విశాఖ 1, అనూరాధ 4, జ్యేష్ఠ 4 పాదములు వృశ్చికం, తేలురాశి.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహ్ణాతి పురు షేణార్జితం ధనమితి గృహం, గేహం చ, గ్రహ ఉపాదనే. - పురుషునిచే సంపాదింపఁ బడిన ధనమును గ్రహించునది.
అష్టపాద వర్గము - సంధిపాద జంతు వర్గములోని ఒక తరగతి, (ఈ తరగతికి చెందిన జంతువులను ఎనిమిది కాళ్ళుండును) ఉదా - సాలీడు, తేలు మొ.వి.
తిన్ననివాఁడి గోళ్ళసతికి వృశ్చికరాశి..…
వృశ్చికము - 1.తేలు, 2.వృశ్చికరాశి.
తేలురాశి - వృశ్చికము.
పొట్టియ - తేలు.
తేలు - 1.నీళ్ళలో మునగక పైకి వచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడ చూపు, వి.వృశ్చికము.
తేలువాఱు - పుట్టు.
పుట్టు - క్రి.సంభవించు, జన్మించు.
వృశ్చిక కీటే చ వృశ్చికః : వృశ్చిక శబ్దము కణుఁదురు నందును, చకారము వలన తేలు నందును, తేలు మందు చెట్టునందును, వృశ్చికరాశి యందును వర్తించును. వ్రశ్చతీత వృశ్చికః. ఓవ్రశ్ఛూ ఛేదనే. పీడించునది. "వృశ్చిక స్త్వౌషధేరాశా" వితి శేషః.
వృశ్చికస్య విషంపుచ్ఛని మక్షికస్య విషఁశిర|
తక్షకస్య విషందంష్ట్రః, సర్వాంగం దుర్జనే విషమ్||
తా. తేలునకు పుచ్ఛము - తోక యందును, ఈఁగ - మక్షికము నకు శిరస్సు నందును, తక్షుడు - తక్షకుడు)పాము నకు దంష్ట్ర - కోరపల్లు కోఱల యందును, దుర్జనుఁడు - దుష్టుడు నకు సర్వాంగము లందును విషముండును. - నీతిశాస్త్రము
వృశ్చిక శ్శూక కీట స్స్యాత్ :
వ్రశ్చతి శూకాగ్రేణ వృశ్చికః - మొనచేత కుట్టునది.
శూకయుక్తః కీటః శూకకీటః - ముల్లుగల పురుగు. ఈ రెండు నల్లతేలు పేర్లు, కణుఁదురని కొందరు.
శూకము - 1.తేలుకొండి, 2.వరిముల్లు, 3.కనికరము, సం.వి. కొన్ని రకముల ధాన్యగొంజల చివర నుండు ముల్లు వంటి అంగము (Awn). అనుక్రోశము - కనికరము; కనికరము - 1.దయ, 2.శోకము.
శూకో స్త్రీ శ్లక్ష్ణ తీక్ష్ణాగ్రే -
శ్యతి స్వాపగమేన ధాన్యం తనూకరోతీతి శూకః. ప్న. శోతనూకరణే. - తాఁబోయిన వెనుక ధాన్యమును సూక్ష్మముగాఁ జేయునది.
ఈ ఒకటి 1 సన్నముక్క గల ధాన్యము పేరు. సూక్ష్మమై వాఁడియునైన వరిముల్లు, తేలుముల్లు మొదలైవది.
గోడ మీద బొమ్మ గొలుసులబొమ్మ, వచ్చేపోయే వారికి వడ్డించే బొమ్మ.
1. తేలు కుట్టినందుకు చింతించవద్దు, పాము కరవనందుకు సంతొషించు.
2. పాము కరచినందుకు చింతించవద్దు, ప్రాణము పోలేదని సంతోషించు.
3. ప్రాణము పోవునని చింతించుటకంటే, పరిప్రాణికి మేలు చేయలేదని చింతించు. - శ్రీ విద్యాప్రకాశా నందగిరి స్వాములవారు.
అలము1 - 1.తేలుకొండి, తేలుకొండి ముల్లు, 2.అరిదళము.
ఆలము2 -1.తేలుకొండి, 2.అరిదళము, విణ.1.చాలినది, 2.అధికము, 3.శ్రేష్ఠమైనది.
అరిదళము - పసుపు రంగుగల ఒక ఖనిజము, సం.హరితాళః.
హరితాళము - పసుపు రంగుగల ఒక ఖనిజము, వి.హరిదళము.
హరిదళము - హరితాళము, రూ.అరిదళము.
అధికము - ఎక్కువది, పెద్దది వి.(అలం.) ఒక అర్థాలంకారము.
కొండి - 1.తేలు తోక, 2.తలుపుల కమరించు ఇనుప గొళ్ళెము.
కొండెము - కొండియము.
కొండియము - చాడి, లేని నేరము చెప్పుట రూ.కొండెము.
(ౘ)చాడీ - కొండెము, రూ.చాడి.
చాడీకొట్టు - కొండెకాఁడు, చాడీకోరు.
అంగడుదుడీపి - తంటాలమారి, ఇక్కడ మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పువాడు, చాడీకోరు, రూ.అంగడు దుడుపు.
కొండియుఁడు - 1.చాడీలు చెప్పువాడు,
కొండెకాడు, 2.పిసిని గొట్టు.
ద్విజిహ్వుఁడు - కొండెగాడు.
తాళము(నోటికి తాళము) వేసితిని గొళ్ళెము(కొండి) మరిచితిని.
మాత్ర1 - 1.కొండెము, 2.అక్షరావయవము, 3.కొలది, 4.త్రుటి.
మాత్ర2 - 1.చిన్నమందుండ, 2.బాటసారుల సామానుసంచి.
కొండెము చెప్పుట కలిగియున్న నితర పాపము లేదు.
ముల్లు - ములు.
ములు - 1.కంటకము, 2.త్రాసుముల్లు, 3.వరి మొ. వాని ముల్లు, రూ.ముల్లు (బహు.) ముళ్ళు.
ముళ్ళు - మారాముళ్ళు, చిక్కులు.
కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూదిమొన, 5.కాకి, 6.తప్పు.
కంటకము2 - విరోధయుక్తి, విణ.విరుద్ధము.
విరుద్ధము - విరోధము గలది.
కర్ణేజప స్సూచక స్స్యాత్ పిశునో -
రాజాదీనాం కర్ణేజపతి వ్యక్తం వదతి పరకీయదోషా నితి కర్ణే జపః జపవ్యక్తాయాం వాచి. – రాజాదుల యొక్క చెవియందు ఇతరుల దోషము(దోషము - 1.తప్పు, 2.పాపము.)లను జెప్పువాఁడు.
సూచేయతీతి సూచకః. సూచ పైశున్యే. - సూచించువాఁడు.
పింశత్యనృతస్యావయవో భవతీతి పిశునః పిశ అవయవే. - అసత్యము(అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.)నకు అవయమయిన వాఁడు. ఈ 3 కొండెముఁ జెప్పువాని పేర్లు.
సూచకము - 1.సూది, 2.నక్క, 3.కుక్క, 4.కాకి, 5.పిల్లి, (రసా.) అమ్ల క్షారములతో రాసాయనికముగా కలిసిన మిశ్రమము యొక్క అమ్లధర్మమునుగాని క్షారధర్మమునుగాని సూచించు పదార్థము (Indicator).
సూచి - సూది, రూ.సూచిక, సూచిని (గణి.) ఘాతమును సూచించు సంఖ్య, (Index), (భూగో.) సూచిక, (భౌతి.) 1.ఏవైన కొలుచు పరికరముల కొలత గుర్తులను చూపు సూదివంటి సాధనము, 2.దిక్కును సూచించుసూది (Needle). ఏసూదికీ రెండు మొనలుండవు.
సూది - సూచి, గుడ్దలుకుట్టు సాధనము, సం.సూది.
సీవని - సూది.
సీవనము - కుట్టుట.
సూచిక - (గణి.) ఒకరాశి ఏఘాతమునకు హెచ్చింపబడినదో సూచించు (తెలుపుడుచేయు) సంఖ్య (Index), ఉదా. an ఇచ్చట a ఒక రాశి, n సూచిక, అ అనురాశి nవఘాతమునకు హెచ్చింపబడినదని సూచించును.
సూచకుఁడు - 1.కొండెగాడు, 2.బోధచేయువాడు.
సూచన - 1.జాడ, 2.గ్రుచ్చుట, 3.తెలుపుట, 4.చూపు.
సూచించు - క్రి.జాడగా తెలియజేయు.
సూచీకటాహన్యాయము - (న్యా.) ఒక పనివానికిని గాబొకటియు, సూది యొకటియు చేయమని చెప్ప అతడు కొంత కాలమునకు సూది యిచ్చి, గాబి మ్మని తొందర చేసినప్పుడు రెంట నొకటి యిచ్చియుండ రెండవ దానికంత తొందరేల యనినరీతి.
సూది ఇచ్చి గాబు(గాబు - మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.)తీసుకొని పోయాడుట.
"సూదిలో దారం ఎక్కించే ముందు విడివిడిగా ఉన్న దారపు పోగులను సరిజేసి, ఒకటిగా పేని, కొనదేలి ఉండేట్లు చేస్తాం. అపుడు సులభంగా దారాన్ని సూదిలోకి ఎక్కించవచ్చు. అలాగే విచ్చలవిడిగా ఉండే కోరికలను తొలగించుకొని, అహింకారాన్ని విడిచిపెట్తి, వినమ్రతతో ఏకాగ్రతతో మన మనస్సును భగవంతుని మీద లగ్నం చేయాలి" - శ్రీరామకృష్ణ పరమహంస
కుట్టు - 1.శూల రోగము (Chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు.
సూల - శూలరోగము, సం.శూలా.
అంటించు - 1.అతికించు, 2.చేర్చు, 3.(తేలు)కుట్టు.
అతుకు1 - చేర్చి కుట్టుట, కత్తిరిచిన వానినిదగ్గర చేర్చికుట్టిన భాగము (Seam).
అతుకు2 - క్రి. 1.అతికించు, కలిసిపోవునట్లు చేయు, 2.అంటుకొను, 3.సరిపడు, వి.అతుకుట, 2.అతికినభాగము, రూ.అదుకు.
అదుకు - క్రి. అతుకు.
చేరుచు - క్రి. చేర చేయు, రూ.చేర్చు.
పిశినుఁడు - 1.కొండెగాడు, 2.హీనుడు, వి.నారదుడు.
కయ్యపుదిండి - (కయ్యము + తిండి) కలహభోజనుడు, నారదుడు.
ద్విజిహ్వుఁడు - కొండెగాడు.
కొండియుఁడు - 1.చాడీలు చెప్పువాడు, కొండెకాడు, 2.పిసిని గొట్టు.
లోభి - లుబ్ధుడు.
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
లుబ్దకుఁడు - 1.పిసినిగొట్టు, లోభి, 2.బోయవాడు.
గొట్టు1 - 1.కఠినము, 2.దుర్లభము, 3.భయంకరము, 4.విరోధి, వి.1.దౌష్ట్యము, 2.అల్లరి, 3.గాలి, సం.కటుః.
గొట్టు2 - ప్రత్య. తాచ్ఛీల్యాద్యర్థమున వచ్చు ప్రత్యయనము, ఉదా.(త్యాచ్ఛీల్యమున) గొడవగొట్టు, (స్వార్థమున) పిసినిగొట్టు.
క్రూరదృక్కు - 1.పిశునుడు, లోభి, 2.శని Saturn, 3.అంగారకుడు, 4.రాహువు, 5.క్రూరదృష్టి కలవాడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు. కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
పిశున శబ్దము దుర్జనునికిని, కొండెగానికిని పేరు. పిశ్యతీతి పిశునః శో తనూకరణే. - పీడించువాఁడు.
ఓరుదలకాఁడు - కొండీడు, పిశునుడు.
ఒరుదల - కొండెములు చెప్పుట, పై శున్యము.
క్రూరదృష్టి - 1.అంగారకుడు, 2.శని, విణ.క్రూరదృష్తికలవాడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
నరకుఁడు - 1.దుష్టుడు, 2.దయలేనివాడు, సం.నరకగః.
నికృత స్త్వనృజు శ్శఠః,
నికృణోతి హినస్తి నికృత, కృఞ్ హింసాయాం. - పీడించువాఁడు.
అనృజు హృదయత్వా దనృజుః - కుటిలహృదయము గలవాఁడు.
శఠతీతి శఠ, శఠకైతవే. - కపటము గలవాఁడు. "గూఢ విప్రియ కృచ్ఛఠః" అని యాలంకారములు. ఈ 3 కుత్సితుని పేర్లు.
నికృంతనము - ఖండనము, నరకుడు.
నికృత్తము - నరకబడినది.
నికృతి - 1.బెదురుమాట, 2.వంచన, 3.తిరస్కృతి.
శఠుఁడు - కుత్సితుడు, మోసగాడు.
కుజనుఁడు - కుత్సిత పురుషుడు.
అడిగొట్టు - కుత్సితుడు, కుజనుడు.
బేరజము- కుత్సితపు నడక, విణ.1.కుత్సితుడు, 2.కుత్సితురాలు.
కుచ్చితము - 1.కపటము, 2.నీచము, నింద్యము, సం.కుత్సితః.
కూళ - 1.కుత్సితుడు, 2.క్రూరుడు, సం.క్రూరః.
క్రూరుఁడు - దయలేనివాడు.
కృంతతీతి క్రూరః కృతీ ఛేదనే. - వ్యథ పెట్టువాఁడు.
క్రూరౌ కఠిన నిర్దయౌ : క్రూరశబ్దము కఠినమయినదానికిని, (నిర్దయుఁడు - దయలేనివాడు)దయలేని వానికిని పేరు. మఱియు, భయంకరమైన దానికిని పేరు.
కృణాతీతి క్రూరః. కృఞ్ హింసాయం. - హింసించునది.
చెడగరము - 1.క్రూరము, 2.క్రూరుడు.
క్రూరము - 1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది.
క్రౌర్యము - క్రూరస్వభావము, క్రూరత్వము.
ప్రామిడి - (ప్రాము+ఇడి) క్రౌర్యము, విణ.క్రూరుడు.
లోష్టమర్దీ త్రుణచ్ఛేదీ - నఖఖాదీచ యోషరిః|
సవినాశం వజ్రత్యాశు సూచకో అశుచి రేవచ||
తా. మట్టిపెళ్ల(లోష్టము - మట్టిగడ్ద)లను నలుపు వాడును, తృణంబును ఛేదించువాఁడును, గోళ్ళను గొఱుకువాడును, కొండెము జెప్పువాఁడు ను, అపరిశుద్ధుఁడైన వాఁడును, వీరలు వృద్ధి నొందరు. కావున నీ పనులు చేయరాదు. - నీతిశాస్త్రము
సాలవృకము - 1.వృక్షము, 2.కోతి, 3.తోడేలు, 4.నక్క.
వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృఢమైన శాఖలుగల మొక్క(Tree).
చెట్టుగట్టు - క్రి.చెట్టుగా నేర్పడు (అవయవ సౌష్ఠవ మేర్పడుట).
సాలావృకాః కపి క్రోష్టు శ్వానః -
సాలవృకశబ్దము కోఁతికిని, నక్కకును, కుక్కకును పేరు.
స్యంతివర్కంతే చ సాలావృకాః షో (అ)న్తకరణి. వృక ఆదానే.
హింసించి పుచ్చుకొనునవి. టీ. స. సాలాన్ వృక్షాది వర్తినో జీవాన్ ఆవర్కంతే భక్షయంతీతి సాలవృకాఁ తాలవ్యాదిరితి సూభూతిచంద్రః.
సాల - శాల, ఇల్లు, సావడి, సం.శాలా.
శాల - ఇల్లు.
ద్రుతము - 1.త్వరితము, 2.కరగనిది, 3.జారినది, సం.వి.1.వ్యాకరణము నందు న కారము, 2.తేలు, 3.చెట్టు.
త్వరితము - శీఘ్రము, వడిగలది.
శీఘ్రము - వడి, విణ.వడిగలది.
వేగ - వడి, విణ.త్వరితము.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి.పద్యయతి, సం.వళిః.
వేగము - జవము, త్వర, (గణి., భౌతి.) ఒకవస్తువు స్థలచలనము యొక్క రేటు (Velocity).
జవము - వేగము. వేగిరము - వేగము, విన. త్వరితము.
త్వర - వేగిరపాటు; వేగిరపాటు - వేగపాటు.
వళి - కడుపు మీద ముడుత.
భ్రషము - జారినది.
భ్రష్టుఁడు - 1.వెలివేయబడినవాడు, వ్యాధుడు, రూ.భ్రష్టు.
తేలు - 1.నీళ్ళలో మునగక పైకి వచ్చు, 2.నీటిలో క్రీడించు(ఆటలాడు చోట అలుక పూనరాదు.), 3.తేలగిల్లు, 4.పొడ చూపు, వి.వృశ్చికము.
ఉపప్లవము - 1.ఉత్పాతము, 2.ఉపద్రవము, 2.నీటిపై తేలుట.
ఉత్పాతము - 1.ఉల్కాపాతము మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
అజన్యము - ఉత్పాతము, విణ.జన్యము కానిది.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.
దుమగతికేతు - ధూమకేతువు, అరిష్ట సూచకమగు తోకచుక్క.
తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో,) సూర్యునిచుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగుచున్న తోక గలిగిన ఒక గ్రహము, (Comet).
ఉల్కశ్మలోహము - (రసా.) ఆకాశమునుండి అప్పుడప్పుడు భూతలము పైబడు ఉల్కలలో నుండు ఇనుము (Meteoric iron).
ఉల్క - 1.కొఱివికట్టె, 2.కాగడా, 3.ఆకాశమునుండి పడు తేజపుంజము, 4.అగ్ని కణము (Meteor).
మిడుఁగు - అగ్నికణము; విస్ఫులింగము - అగ్నికణము.
తేలగిల్లు - 1.పైకి తేలు, 2.పరవశమగు, రూ.తేలగిల్లు.
(ౘ)చొక్కు - క్రి. పరవశమగు, వి.1.పారవశ్యము, చొక్కుపొడి, 2.మూర్ఛ, 3.మోహము, వై.విణ.శుష్కము, ఎండినది.
పారవశ్యము - 1.విస్మృతి(విస్మృతి - మరుపు), 2.పరవశత్వము.
పరవశము - 1.పరాధీనము, 2.ఒడలెరుగకుండుట.
పరతంత్రము - పరాధీనము, వ్యతి. స్వతంత్రము.
పారతంత్రము - పరాధీనత, వ్యతి.స్వాతంత్ర్యము.
అదంత్రము - 1.నడుమ భగ్నమైనది, సగములో చెడినది, 2.స్వాతంత్రము లేనిది, పరాధీనము.
మూర్ఛ - రోగాదులచేత స్మృతి తప్పుట, సొమ్మ.
సొమ్మ - మూర్ఛ, సం.శ్రమః.
మోహము - 1.అజ్ఞానము, 2.వలపు, 3.మూర్ఛ.
తేలునకు ఎవ్వరు అపకారము చేసిరి. తేలుకు అపకారం చేయనివారెవరు?
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము - గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద(పొద - చిన్న చెట్ల గుంపు), 4.బోదెలేనిచెట్టు, 5.పురాభి ముఖ రాజమార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలి ఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి. (జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen).
చెట్టుగట్టు - క్రి.చెట్టుగా నేర్పడు (అవయవ సౌష్ఠవ మేర్పడుట).
పాలసుకైన యాపద
జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞనకుం
దేలగ్నిబడగ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ.
తా. తేలు అగ్నిలో పడనున్న సమయంలో, జాలిపడి దానిని తప్పించినచో అది మనం చేసిన మేలును, గ్రహింపక వెంటనే కుట్టును. అట్లే సర్వజ్ఞుఁడు - 1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు. లోకంలో అన్నియు తెలిసిన వాడైనను, పాలసుఁడు - బాలిశుడు, మూర్ఖుడు, సం.బాలిశః.)దుష్టునికి కల్గిన ఆపదకు కనికరించి తీర్చుటకు పూనుకోరాదు, దుర్జనుఁడు - దుష్టుడు, దుష్టుడగు వాడు మనం చేసిన మేలును గ్రహింపక మనకే అపకారం చేయును.
చెట్టుఁద్రిమ్మరి - కోతి, వృక్షచరము.
కోఁతి - వానరము, రూ.క్రోఁతి.
వానరము - కోతి.
కోఁతికొమ్మచ్చి - ఒకవిధమగు బాలక్రీడ.
వృశ్చిక వానర న్యాయము - న్యా. అసలే కోతి, దాని వికార చేష్టలతో పాటు, తేలు కుట్టినచో మరింత వికారముగ గంతులు వేయునను రీతి.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
భూరిమాయము - నక్క, వ్యు.పెక్కుమాయలు గలది.
భూరయో మాయా అస్యేతి భూరిమాయుః, ఉ. పు. భూరిమాయ - అనేకమాయలు భూరి మాయుః పిత్తమస్యేతి భూరిమాయుః అధికమైన పిత్తము గలది.
పిత్తము - ఒక ధాతువు (వాత పిత్త శ్లేష్మము లనునవి త్రివిధధాతువులు.)
మాయుః పిత్తమ్
మీనోతి శిరో భ్రమణేన బువి క్షేపయతీతి మాయుః, ఉ. పు. డు మిఞ్ ప్రక్షేపణే. - శిరోభ్రమణముచేత జనమును బడఁద్రొబ్బునది.
పతతి పిత్తం పత్ ఌ గతౌ. - ద్రవరూపమై పడునది. ఈ 2 పైత్యము పేర్లు.
మాయువు - పైత్యరోగము.
పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.
పైత్యరసము - (జం.) కాలేయము నుండి ఊరురసము (Bile). (ఇది పిత్తాశయములో నిలువచేబడును.)
పిత్తకోశము - (గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువచేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కాలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువచేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).
గాః మినోతి క్షీపతీతి గోమాయుః, డు మిఞ్ ప్రక్షేపణే. - గోవులను బోఁదోలునది.
మృగధూర్తకము - నక్క.
మృగేషు దూర్తః మృగధూర్తకః. - మృగముల యందు ధూర్తమైనది.
మృగము - 1.జింక, 2.అడవి యందు తిరిగెడు ఏనుగు, 3.మృగశీర్ష నక్షత్రము.
ధూర్తుఁడు - 1.జూదరి, 2.మోసకాడు, రూ.ధూర్తుః.
వంచకుఁడు - మోసగాడు.
ధూర్తస్తు వఞ్చకః,
ధూర్వతి హినస్తీతి ధూర్తః, ధుర్వీ హింసాయాం. - పీడించువాఁడు.
వఞ్యతీతి వఞ్చకః, వఞ్చు విప్రలంభే. - మోసపుచ్చువాఁడు. ఈ 2 మోసపుచ్చువానిపేర్లు.
సృగాలము - నక్క, రూ.శృగాలము.
అసృక్ అలతీతి సృగాలః లా ఆదానే. - మాంసమును దినునది.
పా, శృగాలః అని తాలవ్యాదియుఁ గలదు.
గుంటనక్క - 1.సృగాలము, చిన్నజాతి నక్క, 2.కుతంత్రములుపన్ను వాడు.
The foxes have their holes, and the birds of the air have their nests, but the Son of man hath not where to lay his head.
నక్కలెరుగని బొక్కలు నాగు లెరుగని పుట్టలుండునా ?
సృగాలరూప స్సిద్ధార్థో మృడ స్సర్వ శుభంకరః,
అజశ్చ బహురూపస్చ గంగాధారీ కపర్ద్యపి| - 46స్తో
వంచకము - నక్క, విణ.మోసము(వంచన - మోసము)చేయునది.
వంచయతీతి వంచకః, వఞ్చ కౌటిల్యే. - వంచించునది.
కౌటిల్యము - 1.వంకరతనము, 2.కాపట్యము.
కాపట్యము - జిత్తు, మోసము, కపటము.
జిత్తు - మాయోపాయము, సం.యుక్తిః.
జిత్తులమారి - జిత్తులు చేయువాడు.
నక్కజిత్తులు - మోసపు పనులు.
నక్కవినయము - జాతీ. కపటముతో కూడిన వినమ్రత.
కపటము - కవుడు, వ్యాజము.
కౌడు - 1.మోసము, 2.ప్రమాదము, తప్పు, రూ.కవుడు, సం.కపటః.
వ్యాజనము - కపటము, నెపము.
నెపము - 1.వ్యాజము, కారణము, 2.తప్పు, రూ.నెపము, సం.నిభ, త. నిపమ్ , క. నెవ, నెవను.
నిమిత్తము - 1.కారణము, 2.శకునము, 3.గురి.
నెవము - నెపము.
నిభము - నెపము, విణ.సమానము.
నిభాయించు - క్రి.సహించు.
నక్కను త్రొక్కుట - జాతీ. శుభసకునములు.
నక్కపుట్టి నాలుగువారాలు కాలేదు, ఇంత ఉప్పెన యెప్పుడూ చూడలే దందిట. నక్క యెక్కడ నాగలోక మెక్కడ ?
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందిట. నక్కను తరిమిన వారందరును వేటకాండ్రేనా ? మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు. నక్క వచ్చి, కుక్క తోక సరిచేసిందట.
క్రోష్టువు - నక్క.
క్రోశతి క్రోష్టుః, ఉ. పు. క్రోష్టా, ఋ క్రుశ ఆహ్వానే రోదనేచ. మొఱుఁగునది.
మొఱఁగు - 1.కుక్కకూత, 2.మోసము, విణ.వంచకుడు, క్రి.పొందు.
వంచన - మోసము.
వంచకుఁడు - మోసకాడు.
విలోమము - అవరోహణక్రమము గలది, వి.1.పాము, 2.కుక్క.
అవరోహణక్రమము - (గణి.) వరుస తగ్గుచుపోవు క్రమము (Descending order).
అవరోహణ(ము) - (గణి.) క్రమముగా క్షీణించుట (Descent).
తలక్రిందు - అధోముఖము, విలోమము, రూ.తలక్రిందు.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రొ.రుద్దు.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
సర్పము - పాము, సప్పము.
గ్రామమృగము - కుక్క, (గ్రామసింహము).
సారమేయము - కుక్క; కుక్క - శునకము, సం.కుర్కురః.
భైరవుఁడు - 1.శివుడు, 2.శునకము, విణ.భయానకరసము గలవాడు.
భైరవము - 1.భయానకరసము, 2.భయము.
శునకము - కుక్క; భషకము - శునకము.
కుక్కురము - 1.కుక్క, వ్యు.ఎముకలు మొ.ని తెచ్చుకొనునది, 2.మాచిపత్రి.
సరమ - శ్రమము, సం.వి.1.విభీషణుని భార్య, 2.ఆడుకుక్క.
శుని - ఆడుకుక్క.
యోగితము - పిచ్చికుక్క.
అలర్కరోగము - (గృహ.) వెఱ్ఱి కుక్క కరచినచో వచ్చు పచ్చి.
కుక్క వెఱ్ఱి - (గృహ.) వెఱ్ఱికుక్క కాటు వల్ల కలిగెడు ఒక రోగము, జలద్వేషము (Hydrophobia).
శూనారము - 1.కుక్కపాలు, 2.పాముగ్రుడ్డు.
అడవికుక్క - తోడేలు, అరణ్యశునకము.
తోఁడేలు - 1.వృకము, 2.అడవికుక్క, తూ.తోడేలు.
వృకము - 1.తోడేలు, 2.కుక్క.
మొఱఁగు - 1.1.కుక్కకూత, 2.మోసము, విణ.వంచకుడు, క్రి.పొందు.
కోకము - 1.జక్కవ, 2.తోడేలు, 3.కప్ప, 4.బల్లి, 5.ఈత.
ఈహామృగము - 1.తోడేలు, 2.ఒక విధమగు రూపకము (లేడివలె అలభ్యయగు స్త్రీకొరకు కథానాయకుడు వెన్నాడినట్టు వర్ణింపబడిన కథగల నాలు గంకముల నాటకము.)
కోక స్త్వీహా మృగో వృకః -
కోకతే వృకతేచ మాంసాదికం కోకః, వృకశ్చ. కుక వృకాదానే. - మాంసాదులను బుచ్చుకొనునది కోకము, వృకము.
మృగానీహతే ఈహామృగః ఈహ చేష్టాయాం. - మృగముల నిచ్ఛయించునది. ఈ మూడు తోఁడేలు పేర్లు.
మేకతిండి - తోడేలు, వ్యు.మేకలు తిండిగా గలది.
త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి, 3.మిడత.
ఓతువు - పిల్లి, మార్జాలము.
అవతి మూషకబాధయాః ఓతుః, పు. అవరక్షణాదౌ. - మూషక బాధవలన రక్షించునది.
బిడాలము - 1.పిల్లి, 2.కనుగుడ్డు.
బిడతి మూషికాన్ బిడాలః, బిడ భేదనే. - మూషికములను భేదించునది.
బిడాలకము - 1.పునుగు చట్టము, 2.కంటిమందు, 3.పిల్లి.
మది యొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగన్
అది చిలుక బిల్లిపట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.
తా. చిలుకను పెంచి పిల్లి కప్పగించినట్లు. చిలుక పంజరములో పిల్లిని ప్రవేశపెట్టిన చిలుక(ౘదువుల పులుగు - చిలుక)వలె మాటలు మాటలాడనట్లు, ఒకని మదిలో(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.) కోరియున్న వనితను మరియొకరు(వదలక తిరిగినను-ఆ తిరుగుడు వ్యర్థం)స్వాధీన పరచుకొనలేరు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
When I play with my cat, who knows whether I do not make her more sport than she makes me?
కమ్మపిల్లి - పునుగు పిల్లి.
పునుఁగు - పునుగుపిల్లి వలన క లు గు సుగంధద్రవ్యము.
పతంగము - 1.మిడుత, 2.పక్షి, 3.బాణము, 4.పాదరసము.
సమౌ పతఙ్గ శలభౌ -
పత త్యగ్నౌ పతఙ్గః పత్ ఌ గతౌ. - అగ్నియందుఁ బడునది.
మిడుత - శలభము; శలభము - మిడుత.
శలత్యాశు గచ్ఛ త్యగ్నిం శలభః, శల అశుగమనే. - అగ్నిని గూర్చి శీఘ్రముగాఁ బోవునది. ఈ 2 మిడత పేర్లు. దివ్యాఱుపుఁ బ్రువ్వు అని కొందఱు.
మిడుత కుటుంబము - (వ్యవ., కీట.) వరి మిడతలు, జొన్న మిడతలు, జట్టి మిడుతలు మొ. కీటకములు ఈకుటుంబమునకు చెందినవి.
మార్జాలము - మార్జారము.
ఆఖుగ్ర హణేన గృహం మార్జీతి మార్జారః, పా. మార్జాలః, మృజూ శుద్ధౌ. - మూషక గ్రహణముచేత గృహమును శుద్ధిచేయునది.
మార్జారము - పిల్లి, రూ.మార్జాలము.
మార్జాల కబళ న్యాయము - న్యా. పిల్లి భోజనము చేయువాని వద్ద కూర్చుండువాడు తీసికొను కబళములన్నియు తన నిమిత్తమేయని తలచెడు రీతి.
కబళము - ముద్ద, కడి, గ్రాసము.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిడుచ - 1.ముద్ద, 2.కబళము.
గ్రాసస్తు కబళః పుమాన్,
గ్రస్యత ఇతి గ్రాసః, గ్రసు అదనే. - భక్షింపఁబడునది.
భక్షణ సమయేకే తాలుని వలత ఇతి కబళః, వలసంచలనే. - భక్షణ సమయమందు దౌడ యందు కదలునది.
గ్రాసశబ్దము కబళము యొక్క అర్థము గలది గనుక కబళార్థకము. రెండు పర్యాయములు. ఈ 2 కడి పేర్లు
గ్రాసము - 1.కబళము, తిండి, 2.గ్రహణము.
పిండము - 1.బ్రదుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద, 3.గర్భము, 4.సమూహము.
తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా.
తా. పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు. త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, మార్జారము - పిల్లి, రూ.మార్జాలము. అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పుగలవాడు తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.తో, తగవు యొక్క న్యాయ న్యాయము లను విమర్శించి నిర్ణయించును, తెలివి రసజ్ఞత లేనివా డట్లుచేయలేదు.
సింజానమణిమంజీర-మండిత శ్రీపదాంబుజా|
మరాళీమందగమనా - మహాలావణ్యశేవధిః.
వృషదంశకము - మార్జాలము, పిల్లి, రూ.వృషదంశకము.
వృషాన్ మూషకాన్ దంసతీతి వృషదంశకః, దంశ దంశనే. - మూషకమును గొఱుకునది, పా. పృషదంశకః.
ఆఖుభుక్కు - పిల్లి, వ్యు.ఎలుకలను తినునది.
అఖూన్ భుఙ్క్తే అఖుభుక్, జ. పు. భుజ పాలనాభ్యవహారయోః. - ఎలుకలను భక్షించునది.
ఆఖువు - ఎలుక, పందికొక్కు.
పిల్లి పిల్లల్నిపెట్టి పదహారు చోట్లకి తిప్పుతుండట ! పిల్లికి ఎలుక సాక్ష్యము. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణసంకటము.
(ౙ)జంగుపిల్లి - అడవి పిల్లి.
బావురుఁబిల్లి - బావు రని కూసెడు పెద్ద గండుపిల్లి.
బావురు - ఏడ్చుట యందలి ధ్వని.
అస్తమానము అరిచేపిల్లి ఎలుకలను పట్టేదికాదు.
నాసి - పిల్లి.
పిల్లికి కలలో కనుపించేవి పాలకుండలే. పిల్లి కళ్ళుమూసుకుని పాలుతాగుతూ, తన్నెవరూ చూడటం లేదనుకుంటుందిట. పిల్లి పాలగిన్నెవంచి పాలు వలకపోయగలదు, కాని గిన్నెని తిరిగి నెలబెట్టలేదుగా.
పిల్లిమెళ్ళో గంట కట్టెదెవరాని! పిల్లిశాపానికి ఉట్టు తెగదుగా!
కానివానిచేత గాసు వీసం బిచ్చి
వెంట దిరుగువాడె వెఱ్ఱివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా విశ్వ.
తా|| దుర్మార్గుని చేతికి ధనముయిచ్చి, దానికై మరల అతని వెంట దిరుగుట తెలివితక్కువ తనము. పిల్లి మ్రింగిన కోడి(కోడి - అజ్జవాలు, సం.కుక్కుటః. పిల్లి తిన్న కోడి)పిలిచిననూ పలుకదు కదా.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
పృదాకువు - 1.పులి, 2.పాము, 3.తేలు.
పర్దతీతి పృదాకుః ఉ. పు. పర్ద కుత్సితేశబ్దే. - కుత్సితముగా బలుకునది.
పులి - 1.నల్లని, 2.పులిసినది, వి.శార్దూలము.
పుల్లరీకము - 1.ఒకానొక దేశము, 2.పాము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము; సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి. (గణి.) కొలతలలోని తప్పులు.
పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము - పాము snake.
కస్తి - 1.కష్టము, 2.వగ, 3.దుఃఖము, 4.విపత్తు.
రుద్దు - పులుము, తోము. తోము - రుద్దు.
వృశ్చిక చోర న్యాయము - న్యా. దొంగవాడు రహస్యముగ కన్నము వేయు చుండ, తేలు కుట్టినచో నోరు మూసికొని చప్పుడు చేయక తిరిగి పోవునను రీతి.
దస్యుఁడు - 1.దొంగ, 2.శత్రువు. దివాభీతుఁడు - దొంగ.
తస్కరుఁడు - దొంగ.
తస్కరించు - దొంగిలించు. దొంగను తేలు కుట్టినట్లు.
హాస్యాగానికి తేలుకుడితే హాస్యం క్రిందకు పోతుంది.
హాస్యము - 1.నవ్వు, 2.గేలి 3.(అలం.)ఒక రసము.
హసనము - హాసము.
హాసము - నవ్వు (ఆరు విధములు:- స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, అపహసితము, అతిహసితము).
నవ్వు - క్రి.1.హసించు, 2.వికసించు, 3.పరిహసించు, 4.అపహసించు, రూ.నవు, నగు, వి.1.హాసము, 2.వికాసము, 3.పరిహాసము, అపహాసము, రూ.నవు, రూ.నవు, నౌ.
నౌ - నవు, నవ్వు.
హసించు - నవ్వు.
నగు - క్రి.హసించు, అపహసించు, వి.హాసము, రూ.నవ్వు, నగవు.
నగించు - క్రి.నవ్వించు, నగుపించు.
స్మితము - 1.అధరమందుమాత్రము ప్రకాశించు చిరునవ్వు, 2.లేతనవ్వు, రూ.స్మిలి.
చిరునవ్వు - స్మితము; ఎలనవ్వు - చిరునవ్వు.
మందస్మితము - చిరునగవు.
హసితము - పండ్లుకనబడునట్లు నవ్వెడి నవ్వు.
గేలి - పరిహాసము, సంకేళీ.
ఎగతాళి - గేలి, పరిహాసము.
పరియాచకము - పరిహాసము, ఎగతాళి, సం.పరిహాసకః.
వేళాకోళము - చిక్కు, పరిహాసము, ఎగతాళి (అని వాడుకలో).
అపహాసము - గేలి, ఎగతాళి, రూ.అపహాస్యము.
అపగసుంచు - క్రి.గేలిచేయు, నవ్వు.
క్రేణి - 1.పరిహాసము, 2.అధికారము, 3.ఉన్నతపదవి.
ఉల్లసము1 - 1.ఎత్తిపొడుపు, 2.ఎత్తిపొడుపుమాట, 3.పరిహాసము, 4.నింద, 5.బాధ.
ఉత్ప్రాసము - మనస్సు నొచ్చునట్లు చేయు అపహాస్యము, ఎత్తిపొడుపు మాట, రూ.ఉత్ప్రాసనము.
ఉల్లసము2 - 1.సంతోషము, 2.ప్రకాశము, 3.వికాసము, రూ.ఉల్లాసము.
ఉల్లాసము - 1.ఉల్లసము, 2.ఒక అర్థాలంకారము.
ఎకసకియము - 1.వికటపుమాట, 2.అవమానము, 3.వంచన, 4.అపహాస్యము, విణ.వికటము, రూ.ఎకసకెము.
తలవంపు - అవమానము.
అవజ్ఞ - అవమానము.
అవమతి - 1.అవమానము, 2.తిరస్కారము, 3.అనాదరము.
అవమయస్మతే లవమతం, అవజ్ఞాయతే స్మ అవజ్ఞాతం, మన జ్ఞానే, జ్ఞా అవబోధనే. - నికృష్టముగాఁ దలఁచబడినది అవమతము, అవజ్ఞాతమును.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అవమానము.
అవమాన్యతే స్మ అవమానితం, భూ సత్తాయాం, పరిపూర్వస్తిరస్కారే - తిరస్కరింపఁబడినది.
కారణములేని నగవును
బేరణము లేని లేమ పృథివీస్థలిలోఁ
బూరణములేని బూరెయు
వీరణములు లేని పెండ్లి వృధరా సుమతీ.
తా. కారణములేని నవ్వు, నాట్యమెరుగని స్త్రీ(లేమ - స్త్రీ, సం.రామా.), పూర్ణములేని బూరె, (వీరణము - చర్మవాద్యము, సం.వీరధ్యానః.)వాయిద్యములేని పెండ్లి యీ భూమియందు వ్యర్థములు.
ఆఖర్న నవ్వేవాడు చాలా బాగా నవ్వగలడు. - పాత ఇంగ్లీషు సామెత
మండ్రగబ్బ- A large black scorpion, పుట్టతేలు, నల్లని పెద్దతేలు.
షడ్భిందువు - మండ్రగబ్బ.
పుట్ట - 1.వల్మీకము, 2.చిన్నపొద, 3.స్థానము, ఉదా. "రోగముల పుట్ట ".
వల్మీకము - పుట్ట; పాములబిడారము - (వ్యవ.) పుట్ట.
తుప్ప - చిన్నపొద, వి.(వృక్ష.) సామాన్యమగు ఏత్తు గుబురుగా నున్న ధృడమగు శాఖలు కలిగి ప్రత్యేకముగు కాండము స్పష్టముగా లేని మొక్క (Shrub).
ఖర్జూరము - 1.వెండి Silver, 2.తేలు, 3.ఖర్జూరపుచెట్టు, ఖర్జూరపు పండు.
ఖర్జయతి రక్తపిత్తమితి ఖర్జూరః, ఖర్జ వ్యథనే. - రక్తపిత్తాదులను బోఁగొట్టునది, ఖర్జూరము పేరు.
వెండి-రజతము, అవ్య. మరియు (వెండియు).
తేలు - క్రి.1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము Scorpion.
కజ్జారము - ఖర్జూరము.
ఖర్జ్యతే పీడ్యత ఇతి ఖర్జూరం. ఖర్జు వ్యథనే. - అగ్ని సంతాపాదులచేతఁ బీడింపఁబడునది.
శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
పూరిత సద్గుణంబుఁగలపుణ్యున కించుక రూప సంపదల్
దూరములైన వానియెడ దొడ్డగఁజూతురు బుద్ధిమంతులెట్లా
రయ గొగ్గులైన మఱి యందుల మాధురిఁజూచి కాదె ఖ
ర్జూర ఫలంబులన్ బ్రియముజొప్పిల లోకులు గొంట, భాస్కరా.
తా. ఖర్జూరపు పండ్లు ముడతలు పడి కంటికింపుగా గానబడకున్నను జనులా పండునందు గల మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు. తీయదనము నకు మిక్కిలి యిష్టముతో కొందురు. అట్లే మంచి గుణములు గల వానికి ఒకప్పుడు భాగ్య రేఖయు, రూపును చెడిపోయి నప్పటికీ వానిని బుద్ధిమంతు లగు వారు తొంటి(పూర్వపు) విధముగనే చూతురు.
ముఖం మీద ముడతలు ఇదివరకు చిరునవ్వులుండే చోట్లను సూచిస్తాయి. - మార్క్ ట్వేన్
16. చేటరిక్క - విశాఖనక్షత్రము.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ. ఋక్షము.
ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి.
ఋక్షరాజు - 1.చంద్రుడు, 2.జాంబవంతుడు.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ | ఉన్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ | తస్యాం దేవా అధిసంవసంతః | ఉత్తమే నాక ఇహ మాదయంతామ్ | పృథ్వీ సువర్చా యువతిః సజోషాః | పొర్ణమాస్యుదగాచ్చోభమానా | ఆప్యాయయంతీ దురితాని విశ్వా | ఉరుం దుహాం యజమానాయ యజ్ఞమ్ ||15||
ఉద్భటము - అధికము, వి.1.చేట, 2.తాబేలు.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
చేటచెవులవేలుపు - గణపతి.
గణపతి - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
వీఞ్ ప్రాపణే, విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్రత్వాత్ - స్వతంత్రుఁడౌటవలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
ఒంటికొమ్మువేలుపు - ఏకదంతుడు, గణపతి.
ఏకదంతుఁడు - వినాయకుడు.
కార్తికేయోత్పాటితైక దంతత్వా దేకో దంతో యస్య స ఏకదంతః - కుమారస్వామిచే నొకదంతము పెఱికివేయఁబడెను గనుక నేకదంతుడు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
ఉద్భటము - అధికము, వి.1.చేట, 2.తాబేలు.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
తాబేలు - A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.
దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.
దాసుడు - 1.పనివాడు; సేవకుడు, 2.భక్తుడు(భక్తిగలవాడు), 3.జ్ఞాని.
దాసేయుఁడు - పనివాడు, విణ.దాసికి పుట్టినవాడు, రూ.దాసేరుడు.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
దాసరిపాము - చారలుగల పెద్దపాము.
తలమేల కులమేల తపమే కారణము
యెలమి హరిదాసులు యేజాతియైన నేమి……
వేదాన్తగో బ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||
17. అనూరాధ : అనూరాధ, జ్యేష్ఠ - (ఛత్రాకారము) గొడుగునుపోలి 6 నక్షత్రములు వుండును.
వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).
అనూరాధ వర్షోదకము - Rain water that falls in Anuradha karti. సమస్తజంతువులకు అన్ని సస్యములకు మిక్కిలి ఆరోగ్యకరమైన దిగ నుండును.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ, వి. సం.క్రాంతిః.
ఋద్ధ్యాస్మ హవైర్నమసోపసద్య | మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు | అనురాధన్, హవిషా వర్ధయంతః | శతం జీవేమ శరదః సవీరాః | చిత్రం నక్షత్రముదగాత్పురస్తాత్ | అనూరాధా స ఇతి యద్వదంతి | తన్మిత్ర ఏతి పథిభిర్దేవయానైః | హిరణ్యయై - ర్వితతై-రంతరిక్షే ||16||
దోరణపు సాటి రిక్క - అనూరాధ, తోరణము వలెనుండు నక్షత్రము.
రిక్క - నక్షత్రము, ఋక్షమ్
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్కరాయుడు.
దోరణ - తోరణము, మామిడాకులు మొదలగునవి గ్రుచ్చిన సరము, రూ.దోరణము, సం.తోరణమ్.
తోరణము - 1.పుష్పమాలాదులు కట్టుటకై గృహమునకు వెలుపల రెండు స్తంభాలచే ఏర్పరుపబడిన ద్వారము, 2.ద్వారమునకు కట్టు మామిడా కుల దండ, రూ.తోరణ.
చెలిచుక్క - అనూరాధ.
చెలి - స్త్రీ, స్నేహితురాలు.
చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు. శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
మైత్రి - మిత్రభావము, స్నేహము, అనూరాధ, యతిమైత్రి, affinity.
బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship).
సంబంధము - 1.చుట్టరికము, 2.కూడిక.
(ౘ)చుట్టఱికము - బంధుత్వము, సంబంధము. వావి - బంధుత్వము.
యః కశ్చిదప్యసంబద్ధః మిత్రభావేన వర్తతే |
స ఏవ బంధుస్తన్మిత్రం సా గతిస్తతత్పరాయనమ్||
బంధుత్వం లేకుండానే స్నేహభావంతో ప్రవర్తించే వాడే బంధువు, వాడే మిత్రుడు, వాడే గతి, వాడే చివరికి చేరదగినవాడు.
ఎచట మైత్రి యుండునో దానిని వృద్ధిచేయుము. స్వార్థంలేని స్నేహం పవిత్రమైనది. అదే సృష్టిలో తీయని స్నేహం.
ఐక్యము - ఏకీభావము, మైత్రి.
ఏకీభావము - ఐక్యము, ఒకటియగుట.
పొందు - 1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
పొందుతనము - (పొందు + తనము), 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందుకాఁడు - స్నేహితుడు.
ఒంటింపు - 1.అనుకూల్యము, 2.పనుల యేర్పాటు, 3.మైత్రి, 4.సహాయము.
పొసఁగుడు - వి.1.ప్రాప్తి, 2.స్నేహము.
పొసఁగు - క్రి.1.అనుకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.
మిత్ర సంగ్రహేణ బలం సంపద్యతే |
'మిత్రులని సంపాదించడం వల్ల బలం చేకూరుతుంది.'
శ్లో|| మైత్రీం భజతాఖిల హృద్ జైత్రీం, ఆత్మ వదేవ పరానపి పశ్యత|
యుద్ధం త్యజత స్పర్థాం త్యజత, త్యజత పరేష్వ క్రమ మాక్రమణమ్||
తా. అందరి హృదయములను జయించు మైత్రిని పెంచుము. ఇతరుల నందరిని నీ వలెనే చూచుకొనుము. యుద్ధమును స్పర్థను త్యజించుము. ఇతరులపై అక్రమ ఆక్రమణను వదలి పెట్టుము. - శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి, కంచి.
వాసనలు చతుర్విధాలు : 1.మైత్రి, 2.కరుణ, 3.ముదిత, 4.ఉపేక్ష.
నిత్యతృప్తా భక్తనిధి - ర్నియంత్రీ నిఖిలేశ్వరీ|
మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణీ.
ఉగ్మలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు, 3.ఇల్లాలు.
ఇల్లాలు - భార్య, ఇంటియజమానురాలు.
గృహిణి - ఇల్లాలు, భార్య.
నాస్తి భర్యాసమో బంధు, ర్నాస్తి భార్యాసమాగతిః,
నాస్తి భార్యాసమో లోకే సహాయోధర్మా సంగ్రహే. - మహాభారతం
అను1 - క్రి.1.చెప్పు, వచించు, 2.అనుకరణ శబ్దములకు అనుప్రయుక్తమగును.
అను2 - ఈ క్రింది అర్థములనిచ్చు ఉపసర్గ; 1.ఆశ్రయము, 2.ప్రాప్తము, 3.పోలిక, 4.తరువాత, 5.తగినది, 6.క్రమము, 7.సామీప్యము, 8.సహార్థము, 9.అనుకూల్యము.
అనుఁగు - 1.చెలికాడు, 2.ప్రేమ, 3.ముఖ్యుడు, విన.1.ప్రియుడు, 2.ప్రియురాలు, 3.మనోజ్ఞము, 4.సహాయుడు, 5.మొదటిది.
అనుఁగుకాఁడు - చెలికాడు.
అనుఁగుగత్తె - చెలికత్తె.
సకి - సఖి, చెలి, స్త్రీ, రూ.సకియ, సం.సఖీ.
సఖీ - 1.సకి, చెలికత్తె, స్నేహితుడు, సహాయుడు, రూ.సఖుడు.
సకుఁడు - సఖుడు, చెలికాడు, సం.సఖా.
సఖికోశములు - (వృక్ష.) అధోవాహినిలో నుండు జల్లెడ గొట్టములకు ప్రక్కన సహాయకారిగానుండు ఒక్కొక్క జీవకణ కోశము (Companion cells).
సఖ్యం సాప్తదీనం స్యాత్ -
సఖ్యం - చెలిమి.
సఖ్యుః భవః సఖ్యం. - సఖునియొక్క భావము సఖ్యము.
సాప్తదీనము - చెలిమిరి, వ్యు.ఏడు మాటలలో లేక ఏడు అడుగులలో కలుగునది.
సతభిః పదైః ప్రాప్యతే సాప్తపదీనం. - ఏడదుగు (ఏడుమాట) లచేతఁ బొందఁబడునది. ఈ ఒకటి చెలిమి పేర్లు.
ఆఁడది - ఆఁటది ఆఁటది, రూ.ఆడుది.
ఆఁటది-ఆడుది, ఇంతి, రూ.ఆఁడది, ఆఁడుది.
ఇంతి - 1.స్త్రీ, 2.భార్య, 2.చెలికత్తె, సం.స్త్రీ, ప్రా. ఇత్థీ, ఇత్థియ.
చెలియ - స్త్రీ; సహధర్మిణి - భార్య;
జన్య - 1.తల్లి, చెలికత్తె, 2.తోడ పెండ్లికూతురు, 3.సుఖము.
స్త్రీగా పుట్టడంలో విశేషమేమిటంటే ఆమె తన పనులు చేసుకుంటూనే మరో మనిషికి తిండి, సుఖం అమరుస్తుంది. - పెరల్ బక్
స్నేహము - 1.చెలిమి, 2.చమురు.
చెలిమి - స్నేహము.
నూనియ - చమురు, రూ.నూనె.
ౘమురు - రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.
నే - నేయి.
నేయి - నెయ్యి, సం.స్నేహః.
నేయము - నెయ్యము, సం.స్నేహః.
చమురు గ్రంథులు - (జీవ.) చమురును అందచేసి శరీరముమీద రోమములు పెరుగుటకు సహాయపడు గ్రంథులు(Sebacous glands).
చము రింకిబోయినను దీ
పము శమియించిన విధంబు, పౌరుషము విహీ
నమె యగును; దైవ మనుకూ
లము గాకుండినను భూత, లమునఁ గుమారా!
తా. చమురు తగ్గిపోఁగా దీపమేరీతిగా, దగ్గిపోవునో చమురులేని దీపపువత్తి చరచర కాలిపోతుంది. అట్లే పురుషుని ప్రయత్నమంతయు దైవమను కూలము కాక యుండిన నశించును.
ౘమురు గింజల పైరులు - (వ్యవ.) నూనెనిచ్చు గింజల పైరులు, ఉదా. ఆముదము, వేరుసెనగ, కుసుమ, నూవు మొదలగునవి, (Oiled crops).
నువు - తిల, రూ.నువ్వు, నూవు.
నూవు - నువు, రూ.నువ్వు, నూగు.
నూగు - నువ్వు, తిలసస్యము. నువ్వు - ఒకరకపు పంట.
తెలికలు - తిలలు, నువ్వులు, సం.తిలకః.
తిలలు - నువ్వులు.
తిలయంత్రము - గానుగ.
గానుగ - నూనె, చెరకురసము మొ.వి. తీసెడియంత్రము, పరంజము, రూ.గానిగ, గానుఁగు.
తెలకపిండి - గానుగపిండి.
తిలతండుల న్యాయము - న్యా. నువ్వులు బియ్యము(తండులము - బియ్యము)కలిసిన విధము.
తిలఘాతకుఁడు - గాండ్లవాడు, తెలికవాడు.
తెలికవాఁడు - గాండ్లవాడు.
గాండ్ల - నూనె ఆడి అమ్మి జీవించువారి కులము, తెలికలకులము.
స్థిరతైలములు - (వ్యవ.) గాలి పారినను ఆరి, హరించిపోకుండ స్థిరముగానుండు నూనెలు (Fixed oils), ఉదా. నూవులనూనె, ఆముదము.
తైలము - తిలలనుండి లభ్యమగు నూనె, (ఏ నూనెనైన తైలమనుట పరిపాటియైనది, (రసా.) తైలములు కార్బన్, ఉదజని, ఆక్సిజన్ గల రాసాయనిక యౌగికములు.)
అశోషకతైలములు - (వ్యవ.) గాలి పారినను చాలకాలము జిడ్డుగా నుండు నూనెలు. ఉదా. నూవులనూనె, వేరు సెనగనూనె మొ.వి (Non- drying oils).
కుసుమ - 1.ఒకరకపు ధాన్యము, (వడ్లలో పెద్ద కుసుమ, చిన్న కుసుమ, గుత్తికుసుమ మొ.వి. 2.(వ్యవ.) గింజల నుండి 'కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower).
హైడ్రోజనేషన్ - (గృహ.) (Hydrogenation) నూనెలను నెయ్యివలె పేరుకొనునట్లు చేయుటకు ఉదజనిని తగుపాళ్ళలో కలుపుట (Dalda).
ఉదజనీకరణము - (రసా.) ఒక యౌగికమునకు ఉదజనిని రాసాయనిక ముగా కలుపుట, ఉదా. ద్రవరూప తైలమునకు ఉదజనిని కలుపుటవలన గడ్డకట్టు తైలములుగా మారును (డాల్డా వేరుసెనగ నూనెనుండి తయారు చేయుటలో).
ఉదజని - (రసా.) ఆమ్లజనితో సంయోగించి ఉదకము నిచ్చుటచే ఈ మూలద్రవ్యమునకు ఉదజని అను పేరు వచ్చినది (Hydrogen).
విస్పరీకరణము - (రసా.) నూనెలు, క్రొవ్వు మొదలగు వానిలోనున్న కర్బనామ్లముల సంయోగింపజేసి లవణముల వంటి సంయోగ ద్రవ్యములుగా మార్చుట (Esterification).
తడవగరాదు దుష్టగుణుఁ దత్త్వ మెఱుంగక నెవ్వరైన నా
చెడుగుణ మిట్లు వల్వ దనిచెప్పిన గ్రక్కునఁ గోపచిత్తుడై
కడుఁదెగఁజూచుఁగా, మరుఁగగాగినతైలము నీటిబొట్టు పైఁ
బడునెడ నాక్షణం బెగసి, భగ్గినమండక యున్నె? భాస్కరా.
తా. సలసల క్రాగుచున్న నూనెలో నొక నీటి బిందువు పడినచో తక్షణమే పైకిలేచి (మంటలు)మండును, అట్లే దుర్మార్గుని దుష్ప్రవర్తనమును మార్చుకొనమని చెప్పినచో వారు యెవ్వరైనను, ఆ దుష్టుడు వారి మీదకి తక్షణమే లేచును.
నేస్తము - స్నేహము, నెయ్యము.
నెయ్యము - 1.స్నేహము, చెలిమి, 2.ఇంపు, నెయ్యమి, నేయము, సం.స్నేహః.
ఇంపు - 1.ఇచ్ఛ, 2.ఆనందము, 3.మనోజ్ఞత, విణ.ఇష్టము, ప్రియము.
ఇచ్చ - 1.కోరిక, 2.చిత్తము, (చిత్తము - మనస్సు) సం. ఇచ్ఛా.
ఆనందము - సంతోషము, సుఖము.
మనోజ్ఞత - (గృహ.)1.ఆకర్షించు శక్తి, 2.రంజింపజేయు శక్తి, 3.సౌందర్యము(Charm), చక్కదనము.
ప్రియంవదుఁడు - ఇచ్చక మాడువాడు, ప్రియవాది.
నెయ్యము - స్నేహము, చెలిమి, 2.ఇంపు, రూ.నెయ్యమి, నేయము, సం.స్నేహః.
నెయ్యమాడు - క్రి.స్నేహించు.
నెయ్యుఁడు - స్నేహితుడు, నెయ్యరి.
నెయ్యపుఱేఁడు - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్నువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
నెయ్యపుటలుక - ప్రణయకోపము.
ప్రేమా నా ప్రియతా సార్దం ప్రేమ స్నేహః :
ప్రియస్య భావః ప్రేమా, న. పు. ప్రియతా చ.- ప్రియము యొక్క భావము, ప్రేమ ప్రియత.
హృదయే భవం హార్దం - హృదయ మందుఁ బుట్టినది.
ప్రీణనం ప్రేమ. న. న. ప్రీఞ్ తర్పణే - సంతోషింపఁజేయుట.
స్నిహ్యత ఇతి స్నేహః. ష్ణిహప్రీతౌ. ప్రీతి. ఈ నాలుగు 4 స్నేహము పేర్లు.
ప్రేముడి - స్నేహము, సం.ప్రేమన్.
ప్రేయసి - ప్రియురాలు; ప్రియ - ప్రియురాలు.
హార్దము - స్నేహము, విణ.హృదయ సంబంధమైనది.
గాదిలి - 1.ప్రేమము, ముద్దు, 2.చుట్టము, 3.ప్రియుడు, 4.భర్త, 5.భార్య, విణ.ప్రేమపాతము.
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.
ప్రణయము - 1.ప్రేమము, 2.వినయము.
ప్రణయని - ప్రియురాలు.
ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చువెలగలది.
ఇష్టము - 1.యజ్ఞ కర్మము, 2.సంస్కారము, 3.యజ్ఞము, 4.కోరిక, విణ.1.కోరబడినది, 2.ప్రియమైనది, 3.పూజింపబడినది.
ఇష్టుఁడు - 1.ప్రియుడు, 2.ఆప్తుడు, 3.విష్ణువు.
ప్రియుఁడు - ప్రాణనాథుడు.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.
చుట్టము - 1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు.
(ౘ)చుట్టఱికము - బంధుత్వము, సంబంధము.
వావి - బంధుత్వము. తగిన అవసరము వచ్చినపుడు బంధువు లొకరి నొకరు కాపాడుకొనుట మిత్రత్వమునకు మిక్కిలి మంచిది. మిత్రుడు దుఃఖించు నపుడు చూపని స్నేహమేమి స్నేహము? ఆపదలలో ఆదుకునేవాడే - ఆత్మబంధువు.
పరదేశా గమనము వలన స్నేహమును, ప్రేమ లేకపోవుట వలన మైత్రియును నశించును.
చెలిమి - స్నేహము.
చెలికారము - స్నేహము, రూ.చెలిమి.
చెలిమికాఁడు - మిత్రుడు; సహృదుఁడు - మిత్రుడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు.
ఉద్ది - 1.జత, జట్టు, 2.చెలిమి, విణ.1.సమానము, 2.ప్రతిస్పర్ధి.
ఉద్ధీఁడు - 1.జతకాడు, 2.మిత్రుడు, రూ.ఉద్ధికాఁడు.
ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ(దయ - కనికరము), 4.తృప్తి.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను భావము.
ఆదట2 - అనంతరము, పిమ్మట. అనుక్రోశము - కనికరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content).
చెలిమిరి - 1.చెలికాడు, 2.చెలికత్తె.
చెలికాఁడు - స్నేహితుడు; స్నేహితుడు - చెలికాడు.
వయస్య - చెలికత్తె; వయస్యుఁడు - చెలికాడు.
సహవాసము - 1.కూడనుండుట, 2.స్నేహము.
సాహాయ్యము - 1.తోడుపాటు, 2.సహాయత్వము, 3.స్నేహము.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
సార్థః ప్రవసతో మిత్రం భార్యా మిత్రం గృహే సతః
ఆతురస్య భిషక్ మిత్రం దానం మిత్రం మరిష్యతః.
తా. ప్రవాసికి ప్రవాసుల గుంపు మిత్రుడగును, ఇంటిలో నున్న వానికి భార్యయే మిత్రము, రోగికి వైద్యుడే మిత్రుడు, చావనున్న వానికి దానమే మిత్రుడు.
ప్రీతి - 1.సంతోషము, 2.స్నేహము.
సంతోషము - సంతసము, ముదము.
ముదము - సంతోషము. సంతోసము - సంతసము.
పొత్తు - 1.స్నేహము, సంగతి, 2.అవిభక్తత.
సంగతము - స్నేహము, చేరిక, విణ.యుక్తము.
సంగాతము - చెలిమి, సంగతము, సం.సంగతమ్.
సంగాతకత్తె - చెలికత్తె.
సంగాతకాఁడు - చెలికాడు, సంగాతి.
సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము. సమీపము - చేరిక.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
జ్ఞానము - తెలివి, ఎరుక.
సమాచారము - 1.చక్కగా నడుపుట, 2.వృత్తాంతము.
నిద్ధము - 1.నిగ్ధము, నునుపైనది, 2.స్నేహము, రూ.నిద్ధా, సం.స్నిగ్ధము.
స్నిగ్థము - 1.స్నేహముగలది, 2.నునుపుగలది, 3.చక్కనిది.
స్నిగ్ధుఁడు - స్నేహితుడు. స్నేహితుడు దివ్యౌషధము వంటివాడు.
విస్రభము - 1.నమ్మకము, స్నేహము, 2.జగడము.
విస్రబ్దము - 1.నమ్మబడినది, 2.అణిగినది, 3.శాంతినొందినది, 4.అత్యంతము.
విశ్వస్తము - విశ్వసింపబడినది.
నమ్మకము - విశ్వాసము, నచ్చిక, రూ.నమ్మిక, నమ్మిగ.
నచ్చిక - విశ్వాసము, రూ.నచ్చిగ, నచ్చికము.నమ్మిక - నమ్మకము.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము.
స్తబ్ధము - 1.అడగినది, ముడిగినది, 2.కదలలేనిది.
నిష్క్రియము - (గృహ.) స్తబ్ధముగా నుండునది (Passive).
నిష్క్రియ -(గృహ.)ఏమియు చేయ లేకపోవుట, ఊరక కూర్చుండుట.
తనవారు లేనిచోటను
జనమించుక లేనిచోట జగడము చోటన్
అనుమానమైన చోటను
మనుజునకును నిలువదగదు మహిలో సుమతీ.
తా. తన బంధుజనము లేనిచోటను, లేశమైన పరిచయములేని ప్రదేశమునను, కలహమాడెడు తావునను, సందేహంగల తావునను మనుష్యుడు నిలువరాదు. యే స్థలమందైనను తనకు లాభములేని యెడల (తన మాటకు విలువలేని యెడ) ఉండుట మంచిదికాదు.
తెలివైన వాళ్ళు వెళ్ళడానికి సందేహించే ప్రదేశానికి మూర్ఖులు పరుగులు పెడతారు. - శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి
మంత్రి - 1.ధీసచివుడు(ధీ - బుద్ధి), 2.సహాయుడు.
సచివుఁడు - 1.మంత్రి, 2.స్నేహితుడు, 3.సహాయుడు. సహకారి - సహాయుడు.
వ్యావహారికుఁడు - మంత్రి, సచివుడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
అంతరంగుడు - స్నేహితుడు.
అమాత్యుఁడు - 1.మంత్రి, 2.సహచరుడు, రాజుతో నుండువాడు.
మంతిరి - మంత్రి, ప్రధానుడు, సం.మంత్రీ.
నియోగి - 1.మంత్రి, 2.నియోగి, బ్రాహ్మణులలో నొక తెగ.
నియోగీ - నొయోగి, సం.నియోగీ.
మన్త్రీ ధీ సచివో(అ)మాత్యః -
మన్త్రో గుప్తవాదః, ఇతి కర్తవ్యతాధారణం వా. సో (అ)స్తీతి మన్త్రీ, న. పు. - మన్త్ర మనఁగా రహస్యవాదము, లేక ఇది సేయఁదగినది యను నిశ్చయము, అది గలవాఁడు.
ధీయా సచతి సమవేతి ధీ సచినః, షచ సమవాయే. - బుద్ధితోఁ గూడియుండువాఁడు.
అమాశబ్దస్సహర్థే నిపాతః అమా మంత్రేణ సహ వర్తత ఇతి అమాత్యః, మంత్రముతోఁగూడియుండువాఁడు. ఈ 3 ఆలోచన సెప్పు మంత్ర పేర్లు.
ప్రెగడ - 1.మంత్రి, 2.ప్రధాన పురుషుడు, రూ.ప్రెవడ, ప్రెగ్గడ, పెగడ, సం.ప్రఘనః, ప్రకృష్టః, ప్రధానః.
ప్రగడ - ప్రధాని, రూ.ప్రగ్గడ, ప్రెగడ, ప్రెగ్గడ, సం.ప్రఘనః., ప్రాజ్ఞః ప్రధానః.
ప్రధానమంత్రి - (రాజ, శాస.) మంత్రి వర్గనాయకుడు, కేంద్రమంత్రి వర్గనాయకుడు.
మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలుడినట్లు జరుగదు సుమతీ.
తా|| మంత్రిగలవాని రాజ్యం చెడిపోక సుస్థిరంగా ఉండును, యంత్రపు ఇరుసు విరిగిన పనికిరానట్లు, మంత్రిలేని రాజ్యం యొక్క పాలన సాగనేరదు.
ఆలి - శుద్దంతఃకరణము గలది. వి. 1.తేలు, 2.తుమ్మెద, 3.శ్రేణి, 4.చెలికత్తె, 5.ఆనకట్ట.
అలి - 1.తుమ్మెద, 2.తేలు, 3.కోకిల, 4.కాకి, రూ.అళి.
అళి - 1.తుమ్మెద, 2.తేలు, రూ.అలి.
అలివేణి - 1.తుమ్మెదల బారువంటి జడగల స్త్రీ, 2.స్త్రీ.
అళి ద్రోణౌ తు వృశ్చికే :
అలయోగాత్ అళీ - అలమనఁగా దోఁక, అది గలది.
ఆళిః, "అలం వృశ్చికలాంగుల ద్రోణ ఆలీ తు వృశ్చిక" ఇతి హలాయుధః, "భృంగవృశ్చికయోరళి" రితి రభసశ్చ.
ద్రుణతీతి ద్రోణః, ద్రుణ హింసాగతి కౌటిల్యేషు - హింసించునది.
ద్రూణమని కొందరు. వృశ్చిక శబ్దమునకు పూర్వమువలె వ్యుత్పత్తి. ఈ 3 ఎఱ్ఱతేలు పేర్లు.
ద్రుణము - 1.కత్తి, 2.విల్లు, 3.తేలు, 4.తుమ్మెద.
ద్రూణము - ఎఱ్ఱతేలు, తేలు రూ.ద్రుణము.
కరవాలము - కత్తి.
కరవీరము - 1.కత్తి, 2.గన్నేరు. కత్తియ - స్త్రీ ప్రత్యయము, ఉదా.చెలికత్తియ, సొగసుకత్తియ.
వేలము - 1.శిబిరము, 2.కత్తి, 3.వేగము, 4.వేలముపాట, సం.వేలా.
వేలము పాట - (వ్యావ.) బహిరంగ క్రయములో ఎవరు ఎక్కువ ధరకు కొనుటకు ఇష్టబడిన వారికి సరకు అమ్ముపద్దతి.
వాలము - 1.తోక, 2.కత్తి.
వాలము - బెబ్బులి. తోఁక - తొంక.
తొంక - పుచ్ఛము, వ్యు.తొంగునది, వంగియుండునది, రూ.తోఁక.
పుచ్ఛము - తోక.
పుచ్ఛసంబంధి - (జం.) తోకకు సంబంధించినది, (Caudal).
తోకఁచిచ్చు - 1.నిప్పు రగిల్చిన పిడకల వరుస, 2.ఒక దాని నుండి మరొకటి అంటు కొనుచు వ్యాపించు అగ్ని.
అంటుకొను - క్రి. 1.అగ్ని రగులుకొను, 2.ముట్టుకొను.
క్రమము - విణ.ఇంపైనది, వి.పిడక నిప్పు.
లాంగూలము - తోక.
లఙ్గతి చలతీతి లాంగూలం, లగిగతౌ. - కదలునది.
లాంగూలతరణ న్యాయము - న్యా. కుక్క తోకపట్టుకొని గోదావరి యీదె ననురీతి.
ఆలిమాటలు విని యన్నదమ్ముల బాసి
వేరే పోవు వాడు వెర్రివాడు
కుక్కతోక బట్టి గోదావరీదునా విశ్వ.
టీ|| ఆలి మాటలు విని అన్నదమ్ములని వదిలి వేరేపోవువాడు(వేఱిఁడి - అవివేకి, రూ.వీఱిడి.)అవివేకము, కుక్కతోక బట్టుకొని పెద్దనది యయిన గోదావరి నీదుట అసాధ్యము అని తెలుసు కొనుము.
విల్లు - ధనుస్సు.
తేలు - 1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.
తుమ్మెద - భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
భ్రమణము - 1.తిరుగుట, 2.తుమ్మెద, సం.వి. (భౌతి., గణి.) పరిభ్రమణమునకు విరుద్ధముగ ఒక వస్తువు ఇంకొకదాని చుట్టు ఒక కక్ష్యలో తురుగుట (Revolution), ఉదా.భూమి సూర్యునిచుట్టు తిరుగును, సం. (గణి.) ఏదైన బిందువు చుట్టుగాని సరళరేఖ చుట్టుగాని తిరుగుట (Rotation).
భ్రమి - (భౌతి.) శరీర కేంద్రమం దొక కుహరమును(కుహరము - 1.గుహ, 2.రంధ్రము.)కల్పించుకొని ఒక ప్రవాహి గ్రహించుభ్రమణము (Vorten motion), (పర్యాయ పదము, భ్రమరకము).
భ్రమరకము - 1.తుమ్మెద, 2.బొంగరము.
బొంగరము - త్రాడుచుట్టి యాడెడు ఆటవస్తువు, సం.భ్రమరకమ్.
కురుళము - ముంగురులు.
కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
ముంగురులు - (ముందు+కురులు) నొసటిపైన గునిసి యాడెడు ఉంగరపు వెండ్రుకలు.
భ్రమర కీటన్యాయము - న్యా. ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లే తాననురీతి (తుమ్మెద పురువుం దెచ్చి తన గూటిలో నుంచి దాని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగు నను రీతి).
మధుప్రతో మధుకరో మధులిణ్మధు పాళినః
ద్విరేఫ పుప్పలి ద్భృఙ్గ షట్పద భ్రమ రాళయః. (ఇన్దిన్దిర శఞ్చరీకో రోలమ్బో బమ్భరశ్చసః.) :
మధు పుప్పర సం వ్రతయతి భుజ్క్తే మధువ్రతః. వృతు వర్తనే. - పూఁదేనను భుజించునది.
మధు కరోతీతి మధుకరః. దు కృఞ్ కరణే. - పూఁదేనెను జేయునది.
మధు లేఢీతి మధు లిట్. హ. పు. లిహ ఆస్వాదనే. - పూఁదేనెను ఆస్వాదించునది.
మధు పిబతీతి మధుపః పా. పానే. - పూఁదేనెను బానము సేయునది.
అలతి భూషయతి పద్మాదిక మితి అళీ. న. పు. అల భూషణాదౌ. - పద్మాదుల నలకరించునది.
అమ - 1.తల్లి, 2.పూజ్యురాలు, రూ.అమ్మ, సం.అంబా.
అమ్మ - 1.తల్లి, 2.పూజ్యురాలు, సం.అంబా. అవ్య. ఆశ్చర్యాది వాచకము, ఔర.
అమ్బా మాతా -
అంబ్యతే శబ్ద్యతే బాలై రిత్యంబా. అబి శబ్దే. - బాలురచేఁ బిలువఁబడునది. ఈ ఒకటి తల్లిపేరు.
భ్రమరాంబ - అంబ, పార్వతి.
అంబ - 1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.
భ్రామరి - పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతురు. శ్రీశైలే భ్రమరాంబికా శక్తిపీఠం|
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
అస్య భ్రమర ఇతి నామ్నిద్వౌ రేఫా స్త ఇతి ద్విరేఫః - భ్రమర మను తన పేరునందు రెండు రేఫలు గలది.
ద్విరేఫము - భ్రమరము, వ్యు.రెండు రేఫలు కలది.
రేఫము - ర వర్ణము, విణ.అధమము.
భ్రామరము - భ్రమరములు గూర్చిన తెల్లని తెనె.
పుష్పదయము - తుమ్మెద.
పుష్పం లేఢి ఆస్వాదయతీతి పుష్పలిట్. హ. పు. లిహ ఆస్వాదనే. - పుష్పము నాస్వాదించునది.
కార్ష్యం భరతీతి భృఅంగః. భృఞ్ భరణే. - నలుపును భరించునది.
షట్పదా న్యస్యేతి షట్పదః - ఆఱుకాళ్ళు గలది. భ్రమరకము - 1.తుమ్మెద, 2.బొంగరము.
భ్రమతీతి భ్రమరః భ్రము అనవస్థానే. - తిరుగు చుండునది.
భ్రమణము - 1.తిరుగుట, 2.తుమ్మెద, సం.వి.(భౌతి., గణి.) పరిభ్రమనమునకు విరుద్ధముగ ఒక వస్తువు ఇంకొకదాని చుట్టు ఒక కక్ష్యలో తిరుగుట (Revolution), ఉదా. భూమి సూర్యునిచుట్తు తిరుగును, సం. (గణి.) ఏదైన బిందువు చుట్టుగాని సరళరేఖ చుట్టుగాని తిరుగుట (Rotation).
భ్రమి - (భౌతి.) శరీర కేంద్రమం దొక కుహరమును కల్పించుకొని ఒక ప్రవాహి గ్రహించు భ్రమణము (Vorten motion), పర్యాయపదము, భ్రమరకము).
భ్రమర కీటన్యాయము - ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లే తాననురీతి (తుమ్మెద పురువుం దెచ్చి తన గూటిలో నుంచి దాని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగు నను రీతి).
ఓం హ్రీంకారాంభోజ భృంగికాయై నమః : హ్రీంకార రూపమైన పద్మము నందు లలితాదేవి భ్రమరము వంటిది. పరాగ, పరిమళాదులు విశేషంగా ఉండునట్టి పద్మంలో విశేషాసక్తితో భ్రమరం ఉంటుంది.
ఆళి - 1.పంక్తి, 2.చెలికత్తె, 3.తేలు, 4.సముదాయము, 5.ఆనకట్ట.
ఆలతి పుష్పాణి ఆళి. ఇ. పు. అల భూషణాదౌ. - పుష్పముల నలంకరించునది.
(ఇందిందిరము - తుమ్మెద.
ఇందతి ఇందిరయా ఇందిందిరః ఇది పరమైశ్వర్యే. - పద్మ సంపదతోఁ గూడినది.
చంచరీకము - తుమ్మెద, వ్యు.చరించు చుండునది.
చరతీతి చంచరీకః. చర గతి భక్షణయోః - చరించు చుండునది.
చరించు - 1.కదులు, 2.తిరుగు, 3.చేయు.
తిరుగు - 1.సంచరించు, పరిభ్రమించు, 2.వెనుకకు మరలు, 3.పరివేష్టించు, రూ.తిరువు, తిర్గు.
తిరుగు - తిరుగుట.
భ్రమించు - క్రి. తిరుగు, పరిభ్రమించు.
తిరుగుడుపడు - పరిభ్రమించు.
చేయు - 1.ఒనర్చు, 2.నిర్వహించు.
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెద...నీ ఒల్లు జాగరతె తుమ్మెద...
రోలంబము - తుమ్మెద.
రౌతీతి రోలంబః. రు శబ్దే. - మ్రోయునది. పా. రలయోర భేదా ల్లోలంబః.
లోలంబము - తుమ్మెద, రోలంబము.
బంభరము - తుమ్మెద.
బమితి శబ్దం బిభర్తీతి బంభరః – బం అనెడు శబ్దమును భరించునది. - తుమ్మెద పేర్లు. ఇందిందిరాదులు నాలుగు అధికనామములు).
మధుకము - తుమ్మెద.
మధుకరము - 1.భిక్షాన్నము, 2.తుమ్మెద.
తేటి - తుమ్మెద, తేనెటీగ; తేనెదిండి - తుమ్మెద. తియ్యని తేనెనిండిన నోటితోనే, తేనెటీగ కుట్టేది.
ఉచ్ఛిష్టము - 1.ఎంగిలి, తినగా మిగిలినది 2.పూర్వులు ఉపయోగించి నది, వి. తేనె.
ఎంగిలి - 1.ఉచ్ఛిష్టము 2.లాలాజలము (Saliva).
తుమ్మిపూవులు తెచ్చినీకు తుష్టుగా పూచేదమంటే ఓ...….
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.....ఏమి సేతురా|
లంబ - దుర్గ, లక్ష్మి.
లోల - 1.నాలుక, 2.లక్ష్మి, విణ.1.కదలునది 2.మిక్కిలి యిచ్ఛకలది. ఉత్పలావర్తనము నందు దేవిస్థానం లోల.
లోలతీతి లోలః. లుల సంచలనే - కదలునది.
లోలశ్చల సతృష్ణయోః : లోల శబ్దము కదలుదానికిని, ఆశ గలవానికిని పేరు.
తుమ్మెదలు ఘ్రాణీద్రియం(ఘ్రాణం, ఘోణ-ముక్కు) వల్ల నశిస్తున్నాయి. తుమ్మెదలు ఒకదాని నొకటి కలిసి యుండవు - వీడియుండును.
నాన - ముక్కు, రూ.నస, నాసిక.
ఘ్రూణము - ముక్కు, విణ,మూర్కొన బడినది.
ఘ్రాతి - 1.ముక్కు, 2.వాసన, 3.వాసనచూచుట.
ముకు - నాసిక, రూ.ముక్కు.
నాన - ముక్కు, రూ.నస, నాసిక. ముక్కుతో చూడగలం-వాసన; కంటితో చూడలేము.
తా ననుభవింప నర్థము
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగల గూర్చిన
తేనియ తేరుజేరునట్లు తిరముగ సుమతీ.
తా. అడవియందు తేనెటీగలు కష్టపడి కూడబెట్టిన తేనె ఇతరుల పాలయినట్లు, తాననుభవింపని ధనం భూమీశుల పాలగును, మఱికొంత భూమిపాలును అగును.
తత్ర వాయుర్గంధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః ||
తేనె సేకరించే వాడు క్రింద చూడకుండా పడిపోతూ ఉంటాడని జూదం జరుగుతున్నప్పుడు, విదురుడు దృతరాష్ట్రుడుతో, దుర్యోధనుడు గురించి చెప్పాడు. ఇది శుక్రాచార్యుడు చెప్పిన నీతి అని కూడా చెప్పాడు.
ఆళి - 1.పంక్తి, 2.చెలికత్తె, 3.తేలు, 4.సముదాయము, 5.ఆనకట్ట.
ఆలతి పుష్పాణి ఆళి. ఇ. పు. అల భూషణాదౌ. - పుష్పముల నలంకరించునది.
అళిని - 1.ఆడుతుమ్మెద, 2.తుమ్మెదల సముదాయము.
అళి స్స ఖ్యావళీ అపి : అళి శబ్దము చెలికత్తెకును, పఙ్క్తికిని, అపిశబ్దము వలన కట్టకును పేరు. అలతీ త్యాళిః. సీ. అల భూషణాదౌ. - అలంకరించు ను గనుక ఆళి.
ఆళి స్సఖీ వయస్యా చ -
అలతి అనురూప సంబంధినీవ భూషయతి ఆళిః - అనురూప సంబంధిని వలె భూషించునది.
గుణాదినా సమానా ఖ్యాతి రస్యా ఇతి సఖీ - గుణాదులచేత సమానమైన ఖ్యాతి గలది.
వయసా తుల్యా వయస్యా - వయస్సు చేత సమానయైనది. ఈ మూడు 3 చెలికత్తె పేర్లు.
ఆనకట్ట - (ఆను+కట్ట) ఏటి అడ్డుకట్ట, కాల్వలద్వారా నీటిని సరఫరా చేయుటకు ఏటిలోని సహజప్రవాహమును అరికట్టుటకు నిర్మించున ఆడ్డంకి.
అనకట్ట - నీరు మరలించుటకు నీటికి కట్టు అడ్డుకట్ట, రూ.ఆనకట్ట.
డామ్ - (భూగో. అర్థ.) (Dam) నీటిపారుదల, విద్యుచ్ఛక్తి తయారు చేయుటకుకై నది లోని నీరు వృథాకాకుండ నిలుచుటకై కట్టిన ఆనకట్ట.
జలవిద్యుచ్ఛక్తి - (భూగో. అర్థ.) నీరు ఎత్తు నుండి లోతునకు పడునపుడు ఉత్పత్తియగు శక్తినుండి సేక్రించు విద్యుచ్ఛక్తి.
వారధి - వంతెన, అడ్డకట్ట (ఈ అర్థము తెలుగునందే).
వంతెన - ఏటిపైకట్ట, వారధి.
సేతువు - నీటికట్ట.
గతజల సేతుబంధన న్యాయము - న్యా. నీరుపోయిన తర్వాత సేతువు కట్టుట, గతించినదానికై విచారించుట.
గోల - 1.వట్రువయగు నీటికాగు, 2.గుండ్రని పదార్థము, 3.మణిశిల, 4.చెలికత్తె, 5.గోదావరీనది, వి.1.ముగ్ధ, ముగ్ధుడు, 2.కలకలము.
గోదారి - 1.వెన్న కాచినమడ్డి, 2.గోదావరి. గోదావరి - గౌతమీనది.
బేల - 1.మూఢురాలు, 2.ముగ్ధ, 3.మూఢుడు, 4.గోల, 5.అమాయకుడు, సం.భేలః.
భేల - పేల, ముగ్ధ; భేలుఁడు - 1.మూర్ఖుడు, 2.చలించువాడు.
ముగ్ధ - 1.ముదిత, 2.ఒక నాయిక, వికృ.ముగుద.
ముదిత - ముద్దియ, స్త్రీ; ముగుద - స్త్రీ, సం.ముగ్ధా.
ముదియ - స్త్రీ, రూ.ముద్దియ, సం.ముగ్ధా.
వాణీని - ఆటకత్తె, ముగ్ధ.
కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
మొఱటు – మోటు; మోటు - 1.మొద్దు, 2.తట్టువ గుఱ్ఱము, 3.పంది కెదుట మనుష్యా కారముగ నిల్చిన కపటలక్ష్యము, విణ.మూర్ఖుడు, సం.మూఢః.
మొద్దు - మ్రానిమోడు, విణ.1.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.
అమాయకుఁడు - మాయ, కపటము మొ. వి. ఎరుగనివాడు, రూ.అమాయకుడు.
గోసన - 1.చాటించుట, 2.గోల, కలకలము, సం.ఘోషణా.
(ౘ)చాటువ - చాటించుట. ఘోషణ - చాటింపు.
కలకలము - గుంపున పుట్టిన పెద్ద మ్రోత; గొలక - కలకలము.
దొండోర - చాటింపు, రూ.తండోరా, దండురా.
(ౘ)చాటు - 1.విశదపరచు, 2.ఎల్గెత్తి చెప్పు, వి.మరుగు, రహస్యము.
అతిరహస్యము బట్టబయలు, ముగ్గురుకు తెలిసిన రహస్యము మూడు లోకాలా ప్రాకినదే. ఆరు చెవులలో పడినది అసలే రహస్య మనిపించు కోదు.
అళీకం త్వప్రియే నృతే : అళీక శబ్దము అప్రియమునకును, అసత్యమునకును పేరు. అల్యతే వార్యత ఇత్యళీకం. అల భూషణాదౌ. వారింపఁబడునది. "ఆళీకం తు లలాటే స్యా"దితి శేషః.
ఆలము1 - 1.యుద్ధము, 2.ఆగడము.
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము.
కయ్యము - జగడము, యుద్ధము. పొరిగింటి కలహము వినవేడుక.
కలహము - సమరము, వికృ. కయ్యము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది.
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
ౙగడగొండి - కలహశీలుడు, కలహశీలురాలు.
తంట - 1.కలహము, 2.చాడీ, 3.శ్రమము, 4.మోసము, రూ.తంటా.
అంగడుదుడిపి - తంటాలమారి, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పువాడు, చాడీకోరు, రూ.అంగడు దుడుపు.
దగ్గర గొండెను సెప్పెడు
ప్రెగ్గెడ పలకులకు రాజప్రియుడై మఱి తా
నెగ్గు ప్రజ కాచరించుట
బొగ్గుల కై కల్పతరువుఁ బొడుచుట సుమతీ!
తా. ప్రజాపాలకుడగు వాడు దుర్మంత్రి చెప్పెడు కొండెపు మాటలకు తలయొగ్గి (ప్రియుడై, వసుడై) తాను ప్రజలకు అపకారం చేయునది(ట) ఎట్లన, బొగ్గుల కోరకై వరముల నొసగే కల్పవృక్షమును నఱకుట వంటిది.
దుర్మంత్రి కలుగుటవలన రాజును నశించిపోవును.
చెప్పుడుమాట - ఒకరు చెప్పినది తాను వినినమాట, చాడీ.
ఆగడము - 1.చెడ్దపని, 2.దుష్కార్య చిహ్నము, 3.దౌష్ట్యము(దౌష్ట్యము – దుష్టత్వము), 4.వంచన, 5.అనాదరము, 6.అన్యాయము, 7.ఉత్పాతము, విణ.1.వంచకుడు, 2.అపరాధి, సం.ఆగస్.
తీఁపురము - ఆగడము.
అపకారము - 1.కీడు, 2.ద్రోహము, 3.చెడ్దపని, రూ.అపకృతి.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
ద్రోహము - 1.కీడుతలపు, 2.చంపు నిచ్చ.
అపకృతి - అపకారము. అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
అపకర్షము - 1.తొలగించుట, 2.తగ్గించుట, 3.అవమానపరచుట, (భౌతి.) ఒక వస్తువు ఇంకొకదానిని మళ్ళ గొట్టు గుణము (Repultion).
దుర్నయము - 1.అన్యాయము, 2.దుర్నీతి.
నీళ్ళుతోడు - జాతీ. ద్రోహముచేయు, కీడు తలపెట్టు. దుష్టబుద్ధికి ద్రోహచింతకు మందులులేవు.
అన్నెము1 - ఇతరము, వేరగునది.
అన్నెము2 - పాపము, సం.అన్యాయః.
అన్నెకాఁడు - అన్యాయకారి.
రళము - 1.తలుపు గడియ, 2.ప్రతిరోధము, అడ్డంకి 3.పెద్ద అల.
గొళ్ళెము - తలుపు చిలుకు, రూ.గొండెము .
గొండెము - తలుపు చిలుకు, రూ.గొళ్ళెము, గొండ్లెము.
విష్కంభము - 1.అడ్డంకి, 2.గ్రహ యోగము, 3.గొళ్ళెము, అలం.నాటకాంగము.
ఎడ్డము - అడ్డంకి, అడ్డము.
అడ్దము - 1.నిరోధము, అడ్దంకి, 2.చాటు, 3.తాకట్టు, 4.పూట, విణ.విరోధకము, అడ్దునది.
అడ్దంకి - అడ్డి, అడ్డు, నిరోధము.
అడ్డి - అడ్దంకి, నిరోధము. నిరోధము - 1.అడ్దు, 2.చేటు, సం.వి.(భౌతి.) ఒక వస్తువు యొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్డంకి (Resistance).
నివారణము - అడ్డగింత.
నివారణీయము - అడ్దగింపదగినది, రూ.నివార్యము.
అరికట్టు - 1.అడ్దగించు, నిరోధించు, 2.చుట్టుకొను, వి.1.అడ్దు, నిరోధము, 2.దుప్పటి మెలిపెట్టి రెండు భుజముల యందును జందెపువాటుగవైచి కట్టినకట్టు, వేటకట్టు.
ఉత్పాతము - 1.ఉల్కాపాతము, మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
ఆగడకాఁడు - (ఆగడము + కాడు) అకార్యముల చేయువాడు, దుండగీడు, దుష్ఠుడు.
ఆగడీఁడు - అకార్యము చేయువాడు, దుండగీడు, దుష్టుడు.
దుండగీఁడు - 1.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు), 2.కొంటె.
కొంటె - అకార్యశీలుడు, తులువ.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు.
జాడ్యం హ్రీమలిగణ్యతే వ్రతరతే దంభ శ్శుచౌకై తనం,
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని|
తేజస్వి న్యవలి ప్తతా ముఖరతా వక్తవ్య శక్తిస్థిరే,
తత్కోనామగుణో భవేత్సుగుణినాం యా దుర్జనై ర్నాంకితః||
తా. దుర్జనుఁడు సజ్జనుల యందుగల సద్గుణములను దుర్గుణములుగా నెంచును. అవియెట్లనిన, లజ్జావంతునిజూచి జడుఁడని చెప్పును, వ్రతశీలుని డాంభికుఁడని చెప్పును, ఆచారవంతుని కపటుఁడని చెప్పును, శూరుని (శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.)కనికరములేనివాఁడ ని చెప్పును, తేజస్సుగలవానిని గర్వించు వాఁడని చెప్పును, సద్వర్తనుని వాచాలునిగా నెంచును, కావున దుర్జనునికి సకల జనులయందలి సద్గుణ మొకటియైనను కనుపడదు. - నీతిశాస్త్రము
అలము2 - 1.వ్యాపించు, 2.ఆక్రమించు, 3.చుట్టుకొను, 4.కౌగలించు, 5.కప్పు, 6.అదుము, 7.పట్టుకొను, 8.పూయు, వి.నేలపై ప్రాకుతీగ.
ఒలయు - 1.వ్యాపించు, 2.కలుగు, 3.ప్రవేశించు, 4.చుట్టుకొను, 5.కలయు, 6.చేరు. తిరువులుగట్టు - వ్యాపించు.
ఆక్రమణము - 1.క్రమ్ముట, ఆక్రమించుట, 2.బలిమిచే వశపరచు కొనుట.
ఒత్తరించు - 1.మించు, 2.ఆక్రమించు, సం.ఉత్తరణమ్.
మొగరించు - 1.ఆక్రమించు, 2.ఎదిరించు.
అఱుము- 1.ఎదుర్కొను, 2.బాధించు, 3.ఆక్రమించుకొను, 4.ప్రతిఘటించు, 5.తెగించు, 6.విజృంభించు, వి.ఆక్రమణము.
చుట్టుకొను - క్రి. పరివేష్టించు.
కౌగిఁలి - ఆలింగనము, కవుగిలి.
కప్పు - 1.అచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు, 4.చీకటి, క్రి.1.క్రమ్ము 2.మూయు.
అదుము - క్రి. అణుచు, నొక్కు.
పూయు - క్రి. అలదు, మెత్తు; అలదు - పూయు.
మొత్తు - దెబ్బ, క్రి.మోదు, కొట్టు, నరకు.
మోఁదు - కొట్టు, వి.దెబ్బ.
దెబ్బ - తాడవము, కొట్టు. తాడించు – కొట్టు; అడుచు - కొట్టు.
తాడనము - కొట్టుట.
ప్రహరణము - 1.ఆయుధము, 2.బాణము, 3.కొట్టుట.
కొట్టు1 - కొట్తడి.
కొట్టు2 - ప్రహరించు.
వేటు - వేయుట, దెబ్బ రూ.వ్రేటు.
అభిఘాతము - 1.దెబ్బ, 2.కొట్టుట 3.సమూలనాశము.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీకటింట్లోకి వెళ్ళరాదు - చిక్కుముళ్ళు త్రొక్కరాదు - తేలుకొండె. తేలుకు పెత్తన మిస్తే తెల్లవార్లు అంటబొడిచినదట.
ఊతి - 1.కుట్టు, 2.నేత, 3.రక్షణము, 4.క్రీడ.
కుట్టు - 1.శూల రోగము (chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు. సూల - శూలరోగము, సం.శూలా.
నేఁత - ప్రభువు.
రక్షణము -
క్రీడ - 1.ఆట, 2.ప్రియుల పరిహాసము, 3.అనాదరము, 4.వినోదము, 5.విహారము, 6.గంతులువేసి ఎగురుట.
క్రీడి - అర్జునుడు, సం.కిరీటి.
క్రీడించు - ఆటలాడు, విహరించు.
సేవనము - 1.కొలువు, 2.కుట్టు.
కొలువు - ఓలగము, అస్థానము 2.సేవ.
నేవ కార్థ్యను జీవినః :
సేవతే సేవకః షేవృ సేవనే. - సేవించువాఁడు.
అర్థనమర్థః. సో స్యాస్తీతి అర్థీ. న.పు. - అడుగుట గలవాఁడు.
ప్రభుమనుసృత్య జీవతీతి అనుజీవీ. న.పు. - ప్రభువు ననుసరించి బ్రతుకువాఁడు. 3 కొలువువాఁడు.
ఎప్పుడు తప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడదది యెట్లన్నన్
సప్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ.
తా. ఎంతపని చేసినను అతని యందు దోషమునే వెదకుచుండు యజమాని యొక్క కొలువును మానుకొనవలెను, లేని యెడల సర్పము పడగ క్రింద ఉన్న కప్పరీతి ఆపదలకు గురికాగలరు.
ఎచ్చటనైనను అవసరము కంటే అధికముగా చేసిన పని కష్టములకే కారణ మగును. శ్రమ తెలిసికొనలేని యజమాని యొక్క సేవయు, చెడ్దవాని వద్ద కొలువును మిక్కిలి ఆపదలు కలిగించును.
ఆలము3 - ఉపేక్ష, 1.ఉపేక్షితము, అనాదరింపబడినది, 2.అసత్యమైనది.
ఉపేక్ష - 1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము.
అశ్రద్ధ - 1.ఆసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి, (కడపటి రెండర్థములును తెనుగునందు మాత్రమే గలవు).
అసడ్ద - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
కక్కుఱితి - 1.లోభము, 2.అశ్రద్ధ.
లోభము - 1.కక్కురితి, 2.పితలాటకము, 3.పిసినితనము.
పితలాటము - మోసము(వంచన - మోసము), రూ.పితలాటకము.
నిర్లక్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దైవాధీనమైనది, (Casual), వి.అశ్రద్ధ.
బొంకు - కల్లమాట, క్రి.కల్లలాడు.
బొంకరి - కల్లలాడువాడు.
అలికము - నొసలు, లలాటము, రూ.అళికము.
నొసలు - నుదురు; లలాటము - నుదురు; నుదురు - నొసలు.
నిటలము - నొసలు, రూ.నిటాలము.
నిటలాక్షుఁడు - శివుడు.
శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ౠతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి, సం.క్రాంతిః.
18. జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
జ్యేష్ఠా నక్షత్రయుక్తా స్మిన్నితి జ్యేష్ఠః - జ్యేష్ఠా నక్షత్రముతోఁగూడిన పున్నమ దీనియందు గలదు.
శోచ యతి ప్రాణిన ఇతి శుక్రః శుచ శోకే - తాపము చేత ప్రాణులను దుఃఖింపఁ జేయునది.
హంస - 1.అంౘ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము రూ.హంసము.
అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ. చతుర్థం హంసవాహనా|
అంౘపదము - వ్రాతయందు వదలి పోయిన అక్షరములను ఎత్తి వ్రాయునపుడు ఉంచెడు గుర్తు, హంసపాదము.
యమి - 1.ముని, 2.హంస.
ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
చతురాసన సమ్రాజ్ఞీ బ్రహ్మవిష్ణుశివాత్మికా,
హంసాసనా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ.
యోగి - యోగ్యాభ్యాసము జేయు పురుషుడు.
(ౙ)జోగి - 1.యోగి, 2.భిక్షుకుడు, సం.యోగీ.
భిక్షుకుఁడు - బిచ్చగాడు.
భిక్షువు - సన్న్యాసి, బ్రహ్మచారి, (చరి.)బౌద్ధ సన్న్యాసి.
యతి - 1.పద్యవిశ్రమస్థానము, 2.సన్న్యాసి.
పురుషుఁడు - 1.పరమాత్మ, 2.మనుష్యుడు.
పురుషకారము - పురుషప్రయత్నము.
పౌరుషము - 1.పురుషము, 2.పురుష ప్రయత్నము, పురుషవ్యాపారము, 3.పరాక్రమము.
పొరుషేయము - పురుషుడు చేసినది, (వేదములు పౌరుషేయములు కావు).
పురుషకారము - పురుషప్రయత్నము.
పురుషార్థములు - ధర్మార్థకామమోక్షములు.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.
ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదర్ధాలున్నయి. 1) హంస-అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగు వేళ వాయువు "హ" కారములో బహిర్గతమై "స" కారములో లోపలికి వస్తుంది అంటే హంస శబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉంది. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్ర రూపిణీయైన దేవికి వందనాలు. - శ్రీ లలితా త్రిశతీనామావళిః
ఓం హంసిన్యై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులూన్నయి. అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేదము.
ఓం పంచయజ్ఞ ప్రియాయై నమః : అగ్ని హోత్ర, దర్శ, పూర్ణమాస, చతుర్మాస, పశుసోమాలు - పంచ యజ్ఞలని పిలువ బడతాయి. ఈ పంచ యజ్ఞాలయందు ప్రీతిగల మాతకు(లలిత) వందనాలు.
వంచ యింతలేక నెటువంటిమహాత్ముల నాశ్రయించినన్
కొంచెమె కాని యేలు సమగూడ దదృష్టములేనివారికిన్
సంచితబుద్ధి బ్రహ్మ నవిశంబును వీఁపునమోయునట్టి రా
యంచకుఁదమ్మి తూండ్లు దిననాయె కదాఫలమేమి, భాస్కరా.
తా. సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సంచితబుద్దితో వీపున మోసెడి రాజహంసకు(రాజహంస - 1.రాయంచ, 2.ఎఱ్ఱని ముక్కు కాళ్ళుగల హంస, 3.మధురముగ బలుకు హంస.)బ్రహ్మనుమోయు ఫలితము లేదాయెను. అది తామరతూండ్లనే తినవలసి వచ్చెను. మోసగించక సేవ చేయువారి కావంతయు లాభ ముండదు.(ఈ పద్య మందుపమానము న్నను రాయంచ లోపమేమియు వ్యక్తీకరించలేదు. అందుచే సమభావము పారమార్ధికనిమిత్తముగా నుండునుగదా, అందుతప్పే మున్నది.)
తూఁడు దిండి - హంస, వ్యు. తూడే భోజనముగా కలది.
చక్రము - 1.శ్రీకృష్ణుని ఆయుధము, 2.బండికల్లు, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము, 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.
చక్రాంగము - 1.హంస, 2.జక్కవ.
చక్రపక్షము - హంస.
తాటి రిక్కనెల - జ్యేష్ఠమాసము; పెద్దనెల - జ్యేష్ఠమాసము.
కందాయము - సంవత్సరమున మూడవ భాగము, జ్యేష్ఠాది మాస చతుష్టయము.
ఆయతి1 - 1.రాబడి, 2.నిడుపు, 3.రాగలకాలము, 4.కోశ దండముల వలన రాజునకు గలుగుశక్తి, ప్రభావము, 5.ఫలము గలుగు సమయము, 6.ప్రాపణము, 7.కూడిక, 8.పని, 9.సంయమము.
ఆయతి2 - జేష్టాది మాసచతుష్టయము, కందాయము.
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీ సంయోగము, 3.లాభము, 4.చెలిమి(చెలిమి - స్నేహము), 5.రాబోవుకాలము, ఆయతి.
కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
చినుకు - క్రి.1.కారు, 2.కురియు, 3.కార్చు, వి.వానబొట్టు.
వయసు - ప్రాయము, యౌవనము.
ప్రాయము - 1.వయస్సు, 2.బాహుళ్యము, 3.చావు.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది సంవత్సరముల(16-50)వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు; స్నేహితుఁడు - చెలికాడు.
కారు2- వి. 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, ముదిమి.
ఉప్పు - క్రి. ఆవిరిపోకుండ ఉడక బెట్టు వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
పెడ - 1.పెద్ద, 2.వెనుకటిది, 3.విపరీతము, సం.వృద్ధః.
పెరుఁగు - వృద్ధిచెందు, ఎదుగు, వి.దధి,, విణ.వృద్ధుడు.
జ్యేష్ఠుఁడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రజుఁడు - 1.బ్రహ్మ, 2.బ్రాహ్మణుడు, 3.అన్న. బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
జ్యేష్ఠంబున మిత్రాభిధానంబున నత్రి పొరుషేయుండు; తక్షకుండు మేనక హాహా రథస్వనుం డను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; జ్యేష్ఠ మాసంలో సూర్యుడు మిత్రుడన్న పేరు దాల్చి అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హా, హ రథస్వనుడు అనే పరిచరులతో కలిసి ప్రవర్తిస్తుంటాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun. సర్వభూతేషు మేద్యతి స్నిహ్యతీతి మిత్రః, ఞి మిదా స్నేహనే - సర్వభూతములయందు స్నేహ యుక్తుఁడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). అనసూయ - 1.అసూయలేమి, 2.అత్రిమహర్షి భార్య.
తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు - తక్షకుడు.
పొరుషేయము - పురుషుడు చేసినది (వేదములు పౌరుషేయములు కావు).
పౌరుషము - 1.పురుషము, 2.పురుష ప్రయత్నము, పురుష వ్యాపారము, 3.పరాక్రమము.
పురుషకారము - పురుషప్రయత్నము.
పురుషార్థములు - ధర్మార్థకామ మోక్షములు.
మేన1 - మేనక.
మేనకాయాః ఆత్మజా మేనకాత్మజా - మేనక కూతురు, పార్వతీదేవి.
మేన2 - తోడబుట్టిన దాని యొక్కయు, తల్లిదండ్రుల తోడబుట్టిన వారి యొక్కయు దేహసంబంధము, ఉదా. మేనకోడలు, మేనత్త.
పితృదేవతల మానస పుత్రియై హిమగిరి పత్నియైన మేనక, ప్రకృతి కళవల్ల పుట్టిన స్త్రీ.
ఒక పేరుంది - అ పేరుకు మధ్య అక్షరం తీసేస్తే నాలుగు కాళ్ళ జంతువు పేరొస్తుంది - మే(న)క.
శీతకారు - (వ్యవ.) డిసెంబరు December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, అను కార్తెలు, హేమంత ఋతువు (Winter season).
శీత - నాగటిచాలు, రూ.సీత.
వరజు - నాగటి చాలు, సీత.
ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి | యస్మిన్ వృత్రం వృత్ర తూర్యే తతార | తస్మిన్వయ-మమృతం దుహానాః | క్షుధంతరేమ దురితిం దురిష్టిమ్ | పురందరాయ వృషభాయ ధృష్ణవే | అషాఢాయ సహమా-నాయ మీఢుషే | ఇంద్రాయ జ్యేష్ఠా మధుమద్దుహానా | ఉరుం కృణోతు యజమానాయ లోకమ్ ||17||
తాటిరిక్క నెల - జ్యేష్ఠమాసము.
తాటిరిక్క - జ్యేష్ఠా నక్షత్రము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
రిక్క - నక్షత్రము, ఋక్షమ్.
రిక్షము - రిక్క, రూ.ఋక్షము.
రిక్కదారి - ఆకాశము.
ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రుని భార్య, 4.జ్యేష్ఠానక్షత్రము, 5.తూర్పు.
జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
జయంతః పాకశాసనిః,
ఇంద్రుని కొమారుఁడు జయంతుఁ డనంబడును. జయంతి శత్రూనితి జయంతః - శత్రువులను జయించువాఁడు.
జి.జయే సౌందర్యేణ సర్వానభిభవతీతివా - సౌందర్యముచే నందఱిని బరిభవించువాఁడు.
పాకశాసనస్యాపత్యం పాకశాసనిః. ఈ-పు. - ఇంద్రుని కొడుకు.
పాకశాసనుఁడు - ఇంద్రుడు, వ్యు.పాకుడను రాక్షసుని పరిమార్చిన వాడు.
పాకం వృత్రాసురభ్రాతరం శాసితవాన్ పాకశాసనః - వృత్రాసురుని సోదరుఁడైన పాకాసురునిఁ జంపినవాఁడు.
పాకం గర్భం శిక్షితవాన్ - గర్భమును శిక్షించినవాఁడు. శాసు అనుశిష్టౌ.
పాకశాశని - 1.అర్జునుడు, 2.జయంతుడు, వ్యు.పాకశాసనుని కొడుకు.
ఐంద్రుడు - ఇంద్రపుత్రుడు, వి.1.జయంతుడు, 2.అర్జునుడు, 3.వాలి.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ|
వాలిఁడి - (వాలు+ఇఁడి)1.తోకలేని కోతి, 2.తోకలేనిది.
వాలిశుఁడు - విష్ణువు. గర్విత వాలిసంహారక రామ్|
మునుపొనరించుపాతక, మమోఘము జీవుకెల్ల బూనియా
వెనుకటి జన్మం దనుభవింపకదీరదు, రాఘవుండు వా
లిని బడవేసి తా మగుడ లీల యదూద్భువుడై కిరాతుచే
వినిశిత బాణపాతమున వీడ్కొనడే తనమేను, భాస్కరా.
తా. రఘురాముడు వాలిని వధించిన యనంతరము రామావతారము చాలించి తిరిగి యదుకుల సంభూతుడై పుట్టెను. ఆ కృష్ణావతారము(కృష్ణమూర్తి-కృష్ణావతారము)నందు యుగాంతమునకు దాపుగా శ్రీకృష్ణుడు అడవిలో తపము చేయుచుండగా నొక కిరాతు డాతనిని(కిరాతుఁడు - ఆటవికుడు, అడవియందు తిరిగెడు బోయ.)మృగముగా భావించి యొక వాడికోల నేయగా దానిచే కృష్ణుడు తనమేనుఁ బాసెను. కావున సమస్తజీవులకు పూర్వజన్మమున జేయు పాపఫల మేజన్మమందు ననుభవింపక తీరదు.
యో వాలినా ధ్వస్తబలం సుకంఠం న్యయోజద్రాజపదే కపీనామ్|
తం స్వీయసంతాపసుతప్తచిత్తం శ్రీజానకీజీవనమానతో(అ)స్మి|
జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము.
పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రుపురముల నాశమొనర్చువాడు.
పురాణి అరీణాం దారయతీతి పురందరః - శత్రుపురముల వ్రక్కలించినవాఁడు. దౄవిదారణే.
పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.
పురంధ్రి - కుటుంబిని, స్త్రీ.
కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
జిష్ణువు - 1.ఇంద్రుడు, 2.అర్జునుడు, విణ.జయశీలుడు, రూ.జిష్ణుడు.
జయశీలో జిష్ణుః ఉ-పు. - జయించు శీలము గలవాఁడు.
జిత్వరుఁడు - జయశీలుడు.
జేతా జిష్ణుశ్చ జిత్వరః,
జయతి తాచ్ఛీత్యేనజేతా, ఋ. జిష్ణుః,, ఉ. జిత్వరశ్చ, జి జయే. - స్వభావముననే గెలుచువాఁడు గనుక జేత, జిష్ణువు, జిత్వరుఁడును. ఈ 3 గెలుచు స్వభావము గలవాని పేర్లు.
ఫల్గునుఁడు – అర్జునుడు.
పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
గెలుపు పేరుగలఁవాడు - పార్థుడు, అర్జునుడు, విజయు డను పేరు గలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణుద్వారపాలకులలో నొకడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి(కపి - కోతి)చిహ్నము ధ్వజమందు కలవాడు.
కిరీటి - 1.అర్జునుడు, వ్యు.ఇంద్రదత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి.
క్రీడి - అర్జునుడు, సం.కిరీటి.
శ్వేతవాహనుఁడు - 1.చంద్రుడు, 2.అర్జునుడు.
బీభత్సుఁడు - అర్జునుడు, వివచ్చుడు, విణ.వికారము గలవాడు.
వివచ్ఛుఁడు - అర్జునుడు, సం.బీభత్సః.
ధనంజయుఁడు - 1.అగ్ని, 2.అర్జునుడు.
గుడాకేశుడు - 1.అర్జునుడు, 2.శివుడు, వ్యు.జెముడువలె గుబురుగా పెరిగిన జుట్టు కలవాడు.
బృహన్నల - అజ్ఞాతవాసము నందలి అర్జునుని పేరు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.
కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
భుజబలశౌర్యవంతులగు పుత్రులఁగాంచిన వారికెయ్యెడన్
నిజహృదయేప్సితార్థములు నిక్కముచేకురు కుంతిదేవికిన్
విజయబలాఢ్యునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా
గజమునుదెచ్చి తల్లివ్రతకార్యముఁదీర్పడె తొల్లి భాస్కరా.
తా. కుంతీదేవికి వీరుడును, పరాక్రమ వంతుడును యగు (న)అర్జునుడు కుమారుడగుట చేతనే తల్లివ్రతమును సఫలము చేయుటకు ఐరావతము ను సైతము తీసికొని వచ్చి ఆ పనిని నెరవేర్చెను. పరాక్రమవంతులగు పుత్రులనుగన్న తల్లితండ్రు లకు కావలసిన కోర్కెలన్నియు సమకూరును గదా.
గాండీవము - అర్జునుని విల్లు, రూ.గాండీవము.
గాండీవి - అర్జునుడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపిచిహ్నము ధ్వజమందు కలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
కపిధ్వజస్య గాణ్డీవ గాణ్డివౌ పుంనపుంసకౌ,
గాండీకృతం అశ్లక్షీ కృతం పర్వస్థాన మస్యేతి గాండీవః, గాండివశ్చ. ప్న. - నునుపుగాఁ జేయఁబడని గణుపులు గలది. ఈ ఒకటి అర్జునుని వింటి పేరు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
భూరిబలాఢ్యుడైనఁ దలపోయగ విక్రమశక్తిచే నహం
కారము నొందుటల్ తగవుగా దతడొక్కడె మోసపోవుగా
వీరవరేణ్య డర్జునుడు వింటికి నే నధికుండ నంచుఁ దా
నూరక వింటినెక్కిడఁగనోపడు కృష్ణుడులేమి, భాస్కరా.
తా. అర్జునుడు జగదేక వీరుఁడనని గర్వించి, తానే తన గాండీవమునకు దగినవాడనని తలంచుచు శ్రీకృష్ణ(కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.) నిర్యాణానంతరము ఆ విల్లు నెక్కుపెట్టుట కైనను చాలని వాడాయెను. అట్లే మనుష్యుడు తనకు భుజబల మున్నదని గర్వించి, తానే గొప్పవాడనని చెప్పుకొనరాదు. అట్లగునేమి నొకప్పుడు మోసపోవును.
సురపతి - ఇంద్రుడు.
సురాణాం పతి స్సురపతి - దేవతలకుఁ బ్రభువు.
సురలు - వేలుపులు.
సురతాణి - 1.ఇంద్రుడు, 2.ఇంద్రాణి, సం.సురత్రాణః.
ఇంద్రుఁడు - 1.దేవతలర్రాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
పులోమజ - శచీదేవి, వ్యు.పులోముని కూతురు.
పౌలోమి - శచీదేవి.
ఇంద్రాణీ - ఇంద్రుని భార్య, శచీదేవి. దేవ లోకమందు దేవీస్థానం ఇంద్రాణి|
పులోమజా శ చీంద్రాణీ :
పులోమ్నో మునేర్జాతా పులోమజా - పులోముఁడను ముని వలనఁ బుట్టినది.
తస్మా జ్ఞాతేతివా - విస్తారమైన రోమములు గలవాఁడు పులోముడు. అతని కూతురు. జనీ ప్రాదుర్భావే.
శచతి హంసవద్గచ్ఛతీతి శచీ - హంసవలె నడచునది. శచి శ్వచి గతౌ.
ఇంద్రస్య పత్నీ ఇంద్రాణీ. ఈ.సీ. - ఇంద్రుని భార్య. ఈ మూడు 3 శచీదేవి పేర్లు.
పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా|
పులోమజార్చితా బంధ-మోచనీ బర్బరాలకా.
బలసూదనుఁడు - ఇంద్రుడు.
బలాఖ్యస్యాసురస్య అరాతి ర్బలరాతిః - బలాసురునికి శత్రువు.
శచీపతి - ఇంద్రుడు.
శచ్యాః పతి శ్శచీపతిః ఇ-పు. - శచీదేవికి భర్త.
జంభారి - ఇంద్రుడు; జంభభేది - ఇంద్రుడు.
జంభఖ్య మసురం భిన్తతీతి జంభభేదీ, న-పుః. - జంభాసురుని భేదించినవాఁడు. భిదరే విదారణే.
డింభాకృతియుత రంభానటరత
జంభారివినుత కుంభోద్భవనుత||శరవణభవ||
స్వారాట్టు - ఇంద్రుడు.
స్వః స్వర్గేరాజ త ఇతి స్వరాట్. జ-పు. - స్వర్గమందుఁ బ్రకాశించువాఁడు. రాజృ దీప్తౌ.
సురలోకము - స్వర్గము.
స్వర్గము - దేవలోకము.
స్వర్భానుఁడు - రాహువు Rahu.
స్వః స్వర్గే భాతీతిస్వర్భానుః. ఉ. పు. భాదీప్తౌ - స్వర్గమునందు ప్రకాశించువాడు.
అమరావతి - 1.ఇంద్రుని పట్టణము, 2.స్వర్గము, 3.గుంటూరుజిల్లాలోని ప్రాచీన పట్టణము.
నగరీ త్వమరావతీ,
అమరా అస్యాం సంతీ త్యమరావతీ, ఈ-సీ. - దేవత లిందు నివసించి యుందురు. ఈ ఒకటి ఇంద్రగిరి అమరావతి యనంబడు.
స్వారాజ్యము - స్వర్గలోకపు దొరతనము.
వృషుఁడు - 1.వీర్యవృద్ధి గలవాడు, 2.ఇంద్రుడు.
వృషాకపి - 1.విష్ణువు, 2.శివుడు, 3.అగ్ని.
హర విష్ణూ వృషాకపీ,
వృషాకపిశబ్దము శివునకును, విష్ణువునకును పేరు. ప. అగ్నికి, ఇంద్రునికిని పేరు. వృషేణ ధర్మేణ అకంతి యాంతితి వృషాకాః ధర్మశీలాః, తాన్ పాతీతి వృషాకపి. పు. అక కుటిలాయాం గతౌ. పా రక్షణే. - ధర్మముచేత చరించువారు వృషాకలు; వారిని రక్షించువాఁడు.
వృషాకపాయి - 1.లక్ష్మి, 2.పార్వతి, 3.శచి, 4.స్వాహా.
స్వాహా - అగ్నిభార్య.
వృషాకపాయీ శ్రీ గౌర్యోః -
వృషాకపాయీశబ్దము లక్ష్మికిని గౌరీదేవికిని పేరు. వృషాకపేః స్త్రీ వృషాకపాయీ, ఈ. సీ. వృషాకపులనఁగా హరిహరులు. వారిభార్యలు. టీ. స. అగ్నిభార్యయా మింద్రాణ్యాం చ వృషాకపాయీ శబ్ద్యోవర్తతే.
శచీ ముఖ్యామర వధూ సేవితాయై నమో నమః|
జ్యేష్ఠ - 1.ఒక నక్షత్రము, 2.పెద్దమ్మ.
పెద్దమ్మ - 1.జ్యేష్ఠాదేవి, 2.పెద్దతల్లి.
మూదేవి - (వ్యవ.) పెద్దమ్మ.
జెష్ఠ - 1.దారిద్ర్యదేవత, 2.పెద్దమ్మ, సం.జ్యేష్ఠా. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం.
భ్రష్టున కర్ధవంతులగు బాంధవు లెందఱు గల్గినన్, నిజా
దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపగలేరు సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల కతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి
జ్యేష్ఠ కదేటికిం గలుగ జేయదు తోడనెబుట్టి, భాస్కరా.
తా. అందరకును భాగ్యమిచ్చు లక్ష్మి తన తోబుట్టువైన జ్యేష్ఠాదేవికి సంపద (సంపత్తి - సంపద, సంవృద్ధి.)నీయజాలక పోయెను. అట్లే పనికిమాలిన వానికి భాగ్యవంతులగు చుట్టము లెందరున్నను అతనికి అదృష్ఠరేఖ లేనిచో బీదవాడైయుండును.
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా,
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ.
అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు Sun, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.
అంబరీషము - 1.యుద్దము, 2.మంగలము, 3.పశ్చాత్తాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అమ - 1.తల్లి, 2.పూజ్యురాలు, రూ.అమ్మ, సం.అంబా.
అమ్మ - 1.తల్లి, 2.పూజ్యురాలు, సం.అంబా. అవ్య. ఆశ్చర్యాది వాచకము, ఔర.
అమ్బా మాతా -
అంబ్యతే శబ్ద్యతే బాలై రిత్యంబా. అబి శబ్దే. - బాలురచేఁ బిలువఁబడునది. ఈ ఒకటి తల్లిపేరు.
అంబ - 1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.
భ్రమరాంబ - అంబ, పార్వతి.
భ్రామరి - పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతురు. శ్రీశైలే భ్రమరాంబికా శక్తిపీఠం|
అథ మాగధీ, గణికా యూథి కామ్బష్ఠా -
మగధదేశే ప్రచురా మాగధీ - మగధదేశమందు ప్రచురమైనది.
గణిక - 1.ఆడేనుగు, 2.వేద్య.
గణికావచ్చిక్తకర్షణాద్గణికా - వేశ్యవలె మనస్సును హరించునది.
యూధము - సజాతీయ పశుసమూహము.
యూథోజాల మస్యా ఇతి యూథికా - గుంపు గలిగి యుండునది.
అంబః భ్రమరాణాం ధ్వని; సో (అ)త్ర తిష్ఠతీతి అంబష్ఠా, ష్ఠా గతినివృత్తౌ. - తుమ్మెదలమ్రోత దీనియం దుండును. ఈ 4 అడవి మొల్ల పేర్లు.
అంబిష్ట - (వృక్ష.) 1.అడవి మొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి.
అమ్లము - 1.పులుపు, 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ, 3.పులిసిన పెరుగు, 4.పులిచింత, 5.దబ్బ.
అంబిక - 1.తల్లి, 2.మేనత్త, 3.పార్వతి, 4.ధృతరాష్ట్రుని తల్లి.
అమ్మిక - పార్వతి, దుర్గ, సం. అంబికా.
జగన్మాతృత్వా దంబికా - లోకముల తల్లి. అంబతే జనయతి సర్వ మంబికా - సమస్తమును జనింపఁ జేయునది. అంబ జననే.
అమ్మి - 1.అమ్మాయి, 2.నీచజాతి స్త్రీ, సం.అంబిః.
అమ్మాయి - 1.బాలిక, చిన్నపిల్ల, 2.కూతురు.
కుమారి - 1.కూతురు, 2.పెండ్లికాని ఎనిమిదేండ్ల పడుచు, 3.పార్వతి.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
ఆంబికేయుఁడు - 1.ధృతరాష్ట్రుడు, 2.కుమారస్వామి, 3.వినాయకుడు.
మేన1 - మేనక. ఒక పేరుంది - అ పేరుకు మధ్య అక్షరం తీసేస్తే నాలుగు కాళ్ళ జంతువు పేరొస్తుంది - మే(న)క.
మేనకాయాః ఆత్మజా మేనకాత్మజా - మేనక కూతురు, పార్వతీదేవి.
మేన2 - తోడబుట్టిన దాని యొక్కయు, తల్లిదండ్రుల తోడబుట్టిన వారి యొక్కయు దేహసంబంధము, ఉదా. మేనకోడలు, మేనత్త.
వ్రతినీ మేనకా దేవి బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ,
ఏకాక్షరపరా తారా భవబంధ వినాశినీ.
మైనాకుఁడు - హిమవంతుని కొడుకు, మైనకాత్మజుడు.
భూప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రం యుతేనచ|
సేతుస్స్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృ వందనే||
తా. ఆరుమారులు భూప్రదక్షిణంబులు, పదివేలమారలు గంగా స్నానంబులు, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించి నందున కలుగు ఫలము తమ తల్లికి ప్రీతిపూర్వకముగా వందన (వందనము - 1.పూజ, 2.స్తోత్రము 3.నమస్కారము)మాచరించుటవలన కలుగును. - నీతిశాస్త్రము
పురుషార్థ ప్రదా పూర్ణా భొగినీ భువనేశ్వరీ,
అంబికా నాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా. – 69శ్లో
అయ్య - తండ్రి, విణ.పూజ్యుడు, రూ.అయ, సం.ఆర్యః.
అయ - 1.తండ్రి, 2.పూజ్యతను తెలుపు పదము, 3.పురుషనామము లకు అనుప్రయుక్తము, రూ.అయ్య, సం.ఆర్యః.
ఆర్యుఁడు - 1.పూజ్యుడు, 2.మంచివాడు, (చరి.) (Aryan), వి.1.ఆర్యావర్త దేశపువాడు, 2.(నాట.) నటి భర్తను పిల్చునపుడు వాడెడు పేరు, నాట్య పరిభాషయందు పెనిమిటి.
ఆర్య - 1.పదునారెండ్ల కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద.) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట.) నటుడు భార్యను పిల్చునపుడు వాడెది మాట.
ఆర్యాణి - 1.పూజ్యురాలు, 2.పార్వతి.
ఆఁడుతోడు - సోదరి, తోడబుట్టువు.
సహజ - తోడబుట్టినది.
భగినీ స్వసా,
భగిని - సహోదరి; సహోదరి - తోడబుట్టినది.
భగః కల్యాణం శ్రేయః వివాహే అస్యా ఇతి భగినీ - వివాహ మందిలి శ్రేయస్సు గలది.
స్వస - తోడపుట్టునామె.
సుష్ఠు అస్య సోద రాయాసమితి స్వసా. ఋ. సీ. అసు క్షేపణే. - సోదరుని (యా)ఆయాసమును బోఁగొట్టునది. ఈ రెండు తోడఁ బుట్టిన స్త్రీ పేర్లు.
నందన - 1.కూతురు, 2.అరువది సంవత్సరములలో ఒకటి.
కూఁతురు - కుమార్తె. ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
ననన్దా తు స్వసా పత్యుః :
న నన్దయతీతి ననన్దా. ఋ. సీ. టు నది సమృద్ధౌ. - సంతోషింపఁ జేయనిది. దీర్ఘ మధ్యమంబును హ్రస్వమధ్యమంబును గలదు. "నవనాన్దతు స్వసాపత్యుర్న నాన్దా నన్దినీచ" నేతి శబ్దార్ణవే. - మగనితోడఁ బుట్టిన స్త్రీ పేరు. ఆఁడుబిడ్ద.
ఆఁడుపాప - 1.కన్యక, 2.ఆడుబిడ్ద, 3.స్త్రీ శిశువు.
ఆఁడుఁబడుచు - 1.కూతురు, 2.మగని సోదరి, రూ.ఆఁడబడుచు.
వదినె - అన్నభార్య, మగని తోబుట్టువు, మేనత్త మేనమామలకూతురు, భార్యాక్క, సం.వధూని.
జననము - 1.పుట్టుక, 2.వంశము.
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక; ప్రాదుర్భావము - పుట్టుక.
ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి.
జనయిత్రీ ప్రసూర్మాతా జననీ -
జనయతీతి జనయత్రీ; జననీ చ. సీ. జనీప్రాదుర్భావే. - కొడుకులఁ గనునది.
ప్రసూతే ప్రసూః. ఊ. సీ. షూఙ్ ప్రాణి ప్రసవే. - కొడుకులను గనునది.
మాతి వర్తతే గర్భో త్ర మాతా. ఋ. సీ. మామానేవర్తనే చ - గర్భ మీమెయం దిమిడి యుండును. ఈ నాలుగు తల్లి పేర్లు.
తలి - జనని, తల్లి.
అగ్నిశిఖము - కుంకుమపువ్వు; వహ్నిశిఖము - కుంకుమపువ్వు; ఘుసృణము - కుంకుమపువ్వు.
కుంకుమపువ్వు - అగ్నిశిఖయను అంగడి దినుసు, కాశ్మీరము, (వ్యవ.) 'ఇరిడేసి' (Iridacease) అను కుటుంబమునకు చెందిన Crocus sativus అను మొక్క యొక్క పుష్పముల లోని కీలాగ్రములు. ఇవి నారింజవర్ణముతో గూడిన ఎరుపు రంగు కలిగియుండును. ఇది పరిమళ ద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగింపబడు చుండును (Saffron).
కాశ్మీరము - 1.కుంకుమవ్వు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీరదేశము. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం|
అంబరు- ఒక పరిమళద్రవ్యము, సం.అంబరమ్.
అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమపువ్వు, 6.అంబరు అనెడి పరిమళ ద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.
కృమి - 1.పురువు, 2.లక్క.
పురుగు - క్రిమి, పురువు, సం.పులకః
క్రిమి - 1.కీటకము, పురుగు, 2.లక్క, 3.సాలెపురుగు.
రక్ష - 1.రక్షణము, 2.లక్క.
క్షతఘ్నము - లక్క; యావము - లక్క.
అలక్తము - లక్క, లత్తుక. లత్తుక - లక్క, సం.లాక్షా. లాక్ష - లక్క.
కృపణము - కీటకము, విణ.కుటిలమైనది.
కీటకము - పురుగు, రూ.కీటము.
కీటము - కీటకము.
కీటకములు - (జం.) ఆరు కాళ్ళుగల చిన్న ప్రాణులు (పురుగులు) (Insects).
కీటకశాస్త్రము - (జం.) పురుగుల జీవితమును గూర్చి తెలియజేయు శాస్త్రము (Entomology).
కనీనికాపటలము - (జం.) కృపణము, కనుపాపను పెద్దదిగను, చిన్నదిగను చేయు కండరములు గల పొర (Iris).
ఐరిస్ - (జం.) (Iris) కనుపాపలో దృష్టిని క్రమపరచు భాగము.
కనుపాప - (జం.) కనీనికాపతలమునకు గల రంధ్రము, (దీనిగుండా వెలుతురు కంటిలోనికి ప్రవేశించును). (Pupil.)
కృపణము - కీటకము, విణ.కుటిలమైనది.
పాప - 1.శివుడు, 2.కంటి నల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.
స్పర్శసూత్రములు - (జం.) కొన్ని కీటకముల తల ముందు భాగమున నుండు పొడవైన సూత్రములవంటి అవయవములు (Antennae) (వీనితోనవి స్పృశించి వస్తువులను తెలిసికొన గలవు).
ప్రశ్వాసరంధ్రము - (జం.) కీటకముల శరీరములలో నుండు శ్వాసనాళికలు బయటికి తెరచుకొను ఒక రంధ్రము. ఉభయ చర జంతువులలో మొప్పుల చీలిక లుండుగది బయటికి తెరచుకొను రంథ్రము (Spiracle).
గ్లోసా - (జం.) (Glossa) కీటకముల నోటి భాగములో నొకటి, జిహ్వ.
జిహ్వ - నాలుక, (Lingua) కీటకముల క్రింది పెదవి, (Labium)లో గల మూడు భాగములలో నొకటి. చిబుకము (Mentum) (Sub-mentum) అనునవి తక్కిన రెండు భాగములు.
నాలుక - నాలిక; నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వచాపల్యము - తినవలెననెడి కోరిక.
ఉష్ఠీషము1 - (జం.) అంతర్జిహ్వ, Galea, lacinia అను రెండును కీటకముల నోటి భాగములలో మొదటి ఉత్తర హనువునకు జెందిన భాగములు.
ఉష్ఠీషము2 - తలపాగ, కిరీటము, వ్యు.వేడిని తగలకుండ చేయునది.
అధోవ్భంతము - (జం.) కీటకముల హనువు (Maxilla)లో ఉండు మొదటి తునక.
ఉద్వృంతము - (జం.) కీటకముల హనువు (Stipes maxilla)లో అధోవృంతము తర్వాత నున్న తునక.
ఉదోష్ఠము - (జం.) కీటకముల పై పెదవి (Labrum).
ఓష్ఠమృశములు - (జం.) కీటకముల నోటి భాగములలో ఒకవిధమైన భాగములు (Labial palps).
పృష్ఠఫలకము - (జం.) కీటకముల ఉరఃపంజరము యొక్క ప్రతిభాగము నకు గల బాహ్యకంకాళములో పృష్ఠభాగమున నుండు కైటిన్ పట్టము (Tergum).
పరిక్లోమములు - (జం.) కీటకములు ఉరఃపంజరమునకు గల బాహ్య కంకాళములో ప్రక్కలనున్న కైటిన్ పట్టములు ఉరః పంజరములో నుండు రెండు పొరలు గల అస్తరు ఒక పొర ఊరిరితిత్తులపైన, మరియొకపొర ఉరః కుహరము చుట్టును ఉండును (Pleura).
అగ్రోరము - (జం.) కీటకముల రొమ్ము భాగములో తల తరువాత నున్న భాగము (Prothorax).
ఉరఃపంజరము - (జం.) (కీటకముల) శరీరము ఏర్పడిన మూడు భాగములలో మధ్యభాగము, పాలిచ్చు జంతువులలో రొమ్ముభాగము (Thorax).
ఉరోమధ్యము - (జం.) కీటకము యొక్క రొమ్మునకు గల మూడు భాగములలో మధ్యభాగము (Mesothorax).
ఉరఃపశ్చము - (జం.) (కీటకముల) రొమ్ముభాగములో క్రిందివైపున నున్న భాగము (Meta-thorax).
ఉరగము - 1.పాము, వ్యు.రొమ్ముతో ప్రాకునది, 2.ఆశ్లేష నక్షత్రము.
యకృత ఉణ్డుకములు - (జం.) కీటకముల అన్నవాహికలో అంతర్జఠరము తర్వాత భాగముపై నుండు వేళ్ళవంటి నిర్మాణములు (Hepatic caecae).
కక్షాంగము - (జం.) కీటకముల కాలి భాగములలోనిది మొదటిది (Coxa).
ఉదూరువు - (జం.) కీటకముల కాలి భాగములలో ఇది రెండవది (Trochanter).
పులకము - 1.పులగము, 2.పురుగు.
పులకరము - 1.జ్వరము, 2.గుగుర్పాటు, సం.పులకః.
సాలీఁడు - 1.సాలెవాడు, 2.సాలెపురుగు.
సాలెవాఁడు - తంతువాయుడు, నేతరి.
తంతువాయుఁడు - సాలెవాడు.
నేఁతరి - నేతకాడు; నేఁతకాడు - నేయువాడు, తంతువాయుడు.
సాలె - శాలిక నేతనేసి జీవించు ఒక జాతి, సం.శాలికః.
సాలెపురుగు - ఒకజాతి పురుగు, సం.జాలపటః.
అష్టపాద వర్గము - సంధిపాద జంతు వర్గములోని ఒక తరగతి, (ఈ తరగతికి చెందిన జంతువులను ఎనిమిది కాళ్ళుండును) ఉదా - సాలీడు, తేలు మొ.వి.
లూత - 1.సాలెపురుగు, 2.రోగము(రోగము - వ్యాధి).
లూషిక - సాలెపురుగు.
తంతునాభము - సాలెపురుగు.
సాలెపురుగు - వై.వి. ఒక జాతి పురుగు, సం.జాలపటః.
లూయతే లూతా, లూఞ్ చేదనే - ఛేదింపఁబడునది.
తంతూన్వయతి తంతువాయః, వేఞ్ తంతుసంతానే - నూలును నేయునది.
ఊర్ణ నాభావస్య ఊర్ణనాభః - ఊర్ణమనఁగా నూలు; అది నాభియందుఁ గలది.
తంతుమవలంబ్య మర్కటవ దారోహణా న్మర్కటః - నూలు పట్టుకొని మర్కటమువలె నెక్కునది. ఈ నాలుగు సాలెపురుగు పేర్లు.
దూషిక - 1.కంటి పుసి, 2.సాలెపురుగు.
నేత్రే దూషయతీతి దూషికా. ధుష వైకృత్యే - కన్నులను వికృతముగాఁ జేయునది.
కండ్ల కలక - ఒక రకపు నేత్రవ్యాధి, కనులు వాచి పుసులు కట్టు వ్యాధి (Sore eyes).
ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్ సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొరచెఁగరి; చెం చే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా? కావు; నీపాద సం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!
తా|| ప్రాణికోటులకు మోక్షము గలుగుటకు నీ పాదములు సేవించు భక్తి యొక్కటియే కారణమగును గాని, చదువులెన్ని చదివినను జ్ఞానమును, మోక్షమును గలిగించునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికిని జ్ఞానము గలిగినదా? మోక్షము కలిగినదా? నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివినది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినది? ఎరుకవాడే(తిన్నడు) మంత్రజపము చేసినాడు? వీరందరును ముక్తినొందుటకు చదువులే కారణమైనవా? - ధూర్జటి మహాకవి(ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.)
ఊర్ణాయువు - 1.పొట్టేలు, 2.ఉన్నికంబళి, 3.సాలెపురుగు, విణ.ఉన్నికలది.
ఊర్ణనాభము - సాలెపురుగు, రూ.ఊర్ణనాభి. ఊర్ణ నాభావస్య ఊర్ణనాభః - ఊర్ణమనఁగా నూలు; అది నాభియందుఁ గలది. ఊర్ణము - 1.నూలు, 2.కనుబొమల నడుమ సుడి, వి.ఉన్ని.
ఊర్ణా మేషాదిలోమ్ని స్యాదావర్తే చాన్తరా భ్రువౌ : ఊర్ణాశబ్దము గొఱ్ఱె, కుందేలు, ఎలుక మొదలయినవాని రోమములకును, కనుబొమ్మల నడుమ నుండు మహాపురుష లక్షణమైన సుడికిని పేరు. ఊర్ణోతీ త్యూర్ణా. ఊర్ణుఞ్ ఆచ్ఛాదనే. కప్పియుండునది.
కంబళ భోజన న్యాయము - గొంగళిలో భోజనము చేయుచు వెండ్రుక లేరు పద్దతి.
కంబళము - 1.జలము, 2.కంబడి, గొంగడి(రల్లకము - కంబళి), 3.కంబళిపురుగు, 4.ఏనుగుపై పరిచెడి రత్నకంబళము.
ఊర్ణనాభిరివాద్యాహం జాలేన స్వకృతేన వై |
దద్దోహ్ స్మి సుడృఢేనాత్ర కిం కర్తవ్యమితః పరమ్ ||
సాలీఁడు - 1.సాలెవాడు, 2.సాలెపురుగు.
సాలెవాఁడు - తంతువాయుడు, నేతరి.
తంతువాయుఁడు - సాలెవాడు.
నేఁతరి - నేతకాడు; నేఁతకాడు - నేయువాడు, తంతువాయుడు.
సాలె - శాలిక నేతనేసి జీవించు ఒక జాతి, సం.శాలికః.
శలకము - సాలెపురుగు.
శాలికుఁడు - సాలెవాడు.
శాలీసుఁడు - దిట్టదనము లేనివాడు.
వాయుదండము - 1.సాలెవాడు 2.నేత, సరికట్టెడు పలక.
మగ్గరి - సాలెవాడు; కువిందుడు - సాలెవాడు.
మగ్గము - సాలెవాడు నేసెడు యంత్రము.
నేఁత - నేయుట; పురుగు - క్రిమి, పురువు, సం.పులకః.
ఆసు1 - నేతపనిలో వడుగుతోడుటకు ఉపయోగించు చట్టము, సాలెవాని ఉపకరణము.
ఆసు2 - (Ace) పేకాటలో ఒకముక్క.
ఆసుపోయు - క్రి. పోగువాటించు, నూలు ఆసునతోడు.
దేండ్ర - నేతనేసి జీవించు ఒక జాతి, రూ.జేండ్ర.
జేండ్ర - దేండ్ర; దేవాంగులు - జేండ్రవారు.
పటకారుఁడు - సాలెవాడు, వ్యు.పటముల(వస్త్రముల) తయారు చేయువాడు.
పటము - 1.వస్త్రము, 2.చిత్తరువు వ్రాయు వస్త్రాదికము.
వస్త్రము - బట్ట, వలువ.
వలువ - సన్నవస్త్రము, బట్ట.
బట్ట - 1.పశువుల మేని చార, విణ.వెండ్రుక లూడినది, 'బట్టతల ' వై.వి.వస్త్రము, సం.పటః
బట్టల దొంతర్లు - (గృహ). బట్టల రాసుల మూటలు (Bales).
అస్తరు - (గృహ.) గుడ్డతో చేర్చి కుట్టిన మరియొక గుడ్ద (Lining).
డోరియా - 1.బట్టయొక్క వడుగు పేకల గళ్ళు, 2.చారలు.
దర్జీ పని - (గృహ.) సౌచకము, దుస్తులను కుట్టుట, (Tailoring).
దరిజీ - కుట్రపువాడు.
కుట్రపువాడు - దుస్తులు కుట్టువాడు, కుట్టు పనిచేయువాడు, దర్జీ.
సౌచికుఁడు - కుట్టుపనివాడు.
చిప్పెవాఁడు - కుట్రపువాడు, దర్జీ.
ఈఁగపులి - సాలెపురుగు.
పులికోచ - ఒక విషజాతి సాలెపురుగు.
చిరు సాలెపురుగులు - (వ్యవ.కీట.) కీళ్ళు కలిగి, ఎనిమిది 8 కాళ్ళతో నుండు నొక విధమైన సాలెపురుగులు, (ఇవి బెండ, ఆముదము, ప్రత్తి మొదలగు మొక్కలను పాడు చేయును.) (Mites).
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.వృద్ధః, పృథుః.
జ్యేష్ఠుఁడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అగ్రజుఁడు - 1.బ్రహ్మ, 2.బ్రాహ్మణుడు, 3.అన్న.
అధికుఁడు - గొప్పవాడు.
శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
బలభద్రుఁడు - బలరాముడు.
బలభద్రః, బలేన భద్ర శ్రేష్ఠః - బలముచేత శ్రేష్ఠుడు.
ప్రలంబఘ్నుఁడు - బలరాముడు.
ప్రలమఘ్నః ప్రలంబ మసురం హతవాన్ - ప్రలంబుఁ డను రాక్షసుని జంపినవాఁడు.
బలదేవుఁడు - బలరాముడు.
బలేన దీవ్యతీతి బలదేవః - బలముచేతఁ బ్రకాశించువాఁడు.
హలాయుఁధుడు - బలరాముడు.
హలాయుధః, హలం లాంగులం వలన ఆయుధం యస్య సః - నాఁగేలు ఆయుధముగాఁ గలవాఁడు.
నాగఁటిజోదు - బలరాముడు, హలాయుధుడు.
నాఁగలి - దున్ను సాధనము, లాంగలము, రూ.నాఁగెలు, నాఁగేలు, సం.లాంగలః.
లాంగలము - నాగలి.
లంగతి భువో తర్గచ్ఛతీతి లాంగలం. లగి గతౌ. - భూమిలోఁ జొచ్చునది.
హలము - నాగలి, రూ.హాలము.
హలతి విలిఖతి భువమితి హలం. హల విలేఖనే. - భూమిని గీఱునది.
కొండ్రకైదువు - నాగలి.
కొండ్ర - మళ్ళించి దున్నినచాలు, (వ్యవ.) వ్యవసాయదారునిగల భూమి (Land).
కొండ్రవేయుట - (వ్యవ.) మడిలో నొక వైపున కొంత వెడల్పున నాగలితో దున్ను పద్ధతి.
నాఁగటిచిప్ప - పణత, నాగలిదుంప.
నాఁగటిదుంప - పణత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
సీతా లాఙ్గల పద్ధతిః,
స్యతి భువమితి సీతా, షో (అ)న్తకర్మణి. - భూమిని నశింపఁజేయునది.
దంత్యాది, " సీతా లాఙ్గలరేఖా స్యాద్వ్యోమగంగా చ జానకీ' అని రభసుఁడు, తాలవ్యాదియుఁగలదు. "శీతా సభస్సరితి లాంగలపద్ధతౌ స్యాచ్ఛీతా దశాననరిపో స్సహధర్మణీ చ, శీలం స్మృతం హిమగుణేచ తదన్వితేచ శీతో లసే చ బహు వారతరౌ చ దృష్టః" అని తాలవ్యాదులయందు ధరణి, లాఙ్గలస్య పద్ధతిః, లాంగలపద్ధతిః, ఈ. సీ. నాఁగేటిచాలు. ఈ 2 నాఁగేటిచాలు పేర్లు.
నాఁగటి (ౘ)చాలు పేరి యతివ - సీత.
శీత - నాగటిచాలు, రూ.సీత.
వరజు - నాగటి చాలు, సీత.
హల్య - నాగళ్ళ సమూహము.
హలానాం సమూహో హల్యా. ఈ ఒకటి నాఁగేళ్ళ గుంపు పేరు.
లాఙ్గలం హలమ్, గోదారణం చ సీరః -
గాం భువం చారయతీతి గోదారణం. దౄ విదారణే. - భూమిని వ్రక్కలించునది.
దుక్కివాలు తాలుపు - బలరాముడు.
దుక్కివాలు - నాగలి.
నాగలి చేతి నుండి వదిలితే నాయుడుగారికి నాగరికం ముదురుతుందికాని భోజన సౌఖ్యముండదు.
హలి - 1.నాగలి, 2.బలరాముడు, 3.పొలముదున్నువాడు.
హల మస్యాస్తీతి హలీ, న-పు. - నాఁగలి యాయుధముగాఁ గలవాఁడు.
హలికుఁడు - పొలముదున్నువాడు.
పొలము - 1.పైరు పెట్టునేల, 2.ఊరు, 3.జాడ, 4.విధము.
ఊరు - 1.లోపలనుండి నీరు బయటికి వచ్చు, 2.నాను, 3.పుట్టు, 4.పెద్దది యగు, వి.1.గ్రామము, 2.ఏడికోల లేని నాగలి, 3.దేశము.
నాను - జలాదులందు చాలకాలముండు, వి.హారము.
తేలువాఱు - పుట్టు; పుట్టు - సంభవించు, జన్మించు.
(ౙ)జాడ - 1.అడుగుల గురుతు, 2.సైగ, 3.త్రోవ, 4.విధము.
విధము - ప్రకారము, విధి.
పొలమరి - పొలముకాపు; పొలమరి - జాడతెలిసినవాడు.
సమసధము - ఊరు; పరివసధము - ఊరు.
గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.) షడ్జాది స్వరము.
కుప్పము - గ్రామము.
సమౌ సంవసథగ్రామౌ -
సంవసంత్యత్ర సంవసథ, వస నివాసే. – దీని యందు లెస్సగా నుందురు.
గ్రస్యతే భుజ్యత ఇతి గ్రామః. గ్రసు అడనే. ప్రాణులచేత భుజింపఁబడునది. ఈ 2 గ్రామము పేర్లు.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
పరారి - ఊరు విడిచి పారిపోయినవాడు, హిం. ఫరార్.
అపథము - 1.తప్పుత్రోవ, 2.అవినీతిమార్గము, విణ.మంచిమార్గము కానిది (గ్రామాదికము).
అపమార్గము - 1.తప్పుత్రోవ, 2.ప్రక్కత్రోవ.
ఊరజోగి - ఊరియందు తిరిగి బిచ్చమెత్తుకొను సన్న్యాసి.
ఆద్వా రేణచ నాతీయాద్గ్రామందా వేశ్మనా వృతం|
రాత్రౌ చ వృక్షమూలాని దూరతః పరివర్జ యేత్||
తా. గ్రామమునకుగాని, యింటికిగాని వాకిలివిడిచి తప్పుత్రోవలో పోరాదు, రాత్రియందు వృక్ష మూలమును పరిత్యజింప వలయును. – నీతిశాస్త్రము
సంకర్షనుఁడు - బలరాముడు.
శత్రూన్ ప్రళయే జనాన్వాసంకర్షతీతి సంకర్షణః - శత్రువులను లేక ప్రళయమందు సర్వజనులఁగాని సంహరించువాఁడు.
సీరపాణి - హలాయుధుడు, బలరాముడు.
సీరపాణిః ఈ-పు. సీరం లాగలం పాణౌ యస్య సః- నాఁగేలు హస్తమందుఁ గలవాఁడు.
సీరి - సీరముకలవాడు, బలరాముడు.
సీరము - నాగలి.
సీయతే యుగేన సహ బద్ధ్యత ఇతి సీరం. షిఙ్ బంధనే. - కాఁడితోఁగూడఁ గట్టఁబడునది.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
బల మస్యాస్తీతి బలః - బలము గలవాఁడు.
అశ్మంతము - 1.పొయ్యి, 2.పొలము, 3.చావు, 4.అశుభము, 5.మేరలేనిది, విణ.మేరలేనిది.
దీనియందు ఱాతికఁ గూడ నాశము గలుగును.
ఉద్దీయతే అగ్నిరనేనేతి ఉద్దానం. డు ధాఞ్ ధారణ పోషణయోః. దీనిచేత నగ్ని ధరింపఁ బడును.
పా. "ధ్మా శబ్దాగ్ని సంయోగయోః" అను ధాతువు మీద ఉద్మానమని కొందఱు.
అధిశ్రయణి - ప్రొయ్యి; ప్రొయ్యి - పొయ్యి.
అధిశ్రియతే అనయేత్యధిశ్రయణీ. ఈ. సీ. శ్రీఞ్ పాకే. - దీనిచేత పాకము సేయఁబడును.
చుల్లి - 1.ప్రొయ్యి, 2.సొద, రూ.ఛుల్లి.
చుల్ల్యతే అగ్నిరస్యామతి చుల్లిః. చుల్ల భావకరణే. - దీనియందు అగ్ని ప్రేరేపింపఁబడును.
ఈకారంతమును గలదు.
ఛుల్లి - చుల్లి, ప్రొయ్యి.
సొద - చితి, పీనుగు కాల్చుటకు పేర్చిన కట్టెల ప్రోగు, సం.చితా.
చిత - 1.సొద, 2.ప్రోవు, రూ.చితి.
చితి - 1.సొద, 2.ప్రోగు.
ప్రోఁగు - పోగు; పోఁగు - 1.దారము, 2.చెవినగ.
దారము - పేనినత్రాడు, నూలు, పోగు (Yarn).
నూలు - 1.ప్రత్తి వడికిన పోగు, 2.తంతువు.
తంతువు - నూలుపోగు.
ఇంటింటా ఒక పొయ్యి మా ఇంట్లో మరో పొయ్యి. కర్రవంకరని పొయ్యి తీస్తుందట. పొరుగు పచ్చగా వుంటే, పొయ్యిలో నీళ్ళు పోసికొన్నారుట.
జనపదుఁడు - పల్లెటూరివాడు, రూ.జానపదుఁడు.
జానపదుఁడు - గ్రామస్థుడు, పల్లెటూరివాడు, రూ.జనపదుడు.
జానపదము - జనపదము.
జనపదము - 1.గ్రామము, 2.దేశము, రూ.జానపదము, (చరి,) ప్రాచీన భారతదేశము (క్రీ. పూ. 600 ఊత్తర హిందూ స్థానమందలి)లోని రాజ్యములు, (వీరి పరిపాలకులకు 'విరాటీ' అనిపిలుచుచుండిరి.)
నీవృత్తు - 1.దేశము, 2.గ్రామము.
నాడు - 1.నాటు, వి.1.దేశము, 2.గ్రామము.
నాటు - 1.గ్రుచ్చు, 2.గ్రుచ్చుకొను, వి.1.నాటుట, 2.గడ్దపార మున్నగు వానితో పోడిచిన రంధ్రము.
గ్రుచ్చు - 1.గాఢముగా పట్టుకొను, 2.నాటించు, 3.భేదించు, 4.పెల్లగించు.
గాఢత - (గృహ.) తీవ్రత, తీక్ష్ణత (Intensity). తీక్ష్ణణ - తీవ్రత.
గ్రామ్య మశ్లీలమ్-
గ్రామే భవం గ్రామ్యం - గ్రామమందుఁ బుట్టినది.
శ్రీఃచారుతా సా నాస్యస్మిత్యశ్లీల - శ్రీ యనఁగా నొప్పిదము; అది లేనిది గనుక అశ్లీలము. ఈ రెండు పామరజను లాడెడి పలుకుల పేర్లు.
గ్రామ్యము - 1.అశ్లీలము,, 2.అసభ్యమగు మాట, 3.పామర జనవాక్యము, విణ.1.ఊరియందు పుట్టినది, 2.తెలివిలేనిది, 3.నాగరికతలేనిది.
అశ్లీలము - 1. (అలం.) ఒక అర్థ దోషము, 2.ఒక శబ్దదోషము, 3.అసభ్య వచనము, ఏవగింపు పుట్టించినమాట, బూతు.
బూతు - 1.కుచ్చితపు తిట్టు, 2.బట్టువాడు.
చెనుటరి - గ్రామ్యపు మాట.
కావ్యదోషములు - (అలం.) పదదోషములు 17:- అప్రయుక్తము, అపుష్టార్థము, అ స మ ర్థ ము, ని ర ర్థ క ము, సేయార్థము, చ్యుత సంస్కారము, సంధిగ్ధము, అప్రయోజనము, క్లిష్టము, గూడార్థకము, గ్రామ్యము మొ.వి.
ఇమ్ముగ చదువని నోర్ను
అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్
తమ్ముల పిలువని నోరును
కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ.
తా. చక్కగా చదువనినోరు, అమ్మా! అని ప్రియమార తల్లిని పిలిచి అన్నము అడగనినోరు, తోడబుట్టిన వారిని పలుకరించనినోరు, నోరుకాదు. అది కుమ్మరీవాడు మన్నుకొఱకు తీసిన గొయ్యతో సమానము.
గ్రామణి - 1.గ్రామాధిపతి, 2.శ్రేష్ఠుడు, వి.1.మంగలి, 2.వేశ్య, (చరి.) మౌర్యుల కాలమునాటి గ్రామపెద్ద.
మునసబు - 1.గ్రామాధికారి, 2.న్యాయాధికారి.
పటేలు (మహారాష్ట్రము) - గ్రామాధికారి.
శ్రేష్ఠుడు-కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
(ౘ)చౌదరి - గ్రామమునకు పెత్తనకాడగు కాపు, (కమ్మవారి పేర్లలో చివరిభాగము, రూ.చవుదరి, సం.చతుర్.
ప్రజాపతి - బ్రహ్మ, (చరి.) 1.యుద్ధ సమయములందు కులపతులపై నుండు సైన్యాధికారి, 2.గ్రామపెద్ద.
ప్రజానాం పతిః, ప్రజాపతిః. ఈ-పు. - ప్రజలకుఁ బ్రభువు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
కల్లలాడువాని గ్రామకర్త యెరుంగు
సత్యమాడువాని స్వామి యెరుంగు
బెక్కు తిండిపోతు బెండ్లామెరుంగుదురా! విశ్వ.
తా|| అబద్దమాడువానిని (కల్ల - 1.అసత్యము, 2.పరుషవచనము.) గ్రామపెద్ద తెలుసుకొనును. సత్యవంతుని భగవంతుడు(స్వామి - 1.ఒడయుడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.)తెలుసుకొనును, పెక్కు తిండిపోతును(తిండిపోతు - తిండీడు, తిండికాడు.)భార్యయెరుగును.
మంగలకత్తి రూపు - కృత్తికా నక్షత్రము.
మంగల1 - క్షౌరముచేసి జీవించు జాతి.
మంగల2 - 1.పతివ్రత, 2.దుర్గ.
పతివ్రత - సాధ్వి; సాధ్వి - పతివ్రత.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా. దుఃఖేన గంతుం శక్యతే దుర్గా - కష్టముచే నెఱుగఁదగినది.
దుర్గం వనగిరిరూప మావాసోయ స్యా స్సా - వనాదిదుర్గము స్థానముగాఁ గలది.
సర్వమంగళ - పార్వతి.
సరాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమతమైన శుభములు గలది.
మంగళ - పార్వతి.
పార్వతి - పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
మంగళదేవత - లక్ష్మి.
సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్త్రీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ|
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
కల్యాణము - 1.క్షేమము, 2.శుభము, 3.పెండ్లి.
కల్యం సుఖం అనయతి ప్రాపయతీతి కల్యాణం, అణగతౌ. - సుఖమును పొందించునది.
మంగళము - శుభము, క్షేమము.
మంగం సుఖం లాతీతి మంగళం, లాదానే - సుఖము నిచ్చునది.
శుభము - మంగళము.
శోభతి ఇతి శుభం, శుభ శోభనే. - ఒప్పునది.
వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్ట విధములు).
శుభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.
మంగళుఁడు - కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
కుశల ప్రశ్నము - క్షేమ మరయుట.
కుశలము - 1.క్షేమము, శుభము, 2. (వ్యావ.) చిన్నది, ఉదా. "మాయిల్లు కుశలము" = ఇరుకైనది, 3.తనివి, 4.పుణ్యము.
కుత్సితం శ్యతీతి కుశలం, శో తనూకరణే - కుత్సితము నల్పముగాఁ జేయునది.
కుశ్యతి నత్స్పితి కుశలం, కుశ సంశ్లేష - మంచివారియందుఁ గూడుకొనియుండునది.
కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.
సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది.
స్వస్తి - శుభము.
శస్య ఇతిశ స్తం సంసుస్తుతౌ - స్తోత్రముచేయఁ బడునది.
భవిష్యము - 1.శుభము, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
లోకః పృచ్ఛతిసద్వార్తాం శరీరే కుశలం తవ|
కుతః కుశల మస్మాకమాయు ర్యాతి దినేదినే||
తా. సాధారణముగా లోకమున నందఱు అప్పా నీవు కుశలమా అని యడిగెదరు గాని దినదినంబును క్షీణించుచుండెడి ఆయువు గల మాకు కుశలం బెక్కడిది, అనఁగా నూరు సంవత్సరములు పరిమితి గలదు. మనుజులకు నొక్కొక్క దినంబును, గతించుచుండగా (నా)ఆయువు నశించునునే వచ్చుచున్నది. దానివలన కుశలం బెక్కడిదని భావము. శరీర భ్రమచే (నా)ఆయువు దినే దినే తగ్గుచున్నదని మఱపు గలుగుటకు కుశలంబుగాదు. కుశలంబన్నది తానైన స్వరూపాత్మకు నిత్యత్వమం దెల్లప్పుడుండునదే కుశలంబు. - నీతిశాస్త్రము
యోగరతో వా భోగరతో వా - సంగరతో వా సంగవిహీనః,
యస్య బహ్మణి రమతే చిత్తం వందతి నందతి నందిత్యేవ. - 19
Let one practice concentration; or let one indulge in sense-enjoyment. Let one find pleasure in company; or in solitude. he alone is happy, happy, verily happy, whose mind revels in Brahman. – భజగోవిందం
మంగలి - అంబష్టుడు.
అడపకాఁడు - 1.మంగలి, 2.అడపము పట్టుకొనువాడు.
అడపము - 1.వక్కలాకులు పెటూకొను సంచి, 2.మంగలి పొది.
క్షురి - మంగలి, క్షౌరకుడు.
క్షుర మస్యాస్తీతి క్షురీ, న. పు. - కత్తి కలవాఁడు.
క్షురము - 1.చురకత్తి, 2.మంగలికత్తి.
క్షురకర్మ - మంగలిపని, ముండనము.
ముండి - మంగలి.
ముండయతి కేశానితి ముండీ, న. పు. ముండి ఖండనే. - వెండ్రుకలు గొఱుగువాఁడు.
భద్రాకరణము - ముండనము.
ముండనము - 1.క్షౌరము 2.సంరక్షణము.
కోఁగుట - క్షౌరము, ముండనము, రూ.గోఁగట.
కోఁగు - క్షౌరముచేయు, గొరుగు.
గొఱుగు - క్షౌరముచేయు. పనిలేని మంగలి పిల్లితల గొరిగాదుట.
వపనము - క్షౌరము, ఆయుష్కంత్మము.
ఆయుష్కరము - ఆయుర్వృద్ధికరమగు పని, క్షౌరము.
చూడాకర్మము - పుట్టువెండ్రుకలు తీయుట.
చౌలము - వెండ్రుకలు తీయు నొకానొక కర్మ, చూడాకర్మ, పుట్టువెండ్రుకలు తీయు సంస్కారము.
నాపితుఁడు - మంగలి.
దివైనకీర్త్యతే రాత్రౌ క్షౌరము నిషిద్ధమౌట వలన పగలే పిలువఁబడువాఁడు.
నాప్నోతి అస్పృశ్యత్వాదితి నాపితః, ఆప్ ఌ వ్యాప్తౌ. - అస్పృశ్యుండౌట వలన నంతత వ్యాపింపనివాఁడు.
మనుష్యులను పరిచయమువలనను, మంగలిని క్షౌరము వలనను, బంగారమును గీటుకాల్పులవలనను, నాణ్యము చేయవలెను.
మంగలికోళ్ళు - సన్నాయి, వ్యు.మంగలి ఊదు గొట్టము.
నాదస్వరము - మేళగాండ్రు పాటలు పలికించు క్రోవి, సన్నాయి.
మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసి పోవుగాని నెగదదు సుమతీ.
తా. మంచిని గుర్తుంచుకోనట్టి వానిని, కంసాలిని, మాలవానిని, మంగలివానిని స్నేహితునిగా ఉంచుకొనిన రాజుయొక్క రాజ్యపాలన నశించునే కాని వృద్ధిచెందదు.
అంతే అవస్థాతుం శీలమస్య అంతావసాయీ, న. పు. షో (అ)న్తకర్మణి, అవపూర్వః అర్థాంతరేవర్తతే. - కడపట నుండు స్వభావముగలవాఁడు (మంగలి).
మంగలికోళ్ళు - సన్నాయి, వ్యు.మంగలి ఊదు గొట్టము.
నాదస్వరము - మేళగాండ్రు పాటలు పలికించు క్రోవి, సన్నాయి.
మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసి పోవుగాని నెగదదు సుమతీ.
తా. మంచిని గుర్తుంచుకోనట్టి వానిని, కంసాలిని, మాలవానిని, మంగలివానిని స్నేహితునిగా ఉంచుకొనిన రాజుయొక్క రాజ్యపాలన నశించునే కాని వృద్ధిచెందదు.
రాజు కూడా ఒకరిముందు(మంగలివాని ముందు)తల వంచాల్సిందే. మనుష్యులందరి తలపైన మంగలి చేయి.
అంబష్ఠుఁడు - 1.మంగలి, 2.మావటి.
మంగలి - అంబష్టుడు.
అడపకాఁడు - 1.మంగలి, 2.అడపము పట్టుకొనువాడు.
అడపము - 1.వక్కలాకులు పెటూకొను సంచి, 2.మంగలి పొది.
ముండుఁడు - రాహుగ్రహము, విణ.తెగినకాళ్ళు చేతులు కలవాడు.
ముండము - తల. ముండితుఁడు - బోడియైనవాడు.
మొండెపుగాము - రాహువు Rahu.
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
చెడగు - 1.అశుభకార్యము, విన.1.క్రూరము, 2.దుష్టము.
చెడగరము - 1.క్రూరము, 2.క్రూరుడు.
కాపురుషుఁడు - కుత్సిత పురుషుడు, దుష్ట ప్రవర్తన గల పురుషుడు.
కుజనుఁడు - కుత్సిత పురుషుడు.
ఏతరి - దుర్ణయపరుడు, కుజనుడు.
కుచ్చితము - 1.కపటము, 2.నీచము, నింద్యము, సం.కుత్సితః.
కుత్సితము - నికృష్టము; నికృష్టము - అధమము.
కృపణుఁడు- 1.పిసినిగొట్టు, లోభి, 2.కుత్సితుడు.
కల్పతే కుటుంబ పీడనేవాపి జీవనాయ సమర్థో భవతీతి కృపణః కృపూ సామర్ధ్యే. - కుటుంబమును బీడించియైనను బ్రతకనేర్చినవాఁడు.
లోభి - లుబ్ధుడు. లోభికి ఖర్చెక్కువ.
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
లుబ్ధకుడు - 1.పిసినిగొట్టు, లోభి 2.బోయవాడు.
ఆక్షేపకుఁడు - 1.అక్షేపించువాడు, 2.బోయవాడు. శకుఁడు - కుత్సితుడు, మోసగాడు.
క్షుద్ర - 1.ఈగ, 2.వేశ్య, 3.అంగహీనయగు స్త్రీ 4.నట్టువకత్తె, 5.గయ్యాళి.
ఈగ - మక్షికము. మక్షిక - ఈగ. ఈగకు శిరస్సునందు విషముండును.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
అంగహీనయగు స్త్రీ -
నట్టువకత్తె -
గయాళి - 1.దిక్కరించి మాటలాడునది, 2.వదరుబోతు, రూ.గయ్యాళి, వి.ధూర్త స్త్రీ. గట్టివాయి - గయాళి, ధూర్తురాలు. వదరు - ప్రేలు, సం.వక్తృ.
క్షుద్రా వ్యఙ్గా నటీ వేశ్యా సరఘా కణ్డకారికా,
త్రిషు క్రూరే (అ)ధ(నే)మే (అ)ల్పేపి క్షుద్రః -
క్షుద్రాశబ్దము అంగహీనురాలికిని, నాట్యమాడు స్త్రీకిని, వేశ్యకును, తేనెటీఁగకును, వాఁకుడు చెట్టునకును పేరైనపుడు సీ. క్రూరునికిని, అధమునికిని కొంచెమైనదానికిని, అపిశబ్దము వలన కృపణునికిని పేరైనపుడు త్రి, క్షుద్యత ఇతి క్షుద్రా, క్షుద్రశ్చ, క్షుద క్షోదే. - మెదుపబడునది గనుక క్షుద్ర, క్షుద్రమును.
సరఘ - తేనెటీగ.
తేఁటి - తుమ్మెద, తేనెటీగ.
(ౙ)జుంటీగ - చిన్నతేనెటీగ, సరఘ.
సరఘా మధుమక్షికా :
సరంతీతిసరాః స్వవిషయం ప్రాప్తాః, తాన్. హంతీతి సరఘా. హన హింసాగత్యోః - తననుగూర్చి వచ్చువారిని హింసించునది.
మధుని సక్తా మక్షికా మధుమక్షికా - తేనెయం దాసక్తమైన యీఁగె. ఈ రెండు జుంటీగ, తేనెటీఁగ పేర్లు.
గామిడీ - 1.శ్రేష్ఠుడు, 2.పీనము బలిసినది, 3.గయాళి, 4.దుష్టము, సం.గ్రామణీః.
గ్రామీణ - 1.వేశ్య, 2.పాలకూర, సం.విణ.ఊరి సంబంధమైనది.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
చేరుగొండి - 1.దుష్టము, వి.పెండ్లి యాడకనే వచ్చిన భార్య.
దుష్టము - చెడ్దది. అసత్తు - 1.లేనిది, 2.చెడ్దది.
చెడ్ద - 1.కీడు, విణ.దుష్టము.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
కీడుపడు - క్రి.1.తక్కువగు, 2.దైన్యపడు, 3.చచ్చు, రూ.కీడ్పడు.
దుర్నామకార్శసీ -
పాపరోగత్వేన ప్రసిద్ధతయా దుష్టం నామాస్యేతి దుర్నామకం - ప్రసిద్ధమైన పాపరోగ మౌటచేత దుష్టమైన పేరు గలది.
అరివత్ ప్రాణినం శ్యతి తనూకరోతీతి అర్శః, స, స. శోతసూకరణే. - శత్రువు వలె ప్రాణి(శరీరి - ప్రాణి)నల్పముగాఁ జేయునది.
రూపమిమర్తి ఉద్గచ్ఛతీతి అర్సః - రూపమును జెఱుచునది. ఈ 2 మూలవ్యాధి పేర్లు.
అర్సిమొలలు - (గృహ.) గుదములోని రక్తనాళములు ఉబ్బి రక్తము కారుట, మూలశంక (Piles).
మూలవ్యాధి - Piles, అర్శరోగము.
ఆర్శరోగము - Piles. మూలవ్యాధి, అనగా గుదస్థానమున లోపలగాని, వెలుపలగాని మాంసపుమొలకలు జనించి, రక్తము స్రవించుచుగాని, స్రవించక వేదన గలిగించు రోగము.
దుష్టాభార్యా శఠోమిత్త్రం భృత్యోహంకార సంయుతః|
నసర్పేచ గృహేనాసో మృత్యురేవనశంశయః ||
తా. గయ్యాళియైన భార్య, కుత్సితుఁడైన స్నేహితుడు, అహంకారముగలిగిన(భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.)బంటు, సర్పము(సర్పము - పాము, సప్పము.)గల గృహమందు వాసము, ఇవి మనుష్యునకు నిస్సంశయముగా మరణావస్థను గలుగఁజేయును. – నీతిశాస్త్రము
క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.
క్షుద్నాతి కుటుంబం పీడయతీతి క్షుద్రః కుదిర్ సంపేషణే - కుటుంబమును పీడించువాఁడు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు.
లోభి - లుబ్ధుడు. లోభికి ఖర్చెక్కువ.
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
హింసకుఁడు - హింసించువాడు.
హింసనము - హింసించుట.
హింస - 1.చంపుట, బాధించుట.
హననము - చంపుట, హత్య.
హత్య - చంపుట. చంపుట ఏమి గొప్ప? ఏమి ఘనకార్యము?
ప్రతిఘాతనము - చంపుట.
ప్రతిహంతీతి ప్రతిషుః హనహింసాగత్యోః. - సత్కర్మను జెఱుచునది.
అభిమానము - 1.గర్వము, 2.ప్రేమ, 3.ఆత్మగౌరవము, 4.హింస, 5.జ్ఞానము, 6.పగతీత్చుకొనుట, 7.అజ్ఞానము(తెలివిలేనితనము).
హంకారము - 1.అహంకారము, 2.అభిమానము, సం.అహంకారః.
అహంకారము - 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి 3.అష్ట ప్రకృతులలో ఒకటి 4.ఆత్మాభిమానము(Egotism) 5.క్రోథము.
అహంభావము - 1.గర్వము, నేననుట 2.(వేదాం)అవిద్య, దేహభ్రాంతి.
గర్వో(అ)భిమానో(అ)హంకారో -
గర్వయనేనేతి గర్వః ఖర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
ఆత్మానముత్కృష్టం మానయతీత్యభిమానః - మను అవబోధనే తన్ను ఉత్కృష్టునిఁగాఁ దలఁపించునది.
అహమితి బుద్ధిం కరోతీత్యహంకార. డుకృఞ్ కరణే. - నేను ఉత్కృష్టుఁడ నను బుద్ధినిఁ జేయునది. ఈ 3 అహంకారము పేర్లు.
నాస్త్యహంకారసమః, శత్రుః. -
అహంకారానికి సమానమైన శత్రువు లేదు.
బ్రాతి - ప్రేమ, విణ.1.అధికము, 2.దుర్లభము.
మమత - ప్రేమము, అభిమానము.
మమకారము - 1.ప్రేమ, 2.నాదియను అభిమానము.
అభిమానో ర్థాది దర్పే జ్ఞానే ప్రణయ హింసయోః : అభిమాన శబ్దము ధనరూప కులాదులచే వచ్చిన గర్వమునకు, జ్ఞానమునకు, ప్రార్థనకు, హింసకును పేరు. అభిమాననం, అభిమననం చ, అభిమానః. మాన పూజాయాం, మనజ్ఞానే. మీఞ్ హింసాయాం, గర్వించుట జ్ఞానము, హింసయును, అభిమానము.
హింస - 1.చంపుట, 2.బాధించుట.
విశసనము - 1.చంపుట, 2.కత్తి.
విశరఘాతము - చంపుట, బాధించి చంపుట.
హింసా చౌర్యాదికర్మ చ : హింసా శబ్దము దొంగతనమునకును, ఆదిపదము చేత కొట్టుట మొదలయిన దానికిని, చకారము వలన చంపుటకును పేరు. హింసనం. హింసా. హిసి హింసాయాం. చంపుట గనుక హింస.
హింసను విడనాడు - అహింసను పాటించు. ప్రాణి హింసను చేయరాదు. మేలు చేసిన వారికి - కీడుచేయకు. కూడు బెట్టిన వానిని - కూలద్రోయకు.
జ్ఞానము - తెలివి, ఎరుక.
మంచితనములేని తెలివి, తెలివిలేని మంచితనము ?
అహింస పరమో ధర్మః. - జీవితాన్ని ప్రేమించే వాడు హింసకు దిగలేడు. అన్యుల ప్రాణాలు తీయలేడు.
వైరశుద్ధి - ప్రతీకారము, పగతీర్చుకొనుట.
ప్రతీకారము - (గృహ.) ప్రతిఘాతము (Reaction).
ప్రాయశ్చిత్తము - 1.పాప పరిహారమునకై చేయుకర్మము, 2.ప్రతీకారము.
వైరశుద్ధిః ప్రతీకారో వైరనిర్యాతనం చసా :
వైర్స్య శుద్ధిః వైరశుద్ధిః - వైరము పోఁగొట్టుకొనుట.
ప్రతికరణం ప్రతీకారః - చేసినదానికి బదులు చేయుట ప్రతీకారము.
వైరస్య నిర్యాతనం వైరనిర్యాతనం - వైరముఁ బోఁగొట్టుట. ఈ మూడు 3 పగ దీర్చుకొనుట పేర్లు.
వైరము - విరోధము.
విరోధము - పగ, ఎడబాటు.
పగ - విరోధము; పగగొను - విరోధపడు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
అసూయ - 1.గుణము లందు దోషమును ఆరోపించుట, ఓర్వలేనితనము, 2.కోపము.
పగ ప్రతీకారం స్వభావముగా ఉన్నవారికి ఎప్పుడు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పగ తీర్చుకోవాలను కోవడం మానిపోయే తన గాయాల్ని రేపుకోవడమే. - బేకన్
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
శుష్కవైరం వివాదంచ నకుర్యా తైనచికిత్సా|
తా. ఎవనితోనైనను నిష్ప్రయోజనమైన విరోధమును, వివాదమును జేయరాదు. – నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
కింపచానుఁడు - లోభి, వ్యు.ఇంచుక వంటచే బ్రతుకువాడు, పిసినిగొట్టు.
కించి దన్నం పచతీతి కింపచానః - ఇంచుకంత వంటకమును వండుకొనువాఁడు.
పచా పాకః, కిం కించిత్ పచయా అత్యల్పపాకేన అనితి జీవతీతి కింపచానః అన ప్రాణనే. - ఇంచుక వంటచేత బ్రతుకువాఁడు.
మితంపచుఁడు - లోభి.
మితం అత్యల్పం పచతీతి మితంపచః. డు పచష్ పాకే. - కొద్దిగా వండుకొనువాఁడు.
అతిగుణహీనలోభికిఁ బదార్ధముగల్గిన లేక యుండినన్
మితముగఁగాని కల్మిగల మీఁదటనైన భుజింప డింపుగా
సతమనినమ్ముదేహమును సంపద, నేఱులు నిండి పాఱినన్
గతుకగఁజూచుఁగుక్క తనకట్టడిమీఱనెందు, భాస్కరా.
తా. భాస్కరా! ఏరులలో నిండి జలము ప్రవహించు చున్నను, చూచి కుక్క - శునకము, సం.కుర్కరః.) కుతుకుటకే తలంచును, అట్లే మిక్కిలి లోభియగు వాడు తనకెంత ఐశ్వర్యమున్నను, తాను మాత్రము తక్కువగానే భుజించును. తనకు లేనప్పుడు తక్కువగా తినుట ధర్మము, (ఉన్నప్పుడు కూడా తక్కువగా తినుట లోభిత్వము.)
కీనాశుఁడు - 1.యముడు, 2.రాక్షసుడు, విణ.1.పేద, 2.పిసినిగొట్టు, 3.కటికవాడు.
కటిక - 1.కటికవాడు, 2.బెత్తము పట్టియుండువాడు, 3.మాంసము అమ్మువాడు. కీకటుఁడు - లోభి, పేదవాడు.
వినాశము - చేటు.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
వినాశ స్స్యా దదర్శనమ్,
వినశనం వినాశః, అదృష్టి రదర్శనం, ణశ అదర్శనే, దృశిర్ ప్రేక్షణే. - కానరాకుండుట వినాశము, అదర్శనమును. ఈ 2 కానరాకుండుట పేర్లు.
ముష్టింపచుఁడు - దరిద్రుడు, పిడికెడు బియ్యము మాత్రమే వండుకొనువాడు.
ముష్టి - 1.కత్తిపిడి, 2.పిడికిలి, 3.(వ్యవ.) బిచ్చము.
పేద - 1.దరిద్రుడు, 2.భటుడు, 3.అశక్తుడు, సం.వ్యర్థః.
దరిద్రుఁడు - బీదవాడు.
బీద - దరిద్రుడు, రూ.పేద, సం.భీతః. కూటికి పేదకాని కులానికి పేదకాదు.
మక్షి కా మారుతో వేశ్యా యాచకో మూషక స్తధా|
గ్రామణీ ర్గణక శ్చైవ సప్తైతే పర బాధకాః||
తా. ఈఁగలు, మారుతము - వాయువు, భోగముది, బిచ్చగాడు, ఎలుక, గ్రామాధికారి, కరణము; వీర లేడుగు రెల్ల(ఎల్ల)ప్పుడు పరులను పీడించువారనుట. – నీతిశాస్త్రము
టైఫాయిడ్ - (Typhoid) అపాయకరమైన విషజ్వరము, (ఇది నీటి మూలమున, ఈగల మూలమున వ్యాపించును.)
అడీయరి - 1.కింకరుడు, 2.లోభి, 3.పాదసేవకుడు.
అడీయడు - పాదసేవకుడు, రూ.అడియరి, త.అడియావన్, అడియాన్.
కింకరుఁడు - పరిచారికుడు, వ్యు.ఏమి చేయుదు నని అడుగువాడు.
కింకర - పరిచారిక, దాసి, రూ.కింకర.
దాసి - పనికత్తె, పరిచారిక
చేటి - 1.పనికత్తె, రూ.చేటిక.
చేటిక - చేటి; చేడియ - చేటి స్త్రీ, రూ.చేదె, సం.చేటీ.
పరిచారిక - సేవకురాలు.
బానిస - దాసి, తొత్తు.
తొత్తు - 1.బానిస, 2.రంకుటాలు.
భుజిష్యు - 1.పరిచారిక, 2.వేశ్య.
భుజిష్యుఁడు - పరిచారికుడు, విణ.స్వతంత్రుడు.
ఊడిగము - పరిచర్య, సేవ, రూ.ఊడెము, ఉడిగము, ఊళిగము, ఉళిగము.
గోప్యుఁడు - 1.ఊడిగపువాడు, 2.దాసీపుత్త్రుడు, విణ.కావదగినవాడు.
దాసీమానథనంహంతి – హంతివేశ్యా ధనాధికమ్|
ఆయూ క్షీవిధవాహంతి - సర్వ హంతి పరాంగనా||
తా. దాసీసంగమము మానమునుబోఁగొట్టును, వేశ్యాసంగమము ధనాదులను బోగొట్టును, విధవా సంగమ మాయుస్సు(ఆయువు)ను క్షీణింప జేయును, పరాంగనా(పరస్త్రీ)సంగమ మన్ని సుగుణములను పోగొట్టును. - నీతిశాస్త్రము
ఒప్పమి - 1.తప్పు, 2.కీడు, 3.అనంగీకారము.
అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
మహాకాలుఁడు - 1.శివుడు, 2.శివభటుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
అవంతి - 1.ఉజ్జయిని, 2.అక్క.
అక్క1 - 1.తనకంటె పెద్దది అగు తోడబుట్టువు, జేష్ఠభగిని, అప్ప, 2.పూజ్య స్త్రీ, 3.వంటలక్క. ఉజ్జయిన్యాం మహాకాళమ్| ఉజ్జయిన్యాం మహాకాళీ శక్తిపీఠం|
అంతిక - 1.అక్క, 2.పొయ్యి, 3.(వృక్ష). సాతల మనెడు ఓషధి.
అంతోనాశో అస్యామస్తీతి అంతికా - దీనియందు పదార్థములకు నాశము గలుగును.
పొక్కలి - ఎత్తుడు ప్రొయ్యి.
ఎత్తుగడలు - ప్రొయ్యిగడలు.
గడ్డప్రొయ్యి - గడ్డలతో నేర్పరచిన పొయ్యి.
ఇంటింటా ఒక పొయ్యి మా ఇంట్లో మరో పొయ్యి. కర్రవంకరని పొయ్యి తీస్తుందట.
అక - అక్క, పూజ్యస్త్రీ.
ఆయక - (ఆ+అక) 1.ఆపూజ్యస్త్రీ, 2.అకె, ఆ యక్క.
ఆకె - ఆమె, ఆయమ. ఆమె ఎవరు ?
ఆయమ - (ఆ+ఆమె) ఆమె, ఆపె, ఆకె.
ఆబిడ - (ఆ+బిడ్ద) ఆపె, రూ.అబిడె.
ఆపె - ఆమె, రూ.ఆకె.
ఆకె - ఆమె, రూ.ఆకె.
ఆమె - స్త్రీ; స్త్రీ - ఆడుది.
ఆమెత - 1.విందు, 2.ఉత్సవము.
విందు - 1.ఆతిథ్యము, చుట్టములులోనగు వారికిడు భోజనము, 2.చుట్టము, అతిథి.
ఆతిథ్యము - ఆతిథేయము, విణ.అతిథి కొరకైనది.
అతిథేయము - అతిథి సత్కారము, విణ.అతిథికి యోగ్యమైనది.
ఆగంతుకుఁడు - అతిథి, విందు.
ఆగంతువు - అకస్మాత్తుగ వచ్చునది, అకస్మికముగ సంభవించునది, వి.అతిథి, విందు.
అతిథి - 1.భోజన సమయమునకు వచ్చు పరదేశి, 2.అహుతుడు, 3.కుశుని కొడుకు.
మనుగడుపు - అల్లియము, క్రొత్త పెండ్లి కుమారునకు అత్తగారుచేయు విందు.
అల్లియము - 1.ఆలుడగుట, 2.క్రొత్త పెండ్లికొడుకునకు బెట్తెడి అత్తవారింటి విందు, మనుగడుపు.
అల్లెము - అల్లియము.
అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా|
ఏతే విత్తం నజానంతి జామాతా శ్చైవ పంచమః||
తా. అడుగవచ్చెడు అథిథి, చిన్నవాడు - బాలుడు, స్త్రీలు, నృపతి - రాజు, రూ.నరపతి., జామాత - అల్లుడు, పెనిమిటి.; యీ ఐదుగురు కలిమి లేమి నెఱుగరు. - నీతిశాస్త్రము
అవన్తికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్|
అకాలమృత్యోః పరిరక్షనార్థం వన్దే మాహాకాల మహం సురేశమ్. – 3స్తో
అక్క2 - తల్లి.
తలి - జనని, తల్లి. తల్లి - జనని, రూ.తల్లి, విణ.మొదటిది, సం.వి. జవరాలు, తరుణి.
తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ, సీ, తౄప్లవన తరణయోః - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః, యు మిశ్రణే. - పురుషునితోఁ గూడునది. ఈ రెండు జవ్వని పేర్లు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
తరుణిమ - యౌవనము, రూ.తరుణ్యము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50va) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
యౌవతము - యువతీ సమూహము.
అప్ప - అప1.
అప1 - అవ్య. సమాసపూర్వ పదముగా నుండి క్రింది అర్థముల నిచ్చును, 1.విపరీతము ఎక్ష్త్రెమె, ఉదా.అపకీర్తి (అపప్రధ - చెడ్డపేరు; అపకీర్తి - చెడుపేరు, దుర్యశము. అపకీర్తి కలిగిన మరణము పనిలేదు.) 2.అపగతము(అపగతము - పోయినది), ఉదా.అపక్రమము = క్రమము తప్పినది, క్రమములేనిది, 3.చెడ్దది, ఉదా.అపక్రమము = చెడ్డపని.
అప2 - 1.తల్లి, 2.తండ్రి, 3.అక్క, రూ.అప్ప.
అప్పళము1 - 1.అప్పడము, 2.బాలక్రీడలలో ఒకటి, 3.(తోడ మొ.వి)చరచుట.
అప్పళము2 - అవ్య. బిరాన, శీఘ్రముగా.
బిరబిర - శీఘ్రముగ, బిరాన.
అప్పము - బెల్లమును పిండియు కలిపిచేసిన గుండ్రని భక్ష్యము, గుడాపూపము, సం.అపూపః.
పూపో (అ)పూపః పిష్టకస్స్యాత్ -
పునాతీతి పూపః, పూఞ్ పవనే. - పవిత్రము చేయునది.
నపూయతే నవిశీర్యత ఇత్యపూపః, పూయీవిశరణే. - జీర్ణముగానిది.
పిష్టవికారత్వాత్ పిష్టకః - పిండిచేతఁ జేయబడునది. ఈ 3 పిండివంట పేర్లు.
పూపము - అపూపము, అప్పము.
అపూపము - పిండివంట, అప్పము.
పిష్టకము - 1.కంటితెవులు, 2.పిండివంట.
అప్పా ! యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
యప్పా నను గనుఁగొనవే
యప్పా ననుఁబ్రోవు వేంకటప్పా కృష్ణా.
తా. కృష్ణా! అప్పములు అరిసెలు(అతిరసము - అరిసె)ఇత్తువు. నను దయతోడ కావుము, వేంకటాద్రి మునీ ! నిను గొలిచెదను.
పాచకి - వంటలక్క; వంటలక్క - వంటకత్తె.
వంటరి - (వంట+అరి) వంటకాడు, వంటలక్క.
వంటపుట్టి - వంట జేసి జీవించునది.
బోనకత్తియ - (బోనము+కత్తియ) అన్నము వండి పెట్టునది, దాసి.
బోనము - అన్నము, సం.భోజనమ్.
బోనము పెట్తె - తోలుకప్పిన గుండ్రని పెట్తె.
దాసి - పనికత్తె, పరిచారిక.
పరిచారిక - సేవకురాలు.
చేటి - 1.పనికత్తె, రూ.చేటిక.
చేటిక - చేటి.
బానిస - దాసి, తొత్తు.
తొత్తు - 1.బానిస, 2.రంకుటాలు.
వండుకొన్నమ్మకి ఒకటే కూర, దండుకున్నమ్మకి అన్నీ కూరలే.
ఔదనికుఁడు - వంటవాడు.
ఔదరికుఁడు - 1.తిండియందే ఆసక్తి గలవాడు, 2.ఏమియుపనిలేకుండ నున్నవాడు.
అద్దగోడ - 1.సగముగోడ, వంట యింటిలో వడ్దన పదార్థముల మరుగుకై అమర్చిన పొట్టిగోడ, మరుగుగోడ, సం.అర్ధకుడ్యమ్.
నలమేనిదొర - విష్ణువు.
విష్ణువు - విష్ణుః ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
నల - అరువది సంవత్సరములలో నొకటి, వై.విణ.నల్ల.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కఱివేలుపు - కృష్ణుడు, నల్లనయ్య.
నల్ల - 1.నెత్తురు, వై.వి. నలుపు, 2.బొగ్గు, విణ.నలుపైనది.
నెత్తురు - రక్తము Blood, రూ.నెత్రు.
కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కల్యస్య సంఖ్యాయతే అనేనకాలః, కలసంఖ్యానే - దీనిచేత లెక్క పెట్టఁబడును.
కాలయతి ప్రేరయతీతి వా కాలః, కల కిల క్షేపే - ప్రేరేరింపఁజేయునది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
కాలరాత్రి - 1.ప్రళయకాలము, 2.దుర్గామూర్తి భేధము, 3.చీకటిరాత్రి, సం.వి.కాలిబంటు, పదాతి.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
సమ్యగయతే సమయః అయగతౌ - లెస్సగా నెఱుఁగఁబడునది.
కఱ - 1.నలుపు, 2.మఱక, సం. కాలః.
మఱక - 1.కఱ, 2.మేకపడ్డ, (రసా.) నూనె మొ.వానిచే కలుగుమచ్చ (Stain).
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి, 5.క్రొత్త మబ్బు.
బొగ్గు - మండి చల్లారిన కఱ్ఱతునక, అంగారము.
అంగారము - 1.నిప్పు 2.బొగ్గు.
మసి - 1.చూర్ణము, 2.నలుపు, 3.బొగ్గు, సం.మసీ.
మసి బొగ్గు చల్లగా ఉన్నపుడు ముట్టుకుంటే చేతికి మసి అవుతుంది. ఒక బొగ్గు రగులుకొనదు. కాలుతున్నప్పుడు ముట్టుకుంటే మన చేతినీ కాలుస్తుంది.
ఆంగారము - బొగ్గులప్రోవు, అంగారముల సమూహము, విణ.అంగారసంబంధమైనది.
అడవిలో పుట్టాను నల్లగా మారాను - మీ ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను - కుప్పలో పడ్డాను తెల్లగా మారాను. - బొగ్గు.
ఎప్పుడదృష్టతామహిమయించుక పాటిలు నప్పుడింపు సొం
పొప్పుచు నుండుగాక యదియొప్పని పిమ్మట రూపుమాయగా
నిప్పుననంటియున్న యతినిర్మలినాగ్నిగురు ప్రకాశముల్
దప్పిననట్టి బొగ్గునకుఁదా నలుపెంతయు బుట్టు, భాస్కరా.
తా. బొగ్గు అగ్నిలో చేరియున్నపుడు దానియందలి స్వచ్చమైన కాంతుల తో ప్రకాశించును, అగ్ని సంబంధము తప్పిపోయినచో, అది ముందు తనకున్న కాంతిని బాసి నల్లగా నగును. అట్లే అదృష్టమున్న దినములలో మానవుడు ప్రభ కలిగి యుండును. లేనిచో తొల్లింటి(పూర్వము)ప్రభ నశించును.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
పంచమి - 1.పక్షమునందు ఐదవతిథి, 2.ద్రౌపది.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపిత్త్రిక), 2.బొమ్మ.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
తిమిరము - చీకటి; చీకటి - అంధకారము.
అంధకారము - చీకటి; అంధము - చీకటి, విణ.గుడ్డిది.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
గ్రహము - 1.రాహుగ్రహము, 2.అనుగ్రహము, 3.చెర, 4.యుద్ధయత్నము, 5.పిశాచము, 6.సూర్యాది నవగ్రహములు:- (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు), (భౌతి.) ఆకాశములో సూర్యునిచుట్టు తిరుగుచు స్థిరముగా కాంతిని వెదచల్లెడు ఖగోళరాశి (Planet).
కూష్మాండము - 1.గుమ్మడి, 2.ఒక విధమగు పిశాచము.
గుమ్మడి - పెద్ద పెద్దకాయలు కాయు తీగ, సం. కూష్మాం(శ్మా)డః. కూష్మాండేతి చతుర్థకీ|
కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.
కూశ్మాణ్డకస్తు కర్కారుః -
కు ఈషత్ ఊష్మా అండేషు బీజేష్వస్యేతి కూశ్మాండకః - కుత్సితమైన ఉష్ణము బీజముల యందుఁ గలది. పా. కూషాండః.
తృప్తిం కరోతీతి కర్కః, ఇయర్తీతి అరుః, కర్కశ్చాసౌ అరుశ్చ కర్కారుః. పు. - తృప్తిని జేయునదియును వ్యాపించునదియును గనుక కర్కారువు. ఈ రెండు గుమ్మడి పేర్లు.
పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము.
అపదేవత - పిశాచము.
కాలియ - పిశాచము, సం.కాళికా.
కొఱివి తాల్పు - పిశాచము (కొఱవి దయ్యము).
కొఱకచ్చు - కొరవి (కొరకంచు అని వాడుక).
వ్యావృతి - కొరివి దయ్యము. కొరవితో కొప్పు గోకికొనినట్లు. కొరవి దయ్యముతో ఎవరైనా తల గోక్కుంటారా!
డాకిని - ఆడు దయ్యము. డాకిన్యాం భీమశంకరమ్|
శాకిని - ఒక తెగ పిశాచ స్త్రీ.
దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
డాకినీ యోగినీరూపా భూతేశీ భూతనాయికా,
పద్మావతీ పద్మనేత్రీ ప్రబుద్ధా చ సరస్వతీ|
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి;-పృథివి, అప్పు, 3.తేజము, వాయువు, ఆకాశము), 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
వృశ్చికరాశిలో(గురుడు Jupiter) భీమానది పుష్కరాలు. పండరీపురం భీమానది ఒడ్డున వుంది. భీమానది, కృష్ణానది ఉపనదిలో ఒకటి, పశ్చిమాన పారి కృష్ణానదిలో కలుస్తుంది.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
యో డాకినీశాకినికాసమాజే నిషేవ్యమాణః పిశితాశనైశ్చ|
సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి| - 8
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
ౙమున - యమున.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామవర్ణో (అ)స్యాస్తీతి శ్యామలః - శ్యామవర్ణము గలిగినది.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామతి శమలం, శము ఉపరమే. - నశించునది.
శ్యామిక - చీకటి, నలుపు.
ఖండిత చండ మహాసుర మండల
మండిత నిబిడ శ్యామల కుంతల| ||శరవణభవ||
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ- సీ. - గౌరవర్ణము గలది. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|
విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ 27వ సంవత్సరము.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుఃఖేన గంతుం శక్యతే దుర్గా - కష్టముచే నెఱుగఁ దగినది.
దుర్గం వనగిరిరూప మావాసోయ స్యా స్సా – వనాది దుర్గము స్థానముగాఁ గలది.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
కాళవర్ణత్వాత్కాళీ - నీలవర్ణముగలది.
మేఘజాలే చ కాళికా : కాళికా శబ్దము మేఘ సమూహమునకును, చకారము వలన పార్వతీదేవికిని, యోగినికిని, మర్యాదకును పేరు.
కాళవర్ణత్వత్ కాళికా - నల్లనిది.
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవతుని పుత్త్రిక.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
శ్రీమద్విశ్వేశ్వశ! కాళీ గిరివరతనయా సాచ గంగేతి త్రిసః
ప్రేయస్య, స్తత్రకాశ్యాం త్వమసి కృతరుచి, ర్నేతరత్రో భయోర్యత్
తత్రాద్యా త్వత్సరూపాన్ ధృతగరళగళాన్ ఫాలనేత్రాన్ ప్రసూతే
పుత్రా నర్ధేదుమౌళీ సహహ ! కథ ముభే తేగజాస్యం షడాస్యమ్|
తా. విశ్వనాథా ! నీకుఁ కాళియను నామెయు, గిరిరాజకుమారియగు పార్వతియు, గంగయు నిల్లాండ్రు. వారి మువ్వురలోఁ గాశీసతియందు మిగుల ననురాగయుక్తుఁడవై యుందువు. ఏలయన నమె నిన్నుఁబోలిన చంద్రశేఖరులను గరళ గ్రీవులను(ఫాలనేత్రుఁడు - ముక్కంటి)ఫాలనేత్రులను గనుచున్నది. గౌరియు గంగయు నన్నచో నీకు విరుద్ద స్వరూపులైన గజవదనుని(గజవదనుఁడు - వినాయకుడు), షడాననునిఁ(షడాననుఁడు - కుమారస్వామి, షణ్ముఖుడు, వ్యు.ఆరు ముఖములు కలవాడు.)గనివారలు, (కాశియం దెల్లరును శంకర స్వరూపులని భావము.)
కాళికా తిమిర కుంతలాంతఘన భృంగ మంగళ విరాజినీం,
చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం|
వాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం,
కాళికా మఖిలనాయికాం మనసి భావయామి పరదేవతాం| - 9
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.
కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము - పాము.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సప్పము - సర్పము, సం.సర్పః.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
కలుషము - పాపము; దురితము - పాపము.
నస - 1.నాశము 2.ద్రవ్యనాశము 3.(వ్యవ.)వాగుడు, 4.దురద, 5.ఉపద్రవము సం.వి. ముక్కు రూ.నాసిక.
నసగూఁటి - కామోద్రేకము గలది - గలవాడు.
నసగూఁడు - కామోద్రేకము.
నసుకు-అసత్యవచనము, విణ.అసత్యము, క్రి.అస్పష్టముగా మాటలాడు.
నసిమిరి - దురద; దురద - 1.జిల, 2.కసరు, 3.తీట.
జిల - దురద.
కసరు - కోపించు, వానగాలి.
తీఁట - గజ్జి(పామ - గజ్జి.), దురద.
గజ్జి - తీటకురుపులు, సం.కచ్ఛూః, ఖర్జూః.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
నశ్యతే నాశః ణశ అదర్శనే. - నశించుట నాశము.
నాశిల్లు - క్రి.నశించు.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
వినాశము - చేటు. పంచత్వము - మరణము.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.
అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
అపచయము - 1.హాని, నష్టము, తగ్గుట, 2.పుష్పాదులను కోయుట, (రసా.) తగ్గించుట, రూ.హాసము.
అపసరము - తొలగుట, రూ.అసారము.
కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
కీడుపడు - క్రి.1.తక్కువగు, 2.దైన్యపడు, 3.చచ్చు, రూ.కీడ్పడు.
విగమము - 1.నాశము, 2.విభజనము. విభజనము - వేరుచేయుట.
క్షతి - 1.గాయము, 2.నాశము.
క్షతము - 1.గాయపడినది, 2.చీల్చబడినది, 3.నాశనమైనది, సం.వి.1.1.గాయము, 2.చీల్చుట, 3.దెబ్బ.
క్షతజము - 1.నెత్తురు, 2.చీము.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.
గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
ఆముదము - ఏరండ వృక్షము, ఏరండ తైలము, ఏరండ బీజములు, సం.ఆమండః.
ఏరండము - ఆముదపు చెట్టు.
ద్విలింగి - (వృక్ష.) ఆడు పువ్వులు మగ పువ్వులు ఒకే మొక్క పైనున్నట్టిది (Monoecious), ఉదా. ఆముదపు మొక్క.
వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
రెగ్మా - (వృక్ష.) (Regma) ఇది వేశ్మస్ఫోట ఫలములలో నొకటి. ఈ ఫలము ఒక్కొక్క గింజ కల భాగములుగా ఎండిన తరువాత విడిపోవును, ఉదా. ఆముదపు కాయ.
పుచ్చు - 1.అజ్ఞాపించు, 2.గ్రహించు, 3.పుప్పిపట్టు, 4.పంపించు, వి.ఆముదపు మడ్డి.
పిణ్యాకములు - (వ్యావ.) పిండి యెరువులు (oil cakes), ఉదా. ఆముదపు పిండి, వేరుసెనగ పిండి మొదలగునది.
సంస్థితి - 1.చావు, 2.చక్కనియునికి.
సావు - చావు; (ౘ)చావు - మృతి; మృతి - చావు.
పెద్దనిద్దుర - మరణము, దీర్ఘనిద్ర.
పంచత్వము - మరణము; దీర్ఘనిద్ర - చావు.
నిధనము - 1.కులము, 2.చావు, 3.చేటు.
నివృత్తో (అ)ర్థ సంబంధో (అ)త్ర నిధనః, అ. ప్న. - ధన సంబంధము దీనియందు నివృత్తమౌను.
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ|
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా.- 50
మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు.
మృత్యుం జయతీతి మృత్యుంజః - మృత్యువును గెలిచినవాఁడు. జి జయే.
మిత్తిగొంగ - మృత్యుంజయుడు, శివుడు.
గొంగ - శత్రువు.
మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.
మ్రియతే మృత్యుః, ఉ. ప్స. మరణంచ, మృఙ్ ప్రాణత్యాగే. - చచ్చుట మృత్యువు, మరణమును.
మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మృతు - చావు.
మిత్తిౘూలు - కేతువు Ketu.
ౘూలు - 1.గర్భము 2.బిడ్డ.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
టెక్కెపుగాము - వి.1.కేతుగ్రహము, మిత్తిచూలు.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము 5.కుబేరుని భార్య.
కుత్సీరము - వడ్డీబ్రతుకు.
తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
వైమనస్యము - 1.దుఃఖమనస్కుని భావము, 2.పొదుపు, 3.అభిప్రాయ భేదము.
పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు - (గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy).
ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.
తూరుపుఱేఁడు - ఇంద్రుడు.
పూర్వ - తూర్పు.
పూర్వత్వాత్పూర్వా - మొదటిదిక్కు.
ప్రాచీనబర్హి - ఇంద్రుడు.
ప్రాచి - తూర్పు East.
ప్రాక్ ప్రాచ్యం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.
ప్రాక్ ప్రథమం అంచత్యస్యాం రవి(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)రితి ప్రాచీ. ఈ-సీ. - ప్రథమమున సూర్యుఁడు ఈదిక్కున బొడమును గనుక ప్రాచి.
తూరుపు - సూర్యుడుదయించు దిక్కు, ప్రాగ్దిశ, రూ.తూర్పు.
సూర్యుడు తూర్పుదిక్కున మాత్రమే ఉదయిస్తాడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
గౌడదేశేశ్వరో గోప్తా గుణీ గుణవిభూషణః,
జ్యేష్ఠానక్షత్రసంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః.
ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రుని ఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.
మువ్వన్నెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు - (భౌతి.) సూర్య కిరణములు(మువ్వన్నెకాఁడు - సూర్యుడు) నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow).
ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు(నాల్గు దంతములు కలది), 2.అమృతము.
(ౘ)చౌదంతి - చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము.
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.
పుంనాగే పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః,
పున్నాగ ఇవ పున్నాగః - పురుష శ్రేష్ఠునివలె పూజ్యమైనది.
పురుషవ దున్నతత్వాత్పురుషః తుంగశ్చ - పురుషునివలె ఉన్నతమైనది పురుషము, తుంగమును.
ప్రశస్తాః కేశరాస్సంత్యస్య కేసరః - మంచి ఆకరవులు గలది.
దేవానాం వల్లభః - దేవతలకు ప్రియమైనది. ఈ నాలుగు 4 సురపొన్న పేర్లు.
ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
యమపత్ని - ఐరావతి.
పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను - 1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం- పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.
సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.
సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధాకరుడు - చంద్రుడు.
అమృతకరుఁడు - చంద్రుడు.
అమృతాంధుసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
చాలఁబవిత్రవంశమున సంజనితురిడగునేని యెట్టి దు
శ్శీలునినై నఁ దత్కులవిశేషముచే నొకపుణ్య పు డెంతయున్
దాలిమి నుద్ధరించును, సుధానిధిఁబుట్టగఁ గాదె, శంభుడా
హాలహలానంబు గళమందు ధరించుటఁబూని, భాస్కరా.
తా. మున్ను సురాసురలు పాల సముద్రము మధింపగా అందుండి పుట్టిన హాలాహలం (పాల సముద్రమున పుట్టిన విషము.)మనెడి యగ్నిని శివుడు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)తన కంఠ మందు ధరించెను. అది ఆ యగ్ని గొప్పతనముకాదు, అది పుట్టినట్టి పాల సముద్రము యొక్క గొప్పతనము చేతనే. అట్లే, మంచి వంశమందు బుట్టిన, వాడు నీచుడైనను వానిని ఆ కులము యొక్క ఔనత్యము ను దలంచియే సజ్జనులు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)తో కాపాడుదురు గాని ఆ నీచుని జూచికాదు.
ఫాలవిలోచన భానుకోటిప్రభ, హాలాహలధర అమృత శివ|
No comments:
Post a Comment