Wednesday, December 7, 2011

మాసములు-ఋతువులు

సూర్యుడు ఒక్కొక్క రాశిలో వుండే కాలపరిమితి ఒక మాసం అని వ్యవహారం. అలాటి రెండు నెలలకు ఋతువు అని సంజ్ఞ. ఋతువులు రెండు రెండు నెలలవి. ఆరు ఋతువులు ఒక సంవత్సరము. సంవత్సరము ప్రజాపతి రూపము. ప్రజాపతి జగత్కర్త.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
లోకబాంధవుఁడు -
సూర్యుడు. లోకబాంధవో లోకబాంధవః - లోకమునకుఁ చుట్టము, బంధువు.
ౙగముచుట్టము - సూర్యుడు.
ౙగముకన్ను - సూర్యుడు.
జగచ్చక్షువు - సూర్యుడు.

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
   
భా|| ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.   

సంక్రమణము - సూర్యుడొక రాశి నుండి మరియొక రాశికి ప్రవేశించుట, సం.వి.(భౌతి.) ఒక చోటగల స్థితి దశ, రీతి విషయము అను వానినుండి మరొకచోట గలస్థితి, దశ, రీతి విషయము అనువానికి మార్పు (Transition), సం.వి. (రసా.) దాటుట (Transition), ఉదా. రాంబిక్ గ్రంథము 96 డిగ్రీల(degrees) యొద్ద మానోక్లినిక్ రూపమునకు సంక్రమణము చేయును.

అధ్యవసానము - 1.పూనిక, ఉత్సాహము, ప్రయత్నము, శ్రద్ధ, 2.(అలం.) ప్రకృతా ప్రకృతముల యొక్క  అబేధ నిశ్చయము.

విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత -
1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.

కాలమును బోలిన ఘనుడగు బోధకు డుండ బోడు. ప్రేమ గలవాడే పెద్ద బోధకుడు.

ఋతుపవనములు - (భూగో.) ఏదైన ఒక ఋతువులో వీచు పవనములు. (ఇవి ఆరు నెలల కొకసారి వీచుచుండును. ఇవి అగ్నేయ ఆసియా, హిందూ మహాసముద్రములో ముఖ్యముగా ఏప్రిల్ నుండి అక్టోబరువరకు నైరృతి నుండియు, అక్టోబరునుండి ఏప్రిల్ వరకు ఈశాన్యము నుండియు వీచును, వ్యాపార పవనములు భూమధ్య రేఖను దాటునపుడు అక్కడి ఉష్ణ తీవ్రతచేత దిక్కును మార్చుకొని ఋతుపవనము లగుచున్నవి.) (Monsoon.)     

వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం
బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాల తంత్రమై
పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం
జేయుచు నుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్.
భా||
ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకొంటూ దూరంగాపోతూన్న విధంగా ఈ ప్రపంచం లోని ప్రాణికోటి సమస్తమూ కాలచక్రం వల్ల కూడుతూ, వీడుతూ ఉంటుంది. స్వేచ్ఛ అనేది లేదు. కాలం ఒకే విధంగా ప్రవర్తించదు. కాలమే అన్నిటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. కాలం ఎన్నో రకాలైన పనులను చేస్తూ ఉంటుంది. ఎంత వారు కూడా ఈ కాల ప్రవాహాన్ని దాటలేరు. 

జీవితంలో మరలిరానిది - కాలం. కాలాన్ని జయించినవాడు లేడు. కాలాన్ని ఎదిరించడం అసాధ్యం.

కాలం నిరంతరం సాగుతూనే వుంటుంది. కాలమే సృష్టిస్తుంది. కాలమే రక్షిస్తుంది. కాలమే కల్లోలాలు కలిగిస్తుంది. కాలమును నిలిపి పట్టుకొనుటకు చేతులు చాలవు. కాలానికి నిలకడ లేదు. కాలమే సర్వాన్ని అంతం చేస్తుంది.

కాలము ఆలస్యమునకు లోబడునదికాదు. కాలం అజేయం. కాలమే జీవి వృద్ధి క్షయాలకు మూలం. కాలము కొలది మర్యాదలు. ఒక కాలమున దోషముగా తోచినవి కాలము మారి యొకప్పుడు గుణముగ తోచవచ్చును. కాలము మారిపోతే మనము దానితో పాటే మారెదము.

మూడు ఋతువుల మొత్తనికి ఆయనం అనీ, రెండు ఆయనాల ఉత్తరాయణము, దక్షిణాయనము కాలానికి సంవత్సరమనీ పెద్దలు అన్నరు.

అయనము - 1.మార్గము, 2.స్థానము, 3.సైన్యవ్యూహమున ప్రవేశించు ద్వారము, 4.(జ్యోతి.) సూర్యుడు దక్షిణోత్తర దిశలకు పోవుట, 5.సూర్యుని యొక్క దక్షిణోత్తర దిగ్గమనములకు పట్టుకాలము, ఆరునెలలు, 6.మోక్షము.

తైరయనం త్రిభిః :
తైస్త్రిభిః అయనముచ్యతే - మూఁడుఋతువులు చేరిన కాలము అయన మనంబడును.
అయతే యాత్యనేనార్క ఇత్యయనం, అయగతౌ - దీనిచేత సూర్యుఁడు పోవును. 3 ఋతువులు ఒక అయనము.

అయనపరిమితి - (భూగో.) సూర్యుడు ఆరుమాసముల పరిమితిలో కర్కాటకరేఖ నుండి మకరరేఖలో, మకరరేఖ నుండి కర్కాటకరేఖలో ప్రవేశించుట.
అయనరేఖలు - (భూగో.) కర్కాటక మకరరేఖలు.

కర్కటరేఖ - (భూగో.) భూమధ్యరేఖకు ఉత్తరమున 23 1/2 డిగ్రిలో ఉన్న రేఖ (Tropic of cancer).
మకరరేఖ - (భూగో.) భూమధ్య రేఖకు దక్షిణమున 23 1/2 డిగ్రిలో ఉన్న రేఖ (Tropic of capricorn).

ప్రతివ్యాపార పవనములు - (భూగో.) కర్కాటక, మకర రేఖల యొద్దనుండి ఉత్తర దక్షిణ ధ్రువవృత్తముల యొద్దనున్న అల్పపీడన ప్రదేశమునకు వీచు పవనములు. (ఇవి వ్యాపార పవనముల దిక్కునకుగాక వ్యతిరేకముగా వీచుచుండును.) 

సూర్యుడు ఆకాశవీధిలో ఒక పరిభ్రమణము (సంవత్సరము)లో సగమును అతిక్రమించే కాలాన్ని ఆయనము అని వ్యవహరిస్తారు. మొత్తం పన్నెండు రాసులలో ఆరవ భాగం సంచారంచేసే కాలాన్ని'ఋతు' వని వ్యవహరిస్తారు. ఆ రాసులలో సగభాగం సంచరిస్తూ ఆరు రాసులలో తిరిగే కాలాన్ని  'అయన' మంటారు. రాసులు అన్నిటిలోనూ పూర్తిగా తిరిగినకాలాన్ని "సంవత్సర"మని నిర్ణయిస్తారు.      

వసంత, గ్రీష్మ వర్షములు దేవ ఋతువులు. శరత్తు, హేమంత, శిశిరములు పితృ ఋతువులు.

ఈ ఆరు ఋతువులు ప్రకృతిలో, మానవ శరీరంలో, మనసులో, అభిరుచుల్లో ఎన్నో మార్పులు తెస్తాయి. ప్రతి ఋతువూ సుందరమూ, సురుచిరమూ, సౌభాగ్యవంతమే. అన్ని ఋతువులూ సమస్త ప్రకృతి మీదా, ప్రాణుల మీదా, నరుల మీదా ప్రభావం చూపుతాయి. ప్రకృతిని నిరోధించుట సాధ్యము కాదు. ప్రకృతి శాశ్వతమైనది.

ప్రకృతి - 1.ప్రత్యయము చేరక ముందటి శబ్ద రూపము, 2.సౌర వర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము, (స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి సప్త ప్రకృతులు).

స్వామి యనఁగా రాజు, అమాత్యుఁడు మంత్రి,; సుహృత్తు చెలికాఁడు(మంచి హృదయము కలవాడు, మిత్రుడు), కోశము భండారము, రాష్ట్రము దేశములఁతోఁ గూడిన పట్టణము, దుర్గము పర్వతోదక వృక్షములచేతఁ బోవ శక్యముగాని పట్టణము, బలము సైన్యము.

ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది - సంవత్సరాది.

ఋతువృత్తి - సంవత్సరము.
సంవత్సరము - ఏడు; ఏడు - ఆరునొకటి. వత్సరము - ఏడాది.
హాయనము - 1.సంవత్సరము, 2.కిరణము.
కిరణము - వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.

సప్తకము - ఏడు, విణ.ఏడవది.
సప్తమము -
ఏడవది.
సప్తహస్తుఁడు - అగ్ని.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.

వత్సరః : తే ద్వే వత్సర ఇత్యుచ్యతే. ఆ దక్షిణాయనోత్తరరాయణములు, కూడిన కాలము వత్సర మనంబడును. ఉతరాయణ దక్షిణాయనములు రెండు చేరి ఒక సంవత్సరము పేరు.

జ్యొతి - 1.వెలుగు 2.నక్షత్రము 3.అగ్ని 4.సూర్యుడు(కర్మసాక్షి).

లోకధారుడయిన నారాయణుడు లోకక్షేమమును ఆకాంక్షించి వేదస్వరూపుడై కర్మశుద్ధి లక్ష్యముగా భాస్కరుడుగ రూపొంది జీవకోటికి చైతన్యమును ప్రసాదిస్తున్నాడు. వసంతము మొదలైన ఆరు ఋతువులందును వాటికి తగిన గుణాలను కలిగిస్తూ ఉంటాడు.

ఋతుపతి - వసంతర్తువు. ఋతువులు మధురంగా వుండాలి.

1. చైత్ర వైశాఖ మా|| - వసంత ఋతువు, చెట్లు చిగిర్చి పూవులు పూయును. వసంత ఋతువు లో చెట్లు చేమలు చిగుర్చి, పుష్పించి, మనోహరముగా నుండును.

శీతోష్ణ వర్షాల తీవ్రత లేనిది వసంతమాసం - సుఖ ప్రదాయకం కనుకనే వసంతం అని పేరు నిర్వచించారు. సుఖంగా ఉండే(ఉంచే)కాలము – వసంతం.

Madhu & Madhava – Vasanta Ritu(Spring). Nature awakens in Spring. Tasyate vasanta sirah – head as spring season.

ధనుః పౌష్పం మౌర్వీ - మధుకరమయీ పంచ విశిఖాః
వసంత స్సామన్తో - మలయ మరుదాయో దనరథః|
తథాప్వేకః సర్వం - హిమగిరి సుతే! కామపి కృపామ్ 
అపాంగా త్తే లబ్ధ్వా - జగదిద మనఙ్గో విజయతే|| - 6శ్లో      
తా.
ఓ హైమవతీ! మృదువులై తాకిన కందిపోవును, తాకుటకు గాని వంచుటకు గాని వీలుగాని విల్లు పూలది; ఒకటి కొకటికి పొందిక లేనందున త్రాడగుటకు తగని అల్లెత్రాడు(మౌర్వీ- అల్లెత్రాడు) తుమ్మెదల మొత్తము; బాణములు ఐదు; వసంతుడు మంత్రి; మందమై ఎల్లపుడు నుండక స్థిరముకాని, రూపములేని మలయమారుతము యుద్ధ రథము. ఇట్లు ఉపయోగ రహితములన పరికరములను కలిగిన మన్మథు(అనంగఁడు - మన్మథుడు, విణ.అంగములేనివాడు.)డొక్కడే నీ క్రీగంటి(అపాంగము - కడకన్ను, విణ.అంగహీనము.)చూపు వలన అనిర్వాచ్యమగు దయను పొంది ఈ జగత్తు నంతను జయించుచున్నాడు. - సౌందర్యలహరి        

"వసంతో మధు మాధవౌ" అని కోశము. వసంతుడు మంత్రి; అటూఇటూ ఇద్దరు ముద్దుగుమ్మలు. ఒకతె మధుశ్రీ, ఇంకొకతె మాధవశ్రీ.

Kusumakarah: The spring season is the most beautiful, and nature puts forth all her beauty, Lord Sri Rama was born in the month of Chaitra. – Gita Makarandam

ఎండ కారు- ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాస కారు. పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృతిక, రోహిణి కార్తెలు,April May నెలలు, వసంతర్తువు(pre-monsoon period)
పునాసలు - పునర్వసు నక్షత్రమందు సూర్యుడుండి నపుడు చల్లిన ధాన్యము. 

రోహిణి యెండకు ఱోళ్ళుపగులుతాయి. సంవత్సరములో రెండు వేసవులు రావు, ఉండవు.

ఎండ దొర – సూర్యుడు.
ఎండ -
సూర్య ప్రకాశము, ఆతపము.
ఆతపతము - 1.ఎండ 2.వెలుతురు.

వేసగి - వేసవి, సం. వైశాఖః
వేసవి - వేసవి కాలము.
వెట్ట కారు – వేసవి.
వెట్ట - వేడిమి  సం.ఉష్ణః. వెప్పు - వేడిమి. సంతాపము - కాక, వేడిమి.

ఉష్ణము-1.వేడి 2.ఎండకాలము విణ.1.వేడిగలది 2.కోపోద్రేకము గలది.
కాఁకవెలుగు - సూర్యుడు, ఉష్ణరశ్మి. ఉష్ణరశ్మి - సూర్యుడు. సంజ్వరము - కాక, వేడిమి.

సూర్యుడికి ఎండకు భేధము లేదు. ఎండాకాలంలో కొత్త కుండలో నీళ్ళు ఎంత రుచి! చల్లని నీరు నాలుకకు ఇంపు. ఎండ ఎక్కువగా నున్నచో నీడకై వెదకును, ఎండవేడి పడనివాడికి చెట్టు నీడలో సుఖం ఏమి తెలుస్తుంది?

వేడి వేలుపు - 1.వహ్ని, 2.సూర్యుడు. 
వేడి - 1.తాపము, 2.చురుకు, 3.వాడిమి, 4.ప్రకాశము.

ఎండు - 1.నీరింకు 2.తడియారు 3.శుస్కించు 4.తపించు. ఉసురు(తాపమునందగు నిశ్వాసధ్వన్యను కరణము, ప్రాణము) నిలిస్తే ఉప్పు అమ్ముకొని యైన జీవించవచ్చును. పైరు లేని పంట, ఉప్పు.

గాడుపు - గాలి, గాలించినా కనబడనిది; వాయువు రూ.గాడ్పు.
గాడుపు మేపరి - పాము, పవనాశము. వాయువును తిని బ్రతుకు చుండును, పాము. రక్షించినవానిని భక్షించేవాడు.

తొలకరి - చైత్ర వైశాఖములందలి వాన, వర్షర్తువు, రూ.తొల్కరి.
తొల్కరి -
తొలుకరి.
తొలకరిసూడు - హంస, వ్యు.వర్షాకాల విరోధి.

తొల్కరించు - తొలకరించు.
తొలకరించు - వానకురియు(తొలుకు - కురియు), పుట్టు(సంభవించు, జన్మించు), రూ.తొల్కరించు. 

తొలకరి వాన, మెలకువ తల్లి. కార్యదీక్ష కన్నతల్లి. తొలకరిని చెరువునిండినా, తొలిచూలు కొడుకు పుట్టినా లాభం.

తొలకరి వానకారు - (వ్య్వ.) ముంగటి వానకారు, జూన్ జులై నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).

సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు తొలకరి వానలు ప్రారంభమవుతాయి. దీనినే మృగశిర కార్తె అంటారు. వర్షాకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు.

తొలుకారు - మొదటికారు, వర్షర్తువు ముక్కారు పంటలలో మొదటికారు పంట.  తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు. తొలకరి జల్లులు కారణంగా భూమిపై నుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నిటికినీ ఆనందం కలిగిస్తుంది.   

కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచు కాలము. సంవత్సరమున పునాస (ఎండ) కారు, తొలకరి (ముంగటి వాన కారు). నడివాన కారు, వెనుకటి వానకారు, శీత కారు, పయర కారు అని ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).

ఆరబము - 1.తొలకరిపైరు, 2.పైరు, సం.ఆరంభః.
ఆరంబము -
1.మొదలు పెట్టుట, ఉపక్రమము, 2.ప్రయత్నము, 3.కార్యము, 4.త్వర, సం.ఆరంభః, 5.పైరు (ఇది తెనుగున మాత్రము కానవచ్చును), రూ.ఆరబము.
ఆరంభించు - యత్నించు, మొదలు పెట్టు.
ఆరకాఁడు - కృషీవలుడు, రైతు.

పైరు - సస్యము; సస్యము - పైరు, రూ.శస్యము.
పైరుల యెకమీఁడు -
1.చంద్రుడు, 2.ఓషధీశుడు.
ఓషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. 

ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఔషధము -
1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు.
ఓషధములు - (వృక్ష.) ఔషధములుగా నుపయోగపడు మొక్కలు ఉదా. సునాముఖ, అడ్డసరము మొ.వి. (Medicinal pants or herbs).
ఓషధీశుఁడు - చంద్రుడు.  

వసంతం యౌవనంవృక్షాః పురుషా ధనయౌవనమ్|
సౌభాగ్యం యౌవనానార్యో యౌవనావిద్యయా బుధాః||
తా.
వృక్షములకు వసంత ఋతువు యౌవనము, పురుషులకు ధనము యౌవనము, స్త్రీలకు భాగ్యమే యౌవనము, పండితులకు విద్యయే యౌవనము. - నీతిశాస్త్రము

వసంతము - 1.చైత్ర వైశాఖ మాసములు, 2.ఒకానొక రాగము, వి.పసుపును సున్నమును కలిపిన యెఱ్రనీళ్ళు.

వసన్తే పుష్పసమయ స్సురభిః :
వసతి కామో స్నిన్నితి వసంతః. వసనివాసే. - దీనియందు మన్మథుఁడు వసించును.
వసంతి సుఖం యథాతథా అస్మిన్నితి వసంతః. - దీని యందు జనులు సుఖముగా నుందురు.
పుషాణాం సమయః కాలః పుష్ప సమయః - పుష్పము పూచెడు కాలము.
సుష్ఠురభంతే హృష్యంత్యత్రేతి సురభిః. ఇ-పు. రభరాభ్యసే. - దీనియందు జనులు లెస్సఁగా సంతోషింతురు.
సుష్ఠు రభంతే ఉపక్రమంతే శుభకార్యం కర్తుమితి సురభిః. - దీనియందు జనులు శుభకార్యముఁ జేయ నారంభింతురు. ఈ మూడు 3 చైత్రవైశాఖములతోఁ జేరిన ఋతువు పేర్లు.

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు -
మన్మథుడు; మదనుఁడు - మన్మథుడు.

పుష్ప సమయము - వసంత ఋతువు
పూదఱి -
వి.పుష్పసమయము, వసంతఋతువు.
ఋతుపతి - వసంతర్తువు, king of seasons.

'నా విష్ణుః పృథివీపతిః' అను నార్యోక్తి ప్రకారము రాజు విష్ణు స్వరూపుడు.

పుష్పవంతులు - సూర్యచంద్రులు.

విశ్వమును ప్రకాశింపజేయు సూర్యుడు, విష్ణువు కన్నుల నుండి ప్రభవించెను. శీతోష్ణములకు, వర్షములకు, కాలమునకు, వెలుగునకు అతడే మూలము.

ఎప్పుడూ ఒంటరిగా తిరుగుతాడు. అందరికీ వెలుగునిస్తాడు - సూర్యుడు. సూర్యుని మీద బుగ్గిజల్లితే తన(మన)మీదే పడుతుంది.

శర్వరీ దీపకశ్చంద్రః - ప్రభాతో దీపకో రవిః
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపికః|
తా.
చంద్రుడు రాత్రి(శర్వరి - రాత్రి)ని ప్రకాశింప జేయును, సూర్యుడు (రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)పగటిని ప్రకాశింప జేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింప జేయును, సుపుత్రుండు కులమును బ్రకాశింప జేయును. - నీతిశాస్త్రము

చంద్రుడు వృద్ధిపొందే పక్షమునందలి కళలచే దేవతలకు, క్షీణకళలచే పితృదేవతలకు ప్రీతి కలిగిస్తూ వుంటాడు.

చంద్రుఁడు తానుపుట్టిన సముద్రమును వర్ధిల్ల జేయును. రాత్రిని కలిగించే చంద్రుడు, పదారు కళలతో కళకళలాడే చల్లనిమూర్తిమత్త కలవాడు. అమృతమయుడు, మనోమయుడు, అన్నమయుడు, వేల్పులకు, ఓషధీ లతలకూ, చెట్లకూ జీవకళ ఇచ్చేవాడు. ఫలించి చనిపోయే మొక్కలను ఓషదులు అంటారు.

మదనము - 1.ఆమని, వసంతకాలము, 2.ఉమ్మెత్త.
ఆమని -
1.వసంతఋతువు, వసంతుడు, 2.ఫలసమృద్ధి, విణ.1.మిక్కుటము, 2.తృప్తికరము, క్రి.విణ.1.మిక్కుటముగా, 2.తృప్తికరముగా.

మిక్కటము - మిక్కిలి, అతిశయము, రూ.మిక్కుటము. తుష్టి - 1.తృప్తి, 2.సంతొషము.

బుద్ధి కొద్దీ సుఖం. సుఖాల్లో గొప్పది సంతోషం. కొడుకును కౌగలించుకోవడం వల్ల కలిగే సుఖాన్ని మించిన సుఖం లేదు.

ఆమని జనులకు హాయి గూర్చెడిరీతి ఆశీర్వదింతురు అఘము తొలగ
వర్షము చేత సహర్షిరమయ్యెడి పొలము రీతిగ నీకు బుద్ధి గరపి
శరదృతు వెన్నెల సారవంతము జేయు సస్యమను మనసు వశ్యపరచి
హేమంతమున రాలు హిమబిందువులవలె ద్రవియించునట్టి హృదయము కాగ

తాము తరియించి మమ్ముల దరికి జేర్చు
గురువులకు నమస్కారమ్ము కూర్మిజేతు
జ్ఞాన వైరాగ్యములు తదనంతరమున
ముక్తి కలుగుటకీ పద్యముల రచించు - కందూరు పద్మనాభశర్మ

ఆమని పాడవే కోయిలా మూగవైపోకు ఈవేళ... సుకుమారమైన మామిడి పండును గోరెడి చిలుక యిష్టముతో వుమ్మెత్త కాయ తినునా?

వసంతం - చెట్లు చిగురిస్తాయి. ఎండలు మండుతాయి. అడవులు తగలబడ్తాయి. వడ గాలులు, సుడిగాలులు(పెద్దచెట్లకు సుడిగాలి పెనుభూతమె), వడగళ్ల వానలు వస్తాయి. మోదుగులు అగ్నికణాల్ని పూస్తాయి. మామిడిపళ్లు- పెళ్ళిళ్లలో ముస్తాబవుతాయి. ఆవకాయలు అవతరిస్తాయి.

వసంతదారువు - (వృక్ష.) కాండములో వసంత కాలమున ఉత్పత్తియైన దారువు (Spring wood).

ననాహత - వసంతకాలము.
వసంత -
Spring, ననకారు, పూల ఋతువు.
ననకారు - వసంతము; పూల ఋతువు.
నన - 1.పువ్వు, 2.మొగ్గ, 3.చివురు.
ననయు - క్రి.పూచు, చిగురించు.
ననుచు - క్రి.1.పూచు చిగురించు, 2.మొగ్గతొడుగు, 3.అతిశయించు, 4.అనురాగ మందు, 5.ఇంపగు, రూ.నవయు.
ననవిలుకాఁడు - మన్మథుడు, రూ.ననవిలుతుఁడు.

పల్లవము - 1.చిగురు, 2.చిగిరించిన కొమ్మ, 3.కోక చెరగు, 4.విరివి. చిగురు - 1.పల్లవము, విణ.లేత, రూ.చిగురు.(ప్రబలము - చిగురు విణ. మిక్కిలి బలముగలది). ప్రపంచములో బలమైనది, క్షమ.

చిగురాకు దిండి - కొయిల, పల్లవఖాది.

మామిడి చిగురుటాకులను నమలెడు కొయిల జిల్లేడు కొనలను నోట కొరుకునా?

కుసుమము - 1.పూవు, 2.నేత్రరోగము, 3.స్త్రీరజస్సు, 4.పండు.
సుమము -
పువ్వు, కుసుమము.
పువు - పుష్పము, రూ.పువ్వు, సం.పుష్పమ్.
పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీరజస్సు.
విరి - పువ్వు.
విరిఁబోడి - పుష్పమువలె మనోజ్ఞమైన స్త్రీ.
పువుఁబోడి - అందగత్తె, రూ.పువ్వుబోడి, పూబోడి.
పువ్వువిలుతుఁడు - మన్మథుడు, రూ.పువ్విలుతుడు.
పుష్పశరుఁడు - మన్మథుడు; కుసుమాయుధుఁడు - మన్మథుడు.  

రజము - రజస్సు.
రజస్సు -
1.రజోగుణము, 2.దుమ్ము, 3.స్త్రీరజస్సు, 4.పుప్పొడి.
రాజసము - రజోగుణము వలన కలిగినది.

సుమనస్సు -1.పువ్వు, 2.వేలుపు(దేవత, దేవతాస్త్రీ), 3.విద్వాంసుడు. సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు.

పుష్పసమయము (పౌష్పం) పుష్పములు అతి మృదువులు. పువ్వులు సువాసన ఇచ్చును. స్పర్సనే సహింపవు. తాకుడుకే నలిగి వాడిపోవును.

పువ్వులను ఎవరు - పూయమన్నారు? పువ్వులకు రంగులు - ఎవరు వేశారు? అంతటా సుగంధాలను - ఎవరు నింపమన్నారు?

పుష్పములపై ప్రసరిస్తూ వాయువు(గాలి) గంధమును జీవులకు అందజేస్తూ గంధమును మోస్తూ, తాను ఏమి స్వీకరించకుండా జీవరాసుల ముక్కు పుటములకు అందిస్తూ వుంటుంది. ఆనందం కలజేస్తూ ఉంటుంది. తాను మాత్రం సుగంధమును గాని దుర్గంధమునుగాని పొందక సర్వదా వేరుగా వుంటుంది. అప్రమేయమై - పరమై ఉంటోంది.

పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట, నెట్టిమానవుం
డైనను వానినెవ్వరును ప్రియంబునబల్కరు పిల్వరెచ్చటన్
దానిది యెట్లోకో యనిన తథ్యము పుష్పమువాడి వాసనా
హీనతనింది యున్నయెడ నెవ్వరు ముట్టదురయ్య, భాస్కరా.
తా.
సువాసన గల పూవు వాడి తన సువాసనను గోల్పోయి నంతనే దాని నెవ్వరూ ముట్టరు. అట్లే మొదట అదృష్టము గలిగి పిదప అది తొలగిన వానిని ఎవరును మునుపటి వలెనే చూడరు. వానితో సంభాషింపరు. వాడు పిలిచినను పలకరు.

కుసుమాకరము - 1.వసంతర్తువు, 2.తోట.
తోఁట -
1.ఉపవనము , 2.ఆశ్రమము.
చైత్రరథము - కుబేరుని తోట.(చైత్రరథము నందు దేవిస్థానం మదోత్కట)
ఉపవనము - పెంచినతోట, ఉద్యానము, అవ్య. వనసమీపమున.
ఉద్యానవనము - రమణీయములగు అనేక విధములైన చెట్లు, లతలు, గుల్మములు అందముగ నమర్చి పెంచుతోట (Garden).
ఉద్యానము - 1.(రాజుల) విహారార్థమైన తోట, 2.విహారము కొరకు వెడలుట, 3.ప్రయోజనము(ఉద్దేశ్యము, కారణము (Motive). వనాన్ని ఒకరెవరో పుట్టిస్తే మిగతావారు దానిని పెంచి పెద్ద చేస్తారు.

పూర్తము - నూతిని, చెరువును త్రవ్వించుట, గుడి కట్టించుట, తోట నిర్మించుట, అన్నము పెట్టుట, విణ.నింపబడినది.

తోఁట సేద్యము - (వృక్ష.) ఎక్కువ నీరు నిలువకుండ తగుమాత్రము నీరు పెట్టి పైరులను సాగుచేయు పద్ధతి. దీనికి అనుకూలముగా నుండు నేలలు ' తోటనేలలు ' అనబడును, (Garden cultivation).  

సహకారము - వ్యష్ఠి, సమిష్టి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగాచేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి.తియ్యమామిడిచెట్టు.

వృక్షవాటిక - 1.ధనికుల గృహముల యందలి ఉపవనము, 2.చిన్నతోట.
వనమహోత్సవము -
(వ్యవ.) చెట్ల పండుగ. సంవత్సరమున కొకసారి క్రొత్త వృక్షములను నాటు పండుగ. (ఇది మన దేశములో ఇటీవల సుమారు 15 ఏండ్ల నుండి ఆచారములోనికి తీసుకొని రాబడినది, వనములను పెంచుటకై వృక్షములు నాటు ఉత్సవము.) ఈ ఉత్సవము భారతదేశములో మొదటిసారిగా శ్రీ కనయ్యాలాల్ మున్షీచే క్రీ.శ. 1950లో ప్రారంభించబడెను.  

పరాయణము - 1.ఆశ్రమము, 2.అత్యంతాసక్తి, విణ.అభీష్టమైనది.
ఆశ్రమము -
1.మునుల ఇల్లు, 2.ఆకుటిల్లు, 3.మఠము, 4.బ్రహ్మచర్యాది, 5.పాఠశాల.
ఆకుటిల్లు - (ఆకు+ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల; పర్ణశాల - ఆకుటిల్లు.
మఠము - సన్న్యాసులు మొ.వారుండు చోటు.
పాఠశాల - బడి; బడి - 1.పాఠశాలు, 2.క్రమము, అవ్య.వెంబడి.
ఆశ్రమములు - 1.బ్రహ్మచర్యము, 2.గార్హస్థ్యము, 3.వానప్రస్థము, 4.సన్న్యాసము.

వెయ్యేళ్ల తెలుగు పద్యం:

వన నివహంబులెల్ల మృదువల్లుల, నా మృదువల్లులెల్ల లే
గొనల దనర్చు, లేగొనలు గుత్తుల, గుత్తులలో చిగుళ్ళు పెం
పొనరు చిగుళ్ళు క్రొవ్విదుల, పొందగు క్రొవ్విరులెల్ల తేటులన్
మునుకొని తేటులెల్ల నునుమ్రోతల నెంతయు నొప్పె నామనిన్ –మంచన

వసంతం సమయం వచ్చేసింది. వసంతం రాకముందు కూడా వన్నల్లో వల్లులు(తీగలు) వుండక తప్పదు. అయితే, వసంతం వచ్చిన తర్వాతనే ఆ వల్లులు మృదు వల్లులుగా తయారయాయి. ఆ మృదు వల్లులు లేత కొనలు వేశాయి, ఆ కొనలు చివుళ్ళు తొడిగాయి, ఆ చివుళ్ళనుంచే పువ్వులు విరిశాయి. ఆ పువ్వుల చుట్టూ తేటులూ(తుమ్మెదలు) వాటి సంగీత సంరంభంతో వసంతం దృశ్యంగానూ, శ్రావ్యంగానూ కూడా మనోహరంగా తయారయింది.

సాధారణ దృష్టితో చూస్తే యీ పద్యంలో యే విశేషమూ లేనట్లు కనిపిస్తుంది. సునిశితంగా పరిశీలిస్తే యీ పద్యంలో వున్న శిల్పం అర్థమవుతుంది. పద్య ప్రారంభం మెత్తగా తేగెసాగింది. ఆ తర్వాత తీగ అల్లుకున్నట్లుగానే, ఒక దశ నుంచీ మరో దశకు ప్రాకుతూ వెళ్ళి, ఆఖరుకు సంపూర్ణ వసంతంగా వికసించింది. ఇదీ… పద్య నిర్మాణంలో వున్న అంతర శిల్పం.

మంచన రచించిన "కేయూర బాహు చరిత్ర" లోనిది యీ పద్యం. - శ్రుతి

భుజకీర్తి - బాహుపురి, కేయూరము.
బాహుపురి -
కేయూరము.
కేయూరము - భుజకీర్తులు, వ్యు.భుజాగ్రమున నుండునది.
సందలిదండ - కేయూరము, బాహుపురి.

ముత్తెపురిక్క నెల - చైత్ర మాసము(చిత్తా నక్షత్ర యుక్తము). చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందు గలదు, గనుక చైత్రము, చైత్రికమును అనబడును.

చైత్రసఖుఁడు - మన్మథుడు.
చైత్రసారథి - మన్మథుడు.

స్యా చ్చైత్రే చైత్రికో మధుః :
చిత్తనక్షత్రయుక్తా పూర్ణిమా చైత్రీ సా స్నిన్నస్తీతి చైత్రః. చైత్రికశ్చ - చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు. గనుక చైత్రము, చత్రికమును.
మన్య్తే సర్వత్ర కామదేవో మధుః. ఉ-పు. మన జ్ఞానే - దీనియందు మన్మథుఁ డంతటఁ దలంపఁబడును.
మధునా పుష్పరసేన యోగాద్వా మధుః - దీనియందు మకరంద ముండును. ఈ మూడు చైత్రమాసము పేర్లు.

చైత్రికము - చైత్రమాసము.
చైత్రము -
1.నెల, 2.ఒకానొక కొండ.

నెల-1.మాసము 2.చంద్రుడు 3.పున్నమి 4. స్థానము 5.కర్పూరము.

మాసము - నెల, (చైత్రము, వైసాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావనము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాసరము - 1.పొడవైనది, 2.వ్యాపించినది, 3.అందమైనది.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురిగింజల యెత్తు.
మినుము - మినుపపైరు, మాషము.

మాసస్తు తావుభౌ :
తావుభౌ మాస ఇత్యుచ్యతే ఆ పక్షములు రెండు కూడిన కాలము మాసమనంబడును.
మస్యతే పరిమీయతే నేనేతి మాసః. మసీ పరిమాణే - దీనిచేత కాలము పరిమాణము చేయఁబడును. రెండు పక్షములు ఒక నెల.

చంద్రుడు - చందమామ. లక్షనక్షత్రాలైన ఒక చంద్రుడు కావు. చంద్రుడు నక్షత్రములకు రాజు.

బల్లిదుడైన సత్ప్రభువు పాయకయుండినగాని రచ్చలో
జిల్లరవారు నూరుగు సేరినఁ దేజముగల్గ దెయ్యెడన్
జల్లని చందురుం డెడసి సన్నపుజుక్కలు కోటియున్న రం
జిల్లునెనెన్నెలల్ జగము చీకటులనియు బాయ! భాస్కరా.
తా.
చుక్కలెన్ని(నక్షత్రములు) యుండి ప్రకాశించినను చీకటి తొలగదు. వానికి తోడుగా చంద్రుడున్నప్పుడే చీకటి లేకుండా నుండును. అట్లే బలవంతుడగు మంచిరాజు సభ యందు లేక సభ ప్రకాశించదు. సాధారణ జనులెందరుండినను ప్రయోజనము లేదు.

ఐందవము - చంద్రుని సంబంధమైనది, వి.1.చాంద్రమానము, 2.చాంద్రాయణ వ్రతము.
చాంద్రమానము -
చంద్రుని గతిని బట్టి యేర్పరచిన కాల ప్రమాణము.
చాంద్రాయణము - చంద్రుని వృద్ధిక్షయముల ననుసరించి ఆహార పరిమితి దిన క్రమమున హెచ్చించుచు తగ్గించు వ్రతము.
చాంద్రసంవత్సరము - చంద్రుడు అమావాస్య మొదలుకొని అమావాస్య వరకు భూమిచుట్టు తిరిగివచ్చు కాలమును బట్టి నెలను నిర్ణయించుట, చాంద్ర సంవత్సరమున గల 365 రోజులకు దానిని సరి పుచ్చుటకై అధిక మాసము వచ్చును. మలమాసము - అధిక మాసము.
అధిక మాసము - చాంద్రమానమున మూడేండ్ల కొకసారి వచ్చు పదమూడవ నెల. సూర్యసంక్రమణము లేని చాంద్రమాన మాసము.
ఐందవి - పల్కుచెలి, సరస్వతి.
పలుకుఁజెలి -
సరస్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒకనది.

పున్నమ - పూర్ణిమ, సం.పూర్ణిమా, ప్రా.పుణ్ణమా.
పూర్ణిమ -
పున్నమ, అఖండ చంద్రుడు గలది.
పౌర్ణమి - సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని అర్ధభాగముపై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.

పూర్ణిమనాడు చంద్రుడు యే నక్షత్ర మండలమందు కనబడునో ఆ నక్షత్రము పేరు ఆ నెలగా నుదహరింపబడును.

భువి - 1.భూమి, 2.స్థానము. మన భూమి కర్మ భూమి. కర్మ అన్నిటికీ మూలం.

స్థానము - 1.చోటు ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ. స్థలము - 1.మెట్టనేల 2.చోటు. నెలకువ - స్థానము; నెలవు - నివాసము, విణ. 1.వాసస్థానము, 2. స్థానము, 3.పరిచయము.

భూమి నుండి అన్నం - అన్నం నుంచి రక్తం - రక్తం నుంచి రేతస్సు - రేతస్సు నుండి సంతానం.

'అన్నం వై కృషిః' అన్నమే కృషి అన్నది వేదం. అన్నం మనకు జన్మనిచ్చింది. మనకు శక్తినిస్తుంది. ఆ శక్తితోనే మనం జీవిస్తున్నం. ఆ శక్తితోనే పనులు చేస్తున్నాం. ఆర్జిస్తున్నం. అధికులం అవుతున్నం. కాబట్టి అన్నన్ని అవమానించ రాదు. ఆదరించాలి. పూజించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది వేదం.

రక్తము - 1.నెత్తురు 2.కుంకుమ 3.ఎరుపు. రక్తము నీటి కన్న చిక్కగా నుండునది.

తేజము - 1.ప్రకాశము, వెలుగు, విణ.బయలు పడినది 2.ప్రభావము(ప్రతాపము, తేజము),3.పరాక్రమము(బలము, శౌర్యము), 4.రేతస్సు రూ.తేజస్సు.

కర్పూరము - ఘనసారము, కప్పురము.
ఘనసారము -
1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేధము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టు బంక.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.

ఫసలు - (వ్యవ.) 1.పంట, 2.ఋతువు, 3.కాలము, 4.జరుగుచున్న సంవత్సరము.

ఫలము - 1.పండు, 2.పంట, 3.ప్రయోజనము, 4.లాభము, వి.(రసా.) భౌతిక రసాయనిక ప్రక్రియల యొక్క పర్యవసానము (Effect), వి.(గణి.) కొన్ని రాసులపై గనితశాస్త్ర విధానముల నుపయోగించిన లభించు రాశి (Result).
ఫలసాయము - (వ్యావ.) పండినపంట.
ఫలినము - పండ్లుగలది (వృక్షము).

శివరాత్రికి జీడిపిందె, ఉగాదికి ఊరగాయ. జీడివారికోడలు సిరిగలవారికి ఆడపడుచు - వయసులో కులికే వయ్యరి వైశాఖమాసంలో వస్తుంది.

పంటవలఁతి - భూమి.
పంట -
1.పండుట, 2.కృషి.
ఫలము - 1.పండు, 2.పంట, 3.ప్రయోజనము, 4.లాభము, వి.(రసా.) భౌతిక రసాయనిక ప్రక్రియల యొక్క పర్యవసానము (Effect), వి.(గణి.) కొన్ని రాసులపై గణితశాస్త్ర విధానముల నుపయోగించిన లభించు రాశి (Result).
ఫలసాయము - (వ్యావ.) పండినపంట. 
కృషి - సేద్యము, వ్యవసాయము.
సేద్యము - కృషి, వ్యవసాయము, సం.సేత్యమ్.

కృషితోనాస్తి దుర్భిక్షం జపతోనాస్తి పాతకం|
మౌనేన కలహం నాస్తి, నాస్తిజాగరతో భయం||
తా.
కృషి చేసికొనువానికి కఱువులేదు, జపము జేసికొనువానికి పాపములేదు, మౌనముతో నున్నవానికి కలహములేదు, మేల్కొని యున్నవానికి భయము లేదు. - నీతి శాస్త్రము

ఋతువు - 1.రెండు మాసముల కాలము, 2.గర్భధారణకు యోగ్యకాలము, 3.స్త్రీ రజస్సు, 4.వెలుగు, ప్రకాశము.
ఆర్తనము - 1.వసంతాది ఋతు సంబంధమైనది, 2.స్త్రీ ఋతు సంబంధమైనది, వి.1.స్త్రీ ఋతువు, 2.పువ్వు, 3.ఋతుస్నానమైన పిదప గర్భోత్పత్తికి అనుకూలమైన కాలము. 

ఋతుః స్త్రీకుసుమే పి చ. : ఋతుశబ్దము స్త్రీల రజస్సునకును, వసంతాది ఋతువులకును పేరు. ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ. - పోవునది.

ఋతుఁడు - సూర్యుడు.

ద్వౌద్వౌ మాఘాదిమాసా స్యా దృతుః :
ద్వౌద్వౌ మాఘాదిమాసౌ ఋతురిత్యుచ్యతే. - మాఘము మొదలైన రెండేసి మాసములు ఋతు వనంబడును.
ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ - గతించునది. ఈ రెండు నెలలు ఒక ఋతువు.

ఋతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః|
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||

చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రములందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె -
సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె   మొ,వి. క్రాంతిః.

చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
చిత్ర -
1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్రకంఠము - 1.కపోతము, 2.గువ్వ.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
గువ్వ - 1.అడవిపావురము, 2.పక్షి.
పారావతము - పావురము.

మధువు - 1.నీరు, 2.పాలు, 3.తేనె(నననీరు-మకరందము, తేనె), 4.కల్లు, 5.వసంతర్తువు, 6.చైత్రమాసము(మదుమాసం - చైత్రమాసం, మధువనఁగా వసంతుఁడు, అతడు దీనియందుఁ గలడు).

నీరు - 1.నీరము, జలము(నీరము - జలము), 2.మూత్రము, సం.నీరమ్.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
పయస్సు - 1.క్షీరము, 2.నీరు.
పయస్విని - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
తెనియ - మధువు, రూ.తేనె. తేనెదిండి - తుమ్మెద.  
మధూళి - 1.కల్లు, 2.పూదేనె; పూఁదేనియ - మకరందము.   
కల్లు1 - 1.బండికన్ను(చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.
మాధ్వి - 1.మద్యము, 2.మకరందము.
మకరందము - పుష్పరసము, మరందము. 
మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు.
మాధుర్యము - 1.తీపు, 2.పక్షులు మొ. నవి వచ్చుటకు బోయ వేయు ఈల, 3.శృంగారచేష్ట.    
తీపు - 1.మాధుర్యము, 2.గుంజెడుబాధ.

మాధవి - 1.పూల గురివెంద, 2.కల్లు, 3.తేనె, 4.లక్ష్మి, 5.కుంటెనకత్తె.
మాధవుఁడు -
లచ్చిమగడు, విష్ణువు. 

కౌసుమము - 1.పూదేన, 2.పుప్పొడి, విణ.కుసుమ సంబంధమైనది.

తేనెటీగ, పూదేనె కోసం చిన్నా పెద్దా పుష్పములపై వ్రాలుతుంది. అది పుష్పానికి ఎటువంటి చేటు కలిగించదు. పుష్పపు రెక్కలకు హాని కలుగనీయదు. తేనెటీగలు రాత్రులందే మధువును సంగ్రహించునని లోకప్రసిద్ధి.

తేనెయున్న చోటికి యీగలు(ఈగ, కీటకము - వ్యాధుల దెచ్చునది, ఈగలకు తలయందు విషము ఇమిడియుండును) అవే వస్తాయి. తేనపట్టు పున్నమికి ఊట, అమావాస్యకు ఆరగింపు.

వైశాఖము - 1.వైశాఖ మాసము, 2.కవ్వము, 3.వీలుకాని స్థానము.
మాధవము - 1.వైశాఖ మాసము, 2.వసంత ఋతువు.

వైశాఖే మాధవో రాధో :
విశాఖానక్షత్రయుక్తా పూర్ణిమా వైశాఖీ, సా స్మిన్నితి వైశాఖాః - విశాఖా నక్షత్రముతో గూడిన పున్నం దీనియందుఁ గలదు.
కుసుమసంభృతం మధు ప్రచురం అస్మిన్నస్తీతి మాధవః - కుసుమసంభృతమైన మధువు విస్తారముగలది.
మధుః వసంతః, అస్మిన్నితివా మాధవః - మధువనఁగా వసంతుఁడు, అతఁడు దీనియందుఁ గలఁడు.
రాధా విశాఖా, త్యుక్తాపూర్ణిమా స్త్యస్మిన్నితి రాధః - రాధ యనఁగా విశాఖ, దానితోఁ గూడిన పున్నమ గలది. ఈ మూడు 3 వైశాఖ మాసము పేర్లు.

కవ్వము - పెరుగు చిలుకు సాధనము.
దధిచారము -
కవ్వము; గూటిలో గువ్వ గుబగుబలాడినది. తరిగోల – కవ్వము. క్షుబ్ధము - కలత పెట్ట బడినది. వి. చల్లకవ్వము.

చిత్త చిత్తగించి స్వాతి చల్లచేసి విశాఖ విసరికొడితే చేనుకంకిలో కావలిసినన్ని ధాన్యము పండును.

చల్ల-మజ్జిగ, శీతము.
దండాహతము - మజ్జిగ వ్యు.కవ్వముచే త్రచ్చ బడినది.

పాలు చిక్కనైతే వెన్న వెక్కసం(ము)- 1.అధికము 2.దుర్లభము. పెరుగును కవ్వముతో నెంత తరచిన నంత వెన్న వచ్చును. చల్లకు వచ్చి ముంత దాచనేల. మంది యెక్కువైన కొద్దీ మజ్జిగ పల్చన. హస్తకు ఆరుపాళ్ళు చిత్తకు మూడుపాళ్ళు.

రసాయనము - 1.జరావ్యాధులను పోగొట్టెడి మందు 2.మజ్జిగ.

వాసంతము - వసంత సంబంధమైనది, వి.1.ఒంటె, 2.కోయిల, 3.తెమ్మెర.
ఒంటె -
ఒంటియ.
ఒంటియ - ఉష్ట్రము, మహాంగము, లొట్టుపిట్ట, రూ.ఒంటె.
ఉష్ట్రము - ఒంటె, వ్యు.ఎల్లప్పుడును ఎండచే తపింపబడునది.
మహాంగము - 1.లొట్టిపిట్ట, 2.పందికొక్కు.
లొటిపిట - లొటిపిట్ట, లొట్టిపిట, లొట్టిపిట్ట.
కొక్కు - పందికొక్కు; కొక్కురౌతు - వినాయకుడు.
పందికొక్కు - మూషికము; ఎలుక - మూషికము.
మూషికము - 1.ఎలుక, 2.పందికొక్కు.
అఖువు - ఎలుక, పందికొక్కు.
అఖువాహనుఁదు - వినాయకుడు, వ్యు.ఎలుక వాహనముగా గలవాడు.

కానకచేరఁబో దలతికర్ముఁడు నమ్మిక లెన్నిచేసినన్
దా నదినమ్మి వానికడ డాయఁగబోయిన హానివచ్చున
చ్చోనదియెట్లనన్ గొరుకచూపుచు నొడ్డనబోనుమేలుగా
బోనవి కానకాసపడిపోవుచుఁ గూలదెకొక్కు, భాస్కరా.
తా.
బోనులోని యాహారమును చూచి అది ఒక బోననియు, తనకక్కడ పోయినచో ఆపద కలుగుననియు తెలిసి కొనక, పందికొక్కు అందలి యెరకైనేగి యందు చిక్కుకొని మృతి నొందును. అట్లే, దుర్మార్గుల మోసమును తెలిసి కొనక వారాచరించు పను లన్నియు మంచివే యని తలచి, వారి యొద్దఁ జేరినచో యాపద కలుగుట నిశ్చయము. 

కోకిలము - కోకిల.  పరభృతము – కోయిల. పైకము - ధనము వి. కోకిల గుంపు. కాకపుష్ఠము - కొయిల,  వ్యు.కాకిచే పోషింపబడినది.

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కొయిల, 3.నెమలి. చిగురుకొమ్మన అల్లరిపక్షి- రాగమెవ్వరు నేర్పారే రాగాలపక్షి. పిట్ట కొంచెం, కూత ఘనం. ఆడేకాలు పాడేనోరు ఊరుకొనలేవు.

కల1 - 1.కళ(చంద్రభాగయందు దేవీస్థానం కళ) 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము,  విణ.అవ్యక్త మధుర స్వరము.
కల2 -  స్వప్నము. కలకాల మొకరీతి కల్ల యౌనది.

కలకంఠము - 1.కొయిల, 2.పారావతము(పావురము), 3.హంస, వ్యు.మధురమైన కంఠముగలది. కోకిలప్రియ - కోకిలారవము. చిత్రకంఠము - 1.కపోతము, 2.గువ్వ(అడవి పావురము, తవ్వలా వుంటుంది అవ్వలా గొణుగుతుంది.)

కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్‌|
విద్యారూపం విరూపాణాం క్షమారూపం తపస్వినామ్||
తా.
కోకిలకు(కోకిల నల్లనిది) స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము, కురూపునకు విద్యయే రూపము, యతులకు శాంతమే రూపము. - నీతిశాస్త్రము

వేసవికాలము : చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢ మాసములు.

2. జ్యేష్ఠ ఆషాడ మా|| - గ్రీష్మ ఋతువు, వేసవి(జ్యేష్ఠాషాడ మాసములు), ఎండలు మెండుగా కాయును.

Sukra&Suchi – Greeshma(Summer). Greeshmo dakshinah pakshaha, right shoulder – the Summer.

గ్రీష్మం - ఎండలు తగ్గుతాయి. చెట్లు ఆకులతో నిండుతాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆకాశంలో మబ్బులు ఆశపెడతాయి. చినికులు పడ్తాయి - పడ్డట్లు, పడనట్లు. రైతు ఆకాశానికి మొక్కుతుంటాడు!గ్రీష్మకాలంలో ఎండలకు ఎండి బద్దలయిన నేల, తొలకరిజల్లు పడగానే మెత్తబడి చల్లపడుతుంది. వరుణదేవుని పలకరింతలు - భూదేవి పులకరింతలు.

గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్ఠాషాడ మాసములు.)
గ్రీష్మము -
1.వేడి, వేసంగి. 
ఊష్మము - 1.ఆవిరి, 2.వేసగి, 3.గ్రీష్మ ఋతువు, 3.ఊష్మధ్వనులు (శ, ష, స, హ). 
గ్రీష్మ - Summer; శుచి, అగ్ని(నీరు బిడ్డగా కలది).
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది. 
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు - చంద్రుడు, రూ.శుభ్రాంకుడు. 

వేసఁగి - వేసవి, సం.వైశాఖః.
వేసవి -
వేసవి కాలము; ఉష్ణకము - వేసవికాలము.

వెచ్చ - కాక, వేడిమి, సం.ఊష్మ.
కాఁక -
1.జ్వరము, 2.తాపము, 3.కోపము, విణ.వేడియైనది.
కాఁకవెలుగు - సూర్యుడు, ఉష్ణరశ్మి.
వెట్ట - వేడిమి, సం.ఉష్ణః.
వెట్టకారు - వేసవి.

ఊష్మము - 1.ఆవిరి, 2.వేసగి, గ్రీష్మ ఋతువు, 3.ఊష్మధ్వనులు (శ,ష,స,హ).

ఆవిరి - బాగుగ కాచిన నీటి నుండి లేచు ఊష్మము, అవి (Steam).
అవి1 - 1.శ్వాసము, ఊపిరి, 2.తాపము, 3.ఆవిరి, 4.చీడ.
అవి2 - 1.ప్రసవ వేదన, 2.రజస్వల, 3.చూలాలు.

శ్వాసము - 1.ఊపిరి, 2.ఉబ్బసము, 3.వాయువు.
ఊపిరి -
శ్వాసము, ఊర్పు.
ఊరువు1 - ఊపిరి, శ్వాసము, రూ.ఊర్పు, సం.ఊర్జః.
ఊరువు2 - ఒకవిధముగా వండినకూర, ఒకరకపు వ్యంజనము, రూ.ఊర్పు.
ఉబ్బసము - ఊర్థ్వశ్వాస రోగము, వగరుఃపురోగము, సం.ఉచ్ఛ్వాసః. 
ఉబ్బసపుదగ్గు - (గృహ.) ఉబ్బసము, భారమైనదగ్గు, ఊపిరాడకుండ వచ్చు దగ్గు, (Asthma).

చీడ - పైరులను చెరిపెడి పురుగు.

ఉమ్మదము - ఉబ్బ, సం.ఉష్మదమ్.
ఉమ్మ -
ఉబ్బ; ఉబ్బ - ఉక్క, రూ.ఉమ్మ, ఉమ్మదము, సం.ఊష్మః.
ఉక్క - ఉమ్మ, తాపము, వేడి.
వేఁడి - 1.తాపము, 2.చురుకు, 3.వాడిమి, 4.ప్రకాశము.
తాపము - 1.వేడిమి, 2.బాధ, సం.వి. (భౌతి.) వేడి (Hot).
(ౘ)చుఱుకు - 1.వాడి, వాడిమి, 2.వేడిమి, 3.వేగము, 4.ఆయుధము నాటుట, 5.నిప్పు సోకుటయందగు అనుకరణము, రూ.చురుక్కు. 
వేఁకి - 1.జ్వరము, 2.వేడిమి, 3.అగ్ని.
వేఁడికంటి - ఉగ్రాక్షుడు, శివుడు.

ప్రకాశము - వెలుగు, విణ.బయలు బడినది.
వెలుఁగు -
1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.

వేఁడివేలుపు - 1.వహ్ని, 2.సూర్యుడు.
వహ్ని -
అగ్ని.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్చుఱ, సం.శుచిః.
చిచ్చఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.

గ్రీష్మ - Summer; శుచి, అగ్ని(నీరు బిడ్డగా కలది).
శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపదాశుద్ధుడైన మంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.

పావకే శుచిః. మాస్యమాత్యే చాత్యుపధే మధ్యే సితే త్రిషు. :
శుచి శబ్దము అగ్నికిని, ఆషాఢమాసమునకును, ధర్మాదిపరీక్షలచేతఁ పరిశుద్ధుఁడైన (య)అమాత్యునకును పేరైనపుడు పు. పవిత్రమైన దానికిని, తెల్లని వస్తువునకును పేరైనపుడు త్రి. శోచంత్యనేనేతి శుచిః శుచశోకే. దీనిచేత వ్యథనొందుదురు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
నిప్పు -
అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గికంటి - శివుడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.

చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
శిఖ -
1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు - అగ్ని, సం.విణ. జుట్టు ముడికలవాడు.
శిఖి - 1.అగ్ని, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.
శిఖివాహనుడు - కుమారస్వామి.

బర్హి - 1.నెమలి 2.దర్భ(కుశ,పవిత్రమైనది)కు-భూమి;శ–విత్తనాలు. బర్హిస్సు - అగ్ని; అవసరమైనవాడు - ఆత్మబంధువువాడు, బహుముఖంబులవాడు వాయు సఖుడు. వాయువు తోడ్పాటుతో అగ్ని వృద్ధి పొందును.

నర్తన ప్రియము - నెమలి(నర్తనము-1.నటనము 2.ఆట). గిరులపై మయూరములు(నెమళ్ళు) వర్షపు మేఘమును జూచి పురివిప్పి ఆడును. మహారణ్యములోమయూర నృత్యము. నెమలి నాట్యము మనకు ఆనందము నిచ్చును.

తాటిరిక్కనెల - జ్యేష్ఠమాసము; పెద్దనెల - జ్యేష్ఠమాసము.
జ్యేష్ఠము - 1.ఒక మాసము, 2.హంస.
 

జ్యేష్ఠానక్షత్ర యుక్తా స్మిన్నితి జ్యేష్ఠః - జ్యేష్ఠానక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందు గలదు. శోచయతి ప్రాణిన ఇతి శుక్రః శుచ శోకే. తాపముచేత ప్రాణులను దుఃఖింపఁజేయునది.

గౙ - పెద్ద, సం. గజః.
పెడ -
1.పెద్ద, 2.వెనుకటిది, 3.విపరీతము, సం.వృద్ధః.(వృద్ధ - ముసలిది.)
పెద్ద - 1.వృద్ధుడు, 2.జ్యేష్ఠుడు, 3.అధికుడు, 4.శ్రేష్ఠము, 5.దీర్ఘము, 6.అత్యంతము, సం. పృద్ధః, పృథుః.
ముసలి - 1.ఉడుము, 2.బలరాముడు, విణ.వృద్ధుడు.
జ్యేష్ఠుఁడు - 1.అగ్రజుడు, 2.మిక్కిలి వృద్ధుడు.
అధికుఁడు - గొప్పవాడు.
శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.
దీర్ఘము - నిడుద(నిడుద - పొడవు, దీర్ఘము, రూ.నిడుపు).
మాసరము - 1.పొడవైనది, వ్యాపించినది, 3.అందమైనది.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - అధికము, శ్రేష్టము.

కందాయము - సంవత్సరమున మూడవ భాగము, జ్యేష్ఠాది మాస చతుష్టయము.  
ఆయతి1 -
1.రాబడి, 2.నిడుపు, 3.రాగలకాలము, 4.కోశ దండముల వలన రాజునకు గలుగుశక్తి, ప్రభావము, 5.ఫలము గలుగు సమయము, 6.ప్రాపణము, 7.కూడిక, 8.పని, 9.సంయమము.
ఆయతి2 - జేష్టాది మాసచతుష్టయము, కందాయము.
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీ సంయోగము, 3.లాభము, 4.చెలిమి, 5.రాబోవుకాలము, ఆయతి. 

హంస - 1.అంచ, 2.యోగి, 2.పరమాత్మ, 3.గుఱ్రము, 5.శరీర వాయు విశేషము  రూ.హంస.

అంౘ1 - హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము. అంౘల - ప్రక్క, సమీపము(చేరువ).
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.

చతురాసన సమ్రాజ్ఞీ బ్రహ్మవిష్ణుశివాత్మికా,
హంసాసనా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ.

యోగి - యోగ్యాభ్యాసము జేయు పురుషుడు.
(ౙ)జోగి - 1.యోగి, 2.భిక్షుకుడు(బిచ్చగాడు), సం.యోగీ.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము. 

ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదర్ధాలున్నయి. 1) హంస-అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగు వేళ వాయువు "హ" కారములో బహిర్గతమై "స" కారములో లోపలికి వస్తుంది అంటే హంస శబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉంది. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్ర రూపిణీయైన దేవికి వందనాలు. - శ్రీ లలితా త్రిశతీ నామావళిః   

ఓం హంసిన్యై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులూన్నయి. అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేధము.

ఆషాఢము - 1.ఆషాఢ నక్షత్రముతో గూడిన పున్నమ గల మాసము, చైత్రము మొదలు నాల్గవ నెల 2. బ్రహ్మచారి ధరిచు మోదుగుకోల.

చాతుర్మాస్యము - ఆషఢ శుద్ధము మొదలు కార్తీక శుద్ధమునకు అనగా నాలుగు మాసములు చేయు ఒక వ్రతము. శివరాత్రి కన్న గొప్ప రాత్రి - మౌనవ్రత్రం కన్న మంచి వ్రతం లేవు.

సనాతనుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు,  విణ. శాశ్వతుడు.

chaturmasya – the four months of the rainy season in India, during which devotees of Lord vishnu observe special austeries.

ఓం పంచయజ్ఞ ప్రియాయై నమః : అగ్ని హోత్ర, దర్శ, పూర్ణమాస, చతుర్మాస, పశుసోమాలు - పంచ యజ్ఞలని పిలువ బడతాయి. ఈ పంచ యజ్ఞాలయందు ప్రీతిగల మాతకు(లలిత) వందనాలు.

ఆతురే నియమోనాస్తి బాలేవృద్ధే తధైవచ|
సదాచర రతౌచైవ హ్యేషధర్మ స్సనాతనః||
తా.
అత్యాశ గలవానికి(అత్యాశ గలిగినయున్న వేరు దుర్గుణము పనిలేదు), బాలునికి, వృద్ధునికి, సదాచార రతునికి వీరలకు వ్రతంబు పనిలేదు. - నీతి శాస్త్రము

చినుకు - 1.కారు, 2.కురియు, 3.కార్చు,  వి.వానబొట్టు.
కారు1 -
వి. 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు(ప్రాయము, యౌవనము).

వయసు - ప్రాయము, యౌవనము.
ప్రాయము -
1.వయస్సు, 2.బాహుళ్యము, 3.చావు(మృతి - చావు).
యౌవనము - పదియాఱు,16 మొదలు ఏబది,50 సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ. జవ్వనము. జీవితంలో తిరిగిరానిది యౌవ్వనం.    

కారు2 - వి. 1.ఉప్పు, 2. అడవి, 3. నలుపు, 4. నస, 5. ముదిమి.  ఉప్పు -(నీళ్ళవరుగు-ఉప్పు) క్రి.ఆవిరి కుండ ఉడక బెట్టు వి.1.లవణము 2.ఉప్పదనము 3.సొమ్ము.

దక్షిణపుకొమ్ము హెచ్చు (చంద్ర వంకకు)ధాన్యానికి ధర; ఉత్తరపుకొమ్ము హెచ్చు ఉప్పుకు ధర.

లక్ష్మీదేవి పుట్టకముందు ఆకులేని పంట పండింది - ఉప్పు. లక్షాధికారైన లవణ మన్న మెకాని, మెఱుగు బంగారంబు మ్రింగఁబోఁడు. ఉప్పు అధికము తినేవాడే నీరు ఎక్కువ త్రాగువాడు. 

అడవి - అరణ్యము, సం.అటవీ.
అడవికాపు - వానప్రస్థుడు.

సాధారణంగా అరణ్యాలలో వ్యాఘ్ర సింహాది కౄరమృగాలుంటాయి. కాని సహజాతభయ విహారిణులైన హరిణులున్న(జింకలు) ప్రదేశంలో కౄర జంతువులుండవని తెలిసికోవాలి.

కాంతారము - 1.పోరాని మార్గము 2.అడవి, అరణ్య రోదనము అడవి గాచిన వెన్నెల. 3.చెరకు 4.దైవికముగ వచ్చు ఆపద.

జీవితంలో దారి తప్పడం - పిల్లదారి పట్టడం తప్పులు కావు. సంశయారణ్యములలో తప్పుదారులలో పోవుట, దారి మరవడం మహాతప్పు. పోరాని తావునకుపోతే రారాని నిందలు రాకమానవు.

అదృష్టము – 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, అగ్ని నీరు లేనిచోట దహించునుగాని నీరున్నచోట దహింపలేదు. 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాప రూప కర్మఫలము 3.భాగ్యము విణ. చూడబడనిది.

దాపము -1.దవము, కార్చిచ్చు 2.అడవి 3.బాధ.
దవము - 1.కార్చిచ్చు, దావానలము, 2.అడవి రూ.దావము. కారుచిచ్చు - దవానలము, రూ.కార్చిచ్చు.

అడవిలో మ్రాకులు ఒకటితో నొకటి ఒరసికొనగాపుట్టి అడవిని దహించెడి అగ్ని. అడవిలో వెదురు పొదలలో పెద్దగాలి కొట్టినపుడు ఒక వెదురు మరి యొక్క వెదురుతో రాపిడి చేసుకొని నిప్పు పుట్టును. ఆ నిప్పుతో అరణ్యమంతా దగ్ద మగును.

బలయుతుఁడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని యాతడే
బలము దొలంగెనేని, తనపాలిట శత్రు వదెట్లు, పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చుతరి వాయువు సఖ్యము జూపుగానినా
బలయుడు సూక్ష్మ దీపముననున్న పుడార్పును గాదె! భాస్కరా.

తా. అగ్ని గొప్ప మంటలతో నొక యడవిని దహించుచున్నపుడా యగ్నికి వాయువు సహాయ కారునివలె నుండును గాని, ఆ అగ్నే ఒక చిన్న దీపము రూపమున ప్రకాశించు నప్పుడా వాయువు దానికి శత్రువై ఆ దీప మార్పును. అట్లే బలము గలిగి నప్పుడు తన బంధువులందరు స్నేహితులగుదురు. తన బలము తగ్గి నప్పుడా చుట్టములే శత్రువు లగుదురు. 

తన బాహుబలము తగ్గిపొయినప్పుడు యెంతటి గొప్ప వాఁడయిననూ తన సంపదలను నిల్పుకొనలేడు. 

కఱ - 1.నలుపు 2.మరక సం. కాలః

కృష్ణము - 1.ఇనుము, 2.మిరియము(కేవల ద్రవ్యము) 3.నలుపు 4.కాకి(కాకి మరియొక కాకిని పొడవదు) 5.కోకిల(నూరు కాకులలో ఒక కోకిల, కోకిలను గన్న కాకులు దాని చుట్టును మూగి అసహ్యపు కూతలను కూయుచూ దానిని తన్ని తరిమి వేయును కదా!) 6.కాలాగురువు  విణ. నల్లనిది.   

ఇనుము - ఒక లోహము, కాలాయనము.
శస్త్రము - 1.ఆయుధము, ఆయుధ బలము కన్న ధర్మబల మధికము. 2.ఇనుము, ఇనుమును గూడిన అగ్నికి(వేడి వేలుపునకు) సమ్మెట పెట్లు . శ్యామము-1.మిరియము 2.ఆకు పచ్చ 3.నలుపు 4.మబ్బు. 

మబ్బు- 1.మేఘము-ఉడిగి ఉత్తరం చేరేది, కమలాప్త బింబంబుగ్రప్పునది మబ్బు. 2.చీకటి 3.అజ్ఞానము, లోకాన్ని కప్పివున్నది.

శ్యామిక - చీకటి, నలుపు. నల్ల - 1.నెత్తురు వై.వి. నలుపు 2.బొగ్గు విణ.నలుపైనది. ఒక బొగ్గు రగులుకొనదు. రెండు నులుపులు కలిపినా ఒక తెలుపు కాదు.

చీఁకటిగొంగ - సూర్యుడు,  వ్యు. చీకటికి శత్రువు

నస  -  1.నాశము  2.ద్రవ్యనాశము  3.(వ్యవ.)వాగుడు  4.దురద 5.ఉపద్రవము. సం.వి.ముక్కు,రూ.నాసిక. రాటు - ఉపద్రవము, సం.రాష్ట్రము. నాన – ముక్కు, ముక్కుతో చూడగలం-కంటితో చూడలేం రూ.నస, నాసిక. నసుకు - అసత్యవచనము విణ.అసత్యము. 

అటమట - 1.వంచన 2.దుఖఃము  విణ.1.వ్యర్ధము 2.అసత్యము.
అసత్యము - బొంకుమాట  విణ.సత్యము కానిది.

కాఱులు-1.అనృతవచనములు(అసత్యమైనవి, హానికరమగు మాటలు, అప్రియమైనవి) 2.పరుషవచనములు 3.వ్యర్ధవచనములు.

ఎన్నో వ్రణములు కోసితిని కాని నాకురుపు కోసినప్పటి బాధ ఎవ్వరికి కలుగలేదు అన్నట్లు. కత్తి మెత్తన అత్త మంచిది వుండదు. కత్తి చేసిన గాయం మానుతుంది కాని పరుష వాక్కులు చేసిన గాయం మాత్రం మానదు.

సడుగులు - 1.నడుము కీళ్ళు 2.వంకరమాటలు.
వ్యాహకము - 1.మిక్కిలి కొట్ట బడినది 2.వ్యర్ధమైనది.

కొండెము(చాడి, లేనినేరము) చెప్పుట కలిగియున్న నితర పాపము లేదు. గొప్ప మాటలు గోడలుదాటవు కాని చెడ్డమాటలు జగమంతా ప్రాకును.    

ముదిమి – ముసలితనము. వయస్సు పడమరకు తిరిగింది.
వృద్ధత్వము - ముసలితనము(senility) వృద్ధాప్యము బలమైనశత్రువు. ముసలి - 1.ఉడుము(ఉడుము నూరేండ్లు జీవించును) 2.బలరాముడు విణ.వృద్ధుడు.

నైఋతి వర్షవాయువు - (వ్యవ.) June నుండి September వరకు నైఋతి మూలనుండి వీచు వాయువు(south-west monsoon).

వాయువు యొక్క ప్రేరణ చేత ఆకాశంలో మేఘాలు పరుగులు తీస్తూ వుండవచ్చుగాక! మేఘముల రాక - పోకలతో ఆకాశం దోషం పొందు తోందా?

ఉఱుము1 - ఉడుము
ఉఱుము2 - క్రి. గర్జించు, వి. 1.మేఘధ్వని, 2.వీరహుంకారము. పర్జన్యము - 1.ఉరిమెడు మేఘము, 2.ఉరుము.
పర్జన్యుఁడు - వర్షాధిపతి.

పర్జన్యౌ రసద బ్దేన్ద్రౌ : పర్జన్య శబ్దము ఉఱుముచున్న మేఘమునకును, దేవేంద్రునికిని పేరు.
పర్షతీతి పర్జన్యః పృషు సేచనే. వర్షించును గనుక పర్జన్యుఁడు.

మేఘనాదము - ఉరుము. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఈదురుగాలి, భయం గొలుపుతాయి.

మేఘములు నీటితో ఆకాశమున వ్రేలాడును. ఆకాశం మేఘములతో నుండి వర్షించుటకు ముందుగా మెరుపులు మెఱయును.

చంద్రునకు(చంద్రుడు) గుండ్రము, జలదము(మేఘము, మొగులు)నకు స్థిర నివాసము ఎంతకాలము.

మేఘము భయంకరముగా నురిమి తుదకు జనులను రక్షించుటకై వర్షము కురియును. మేఘము వర్షించి నపుడే దాని గొప్పదనం, గర్జించి నపుడు కాదు. నల్లని మేఘాలు చీకటికి మాత్రమే కారణం అవుతాయి. మేఘములు నలుపైనా కురిసేవాన తెలుపే! మేఘములు చెదిరిపోయినా వర్షపు నీరు నిలిచియే యుండును.

మేఘములను నమ్మి చెరువుగట్టు తెగకొట్టుకుంటారా? Why thunder lasts longer than that which causes it?

మేఘములను ఎవరు - ఘర్జించమన్నారు? వర్షమును ఎవరు కురవమన్నారు? కన్ను ఎర్రనైనా(ఎఱగన్ను- శివుని అగ్నినేత్రము), మిన్ను(ఆకాశము) యెర్రనైనా నీరే.

ఒక తటాక మైతే వసంత - గ్రీష్మ ఋతువులలో (వేసవిలో)ఎండిపోతుంది, (వర్షాకాలంలో) నిండుగా కనిపిస్తుంది. అదే సముద్రమో! వర్షర్తువులో వృద్ధిపొందదు, యండాకాలంలో ఎండిపోదు. సర్వఋతువులందు సముద్రం ఒకే రీతిగా వుంటుంది.

3. శ్రావణ భాద్రపద మా|| -  వర్ష ఋతువు, వర్షములు విశేషముగా కురుయును.

అష్టౌ మాసాన్ నిపీతం యద్భూమ్యాశ్చోదమయం వసు |
స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే | 

Nabhas & Nabhasya – Varsha Ritu(Rainy season). Varshah Punchcham – the cluster the rainy season.  నభస్సు సంబంధి నాభసము.

నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
నభస్వంతుఁడు -
వాయువు.

నభః ఖం శ్రావణో నభాః,
నభ శబ్దము ఆకాశమునకు పేరైనపుడు న. శ్రావణమాసమునకు పేరగునపుడు పు. శూన్యత్వాత్, మేఘచ్ఛన్నత్వచ్ఛ నభాతీతి నభః, నభాశ్చ. స. భా దీప్తౌ. శూన్యమయ్యుని, మేఘచ్ఛన్నమయ్యు నుండుట వలన ప్రకాశించనిది. 'నభః క్లీబం జలధరే నా తు ఘ్రాణే పతద్ర్గహే, మృణాళ సూత్రవర్ణాసు 'ఇతి శేషః.  

నభస్య అశ్వినోర్జౌ చ మార్గశీర్షః శుచిర్నభాః|
ఏతే మాసాఁ కథారంభే శ్రోతౄణాం మోక్షసూచకాః||

మా అమ్మ చీర మడవలేం - మా నాన్న డబ్బు ఎంచలేం(ఆకాశం - నక్షత్రాలు). తల్లి దైవము తండ్రి ధనము. ఆకాశం కంటే ఉన్నతమైనవాడు, తండ్రి. తల్లి దేవలపక్షము ధరణి దేవలపక్షము.

ప్రావృట్టు - వర్షఋతువు, రూ.ప్రావృష.
ప్రుష్వము - 1.వానకాలము, 2.నీటిబొట్టు.

చిత్తఱి - వర్షర్తువు, వానకాలము.
వాన - వర్షము.
వానకాళ్ళు - వర్షధారలు.
వర్ష – Rainy, నీరామని.
నీరామని - వర్ష ఋతువు.

స్త్రియాం ప్రావృట్ స్త్రియాం భూమ్ని వర్షాః -
ప్రవర్షంతి ఘనా అత్రేతి ప్రావృట్. ష-సీ. వృషు సేచనే - మేఘములు మిక్కిలి దీనియందు వర్షించును.
వర్షణం వర్షః సో త్రేతి వర్షాః. ఆ-సీ. - నిత్యబహువచనము. వర్షము గలిగినది. శ్రావణభాద్ర పదములతోఁ గూడిన ఋతువు పేర్లు.

పర్జన్యము - 1.ఉరిమెడు మేఘము, 2.ఉరుము.
పర్జన్యుఁడు -
వర్షాధిపతి.

ఘనాఘనము - 1.కురియునట్టి మేఘము, 2.తొలిమొగులు, 3.హింసించునట్టి మదపుటేనుగు.
ఘనాఘనుఁడు - ఇంద్రుడు.

దుర్దినము - 1.చెడు కలిగిన దినము, 2.మబ్బు క్రమ్మిన దినము, 3.వాన.
మేఘము -
మబ్బు.
మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అజ్ఞానము - తెలివిలేనితనము.

ౙడి - బాధ, వై.వి.వాన, విణ.నిరంతరము.

వర్షము - 1.వాన, 2.పేడితము, 3.ద్వీపము, 4.సంవత్సరము.
వార్షికము -
1.సంవత్సరకాల పరిమితి గలది, వాన కాలమున బుట్టినది.
పడితరము - 1.ఏర్పాటు, 2.వార్షికము, 3.ఏటేట వచ్చు మొత్తము (బత్తెము).  
వర్షాశసము - 1.ప్రభువులు, పండితులు, కవులు మొదలగు వారికి సంవత్సరమున కొక తూరి యిచ్చెడు సంవత్సర గ్రాసద్రవ్యము, 2.వర్షికము.

వర్షదహనము - (భూగో.) సూర్య కిరణోష్ణము వలన భూమిపైనున్న నీరు చెమ్మ ఆవిరిగామాఱి పై కెగచి, చల్లబడి, వర్షపాతముగ భూమిపై పడుట.

నిరంతర హరితారణ్యములు - (భూగో.) ఏకాలమునను చెట్ల ఆకులు పూర్తిగా రాలిపోని అడవులు (వర్షము 80"కంటె అధికముగ నుండు ప్రాంతములలో ఈ అడవులుండును, రబ్బరు, సింకోవా, దేవదారు చెట్లు మొదలగునవి యిందు పెరుగును).  

సంవహనీయ వర్షము - (భూగో.) వర్ష వహనము భూమధ్యరేఖకు నిరుప్రక్కలనుండు ఉష్ణప్రదేశములలో నీటితో నిండిన వాయువు పైకిపోయి వర్షరూపమున తిరిగి భూమిపైబడుట.

వర్షం - వర్షం అంటే వాన -వర్షం అంటే సంవత్సరం. ఆకాశం నుంచి దిగి వచ్చింది వర్షం. 'వర్షం హర్షాయతే' వాన అందరినీ సంబరపరుస్తుంది. పశువులూ, పక్షులు గంతులు వేస్తాయి. పంట పొలాలు పచ్చగా ఉంటాయి. వృక్ష సుందరి తలంటి పోసుకుంటుంది. ఏర్లూ, వాగులూ పొంగి పొర్లుతాయి. నిండుజవ్వనిలా ఉంటాయి. తామరపూలు చెరువుల తలలో పూలు తురుముతాయి. తుమ్మెదలు వాటివెంట పడ్తాయి. తూనీగ లాడితే, తూమెడు వర్షం కురుస్తుంది.

తేనెదిండి - తుమ్మెద, తేనటీగకు తీరుబడి లేని పని.
తుమ్మెదకంటు - సంపెంగ వ్యు.తుమ్మెదకు కంటు గల్గించునది.

పరాగ, పరిమళాదులు విశేషంగా ఉండునట్టి పద్మములో విశేషాసక్తితో భ్రమరం ఉంటుంది. భ్రమరం(తుమ్మెద)కు తొందరపాటుతనము ఎక్కువ. తుమ్మెద తామరలోని పూఁదేనె వాసనకును లోనయ్యి చిక్కుకొను చున్నది. పద్మాల్లోని పూఁదేనె త్రావెడి తుమ్మెద పల్లేరుపూల దగ్గరకు పోవునా?

వర్షకాలం జగతికి ప్రాణం. వ్యవసాయానికి వర్షం ముఖ్యం. వర్షం కురుయుటకు యజ్ఞము కారణము. వేదంలో ఎక్కువ సార్లు వర్షప్రస్తావన వస్తుంది. ’నికామే నికామేనః పర్జన్యో వర్షం వర్షతు ' మేము కోరినపుడల్లా పర్జన్యుఁడు(వర్షాధిపతి) వర్షం కురిపించునుగాక.

నలంఘయే ద్వత్సతంత్రీం నప్రధా వేచ్చ వర్షతి|
నచోదకే నిరీక్షేత స్వం తూప మితినిర్ణయం||
తా. దూడను గట్టిన త్రాడును దాటగూడదు, వాన యందు బరుగిడరాదు(పరుగెత్త కూడదు), నీటియందు తననీడను జూచు కొనరాదు. - నీతి శాస్త్రము.

సారువా - వానకాలమున నీటి యాధారమున పండు పల్లపు పంట.
సారువాపంట -
(వ్యవ.) వరి మొదటి పంట. సాధారణముగ వేసవిలో ఫలితము నకు వచ్చు వరిపంట (Paddy first crop).

పైనుండి క్రిందకి ఒకటే పరుగు. పడుతుందేగాని లేవలేదు. – వాన   

తూర్పు వానలు - ఈశాన్య వర్ష వాయువుచే వచ్చు వానలు(Eastern rains). గాలివాన వస్తే కథే లేదు. గాలివాన పిదప కావలసినంత విశ్రాంతి.    

అతివృష్టి - 1.మితిమీరిన వాన, 2.పైరులను పాడుచేయునట్టి పెద్ద వాన. ఈతిబాధ లారింటిలో ఒకటి, వ్యతి.అనావృష్టి. పెద్ద వర్షము వేగమే ముగియునుకాని చాలని వర్షము చాలాకాలము పట్టును.

నడి వాన కారు - (వ్యవ.) వర్ష ఋతువు - August, September  నెలలు. ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season). కార్తె - సూర్యుడుండు నక్షత్రము.

మఖాపంచకం సదావంచకం. మఖ యురిమితే మదురుమీద మొక్కకూడ కాస్తుంది. మఖ ఉరిమితే మదురు మీది కర్రైనా పండుతుంది. మఖ పుబ్బ (పూర్వఫల్గుని) వొరుపైతే మహాక్షామము సిద్ధము.

పుబ్బలో పుట్టి మఖలో మాడినటులు. పుబ్బలో పుట్టెడు విత్తనాలు చల్లడంకంటె మఖలో మానెడు చల్లడం మేలు. పుబ్బలో చల్లడంకంటే దిబ్బల మీద వేయడం మేలు.

ఉత్తర చూచి ఎత్తరా గంప. ఉత్తర ఉరిమి వర్షించినా పాము కరచినా ఊరికేపోదు. దంత శూకము - పాము వ్యు.కుత్సితముగా కరచునది.

అతివృష్ఠి - 1.మితిమీరిన వాన, 2.పైరులను పాడుచేయునట్టి పెద్దవాన, ఈతిబాధ లారింటిలో ఒకటి, వ్యతి.అనావృష్ఠి.
అనావృష్ఠి - వరపు, వానలేకపోవుట, వ్యతి.అతివృష్ఠి.
వరుపు - వానలేమి, సం.వర్షాభావః.
వరబడి -
1.కరవు, 2.వానలేమి, వరపు.

వాన కురియకున్న వచ్చును క్షామంబు
వాన కురిసెనేని వరద పారు
వరద కరవు రెండు వరుసతో నెరుగుడీ విశ్వ.
తా||
వాన కురియనిచో కరువువచ్చును. వానకురిసిన వరద వచ్చును. వరదా కరవూ వచ్చిన నష్టము సంభవించునుకదా. - వేమన పద్యం

కృషి ఉంటే కరువులేదు. ప్రతి చోటా కృషికి స్థానం ఉంటుంది. కృషి అంటే ప్రయత్నం. ' కృషి ' అంటే వ్యవసాయం. 'అన్నం వై కృషిః' అన్నమే కృషి అన్నది వేదం.

అడిత్రాగుడు - 1.కరవు, దుర్భిక్షము, 2.చాలీచాలని తిండి.
దుర్భిక్షము - కరవు.
క్షామము - కరవు, విణ.తక్కువైనది.
కఱవు - కాటకము, క్షామము, దుర్భిక్షము.
కాటకము - కరవు, దుర్భిక్షము.
వగ్రహము - కరవు (అవగ్రహము).

దుర్భిక్షము, పన్నులు మొదలయిన పీడలచే ఉపద్రవములకు గురియై జనులు దుఃఖితులై గోధుమలు యవధాన్యము పండు దేశములకు వలస పోవుదురు.

కరువు కొంచెమైనా గాబరాయెక్కువ కలిగించును. కరువులో, అధికమాసం. కరువు కొద్దికాలమైనా జ్ఞాపకము చాలాకాలముండును.

కన్న కడుపున చిచ్చు రగిలిన కరువున పాలవును దేశం…..

దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షే చ హిరణ్యదమ్|
చతురోహం నమస్యామి రణేధీర మృణేశుచమ్||
తా.
దుర్భిక్షకాలమందు అన్నదానము చేయువానిని, సుభిక్షకాలమందు ధనమును దానము చేయువానిని, రణమందు ధైర్యము గలవానిని, ఋణమందు శుచిగలవానిని (అనఁగా నప్పులేనివానిని) ఈ నలుగురిని గూర్చి నేను నమస్కరించెదనని శ్రీకృష్ణుఁడు చెప్పెను. - నీతిశాస్త్రము 

శ్రావణము - 1.వినిపించుట, 2.ఒక మాసము, 3. పట్టుగఱ్ఱవంటి చిన్న పని ముట్టు(foreceps). పని నేర్పులేని వానికి పరికరము లనుకూలింపవు.  

తూపురిక్క నెల - శ్రావణ మాసము.
తూపు రిక్క -
శ్రవణ నక్షత్రము.
తూపు - బాణము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
బాణము - అమ్ము; అంబకము - 1.కన్ను, 2.బాణము.
అమ్ము2 - క్రి. విక్రయించు, వెలకు ఇచ్చు.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము. 

శ్రావణే తు స్యాన్నభాః శ్రావణికశ్చ సః -
శ్రవణనక్షత్ర యుక్తా పూర్ణిమా అస్మిన్నితి శ్రావణః, శ్రావణికశ్చ. - శ్రవణనక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁగలదు.
స్రవంత్యస్మిన్ మేఘా ఇతి శ్రావణః. స్రుప్ర స్రవణే. - దీనియందు మేఘములు వర్షించుచున్నవి.
భాసతే మేఘచ్ఛన్న త్వాత్ నభాః స. పు. భాసృ దీప్తౌ. - మేఘచ్ఛన్నమై ప్రకాశింపనిది. ఈ మూడు 3 శ్రావణమాస నామములు.

పిబంతి నద్య స్స్వయమేవ నావః, ఖాదంతి నస్వాదు ఫలానివృక్షాః |
పయోధరా స్సస్యమదంతినైవ, పరోపకారాయ సతాం విభూతయః ||
తా.
నదులు తమ జలమును తాము త్రాగవు, వృక్షములు తమయందు ఫలించిన ఫలములను తాము భక్షింపవు, మేఘములు వర్షించుటచే పండిన పైరులు నా మేఘములు భక్షింపవు, కావున లోకమందు ధర్మాత్ములైన సత్పురుషులు, సంపాదించిన ధనమును పరోపకారము సేయుదురు. – నీతిశాస్త్రము

భాద్రపదము - భాద్రపద మాసము.
ప్రౌష్ఠపదము -
భాద్రపద మాసము.
ప్రౌష్ఠపద - పూర్వభాధ్ర నక్షత్రము(పూర్వ - తూర్పు).

ఋషిపంచమి - భాద్రపదశుద్ధ పంచమి, ఒక వ్రతము.
ఋషి - 1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.

వర్షంలో తామరలు కనిపించవు. తామరపుష్పాలు జలమును వదలినయెడల, తమకాప్తుడైన స్నేహితుడు సూర్యని కిరణములుసోకి వాడిపొయినట్లే, తమ తమ నెలవులు దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు.

అబ్జము - 1.తామర 2.నూరు కోట్లు(శతకోటి, మహాక్షితి, అమేయము) 3.ఉప్పు 4.శంఖము 5.హారతి కర్పూరము 6.(నీటిప్రబ్బలి) విణ. నీటబుట్టినది.

తామర - 1.తామరసము, పద్మము రూ.తమ్మి వి.చర్మరోగము(ring worm).(ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)

జడము - నీళ్ళు రూ.జలము విణ. తెలివిలేనిది.
జలము - 1.నీరు 2.జడము 3.ఎఱ్ఱతామర.(నార మంటే జలం) మొగలువిరి - జలము, మేఘ పుష్పము. మేఘ పుష్పము - 1.నీరు 2.కృష్ణుని తేరు గుఱ్రములలో ఒకటి.

స్వభావతః చల్లదనము కల నీరు నిప్పుచే కానీ, ఎండకి కాని వేడెక్కినా వాటి నుంచి వేరైన కొంతసేపటికి మళ్ళీ పూర్వస్థితికి వస్తుంది.

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
తా.
తామరలు జలమును వదలినయెడల తమకాప్తులైన సూర్యుని కిరణంసొకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు.

అబ్జ బంధవుడు - సూర్యుడు వ్యు. తామరలకు బంధువు. అబ్జమిత్రుడు - సూర్యుడు. సహృదుఁడు - మిత్రుడు. మిత్రుడు - 1.హితుడు 2.సూర్యుడు. సూర్యుని జూచి తామరలు వికసించును.

అబ్జజూడు - బ్రహ్మ, తమ్మిచూలు.
అబ్జయోని - బ్రహ్మ, తమ్మిచూలి, తమ్మి యందు పుట్టినవాడు. నాభిలో తామర పువ్వు కలిగినవాడు విష్ణువు. పద్మంలో జన్మించిన బ్రహ్మకి బ్రహ్మ పదవిని ఒసగిన కారుణ్యమూర్తి శ్రీ మహావిష్ణువు.

అబ్జవైరి – చంద్రుడు వ్యు. తామరలకు శత్రువు(ప్రతీపుడు, ప్రత్యర్థి)రాత్రి ముకుళించునది యగు పద్మమును జయించు ననుటలో వింత యేమున్నది !

తమ్మిదొర – సూర్యుడు.
తమ్మి యింటిగరిత -
లక్ష్మి, పద్మాలయ.
గరిత - 1.ఇల్లలు 2.పతివ్రత 3.స్త్రీ  రూ.గర్త   సం. గృహస్థా.
తమ్మికంటి - 1.స్త్రీ 2.విష్ణువు.

తమ్మి - 1.తామరసము 2.పద్మము 3.పద్మ వ్యుహము రూ.తామర. తామరసము - 1.తామర 2.బంగారు 3.రాగి(copper, soft). రాగి - ఒక విధమైన పైరు,  వై.వి. తామ్రము విణ.1.అనురాగము కలది 2.ఎరుపుగలది.

తామరసము - 1.ఆలస్యము 2.పాము  విణ.తమోగుణము కలది.

నీరజము -1.తామర 2.ముత్యము విణ. దుమ్ములేనిది.
నీరు పుట్టువు - 1.తామర 2.శంఖము 3.కౌస్తుభము.
కౌస్తుభము - విష్ణు వక్షస్తలము నందలి మణి వ్యు. సముద్రమునందు పుట్టినది. దేవమణి - 1.కౌస్తుభము 2.గుఱ్రపు మెడ మీది సుడి.
కౌస్తుభవక్షుడు - విష్ణువు.

పంకజము - తామర  వ్యు.బురదలో పుట్టినది.
పంకము - 1.బురద 2.పాపము  వి.పాలు.
రొంపి - అడుసు, బురద, ఊబి. అడుసు త్రొక్కనేల? కాలు కడుగనేల?

దమము - 1.క్లేశమునోర్చుగుణము, 2.బాహేంద్రియ నిగ్రహము 3.అణచుట 4.అడుసు.
దమ్ము - 1.దమము 2.అడుసు, (వ్యవ.) దంప సాగుచేయుటకు మడిలో నీరుపెట్టి నేల నానిన తరువాత నీరు స్వల్పముగ మదిలో నుండగనే నాగలితో దున్నుట, (pudding).

మడిదున్ని మహారాజైనవాడు, చేను దున్ని చెడ్డవాడు లేడు.  మడి బీద, రైతు బీదకారాదు. మడికి గట్టు ఇంటికి గుట్టు వుండాలి. మడినిబడ్డ నీరు, పైనబడ్డ దెబ్బ పోదు. 

వర్షము తోపాటే బురద. బురదలో పడి మరిపైకి రాలేనివాడు మరి నలుగురిని దింప ప్రయత్నిస్తాడు. బురద నీటి యందు యేదీ ప్రతి ఫలించదు. 

రొంపికంబ మౌకంటే రోయుటేచాలు(రో – ధనము) - బురద లోని స్తంభము వలె హేయమైన జీవితం గడపటం కంటే బురద లాంటి అధర్మానికి దూరంగా ఉండటం మేలు. - అన్నమయ్య సంకీర్తన 

పాధస్సు - 1.జలము 2.అన్నము "ఆయుర్దాయమే అన్నము పెట్టు".
పేయము - 1.నీళ్ళు 2.పాలు విణ. త్రాపదగినది.

పాఱు - 1.ప్రవహించు 2.పరునెత్తు. పరుగెత్తి పాలుద్రాగుటకన్న నిలుచుండి నీరు త్రాగుట మేలు.

క్షీరము - 1.పాలు 2.పాలసముద్రము 3.నీళ్ళు 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస  విణ.పాలు త్రాగునది. హంసకు నీర క్షీర విభేదన తెల్పినట్లు. హంసలు నడకలో ప్రసిద్ధిచెందినవి.

మానసౌక(స)ము – హంస. మనసు సంబంధి మానసము. శబ్దము చేయని హంసలు తుమ్మెదలతో కూడిన పెద్ద తామరకొలనులో, కొంగలు కూడ వుండును. హంసలలో గలసినంత మాత్రామున కొంగకు రాయంచ గమన ప్రవర్తనములు రావు.

చేప కనిపించే వరకు కొంగకు యోగదృష్ఠి అభ్యాసమే(బక ధ్యానము). కొంగలు సరస్సులోని చేపల నీడను బట్టి రయ్యిన దిగి, చేపలను నోట కరచుకొని ఎగురుతాయి. ఆకాశంలో పక్షికి నీటిలోని చేప ఆహారం!

నలినము -1.తామర 2.తామరకొలను 3.తామర తీగ. తూడు - తామరకాడ, బిసము. బిసము - తామర తూడు, తామర తీగ. గుప్పెడు గువ్వకు బారెడు తోక. - తామరపువ్వు

తూడుదిండి - హంస వ్యు. తూడే భోజనముగా కలది.

సృష్టికర్త యగు బ్రహ్మదేవుని సంచిత బుద్ధితో వీపున మోసెడి రాజహంసకు బ్రహ్మను మోయు ఫలితము లేదాయెను. అది తామర తూండ్లనే తినవలసి వచ్చెను. తురీయమును ఆశ్రయిస్తూ క్రమంగా అభిమానము - భోగ చింతన..... ఈ రెండిటినీ విడిచివేయును గాక!

వారి - నీరు. వారిచరము - చేప, మొ.…నిద్రలోనూ కళ్ళు మూయనిది.

గాలి గండమేగాని నీటిగండం లేనిది. చేఁప నీళ్ళు ఎండిపోయిన బురదలో చిక్కు కొన్నను, ఆ చోటును విడిచి కదలక అందే నిలిచి నీళ్ళనే తుదకు కోరును.

వర్షాకాలము : శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకమాసములు.

4. ఆశ్వయుజ కార్తీక మా|| - శరదృతువు , వెన్నెల కాయును, బురద యింకును. శరత్ కాలము - ఆశ్వయుజ కార్తీక మాసములు. వెన్నెల కాలము-ఋతువు season.

శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః |
భ్రష్టానామివ చేతాంసి పునర్యోగనిషేవయా |

Isha & OOrja – Saradritu. Saraduttarah pakshaha, Left shoulder – Sarat Ritu.

శరత్తు - శరత్కాలము దయగలది. 1.ఒక ఋతువు (ఆశ్వయుజ కార్తీక మాసములు) వెన్నెలకాలము, 2.సంవత్సరము,  రూ.శరద.
శారదము - సంవత్సరము, విణ.శరత్కాలమున బుట్టినది.

అథ శరత్ స్త్రియామ్ :
శృణాతి పంకమితి శరత్ ద. సీ. శౄ హింసాయాం. - అడుసును బోఁగొట్టునది. ఇది అకారాంత స్త్రీలింగంబును. 'కాలప్రభూతం శరదా' అని త్రికాండియందుఁ బ్రయోగింపఁబడియున్నది. ఈ ఒకటి ఆశ్వయుజ కార్తీక మాసములతోఁ గూడిన ఋతువు పేరు.

శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయి మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీకాళస్తీశ్వరా!
 
తా|| సంపదలనెడి మెఱుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల నుండి కురిసిన, పాపములనెడి నీటిధారలచేత నామనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయయను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటచే కాదు సర్వసమృద్ధులు గలవాడనై నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతము లగును.)   

వెన్నెల - (వెలి+నెల), చంద్రిక. హరిశ్చంద్రము నందు దేవీస్థానం చంద్రిక.
చంద్రిక -
వెన్నెల, రూ.చందిరిక.
కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
చంద్రశాల -1.పైమేడ, 2.వెన్నెల; ఓవరి - 1.లోపలిగది, 2.చంద్రశాల.   
చంద్రతాపము - వెన్నెల; చాంద్రి - వెన్నెల; నెలవెలుగు - వెన్నెల.
జ్యోత్స్న - వెన్నెలరేయి, రూ.జ్యోత్స్ని. జ్యోత్స్ని- వెన్నెలరేయి.
వెన్నెలగతి - చంద్రుడు; చంద్రుడు - నెల, చందమామ. 

(ౙ)జాబిల్లి - చందమామ, రూ.జాబిల్లి.
జాబిలితాలుపు - శివుడు, చంద్రధరుడు.
జాబిలిమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

వనచంద్రికా న్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెల యనురీతి, నిష్ప్రయోజన మని యర్థము).

కౌముది - 1.వెన్నెల, వ్యు.కుముదములను వికసింపజేయునది, భూజాను(భూజాని - 1.విష్ణువు, 2.రాజు.)లను సంతోషపెట్టునది, 2.ఉత్సవము, పండుగ, 3.కార్తీక పూర్ణిమ.
కౌమోదకి - విష్ణుమూర్తి గద.

కుముద - 1.టేకు, 2.గుమ్ముడు.
కుముదము -
1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.నిధి, 3.ఒకానొక మణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

శారద - 1.సరస్వతి, 2.పార్వతి.
సరస్వతి -
1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది. బ్రహ్మ ముఖములందు సరస్వతి. సరస్వతి యందు దేవమాత. శివసన్నిధిని పార్వతి.

ద్వౌతు శారదౌ, ప్రత్యగ్రా ప్రతిభౌ : శారద శబ్దము నూతనమైనదానికిని, సమర్థుఁడు కానివానికిని పేరు. శరది భవః శారదః శరత్తు నందుఁ బుట్టినది. 'శారద స్సప్తపర్ణే స్యాత్సరస్వత్యాంతు శారదా, శారదా గజపిప్పల్యాం మృధువర్షభవేత్రి' ప్వితిశేషః.

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ. – 42శ్లో

శరదృతువు పరదేవత కెంతో ఇష్టం. సరస్వతి శరత్కాలంలో పూజింప బడుతుంది కనుక ఆమె శారద అయింది. శరత్కాలం వెన్నెల స్పష్టంగా స్వచ్చమై, ప్రకాశవంతంగా ఉంటుంది. శరత్కాల మేఘములు తెల్లనైనవి.

శరజ్జ్యోత్స్నాశుద్ధాం - శశియుత జటాజూటమకుటాం
వరస్త్రాసత్రాణ - స్ఫటికఘు(ఘ)టికా పుస్తకకరామ్,
సకృన్నత్వా న త్వా - కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీర ద్రాక్షా - మధురిమధురీణాః ఫణితయః. - 15శ్లో
తా.
శరత్కాల చంద్రికవలె శుభ్రమై చంద్రునితో గూడిన జడల ముడి శిరస్సున(జటాజూటరూప కిరీటంతో), హస్తాలలో వర అభయ ముద్రలను దాల్చి, స్ఫటిక మణిమాల పుస్తకములు ధరించిన నిన్ను, ఒక్కసారి యైనను నమస్కరింపని యెడల(ప్రణమిల్లకపోతే) - మధు క్షీర, ద్రాక్షా సదృశ్యమైన మధుర వచనాలు సత్పురుషుల(కవులకు) ఎలా సిద్ధిస్తాయి తల్లీ!  - సౌందర్యలహరి 

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరఛ్ఛంద్రనిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా. - 43శ్లో

శరత్ దారువు - (వృక్ష.) కాండములో శరత్కాలమున ఉత్పత్తియైన దారువు, (Autumn wood).

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ కార్తెలు శరదృతువు (Post-monsoon period).

చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తిగలుగుచోట ఫలమేల తప్పురా విశ్వ. - వేమన పద్యం.

తా|| స్వాతికార్తెలో ముత్యపుచిప్పలోబడిన చినుకు ముత్యమగును. నీటబడినది నీటిలో కిలిసిపోవును. ప్రాప్తించుచోటు ఫలము తప్పదు.

స్వాతి వానకు ముత్యపు చిప్పలు ఎదురు చూచినట్లు. నీటిలో పుట్టాను - చిప్పలో పెరిగాను - నేలపై కొచ్చాను - స్త్రీలలో కలిసాను. అరగని ముత్యాలకు మెరుగుండదు. నత్త గుల్లలన్నీ ఒక రేవునకు ముత్యాలన్నీ ఒక రేవుకు చేరును. నత్తగుల్లకి ముత్యం విలువ తెలియదు. రత్నాలన్ని యొకచోట నత్తగుల్లలన్నీ ఒక చోట.

why shells exist on the tops of mountains along with imprints of plants usually found in the sea?

తొలురిక్క నెల - ఆశ్వయుజము. ఆశ్వయుజము - అశ్వనీ నక్షత్రము పూర్ణిమ నాటి చంద్రునితో కూడి ఉండేది ఆశ్వయుజమాసం.  ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు ఆలవాలయైన శరదృతువులోని తొలిమాసమిది.  

స్యాదాశ్విన ఇషో ప్యాశ్వయుజో పి :
అశ్వనీనక్షత్రయుక్తా పూర్ణిమా అస్మిన్నితి ఆశ్వినః - అశ్వినీనక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు.
ఏషణం ఇట్ యాత్రా సాస్మిన్నితి ఇషః, విజిగీషాయాః కాలత్వాత్ - ఇట్టనఁగా యాత్ర శత్రువుల గెలువ నిచ్ఛయించినవారికి యాత్ర దీనియందుఁ గలగుచున్నది.
అశ్విన్యేవ అశ్వయుక్ తద్యుకా పూర్ణిమా అస్మిన్నస్తీతి ఆశ్వయుజః - అశ్వినియే అశ్వయుక్క దానితోఁగూడిన పున్నమ దీనియందుఁ గలదు. ఈ మూడు 3 అశ్వయుజమాసము పేర్లు.  

ధరలోఁ ద్వష్ట్రాహ్వయమును,
నిరవుగ ధరియించి ధాత్రి కింపు దలిర్పం
బరియించుచు నభమందున్,
సరసిజహితుఁ దాశ్వయుజము సయ్యనఁ గడపున్.
భా||
ఆశ్వయుజ మాసంలో సూర్యుడు, త్వష్ట అన్నపేరుతో భూమికి ప్రమోదం కలిగేటట్లు ఆకాశంలో సంచరిస్తుంటాడు.

త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ -
దేవశిల్పి.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్య పనిచేయువాడు, 2.పక్షివిశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.

అశ్వర్థము - 1.రావి చెట్టు, 2.అశ్వనీ నక్షత్రము 3.ఆశ్వయుజ పూర్ణిమ.
అశ్వర్థ వృక్షమందు సమస్త ఓషధులు, అధిష్ఠాన దేవతలు గలరని వేద ప్రమాణము, విష్ణుమూర్తి యవతారమని ప్రసిద్ధి.

దశరా - 1.దశరాత్రము, 2.దేవీ నవరాత్రము, సం.దశరాత్రమ్.
విజయదశమి -
ఆయుధములు పూజించెడు ఆశ్వయుజ శుద్ధదశమి.
మహాలయము -మహాలయామావాస్య. మహాలయము నందు దేవీస్థానం మహాభాగ. 

పాఱువేఁట - దసరానాడు ఉత్సవ విగ్రహాదులను వేటకు తీసికొని పోవుటకై తీసుకొనిపోవు ఉత్సవము.

విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ సంవత్సరము. 
గౌరి -
దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి.
గయిరమ్మ - పార్వతి, రూ.గౌరమ్మ, గవురమ్మ, సం.గౌరంబా.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా. 
దుర్గ - పార్వతి, రూ.దుర్గి. శివసన్నిధిని దేవీస్థానం పార్వతి.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు. కాలంజరము నందు దేవీస్థానం కాళి. 

విజయుడు - 1.అర్జునుడు, 2.విష్ణు ద్వారపాలకులలో నొకడు.
అర్జునుఁడు -
1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

శరద్ - వృక్షజాలం వెన్నెల్లో అందాలు సంతరించుకుంటుంది. చంద్రుడు వెన్నెలపాలు నేల మేద పారబోస్తాడు. నదులు నిర్మలం, మందగమనల్లా పార్తాయి. ప్రకృతి సాంతం స్వచ్ఛంగా, సుందరంగా, మౌనంగా ఉంటుంది. శరన్నవరాత్రులు అమ్మలగన్న యమ్మ పర్వాలు. ప్రమదుల సందడి - రాత్రులు ఆరాధనలు. ప్రకృతి పగలబడి నవ్వుతుంది.

దీపావళి - 1.నరకచతుర్దశి మరునాడు వచ్చు పండుగ, 2.దీపముల సమూహము.

అగ్నిక్రీడ - (రసా.) బాణసంచు, మతాబులు, టపాకాయలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు మొ||వి. తయారు చేయు కళ (Pyrotechnics), 2.బాణసంచు(అని కొందరు).
బాణసంచు - దీపావళినాటి రాత్రి, తుపాకి మందుచేర్చి కాల్చెడు మతాబులు పూలవత్తులు మొదలగునవి.
ఆకాశబాణము - ఆకసము వైపు విడుచుచువ్వ, బాణసంచు, (తారాచువ్వ).
అవాయి - ఆకాశబాణము, ఒక విధమగు బాణసంచా.

దీపావళికి దీపమంత చలి. దీపావళి వర్షాలు, దీపాంతరం దాటుతాయి.

కార్తికము - కార్తిక మాసము.
కత్తెర నెల -
కార్తీక మాసము. కత్తెర - 1.వస్త్రాదులను కత్తిరించెడి సాధనము, 2.భరణి మూడు, నాలుగు పాదములందును, కృతిక యందును, రోహిణి మొదటి పాదమందును సూర్యుడుండు కాలము 3.కృతికా నక్షత్రము, కృత్తి వాసః ప్రియే.

స్యాత్తు కార్తికే, బాహులోర్జా కార్తికికో :
కృత్తికా నక్షత్రయుక్తాపూర్ణిమా అస్మిన్నస్తీతి కార్తికః, కార్తికికశ్చ - కృత్తికా నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీని యందుఁగలదు.
బహూనర్థా న్ లాంతీతి బహులాః కృత్తికాః, తద్యుక్తా పూర్ణిమా అస్మిన్న స్తీతిబహులః. - అధికములైన యర్థముల నిచ్చునది గనుక బహుళ యనఁగా గృత్తిక, దానితోఁ గూడిన పున్నమ దీనియందుఁగలదు.
ఊర్జముత్సాహః తదస్మిన్నాసే విజిగీషుణామస్తీతి ఊర్జః. - ఊర్జమనఁగా నుత్సాహము, అది యీమాసమందు శత్రుజయము నిచ్ఛయించిన వారికిఁ గలదు. ఈ నాలుగు కార్తికమాసము పేర్లు.

కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చేమాసం కార్తీకం. కృత్తికా నక్షత్రానికి అగ్ని అధిదేవత. అందువల్లనే అగ్ని అంతటి పవిత్రత కలిగిందీ మాసం.

కృత్తివాసుడు - ముక్కంటి, శివుడు. కృత్తికాసుతుఁడు - కుమారస్వామి(విష్ణువు అంశలో పుట్టినవాడు; విష్ణువు యొక్క అంశలో పుట్టినవాడే భూపాలకుడు కాగలడు).

బాహులము - 1.బాహుత్రాణము, 2.కార్తీక మాసము.
బాహులేయుడు - కుమారస్వామి.

ఊర్జము - 1.కార్తికమాసము, 2.పూనిక, 3.ఉత్సాహము, 4.ఊపిరి వెలుపలికి విడుచుట విణ.బలము గలది.
పూనిక - 1.యత్నము, 2.సన్నాహము, 3.పట్టుదల.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము, 3.కోరిక, 4.ప్రభుభక్తి, 5.(అలం.) వీరరసమునకు స్థాయి, 6.ఆస్థ.
పట్టుదల - వదలనిపట్లు, చలము.

ఉత్సహించు - 1.యత్నించు, 2.ఉత్సాహపడు, రూ.ఉత్సాహించు.
ఉత్సాహించు - ఉత్సహించు.
ఉత్సాహకుఁడు - 1.ఇష్టకార్యసిద్ధికై ప్రయత్నించువాడు, 2.ఇష్టవస్తు ప్రాప్తికై తహతహపడువాడు.

కార్తికేయుఁడు - కుమారస్వామి, వ్యు.కృత్తికల కుమారుడు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.

ఉత్సాహం సాహసంధైర్యం బుద్ధి శ్శక్తిః పరక్రమః|
షడైతే యత్రతిస్టంతి తత్రదేవోపి తిష్టతి||
తా.
సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము; ఈ యారు ఎవనియందు గలవో వానికి దైవసహాయము గలుగును. – నీతిశాస్త్రము

కౌముదము - కార్తీక మాసము. కార్తికమునందు దేవీస్థానం అతిశాంకరి. అదితి పుత్రులగు ఆదిత్యులు పండ్రెండుగురును, ఒక్కొక్క మాస మందొక్కొక్కరుగా, సూర్యగోళమును ప్రకాశింప జేతురు. ఆ పండ్రెండ్రుగురి లో కార్తీక మాసమందు కార్యనిర్వాహణ మొనర్చునతడు విష్ణు నామధేయుడు. అదితి పుత్రులగు ద్వాదశాదిత్యులలో విష్ణువను వాడు నా విభూతి. - శ్రీకృష్ణుడు భగవద్గీత

కార్తీకమాసంలో సూర్యుడు విష్ణువనే పేరుతో వ్యవహరిస్తాడు. అతనికి పరిచరులుగా అశ్వతరుడు, రంభ, సూర్యవర్చసుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘాపేతుడు అనేవారు సహకరింపగా కాలాన్ని నడుపుతుంటాడు.

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు -
విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుడు, (వెన్నుని+అంటు = కృష్ణుని మిత్రము).

ఆదిత్యుడు - 1.సూర్యుడు 2.వేలుపు 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.

కుముదము(కుముదమునందు దేవీస్థానం సత్యవాదిని) - 1.ఎఱ్ర తామర 2.నైరుతి దిక్కునందలి ఏనుగు(అనుపమ - నైరుతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య) 3.తెల్ల కలువ.

కమలము - 1.తామర, 2.ఎఱ్రతామర, 2.జలము, 3.రాగి, 4.మందు(ఔషదము, ఉపాయము).

కమల(కమలాలయము నందు దేవీస్థానం కమల) - 1.లక్ష్మి, చంద్రసహోదరి(భగిని-సహోదరి) 2.పూజ్యస్త్రీ 3.కమలాఫలము.

లక్ష్మీదేవి దినము పేరంటమునకై(ముత్తైయిదువలు చేయు వేడుక) తిరుగు చుండును. పేరంటాలు - 1.పరలోకమున నున్న ముత్తైదువ 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ.

సుమంగళి - ముత్తెదువ, సువాసిని.
సువాసిని – 1. ముత్తయిదువ, 2.పేరంటాలు.

తామర - ఎఱ్రకలువ. రోచన - 1.గోరోజనము 2.ఎఱ్రగలువ, ఉత్తమ స్త్రీ.
తామర చెలి – సూర్యుడు, పద్మ మిత్రుడు. లోకబాంధవుడు–సూర్యుడు. భాస్కరుడు-1.సూర్యుడు2.అగ్ని. జీవకోటికిభాస్కరునికన్నమిత్రులులేరు.

కమలాప్తుడు - సూర్యుడు, విష్ణువు. కాలచక్రానికి కమలాప్తుడు ఆత్మ. ఆప్తుడు - 1.బంధువు 2.స్నేహితుడు 3.యధార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

కుముదిని(దక్షిణ మానసము, మనస్సునందు దేవీ స్థానం కుముద) - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను. కలువ రాయుడు, తొగచెలికాడు(తొగ - కలువ) – చందమామ (మామ కాని మామ). చంద్రుడు పొడసూప సంతసించునది కల్వ. చంద్రుని చూసి కలువలు వికశించును. సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్ర రూపిణీ.

తొగసూడు – సూర్యుడు వ్యు.కలువలకు శత్రువు

ఓం మహా కామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః : మహా కామేశుడు అంతే పరమ శివుడని అర్థము - అట్టి పరమ శివుని నేత్ర రూపమైన(కన్నుకలువలకు చంద్రికగా) కలువలను వికసింపజేయు వెన్నెల వంటి తేజోమయ మూర్తికి వందనాలు. - లలితా సహస్రనామము

గుప్పెడు రాణికి బారెడు జడ. బురదలో పుట్టి ఆడవారి అందాలకు ప్రతీకగా నిల్చి దేవుని పాదాల చెంత ప్రాణాలర్పించేది - తెల్ల కలువ.

దక్షిణాయనంలో గ్రీష్మ వర్ష శరదృతువులు మూడూ ఊంటాయి. ఎండా, వానా, ౘలి మూడూ ఉన్న దక్షిణాయణం వెంటే హేమంతం ఉన్నా - తరువాత వచ్చే ఆహ్లాదకరాలైన శిశిర వసంతాలు కలిగిన ఉత్తరాయణమే మంచిది. పొడిబారిన వాతావరణం, ఆహ్లాదకరమైన ఉష్ణం, చల్లనిగాలి కలిగిన ఉత్తరాయణం జనులకు ఆరోగ్యప్రదమైనది.  

కార్తీకమాసంలో కదురంతవుంటినా - మాఘమాసంలో నా మహిమ చూపుతా అందిట. - చిక్కుడుతీగ

తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే |
చతుసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా |

5. మార్గశిర పుష్య మా|| హేమంతఋతువు, మంచుకురియును, ౘల్లగనుండు కాలము. చలికాలం దీర్ఘ రాత్రులు, పగలు స్వల్పకాలం.

Sahas & Sahasya – Hemanth Ritu(Winter season). Hemanto madhyam, the central part of the body is winter.

శంభుకంట నొకటి జలరాశి నొక్కటి,
మఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁగాక మెఱసియున్న మూఁడగ్నులు,
చలికి నులికి భక్తి సలుపకున్నె?
భా||
హేమంతకాలంలో చలిని పోగొట్టేవి అయిన ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులు చలి దెబ్బకు తట్టుకోలేక ఒకటి శివుని ఫాల నేత్రం(ఫాలనేత్రుఁడు - ముక్కంటి)లో అణగిపోయింది. మరొకటి సాగరగర్భంలో బడబాగ్ని రూపంలో చొచ్చింది. ఇంకొకటి గృహస్తుల ఇండ్లలో ఒదిగిపోబట్టి తమ గౌరవాన్ని కాపాడుకొన్నాయి కానీ, అలా కాకుండా అవి బట్టబయట ఉండి ఉంటే, చలికి భయపడి సేవచేయ కుండా తప్పించుకొనగలిగి ఉండేవి కావు.

హేమంతము - మంచు కాలము, Winter. మార్గశిర పుష్య మాసములు, హేమంత ఋతువు. మార్గశీర్ష పౌషమాసములతోఁ గూడిన ఋతువు పేరు. మృగశిరా నక్షత్రములో పూర్ణిమ కూడిన మాసమునకు మార్గశీర్షమాసమని పేరు.

హేమన్తః - హిమేన హంతీతి హేమతః. హన హింసాగత్యోః - చలిచేత జనులను హింసించునది. హేమంతం - వృక్షజాతి ముడుచు కుంటుంది. చలి వణికిస్తుంది. పొగమంచు ఎదుటివాణ్ణి చూడనివ్వదు. పసుపు పరచినట్లు జనపచేలు, పచ్చని మిరపతోటలో ఎర్రని మిరపపండ్లు, పసుపు ముద్దబంతులు, బళ్లలో ఇంటికి పంటచేరడం, ఊరినిండా గడ్డీగింజా, సస్యశ్రీ పరవసిస్తుంది.

బృహన్మరీచము - మిరెపకాయ.
మిరెపకాయ - బృహన్మరీచము, రూ.మిరపకాయ.

పచ్చని పందిట్లో ఎర్రని పెళ్ళికూతురు. మిరపకాయ చిన్నదని మేలమాడజనదు, నమిలి చూస్తే నాలుకే చెపుతుంది దానిసత్తువ.

వలిగొను - చలిగొను, వణకు.
వడకు - చలించు, వణకు; చలించు – తిరుగు.
వడకు తోవ – ఉత్తరాయణము.

ఉత్తరాయణము - (భూగో.) సూర్యుడు December 22వ తేది మకర రేఖను చేరి అచ్చటినుండి ఉత్తరమునకు మరలునప్పటి నుండి ఆరునెలల కాలము, సంవత్సరమున వచ్చు రెండు ఆయనములో ఒకటి. మకరం మొదలు మిథునం వరకు ఉన్న సంచారం ఉత్తరాయణం.

ఉత్తరాయణం హేమంతంలో మొదలై శిశిర వసంతాలను కలుపుకొంటుంది. ఉత్తర మానసము(మనస్సు)నందు దేవీ స్థానం విశ్వకామ.

Dattatreya was born in the same month on suddha purnima. It is stated in the Ramayana, that Margasirsha is the ornament of the year.

‘మాసానాం మార్గశీర్షోఃహం’ మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును నేనే. - భగవద్గీత

శీతకారు - (వ్యవ.) డిసెంబరు, జనవరి నెలలు, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, అను కార్తెలు, హేమంత ఋతువు (Winter season).
మం(ౘ)చుకారు - హేమంత ఋతువు.
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు హేమంత ఋతువు.
మిహిక - మంచు.
మిహిరాణుఁడు - శివుడు. 

మూలకురిస్తే ముంగారువాడు. మూల ముంచుతుంది జ్యేష్ఠ తేలుస్తుంది. నీరు దేనిని తేలుస్తుందో దానినే ముంచుతుంది.

చలికాలము : మార్గశిరము, పుష్యమి, మాఘము, పాల్గుణ మాసములు. సీతు - 1. ౘలి 2.చలికాలము రూ. సీతువు సం. శీతం.

శీతకము - ౘలికాలము.
శీతలము - ౘల్లనిది. శీతము - 1. ౘల్లనిది 2.అలసమైనది.
శీతకరుఁడు - చంద్రుడు, ౘలివెలుగు. శీత - నాగటి చూలు, రూ.సీత. శీతమయూఖుఁడు - చంద్రుడు వ్యు. ౘల్లని కిరణములు కలవాడు. శీతకిరణుఁడు - చంద్రుడు. శీతభానుఁడు - చంద్రుడు.

నీహారము - మంచు. మంచుకారు - హేమంత ఋతువు.

హిమిక - మంచు.
హిమాని -
హిమసమూహము.
హిమాంశువు - చంద్రుడు.
హిమకరుఁడు - చంద్రుడు; హిమధాముఁడు - చంద్రుడు.

మిహిక - మంచు (మిహి - 1.శ్రేష్ఠము 2.నున్ననిది 3.క్రొత్తది)
మిహిరుఁడు - 1.సూర్యుడు 2.చంద్రుడు 3.వాయువు 4.వృద్ధుడు.
మిహిరాణుఁడు – శివుడు.

ఇవక - శైత్యము, హిమము, సం.మిహికా.
శైత్యము -
1.చలువ, 2.జలుబు.
ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి(చలువ)
ౘల్లన - శైత్యము, విణ.శీతము. 

ఈము - 1.మంచు, 2.చల్లదనము, సం.హిమమ్.
ఇగము - 1.మంచు, హిమము 2.శైత్యము, చల్లదనము రూ.ఇవము, ఈము. ప్రాలేయము - మంచు. మంచును ఎవరు - కురవ మన్నారు?

ఇవసూడు - సూర్యుడు(ఇవమునకు శత్రువు).

రజనీ(రజని – రాత్రి)జలము – మంచు, చంద్రునిలో మంచు.  రేకంటు - (రేయి + కంటు) సూర్యుడు వ్యు.రాత్రికి శత్రువు.

తుషారము - 1.మంచు, 2.తుంపర.
తుంపర -
చెదరిపడు నీటిబొట్లు, శీకరము, రూ. తుంపురు, తుప్పర, సం.తుషార.
శీకరము - 1.తుంపరము, 2.ఏనుగు తొండము చివరపుట్టు మదము.
తుంపిళ్ళు - తుంపరలు, తుంపరవాన.
తుప్పర - తుంపర. తుంపరు - రూ.తుంవర.
తూర - వానబొట్టు, రూ.తువర.
తువర - తుంపురువాన, రూ.తువ్వర, తూర.

తుహినము - మంచు.
తుహినకరుఁడు -
చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.

తుషారాంకము - (భూగో.) గాలిలో గల తేమ రాత్రులందు చల్లబడి నీటిబిందువులుగ మారి నేలపైగాని నేలకు సమీపమున నున్న ఆకులపైగాని పడును. 
పొగమంచు(ౘ) - (భౌతి.) గాలిలో నెగరుచుండు పొగదుమ్ము నలుసుల పై తేలియాడు ద్రవించిన నీటియావిరి బిందువుల సమూహములు (Fog and mist).

కొండగాలి - (భూగో.) శీతకాలమున ఉదయమున ఉత్తరమునుండి కాని వాయువ్యమునుండి కాని వీచు చలిగాలి (Cold wind).
కొండ - మల, పర్వతము.

వాయువు - (భూగో.) గాలియొక్క చలనము, సం.వి.గాలి. వాయువును ఎవరు - వీచమన్నారు?

జింకతల చుక్క నెల - మార్గశిరము.
మీసర -
మృగశీర్ష (మీసరము -శ్రేష్ఠము, మేలైనది)
మారశీర్షము - తొమ్మిదవ నెల.  
హైమనము - మార్గశీర్షము(శీర్షము - తల) విణ.1.మంచుచే కలిగినది  2.బంగారుచే కలిగినది.
హైమనము - మార్గశీర్షము, విణ.1.మంచుచే కలిగినది, 2.బంగారుచే కలిగినది.
హైమము - వేకువను మంచుచే కలిగిన జలము, విణ.బంగారుచే కలిగినది.

సహో బలం సహా మార్గో : సహశ్శబ్దము బలిమికి పేరైనపుడు న. మార్గశీర్షమాసమునకు పేరైనపుడు పు. సహంతే అనేన, అస్మిన్నితి చ సహః, సహాశ్చ. స. షహ మర్షణే. - దీనిచేత, దీనియందును ఓర్తురు(ఓర్చుట) గనుక సహస్సు. ' సహో జ్యోతిషి హేమంతే నా హాసవతి వాచ్యవ ' దితి శేషః.

మార్గశీర్ష మాసంలో సూర్యుడు అర్యము డన్నపేరుతో అభిహితుడౌతాడు. కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేనుడు, ఊర్వశి, విద్యుచ్ఛత్రువు, మహాశంభుడు అనేవారు అనుచరులు కాగా కాలనిర్వహణ కార్యక్రమం చేస్తుంటాడు.

అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు.

పొంగటినెల - మార్గశీర్ష మాసము(పొంగలి + నెల), పొంగలి పండుగ.
పొంగటి పండుగ - మకర సంక్రాంతి. సంక్రాంతి - మేషాది సంక్రమణము. 
పొంగలి - 1.పాలు చేర్చి పొంగించునట్టి అన్నము 2.పొంగలి పండుగ. పొంగలి - పక్షుల ఆహారము, ఇంద్రునికి పొంగలి నైవేద్యం.

గొబ్బి - 1.ధనుర్మాసమున బాలికలు చేతులు చరచుచు గుండ్రముగా తిరుగుచు పాటలు పాడువేడుక, 2.ఇక్షురకము, గొలిమిడి, మొగబీర.
గొబ్బిళ్ళు - 1.గొబ్బి, 2.నమస్కార భేదము, 3.బాలక్రీడ, 4.గొబ్బిపాట.

కనుము - 1.శరము, 2.తృణము, 3.మకరసంక్రమణమునకు తరువాతిరోజు.
శరము - 1.బాణము(అమ్ము), 2.రెల్లు, 3.జలము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీద నఖక్షతము, అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.
తూపు - బాణము; తూపురిక్క - శ్రవణ నక్షత్రము.
తృణము - గడ్డి, చామలోనగు పైరు.

మృగశిరకు ముంగిళ్ళు చల్లబడుతాయి. మార్గశీర్ష మాసము ఒకప్పుడు సంవత్సరారంభముగను ఉత్తరాయణ సమయముగను ఉండెడిది. ఇంతేగాక ఈ మాసమునందు పంటలు సమృద్ధిగా పండి, పాడిపంటలు సమృద్ధిగా వుండి మనుజులకు పశువులకు గూడ ఆరోగ్యప్రదమును ఆనందదాయకమునై యుండును.

రాబీపంటలు - (వ్యవ.) శీరకాలములో నాటబడి వసంతఋతువులో కోతకు వచ్చు పంటలు.
రాబ్బీధాన్యము - రెండవ ధాన్యము.

కాలిఫ్ పంట - (భూ.గో. అర్థ,) ఉత్తరహిందూస్థానములో మాన్‌సూన్ల (Monsoon)లో నాటిన శీతకాలము, కోయబడు పంట.

పాడి - 1.ధర్మము, న్యాయము 2.స్వభావము 3.వ్యవహారము.
పంట - 1.పండుట 2.కృషి.

సేద్యము - కృషి, వ్యవసాయము. ధాన్యమునకు కృషియే మూలము. ధాన్యం దంపుకుంటేనేగాని బియ్యము రావు.

దూడలేని పాడి దుఖఃపుపాడి. పంటలెక్కువ అయినకొలది బాధ్యతలు యెక్కువే.

భోగి - 1.పాము, 2.రాజు, 3.భోగిపండుగ, 4.మంగలి.
పాము -
1.సర్పము 2.కష్టము, క్రి.రుద్దు.
రాజు - 1.రేడు, రాచవాడు(క్షత్రియుడు), 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
బోగి - సంక్రాంతి పండుగకు తొలిదినదము.
మంగలి - అంబష్ఠుడు; అంబష్ఠుఁడు - 1.మంగలి, 2.మావటి.

భోగ్యము - 1.ధనము 2.ధాన్యము విణ. భోగింపదగినది.

ధనము నిచ్చు విద్యయే విద్య. మంచి విద్య కలిగిన ధనము పనిలేదు. ఎంత దానం చేసినా తరగనిది - విద్య. వానకు తడవనిది - ఎండకు ఎండనిది - మంటకు కాలనిది - దొంగలు దోచనిది - విద్య.

At the time of Mahabharata, the year used to start with the month of Margasirsha.  The Bhagavad Gita was proclaimed to Arjuna in the month of Margasirsha (suddha ekadasi) on the 11th day of the bright fortnight.

The Sastras declare that the month is most suitable and meritorious for the performance of vows and fasts etc. The atmosphere is pleasant and equable and so the month is most suitable for tapas and sadhana (spiritual practice). – Gita Makarandam

భారతము - 1.వ్యాసభట్టారక ప్రోక్తమైన పంచమవేదము, 2.భరత ఖండము.
భారతి - 1.సరస్వతి 2.వాక్కు.
సరస్వతి - 1.పలుకుచెలి 2.పలుకు 3.ఒకనది.

తైషము - పుష్య మాసము(శూన్య మాసము).
పుష్యము -
1.నక్షత్రము 2.పౌషమాసము.
పౌషము - పుష్యమీ నక్షత్ర సహిత పూర్ణిమ గల నెల, పుష్యమాసము.

పౌషే తైష సహస్యా ద్వౌ :
పుష్యనక్షత్ర యుక్తాపూర్ణిమా స్మిన్నితి పౌషః - పుష్యనక్షత్రముతోఁ గూడిన పున్నమ యందుఁ గలదు.
పుష్య ఏవ తిష్యః - తద్యుక్తా పూర్ణిమా స్మిన్నితి తైషః - పుష్యమే తిష్యము - ఆ నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు.
సహః బల మస్త్యస్మిన్నితి సహస్యః - సహమనఁగా బలము, అది దీనియందుఁ గలదు. ఈ మూడు 3 పుష్యమాసము పేర్లు.   

పుష్యమాసంలో పూసలుగుచ్చేపాటి పొద్దేనా ఉండదు.

పుష్యయుక్తా పౌర్ణ మాసీ పౌషీ తు యత్ర సా,
నామ్నా స పౌషో మాఘాద్యాశ్చైవ మేకాదశాపరే. :
పుష్యనక్షత్రయుక్తా పూర్ణిమా పౌషీ సా యత్ర మాసే సః నామ్నా పౌషః - పుష్యనక్షత్రముతోఁ గూడిన పున్నమ పౌషి మనంబడును.
అపరే మాఘాద్యా ఏకాదశ చ ఏవమేవ యోజ్యాః - ఇతరములైన మాఘాదిమాసములు పదకొండు 11 ను ఇట్లే తెలియఁదగినది.

6. మాఘ ఫాల్గుణ మా|| - శిశిర ఋతువు, చెట్లు ఆకులు రాల్చును. ఆకులు రాలుటకు - ఒక ఋతువు ఉంటుంది. పన్నెండు నెలలే దాని ఆకులు. చెట్లు ఆకులను ఎవరు - రాల్చమన్నారు?

చలినెల - మాఘము, ఫాల్గునము. చలికారు - శీతాకాలము, శిశిరర్తువు(Winter). Tapas & Tapasya – Sisira Ritu.

శిశిరో స్త్రియామ్:
శినోత్యంగం శీతేన శిశిరః. శీఞ్ నిశానే. - శీతముచేత దేహము నల్పముగాఁ జేయునది.
శినోత్యర్థం శీతేన శిశిరః - శీతముచేత ప్రయోజనమును స్వల్పముగాఁ జేయునది. మాఘఫాల్గున మాసములతోఁ గూడిన ఋతువు పేరు.

మాఘే చ సితసప్తమ్యాం మఘారాకాసమాగమే |
రాకయే చానుమత్యా వా మాసరా క్షాణి యుతాన్యపి |
  

పయరకారు - (వ్యవ)పయర గాలి విసరు కాలము. February, March నెలలు, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు శిశిర ఋతువు.

రేవతి వర్షం, సస్యాలకు హర్షం.

పయర-దక్షిణపుగాలి(పైర–దక్షిణపుగాలి,గాలి), వాయువు, రూ.పయ్యర.
పయరగాలి - (భూగో) వేసవి చలికాలముల యందు అగ్నేయదిశనుండి సముద్రము నుండి భూమి మీదికి వీచుగాలి.

పెసరకు పైరుగాలి పసరానికి నోటిగాలి ప్రమాదము. ఓర్చిన పసరమునకు(పసువులు) తేటనీరు. మనిషికి ఉన్నది పుష్టి, పసరానికి తిన్నది పుష్టి.

శీతస్వానము - (జం.) చలనము లేని స్థితిలో చలికాలమును గడుపుట (Hibernation).

జంతువులు ప్రాణవాయువును అతి తక్కువగా తీసుకోవడం ద్వారా గ్రీష్మ శీతకాలాలు సుషుప్తావస్థలోనికి ప్రవేశించి (సుషుప్తి - ఒక నాడి, ఒడలెరుగని నిద్ర) కొద్దిగా ఆయుః ప్రమాణాన్ని పెంచుకుంటాయి.

శిశిరం - చెట్లు ఆకు రాలుస్తాయి. మునుల్లా నిలుస్తాయి. చెట్లకింద ఎండిన ఆకుల గలలు. నిర్మలమైన నీలినీలి ఆకాశం. చలిపొయింది - ఎండరానుంది. హాయి వాతావరణం. హాయిగా బయట తిరగగలిగిన వాతావరం. శిశిరం వర్షమంత ప్రధానం. శీశీరం నేలకు రాలిన ఆకులు ఎరువు సమకూరుస్తుంది. వర్షం బీజావాపనం చేస్తుంది.

శంభుధ్యాన వసంతసంగిని హృదారామే-ఘ జీర్ణచ్చదాః
స్రస్త్రా భక్తి లతాచ్ఛటా విలసితా పుణ్య ప్రవాళాశ్రితాః |
దీప్యంతే గుణ కోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనాః
జ్ఞానానంద సిధా మరంద లహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ||
తా.
మనోరూపమైన ఉద్యానవనంలోని భగవద్ధ్యాన మనే వసంత ఋతువు ప్రవేశించగా పాప రూపంలో వుండే ఎండుటాకులు రాలిపోతాయి. భక్తి లతలు భాసిల్లుతూ, పుణ్యాలనే చిగుళ్ళుతో, సద్గుణాలనే మొగ్గలతో, జనుల వచనాలనే పుష్పాలతో, సుగంధాలతో బ్రహ్మజ్ఞానామృతం అనే మకరందం ప్రవాహం కలిగి తేజరిల్లుతున్నది. - శివానంద లహరి 

పతనశీలము - (వృక్ష.) క్రిందికిరాలి పొవునట్టిది. సామాన్యముగా శీతకాలమున రాలిపోవునట్టిది (ఆకులు) (Deciduous).   

ఆకు - 1.చెట్టునందలి ఆకు, 2.తమల పాకు, 3.గ్రంథములోని పత్రము, 4.అజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.

ఆకుతెగుళ్ళు - (వ్యవ.) మొక్కల ఆకులకు శిలీంద్రముల వలన సంభవించు తెగుళ్ళు (Leaf diseases). (ఇవి సామాన్యముగా 1.మచ్చతెగుళ్ళు (Leaf Spots), 2.చారతెగుళ్ళు (Rusts), 3.బూడిద తెగుళ్ళు (Mibdews) అని మూడు రకములౌగా ఉండును).
మచ్చతెగులు - (వ్యవ.) ఆకులపై ఎరుపు, గోధుమ, నల్లని రంగు గల మచ్చలేర్పడు రోగము.

శల్కములు - (వృక్ష.) కొన్ని మొగ్గలకు రక్షణ కొఱకు పైని గోధుమరంగుతో ఎండిపోయి అగుపడు బిరుసైన నిర్మాణములు, (Scales). (ఇవి సాధారణముగా శీతకాలమున ఆకు రాలు మొక్కల కుండును).   

ఆకులురాలు చెట్ల అడవులు - (భూగో.) వెడల్పు ఆకులుగల చెట్ల అడవులు. ఇవి సమశీతమండలమున పెరుగును. ఇవి ఉత్తరార్థగోళము నను, దక్షిణార్థగోళమునను 45 డిగ్రీలు(degrees) మొదలుకొని 55 డిగ్రీల వరకు ఉన్నవి. శీతకాలమున కలుగు మంచు శీతలత నుండి రక్షించుకొనుటకై శీతకాలము రాకపూర్వమే చెట్టు తమ ఆకులను రాల్చి వైచును. ఉదా. సుందూరము, టేకు(టేకు - శాక వృక్షము.) ఎల్మ మొ. వృక్షములు ఈ జాతికి చెందినవి.

ఋతుపవనారణ్యములు - (భూగో.) 40" మొదలు 80" వరకు వర్షముగల ప్రదేశములలో నున్న అడవులు (వెడల్పయిన ఆకులు గలిగి, వేసవిలో ఉష్ణము నుండి తప్పించుకొనుటకై ఆకులురాల్చును, వర్షకాలమందు పుష్పించి ఆకులు వేయు చెట్లుగల అడవులు. ఉదా. టేకు చెట్ల అడవి.)   

అర్ణము - 1.నీరు, 2.వర్ణము, అక్షరము, 3.టేకు, విణ.1.చలించునది, 2.కలతపడినది. 
పీలుపు - 1.ఏనుగు, 2.అమ్ము, 3.పరిమాణువు, 4.గోగు, 5.టేకు. 
కుముద - 1.టేకు(టేకు - శాక వృక్షము), 2.గుమ్మడు.
శాకము - 1.కూర, 2.టేకు చెట్టు, 3.ఒక ద్వీపము.
శాకకృషి - (వృక్ష.) కూరగాయల తోటలను పెంచుట (Vegetable cultivation).
కూర - శాకము, వ్యంజనము, సం.కూరమ్.
వ్యంజనము - 1.కూర, దప్పళము(దప్పళము - పులుసు), 2.లేహ్యము.
కూరదినుసులు - వ్యవ.) కూరగాయల నిచ్చు పైరులు, ఉదా. బెండ, బీర, తోటకూర, మొ.వి.(Vegetables).
గుమ్మఁడు - అలంకరించుకొనువాడు, సొగసుకాడు.  
సొగసుకాఁడు - విటకాడు, విణ.అందగాడు.
విటకాఁడు - విటుడు.

తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిరర్తువు.
ద్యానము -
చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
ద్యానీయము - 1.ధ్యానింపదగినది, 2.కోరదగినది.
ధ్యాతవ్యము - 1.ధ్యానింపదగినది, 2.ధ్యేయము.
ధ్యేయము - ధ్యానింపదగినది.
ధ్యాతము - ధ్యానింపబడినది.
ధ్యాత - ధ్యానించువాడు.

తపః కృచ్ర్ఛాదికర్మ చ. :
తపశబ్దము సాంతపనము, చంద్రాయణము మొదలయిన కృచ్ర్ఛము లకును, చకారమువలన ధర్మమునకును పైరైనపుడు న. శిశిరర్తువు నకును, మాఘమాసమునకును పేరైనపుడు పు. తపంత్యత్రేతి తపః, తపాశ్చ. స. తప సంతాపే. దీనియందు తపింతురు. 'తపౌ లోకే ధర్మమాత్రే క్లేశే శిశిర మాఘయో'రితి శేషః.

బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
వేదము - దీనిచేత ధర్మాధర్ముల నెరుగుదురు, తొలిచదువులు(తొలిచదువులు - వేదములు). ఇవి నాల్గు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము.
పరమము - పరమాత్మ, విణ.ఉత్కృష్టము, 1.ఆద్యము, 2.ప్రధానము.
తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది, రూ.తుర్యము. 

చిత్తశుద్ధి లేనివాని జపము, తపము, దానము, ధర్మము, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలూ, దివ్యక్ష్యత్ర దర్శనాలూ కాలక్షేపం కోసం చేసేవే అవుతాయి, కాని సత్ఫలము నిచ్చేవికావు. భూతదయలేని తపస్సు వ్యర్థము.

తబము - తపము, తపస్సు, సం.తపన్.
తపస్వి - తపస్సు చేయువాడు.
తపస్విని - తాపసురాలు.
తబిసి - తపసి, ముని, సం.తపస్వీ. 

సత్యము గలిగియున్న వేరు తపస్సు పనిలేదు. యోగుల హృదయంలో ధ్యానరూపం గలవాడు విష్ణువు.

యమి - 1.ముని, మునులకు సాత్వికం 2.హంస.

ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
ఋషి -
1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు(వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము).
అగస్త్యము - అవిసెచెట్టు.
అవిసియ - అగిసె, రూ.అవిసె, అగస్త్యః.
అగిసియ - అగిసె; అగిసె - అగస్త్యము.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయువిశేషము, రూ.హంసము.
అంౘ1 -
హంస, సం.హంసః.
అంౘ2 - 1ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ , వ్యు. ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ. 

యోగి - యోగాభ్యాసము జ్యేయు పురుషుడు.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.

రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్ఠునికిని పేరు.

సమున్మీలత్సంవి - త్కమల మకరందైకరసికం
భజే హంసద్వంద్వం - కిమపి మహతాం మానసచరమ్
యదాలాసా దష్టా - దశగుణిత విద్యాపరిణతిః
యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్బ్యః పయ ఇవ. - 38శ్లో
తా.
ఓ దేవీ! ఏ హంసల జంటల కూతలు పదునెనిమిది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణములను గ్రహించునో, వికసించిన జ్ఞాన పద్మమందలి మకరందముచే ననందించు మహాత్ముల యొక్క మనస్సు లనెడి మానస సరస్సునందు విహరించు నా హంసల జంటను సేవించుదును. - సౌందర్యలహరి   

హిరణ్యగర్భ శ్శిశిరా స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో దితేః పుత్త్ర శ్శంఖ శ్శిశిరనాశనః.

మాఘము - మాఘమాసము.
జన్నపురిక్క నెల -
మాఘమాసము.

తపా మాఘే :
తపంతి వ్రతం కుర్వంత్యస్మిన్నితి తపాః. స. పు. తప సంతాపే. - దీనియందు తపోయుక్తు లగుదురు.
మఘానక్షత్రయుక్తా పూర్ణిమా మాఘి, సా స్మిన్నితి మాఘః - మఘానక్షత్రముతోఁ గూడున పున్నమ దీనియందుఁ గలదు.
మా అవిద్యమానం అఘం అస్మిన్నతి మాఘః - దీని యందు పాపములేదు గనుక మాఘము. ఈ మూడు మాఘమాసము పేర్లు.  

బలవంతాన మాఘస్నానము చేయించడమా? 

ఎడకారు - మాఘమాసము నుండి జ్యేష్ఠమాసము లోపల పండు పంట(దాళవా).

ఎడ1 - 1.స్థానము, 2.అవకాశము, 3.దూరము, 4.గడువు, 5.భేదము, 6.విఘ్నము, 7.వ్యవహారము, 8.దౌత్యము, విణ. 1.అధికము, 2.ఎలప్రాయము కలది, 3.ఎడమప్రక్కనున్న, అవ్య.అందు విషయమున.
ఎడ2 - హృదయము సం.హృత్ హృదయం లలితాదేవి.…..
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, గుండె(Heart).

సూర్యుడు వల్లనే దిక్కులు, స్వర్గము, భూమి, ఆకాశము అనే భేదాలు కలిగాయి. కనుక అందరికీ సూర్యుడు నేత్రమయినాడు.

ఫల్గునము - పండ్రెండవ మాసము.

అథ ఫాల్గునే :
తపసి సాధుః తపస్యః. - తపస్సు నందును యోగ్యమైనది.
ఫల్గునీ నక్షత్రయుక్తా పౌర్ణమాసీ ఫాల్గునీ. సా స్మిన్నితి పాల్గునః - ఉత్తర ఫల్గునీ నక్షత్రముతోఁ గూడిన పున్నమ దీనియందుఁ గలదు గనుక ఫాల్గునము.
ఫాల్గునికశ్చ - ఫాల్గునికము. ఈ మూడు 3 ఫాల్గున మాసము పేర్లు.

హోళీపండుగ - కామదహనము (ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు జరుగు పండుగ).
హోళిగ - పోళీ, భక్ష్యవిశేషము.
పోళీ - (పోలీ) బొబట్లు (భక్ష్యవిశేషము).

క్రతునామంబు ధరించియుఁ
జతురతఁబలించుచుండుఁ జాతుర్య కళా
రతుఁడై సహస్ర కిరణుఁడు,
మతియుతు లౌననఁ దపస్యమాసము లీలన్.
భా||
ఫాల్గుణ మాసంలో సహస్ర కిరణుడైన సూర్యుడు చాతుర్యకళా కేళీలోలుడై బుద్ధిమంతులు ప్రశంసించునట్లుగా క్రతు(క్రతువు - యజ్ఞము) వన్న పేరు పెట్టుకుని కాలాన్ని పరిపాలిస్తాడు.

దినయామిన్యౌ సాయం ప్రాతః - శిశిరవసంతౌ పునరాయాతః,
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః - తదపి న ముంచత్యాశావాయుః. - భజగోవిందం
   

krishna8

3 comments:

  1. Respected Rama Devi Garu,
    I just happened to see your blog when I was in search of matter relating to RUTUVULU. I must admit with pride and proud that your article in the subject matter was utmost inspiring and lot of utility-oriented content has been found.
    Incidentally, we have been conducting (being our Organisation - TELUGU RATHAM) regularly TELUGU LITERATURE Programmes in Tyagaraya Gana Sabha and the present series on MANA TELUGU RUTUVULU with six programmes @ each per RUTUVU. We have conducted first one i.e. VASANTHAM. We are planning the second one GREESHMAM 10th Tuesday @ 630 pm with selected speakers on the subject.
    I express my sincere thanks for the article which may be permitted to use the same during the matter with sincere acknowledgements which will be expressed in the matter.
    Regards
    Kompella Sarma
    kbssarma@gmail.com

    ReplyDelete
  2. VERY KNOWLEDGEBLE AND VERY INSPERATIVE HAPPY TO COME ACROSS YOUR BLOG MAM. THANQ FOR THE VAST INFORMATION PL, KEEP UP THE GOOD WORK.

    ReplyDelete
  3. 3,6,12,24 వీటిని వివరించండి

    ReplyDelete