మఘ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదములు సింహరాశి Leo.
నరసింహుడు - 1.దశావతారములలో ఒకటి, 2.నరశ్రేష్ఠుడు.
నృసింహుఁడు - నరసింహుడు, నర. శ్రేష్టుడు.
నృహరి - నరసింహుడు. సింహంకాని సింహం. - నరసింహం
కంబమయ్య - కంబము(స్తంభము)నందు ఉద్భవించిన నృసింహస్వామి.
కంబము - గుంజ, సం.స్కంభః.
గుంజ - 1.స్తంభము, 2.కట్టుగొఱ్ఱు, సం.గుండ్రమ్.
కుంద - గుంజ, స్తంభము, సం.గుంధః.
కట్టుగొఱ్ఱు - పసులను కట్టుటకు పొలములో పాతినకొయ్య.
మొకరము - స్తంభము, గడెమ్రాను. మేధి - పశువులను కట్టునట్టి స్తంభము.
గడ - 1.నిడుపాటికోల, 2.వెదురు గడ, 3.స్తంభము, 4.గడన, 5.ఒకరకపు యుద్ధ సాధనము, 6.తెరచాపకొయ్య, 7.చెరకు మొ.వి కాండము, సం.కాండః.
గడన - 1.ఎన్నిక, 2.స్తోత్రము, 3.సంపాదనము, 4.లెక్క, సం.ఘటనా, గణనా.
గుత్సము - 1.ముప్పదిరెండు మణులు గ్రుచ్చినహారము, 2.కంబము, 3.వరి మొ.వి. దుబ్బు, 4.పూగుత్తి.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము.
కుచ్చు - 1.గుత్తి, 2.పూగుత్తి, 3.ఏదేని చేర్చి కట్టినది, కొనచెవి నుంచు కొనెడి భూషణము, సం.గుచ్ఛః.
గుళుచ్ఛము - 1.గుత్తి, 2.పూగుత్తి.
గుత్తి - 1.పూగుత్తి, 2.చీలమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.చీలమండ (Ankle bone).
మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
నరునకును సింహమునకు నే వరుసమైత్రి
గలుగు రెండురూపములును గలుగునట్టు
లవతరించుట నిక్కమే యయినయెడల
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
వైశాఖశుక్ల భూతోత్థ శ్శరణాగతవత్సలః,
ఉదారకీర్తిః పుణ్యాత్మా మహాత్మా చండవిక్రమః. – 11శ్లో
రోతయైన పేగుల పేరులగలవాడు - హిరణ్యకశిపుని చీల్చి చెండాడి, ప్రేగులను హారమాలికగా ధరించినవాడు, నరసింహావతారం.
పదునాలుగవదియైన నరసింహరూపంబునం గనక కశిపుని సంహరించెఁ - పద్నాలుగోసారి "నరసింహమూర్తి" యై ధుర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు.
ఆదరమింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికిన్
ఖేదముచేయుటల్, దనదుపేర్మికి గీడగు, మూలమెట్ల మ
ర్యాద హిరణ్యకశ్యపుఁడునా దనుజుఁడు గుణాఢ్యుడైన ప్ర
హ్లాదునకెగ్గుసేసి ప్రళయంబును బొందఁడె మున్ను, భాస్కరా.
తా. పూర్వము దుష్టవర్తియై హిరణ్య కశిపుడను రాక్షసుడు అతని కుమారుడైన ప్రహ్లాదుని సద్గుణములను సహింపలేక యాతని బాధించి తాను చివరకు నాశన మయ్యెను. అట్లే మనుష్యు డెంత గొప్పవాడైనప్పటికీ(తనకుగల అధికబలము చేత)సజ్జను(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)లను నిర్దయుడై బాధించినచో నశించును.
పూర్వగాధ :- హిరణ్య కశిపుడు శివుని పూజించుట యందును, బ్రహ్మను పూజించుటయందును భక్తిగలవాడే అయినను విష్ణుభక్తులను జూచి విష్ణువుని గొల్వ రాదనియు తన మతమే ముఖ్యమైన దనియు, అహింభావము గలిగి యుండుటచే నాతని కావిధముగా నాశనము సంభవించెను. కావున నెట్టివారికైనను అహంభావము పనికిరాదు.
ఇచ్చట ప్రహ్లాదుడు సర్వ దైవములను సమ దృష్టితోఁ జూచుటచే యోగ్యుడని చెప్ప వలెను. (ఈ పై వ్రాసినది విశేషమని భావింప వలెను.)
తవ కరకమలవరే నఖమద్భుతశృంగమ్,
దళితహిరణ్యకశిపు తనుభృంగమ్|
కేశవ! ధృత నరహరిరూప! జయ జగదీశ! హరే! ||
మనసు సరిచేయ నీవంటి ఘనులు లేరు
రక్కసుల పిల్లలైన నీ ప్రక్కనంద్రు
దుష్టశిక్షనుదెల్పు నీ శిష్టతనము
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
నాలుగు కాళ్ళు - కొమ్ములు కోఱలు మొ.నవి గల జంతువులలో సింహమును నేనే. - భగవద్గీత
సింగఁడు - 1.నృసింహుడు, 2.ఎరుకువాడు, సం.సింహః.
ఎఱుకవాఁడు - బోయవాడు.
సింగి - ఎరుకది, సం.శృంగీ.
ఎఱుకత - బోయ స్త్రీ, ఎఱుకసాని.
బోయత - కిరాత స్త్రీ, రూ.బోయత, (చెంచెత వలె).
చెంచు - ఒక తెగ బోయ.
నరుని నిను రాజ్యలక్ష్మి యేవరుసఁ గోరె
హరిని నినుఁ జెంచులక్ష్మి యే యదును నందె
నరహరుని బీదసాదలు నన్నియుంద్రు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.
గుహాశయము - 1.పరమాత్మ, 2.సింహము, మొ.వి. విణ. గుహా యందుండునది.
గుహ - 1.కొండబిలము, 2.పల్లము, 3.దాగుట, 4.హృదయము, 5.బుద్ధి.
కందర - కొండబిలము, గుహ. బిలము - 1.రంధ్రము, 2.గుహ. కుహరము - 1.గుహ, 2.రంధ్రము.
గండి1 - 1.బిలము, 2.సందు, 3.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారునపుడు ప్రవాహ వేగముచే వడిగా పారునపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కంధము.
స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
ప్రకాండము - చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా. పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
బోదియ - 1.ప్రకాండము, 2.మిరపచేల యందు కాలువ లేర్పరిచి కట్టిన కట్ట 3 స్తంభముల మీది దూలముల క్రింద నుండు పీట.
ప్రకాండవ్యూహము - (వృక్ష.) మొక్కకు భూమిపై నున్న కాండము, కొమ్మలు, ఆకుల మొదలగు భాగముల సముదాయము (Shoot system).
శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).
సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్.
గవి1 - ఆవు Cow.
గవి2 - 1.గుహ, 2.గుంట.
దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్.
దరి - గుహ.
నారసింహో మహాసింహో దివ్యసింహో మహాబలః,
ఉగ్రసింహో మహాదేవ స్త్సంభజ శ్చోగ్రలోచనః|
అహోబిలం(గరుడాచలంలో అహోబలం, అక్కడ నృసింహస్వామి దేవేరి అమృతవల్లి), సింహాచలం(సింహాద్రి అప్పన్న), వేదాద్రి, మంగళగిరి, యాదగిరిగుట్ట(లక్ష్మినరసింహస్వామి) నరసింహస్వామి క్షేత్రములు మొ.వి.
పంచనారసింహ క్షేత్రభావ మరసి
యున్నఁ జాలును మేలు మహోత్సవంబు
పంచభూతంబు లరచేత సంచరించు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
ఏకోదేవః కేశవోదా శివోదా, ఏకోవాసః పట్టణందా వనందా|
ఏకోమిత్త్రః భూపతిర్వా యతిర్వా, ఏకోనారీ సుందరీదా దరీదా||
తా. విష్ణువైన(కేశవుఁడు - విష్ణువు)శివుడైన నొకండే దేవుండని నమ్మ వలయును. పట్టణమైన, వనమైన నొండు వాసయోగ్యముగా నెంచ వలయును. రాజు(భూపతి - నేలరేడు, రాజు.)తోనైన సన్యాసితోనైన స్నేహము చేయ వలయును. సౌందర్యముగలభార్య(సహధర్మిణి - భార్య)తో గుడియైనను గుహయందైన నుండవలయును - నీతిశాస్త్రము
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః|
నారసింహవపు శ్శ్రీమాన కేశవః పురుషోత్తమః|| - 3శ్లో
సింహో మృగేన్ద్రః పఞ్చాస్యో హర్యక్షః కేసరీ హరిః :
హిన్స్తి హస్త్యాదికమితి సింహ హిసి హింసాయాం - ఏనుఁగులు మొదలైన మృగముల హింసించునది. హింసి 'ధాతువు నుండి సింహ శబ్దము.
మృగాణా మింద్రః శ్రేష్ఠః మృగేన్ద్రః - మృగములలో శ్రేష్ఠమైనది, మృగరాజు.
పంచ ఇతి పంచం. పచి విస్తారే. పంచం విస్తృమాస్యమస్యేతి పంచాస్యః – విస్తీర్ణమైన (విశాలమగు) ముఖము గలది.
హరిణీ కపిలవర్ణే అక్షిణీ అస్య. హర్యక్షః - కపిలవర్ణములైన కన్నులుగలది.
కే శిరసి సరంతీతి కేసరాః సటాః, తా అస్యసంతీతి కేసరీ. న. పు. – జూలు గలది.
హరతి గజాదికం హరిః పు. హృఞ్ హరిణే - గజాదులను హరించునది. (1.కంఠే రవో యస్య సః కంఠీరవః - కంఠమందు ధ్వనిగలది. 2.గజానా రిపుః పు - ఏనుఁగులకు శత్రువు. 3.పింగే దృష్టీ యస్య సః పింగదృష్టిః పు - పచ్చని చూపులు గలది. 4.మృగాణామధిపః మృగాధిపః - మృగములకు దొర. ఈ నాలుగు ఆధిక నామములు) సింహము పేర్లు.
మృగరాజు - సింహము. సింహము మృగరాజు, మిక్కిలి పౌరుషముగలది. కంఠీరవము - 1.సింహము, 2.మదపుటేనుగు, 3.పావురము.
ఏనికదిండి - సింహము, వ్యు.ఏనుగు తిండిగాగలది.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
దంతి - ఏనుగు, విణ. కోరపండ్ల వాడు.
ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏన్గు.
అనేకపము - ఏనుగు. మహామృగము - ఏనుగు.
ఏనుఁగు గొంగ(శత్రువు) - సింహము, వ్యు.ఏనుగు తిండిగాగలది.
ఏగతిఁ బాటుపడ్డఁగలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము, భాగ్యరేఖగల పుణ్యున కుంబలె? భూరిసత్త్వసం
యోగమదేభకుంభ యుగళోత్థిత మాంసము నక్కకూన కే
లాగుఘటించు, సింహము తలంచినఁ జేకుఱుఁగాక, భాస్కరా.
తా. ఎవరెన్ని విధముల కష్టపడినను అల్పునకు సమ్యగ్‌భోగము లబ్బవు, ఏనుగు(మహామృగము-ఏనుగు)కుంభస్థలమందలి మాంసము సింహమునకు ప్రాప్త మగునుగాని, ఎన్నిపాట్లు పడిననూ నక్కపిల్లకు లభించదుగదా! మదపుటేనుంగుల కుంభస్థలముల జీల్చి చెండాడెడు మృగేంద్రము క్షుద్రజంతువులను లెక్కింపదు.
పంచాననము - సింహము వ్యు.విశాలమగు ముఖము గలది.
తెఱనోటి మెకము - సింహము వ్యు.విస్తారమగు నోరు గల మృగము. తెల్లడాలు మెకము - సింహము వ్యు.తెలుపు వన్నె కల మెకము.
హర్యక్షము - సింహము వ్యు.పచ్చని కన్నులు కలది.
బాకినోటి మెకము - సింహము.
తెఱనోటిమెకము - సింహము, వ్యు.విస్తారమగు నోరు గల మృగము.
తెఱ - 1.తెరపయైనది, మరుగులేనిది, రూ.తెఱ్ఱ.
తెఱప - 1.తెరచుట, 2.ఉపశమము, విణ.మరుగులేనిది.
తెఱచు - క్రి. 1.తెరపచేయు, 2.బయటపడు.
తెఱవ - స్త్రీ, వ్యు.తెరపు + వా(యి)కలది, రహస్యము దాగని నోరుకలది.
ఉపశమము - 1.అడగుట, 2.రోగాదులబాధ తగ్గుట, 3.ఇంద్రియ నిగ్రహము, 4.ఓర్పు, రూ.ఉపశాంతి.
ఉపశాంతి - ఉపశమము.
మిత్రుండు దనకు విశ్వా
మిత్రముఁ జేసినను గాని * మే లనవచ్చును,
శాత్రవుఁడు ముద్దు గొన్నను,
ధాత్రిన్ దన కదియె కీడు * తలఁపఁ గుమారా!
తా. మిత్రుఁడు తనకు సంపూర్ణముగాఁ గీడుచేసినను మేలుచేసిన వాఁడే యగును. శత్రువు తన్ను ఎంత ప్రేమించినను కీడుచేసినవాఁడుగనే యెంచబడును.
నరుఁడవో సింహమవొ నీదు నామమేమొ
నోరుతెరచుటఁ గల్గు వినోదమేమొ
నిన్నుఁజూచుట చిత్రంబు నీరజాక్ష
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
సింహము - 1.కేసరి, సింగము, 2.ఒక రాశి, 3.శ్రేష్ఠము, (సమాసోత్తర పదమైనచో).
ఏకై కాగౌ స్త్రయస్సింహాః పంచవ్యాఘ్రాః ప్రసూఃతిభిః
అధర్మో నష్ఠసంతానో - ధర్మ స్సంతానవర్థనః|
తా. గోవు ఒక్కొకటియే కనును, సింహము మూడేసి మూఁడేసిగాకనును, పులి అయిదయిదుగా కనునుగాని పులి(Tiger) సింహముల(Lion)యొక్క ధర్మంబు దాని సంతతిని నశింప జేయుచుండును. గోవుయొక్క ధర్మంబు దాని సంతానమును వృద్ధిజేయుచుండును. కావున నెల్లపుడు ధర్మముగాఁ ప్రవర్తింపవలయును. - నీతిశాస్త్రము
కేసరి - 1.సింహము, 2.గుఱ్ఱము, వ్యు.కేసరములు గలది, 3.ఒక విధమగు వరి పైరు విణ.శ్రేష్ఠుడు.
సింగము - సింహము, సం.సింహః.
కరభీరము - సింగము. (కేసరిసుతాయ, కేసరినందన - హనుమ.)
గుఱ్ఱము - అశ్వము; అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అనుసంఖ్య.
కంఖాణము - గుఱ్ఱము, హయము.
హయము - గుఱ్ఱము, వ్యు.త్వరగా పోవునది.
వారువము - గుఱ్ఱము, రూ.వార్వము, సం.వారః.
వాపురము - గుఱ్ఱము, రూ.వారువము, వార్వము, సం.వారః.
వారము - 1.సూర్యాది వాసరము, 2.తడవ, 3.సమూహము, వి.వారు, వావము, గుఱ్ఱము (కొందరీ యర్థమందును వారశబ్దము, సం.వి.గనే గ్రహించిరి).
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
సప్తి - గుఱ్ఱము; వాజి - గుఱ్ఱము; ఖేంభాణము - గుఱ్ఱము.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.
కాండము - 1.గ్రంథభాగము, 2.కావ్యపరిచ్ఛదము (రామాయణము నందు షటాండములు గలవు), 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
ప్రకీర్ణము - 1.విరివి, 2.వింజామరము, 3.గుఱ్ఱము.
కేశి - 1.ఒకానొక రాక్షసుడు, 2.సింహము, విణ.మంచి తల వెండ్రుకలు కలవాడు.
కేశిసూదనుఁడు - శ్రీకృష్ణుడు వ్యు.కేశియను రాక్షసుని చంపినవాడు.
కేశి - హయశిరుఁడు. కేశి అనే రాక్షసుని సంహరించి కేశవునిగా పిలువ బడుతున్నాడు. బ్రహ్మ రుద్రులు ఈయనయందు జనించిరి గనుక కేశవుడు. బ్రహ్మవిష్ణురుద్రులు ఈయన యందుండుటవలనఁ కేశవుఁ డని కొందరు.
కేశవుఁడు - విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
శివునిఁ గేశవునిన్ నరున్ సింహము మది
బూని ప్రేమ సాలగ్రామమౌ నృసింహు
సేవ చేయుట మేలగు సిద్ధికాదె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
ఓం కేశవాయః స్వాహా - సుషుప్తి(సుషుమ్న - ఒక నాడి) నాడిలో వ్యాపించి వుంది. (మహేశ్వరీపురము నందు దేవీస్థానం స్వాహా.)
కాలనేమినిహా శౌరిః శూర శ్శూరజనేశ్వరః|
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేహిహా హరిః||
చెలఁగు హరిమధ్యకును సింహరాశి…..
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నునంటు - అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి(వాసరము - దినము).
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.
హరిదశ్వుఁడు - సూర్యుడు, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.
ౙడలమెకము - సింహము. చమరము.
జటిలము - జటాలము, వి.సింహము.
జటాలము - జడలుగలది, రూ.జటిలము.
ౙడ - 1.వెండ్రుకల యల్లిక, 2.జూలు, సం.1.జటా, 2.సటా.
(ౙ)జూలు - 1.సింహము మొదలగు వాని మీది నెండ్రుకలు, 2.ఏనుగు పై పరచు ఎఱ్ఱ కంబళి.
జట - 1.జడ, 2.ఊడ.
సట - కపటము, మోసము, సం.వి.1.సన్న్యాసుల జడ, 2.జూలు.
ౙడదారి - జడలు ధరించిన సన్యాసి, సం.జటాధారీ.
ధర్మద్వజి - జీవనార్థము సన్న్యాసి వేషము దరించినవాడు.
ౙడముడి - 1.కపర్దము, ఈశ్వరుని జటాజూటము, 2.జడలుగంటు.
కపర్ధము - 1.గవ్వ, 2.శివుని జటాజూటము.
జూటము - 1.శివుని జడముడి, 2.జడముడి.
ౙడముడిజంగము - శివుడు, కపర్ధి.
కపర్ధి - శివుడు.
జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః. – భజగోవిందం
అగౌకసము - 1.సింహము, 2.శరభమృగము, 3.పక్షి, వ్యు. కొండ లేక చెట్టు నివాస స్థానముగా గలది.
శాక్యసింహుఁడు - శాక్యముని, బుద్ధుడు.
శాక్య సింహః శాక్యేషు సింహఃశ్రేష్ఠః - శాక్యులలో శ్రేష్టుడు.
శాక్యముని - శాక్య బుద్ధదేవుడు.
పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁడిక్కఁడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబుర కేమి యొగ్గగన్
కొండొక కోతి చెట్టుకొన కొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహ నికరంబులు నుండవె, చేరి భాస్కరా.
తా. ఒక చెట్టుక్రింద గండభేరుండములు, సింహములు, ఏనుగులు గుంపులుగా నుండగా, ఆ చెట్టుపైకొక కోతిఎక్కి కూర్చునంత మాత్రమున దానిచే వాటి కేయాపదయు ఘటిల్లదు, అట్లే పండితులొక్కప్పుడు తక్కువ స్థానములలో నుండగా ఒక నీచుడు ఎక్కువ స్థాన మందున్నను యాతనివలన వారి కెట్టిలోపమునూ రాదు.
బొబ్బ మెకము - సింహము, గర్జించు మృగము.
బొబ్బ - 1.పొక్కు 2.సింహనాదము. క్వేడ - సింహనాదము. క్ష్వేళితము - సింహనాదము రూ.క్ష్వేళి.
సింహనాదము - వీరుల గర్జనము.
క్ష్వేడా తు సింహనాద స్స్యాత్ -
క్ష్వేఅడనం క్ష్వేడా. క్ష్వడృ అవ్యక్తే శబ్దే. - బొబ్బ పెట్టుట. పా.క్ష్వేళా.
సింహనాం నాద ఇవ నాదః సింహనాదః - సింహముల యొక్క నాదమువంటి నాదము. ఈ రెండు శత్రు భంగార్థమైన యోధులు సేయు బొబ్బరింత పేర్లు.
సింహమును పంజాపట్టి పోల్చవచ్చును. గొప్పవారితో మైత్రి సింహముతో సోదరత్వము వంటిది.
తరక్షువు - సివంగి.
సివఁగి - చివగి, సివ్వంగి, సింహికః. కృత శౌచం నందు దేవిస్థానం సింహిక.
చివఁగి - 1.ఒక తెగ వేట కుక్క, రూ.చివ్వంగి, చివ్వగి, సివగి, సివంగి.
చివ్వంగి - సివంగి; చివ్వఁగి - సివంగి.
చివ్వలాడి - కలహశీలురాలు, పోట్లాడు స్వభావము కలది.
తరక్షుస్తు మృగాదనః. -
తరన్ ప్లవన్ క్షిణోతీతి తరక్షుః. పు. క్షిణు హింసాయాం. - దుమికి చంపునది. మృగా నత్తీతి.
మృగాదనః అద భక్షణే. - మృగముల భక్షించునది. ఈ రెండు 2 సివంగి పేర్లు.
చిక్కి యున్నవేళ సింహంబు నైనను
బక్క కుక్క కరచి బాధచేయు
బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వ.
తా. బలము లేనప్పుడు సింహమునైనను బక్క కుక్క(గ్రామమృగము - కుక్క, (గ్రామసింహము).)కరచి బాధ పెట్టును, శక్తిలేనప్పుడు పంతము లకు పోక తలవంచుకొని తిరుగుట మంచిది.
సింహం ఆకలితో అలమటిస్తున్నా, చావనైనా చస్తుంది గాని, గడ్డి మాత్రం తినదు(మేయదు). శునకములు తిని విడిచినదానిని సింహములు తినునా?
నారసింహీ మహూగ్రాస్యా భక్తానా మార్తినాశినీ,
అంతర్బలా స్థిరా లక్ష్మీ ర్జరామరణనాశినీ.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు - ఆగస్టు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season). కార్తె - సూర్యుడుండు నక్షత్రము.
10. మఘ - పల్లకీ ఆకారముగా 8 నక్షత్రములుండును.
మేనా - (వ్యావ.) పల్లకి , సవారి.
పల్యంకిక - పాలకి, పల్లకి.
సవారి - ప్రశ్న, యుక్తిప్రశ్న.
కైపదము - కవి కిచ్చుసమస్య, చిక్కుప్రశ్న, సం.కవిపదమ్.
(ౘ)చౌతా - డోలి.
చతురంత యానము - పల్లకి; శిబిక - పల్లకి.
అందలము - 1.పల్లకి, ఆందోళిక; 2.ఒకరకపు బాలక్రీడ, సం.ఆందోళః.
ఆందోళిక - ఆందోళము.
ఆందోళము - 1.పల్లకి, 2.ఉయ్యెల, రూ.ఆందోళిక, వికృ.అందలము.
అందరు అందలం(పల్లకీ)ఎక్కే వారే ఐతే, మోసే వారెవ్వరు ? ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి(సవారీ) మోత.
ఊయల - (గృహ.) చంటిబిడ్డలను పరుండబెట్టు తొట్టె, బట్టతోగాని, వలతోగాని కట్టిన ఊయెల, రూ.చూ.ఉయాల, (Cradle).
ఉయ్యాల - ఊగెడి డోల, రూ.ఊయెల.
దోల - డోల, ఉయ్యాల.
దోల - డోల, ఉయ్యాల.
ఉయాల - డోల, రూ.ఉయేల, ఉయ్యల, ఉయ్యెల, ఉయ్యేల, ఊయల, ఊయేల.
డోల - ఉయ్యాలవంటి అందలము, తొట్ల, ఉయ్యాల.
తొట్టియల - బిడ్డల పరుండబెట్టు ఉయ్యెల, రూ.తొట్టెల, తొట్ల, తొట్టియ, తొట్టె. తొట్టె - తొట్టియ.
తొట్టియ -1.నేయువాడు నూలుకండె నుంచుకొనునాడె, 2.ఉయ్యాలతొట్టె.
లాలి - ఉయ్యెల.
ఉయ్యెల - ఉయ్యాల; ఉయ్యల - ఉయాల; ఉయ్యేల - ఉయ్యాల.
ఉయ్యలపులుఁగు - సారసపక్షి.
8. ఉపహూతాః పితరో యే మఘాసు | మనోజవ సస్సుకృతస్సుకృత్యాః | తే నో నక్షత్రే హవమాగమిష్ఠాః | స్వధాభిర్యజ్ఞం ప్రయతం జుషంతామ్ | యే అగ్నిదగ్ధా యేనగ్నిదగ్ధాః | యే ముల్లోకం పితరః, క్షియంతి యాగ్‌శ్చ విద్మ యాగ్ం ఉ చ స ప్రవిద్మ | మఘాసు యజ్ఞగ్ం సుకృతం జుషంతామ్ ||
పితరులు - పితృదేవతలు. సంతానమును అధికముగా కోరేవాడు పితృదేవతలను ఆరాధించాలి.
పితరుల చుక్క - మఘా నక్షత్రము.(పితరులు - పితృదేవతలు).
తాత - 1.తండ్రికి తండ్రి, 2.తల్లికి తండ్రి, వై.వి.విధాత, బ్రహ్మ, సం.వి.తండ్రి.
పితామహుఁడు - 1.తండ్రికి తండ్రి, 2.బ్రహ్మ.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
పితామహః పితౄణాం పితా - పితౄణా మపి జనయి తేత్యర్థః - పిత(తండ్రుల) పుట్టించినవాడు, బ్రహ్మ.
తాతస్తు జనకః పితా :
తనోతి కులం తాతః. తను విస్తారే. - కులమును విస్తరింపఁజేయువాఁడు.
జనయతీతి జనకః. జనీ ప్రాదుర్భానే. - పుట్టించువాఁడు.
పాతీతి పితా. ఋ. పు. పా రక్షణే - రక్షించువాఁడు. ఈ మూడు 3 తండ్రి పేర్లు.
ధాత -1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
ఆంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి(Jupiter), 2.జీవాత్మ, రూ.అంగిరసుడు.
లెక్కపెట్టఁగానౌనె నీ లీల లరయ
బ్రహ్మయంతటివాఁడు నీ పట్టి యయ్యు
నేరలేఁ డయ్యె యో యయ్య నీ గుణములు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.
అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు. ముఖ్య పితరు లేడుగురిలో అర్యముడు పెద్ద.
సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
ప్రపితామహుఁడు - ముత్తాత.
ముత్తాత - వృద్ధ పితామహుడు, ప్రపితామహుడు.
ముత్తవ - వృద్ధ పితామహి, ముత్తవ్వ, ప్రపితామహి.
పైతామహము - పితామహ సంబంధమైనది.
పైతృకము - పితృసంబంధమైనది.
పైత్రము - పితృసంబంధమైనది.
పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింపబడినది.
పిత్రార్జితము - పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).
భూర్భువ స్త్వస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్యా యజ్ఞాంగో యజ్ఞవాహనః||
జనకుడు - 1.తండ్రి, 2.సీత యొక్క తండ్రి, విదేహరాజు(జనకర్షి).
జనయిత్రి - తండ్రి; జనయిత - తల్లి.
తండీరి - జనకుడు, రూ.తండ్రి.
తండ్రీ - తండిరి; నాయన - తండ్రి.
బాబు - 1.పూజ్యుడు, 2.తండ్రి, సం.భావ్యః.
ఠాకురు - 1.తండ్రి, 2.అధిపతి, 3.గురువు, రూ.ఠాగూరు, సం.టక్కురః. అయ్య - తండ్రి, విణ.పూజ్యుడు, రూ.అయ, సం.ఆర్యః.
జానకి - జనకుని కూతురు, సీత. సీతా రూపమున లక్ష్మి, జనకమహారాజు యజ్ఞ భూమి నుండి యుద్భవించెను.
పితరుఁడు - తండ్రి, సం.పితా.
పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు - బ్రహ్మోపదేశం చేసినవాడు తండ్రి, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు) పితా జ్ఞానం. పితరః ప్రజాపతిః.
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు.
కూచి - 1.యుద్ధయాత్రకై వాద్యము మ్రోగించుట, 2.ఆడుది(స్త్రీ - ఆడుది), విణ.1.వాడియైనది, 2.వికసించినది.
పితాధర్మః పితాస్వర్గః, పితాహి పరమం తపః|
పితరి ప్రీతి మాపన్నే, సర్వా ప్రియంతి దేవతాః|| (మహాభారతం శాంతి పర్వం 266-21)
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి సం.కృష్ణః.
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు. వ్రాత్యుఁడు - ఉపనయనాది సంస్కారములు లేని బ్రాహ్మణుడు.
జనితా చోపనీతాచ యేన విద్యోపదిశ్యతే|
అన్నదాతా భయత్రాతా పంచె తే పితరస్మృతాః||
తా. కన్నతండ్రి, ఉపనయనము చేసినవాఁడు, విద్య చెప్పినవాఁడు, అన్నము బెట్టినవాఁడు, భయము తీర్చినవాఁడు. ఈ ఐదుగురును తండ్రులు. - నీతిశాస్త్రము
స్వధ: పితృపత్ని, ఆమెకి మన్నన ఈయకపోతే పితరులకు చేసే దాన ధర్మాలు వారికి తృప్తికరములు కావు.
అనిర్వణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః|
నక్షత్రనేమి ర్నక్షత్రీ క్షమః క్షామః స్సమీహనః||
మాఘము - మాఘమాసము.
జన్నపుఁరిక్కనెల - మాఘమాసము.
మఘము - యజ్ఞము.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము. ఇవి పంచ యజ్ఞములు, వికృ. జన్నము.
యజ్ఞస్సవో ధ్వరో యాగ స్సప్తత్తన్తుర్మఖః క్రతుః :
యజతే యజ్ఞః యజ దేవపూజాసంగతి కరణదానేషు. - పూజించుట.
సూయతే సోమో స్మిన్నితి సవః. షుఞ్ అభిషవే. - దీనియందు సోమము తడపబడును.
అధ్వానం వైదికమార్గం రాతి అధ్వరః. రా దానే. - వైదిక మార్గము నిచ్చునది.
యజనం యాగః. యజదేవ పూజాదౌ - పూజించుట.
సప్తభిశ్ఛందో భిస్తన్యత ఇతి సప్తతంతుః, ఉ. పు. తను విస్తారే. - ఏడు ఛందస్సులచేత విస్తరింపఁ బడునది.
మఖన్తి దేవా అత్రేతి మఖః. మఖి గతౌ. - దీనికి దేవతలు వత్తురు.
క్రియతే బ్రాహ్మణాదిభిరితి క్రతుః. ఉ. పు. డుకృఞ్ కరణే - బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులచేతఁ జేయఁబడునది. ఈ ఆరు యజ్ఞము పేర్లు.
దేవానాంప్రియము - మేక, యజ్ఞము లందు దేవతల కర్పింపబడును గాన. శసనము - యజ్ఞమందలి పశువధము. యజ్ఞయాగాది క్రతువులకు కలియుగంలో అంత ప్రాధాన్యత లేదు. జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు...
యూపము - యజ్ఞ మునందు పశుబంధనార్థము నాటిన పై పట్టలలేని పాలకొయ్య.
చషాలము - యూప స్తంభమూందలి కొయ్య కడియము.
సవము - యజ్ఞము, జన్నము.
సవనము - యజ్ఞము.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజనః.
ౙన్నపుగొంగ(గొంగ - శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.
క్రతుధ్వంసి - శివుడు, వ్యు.దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుదిండి, రూ.క్రతుభుక్కు.
ౙన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
వేలుపు - 1.దేవత, దేవతా స్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు - వేలుపు; సుపర్వుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
త్రిదివము - స్వర్గము.
ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, 2.వేలుపు, 2.సూర్యుమండలాంతర్గత విష్ణువు.
జన్నపుఁబొజ్జ - ఋత్విజుడు.
ఋత్విజుడు - ఋత్విక్కు.
ఋత్విక్కు - యజ్ఞకర్త(యష్ట - యజ్ఞకర్త)వలన ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు, యాజకుడు, రూ.ఋత్విజుడు.
యాజకుఁడు - యాజ్ఞికుడు.
యాజ్ఞికుఁడు - 1.పురోహితుడు, 2.యజ్ఞమును నడుపువాడు.
పురోహితుఁడు - 1.యాజ్ఞికుడు, 2.పౌరోహిత్యముచేయు బ్రాహ్మణుడు.
స్తేయుఁడు - 1.తీర్పరి, 2.పురోహితుడు, విణ.మిక్కిలి స్థిరుడు.
తీర్పరి - న్యాయధిపతి.
దక్షిణ - 1.కుడిదిక్కు, 2.యజ్ఞము మున్నగు వానిలో ఋత్వికులు మొదలగు వారి కిచ్చు ధనము, రూ.దక్షిణము.
ౙన్నపుఁజుక్క - మఘా నక్షత్రము, పదియవ నక్షత్రము.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి సం.యజ్ఞః.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతు రాజము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచ యజ్ఞములు). వికృ.జన్నము. యజ్ఞః ప్రజాపతిః.
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనకత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
వేలిమి - హోమము రూ.వ్రేల్మి, వేల్మి.
వ్రేల్మి - వేలిమి, హోమము, యజ్ఞము.
హోమము - వేల్మి, యజ్ఞము.
ఆహవనము - 1.యజ్ఞము, 2.హోమము.
హవనము - హోమము. మంత్రంతో హవిస్సును అగ్నిలో ఆహుతి చేయించాలి.
హవము - 1.ఆజ్ఞ, 2.పిలుపు(ఆహ్వానము - పిలుపు), 3.యజ్ఞము.
హూతి - పిలుపు, రూ.ఆహూతి.
స్థండిలము - వ్రతనియమమున నున్నవాడు పండుకొనుటకు దర్భాదులు పరచిన భూమి. అగ్నిహోత్ర ముంచుటకై సంస్కరించిన భూమి.
స్థాండీలుఁడు - స్థండిల భూమియందు శయనించినవాడు, రూ.స్థండిలశాయి.
అగ్నిహోత్రము - 1.అగ్ని, 2.హోమము, 3.హవిస్సు.
అగ్నిహోత్రుడు - ప్రజాపతి రగ్నిః పరిశుద్ధుడు, సర్వభక్షకుడు, పంచ భూతములలో నొకడు.
అగ్నిచిత్తు - అహితాగ్ని, నిత్యాగ్ని, హోత్రి.
హోత - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు, రూ.హోత్రి.
హవ్యవాహనుఁడు - అగ్ని, రూ.హవ్యవహుడు.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, 2.వేలుపు, 2.సూర్యుమండలాంతర్గత విష్ణువు.
వీతిః అశనం హోత్రం హవిః యస్యసః వీతిహోత్రః - వీతి యనఁగా అశనము. హోత్ర మనఁగా హవిస్సు. ఆ యశనమే హవిస్సుగా గలవాఁడు.
హోత్రస్య హవిషోవీతి రశ్వ ఇవ వహనాద్వా - హవిస్సును గుఱ్ఱమువలె మోచికొనిపోయి దేవత కిచ్చువాఁడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.
జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.
వషటృకృతము - విణ.అగ్నియందు వేల్వబడునట్టిది (హవిస్సు).
వషట్కారము - అగ్నియందు చేయు హవిరాదిత్యాగము.
కవ్యము - పితృదేవతల కిచ్చు అన్నము.
హవిస్సు - వేల్పుటకు ఇగురు పెట్టిన అన్నము.
ప్రసాదనము - 1.అనుగ్రహము(అనుగ్రహము - దయ, కరుణ), 2.ప్రసన్నత, 3.భగవంతునికి నివేదించిన అన్నము.
ప్రసాదనము - 1.తేర్చుట, 2.అన్నము.
పసదనము - కృతజ్ఞతతో నిచ్చు పారితోషకము, సం.ప్రసాదనమ్.
గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
స్వాహా : అగ్ని భార్య(మహేశ్వరి యందు దేవీస్థానం స్వాహా). ఆమె దయవల్లనే దేవతలకు హవిర్భాగాలు అందుతున్నాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు చేసే యజ్ఞములకు సంబంధించిన హవ్యము దేవతల ఆహారమై ఆకలిని పోగొట్టుతుంది. స్వాహా అనే ఆమె పేరు చేర్చకుండా యిచ్చే ఆహుతులను అగ్ని స్వీకరించడు.
అగ్నిదేవునకు దక్షుని కూతురయిన స్వాహాదేవి అను భార్యవల్ల హవిస్సులే భోజనంగాగల పావకుడు(పావకుడు - అగ్ని), పవనుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు.
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
గభస్తి నేమి స్సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః|
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః||
స్వాహా - ముగ్గురు కొడుకులు (ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అని పేర్లు.)
ఆహవనీయము - హోమము చేయదగినది (హవిరాది) వి. త్రేతాగ్నులలో ఒకటి. (తక్కిన రెండు 1.దక్షిణాగ్ని, 2.గార్హ పత్యాగ్ని).
గార్హపత్యము - 1.మూడు శ్రౌతాగ్నులలో ఒకటి, (మూడు శ్రౌతాగ్నులు గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని) 2.గార్హస్థ్యము.
గార్హస్థ్యము - 1.గృహస్థాశ్రమము 2.గృహస్థధర్మము 3.గృహస్థుడు ప్రతి దినము అనుషింప వలసిన పంచయజ్ఞములు మొ.ని.
ఔపాసనము - గృహస్థుడగు బ్రాహ్మణుడు ప్రాతఃకాలమునందు చేయు అగ్ని ఉపాసన.
ముచ్చిచ్చు - (మూడు+చిచ్చులు) త్రేతాగ్ని (గార్హస్పత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని).
త్రేత - 1.రెండవ యుగము, 2.గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అను మూడగ్నులు, తేతాగ్ని.
త్రేతా త్వగ్నిత్రయే యుగే :
త్రేతా శబ్దము గార్హపత్యము మొదలైన మూఁడగ్నులకును, యుగమునకును పేరు. త్రిత్వమితా ప్రాప్తా త్రేతా. ఇణ్ గతౌ. త్రిత్వ సంఖ్యను బొందినది. టీ. స. త్రీ న్ ధర్మపాదాన్ ఇతా త్రేతా. తదుక్తం. "త్రేతాయుగే తు సంప్రాప్తే దర్మః పాదోనతాం గత"ఇతి.
త్రేతాయాం వర్తమానాయాం కాలః కృతసమో భవత్ |
రామే రాజని ధర్మజ్ఞే సర్వభూత సుఖావహే |
పూర్ణాహుతి - హోమాంతమందు ప్రీతికై పరిమళద్రవ్యాలతో చేయు హోమము.
అగ్ని హోత్రం గృహంక్షేత్రం గర్భిణీంవృద్ధ బాలకా|
రిక్త హస్తేన నోపే తో ద్రాజానందైవతం గురుమ్||
తా. అగ్ని హోత్రునకు మంత్ర పూర్వ కాహుతు లిచ్చునపుడును, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలురు, రాజులు, దేవుడు వీరుల కడకు వట్టి చేతులతో బోరాదు, అనఁగా ఫలాదులు తీసికొని పోవలయును. - నీతి శాస్త్రము.
యజ్ఞము ధర్మాన్ని వృద్ధి పరుస్తుంది. హోమము చేయు పొగ యొడలి మీఁదఁ (శరీరము మీద) పాఱుట వలన ఆయుస్సు వృద్ధిపొందించును.
యజ్ఞపురుషుఁడు - విష్ణువు.
ఇష్టి - 1.యజ్ఞము, 2.యజ్వ, 3.కోరిక, 4.(వ్యాక.) పతంజలి అభిప్రాయమును తెలుపు వాక్యము, 5.సంగ్రహ శ్లోకము.
ఇష్టము - 1.యజ్ఞ కర్మము, 2.సంస్కారము, 3.యజ్ఞము, 4.కోరిక, విణ.1.కోరబడినది, 2.ప్రియమైనది, 3.పూజింపబడినది.
ఇష్టుఁడు - 1.ప్రియుడు, 2.ఆప్తుడు, 3.విష్ణువు.
యజ్వ - విధ్యుక్తముగా యజ్ఞము చేసినవాడు.
యాగము - యజ్ఞము; యియక్షువు - యాగము చేయకోరువాఁడు.
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మక్షర సముద్భవమ్ |
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ || - 15శ్లో కర్మయోగః
భూతజాలములు అన్నమునుండి ఉత్పన్నమగుచున్నవి (అన్నము రక్తమై యీ రక్తమే స్త్రీ పురుషులయందు శుక్రశోణితములుగా పరిణమించి వాటి సంయోగమువలన భూతములు జనించును). అన్నము వర్షమువలన లభించును. వర్షముకురియుటకు యజ్ఞము కారణము. కర్మకాండ యజ్ఞములకాధారము. వేదము కర్మకాండ నాదేశించును. వేదము పరబ్రహ్మము నుండి వెలుబడినది. కావున నిత్యము చేయబడు యజ్ఞక్రియలయందు సర్వవ్యాపకుడగు పరమాత్మ సుప్రతిష్ఠుడై యున్నాడు.
అనగా ప్రతి యజ్ఞకర్మము స్వార్థరాహిత్యమలపచుటచే పరమేశ్వర స్థితికి సన్నిహితమొనర్చును. - భగవద్గీత
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః || – 14శ్లో
అధ్వర్యము - 1.హింసారహితము, 2.సావధానము, వి.1.యజ్ఞము, 2.సోమయాగము, 3.ఆకాశము.
అధ్వరుఁడు - యాగమునందు యజుర్వేద తంత్రమును నడుపువాడు, రూ.అధ్వర్యుడు.
సప్తతంతువు - యజ్ఞము. యజ్ఞ మంటే పవిత్రమైన పని.
మఖము - యజ్ఞము; మఘము - యజ్ఞము.
మఖపంతుఁడు - ఇంద్రుడు; మఘవుడు - ఇంద్రుడు, మఘవంతుడు.
శతమన్యువు - ఇంద్రుడు వ్యు.నూరు యజ్ఞములు చేసినవాడు.
పురుహూతుఁడు - ఇంద్రుడు వ్యు.యజ్ఞము లందెక్కువగ పిలువ బడువాడు. ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
మఖము సేయ వజ్రి మది సంతసించును,
వజ్రి సంతసింప వాన గురియు
వాన గురియఁ గసవు వసుమతిఁ బెరుఁగును,
గసవు మేసి ధేనుగణము బ్రదుకు.
భా|| యజ్ఞం చేస్తే వజ్రయుధుడైన దేవేంద్రుడు(వజ్రి - 1.ఇంద్రుడు, 2.బుద్ధుడు, 3.ఆకుజెముడు.) సంతోషిస్తాడు. ఆయన హర్షిస్తే మేఘం(మేఘము - మబ్బు)వర్షిస్తుంది. వాన(వాన - వర్షము) కురిస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది. గడ్డిమేసి మన ఆలమందలు బ్రతుకుతాయి (గడ్డిమేసి ఆవులు పాలుయిస్తాయి).
క్రతు రాజము - రాజసూయ యాగము.
రాజసూయము - ఒక రాజు తక్కిన రాజుల గెలిచి చేసెడు యజ్ఞము. రాజసూయ యాగంలో ప్రధాన దేవత వరుణుడు.
రత్నిన్ - ప్రాచీనార్యుల కాలమున రాజసూయ యాగము చేయునపుడు రాజుతో సమానముగా కొన్ని యజ్ఞ విధులందు పాల్గొను అధికారులు. (సేనాని, గ్రామణి, భాగదూఘ, క్షత్రియ, గోవి కరతనుడు, పాలగాలుడు, తక్షుడు, రథకారుడు మొ||) ఆహవము - 1.యుద్ధము, 2.యజ్ఞము.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
క్రతువు - యజ్ఞము.
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుదిండి, రూ.క్రతుభుక్కు.
ౙన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
వేలుపు - 1.దేవత, దేవతా స్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
తొలివేలుపు - 1.బ్రహ్మ, 2.అసురుడు, 3.పూర్వదేవుడు.
దైతేయుడు - దితికొడుకు, తొలివేల్పు రూ.దైత్యుడు.
దైతేయుఁడు - దితికొడుకు, తొలివేల్పు, రూ.దైత్యుడు.
దైత్యారి - విష్ణువు. విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, 2.వేలుపు, 2.సూర్యుమండలాంతర్గత విష్ణువు.
అమర్త్యుఁడు - దేవత, వేల్పు, విణ.చావు లేనివాడు.
అమరుఁడు - 1.దేవత, 2.అమర సింహుడు (సంస్కృత నిఘంటు కర్త.), విణ.మరణము లేనివాడు.
త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు - వేలుపు; సుపర్వుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
త్రిదివము - స్వర్గము.
చంద్రుఁడు వృద్ధిపొందే(శుక్ల) పక్షమునందలి కళలచే దేవతలకూ, కృష్ణపక్షము నందు క్షీణ కళలచే పితృదేవతలకు ప్రీతి కలిగిస్తుంటాడు. హాని వృద్ధులు చంద్ర కళలకే గాని చంద్రునికి లేవు.
ఋతము - 1.సత్యమైనది, 2.పూజింపబడినది, 3.ప్రాప్తము, వి.1.జలము, 2.సత్యము, 3.మోక్షము, 4.యజ్ఞము.
ఋతంభరుఁడు - 1.సత్యపాలకుడు, 2.పరమేశ్వరుడు.
ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
దైవాధీనం జగత్సర్వం సత్యాధీనంతు దైవతమ్|
తత్సాత్య ముత్తమాధీనం ఉత్తమో మను దేవతా||
తా. ఈలోకమంతయు దైవాధీనమైయున్నది, ఆదైవము సత్యమున కాధీనమై యున్నది, ఆ సత్యము ఉత్తముల యందున్నది, కాబట్టి ఆ ఉత్తమభక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను. - నీతిశాస్త్రము
అగ్నిహోత్రము, మౌనము, వేదాధ్యయనము, యజ్ఞము - ఈ నాలుగు కర్మలు మనుష్యుని భయవిముక్తుని చేస్తాయి. వానిని సక్రమంగా శ్రద్ధగా చేయక, అభిమాన పూర్వకంగా అనుష్ఠించితే నిర్భయయానికి బదులు భయం కూడా కలిగిస్తుంది.
బ్రహ్మయజ్ఞము - వేదపాఠము.
పాఠము - 1.చదువు, 2.వేదపాఠము.
ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.
పఠనము - చదువు.
విద్దె - చదువు, విద్దియ, సం.విద్యా.
విద్య - 1.చదువు, 2.జ్ఞానము. మంచి విద్య గలిగిన ధనము పనిలేదు.
జ్ఞానము - 1.తెలివి(వివేకము, ప్రకాశము), 2.ఎరుక. (జాతీ. ఎరుక పిడికెడు ధనము - దాచుకొన్న సొమ్ము.)
సంత - 1.నిర్ణయింపబడిన దినమున నుంచెడుబజారు, 2.వేదపాఠము, వి.చెంత. చెంత - చేరువ, సమీపము.
తొలిచదువులు - వేదములు.
పాఠో హోమ శ్చాతి థీనాం సపర్యా తర్పణం బలిః,
ఏతే పఞ్చ మహాయజ్ఞా బ్రహ్మయజ్ఞాది నామకాః. :
పాఠదయః బ్రహ్మయజ్ఞాదినామకాః పంచ మహాయజ్ఞాస్స్యుః. - వేదపాఠము, వైశ్వదేవాది హోమము, అతిధిపూజ, పితృతర్పణము, భూతబలి అను నీ ఐదు(5)ను పంచమహా యజ్ఞము లనంబడును.
మహాఫలయజ్ఞ త్యాన్మహాయజ్ఞాః. పంచచ తే మహాయజ్ఞాశ్చ పంచమహాయజ్ఞాః. - గొప్ప ఫలముగలవి పంచ మహా యజ్ఞములు 'పూజా, సప, ర్యాధ్యయనం, బ్రహ్మ, యజ్ఞస్తు, తర్పణమ్, హోమో, దైవోబలి, ర్భౌతో, నృ యజ్ఞఓ తిథిపూజన ' మితి స్మృతిః.
ఇవి పంచమహాయజ్ఞములు - వేదపాఠము, బ్రహ్మయజ్ఞము, హోమము, దేవయజ్ఞము, అతిథిపూజనము, మనుష్యయజ్ఞము, పితృతర్పణము, పితృయజ్ఞము, భూతబలి, భూతయజ్ఞము ఇవి.
ౘదువులవేలుపు - బ్రహ్మ.
ౘదువుల ముదకుఁడు - బ్రహ్మ.
ౘదువులపడతి - సరస్వతి. పడఁతి - స్త్రీ, రూ.పణఁతి.
ౘదువులయ్య - ఉపాధ్యాయుడు.
ఉపాధ్యాయుఁడు - చదువు చెప్పువాడు.
చదువు పేదవానికి పెన్నిధి, సంపన్నునికి గౌరవం, యువతకు బలం, ముసలివారికి ఆసరా. - లావెటర్
అధ్యాపనము - వేదమును చదివించుట.
అధ్యాయము - 1.చదువుట, 2.వేదపఠనార్హ కాలము, వ్యతి.అనధ్యాయము, 3.వేదపాఠము, 4.గ్రంథభాగము.
అధ్యయనము - 1.గురుముఖమున వేదము చదువుట, 2.చదువుట.
అధ్యాపకుఁడు - 1.వేదములను చదివించువాడు, 2.చదువు చెప్పువాడు, గురువు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
అధ్వము - 1.దారి, 2.దూరము, 3.పయనము, 3.వేదశాఖ, 5.కాలము, 6.ఆకాశము, 7.పయనమునందు ఆగెడి స్థలము, 8.ఉపాయము.
అధ్వనీనుఁడు - 1.ప్రయాణము చేయుటకు సమర్థుడు, వేగముగా పయనము చేయువాడు, 2.బాటసారి.
అధ్వగుఁడు - బాటసారి, వి.సూర్యుడు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడు విధములైన రక్షకము, రూ.ఏడ్గడ.
బ్రహ్మణ్యము - వేదపాఠభూమి.
బ్రహ్మాంజలి - వేదాధ్యయమున కాలమందలి మ్రొక్కు.
బ్రహ్మబిందువు - వేదపాఠమందలి నోటితుంపర.
బ్రహ్మభూయము - బ్రహ్మత్వము.
బ్రాహ్మ్యము - 1.ఒక తరగతి వివాహము, 2.బ్రహ్మత్వము.
బ్రాహ్మ్యము - బ్రహ్మ సంబంధమైనది, వి.విద్యయు నాచారమును గల వరుని పిలిచి వధూసహితముగ వస్త్రాదులచే నలంకరించి పూజించి, కన్య నిచ్చి చేయు వివాహము.
అగ్నిహోత్ర ఫలావేదా విత్తభుక్త ఫలంధనమ్|
రతిపుత్త్ర ఫలా దారాః శీలవృత్తి ఫలంశ్రుతమ్||
తా. వేదము చదివినందు కగ్నిహోత్రము చేయుటయును, ధనము కలిగినందుకు దానభోగములును, భార్యయున్నందుకు సంగమ సంతానములును, శాస్త్రమును విన్నందు కాచారవంతుడగుటయు ఫలము. - నీతిశాస్త్రము
చదువు వలననె జ్ఞానము కుదురుగాదు
సాధనం బున్న మాత్రనే చక్కనౌనె
మనసు నిలుపంగ నన్నియు ననువు గనును
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
పితృయజ్ఞము - తలితండ్రులకు చేయు అంత్యకర్మ.
శ్రాద్ధము - పితృకర్మము, వ్యు.శ్రద్ధతో కూడినది. విరచిత నిజపితృకర్మక రామ్|
శ్రాద్ధదేవుఁడు - యముడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ. జముడు.
కాలుఁడు - యముడు.
శని - నవగ్రహములలో ఏదవ గ్రహము (Saturn).
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః.
శమనుడు - యముడు.
తతో మమః శ్రాద్ధదేవః సంజ్ఞాయామాన భారత|
శ్రద్ధయాం జనయామాన దశ పుత్రాన్ స ఆత్మవాన్|
ఔర్థ్వదేహికము - చచ్చినవారికి చేయబడు కర్మకు సంబంధించినది.
అపరక్రియ - చచ్చినవారికై చేయు కర్మము.
ఆబ్ధికము - తద్దినము, మరణించిన వారికి ప్రతి సంవత్సరము అతిథియందు చేయు కర్మము, వ్యు.అబ్దమున కొకసారి చేయబడునది.
తద్దినము - 1.ఆదినము, 2.మృతి పొందిన దినము, 3.అబ్ధికము పెట్టుదినము.
తార్వణము - పిండప్రదానము, విణ.సర్వసంబంధమైనది.
నివాపము - పితరుల నుద్దేశించిన తిల తర్పణాది కర్మము, సం.వి. (జం.) మస్తిషములో దృక్ స్వాస్తికము వెనుక మధ్య మస్తిష్కము యొక్క అడుగు భాగము రెండు తమ్మెలు సొట్టపడి యుండు భాగము (Infundibulum).
నివాపరూపము - (జం.) గరాటు వలె నుండునది (Infundibuli form).
తర్పణము - 1.తృప్తి, 2.పితృయజ్ఞము.
తృప్తి - తనివి; తనివి - తృప్తి, రూ.తనివు.
తనుపు - తనియచేయు, వి.1.తనివి, 2.శైత్యము, 3.శైత్యోపచారము, 4.పితృయజ్ఞము, 5.తడి(ఈమిరి - తడి).
తనివోవు - తృప్తిపడు.
శైత్యము - 1.చలువ(ౘలువడి - చలువ), 2.జలుబు.
ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి.
ౘల్లన - శైత్యము, విణ.శీతము.
ఇవక - శైత్యము, హిమము, సం.మిహికా.
ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ(దయ - కనికరము), 4.తృప్తి.
ఆదట2 - అనంతరము, పిమ్మట. అనుక్రోశము - కనికరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content).
వలి - 1.కంపము, 2.శైత్యము, సం.వి.కడుపుమీది ముడుత, ముడుత.
వలిమొలక - భీమసేనుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.
మారుతి - 1.స్వాతీ నక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
వలితండ్రి - ఆకసము. ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
మందాకిని - 1.గంగ, 2.అరువదేండ్ల స్త్రీ.
భాగీరథి - గంగ (వ్యు. భగీరథునిచే భూమికి తేబడినది).
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.
మిను(ౘ)చూలు - వాయువు.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది. కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
కొమరసామి - స్కందుడు. స్కందుఁడు - కుమారస్వామి.
ప్రాచీనవీతము - కుడిభుజము మీదుగా ఎడమపార్శ్వమున వ్రేలాడు జందెము (పితృ కర్మలలో ఇట్లు వేసికొందురు).
బద్దె - 1.వస్త్రము మొదలు, 2.అపరకర్మము చేయునపుడు జందెము వలె వేసికొను వస్త్ర ఖండము (బద్దియ), సం.వస్తిః, పట్టికా.
వస్తి - 1.బద్దె, 2.పొత్తికడుపు.
కవ్యము - పితృదేవతకిచ్చు అన్నము.
పొత్తర - 1.ఆకులు పూలు లోనగు వాని కట్ట, 2.పితృకార్యము లందు బ్రాహ్మణుల కిచ్చు బియ్యము మొ.వి గల విస్తరి, సం.పత్రమ్.
ఆమద్రవ్యములు - పొత్తర యందుంచు కాయగూరలు, బియ్యము, తాంబూలము మొ. వస్తుసముదాయము.
పలపైతృకము - శ్రాద్ధమున మాంసము నుపయోగించు పూర్వకాలపు కర్మ.
బ్రాహ్మణార్థము - పితృకార్యము లందు భోజనమునకు పోవుట.
భోక్త - 1.భుజించువాడు, 2.బ్రాహ్మణార్థము చేయువాడు.
సుకలుఁడు - దాతయు భోక్తయు నైనవాడు.
శ్రాద్ధం పితృభ్యో న దదాతి దైవతాని న చార్చతి |
సుహృన్మిత్రం న లభతే తనూహుర్మూఢచేతసమ్ ||
పితరులకు శ్రాద్ధం పెట్టడు. దేవతల్ని పూజించడు. మంచి హృదయం గల మిత్రుణ్ణి పొందడు. అలాంటివాణ్ణి మూడబుద్ధి అంటారు.
ఉద్వాహుఁడు - 1.పైకెత్తువాడు, 2.మోయువాడు, 3.పితృదేవతలను నరకము నుండి రక్షించువాడు, కుమారుడు.
పుత్రకామేషి - పుత్రునికోరి చేయు యాగము.
పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు:- ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు).
ఔరసుఁడు - ధర్మపతి యందు బుట్టిన కొడుకు.
ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కున్న - బిడ్డ, రూ.కున్నె, కూన, సం.కుణకః.
కున్నడు - బాలుడు, బిడ్డడు.
చిన్నవాడు - బాలుడు.
స్కందుఁడు - కుమారస్వామి; కొమరసామి - స్కందుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
లాలన వలన పుత్త్రుడును, దుష్టపుత్రుని వలన కులంబును నశించును.
లాలనము - బుజ్జగము, ముద్దుచేయుట.
లాలనము - అధికేచ్చ, ఔత్సుక్యము.
బు(ౙ)జ్జగము - ఇచ్ఛకము, ఉపలాలనము.
ఉపలాలనము - బుజ్జగించుట.
ఇచ్చ(ౘ)కము - 1.ముఖప్రీతి, ముఖస్తుతి, 2.ప్రియవచనము, విణ.ప్రియము, ప్రీతికరము.
ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చువెలగలది.
ప్రియంవదుఁడు - ఇచ్చక మాడువాడు, ప్రియవాది.
ఇచ్చకాలమారి - ఇచ్చకాలాడువాడు, ముఖస్తుతి చేయు స్వభావము కలవాడు.
ఇచ్చగొండి - ఇచ్చకాలమారి.
ముద్దాడు - చుంబనాది పూర్వకముగా లాలనచేయు, ఆదరించు.
చుంబనము - ముద్దు.
ముద్దు - 1.ప్రేమము, ఆదరము, 2.మనోజ్ఞత, 3.చుంబనము.
ముద్దయ్య - (ముద్దు + అయ్య) కుమారస్వామి.
రాజవత్సంచ వర్షాణి, దశవర్షాణి దాసవత్ |
ప్రాప్తేతు షోడశేషవర్షే పుత్త్రంమిత్త్ర సదాచరేత్ ||
తా. పుత్త్రుని యైదేండ్ల(5 సం.) పర్యంతము రాజువలెను, పిమ్మట పదేండ్ల(10 సం.) పర్యంతము దాసునివలెను, పదియాఱేండ్లు(16 సం.) మొదలుకొని స్నేహితుని వలెను చూడవలయును. - నీతిశాస్త్రము
అధ్వర్యము - 1.హింసారహితము, 2.సావధానము, వి.1.యజ్ఞము, 2.సోమయాగము, 3.ఆకాశము.
మన్యువు - 1.క్రోధము, 2.శోకము, 3.యజ్ఞము.
క్రోధము - 1.కోపము, రోషము 2.రౌద్రరస స్థాయిభావము.
అమర్షము - 1.కోపము, 2.ఓర్వలేమి, విణ.ఓర్వనిది.
ఓర్వమి - ఓర్వలేనితనము. ఈర్ష - ఓర్వలేనితనము, అసూయ.
ఈర్షాశువు - అసహనుడు, అసూయాగ్రస్తుడు, ఓర్వలేనితనము స్వభావముగా గలవాడు.
అసూయ - 1.గుణము లందు దోషమును ఆరోపించుట, ఓర్వలేనితనము, 2.కోపము.
కోపము - కినుక, క్రోధము. కినుక - అలుక, కోపము.
రోషము - 1.కినుక, రోసము.
అలుక - 1.కోపము, 2.ద్వేషము(ద్వేషము - పగ), 3.ద్రోహచింత, విణ.1.అల్పుడు, 2.గౌరవహీనుడు, రూ.అలుకవ.
కోప క్రోధామర్షరోష ప్రతిఘా రు ట్క్రుధౌ స్త్రియౌ :
కోపనం కోపః కుప ద్రోధే. - కోపించుట.
క్రోధేనం క్రోధః. క్రుధ క్రోధే - క్రోధించుట క్రోధము.
న మర్షణమర్షః. మృషు సహనే. - ఓర్వకుండుట అమర్షము.
లుప్యతే అనేనేతి రోషః రుష హింసాయాం - దీనిచేత హింసింపఁ బడును.
ప్రతిహంతీతి ప్రతిషుః హనహింసాగత్యోః. - సత్కర్మను జెఱుచునది.
రుప్యత ఇతి రుట్. ష-సీ. - రుష రోష రోషించుట.
క్రోధః. క్రుధ్. ధ. సీ. క్రుధరోషే - క్రోధించుట. ఈ ఏడు కోపము పేర్లు.
ఆగ్రహము - 1.కోపము, రోషము, 2.అనుగ్రహము(అనుగ్రహము - దయ, కరుణ.), 3.ఆక్రమణము, 4.ఆసక్తి.
కోపము - Anger, పైత్యమును హెచ్చించును; వాతము నణచును; రక్తమునకు వేడి బుట్టించును; శిరస్సునకు విస్తారముగ రక్తమును ప్రవహింపజేయును; క్షయ, కాస, శ్వాస, మొదలగు ననేకరోగములను బుట్టించును; అన్నిరోగములను బలపరచును; బుద్ధినిదానమును తగ్గించును; ఆయుక్షీణము జేయును.
క్రోధము శత్రువు వంటిది. క్రోధము(కోపము) సర్వలోకములను మ్రింగినను శమించదు. కోపము గుణదోషములను పాటించునది కాదు. శోకము సర్వము నాశనము చేసేస్తుంది. ధైర్యం కోల్పోతారు, బలం నశించిపోతుంది.
శోకము - దుఃఖముచే తపించుట, వగవు; వగవు - శోకము.
తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
శ్యామిక - చీకటి, నలుపు.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ - సూర్యుడు, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
ఉత్తమేక్షణ కోపన్స్యా న్మధ్య ఓ ఘటికా ద్వయమ్|
ఆధమేస్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతరమ్||
తా. కోప ము(ఉ)త్తమునియందు క్షణకాల ముండును, మధ్యముని యందు రెండు ఘడియలుండును, అధముని(అధముఁడు - తక్కువైన వాడు, నీచుడు)యందు నొక యహోరాత్ర ముండును(అహోరాత్రము - రేపగలు, ఎల్లప్పుడు), పాపిష్ఠియందుఁ జచ్చెడు(మరణించు) పర్యంత ముండును. – నీతిశాస్త్రము
అశ్వమేథము - అశ్వమును బలిపశువుగా చక్రవర్తి చేయు యజ్ఞము.
యాయావరము - 1.ధాన్యయాచన, 2.అశ్వమేధ పశువు.
చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు.
సార్వభౌముఁడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.
సమ్రాట్టు - చక్రవర్తి.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము.
గుఱ్ఱము - అశ్వము; అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
సప్తి - గుఱ్ఱము.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.
వీతయః అశ్వాః హోత్రం హవ్య మశ్వమేధే యస్య సః - అశ్వమేధము నందు గుఱ్ఱములు హవిస్సుగాఁ గలవాడు. అశ్వమేధక్రతు దీక్షిత రామా!
దరిద్రాయ కృతం దానం, శూన్య లింగస్య పూజనమ్|
అనాధ ప్రేత సంస్కారం అశ్వమేధ సమంవిదుః||
తా. దరిద్రుని కొఱకుఁ జేయఁబడిన దానము, పూజలేని లింగమునకు పూజ గలుగ జేయుట, దిక్కులేని శవమునెత్తి కాల్చుట ఈ మూడును అశ్వమేధ యాగమునకు సమానములు. - నీతి శాస్త్రము
గవాం లక్షసహస్రాణి ముక్తీభాగీ భవే న్నరః,
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః. - 15శ్లో
11. పుబ్బ-ఉత్తర - రెండేసి చొప్పున చతురస్రాకారముగా నాలుగు 4 నక్షత్రములుండును.
పుబ్బ - వి. పూర్వఫల్గుణీ నక్షత్రము, కి. పుబ్బె.
సాముకంటి చుక్క - పుబ్బనక్షత్రము.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు - ఆగస్ఠు August, సెప్టెంబరు September నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.
మఖా పంచకం సదా వంచకం. మఖ ఉరిమితే మదురుమీద కర్రైనా పండుతుండి. మఖ యురిమితే మదురుమీద మొక్కకూడ కాస్తుంది. మఖ పుబ్బ వొరుపైతే మహాక్షామము సిద్ధము.
పుబ్బ పుట్టెడు ధాన్యం చల్లడంకంటె మఖలో మానెడు గింజలు చల్లడం మేలు. పుబ్బలో చల్లడంకంటె దిబ్బలమీద వేయడం మేలు. పుబ్బలో పుట్టి మఖలో మాడినటులు.
పుబ్బరేగినా భూతురేగినా ఊరుకోదు. పుబ్బ కెరలితే భూతం కెరలి నటులు.
ఉత్తర ఉరిమి వర్షించినా పాముకరచినా ఊరికేపోదు. ఉత్తర చూసి ఎత్తరా గంప (అప్పటికీ వర్షం కురవకపోతే వలస వెళ్ళిపో). వర్షములు కురియక దుఃఖించి, తమకు తాము చత్తురు. కన్నకడుపున చిచ్చు రగిలిన కరవున పాలవును దేశం.
వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరద పారు
వరద కరవు రెండు వరుసతో నెరుగుడీ విశ్వ.
తా|| వాన కురియనిచో కరువువచ్చును, వాన కురిసిన వరద వచ్చును. వరదా కరువు రెండునూ వచ్చిన నష్టము సంభవించును కదా.
గవాం పతిః ఫల్గునీనామసి త్వమ్ | తదర్యమన్ వరుణమిత్ర చారు | తం త్వా పయగ్ం సనితారగ్ం సనీతామ్ | జీవా జీవంతముప సంవిశేషు | యేనేమా విశ్వా భువనాని సంజితా | యస్య దేవా అనుసంయంతి చేతః | అర్యమా రాజా జరస్తు విష్మాన్ | ఫల్గునీనామృషభో రోరవీతి ||9||
పుబ్బ - పూర్వఫల్గుణీ నక్షత్రము, కి. పుబ్బె.
సాముకంటి చుక్క - పుబ్బనక్షత్రము.
సాము - 1.సగము, 2.వ్యాయామము, స.1.సామి, 2.శ్రమః.
సగము - 1.స్వామి, 2.అర్ధము, రూ.సవము, సాము, సం.సామి.
సవము - సగము, సం.సామి.
సవము - యజ్ఞము, జన్నము.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము, ఇవి పంచ యజ్ఞములు), వికృ.జన్నము.
యాగము - యజ్ఞము.
యజ్ఞపురుషుఁడు - విష్ణువు.
ౙన్నము - యజ్ఞము, వేలిమి, హోమము, వ్రేల్మి, సం.యజ్ఞః.
ౙన్నపుఁజుక్క - మఘానక్షత్రము.
కంటిపాప - కంటి నల్లగ్రుడ్డులోని చుక్క, (ఈ ద్వారముననే వెలుగు లోపలికి ప్రవేశించును) (Pupil).
(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువరి యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
సామి -1.స్వామి, 2.రాజు, 3.పెనిమిటి, 4.కుమారస్వామి సం.స్వామి.
స్వామి - 1.ఒడయడు, 2.కుమారస్వామి, విణ.అధికారి.
ఒడయఁడు - 1.మగడు, 2.ప్రభువు, రూ.ఒడయుఁడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
మనుష్యుడు - మానిసి, మానవుడు.
మానిసి - 1.మనుష్యుడు, 2.పురుషుడు, 3.స్త్రీ, 4.భటుడు.
మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జనించిన వాడు.
వల్లభుఁడు - ప్రియుడు, స్వామి.
వల్లభము - మేలుజాతి గుఱ్ఱము, విణ.ప్రియమైనది.
ప్రియుఁడు - ప్రాణనాథుడు; జీవితేశుఁడు -1.ప్రాణనాథుడు, 2.యముడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
రాట్టు - రేడు; ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
రాచ - రాజ సంబంధి, సం.రాజన్.
రాజకము - 1.రాజసమూహము, 2.క్షత్రియ జాతి సమూహము.
రాజన్యుఁడు - క్షత్త్రియుడు; క్షత్త్రియుఁడు - రాచవాడు.
క్షత్రియాణి - క్షత్త్రియ స్త్రీ, రూ.క్షత్త్రియ, క్షత్రియక.
క్షత్త్రియి - క్షత్రియుని భార్య.
క్షత్త్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు. అధికుఁడు - గొప్పవాడు.
అధిపుడు - ప్రభువు, అధిపతి.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోదనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సామాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
ఇందుఁడు - చంద్రుడు.
చంద్రుడు - నెల, చందమామ.
చందిరుడు - చంద్రుడు; చంద్రముఁడు - చంద్రుడు.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలకువ - స్థానము.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.
నెలకూన - 1.బాలచంద్రుడు, 2.నఖిక్షతము.
నెలవంక - బాలచంద్రుడు.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
నెలమేపరి - రాహువు.
రాహువు - ఒక ఛాయగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.
కృష్ణవర్త్మ - 1.అగ్ని, 2.రాహుగ్రహము, విణ.దురాచారుడు.
రాజ్యాంగములు - (రాజ.) రాజు, మంత్రి, చెలికాండ్రు, భండారము, పట్టణము, కోట, సైన్యము అనునవి ఏడు.
క్రతు రాజము - రాజసూయ యాగము.
రాజసూయము - ఒక రాజు తక్కిన రాజుల గెలిచి చేసెడు యజ్ఞము. రాజసూయ యాగంలో ప్రధాన దేవత వరుణుడు.
రత్నిన్ - ప్రాచీనార్యుల కాలమున రాజసూయ యాగము చేయునపుడు రాజుతో సమానముగా కొన్ని యజ్ఞ విధులందు పాల్గొను అధికారులు. (సేనాని, గ్రామణి, భాగదూఘ, క్షత్రియ, గోవి కరతనుడు, పాలగాలుడు, తక్షుడు, రథకారుడు మొ||)
రాజ్యానికి రాజు, జగానికి చంద్రుడు. రాజెంతో ప్రజా అంతే. రాజాధి రాజైనా తల్లితండ్రులకు కుమారుడే.
రాజన్నము - 1.రాజవము, ఒకరకమైన వరిధాన్యము, 2.రాజులు భుజింపఁ దగిన అన్నము.
ధవుడు - 1.పెనిమిటి, 2.రాజు. నాధుడు - 1.పెనిమిటి, 2.రాజు.
జామాత - 1.అల్లుడు, 2.పెనిమిటి.
అల్లుఁడు - 1.కూతుమగడు, 2.మేనల్లుడు, రూ.అల్లువాడు.
అల్లువాఁడు - అల్లుఁడు.
ధవః ప్రియః పతిర్భర్త -
ధునోతి స్త్రియం దవః ధూఞ్ కంపనే. - స్త్రీని కంపించువాఁడు.
ప్రీణాతి ప్రియః ప్రీఞ్ ప్రీణనే. - ప్రేమించువాడు.
పాతీతి పతిః పా రక్షణే. - రక్షించువాఁడు.
బిభర్తీతి భర్తా. ఋ. వు. డు భృఞ్ ధారణపోషణయోః. - భరించువాఁడు. ఈ నాలుగు మగని పేర్లు.
దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
ఏలిక - 1.రాజు, యజమానుడు.
యజమానుఁడు - 1.గృహపతి, 2.యజ్ఞకర్త.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః.
భర్త - మగడు(పరిణేత - మగడు), విణ.ప్రోచువాడు.
ప్రోచు - అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.
ఏలినవాఁడు - ఏలిక, రాజు.
ఏలికసాని - దొరసాని, రాణి.
దొరసాని - రాణి; రాజ్ఞి - రాణి; రాణి - రాజ్ఞి, భార్య.
దేవేరి - 1.దేవి, 2.దొరసాని, రూ.దేవేరి, సం.దేవేశ్వరి.
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దయిత - 1.భార్య, 2.స్త్రీ. పత్ని - భార్య.
మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కుల స్త్రీ.
పతింవర - తనంతట మగని వరించునట్టి ఆడుది.
శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
వీరుఁడు - శూరుడు. ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
ప్రగల్భుఁడు - ప్రౌఢుడు.
ప్రోడ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రౌఢ - పదునెనిమిదేండ్లకు పైబడిన వయస్సుతోడి సంపూర్ణ యౌవనము గలది.
ప్రౌఢము - 1.పెరిగినది, 2.వయస్సు వచ్చినది, 3.నేర్పుగలది.
ప్రౌఢి - 1.సామర్థ్యము, 2.నేర్పు, 3.వృద్ధి, 4.గర్వము.
ప్రావీణ్యము - నేర్పు; పటిమ - నేర్పు, సామర్థ్యము.
ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion ).
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి.
సమర్థుఁడు - నేర్పరి; నిష్ణాతుఁడు - నేర్పరి.
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice).
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 2.శ్రీకృష్ణ భగవానుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్రుడు, దేవసేనాపతి. వికృ.కొమరసామి.
స్కందుఁడు - కుమారస్వామి.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు, కుమారస్వామి. సదా బాలత్వాత్ కుమారః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాడు. స్వామిమలై క్షేత్రంలో కుమారస్వామిని గురునాథుడని పిలుస్తారు.
స్వామినో దేవృదేవరో :
భ్రాతృజాయాభిస్సహ పరిహాసేన దీవ్యతి క్రీడతే దేవా. ఋ. పు. దేవరవ్చ - అన్నదమ్ములభార్యలతో పరిహాసముచేఁ గ్రీడించువాఁడు.
ఈ ఒకటి మగనితోఁ బుట్టినవారు, బావలు, మఱఁదులును(మరుదులు).
స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః|
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||
తరలాక్షుడ యెడ నెన్నఁడుఁ
జరుగకు గహనాంతర స్థ * లాదుల కొంటిన్;
పరికించి నిరీక్షించిన
నురు దోషం బనుచుఁ దలఁపు * చుండు కుమారా!
తా. స్త్రీలను జూచి వారిదగ్గర నెగతాళిగ మాటలాడవలదు. బాగుగా యోచించి చూచినయెడల నిది గొప్ప దోషమని తలంపవలయును.
అర్దము - 1.సగము, 2.తునక, విణ.అసంపూర్ణము, ఖండము.
అసంపూర్ణము - (గణి.) సంపూర్ణముకానిది (Partial).
అసంపూర్ణసంధి - (జం.) రెండు ఎముకలు కలిసినచోట మధ్య ఒకపొర మృదులాస్థి ఉండుటచే కొంచుముగా కదల్చుటకు అవకాశము గల కీలు, ఉదా.అంసచక్రము, నితంబమేఖలము లందలి ఎముకలు (Imperfect joint).
తుంట - 1.తునక, 2.చెరకు, రూ.తూఁట వై.విణ. దుష్టుడు, తుంటరి.
తుంటవిలుకాఁడు - మన్మధుడు, రూ. తుంటవిలుకాడు, తుంటవిల్తుఁడు.
అర - 1.సగము, 2.కొంచెము, 3.గది, 4.పెట్టె మొ.ని లోపలి గది, సం.అర్ధమ్.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, అఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా ఖండములు).
(గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన వృత్త భాగము, ఒక ఘనతలముచే ఛేదింపబడిన ఘనరూపభాగము.
(భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్నభిన్నముగ చేయబడని భూభాగము.
బిల్ల - 1.ఖండము, 2.సూర్యచంద్రుల బింబము, 3.గుండ్రని తలగడ, 4.మెడ లోనగుచోట్ల లేచు నెత్తురుగడ్డ, 5.తపాలుబిళ్ళ.
బిల్లిక - సూర్యచంద్రుల బింబము.
భిత్తం శకలఖణ్డే వా పుంస్యర్దః :
భిద్యత ఇతి భిత్తం, భిదిర్ విదారణే - వ్రక్కలింపఁబడునది.
శక్తతే భేత్తుమితి శకలం ! ప్న. శక్ శక్తౌ - భేదింప శక్యమైనది.
ఖండ్యత ఇతి ఖండం. ప్న. ఖడి ఖండనే - త్రుంచఁబడునది.
అర్ధతి భేదం గచ్ఛతీత్యర్ధః. పు. అర్ధగతౌ - భేదమును బొందునది.
ఋద్యతే సముదాయో నేనేతి అర్ధః, ఋధి వృద్దౌ - దీనిచేత సముదాయము విభజింపఁబడును. తునక పేర్లు.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షి ముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుండి - 1.ఉరుకు బొడ్డు రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
ముఖపాకము - (గృహ.) నాలుక పూత(Red-tongue) విటమిన్ బి 'B12 లేక విటమిన్ డి 'D లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).
ప్రతిబంధము చేయు వ్యాధులు - (గృహ.) వ్యాధులు రాకుండ తప్పించుట, ఆహారలోపము వలన కలుగు వ్యాధులు రాకుండ తప్పించుకొనుట (Preventable diseases) ఉదా.(Deficience diseases) ఎఱ్ఱనాలుక, కండ్లజబ్బు మొదలగునవి.
నోరు - 1.ముఖద్వారము, 2.వదనము.
వదనము - నోరు, ముఖము.
మొకము - ముఖము, సం.ముఖమ్.
లననము - 1.ముఖము, 2.నోరు, 3.మాట.
మాట - 1.పలుకు, వచనము, 2.నింద, వృత్తాంతము.
వా - నోరు, వాదర, రూ.వాయి, సం.వాక్.
వాదర - (వాడి+దార) కత్తి యొక్క పదునుగల అంచు.
వాయి - 1.నోరు, ముఖము, 2.ఖడ్గధార, సం.వాక్.
వాతప్పు - (వాయి+తప్పు) నోట వెలుబడిన తప్పుమాట.
నోరు మంచిదైతే ఊరు మంచిదే. నోరుంటే తల గాస్తుంది. ముఖమునకు అలంకారము సత్య వాక్కు.
మోము - మొగము, సం.ముఖమ్.
ఏనుఁగు మోముసామి - గజాననుడు రూ.ఏనుగు మొగముసామి.
గజవదనుడు - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు - వినాయకుడు.
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
పంచముఖుఁడు - శివుడు, (ఐదు మోముల వేలుపు).
పంచాననుఁడు - శివుడు, వ్యు.ఐదు మొగాలు కలవాడు.
ఐదుమోముల వేలుపు - పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.
ఇమ్ముగ చదువని నోర్ను
అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్
తమ్ముల పిలువని నోరును
కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ.
తా. చక్కగా చదువనినోరు, అమ్మా! అని ప్రియమార తల్లిని పిలిచి అన్నము అడగనినోరు, తోడబుట్టిన వారిని పలుకరించనినోరు, నోరుకాదు. అది కుమ్మరీవాడు మన్నుకొఱకు తీసిన గొయ్యతో సమానం.
వ్యాయామము - 1.క్రమము, 2.సాము, 3.నిలువు, 4.బార.
క్రమము - 1.విధము, 2.వరుస, సొరిది, 3.విధి, 4.క్రమాలంకారము.
వాదిరి - క్రమము, ఉత్కర్షము విణ.అధికము.
ఉత్కర్షము - 1.మేలు, 2.అతిశయము, 3.అభివృద్ధి.
మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.
శరీరానికి వ్యాయామము ఎలాంటిదో మనసుకి చదవడం అలాంటిది.
శ్రాంతి - ఊరట, విశ్రాంతి, అలసట.
ఊరట - 1.విశ్రాంతి, విరామము 2.ఊరడించుట, 3.స్వస్థి చిత్తత, విణ.విశ్రాంతి నిచ్చునది.
విశ్రాంతి కొరకు ఆరాటపడి మానవులు అలసిపోతూ వుంటారు. - లారెన్స్ స్టెరెన్
ఆయాసము - 1.శ్రమము, 2.ఉత్సాహము, 3.పరితాపము.
శ్రమము - 1.అలసట, 2.అలవాటు, 3.సాము.
సేద - శ్రమము, బడలిక(బడలిక – అలసట), సం.స్వేదః.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసస్థాయి, 6.ఆస్థ.
ఉత్సవము - 1.ఊరేగింపు, 2.పండుగ, 3.కోపము, 4.గర్వము.
పబ్బము - 1.పండుగ, ఉత్సవము, 2.అతిథ్యము.
శ్రమదానము - సాంఘికాభివృద్ధి కార్య క్రమములలో నిస్ప్వార్థముగ కాయ కష్టము చేయుట.
ఉత్సవే వ్యసనే చైవ దుర్భిక్షే శత్రు నిగ్రహే,
రాజద్వారే శ్మశానే చ యస్తిష్ఠంతి సబాంధవః|
తా. సంతోషంతో పండుగలు చేసుకుంటున్న సమయంలో, దుఃఖంలో ఉన్నపుడు, కరువు వచ్చినపుడు, శత్రువులతో యుద్ధంలో పోరునపుడు, రాజద్వారంలో(ద్వారము - 1.వాకిలి 2.ఉపాయము), శ్మశానంలో ఎవరైతే తోడుగా ఉంటారో వారే నిజమైన బంధువులు.
కాశి - 1.వారణాసి, 2.ప్రకాశము, 3.సూర్యుడు, 4.అలసట.
వారణాసి - కాశి, కాశివిశ్వేశ్వరుడు.
వారణాసి యందు దేవీస్థానం విశాలాక్షి (సతిదేవి ముఖం పడిన చోటు వారణాసి. అక్కడ ఉండే గౌరికి విశాలాక్షి అని పేరు).
విశ్వనాథుడు - కాశీక్షేత్ర వాసియగు శంకరుడు.
సానన్ద మానన్దవనే వసన్త - మానన్దకన్దం హతపాప బృన్దమ్|
వారాణసీనాథ మనాథనాథం - శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.
పెనుమసనము - (పెనువు+మనసము) కాశి, వారణాసి(హిందువుల పుణ్యక్షేత్రము).
పెనువు - పెంపు, అధిక్యము, వృద్ధి.
పెంపు - 1.సమృద్ధి, 2.నాళము, 3.గౌరవము, 4.మహత్త్వము, 5.నాశముచేయు, సం.1.వృధ్, 2.భంజ్.
సమృద్ధి - 1.మిక్కిలి సంపద, 2.నింపు, 3.అభివృద్ధి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనక్రోవి.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పతనము, 3.మన్నన.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
వడ్ది - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి - (గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరివద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చెల్లించు అధికద్రవ్యము (Interest).
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్దితో జీవనము చేయుట.
ఆఢ్యుడు - ధనికుడు, సమృద్ధికలవాడు.
వడ్డికాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
బాలాజీ - శ్రీ తిరుపతి వేకంటేశ్వరస్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలా.
క్షత్రియం చైవసర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం,
నామ మశ్యేత వైభూష్ణుః కృశానపి కదాచనః ||
తా. అభివృద్ధిగాఁ గల నరుఁడు రాజును, పామును, బ్రాహ్మణుని, పండితుని, కృశించినవారలను వీరల నొకప్పుడు అవమానించ రాదు. (బ్రాహ్మణులను అవమానము చేసిన ఆయుస్సు నశించును, నీతి లేకపోవుట వలన సమృద్ధి నశించిపోవును.) - నీతిశాస్త్రము.
మసనము - శ్మశానము, సం.శ్మశానమ్.
శ్మశానము - మసనము, ప్రేతభూమి. రుద్రభూమి - శ్మశానము.
శ్మశానవైరాగ్యము - (జాతీ.) శ్మశానమున నిలిచినప్పుడు కలుగు వైరాగ్యము (ఆ వైరాగ్యము తరువాత నిలువదు. ఇట్లే ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము అను వానిని చెప్పుదురు).
ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
12. ఉత్తరఫల్గుని - పండ్రెండవ నక్షత్రము.
ఉత్తర - 1.ఉత్తర ఫల్గునీ నక్షత్రము, 2.ఉత్తరదిక్కు, 3.విరటుని కూతురు.
నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు - ఆగస్ఠు, సెప్టెంబరు నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.
పుబ్బ-ఉత్తర రెండేసి చొప్పున చతురస్రాకారముగా నాలుగు 4 నక్షత్రము లుండును.
దుర్భర బాణము రాఁగా
గర్భములో నుండి యభవ ! గావు మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.
తా. కృష్ణా ! వచ్చిన బాణమునకు భీతిల్లి ఉత్తర గర్భమందుండి ' కృష్ణా కావుమని ' వేడగా, అభిమన్యుని కుమారుఁడగు పరీక్షిత్తుని గాపాడితివి, నీవు(అచ్త్యుతుఁడు - విష్ణువు.)ఆర్తత్రాణ పరాయణుఁడవు.
శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి | తత్త్వా విదుః ఫలునీస్తస్య విత్తాత్ | అస్మభ్యం క్షత్రమజరగ్ం సువీర్యమ్ | గోమదశ్వవదుపసన్నుదేహ | భగోహ దాతా భగ ఇత్ప్రదాతా | భగో దేవీః ఫల్గునీరావివేస | భగస్యేత్తం ప్రసవం గమేమ | యత్ర దేవైస్సధమాదం మదేమ ||10||
ఫల్గునుఁడు - అర్జునుడు. హిమాలయ శిఖరం మీద ఉత్తరఫల్గుని నక్షత్రంలో అర్జునుడు జన్మించాడు. (ఫల్గుణసఖః, హనుమంతుడు)
అర్జునుఁడు - 1.పాడవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
గయ - ఫల్గునీ నదీ ప్రాంత నగరము, బీహారు రాష్ట్రము నందలి ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రము (గయలో దేవిష్థానం మంగళ).
ఫాల్గునము - పండ్రెండవ మాసము.
స్యాత్తపస్యః ఫాల్గునికః :
తపసి సాధుః తపస్యః - తపస్సునందును యోగ్యమైనది.
ఫల్గునీ నక్ష్త్రయుక్తా పౌర్ణమాసీ ఫాల్గునీ. సా స్మిన్నితి పాల్గునః - ఉత్తర ఫల్గునీ నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు గనుక ఫాల్గునము.
ఫాల్గునికశ్చ - ఫాల్గునికము.
క్రతునామంబు ధరించియుఁ
జతురతఁబలించుచుండుఁ జాతుర్య కళా
రతుఁడై సహస్ర కిరణుఁడు,
మతియుతు లౌననఁ దపస్యమాసము లీలన్.
అందు వర్చసుండు భరద్వాజుండు పర్జ్యనుండు సేనజిత్తు విశ్వుం డైరావతుం డనువారలతో నెనసి కాలయాపనంబు సేయుచుండు.
భా|| ఫాల్గుణ మాసంలో సహస్ర కిరణుడైన సూర్యుడు చాతుర్యకళా కేళీలోలుడై బుద్ధిమంతులు ప్రశంసించునట్లుగా క్రతు(క్రతువు - యజ్ఞము)వన్న పేరు పెట్టుకుని కాలాన్ని పరిపాలిస్తాడు.
ఆ సమయంలో వర్చసుడు, భరద్వాజుడు, పర్జన్యుడు(పర్జన్యుఁడు – వర్షాధిపతి), సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు అనేవారు అతనిని పరిచరిస్తుంటారు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
క్రతుధ్వంసి - శివుడు, వ్యు.దక్ష యజ్ఞమును నాశము చేసినవాడు.
ౙన్నపుగొంగ(గొంగ - శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.
వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తెనమోనమః
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ ||
క్రతుభుజుఁడు - వేలుపు, జన్నపుదిండి, రూ.క్రతుభుక్కు.
ౙన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
వేలుపు - 1.దేవత, దేవతా స్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు - వేలుపు; సుపర్వుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
త్రిదివము - స్వర్గము.
ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, 2.వేలుపు, 2.సూర్యుమండలాంతర్గత విష్ణువు.
ఉప ర్యుదీచ్య శ్రేష్ఠే ప్వ ప్యుత్తర స్స్యాత్ :
ఉత్తర శబ్దము మీఁదికిని, ఉత్తరదేశము మొదలయినదానికిని, శ్రేష్ఠునికిని పేరు. అపిశబ్దము వలన ప్రత్యుత్తరమునకును పేరు. ఉదా. మీఁదికి-'ఇత ఉత్తరం.' ఉత్తరదేశమునకు - 'ఉత్తరే కుబేరః' అని. అతిశయే నోద్గత ముత్తరం - మిక్కిలి కనిపించునది. "ది శ్యుత్తరా స్త్రియాం పుంసి విరాటనయే పి చ, ఉత్తరం ప్రతివాక్యే స్యా"దితి శేషః.
ఉత్తరుఁడు - శ్రేష్టుడు, 1.శివుడు, 2.విష్ణువు, 3.విరటుని కొడుకు. ఉత్తర కుమారుడు, విరాటరాజు కుమారుడు, మహా రథసారధి.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు. త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచెలి - కుబేరుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
హర్యక్షుడు - కుబేరుడు, ఉత్తరదిక్పాలకుడు, అతి ధనశాలి.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత(దాత - ఇచ్చువాడు).
శ్రీదుఁడు - కుబేరుడు; ధనాధిపుఁడు - కుబేరుడు.
వైశ్రవణుఁడు - కుబేరుడు; నరవాహనుఁడు - కుబేరుడు.
విడువరి - పరిత్యాగశీలుడు, వదాన్యుడు, దాత.
వదాన్యుఁడు - మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉత్తంసుఁడు - గొప్పవాడు.
ఉదారుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.
మహనీయుఁడు - గొప్పవాడు; అలఘుఁడు - గొప్పవాడు.
మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.
ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.
దాతదరిద్రః కృపణోధనాఢ్యః, పాపీచిరాయుస్సు కృతీగతాయుః|
రాజాకులీన స్సుకులీనసేవ్యః, కలౌయుగే షడ్గుణ మాశ్రయంతి|
తా. దాతయైనవాఁడు దరిద్రుఁడౌట, లోభి ధనాఢ్యుడౌట, పాపి ధీర్ఘాయుష్మ తుడౌట, పుణ్యాత్ముఁడు అల్పాయుష్కుండౌట, హీనకులుడు రాజౌట, శ్రేష్ఠకులుడు సేవకుడౌట, ఈ యాఱు గుణములు కలియుగము నందు కలిగియున్నది. - నీతిశాస్త్రము
పుష్పకము - 1.కుబేరుని విమానము, 2.రత్నకంకణము, వి.(వృక్ష.) ముండక పుష్పమంజరిలోని పూవు (Floret).
యక్షుఁడు - 1.కుబేరుడు, 2.ఒక దేవ జాతివాడు.
యుక్షరాట్టు - 1.జక్కులరేడు, 2.కుబేరుడు.
ౙక్కులఱేఁడు - కుబేరుడు.
ౙక్కులు - యక్షులు, దేవతలలో నొక తెగ.
ౙక్కిణి - 1.యక్షిణి, 2.కుబేరుని భార్య, 3.లోకాంతర మొంది దేవత్వము పడసిన ముత్తైదువ.
యక్షిణి - 1.గతించిన వృత్తాంతములదెల్పు విద్య, 2.కుబేరుని భార్య, 3.యక్షుని భార్య.
ఋద్ధి- 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము 5.కుబేరుని భార్య. అష్టలక్ష్ములలో ఉత్తర దిశలో ధనలక్ష్మి ఉంటుంది.
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
ఉత్కర్షము - 1.మేలు, 2.అతిశయము, 3.అభివృద్ధి.
మేలు - 1.క్షేమము, శుభము 2.వలపు 3.పుణ్యము, సుకృతము 4.లాభము. శ్రేయము - 1.శుభము 2.ధర్మము, రూ.శ్రేయస్సు. పుణ్యము - 1.ధర్మము 2.సుకృతము. పుణ్యము కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు.
సుకృతపత్ని కీర్తి : కీర్తికి మన్నన లేకపోతే లోకానికి సుడి.
సుడి - 1.జలావర్తము, నీటిసుడి(సుడిగుండము) 2.రోమావర్తము, వెండ్రుకలసుడి 3.అనిలావర్తము, గాలిసుడి(వాత రోగము).
ధర్మానికి అధారం దయ. ఎంత చిన్న సాయమైన అవసరానికి ఆదుకునేదైతే దాని ద్వారా వచ్చే పుణ్యం అనల్పమైన ఫలాన్ని ఇస్తుంది.
అంశము - 1.భాగము, పాలు, వంతు 2.విషయము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
రాజవత్పుత్త్ర దారాశ్చ భాగ్యావంతం త్రబాంధవాః|
ఆచార్య వత్సభామధ్యే భాగ్యవంతం స్తువంతిహి||
తా. లోకమునందు భాగ్యవంతుని తన భార్యాబిడ్డలు ప్రభువు వలె జూతురు. చుట్టములు, స్నేహితులు యజమానునివలె భావింతురు, ప్రభువులు సభయందు ఆచార్యునివలెఁ జూతురు. కావున భాగ్యము గలవాఁడే గొప్పవాఁడు. – నీతిశాస్త్రము
పైఁడిఱేఁడు - కుబేరుడు.
పైఁడినెలఁత - లక్ష్మి. నెలఁత - స్త్రీ, రూ. నెలఁతుక.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
ఐలబిలుఁడు - 1.ఇలబిలకోడుకు, కుబేరుడు, 2.దిలీపుడు.
ఖర్వము - 1.ఒక సంఖ్య (10,000,000,000), 2.కుబేరుని నిధులలో ఒకటి, విణ.1.అధమము, 2.పొట్టిది, 3.స్వల్పము.
అధమము - తక్కువైనది, నీచము.
పొట్టిది -
స్వల్పము - మిక్కిలి అల్పము.
రొక్కపుదొర - కుబేరుడు.
రొక్కము - 1.నగదు, 2.చేతివెల, 3.సమూహము, సం.ఋక్షమ్.
నగదు - నాణెము రూపమైన సొమ్ము, (అర్థః.) రొక్కము, సొమ్ము, పైకము, ద్రవ్యము.
సొమ్ము - 1.స్వము, 2.ధనము, 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీనవస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ద్రవ్యము - 1.ధనము, 2.వస్తువు.
ద్రవ్యము - (అర్థ.) 1.క్రయవిక్రయ కార్యములలో వినిమయమునకు ఉపయుక్తమగునట్టిది (Money), 2.ప్రభుత్వామోదము కలిగిన ఏదైన వస్తువు, 3.(భౌతి.) పదార్థము (Matter).
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు. అధికుఁడు - గొప్పవాడు.
అర్థాగృహేనివర్తంతే శ్మశానే మిత్ర బంధవాః|
సుకృతం దుష్కృతం చవగచ్ఛంత మనుగచ్ఛతి||
తా. ద్రవ్యమును సంపాదించి ధర్మము సేయక దాచినను లోకాంతర గతుండౌనపు డాద్రవ్యము గృహమందుండును, వాని వెంటరాదు. పుత్త్రమిత్త్ర బాంధవులు శ్మశాన పర్యంతము వత్తురు కాని వెంటరారు, పుణ్యపాపములు రెండును వెంట వచ్చును. కనుక ధర్మమే చేయ వలెయును. - నీతిశాస్త్రము
ఉత్తరో గోపతి ర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః|
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః||
ధ్రువనక్షత్రము - ఉత్తరదిక్కులో నుండు నక్షత్రము (Pole star).
ధ్రువుఁడు - 1.ఉత్తానపాదుని కొడుకు, 2.విష్ణువు, 3.శివుడు.
ఔత్తానపాది - ధ్రువుడు, వ్యు.ఉత్తానపాదుని కొడుకు.
ఔత్తరాహుఁడు - ఉత్తరదేశపువాడు.
ఔత్తరేయుఁడు - పరీక్షిన్మహారాజు.
ధ్రువ ఔత్తానపాదిః స్యాత్ :
ధ్రువతీతి ధ్రువః, ధ్రువస్థైర్యే - స్థిరమైనవాడు.
ఉత్తానపాదస్య అపత్యం ఔత్తానపాదిః - ఉత్తానపాదుని కొడుకు. ఈ రెండు2 ధ్రువుని పేర్లు.
కారణమైన కర్మములుకాక దిగంబడ వెన్నిగొందులన్
మాఱిన నెంతవారలకుఁ, దొల్లిపరీక్షిఁతు శాపభీతుఁడై
వారధినొప్పు నుప్పరిగపైఁ బదిలంబుగ దాగియుండినన్
గ్రూరభుజంగదంతహతిగూలఁడె లోకులెరుంగ, భాస్కరా.
తా. పూర్వము పరీక్షిన్మహారాజు మునిశాపముచే తనకు కీడుకల్గునని తలంచి సముద్రమందు మేడను నిర్మింపజేసి అందు దాగియుండినను, విధివిధానము యెవ్వరికిని నతిక్రమింప వీలు కానిదగుటచే నతడు తుదకు పాము కాటుచే మరణించేను. ఎంత గొప్పవాడైనను దైవ విధానమునకు ప్రతి విధానము చేసి ఆ యాపదలను తొలగించుకొంద మన్నను, నవి యపాధ్యములు గాక, సాధ్యములగునా?
సుమేరుజ్యోతి - (భూగో.) ఉత్తర ధ్రువమువద్ద కనిపించు ఎఱ్ఱని ఉషః కిరణములు.
సుమేరువు - మేరుపర్వతము, వ్యు.శిఖరములచే నక్షత్రాదులను వహించునది.
మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుండెడి మణి, 3.హార మధ్యమునందు వ్రేలెడు మణి.
కనకాచలము - బంగారుకొండ, మేరువు.
ఉదీచి - ఉత్తర దిక్కు; డాకడ - ఎడమ వైపు, ఉత్తరదిక్కు(డా – ఎడమ)ఉత్తరతి మేర్వాదిభ్య ఇత్యుత్తరా. తౄ ప్లవన తరణయోః - మేర్వాదులను (మేరు పర్వతములను) దాఁటియుండునది.
వామము - ధనము, విణ. 1.ఎడమ, 2.సుందరము, 3.హ్రస్వము.
దా - 1.ఎడము, 2.సవ్యము, డా యొక్క రూపాంతరము (దాపల - డాపల)క్రి. రమ్ము.
ఎడము - 1.చోటు, తావు, 2.అవకాశము, 3.నడిమిభాగము.
సవ్యము - 1.ఎడమ, 2.కుడి, 3.ప్రతికూలము.
ఎడమ - సవ్యము, వ్యతి.కుడి, వి.వాసుభాగము.
కుడి - కుడుచుట, కుడుపు, విణ.అపసవ్యము వలపల.
అపసవ్యము - 1.ప్రతికూలము, కుడిభాగము.
వామ - ఉత్తమ స్త్రీ.
వామదేవుఁడు - శివుడు.
ఉత్తరధ్రువము - (భూగో.) భూమధ్య రేఖకు 90 డిగ్రీల దూరమున నున్న బిందువు (North pole).
ఉత్తరము - 1.బదులు, 2.ఒక దిక్కు, 3.జాబు, (ఈ అర్థము తెనుగు నందు మాత్రమే కలదు, సంస్కృతమున లేదు), విణ.మీదిది.
బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి.
అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము - 1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బీ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విణ.ఋణరాశి (Negative).
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
నీరము - జలము.
ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః|
ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||
తా. సకలజనులకు పశువులు, పెండ్లాము(పత్ని - భార్య), కొమాళ్ళు, ఇండ్లును(ఆలయము-1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.), జన్మాంతర ఋణసంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించుచున్నవి. కాబట్టి చింతించుటవలన లాభమేమి. - నీతిశాస్త్రము
భూతము - 1.పృధివ్యాధి భూతములు (ఇవి:- పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.)2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
బూతము - భూతము, పిశాచము, సం.భూతః.
బూచి - భూతము, సం.భూతః.
బూ(ౘ)చులఱేఁడు - శివుడు. శివతేజ శ్చతుర్దశః.
భూతేశుఁడు - శివుడు.
యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదాశాహాని శుక్లః కృష్ణశ్చ మానద ||
భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది.
పృథివి - పృథ్వి, భూమి. వ్యు.పృథుచక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది.
పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
క్షత్రియుఁడు - రాచవాడు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
మహస్సు - 1.తేజము, 2.వెలుతురు, 3.యజ్ఞము, 4.ఉత్సవము.
భూతాత్మము - దేహము; దేహము - శరీరము, మేను.
దేహి - దేహము గలవాడు.
అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||
తా. బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకలభూతములకు ద్రోహము గలుగని వృత్తిచేత జీవించవలయును. లేక భూతములకు స్వల్పపీడ సేయునట్టి వృత్తి చేతనైనను జీవింపవచ్చును. - నీతిశాస్త్రము
పంచభూత మహాగ్రాసా పంచభూతాధి దేవతా,
సర్వప్రమాణా సంపత్తి స్సర్వరోగ ప్రతిక్రియా.
(ౙ)జాబు - లేఖ, కమ్మ, ఉత్తరము.
లేఖ -1.మిక్కిలి చేరిక యగు వృషాదుల పంక్తి, 2.లిపి, వ్రాత 3.జాబు. లేక - 1.జాబు, 2.మిక్కిలి చేరిక గల వృక్షాదుల వరుస, 3.సమూహము సం.లేఖా.
ఆకు - 1.చెట్టునందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని వారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.
రామబాణము - తాటాకులోనగు పుస్తకములు తొలిచెడి పురుగు.
కుంటెనముడి - తాటాకుల పుస్తకమునకు నడుమ నుంచు దారపుపిడి.
కుంటెన - తార్పెడువాడు, రూ.కుంటెనీఁడు, సం.కుట్టనీ.
రేక - తాటాకు మట్టతో గట్టిన దొప్ప, వై. వి.గీరబాబు, పంక్తి, సం.రేఖా, లేఖః.
కమ్మ - 1.తాటియాకు, 2.తాటంకము, స్త్రీల కర్ణభూషణము 3.జాబు, 4.ఒక కులము, విణ. పుల్లనిది లేక కమ్మగా (ఇంపుగా) నుండునది. కమ్మపంజులు - రత్నతాటంకము, కమ్మ పువ్వు.
తాటంకము - చెవికమ్మ. తాళపత్రము - 1.తాటియాకు, 2.చెవ్వాకు; చెవికమ్మ.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు, ఈ ఐదువన్నెలు సుమంగళి చిహ్నములు). జీవ భర్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.
సుధా మప్యాస్వాద్య - ప్రతిభయ జరామృత్యు హరిణీం
విపద్యన్తే విశ్వే - విధిశత మఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేళం - కబళితవతః కాలకలనా
న శమ్భో స్తమ్మూలం - తవ జనని! తాటఙ్కమహిమా || - 28శ్లో
తా. తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలు భయంకరమైన జర(ముసలితనము)మృత్యువు(మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.)లను హరించు (న)అమృతమును త్రావియు నాపద లందుచున్నారు. భయంకరమగు కాలకూటమనే విషమును మ్రింగిన శివునకు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.) మరణ భయములేదు. ఇందుకు కారణము నీ చెవికమ్మల ప్రభావమే కదా! - సౌందర్యలహరి
కమ్మగాడుపు - మలయమారుతము.
మలయ మారుతము - కమ్మగాడ్పు.
గాడుపు - గాలి, వాయువు, రూ.గాడ్పు.
గాడ్పు - గాడుపు.
గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపు సంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
కమ్మవిలుకాఁడు - మరుడు, కమ్మవిల్తుడు.
కమ్మవిల్తుఁడు - మన్మధుడు.
వ్రాయనము - వ్రాత, లేఖ.
వ్రాఁత - దస్తూరి, లేఖనము.
దస్తూరి - 1.చేవ్రాత, 2.సంతకము.
సంతకము - చేవ్రాలు.
వ్రాలు - (వ్రాయి బహువచనము) సంతకము (చేవ్రాలు), క్రి.1.క్రిందికి దిగు, 2.తగ్గు, 3.ఒరగు.
లిపి - వ్రాత. లేఖనము - లిపి, వ్రాత.
లిఖించు - క్రి.వ్రాయు.
లిఖితము - వ్రాయబడినది, వి.అక్కరము.
లిఖితుఁడు - 1.సాక్షి, 2.ఒక ముని.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.
సాక్ష్యము - సాక్షి కనివిని చెప్పినది.
లేఖర్షభుఁడు - ఇంద్రుడు.
లేఖుఁడు - వేలుపు.
లేఖ్యపత్రకము - తాటి చెట్టు.
కోఁదాడు - ఒకరకపు తాటిచెట్టు, సం.కంతాళః.
బొంద - 1.రంధ్రము, 2.తాటి మొదలగు చిన్న చెట్టు, 3.గుంట.
తూఁటు - రంధ్రము, చిల్లి.
తూఁటాడు - క్రి.వేధించు, 2.రంధ్రము చేయు.
తూఁటుకట్టు - క్రి.రంధ్రముపడు.
తాడు - తాటిచెట్టు, సం.తాళీ.
తాలము - తాటిచెట్టు, రూ.తాళము.
తాళము - 1.బీగము, 2.పాడునపుడు చేతులతో చరచుచరపు, 3.తాటిచెట్టు, 4.తాళమువేయు కంచువాద్యము.
తాలధ్వజుఁడు - బలరాముడు.
తాలాంకుఁడు - బలరాముడు.
కానివానితోడఁ గలసి మెలఁగుచునున్న
గానివానివలెను కాంతు రవని
తాటిక్రిందఁ బాలుత్రాగిన చందమౌ విశ్వ.
తా. దుర్మార్గునితో కలసి తిరిగినచో, వానినికూడ దుర్మార్గుడనే జూతురు. తాటిచెట్టు క్రింద కూర్చుండి పాలు త్రాగినను, కల్లు త్రాగుచున్నాడందురు.
టపా - 1.ఉత్తరము, 2.ఉత్తరముల సంచి.
ఖత్తు - 1.విధము 2.ఉత్తరము.
విధము - ప్రకారము, విధి.
ప్రకారము - 1.విధము 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
మన్మథుఁడు - మారుడు, వ్యు.విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. మారుఁడు - మన్మథుడు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలముచేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటలనల మధ్య దొరలు కాలము (Time).
కాలంతకుఁడు - శివుడు, (వ్యవ.) అసాధ్యుడు.
శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.
శ్యామలము - నలుపు, విణ. నల్లనిది.
శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
జీవితంలో మరలిరానిది - కాలం. కాలం దేనినీ పట్టించు కోకుండా దాని ధర్మం అది పాటించుకుంటూ వెళ్ళిపోతుంది. కాలమును బోలిన ఘనుడగు బోధకు డుండబోడు.
కాలమే సృషిస్తుంది. కాలమే రక్షిస్తుంది. కాలమే కల్లోలాలు కలిగిస్తుంది. కాలానికి కళ్ళూ నోరూ ఉంటే ఎన్ని వాస్తవాలు వెల్లడించగలదో? కాలానికి నిలకడలేదు. కాలం నిరంతరం సాగుతూనే ఉంటుంది. కాలమే సర్వాన్నీ అంతం చేస్తుంది. కాలాన్ని జయించినవాడు లేడు. కాలం అజేయం.
కాలము ఎవరినీ నరకదు. అది కేవలం అన్ని విషయాలలోనూ మనిషి బుద్ధిని తప్పు దారికి మళ్ళిస్తుంది. - సంజయుడు, మహాభారతం
విధానము - 1.చేయుట, 2.ఆజ్ఞ.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
విధుంతుదుఁడు - రాహుగ్రహము.
కృష్ణవర్త్మ - 1.అగ్ని, 2.రాహుగ్రహము, విణ.దురాచారుడు.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా. విష్ణువు చేతగాని, శివుని చేతగాని, బ్రహ్మ చేతగాని, ఇతరమైన దేవతల చేతగాని నొసట వ్రాయబడిన వ్రాత తుడిచివేయ నలవిగాదు (మనుష్యల చేత కాగలదా! బ్రహ్మ రాత బయలుపడేదికాదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.) - నీతిశాస్త్రము
వడదెస - ఉత్తరపు దిక్కు.
వడ - 1.తాపము, వేడిమి 2.భక్ష్యము, 3.అలసట.
వేండ్రము - తాపము.
తాపము - 1.వేడిమి (Heat) 2.బాధ, సం.వి. (భౌతి.) వేడి(Hot). సంతాపము - కాక, వేడిమి. సంజ్వరము - కాక, వేడిమి.
వెప్పు - వేడిమి. వెమ్ము - తపించు, సంతాపించు(మిక్కిలి తపించు). (ౙ)జూవరము - 1.జ్వరము 2.సంతాపము.
వేఁకి - 1.జ్వరము 2.వేడిమి 3.అగ్ని.
వెరవేఁకి - 1.విరహతాపము 2.భయ జ్వరము.
కందు - 1.తాపము, 2.నలుపు, ఉదా. చంద్రబింబములోని కందు, 3.శిశువు, బిడ్డ క్రి.1.తప్తమగు 2.వాడు 3.కృశించు.
కందుఁడు - కుమారస్వామి, సం.స్కందః.
సంతాప స్సంజ్వర స్సమౌ :
సమ్య క్తాపయతీతి సంతాపః. తప సంతాపే - మిక్కిలి తపింపఁజేయునది.
సమ్యక్ జ్వరయతీతి సంజ్వరః. జ్వర రోగే - మిక్కిలి పీడించునది. ఈ రెండు 2 వేఁడిమి పేర్లు.
భక్ష్యము - భక్షణీయము, తినుబండము. (పంచభక్ష్యాలు:- భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయము.)నలితిండి - చిరుతిండి. చిఱుదిండి - 1.భక్ష్యము, 2.అల్పాహారము.
అలసట - అలపు, ఆయాసము, బడలిక, గ్లాని.
చింత - 1.తలపు, 2.వ్యసనము, 3. వై.వి. చింత చెట్టు, సం.చింతా.
చింతచెట్టు చింత కలిగిస్తుంది. చింత గడ్డి కంటేను ఎక్కువగా అంతటను కనబడుతుంది. చింతకు చితకు మధ్య సున్న మాత్రమే అంతరం. కాబట్టి చింత నీడన ఉండ రాదు. చింతచెట్టు క్రింద, చింతపుల్లల మంటలో వండుకు తినరాదు. చింతచెట్టు నీడన పడుకో రాదు.
తలఁపు - 1.తలచుట, 2.కోరిక, 3.ఆలోచనము, 4.జ్ఞప్తి, 5.హృదయము, 6.అభిప్రాయము, 7.ఊహించుట.
తలఁచు - 1.ఎంచు, 2.ధ్యానించు, రూ.తల్చు.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
ఆలోచన - 1.చూచుట 2.ఆలోచించుట, యోచన, తలంపు.
తలంపు - 1.ఊహించుట 2.ఆలోచనము, రూ.తలఁపు.
జ్ఞప్తి - 1.తెలివి 2.తలపు.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె(Heart). హృదయం ఒకటైనా..... భావాలెన్నో..…
అభిప్రాయము - 1.తలపు 2.భావము, తాత్పర్యము 3.అభిలాష, కోరిక 4.వైఖరి, రీతి, సంస్థితి (Attitude).
భావము - 1.అభిప్రాయము 2.మనోవికారము 3.పుట్టుక 4.ధాత్వర్థ రూప క్రియ 5.సత్తు 6.స్వభావము, సం.(గృహ.) ఊహ, సామాన్యమైన ఊహ, భావన (Concept).
ఆంతర్యము - 1.అభిప్రాయము, 2.మిక్కిలి సన్నిహిత సంబంధము, 3.అక్షరములకు స్థానప్రయత్నాదులచే కలుగు పరస్పర సాదృశ్యము, 4.గుట్టు, 5.హృదయము.
అభిప్రాయాన్ని చెప్పడానికి నీరసులు వణుకుతారు. తెలివి తక్కువవారు దాన్ని వ్యతిరేకిస్తారు. బుద్ధిమంతులు విషయ నిర్ణయం చేస్తారు. చతురులు దాని గమనాన్ని నిర్దేశిస్తారు. - మదాం జిన్నెరోలండ్
తలఁపుచూలి - మన్మథుడు, భావజుడు.
ఉపరాగము - 1.సూర్యాదిగ్రహణము, 2.వ్యసనము, దుర్వ్యసనము, 3.అన్యాయము.
వ్యసనం విపది భ్రంశే దోషే కామజ కోపజే :
వ్యసనశబ్దము ఆపదకును, పడుటకును, కామక్రోధములవలనఁ బుట్టిన స్త్రీ ద్యూతాది సప్త వ్యసననములకును పేరు. వ్యస్యతే శ్రేయో మార్గాత్ప్రచ్యావ్యతే పురుషో నేనేతి వ్యసనం. అసు క్షేపణే. దీనిచేత పురుషుఁడు శ్రేయోమార్గము నుండి తొలగఁద్రోయఁబడును.
వ్యసనము - 1.ఆపద, 2.ఆసక్తి, 3.పాపము, 4.కుతూహలము, వేడుట, 5.కామక్రోధాదులవలన బుట్టిన దోషము. వ్యసనము విషపు చుక్కలాంటిది. చిన్నదైనా ప్రాణాలమీదకు తెస్తుంది.
ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపతీ - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి, కలుగుట 3.(తర్క) అయథార్థ జ్ఞానము.
ఆసంగము - 1.ఆసక్తి 2.పట్టుదల 3.సంబంధము 4.ఆశ్రయము.
పాపము - దుషృతము, కలుషము.
కుతూహలము - 1.కోరిక 2.ఆనందము 3.నాయికకు మనొజ్ఞమైన వస్తువును చూచుట యందుగల లోలత్వము.
అమ్లము - 1.పులుపు 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ 3.పులిసిన పెరుగు 4.పులిచింత 5.దబ్బ.
ఆమ్లము1 - 1.చింతపండు పులుసు 2.చింతచెట్టు 3.ఆరు రసములలో ఒకటి 4.పులిత్రేపు విణ.పుల్లనిది. (Acid)
ఆమ్లిక - 1.చింతచెట్టు 2.పులిత్రేపు.
పులిత్రేపు - అజీర్ణపుత్రేపు.
అజీర్ణము - అన్నాదులు అరుగక పోవుట, విణ.జీర్ణముకానిది.
Dyspep’sia - అజీర్ణ రోగము.
Dyspep’sy – indigestion.
అమ్లశ్చ : ఆమయతీత్యమ్లః. అమరోగే. - రోగమును జేయునది.
పా. అమ్బతే ముఖశబ్దహేతుర్భవతీత్యమ్బ్లః. అబి శబ్దే. – చవిగొను నపుడు సీత్కారశబ్దమును బుట్టించునది.
ఆమ్లపిత్తము - (గృహ.) ఒక రోగము, (ఇది అగ్నిమాద్యము వలన జనించు కడుపులోని అమ్లములచే కలుగును) (Heart burn).
వేఁడి - 1.తాపము 2.చురుకు 3.వాడిమి 4.ప్రకాశము.
వేఁడికంటి - ఉగ్రాక్షుడు, శివుడు.
వేఁడి వేలుపు - 1.వహ్ని, అగ్ని, 2.సూర్యుడు.
తపతీతి తపనః, తపసంతాపే - తపింపఁజేయువాడు, సూర్యుడు.
వత్సలము - వహ్ని, తృణాగ్ని.
వత్సలుఁడు - వాత్సల్యము(దయ) గలవాడు.
వహతి ప్రాపయతి హవ్యమితి వహ్నిః ఇ-పు. వహ ప్రాపణే. - హవ్యమును దేవతలకుఁ జేర్చువాఁడు.
ప్రకాశము - వెలుగు, విణ. బయలు పడినది.
వెలుఁగు - 1.కిరణము 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.
సూర్యుఁడు - వెలుగురేడు.
అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః,
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః. - భజగోవిందం
భాస్కరుఁడు - 1.సూర్యుడు 2.అగ్ని.
భాస్వంతుఁడు - సూర్యుడు, విణ.ప్రకాశించువాడు.
భాసిల్లు - ప్రకాశించు. భాస్వరుడు – సూర్యుడు.
కేదారము - 1.వరిమడి, 2.కొండ, 3.కేదార ఘట్టము(కాశీలో నొక పుణ్య స్థలము) 4.పాదు, 5.శివలింగ భేదము. కేదారపీఠము నందు దేవిస్థానం సన్మార్గదాయిని.
కేదారుఁడు - గంగాధరుఁడు, శివుడు, వ్యు. శిరస్సున భార్య కలవాడు.
గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు(శంతనుడు సముద్రాంశ).
గంగాపుత్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.
క్షేత్రము - 1.వరిమడి, 2.భూమి, 3.శరీరము, దేహము 4.భార్య, (భౌతి.) అయస్కాంతము చుట్టు అయస్కాంత శక్తి ప్రసించు ప్రదేశము (Field) (గణి.) కొన్ని రేఖల మధ్యనున్న ప్రదేశము (Figure) (భౌతి. గణి) కొన్ని రేఖల మధ్యనున్న క్షేత్రము (Figure) (భౌమి) బలములు (Forces) పనిచేయుచున్న ఆకాశభాగము (చోటు, Field).
వలజము - 1.వరిమడి(వరి - వడ్లు, శాలిధాన్యము), 2.పైరు(సస్యము), 3.యుద్ధము, 4.పుర ద్వారము.
కొండ - మల, పర్వతము; మల - పర్వతము, మలైః.
పాదు - 1.కుదురు, ఆలవాలము 2.నిలకడ 3.ఆశ్రయము, సం. పాదః పదమ్.
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః|
పరర్థిః పరమస్పటః తుష్టః పుష్ట శ్శుభేక్షణః||
క్షత్త్రము - 1.క్షత్త్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
క్షత్త్రియాణి - క్షత్త్రియ స్త్రీ, రూ.క్షత్త్రియ, క్షత్త్రియిక.
క్షత్త్రియి - క్షత్త్రియుని భార్య.
క్షేత్రజ్ఞుఁడు - 1.జీవుడు, 2.పరమాత్మ.
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. (Jupiter)
జీవితేశుఁడు - 1.ప్రాణనాథుడు, 2.యముడు.
కృషితోనాస్తి దుర్భిక్షం జపతోనాస్తి పాతకం|
మౌనేన కలహంనాస్తి నాస్తిజాగరతో భయమ్||
తా. కృషి చేసుకొనువానికి కఱవులేదు, జపము జేసికొనువానికి పాపములేదు, మౌనముతో నున్నవానికి కలహములేదు, మేల్కొని యున్నవానికి భయములేదు. - నీతిశాస్త్రము
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.
హ్రీబేరము - కురువేరు. హ్రీ - సిగ్గు.
కేశము - 1.తలవెండ్రుక, 2.కురువేరు.
శిరోజము - తలవెండ్రుక; శిరోరుహము - తలవెండ్రుక.
వెండ్రుక - కేశము, రూ.వెంట్రుక. తలవెండ్రుకలు పెరిగినకొలది తలచిన్నదియే.
కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు - చంద్రుడు Moon.
ఉదీచ్యము - 1.ఉత్తర దిక్కున ఉన్నది, 2.ఉత్తర కాలమున ఉన్నది, వి.1.శరావతీ నదికి వాయవ్యమున ఉన్న దేశము, 2.కురువేరు.
ఉదక్ ఉత్తరస్యాం భవం ఉదీచీనం - ఉత్తరదిక్కునఁ బుట్టినది.
సార్వభౌమము - ఉత్తర దిక్కున నుండు ఏనుగు.
సర్వభూమ్యాం విదితః సార్వభౌమః - సమస్త భూమి యందు నెఱుఁగఁ బడునది.
అంగన - 1.ఉత్తర దిక్కునందలి సార్వభౌమము అను దిగ్గజము యొక్క భార్య, 2. స్త్రీ(స్త్రీ - ఆడుది).
ప్రశస్తాన్యంగా న్యస్యా ఇతి అంగనా - మంచి అవయవములు గలది.
అంగననమ్మరాదు తన యంకెకురాని మహాబలాఁఢ్యు వే
భంగులమాయలొడ్డి చెఱుపం దలపెట్టు, వివేకియైన సా
రంగధరుం బదంబులుఁ గరంబులఁ గోయగజేసెఁ దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడవరాని కుయుక్తములుఁబన్ని, భాస్కరా.
తా. భాస్కరా ! పూర్వము చిత్రాంగి యను నామె తన కామోద్రేకముచే బుద్ధి మంతుడ(వివేకము - జ్ఞానము, విచారము.)మగు సారంగధరుని తన కామము తీర్చుమని కోరగా, నత డందులకు నిరాకరించగా, నామె యెన్నో(చెప్పరాని)దుస్తంత్రములు పన్ని యాతని కాలుసేతులు(కాళ్ళు చేతులు)ఖండింప జేసెను, స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపని వాడెంత బలాఢ్యుడైనను వానిని పాడుచేయుట కాలోచింతురు(తలపెట్టు-క్రి.1.ఆరంభించు, 2.ప్రస్తావించు.)దురు, కాన, స్త్రీలను నమ్మరాదు.
పర తత్త్వం పరంధామ సచ్చిదానందవిగ్రహః,
లక్ష్మీనృసింహ స్సర్వాత్మా ధీరః ప్రహ్లాదపాలకః
No comments:
Post a Comment