ఉత్తరాషాఢ 3పాదములు, శ్రవణము 4పాదములు, ధనిష్ఠ 2పాదములు మకరరాశి, మొసలి.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహ్ణాతి పురు షేణార్జితం ధనమితి గృహం, గేహం చ, గ్రహ ఉపాదనే. - పురుషునిచే సంపాదింపఁ బడిన ధనమును గ్రహించునది.
బృందము - సమూహము.
బృందారకుఁడు - వేలుపు, విన.మనోజ్ఞుడు.
శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె, మొ.వి. సం.క్రాంతిః.
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు హేమంతఋతువు.
మంచు(ౘ)కారు - హేమంత ఋతువు.
కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
వయసు - ప్రాయము, యౌవనము.
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు; స్నేహితుఁడు - చెలికాడు.
కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, 5.ముదిమి. ముదిమి - ముసలితనము.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).
గ్రాహము - 1.పంది, 2.చెర, 3.మొసలి, 4.గ్రహణము, 5.గ్రహించుట.
పంది - సూకరము; సూకరము - పంది, రూ.శూకరము.
గ్రాహో(అ)వహారో -
గృహ్ణత్యేవ సముంచతీ ప్రాణీన ఇతి గ్రాహః, గ్రహ ఉపాదానే. - ప్రాణులనుబట్టి విడువనిది.
అవహరతీత్యవహారః, హృఞ్ హరణే. - ప్రాణులను హరించునది. ఈ 2 లతాకారముగాఁ జుట్టునొని ప్రాణిహింసఁజేయు మత్స్యముపేర్లు.
గ్రహణము - 1.రాహు కేతువులు సూర్యచంద్రులను పట్టుట, 2.గ్రహించుట, 3.బుద్ధి, (భౌతి.) గ్రహమునకు వేరు గ్రహము అడ్డువచ్చి కన్పించకుండుట(Eclipse), (భూగో.) భూమియొక్క కక్ష్య, చంద్రుని యొక్క కక్ష్య, రెండు బిందువుల (రాహుకేతువుల)లో కలియును. ఆ రెండింటిలో ఏదైన ఒక బిందువు భూమికి తిన్నగా వెనుకగాని ముందుగాని, వెనుకగాని వచ్చినచో గ్రహణము కలుగును.
పట్టు - 1.చెల్లు, 2.ప్రారంభించు, 3.కలుగు, 4.గ్రహించు, వి.1.గ్రహణము, 2.స్థానము(నెలకువ - స్థానము), 3.అవలంబము.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Intelligence).
మతి - బుద్ధి, మనస్సు, సం.మతిః.
చిత్తము - మనస్సు. చిత్తము నందు దేవీస్థానం బ్రహ్మకళ.
కక్ష్య1 - 1.మొలనూలు, 2.తొట్టికట్టు, 3.ఏనుగు నడుమునకు గట్టు గొలుసు, 4.వసారా, 5.(గణి.) పరిభ్రమణ మార్గము (Orbit).
కక్ష్య2 - (భూగో.) భూమి సూర్యుని చుట్టు పూర్తిగా తిరుగుట.
యస్మిన్ బ్రహ్మాభ్యజయత్సర్వమేతత్ | అముంచ లోక - మిదమూచ సర్వమ్ | తన్నో నక్షత్ర - మభిజిద్విజిత్య | శ్రియం దధాత్వహృణీయ మానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మణా సంజితేమౌ | తన్నో నక్షత్ర - మభిజిద్విచష్టామ్ | తస్మిన్వయం పృతనా స్సంజయేమ | తన్నో దేవాసో అనుజానంతు కామమ్ ||21||
కానరానిచుక్క - అభిజిత్ నక్షత్రము.
అభిజిత్తు - 1.పగలు పదునాల్గు గడియలపై రెండు గడియల కాలము, 2.ఒక నక్షత్రము.
బొమ్మచుక్క - కానరానిచుక్క, అభిజిన్నక్షత్రము.
బొమ్మ - 1.కనుబొమ, 2.బిరుదు చిహ్నము, 3.అవమానచిహ్నము, 4.ప్రతిమ, 5.బ్రహ్మ, విణ.అల్పము, సం.1.భ్రూ, 2.ప్రతిమా, 3.బ్రహ్మ.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్త్రిక), 2.బొమ్మ.
బొమ - 1.కనుబొమ, 2.ప్రతిమ, రూ.బొమ్మ.
భ్రూపు - కనుబొమ్మ; కనుబొమ - కనుబొమ్మ.
భ్రూభంగము - బొమముడి.
భ్రుకుటి - బొమముడి, రూ.భ్రూకుటి.
బొమముడి - కోపముచే కలిగెడు కనుబొమల ముడి, భ్రుకుటి.
బొమ్మపెట్టు - క్రి.వెక్కిరించు, ఉదా. "దేవతా మణులకు బొమ్మ పెట్టు క్రియ నుర్దల తాళనినాద పద్దతిన్" (రా మా భ్యు దయము).
బేరము - ప్రతిమ, వై.వి. వ్యాపారము, వెలకడుగుట, సం.వ్యవహారః.
ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలనము, వి. (భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).
ఛాయ - 1.నీడ, 2.కాంతి, 3.రంగు, 4.ప్రతిబింబము, 5.సూర్యునిభార్య, 6.లంచము, 7.వరుస, 8.కొంచెము, 9.చీకటి, (భౌతి.) ఒక కాంతి నిరోధకమైన వస్తువునకు వెనుకవైపున నుండు కాంతి విహీన చిత్రము (Shadow).
ఛాయాపుత్రుఁడు - శని Saturn.
ఆభాసము - 1.కాంతి, 2.ప్రతిబింబము, 3.వాస్తవము కాకపోయినను పైకి వాస్తవమైన దానివలె కనించునది, ఉదా.హేత్వాభాసము, రసాభాసము మొ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ఆనందని - బ్రహ్మపట్టణము.
ఆనంద - ప్రభవాది సంవత్సరములలో నలువదియవ(40వ) సంవత్సరము.
ఆనందనము - బంధు మిత్రాదులను కుశలప్రశ్న ఆలింగనాదులచే సంతోషపెట్టుట.
ణ్యము - బ్రహ్మలోకమందలి యొక సరోవరము.
ఖచితము - చెక్కబడినది, పొదుగ బడినది, సం.వి.బ్రహ్మయొక్క ఖడ్గము, వికృ.కచ్ఛితము.
గాత్రము1 - 1.దేహము, 2.అవయవము.
గాతే గచ్ఛతీతి గాత్రం, గాఙ్ గతౌ. - పోవునది.
గాత్రము2 - స్థూలము.
వపువు - 1.శరీరము, 2.చక్కని రూపము.
వపుః, టు వప్ బీజసంతానే. - పూర్వకర్మముల చేతఁ బుట్టింపఁబడునది.
సంహర్త - సంహరించువాడు, రూ.సంహారకుడు.
సంహృతము - సంహరింపబడినది.
సంహృతి - సంహారము, 2.మరల్చుట.
సంహననము - 1.శరీరము, 2.చంపుట, 3.కలయిక.
సంహన్యన్తే సంబద్ధ్యన్తే, అఙ్గాన్యత్రేతి సంహననం, హన హింసాగత్యోః - అవయవములు దీనియందుఁ గూడియుండును.
పృత్వివ్యాదిపంచ భూతములు దీనియందుఁ గూడి యుండును.
సంహరణము - చంపుట.
క్షత్త్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
శరీరము - దేహము.
శీర్యత ఇతి శరీరం, శౄ హింసాయాం. - నశించునది.
శరీరి - ప్రాణి.
శరీరవర్థకములు - (గృహ.) దేహాభి వృద్ధినిచేయు ఆహార పదార్థములు. శరీరమును పెంపొందజేయు పదార్థములు, పెరుగుదలకు తోడ్పడు పదార్థములు (Body Builders).
శరీరాభివృద్ధి - (గృహ.) అవయవాభి వృద్ధి శరీరము పెరుగుట (Physical growth)
శరీర నిర్మాణము - (జీవ.) శరీరము యొక్క అవయవములలోపలి నిర్మాణము, (Anotomy-Internal anatomy), బాహ్య నిర్మాణము, (External morphology).
శరీరనిర్మాణ విజ్ఞానము - (జీవ.) ఒక ప్రాణియొక్క అవయవములు లోపలి నిర్మాణమునకు సంబంధించిన జ్ఞానము (Anatomy).
అపఘనము - 1.శరీరావయము, 2.శరీరము, విణ.మబ్బులేనిది.
వర్ష్మము - 1.శరీరము, 2.మిక్కిలి చక్కని రూపము, 3.కొలత.
వృవ్యత ఇతి వర్ష్మ, న, న. వృషు సేచనే. - తడుపఁబడినది.
విగ్రహము - 1.శరీరము, 2.విభాగము, 3.బొమ్మ, మూర్తి, 4.యుద్ధము.
విశేషముగా ఆత్మచేత గ్రహింపఁబడినది.
9. దేహము - శరీరము, మేను.
దిహ్యతే అన్నరసేనేతి దేహః, అ, ప్న. దిహ ఉపచయే. - అన్న రసాదులచేత వృద్ధిబొందింపఁ బడునది.
దేహి - దేహము గలవాడు.
దేహయాత్ర - 1.తిండి, 2.జీవనము, 3.చావు.
మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్ఛతి సముచ్ఛ్రితో భవతీతి మూర్తిః, సీ, మూర్ఛా మోహనముచ్ఛ్రాయయోః. - ఉన్నత మగునది.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదుల చెక్కు శిల్పవిద్య(Sculpture).
మూర్తిః కాఠిన్య కాయయోః,
మూతిశబ్దము గట్టితనమునకును, శరీరమునకును పేరు. మూర్చయతీతి మూర్తిః, సీ. మూర్చామోహ సముచ్ఛ్రాయయోః, అధిక్యమును బొందునది, "ఉచ్ఛ్రాయమోహబంధేషు మూర్తిః పరిమితా వపి" ఇతి శేషః.
ఆభీలము - భయంకరము, వి.శరీర బాధ.
పొంగటి నెల - మార్గశీర్ష మాసము (పొంగలి+నెల) పొంగలిపండుగ వచ్చు నెల.
ఉత్తరాయణము - (భూగో.) సూర్యుడు డిసెంబరు 22వ తేది మకర రేఖను చేరి అచ్చటినుండి ఉత్తరమునకు మరలునప్పటి నుండి ఆరునెలల కాలము, సంవత్సరమున వచ్చు రెండు అయనములలో ఒకటి.
మకరరేఖ - (భూగో.) భూమధ్య రేఖకు దక్షిణమున 23 1/2లో ఉన్న రేఖ (Tropic of capricorn).
పొంగటి పండుగ - మకర సంక్రాంతి.
పొంగలి - 1.పాలు చేర్చి పొంగించునట్టి అన్నము, 2.పొంగలి పండుగ.
పొంగిలి - పక్షుల ఆహారము.
సంక్రాంతి - మేషాది సంక్రమణము.
సంక్రమణము - సూర్యుడొక రాశి నుండి మరియొక రాశికి ప్రవేశించుట. సం.వి.(భౌతి.) ఒక చోటగల స్థితి, దశ, రీతి విషయము అనువాని నుండి మరొకచోట గలస్థితి, దశ, రీతి విషయము అనువానికి మార్పు, (Transition), సం.వి.(రసా.) దాటుట (Transition), ఉదా.రాంబిక్ గంధకము 96 డిగ్రీల యొద్ద మోనోక్లినిక్ రూపమునకు సంక్రమణము చేయును.
శీతకారు - (వ్యవ.) డిసెంబరు December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు, హేమంత ఋతువు (Winter season).
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశీర్ష, పుష్య మాసములు హేమంతఋతువు.
మంౘుకారు - హేమంత ఋతువు.
కర్తె - సూర్యుడుందు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.
హేమన్తః -
హిమేన హంతీతి హేమతః. హన హింసాగత్యోః - చలిచేత జనులను హింసించునది. మార్గశీర్ష పౌషమాసములతోఁ గూడిన ఋతువు పేరు.
శీత - నాగటిచాలు, రూ.సీత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
శీతకరుఁడు - చంద్రుడు, చలివెలుగు.
ౘలివెలుఁగు - చంద్రుడు, శీతకిరణుడు.
శీతకిరణుఁడు - చంద్రుడు; శీతాంశుఁడు - చంద్రుడు; శీతభానుఁడు - చంద్రుడు.
శీతమయూఖుఁడు - చంద్రుడు, వ్యు. చల్లని కిరణములు కలవాడు.
శీతము - 1.చల్లనిది, 2.అలసమైనది.
శీతలము - చల్లనిది.
శీతలీకిరణము - (భౌతి.) చల్లచేసి తాపక్రమమును తగ్గించుట, (Cooling).
శీతకము - చలికాలము, సం. వి. (రసా.) ద్రవభాష్పములను శీతకరించి ద్రవముగా మార్చుట కుపయోగించు పరికరము, (Condenser), చూ. స్వేదనము.
శీతస్వానము - (జం.) చలనము లేని స్థితిలో చలికామును గడుపుట, (Hibernation).
శీతనగము - హిమాచలము.
శీతమండలము - (భూగో.) ఉత్తరార్థములో అర్కిటిక్ వృత్తములోని ప్రాంతములు, దక్షిణార్థములో అంటార్కిటిక్ వృత్తములోని ప్రాంతములు. ఈ ప్రాంతములలో సూర్యకిరణము లెల్లప్పుడు చాల ఏటవాలుగ ప్రసరించుటచే వేసవి కాలలోకూడ చల్లగనే యుండును. చలికాలములో విపరీతమైన చలిగ నుండును.
ప్రాలేయము - మంచు.
ప్రళయాచ్ఛరదంతా దాగతమితి ప్రాలేయం. - ప్రళయ మనఁగా అంతము, శరత్కాలాంతమున వచ్చునది.
తుహినము - మంచు.
తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.
ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి.
శైత్యము - 1.చలువ, 2.జలుబు.
ౘలువడి - చలువ.
ౘలువజ్యోతి - చంద్రుడు.
హిమాచల మహావంశ పావనాయై నమో నమః|
సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి ని ర్మా ణ ము లు, ఊపిరి తిత్తులు, రెండు బృహద్ధమన చాపములుగల పృష్ట వంశిక జంతువులు (Reptilia), ఉదా. బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.
మకరము - 1.మొసలి, 2.ఒక నిధి, 3.ఒక రాశి.
మొసలిరాశి - మకరరాశి.
మీనరము - మొసలి, మకరము.
మకర మొకటి రవిఁ జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు * మాటున డాఁగెన్
మకరాలయమునఁ దిరిగెడు
మకరంబులు కూర్మరాజు * మఱువున కరిగెన్.
భావ|| మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ దృశ్యాన్ని చూసి ..... అ భయానకమైన సుదర్శనము(విష్ణు చక్రము) తన పైకి వస్తుందేమో నని భయపడి రాశులలో ఒకటయిన మకరం సూర్యుని వెనుక చేరింది. నిధులలో ఒక రకమయిన మకరం కుబేరుని శరణు కోరి, ఆయన వెనుక దాక్కుంది. (మకరాలయము- సముద్రము)సముద్రంలో ఉన్న మొసళ్ళన్నీ ఆదికూర్మం అయిన తాబేలు కిందకు దూరిపోయాయి.
*మకరము + ఒకటి అంటే పన్నెండు రాశులలో ఒకటి అయిన మకరం. రవి జొచ్చెన్ అంటే సూర్యుని(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)దగ్గరకు చేరింది.
*మకరము మరి యొకటి అంటే మరొక మకరం (కుబేరుని ధనరాశులలో ఒకటి అయిన మకరం). ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత. ధనుమాటున అంటే కుబేరుని చాటున డాగెన్ అంటే దాకుంది.
*తిరిగెడు అంటే తిరుగుతున్నటువంటి, మకరంబులు అంటే మొసళ్ళన్నీ, కూర్మరాజు మరువునకు అంటే(అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.) ఆదికూర్మం అయిన తాబేలు(ఆదికూర్మావతార మెత్తిన విష్ణువు)కిందకు, అరిగెన్ అంటే మఱుఁగున జేరెను.
*మకరం అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. నక్షత్రమండలంలో మనకున్న పన్నెండు రాశులలో మకరం అనేది ఒక రాశి పేరు. ధనదుడు - కుబేరుడు, విణ.దాత. అంటే ధనాన్ని ఇచ్చేవాడు. ఆ ధన్నాన్ని ఇచ్చే కుబేరుని దగ్గర ఉన్న అపారమైన నిధులు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు మకరం. మామూలుగా మకరం అంటే మొసలి అనే అర్థం.
మకర ఇవ గ్రహీతు మశక్యత్వాన్మకరః - మొసలివలె గ్రహింప నశక్యమైనది.
మకరకేతసుఁడు - మన్మథుడు.
మకరధ్వజః మకరోధ్వజోయస్య సః - మకరము ధ్వజముగాఁ గలవాడు, మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
మకరాలయము - సముద్రము.
మహాశయము - సముద్రము.
సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.
మాలంకషము - సముద్రము.
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రవాత్
మాఙ్గల్యభాజి మధుమాథిని మన్మథేన
మ య్యాపతే త్త ది హ మన్థర మీక్షణార్థం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయః|
మొసలి దోరణము - మకర తోరణము.
మకరతోరణము - మొసలి రూపము గల తోరణము.
మకరిక - మకరికాపత్రము, స్త్రీలకు చెక్కిళ్ళపై లత్తుకతో వ్రాయు మకర రూపమగు రేఖ.
పత్రభంగము - మకరికాపత్రము, పత్రరేఖ.
చిన్ని మకరాంకపుఁ బయ్యెద చేడెకు మకరారాశి....
మొసలి - నక్రము, మకరము.
కుంభీరము - మొసలి.
ప్రాణికబళనే ముఖం కిరతీతి మకరః, కౄ విక్షేపణే. - ప్రాణులను కబళించునప్పుడు ముఖమును విదిలించునది.
మాయాం కరోతీతి మకరః, డుకృఙ్ కరణే. - మాయను జేయునది, చొరమీను.
నక్రము - 1.అడ్డకమ్మి, 2.త్రొక్కుడుకమ్మి, 3.మొసలి.
నక్రస్తు కుమ్భీరః :
నక్రామతీతి నక్రః క్రము పాదవిక్షేపే. - భూమియందు పాదవిక్షేపము చేయనిది.
కుంభినో(కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు గలది, 2.కుమ్మరి.)గజాన్ రాతీతి కుంభీరః రా ఆదానే. - గజములను గ్రహించునది. ఈ రెండు ఏనుఁగును బట్టి యీడ్చుకొనిపోవు జలజంతువు పేర్లు.
అడ్డకమ్మి - ద్వారబంధపు పైకమ్మి, లచ్చికమ్మి, నాస.
దోరణపుఁగమ్మి - ద్వారము మీది అడ్దకమ్మి.
కమ్మి - ఇనుము మొ.గు లోహపు కడ్డీ.
మొసలివాయి - మొసలికాటు.
మొసలికాటు - మొసలి గల నోరు గల కత్తిపిడికొన.
నీళ్ళలోన మొసలి నిగడి యేనుఁగు బట్టు
బైట కుక్క చేత భంగపడును
స్థానబల్మి గాని తనబల్మి కాదయా! విశ్వ.
తా. మొసలి నీటిలో(మొసలికి నీళ్ళే తన యునికి పట్టు)వున్నప్పుడు, ఏనుగు(మహామృగము -ఏనుగు)నైనను పట్టుకొన గలుగును, బైట కుక్కను(కుక్క - శునకము, సం.కుర్కురః.)ను యేమి చేయలేక లొంగిపోవును. అది స్థానబలమే కాని, దాని స్వంత బలము కాదు.
సంసారసాగర విశాలకరాలకాల
నక్రగ్రహగ్రసిత నిగ్రహవిగ్రహస్య|
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలంబమ్.
నాస - ముక్కు, రూ.నస, నాసిక.
ముకు - నాసిక, రూ.ముక్కు.
నాసికాసంబంధము - (జం.) ముక్కుతో సంబంధము గలది (Nasal).
నాసావివరములు - (జం.) బయటికి తెరచుకొను ముక్కుకొన నుండు రంధ్రములు (Nostrils).
క్లీబే ఘ్రూణం గన్ధవహా ఘోణా నాసా చ నాసికా,
జిఘ్రతి అనేన ఘ్రూణం. న. ఘ్రూ గన్ధోపాదానే. - దీనిచేత వాసన గ్రహింతురు.
గంధం వహతీతి. గంధవాహా. వహ ప్రాపణే. - గంధమును వహించునది.
ఘుణతి భ్రమతి గంధగ్రహణాయ ఘోనా. ఘుణుభ్రమణే. - భ్రమించునది.
నాసతే శబ్దాయతే నాసా. నాసికా చ. నాసృసబ్ధే. - ధ్వనిచేయునది. ఈ 5 ఐదు ముక్కు పేర్లు.
ఘ్రూణము - ముక్కు, విణ.మూర్కొనబడినది.
ఘోణ - ముక్కు.
ఘ్రూతి - 1.ముక్కు, 2.వాసన, 3.వాసనచూచుట.
ఘ్రూణించు - క్రి.మూర్కొను, వాసనచూచు.
గంధవహ - ముక్కు, రూ.గంధవాహ.
గంధవహుఁడు - వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొనిపోవువాడు.
నాసామణి - ముక్కర, ముంగర.
ముంగర - ముక్కర, అడ్డబాస.
ముక్కఱ - ముంగర; ముంగర - అడ్డబాస.
అడ్డబాస - బులాకి, ముంగర.
బేసరి - ఒక రకము ముక్కర, అడ్దబాస.
హిమాచల మహావంశ పావనాయై నమో నమః|
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాళిల ఘోరపావనికరీ - ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ.
ఇల్లి ముక్క - నెత్తురు కారు ముక్కు రోగము.
దిబ్బడ - శైత్యాధికముచే ముక్కుచెవులు మూసికొని పోవుటవల్ల కలుగు బాధ.
కంబి - 1.వెదురుకమ్మి, 2.గరిటె.
గరిట - కఱ్ఱతో లేక ఇనుముతో చేసినతెడ్డు, రూ.గరిఁటె, గంటె, (రసా.) ద్రవ్యములను గ్రహించు సాధనము (Ladle).
గంటె - 1.గరిటె, 2.సజ్జపైరు, ఒక రకపు సస్యము, బహు.గంటెలు.
విష్కంభము - 1.అడ్డంకి, 2.గ్రహయోగము, 3.గొళ్ళెము, (అలం.) నాటకాంగము.
గొళ్ళెము - (వ్యవ.) తలుపు చిలుకు, రూ.గొండెము.
గొండెము - తలుపు చిలుకు, రూ.గొళ్ళెము, గొండ్లెము.
శింశుమారము - 1.మొసలి, 2.నీరుకోతి.
శిశూన్ మారయతీతి శింశుమారః, మృఙ్ ప్రాణత్యాగే. - శిశువులను జంపునది. పా, శిశుమార ఇత్యపి కేచిత్, మొసలి.
విష్ణువు శింశుమార రూపమున (మొసలి రూపమున) ఊర్థ్వలోకములైన భూః మొదలగు లోకములను ధరించుచున్నాడు.
సర్వైర్ద్రువాదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ, పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్!
తా. క్షీరసాగరమున శయనించియున్న శ్రీమన్నారాయణా! శింశుమార రూపమున నున్న నీ యొక్క పుచ్ఛము(పుచ్ఛము - తోక)మొదలైన అవయములందు ధ్రువాది నక్షత్రములు, సూర్యుడు Sun, చంద్రుడు Moon మొదలైన గ్రహములునట్లు కల్పించబడుచున్నవి. ఆ శింశుమార రూపమునున్న నిన్నుమహాత్ములు మూడు సంధ్యా సమయములందు ఉపాసించు చున్నారు. అట్టి శింశుమారరూపా! పాపములను దూరమొనర్చి, నాకు నరకము కలుగ కుండునట్లు అనుగ్రహింపుము. - నారయణీయము
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము - 1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
ద్యుపు - 1.ఆకాశము, 2.దినము, 3.స్వర్గము.
దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.
దివనము - 1.పగలు, 2.దినము, రోజు.
దినము - 1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
పగలు - పవలు, దినము.
రోజు - దినము.
రోజు - 24 గంటలు, దినము భూమి తన అక్షముపై పడమటనుండి తూర్పునకు తనచుట్టును 360 డిగ్రీలు తిరుగుటకు తీసికొను వ్యవధి, సం.రోచిః.
దినకరుఁడు - సూర్యుడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
చేటచెవులవేలుపు - గణపతి.
గణపతి - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ – స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.
ఒంటికొమ్మువేలుపు - ఏకదంతుడు, గణపతి.
ఏకదంతుఁడు - వినాయకుడు.
కార్తికేయోత్పాటితైక దంతత్వా దేకో దంతో యస్య స ఏకదంతః - కుమారస్వామిచే నొకదంతము పెఱికివేయఁబడెను గనుక నేకదంతుడు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
ఉద్భటము - అధికము, వి.1.చేట, 2.తాబేలు.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
ప్రస్పోటనం శూర్పో మస్త్రీ -
ప్రస్పోటనము - 1.చేట 2.దెబ్బ.
ప్రస్ఫోట్యతే బహిర్నిష్క్రియతే తుషాది రనేనేతి ప్రస్ఫోటనం. స్ఫుటిర్ విశరణే. - దీనిచేత పొట్టు మొదలయినవి నిరసింపఁబడును.
శూర్పము - చేట.
శీర్యతే తుషాది రనేనేతి శూర్పం. అ. ప్న. శౄ హింసాయాం. - దీనిచేత పొట్టు మొదలైనవి చెరుగఁబడును.
చేట - చెరిగెడి సాధనము, శూర్పము.
శూర్ప్యతే అనేన్ శూర్పం. శూర్పమానే. - దీనిచేత కొలవఁబడును. ఈ రెండు చేట పేర్లు.
చెరుగు - క్రి.ధాన్యము చేటలో చెరుగు.
కోఁడు - క్రి. ధాన్యము చేటలో పోసి ప్రక్కవాటుగా ఇటునటు త్రిప్పు.
ఎగురఁబోతు - (వ్యవ.) నూర్చిన ధాన్యములో పొట్టు, దుమ్ము మొ.వి లేకుండ చేయుటకు ధాన్యమును గాలి వీచునపుడు కొంత ఎత్తుననుండి చేటలో మెల్లగా క్రిందికి విడుచుచుండుట, తూర్పారపట్టుట (Winnowing).
తూరుపాఱఁబట్టు - పొల్లుగింజలు దూరముగ పోవునట్లు గాలి కెత్తిపోయు, రూ. తూరుపెత్తు, తూర్పెత్తు, తూర్పాఱఁబట్టు.
మేలురాసి - తూర్పెత్తిన ధాన్యపుప్రోవు.
మొరుములు - (వ్యావ.) చేటచే తనపైవు కోడగా వచ్చిన పెద్ద గింజలు, గుండ్రలు.
శూర్పకారాతి - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
అరాతి - శత్రువు.
ఇయర్తి అరాతిః, ఇ.పు. ఋ గతౌ. - సంహరించువాఁడు.
శూర్పణఖ - రావణుని చెల్లెలు.
ౘుప్పనాక - శూర్పణఖ, రావణుని చెల్లెలు, రూ.చుప్పనాతి. శూర్పణఖార్తి విధాయక రామ్|
రాముడిని కోరుకుని, సీతను వద్దన్న శూర్పణక ముక్కు చెవులు కోయించుకుంది.
స్త్రీ హత్య మహాపాపం కనుక లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి వదిలిపెట్టాడు.
దెబ్బ - తాడనము, కొట్టు.
ఆస్ఫోటనము - 1.పోటు, 2.చీలిక, 3.జీవస్థానము నందు పొడుచు పోటు, 4.భుజము లప్పించుట, 5.బయలుపరచుట, 6.వికసించుట, 7.ధాన్యములు పొట్టుపోవునట్లు చెరుగుట.
పోటు - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 4.పెద్ద అల.
ఊటు - 1.పొడుచు, 2.నొవ్వునాటు, వి.పోటు.
ఉపహతి - 1.దెబ్బ, 2.ఉపద్రవము, 3.నాశము, 4.అడ్దగింపు.
హతి - దెబ్బ, ఉపహతి.
హతుఁడు - విణ. 1.కొట్టబడినవాడు, 2.మనసు చెడినవాడు.
గొహారు - 1.ఉపద్రవము, 2.తాపము, 3.పెద్దమ్రోత.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.
నొప్పి - 1.బాధ 2.ఆపద.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
చేటు - 1.వినాశము, 2.కీడు, 3.అశుభము, 4.మరణము.
ఆఘాతము - 1.కొట్టుట, 2.దెబ్బ, 3.చంపుట, 4.చంపుచోటు, 5.గాయము, 6.దుఃఖము, 7.మూత్రము అడ్డుపడుట, మూత్రాఘాతము.
అబ్రహ్మణ్యము - బ్రాహ్మణునికి తగనిది (వధాదులు), వి.చంపవలదు అని బ్రాహ్మణుఁడు పెట్టు మొర.
గాయము - కత్తి మొ.వానితాకున గలుగు దెబ్బనరకు, క్షతి.
గంటి - 1.గాయము, క్షతి, 2.దుఃఖము, 3.కన్నము.
ఎన్నో వ్రణములు కోసితిని కాని నాకురుపు కోసినప్పటి బాధ ఎవ్వరికి కలుగలేదు అన్నట్లు. కత్తి చేసిన గాయము మానుతుంది, కాని పరుషవాక్కులు చేసిన గాయము మానదు.
క్షతి - 1.గాయము, 2.నాశము.
క్షతము - 1.గాయబడినది, 2.చీలచబడినది, 3.నాశమైనది, సం.వి.1.గాయము, 2.చీల్చుట, 3.దెబ్బ.
భేదనము - భేదించుట, (గృహ) విడదీయుట, చీల్చుట, విభజన(వేరుచేయుట), బద్దలు చేయుట (splitting).
స్ఫుటనము - భేదించుట.
స్ఫోటము - భేదించుట.
విషాదము - భేదము, దుఃఖము.
ఖేదము - దుఃఖము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
మూత్రకృచ్ఛము - 1.ఉబ్బరము, నీరుకట్టు తెవులు, 2.అతి మూత్రము.
నీరుకట్టు - మూత్ర బంధరోగము(Dys’uria). నీరుడి - అతిమూత్రము.
ఉబ్బరము - 1.కడుపుబ్బు, సం.ఉబ్బణమ్ 2.నివ్వెరచూటు, సం.ఉద్భ్రమః.
ఉబ్బరపోవు - క్రి.(ఉబ్బరము + పోవు) 1.నివ్వెరపడు 2.బాధనొందు.
నివ్వెఱ - (నిండు+వెఱ) 1.పారవశ్యము, 2.నిశ్చేష్టత, 3.భ్రాంతి, రూ.నివ్వెర, మిక్కిలిభయము, రూ.నివ్వెరగు.
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.
జడత్వము - (భౌతి.) విశ్రాంతి స్థితిలోగాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము (Inertia).
నెఫ్రైటిస్ - (గృహ.) (Nephritis), మూత్ర పిండములు చెడిపోవుట. (ఈ వ్యాధికి సూచనలు లేవు. ఇది చాల అపాయకరమైన వ్యాధి.)
తూరుపాఱఁబట్టు - పొల్లుగింజలు దూరముగ పోవునట్లు గాలి కెత్తిపోయు, రూ. తూరుపెత్తు, తూర్పెత్తు, తూర్పాఱఁబట్టు.
చెరుగు - ధాన్యమును చేటలో చెరుగు.
పవనము - 1.గాలి, 2.తూర్పెత్తుట, చెరుగుట.
పునాతీతి పవనః, పవమానశ్చ, పూఞ్ పవనే - పవిత్రముఁ జేయువాడు గనుక పవనుఁడు, పవమానుఁడును.
పవతీతివా పవనః, పవమానశ్చ. పవ గతౌ - సంచరించువాఁడు.
దాశార్హుఁడు - కృష్ణుడు, వ్యు.దశార్హుని సంతతివాడు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.
తాబేలు - A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.
దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.
దాసుడు - 1.పనివాడు; సేవకుడు, 2.భక్తుడు(భక్తిగలవాడు), 3.జ్ఞాని.
దాసేయుఁడు - పనివాడు, విణ.దాసికి పుట్టినవాడు, రూ.దాసేరుడు.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
దాసరిపాము - చారలుగల పెద్దపాము.
టెక్కి - దాసరికుల్లయి, ఒక రకమైన పొడుగు టోపి.
అల్లుని మంచితనమును
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
తెల్లని కాకులునులేవు తెలియర సుమతీ!
తా. మామగారు ఎంతధనము పెట్టినను, గౌరవించినను, అల్లుడను వానికితృప్తి యుండదు. గొల్లవానికి సాహిత్యం తెలియదు. కోమలి - చక్కదనము గల స్త్రీ.)ఎప్పుడును నిజము చెప్పదు. వడ్లు దంచిన బియ్యం లభించునుగాని, ఏరిపారవేసెడి తఱక - 1.గింజ సరిగా పట్తని ధాన్యము.)లందుదంచిన బియ్యమును, తెల్లని కాకులులేవు. తెలియర - తెలిసికొనుము!
నిరుపయోగమైన తేలిక పదార్థాలను విడిచిపెట్టి, ఉపయోగపడే బరువైన పదార్థాలనే తనలో నిలుపుకొనే 'చేట' లాగా ఉత్తమభక్తులు కూడా మంచి చెడులపట్ల తగిన విచక్షణ(విచక్షణ - నేర్పు)తో ప్రవర్తిస్తారు. - శ్రీ రామకృష్ణ పరమహంస
సామయిక పవనములు - ఎల్లప్పుడు ఒకే సమయమున నీచు పవనములు.
ఏనాదము - సముద్రతీరము.
ఏనాది - 1.ఒక కులము 2.ఆకులము లోనివాడు.
కెరిబో - (భూగో.) (Caribow) మంచు ఎడారులలో నుండు 'రాన్ డీర్ ', (Rein deer) అను జింక.
రాన్ డీర్ - (భూగో.) (Ran-deer) ధ్రువపుజింక, ఉత్తర దక్షిణ ధ్రువములలో ప్రయాణ సౌకర్యములకై ఉపయోగింప బడు జింక.
ఎడారి - నిర్జనమగు ఇసుకబయలు.
ఎడారిభూములు - (భూగో.) కర్కాటక మకర రేఖల పైన అధిక పీడన ప్రదేశములో గల భూములు, (ఇక్కడ వర్షము నామ మాత్రముగా నుండును. మనుష్యులుచెట్లు చేమలు లేని ప్రదేశము. సమశీతోష్ట్ణమండలమున గల వర్షచ్ఛాయా ప్రదేశములో కూడ ఎడారు లున్నవి), ఇసుకభూములు.
ఇసుకతెర - సముద్ర సమీపమున ఉన్న నేల.
ఇసుక - ఇసుము, సికత.
ఇసుము - ఇసుక.
సైకతము - ఇసుకదిబ్బ, ఇసుకనేల.
సై కతం సికతామయమ్,
సికతాః అస్య సంతీతి సైకతం, సికతామయంచ - సికతమనఁగా ఇసుక; అది గలిగినది సైకతము, సికతామయమును. ఈ 2 ఇసుకదిన్నె పేర్లు.
ఇసుకతిన్నె - ఇసుకదిబ్బ, సైకతము.
ఇసుక నేలలు - బంకరేణువులు, వండలి రేనువులు తక్కువగా నుండి ఇసుక హెచ్చుగా నున్న నేలలు (Sandy soils).
ఇసుక గరములు - బంక రేణువులు, సన్న వండలి రేణువులు ప్రమానములు నూటికి 20, 30 ఉన్న నేల.
ఎడరు - క్రి.భగ్నమగు, వి.1.ఆపద, 2.భంగము, 3.సందు, 4.ఎడారి.
దేశికుఁడు - గురువు Jupiter.
దేశ్యము - దేశమునకు తగినది, వి.భాషలో తత్సమాదివిభాగములలో నొకటి.
అంతకము - 1.మొత్తము, 2.ఎల్ల, 3.సీమ, (సం.వి. అని కొందరు).
సీమ1 - 1.దేశము, 2.ప్రదేశము, 3.రాజ్యము, 4.పరదేశము.
సీమ2 - 1.ఎల్ల, 2.పెడతల.
సీమ సీమే స్త్రియా ముభౌ,
సీయతే బద్ధ్యత ఇతి సీమా, న. సీ. సీమా చ, ఆ, సీ. షిఞ్ బంధనే. - ఇంత మేర యని కట్టఁబడునది. ఈ 2 పొలిమేర గుఱుతు పేర్లు.
ప్రాంతరము-1.అడవి, 2.తొఱ్ఱ, 3.ఎడారిత్రోవ, 4.పొలిమేర.
ప్రాన్తరం దూరశూన్యో (అ)ధ్వా -
ప్రకృష్టం గ్రామయోరంతరం వ్యవధానమత్రేతి ప్రాంతరం - అధికమైన గ్రామములయొక్క వ్యవధానము గలిగినది. ఈ ఒకటి ఎడరియై జనసమూహము లేని మార్గము పేరు.
అడవికాపు - వానప్రస్థుడు.
అడవి - అరణ్యము.
తొట్ట - తొఱ్ఱ.
నిష్కుహః కోటరం నానా -
నిష్కుటము - 1.తొఱ్ఱ, 2.అంతిపురము, 3.ఇంటితోట, 4.తలుపు, రూ.నిష్కాటము.
నిష్కూతే విస్మాపయతీయి నిష్కుహః, కుహ విస్మాపనే. - విస్మయమును బొందించునది.
కోటరము1 - చెట్టుతొఱ్ఱ.
కుటతీతి కోటరం, అ. ప్న. కుట కౌటిల్యే కుటిలమై యుండునది. ఈ 2 మ్రానితొఱ్ఱ పేర్లు.
కోటరము2 - కోడంత్రము, కోడలితనము.
కోటఱికము - కోడరికము.
కోడంట్రము - కోటరికము, రూ.కోడంట్రికము, కోడరికము.
పొలిమేర - 1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు, ఎల్ల.
ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య.సర్వశబ్దార్థకము.సమస్తము - సర్వము; సర్వము - (సర్వ.)సమస్తము, అంతయు.
మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
వఱ - మేర, హద్దు.
వఱగొడ్దము - 1.వంకరమాట, 2.మర్యాద నతిక్రమించుమాట.
ఉపకంఠము - దాపైనది, వి.1.పొలిమేర, 2.సమీపదేశము, 3.సమీపకాలము.
కంఠసమీపంగత ఉపకంఠః - కంఠసమీపమును బొందినది.
మృగతృష్ణ - మరీచిక, ఎండమావులు.
మృగాణాం తృష్ణా అస్యామితి మృగతృష్ణా - మృగములకు దీనియందు ఆశగలదు.
ఎండమావులు - (భౌతి.) ఎడారులలో మైదానములలో నీరునట్లు భ్రాంతిని గొల్పెడి ఉష్ణ వాయు మండలము, మృగతృష్ణ (Mirage).
ఒయాసిస్ - (భూగో.) (Oasis) ఎడారులలో సరస్సులు గల ఫలవంతమైన ప్రదేశము.
మరీచి - 1.కిరణము, 2.వెలుగు, 3.ఎండమావులు, 4.ఒక ప్రజాపతి.
మ్రియంతే అనయా క్షుద్రజంతవో మృగావా మరీచికా - మృఙ్ ప్రాణత్యాగే-క్షుద్ర జంతువులై నను మృగములైనను దీనిచేత మృతిఁజెందును. మారీచా ర్తికృదాశుగ రామ్|
మరీచిరివ మరీచికా - కిరణమువలె తోఁచునది. మృగతృష్ణా మరీచికాశబ్దములు 2 ఎండమావులు పేర్లు
పవనాశుగ సంక్షిప్త మారీచాది సురారయే,
నమో మఖపరిత్రాతే రామా.....
కృష్ణము - 1.ఇనుము, 2.మిరియము, 3.నలుపు, 4.కాకి, 5.కోకిల, 6.కాలాగురువు, విణ.నల్లనిది.
కాలాగు ర్వగురుః -
కాలం చ తత్ అగురు చ కాలాగురు, ఉ. న. నల్లని అగురువు.
కాలాగుర్వేవ, అగురు, ఉ. పు. ఆ కాలాగురువే అగురువు. ఈ 2 నల్లని యగురు పేర్లు.
అసితము - నల్లనిది, వి.నలుపు(నీలిమ - నలుపు), నీలవర్ణము.
అసితుఁడు - నల్లనివాడు, వి.1.శనైశ్చరుడు, 2.దేవలుడు అనుముని.
శనైశ్చరుఁడు - శని, వ్యు.మెల్లగా నడుచువాడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
దేవలుఁడు - తంబళవాడు, నంబివాడు, పూజారి.
పూజారి - పూజచేయువాడు, అర్చకుడు. అర్చకుఁడు - పూజారి.
తంబళ - శివార్చన చేసి బ్రతికెడు ఒక జాతి.
నంబి - విష్ణు పూజకుడు. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు.
నంబెరుమాళ్ళు - శ్రీరంగనాయకుడు.
రంగఁడు - 1.శ్రీరంగడు, 2.నంబెరుమాళ్ళు.
సిరంగఁడు - శ్రీరంగనాథుడు, సం.శ్రీరంగః.
సిరంగము - శ్రీరంగము.
రంగము - 1.సత్తు, 2.యుద్ధభూమి, 3.నాట్యస్థానము, 4.శ్రీరంగము, 5.రంగు.
రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.
విభుం వేణునాదం చరంతం దురంతం,
స్వయం లీలయాగోపవేషం దధానమ్|
గవాం బృందకానందదం చారుహాసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్||
రుక్మకారుఁడు - స్వర్ణకారుడు.
రుక్మము - 1.బంగారు, 2.లోహము.
రోచత ఇతి రుక్మం, రుచ దీప్తౌ. - ప్రకశించునది.
రుక్మిదారి - బలరాముడు.
ఖనిజము - లోహము, వ్యు.గని యందు పుట్టునది, (రసా.) సమ్మేళనస్థితి యందు లభించులోహము (Ore), (భూగ.) గనులనుండి త్రవ్వి తీయబడిన లోహము (Mineral).
ఖనిజ విజ్ఞానము - (రసా.) ఖనిజముల ప్రభవస్థానములను, ధర్మములను ఉపయోగములను చరించు శాస్త్రము (Minerology).
లోహకారకుఁడు - కమ్మరి.
కమ్మర - ఇనుము పనిచేసి బ్రతుకుజాతి, కమ్మరి, సం.కర్మారః.
లోహము - బంగారు, వెండి, ఇనుము మొదలగునవి, ఖనిజము (రసా.) ఇనుము, (మానవులకు మిక్కిలి ఉపయోగము గల ధాతువు. ఇది ఆవర్తక్రమమందు నికిల్ కొబాల్టులతో పాటు 8వ వర్గములో నుండును).
లూనాతీతి లోహః, అ. ప్న. లూఞ్ ఛేదనే. - శస్త్రరూపమై కోయునది.
లోహము - (భౌతి.) పారదర్శకము కాని ఉష్ణవాహకము, విద్యుద్వాహకము, మరి కొన్ని ధర్మములు కలిగిన మూలద్రవ్యము.
శస్త్రి - చురకత్తి, మాదిగకత్తి, విణ.శస్త్రము గలవాడు.
శస్త్రము - 1.ఆయుధము, 2.ఇనుము.
శస్యతే (అ)నేనేతి శస్త్రం, శసు హింసాయాం. - దీనిచేత హింసింతురు.
తీక్ష్ణము - వేడిమి, విణ.వాడియైనది.
తిజ్యత ఇతి తీక్ష్జం, తిజ నిశాతనే. - వాఁడిగాఁ జేయఁబడునది.
పిండ్యతే సంహన్యత ఇతి పిండం, పిడి సంఘాతే(సంఘాతము - 1.సమూహము, 2.దట్టి, దిబ్బ.). - ముద్దగాఁ జేయఁబడునది.
దాకలి - లోహము కాచి సాగగొట్టుటకు క్రింద ఊతముగా నుంచుకొను ఇనుముదిమ్మె, విఘాతక, రూ.దాకలి, దాగలి.
దాయి - దాకలి, సం.విణ.ఇచ్చువాడు.
దాగలి - దాకలి.
సుత్తె - లోహములను సాగగొట్టు సాధనము, రూ.సుత్తియ.
కమ్మి - ఇనుము మొ,గు కడ్డీ.
కమ్ము - క్రి.1.చుట్టుకొను, 2.కమ్మిగా సాగగొట్టు.
ఇనుము - ఒక లోహము, కాలాయానము.
కాలం చ తత్ అయశ్చ కాలాయనం - అయస్సనఁగా నినుము, నల్లనైన యినుము కాలాయసము.
అయస్సు - ఇనుము, రూ.అయము.
ఆయసము - ఇనుపది, వి.1.ఇనుప వస్తువు, 2.ఇనుము.
ఇయంత్యేత దితి అయః, స. న. ఇణ్ గతౌ. - కార్యార్థులు దీనిఁ బొందుదురు.
అయము - 1.శుభకర్మము, మేలు చేకూర్చునది, 2.శుభము, మేలు, 3.ఇనుము.
శుభము - మంగళము.
శోభతి ఇతి శుభం, శుభ శోభనే. - ఒప్పునది.
ఉపకారము - మేలు, రూ.ఉపకృతి.
ఉపకృతి - మేలు.
మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.
ఉపకారికి నుపకారము
విపరీతము కాదుసేయ, వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
తా. మేలు చెసినవానికి మేలుచేయుట గొప్పతనముకాదు. తనకు అపకారము - 1.కీడు, 2.ద్రోహము, 3.చెడ్దపని, రూ.అపకృతి. హానిచేసిన వానికి వాని తప్పులను గణింపక మేలు చేయువాడె గొప్ప బుద్ధిమంతుడు.
శుభకృత్తు - అరువది సంవత్సరములలొ నొకటి.
శ్రేయము- 1.శుభము, 2.ధర్మము, రూ.శ్రేయస్సు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
అశ్మము - రాయి.
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
అశ్మా గర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగాఁ గలది.
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి, 3.రంపము.
అశ్మనస్సారః అశ్మసారః - ఱాతియొక్క సారము. ఈ 7 ఇనుము పేర్లు
అశ్మజము - 1.సిలాజిత్తు, 2.ఇనుము, విణ.రాతినుండి పుట్టినది.
కాంతము - 1.ఇనుము, 2.లోహము, 3.చంద్ర సూర్య పర్యాయ శబ్దములకు తరువాత వచ్చినచో రాయి(అశ్మము - రాయి)అను అర్థము నిచ్చును, చంద్రకాంతశిల, సూర్యకాంతశిల మొ.ని, 4.కాంతభస్మము, ఔషధములలో ఒకటి.
అయోమార్గము - ఇనుపదారి.
అయోమయము - 1.ఇనుముతో చేయబడినది, 2.కఠినము, వి.ముందు వెనుకలు తోపమి.
అయోగము - సంబంధము లేనిది, వి.1.కూడికలేమి, ఎడబాటు(విశ్లేషము-ఎడబాటు) 2.పొసగమి, 3.(జ్యోతి.) తిథివారాదుల దుష్ట యోగము, 4.గట్టి పూనిక, 5.ఇనుప సుత్తె, 6.వమనముచే ఉపశమింపదగు రోగము.
అథ మణ్డూరం సింహాణమపి తన్మలే,
మండూరము - ఇనుప చిట్టెము.
మండ్యతే అయఃపిండా ద్విభజ్యత ఇతి మండూరం, మడి విభాజనే. - ఇనుపముద్దవలన విభజింపఁబడినది.
శింఘాణము - 1.ఇనుప చిట్టెము, 2.చీమిడి, రూ.సింహాణము.
హినస్తి పాండురోగమితి సింహాణం, పా, శిఙ్ఘాణం, హిసి హింసాయాం. - పాండురోగమును జెఱుచునది. ఈ 2 అయినుపచిట్టెము పేర్లు. చీమిడి - నాసామలము, శింఘాణము.
చిట్టియము - ఇనుము కాచునప్పుడు వచ్చు మురికి, రూ.చెట్టెము.
చిట్టెము - చిట్టియము.
ముద్గరము - ఇనుప గుదియ, సమ్మెట.
ముదం సంతోషం గిరతీతి ముద్గరః, గౄ నిగరణే. - సంతోషమును హరించునది.
సమ్మెట - పెద్దసుత్తె, ముద్గరము, వై.వి.కశ.
అనఘునికైనఁ జేకుఱు ననర్హునిఁగూడి చరించి నంతలో
మనమెరియంగ నప్పుడవమానముఁగీడు ధరిత్రియందునే
యనువుననై నదప్పవు యదార్థము తానది యెట్టులన్నచో
నినుమునుఁగూర్చి యగ్నినలయింపదె సమ్మెట పెట్టు, భాస్కరా.
తా. ఇనుము కాలినప్పుడే, సమ్మెట దెబ్బలకి లొంగుతుంది. ఇనుమును గూడిన వేఁడివేలుపు- 1.వహ్ని, 2.సూర్యుడు.నకు సమ్మెట పోట్లబ్బెను. అట్లే హీనుని గూడిన అనఘుఁడు - నిర్దోషి, పాపరహితుడు. మాననీయునకు లఘుత్వము గలుగును గదా! అనగా కలుగునని భావము.
ప్రఘణము - 1.తలవాకిలి ప్రక్కనుండు చిన్నగది, 2.ఇనుపగుదియ, రూ.ప్రఘాణము.
శిరస్త్రము - శిరస్త్రాణము, ఇనుప తోపి.
గొగ్గి - 1.ఎచ్చుతక్కువైనది, వి.1.ఎచ్చుతగ్గులుగా నుండుట, 2.శిరస్త్రాణము, 3.ఎచ్చుతగ్గులు గల ముత్తెము. అరగని ముత్యాలకు మెరుగుండదు.
మలీమసము - విణ.మాసినది, వి.ఇనుము.
హీనధాతువు - (రసా.) గాలికి, నీటికి, సులభముగా మార్పు చెందగల ధాతువు (Basemetal), ఉదా. ఇనుము, రాగి, జింకు, సీసము.
సంక్షారణము - (రసా.) మెల్లమెల్లగా తినివేయుట (Corrosion), ఉదా. గాలిలో పెట్టిన ఇనుము క్రమముగా త్రుప్పగును, ఆమ్లము సంపర్కముతో ఎల్యూమినియమ్ మెల్లగా తినివేయబడును. క్షార జలము ఇనుమును తినివేయును. ఇనుమును చెడగొట్టేది త్రుప్పు.
త్రుప్పు - (రసా.) 1.బయటపడవేసిన ఇనుముపై వాతావరణ ప్రభావము వలన ఏర్పడిన ధూసరవర్ణము గల చూర్ణము, (Rust). ఇది రాసాయనికముగ ద్విలోహ త్ర్యామ్ల జనిదము), వి.అరుచి.
భారీపరిశ్రమలు - ఇనుము, ఉక్కు మొ, వానికి సంబంధించిన పెద్దపరిశ్రమలు (Large Scale Industries).
టాటానగరము - (చరి. భూగో.) జమ్ షేడ్ పూర్, బీహారులోని ముఖ్య పారిశ్రామిక స్థానము. (జమ్షెడ్జి టాటా అను పార్శీ పారిశ్రామికుని పేరిట నీ పట్టణము వెలసినది. ఇచ్చటికి సమీపమున ఇనుము, బొగ్గు గనులు కలవు. అందుచే టాటా ఉక్కుపరిశ్రమ కేంద్రము ఇచ్చట అభివృద్ధి నొందెను. ఆసియా లోనికెల్ల పెద్ద యంత్రాగార మిచ్చట కలదు.)
దుంప ఇనుము - (రసా.) దుక్క ఇనుము కొలిమి నుండి పైకి వచ్చిన వెంటనే కడ్డీల రూపములో తయారుచేయబడిన ఇనుము, (Pig Iron).
పోఁత యినుము - (రసా.) బ్లాస్టు ఫర్నేసు నుండి సూటిగా ఘనీభవింప చేసిన యినుము (Cast iron).
చేత ఇనుము - (రసా.) పోత యినుమును కరగించి మలినములను పోగొట్టగా మిగిలిన యినుము, (Wrought iron).
నిష్క్రియత - (రసా.) గాఢ నైట్రికామ్లములోగాని, క్రోమి కామ్లములోగాని ఒకసారి ముంచి తీసివేసిన యినుము దాని రాసాయనిక ప్రవృత్తిని కోలుపోవుట (Passivity).
పదును - 1.తడి, 2.ఉక్కును వేడిచేసి నెమ్మదిగా చల్లార్చిన వచ్చు కాఠిన్యము (Temper).
ఉక్కు - చచ్చు, నలగు, మ్రగ్గు, వి.1.కాచి శుభ్రము చేసిన ఇనుము, 2.శౌర్యము, 3.బలము, 4.గౌరవము, 5.స్థైర్యము, 6.సాహసము, 7.2% మొదలు 1.5% వరకు కర్బనము(Carbon) కలిసి యుండు ఇనుము (Steel).
ఏకస్పర్శ పద్ధతి - (భౌతి.) ఉక్కుకడ్డీని అయస్కాంతముగా మార్చు పద్దతులలో ఒకటి, (Single touch method).
ద్విస్పర్శ పద్ధతి - (భౌతి.) ఉక్కుకడ్డీని అయస్కాంతముగా మార్చు పద్ధతులలో నిది యొకటి, (Double-touch method).
ఇనుప ఊపిరితిత్తి - (గృహ.) కృత్రిమమైన ఊపిరితిత్తి, దీనిని శస్త్రచికిత్సలో ఉపయోగింతురు (Iron lung).
చిట్టియము - ఇనుము కాచునప్పుడు వచ్చు మురికి, రూ.చెట్టెము.
చిట్టెము - చిట్టియము.
ఇనుము విగిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు క్రమముగాను
మనసు విగిగెనేని మరి యంట నెర్చునా విశ్వ.
తా|| ఇనుము విరిగిన కాల్చి, రెండుమూడుసార్లు అతుకవచ్చునుగాని, మనసు విరిగిన అతుకదు. మరల అంటించుట యెవరివల్ల సాధ్యము గాదు.
ఉల్కశ్మలోహము - (రసా.) ఆకాశమునుండి అప్పుడప్పుడు భూతలము పైబడు ఉల్కలలో నుండు ఇనుము (Meteoric iron).
ఉల్క - 1.కొఱివికట్టె, 2.కాగడా, 3.ఆకాశమునుండి పడు తేజపుంజము, 4.అగ్ని కణము (Meteor). మిడుఁగు - అగ్నికణము.
తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో.) సూర్యునిచుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగుచున్న తోక కలిగిన ఒక గ్రహము, (Comet).
ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.
ఉత్పాతము - 1.ఉల్కాపాతము, మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణ మగు శ్లేషాది వికారము.
వంగడము - వంశము, రూ.వంగనము, వై (వ్యవ.) పశుజాతి నుండి గాని, వృక్షజాతి నుండిగాని యెంచబడిన ప్రత్యేక లక్షణములు గల తరగతి(వంశము) (Strain) ప్రత్యేక లక్షణములను కలిసియున్న ఉపజాతిలోని రకము.
తారతమ్యము - (భౌతి.) రెండు రాసుల మధ్యనున్న పరస్పర సంబంధము (Relative), సం.వి.తరతమ భావము, ఎచ్చుతక్కువలు.
అంతరువు - 1.తారతమ్యము, 2.కొంచెముదూరము, 3.మరుగుచోటు, సం.అంతరమ్.
వరిష్ఠము - మిక్కిలి శ్రేష్ఠమైనది, వి.మిరియము.
కేవలద్రవ్యము - మిరియము.
మిరియము - కారముగల సంబారు వస్తువు, రూ.మిరెము, సం.మరీచమ్. (వ్యవ.) Pepper piparaceae అను కుటుంబము నకు చెందిన Pipper nlgrum అను తీగ యొక్క ఎండిన పండ్లు, (ఇవి సంబార ద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగించును.)
మరిచము - మిరియము, రూ.మరీచము.
తోఁక మిరియము - చలువ మిరియము.
శ్యామము - 1.మిరియము, 2.ఆకుపచ్చ, 3.నలుపు, 4.మబ్బు.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
వాయసము - కాకి Crow.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
ఏకదృష్టి - కాకి, ఏకాక్షము, వ్యు.ఒక చూపు కలది.
ఏకైన దృష్టి రస్య ఏకదృష్టిః, ఈ. పు. - ఒక్కచూపు గలది.
ఏకాక్షము - 1.కాకి Crow, 2.ఒక కన్నుగలది.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
కాకదంత పరీక్ష - న్యా. వ్యర్థమైన పని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.) నూరు కాకులలో ఒక కోకిల. కాకి మరియొక కాకిని పొడవదు.
కాణుఁడు - ఒంటికంటివాడు, ఏకాక్షుడు.
కాణము1 - గుఱ్ఱమునకు బెట్టెడి దాణా, సం.ఖాదనమ్.
ఖాణము - గుఱ్ఱములదాణా, సం.ఖాదనమ్, ఖానమ్.
కాణము2 - 1.ఒంటి కన్ను గలది, 2.తూటుపడినది, వి.కాకి.
మెల్లకంటి - కాకి Crow.
మెల్ల - 1.ఒరిగినది (చూపు) (మెల్లకన్ను), విణ.మేలైనది, క్రి. విణ.1.మెల్లగా, 2.నిశబ్దముగా.
ఒంటికంటిగాము - శుక్రుడు.
ఒంటి - ఏకాకిత్వము, విణ.ఒకటి.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము. అపదేవత - పిశాచము.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
అక్షి - 1.కన్ను, 2.రెండు అను సంఖ్యకు సంకేతము.
అక్ష్ణోతి దూరమిత్యక్షి, అక్షూ వ్యాప్తౌ. - దూరముగా వ్యాపించినది.
వళిరః కేకరే -
వలతే విషయగ్రహన వేళాయాం అపాఙ్గదేశం ప్రతీతి వళిర్గోళకం; తద్యోగాత్ వళిరం నేత్రం; తద్యోఅత్ పురుషో (అ)పి వళిరః - పదార్థముల గ్రహించునప్పుడు కడకంటికివచ్చు చూపు కలవాఁడు.
కే శిరస్సమీపే అక్షిసఞ్చారం కరోతీతి కేకరః. - శిరస్సమీపమందు నేత్రసంచారముఁ జేయువాఁడు. ఈ 2 మెల్లకంటివాని పేరు.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.
కాకాక్షన్యాయము - న్యా. కాకి చూపువలె ఏదేని ఒక ప్రక్కకు ఒరగుట.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.
త్రిప్పుతాడు - తరిత్రాడు, రూ.త్రిప్పుడు త్రాడు.
వలిపము - సన్నని తెలుపుబట్ట.
వీణము - వలిపము, సన్ననివస్త్రము, సం.వయనమ్.
కాణయాచి - చిరకాల వా స స్థా న ము, విణ. చిరకాలానుభవము గలది, రూ.కాణాచి.
కాణాదము - కణాద ఋషి వ్రాసిన న్యాయశాస్త్రము, (దీనినే వై శేషిక దర్శన మందురు).
"సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండితః,
అర్థేన కురుతే కార్యం సర్వనాశో హి దుర్భరః."
'సర్వము కోల్పోవు పరిస్థితి దాపురించినపుడు తెలివికలవాడు, సగము వీడి, తక్కిన సగము కాపాడుకొనును.' అన్న లోకనీతి ననుసరించి సర్వేంద్రియములలో ప్రధానములగు కన్నులు రెంటిలో ఒకదానిని ఆ కాకి వదలుకొనెను. కాకి కుడికంటిని విడిచిపెట్టి ప్రాణములు కాపాడుకొనెను సీతోదిత కాకావన రామ్| (సీతాదేవిని బాధించినందుకు శ్రీరాముని కోపమునకు గురైంది). - సుందరకాండ
కాకాసురైకనయన హరల్లీలాస్త్రధారిణే,
నమో భక్తైకవేద్యాయ రామా....
ఆదిభిక్షువు - శివుడు.
భిక్షువు - సన్న్యాసి, బ్రహ్మచారి, (చరి.) బౌద్ధ సన్న్యాసి.
భిక్షతే భిక్షుః ఉ. పు. భిక్ష భిక్షాయాం. - అడుగువాఁడు. భిక్షుక సంస్తుత గోవిందా|
భిక్షతేయాచతే భిక్షుః, ఉ. పు. భిక్ష భిక్షయాం యాచించువాఁడు సన్న్యాసి. ఆ సన్న్యాసి కుటీచకుఁడు, బహూదకుఁడు, హంసకుఁడు పరమహంసకుఁడు అని నాలుగు తెఱఁగులు గలవాఁడు. ఇట్లీ నాలుగు శబ్దములును క్రమముగా బ్రహ్మచారికి, గృహస్థునికి, తపస్వికి, సన్న్యాసికిని పేర్లు.
కక్షపాల - సన్యాసుల జోలె, సం.కక్షపాలః.
కక్షపాల - కకపాల.
(ౙ)జోలియ - చంకకు వ్రేల వేసికొను బిచ్చపు సంచి, రూ.జోలె.
ౘంకరాళి - చంకమూట.
పరివ్రాజకుఁడు - సన్న్యాసి.
పరిత్యజ్య సర్వం వ్రజతీతి పరివ్రాట్, జ. పు. వ్రజగతౌ. - అన్నింటిని బరిత్యజించి పోవువాఁడు.
పరిత్యాగము - బొత్తుగా విడిచిపెట్టుట.
మార్గణుఁడు - యాచకుడు.
మార్గయతి దాతారమితి మార్గణః, మార్గ అన్వేషణే. - దాతను వెదకువాఁడు.
మార్గణము - 1.వెదకుట, 2.యాచించుట, 3.బాణము, వ్యు.గురివెదకుచు పోవునది.
మార్గయతి లక్ష్యమితి మార్గణః, మార్గ అన్వేషణే - గుఱిని వెదకునది.
మస్కరి - సన్న్యాసి, యాచకుడు.
మస్కరో వేణుదండః, సో (అ)స్యోస్తీతి మస్కరీ, న. పు. మస్చర మనఁగా వెదురుగడ; అది గలవాఁడు.
మా కరణశీలః కామకర్మవ్రతిషేధపరోవా మస్కరీ. - కామకర్మములను బ్రతిషేధించు స్వభావముగలవాఁడు.
యాచకుఁడు - 1.భిక్షుకుడు, 2.వేడువాడు.
యాచనం యాచ్జా, టు యాచృ యాచ్జాయాం, భిక్షణం భిక్షా, భిక్ష యాచ్జాయాం. అర్థనం అర్థనా, అర్థ ఉపయాచ్జాయాం. అర్థనం అర్దనా, అర్ద గతౌ యాచనే చ. అడుగుట యాచ్జ, భిక్ష, అర్థన, అర్దనయును, అ. ఈ నాలుగు అడుగుట పేర్లు.
యాచన - దైన్యముతో వేడుట.
(ౙ)జోగి - 1.యోగి, 2.భిక్షుకుడు, సం.యోగీ.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవిశేషము, రూ.హంసము.
యోగి - యోగాభ్యాసము జేయు పురుషుడు.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.
(ౙ)జొగ్గు - భిక్షము, రూ.జోగు.
(ౙ)జోగు - భిక్షము, రూ.జొగ్గు, ఓడ.
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందిట.
భిక్షుకుఁడు - బిచ్చగాడు.
బికారి - బిచ్చగాడు, దరిద్రుడు, వికృతవేషధారి, సం.వికారీ.
బిక్క - 1.నిరుపేద, 2.బెదురు గలది, సం.భిక్షుకమ్, 2.భీరుకమ్.
భిక్ష - బిచ్చము, బికిరము.
బికిరము - 1.వేడికోలు, 2.బిచ్చము, సం.వికరమ్.
భిక్షా సే వార్థనా భృతిః,
భిక్షాశబ్దము సేవించుటకును, యాచించుటకును, కూలికిని పేరు. భిక్షణం భిక్షా, భిక్ష యాచ్జాయాం - అడుగుట గనుక భిక్ష, "భిక్షాభిక్షిత వస్తుషు" ఇతి శేషః.
తిరిపిగాడు - బిచ్చగాడు; తిరుపగత్తె - బిచ్చకత్తె.
తిరివగొట్టు - బిచ్చమెత్తుటయే వృత్తిగా కలవాడు, రూ.తిఱిగొట్టు.
తిరియు - క్రి.బిచ్చమెత్తు, రూ.తిరుచు.
తిరిపము - భిక్షము.
ఋణము - 1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బీ. గణి.) a. తీసివేయు సంఖ్య, b.తీసివేత గుర్తు, విణ.ఋణరాశి (Negative).
ఋణం యాచ్నా చ వృద్ధత్వం జార చోర దరిద్రతా|
రోగశ్చ భుక్త శేష శ్చా వ్యష్టకష్టాః ప్రకీర్తితాః||
తా. ఋణము debt, యాచించుట, వృద్ధత్వము - ముసలితనము (Senility), వ్యభిచారము, చోరీ - దొంగతనము robbery, దారిద్ర్యము poverty, రోగము - వ్యాధి disease, భుక్తశేష భోజనము ఇవి అష్టకష్టములు. - నీతిశాస్త్రము
కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
కప్యతి హినస్తీతి కష్టం, కష హింసాయాం. - హింసించునది.
భిక్షురూప సమాక్రాంత బలి సర్వైకసంపదే,
నమో వామనరూపాయ రామా.....
రాజీవము - తామర.
కేనరరాజియోగాత్ రాజీవం - ఆకరులయొక్క పంక్తి గలిగినది.
రాజీవ శోచిస్సంస్పంద రుచిరాంగాదిశోచిషే,
నమః కైవల్య నిధయే రామా......
పుష్కరము - 1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
శ్రాన్తం పుష్ణాతీతి పుష్కరం, పుక్ష పుష్టౌ. - బదలినవానిని బోషించునది.
శ్రీకంఠుఁడు - శివుడు, కరకంఠుడు.
శ్రీకంఠః కాలకూటభరణజా శీ శ్సోభా కంఠే యస్య సః - కాలకూటమును భరించుటవలనఁ గలిగిన శ్యామశోభ కంఠమందుఁ గలవాఁడు.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
కఱకంఠుఁడు - నీలకంఠుడు, శివుడు.
కఱ - 1.నలుపు, 2.మరక, విణ.కాలః.
కాలకూటము - విషభేధము.
కాలస్య వర్ణస్య కూటః కాలకూటః - కృష్ణవర్ణము నకు స్థానము.
కాలం యమమపి కూటయతి కాలకూటః, కూటపరిదాహే. - యమునిఁగూడ పీడించునది.
తిర్యగ్రేఖ బుద్భుదాకార ఘనబిందువ్యాప్త పృథు మాలినామకాసురరక్తజన్య విషనామ - ఇదం అహిచ్ఛత్రమలయ కోంకణ శృంగిబేర పురాదిషూత్పద్యతే - అద్డగీఱలుగలిగి నీటిబుగ్గల వంటి పెద్ద బొట్లచేత వ్యాపింఁబడినదై దేవాసురయుద్ధమందు పృథుమాలియను నసురుని నెత్తురువలనఁ బుట్టినది.
ఇది అహిచ్ఛత్రము మలయము మొదలైన దేశములయందుఁ బుట్టును.
శ్రీకంఠ చాపదళన ధురీణబలబాహవే,
నమః సీతానుషక్తాయ రామా.....
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈసరుఁడు - ఈశ్వరుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.
నిజము - స్వభావము, విణ.1.తనది, 2.శాశ్వతమైనది.
నిజము - సత్యము, విణ.శాశ్వతమైనది, 2.సత్యమైనది.
కల్ల నిజములెల్ల గరకంఠు డెరుగును
నీరు పల్లమెరుగు నిజముగాను
తల్లియు నెరుగును తనయుని జన్మంబు విశ్వ.
తా|| సత్యము అసత్యము(కల్ల - 1.అసత్యము, 2.పరుషవచనము.)ఈశ్వరుడెరుగును. నీరు పల్లమునకే ప్రవహించును - (తనయుఁడు - కొడుకు)కుమారుని పుట్టుక తల్లికి తెలియును.
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ|
నిత్యాశోడశికారూపా శ్రీకంఠార్ధశరీరణీ. - 85
శితికంఠుఁడు - శివుడు, వ్యు.నల్లని కంఠము గలవాడు.
శితిః కృష్ణవర్ణః కంఠో యస్యసః శితికంఠః - నల్లనికంఠము గలవాడు.
శితిః కంఠే యస్యేతి వా - కంఠమున నలుపు గలవాఁడు.
శితి - 1.తెల్లనిది, 2.నల్లనిది.
కంఠేకాలుఁడు - శివుడు, వ్యు.కంఠము నందు నలుపు కలవాడు.
శితీ ధవళ మేచకౌ,
శితిశబ్దము తెల్లనిదానికిని, నల్లనిదానికిని పేరు. శ్యతి వర్ణాంతరం తనూ కరోతీతి శితిః, శో తనూకరణే. - వర్ణాంతరమును గొంచెముగాఁ జేయునది.
శీయత ఇతి శితిః, శి శోధనే. - శోధింపఁబడునది.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
ధవళత్వాత్ ధవళా - తెల్లని వన్నె గలది.
ధావతి శుద్ధ్యతి ధవళ, ధావు గతి శుద్ధ్యోః - దీనిచేత పదార్థము శుద్ధిఁబొందును.
ధవళము - ఆబోతు విణ. 1.తెల్లనిది 2.చక్కనిది.
ధవళిమ - తెలుపు. తెలుపు - 1.ఎరింగించు 2.మేలుకొలుపు 3.తేర్చు వై.వి.1.ధావళ్యము 2.పరిశుద్ధి (Purity).
ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
సితుఁడు - శుక్రుడు Venus, విణ.తెల్లనివాడు.
సితము - 1.తెల్లనిది, 2.కట్టబడినది.
సినోతి మన ఇతి సితః, సిఞ్ బంధనే. - మనస్సును బంధించునది.
చంద్రకము - నెమలిపురి కన్ను.
మేచకము - 1.చీకటి, 2.నెమలి పురికన్ను, విణ.నల్లనిది.
సమౌ చన్ద్రక మేచకౌ,
ఛంద్ర ఇవ చంద్రకః - చంద్రకారమై యుండునది.
హరిత మిశ్రవర్ణత్వాత్ మేచకః - పచ్చవన్నెయు నల్లవన్నెయుఁ గలది. ఈ 2 నెమలిపురికన్ను పేర్లు.
మసక - 1.ఇంచుక నలుపు, 2.మునిచీకటి, సం.మేచకః.
కనుచీఁకటి - లేచీకటి, మసకచీకటి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
బలాహకము - మబ్బు. చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
తమస్సు - తమము.
తమి - రాతిరి, చీకటి.
చీకటిగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
వామదేవుఁడు - శివుడు.
వాముః శ్రేష్ఠ స్ప చాసౌ దేవశ్చ వామదేవః - శ్రేష్ఠుడైన దేవుఁడు.
వామపార్శ్వే ధృతా దేవీయస్య నః - ఎడమ ప్రక్కను ధరింపఁబడిన భార్య గలఁడు.
వామయా దీవ్యతీతి నా - స్త్రీచే బ్రకాశించువాఁడు.
దివ్ క్రీడావిజీగీషా వ్యవహార - ద్యుతి స్తుతిమోద మద స్వప్న కాంతిగతిషు. వక్రత్వాద్వామస్స చాసౌ దేవశ్చేతి వా - వక్రక్వము గల దేవుఁడు.
వామ - ఉత్తమ స్త్రీ.
వామే రుచిరే లోచనే అస్యా ఇతి వామలోచనా - మంచి కన్నులు గలది.
వామత్వేన వక్రస్వభావత్వేన రమ్యత్వేన వా వామా - వక్రశీలమైనదిగాని, రమ్యమైనదిగాని వామ.
వామనము - లేతది.
వామనత్వా త్వామనః - పొట్టిదిగనుక వామనము. వామం వల్గు శరీర మస్యాస్తీతి వా వామనః - అందమైన శరీరము గలది.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.
వామము - ధనము, విణ. 1.ఎడమ, 2.సుందరము, 3.హ్రస్వము.
దా - 1.ఎడము, 2.సవ్యము, డా యొక్క రూపాంతరము (దాపల - డాపల)క్రి. రమ్ము.
ఎడము - 1.చోటు, తావు, 2.అవకాశము, 3.నడిమిభాగము.
సవ్యము - 1.ఎడమ, 2.కుడి, 3.ప్రతికూలము.
ఎడమ - సవ్యము, వ్యతి.కుడి, వి.వాసుభాగము.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము వలపల.
అపసవ్యము - 1.ప్రతికూలము, కుడిభాగము.
వామౌ వల్గు ప్రతీపా ద్వౌ - వామశబ్దము మనోహరమైనదానికిని, ప్రతికూలమైనదానికిని పేరు. వాయతే వమ్యత ఇతిచ వామః, వా గతి గంధనయోః, టు వము ఉద్గిరనే. - పొందఁబడునది; విడువఁబడునదియును గనుక వామము. "వామ పుంసి హరే క్లీబం ద్రవినే స్త్రీతు యోషితి, వామీ సృగాలీ బడబా రాసభీ కరభీషుచే"తి శేషః.
కూబరము - మనోజ్ఞము, సుందరము, సం.వి.1.బొండినొగ, 2.మోచేయి.
హ్రస్వము - కురుచ, పొట్టి.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
ఖర్వము - 1.ఒక సంఖ్య (10,000,000,000), 2.కుబేరుని నిధులలో ఒకటి, విణ.1.అధమము, 2.పొట్టిది, 3.స్వల్పము.
అథ వామనే,
న్య ఙ్నీ చ ఖర్వ హ్రస్వా స్స్యుః -
వామో వల్గుత్వ మస్యాస్తీతి వామనః - ఒప్పిదము గలది.
నిమ్నమంచతీతి న్యఙ్. చ. నీచశ్చ. అఞ్చుగతిపూజనయోః - దిగువఁబొందునది.
ఖర్వత్యవయ పదార్ద్యేనేతి ఖర్వ గర్వ దర్పే. - అవయవ దార్ఢ్యముచేత గర్వించునది.
హ్రసతీతి హ్రస్వః. హ్రస హ్రాసే. - కొంచెమై యుండునది. ఈ 4 కుఱుచైనదాని పేర్లు.
అధమము - తక్కువైనది, నీచము.
హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).
హ్రస్వము - మిక్కిలి పొట్టిది.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము.
స్వల్పము - మిక్కిలి అల్పము.
హ్రస్వదృష్టి - (భౌతి.) దగ్గరనున్న వస్తువులే కనిపించుదృష్తి (Short-sight) దూరపు వస్తువులు సరిగా కనిపించక పోవుట.
హీనాంగా నతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయౌధి కాన్ |
రూపద్రవ్య విహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షి పేత్ ||
తా. కుఱచగల నిడుపులైన చేతులు, కాళ్ళు మొదలయిన అవయములుగల వారలను, విద్యావిహీనులను, వయసుచేత పెద్దనైన వారలను, సౌందర్యము(చక్కదనము), ద్రవ్యము(ద్రవ్యము - ధనము, వస్తువు), జాతి వీనిచే(హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.)దక్కువైన వారలను ఆక్షేపింపఁ గూడదు. – నీతిశాస్త్రము
మహాదేవుఁడు - శివుడు.
మహాం శ్చాసో దేవశ్చ మహాదేవః - శ్రేష్ఠుఁడైన దేవుడు.
విరూపాక్షుఁడు - శివుడు.
విరూపాణి రవిచంద్రాగ్ని రూపత్వా త్త్రివిథాని అక్షీణి - యస్య సః విరూపాక్షః సూర్యచంద్రాగ్ని రూపము లగుటవలన మూడువిధములైన కన్నులు గలవాఁడు.
మిక్కిలికంటివేల్పు - ముక్కంటి.
మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము.
మిక్కటము - మిక్కిలి, అతిశయము, రూ.మిక్కుటము.
ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమోనమః|
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
త్రీణిలోచనాని యస్యసః త్రిలోచనః - మూడుకన్నులు గలవాఁడు.
ముక్కంటి - త్రిలొచనుడు, శివుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
లోచనము - నేత్రము.
లోచ్యతే అనేనేతి లోచనం. లోచృ దర్శనే. - దీనిచేత చూడఁబడును.
ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః|
కృశానరేతసుఁడు - శివుడు, వ్యు.అగ్నిలో పడిన వీర్యము కలవాడు.
కృశానురగ్నిః రేతోయస్య సః కృశానురేతాః, స-పు. - అగ్నిరూపమైన రేతస్సు గలవాడు.
కృశానువు - అగ్ని.
కృశ్యతి తనూ కరోతి స్వసంబద్ధమితి కృశానుః, ఉ - పు. కృశ తనూకరణే - తన్నంటిన దానినిఁ గృశింపఁజేయువాఁడు.
కృశో (అ)ప్యతివర్ధతే కృశానుః - కృశుఁడైనను వృద్ధిఁబొందువాఁడు.
కృశము - 1.బక్క, 2.సన్నము, 3.అల్పము.
కృశ్యతీతి కృశం, కృశ తనూకరణే. - సన్నమైయుండునది.
బక్క - కృశించినది, శుష్కము.
శుష్కము - వంటచెరకు, విణ.ఎండినది, వట్టి.
శుష్కించు - క్రి.1.ఎండు, 2.ఇంకు.
శుష్కపరీక్షణ - (రసా.) గుణాత్మక రాసాయనిక విశ్లేషణప్రక్రియయందు, జరిగించు ప్రథమాంకము, (Dry test).
ఇంకు - క్రి.1.నేల మున్నగు వానిలో (ద్రవపదార్థములు) ఇగిరిపోవు, 2.వట్టిపోవు, ఎండు, 3.నశించు, 4.కృశించు, రూ.ఇసుకు.
కృశాంగి - స్త్రీ, విణ.బక్కపలుచని దేహము కలది.
పావకుఁడు - అగ్ని.
పునాతీతి పావకః, పూఙ్ పవనే - పవిత్రమును జేయువాఁడు.
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.
ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
ఆగమనము - 1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
అవాప్తి - ప్రాప్తి, పొందుట.
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది(ప్రణిహితము - పొందబడినది), వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి.
లబ్ధి - లాభము; లాభము - (అర్థ.) పరిశ్రమలవలన కాని వ్యాపారము వలన కాని ఖర్చులుపోను మిగిలిన నికరపు ఆదాయము. విక్రయించుటకు కావలసిన అన్ని వ్యయములుపోగ మిగిలిన సొమ్ము, సం.వి. క్రయ విక్రయములందు వచ్చు హెచ్చు ధనము అధికముగా పొందబడినది.
రాబడి - ఆదాయము; వసూలు - ఆదాయము, జమ.
జమ - (వాణి.) లెక్కలోకట్టుట (Credit).
ఆదాయము1 - 1.గ్రహించుట, 2.లాభము, లబ్ధద్రవ్యము, రాబడి.
ఆదాయము2 - (అర్థ.) ఆస్తి వలనగాని, కృషివలనగాని మానవుడు ఆర్జించు సంపాదన.
ఆదాయపుపన్ను - (అర్థ.) వ్యక్తి యొక్క ఆదాయమునుబట్టి ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పన్ను, రాబడిపై పన్ను, (ఇది వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లింప వలసి యున్నది. ఇది సంవత్సరాది కాదాయముపై విధింపబడును. దీనిని మన దేశములో కేంద్రప్రభుత్వము(Central Government) వసూలు చేయుచున్నది, (Income-tax).
పన్ను మదింపు - మొత్తము రాబడినిబట్టి పన్ను విధించుట.
రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము. రాకాచంద్ర సమానన రామ్|
పూర్ణే రాకా నిశాకరే :
తస్మిన్ పూర్ణే సతి సా రాకేత్యుచ్యతే శుద్ధేతిభావః - చంద్రుఁడు పూర్ణుఁడై యున్నపుడు ఆ పున్నమ రాక యనంబడును. అనఁగాఁ చతుర్దశి వేధ లేనిది. అసుమన్యంతే దేవాః పితృసహితా అస్యామిత్యనుమతిః. దీని యందు దేవతలు పితృసహితులై సేవకొఱకు తలఁపఁబడుదురు. రాతి దదాతి సుఖమితి రాకా. రా దానే - సుఖము నిచ్చునది. అన్ని కళలతో నిండిన చంద్రుఁడు గలది.
నిశాకరుఁడు - చంద్రుడు; నిశాపతి - చంద్రుడు.
నిసివెలుఁగు - చంద్రుడు Moon.
నిశ - 1.రేయి, 2.పసుపు.
నిసి - నిశ, రేయి, సం.నిశా.
నిసుఁగు - శిశువు, బిడ్డ, రూ.నిసువు, సం.శిశుః.
రాకాచంద్రసమానకాంతివదనా నాకాధిరాజ స్తుతా
మూకానామపి కుర్వతీ సురధునీనీకాశ వాగ్వైభమ్
శ్రీకాంచీనగరీవిహారరసికా శోకాపహంత్రీ సతా
మేకా పుణ్యపరంపరా పశుపతేరాకారిణీ రాజతే|
తా. సంపూర్ణ పూర్ణిమనాటి చంద్రుని కాంతిగల ముఖం గలది, ఇంద్రునితో పొగడబడేది, మాటలు రానివారికి కూడ గంగానదీప్రవాహంవంటి వైభవంగల వాక్కులను ప్రసాదించేది, సజ్జనుల దుఃఖాలను దూరంచేసేది,పశుపతి - శివుడు పుణ్యఫలాలకు ఆకారమైనది, శ్రీకాంచీ నగరంలో విహరించటంలో ఆనందించేది - అయిన ఒకానొక తల్లి ప్రకాశిస్తున్నది.
సర్వమంగళ - పార్వతి.
సర్వాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమస్తమైన శుభములు గలది.
మంగళ - పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
మంగళదేవత - లక్ష్మి.
ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం,
ఆగమావయశోభినీం అఖిల వేదసారకృత శేఖరీం,
మూలమంత్ర ముఖమండలాం ముదిత నాదబిందునవయౌవనాం
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్. - 8శ్లో
ఆభాణకము - లోకోక్తి, జనప్రవాదము.
గాలిమాట - 1.లోకప్రమాదము, 2.ఆధారము లేనిమాట, జనశ్రుతి.
జనశ్రుతి - నానుడి, కింవదంతి.
ఉద్ఘోషము - 1.మొర, 2.పెద్దధ్వని, 3.చాటుట, 4.కింవదంతి.
ఉద్ఘోషించు - క్రి.1.మొరపెట్టు, 2.పెద్ద ధ్వనిచేయు, 3.చాటు.
కింవదన్తీ జనశ్రుతిః,
కో (అ)పి వాదః కింవదన్తీ, ఈ-సీ. - సత్యంబును అసత్యంబును గాని యొకానొక వాదము.
కింకిమితి పరస్పరం వదంత్యత్రేతి కింవదంతీ, వదవ్య్క్తాయాం వాచి. - ఏమేమని పరస్పరము చెప్పుకొందురు.
జనేభ్యః శ్రుతిః జనశ్రుతిః, ఇ-సీ, శ్రు శ్రవణే - జనులవలన వినుట జనశ్రుతి.
జనైఃశ్రూయత ఇతి జనశ్రుతిః - జనులచేత వినఁబడునది. ఈ 2 లోకవాదము పేర్లు.
కింవదంతి - జను లాడుకొను మాట.
నానుడి - (నాను+ నుడి) కింవదంతి, సామెత.
సామెత - లోకోక్తి, నానుడి, సం.సామ్యోక్తి.
లోకోక్తి - 1.వాడుకమాట, 2.పుకారు, 3.సామెత.
ప్రవాదము - కారణము లేకయే వ్యాపించిన మాట.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో సుమతీ.
తా. ప్రపంచములో యెవరేమి చెప్పినను శ్రద్ధతో వినవలెను. విన్నంత మాత్రాన తొందరపడరాదు, విచారించవలెను. నిజానిజాలను తెలుసుకొని నడుచు కొనువాడే నీతిపరుడైన మానవుడు.
ఆగమ నిగదిత మంగళ గుణగణ
ఆదిపురుష పురూహుత సుపూజిత| ||శరవణభవ||
కరిముఖుఁడు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
కరి1 - 1.ఏనుగు, 2.కోతి.
కరో (అ)స్యాస్తీతి కరీ, న. పు. - తొండము గలది.
కరి2 - 1.నిదర్శనము, 2.మేర, విణ.సాక్షి.
కరణీప్రసవ న్యాయము - న్యా. పందికి పదిపిల్లలు పుట్టుక కన్న ఏనుగుకు ఒక పిల్ల పుట్టుట మేలు అను భావము. (కరణి - విధము, రీతి.).
కోఁతి - వానరము, రూ.క్రోఁతి.
వానరము - కోతి.
నర ఇవ వానరః - నరునివలె నుండునది.
కోఁతికొమ్మచ్చి - ఒకవిధమగు బాలక్రీడ.
వృశ్చిక వానర న్యాయము - న్యా. అసలే కోతి, దాని వికార చేష్టలతో పాటు, తేలు కుట్టినచో మరింత వికారముగ గంతులు వేయునను రీతి.
కాష్ఠ - 1.పదునెనిదిది రెపపాట్లు కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది.
కరణము సాదై యున్నను
కరి మదముడిగినను బాము కఱవయున్నన్
ధర తేలు మీటకున్నను
గరమదుగ లెక్కగొనరు కదరా సుమతీ.
తా. గ్రామకరణం సాధువుగానున్నను(బాధించని కరణమును), మదము లేని కరిని, పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు. కాటువేయక యున్నను, తేలు - క్రి.1నిళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.)కుట్టక యున్నను ఈ లోకములో జనులు లక్ష్యపెట్టరు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
గుఱి - 1.లక్ష్యము, 2.గుర్తు, 3.నిదర్శనము, 4.నమ్మిక, 4.సాక్షి, 6.నిర్ణయము, 7.యుక్తి, 8.పరిమితి, 9.కళంకము.
గుఱుతు - 1.చిహ్నము, 2.మేర, 3.కీర్తి, 4.పరిమితి, 5.స్థానము, 6.విధము, 7.మచ్ఛ, 8.సాక్షి, రూ.గుర్తు.
ఏనుఁగు మోముసామి - గజాననుడు, రూ.ఏనుగు మొగముసామి.
గజవదనుడు - వినాయకుడు.
గజస్యేవ ఆననన్మ్ యస్య సః గజాననః - ఏనుఁగు మొగము వంటి మొగముగలవాడు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో వుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
హరి! నీవె దిక్కు నాకన
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయన్
బరమేష్ఠి సురలు బొగడఁగ
కరిఁగాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా.
తా. కృష్ణా! బ్రహ్మ(పరమేష్ఠి - బ్రహ్మ)దేవతలు అందరు పొగడగ, లక్షీయుతుఁడవై(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)తో వచ్చి మొసలిని దనుమాడి ఏనుగును రక్షించినట్లు నన్ను కాపాడుము. నీవే నాకు దిక్కు.
ఇభము - ఏనుగు.
ఏతిమదమితి ఇభః ఇణ్ గతౌ. - మదమును బొందునది. ఇభరాజరక్షక గోవిందా|
ఇభి - ఆడేనుగు.
ఇభ్య - ఆడేనుగు, విణ.ఒడయరాలు, రాణి.
ప్రభ్విణి - ఒడయురాలు (రాణి.) యజమానురాలు.
ఇభ్యుఁడు - 1.ధనికుడు, 2.మావటివాడు.
ఇభ మర్హతీతి ఇభ్యః - ఏనుఁగు నెక్క నర్హుఁడు.
ఆఢ్యుఁడు - ధనికుడు, సమృద్ధికలవాడు.
అ సమంతాద్ధ్యాయంతే సమిత్యాధ్యః, ధై చింతాయాం. - అంతట నితనిఁదలఁతురు.
ధని - ధనము కలవాడు.
ధన మస్యాస్తీతి - ధనముగలవాఁడు. ఈ 3 ధనికుని పేర్లు.
ధనిక - 1.వర్తకుని భార్య, 2.యువతి.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
యౌవతము - యువతీ సమూహము.
కడు బలవంతుడై నను
బుడమిని బ్రాయింపుటాలిఁ బుట్టిన యింటం
దడ వుండ నిచె నేనియుఁ
బడుపుగ నంగడికి దానె పంపుట సుమతీ|
తా. ఎంత చెల్లుబడివున్న బలవంతుడైనను, తన యౌవనవంతురాలైన భార్యను తల్లిగారియింటనే దీర్ఘకాలము వుంచిన, ఆమె పతివ్రతా ధర్మమునకు కళంకము తెచ్చినవాడగును.
ఇభవదనానుజ శుభ సముదయయుత
విభవకరంబిత విభుపద జృంభిత| ||శరవణభవ||
అంగద1 - 1.ఆకలి, 2.ఆపద, ఉపద్రవము, 3.కోపము, 4.దుఃఖము.
అంగద2 - దక్షిణ దిక్కునందలి వా మ న ము అను దిగ్గజముయొక్క భార్య.
ఈఁతి - 1.ఉపద్రవము, 2.ఊరువిడిచిపోవుట, 3.మారి మొ. అంటువ్యాధి, 4.అతివృష్ట్యాది ఈతిబాధ (అతివృష్టి, అనావృష్టి, మిడుతల దండు, ఎలుకల దండు, చిలుకలదండు, చేరురాజులు అనునవి ఆరు ఈతిబాధలు.)
ఈతి ర్డిమ్బ ప్రవాసయోః,
ఈతిశబ్దము "అతివృష్టి రనావృష్టిః శలభా మూషికా శుకాః, అత్యాసన్నాస్చ రాజానష్షడేతా ఈతయః స్మృతాః" అను నాఱువిధములైన యుపద్రవములకును, ప్రవాసమునకును పేరు. అయన మీతిః, సీ. ఈఙ్ గతౌ. - పోవుట గనుక ఈతి.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
నీతి - న్యాయము. నీతి సురక్షిత జనపద రామ్|
న్యాయము - 1.తగవు, 2.స్వధర్మము నుండి చలింపకుండుట, 3.తర్కశాస్త్రము.
తగవు - 1.తగుట, 2.న్యాయము, 3.జగడము, 4.పెండ్లియప్పుడు పెండ్లి కూతునకు తల్లిదండ్రు లిచ్చు బహుమానము.
రీతి - 1.తెరగు, 2.మేర, 3.ఇత్తడి, 4.కావ్యశైలి పద్ధతి (కావ్య శైలి త్రివిధము., పాంచాలి, గౌడ, వైదర్భి.)
తెఱఁగు - 1.విధము, క్రమము, 2.చక్కన, 3.సంధి, రూ.తెఱవు.
తెఱఁగుపడు - క్రి.సంధియగు.
తగవుగోరి - సంధిచేయువాడు, మధ్యస్థుడు.
మధ్యస్థుఁడు - ఇ రు క క్ష ల కు న్యాయము చెప్పువాడు, నడుమనుండువాడు.
విశారదుఁడు - విద్వాంసుడు, నేర్పరి.
వ్యక్తుఁడు - విశారదుడు.
విద్వత్పు ప్రగల్భౌ విశారదౌ,
విశారదశబ్దము విద్వాంసునికి, ప్రౌఢునికి పేరు.
విశిష్టా శారదా అస్యేతి విశారదః - అధికమైన సరస్వతి గలవాఁడు.
ఈతి భయాపహ నీతి నయావహ
గీతిక లాఖిల రీతి విశారద| ||శరవణభవ||
సర్వ్జః, సర్వంజానాతీతి సర్వజ్ఞః - సమస్తము నెఱింగినవాఁడు. జ్ఞా అవబోధనే.
సర్వం జానా తీతి సర్వజ్ఞ - సర్వము నెఱింగినవాఁడు.
సుగతుఁడు - బుద్ధుడు.
సుగతః శోభనం గతం జ్ఞానమస్య సుగతః - మంచి జ్ఞానము గలవాఁడు.
సుష్టు అపునరావృత్త్యా మోక్షం గతః - లెస్సగా పునరావృత్తి లేక మోక్షమును బొందినవాడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుద్ధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ధర్మరాజు - 1.యుధిష్ఠిరుడు, 2.యముడు, 3.బుద్ధదేవుడు.
యథాపరాధ దండదానేన ధర్మస్య రాజా ధర్మరాజః - అపరాధమునకుఁ దగినట్లు శిక్షించుటచేత ధర్మమునకు రాజు.
జయుఁడు - 1.ఇంద్రుని కొడుకు, 2.ధర్మరాజు, 3.విష్ణువుయొక్క ద్వారపాలకుడు.
ధర్మరాజౌ జినయమౌ -
ధర్మరాజ శబ్దము బుద్ధదేవతకును, యమునికి, యుద్ధిష్ఠిరునకును పేరు. ధర్మస్య రాజా ధర్మరాజః - ధర్మమునకు రాజు.
యుధిష్ఠిరుఁడు - ధర్మరాజు, అజాత శత్రువు.
అజాతశత్రువు - ధర్మరాజు, విణ.శత్రువు లేనివాడు.
కర్ణానుజుఁడు - యు ధి ష్ఠి రు డు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.
జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.
జినః జయతి భవం జినః - సంసారమును జయించెడివాఁడు, జి జయే.
సత్యం మాతాపితా జ్ఞానం ధర్మోభ్రాతా దయా సఖా|
శాంతిఃపత్నీ క్షమాపుత్ర స్షడైతే మమభాదవాః||
తా. సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము తోఁడబుట్టినవాఁడు, దయ(దయ - కనికరము)స్నేహితుఁడు, శాంతి(శాంతి - శమనము)భార్య, క్షమ(క్షమ - 1.ఓర్పు, 2.నేల, మన్నింపు.)కుమారుఁడు, ఈ యాఱును నాకు బాంధవులని ధర్మరాజు చెప్పెను. – నీతిశాస్త్రము
సంయమని - యముని పట్టణము.
ప్రేతపురము - యమపట్టనము.
అనంతవిజయము - ధర్మరాజు శంఖము, విణ.అంతములేని జయము కలది.
అనన్తవిజయం రాజా కున్తీ పుత్రో యుధిష్ఠిర|
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ|| -16శ్లో
తా|| కుంతీపుత్రుడగు ధర్మరాజు అనంతవిజయమను శంఖమును, నకులుడు సుఘోషమను శంఖమును, సహదేవుడు మణిపుష్పకమను శంఖమును పూరించిరి. - అర్జునవిషాదయోగము, భగవద్గీత
గోల - 1.వట్రువయగు నీటికాగు, 2. గుండ్రని పదార్ధము, 3.మణిశిల, 4.చెలికత్తె, 5.గోదావరీనది, వి. 1.ముగ్ధ, ముగ్ధుడు, 2.కలకలము.
కోలాహలః కలకలః -
కోలాహలము - 1.కలకలము, 2.ఒకానొక కొండ.
కోలానాహలతీతి కోలాహలః, హల విలేఖనే. - కోలములు వరాహములు వానిని భయపఱచునది.
కోలనం కోలః ఏకీభావః, తమాహరతి భినట్టీతివా కోలాహలః - కొలమ్నఁగా చేరియుండుట, దానిని జెఱచునది.
కలకలము - గుంపున పుట్టిన పెద్దమ్రోత.
కల్యతే అవ్యక్తం శబ్ద్యత ఇతి కలకలః, కల శబ్ద సఙ్జ్యానయోః. - అవ్యకముగాఁ బలుమాఱు పలుకఁబడునది.
కలకలః అని అభీక్త్ష్యమందు ద్విర్భావము. ఈ 2 గుంపునఁ బుట్టిన గొప్పధ్వని పేర్లు.
అలబలము - కలకలము, సందడి.
గౌతమబుద్ధుడు - (చరి.) సిద్ధార్థుడు, (క్రీ. పూ. 566-486). బౌద్ధధర్మ స్థాపకుడు, తథాగతుడు, శాక్యముని.
తథాగతఁ యథా పునరావృత్తిర్నభవతి తథా మోక్షం గతః - ఎట్లు పునరావృత్తి గలుగదో అట్లు మోక్షమునొందినవాడు.
తథా సమ్యగ్గతం జ్ఞాన మస్యేతి తథాగతః - మంచిజ్ఞానముగలవాఁడు.
యథామునయో మోక్షం గతా స్తథా మోక్షం గత ఇతివా - మునులెట్లు మోక్షమును బొందిరో అట్లు మోక్షమును బొందినవాడు.
సిద్ధర్థుఁడు - శాక్య బుద్ధుడు.
సమంతభద్రః సమంతతః పుణ్యసంభారాత్ జ్ఞాన సంభారాచ్చ భద్రః శ్రేష్ఠః - పుణ్యసంభారము వలనను జ్ఞాన సంభారము వలనను శ్రేష్ఠుడు.
సమంతం సంపూర్ణం భద్రం మంగళమస్యేతి వా - సంపూర్ణమైన శుభము గలవాఁడు.
శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
శాక్యమునిః, ఇ-పు. శాకవనవాసిత్వాచ్ఛాక్యః - శాక్యశ్చాసౌ మునిశ్చ శాక్యమునిః, శాకావృక్షప్రతిచ్ఛన్నం, వాసం యస్మాచ్చ చక్రిరే, తస్మాదిక్షాకు వంశ్యాన్తే శాక్యా ఇతి భువి స్మృతాః. - శాకవనమందుందువాడు.
శకదేశేషు జాతో మునిః - శకదేశములయందుఁ బుట్టిన ముని.
శాక్యసింహుఁడు శాక్యముని, బుద్ధుడు.
శాక్యసింహః, శాక్యేషు సింహఃశ్రేష్టః - శాక్యులలో శేష్ఠుడు.
సర్వార్థసిద్ధుఁడు - శాక్య బుద్ధుడు.
సర్వార్థసిద్ధః సర్వార్థేషు సిద్ధో నిష్పిన్నః - అన్నిపనులయందు గృతార్థుడైనవాడు.
గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు.
గౌతమః గౌతమస్య శిష్యాశ్శాక్యా గౌతమా ఇత్యుచ్యతే, తద్వంశావతీర్థత్వా ద్బుద్ధో (అ)పి - గౌతమముని శిష్యులు గనుక శాక్యులు గౌతములు, ఆ వంశమందుఁ బుట్టినవాఁడు. గౌతమముని సంపూజిత రామ్|
అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్కవంశత్వాత్ అర్కబంధుః, ఉ-పు. - సూర్యవంశమున జనించుటవలన అర్కబంధువు.
ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.
ధూర్భారతా జటిః జటా యస్యేతి ధూర్జటిః ఈ-పు. - భారమైన జడలు గలవాఁడు.
ఊర్జిత శాసన మార్జిత భూషణ
స్ఫూర్జథుఘోషణ ధూర్జటి తోషణ|| శరవణభవ||
నీలలోహితుఁడు - శివుడు.
నీలలోహితః జుహ్వతో బ్రహ్మణో లలాతస్వేదనం తేజో (అ)గ్నౌ నిపత్య నీలం సల్లోహిత మభూత్. తతో (అ)యం జాత ఇతి నీలలోహితః - బ్రహ్మహోమము చేయునపుడు లలాటస్వేదము వలనఁ గలిగిన తేజము అగ్నియందుందుఁబడి నీల వర్ణమై పిమ్మట రక్తవర్ణమాయెను. అందు వలనఁ బుట్టినవాఁడు గనుక నీలలోహితుఁడు.
నీలలోహితము - (రసా.) బచ్చలిపండు రంగు గలది (Purple).
నీలకంఠుఁడు - శివుడు.
నీలః కంఠే లోహిత కేశే ప్యస్యేతి వా - కంఠమందు నీలవర్ణంబును కేశములయందు రక్తవర్ణమును గలవాఁడు.
నీలకణ్థశ్శివే (అ)పి చ,
నీలకంఠశబ్దము శివునికిని, అపిశబ్దమువలన నెమిలికిని పేరు.
నీలః కంఠో యస్య నీలకంఠః - నల్లనిమెడ గలవాఁడు.
నీలకంఠము - 1.నెమలి, 2.పిచ్చుక (నల్లని కంఠము కలది).
కప్పుకుత్తుక పులుగు - నెమలి, నీలకంఠము.
నీలః కంఠో (అ)స్య నీలకంఠః - నల్లనిమెడ గలది.
చటకము - పిచ్చుక Sparrow.
చటకః కలవిఙ్కస్స్యాత్ -
చటతి ధాన్యాదికమితి చటకః చట భేదనే. - ధాన్యాదులను బొడిచి తినునది.
సుఖం యథా భవతితథా లపతి కలవింకః, లప వ్యక్తాయాంవాచిః. - సుఖముగా బలుకునది. ఈ 2 పిచ్చుక పేర్లు.
నీలకము - నల్లకోతి.
కఱకంఠుఁడు - నీలకంఠుడు, శివుడు.
కఱ - 1.నలుపు, 2.మరక, సం.కాలః.
కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
కాలరాత్రి - 1.ప్రళయకాలము, 2.దుర్గామూర్తి భేధము, 3.చీకటిరాత్రి, సం.వి.కాలిబంటు, పదాతి.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
తరుణము - సమయము, సం.విణ. క్రొత్తది, యౌవనముగలది.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
తరుణిమ - యౌవనము, రూ.తారుణ్యము.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామవర్ణో (అ)స్యాస్తీతి శ్యామలః - శ్యామవర్ణము గలిగినది.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామతి శమలం, శము ఉపరమే. - నశించునది.
ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేతా కలాపీ, నతా
నుగ్రాహీ ప్రణవోపదేశనినదైః కేకీతి యోగీ యతే,
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే| - 53శ్లో
భా|| (నీలకంఠం - అంటే నెమలి, శిఖి, కలాపి, కేకి _ అని నామాంతరాలు కల అది పర్వతాలపై నాట్యం చేస్తుంది.)
అంబరకేశుడు, నాగేంద్రుడు హారంగా కలవాడూ, భక్తులను అనుగ్రజించివాడు, ప్రణవ ఉపదేశ నాదాలచే కేకి అని కీర్తింపబడేవాడు, యౌవనాంగి అయిన పార్వతీ సతిని తిలకించి పులకితాంగాలతో నాట్యమాడేవాడూ, ఉపనిషత్తులు - అనే వనాలలో విహరించ రసికుడైనవాడు అయిన నీలకంఠుని భజిస్తున్నాను. - శివానందలహరి
శివాయ గౌరీవదనారవింద
సూర్యాయ ధక్షాధ్వర నాశనాయ|
శ్రీనీలకంఠాయ వృషధ్వ్జాయ
తస్మ్యై "శి"కారాయ నమశ్సివాయ | - 3
నర్తనప్రియము - నెమలి.
మాయురము - నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది.
కేకి - నెమలి.
కేకారవో స్యాస్తీతి కేకీ, స. పు. - కేకారవముగలది.
కేక - నెమలికూత.
కేకా వాణీ మయూరస్య -
కే శిరసి కాయతే అభివ్యజ్యత ఇతి కేకా. - శిరస్సు నెత్తి పలుకఁబడునది. ఈ ఒకటి నెమలికూఁత.
కేకరించు1 - 1.కేకలువేయు, 2.గొంతుక సరిచేసికొనునట్లు ధ్వనిచేయు.
కేకరించు2 - క్రీగంట చూచు.
కటాక్షము - 1.కడకంటి చూపు, కడకన్ను.
కడగన్ను - కటాక్షము, క్రేఁగన్ను.
క్రేఁగన్ను - (కేవ+కన్ను) కడకన్ను, అపాంగము.
కటాక్షో (అ)పాన్గదర్శనే,
అపాంగదర్శనే కటాక్షోవర్తతే, కడకంటిచూపు కటాక్ష మనం బడును.
కటేనేత్ర దేశే అక్ష్ణోతీతి కటాక్షః అక్షూ వ్యాత్తా. - కటమనఁగా నేత్రములయొక్క వెలుపలి భాగము, దానియందు వ్యాపించునది.
అపాంగము - కడకన్ను, విణ.అంగహీనము.
అపాఙ్గా నేత్రయో రన్టౌ -
నేత్రయోరన్తౌ అపాఙ్గా విత్యుచ్యేతే. - రెండుకన్నుల కడలు అపాంగము లనంబడును, కడకన్నులు.
అఙ్గా న్నాసికాయా అపకృష్టౌ అపాఙ్గా - అంగము కంటె అపకృష్టములైనవి. ఈ ఒకటి కడగన్నుల పేరు.
ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు - ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
(ఌ)ౠకారకృతి శోకాపోహన
కేకారవయుత కేకి వినోదన| ||శరవణభవ||
కోసలము - ఒకానొక దేశము.
కోసు1 - రెండు వేల విండ్ల పట్టుకొలది, సం.క్రోశః.
కోసు2 - దీర్ఘము(దీర్ఘము - నిడుద), పొడుగైనది.
కూఁతనేల - 1.కూతవేటు, 2.క్రోసు.
క్రోశము - 1.ఏడ్పు, 2.పిలుపు, 3.కూత వినిపించు నంతదూరము, కోసు.
ఆకారణ - పిలుపు, ఆహ్వానము, రూ.ఆకారణము.
ఆహ్వానము - పిలుపు.
ఆక్రందనము - 1.బిగ్గరగా ఏడ్చుట, ఏడుపు, 2.మొఱ, 3.పిలుపు, రూ.ఆక్రందము.
ఏడ్చు - ఏడుచు; ఏడ్పు - ఏడుచు.
వాపోవు - అరచు, ఏడ్చు.
వాపోక - ఏడ్చుట, అరచుట.
ఉత్క్రోళము - 1.మొర, 2.చాటింపు, 3.ఒకజాతి పక్షి.
క్రన్దితం రుదితం క్రుష్టమ్ -
క్రన్దనం క్రన్దితం క్రది ఆహ్వానే రోదనే చ - రోదించుట.
రోదనం రుదితం రుదిర్ అశ్రువిమోచనే. - దుఃఖముచేత కన్నీరు జాఱవిడుచుట.
క్రోశనం క్రుష్టం, క్రుశ ఆహ్వానే రోదనే చ - ఏడ్చుట క్రుష్టము. ఈ 3 రోదనము పేర్లు.
రుద్యతే అ నేన రోదనం. రుదిర్ అశ్రువిమోచనే. - దీనిచే దుఃఖింతురు.
రోదనము - 1.శోకము, ఏడ్చు, 2.కన్నీరు.
ఏడుపు - రోదనము, రూ.ఏడ్పు.
కన్నీరు - హర్ష శోకముల వలన కన్నుల నుండి కారెడు నీరు.
శోకము - దుఃఖముచే తపించుట, వగపు.
వగపు - శోకము.
ఏడుచు(ౘ) - దుఃఖించు, రోదనము చేయు, రూ.ఏడ్చు.
అడలు - 1.ఏడ్చు, దుఃఖించు, 2.భయపడు, వి.1.శోకము, 2.భీతి.
విలపించు - క్రి.అడలు, అంగలార్ఛు.
అంగలారుచు - క్రి.భయాదులచే అరచు, దుఃఖించు, రూ.అంగలార్చు.
ఆక్రందనము - 1.బిగ్గరగా ఏడ్చుట, ఏడుపు, 2.మొఱ, 3.పిలుపు, రూ.ఆక్రందము.
ఏడ్చు - ఏడుచు; ఏడ్పు - ఏడుచు.
వాపోవు - అరచు, ఏడ్చు.
వాపోక - ఏడ్చుట, అరచుట.
ఉత్క్రోళము - 1.మొర, 2.చాటింపు, 3.ఒకజాతి పక్షి.
సారావే రుదిరే త్రాతర్యాక్రన్దో దారుణే రణే,
ఆక్రందశబ్దము ఆర్తధ్వనితోఁగూడిన రోదనము నకును, రక్షించువానికిని, భయంకరమైన యుద్ధమునకు పేరు. ఆక్రందనం, ఆక్రంద్యతే అస్మ్యై, అస్మిన్నితి చ ఆక్రందః, క్రిది ఆహ్వానే రోదనే చ. - మొఱపెట్టుట. వీనికొఱకు దీనియందు మొఱపెట్టఁబడును.
క్రందనము - 1.ఆర్తధ్వని, ఏడుపు, 2.(యోధుల) ఆర్పు, 3.పిలుపు.
క్రందు - క్రి.1.ఘోషించు, 2.విలపించు, వి.1.మ్రోత, 2.ఉపద్రవము, 3.సందడి, సం.క్రంద్.
తమ అందమైన పలువరుసను ప్రదర్శించడానికి కొందరు నవ్వితే, తమ సహృదయాన్ని ప్రకటించడానికి కొందరు రోదిస్తారు. - జోసఫ్ రాక్స్
దారుణము - భయంకరము.
దారయతి చిత్తమితి దారుణం, దౄ విదారణే. - చిత్తమును భేదించునది.
రణము - 1.యుద్ధము, 2.మ్రోత.
రణన్తి భేర్యాదయో (అ)త్ర రణః రణశబ్దే. - భేరి మొదయైనవి దీని యందు మ్రోయును.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.
అత్యయము - 1.అతిక్రమము, 2.కష్టము, 3.చేటు, 4.దుఃఖము, 5.అపరాధికి నిధింపబడు జాల్మానా.
అత్యయనం అత్యయః ఇణ్ గతౌ. - కాలము నతిక్రమించిపోవుట అత్యయము.
అతిక్రమము - 1.మీరుట, అతిపాతము, 2.శత్రువులపై దండెత్తి పోవుట, 3.ఆలస్యము.
అత్యయో(అ)తిక్రమే కృచ్చే దోషే దణ్దేపి -
అత్యయశబ్దము ఉల్లంఘించుటకును, దుఃఖమునకును, దోషమునకును, దండించుటకును, అపిశబ్దమువలన నాశమునకును పేరు. అత్యయం, అయమతిక్రాంతిశ్చ అత్యయః, ఇణ్ గతౌ. - అతిక్రమించుటయు, శుభావహవిధి నతిక్రమించినదియు అత్యయము, "వినాశే (అ)ప్యత్యయః ప్రోక్త" ఇతి శేషః.
అతిక్రమణము - (భౌతి.) కాంతి కిరణము, 2.సామాన్య మార్గమును అతిక్రమించుట (Deviation).
ఏడిక - ఏడకము.
ఏడకము - పొట్టేలు.
ఇలతి గచ్ఛతీ త్యేడకః ఇల గతౌ. - సంచరించునది.
ఏడక - గొఱ్ఱె. గొఱ్ఱె కసాయివాడినే నమ్ముతుంది.
అభీలము - భయంకరము, వి.శరీరబాధ.
ఆసమంతాత్ భయంలాతీ త్యాభీలం, లాదానే. - అంతట భయము నిచ్చునది.
ఆర్తము - 1.దుఃఖము నొందినది, 2.నొప్పింపబడినది, 3.రోగము గలది.
అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సు లేనివాడు, 2.దుఃఖము నొందినవాడు, 3.ధ్యాన నిమగ్నుడు.
విలాపము - దుఃఖముతోడి మాట.
పరిదేవనము - 1.దుఃఖముతో పలికెడు మాట, 2.దుఃఖము.
విలాపః పరిదేవనమ్,
విలపనం విలాపః - విలపించుట విలాపము.
పరిదేవన మనుశోచనం దేవృ పరిదేవనే. - దుఃఖించి పలుకుట పరిదేవనము. ఈ 2 దుఃఖముతోఁ బలికెడు వాక్కు పేర్లు.
బంబోతు - (బంబ+పోతు) బలిసినవాడు.
బంబ - స్థూలము, పెద్దది, సం.బృంహ.
మొక్కఁడు - 1.బలిసినవాడు, 2.కఠినుడు.
బళాయి - బలవంతుడు, సం.బలవాన్.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
అతగుఁడు - 1.దుర్బలుడు, 2.అవివేకి, తెలివితక్కువవాడు.
బెండుమానిసి - బలహీనుడు.
బెండుపడు - క్రి. బలహీనత చెందు.
విత్తము - ధనము, సం.విణ.1.విచారింప బడినది, 2.తెలియబడినది.
విద్యతే లభ్యత ఇతి విత్తం, విద్ ఌ లాభే. - పొందఁబడునది.
సత్తువగల యాతఁడు పై
నెత్తిన దుర్బలుడు తస్క * రించు నతండున్
విత్తముఁ గోల్పడు నతఁడును
జిత్తనిపీడితుఁడు జింతఁ జెందుఁ గుమారా !
తా. కుమారా! తనమీదికి బలవంతుడు దండెత్తిరాఁగా దుర్బలుఁడు - బలహీనుడు, బలహీనుఁడైనవాఁడును, తస్కరుఁడు - దొంగ, దొంగతనము చేయునతఁడును, ధనమును బోఁగొట్టు కొనువాఁడును, మనోవ్యాధి కలవాఁడును దుఃఖము-1.బాధ, 2.చింత.దుఃఖించుచుండురు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
ఏడక వాహన మూఢ వినోదన
ఊఢసమభువన సోడసదకరణ | ||శరవణభవ||
ఐలబిలుఁడు - 1.ఇలబిలకోడుకు, కుబేరుడు, 2.దిలీపుడు.
ఇలబిల యనెడు స్రీ యొక్క కొడుకు. లడయో రభేదాత్ ఇడబిట్ భ్రాతా అస్యేతి ఐడబిడః - ఇడబిట్టనెది తమ్ముఁడు గలవాఁడు.
మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.
ఐలబిలాది దిగీశ బలావృత
కైలాసాచల లీలా లాలస| ||శరవణభవ||
శ్రీదుఁడు - కుబేరుడు.
శ్రియం దదాతీతి శ్రీదః - సంపద నిచ్చువాఁడు.
లిబ్బిదొర - శ్రీదుడు, కుబేరుడు.
లిబ్బిపడఁతి - లక్ష్మి. పడఁతి-స్త్రీ, రూ.పణఁతి.
లిబ్బి - 1.పాతర, 2.రాశి, 3.నిధి, 4.ప్రోగు(ప్రోఁగు - పోగు), ధనము.
నేలమాళిగ - 1.నేలలోపలిగది, 2.పాతర, 3.నేలమాణ్యము (Cellar).
నిధానము - 1.ఉంచుట, నిలువజేయుట, 2.పాతర.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు, (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము, (Quantity).
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
నికరము - 1.పోవలసినదిపోగా మిగిలినది, 2.శ్రేష్ఠము, సం.వి.1.సమూహము, 2.నిధి.
మేలుతరము - శ్రేష్ఠము; శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.
మేలిమి - 1.అపరంజి, 2.అధిక్యము.
అపరంజి - మేలిమి బంగారము, కుందనము.
నిధి - పూడ్చి యుంచిన ధనము, పాతర. (అర్థ.) ఒక యవసరము కొరకు ప్రత్యేకముగ నిలుపచేసిన ధనము. (ఏ యవసరమునకై నిథి ఉపయోగింప బడునో ఆ పేరు దానికి పెట్టబడును, ఉదా. రక్షణ నిధి.)
నితరాం ధీయతే అస్ఠిన్నితి నిధిః, ఈ-పు డుధాఙ్ ధారణపోషనయోః - మిక్కిలి రక్షింపఁబడునది.
శేవధి - నిధి, రూ. సేవధి. కుబేరాగారమందు దేవీస్థానం నిధి|
శేవం స్థాన్య ధనం ధీయతే అస్మిన్నితి శేవధిః, ఈ-పు. శేవమనఁగా స్థాన్యధనము - అది దీనియందు ఉంపఁబడును. నా = పుల్లింగము ఇది కాకాషిన్యాయముచేత నిధి శేవధిశబ్దములు రెంటియందును అన్వయించుచున్నది. ఈ 2 నిధి పేర్లు.
విడిముడి - ధనము, (విడియు + ముడి).
ధనము - 1.విత్తము, 2.ఆలమంద వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోషపెట్టునది, 'ధన ధన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది (Positive).
పైఁడిఱేఁడు - కుబేరుడు.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పైఁడినెలఁత - లక్ష్మి. నెలఁత - స్త్రీ, రూ. నెలఁతుక.
అర్థాగృహేనివర్తంతే శ్మశానే మిత్ర బంధవాః|
సుకృతం దుష్కృతం చవగచ్ఛంత మను గచ్ఛతి||
తా. ద్రవ్యమును సంపాదించి ధర్మము సేయక దాచినను లోకాంతర గతుండౌనపు డాద్రవ్యము గృహము-1.ఇల్లు, 2.భార్య. గృహమందుండును, వాని వెంటరాదు. పుత్త్ర మిత్రుడు - 1.హితుడు, 2.సూర్యుడు. బాంధవులు శ్మశాన పర్యంతము వత్తురు కాని వెంటరారు, సుకృతము-1.పుణ్యము, 2.శుభము.)పాపములు(దుష్కృతము - పాము)రెండును వెంట వచ్చును. కనుక ధర్మమే చేయ వలెయును. - నీతిశాస్త్రము
రిక్థము - 1.ధనము, 2.హిరణ్యము, (శాస.) మరణ సమయమున విడిచిన ఆస్తి (లెగసీ Legacy బిక్వెష్టు bequest).
రిచ్యతే విభజ్యత ఇతి రిక్థం, రిచెర్ పృథగ్భావే. - విభజింపఁబడునది.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).
కృత్స్నము - 1.జలము, 2.కడుపు, విణ.సర్వము.
కృత్యతే వ్యప్రియతే (అ)నేనేతి కృత్స్నం, కీతీ వేష్టనే. - దీనిచేత వ్యపింపఁబడును.
పిచండము - కడుపు.
పచతి ఆన్నం స్వగతాగ్నినా పిచండః - తనయందుండెడు అగ్నిచేత అన్నమును బక్వము సేయునది.
అపిచమత్యాహార మితివా పిచండః. చము అదనే. - ఆహారమును బక్షించునది.
పిచండిలుఁడు - పెద్ద బొజ్జ కలవాడు.
పిచండిలశ్చ - తుంది పిచండశబ్దములు కుక్షివాచకములు; అది గలిగినవాఁడు. అనఁగా దొడ్డకడుపు గలవాఁడు.
కుక్షి- కడుపు, జఠరము. కుక్షిం చ వైష్ణవీ పాతు|
కుప్యతే బహిప్క్రియతే మలమస్మాదితి కుక్షిః. పు. కుష నిష్కర్షే. - దీనివలన మలము బయలు వెల్లింపఁబడును.
జఠరము - కడుపు, విణ. 1.ముదిసినది 2.కఠినమైనది.
జన్యతే గర్భో అస్మిన్నితి జఠరం. జనీ ప్రాదుర్భావే - దీని యందు గర్భము పుట్టింపఁబడును.
జఠరః కఠినే పి స్యాత్ -
జఠర శబ్దము కఠినమయిన వస్తువునకు పేరు. అపిశబ్దమువలన కడుపునకు పేరగునపుడు ప్న. జాయతే అస్మిన్నితి జఠరః, జనీ ప్రాదుర్భావే. - దీనియందు పుట్టును గనుక జఠరము. "కుక్షౌ తు జఠరోన స్త్రీ త్రిషు వృద్ధ కఠోరయో" రితి రుద్రః.
కౌక్షేయము - కత్తి, ఖడ్గము, వ్యు.కుక్షికి దగ్గరగా ఉంచుకొన బడినది.
కుక్షౌ చర్మ నిర్మితకోశే భవః కౌక్షేయకః - చర్మ నిర్మితమై కుక్షిప్రాయమైన యొరలో నుండునది. అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి.1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.
ఉదరము - 1.కడుపు (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువగా నుండు భాగము (Abdomen).
ఉదయర్తిగర్భో అస్మాదితి ఉదరం. ఋ గతౌ. - దీనివలన గర్భము ప్రకాశమౌను.
తుద్యతే అజీర్ణాదినాతుందం. తుద వ్యథనే. - అజీర్ణాదులచేత వ్యథ పెట్టఁడునది. జఠరాది శబ్దములు 3 ను సమాహార ద్వందము కడుపు పేర్లు.
పొట్ట - 1.కడుపు, 2.పరిపొట్ట. పొట్ట పైరుకు పుట్టెడు నీరు.
ఉదరంభరి - తనపొట్టను మాత్రమే పోషించు కొనువాడు.
స్వోదర మేవ పూరయతీతి స్వోదరపూరకః - పోష్యవర్గమును నిడిచి తన కడుపు నింపుకొనువాఁడు స్వోదరపూరకుఁడు. వానియందు ఆత్మభరి కుక్షింభరి శబ్దములు వర్తించును.
కుక్షింభరి - తనకడుపు మాత్రము నింపుకొనువాడు, ఉదరంభరి.
ఆత్మంభరి - తనపొట్ట మాత్రము పూరించుకొను వాడు, కుక్షింభరి.
అత్మానం స్వమేవ బిభర్తీతి ఆత్మంభరిః, స్వకుక్షిమేవ బిభర్తీతి కుక్షింభరి, డు భృఙ్ ధారణ పోషణయోః. - తన కడుపుమాత్రము నిండించుకొనువాఁడు.
తుందము - కడుపు.
తుద్యతే అజీర్ణాదినాతుందం తుద వ్యథనే. - అజీర్ణాదులచేత వ్యథ పెట్టఁబదునది.
తుంది - 1.కడుపు, 2.ఉరుకుబొడ్డు, విణ.బొజ్జ కడుపు కలవాడు.
పునః పునస్తుందం పరిమార్ష్టీతి తుందపరిమృజః. మృజూ శుద్ధౌ.- పలుమాఱు కడుపు నిమురు కొనువాఁడు.
తుండిభుఁడు - ఉరుకు బొడ్డువాడు, రూ.తుండిలుఁడు.
తుందిభుఁడు - 1.బొజ్జకడుపు గలవాడు, 2.ఉరుకుబొడ్డు కలవాడు, రూ.తుందిలుడు.
తుంది పిచండశబ్దౌ కుక్షిపర్యాయౌ తద్యోగాత్ తుందిలః, తుందిభః, పా, తుందికః, తుందీ,న్.
తొంద - తుదిలుండు, బొజ్జకడుపువాడు, రూ.తొందు, సం.తుందీ.
తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
తుండుపడు - వై. క్రి. మోడువలెనగు, మొండియగు.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, అఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా ఖండములు). (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన వృత్త భాగము, ఒక ఘనతలముచే ఛేదింపబడిన ఘనరూపభాగము.
(భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్నభిన్నముగ చేయబడని భూభాగము.
లంబోదరుఁడు - వినాయకుడు.
లంబ ముదరం యస్య సః లంబోదరః - వ్రేలెడి బొజ్జగలవాడు.
బొజ్జ - కడుపు.
బొజ్జదేవర - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
బృహత్కుక్షి - పెద్దకడుపువాడు.
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం.పృద్ధః, పృథుః.
పెరుఁగు - క్రి. వృద్ధిచెందు, ఎదుగు, వి.దధి, విణ.వృద్ధుడు.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
దొడ్ద - గొప్ప, రూ.దొడ్డు.
దొడ్డువాఱు - 1.క్రి.గొప్పయగు, 2.లావగు.
లావు - 1.బలము, 2.అతిశయము, సామర్థ్యము, విణ.స్థూలము.
కరువు1 - 1.పోతపోసెడి అచ్చు, 2.మూస.
కరువు2 - గర్భము, సం.గర్భః.
దుర్భిక్షము - కరవు.
క్షామము - కరవు, విణ.తక్కువైనది.
కాటకము - కరవు, దుర్భిక్షము.
వగ్రహము - కరవు (అవగ్రహము).
అడిత్రాగుడు - 1.కరవు, దుర్భిక్షము, 2.చాలీచాలని తిండి.
అఱ్ఱాఁకలి - 1.మిక్కిలి ఆకలి, (ఆకలి+ఆఁకలి), 2.సగము ఆఁకలి, ఆఁకలి పూర్తిగ తీరమి (అఱ్ఱు+ఆకఁలి).
దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షే చ హిరణ్య దమ్|
చతురోహం నమస్యామి రణేధీరమృణే శుచమ్||
తా. దుర్భిక్షకాలమందు అన్నదానము చేయువానిని, సుభిక్షకాలమందు సుభిక్షము - 1.సులభభిక్షము గలది, 2.కరవు లేనిది.)ధనము దానము చేయువానిని, రణమందు రణము - 1.యుద్ధము, 2.మ్రోత.) ధైర్యము గలవానిని, ఋణమందు శుచిగలవానిని(అనఁగా నప్పులేని వానిని) ఈ నలుగురిని గూర్చి నేను నమస్కరించెద నని శ్రీకృష్ణుడు చెప్పెను. - నీతిశాస్త్రము
పిండము - 1.బ్రతుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద(కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.), 3.గర్భము, 4.సమూహము, సం.వి.(గృహ.) గర్భములోని శిశువు, (Foetus embryo).
జననావయము - (జీవ.) సంతానోత్త్పత్తికి సంబంధించిన అవయవము, (Reproductive organ).
ఉల్బము - (గృహ.) పిండములోపలి పొర (Amnion).
ప్రత్యుత్పత్తి - (జం.) సంతానోత్పత్తి (Reproduction).
ప్రథమ రూప సంబంధము - (జీవ.) ఒక భాగముగాని ఒక అవయముగాని సంపూర్ణముగా అభివృద్ధి చెందక యుండునది(స్థితి) (Rudimentary).
గర్భము - 1.కడుపు, 2.కడుపులోని పిండము, బిడ్ద, 3.అగ్ని Fire, 4.లోపలి భాగము, 5.నాటక సంధులలో ఒకటి, 6.సంతానము, 7.బీజము.
మాతృభుక్తాన్న రసం గిరతీతి గర్భః, గౄ నిగరణే. - తల్లి భుజించిన యన్నపానాదుల మ్రింగునది.
భ్రూణము - గర్భము, బిడ్డ, శుక్ల శోణిత పిండము, (జీవ.) ఫలదీకరణ మైన అండము. దానితరువాత అభివృద్ధిదశలు, గింజలోనుండు అంకురము, బీజదళములు, సంయుక్త బీజము (Embryo).
భ్రామ్యతి కుక్షావితి భూణః, భ్రము అనవస్థానే. - కడుపులోఁ దిరుగునది.
బ్రియతే మాత్రేతి వా భూణః, భృఙ్ బరణే. - తల్లిచే భరింపఁబడునది.
భూణస్యూనము - సంయుక్త బీజము భూణముగా పెరుగుసంచి (Embryo sac).
స్యూతి (భ్రూణము) - 1.కుట్టు, 2.సంతతి, సం.వి. (జం.) జంతువు యొక్క పిండము పెరుగుటలోనిదియొక దశ (Castrula). భ్రూణము యొక్క జీర్ణకోశ కుహరము చుట్టును బహిశ్చర్మము, అంతశ్చర్మము అనువానితోకూడిన రెండు పొరలసంచి యుండును. జీర్ణకోశకుహరము బయటికి ఆద్యంత్ర ముఖము ద్వారా తెరచు కొనును.
కుట్టు - 1.శూలరోగము, 2.కడుపు నొప్పి, 3.పొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.)కుట్టు, 2.(వస్త్రము)కుట్టు, 3.(ఆకులు)కుట్టు.
సంతతి - 1.కులము, 2.సంతానము, 3.పుత్రపౌత్ర పారంపర్యము, 3.వరుస.
అధ్యావృద్ధి - (జం.) భ్రూణములో నుండి సూక్ష్మఖండములు త్వరగా వృద్ధి చెంది మహాఖండముల మీదికి త్రోసికొని వచ్చుట (Epiboly).
గర్భస్రావము - (గృహ.) గర్భవిచ్చిత్తి, విచ్చిన్నము, నాలుగు మాసములలోపల గర్భము జారిపోవుట (Abortion).
ఆపన్నత్వ - గర్భిణి, వ్యు.లోపల ప్రాణిగలది.
ఆపన్నం గృహీతం సత్వం గర్భో (అ)నయే త్యాపన్నసత్త్వా - గ్రహింపఁబడిన గర్భముగలది.
గుర్వి - గర్భిణి; గర్భిణి - గర్భవతి.
గురు గర్భ శరీర మస్త్యస్యా మితి గుర్విణీ - బలువైన గర్భ శరీరము గలది.
అంతర్వత్ని - లోపల శిశువు కలది.
ఉదరాంతర్గర్భో (అ)స్యా అంతర్వత్నీ - కడుపులో గర్భము గలది.
గర్భవతి - చూలాలు; (ౘ)చూలాలు - గర్భవతి.
గర్భో (అ)స్యా ఇతి గర్భిణీ - గర్భము గలది.
ఆపన్నత్వ - గర్భిణి, వ్యు.లోపల ప్రాణిగలది.
ఆపన్న సత్వ గుర్వీస్యాదితి పాఠ ఇతి కేచిత్.
ౘ)చూలు - 1.గర్భము, 2.బిడ్డ.
అయోనిజుఁడు - గర్భమున పుట్టనివాడు, వి.1.విష్ణువు, 2.శివుడు.
అయోనిజ - గర్భమున పుట్టని స్త్రీ, వి.సీత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
గర్భాగారము - 1.శయనతృహము, 2.లోపలిది, 3.గర్భాశయము, 4.పురిటిల్లు, 5.దేవాలము లందు దేవతా విగ్రము లుండుచోటు, గర్భగుడి.
గర్భకోశము - (జీవ.) గర్భాశయము, బిడ్డతిత్తి, పిండము పెరుగుసంచి.
ఫాలోఫియన్ గొట్టము - (గృహ.) గర్భకోశమునకు ఇరు ప్రక్కల గల నాళములు (Fallopian tube.) ఇందులో గర్భోత్పత్తియగును.
గర్భాశయము - (జం.) మావి, గర్భమును చుట్టుకొనియుండు సంచి, అండాశయ నాళము చివర ఉబ్బియుండు భాగము (Utterus). (అండము అభివృద్ధి చెందుటకై దీనిలో నిలిచియుండును).
గర్భాశయో జరాయుః స్యాత్ -
గర్భ ఆశేతే త్ర గర్భాశయః శీజ్ స్వప్నే. - గర్భము దీని యందుండును.
గర్భనిష్క్రమణానన్తరం జరాం జీర్ణతా మేతి జరాయుః. ఉ. పు. ఇణ్. గతౌ. - గర్భము వెళ్ళినపిమ్మట జీర్ణత్వమును బొందునది. స. జరాయుః. ఈ రెండు 2 మావి పేర్లు.
జరాయువు - 1.మావి, 2.జటాయువు, (వృక్ష.) అండాశయములో బీజాండము లమరియుండు దిమ్మ, (Placenta).
అండలంబనస్థానము - (వృక్ష.) జరాయువు, అండాశయములో బీజాండములు అమర్చబడిన దిమ్మ (Placenta).
మావి - 1.గర్భస్థ పిండమునకు మీద కప్పికొని యుండు తోలు సంచి, జరాయువు, 2.మామిడి.
మాకందము - మామిడి చెట్టు.
మామిడి - మామిడిచెట్టు, రూ.మావి.
ఆమ్రము - 1.మామిడి, చూతము.
చూతము - మామిడిచెట్టు.
మాఁగాయ - మామిడికాయ.
ఆమ్ర శ్చూతో రసాలః -
అమ్యతే అభిలష్యతే ఆమరః. అమగత్యాదిషు. - అభిలషింపఁబడునది.
అమయతి రోగయతివా ఆమ్రః. ఆమరోగే. - రోగమును గలిగించునది.
చ్యోతతి ధనం ప్రసతీతి చూతః. ద్యుతిర్ క్షరణే. - రసమును స్రవించునది.
రసాలము - 1.చెరకు, 2.మామిడి.
రసం అలాతీతి రసాలః. లా దానే. - రసము నిచ్చునది.
రసమలతి భూషతివా రసాల. అల భూషణాదౌ. - రసము నలంకరించునది. ఈ 3 మామిడిచెట్టు పేర్లు.
ప్రియాలము - ఒక విధమగు మామిడిచెట్టు, రూ.ప్రియాళువు.
అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా.కొబ్బరికాయ, మామిడిపండు Mango fruit.
జటాయుషో దీనదశాం విలోక్య - ప్రియావియోగ ప్రభవం చ శోకమ్|
యో వై విసస్మార తమార్ద్రచిత్తం - శ్రీజానకీ జీవనమాసతోస్మి| - 3
సహకారము - వ్యష్టి, సమిష్ఠి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి. తియ్య మామిడి చెట్టు.
వ్యష్టి - ప్రయోజనము. ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చుశక్తి (Utility).
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధంతము, వి. (అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తినిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో మూల్యమధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
ఉద్దేశము - 1.గురి, 2.తలంపు, 3.నిశ్చయము, 4.ఎత్తైన ప్రదేశము.
ఉద్దేశించు - క్రి.1.గుర్తించు, 2.అనుకొను.
పుల్ల విరుగుడు తెగులు - (వ్యవ.) చెట్ల కొమ్మలు, రెమ్మలు నీరసించి ఆకులు రాలిపోయి యెండిపోవుట (Die back disease) ఉదా. నారింజ, మామిడి మొ. ఇది యొకజాతి శిలీంద్రము వలన కల్గును.
స్తంభసంయోగము - (వృక్ష.) అండాశయములో మధ్య నిలువుగా స్తంభమువలె నున్న జరాయువు (Placenta) పై బీజాండములు ప్రతి గదియందును అమర్చబడియుండు విధము ఊచకూర్పు, (Axile placentation).
గర్భాగారము - 1.శయనతృహము, 2.లోపలిది, 3.గర్భాశయము, 4.పురిటిల్లు, 5.దేవాలము లందు దేవతా విగ్రము లుండుచోటు, గర్భగుడి.
అరిష్టము - 1.హంసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము,, 5.మరణిచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ.ఉత్పాతము, 9.రాగి.
పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీజఠరే శయనం |
ఇహ సంసారే బహు దుస్తారే, కృపయా(అ)పారే పాహి మురారే || - 21
మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ మాతృగర్భంలో పడి ఉండడం, ఈ సంసార చక్రభ్రమణం తప్పించుకోలేనంత దుస్తరమైనది. ఓ మురారే! అపారకృపతో నన్ను ఈ సంసారం నుండి రక్షించు ప్రభో! - భజగోవిందం
Repeated birth, repeated death, and repeated lying in mother’s womb – this transmigratory process is extensive and difficult to cross; save me, O Destroyer of Mura (O Krishna), through your grace!
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
అనంతి జీవంత్యనేన లోకా ఇత్యనలః, అన ప్రాణనే. - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాప్తి ర్నాస్త్యసేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేని లేనివాఁడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రముల్లము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
గ్రహణి - 1.ఒక విధమైన రోగము, జఠరాగ్నికి అధిస్ఠానమగు నాడి, (ఇది చెడి పోయినచో గ్రహిణీరోగము కలుగును).
Dysentery - disorder of the bowels, గ్రహణి, అతిసారము.
విరేచనముల వ్యాధి - (గృహ.) అతిసారము (Diarrhoea).
విలగ్నము - సన్ననినడుము, విణ.చక్కగా తగిలినది.
మధ్యమము - నడుము, (గణి.) రెండు పదముల మధ్య చొప్పించబడిన పదము (Mean).
నడుము - 1.కౌను, 2.మధ్యభాగము, రూ.నడ్ము.
కౌను - 1.నడుము, 2.వింటినడుము.
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము.
మధ్యభాగము -
భంబు - 1.ఆకాశము, 2.నక్షత్రము.
ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి 3.అభ్రకము 4.బ్రహ్మము 5.(గణి.) సున్న, శూన్యము 6. (భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతిక వస్తువులు ఆక్రమించు చోటు (Space).
విను - ఆకర్షించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినువాఁక - గంగ.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మినుచూలు - వాయువు.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
తారాపతి - చంద్రుడు. తారాచంద్రుల విలాసములతో...….
తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య, 3.వాలిభార్య. కిష్కింధాచలము నందు దేవిస్థానం తార|
తారస్వరము - (భౌతి.) గట్టిగా వినిపించు స్వరము, (High note).
ముక్తాశుద్ధౌ చ తార స్స్యాత్ :
తార శబ్దము ముత్యముల నిర్దోషత్వమునకును, చకారమువలన నక్షత్రమునకును, అత్యుచ్చస్వరమునకును, కనుగుడ్డునకును పేరు.
తరంత్యనేనేతి తారః - దీనిచేత తరింతురు.
"తారో నామౌక్తికే శుద్ధే గురు సుగ్రీవ భార్యయోః, బౌద్ధదేవ్యాం స్తారా దౌరూప్యవర్ణ యోః, తారమత్యుచ్ఛ నిద్ధ్వనతరీ సంబంధయోస్త్రిషు"ఇతి శేషః.
తారాపథము - ఆకాశము. ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈవేళ....
తారానాయకసంకాశవదనాయ మహౌజసే,
నమోస్తు తాటకాహంత్రే రామా.......
తారకము - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింప చేయునది.
కనీనిక - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.చిటికెన వ్రేలు.
నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక.
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.
తారకాణ - దృష్టాంతము, రూ.తార్కాణము, తారకాణము, తార్కాణ.
దృష్ఠాంతము - 1.ఉదాహరణము, 2.శాస్త్రము, 3.చావు, 4.(అలం.) ఒక అర్థాలంకారము.
దిష్టస్య జీవిత కాలస్య ప్రారబ్ధ కర్మణో వా అంతః దిష్టాంతః. - జీవిత కాలముయొక్కగాని ప్రారబ్ధ కర్మము యొక్కగాని అంతయు దిష్టాంతము.
దృషాంతరీకరించు - క్రి.ఉదాహరించు.
ప్రామాణ్యము - 1.దృష్టాంతము, 2.సాక్ష్యము.
ప్రామాణికుఁడు - 1.సత్యము తప్పనివాడు, 2.మేరమీరనివాడు, 3.శాస్త్రము నెరిగినవాడు. నిదర్శనము - 1.దృష్టాంతము, 2.(అలం.) ఒక అర్థాలంకారము.
ఛేదిత తారక భేదిత పాతక
ఖేదిత ఘాతుక వాంఛిత దాయక| ||శరవణభవ||
ఉడురాజు - చంద్రుడు.
ఉడువు1 - క్రి. ఉడుగు.
ఉడుగు - 1.మాను, 2.ఇంకు, 3.నశించు.
ఉడుపు2 - నక్షత్రము.
ఉడువు - క్రి.1.అణగించు, 2.పోగొట్టు, వి.దుస్తు.
ఉడువులు - (గృహ.) దుస్తులు (Clothing).
దుస్తు - 1.ఉడువు, 2.అందము, విణ.ఎక్కువ.
దుస్తులు - (గృహ.) బట్టలు, వస్త్రములు ఉడువులు (Garments or clothes).
దుస్తులచెయ్యి - (గృహ.) మీద దుస్తుల లోని చేతి భాగము (Sleeve).
బట్ట - 1.పశువుల మేని చార, విణ.వెండ్రుక లూడినది, 'బట్టతల ' వై.వి.వస్త్రము, సం.పటః.
చేలము - వస్త్రము, రూ.చేల, సేల.
సేల - చేల, వస్త్రము, సం.చేలమ్.
చిల్యతే చేలం, చిల వసనే. - కొట్టు కొనఁబడునది.
సుచేలకః పటో స్త్రీ స్యాత్ -
శోభనశ్చాసౌ చేలకశ్చ సుచేలకః. - మంచివలువ.
పటతి వాయునా పటః, అ.ప్న. పట గతౌ. - వాయువుచేత కదలునది.
పటయతి దేహం పటః, పత వట గ్రంథే. గ్రంథో వేష్టనం, - దేహమును గప్పునది. ఈ 2 మంచికోక పేర్లు.
పటము - 1.వస్త్రము, 2.చిత్తరువు వ్రాయు వస్త్రాదికము.
ౙమారు - దోవతులచాపు, సెల్లా.
సెల్లా - సన్నని వస్త్రము (రవసెల్లా), సం.చేలమ్.
పరజనులు కట్టి విడిచిన
వరచేలములైనఁ గట్టవలదు; * వలువలన్
నెఱిమాయు మడత మార్చుచు
ధరియించుట యొప్పదండ్రు: ధరను గుమారా!
తా. ఇతరులు కట్టుకొని విడిచివేసిన (వస్త్రము)గుడ్దలను ఎంత మంచివైనను కట్తుకొనరాదు. మాసిన వస్త్రములు మడతలు మార్చి కట్టుకొన రాదు.
ఏడుగడ - 1.గురువు, 2.తల్లి, 3.తండ్రి, 4.పురుషుడు, 5.విద్య, 6.దైవము, 7.దాత అని ఏడు విధములైన రక్షణము రూ.ఏడ్గడ(ఏడు+కడ).
వరాళి - 1.చందమామ Moon, 2.ముతకబట్ట.
వరాట - ముతకవస్త్రము. రెట్టు - ముతకబట్ట. ముతుక - ముదుక.
ముడుతలు - (గృహ.) నలుగుట, సాపులేక పోవుట, చర్మము లేదా బట్టలు ముడుతలు (Wrinkles).
కుంచించుకొని పోవుట - (గృహ.) ముడుచుకొని పోవుట, క్రొత్త బట్టను నీటిలో ముంచినచో లేదా ఉదికినప్పుడు అది ముడుచుకొనుటచే చిన్నదిగనగుట (Shrinkage).
ముడుతపడనిపడనిది - (గృహ.) ఉతికినపుడు నలుగనిది (Dipdry-finish).
పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు.
అనుజీవి - సేవకుడు, విణ.ఆశ్రయించి బ్రతుకువాడు.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
సాయము1 - సాహాయ్యము.
సాహాయ్యము - 1.తోడుపాటు, 2.సహాయత్వము, 3.స్నేహము.
తోడ్పాటు - తోడుపాటు; తోడుపాటు - సాహాయ్యము, రూ.తోడ్పడు.
తోడ్పడు - తోడుపడు; తోడుపడు - సహాయపడు, రూ.తోడ్పడు.
సహాయనాం సహాయతా,
సహాయానాం సమూహః సహాయతా. ఈ ఒకటి తోడువచ్చినవారల సమూహము పేరు.
స్నేహితుఁడు - చెలికాడు.
అనుఁగు - 1.చెలికాడు, 2.ప్రేమ, 3.ముఖ్యుడు, విణ.1.ప్రియుడు, 2.ప్రియురాలు, 3.మనోజ్ఞము, 4.సహాయుడు, 5.మొదటిది.
అనుఁగుకాడు - చెలికాడు. చెలికాఁడు - స్నేహితుడు.
అనుఁగుకత్తె - చెలికత్తె.
సహకారి - సహాయుడు.
సహ అయతే సహాయః అయ గతౌ. - కూడవచ్చువాఁడు.
అనుచరుఁడు - 1.సహాయుడు, 2.భృత్యుడు.
అనుపశ్చాచ్ఛరతీతి అనుచర, చర గతిభక్షణయోః. - వెంట వచ్చువాఁడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
సహచరుఁడు - మిత్రుడు, విణ.కూడ దిరుగువాడు.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
సాయము2 - 1.సాయంకాలము, 2.బాణము.
సాయంతనము - సాయంకాల సంబంధమైనది.
సాయం సాయే -
సాయం - ఇది సాయంకాలమందు వర్తించును, ఉ. 'సాయంతన మల్లికాసు'.
మాపు-పోగొట్టు, వి.1.రాత్రి, 2.సాయంకాలము, 3.మైల.
రాత్రిమణి - చంద్రుడు Moon.
రాత్రి - (రజని - రాత్రి) సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకు గల కాలము.
సాయంకాలము - మునిమాపు; మునిమాపు - (మును+మాపు) ప్రదోషము, సంజ.
ప్రదోషము - 1.మునిమాపు, 2.మిక్కిలి దోషము.
మఱుసంౙ - సాయం సంధ్య. అసుర సంధ్య - రాక్షసవేళ, సాయంసంధ్య.
సంధ్యా పితృప్రసూః,
సంధ్య - 1.ప్రొద్దుపుట్టుటకు ముందైదు ఘడియల వరకును, ప్రొద్దుక్రుంకిన వెనుక మూడు 3 ఘడియల వరకును గల కాలము, 2.సంధి, 3.ప్రతిజ్ఞ.
సంౙు - సంధ్య, సంధ్యా.
సమ్యక్ ధ్యాయంత్యస్యామితి సంధ్యా ద్వైచింతాయాం - దీనియందు లెస్సఁగా ధ్యానము చేయుదురు.
సంధీయతె అహోరాత్రాభ్యా మితివా సంధ్యా, డు ధాఞ్ ధారణపోషణయోః, అహోరాత్రములచే సంబంధింపఁబడునది.
పితౄన్ ప్రసూత ఇతి పితృప్రసూః, ఊ. సి. షూఙ్ ప్రాణిగర్భ విమోచనే - పితృదేవతలఁ బుట్టించునది.
సంధ్యయాః బ్రహ్మశరీరత్వాత్ పితృప్రసూరితి పురాణప్రసిద్ధిః సంధ్య బ్రహ్మ శరీరము గనుక పితృలోకమును బుట్టించుటచేత పితృప్రసు వనంబడును.
సూర్యాస్తమయమునకుఁ 3 గడియలును సూర్యోదయమునకు ముందు 4 గడియలును సంధ్య యనంబడును. ఈ 2 సంధ్యా కాలము పేర్లు.
నెత్తురుపొద్దు - సంధ్యాకాలము.
నీరుకాళ్ళు - సాయంకాలములందు దోచు ఎఱ్ఱని పచ్చని కిరణములు.
అజిహ్మగము - బాణము, వ్యు.వంకరగా పోనిది, తిన్నగా పోవునది.
నాళీకము - 1.తామర, 2.బాణము, 3.బాణపు ములికి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 2.కూతురు, సం.1.భేత్త్రీ, 2.పుత్త్రః, 3.పుత్రి.
తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.
శణము - 1.జనము, 2.బాణము.
జనము - ప్రజ; ప్రజ - జనము, సంతతి.
సంతతి - 1.కులము, 2.సంతానము, 3.పుత్రపౌత్ర పారంపర్యము, 3.వరుస.
సంతు - సంతతి, సంతానము, కులము, సం.సంతతిః.
సంతానము - 1.బిడ్డ, పుత్రపౌత్ర పారంపర్యము, కులము, 2.ఒక కల్పవృక్షము.
వృద్ధార్కో హోమధూపశ్చ - బాలస్త్రీ నిర్మలోదకమ్|
రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ - ఆయుర్వృద్ధిః దినేదినే||
తా. సాయంకాలమునం దెండ(ఎండ)కాచుకొనుట, హోమము(వేల్మి, యజ్ఞము)సేయు పొగ యొడలిమీఁదఁ బాఱుట, తనకంటె చిన్నదానితో సంగమము చేయుట, మంచినీళ్ళు త్రాగుట, రాత్రుల యందు క్షీరాన్న భోజనము చేయుట; ఇవి దినదినమున (ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.)ఆయుస్సును వృద్ధి పొందించును. – నీతిశాస్త్రము
వంశము - 1.కులము, 2.వాసము, 2.పిల్లనగ్రోవి, 3.వెన్నుగాడి, 4.సమూహము, 5.ఒక పురాణ లక్షణము.
ద్వౌ వంశౌ కుల మస్కరౌ. -
వంశ శబ్దము కులమునకును, వెదురునకును పేరు. వన్యత ఇతి వంశః. వన షణ సంభక్తౌ. - ఆశ్రయింపఁబడునది.
"పృష్ఠాస్థి గేహోర్ధ్వకాష్ఠే వంశే వేణౌ గణేకుల"ఇతి విశ్వప్రకాశః.
ఈ పిల్లనగ్రోవికి వెల యెంత అర్థరూపాయి..... ఇందులో ఉన్నాయమ్మా రాగాలు ఒక వేయి.....
కులము - 1.వంశము, 2.ఇల్లు, 3.తెగ, 4.శరీరము, 5.ఊరు.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
తెగ - 1.సజాతీయ సమూహము, 2.సమూహము, రూ.తెవ, 3.పక్షము, 4.విధము, 5.అల్లెత్రాడు ఎక్కుపెట్టుట, 6.నిడుపుడు, అవ్య. 1.నిశ్శేషముగా, 2.ఖండితముగా.
శరీరము - దేహము; దేహము - శరీరము, మేను.
ఊరు - 1.లోపలనుండి నీరు బయటికి వచ్చు, 2.నాను, 3.పుట్టు(సంభవించు, జన్మించు), 4.పెద్దది యగు, వి.1.గ్రామము, 2.ఏడికోల లేని నాగలి, 3.దేశము.
సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
నివసథము - గ్రామము.
గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.) షడ్జాది స్వరము.
గ్రామత - 1.గ్రామముల సమూహము, 2.త్రాళ్ళ సమూహము.
కొలము - 1.వంశము, సజాతీయ ప్రాణిసమూహము, సం.కులమ్.
జననము - 1.పుట్టుక(జన్మము - పుట్టుక), 2.వంశము.
సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
జాత్యము - 1.మంచి కులమున పుట్టినది, 2.మేలైనది, 3.చక్కనిది.
కులపాలిక - 1.తల్లిదండ్రులచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.
యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
కార్యేషుదాసీ కరణేషుమంత్రీ | రూపేచలక్ష్మీ క్షమయాధరిత్రీ |
భుక్తేషుమాతా శయనేతు వేశ్యా షట్కర్మయుక్తా కులధర్మపత్నీ |
తా. ఇంటి కార్యములయందు పనికత్తెవలెను, కార్యాలోచనయందు మంత్రివలెను, రూపము నందు లక్ష్మివలెను, ఓర్పునందు ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి.)వలెను, ఆహారము(భుక్తి - 1.భోజనము, 2.అనుభవము.)నందు తల్లివలెను, పడకయందు వేశ్యవలెను, ఈరీతిగా బ్రతివిషయమునను బ్రవర్తించునది కులస్త్రీ యనబడును. - నీతిశాస్త్రము
వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
వసతి - 1.ఇల్లు, ఉనికి. నివసతి - ఇల్లు.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికుంచుట (Dislocation).
నివాసము - ఇల్లు, రూ. నివసనము, వాసము.
నివాసి - వాసముచేయువాడు.
వాస - వాసము (వెదురు).
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
ఆవాసము - ఇల్లు.
వాసః కుటీ ద్వయోః శాలా సభా -
వసంతత్యస్మిన్నితి వాసః నివాసే. - దీనియందు జనులు నివసింతురు.
కుటతి కుటిలీభవతీతి కుటీ. - కుట కౌటిల్యే వక్రమగునది.
శలన్త్యస్యామితి శాలా, ప్స, శలగతౌ. - దీనియందు జనులు చేరుదురు.
శాల్యతే శాలా. శాలా శ్లాఘాయాం. - కొనియాడఁ బడునది.
సహభాంత్యస్యామితి సభా - దీనియందుఁ గూడికొని ప్రకాశించురు.
సమగ్భాతీతి సభా - లెస్సగా నొప్పునది ఈ 4 సభాగృహము పేర్లు.
వెదురు - వేణువు, సం.వేణుకః.
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి.
వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి.
మురళి - 1.పిల్లనగ్రోవి, 2.ఒక విధమైన గుఱ్ఱపునడక.
మైలక్రోవి - మురళి.
మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.
మురళీగాన వినోద వేదస్తుతభూపాద నారాయణ|
త్వక్సారము - వెదురు, రూ.త్వచిసారము.
త్వక్కు - 1.చర్మము, 2.చెట్టుపట్ట, 3.లవంగపట్ట, 4.నార, రూ.త్వచము.
నార - చీల్చిన చెట్టుపట్టలోని పీచు, వల్కలము.
వల్కలము - చెట్టుమీది పట్ట.
త్వచము - (వృక్ష.) బెరడు, బెండు (Cork).
బెరడు - చెట్టుబోదె పై కప్పు, బెరడు, (Bark).
బెండు - జిలుగు, విణ.నిస్సారము. బూలి - 1.నిస్సారమైనది, 2.బెండు.
జిలుగు - 1.సూక్ష్మవస్త్రము, విణ.అల్పము, 3.మందము, సం.జాలికా.
బెండుమానిసి - బలహీనుడు; దుర్బలుఁడు - బలహీనుడు.
బెండుపడు - క్రి. బలహీనత చెందు.
మందము1 - యుద్ధకాలమున వాహన యోగ్యమైన గజజాతి.
మందము2 - దట్టము, స్థూలము. అవిరళము - దట్టమైనది.
దళసరి - 1.మందము, 2.ఘనత.
దప్పము - దట్టము, సం.దర్పః.
దట్టి - 1.దట్టము, 2.కాసె, సం.ధటీ.
దట్టము - 1.పావడ, 2.గుఱ్ఱము, విణ.తరచు, విరళము, రూ.దళము.
పావడ - 1.పరికిణి, 2.ధౌతవస్త్రము. అంగదట్టము - పావడ, పరికిణి.
దడము - దట్టము, రూ.దళము.
దణా - దళము, సేన, సం.దళః.
దళము - 1.అధిక్యము, విణ.2.దట్టము, 3.తరచు, రూ.దడుము.
దళము - 1.ఆకు, 2.దండు.
దణాయుఁడు - దళనాయకుడు, సేనాపతి, సం.దళనాయకః.
దళవాయి - 1.సేనాధిపతి, 2.సుంకరికి సహాయుడైన యుద్యోగి.
దణి - 1.ప్రభువు, 2.సేనాని, సం.ధనీ.
సేన - దండు, విణ.అధికము, చాల.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు… అల్లన మోవికి(పెదవికి) తాకితే గేయాలు.....
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
క్రోవి - 1.తామరనాళము, 2.గొట్టము, 3.తుపాకి, 4.బుడ్డి, 5.భూమిలోపల నీళ్లు వచ్చుటకు ఏర్పరచిన తూము, 6.మూస(మూష - మూస), 7.ఊదుక్రోవి.
చిమ్మన గ్రోవి - జలక్రీడలయందు నీళ్ళు చెమ్మెడు గొట్టము.
గొట్టము - క్రోవి, (భౌతి.) ఒక చోటు నుండి మరియొక చోటికి, ద్రవ్యము లను గాని, వాయువులను గాని, కొనిపోవు పరికరము (Tube).
ఊఁదుఁగ్రోవి - 1.అగసాలివాడు కుంపటిని ఊదెడి గొట్టము, 2.పిల్లనగ్రోవి.
తూఁతకొమ్ము - పిల్లనగ్రోవి.
ధమని - 1.అవయములకు గుండె నుండి నెత్తురు తీసికొనిపోవునరము, 2.మెడ, neck 3.అగసాలెవాని ఊదుగొట్టము, సం.వి. (జం.) మంచి రక్తమును తీసికొని పోవు రక్తనాళము (Artery).
కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్త నాళములు(ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries).
క్రౌంచము - 1.క్రౌంచపర్వతము, 2.ఒకానొక ద్వీపము, 3.ఒకరకపు కొంగ.
క్రొంచ - కొంచ, సం.క్రౌంచః.
కొంౘ - 1.క్రౌంచము, 2.ఒకానొక పర్వతము, సం.క్రౌంచః.
కొంౘగుబ్బలి - క్రౌంచపర్వతము.
క్రౌంచదారణుడు - కుమారస్వామి, గుహుడు, వ్యు.క్రౌంచపర్వతమును భేదించినవాడు.
క్రౌంచాఖ్యం పర్వతం దారితవాన్ క్రౌంచదారణః - క్రౌంచపర్వతమును వ్రక్కలించినవాఁడు. దౄ విదారణే. క్రౌంచదారీ పంచదశః|
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
గుహుఁడు - కుమారస్వామి, వ్యు.దేవసేనలను పొదివి రక్షించువాడు, 2.ఒక నిషాదరాజు.
గూహతి పరాయు ధేభ్య ఆత్మసైన్యం గోపాయతీతి గుహః - తన సైన్యమును రక్షించుకొనువాఁడు, గుహూ సంవరణే.
నిషాదుఁడు - 1.బోయవాడు, 2.మాలవాడు.
నిషీదతి పాప మస్మిన్నితి నిషాదః, షద్ ఌ విశరణ గత్యవసాదనేషు. - వీనియందు పాప ముండును.
అమూ తే వక్షోజా - వమృతరసమాణిక్య కలశౌ
న సందేహస్పందో - నగపతిపతాకే! మనసి నః|
పిబంతౌ తౌ యస్మా - దివిదితవధూసంగరసికౌ
కుమారా వద్యాపి - ద్విరదవదన క్రౌంచదళనౌ| - 73శ్లో
తా. హిమవంతుని వంశ పతాకవంటి తల్లీ! అమృతముగల మణి కలశముల వంటి నీ స్తనములను పానము చేయుచున్న వినాయక కుమారస్వామి(క్రౌంచదారణుఁడు-కుమారస్వామి, గుహుడు, వ్యు.క్రౌంచపర్వతమును భేదించిన వాడు.) వీరిరువురును - నేటికి గూడ ఇప్పటికిని స్త్రీ సాంగత్యము నెరుగని-కోరనివారై కుమారులుగ (బాలురుగ)యున్నారు కదా! - సౌందర్యలహరి
క్ష్మా - భూమి, వ్యు.భారము నోర్చునది.
క్షమతే భారం క్ష్మా - భారము నోర్చునది.
క్ష్మాభృత్తు - 1.కొంగ, 2.ఱేడు, వ్యు.భూమిని మోయునది(వాడు).
క్ష్మాం బిభ ర్తీతి క్ష్మాభృత్, త. పు. డు భృఙ్ ధారణపోషణయోః. - భూమిని ధరించునది.
క్ష్మాం భువం బిభ ర్తీతి క్ష్మాభృత్ త. పు. భృఞ్ భరణే. - భూమిని భరించువాఁడు.
కొంగ - బకము, సం.క్రుజ్.
బకము - కొంగ, రూ.బకోటము.
క్రుఙ్ క్రౌఞ్చః -
క్రుఞ్చతి పఙ్క్తి రూపేణ గచ్ఛతీతి క్రుఙ్, చ. పు. క్రౌంచశ్చ, క్రుఞ్చ గతికౌటిల్యాల్పీ భావయోః. - పంక్తిరూపముగాఁ బోవునది. లేక కుటిలమై యుండునది. ఈ 2 కొంగ పేర్లు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
క్ష్మాయిత - కంపించువాడు.
క్ష్మాజము - చెట్టు, వ్యు. భూమి నుండి జన్మించినది.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
వృక్షము - చెట్టు, సం. (వృక్ష.) చాల యెత్తుగా, లావైన కాండము, ఎక్కువ ధారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree).
వృశ్చ్య ఛిద్యత ఇతి వృక్షః, ఓవ్రశ్చూ చ్ఛేదనే. - ఛేదింపఁబడునది.
చెట్టుగట్టు - క్రి.చెట్టుగా నేర్పడు (అవయవ సౌష్ఠవ మేర్పడుట).
కర్కరేటుః కరేటు స్స్యాత్ -
కర్కః సితాశ్వ ఇవ రేటతీతి కర్కరేటుః, ఉ. ప్స, రేటృ పరిభాషణే. - తెల్లగుఱ్ఱమువలె శబ్దించునది.
కర్క ఇతి రేటతి కర్కరేటుః - కర్కయని పలుకునది.
కే వృక్షాదీనాంశిరసి రేటతీతి కరేటుః, ఉ. ప్స. - వృక్షాదులకొనయందుఁ బలుకునది. ఈ 2 పెద్దకొక్కెర పేర్లు.
బలాక - పెద్ద కొక్కెర.
బలాకా బిసకణ్డికా,
బలేన మేఘమాలా అకతి బలాకా, అక కుటిలాయాం గతౌ. - బలముచే (కాదంబిని - మేఘపంక్తి) మేఘపంక్తి బొందునది.
బిసవత్ కంఠో (అ)స్యా ఇతి బిస కంఠికా - తామర తూఁడు(బిసము - తామరతూడు, తామర తీగ.)వంటి మెడగలది. ఈ 2 తెల్లకొక్కెర పేర్లు.
సారవివేకవర్తనుల సన్నుతికెక్కిన వారి లోపలన్
జేరినయంత మూఢులకు జేపడదానడ యెట్లనగాఁ
సారములోన హంసముల సంగతినుండెడి కొంగ పిట్టకే
తీరున గల్గనేర్చును దదీయగతుల్ దలపోయ ! భాస్కరా.
తా. హంసలతో(హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.)గలిసినంత మాత్రమున కొంగపిట్టకు రాయంచ గమన ప్రవర్తనములు ఏ విధముగా, కలుగును? (కలుగదు) రాదు. అట్లే, మంచి యోగ్యతలు(నిజమగు యుక్తాయుక్త విచక్షణ)గల వారి నాశ్రయించినంత మాత్రమున మూర్ఖులకా(మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.)గొప్పవారి పేరు ప్రతిష్ఠలు రావు.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
అరవ - 1.తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.
అఱవము - ద్రవిడభాష.
ద్రవిడము - 1.దక్షిణదేశము, 2.దక్షిణదేశ భాష, రూ.ద్రావిడము.
ద్రవిణము - 1.ధనము, 2.బంగారు, 3.బలము.
ద్రవతి గచ్ఛతీతి ద్రవిణం, ద్రు గతౌ. - వెచ్చ పోవునది.
త్రాణ - 1.ద్రవిణము, 2.బలము, 3.సత్తువ, సం.ద్రవిణమ్.
ద్రవత్యనేన శత్రుం ప్రతి ద్రవిణం, ద్రుగతౌ. - దీనిచేత శత్రువును గూర్చి పోవును.
అఱవము - ద్రవిడభాష.
ద్రవిణం తు బలం ధనమ్,
ద్రవిణశబ్దము బలిమికిని, ధనమునకును పేరు. ద్రవంత్య సేన, ద్రవతీతి చ ద్రవిణం, ద్రు గతౌ. దీనిచేత యుద్ధాదులకుఁ బోవుదురు గనుకను, కరఁగునది గనుకను ద్రవిణము.
ద్రావణీయము - కరగునట్టిది (Soluble).
ద్రావిడ ప్రాణాయామము - జాతీ. 1.సులభముగా కానిపని, 2.సూటిగా చెప్పక డొంకతిరుగుడుగా చెప్పుట.
దద్యద్దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్ అకించనవిహంగశిశౌ విషణ్ణే|
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయనీ నయనాంబువాహః| - 9
ద్రుమ్నము - 1.ధనము, 2.బలము, 3.పరాక్రమము.
ద్యూయతే అభిగమ్యత ఇతి ద్యుమ్నం, ద్యూభిగమనే. - పొందఁబడునది.
దివి మ్నాయత ఇతి ద్యుమ్నం. మ్నా అభ్యాసే. - స్వర్గమందును గోరఁబడునది.
అఱవ - సాధువుకాని ఆవు, విణ.దుష్టుడు, దుష్టము.
నఱవ - అరవ, సాధువుకాని యావు.
నఱ్ఱ - 1.ప్రయాసచే పిదుకదగిన యావు, 2.ప్రయాసముచే బండికి గట్టబడిన యెద్దు.
అఱ్ఱ - 1.అఱ, గది, 2.ప్రయాసమున పాలు పిదుకదగిన ఆవు.
సృతి - 1.త్రోవ, 2.పోక, (గణి.) ఒక స్థిరబిందువునకు ఒక చల బిందువుతో కలుపు ఋజురేఖ (Radius vector).
కరట - 1.ప్రయాసచే పిదుకదగిన ఆవు, 2.కాకి.
క ఇతి రటతీతి కరటః రత పరిభూషనే. - క యని పలుకునది.
కాకే భణ్డౌ కరటౌ -
కరతశబ్దము కాకిని, ఏనుఁగు గండస్థలమునకును పేరు. కేతి రతతి కరోతి మదమితిచ కరతః, రత పరిభాషన్ణే. - కా యని కూయునదియును, మదజలమును జేయునదియును గనుక కరతము. "కరటో వాద్యభేదేస్యాత్ కుసుంభకరిగందయో, ఏకాదసే చ శ్రాద్ధే వాయసే నింద్యజీవన" ఇతి ప్రతాపః.
కరటము - 1.కాకి, 2.గోదురుకప్ప, 3.ఒకరకపువాద్యము, 4.కుసుమపువ్వు, 5.మారేడు.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.
కా ఇతికాయతికాకః, కైశబ్దే. - కాయని యఱచునది.
కా - కాకి అరచుటయం దగు ధ్వన్వనుకరణము, విణ.కుత్సిత శ బ్ద మునకు వచ్చు ఆదేశము, ఉదా.కాపురుషుడు మొ.వి. అవ్య.కదా.
గోఁదురు - పెద్దకప్ప; గోండ్రు కప్పలు - గోదురు కప్ప.
కాకిఱెల్లు - కాకివెదురు, (దీని పుల్లలను చివర సన్నముగా చెక్కి కలములుగా వాడెడివారు).
కాకిచెఱకు - చెరకు వంటి తృణము, తేజనకము.
తేజయతి పిత్తాదిరోగానితి తేజనకః, తిజ నిశాతనే. - పిత్తాది రోగములను కృశముఁగా జేయునది.
కాకిచిప్ప - ముత్తెపు చిప్పవంటి గుల్ల, శంబూక.
శంబూకము - 1.కప్ప చిప్ప, 2.నూక, రూ.శంబుకము. సర్వత శంబుక సంస్తుత రామ్|
నూక - బియ్యపు తునక.
చిప్ప - 1.కప్ప చిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విన.అల్పము.
కర్కోటము - 1.మారేడు, 2.ఒకపాము.
క్షేడము - కర్కోటక మను పాము.
బీల్వశ్శాణ్డిల్య శైలూషా మాలూర శ్రీఫలావపి,
బిల్వము - మారేడు; మారేడు - బిల్వము.
బిలుపము - మారేడు పండు, సం.బిల్వ.
బిలతి కుష్ఠాదీన్ బిల్వః, బిల భేదనే. - కుష్ఠాదులను గొట్టివేయునది.
సేవకస్య పాపం బిలతి హిన స్తీతి వా బిల్వః - సేవకుని పాపమును(పాపము - దుష్కృతము, కలుషము.)బోఁగొట్టునది. బిల్వనిలయాం| బిల్వపత్రార్చిత గోవిందా|
శాండిల్యఋషివ ద్విప్రమాన్యత్వాత్ శాండిల్యః - శాండిల్యుఁ డనెడి ఋషి వలె బ్రాహ్మణ పూజ్యమైనది.
మాలూరము - 1.మారేడు చెట్టు, 2.వెలగ చెట్టు.
మల్యతే దేవైఁ మాలూరః, మల మల్ల ధారణే. - దేవతలచేత ధరింపఁ బడునది. మాం లక్ష్మీం లాతీతి వా మాలూరః లాదానే. - సంపద నిచ్చునది.
శ్రీఫలము - మారేడు.
శ్రీప్రదం శ్రీప్రియం వా ఫలమన్యేతి శ్రీఫలః - లక్ష్మీప్రదముగాని, లక్ష్మీప్రియముగాని అయిన ఫలముగలది. ఈ 4 మారేడు చెట్తు పేర్లు.
సధార్మికే వసేద్గ్రామే నవ్యాధి బహుళే భృశం|
నైకః ప్రపద్యే తాధ్వానం నచికం పర్వతేవ సేత్||
తా. ధార్మికులులేని యూరియందును, మిగుల వ్యాధిగల గ్రామము - 1.ఊరు, 2.సమూహము, 3.(సంగీ.)షడ్జాది స్వరము. యందును నుండరాదు, ఒంటరిగా త్రోవ నడువరాదు, కొండ - మల, పర్వతము యందుఁ చిరకాలంబు నివసింపరాదు. - నీతిశాస్త్రము
బిల్వాటవీమధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టాపదామ్భోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్. - 22
గ్రాహి - వెలగ, విణ.1.గ్రహించునది, 2.మలబంధనము కలిగించునది.
వెలఁగ - కపిత్థము.
కపిత్థము - వెలగచెట్టు.
ఒగరు - పచ్చివెలగ, పచ్చిదానిమ్మ కాయలవంటి రుచి, సం.తువరః.
తువరము - వగరు.
అరిష్టము - 1.హింసింపబడనిది, 2.నిరుపద్రవము, వి.1.రాపులుగు, 2.కాకి, 3.వెల్లుల్లి, 4.అశుభము, 5.మరణచిహ్నము, 6.శుభము, 7.పురుటిల్లు, 8.భూకంపము మొ. ఉత్పాతము, 9.రాగి.
రివ్యతేరోగైరి త్యరిష్టః, రిషహింసాయాం. - రోగములచే హింసింపఁబడనిది.
రిష్టం మరణ లక్షణం తదస్యనా స్తీతి అరిష్టః. - (త్వరగా) మరణములేనిది.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
బల మస్యాస్తీతి బలః - బలము గలవాఁడు.
బలు - 1.సమాసమందు బలువు శబ్దమున కేర్పడు రూపము, 2.గొప్పది, 3.బలము కలది.
బలీయము - ఎక్కువ బలము కలది (బలి, బలీయము, బలిష్ఠము).
బలియుఁడు - బలవంతుడు, సం.బలియస్.
బల్లిదుఁడు - మిక్కిలి బలము కలవాడు, సం.బలిష్ఠః.
బల్లిదము - (బలిష్ఠమ్) మిక్కిలి బలము కలది, సం.బలిష్ఠమ్.
బల్లిదురాలు - మిక్కిలి బలముగలది.
బలీయ (మైన) లక్షణము - (జీవ.) శిశువులో ప్రవేశించిన రెండు పరస్పర వ్యత్యాసము గల లక్షణములలో ఒక లక్షణము (తండ్రి నుండి వచ్చినదిగాని, తల్లినుండి వచ్చినదిగాని) మాత్రమే పైకి కనబడునది (Dominan character).
బలము - సత్తువ, సైన్యము.
బలవియోజనము - (భౌతి.) ఒక బలమును రెండు ఘటక బలముల ఫలముగా ప్రదర్శించుట(Resolution of forces).
బలిపుష్ఠము - కాకి.
బలినా పుష్టః బలిపుష్టః పుష పుష్టౌ. - బలిచేఁ బొషింపబడునది.
సకృత్ప్రజా అస్యేతి సకృత్ప్రజః - ఒక్కసారి పిల్లఁగనునది.
బలిప్రసన్నో(అ)భయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః|
ధ్వాంక్షము - 1.కాకి Crow, 2.కొక్కెర.
ధ్వాంక్షతి కాంక్షతి ఆమిషమితి ధ్వాంక్షః, ధ్వాక్షి కాంక్షాయాం. - మాంసమును గాంక్షించునది.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
వాయసము - కాకి Crow.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము.
కాకదంతపరీక్ష - న్యా. వ్యర్థమైనపని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.)
కాక మత్యత్ఖగౌ ధ్వాఙ్క్షౌ -
ధ్వాంక్షశబ్దము కాకికిని, కొక్కెరకును పేరు. ధ్వాంక్షతి మాంసమితిధ్వాంక్షః - ధ్వాక్షి కాక్షాయాం. - మాంసము నిచ్చయించునది. "ధ్వాంక్షౌ తు బక వాయసా" విత్యమరమాలా.
కొక్కెర - కొక్కరాయి.
కొక్కరాయి - కొంగ, బకము, రూ.కొక్కెర, కొక్కెరాయి.
కొంగ - బకము, సం.క్రుఙ్.
కృకణ క్రకరౌ సమౌ,
కృ ఇతి క్వనతి సభ్దాయతే కృకణః, కణ శబ్దే. - కృ అనుధ్వనిఁ జేయునది.
కృకం శిరోగ్రం పార్శ్వ కండూయనాయ నయతీతి కృకణః, ణీఞ్ ప్రాపణే. - శిరోగ్రమును పార్శ్వ కండూయనము కొఱకు పొందించునది.
క్ర ఇతి శబ్దం కరోతీతి క్రకరః, డుకృఞ్ కరణే. క్ర యనెడు శబ్దము జేయునది. ఈ 2 కొక్కెర పేర్లు.
కక్కెర - కొంగ, సం.క్రకరః.
క్రకరము - 1.రంపము, 2.కక్కెర పక్షి, 3.వెణుతురు చెట్టు.
క్రకచము - రంపము; ఱంపము - క్రకచము, పలకలులోనగు వానిని కోసెడు సాధనము.
కరపత్రము - 1.క్రకచము, రంపము, 2.జలక్రీడ, 3.ప్రకటన పత్రము.
క్రకచవత్ - (వృక్ష.) రంపపు పండ్లు వలెనున్న, రంపగరివలె నున్న (Serrated).
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి(ఇంద్రనీలము - నీలమణి), 3.రంపము.
విద్య లేనివాడు విద్యాధికుల చెంత
నుండినత పండితుండు కాడు
కొలని హంసలకడఁ గొక్కెర యున్నట్లు విశ్వ.
తా. ఓ వేమా! విద్యలేనివాడు పండితులతో కలిసి తిరుగుచున్నను పండితుడు కాలేడు. హంసలు(హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.) వుండుకొలనులో కొంగ కూడ వుండును. కాని, అంతమాత్రమునకు ఆ కొంగ హంస కాలేదు కదా.
కోయష్ఠికము - చీకుకొక్కెర, గ్రుడ్డి కొంగ.
ఓకసా స్థానే యజతే సంగచ్ఛతే కోయష్టికః, యజ దేవపూజాదౌ. - స్థానముతో సంగతమై యుండునది.
కోయ - ఒకజాతి బోయ.
చీఁకు - క్రి.1.చప్పరించు, 2.చుంబించు, వి.అంధత్వము, విణ.అంధుడు.
చీఁకురించు - క్రి.అంధమగు.
ౘప్పరించు - క్రి.చవిచూచు.
ముద్దయ్య - (ముద్దు+అయ్య) కుమారస్వామి.
ముద్దు - 1.ప్రేమము, ఆదరము, 2.మనోజ్ఞత, 3.చుంబనము.
చుంబనము - ముద్దు.
చుంబించు - క్రి.ముద్దిడుకొను.
ముద్దాడు - క్రి.చుంబనాది పూర్వకముగా లాలనచేయు, ఆదరించు.
ముద్దువాడు - ఏమియు తెలియనివాడు, సం.ముగ్ధః.
కొమరసామి - స్కందుడు.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొ మ రు ద న ము) కొ మ రు ప్రాయము=యౌవనము).
దాన పరోపకార గుణధన్యత చిత్తములోన నెప్పుడున్
లేని వివేకశూన్యునకు లేములు వచ్చిన నేమి? సంపదల్
పూనిననేమి? నొక్కసరిపోలును, చీకున కర్ధ రాత్రియం
దైన నదే మి పట్టపగలైన నదేమియులేదు! భాస్కరా.
తా. గ్రుడ్డివానికి పగలైనను, పట్టపగలు -(పగలు+పగలు) మట్ట మధ్యాన్నము యైన, రాత్రి(సరిప్రొద్దు - అర్ధ రాత్రము)యైనను ఒకటే. అట్లే దానపరోపకారమను గుణధన్యత(ధన్య - దాది, విణ.ధన్యురాలు)మనస్సులో లేని వానికి భాగ్యము(సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.)భాగ్యము కలుగినను దరిద్రము(లేమి - దారిద్ర్యము, లేమిడి, ఉండమి.)సంభవించినను ఒకటే.
అంథిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
అంధుఁడు - 1.గ్రుడ్డివాడు, 2.వివేకము లేనివాడు, వి.బాహ్యదృష్టి లేని సన్న్యాసి.
కాననివాఁడు - గ్రుడ్డి, అంధుడు.
గ్రుడ్డి - అంధుడు (రాలు), చూడశక్తి లేనిది (వాడు).
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గుడ్డివాడు, 3.మంచి కన్నులు కలవాడు.
అంధము - చీకటి; విణ.గ్రుడ్డిది.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.
అన్ధం తమస్యపి,
అంధశబ్దము అంధకారమునకును పేరగునపుడు న. అపిశబ్దము వలన గ్రుడ్డివానికిఁ బేరగునపుడు త్రి, అన్ధయతీ త్యన్ధం, అన్ధ దుష్ట్ట్యపసంహారే. - కానరాకుండఁ జేయునదియు, కానరానివాఁడును అంధము, అంధుఁడును.
గ్రుడ్డు - 1.కనుగ్రుడ్డు, 2.పక్షుల అండము, విణ.గ్రుడ్డితనము.
గ్రుడ్డిచుక్క - (గృహ.) కన్నుగ్రుడ్డులో రెటీనాకు వెనుకభాగమున దృష్టినరము బయలుదేరు చోటనున్న చుక్క (చూచిన వస్తువునీడ ఈ చుక్కపైబడిన దృష్టి కనిపించదు)(Blind spot).
అంధబిందువు - (జం.) 1.గ్రుడ్దిచుక్క, 2.కంటిపూవు, 3.కంటియొక్క మూర్తిపటములో అక్షనాడి ప్రవేశించు చోటు (Blind spot). అంధ్యము - గ్రుడ్డితనము, అంధత్వము.
ప్రతిబంధము చేయు వ్యాధులు - (గృహ.) వ్యాధులు రాకుండ తప్పించుట, ఆహారలోపము వలన కలుగు వ్యాధులు రాకుండ తప్పించుకొనుట (Preventable diseases), ఉదా. (Deficienc diseases) ఎఱ్ఱనాలుక, కండ్లజబ్బు మొదలగునవి.
గ్రుడ్డుకానుపు - 1.పాము, 2.పిట్ట, పక్షి.
కాయకంటి - కుబేరుడు.
కాయకన్ను - కాయకాచిన కన్ను.
కాయ - 1.చెట్టున కాయకాచు, 2.కఠినవస్తు స్పర్శచే హస్తాదులందు కలుగు కాయ, 5.కంటి తెవులు.
పటోలి - 1.పొట్ల తీగ, 2.కాయ.
ఐర - కంటె తెవులు, నేత్రరోగము, రూ.అయిర.
అర్భుదము - 1.పదికోట్లు, 2.(గృహ.) కొరకుపుండు (Cancer), 3.నేత్రవ్యాధి, 4.హానికరమైనగ్రంధి, మాంసార్భుదము, విణ.పదికోట్ల సంఖ్యగలది, 2.కఠినము.
ఐరిస్ - (జం.) (Iris) కనుపాపలో దృష్టిని క్రమపరచు భాగము.
కాయజుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం, మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
కాయకము - బ్రదుకు, జీవనము.
గ్రుడ్డివాటు - (గ్రుడ్డి+పాటు) దైవము వలన కలిగినది.
దైవికము - దైవము వలన కలిగినది.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత మగుటవలన కానఁబడనిది. వహ్నితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆది శబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాంగల్యము.
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి గలవాడు, 2.గ్రుడ్డివాడు, 3.మంచికన్నులు కలవాడు.
బాహ్యపటలము - (గృహ.) కన్ను గ్రుడ్దునకు పైపొర (Scierotic layer).
బాహ్యత్వజాడ్యము - (గృహ.) కాచబింబము మెత్తనగు వ్యాధి, ఆహారములో వైటమిన్ "A", తక్కువైన ఈ వ్యాధి కలుగును.
నేత్రశుక్లము - (జం.) కంటి గ్రుడ్డు యొక్క కాచబింబముతో కలిసియుండు పలుచని అధిచ్ఛదపు పొర (Conjuctive).
నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'ఆ' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి, (Kerophthalimia) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డి యగును).
కాచబింబము - (జం.) కంటి గ్రుడ్డులోని ఎదుటి భాగము, (ఇది కొంచెము ఉబ్బెత్తుగా ఉన్న స్వచ్ఛమైన పొర) (Cornea).
తనకు నదృష్టరేఖ విశదంబుఁగ గలిగినఁగాని లేనిచో
జనునకు నెయ్యెడన్ బరులసంపదవల్ల ఫలంబులేదుగా
కదుఁగవ లెస్సగాఁ దెలివిఁ గల్గినవారికిఁగాక, గ్రుడ్డికిన్
గనుపడునెట్లు వెన్నెలలుగాయఁగ నందొక రూపు, భాస్కరా.
తా. వెన్నెల(కాయు - క్రి.వెన్నెల ఎండ మొ.వి ప్రకాశించు.)ప్రాకాశించునప్పుడు రెండు కండ్లకు దృష్టి సరిగా నున్న వారికి అందలి వినోద సందర్భమున కనువుగా నుండినచో నతనికే లాభము. కాని వెన్నెల(చంద్రతాపము - వెన్నెల)యొక్క స్వరూపమైనను గనుగొనలేని గ్రుడ్దివానికేమి లాభము? తన కదృష్టరేఖ కల్గినచో లాభముండు నుగాని, తనకాయదృష్ట రేఖ లేకపోయి నచో పరుల సంపద తన కెట్లబ్బును ? అబ్బదు అంచుచే లాభము లేదు.
ఆత్మఘోషము - 1.కాకి, 2.కోడి, 3.ఆత్మస్తుతి.
ఆత్మానమేవ ఘోషతికాకేతి ఆత్మఘోషః - కా కా అని తన పేరును బలుకునది.
వికత్తనము - ఆత్మస్తుతి.
అహం కేంద్రకత - తన్నుతాను పొగడుకొనుట, ఆత్మస్తుతి (Egocentra- lism).
ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
శృణ్వంతి శ్రోణా - మమృతస్య గోపామ్ | పుణ్యామస్యా ఉపశృణోమి వాచమ్ | మహీం దేవీం విష్ణుపత్నీ- మజూర్యామ్ | ప్రతీచీ మేనాగ్ం హవిషా యజామః | త్రేధా విష్ణు - రురుగాయో విచక్రమే | మహీం దివం పృథివీ - మంతరిక్షమ్ | తచ్ఛ్రోణైతి శ్రవ - ఇచ్ఛమానా | పుణ్యగ్గ్ శ్లోకం యజమానాయ కృణ్వతీ ||22||
మహి - పుడమి, భూమి.
మహ్యతే మహీ. ఈ. సీ. పా. మహిః. ఇ. సీ. మహ పూజాయాం. - పూజింపఁబడునది.
పుడమి - భూమి, సం.పృథ్వీ.
పుడమికానుపు - 1.సీత, 2.చెట్టు.
పుడమితాలుపు - శేషుడు, వ్యు. భూమిని ధరించువాడు.
మహిళ - స్త్రీ.
మహ్యత ఇతి మహిళా, మహపూజాయాం. - ఆదరింపఁ బడునది.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
పూచిన పువ్వులు అన్నీకాయలే అయితే పుడమి భరించగలదా ?
సూక్ష్మో పి భారం నృపతే స్యందవో వై
శక్తో వోఢుం న తథాన్యే మహీజాః|
ఏవం యుకత భారసహా భవంతి
మహాకులీనా న తథా న్యే మనుష్యాః||
తా. రథం చిన్నదయినా పెద్ద బరువు మోస్తుంది. కాని చెట్లు అలా మోయలేవు. అలాగే(కులీనత - మంచి కులమున పుట్టుట.)మహాకుల సంజాతుల యిన వారు పెద్దభారం సహింపగలరు. అలా ఇతరులు మోయలేరు.
మహీజా కుచ్చ సంలగ్న కుంకుమారుణ వక్షసె,
నమః కల్యాణరూపాయ రామా.….
మాహేయి - గోవు.
మాహాగౌః, తస్యా అపత్యం మాహేయీ, ఈ. సీ. - మాహయనఁగా ఆవు, దానికి పుట్టినది.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
మహ్యాః సుతః మహీసుతః - భూమికొడుకు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
కుజము - చెట్టు, వ్యు.భూమినుండి పుట్టినది.
కుధరము - కొండ.
మహీరుహము - వృక్షము.
మహ్యాం రోహతీతి మహీరుహః, రుహబీజజన్మని ప్రాదుర్భావేచ. - భూమియందు మొలచునది. వృక్షము - చెట్టు, సం.(వృక్షః) చాలా ఎత్తుగా, లావైన కాండము, ఎక్కువ దారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree).
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
గుల్మము - 1.గుల్మరోగము (ప్లీహము పెద్దదగు రోగము), 2.ప్లీహము ఎడమ ప్రక్కనుండు పచ్చని మాంస ఖండము, 3.పొద, 4.బోదెలేనిచెట్టు, 5.పురాభిముఖ రాజ మార్గము, 6.9ఏనుగులు, 27గుఱ్ఱములు, 45పదాతులు, 9రథములు గల సేన, 7.పల్లెయందలిఠాణా.
ప్లీహము - హృదయమున ఎడమ ప్రక్క నుండు మాంసగోళము, సం.వి.(జీవ.) అధరాంత్రము వెనుక భాగమున నుండు ఎఱ్ఱని గోళాకారపు గ్రంథి (Spleen).
గుల్ముఁడు - సైనికుడు (గుల్మము = సేన-అందుండు వాడు.)
సైనికుఁడు - సేనాపతి, విణ.సేనలోనివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
మహాసేనుఁడు - కుమారస్వామి.
మహేంద్రము - కుల పర్వతములలో ఒకటి.
మహీం కీలభూతో ధరతీతి మహీద్రః. దృఞ్ ధరణే. - భూమిని చీలవలె నుండి ధరించునది.
చెట్టుఁద్రిమ్మరి - కోతి, వృక్షచరము.
కోఁతి - వానరము, రూ.క్రోఁతి.
క్రోఁతి - వానరము, రూ.కోతి.
వానరము - కోతి.
కోఁతికొమ్మచ్చి - ఒకవిధమగు బాలక్రీడ.
మహీం మూలాధరే - కమపి మణిపూరే హుతవహం
స్థితం స్వాధిష్ఠానే - హృది మరుత మాకాశ ముపరి
మనో పి భ్రూమధే - సకల మపి భిత్త్వా కులపధం
సహస్రారే పద్మే - సహ రహసి పత్యా విహరసే. - 9శ్లో
తా. ఓ పరాశక్తీ! మూలాధార చక్రమందు భూతత్త్వమును, స్వాధిష్ఠాన చక్రమందు(హుతవహుఁడు - అగ్ని.)అగ్నితత్త్వమును, మణిపూర చక్రమందు జల తత్త్వమును, అనాహత చక్రమందు(మరుత్తు - వేలుపు, గాలి.)వాయు తత్త్వమును, దానిపై నున్న విశుద్ధ చక్రమం దా(ఆ)కాశ తత్త్వమును, ఆగ్నేయ చక్రమందు మనస్తత్త్వమును వీడి, సమస్తమైన సుషుమ్నా మార్గమును భేదించి సహస్రార పద్మమందు ఏకాంతమున, భర్తతో విహరించుచున్నవు. - సౌందర్యలహరి
విశేషము:- లింగ స్థానమందు(స్త్రీ పురుష భేదము) స్వాధిస్థాన చక్రము, నాభియందు మణిపూర చక్రము, హృదయమందు అనాహత చక్రము, అనాహత చక్రమునకు పై భాగమున విశుద్ధ చక్రము, భ్రూ మధ్యమందు ఆగ్నేయ చక్రము నున్నదని యెఱునునది.
దేహస్థషట్చక్రదేవీ దహరాకాశమధ్యగః,
యోగినీగుణసంసేవ్యా భృంగ్యాదిప్రమథా వృతః|
భూ - భూమి; భువి - 1.భూమి, 2.స్థానము.
భూమిక - 1.మారువేషము, 2.రచన.
బూమియ - 1.మారువేషము, 2.మాయ, వంచన, సం.1.భూమికా, 2.భ్రామకః.
వేషము - వేసము, వస్త్రభూషణాద్యలంకారము, మారువేషము.
వేడబము - వేషము, మాయ, వంచన, సం.విడంబః.
విడంబనము - 1.అనుకరించుట(అనుకరించుట - ఒకరు చేసినట్లు చేయుట), 2.వేడబము, మోసపుచ్చుట.
వాలకము - 1.రూపు, 2.వంచన(వంచన - మోసము), 3.వేషము.
రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచెష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
ప్రతిభా విశేషము - (గృహ.)వ్యక్తిత్వము, ఆకారము Personality).
రచన - నిర్మాణము, రచనము, సం.వి. (రసా.) పరమాణువుల స్వభావము, సంఖ్యయేకాక, అవి యౌగికమందు అమరియున్న తీరును తెలుపు విన్యాసము, (Contitution), సం.వి. (భౌతి.) ఒక వస్తువు యొక్క అవయవ విన్యాసము, (Structure), సం.వి. (రసా.) యౌగికముల విషయములో రచన యనగా వాని ఘటకాంగ విన్యాసము, (Structure).
రచనాత్మకము - (రసా.) రచనా సంబంధమైనది (Structural).
నిర్మణాత్మకము - (గృహ.) కట్టడము సంబంధమైనది (Structural).
నిర్మాణము - (గణి.) నిరూపణకు సహాయపడు నిర్మాణము (Construction) సం.వి. (రసా.) వస్తువులను, పారిశ్రామికముగా తయారుచేయుటకు (Manufacture), సం.వి.1.నిర్మితి, 2.యోగ్యత.
నిర్మితి - నిర్మాణము, సృష్టి.
సృష్తి - 1.సృజించుట, 2.ప్రకృతి, 3.స్వభావము.
నిర్మాత - నిర్మించువాడు, రూ.నిర్మాయి.
ఉపయోజనము - (జీవ.) నిర్మాణము నందును, శరీర ధర్మముల యందును ప్రాణి ఒక ప్రత్యేక పర్యావరణమునకు తగియుండు క్రమము (Adaptation).
కూపారము - కడలి, సముద్రము.
కడలి - సముద్రము; వనధి - కడలి.
కడలికాలువ - సముద్రపుపాయ.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలిమీఁగడముద్ద - చందమామ Moon.
కడలివెన్న - 1.చంద్రుడు, 2.అమృతము.
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పా ల క డ లి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
కడలిరేఁడు - వరుణుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.
కూపకము - (జం.) పొత్తికడుపు చుట్టునుండు అస్థిపంజరము (Pelvis).
కూపకాస్తు విదారకాః,
కూపకము - 1బెజ్జము, 2.నూయి, 3.చెలమ, 4.ఓడకంబము, 5.రంధ్రము.
స్వల్పాః కూపాః కూపకాః, అ. పు. - అల్పమైన నూతులు.
సుషిరము - 1.బెజ్జము, బెజ్జములు గల పిల్లనగ్రోవి, మొదలగు వాద్యము.
సుషి - బెజ్జము.
నుయి - బావి, రూ.నుయ్యి, నూయి.
బావి - 1.నుయ్యి, 2.దొరవు, 3.చెడువు.
విదారకము - చెలమ, పిల్ల నూయి, సం.విణ.చీల్చునది.
విదార్యంతే విదారకాః, అ. పు. దౄ విదారనే. - త్రొవ్వఁబడునది. ఈ 2 చెలమలు పిల్లనూతులు మొదలైనవాని పేర్లు.
చెలమ - 1.నీటి కొరకు యిసుకలో త్రవ్విన పల్లము, 2.కూపకము.
దొరవి - కొలను, రూ.దొరవు.
దొరవు - 1.నడ బావి, 2.కొలను, రూ.దొరవి.
సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.
సంద్రుఁడు - సముద్రుడు, సం.సముద్రః.
సంద్రము - సందరము, సం.సముద్రః.
సందరము - సముద్రము, మున్నీరు, రూ.సంద్రము, సం.సముద్రః.
మున్నీరు - (మును+నీరు) సముద్రము.
మున్నీటిచూలి - క్షిరసాగర కన్యక, లక్ష్మి.
క్షీరాబ్ధేస్తనయా క్షీరాబ్ధితనయా – పాలకడలి కూఁతురు. రమత ఇతి రమా - క్రీడించునది, రము క్రీడాయామ్.
సముద్ర మథనే లేభే హరిర్లక్ష్మీం హరోవిషమ్|
భాగ్యం ఫలతి సర్వత్రన విద్యానచ పౌరుషమ్||
తా. సముద్రమును మధించినపుడు విష్ణువు(హరి) లక్ష్మీదేవిని, హరుఁడు - శివుడు విషంబును (బొ)పొందిరి. గాన వారివారి భాగ్యాసు సారముగా ఫలంబు గలుగును. - నీతిశాస్త్రము
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)
పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే,
ఇందిరేందిందిరాభాక్షీ క్షీరసాగర కన్యకే|
అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.
ఆపః ధీయంతే అస్మిన్నిత్యబ్ధిః. ఇ. పు. డుధాఞ్ ధారణపోషణయోః - జలములు దీనియందు ధరింపఁబడును.
అబ్ధిభవే త్రిషు సముద్రియమ్,
సముద్రే భవం సముద్రియం. అ. త్రి. సముద్రమునందుఁ బుట్టినది.
సముద్రియా ఆప; సముద్రియా ముక్తామణి; సముద్రియం లవణం. అని మూఁడు లింగములయందును వర్తించును. ఈ ఒకటి సముద్రమునఁ బుట్టిన వస్తువు పేరు.
అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.
అబ్దిపల్లవము - పగడము.
అబ్దిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.
అకూపారము - మేరలేనిది, 1.సముద్రము, 2.ఆదికూర్మము.
మర్యాదయా న కుం పృథివీం పృణాతీత్యకూపారః. వౄ పాలన పూరనయోః - మర్యాదచేతను భూమిని నింపనిది.
అకుత్సితం పారమన్య అకూపారః - కుత్సితముగాని దరిగలిగినది.
అవిద్యమానా కుః పృథ్వీ పారే (అ)స్యేతి వా అకూపారః - దీని అవలి దరియందు భూమి లేదు.
నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జన సమూహము(జనత -జనసమూహము)స్థానముగా గలవాడు.
నారాయణః నరన్యేదంనారం అవతారేషు నారం వపురయత ఇతి నారాయణః - నరసంబంధమైన శరీరము నారము. అవతారములయందు నర శరీరమును బొందినవాడు.
నారము - 1.నరసమూహము 2.నీళ్ళు(నీరు). అయగతౌ. నారా ఆపః అయనం స్థానం యస్యసః - నారమనగా జలము అది స్థానముగా గలవాడు.
నరసమూహో నారం తస్యయనమితి వా, తదయ నమన్యేతివా - నర సమూహమునకు స్థానమయిన వాడు. లేక నర సమూహము నివాసముగా గలవాడు.
రాశ్శబాః అయంతే నిర్గచ్ఛంతే యస్మా త్సనారాయణః. రాయణాదన్యః అరాయణః అరాయణోనభవతీతి నారాయణః - శబ్దగమ్య ఇత్యర్థః - ఎవనివలన శబ్దములు బయలు వెడలుచున్నవో అతడు రాయణుడు. రాయణుడు గానివాడు అరాయణుడు. అరాయణుడు గానివాడు నారాయణుడు. అనగా శబ్దగమ్యుడనుట. రైశబ్దే.
నాల్గవ(4వ) పరి ధర్మభార్యా సర్గంబునందు నరనారాయణాభి ధానుండై దుష్క్రంబైన తపంబు సేసె; నాలుగో(4వ) అవతారంలో ధర్ముడను(ధర్ముఁడు - 1.యముడు, 2.సోమయాజి.)అను వానికి మూర్తి(మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.)యందు నరనారాయణులనే ఋషుల రూపము లను దాల్చి స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం మనస్సు యొక్క పూర్ణమగు నిగ్రహముతో కూడిన అపారమైన తపస్సు చేసాడు.
మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.మూర్ఛతి సముచ్ఛ్రితో భవతీతి మూర్తిః, సీ, మూర్ఛా మోహనముచ్ఛ్రాయయోః. - ఉన్నత మగునది.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదుల చెక్కు శిల్పవిద్య(Sculpture).
నారాయణం తను త్యాగే.....
నీరు అంతా నారాయణ స్వరూపమే. కాని అన్ని రకాల నీళ్ళని మనం త్రాగడానికి వాడలేము కదా! ఒక రకం నీళ్ళు కాళ్ళు కడుకుకొనడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరొక రకం నీరు స్నానానికి ఉపయోగ పడుతుంది. అదే విధంగా భగవంతుడు అంతటా ఉన్నప్పటికీ అన్ని చోట్లకు మనం వెళ్ళకూడదు. కొన్ని ప్రదేశాలే చూడదగినవిగా ఉంటాయి. కొన్ని ప్రదేశాలు, మనం వాటి దగ్గరకు పోవడానికి కూడా వీలులేనివిగా ఉంటాయి. - శ్రీరామకృష్ణ పరమహంస
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది. సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి|
నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70
పారావారము - 1.ఈవలిదరులు, 2.సముద్రము.
పారమావృణోతి పారావారః వృఞ్ వరనే. - దరిని గప్పునది, అనఁగాఁ దరిలేని దనుట.
పా. పార మపారమస్య పారావారః. - అపారమైన తీరము గలిగినది.
"సతమాస్సత మాలతయా పారాపారాయ యస్సదా వోదావ" ఇతి హరి ప్రబోధే సందిష్టయమకం.
పారావారే పరార్వాచీ తీరే -
పరంచ అర్వాక్చ పరార్వాచీ, తే తీరే పారావారే ఇత్యుచ్యేతే. - పార అవారశబ్దములు వరుసగా, ఈవలిదరికిని ఆవలిదరికిని పేర్లు.
పారము - 1.అవతలిదరి, 2.సమీపము.
పార్యతే తరణకర్మాత్ర పారం - దీనియందు దాఁటెడు వ్యాపారము ముగియును.
న విద్యతే వాః జల మత్ర అవారం - దీనియందు జలము లేదు. పా. అపారమిత్యపి పారముగానిది అపారము.
అవారి - 1.అధికము, 2.అడ్దులేనిది, రూ.అవ్వారి, సం.అపారమ్.
అవ్వారి - అవారి.
కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ|
సదేశము - సమీపము.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
తవస్తన్యం మన్యే - ధరణిధరకన్యే! హృదయతః
పయఃపారావారః - పరివహతి సారస్వత మివ|
దయావత్యాదత్తం - ద్రవిడశిశు రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా - మజని కమనీయః కవయితా|| - 75శ్లో
తా. ఓ పర్వతపుత్రీ! తల్లీ! కారుణ్యముతో నీచే ఇయ్యబడిన క్షీరాలను త్రావి యీ ద్రవిడ శిశువు(శ్రీ శంకర భగత్పాదులు)ఇంపగు కవిత్వము (కమనీయము-మనోహరమైనది)చెప్పెను. కారుణ్యముతో నీచే ఇయ్యబడిన క్షీరాలను త్రావి యీ ద్రవిడ శిశువు(శ్రీ శంకర భగత్పాదులు) ప్రౌఢ కవులతో జగన్మోహనుడై కవిగా నెట్లయ్యెను? నీ స్తన్యము హృదయము నుండి క్షీరసముద్రము వలె సారస్వతము- సరస్వతీ సంబంధమైనది, వి.1.వాఙ్మయము, 2.భాష.)విశేషంగా ప్రవహింప చేయుచున్నది. - సౌందర్యలహరి
కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం స పతతి శోకే |
పారావారవిహారిణి గఙ్గే విముఖయువతి కృత తరళాపాఙ్గే ||
కథా పారావార స్సజల జలద శ్రేణి రుచిరో
రమా వాణీ సౌమ స్ఫుర దమల పద్మోభవ ముఖైః
సురేంద్రై రారాధ్యః శ్రుతిగణ శిఖా గీత చరితో
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే|
జక్కరరాయఁడు - సముద్రుడు, సరిత్పతి.
ౙక్కర - నది.
సరిస్పతి - సముద్రుడు.
సరితాంపతిః సరిత్పతిః, ఈ. పు. - నదులకుఁ బ్రభువు.
ఏటిఱేఁడు - (ఏరు + ఱేఁడు) సముద్రుడు, సరిస్పతి.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
అథ నదీ సరిత్,
తరఙ్గిణీ శైవలినీ హ్రాదినీ ధునీ,
స్రోతస్వినీ ద్వీపవతీ స్రవన్తీ నిమ్నగాపగా -
(కూలంకకషా నిర్ఝరిణీ రోధోవక్రా సరస్వతీ)
సరిత్తు - నది.
సరితో న్యాశ్చ -
అన్యాశ్చ - ఇతరములైన కృష్ణ, వేణి, గోదావరి, సరయువు మొదలైన వియు సరిత్తు లనంబడును.
నదీమాతృకము - ఏటి నీటిచే పండెడు భూమి.
నద్యంబూని చ వృష్ట్యంబూని చ తైస్సంపన్నాశ్చ తే వ్రీహయస్చ తైః పాలితః, నీ మాతస్య నదీమాతృకః - నదియే తల్లిగాఁగలది.
నదీగర్భము - (భాగో.) 1.నీటిలో గల నద్యంతర్భాగము, 2.నది లేక సరస్సు యొక్క నీటి స్థావరము, 2.నది లోపల రాళ్ళతో కూడిన భాగములను స్పష్టముగా తెలుపు స్థలము.
నదీపరివాహ ప్రదేశము - (భూగో.) నది యొక్క నీరు పోవు స్థలము, (ద్రోణీ) (River basin).
నదీపోషక ప్రదేశము - (భూగో.) ఒక నది వలన దాని (యు)ఉపనదుల వలన పోషింపబడు ప్రాంతము (River basin).
నీటిఱేఁడు - 1.వరుణుఁడు, 2.సముద్రుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.
వరణ - కాశీనగరమునకు త్తరమున గల ఏఱు.
ప్రచేతా వరుణః పాశీ యాదసాంపతి రప్పతిః,
ప్రచేతసుఁడు - వాల్మీకిముని తండ్రి, విణ. గొప్పమనస్సు గలవాడు.
ప్రకృష్టం చేతః యస్య సః ప్రచేతాః స-పు. - మంచి మనస్సు గలవాఁడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
వృణోతి వరా నముం లోక ఇతి వరుణః వృఙ్ వరణే. - జనము ఇతనిని వరము లడుగుచున్నది.
వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమః.
నీరధి - సముద్రము.
సరో నీరే తటాకే చేతి రుద్రః, తద్యోగాత్సరస్వాన్ త, పు. - సరస్సనఁగా నుదకము అది గలిగినది. నీరదము - మేఘము; మేఘము - మబ్బు.
మేహమీతి మేఘః, మిహ సేచనే - తడుపునది.
నీరుమోపరి - 1.కడవ, 2.మేఘము, మబ్బు.
నవనీరదసంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ|
నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.
లోకత్రయోద్వేగకర కుంభకర్ణ శిరశ్ఛిదే
నమో నీరదదేహాయ రామా.....
నీరము - జలము.
నిమ్నమీర్తే నీరం, ఈరగతౌ. - పల్లమును బొందునది.
నయతి సుఖమితి నీరం. నీఞ్ ప్రాపణే. - సుఖమును బొందునది.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువులకెల్లన్
నారే నరులకు రత్నము
చీరే శృంగారముండ్రు సిద్ధము సుమతీ.
తా|| సమస్త జీవులకు నీరే ముఖ్యాదారం, సంభాషణకు నోరే కేంద్రం మానవులకు, స్త్రీ(నారి - అల్లెత్రాడు, వై.వి.నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.)రత్నమువంటిది, చీరయే స్త్రీకి అలంకారం.
నీరమునకుఁ బాలునకును దారి నీవు
కలుపఁగా విడఁదీయఁగాఁ గర్త వీవు
హంస సోహమ్మునందు మాహాత్మ్యమూను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
పాశ్చాత్యుఁడు - 1.పడమటివాడు, 2.వరుణుడు.
పాశి - 1.వరుణుడు, 2.యముడు.
వృణోతి అరీ న్ పాశైరితి వా వరుణః - పాశముల పాశము - త్రాడు)చేత శత్రువులఁ గట్టువాడు.
పాశము బంధ హేతువు(కారణము), పాశో స్యాస్తీతి పాశీ. న. పు. - పాశము ఆయుధముగాఁ గలవాఁడు.
పాశికుఁడు - పిట్టల వేటకాడు.
పాక్షికుఁడు - పిట్టలవేటకాడు.
నాగపాశము - వరుణుని ఆయుధము.
యముఁడు - 1.కాలుడు, 2.శని Saturn, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - న వ గ్ర హ ము ల లో ఏడవ గ్రహము (Saturn)
జంబుకుఁడు - 1.వరుణుడు, 2.నీచుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కున కథిపతి, 2.నీటిఱేడు.
నీచుఁడు - అధముడు, రూ.నీచు.
నికర్షమఙ్చతీతి నీచః, అంచు గతి పూజనయోః - తక్కువను బొందినవాఁడు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు.
అల్పుఁడు - నీచుడు; కొంచెకాడు - అల్పుడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.
ఉద్దముఁడు - 1.స్వతంత్రుడు, 2.భయంకరుడు, 3.అధికుడు, వి. వరుణుడు.
స్వతంత్రుఁడు - ఒకరిపై ఆధారపడకుండ నుండువాడు, తన్నుతాను పోషించు కొనువాడు.
అధికుఁడు - గొప్పవాడు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|
వినిఘ్నతి త్వయథ జంబుకౌఘం సనామకత్వాద్వరుణస్తదానీమ్ |
భయాకులో జంబుకనామధేయం శ్రుతిప్రసిద్ధం వ్యధితేతి మన్యే ||
తా. వరుణుడు వేదములయందు జంబుక నామధేయుడుగా ప్రసిద్ధుడు. కనుక నీవు జంబుకము(నక్క)ల రూపమున ఉన్న రాక్షసులను సంహరించుచుండుట చూచి 'జంబుక 'అను పేరు కల వరుణునకు కూడ భయము కలిగినది. ఆ భయముచేతనే తనయొక్క జంబుక నామ ధేయమును అతడు వేదములయందు మాత్రమే ప్రసిద్ధము చేసికొనెను, అని నేనందుకొందును. - నారాయణీయము
జంబుకము - నక్క.
జమతి మాంసమత్తీతి జంబుకః, జము అదనే. - మాంసమును భక్షించునది.
జమ్బుక క్రోష్టు వరుణౌ
జంబుశబ్దము నక్కకును, వరుణదేవునికిని పేరు. జమతీతి జంబుకః, జము అదనే. - భక్షించునది.
దుష్టుల హింసించువాఁడు గనుక జంబుకము, జంబుకుండును.
క్రోష్టువు - నక్క.
క్రోశతి క్రోష్టుః, ఉ. పు. క్రోష్టా, ఋ క్రుశ ఆహ్వానే రోదనేచ. మొఱుఁగునది.
కయ్యాలమెకము - జంబుకము.
నరియఁడు - నక్క.
నక్క - జంబుకము, క్షుద్రము.
క్షుద్రము - కొంచెము, స్వల్పము.
నాక్రము - నక్రముఖమువంటి ముఖము గల నక్క.
చిలువాయనము - 1.చిల్లర, 2.క్షుద్రము.
చిల్లర - 1.కొంచెపాటినాణెము, 2.చింతపండు మొదలగు సరకు, విణ.సామాన్యము.
ఘోరము - భయంకరము, సం.వి.నక్క, కుంకుమపువ్వు.
ఊళమెకము - నక్క, జంబుకము.
ఊళ - 1.నక్కకూత, 2.ఈల.
ఈల - 1.తస్కరాదుల సంకేతధ్వని, 2.సముద్రప్రాంతపు నేలను అంటిమొలచెడు ఉప్పనిరుచి గలకూర, ఈలకూర, 3.చిమ్మట కూత, 4.సిగ్గు.
ఈలకూతలు - బాలక్రీడలలో ఒకటి.
నక్కకూత దానిపిల్లలకే చేటుదెచ్చును. నక్కపిల్లకు అరవడం నేర్పక్కర లేదు.
ఈలగ్రద్ధ - ఈల వేసెడు డేగ, ఒకజాతి డేగ, విణ.లోభి.
ఈలకరచు - క్రి.ప్రాణములు బిగపట్టు, రూ.ఇలకరచు.
ఇలకఱచు - క్రి.1.పండ్లుబిగించు, 2.ప్రాణము బిగబట్టు.
గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు.
గౌతమః గౌతమస్య శిష్యాశ్శాక్యా గౌతమా ఇత్యుచ్యతే, తద్వంశావతీర్థత్వా ద్బుద్ధో (అ)పి - గౌతమముని శిష్యులు గనుక శాక్యులు గౌతములు, ఆ వంశమందుఁ బుట్టినవాఁడు. గౌతమముని సంపూజిత రామ్|
గోదవరి - గౌతమినది. గౌతమముని భార్య, అహల్య. శ్రీమ దహల్యోద్ధార్క రామ్|
గోదారి - 1.వెన్నకాచిన మడ్డి, 2.గోదవరి. గోదావరి యందు దేవీస్థానం త్రిసంధ్య|
ధార - 1.నీటిచాలు, 2.ఆయుధముల వాదర, 3.చిల్లి, 4.అశ్వగతి విశేషము, 5.ప్రవాహము, 6.పరంపర.
దార - 1.ధార, 2.నీటిచాలు, 3.దానము, 4.క్రమము, సం.ధారా.
దార - భార్య.
భార్య - అగ్నిసాక్షిగ పరిణ్యమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
క్రూరమనస్కులౌ పతులఁగొల్చివసించిన మంచి వారికిన్
వారిగుణంబుపట్టి చెడువర్తనవాటిలుఁ, మాధురీ జలో
ధారలు గౌతమీముఖమాహానదు లంబుధిఁ గూడినంతనే
క్షారముఁజెందవే మొదలి కట్టడలన్నియుఁదప్పి భాస్కరా.
తా. గోదావరీ మొదలగు మహా నదులలోని తియ్యని నీళ్ళు అంబుధి - సముద్రమున కలసి నంతనే, వాని మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు. తీయదనమును పోగొట్టుకొని ఉప్ప దనమునే పొందును. అట్లే దుర్మార్గులగు యజమానులను సేవించు వారికి వారి దుర్మార్గతయే పట్టుబడును.
క్షారము - 1.గాజు, 2.బూడిద, 3.కారము, (రసా.) చేతికి జిడ్డుగ తగులునది, ఆమ్లములతో లవణముల నిచ్చునది, ఎఱ్ఱలిట్ మస్ ను నీలిరంగుగ మార్చునది (Alkali).
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయాణ|
అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్కవంశత్వాత్ అర్కబంధుః, ఉ-పు. - సూర్యవంశమున జనించుటవలన అర్కబంధువు.
వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.
విదేహదేశేభవా వైదేహీ. సీ. - విదేహదేశ మందుఁ బుట్టినది. విదేహ మానస రంజక రామ్|
జన్మనా జనకః సో అభూద్వైదేహస్తు విదేహజః|
మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా||
సంభ్రమసీతాకా(హా)ర సాకేకపురవిహార నారాయణా|
అచలము - కొండ, విణ. కదలనిది.
న చలతీత్యచలః, చల కంపనే. - చలింపనిది.
కొండ - పర్వతము.
కొండ(ౘ)చూలి - పార్వతి.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ, సీ. - పర్వతమునకు గూతుఁరు.
కొండమల్లయ్య - శివుడు; కొండయల్లుఁడు - శివుడు.
విలోమచలత్వము - (గణి.) రెండు రాసులు తమ గణన ఫలము అచలమగు నట్లు మారుచుండుట (Indirect Variation or Inverse Variation).
అచలోద్దృతిచంచత్కర భక్తానుగ్రహతత్త్పర నారాయణా|
అచలసంధి - (జం.)కదలికకు వీలులేని ఎముకలసంధి, ఉదా. పుఱ్ఱెలోని ఎముకలు కదలని కీలు (Immovable joint).
కదలని కీళ్ళు - (జం.) కదల్చుటకు వీలుకాని కీళ్ళు, ఉదా. తల ఎముకలు (Immovable joints).
కొండఱేఁడు - హిమవంతుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
హరుఁడు - శివుడు.
హరతి ప్రళయే సర్వమితి హరః - ప్రళయకాలమున సర్వమును హరించువాఁడు.
భక్తానా మూర్తిం హరతీతి వా - భక్తులపీడను హరించువాఁడు. హృఞ్ హరణే.
వృషాకపి - 1.విష్ణువు, 2.శివుడు, 3.అగ్ని.
హర విష్ణూ వృషాకపీ,
వృషాకపిశబ్దము శివునకును, విష్ణువునకును పేరు. ప. అగ్నికి, ఇంద్రునికిని పేరు. వృషేణ ధర్మేణ అకంతి యాంతితి వృషాకాః ధర్మశీలాః, తాన్ పాతీతి వృషాకపి. పు. అక కుటిలాయాం గతౌ. పా రక్షణే. - ధర్మముచేత చరించువారు వృషాకలు; వారిని రక్షించువాఁడు.
వృషాకపాయి - 1.లక్ష్మి, 2.పార్వతి, 3.శచి, 4.స్వాహా.
స్వాహా - అగ్నిభార్య.
వృషాకపాయీ శ్రీ గౌర్యోః -
వృషాకపాయీశబ్దము లక్ష్మికిని గౌరీదేవికిని పేరు. వృషాకపేః స్త్రీ వృషాకపాయీ, ఈ. సీ. వృషాకపులనఁగా హరిహరులు. వారిభార్యలు. టీ. స. అగ్నిభార్యయా మింద్రాణ్యాం చ వృషాకపాయీ శబ్ద్యోవర్తతే.
శచీ ముఖ్యామర వధూ సేవితాయై నమో నమః|
మనసిజుఁడు - మన్మథుడు.
మనసి జాయత ఇతి మనసిజః - మనస్సునందుఁ బుట్టెడువాఁడు.
చేతోభవుఁడు -మన్మథుడు, మనసిజుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
హరక్రోధజ్వాలా - వళిభి రవలేఢేన వపుషా
గభీరే తే నాభీ - సరసి కృతసంగో మనసిజః|
సముత్తస్థౌ తస్మా - రచలతనయే! ధూమలతికా
జన స్తాం జానీతే - తవ జనని! రోమావళి రితి|| - 76శ్లో
తా. ఓ అచలతనయా! హరుని క్రోదాగ్ని జ్వాలా వళిచే ఆక్రమింపబడిన శరీరముతో మనసిజుఁడు- మన్మథుడు తన్ను తాను కాపాడుకొనుటకుగాను లోతైన గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.) నీ నాభిసరస్సున చేరెను. కనుక జననీ! అందువలన మన్మథుని దేహబహిర్గతమైన ధూమ(లతిక-1.తీగ, 2.నూరు పేటల హారము.)జనులు నీ రోమావళిగా నెరుగుచున్నారు. - సౌందర్యలహరి
హకరారూపా హలధృత్పూజితా హరిణేక్షణా,
హరప్రియా హరారాధ్య హరిబ్రహ్మేంద్ర సేవితా| - 20
హరసార సముద్భవ హైమవతీ |
కరపల్లవ లాలిత దివ్యతనో |
మురవైరి విరించి ముదంబునిధే |
పరిపాలయ తారకమారకమాం ||
హర త్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః,
నమోస్తు హరయే తుభ్యం రామా.....
హరనేత్రాగ్నిసందగ్ధ - కామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైక - స్వరూపముఖపంకజా.
కృతాంతుఁడు - యముడు.
కృతః అంతో వినాశో యేన నః కృతాంతః - ఇతనిచే వినాశము(వినాశము - చేటు.)చేయఁబడును.
కృత్తాన్తే పుంసి కీనాశః క్షుద్ర కర్షకయోస్త్రిషు,
కీనాశశబ్దము యమునికి పేరగునపుడు పు. దరిద్రునికిని, దున్నువానికిని పేరగునపుడు త్రి, కుత్సితం నాశయతీతి కీనాశః, ణశ అదర్శనే. - కుత్సితమును జెఱుచువాఁడు.
కృతాంతము - 1.అశుభకర్మ, 2.భాగ్యము, 3.సిద్ధాంతము.
కృతాన్తో యమ సిద్ధాంత దైవా కుశల కర్మసు,
కృతాంతశబ్దము యమునకును, సిద్ధంతము నకును, పురాకృత శుభాశుభ కర్మలకును, పాపకర్మమునకును పేరు.
కృతః అంతః అనేనేతి కృతాంతః - దీనిచేత అంతము చేయఁబడును.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
మును మనుజుఁడు జన్మానతర
మునఁజేసిన పుణ్యపాప* ములు పుడమిని వా
నిని బొందక విడువవు: దే
వుని నిందింపకుము కీడు * వొడమఁగుమారా!
తా. కుమారా! మనుష్యుఁడు పూర్వము జేసి యున్నట్టి మంచిచెడ్డల ననుభవింపక తప్పించు కొనఁజాలఁడు. కాబట్టి కష్టములు పొందువేళ మఱింత నాశనము కలుగునట్లు దేవుడు - భగవంతుడు, దైవమును ధూషింపవద్దు.
చిట్టియ - 1.వెదురు గనుపు, 2.వస్త్రపు టంచుల సన్నకమ్మి, రూ.చిట్టె.
చిట్టె - చిట్టియ.
పరువు - 1.వెదురుగనుపు, 2.సముద్రము.
పరువు - 1.ధావనము, పరుగెత్తు, 2.కోసుదూరము, రూ.పరుగు.
ధావనము - 1.పరుగు, 2.శుద్ధి.
శుద్ధి - 1.శోధనము, 2.మార్జనము, 3.కడుగుట, 4.పవిత్రత.
శోధనము - (రసా.) ఒక ద్రవ్యమును శుద్ధముచేయుట, (Purification), సం.వి.శుద్ధిచేయుట, పరిశోధించుట, వెదకుట.
మార్జనము - 1.శుద్ధి, 2.తుడుచుట.
ధావనము - (రసా.) కడుగుట (Washing).
పరువు - 1.పరిపాకము, 2.గౌరవము, సం.భరః.
పునీతుఁడు - పవిత్రుడు, శుద్ధుడు.
గురువులువాఱు - (గురువులు+పాఱు) 1.అతిశయించు, 2.వేగముగా పరుగెత్తు, 3.ఉప్పొంగు.
విను ప్రాణ రక్షణమునన్
ధనమంతయు మునిగిఁపోవు * తఱి బరిణయమం దున గురుకార్యమున వధూ
జన సంఘములందు బొంకఁ * జనును గుమారా!
తా. ప్రాణమును గాపాడుటయందును, ధనము పోవునపుడును, వివాహమునందును, గురువుల పనులయందును, స్త్రీల సమూహము నను అబద్ధమాడవచ్చును దాన దోషము కలుగదు.
పృశ్నిగర్భుడు - శ్రీమహావిష్ణువు.
పృశ్ని - కిరణము, 1.పొట్టిది, 2.చిన్నది.
పృశ్ని రల్పతనౌ -
శిరసి ప్రాంశుభిః స్పృశ్యత ఇతి పృశ్నిః, ఈ. - పొడవైనవారిచేత తలమీఁద సృశింపఁ (మొట్టఁ) బడువాఁడు.
అలిపిరి - 1.దుర్బలము, 2.మెల్లనిది, 3.బక్కది, పలుచనిది, 5.బక్కచిక్కినవాడు.
అల్పాతను ర్యస్య సః అల్పతనుః, ఉ. - అల్పమిన తనువు గలవాఁడు. ఈ 2 కుఱుమట్టపు అలిపిరివాని పేర్లు.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).
దుర్బలుఁడు - బలహీనుడు.
అతగుఁడు - 1.దుర్బలుడు, 2.అవివేకి, తెలివితక్కువవాడు.
దుర్బలలక్ష్యము - (జీవ.) (Receissive character) పరస్పర వ్యత్యాసము గల లక్షణములలో నొక బలీయ లక్షణముతో (Dominant character) కూడి సంక్రమించిన రెండవ లక్షణము, సంతానములలో పైకివికాసమును చూపకుండునది.
జలజము - 1.తామర, 2.శంఖము.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
దుఃఖం శమయతీతి శంఖః, శము ఉపశమునే - దుఃఖమును శమింపఁజేయునది.
దరము - 1.భయము, 2.గొయ్యి, 3.శంఖము, అవ్య.ఇంచుక.
రసానుక్వా భావానాహ - దరేతి దీర్యతే (అ)స్యాదితి దరః, దౄభయే.
గొయ్యి - పల్లము, రూ.గోయి.
దరో (అ)స్త్రియాం భయే శ్వభ్రే -
దరశబ్దము భయమునకును, గుంటకును పేరు. దరణం, దీర్యత ఇతి చ దరః, ప్న. దౄ విదారణే. వెఱచుట, త్రవ్యఁబడునదియును దరము. ఈషదర్థమందు దరశబ్ద మవ్యయము. "దరదళిత హరిద్రాపింజరాణ్యంగకాని" "ఈషదర్ధే ద రాలింగ" మితి శేషః.
ముందుకుపోతే నుయ్యి, వెనుకకుపోతే గొయ్యి. శంఖములో పోస్తే తీర్థము, పెంకులో పోస్తే నీళ్ళు.
దభ్రము - సన్నము, వి.1.సముద్రము, 2.బొంకు.
దభ్యతే నివార్యత ఇతి దభ్రం, దంభురోధనే. - అడ్దగింపఁబడునది.
బొంకు - కల్లమాట, క్రి.కల్లలాడు.
మృషావాది - కల్లరి.
మృష - బొంకు.
మిథ్య - మృష, అసత్యము.
మృషా మిథ్యా చ వితథే -
మృషా, మిథ్యా ఈ 2 అసత్యమందు వర్తించును. ఉ 'ఉచ్ఛ్రాయ సౌందర్యగుణా మృషోద్యా', మిథ్యావాదిని దూతిబాంధవ జనస్యాజ్జాత పీడాగమే'.
మిథ్యామతి - భ్రాంతి.
మిథ్యాదృష్టి - నాస్తికత్వము, ఇహలోకమే కాని పరలోకము లేదనెడు బుద్ధి.
మిథ్యా ప్రతిబింబము - (భౌతి.) తెరపై పట్టుటకు రాని ప్రతి బింబము (Virtual image).
లవిటి - 1.రెక్కమొదలు, 2.చెవిటి.
కల్లఁడు - చెవిటి, బదిరుడు.
కల్ల - 1.అసత్యము, 2.పరుషవచనము.
అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.
పెద్దవిన్నపము - 1.చెవుడు, 2.గొప్పమనవి.
చెవుడు - చెవులు వినని రోగము, బాధిర్యము.
బాదిర్యము - బధిరత్వము, చెవుడు.
బదిరుఁడు - చవిటివాడు.
బధ్యతే వాతాదినా శ్రవణ సామర్థ్య మస్యేతి బధిరః, బధ బంధనే. - ఇతనికి శ్రవణ సామర్థ్యము బంధింపఁబడును.
ఏడుఁడు - చెవిటివాడు.
చెవిటిమూఁగ - చెవుడును, మూగతనమును కలవాడు, ఏడమూకుడు. చెవిటివానికి సత్కథా శ్రవణమేల ?
అవివేకము - అజ్ఞానము, తెలివిలేమి, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమి, విణ.తె లి వి లే ని ది, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యము లేనిది.
నవరస భావాలంకృత
కవితాగోష్టియును, మధుర గానంబును తా
నవివేకికి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ.
తా|| నవరసములు అనగా, శృంగారం, హాస్యం కరుణ, వీరత్వం, శాస్త్రం భయానకము, భీభత్సం, అద్భుతం, శాంతం అను వీటియొక్క భావాలను, మధురంగా నుండు పాటను గూర్చి యెంత చెప్పినను అవివేకి గ్రహింప జాలడు, ఎట్లనగా చెవిటివాని వద్ద శంఖంతో ఊదినను దాని ధ్వనిని ఆ చెవిటివాడు గ్రహింప లేక పోవుచున్నాడు గదా!
జలజనిభ నయనఖిల మనుజమథన
బలిదనుజ మదన కలికలుష శమన| ||శరవణభవ||
ఝషము - 1.చేప, 2.మొసలి.
ఝషతి హినస్తి బాలమత్స్యానితి ఝషః ఝష హింసాయాం - పిల్ల చేఁపలను (ౘ)చంపి తినునది.
చేఁప - మత్స్యము; మత్స్యము - చేప Fish.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః, మదీ హర్షే. - మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.
మాత్స్య న్యాయము - న్యా. పెద్ద చేప చిన్న చేపను తినునను న్యాయము. హెచ్చు బలము కలిగిన పెద్ద చేపలు బలహీనమైన చిన్న చేపలను బలవంతంగా, మింగుతుంటాయి.
ఝషకేతుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మారుఁడు - మన్మథుడు.
మారయతి విరహిజనం మారః - విరహినులను జంపువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).
ఝుష కేతన సమవృష కేతనరమ
మిష చేతనయమ వృషకారి సుగమ| శరవణభవ|
మకరరేఖ - (భూగో.) భూమధ్య రేఖకు దక్షిణమున 23 1/2 డిగ్రీలలో ఉన్న రేఖ (Tropic of Capricorn).
పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి ప్రొతసామస్మి జాహ్నవీ || - 31శ్లో
పావనమొనర్చువాటిలో వాయువును, శస్త్రధారులలో రాముడును, జలచరములలో మొసలియు, నదులలో గంగయు(జాహ్నవి - గంగ) నావిభూతులే. రామబాణమఘోఘమైనది కావుననే శత్రధారులలో అతడగ్రేసరుడు.
త్రిలోకపావనియగు గంగ విష్ణుపాదమునుండి పుట్టినది. వైజ్ఞానికులు గంగా జలములు ఎంతకాలముంచినను చెడిపోవనియు, వీనియందు రోగక్రిములు జీవింప జాలవనియు ఋజువు చేసిరి. హిందువులు గంగను పూజించుటచే సర్వపాపములు నశించి ముక్తికలుగునని విశ్వసింతురు. - భగవద్గీత విభూతియోగః
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయంచిత్తుడు, జ్ఞాతిరేతుడు).
సపిండీకరణము - చచ్చిన పండ్రెవ దినమున చేయు శ్రాద్ధము.
సపిణ్డాస్తు సనాభయః,
సమానః ఏకః పిండః పిండప్రదాన మేషామితి సపిండాః - సమానమైన పిండప్రదానము గలవారు.
సమానః ఏకః పిండః శరీరమేషామితి వా సపిండాః - ఒక్కటైన శరీరము గలవారు.
సమాన నాభిః మూలకారణం కూటస్థపురుషో యేషామితి సనాభయః, ఈ-పు. - సమానమైన కూటస్థ పురుషుఁడు గలవారు. ఈ 2 ఏడు తరములకు లోఁబడిన జ్ఞాతుల పేర్లు.
సనాభి - జ్ఞాతి, సమానుడు.
స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 1ఒ.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు.
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిగా...
తొలఁగుబావ - శత్రువు, దాయ.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
సగోత్రుఁడు - దాయ.
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.
దాయాదౌ సుత బాన్ధనౌ,
దాయాదశబ్దము కొడుకునకును, జ్ఞాతికిని పేరు.
దాయం విభజనీయం ధన మత్తీతి, ఆదత్త ఇతి వా దాయాదః అద భక్షణే, డు దాఞ్ దానే. – పాలిసొమ్మును భుజించువాఁడుగాని, పుచ్చుకొను వాఁడు గాని దాయాదుఁడు.
విమతుఁడు - శత్రువు, విణ.విరుద్ధ మతము గలవాడు.
విరుద్ధము - విరోధము గలది.
విరుద్ధః పక్షో (అ)స్యేతి విపక్షః - విరుద్ధమైన పక్షము గలవాడు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
విరోధచర్య - (రాజ.) యుద్ధము ప్రకటించుటకు తగినంత కారణముగా నెంచదగినచర్య.
వైరి - శత్రువు.
వైరమస్యాస్తీతి వైరీ, న. పు. - వైరము గలవాఁడు.
వైరము - విరోధము.
విరోధము - పగ, ఎడబాటు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు). విద్విషుఁడు - శత్రువు.
వైరిణం నోప సేవేత సహాయం చైవ వైరిణః,
అధార్శికం తస్కరంచ తథైవ పరయోషితం|
తా. శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ(తస్కరుఁడు - దొంగ), పరస్త్రీ(యోష - 1.బోటి, 2.ఆఁడుది, రూ.యోషిత, యోషిత్తు., వీరలతో సహవాసము జేయరాదు. - నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
జ్ఞాతాగమచయ ధూతాఘవిచయ
వీతషడరిరయ గీతగుణోదయ| ||శరవణభవ||
హాటకగర్భుఁడు - బ్రహ్మ, హిరణ్యగర్భుడు.
హాటకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హటతి దీప్యత ఇతి హాటకం, హత దీప్తౌ. - ప్రకాశించునది.
ఠాకృతి రాజిత హాటక కుండల
స్వాకృతిరేజిత ఘోటక మండల| ||శరవణభవ||
శిశుకము - 1.శిశువు, 2.ఉలుచ మీను, 3.మొసలి.
శిశుత్వం శైశవం బాల్యమ్ -
శిశో ర్భావిశ్శివుత్వం, శైశవంచ - శిశువు యొక్క భావము శిశుత్వము, శైశవము.
శైశవము - (గృహ.) శిశుత్వము, బాల్యము. బాలస్య భావః బాల్యం - బాలునియొక్క భావము. ఈ 3 పదియాఱేండ్లకు(16సం.) లోఁబడిన వయస్సు.
అంతర్వత్ని - లోపల శిశువు కలది.
ఉదరాంతర్గర్భో (అ)స్యా అంతర్వత్నీ - కడుపులో గర్భము గలది.
శిశువు - బిడ్డ.
సిసువు - శిశువు, పసిబిడ్డ, సం.శిశుః.
పసిబిడ్డ - (గృహ.) శిశువు, చంటిబిడ్డ (Infant child).
చేతిబిడ్ద - పసిబిడ్ద.
నెత్తురుపాప - జొత్తుపాప, పసిబిడ్డ.
(ౙ)జొత్తుపాప - నెత్తురుకందు, మిక్కిలి పసిబిడ్డ.
పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయము, వి.బిడ్డ.
కిసరు - 1.కోపవికారము, 2.అంటు సోకుటచే పసిబిడ్డలకు గలుగు దోషము.
శిశుసంరక్షణ - (గృహ.) చంటిబిడ్దను జాగ్రత్తగా పెంచుట (Child care).
శిశుసంరక్షణశాల - (గృహ.) పసిబిడ్డలకు కావలసిన సంరక్షణలు చేయు వైద్యశాల, (Baby Clinic).
బాలారిష్టము - పుట్టినది మొదలు 12 సంవత్సరముల లోపున బాలబాలికలకు కలుగుకీడు, మరణము.
ఉలుౘ - మిక్కిలి చాపల్యముగల చేప, సం.ఉలూపిః.
ఉలూపి - 1.ఒక నాగకన్య, 2.ఉలుచ చేప.
ఉలూపీ శిశుకస్సమౌ :
ఉత్ ఊర్థ్వం ఉంపతి భ్రమతీతి ఉలూపీ. లుప్ ఌ చేదనే. - ఊర్థ్వముగా భ్రమించునది.
చాపల్యాచ్చిశురివ శిశుకః - చాపల్యము వలన శిశువువంటిది. ఈ రెండు శిశువువలె చపలమైన ఉలసమీను పేర్లు.
ఉలూచి నాగరాజు కుమార్తె, జలంలో ఎల్లప్పుడూ అర్జునుడు అజేయుడుగా ఉండగలడని ఉలూచి వరమిచ్చింది. అర్జునుని భార్య ఉలూచి.
క్రోవ - 1.సరము, 2.బిడ్డలకు గొంతుక యందు కలుగు రోగము.
సరము - స్వరము, ముకుగాలి, షడ్జాది స్వరము, సం.స్వర, సం.వి.1.హారము, 2.గమనము.
స్వరము - 1.కంఠధని, 2.ముక్కుగాలి, 3.అచ్చు(అకారాది) ఉదాతాను దాత్త స్వరితములు (వేదములోని), 4.షడ్జాది సంగీత స్వరములు ఏడు, సం.వి.(భౌతి.) సంగీత ధ్వనులలో ఒక నియత ధ్వనిని సూచించు చిహ్నము (Note), సం.వి.(భౌతి.) ధ్వని యొక్క గుణము (Tone).
స్వరములు - (భౌతి.) వినుట కింపైన ధ్వనులు (Notes).
పాప - 1.శివుడు, 2.కంటి నల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
చిన్నవాడు - బాలుడు.
పూప - 1.పూసిందె, 2.శిశువు, 3.కంటిపాప, విణ.లేత.
కంటిపాప - కంటి నల్లగ్రుడ్డులోని చుక్క, (ఈ ద్వారముననే వెలుగు లోపలికి ప్రవేశించును) (Pupil).
అడ్డపాప - 1.అడ్దముగా ఎత్తుకొనదగిన శిశువు, 2.దూరస్తువులను చూడజాలని వాని కంటిలోని పాప.
పృథుకము - 1.అడుకులు, 2.శిశువు.
అడుకులు - అటుకులు.
అటుకులు - వడ్లు నానవోసి వేయించి కొట్టినవి, రూ.అడుకులు.
పృథుక స్స్యాచ్చిపిటకః -
పృథుత్వాత్ పృథుకః - దంచఁబడినదై పెద్దదగునది.
నితరాంభవ తీతిచిపిటకః - ఘనమౌనట్టిది. పా. చిపుటకః "చిపిటస్స్యాచ్చిపుటక" ఇతి రభసః, అడుకులు.
చిపిటము - అదుకులు విణ. చప్పట ముక్కు వాడు.
చిపిటతలము - (భౌతి., గణి.) చదునుగా నుండెడుచోటు (Flat place.)
అలఘుగుణ ప్రసిద్ధుడగునట్టి ఘనుండొకఁ డిష్టుడై తనన్
వలచి యొకించుకేమిడిననట్టి వానికి మిక్కిలి మేలుచేయగాఁ
దెలిసి కుచేలుడొక్కకొణిదెండటుకుల్ దన కిచ్చినన్ మహా
ఫలదుఁడు కృష్ణుఁడత్యధిక భాగ్యములాతనికీఁ డె, భాస్కరా.
తా. శీ కృష్ణ భగవానుడు(కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.)తనకు కుచేలుడు స్వల్పమైన చారె డటుకులీయగా అతనికి గొప్ప భాగ్యము(భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.)లిచ్చెను. అట్లే ప్రఖ్యాతిగల(అలఘుఁడు - గొప్పవాడు)గుణవంతు నకు తన స్నేహితుడైనవాడు ప్రేమతో లేశమైన పదార్ధము నిచ్చినను, అతనికి గొప్ప మేలు(మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.)కలుగజేయును.
పూర్వగాథ:- కుచేలుడును కృష్ణుడును చిన్నతన మందు కాశీనగరమందు సాందీపుని వద్ద విద్య నేర్చుకొనిరి. కృష్ణుడు విద్యా నంతరము రాజ్య పాలకుడై మహేంద్ర భోగముల నను భవించుచు ద్వారకా నగరమందుండెను. కుచేలుడు నిజకులాచార ధర్మపరుడై భార్యతో కాలక్షేపము చేయుచూ పేదయయ్యెను. దారిద్ర్యమునకు తోడుగ నతనికిని 27 గురుపుత్రులు జన్మించిరి. వారందరకు తగిన యాహార పానీయములు లభింపక అతడు చిక్కుల పొందుచుండగా నాతని భార్యయగు వామాక్షి తన నాధునకు పిడికె దటుకుల నొక(కుచేలము - 1.చినిగిన వస్త్రము, 2.సముద్రము.)జీర్ణాంబరము నకొన కొంగు నందు కట్టి 'బాల్య స్నేహితుడైన కృష్ణుని దర్శించి రండు, అతడు మన యవస్థను తెలిసికొన భాగ్యమిచ్చును' అని పంపగా కుచేలుడు కృష్ణుని జేరి తాదెచ్చిన యటుకులను కృష్ణున కిచ్చినన్ దనిసి యాతడా తనికి భాగ్యము నిచ్చెను.
బిడ్డ - 1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు Sun, రూ.ప్రసూనుడు.
సూనువు - 1.కొడుకు, 2.కూతురు.
తమ్ముఁడు - వెనుక పుట్టినవాడు, అనుజుఁడు, రూ.తమ్మువాడు. అనుజుఁడు - తమ్ముడు; తమ్మువాఁడు - తమ్ముడు; అవరజుఁడు - తమ్ముడు
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
స్కందుఁడు - కుమారస్వామి; కొమరసామి - స్కందుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కున్నడు - బాలుడు, బిడ్డడు.
బుడుత- బిడ్డ, బాలుడు, విణ.పొట్టి (బుడుతడు).
బుడుబుడుక్క - డుబుడక్క.
డుబుడక్కవాఁడు - బుడబుడకవాడు.
బుడతకీచులు - పోర్చుగీసు దేశస్థులు(Portuguese).
బురుక - బిడ్డ, విణ.పొట్టి.
బురుకఁడు - వామనుడు, పొట్టివాడు.
వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు. చతుర్ధం వామనం తధా|
టింగణా - పొట్టివాడు, వామనుడు.
కొట్ర1 - వామనుడు, సం.ఖటేరకః.
కొట్ర2 - పిండి మొ.వి ఉడుకబెట్టుటకు పెట్టిన ఎసరు.
పదునేనవదియైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించిమూడు లోకంబుల నాక్రమించెఁ; పదిహేనో అవతారంలో మాయా "వామనాతారు" డై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి(త్రివిక్రముడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించినవాడు.)ముల్లోకాలు ఆక్రమించాడు.
ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన,
పదనఖనీరజనిత జనపావన |
కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే!
సమయమును గాంచి ద్వేషవేషమును మార్చి
రాక్షసులమైత్రి చేసిరి శిక్ష కనిరి
గొడుగు వట్టిరి వలసిన యడుగు మాని
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
ఉపేంద్రుఁడు - 1.వామనుడు, విష్ణువు, 2.కృష్ణుడు.
ఉపేంద్రః ఇంద్ర ముపగతః అనుజత్వా దుపేంద్రః - ఇంద్రునికి తమ్ముడు గనుక ఉపేంద్రుడు.
ఇంద్రరక్షణాయ తత్సమీపే స్థితో వా - ఇంద్రుని రక్షించుటకై అతనియొద్ద నున్నవాఁడు.
ఇంద్రలోకా దుపరితిస్థతీతి వా ఉపేంద్రః – ఇంద్ర లోకమున కంటె పైలోక మందుండువాఁడు.
ఇంద్రావరజుఁడు - ఇంద్రునితమ్ముడు, ఉపేంద్రుడు, విష్ణువు.
ఇంద్రస్య అవరజః - ఇంద్రుని దమ్ముడు.
ఉపేంద్రో వామనఁ ప్రాంశు అమోఘః శుచి రూర్జితః
అతీంద్రః స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః| – 17స్తో
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు. మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ - కూతురు, 2.బుద్ధి.
కందుఁడు - కుమారస్వామి, సం.స్కందః.
కందు - 1.తాపము, 2.నలుపు, ఉదా. చంద్రబింబములోని కందు, 2.శిశువు, క్రి.1.తప్తమగు, 2.వాడు, 3.కృశించు.
కసుఁగందు - లేత బిడ్ద, పసికూన.
కసుగందు - (కందు+కందు) 1.మిక్కిలివాడు, 2.బాధపడు.
డింభము - పిల్ల, గ్రుడ్దు.
డయతే డింభః, డీఙ్ విహాయసాగతౌ. - కాలక్రమమున నెగయునది.
డయతే గమనాయ డింభా, డీఙ్ విహాయసాగతౌ. - గమనము కొఱకు నెగయునది. గ్రుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిదిట.
డీనము - పక్షిగతి, మీది కెగరుట.
డిమ్భౌతు శిశు బాలిశౌ,
డింభశబ్దము శిశువునకును, మూర్ఖునికిని పేరు. డయతే డింభః, దీఙ్ విహాయసా గతౌ. - ఎరుగువాఁడు.
బాల - పదునారేండ్లకు లో బడిన పిల్ల.
బాలాజీ - శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, విణ.బాలా.
బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.
పరదత్తం బలిం పూజాంశ్యతీతి బలిశః; బలిశ ఏవ బాలిశః - తనకుఁ జేసిన సన్మానమును జెఱుచుకొనువాఁడు బాలిశుఁడు.
దేవతార్థం దత్తమవూపాది బలిం శ్యతి భక్షణేన తనూకరోతీతి బలిశః; బలిశ ఏవబాలిశః - దేవతార్థమై యుంచఁబడిన యపూపాదులను భక్షించి స్వల్పముగాఁ జేయువాడు.
డింభౌషణము - (గృహ.) పొదుగుటకు అనుపగుస్థితి, గ్రుడ్లుగాని, క్రిమిబీజములుగాని వృద్ధి పొందుటకు అనువగు సూచనలు అనగా తగు శీతోష్ణస్థితులు కలిగి యుండుట, (Incubation).
డింభౌషణకాలము - (జం.) గ్రుడ్డు పగిలి దానినుండి ప్రాణి బయటికి వచ్చుటకు పట్టుకాలము, శరీరమున రోగజీవులు ప్రవేశించినది మొదలు రోగ చిహ్నములు పైకి కనబడువరకు పట్టుకాలము (Incubation period).
డింభాకృతియుత రంభానటరత
జంభారివినుత కుంభోద్భవ నుత| ||శరవణభవ||
అనాహతము - కొట్టబడనిది, ఉత్తరింపబడనిది, చలువచేయబడనిది, (క్రొత్త వస్త్రము). (గణి.) గుణింపబడనిది, వి.1.దేహమందలి షట్చక్రములలో ఒకటి, 2.దౌడ మొ.ని స్పర్శలేకుండ పుట్టుధ్వని.
కారికము - చలువ చేయని క్రొత్తది (వస్త్రము). ౙవళి - అమ్మదగిన క్రొత్తవస్త్రము, రూ.జవిళి.
అనహూతము - పిలువబడనిది.
దౌడ - తాలుపు, రూ.దవుడ.
తాలుపు - దౌడభాగము (Palate).
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టినధ్వని, ఉదా. ౘ, ౙ.
సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బ లు సరళములు.
ఔదార్యము - ఉదారత్వము, దాతృత్వము.
లంబము - (గణి.) ఒక సరళరేఖతో సంకోణముచేయు సరళరేఖ (Perpendicular).
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.నిష్కపటము.
అభిదిశ - (గణి.) సరళ రేఖయొక్క దిక్కు (Serse).
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
ఆహతము - 1.కొట్టబడినది, 2.వాయించబడినది (మద్దెల మొ.వి.), 3.(గణి.) గుణింపబడినది (సంఖ్య.) వి.1.ఢక్క 2.కొత్తవస్త్రము, 3.ప్రాతవస్త్రము, 4.(సంగీ.) గమకభేదము.
ఉదాత్తము - 1.వేదమందలి ఊర్థ్వస్వరము (వ్యతి, అనుదాత్తము) 2.దానము, 3.పెద్ద మద్దెల, 4.(అలం.) ఒక అలంకారము విణ.1.ఎత్తైనది, 2.గౌరవము కలది, 3.ధారాళము, అడ్డుపాటులేనిది.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడలనుండికారు మదము, 3.చతురపాయములలో నొకటి, 4.ఛేదనము.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
వితరణము - ఈవి.
వరము - కోరిక, వరించుట.
బహుమానము - (గృహ.) కానుక, ప్రతి ఫలము (Reward).
బహుమతి - కానుక, బహుమానము. పారితోషికము - బహుమతి.
ఉపాయనము - 1.కానుక, 2.గుర్వాదుల సమీపమునకు పోవుట, 3.పొందుట.
కానుక - కానిక; కానిక - ఉపహారము, రూ.కానుక, కాంక.
ఉపహారము - 1.కానుకగా నిచ్చు ద్రవ్యము, 2.సత్కారము.
సత్కారము - సమ్మానము, రూ.సత్కృతి, సత్ర్కియ.
సమ్మానము - గౌరవము, సత్కారము.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, ఇచ్చువాడు 3.మనోజ్ఞుఁడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
అధికుఁడు - గొప్పవాడు.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత. దాత - ఇచ్చువాడు.
గొనబు - మనోజ్ఞత, విణ.1.మంజులము, 2.మధురము, 3.శ్రావ్యము, 4.పరిమళించు, సం.గుణః.
గొనబుకాఁడు - అందగాడు, సుందరుడు. సుందరుఁడు - చక్కనివాడు.
నిష్ణాతుఁడు - నేర్పరి.
ఉదారము - 1. గొప్పది, 2.ఊదరలు ఒక రకపు ధాన్యము.
ఉన్నతము - 1.పొడవైనది, ఎత్తైనది 2.గొప్పది. బృహత్తు - గొప్పది.
ఉన్నతి - 1.ఎత్తు 2.ఊచ్ఛస్థితి 3.గరుడుని భార్య.
ఉదారతా వాదము - (రాజ, చరి.) వ్యక్తికి స్వాతంత్యము, సమాన అర్థిక అవకాశములు ఉండవలె నను వాదము (Liberalism).
ఢక్క - ఢంకా, రాజులు బయలు దేరునపుడు ముందు వాయించు వాద్యము.
డవిణ - డంకా, ఒకానొక చర్మవాద్యము.
యశఃపటహము - డంకా, ఒక రకమైన వాద్యము.
యశోర్థః పటహః యశపతహః - కీర్తికొఱకై పటహము గనుక యశఃపటహము.
డంకా - నగారా, డక్క, సం.డక్కా.
ఢగతి అవ్యక్తం కాయతీతి ఢక్కా కైశబ్దే. - ఢక్ అనెడి శబ్దమును బలుకునది.
నగారా - పెద్ద డంకా.
పంబ - చర్మవాద్యము(పంబలవాడు.) సం.పణవః.
ఢక్కారవృత ధిక్కారాహిత
దిక్కాలామిత హిక్కాదిరహిత| ||శరవణభవ||
కొండఱేఁడు - హిమవంతుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక.
అనంత - 1.భూమి, 2.పార్వతి, (వృక్ష.)1.ఎద్దు నాలుక చెట్టు, 2.గరిక, 3.ఉసిరిక, 4.తిప్పతీగ, 5.జీలకర్ర, 6.పిప్పలి.
నాస్త్యంతో (అ)స్యా అనంతా - అంతములేనిది.
భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
గఱిక - తృణము.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము, (పులుగడిగిన ముత్యము).
పూరి - 1.తృణము, 2.మృగాదుల చనుపాలు.
తృణము - గడ్డి, చామలోనగు పైరు.
ఉటము - 1.ఆకు, 2.గడ్ది.
ఉటజము - 1.పర్ణసాల, పూరిల్లు, 2.మున్యాశ్రమము.
శష్పము - 1.లేతకసవు, 2.ప్రతిభా హాని.
లేఁగసువు - బాలతృణము.
శష్పం బాలతృణం -
శస్యతే హింస్యతే పశుభి రితి శష్పం, శసు హింసాయాం. - పశువులచే హింసింపఁబడునది.
బాలం చ తత్ తృణం చ బాలతృణం. - లేఁతకసవు. ఈ 2 లేఁతకసవు పేర్లు.
కనుమ - 1.శరము, 2.తృణము, 3.మకర సంక్రమణమునకు తరువాతి రోజు.
శరము - 1.బాణము, 2.రెల్లు, 3.జలము.
శృణాతీతి శరః, శౄ హింసాయాం. - హింసించునది.
తృణము - గడ్డి, చామలోనగు పైరు.
గడ్డి - తృణము, కసవు.
తృణధ్వజము - వెదురు.
తృణానాం మధ్యే ముఖ్యత్వాత్ తృణధ్వజః - తృణవిషేషములలో ముఖ్యమైనది.
తృణధ్వజము - వెదురు.
వెదురు - వేణువు, సం.వేణుకః.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జలతి జడీభవతీతి జలం, జల ఘనే. - జడీభవించునది.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.
నీళ్ళు - నీరు.
కాశము - 1.రెల్లు, 2.ప్రకాశము.
ఱెల్లు - తృణవిశేషము, శరము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
సుబ్బు - క్రి.బయలుపడు.
అధో కాశ మస్త్రియామ్, ఇక్షుగన్ధా పోటగళః -
కాశత ఇతి కాశం, అ.ప్న. కాశ్య దీప్తౌ. - ప్రకాశించునది.
ఇక్షోరివగంధో స్యా ఇతి ఇక్షుగంధా - చెఱకు పరిమళమువంటి పరిమళముగలది.
పుటతిగళతి చేతి, పోటగళః - కూడుకొని జాఱునది. ఈ 3 ఱెల్లుకసవు పేర్లు.
కాష్ఠ - 1.పదునెనిదిది రెపపాట్లు కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది.
నీరుకాళ్ళు - సాయంకాలమందు దోచు ఎఱ్ఱని పచ్చని కిరణములు.
శరజన్ముఁడు - కుమారస్వామి.
ఱెల్లు(ౘ)చూలి - కుమారస్వామి, శరజన్ముడు.
శరాఖ్యేతృణే జన్మ యస్య సః శరజన్మా, న-పు. - ఱెల్లునందు జన్మించినవాఁడు.
శరే జలే వా జన్మ యస్య సః - ఉదకమందు జన్మించినవాఁడు. గంగాసుత శ్శరోద్భూతః| షష్ఠ శ్శరవణోద్భవః|
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
కాయము1 - 1.మేను, శరీరము, 2.స్వభావము.
చీయతే అవయవైరితి కాయః, చిఞ్ చయనే. - అవయవములచేత కూర్చఁబడునది.
కాయము2 - బాలెంతకిచ్చు మందు, సర్మ్య.
కాయకము - శరీర సంబంధమైనది.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 2.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
కాయమున నాటు శరము లు
పాయంబున; దీయవచ్చు; బహు నిష్ఠురతన్
గూయ మది నాటుమాటలు
పాయగా యెపుడు వెగదు*పరచుఁ గుమారా!
తా. దేహమున నాటుకొన్న బాణములు యుక్తితో నూడఁబెఱుక వచ్చును. నిష్ఠురముగా మాటలాడిన మాటలు మాత్రము ఏ యుపాయము చేతను వెలికిఁదీయఁజాలము. పైగా నెపుడు చూచినను వికారమును గలిగించుచుండును.
ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము.
రక్తస్రావము - (జీవ.) రక్తము వెలుపడుట. (Hemorrhage) (ఇది శరీరములో జరిగిన చాల అపాయకరము.)
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము, (పులుగడిగిన ముత్యము).
కసవు - గడ్డి, తృణము, సం.ఘాసః.
ఘాసము - తృణము, లేబచ్చిక, కసవు.
తృణము - గడ్డి, చామలోనగు పైరు.
గడ్డి - తృణము, కసవు.
తుంగ - ఒక విధమైన గడ్డి.
చెత్త - 1.తృణము, గడ్ది, 2.పనికిరానిది.
చెత్తనేలలు - (వ్యవ.) అడవులలో ఆకులు అలములు రాలి క్రుళ్ళుట వలన సేంద్రియ పదార్థములు ఎక్కువగా నుండు నేలలు, (Organic or peaty Soils).
దుబ్బు - గడ్డిలోనగువాని గంట తృణస్తంభము, సం.స్తోమమః.
దుబ్బునేలలు - (భూగో.) సాలుకు 40"ల కంటె తక్కువ వర్షముగల ప్రదేశములలో ముండ్ల చెట్ట్లు, చిట్టి పొదలు మున్నగు వానితో ఏర్పదిన నేలలు.
తుకము - 1.మదింపు, 2.విత్తనాల చల్లకపు అంచక, (శ, ర,), 2.నారుమడి, 4.స్థానము, నెలవు (అని కొందరు).
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).
మదింపు - వెల నిశ్చయించుట, అంచనా.
అంచనా - పంట, వెల మొ. వానికి సంబంధించిన ఊహ, క్రి.అంచనా వేయు (Estimate).
అంచనదారుడు - అంచనా వేయువాడు.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ.
గరుడ పచ్చ - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
గరుత్మతో జాతం - గరుత్మంతునివలనఁ బుట్టినది.
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, గరుడ పురాణము(మజ్జ) 12000 శ్లోకములు గలది. గరుడదేవతాకమైన అస్త్రము.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు.
పచ్చ - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరు రేఖ. సం.పలాశః.
మకరతము - మరకతమణి, రూ.మరకతము.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మరం మరణం తకత్యనేనేతి మరకతం, తక హనహసనయోః. - విషహరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.
అశ్మము - రాయి.
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
అశ్మా గర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగాఁ గలది.
అశ్మసారము - 1.ఇనుము, 2.నీలమణి, 3.రంపము.
అశ్మనస్సారః అశ్మసారః - ఱాతియొక్క సారము. ఈ 7 ఇనుము పేర్లు
అశ్మజము - 1.సిలాజిత్తు, 2.ఇనుము, విణ.రాతినుండి పుట్టినది.
ఇంద్రనీలము - నీలమణి; కప్పుఱాయి - నీలమణి.
నీలము - ఒక విలువ గల రత్నము,(Sapphire). (ఇది రాసాయని కముగ ఎల్యూమినియమ్ ఆక్సైడ్ (Corundum). దీని నీలిరంగునకు కారణము అందులో అతిసూక్ష్మరాశిగా నుండు క్రోమియమ్ ఆక్సైడ్).
నీలము - 1.నీలిచెట్టు, Indigo plant, 2.నలుపు, 3.నల్లరాయి.
నీలి - నల్లనూలు Black wool, విణ.నల్లనిది, సం.నీలమ్. సం.వి.ఒకానొక చెట్టు, విణ.గారడము, సం.వి.(వ్యవ.) నీలిమందు (Indigo), రంగు ద్రవ్యములలో నొకటి, (Leguminose) అను కుటుంబములో Papilonaceae అను కుటుంబమునకు చెందిన Indigo feratinctoria అను మొక్క పట్తనుండి దీనిని తయారు చేయుదురు).
నీలీకరణము - (గృహ.) బట్టలకు నీలివేయుట, తెల్లబట్టలను ఉదికినప్పుడు తేట నిచ్చుటకై కొంచెము నీలి రంగు వేయుట (Bluing).
నీలలోహితము - (రసా.) బచ్చలి పండు రంగు గలది (Purple).
నిక్కమైన మంచినీల మొక్కటిచాలు
దళుకు బెళుకురాళ్ళు తట్టెడేల
చాటుపద్యమిలను చాలదాయొక్కటి? విశ్వ.
తా|| శ్రేష్ఠమైన నీలము అనురత్నము ఒక్కటివున్ననూ చాలును. రత్నమువలె తళతళ మెఱయుచుండు రాళ్ళు తట్టెడువున్ననూ ప్రయోజనము లేదుగదా. ఆవిధముగనే యీలోకములో మంచి నీతిని బోధించు చాటువు - 1.ప్రియమైనమాట, 2.గ్రంథస్థము కాకున్నను లోకమున ప్రజాదరణ పొందిన పద్యము.) ఒక్కటైనను చాలును.
మందాళి - 1.పచ్చపట్టు చీర, 2.కృత్రిమ మరకతము.
మంజడి - 1.చిత్రవర్ణ వస్త్రము, నీల వస్త్రము, సం.మాంజిష్ఠమ్.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి. ఈ 4 పచ్చల పేర్లు.
ఉసిరిక - 1.అమలక వృక్షము, నెల్లిచెట్టు, 2.నేల ఉసిరిక.
మండ1 - ఉసిరిక.
అగ్నిమంథము - నెల్లిచెట్టు, ఉసిరిక.
నెల్లి - ఉసిరిక.
మండ2 - 1.శాఖ, చిన్నకొమ్మ, 2.చీలమండ.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేద భాగము, 3.చేయి. కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ.
సీలమండ - చీలమండ.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.సీలమండ. (Ankle bone).
ఘుటిక - 1.గుళిక, చిన్నమాత్ర, 2.చీలమండ.
గుళిక - ఉండ, మాత్ర(రసగుళిక).
గులక - సన్ననిరాయి, సం.గుడికా, గుళికా.
ఉండ - గుళిక విణ.గుండ్రము.
ఉంట - 1.ఉండ, 2.ఉండుట, విణ.గుండ్రనిది.
ఉండు - 1.వసించు, 2.మిగులు.
ఉండ్రము1 - గుండ్రనిది, రూ.ఉండ్రస.
ఉండ్రము2 - వేడినీళ్ళతో తడిపిన పిండిని గుండ్రని ఉండలు చేసి ఆవిరిపై ఉడికించిన భక్ష్యము, మోదకము, సం.ఉండేరకః.
మోదకము - కుడుము లడ్డు. కుడుము - మొదకము. వినాయకుని మీద భక్తా, ఉండ్రాళ్ళ మీద భక్తా!
తత్ద్రంథీ ఘుటికే గుల్ఫౌ -
ఘోటతే పరివర్తతే ఘుటికా. ఘుట పరివర్తనే. - చుట్టువాఱియుండునది.
అభిఘాతాద్గుల్యతే రక్ష్యత ఇతి గుల్ఫాః. గుడ రక్షయాం. - అభిఘాతము(అభిఘాతము - 1.దెబ్బ, 2.కొట్టుట, 3.సమూలనాశము.)వలన రక్షింపఁబడునది. ఈ 2 రెండు పాదముల పార్శ్వముల యందలి బుడుపుల పేర్లు(చీలమండ).
గుది - 1.ఆకులు మొ.ని గ్రుచ్చిన సరము, 2.చీలమండ, (తాటిచెట్టు మొ.ని ఎక్కుటకు కాళ్ళకు తగిలించికొను బందము).
గుత్సము - 1.ముప్పదిరెండు మణులు గ్రుచ్చినహారము, 2.కంబము, 3.వరి మొ.వి. దుబ్బు, 4.పూగుత్తి.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము.
కుచ్చు - 1.గుత్తి, 2.పూగుత్తి, 3.ఏదేని చేర్చి కట్టినది, కొనచెవి నుంచు కొనెడి భూషణము, సం.గుచ్ఛః.
గుళుచ్ఛము - 1.గుత్తి, 2.పూగుత్తి.
గుత్తి - 1.పూగుత్తి, 2.చీలమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.
స్తబకము - పూగుత్తి. పుష్పమంజరి - (వృక్ష.) పూలగుత్తి (Inflorscence).
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.చీలమండ (Ankle bone).
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
తిప్యఫలా త్వామలకీ త్రిషు, అమృతా చ వయస్థా చ :
తిప్యవచ్ఛుభఫలత్వాత్తిప్యఫలా - తిప్య నక్షత్రమువలె శుభప్రదమైన ఫలములు గలది.
తిప్యనక్షత్రయుక్తేకాలే ఫలం కరోతీతివా తిప్యఫలా - పుష్య నక్షత్ర కాల మందు ఫలించునది.
అమలకము - 1.ఉసిరికాయ, 2.ఉసిరి చెట్టు. ఆమలతే గుణానామలకీ. త్రి. మల మల్ల ధారణే. - గుణములను ధరించునది.
రసాయనత్వాదమృతా - అమృతమువంటి రసము గలది.
వయో యౌవనం తిష్ఠతిస్థిరీభ వత్యనయేతి వయస్థా. ప్ఠా గతినివృత్తౌ. - యౌవనము దీని చేత స్థిరమగును. ఈ నాలుగు ఉసిరిక చెట్టు పేర్లు.
కరతలామలకము - జాతీ. అరచేతి లోని ఉసిరికాయ, సులువుగ అధీనమగునది.
అభుక్వా అమలకం పథ్యం భుక్త్వాతు బదరీఫలమ్|
కపిత్థం సర్వదాపథ్యం కదళీ నకదాచన||
తా. పరగడుపున పరగడుపు - (పరము+కడుపు) ఆహారము వేయని కడుపు. ఉసిరికాయయు, భోజనానంతరము రేగుపండును భుజింప వచ్చును. ఎప్పుడును వెలగపండు పద్యకరము. అరటిపండును ఒకప్పుడు పద్యకరముగాదు. - నీతిశాస్త్రము
సోమలత - 1.తిప్పతీగ, 2.సోమరసము తయారుచేయు తీగ.
సోమము - పరాక్రమము, సం.వి.1.తిప్పతీగ, 2.జలము, 3.కర్పూరము, 4.సోమరసము.
సోమ - 1.శ్రమము, 2.పరాక్రమము, రూ.సోమము, సం.శ్రమః, స్తోమః.
పురోడాశము - 1.యజ్ఞార్థమైన అపూపము, సోమలతరసము, 2.హుతశేషము.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
జీలకఱ్ఱ - జీలకర, జీలకఱ్ఱ, సం.జీరకః, (వ్యవ.) ఇది సంబారపు ద్రవ్యములలో నొకటి, (Cumin). ఇది umbelliferae అను కుటుంబమునకు చెందిన Cuminum Ciminumఅను మొక్క యొక్క పండ్లు.
జీరకో జీరణో (అ)జాజీ కణా -
జీర్యతే అన్నమనేన జీరకః, జీరనశ్చ జౄష్ వయోహానౌ. - దీనిచేత నన్నము జీర్ణమౌను గనుక జీరకము, జీరణమును.
అజంస్వాభావికమందాగ్ని మజతీతి అజాజీ, అజ గతిక్షేపణయోః. - స్వాభికమైన మందాగ్నినిఁ బోఁగొట్టునది. ఈకారాంతస్త్రీలింగము.
"స్త్ర్యజాజీజిరణౌ జీర" ఇతి వోపాలితః, కణా స్సంత్యస్యా ఇతి కణా. - సూక్ష్మావయవముల గలిగినది. ఈ 4 జీలకఱ్ఱ పేర్లు.
జీరకము - జీలకఱ్ఱ, రూ.జరగము.
అజాజీ - జీలకఱ్ఱ.
జీవాతువు - జీవగఱ్ఱ, బ్రతుకు.
జీవగఱ్ఱ - జీవనౌషధము, జీవనాధారము.
బ్రతుకు - 1.జీవనము, 2.జీవనోపాయము.
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
ఆజీవో జీవికా వార్తా వృత్తి ర్వర్నన జీవనే,
ఆజీవన్తి ప్రాణినో (అ)నేనేతి ఆజీవః, జీవి కా చ, జీవ ప్రాణధారణే. - దీనిచేత బ్రతుకుదురు.
వృత్తిః ప్రాణధారణా, సాస్యామస్తీతి వార్తా - వృత్తి యనఁగా ప్రాణధారము, అది దీనియందుఁ గలదు.
వర్తనే అనయేతి వృత్తిః, వర్తనం చ, వృతు వర్తనే. - దీనిచేత వర్తింతురు గనుక వృత్తి, వర్తనమును.
జీవంత్యనేన జీవనం, జీవ ప్రాణధారణే. - దీనిచేత బ్రతుకుదురు. ఈ 6 జీవనోపాయము పేర్లు, బ్రతుకు.
ఉపజీవిక - 1.బ్రతుకు, 2.జీవనోపాయము.
ఉపజీవి - ఒకరిననుసరించి బ్రతుకువాడు, రూ.ఉపజీవకుడు.
ఉపజీవించు - క్రి.ఒకరినాశ్రయించి జీవించు.
పంచ త్వానుగమిష్యంతి యత్ర యత్ర గమిష్యపి |
మిత్రాణ్యమిత్రా మధ్యస్థా ఉపజీవ్యోపజీవినః ||
భా|| స్నేహితులు friends, శత్రువులు foe, మధ్యస్థుఁడు - ఇ రు క క్ష లకు న్యాయము చెప్పువాడు, నడుమనుండువాడు. తటస్థులు, ఆశ్రయమిచ్చేవారు, ఆశ్రయం పొందేవారు - ఈ ఐదుగురు నీ వెంట వస్తారు, ఎప్పుడూ వెంటే వుంటారు.
జీవిక - బ్రతుకు తెరువు.
వార్త - వృతాంతము, సమాచారము, వర్తనము.
వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుచున్నది.
వృత్తి - 1.జీవనోపాయము, 2.నడవడి, 3.సమానము, 4.వివరణగ్రంథము.
వృత్తికళ - ఒక వృత్తికి సంబంధించిన కళ, నేర్పు.
వర్తనము - 1.నడవడి, 2.జీవనము.
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
కాయకము - బ్రదుకు, జీవనము.
వృత్తము - 1.నియత గణములును యతిప్రాసములుగల పద్యము, 2.నడత(నడత - ప్రవర్తనము), 3.జీవనము(జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.), విణ.వట్రువైనది, కొంచెము గట్టియైనది, (గణి.) ఒక సమతలములో ఒక స్థిరబిందువు నుండి ఒకే రూపములో చరించు బిందువు యొక్క పథము, (Circle).
మనువు - 1.జీవనము 2.వర్తనము 3.మగడు 4.కాపురము 5.పెండ్లి.
జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
వర్తనము - 1.నడవడి, ప్రవర్తన, నడత (Behavior) 2.జీవనము.
మగడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ. పురుషో హి ప్రజాపతిః.
పురుషా వాత్మ మానవౌ : పురుష శబ్దము జీవునికిని, మనుష్యునికిని పేరు. పిపర్తీతి పురుషః పౄ పాలన పూరణయోః - పాలించువాడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
ఏడుగడ - 1.గురువు, 2.తల్లి, 3.తండ్రి, 4.పురుషుడు, 5.విద్య, 6.దైవము, 7.దాత అని ఏడు విధములైన రక్షణము రూ.ఏడ్గడ (ఏడు + కడ).
ౙరుగుఁబాటు - జీవనము, రూ.జరుగుబడి, జరుగుడు.ౙరుగు - క్రి.జరగు.
ౙరుపుడు - దినములు జరుపుట.
ౙరుగు - 1.రొమ్ముతో ప్రాకు, జారుకా(ఉరస్సు చేత సంచరించునది), 2.జీవనము నడుచు(ౙరుగు బాటు)3.కడుచు 4.పోవు రూ.జరుగు.
నిర్వాహము - 1.శక్తి, 2.జరుగుబాటు.
ౘను - 1.పోవు, 2.చెల్లు, 3.తగు, 4.కడచు.
కుడుచు - 1.అనుభవించు, 2.తిను, 3.త్రాగు.
పోవు - 1.వెళ్ళు, 2.నశించు, 3.యత్నించు, 4.కలయు.
తగు - అర్హతమగు, రూ.తవు.
తవు - తగు యొక్క రూపాంతరము.
జరుగుబాటుంటే రోగమంత సుఖం లేదన్నాట్ట! జరుగుతే జయభేరి, లేకపోతే రణభేరి.
కాపురము - 1.నివాసము, 2.సంసారము.
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివసనము - ఇల్లు; నివసతి - ఇల్లు.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహమేధి - గృహస్థు, వ్యు.భార్యతో చేరియుండువాడు.
గృహిణి - ఇల్లాలు, భార్య.
వాసము - 1.వస్త్రము 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.
వస్త్రము - బట్ట, వలువ(సన్న వస్త్రము, బట్ట).
కాపు - 1.గృహస్థుడు 2.పంటపెట్టువాడు 3.శూద్రుడు 4.కాపురము.
ఇంటికాపు - గృహస్థుడు. ఇలుదొర - గృహస్థు.
ఆజవంజనము - సంసారము, కుటుంబము.
సంసృతి - సంసారము.
సంసారము - 1.ఆలుబిడ్డలతోడి యునికి, 2.ప్రపంచము.
సంసారి - సంసారము కలవాడు, గృహస్తుడు.
సంసరణము - 1.సంసారము, 2.బాట, 3.యుద్ధప్రారంభము.
ప్రపంచము - 1.లోకము, 2.సంసారము, 3.విరివి.
లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
విరివి - విస్తృతి, విణ.విస్తృతము, వెడల్పైనది.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్యాటికుఁడు - భార్యమాత జవదాటనివాడు.
పెండ్లి - వివాహము. వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్ట విధములు.
వార్తము - రోగము లేనిది,,వి.1.అనాయాసము, ఆరోగ్యము, 2.పొల్లు.
ఉత్తమం కులవిద్యాచ మధ్యమం కృషి వాణిజాత్|
అధమం సేవకావృత్తిః మృత్యుశ్చౌర్యోప జీవనాత్||
తా. కులవిద్యవలను జీవనము సేయుటయు ఉత్తమము, కృషి- సేద్యము, వ్యవసాయము వల్లను, వర్తకమువల్లను జీవించుట మధ్యమము, సేవ - శుశ్రూష, కొలువుగొలిచి జీవించుట (అ)ధమము, చౌర్యము - దొంగతనము చేత జీవించుటకంటె మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత. మంచిదని తెలియ వలెను. – నీతిశాస్త్రము
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి (వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
పుదీనాపువ్వు - (వ్యవ.) (Spear-mint) తులసి కుటుంబము (Labiatae)నకు చెందిన (Mentha viridis) అను పుదీనా మొక్క ఆకునుండి దీనిని తయారు చేయుదురు. ఇది ఒక పరిమళద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగింపబడుచుండును. ఈ మొక్క ఆకులతో పచ్చడి చేసికొని తినుచుందురు.
పెప్భర్మింటు - (వ్యవ.) (Peppar-mint). తులసి కుటుంబమునకు చెందిన Mentha piperata అను మొక్క ఆకుల నుండి దీని తయారు చేయుదురు. (ఇది పరిమళద్రవ్యముగను ఓషధిగను ఉపయోగపడును.)
భ్రమయుగ్మమంజరి - (వృక్ష.) ఇది ఒక ప్రత్యేక పుష్పమంజరి, ద్విశాఖీయమధ్యా రంభ మంజరి, సంక్షిప్తముకాబడి ఇది ఏర్పడును. దీని పుష్పములకు వృతంతములుండవు. తులసి కుటుంబము మిక్కల కిది కాననగును (Verticil-Laster).
లవండరు - (వ్యవ.) (Lavender) ఇది పరిమళము నిచ్చు అస్థిర తైలములలో నొకటి. దీనిని తులసి కుటుంబము (Labiatae)నకు చెందిన Lavendal Sp. అను మొక్కల పూవులనుండి తీయుదురు.
కళయా తులసీరూపం ధర్మధ్వజసుతా సతీ|
భుక్త్వా కదా లభిష్యామి త్వత్పాదాంబుజ మచ్యుత||
అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమ పువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.
అంబతే శబ్దాయత ఇత్యంబరం, అభిశబ్దే - శబ్దగుణక మగుటవలన మ్రోయుచుండునది.
అమ్బరం వ్యోమ్ని వాససి,
అంబరశబ్దము ఆకాశమునకును, వస్త్రమునకును పేరు. అంబత ఇతి అంబరం, అబి శబ్దే. - మ్రోయునది.
'అంబరం వ్యసనే వ్యమ్ని కార్పాసే చ సుగంధిని ' ఇతి విశ్వప్రకాశః.
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్యశివ |
వస్త్రము - బట్ట, వలువ.
బట్ట - 1.పశువుల మేని చార, విణ.వెండ్రుక లూడినది, 'బట్టతల ' వై.వి.వస్త్రము, సం.పటః. వలువ - సన్ననివస్త్రము, బట్ట.
ప్లోతము - 1.గాయమునకు కట్టుగుడ్డ, 2.బట్ట.
బట్ట - 1.పశువుల మేని చార, విణ.వెండ్రుక లూడినది, 'బట్టతల ' వై.వి.వస్త్రము, సం.పటః
బట్టల దొంతర్లు - (గృహ). బట్టల రాసుల మూటలు (Bales).
వస్త్ర మాచ్ఛాదనం వాస శ్చేల వసన మంశుకమ్,
వస్యతే అనేనాంగమితి వస్త్రం. వాసః. స. స. వసనం చ.వస ఆచ్చాదనే. - దీనిచేత అంగము కప్పఁబడును గనుక వస్త్రము, వాసస్సు, వసనము.
అచ్ఛాద్యతే అనేన ఆచ్ఛాదనం. ఛద ఆపవారణే. - దీనిచేత కప్పఁబడును.
చిల్యతే చేలం. చిల వసనే. - కట్టుకొనఁబడునది.
అంసుభిస్తంతుభిః. కాయతి అంశుకం. కై శబ్దే. - తంతువులచేత ఇంచుకంత పలుకునది. ఈ 5 కోకపేర్లు. నక్త కది శబ్దములు 6 కోకపేర్లని కొందరు.
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
కఱివేల్పు - కృష్ణుడు, నల్లనయ్య.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.
కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
ఆచ్ఛాదనము - 1.కప్పుట, 2.వస్త్రము.
కప్పు - 1.ఆచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు, 4.చీకటి, క్రి.1.క్రమ్ము, 2.మూయు.
క్రమ్ము - 1.కవియు, వ్యాపించు, 2.పైకుబుకు.
ఆచ్ఛాదనే సంపిధాన మపవారణ మిత్యుభే,
ఆచ్ఛాదనశబ్దము వస్త్రమునకును, కప్పుటకును పేరు. ఆచ్ఛాద్యతే అనేనేతి ఆచ్ఛాదనం. ఛద అపవారణే. - దీనిచేత కప్పఁబడును కనుకను, కప్పుట గనుకను అచ్ఛాదనము.
పటలము - 1.సమూహము, 2.ఇంటికప్పు, 3.కంటిపొర, 4.గ్రంథభాగము.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
కప్పుమేనిగాము - శనిగ్రహము Saturn.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
అవగుంఠనము - 1.మేలు ముసుగు, 2.దానిని వేసికొనుట, 3.కప్పువస్త్రము, 4.కప్పు.
కప్పుఁదెరువరి - అగ్ని.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
స్థగితము - కప్పు.
స్థగితము - 1.కప్పబడినది, 2.కూర్పబడినది.
అంతరీయము - కట్తుబట్ట, పరిధానము.
కట్టుఁగొంగు - కోకయొక్క కట్టుకొను చెరగు.
అన్తరీ యోపసంవ్యాన పరిధానా వ్యధో అంశుకే,
నాభే రంతరే భవం అంతరీయం. – నాభి యొక్కయు పిక్క యొక్కయు నడుమ నుండునది.ఉపసంవీయతే అనేనేతి ఉపసంవ్యానం, వ్యేఞ్ సంవరణే. – చుట్టఁ బడునది.
పరిధీయతే అనేనేతి పరిధానం డుధాఞ్. ధారణపోషణయోః. - ధరింపఁబడునది.
అధాస్థ్సితం అంశుకం అధోంశుకం. - క్రింద నుండు కోక. ఈ 4 కట్టుచేర పేర్లు.
పరిధానము - ధోవతి.
దోవతి - మగవాని కట్టువత్రము.
కట్టుగోక - మొలగుడ్డ, ధోవతి.
వేషువ - ధోవతి, సం.వేష్టితమ్.
వేష్టించు - క్రి.పరివేష్టించు.
అంకుశము - 1.వస్త్రము, 2.సన్నని వస్త్రము, 3.ఉత్తరీయము, పైట, 4.మృదుకాంతి, (వృక్ష.) ఆకుపత్రి.
సంవ్యానము - 1.ఉత్తరీయము, 2.వస్త్రము.
ఓణి - 1.ఉత్తరీయము, కండువా, 2.యుక్త వయస్సు వచ్చిన ఆడువారు పరికిణి పైన భుజముపైకి వేసికొను పైట.
కండువ - ఉత్తరీయము.
ఉత్తరవాసము - పై వస్త్రము, ఉత్తరీయము.
ఒలె - వస్త్రము, ఉత్తరీయము, రూ.ఒల్లె, ఒల్లియ, వల్లె, వల్లియ.
ఒల్లియ - ఒల్లె; ఒల్లె - ఒలె.
ఒల్లెవాటు - మెడచుట్టి వచ్చు నట్లు భుజముల మీద వైచుకొనుట, రూ.వల్లెవాటు.
వలెవాటు - వల్లెవాటుగా వైచుకొనిన ఉత్తరీయము.
పైఁట - పయట, సం.పైఠా.
పయఁట - స్త్రీల రొమ్ముమీదివస్త్రము చెరుగు, రూ.పయ్యఁట, పైట, సం.ప్రతిష్ఠానమ్, పై ఠా.
పైయ్యెద - (పై+ఎద) పయట, రూ.పయ్యద.
బాహ్లికము - 1.ఇంగువ, 2.కుంకుమపువ్వు, 3.ఒక దేశము.
అగ్నిశిఖము - కుంకుమపువ్వు; వహ్నిశిఖము - కుంకుమపువ్వు; ఘుసృణము - కుంకుమపువ్వు.
కుంకుమపువ్వు - అగ్నిశిఖయను అంగడి దినుసు, కాశ్మీరము, (వ్యవ.) 'ఇరిడేసి' (Iridacease) అను కుటుంబమునకు చెందిన Crocus sativus అను మొక్క యొక్క పుష్పముల లోని కీలాగ్రములు. ఇవి నారింజవర్ణముతో గూడిన ఎరుపు రంగు కలిగియుండును. ఇది పరిమళ ద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగింపబడు చుండును (Saffron).
కాశ్మీరము - 1.కుంకుమపూవు, 2.మెట్ట తామరదుంప, 3.కాశ్మీరదేశము.
కాశ్మీరదేశే భవం కాశ్మీరం - కాశ్మీరదేశమందుఁ బుట్టినది. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం|
అంబరు- ఒక పరిమళద్రవ్యము, సం.అంబరమ్.
వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా, పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధవహాత్మతా న్నపచనే బర్హిర్ముఖా ద్యక్షతా,
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చే ద్బాలేదు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే! స్వామిన్! త్రిలోకీ గురో. - 30శ్లో
తా. మస్తకంపై బాలచంద్రుడ్డి ధరించిన దేవా పశుపతి - శివుడు ! జగత్రయాలకు గురువైన వాడా ! అంబరాలను (బట్టలను) శుభ్రం చేసే విషయంలో సహస్రకరాలు కల సూర్యత్వాన్నీ, పువ్వులతో పూజించడంలో(వ్యాపకత్వం) విష్ణుత్వాన్నీ, సు గం ధా న్ని వ్యాపింపజేయడంలో వాయుత్వాన్నీ, ఆహారాన్ని పక్వం చెయ్యడంలో- ఇంద్రత్వాన్నీ, పాత్రలను శుభ్రం చెయ్యడంలో(సువర్ణత్వం) అంటే బ్రహ్మత్వాన్నీ నేను పొంది ఉంటే నీ సేవ చేయగలను. – శివానందలహరి
కుచేలము - 1.చినిగిన వస్త్రము, 2.సముద్రము.
నక్తకము-1.చినిగిన వస్త్రము, 2.మాసిన వస్త్రము. కర్పడము - 1.చి ని గి న బ ట్ట, 2.మాసినగుడ్డ.
సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.
మానేన రఖ్యతే ధాన్యం అశ్వాన్ రక్షత్యమ క్రమః |
అభీక్ష్ణదర్శనం గాశ్చ స్త్రియో రక్ష్యాః కుచేలతః ||
భా|| కొలతచే ధాన్యము - 1.వడ్లు మొ.గునవి, 2.ధనియాలు, 3.కొఱ్ఱ, జొన్న మొదలగు తృణధాన్యములు (Grain) కాపాడబడుతుంది, వెంబడింపు గురాల్నిఅశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అనుసంఖ్య. కాపాడుతుంది, మాటిమాటికి చూచుకోవటం దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము. వల్ల ఆవులు, మలినవస్త్రాల వల్ల స్త్రీలు కాపాడబడుతారు.
నిష్ఠురము - కఠినము, పరుషము.
నితరాం తిష్ఠతీతి నిష్ఠురం, ష్ఠా గతినివృత్తౌ. - మిక్కిలి యుండునది.
నిష్ఠురం పరుషమ్ -
నిశితమివ తిష్ఠతీతి పరుషం. ష్ఠా గతినివృత్తౌ. - తీక్షణమైయుండునది.
పివర్తివక్తారమితి పరుషం. వౄ పాలన పూరణయోః - పలికెడు వానిని బూర్ణముగాఁ జేయునది. ఈ 2 కఠినమైన వాక్కు పేర్లు.
పరుషము - 1.నిష్ఠురము, 2.నిష్ఠురవాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు.
సంధ్యనిద్ర - (గృహ.) 1.చీకటి పడెడి సమయమందు నిద్రపోవుట, 2.ప్రసూతి సమయమున గలుగజేయు మైకము, (ఇందు కై మార్ఫిన్, స్కోపోలమిస్ అల్కాలాయడ్ల మిశ్రమమునిత్తురు) (Twilight sleep).
కుచేలినం దంతమలాపహారిణం |
బహ్వాశినం నిష్ఠుర వాక్య భాషిణమ్|
సూర్యోదయే చా స్తమయేచశాయినం, విముంచతి శ్రీరసి చక్రపాణినమ్||
తా. మలినవస్త్రము ధరించినవానిని, పండ్లు తోమనివానిని, తిండిపోతు ను, నిష్ఠురోక్తులు కలవానిని, ప్రాతస్సాయంకాలముల యందు నిద్రించు వానిని, ఇతర గుణములచేత విష్ణు చక్రపాణి - విష్ణువు సమానులై యున్నను వీరిని లక్ష్మి పరిత్యజించును. - నీతిశాస్త్రము
పట్ర - ఒకానొక కిరాతుడు, సం.పాటచ్చరః.
కిరాతుఁడు - ఆటవికుడు, అడవియందు తిరిగెడు బోయ.
పాటచ్చరుఁడు - దొంగ, వ్యు.ముసుగు వేసికొనినట్లు కనబడకుండ తిరుగువాడు.
పాటయన్ విదళయన్ చరతీతి పాటచ్చరః చరగతి భక్షణయోః. - పీడించుచుఁ జరించువాఁడు, పటచ్చర మపి గృహ్నాతీతి పాటచ్చరః - చినిఁగిన కోకనైనను దీసికొనువాఁడు.
పాటచ్చర యామిక న్యాయము - న్యా. దొంగను గస్తీ తిరుగుటకు నియమించినచో దొంగతనము పట్టువారుండురను రీతి.
పటచ్చరం జీర్ణవస్త్రమ్ -
పటచ్చరము - ప్రాతగుడ్డ.
పటదితిచరతి స్ఫుటతీతి పటచ్ఛరం. - పట్టని చినుఁగునది.
పూర్వంపటభూతం పటచ్చరం పూర్వము మంచికోకయై యుండినది.
ప్రాఁగబ్బము - (ప్రాత+కబ్బము), వేదము.
ప్రాఁత - 1.భృత్యుడు, 2.జీర్ణవస్త్రము, వస్త్రము, విణ.1.బహుకాలము నాటిది, పూర్వము, పురాతనము, సం.భృత్యః, వస్త్రమ్, పురాతనమ్.
కబ్బము - ప్రబంధము(ప్రబంధము - కావ్యము.), సం.కావ్యమ్.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
భరణీయో భృత్యః, డు భృఞ్ ధరణ పోషణయోః - పోషింపఁదగినవాఁడు.
జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము.
జీర్ణంచతత్ వస్త్రంచజీర్ణ వస్త్రం. - చినిఁగిన కోక.
మెదుగుడు - ప్రాతవస్త్రము.
చింపి - చినిగినది (వస్త్రము).
చించు - క్రి. 1.చినుగచేయు, రూ.చింపు.
చింపు - 1.చించు, 2. వి.చినిగినవస్త్ర ఖండము.
పికులు - (వ్యావ.) చినుగు, రూ.పిగులు.
చినుఁగు - క్రి. వస్త్రాదులు చిన్నమగు.
అంపియ - చింపిగుడ్ద, రూ.అంపె.
అంపె - అంపియ.
పూర్వము - మొదటిది, (జం.) ముందుగానున్న (Anterior).
పురాతనము - ప్రాతది.
ప్రాక్తనము - 1.ప్రాతది, 2.పురాతనము.
ప్రాక్తనజన్మ - పూర్వజన్మ.
శిధిలము - సంధులు వదలినది, శ్లథము.
శ్లథము - శిధిలమైనది, వదులైనది.
వదులు - క్రి.శిధిలమగు, పట్టువీడు. వదులు - బిగుతుకానిది.
అఱగుళ్ళు - శిథిలము, వి.తునకలు.
రినోవేషన్ - (గృహ.) (Renovation) ప్రాతవానిని క్రొత్తవిగా చేయుట.
చిరత్నము - చిరంతనము.
చిరంతనము - 1.బహుదినములది, 2.ప్రాతది, రూ.చిరత్నము.
చిరలగ్నము - (వృక్ష.) కొన్ని ఏండ్లవరకు ఉండునట్టిది (Persistent).
వాసాంసి జీర్ణాని యథా విహాయ - నవాని గృహ్ణాతి నరో పరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నావాని దేహీ || - 22శ్లో
తా|| మనుజుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచి ఇతరములగు నూతన వస్త్రములను ధరించినట్లు, జీవాత్మయు, నిరుపయోగములైన జీర్ణ శరీరములను వదలి ఇతరములగు నూతన శరీరములను ధరించు చుండును. - భగవద్గీత, సాంఖ్యయోగము
రథ్యాచర్పట విరచిత కంథః, పుణ్యాపుణ్య వివర్జితపంథః |
యోగీ యోగ నియోజిత చిత్తో, రమతే బాలోన్మత్తవదేవ || - 22
దారిలో దొరికిన గుడ్దపేలికలతో చేయబడిన బొంతను చుట్టుకొని, పుణ్యపాపాలకు అతీతమైన మార్గాన చరిస్తూ యోగమందే చిత్తాన్ని నిల్పియుంచు యోగి, పసిబాలునివలె, పిచ్చివాని వలె ఆనందిస్తుంటాడు. - భజగోవిందం
He who wears a dress made of rags that lie about in the streets, he who walks in the path that is beyond merit and demerit, the yogin whose mind is given up to yoga, revels (in Brahman) just as a child or as a mad man.
అంబు - 1.ఆకాశము,2.స్వర్గము, 3.శూన్యము, 4.సుఖము.
అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంభోజము - 1.తామర, (జం.) సారసపక్షి, బెగ్గురుపక్షి.
అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
మేఘైర్న భాతీతి నభః, స. న. భా దీప్తౌ ప్ మెయిళ్ళచేతఁ బ్రకాశింపనిది.
నభస్వంతుఁడు - వాయువు.
నభఃకారణత్వాన్నభో (అ)స్యాస్తీతి నభస్వాన్ త-పు. - ఆకాశము ఉత్పత్తిస్థానముగాఁగలవాఁడు.
అంతరిక్షము - ఆకాశము, రూ.అంతరిక్షము.
అంతః ఈక్ష్యతే జగదస్మిన్ని త్యంతరిక్షం, ఈక్ష దర్శనే. - దీనిలోపలను జగత్తు చూడఁబడును.
అంత ఋక్షాణి నత్యస్మిన్ని త్యంతరిక్షం - నక్షత్రము లిందుఁ గలవు.
అంతరిక్షనౌక - ఖగోళయాత్రలో రాకెట్ చోదనముచే పయనించు విమానము (Space-Ship).
విమానము - 1.వ్యోమయానము, వ్యు.ఆకశమున సంచరించునది, 2.చక్రవర్తి సౌధము, 3.ఓడ, గర్భగుడిపై గల గోపురము, (బౌతి.) గాలిలో ప్రయాణించు ఓడ, (Air-craft, Aeroplane).
వ్యోమయానము - ఆకాశమునందు తిరుగు విమానము.
వ్యోమగామి - గ్రహాంతరములకు అంతరిక్ష నౌకలో(Space ship) ప్రయాణము చేయు వ్యక్తి (Austronaut).
విమానవాహకము - (బౌతి.) విమానములు దిగుటకు ఎగిరిపోవుటకు అనువైన ప్రదేశము కలిగిన ఓడ (Air-craft carrier).
ఖగోళము - ఆకాశ మండలము.
ఖగోళశాస్త్రము - (ఖగో.) నక్షత్రములు, గ్రహములు మొ.గు వానిని గూర్చి తెలుపు శాస్త్రము (Astronomy).
అంతరాళము - 1.ఎల్లదిక్కులకు నడిమిచోటు, 2.(దేశకాలముల) నడిమి భాగము, 3.సంకీర్ణజాతి, సంకరజాతి.
ఎడము - 1.చోటు(చోటు - తావు), 2.అవకాశము, 3.నడిమిభాగము.
సంకీర్ణము - ఒకటితో నొకటి కలిసినది.
సంకరము - బేధము తెలియని కూడిక.
ఆస్కారము - ఆధారము, అవకాశము.
అవకాశము - 1.తరుణము, వీలు, 2.దేశకాలముల ఎడము, 3.(భౌతి.) సకల రాసులను కలిసియుండి ఆద్యంతములు లేనిది (Space).
తరుణము - సమయము Time, సం.విణ. క్రొత్తది, యౌవనముగలది.
వీలు - అనుకూల్యము, క్రమము.
క్రమము - 1.విధము, 2.వరుస, సొరిది, 3.విధి, 4.క్రమాలంకారము.
ఒక మహాదవకాశం కొరకు వేచి చూడటం కంటె వచ్చే చిన్న చిన్న అవకాశాలను ఉపయోగించుకుని లక్ష్యాన్ని చేరుకోవచ్చు. - హగ్ ఎలెన్
ఆశావాదికి ప్రతి దురదృష్ట సంఘటనలో(ఘోరమైన సన్నివేశంలోనూ) ఒక అవకాశం కనిపిస్తే, నిరాశావాదికి ప్రతి అవకాశంలోనూ ఒక దురదృష్టము (ఘోరం, చెడు) కనిపిస్తుంది. - ఒక సూక్తి
అనువు - 1.విధము, 2.ఉపాయము, 3.అనుకూల్యము, 4.సామర్థ్యము, 5.అవకాశము, 6.బాగు (విణ.) 1.యుక్తము, తగినది, 2.వరమైనది, 3.వీలైనది.
అనువుచేయు - క్రి.సిద్ధపరుచు, అయుత్తపరుచు.
అనువుపడు - క్రి.1.ఏర్పడు, 2.అనుకూలపడు, 3.నెరవేరు, 4.ఒప్పు.
వీలు - అనుకూల్యము, క్రమము.
క్రమము - 1.విధము, 2.వరుస, సొరిది, 3.విధి, 4.క్రమాలంకారము.
శీతకారు - (వ్యవ.) డిసెంబరు December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు, హేమంత ఋతువు (Winter season).
22. శ్రవణము - ఒకే పంక్తిగా వేణువువలె 8 నక్షత్రములుండును.
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి.
వెదురు - వేణువు, సం.వేణుకః.
వాసెగ్రోలు - పిల్లనగ్రోవి, వంశి. కరతలే వేణుమ్…
తృణధ్వజము - వెదురు.
తృణానాం మధ్యే ముఖ్యత్వాత్ తృణధ్వజః - తృణవిషేషములలో ముఖ్యమైనది.
అకూపారము - మేరలేనిది, వి.1.సముద్రము, 2.ఆదికూర్మము.
అమితము - విస్తారము, మితిలేని, మేరలేనిది.
నిరవధికము - మేరలేనిది.
అనంతము - 1.మేరలేనిది, 2.నాశరహితమైనది, వి. 1.విష్ణు శంఖము, 2.మేఘము, 3.అభ్రకము, 4.(వృక్ష.)వావిలి, 5.శ్రవణ నక్షత్రము, 6.అనంత చతుర్దశినాడు చేతికి కట్టుకొను తోరము, 7.ఆకాశము, 8.మోక్షము, 9.పరబ్రహ్మము.
న విద్యతే అంతో యస్యతత్ అనంతం, అంతము లేనిది.
అనంతుఁడు - విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణు, ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
మలయమున జందనము క్రియ,
వెలయఁగ ధర్మజుని కీర్తి వెలయించుటకై
యిలలో నభవుఁడు హరి యదు
కులమున నుదయించె నండ్రు గొంద ఱనంతా!
భా|| అనంతా! ధర్మనందనుని యశస్సు నలుదెసలా ప్రసరింప జేయుటా నికి మలయపర్వతం(మలయము - 1.ఒక కొండ, 2.ఆరామము.)మీద చందనవృక్షం చందాన, పుట్టుక ఎరుగని పురుషోత్తముడు(హరి) యదు వంశములో జన్మించాడని కొందరంటారు.
పాంచజన్యము - విష్ణువు శంఖము.
వలమురి - దక్షిణావర్త శంఖము. దక్షిణావర్తము - (వృక్ష.) కుడి నుండి ఎడమ వైపునకు చుట్టుకొనునది.
వలము - 1.స్థౌల్యము, 2.విస్తారము.
స్థౌల్యము - స్థూలభావము, లావుతనము, మొద్దుతనము.
వలమురి తాలుపు - విష్ణువు.
శంఖో లక్ష్మీపతేః పాంచజన్యః :
పాంచజన్యః సముద్రే తిమిరరూపచారిణః పరచజనాఖ్యస్యా సురస్య అస్థిజత్వా త్పాంచజన్యః - సముద్రమందు తిమిర(తిమిరము - చీకటి)రూపుఁడై సంచరించు చున్న పంచజనుఁ డనెడు(పంచజనుఁడు - 1.మనుజుడు, 2.ఒక రాక్షసుని పేరు.)రాక్షసుని యొక్క అస్థివలనఁ బుట్టినది.
పంచజనుఁడు - 1.మనుజుడు, 2.ఒక రాక్షసుని పేరు.
పంచభిః పృథివ్యాదిభిర్జాయంత ఇతి పంచజనాః - పృథివి మొదలైన పంచభూతములచేఁబుట్టువారు.
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు మ్రోవ నాగవభూమిన్
విభ్రములగు దనుజనుతా
గర్భంబులు వగులఁజేయు ఘనుఁడవు కృష్ణా.
తా. కృష్ణా! శుభ్రమగు పాంచజన్యమును, ఆకాశమంట్లునట్లు మ్రోగించి, యుద్ధభూమిలో దనుజుల(దనుజుఁడు - రాక్షసుడు, వ్యు.దనువు నందు జన్మించినవాడు.)గర్భంబులు భేదింపఁ జేయు ఘనుడవు కదా !
పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః|
పౌండ్రం దథ్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదరః|| -15వ శ్లో
తా|| శ్రీకృష్ణుడు(హృషీకేశుఁడు - విష్ణువు)పాంచజన్యమను శంఖమును, అర్జునుడు దేవదత్తమను శంఖమును, భయంకరమగు కార్యములనొనర్చు భీముడు(వృకోదరుఁడు - భీముడు)పౌండ్రమను మహాశంఖమును ఊదిరి. - అర్జున విహాదయోగము, భగవద్గీత
వైకుంఠుడు - 1.విష్ణువు, 2.ఇంద్రుడు.
వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.
ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా
కార పిశాచసంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వారకవాటభేది నిజ దాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
తా. రామా! నీ తారకనామము భయంకరులయిన యమదూతలను(కృతాంతుఁడు - యముడు)గుండెలదరజేయును. దరిద్రత అనెడి పిశాచమును బోగొట్టును. ఎల్లప్పుడును నీ దాసజనులు పరమ పదమునకుఁ బోవుటకుగల యుడ్డములను తొలగించును.
వాసుకము - వైకుంఠము. కంఠం వైకుంఠ వాసినీ|
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. వైకుంఠాలయ సంస్థిత రామ్|
విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణోః పదం విష్ణుపదం - విష్ణువునునకు స్థానము.
విష్ణుపది - గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగా గలది.
విష్ణుపదోద్భవా విష్ణుపదీ. ఈ. సీ.- విష్ణుపాదమునఁ బుట్టినది.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.
పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది - పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.
వైకుంఠేచ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి
గంగాచతులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకగాః
కృష్ణప్రాణాధిదేవీత్వం గోలోకేరాధికాస్వయమ్
రాసేరాసేస్వరీ త్వంచబృందావనేవనే|| - 3స్తో
విరజ - వైకుంఠము నందుండు నది. (మోక్షం కలగాలంటే దీన్ని దాటాలి) పరమపదమున సమీపముగా నుండునది విరజానది, ఆ విరజా నదియే యమునగా మారి వచ్చినది - తిరుప్పవై.
విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా,
యస్యాః సందర్శనా న్మర్త్యాః పునాత్యాసప్తమం కులమ్ |
ఉత్కలదేశమున విరజయను క్షేత్రముకలదు. ఆ క్షేత్ర అధిస్ఠానదేవతకు విరజయను సంజ్ఞ కలదు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడిన ఈ దేవతా సందర్శనమున నేడుతరముల(ఏడు తరముల)వారిని పునీతుల చేయుదురని బ్రహ్మాండ పురాణమున తెలియుచున్నది.
శ్రీరమ సీతగాఁగ నిజ సేవకబృందము వీర వైష్ణవా
చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్రశైల శిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధారకు డన విష్ణుఁడవు దాశరథీ కరుణా పయోనిధీ.
తా. దశరథరామా ! నీవు పరమపదమందున్న లక్షీదేవిని ఇచట సీతగాఁ జేసికొని, అందలి పరివారము ఇచట వీరవైష్ణవజనులుగా వచ్చి కొలుచు చుండగా, అచ్చట విరజానది ఇచట గోదావరిగా ప్రవహింపగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రగిరి కొమ్మకొనయై రాణింపగా వేంచేసి చేతనులను ఉద్దరించుచున్న శ్రీవిష్ణుదేవుండవే కాని వేఱుకావు.
రామో విరామో విరజో మార్గనేయో నయోనయః
వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మవిదుత్తమః - 43శ్లో
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. - 149శ్లో
తూపు రిక్క - శ్రవణ నక్షత్రము.
తూపు - బాణము.
తూపురిక్క నెల - శ్రావణమాసము.
శ్రావణము - 1.వినిపించుట, 2.ఒక మాసము, 3.పట్టుగఱ్ఱవంటి చిన్న పనిముట్టు (Forceps).
శ్రావణే తు స్యాన్నభాః శ్రావణికశ్చసః :
శ్రవణనక్షత్ర యుక్తా పూర్ణిమా స్మిన్నితి శ్రావణః, శ్రావణికశ్చ. - శ్రవణనక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁగలదు.
ప్రవంత్యస్మిన్ మేఘా ఇతి శ్రావణః. స్రుప్ర స్రవణే. - దీనియందు మేఘములు వర్షించుచున్నవి.
న భాసతే మేఘచ్ఛన్న త్వాత్ నభాః స. పు. భాసృ దీప్తౌ. - మేఘచ్ఛన్నమై ప్రకాశింపనిది. ఈ మూడు శ్రాణమాస నామములు.
పాదోదకము - మేఘము.
పాద్యము - పాదము కొరకైన నీళ్ళు.
నీరదము - మేఘము.
అభ్రము - 1.మేఘము, 2.ఆకాశము, 3.అభ్రకము, 4.బంగారు, 5.హారతి కర్పూరము, 6.తుంగముస్త, 7.(గణి.) సున్న.
అపః బిభర్తీ త్యభ్రం భృఞ్ భరణే - ఉదకమును భరించునది.
నభ్రంశం త్యాపో స్మాది త్యభ్రం, భ్రంస గతౌ. - ఉదకములు దీనినుండి కొఱతపడవు - అనఁగా దీయందు లేకపోవు.
అపో రాతీ త్యభ్రం, రా దానే. - ఉదకము నిచ్చునది.
అభ్రతిగచ్ఛతీత్యభ్రం, అభ్రగతౌ - సంచరించునది.
అభ్రమణి - సూర్యుడు.
న భ్రమతి అమూర్తత్వాత్ అభ్రం, భ్రము చలనే - అమూర్తమైనదున చలింపనిది.
నభ్రాజత ఇత్యభ్రం, భ్రాజృదీప్తౌ - అమూర్మై నదున ప్రకాశింపనిది Sky.
అభ్రంకషము - ఆకాశమును ఒరయునది, మిక్కిలి ఎత్తైనది.
ఆకాశమును మేఘములు ఆవరించినా - ఆవరించక పోయినా సూర్యునికి ఎటువంటి హాని వృద్ధులు ఉండవు కదా!
అంభోదము - 1.మేఘము, 2.(వృక్ష) తుంగమస్త.
అంభోదరము - 1.మేఘము, వ్యు.నీటిని ధరించునది, 2.(వృక్ష.)ముస్త.
ఆకాశమును మేఘములు ఆవరించినా - ఆవరించక పోయినా సూర్యునికి ఎటువంటి హాని వృద్ధులు ఉండవు కదా!
అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
నభ్రమతి స్వం వల్లభం హిత్వా కుత్రచిన్న గచ్ఛతీ త్యభ్రముః. ఉ-సీ భ్రముచలనే - తన మగని విడిచి కదలనిది.
అభ్రేషు మాతివర్తత ఇత్యభ్రముః మాఙ్ మానే వర్తనేచ - మేఘముల యందుండునది.
అమలము - 1.నిర్మలము, 2.దోషము లేనిది 3.తెల్లనిది, వి. అభ్రకము.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషము లేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
శుద్ధత - (రసా,) శుద్ధముగానుండు స్థితి (Purity).
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||ని.
అభ్రకం గిరిజామలే :
అభ్రసదృశత్వాత్ అభ్రకం - మేఘమువంటి వర్ణము గలది.
గిరౌయత ఇతి గిరిజం. జనీ ప్రాదుర్భావే. - పర్వతమునఁ బుట్టినది.
న విద్యతే మల మత్రేతి అమలం - దీనియందు కల్మషము లేదు.
గిరిజామలమని యొకపేరుగాఁ గొందఱు చెప్పుదురు. ఈ 3 మూడు అభ్రకము పేర్లు.
అభ్రకము - (రసా.) కాకిబంగారము, (రాసాయనికముగ ఇది మగ్నీషియమ్, ఇనుము, సోడియమ్, పొటాషియమ్‌తో కూడుకొనిన సిలికేట్ యౌగికము. ఇది పొరలుగా విడదీయబడ గలదు. దీనిని తాపవిద్యుత్ నిరోధకముగా వాడుదురు) (Mica).
కాకిబంగారము - పీతాభ్రకము.
బేగడ - కాకి బంగారు; ముచ్చెబంగారు - కాకి బంగారు.
ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః.
అబ్దము - 1.సంవత్సరము, 2.మేఘము, 3.తుంగమస్త, 4.ఒక కొండ, 5.అద్దము, విణ.నీటి నిచ్చునది.
అప్యతే అధికమాసేన అబ్దః, ఆప్ ఌ వ్యాప్తౌ. - అధికమాసముచే వ్యాపించునది.
అపః దదాతీతివా అబ్దః, డుదాఞ్దానే. - జలము నిచ్చునది.
అబ్దౌ జీమూత వత్సరౌ,
అబ్దశబ్దము మేఘమునకును, సంవత్సరమునకును పేరు. పా, అబ్దౌ జీమూతపర్వతౌ, అపో దదాతీతి, ఆప్నోతీతి చ అబ్దః, డు దాఞ్ దానే, ఆప్ ఌ వ్యాప్తౌ. - జలము నిచ్చునదియు, పొందినదియు అబ్దము. "గిరిదర్పణయో దబ్ద" ఇతి శేషః.
ఆబ్దికము - తద్దినము, మరణించిన వారికి ప్రతి సంవత్సరము అతిథియందు చేయు కర్మము, వ్యు.అబ్దమున కొకసారి చేయబడునది.
తద్దినము - 1.ఆదినము, 2.మృతి పొందిన దినము, 3.అబ్దికము పెట్టుదినము.
అనువు గానిచోట నధికుల మనరాదు
గొంచెమైన నదియు గొదువగాదు
కొండ యద్దమందుఁ గొంచమైయుండదా! విశ్వ.
తా. వీలుగానిచోట అధికుడని(అధికుఁడు - గొప్పవాడు)డని సంచరించరాదు. సామాన్యముగా నుండుట (కొద - కొదవ, తక్కువ.)నీచముగాదు. అద్దములో కొండచిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు కదా!
అంభోదము - 1.మేఘము, 2.(వృక్ష) తుంగమస్త.
అంభోదరము - 1.మేఘము, వ్యు.నీటిని ధరించునది, 2.(వృక్ష.)ముస్త.
జీమూతము - 1.మేఘము, 2.కొండ.
జీవన ముదకం మూయతే బద్ద్యతే త్ర జీమూత, మూఙ్ బంధనే - ఉదకము దీనియందు బంధింపఁబదును.
జీమూతౌ మేఘపర్వతౌ :
జీమూతశబ్దము మేఘమునకును, పర్వతము నకును పేరు.
జీవనం ముఞ్చతీతి జీమూతః - జీమూతమును (నీళ్ళను) ఇచ్చును.
జీవన ముదకం మూయతే బద్ధ్యతే త్ర జీమూతః, మూజ్ బందహనే – ఉదకము, నీరు దీనియందు బంధింపఁబడును.
అంబుదము - నీటి నిచ్చునది, మేఘము, మబ్బు.
పర్జన్యుఁడు - వర్షాధిపతి.
పర్జన్యము - 1.ఉరిమెడు మేఘము, 2.ఉరుము.
మేఘనాదము - ఉరుము.
పర్జన్యౌ రసద బ్దేన్ద్రౌ -
పర్జన్యశబ్దము ఉఱుముచున్న మేఘమునకును, దేవేంద్రునికిని పేరు. పర్షతీతి పర్జన్యః పృషు సేచనే. - వర్షించును గనుక పర్జన్యుఁడు.
పర్జన్యనాథాః పశవః రాజానః మంత్రి బాంధవాః|
పతయో బాంధవాః స్త్రీణాం బ్రాహ్మణాః వేద బాంధవాః||
భా|| పశువులకు మేఘుడు రక్షకుడు, రాజులకు మంత్రి-1.ధీసచివుడు, 2.సహాయుడు. చుట్టాలు. స్త్రీలకు పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు. బంధువులు, బ్రాహ్మణులకు వేదాలే చుట్టాలు.
ఘనాఘనుఁడు - ఇంద్రుడు.
ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు.
ఘనాఘనము -1.కురియునట్టి మేఘము, 2.తొలిమొగులు, 3.హింసించునట్టి మదపుటేనుగు.
తొలుమొగులు - వర్షించుచున్న మేఘము.
దేవమాతృకము - వర్షాధారమున పండెడు పైరు గల దేశము.
దేవః మాతస్య దేవమాతృకః - పర్జన్యుఁడే తల్లిగాఁ గలది.
మేఘములను ఎవరు - ఘర్జించమన్నారు?
ఆకాశంలో కదిలే మేఘాలు ఆకాశాన్ని మలినం చేయడం లేదు. మేఘములు నలుపైనా కురిసే వాన తెలుపే.
మేఘముల రాక - పోకలతో ఆకాశం దోషం పొందుతోందా?
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచియుగ్రవా
క్పరుషత జూపినన్ ఫలముగల్గుట తద్మము గాదె, యంబుదం
బురిమిన యంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ
స్థిరతర పౌరుషంబున (న)అశేషజనంబు లెఱంగ, భాస్కరా.
తా. మేఘము భయంకరముగా నురిమి తుదకు జనులను రక్షించుటకై వర్షము కురియును, అట్లే కనికరించు స్వభావము కలవాడు సమయము కొలది కఠినముగా మాట్లాడినను తుదకు మేలునే చేయును.
అద్దము - 1.సగము, సం.అర్థమ్, 2.దర్పణము, సం.అబ్దమ్.
దర్పణము - అద్దము, (భౌతి.) కాంతి కిరణమును క్రమపరావర్తనము నొందించు నునుపైన ఉపరతలము గల వస్తువు, (Mirror).
ముకురము - 1.అద్దము, రూ.మకురము, 2.కుమ్మరిసారె త్రిప్పెడు కఱ్ఱ.
ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
దర్పణేముకు రాదర్శౌ -
దృప్యతే అనేన నువేషాభిమానా దితి దర్పణః దృప దృప్తౌ. - దీనిచేత మంచి వేషాభిమానము వలన గర్వింతురు. ముకుర సాహచర్యము చేత పులింగము.
మంక్యతే అనేన ముకురః, మకిమండనే. దీనిచేత నలంకరింపఁబడుదురు, షా. మకురః.
ఆదశ్యతే (అ)స్తి న్నాత్తనః - ప్రతిబింబమితి ఆదర్శ, దృశిర్ ప్రేక్షణే. - దీనియందు తన నీడ కానఁబడును. ఈ అద్దము పేర్లు.
ఆదర్శగజ న్యాయము - న్యా.పెద్ద ఏనుగు చిన్న అద్దములో కనిపించుట అను న్యాయము.
ఆదర్శము - 1.పరమోత్కృష్టస్థితి, మేలుబంతి, 2.అద్దము, విణ.అనుకరింపదగినది.
దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.
దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు; (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్దివాడు, 3.మంచికన్నులు కలవాడు.
ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు - ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వీనికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).
తెలియని కార్యమెల్ల గడదేర్చుటకొక్క వివేకి జేకొనన్
వలయు, దానదిద్దికొననచ్చు, బ్రయోజన మాంద్యమేమయిన్
గలుఁగదు, ఫాలమందుఁ దిలకంబిడునప్పుడు చేతనద్దమున్
గలిగినఁ జక్కఁజేసికొనుఁగాదె నరుండది చూచి, భాస్కరా.
తా. చేతిలో అద్దము గలవాడు అది చూచి బొట్టు(కురువము - తిలకము)చక్కగా పెట్టుకొనును, అట్లే తనకు తెలియనిపనిని చేయవలసి వచ్చినట్ల యతే, ఆ పని నెరింగిన మంచివారి నాశ్రయించి నెరవేర్చుకొన వలెను.
విశ్వం దర్పణదృశ్యమాననగరీ - తుల్యం నిజాంతర్గతం
పశ్య న్నాత్మనిమాయయా బహిరివో - ద్భూతం యధా నిద్రయా |
యః సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమేవద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||
ఒకే సూర్యరశ్మి భూమిమీద అనేక ప్రదేశాలలో పడుతుంది. కానీ ఆ కాంతి అద్దంమీద కానీ, మెరుగు పెట్టిన లోహాల మీద కానీ, నీటిమీద కానీ పడినప్పుడే చక్కగా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా భగవంతుని తేజస్సు అందరి హృదయాల మీద సమానంగా ప్రసరిస్తుంది. కానీ మంచివారు, సాధువులు మాత్రమే తమ నిర్మల హృదయాలతో ఆ తేజస్సును స్వీకరించి ఆ వెలుగును తిరిగి అందరికీ పంచగలుగుతారు. - శ్రీరామకృష్ణ పరమహంస
కర్కము - 1.అందము 2.అద్దము 3.అగ్ని.
అందము - 1.సౌందర్యము 2.అలంకారము 3.విధము. విణ.1.చక్కనిది 2.తగినది.
సౌందర్యము - చక్కదనము.
పొంకము - 1.పొందిక, 2.సౌందర్యము.
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
అలంకర్త - అలంకరించువాడు.
అలంకరిష్ణువు - అలంకరించు స్వభావము కలవాడు, అలంకార ప్రియుడు.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము 2.అందము.
బంగరు - బంగారము, సం.భృంగారః.
హృద్యము - మనసు కింపైనది, మదికి హితమైనది.
అందము - 1.సౌందర్యము 2.అలంకారము 3.విధము, విణ.1.చక్కనిది 2.తగినది.
సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
సొన్నారి - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.
గీటురాయి బంగారాన్ని పరీక్షించినట్టు మనిషిని పరీక్షిస్తుంది బంగారం – చిలో
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశగంగ.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటిచాలు, 3.ఆకాశ గంగ.
స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి.(రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ పర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.
సుష్ఠు ఋణోతి దీప్త్యత ఇతి స్వర్ణం, ఋన దీప్తౌ. - లెస్సగాఁ బ్రకాశించుఁనది.
బంగారము - వై.వి. దుర్లభము, వి.స్వర్ణము.
సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచి వర్ణముకలది.
శోభనో వర్ణో యస్య తత్ సువర్ణం - మంచివర్ణము గలది.
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 4.స్వభావము.
రూపకము - 1.నాటకము, 2.ఆరక్షరముల కాలము గల తాళభేదము, 3.రూపము, 4.రూపకాలంకారము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపమడఁగు - క్రి.1.చచ్చు, 2.నశించు.
కురువిందము - ఎఱ్ఱని కెంపు, అద్దము Mirror(రసా.) గనులలో దొరకు ఎల్యూమినియం ఆక్సైడ్ (ద్విఎల్యూమినియమ్ త్య్రామ్లజనిదము). (సర్ణకారులు బంగారు మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగింతురు) (Corundum).
శోణరత్నం లోహితకః పద్మరాగః -
శోణవర్ణం రత్నం శోణరత్నం - ఎఱ్ఱనిరత్నము.
లోహితవర్ణత్వా ల్లోహితకః - ఎఱ్ఱనైనది.
పద్మవద్రాగో యస్య పద్మరాగః - తామరపువ్వువంటి యెఱుపుగలది. ఈ 3 కెంపు పేర్లు.
శోణరత్నము - కెంపు; లోహితకము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము). మాణిక్యము - కెంపు.
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.
మానికము - కెంపు, రత్నము, సం.మాణిక్యమ్.
మానికదారి - 1.వేశ్య, 2.మాణిక్యధారిణి.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.
మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)
కెంపుగాము - అంగారకుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు గలది.
పాటము - కెంపుల నాణెము చూచుటకు తగిన యెండ, సం.ప్రభాతమ్.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
వరువాత - ప్రాతఃకాలము, విణ.ప్రాతః.
ప్రత్యూషము - వేగుజాము; వేకువ - వేగుజాము.
స్రీ ఘోషము - వేకువ.
ఉషస్సు - తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము, ప్రత్యూషము, వేకువ.
సిందువారము - వావిలిచెట్టు.
సిందురము - 1.సింధూరము, 2.కుంకుమ, 3.వావిలిచెట్టు, సం.సిందూరం, సిందువారః.
సిందూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగ ద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
కాంతరజము - కుంకుమము.
సిన్దువా రేంద్రసురసా నిర్గు ణ్డీన్ద్రాణి కేత్యపి :
రసం స్యన్దతే సిన్దుకః స్యన్దూ ప్రసరణే. - రసమును స్రవించునది.
సిన్దుం స్యన్దనం త్వగాదినా వృణోతీతి సిన్దువారః. వృఙ్ వరణే. - స్రవించుటను పట్ట మొదలైనవానిచేతఁ గప్పునది.
ఇంద్రస్యసురసః ప్రియః ఇంద్రసురసః - ఇంద్రునికి ప్రియమైనది.
గుడాత్పరివేష్టనాన్నిష్క్రాంతా నిర్గుండీ. గుడవేష్టవే. - గుడమనఁగా జుట్టుకొనుట; అందువలనఁ బాసినది.
ఇంద్రస్య ప్రియా ఇంద్రాణికా - ఇంద్రునికిఁ ప్రియమైనది. ఈ ఐదు వావిలిచెట్టు పేర్లు.
రుదిరము - 1.నెత్తురు, 2.సిందూరము.
రుద్యతే త్వచా రుధిరం, రుధిర్ ఆవరణే. - చర్మముచేత కప్పఁబడునది.
నెత్తురు - రక్తము, రూ.నెత్రు.
సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
లోహితము - 1.రక్త చందనము, 2.సింధూరము, 3.నెత్తురు blood.
రక్తము - 1.నెత్తురు, 2.కుంకుమ, 3.ఎరుపు.
లోహితవర్ణత్వాత్ లోహితం. రక్తం చ. - ఎఱ్ఱని వన్నె గలది, లోహితము రక్తము.
లోహితో రోహితో రక్తః -
రోహితి ప్రాదుర్భవతి సంధ్యాదావితి రోహితః - రలయోర భేదాత్ లోహితశ్చ రుహ బీజజన్మని ప్రాదుర్భావే. - సంధ్యాదికాలములయందుఁ బుట్టునది. అది దాసాని పువ్వు వంటిది.
రజ్యత ఇతి రక్తః, రంజరాగే. - రాగమును బొందునది, అది సంధ్యారాగమువంటిది. ఈ 3 ఎఱుపువన్నె పేర్లు.
రక్తచందనము - ఎఱ్ఱ చందనము, (రక్త) ద్రవపదార్థము సం.వి. (జం.) సామాన్యముగా రక్తములోనున్న ద్రవపదార్థ భాగము, (Plasma) రసకళ, Plasma membrane.
ఎఱ్ఱగందము - రక్తచందనము.
మదన బాధలలోఁ జిక్కి మమతనొంది
యందరానట్టి బాధల ననుభవింతు
దర్పణంబు నీ ముఖమౌట దారితీరు
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ|
నిశ్చల - భూమి.
నిశ్చర(ల)ము - (గణి.) చలించనిది (Invaiant).
స్థావరము - (భౌతి.) కదలనిది, చలనము లేనిది, స్థిరము, మార్పులేనిది, (Stationary), సం.వి. 1.వింటినారి, 2.కొండ, 3.వృద్ధత్వము.
ఢంఢంఢమరుక ధరణి నిశ్చల ఢుండి వినాయక సేవ్య శివ|
సార్థవాహుఁడు - వర్తకుడు, విణ.ముఖ్యుడు.
సార్థం వణిక్సంఘాతం వహతి దేశాంతరం ప్రాపయతీతి సార్థవాహః, వహప్రాపణే. – బేరుల మూఁకను దేశాంతరమును జేర్చువాఁడు.
సార్థము - 1.జంతుసమూహము, 2.వర్తకజన సమూహము, విణ.అర్థముతో కూడినది.
సాతు - 1.సార్థకము, 2.వర్తకజనసమూహము, సం.సార్థమ్.
సార్థకము - సఫలము.
సఫలము - 1.ఫలముతో కూడినది, 2.సార్థకము.
నిగమము - 1.వేదము, 2.అంగడి మార్గము, 3.పట్టణము, 4.వర్తక సంఘము.
వణిక్పథః పురం వేదో నిగమోః -
నిగమశబ్దము అంగడివీథికిని, పట్టనమునకును, వేదమునకును పేరు.
నియతం గమ్యత ఇతి నిగమః, గమ ఌ గతౌ. - నియతముగాఁ బొందఁబడునది.
నగరము - పట్టణము, రూ.నగరి.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమైన ప్రథాననగరము.
పుటభేదనము - పట్టణము, రూ.పుటభేదము.
నగరభూగోళశాస్త్రము - (భూగో.) పల్లెలయు, పట్టణములయు వివరములు తెల్పు భూగోళశాస్త్రము.
కొటిక - 1.చిన్నగ్రామము, పల్లె, 2.నగరము, సం.కుటీ, విణ.పొట్టివాడు.
గూడెము - 1.కొండ ప్రాంతమందలి బోయపల్లె, 2.చిన్న గ్రామము, ఉదా. గొల్ల గూడెము మొ. వి రూ.గోడెము.
ఖండిక - 1.చిన్నపల్లె, రూ.ఖండ్రిక, కండ్రిక, 2.పన్ను లేకుండ గుత్తకిచ్చిన భూఖండము.
పూడి - చిన్నగ్రామము, సం.పూర్.
ఖండ్రిక - ఖండిక.
అగారే నగరే పురమ్, మన్దిరం చ -
పురశబ్దమును, మందిరశబ్దమును ఇంటికిని, పట్టణమునకును పేర్లు.
పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.
పూర్యత ఇతి పురం, పౄ పాలన పూరణయోః, పరిపాలింపఁబడునది గనుక పురము.
మందిరము - 1.ఇల్లు, 2.పట్టణము, 3.దేవగృహము, 4.దేవపీఠము.
మందతె (అ)స్మిన్నితి మందిరం, మది స్తుతి మోద మదస్వన కాంతి గతిషు. - దీనియందు సంతోషింతురు గనుక మందిరము, "గృహో పరిగృహేపురం, దేహే పాటలిపుత్రే చ గుగ్గులౌ కథతః పురః, పురావ్యయం పూర్వకాల" ఇతి, "మందిరో మకరాలయ" ఇతి చ శేషః.
నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు.
ప్రాసాదము - 1.దేవాలయము, 2.రాజగృహము.
దేవాలయము - గుడి; దేవళము - దేవాలయము, గుడి, సం.దేవాలయః.
ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి. ఇంటి కన్నా గుడి పదిలంట.
కోవెల - గుడి, వై.వి. కోకిలము.
కోకిలము - కోయిల.
గుడి - 1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.
సంఘము - 1.ప్రాణిసమూహము, 2.గుంపు.
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ. నివహము - గుంపు.
అభిజనము - 1.కులము, 2.జన్మభూమి, 3.పరిజనము, 4.కులాంగత మైన టెక్కెము మొ.బిరుదు.
వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
వసతి - 1.ఇల్లు, ఉనికి. నివసతి - ఇల్లు.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికుంచుట (Dislocation).
నివాసము - ఇల్లు, రూ. నివసనము, వాసము.
నివాసి - వాసముచేయువాడు.
కుటుంబి - కుటుంబ పొషకుడు.
కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
పురంధ్రి - కుటుంబిని, స్త్రీ(ఆడుది).
స్యాత్తు కుటుమ్బినీ, పురంధ్రీ-
కుటుంబం పుత్రభృత్యాదికం అస్యా ఇతి కుటుంబినీ., సీ. - పొషింపఁదగిన పుత్రభృత్యాదులు గలది.
పురం గృహం ధరతీతి పురంధ్రీ. సీ. ధృఞ్ ధరణే. - పురమనఁగా గృహము, దానిని భరించునది. ఈ 2 బిడ్డలు సేవకులు మొదలగు కుటుంబము గల స్త్రీ పేర్లు.
అసారే ఖలుసంసారే - సారం శ్వశుర మందిరమ్|
హిమాలయే హర శ్శేతే - హరి శ్శేతే మహోదధౌ||
తా. సంసారము సారము లేనిదైనను శ్వశుర (శ్వశురులు - అత్తమామలు) గృహంబు సారంబు గలది. గనుకనే హరుఁడు - శివుడు హిమవత్పర్వతంబు నందు, (హరి) విష్ణువు సముద్రము(మహాశయము - సముద్రము)నందును శయనించిరి. – నీతిశాస్త్రము
నిగముడు - బేహారి.
బేహారి - వ్యాపారము తెలిసినవాడు, వణిజుడు.
నిగమః వత్తనం తత్రభవో నైగమః - పట్టనమునం దుండువాఁడు.
వణిజుఁడు - వర్తకుడు; వర్తకుడు - వ్యాపారి.
వ్యాపారి - మాధ్వబ్రాహ్మణుడు, విణ.వ్యాపారము కలవాడు.
నాగరో వణిక్, నైగమౌ ద్వౌ -
నైగమశబ్దము పట్టణమందున్నవానికిని, వర్తకునికిని, ప్రత్యేకముగాఁగాని ఏకముగాఁగాని పేరు.
నిగమే భవో నైగమః - పట్టనమందును, అంగడి యందును నుండువాఁడు నైగముఁడు.
నైగమము - వేదాంతము.
వేదాంతి - వేదాంతము తెలిసినవాడు.
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ|
వాణిజుఁడు - సార్థవాహుఁడు.
పణతే వ్యవహరతీతి వణిక్, జ. పు పణ వ్యవహారేస్తుతౌ చ. - బేరమాడువాఁడు.
వణిజుఁడు - వర్తకుడు.
వణిగేవ వాణిజః. - వణిజుఁడే వాణిజుఁడు.
వణిక్సమాజము - వర్తకశ్రేణి (Trade guild).
వాణిజ్యము - (అర్థ.) వ్యాపారము, వర్తకము, సరకులను లాభముల కొఱకు అమ్ము వృత్తి.
వాణిజ్య మండలము - (వాణి.) వ్యాపారస్థుల సంఘములు, ప్రభుత్వమునకు వ్యాపార విషయములలో సలహాలిచ్చుట. తమ ఇక్కట్లను ప్రభుత్వమునకు నివేదించుట ఇట్టి మండలముల ముఖ్యోద్దేశము.
వాణిజ్యబ్యాంకు - (వాణి.) సాధారణ వ్యాపారములకు వివిధ సేవల వలన తోడ్పడుబ్యాంకు (Commercial Bank).
వాణిజ్యము - (అర్థ.) వ్యాపారము, వర్తకము, సరకులను లాభముల కొఱకు అమ్ము వృత్తి.
వర్తకము - వ్యాపారము, బేహారము.
బేహారము - వ్యాపారము, రూ.బెహారము.
వ్యావృతి - వ్యాపారము.
వ్యాపారము - 1.పని, 2.ఉద్యోగము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
ఉద్యొగము - 1.యత్నము, 2.పని, 3.కొలువు, 4.పాటుపడుట. ఉద్యోగము పురుష లక్షణం.
దీర్ఘసూత్రుఁడు - ఆలసించి పనిచేయువాడు.
శ్రమకము - (గృహ.) పాటుపడెడు స్వభావము కలది, పనిచేసెడు స్వభావము గలది, (Industrious).
సక్రియము - (గృహ.) 1.చురుకుదనముగలది, 2.పనిచేయ సమర్థమగునది (Active).
చేటి - 1.పనికత్తె, రూ.చేటిక.
చేడియ - 1.చేటి, స్త్రీ, రూ.చేడె, సం.చేటీ.
చేటిక - చేటి.
బూర్జువా - (రాజ., అర్థ) మధ్య తరగతి ప్రజలు సామంత తంత్రపు కాలములో ఉన్నత ప్రభు వంశమునకు చెందిన కాయ కష్టముచేసి జీవించెడి ప్రజలను (దీనిలో వర్తకులు, శిల్పులు, వైద్యులు న్యాయవాదులు కూడ చేర్చబడిరి) ఇట్లు సంబోధించుచుండిరి.
కార్యము-1.పని, 2.హేతువు, 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది.
కృత్యము - పని, వ్యాపారము, విణ.చేయదగినది.
కృత్య - 1.ఒకానొక దేవత 2.చేష్ట.
చేష్ట - 1.పని, 2.వ్యాపారము.
చెయిదము - 1.పని, చేష్ట, రూ.చెయిది, చెయ్ది, చెయువు.
చెయిది - చెయిదము, చేష్ట.
చెయ్ది - చెయిదము; చెయ్దము - చెయిదము.
చెయ్వు - చెయువు; చెయువు - చెయిదము.
చెయువుల సాకిరి(సాకిరి - సాక్షి) - 1.కర్మసాక్షి, సూర్యుడు Sun.
కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలకు సాక్షియైనవాడు.
ఉపయోగము - 1.అనుకూల్యము, 2.వాడుక, 3.ప్రయోజనము.
ఉపయుక్తి - (అర్థ.) ఉపయోగము, ఉపయోగిత, అక్కరగల వస్తువు యొక్క అనుభవసౌఖ్యము.
ఉపయుక్తి - (అర్థ.) ఉపయోగిత, వస్తువు యొక్క ఉపయోగము, వ్యక్తి యొక్కవాంఛలను తీర్చగలశక్తి, ప్రయోజనము. (ఏదేని పదార్థమును అనుభోగించుట మొదలిడిన వెంటనే ఆ పదార్థ రాశి వలన వచ్చు ఉపయోగిత ఎక్కువగు చుండును. అటుపై ఇంకను అదే పదార్థమును అనుభోగించిన ఉపయోగిత స్థిరముగ నుండును. అటు పిమ్మట క్రమముగ తగ్గిపోవుచుండును.)
ఉపయుక్తము - 1.అనుకూలమైనది, సరిపడినది, 2.ఉపయోగింప బడినది, 3.న్యాయమైనది.
వాడుక - 1.ఉపయోగము, 2.పాడి, 3.రివాజు, 4.అభ్యాసము.
వాడుక - (గృహ.) క్రమము, పరిపాటి, నియతచర్య (Routine).
పాడి - 1.ధర్మము, న్యాయము, 2.స్వభావము, 3.వ్యవహారము.
అభ్యాసము - 1.అలవాటు, 2.ఆవృత్తి, సాధన, 3.(గణి.) గుణించుట, విణ.దాపైనది.
ప్రయోజనము - విలువ (మూల్య) సిద్ధాంతము వి.(అర్థ.) వ్యక్తి యొక్క అవసరములు తీర్చు శక్తి నిబట్టి రాశియొక్క విలువ (మూల్యము) నిశ్చయింపబడును. రాశి తక్కువ యున్నచో ముల్య మధికము. అవసరములకన్న రాశి (వస్తువు) అధికముగ లేక సులభముగ లభించినచో విలువమూల్యము క్షీణించును.
రాజీనామా -1.ఒప్పందము, 2.ఉద్యోగాదులను ఇష్టము మీద విడుచుట.
ఒప్పందము - 1.వ్యాపారుల ఒడంబడిక, 2.అంగీకారము.
గ్రాట్యుటీ - (Gratuity) ఉద్యోగము నుండి విరమించిన వ్యక్తికి లభించు ఉచితార్థ పారితోషికము.
ప్రావిడెంటు ఫండు - (శాస.) (Provident fund) భవిష్యన్నిధి, ఆపదర్థనిధి. ముందు జాగ్రతకోరకు ఏర్పాటు చేయబడిన నిధి. ఉద్యోగి ఉద్యోగము నుండి విరమించునప్పుడు పారితోషికముగా ప్రభుత్వముగాని సంస్థగాని ఇచ్చు నిధి. ఈ నిధికి ఉద్యోగికూడ ఉద్యోగములో నున్నంత కాలము ప్రతిమాసము తన వేతనములో కొంత శతాంశము ఇయ్యవలసి యుండును.
పింఛను - (వ్యావ., రాజ.) ఉపకార వేతనము, ఉద్యోగము చేసిపనినుండి తొలగిన తరువాత ప్రభుత్వము నుండి దొరకు భరణము (Pension).
అభ్యాసానుత రీవిద్యా బుద్ధిః కర్మానుసారిణీ|
ఉద్యొగసారణీ లక్ష్మీ ఫలం భాగ్యానుసారిణీ||
తా. అభ్యాసము నను సరించి విద్య - 1.చదువు, 2.జ్ఞానము వచ్చును, కర్మాను సారముగా బుద్ధి గలుగును, ఉద్యోగానుసారముగా ఐశ్వరము వచ్చును, భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది. భాగ్యాను సారముగా ఫలము గలుగును. - నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.
ఉద్యోగపత్ని క్రియ : క్రియ శూన్యమైన కర్మ(పని) వ్యర్థం.
వినీతుఁడు - 1.జితేంద్రియుడు, 2.గురువుచేత శిక్షింపబడినవాడు, 3.విధేయుడు, వి.వర్తకుడు.
వినీయతే శిక్ష్యత ఇతి వినీతః, ణీఞ్ ప్రాపనే. - శిక్షింపఁ బడినవాఁడు.
విధేయుఁడు - వినయము గలవాడు.
ఆపణికుఁడు - వర్తకుడు, బేహారి, వణిజుడు.
ఆపణత ఇత్యాపనికః, పన వ్యవహారేస్తుతౌ చ. - బేరమాడువాఁడు.
బేహారి - వ్యాపారము తెలిసినవాడు, వణిజుడు.
బేహారము - వాణిజ్యము, రూ.బేహరము, బేహారము, సం.వ్యవహారః.
విష్టి - (చరి.) బేగారి, ప్రతిఫలమివ్వ కుండ బలవంతముగా పనిచేయించుకొనుట, సం.వి.కూలి, వెట్టి.
వెట్టి - కూలిలేక చేయుపని, సం.విష్టిః.
వెట్టివాఁడు - వెట్టిపనిచేయువాడు.
విపణి - అంగడి, అంగడి సరకు, వర్తకుడు.
విపణిః పణ్యవీథికా,
విపణిః ఈ. సీ. పా. విపణా. పణ్యానాం మానీతానాం వీథిః పణ్యవీథికా - విక్రియింపఁ దెచ్చిన వస్తువు లుండెడు వీథి. ఈ ఒకటి అంగడివీథి పేళ్ళు.
విపణము - విక్రయము; విక్రయము - అమ్మకము.
విక్రయితుఁడు - అమ్మువాడు.
క్రమవిక్రయాభ్యాం జీవతీతి క్రయవిక్రయకః - క్రయవిక్రయములచేత బ్రతుకువాఁడు.
విక్రేతకౌశలము - (అర్థ.) వస్తు విక్రయములో నేర్పు.
విక్రీతము - విక్రయింపబడినది.
అంగడి - 1.దుకాణము, 2.రచ్చ, న్యాయసభ, 3.అగసాలె మొ. వారు పనిచేయుచోటు.
దుకాణము - అంగడి.
విపణి - అంగడి, అంగడి సరకు, వర్తకుడు.
పణ్యవీథి - విపణివీథి, అంగడివీథి.
అంగడివాడ - బజారు, అంగడివీధి.
గ్రామముఖము - అంగళ్ళవీధి, బజారు.
ఆపణము - 1.అంగడి, 2.బజారు.
పణిక్పథే చ విపణిః -
విపణి శబ్దము అంగడివీథికిని, చకారముచేత అంగడికిని పేరు. విపణ్యతే (అ)త్రేతి విపణిః, సీ. - దీనియందు వ్యవహింపఁబడును. "అపణే పణ్యవీథ్యాం చ పణ్యే చ విపణిః స్త్రియా" మితి రుద్రః.
పణ్యాజీవుఁడు - వర్తకుడు.
వణ్యేన ఆజీవతీతి పణ్యాజీవః, జీవ ప్రాణధారణే. - అంగడిసరకుచేత బ్రతుకువాఁడు.
పణ్యాంగన - వేశ్య.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారముచేత శోభజెందినది.
వేశే భవా వేశ్యా - వేసమనఁగా వేశ్యావాటిక, దానియందుఁ బుట్టియుండునది.
వేశో నైపథ్యం తేన శోభతే వేశ్యా - అలంకారము చేత ప్రకాశించునది.
దర్శనా చ్చిత్తవైకల్యం స్పర్శనాచ్చ ధన క్షయమ్|
సంభోగాత్కిల్బిషం పణ్యస్త్రీణాం ప్రత్యక్ష రాక్షసామ్||
తా. వారస్త్రీ(పణ్యాంగన - వేశ్య) యొక్క దర్శనము వలన మనస్సునకు వైకల్యము - వికలత్వము పుట్టును, స్పర్శము వలన ధనక్షయ మగును, సంభోగము వలన బాపము సంభవించును. కావున వేశ్యలు ప్రత్యక్ష రాక్షసులు. - నీతిశాస్త్రము
రచ్చ - 1.కలకల ధ్వని, 2.గోష్ఠి, 3.కలహము, 4.మండపము(జనాశ్రయము - మండపము), 5.మొగసాల(సంవేశిని - మొగసాల), సం.రాజమార్గము, 7.బాధ. ఇంట గెలిచి రచ్చ గెలువు.
గోష్ఠి - 1.పరిషత్తు సభ, 2.ఇష్టా గోష్ఠి.
మహాపథము - 1.ప్రాణాంతము, 2.రాజమార్గము.
బల్లిదుడైన సత్ప్రభువు పాయకయుండినగాని రచ్చలో
జిల్లరవారు నూరుగు సేరినఁ దేజముగల్గ దెయ్యెడన్
జల్లని చందురుం డెడసి సన్నపుజుక్కలు కోటి యున్న రం
జిల్లునె వెన్నెలల్ జగము చీకటులనియు బాయ! భాస్కరా.
తా. చుక్కలెన్ని(నక్షత్రములు) యుండి ప్రకాశించినను చీకటి తొలగదు. వానికి తోడుగా చందిరుడు - చంద్రుడుMoonన్నప్పుడే చీకటి లేకుండా నుండును. అట్లే బలవంతుడగు పబువు - ప్రభువు, సం.ప్రభుః.)మంచిరాజు సభ యందు లేక సభ ప్రకాశించదు. సాధారణ జనులెందరుండి నను ప్రయోజనము లేదు.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - క్రి. విక్రయించు, వెలకు ఇచ్చు.
కంకపత్రము - అమ్ము, బాణము.
అంబు - బాణము, రూ.అమ్ము, సం.అంబకమ్.
బాణము - అమ్ము. పృషత్కము - అమ్ము, బాణము.
అంబకము - 1.కన్ను, 2.బాణము.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలి పురికన్ను, 7.చూపు(నిబోధనము - చూపు), 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
చక్షువు - కన్ను. చక్షు సేతు విశాలాక్షీ|
కను - క్రి.1.చూచు, 2.ప్రసవించు, 3.తెలియు, వి.నేత్రము.
కంట - 1.కనుట, 2.నాట్యబంధము.
కానుపు - 1.వీక్షణము, 2.ప్రసూతి, రూ.కాన్పు.
వీక్షణము - అవలోకము, ఈక్షణము.
అవలోకనము - 1.చూపు, 2.చూచుట, 3.కన్ను, 4.విచారణ.
ఈక్షణము - 1.కన్ను, 2.చూపు, 3.వీక్షణము.
ఈక్షితము - 1.చూడబడినది, 2.ఆలోచించబడినది, వి.చూపు, దృష్టి.
విలోకనము - చూపు. ప్రసూతి - కానుపు, పుట్టుక. జనువు - పుట్టుక.
నారసము - వై. వి. నారాచము, బాణము.
అజిహ్మగము - బాణము, వ్యు.వంకరగా పోనిది, తిన్నగా పోవునది.
పత్రము - 1.ఆకు, 2.రెక్క, 3.వ్యవహారము చెల్లుబడికై వ్రాసికొను కాగితము, 4.వాహనము, 5.బాణము.
పత్తిరి - పూజకుపయోగించు ఆకులు, సం.పత్రమ్.
పతత్రము - 1.రెక్క, 2.పత్రము.
పతత్రి - పక్షి, వ్యు.రెక్కలుగలది.
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
పూరి - 1.తృణము, 2.మృగాదుల చనుపాలు.
పక్షీణాం బలమాకాశం మత్స్యానా ముదతఁ బలమ్|
దుర్బలస్య బలంరాజా బాలానాం రోదనం బలమ్||
తా. పక్షులకు ఆకాశము బలము, చేపలకు (ఉదకము - నీరు, వ్యు. తడుపునది, రూ.ఉదము.)నీళ్ళు బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము(రోదనము-1.శోకము, ఏడ్పు, 2.కన్నీరు.)బలము. – నీతిశాస్త్రము
వలాహకము - 1.మేఘము, 2.కొండ.
ధారాధరము - 1.మేఘము, 2.కత్తి.
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము - 1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
ద్యుపు - 1.ఆకాశము, 2.దినము, 3.స్వర్గము.
దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.
దివనము - 1.పగలు, 2.దినము, రోజు.
దినము - 1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
పగలు - పవలు, దినము.
రోజు - దినము.
రోజు - 24 గంటలు, దినము భూమి తన అక్షముపై పడమటనుండి తూర్పునకు తనచుట్టును 360 డిగ్రీలు తిరుగుటకు తీసికొను వ్యవధి, సం.రోచిః.
దినకరుఁడు - సూర్యుడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
భంబు - 1.ఆకాశము, 2.నక్షత్రము.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది, (నక్షత్రము లిరువది యేడు).
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
రిక్కదారి - ఆకాశము.
ఖంబు - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.శూన్యము, 4.సుఖము.
ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖగపతి - గరుడుడు.
గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
ఖచరము - 1.గాలి, 2.మేఘము, 3.పక్షి.
ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.
ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు - వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమని, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.
నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.
సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము. సౌఖ్యము - సుఖము.
నిరామయము - 1.రోగములేమి, 2.సౌఖ్యము.
నాకౌకసుఁడు - 1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నిర్జరుఁడు - వేలుపు; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకిని - దేవత స్త్రీ.
నాకేశుఁడు - ఇంద్రుడు.
సురలు - వేలుపులు.
సురచార్యుఁడు - బృహస్పతి.
సురజ్యేష్ఠుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆకాశము - 1.విన్ను, మిన్ను, 2.భూతము లై దింటిలో ఒకటి, 3.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) ఉన్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).
ఆసమంతా త్కాశంతే సూర్యాదయః అత్రేత్యాకాశం, అ. ప్న, కాశ్చదీప్తౌ - దీనియందంతటను సూర్యాదులు ప్రకాశించుతురు.
ఆసమంతా త్కాశత ఇతివా - అంతట ప్రకాశించునది.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
నిరాకారము - ఆకాశము, విణ.ఆకారము లేనిది.
విహాయసము - ఆకసము.
విశేషేణ హయతి గచ్ఛతి సర్వమస్మిన్నితి విహాయః, స, ప్న, హయ గతౌ - దీని యందు విశేషముగా నన్నియు సంచరించును.
జీహీతే సర్వం విహాయః, ఓ హాఙ్ గతౌ - సర్వము దీనిఁ బొందును.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milkyway).
వినుప్రోలు - స్వర్గము.
వినుచూలి- వాయువు; మినుచూలు - వాయువు.
మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.
మొగులుదారి - ఆకసము.
జలదము - మేఘము, మొగులు.
మొగులు - మేఘము, రూ.మొగిలు, మొయిలు.
మేఘ పుష్పము - 1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.
మొగులువిరి - జలము, మేఘ పుష్పము.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరము - జలము; నీళ్ళు - నీరు.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.
క్షరము - నశించునది, వి.1.నీరు, 2.మబ్బు.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
విను - ఆకర్ణించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినువాఁక - గంగ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
తూపు రిక్క - శ్రవణ నక్షత్రము.
తూపు - బాణము.
వావిలి - శ్రవణ నక్షత్రము.
భవములకు మందు, చిత్త, శ్రవణానందము
ముముక్షుజన పదము, హరి
స్తవము పశుఘ్నుఁడు, దక్కను,
జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁదే.
భా|| శ్రీహరియైన విష్ణువుయొక్క స్తోత్రం సంసార బాధలకు ఔషధం వంటిది. అది చెవులకు మనస్సుకు ఆనందం కలిగిస్తుంది, ముముక్షువు - 1.విడువనిచ్ఛగలవాడు, 2.మోక్షము పొందు కోరిక కలవాడు. అర్థించే జనులు కోరే స్థానం అది. అటువంటి హరి స్తవము - స్తోత్రము విని కసాయివాడు అయితే తప్ప 'నాకు తృప్తి కలిగింది చాలు ' అనే మూర్ఖుడు ఎవ్వడూ ఉండడు.
స్నాత్వా తులార్కే కావేర్యాం మహాత్మ్య శ్రవణం కురు,
గవాశ్వవస్త్ర ధాన్యాన్న భూమికన్యాప్రదో భవ|
కర్ణ శబ్దగ్రహౌ శ్రోత్రం శ్రుతిః స్త్రీ శ్రవణం శ్రవః :
కరోతి శబ్దగ్రహణం కర్ణః డుకృఞ్ కరణే. - శబ్దగ్రహణమును జేయునది.
కీర్యతే శబ్దో త్రేతి వాకఋనః. కౄ విక్షేపే. - శబ్దము దీనియందుఁ జల్లఁబడును.
గృహతే అనేన గ్రహః. శబ్దస్య గ్రహః. శబ్దగ్రహః. గ్రహ ఉపాదానే. - శబ్దము దీనిచేతఁ గ్రహింపఁబడును.
శృణోత్యనేన శ్రోత్రం. శ్రుతిః. సీ. శ్రవణ శ్రవశ్చ. స. న. శ్రు శ్రవణే. - దీని చేత విందురు. కనుక శ్రోత్రము, శ్రుతి, శ్రవణము, శ్రవస్సు.
శ్రీహరి యగు వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణం.
కర్ణము1 - 1.చెవి, 2.చుక్కాను.
కర్ణము2 - (గణి.) లంబకోణ త్రిభుజములో లంబకోణమునకు ఎదురుగా నున్న భుజము (Hypotenuse).
కర్ణసంబంధము - చెవికి సంబంధించినది (Auditory).
కర్ణసాయనము - (జాతీ.) చెవుల కింపైనది, కర్ణపేయము.
కర్ణకారుఁడు - ఓడవాడు, సరంగు.
కర్ణధారుడు - సరంగు; సరంగు - నావికుడు.
ఓడంగి - ఓడవాడు, నావికుడు. నావిక ధావిత మృదుపదరామ్|
కర్ణికలు - (జం.) 1.హృదయము లోపల జఠరికల పైభాగమున నున్న రెండు కుహరములు, 2.బయటి చెవులు.
జఠరిక - (జం.) గుండెకాయలో నుండి రక్తమును బయటికి పంపునది, (Ventricle).
జఠరికలు - (గృహ.) గుండెలోని క్రింది గదులు (Ventricles).
శష్కులి - చక్కిలము, బయటచెవి.
కర్ణభేరి - 1.(శారీ) చెవి యొక్క మధ్యభాగము, మధ్య కర్ణకుహరమును బయటిదాని నుండి వేరుచేయు పొర (Ear-Drum), 2. (జం.) శబ్దములను వినుట కుపయోగించు కంపనశక్తి గల పొర, చెవిలో నుండు డోలువంటి నిర్మాణము (Tympanum).
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోశపు పొర క్రింద నుండు అంతస్రావగ్రంథి (Thymus gland).
పురఃకర్ణాస్థి - (జం.) శ్రవణ ప్రావరములో నున్న ఎముకభాగము (Pro-otic).
స్తంభిక - (జం.) శ్రవణ ప్రావరములో నున్న చిన్న కడ్డీ వంటి ఎముక (Columella).
రికాబు - (జం.) మధ్య చెవి భాగములో నున్న స్తంభికకు ఒకవైపున అంటియుండు చిన్న కోమలాస్థి బొడిపె (Stapes).
యూష్టాషియన్ ట్యూబ్ - (జీవ.) (Eustachion tube) చెవిలోపలి భాగము పేరు.
కర్ణాశ్మములు - (జం.) అంతర్లసికములో నుండు స్పటికాకారమైన నున్నపు సంబంధమగు రేణువులు (Ototiclas, ear Stones).
తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా
ఓగు నేర మెంచు నొరులఁగాంచి
చక్కిలంబు గాంచి జంతిక నగినట్లు విశ్వ.
తా|| తనయందు అనేక(పెక్కు - అనేకము, సం.పుష్కలమ్.)తప్పులు పెట్టుకొని, యితరుల(ఓగు - 1.అశుభము, 2.కీడు(బాగోగులని వాడుదురు బాగు+ఓగు) తప్పులను(నేరము-తప్పు) యెన్నుచిందురు. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!
చుక్కాను - 1.మేక, 2.సంతాపము నందు కలిగించు ధ్వని.
మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.
గాంధారము - 1.(సంగీ.) ఒక విధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార్ అను ఒకానొకదేశము.
అరిత్రం కేనిపాతకః,
ఋచ్ఛతి నౌర నేనేత్యరిత్రం, ఋ గతౌ. దీనిచేత నావ నడుచును.
కే జలే నిపాత్యన్తే నావః అనేనేతి కేనిపాతకః, పత్ ఌ గతౌ. - జలమందు ఓడలు దీనిచేత నడపఁబడును. ఈ 2 ఓడ నడుపు తెడ్దు పేర్లు.
అరిత్రము - 1.చుక్కాని, 2.ఓడ తెడ్డు.
(ౘ)చుక్కాను - పడవ నడుపు తెడ్డు, అరిత్రము.
తండువు - 1.తెడ్దుకొయ్య, 2.నందికేశ్వరుడు.
తెడ్డు - 1.తుండువు, 2.కొయ్యగరిటె, 3.పడవ త్రోసెడు పలక, రూ.త్రెడ్డు.
తండెలు - ఓడపెత్తనగాడు, రూ.తండేలు.
పీలికాఁడు - చుక్కాను పట్టువాడు.
కలాసి - ఓడమీదిపనివాడు.
కర్ణకారుఁడు - ఓడవాడు, సరంగు.
కర్ణధారుడు - సరంగు; సరంగు - నావికుడు.
ఓడంగి - ఓడవాడు, నావికుడు. నావిక ధావిత మృదుపదరామ్|
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్ల మీద నొప్పుగవచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ.
తా. ఓడలమీద బండ్లువచ్చును, బండ్లుమీద ఓడలు వచ్చుచుండును. అట్లే ఈ భూమి(వసుధ - భూమి, వ్యు.వసువును(బంగారమును) ధరించునది.)యందు సుఖమున్న వారికి కష్టము, దారిద్ర్యమున్నవారికి సంపద వచ్చుచుండును.
శబ్దగ్రహము - 1.చెవి Ear, 2.శబ్దజ్ఞానము.
శ్రవ్యము - (భౌతి.) చెవి, గ్రహింప బడ గలది, (Audible).
శ్రవము - చెవి; శ్రవణీయము - వినదగినది.
శ్రోత్రము - చెవి; శ్రోతవ్యము - వినదగినది.
శ్రుతి - 1.వేదము, 2.చెవి, 3.వినికి.
సుతి - శ్రుతి, కంఠస్వరాదులకు సహాయమగు తంత్రి, మొ. వాని ధ్వని, సం.శ్రుతిః.
ఆకర్ణించు - క్రి.విను, ఆకర్ణనముచేయు.
వీను - 1.ప్రసిద్ధి, 2.చెవి. Ear is your teacher.
శ్రవణము - 1.చెవి, Ear 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
శ్రవణ బిందువు - (జం.) చివిలోని పటల గహనమునకు అస్తరుగానుండు అదిచ్ఛద జీవకణములలో కొన్ని చాల పొడవుగానుండి, ఒక్కొక్క కణము నకు ఒక్కొక్కశ్రవణ రోమము (Auditory hair) ఉండును. అట్టి జీవ కణముల గుంపు శ్రవణ బిందువు లనబడును (Accoustic spots).
దేవకీనందన శ్శౌరి ర్హయగ్రీవో జనార్దనః,
కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరో(అ)నఘః
చెవి - 1.శ్రవణము, వినెడి యింద్రియము, 2.రాట్నము మొదలగు వాని యందుగల యొక భాగము, 3.తాళపుచెవి.
ఆకర్ణము - వినికి, శ్రవణము. శ్రవణము తో మనశ్శుద్ధి కలుగుతుంది.
వినికి - వినుట, రూ.వినుకలి. Ear is your teacher.
బైనోరల్ - (Binoral),1.వినుట, 2.వినిపించుట.
శ్రోత - వినువాడు. చెప్పేవాడికి వినేవాడు లోకువ.
శ్రవణ ప్రావరములు - (జం.) శబ్దమును గ్రహించు ముఖ్యావయములను కప్పియుంచి రక్షించు సాధనములు, శబ్దమును గ్రహించు బరిణులు (Auditory capsules).
ఆలకించు - క్రి.1.విను, 2.ఆదరించు, రూ.ఆలించు.
ఆలించు - క్రి.విను, ఆలకించు.
విను - ఆకర్ణించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినుకెంపు - సూర్యుడు, వ్యు.విన్నునకు కెంపువంటివాడు, ద్యుమణి.
ద్యుమణి - సూర్యుడు Sun, చదలుమానికము.
ౘదలుమానికము - సూర్యుడు Sun, ద్యుమణి, నభోమణి.
దివః ఆకాశస్య మణిః ద్యుమణిః. - ఆకాశమునకు మణివంటివాఁడు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్|
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్||
అంకుటము - కుంచెకోల, తాళపుచెవి.
కుంచిక - 1.తాళముచెవి, 2.కుంచెకోల, 3.చిత్రములు వ్రాయు తూలిక.
కుంచియ - 1.కుచ్చు, సం.గుచ్ఛః 2.చామరము, వింజామరము, 3.చిత్రములు వ్రాయు తూలిక, 4.గోడకు సున్నము కొట్టుడు, మట్ట స.కుంచికా. తూలిక - 1.చిన్నయీక, 2.వ్రాసెడు కలము writing pen, 3.చిత్రమువ్రాయుకుంచె, రూ.తూవి.
కు(ౘ)చ్చు - 1.గుత్తి, 2.పూగుత్తి, 3.ఏదేని చేర్చి కట్టినది, కొనచెవి నుంచు కొనెడి భూషణము, సం.గుచ్ఛః.
గుత్తి - 1.పూగుత్తి, 2.చీలమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమరిపురి, రూ.గుచ్ఛము.
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
అమ్నాయము - 1.వేదము, 2.శాస్త్రము, 3.సంప్రదాయము, గురుపారంపర్యము, 4.వంశము, 5.సముదాయము.
శ్రుతిః స్త్రీ ఆమ్నాయ స్త్రయీ :
శ్రూయతే ధర్మాధర్మాదికమనయేతి. ఇ. సీ. శ్రుశ్రవణే - దీనిచేత ధర్మాధర్మాదులు వినఁబడును.
విదంత్యనేన ధర్మాధర్మావితి వేదః. విదజ్ఞానే - దీనిచేత ధర్మాధర్మముల నెఱుఁగుదురు.
ఆమ్నాయతే పారంపర్యే ణేత్యామ్నాయః మ్నా అభ్యాసే - పారంపర్యము చేత నభ్యసింపఁబడునది. ఈ మూడు 3 వేదము పేర్లు.
ఆమ్నాయాంబుధి మాదరేన సుమనస్సంఘా స్సముద్యన్మనో
మంథానం ధృడభక్తి రజ్జుసహితం కృత్వా మథిత్వా తతః
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం
నిత్యానంద సుధాం నిరంతర రమా సౌభాగ్య మాతన్వతే| - 37శ్లో
తా. దేవ సంఘాలు తమ సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు. మంచి మనస్సులను భక్తి అనే సద్గుణంతో కూడిన కవ్వంగా చేసి వేదమనే సాగరాన్ని మథన చేసి - ఆ వేదసాగరాన్నుండి, చంద్ర, కల్పతరు, కామధేను, చింతామణ్యాదులను బుద్ధి కనుకూలమగు నిత్యానందామృతాన్నీ, శాశ్వత మహాలక్ష్మీ సౌభాగ్యాన్నీ పొందినట్లుగా ధీమంతులు - కల్పవృక్ష, కామధేను, చింతామణి సదృశుదగు ఉమా సమేతుడగు సదాశివదేవుని భక్తిపూర్వకంగా ధ్యానించి శాశ్వతానందా మృతాన్ని- మోక్షలక్ష్మిని పొందుచున్నారు. - శివానందలహరి
త్రయీ కదంబమంజరీ తమోవితాన భాస్వరే ఓం శాంకరీ
మణి ప్రవాళ మౌక్తికప్రభా సభాంతరేశ్వరీ ఓం మహేశ్వరీ
సుధా మయూఖ మాలికా ప్రపూర్ణ అవాంతర
ప్రకీర్ణ బంభస్వర ప్రవేళికా ప్రమోదినీ ఓం భవానీ|
శ్రుతి - 1.వేదము, 2.చెవి, 3.వినికి.
శ్రవణము - 1.చెవి, Ear 2.వినికి, 3.నక్షత్రములలో నొకటి.
ఆకర్ణము - వినికి, శ్రవణము. శ్రవణము తో మనశ్శుద్ధి కలుగుతుంది.
సుతి - శ్రుతి, కంఠస్వరాదులకు సహాయమగు తంత్రి, మొ. వాని ధ్వని, సం.శ్రుతిః.
వేదే శ్రవసి చ శ్రుతిః :
శ్రుతిశబ్దము వేదములకును, చెవికిని, చకారమువలన వినుటకును, వార్తకును పేరు. శ్రూయతే, శృణో త్యనయా - శ్రవణం చ శ్రుతిః సీ. శ్రు శ్రవణే. - వినఁబడునది. దీనిచేత విందురు, వినుటయును గనుక శ్రుతి.
వేదముతో సమానమైన శాస్త్రము లేదు. వేదానికి 'శ్రుతి'అని కూడా పేరుంది. 'శ్రుతి' అంటే చెవిన పడింది-విన్నది.
వేదం శృతి - విన్నది - వినసొంపైనది. వేదం వినిపించడంలో ఆనందం ఉంది. వేదం వినడంలో అమృతం అందుతుంది. స్వరయుక్తంగా చదివిన వేదం శ్రావ్యం - మహిమాన్వితం.
శ్రుతము - 1.వినికి, వినుట 2.శాస్త్రము(Science) విణ.వినబడినది.
ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గణి.) విషయ విపులీకరణము (Exposition).
ఉపశ్రుతి - 1.ప్రసంగమున ఇతరులు పలికిన శుభాశుభసూచక మగు వాక్యము, 2.సమ్మతి, 3.వినికి, అవ్య. చెవిదగ్గర.
ఉపశ్రుతము - 1.వినబడినది, 2.అంగీకరింపబడినది, సమ్మతింప బడినది.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ.
సమ్మతము - ఇష్టమైనది, అంగీకృతమైనది, సం.వి.(గృహ.) స్వీకరణ, అంగీకారము, (Acceptance).
సమ్మతించు - క్రి.అంగీకరించు, రూ.సమ్మితిల్లు.
మిడియ - వేదవాక్యము.
వైదికుఁడు - వేదము తెలిసినవాడు.
వైదికము - వేదము నందు చెప్పబడినది.
విద్యాదానం తపస్సత్యం ధర్మస్యేతి పదాని చ |
ఆశ్రమాంశ్చ యథాసంఖ్యమసృజత్సహ వృత్తిభిః |
శ్రుతం శాస్త్రావ ధృతయోః : శ్రుత శబ్దము శాస్త్రామునకు పేరైనపుడు న. వినఁబడినదానికి పేరైనపుడు త్రి. శ్రూయత ఇతి శ్రుతం. శ్రు శ్రవణే. – వినబడునది.
శాస్త్రము - నియమన గ్రంధము, సం.వి. (గణి., భౌతి., రసా.,) గమనించిన విషయములను క్రోడీకరించి విషయతత్వ నిర్ణయముచేసి సూత్రముల నిర్మించి ధర్మముల నుగ్గడించినది (Science).
శాస్త్రీయము - శాస్త్రసంబంధమైనది.
శాస్యము - శాసింపదగినది.
శాస్త్రవిదుఁడు - శాస్త్రము తెలిసినవాడు.
శాస్త్రి - శాస్త్రము తెలిసినవాడు.
నిదేశ గ్రస్థయో శ్శాస్త్రమ్ : శాస్త్ర శబ్దము ఆజ్ఞకును, వ్యాకరణాది గ్రంథము లకును పేరు. శాసనం, శిష్యతే అనేనేతి శాస్త్రం. శాసు అనుశిష్టౌ. - శిక్షించుటయు, దీనిచేత శిక్షింపఁబడును గనుకను శాస్త్రము. శాస్త్రానికి రూపం ధర్మం.
ప్రామాణికుఁడు - 1.సత్యము తప్పనివాడు, 2.మేర మీరనివాడు, 3.శాస్త్రము నెరిగినవాడు.
విజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.మిక్కిలి తెలిసినవాడు.
సమర్థుఁడు - నేర్పరి.
విశేషేన జానాతీతి విజ్ఞః - అధికముగా నెరిఁగినవాఁడు.
విజ్ఞాతుఁడు - ప్రసిద్ధుడు.
విశేషేణ జ్ఞాయత ఇతి విజ్ఞాతః, జ్ఞా అవబోధనే. - విశేషముగా నెఱుఁగబడువాఁడు.
విజ్ఞాపము - శాస్త్రాదుల యందలి విశేషజ్ఞానము.
అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోః,
విరూపం జ్ఞానం విజ్ఞానం, జ్ఞా అవబోధనే. - నరునికి మోక్షార్ధమైన జ్ఞానమే హితము గనుక తదితర జ్ఞానము విపరీత జ్ఞానము. ఈ ఒకటి శిల్పాది విషయమైన బుద్ధి పేరు.
విజ్ఞాన శాస్త్రము - శాస్త్రీయ పద్ధతులతో వస్తుతత్త్వమును గురుంచి సహేతుకముగా తెలిసికొన్న జ్ఞానరాశి (Science).
ప్రత్యవేక్షణ - (భౌతి., రసా.) జాగ్రత్తతో చూచుట, ఇట్టి సావధానమైన చూపు విజ్ఞానశాస్త్రములకు మూలాధారము. ప్రకృతిలో జరుగు సంఘటనల యథాతథముగ గుర్తించుట (Observation).
ఛాందసుఁడు - 1.వేదము చదివినవాడు, 2.శ్రోత్రియుడు, 3.లౌకికజ్ఞాన రహితుడు.
శ్రోత్రియుఁడు - వేదము చదివిన బ్రాహ్మణుడు.
ఛాందసము - 1.తెలివితక్కువ, 2.అమాయకత్వము, విణ.ఛందస్సునకు సంబంధించినది.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
అమాయకుఁడు - మాయ, కపటము, మొ.వి. ఎరుగనివాడు, రూ.అమాయకుడు.
లౌకికము - లోకవ్యవహార సిద్ధమైనది; రహితము - విడువబడినది.
అగ్నిహోత్ర ఫలావేదా విత్తభుక్త ఫలంధనమ్|
రతిపుత్త్ర ఫలా దారాః శీలవృత్తి ఫలం శ్రుతమ్||
తా. వేదము చదవినందు (క)అగ్నిహోత్రము చేయుటయును, ధనము గలిగి నందుకు దాన భోగములును, భార్య(దార - భార్య)యున్నందుకు సంగమ సంతానములును, శాస్త్రమును విన్నందు (కా)ఆచారవంతుడగు టయు ఫలము. - నీతిశాస్త్రము
తంత్రము - 1.ఉభయార్థసాధకమైన ఉపాయము, 2.స్వరాష్ట్ర చింత, 3.కారణము, 4.గుంపు, 5.శాస్త్రము.
పంచతంత్రము - జంతువుల కథల ద్వారా మానవునకు నీతి బోధించు సంస్కృత కథాగుచ్ఛము:- 1.మిత్రలాభము, 2.మిత్రభేదము, 3.సంధి విగ్రహము, 4.లబ్ధనాశము(లబ్ధము - పొందబడినది), 5.అసంప్రేక్ష కారిత్వము అనునవి యందలియైదు తంత్రములు.
స్వాధ్యాయము - 1.వేదాద్యయనము, 2.వేదము, 3.జపము.
స్వాధ్యాయి - వేదాద్యయనము చేయువాడు.
జపము - 1.మంత్రావృత్తి, 2.వేదాధ్యయనము, రూ.జపము.
జపించు - క్రి.జపముచేయు.
అధ్యయనము - 1.గురుముఖమున వేదము చదువుట, 2.చదువుట.
అధ్యాయము - 1.చదువుట, 2.వేద పఠనార్హ కాలము, వ్యతి.అనధ్యాయము, 3.వేదపాఠము, 4.గ్రంథభాగము.
ఘనా(న)పాఠి - వేదధ్యయన సంపన్నుడు.
అనామ్నాయమలా వేదాః బ్రాహ్మణస్యావ్రతం మలమ్ ||
మల పృథివ్యా బాహ్లీకాః పురుషస్యానృతం మలమ్ |
కౌతూహలమలా సాధ్వీ విప్రవాసమలాః స్త్రియః ||
భా|| అభ్యాసం లేకపోవడమే వేదాలకు దోషం, వ్రతము - నియమము, నోము, ఉపవాసాది పుణ్యకర్మము.) లేకపోవడమే బ్రాహ్మణునకు దోషం, భూమికి బాహ్లికులు దోషం, పురుషునికి అనృతము - అసతమైనది, వి.1.అసత్యము, 2.సేద్యము. అసత్యం దోషం, సాధ్వి - పతివ్రతకి కుతూహలం దోషం, స్త్రీకి ఎడబాటు దోషం.
విశ్వాధికా వేదవేద్య వింధ్యాచల నివాసినీ|
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ.
అంశుమాలి - సూర్యుడు.
అంశుమాలాః కిరణరాజయః అస్య సంతీతి అంశు మాలీ, న.పు. - కిరణ సమూహముగలవాఁడు.
అంశువు - 1.కిరణము, 2.కాంతి, 3.కొస, 4.అణువు, 5.దారము.
అశ్నుతే వ్యాప్నోతి త్యంశుః ఉ.పు. అశూవ్యాప్తౌ - వ్యాపించునది.
అంశుమంతుఁడు - 1.సూర్యుడు, 2.సగరచక్రవర్తి మనుమడు, 3.ధనవంతుడు.
కలవాఁడు - 1.ఆప్తుడు, 2.ధనవంతుడు, 3.శక్తుడు.
ధనవంతుఁడె కులవంతుఁడు;
ధనవంతుఁడె సుందరుండు; ధనవంతుండే
ఘనవంతుఁడు బలవంతుఁడు
ధనవంతుఁడె ధీరుఁడనుచుఁ*దలఁపు? కుమారా!
తా. ధనముగలవాఁడు మంచి వంశము గలవాఁడు, సౌందర్యము గలవాడు(సుందరుఁడు - చక్కని వాడు), మర్యాదగలవాడు, బలముగలవాడు, ధీరుడు(ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము గలవాడు. అని తలంపుము!
త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.
త్రయాత్ర యోవేదా ఏవ తనుర్యస్య త్రయీతనుః, ఉ-పు. - మూఁడువేదములే శరీరముగాఁ గలవాఁడు.
త్రయి - త్రయము, 2.మూడు వేదములు.
త్రయము - మూటి సమూహము, రూ.త్రయి.
ఇతి వేదా స్త్రయ స్త్రయి,
ఇమే వేదస్త్రయః త్రయీత్యుచ్యతే - ఈ వేదములు మూఁడును త్రయి యనంబడును.
త్రయోవేదా అవయవాః అస్యాఇతి త్రయీ, ఈ. సీ. - మూఁడువేదములు అవయములుగాఁ గలిగినది.
త్రయాణాం వేదానాం సమాహారస్త్ర యీతివా - మూఁడువేదములయొక్క యేకీభావము. ఈ ఒకటి మూఁడు వేదముల సమూహము పేరు.
త్రయీధర్మము - వేదవిహిత ధర్మము.
త్రికము - 1.త్రయము, 2.ముడ్డి పూస, (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
టికము - ముడ్డిపూస, సం.త్రికమ్.
ముౘ్చ - ముడ్డిపూస
ముయ్యెల గుట్ట - (మూడు+ఎల్ల+గుట్ట) 1.మూడు ఎల్లలు కలియు చోటు, 2.మూడు దారులు కలియుచోటు, 3.త్రికము (ఎల్ల శబ్దమున కిచట స్థానమని అర్థము).
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, అను ధ్వనులు.
తిగ - మూడు, రూ.తివ, సం.త్రికమ్.
తివ - తిగ.
పృష్ఠవంశాధరే త్రికమ్,
పృష్ఠవంశాధరే త్రికం. - పృష్ఠవంసమనఁగా వీఁపు యెముక. దానికి దిగువనున్న ప్రదేశము త్రికమనం బడును.
త్రయాణాం ఊరుద్వయపృష్ఠా స్థినాం సమాహార స్త్రికం. - తొడలు రెండును వీఁపు యెముకయు నీమూఁటి యొక్క కూటమిగనుక త్రికము. వెన్నుముక దిగువనున్న చోటు.
త్రిపురా షోడశీ మాతా త్ర్యక్షరా త్రితయా త్రయీ,
సుందరీ సుముఖీ సేవ్యా సామవేద పరాయణా|
స్తువ న్తియే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవన్తి తే విభు బుధ భావితాశయాః|
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ|
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాకృతి. – 163స్తో
ప్రకృష్ఠం ద్యోతతే ప్రద్యోతనః - విశేషముగాఁ బ్రకాశించువాఁడు.
ఖదోతుఁడు - సూర్యుడు.
ఖేద్యోతతే, ఖద్యోతః, ద్యుత దీప్తౌ - ఆకాశమందుఁ ప్రకాశించువాఁడు.
ఖద్యోతో జ్యోతి రిఙ్గణః,
ఖద్యోతము - 1.మబ్బు, 2.మిణుగురు పురుగు, వ్యు.ఆకాశమున వెలుగునది.
ఖేద్యోతత ఇతి ఖద్యోతః, ద్యుత దీప్తౌ. - ఆకాశమందుఁ బ్రకాశించునది.
మిడుఁగుఱుబురువు - మిణుగురు పురువు, ఖద్యోతము.
జ్యోతిరింగణము - మిడుగురు పురుగు.
జ్యోతిషా ప్రకాశేన ఉపలక్షితస్సన్ రిఙ్గతి గచ్ఛతీతి జ్యోతిరిఙ్గణః, రిగి గతౌ. - ప్రకాశముచేతఁ బోవునది. ఈ 2 మిణుఁగురు పురుగు పేర్లు.
ధ్వాంతమణి - మిణుగురు పురుగు, వ్యు.చీకటిలో మణివలె ప్రకాశించునది.
ధ్వాంతము - చీకటి.
ద్వనంత్యత్ర మార్గ మపస్యంత ఇతి ధ్వాన్తం, ధ్వన సద్బే. - మార్గమును గాననివారలై దీనియందు మొఱపెట్టుదురు.
అదరులు - మిణుగురులు, నిప్పుకలు.
లోకబాంధవుఁడు - సూర్యుడు.
లోకస్యబాంధవో లోకబాంధవః - లోకమునకు జుట్టము. సురేషు ఉత్తమ స్సురోత్తమ - దేవతల యందు శ్రేష్ఠుఁడు.
ధామనిధి - సూర్యుడు.
ధామ్నాం నిధిః - కాంతులకు గనియైనవాఁడు.
ధామము - 1.ఇల్లు, 2.చోటు, తావు 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము 6.మేను, 7.పుట్టువు.
తొలుచదువులు - వేదములు.
తొలుమినుకులు - వేదములు.
ౘదువు - పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.
పఠనము - చదువు; విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
ౘదువుల పడఁతి - సరస్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
ౘదువుల వేలుపు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- 1.భృగువు, 2.పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
విద్యానామ నరస్యరూపమధికం ప్రచ్ఛన్న గుప్తధనం
విద్యాభోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాంగురుః|
విద్యాబంధుజనో విదేశగమనే విద్యాపరా దేవతా|
విద్యారాజసుపూజ్యతే నహిధనం విద్యావిహీనః పశుః.
తా. విద్య పురుషునికి శ్రేష్ఠమైన రూపము, రహస్యముగా దాచిన ధనము, భోగమును కీర్తిని సుఖమును గలుగఁజేయునది, గురువుల కందఱికి పూజ్యమైనది, దేశాంతర గమనమున బంధుజనములవలె రక్షించునది. ఉత్తమమయిన దైవమువలె నభీష్టముల నిచ్చునది, ప్రభువుల వలనఁ పూజింపఁబడునది. ఇట్టి విద్యకు సర్యైన ధనము లేదు(మంచి విద్య గలిగిన ధనము పనిలేదు), గావున విద్యలేనివాఁడు పశుప్రాయుఁడు. – నీతిశాస్త్రము
ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.), దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.
తొలిమినుకులు - వేదములు.
పెనుమినుకులు - వేదము.
ప్రామినుకులు - (బహు.) వేదము.
మినుకుఁజేడియ - సరస్వతి.
మినుకు - 1.కిరణము, 2.తాలిబొట్టు, 3.మినుకు మినుక్కు మను కాంతి, 4.వేదము.
కిరణము - వెలుగు, మయూఖము.
తాలిబొట్టు - మంగళసూత్రపు బొట్టు, రూ.తాళిబొట్టు.
మినుకులబరణి - సూర్యుడు, వ్యు.కాంతులకు బరణివంటివాడు Sun.
మంగళసూత్రము - మాంగల్యము, పుస్తె.
మాంగల్యము - 1.మంగళత్వము, 2.తాళిబొట్టు.
పుస్తె - తాళిబొట్టు; కంఠసూత్రము - పుస్తె, మంగళసూత్రము.
శతమానము - 1.నూటికొలది, 2.పుస్తె, మంగళసూత్రము. శతమానం భవతిః|
తాలి - మంగళసూత్రము, రూ.తాళి.
తాళి - పతకము, హారము, రూ.తాలీ.
ఋగ్వేదస్త్వం యజుర్వేద స్సామ వేద స్త్వథర్వచ|
శిక్షా కల్పోనిరుక్తంచ ఛన్దో జ్యోతిష మేవచ ||
తొలిచదువులు - వేదములు.
వేదము - దీనిచేత ధర్మాధర్మములు నెరుగుదురు, తొలిచదువులు. ఇవి నాల్గు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. ప్రాచీన భారత ఆర్య (ఇండో - ఇరానియనుల) ధర్మ గ్రంథములు.
1. ఋక్ వేదము :- 1017 వేద మంత్రముల సంహితము, వేదము లన్నిటిలోను పురాతనమైనది. ఋక్ వేదమంత్రములకు, పారశీక (ఇరానియనుల ధర్మగ్రంథమయిన) ధ్యాన శ్లోకములకు సన్నిహిత సంబంధము గలదు.
ఋగ్వేదము - నాలుగు వేదములలో ఒకటి.
ఋక్ - 1.ఛందోబద్ధమగు వేదమంత్రము, 2.ఋగ్వేదము, 3.స్తుతి.
హోత - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు, రూ.హోత్రి.
స్తవః స్తోత్రం స్తుతి ర్నుతిః,
స్తూయతే అనేనేతి స్తవః, స్తోత్రం చ, స్తుతిశ్చ, ఇ. సీ. ష్టుఞ్ స్తుతౌ. - దీనిచేత స్తోత్రము చేయఁబడును గనుక స్తవము, స్తోత్రము, స్తుతియు, 3. నూయతే అనేనేతి సుతిః. ణు స్తుతౌ, దీనిచేత నుతింపఁబడును. ఈ 4 స్తోత్రము పేర్లు.
1. స్తవము - స్తోత్రము. స్తవనీయము - పొగడదగినది, స్తుతింపదగినది.
స్తోత్రము - పొగడ్త; పొగడ్త - స్తుతి, మెప్పు. ప్రశస్తి - 1.ప్రసిద్ధి, 2.పొగడ్త.
ప్రశంస - మెప్పు, స్తుతి ప్రస్తావించుట.
మెప్పు - 1.మెచ్చు, 2.వరము, 3.ప్రీతి.
మెచ్ఛు - 1.శ్లాఘన, 2.ప్రేమము, క్రి.శ్లాఘించు.
వరము - కోరిక, వరించుట. ప్రీతి - 1.సంతోషము, 2.స్నేహము.
స్తోమము - 1.సమూహము, 2.స్తోత్రము, 3.యజ్ఞము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
స్తోమ్యము - పొగడదగినది.
వర్ణనము - స్తోత్రము, వస్తుగుణము లను వివరించుట.
స్తుతి - స్తోత్రము. స్తుతము - స్తోత్రము, చేయబడినది.
స్తుత్యము - స్తుతింపదగినది.
4. నుతి - స్తోత్రము; నుతించు - క్రి.స్తోత్రముచేయు.
ప్రస్తుతి - స్తోత్రము. నవము - స్తోత్రము, విణ. క్రొత్త.
క్రొత్త - 1.నవీనము, నూతనము, 2.అపూర్వము.
నవీనము - క్రొత్త; నూతనము - క్రొత్త, రూ.నూత్నము.
అపూర్వము - అపురూపము; అపురూపము - అపూర్వము, పూర్వములేనిది, అరుదు, సం.అపరూపమ్, (వ్యావ.) ప్రాణపదము, ఉదా.నేను దాన్ని అపురూపంగా చూచుకుంటున్నాను.
అరుదు - 1.ఆశ్చర్యము, 2.ఒకానొక నగ, 3.వింత, విణ .1.ఆశ్చర్యకరము, 2.అపురూపము, 3.అశక్యము, 4.దుష్కరము, 5.దుస్సహము, 6.దుర్లభము.
ఆశ్చర్యము - అచ్చెరువు. అచ్చెరియము - అచ్చెరువు, సం.ఆశ్చర్యమ్.
వింత - అబ్బురము, ఆశ్చర్యము, విణ.1.చిత్రము, 2.అరుదు, 3.అన్యము, 4.క్రొత్త. కొత్తవింత, పాత రోతా.
చిత్రము - 1.ఆశ్చర్యము, 2.పటమున వ్రాసిన రూపము, 3.చతుర్విధ కవిత్వములో నొకటి, 4.విణ.నానా వర్ణములు గలది.
విచిత్రము - ఆశ్చర్యము surprise, సం.విణ. చిత్రవర్ణము కలది. అన్యము - 1.ఇతరము, వేరు, 2.అసాధారణము.
ఇతరము - 1.అన్యము, 2.నీచము.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
మంద్రము - గం భీ ర మై న ది, (స్వరము). గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది (స్వరము), రూ.గంభీరము.
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
వేరు - చెట్టుయొక్క మూలము.
అసాధారణము - 1.సాధారణము కానిది, అసామాన్యము, 2. (భౌతి.) సామాన్య విషయములకు వ్యతిరేకమైనది, వి.(తర్క.) హేత్వాభావము లలో ఒకటి.
అసామాన్యము - సామాన్యము కానిది (Abnormal).
దుష్కరము - చేయసాధ్యము కానిది.
దుస్సహము - సహింపరానిది. అసహ్యము - సహింపరానిది, భరింపరానిది.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
ఋగ్వేదశ్రుతిమౌళివిభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్రశివ|
శాభి - 1.వృక్షము, 2.వేదము, వ్యు.శాఖలు కలది.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి. శాఖాః అస్య సంతీతి శాఖీ, న. పు. - కొమ్మలు గలిగినది.
పనస - 1.వేదభాగము, ఏబది పదముల సమూహము (పంచాశత్) అనబడును, సం.పంచాశత్, 2.ఒక ఫలవృక్షము, సం.పనసః.
పనసః కణ్డకి ఫలః -
పన్యతే స్తూయత ఇతి పనసః, పణ వ్యవహారే స్తుతౌ. - స్తోత్రము చేయఁబడునది. పా, పణసః.
కంటకయుక్తాని ఫలాస్యస్య కంటకి ఫలః - ముండ్లు గల పండ్లు గలది. ఈ 2 పన్సచెట్టు పేర్లు.
కంటకిఫలము-1.పనస, 2.ఉమ్మెత్త, 3.పల్లేరు.
తండ్రి గరగర తల్లి పీచుపీచు బిడ్డలు రత్నమాణిక్యాలు. - పనసపండు
పనసపండును ఒలవడానికి ముందు చేతులకు నూనె రాసుకుంటే, (తొనలు తీసేటప్పుడు) ఒలిచేటప్పుడు దాని జిగురు చేతికి అంటదు కదా! అదే విధంగా భక్తిజ్ఞానా లను రక్షగా పొందినప్పుడు సిరిసంపదలు, సంసార వ్యామోహం నిన్నెంత మాత్రమూ బాధించలేవు. – శ్రీ రామకృష్ణ పరమహంస
పన్నము - వేదమందలి అట్టమునకు అవయవము, వేదపరిచ్ఛేదము, సం.ప్రశ్నః, సం.విణ. జారినది.
అట్టము - ఎనిమది పన్నములుగల వేద భాగము, సం.అష్టకమ్.
అష్టకము - 1.ఎనిమిదింటి సమూహము, 2.ఎనిమిది 8, 3.ఋగ్వేద మందలి ఒక భాగము, అట్ఠము, రూ.అష్టము.
అష్టము - (భౌతి.) 1.ఎనిమిదింటి సమూహము, 2.ఒక క్రింది స్వరము నకు ఎనిమిదవ మీదిస్వరము (Octave).
ఎనిమిది - ఏడు నొకటి.
అజ్జము - కొన్ని పనసలుగల వేదభాగము, రూ.అఘము, సం.అధ్యాయ.
స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతతవైభవా |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః. - 172శ్లో
అఘమర్షణము - సర్వపాపములు పోవుటకై జపించు మంత్రము, (ఋగ్వేదము 10-190).
అఘము - పాపము.
నహంతి ధన్యమిత్యఘం, హన హింసాగత్యోః ధన్యునిఁ జెఱపనిది.
కర్మాం ఘంతీత్యఘం, అఘిగతౌ. కర్తను బొందునది.
నజహాతి దుఃఖమితివా అఘం, ఓహక్ త్యాగే. - దుఃఖమును విడువనిది.
పాపము - దుష్కృతము, కలుషము.
పాతకము - మహాపాపము (పంచ మహా పాతకములు :- స్వర్ణస్త్యేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము).
బ్రహ్మహత్య - విప్రుని చంపుట (మహాపాతకము లలో నొకటి).
సర్వ్యైన సామపధ్వంసి జప్యం త్రిష్వఘమర్షణమ్,
అఘం మృప్యతే అనేన అఘమర్షణం, త్రి. మృష హింసాయాం. - దీనిచేత పాపము చెఱుపఁబడును.
అఘమర్షణీ ఋక్, అఘమర్షణో మంత్రః. ఈ ఒకటి సర్వపాపములను బోఁగొట్టుటకు జపించు మంత్రము.
అంహస్సు - పాపము, దోషము.
అహంతి నరకమనేన అంహః స. న. అపి శబ్దే. - దీనిచేత జనులు నరకమును బొందుదురు.
దురితము - పాపము.
దురస్య దురితం, ఇణ్ గతౌ. - నిందితమైన నడత గలిగినది.
దుష్కృతము - పాము.
దుర్నిందితంకృతం కరణమస్య దుష్కృతం. - నిందితమైన కార్యము గలది.
అంహో దుఃఖవ్యసనే ష్వఘమ్,
అఘశబ్దము పాపమునకును, దుఃఖమునకు, దూతాది వ్యసనమునకును పేరు. సంహంతి ధనీ మిత్యఘం, హన హంసాగత్యోః. - ధన్యుడైనవానిఁ జెఱచనిది.
అంహోనాశన రంహో గాహన
బ్రహ్మోద్బోధన సిహ్మోన్మేషణ | ||శరవణభవ||
2. యజుర్వేదము :- వైదిక తంత్రములను గురించిచెప్పు సంహిత.
3. సామవేదము :- వేద మంత్రములకు స్వరములు కల్పించి గాన రూపమును చూపు సంహిత.
సామము - 1.ఒక వేదము, 2.మంచిమాట, 3.అనుకూలోపాయము.
తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమార్థస్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ. - 168శ్లో
4. అధర్వణ వేదము :- వేద సంహితలలో చివరిది. ఈ సంహిత భూతప్రేత మంత్రములతోను చారిత్రిక విషయములతోను కూడి యున్నది.
మంత్రము1 - 1.గాయత్రి, మొ.వి. 2.రహస్యము, 3.అధర్వణ వేదము.
త్రిపది - 1.ఏనుగు కాలి సంకెల, 2.గాయత్రి.
గాయత్రి - 1.సంధ్యావందన సమయమున జపించు ఒకానొక మంత్రము, 2.సంధ్యావందన సమయమున ఉపాసింపబడు దేవత, 3.పాదమునకు ఆరేసి అక్షరములు గల ఒక వైదిక చ్ఛందస్సు.
చిచ్ఛక్తి శ్చేతనారూపా జడశక్తి ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి స్సంధ్యా ద్విజబృంద నిషేవితా. - 90శ్లో
తురీయము - బ్రహ్మము, విణ. నాల్గవది, రూ.తుర్యము.
బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు(జీవుఁడు -1.ప్రాణి, 2.బృహస్పతి.), 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
పరమము - పరమాత్మ, విణ.1.ఉత్కృష్టము 2.ఆద్యము 3.ప్రధానము.
అక్షయము- 1.తరుగనిది, నాశముకానిది, 2.ఇల్లులేనిది, వి.పరమాత్మ.
కేవలుఁడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిర్తువు.
ధ్యానము - చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
గోవిందుఁడు -1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.
తుర్యే ధర్మకలాసర్గే నరనారాయణావృషీ |
భూతాత్మోవశమోపేత మకరోద్దుశ్చరం తపః |
ధ్యాతవ్యము - 1.ధ్యానింపదగినది, 2.ధ్యేయము.
ధ్యానీయము - 1.ధ్యానింపదగినది, 2.కోరదగినది.
ధ్యేయము - ధ్యానింపదగినది.
ధ్యాత - ధ్యానించువాడు.
ధ్యాతము - ధ్యానింపబడినది.
ప్రణితము - 1.ఉంచబడినది, 2.ధ్యానము చేయబడినది.
యావ - (వ్యా.) 1.ధ్యానము, "నాపుత్రునిపై యావపాఱినది", 2.దృష్టి.
అజం రుక్మిణీప్రాణసంజీవనం తం, పరం ధామ కైవల్యమేకం తురీయమ్|
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్||
మోక్షము - 1.కైవల్యము 2.మోచనము, విడుపు 3.ముక్తి.
కైవల్యము - ముక్తి, మోక్షము. అపవర్గము - మోక్షము.
మోచనము - 1.విడుపు 2.మోక్షకాలము.
ముగితి - 1.ముక్తి, 2.విడుదల, సం.ముక్తిః.
ముక్తి - మోక్షము, విడుపు, విమోచనము.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.
మహోదయము - 1.కన్యాకుబ్జము, 2.అధిపత్యము, 3.అభివృద్ధి, 4.మోక్షము.
ముక్తిచతుష్టయము - సామీప్యము, సాలోక్యము, సారూప్యము, సాయుజ్యము.
సామీప్యము - సమీపత్వము, దగ్గర.
సాలోక్యము - 1.సమానలోకత్వము, 2.ఒక విధమగు ముక్తి.
సారూప్యము - 1.సమానరూపత్వము, 2.ఒక విధమైన ముక్తి.
సాయుజ్యము - 1.సహయోగము, 2.ఒక విధమైన మూర్తి.
పరము - 1.మోక్షము, 2.కేవలము, విణ.1.ఇతరము, 2.దూరము, 3.మీదిది, 4.శ్రేష్ఠము.
పరమేష్ఠి - బ్రహ్మ.
కేవలము - 1.నిర్ణయము, అవధారణము, విణ. 1.అంత, సమస్తము 2.అచ్చము, ఒకటి 3.ప్రధానము.
కేవలుఁడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
అవ్యయము - 1.పరబ్రహ్మము, 2.శుభము, అభ్యుదయము, 3.(వ్యాక.)లింగవచన విభక్తి శూన్యపదము, విణ.1.నాశరహితము, 2.మార్పులేనిది, 3.వ్యయము, లేనిది.
అవ్యయుఁడు - 1.విష్ణువు, 2.శివుడు.
అద్వైతము - 1.అభేదము, 2.జీవేశ్వరుల ఐక్యమును బోధించు మతము, 3.పరబ్రహ్మము, విణ. భేదములేనిది.
సమరసము - అభేదము.
అభేదము - భేదములేమి, ఏకీభావము.
ఏకీభావము - ఐక్యము, ఒకటియగుట.
ఐక్యము - ఏకీభావము, మైత్రి.
చెడుఁ గరులు హరులు ధనములు
చెడుదురు నిజసతులు * చెడుఁచెనఁటులకున్
జెడక మను నెఱసుగుణులకుఁ
జెడని పదార్థములు విష్ణు * సేవానిరతుల్.
తా. నిత్యానిత్యవస్తు వివేకము లేనిమూఢులు భగవంతునియందుఁ గించి త్తయినను మనంబుంచక, సదా సంసారచక్రమందుఁ దిరుగుచు, తనచుట్టు నున్న పశువాహనాదులు, ధనధాన్యాదులు, పుత్త్రమిత్త్ర కళత్ర బాంధ వాదులు శాశ్వతంబులను నమ్మియుందురు. అవి యెన్నటికిని స్థిరంబులు గావు. ఎవరు సంసారధర్మమునందున్నను, ఫలాపేక్షమాని భగదర్పణబుద్ధితో సత్కార్యములను జేయుచు, భగవంతుని విడువక ధ్యానము చేయుచుందురో, వారు ఇహమున పుత్రమిత్ర కళత్ర బాంధవ పరివారాది సమేతులయి, ధనకనకవస్తువాహనాది సమృద్ధి గలిగియుండి, కడపట శాశ్వతం బగు మోక్షపదంబు(మోక్షము) నొందుచున్నారు. (విష్ణుభక్తి చిత్త వృత్తులెప్పటికిని నుండు పదార్థములు.)
స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది.
మృదఙ్గా మురజాః :
మృదంగము - 1.మద్దెల, 2.తప్పెట, 3.సద్దు.
మృద్యత ఇతి మృదంగః మృద మర్దనే. - కొట్టఁబడునది.
మురజము - మృదంగము.
మృత్ అంగమస్యేతి వా మృదంగః - మృత్తిక అంగముగాఁగలది.
వేష్టనము - 1.చుట్టుకొనుట, పాగ, 2.చెవివెలుపలి భాగము, 3.ఒడ్డాణము.
మురతీతి మురః వేష్టనం. ముర వేష్టనే. చర్మపట్టికాసం వేష్టనా జ్ఞాతఃమురజః. - మురమనఁగా చర్మవలయము. అందువలనఁ గలిగినది. ఈ రెండు మద్దెల పేర్లు.
పాగా - 1.తలగుడ్డ, 2.అశ్వశాల, రూ.పాగ.
పాగా - పాపకోళ్ళు, కట్టెతో చేసిన పాదుకలు, సం.పాదుకా, వి.1.గుఱ్ఱములసాల, 2.తలపాగ. ముందలచీర - తలపాగ.
తబేల - అశ్వశాల. రుమాలు - చేతిగుడ్డ, తలగుడ్డ.
ఒడికట్టు - క్రి.1.యత్నించు, 2.పాల్పడు, వి.1.ఒడ్డానము, 2.ఒడిపై ధరించిన వస్త్రము.
ఒడ్డాణము - నడుమునకు ధరించు నగ, సం.ఓఢ్యాణమ్.
ఓఢ్యాణము - ఒడ్దాణము. ఓఢ్యాయాం గిరిజాదేవీ శక్తిపీఠం|
వేష్టించు - క్రి.పరివేష్టించు.
పూర్ణానకము - 1.తప్పెట, 2.పూర్ణపాత్రము.
పటాహము - 1.తప్పెట, 2.యుద్ధవాద్యపు మ్రోత.
మార్దంగికుఁడు - మృదంగము వాయించువాడు.
తోలువాయిదము - ఆనర్ధము, తోలుకప్పిన వాద్యము.
ఆనద్ధము - మృదంగాది చర్మవాద్యము, విణ.కట్టబడినది (కేశభూషణాదికము).
ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ|
రహోయాగక్రమారాధ్య రహ స్తర్పణ తర్పితా. - 83
మధురిపుఁడు - విష్ణువు.
మధో రసురస్య రిపుః మధురిపుః ఉ - పు. - మధు వనెడి రాక్షసునికి శత్రువు.
త్రివేణి - గంగ, వ్యు.గంగ, యమున, సరస్వతి అను మూడు నదులు గలది.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
యమున - యమునానది, పార్వతి , (వికృ.) జమున.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, ఒక నది.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
అంగూరు - ఒక రకపు ద్రాక్ష.
కిసిమిసిపండు - లఘుద్రాక్షాఫలము.
మృద్వీకా గో స్తనీ ద్రాక్షా మధురనేతి చ,
మృద్యత ఇతి మృద్వీకా - మెదుపఁబడినది.
గోస్తని - 1.ద్రాక్ష, 2.ఒకనది.
గో స్తనాభ ఫలత్వాద్గోస్తనీ, సీ. - ఆవుచన్నులవంటి పండ్లు గలది. మాణిక్యే ద్రాక్షవాటికా శక్తిపీఠం|
ద్రాక్ష - ఒకజాతి ఫలలత, ద్రాక్షపండు.
ద్రాతి దాహాదికంద్రక్షా, ద్రాకుత్సా యాంగతౌ. - దాహాదికమును బోఁగొట్టునది.
స్వాదువు - 1.ఇంపైనది, 2.తియ్యనిది, 3.మంచిది.
స్వాదుత్వా త్స్వాద్వీ,సీ. - రుచియైనది.
మధురస - ద్రాక్ష.
మధురసయోగా న్మధురసా - మాధుర్యముగలది.
ఇష్ట మధురౌ స్వాదూ -
స్వాదుశబ్దము ఇష్తమైనదానికిని, మధురమయిన దానికిని పేరు. స్వదత ఇతి స్వాదు, త్రి. ష్వద ఆస్వాదనే. - రుచించునది. 'స్వాదు ర్కృష్ట మనోజ్ఞయో రిత్యజయః.
ద్రాక్షచక్కెర - (వృక్ష.) ద్రాక్ష పండ్లలో నుండు చక్కెర, గ్లూకోజ్, (Glucose).
డెక్ స్ట్రోజ్ - (జీవ.) (Dextrose) ద్రాక్ష చక్కెర.
గ్లైకోజిన్ - (గృహ.) (Glycogen) కాలేయపు చక్కెర, (కాలేయము రక్తములో ఎక్కువగానున్న గ్లూకోస్(Glucose)ను, గ్లైకోజిగాన్ మార్చి నిల్వచేయును కాలేయములోను, కండర జీవకణములోను నిలువ చేయబడు చెక్కెర రూపము).
కావ్యపాకములు - (అలం.) ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళపాకము.
స్వాదూదము - మంచినీళ్ళ సముద్రము.
స్వాదుధన్వుఁడు - తియ్యవిలుకాడు, మన్మథుడు.
తియ్యవిలుకాఁడు - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది (29వ).
తియ్య - మధురము, రూ.తీయ.
తియ్యము - 1.ఓదార్పు, 2.ప్రియము, రూ.తీయము.
తియ్యబోఁడి - స్త్రీ.
తియ్యగూర - పులుసులేని కూర.
మధురో -
మధుమాధుర్య మస్యాస్తీతి మధురః. - మధు వనఁగా మాధుర్యము, అధి గలిగినది మధురము.
మథ్నాతి వాత మితివా మధురః, మంథవిలోడనే. - వాతమును జెఱుచునది. ఈ ఒకటి తియ్యదనము పేరు.
మధురము - విషము, విణ.తియ్యనిది, ఇంపైనది.
మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు.
కాళింగము - ఏనుగు Elephant, విణ.కళింగ దేశమున పుట్టినది.
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
కృష్ణవర్ణత్వాత్ శ్యామా - నల్లనిది.
కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. యమున యందు దేవీస్థానం మృగావతి|
కృష్ణసారము - నల్లయిఱ్ఱి.
కృష్ణేన నీలవర్ణేన సారః కృష్ణసారః - నల్లనివన్నె చేత శ్రేష్ఠమైనది. కృష్ణశారమని కొందఱు.
త్రియామ - 1.రాతిరి, 2.పసుపు, 3.యమున.
యామము - జాము, మూడు గంటల కాలము.
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.
త్రయో యామాః ఊస్యాంసాత్రియామా - యామమనఁగా జాము, మూఁడు జాములు గలది, రాత్రియందు ప్రథమయామము చేష్టాకాలము గనుకను, అంత్యయామము విబోధకాలము గనుకను నీ రెండు యామములందు సగము దివసముగా వునఁ ద్రియామ యనంబడును.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
యౌవతము - యువతీ సమూహము.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.
కాళింది - యమునానది, శ్రీకృష్ణుని భార్య.
సూర్యతనయ - యమున, యముని తోబుట్టువు.
కాళిందీ బోధసుఁడు - బలరాముడు.
కాళిందీం యమునాం హలేన భినత్తీతి కాళిందీ భేదనః : హలముచేతఁ కాళిందీ నదిని భేదించినవాడు.
దేవకీనన్దన శ్శ్రీశో నన్దగోప ప్రియాత్మజః,
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః|
మధుర - ఒక పట్టణము. ఉత్తర మధుర ఉత్తరప్రదేశ్. శ్రీకృష్ణ జన్మభూమి. యమునానది వర్షాకాలపు కొత్త నీటి పొంగు తగలి, అంతంత ఎత్తుకి ఎగిరెకెరటాలలో ఉరకలుపెడుతూ, కడు వడిగా ప్రవహిస్తూ ఉంది. వసుదేవుడు పసిగుడ్దు చిన్నికృష్ణునితో నదిలో దిగగానే (శ్రీకృష్ణుని పాదలు తగిలిన యమున పునీతమయింది) మోకాలి బంటి అయి దారియిచ్చి సహాయపడినది.
యమునాతీరవిహార ధృతకౌస్తుభ మణిహార నారాయణ|
నందవ్రజశ్చ్యైవతే - నంద గోకులం. శ్రీకృష్ణడు గోపికలతో కలసి జలక్రీడలు సలిపిన పవిత్రమైనది యమునానది. పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది తీరమున విహరించువాడు శ్రీకృష్ణుడు.
కాళిందీ సూర్యతనయా యమునా శమన స్వసా:
కళిందపర్వతాజ్ఞాతా కాళిందీ - కళింద పర్వతము వలనఁ బుట్టినది.
సూర్యస్య తనయా సూర్యతనయా - సూర్యుని కూఁతురు.
యమేన సహ జాతా యమునా - యమునితోఁ గూడఁ బుట్టినది.
శమనస్య యమస్య స్వసా శమనస్వసా - యముని చెల్లెలు.
పదుమూడవది యమున మోహినీ వేషంబున అసురుల మోహితులంజేసి సురల నమృతాహారులం గావించె; పదమోడో (13వ)అవతారం లో 'మోహిని" వేషంతో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం అహారంగా చేస్తూ పంచి పెట్టాడు.
యమున - యమునానది, పార్వతి , (వికృ.) జమున.
జమున - యమున. యమున యందు దేవీస్థానం మృగావలి|
జమునయ్య - సూర్యుడు Sun.
జమున తోబుట్టువు - యముడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ౙముఁడు- యముడు, శమనుడు, సం.యమః.
యమునానద్యాః భ్రాతా యమునాభ్రాతా - యమునానదికి తోడఁబుట్టిన వాఁడు.
యమునయా సహ యమళత్వేన జాతత్వాద్యమః - యమున తోఁగూడ కవగాఁ బుట్టినవాఁడు.
ౙమునెక్కిరింత - దున్నపోతు, యముని వాహనము.
కర్కాటకరాశిలో గురుడు Jupiter ప్రవేశం యమునానది పుష్కరాలు.
యమునోదకము - Water of the Jamuna river రుచిగా నుండును. ఇంద్రనీల కాంతిగలిగి మనోహరమై యుండును; గ్రీష్మఋతువు(గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్టాషాడ మాసములు.)నందు కోరతగినది, జఠరదీప్తి, మనోవికాసము, బుద్ధి, బలము, కాంతి వీనినిచ్చును; ఆయాసమును బోగొట్టును, ఆరోగ్యమునిచ్చును.
యదేత త్కాళిందీ - తనుతరతరఙ్గాకృతి శివే!
కృశే మధ్యే కించి - జ్జనని తవ యద్భాతి సుధి యామ్|
విమర్దా దన్యోన్యం - కుచకలశయో రంతర గతం
తనూభూతం వ్యోమ - ప్రవిశదివ నాభిం కుహరిణీమ్|| - 77శ్లో
తా. తల్లీ! పరమశివుని పట్టపురాణీ! యమునానది తరంగమువలె సన్ననైన కృశించిన(తనుమధ్య - స్త్రీ, సన్నని నడుముకలది.)నీ నడుము నందు కొలదిగనున్న(కించిత్తు - ఇంచుక కొంచెము)నూగారు - కలశములవంటి స్తనముల నడుమ మధ్యనున్న వ్యోమము - 1.ఆకసము, 2.నీరు., ఆ కుచములు రెండు పరస్పరం ఒరయుటవల్ల, మిగుల నలిగినల్లనై సన్నగా కిందికి నాభివరకు కుహరము - 1.గుహ, 2.రంధరము.)లక్కజారి నట్లు జారినదిగా పండితు(సుధి-విద్వాంసుడు)లూహించుచున్నారు. – సౌందర్యలహరి
సుధి - విద్వాంసుడు.
శోభనం ధ్యాయతీతి సుధీః, ఈ. పు. ధ్యై చింతాయాం. - లెస్సగా విచారించువాఁడు.
కాళిందీ నది నలుపు | నలుపు బింబిత మాహాకాశంబు నల్పు |
అందులో కూలంబందు తమాల రాశి నలుపు | ఆ ఘోరాహియున్ నలుపు
తన్ మౌళిన్ నర్తియు నీవు నలుపు | నల్పులు భావింపగా నిన్ని యున్
నాలో నలుపు తొలగున్, చిత్రమిది కృష్ణా ఆపదోద్ధారకా !
ఇడా పింగళా సుషుప్నా నాడులను గంగ యమునా సరస్వతులుగా చెప్పుట కలదు. కాళిందీ నామ యమున నామధేయ పింగళానాడి గత ప్రాణ క్రియను మనసునందుచుకొని యీ ఉపమానమును కల్పించుట వున్నది. జారునట్టి ఆకాశతత్త్వము సూర్యమండలమునుండి క్రింది జాఱుచున్నది.
గంగాం సరస్వతీం నందాం కాలిందీం సితవారణమ్ |
ధ్రువం బ్రహ్మఋషీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్ |
శమనుడు - యముడు.
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమయతి ప్రాణిన ఇతి శమనః, శము ఉపశమనే - ప్రాణులను శమింపఁజేయువాఁడు.
ఉపశమము - 1.అడగుట, 2.రోగాదుల బాధ తగ్గుట, 3.ఇంద్రియ నిగ్రహము, 4.ఓర్పు, రూ.ఉపశాంతి.
ఉపశాంతి - ఉపశమము. ఓర్పు కవచము వంటిది. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతి.
శమించు - అడగు.
శమథస్తు శమశ్శాన్తిః -
శమనం శమథః, శమః, శాంతిశ్చ, సీ. శము ఉపశమే. శమించుట గనుక శమథము, శమము, శాంతియును. ఈ 3 కామక్రోథాదులు లేకుండుట పేర్లు.
శాంతము - శాంతిబొందినది, సం.వి.1.కామ క్రోధాది రాహిత్యము, 2.ఉపశమనము, 3.తొమ్మిది రసాలలో నొకటి.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యదగి యుండుట.
తనకోపము తనశత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.
తా. తనకోపమే శత్రువగును, తనసహనమె రక్షణ, దయచుట్టము వలె ఆదరించును. సంతోషము స్వర్గలోకంవలె సుఖమునిచ్చును, తన దుఃఖమె నరకమని చెప్పబడుచున్నది.
శమనము - శాంతి పథము, రూ.శామనము.
శాంతి - శమనము.
శామనము - 1.శమనము, 2.పధము.
మదిమది - 1.నెమ్మది, శాంతి, 2.అనాలోచనము.
శాన్తః శమితే -
శామ్యతేస్మ శమిత, శ్శంతశ్చ, శము ఉపశమే. - శమింపఁబడినది. శాంతము, శమితమును. ఈ 2 శమింపఁబడిన రాగాదుల పేర్లు. ప్రతి క్రియా నివర్తితస్య రోగాదేర్నామనీ, ఇతి టీ. స.
ధర్ముఁడు - 1.యముడు, 2.సోమయాజి.
దమ్మఁడు - 1.ధర్ముడు, 2.కపటము లేనివాడు, సం.ధార్మికః.
ధార్మికుఁడు - 1.పుణ్యాత్ముడు, 2.విలుకాడు.
సోమాని - సోమయాజి, సోమయాగము చేసినవాడు, సం.సోమయాజీ.
సోమసీథి - 1.సోమపానము చేయువాడు, 2.సోమయాజి, యజ్ఞము చేసినవాడు.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
ధరతి లోకానితి ధర్మః - లోకములను ధరించునది.
ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేఁ బూనఁబదునది. ఈ ఒకటి వేదవిహితమైన కర్మ పేరు.
దమ్మము - ధర్మము, సం.ధర్మః.
ధర్మము - ధర్మమునుండి తొలగనిది.
ధర్మి - ధర్మముగలది.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).
దాంతి - 1.తపః క్లేశము నోర్చు గుణము, 2.బాహ్యేంద్రియ నిగ్రహము.
దాన్తిస్తు దమథో దమః,
దమనం దాన్తి, సీ, దమథః, దమశ్చ దము ఉపశమనే. - ఓర్చుట గనుక దాంతి, దమథము, దమమును. ఈ 3 బ్రహ్మచర్యాది క్లేశమును సహించుట పేర్లు.
దమము - 1.క్లేశమునొర్చుగుణము, 2.బాహేంద్రియ నిగ్రహము, 3.అణచుట, 4.అడుసు.
దమనము - 1.అణచుట, 2.దవనము.
దవనము - దమనము, సువాసనగల ఒకతెగ మొక్క, సం.దమనః.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.
ౙమ్మి - శమీ వృక్షము, సం.శమీ.
శమీసక్తుఫలా శివా,
శమయతి దోషాన్ శమీ, ఈ.సీ. శము ఉపరమే. - దోషములను శమింపఁజేయునది.
సక్తువత్స్వాదూని ఫలాన్యస్య సక్తుఫలా - సక్తువువలె స్వాదువైన ఫలములు గలది.
దోషశమునాచ్చివా - దోషశమనమువలన శుభస్వరూపమైనది. ఈ 3 జమ్మిచెట్టు పేర్లు.
అల్పా శమీ శమీర స్స్యాత్ -
అల్పా శమీ శమీరః - చిన్నదైన జమ్మి. ఈ ఒకటి పిన్న జమ్మి పేరు.
అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం|
అస్థిరం దారపుత్త్రాద్యాః ధర్మ కీర్తి ద్వయం స్థిరమ్|
తా. జీవితకాలము, యౌవనము, ధనము, దారాపుత్త్రాదులు ఇవి అస్థిరము - 1.నిలుకడ లేనిది, అశాశ్వతము, 2.నిశ్చితము కానిది.)అస్థిరములు, తాను చేసిన ధర్మము, దాని వలన కలిగెడు కీర్తియు రెండును శాశ్వతములు. - నీతిశాస్త్రము
అవినయమపనయ విష్ణో! దమయ మనః
శమయ విషయమృతతృష్ణామ్|
భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః | - 1
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
యమనాత్ యమాః ప్రజాసంయమోద్యమాః మృత్యుప్రభృతయో (అ)స్యకింకరాః, యమ ఉపరమే, తేషు రాజత ఇతి యమరాట్,జ.వు. రాజృగీప్తౌ. - ఇతని కింకరులైన మృత్యువు మొదలైనవారు ప్రజల నియమించువారు గనుక యములనంబడుదురు, వారికి రాజు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
కాలుఁడు - యముడు.
కలయతి ధర్మాధర్మణామాయుషో వా సంఖ్యానం కరోతీతి కాలః, కల శబ్ద సంఖ్యానయోః - ధర్మాధర్మములనైనను ఆయువునైనను లెక్క పెట్టువాఁడు.
కృతాన్తానే హసోః కాలః -
కాలశబ్దము యమునికి, కాలమునకును పేరు. కలయతి ప్రాణిన ఇతి కాలః కల కల క్షేపే. - ప్రాణులను పోఁ ద్రొబ్బువాఁడు.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
కాలరాత్రి - 1.ప్రళయకాలము, 2.దుర్గామూర్తి భేధము, 3.చీకటిరాత్రి, సం.వి.కాలిబంటు, పదాతి.
కాలధర్మము - 1.కాలము యొక్క ధర్మము, 2.మరణము, ఉదా.అతడు కాలధర్మము నొందెను.
కాలస్య యమస్య ధర్మః కాలధర్మః – యముని యొక్క ధర్మము.
లోకమున సర్వజనులకు
నా కాలుఁడు ప్రాణహారి * యై యుండగ శో
భాకృతకార్యముల వడిం
బ్రాకటముగఁ జేయకుండ * రాదు కుమారా!
తా. యమధర్మరాజు జనులందరఱకుఁ బ్రాణాంతకుఁడుగానున్నాఁడు. కాఁబట్టి మంచికార్యములను(శోభాకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.)త్వరగాఁజేయక యూరకుండఁ గూడదు.
వాసుదేవుడు - కృష్ణుడు, వ్యు.వసుదేవ కుమారుడు.
వాసుదేవః వసుదేవ స్యాపత్యం పుమాన్ - వసుదేవుని కుమారుడు. వసుదేవతనయా గోవిందా|
వసంత్యస్మిన్ జగంతీతి వాసుః - వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవః - అన్ని జగములు తనయందు గల దేవుఁడు. సప్తమం వాసుదేవం చ|
వస నివాసే. జగతి వస త్యయమితివా - జగమున నంతట నుండు దేవుఁడు.
తదుక్తం. శ్లో. వసత్యాత్మా జగత్య త్ర తస్మి న్వనతి వా జగత్, స వాసుదేవ ఇత్యాది.
వసుదేవుఁడు- కృష్ణునితండ్రి, ఆనక దుందుభి.
ఆనకదుందుభి - 1.శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు (భగవంతునికి తండ్రి కాబోవుచున్నాడని యీతని జన్మకాలమున దేవతలు ఆనకదుందుభులు మ్రోగించి నందువల్ల ఈ పేరు వచ్చెను), 2.పెద్ద డక్క.
భేరీ స్త్రీ దున్దుభిః పుమన్,
బిభ్యతి శత్రవో (అ)స్యా ఇతి భేరీ, ఈ. సీ. ఞి భీ భయే. - దీనివలన శత్రువులు భయపడుదురు.
దుందుశబ్దేన భాతీతి దుందుభిః, ఈ, పు. భాదీప్తౌ. - దుందువను శబ్దముచేత ప్రకాశించునది.
ఓభనం ఉభిః పూరణం, ఉభ పూరనే. దుందుశబ్దేన ఉభిరత్రేతి దుందుభిః. - ఉభి యనఁగా నిండుట. దుందు అనెడి ధ్వనిచేత నిండుట దీనియందుఁ గలదు. భేరి పేర్లు.
భేరి - దుందుభి.
దుంధుభి - 1.పాచిక యందలి ఆరు చుక్కలు గల పాచిక, ఇత్తిగ, 2.భేరి, 3.60 సంవత్సరము లలో నొకటి.
ఇత్తిగ - (ఇరు+తిగ) ఆరు, వి.పాచికల మీది మూడు బొట్లజత, దుందుభి(పాచికల ఆటలలోని పరిభాష).
ఘనుఁడగునట్టివాఁడు నిజకార్య సముద్ధరణా ర్ధమై మహిం
బనివడి యల్పమానవునిఁ బ్రార్ధనసేయుట తప్పుకాదుగా,
యనఘతఁ గృష్ణజన్మమున వసుదేవుడుమీఁది టెత్తుగాఁ
గనుఁగొని గాలిగాని కడకాళ్ళకుఁ మ్రొక్కఁడె నాడు, భాస్కరా.
తా. పూర్వము వసుదేవునకు దేవకీదేవి యందు 8 మంది సుతులు గల్గిరి. కాని దేవకీ దేవి యగ్రజుడగు కంసుడు, ఆమెకు పుట్టిన సంతానము చే తన కాపద గలుగనని యాకాశవాని పలికిన పలుకులను విశ్వసించి ఆమెను, ఆమె భర్తయగు వసుదేవుని కారాగార మందుంచి వారికి గలిగిన సంతానము నెప్పటికప్పుడు కడతేర్చు చుండెను. ఇట్లేడ్గురు(ఏడుగురు)శిశువుల నాతడు వధించెను. ఎనిమిదవ చూలు యాగు కృష్ణునైనను వారు దక్కించుకొన దలచి, వసుదేవు డర్థరాత్రమున ఖైదు వెడలి శ్రీకృష్ణుని తీసికొని పోవుచుండగా నొక గాడిద వానిని గని ఓండ్ర పెట్టసాగెను. అందుచే తన రహస్యము బట్ట బయ లగునేమో నని వసుదేవుడు గాడిదను(గాలిగాఁడు - గాడిద)ను ప్రార్థించి, తన పనిని నెరవేర్చు కొనెను. కావున, ఎంత గొప్పవాడైనను(ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు.)తన కార్యము నిర్వహించు కొనుటకు నీచుని ప్రార్థించిననూ తప్పులేదు.
ధిమి ధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ఘుమ ఘుమ ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శ యుతే
జయ జయహే మధుసూదన కామిని ధనలక్ష్మీ రూపేణ పాలయమాం|| - 8
కస్త్వం, కో(అ)హం, కుత ఆయాతః, కామే జననీ, కో మే తాతః |
ఇతి పరిభావయ సర్వమసారం, విశ్వం త్యక్త్వా స్వప్నవిచారం || - 23
నీ వెవరవు, నేనెవరిని, ఎక్కడినుండి వచ్చావు, నా తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఈ విధంగా శోధించు. నిస్సరామైన, స్వప్నంలాంటి ఈ విశ్వాన్ని గురించి వ్యర్థపు ఆలోచనలు కట్తిపెట్టి, తత్త్వవిచారణ చెయ్యి (అన్నారు శ్రీయోగానందులు) - భజగోవిందం
Who are you? Who am I? Where have I come? Who is my mother? Who, my father? Thus enquire, leaving aside the entire world which is comparable to a dream, and is essenceless.
త్రివిక్రముఁడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించెను.
త్రివిక్రమః బలిబంధనకాలే త్రిషు లోకేషు త్రయో విక్రమాః పాదన్యాసాః యస్య సః - బలిబంధనకాలమందు మూఁడులోకములను మూఁడడుగులచేఁ గప్పినవాఁడు. క్రము పాదవిక్షేపే.
విక్రముఁడు - 1.విక్రమార్కరాజు, 2.విష్ణువు.
విక్రమ - పదునారవ(16వ) సంవత్సరము.
వి క్రమము - 1.అధిక బలము, 2.శౌర్యము.
విక్రాంతి - విక్రమము.
విక్రమ స్త్వతిశక్తితా,
విశేషేణ క్రమతే (అ)నేన విక్రమః - దీనిచేత విశేషముగా నాక్రమించును. ఈ ఒకటి అధికమైన శక్తి పేరు.
వటువు - బ్రహ్మచారి, బాలకుడు.
బ్రహ్మచారి - బ్రహ్మచర్య వ్రతము ననుష్ఠించువాడు.
బ్రహ్మ వేదః తదధ్యయనార్థం వ్రతమపి బ్రహ్మ తచ్చరతీతి బ్రహ్మచారీ, న. పు. - బ్రహ్మ మనఁగా వేదము తదధ్యనార్ర్థమైన వ్రతంబును బ్రహ్మము దాని నాచరించువాఁడు.
వర్ణినో బ్రహ్మచారిణః,
వర్ణా ఏషాం సంతీతి వర్ణినః, న. పు. స్తుతులు (బ్రహ్మణాది వర్ణములు)గలవారు.
బ్రహమవేదాధ్యనవ్రతం చరంతీతి బ్రహమచేరిణః, న. పు. చరగతిభక్షనయోః, బ్రహ్మ మనఁగా వేదాధ్యనవ్రతము; దాని నాచరించువారు. ఈ 2 బ్రహ్మచారి పేర్లు.
బ్రహ్మమేఖలము - బ్రహ్మచారులకు ముంజిగా నుపయోగపడు తృణము.
పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొ త్తమే
లొదవజగ త్తయంబుబురుహుతునకియ్య వటుండవై నచి
త్సదలమూర్తి నీవెకద దాశరథీ కరుణా పయోనిధీ.
తా. ఒక పాదము భూమియందును, మఱొకటి ఆకాశమునందును పెట్టి, యట్లు రెండు పాదము లచే లోకమాక్రమించి, మహాపరాక్రమవంతుఁడైన బలిచక్రవర్తి తలమీద నొక పాదము పెట్టి పాతళమునకు అణఁగ ద్రొక్కి మేలగునట్లు ముల్లోకములను ఇంద్రునకు(పురుహూతుఁడు - ఇంద్రుడు, వ్యు.యజ్ఞములం దెక్కువగ పిలువ బడువాడు.) ఇచ్చుటకై వటువుగాఁ(వటువు - బ్రహ్మచారి, బాలకుడు.)గా బుట్టిన సచ్చిదానంద మూర్తివి నీవెకాని మఱి యెవ్వరునుగారు కనుక నన్నుఁ గాపాడుమా !
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః, వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణః |
భవ సమచిత్తః సర్వత్ర త్వం, వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం || - 24
నీలోను, నాలోను, ఇతరులందరిలోను, అంతటను వ్యాపించియున్నది ఆ విష్ణువు మాత్రమే. ఈ పరమసత్యాన్ని అవగాహన చేసుకోలేని నీవు, పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపిక లేని నీవు, అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావుగాని, ఇది మాత్రం సత్యం. నీవు విష్ణుపదాన్ని త్వరగా పొందదలచుకుంటే, అన్ని పరిస్థితులందూ సమచిత్తత్వాన్ని కలిగియుండాలి. - భజగోవిందం
In you, in me, and elsewhere too, there but one Vishnu (God). Vainly do you get angry with me, being impatient. See the Self in all things, and leave off everywhere ignorance which is the cause of difference.
నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
భవబంధనహర వితతమతే పాదోదక విహతాఘతతే
వటుపటువేషమనోజ్ఞ నమో భక్తం తే పరిపాలయ మామ్.
దేవక్యః నందనః దేవకీనందనః - దేవకీదేవి కొమారుఁడు.
నందనుఁడు - కొడుకు, విణ.సంతోషించువాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కున్నడు - బాలుడు, బిడ్దడు.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కూన - కున్న, కుర్ర, సం.కుణకః.
కుఱ - 1.కొడుకు, 2.బిడ్ద, 3.బాలుడు, రూ.కుఱఁడు.
కూనలమ్మ - సంతతినిచ్చు దేవత.
స్కందుఁడు - కుమారస్వామి.
కొమరసామి - స్కందుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 2.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొ మ రు ద న ము, కొ మ రు ప్రాయము=యౌవనము).
మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింపజేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీ కుక్షి నిల్పుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా.
తా. కృష్ణా! పదునాలుగులోకములు(భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.) నీ కుక్షిలో గలవాడవు, విదితంబుగ(విదితము - తెలియ బడినది) నీతల్లియగు దేవకీదేవి ఉదరములో ఎట్లు అణగియుంటివో! చాలచిత్రము.
దేవకీనందన శ్శౌరి ర్హయగ్రీవో జనార్థనః,
కన్యాశ్రవణతా రేజ్యః పీతాంబరధరో నఘః|
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
శూర ఇతి వసుదేవస్య పితారస్య గోత్రాపత్యం శౌరిః- ఈ-పు. - శూరుడనగా వసుదేవునితండ్రి, అతని మనుమఁడు.
శూరుఁడు – సూర్యుడు Sun , విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
శూరో వీరశ్చ విక్రాంతః -
శూరయతీతి శూరః, వీరయతీతి వీరః, శూర వీర విక్రాంతౌ. - విక్రమించువాఁడు గనుక శూరుఁడు, వీరుఁడును.
విక్రామతి స్మ విక్రాన్తః, క్రము పాదవిక్షేపే. - విక్రమించువాఁడు. ఈ 3 శూరుని పేర్లు.
వీరుఁడు - శూరుడు.
వీరపత్ని - వీరుని భార్య.
వీర - పెనిమిటి పుత్రులుగల స్త్రీ.
వీరసువు - వీరుని గన్నతల్లి.
వీరాశంసనము - భయంకర యుద్ధ భూమి.
వీరపానము - యుద్ధ ప్రారంభమున అవపానము, వీరులుచేయు గోష్ఠీపానము, కల్లు త్రాగుట.
ఎక్కటి - 1.ఒకటి, 2.ఒంటరివాడు, విణ.శూరుడు, సం.ఏకః.
ఎక్కటీఁడు - అసహాయశూరుడు.
ఎక్కటి కయ్యము - ఒకనితో ఒక్కడే చేయు యుద్ధము, ద్వంద్వయుద్ధము, దండపోరు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
ప్రగల్భుఁడు - ప్రౌఢుడు.
ప్రోడ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రౌఢ - పదునెనిమిదేండ్లకు పైబడిన వయస్సుతోడి సంపూర్ణ యౌవనము గలది.
ప్రౌఢము - 1.పెరిగినది, 2.వయస్సు వచ్చినది, 3.నేర్పుగలది.
ప్రౌఢి - 1.సామర్థ్యము, 2.నేర్పు, 3.వృద్ధి, 4.గర్వము.
ప్రావీణ్యము - నేర్పు; పటిమ - నేర్పు, సామర్థ్యము.
ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion ).
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి.
సమర్థుఁడు - నేర్పరి; నిష్ణాతుఁడు - నేర్పరి; కలింగుఁడు - నేర్పరి.
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice).
శత్రౌ మిత్త్రే పుత్రే బంధౌ, మాకురు యత్నం విగ్రహ సంధౌ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానాం, సర్వత్రో(అ)థ సృజ, భేదా జ్ఞానం || - 25
శత్రువులతోనైనా, మిత్రులతోనైనా, పుత్రులతో నైనా, బంధువులతోనైనా, ఎవ్వరితోనైనా, విరోధించడం, సంధిచేసుకోవడంలాంటి ప్రయత్నాలు చేయకు. అందరి యందూ, అంతటా ఆత్మనే దర్శిస్తూ అజ్ఞానం వలన కలిగిన భేదభావాన్ని ఎక్కడా లేకుండా పీకిపారవేయి. – భజగోవిందం
Make no effort to be either at war with, or in league with, enemy, friend, son, or relative. If you want to attain the status of Vishnu soon, be equal-minded towards all things.
హంవీరుఁడు - క్షత్రియుడు, విణ.శూరుడు.పోటరి - హంవీరుడు, శూరుడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
రాట్టు - రేడు; ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
రాచ - రాజ సంబంధి, సం.రాజన్.
రాజకము - 1.రాజసమూహము, 2.క్షత్రియ జాతి సమూహము.
రాజన్యుఁడు - క్షత్త్రియుడు; క్షత్త్రియుఁడు - రాచవాడు.
క్షత్రియాణి - క్షత్త్రియ స్త్రీ, రూ.క్షత్త్రియ, క్షత్రియక.
క్షత్త్రియి - క్షత్రియుని భార్య.
క్షత్త్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు. అధికుఁడు - గొప్పవాడు.
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోదనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సామాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
ఇందుఁడు - చంద్రుడు.
చంద్రుడు - నెల, చందమామ.
చందిరుడు - చంద్రుడు; చంద్రముఁడు - చంద్రుడు.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలకువ - స్థానము.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.
నెలకూన - 1.బాలచంద్రుడు, 2.నఖిక్షతము.
నెలవంక - బాలచంద్రుడు.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
నెలమేపరి - రాహువు.
రాహువు - ఒక ఛాయగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
రాజ్యాంగములు - (రాజ.) రాజు, మంత్రి, చెలికాండ్రు, భండారము, పట్టణము, కోట, సైన్యము అనునవి ఏడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జనించిన వాడు.
ధవుడు - 1.పెనిమిటి, 2.రాజు.
నాధుడు - 1.పెనిమిటి, 2.రాజు.
జామాత - 1.అల్లుడు, 2.పెనిమిటి.
అల్లుఁడు - 1.కూతుమగడు, 2.మేనల్లుడు, రూ.అల్లువాడు.
అల్లువాఁడు - అల్లుఁడు.
సుదాయము - పెండ్లియందు అల్లుని కిచ్చెడు అరణము.
ధవః ప్రియః పతిర్భర్త -
ధునోతి స్త్రియం దవః ధూఞ్ కంపనే. - స్త్రీని కంపించువాఁడు.
ప్రీణాతి ప్రియః ప్రీఞ్ ప్రీణనే. - ప్రేమించువాడు.
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
బిభర్తీతి భర్తా. ఋ. వు. డు భృఞ్ ధారణపోషణయోః. - భరించువాఁడు. ఈ నాలుగు మగని పేర్లు.
ఇష్టుఁడు - 1.ప్రియుడు, 2.ఆప్తుడు, 3.విష్ణువు.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహుతుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.
దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.
దయిత - 1.భార్య, 2.స్త్రీ.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
ఏలిక - 1.రాజు, యజమానుడు.
ఏలినవాఁడు - ఏలిక, రాజు.
ఏలికసాని - దొరసాని, రాణి.
దొరసాని - రాణి; రాణి - రాజ్ఞి, భార్య.
రాజ్ఞి - రాణి.
దేవేరి - 1.దేవి, 2.దొరసాని, రూ.దేవేరి, సం.దేవేశ్వరి.
దేవి - 1.పార్వతి, 2.రాణి.
రాజు - 1.రేడు, రాచవాడు 2.ఇంద్రుడు 3.చంద్రుడు.
యజమానుఁడు - 1.గృహపతి, 2.యజ్ఞకర్త.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
భర్త - మగడు, విణ.ప్రోచువాడు.
పరిణేత - మగడు.
ప్రోచు - అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.
యజమానుఁడు - 1.గృహపతి, 2.యజ్ఞకర్త.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః. ఇలుదొర - గృహస్థు.
మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కులస్త్రీ.
సభత్తృక - మగనాలు, ముత్తైదువు.
యామి - 1.కులస్త్రీ, 2.తోడబుట్టినది.
ముత్తైదువ - ముత్తయిదువ; ముత్తయిదువ - సుమంగళి. సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.సురలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ.
సహజ - తోడ బుట్టినది.
అథ కులస్త్రీ కులపాలికా :
కులేన అవ్యభిచారేణ రక్షితాస్త్రీ కులస్త్రీ – ఒచ్చెము(న్యూనత, కొరత)లేని కులముచేత రక్షితయైనది.
కులం పాలయతీతి కులపాలికా. పాల రక్షణే. - కులమును రక్షించునది. వ్యభిచారము చేయక కులమును మానమును కాపాడుకొను స్త్రీ పేర్లు.
కులపాలిక - 1.తల్లిదండ్ర్లచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.
చిరంటి – 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపసుమీ
కలకంటి కంట కన్నీరొలికిన
సిరి యింటనుండ నొల్లదు సుమతీ.
తా. కులసతితో(సతి - పతివ్రత స్త్రీ, పార్వతి)కయ్యము, లేనిదోషాలు ఆరోపించుట మంచిది కాదు, ఏలయన స్త్రీ కన్నీరు విడిచిన, ఆ యింటి యందు(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)లక్ష్మి నివసించదు.
ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
శ్రీపతి - 1.విష్ణువు, 2.రాజు.
శ్రియపతి - విష్ణువు, లక్ష్మీభర్త.
శ్రీపతిః ఇ - పు. శ్రియః లక్మ్యాః పతిః - లక్ష్మీదేవికి భర్త.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
పాతి స్వానుజీవిన మితి పతిః, పా రక్షణే. - తన యాశ్రితుని రక్షించువాఁడు.
స్త్రీలింగమందు రుచి శబ్దము వలెను, నపుంసకమందు వారి శబ్దమువలెను రూపము. పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపద్యతే జనైరితి సంపత్. ద.సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. - జనులచేత పొందఁబడునది.
శ్రియతే జనైరితి శ్రీః ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది.
లక్ష్యతే లక్ష్మీః. ఈ. సీ. లక్ష దర్శనాంకనయోః. - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు 4 సంపద పేర్లు.
తిరు - శ్రీ పదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము.
శ్రీఫలము - మారేడు.
శ్రీప్రదం శ్రీప్రియం వా ఫలమన్యేతి శ్రీఫలః - లక్ష్మీప్రదముగాని, లక్ష్మీ ప్రియముగాని అయిన ఫలముగలది.
లక్కి - లక్ష్మి, సం.లక్ష్మీ. లక్కిమి - లచ్చి.
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః.
సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సమృద్ధమైనది.
దివ్యధునీ మకరందే పరిమళపరిభోగ సచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే|
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.)ఒక కావ్యగుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది (Light).
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమానాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
విషము - 1.గరళము, 2.జలము.
దేహం వేవేష్టీతి విషం, విష్ ఌ వ్యాప్తౌ. - దేహమును వ్యాపించునది.
విష మప్సు చ,
విషశబ్దము నీళ్ళకును, చకారమువలన విషమునకును పేరు.
వేవేష్టీతి విషయం, విష్ ఌ వ్యాప్తౌ. - వ్యాపించునది.
నవిష విషమిత్యాహుః భక్తవం విషముచ్యతే|
విష మేకాకిసంహంతి ర్భక్తస్వం పుత్రపౌత్రకమ్||
తా. విషము విషముగాదు, భక్తులసొమ్ము విషము, విషమువలన నొక్కడే చచ్చును, భక్తులసొమ్ము నపహరించిన వాని పుత్రపౌత్రాదులు నాశన మొందుదురు. – నీతిశాస్త్రము
గేయం గీతా నామసహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ చ చిత్తం|| - 27
భగవద్గీతను, సహస్రనామాలను గానం చేస్తుండాలి. ఎల్లాప్పుడు శ్రీపతి రూపాన్నే ధ్యానిస్తుండాలి. చిత్తాన్ని సజ్జన సాంగత్యం వైపుకే నడుపుతుండాలి. సంపద (ఐశ్వర్యము) దీనజనులకు(దేయము - ఇయ్యదగినది)ఇస్తుండాలి. – భజగోవిందం
The Bhagavadgita and the Sahasranama should be sung; the form of the Lord of Lakshmi(Vishnu) should be always meditated on; the mind should be led to the company of the good; and wealth should be distributed among the indigent.
పురుషోత్తముఁడు - శ్రీకృష్ణుడు.
పురుషే షూత్తమః పురుషోత్తమః - పురుషుల యం దుత్తముఁడు.
పురాణపురుషుఁడు - విష్ణువు.
పురాణము - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అను నైదు లక్షణములు గల గొప్ప గ్రంథము. పురాణములు పదునెనిమిది(18), అవి - బ్రహ్మ ఫద్మ విష్ణుభాగవత నారదీయ మార్కాండే యాగ్నేయ భవిష్యత్ బ్రహ్మవైవర్త లింగ వరాహ వాయు స్కాంద వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండములు. పురాణ పురుషా గోవిందా|
పురాణములు - (చరి.) ప్రాచీనేతి హాసములతో కూడిన పదునెనిమిది మహాకావ్యములు. సూ ర్య చం ద్ర వంశపు రాజుల వంశావళులు, మహర్షుల వంశావళులు చెప్పు హైందవధర్మకావ్యములు. వీనికిని మహాభారతమునకును సన్నిహిత సంబంధము కలదు. పురారణములలో ముఖ్యమైనవి గరుడ, కూర్మ, మత్స్య - అగ్ని మార్కండేయ ఫద్మ బ్రహ్మవైవర్త విష్ణు భాగవతస్కాంద శివ లింగ భవిష్యత్ పురాణములు.
పురాణించు - క్రి.1.వర్ధిల్లు, 2.విజృంభించు, సం.పురాణమ్, సం.క్రి.పురాణము చెప్పు.
ప్రకరణము - 1.ప్రస్థావము, 2.గ్రంథభాగము, 3.ఒక తెగ రూపకము.
ప్రకృతము - 1.చక్కగా చేయబడినది, 2.ప్రకరణము వలన పొందబడినది.
ప్రస్తావన - (నాట) 1.నాటకము లందు నాంది తరువాత వచ్చు సూత్రధారుడు, నటి గావించు సంభాషణము. (ఇందు కవి, నాటకేతివృత్తము ప్రస్తావింప బడును), 2.వృత్తంతము.
వృత్తాంతము - 1.వర్తమానము, 2.కథ, 3.ప్రస్తావము.
వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుచున్నది.
కథ - తొల్లింటికత, వాస్తవార్థము కలది.
సదృశము - (గణి.) అనురూపము, సం.విణ.సమానము, తగినది, (Corresponding).
సదృశ సమ్మేళనములు - (వాణి.) ఒకే పారిశ్రామిక ప్రక్రియ లేక దశలలో పని చేయుచున్న సంస్థలు ఒకటిగ వ్యవహరించుట.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వస్య భావః స్వభావః - తనయొక్క భావము స్వభావము.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ప్రస్తావ సదృశంవాక్యం స్వభావ సదృశ క్రియామ్|
ఆత్మశక్తి సమంకోపం యోజానాతి సపండితః||
తా. ప్రస్తావమునకుఁ దగిన(వాక్యము - భావముగల పదసముదాయము)మాట, పరుల స్వభావము నకుఁ దగిన కార్యము, తన శక్తికి దగిన కోపము(కోపము - కినుక, క్రోధము.)ఎవం డెఱుంగు నోవాఁడు వివేకియగును. - నీతిశాస్త్రము
మాట్లాడవలసిన అవసరం వున్నపుడు మాట్లాడకుండా వూరుకోవడం, మాట్ల్లడక పోవడం మంచిదైనపుడు మాట్లాడడం, ఇవి రెండూ మనిషి బలహీనతకు నిదర్శనాలు. - పర్షియన్ సామెత.
భువనము - 1.జగము 2.ఆకాశము 3.ఉదకము.
భవత్యస్మిన్నితి భువనం. - దీనియందు సర్వము గలుగును.
భవతి సర్వమనేనేతి భువనం, జీవ ప్రాణధారణే. - దీనివలన నన్నియు గలుగును.
భువి - 1.భూమి, 2.స్థానము.
భువం దారయతీతి భూదారః దౄవిదారణే. - భూమిని వ్రక్కలించునది.
భువనేశ్వరము - చుట్టులవంతి.
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థాని - స్థానము కలది.
స్థానాంతరీకరణము - (భౌతి.) ఒక వస్తువును ఒక చోటునుండి ఇంకొకచోటికి మార్చుట, (గతిశాస్త్రము,) ఇంకొక చోటికి తరలించుట (Translocation).
స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికించుట, (Dislocation).
భోగవతి - 1.పాతాళము, 2.పాతాళమందలి నది, విణ.భోగము గలది.
నదీ నగర్యో ర్నాగానాం భోగవతీ -
భోగవతీశబ్దము సర్పములయొక్క నదీ పత్తనమునకు(నగరము - పట్టణము, రూ.నగరి.)పేరు. భోగాః సర్పయా ఉపభోగావా సంత్యస్యామితి భోగవతీ, సీ. - దీనియందు సర్ప శరీరములు గాని సుఖములుగాని కలవు గనుక భోగవతి.
భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది :- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).
ఆదిశేషుడు - సర్పరాజు.
వాసుకి - 1.సర్పరాజు, 2.మృగపక్షి ధ్వని.
వాసుకిస్తు సర్పరాజః -
వసు రత్నం కే శిరసి యస్య సః వసుకః, తస్యాపత్యం వాసుకిః, ఈ. పు. - వసు వనఁగా రత్నము, అది శిరస్సునఁ గలవాఁడు వసుకుఁడు, వాని కొడుకు వాసుకి.
వసతి పాతాళ ఇతి వాసుకిః, వస నివాసే. - పాతాళ నాగలోకము - పాతాళము మందుండువాఁడు.
సర్పాణాం రాజా సర్పరాజః - సర్పములకు ఱేఁడు. ఈ 2 వాసుకి పేర్లు.
ఏకకుండలుఁడు-1.బలరాముడు, 2.కుబేరుడు, 3.ఆదిశేషుడు.
బలుఁడు - బలరాముడు, విణ.బలము గలవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్య సః కుబేరః - బేరమనఁగా శరీరము, కుత్సితమైన శరీరము గలవాఁడు.
కుండలము - 1.యజ్ఞము చేసినవారు ధరించు కర్ణభూషణము, గుండ్రనితనము.
తమ్మంటు - కుండలము, ఆభరణ విశేషము.
కుణ్డలం కర్ణవేష్టనమ్,
కుండవద్వృత్తత్వాత్ కుండలం. కుండలమువలె వట్రువగానుండునది.
కర్ణౌ వేష్టవే కర్ణవేష్టవం, వేష్ట వేష్టనే. - కర్ణమును బరివేష్టించునది. ఈ 2 స్త్రీ పురుషులు పెట్టుకొను కర్ణభూషణములు పేర్లు, పోఁగులు.
అంటుజోడు - చెవిపోగుల జత, కర్ణభూషణము.
అంటుపోగులు - అంటుజోడు.
మకరకుండలము - మొసలి ముఖ మేర్పడ జేసిన కర్ణభూషణము.
మొసలివాపోఁగులు - మకర కుండలములు.
ఉత్తంసము - 1.కర్ణభూషణము, 2.శిరోభూషణము, 3.శ్రేష్థవాచకము.
వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య నేర్వగా
బూనినఁ బూనుఁగాక, తన పుణ్యముచాలక భాగ్యరేఖకున్
బూనఁగ నెవ్వడోపు, సరిపో చెవి పెంచునుగా కదృష్టతా
హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపగవోపు, భాస్కరా.
తా. అదృష్టములేని వ్యక్తి చెవికన్నము పెంచ గలడుగాని, చెవుల కలంకారములగు కుండలము లను సంపాదించలేడు. అట్లే, విద్యచే ఒకనికి సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)భాగ్యమ బ్బినదని వేరొకడు విద్యనేర్చిన నేర్వవచ్చును గాని, అదృష్టమును సంపాదించలేడు.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
వరదాభయకర వాసుకి భూషణ వనమాలాది విభూషణ శివ|
అధోభువనము - పాతాళలోకము.
అధః స్థితం భువన మధోభువనం - క్రిందనుండు లోకము.
పాతాళము - క్రిందిలోకము.
పతం త్యస్మిన్ పాపాత్పాతాళం. పత్ ఌ గతౌ. – పాపము వలన దీనియందుఁ బడుదురు.
బలిధ్వంసి - విష్ణువు.
బలిధ్వంసీ న-పు, బలినం ధ్వంసితం శీలమస్యేతి - బలి నణచినవాఁడు, ధ్వంసు అవస్రంసనే.
బలి - 1.దేవత యెదుట మృగాదుల నరకుట, 2.కప్పము, 3.కానుక, విణ.బలము గలవాడు.
బలిసద్మము(సద్మము - గృహము.) -
బలేరసురస్య సద్మ నివాసః బలిసద్మ. న. న. - బలిచక్రవర్తికి నివాసము.
బలిపుష్ఠము - కాకి.
బలినా పుష్టః బలిపుష్టః పుష పుష్టౌ. - బలిచేఁ బొషింపబడునది.
బలిభుక్కు - 1.కాకి, 2.ఊరుపిచ్చుక.
బలింభుఙ్క్తే బలిభుక్, జ. పు. బుజ పాలనా భ్యవహారయోః - బలిని భుజించునది.
ఊరఁబిచ్చిక - (ఊరు+పిచ్చిక) ఊరి యందు తిరిగెడు పిట్ట, చటకము, రూ.ఊరఁబిచ్చుక.
ఊరఁబిచ్చుక - (ఊరు+పిచ్చుక). చటకము - పిచ్చుక.
వాయసము - కాకి Crow.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము.
బలిప్రసన్నో(అ)భయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః|
కుండిక - 1.రసాతలము, 2.చిన్నపాత్ర.
రసాతలము - పాతాళలోకము, అధోలోకము.
రసాయాః భూమేః తల మధోభాగః రసాతలం - భూమి యొక్క అధోభాగము.
నాగలోకము - పాతాళము; పాపౙగము - నాగలోకము.
నాగానాం సర్పాణాం లోకః నాగలోకః - సర్పములు యొక్క లోకము.
నాగవాసము - గొండ్లెము తగిలించెడు రెండు కొనలు వంచిన యినుప కమ్మి, వై.వి.1.వేశ్యాసమూహము, 2.ఆటమేళము, సం.వి.నాగలోకము.
రెండవ మాఱు జగజ్జనంబు కొఱకు రసాతలగత యయిన భూమి నెత్తుచు యజ్ఞేశుం డయి వరాహదేహంబు దాల్చె: రెండవసారి "యజ్ఞ వరాహ" దేహం ధరించి ఈ జగత్తును సృషిగాంచు నిమిత్తం రసాతలము - 1.పాతాళలోకము, 2.అధోలోకము. నుంచి భూమండలాన్ని ఉద్దరించాడు.
శృంగము - 1.కొమ్ము, 2.కొండకొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
ధారుణి జాఁపజుట్టిన విధంబునఁ గైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోన దాఁగినను వాని వధించి వరాహమూర్తివై
ధారుణి దొంటికైవడిని దక్షిణశృంగమునన్ ధరించి వి
స్తార మొనర్చితీవెకద దాశరథీ కరుణా పయోనిధీ.
తా. దశరథరామా! హిరణ్యాక్షుడు భూమిని చాప చుట్టగా చుట్టి యెత్తుకొని సముద్రములోనికి బోఁయి దాగుకొనఁగా, నీవు వానిని జంపి వరాహరూపమును దాల్చి, కుడిపంటికోఱతో ధారణి - భూమి, రూ.ధారుణి, ధరణి. ఎత్తుకొని వచ్చి మునుపటివలె చాపఁగా పఱపునొంది యుండునట్లు చేసినవాఁడవు నీవెకాని మర్రెవ్వరు గారు, కనుక నన్నును అట్లే ఉద్దరింపుమా!
రస - 1.నాలుక, 2.రసాతలము.
రసన - నాలుక; నాలుక - నాలిక.
నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వ - నాలుక. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి.
జిహ్వాచాపల్యము - తినవలెననెడి కోరిక.
రసజ్ఞా రసనా జిహ్వా :
రసం జానాతీతి రసజ్ఞా. జ్ఞా అవబోధనే. - రసము నెఱుఁగునది.
రస్యతే అనయా రసనా. రస అస్వాదనే. - దీనిచేత నాస్వాదింపఁబడును.
హ్వయతి రసవద్వస్తు జిహ్వా. హ్వేఞ్ స్వర్థాయాం శబ్దే చ. - రసయుక్తమైన వస్తువుల నిచ్ఛయించునది. ఈ మూడు నాలుక పేర్లు.
లోల - 1.నాలుక, 2.లక్ష్మి, విణ.1.కదలునది 2.మిక్కిలి యిచ్ఛకలది.
లోలశ్చల సతృష్ణయోః,
లోలశబ్దము కదలుదానికిని, ఆశ గలవానికిని పేరు.
లోలతీతి లోలః, లుల సంచలనే. - కదలునది.
చల - 1.లక్ష్మి, 2.మారుస్వభావము గల వాయువు యొక్క ఆయతనము దానిపై నుండు ఒత్తిడిని బట్టి ఉండును (తాపక్రమము మారనప్పుడు) అందుచే వాయువు యొక్క ఆయతనము ఒక చలము లేదా చలరాశి (Variable).
చలత్వము - (గణి.) రాసుల విలువలు మారుచుండుట (Variation). ఉత్పలావర్తనము నందు దేవిస్థానం లోల|
విభేదములు - (జీవ.) ఒకే జాతికి చెందిన ప్రాణులలో నిర్యాణమునందును శరీర వ్యాపారములయందును గల భేదములు (Variations).
జిహ్వాసంబంధము - (జం.) నాలుకకు సంబంధించినది, (Lingual).
జిహ్వాగ్రసని సంబంధము - (జం.) నాలుక గళములతో సంబంధము గలది, (Glosso-pharayngeal).
జిహ్వామూలీయము - (వ్యాక.) 1.జిహ్వ యొక్క మూలమునుండి (మొదలు నుండి)పుట్టు అక్షరములు. క, ఖ, అనువానికి ముందున్న విసర్గ స్థానమందు వచ్చు ఒక వర్ణము. దీనిని (తలకట్టు లేని రెండు గ లు ఒకదాని పైన ఒకటి, కిందకి పైకి) అను విధముగ వ్రాయుదురు, ఉదా.యశ () కాయము, 2.కవర్గము.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.
కులుకము - నాలుక మురికి.
ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12 లేక ' డి ' లోపము వలన కలుగు వ్యాధి (Stomattis).
రసజ్ఞుఁడు - పండితుడు, విణ.రుచి నెరిగినవాడు, కళాసౌందర్యవేత్త.
రుచి - (రసా.) నాలుకతో గుర్తించ బడు వస్తుగుణము, ఉదా. పులుపు, తీపి, చేదు.
రుచి-1.ఇచ్ఛ 2. చవి, 3.కాంతి 4.సూర్యకిరణము.
ౘవి - 1.రుచి, 2.రసము.
రసభరితము - (వృక్ష.) రసముతో నిండినది,(Succulent).
సరసము - రసముతో గూడినది.
రసధాని - (జీవ.) జీవకణములో జీవరస వ్యాపారముల ఫలితముగా వచ్చిన రసముచే నిండి యుండు సూక్ష్మమైన సందు (Vacuole).
రసభ్రమణము - (జీవ.) జీవకణములో నున్న జీవరసము వర్తులకారముగ తురుగుచుండుట (Cyclosis).
స్వాదుముకుళములు - (జం.) రుచిని గ్రహించు జీవకణములు గుంపులు (Taste buds).
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే
పెరుగుట విఱుగుట కొఱకే
ధరతగ్గుట హెచ్చు కొరకే తథ్యము సుమతీ.
తా. హాస్యపుమాటలు విరోధమును(విరసము - రసము లేనిది, విరుద్ధ రసము గలది.కలిగించుట, పరిపూర్ణసుఖం(సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము.)దుఃఖాన్ని కల్గించుట, అధికంగా పెరుగుట - ఎదుగు, వృద్ధిచెందుట (Growth) విరుగుటకొఱకు, ధరలు తగ్గుట పెరుగుటకోసమే ఇవి సత్యములు.
రుక్కు-1.కాంతి, 2.సూర్యకిరణము, 3.ఇచ్ఛ.
ఇచ్ఛ - అభిలాష, కోరిక.
అభిరుచి - 1.అత్యాసక్తి, 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినవి (Taste). లోకో భిన్నరుచిః.
భాతి - 1.కాంతి, 2.రీతి.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
గోజ్ఞేయవర్గః తం బభస్తి దీపయతీతి గభస్తి, ఇ.పు. భసభర్త్సనదీస్త్యోః. - వస్తువులను జూపునది.
లేలిహాసము - సర్పము, వ్యు.మాటి మాటికి నాలుక చాచునది.
చేప Fish రసనేద్రియం జిహ్వ(నాలుక) వల్ల : ఇంద్రియ నిగ్రహం లేక నశించి పోతుంది.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్త్ర బాంధవాః|
జిహ్వాగ్రే బంధసంప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం||
తా. నాలుకవలన సంపద (గ)కలుగును, నాలుకవలన చుట్టాలు(బంధువు, సంబంధి.)స్నేహితులు వత్తురు, నాలుకవలన సంకెళ్ళు ప్రాప్తమగును, నాలుకవలన చావును కలుగును. - నీతిశాస్త్రము
లోలదుకూలాంచల పాదాంచల
బాలకుతూహల లీలాపేశల| ||శరవణభవ||
తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ|
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ. – 95స్తో
భోగి - 1.పాము, 2.రాజు, 3.భోగిపండుగ, 4.మంగలి.
భోగస్సర్పశరీరం దతస్యాస్తీతి భోగీ. న.పు. - భోగమనఁగా సర్పశరీరము; అది గలిగినది.
భోగిని - 1.ఆడుపాము, 2.వేశ్య, 3.పట్టాభిషిక్తురాలుకాని రాజు భార్య.
భోగిన్యో(అ)న్యా నృపస్త్రియః,
భోగః సంభోగో యాస్వితి భోగిన్యః - ఎవ్వరియందు సంభోగము గలదో వారు భోగినులు. ఈ ఒకటి తక్కిన రాజభార్యలు.
భోగ్యము - 1.ధనము, 2.ధాన్యము, విణ.భోగింపదగినది.
భోగించు - 1.సుఖించు, 2.అనుభవించు.
కుప్ప - ధాన్యము మొ. ని రాశి.
కుప్పట - ధాన్యము వలన ధనము.
భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడువెల, (భోగములు ఎనిమిది:- గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).
నిర్వేశము - 1.కూలి, 2.జీతము, 3.భోగము.
నిర్విశ్యతే భుజ్యత ఇతి నిర్వేశః, విశ ప్రవేశనే. - భుజింపఁబడునది.
నిర్వేశో భృతి భోగయోః,
నివేశశబ్దము కూలికిని, భోగమునకును పేరు. భృతికి - ప్రతిగ్రహ జయక్రియ నిర్వేశాధితైరర్థ్వైః', భోగమునకును - 'వస్త్రాన్న పానం నిర్వేశః' అని నిర్విశ్యత ఇతి నిర్వేశః, విశ ప్రవేశనే, నిర్పూర్వోభోగే, అనుభవింపఁబడునది.
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.
భరణీయో భృత్యః, డు భృఞ్ ధరణ పోషణయోః - పోషింపఁదగినవాఁడు.
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భృత్య - కూలి.
దాసీ భృత్య స్సుతో బంధుర్వస్తు వాహన మేవచ|
ధన ధాన్య సమృద్ధిశ్చా వ్యష్ట భోగాః ప్రకీ ర్తీతాః||
తా. దాసీజనులు, భటులు, కొమారులు, చుట్టములు ౘుట్టము-1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు. పదార్థములు, వాహనములు, ధనము, ధాన్యము ఇవి అష్టభోగములు. - నీతిశాస్త్రము
సుఖతః క్రియతే రామభోగః, పశ్యాత్ హంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం, తదపి స ముంచతి పాపాచరణం || - 28
భా|| ఇంద్రియ విషయలోలుడై సుఖాన్ని అనుభవించాలనుకుంటాడుగాని, మానవుడు, పాపం! తరువాత, రోగాల్లో చిక్కుకుంటాడు. ఈ లోకలో, చివరకు మరణమే శరణం అని తెలిసి యున్నను, అతడు మాత్రం పాపకృత్యాలు చేయడం మానడు! ఎంత దౌర్భాగ్యం!
One easily takes to carnal enjoyment; afterwards, look there is disease of the body. Although, in the world death is the refuge, even then one does not relinquish sinful ways. - భజగోవిందం
ఆమర్దసంజ్ఞే నగరే చ రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః|
సద్భుక్తిము క్తిప్రద మీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. - 6
నీదు శయ్యము భోగియౌ నేది తీరు
నన్ని వంకలె నీ కున్న వెన్న నేల
నాదువంకను గొనక సమ్మోదముననె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
వనమాలి - విష్ణువు.
వనమాలీ, న. పు. శ్లో. అపాదపద్మం యామా లా వనమాలేతి సా మతా, ఇతి కళిఙ్గః. సా అస్యాస్తీతి వనమాలీ - పాదములదాక వ్రేలెడు పుష్పమాలిక గలవాఁడు.
వనమాల - ఆకులు పువ్వులు చేర్చికట్టిన హారము.
తోటమాలియ - ఆకులు, పూవులు చేర్చి కట్టిన మాల, రూ.తోఁటమాలె, తోమాలియ, తోమాలె.
తోమాలె - తోటమాలియ. తోమాలెసేవ.
వనమాలా వై జయంతీ పంచదివ్యాయుధాత్మికా,
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ|
మాల్యము - 1.పుష్పమాలిక, 2.పుష్పము.
రుచకము - 1.మాల్యము, 2.మంగళ ద్రవ్యము.
మాల1 - 1.పూదండ, 2.వరుస.
మాల2 - చండాలుడు, సం.మాలః.
మాలెత - (మాల+ఎత) మాలది.
మాల్యం మాలా స్రజౌ మూర్ధ్ని -
మాల్యతే ధార్యత ఇతి మాల్యం, మల మల్ల ధారణే. - ధరింపఁబడునది.
మాం లక్ష్మీ లాతీతి మాలా, లా దానే. - ఒప్పిదము నిచ్చునది.
సృజ్యతే స్రక్, జ. సీ. - సృజ విసర్గే. - విడువఁబడునది.
శిరస్సు నందలి పువ్వులదండ పేర్లు. కంఠాదుల యందలి పువ్వులదండయును.
స్రజము - పూలదండ.
స్రగ్వి - పూదండగలవాడు.
మాలిక - 1.పూదండ, 2.వరుస, 3.విరజాజి, 4.శంకరాభరణము, 5.కూతురు.
మాల1 - 1.పూదండ, 2.వరుస.
వరుస - 1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
ఇండె - 1.పూదండ, 2.ఎముక కీలు, 3.చీలిక.
చీరిక - 1.పాయ, రూ.చీలిక.
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, ఆఫ్రికా అస్త్రేలియా, ఐరోపాఖండములు), (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన ఘనరూపభాగము, (భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్న భిన్నముగ చేయబడిన భూభాగము.
విరజాజి - నవమల్లికా కుసుమము; నవమాలిక - విరజాజి.
సప్తలా నవమాలికా,
సప్తమనో బుద్ధ్యంతానీంద్రియాని లాతీతి. సప్తలా. లా ఆదానే. - మనోబుద్ధులతోఁ గూడిన పంచేద్రియములను అనఁగా నేడింటిని పరిమళము చేత స్వవశముగాఁ జేసికొనునది.
నవాస్తుత్యామాలా అస్యా ఇతి నవమాలికా - స్తోత్రము చేయఁదగిన దండ గలది. ఈ 3 విరజాజి పేర్లు.
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.
కూఁతురు - కుమార్తె.
నందన - 1.కూతురు, 2.అరువది సంవత్సరములలొ ఒకటి.
పుత్రిక - 1.కూతురు, 2.బంగారుబొమ్మ.
సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు.
సుమన సః-సాంతః-పు. సుష్ఠు మన్వత ఇతి సుమనసః - లెస్సగా నెఱిఁగినవారు గనుక సుమనస్సులు.
మన జ్ఞానే, శోభనం మనో యేషాం తే మంచి మనస్సు గలవారు.
సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
సుమనా మాలతీ జాతిః
సుష్ఠు మన్యతే సుమనాః, స. సీ. మన జ్ఞానే. - లెస్సగా తలంపఁబడునది.
మల్యతే ఆమోదైర్మాలతీ, మల మల్ల ధారణే. - పరిమళముచేత ధరింపఁబడునది.
జాయతే అనయా సుఖం జాతిః, ఇ. సీ. జనీ ప్రదుర్భావే. - సుఖము దీనిచేతఁబుట్టును. ఈ 3 జాజి పేళ్ళు.
మాలతి - 1.ఒకానొక స్త్రీ, 2.జాజిచెట్టు.
(ౙ)జాజి - 1.జాతి, మాలతీవృక్షము, ఒక తెగమల్లె, 2.జాజికాయ, రూ.జాది, సం.జాతీ.
(ౙ)జాది - జాజి.
కేతకి - 1.పచ్చపూవుల మొగిలి (ఇది శివపూజకు అర్హము కాదు), వికృ.గేదగి, 2.జాజి.
కిత్యతే జ్ఞాయతే గంధో (అ)నేనేతి కేతకీ, సీ. కితజ్ఞానే. - దీనిచేత పరిమళము తెలియఁబడును.
గేదఁగి - 1.పచ్చపూమొగిలి, 2.మొగిలిపూవు, సం.కేతకీ.
మొగలి - గేదంగి, కేతకి.
కైతకము - కేతకీ పుష్పమునకు సంబంధించినది.
జాతి1 - 1.కులము, 2.పుట్టుక, 3.సమానత్వము, 4.జాజికాయ, 5.మాలతి, 6.పద్యభేదము.
అథ జాతీకోశ జాతీఫలే సమే,
జాత్యాః లతావివేషస్య కోశం జాతీకోశం, జాత్యాః ఫలం జాతీఫలం. - జాతీలత యోక్క ఫలము. 1, 2, జాజికాయ పేర్లు.
జాతికోశము - జాజికాయ.
జాజికాయ - (వ్యవ.) (Nutmeg) ఇది (Myristaceae) అను కుటుంబమునకు చెందిన Myristica fragransఅనుమొక్క యొక్క గింజ, ఇది పరిమళ ద్రవ్యముగ నుపయోగపడు చుండును. (జాపత్రియను పరిమళ ద్రవ్యము జాజికాయపై నుండు బీజ పుచ్ఛము.)
జాతి2 - (జీవ.) గణము, ప్రాణులలో కొన్ని ఉపజాతులు కలిసి ఒక జాతిగా వర్గీకరింపబడినది (Genus).
జాతి3 - (చరి, రాజ.) ఒక దేశములో నివసించుచు సాధారనముగ ఒకే తెగకు చెంది ఒకే భాష, సంస్కృతి, ఆచారములు కలిగి ఒకే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో నుండు జనులు.
జాతి స్సామాన్యజన్మనోః,
జాతిశబ్దము గోత్వాదిజాతులకును, పుట్టుటకును పేరు. జాయతేభిన్నే ష్వభిన్నాభిదాన ప్రత్యయా వనయేతి, జననం చ జాతిః. సీ. జనీ ప్రాదుర్భావే. భిన్నము లయిన వస్తువులయందు అభిన్నములైన నామ జ్ఞానములు దీనిచేతఁ బుట్టును గనుకను, పుట్టుట గనుకను జాతి.
జాత్యైకీకరణ సమితి - కులమత వైషమ్యములను రూపుమాపి భారత జాతిని సుసంఘిటితముగ చేయుటకై క్రీ.శ.1962 సంవత్సరములో భారత ప్రభుత్వము అధ్వర్యములో భారత నాయకుల సమావేశము (National Integration Samiti).
జాతిపత్రి - జాపత్రి.
(ౙ)జాపత్తిరి - జాతిపత్రి, రూ.జాపత్రి, సం.జాతిపత్రమ్.
జాతిచరిత్ర - (జీవ.) ఒక జాతి యొక్క పూర్వికుల వృత్తాంతము, (Phylogeny).
సజాతీయత - (చరి.,రాజ) భాష, మతము, ఆచారము, సాంప్రదాయములు, చరిత్ర యొక్క బంధముగల ప్రజలు (Nationality).
జాత్యము - 1.మంచి కులమున పుట్టినది, 2.మేలైనది, 3.చక్కనిది.
జాతము - సమూహము, విణ.పుట్టినది.
జాతి ర్జాతం చ సామాన్యమ్ -
జాయత ఇతి జాతిః, ఈ-సీ. జాతం చ ప్రాదుర్భవించునది. 1, 2, సమానానాం భావః సామాన్యం, సమానములైన పదార్థములయొక్క భావము. ఈ 3 ఘటత్వాది జాతికి పేర్లు.
మాలికుఁడు - 1.మాలకరి, 2.తోటమాలి, 3.చిత్రకారుడు.
మాలకరి - 1.దండలు కట్టువాడు, 2.తోటమాలి, సం.మాలకారీ.
తోఁటమాలి - తోటను సంరక్షించువాడు.
తోఁటీఁడు - వనపాలకుడు; వనపాలుఁడు - తోటకాపు.
వైజయంతి - 1.టెక్కెము, 2.విష్ణుమాలిక, 3.విష్ణు ప్రాకారము.
టెక్కెము - టెక్కియము.
టెక్కియము - జండా, రూ.టెక్కెము.
జండా - టెక్కెము.
స్యాత్ ప్రాసాదో వైజయంతః -
ప్రశస్తాః వైజయంత్యః పతాకా అస్మిన్ సంతీతి వైజయంతః. ఒకటి ప్రశస్తములైన టెక్కెములు గలది. ఇంద్రునిమేడ వైజయంత మనంబడును.
వైజయంతము - ఇంద్రుని నగరు.
పతాకము - 1.పడగ, 2.టెక్కెము.
పతాకాధికారి - సైన్యములో జాతీయ ధ్వజమును మోయు సైనికోద్యోగి.
పతాకిని - సేన, వ్యు.పతాకములు కలది.
పతాకీ వైజయన్తికః,
పతాకా (అ)స్యాస్తీతి పతాకీ, నాంతః. - టెక్కెము గలవాఁడు.
వైజయంత్యా చరతీతి వైజయంతికః - టెక్కెము చేత చరించువాఁడు. ఈ 2 టెక్కెము గలవాని పేర్లు.
ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి. కేతువు, Ketu.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
హారము - 1.నూట ఎనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది ‘హారము ' (Denomination).
హారి - 1.మనోజ్ఞము, 2.హరించువాడు, 3.హారము కలవాడు.
మాల2 - చండాలుడు, సం.మాలః.
మాలెత - (మాల+ఎత) మాలది.
చండా లుఁడు - 1.మాలవాడు, రూ.చండాలుడు.
మాలఁడు - చండాలుడు, సం.మాలః.
తోటి - 1.మాల, చండాలుడు, 2.వేడుక
వేడుక - 1.సంతోషము, 2.వినోదము, 3.కుతూహలము.
పంచముఁడు - మాలడు, విణ.ఐదవవాడు.
సురియాళు - మాలవాడు, రూ.సులేయాళు.
పుల్కసుఁడు - 1.బోయ, 2.మాల, 3.అధముడు, రూ.పుల్కసుఁడు.
పుళిందుఁడు - బోయ (భాషాజ్ఞానమే లేక అడవిలో తిరుగు బోయ).
అంత్యజుఁడు - చండాలుడు, హరిజనుడు. హరిజనుడు - అంటరానివాడు, (అస్పృశ్యులకు గాంధీ పెట్టిన పేరు).
ౘట్టు - 1.చాపరాయి, 2.రాయి, వై.వి.శిష్యుడు, సం.ఛాత్రః.
ౘట్రాయి - చాపరాయి.
ఛాత్రాన్తేవాసినౌ శిష్యే -
ఛాత్రుఁడు - శిష్యుడు.
గురోరసచ్చరిత్రం ఛాదయతీతి ఛాత్రః. ఛద అపవారణే. - గురువుయొక్క అనచ్చరిత్రమును గప్పువాఁడు.
అంతేవాసి - 1.శిష్యుడు, 2.హరిజనుడు, విణ.దగ్గరనుండువాడు, 2.ఎల్లయొద్ద నుండువాడు.
గురోరన్తే నికటే వసతీ త్యన్తేవాసీ. స. పు. వస నివాసే. - గురువు యొక్క సమీపమందుండెడు వాఁడు.
శిష్యుఁడు - విద్యకొరకుచేరి సేవించుచు శిక్షింప బడువాడు.
శాసనీయః శిష్యః. శాసు అనుశిష్టా. – శిక్షింపఁదగిన వాఁడు. ఈ 3 శిష్యుని పేర్లు.
నిషాదుఁడు - 1.బోయవాడు, 2.మాలవాడు.
నిషీదతి పాప మస్మిన్నితి నిషాదః, షద్ ఌ విశరణ గత్యవసాదనేషు. - వీనియందు పాప ముండును.
గ్రామాంతము - మాలపల్లె.
వెలివాడ - మాలపల్లె.
శ్రద్ధధానా శ్శుభాం విద్యా మాదదీ తా వరాద్రపి|
అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులా దపి||
తా. మంచివిద్యను జాత్యాదిహీనుని వలన నైనను శ్రద్ధాయుక్తులై గ్రహింప వచ్చును, సద్గుణవతియైన స్త్రీని దుష్కులము వలననైనను గ్రహింప వచ్చును. - నీతిశాస్త్రము
కృష్ణప్రియాత్వభాండీ రే - చంద్రా చందన కాననే
విరజాచంపకవనే - శతశృంగేచసుందరీ
పద్మావతీపద్మవనే - మాలతీ మాలతీవనే
కుందదం తా కుందవనే - సుశీలా కేతకీవనే|
వనమాలీ పద్మనాభో మృగయాసక్తమానసః,
అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జనసముత్పుకః|
వనధి - కడలి; కడలి - సముద్రము.
కడలికాలువ - సముద్రపుపాయ.
కడలిరేఁడు - వరుణుడు.
వరుణుఁడు - 1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.
వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.
కడలికూఁతురు - లచ్చి, లక్ష్మి.
కడలియల్లుఁడు - వెన్నుడు, విష్ణువు.
కడలిమీఁగడముద్ద - చందమామ Moon.
కడలివెన్న - 1.చంద్రుడు, 2.అమృతము.
వనచంద్రికాన్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెలయనురీతి, నిష్ప్రయోజనము.
అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.
వనపు - వనలు.
వనసంబంధము - సరస్సు, కోనేరు.
వన్యతే యాచ్యత ఇతివనం, వను యాచనే, అడుగఁబడునది.
వనీతివా వనం, వన సంభక్తౌ. - లెస్సగాఁ గూడియుండునది.
వనే సలిల కాననే,
వనశబ్దము నీళ్ళకును, అడవికిని పేరు. వన్యత ఇతి వనం, వనుయాచనే. - అడుగఁబడునది వనము.
వన్యము - వనమునందు పుట్టినది.
వనజము - తామర, వ్యు.నీటియందు పుట్టినది.
వనపాలుడు - తోటకాపు; తోటీఁడు - వనపాలుడు.
తోఁటకాపు - 1.తోటవాడు, 2.తోటమాలి.
తోఁటమాలి - తోటను సంరక్షించువాడు.
వైఖాసనుఁడు - 1.వానప్రస్థుడు, 2.విష్ణ్వర్చకులలో నొకడు.
వనభోజనము - (గృహ.) క్రీడకై వేరే స్థలమునకు కొంతమంది కలిసి ఆహారపదార్థములను తీసికొనిపోయి లేదా వండుకొని భుజించుట.
వనమహోత్సవము - (వ్యవ.) చెట్ల పండుగ. సంవత్సరమున కొకసారి క్రొత్త వృక్షములను నాటు పండుగ. (ఇది మన దేశములో ఇటీవల సుమారు 15 ఏండ్ల నుండి ఆచారములోనికి తీసికొని రాబడినది, వనములను పెంపొందించుటకై వృక్షములు నాటు ఉత్సవము. ఈ ఉత్సవము భారతదేశములో మొదటిసారిగా శ్రీ కనయ్యాలాల్ మున్షీచే క్రీ.శ.1950లో ప్రారంభింపబడెను.
వనాటము - వనమునందు చరించు జంతువు.
వనచరము - కోతి; వనేచరము - వానరము.
వనౌకసము - వానరము; వానరము - కోతి.
నర ఇవ వానరః - నరునివలె నుండునది. తాచెడ్ద కోతి వనమెల్లా చెరిచిందట.
ఆదిమవాసులు - కొండలందు, అడవులందు ఉండు అ నా గ ర కు లు (Aborigines).
సురక్షితారణ్యములు - ఈ అరణ్యములపై ప్రభుత్వమునకేకాక ప్రజలకు కూడ హక్కులుండును.
వనే రణే శత్రు జలాగ్ని మధ్యే - మహార్ణవే పర్వత మస్తకే వా సుప్తం ప్రమత్త విషమ స్థితంవా రక్షంతి పుణ్యాని పురాకృతాని.
వనిత - స్త్రీ, మిక్కిలి అనురాగముగల స్త్రీ.
వనతి పురుషమితి వనితా, వన షణ సంభక్తౌ. - పురుషునిఁ(పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.)బొందునది.
స్త్రీ - ఆడుది.
వనితా జనితాత్యర్థానురాగాయాం చ యోషితి,
వనితాశబ్దము మిక్కిలి యనురాగము పుట్టించునట్టి స్త్రీకిని, చకారమువలన స్త్రీమాత్రమునకును పేరు.
వన్యత ఇతి వనితా, వసుయాచనే, వన షణ సంభక్తౌ. - అడుగఁబడునది గనుకనైన, కూడఁబడునది గనుకనైనను వనిత.
పుస్తకం వనితావిత్తం పరహస్తం గతంగతం|
అధవా పునరాయాతం జీర్ణం భ్రష్టాచ ఖండశః||
తా. పుస్తకము, వనిత, ధనము, ఒకరిచేతికి పోయిన పోయినదియే యగును. ఒక వేళ తిరుగవచ్చినను పుస్తకము (జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము.)జీర్ణమె వచ్చును, వనిత భ్రష్టురాలై వచ్చును, ధనము కొంచెముగా వచ్చును. – నీతిశాస్త్రము
శ్రుత్వైవ యో భూపతిమాత్తవాచం వనం గతస్తేన న నోదితో పి|
తం లీలయాహ్లాదవిషాదశూన్యం శ్రీజానకీ జీవనమానతో స్మి| - 2
నిర్వాణము - 1.ముక్తి, 2.నాశము, 3.సుఖము, 4.జీవిత వ్యామోహముల నుండి సంపూర్ణ విముక్తిని పొందుట.
నిర్వాంతి నిర్గచ్ఛంతి దుఃఖదయో (అ)స్మిన్నితి నిర్వాణం, నిరిత్యుపసర్గ పూర్వకో వా గతిగంధనయోరిధాతుః. - దుఃఖాదులు దీని యందు నిర్గతమవును.
నిర్వాణో మునివహ్న్యాదౌ -
నిర్వాతి శామ్యతి స్మ నిర్వాణః వా గతిబంధనయో, నిర్పూర్వశ్సమనే. - శాంతమైనది.
అదిశబ్దముచేత మగ్నమైన గజాదులకును పేరు. - శాంతుఁడైన మునికి, అగ్ని మొదలైనదానికిని పేరు.
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ|
నిత్యాషోడశికారూపా శ్రీకంఠార్దశరీరిణీ. - 85
శీతకారు - (వ్యవ.) డిసెంబర్ December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు హేమంత ఋతువు.
శీత - నాగటిచాలు, రూ.సీత.
నాఁగటి(ౘ)చాలు పేరి యతివ - సీత. వరజు - నాగటి చాలు, సీత.
శీతకరుఁడు - చంద్రుడు, చలివెలుగు.
ౘలివెలుగు - చంద్రుడు, శీతకిరణుడు.
శీతకిరణుఁడు - చంద్రుడు.
శీతభానుఁడు - చంద్రుడు.
శీతమయూఖుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు కలవాడు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె, మొ.వి. సం.క్రాంతిః.
అష్టౌ దేవా వసవస్సోమ్యాసః | చత్రస్రో దేవీ - రజరాః శ్రవిష్ఠాః | తే యజ్ఞం పాంతు రజసః పురస్తాత్ | సంవత్సరీణ - మమృతగ్గ్ స్వస్తి | యజ్ఞం నః పాంతు వసవః పురస్తాత్ | దక్షిణతోభియంతు శ్రవిష్థాః | పుణ్యన్నక్షత్ర మభి సంవిశామ | మా నో అరాతి - రఘశగ్ంసాగన్న్ ||23||
23. ధనిష్ఠ - మద్దెల యాకారముగా 5 నక్షత్రములుండును.
మద్దెల - పాటకు తోడుగ వాయించు చర్మవాద్యము, సం.కల్లు.
మర్దలము - మద్దెల.
గంగయందును కల్లునందును ప్రతిఫలించు సూర్యబింబమునకు భేదమేమి కలదు?
ధనిష్ఠ - నక్షత్రములయం దొకటి.
శ్రవిష్ట - ధనిష్ఠ.
శ్రవిష్ఠయా, సమా ధనిష్ఠా :
శ్రూయతే శుభకర్మణీతి శ్రవిష్ఠా, శ్రు శ్రవణే - శుభకర్మము నందు మంచిదని వినఁబడునది.
ధనతి ధనం కరోతీతి ధనిష్ఠా, ధనధాన్యే - సంపదను జేయునది. ఈ రెండు ధనిష్ఠ పేర్లు.
శకృత్తు - విష్ఠ; విష్ఠ - మలము.
శక్నోతి అనేనకృత్, త. న. శక్ ఌ శక్తౌ. - దీనిచేత శక్తుఁడౌను.
గదాగ్రజుఁడు - గదుని అన్న, విష్ణువు.
కౌమోదకి - విష్ణుమూర్తి గద.
గది1 - ఇంటిలోపలి అర.
గది2 - 1.రోగి, 2.గదను ధరించినవాడు (విష్ణువు).
కౌమోదకీ గదా,
కౌమోదకీ, ఈ.సీ. కుం = భూమిం, మోదయతి = హర్షయతీతి కుమోదకో విష్ణుః తస్యేయం కౌమోదకీ - భూమిని సంతోషింపఁజేయు విష్ణుని సంబంధమయినది. ఈ ఒకటి విష్ణుని గద పేరు.
అఱ1 - 1.గది, 2.హస్తతలము, 3.పెట్టె మొ.ని లోనిది.
అఱ2 - 1.కొరత, 2.కీడు, 3.కపటము, 4.సందేహము, 5.చినుగు, విణ.కొంచెము, సగము, క్రి.విణ.కొంచెముగా సం.అర్థమ్.
అద్ద - 1.సగము, 2.అరసోల, 3.నూర్చక వేసిన కుప్పయొక్క క్రింది సగము భాగము, సం.అర్థమ్.
అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).
తేజోవృషో ద్యుతిధరః స్సర్వశస్త్ర భృతాంవరః
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః. - 81స్తో
సవము - సగము, సం.సామి.
సాము - 1.సగము, 2.వ్యాయామము, సం.1.సామి, 2.శ్రమః.
సగము - 1.స్వామి, 2.అర్ధము, రూ.సవము, సాము, సం.సామి.
సామి త్వర్ధే జుగుప్సితే,
సామి - ఇది సగమను నర్థమందును, నిందింపఁబడినదానియందును వర్తించును. ఉ. సగమునకు - సామి నిమీలితాక్షీ, నిందింపఁ బడినదానికి - 'సామ్యధ్యయన మనధ్యాయే.'
సామి - 1.స్వామి, 2.రాజు, 3.పెనిమిటి, 4.కుమారస్వామి, సం.స్వామి.
స్వ మైశ్వర్య మస్యాస్తీతి స్వామీ, నాంతః - సొమ్ము గలవాఁడు.
సాముకంటి చుక్క - పుబ్బనక్షత్రము.
సా - సగము, సమాసమునందు 'సాము' శబ్దము నకు అన్యక్షరశేషము లోపింపగా మిగిలిన రూపము, ఉదా.సామేను, సం.సామి.
సామేను - సగము మేను.
సవము - యజ్ఞము, జన్నము.
సూయతే సోమో స్మిన్నితి సవః. షుఞ్ అభిషవే. - దీనియందు సోమము తడపబడును.
సవనము - యజ్ఞము.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజనః.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతు రాజము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచ యజ్ఞములు). వికృ.జన్నము.
ౙన్నపుఁజుక్క - మఘా నక్షత్రము.
భిత్తం శకలఖణ్డే వా పుంస్యర్దః :
భిత్తము - తునక, శకలము.
భిద్యత ఇతి భిత్తం, భిదిర్ విదారణే - వ్రక్కలింపఁ బడునది.
వందఱ - శకలము.
వందఱలాడు - క్రి.ఖండించు.
శకలము - 1.చెట్టుపట్ట, నార, 2.ఖండము.
శక్తతే భేత్తుమితి శకలం ! ప్న. శక్ శక్తౌ - భేదింప శక్యమైనది.
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా Asia, అమెరికా America, అఫ్రికా Africa, ఆస్ట్రేలియా Australia, ఐరోపా Europe ఖండములు). (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన వృత్త భాగము, ఒక ఘనతలముచే ఛేదింపబడిన ఘనరూపభాగము.
(భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్నభిన్నముగ చేయబడని భూభాగము.
ఖండ్యత ఇతి ఖండం. ప్న. ఖడి ఖండనే - త్రుంచఁబడునది.
అర్ధము - 1.సగము, 2.తునక, విణ.అసంపూర్ణము, ఖండము.
అర్ధతి భేదం గచ్ఛతీత్యర్ధః. పు. అర్ధగతౌ - భేదమును బొందునది.
ఋద్ధము - 1.సమృద్ధము పెరిగినది, 2.నూర్చి తూర్పెత్తుటకు సిద్ధముగా నుంచినది(ధాన్యము), వి.1.వృద్ధి, 2.సిద్ధాంతము.
ఋద్యతే సముదాయో నేనేతి అర్ధః, ఋధి వృద్దౌ - దీనిచేత సముదాయము విభజింపఁబడును. తునక పేర్లు.
ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధద్రవ్యము, 5.కుబేరుని భార్య.
ఋద్ధ్నోత్యనయేతి ఋద్ధిః, సీ. ఋతు వృద్ధౌ. - దీనిచేత వృద్ధిఁబొందును.
అరవుఁడు - తుణక, ఖండము.
అసంపూర్ణము - (గణి.) సంపూర్ణముకానిది (Partial).
అసంపూర్ణసంధి - (జం.) రెండు ఎముకలు కలిసినచోట మధ్య ఒకపొర మృదులాస్థి ఉండుటచే కొంచుముగా కదల్చుటకు అవకాశము గల కీలు, ఉదా.అంసచక్రము, నితంబమేఖలము లందలి ఎముకలు (Imperfect joint).
అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థ్యత ఇత్యర్థః అర్థ ఉపయాచాజ్ఞాయాం - ప్రార్థింపబడునది.
విడిముడి - ధనము, (విడియు + ముడి).
ధనము - 1.విత్తము, 2.ఆలమంద వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోషపెట్టునది, 'ధన ధన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది (Positive).
అర్ధానా మార్జనే దుఃఖం ఆర్జి తానాంచ రక్షిణే|
అర్జేదుఃఖం వ్యయేదుఃఖం కిమర్ధం దుఃఖ భాజనమ్ ||
తా. ద్రవ్యమును సంపాదించుటయందు దుఃఖము, దానిని గాపాడుటయందును దుఃఖము. దాని ఆదాయమందును వ్యయమందును దుఃఖము, కాబట్టి దుఃఖమునకు మూలమైన ధన మెందు కనుట. – నీతిశాస్త్రము
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు:- ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు).
అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధనభాజాం భీతిః, సర్వత్త్రైషా విహితా రీతిః || - 29
ద్రవ్యం ఉపద్రవాలను (అనర్థాలను) తెచ్చిపెట్టేది అని ఎల్లప్పుడూ గుర్తుంచుకో, దానివలన కించిత్తు కూడ సుఖముండదనడం సత్యము. ధనవంతునికి తన స్వంతపుత్రునివలన కూడా ప్రమాదం వాటిల్లే భయముంటుంది. ఎక్కడైనా, ఈ ధనంయొక్క లక్షణమే ఇది.
Wealth is no good; thus reflect always; there is not the least happiness therefrom; this is the truth. For the wealthy, there is fear even from a son; everywhere this is the regular mode. – భజగోవిందం
గుదియతాలుపు - యముడు, దండధరుడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని Saturn, వికృ.జముడు.
దండధరుఁడు - యముడు.
కాలదండాఖ్యస్య దండస్య ధరః దండధరః, దండంధారయతితీవా, దృ ధారణే - కాలదండ మనెది దండమును ధరించినవాఁడు.
దండి - 1.ప్రతాపము, 2.గొప్ప, సం.వి.1.యముడు, 2.ద్వారపాలకుడు, విణ.దండముగలవాడు.
దండము - 1.దండము, 2.రాజు ధనవంతుని బలాత్కారము చేసి పుచ్చుకొనెడు ధనము, 2.అపకారి అపరాధి వలన గొనెడు డబ్బు, 4.జరిమానా, 5.నష్టము, రూ.దండుగు, దండుగ, దండువు. అన్ని దండుగ పనులే. ఏంతో నష్టము వచ్చింది. అంతా నష్టమే.
దండనము - శిక్ష, దండించుట.
దండించు - శిక్షించు.
గద - దుడ్డువలె నుండు ఒకరకపు ఆయుధము, వికృ.గుదియ.
గుదియ - 1.ఇనుపగద, 2.నాలుగు మూరలదండము, (యమ)దండము, 3.గుదిగిఱ్ఱ, రూ.గుదె, సం.గదా.
గుదిగఱ్ఱ - పోట్లావు మొ.గు వానికి మెడను గట్టెడు కొయ్య.
గుదిపడు (గుది+పడు) - క్రి.కట్టుపడు, స్తబ్ధమగు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
సిరి - 1.శ్రీ, లక్ష్మి 2.సంపద 3.శోభ, సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద 3.వస్త్రభూషణాదుల శోభ, 4.మెట్టదామర.
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః.
సంపత్తి - సంపద, సంవృద్ధి. సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
శోభ - 1.వస్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.
శ్రీః ఈసీ శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది. శ్రిఞ్ సేవాయాం.
స్మరం యోనిం లక్ష్మీ - త్రితయ మిద మాదౌ తవ మనోః
నిధాయైకే నిత్యే! - నిరవధి మహాభోగ రసికాః|
భజంతి త్వాం చింతా - మణిగుణ నిబద్ధాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వన్తః - స్సురభిఘృత ధారాహుతి శతైః|| - 33శ్లో
తా. ఆద్యంతరహితయైన నిత్యయగు ఓ త్రిపురసుందరీ! పరమయోగులు కొందఱు నీ మంత్రమునకు మొదటి కామ బీజమగు ‘ఐమ్’ ఐం శుద్ధసాత్త్వికం, యోని బీజమగు ‘హ్రీమ్’ హ్రీం(హ్రీం -1.మాయా (శక్తి) బీజం, 2.దేవీ ప్రణవం.), లక్ష్మీ బీజమగు శ్రీం 'శ్రీమ్' అను వర్ణములను జేర్చి, చింతామణు(మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు)లచే సమగూర్చబడిన జపమాల(అక్షమాల)లను హస్తము లందు గలిగి, కామధేనువు సంబంధమగు నేతి ధారలచే శివాగ్నియందు హోమము చేయుచు, నిన్నుకొలుచుచున్నారు. - సౌందర్యలహరి
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ,
శ్రీం బీజ జపసంతుష్టా ఐం హ్రీం శ్రీం బీజపాలికా| - 152శ్లో
వైభవము - విభవము, సంపద.
విభవము - సంపద, ఐశ్వర్యము.
కలిమి - 1.అతిశయము(అతిశయము - అధిక్యము), 2.సంపద.
సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.
సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి.
సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సమృద్ధమైనది.
సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపద్యతే జనైరితి సంపత్. ద. సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. – జనులచేత పొందఁబడునది.
శ్రియతే జనైరితి శ్రీః. ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది.
లక్ష్యతే లక్ష్మీః ఈ.సీ. లక్ష దర్శనాంకనయోః - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు సంపద పేర్లు.
శ్లీలము - 1.సంపదగలది, 2.సభ్యత కలది.
శ్లీలుడు - అదృష్టవంతుడు. జాతకుఁడు - 1.పుట్టినవాడు, 2.అదృష్టవంతుడు.
సిరిమంతుఁడు - శ్రీమంతుడు, సం.శ్రీమాన్.
శ్రీమంతుఁడు - సంపదకలవాడు.
శ్రీమంతము - 1.సంపదకలది, 2.ఒప్పిదముకలది.
శ్రీకరుఁడు - సంపత్కరుడు. మాఢ్యుడు - సిరితో గూడినవాడు.
సిరి చేర్చు బంధువుఁల నా
సిరియే శుభముల నొసంగు * చెలువులఁ గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించుగం మఁ * దలంపు కుమారా !
తా. కుమారా! సంపదయే చుట్టములను దగ్గరఁ జేరునట్లుచేయును, శుభములన్నింటిని యిచ్చును. అందముకూడ కలిగించును. ప్రపంచములో గుణవంతుఁడని పొగడునట్లు చేయును.
శ్రీదుఁడు - కుబేరుడు.
శ్రియం దదాతీతి శ్రీదః - సంపద నిచ్చువాఁడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత. దాత - ఇచ్చువాడు.
ధనాధిపుఁడు - కుబేరుడు.
శ్రీధరుఁడు - విష్ణువు. శ్రీధరం ప్రియ సంగమే!
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీద తండ్రి.
తిమ్మ - స్వస్థము; స్వస్థము - నెమ్మదిగా నుండునది.
తిరు - శ్రీ ప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమల - వేంకటాచలము.
శేషశైలము - తిరుమల; శేషాచలము - తిరుమల.
శేషాద్రి - తిరుమల.
శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః|
శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య - బంధమోక్షానుదర్శనమ్|
వివిక్తపదమజ్ఞాయ కిమసత్కర్మభిర్భవేత్ |
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.
కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.
మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయంగమము - మనస్సుకింపైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా,
శ్రీ స్సౌమ్యలక్షణా(అ)తీత దుర్గా సూత్ర ప్రబోధికా. - 32శ్లో
వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కోరిక - ఇచ్ఛ, విణ. అభీష్టము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.
తేజః పురీషయో ర్వర్చః :
వర్చ శబ్దము తేజస్సునకును, విష్ఠకును పేరు. వర్చతీతి వర్చః. స. స. వర్చదీప్తౌ. – ప్రకాశించునది.
'వర్చస్తురూపవ 'దితిశేషః. రూప ఇవేత్యర్థః.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).
అలంకారము - 1.అలంకరించుట, సింగారము 2.హారాది ఆభరణము 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ. సింగారము - శృంగారము, అలంకారము, సం.శృంగారః.
శృంగారము - 1.నవరసములలో నొకటి, 2.అలంకారము, వికృ.సింగారము.
సింగారి - శృంగారవతి.
పాటన - 1.అలంకారము, 2.ఆదరణము.
ఆదరణము - 1.సన్మానించుట, 2.మన్నించుట, 2.లక్ష్యముచేయుట, పాటించుట.
ఆదరణీయము - సన్మానింపదగినది.
అలంకరిష్ణువు - అలంకరించుకొను స్వభావము కలవాడు, అ లం కా ర ప్రియుడు.
అలంకర్త - అలంకరించువాడు.
శఙ్గార శ్శుచి రుజ్జ్విలః,
శృఙ్గం ప్రాధాన్యమియర్తీతి శృఙ్గారః. - ప్రాధాన్యము నొందు నది.
పరిశుద్ధత్వాచ్ఛుచిః. ఇ. పు. - జుగుప్సా విరహితమై పరిశుద్ధమైనది.
ఉజ్జలతి ప్రకాసత ఇత్యుజ్జ్వలః, జ్వల దీప్తౌ. - ప్రాకాశించునది. ఈ 3 శృంగారరసము పేర్లు.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్దులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.
ఔజ్జ్వల్యము - ఉజ్జ్వలత్వము, ప్రకాశము.
హవణిక - అలంకారము.
హవణించు - క్రి. 1.అలంకరించు, 2.ధరించు, 3.చక్కబరచు, 4.ఉంచు.
హవణిల్లు - క్రి. 1.ప్రకాశించు, 2.విజృంభించు.
శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి - మదనుడు; మరుఁడు - మన్మథుడు.
మదనుఁడు - మన్మథుడు; మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. జరాభీరువు - మదనుడు(జర - ముసలితనము). శృంగారయోని - మన్మథుడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు, 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మజ - 1.కూతురు, బుద్ధి.
ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
వస్త్ర ముఖ్య స్వలంకారః ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం విద్యాముఖ్యస్తు పూరుషః||
తా. అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము) ముఖ్యములు. - నీతిశాస్త్రము
శుద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మీ ర్జయలక్ష్మీ స్సరస్వతీ|
శ్రీ లక్ష్మీ ర్వర లక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా|
రమాదేవి గారు 🙏 నేను ఏదో ఒక పదం అర్ధం గురించి వెతుకుతుంటే మీ బ్లాగ్ వచ్చింది.
ReplyDeleteఅనుకోకుండా మీ బ్లాగ్ చూడటం వల్ల నేను ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం
ఇక ముందు మిమ్మల్ని అంటే మీ బ్లాగ్ ప్రతిసారి చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. 🙏🙏🙏