నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువడి యేడు 27).
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ.ఋక్షమ్.
నక్షత్రమాల - 1.ఇరువదేడు ముత్యముల కూర్చిన హారము, 2.ఇరువదేడు 27 పద్యములు గల కావ్యము.
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్కరాయుడు.
నక్షత్రమృక్షం భం తారా తారకాప్యుడు వా స్త్రియమ్ :
నక్షత్రతీతి నక్షత్రం, క్షర సంచలనే - నశింపనిది గనుక నక్షత్రము.
న క్షీయత ఇతి వా నక్షత్రం. క్షీ క్షయే - నశింపనిది.
ఋక్షతి తమో నాశయతీతి ఋక్షం, ఋక్షగతౌ - సంచరించునది.
భాతీతి భం, భా దీప్తౌ - ప్రకాశించునది.
తరంత్యనయా నావికా ఇతి తారా. తారకా. చ.స్న. తౄప్లవన తరణయోః - దీనిచేత నావికులు తరింతురు.
ఉడ్డీయత ఇత్యుడు. ఉ. స్న. డీఙ్ విహాయసా గతౌ - ఆకాశమందు సంచరించునది.
ఉడు వాస్త్రియాం. ఉడుశబ్దో వికల్పేన స్త్రీలింగే వర్తతే. పక్షే నపుంసకలింగేచ. తారక పీత్యపిశబ్దేన తార కాశబ్దస్యాపి వాస్త్రియామి త్యనేనాన్వయః పక్షేక్లీ బత్వం చ ఉడుశబ్ద సాహచర్యాత్.
తదుక్తం - ద్విత్రై ర్వ్యోమ్ని తుషార బిందు మధురచ్ఛాయైః స్థితం తారకై రితి - ఉడు శబ్దమునకు స్త్రీ నపుంసకలింగములు గలవు.
తారాతారకా శబ్దములకు ఉడుశబ్దమునకు వలె లింగములు గలవు. ఈ. ఆరు సాధారణముగా నన్ని చుక్కలకుఁ పేర్లు.
(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు. చంద్రుని ఎవరు - ప్రకాశించమన్నారు?
వెలది(వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి. స్త్రీ) నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.
ఉదకము నుండి చంద్రొత్పత్తి, సూర్యోత్పత్తి, అగ్ని ఉత్పత్తి, చంద్ర కళాత్మకములైన దివసముల ఉత్పత్తి, తదంశములైన నక్షత్రముల ఉత్పత్తి ప్రతిపాదింపబడినది.
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపురాశి
కన్నె నీరాశి కూటమి గలిగినరాశి...
రాసులు - ఇవి పండ్రెండు. మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
అజకము - 1.మగమేక, 2.మేషరాశి, 3.పుట్టుకలేనిది.
మేకము - ఛాగము; మేకపోఁతు - ఛాగము.
ఛాగము - మేకపోతు, పద్యా.ఛగలము, ఛగల.
ఛాగ ఛగల శబ్దములకు ఛాగీశబ్దము వలె వ్యుత్పత్తి బంత్యతే హింస్యత ఇతి బస్తః, బస్త అర్ధనే. - హింసింపఁబదునది. అజ శబ్దమునకు అజాశబ్దమువలె వ్యుత్పత్తి. ఈ 4 మేఁకపోతు పేర్లు.
ఛగలము - 1.మేకపోతు, రూ.ఛాగము, 2.పిడకనిప్పు.
మేకపోతుఁ గాంభీర్యము - జాతీ. మేకపోతు ధైర్యమువంటి ధైర్యము, లోపల పసలేకుండుట.
వేఁట - 1.మృగయ, 2.పొట్టేలు, మేకపోతు.
మృగయ - 1.వేట, 2.వెదకుట.
మృగయుఁడు - బోయ.
చింబు - మేకపోతు.
చింబోతు - మేక.
బహురోమము - మేక.
అజాయుద్ధే ఋషిశ్రాద్ధే ప్రభాతే మేఘడంబరే|
దంపత్యో, కలహేచైన బహ్షారంభో లఘుక్రియా||
తా. మేకపోతులు యుద్ధమునందును, ఋషి శాద్ధమందును(శ్రాద్ధము - పితృకర్మము, వ్యు.శ్రద్ధతో కూడినది.), మేఘములు విజృంభణమున (డంబరము - విజృంభణము), దంపతులు - ఆలుమగలు, రూ.జంపతులు.)కలహమందును ఆరంభ మధికము, క్రియ స్వల్పంబు. - నీతి శాస్త్రము
అజితుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, విణ.జయింపబడనివాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
అజుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒకరాజు.
అజా విష్ణు హర చ్ఛాగాః - అజశబ్దము విష్ణువునకు, శివునికిని, మేఁకకును పేరు. న జాయతే, అజతీతి చ అజః జనీ ప్రాదుర్భావే;అజగతౌ. పుట్టుకలేనివాఁడును, పోవునదియు అజుడు, అజమును.
అజునకు దండ్రివయ్యు సనకాదులకుంబర తత్త్వమయ్యుం
సద్ద్విజమునికోటికెల్ల బరదేవతయ్యు దినేశ వంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుఁడవై వెలుగొందు పక్షిరా
డ్ఢ్వజ మిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
తా. బ్రహ్మకు తండ్రిగాను, సనకసనందనాది మహర్షులు ధ్యానము సేయు పరతత్త్వముగాను, విప్రముని సమూహములు కొలుచునట్టి పరదైవము గాను, సూర్యవంశ రాజుల(భూభుజుఁడు- రాజు)కు అధిపుడివి, ఇట్లు అన్ని లక్షణములును పరిపూర్తినొందిన వాడవై గరుడుఁడు ధ్వజముగా గలిగి ప్రకాశించు దయానిధీ ! నిన్ను మిక్కిలి ప్రస్తుతించెదను.
అజమనుచు మేషమునునకుఁ బేరు
నిజకోరిక లేలా గీడేరు
అజుఁడని వాగీశ్వరునికిఁ బేరు
విజయము గల్గును త్యాగరాజ నుతుని ||తెలిసి||
అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః||
ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషరాశి.
ఋక్షరాజు - చంద్రుడు, జాంబవంతుడు. బ్రహ్మదేవుని కుమారుడు, హరిభక్తుడు, చిరంజీవి.
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్కదారి - ఆకాశము.
దాక్షాయణ్యో శ్వినీత్యాది తారాః :
అశ్వినీత్యాదితారా దాక్షాయణ్య ఇత్యుచ్యంతే - అశ్విన్యాది రేవత్యంత నక్షత్రములు దాక్షాయణు లనంబడును.
దక్షస్య ప్రజాపతే రపత్యాని స్త్రియః దాక్షాయణ్యః - దక్షప్రజాపతి యొక్క కొమార్తెలు. అశ్విని మొదలు 27 నక్షత్రములకుఁ పేర్లు.
ఆచంద్రతారార్కము - చంద్రుడు నక్షత్రములు సూర్యుడు ఉండు నంతి వరకు, శాశ్వతముగా, ఎల్లప్పుడు.
అశ్విని మొదలు రేవతి వరకు గల మొత్తం ఇరవైయేడు నక్షత్రాలకు మేషాది మీనాంతంగల పన్నెండు రాశులకు విభజిస్తే ఒక్కొక్క రాశికి సపాద నక్షత్రద్వయం వస్తుంది. (నక్షత్రానికి నాలుగుపాదాలుకాగా, అశ్విని, భరణి, కృత్తిక ప్రథమపాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ విధముగానే మిగతా నక్షత్రాల పంపకం, రాశుల ఏర్పాటూ చూసుకొనేది)
మృగదంశకః - 1.కుక్క, 2.ఎలుగు.మృగాన్ దశతీతి మృగదంశకః, దంశ దంశనే. - మృగములను గొఱుకునది.
ఎలుఁగు - 1.కంఠస్వరము, 2.ఎలుగుబంటి, రూ.ఎల్గు, ఎలువు.
అచ్ఛభల్లము - ఎలుగుబంటి.
అచ్ఛేన అభిముఖ్యేన భల్లతి అచ్ఛభల్లః - అభిముఖ్యముచేత హింసించునది.
ఆత్మీయాన్ అచ్ఛతి పరాన్ భల్లతి హీనస్తీతి వా అచ్ఛభల్లః, ఛో ఛేదనే, భల్లహింసాయాం. - తన సంబంధమైనవారిని ఛేదింపక పరులను హింసించునది.
అచ్ఛః భల్లః అని రెండు పేళ్ళని కొందఱు. "అఛౌ నిర్మల భల్లూకా" విత్యజయః "భల్లౌ భాలూకబాణౌ స్త ఇతిమేదినీ.
అచ్ఛము - అచ్చము, వి.1.ఎలుగుబంటి, 2.పటికపురాయి.
పటిక - స్పటిక, బంగారమునకు మెరుగునిచ్చు ఉప్పు, సం.స్ఫటికమ్. వై.వి. (రసా.) పొటాసియమ్ అల్యూమినియముల డబుల్ సల్ఫేటు (Alum).
స్పటికము - 1.ఒకతెల్లని రాయి, పటికము (రసా.) సమతలములచే నేర్పడు ఘనరూపము (Crystal).
భల్లము - 1.ఎలుగుగొడ్డు, 2.బల్లెము.
అత్తలము - 1.ఈటె, కుంతము, ప్రాసము, బల్లెము, రూ.అత్తళము.
ఈఁటియ - పొడిచెడి సాధనము, కుంతము, రూ.ఈటె.
కొంతము - ఈటె, బల్లెము, సం.కుంతః.
కుంతము - 1.ఈటె, 2.బాణము. నేజ - ఈటె, రూ.నేజము, నేజో.
బల్లెము - 1.ఆలుగులు గల బాణము, 2.ఈటె, సం.భల్లః.
ప్రాసము - 1.పద్యపాదమున రెండవ అక్షరము, 2.ఈటె.
ప్రాసికుఁడు - ఈటెకాడు.
మృగదంశకః - 1.కుక్క, 2.ఎలుగు.
మృగాన్ దశతీతి మృగదంశకః, దంశ దంశనే. - మృగములను గొఱుకునది.
భల్లుకము - 1.భల్లము, 2.ముల్లు, 3.కోతి, రూ.భల్లూకము.
ములు - ముల్లు; పత్రసూచి - ముల్లు.
ములు - 1.కంటకము, 2.త్రాసుముల్లు, 3.వరి మొ.వాని ముల్లు, రూ.ముల్లు (బహు.)ముళ్ళు.
కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూది మొన, 5.కాకి crow, 6.తప్పు.
కంటకము2 - విరోధయుక్తి, విణ.విరుద్ధము.
ములుకత్తి - ముల్లు తీసెడు కత్తి.
కరి1 - 1.ఏనుగు, 2.కోతి.
కరి2 - 1.నిదర్శనము, 2.మేర, విణ.సాక్షి.
కరిముఖుఁడు - వినాయకుడు.
వినాయకః సర్వా న్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు ణీఞ్ ప్రాపణే.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు - వినాయకుడు.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాడు. నీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నానాం రాజ విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః,
సుఖప్రద స్సురూపాక్ష స్సర్వాభీష్ట ఫలప్రదః. - కుజుడు(Mars)
ఈలాగు ఏర్పడే రాశులలో సూర్యుడు ఒక రాశినుంచి ఇంకొక రాశియందు ప్రవేశించడం సంక్రమణం అని సంజ్ఞ. (సూర్యుడు అశ్విని ప్రథమపాదముతో ఆరంభించి కృత్తిక మొదటి పాదముతో ఏర్పడినది మేషం. ఆ రాశియందు సూర్యుడు ప్రవేశించిననాడు మేష సంక్రమణం అని వ్యవహారం. ఈలాగే కర్కటక సంక్రమణం, మకర సంక్రమణం వగైరా గ్రహించేది.
లగ్నము - మేషాదిరాసుల ఉదయము, విణ. తగులుకొన్నది.
అశ్వినీ, భరణీ, కృత్తికలు నాగవీథి అనీ; రోహిణి, మృగశిర, ఆర్ద్ర గజవీథి అనీ; పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఐరావత వీథి అనీ; హస్త, చిత్త, స్వాతి గోవీథి అనీ; జ్యేష్ఠా, విశాఖా, అనూరాధలు జారద్గవ వీథి అనీ; మూల, ఉత్తరాషాఢ, పూర్వాషాఢ అజవీథి అనీ; శ్రవణ, ధనిష్ఠా శతభిషలు మృగవీథి అనీ; పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వైశ్వానరవీథి అనీ ప్రసిద్ధములు.
అశ్వని 4, భరణి 4, కృత్తిక 1 పాదములు మేషము మేకరాశి.
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, pre-monsoon period.
ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.
ఆతపము - 1.ఎండ, 2.వెలుతురు.
ఎండరొర - సూర్యుడు.
ప్రకాశము - వెలుగు, విణ. బయలు పడినది.
వెలుఁగు - 1.కిరణము 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు. సూర్యుఁడు - వెలుగురేడు.
ప్రకాశో ద్యోత ఆతపః :
ప్రకాశతే ప్రకాశః, కాశృదీప్తౌ - ప్రకాశించునది.
ద్యోతతే ద్యొతః, ద్యుతదీప్తౌ - ప్రకాశించునది.
ఆ సమంతాత్తపతీత్యాతపః, తప సంతాపే - అంతటఁ దపించునది. ఈ మూడు 3 ఎండ పేర్లు.
ఎండకాలంలో కొత్త కుండలో నీళ్ళు ఎంత రుచి! చల్లని నీరు నాలుకకు ఇంపు!
ఉష్ట్రము - 1.వేడి, 2.ఎండకాలము విణ.వేడిగలది 2.కోపోద్రేకము గలది.
వేఁడి - 1.తాపము, 2.చురుకు, 3.వాడిమి, 4.ప్రకాశము.
వేండ్రము - తాపము.
తాపము - 1.వేడిమి, 2.బాధ, సం.వి. (భౌతి.) వేడి (Hot).
వేఁడికంటి - ఉగ్రాక్షుడు, శివుడు.
వేఁడి వేలుపు - 1.వహ్ని, అగ్ని, 2.సూర్యుడు.
(ౘ)చురుకు - 1.వాడి, వాడిమి, 2.వేడిమి, 3.వేగము, 4.ఆయుధము నాటుట, 5.నిప్పు సోకుటయందగు అనుకరణము, రూ.చురుక్కు.
ఉష్ణత - (భౌతి.) వేడిమి (Heat).
వేఁకి - 1.జ్వరము, 2.వేడిమి, 3.అగ్ని.
కాఁక - 1.జ్వరము 2.తాపము 3.కోపము విణ.వేడియైనది.
కాఁకవెలుగు - సూర్యుడు, ఉష్ణరశ్మి. ఉష్ణరశ్మి - సూర్యుడు.
ఉష్ణాః రశ్మియో యస్య ఉష్ట్రరశ్మిః ఇ.పు. - ఉష్ట్రములైన కిరణములు కలవాఁడు.
ఇద్దము - 1.పరిశుద్ధము, 2.కాంతిమంతము, 3.కాల్పబడినది, 4.అడ్డులేనిది, వి.1.ఎండ, 2.ప్రకాశము, 3.ఆశ్చర్యము.
తీక్ష్ణము - వేడిమి, విణ.వాడియైనది, చురుకైనది.
గాఢత - (గృహ.) తీవ్రత, తీక్ష్ణత (Intensity).
ఉగ్రత్వా దుగ్రం - ఉగ్రమైనది.
తీవ్రము - 1.అధికము 2.వేడిమి గలది 3.కారముగలది (భౌతి.) గట్టిగా వినబడునది (ధ్వని.) (Loud).
తీవరము - తీవ్రము, త్వరితము, సం.తీవ్రమ్.
త్వరితము - శీఘ్రము, వడిగలది.
తీవరపాటు - తొందరపాటు. తొందరపాటు - త్వరపడుట.
తొందర - 1.మిక్కిలి త్వర, 2.బాధ.
తొందరచేయు - 1.బాధించు, 2.త్వరపడు. నెమ్మదిగా త్వరపడు.
తొందరపాటుతనం తక్కువ మందికే విజయాన్ని, ఎక్కువ మందికి దురదృష్టాన్ని చేకూరుస్తుంది. - ప్రూథాన్
వహ్ని - అగ్ని.
వత్సలము - వహ్ని, తృణాగ్ని.
వత్సలుఁడు - వాత్సల్యము(దయ) గలవాడు.
వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః ఇ-పు. వహ ప్రాపణే. - హవ్యమును దేవతలకుఁ జేర్చువాఁడు.
భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాస్వంతుఁడు - సూర్యుడు, విణ.ప్రకాశించువాడు.
భాసిల్లు - ప్రకాశించు. భాస్వరుడు - సూర్యుడు.
భా - 1.సూర్యకిరణము 2.సూర్యుని వెలుగు.
భానువు - 1.సూర్యకిరణము 2.సూర్యుడు.
భామము - 1.కోపము 2.రోషము 3.సూర్యకిరణము.
భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.
సూర్యుఁడు - వెలుగు రేడు.
బావ - తోడ పుట్టిన దాని మగడు, సం.భావుకః.
భామ - స్త్రీ. భామలలో తిలోత్తమ|
భామిని - 1.క్రీడాసమయమందు కోపము చూపెడు స్త్రీ, 2.స్త్రీ.
కోపనా సైవ భామినీ :
కోపశీలా కోపనా - కోపమే స్వభావముగాఁ గలిగినది.
భామ్యత్యవశ్యం కుప్యతి భామినీ. భామక్రోధే. - అవశ్యము కోపగించు కొనునది. ఈ రెండు కోపముగల స్త్రీ పేర్లు.
అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః,
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. - భజగోవిందం
ఘర్మము - 1.చెమట, 2.ఎండ, 3.వేడిమి, 4.వేసగి.
చెమట - 1.స్వేదము, రూ.చెమరు.
చెమరు - 1.చెమట, 2.చెమరుకాకి.
చెమటపట్టు - క్రి. చెమటపోయు.
చెమరించు - క్రి. చెమటపోయు.
చెమటగొట్టు - చెమట పట్టినవాడు.
చెమరుఁబోతు - మిక్కిలిచెమట గలవాడు.
చెమటకాయ - ఎండ వేడికి దేహమున లేచు చిన్న గుల్ల.
స్వేదగ్రంధులు - (గృహ.) ఇవి శరీరమునుండి కేశినాళికలద్వారా మలిన పదార్థములను నీటితో సహా పీల్చుకొని చెమటరూపమున శరీరము మీదికి విడిచి పెట్టును (Sweat glands).
స్వేదజము - చెమటవలన పుట్టినది (పేను మొదలగునవి).
స్వేదజాః కృమి దంశాద్యాః : స్వేదాత్ భౌమోష్మణో జాతా స్వేదజాః - ఉక్కవలనఁ బుట్టినవి. పురుగులు ఈఁగలు మొదలైనవాని పేరు. ఆది శబ్దము వలన ఉసుళ్ళు దోమలు మొదలైన వానికి పేరు.
ఈగ - మక్షికము; మక్షిక - ఈగ; ఈవ - ఈగ;ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత.
ఈపి - 1.తలయం దుండెడి అంటుపేను, పేనుగుడ్డు, 2.ఈగ పెట్టిన గ్రుడ్డు 3.ఈగ మలము.
ఈరు - అల్పము, వి.పేనుగ్రుడ్డు.
పేను - తలలో పెరుగు సూక్ష్మప్రాణి, యూకము.
యూకము - 1.చీరపోతు, 2.పేను.
చీరపేను - 1.చీరబోతు, 2.గుడ్డ నంటుకొని యుండు తెల్లపేను, 3.ధేనుకము(చీరపేను).
అంటు పేను - తల నంటుకొని యుండు చిన్నపేను.
అంట్లు - 1.వంటచేసిన పిదప తోమక యుండు పాత్రలు (ని. బహు.), 2.అంటు పేలు.
చీఁదఱ - 1.ఉపద్రవము, 2.ఛిద్రము, 3.అసహ్యము. ఛిద్రపు రోజులలో చీడపేలేగాని సిరిసంపదలు కలుగవు. పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గొరిగిందట.
క్షుద్ర - 1.ఈగ, 2.వేశ్య, 3.అంగహీనయగు స్త్రీ 4.నట్టువకత్తె, 5.గయ్యాళి.
ఈగ - మక్షికము. మక్షిక - ఈగ. ఈగకు శిరస్సునందు విషముండును.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
అంగహీనయగు స్త్రీ -
నట్టువకత్తె -
గయాళి - 1.దిక్కరించి మాటలాడునది, 2.వదరుబోతు, రూ.గయ్యాళి, వి.ధూర్త స్త్రీ. గట్టివాయి - గయాళి, ధూర్తురాలు. వదరు - ప్రేలు, సం.వక్తృ.
మక్షి కా మారుతో వేశ్యా యాచకో మూషక స్తధా|
గ్రామణీ ర్గణక శ్చైవ సప్తైతే పర బాధకాః||
తా. ఈఁగలు, గాలి(మారుతము - వాయువు), భోగముది, బిచ్చగాడు, ఎలుక, గ్రామాధికారి, కరణము; వీర లేడుగు రెల్ల(ఎల్ల)ప్పుడు పరులను పీడించువారనుట. – నీతిశాస్త్రము
టైఫాయిడ్ - (Typhoid) అపాయకరమైన విషజ్వరము, (ఇది నీటి మూలమున, ఈగల మూలమున వ్యాపించును.)
దోమ - చీకటీగ(చీకటి యీఁగ - చిన్నదోమ), మశకము.
మశకము - దోమ; తీక్షతుండము - దోమ.
ఏనికదోమ - ఒక తెగ పెద్ద దోమ, ఘోణిక.
ఘోణి - ఏనుగు, దోమ, పంది.
దంశి - అడవిదోమ, చిన్న అడవియీగ.
దంశము - 1.అడవియీగ, 2.కాటు, 3.దంతము.
దంశనము - 1.కాటు, 2.కవచము, 3.పల్లు, రూ.దంసనము.
దంతము - పల్లు, కోర.
మూఁగ - 1.మూగవాడు, విణ.మాటాడలేనిది (Dumb) 2.దోమ, సం.మూగః.
నోరుమెంగ - మూగ.
మలిమ్లుచము - 1.దోమ, 2.మల మాసము.
మలమాసము - అధిక మాసము.
అధిక మాసము - చాంద్రమానమున మూడేండ్ల కొకసారి వచ్చు పదమూడవ నెల. సూర్యసంక్రమణము లేని చాంద్రమాన మాసము.
అనాఫిలిస్ - (Anophele) దోమలలో ఒక జాతి. (ఈ జాతి ఆడు దోమల ద్వారా అనాఫిలిస్ మలేరియా వ్యాపించును.)
మలేరియా - (గృహ.) (Malaria) చలిజ్వరము, (ఈ జ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)
గుణన పూర్వదశ - (జం.) మానవ రక్తకణములలో ప్రవేశించిన మలేరియా రోగజీవి అభివృద్ధి చెందుచు విభజనకు సిద్ధముగా నున్న దశ (Schizont).
ఖండగుణము - మానవ రక్త కణములలో జరుగు మలేరియా రోగజీవి యొక్క జీవిత దశలు (Schizogony).
1. తొలురిక్క - అశ్విని, గుఱ్ఱము ముఖమును పోలి 3 నక్షత్రములు వుండును.
అశ్వయు గశ్వినీ : అశ్వం యునక్తి రూపేణ బధ్నాతీ త్యశ్వయుక్. యుజిర్ యోగే - రూపముచేత అశ్వసామ్యమును బొందునది. అశ్వరూప యోగా దశ్వినీ - అశ్వమువంటి రూపము గలది. అనునవి అశ్విని పేర్లు.
తదశ్వినావశ్వయుజోపయాతామ్ | సుభంగ మిష్టౌ సుయమేభిరశ్వైః | స్వం నక్షత్రగ్ం హవిషా యజంతౌ | మధ్వాసంపృక్తౌ యజుషా సమక్తౌ | యౌ దేవానాం భిషజౌ హవ్యవాహౌ | విశ్వస్య దూతా - వమృతస్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప యాతామ్ | నమోశ్విభ్యాం కృణుమోశ్వ - యుగ్భ్యామ్ ||28||
అశ్విని - 1. 27 నక్షత్రములలో మొదటిది (Aries), 2. అశ్వినీ దేవతల తల్లి, బడబ.
బడబ - 1.ఆడుగుఱ్ఱము, 2.బ్రహ్మణ స్త్రీ, 3.తార్పుకత్తె.
వామి - ఆడు గుఱ్ఱము, వి.ప్రోగు, రాశి.
ప్రోఁగు - పోగు; పోఁగు - దారము, 2.చెవినగ.
రాశి - 1.రాసి 2.నికాయము, సమూహము. 2.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, నూలు, 3.వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
కుప్ప - ధాన్యము మొ. ని రాశి.
కుప్పట - ధాన్యము వలన ధనము.
ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.
నీరుచిచ్చు - బడబాగ్ని (నీటిలో మండు అగ్ని).
ఔర్వస్తు బాడబో బదబానలః :
ఉర్వస్య ఋషే రపత్యం ఔర్వః - ఉర్వుఁడను మునికి కొడుకు.
ఉర్వతీత్యౌర్వః, ఉర్వీ తుర్వీ ధుర్వీ దుర్వీ హింసాయాం - హింసించునది.
బడబాయాం భవః బాడబః, బడబానల శ్చ - బడబ యనఁగా ఆఁడు గుఱ్ఱము, దాని ముఖము నందుండునది బాడబము. బడబానలమును, ఈ మూడు బడబాగ్ని పేర్లు.
బాబా - గుఱ్ఱము, సం.బడబా, వాహః.
వాహము - 1.గుఱ్ఱము, 2.ఎద్దు, 3.భుజము.
బాబారౌతు - కుబేరుడు.
బాడబము - 1.బడబా సమూహము, 2.బడబానలము.
బాడబాగ్నిరివాతృప్తో బాడబః - బడబాగ్ని వలెఁ దృప్తిలేనివాఁడు.
బడబా బ్రాహ్మణీ. తస్యా అపత్య మితివా బాడబః - బడబ యనఁగా బ్రాహ్మణస్త్రీ; దాని వలన బుట్టినవాఁడు, బ్రాహ్మణుడు. "కుంభదాస్యశ్వా స్త్రీవిశేషా ద్విజాంగనా" అని రభసుడు.
బ్రహ్మణ్యము - 1.బ్రాహ్మణులకు హితమైనది, 2.గంగరావి.
బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము. బ్రాహ్మణములు - వైదిక ధర్మగ్రంథములు, యజ్ఞతంత్రములను, పురాణగాథలను చెప్పు ధర్మ గ్రంథములు.
బ్రాహ్మణ్య బాడబ్యే తు ద్విజన్మనామ్ :
బ్రాహ్మణానాం సమూహో బ్రహ్మణ్యం; బాడబానాం సమూహో బాడబ్యం - బ్రహ్మణుల యొక్క సమూహము బ్రహ్మణ్యము, బాడబ్యమును.
ధేనుక - 1.లేగటి యావు, 2.ఆడేనుగు, 3.ఆడుగుఱ్ఱము, 4.చిన్నకత్తి, 5.పార్వతి, రూ.ధేనువు.
ధేనుకా తు కరేణ్వాం చ :
ధేనుకా శబ్దము ఆఁడుఏనుగునకును, చకారము వలన క్రొత్తగా నీనిన యావునకును పేరు. దయంత్యేనా మితి ధేనుః, ధేనురేవ ధేనుకా. ధేట్ పానే. దీని క్షీరమును ద్రాగుదురు. "ధేనుకా త్వశ్వయోషితి, భవాన్యాం చ కృపాణ్యాం చ ప్రసూతాయాం పశౌ గవి" ఇతి శేషః.
ధేనువు - లేగటి యావు.
లేఁగడియావు - లేతదూడగల యావు.
లేఁగ - (లేత+కానుపు) క్రొత్తగా బుట్టిన దూడ.
తర్ణకము - అప్పుడు పుట్టిన దూడ. పాలకొరకు లేగదూడ పరుగులెత్త సాగెను.
ధేను స్స్యాన్న వసూతికా :
ధయ త్యేనాం వత్స ఇతి ధేనుః. ఉ.సీ. ధేట్ పానే. - దూడ దీని చన్నుఁ గుడుచును.
నవం సూతా నవసూతికా - క్రొత్తగా నీనినది. ఈ రెండు లేఁగటియావు పేర్లు.
వలనుగ గానలందు ప్రతివర్షమునం బులి నాలుగైదు పి
ల్లలగను చూడనొక్కటి నిలంగను ధేనువు రెండుమూడునే
డులకటులైన బెబ్బులి కుటుంబము లల్పము లాయె నాలమం
దలుగడువృద్ధిజెందవె యధర్మము ధర్మము దెల్ప, భాస్కరా.
తా. ఆవు రెండు మూడేండ్లకొక దూడవంతున నీనినను అవి వృద్ధి జెంది మందలగు చున్నవి. పులి ప్రతి సంవత్సరము నాలుగైదు పిల్లలను ఈనినను నవి వృద్ధి పొందలేదు. అధర్మము నిలువకుండుటకు, ధర్మము నిలిచియుండుటకు ఇవియే తార్కాణము.
కరేణువు - ఆడేనుగు.
వశ - ఆడేనుగు.
గోడిగ - ఆడు గుఱ్ఱము, సం.ఘోటికా.
ఘోటకము - గుఱ్ఱము, వి.గోడా.
గోడ - 1.భిత్తి, సం.కుడ్యమ్, 2.గుఱ్ఱము, రూ.గోడా, సం.ఘోటః.
కుదరము - గుఱ్ఱము, వికృ.కుదిర.
కుదిర - గుఱ్ఱము, సం.కుడరః.
అండగోడ - గోడకు ఆసరాగాకట్టినగోడ, అడ్దగోడ, అడ్దుగానుంచిన చిన్నగోడ.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పంచమి - 1.పక్షమందు ఐదవ తిథి, 2.దౌపది.
పాంచాలి - 1.దౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.
చాకు - చిన్నకత్తి; బాగుదార - చిన్నకత్తి.
తార్పుకత్తె - తాపికత్తె; ఎడ కత్తియ - తార్పుకత్తియ, దూతి; దూతి - కుంటెనకత్తె, రూ.దూతిక. కుంటికత్తె - తార్చునట్టి స్త్రీ, రూ.కుంటినకత్తె, కుంటెనకత్తె; సంచారిక - కుంటెనకత్తె. విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 3.పసుపు.
విష్టరశ్రవుఁడు - విష్ణువు, వ్యు.దర్భ పిడికిళ్ళ వంటి చెవులు గలవాడు.
విష్టరశ్రవా, స-పు. విష్టరే ఇనశ్రవసీ కర్ణౌయస్యసః - దర్భముడి వంటి చెవులు గలవాడు.
విష్తరే అశ్వర్థతరౌ శ్రూయత ఇతివా - అశ్వర్థ వృక్షము నందు వినబడువాడు.
విష్టరాకారో రోమావర్తః శ్రవసి యస్యసః - విష్టరాకార మైనరోమావర్తము చెవియందుగలవాఁడు.
విష్టరం వ్యాపనశీలంశ్రవః కీర్తిర్యస్యసః - వ్యాపన శీలమైన కీర్తిగలవాడు.
విష్టరము - 1.ఆసనము, 2.మ్రాను, 3.దర్భ పిడికిలి.
ఆసనము - 1.పీఠము, 2.దేశకాలాదులను పట్టి దండెత్తిపోక నిల్చియుండుట, (వ్యతి.) యానము, 3.యోగాసనము.
విష్టరో విటపీ దర్భముష్టిః పీఠాద్యమాసనమ్,
విష్టరశబ్దము వృక్షమునకును, దర్భ పిడికిలికిని, పీట మొదలైన యాసనములకును పేరు. విస్తీర్యత ఇతి విష్టరః, స్తృఞ్ అచ్ఛాదనే. విస్తరింపఁ బడునది గనుక విష్టరము.
రావి - 1.అశ్వర్థము, 2.రావిచెట్టు.
అశ్వర్థము - 1.రావిచెట్టు, 2.అశ్వినీ నక్షత్రము, 3.ఆశ్వయుజ పూర్ణిమ. రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠావాసం.
రావిరేక - బిడ్డలకు జడను గట్టు నగ.
తొలురిక్క నెల - ఆశ్వయుజము.
కోజాగరము - ఆశ్వయుజ పూర్ణిమ.
స్వర్వైద్యావశ్వినీ సుతా, నాసత్యా వశ్వినౌ దస్రా వాశ్వినేయౌ చ తా వుభౌ :
అశ్వినీ దేవతలు - దేవ వైద్యులు.
స్వః స్వర్గే వైద్యౌ స్వర్వైద్యౌ - స్వర్గమునందుండు వైద్యులు.
అశ్వని సుతులు - దేవతల వైద్యులు.
అశ్వరూప ధారిణ్యా స్సూరపత్న్యా స్సంజ్ఞాయా స్సుతౌ అశ్వినీ సుతౌ - అశ్వరూపమును ధరించిన సంజ్ఞయనుపేరు గల సూర్యుని భార్యకు సుతులు. సూర్యునిభార్య యగు సంజ్ఞాదేవి యశ్వరూపధారిణియై వీరలం గనె నని కథ గలదు.
నా సత్యులు - అశ్వినీ దేవతలు.
న విద్యతే అసత్యం యయో స్తౌ నాసత్యౌ - అసత్యము లేనివారు.
అశ్విన్యాం జాతౌ అశ్వినౌ - అశ్వరూపము గల సంజ్ఞా దేవియందుఁ బుట్టినవారు.
అశ్వయుక్క - 1.అశ్వినీ నక్షత్రము, 2.ఆశ్వయుజ మాసము, విణ.1.గుఱ్ఱములను పూనుచువాడు, 2.గుఱ్ఱములను కట్టునది(రథము), 3.అశ్వినీ నక్షత్రమున పుట్టినవాడు.
అశ్వినీ నక్షత్రే జాతావశ్వినౌ - అశ్వినీ నక్షత్ర మందుఁ బుట్టినవారు.
ప్రశస్తాః అశ్వాః అనయౌః సంతీతి అశ్వినౌ సదా అశ్వారూఢత్వాత్ - గుఱ్ఱములు గలవారు.
దస్రులు - అశ్వినీ దేవతలు.
దస్యతః క్షిపతో రోగానితి దస్రౌ. దసు ఉపక్షయే - రోగములను క్షయింపఁ జేయువారు.
అశ్వులు - దేవవైద్యులు, సూర్యుని కొడుకులు
అశ్విన్యా అపత్యే అశ్వినేయౌ - అశ్వినీదేవీ కొడుకులు, అశ్వినీదేవతలు; వీరిద్దరు అమడలు.
అశ్వర్థ వట నింబామ్ర కపిత్థ బదరీగతే|
వనసార్క కరీరాది క్షీరవృక్ష స్వరూపిణీ||
ఆశ్వయుజ మాసంబున ఋచీకతనయుండు కంబళాశ్వుండు, తిలోత్తమ, బ్రహ్మోపేతుండు, శతచిత్తు, దృత్రాష్ట్రుం డిషంభరు లను సభ్యులతోడఁ గూడి కాలంబు గడుపుచుండుఁ - ఈ నెలలో ఋచీకుని సుతుడైన కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మోపేతుడు, శతజిత్తు, దృతరాష్ట్రుడు, ఇషంభరుడు అనే సభ్యులతో సహవర్తియై కాలక్షేపం చేస్తుంటాడు.
త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ - దేవశిల్పి.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్య పనిచేయువాడు, 2.పక్షివిశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.
ధరలోఁ ద్వష్ట్రాహ్వయమును,
నిరవుగ ధరియించి ధాత్రి కింపు దలిర్పం
బరియించుచు నభమందున్,
సరసిజహితుఁ దాశ్వయుజము సయ్యనఁ గడపున్.
భా|| ఆశ్వయుజ మాసంలో సూర్యుడు, త్వష్ట అన్నపేరుతో భూమికి ప్రమోదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తుంటాడు.
అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య, 7number.
గుఱ్ఱము - అశ్వము.
ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
సంవత్సరము - ఏడు; ఏడు - ఆరునొకటి.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సత్తా - సత, ఏడు, సం.సత్త, వై.వి. శక్తి, సం.సత్వమ్.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సతనాల్కల జేజే - అగ్ని, సప్తజిహ్వుడు, ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు - అగ్ని.
రేవంతుఁడు - అశ్వశిక్షకుడు.
రౌతు - రావుతు, రాహుత్తు రావుతు, సం.రాహుత్తః.
రాహుతు - గుఱ్ఱపు రౌతు, సం.రాహుత్తః.
గోడ - 1.భిత్తి, సం.కుడ్యమ్, 2.గుఱ్ఱము, రూ.గోదా, సం.ఘోటః.
భిత్తి - 1.గోడ, 2.భేదనము, 3.జుత్తలి.
కుడ్యము - 1.గోడ, 2.పూత. భిత్తిక - 1.పిడుగు, 2.గోడ.
గోదా - కుస్తీచేయు ప్రదేశము.
గోడిగ - ఆడు గుఱ్ఱము, సం.ఘోటికా.
హేష - గుఱ్ఱపు సకిలింత, హేష.
హ్రేషితము - హ్రేష.
కదను - ఒకరకపు అశ్వగతి.
రేచితము - వంకరలేక వేగముతో బోయెడి యశ్వగతి.
మందడి - గుఱ్ఱపుసాల, సం.మందురా.
మందురా - చంద్రుడు Moon.
అగము - 1.చెట్టు, 2.కొండ, 3.పాము, 4.సప్త సంఖ్య.
చెట్టు - 1.గుల్మము 2.వృక్షము.
గుల్మము - గుల్మరోగము, (ప్లీహము, పెద్దదగు రోగము), 2.ప్లీహము, Spleen ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలెని చెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6. 9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన 7.పల్లెయందలి ఠాణా.
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము + సేన-అందుండు వాడు.)
వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాల ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృఢమైన శాఖలుగల మొక్క(Tree).
నగము - 1.కొండ 2.చెట్టు రూ.అగము.
నగవైరి - ఇంద్రుడు వ్యు.కొండలకు శత్రువు.
అగజాత - 1.పార్వతి, 2.వసురాజు భార్య గిరిక.
అగచరము - కోతి, వ్యు.చెట్టు లేక కొండలపై తిరుగునది.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
రుద్దు - పులుము, తోము.
పాములబిడారము - (వ్యావ.) పుట్ట. పుట్టమన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి.....
మొలక బంగారు - పుట్ట బంగారు (పుట్టలో పురుగులవలన కలిగినది.
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవై నయట్లు పామరుడు దగన్
హేమంబు గూడబెట్టిన
భూమీశులపాల జేరు భువిలో సుమతీ.
తా. చీమలు కష్టపడి వాల్మీకములు నిర్మించిన, అవి పాములకు తావైనట్లు, పామరుఁడు - 1.మూర్ఖుడు, అజ్ఞుడు, 2.నీచుడు.)కూడబెట్టిన హేమము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.) రాజుల పాలగును.
ఏనుఁగు మోముసామి - గజాననుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజవదనుడు - వినాయకుడు.
గజస్యేవ ఆననన్మ్ యస్య సః గజాననః - ఏనుఁగు మొగము వంటి మొగముగలవాడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో వుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేన్నాంగములలో ఒకటి.
గజతి మాద్యతీతి గజః, గజమదే. - మదించునది.
గౙ - పెద్ద, సం.గజః.
గజయాన - ఏనుగు నడకవంటి నడకగల స్త్రీ, స్త్రీ.
గజే పి నాగ మాతఙ్గా :
నాగ శబ్దము ఎనుగుఁనకున, అపిశబ్దము వలన పామునకును, సీసమునకును పేరు. మాతంగశబ్దము ఏనుఁగునకును, అపిశబ్దము వలన చండాలునకును పేరు.
నగే భవో నాగః - పర్వమందుఁ బుట్టినది.
మాతంగాదృషేర్జాతో మాతంగః - మతంగుఁడను ఋషివలనఁ బుట్టెను మాతంగము, మాతంగుఁడును.
లావరి - బల్వంతుడు.
లావు - 1.బలము, 2.అతిశయము, 3.సామర్థ్యము, విణ.స్థూలము.
లావు గలవాని కంటెను,
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును,
మావటివాఁ డెక్కినట్లుమహిలో సుమతీ.
తా. శరీరబలము గలవానికంటెను బుద్ధిబలము గల మానవుడు శక్తిమంతుడు. ఎట్లనగా గొప్ప బలముగల ఏనుగును మావటి - శూరుడు, మల్లుడు, రూ.మాసటీడు, విణ.శ్రేష్ఠుడు. స్వాధీనపరచు కొనుట యిందుకు నిదర్శనం.
నాగము - 1.సత్తు, 2.తగరము, 3.పాము, 4.ఏనుగు, 5.కొండ, 6.మేఘము, 7.తమలపాకుతీగ. Air in organs
నగేగిరౌ భవోనాగః - పర్వతమందుఁ బుట్టినది Elephant.
సత్తు - సత్త్వము, సత్యము, సారము, వి.సీసము Lead, సం.విణ. (సత్) ఉన్నది 1.చదువరి (ౘదువరి - విద్వాంసుడు), 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
నాగ సీసక యోగేష్ట వప్రాణి -
న గచ్ఛతీ త్యగం, తన్నభవతి చలత్వాదితి నాగం, గమ్ ఌ గతౌ. - మెత్తనౌటచేత కదలునది.
సినోతి బద్నాతి పారదమితి సీసకం. - పాదరమును బంధించునది.
సువర్ణకరణయోగే ఇష్టం భతీతి యోగేష్టం. - బంగారు చేయు యోగమందిష్టమైనది.
ఉప్యతే సువర్ణ యోగ ఇతి వప్రం, టు వప్ బీజసంతానే. - బంగారు చేయు యోగమందుఁ బెట్టఁబడునది. ఈ 4 సీసము పేర్లు
మహాబలము - సీసము.
సీసము1 - (రసా.) కత్తితోకోయబడు నంతటి మెత్తగానుండు ధాతువు. దీని రంగు నీలి ధూసరముల మధ్యనుండును. ఇది ఆవర్తక్రమపట్టిక నాల్గవ 4వ వర్గములో నుండును (Lead).
సీసము2 - 1.ఒకరకపు పద్యము, 2.ఒకానొక మల్లబంధము.
సీసకము - 1.కిరీటము, 2.ఒకవిధమైన మల్లబంధము.
హీనధాతువు - (రసా.) గాలికి, నీటికి, సులభముగా మార్పు చెందగల ధాతువు (Base metal), ఉదా. ఇనుము, రాగి, జింకు, సీసము.
తమరము - 1.తగరము, 2.సీసము.
త్రపు పిచ్చటమ్, రఙ్గవఙ్గే -
త్రపువు - తగరము, సీసము.
త్రపతే అగ్ని సన్ని ధౌ ద్రవతీతి త్రపుః ఉ.పు త్రపూష్ లజ్జాయాం. - అగ్ని సమీపమందు సిగ్గుపడునది, అనఁగా కరఁగునది.
పిచ్యతే కుట్యత ఇతి పిచ్చటం, పిచ్చ కుట్టనే. - కొట్టఁబడునది.
వంగము - 1.తగరము, సత్తు, 2.వంగ, 3.వంగదేశము West Bengal.
వంగ - వంగచెట్టు, సం.వంగమ్.
వంకాయ - (వంగ+కాయ) వంగకాయ, వార్తాకము.
వార్తాకము - వంగ.
వంగలేపనము - (రసా.) ఇనుమునకు, ఇత్తడికి రాగికి తగరపు కళాయి పూయుట, (Tinning). కలాయి - పాత్రలకు తగరము పూయుట, రూ.కళాయి.
అదృశ్య విషజీవులు - (వ్యవ.) సూక్ష్మదర్శని సాయమునకూడ నిరూపించరాని కొన్ని అతిసూక్ష్మజీవులు. ఉదా. వంగ, సీమవంగ మొ. మొక్కలకు తెగులు కలిగించునట్టి జీవులు. అట్టి తెగుళ్ళను అదృశ్య విషరోగములు, (Virus disease) అందురు.
సువర్ణస్య మలం రూప్యం - రూప్యస్యాపి మలం త్రపు |
జ్ఞేయం త్రపుమలం సీసం, సీసస్యాపి మలం మలమ్ ||
బా|| సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచివర్ణము కలది. Gold) బంగారానికి మలం (కాలుష్యం) వెండి Silver, వెండికి మలం తగరం, తగరానికి మలం సీసం Lead, సీసానికి మలం మలమే.
నంబెరుమాళ్ళు - శ్రీరంగనాయకుడు.
రంగఁడు - 1.శ్రీరంగడు, 2.నంబెరుమాళ్ళు.
సిరంగఁడు - శ్రీరంగనాథుడు, సం.శ్రీరంగః.
సిరంగము - శ్రీరంగము.
రంగము - 1.సత్తు, 2.యుద్ధభూమి, 3.నాట్యస్థానము, 4.శ్రీరంగము, 5.రంగు.
రంగతి ద్రవతి రంగం, రగి గతౌ, వంగతి ద్రవతి వంగం, వగిగతౌ. - కరఁగునది గనుక రంగము, వంగము, త్రపుశబ్దము సీసమునకును పేరు. "రంగసీసకయోస్త్రపు" అని రుద్రుడు. ఈ 4 తగరము పేర్లు.
రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.
సత్తు - సత్త్వము, సత్యము, సారము, వి.సీసము Lead, సం.విణ. (సత్) ఉన్నది 1.చదువరి (ౘదువరి - విద్వాంసుడు), 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
సత్త్వము - 1.సత్త, బలము 2.స్వభావము 3.ఒక గుణము 4.జంతువు.
సత్త్వము - (రసా.) ఒకవస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
బలము - సత్తువ, సైన్యము.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
జంతువు - చేతనము, ప్రాణముగలది.
చేతనము - 1.ప్రాణము కలది, 2.ఆత్మ, 3.పరమాత్మ.
జంతుశాస్త్రము - (జం.) జీవశాస్త్రపు శాఖలలో నొక శాఖ, జంతువుల జీవితములను గురించి తెలియచేయుశాస్త్రము, (Zoology).
బలము - సత్తువ, సైన్యము.
బలము త్యనే నేతిబలం, బలప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
కృత్యము - యుగములు నాల్గింటిలో మొదటిది, విణ.చేయబడినది.
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి - క్రియాశక్తి స్వరూపిణీ|
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ. – 130శ్లో
వినమ్రము - మిక్కిలి వంగినది, సం.వి.తగరము (వినమితము).
తగరము - తవురము, ఒక తెల్లని లోహము, రూ.తవరము, సం.తమరమ్, వై.వి. (రసా.) వంగము, సులభముగా కరగు వెండివలె తెల్లనగు ధాతువు (Tin). (ఇది ఆవర్తక్రమ పట్టికలో నాల్గవ 4వ వర్గమున కననగును.) సం.వి. పొట్టేలు.
నాగుఁడు - శేషుడు, సం.నాగః.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
శేషశయనుఁడు - విష్ణువు.
నాగువు - నాగము, త్రాచు, రూ.నాగుబాము, నాగులు, సం.నాగః.
నాగ - 1.పూజ్యము, (ఉదా. నాగ బెత్తము.) 2.పెద్ద (నాగగన్నేరు) సం.నాగః.
త్రాచు - నాగుబాము; మంచిపాము - నాగుపాము.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏన్గు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
ఏనుఁగుకాలు - కాలు లావగు వ్యాధి, బోదకాలు (Elephantiasis).
పుట్టకాలు - బోదకాలు; బూరకాలు - బోదకాలు.
బోదకాలు - వ్యాధిచే వచ్చు ఏనుగు కాలు వంటి కాలు.
ఏనుఁగు గజ్జి - మూగగజ్జి (Eczema).
ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగా గలది.
ఏనుఁగు గొంగ - సింహము Lion, వ్యు.ఏన్గులకు శత్రువు.
కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, మలై.
కొండచూలి - పార్వతి. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కొండయల్లుఁడు - శివుడు. కొండమల్లయ్య - శివుడు.
కొండఱేఁడు - హిమవంతుడు.
కొండ పగతుఁడు - ఇంద్రుడు, కొండలకు శత్రువు.
మేఘము - మబ్బు.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము(తెలివిలేనితనము).
చీఁకటి - అంధకారము.
చీఁకటిగాము - రాహువు Rahu.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
ఆకుతోట - తమలపాకుల తోట.
ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.
తాంబూవల్లీ తామ్బూలీ నాగవల్ల్యపి :
తాంబూలవల్లి - తములపాకు తీగ, రూ.తాంబూలి.
తాంబూలార్థం వల్లీ తాంబూలవల్లీ - తాంబూలము కొఱకైన తీఁగె.
తామ్యతి వివశోభవ త్యనయా జన ఇతి తాంబూలీ. సీ. తము గ్లానౌ. - దీనిచేత నరుఁడు వివశుఁ డగుచున్నాఁడు.
నాగవల్లి - పెండ్లిలో తుది దినమున జరుపు శుభకార్యము, సం.వి. తములపాకు తీగ, సం.నాకబలిః.
నాగస్త్యైరావణస్యాలానే జాతత్వాన్నాగవల్లీ. సీ. - ఐరావతము యొక్క కట్టుకంబమందుఁ బుట్టినది.
నాకబలి - నాగవలి.
"నాగలోకాదానీతా వా వల్లీ నాగవల్లీ - నాగలోకము నుండి తేఁబడిన తీఁగె. ఈ మూడు 3 తమలపాకుతీఁగె పేర్లు. తమలపాకు తీగ ఆధారం లేకుండా పెరగదు బ్రతకదు.
నాగవసాని - నాగవల్లి నడుపు ముత్తైదువ, రూ.నాపసాని.
నాపసాని - నాగపసాని, నాగవల్లి నడుపు పెద్ద మూత్తైదువ.
నాగవల్లి నిష్ఠురము - (జాతీ.) పెండ్లియైదవ నాటిదెప్పులు, పనియైన పిదప పోరాటము.
తములపాకు - నాగవల్లి దళము, రూ.తములపుటాకు.
తమలపాకు - (వ్యవ.) ఈ ఆకులు తాంబూలము నకును, వైద్యమునకును ఉపయోగించును. (ఈ తీగ మిరియపు కుటుంబము (Piperaceae) నకు చెందిన Piper betle అను మొక్క.) రూ.తమలపాకు.
కమ్మెరాకు - కారపు నల్ల తమలపాకు.
ఆకులోకెల్ల మేలైన ఆకు - తమలపాకు.
ఇంతింతాకు - పచ్చని ఆకు - రాజులు మెచ్చిన రత్నాలాకు - తమలపాకు.
ఆకుమడుపు - తమలపుచుట్ట.
మావటము - తమలపాకుల కట్ట.
కన్నాకు - మేలుతరము, శ్రేష్ఠము, వి.1.ముఖ్యుడు, 2.తమలపాకు కట్టయందు పైననుండు పెద్ద ఆకు.
ఆకుతెగుళ్ళు - (వ్యవ.) మొక్కల ఆకులకు శిలీంద్రముల వలన సంభవించు తెగుళ్ళు (Leaf diseases). (ఇవి సామాన్యముగా 1.మచ్చతెగుళ్ళు (Leaf Spots), 2.చారతెగుళ్ళు (Rusts), 3.బూడిద తెగుళ్ళు (Mibdews) అని మూడు రకములుగా ఉండును).
మచ్చతెగులు - (వ్యవ.) ఆకులపై ఎరుపు, గోధుమ, నల్లని రంగు గల మచ్చలేర్పడు రోగము.
తములము - తాంబూలము, వక్కాకు, రూ.తమ్మలము, సం.తాంబూలమ్.
తాకబూలము - వక్కాకు, తములము.
కిళ్లి - పరిమళ ద్రవ్యములతో గూడిన తాంబూలము.
విడియము - తాంబూలము, రూ.విడియ, వీడెము, విడ్యము, వీడ్యము, సం.వీటికా.
అన్నదమ్ములం ముగ్గురం మేము - అయితే బుద్ధులు వేరు - నీళ్ళలో మునిగేవాడొకడు - తేలేవాడొకడు - కరిగేవాడొకడు, మేమెవవరం? – వక్క-ఆకు-సున్నం
సుదియ - తమలపాకుల బరువులో సగము, విన.తులువ.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు; దుర్జనుఁడు - దుష్టుడు.
తులువకత్తి - వంపు చురకత్తి.
తమ్మ - నమలిన తాంబూలము, సం.తాంబూలమ్.
తమ్మతనుకు - తమ్మపడిగ, తాంబూలముమియు పాత్రము.
హడవము - అడపము, వక్కలాకులుంచుకొను బరణి.
అడపము - 1.వక్కాకులు పెట్టుకొను సంచి, 2.మంగలి పొది.
కరతిత్తి - వట్రవు సంచి, తమలపాకులు మొ.వి ఉంచుకొను చేతిసంచి, సం.కరదృతిః.
వట్రము - కురుచ, హ్రస్వము, వి.వక్కాకు తిత్తి.
అడపకాఁడు - 1.మంగలి, 2.అడపము పట్టుకొనువాడు.
అడప - తాంబూలపు బరణి పట్టుకొను సేవకురాలు.
అడపకత్తె - వక్కలాకుల బరణిని మోయు స్త్రీ.
వలవదు క్రూరసంగతి యవశ్యమొకప్పుడు సేయబడ్డచో
గొలదియెకాక యొక్కవలుగూడవు తమ్ముల పాకులోపలన్
గలసిన సున్న మించుకయెగాక మఱించుక యెక్కువైనచో
నలుగడ జుఱ్ఱుచుఱ్ఱుమని నాబుకపొక్కక యున్నె, బాస్కరా.
తా. తాంబూలములో కలియు సున్నము స్వల్పమయినచో బాధలేదు, ఎక్కువైనచో నాలుక మండును, అట్లే, దుర్మార్గులతో స్నేహము జేయరాదు, చేసిననూ అంత అధికముగా నుండరాదు.
భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది ; గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).
గంధసార ఘనసార చారునవనాగవల్లి రస వాసినీం,
సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం|
మంథరాయతవిలోచనాం అమలబాలచంద్ర కృతశేఖరీం,
ఇందిరారమణసోదరీం మనసి భావయామి పరదేవతాం|| - 2
తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా|
మృగక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. - 114శ్లో
తగరము - తవురము, ఒక తెల్లని లోహము, రూ.తవరము, సం.తమరమ్, వై.వి. (రసా.) వంగము, సులభముగా కరగు వెండివలె తెల్లనగు ధాతువు (Tin). (ఇది ఆవర్తక్రమ పట్టికలో నాల్గవ 4వ వర్గమున కననగును.) సం.వి. పొట్టేలు.
మేణ్డోరభ్రోరణోర్ణాయు మేషవృష్టయ ఏడకే,
మేండ్రము - పొట్టేలు.
మేహతి తేత స్సిఞ్చతీతి మేణ్డః, పా. మేడ్రః, మిహ సేచనే. - రేతస్సును విడుచునది.
మేండించు - క్రి.భేదించు, 2.నశింప చేయు.
ఉరభ్రము - ఉరణము, పొట్టేలు, తగరు.
ఉరో భ్రమయతీ త్యురభ్రః భ్రము చలనే. ఉరమును ద్రిప్పునది.
ఉరణము - పొట్టేలు, వ్యు.బిగ్గరగా మొరబెట్టునది.
ఉచ్చైః రణ త్యురణ రణ శబ్దే. - బిగ్గరగా మొరఁ బెట్టునది.
ఉరణించు - క్రి.ఉరడించు.
ఉరడించు - క్రి.1.వేగిరపడు, 2.విజృంబించు, 3.పరాక్రమించు, రూ.ఉరవణించు, 3.ఉరవడించు, ఉరువణించు.
ఉరవణించు - క్రి.ఉరవడించు.
ఉరవడించు - క్రి.ఉరవడిగొను, ఉరడించు.
డీ - తలతో తలను పొడుచుట(డీడిక్కులు).
డీకొను - క్రి.కవియు, ప్రతిఘటించు.
దీకొను - 1.పొట్టేళ్ళు మొ||వి తలలతో పొడుచు, 2.ఎదిరించు, 3.కవియు, 4.సిద్ధపడు, రూ.డీకొను.
పొట్టేలు - మొగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
తగరు - పొట్టేలు, సం.తగరః.
తగరురౌతు - అగ్ని Fire.
తగిలిమదంబుచేనెదిరి దన్ను నెఱుంగక దొడ్డవానితో
బగఁగొని పోరుటెల్ల నతిపామరుఁడై చెడుటింతె గాక తా
నెగడి జయొంపలేడఁది నిక్కము, తప్పదు, ధాత్రి లోపలన్
తెగియొక కొండతోఁదగరు ఢీకొని తాకిననేమి? భాస్కరా.
తా. గొఱ్ఱె మూర్ఖతచే కొండతో నెదిరించి పోట్లాడిన అది ఆ కొండ - మల, పర్వతమును జయింప గలదా? అట్లే పామరుఁడు - 1.మూర్ఖుడు, అజ్ఞుడు, 2.నీచుడు. యెదుటి వారి ఘనతనూ తన శక్తినీ తెలిసి కొనక విరోధించి(పగ-విరోధము)తో మార్కొనుట ప్రయోజనము లేదు.
ఊర్ణాయువు - 1.పొట్టేలు, 2.ఉన్ని కంబళి, 3.సాలెపురుగు, విణ.ఉన్నికలది.
ఊర్ణా మేషరోమ తదస్యాస్తీతి ఊర్ణాయుః, ఉ. పు. - ఊర్ణయనఁగా గొఱ్ఱె వెండ్రుకలు; అవి గలిగినది.
ఊర్ణా మేషాదిలోమ్ని స్యాదావర్తే చాన్తరా భ్రువౌ : ఊర్ణాశబ్దము గొఱ్ఱె, కుందేలు rabbit, ఎలుక rat మొదలయినవాని రోమములకును, కనుబొమ్మల నడుమ నుండు మహాపురుష లక్షణమైన సుడికిని పేరు. ఊర్ణోతీ త్యూర్ణా. ఊర్ణుఞ్ ఆచ్ఛాదనే. కప్పియుండునది.
ఊర్ణము - 1.నూలు, 2.కనుబొమల నడుమ సుడి, వి.ఉన్ని.
ఉన్ని - గొఱ్ఱె మొ.ని బొచ్చు.
ఉన్ని అల్లిక - (గృహ.) ఊలును దుస్తులుగా అల్లుట (Knitting).
మేషకమ్బళ ఊర్ణాయుః -
కామ్యతే శీతార్త్యై కంబళః, మేషస్య కంబళః మేషకంబళః, కముకాంతౌ. - శీతార్తులచేత కాంక్షింపఁబడునది గనుక కంబళము.
గొఱ్ఱె వెండ్రుకలచేత చేసిన కంబళము.
ఊర్ణా మేష్రోమ త దస్త్యాస్తీతి ఊర్ణాయుః, ఉ. పు. ఊర్ణాయుయనఁగా గొఱ్ఱెవెండ్రుక, అది దీనియందుఁ గలదు. ఈ 2 గొఱ్ఱెవెండ్రుకలచేత నేసిన కంబళి పేర్లు
సాలు1 - 1.ఉన్నిబట్ట, 2.సన్నని వస్త్రము, రూ.సాలువు.
సాలు2 - సంవత్సరము.
సమ్యక్ వసంతి ఋతవో (అ)స్మిన్నితి సంవత్సరః, వత్సరశ్చ, వసనివాసే. - ఋతువులు దీనియందు వసించునుగనుక సంవత్సరము, వత్సరమును.
సాలువరి - ప్రతి సంవత్సరమునకు సంబంధించినది, (Annual).
క్రోషే - (గృహ.) (Crochet) కొక్కెము గల సూది, క్రోషేలేసును అల్లుసూది.
కురుమ - గొఱ్ఱెబొచ్చుతో కంబళ్ళు నేయు గొల్లజాతి.
కంబళికుట్టు - (గృహ.) పో గులు లు రేగియున్న అంచులను పోగు లూడకుండ ఉండుటకు ఉపయోగించెడి కుట్టు.
కురుమగొఱ్ఱె - కంబళ్ళునేయుటకు పనికి వచ్చు ఉన్ని నిచ్చుగొఱ్ఱె.
గొఱ్ఱియ - గొఱ్ఱె, సం.కురరః, కురరీ.
కురరి - ఆడుగొఱ్ఱె.
సమౌ రల్లక కమ్బళౌ,
రల్లకము - కంబళి.
రమంతే అస్తిన్నితి రల్లకః, రము క్రీడాయాం. - దీనియందు క్రీడింతురు.
కంబళము - 1.జలము, 2.కంబడి, గొంగడి, 3.కంబళిపురుగు, 4.ఏనుగుపై పరిచెడి రత్నకంబళము.
కామ్యతే శీతాళుభిరితి కంబళః కాంతౌ. - చలిగలవారిచేత కోరఁబడునది. ఈ 2 కంబళి పేర్లు.
ఆస్తరణము - 1.పరచుట, 2.పరిచెడి కంబళి మొ, 2.చిత్రకంబళి, 4.ఏనుగు మీద పరచెడి కంబళి, 5.పరువు.
ఆస్తీర్యత ఇత్యాస్తరనం, స్తృఞ్ ఆచ్ఛాదనే. - కప్పఁబడునది.
మొగవడము - ఏనుగు మీద కప్పెడు నల్లకంబళము, సం.ముఖపటః.
గొంగడి - 1.కంబళి, 2.ఒకానొక పక్షి, రూ.గొంగళి.
గొంగళి పురుగు - కంబళి పురుగు (వ్యవ, కీట.) శరీరముపై రోమములు గొంగళిపురుగు కల కీటక డింభము (Hairy caterpiller).
ఝూటి - పెద్ద గొంగళి.
కంబళ భోజన న్యాయము - న్యా. గొంగళిలో భోజనము చేయుచు వెండ్రుక లేరు పద్దతి.
ఆవయ శ్శైల మేషార్కాః -
అవిశబ్దము పర్వతమునకును, గొఱ్ఱెకును, సూర్యునికిని(Sun)పేరు. అవతీత్కవి, పు. అవ రక్షణే. - రక్షించును గనుక అవి. 'అవిర్మూషిక కమ్బళే' ఇతి శేషః. అభౌ కంబళే చేత్యర్థః, పుష్పవయాం తు విసర్జనీయ ఈకారాంతః ప్రాగుక్తః.
మేషము - 1.మేక, 2.గొఱ్ఱెపోతు, పొట్టేలు, 3.మేషరాశి (Aries).
మిషతి స్పర్ధత ఇతి మేషః, మిష స్పర్ధాయాం. - ఎదుటి పొట్టేలితోఁ బోరునది.
మేఁక - ఆడుమేక, సం.మేకః.
మేఁకరాసి - మేషరాశి.
అజా ఛాగీ :
అజ - 1.ప్రకృతి, వ్యు.పుట్టుకలేనిది, శాశ్వతమైనది, 2.ఆడుమేక, ఎక్కువగా తిరుగునది.
అజతీ త్యజా. అజ గతిక్షేపణయోః - తిరుగునది.
ఛాగి - మేక
ఛ్యతి రోగానితి ఛాగీ. ఈ. సీ. ఛో ఛేదనే. - రోగములఁ జెఱుచునది. ఈ రెండు మేక పేర్లు.
ప్రకృతి - 1.ప్రత్యయము చేరక ముందటి శబ్ద రూపము, 2.సౌర వర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము(స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కొశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి, సప్త ప్రకృతులు).
ప్రకృతి శాస్త్రములు - (జీవ.) వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, భూగర్భశాస్త్రము మొదలగునవి, ప్రకృతికి సంబంధించిన శాస్త్రములు (Natural Sciences).
అజా క్షయవినిర్ముక్తా ముగ్ధ క్షిప్రప్రసాదినీ|
అంతర్ముఖ సమారధ్యా బహిర్ముఖ సుదుర్లభా||
సృష్టి - 1.సృజించుట 2.ప్రకృతి(సృజన) 3.స్వభావము. సృజన - సృష్టి. సృష్టికి మూలం శక్తి. శక్తి బహురూపములు గలది. ఆ శక్తికి రూపం స్త్రీ. సృష్టి అంతటిది తల్లి.
మార్పు ప్రకృతి లక్షణం; మార్పు వృద్ధే కావచ్చు, క్షయమూ కావచ్చూ. లోక క్షేమం కోసం నియమితమైన ధర్మాన్ని, న్యాయాన్నీ అతిక్రమిస్తే ప్రకృతి శక్తి నిర్వీర్యమవుతుంది.
సృష్టిలో అందాలున్నాయి. అందవికారాలూ (మానవ దృష్టిలో) ఉన్నాయి. ప్రకృతి మొత్తం ద్వంద్వ పూరితం. భిన్నత్వంలో ఏకత్వమే ప్రకృతి. రెంటి సమతుల్యమే సౌందర్యోత్పత్తి.
ప్రకృష్ట వాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టి వాచకః|
సృష్టౌ ప్రకృష్టా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా||
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
సహజజ్ఞానము - (జం.) వివేకముతో గాని అనుభవముతో గాని నిమిత్తము లేనట్లు జంతువులు తమ సహజమైన ప్రేరేపణ సాయముతో ప్రవర్తించుట, (Instinct).
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
అవ్యక్తము - స్పస్టముకానిది, వి.1.మూలప్రకృతి, 2.అజ్ఞానము, 3.సూక్ష్మశరీరము, 4.పరబ్రహ్మము, 5.(బీ.గణి.) తెలియబడని సంఖ్య.
అవ్యక్తుఁడు - 1.శివుడు, 2.విష్ణువు, 3.మన్మథుడు, విణ. మూఢుడు.
స్వామ్యమాత్య సుహృత్కోశ రాష్ట్ర దుర్గ బలాని చ,
రాజ్యాఞ్గా ప్రకృతయః పౌరాణాం శ్రేణయో (అ) పి చ,
స్వామి యనఁగా రాజు; అమాత్యుఁడు మంత్రి; సుహత్తు చెలికాఁడు; కోశము భండారము; రాష్ట్రము దేశములతోఁ గూడిన పట్టణము; దుర్గము పర్వతోదక వృక్షములచేతఁ బోవ శక్యముగాని పట్టణము; బలము సైన్యము; ఒకఁడు ముఖ్యుఁడుగాఁ గలవారును సజాతీయులునునైన పురజనుల సమూహములు పౌరశ్రేణులు.
1.స్వం విద్యతే అస్యేతి స్వామీ - ధనముగలవాఁడు.
స్వము - 1.ధనము, 2.తాను, విన.తనది.
2.అమా సమీపే భవః అమాత్యః - సమీపమందుండు వాఁడు.
అమాత్యుఁడు - 1.మంత్రి, 2.సహచరుడు, రాజుతో నుండువాడు.
మంతిరి - మంత్రి, ప్రధానుడు, సం.మంత్రి.
మంత్రి - 1.ధీసచివుడు, 2.సహాయుడు.
సహకారి - సహాయుడు.
3.శోభనం హృదయమస్యేతి సుహృత్ - మంచి హృదయము గలవాఁడు.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు.
సుహృదుఁడు - మిత్రుడు; మిత్రుడు - 1.హితుడు, 2.సూర్యుడు.
సహచరుఁడు - మిత్రుడు, విణ.కూడ దిరుగువాడు.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
4.కూయతే ఉత్కృష్ట ఇతికోశః - కోషమని మూర్థన్యాంతముగా గొందుఱు.
కుశబ్దే - ఉత్కృష్టమని పలుకఁబడునది.
5.రాజత ఇతి రాష్ట్రం - ప్రకాశించునది.
6.దుఃఖేన గమ్యత ఇతి దుర్గం - ప్రయాసముచేతఁ బొందఁబడునది.
7.బలంత్త్యనేన బలం, బల ప్రాణనే - దీనిచేత బ్రదుకుదురు.
ప్రక్రియతే రాజ్యమాభి రితి ప్రకృతయః - వీనిచేత రాజ్యము ప్రకృష్టముగాఁ జేయఁబడును.
శ్రయంత్తే పరస్పర మితి శ్రేణయః. శ్రిఞ్ సేవాయాం - పౌరులయొక్క శ్రేణులు పౌరశ్రేణులు.
స్వామిన్ శబ్దము మొదలు ను రాజ్యాంగములనంబడును. ఈ సప్తాంగములే ప్రకృతులనంబడును. పౌరశ్రేణులను ప్రకృతులనంబడును.
దేవానాంప్రియము - మేక, యజ్ఞములందు దేవతల కర్పింపబడును గాన.
ఆజకము - మేకలమంద, మేక.
లంబకర్ణము - మేక, విణ.వ్రేలాడెది చెవులు కలది.
లంబ - దుర్గ, లక్ష్మి.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.
అజోరజః ఖరరజస్తథా జన్మార్జనీరజః|
స్త్రీణాంపాదరజశ్చైవ శక్రస్యాసి శ్రియం హరేత్|
తా. మేకలకాలిదువ్వ, గాడిదకాలిదువ్వ, చీపురుకట్టదువ్వ, స్త్రీకాలిదువ్వ, ఇవి పైబడిన ఇంద్రునికైన ఐశ్వర్యము తొలగిపోవును. - నీతిశాస్త్రము
ఆదిశక్తి రమేయాత్మా - పరమా పావనాకృతిః|
అనేకకోటి బ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా.
మేకతిండి - తోడేలు, వ్యు.మేకలు తిండిగా గలది.
తోడేలు - 1.వృకము, 2.అడవికుక్క, రూ.తోడెలు.
వృకము - 1.తోడేలు, 2.కుక్క.
జంతువులకు కీడు తలపెట్టునది, తిండిపోతు. తోడేలును గొర్రెమందకు కావలిపెట్టినట్లు. గొర్రె ఏడ్చునని తోడేలునకు కనికరమా?
అజగరేశయు ర్వాహస ఇ త్యుభౌ -
అజగరము - పెద్దపాము.
అజం ఛాగం గిరతీత్యజగరః, గౄ నిగరనే. - మేకను మ్రింగునది.
న జాగర్తీత్య జగరః, జాగృ నిద్రాక్షయే. - ఎప్పుడును మేలుకొననిది.
అజగరః నిత్య గరః అస్య వా అజగరః - నిత్యమైన విషము గలిగినది.
శయాళువు - పెనుబాము, విణ.నిద్రపోతు, రూ.శయతుడు.
శేతే అత్యర్థం శయుః, ఉ. పు. శీఞ్ స్వప్నే. - మిక్కిలి నింద్రించునది.
స్వప్నక్ శయాళుర్నిద్రాళుః -
నిదురపోతు - నిద్రాళువు, రూ.నిద్దురపోతు.
స్వపితి తాచ్ఛీల్యేనేతి స్వప్నక్, జ. ఞి ప్వప్ శయే. - శేతే తాచ్ఛీల్యేనేతి శయాళుః, శీఙ్ స్వప్నే.
నిద్రాళువు - నిదురపోతు, నిద్రించు స్వభావము గలవాడు.
నిద్రాతి తాచ్చీల్యేనేతి నిద్రాళుః, ద్రా కుత్సాయాంగతౌ. - నిద్రపోవు స్వభావము గలవాఁడు. ఈ 3 నిద్రపోతు పేర్లు, తూఁగపోతు.
వాహసము - 1.సర్పము, 2.తూముకాలువ.
వాతీతి వాయుః, తేన మసతీతి వాహసః, హసహసనే - వా యనఁగా వాయువు, దానిచేత సంతోషించునది.
వాహం గమనం స్యతీతి వాహసః, షో (అ)న్తకర్మణి. - గమనమును జెఱుచునది. ఈ 3 పెనుబాము పేర్లు.
సర్పము - పాము, సప్పము.
సర్పతీతి సర్పః, సప్ ఌ గతౌ. చరించునది.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.
శయము - 1.శయ్య, 2.చెయి, 3.పాము.
స్వకీయ ధనమత్ర శేతే తిష్ఠతి శయః, శీఙ్ - స్వప్నే. - తన ధనము దీనియం దుండును.
శయ్యయాం శయనీయవత్ శయనమ్ -
శయనీయము - శయ్య, వ్యు.శయనింపదగినది.
స్వాపము - 1.శయనము, 2.అజ్ఞానము.
స్వపితం స్వాపః ; స్వప్నశ్చ, ఞిష్వప్ శయే. - శయనించుట స్వాపము, స్వప్నంబును.
శయనము - శయ్య, నిద్ర.
శేతే అస్యామితి శయ్యా, శయనీయం శయనం చ, శీఙ్ స్వప్నే, యథా శయ్యాయాం శయనీయశబ్దః తథా శయనశబ్దో (అ)పీతి వతి ప్రత్యయార్థః. - దీనియందు నింద్రింతురు, పానుపు పేర్లు, పఱుపు.
తమిరె - 1.కాడి నడిమిచీల, 2.శయ్య.
భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది ; గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).
తలివము - తలిమము, శయ్య, సం.తలిమమ్.
తలిమము - 1.దూదిపరుపు, 2.రాతికట్టదపు నేల.
తల్పము - దూదిపరుపు.
సెజ్జ - శయ్య, పడక, సం.శయ్యా.
శయ్య - 1.పడక, 2.పదగంఫనము, 3.విధము.
తెనమణు - క్రి.శయనించు, పరుండు.
పడు - క్రి.1.శయనించు, 2.పతనమగు, 3.అనుభవించు(కష్ట పడు), సం.పత్.
తొరఁగు- క్రి.1ప్రసవించు, 2.ప్రవహించు, 3.పడు, 4.వ్రాలు, రూ.తొరఁగు.
పతనము - పడుట, (భౌతి.) ఒక వస్తువుపై కాంతి కిరణము పడుట (Incident).
నిపాతనము - దిగద్రొబ్బుట, పడద్రోయుట.
నిపాతము - పడుట, (వ్యాక.) 1.అవ్యయము, 2.సూత్రమునకు వ్యతిరేకముగ విధించు శబ్దము.
పడకపుండు - (గృహ.) ఎక్కువ జబ్బుతో కదల లేకుండ పండుకొని యున్న వారికి మంచము వేడివల వచ్చుపుండ్లు (Bedsore).
కదా శయానో మణికర్ణి కాయాం
కర్ణే జప త్యక్షర మిందుమౌళౌ
అవాప్య నిద్రాం గతమోహముద్రాం
నాలోకయామిహపునః ప్రపంచమ్|
భా|| మణికర్ణికాతీరమున శయనించినఁ నా శ్రవణ పుటమునందు ఇందుఁడు - చంద్రుడు) ఇందుమౌళీశ్వరుడు ప్రణవమంత్రము నుపదేశించుచుండగాఁ బోయిన మోహముద్ర గలిగిన నిద్రా సుఖము ననుభవించుచు మరల నేన్నఁడీ మహోగ్రకలుషసంభఠితమైన ప్రపంచమును గాంచకుండుడునో కదా?
అశీరుఁడు - 1.అగ్ని, 2.రాక్షసుడు, 3.సూర్యుడు Sun.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతి కుటిలం ఊర్త్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఈ-పు, అగ కుటిలాయాం గతౌ - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.
అసురాః, న విద్యతే సురా యేషాం తే - అమృతము లేనివారు.
సురేభ్యో (అ)న్యే వా - దేవతలు గానివారు.
యజ్ఞభాగాన్ని రస్యంత ఇతి వా - యజ్ఞభాగము వలనఁ ద్రోయఁబడినవారు, అసు క్షేపణే.
అసూన్ ప్రాణాన్ రాంతి గృహ్ణంతీతివా - ప్రాణముల గొనువారు, రా ఆదానే. - రాక్షసుడు.
రాక్షస - అరువది సంవత్సరములలో 49వ దాని పేరు.
అశృణాతి హిన స్తీత్యాశరః శ్రు హింసాయాం - హింసించువాఁడు.
పా, అసురః-అసూన్ రాతీత్యసురః, అసురేఅవ అసురః, రా ఆదానే - ప్రాణముల నపహరించు వాఁడు - అసురుఁడు, వాఁడే అసురుఁడు.
ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
అశిషి దంష్ట్రాయాం విషమస్యాస్తీ త్యాశీవిషః - ఆశీస్సు అనఁగా కోఱ, అందు విషము గలది.
అశీశబ్ద ఈకారాంతో(అ)ప్యస్తి. "ఆశీమివ కలామిందో" రితి రాజశేఖరః.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.
స్త్రీ త్వాశీర్హితాశంపాహి దంష్ట్రయోః,
అశీశ్శబ్దము హితమైన యర్థము గావలయు ననుటకును, పాముకోఱకును పేరు.
అశాసనం, అశంసతీతి చ అశీః, స. సీ. ఆజ శ్శాసు ఇచ్ఛాయాం, ఇచ్ఛయించుటయు, హింసించునదియు ఆశీస్సు.
సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర
దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః|
నాగరివాహన! సుధాబ్ధినివాస! శౌరే!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. - 7
క్షేళస్తు గరళం విషమ్,
క్షేడము - 1.చెవుడు, 2.మ్రోత, 3.విసము.
చెవుడు - చెవులు వినని రోగము, బాధిర్యము.
మ్రోఁత - ధ్వని; ధ్వని - 1.శబ్దము, చప్పుడు, 2.వ్యంగ ప్రధానశబ్దము, 3.వ్యంగము, (భౌతి.) శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహింపపడు సంక్షోభము, (Sound).
క్షేళము - విషము.
క్ష్వేళతే మోహయతీతి క్ష్వేళః ఞి క్ష్విదా స్నేహనమోఅహనయోః. - మోహమును బొందించునది.
గరళము - 1.సర్పవిషము, 2.విషము, 3.గడ్డిమోపు.
గిరతి జీవం గరళం, గౄ నిగరణే. - ప్రాణమును మ్రింగునది.
మోపు - 1.మోయుజేయు, ఆరోపించు (నిందమోపు), వి.1.గడ్డిమోపు, 2.వింటినారి, విణ.అధికము.
విషము - 1.గరళము, 2.జలము.
దేహం వేవేష్టీతి విషం, విష్ ఌ వ్యాప్తౌ. - దేహమును వ్యాపించునది.
విష మప్సు చ,
విషశబ్దము నీళ్ళకును, చకారమువలన విషమునకును పేరు.
వేవేష్టీతి విషయం, విష్ ఌ వ్యాప్తౌ. - వ్యాపించునది.
అహిఫేనము - 1.నల్లమందు, అభిని, 2.గరళము, 3.పామునోటి చొంగ.
అభిని - నల్లమందు, సం.అహిఫేనమ్, అఫేనమ్.
నల్లమందు - (వ్యవ.) అభిని, అహిఫేనము (Opium), (ఇది మాదక పదార్థముగను వైద్యమునందును ఉపయోగింపబడును. దీనిని Papaveraceae అను కుటుంబమునకు చెందిన Opium poppy (అభిని లేక గసగసా) అను మొక్క కాయలను గీయగా వచ్చిన పాలతో తయారుచేయుదురు. నల్లమందులో మార్ఫిన్ (Morphine) అను ముఖ్యమైన క్షారముండును.)
గసగసాలు - ఒక దినుసు విత్తులు, (వ్యవ.) ఇవి సంబారద్రవ్యముగా వాడబడుచుండును. (ఇవి నల్లమందు మొక్క యొక్క గింజలు. వీనిలో సుమారు నూటికి 50 వంతులు చమురుండును), సం.గసకః.
తామసము - 1.ఆలస్యము, 2.పాము snake, సం.విణ.తమోగుణము కలది.
విషధరము - 1.పాము, 2.మేషము, (విషము = నీరు, విషము).
విషస్య ధరః విషధరః - విషమును ధరించునది.
పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పతీతి సర్పః, సృప్ ఌ గతౌ. చరించునది.
మేషము - 1.మేక, 2.గొఱ్ఱెపోతు, పొట్టేలు, 3.మేషరాశి (Aries).
మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.
విషాదప్యమృతం గ్రాహ్యం బాలాదపి సుభాషితం|
ఆమిత్త్రాదపి సద్వృత్త మమేథ్యాదపి కాఞ్చనం||
తా. విషము వలనైన నమృతంబును గ్రహింప వలయును, బాల - పదునా రేండ్లకు లోబడిన పిల్ల. బాలునిచే నైనను మంచిమాటలను గ్రహింప వలయును. శత్రువులనైనను సత్స్వభావమును గ్రహింపవలయును, అమేధ్యము వలన నైనను కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.)గ్రహింపవలయును. - నీతిశాస్త్రము
ప్రౌఢో(అ)హం యౌవనస్థో విషయ విషధరైః పంచ భి ర్మర్మసంథౌ
దష్టో నష్టో వివేక స్సుతధనయువతి-స్వాదసౌఖే నిషణ్ణః|
శై వీచింతావిహీనం మమహృదయ మహో మానగర్వాధిరూఢం
క్షంతవ్యో మే(అ)పరాధ శ్శివ! శివ! శివ! భోః!
శ్రీమహాదేవ! శంభో! - 3
దద్దోహ్ స్మి సుడృఢేనాత్ర కిం కర్తవ్యమితః పరమ్ ||
కోమలపు చేగురు మోవి కోమలికి మేషరాశి....
వృష్టి - 1.పొట్టేలు, 2.ఒక గొల్లవాడు, 3.కృష్ణుడు, 4.ఇంద్రుడు, 5. వహ్ని.
వర్షతి రేత ఇతి వృష్టిః వృషు సేచనే. - రేతస్సును వర్షించునది.
జాబాల స్స్యాదజాజీవి :
జాబాలుఁడు - 1.మేకల మేపువాడు, 2.ఒక ఋషి.
అజాః పాలయతీతి జాబాలః. - పాలరక్షణే. - మేఁకలఁ గాచువాఁడు.
అజాజీవుడు - మేకలను మేపుకొని జీవించువాడు, గొల్లవాడు.
అజాభి ర్జీవతీ త్యజాజీవీ. న. పు. జీవ ప్రాణధారనే. - మేఁకలచేత బ్రతుకువాఁడు. పా. అజాజీవః 'అజాపాల మజాజీవ' మని రత్నమాల. ఈ రెండు మేఁకలఁగాచువాని పేర్లు.
దోగ్ధ - 1.గొల్లవాడు, 2.దూడ, 3.కవిత్వము చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
దోగ్ధ్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది.
వ్రేఁత - గొల్లది; మహాశూద్రి - గొల్లది; గోపి - గొల్లది (గోపిక).
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
వ్రే - గొల్లకులము, సం.వృష్ణిః.
వ్రేపల్లియ - గొల్లపల్లె.
వ్రేఁడు - గొల్లడు, సం.వృష్ణః.
వల్లవుఁడు - గొల్లవాడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గోపుఁడు - రక్షించువాడు, వి.1.రాజు, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి, (అయిదింటిపైగాని, పదింటిపైగాని అధికారము కలిగి గ్రామములలోని భూముల ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల అర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్తవ్యములై యుండెను.)
గొల్ల1-1.గొల్లజాతి, 2.పాడిపసరముల మేపి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.
ద్వారపాలకుఁడు - వాకిటి కావలివాడు.
ద్వార్థ్సికుఁడు - ద్వారపాలకుడు, రూ.ద్వార్థ్సుడు.
దర్శకుఁడు - ద్వారపాలకుడు, విణ.చూపెడువాడు, 2.నేర్పరి.
ఉపదర్శకుఁడు - 1.తప్పునడవ కుండ చూచుకొను అధికారి, 2.చూచువాడు, చూపువడు, వి.ద్వారపాలకుడు.
దండి - 1.ప్రతాపము, 2.గొప్ప, సం.వి.1.యముడు, 2.ద్వారపాలకుడు.
దండించు - క్రి.శిక్షించు.
మురారి - 1.కృష్ణుడు, 2.ఒకానొక సంస్కృతకవి.
ఇంద్రుఁడు-1.దేవతలరాజు 2.సమాసోత్తర పదమైన శ్రేష్ఠుడు, రాజేంద్రుడు. రాజు - 1.రేడు(రాట్టు - రేడు ), రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు. క్షత్రియుఁడు - రాచవాడు.
రాజన్యుఁడు - క్షత్రియుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
నెల -1.మాసము 2.చంద్రుడు 3.పున్నమ 4.స్థానము 5.కర్పూరము. నెలకూన - 1.బాలచంద్రుడు(నెలవంక - బాలచంద్రుడు), 2.నఖిక్షతము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
ఏడ - ఎక్కడ; ఎక్కడ - (ఏ+కడ) ఏచోట.
ఏడక - గొఱ్ఱె. గొఱ్ఱె కసాయివాడినే నమ్ముతుంది.
ఇలతి గచ్ఛతీ త్యేడకః ఇల గతౌ. - సంచరించునది, గొఱ్ఱె.
ఏడకము - పొట్టేలు; ఏడిక - ఏడకము.
పొట్టేలు - మగగొఱ్ఱె, రూ.పొట్టేలు, పొట్టెలు.
ఏడగజ - మేషాక్షి సదృశ పుష్పత్వాత్ ఏడః; శ్రేష్ఠత్వాత్ గజ, ఏడశ్చాసౌ గజశ్చ ఏడగజః - మేఁకకండ్లవంటి పువ్వులుగలిగి శ్రేష్ఠమైనది, తగిరిసచెట్టు.
దండాభావన్యాయము - న్యా. కట్టెలేని వానిని గొర్రె కరచిన దను రీతి.
ఏడక వాహన మూఢ విమోహన
ఊఢసమభువన సోడసదకరణ | ||శరవణభవ||
సాధు పృష్టం మహాభాగ సర్వలోక హితైషిణః,
మహతా మేష ధర్మశ్చ నాన్యేషా మితి మే మతిః
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.
2. భరణి - రెండవ నక్షత్రము, బరిణి, బరిణె. త్రిభుజమును పోలి 3 మూడు నక్షత్రములు దగ్గరగా నుండును.
త్రిభుజము - (గణి.) ఒక సమతలములో ఒకే సరళ రేఖలో లేని మూడు బిందువులను కలువగా నేర్పడిన క్షేత్రము. ఇది మూడు భుజములు మూడు కోణములు కలిగియుండును, (Triangle).
ముక్కోణము - మూడు కోణములు(త్రిభుజము).
బరణి - కరాటము, భరణి. దబ్బీ - బరణి. సంపుటము - 1.బరిణి 2.ముకుళనము. సముద్గకము - బరణి.
బరణిపురుగు కుటుంబము - (వ్యవ., కీట.) అక్షింతలపురుగు (Epitachna Punctata) తాటాకుతెగులు పురుగు (Rice hipsa-Hipsa armigera) గండకబరిణె పురుగు (Oryctes rhinoceros), ధాన్యపునుసి పురుగు (Sitophlus oryzae) మొదలగునవి (Coleoptera) కుటుంబమునకు చెందిన కీటకములు.
ధాన్యపు నుసిపురుగు - (వ్యవ.) నిలువ చేసిన వడ్లను దొలిచి పాడుచేయు పురుగు (Sitophilus oryzae Rice wevil). (ఇది బరిణె పురుగు కుటుంబములోనిది).
పరభక్షకములు - (వ్యవ.) ఇతర జారుల కీటకముల దిని జీవించు పురుగులు (predators), ఉదా. మిడత కుటుంబములోని గొల్లభామలు, చుక్కల బరిణె పురుగు (Lady bird bettle) మొదలగునవి.
దొ(తొ)లుపు పురుగులు - (వ్యవ.) దుంపలు, వేళ్ళు, కాండము, తొలుచుకొనితిను పురుగులు: (Borers) ఉదా. గండక బరిణె పురుగు, మొ. బరిణె పురుగు కుటుంబము లోనివి.
భరణి కార్తె భరించలేం (ఎండలు మెండుగా ఉంటాయి). భరణి ఎండకు బండలు పగులుతాయి. కృత్తిక ఎండకు కుత్తుకలు ఎండి పోతాయి.
మందన - మంజూష పెట్టె, సం.మంజూషా.
మంజూష - పెట్టియ, పెట్టె. బదరికము - పెట్టె.
భోషాణము - పెద్దపెట్టె.
అప పాప్మానం భరణీర్భరంతు | తద్యమో రాజా భగవాన్, విచస్టామ్ | లోకస్య రాజా మహతో మహాన్, హి | సుగం నః పంథామభయం కృణోతు| యస్మిన్నక్షత్రే యమ ఏతి రాజా | యస్మిన్నేన - మభ్యషించంత దేవాః | తదస్య చిత్రగ్ం హవిషా యజామ | అప పాప్మానం భరణీర్భవంతు ||29||
యామ్య - 1.దక్షిణపు దిక్కు, 2.భరణీ నక్షత్రము.
దక్కినము - దక్షిణము, వలదెస, స.దక్షిణా.
దక్కినపురాయుఁడు - వై. యముడు, దక్షిణ దిగధిపతి.
దక్కినము - దక్షిణము, వలదెస, సం.దక్షిణా.
దక్షతే వర్ధతే దక్షిణా, డక్ష వృద్ధౌ - వృద్ధిబొందు నట్టిది.
దక్షిణేయో దక్షిణార్హస్తత్ర దాక్షిణ్య ఇత్యపి,
యోగాదౌ ఋత్విగాదీనాం ఆనతిద్వారా కర్మసాద్గుణ్యార్థం తేభ్యో దీయమానం గోహితణ్యాదికం దక్షిణా, తాం అర్హతీతి దక్షిణేయ; దక్షిణార్హః, దాక్షిణ్యశ్చ - దక్షిణఁ బుచ్చుకొన నర్హుఁడు గనుక దక్షిణేయుఁడు, దక్షిణ్యార్హుడు, దాక్షిణ్యుఁడు, పా. దక్షిణ్యుడు. ఈ 3 దక్షిణకు యోగ్యమైనవాని పేర్లు.
దక్షిణ - 1.కుడిదిక్కు, 2.యజ్ఞము మున్నగు వానిలో ఋత్వికులు మొదలగు వారి కిచ్చు ధనము, రూ.దక్షిణము.
దక్షిణుఁడు - 1.అనేక నాయికలందు సమముగా వర్తించువాడు, విణ.1.చక్కని మనస్సు కలవాడు, దాక్షిణ్యము కలవాడు, 2.నేర్పరి.
దక్షిణే సరళోదారౌ -
దక్షతే పరకార్యం శీఘ్రం కరోతీతి దక్షిణః. - దక్ష వృద్ధౌ శీఘ్రార్థేచ. - పరప్రయోజనము శీఘ్రముగాఁ జేయువాఁడు.
సరతి పరేచ్ఛా మనుసరతీతి సరళః సృగతౌ. - పరహృదయము ననుసరించువాఁడు.
ఉదియర్తి పరకార్యం కర్తు మేతీ త్యుదారః. ఋ గతౌ. - పరకార్యమును జేయుకొఱకుఁ బోవువాఁడు. ఈ మూడు కుటిలముగాక చక్కనైన మనస్సు గలవాని పేర్లు.
దాక్షిణ్యము - 1.దయ, 2.నేర్పు, 3.సామర్థ్యము, 4.దక్షిణ నాయక భావము.
మోమాటము - 1.దాక్షిణ్యము, కనికరము, 2.మనస్సంకోచము, రూ.మొగమాటము.
సామర్థ్యము - 1.నేర్పు 2.యోగ్యత (భౌతి) పనిచేయురేటు(Power) (గృహ)బలము, సత్తువ.
విచక్షణత - నేర్పు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion).
అవాచి - దక్షిణదిక్కు.
అవా గంచతి దక్షిణాయనే నాస్యాం రవి రిత్యవాచీ, ఈ-సీ. - సూర్యుఁడు దక్షిణాయనముచేత నీదిక్కునఁ దోఁచును.
అవ మధ్యాహ్నే అంచత్యస్యాం రవి రిత్యవాచీ - మధ్యాహ్నమున సూర్యుఁడు(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)దీనిఁ బొందును గనుక అవాచి.
అవాచి మూకః -
మూయతే బధ్యతే వాక్ప్రవృత్తి రస్యేతి మూకః, మూఙ్ బంధనే వాగ్వ్యాపారము వీనికి బద్ధమైయుండును. ఈ ఒకటి మూఁగవాని పేరు.
మూక - 1.సమూహము, 2.దండు.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
సమ్య గూహ్యతే ఏకత్రేతి సమూహః, ఉహ వితర్కే - ఒకదిక్కున నన్నియు లెస్సగా నూహింపఁబడును.
దండు - 1.దండము, 2.సేన, 3.గుంపు, సం.దండః.
మౌకలి - కాకి.
మౌద్గలి - మౌకలి, కాకి Crow.
మూకలస్య యమస్యాయం మౌకలిః - మూకలుఁడనఁగా యముఁడు; అతని సంబంధమైనది. "మూకలః ప్రేతభర్తా స్యాన్మూకలః కాననే చర" ఇతి శబ్దార్థవే.
భక్తిహీనం హతందానం, హతంసైన్యమ సాయకం|
హతో రూపవతీవంధ్యా - హతో యజ్ఞ స్త్వదక్షిణః||
తా. భక్తి(భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.)లేక యిచ్చిన దానమును, నాయకుడు లేని సైన్యమును, సౌందర్యవతి యైన వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది., దక్షిణలేని యజ్ఞంబును ప్రయోజనములేనిది నిష్ప్రయోజనంబులు. - నీతిశాస్త్రము
హిమశైలకుమారీ చ శరణాగత రక్షిణీ,
సర్వాగమస్వరూపా చ దక్షిణా శంకరప్రియా.
దక్షిణాదేవి(లక్ష్మీదేవి అంశ): ఈమెకు దీక్ష అని ఇంకొకపేరు. ఈమె, పూర్ణ దీక్షాపరురాలు యజ్ఞ పురుషుని ఇల్లాలు. దక్షిణాహీనములైన కర్మలు నిష్పలములు. యజ్ఞే శానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ.
సాక్షా చ్ఛ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః.
ఓం హ్రీంకారాధ్వర దక్షిణాయై నమః : హ్రీకారమనే యజ్ఞానికి దక్షిణా స్వరూపురాలైన దేవికి వందనాలు. యాగం చేసిన వారికి యజమానులు ఫలస్వరూపంలో దక్షిణలిస్తారు. ఇక్కడ హ్రీంకార రూప యాగం చేసిన భక్తులకు దక్షిణ రూపంలో పరదేవత దర్శన మిచ్చి అనుగ్రహిస్తుంది.
దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా |
కౌళినీ కేవలా నర్ఘ్యా - కైవల్యపదదాయినీ. – 171శ్లో
దక్షిణాపథము - వింధ్య మొదలు సేతువు(నీటి కట్ట) వరకు గల దేశము.
ఆర్యావర్తము - ఆర్యులు తమ పశు సముదాయముతో చరించిన భూమి (వింధ్యాచల హిమాచల మధ్య భూమి.) పుణ్యభూమి.
దక్షిణావర్తము - (వృక్ష.) కుడి నుండి ఎడమ వైపునకు చుట్టుకొనునది.
రామేశ్వరము - దక్షిణ దిశనున్న యొకానొక గొప్ప పుణ్యక్షేత్రము.
రాగల శని రామేశ్వరమేగినా వెంటాడించేదే.
రామేశ్వర రమణియముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ|
అపసవ్యము - 1.ప్రతికూలము, 2.కుడిభాగము.
ప్రతికూలము - అనుకూలముకానిది.
అపసవ్యం తు దక్షిణే :
సవ్యా దపక్రాంత మపసవ్యం - ఎడమ దిక్కువలనఁ బాసినది.
దక్షతే బలవత్తయా వర్ధత ఇతి దక్షిణం. దక్ష వృద్ధౌ శీఘ్రార్థే చ. - బలము గలిగిన దగుట చేత వృద్ధిఁ బొందునది. ఈ రెండు కుడిదిక్కు పేర్లు.
వలను - 1.పక్క, 2.ఉపాయము, నేర్పు, 3.శకునము, 4.ప్రదక్షిణము, 5.శుచిత్వము, 6.ఒప్పిదము, 7.అనుకూల్యము, విణ.1.కుడి, 2.యుక్తము.
వలగొను - క్రి.ప్రదక్షిణముచేయు, తిరిగివచ్చు.
వలకట్టు - అనుకూలపరచు. వలనొప్పు - క్రి. అనుకూలించు.
వలకేలు - కుడిచెయ్యి Right hand.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము, వలపల.
వలపక్షము - (వ్యవ.) (వలను + పక్షము), పక్షపాతము.
ఏట - పక్షము, ప్రక్క, విణ.అతిశయము(అధిక్యము), రూ.ఏటము.
పక్షము - 1.నెలయందు పదునైదు దినములు (శుక్లకృష్ణ పక్షములు) 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.
ప్రక్క యెముకలు - (గృహ.) రొమ్ము ప్రక్క యెముకలు (Ribs).
ఏటవాలు - 1.పక్షపాతము, 2.వంపు.
పక్షపాతము - ఒక ప్రక్క కొరుగుట, పక్షపాత బుద్ధితో మెలగుట.
వంపు - వంగుట, విణ.వంగినది, సం.భంగః, వక్రః.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు, కొలువుకాడు.
పక్షవాతము - శరీరము నొక ప్రక్క కొరగచేసెడి రోగము.(Paralysis)
వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.
దిక్కు - 1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.
శరణము - 1.రక్షకము, రక్షణము, 2.గృహము.
దిశ - దిక్కు, దెస, (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కులలో నొకటి.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, 2.దశా.
కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
చంద్రుడు - నెల, చందమామ.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
నెలకువ - స్థానము.
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెలవుకొను-క్రి.1.నిలుకడయగు, 2.నిలుచుండు, రూ.నెలకొను.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.
చంద్రుడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు (Rahu).
అజుఁడు వాని శిరము నంబరవీథిని,
గ్రహము సేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను బట్టుచుండు.
భా|| బ్రహ్మదేవుడు రాహువు శిరస్సును ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించాడు. ఆ రాహుగ్రహము సూర్యచంద్రులకు నిత్యవైరి కనుక పగ వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికీ అడ్డగిస్తూ ఉండి, వారిపై దాడిచేయుటకు సదా ప్రయత్నిస్తు ఉంది.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి (వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
యమానిలేన్ద్ర చద్దృరార్క విష్ణు సింహాంశు వాజిషు.
శుకాహి కపి ఖేకేషు హరి ర్నా కపిలే త్రిషు, :
హరి శబ్దము యమునికిని, వాయువునకును, ఇంద్రునికిని, చంద్రునికిని, సూర్యునికిని, విష్ణువునకును, సింహునకును, కిరణమునకును, గుఱ్ఱమునకును, చిలుకకును, పామునకును, కోతికిని, కప్పకును పేరైనపుడు పు. కపిలవర్ణము గలదానికి పేరైనపుడు త్రి, కపిలవర్ణ మనఁగా బంగారు చాయ. హరతీతి హరిః హృఞ్ హరణే. - హరించును గనుక హరి.
సమవర్తి - యముడు, వ్యు.అందరి యెడ సమానముగనుండువాడు.
సమం వర్తితం శీలమస్యేతి సమవర్తీ, న. పు. వృతు వర్తనే - అందఱియందును పక్షపాతము లేక సమముగా వర్తించు స్వభావము గలవాఁడు.
పరేతరాట్టు - యముడు.
పరేతాః మృతాః తేషాం రా ట్పరేతరాట్, జ-పు. - పరేతలనఁగా మృతిఁ జెందినవారు, వారికిఁ బ్రభువు.
కృతాంతుఁడు - యముడు.
కృతః అంతో వినాశో యేన నః కృతాంతః - ఇతనిచే వినాశము(వినాశము - చేటు.)చేయఁబడును.
కృతాన్తో యమ సిద్ధాంత దైవా కుశల కర్మసు,
కృతాంతశబ్దము యమునకును, సిద్ధంతము నకును, పురాకృత శుభాశుభ కర్మలకును, పాపకర్మమునకును పేరు.
కృతః అంతః అనేనేతి కృతాంతః - దీనిచేత అంతము చేయఁబడును.
కృతాంతము - 1.అశుభకర్మ, 2.భాగ్యము, 3.సిద్ధాంతము.
కృత్తాన్తే పుంసి కీనాశః క్షుద్ర కర్షకయోస్త్రిషు,
కీనాశశబ్దము యమునికి పేరగునపుడు పు. దరిద్రునికిని, దున్నువానికిని పేరగునపుడు త్రి, కుత్సితం నాశయతీతి కీనాశః, ణశ అదర్శనే. - కుత్సితమును జెఱుచువాఁడు.
కీనాఁశుడు - 1.యముడు, 2.రాక్షసుడు, విణ.1.పేద, 2.పిసినిగొట్టు, 3.కటికవాడు.
మును మనుజుఁడు జన్మానతర
మునఁజేసిన పుణ్యపాప* ములు పుడమిని వా
నిని బొందక విడువవు: దే
వుని నిందింపకుము కీడు * వొడమఁగుమారా!
తా. కుమారా! మనుష్యుఁడు పూర్వము జేసియున్నట్టి మంచిచెడ్డల ననుభవింపక తప్పించుకొనఁజాలఁడు. కాబట్టి కష్టములు పొందువేళ మఱింత నాశనము కలుగునట్లు దైవమును ధూషింపవద్దు.
దండధరుఁడు - యముడు.
కాలదండాఖ్యస్య దండస్య ధరః దండధరః, దండంధారయతితీవా, దృ ధారణే - కాలదండ మనెది దండమును ధరించినవాఁడు.
దండి - 1.ప్రతాపము, 2.గొప్ప, సం.వి.1.యముడు, 2.ద్వారపాలకుడు, విణ.దండముగలవాడు.
దండము - 1.దండము, 2.రాజు ధనవంతుని బలాత్కారము చేసి పుచ్చుకొనెడు ధనము, 2.అపకారి అపరాధి వలన గొనెడు డబ్బు, 4.జరిమానా, 5.నష్టము, రూ.దండుగు, దండుగ, దండువు. అన్ని దండుగ పనులే. ఏంతో నష్టము వచ్చింది. అంతా నష్టమే.
దండనము - శిక్ష, దండించుట.
దండించు - శిక్షించు.
పింగళ - 1.దక్షిణ దిక్కు నందలి ఆడేనుగు, 2.అరువది సంవత్సరములో నొకటి.
పింగళవర్ణత్వా త్పింగళా - పింగళవర్ణము గలిగినది.
పింగళుఁడు - 1.అగ్ని, 2.శివుడు.
పింగళవర్ణత్వా త్పింగళః - పింగళవర్ణము గలవాఁడు.
ఏకపింగళుఁడు - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్యః సః కుబేరః - బేరమనఁగా శరీరము, కుత్సితమైన శరీరము గలవాఁడు.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గికంటి - శివుడు.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః - అగ్నివలనఁ బుట్టినవాఁడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.
(ౙ)జంటమోము వేలుపు - అగ్నిదేవుడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.
ఊర్థ్వలోచనము - మీగండ్ల మెకము, శరభము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
దచ్చికాళ్ళ మెకము - శరభము, అష్టాపదము.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్.
అష్టాపదము - బంగారము.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము Gold.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.
(ౙ)జంటమోము వేలుపు - అగ్నిదేవుడు.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి.
ఊర్థ్వలోచనము - మీగండ్ల మెకము, శరభము.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
దచ్చికాళ్ళ మెకము - శరభము, అష్టాపదము.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్.
అష్టాపదము - బంగారము.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము Gold.
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.
ఎండదొర - సూర్యుడు.
3. కృత్తిక - కొడవలి యాకారముగా 6 నక్షత్రములుండును.
దాత్రము - కొడవలి.
కొడవలి - కోయు సాధనము, లవిత్రము, (వ్యవ.) చిన్న పిడితో వంపు తిరిగి, అంచునకు చిన్నరంపగరి యుండు కత్తి (Sickle).
లవిత్రము - కొడవలి, లిక్కి. లిక్కి - కొడవలి.
అగ్నిర్నః పాతు కృత్తికాః | నక్షత్రం దేవమింద్రియమ్ | ఇదమాసాం విచక్షణమ్| హవిరాసం జుహోతన | యస్య భాంతి రశ్మయో యస్య కేతవః | యస్యేమా విశ్వా భువనాని సర్వా | స కృత్తికాభిరభి సంవసానః | అగ్నిర్నో దేవస్సువితే దధాతు ||1||
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనతి జీవంత్యనేన లోకా ఇత్యనలః అన ప్రాణనే - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాప్తి ర్నాస్త్యస్యేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేనివాఁడు.
కత్తెర - 1.వస్త్రాదులను కత్తిరించెడి సాధనము, 2.భరణి మూడు, నాలుగు పాదములందును, కృతిక యందును, రోహిణి మొదటి పాదమందును సూర్యుడుండు కాలము, 3.కృతికా నక్షత్రము.
కత్తెర నెల - కార్తీకమాసము; కార్తికము - కార్తిక మాసము.
కార్తికేయుఁడు - కుమారస్వామి, వ్యు.కృత్తికల కుమారుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
బాహులము - 1.బాహుత్రాణము, 2.కార్తీక మాసము.
బాహులేయుడు - కుమారస్వామి.
ఊర్జము - 1.కార్తికమాసము, 2.పూనిక, 3.ఉత్సాహము, 4.ఊపిరి వెలుపలికి విడుచుట విణ.బలము గలది.
పూనిక - 1.యత్నము, 2.సన్నాహము, 3.పట్టుదల.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
పట్టుదల - వదలనిపట్లు, చలము.
ఊర్జితము - ధృడము చేవగలది, వి.1.బలము, 2.ఉత్సాహము.
ఊర్జస్వలుఁడు - 1.మిక్కిలిబలము గలవాడు, 2.మిక్కిలి ఉత్సాహము కలవాడు, 3.గొప్పవాడు.
ఊర్జస్వి - మిక్కిలి బలవంతుడు, వి.ఒక అర్థాలంకారము.
ఉత్సహించు - 1.యత్నించు, 2.ఉత్సాహపడు, రూ.ఉత్సాహించు.
ఉత్సాహించు - ఉత్సహించు.
ఉత్సాహకుఁడు - 1.ఇష్టకార్యసిద్ధికై ప్రయత్నించువాడు, 2.ఇష్టవస్తు ప్రాప్తికై తహతహపడువాడు.
ఉత్సాహం సాహసంధైర్యం బుద్ధి శ్శక్తిః పరక్రమః|
షడైతే యత్రతిస్టంతి తత్రదేవోపి తిష్టతి||
తా. సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము; ఈ యారు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. - నీతిశాస్త్రము
కృత్తి కాది భరణ్యంత నక్షత్రే ష్ట్యర్చితోదయా
గ్రహ విద్యాత్మికా జ్యోతి ర్జ్యోతి ర్విన్మతి జీవికా.
కృత్తివాసుఁడు - ముక్కంటి.
కృత్తిశ్చర్మ వాసో (అ)స్య కృత్తివాసాః, స-పు. - చర్మము వస్త్రముగాఁ గలవాఁడు. కృత్తి వాసః ప్రియే|
భవిష్యత్త్రిపురాంతాయ తరాంధక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే||
ముక్కంటి - త్రిలొచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
కృతి - 1.ప్రబంధము, సప్తసంతానములలో ఒకటి, 2.చదువరి(ౘదువరి – విద్వాంసుడు), విణ. నేర్పరి. అష్ట ప్రకృతి రష్టాష్ట విభ్రాజ ద్వి కృతాకృతిః.
కృత్తికాసుతుఁడు - కుమారస్వామి. అన్ని చోట్లా ఈశ్వరుని సందర్శించా లన్నది కుమారస్వామి బోధ.
కృత్తివాసా స్త్సుతః కృష్ణ తండినా శుభబుద్ధినా,
స్తవ మేతం భగవతో బ్రహ్మా స్వయ మధారయత్. - 170శ్లో
కత్తెర చుక్క - కృత్తికా నక్షత్రము.
కత్తెర - 1.వస్త్రాదులను కత్తిరించెడు సాధనము, 2.భరణి మూడు, నాలుగు పాదములందు, కృత్తిక యందును రోహిణి మొదటి పాదమందును సూర్యుడుందు కాలము, 3.కృత్తికానక్షత్రము.
ౘుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
కృపాణీ కర్తరీ సమే :
కృపాణి - 1.చురకత్తి, 2.కత్తెర.
కల్పతే ఛేదనాయేతి కృపాణీ. ఈ. సీ. కృపూ సామర్థే - ఛేదించుట కొఱకు సమర్థమైనది.
కర్తరి - కత్తెర.
కృత్యతే ఛిద్యతే నయేతి కర్తరీ. ఈ. సీ. కృతీచ్ఛేదనే. - దీనిచేత ఛేదింపఁబడును. ఈ రెండు 2 కత్తెర పేర్లు.
కర్తనము - (గృహ.) కత్తిరించుట, గొఱ్ఱెబొచ్చు మొ.వి కత్తిరించుట (Shearing).
గండకత్తెర - 1.దాట శక్యముకాని కష్టము, 2.మెడను కత్తిరించు పెద్ద కత్తెర, 3.వాడియైన కత్తెర, సం.గండకర్తరీ.
అసి1 - అల్పము, కొంచెము.
అసి2 - కత్తి, ఖడ్గము.
అసిపుత్రి - చురకత్తి, చిన్నకత్తి.
బాగుదార - చిన్నకత్తి; చాకు - చిన్నకత్తి.
(ౘ)చురకత్తి - ఛురిక, చిన్నకత్తి, రూ.చురి, చురియ, చూరి, చూరీ, సురియ.
ఛురి - చిన్నకత్తి, చురకత్తి, రూ.ఛురి. చురి - ఛురిక.
ఛురి - చిన్నకత్తి. (చ)చూరకత్తి - చురకత్తి.
సురియ - చురియ, చురకత్తి, సం.ఛురీ, ఛురికా.
కృతి - సప్త సంతానములలో నొకటి, 1.చర్మము, తోలు, 2.కృత్తికా నక్షత్రము, 3.కత్తెర.
కృత్తిక - skin, తోలు, కత్తెర.
చర్మము - 1.తోలు, 2.కేడెము, డాలు.
తోలు - పశువులను నడుపు, వి.చర్మము, రూ.తోలుక.
త్రోలు - క్రి.పశ్వాదులను తోలు, రూ.తోలు.
తోలుదాలుఁపు - శివుడు, చర్మాంబరుడు.
తనువు - 1.దేహము, 2.తోలు, విణ.1.చిన్న, 2.సన్న.
దేహము - శరీరము, మేను.
కళవసము - తోలు, రూ.కళాసము. అజినము - తోలు.
చిన్న - 1.చిన్న, 2.మనోజ్ఞము.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
అందము - 1.సౌందర్యము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
చిట్టి - చిన్న, రూ.చిటి.
చిటి - 1.చిన్న, రూ.చిట్టి.
చిన్న - 1.అల్పము(చిడుగు - అల్పము), 2.కనిష్టము.
చిడిపి - 1.అల్పము, 2.పరుషము.
పరుషము - 1.నిష్టురము(నిష్ఠురము - కఠినము, పరుషము.), 2.నిష్టుర వాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు.
సన్న - సంజ్ఞ, సైగ, సం.సంజ్ఞా.
సంజ్ఞ - 1.సైస, 2.పేరు, 3.తెలివి, 4.పరిభాష, 5.సూర్యునిభార్య.
సంజ్ఞ - (గృహ.) 1.అభినయము, 2.చేష్ట, 3.చేష్టలచే అభిప్రాయమును తెల్పుట (Gesture).
సైగ - సంజ్ఞ, రూ.సయిగ, సం.సంజ్ఞా.
సంజ్ఞలు - (గణి.) రాసులు ధనరాసులో ఋణరాసులో తెలియజేయుట కుపయోగపడు గుర్తులు (+) అనునది ధనరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (-) అనునది ఋణరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (Signs).
చర్మీ ఫలకపాణిస్స్యాత్ -
చర్మి - కేడెము ధరించినవాడు.
చర్మ ఫలక మస్త్యాస్తీతి చర్మీ, నాంతః - చర్మ మనఁగా అరిగె, అది గలవాడు.
ఫలకము - 1.పలక, వ్రాతపలక, 2.కేడేము, డాలు.
ఫలతి విశీర్యతే ఘాతై రితి ఫలకః, ఞి ఫలా విశరణే, ఫలకః పాణావస్యేతి ఫలకపాణిః - వేటులచేత పగులునది గనుక ఫలకము అరిగె; అరిగ - డాలు, కేడెము. అది హస్తమందుఁ గలవాఁడు. ఈ 2 అరిగె (కేడెము) గలవాని పేర్లు.
పట్టె - 1.డాలు, 2.మంచముపట్టె, దున్నినచాలు, సం.పట్టికా.
డాలు - 1.కాంతి, 2.రంగు, 3.జెండా, టెక్కెము 4.కేడెము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము Ketu, 2.మిత్తిచూలు.
గ్రహభేదే ధ్వజే కేతుః -
కేతు శబ్దము కేతుగ్రహమునకును, టెక్కెమునకును పేరు. కిత్యతే అనేనేతి కేతుః. కిత జ్ఞానే. దీనిచేత నెఱుఁగఁబడును, కేతుశబ్దము కాంత్యుత్పాత చిహ్నములకును పేరు. "పతాకాయాం ద్యుతౌ కేతుః గ్రహోత్పాతాది లక్ష్మసు" అని రుద్రుఁడు.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
హరిగ - కేడెము, డాలు, రూ.అరిగ.
కేడేము - డాలు, రూ.కేడియము, సం.కేటకమ్. అడ్డలము - కేడెము, డాలు.
ఖేటకము - 1.డాలు, రూ.ఖేటము, 2.ఒకరకపు గ్రామము, 3.శ్లేష్మము.
ఖేటము - 1.రైతులుండు పల్లె, 2.వర్తకు లుండు పేట, 3.సూర్యాది గ్రహము, 4.శ్లేష్మము, 5.బలరాముని గద, 6.వేట, 7.చర్మము, 8.గడ్డి, 9.డాలు, విణ.1.అధమము, 2.వడ్డీ బ్రదుకునది.
కఠిని - పలకమీద వ్రాయుబలపము.
ఖటిక - 1.బలపపుపుల్ల, 2.కర్ణరంధ్రము.
పలక - 1.కేడెము, 2.చెక్క, 3.వ్రాయదగిన సాధనము, సం.ఫలకః.
చెక్క - మ్రానులోనగు వాని తునక, సం.శకలః.
ఫలకో (అ)స్త్రీ ఫలం చర్మ -
ఫలతి విశీర్యతే ప్రహారైరితి ఫలకః, ఫలం చ, ఞి ఫలా విశరణే. - వ్రేలుటచే బగులునది ఫలకము, ఫలమును.
చర్మణా బద్దత్వాత్ చర్మ, న, న. - తోలుచేతఁ గప్పబడినది. ఈ 3 అరిగపేర్లు, కేడెము.
చర్మపత్రము - వ్రాయుటకు అనువుగచేసిన మేక, గొరె మొ.ని తోలు, (Parchment).
మంగలకత్తి రూపు - కృత్తికా నక్షత్రము.
మంగల1 - క్షౌరముచేసి జీవించు జాతి.
మంగల2 - 1.పతివ్రత, 2.దుర్గ.
పతివ్రత - సాధ్వి; సాధ్వి - పతివ్రత.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
మంగళ - పార్వతి.
మంగళదేవత - లక్ష్మి.
మంగళ - పార్వతి, (ప్రకృతి అంశతో మంగళాదేవి జన్మించింది, గయలో దేవిస్థానం మంగళ). దుర్గమములైన బాధలనుంచి కాపాడుతుంది కనుక ఈ దేవికి 'దుర్గ ' అనే పేరు సార్థక మయింది.
అక్షమాల - 1.అకారము మొదలు క్ష కారము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తాళవము, 3.అరుంధతి.
అక్షసరము - జపమాల; అక్షసూత్రము - జపమాల.
ఆరంజ్యోతి - 1.వసిష్ఠుని భార్య, 2.ఆ పేరుగల నక్షత్రము సం.అరుంధతీ.
అరుంధతి - 1.వసిష్ఠుని భార్య, 2.ఒకానొక నక్షత్రము, 3.దక్షుని కూతురు, వికృ.ఆరంజ్యొతి. సతుల యందు అరుంధతి|
మాతంగి - 1.పార్వతి, 2.వసిష్ఠుని భార్య. మాతంగి మధుశాలినీ.....
స్థూలారుంధతీ న్యాయము - అరుంధతీ నక్షత్రము చిన్నది, కావున దానిని, చూచుటకై పెద్ద నక్షత్రమొక దానిని చూపించి దాని సమీపమున నున్నదని చూపు నట్టిరీతి.
మాతంగీ మత్తమాతంగీ మహాదేవప్రియా సదా,
దైత్యహన్త్రీచ వారాహీ సర్వశాస్త్రమయీ శుభా|
ఆగ్నేయము - అగ్నికి సంబంధించినది, 1.అగ్నిపర్వతము, 2.వివాహములో అరుంధతీ దర్శనాంతరము యజుర్వేదులు చేయు ఒక కర్మ (యజ్ - ఆరాధన), 3.కృత్తికా నక్షత్రము, 4.ఆగ్నేయాస్త్రము(అగ్ని దేవతాకమైన అస్త్రము).
అగ్నిపర్వతము - లోపల అత్యుష్టమై ఘనద్రవ పదార్ధములున్న కొండ. (అది జ్వాలా బిలము ద్వారా భూమి ఉపరితలముతో కలిసియుండును.) ఉజ్జు(ౙ)వకల్లు - అగ్నిపర్వతము నుండి బయలు పడిన రాయి. లావా - (భూగో.) (Lava) శిలాద్రవము, అగ్నిపర్వతముల నుండి రాయి కరిగి ప్రవహించు అత్యధికోష్ణోగ్రతకల ద్రవము. పగిలే అగ్ని పర్వతాన్ని అణచి వేయగలరా?
జ్వాలాబిలము - (భూగో.) అగ్ని పర్వతముపై గిన్నెవలె మండు పైభాగము. దీని ద్వార ఉపరితలమునకు గొట్టము వంటి దారి యుండును.
మాతంగి - 1.పార్వతి, 2.వసిష్ఠుని భార్య.
పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁడు.
మతంగుఁడు - 1.ఋషి, 2.మాదిగవాడు.
ఋషి - 1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.
మతంగజము-ఏనుగు; మాతంగము-ఏనుగు.
నతంగాదృషేర్జాతో మతంగజః - మతంగుఁడను ఋషివలనఁ బుట్టినది.
ఆసాది - 1.మాదిగవాడు, మతంగుడు, 2.గ్రామదేవతను పూజించు పూజారి.
మాతంగతి న గచ్ఛతి గ్రామమధ్య మితి మాతంగః తగుగతౌ. - గ్రామమధ్యమును బొందనివాఁడు.
మతంగసంతతి కాఁగా మాతంగులని పౌరాణికులు చెప్పుదురు.
మాదిగ - చెప్పులు కుట్టి జీవించు జాతి, కరటుడు, గోహింసకుడు, సం.మాతంగః.
గొడగర - మాదిగజాతి.
గొడగరి - మాదిగవాడు, రూ.గొడారి.
గొడారి - గొడగరి. గొడ్డువాడు గొడ్డున కేడుస్తే గొడారి తోలున కేడ్చి నాడుట.
గూబరి - మాదిగవాడు.
పాదూకృ చ్చర్మకార స్స్యాత్ -
పాదూం కరోతీతి పాదుకృత్, త. పు. - ముచ్చెలు సేయువాఁడు, పా. పాదుకృత్.
చర్మకారుడు - మాదిగవాడు.
చర్మ కరోతి వికారతా మాపాదయతీతి చర్మకారః - తోళ్ళను పాదరక్షాది వికారమును బొందించువాఁడు. ఈ 2 గొడగర వాని పేర్లు, (తోళ్ళూని) చెప్పులు గుట్టువాఁడు.
గల్ల - 1.పొల్లు, 2.మాదిగవాడు తోలు నానవేసెడి కుండ.
ఆర1 - 1.మాదిగవాడు చెప్పులు కుట్టు సూది, 2.(వైద్య.) శస్త్రములలో ఒకటి, 3.గుఱ్ఱములను తోలు కొరడా.
అరె - 1.చెప్పులు కుట్టు సూది, 2.కోడి మున్నగు పక్షుల కాలి వెనుక గోరు, 3.ఒకరకపు బాణము, సం.ఆరా.
ఆర2 - సంబోధనమున బహువచనమందు వచ్చు ఆగమము, ఉదా. జనులారా, మగువలారా మొ,వి.రూ.ఆరా.
ఆరా చర్మప్రభేదినీ,
ఆ ఇయర్తి చర్మే త్యారా, ఋ గతౌ ప్రాపణే చ. - చర్మమును బొందునది.
చర్మ భినత్తీతి చర్మభేది (కా)నీ, ఈ. సీ. - చర్మమును భేదించునది. ఈ ఆరె పేర్లు.
కొమ్ముకాఁడు - 1.కొమ్మునూదెడు మాదిగవాడు, 2.పంది, 3.ఏనుగు, రూ.కొమ్ముకాడు.
కొమ్ము - 1.ఉకారముయొక్క రూపాంతరనామము, 2.ఎద్దు మొ,ని. కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.పసుపు మొ,ని. ఎండినగడ్డ, ఉదా. పసుపుకొమ్ము, శొంఠికొమ్ము, 5.పల్లకి వెదురు, 6.ఏనుగు దంతము, 7.పందికోర, 8.ఊదెడివాద్యము, కాళె, 9.శిఖరము, కొన, 10.ఉత్సాహము.
త్వగ్దాహము - (గృహ.) 1.చర్మదాహము, 2.కరకైన చర్మము, 3.చర్మవ్యాధి, 4.బొటిమలు పెరిగిన, పగిలిన చర్మము. (విటమిన్ ' ఎ ' లోపమువలన కలుగు వ్యాధి, (Der matitis).
త్వక్ - చర్మ నామక ధాతువు.
త్వక్కు -1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము.
తొక్క - 1.చెట్టుపట్ట, 2.పండ్లమీది చర్మము, సం.త్వక్.
త్వచము - (వృక్ష.) బెరడు, బెండు (Cork).
బెరడు - చెట్టుబోదె పై కప్పు, బెరడు, (Bark).
బెండు - జిలుగు, విణ.నిస్సారము.
పట్ట - చెట్టు మీది తోలు, బెరడు, వై.వి. (వృక్ష.) వృక్షకాండము పై భాగమున నుండు దట్టమైన బెరడు, సం.పట్టమ్.
వల్కలము - చెట్టుమీది పట్ట.
వవ్కవము - పట్టనార, నారచీర.
రేషము - (వృక్ష.) నార, పీచు, పోగు (Fibre).
నార - చీల్చిన చెట్టుపట్టలోని పీచు, వల్కలము.
పీచు వేళ్ళు - వృక్ష.) తల్లివేరు ప్రత్యేకముగ లేకుండ అన్నియు నారవలె నుండు వేళ్ళు (Fibrous roots).
నార పంటలు - (వ్యవ.) నారనిచ్చు సస్యములు (Fibre crops) ఉదా. ప్రత్తి, గోగు జనుము, మొదలగునవి.
నారగోగు - (వ్యవ.) ఇది ప్రత్తి కుటుంబము (Molvaceae)నకు చెందిన గోగు (Hibiscus Cannabinus) మొక్క. దీని కాండము నుండి తీయబడు నార 'గోగు నార ' అనబడును (Deccan hemp, Bombay hemp or Bhimilipatam Jute).
జూట్ - (వ్యవ.) (Jute) ఇది పలాస్త్రీ కుటుంబము (Tiliaceae) నకు చెందిన Corchorus capsularis Cholitorius మొక్కల కాండము నుండి తీయబడు నార.
కార్పాసము - 1.ప్రత్తి, 2.నూలు, 3.వస్త్రము, కాగితము, విణ.నూలుతో సేయబడినది (వస్త్రము).
పత్తి - ప్రత్తి, సం.వి.1.గమనము, 2.ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు కాల్వురుగల సైనికదళము, 3.కాలిబంటు.
దూది - ప్రత్తి. వస్త్రములు వేరు - దూది ఒకటే.
పింజ - 1.దూది, 2.పసుపు(హరిద్ర - పసుపు), 3.గుంపు.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
ఖంజ - కుంటిది, వి.1.పసుపు, 2.దూది.
ఖంజము - ఒక కాలు కుంటియైనది.
దూదేకుట (దూది+ఏకుట) - (గృహ.) ప్రత్తిని పింజలుగా చేయుట, ప్రత్తి నుండి గింజలను వేరుచేయుట (Carding).
పింజ-దగ్ధపద మార్జాలన్యాయము - న్యా. నలుగురు దూది వర్తకులు పిల్లిని పెంచిన కథ, అందు న్యాయాధికారి తీర్పురీతి. (కాలు కాలిన పిల్లి వలె).
దగ్ధపట న్యాయము - మడత పెట్టిన బట్ట కాలిపోయిన మడతలు మడతలుగాను నూలిపోగులు స్పష్టముగాను కంపించును, కాని చేత పట్టుకొనిన విడిపోవు ననురీతి.
దగ్ధము - కాల్పబడినది. కొండంత దూదిని గాలుచుటకు కొండంత నిప్పు కావలెనా?
కొండంత దూది కూడా రవ్వంత నిప్పుతో కాలి బూడిద అయినట్లే పవిత్రమయిన భగవన్నామ స్వరణతో పాపపు రాశులన్నీ పటాపంచలవు తాయి. - శ్రీ రామకృష్ణ పరమహంస
ప్రత్తి రేవడి నేలలు - (వ్యవ.) కృష్ణ రేవడి నేలలు, ప్రత్తి సాగుచేయుట కుపయోగపడు ఒక విధమగు బంకనేలలు (Black cotton soils).
బదరి - 1.రేగుచెట్టు, 2.ప్రత్తిచెట్టు, 3.ఒక పుణ్యక్షేత్రము.
కంటకద్రుమము - 1.బూరుగుచెట్టు, 2.ముండ్లచెట్టు.
బూరుగు దూది - (గృహ.) పట్టుప్రత్తి (Kapok).
పట్టు - ఒక జాతి పురుగులవల్ల కలిగెడు ఒక దినుసు మేలు నూలు, సం.పట్టః.
పిచ్ఛాతు శాల్మలీవేష్ట,
పరాఙ్గుసంగాత్ పిచ్ఛా - వ్రేలికి అంటుకొనునది.
శాల్మలిం వేష్టయతీతి శాల్మలీవేష్టః - బూరుగును చుట్టువాఱి యుండునది. ఈ 2 బూరుగుబంక పేర్లు.
పిచ్ఛిలా పూరణీ మోచా చిరాయు శ్శాల్మలిర్ద్వ యోః,
ఆయిటి - బూరుగు.
పిచ్ఛాస్యా ఇతి పిచ్చిలా - బంక గలిగినది.
బూరుగు - శాల్మలీ వృక్షము, రూ.బూరువు.
పూరయతి తూలేన ఫలానీతి పూరణీ, ఈ. సీ. వూరీ ఆప్యాయనే. - దూదిచేత(తూలము - దూది)ఫలములు నిండించునది.
మోచ - 1.అరటి, 2.బూరుగు.
రసం ముంచతీతి మోచా, ముచ్ ఌ మోక్షణే. - రసమును విడుచునది.
చిరమాయుర్యస్య చిరాయుః, స.పు. చిరకాల ముండునది. తథాచ, "షస్టి ర్వర్ష సహస్రాణి వనే జీవతి శాల్మలి"రిరి, పా.స్థిరమాయు ర్యస్య చిరజీవిత్వాత్ స్థిరాయుః - అనేక కాల ముండునది.
శాల్మలి - 1.బూరుగుచెట్టు, 2.సప్త ద్వీపములలో నొకటి.
విటపైశ్శాల్మతే శాల్మలిః, ఇ.ప్స. శాఖా విస్తారము చేత కొనియాడఁబడునది, పా. శాల్మలీ. - ఈ 4 బూరుగుచెట్టు పేర్లు.
దానము చేయనేరని యధార్మికు సంపద యుండియుండినన్
దానె పలాయనంబగుట తథ్యము, బూరుగు మ్రాను గాచినన్
దానిఫలంబు లూరక వృధాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన, నేమిటికిఁగాక యభోజ్యములౌట ! భాస్కరా.
తా. బూరుగుచెట్టు బాగుగా ఫలించినను దాని ఫలములు తినరాని వగుటచే, అవి అడవిలో ఎవరికి ఉపయోగపడక ఎండిపోయి, గాలికి నేల రాలిపోవును. అట్లే ఒకరికి దానముచేయని వాని సంపద యొకప్పుడు న్నను మరి యొకప్పుడు తొలగిపోవును.
ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపు కోడు.
ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3.మంచపు కోడు.
గొరిజ - పసువు కాలిగిట్ట, సం. ఖురః.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపు కోడు, క్రి. మండు. కాలికి జూటూకున్న పాము కరవక మానునా?
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా|
పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయంకరీ.
పుండరీకాక్ష. పుండరీకే ఇవ అక్షిణీ యస్య సః - తెల్లదామరవంటి కన్నులు గలవాడు.
పుండరీకం హృత్కమలం అక్ష్ణోతి వ్యాప్నోతీతివా - హృదయకమలమును వ్యాపించియుండువాఁడు. అక్షూ వ్యాప్తౌగా.
పుండరీకము - 1.తెల్లదామర, 2.అగ్నేయపు దిక్కునందలి యేనుగు, 3.శార్దూలము, పులి. పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱచెరకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
అనిక్షువు - నల్లచెరకు.
పుణ్ణరీకం సితామ్భోజం :
పుణతి మంగళత్వా త్పుండరీకం. పుణ కర్మణి శుభే.
సితం చ అంభోజం చ సితాంభోజం - తెల్లనైన తామర. ఈ రెండు తెల్లతామర పేర్లు.
మహాయోగపీఠే తటే భీమరథ్యా పరం పుండరీకాయ ధాతుం మునీంద్రైః|
సమాగత్య తిష్ఠంతి మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్|
కపిల - 1.ఆగ్నేయ దిశయందలి ఆడేనుగు, 2.పుల్లావు.
పుల్లావు - కపిలగోవు.
కపిల వర్ణత్వాత్కపిలా - కపిల వర్ణము గలిగినది.
కామ్యత ఇతి కపిలా - కోరఁబడునది.
బభ్రువు - 1.కపిలగోవు, 2.అగ్ని, 3.బట్టతలవాడు, విణ.1.పచ్చనిది, 2.రోగము వలన బట్టతల కలవాడు.
ఖర్వాటుఁడు - బట్టతలవాడు, రూ.ఖల్వాటుడు.
చెంబుతల - బట్టతల.
నూలిగరను - బట్టతల, ఇంద్రలుప్తము.
ఇంద్రలు ప్తకము - 1.బట్టతల, 2.తల వెండ్రుకలూడిపోవు ఒక రోగము, రూ.ఇంద్రలుప్తము.రూ.ఇంద్రలుప్తము.
No comments:
Post a Comment