గానివాడు నారాయణుడు. అనగా శబ్దగమ్యుడనుట. రైశబ్దే.

జనము - ప్రజ. యదా రాజా తథా ప్రజ. 
పబ్లిక్ - స్వాజనితము, వి. ప్రజ, జనసామాన్యము (Public). రాజెంతో ప్రజ అంతే.

ప్రజా స్యా త్యంతతౌ జనే,
ప్రజ - జనము, సంతతి.
ప్రజాశబ్దము సంతానమునకును, జనులకును పేరు. ప్రజాయత ఇతి ప్రజా, జనీ ప్రాదుర్భావే పుట్టినది.
సంతతి - 1.కులము, 2.సంతానము, 3.పుత్రపౌత్ర పారంపర్యము, 3.వరుస.
టీ, స, సంతతౌ యథా _ "ప్రజయా హి మనుష్య ఇత్యసా" వితి చంపూభారతే, జనేయథా _ "అథప్రజానా మధిపః ప్రభాత" ఇతి రఘువంశే.    
జనత - జనసమూహము. 
జనానాం సమూహో జనతా - జనుల యొక్క సమూహము.

నాల్గవ(4వ) పరి ధర్మభార్యా సర్గంబునందు నరనారాయణాభి ధానుండై దుష్క్రంబైన తపంబు సేసె; నాలుగో(4వ) అవతారంలో ధర్ముడను(ధర్ముఁడు - 1.యముడు, 2.సోమయాజి.)అను వానికి మూర్తి(మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.)యందు నరనారాయణులనే ఋషుల రూపము లను దాల్చి స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం మనస్సు యొక్క పూర్ణమగు నిగ్రహముతో కూడిన అపారమైన తపస్సు చేసాడు.

మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్ఛతి సముచ్ఛ్రితో భవతీతి మూర్తిః, సీ, మూర్ఛా మోహనముచ్ఛ్రాయయోః. - ఉన్నత మగునది.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదుల చెక్కు శిల్పవిద్య(Sculpture). 

మూర్తిః కాఠిన్య కాయయోః,
మూర్తిశబ్దము గట్టితనమునకును, శరీరమునకును పేరు. మూర్చయతీతి మూర్తిః, సీ. మూర్చామోహ సముచ్ఛ్రాయయోః, అధిక్యమును బొందునది, "ఉచ్ఛ్రాయమోహబంధేషు మూర్తిః పరిమితా వపి" ఇతి శేషః.

నీళ్ళు - నీరు.
నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము. 

మహాలక్ష్మి - 1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి.
కోల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం| కరవీరము నందు మహాలక్ష్మి.

నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది. సుపార్శ్వము నందు  నారాయణి|

నీరు అంతా నారాయణ స్వరూపమే. కాని అన్ని రకాల నీళ్ళని మనం త్రాగడానికి వాడలేము కదా! ఒక రకం నీళ్ళు కాళ్ళు కడుకుకొనడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరొక రకం నీరు స్నానానికి ఉపయోగ పడుతుంది. అదే విధంగా భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ అన్ని చోట్లకు మనం వెళ్ళకూడదు. కొన్ని ప్రదేశాలే చూడదగినవిగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు, మనం వాటి దగ్గరకు పోవడానికి కూడా వీలులేనివిగా ఉంటాయి. - శ్రీరామకృష్ణ పరమహంస  

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా |
హ్రింకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో

భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
భూతాత్మము - దేహము.
భూతేశుఁడు - శివుడు. 

వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.
నీరు -
1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమః.
నీరము - జలము.
నీటిఱేఁడు - 1.వరుణుఁడు, 2.సముద్రుడు.

ప్రచేతా వరుణః పాశీ యాదసాంపతి రప్పతిః :
ప్రకృష్టు చేతః యస్య సః ప్రచేతాః. స-పు. - మంచి మనస్సు గలవాఁడు.
వృణోతి వరా నముం లోక ఇతి వరుణః. వృజ్ వరణే. - జనము ఇతనిని వరము లడుగుచున్నది.
వృణోతి అరీ న్ పాశైరితి వా వరుణః - పాశముల(పాశము - త్రాడు)చేత శత్రువులఁ గట్టువాడు. పాశము బంధ హేతువు(కారణము).
పాశో స్యాస్తీతి పాశీ. న. పు. - పాశము ఆయుధము గాఁ గలవాఁడు. 
యాదసాం జలజంతూనాం పతిః - యాదసాం పతిః. ఇ. పు. - యాదస్సు లనఁగా జలజంతువులు వానికి పతి, అలుక్సమాసము.
అపాం పతిః అప్పతిః. ఇ. పు. అప్పులనఁగా(అప్పు - ఋణము, సం.వి.జలము.)జలము, దానికి పతి. ఈ ఐదు 5 వరుణిని పేర్లు. 

ప్రచేతసుఁడు - వాల్మీకిముని తండ్రి, విణ.గొప్పమనస్సు గలవాడు.

వరుణుఁడు - 1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
పాశ్చాత్యుఁడు -
1.పడమటివాడు, 2.వరుణుడు.
పాశి - 1.వరుణుడు, 2.యముడు.
నాగపాశము - వరుణుని ఆయుధము.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - న వ గ్ర హ ము ల లో ఏడవ గ్రహము (Saturn)

యాదస్సు - 1.క్రూరజంతువు, 2.నీటిదయ్యము, 3.నది, 4.నీరు.
యాదోనాథుఁడు -
సముద్రుడు.

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3, భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.

జంబుకుఁడు - 1.వరుణుడు, 2.నీచుడు.
వరుణుఁడు -
1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
నీచుఁడు - అధముడు, రూ.నీచు. అల్పుఁడు - నీచుడు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు. కొంచెకాడు - అల్పుడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.
ఉద్దముఁడు - 1.స్వతంత్రుడు, 2.భయంకరుడు, 3.అధికుడు, వి. వరుణుడు.
స్వతంత్రుఁడు - ఒకరిపై ఆధారపడకుండ నుండువాడు, తన్నుతాను పోషించు కొనువాడు.
అధికుఁడు - గొప్పవాడు.

వినిఘ్నతి త్వయథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ |
భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే ||
తా.
వరుణుడు వేదములయందు జంబుక నామధేయుడుగా ప్రసిద్ధుడు. కనుక నీవు జంబుకము(నక్క)ల రూపమున ఉన్న రాక్షసులను సంహరించుచుండుట చూచి 'జంబుక 'అను పేరు కల వరుణునకు కూడ భయము కలిగినది. ఆ భయముచేతనే తనయొక్క జంబుక నామ ధేయమును అతడు వేదములయందు మాత్రమే ప్రసిద్ధము చేసికొనెను, అని నేనందుకొందును. - నారాయణీయము  

కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణా|

కడలిఱేఁడు - వరుణుడు.
కడలి -
సముద్రము.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలిమీఁగడ ముద్ద - చందమామ.
కడలివెన్న - 1.చంద్రుడు Moon, 2.అమృతము.

అబ్ధిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.

వారి - నీరు.
వారిచరము -
చేప మొ.
వారిజము - 1.తామర, 2.శంఖము, 3.ఉప్పు.

వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ|

వారిదము - మేఘము, వ్యు.నీటి నిచ్చునది.
వారిమసి -
మేఘము, వ్యు.నీరుని మసివలె నల్లగ చేయును. 

సలిలము - నీరు.
సలిలము -
కొలువుడు కానిని కొలువు నుండి త్రోయుట, సం.చాలితమ్.
సరతీతి సలిలం. సృ గతౌ. రలయోరభేదః. - ప్రవహించునది.
సరతీతి సలిలం. షల గతౌ – పోవునది.

పంచముఖుఁడు - శివుడు, (ఐదు మోముల వేలుపు).
పంచాననుఁడు -
శివుడు, వ్యు.ఐదు మొగాలు కలవాడు.
ఐదుమోముల వేలుపు - పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.                               

పంచాననము - సింహము, వ్యు.విశాలమగు ముఖము గలది Lion.
పంచ ఇతి పంచం, పచి విస్తారే, పంచం విస్తృమాస్యమస్యేతి పంచాస్యః - విస్తీర్ణమైన ముఖము గలది.

లగ్నము - (వృక్ష.) కింజల్కము యొక్క దండము పుప్పొడితిత్తి పొడవున అంటుకొనియున్నస్థితి కలది, (Adnate). 
లగ్నము - మేషాదిరాసుల ఉదయము, విణ.తగులుకొన్నది.

కర లగ్న మృగః కరీంద్ర భంగో
ఘన శార్దూల విఖండనో స్త జంతుః
గిరిశో విశదాకృతిశ్చ చేతః
కుహరే పంచముఖో స్తిః కుతో భీః ? 
తా.
కరమందు చిక్కుకున్న మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.)యును, గజ రాక్షస హింస యును, వ్యాఘ్రాసురుని సంహార మును, ప్రాణినాశమును, గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.)గిరి నివాసమును, విశదము - తెల్లనిది, స్పష్టమైనది)  స్వరూపమును కలిగి పంచముఖుఁడు - శివుడు (ఐదుమోముల వేలుపు.)పంచవదనాలతో భాసిల్లే సదాశివ దేవుడు మనోరూప(కుహరము - 1.గుహ, 2.రంధ్రము.)గుహలో ఉండగా భీ - భయము  ఎక్క డుంటుంది? - శివానందలహరి

పంచాననః పరం బ్రహ్మ చాఘోరో ఘోరవిక్రమః,
జ్వలన్ముఖో జ్వాలమాలీ మహాజ్వాలో మహాప్రభుః|

అహోబిలం(గరుడాచలంలో అహోబలం, అక్కడ నృసింహస్వామి దేవేరి అమృతవల్లి), సింహాచలం(సింహాద్రి అప్పన్న), వేదాద్రి, మంగళగిరి, యాదగిరిగుట్ట(లక్ష్మినరసింహస్వామి)నరసింహస్వామి క్షేత్రములు మొ.వి.

పంచనారసింహ క్షేత్రభావ మరసి
యున్నఁ జాలును మేలు మహోత్సవంబు
పంచభూతంబు లరచేత సంచరించు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

14. హర్యక్షుడు - కుబేరుడు.
ఏకపింగళుఁడు - కుబేరుడు.
ఏకం చక్షుః గౌరీశాపాత్పింగళవర్ణం జాతం యస్య స ఏకపింగః - పార్వతీదేవి(గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.)శాపము వలన పచ్చనైన యొక కన్ను గలవాఁడు.

పౘ్చకామెర్లు - (గృహ.) కామిల, ఒక విధమైన కాలేయపు వ్యాధి (Jaundice), (దీనిచే కన్నులు మొదలగునవి పసుపు పచ్చగా నగును.)   
కామల - కామలరోగము, కన్నులు పచ్చనగు వ్యాధి, (Jaundice).
కాయిలా - రోగము, జబ్బు.  
కండ్లు, శరీరము, ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణముగలిగి తంద్ర(తూగు, కునికిపాటు), అగ్నిమాంద్యము, దాహము, నీరసము మొదలగు లక్షణములు గలిగినది.    

కాయకంటి - కుబేరుడు.
కాయకన్ను - కాయకాచిన కన్ను.
కాయ - 1.చెట్టున కాచుకాయ, 2.కఠినవస్తు స్పర్శచే హస్తాదులందు కలుగు కాయ, 3.జూదపుసారె, 4.వీణాసొరకాయ, 5.కంటితెవులు.

గుడ్డికన్ పాదుషా - కుబేరుడు. 
పాదుషా - రాజు, హిం.బాద్ షాహ్.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon.   

హర్యక్షము - సింహము, వ్యు.పచ్చని కన్నులు కలది.
హరిణీ కపిలవర్ణే అక్షిణీ అస్య, హర్యక్షః - కపిలమైన కన్నులుగలది. 

పింగదృష్టి - సింహము Lion.
పింగే దృష్టీ యస్య సః పింగదృష్టిః పు. - పచ్చని చూపులు గలది. తృతీయం కృష్ణపింగాక్షం..

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృష్టించు - క్రి.చూచు.
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve)
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగ్రుడ్డునకు సంబంధించినది (Optic)
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.
నిబోధనము - చూపు.      
ౘూపు - క్రి.చూపించు, వి.దృష్టి.

సెర - కంటి యందలి రేఖ.

దిష్టి - దృష్టిదోషము, సం.దృష్టిః.
దృష్టి వైషమ్యము - (జీవ.) నేత్రదోషము వలన అక్షపటలముపై బొమ్మను కేంద్రీకరించ లేకపోవుట, (Astigmatism).
కను - క్రి.1.చూచు, 2.ప్రసవించు, 3.తెలియు, వి.నేత్రము. 
కనుకలి - చూపు, కానుపు.    

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.

15. ఐలబిలుఁడు - 1.ఇలబిలకోడుకు, కుబేరుడు, 2.దిలీపుడు.
ఇలబిల యనెడు స్రీ యొక్క కొడుకు. లడయో రభేదాత్ ఇడబిట్ భ్రాతా అస్యేతి ఐడబిడః - ఇడబిట్టనెది తమ్ముఁడు గలవాఁడు.

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

ఐలబిలాది దిగీశ బలావృత
కైలాసాచల లీలా లాలస| ||శరవణభవ||

కమలాప్తుఁడు - సూర్యుడు Sun, విష్ణువు.
సూర్యుడు - వెలుగురేడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.  
విష్ణుః, ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
కం జలం అలతి భూషయ తీతి కమలం, అల భూషణదౌ - జలమును భూషించునది.
కేన మల్యతే ధార్యత ఇతి వా కమలం. మలమల్ల ధారణే. - జలముచేత ధరింపఁబడునది.
కామ్యతే తృషార్తైరితి కమలం. కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరఁబడునది.
సహస్రపత్రము - కమలము, తామర.
సహస్రం పత్రాణ్యస్య సహస్రపత్రం వేయుఱేకులు గలది. కమలదళాక్ష గోవిందా| 

శ్రీపర్ణం కమలే (అ)పి చ,
శ్రీపర్ణశబ్దము తామరపువ్వునకును, అపిశబ్దము వలన నెల్లి(నెల్లి - ఉసిరిక)చెట్టునకును పేరు. శ్రీయుక్తాని పర్ణాన్య స్యేతి శ్రీపర్ణం - ఒప్పిదము గల పర్ణములు గలిగినది.

రాగి - ఒక విధమైన పైరు, వై.వి.తామ్రము, సం.విణ.1.అనురాగము కలది, 2.ఎరుపు గలది. 

కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.  

తామరతూపరి - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మదనః మదయతీతి మదనః - మదింప జేయువాఁడు, మదీ హర్ష గ్లేపనయోః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మధతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).    

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

తా. తామరులు జలమును వదలినయెడల కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు. తమకాప్తు లైన సూర్యుని రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయి నట్లే, తమ తమ నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.)దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువు లగుదురు.

మహాలక్ష్మి-1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి. కొల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం|

కమల-1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 2.కమలాఫలము.
కమలమస్యా అస్తీతి కమలా - కమలము చేతియందు గలిగినది. కమలాలయము నందు దేవిస్థానం కమల|     

స్యాత్కురజ్గే పి కమలః :
కమల శబ్దము ఇఱ్ఱికి పేరైనపుడు పు. అపిశబ్దము వలన తామరకును, నీళ్ళకును పేరైనపుడు న. మహాలక్ష్మికీ పేరైనపుడు సీ. కామ్యత ఇతి కమలః. కము కాంతౌ. కోరఁబడునది. 'కమలం సలిలే తామ్రే జలజే క్లోమ్ని భేషజే, మృగప్రభేదే కమలః కమలా శ్రీవరస్త్రియో' రితి విశ్వప్రకాశః.

కమలుఁడు - బ్రహ్మ, ఇంద్రుడు. 
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.   
కమలాసనః, కమలం ఆసనం యస్య సః - కమలము ఆసనముగాఁ గలవాఁడు.    

ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

కమలిని - 1.తామరకొలను, 2.తామరతీగ.
కమలు - క్రి.1.తపించు, 2.సంతాపించు, 3.కాలు.

ఉమాపతి - శివుడు.
ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు. 
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
పాతి స్వానుజీవిన మితి పతిః, పా రక్షణే. - తన యాశ్రితుని రక్షించువాఁడు.
స్త్రీలింగమందు రుచి శబ్దము వలెను, నపుంసకమందు వారి శబ్దమువలెను రూపము. పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే అడ్డు పెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉమా, ఆ-సీ. ఉ ఇత్యనేన సంబోధ్య మా ఇత్యనేన తపసో మాత్రా నిషిద్ధత్వాదుమా, ఉ = ఓ బిడ్డా, మా = వలదు. అని యట్లు తల్లి చేఁ దపస్సువలన నిషేధింపఁబడెను గనుక ఉమ, అవతీత్యుమా - రక్షించునట్టిది.  

మేని - కాంతి.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కామ్యత ఇతి కాంతిః, ఈ-సీ. కము కాంతౌ - ఇది కోరఁబడుచున్నది గనుక కాంతి.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).   

అభిరుచి - 1.అత్యాసక్తి, 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినచవి (Taste).  

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కాంతికిరణపుంజము - (భౌతి.) కాంతికిరణముల గుంపు, రూ.కిరణశలాక (Beam of light).
కిరణశలాక - (భౌతి.) సమాంతరముగ నున్న కిరణముల సమూహము (Pencil of rays).

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ|

నలినము - 1.తామర, 2.తామరకొలను, 3.తామరతీగ.
నల్యతే బద్ద్యతే చంద్రేణేతి నలినం. - చంద్రునిచేత ముకుళరూపమున బంధింపఁ బడినది.
రాగము - 1.అనురాగము, 2.రంగు, 3.మాత్సర్యము, 4.సంగీతమున నాట మొ|| రాగము.

హాసము - నవ్వు (ఆరు విధములు:- స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, అపహసితము అతిహసితము).

మధ్యమః స్యా ద్విహసితమ్ -
స్మితాతిహసిత యోర్మధ్యమః విహసితం – చిఱునవ్వునకును పెద్ద నవ్వునకును మధ్యమైన నవ్వు విహసిత మనంబడును.
విహసితము - మృదు ధ్వనిగల నవ్వు.
విశేషేణ హసనం విహసితం, హసే హసనే. - విశేషముగా నవ్వుట విహసితము.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.
 
అవ్యక్తరాగ స్త్వరుణః -
ఇయర్తీత్యరుణః ఋ గతౌ. - మనస్సును బొందునది. ఈ 1 వ్యక్తము కాని యెఱుపు పేరు.

నఖానా ముద్ద్యోతై - ర్నవనలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం - కథయ కథయామః కథ ముమే|
కయాచిద్వా సామ్యం - భవతు కలయా హన్త కమలం 
యది క్రీడల్లక్ష్మీ - చరణతలలాక్షారుణదలమ్|| - 71

తా. ఓ ఉమా! తల్లీ! నూతనమగు పద్మకాంతిని విహసితము - మృదు ధ్వనిగల నవ్వు, గోళ్ళచే ప్రకాశించుచున్న నీ చేతుల కాంతి - 1.కోరిక, 2.(అలం.)ఒక కావ్యగుణము. నెట్లు ఏమని పొగడగలము? కమలము తా నే విధముగానైన క్రీడించుచున్న లక్ష్మీదేవి యొక్క పాదములందలి  లాక్షారసము - పారాణి అరుణిమను పొందగలిగిన - కొంచెముగా సామ్యము - సమత్వము, పోలిక. పొందిన పొందవచ్చును. సంపూర్ణమైన సామ్యము నకు తగదు. సాటిగాని కమలపు ఏ కళతో నీ నఖకాంతి సమమగును. - సౌందర్యలహరి

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

కమలే! కమలాక్షవల్లభే! త్వం
కరుణాపూర తరంగితైరపంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః|| -21

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.

తామరసము - 1.తామర, 2.బంగారు, 3.రాగి.
తమఃప్రకర్షో రసో (అ)స్య తామరసం - ప్రకృష్టమైన రసము గలిగినది.
తామ్యద్భిః రస్యత ఇతి వా తామరసం, రస ఆస్వాదనే.- బడలినవారిచే నాస్వాదింపబడునది.
తామరసం జలం తత్రసస్తి తిష్ఠతీతి తామరసం, షస స్వప్నే. - ఉదకమందుండునది. 
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring Worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)

కిట్టాలము - 1.రాగిపాత్ర, 2.రాగిగాజు.

చిరుధాన్యములు - (వ్యవ.) సజ్జ, రాగి, తమిద మొదలగునవి. అవి గడ్డి జాతి ధాన్యములలో చిన్నవి, (Millets).

సంకటి - రాగిపిండి లోనగు వానితో వండిన సంకటము, అంబలి.
అంబలి - ఒకరకపు జావ.  
అంబకళము - అంబలి, ఒకరకపుజావ. అంబలి ద్రావేవాని మీసము ఎత్తిపట్టుకొనే వారొకరా!

అథ తామ్రకమ్, శుల్బం మ్లేచ్ఛముఖం ద్వ్యష్ట వరిష్ఠోదుమ్బరాణి చ,

ౘోడి - రాగిపైరు, (బహు, చోళ్ళు.)
తృణధాన్యము - (వ్యవ.) గడ్దిజాతి ధాన్యము (Cereals), ఉదా. వరి, ఝొన్న, గోధుమ, చోడి మొదలగునవి. 

తమిఁద - రాగిపైరు, రూ.తవిద, తవ్విర.
తవిద - తమిద.
రాగి - ఒక విధమైన పైరు, వై.వి.తామ్రము, సం.విణ.1.అనురాగము కలది, 2.ఎరుపు గలది.
రాగిల్లు - రంజిల్లు.

బుసము - 1.పొల్లు, 2.మీగడ తీసిన పెరుగు, 3.బూగర, సం.వి. (వృక్ష.) వడ్లగింజపై నుండు రెండు ఊకపాయలలొ చిన్నది(Palea), (పెద్దది "అవలంబనము" (Lemma) అనంబడును).
బూగర - 1.రాగి మొదలగు ధాన్యము లపై గల పొట్టు, 2.కర దూపము. 

దూగఱ - కరదూపము, ధాన్యాదులలోని దుమ్ము.

పిశంగము - (రసా.) రాగి రంగుగలది, (Brown) సం.వి.కపిలవర్ణము.  

తామ్రము - 1.రాగి, 2.ఎరుపు, సం.వి. (రసా.) (Copper) రాగి, పిశంగ (Brown) వర్ణము గల ధాతువు. (ఇది ఆవర్త క్రమపట్టికలో రెండవ (2వ) వర్గములో వెండి బంగారముతోపాటు అమర్చబడి యున్నది. మొక్కలకు కావలసిన సూక్ష్మమూల ద్రవ్యములలో నిది యొకటి). తామ్యతి వ్యధతే అగ్నిసంయోగాదితి తామ్రకం, తముగ్లావౌ, - అగ్ని సంయోగము వలన వ్యథ నొందునది అనఁగా కరఁగునది.

స్పోటిత తామ్రము - (రసా.) రాగి ఖనిజము నుండి రాగిని సాధించు ప్రక్రియలో చివరదశలోని రాగి కరగియున్న ధాతువు నుండి సల్ఫర్ డైయాక్సైడ్ వాయువు పైకి ఉబుకుటచే బొబ్బలుగా ఏర్పడిన పైతలము గల రాగిముడి ధాతువు (Blister copper).

త్రాడుఁదాలుపు - వరుణుడు.
వరుణుఁడు - పడమటి దిక్కున అధిపతి, 2.నీటి రేడు.  
త్రాడు - 1.పేనినదారము, 2.పాశము, 3.కిరణము, వెలుగు.
త్రాడుపఁడు - 1.కృశించు, 2.దారమగు.  

శుల్భము - 1.రాగి, 2.త్రాడు.
శలతి అశుగచ్ఛతి ద్రవావస్థాయా మితి శుల్బం. శల అశుగమనే.- కరఁగినప్పుడు జాఱునది, రాగి.
పాశము - త్రాడు.
శోచంత్యనేన మృగాదయ ఇతి శుల్బం, శుచ శోకే. - మృగాదులు దీనిచేత దుఖించును, పా. శుమ్భం, త్రాడు.

బీజకోశో వరాటకః,
బీజకోశము - (జీవ.) అండాశయము, అండములను స్త్రీ బీజములను ఉత్పత్తి చేయు స్థలము (Ovary).
బీజానాం పద్మాక్షాణాం కోశః ఆకరో బీజకోశః - తామరవిత్తులకు నెలవైనది.   
వరాటకము - 1.గవ్వ, 2.తామరదుద్దు, 3.మోకు.
వట్యతే వేష్ట్యత ఇతి వరాటకః, వట వేష్టనే. - చుట్టఁబడునది, పా, వరాటకః.
వృణోతి బీజానితి వరాటకః - విత్తులను గప్పునది. ఈ 2 తామరపువ్వులోని దుద్దు పేర్లు.

న్యగ్రోధో బహుపా ద్వటః,
న్యగ్రోధము - 1.మఱ్ఱి, 2.జమ్మి.
న్యక్ రుణద్ధి మార్గమితి న్యగ్రోధః, రుధిర్ ఆవరణే - మార్గము నడ్దముగాఁ గప్పునది.
బహుపాదము - మఱ్ఱి చెట్టు.
బహవః పాదాః మూలాని సంత్యన్యే బహుపాత్, ద. పు. - విస్తారమైన యూడలుగలది.
వటము - 1.త్రాడు, 2.మఱ్ఱి, 3.గవ్వ.
వటతిమూలైః స్వస్థానం వేష్టయతి వటః, వట వేష్టనే. - ఊడలచేత స్వస్థానమును జుట్టుకొని యుండునది. ఈ 3 మఱ్ఱిచెట్టు పేర్లు. 
వటి - 1.త్రాడు, 2.వటము.
వట్యతే వేష్ట్యత ఇతి వటీ, వతవేష్టనే, త్రి. - చుట్టఁబడునది.

వ్యమో వటశ్చ న్యగ్రోధౌ -
న్యగ్రోధశబ్దము బారకును, మఱ్ఱిచెట్టునకును పేరు. స్యక్ రోహతీతి న్యగ్రోధః, రుహ బీజజన్మని ప్రాదుర్భావే. - అడ్దముగా వ్యాపించునది.
న్యక్ తిర్యక్ రుణద్ధి న్యగ్రోధీ, రుథిర్ ఆవరణే. - అడ్దముగాఁ బాఁకునది.

రాగరజ్జువు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మధతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
రజ్జువు - 1.త్రాడు, 2.స్త్రీజడ. 
సృజ్యత ఇతి రజ్జు, ఉ. సీ. సృజవిసర్గే. - సృజింపఁబడునది.

రజ్జౌ సర్పభ్రమణారోపః తత్ద్వద్బ్రణణి జగదారోపః,
మిధ్యామాయామోహవికారం, మనసి విచారయ వారం వారం||భజ||

గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
గుణ్యతే అభ్యస్యత ఇతి గుణః. గుణ అభ్యాసే. - అభ్యసింపఁబడునది.
గుణ్యతే అభ్యస్యతే బంధనాయేతి గుణః, గుణ అభ్యాసే. - బంధనము కొరకభ్యసింపఁబడునది. ఈ 5 త్రాడు పేర్లు. 
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.    
ప్రకృతేర్గుణాః సత్త్వరజస్తమాంసీత్యుచ్యంతే - ప్రకృతియొక్క గుణములు సత్త్వరజస్తమంబు లనంబడును.
గుణయంతి పాకం పునరావర్తయంతీతి గుణాః, గుణ అభ్యాసే. - పాకమైనదానిని తిరుగఁబోసి వండువారు (వంటవారు).

పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు:- ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు).
పున్నమ్నో నరకాత్త్రాయత ఇతి పుత్రః, త్రైఙ్ పాలనే. - పుంఅనెడి నరకముల వలన రక్షించువాఁడు.

వట్టుచుఁ దండ్రి యత్యధమవర్తను డైననుగాని వానికిం
బుట్టిన పుత్రకుండు తన పుణ్యవశంబున దొడ్ద ధన్యుడౌ
నెట్లన మఱ్ఱివిత్తుమును పెంతయు గొంచెము దానబుట్టునా  
చెట్టుమహోన్నతత్త్వమునుజెందదె శాఖ నుండి, భాస్కరా.

తా. మఱ్ఱి విత్తనము చిన్నదైనను దాని విత్తనము లో నుండి ఉద్భవించిన మొక్క పెద్దదై అనేక శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.)లతో పెరుగును. అట్లే నీచున కుదయించినను వారు(పుత్రుడు) తమ పుణ్య ఫలముచే(ధన్యుఁడు - పుణ్యవంతుడు)ఘనత గాంచవచ్చును.

గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః,
న్యగ్రోధ రూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితి ర్విభుః|

సులభః సువ్రత స్సిద్ధః శత్రుజిత్ శత్రుతాపనః
న్యగ్రోథోదుంబరో(అ)శ్వర్థ శ్చాణూరాంధ్ర నిషూదనః| - 88

మ్లేచ్ఛముఖము - రాగితామ్రము, వ్యు.మ్లేచ్ఛజాతి వ్యక్తిముఖము వలె ఎఱ్ఱనైనది.     
మ్లేచ్ఛదేశే ముఖ్యత్యాత్ మ్లేచ్ఛముఖం - మ్లేచ్ఛదేశ మందు ముఖ్యమైనది. 

మ్లేచ్చుఁడు - 1.ఆచారహీనుడు, 2.పాపరతుడు, 3.నీచజాతివాడు.
మ్లేచ్చముఖము - రాగితామ్రమౌ, వ్యు.మ్లేచ్ఛజాతి వ్యక్తిముఖమువలె ఎఱ్ఱనైనది.
"గోమాంసభక్షకో యస్తులోకబాహ్యం చ భాషతే, సర్వాచార విహీనో (అ)స్యా మ్లేచ్ఛ ఇత్యభిధీయతే" అనుతీతిని మ్లేచ్ఛంతే అవ్యక్తం భాషంత ఇతి మ్లేచ్ఛ అవ్యక్తే శబ్దే. - వ్యకతముగాకుండఁ బలుకువారు గనుక మ్లేచ్ఛులు.
మ్లేచ్ఛజాతులలో నెమిలిపింఛము మొదలైనవి కట్తుకొనువారు గనుక మ్లేచ్చులు.

ద్వ్యష్టము - రాగి, తామ్రము.
ద్వేహేమరూప్యే అశ్నుతే ద్వ్యష్టం. అశువ్యాప్తౌ. - వెండి బంగారములను రెంటిని వ్యాపించునది. శ్రేష్ఠత్వాత్ వరిష్ఠం - లోహములలో శ్రేష్ఠమైనది.

అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.

లేపకుఁడు - పూయువాడు.
లేపరము - పూతపూయుట (Plating). 

చేసిన దుష్టచేష్ట నదిచెప్పక నేర్పున గప్పి పుచ్చి తా
మూసిన యంతటన్ బయలుముట్టకయుండద దెట్లు? రాగిపై
బూసిన బంగరున్ జెదరిపోవగడంగినవాఁడు నాటికిన్
దాసినరాగి గానఁబడదా పనులెల్ల నెఱుంగ, భాస్కరా.  
తా.
రాగిపై బంగారము బంగరు - బంగారము, సం.భృంగారః. ఒక పొరగా ఏర్పరచి దాని నంతను బంగారమని చెప్పినను కాలక్రమమును, ఆ మేఁగు -1.పూయు, లేపనముచేయు, 2.ఆవరించు.)బడిన బంగారము తొలగిపోగానే ప్రజలందరికి అది ' రాగి ' యని తెలియును. అట్లే నీచుదొక దుర్మార్గమైన పని చేసి(చేసిన) దానిని యెవరికినీ చెప్పక, రహస్యముగా దాచి యుంచినను కొన్నాళ్ళకది బయలుపడక మానదు.

హీనధాతువు - (రసా.) గాలికి, నీటికి, సులభముగా మార్పు చెందగల ధాతువు (Base metal), ఉదా. ఇనుము, రాగి, జింకు, సీసము.

ఔదౌంబరము - 1.ఒకలోహము, 2.రాగి, విణ.ఉదుంబర (మేడి) వృక్ష సంబంధమైనది.
ఉదుంబరాభత్వా దుదుంబరం - మేడివంటి వన్నె గలది.
"ఔదుంబరం చ తామ్రం" అని యమర మాలయం దార్యావృత్తమున జెప్పినాఁడు గనుక ఔదుంబరం మని ఔకారాదియుఁ గలదు. ఈ 6 రాగి పేర్లు.

రాగి - ఒక విధమైన పైరు, వై.వి.తామ్రము, సం.విణ.1.అనురాగము కలది, 2.ఎరుపు గలది.

ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్|
మత్స్యాపాదంజ లే పశ్యే న్ననారీ హృదయ స్థితమ్||

తా. మేడిపువ్వులనైన గానవచ్చును, తెల్లని వాయసము-కాకి(ధూంక్ష్మము - తెల్లకాకి నైనఁ గానవచ్చును, నీళ్ళలోపల మత్స్యము - చేపల యడుగులనైనఁ గానవచ్చును, నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.స్త్రీ.)స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను. - నీతిశాస్త్రము

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

9. తామ్రపర్ణి - 1.ఒకనది, 2.పడమటి దిక్కునందలి అంజన మను దిగ్గజము యొక్క భార్య.
తామ్రపర్ణాఖౌషధీ సాహచర్యాత్తామ్రపర్ణీ, ఈ-సీ. - తామ్రపర్ణ మనెడి ఓషధితోఁగూడినది.

శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబద్ద్య సేతుం నిశి బిల్వపత్రైః|
శ్రీరామచన్ద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్య సతతం నమామి. - 9

చిలుము - 1.రాగి మొదలగు లోహము లందలి మురికి, 2.విషము, 3.పొగ పీల్చుట కుపయోగించు గొట్టము.  

కిలుము - (గృహ.) ఇత్తడి లేక రాగిమీద ఏర్పడు మాలిన్యము, (ఇది ఒక విధమైన విషము), రూ.చిలుము, (Veradigris).

చిలుమువాలు - 1.తులువ, 2.కుత్సితుడు, 3.తుప్పుపట్టిన కత్తి.  

ఉలిపి - 1.తులువ, 2.పొగరుబోతు, 3.శోఫరోగము కలవాడు.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు. దుర్జనుఁడు - దుష్టుడు.
దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్డజాతి.
రాజమల్లుఁడు - పొగరుబోతు; దృప్తుఁడు - దర్పించినవాడు, పొగరుపోతు.

భండుఁడు - 1.ఆకతాయి, 2.దుశ్చేష్టుడు.
బండగుఁడు - బండడు, ఆకతాయి, సం.భండః.
ఆకతాయి - తుంటరి, దుష్టుడు, సం.ఆకతాయీ.

భండనము - 1.యుద్ధము, 2.దుశ్చేష్ట.

బండ - 1.వెడల్పగురాయి, 2.పొట్టి రోకలి, వై.వి.ఘోరకృత్యములచే బిచ్చమెత్తెడు ఒక నీచ జాతి, రూ.బండడు, సం.భండః, విణ.అరిగినది.

ఆతాపి చిల్లౌ -
ఆతతాయి - 1.దుర్మార్గుఁడు, 2.హింసాస్వభావము కలవాడు.
ఆతాపయతి పరజాతీ మిత్యాతాసీ, న. పు. తప సంతాపే. - ఇతర జాతిని తపింపఁ జేయునది, పా, ఆతాయీ, న, పు.
చిల్లకొండి - కలహకారి.    
చిల్లయతి శిథిలీకరోతి పరానితి చిల్లః, చిల్ల శైథిల్యే. - ఇతర పక్షులను శిథిలముగా జేయునది. ఈ 2 పిన్న గ్రద్ద పేర్లు, జెముడు కాకి, చీరపిట్టయు.

ఆగడకాఁడు - (ఆగడము + కాడు) అకార్యముల చేయువాడు, దుండగీడు, దుష్ఠుడు.
ఆగడీఁడు - అకార్యము చేయువాడు, దుండగీడు, దుష్టుడు.
దుండగీఁడు - 1.దుష్టుడు, 2.కొంటె.
కొంటె - అకార్యశీలుడు, తులువ.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు.  

కాకృత్యము - అకార్యము, చెడ్దపని.

ఆగడము - 1.చెడ్దపని, 2.దుష్కార్య చిహ్నము, 3.దౌష్ట్యము, 4.వంచన, 5.అనాదరము, 6.అన్యాయము, 7.ఉత్పాతము, విణ.1.వంచకుడు, 2.అపరాధి, సం.ఆగస్.       

అవద - పలుగాకి, దుష్టుడు.
పలువ - పలుగాకి; పలుగాకి - దుష్టుడు.

వెంబర - దుష్టుడు.
వెంబరవిత్తు - దుష్టా గ్రేసరుడు.

దొసఁగు - 1.ఆపద, 2.విఘ్నము, 3.పొరబాటు, 4.తప్పు, రూ.దొసవు.
దొసఁగులఁపెట్టు - క్రి.బాధించు, పీడించు.

జాడ్యం హ్రీమలిగణ్యతే వ్రతరతే దంభ శ్శుచౌ కై తనం, 
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని| 
తేజస్వి న్యవలి ప్తతా ముఖరతా వక్తవ్య శక్తి స్థిరే,
తత్కోనామగుణో భవేత్సుగుణినాం యా దుర్జనై ర్నాంకితః||

తా. దుర్జనుఁడు సజ్జనుల యందుగల సద్గుణము లను దుర్గుణములుగా నెంచును. అవియెట్లనిన, హ్రీ -సిగ్గు)లజ్జావంతునిజూచి జడుఁడని చెప్పును, వ్రతి - వ్రతము కలవాడు.)వ్రతశీలుని డాంభికుఁ డని చెప్పును, శౌచము - శుచిత్వము గలవానిని కపటుఁడని చెప్పును, శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధము నకు భయపడనివాడు, ప్రౌఢుడు.)కనికరములేని వాఁడని చెప్పును, యమి-1.ముని, 2.హంస. తేజస్సుగలవానిని గర్వించు వాఁడని చెప్పును, వక్త - 1.విశేషముగ మాటలాడు వాడు, 2.పండితుడు.)సద్వర్తనుని వాచాలునిగా నెంచును, కావున దుర్జనుఁడు - దుష్టునికి సకల జనుల యందలి సద్గుణ మొకటియైనను కనుపడదు. - నీతిశాస్త్రము

ఉలుపఁడు - శోఫరోగము గలవాడు, రూ.ఉలిపి. 

శోఫ - వాపురోగము, సం.వి. (గృహ.) నంజువ్యాధి, నీరుపట్టుట్ట (Ocdema)ఆహారములో మాంసకృత్తుల లోపమువలన కలుగువ్యాధి.
మాద - వాపురోగము.
నంజు(ౙ)వ్యాధి - (గృహ.) 'B' విటమిన్ (తాయమిన్ Thiamine) లోపమువలన కలుగువ్యాధి (Beri-beri). (గుండెదడతో సహా శరీరములో నీరుపట్టుట లేదా శుష్కించుట, చిక్కిపోవుట, ఈ వ్యాధి లక్షణములు).
తయమిన్ - (గృహ.) (Thiamine) 'బి' విటమిన్. నంజువ్యాధిని తొలగించు విటమిను 'బి ' గ్రూపు విటమినులలో మొదటిది.

చలికురుపులు - శీతకాలమందు ఎక్కువ చలిచే కలుగు కురుపులు లేక బొబ్బలు (Chilbiains). 

యమళిక - ఒక చర్మవ్యాధి.
మూఁగతీట - ఒడలిపై దట్టముగ పేలిన తీట.

కిలాసము సిద్మ -
కిలాసము - దేహమునందు గలుగు ఒక విధమైనపొడ.
కుత్సితం లస్యతే శ్లిష్యతే అనే నేతి కిలాసం, లస శ్లేషణ క్రీడనయో. - దీనిచేత జనులు కుత్సితముగాఁ బొందఁబడుదురు.
సిబ్బెము - సిధ్మము, దేహమున గలుగు తెల్లపొడ, శోఫ, రూ.సిబ్బియము.
సిద్యతి భేషజేన అశు గచ్ఛతీతి సిద్మ, న. న. షిధు గత్యాం - చికిత్సచేఁ బోవునది., సా. సిద్మం, అ. న. - ఈ 2 సిబ్బెము పేర్లు.
సోబ - శోఫ, సిబ్బెము, బొల్లి, సం.శోఫా, రూ.సోబె, సోబియ.
సిధ్మము - సిబ్బెము, బొల్లి. సోబె - సోబ. 
బొల్లి - 1.తెల్లనిది, 2.తెల్లనివాడు. 

నంజు(ౙ) - తిను, వి.1.విషము, నెత్తురు చచ్చి తెల్లపారుట.
విషము - 1.గరళము, 2.జలము.
తిను - భుజించు; నమలు - తిను.  

నవిష విషమిత్యాహుః  భక్తవం విషముచ్యతే|
విష మేకాకిసంహంతి  ర్భక్తస్వం పుత్రపౌత్రకమ్||

తా. విషము - 1.గరళము, 2.జలము.)విషము గాదు, భక్తులసొమ్ము విషము, విషమువలన నొక్కడే చచ్చును, భక్తులసొమ్ము నపహరించిన వాని పుత్రపౌత్రాదులు నాశన మొందుదురు. - నీతిశాస్త్రము 

తయమిన్ - (గృహ.) (Thiamine) 'బి' విటమిన్. నంజువ్యాధిని తొలగించు విటమిను 'బి ' గ్రూపు విటమినులలో మొదటిది.

జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము -
నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.

కుముదము - 1.ఎఱ్ఱతామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుముదిని -
1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.
అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య. 

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు -
విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
మోక్షము - 1.కైవల్యము, 2.మోచనము, విడుపు, 3.ముక్తి.

ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. - 157శ్లో

మందు - ఔషధము, ఉపాయము.
ఔషధము -
1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు.
ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఓషధీశుఁడు - చంద్రుడు. (ఉత్తర కురుక్షేత్రము నందు ఓషది.)
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.

ఆగదము - 1.తెవులులేనిది, 2.పలుకనిది, వి.1.మందు, ఔషధము, 2.ఆరోగ్యము, 3.ఆయుర్వేదమున విషాదుల విరుగుడును తెలుపు భాగము.
ఆగదంకారుఁడు - వైద్యుడు, వ్యు.ఆరోగ్యమును కలిగించువాడు.
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
చికిత్సకుఁడు - వైద్యుడు; వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.
జీవదుఁడు - వైద్యుడు.

ఏంటిబయోటిక్స్ - (గృహ.) (Antibiotics) విషక్రిమి వినాశకములు, వ్యాధిజనక్రిములను నాశముచేయు మందులు.

కొన్ని రోగాల నివారణకు పైకి మందు పూయడంతో పాటు లోపలికి కూడా మందు తీసుకోవాలి. అలాగే సంసారబాధలనే రోగనివారణకు భగవన్నామాన్ని వినడంతో పాటు సంకీర్తన కూడా అవసరమే. - శ్రీ రామకృష్ణపరమహంస     

జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
వర్తనము -
1.నడవడి, 2.జీవనము.
నీళ్ళు - నీరు; సలిలము - నీరు.
ప్రవృత్తి - 1.నడక, 2.ప్రవేశము, 3.బ్రతుకుతెరువు.
వృత్తము - 1.నియత గణములును యతిప్రాసములుగల పద్యము, 2.నడత(నడత - ప్రవర్తనము), 3.జీవనము, విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే రూపములో చరించు బిందువు యొక్క పథము, (Circle).

జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic).

భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.
ౙగము -
లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
చరాచరము - 1.జగత్తు, 2.విణ.తిరుగునదియు, తిరుగనదియు.
జనము - ప్రజ. ప్రజ - జనము, సంతతి.
లోకబాంధవుఁడు - సూర్యుడు. జగచ్చక్షువు - సూర్యుడు.
జగముకన్ను - సూర్యుడు; ౙగము చుట్టము - సూర్యుడు.

లోకజనని - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
లోకమాత - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.

మా1- 1.లక్ష్మి, 2.తల్లి.
మా2 -
మిక్కిలి, సం.మహాన్.
మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).

ధరణినాయకు రాణియు
గురురాణియు నన్నరాణి * కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును  
ధర నేవురు తల్లులనుచుఁ * దలఁవుఁ గుమారా!
తా.
రాజు భార్యయును(రాణి - రాజ్ఞి, భార్య), గురు భార్యయును, అన్న భార్యయును, భార్యతల్లి(అత్తయును), తన(తన - ఆత్మార్థకము)కన్నతల్లి, ఈ ఐదుగురు తల్లులని భావింపవలెను.  

ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.
ఉదజము -
నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పశువులను త్రోలుట.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒకవ్యూహము, 4.ఏనుగు, 5.ముఖము పైగల చుక్కలు.
కంజము - తామరపువ్వు.
కంజాతము - తామర, పద్మము.
కంకము - 1.పద్మము, 2.రాబందు(రాపులుఁగు - రాబందు).
తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.

పాథస్సు - 1.జలము, 2.అన్నము.
అన్నము -
కూడు, బువ్వ, విణ.తినబడినది.
కూడు - అన్నము, క్రి.1.ఒప్పు, 2.సాధ్యపడు, 3.కూడబెట్టు, 4.లెక్కచూడు, 5.కలుపు.
బువ్వ - అన్నము.

నాన్నోదక సమందానం నద్వాదశ్యాః పరంవ్రతమ్|
నగాయత్ర్యాః పరమ్మంత్రం సమాతుర్దైవతంపరమ్||
తా.
అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశివ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతిశాస్త్రము

భక్తము - విణ. భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.

ప్రసాదనము - 1.తేర్చుట, 2.అన్నము.
ప్రసాదము - 1.అనుగ్రహము(దయ, కరుణ), 2.ప్రసన్నత, 3.భగవంతునికి నివేదించిన అన్నము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.

సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
విశ్వతోముఖము -
అంతట వ్యాపించినది, సర్వతోముఖము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుఁడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 

సదాతనుఁడు - 1.విష్ణువు, 2.శాశ్వతుడు.
సదాశివుఁడు - శివుడు. (సదా - ఎల్లప్పుడు.)

ఋతము - 1.సత్యమైనది, 2.పూజింపబడినది, 3.ప్రాప్తము, వి.1.జలము, 2.సత్యము, 3.మోక్షము, 4.యజ్ఞము.
ఋతంభరుఁడు -
1.సత్యపాలకుడు, 2.పరమేశ్వరుడు.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.

దైవాధీనం జగత్సర్వం సత్యాధీనంతు దైవతమ్|
తత్సాత్య ముత్తమాధీనం ఉత్తమో మను దేవతా||
తా.
ఈలోకమంతయు దైవాధీనమైయున్నది, ఆదైవము సత్యమున కాధీనమై యున్నది, ఆ సత్యము ఉత్తముల యందున్నది, కాబట్టి ఆ(ఉ)యుత్తమభక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను. - నీతిశాస్త్రము 

అంబువు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము (ఛం.) ఒకరకపు వృత్తము.
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము (వృక్ష.) కురువేరు.

అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి(వలికి - బెగ్గురుపక్షి).
అంభోజము - 1.తామర, (జం.) సారసపక్షి, బెగ్గురుపక్షి.
అంభోరుహము - 1.తామరపువ్వు, 2.(జం.) బెగ్గురుపక్షి.

అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.

అర్ణము - 1.నీరు, 2.వర్ణము, అక్షరము, 3.టేకు, విణ.1.చలించునది, 2.కలతపడినది.
వర్ణము -
1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.
వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
వర్ణుడు - కుమారుడు.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు. 

కర్బురము - 1.జలము, 2.బంగారము, విణ.చిత్రవర్ణములు గలది.

కోమలము - 1.నీరు, 2.హరిణము, విణ.1.మృదువైనది, 2.అందమైనది, 3.ఒంపైనది.

కబంధము - 1.జలము, 2.మొండెము, 3.సముద్రము.
కంబు1 -
1.జలము, 2.తల.
కంబు2 - సజ్జపైరు.
మొండెము - తలతెగిన కళేబరము, కబంధము, సం.వి.ముండమ్, (గృహ.) భుజము క్రింది తుంటిపై భాగము, కబంధము, ఊర్థ్వకాయము (Trunk).
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.

జన్యువు - 1.జంతువు, 2.అగ్ని(నీటిచూలి - అగ్ని), 3.బ్రహ్మ.
జన్మి -
జంతువు, శరీరధారి.
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.

క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.
నీరు -
1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.

మొగులువిరి - జలము, మేఘ పుష్పము.
మేఘ పుష్పము -
1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.

పాదోదకము - మేఘము.
పాద్యము -
పాదము కొరకైన నీళ్ళు.

శుక్ర శోణిత మజ్జా చ మలమూత్రం చ పంచమమ్|
అపాం పంచగుణాఃప్రోక్తా బ్రహ్మజ్ఞానేన భాషితమ్||
శుక్ర, శోణిత, మజ్జా, మల మూత్రములు; అనే ఈ అయిదు జలతత్త్వపు పంచగుణములు.

చొంగ, మూత్రము, వీర్యము, మజ్జ, నెత్తురు ; ఈ ఐదు 5 జలము యొక్క గుణాలు. (Feminine qualities)

1. (ౘ)చొంగ - జొల్లు.
(ౘ)చొల్లు -
చొంగ, రూ.జొల్లు.
(ౙ)జొల్లు - చొంగ, లాల; లాల - చొంగ.
చొల్లుకార్చు - (గృహ.) పసిబిడ్దలు ఉమ్మిని మ్రింగుటకు చేతకాక నోటినుండి కార్చు, చొంగ కార్చు (Slavering).
సృణీక - సొంగ, రూ.సృణీక.
స్యందిని - చొంగ; నొచ్చిళ్ళు - చొంగ.   

సృణికా స్యన్దినీ లాలా -
సరతి స్రవతి సృణికా. పా. సృణీకా.
స్యందతీతి స్యందినీ. సీ. స్యందూ ప్రస్రవణే. - జాఱునది.
విరుద్ధ లక్షణయా లలతి లాలా విలాసే. - విరుద్ధ లక్షణచే నింపైనది. ఈ మూడు 3 నోటి జొల్లు(చొంగ) పేర్లు.   

ఊర్మి - 1.అల, 2.ఉమ్మి, 3.నొప్పి, 4.తహతహ, 5.వస్త్రపు ముడుత, 6.కడుపుమీద నుండు ముడుత, (ఆకలి, కోరిక, మోహము, దుఃఖము, ముసలితనము, మరణము - వీనిని షడూర్ములందురు).
ఊర్మిక - 1.అల, 2.ఉంగరము, 3.వస్త్రపు ముడుత.
అల - తరంగము, విణ.ప్రసిద్ధి తెలుపును, ఉదా.అలవైకుంఠపురంబులో.
తరంగము - 1.అల, తరగ, 2.ఒక రీతిగేయము, సం.వి. (భౌతి.) ఏదైన వస్తువు వేగముగా చలించుటచే గాలిలో సంపీడనము, విరశీకరణము, ఒకదాని వెంబడి ఒకటి సంభవించుటచే ఏర్పడిన చలనము, (Wave).
వీచి - తరంగము; తరఁగ - తరంగము, అల, సం.తరంగః.
లహరి - 1.పెద్ద అల, 2.వీచి. కరడు - కెరటము; కెరటము - కరడము.

భంగము - 1.చెరుపు, 2.అవమానము, 3.అల, 4.రోగము, వ్యాధి.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.

అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలలఁ గాంచు లక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో విశ్వ.

తా|| కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నసించును. కలలో కనబడు లక్ష్మిని పొందలేము. ఈ భూమిలో(ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.)భోగభాగ్యములు కూడా యిట్టివే కదా.

ఉమ్మి - ఉమి.
ఉమి -
ఉమిసిన ఎంగిలి, రూ.ఉమ్మి.
ఉమియు - ఎంగిలి ఉమ్ము.
జుష్ఠము - ఎంగిలి.

గతుకు - క్రి. ఎంగిలితిను, వి.ఎంగిలి తినుట, బహు.ఎత్తుపల్లములు.

ఫేల - ఎంగిలి, రూ.ఫేలము, ఫేలి.
ఎంగిలి -
1.ఉచ్ఛిష్టము, 2.లాలాజలము.
ఉచ్ఛిష్టము - 1.ఎంగిలి, తినగా మిగిలినది, 2.పూర్వులు ఉపయోగించినది, వి.తేనె.
లాలాజలము - (జం.) నోటిలో ఊరెడి నీరు, ఉమ్మినీరు, (Saliva).
లాల జలగ్రంధులు - (జం.) ఉమ్మిని ఉత్పత్తిచేయు గ్రంధులు (Salivary glands) (ఇవి నోటికి ఇరుప్రక్కల దవడలలో ఉండును).
లాలాజలనాళము - (జం.) లాలాగ్రంధుల నుండి ఉమ్మినీటిని తీసికొనివచ్చు గొట్టము, (Salivary duct).

ఏంజైం - (జీవ.)(Enzyme) ఒక సేంద్రియ పదార్థము, ఫేనక ద్రవ్యము.
ఎన్జైమ్స్ - (Enzymes) (గృహ.) జీవకణములలో నుద్భవించెడు ప్రేరక ద్రవ్యములు, (ఇవి శరీరములో నేక రాసాయనిక ప్రక్రియలను జరుపు చుండును).

సేంద్రియ మండలములు - (వృక్ష.) చయాపచయ క్రియలకు ఉత్తేజమునిచ్చు నత్రజనిసంబంధమగు ప్రత్యేక రసాయన పదార్థములు (Enzymes) (ఇవి జీవరసముచే నుత్పత్తిచేయబడును, ఇవి నీటిలో కరగును.)   

నిష్ఠీపనము - 1.ఉమియుట, 2.నిరసనము.
నిష్ఠూతము -
1.ఉమియబడినది, 2.త్రోయబడినది.
నిరసనము - 1.తిరస్కారము, ఆక్షేపము, 2.వధము, రూ.నిరాసనము.
నిరస్తము - తిర్కరింపబడినది, వెడలగ్రక్కబడినది, నిరాకృతము.
నిరాకృతము - న్యాయముచేత్రోయబడినది, నిరస్తము.
ఆక్షేపము - ఆక్షేపణము, 1.(అలం.) ఒక అ ర్థా లం కా ర ము, 2.అడ్డము, 3.విరోధము.
అక్షేపణము - 1.త్రోసివేయుట, 2.లాగుట, 3.అదల్పు, 4.అపవాదము, 5.అపహరించుట, 6.దోషములు ఎంచుట, 7.వణకురోగము.
అపవాదము - 1.నింద, దూఱు, 2.ఆజ్ఞ.
ఉపక్రోశము - నింద; నింద - దూరు, అపదూరు.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.  

ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణము నకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశము.
ఆక్రోశించు - క్రి.1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.
ఆఘోషిం(ౘ)చు - క్రి.1.అరచు, 2.మ్రోయు, 3.చాటు.  

నికారణము - వధము; వధము - చంపుట.
(ౘ)చంపు -
క్రి.చావచేయు.
(ౘ)చంపుడుగట్టు - వధ్యస్థానము.
(ౘ)చావఁజూఁచు - క్రి.చంపు.
(ౘ)చక్కాడు - క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.
చక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.

ఆఘాతము - 1.కొట్టుట, 2.దెబ్బ, 3.చంపుట, 4.చంపుచోటు, 5.గాయము, 6.దుఃఖము, 7.మూత్రము అడ్దుపడుట, మూత్రాఘాతము.
ఆఘాతిం(ౘ)చు -
చంపు. చంపుట ఏమి గొప్ప, ఏమి ఘనకార్యము ? 

త్రుంచు - క్రి.1.తునకలుచేయు, 2.చంపు, 3.చించు.
చించు - క్రి.1.చినుగచేయు, రూ.చింపు.   

ఆక్షేపకుఁడు - 1.ఆక్షేపించువాడు, 2.బోయవాడు.
వ్యాధుఁడు -
బోయవాడు. 

విరోధము - పగ, ఎడబాటు.
విరోధి -
1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
విశ్లేషము - ఎడబాటు. 

కుతిల - 1.బాధ, 2.దుఃఖము.
కుతిలపడు -
క్రి.గాసిచెందు, బాధపడు.

నొప్పి - 1.బాధ, 2.ఆపద.
నొవ్వి - 1.వేదన, 2.వ్యాధి, రూ.నొవ్వు, నోవి, నోవు.
నోవరి - నొవు, రూ.నొవ్వు.
వేదన - నొప్పి.
నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.

ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపత్తి -
1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపన్నము - 1.ఆపదనొందినది, 2.లభించినది, 3.సంభవించినది.
ఆపన్నుఁడు - ఆపదనొందినవాడు.

ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.

దుర్జనుల నైనఁ దిట్టకు;
వర్ణింపకు సుజనగోష్ఠి; వరులను నెల్లన్
నిర్జింతు ననుచుఁ ద్రుళ్ళకు;
దులనుఁడండ్రు నిను నిందఁ దోఁపఁ గుమారాః
తా. కుమారా! చెడ్డవారినైనప్పటికి(దుర్జనుఁడు - దుష్టుడు)ని ఎప్పటికి దూషింప వద్దు. సత్పురుషులతో సంభాషణముచేయుట మానవలదు. గొప్పవారిని గెలుతు(నిర్జించు - క్రి.గెలుచు, జయమును పొందు.)నని చెప్పవలదు. నీయందేలోపము కనఁబడినను, చెడ్దవాఁడని యందురు.  

నళినీదళగత జలమతి తరళం - తద్వత్ జీవిత మతిశయ చపలమ్,
విద్ధి, వ్యాధ్యభి మానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్. - భజగోవిందం

The water on the lotus leaf is very unsteady; so also is life extremely unstable. know that the entire world is devoured by disease and conceit, and smitten with sorrow.

ఉగ్గు - 1.చనుబాలతో రంగరించి పసి బిడ్డలకు పోయు ఆముదము, 2.ముడుత.
ఉంగ -
శిశువులకు ఉగ్గుపెట్టునపుడు వారి యొక్క ధ్వన్యనుకరణము.
ఉగ్గుపడు - క్రి.1.ముడుతలుపడు, 2.క్షీణించు.

వలి - 1.కంపము, 2.శైత్యము, సం.వి.కడుపుమీది ముడత, ముడత. వళి - కడుపు మీద ముడుత.
ౙలదరము - కంపము, భయముచేనగు గగుర్పాటు, సం.చలనమ్.
కంపము - 1.వణుకు, 2.వేపధువు.
వేపధువు - కంపము, స్వరకంపము.
శైత్యము - 1.చలువ, 2.జలుబు. ౘలువడి - చలువ.
ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి.
ౙలుబు - శైత్యము, సం.జలమ్, శైత్యమ్.
ౘల్లన - శైత్యము, విణ.శీతము. 
తనుపు - తనివిచేయు, వి.1.తనివి, 2.శైత్యము, 3.శైత్యోపచారము, 4.పితృయజ్ఞము, 5.తడి.
తనివి - తృప్తి, రూ.తనివు.
తర్పణము - 1.తృప్తి, 2.పితృయజ్ఞము.
పితృయజ్ఞము - తల్లితండ్రులకు చేయు అంత్యకర్మ.
పితరులు - పితృదేవతలు, రూ.పితాళ్ళు.
పిత - జనకుడు, (కన్నవాడు, వడుగు చేసినవాడు, చదువుచెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.)
జనకుఁడు - 1.తండ్రి, 2.సీత యొక్క తండ్రి, (జనకర్షి).

జనితా చోపనీతాచ యేన విద్యోప దిశ్యతే|
అన్న దాతా భయ త్రాతా పంచె తే పితరస్మృతాః||
తా.
కన్నతండ్రి, ఉపనయము చేసినవాఁడు, విద్యచెప్పినవాఁడు, అన్నము బెట్టినవాఁడు, భయముతీర్చినవాఁడు; ఈ ఐదుగురును తండ్రులు. - నీతిశాస్త్రము

ఫేనము - 1.సముద్రపు నురుగు, 2.నురుగు, చొంగ.
నురుగు -
ఫేనము, రూ.నురువు.
నురువు - నురుగు.
ఫేనిలము - నురుగుకలది, 1.కుంకుడు, 2.రేగుపండు.

అహిఫేనము - 1.నల్లమందు, అభిని, 2.గరళము, 3.పాములనోటి చొంగ.
నల్లమందు -
(వ్యవ.) అభిని, అహిఫేనము (Opium), (ఇది మాదక పదార్థముగను వైద్యమునందును ఉపయోగింపబడును. దీనిని Papaveraceae అనుకుటుంబమునకు చెందినది (అభిని లేక గసగసా) అను మొక్క కాయలను గీయగా వచ్చిన పాలతో తయారుచేయుదురు. నల్లమందులో మార్ఫీన్ (Morphine) అను ముఖ్యమైన క్షారముండును.)
అభిని - నల్లమందు, సం.వి.అహిఫేనమ్, అఫేనమ.
గరళము - 1.సర్పవిషము, 3.విషము, 3.గడ్డిమోపు.
విషము - 1.గరళము, 2.జలము.

విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితం|
ఆమిత్త్రాదపి సద్వృత్త మమేథ్యాదపి కాఞ్చనం||
తా.
విషము వలనైన నమృతంబును గ్రహింపవలయును, బాలునిచే నైనను మంచిమాటలను గ్రహింపవలయును. శత్రువులనైనను సత్స్వభావమును గ్రహింపవలయును, అమేధ్యము వలన నైనను బంగారమును గ్రహింపవలయును. - నీతిశాస్త్రము 

అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృతాసురుడు.
అహిర్బుద్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశరుద్రులలో ఒకడు.

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

చెలిది - 1.చర్మరోగము, 2.మేహరోగము, రూ.చెల్ది.
మేహము - ఒక రోగము.
మేహయతే మూత్రయతే భృశమనేనేతి మేహః, మిహ సేచనే. - దీనిచేత మిక్కిలి మూత్రము గలిగును, ఇది ప్రమేహము.
సవాయి - 1.మేహరోగము, 2.పడవపెద్ద మోకు. 
కొఱుకు - 1.ఒకరకపు మేహరోగము, 2.ఎర, 3.తినుట, క్రి.1.కఱచు, 2.పండ్లు పటపటలాడించు, 3.అపహరించు.

2. మూత్రము - ఉచ్చ, కాలుమడి.
ఉచ్చ(ౘ) -
మూత్రము; కాయజలము - మూత్రము.
అల్పాచమానము - 1.మూత్రము, 2.మూత్రవిసర్జనము.
మూత్రించు - కాలుమడుచు.
నీరుముట్టు - 1.మూత్రించు, 2.జల స్పర్శము చేయు.

మూత్రం ప్రసావః -
మూత్రయతి ప్రస్రవతి మూత్రం, ప్రసావశ్చ. - మూత్ర ప్రసరణే.
స్రు స్రవణే - జాఱునది. ఈ రెండు మూత్రము పేర్లు.

అల దేవగృహము కడప యి
రుల గోవాటములయందుఁ * ద్రోవలలో ఱ
చ్చల కొట్టములను నొప్పదు
మలమూత్ర విసర్జనంబు * మహిని గుమారా !
తా.
గుడియందు, ఇంటిముంగిట, పశువులకొట్టములో, మార్గము నందును, ఱచ్చలయందు, చీకటిచోట్లలో మలమూత్రముల విడువ రాదు.  

ఉచ్చమల్లి - 1.దిసమొల స్త్రీ, నగ్నిక, 2.రోత పుట్టించు స్త్రీ.
నగ్నిక -
1.కన్య, 2.దిసమొల ఆడది, రూ.నగ్నా.
దిసమొల(బిత్తల - దిసమొల) - నగ్నత్వము, రూ.దిస్సమొల.

స్త్రీ నగ్నికా కోటవీ స్యాత్ -
నజతే నగ్ని కా. ఓనజీ వ్రీడే. - లజ్జించునది.
కుటేన కౌటిల్యేన వేతి యాతీతి కోటవీ. సీ. వీ గతిప్రజనన కాంత్యసన ఖాదనేషు. - కౌటిల్యము(కౌటిల్యము-1.వంకరతనము, 2.కాపట్యము.)చేత పోవునది. ఈ రెండు దిసమొలతో నుండు స్త్రీ పేర్లు.

న్నగ్నింముఖే నోవథ మే నగ్నాం నేక్షేతచ స్త్రీయం|
నామేధ్యం ప్రక్షి పేడగ్నౌ నచపాదౌ వ్రతాపయేత్ ||
తా.
అగ్నిని నోటిచే (నూ)ఊదరాదు, దిగంబరియై(వివస్త్రయై)యున్న స్త్రీని జూడరాదు, అపరిశుద్ధమైన వస్తువు (న)అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.)యందు వేయరాదు, అడుగు లను గాచుకొనగూడదు. - నీతిశాస్త్రము  

మూత్రకోశము - ఉచ్చబుడ్ద, నీరుతిత్తి.
నీరుతిత్తి -
మూత్రకోశము.
ఉచ్చబుడ్డ - మూత్రాశయము.
మూత్రాశయము - తోలుసంచి (Bladder) (మూత్ర నాళముల ద్వారా మూత్రము మూత్రాశయమునకు, కొని పోబడును. మూత్రము మూత్ర పిండములో వేరుపడిన తర్వాత మూత్రనాళముల ద్వారా మూత్రాశయముతో కూడికొనును.) (జం.) మూత్రము చేరు సంచి (Urinary bladder).

మూత్రజనన మండలము - (జం.) మూత్రముతో సంబంధము గల అవయవములు, పునరుతిత్తితో సంబంధము గల అవయములు కలిసియున్న మండలము, (Urinogenital system).

మూత్రనాళము - (జం.) మూత్రపిండముల నుండి ఉచ్ఛార మార్గమునకు గాని, మూత్రసంచి లోనికి గాని మూత్రమును తీసికొనిపోవు గొట్టము (Ureter).
మూత్రనాళికలు - (జం.) మూత్రమును తీసికొని పోవు సన్నని గొట్టములు (Urinary Tubes).
మూత్ర మార్గము - (జం.) మూత్రపు సంచి నుండి మూత్రమును బయటికి పంపు గొట్టము (Uretra).
మూత్రపిండములు - (జం.) వృక్కము రక్తము నుండి మూత్రమును తయారు చేయు అవయములు రక్తమును శుద్ధి చేసి మూత్రమును వేరుచేయు రెండు పెద్దగ్రంధులు (Kidneys).

మీఢము తు మూత్రితే,
మీఢము - విడువబడినది (మూత్రము).
మిహ్యతే సిచ్యతే స్మ మీఢం, మిహ సేచనే. - చిమ్మఁబడినది.
మూత్రతేస్మ మూత్రితం, మూత్ర ప్రసరణే. - కార్చఁబడునది.
2. టీ, స. కేచిత్తు గూనద్వయం కృతపురీషోత్సర్గే ప్రాణిని, మీఢద్వయం ఉత్పృష్టమూత్రే ప్రాణినీత్యాహుః. ఈ 2 విడువఁబడినమూత్రము పేర్లు.

ఉపవృక్కము - (జం.) మూత్రపిండమునకు సమీపముగా నుండు వాహికలేని గ్రంథి (Adrenal gland).
ఉపవృక్కి -
(జం.) ఉపవృక్క గ్రంథులనుండి ఊరు రసద్రవ్యము (Adrenalin).

వృక్క సంబంధము - (జం.) మూత్ర పిండములతో సంబంధము గలది, (Renal).
వృక్క కేశికాభాజి మండలము -
(జం.) మూత్ర పిండములో ప్రవేశించు వృక్క కేశికాభాజిసిరలోనికి తెరచుకొను ఊరుసిర, నితంబసిర, అధరమహా సిరలోనికి తెరచుకొను వృక్కసిర, ఈ మండలమున ముఖ్యమైన రక్తనాళములు, (Renal portel system).     

కేశికాజూటము - (జం.) హెచ్చు తరగతి పృష్ఠవంశిన జంతువుల మూత్రపిండములో మూత్రనాళిక చివర ఉబ్బి యుండు చోట నున్న బంతివంటి నాళికల చుట్ట (Glomerulus).

యూరియా - (రసా.) (Urea) మిహము, సం.మూత్రములో నుండు నత్రజని సంబంధియైన లవణాధారము.
విసర్గనాళికలు - (జం.) రక్తములో నుండి నత్రజని సంబంధమగు అనవసర పదార్థములను తీసికొను నాళికలు (Malp-ghian tubules) (ఇవి మూత్రపిండములలో నుండును).
విసర్గ ప్రావరము - (జం.) మూత్ర పిండములోనున్న మూత్ర నాళికలు ఒక్కొక్కటి ఉబ్బియుండు (కేశికాజూటము) రెండు పొరలుగల సంచి. (Malpighian capsule).

మూత్రం నవధికుర్వీత నభస్మవనగోవ్రజే | నఫాలకృష్టే నజ-
లే నచిత్యా నచపర్వతే | నజీర్ణ దేవాయత నేనవల్మీకే కదా  
చన నచనిత్వేషుగర్తేషు నగచ్ఛన్నాపిచస్థితః ననదీతీరమా
సాద్యనచపర్వతమస్తకే | దాయ్వగ్ని భక్తాద్యాదిత్యమపః   
పశ్యం స్తధైవగాః | నకదాచనకుర్వీత విణ్మూత్రశ్యవిసర్జనం|| 
తా.
త్రోవ, బూడిద, ఆవులమంద, దున్నిననేల, జలము, పెద్దకొండ, శిధిలమైన దేవాలయము, పుట్ట, జంతువులతో కూడిన బొక్క వీని యందును, నడుచుచును, నిలుచుండియు, నదీతీర మందును, పర్వతశిఖరమందును, విణ్మూత్రము లును విడువరాదు. మఱియు వాయ్వగ్ని, భగవద్భక్తులను, సూర్యుని, (ను)ఉదకమును, గోవులను వీనిని జూచుచు విణ్మూత్రములను విడువరాదు. - నీతిశాస్త్రము

అంహతి - 1.దానము, ఈవి, 2.విడుపు, 3.రోగము (వైదికము).
విసర్జనము -
ఈవి, విడుపు, సం.(జీవ.) చయాపచయక్రియలో నేర్పడిన వ్యర్థపదార్థములను శరీరమునుండి బయటికి విడుచుట, వ్యర్థపదార్థము (Excretion).
విసర్జనములు - (వ్యవ.) మొక్కల శరీరమునుండి బయటికి త్రోసివేయ బడు జిగురు ద్రవ్యములు మొ|| (Excretions). 

మధుమేహము - మూత్రరోగము, (Diabetes).
మధుమేహము -
The diabetes in which the urine could be like honey or sugar complaint. మూత్రము కొంచెము చిక్కని తేనెవలె వెడలెడు మేహరోగము. అనగా మూత్రము నందు పంచదార వంటి పదార్ధముపోవుట, ఈమూత్రమునకు చీమలు పట్టును.
మధువళి - (జం.) ఇన్ స్యులిన్ సర్వకిణ్వ గ్రంధి నుండి స్రవించు అంతఃస్రావము, (ఇది రక్తములో నుండవలసిన చక్కెర పరిమితిని అదుపులో నుంచును) (Insulin).
మధువళి గ్రంధులు - (జం.) సర్వకిణ్వ గ్రంధిలో మధువళిని తయారు చేయు జీవకణ కూటములు (Islands of lange-hans).
మధుజని - (రసా.) రక్తములో అధికముగా నున్న చక్కెర నుండి కాలేయము తయారుచేయు ఒక విధమగు పిండి పదార్థము. ఇది కాలేయములో నిలువ చేయబడును.

ఫలశర్కర - (వృక్ష.) సాధారణముగా తీయని పండ్లలో నుండు చక్కెర (Fructose). 

ౘక్కెర - శర్కర, పంచదార, సం.శర్కరా.
శర్కర -
1.చక్కెర, 2.మొరము, 3.వ్రయ్య.
పంచదార - చక్కెర, సం.పంచసార.
పంచసారము - పంచదార.
శర్కరిజము - (వృక్ష.) పిండి పదార్థమును చక్కెరగాజేయు మండలము (Diastase). 
ౘక్కెరతిండి - చిలుక; చిరి - చిలుక; రామతమ్మ - చిలుక.
చిలుక - కీరము, శుకము, రూ.చిల్క.
కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
శుకము - చిలుక; చిలుకరౌతు - మదనుడు.
శుకవాహుఁడు - మన్మథుడు. మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.

వాగ్మి -1.చిలుక, 2.బృహస్పతి, విణ.యుక్తయుక్తముగా మాటాడువాడు.
మేధావి -
ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.

తియ్య - మధురము, రూ.తీయ.
మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.

చెలిది - 1.చర్మరోగము, 2.మేహరోగము, రూ.చెల్ది.
మేహము - ఒక రోగము.
మేహయతే మూత్రయతే భృశమనేనేతి మేహః, మిహ సేచనే. - దీనిచేత మిక్కిలి మూత్రము గలిగును, ఇది ప్రమేహము.
సవాయి - 1.మేహరోగము, 2.పడవపెద్ద మోకు. 
కొఱుకు - 1.ఒకరకపు మేహరోగము, 2.ఎర, 3.తినుట, క్రి.1.కఱచు, 2.పండ్లు పటపటలాడించు, 3.అపహరించు.

నిబంధము - 1.మలమూత్రబంధము, 2.బంధము.
ఇరుకట్టువాయి కట్టు -
మలమూత్రబంధ రోగము.
నిబంధించు - క్రి.1.బంధించు, 2.అడ్డగించు. నిరోధించు - క్రి.అడ్దగించు.

ఆనామస్తు నిబంధ స్య్యాత్ -
అనహ్యతే నిబద్ధ్యతే విణ్మూత్రమనేనేతి ఆనాహః. నిబంధశ్చ. ణహ బంధనే; బధ బంధనే. - మలమూత్రములు దీనిచేత కట్టఁబడును. పా. నిబంధః. ఈ రెండు మలమూత్ర నిర్బంధము పేర్లు. ఇరువాయిగట్టుట. 

బంధము - (రసా.) ఒక యౌగికమందు ఘటకములుగా నున్న పరమాణువుల మధ్యనుండు ఆకర్షణశక్తిని సూచకముగా కల్పించెబడు లంకె (Bond).
లంకియ - బంధము, తగులుపాటు, లంకె.
తగులాటము - 1.బంధము, తగులు, 2.తొడుసు.
తొడుసు - సంబంధము; సంబంధము - 1.చుట్టరికము, 2.కూడిక. చుట్టఱికము - 1.బంధుత్త్వము, 2.సంబంధము.
చుట్టము - 1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు.
కూడిక - సంయోగము, చేరిక, (Addition).

సబంధుర్యోహి తేషుస్స్యా త్సపితాయస్తుపోషకః|
స ఖాయత్ర విశ్వాసస్స భార్యాయత్ర నిర్వృతిః||
తా.
హితముగోరువాఁడే బంధువు, పోషించువాఁడే తండ్రి, విశ్వాసము గలవాఁడే స్నేహితుఁడు(అంతరంగుడు - స్నేహితుడు), సుఖింప జేయునదే భార్యయగును. - నీతిశాస్త్రము  

నెఫ్రైటిస్ -(గృహ.) (Nephritis), మూత్ర పిండములు చెడిపోవుట. (ఈ వ్యాధికి సూచనలు లేవు. ఇది చాల అపాయకరమైన వ్యాధి.) 

ఉచ్ఛారమార్గము - (జన.) (Cloaca) మూత్రమునకు, పురీషమునకు కలిసి ఒకటిగానుండు మార్గము, ఉచ్ఛారద్వారము (Cloacal aperture).

మలబద్ధము - (గృహ.) విరేచనము సరిగాకాకపోవుట(Constipation). 
పిప్పిపదార్థము లేదా పొట్టుపదార్థము - (గృహ.) ఆహారములోని పిప్పి పదార్థములు (Roughage).(అవి మలబద్ధకము లేకుండ చేయును.)
మృదువిరేచనకారి - (గృహ.) బలహీనముగా నున్నవారికి, మలబద్ధము గల వారికి కొంచెముగా విరేచనము లగుటకు ముందు లేక విరేచనముల కనుకూలముగ ఆహారమిచ్చుట (Laxative): కడుపును శుభ్రము చేయుటకై ఇచ్చినచో దీనిని (Purgative) అందురు.

అర్సిమొలలు - (గృహ.) గుదములోని రక్తనాళములు ఉబ్బి రక్తము కారుట, మూలశంక (Piles).
మూలవ్యాధి - Piles, అర్శరోగము. ఆర్శరోగము - Piles. మూలవ్యాధి, అనగా గుదస్థానమున లోపలగాని, వెలుపలగాని మాంసపుమొలకలు జనించి, రక్తము స్రవించుచుగాని, స్రవించక వేదన గలిగించురోగము. 

నెత్తురు బంక - రక్తముతో కూడిన బంక విరేచనము.

జిగట విరోచనములు - (గృహ.) మలము చీము రక్తముతో కలిసి పడుచుండుట, (దీనికి బొడ్దు దగ్గర కూడ నొప్పి యుండును). (Dysentery).
జిగట - 1.బంక, 2.బందన.
బందన - జిగట, గోదు, సం.బంధనమ్.
బంక - 1.చెట్లయందు కలుగు జిగట వస్తువు, 2.గ్రహణి.
గ్రహణి - 1.ఒక విధమైన రోగము, జఠరాగ్నికి అధిష్ఠానమగు నాడి, (ఇది చెడి పోయినచో గ్రహిణీరోగము కలుగును).

అరోచకము - 1.ప్రకాశింపనిది, 2.ఏవకలిగించునది, వి.ఆహారము ఇతవు కాకుండుట, ఒక వ్యాధి.

ఫోలిక్ ఆసిడ్ (B6) - ఇం.(గృహ) (Folic acid) (B6) జీర్ణశక్తి వృద్ధిచెసి విరోచనముల నరికట్టు విటమిన్.

మూత్రకుచ్ఛము - 1.ఉబ్బరము, నీరుకట్టు తెవులు, 2.అతిమూత్రము.
మూత్రవిస్రవనకాలే కృచ్ఛ్రం కష్టమస్యేతి మూత్రకృచ్ఛ్ఛ్రం - మూత్రము విడుచునప్పుడు ప్రయాసము దీనియనుఁ గలదు.
ఉబ్బరము - 1.కడుపుబ్బు, సం.ఉబ్బరమ్, 2.నివ్వెరబాటు, స.ఉద్భమః.
ఉబ్బరపోవు - (ఉబ్బరము+పోవు) 1.నివ్వెరపడు, 2.బాధనొందు.

మూత్రకృచ్ఛము - Stranguary, మూత్రము బొట్టు బొట్టుగ, వ్యధతోగూడిపడెడు రోగము. ఈరోగికి శుక్లము, మూత్రముతో పడిపోవును.

నీరుచుఱుకు - మూత్రము దిగునపుడు మంటయెత్తు రోగము.

అతిమూత్రము - Diabetes. అనగా బహుమూత్రము. మేహాధికముచే మూత్రము విస్తారముగ పొయ్యెడురోగము.
నీరుడి - అతిమూత్రము.

పడక తడుపుకొనుట - (గృహ.) పడకలో మూత్రము విడుచుట (Enuresis).

నీరుకట్టు - మూత్రబంధరోగము.
Dys’uria -
మూత్రబంధరోగము.
Dys’ury - difficulty in passing urine.

మూత్రఘాతము - Retention of urine. Drysuria అనగా మూత్రము బంధించుట మలమూత్ర శుక్లములు, వికృతినిబొంది పొత్తికడుపున చేరియుండుటవలన మూత్రనిరోధముకలిగి, అందు వలన మూత్రం బతికష్టముగ బయలువెడలెడు మేహరోగము.

ఆఘాతము - 1.కొట్టుట, 2.దెబ్బ, 3.చంపుట, 4.చంపుచోటు, 5.గాయము, 6.దుఃఖము(దుఃఖము - 1.బాధ, 2.చింత), 7.మూత్రము అడ్డుపడుట, మూత్రాఘాతము.
అభిఘాతము - 1.దెబ్బ, 2.కొట్టుట, 3.సమూలనాశము.
ఉపహతి - 1.దెబ్బ, 2.ఉపద్రవము, 3.నాశము, 4.అడ్డగింపు.
అడ్డుపడు - క్రి. అడ్దగించు, (శత్రువులు, ఆపదలు మొ.ని నుండి తప్పించుటకై) అడ్దముపడు. 

అబ్రహ్మణ్యము - బ్రాహ్మణునికి తగనిది (వధాదులు) వి.చంపవలదు అని (బ్రాహ్మణుఁడు) పెట్టుమొర.

జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.
జడత్వము -
(భౌతి.) విశ్రాంతి స్థితిలో గాని చలించుచున్న స్థితిలోగాని ఉన్నవస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము (Intertia). 
ౙడ్డు - 1.జాడ్యము, 2.మాంద్యము, తగులము, 3.జోలి.
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము.
మాంద్యము - 1.ఆలస్యము, 2.జాడ్యము.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త, 3.జాగు.
సోమరి - అలసుడు, మందుడు.
మందుఁడు - శని, విణ.1.అల్పుడు, 2.మూర్ఖుడు, 3.వ్యాధిగ్రస్తుడు. అలసుఁడు - సోమరి, చురుకుదనము లేనివాడు.
మసలిక - మాంద్యము, విణ.అలసము.
అలసము - 1.మందమైనది, సోమరి, 2.శ్రమచెందినది, వి.1.బురదలో తిరుగుటచే కాలివ్రేళ్ళనడుమ వచ్చు పుండు, బురదపుండు, 2.ఒకరకపు అజీర్ణవ్యాధి, 3.విషము గల ఎలుక.
అజాగ్రత్త -జాగ్రత్తలేమి,మెలకువ లేమి.అజాగ్రత్త కొంచెమైన కీడు అధికము. (ౙ)జాగు - ఆలస్యము.   

జాడ్యంధియో హరతినిఞ్చతివాచి సత్యం, మానోన్నతిం
దిశతిపాపమపాకరోతి| చేతః ప్రసాదయతి దిక్షురినోతి
కీర్తిం, సత్సంగతిః కథయ కిం నకరోతి పుంసాం||
తా.
సత్సాంగత్యము బుద్ధి జాడ్యమును బోగొట్టును, వాక్కునందు సత్యము గలుగఁజేయును, గౌరవము నిచ్చును, పాపములబోగొట్టును, మనస్సును స్వచ్చముగాజేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింప జేయును, మఱియు నెట్టి శుభముల నైనను గలుగజేయును. - నీతిశాస్త్రము

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్,
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. - భజగోవిందం   

పిత్తము - (గృహ.) చేదుకట్టె,  పైత్యరసమును నిలువచేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము -
(జం.) కాలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువచేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).

మాయుః పిత్తమ్
మీనోతి శిరో భ్రమణేన బువి క్షేపయతీతి మాయుః, ఉ. పు. డు మిఞ్ ప్రక్షేపణే. - శిరోభ్రమణముచేత జనమును బడఁద్రొబ్బునది.
పతతి పిత్తం పత్ ఌ గతౌ. - ద్రవరూపమై పడునది. ఈ 2 పైత్యము పేర్లు.

మాయువు - పైత్యరోగము.
పిత్తము - ఒక ధాతువు (వాత పిత్త శ్లేష్మము లనునవి త్రివిధధాతువులు.)
పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.
పైత్యరసము - (జం.) కాలేయము నుండి ఊరురసము (Bile). (ఇది పిత్తాశయములో నిలువచేబడును.)

పిచ్చ - తక్కువ, కొరత (పిచ్చకుంచము), వై. వి. 1.వెఱ్ఱి 2.వృషణము(బీజము), సం.1.పిత్తమ్ 2.పిచ్ఛా.    

వెఱ్ఱి - పిచ్చి, అవివేకము, విణ.పిచ్చివాడు.
తిక్క -
పిచ్చి, రూ.త్రిక్క.
తిక్కకొను - పిచ్చియెత్తు. 
అవివేకము - అజ్ఞానము, తెలివిలేమి, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమి, విణ. తె లి వి లే ని ది, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యము లేనిది.
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.    

అణీయ - పైత్యము వలన శరీరమున బుట్టెడు దద్దురులు, దద్రురోగము, రూ.ఆణె.
దద్దు -
దద్రువు(దద్రువు - దద్దు), చిన్నవాపు, రూ.దద్దురు, సం.దద్రుః. అనియ - దద్రురోగము, రూ.ఆడె, ఆనె, ఆణియ. 

ఉన్మాదము - 1.వెఱ్ఱి, పిచ్చి 2.(అలం.) సంచారీభావములలో ఒకటి.
ఉన్మత్తము -1.వెఱ్ఱియెత్తినది, 2.కై పక్కినది, 3.గర్వించినది, 4.పిశాచా ద్యావేశము కలది, వి.ఉమ్మెత్త చెట్టు. 
వేఁదురు - ఉన్మాదము.
రిమ్మ - ఉన్మాదము, చూ.రింబ. బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులన్నారు. 
రింబ - రిమ్మ, పిచ్చి. ఎవరి పిచ్చి వారికి ఆనందము. 
ఉన్మత్త ఉన్మాదవతి : ఉన్మద్యతే ఉన్మత్తః. మదీ హర్షగ్లపనయోః. - మిక్కిలి మదించినవాఁడు. వెఱ్ఱియెత్తినవాని పేరు.

పార్షి - 1.ఉన్మత్తురాలు, 2.మడమ(గుదికాలు, చీలమండ అడుగు భాగము) 3.దండు వెనుక. 

శీల ధర్మపత్నులు - త్రప(లజ్జ), శాంతి అని ఇద్దరు. వీరు లేకపోతే లోకం ఉన్మత్తం అవుతుంది.

పంచశరుఁడు - మన్మథుడు, ఉన్మాదన, తాపన, శోషణ, స్తంభన, సమ్మోహనములను ఐదు బాణములు కలవాడు.
ఉన్మాదన తాపన శోషణ స్తంభన సమ్మోహనాఖ్యాః పంచశరాః యస్యసః పంచశరః - ఉన్మాదన శోషణ స్తంభన సమ్మోహనములను (నై)ఐదు బాణములు గలవాఁడు.

వలవాక - మన్మథ తాపము.
వలవంత - 1.మన్మథవ్యథ, 2.సంతానము.

సోన్మాద స్తూ న్మదిష్ణు స్స్యాత్ :
ఉనాదేన సహితః సోన్మాదః - ఉన్మాదముతోఁ గూడుకొన్నవాఁడు. పా. సూన్మాదః ఉన్మదః.
ఉన్మాదశీలః ఉన్మదిష్ణుః. మదీ హర్షగ్లేపనయోః. - ఉన్మాద స్వభావము గలవాఁడు. ఈ రెండు భూతావేశాదులచేత నొడలెఱుఁగనివాని పేర్లు.

నశ్యత్య నాయకం కార్యం తదైవ శిశునాయకమ్|
స్త్రీ నాయకం తధోన్మత్త నాయకం బహునాయకమ్||
తా.
యజమానుఁడు లేని కార్యమును, బాలురు, స్త్రీలు, ఉన్మత్తులు, అనేకులు(పెక్కుమంది); ఈ ఐదుగురు విచారించగల కార్యములు చెడిపోవును. - నీతిశాస్త్రము

అలర్కరోగము - (గృహ.) వెఱ్ఱి కుక్క కరచినచో వచ్చు పచ్చి.
కుక్క వెఱ్ఱి -
(గృహ.) వెఱ్ఱికుక్క కాటు వల్ల కలిగెడు ఒక రోగము, జలద్వేషము (Hydrophobia).
యోగితము - పిచ్చికుక్క.

అరతి - 1.విరక్తుడు, 2.సంతొషము లేనివాడు, వి.1.విషయములందు ఇష్టములేమి, 2.అనురక్తి(అనురాగము, ప్రేమ)లేమి, 3.సంతోషము లేమి, 4.బాధ, 4.అరుచిని కలిగించు పిత్తరోగము, 6.క్రోధము, 7.(అలం.) మన్మథావస్థలు పదింటిలో నారవది (దేనియందును ఇష్టము లేకుండుట.)

అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సులేనివాడు, 2.దుఃఖము నొందినవాదు, 3.ధ్యాన నిమగ్నుడు.   

అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు.  
అనిష్టము - 1.ఇష్టముకానిది, 2.యజింప బడనిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.
విరక్తి - విరాగము, వైరాగ్యము, Dispassion.
వైరాగ్యము - వేషయేచ్చా రహితత్వము, లౌకిక సుఖ సుఖములం దిచ్ఛలేమి.  
నిర్వేదము - 1.దుఃఖము, 2.వైరాగ్యము. 
వీతరాగి - విరాగుడు, వైరాగ్యము గలవాడు.
అరుచి - 1.రోత(ఏవగింపు - రోత), 2.నోటికి రుచి కాకుండుట.
క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము. 

భగము - 1.ఆడుగురి, 2.సంపత్తి, 3.వైరాగ్యము, 4.తెలివి, 5.వీర్యము, 6.కీర్తి, 7.మహత్త్వము.

రాజారాష్ట్ర కృతంపాపం రాజపాపం పురోహితః|
భర్తాచ స్త్రీకృత పాపం శిష్యపాపం గురుర్వ్ర జేత్||
తా.
తనదేశమునందలి ప్రజలుచేయుపాపమును రాజు పొంచును, రాజు చేయుపాపమును పురోహితుడుపొందును, పెండ్లాము చేయుపాపమును మగడుపొందును, శిష్యుడు చేయుపాపమును గురువుపొందును. - నీతిశాస్త్రము

పైత్రము - పితృసంబంధమైనది.
పైతృకము - పితృసంబంధమైనది.

త్రిదోషములు - వాత పిత్త శ్లేష్మములు.
ౙన్ని - సన్నిపాతము, త్రిదోషములచే కలిగిన మోహరోగము.
సన్నిపాతము - (గణి., భౌతి.) ఒక స్థానమునే ఆక్రమించునది, (Coincident), సం.వి.జన్ని, సన్నిపాత జ్వరము, సంధి, కలయిక. Fever attended with delirium. జ్వరము గలిగి యున్నప్పుడు వాతపిత్తశ్లేష్మముల ప్రకోపము వలన గలిగెడు వికృత స్థితి. దీనినే జన్నిరోగమని, సంధిరోగమని యందురు. 

ఆమ్లపిత్తము - (గృహ.) ఒక రోగము, (ఇది అగ్నిమాంద్యము వలన జనించు కడుపులోని ఆమ్లములచే కలుగును) (Heart burn).
అమ్లము - 1.పులుపు, 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ, 3.పులిసిన పెరుగు, 4.పులిచింత, 5.దబ్బ.
ఆమ్లము1 - 1.చింతపండు పులుసు, 2.చింతచెట్టు, 3.ఆరు రసములలో ఒకటి, 4.పులిత్రేపు, విణ.పుల్లనిది.
ఆమ్లిక - 1.చింతచెట్టు, 2.పులిత్రేపు. పులిత్రేపు - అజీర్ణపుత్రేపు.
అజీర్ణము - అన్నాదులు అరుగక పోవుట, విణ.జీర్ణముకానిది.
చింత - 1.తలపు, 2.వ్యసనము, 3.వై.వి.చింతచెట్టు, సం.చింతా.
ఆశయము - 1.తలపు, 2.మనస్సు. 3.పడుక, 4.మృగాదులను పట్టుటకై వేటకాండ్రుత్రవ్వుగోయి, 5.ఆధారము, 6.స్థానము, 7.(వైద్య.) దేహము నందలి శ్లేష్మాదుల స్థానము, ఉదా. పిత్తాశయము, మూత్రాశయము, మొ.వి.

Dyspep’sia - జీర్ణరోగము.
Dyspep’sy – indigestion.

తలఁపు - 1.తలచుట, 2.కోరిక, 3.ఆలోచనము, 4.జ్ఞప్తి(జ్ఞప్తి - తెలివి, తలపు), 5.హృదయము, 6.అభిప్రాయము, 7.ఊహించుట.
తలఁపుచూలి - మన్మథుడు, భావకుడు.
భావకుఁడు - తోడబుట్టిన దానిమగడు, బావ. 

చితా చింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసీ|
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుత వపుః||
తా.
సొదకంటే చింతయధికమైనది, ఎట్లనిన సొద ప్రాణంబు పోయిన  పిమ్మట శరీరమును దహించును. చింత ప్రాణంబుతో గూడిన శరీరమును దహించును, గావున చింతగూడదని భావము. - నీతిశాస్త్రము

బాలాస్తావత్ క్రీడాసక్తః  తరుణస్తావత్ తరుణీసక్తః,
వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కో అపి న సక్తః. - భజగోవిందం
When a boy, one is attached to sport; when a youth, one is attached to a young woman; when old, one is attached to anxiety; to the supreme Brahman, no one, alas is attached! 

పక్షౌ పూర్వా పరౌ శుక్ల కృష్ణా -
పూర్వాపరౌ పక్షౌ శుక్ల కృష్ణా విత్యుచ్యేతే, ఇందు పూర్వపక్షము, శుక్ల మనియు, అపరపక్షము కృష్ణ మనియుఁ జెప్పఁబడును. మొదటిది శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము.

తెలిపక్కము - శుక్లపక్షము.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.   
శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
శోకతి గచ్ఛతి మనః అస్మిన్నితి శుక్లః, శుక గతౌ. - మనస్సు దీనియందుఁ బ్రవర్తించును.

శుక్రము - 1.రేతస్సు, 2.కంటిపువ్వు.
స్త్రీ సందర్శనాదినా శోకతి స్రవతి శుక్ర్మ్, శుక గతౌ. - స్త్రీ సందర్శనాదులచేత జాఱునది. 
కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).
శుక్ర పటలము - (జం.) కనుగ్రుడ్డుపై నున్న మూడు పొరలలో అన్నిటికంటె పైనున్న పొర (Seclerotic coat).

అంధబిందువు - (జం.) 1.గ్రుడ్ది చుక్క, 2.కంటిపూవు, 3.కంటియొక్క మూర్తిపటములో అక్షినాడి ప్రవేశించు చోటు (Blind spot).
కెరోటిన్ - (గృహ.) (Carotene) పసుపు పచ్చని పదార్థము ' ఏ ' విటమిన్ తయారగుటకు కావలసిన పదార్థము (ఇది కనుల బలహీనతను నిరోధించును).

తెలిగాము - శుక్రుడు.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలొ నొకటి (Venus).
శోచయతీతి శుక్రః, శుచ శోకే - శోకింపఁ జేయువాఁడు.
శుక్రంతేజః రాదానే - శత్రువులకు దుఃఖము నిచ్చువాఁడు.
శుక్రం రుద్రరేతో (అ)స్మిన్నితివా - రుద్రరేతస్సు ఇతనియందుఁ గలదు. 

తేజము - 1.ప్రకాశము, 2.ప్రభావము, 3.పరాక్రమము, 4.రేతస్సు, రూ.తేజస్సు.
తేజయతి తనూకరోతి స్రవణానంతరం తేజః, స. న. తిజ నిశాశనే. - ౙాఱినమీఁదట కృశునిగాఁ జేయునది.

తేజః ప్రభావే దీప్తౌ చ బలే శుక్రే (అ)పి -
తేజశబ్దము ప్రభావమునకును, కాంతికిని, బలిమికిని, రేతస్సునకును, అపిశబ్దము వలన తిరస్కారము నొర్వకుండుటకును పేరు. 'అధిక్షే పావమానాదేః ప్రయుక్తస్య పరేణ యత్, ప్రాణత్యయే (అ)వ్యవస్థానం తత్తేజ స్సముదాహృతం ' అని. తేజయతీతి తేజః, స. న. తిజ నిశాశనే. - కృశముగాఁ జేయునది.

రేతము - 1.వీర్యము, శుక్లము, 2.పాదరసము, రూ.రేతస్సు.
రియతి స్రవతి రేతః, స. న. రి గతౌ. - స్రవించునది.

శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.

వీర్యం బలే ప్రభావే చ -
వీర్యశబ్దము సత్తువకును, ద్రవ్యశక్తికిని, చకారములవలన రేతస్సునకును పేరు. వీరయితం యోగ్యం వీరస్య స్వభావః కర్మ నావీర్యం. శూర వీర విక్రాంతౌ - విక్రమింప యోగ్యమైనది, వీరునియొక్క భావమైనను, కర్మమైనను వీర్యము.

3. వీర్యము - 1.పరాక్రమము, తేజము, ప్రభావము, 2.రేతస్సు.
వీరే అక్లీ బే సధు వీర్యం నపుంసకుఁడు కానివానియందుఁ బుట్టునది.

స వీర్య మతిశ క్తిభాక్,
వీరే సధు వీర్యం - వీరునియం దుండునది. ఈ ఒకటి మిక్కిలి ధృఢమైన యా యుత్సాహము పేరు.

పరాక్రమము - 1.బలము, 2.శౌర్యము.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
వీరము - పరాక్రమము, వీరరసము, రూ.బీరము.
బీరము - వీర్యము, శౌర్యము.
శౌర్యము - శూరత్వము, ప్రౌడిమము. 
తేజము - 1.ప్రకాశము, 2.ప్రభావము, 3.పరాక్రమము, 4.రేతస్సు, రూ.తేజస్సు.  

ప్రభావము - 1.ప్రతాపము, 2.తేజము.
ప్రతాపము - 1.తేజము, 2.వేడిమి.

శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
శ్వేతము - 1.వెండి, 2.తెలుపు, 3.కైలాసము, 4.ఒక ద్వీపము.
శ్వేతవాహనుఁడు - 1.చంద్రుడు(చంద్రబీజము - వెండి), 2.అర్జునుడు.

చంద్రుడు - నెల, చందమామ.
(ౘ)చందమామ -
చంద్రముడు, చంద్రుడు, రూ.చందమామ, సం.చంద్రమాః. 
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలకూన - 1.బాలచంద్రుడు, 2.నఖిక్షతము.
నెలవంక - బాలచంద్రుడు.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు. 
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు. 
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
నెలమేపరి - రాహువు. రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.  

ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు అను సంఖ్య.
హృషీకము -
ఇంద్రియము.
హృషీకేశుఁడు - విష్ణువు.

ఊర్ధ్వరేతసుఁడు - 1.జితేంద్రియుడు, 2.అధః పతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుడు, 3.భీష్ముడు, రూ.ఊర్ధ్వరేతుడు.
జితేంద్రియుఁడు - ఇంద్రియము లను జయించినవాడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
భీష్ముఁడు - 1.శంత పుత్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగువాడు, విష్ణువు. 

అధోక్షకము - (జం.) భుజమున కును శరీరభిత్తికకును సంబంధించినది (రక్తనాళము) (Subclavian).

వేశీ కోశో ద్విహీనే(అ)ణ్డమ్, 
వేశయతి గర్భమితి వేశీ. పిశ అవయవే. - దీనియందు గర్భం బ(అ)వయవ యుక్తమగును.
గర్భస్య కోశత్వా త్కోశః - గర్భమున కాధారమైనది.
పేశీనాం మాంసఖండానాం కోశః పేశీకోశః - మాంసఖండముల యొక్క సమూహము అని యేకనామముఁగా గొందఱు.         
అమతి నిస్సరత్యస్మాచ్ఛితి రిత్యండం. అమ గతౌ. - దీనివలనఁ బిల్ల(పిల్ల) వెడలును. ఈ 3 గ్రుడ్డు పేర్లు.

కోశము - 1.కత్తియొర, 2.గ్రుడ్డు, 3.పుస్తకము, 4.బొక్కసము, (పంచ కోశములు:- అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు).

పేశి - 1.గ్రుడ్డు, 2.కత్తియోర, 3.మాంసపుముద్ద.

పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
కితాబు -
1.బిరుదు, 2.పుస్తకము.
పుస్తకము - పొత్తము. 
గ్రంథము - 1.కావ్యము, పుస్తకము, 2.ధనము, 3.ముప్పది రెండక్షరముల శ్లోకము.

కావ్యము -  కవికృత గ్రంథము, కవి కల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కావ్యుఁడు - శుక్రుడు. శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలొ నొకటి (Venus).

పుస్తకేషుచ యావిద్యా పరహస్తే చ యద్ధనమ్|
సమయేతు పరిప్రాప్తేన సావిద్యా నతద్ధనమ్||
తా.
పుస్తకములోని చదువు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.), పరులకిచ్చిన ధనము, ఇవి సమయమున కుపయోగింపవు. - నీతిశాస్త్రము

బొక్కసము - 1.పంటసాల, 2.ముల్లె, 3.ధనాగరాము.
ఉగ్రాణము -
1.సామగ్రు లుంచెడిగది, 2.బొక్కసము.
భాండాగారము - బండారము, బొక్కసము.
భండారము - బొక్కసము.
బండరువు - (భండారువు), బొక్కసము, రూ.బండారము, బండారు(బండారు - పసుపు పొడి), సం.భండారః.
బండారి - బొక్కసమున కధికారి.

కోశాధికారి - ఒక సంస్థ యొక్క లేక ప్రభుత్వము యొక్క బొక్కసముపై అధికారి.  

కోష్ఠము - 1.లోకడుపు, 2.గాదె, 3.సామాగ్రు లుంచుకొనుకొట్టు, (జం.) అననుకూల పరిస్థితులలోగాని ఒక ప్రాణిచుట్టును ఏర్పడిన నిరోధక శక్తికల పొర (Cyst) (cneystment) = పరివేష్టనము, (వృక్ష.) కోశము, అండాశయములో నుండు గది (Locule).

పుంసి కోష్ఠో(అ)న్తరజ్ఠరం కుసూలో (అ)న్తర్గృహం తథా,
కోష్ఠ శబ్దములోని కడుపునకును, గాదెకును, లోపలియింటికిని పేరు.
కుప్యతే (అ)స్మిన్ని తికోష్ఠ, కుషనిష్కర్హే. - దీనియందుఁ గూర్చఁబడును.       

కోట్టాము - 1.పసుల గట్టెడిచోటు, రూ.కొట్టము, సం.గోష్ఠమ్, 2.కొట్టు, సం.కోష్ఠమ్. 
గోష్ఠము - ఆవులమంద యుండు చోటు, గొట్టము.
కొట్టు1 - కొట్టడి; కొట్టడి - సామగ్రు లుంచుగది, రూ.కొట్టు, సం.కోష్ఠః.
కొట్టు2 - క్రి.ప్రహరించు.
ద్వికోష్ఠకము - (వృక్ష.) రెండు గదులుగలది, Bilocular, (అండాశయము).

అండము - 1.గుడ్డు, 2.వృషణము (జీవ.) 3.వీర్యము, శుక్లము (Ovum).

గుడ్దు - (వ్యావ.) 1.అండము, 2.సున్న.
గ్రుడ్డు -
1.కనుగ్రుడ్డు, 2.పక్షుల అండము, విణ.గ్రుడ్డితనము.
బిడాలము - 1.పిల్లి, 2.కనుగుడ్డు.
బిడాలకము - 1.పునుగు చట్టము, 2.కంటిమందు, 3.పిల్లి.
త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి, 3.మిడత.
మార్జాలము - మార్జారము; మార్జారము - పిల్లి, రూ.మార్జాలము.
మార్జాల కబళన్యాయము - (న్యా. పిల్లి భోజనముచేయు వాని వద్ద కూర్చుండువాడు తీసికొను కబళములన్నియు తన నిమిత్తమేయని తలచెడు రీతి.  

మది యొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగన్
అది చిలుక బిల్లిపట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.
తా.
చిలుకను పెంచి పిల్లి కప్పగించినట్లు. (హరి)చిలుక పంజరములో పిల్లిని ప్రవేశపెట్టిన చిలుక(ౘదువుల పులుగు - చిలుక)వలె మాటలు మాటలాడనట్లు, ఒకని మదిలో(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.) కోరియున్న వనితను మరియొకరు(వదలక తిరిగినను-ఆ తిరుగుడు వ్యర్థం) స్వాధీనపరచుకొనలేరు.

ఏకతఃపీతి - (జం.) అండములో నున్న అండపీతము ఒకేధ్రువము చగ్గర కేంద్రీకరింపబడిన అండము (Teleolecithal).
ఏకభిత్తిక గోళము - (జం.) ఫలదీకరణమైన తరువాత అండము అభివృద్ధి పొందు దశలలోనిది యొకటి, లోపల బోలుగా నుండి, చుట్టును ఒక జీవకణము మందముగల గోడతో గోళాకారముగా నున్నదశ (Blastula).
ఏకభిత్తికా కుహరము - (జం.) ఏకభిత్తిక గోళములో నున్నతొఱ్ఱ (Blastococle). 

గుటి పుంజము - (జం.) చాల జంతువులలో అండము మొదటి దశలో అభివృద్ధి చెందుచున్నప్పుడు ఏర్పడిన గోళాకారముగనున్న జీవకణముల ముద్ద (Morula).

అండజము - 1.పక్షి, 2.చేప, 3.పాము, 4.తొండ(తొండ - సరటము), వ్యు. గుడ్డు నుంచి పుట్టినది.
అండాత్ జాయత ఇత్యండజః. జనీప్రాదుర్భావే. - గ్రుడ్డువలనఁ బుట్టునది.
విచిత్రం సరతీతి విసారః, సృ గతౌ. - విచిత్రముగాఁ జరించునది.

నీడోద్భవము - పక్షి, గూటికానుపు.
నీడము -
1.చోటు, 2.పక్షి గూడు. నీడ - ఛాయ.
గూఁడుకానుపు -
పక్షి, నీడోద్భవము.
గూఁడు - 1.కులాయము, 2.పంజరము, 3.గోడలో దీపముంచుటకు ఏర్పరచిన చోటు, 4.ఆకుగుడిసె, 5.చాప మొ.నితో కట్టిన బండిపైకప్పు, బహు. గూండ్లు, గూడులు.
కులాయము - 1.పక్షిగూడు, 2.చోటు, 3.ఇల్లు.
పంౙరము - పక్షులను పెంచెడుగూడు, సం.పంజరమ్.

సనీడము - సమీపము, విణ.నీడముతో గూడినది. 

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్కి - పక్షి, పులుగు, సం. పక్షీ.
చేఁప - మత్స్యము; మత్యము - చేప. 
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష. 
చక్రధరము - పాము.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.

గ్రుడ్డికానుపు - 1.పాము, 2.పిట్ట, పక్షి.  

చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి -
పాము, చక్షుశ్రవము. 
ద్విజిహ్వము - పాము, వ్యు.రెండు నాల్కలు కలది.  
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.
లేలిహాసము - సర్పము, వ్యు.మాటిమాటికి నాలుక చాచునది.

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము(దంతము - పల్లు, కోర.), 4.చేప, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి. ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.
దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతమునకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.

ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమద్విజుడు.
ద్విజుఁడు -
1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.

అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||
తా.
తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు రాజు, సిగ్గుగల వేశ్య(వేశ్య - భోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది), సిగ్గులేని (సిగ్గు – స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.)లేని ఇల్లాలు చెడుదురు. - నీతిశాస్త్రము

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః. - చంద్రుడు

డింభము - పిల్ల, గ్రుడ్డు. గ్రుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిది.
డింభౌషణము -
(గృహ.) పొదుగుటకు అనుపగుస్థితి, గ్రుడ్లుగాని, క్రిమిబీజములుగాని వృద్ధి పొందుటకు అనువగు సూచనలు అనగా తగు శీతోష్ణస్థితులు కలిగి యుండుట, (Incubation).
డింభౌషణకాలము - (జం.) గ్రుడ్డు పగిలి దానినుండి ప్రాణి బయటికి వచ్చుటకు పట్టుకాలము, శరీరమున రోగజీవులు ప్రవేశించినది మొదలు రోగ చిహ్నములు పైకి కనబడువరకు పట్టుకాలము (Incubation period). 

అల్ బ్యూమినాయిడ్స్ - (గృహ.) (Albuminoids) గ్రుడ్డులోని తెల్లని మాంసకృత్తులు.  
ఆల్బుమిన్1 - (వృక్ష.) (Albumin or endosperum) అంకురచ్ఛదము, బీజపోషకపదార్థము, భ్రూణము పెరుగుటకు భ్రూణస్యూనములో ఏర్పడిన ఆహారము.
ఆల్బుమిన్2 - (Albumin) ఆహార పదార్థములలో ముఖ్యముగా పాలలోను గ్రుడ్డులోను గల ఒకరకపు మాంసకృత్తు.
ధవళము - కోడిగ్రుడ్డులోని తెల్లని సొన (Albumen).
జంతుమాంసకృత్తులు - (జం.) జంతువుల శరీరములో తయారైన మాంసకృత్తులు(Animal proteins) ఉదా.ఆల్బుమిన్ (Albumen), కేసిన్(Casein) ఫ్రైబ్రిన్(Fibrin), మయోసిన్ (Myocin), జిలాటిన్ (Gelatin). 

అంకురము - 1.మొలక, బీజము, 2.నీళ్ళు, 3.నెత్తురు, 4.వెండ్రుక, రూ.అంకూరము, (జీవ.) పిండము, భూణము (Embryo).
అంకూరము -
అంకురము.
అంకురోత్పత్తి - (వృక్ష.) బీజములో నున్న అంకురము మొలకెత్తుట. బీజోత్పత్తి (Germination).
అంకురించు - 1.మొలకెత్తు, 2.పుట్టు, 3.కలుగు.

మొలక - 1.మొక్క, అంకురము, 2.వ్రణము నందు పెరుగు దుర్మాంసము, విణ.లేత, సం.మూలికా. 
మొక్క - మొలక, రూ.మోక = చిన్నచెట్టు, (వ్యవ.) ఉద్భిజము, చెట్టు, వృక్షము (Plant).
మొసు - 1.మొలక, 2.తునక, 3.అందము.
మొసులెత్తు - క్రి. పుట్టు, కలుగు.

నవోద్భిజ్జము - (వృక్ష.) మొలక, చిన్న లేత మొక్క, నారుదశలో నున్న మొక్క (Seedling).

మాంగన - (రసా.) మొక్కలు నేలనుండి తీసికొను మూలద్రవ్యములలో ఒకటి (Manganese).
మగ్నము - మునిగినది, వి. (రసా.) నేల నుండి మొక్కలు తీసికొను మూలద్రవ్యములలో ఒకటి (Magnesium).

స్ఫటము - (రసా.) అల్యూమినియమ్ అనబడు ధాతువు (Aluminium), (ఇది మిక్కలకు సూక్ష్మప్రమాణములో కావలసిన మూల ద్రవ్యము).
అల్యూమినియం -
(రసా.) (Aluminum) తేలికగానుండు తెల్లని లోహము, (వంటపాత్రలు, విమానభాగములు చేయుట కుపయోగింతురు).

ఉద్భిజ్జవీర్యదములు - (వ్యవ.) మొక్కలు జీవరసము నుండి ఉత్పత్తి చేసికొను కొన్ని ప్రత్యేక రసాయన పదార్థములు. (ఇవి మొక్కల పెరుగుదల మొ. జీవవ్యాపారములకు ముఖ్యావసరము), ఉదా. ఇండోల్ ఆసిటిక్ ఆమ్లము. 
ఉద్బిజ్జమాంసకృత్తులు - (వృక్ష.) మొక్కల శరీరములో తయారైన మాంసకృత్తులు (Plant proteins), ఉదా.లెగూమిన్(Legumin), గ్లూటెన్ (Gluten).

కార్యసంబంధ శోష - (వృక్ష.) మొక్క నీటిలో పెరుగుచున్నను ఉప్పు నీరగుట వలన నీటిని పీల్చుకొనజాలని స్థితి (Physiological draught).

బీరజము - (బీజము) అండకోశము, ముష్కము, సం.బీజమ్.

బీజాశయము - (జం.) పునరుత్పాద కావయము, వృషణము లేక అండాశయము (Gonad).

ముష్కో(అ)ణ్డకోశో వృషణః-
ముష్కము - 1.వృషణము, 2.మొత్తము.
ముష్ణాతి గోపాయతి తేత ఇతి ముష్కః, ముషస్త్యేయే. - రేతస్సును దాఁచునది.
అండకోశము - 1.(వృక్ష.) పుష్పములోని స్త్రీలింగభాగము (Prstil or gynoecium), 2.వృషణము, ముష్కము. 
అండయోః కోశః అండకోశః - అండములయొక్క కూటమి అండః కోశః అని రెండు పేళ్ళని కొందఱు.
వృషణము - బీజము,  ముష్కము. 
వర్షతి రేత ఇతి వృషణః వృషు సేదనే. - రేతస్సును గురియునది. ఈ 3 వృషణముల పేర్లు.

బీజ్యుఁడు - మంచి కులమున పుట్టినవాడు.
బీజము - 1.విత్తము, 2.విత్తుట, 3.ముష్కము, 4.హేతువు, 5.రేతస్సు.
విశేషేణ జాయత ఇతి బీజం, వబయోర భేదః, జనీ పాదుర్భావే. విశేషముగా నగునది.
బీజ్యతే అనే నేతివా బీజం - బీజ రోహణే. - దీనిచేతఁ బుట్టింపఁబడును.  

బీజకణము - (జీవ.) సిద్ధబీజము; నిరోధకశక్తి గల పైపొరతో కూడిన జీవకణము(Spore). (ఇది స్వయముగా నొక క్రొత్త ప్రాణిగా అభివృద్ధి చెందగలదు).


విత్తనము -
గింజ; గింౙ - విత్తు.
ఆవాపము - 1.విత్తుట, 2.ధాన్యాదులుంచెడి ప్రాంతము, 3.పాదు. ప్రాంకురము - (వృక్ష.) గింజలో నుండు ప్రాథమికాక్షము యొక్క భూమి పైకి పెరుగు కొన (Plumule).

వప్త - విత్తెడివాడు, సం.వి.తండ్రి.

శుక్రగంధి - (జం.) శుక్రకోశములను ఉత్పత్తిచేయు గ్రంధి, వృషణము (Testis).
శుక్రజననము - (జం.) ఆది బీజాణుకోశములనుండి శుక్రకోశములు ఉత్పత్తియగు విధానము (Spermato-genesis).
శుక్రాశయము - (జం.) స్త్రీప్రాణి శరీరములో ప్రవేశపెట్టు వరకును, పురుష ప్రాణి శరీరములో సుక్రకోసములను నిలువ యుంచుకొను సంచి (Seminal vesicle).
శుక్రకోశము - (జం.) పురుష శరీరములో కార్యరూపముగా ముఖ్యమై లైంగికమైన జీవకణ కోశము, శుక్రరేణువు, (Sperma ozoon). 
శుక్రమాతృకణము - (జం.) పురుషుని శరీరములో శుక్రకోశములను ఉత్పత్తిచేయు జీవకణము (Spermao cote).   
ప్రశుక్రకోశములు - (జం.) శుక్రజనన క్రియ జరుగుటకు ముందు వృషణములో నుండు సంయోగకణములు (Spermatogonia). 
పుంజన్యము - (జీవ.) పురుష సంయోగికణము (Male gametic). 

బీజకోశము - (జీవ.) అండాశయము, అండములను స్త్రీ బీజములను, ఉత్పత్తి చేయు స్థలము (Ovary).
అండాశయము -
(జీవ.) స్త్రీ బీజకోశము (Ovary).

బీజాండము - (వృక్ష.) అండాశయములో నుండు తెల్లగ్రుడ్డు వంటి నిర్మాణము (Ovule) (దీనిలో భూణ స్యూన మేర్పడును. భ్రూణ స్యూనములో అండము తయారగును. ఫలదీకరణైన తరువాత బీజాండము గింజగా మారును.) 
ప్రదేహము - (వృక్ష.) బీజాండము యొక్క ముఖ్య శరీరము (Nucellus).
ప్రబీజాధారము - (వృక్ష.) బీజాండము యొక్క ప్రదేహము (Nucellus), అండత్వక్కులు, సంధిరేఖ (Raphe) ఈ మూడును కలియుచోటు (Chalaza).
సంధిరేఖ - (వృక్ష.) ఉదారవర్త బీజాండమునకు బీజబంధము కలిసియున్నంతవరకు ఏర్పడిన చాలు (Raphe).

ఉదారవర్త బీజాండము - (వృక్ష.) తల క్రిందుగా నున్న బీజాండము (Anattropous ovule).

ప్రాండకోశము - (జం.) అండము తయారగు కోశము (Oogonium). అండమాతృకణము - (జం.) అండము తయారగు మాతృజీవకణము, (Ooeyte).

జననస్యూనము - (జం.) అండాశయనాళము నుండి వచ్చిన అండము లుండు సంచి, (Genital pouch). 

సేవనీసంయోగము - (వృక్ష.) అండాశయములో నొకగది మాత్రమే యుండును, పత్రదళముయొక్క రెండు అంచులు కలిసిన సేవనిమీద జరాయువు ఏర్పడును (Marginal placentation) (అధర సేవనిపై on the ventral suture).
సేవని - (జీవ.)రెండు భాగములు కలియుచోటు ఏర్పడినరేఖ(Suture).

స్త్రీజన్యము - (వృక్ష.) అండకణము, స్త్రీసంయోగికణము (Female gamete).
అండకణము - (జీవ.) స్త్రీ సంయోగికణము (Egg-cell). 
మహాబీజమాతృకణము - (జం.) స్త్రీ సంయోగి కణమును ఉత్పత్తిచేయు జీవకణము. 

అండగోళము - (జీవ.) అండకణము (Cosphere).
సహాయకోశికలు -
(వృక్ష.) భ్రూణ స్యూనములో అండకణమునకు చెరియొక వైపుననుండు కణములు. ఇవి ఫలదీకరణమునకు సహాయపడును, (Synergids).

సం యో గ కణము - (జీవ.) సంతానోత్పదక జీవకణము(Germ cell).
సంయుక్తబీజము - (జీవ.) పురుష సంయోగి స్త్రీ సంయోగి కలిసి ఏర్పడిన జీవకణము (zygote), సం.వి. (వృక్ష.) ఫలదీకరణమైన అండములో నేర్పడిన జీవకణము (Oospore).
ఫలదీకరణము - (జీవ.) పునరుత్పాద క్రియలో రెండు భిన్నముగా నుండు (సామాన్యముగా స్త్రీ పురుష) సంయోగికణములు (Gametes)  సమ్మిళితమై సంయుక్త బీజము (Zygote) ఏర్పడుట, (Fertilization).   
భాజనము - (జీవ.) సంయుక్త బీజము (Zogote) జీవకణములుగా విభజన మగుట (Cleavage). 

ఋజుకణ విభాగము - (జీవ.) జీవకణము నందు కండెపోగులు ఏర్పడకుండనే జరుగు కణవిభజన, అసూత్రభాజనము (Amitosis).  యుగ్మక ఖండములు - (జం.) ఫలదీకరమైన తర్వాత అండము యొక్క తొలి విభజనలలో నేర్పడు జీవకణములు (Blastomeres).

కణము - 1.కొంచెము, 2.నూక(బియ్యపు తునక), 3.సూక్ష్మాంశము, విణ.సూక్ష్మమైనది, సం.వి.1.(భౌతి.) అత్యంతల్ప ప్రమాణము కల ద్రవ్యశకలము (Particle), 2.(జీవ.) జీవకణము (Cell).
జీవకణము -
(వృక్ష.) జీవరసముతో నిండి యున్నగది. శరీర నిర్మాణమునకు, శరీరధర్మములు నిర్వర్తించుటకును ఇది ప్రమాణము, (Cell). 

తని - 1.అల్పము, 2.సూక్ష్మము, సం.తనుః.
తను కోశములు -
(జం.) పునరుత్పత్తి క్రియ కాక శరీరములో తక్కిన జీవిత వ్యాపారములతో సంబంధము కల జీవ కణములు. (Somatic or body cells.)

కణసిద్ధాంకము - (జీవ.) "ప్రాణుల శరీర నిర్మాణములో జీవకణము ముఖ్యమైన మూల ప్రమాణము" అను సిద్ధాంతము (1839లో ష్లీడెన్, ష్వాన్ అను శాస్రజ్ఞులు ఈ సిద్ధాంతమును చేసిరి) (Cell theory).

జీవకణశాస్త్రము - (జీవ.) జీవకణ నిర్మాణమును గూర్చి తెలియచేయు శాస్త్రము, (Cytology). Study of cell structure and functions 
సూక్ష్మనిర్మాణము - (జీవ.) శరీరము యొక్క వివిధావయములలోగల జీవకణ జాలముల చరిత్ర (Histology). This branch is cencerned with the study of tissues of the plants.

అఖండ జీవకణ కోశము - (వృక్ష.) మధ్యమధ్య భిత్తికలు లేక ఒకటేగొట్టము వలె పొడవుగా నుండు జీవకణము (Coenocyte).
ఏకాండము - అతుకులేనిది, విణ.అఖండము.
అఖండము - సంపూర్ణము, నిండైనది, ఖండము కానిది, (వృక్ష.) పండ్లుగాని తమ్మెలుగాని లేక తిన్నగా నున్న అంచుగలది.

జీవకణజాలము - (జీవ.) ఒకే నిర్మాణము, ఒకే వ్యాపారము గల జీవకణముల సమూహము, (Tissue).
కణజాలము - ఒకే వ్యాపారమును నిర్వర్తించు అనేక కణములుగూడి ఏర్పడిన నిర్మాణము (Tissue).
జీవకణ సంహతి - (వృక్ష.) జీవకణ సమూహము (Tissue).
మృదుకోణ జీవకణసమితి - (వృక్ష.) కణకవచము మృదువుగానున్న జీవకణ జాలము (Paren chyma).   

ఏరియోలర్ టిస్యూ - (జం.) (Areolar tissue) ఇది ఒకరకపు సంధాయక కణజాలము.
సంధాయక కణజాలము - (గృహ.) ఒకదానిని మరియొకదానితో చేర్చి అతుకు కణజాలము, (Connective tissue). 

బహిఃప్రసరము - (జీవ.) జీవకణములో నున్న కోశరసముపై నుండు పొర (Ectoplasm). 

చయాపచయక్రియ - (జీవ.) జీవరసములో జరుగు సంశ్లేషణ విశ్లేషణ క్రియలు కలసియున్న ధర్మము (Metabolism).
బేసల్ మెట బోలిజమ్ - (గృహ.) (Basal metabolism) శరీరము కదలికలేని సమయమున కావలసిన పోషణ శక్తి, జీవధారణ మూలక చయాపచయ క్రియ.

జీవరసము - (జీవ.) ప్రోటో ప్లాసం (Protoplasm), జీవకణములో నుండు కోశరసము, (Cytoplasm). అష్ఠి రెండును కలిసి జీవరసము లనబడును, (ఇది ద్రవ ఘన రూపములకు మధ్యస్థముగా (శ్లేషాభము (Colloid) నుండును. దీనిరసాయనిక సంఘట్టనము క్లిష్టముగా నుండును. ప్రాణి యొక్క ప్రాణమునకు ఇది మూలాధారము.  
Protoplasm : The transparent, colourless, colloidal fluid as a living substance is called protoplasm. It contains numerous suspended granules and droplets. It contains about 85% water, 10% proteins, 1.5% fats, 1% carbohydrates.
కొశరసము - (జీవ.) జీవకణములో నుండు జీవరసము (Cytoplasm). Proto-Plasmలో అష్ఠి (Nucleus)ని మినహా యించినచో మిగిలిన ద్రవపదార్థము.
Cytoplasm : The part of the protoplasm that surrounds the nucleus is called cytoplasm. On its outer side of plasma membrane. Tonoplast is on the inner side. Cytoplasm is a complex material composed of membranes, particles of organelles.

The cytosol is the soluble part of the cytoplasm. The fluid part os the cytoplasm is called hyaloplasm. The fluid cavities are called vacuoles.

రసధాని - (జీవ.) జీవకణములో జీవరస వ్యాపారముల ఫలితముగా వచ్చిన రసముచే నిండియుండు సూక్ష్మమైన సందు (Vacuole).

Cytoplasm supplies proper nutrition to the living parts of the cell. Many vital and chemical reactions important for life take place in it. These reactions are important for protein synthesis, respiration, etc.

అష్ఠి - (జీవ.) జీవకణస్థానము, జీవకణములో వర్ణిద్రవ్యముతో నిండి గుండ్రముగా ఉండు భాగము (Nucleus).
కదష్ఠి - (జీవ.) జీవకణ స్థాన గర్భము, వర్ణి పదార్థముతో నిండి అష్ఠిలో నుండు గుండ్రని నిర్మాణము (Nucleus).
Nucleus : It is spherical, dense and centrally located portion of the cell. It occupie two thirds of the cell space. It contains heriditary material i.e. chromosomes. Some cells may contain more than one nucleus.

అష్ఠికవచము - (జీవ.) జీవకణములో అష్ఠిచుట్టును పలుచనిపొర, అష్ఠికళ (Nuclear membrane).
అష్ఠికళ -
(జీవి.) చూ. అష్ఠికవచము.
Nuclear membrane : The membrane which separa- tes the nucleus from cytoplasm is known as nuclear membrane. In the nuclear membrane many pores can be observed.

సత్యకదృష్టి - (జీవ.)అష్ఠిలోనుండు నిజమైన కదృష్ఠి (Plasmosome).

ఆదిలవములు - (వృక్ష.) జీవకణ కోశరసములో ఉండు ప్రత్యేక జీవరస పదార్థములు (Plastids) (ఇవి గుండ్రముగను బిళ్ళలవలెను ఉండును ఇవి హరిత కణములు (Chloroplasts). వర్ణ కణములు (Chromoplasts), నిర్వర్ణకములు (Leucoplasts) అని మూడు రకములుగా నుండును.)
వర్ణకణములు - (వృక్ష.) ఇవి ఆదిలవములలో నొకటి, జీవకణమునకు రంగు నిచ్చు ఆదిలవములు (Chromoplasts).
పత్రహరిత కణములు - (వృక్ష.) జీవకణకోశరసములో పత్రహరితము కల గుండ్రని లేక బిళ్ళలవంటి నిర్మాణములు (Chromoplasts). ఇవి జీవకణ కోశరసములో నుండు ఆదిలవములలో నొకటి. 
నిర్వర్ణకణములు - (వృక్ష.) ఇది ఆది లవణములలో నొకటి. ఇవి జీవకణమునకు(cell) ఏ విధమైన రంగును  కలుగచేయవు(Leucoplasts). These are colourless plastids. Leucoplasts are mainly found in underground roots. These are not exposed to Sun light. In size they are small and in shape they are spherical. Leucoplasts tranform sugar and starch. The food storage is done by Leucoplasts. 

శ్వేతకణములు - (జం.) రక్తములో నున్న తెల్లజీవకణములు (White carpuscles or leucocytes)
భక్షక కణములు - (జం.) శ్వేత కణములు (Phagocytes) సూక్ష్మ జీవులు తినివేయు జీవకణములు (Leucocytes).

' కె ' విటమిన్ - (గృహ.) (Vitamin K) రక్తము గడ్ద కట్టుటకు తోడ్పడు విటమిన్.

కణాభములు - (జీవ.) జీవకణకోశరసములో సూక్ష్మమైన కడ్డీలవలెను, పోగులవలెను, రేణువులవలెను ఉండు ఒక విధమగు పదార్థములు (Chondriosomes or mitochondria).
మైటోకాండ్రియా - (జీవ.) (Mito-chondria) చయాపచయ క్రియలతో సంబంధముకలిగి కోశరసములో నున్న క్రమమైన ఆకారముగల జీవ ద్రవ్యములు.
Mitochondria : Mitochondria is mainly responsible for the release of energy from food material. Mitochon-dria is found in the cells of all the plants and animals. Mitochondria is not found in bacteria and blue-green algae. The size of mitochondria varies from 0.2 to 7.om in diameter.

గాల్గి వస్తువులు - (జం.) కొన్ని జీవకణముల కోశరసములో నుండు ప్రత్యేకమగు జీవ ప దా ర్థ ము లు (Golgi bodies).
Golgi Body : As the name indicates, golgi body or golgi apparatus was discovered by Camillo Golgi in 1898. They occur near the nucleus. Golgi appartus are present in all animal and plants’ cells. They occur as network of threads. They are involved in secretaory activity of the cell.

తారాకేంద్రము - (జం.) జీవకణరసములో కేంద్రికతో నేర్పడు ఒక ప్రత్యేక మైన భాగము, (Centrosome).
తారానాభి - (జం.) కేంద్రిక చుట్టు నుండు గుండ్రని భాగము, (Centro-sphere).  
కేంద్రిక - (జం.) తా రా కేం ద్ర ము యొక్క కేంద్రస్థామున నుండు చిన్న రేణువు (Centriole).

Centrioles and Centrosome : Centrioles are hollow cylinders and do not have membranes. They occur in pairs at right angles to one another. Centrioles are found in most of the animal cells and lower plant cells. It is made of nine triplets of microtubules. They separate and mitigate to opposite poles of an animal cell. Cilia and flagella development and organisation is also done by Centrioles.

నక్షత్రాకార రేఖలు - (జం.) అప్రత్యక్ష కణవిభాగము జరుగునపుడు జీవకణములో తారా కేంద్రము చుట్టును ఏర్పడు నక్షత్రమువలె నుండు రేఖలు, (Aster).   

పక్ష్మములు - (జం.) జీవకణము పై నుండు నూగువంటి చిన్న చిన్న పోచలు (Cilia). (వీనికి సమానావశ్యకతతో కంపించు శక్తిగలదు.)
కశము -
(జం.) చలమున కుపయోగించుచు, జీవకణమున కున్న పొడవైన కొరడావంటి అవయవము (Flagellum).

రసభ్రమణము - (జీవ.)జీవకణములోనున్న జీవరసము వర్తులాకారముగ తిరుగుచుండుట, (Cyclosis).

అంతరకణము - (జీవ.) జీవకణము లలో ఒక కణమునకు మరియొక కణమునకు మధ్య గలది (Intercellular).
కణాంతస్థము - (వృక్ష.) జీవకణము లోపల నున్నది (Intra - cellular)
అంత్యకణము - (వృక్ష.) సూత్రము వలె అవయమునకు కొన నున్న జీవకణము (Apical cell).

అదిచద్ఛము - (జం.) దేహము పై భాగమున లోపలి భాగమున ఉండు ఒక విధమగు జీవకణములలో నేర్పడు పొర (Epithellium).
బహిః ప్రసరము - (జీవ.) జీవకణములో నున్న కోశరసముపై నుండు పొర (Ectoplasm). 

కణవిభాగము - (జీవ.) జీవకణ విభజన (Cell division).
జీవాణు విభజనము -
(జీవ.) జీవకణములు ఒకటి రెండుగా రెండు నాలుగుగా విభజన చెందుట, వీనిలో తొలిదశ (Prophase), మధ్యదశ (Metaphase) చలనదశ (Anaphase), అంత్యదశ (Telophase) అను నాలుగు దశలుండును, (Cell division).
అప్రత్యక్షకణ విభజన - (జీవ.) ఈ కణ విభజనలో ఏర్పడిన, రెండు జీవకణ స్థానములలో క్రొమోసోములు రెండుగా చీలుటవలన సమాన సంఖ్యగల క్రొమోస్రోములుండును. (Mitosis indirect cell division). 

అనువంశికము - (జీవ.) వంశపారంపర్యము, తల్లితండ్రులనుండి పిల్లలకు లక్షణములు సంక్రమించుట (Heridity).

పితృద్రవ్యము - (జీవ.) అనువంశికమునకు భౌతికాధారమైన పదార్థము, వర్ణేషి, (Germ-plasm), (వ్యావ,) తను ద్రవ్యము (Somatoplasm).
పితృద్రవ్యా విచ్ఛిన్నత - (జీవ.) అనువంశిక లక్షణములు గల సంయోగ కణములలోనున్న జీవరసము తరతరములకు ఎడతెగకుండ ప్రవహించుననుట, (వెయిన్ మాన్ అను శాస్త్రజ్ఞుడీ తము చేసెను) (Continuity of germ-plasm).    

పిత్ర్యసూత్రములు - (జీవ.) క్రోమోజోములు, జీవకణము విభజన చెందు నపుడు రాని అష్టిలో నేర్పడు క్రోమోటిన్ కడ్డీలు (Chromosomes).
వర్ణగ్రాహకములు - (గృహ.) బిడ్దలకు తల్లిదండ్రుల పోలికలనిచ్చు జీవకణములలోని క్రోమోటిన్ ముక్కలు (Chromosomes).
క్రోమొసోమ్ - (జీవ.) (Chromosomes)) వర్ణిఖండము, ప్రిత్యసూత్రము.

అర్ధసంఖ్య - (జీవ.) సంయోగికణములలో ఉండు క్రోమోసోముల సంఖ్య (Haploid).
అర్ధ సూత్రణ - (జీవ.) సంయోగికణములు ఉత్పత్తియగు క్రమములో తనుకోశములో నుండు క్రోమోసోముల సంఖ్య సగముగానగు విధానము (Meiosis).
ఏకల సూత్రములు - (జీవ.) క్రోమోసోముల యొక్క సగము భాగము (Chromatids).   

భిన్నయుగ్మ గుణదములు - (జీవ.) సధర్మములగు క్రోమొసోములపై నుండు గుణలలో ఏకాంతర లక్షణములకు కారణము లయిన గుణలు (Genes), ఉదా. పొడుగు పొట్టి మొదలగునవి (Alelo-morphs). 

క్రెటినిజమ్ - (Cretinism) మరుగుజ్జు తనము, పొట్టి, అయొడిన్ Iodine శరీరమునకు అందకపోవుటచే శరీరము పెరుగని స్థితి.
అయోడిన్ - (రసా.) (Iodine) 1.ఔషధముగాను, ఛాయచిత్రకళలోను ఉపయోగించు ఒక రసాయనిక ద్రవ్యము, (సముద్రపు నీటిలోను పాచిలోను దొరుకును), 2.పరమాణుద్వయమున్న అణువు. 
వృద్ధిచెందని పిల్లలు - (గృహ.) ఎదుగుటలోగాని, తెలివితేటలలోగాని వెనుకబడిన పిల్లలు(క్షీణపరిణత శిశువులు).(Retarded Children).

ఏకలక్షణ సంకరజీవి - (జీవ.) ఒక లక్షణములో తేడా యున్న తలిదండ్రుల సంతానము (Monohybrid).

బలీయ (మైన) లక్షణము - (జీవ.) శిశువులో ప్రవేశించిన రెండు పరస్పర వ్యత్యాసము గల లక్షణములలో ఒక లక్షణము (తండ్రి నుండి వచ్చినదిగాని, తల్లినుండి వచ్చినదిగాని) మాత్రమే పైకి కనబడునది (Domain character).
బలీయము - ఎక్కువ బలము కలది, (బలి, బలీయము, బలిష్ఠము).
బలిష్ఠము - మిక్కిలి బలము గలది.
బల్లిదుఁడు - మిక్కిలి బలము గలవాడు, సం.బలిష్ఠః.
బల్లిదము - (బలిష్ఠము) మిక్కిలి బలముగలది, సం.బలిష్ఠమ్.
బల్లిదురాలు - మిక్కిలి బలముగలది. 

Dominant and Recessive : In one pair of characters, one is effective and visible on the other and present in the progeny and is called dominant over the one which is hidden and is called recessive.

దుర్బలలక్ష్యము - (జీవ.) (Receissive character) పరస్పర వ్యత్యాసముగల లక్షణములలో నొక బలీయ లక్షణముతో (Dominant character) కూడి సంక్రమించిన రెండవ లక్షణము, సంతానములో పైకి వికాసమును చూపకుండునది.
దుర్బలుఁడు - బలహీనుడు.

ఆకస్మిక పరివర్తనము - (జీవ.) ఒక ప్రాణి సాధారణ లక్షణములలో హఠాత్తుగా మార్పు గలుగుట (ఈ మార్పు సంతానమునకు సంక్రమించును) (mutation).
Mutations : These are sudden changes and they are discontinuous inheritable as produced due to changes in genetic make up.

అనిషిక్త జననము - (జీవ.) ఫలదీకరణము కాని అండకణము భ్రూణముగా అభివృద్ధి యగుట (Parthenogenesis). 

భ్రూణము - గర్భము, బిడ్డ, శుక్ల శోణిత పిండము, (జీవ.) ఫలదీకరణ మైన అండము. దానితరువాత అభివృద్ధిదశలు, గింజలోనుండు అంకురము, బీజదళములు, సంయుక్త బీజము (Embryo). భూణస్యూనము - సంయుక్త బీజము భూణముగా పెరుగుసంచి (Embryo sac).

గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్ద, 3.అగ్ని, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.

(ౘ)చూఁడి - గర్భము, చూలు.
(ౘ)చూలు - 1.గర్భము, 2.బిడ్డ.  

అయోనిజ - గర్భమున పుట్టని స్త్రీ, వి.సీత.
అయోనిజుఁడు - గర్భమున పుట్టనివాడు, వి.1.విష్ణువు, 2.శివుడు.

అంతర్వత్ని - లోపల శిశువు కలది, గర్భవతి.
గర్భిణి - గర్భవతి; గర్భవతి - చూలాలు; (ౘ)చూలాలు - గర్భవతి. భ్రూణ - చూలాలు.

పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద(కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.), 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
జననావయము - (జీవ.) సంతానోత్త్పత్తికి సంబంధించిన అవయవము, (Reproductive organ).

ప్రత్యుత్పత్తి - (జం.) సంతానోత్పత్తి (Reproduction).
ప్రథమ రూప సంబంధము - (జీవ.) ఒక భాగముగాని ఒక అవయముగాని సంపూర్ణముగా అభివృద్ధి చెందక యుండునది(స్థితి) (Rudimentary). 

అధ్యావృద్ధి - (జం.) భ్రూణములో నుండి సూక్ష్మఖండములు త్వరగా వృద్ధి చెంది మహాఖండముల మీదికి త్రోసికొని వచ్చుట (Epiboly).

గర్భస్రావము - (గృహ.) గర్భవిచ్ఛిత్తి, విచ్ఛిన్నము, నాలుగు మాసములలోపల గర్భము జారిపోవుట (Abortion).
విచ్ఛిన్నము - 1.ఎడబడినది, నరకబడినది, 2.పూయబడినది.

‘ఇ’  విటమిన్ - (గృహ.) (Vitamin E) సంతానోత్పత్తికి తోడ్పడు విటమిన్. ఇది గోధుమ మొలకలలో ఉండును.

గర్భకోశము - (జీవ.) గర్భాశయము, బిడ్డతిత్తి, పిండము పెరుగుసంచి.
గర్భాశయము -
(జం.) మావి, గర్భమును చుట్టుకొనియుండు సంచి, అండాశయ నాళము చివర ఉబ్బియుండు భాగము (Utterus). (అండము అభివృద్ధి చెందుటకై దీనిలో నిలిచియుండును).

గర్భాశయో జరాయుః స్యాత్ -
గర్భ ఆశేతే త్ర గర్భాశయః శీజ్ స్వప్నే. - గర్భము దీని యందుండును.
గర్భనిష్క్రమణానన్తరం జరాం జీర్ణతా మేతి జరాయుః. ఉ. పు. ఇణ్. గతౌ. - గర్భము వెళ్ళినపిమ్మట జీర్ణత్వమును బొందునది. స. జరాయుః. ఈ రెండు 2 మావి పేర్లు.

మావి - 1.గర్భస్థ పిండమునకు మీద కప్పికొని యుండు తోలు సంచి, జరాయువు, 2.మామిడి.
జరాయువు - 1.మావి, 2.జటాయువు, (వృక్ష.) అండాశయములో బీజాండము లమరియుండు దిమ్మ, (Placenta).
అండలంబనస్థానము - (వృక్ష.) జరాయువు, అండాశయములో బీజాండములు అమర్చబడిన దిమ్మ (Placenta). 
మామిడి - మామిడిచెట్టు, రూ.మావి.
ఆమ్రము - 1.మామిడి, చూతము.
చూతము - మామిడిచెట్టు; మాకందము - మామిడి చెట్టు.
మాఁగాయ - మామిడికాయ.

రసాలము - 1.చెరకు, 2.మామిడి.

ఆమ్ర శ్చూతో రసాలః -
అమ్యతే అభిలష్యతే ఆమరః. అమగత్యాదిషు. - అభిలషింపఁబడునది.
అమయతి రోగయతివా ఆమ్రః. ఆమరోగే. - రోగమును గలిగించునది.
చ్యోతతి ధనం ప్రసతీతి చూతః. ద్యుతిర్ క్షరణే. - రసమును స్రవించునది.
రసం అలాతీతి రసాలః. లా దానే. - రసము నిచ్చునది.
రసమలతి భూషతివా రసాల. అల భూషణాదౌ. - రసము నలంకరించునది. ఈ 3 మామిడిచెట్టు పేర్లు.

ప్రియాలము - ఒక విధమగు మామిడిచెట్టు, రూ.ప్రియాళువు.

అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు Mango fruit.

సహకారము - వ్యష్టి, సమిష్ఠి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి. తియ్య మామిడి చెట్టు.
వ్యష్టి - ప్రయోజనము. ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చుశక్తి (Utility).
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధంతము, వి. (అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తినిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో మూల్యమధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.   

ఉద్దేశము - 1.గురి, 2.తలంపు, 3.నిశ్చయము, 4.ఎత్తైన ప్రదేశము.
ఉద్దేశించు - క్రి.1.గుర్తించు, 2.అనుకొను.

పుల్ల విరుగుడు తెగులు - (వ్యవ.) చెట్ల కొమ్మలు, రెమ్మలు నీరసించి ఆకులు రాలిపోయి యెండిపోవుట (Die back disease) ఉదా. నారింజ, మామిడి మొ. ఇది యొకజాతి శిలీంద్రము వలన కల్గును.

ఫాలోఫియన్ గొట్టము - (గృహ.) గర్భకోశమునకు ఇరు ప్రక్కల గల నాళములు (Fallopian tube.) ఇందులో గర్భోత్పత్తియగును.

స్తంభసంయోగము - (వృక్ష.) అండాశయములో మధ్య నిలువుగా స్తంభమువలె నున్న జరాయువు (Placenta) పై బీజాండములు ప్రతి గదియందును అమర్చబడియుండు విధము ఊచకూర్పు, (Axile placentation). 

గర్భాగారము - 1.శయనతృహము, 2.లోపలిది, 3.గర్భాశయము, 4.పురిటిల్లు, 5.దేవాలములందు దేవతా విగ్రము లుండుచోటు, గర్భగుడి.

అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.

మాయ - 1.అవిద్య, 2.ఇంద్ర జాలాదివిద్య, 2.ఒక పట్టణము, వి.(గృహ.) మావి, పిండపుసంచి (Placenta).
అవిద్య -
1.అజ్ఞానము, తత్త్వజ్ఞానము లేమి 2.మాయ. 
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.  

అథాజ్ఞాన మవిద్యాహంమతిః స్త్రియామ్ :
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము.
విపరీతజ్ఞాన మవిద్యా. విదజ్ఞానే - విపరీత జ్ఞానము అవిద్య. అహమితిబుద్ధిరహం మతిః. సీ. - నే ననేడు స్వతంత్రబుద్ధి అహంమతిః. ఈ మూడు అజ్ఞానము పేర్లు.

అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.

'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనగా అవిద్యచే జరా మరణములను లేకుండ చేసికొని, విద్యచే అమృతస్థితిని (మోక్షమును) పొందునని శ్రుతి(వేదము) చెప్పినది.

కడు బలవంతుడైనను
బుడమిని బ్రాయింపుటాలిఁ బుట్టిన యింటం
దడ వుండ నిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ.

తా. ఎంత చెల్లుబడివున్న బలవంతుడైనను, తన యౌవనవంతురాలైన భార్యను తల్లిగారియింటనే దీర్ఘకాలము వుంచిన, ఆమె పతివ్రతా ధర్మము నకు కళంకము తెచ్చినవాడగును.

జటాయుషో దీనదశాం విలోక్య - ప్రియావియోగప్రభవం చ శోకమ్|
యో వై విసస్మార తమార్ద్రచిత్తం - శ్రీజానకీ జీవనమాసతోస్మి|

శ్రద్ధాళువు - వేవిళ్ళుకల స్త్రీ, విణ.శ్రద్ధగలవాడు, ఆశక్తి కలవాడు.  

ప్రాతర్వమనము - (గృహ.) వేవిళ్ళు, గర్భిణీ స్త్రీలకు మొదటి నెలలో నుండు కడుపులోని వికారము (Morning sickness).
వేవిళ్ళు - భక్షణాది వాఛగలుగు గర్భలక్షణము, దౌహృదము.
దౌహృదము - వేవిళ్ళు; చిట్టుములు - గర్భిణికి కలుగు ఒక లక్షణము, వేవిళ్ళు.

క్రక్కు - కక్కు తెవులు, క్రి.వికారముచే కడుపులోని పదార్థములను వాంతి చేయుట.

అలగ్నమధ్యసంయోగము - (వృక్ష.) అండాశయములో మధ్య జారాయువు నిలువుగానుండి దానిచుట్టును బీజాండము లున్నస్థితి (Free central placentation).

ఉల్బము - (గృహ.) పిండములోపలి పొర (Amnion).   

ఆమనస్యము - ప్రసవవేదన, బిడ్డకుట్టు.
బిడ్డకుట్టు - ప్రసవవేదన.

ఉమ్మనీరు - 1.ఉబ్బనీరు, 2.ప్రసవమునకు ముందువచ్చు నీరు, ప్రసవ జలము (Bag of water). ఉబ్బ - ఉమ్మ.
ఉబ్బనీరు - ప్రసవమునకు ముందువచ్చు నీరు, ఉమ్మనీరు.

స్యూతి (భ్రూణము) - 1.కుట్టు, 2.సంతతి, సం.వి. (జం.) జంతువు యొక్క పిండము పెరుగుటలోనిదియొక దశ (Castrula). భ్రూణము యొక్క జీర్ణకోశ కుహరము చుట్టును బహిశ్చర్మము, అంతశ్చర్మము అనువానితోకూడిన రెండు పొరలసంచి యుండును. జీర్ణకోశకుహరము బయటికి ఆద్యంత్ర ముఖము ద్వారా తెరచు కొనును.
కుట్టు - 1.శూలరోగము, 2.కడుపు నొప్పి, 3.పొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.)కుట్టు, 2.(వస్త్రము)కుట్టు, 3.(ఆకులు)కుట్టు.
సంతతి - 1.కులము, 2.సంతానము, 3.పుత్రపౌత్ర పారంపర్యము, 3.వరుస.

ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము.
కుదుప -
1.దుర్మాంస పిండము(తస్స - దుర్మాంసము), 2.వంచన, 3.నెత్తురు, మొ, వి పేరుకొన్న ముద్ద. 

ఎదుటికాళ్ళతో కానుపు - (గృహ.) ప్రసవ సమయమున శిశువుకాళ్ళు ముందు వెలుపలికి వచ్చుట (Breach-birth).

తిగలు - ముగ్గురు బిడ్ద లొక కానుపులో కలుగుట (Triplet).
సంతానచతుష్కతీవంౘలు - (గృహ.) నలుగురుబిడ్డలు ఒకే కాన్పులో కలుగుట (Quadruplets). 

పునరపి జననం పునరపి మరణం - పునరపి జననీ జఠరేశయనమ్,
ఇహ సంసారే బహుదుస్తారే - కృపయా (అ)పారే పాహి మురారే. - 21శ్లో

4. మజ్జ - 1.చెట్టుచేవ, 2.ఎముకల యందలి నేయి.
మూలగ -
ఎముకల మధ్యనుండు మాంససారము, మజ్జ, సం.మూలగః.
నెనడు - మజ్జ, మూలగ.
ఎమ్మూట - (ఎమ్ము+ఊట) ఎముకలలోని క్రొవ్వు, మూలగ.

మజ్జాయాః పంక్తిరుత్పన్నా బృహతీ ప్రాణతో భవత్ |
స్పర్శాస్తస్యాభవజ్జీవః సర్వో దేహ ఉదాహృతః ||

సారో మజ్జా సమౌ -
కాలాంతరం అభినరతీతి సారః. నృ గతౌ. - కాలాంతరమును బొంది యుండునది.
మజ్జతీతి మజ్జా. న. పు. టుమసో శుద్ధౌ. - పరిశుద్ధమైనది.
ద్వారంతరే మజ్జతీతి మజ్జా. - మ్రాఁకులో మునిఁగియుండునది.
పా. మజ్జా. ఆ. సీ. ఈ రెండు చెట్టులోనుందు చేవ పేర్లు.

సారము - 1.జవము, 2.ధనము, 3.న్యాయము, 4.బలిమి, 5.చేప, 6.మూలగ, విణ.శ్రేష్ఠము, వి.(గృహ.) ఫలత్వము, 7.ఫలించుశక్తి (Fertility).

సారో బలేస్థిరాంశే న్యాయ్యేక్లీబం వరే త్రిషు. : సార శబ్దము సత్తువకును, చేవకును పేరైనపుడు. పు. యుక్తమైనదానికి, పేరైనపుడు న. శ్రేష్ఠమైనదానికి పేరైనపుడు త్రి. సరతి స్థిరీభవతీతి సారః. సృ గతౌ. - స్థిరమైయుండునది. 

జవము - వేగము; జవనము - వేగముకలది, వి.వేగము.
వేగము -
జవము, త్వర, (గణి.) భౌతి.) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
త్వర - వేగిరపాటు. వేగిరము - వేగము, విణ.త్వరితము.
త్వరితము - శీఘ్రము, వడిగలది. శీఘ్రము - వడి, విణ.వడిగలది. 

రై - 1.ధనము 2.హిరణ్యము.
ధనము -
1.విత్తము(విత్తము కొద్దీ వైభవము) 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది 2.తెలియబడినది.
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.
రైవతుఁడు - శివుడు. 

క్షత్త్రము -1.క్షత్రియకులము, 2.శరీరము, దేహము, 3.ధనము, 4.నీరు.

యస్యాస్తి విత్తం సనరః కులీన, స్సపండితః సశ్రుత ణాన్వివిజ్ఞః|
సవీవవక్తా స చదర్శనీయ, స్సర్వేగుణాః కాంచన మాశ్రయన్తి||
తా.
ధనముగలవాఁడే సత్కులవంతుఁడు, వాడే పండితుఁడు, వాఁడే శాస్త్రజ్ఞుఁడు, వాఁడే కర్తవ్యా కర్తవ్య విధిజ్ఞుఁడును, వాడే పలుక నేర్చినవాఁడు, వాడే చూడదగినవాఁడు గనుక సకల గుణంబులు ధనము నాశ్రయించి యున్నవి. - నీతిశాస్త్రము 

యావత్ విత్తోపార్జనశక్తః తావన్నిజపరివారోరక్తః,
పశ్చాత్ జీవతి, జర్జరదేహే వార్తాం కో పి న పృచ్ఛతి గేహే. - భజగోవిందం

న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్క శాస్త్రము.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లి కూతురునకు తల్లితండ్ర్రు లిచ్చు బహుమానము. 
నాయము - 1.న్యాయము, 2.ధర్మము, సం.న్యాయః.
సమంజసము - న్యాయము, ఒప్పిదము.
నీతి - న్యాయము. నీతి లేకపోవుటవలన సమృద్ధి నశించిపోవును.
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము. ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property). 

తరస్సు - బలిమి, వడి.
వేగ -
వడి, విణ.త్వరితము.
చేప - మత్స్యము; మత్స్యము - చేప.

నీళ్ళలోన మీను నిగిడి దూరముపారు
బైట మూరడైన బారలేదు
స్థానబల్మిగాని తనబల్మి కాదయా విశ్వ.
తా.
చేప నీళ్ళలో చాలా వేగముగా పోవును. బైట మూరెడు దూరమైననూ పోలేదు. అందుచేత అది స్థానబలమేగాని దాని బలముగాదు.  

చేవ - 1.చేగ, సారము, 2.ధైర్యము, 3.(వృక్ష.) ద్వితీయ వృద్ధిచెందిన దారుకణ సంహతి, (Secondary xylem).
చేగ - 1.కొయ్య నడిమి నల్లని గట్టి భాగము, 2.సారము, 3.ధైర్యము, రూ.చేవ.  

మూలగ - ఎముకల మధ్యనుండు మాంససారము, మజ్జ, సం.మూలగః.
మజ్జ -
1.చెట్టుచేవ, 2.ఎముకల యందలి నేయి.
నెనడు - మజ్జ, మూలగ.
మజ్జారజ్జువు - (జం.) వెన్నుపాము, సుషుమ్న నాడి మొదలు నుండి వెన్నెముక గుండా దాని చివరవరకు గల నాడుల త్రాడు(Spinal cord). మైరవము - (జం.) వెన్నెముకకుగాని, వెన్నుపామునకుగాని, సంబంధించినది. మేరుపు = వెన్ను పాము, (Spinal). 
వెన్నుబాము - (గృహ.) వెన్నుపూసలో పారు ముఖ్యమైన నరము.(Spinal cord).

మజ్జాసంస్థా హంసవతీ - ముఖ్యశక్తి సమన్వితా|
హరిద్రాన్నైకరసికా - హాకినీరూపధారిణీ. -   108శ్లో

ఎమ్మూట - (ఎమ్ము + ఊట) ఎముకల లోని క్రొవ్వు, మూలగ.
ఎముక - శల్యము, రూ.ఎమ్ము. (Bone)
ఊట - 1.ఊరగాయరసము, 2.చేప, 3.మూలగ, 4.భూమిలోపలి నుండి పీడనము వలన పైకి ఉబికివచ్చు జలము (Spring).
ఊట వెలుపడు గ్రంథులు - (గృహ.) లోపల ఊరిన రసమును నాళుల ద్వారా బయటకి పంపు గ్రంథులు (Exocrine glands).

ఊటాడు - క్రి. సంభ్రమించు, చలించు, తత్తరపడు.
తత్త ఱించు - క్రి.1.భ్రమించు, 2.చలించు, తత్తరిల్లు.
తత్తఱ - సంభ్రమము, రూ.తత్తరము.

సంవేగము - సంభ్రమము, వేగిరపాటు, సం.(జీవ.) ప్రేరణ (Impulse). ప్రచోదనము - (భౌతి.) హఠాత్తుగా క్షణికముగా నారోపింపబడిన బలము (Impulse), చూ.అఘాతము. 
సంభ్రమము - (గృహ.) 1.సంబరము, 2.వేగిరపాటు, 3.భయము, 4.ఆదరము.
సంవేగాత్మకము - (గృహ.) సులభముగా మనోవికారము పొందు నట్టిది, (Emotional). 

స్రావము - కారుట, సం.(గృహ.) ఊట, గ్రంధిజనిత స్రావము (Secretion).
స్రపణము - కారుట, రూ.స్రవము, స్రావము.
అంతస్రావము - (జం.) వాహిక ద్వారాకాక, తిన్నగా రక్తములోనికి గాని శోషరసము లోనికిగాని ప్రవేశించు స్రావము (Internal secretion).

జాలతానికా ద్రవము - (జం.) దెబ్బకాని, అదురుగాని తగులకుండ కాపాడుటకై వెన్నుపాము చుట్టున ఉండు సాలెపట్టు వంటి నిర్మాణము గల ద్రవము, (Arachnoid fluid).

నిక్కచ్చి - 1.నిర్బంధము, 2.సారము, 3.మోగమోటమి లేమి, సం.నిష్కర్షః. 

తత్త్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి. (భౌతి) మౌలికమైన, సారమైన విషయము. దేని మీద ఇతర సత్యములు ఆధారపడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
తథ్యము - సత్యము.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
నిజము - స్వభావము, విణ.1.తనది, 2.శాశ్వతమైనది.
నిజము - సత్యము, విన.1.శాశ్వతమైనది, 2.సత్యమైనది.
నిజమరి - సత్యశీలుడు.

అసారే ఖలుసంసారే సారం శ్వశుర మందిరమ్|
హిమాలయే హర శ్శేతే హరి శ్శేతే మహోదధౌ||
తా.
సంసారము సారము లేనిదైనను శ్వశుర(శ్వశురులు-అత్తమామలు)(మందిరము - 1.ఇల్లు, 2.పట్టణము, 3.దేవగృహము, 4.దేవపీఠము.)గృహంబు సారంబు గలది. గనుకనే శివుఁడు హిమవత్పర్వతంబు నందు, విష్ణువు సముద్రము నందును శయనించిరి. - నీతిశాస్త్రము 

మజ్జాద్రవ్యము - (గృహ.) క్రొవ్వు పదార్థములు, నెయ్యి, వెన్న, నూనె మొ.వి (Fats).

నూనియ - చమురు, రూ.నూనె.
ౘమురు -
రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.
స్నేహము - చెలిమి(చెలిమి - స్నేహము.), చమురు.

హార్దము - స్నేహము, విణ.హృదయ సంబంధమైనది.   
సాప్తదీనము - చెలిమి, వ్యు.ఏడు మాటలలో లేక ఏడూడుగులలో కలుగునది.

ౘమురు దినుసులు - (వ్యవ.) నూనెగింజల పైరులుగాక నూనె లభించు ఇతర ద్రవ్యములు, ఉదా.నిమ్మగడ్డ, చందనము, సీమబాదము, కొబ్బరి మొదలగునవి, (Oil stuffs). 

అస్థిర తైలము - (వ్యవ.) గాలి పారినచో వాయురూపము నంది శీఘ్రముగా హరించిపోవు నూనెలు. (Volatile or essential oils). ఉదా. నిమ్మగడ్డి నూనె, గులాబినూనె మొ,వి.

జంబీరము - 1.నిమ్మ(నిమ్మ - జంబీరము), 2.మరువము.
మరువకము - మరువము, వాసన మొలక.

కమ్మనిమ్మ - తియ్యనిమ్మ.
కమ్మనూనియ -
సంపెంగ, మొ.ని చేర్చి చేసిన తైలము, రూ.కమ్మనూనె.

ౘమురు గింజల పైరులు - (వ్యవ.) నూనెనిచ్చు గింజల పైరులు, ఉదా.ఆముదము, వేరుసెనగ, కుసుమ, నూవు మొదలగునవి, (Oiled crops ). నూవు - నువు, రూ.నువ్వు, నూగు. నూగు - తిలసస్యము.

తెలికలు - తిలలు, నువ్వులు, సం.తిలకః.
తిలలు - నువ్వులు.
తిలఘాతకుఁడు - గాండ్లవాడు, తెలికవాడు.
తెలికవాఁడు - గాండ్లవాడు.
గాండ్ల - నూనె ఆడి అమ్మి జీవించువారి కులము, తెలికలకులము.

అశోషకతైలములు - (వ్యవ.) గాలి పారినను చాలకాలము జిడ్డుగా నుండు నూనెలు. ఉదా. నూవులనూనె, వేరు సెనగనూనె మొ.వి (Non drying oils).
కుసుమ - 1.ఒకరకపు ధాన్యము (వడ్లలో పెద్ద కుసుమ, చిన్న కుసుమ, గుత్తికుసుమ మొ.వి. 2.(వ్యవ.) గింజల నుండి 'కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower). 

5. రక్తము - 1.నెత్తురు Blood, 2.కుంకుమ, 3.ఎరుపు.

రక్తకుఁడు - అనురాగము కలవాడు.
అనురాగము - అనురక్తి, ప్రేమ, కూర్మి.
అనురక్తి - అనురాగము, ప్రేమ.
రక్తి - అనురాగము.
అనురక్తము - 1.అనురాగము కలది, 2.ఎఱ్ఱనిది, 3.రంగుకలది.
అనురక్త - అనురాగము కలది.

అరుణము - 1.ఇంచుక ఎరుపు(నీరుకావి - కొంచెమెరుపు), 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.

రుధిరే అ సృగ్లోహితాస్ర రక్త క్షతజ శోణితమ్,
రుద్యతే త్వచా రుధిరం. రుధిర్ ఆవరణే. - చర్మముచేత కప్పఁబడునది.
ఆస్యతే త్వగ్భేదేన అసృక్. జ. న. అస్రంచ. అనుక్షేపణే. - చర్మము తెగిన మాత్రమునఁ బ్రవహించునది.
లోహితవర్ణత్వాత్ లోహితం. రక్తం చ. - ఎఱ్ఱని వన్నె గలది. లోహితము రక్తము.
క్షతా జ్జాయత ఇతి క్షతజం. - గండివలనఁ బుట్టినది.
శోణితవర్ణత్వాత్. శోణృ వర్ణగత్యోః. - ఎఱ్ఱనివన్నె గలది. ఈ ఆరు నెత్తురు పేర్లు.

రుధిరము - 1.నెత్తురు, 2.సింధూరము.
నెత్తురు -
రక్తము, రూ.నెత్రు.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
చెందిరము - 1.సింధూరము, 2.కుంకుమ, రూ.చెంద్రము, చందురము.
సిందురము - 1.సింధూరము, 2.కుంకుమ, 3.వావిలిచెట్టు, సం.సిందూరమ్, సందువారః.
సిందూరము - కుంకుమ, చెందిరము.
సిందువారము - వావిలిచెట్టు.

(ౙ)జొత్తు - ఎరుపు.
జొత్తుపాప - నెత్తురు కందు, మిక్కిలి పసిబిడ్డ.

లోహితము - 1.రక్తచందనము, 2.సింధూరము, 3.నెత్తురు.
రక్తచందనము -
ఎఱ్ఱ చందనము, (రక్త) ద్రవపదార్థము, సం.వి. (జం.) సామాన్యముగా రకములోనున్న ద్రవపదార్థ భాగము (Plasma) రసకళ, Plasma membrane. 
ఎఱ్ఱగందము - రక్తచందనము.
లోహితాంగుఁడు - అంగారకుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.(Mars) 

లోహితాస్యుఁడు - హరిశ్చంద్ర నృపాలుని కొమరుడు, రూ.రోహితాస్యుడు. (లౌహితాశ్వుడని కొందఱు.)  
రోహితాశ్వుఁడు - 1.అగ్ని(అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు), 2.హరిశ్చంద్రుని కొడుకు, రూ.1.రోహితాశ్వుడు, 2.రోహితాస్యుడు.

అస్రము - 1.కన్నీరు, 2.నెత్తురు, 3.మూల, 4.వెండ్రుక.
అశ్రము -
1.కన్నీరు, అశ్రువు, 2.నెత్తురు, రూ.అస్రము.
అశ్రువు - కన్నీరు, బాష్పము.
కన్నీరు - హర్ష శోకముల వలన కన్నుల నుండి కారెడు నీరు.
బాష్పము - 1.కన్నీరు 2.ఆవిరి, వి.(భౌతి.) ఘన, ద్రవ ద్రవ్యముల ఆవిరి, సంధిగ్ధ తాపక్రమము క్రిందనుండి ప్రేషము వలన ద్రవీభవించుటకు వీలుగా నున్న వాయువు (Vapour). 

అశ్రుగ్రంధి - (జం.) కన్నీటి గ్రంధి (ఈ గ్రంధులు ముక్కుకు ఇదుప్రక్కల, కండ్లకు చేరువుగా ఉండును.)
ఉపాశ్రుగ్రంధి - (జం.) కన్నీరు ఉత్పత్తి చేయుగ్రంథులకు సహాయకారిగా నుండు గ్రంధి. (ఇది నేత్ర శుక్లమును తడిగా నుంచుచుండును,) (Hardcrian gland).  
నేత్ర రసము - (జం.) నేత్రరస వేశ్మములో నుండు నీటివంటి ద్రవము, కన్నీరు (Aqueous humor).
ఆక్వియస్ హ్యూమర్ - (Aqueous humour) కంటిగ్రుడ్డులో ముందు భాగమున గల స్వచ్ఛమైన ద్రవము, జలాకార రసము. 

రుదితము - రోదనము.
రోదనము -
1.శోకము, ఏడ్చు, 2.కన్నీరు.
శోకము - దుఃఖముచే తపించుట, వగపు.
ఏడుపు - రోదనము, రూ.ఏడ్పు.
ఏడుచు(ౘ) - దుఃఖించు, రోదనము చేయు, రూ.ఏడ్చు.
ఏడ్చు - ఏడుచు; ఏడ్పు - ఏడుచు.
వాపోవు - అరచు, ఏడ్చు. వాపోక - ఏడ్చుట, అరచుట. 
క్రోశము - 1.ఏడ్పు, 2.పిలుపు(ఆహ్వానము - పిలుపు), 3.కూత వినిపించు నంతదూరము, కోసు.
ఆకారణ - పిలుపు, ఆహ్వానము, రూ.ఆకారణము.

తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 2.శోకము, రూ.తమస్సు.
చీకటి -
అంధకారము; అంధకారము - చీకటి. 
చీఁకటిగొంగ(గొంగ - శత్రువు) - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
అంధకరిపుఁడు(రిపువు - శత్రువు) - శివుడు.

కన్ను(ఎఱగన్ను - శివుని అగ్నినేత్రము) ఎర్రనైనా మిన్ను (ఆకాశము) యెర్రనైనా నీరే (కన్నీరు, వర్షం). చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలురావు - కన్నీరు. 

పక్షిణాం బలమాకాశం, మత్స్యానా ముదకంబలమ్|
దుర్బలస్య బలంరాజా, బాలానాం రోదనం బలమ్||
తా.
పక్షులకు ఆకాశము బలము, చేపలకు (ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది, రూ.ఉదము.)నీళ్ళు బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము బలము. - నీతిశాస్త్రము

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.

క్షతజము - 1.నెత్తురు, 2.చీము.
చీము -
చెడి తెల్లనైన నెత్తురు, పూయము.
పూయము - 1.చీము, 2.పీనుగు.
పీనుగు - శవము; శవము - 1.పీనుగు, 2.జలము, వి.సబము.
ఆకారుఁడు - శవము, పీనుగు. సబము - శవము, పీనుగు, సం.శవః. కుణపము - 1.పీనుగు, 2.దుర్గంధము; దుర్గంధము - చెడువాసన. బదుగు - పీనుగు, విణ.1.కృశము, 2.అశక్తుడు. 

మమ్మీ - (చరి.) (Mummy), 1.శవము, 2.సువాసన ద్రవ్యములతో కుళ్ళిపోకుండ ఉంచిన శవము. 

రసి - (జం.) చీము, సం.రసః.
రసి -
(జం.) గడ్దకట్టిన రక్తము నుండి వేఱుపడి, జీవకణ కోశములుగాని తంత్వి (Fibrin)గాని లేక యుండు ద్రవము (Serum).

కలరా - (గృహ.) (Cholera) వాంతి భేది. (ఇది నీటి ద్వారా వ్యాపించు ప్రాణాపాయకరమైన జాడ్యము.)

తాంతవము - (జం.) రక్తము గడ్దకట్టినపుడు దానిలో నేర్పడిన సూక్ష్మమైన తంతుకములలో నుండు పదార్థము (Fibrin) విణ.తంతు సంబంధమైనది.
తాంతవజని - (జం.) రక్తములో నుండు ద్రవపదార్థములనున్న మాంసకృత్తు. దీని నుండి తాంతవము తయారగును. (Fibrinogen).

తయమిన్ - (గృహ.) (Thiamine) 'బి' విటమిన్. నంజువ్యాధిని తొలగించు విటమిను 'బి ' గ్రూపు విటమినులలో మొదటిది.

అనిమీయా - (Anemia) పాలిపోవుట, రక్తములో ఎఱ్ఱకణములు తక్కువగుట, రక్తహీనత, పాండురోగము.
పాండురోగము -
(గృహ.) పాలిపోవుట, రక్తహీనత (Anemia).
పాండువు - 1.పాండురోగము, సం.వి. (వృక్ష.) పత్ర ల కము హరితవర్నము లేక తెల్లగా నుండుట (Chlorosis).

అసాధ్యపాండువు - (గృహ.) చికిత్సకు లోబడని పాండురోగము, కుదుర్పరాని రక్తహీనత (Pernicious anaemia). 

విటమిన్ B12 - (గృహ.) (Vitamin B12) ఒక విధమగు రక్తహీనతను తొలగించు విటమిన్, (ఇది ఉపద్రవకరమైన పాండు రోగమును తొలగించును. B12 లోపమువలన పాండురోగము కలుగును ఇది కాలేయ కల్కములో నుండును).
విటమినులు - (గృహ.) (Vitamins) ఆరోగ్యమును పొందజేయు ఆహారములు 'ఎ ' 'బి ' 'సి ' డి ' మొ. విటమినులు.'

శోణితము - రక్తము.
రోహితము -
1.కుంకుడు పువ్వు, 2.నెత్తురు, 3.ఎరుపు, 4.ఎఱ్ఱచేప.

నల్ల - నెత్తురు, వై.వి. నలుపు, 2.బొగ్గు.

చెన్ను - 1.అందము, 2.విధము, 3.ఎరుపు.
చెన్నుఁడు - అందగాడు.

నిర్వాహిక గ్రంథి - (జం.) వాహికా నాళము లేకుండ తిన్నగా రక్తములోనికి న్యాసర్గమును స్రవింపచేయు గ్రంథి (Ductless gland, endocrine).
న్యాసర్గము -
(జం.) పెద్ద జంతువులలో నిర్వాహిక గ్రంథినుండి స్రవించుచు జీవన వ్యాపారముల కవసరమగునట్టి పదార్థము (Hormone).

నాళరహిత గ్రంథులు - (గృహ.) వాహికలు లేని గ్రంథులు (Ductless glands), ఉదా. పిట్యుటరీ, థైరాయిడ్ మొదలగు గ్రంథులు.
పిట్యూటరీ మాంస గ్రంథులు - (గృహ.) పీనస మాంసగ్రంధులు, పోషగ్రంధులు, (Pituitary glands). 

పోషక గ్రంధి - (జం.) మస్తికము నకు క్రింది భాగమునకుండు ఒక ముఖ్యమగు గ్రంధి (Pituitary body).  
పిట్యూట్రిన్ - (జం.) (Pituitrin) పోషగ్రంథి తయారు చేయు అంతస్సావము  (Hormone) పోషగ్రంధి నిస్సారము. 
హార్ మోన్స్ - (గృహ.) (Hormones) నిర్నాళ గ్రంధులలో ఊరు రసము., (ఇవి శరీర క్రియలను క్రమపరచును) అంతస్స్రావములు. 

రక్తప్రసరణ మండలము - (జం.) శరీరములో రక్తము ప్రవహించు నాళములు, నాళికలు, కేశికలు, గుండె, (Circulatory system or Vascular-system). 

శోషరస మండలము - (జీవ.) లసికా మండలము, శ్వేతధాతు మండలము, శోషరసముండు కుహరముల నాళికలు, (Lymphatic system).
లసికారసము - (జీవ.) జీవకణజాలములో నున్న జీవకణములు మునిగియుండు తెల్లరక్తకణములలో కలిసియున్న ద్రవపదార్థము, (Lymph).
లసికా కోటరములు - (జీవ.) శోష రస ముండుస్థలములు (Lymph sinuses).
లసికా హృదయములు - (జీవ.) గుండెవలె సంకోచవ్యాకోచములచే శోష రసమును స్రవింపచేయు నిర్మాణములు, (Lymph hearts).

పాలగొట్టములు - (గృహ.) సూక్ష్మ రక్తనాళములు. ఇవి శృంగముల మధ్యలో నుండును (క్రొవ్వు ఆహారము జీర్ణమైన తరువాత వీనిచే రక్తములోనికి తీసుకొని బడును) (Lacteals).

రక్తకణము (ఎఱ్ఱకణము) - (జం.) రక్తములో నున్న్న ఎఱ్ఱని కణములు (Erythrocyte) (Red blood corpuscles).
ఎఱ్ఱ రక్త కణములు - (జం.) రక్తమునకు ఎరుపురంగు నిచ్చు కణములు, (Erythrocytes).
ఎఱ్ఱకణములు - (జం.) చిన్న ఉంగరముల వలె నుండి ఎరుపు రంగు నిచ్చు కణములు, (ఇవి ప్రాణవాయువును సరఫరా చేయును) (Red blood corpuscles).
రక్త రుధిర కణములు - (జం.) రక్తములో నున్న ఎఱ్ఱని కణములు, (Red blood corpuscles).
రక్తకణములు - (జం.) రక్తద్రవములో విడివిడిగానుండు జీవకణములు, (Blood corpuscles).

రుద్రవాతము - (వైద్య, గృహ,) మెదడులో రక్తనాళములు పగిలి రక్తస్రావము వలన కలుగు వ్యాధి (Apoplexy).

రక్తస్రావము - (జీవ.) రక్తము వెలుపడుట, (Hemorrhage) (ఇది శరీరములో జరిగిన చాల అపాయకరము.)
అంతస్స్రావము - (జం.) వాహిక ద్వారాకాక, తిన్నగా రక్తములోనికి గాని శోషరసము లోనికిగాని ప్రవేశించు స్రావము (Internal secretion). 

ఎరిత్రొ బ్లాస్టోసిస్ - (Erythro blastosis) రక్తకణములు సరిగా పెరుగక పోవుట. 
విషరక్తత - (గృహ.) విషరక్తమును కలిగించుట రక్తములో విషములు చేరి యుండిన రోగము (Toxaemia).

హీమోగ్లోబిన్ - (Haemoglobin) ప్రాణవాయువును గ్రహించి తీసికొని పోవు రక్తము నందలి ఎఱ్ఱనిపదార్థము. 
ఆక్సీహీమోగ్లోబిన్ -
(జం.) (Oxi-haemoglobin) హీమో గ్లోబిన్ ప్రాణవాయువుతో కలిసి ఏర్పడిన సమ్మిళిత ద్రవ్యము.

శ్వాసము - 1.వూపిరి, 2.ఉబ్బసము, 3.వాయువు.
ఊపిరి -
శ్వాసము, ఊర్పు.
ఊపిరికుట్టు - ఊపిరి పీల్చునపుడు బాధ కలిగించెడి ఒక వ్యాధి, యౌకము.
యౌకము - ఊపిరికుట్టు.
ప్రాణగొడ్డము - ప్రాణహింసకము, సం.ప్రాణకుట్టః.
గొడ్దగము - బాధకము, సం.కుట్టకమ్.    

ఉబ్బసము - ఊర్థ్వశ్వాస రోగము, వగరువురోగము, సం.ఉచ్ఛ్వాసః.
ఉబ్బసపుదగ్గు -
(గృహ.) ఉబ్బసము, భారమైనదగ్గు, ఊపిరాడకుండ వచ్చు దగ్గు. (Asthma).
శ్వాసకాసము - ఉబ్బసముతోడి దగ్గు.
శ్వాసావరోధన - (గృహ.) ఉక్కిరి బిక్కిరియగుట, ఊపిరి యాడకపోవుట, (Suffocation). ఉడ్డుగుడుచు - ఊపిరి తిరుగక బాధపడు, ఉక్కిరి బిక్కిరి యగు.
ఉక్కిరిబిక్కిరి - ఊపిరాడనిది, వి.ఊపిరాడకుండుట.

Dyspncea - శ్వాస కృచ్ఛము, difficulty in breathing.
వగర్చు -
శ్వాసరోగము difficulty in breathing.

ఊపిరికుట్టు - ఊపిరి పీల్చునపుడు బాధ కలిగించెడి ఒక వ్యాధి, యౌకము.
యౌకము - ఊపిరికుట్టు. ఊపిరిగొట్టు నొప్పి, Stitching or catching pain ఉశ్వాసము విడిచినప్పుడు గుండెలలో నొకప్రక్కను పోటుపొడచి నట్లు లేచెడి నొప్పి.

ఊష్మము - 1.ఆవిరి, 2.వేసవి, 3.గ్రీష్మ ఋతువు, 3.ఊష్మధ్వనిలు (శ, ష, స, హ).
గ్రీష్మఋతువు -
వేసవి (జేష్ఠాషాఢ మాసములు.)
గ్రీష్మము - 1.వేడి, 2.వేసంగి.
వేసఁగి - వేసవి, సం.వైశాఖః.
వేసవి - వేసవి కాలము.

గ్రీష్మ – Summer; శుచి, అగ్ని(నీరు బిడ్డగా కలది).
శుచి - 1.అగ్ని, చిచ్చు 2.ఉపదాశుద్ధుడైన మంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గికంటి - శివుడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.

చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
శిఖ -
1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ.జుట్టు ముడికలవాడు.
తాపము - 1.వేడిమి, 2.బాధ, సం.వి.(భౌతి.) వేడి (Hot).
వేఁడివేలుపు - 1.వహ్ని, 2.సూర్యుడు.
వహ్ని - అగ్ని.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్చుఱ, సం.శుచిః.
చిచ్చఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.

హైపర్ వైటమినోసిన్ - (గృహ.) (Hypervitaminosis) కొన్ని విటమినులు ఎక్కువగుటచే శరీరమునకు కలుగు హాని, ఉదా.ఎండ దెబ్బ.

తాపత్రయము - మూడు విధములైన తాపములు - ఆధ్యాత్మికము, అధిదైవికము, ఆధిభౌతికము.

ఆవిరి - బాగుగ కాచిన నీటి నుండి లేచు ఊష్మము, అవి (Steam).
అవి1 -
1.శ్వాసము, ఊపిరి, 2.తాపము, 3.ఆవిరి, 4.చీడ.
ఆవి2 - 1.ప్రసవవేదన(బిడ్డకుట్టు - ప్రసవవేదన.), 2.రజస్వల, 3.చూలాలు(గర్భవతి - చూలాలు).

యువాకోశము - (జం.) ఊపిరితిత్తి నిర్మాణములోనున్న ఒక్కొక్క సూక్ష్మమైన గాలిగది, (Alveolus).

ఉమ్మ - ఉబ్బ.
శ్వాసత్వక్ కుహరము - (జం.) ధమన మూలములో బృహద్ధమన కుహరము ప్రక్కనున్న అర (Cavum pulmo-cutaneum) ఇది ఎడమ వైపున నుండును.

క్షవధువు - 1.కాసరోగము, 2.తుమ్ము, 3.దగ్గు, 4.ఎక్కిలి.
ఉక్కిలి -
పొడిదగ్గు, కాసరోగము.
కాసము - దగ్గు(cough).
ఉక్కిస - పొడిదగ్గు, కాసరోగము.
తుమ్ము - క్షుతముచేయు, వి.క్షుతము.
దగ్గు - కాసముచేయు, కాసము, రూ.డగ్గు.
ఎక్కిలి - దప్పి మొ. నిచే గలుగు బాధ, సం.హిక్కా.
హిక్క - 1.ఎక్కిలి, 2.పైడికంటి యను పక్షి.
పైడిఁకంటి - 1.చిన్నగూబ, 2.కంఠమున పెట్టుకొను బంగారు కంటె. విక్షావము - 1.తుమ్ము, 2.దగ్గు.

కోరింత దగ్గు - కుక్కదగ్గు (Whooping cough), (ఈ దగ్గు సాధారణముగా చిన్న పిల్లలకు వచ్చును).

ధమని - 1.అవయములకు గుండె నుండి నెత్తురు తీసికొనిపోవు నరము, 2.మెడ, 3.అగసాలెవాని ఊదుగొట్టము, సం.వి. (జం.) మంచి రక్తమును తీసికొని పోవు రక్తనాళము, (Artery).

ధమనుఁడు - అగ్ని, విణ.1.కొలిమి తిత్తి నూదువాడు, 2.క్రూరుడు. క్రూరుఁడు - దయలేనివాడు.

గళధమని - (జం.) తలలో నుండు వివిధ భాగములకు మంచిరక్తమును పంపు రక్తనాళము (Carotid artery).
గళగహనము - (జం.) గళధమని బయలుదేరుచోట ఉబ్బిన స్పంజివంటి చిన్న నిర్మాణము. దీనిలో గళదమని యొక్క అతి సూక్ష్మరక్త నాళిక లుండును) (Carotid labrynth).

శిరోధి - మెడ.
మెడ -
కంఠము, రూ.మెడకాయ.
కంఠము - 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము.
కంఠ్యము - కంఠము నందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, ఘ, జ, హః అను ధ్వనులు.

సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.

కృకము - కంఠనాళము, కంఠపు బుడిపి, కుత్తుక. 
కుతుక -
గొంతు, రూ.కుతుక, కుత్తుక.
గొంతు - 1.కుత్తుక, 2.కంఠధ్వని, రూ.గొంతుక, సం.కంఠః.
గళము - 1.కుత్తుక, 2.ఒకానొక వాద్యము.
గళసంబంధము - (జం.) గొంతుతో సంబంధము గలది (Phanyngeal).

పొరబారుట - (గృహ.) గొంతుకపడుట, ఆహారము గాలిగొట్టములొనికి పోయినచో కలుగుస్థితి (Choking).

గళగ్రంధి - (జం.) (కప్ప) ద్విత సాధనమునకు (Hyoid apparatus)గాని, స్వరపేటికకు గాని ఇరువైపుల నుండు అంతస్రావ గ్రంధి (Thyroid gland) దీనినుండి జలతిగ్మి (Thyroxin) అను స్రావము ఊరును. కాకళము, (గృహ.) గవడబిళ్ళలు లేక గాలిబిళ్ళలు అనెడివ్యాధి (Mumps).

నాళరహిత గ్రంథులు - (గృహ.) వాహికలు లేని గ్రంథులు (Ductless glands), ఉదా. పిట్యూటరీ, థైరాయిడ్ మొదలగు గ్రంథులు.

స్వరపేటిక - (జం.) శబ్దమును ఉత్పత్తి చేయు అవయములు గల గది వంటిభాగము (Larynx) సం.వి. (గృహ.) ఇది గొంతులో కొండనాలుకకు క్రింది భాగమునకు గలదు. ఇది మనుష్యులకు మాటలాడుటకు ఆధారమై యుండును. (Voice box).
ముద్రాకాస్థి - (జం.) కప్పయొక్క స్వరపేటికలో ఉన్న రెండు మృదులాస్థి నిర్మాణములలో నిది యొకటి (Cricoid cartilage). రెండవది దర్వీకాస్థీ (Arytenoid cartilage).
దర్వికాస్థులు - (జం.) స్వరపేటికలో ముద్రాకాస్థి వలయముచే చుట్టబడి అర్థ చంద్రాకార కవాటమువలె నుండు కోమలాస్థి నిర్మాణములు (కఫ్ఫ) (Arytenoid cartilages).     

సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి నిర్మాణములు, ఊపిరి తిత్తులు, రెండు బృహద్ధమున చాపములుగల పృష్ట వంశిన జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
సరీసృపము - పాము, ప్రాకుడు జంతువు.

విలోమము - అవరోహణక్రమము గలది, వి.1.పాము, 2.కుక్క.
అవరోహణక్రమము -
(గణి.) వరుస తగ్గుచుపోవు క్రమము (Descending order).
అవరోహణ(ము) - (గణి.) క్రమముగా క్షీణించుట (Descent).    
తలక్రిందు - అధోముఖము, విలోమము, రూ.తలక్రిందు.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రొ.రుద్దు.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
సర్పము - పాము, సప్పము.
గ్రామమృగము - కుక్క, (గ్రామసింహము).

పుప్పసములు (కప్ప).
పప్పున - (జం.) ఊపిరితిత్తులకు సంబంధించినది (Pulmonary). 
పప్పుస ధమని -
(గృహ.) కుడి జఠరిక నుండి ఊపిరి తిత్తులోనికి చెడ్ద రక్తమును కొనిపోవు నాళములు (Pulmonary artery).
పుప్పుస సిరలు - (గృహ.) ఊపిరి తిత్తులలో నుండి శుభ్రపరచిన రక్తమును ఎడమ కర్ణికలోనికి గొంపోవు నాళములు (Pulmonary vein).
పుప్పుస ప్రసరణము - (గృహ.) రక్తము గుండెనుండి ఊపిరితిత్తులకు చేరి తిరిగి ఊపిరితిత్తుల నుండి గుండెకు చేరువరకు జరుగు రక్త ప్రసరణము (Pulmonary circulation).
పుప్పుసోదర నాడి - (జం.) ప్రాణేశ నాడి (Pneumo gastric nerve). (ఇది పదియవ కపోలనాడి, స్వర పేటిక, హృదయము, ఊపిరితిత్తి, ఉదరము అనువానికి  ఈ నాడి పోవును). 

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

కప్ప - మండూకము; మండూకము - కప్ప.
భేకము -
1.కప్ప, మండూకము, 3.మేఘము.
భేకి - ఆడుకప్ప.
భేకశిశువు - (జం.) చిరుకప్ప, కప్ప యొక్క జీవిత దశలలో చేపవలె నుండు మొదటి డింభ దశ. 

ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడు బంధువులు వత్తు, రది యెట్లన్నన్
దెలుప్పగ చెఱువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!
తా.
ఎప్పుడు మానవునికి సంపదలు కల్గునో, అప్పుడు వాని యింటికి లేక్కలేని బంధువులు పిలువకుండగనే వచ్చెదరు, అట్లుగానే చెఱువులు సమృద్ధిగా నిండియున్న తరుణమందు కప్పలు అనేకము అందు చేరుచున్నవు గదా! 

కాలకము - పుట్టుమచ్చ. 
కాలయతి కృష్ణయతి స్వప్రదేశమితి కాలకః - తన స్థలమును నల్లఁగాఁ జేయునది. 
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగుచెట్టు, విణ.శ్రేష్ఠము.
తిలతి స్నిహ్యతీతి తిలకం, తిల స్నేహనే. - మెఱుఁగై యుండునది.
తిల ఇవ తిష్ఠతీతి తిలకః - నువ్వులవలె నుండునది.
తిల ఇవ కాలవర్ణత్వాత్ తిలకాలకః - నువ్వులవలె నల్లఁగా నుండునది. ఈ 5 పుట్టుమచ్చ పేర్లు.
బొట్టు - 1.తిలకము, 2.చుక్కసున్న, 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.

తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహుత్కోళపు పొర క్రింద నుండు అంతస్స్రావగ్రంథి (Thymus gland).  

పుప్పుసము - (జం.) క్లోమము, ఊపిరి తిత్తి, (Lung).
క్లోమము1 - (జం.) 1.కడుపులోని నీరు తిత్తి.

క్లోమము2 - (గృహ.) సర్వకిణ్వము, (ఇది ఒక నాళగ్రంథి, ఇందులో పుట్టు మధుర రసము చిన్న ప్రేవులలో ఆహారము జీర్ణమగుటకు సహాయపడును), 2.తియ్యదబ్బ, (Pancreas).

తిలకం క్లోమ -
తిలతీతి తిలకం. తిల స్నేహనే. - మెఱుఁగై యుండునది.
క్లామ్యతి క్లోమ. న. న. క్లము. గ్లానౌ. - వాడునది. పా. క్లోమ.
ఈ రెండు కడుపులో నొక ప్రక్క నెఱ్ఱనైయుండు మాంస విశేషము పేర్లు. నీరుతిత్తి యని కొందరు.

అమైలాప్సిన్ - (జం.) (Amylopsin) క్లోమ (Pancreas) గ్రంధినుండి తయారగు సేంద్రియ ఖండము (Ferment), ఇది పిండి పదార్థమును చెక్కెరాగా మార్చును).

స్వాదుపిండము - (జం.) సర్వకిణ్వి కడుపు ఆంత్ర మూలముచే నేర్పడిన మడతలో నుండు గ్రంథి (Pancreas). (ఇది మధురసమును ఉత్పత్తి చేయును. దీనిలో సర్వకిణ్వములు ఉండ వచ్చును).

స్వాదువు - 1.ఇంపైనది, 2.తియ్యనిది, 3.మంచిది.
స్వాదుధన్వుఁడు -
తియ్యవిలుకాడు, మన్మథుడు.

యువాకోశము - (జం.) ఊపిరితిత్తి నిర్మాణములోనున్న ఒక్కొక్క సూక్ష్మమైన గాలిగది (Alveolus).
శ్వాసనాళము -
(జం.) ముఖకుహరమునుండి ఊపిరితిత్తులలోనికి గాలిని తీసికొనుటకు వదులుటకు ఉపయోగించు గొట్టము, (Trachea).

క్లోమనాళము - (జం.) శ్వాసనాళము యొక్క శాఖ (Bronchus).
రొమ్ము పడిసెము - (వైద్య., గృహ) గుండె జలుబు, (Bronchitis).
రొంప - పడిసెము; పీనసము - పడిసెము.

విషపడిశెము - (గృహ.) శ్వాసనాళము నకు సంబంధించిన అంటు జ్వరములు,  జలుబులు, (Influenza).  
పీనజ్విరము - జలుబు పడిశముతో వచ్చు జ్వరము. (ఇది ఒక రకపు ఎలర్జీ వలన కలుగు జ్వరము). (Hay fever).
అ నా ఫి లి స్ - (Anophele) దోమలలో ఒక జాతి. (ఈజాతి ఆడు దోమల ద్వారా అనాఫిలిస్ మలేరియా వ్యాపించును.)
మలేరియా -
(గృహ.) (Malaria), చలి జ్వరము, (ఈ జ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)
గుణనపూర్వదశ - (జం.) మానవ రక్త కణములలో ప్రవేశించిన మలేరియా రోగజీవి అభివృద్ధి చందుచు విభజనకు సిద్ధముగా నున్న దశ (Schizont).
ఖండ గుణము - (జం.) మానవరక్త కణములలో జరుగు మలేరియా రోగజీవి యొక్క జీవితదశలు (Schizogony).

బీజానుగుణనము - (జం.) దోమ శరీరములో జరుగు మలేరియా రోగజీవి జీవిత దశలు (Sporogany).
బీజఖండము -  (జం.) మలేరియా వ్యాధికి కారణమగు రోగజీవి జీవన చక్రములో మనుష్యుని రక్తములో నగుపడు దశలలో నొకటి (Merozoite).
చలయుక్తము - (జం.) క్రిమివలె కదలుచుండు సంయుక్త బీజము. ఉదా:- మలేరియా రొగ జీవి యొక్క (Ookinite).

క్వినీన్ -  (వ్యవ.) (Quinine) మలేరియా జ్వరమునుపోగొట్టు మందు, (కాఫీ మొక్క కుటుంబము (Rubia ceae)నకు చెందిన (Cinchona offlcinalis) అను చిన్నచెట్టు యొక్క పట్టనుండి దీనిని తయారు చేయుదురు.)  

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.  

అజిహ్వము - కప్ప, విణ.నాలుకలేనిది.
అజిహ్మము - తిన్ననైనది, వి.కప్ప.

ఘోషన్యూనములు - (జం.) మగకప్ప గొంతునకు రెండు వైపుల గల సంచులు. (ఇవి శబ్దమును దీర్ఘముగా చేయుటకు ఉపయోగపడును) (Vocal sacs).

ముద్రాకాస్థి - (జం.) కప్పయొక్క స్వరపేటికలో ఉన్న రెండు మృదులాస్తి నిర్మాణములలో నిది యొకటి (Cricoid cartilage), రెండవది దుర్వీకాస్థీ (Arytenoid cartilage). 

స్తంభాకారాధిచ్ఛదము - (జం.) నిలువుగా నొకటి ప్రక్క మరియొకటి స్తంభమువలె నమర్చబడిన పొడవైన జీవకణముల పొర (Columanar epithelium) (కప్ప ప్రేగు లోపల అస్తరుగా నున్న పొరలో దీనిని చూడనగును). 

కఫము - తెమడ, శ్లేష్మము.
తెమడ -
శ్లేష్మము; శ్లేష్మము - కఫము.
గళ్ళ - కళ్ళ, శ్లేష్మము.
క్లేదము - 1.తడి, 2.ఉపద్రవము, (జీవ.) చిక్కని నీరు ఎక్కువగా నుండి జారుడు లక్షణములు గల శ్లేష్మసంబంధమగు పదార్థము, తెమడ, (Mucilage).
శ్లేష్మలుఁడు - కఫరోగము గలవాడు, శ్లేష్మణుడు.   

కఫః శ్లేష్మా -
కే శిరసి, కేన జలేన వా ఫలతి కఫః. నిప్బత్తౌ. - శిరస్సు నందుఁగాని జలము చేతఁగాని పుట్టునది.
శ్లిప్యతి హృదయాదౌ శ్లేష్మా. న. పు శ్లిష ఆలింగనే. - హృదయము మొదలైన దానిం బొందునది కఫము.

నిమోనియా - (గృహ.) (Pneumonia) ఊపిరితిత్తి వాపుతో కూడిన జాడ్యము, శ్వాసకోశమునకు సంబంధించిన విషజ్వరము, కఫజ్వరము, శ్లేష్మజ్వరము, పప్పుసదాహము. 

యక్ష్మము - క్షయరోగము.
క్షయరోగము -
ఊపిరితిత్తుల రోగము, క్షయవ్యాధి, (Tuberculosis).
రాజయక్షము - క్షయరోగము, Consumption.

పుమాన్ యక్ష్మా క్షయ శ్శోషః -
యక్ష్యతే రోగేషు యక్ష్మా. న. పు. యక్ష పూజాయాం. - రోగములయందు రాజవుటవలనఁ బూజింపఁబడునది.
క్షీయన్తే అనేనేతి క్షయః క్షి క్షయే. - దీనిచేత క్షయింతురు. 
శుషన్తే అనేనేతి శోషః. శుష శోషణే. - దీనిచేత శోషింతురు. ఈ మూడు 3 క్షయరోగము పేర్లు.

అతిరోగము - అధికమైన రోగము కలది, వి.1.అధికమైన రోగము, 2.క్షయవ్యాధి.

క్షయరోగమునకు ముఖ్యముగ కాస, శ్వాసలు, కఫము, జ్వరము, దేహము శుష్కించుట, నీరసము, అరుచి, అగ్నిమాంద్యము గలిగి యుండును.

క్షయము - 1.క్షయవ్యాధి, 2.తగ్గుదల, 3.ప్రళయము, 4.క్షయనామ సంవత్సరము.

తగ్గుదల - తక్కువ; తక్కువ - కొరత.
తగ్గు - క్రి.1.తక్కువగు, 2.వెనుదీయు, 3.తెగిపడు, వి.తక్కువ.

అపచయము - 1.హాని, నష్టము, తగ్గుట, 2.పుష్పాదులను కోయుట, (రసా.) తగ్గించుట, చూ. హాసము.
నష్టము - నశించినది.
అవగడము - 1.ఏమరిపాటు, 2.అపాయము, విణ.1.అపాయకరము, ఇతరులకు అశక్యమైనది, 3.చెడ్డది. 
ఏమఱిపాటు - 1.పరాకు, 2.ప్రమాదము, విణ.1.అకస్మాత్తుగా, 2.వంచనగా, రూ.ఏమఱుపాటు.
పరాకు - 1.తత్పరత, 2.ప్రమాదము.
ఏమఱిలు - 1.క్రి. 1.ఏమఱు, 2.ఉపేక్షించు, మరచు, ఏమరిలు, ఏమరిల్లు.
ఏమఱచు(ౘ) - క్రి.ఏమరజేయు, రూ.ఏమాఱుచు.   

ప్రళయము -1.కల్పాంతము, 2.అపాయము, 3.మృత్యువు, 4.మూర్ఛ.
అపాయము - హాని; హాని - 1.తక్కువగుట, 2.కీడు.
కల్పము - 1.బ్రహ్మదినము, 2.ప్రళయము, 3.శాస్త్రము.

శర్వుఁడు - శివుడు, వ్యు. ప్రళయ కాలమున భూతముల హింసించు వాడు.   

మృత్యువు - 1.చావు(మృతి - చావు), 2.మరణాధిదేవత.
మృత్యంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించిన వాడు. 

శోషణము - 1.శోషరోగము, 2.క్షయరోగము.
శోషణము -
1.ఇంకుట, ఎండుట, సం.వి. (రసా.) తేమను తొలగించు విధానము (Dessication).
శోషించు - ఇంకిపోవు.
ఎండు - 1.నీరింకు, 2.తడియారు, 3.శుషించు, 4.తపించు.
ఎండుతెవులు - దేహమును శుష్కింప జేసెడి ఒక వ్యాధి.

నవఁత - 1.శ్రమ, 2.దుఃఖము, 3.క్షయరోగము.
శ్రమ -

దుఃఖము - 1.బాధ, 2.చింత.

గ్లాని - 1.శ్రమచే కల్గిన దౌర్బల్యము, 2.అశక్తి, 3.రోగము, 4.నాశము.
గ్లానుఁడు -
తెవులుగొంటు, రోగము చేత కృశించినవాడు.
కార్శ్యరోగము - (గృహ.) చిక్కి శల్యమగుటకు క్షీణించి పోవుట (Emaciation).

ఆస్తేనియా - (గృహ.) (Asthenia) బలము తగ్గుట లేక బలము లేకపోవుట.  

సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడుకాక లేనిచో
మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుడౌ
నేని స్వభోజ్యముల్ గుడుచునేనియు బుష్టివహించులేనినా
డూని, విభూతిలో నడిగియుండడె తేజముదప్పి, భాస్కరా.
తా.
అగ్నిదేవు డయినను తాను తిను తిండి మానినయెడల తన కాంతి గోల్పోయి బూడిద(విభూతి - 1.తిర్యక్పుండ్రధారులు ధరించెడి భస్మము, 2.ఒక ఐశ్వర్యము.)లో నణగియుండును. అట్లే, తనకు ఎక్కువ ప్రీతీయిన అన్నమును తిన్నచో మనుష్యుడు వృద్ధిపొందును, లేనిచో కృశించును. 

అనై చ్ఛిక కండరములు - (జం.) అనిచ్ఛాపూర్వకముగ పనిచేయు కండరములు (Involuntary muscles), ఉదా.గుండెకాయ, పేగులయొక్క కండరములు. 

గుండె - గుండియ.
గుండియ -
హృదయము, రూ.గుండె.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, ప్రాణ, (జం.) గుండెకాయ, గుండె (Heart).
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.
కందనకాయ - గుండెకాయ.
డెందము(దెందము - డెందము) - హృదయము.
హృదయ స్పందనము - (గృహ.) గుండె కొట్టుకొనుట(heart beat).

ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
అసువులు -
ప్రాణములు.

హృది ప్రాణః - ప్రాణము హృదయము నందుండి గర్భమునం(దన్నా) అన్నాదులఁ బ్రవేశింపఁజేయుచుండును.

హృదయము: రక్తము జనించెడి స్థానము, ఇదియె సమస్త రక్తనాడులకు  మూలము.

హృత్కోశము - (జం.) గుండెకాయ చుట్టును ఉండు సంచి(Pericardium). 
హృత్కుంచనము - (జం.) హృదయములోని కండర భిత్తికలన్నియులోని రక్తమును బయటికిపంపుటకు సంకోచము నొందు స్థితి (Systole).
హృదయవ్యాకోచము - (జం.) కండరములతో నేర్పడిన హృదయము యొక్క గోడలు ఒకసారి ముడుచుకొనిన తరువాత తిరిగి యథాస్థితికి వచ్చుట (Diastole).
హృదజ్జువులు - (జం.) సూత్రదండకములు, గుండెలోనున్న కర్ణిక, జఠరిక కవాటముల యొక్క అంచులు జఠరిక యొక్క కండరములకు కలుపుతాళ్ళు, (Chardae tendineae). 

కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
పూర్వకుహరము -
(జం.) ముందు భాగము దొప్పగానున్న (Proceolous), వెన్నుపూసల కున్నట్లు.)

జఠరిక - (జం.) గుండెకాయలో నుండి రక్తమును బయటికి పంపునది, (Ventricle).
జఠరికలు -
(గృహ.) గుండెలోని క్రింది గదులు (Ventricles).
కర్ణికలు - (జం.) 1.హృదయము లోపల జఠరికల పైభాగమున నున్న రెండుకుహరములు, 2.బయటి చెవులు.

ధమని - 1.అవయములకు గుండె నుండి నెత్తురు తీసికొనిపోవునరము, 2.మెడ, 3.అగసాలెవాని ఊదుగొట్టము, సం.వి. (జం.) మంచి రక్తమును తీసికొని పోవు రక్తనాళము (Artery).
ఊఁదుఁగ్రోవి -
1.అగసాలివాడు కుంపటిని ఊదెడి గొట్టము, 2.పిల్లనగ్రోవి.
వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి. 

వంశము - 1.కులము, 2.వాసము (వెదురు), 2.పిల్లనగ్రోవి, 3.వెన్నుగాడి, 4.సమూహము, 5.ఒక పురాణ లక్షణము.
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వెదురు - వేణువు, సం.వేణుకః. 
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి. 

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు…అల్లన మోవికి(పెదవికి) తాకితే గేయాలు(పాటలు).....

మురళి - 1.పిల్లనగ్రోవి, 2.ఒక విధమైన గుఱ్ఱపునడక. 
మైలక్రోవి - మురళి.

కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్త నాళములు(ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries). 

కేశికాభాజి - (జం.) హృదయమునకు రక్తమును తీసికొని వచ్చుచు మధ్యలో మరొక అవయములో కేశికలుగా చీలిన సిర (Portal vein). ఈ మాదిరి సిరా సమూహము కేశికాభాజి మండలము (Portal system) అనబడును.

బృహద్దమని - (జం.) హృదయము నుండి మంచి రక్తమును తీసికొని పోవు పెద్ద రక్తనాళము (Aorta).

దేహమహాధమని - (జం.) ఇది బృహద్ధమని చాపములలో నొకటి. ఇరువైపుల నున్న దేహమనోధమనులు రెండు కలిసి పృష్ఠబృహద్ధమనిగా నేర్పడును, (కప్ప) (Systemic trunk).

ఊర్థ్వబృహత్సిర - (జం.) గుండెకు పైనున్న భాగమునుండి మలిన రక్తమును కుడికర్ణికకు తెచ్చుసిర (Superior venacava).
అధోబృహత్సిర - (జం.) క్రింది భాగముల నుండి మలినరక్తమును కుడి కర్ణికకు తీసికొని పోవు సిర (Inferior Venacava). 

సిరాకోటరము - (జం.) (కప్పలో) గుండె కాయ యొక్క పృష్ఠభాగమును కప్పియుంచు త్రికోణాకారము గల కుహరము, శరీరమునుండి తెచ్చిన చెడురక్తము దీనిలోనికి చేరును. (Sinus venosus).
సిరాపరిఖ - (జం.) ఎముకలో గాని మరి యితర కణజాలములలో గాని ఏర్పడిన కుహరము (Sinus). 

ధమన స్కందము - (జం.) జఠరికలో నుండి మంచి రక్తము ప్రవేశ పెట్టబడు  పెద్దగొట్టము (కప్ప) (Truncus arteriosus).
ద్వారపాత్ర - (జం.) (Pylangium or conus arteriosus) ధమన స్కందము (Trunkus arteriosus) యొక్క రెండు కుహరములలో మొదటి కుహరము. ఇది గుండెకాయలో ఎడమ కర్ణికా భాగముచే కప్పబడియుండును. దీనిలో బృహద్ధమన కుహరము, శ్వాసత్వక్ కుహరము ఉండును, ధమన మూలము.
ధమన మూలము -  (జం.) ధమన స్కందము యొక్క రెండు భాగములలో నొకటి. ఇది పొడవుగా హృదయ కుహరములోనున్న భాగము. (కప్ప) (Conus arteriosus or pylangium).
బృహద్దమన కుహరము - (జం.) ధమన మూలము (Pylangium) యొక్క లోపలి భాగమును ఒక కుంతల కవాటము అసంపూర్ణముగా రెండు అరలుగా విభజించును, వీనిలో కుడివైపున నున్న అర (Cavum aorticum). 

బృహద్దమన కండరము - (జం.) దమనస్కందము యొక్క రెండు భాగములలో నొక భాగము. ఇది పొట్టిగా గుండెకు పైగా నున్న భాగము, ధమనీ స్కంధాంతము (Bulbus aorta or synangium).  
అర్థచంద్ర కవాటము - (జం.) గుండెకాయలోని జఠరిక ధమనస్కంధము లోనికి తెరుచుకొను ద్వారమునకు గల అర్థచంద్రాకార కవాటము (Semi-lunar valve).

ఉదరకుహరధమని - (జం.) ఉదర కుహరమునకు రక్తమును పంపు శుభ్రరక్తనాళము (Coeliac artery).

దేహగుహాంత్రయుజ ధమని - (జం.) దేహకుహరమునకును, ప్రేగులకును, రక్తమును పంపు నాళములు రెండును కలిసిన పెద్ద రక్తనాళము (Coeliaco-mesenteric artery).

ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి. (జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంధి (Spleen).

ఉదరము - 1.కడుపు, (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).
కడుపు - ఉదరము, పొట్ట.
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట.

జఠరము - కడుపు, విణ.1.ముదిసినది, 2.కఠినమైనది.
జఠర సంబంధము -
(జం.) కడుపునకు సంబంధించినది, (Gastric).
జఠరరసము - (గృహ.) ఈరసము అన్నకోశములో పుట్టి, ఆమ్ల సహాయ్యమునే కొంత పిండిపదార్థమును చక్కెరగా మార్చును, (Gastric juice).

పాచకము-(జం.) జఠరరసమందు కల సేంద్రియమండము (Pepsin). స్టెప్సిన్ - (జం.) (Steapsin) మేదః పాచకము (Stearin + papsin)  క్రొవ్వు పదార్థములను అసంబధమగు ఆమ్లములుగను, గ్లిసరీనుగను విడదీయు సేంద్రియమండలము.

కుక్షి - కడుపు.
కుక్షింభరి -
సం.విణ.తనకడుపు మాత్రము నింపుకొనువాడు, ఉదరంభరి.
ఉదరంభరి - తనపొట్టను మాత్రమే పోషించుకొనువాడు.

తుందము - కడుపు.
తుంది -
1.కడుపు, 2.ఉరుకుబొడ్దు, విణ.బొజ్జకడుపు కలవాడు.
తుందిభుఁడు - 1.బొజ్జకడుపు గలవాడు, 2.ఉరుకుబొడ్డు కలవాడు, రూ.తుందిలుడు.
తుండి - 1.ఉరుకు బొడ్డు రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.

నోరు - 1.ముఖద్వారము, 2.వదనము. 
వదనము -
నోరు, ముఖము.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
ఆస్యము - 1.ముఖము, 2.నోరు, విణ.1.నోటనున్నది, 2.ముఖమున ఉన్నది.
ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity).
ముఖశ్వసనము - (జం.) నోటితో గాలినిపీల్చి వదలివేయుట (Buceal respiration).
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము(Peristome).
ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12' లేక ‘డి' లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis). 

నిగళము - (జం.) అన్నవాహికలో గళము తరువాత నుండు భాగము (Gullet or Oesophagus), సం. వి.1.ఏనుగు కాలి సంకెల, 2.సంకెల, రూ.నిగడము.  

అన్నవాహిక - (జం.) ఆహారపు గొట్టము(Stomach).
జీర్ణ మండలము -
(జం.) ఆహారమును శక్తిగాను, జీవకణజాలములు గాను మార్చుటతో సంబంధము గల అవయవములు, అన్నవాహిక, జీర్ణకోశ గ్రంథులు, (Digestive system).
జీర్ణకోశ గ్రంథులు - (జం.) ఆహారమును జీర్ణము చేయుటకు కావలసిన రసములను తయారుచేయు గ్రంథులు (Digestive glands).
జీర్ణ క్రియ - (జీవ.) శోషణమునకును ఉపయోగమునకు వీలుగా నుండు నట్లు ఆహారము రసాయనికముగా సూక్ష్మీకరణము నొందుట (Digestion).

ఆహారనాళిక - (జం.) ఆహారపు గొట్టము, గొంతునకును అన్నకోశము నకు మధ్యనున్న గొట్టము (Aesophagus).
అన్నకోశము - (జం.) అహారపు గొట్టమునకు క్రిందిభాగములో ఉన్న సంచివంటి ఒక అంగము (Alimentary canal). 
అంత్రముఖము - (జం.) కడుపు నుండి ప్రేగులోనికి పోవు ద్వారము (Pylorus).
శేషాంత్రము - (జం.) చిన్నప్రేవులలో అంత్రముఖము తరువాత నున్న భాగము (Heum).
అంత్రమూలము - (జం.) కడుపు నుండి చిన్న ప్రేవులలొనికి దారి చూపు మార్గము. (ఇది చిన్న ప్రేవులయొక్క మొదటి భాగము) (Duodenum).
లాఘ్వాంత్రము - (గృహ.) చిన్న ప్రేవునకు మొదటిలో వంగియున్న భాగము (Deuodenum).
అంత్రీయ ఉణ్ణుకము - (జం.) అంత్రము పైనుండు వ్రేలువంటి ప్రవర్థము (Intestinal cacca).
అంత్రోత్సర్గ - (జీవ.) అన్నవాహికలొనికి తెరుచుకొను ఉత్సర్గ నాళము గలది (Enteronopbric).  

అంతర్జఠరము - (జం.) అన్నవాహికలో కండరములు గల ఒక భాగము (Gizzard).

అంతఃకుహరము - (జం.) దేహకుహరము జీర్ణకోశకుహరము రెండును కలిసియున్న ఒకే కుహరము. దీనికి ఒకే ద్వార ముండును (Coelenteron).
జీర్ణకోశ కుహరము - (జం.) అన్నవాహిక లోపలనుండు ఖాళీస్థలము లేక తొర్ర. (Euteron).
క్విణములు - (జీవ.) ఫేనకములు, ఆహారమును జిర్ణముచేయు రసములలో నుండు ప్రత్యేకమగు సేంద్రియ రసాయన పదార్థములు (Ferments).

అంత్రము - ప్రేగు, (జం.) అన్నవాహికలో సాధారణముగ కడుపు తరువాత నుండు భాగము (Intestine).
అంత్రములు - (జం.) ప్రేవులు (Intestines). 
పురీతత్ - ప్రేవు.  

అన్త్రం పురీతత్ -
అమ్యతే సంభజ్యతే భుక్తానాదిక మనేనేతి అంత్రం. అమగత్యాదిషు. - భుజించిన (య)అన్నాదులు దీనిచేత నేర్పఱచఁబడును. పా. అంత్రం. 
పురీం దేహం తనోతి పురీతత్. త. స్న. తను విస్తారే. - పురియనఁగా శరీరము; దీనిని విస్తరింపజేయునది. ఈ శబ్దము స్త్రీలింగమని కొందఱు. ఈ రెండు ప్రేగుల పేర్లు.

శ్లేష్మకళ - (జం.) ప్రేగు లోపలి భాగమున నుండు అస్తరు (Mucous membrane). ఈ పొర యందలి జీవకణములు శ్లేష్మమును ఉత్పత్తి చేయును, సం. (జం.) ప్రేగుయొక్క గోడలలో నున్న నాలుగు పొరలలో లోపల నుండు మొదటి పొర (Mucosa) ఉపశ్లేష్మకళ  = రెండవపొర (Sub-mucosa).

అధ శ్ల్మేష్మక పేశిస్తరము - (జం.) ప్రేగు యొక్క గోడలో నుండు రెండవ పొరయగు అధశ్శ్లేష్మక స్తరము (Sub-mucosa)లో నుండు పలుచని కందరపు పొర (Muscularis mucosa).

ఎండోతీలియమ్ - (జీవ.) (Endothelium) శరీరములోగల అవయములలోని లోపలిపొర. 

సంధాన వాహినులు - (జం.) శరీరము పైనున్న కవచము నుండియు ఉత్సర్గ నాళికల నుండియు రక్తమును తీసికొని వచ్చు రెండు రక్తనాళములు (Commisural vessels) ఉదా.వానపాము. ప్రమేఖలము - (జం.) శరీరమున కొంతభాగముపై చుట్టును ఏర్పడు పట్టీ వంటి గ్రంధి కణజాలము (Clitellum), ఉదా. వానపాము.
సంధాయక కణజాలము - (గృహ.) ఒక దానిని మరియొక దానితో, చేర్చి అతుకు కణజాలము (Connective tissue).

ఎఱ - వానపాము, విణ.ఎఱ్ఱనైనది.
ఎఱ్ఱ - ఎఱ.
అథ మహీలతా, గణ్ణూపదః కొంచులకో -
వానపాము - ఎఱ్ఱ, మహీలత.
మహ్యాం లతేన తిష్ఠతీతి మహీలతా - భూమి యందు లతవలె నుండునది.
గండూపదము - (జం.) వానపాము, ఎఱ్ఱ (Earth worm).
గండవః శరీర గ్రంథయః త ఏవ పాదాః అన్య గండూపదః - గండు లనఁగా శరీరమున నున్న బుడుపులు; అవి పాదములుగాఁగలది.
కించిచ్చలతీతి కించులకః - ఇంచుకంత చలించునది. ఈ 2 ఎఱ్ఱ పేర్లు.
శిలి - 1.ఆడుఎఱ్ఱ, 1.బాణము.

భిత్తిభంజము - (జం.) కొన్ని అపృష్ట వంశిక ప్రాణులలో ప్రేగు యొక్క కుహరములోనికి చొచ్చు కొని నులువుగా మునిగి యున్న గోడవంటి భాగము (Typhlosole) , ఉదా. వానపాము. 

జననాంకురములు - (జం.) వానపాము శరీరముపై 17వ 19వ ఉంగరములమీద నురడు గుండ్రని పల్లపు భాగములు (genital papillae).
శుక్రధాని - (జం.) ఉదా.మరియొక వానపాము నుండి గ్రహించిన శుక్ర కోశములను నిలుపయుంచు కొనుటకు వానపాము శరీరములో నుండు సంచి, (Spermatheca). 

ఏలికపాము - (జం.) మనుష్యుల ప్రేగుల లోని పరాన్నజీవి (6-12 అంగుళముల పొడ వుండును), (Round worm).
అంతః పరాన్నజీవి - (జీవ.) 1.పోషితృ జీవి (host), 2.శరీరములోపల నుండు పరాన్నజీవి (Endoparasite).
పరిపోషకము - (జీవ.) పరాన్న జీవికి శరీరముపైగాని లోపలగాని నివసించుటకు అవకాశ మిచ్చిన ప్రాణి (Host).

తరంగగతి సంకోచము - (జం.) అన్నవాహిక యొక్క గోడలు సంకోచము చెందుచు ఆహారము తరంగము మాదిరిగా ముందుకు జరుగుట (Peristalisis).
క్రమాకుంచనము - (గృహ.) అన్నకోశములో కెరటములవలె చలనము వలన ఆహారము ముందుకు త్రోయబడుట (Peristalitic Movement).

పయోలసిని - (జం.) జీర్ణమైన క్రొవ్వు పదార్థములను పీల్చుటకై ప్రేగు యొక్క గోడలోనుండు శోషరసనాళము (Lacteal).   

క్రిమిక - (గృహ.) పెద్ద ప్రేవునుండి వెలుపడు ఒకచీలిక, (Vermiform Appendix).

డొక్క - 1.ఒడలి యెముకలగూడు, 2.ప్రక్క కడుపు.  

జీర్ణ శూల - (గృహ.) కడుపునొప్పి, చిన్న పిల్లలకు అజీర్ణము వలన వచ్చు కడుపు నొప్పి, (Colic). కడుపులోగాని, ప్రక్కలోగాని అధాత్తుగా వచ్చెడు కఠినమైననొప్పి.

ఫోలిక్ ఆసిడ్ - (B6) ఇం. (గృహ.) (Folic acid) (B6) జీర్ణశక్తి వృద్ధిచేసి, విరోచనముల నరికట్టు విటమిన్.

గ్రాసము - 1.కబళము, తిండి(ఆహారము), 2.గ్రహణము.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిడుౘ - 1.ముద్ద, 2.కబళము.

శరము - 1.బాణము, 2.రెల్లు, 3.జలము.
అంబు -
బాణము, రూ.అమ్ము, సం.అంబకమ్.
విశిఖము - బాణము; బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.   
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.
ఱెల్లు - తృణ విశేషము, శరము. 
ఱెల్లుచూలి - కుమారస్వామి, శరజన్ముడు.  

కృత్స్నము - 1.జలము, 2.కడుపు, విణ.సర్వము.
కృపీటము - 1.జలము, 2.కడుపు, 3.సమిధ.
కృపీటయోని - అగ్ని, వ్యు.నీటికి ఉత్పత్తిస్థానమైనది.

పిచండము - కడుపు.
పిచండిలుఁడు - పెద్ద బొజ్జ కలవాడు.
బొ(ౙ)జ్జ - కడుపు.
బొజ్జదేవర - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.

నులి - 1.ప్రేగులలో నొప్పి, 2.చిక్కు, విన.అల్పము.
చిక్కు -
1.కృశించు, 2.తక్కు, 3.తగులు, 4.దొరకు, 5.మిగులు, 6.మెలి, 7.సంకటము.
క్షీణించు - తరుగు, కృశించు.
తక్కు - 1.తప్పు, 2.మిగులు, 3.విడుచు, విణ.ఇతరము, వై.టక్కుచేయు, సం.టక్కః.
తగులు - 1.చిక్కు, 2.పట్టు, 3.తాకు, 4.సక్తమగు, 5.అంటు, 6.పొసగు, 7.వెంబడించు, వి.1.ఆసక్తి, అభిలాష, 2.తగులాటము, రూ.తవులు, తౌలు.
దొరకు - 1.లభించు, 2.చిక్కు.
మిగులు - 1.అతిశయించు, 2.శేషించు, 3.మట్టుమీరు, రూ.మివులు.
మెలి - మెలిక, చిక్కు, సం.మిళితమ్.
తొక్కటపాటు - సంకటము. 
తొక్కట - 1.తొక్కుడు, 2.సంకటము, రూ.త్రొక్కటి.
సంకట - ఇరుకు, రూ.కష్టము.
అవిధి - 1.సంకటము, దుఃఖము, కష్టము (ఈ అర్థములు తెలుగునందు మాత్రమే), 2.నియమములేమి, విణ.నియమము లేనిది.
సంకటములు - పలువిధములైన వ్యాధులకూడిక, రోగముల క్లిష్టపరిస్థితి, (Addisons’ disease).  

అధోజఠరము - (జం.) కడుపులోని క్రింది భాగమునకు సంబంధించినది, (Hypogastric).

నురుదబ్బ - కారిజము, యకృత్తు. 
కారిజము - కడుపులో నీరుతిత్తి క్రింద నుండు మాంసఖండము, రూ.కార్జము, సం.కాలేయమ్.
కాలేయము - (జం.) యకృత్తు దేహకుహరములో ఎఱ్ఱగా, గోధుమ రంగుగా నుండు పెద్దగ్రంథి, (దీనికి రెండు పెద్దతమ్మె లుండును. పిత్తాశయము దీనితో చేరియుండును, ఇది పైత్యరసమును తయారుచేయును) (Liver).

కాలఖణ్డ యకృతీ తు సమే ఇమే.
ఖండం మాసఖండం. కాలంచ తత్ ఖండంచ కాలఖండం. - నల్లని మాంస ఖండము.
యకృత్తు - 1.కాలేయము, 2.కార్జము (Liver).
క్లోమ్నోద్వితీయమాత్మానం కరోతీతి యకృత్. త. న. - క్లోమమనెడు మాంసము కంటె తన్ను రెండవదానిఁగా జేసికొనునది. ఈ రెండు కడుపులో కుడిదిక్కున నల్లనైయుండు మాంసవిశేషము పేర్లు. 

కాలేయసంబంధము - (జం.) కాలేయము (Liver)కు సంబంధించినది (Hepatic).
కాలేయపుసిర - (జం.) కాలేయమునకు రక్తము నందజేయు సిర(Hepatic vein).
కాలేయ ప్రసరణము - (గృహ.) జీర్ణమైన ఆహారమును రక్తనాళములు ప్రేవుల నుండి కాలేయమునకు కొనిపోవుట (portal circulation). 

యకృతకేశికా భాజిమండలము - (జం.) హృదయమునకు రక్తమును తీసికొని వచ్చు సిరకాలేయములో కేశికలుగా చీలి, మరల దానినుండి వేరుసిరలు ఏర్పడుట. (దీనిలో పూర్వోధరసిర, యాకృత సిర ముఖ్యమైనవి). (Hepatic portal system)

గ్లైకోజిన్ - (గృహ.) (Glycogen) కాలేయపు చక్కెర, (కాలేయము రక్తములో ఎక్కువగానున్న గ్లూకోస్ ను, గ్లైకోజిన్ గా మార్చి నిల్వచేయును. కాలేయములోను, కండర జీవకణము లోను నిలువ చేయబడు చక్కెర రూపము).

విటమిన్ B12 - (గృహ.) (Vitamin B12) ఒక విధమగు రక్తహీనతను తొలగించు విటమిన్, (ఇది ఉపద్రవకరమైన పాండు రోగమును తొలగించును. B12 లోపమువలన పాండురోగము కలుగును ఇది కాలేయ కల్కములో నుండును).     

కాల్శిమియా - (జం.) (Calcimia) రక్తములో సున్నము ఎక్కువగా ఉండుట.
కాల్సియమ్ -
(రసా.) (Calcium) క్షారమృద్ధాతువులలో ఒకటి. ఆవర్తక్రమ పట్టికలో ఇది 2వ వర్గములో వచ్చునది. 

యకృత ఉణ్డుకములు - (జం.) కీటకముల అన్నవాహికలో అంతర్జఠరము తర్వాత భాగముపై నుండు వేళ్ళవంటి నిర్మాణములు, (Hepatic caecae).

పచ్చ(ౘ)కామెర్లు - (గృహ.) కామిల, ఒక విధమైన కాలేయపు వ్యాధి (Jaundice), (దీనిచే కన్నులు మొదలగునవి పసుపు పచ్చగా నగును.)
కామల - కామలరోగము, కన్నులు పచ్చనగు వ్యాధి, (Jaundice). 

కండ్లు, శరీరము, ఆకుపచ్చ లేక పసుపుపచ్చ వర్ణముగలిగి తంద్ర(తూగు, కునికిపాటు), అగ్నిమాంద్యము, దాహము, నీరసము మొదలగు లక్షణములు గలిగినది.    

కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు -
కుబేరుడు, విణ.దాత.
ధనాధిపుఁడు - కుబేరుడు; దాత - ఇచ్చువాడు.

విడువరి - పరిత్యాగశీలుడు, వదాన్యుడు, దాత.
వదాన్యుఁడు -
మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉత్తంసుఁడు - గొప్పవాడు.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.నిష్ణాతుఁడు - నేర్పరి. 
మహనీయుఁడు - గొప్పవాడు; అలఘుఁడు - గొప్పవాడు.
మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు. 

ఏకపింగళుఁడు - కుబేరుడు.
పింగళుఁడు - 1.అగ్ని, 2.శివుడు.

అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనలము -
1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.)చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య(3).
మందాగ్ని - అగ్నిమాంద్యము, జఠరాగ్ని సన్నగిల్లుట.
అగ్నిమాంద్యము - మందాగ్ని (గృహ.) ఆకలి లేకలోవుట(Anorexia).

వృధాపృషి స్సముద్రేచ వృథా తృ ప్తేరభోజనమ్|  
వృధా ధనవంతౌ దానం దరిద్రే యౌవన్నం వృథా||
తా.
సముద్రము(మహాశయము - సముద్రము)న వర్షించుట, ఆఁకలి లేనివానికి భోజనము బెట్టుట, ధనవంతునకు దానము చేయుట, దరిద్రునకు(దరిద్రుఁడు - పేదవాడు, పేదవానికి)గల యౌవనము ఇవి నిష్ప్రయౌజనములు. - నీతిశాస్త్రము  

అపాంపతి - సముద్రుడు.
అపాంజలానాంపతిః అపాంపతిః ఇ. పు. - జలమునకు పతియైనది.
అప్పతి - వరుణుఁడు, వ్యు.నీటికి అధిపతి.
అపాం పతిః అప్పతి, ఈ. పు. - అప్పులనఁగా జలము దానికి పతి.     
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.  

ఋణదాత - అప్పిచ్చువాడు.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము), 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.కడచినది, 2.పొందబడినది. 

అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము - 1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బూ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విణ. ఋణరాశి (Negative).
ఋణాత్మకము - (గణి.) శూన్యము కన్న తక్కువైనది, (Negative).

జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జలతి జడీభవతీతి జలం, జల ఘనే - జడీభవించునది. 
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము. నీళ్ళు - నీరు.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.

ఋణకర్త - అప్పుచేసినవాడు.

అౘ్చుదల - 1.అచ్చివచ్చుట, 2.అప్పు.
ఋణం పర్యుదఞ్చనమ్, ఉద్దారః - 
అరవడి - ఋణము, అచ్చుదల. 
అర్యతే కాలాన్తర ప్రాప్యత ఇతి ఋణం. ఋ గతౌ. - కాలంతరమునఁ బొందఁబడునది.
పర్యుదంచనము - అప్పు.
పర్యుదఞ్చ్యతే పరిప్రాప్యత ఇతి పర్యుదఞ్చనం. అఞ్చు గతిపూజనయోః. - కాలాంతరమునఁ బొందఁబడునది.
ఉద్దారము - 1.వడ్డి లేని అప్పు, 2.పైకెత్తుట, 3.రక్షించుట, 4.దాయ భాగమునుండి జ్యేష్ఠున కీయదగినసొమ్ము.
ఉద్ద్రియతే గృహ్యత ఇతి ఉద్దారః. హృఞ్ హరణే. - పుచ్చుకొనఁబడునది. ఈ 3 అప్పు పేర్లు.

క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.

ఉత్తరము - 1.బదులు, 2.ఒక దిక్కు North, 3.జాబు, (ఈ అర్థము తెనుగు నందు మాత్రమే కలదు, సంస్కృతమున లేదు), విణ.మీదిది.
బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి.
మారు - ప్రతి.
ప్రతి - 1.సమానము, 2.మారు, 3.ఒక్కొక్క.

అతిదేశము - 1.ఒకచోటు చెప్పబడిన దానిని సామ్యమునుబట్టి, వేరొకచోట ఉపయోగించుట. ఒకదాని ధర్మమును మరొకదానియం దా రో పిం చు ట, 2.బదులు.

పత్ని - భార్య.
పత్యురనయా సహ యజ్ఞయోగా స్సంపద్యత ఇతి పత్నీ, సీ. - పతికి నీమెతోఁ గూడ యజ్ఞ యోగము గలది.
సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు; కూఁతురు - కుమార్తె. 
సుతుఁడు - కొడుకు. 
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును.

అఋణి - అప్పులేనివాడు, అప్పు చెల్లించినవాడు, అనృణి.    

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతా లయాః|
ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||

తా. సకలజనులకు పశువులు, పత్ని - భార్య, కొమాళ్ళు, ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.), జన్మాంతర ఋణ సంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించు చున్నవి. కాబట్టి చింతించుట వలన లాభమేమి. - నీతిశాస్త్రము

 Lord shiva with waters