Wednesday, March 15, 2017

కన్యారాశి

ఉత్తర 3, హస్త 4, చిత్త 2 పాదములు కన్యరాశి.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః. - బుధుడు

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - ఇల్లాలు, భార్య.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

బృందము - సమూహము.
బృందారకుఁడు -
వేలుపు, విన.మనోజ్ఞుడు.

కన్య - 1.పెండ్లి కాని పడుచు, 2.కన్యారాశి, వి.కన్నియ.
కన్నియ -
పెండ్లి కాని పడుచు, సం.కన్యా.
అనూఢ - పండ్లి కాని పడుచు.     

వరద - 1.పెండ్లి కాని పడుచు, 2.దుర్గ, వై.వి. వెల్లువ, సం.ప్రవాహ్.

దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ -
దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుఃఖేన గంతుం శక్యతే దుర్గా - కష్టముచే నెఱుగఁ దగినది.
దుర్గం వనగిరిరూప మావాసోయ స్యా స్సా – వనాది దుర్గము స్థానముగాఁ గలది.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.  

వరదుఁడు - 1.సమర్థకుడు, 2.మిగులదయాళువు.

వెల్లువ - 1.వరద, అధికప్రవాహము, 2.సేన, దండు, విణ.అధికము.
వఱద - వెల్లువ, నీటికాలువ.
వరూధిని - దండు, సేన.

సుప్రతీప స్సుతామ్రాక్ష స్సుబ్రహ్మణ్య స్సుఖప్రదః,
వక్ర స్తంభాదిగమనో వరేణ్యో వరద స్సుఖీ|

ప్రవాహము - 1.వెల్లువ, 2.పరంపర, వి.(భౌతి.) ప్రవహించునది (Current).
వెల్లువ - 1.వరద, అధికప్రవాహము, 2.సేన, దండు, విణ.అధికము.
వఱద - వెల్లువ, నీటికాలువ.
వఱత - వెల్లువ, ఏరు, రూ.వఱద.
నది - 1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
వఱద కాలువలు - వర్షము వచ్చునప్పుడు మాత్రమే నిండి పొలములకు, నీటి నందజేయు కాలువలు. 

ప్రవాహస్తు ప్రవృత్తి స్స్యాత్ :
ప్రకర్షేవిచ్ఛేదేన వహతీతి ప్రవాహః వహ ప్రాపణే. - ఎడతెగక నడుచునది.
ప్రవర్తన ఇతి ప్రవృత్తిః సీ. వృతువర్తనే. - ప్రవర్తించునది. ఈ రెండు ఎడతెగక వచ్చు జలాదుల పరంపర పేర్లు.

ప్రవృత్తి - 1.నడక, 2.ప్రవేశము, 3.బ్రతుకుతెరువు.

నీటిపాఱుదల - మానవ ప్రయత్నము చేత కాలువల ద్వారా, ఉపనదుల ద్వారా సేద్యము కొరకు నీటిని పొలమున కందచేయుట. 
నీటివాలు - (భౌతి.) నీరు ఎత్తునుండి పల్లమునకు పారు వైఖరి.

ప్రవాహి - (రసా.) ప్రవహించు స్వభావము గల ద్రవ్యము, చలన స్వేచ్ఛ గల అణువులు కూర్పు అయిన ద్రవ్యము (Fluid), ఉదా. ద్రవములు, వాయువులు.
ప్రవాహిత - (భౌతి.) ఇటునటు చలించుటకు స్వేచ్ఛగల అనువులుగలిగి యుండుట (Fluidity).

వరదాభయకర వాసుకి భూషణ వనమాలాది విభూష శివ| 

యవ్వనం ఒక మహాప్రవాహం లాంటిది. దానికి సరైన ఆనకట్ట కట్టి నీటిని మళ్ళించినప్పుడే జీవితం ధన్యమౌతుంది. - శ్రీరామకృష్ణ పరమహంస 

శ్లో|| ప్రథమ శైలపుత్రీతి - ద్వితీయా బ్రహ్మచారిణీ
     తృతీయా చిన్న ఘంటేతి - కుష్మాండేతి చతుర్థకీ 
     పంచమాస్కందమాతేతి - షష్ఠా కాత్యాయినీతిచ
     సప్తమా కాళరాత్రీ చ - అష్టమాచాతి భైరవీ
     నవమా సర్వసిద్ధిశ్చాత్ - నవదుర్గా ప్రకీర్తితాః|

ఆర్య - 1.పదునారెండ్ల 16సం. కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద.) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట.) నటుడు భార్యను పిల్చునపుడు వాడెడు మాట.
ఆర్యాణి - 1.పూజ్యురాలు, 2.పార్వతి.
శ్రేష్ఠత్వా దార్యా - శ్రేష్ఠురాలు.   

గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ
స్తోమ శ్శాప్తబలం ఘనేంద్రియ చయో ద్వారాణి దేహస్థితః
విద్యావస్తు సమృద్ధి రిత్యఖిలసామగ్రీ సమేతే సదా
దుర్గాతిప్రయ! దేవ! మామక మనోదుర్గే నివాసం కురు || - 42శ్లో
తా.
దుర్గకు అత్యంత ప్రియుడైన స్వామీ! గాంభీర్య కందకంతో, ధైర్యరూప ప్రాకారంతో, సద్గుణాలే హితాన్ని చేకూర్చే సేనగా దేహంలో వున్న ఇంద్రియాలే ద్వారాలుగా, జ్ఞానమే సర్వవస్తు సంపదగా వున్న నా మనో దుర్గంలో సదాశివ దేవా! సదా నివసించవయ్యా! - శివానందలహరి  

దుష్టదూరా దురాచార - శమనీ దోషవర్జితా|
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా. - 51శ్లో 

కన్యాకుమారి : కన్యాకుమారి దేవాలయము, బంగాళాఖాతము - అరేబియా సముద్రము - హిందూమహాసముద్రములు కలియుచోటు.

పంచ కన్యలు :
అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ తథా|
పంచకన్యాః స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్||

నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి
బాలార్కసదృశాకారే పూర్ణ చంద్రనిభాననే| 

కన్నె పాయపు సతికి కన్నెరాశి.....

పడుచురాశి - కన్యారాశి.
పడుచు -
1.కన్యక, 2.కన్నెరికముగాని వేశ్య.

రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
రూపుమాపు - క్రి.చంపు, నాశనమొనర్చు.    

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).

పిల్ల - 1.పక్షాదుల సంతతి, 2.పడుచు, విణ.చిన్నది, సం.పీలుకః.
కుణకము -
పిల్ల.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).

డింభము - పిల్ల, గ్రుడ్డు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించింది.

కొదమ - పశుపక్ష్యాదుల పిల్ల, ఉదా.సింగపుఁ గొదమ, అంచకొదమ, తేటికొదమ మొ.వి, 2.ఆడుమేకపిల్ల, విణ.1యౌవనము తలచూపినది, 2.దృఢము, 3.లేతది.

కిశోరము - 1.గుఱ్ఱపు పిల్ల, 2.మృగాదుల పిల్ల.
కిశోరుఁడు - వేడివేలుపు (సూర్యుడు), విణ.యౌవనావస్థ కలవాడు.

కిశోర న్యాయాలయము - (శాస.) యుక్తవయస్సు రాని బాలబాలికలు చేసిన నేరముల విచారించు స్థలము, బాల న్యాయస్థానము (Juvinial court).

దృఢము - (భౌతి.) వంగనిది, చిన్న దెబ్బలకు వికారము చెందనిది, గట్టిది, (Rigid) ఉదా.దృఢవస్తువు (Rigid body).
దిట - 1.దార్ఢ్యము, సత్తువ, శక్తి, 2.ధైర్యము(ధీరత్వము), రూ.దిటము, దిటవు, సం.దృఢమ్.
దిట్ట - దార్ఢ్యము, శక్తి, విణ.దార్ఢ్యముకలవాడు, సం.దృఢః, ధృష్టః.
దిట్టఁడు - సమర్థుడు, 2.నేర్పరి, 3.ధైర్యము గలవాడు, సం.ధృష్టః.
దిట్టము -1.ధృఢము(దిటము - దృఢము), 2.నిర్ణయము(నిర్ణయము - ఏర్పాటు), సం.దృఢమ్.

సదాటు - ధృఢము.
తుటారము -
1.దిట్టతనము, 2.పురుషవచనము.
తుటారి - 1.దిట్టతనముగలది, 2.పారుష్యముగలది.

వామనము - లేతది.
లేఁత -
1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.

గున్న - 1.పిల్ల, 2.ఏనుగు మొ.ని పిల్ల, 3.గుబురుగా పెరిగిన లేత మొక్క, ఉదా.మామిడిగున్న, సం.కుణకః.

కలభ కరిశాబకః,
కం ఉదకం లభతే కలభః, దులభష ప్రాప్తౌ. - ఉదకమును బొందునది.
కరిణః శాబకః కరిశాబకః - ఏనుగుపిల్ల. పా. కరిపోతకః.
"పంచవర్ష గజోబాలః పోతస్తు దశవార్షికః, విక్కోవింతతివర్షస్తు కలభస్తీ శదబ్దకః." - ఈ 2 ఏనుగుగున్న పేర్లు.

కలభము - ఏనుగుగున్న; ఎత్తుగున్న- ఏనుగుగున్న.
శాబకము - కూన, రూ.శాబము.
కూన - కున్న, కుర్ర, సం.కుణకః.
కుణకము - పిల్ల.

కొండిక - 1.చిన్నది, 2.అల్పము, వి.1.చిన్నవాడు, 2.బాలుడు, 3.బాలిక, సం.కుణకః.

పోతము - 1.పక్షిపిల్ల, 2.పదేండ్ల యేనుగు, 3.ఓడ.
పిల్లాకము - పక్షిపిల్ల; పీటకము - పక్షిపిల్ల.
పోతవణిజుఁడు - ఓడ బేరగాడు.

తలఁగవు కొండలకైనను
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం
గలఁగవు పిడుగుల కైనను,
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
భా||
గున్న ఏనుగులు ఎక్కువ బలసంపదతో ఎదిరించే శక్తి కలిగి కొండలను డీకొనుటానికైననూ వెనుదీయవు. సింహాలకు కూడ భయపడి తొలగక ఎదిరించి నిలుస్తాయి. పిడుగులను సైతం లెక్క చేయకుండా ముందంజ వేస్తాయి.

చిన్నపిల్లలు గతమును గురించిగాని, జరుగబోవు దానినిగురించి కాని ఆలోచించరు. ఇది మనలో కొందరికే చేతనవుతుంది. వారు ప్రస్తుతాన్ని(వాస్తవాన్ని) సంతోషముగా గడుపుతారు. - సూక్తి.

బాల - పదునా రేండ్లకు లోబడిన పిల్ల.
వాసువు -
(నాట్యపరిభాషలో) బాలిక.
వసతి మాతృసమీపే వాసూః, ఊ-సీ, వస నివాసే. - తల్లిసమీపమున నుండునది. ఈ ఒకటి పిన్నపడుచు పేరు.

కుంక - 1.బాలవిధవ, 2.రండ.
చత్వరిక - బాలవిధవ. 
రండ - విధవ; విధవ - పెనిమిటిలేనిది, అనాథ.
వితంతువు - విధవ, వ్యు.తంతువు (సూత్రము)లేనిది. అనాథ రక్షక గోవిందా|
కుంకటి - పిల్లకుట్టు, విణ.ప్రధానము, ఉదా, కుంకటివేరు = తల్లివేరు, రూ.కూఁకటి.
కూఁకటి - పిల్లజుట్టు, జుట్టు, విణ.1.ప్రధానము, 2.లేతది, సం.కూకటః.

బాలాజీ - శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలా.

అమ్మాయి - 1.బాలిక, చిన్నపిల్ల, 2.కూతురు.
అమ్మి -
1.అమ్మాయి, 2.నీచజాతి స్త్రీ, సం.అంబిః.

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు.

ఆఁడపీక - బాలిక, (భ)ద్రాచల ప్రాంతమున వాడుకలో ఉన్నది).
పోఱి - ఆడపిల్ల, బాలిక.

బలారిష్టము - పుట్టినది మొదలు 12 సంవత్సరముల లోపున బాలబాలిక లకు కలుగుకీడు, మరణము.

కొండిక - 1.చిన్నది, 2.అల్పము, వి.1.చిన్నవాడు, 2.బాలుడు, 3.బాలిక, సం.కుణకః.

చిన్నది-బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు). అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.  లే - (లేత) అల్పము, (వ్యాక.) లేత శబ్దమునకు మీదివర్ణము లోపింపగా మిగిలిన రూపము.
లేఁబ్రాయము - (లేత+ప్రాయము) బాల్యము.
లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.

చిన్నవాడు - బాలుడు.
బాలిశుడు -
1.మూర్ఖుడు, 2.బాలుడు. 

కుఱ - 1.కొడుకు, 2.బిడ్డ, 3.బాలుడు, రూ.కుఱఁడు.
బిడ్ద -
1.సూనుడు, 2.కూతురు.
సూనుఁడు - 1.కొడుకు, 2.తమ్ముడు, 3.సూర్యుడు Sun, రూ.ప్రసూనుడు.      

ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు. కొడుకు - కుమారుడు, సం.కుణకః.

కుమారి - 1.కూతురు, 2.పెండ్లికాని ఎనిమిదేండ్ల పడుచు, 3.పార్వతి.
కూకువు - ఎనిమిదేండ్లవరకు పెండ్లి కాని పడుచు. మయాపురి యందు దేవిస్థానం కుమారి|

కన్యాకుమారీ :
కన్యతే కామ్యత ఇతి కన్యా. కన దీప్తికాంతిగతిషు - కోరఁబడునది.
కుమారయతి క్రీడయతీతి కుమారీ, సీ. కుమార క్రీడాయాం - క్రీడించునది.
కుత్సితో మారో స్యా ఇతి కుమారీ - మన్మథుని(మారుఁడు - మన్మథుడు)ని దిరస్కరించునది. ఈ మూడు మొదటివయస్సున నున్న పెండ్లికాని పడుచు పేర్లు.

కూఁతురు - కుమార్తె.
కొమారి - కూతురు, సం.కుమారీ. 
కొమరె - కుమారి, యౌవనము గల స్త్రీ.  
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది (16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.  

కౌమారి - 1.పార్వతి, 2.బ్రహ్మచర్య వ్రతమున నుండువానిని పెండ్లి యాడిన స్త్రీ, 3.సప్త మాతృకలలో ఒకతె.

కౌమారము - మూడవ యేడు మొదలు పదునారేండ్ల (3-16)వరకునైన ప్రాయము.
మధ్య - పదుమూడేండ్ల నుండి పదునెనిమిది(13-18)వరకు వయస్సు గల కన్య. 

పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు. 

ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచే అడ్డు పెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉమా, ఆ-సీ. ఉ ఇత్యనేన సంబోధ్య మా ఇత్యనేన తపసో మాత్రా నిషిద్ధత్వాదుమా, ఉ = ఓ బిడ్డా, మా = వలదు. అని యట్లు తల్లి చేఁ దపస్సువలన నిషేధింపఁబడెను గనుక ఉమ, అవతీత్యుమా - రక్షించునట్టిది.
ఉమాపతి - శివుడు.
ఉమాయాః పతిః ఉమాపతిః - పార్వతీదేవికి భర్త. 

హరిద్ర - పసుపు.
వరవర్ణిని - 1.భర్త యందనురాగము గల్గియుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
పసుపు(ౘ)చుక్క - (గృహ.) కన్ను గ్రుడ్డులో ఈ చుక్క ఉన్నచోట ప్రతిబింబము పడిన అదిస్పష్టముగా కనబడును (Yellow-spot).

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.

పితారక్షతి కౌమారే - భర్తారక్షతి యౌవనే|
రక్షంతి వార్ధ కేపుత్త్రా - న స్త్రీస్వాతంత్ర్య మర్హతి||
తా.
స్త్రీలను బాల్యమందు తండ్రియు(పిత - జనకుడు (కన్నవాడు, వడుగు చేసినవాడు, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.), యౌవన మందు పెనిమిటియు(భర్త - మగడు, విణ.ప్రోచువాడు), ముదిమి(వార్థకము-వృద్ధత్వము)యందు కొమారులును(కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.)రక్షింతురు. కాబట్టి యొక కాలమందు ను స్త్రీలకు స్వాతంత్ర్యము లేదు. - నీతిశాస్త్రము

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.), దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.

కైలాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ|
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా(అ)న్నపూర్నేశ్వరీ.
- 4  

కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ. 
కతి అయనాని మోక్షమార్గా స్సంతీతి విచారయతీతి కత్యయనః తస్యగోత్రా పత్యంకాత్యాయనీ - మోక్ష మార్గంబు లెన్నిగలవనీ విచారించువాఁడు కత్యయనుఁడు. ఆ ఋషి గోత్రమందేఁ బుట్టినది.

కాత్యాయన్యర్ధవృద్ధా యా కాషాయవసనాధవా,
యా అర్ధజరతీ కాషాయవసనా విధవాచ సా కాత్యాయనీత్యుచ్యతే - సగము ముదిసి కావిచీరఁ గట్టి విధవయైన స్త్రీ కాత్యాయని యనంబడును.
కత్యస్య ఋషే రపత్యమివ వర్తతే కాత్యాయనీ. సీ. - కత్యుఁడను ఋషి కూఁతురివలె నుండునది.

నితా య త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే
సత్యా యాదికుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే
మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాం త సంచారిణే
సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శ్శంభవే|
తా||
శాశ్వతమైనవాడు, త్రిగుణ (సత్త్వ రజ స్తమోగుణాలు) స్వరూపుడూ, పురత్రయాన్ని జయించినవాడు, కాత్యాయనీదేవికి శుభాలు చేకూర్చేవాడు, సత్యమూర్తియూ, ఆది కుటుంబియు, మునుల మనస్సులకు సాక్షాత్కరించునట్టి జ్ఞా న మూ ర్తి యు, మాయతో లోకత్రయాన్ని సృజించువాడు, ఉపనిషత్తు లన్నిటి యందు సంచరించువాడూ, సాయం సంధ్యవేళలో తాండవం చెయాలన్న అభిలాష కలవాడును, జడలను ధరించినవాడు అయిన శంభు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)దేవునికి యిదే ప్రణమిల్లుతూన్నాను. - శివానందలహరి     

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ|
కాత్యాయినీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా.

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|

కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
కాళవర్ణత్వాత్కాళీ - నీలవర్ణముగలది.

కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి, 5.క్రొత్త మబ్బు.  
విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ 27వ సంవత్సరము.
పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపిత్త్రిక), 2.బొమ్మ. 
ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామతి శమలం, శము ఉపరమే. - నశించునది. శ్యామిక - చీకటి, నలుపు. నీలిమ - నలుపు.

అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
తిమిరము -
చీకటి; చీకటి - అంధకారము.
అంధకారము - చీకటి; అంధము - చీకటి, విణ.గుడ్డిది.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.
చీఁకటిగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిచెట్టు - తమాల వృక్షము. 

తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.ఆతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి). ఘటనల మధ్య దొరలు కాలము (Time).
కాలరాత్రి - 1.ప్రళయకాలము, 2.దుర్గామూర్తి భేధము, 3.చీకటిరాత్రి, సం.వి.కాలిబంటు, పదాతి.

మంగళ - పార్వతి.    
సర్వమంగళ - పార్వతి.
సరాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమతమైన శుభములు గలది.
మంగళదేవత - లక్ష్మి.

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్త్రీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ|

అపర్ణ - పార్వతి; మృడాని - పార్వతి; భవాని - పార్వతి.
ఈశ్వరి - పార్వతి.    

భైరవి - 1.పార్వతి, 2.ఒకానొక రాగము.

ఆర్య - 1.పదునారెండ్ల 16సం. కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద.) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట.) నటుడు భార్యను పిల్చునపుడు వాడెడు మాట.
ఆర్యాణి - 1.పూజ్యురాలు, 2.పార్వతి.
శ్రేష్ఠత్వా దార్యా - శ్రేష్ఠురాలు.

దాక్షాయణి - 1.పార్వతి, 2.రోహిణి నక్షత్రము.
దక్షస్యాపత్యం దాక్షాయణీ - దక్షునికూఁతురు.

గిరిజ - పార్వతి, 2.కొండయరటి, 3.మల్లెతీగ.
గిరే ర్జాతా గిరిజా - పర్వతమువలనఁ బుట్టినది. 

కాళికా తిమిర కుంతలాంతఘన భృంగ మంగళ విరాజినీం,
చూళికా శిఖర మాలికా వలయ మల్లికా సురభి సౌరభాం|
వాలికా మధుర గండమండల మనోహరానన సరోరుహాం,
కాళికా మఖిలనాయికాం మనసి భావయామి పరదేవతాం|
     

                  

అనీకము - 1.సేన, 2.సమూహము, 3.యుద్ధము.
అనీకిని - 1.సైన్యము, 2.అక్షౌణిలో పదియవపాలు.

సైన్యము - 1.సేనతోకూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరుగుఱ్ఱములో నొకటి.
ఆరక్షము -
రక్షించునది, వి.1.రక్షణము, 2.ఏనుగు కుంభస్థలముల క్రింది చోటు, 3.సైన్యము.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి. మహాసేనుఁడు - కుమారస్వామి. 

మొన - 1.అగ్రము, 2.దండు, 3.సేనాముఖము.
మొనకాఁడు - సేనాధిపతి, విన.1.శూరుడు, 2.ముఖ్యుడు.

సేన - దండు, విణ.అధికము, చాల.
వరూధిని -
దండు, సేన.
ధ్వజిని - సేన.
దండు - 1.దండము, 2.సేన, 3.గుంపు, సం.దండః.
దండము - నమస్కారము. నమస్సు - నమస్కారము.
నమస్కారము - మ్రొక్కు, రూ.నమస్క్రియ, నమస్కృతి.

రాణువ - 1.దండు, 2.పరివారము.
పరివారము -
1.దండు, 2.కత్తియొర, 3.పరిజనము.
మంది - 1.కాల్బలము, 2.జనసమూహము, 2.పరిజనము. 
పరిజనము - పరివారము.

సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group). 
గుంపు -
1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
నివహము - గుంపు.  

వెల్లి - ప్రవాహము, పరంపర, తెలుపు, సం.వేల్ల్.
వెల్లివాక - గంగ.

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).
త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది.

స్రోతస్సు - 1.ప్రవాహము, ఏరు, 2.నీరువచ్చు తూము.
స్రోతస్విని -
నది, వ్యు. ప్రవాహము కలది.

ధార - 1.నీటిచాలు, 2.ఆయుధముల వాదర, 3.చిల్లి, 4.అశ్వగతి విశేషము, 5.ప్రవాహము, 6.పరంపర.
దార - 1.ధార, 2.నీటిచాలు, 3.దానము, 4.క్రమము, సం.ధారా.
దార - భార్య; భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
ధారపోయు - క్రి.చేతనీరుగొని దత్తముచేయు.

దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విణ.చీల్చువాడు.  

తరంగిణి - నది, ప్రవాహము. వేగం వల్ల వృద్ధి పొందేది నది.
నది -
1.ఏరు, 2.ఆమడకు మీరి పారెడు ఏరు.
నదీమాతృకము - ఏటి నీటిచే పండెడు భూమి.

ఆపగ - నది, ఏరు, వ్యు.జలముతో పోవునది.
ఆపగేయుఁడు -
గంగాపుత్త్రుడు, భీష్ముడు.
గంగాపుత్త్రుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి. 

ౙాలు - ఏరు, చిన ప్రవాహము నీరు, రూ.జోలువు (జామునకు బహు.)
ౙాలువారు - క్రి.ప్రవహించు.
ౙాలువు - జాలు, సం.ఝరా.

గంగ పారు నెపుడు గదలని గతితోడ
మురికివాగు పారు మ్రోతతోడ
పెద్దపిన్న తనము పేర్మి యీలాగురా, విశ్వ.
తా.
ఓ వేమా! మంచినీటి ప్రవాహము నిశ్శబ్దముగ పారుచుండును. మురికినీటి కాలువ పెద్ద చప్పుడు చేయుచు ప్రవహించుచుండును. మంచి చెడ్డ వారితేడా ఆ విధముగనే ఉండును.

శృంగవక్రసరస్సు - (భూగో.) నదీ ప్రవాహములో వంకరలు తిరుగుచు శృంగ వక్రమువలె పాఱు నదీ సమీప తీరము. నది 'U' వలె ప్రవహించి మధ్యప్రాంతమును సారవంతముగ తయారుచేయును.

ప్రవహించే నీరు కొన్నిచోట్లు సుడులు తిరిగినా, వెంటనే వాటిని అధిగమించి ముందుకు సాగిపోతుంది. అలాగే తన హృదయం తరచుగా నిరాశ, దుఃఖం, అవిశ్వాసం వంటి సుడులలో చిక్కుకొన్నప్పటికీ, అవి తాత్కాలిక మేనని గ్రహించి భక్తుడు ముందుకు సాగాలి. - శ్రీ రామకృష్ణ పరమహంస 

వేణి -1.అనేక ప్రవాహముల కూడిక, 2.కాలువ, 3.వేనలి (సర్పాకారము గల జడ).
కాలువ - నీరుపారు మార్గము.
వేనలి - వేణి, కొప్పు, కేశకలాసము, జుట్టు, సం.వేణీ.

కేశబంధము - 1.కొప్పు, 2.ముడి.
క్రొమ్ముడి-(క్రొత్త+ముడి)ఒకరకపు కేశంబంధము, వేనలి.

వేణీ ప్రవేణీ -
వేణతీతి వేణీ. ప్రవేణీ చ. - అణగి యుండునది.
వేణృ నిశామన వాదిత్రాదాన గమన జ్ఞాన చిన్తాసు. పా. వేణిః ప్రవేణిః. ఈ రెండు(మగఁ డూరలేని మగువలు మున్నగువారు) అల్లిన జడ పేర్లు.

సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం సమద్వజ్రపాణిమ్|  
సుధామంథరాస్యాం ముదా(అ)చింత్యవేణీం
భజే శారదాంబా మజస్రం మదంబామ్.    

వఱ్ఱు - 1.ప్రవాహము, 2.అతిశయము.
అతిశయము -
ఆధిక్యము.
మెండు - 1.అధిక్యము, అతిశయము, 2.మిఱ్ఱు(మిఱ్ఱు- ఉన్నత భూమి). వలదు - అధిక్యము, అవ్య.వద్ధు.

పాఱు - 1.ప్రవహించు, 2.పరువెత్తు.
పాఱుఁడు - బ్రాహ్మణుడు; బ్రాహ్మణుడు - పారుడు.

పరంపర - 1.వరుస, 2.విడువక సాగునది, సం.వి.(గణి.) ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల గుంపు (Series). ఉదా.1,3,5,7,9.....
పవుఁజు(ౙ) - 1.వరుస, 2.శ్రేణి, 3.దండు.
వరుస - 1.శ్రేణి, 2.పరంపర క్రమము, 3.బంధుత్వ క్రమము, 4.వంతు.
శ్రేణి - వరుస, (గణి.) ఒక దత్త న్యాయము ప్రకారము వ్రాయబడిన పదముల సముదాయము దత్తన్యాయము ననుసరించి వ్రాయబడిన రాసుల సముదాయము. (Progression)
బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship).  

పద్ధతి - 1.మార్గము, 2.వరుస, సం.వి. (గణి. భౌతి. రసా.) సమకూర్చ బడిన అవయములు (భాగములు) కలిగి క్రమసహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడినది (System) లేదా ఒక పూర్ణముగా పరిగణింప బడు వస్తువుల సమూహము.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
పదవి - మార్గము, వై. వి. ఉన్నతస్థితి, సం.పదమ్.
ఏకపది - 1.మార్గము, 2.ఒకడే నడువదగ్గ మార్గము.   

వంతు - 1.భాగము, 2.వరుస, 3.సామ్యము, 4.పోటీ.
భాగము -
1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
భాగము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.

క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస -
1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము. 

తుల - 1.త్రాసు, 2.పోలిక, 3.రాసులలో ఒకటి.
సామ్యము -
సమత్వము, పోలిక. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property). 

వృషలి - 1.గొడ్రాలు, 2.చచ్చుడు బిడ్డలు గలది, 3.శూద్రి, 4.కన్యక.
వంజ -
వంధ్య, గొడ్రాలు, సం.వంధ్యా, వి.గొడుగులోపలి శలాకల కాసరాగా నేర్పడిన కమ్ములు.
వంధ్య - గొడ్రాలు, గొడ్డుటావు, విణ.ఫలింపనిది. 
గొంజ - 1.గొడ్దుటావు, 2.గొడ్రాలు.
గొడ్డు - 1.ఈనని పశువు, 2.గొడ్రాలు, విణ.శూన్యము.
గొడ్డుఁబోతు - 1.నిష్ప్రయోజకుడు, 2.సంతతి లేనివాడు, 3.కాపులేని చెట్టు.
శూద్రి - శూద్రుని భార్య. 
కన్యక -

విద్యానేన విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమమ్|
సహివంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనామ్||
తా.
లోకమునందు గొడ్రాలు, సహింపగూడని(గుర్వి - గర్భిణి)ప్రసవవేదన(బిడ్డకుట్టు - ప్రసవవేదన)నెట్లె ఱుంగదో అట్లు విద్యాహీనుఁడు విద్వాంసుని పరిశ్రమ(పరిశ్రమ -1.శ్రమము, 2.కర్మాగారము మొ.నవి (Industry) నెఱుఁగలేఁడు. - నీతిశాస్త్రము

విజయా విమలా వంద్యా వందారు జన వత్సలా|
వాగ్వాదినీ వామకేశీ వహిమండ్లవాసినీ. - 77శ్లో

నడివానకారు - (వ్యవ.) వర్షఋతువు - ఆగస్ఠు, సెప్టెంబరు నెలలు, ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర కార్తెలు (Mid-rainy season).
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

ఉత్తర - 1.ఉత్తర ఫల్గునీ నక్షత్రము, 2.ఉత్తరదిక్కు, 3.విరటుని కూతురు.
ఉత్తరఫల్గుని -
పండ్రెండవ నక్షత్రము.

ఉత్తరుఁడు - శ్రేష్టుడు, 1.శివుడు, 2.విష్ణువు, 3.విరటుని కొడుకు.

నక్షత్రము - రిక్క, నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
రిక్క -
నక్షత్రము సం.ఋక్షమ్.
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్క రాయుడు.

ఉత్తరపక్షము - 1.సిద్ధాంతము (వ్యతి పూర్వ పక్షము, 2.కృష్ణపక్షము.
అపరపక్షము - బహుళ పక్షము, కృష్ణపక్షము.

ఉత్తరకృషి - (వ్యవ.) విత్తనములు చల్లిన తరువాతగాని, నాట్లు వేసిన తరువాతగాని చేయు గొప్పు త్రవ్వుట, కలుపుతీయుట మొ. పనులు.
గొప్పులు - 1.వరిమడిలోని చిన్న మెరక స్థలములు, 2.మిరపతోట మొ.వి యందు కొంచెము యెత్తుగా నుండెడిచోటు.
కలుపుతీయుట - (వ్యవ.) చేనిలో పెరిగిన కలుపుమొక్కలను తీసివేయుట (Weeding).
కలుపుమొక్కలు - (వ్యవ.) మడిలో సాగు చేయబడుచున్న మొ క్క లు గా క అచట బయలుదేరిన ఇతర జాతి మొక్కలు (Weeds).

ఉత్తరుఁడు - శ్రేష్టుడు, 1.శివుడు, 2.విష్ణువు, 3.విరటుని కొడుకు.

శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ.మేలిమి బొందినవాడు.
శ్రేష్ఠ్యము - మేలిమి, శ్రేష్ఠత్వము.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి. 
శివః శామ్యతిపరమా నందరూపత్వా న్నిర్వికారో భవతీతిః శివః - బ్రహ్మానంద స్వరూపుఁడును నిర్వికారుండును గనుక శమించియుండు వాఁడు.
శేరతే సజ్జ మనాం స్యస్మిన్నితి వా - ఇతని యందు సజ్జనమనస్సు లుండును. శేతే సజ్జన మనస్స్వితి సాధువుల మనస్సుల యందు శయనించి యుండువాఁడు. 
శీఙ్ స్వప్నే శివం కల్యాణం తద్యోగా ద్వా - శివ మనఁగా శుభము దానితోఁ గూడినవాఁడు.
శివప్రదత్వా ద్వా - శుభముల నిచ్చువాఁడు. 
శివతాతి - శివశంకరుడు.  

శివంకరుఁడు - శుభకరుడు.
శివము - 1.శుభము, 2.సుఖము, 3.మోక్షము.

సిగము - శివము, ఆవేశము, రూ.సిగము, సం.శివా.

శూలపాణి - శివుడు, వ్యు.శూలము చేతి యందు గలవాడు.
శూలమస్యాస్తీతి శూలీ, న.పు. - శూలమనెడి ఆయుధము గలవాఁడు.  
శూలి - శూలపాణి.    

అస్త్రీ శూలం రుగాయుధమ్,
శూలశబ్దము శూలరోగమునకును, ఆయుధ భేదమునకు పేరు.
శూలయతీతి శూలం, శూల రుజాయాం. - వ్యథ(వ్యధ - బాధ, క్లేశము, ఆయాసము.)పెట్టునది.
రోగభేదే భవే చ్చూలం మృత్యోః ప్రావరణాంతరే, యోగభేదే ధ్వజే శూలః శూలాపణస్త్రియాం మతా శూలం విక్రయణే (అ)పి స్యా'దితి ప్రతాపః.

శూలము - 1.మొమ్మొనవాలు, 2.టెక్కెము, 3.ఒక రోగవిశేషము. 

త్రిశూలము - ముమ్మొనవాలు.
ముమ్మొనవాలు - (మూడు+మొనవాలు) త్రిశూలము.

మహితము - శివుని శూలము, విణ.గొప్పది, పూజ్యము.

సూల - శూలరోగము, సం.శూలా.
కుట్టు - 1.శూల రోగము (Chronic pain). 2.కడుపు నొప్పి, 3.ప్రొయ్యిలోని బూడిద, క్రి.1.(తేలు మొ.వి.) కుట్టు, 2.(వస్త్రము) కుట్టు, 3.(ఆకులు) కుట్టు.

మేకు - 1.శూలము, 2.చీల.
చీల - 1.మేకు, 2.కీలము, రూ.సీల.
సీల - చీల.
సీలమండ - చీలమండ.
చీలమండ - 1.కాలిమడమల కిరుప్రక్కల నుండు కీలు, గుల్ఫము, రూ.చీలమండ (Ankle bone).

కీలి - అగ్ని, వ్యు.కీలలు కలది.
కీల - 1.మోచేతిదిబ్బ, 2.మేకు, 3.మంట, జ్వాల.
కీలతి పక్ష్యాదిగతిం నిరుణద్ధీతి కీలః, ప్స. కీలబంధనే. - పక్ష్యాదులయొక్క గతిని నిరోధించునది.  

కీలము - 1.మేకు, 2.మంట, 3.లేశము, 4.మోచేయి, (వృక్ష.) అండాశయములో అండాశయముపై నున్న కాడ (Style).
కీలాగ్రము - (వృక్ష.) కీలము యొక్క కొన (Stigma).

కీలాలము - 1.నెత్తురు, 2.నీరు.
కీలాన్ జ్వాలాన్ అలతి వారయతీతి కీలాలం, అల భూషణపర్యాప్తి శక్తివారణేషు. - అగ్నిజ్వాలలను వారించునది.
కీల్యతే బద్ద్యత ఇతివా కీలాలం, కీల బంధనే. - బంధింపఁబడునది.

కీలక - ప్రభవాది అరువది సంవత్సరములలో నలువది రెండవది(42వ).

గసిక - 1.మేకు, 2.బాణము, 3.త్రవ్వుటకు అనువుగా కొనచెక్కిన కొయ్య.

స్థాణువు - 1.మేకు, 2.శివుడు, 3.కొమ్మలులేని చెట్టు, మ్రోడు, విణ.స్థిరమైనది.
మ్రోడు - 1.మొద్దు, స్థాణువు, 2.మూర్ఖుడు. వైధేయుఁడు - మూర్ఖుడు.
మొద్దు - మ్రానిమోడు, విణ.1.మూడుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.

శివకము - 1.పసులగట్టు గూటము, 2.మేకు.

మహేశ్వరుఁడు - శివుడు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే. 

     

కానీనుఁడు - సం. విణ.కన్యకు పుట్టినవాడు వి.1.కర్ణుడు, 2.వ్యాసుడు.
కానీనః కన్యకాజాత స్సుతః : కన్యయాః పుత్రః కానీనః - కన్యక కొడుకు. పెండ్లిగాని పడుచు కొడుకు. 

ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని(Saturn), 4.కర్ణుడు, 5.సుగ్రీవుడు.
ప్రొద్దు -
1.సూర్యుడు, 2.కాలము, 3.దినము, సం.బ్రధృః.

సూర్యతనయుఁడు - 1.శని, 2.కర్ణుడు.
సూర్యతనయ - యమున. యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.

యువరాజు - 1.చిన్నరాజు, రాజు తర్వాత రాజ్యమున కర్హుడైనవాడు, 2.కర్ణుడు.
కుమారుఁడు -
1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విన.చీల్చువాడు.
భత్తృదారకుఁడు - (నాట్యపరిభాష యందు) యువరాజు.

యౌవరాజ్యము - (రాజ.) యువరాజు యొక్క దొరతనము. 

యువరాజస్తు కుమారో భత్తృదారకః. -
యువా చాసౌ రాజా చ యువరాజః. - పిన్నఱేఁడు.
కుమారయతీతి కుమారః. - ఆడువాఁడు. కుమార క్రీడాయామ్.
ద్రియత ఇతి దారకః. - ఆదరింపఁబడువాఁడు.
భర్తుః దారకః భత్తృదారకః - దొరకొడుకు. ఈ 3 యువరాజు పేర్లు.

రాధేయుఁడు - కర్ణుడు.
రాధ -
ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి. 

కర్ణుఁడు - కుంతి పెద్ద కోడుకు. పాండవుల అగ్రజుడు, యుద్ధమునందు మహావీరుడు, మహాదాత. కుంతీదేవి కన్యగా నున్నపుడు సూర్యుని వలన పుట్టినవాడు.  

కర్ణుఁడు - కుంతి పెద్దకొడుకు. (కుంతి - పాండవులతల్లి, వికృ.గొంతి.)
కర్ణానుజుఁడు - యుధిష్ఠిరుడు, ధర్మరాజు, కర్ణుని తమ్ముడు.

కాలపృష్టము - 1.కర్ణునివిల్లు, 2.విల్లు.
విల్లు -
ధనుస్సు.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

అథ కర్ణస్య కాలపృష్టం శరాసనమ్ -
కాలవర్ణ పృష్టో యస్య సః కాలపృష్ఠః - నల్లనైన వెనుకదిక్కుగలది.
కర్ణస్య శరాసనమ్- కర్ణుని విల్లు.

దీనహస్తే ధనంద్యాత్స్వ భార్యాయాంచ యౌవనమ్|
స్వామికార్యేషుచ ప్రాణం నిశ్చయో మమ మాధవ||
తా.
ఓ కృష్ణా! మాధవా(మాధవుఁడు - లచ్చిమగడు, విష్ణువు.)! తాను సంపాదించిన సొమ్మును బీదలకు వినియోగము చేయవలయును, తన యౌవనమును తనభార్య యందు వినియోగము చేయవలయును, తన ప్రాణమును స్వామికార్యముల యందు వినియోగ పరచవలయును అని, నా నిశ్చయమని కర్ణుడు చెప్పెను. - నీతిశాస్త్రము

కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు(నల్లనివాడు).     
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

కృష్ణద్వైపాయణుఁడు - వ్యాసుడు.
వ్యాసుఁడు - పరాశరుని కొడుకు, ద్వైపాయనుడు.
బాదరాయణుఁడు - వ్యాసుడు.
పారాశరి - 1.వ్యాసముని, 2.ముని, 3.శుకమహర్షి.
పారికాంక్షి - ముని, తపస్వి.
పారాశర్యప్రోక్తసూత్ర మధీతే పారాశరీ న. పు. - వేదవ్యాసులు చెప్పిన సూత్రముల నధ్యయనము సేయువాఁడు.  

బదునేడవ(17వ)దియైన వ్యాసగాత్రంబున నల్పమతులయిన పురుషులం గరుణించి వేదవృక్షంబునకు శాఖ లేర్పఱచెఁ; పదిహేడోసారి వేదవ్యాసుని రూపంలో అల్పప్రజ్ఞు లైన వారికోసం వేదము అనే వృక్షానికి శాఖలను విస్తరింపజేసాడు. 

నల్లని ద్వీపమునందు జన్మించి నందు వల్ల, కృష్ణద్వైపాయనుడనే పేరు గలవాడయినాడు. ద్వైపాయనుడైన వ్యాసమహర్షి అజ్ఞానం నుంచి రక్షించును.

గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.

వ్యాసుడు వశిష్టుని మునిమనుమడు. శక్తికి పుత్రుడు-నిష్కల్మషుడు-పరాశరుని పుత్రుడు. శ్రీశుకుని తండ్రి, తపోధనుడు వ్యాస మహర్షి. కాలాంతరమున ఏకరాశిగా నున్న వేదాలను విడివిడిగా (నాలుగు వేదాలుగా విభజించుట) ఏర్పరచడం మూలాన వ్యాసుడు (వేదాల చిక్కు విడగొట్టేవాడు) లేక వేదవ్యాసుడు అనే పేరు పొందినాడు.

ప్రతియుగమందు సంకుచిత భావులు నల్పతరాయువుల్ సుదు
ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా
శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స
న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్.
భా||
ప్రతియుగంలో కాలం యొక్క ప్రభావంచేత అల్పబుద్ధులూ, అల్పాయుష్కులూ, దుర్గతి పాలయ్యేవారూ అయిన మానవులుంటారు. వాళ్ళకు భగవంతుడు నిర్మించినవీ, శాశ్వతములూ అయిన వేదాలు బోధపడవు. వారు అపారమైన వేదరాశిని అధిగమించలేరు. అలాంటి వాళ్ళను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జనస్తుతి పాత్రుడై పరాశర ప్రియపుత్రుడైన వ్యాసుడుగా ప్రభవించి యుగధర్మానికి తగిన విధంగా ఆ వేదవృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు.   

వ్యాసం వసిష్ట నప్తారం శక్తేః పౌత్రమకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్.

కృష్ణమూర్తి - కృష్ణావతారము.
యాశోదేయుఁడు - యశోద కొడుకు, శ్రీకృష్ణుడు.

కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
నల్లనయ్య -
కృష్ణుడు, కరివేల్పు. 
కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.

కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా.అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
సమయము - 1.కాలము, 2.ఆచారము, 2.ప్రతిజ్ఞ, ఒట్టు.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
కాలరాత్రి - 1.ప్రళయకాలము, 2.దుర్గామూర్తి భేధము, 3.చీకటిరాత్రి, సం.వి.కాలిబంటు, పదాతి. 

శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.

ఒక్కప్రక్కను దుఃఖ మింకొక్కప్రక్క
సుఖము గూచుచు నుండుట చోద్యమేమొ
నన్ను ముందైనఁ బ్రోవుము కన్నతండ్రి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
   

భారతము - 1.వ్యాసభట్టారక ప్రోక్తమైన పంచమవేదము, 2.భరత ఖండము.
భరతము - 1.నాట్యము, 2.భరత పిట్ట, 3.భరత ఖండము.
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము -  శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెడి ఆట.   
నాటకము - 1.నర్తనము, 2.ప్రవర్తనము, సం.వి.నాట్య ప్రధానకావ్యము, (దశ విధ రుపకములలో నొకటి).
నృత్తము - నర్తనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తించు - క్రి.1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు. 
నర్తనప్రియము - నెమలి; నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి Peacock.

జయ - 1.పార్వతి, 2.పార్వతిచెలి, 3.సంవత్సరములలో నొకటి, 4.మహాభారతము.  
జయపెట్టు -
క్రి. జయజయయని దీవించు.
జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె - వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము. 
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.  

జయంతి - 1.ఇంద్రుని కుమార్తె, 2.పార్వతి టెక్కెము, 3.జన్మదినోత్సవము. 

త్రయాణాం దేవానాం - త్రిగుణ జనితానాం తవశివే
భవేత్పూజా పూజా - తవ చరణయో ర్యా విరచితా |
తథహి త్వత్పాదో - ద్వహన మణి పీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వ - న్ముకుళిత కరోత్తం సమకుటాః. - 25శ్లో

తా. ఓ పార్వతీ! నీ చరణాలకు గావించే పూజే నీ త్రిగుణాలవల్ల జనించినవారైన త్రిమూర్తులకు(త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.)చేసే పూజ కూడా, నీ పదములకు చేయబడినచో నదియే పూజ యగును. ఎట్లనగా ఈ మువ్వురును మణిమయ మగు సదా నీ పాదాలను వహిస్తున్న నవరత్న ఖచిత పీఠానికి సమీపంలో శిరసున చేతులు జోడించుకొని యుండువారే గదా! భగవతి పాదసేవ ఆమె అనుగ్రహం వలననే లభిస్తుందని భావం. - సౌందర్యలహరి 

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).

కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

13. హస్త - నక్షత్రముల యందొకటి. 5 నక్షత్రములు హస్తము లేక అరచేతి వలె నుండును. 

హస్తా తు పాణినక్షత్రే : హస్తశబ్దము చేతికిని, నక్షత్ర విశేషమునకును పేరు. హసతీతి హస్తః. హసే హసనే. ప్రకాశించునది.

హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
హస్తకళలు -
(అర్థ.) చేతిపనులు.

పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిశలాకలు - (జం.)అరచేతికుండు ఎముకలు(Meta-carpals).

అయాతు దేవస్సవితోపయాతు | హిరణ్యయేన సువృతా రథేన | వహన్, హస్తగ్ం సుభగ్ం విద్మనాపసమ్ | ప్రయచ్ఛంతం పపురిం పుణ్యమచ్చ | హస్తః ప్రయచ్ఛ త్వమృతం వసీయః | దక్షిణేన ప్రతిగృణమ ఏనత్ | దాతా-రమద్య సవితా విదేయ విదేయ | యో నో హస్తాయ ప్రసువాతి యజ్ఞమ్ ||11||

సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సుపతి సుప్తం ప్రేరయతీతి సవితా. ఋ.పు. షూ ప్రేరణే - సుప్తుని ప్రేరేపించువాఁడు. 

సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యతనయుఁడు -
1.శని Saturn, 2.కర్ణుడు. 
సూర్యతనయ - యమున. యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ. జమున. ౙమున - యమున.
ౙమునతోఁబుట్టు(వు) - యముడు. యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.  
ౙమునయ్య - సూర్యుడు.  

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
కృష్ణవేణి - కృష్ణవేణి అను నది, కృష్ణానది.

సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.
తలి -
జనని, రూ తల్లి.
తల్లి - జనని, రూ.తలి, విణ.మొదటిది, సం.వి.జవరాలు, తరుణి.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
తరుణిమ - యౌవనము, రూ.తారుణ్యము.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50) సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
యౌవతము - యువతీ సమూహము.

జనని - 1.తల్లి, 2.దయ, 3.లక్క, 4.కోరిక.
అమ్మ -
1.తల్లి, 2.పూజ్యురాలు, సం.అంబా, అవ్య. ఆశ్చర్యాది వాచకము, ఔర.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.      

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి ధృడమైన పదార్థము, నేల.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ -
సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నగర్హములలొ కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars). 

హిరణ్యరేతసుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు, రూ.హిరణ్యరేతుడు.
హిరణ్యం రేతో యస్యసః హిరణ్య రేతాః, న.పు. - హిరణ్యమే రేతస్సుగాఁ గలవాఁడు.  
హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 5.గవ్వ.
హిరణ్యగర్భుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసుష్ఠుడు, మరీచి).

సవిత్రీభి ర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం - సహ జనని సఞ్చిన్తయతి యః |
స కర్తా కావ్యానాం - భవతి మహతాం భఙ్గిరుచిభిః 
వచోభిర్వాగ్దేవీ - వదన కమలామోదమధురైః || - 17శ్లో
తా.
  తల్లీ ! ఎవడు వాక్కుల నొసగు నట్టియు చంద్రకాంత మణులవలె ప్రకాశించు వశిన్యాది దేవతలచే కూడియున్న నీ దివ్యస్వరూపాన్ని ఎవరు ధ్యానించుచున్నాడో, (చంద్రకాంతమణి శిల అతిధావళ్యమును కలిగి యుండుట జగత్ప్రసి ద్ధము.) అతడు మహాత్ములవలె నింపగుననియు, కావ్యములను రచింప సమర్థుడవుచున్నాడు. అతని కవిత్వం మృదువైన తీయని మాటలచే రుచిమంతమై, సరస్వతీదేవి(గీర్దేవి - సరస్వతి, వాగ్దేవి.)యొక్క ముఖకమలము(వదనము - నోరు, ముఖము.), పద్మమువలె పరిమళాలను వెదజల్లుతుంది. - సౌందర్యలహరి  

వాగ్దేవీ ర్వశినీముఖ్యా స్సమాహూయేద మబ్రవీత్ |
వగ్దేవతా వశిన్యాద్యా శ్శృణుద్వం వచనం మమ.  

కైసాటి చుక్క - హస్తా నక్షత్రము.
హస్త నక్షత్రము, ధన్వంతరి జన్మనక్షత్రం. పాలకడలి నుంచి ఉద్భబించిన వాడు. పూర్వం సముద్ర మథనకాలంలో ధన్వంతరి జన్మించాడు. ఆదివైద్యుడు ధన్వంతరి. అతడికి బ్రహ్మజ్ఞుడని పేరు పెట్టారు - ఇతడు బ్రహ్మకుమారుడు.  

తుల్యము - సమానము, సాటి.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.

ధన్వంతరి యను పండ్రెండవ 12వ తనువున సురాసుర మథ్యమాన క్షిరపాథోధి మధ్య భాగంబున నమృత కలశహస్తుండై వెడలె - పనెండో అవతారంలో సర్వవ్యాపకుడైన భగవంతుడు "ధన్వంతరి"యై దేవ దానవులు మథిస్తున్న పాలసముద్రంమధ్యభాగంలో నుంచి అమృతకలశం హస్తాన ధరించి సాక్షాత్కరించాడు. 

సీ|| తరుణుండు దీర్ఘ దోర్దాండుండు గంబుకంధరుఁడు పీతాంబరధారి స్రగ్వి
     లాలిత భూషణాలంకృతుం దరుణాక్షుఁ డున్నతోరస్కుఁ డచ్యుత్తముండు
     నీలకుంచిత కేశ నివహుండు జలధర శ్యాముండు మృగరాజ సత్త్వశాలి
     మణికుండలుఁడు రత్నమంజీరుఁ దచ్చ్యుతు నంశాంశ సంభవుం    డమలమూర్తి
ఆ|| భూరియాగభాగ భోక్త ధన్వంతరి,
     యనఁగ నమృత కలసహస్తుఁ డగుచు
     నిఖిలవైద్యశాస్త్ర నిపుణుఁ డాయుర్వేది
     వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చె|

భా|| మంచిప్రాయం కలవాడు, ఆజానుబాహుడు, శంఖం వంటి కంఠమూ, పట్టు వస్త్రమును ధరించినవాడు, పూలదండను మెడలో ధరించినవాడు, ఎఱ్ఱని కన్నులూ, ఎత్తైన రొమ్మూ, నల్లని వెండ్రుకలూ, మేఘంవంటి రంగూ, మణిఖచిత మకరకుండలాలూ, రత్నాల కాలి అందెలూ కలవాడు, మెరసే నగలు ధరించినవాడు, సింహంవంటి శక్తి కల్గినవాడు. విష్ణువు(అచ్చ్యుతుఁడు - విష్ణువు)అంశంతో జన్మించినవాడు, పవిత్రమైన యజ్ఞాలలోని హవిర్భాగాన్ని పొందే యోగ్యత కలవాడు, వైద్య విద్యలో ఆరితేరినవాడు; దేవతలకు వైద్యుడు అయిన ధన్వంతరి అనే దివ్యపురుషుడు తన చేతులలో అమృత కలశాన్ని పట్టుకొని, ఆ పాలకడలి నుండి ఉద్భవించాడు. 

తరుణాంబుదసుందరస్తదా త్వం నను ధన్వంతరిరుత్థితో(అం)బురాశేః|
అమృతం కలశే వహన్ కరాభ్యాం అభిలార్తిం హర మారుతాలయేశ||10||
నూతన నీల మేఘమువలె సుందరముగానున్న నీవు అమృత కలశమును చేబూని, ధన్వంతరి రూపమున క్షిర్రసముద్రమునుండి ఆవిర్భవించితివి. గురువాయూరు(మారుతము - వాయువు)పురాధీశ! నీవు నా బాధలన్నిటిని తొలగింపుము. - నారాయణీయము     

అబ్జుఁడు - 1.చంద్రుడు, 2.ధన్వంతరి, వ్యు.నీటి నుండి పుట్టినవాడు.
అప్సుజాతఃఅబ్జః జనీ ప్రాదుర్భావే - నీటియందుఁ బుట్టినవాఁడు.

ధన్వంతరి రితి ఖ్యాత ఆయుర్వేద దృగిజ్యా భాక్|
తమాలోక్యాసురాః సర్వే కలశం చామృతా భృతమ్|

ధన్వంతరి - 1.దేవవైద్యుడు, 2.సూర్యుడు, 3.మహేశ్వరుడు.   
వేల్పువెజ్జు - దేవవైద్యుడు.

సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు. 
సూర్యతనయ - యమున. యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ. జమున.
ౙమున - యమున. ౙమునయ్య - సూర్యుడు.
ౙమునతోఁబుట్టు(వు) - యముడు. 
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.  

ఓషధీశుఁడు - చంద్రుడు.
ఓషధీనామీశః ఓషధీశః - వరి మొదలగు నోషధులకుఁ బ్రభువు.
ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఔషధము - 1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు. (ఉత్తర కురుక్షేత్రము నందు దేవీస్థానం ఓషది.)     
ఔషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.  

పీతాముత్పలధారిణీం శుచిసుతాం పీతాంబరాలంకృతాం |
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందారమాలాధరాం||

మహేశ్వరుఁడు - శివుడు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే.

ఓం మహేశ్వరయుక్త నటన తత్పరాయై నమో నమః|

ధ్యేయః కాళీవిశ్వనాథో మహేశో
రుద్రాక్షోవై భూతి రామ్నాయవేద్యా
మంత్రాధీశో భాతి పంచాక్షరీయం
నిస్తుల్యోయం శుద్ధకైవల్యమార్గః|
తా.
మహేశ్వరుఁడే ధ్యానింపఁదగినవాఁడు. వేదోచితములైన విభూతి రుద్రాక్షలే ధరింపదగినవి. మహామహిమోపేతమగు పంచాక్షరీ మంత్రరాజ మే జపింపఁ దగినది. నిరుపమానమును బరమకైవల్యప్రాప్తికి మార్గమును నిదియే !

త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. 

చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.      
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.         
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురుడు. విఘ్నరాజు - వినాయకుడు.

కాని ప్రయోజనంబు సమకట్టదు, తాభువినెంత విద్యవా
డైనను, దొడ్డరాజు కోడుకైనను నదెట్లు, మహేశుపట్టి, వి
ద్యానిధి, సవవిద్యలకుఁ దానెగురుండు, వినాయకుండుదాఁ
నేనుఁగు రీతినుండియు నదేమిటికాడఁడు పెండ్లి! భాస్కరా.

తా. వినాయకు డీశ్వరుని కుమారుఁడయ్యు, భూమి యందు తాను, సర్వ విద్యలకు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నకు మూలపురుషుడయ్యు జ్ఞానము నిచ్చు వాడయ్యు, ఏనుగు బలము కలవాడయ్యు అతడు (పెండ్లి - వివాహము)పెండ్లాడక లేక పోయెను. అట్లే ఎంత గొప్పవాడైనను తనకు వశము(స్వాధీనము)కాని పని చేయ బూనినచో నెరవేర్చుకొన లేడు. 

మహేశ్వరప్రియో దాన్తో మేరుగోత్రప్రదక్షిణః,
గ్రహమణ్డలమధ్యస్థా గ్రసితార్కో గ్రహాధిపః|
 

ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈష్ట ఇతీశ్వరః - ఐశ్వర్యయుక్తుఁడు, (ప్రభుత్వము గలవాఁడు).
ఈశ్వరి - పార్వతి.
ఈశ్వరస్య పత్నీ ఈశ్వరీ, ఈ-సీ. - ఈశ్వరుని భార్య.
ఈశ్వర - ప్రభవాది అరువది సంవత్సరములలొ పదునొకండవది(11వ).

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

బలముతొలంగు కాలమునఁ బ్రాభవసంపద లెంత ధన్యుడున్
నిలుపుకొనంగనోప డదినిశ్చయమర్జునుఁడీశ్వ రాదులన్
గెలిచినవాడు దాయకు గీడ్పడిచూచుచు గృష్ణ భార్యలన్
బలువురనీయడే నిలువబఁట్టి సమర్థుడుగాక! భాస్కరా.

తా. తన బాహుబలము తగ్గి పోయినప్పుడు యెంతటి(ధన్యుఁడు - పుణ్యవంతుడు)గొప్పవాఁడ యిననూ తన(ప్రాభవము - ప్రభుత్వము)సంపద లను నిల్పునొకలేడు. మహాబలశాలి, ఈశ్వరాదు లను గెల్చినవీరుడైన అర్జునుడు(అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జు నుడు, 3.తల్లికి ఒకడే కొడుకైన వాడు.)శ్రీ కృష్ణ పట్ట మహిషులను దొంగలకు(దాయ - 1.దాయాదుడు, జ్ఞాతి, 2.శత్రువు,సం.దాయాదః.)దోచుకొనుట కిచ్చివేసెను గదా!

శర్వుఁడు - శివుడు, వ్యు.ప్రళయ కాలమున భూతముల హింసించువాడు.  
శర్వః, ప్రళయే భూతానిశృనాతి హీనస్తీతి శర్వః - ప్రళయమందు భూతములను హింసించువాఁడు, శౄహింసాయాం.
శర్వాణి - పార్వతి. శర్వాణీ శర్వమూర్తిమాన్|
శర్వస్య పత్నీ శర్వాణీ, ఈ. సీ. - శర్వుని భార్య.

క్షయము - 1.క్షయవ్యాధి, 2.తగ్గుదల, 3.ప్రళయము, 4.క్షయనామ సంవత్సరము.

యక్ష్మము - క్షయరోగము.
క్షయరోగము - ఊపిరితిత్తుల రోగము, క్షయవ్యాధి, (Tuberculosis).
రాజయక్షము - క్షయరోగము, Consumption.

పుమాన్ యక్ష్మా క్షయ శ్శోషః -
యక్ష్యతే రోగేషు యక్ష్మా. న. పు. యక్ష పూజాయాం. - రోగములయందు రాజవుటవలనఁ బూజింపఁ బడునది.
క్షీయన్తే అనేనేతి క్షయః క్షి క్షయే. - దీనిచేత క్షయింతురు. 
శుషన్తే అనేనేతి శోషః. శుష శోషణే. - దీనిచేత శోషింతురు. ఈ మూడు 3 క్షయరోగము పేర్లు.

శోషణము - 1.శోషరోగము, 2.క్షయరోగము.
శోషణము - 1.ఇంకుట, ఎండుట, సం.వి. (రసా.) తేమను తొలగించు విధానము (Dessication).
శోషించు - ఇంకిపోవు.
ఎండు - 1.నీరింకు, 2.తడియారు, 3.శుషించు, 4.తపించు.
ఎండుతెవులు - దేహమును శుష్కింప జేసెడి ఒక వ్యాధి.

నవఁత - 1.శ్రమ, 2.దుఃఖము, 3.క్షయరోగము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.

గ్లాని - 1.శ్రమచే కల్గిన దౌర్బల్యము, 2.అశక్తి, 3.రోగము, 4.నాశము.
గ్లానుఁడు - తెవులుగొంటు, రోగము చేత కృశించినవాడు.
కార్శ్యరోగము - (గృహ.) చిక్కి శల్యమగుటకు క్షీణించి పోవుట (Emaciation).

ఆస్తేనియా - (గృహ.) (Asthenia) బలము తగ్గుట లేక బలము లేకపోవుట.

క్షయకరణము - (రసా.) ఒక పదార్థమునందలి, ఆక్సిజన్ మొ. ఋణ విద్యుదాత్మకము లగు మూలకములను తొలగించుట లేక వాని నిష్పత్తి తగ్గించుట, న్యూనీకరణము, అపచయము (Reduction).
న్యూనము - తక్కువైనది.  

అఱు1 - క్రి.నశించు, 2.క్షీణించు.
అఱు2 - 1.కంఠము, 2.సమీపము, 3.ముందుభాగము, రూ.అఱ్ఱు.
అఱ్ఱు - అఱు.

అతిరోగము - అధికమైన రోగము కలది, వి.1.అధికమైన రోగము, 2.క్షయవ్యాధి.
క్షయరోగమునకు ముఖ్యముగ కాస, శ్వాసలు, కఫము, జ్వరము, దేహము శుష్కించుట, నీరసము, అరుచి, అగ్నిమాంద్యము గలిగి యుండును.

అపచయము - 1.హాని, నష్టము, తగ్గుట, 2.పుష్పాదులను కోయుట, (రసా.) తగ్గించుట, చూ. హాసము.
నష్టము - నశించినది.
అవగడము - 1.ఏమరిపాటు, 2.అపాయము, విణ.1.అపాయకరము, ఇతరులకు అశక్యమైనది, 3.చెడ్డది. 
ఏమఱిపాటు - 1.పరాకు, 2.ప్రమాదము, విణ.1.అకస్మాత్తుగా, 2.వంచనగా, రూ.ఏమఱుపాటు.
పరాకు - 1.తత్పరత, 2.ప్రమాదము.
ప్రమాదము - (గృహ.) హటాత్తుగా కలిగిన నష్టము (Casuality).

ప్రమాదో (అ)నవధానతా,
శక్తుండైయుండియు చేయఁదగిన కార్యము చేయకుండుట ప్రమాదము. ప్రకృష్టో మదః ప్రమాదః మదీ హర్షగ్లేపనయోః, ప్రకృష్తమైన మదము ప్రమాదము.
అనవధానస్య భావః అనవధానతా. - అవధానము లేనియొక్క భావము అనవధానత. ఈ 2 ప్రమాధము పేర్లు.

ప్రమత్తుఁడు - ప్రమాదపడినవాడు.
ప్రమాది - అరువది సంవత్సరములలో నొకటి (13వది).
ప్రమాదీచ - నలువదియేడవ(47వ) సంవత్సరము. 
ఏమఱిలు - 1.క్రి. 1.ఏమఱు, 2.ఉపేక్షించు, మరచు, ఏమరిలు, ఏమరిల్లు.
ఏమఱచు - క్రి.ఏమరజేయు, రూ.ఏమాఱుచు.

ప్రమత్తదైత్యభయద శ్శ్రీకణ్ఠో విభుదేశ్వరః,
రమార్చితో నిధి ర్నాగరాజయజ్ఞోపవీతవాన్|
 

తగ్గుదల - తక్కువ; తక్కువ - కొరత.
తగ్గు - క్రి.1.తక్కువగు, 2.వెనుదీయు, 3.తెగిపడు, వి.తక్కువ.

విలయము - ప్రళయము.
ప్రళయము - 1.కల్పాంతము, 2.అపాయము, 3.మృత్యువు, 4.మూర్ఛ.
కల్పము - 1.బ్రహ్మదినము, 2.ప్రళయము, 3.శాస్త్రము. 

సరస్వత్యా స్సూక్తీ - రమృతలహరీ కౌశలహరీః
పిబన్త్యా శ్శర్వాణి - శ్రవణచుళుకాభ్యా మవిరళమ్,
చమత్కారా శ్లాఘా - చలిత శిరసః కుండలగణో
ఝుణత్కారై స్తారైః - ప్రతివచన మాచష్ట ఇవ తే| - 60శ్లో

తా. తల్లీ! శర్వాణి! అమృతలహరీ వంటి(కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.)మాధుర్య మార్దవములను హరించు పలుకులతో సరస్వతి(సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒకనది.)చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ళచేత చక్కగా పుచ్చుకొనుచున్న దానవు (వినుచున్నదానవు); నీవు ఆ స్తోత్రగానములోని చమత్కారమును(శ్లాఘ - 1.ప్రశంస, 2.పరిచర్య, 3.ఇచ్ఛ.) శ్లాఝించుటకు గాను కదల్పబడిన శిరస్సు కల దానవగుచుండగా నీయొక్క కర్ణ భూషణముల సముదాయము - అతి బహుళము లైన ఝణత్కారము చేయుచు అనుమోదించు మాటలను చెప్పుచున్నదో యన్నటుల నుండెను. - సౌందర్యలహరి

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయావహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.

భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
భగవాన్ త.పు. శ్లో. "మహాత్మస్య సమగ్రస్య ధైర్యస్య యశసశ్శ్రియః జ్ఞానవైరాగ్య యోశ్చ్యైవ షణ్ణాం భ" ఇత్యక్తభగో అస్యాస్తీతి. భగవాన్ - సంపూర్ణమైన మహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునివి భగమని చెప్పబడును అది గలవాఁడు.
నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు.
పరాత్పరుఁడు - శ్రేష్ఠుల కందరికి శ్రేష్ఠుడు (భగవంతుడు).

కైంకర్యము - 1.భగవంతునికి చేయుసేవ, 2.ఊడిగము.
ఊడిగము - పరిచర్య, సేవ, రూ.ఊడెము, ఉడిగము, ఊళిగము, ఉళిగము.
ఉడిగము - 1.సేవ, 2.అడకువ, రూ.ఊడిగము.

ముప్పోకలాఁడు - (మూడు + పోకలు + ఆఁడు) త్రిగుణాత్మకుడు, భగవంతుడు.

విష్ణువు - విశ్వమంతత వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, విషుః. 

విభుఁడు - 1.ప్రభువు, సర్వవ్యాపకుడు, 2.బ్రహ్మ, 3.శివుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ఈశుఁడు - 1.శివుడు, 2.ప్రభువు.
పబువు - ప్రభువు, సం.ప్రభుః.
అధిపుడు - ప్రభువు, అధిపతి. 
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయుఁడు - రాజు, రాయలు, సం.రాజా.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు. 

రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon. 

దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.    
దైవికము - దైవము వలన కలిగినది.

దేవుఁడు - భగవంతుడు.
దేవర - 1.దేవత, దేవుడు, 2.ప్రభువు.
దేవత - వేలుపు; వేలుపు - దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది. 

అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.

అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత్వాత్ - దైవకృత మగుటవలన కానఁబడనిది.
వహితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆదిశబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.

భాగ్యము - అదృష్తము, సుకృతము, విణ.భాగింపదగినది.
భక్తము - భాగింపదగినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము. 

తనకు లేనినాడు దైవంబు దూరును
తనకు గల్గెనేని దై వ మేల
తనకు దైవమునకు తగులాట మెట్టిదో విశ్వ.

తా|| తనకుధనము కలిగినకాలములో భగవంతుని అవసరముండదుకాని, చేత ధనములేనప్పుడు భగవంతుని దూషించును. భగవంతునకు తనకుగల(తన - ఆత్మార్థకము)సంబంధము తెలుసుకొనలేడు.         

బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధ - మంచి బుద్ధి గలవాఁడు.

ఌంగస్వరూపక సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశశివ|        

బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
సర్వం బుధ్యతే బుధః బుధ అవగమనే. - అన్నిటి నెఱిఁగినవాడు.

ఏకోపి గుణవాన్ పుత్రో  - నిర్గుణేవ శతైరపి|
ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనమ్||

తా. సకల గుణసంపన్నుఁడైన కుమారుం డొకఁడే చాలును, (నిర్గుణుఁడు - భగవంతుడు, విణ.గుణరహితుడు) గుణములేని కుమారులు నూఱుగురున్న(కౌరవలు - కురువంశపు వారు, వందమంది యున్న)నేమి ప్రయోజన మున్నది. ఇందుకు నిదర్శనము ఒక చంద్రుడుండిన లోకమంతయు ప్రకాశించును. ఆ చంద్రుఁడు Moon లేక నక్షత్రము లెన్నియున్న నేమి ప్రయోజన మున్నది. - నీతిశాస్త్రము

భక్తుల ఇష్టాన్ని బట్టి ఒకే భగవంతుడు వేరువేరు రూపాలలో సాక్షాత్కరి స్తుంటాడు. ప్రతి భక్తుడు భగవంతుణ్ణి గురించి ప్రత్యేకమయిన భావాల్ను కలిగి ఉండవచ్చు. వాటికి తగినట్లుగానే పూజిస్తూ ఉండవచ్చు. ఆయన కొందరికి యజమానిగాను, కొందరికి తండ్రిగాను, కొందరికి తల్లిగాను, కొందరికి విధేయుడైన కొడుకుగాను భావించుకొనే అవకాశాన్ని కలుగ జేస్తాడు. - రామకృష్ణ పరమహంస 

జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.
జినః జయతి భవం జినః - సంసారమును జయించెడివాఁడు. 
బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.

నేకవింశతి తమంబైన బుద్ధనామధేయంబునం గలియుగాద్యవనరంబున రాక్షస సమ్మోహనంబు కొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి తేజరిల్లు; ఇరవై ఒకటోసారి (21వ) కలియుగము మొదలైన వాని అవసరాన్ని తీర్చటానికి "బుద్ధు"డై మధ్య గయా ప్రదేశంలో కలియుగ సమయంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరచి పరిజితులను చేసి జినుని(జినుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విష్ణువు.)కుమారుడై ప్రవర్తిలాడు.    

అద్వయుఁడు - సాటిలేనివాడు, అద్వితీయుడు, వి.బుద్ధుడు.
అద్వయం జీవాత్మ పరమాత్మనో రభేదం వదతీతి అద్వయవాదీ, న-పు. - జీవాత్మ పరమాత్మలకు నభేదమును జెప్పెడువాడు, వద వ్యక్తాయాం వాచి.   

భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ.పూజ్యస్త్రీ.
సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ బ్రవహించునది.
సరాంసి అస్యాం సన్తీతి సరస్వతీ. ఈ. సీ.- సరస్సులు దీనియందుఁ గలవు.

భారతి - 1.సరస్వతి, 2.వాక్కు. 

సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రము నకును, నదీ విశేషము నకును, ఆవునకును(ఆవు - గోవు)పేరు. "సరస్వతీ స్యాత్ స్త్రీరత్నే నద్యాం నద్యంతరే గవి" యని అజయుడు. 

దేవి సురేశ్వరి భగవతి గఙ్గే త్రిభువనతారిణి తరళతరఙ్గే |
శఙ్కర మౌళివిహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పదకమలే ||

భా|| ఓ దేవీ గంగా! నీవు దేవగణానికి ఈశ్వరివి. ఓ భగవతీ! నీ తరళ తరంగాలతో ముల్లోకాలను తరింపజేయు దానవు. విమల జలంతో శంకర శిరస్సున విహరించే నీ చరణకమలములపై నా మనస్సు(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)సతతమూ నిలిచి ఉండుగాక! - 1     

నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా|
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుప్లపవా.

శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.
శం సుఖం కరోతీతి శంకరః - సుఖమును గలుగఁ జేయువాఁడు, డు కృఙ్ కరణే.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.

విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.

సుగతే చ వినాయకః
వినాయకశబ్దము బుద్ధదేవునియందును, చకారము వలన గణాధిపతి యందును, గర్త్మంతుని యందును, గురువునందును వర్తించును.
వినయతి శిక్షయతీతి వినాయకః, ణీఞ్ ప్రాపణే. - శిక్షించువాఁడు. "వినాయకస్తు హేరంబే గరుత్మతి గురావ" పీతి శేషః.

గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).  

కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ. కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.
కొమరుసామి - స్కందుడు.
స్కందయతి శత్రూన్ శోషయతీతి స్కందః - శత్రువుల శోషింపజేయువాఁడు.
దేవస్త్రీదర్శదీశ్వర రేతసః స్కందతీతి ద్కందః - దేవస్త్రీ దర్శనమువలనఁ వదలిన యీశ్వర రేతస్సువలనఁ బుట్టినవాఁడు, స్కదిర్ గతి శోషణయోః.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.
దేవసేనాం నయతి ప్రాపయతి సేనానీః, ఈ-పు. - దేవసేనను నడిపించువాఁడు.

కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
సదా బాలత్వాత్ కుమరః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాఁడు.
కుత్సితాన్ మారయతీతి వా - కుత్సితుల సంహరించువాఁడు.
మృఙ్ప్రాణత్యాగే, కౌ పృథివ్యాం మార్యతి మన్మథవ దాచరతీతి వా - భూమియందు మన్మథునివలె సుందరుఁడైనవాఁడు.
కౌ పృథివ్యాం మాం లక్ష్మీం రాతి దదాతీతి వా - భూమి యందు సంపద నిచ్చువాఁడు.
రాదానే, సదా బ్రహ్మచారిత్వా ధ్వా - ఎల్లప్పుడు బ్రహ్మచారి గనుక కుమారుఁడు.

పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
పోఱఁడు -
బాలుడు; చిన్నవాడు - బాలుడు.

కొమరు - 1.మనోజ్ఞత, 2.అందము, 3.కుమారస్వామి, 3.పైదూలము మీది గుజ్జు, (కొమరుదనము, కొమరు ప్రాయము = యౌవనము).
కొమరుఁడు - 1.కొడుకు, 2.కుమారస్వామి, సం.కుమారః.

ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు. కొడుకు - కుమారుడు, సం.కుణకః. ద్వితీయః స్కంద ఏవ చ|

బాలసఖత్వ మకారణహాస్యం, స్త్రీషునివాద మస జ్జనసేవా|
గార్దభయాన మసంస్కృతవాణి, షట్సునరో లఘుతా ముపయాతి|

తా. బాలురతో చెలిమి, కారణంలేని నగవు, స్త్రీలతో వాదులాడుట, దుర్జనునియొద్ద కొలువుండుట, గాడిద(గార్ధభము - గాడిద)నెక్కుట, సంస్కృతభాష తెలియకుండుట యీ యాఱింటిచే (నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ౠషి.)మనుష్యులు చులకనయగుదురు. - నీతిశాస్త్రము 

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం|

పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ.  
ఆత్మజ - 1.కూతురు, 2.బుద్ధి.

శంకరార్థాంగ సౌందర్య శరీరాయై నమోనమః|

తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.
తుహినము - మంచు.
తోహతి అర్దయతి పద్మమితి తుహినం, తుహిర్ అర్దనే - పద్మమును బీడించునది.

అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి!
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, |
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తా మణిధరః || - 61శ్లో
  
తా. హిమవంశమునకు పతాకవంటి(జండాయైన) ఓ తల్లీ! నీ ముక్కు అనెడి వెదురు మాకు చేరిక యైన తగిన ఫలము నొసగు గాక, ఏ నాసిక లోపల చంద్రనాడి యనెడి నిటూర్పు నుండి(శ్వాస వదలేటప్పుడు) జారిన ముత్తెములను ధరించు చున్నదో ఆ నాసిక వెలుపలను గూడ ముత్తెము లను ధరించుచున్నది - సౌందర్యలహరి

గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వ జనేశశివ|

జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూషిత భూషిత వాసిత వాద్యనుతే !
కనకధరాస్తుతి వైభవ వంధిత శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం| – 6

చంద్రశేఖరుఁడు - 1.శివుడు, 2.నెలతాలుపు.
చంద్రశేఖరః, ఛంద్ర శేఖరఃశిరోభూషణం యస్య - చంద్రుడు శిరోభూషణముగాఁ గలవాడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.

చంద్రుడు - నెల, చందమామ.
నెల -
1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము. 

ఉశనుఁడు-  శుక్రుడు Venus, రూ.ఉశనసుడు.
వష్తి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః, స. పు. వరకాంతౌ. - అసురులశ్రేయస్సు నిచ్ఛయించువాఁడు. 

ఉశీరము - వట్టివేరు. 
ఉశయ ఇతి ఉశీరం, అ, ప్న వశ కాంతౌ. - కాంక్షింపఁబడునది.
నలదము - 1.వట్టివేరు, 2.పూదేన.
నలత్యర్ధ యతీతి నలం పిత్తాదికం, తద్ద్యతీతి నలదం, నల గంధనే, దో అవఖండనే. - పీడించునవి గనుక నల మనఁగా బిత్తాదులు, వానిని ఖండించునది.
లయము - 1.నాశము, 2.ఆలింగనము, 3.నీటి వట్టివేరు. 
జఠరాగ్నౌ లీయత ఇతి లౌఅం, లీఙ్ శ్లేష్నే. - జఠరాగ్నియందు నణఁగునది, లఘులయమని యేకపదముగాను జెప్పుదురు.
అవదాహము - 1.వేడిమి, 2.కాల్చివేయుట, 3.వట్టివేరు.
అవనశ్యతి దాహో నేనే త్యవదాహం - దీనిచేత దాహ మణుఁగును.
కాపథము-1.కుత్సితపు త్రోవ, 2.నీటివట్టి వేరు.
వాతవత్వేన గమన నొరోధ కత్వాదిష్తం కాపథమన్యేతి ఇప్లకాపథం - వాతకారియై గమనమును నిరోధించుటచేత నిష్టమైన కుత్సిత మార్గము గలది.   

ఖండ పరశువు - 1.శివుడు, 2.పరశురాముడు.
ఖండపరశుః ఉ-పు. ఖణ్డయతీతి ఖణ్డః ఖణ్డః పరశుర్యస్య సః ఖణ్డపరశుః - ఖండించెడు గండ్రగొడ్డలి గలవాఁడు. ఖండపర్శుః అని రూపాంతరము.
ఖండ భేదనే. ఖండః ఖండితః పరశురిత్యసురో నేనేతివా - పరశు వనెడు రాక్షసుఁడు ఇతనిచే ఖండింపఁబడెను. 
కదాచిత్ఖండితో స్య పరశురితి వా - ఒకానొకప్పుడు ఈయన పరశువు(గండ్ర గొడ్డలి) ఖండిత మాయెను.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

సుధన్యా ఖణ్ణ పరుశుః దారుణో ద్రవిణః ప్రదః,     
దివిద్పృక్ సర్వ దృగ్వ్యసో వాచస్పతి రయోనిజః|
- 61స్తో

కుఠారము - గొడ్డలి.
గొడ్దలి - చెట్లునరకు సాధనము, కుఠారము (వ్యవ.) పెద్దచెట్లను వానిశాఖలను నరకుట కుపయోగించు ఇనుప పనిముట్టు, సం.కుఠారః.
పరశువు - గండ్ర గొడ్దలి.
పరశ్వధము - గండ్రగొడ్దలి, రూ.పరస్వధము.

ద్వయోః కుఠార స్స్వధితిః పరశుశ్చ పరశ్వథః,
కుఠాన్ వృక్షాన్ ఇయర్తీతి కుఠార ప్స. ఋ గతౌ. - వృక్షములఁ బొందునది.
స్వం స్వకీయం ధియతి బిభర్తీతి స్వధితిః. ఈ. పు. దిధరణే. - స్వకీయమైనవారిని బోషించునది
స్వము - 1.ధనము, 2.తాను, తనది.
స్వకీయము - తనది, రూ.స్వకము. (వ్యతి.పరకీయము).  తన - ఆత్మార్థకము. 
పరాన్ శృణాతీతి పరశుః. ఉ. పు. శౄ హింసాయాం. - శత్రువులను హింసించునది. 
పరాన్ శ్యతీతి పరశ్వథః శో తనూకరణే. - పరులను క్షయింపఁజేయునది. ఈ 4 గండ్రగొడ్డలి పేర్లు.

కలిలము - 1.చొరరానిది, 2.ఎరుగరానిది, వి.గండ్రగొడ్డలి, రూ.కలలము.

ద్రూఘణము - 1.గండ్రగొడ్దలి, 2.ఇనుపగుదియ, రూ.ద్రుఘణము.

చిప్పగొడ్డలి - చెట్లునరకు గొడ్డలి. 

గంధర్వో హ్యదితి స్తార్ క్ష్య స్సువిజ్ఞేయ స్సుశారదః,
పరశ్వథాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః|

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్
క్ష్వేనీలగళం పరశ్వథధారణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| - 4

పదునాఱవదియైన(16వ) భార్గవ రామాకృతి నిఁ గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులయిన రాజుల నిరువది యొక్కమాఱు వధియించి భూమి నిఃక్షత్రంబుఁ గావించె; పదహారోమారు పరశురాముని రూపమును ధరించినవాడై రౌద్రకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి భూమిని క్షత్రియశూన్యం కావించాడు.   

ఇరువదియొక్కమాఱు ధరణీశులనెల్ల వధించి తత్క ళే
బర రుధిర ప్రవాహమున భైఁ తృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామ మూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.

తా. రామా! రాజులనందఱిని ఇరువదియొక్క పర్యాయములు చంపి, వారి దేహముల నెత్తుటి వెల్లువలచేత పితరులకు జలతర్పణమిచ్చి వారి యొద్దనుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహమునకు సంతోషము(ముదము - సంతోషము) కలుగునట్లు దానము చేసిన పరశురాముఁడవు నీవేయగుదువు. 

క్షత్రియరుధిరమయే జగదపగతపాపమ్,
స్నపయసి పయసి శమితభవతాపమ్|
కేశవ! ధృత భృగుపతిరూప! జయ జగధీశ! హరే!| – 6

పరశురాముడు - జమదగ్ని మహర్షికిని రేణుకకును పుట్టినవాడు.
రేణుక - 1.గంధ ద్రవ్యము, 2.జమదగ్ని భార్య.

అథ ద్విజా,
హరేణూ రేణుకా కౌన్తీ కపిలా భస్మగన్ధినీ,

ద్విర్ణాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.
హరతి రోగాన్ హరేనూ, సీ. హృఞ్ హరణే. - రోగములు హరించునది.
రేణు యోగాద్రేణుకా - ధూళి(ధూళి - దుమ్ము)గలది.
కుంత్యై దుర్వాసనా దత్తా కౌంతీ, సీ. - కుంతికొఱకు దుర్వాసునిచే నియ్యబడినది.
కపిలవర్ణత్వాత్కపిలా - కపిలవర్ణము గలది.
భస్మ గంధయతి భస్మగంధినీ. సీ. గంధ అర్దనే. - ధూళిచేఁ బీడించునది. ఈ 5 రేణుక యనుగంధద్రవ్యము పేళ్ళు. తక్కోలము.

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
బ్రహ్మ -
నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ప్రపాతస్తు తటో భృగుః,
ప్రవతంత్యస్మాదితి ప్రాపాతః, పత్ ఌ గతౌ. - దీనినుండి పడుదురు.
తటతీతి తటః, తట ఉచ్ఛ్రాయే. - ఉన్నతమైనది.
భ్రజ్యతే తవ్యతే సూర్యాగ్ని తేజసా భృగుః, ఉ పు. భ్రస్ట పాకే. - సూర్యాగ్ని తేజస్సులచేతఁ దపింపఁ జేయఁబడునది. ఈ 3 కొండచఱియ పేర్లు.   

కొండౘఱియ - కొండపార్శ్వభాగము.
తటము - 1.ఏటియొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము. 
తటి - 1.ఏటియొడ్డు, 2.ప్రదేశము.

ౘఱి - సంచరింప నశక్యమగు పర్వత శిఖరము క్రిందిచోటు, రూ.చఱియ.
జాఱువు - 1.కొండచఱి, 2.జారుట.  
(ౙ)జాఱుఁడు - జారుట.
(ౙ)జాఱు - క్రి.1.జరుగు, 2.ఉరుకు, 3.వదలు, 4.స్రవించు, వి.1.స్ఖలనము, 2.జారుట.

ౙరుగు - క్రి.1.రొమ్ముతో ప్రాకు, జారు, 2.జీవనము నడుచు, 3.కడచు, 4.పోవు, రూ.జరుగు.

ఉఱుకు - క్రి.1.దుముకు, పరుగెత్తు, 2.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప. 

వదలు - క్రి.శిథిలమగు, పట్టువీడు.
శ్లథము - శిథిలమైనది, వదులైనది.
శిథిలము - సంధులు వదిలినది, శ్లథము.

జీర్ణము - 1.అరిగినది, 2.చినిగినది, 3.ప్రాతది, 4.శిథిలము. 

భృగు ర్భోగకరో భూమీసురపాలనతత్పరః,
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః| - 6

భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు. భార్గవదర్ప వినాశక రామ్|      
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి.
భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.

శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి(Venus).
శుక్రవారము - భృ గు వా ర ము, వారములలో నొక దినము Friday.

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోద్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

కాశ్యపి - భూమి, వ్యు.పరశురాముచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయబడినది.
కాశ్యపస్యేయం కాశ్యపీ, ఈ.సీ. - పరశురాముచేత కశ్యపునికొఱకు యజ్ఞ దక్షిణగా నియ్యబడినది.
తథాచోక్తం._ 'శ్లో. త్రిసప్తకృత్య్వః పృధివీం కృత్వానిః క్షత్రియాం తతః, దక్షిణా మశ్వమేధాంతే కశ్యపాయాదదాత్ప్రభు' రితి.

రాజవత్పుత్త్ర దారాశ్చ - భాగ్యావంతం త్రబాంధవాః|
ఆచార్య వత్సభామధ్యే భాగ్యవంతం స్తువంతిహి||

తా. లోకమునందు భాగ్యవంతుని తన భార్యా (దార - భార్య)బిడ్డలు ప్రభువు వలె జూతురు. చుట్టములు, స్నేహితులు యజమానునివలె భావింతురు, ప్రభువులు సభయందు ఆచార్యుని వలెఁ జూతురు. కావున భాగ్యము(భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.)గలవాఁడే గొప్పవాఁడు. - నీతిశాస్త్రము

ప్రణుతి సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషన శాంతి సమాకృత హాస్యముఖే|
నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయమాం|| - 7    

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || - 6

భద్రమూర్తి ర్భద్రగుణో భార్గవో భక్తపాలనః,
భగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః|

జైవాతృకుఁడు - 1.చంద్రుడు, 2.పంటకాపు, 3.వైద్యుడు, విణ.దీర్ఘాయువు కలవాడు.
ఓషధీః జీవయతీతి జైవాతృకః జీవప్రాణధారణే - పైరులను బ్రతికించువాఁడు.

జైవాతృక స్స్యాదాయుష్మాన్-
జీవతి చిరకాల మితి జైవాతృకః, జీవ ప్రాణధారణే. - అనేకకాలము బ్రతుకువాఁడు.
అధిక మాయు రస్యాస్తీ త్యాయుష్మాన్ త. - అధికమైన ఆయుస్సు గలవాఁడు. ఈ 2 దీర్ఘాయుష్మంతుని పేర్లు. 

జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.

జైవాతృక శ్శశాఙ్కే (అ)పి -
జైవాతృకశబ్దము చంద్రునికిని, అపిశబ్దమువలన ఆయుష్మంతునికిని పేరు.
జీవతీతి జైవాతృకః, జీవ ప్రాణధారణే. - బ్రతుకువాఁడు.
"జై వాతృకః కృషే చంద్రే భైషజ్యా యుష్మతోరపి" ఇతి విశ్వప్రకాశః. కృషః = కృషకః.

శశాంకుఁడు - చంద్రుడు.

శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః|
శశాంక ఖండ సంయు క్త మకుటాయై నమో నమః|

జీవదుఁడు - వైద్యుడు.
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.

జైవాతృక శ్శుచి శ్శుభ్రో జయీ జయఫలప్రదః,
సుధామయ స్పురస్వామీ భక్తానా మిష్టదాయకః|- 6

ఆయుష్మంతుడు - దీర్ఘ కాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి - 1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.
చిరంజీవతీతి చిరజీవీ, న. పు. జీవ ప్రాణధారణే. - చాలాకాలము బ్రతుకునది.
దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.  

కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము.

కాకపుష్ఠము - కోయిల, వ్యు.కాకిచే పోషింపబడినది.    

పరితము - కోయిల, సం.పరభృత్.
పరభృతము - కోయిల.
పరైః కాకైః భృతః పరభృతః భృఞ్భరనే. - పరుల (కాకుల)చేతఁ బెంచఁబడునది. 
పరంకోకిలం బిభర్తీతి పరభృత్. త. పు. భృఞ్ భరణే. కోయిల పిల్లను పోషించునది.

కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.

పికము - కోయిల.
అపికాయతీతి పికః, కైగైశబ్దే. చాటుననుండి కూయునది, అపిరంతర్ధౌ.
కాకపిక న్యాయము - న్యా. కోయిల(పికము - కోయిల) కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము.        

పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.

కాకదంత పరీక్ష - న్యా. వ్యర్థమైన పని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.) నూరు కాకులలో ఒక కోకిల. కాకి మరియొక కాకిని పొడవదు. 

దైవతము - వేలుపు, విణ. దేవతా సంబంధమైనది.

వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

లోకములోన దుర్జనులలోఁతు నెఱుంగక చేరరాదు, సు
శ్లోకుఁడు జేరినంగవయజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁగన్న చోటఁగుమిగూడియు సహ్వపుగూత లార్చుచున్
గాకులుతన్నవే తరిమి కాయము తల్లదమంద! భాస్కరా.

తా. లోకమందు సజ్జనుఁడు(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టిన వాడు, 2.మంచివాడు.)దుర్మార్గులకు లోనుండు(దుర్జనుఁడు - దుష్టుడు)గుట్టును తెలిసికొనకయే వారి(ప్రక్కను) కలియ రాదు. అట్లు కలిసినచో వారు వేళాకోళము(ఎకనకియము - 1.వికటపుమాట, 2.అవమానము, 3.వంచన, 4.అపహాస్యము, విణ.వికటము.)చేసి అతనితో గలియబడుదురు. కీడు కలుగును. కోకిలను గన్న కాకులు దాని చుట్టును మూగి అసహ్యపు కూతలను కూయుచూ దానిని తన్ని తరిమి వేయును కదా!

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదో న్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్దనం గతి దాయకమ్,
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్| - 7

ఏకదృష్టి - కాకి, ఏకాక్షము, వ్యు.ఒక చూపు కలది.
ఏకైన దృష్టి రస్య ఏకదృష్టిః, ఈ. పు. - ఒక్కచూపుగలది.  
ఏకాక్షము - 1.కాకి Crow, 2.ఒక కన్నుగలది.
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.
వయ ఏవ వాయసః - పక్షి గనుక వాయసము. 

కాణుఁడు - ఒంటికంటివాడు, ఏకాక్షుడు.  
కాణము1 - గుఱ్ఱమునకు బెట్టెడి దాణా, సం.ఖాదనమ్.
ఖాణము - గుఱ్ఱములదాణా, సం.ఖాదనమ్, ఖానమ్.
కాణము2 - 1.ఒంటి కన్ను గలది, 2.తూటుపడినది, వి.కాకి.

మెల్లకంటి - కాకి Crow.   
మెల్ల - 1.ఒరిగినది (చూపు) (మెల్లకన్ను), విణ.మేలైనది, క్రి. విణ.1.మెల్లగా, 2.నిశబ్దముగా.

ఒంటికంటిగాము - శుక్రుడు.
ఒంటి - ఏకాకిత్వము, విణ.ఒకటి.

శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము. అపదేవత - పిశాచము.    

కాకాక్షన్యాయము - న్యా. కాకి చూపువలె ఏదేని ఒక ప్రక్కకు ఒరగుట.

కాణయాచి - చిరకాల వా స స్థా న ము, విణ. చిరకాలానుభవము గలది, రూ.కాణాచి.
కాణాదము - కణాద ఋషి వ్రాసిన న్యాయశాస్త్రము, (దీనినే వై శేషిక దర్శన మందురు).

"సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండితః,
అర్థేన కురుతే కార్యం సర్వనాశో హి దుర్భరః."

'సర్వము కోల్పోవు పరిస్థితి దాపురించినపుడు తెలివికలవాడు, సగము వీడి, తక్కిన సగము కాపాడుకొనును.' అన్న లోకనీతి ననుసరించి సర్వేంద్రియములలో ప్రధానములగు కన్నులు రెంటిలో ఒకదానిని ఆ కాకి వదలుకొనెను. కాకి  కుడికంటిని విడిచిపెట్టి ప్రాణములు కాపాడుకొనెను సీతోదిత కాకావన రామ్| (సీతాదేవిని బాధించినందుకు శ్రీరాముని కోపమునకు గురైంది). - సుందరకాండ

కాకాసురైకనయన హరల్లీలాస్త్రధారిణే,
నమో భక్తైకవేద్యాయ రామా....

అగదంకారుఁడు - వైద్యుడు, వ్యు.ఆరోగ్యమును కలిగించువాడు.
అగదము - 1.తెవులులేనిది, 2.పలుకనిది, వి.1.మందు, ఔషధము, 2.ఆరోగ్యము, 3.ఆయుర్వేదమున విషాదుల విరుగుడును తెలుపు భాగము.

యోగము - 1.ప్రాణాయామాదికము, 2.కూడిక, 3.ఔషధము, 4.ప్రయత్నము.

సంచికట్టు - సంచిపట్టుకొని అదేపనిమీద ప్రవర్తించువాడు, వైద్యుడు.
వంట్రము - మందులసంచి.

ఆగో (అ)పరాధో మంతుశ్చ -
అగతికుటిలం గచ్ఛతీ త్యాగః, స. న. అగ కుటిలాయాం గతౌ. - కుటిలముగా బొందునది.
అపరాధ్యంతే అనే నేత్యపరాధః, రాధ హింసాయాం. - దీనిచేత హింసింపఁబడుదురు.
మన్యతే కష్టమితి మంతుః, ఉ. పు. మన జ్ఞానే. - కష్టమని తలంపఁబడునది. ఈ 3 అపరాధము పేర్లు.

ఆగము - తప్పు, నేరము, పాపము.
తప్పు - క్రి.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.
నేరము - తప్పు. తప్పిదము - దోషము.
అపచారము - 1.పెద్దలయెడ చేయు తప్పు, 2.లోపము, 3.అపథ్యము, 4.అపథ్యపదార్థము.
లోపము - 1.తక్కువ, 2.మరుగుపాటు.  
అపథ్యము - 1.తినరానిది, 2.హితము కానిది, తగనిది.

మంతువు - 1.తెలివి, 2.అపరాధము, 3.రాజు 4.మనుష్యుడు.

కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
కీడుపడు - క్రి.1.తక్కువగు, 2.దైన్యపడు, 3.చచ్చు, రూ.కీడ్పడు.

దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.)కొలతలలోని తప్పులు.
దోషయుతము - లోపములు గలది, సరికానిది, నేరము కలది, (Faulty).

సంజీవకరణి - జీవమునిచ్చు ఓషధి.
సంజీవి - జీవమును కలుగజేయునది.

ఆయుర్వేదము - హిందూ వైద్యశాస్త్రము.

భిషక్కు - వైద్యుడు.
భేషజము - ఔషధము, వ్యు.భిషక్ సంబంధమైనది. ఔషధేచింతయే ద్విష్ణుం|

రోగము - వ్యాధి.
రోగనిరోధకశక్తి - (జీవ.) రోగము నెదుర్కొని, దానిని జయించుశక్తి.
రోగనిర్భయత - (జీవ.) రక్షణశక్తి, శరీరములో, రోగమును కలిగించు జీవులు ప్రవేశించి రోగములు కలుగజేయకుండ నిరోధించుశక్తి, (Immunity).

రోగహా ర్యగద్కారో భిషగ్వైద్య శ్చికిత్సకే,
రోగం హరతి తాచ్ఛీల్యేన రోగహారీ, న, త్రి, హృఞ్ హరణే. - రోగమును హరించు స్వభావము గలవాఁడు.
అగద మరోగం కరోతి ప్రాణినమి త్యగదంకారః – (శరీరి - ప్రాణి)ప్రాణిని రోగము లేనివానిఁగాఁ జేయువాఁడు.
భిషజ్యతి భిషక్, జ. భిషజ్ చికిత్సాయాం. - చికిత్స సేయువాఁడు.  
విద్యామాయుర్వేదమధీతే వేత్తివా వైద్యః - ఆయుర్వేదమును జదివిన వాఁడుగాని యెఱిఁగిన వాఁడుగాని వైద్యుఁడు. 
చికిత్సతి చికిత్సకః. - చికిత్స చేయువాఁడు. ఈ 5 వైద్యుని పేర్లు.

గృహేపచారము - (గృహ.) రోగికి చేయు ఉపచారము, వైద్య విధానమునకు అంగముగ రోగికి గృహములో చేయు సేవ (Home-nursing).  

ఉపచారము - 1.సేవ, 2.సన్మానము, 3.చికిత్స, 4.పూజ.
ఉపచరించు - క్రి.1.సన్మానించు, 2.సేవించు, 3.బోధించు, 4.నియోగించు.

పాటవము - 1.ఆరోగ్యము, 2.శక్తత.
ఆరోగ్యము - రో గ ము లే మి, స్వాస్థ్యము.
ఆరోగ్యరక్షణము - (గృహ.) రోగము రాకుండుటకై శుభ్రత నవలింబించుట (Sanitation).

సార్థః ప్రవసతో మిత్రం - భార్యా మిత్రం గృహే సతః
ఆతురస్య భిషక్ మిత్రం - దానం మిత్రం మరిష్యతః.

తా. ప్రవాసికి ప్రవాసుల గుంపు మిత్రుడగును, ఇంటిలో నున్నవానికి భార్యయే మిత్రము, రోగికి వైద్యుడే మిత్రుడు, చావనున్న వానికి దానమే మిత్రుడు.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

జీవదుఁడు - వైద్యుడు.
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
చికిత్సకుఁడు - వైద్యుడు; వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.

వైద్యము - రోగచికిత్స శాస్త్రము.
చికిత్స - రోగమునకుచేయు ప్రతిక్రియ.

అప్పిచ్చువాడు, వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పాఱు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూరు మందుము
చొప్పడికున్నట్టియూరు జొరకును సుమతీ.

తా. అవసరమునకు ఆదుకొనినవాడు(ఉత్తమర్ణుఁడు - అప్పిచ్చువాడు. (వ్యతి. అధమర్ణుడు.), రోగం వచ్చినప్పుడు మందులు యిచ్చువాడును, స్నానపానములకు నిత్యం ప్రవహించు నది river లేక కాలువయును, శుభాశుభ కర్మలకును అవసరమగు బ్రాహ్మణుడు(ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.)ఉన్నట్టి గ్రామమున నివసింపవలెను.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్దనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||

విద్వాంసుఁడు-చదువరి, విణ.ఎరుకగలవాడు.
వేత్తి సర్వం విద్వాన్, స. పు. - సర్వము నెఱింగినవాఁడు.

విపశ్చితుఁడు - విద్వాంసుడు.
విశేషేణ పశ్యన్ చేతతీతి విపశ్చిత్. త. పు. చిత్రీ సంజ్ఞానే. - విశేషముగాఁ జూచుచు నెఱుంగువాఁడు.

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
సూతే అమృతమితి సోమః, షూఞ్ ప్రాణిప్రసవే - అమృతమును బుట్టించువాఁడు.
సూయతే ఇతివా సోమః - ప్రతిపక్షమునందును బుట్టింపఁబడువాఁడు.  

సోము - 1.సుఖము, 2.కోరిక, విణ.ఆసక్తము, సం.1.సుఖము, 2.సమీహ.
సుఖము - 1.సౌక్యము, 2.స్వర్గము.
సౌక్యము - సుఖము. సమీహ - కోరిక.

చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

నెలపాలు - చంద్రకళ.
నెలవీసము -
చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.
కళ - 1. 8 సెకనుల(8 Seconds)కాలము, 2.చంద్రకళ, 3.ఒక పాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతాంతము కాని పదము.
కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధురస్వరము.
కల2 - స్వప్నము. 
స్వప్నము - 1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement). 

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

సౌమ్యుఁడు - బుద్ధుడు, విణ.1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.

సౌమ్యం తు సున్దరే సోమదైవతే,
సౌమ్యశబ్దము ఒప్పెడువానికిని, సోముఁడు దేవతగాఁ గలహ విస్సూక్తాదులకును పేరు.
సోమో దేవతాస్యేతి సౌమ్యం, త్రి. - సోముఁడు దేవతగాఁ గలది గనుక సౌమ్యము.

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
సోమోద్భవ - నర్మదానది.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు.

ముక్కంటిచెలి - కుబేరుడు; ధనాధిపుఁడు - కుబేరుడు.    

సత్యవాస స్సత్యవచాః శ్రేయసాంపతి రవ్యయః,
సోమజ స్సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః.

నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధర శ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదాన వ్రతామ్|
కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం
శీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే|

కళానిధి - చంద్రుడు. కళానాం నిధిః కళానిధిః. ఇ. పు. - కళల కునికిపట్టు.    

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

  
విబుధుఁడు - విద్వాంసుడు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
నిష్ణాతుఁడు - నేర్పరి.  చతురిమ - నేర్పరి. 
వేలుపు - దేవత(దేవత -వేలుపు), దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

దైవతము - వేలుపు, విణ. దేవతా సంబంధమైనది.
దైవము -
1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.

త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదివేశుఁడు -
వేలుపు; సుపర్వుఁడు - వేలుపు.
వేల్పుటెంకి - స్వర్గము, వ్యు.దేవతలకు నివాసస్థానము.
త్రిదివము - స్వర్గము; త్రివిష్టపము - స్వర్గము; స్వర్గము- దేవలోకము. 

త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే.

ఓం మహేశ్వరయుక్త నటన తత్పరాయై నమో నమః|

ధ్యేయః కాళీవిశ్వనాథో మహేశో
రుద్రాక్షోవై భూతి రామ్నాయవేద్యా
మంత్రాధీశో భాతి పంచాక్షరీయం
నిస్తుల్యోయం శుద్ధకైవల్యమార్గః|
తా.
మహేశ్వరుఁడే ధ్యానింపఁదగినవాఁడు. వేదోచితములైన విభూతి రుద్రాక్షలే ధరింపదగినవి. మహామహిమోపేతమగు పంచాక్షరీ మంత్రరాజ మే జపింపఁ దగినది. నిరుపమానమును బరమకైవల్యప్రాప్తికి మార్గమును నిదియే !

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి -
1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.         
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురుడు.
విఘ్నరాజు - వినాయకుడు.

గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు -
1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

కాని ప్రయోజనంబు సమకట్టదు, తాభువినెంత విద్యవా
డైనను, దొడ్డరాజు కోడుకైనను నదెట్లు, మహేశుపట్టి, వి
ద్యానిధి, సవవిద్యలకుఁ దానెగురుండు, వినాయకుండుదాఁ
నేనుఁగు రీతినుండియు నదేమిటికాడఁడు పెండ్లి! భాస్కరా.
తా.
వినాయకు డీశ్వరుని కుమారుఁడయ్యు, భూమి యందు తాను, సర్వ విద్యలకు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నకు మూలపురుషుడయ్యు జ్ఞానము నిచ్చు వాడయ్యు, ఏనుగు బలము కలవాడయ్యు అతడు (పెండ్లి - వివాహము)పెండ్లాడక లేక పోయెను. అట్లే ఎంత గొప్పవాడైనను తనకు వశము(స్వాధీనము)కాని పని చేయ బూనినచో నెరవేర్చుకొన లేడు. 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.       

మహేశ్వరప్రియో దాన్తో మేరుగోత్రప్రదక్షిణః,
గ్రహమణ్డల మధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః. - చంద్రుడు

అబ్జము - 1.తామర, 2.నూరుకోట్లు, 3.ఉప్పు, 4.శంఖము, 5.హారతి కర్పూరము, 6.(వృక్ష.) నీటిప్రబ్బలి, విణ.నీట బుట్టినది.
అబ్జ బాంధవుడు -
సూర్యుడు వ్యు.తామరలకు బంధువు.
అబ్జమిత్రుఁడు - సూర్యుడు.

అబ్జౌ శజ్ఖ శశాఙ్కాచ - అబ్జశబ్దము శంఖమునకును, చంద్రునికిని, చకారము వలన తామరకును, ధన్వంతరికిని పేరు. అద్భ్యః జాయత ఇత్యబ్జః, అబ్జం చ. జనీ ప్రాదుర్భావే. - నీళ్ళ వలనఁ బుట్టునది. "శంఖే ధన్వంతరౌ చంద్రే పుం స్యబ్జః క్టీబమంబుజ" ఇతి నానార్థ సంగ్రహః. పూజ్యుడైన ధన్వంతరి రోగహేతువైన అపథ్యము నుంచి రక్షించును.

అబ్జయోని - బ్రహ్మ, తమ్మిచూలి.
అబ్జయోనిః ఇ.పు. అబ్జం విష్ణునాభికమలం యొని రుత్పత్తిస్థానం యస్యసః - విష్ణునాభికమలమే ఉత్పత్తి స్థానముగాఁ గలవాఁడు.
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు. అబ్జజుఁడు - బ్రహ్మ, తుమ్మిచూలి.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).     

అబ్జవైరి - చంద్రుడు, వ్యు.తామరలకు శత్రువు.
అబ్జారి -
చంద్రుడు.

బిలియను – (Billion), నూరుకోట్లు.

ఉప్పు - ఆవిరిపోకుండ ఉడకబెట్టు, వి.1.లవణము, 2.ఉప్పదనము, 3.సొమ్ము.
లవణము - ఉప్పు, సైంధవ, సౌవర్చ, కాచ, బిడా, సముద్ర లవణములని పంచ లవణములు.
ఉప్పదనము -

సొమ్ము - 1.స్వము, 2.ధనము(నెలగ - ధనము), 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీన వస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive). స్వాపతేయము - ధనము.
విత్తము - ధనము, సం.విణ. 1.విచారింపబడినది, 2.తెలియబడినది.
సొత్తు - 1.సత్వము, హక్కు, 2.సొమ్ము, సం.సత్వము, సత్వమ్. 
సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.  
సత్త్వము - (రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము(Active Principle).  
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
సత్తముఁడు - అందరికంటె మంచివాడు, శ్రేష్ఠుడు.  
నిజము - స్వభావము, 1.తనది, 2.శాశ్వతమైనది.
తాను - తాశబ్దమునకు ప్రథమైక వచనము. తన - ఆత్మార్థకము.
ఆత్మీయము - తన సంబంధమైనది, తనది, స్వకీయము.
సొంతము - స్వతంత్రము, స్వకీయము, సం.స్వతంత్రమ్.
స్వకీయము - తనది, రూ.స్వకము, (వ్యతి. పరకీయము).
స్వీయము - తనది, వ్యతి.పరకీయము. 
నైజము - 1.తనది, 2.స్వాభావికము; నైసర్గికము - స్వాభావికము. 
స్వాభావికము - స్వభావముచేత కలిగినది. 

ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ -
భూషణము; భూషణము - అలంకరణము. 
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది.
ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property). 

పిత్ర్యము - పిత్రార్జితము, తండ్రిచే సంపాదింపబడినది.
పిత్రార్జితము -
పైతృకసంపత్తి, తండ్రివలన గాని లేక పెద్దలవలన గాని ప్రాప్తించిన ఆస్తి.
పితృతంత్రము - (గృహ.) తండ్రి ఆస్తి నుండి తనకు దక్కిన హక్కు ననుసరించి గృహ యాజమాన్యములు నిర్వహించు పురుషునికి సంబంధించినది (Patriarchal).  

జ్యేష్ఠాధికారము - (శాస.) జ్యేష్ఠానుక్రమ వారసత్వము, పిత్రార్జితమైన ఆస్తికి జ్యేష్ఠ కుమారుడే వారసుడగుట.
వారసు - వంశపరంపరలో మిగిలిన ఆస్తికి కర్త.
వారసత్వము - (వ్యావ.) సక్రమముగ సంక్రమించెడి యాస్తి, ఆస్తికికర్త.

స్త్రీ ధనము - పెండ్లి మున్నగు, సమయములలో స్త్రీకిచ్చిన ధనము.
సౌదాయికము - స్త్రీ కిచ్చిన ధనము.

ఉత్తమం స్వార్జితం విత్తం - మధ్యమం పితురర్జితమ్|
అధమం భ్రాతృవిత్తంచ - స్త్రీవిత్త మధమాధమమ్||
తా.
తాను సంపాదించినసొమ్ము ఉత్తమము(శ్రేష్ఠము, ముఖ్యము), తండ్రిసొమ్ము మధ్యమము, తోడబుట్టినవాని సొమ్మధమము(అధమము - తక్కువైనది, నీచము), స్త్రీసొమ్ము మిక్కిలి యధమము. - నీతిశాస్త్రము  

జలజము - 1.తామర, 2.శంఖము.
తామర -
తామరసము, పద్మము, తూ.తమ్మి, వి.చర్మరోగము, (ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)

తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయరుహము - తామర, వ్యు.నీటియందు జన్మించినది.

కంబువు - 1.శంఖము, 2.ఏనుగు, 3.కడియము, 4.నత్తగుల్ల.
కంబుగ్రీవ -
1.మూడు ముడుతలు గల మెడ, 2.శంఖము వంటి మెడగలది.

శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
గుల్ల -
1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ. 1.అల్పము, 2.బోలు, సం.క్షుల్లః.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల. (గుల్ల కడియము.)
డొల్ల - 1.బల్లవంటిది, 2.బుఱ్ఱ, 3.డొల్లక.
బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద. 
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
పొక్కు - 1.బొబ్బ, 2.ఎండి లేచినపెల్ల, 3.జనశ్రుతి, క్రి.1.దుఃఖించు, 2.బొబ్బలేచు.
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low). 
సూక్ష్మము - అణువు, విణ.సన్నము.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది, (వస్తువు).      
శంఖిని - స్త్రీ జాతి విశేషము. 

శఙ్ఖో నిధౌ లలాటాస్థ్ని కమ్బౌన స్త్రీ : శంఖ శబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖమునకును పేరు. శమయతి దుఃఖమితి శంఖః శము ఉపశమే. - దుఃఖమును శమింపఁ జేయునది.    

వెలిగుల్ల - శంఖము. శంఖధ్వని వినిపించే చోటు లక్ష్మీదేవి ఉంటుంది. 

శ ఙస్స్యాత్కమ్బు రస్త్రియౌ :
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః ఖను అవధారనే. - సుఖమును  బుట్టించునది.
కామ్యతే శుభార్థిభిరితికంబుః. ఉ-ప్న. కము కాంతౌ. - శుభర్థులైనవారిచేత కాంక్షింపఁబడునది. ఈ రెండు శంఖము పేర్లు.

శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతియందు ధరించువాడు.     

అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.

అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

హారతి కర్పూరము - (వ్యవ.) (Lauraceac) అను కుటుంబమునకు చెందిన Laurus camphor అను చెట్టువేళ్ళు కాండములనుండి ఈద్రవ్యమును అస్థిర తైలమును తీయుదురు (Camphor).

ఆజ్యము - 1.నేయి, 2.దేవదారు బంక, 3.కర్పూరతైలము.

ద్వౌ పరివ్యాధ విదులౌ నాదేయీ చామ్బువేతనే :
పరివిధ్యతే అంభసా పరివ్యాధః వ్యథ తాడనే. - జలముచేత అంతట కొట్టఁబడును.
విదుల్యతే అంభసా విదులః, డుల క్షేపే. - జలముచేతఁ ద్రవ్వఁబడినది.
నద్యాం భవా నాదేయీ, ఈ. సీ. - నదియందుఁ బుట్టినది.
అంబుని వేతసో మ్భు వేతసః - జలమందలి ప్రబ్బలి. ఈ నాలుగు నీరు ప్రబ్బలి పేర్లు.

భవరోగభిష గ్ధన్వంతరిః కామార్యధోక్షజౌ,
ఊర్థ్వకేశో హృషీకేశః క్రతుధ్వంసక రక్షకౌ |
  

కైసాటి చుక్క - హస్తా నక్షత్రము.
కై -
చతుర్ధీ విభక్తి ప్రత్యయము, వి. 1.చేయి, 2.తొండము, రూ.కయి.
కొఱకు - చతుర్థీ విభక్తి ప్రత్యయము.
కయి - 1.చేయి, హస్తము, 2.(కై) చతుర్థీ విభక్తి ప్రత్యయము.
చేయి - 1.చెయి, హస్తము, 2.కిరణము, 3.తొండము, 4.పక్షము.
చెయి - 1.హస్తము, 2.తొండము, రూ.చేయి, చే, చెయ్యి. 
సాటి - ఒకవస్తువునిచ్చి మనొకటి మార్చుకొనుట, వినిమయము, పరివర్తనము, రూ.సాటా, సాటాకోటి.
సాటి - సమానము, రూ.సాటిక.  

తుల్యము - సమానము, సాటి.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.

హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.
హస్తకళలు -
(అర్థ.) చేతిపనులు.

పఞ్చశాఖశ్శయః పాణిః -
పఞ్చ శాఖా - అఙ్గుళీరూపా అస్యేతి పఞ్చశాఖః. - వేళ్ళనెడి యయిదు కొమ్మలు గలది.
స్వకీయ ధనమత్ర శేతే తిష్ఠతీతి శయః, శీఙ్-స్వప్నే. - తన ధనము దీనియం దుండును.
పణతి వ్యవహరత్యనేన పాణిఃం ఇ. పు. పణ వ్యవహారే స్తుతౌ చ. దీనిచేత నరుఁడు(నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ౠషి.)వ్యవహరించును. ఈ 3 మణికట్టునుండి వ్రేళ్ళతోఁగూడిన చేతి పేర్లు.

శాఖ - 1.చెట్టు కొమ్మ, 2.వేద భాగము, 3.చేయి.
కొమ్మ -
1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది(స్త్రీ - ఆడుది), రూ.కొమ్మ. 
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి. 
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు. హరిద్ర - పసుపు.
ౙవరాలు - యౌవనవతి; అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.

ౙవ్వని - యౌవనవతి.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50వ)సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
యౌవతము - యువతీ సమూహము. 

బ్రాహ్మణము - 1.బ్రాహ్మణ సమూహము, 2.వేదభాగము.

పోటకత్తి - (వ్యవ.) పొడవైన పిడితో వంపు తిరిగి యుండు చిన్నకత్తి, (ఇది కొమ్మలను నరకుటకు కుపయోగించును) (Bill-hook).

An old Chinese saying, the branch which does not bend in the wind will break.

శాఖామృగము - కోతి, వ్యు.చెట్ల కొమ్మలపై తిరుగు మృగము.
కొమ్మత్రిమ్మరి - కోతి.
శాఖాచారీ మృగః శాఖామృగః - కొమ్మలయందుఁ జరించు మృగము.

హస్తకళలు - (అర్థ.) చేతిపనులు.
హాండీక్రాఫ్‌ట్సు -
(వాణి.) (Handi-crafts) చేతిపనులు. 

ఐచ్చిక కండరములు - (జం.) ఇచ్ఛాకండరములు, ఇష్టము వచ్చిన ప్పుడు పనిచేయు కండరములు, ఉదా. చేయి, కన్ను, కాలు మొ. వాని కండరములు (Voluntary muscles).

కదలెడికీళ్ళు - (జం.) అవయవ భాగము వంచుటకు లేదా త్రిప్పుటకు వీలగుకీళ్ళు, ఉదా. చేతి ఎముకలు (Movable joints).

చే - తృతీయ విభక్తియందు వచ్చు ప్రత్యయము, వి.1.హస్తము, 2.తొండము.
చేత - 1.తృతీయా విభక్తి ప్రత్యయము, రూ.చేన్.
తోడ - తృతీయ్యవిభక్తి ప్రత్యయము, రూ.తోడుత, అవ్య, కూడ, వెంబడి.
తోడుతో - వెంబడిని, రూ.తోడుతోడ, తోడ్తో, తోడ్తోడ.
తోడ్తో - తోడుకో. తోడ్తోడ - తోడుతోడు.   

తొండము - 1.తుండము, గజహస్తము, 2.కపిలబాన తోక, సం.తుండమ్. 
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.  
తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.

పక్షము - 1.నెలయందు బదునైదు దినములు (శుక్ల కృష్ణపక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.   
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.

చేతులకుఁ దొడవు దానము
భూతలనాధులకు దొడవు బొంకమి ధరలో
నీతియతొడ నెవారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ.
తా.
హస్తములకు దాన మొసంగుటయు, రాజులకు సత్యవాక్పరి పాలనము సర్వజనులకు న్యాయమార్గాను (అను)సరణము, స్త్రీలకు(నాతి - స్త్రీ, రూ.నాతుక.)మానరక్షణము ఆభరణములుగా భువిలో శోభించును. 

అందంగా ఇవ్వటము, తీసుకోవటము కూడా ఒక కళే. ఇచ్చేవాడు వాడే-పుచ్చుకునే వాడూ వాడే. - చెయ్యి 

శయము - 1.శయ్య, 2.చేయి, 3.పాము.
శయ్య - పడక, పదగుంఫనము, 3.విధము.   

పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిశలాకలు - (జం.)అరచేతికుండు ఎముకలు(Meta-carpals).

పాణిగ్రహణము - వివాహము; కరగ్రహణము - పెండ్లి, పాణిగ్రహణము.
పరిణయము - వివాహము. 
వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్టవిధములు). 
పెండ్లి - వివాహము; పెండిలి - వివాహము, రూ.పెండ్లి.

కల్యాణము - 1.క్షేమము, 2.శుభము, 3.పెండ్లి.

వియ్యము - వైవాహిక సంబంధము, సం.వివాహః.
వియ్యంకుఁడు - వియ్యము పొందినవాడు.

పాణిగృహీతి - అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము.
పాణిః గృహీతో (అ)స్యా ఇతి పాణిగృహీతీ. సీ. - దీనిహస్తము గ్రహింపఁ బడును.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.  

త్వదన్యః పాణిభ్యా-అభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి-ప్రకటిత వరాభీత్యభినయా |
భయా త్త్రాతుం దాతుం - ఫలమపి చ వాఞ్ఛాసమధికం
శరణ్యే! లోకానాం - తవ హి చరణావేవ నిపుణౌ || - 4శ్లో
తా.
లోకరక్షకురాలా ! నీ కంటె నితరమగు దేవ(దైవతము - వేలుపు, విన.దేవతా సంబంధమైనది.) సమూహము తమ హస్తాలతో అభయ వరముద్రలను ధరించి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తున్నారు. నీవు మాత్రం హస్తాలతో ఎలాంటి వరాభయముద్రలను ధరించవు కదా! నీవన్ననో వర భయములను ప్రకటించి యభినయించు దానవు కానే కావు. ఏలయనగా నీ పాదములే భక్తులను భయము నుంచి రక్షించుటకు, వారు కోరిన దానికన్నా(సమధికము - మిక్కిలి అధికము)అధిక ఫలము నిచ్చుటకును నిపుణము లైనవి. – సౌందర్యలహరి  

సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. – 8స్తో    

కై(ౘ)చాపులు - అంజలి, నమస్కారములు.
అంజలి -
1.చేమోడ్పు, నమస్కారము, 2.ఒకరకపు అభినయ హస్తము.
దోయిలి - అంజలి, పంపబడిన రెండు చేతులచేరిక, రూ.దోసిలి. 
దోసిలి - దోయిలి, నమస్కారము.
నమస్కారము - మ్రొక్కు, రూ.నమస్క్రియ, నమస్కృతి.
నమస్సు - నమస్కారము; చేతివిప్పు - నమస్కారము పెట్టు. 
చేమోడ్పు - 1.నమస్కారము, రూ.చేమోడుపు.
కైకట్టు - 1.సందర్భము, 2.చేమోడ్పు.
సందర్భము - 1.ప్రబంధము కూర్పు, 2.సమయము.
చేమోడుచు - మ్రొక్కు; మొక్కు - నమస్కరించు, వి.ముడుపు, రూ.మ్రొక్కు.
వినతి - నమస్కారము. నమించు - నమస్కరించు. 
వందనము - 1.పూజ, 2.స్తోత్రము, 3.నమస్కారము.  
నమస్య - 1.పూజ, 2.సపర్య; వేల్పుఁడు - పూజ, సపర్య; సపర్య - 1.పూజ, 2.సేవ.

భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.

కేలు - 1.చేయి, 2.తొండము, సం.కులిః.
కేలుమొగ్గ -
కేలుమోడ్పు, అంజలి బంధము.
కైకట్టు - 1.సందర్భము, 2.చేమోడ్చు.

కృతాంజలి - చేతులు మోడ్చినవాడు, వి.లజ్జాళువు.
లజ్జ -
సిగ్గు. లజ్జ భూషణము వంటిది.
సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.
సిగ్గరి - సిగ్గుకలవాడు.
నాన - సిగ్గు, సం.జ్ఞానమ్, త. నాణ్, క. నాణ. 

జే - 1.జయ, జయజయ యను దీవెన, 2.నమస్కారము, రూ.జేజే.
జేజె -
వేలుపు, రూ.జేజే, సం.జయజయ.
జేజే - 1.నమస్కారము, 2.దేవుడు, 3.జయము జయము.
జేజేపట్టు - స్వర్గము, వ్యు.దేవతలుండు చోటు.

కయికోలు - అంగీకారము, సమ్మతి.
అంగీకారము -
1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ.
కోలు - 1.అను ప్రయుక్తమైన కొను ధాతువునకు కృదంతరూపము, ఉదా.వీడుకోలు, ఇచ్చుకోలు, కొనుగోలు, 2.కొల్ల, విన.మిక్కిలి.

శరణము - 1.రక్షకము, 2.రక్షణము, 2.గృహము.
శరణు -
1.రక్షకము, శరణాగతి, 2.నమస్కారము, రూ.శరణము.
శరణుచొ(ౘ)చ్చు - శరణాగతి పొందు.  
శరణ్యుఁడు - శరణు చొరదగినవాడు. 

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు
 ధృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు విశ్వ.
తా.
ఓ వేమా! పూజచేయుట కంటె పూజనీయమైన బుద్ధి కలిగివుండుట మంచిది. మాటలు చెప్పుటకంటె నిశ్చలమైన మనస్సు కలిగి వుండుట మంచిది. కులము కంటె గుణము ముఖ్యమైనది.

Hands that help are holier than the lips that pray.  

రత్ని - మూర, మోచేయి మొదలు పిడివరకు గల కొలత.

ప్రకోష్ఠే విస్తృతకరే హస్తో -
కపోణేరధః ప్రకోష్ఠః ఈత్ర విస్తృతకరే సతి హస్త ఇత్యుచ్యతే - చాఁచబడిన అరచెయ్యిగల మోఁచేతికి దిగువనున్న ప్రదేశము హస్తమనంబడును.
హన్యతే అంసుకాదిరనేన హస్తః హన హింసాగత్యో - దీనిచేత వస్త్రాదులు కొట్టఁబడును. అనఁగా కొలవఁ బడుననుట.

ప్రకోష్టము - 1.తొట్టికట్టు, 2.ముంజేయి.
ముంజెయి -
(ముందు+చెయి) ముంగేయి. ముంచేతి కంకణమునకు అద్దమేల.
ముంగమురము - ముంజేతి కంకణము, రూ.ముంగమురాము, ముంగమురారి, ముంగైమురారి.
కిష్కువు - 1.ముంజేయి, 2.జేన, 3.మూర.
జేన - పండ్రెండగుళముల కొలది, వితస్తి. 
మూర - రెండు జేనల కొలది.

తొట్టికట్టు - లోగిలి; లోగిలి - ముంగిలి.
ముంగిలి -
(ముంగల+ఇల్లు), 1.అంగణము, 2.బయలు.
అంగణము - 1.ఇంటిముందుచోటు, ముంగిలి, 2.ప్రదేశము.    

అన్వర్త్నిక - (జం.) ముంజేతిలో నుండు ఎముకలలో ఒకటి (Radius), అరత్నిక (Ulna) ముంజేతి నుండు రెండవ ఎముక. ఈ రెండును కలసి 'Radioulna' అనబడును.      

ద్విసిరకండరము - (జీవ.) చేతిదండ (Biceps muscle).
కైదండ -
1.హస్తభూషణము, 2.హస్తావలంబము.
కయిదండ - హస్తావలంబము, రూ.కైదండ.
చేదండ - హస్తావలంబనము, చేతిలోనుంచు కొను పూదండ.

స్రజము - పూలదండ.
స్రగ్వి -
పూదండగలవాడు.

కరము1 - 1.చేయి, 2.కిరణము, 3.తొండము, 4.కప్పము.
కరము2 - మిక్కిలి, కడు, అత్యంతము.

కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు.
పృశ్ని - కిరణము, 1.పొట్టిది, 2.చిన్నది. పృశ్ని గర్భుడు అనగా శ్రీమహావిష్ణువు.

అంశువు - 1.కిరణము, 2.కాంతి, 3.కొస, 4.అణువు, 5.దారము.
అంశుమంతుఁడు -
1.సూర్యుడు, 2.సగరచక్రవర్తి మనుమడు, 3.ధనవంతుడు.
అంశుమాలి - సూర్యుడు Sun.

పోఁచి - మనికట్టు మీది చోటు.
పోఁచీలు -
ఆడువారి ముంజేతి నగలు. 

కడియము1 - హస్తభూషణము, సం.కటకః, రూ.కడెము.
సూడిగములు - గాజులు Bangles, చేతి కడియములు.
కడెము - కడియము1.
కడియము2 - వరికుప్ప నూర్పుచేయుచు చుట్టును వేయు గడ్దవామి.

పరిహార్యము - హస్త కంకణము, విణ.విడువదగినది.
తోడా -
బిరుదుగా వేసిన హస్త భూషణము, 1.అందె.
అందె - అందియ; అందియ - స్త్రీలు కాలియందు ధరించు నగ, నూపురము, 2.బిరుదు చిహ్నముగ కాలికి తొడుగుకొను నగ, రూ.అందె, సం.అందుః.

చేదర్సెనము - చేకానుక.
చేకానుక -
పెద్దల దర్శించబోవునపుడు తీసికొనిపోవు కానుక, చేదర్సెనము.

గోఁటు - 1.కోరికయందున చేర్చికట్టెడు సన్నని సరిగపట్టె, 2.చేతినగ, 3.ఒయ్యారము.
గోఁటుకత్తె - ఓయ్యారము; ఒయ్యారము - ఒయారము.
ఒయారము - 1.విలాసము, 2.సౌందర్యము, 3.గర్వము, రూ.ఒయ్యారము, ఓయారము.
ఒయ్యారి - ఒయారి; ఒయారి - 1.విలాసిని, 2.సుందరి, విణ.సౌందర్యముగలది, రూ.ఒయ్యారి, ఒయారి.
గోఁటుకాఁడు - ఒయ్యారము గలవాడు.

పూస - 1.పూదె, 2.మణి, 3.వ్రేలులోనగు వాని కీలు.

మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము(ముత్యము), 3.మనికట్టు.
ప(ౘ)చ్చ -
1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరురేఖః, సం.పలాశః.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు. 

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

మణికారుఁడు - రత్నములను సాన బట్టువాడు.
మణిగము - అధికారము, రూ.మణియము.

మకరతము - మరకతమణి, రూ.మరకతము.
మరకతము -
(రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్ సిలికేట్ (Emerald). (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
అశ్మగర్భము - మరకతము, పచ్చ.
గరుడపచ్చ(ౘ) - ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
కిరీటపచ్చ - మరకతము, గరుడపచ్చ.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు). 
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు). 
ఇంద్రనీలము - నీలమణి.    

గారుత్మతం మరకత మశ్మగర్భో మరిన్మణిః,
గరుత్మతో జాతం గారుత్మతం - గరుత్మంతునివలనఁ బుట్టినది.
మరం మరణం తకత్యనేనేతి మరకతం. తక హనహసనయోః - విష హరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.
అశ్మాగర్భో (అ)స్య అశ్మగర్భః - ఱాయి ఉత్పత్తి స్థానముగా గలది.  
హరిద్వర్ణో మణిః హరిన్మణిః - పచ్చనిమణి. ఈ 4 నాలుగు పచ్చల పేర్లు. 

గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, 12000 శ్లోకములు గలది, గరుడదేవతాకమైన అస్త్రము.  

మణిబంధము; మణికట్టు - (గృహ.) అరచేతికి మోచేతికి మధ్యనున్న కీలు (Carpus).
మణి బంధాస్థి - (జం.) చేతి మణికట్టులోనున్న ఎముకల సముదాయము (Carpus).  

కావేరి - 1.కావేరీనది, 2.పసుపు.
హరిద్ర -
పసుపు.
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ. 

పీతాంబరుఁడు - పచ్చవలువ ధరించువాడు, విష్ణువు.

అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.   

చెయిదము - 1.పని, చేష్ట, రూ.చెయిది, చెయ్ది, చెయువు.
చేష్ట -
1.పని, 2.వ్యాపారము.
చెయిది - చెయిదము, చేష్ట.
చెయ్ది - చెయిదము; చెయ్దము - చెయిదము.
చెయ్వు - చెయువు; చెయువు - చెయిదము.
చెయువుల సాకిరి(సాకిరి - సాక్షి) - 1.కర్మసాక్షి, సూర్యుడు.
కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలకు సాక్షియైనవాడు.


బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః.
పెద్దనిద్దుర - మరణము, దీర్ఘనిద్ర. దీర్ఘనిద్ర - చావు; మృతి - చావు.

అరి - 1.కప్పము, 2.అల్లెతాడు, 3.హద్దు, మర్యాద. 
అరిగాఁపు - 1.పన్ను చెల్లించురైతు, 2.కప్పము చెల్లించినవాడు.
మౌర్వి - అల్లెత్రాడు.
నారి -
అల్లెత్రాడు వై.వి. నరము, సం.నాడీ స.వి. స్త్రీ.

షడ్భాగము - కప్పము.
భాగధేయము -
1.భాగ్యము, 2.కప్పము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.


సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

బయసి - 1.మర్యాద, గౌరవము, 2.దయ, 3.భాగ్యము.
బైసి -
1.గౌరవము, 2.భాగ్యము, రూ.బయిసి, బవిసి, బగిసి, సం.భూయసీ.

మర్యాద - 1.కట్టుబాటు, 2.తీరము, 3.సన్మానము.
అదుపు - 1.కట్టుబాటు, 2.హద్దు(మేర, ఆజ్ఞ), 3.స్వాధీనము.
కట్టుదిట్టము - కట్టుబాటు. మిర - మేర, హద్దు, మర్యాద. 
తీరము - దరి, (భూగో.) అంచువలె సముద్రపు నీటికి తగిలియున్న భూమి.
దరి - 1.తీరము, గట్టు, 2.మేర, 3.సమీపము, సం.తీరమ్. 
గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువుకట్ట, పర్వతము, సం.ఘట్టః.
సమీపము - చేరువ; సదేశము - సమీపము.

సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.   

గట్టుతాలుపు - విష్ణువు, వ్యు.మందరగిరి నెత్తినవాడు.
గట్టువిలుకాడు - శివుడు, వ్యు.మేరువు విల్లుగా గలవాడు.

యద్య త్పరవశం కర్మ తత్తద్యత్నేవ వర్జయేత్|
యద్య దాత్మవశంతు స్యాత్తత్తత్సేవేత యత్నతః||
సర్వం పరవశందుఃఖం సర్వమాత్మ వశంసుఖం|
ఏతద్వేద్యా త్సమాసేన లక్షణం సుఖదుఃఖయోః||
తా.
పరాధీనమైన కార్యమును(పనిని) విడువ వలయును, స్వాధీనమైన(వశము - స్వాధీనము)కార్యమును చేయవలయును, అది యేమనిన, పరాధీనమైన వన్నియు దుఃఖకరంబులు, స్వాధీనమైనవి సుఖఃకరంబులు, ఇవి సంక్షేమముగా సుఖదుఃఖములకు లక్షణము. - నీతిశాస్త్రము

హస్తిని - 1.ఆడేనుగు, 2.ఒక స్త్రీజాతి, (శంఖినీ, పద్మినీ, చిత్రిణీ జాతు లితరములు).
గణిక -
1.ఆడేనుగు(వశ - ఆడేనుగు), 2.వేద్య.
శంఖిని - స్త్రీ జాతి విశేషము.
పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతిస్త్రీ. 
చిత్రిణి - చిత్తిని, ఒకజాతి స్త్రీ.
చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.

పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు గలది.
పద్మం బిందుజాలక మస్యాస్తీతి పద్మీ.న్. పు. – పద్మమనఁగా దేహమందలి బొట్లు; అవి గలిగినది.
హస్తి - ఏనుగు, వ్యు.హస్తము కలది.
హస్తో (అ)స్యాస్తీతి హ స్తీ న. పు. - తొండముగలది.
చేగల మెకము - ఏనుగు, హస్తి.
కరటి - ఏనుగు, హస్తి.   
హస్తము - 1.చేయి, 2.తొండము, 3.మూర.

హస్తా తు పాణినక్షత్రే -
హస్తశబ్దము చేతికిని, నక్షత్ర విశేషమునకును పేరు. హసతీతి హస్తః - హసే హసనే, ప్రకాశించునది. 

పాణి - మనికట్టు మొదలు చాచిన వ్రేళ్ళతో కూడినచేయి.
పాణిశలాకలు - (జం.) అరచేతికుండు ఎముకలు (Meta-carpals).

హస్తకళలు - (అర్థ.) చేతిపనులు.
హాండీక్రాఫ్‌ట్సు - (వాణి.) (Handi-crafts) చేతిపనులు.  

ఐచ్చిక కండరములు - (జం.) ఇచ్ఛాకండరములు, ఇష్టము వచ్చిన ప్పుడు పనిచేయు కండరములు, ఉదా. చేయి, కన్ను, కాలు మొ. వాని కండరములు (Voluntary muscles).

హస్తిసఖుఁడు - మావటీడు.
మావటి -
శూరుడు, మల్లుడు, రూ.మావటీడు, మాస్టీడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లుఁడు - జెట్టి; జెట్టి - 1.మల్లుడు, 2.శూరుడు, విణ.శ్రేష్ఠుడు.
మల్లు - 1.కోతి, 2.మల్లుడు, జెట్టి, సం.మల్లః.

శూరుఁడు- సూర్యుడు, విన.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుఢు.
శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.

గజము -1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేన్నాంగములలో ఒకటి.
గౙ -
పెద్ద, సం.గజః.
గజయాన - ఏనుగు నడకవంటి నడకగల స్త్రీ, స్త్రీ.
గజవదనుడు - వినాయకుడు. 

లావు గలవాని కంటెను,
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును,  
మావటివాఁ డెక్కినట్లుమహిలో సుమతీ.
తా.
శరీరబలము గలవానికంటెను బుద్ధిబలముగల మానవుడు శక్తిమంతుడు. ఎట్లనగా గొప్ప బలముగల ఏనుగును మావటివాడు స్వాధీనపరచు కొనుట యిందుకు నిదర్శనం.

అత్తి - (వృక్ష.) మేడి ఉదుంబరము, వై. వి. ఏనుగు, సం.హస్తిః.
మేడి -
అంజూరు, అత్తిచెట్టు.
అం(ౙ)జూరు - 1.అత్తిపండు, 2.అత్తిచెట్టు.
ఉదుంబరము - 1.గడప, 2.అత్తిచెట్టు, 3.రావిచెట్టు.
కడప - దేహళి, రూ.గడప, వై. కదంబము (చెట్టు), సం.కదంబః.
దేహళి - గడప, కడప, రూ.గేహళి.
గేహళి - గడప, రూ.దేహళి.

దేహళీ దీపన్యాయము - న్యా. గడప మీద దీపము పెట్టిన నింటిలోన బైట గూడ ఉపయోగించు రీతి, దేహళీదత్త దీపన్యాయము.

ఉదుమ్బరో జన్తుఫలో యజ్ఞాజ్గో హేమదుగ్దకః,
ఉన్నతత్వా దుల్లంఘిత మంబరం అనే నేతి ఉదుంబరః - ఔనత్యముచేత నాకాశమును దాఁటునది.
జంతుయుక్తం ఫలమస్యేతి జంతుఫలః - జంతువు(జంతువు - చేతనము, ప్రాణముగలది)లతోఁ గూడిన ఫలములు గలిగినది.  
యూపాదిరూపేణ యజ్ఞస్యాంగ మువకరణ మితి యజ్ఞాంగః – యూపాది రూపముచేత యజ్ఞమునకు అంగమైయుండునది.
హేమవర్ణం దుగ్ధం క్షీరమస్య హేమదుగ్ధకః - బంగారువంటి పాలుగలది. ఈ నాలుగు 4 అత్తిచెట్లు పేర్లు.    

గేహేశూరన్యాయము - న్యా.ఇంటిలో డంబములు కొట్టువాడే కాని పనికిరాని వాడనుట.
గేహేశూరుఁడు -
ఇంటిలోనే డంబములు కొట్టువాడు, పిరికివాడు.(దంభము - 1.కపటము, 2.తప్పు, 3.గర్వము. అదరుగుండె - పిరికివాడు).

మేడిపండుచూడ మేలిమైయుండును
పొట్టవిప్పిచూడఁ బురుగులుండు
పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వ.
తా.
ఓ వేమా! మేడిపండు చూచుటకు పైకిపచ్చగా బంగారమువలె కంటికింపుగా కనబడును కాని, దానిని బ్రద్దలుచేసి చూచినచో లోపల పురుగులు వుండును.  చెడ్డవారుచూచుటకు పైకి బాగుగనే కన్పించు చున్ననూ, లోపల వారి(మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)గుణములు (బింకము - 1.గర్వము, 2.నిక్కు, బిగువు.)మాత్రము చాలా చెడ్డవిగ వుండును.

ఔదౌంబరము - 1.ఒకలోహము, 2.రాగి, విణ.ఉదుంబర (మేడి) వృక్ష సంబంధమైనది. 

ఉదుంబరక ఫలము - (వృక్ష.) పుష్పమంజరి అంతయు కలిసి ఏర్పడిన ఫలములలో నిది యొకటి. దీనిలో చుట్టును ఆవరించి యున్న పుష్పాసవము మాంసలమై యుండును, ఉదా.అత్తి మొ.వి.

కడిమి1 - 1.అతిశయము, 2.పరాక్రమము; గోహరి - పరాక్రమము.
కడిమి2 - కడప (చెట్టు), సం.కదంబః.
నీపము - కడిమిచెట్టు.
కదంబరము - గుంపు, వై. విణ. మిశ్రము.
కదుపు - సజాతీయ పశు పక్ష్యాది సమూహము, సం.కదంబమ్. 

ఔదుంబరాణి పుష్పాణి శ్వేతవర్ణంచ వాయసమ్|
మత్స్యాపాదంజ లే పశ్యే న్ననారీ హృదయస్థితమ్||

తా. మేడిపువ్వులనైన గానవచ్చును, తెల్లని వాయసము-కాకి (ధూంక్ష్మము - తెల్లకాకి)నైనఁ గానవచ్చును, నీళ్ళలోపల(మత్స్యము - చేప)చేపల యడుగులనైనఁ గానవచ్చును, స్త్రీల యొక్క హృదయము తెలియరాదని శ్రీకృష్ణుఁడు చెప్పెను. - నీతిశాస్త్రము  

కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా|
కల్యాణీ జగతీకందా కరుణారససాగరా. - 73శ్లో

కళావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా|
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా. - 74శ్లో

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).

14. చిత్త - ముత్యము వలె గుండ్రముగా ఒకటే నక్షత్ర ముండును.

సృష్టి ' చిత్ర ' నిర్మాణం చేసిన సమయంగల నక్షత్రమిది కనుక ' చిత్ర ' అనే పేరు వచ్చిందని పెద్దలమాట(శాస్త్రకారుల).

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె -
సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.

చిత్రకారుడు - 1.చిత్తరువు వ్రాయువాడు, ముచ్చి.
ముచ్చి - చిత్రకారుడు.
అం(ౘ)చులవాడు - చిత్రకారుడు, చిత్తరువులు వ్రాయువాడు, ముచ్చి.  

చిత్తము - మనస్సు. చిత్తము నందు దేవీస్థానం బ్రహ్మకళ.
చిత్తగించు - క్రి.1.మనస్కరించు, 2.తలచు, 3.యోచించు.
మనస్కరించు - క్రి.ఇష్తపడు.
తలఁచు - క్రి.ఎంచు, 2.ధ్యానించు, రూ.తల్చు.
ఎంచు - క్రి.1.గణించు, 2.అపేక్షించు, 3.ప్రశంసించు, 4.తలంచు.
 
తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్|
పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్|| 

త్వష్టా నక్షత్రమభ్యేతి చిత్రామ్ | సుభగ్ం ససంయువతిగ్ం  రాచ-మానామ్ | నివేశయన్నమృతాన్మర్త్యాగ్‌శ్చ | రూపాణి పిగ్ంశన్ భువనాని విశ్వా | తన్నస్త్వష్టా తదు చిత్రా విచష్టామ్ | తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యమ్ | తన్నః ప్రజాం వీరవతీగ్ం సనోతు | గోభిర్నో అశ్వైస్సమనక్తు యజ్ఞమ్ ||12||    

త్వష్ట - 1.విశ్వకర్మ, 2.ద్వాదశాదిత్యులలో నొకడు, 3.వడ్రంగి.
విశ్వకర్మ -
దేవశిల్పి; మయుఁడు - అమర శిల్పి.
విశ్వకర్మన్ శబ్దము సూర్యునికిని, దేవశిల్పికిని పేరు. విశ్వం కర్మాస్యేతి విశ్వకర్మా. న. పు. - సకలమైన క్రియలు గలవాఁడు. టీ. స. విశ్వస్య కర్మాణి యస్మాదితి విశ్వకర్మేతి సూర్యపక్షే.  

తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు -
తక్షకుడు. పాఁపఱేఁడు - నాగరాజు. 
స్కల్ ప్ణర్ - (చరి.) (Sculptor) తక్షకుడు, విగ్రహములు చెక్కు శిల్పి.
రథకారుఁడు - తేరుచేయువాడు, వడ్లవాడు.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్యపని చేయువాడు, 2.పక్షివిశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.
వర్థకి - వడ్రంగి, Carpenter. 
సూత్రధారుఁడు -1.నాటకము లాడించు ముఖ్యనటుడు, 2.నడుపువాడు, 3.వడ్రంగి.
కీలుకాఁడు - 1.సూత్రధారుఁడు, 2.యంత్రము త్రిప్పువాడు.
కీలు - 1.మర, 2.మర్మము, 3.ఉపాయము, 4.కఱ్ఱలకు పూసెడు నల్లని చమురు.

ఉలి - వడ్రంగి సాధనము, విణ.అల్పము, రూ.నులి.
నులి -
1.ప్రేగులలో నొప్పి, 2.చిక్కు, విణ.అల్పము.

ఐద్దాయులు - (ఐదు+ దాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె కాసెకులస్థుల పనులు.

అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠ స్థవిరో ధ్రువః - 6స్తో

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త - 1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె -
సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.  

చిత్తిని - 1.చిత్రిణి, 2.స్త్రీలలో ఒక జాతి, 3.ఆ జాతికి చెందిన స్త్రీ.
చిత్రిణి -
చిత్తిని, ఒక జాతి స్త్రీ.

చిత్రకంఠము - 1.కపోతము, 2.గువ్వ. 
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
గువ్వ - 1.అడవిపావురము, 2.పక్షి.

పారావతః కలరవః కపోతః :
పారేన బలేన అవతీతి పారావతః అవ రక్షణాదౌ. - పారమనఁగా బలము. దానిచేతః బోవునది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని గలది.
శీఘ్రగామిత్వేన కస్య వాయోః పోత ఇవ కపోతః - వేగముచేత వాయువు కొదమ వలె నుండునది. ఈ మూడు పావురము పేర్లు.

పావురాయి - పావురము, సం.పారవతః. 
పారావతము -
పావురము.
కలరవము - పావురము.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
కాపోతము - 1.బూడిద రంగు గలది, 2.కపోత సంబంధమైనది. 
కూకి - ఒక రకము పావురము.

కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు. మధురమైన కంఠము కలది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని.

కామి - 1.కాముకుడు, 2.పావురము, 3.జక్కవ.
కామిని -
1.ప్రియ సంగమమందు అద్కేచ్ఛ గల స్త్రీ, 2.ఆడుజక్కవ, 3.ఆడుపావురము, 4.బదనిక, (కాముకి). మాటీనంగ - కాముకి. గంధమాదనము నందు దేవీస్థానం కాముకి|
బదనిక -
చెట్టు మీద మొలుచు ఓషధి విశేషము  సం.పందానికా,(వృక్ష.) పరాన్నభుక్కుగా జీవించు ఉద్భిజము(Parasitic plant).

వన్దాయామపి కామినీ,
కామినీశబ్దము బదనికకును, అపిశబ్దమువలన విలాసినియైన స్త్రీకిని పేరు.
కామో (అ)స్యా అస్తీతి కామినీ, సీ, అభిలాష గలిగినది. "శామాపారావతీ స్త్రీషు చక్రవాక్యాం చ కామినీ" ఇతి ప్రతాపః. 

కపోతవృక్షము - (గృహ.) బలహీనమైన చాతీ, బలహీనత వలన నీరసముగా పెర్గిగిన ప్రక్క ఎముకుల గూడు (Pigeon chest).

చిత్రభానుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు.
చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః, ఉ-పు. - నానావర్ణములైన కిరణములుగలవాఁడు.
చిత్రభాను - అరువది సంవత్సరములలో నొకటి.

సూర్య వహ్నీ చిత్రభానూ :
చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు.
చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః – నానావిధము లైన కిరణములు గలవాఁడు.

                                              

ముత్తెపురిక్క నెల - చైత్ర మాసము (చిత్తా నక్షత్ర యుక్తము). చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ(పూర్ణిమ - పున్నమ, అఖంఢ చంద్రుడు గలది.) దీనియందు గలదు, గనుక చైత్రము, చైత్రికమును అనబడును.

సూర్యుడు చైత్ర మాసంలో ధాత అనే పేరు ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు అనేవాడు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు. 

ధాత - 1.బ్రహ్మ, 2.60 సంవత్సరములలో నొకటి, విణ.1.ధరించువాడు, 2.రక్షించువాడు.
ధాతా. ఋ.పు. సర్వం దధాతీతి ధాతా - సమస్తమును ధరించువాడు. డుధాఞ్ ధారణ పోషణయోః. 

హేతి - 1.అగిశిఖ, 2.మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము.
హినోతి ఇతస్తతో గచ్ఛతి-వర్ధతే వా, హేతిః, ఈ-సీ, హిగతౌ వృద్ధౌ చ - ఇట్టట్టు చలించునది, లేక వృద్ధిఁబొందునది.
హన్యతే అనయేతిహేతిః, హనహింసాగత్యోః - దీనిచేత హింసింపఁబడును.

వాసుకి - 1.సర్పరాజు, 2.మృగపక్షి ధ్వని.  

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః - 5స్తో
 

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.

జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు. 

జగత్సూతే ధాతా - హరి రవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేతత్ - స్వమపి వపు రీశ స్తిరయతి|
సదాపూర్వ స్సర్వం - తదిద మనుగృహ్ణాతి చ శివ
స్తవాజ్ఞా మాలంబ్య - క్షణచలితయో ర్బ్రూలతి కయోః|| - 24శ్లో
  
తా. హే భగవతి! సృష్టికర్తయైన బ్రహ్మ సృష్టించు చున్నాడు. విష్ణువు(హరి) రక్షించుచున్నాడు. రుద్రుడు(రుద్రుఁడు - శివుడు)హరించుచున్నాడు. ఈశ్వరుడు(ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.) ఈ కార్యములను దిరస్కరించి తన శరీరమున కప్పిపుచ్చుచున్నాడు. ఆ (త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) సదాశివుడు త్రిమూర్తి కృతమగు ఇదంతటిని చలించుచున్న నీ కనుబొమ్మల కదలికయే (అజ్ఞాస్వరూపమగును) యాజ్ఞను పొంది యనుగ్రహించు చున్నాడు. - సౌందర్యలహరి

ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్ర స్త్వష్టా ధ్రువో ధరః
ప్రభావ స్సర్వగో వాయు రర్యమా సవితా రవిః| – 105స్తో

జ్వలత్కాంతివహిం జగన్మోహనాంగీం – భజన్మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్|
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం - భజే శారదాంబా మజస్రం మదంబామ్.  

చైత్రము - 1.నెల, 2.ఒకానొక కొండ.
చైత్రికము -
చైత్రమాసము. 

స్యా చ్చైత్రే చైత్రికో మధుః :
చిత్తనక్షత్రయుక్తా పూర్ణిమా చైత్రీ సా స్నిన్నస్తీతి చైత్రః. చైత్రికశ్చ - చిత్రానక్షత్రముతోఁ గూడిన పున్నమ(పున్నమ - పూర్ణిమ, సం.పూర్ణిమా, ప్రా.పుణ్ణమా.)దీనియందుఁ గలదు. గనుక చైత్రము, చత్రికమును.
మన్య్తే సర్వత్ర కామదేవో మధుః. ఉ-పు. మన జ్ఞానే - దీనియందు మన్మథుఁ (మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.)డంతటఁ దలంపఁబడును.
మధునా పుష్పరసేన యోగాద్వా మధుః - దీనియందు మకరంద(మకరందము - పుష్పరసము, మరందము.)ముండును. ఈ మూడు చైత్రమాసము పేర్లు.

నెల-1.మాసము 2.చంద్రుడు 3.పున్నమి 4. స్థానము 5.కర్పూరము.
మాసము -
నెల, (చైత్రము, వైసాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావనము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాసరము - 1.పొడవైనది, 2.వ్యాపించినది, 3.అందమైనది.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురిగింజల యెత్తు.
మినుము - మినుపపైరు, మాషము.

మాసస్తు తావుభౌ :
తావుభౌ మాస ఇత్యుచ్యతే ఆ పక్షములు రెండు కూడిన కాలము మాసమనంబడును.
మస్యతే పరిమీయతే నేనేతి మాసః. మసీ పరిమాణే - దీనిచేత కాలము పరిమాణము చేయఁబడును. రెండు పక్షములు ఒక నెల.

చంద్రుడు - నెల, చందమామ.
నెల -
1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.
చంద్రశేఖరుఁడు - 1.శివుడు, నెలతాలుపు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

(ౘ)చుక్క - 1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగువాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). సితుఁడు - శుక్రుడు (Venus), విణ. తెల్లనివాడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు. 

నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు -
1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు 3.వేలుపు.

నెలమేపరి - రాహువు; రాహువు - ఒక ఛాయగ్రహము, తలగాము.
తలగాము - రాహువు Rahu. కృష్ణవర్త్మ - 1.అగ్ని, రాహుగ్రహము, విణ.దురాచారుడు.

చైత్రరథము - కుబేరుని తోట.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.

అస్యోద్యానం చైత్రరథం -
చిత్రరథో నామ గంధర్వరాజః తేన నిర్మితం చైత్రరథం - చిత్రరథుఁ డను గంధర్వరాజుచేత నిర్మింపఁబడినది. ఒకటి కుబేరుని యుద్యానము. చైత్రరథము నందు దేవిస్థానం మదోత్కట|

తోఁట - 1.ఉపవనము, 2.ఆశ్రమము.
తోఁపు - 1.పెంపుడు వనము, తోట, 2.ఎరుపు, 2.తోపిక.
తోఁపిక - తలపు, తోచుట.

చైత్రసఖుఁడు - మన్మథుడు.
చైత్రసారథి - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

ధనుః పౌష్పం మౌర్వీ - మధుకరమయీ పంచ విశిఖాః
వసంత స్సామన్తో - మలయ మరుదాయో దనరథః|
తథాప్వేకః సర్వం - హిమగిరి సుతే! కామపి కృపామ్ 
అపాంగా త్తే లబ్ధ్వా - జగదిద మనఙ్గో విజయతే|| - 6శ్లో
      
తా. ఓ హైమవతీ! మృదువులై తాకిన కందిపోవును తాకుటకు గాని వంచుటకు గాని వీలుగాని విల్లు పూలది; ఒకటి కొకటికి పొందిక లేనందున త్రాడగుటకు తగని, అల్లెత్రాడు(మౌర్వీ- అల్లెత్రాడు)తుమ్మెదల మొత్తము; (విశిఖము - బాణము)బాణములు ఐదు; వసంతుడు మంత్రి; మందమై ఎల్లపుడు నుండక స్థిరముకాని, రూపములేని మలయమారుతము యుద్ధరథము. ఇట్లు ఉపయోగ రహితములన పరికరములను కలిగిన మన్మథు(అనంగఁడు -మన్మథుడు, విణ.అంగము లేనివాడు.)డొక్కడే నీ క్రీగంటి(అపాంగము - కడకన్ను, విణ.అంగహీనము.)చూపు వలన అనిర్వాచ్య మగు దయను పొంది ఈ జగత్తు నంతను జయించుచున్నాడు. - సౌందర్యలహరి        

భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం - లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్|
చలచ్చంచలాచారుతాటంక కర్ణాం భజే శారదాంబా మజస్రం మదంబామ్. 

గ్లౌ - 1.చంద్రుడు, 2.కర్పూరము.
హిమవాలుక -
కప్పురము, కర్పూరము.

చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
చంద్రేణ కర్పూరేణ మీయతే ఉపమీయత ఇతి చంద్రమాః, స. పు. మాఞ్ మానే. - ఛంద్ర మనఁగా కర్పూరము. దానితోఁ బోల్చఁబడువాఁడు.
కర్పూరము - ఘనసారము, కప్పురము.
ఘనసారము - 1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద. 

చంద్రకి - 1.నెమలి, 2.కౌజు.
నెమలి -
మయూరము, రూ.నెమ్మిలి(నెమ్మలి).
కౌఁజు - కపుఁజుపిట్ట, సం.కపింజలః.
నెమ్మి - 1.ప్రేమ 2.నెమ్మది 3.సంతోషము 4.క్షేమము 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము 2.బండిచక్రము కమ్మి, సం.నేమిః.
నెమ్మిరౌతు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ. కొమరుసామి.

కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
నెలవెలుగు -
వెన్నెల.
చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక
చెంద్రిక - చెందిరిక; చెందిరిక - 1.కమ్మపైదుద్దు, రూ.చంద్రిక.  

హరిచందనము - 1.చెందిరము, 2.వెన్నెల, 3.కల్పవృక్షము.
చెందిరము -
1.సింధూరము, 2.కుంకుమ, రూ.చెంద్రము, చందురము.
చెంద్రము - చెందిరము. 
గాంధారము - 1.(సంగీ.) ఒకవిధమగు స్వరము, 2.సింధూరము, 3.కాంధహార్ అను ఒకానొక దేశము.

చంద్రోదయము - 1.ఉల్లెడ, 2.చందురా, 3.చంద్ర్రుని పొడుగు.
ఉల్లడ -
మేలుకట్టు, చాందిని, రూ.ఉల్లెద, సం.ఉల్లాభః.
చాందిని - మేలుకట్టు.
(ౘ)చందువ - మేలుకట్టు, ఉల్లెడ, రూ.చందురా, సం.చంద్రోదయః.
(ౘ)చందుర - చంద్రకాంతము; చంద్రకాంతము - చలువరాయి.
(ౘ)చలువరాయి - చంద్రకాంతము.

(ౘ)చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా మేడ కట్టిన చలువరాయి ఎలావచ్చెనో తెలుపగలవా.....  

(ౘ)చంద్రము - చందురము, సం.చంద్రః.
చంద్రేన కర్పూరేణ మీయతే ఉపమీయత ఇతి చంద్రమాః. స. పు. మాఞ్ మానే. - చంద్ర మనఁగా కర్పూరము. దానితోఁ బోల్చఁబడువాఁడు.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుఁడు - చంద్రుడు.
(ౘ)చందురుమామ - చంద్రుడు, చందమామ.

(ౘ)చందు - 1.విధము, 2.అందము, 3.చంద్రుడు.
(ౘ)చందము -
ఛందము, విధము, సం.ఛందః. 
చందయతీతి చంద్రః. చది ఆహ్లాదనే - సంతోషింపఁజేయువాఁడు.    

ఐందవము - చంద్రుని సంబంధమైనది, వి.1.చాంద్రమానము, 2.చాంద్రాయణ వ్రతము.
చాంద్రమానము -
చంద్రుని గతిని బట్టి యేర్పరచిన కాల ప్రమాణము.
చాంద్రాయణము - చంద్రుని వృద్ధిక్షయముల ననుసరించి ఆహార పరిమితి దిన క్రమమున హెచ్చించుచు తగ్గించు వ్రతము.
చాంద్రసంవత్సరము - చంద్రుడు అమావాస్య మొదలుకొని అమావాస్య వరకు భూమిచుట్టు తిరిగివచ్చు కాలమును బట్టి నెలను నిర్ణయించుట, చాంద్ర సంవత్సరమున గల 365 రోజులకు దానిని సరి పుచ్చుటకై అధిక మాసము వచ్చును. మలమాసము - అధిక మాసము.
అధిక మాసము - చాంద్రమానమున మూడేండ్ల కొకసారి వచ్చు పదమూడవ నెల. సూర్యసంక్రమణము లేని చాంద్రమాన మాసము.
ఐందవి - పల్కుచెలి, సరస్వతి.
పలుకుఁజెలి -
సరస్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒకనది. 

పున్నమ - పూర్ణిమ, సం.పూర్ణిమా, ప్రా.పుణ్ణమా.
పూర్ణిమ -
పున్నమ, అఖండ చంద్రుడు గలది.
పౌర్ణమి - సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని అర్ధభాగముపై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.

పూర్ణిమనాడు చంద్రుడు యే నక్షత్ర మండలమందు కనబడునో ఆ నక్షత్రము పేరు ఆ నెలగా నుదహరింపబడును.

భువి - 1.భూమి, 2.స్థానము.
స్థానము -
1.చోటు ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ. 
స్థలము - 1.మెట్టనేల 2.చోటు.
నెలకువ - స్థానము; నెలవు - నివాసము, విణ. 1.వాసస్థానము, 2. స్థానము, 3.పరిచయము.

చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.

హిమవాలుక - కప్పురము, కర్పూరము.
కర్పూరము -
ఘనసారము, కప్పురము.
ఘనసారము - 1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.
సితాభము - కర్పూరము, రూ. సితాభ్రము.
కందకము - అగడ్త; అగడ్త - అగడిత.
అగదిత - కోట చుట్టుత్రవ్వబడిన కందకము, రూ.అగడత, అగడ్త.

చందమామ పులుఁగు - చకోరము.
చకోరము -
చకోరకము.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెల చూచి తృప్తి పొందునది.

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచి గుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁ జేరవే
చలువగలట్టివాడయినఁజందురు నెంతయుఁ గోరి, భాస్కరా.
తా.
చంద్రుని యందలి చల్లదనమునకు, (చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక)ఆ కిరణములను భక్షించుటకు ఎక్కువ ఆసక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే బుద్ధిమంతులు రాజు(నృపాలుఁడు - రాజు) మంచివాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను, సంతోషముతో నట్టిరాజునే కోరుదురు.

మధువు - 1.నీరు, 2.పాలు, 3.తేనె(నననీరు - మకరందము, తేనె.), 4.కల్లు, 5.వసంతర్తువు, 6.చైత్రమాసము.
నీరు -
1.నీరము, జలము(నీరము - జలము), 2.మూత్రము, సం.నీరమ్.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జడము - నీళ్ళు(నీళ్ళు - నీరు), రూ.జలము, విణ.తెలివిలేనిది.

మూత్రము - ఉచ్చ, కాలుమడి.
ఉచ్ఛ(ౘ) -
మూత్రము.
ఉచ్చబుడ్డ - మూత్రాశయము.

ఉచ్చమల్లి - 1.దిసమొల స్త్రీ, నగ్నిక, 2.రోత పుట్టించు స్త్రీ.
నగ్నిక -
1.కన్య, 2.దిసమొల ఆడది, రూ.నగ్నా.
దిసమొల(బిత్తల - దిసమొల) - నగ్నత్వము, రూ.దిస్సమొల.

స్త్రీ నగ్నికా కోటవీ స్యాత్ :
నజతే నగ్ని కా. ఓనజీ వ్రీడే. - లజ్జించునది.
కుటేన కౌటిలేన వేతి యాతీతి కోటవీ. సీ. వీ గతిప్రజనన కాంత్యసన ఖాదనేషు. - కౌటిల్యము చేత పోవునది. ఈ రెండు 2 దిసమొలతో నుండు స్త్రీ పేర్లు.

నాగ్నింముఖే నోపథ మే నగ్నాం నేక్షేతచ స్త్రీయం|
నామేధ్యం ప్రక్షి పేదగ్నౌ నచపాదౌ ప్రతాపయేత్ ||
తా.
అగ్నిని నోటిచే నూదరాదు, దిగంబరియైయున్న(వివస్త్రయైయున్న) స్త్రీని జూడరాదు, అపిశుద్ధమైన వస్తువు అగ్నియందు వేయరాదు, అడుగులను గాచుకొన గూడదు. - నీతిశాస్త్రము

పయస్వినీ - 1.ఆవు, 2.ఏరు, వ్యు.పాలు లేక నీరు కలది.
పయస్సు -
1.క్షీరము, 2.నీరు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
నీళ్ళు - నీరు; నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
పేయము - 1.నీళ్ళు, 2.పాలు, విణ.త్రాపదగినది.  
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది. 

క్షీరదము - (జీవ.) క్షీరగ్రంథులు గల జంతువు, పాలిచ్చు జంతువు (Mammal).
క్షీరకంఠుఁడు - బాలకుడు.

పోసనము - 1.క్షీరము, 2.పైపూత, 3.కాంతి.

పాలను కలిసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా
బాలచని జెరచుగావున  
బాలిసుడగు వానిపొందు వలదుర సుమతీ.
  
తా. తెలివిహీనుల(బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.) స్నేహంవల్ల తమకున్న తెలివితేటలుకూడ హరించి పోవును, ఎట్లనగా మంచిపాలు అందులో కలిసిన జలమువల్ల తమ రుచిని కోల్పోవుచున్నవి కదా! కావున దుష్టసాంగత్యం పనికిరాదని భావం. 

క్షీరాబ్ధి లోపల క్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ...

భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తుఁడు - భక్తి గలవాడు.

క్షీరాన్నము - పరమాన్నము.
పారలౌకికము -
పాయసము, పరమాన్నము, విణ.పరలోక సంబంధమైనది.
పాయసము - పరమాన్నము, వ్యు.పయస్సుతో వండినది; పాసెము, సం.వి. (రసా.) (Emulsion) ఒక ద్రవమును ఇంకొక దానితో కొల్లోయిడ్ స్థితిని పొందునట్లు చేయబడిన అవలంబితము  (Suspension). 

మాధవి - 1.పూల గురివెంద, 2.కల్లు, 3.తేనె, 4.లక్ష్మి, 5.కుంటెనకత్తె.
వాసంతి -
అడవి మొల్ల, పూలగురివెంద.
ముక్కు నలుపు - ఒడలంతా ఎరుపు - గురివిందగింజ.

అంబిష్ట - 1.(వృక్ష.) 1.అడవిమొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి. 

అతిముక్తము - మాధవీలత, పువ్వుల గురివెంద, విణ. విముక్తి పొందినది.  

కల్లు1- 1.బండికన్ను(చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.  
మదిర - కల్లు; మదురువు - 1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.

మాధ్వి - 1.మద్యము, 2.మకరందము.
మధూళి -
1.కల్లు, 2.పూదేనె. పూఁదేనియ - మకరందము.
కమ్మనీరు - పూదేనె, మకరందము. మకరందము - పుష్పరసము, మరందము. పుష్పరసము - మకరందము.

కౌసుమము - 1.పూదేనె, 2.పుప్పొడి, విణ.కుసుమ సంబంధమైనది.  

                                                                 

ఐరేయము - 1.కల్లు, సుర, 2.నూగుదోస, విణ.అన్నముతో సంబంధించినది.
బలేయము -
1.నూగుదోస, 2.ఒక పరిమళద్రవ్యము.
కూతురుబుడమ - నూగుదోసకాయ.

సుర1 - 1.గాలిసుడి, 2.గాలి.
సుర2 - కల్లు, పెద్ద.
సురోదము - కల్లు సముద్రము.

సురగాలి - సుడిగాలి.
సుడిగాలి - వాత్య (భూగో.) మిక్కిలి వేగముతో గుండ్రముగా గిరగిర తిరిగెడు గాలి.
సుడిగొట్టు - గాలి.
సుడి - 1.జలావర్తము, నీటిసుడి, 2.రోమావర్తము, వెండ్రుకలసుడి, 3.అనిలావర్తము, గాలిసుడి.

మాధురి - 1.మాధుర్యము, 2.కల్లు.
మాధుర్యము -
1.తీపు, 2.పక్షులు మొ. నవి వచ్చుటకు బోయ వేయు ఈల, 3.శృంగారచేష్ట.      
తీపు - 1.మాధుర్యము, 2.గుంజెడుబాధ. 

కాదంబిని  - మేఘపంక్తి. ఆగడపలు - 1.మెట్లవలె ఏర్పడిన మబ్బు తునకల వరుసలు, 2.మేఘపంక్తి.   

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురి కన్ను, 3.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రనాదులయందలి రంధ్రము.
నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
నేత్రపర్వము - కనులపండువు.

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు -
1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు. (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దృష్టించు - క్రి.చూచు. దృష్టము - చూడదగినది.
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగ్రుడ్డునకు సంబంధించినది (Optic).  
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve).

దిదృక్ష - చూడవలెనన్న కోరిక.
దిదృక్షువు - చూడనిచ్చగలవాడు.

చక్షువు - కన్ను.
చాక్షుషము -
(భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్డివాడు, 3.మంచికన్నులు కలవాడు.

నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'A' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి, (Kerophthalmia.) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డి యగును).
బాహ్యత్వచాజాడ్యము - (గృహ.) కాచబింబము(Cornea) మెత్తనగు వ్యాధి, ఆహారములో వైటమిన్ "A", తక్కువైన ఈ వ్యాధి కలుగును.    కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).

కుసుమాసవము - తేనె, మధువు.
తెనియ -
మధువు, రూ.తేనె.
తేనెదిండి - తుమ్మెద; తుమ్మెద - భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెదకు కంటు గల్గించునది.

కురుళము - ముంగురులు.
కురులు -
ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
ముంగురులు - (ముందు+కురులు) నొసటిపైన గునిసి యాడెడు ఉంగరపు వెండ్రుకలు. 

భ్రామరి - పార్వతి.
భ్రమరాంబ -
అంబ, పార్వతి.

మధుకరము -  1.భిక్షాన్నము, 2.తుమ్మెద.
మధుపము -
తుమ్మెద.
మధులిహము - మధుపము, తుమ్మెద.

భ్రువౌ భుగ్నే కించి-ద్భువన భయభంగ వ్యసనిని!
త్వదీయే నేత్రాభ్యాం - మధుకరరుచిభ్యాం ధృత గుణమ్|
ధను ర్మన్యే సవ్యే-తర - కరగృహీతం రతిపతేః 
ప్రకోష్ఠే ముష్టౌ చ - స్థగయతి నిగూఢాన్తర ముమే|| - 47శ్లో
 
తా. ఉమే! ఓ  ఉమాదేవీ! జగముల(భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.)భయమును దొలగించ నాసక్తిగల తల్లీ! కొంచెము వంపుగ నున్న నీ కనుబొమ్మలు, తుమ్మెదల వలె ప్రకాశించు నీ కనులు - ముడి బడిన నీ కనుబొమల జంట - నారిని పట్టుకొన్న(గృహీతము - 1.గ్రహింప బడినది, 2.స్వీకరింపబడినది, 3.తెలిసికొన బడినది,4.ధరింపబడినది.)యగు మన్మథుని కుడిచేతియందలి(ప్రకోష్టము - 1.తొట్టికట్టు, 2.ముంజేయి.)ముంజెయి పిడికిలిని కప్పబడినదిగా  చూచుటకు(నిగూఢము - రహస్యమైనది, తెలియనిది.)కనుపింపని మధ్యభాగము(నారి - అల్లెత్రాడు, వై.వి.నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.)గల ధనుస్సుగ తలచు చున్నాను. దేవి కనులు మన్మథుని(రతీదేవి భర్తయైన మన్మథుడు)కుడిచేతియందలి ధనుస్సువలె ప్రకాశించు చున్న వనుట. – సౌందర్యలహరి 

                                                                 

కాదంబరి - 1.కల్లు, 2.ఆడుకోయిల, 3.ఆడుగోరువంక, 4.బాణ విరచిన కాదంబరీ కావ్యము, 5.సరస్వతి.
కల్లు1 -1.బండికన్ను (చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.

మద్యమ్ లోపలికి పోయి, వివేకాన్ని బయటకి తరిమి వేస్తుంది. - థామస్ బేకన్(1512-1567)

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

కలహంస - 1.కాదంబము, ధూమ్ర వర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.
కాదంబము - 1.మధురముగ కూయు హంస, ధూమ్రవర్ణము లైన ముక్కు, కాళ్ళు, ఱెక్కలుగల హంస, కలహంస, 2.బాణము.

సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.
పలుకుఁజెలి -
సరస్వతి.

కాదమ్బః కలహంస స్స్యాత్ :
కదంబస్య స్వసంఘస్య సహచారిత్వాత్ కాదంబః - కదంబమనఁగా తన సమూహము; ఆ సంఘముతోఁ గూడియుండునది.
కలో మధురాస్పుట ధ్వని, తద్వాన్ హంసః కలహంసః - అవ్యక్త మధురధ్వని గల హంస. ఈ రెండు 2 ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు గలిగిన హంస పేర్లు.

రాజహంస - 1.రాయంచ, 2.ఎఱ్ఱని ముక్కు కాళ్ళుగల హంస, 3.మధురముగ బలుకు హంస.
ధార్తరాష్ట్రము - 1.నల్లని ముక్కు కాళ్ళు గల హంస.

నిత్యానంద రసాలయం, సురముని స్వాంతాంబు జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ సేవితం కలుషహృత్సద్వా సనావిష్కృతం|
శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసా వతంస! స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి|| - 48 
తా.
ఓ మానస రాజహంసా! బ్రహ్మానంద జలాలకు స్థానమైనదీ, సుర మున్యాదుల మనస్సరోజాలకు నిలయ మైనదీ, నిర్మలమైనదీ, సద్బ్రాహ్మణ సేవితమైనదీ, పాపాలను రూపు మాపేదీ, జన్మాంతర సుకృతాలను ప్రకాశింప జేసేదీ, సుస్థిరమైనదీ అయి(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.) భగద్ధ్యానమనే సరస్సునే ఆశ్రయంచుము. నీచులను(క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.) ఆశ్రయించడమన్న మురికి కాల్వలను ఆశ్రయించాలని ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? - శివానందలహరి

కుసుమాకరము - 1.వసంతర్తువు, 2.తోట.
తోఁట -
1.ఉపవనము, 2.ఆశ్రమము.
ఉపవనము - పెంచినతోట, ఉద్యానము, అవ్య. వనసమీపమున.
ఉద్యానవనము - రమణీయములగు అనేక విధములైన చెట్లు, లతలు, గుల్మములు అందముగ నమర్చి పెంచుతోట (Garden).
ఉద్యానము - 1.(రాజుల) విహారార్థమైన తోట, 2.విహారము కొరకు వెడలుట, 3.ప్రయోజనము(ఉద్దేశ్యము, కారణము (Motive).
వనాన్ని ఒకరెవరో పుట్టిస్తే మిగతావారు దానిని పెంచి పెద్ద చేస్తారు. 

పూర్తము - నూతిని, చెరువును త్రవ్వించుట,  గుడి కట్టించుట, తోట నిర్మించుట, అన్నము పెట్టుట, విణ.నింపబడినది.

తోఁట సేద్యము - (వృక్ష.) ఎక్కువ నీరు నిలువకుండ తగుమాత్రము నీరు పెట్టి పైరులను సాగుచేయు పద్ధతి. దీనికి అనుకూలముగా నుండు నేలలు ' తోటనేలలు ' అనబడును, (Garden cultivation).  

సహకారము - వ్యష్ఠి, సమిష్టి బాధ్యతలను గుర్తెరిగి వ్యక్తులు సంఘముగా చేరి పరస్పర సాహాయ్యక భావముతో పనిచేయుట, సం.వి.తియ్యమామిడి చెట్టు.

సుకుమారమైన మామిడి పండును గోరెడి చిలుక యిష్టముతో వుమ్మెత్త కాయ తినునా?

వృక్షవాటిక - 1.ధనికుల గృహముల యందలి ఉపవనము, 2.చిన్నతోట.
వనమహోత్సవము - (వ్యవ.) చెట్ల పండుగ. సంవత్సరమున కొకసారి క్రొత్త వృక్షములను నాటు పండుగ. (ఇది మన దేశములో ఇటీవల సుమారు 15 ఏండ్ల నుండి ఆచారములోనికి తీసుకొని రాబడినది, వనములను పెంచుటకై వృక్షములు నాటు ఉత్సవము.) ఈ ఉత్సవము భారతదేశములో మొదటిసారిగా శ్రీ కనయ్యాలాల్ మున్షీచే క్రీ.శ. 1950లో ప్రారంభించబడెను.  

కృషితోనాస్తి దుర్భిక్షం జపతోనాస్తి పాతకం|
మౌనేన కలహంనాస్తి నాస్తిజాగరతో భయమ్||
తా. కృషి చేసుకొనువానికి కఱవులేదు, జపము జేసికొనువానికి పాపము(పాతకం - మహాపాపము (పంచ మ హా పాతకములు: స్వర్ణపేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము). లేదు, మౌనముతో నున్నవానికి కలహములేదు, మేల్కొని యున్నవానికి భయములేదు. - నీతిశాస్త్రము 

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః|
పరర్థిః పరమస్పటః తుష్టః పుష్ట శ్శుభేక్షణః||
 

వసంతము - 1.చైత్ర వైశాఖ మాసములు, 2.ఒకానొక రాగము, వి. పసుపును సున్నమును కలిపిన యెఱ్ఱనీళ్ళు.
లాక్షారసము -
పారాణి.

వసన్తే పుష్పసమయ స్సురభిః :
వసతి కామో స్నిన్నితి వసంతః. వసనివాసే. - దీనియందు మన్మథుఁడు వసించును.
వసంతి సుఖం యథాతథా అస్మిన్నితి వసంతః. - దీని యందు జనులు సుఖముగా నుందురు.
పుషాణాం సమయః కాలః పుష్ప సమయః - పుష్పము పూచెడు కాలము.
సుష్ఠురభంతే హృష్యంత్యత్రేతి సురభిః. ఇ-పు. రభరాభ్యసే. - దీనియందు జనులు లెస్సఁగా సంతోషింతురు.
సుష్ఠు రభంతే ఉపక్రమంతే శుభకార్యం కర్తుమితి సురభిః. - దీనియందు జనులు శుభకార్యముఁ జేయ నారంభింతురు. ఈ మూడు 3 చైత్ర వైశాఖములతోఁ జేరిన ఋతువు పేర్లు.

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు; మదనుఁడు - మన్మథుడు.

వసంత - Spring, ననకారు, పూల ఋతువు.
ననకారు -
వసంతము; పూల ఋతువు.
ననాహత - వసంతకాలము.
నన - 1.పువ్వు, 2.మొగ్గ, 3.చివురు.
ననయు - క్రి.పూచు, చిగురించు.
ననుచు - క్రి.1.పూచు చిగురించు, 2.మొగ్గతొడుగు, 3.అతిశయించు, 4.అనురాగ మందు, 5.ఇంపగు, రూ.నవయు.
ననవిలుకాఁడు - మన్మథుడు, రూ.ననవిలుతుఁడు. 

సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు.
వేలుపు -
1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు.
విచక్షణుఁడు - విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.
ౘదువరి - విద్వాంసుడు.
బుధుఁడు-1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. 

పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.
ప్రసూనము -
1.పువ్వు, 2.ఫలము.
కుసుమము - 1.పూవు, 2.నేత్రరోగము, 3.స్త్రీరజస్సు, 4.పండు.
సుమము - పువ్వు, కుసుమము.  
పువు - పుష్పము, రూ.పువ్వు, సం.పుష్పమ్.

మాల్యము - 1.పుష్పమాలిక, 2.పుష్పము. సీతార్పిత వరమాలిక రామ్|

పుష్పాదికములు - (గృహ.) పుష్పముల కొరకు, రమణీయత కొరకు పెంచబడు మొక్కలు (Flowers and plants) ఉదా. గులాబి, క్రోటనులు మొ.

అలరువిలుకాఁడు - మన్మథుడు.
అలరువిల్తుఁడు - మన్మథుడు.
అలరు - క్రి.1.వికసించు, 2.సంతోషించు, 3.శోభిల్లు, 4.ఒప్పు, కలుగు, వి.1.పుష్పము, 2.సంతోషము, 3.శోభ.
అలరుఁబోఁడి - పుష్పమువలె మనోజ్ఞురాలగు స్త్రీ, రూ.అలరుఁబోణి.
ననఁబోడి - అలరుబోడి.

నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవు చున్నట్టు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).

విరి - పువ్వు.
విరిఁబోఁడి -
పుష్పమువలె మనోజ్ఞమైన స్త్రీ.
పువుఁబోఁడి - అందకత్తె, రూ.పువ్వుబోడి, పూబోడి.
పువ్వువిలుతుఁడు - మన్మథుడు.
పుష్పశరుఁడు - మన్మథుడు.

పూనీరు - పన్నీరు, సం.పుష్పనీరమ్.
పన్నీరు -
చల్లనినీరు, సం.పన్నీరమ్.

"అహింసా ప్రథమం పుష్పం – పుష్పమింద్రియనిగ్రహః
సర్వభూతదయా పుష్పం - క్షమా పుష్పం విశేషతః
శాంతిః పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తథైవ చ
సత్య మష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్"
  - ఈ పరిశుద్ధ పుష్పములు ఎమినిటియు కలిగి యుండుటయే పరమేశ్వరికి పుష్పపూజ యగును. 

పువ్వులను ఎవరు - పూయమన్నారు? పువ్వులకు రంగులు - ఎవరు వేశారు? అంతటా సుగంధాలను - ఎవరు నింపమన్నారు?

పల్లవము - 1.చిగురు, 2.చిగిరించిన కొమ్మ, 3.కోక చెరగు, 4.విరివి.
చిగురు -
1.పల్లవము, విణ.లేత, రూ.చిగురు.
ప్రబలము - చిగురు విణ. మిక్కిలి బలముగలది.  

మామిడి చిగురుటాకులను నమలెడు కొయిల జిల్లేడు కొనలను నోట కొరుకునా?

చిగురాకుదిండి - కోయిల, పల్లవఖాది.
చిగురు -
1.పల్లవము, విణ.లేత, రూ.చివురు.
పల్లవము - 1.చిగురు, 2.చిగురించిన కొమ్మ, 3.కోకచెరగు, 4.విరివి.
పల్ల - పాటల (కపిల) వర్ణము గలది, సం.పాటలః. పుండ్రవర్ధనము నందు దేవిస్థానం పాటల|

లేఁత - 1.లేతది, 2.చులకన, 3.సుకుమారము.
వామనము -
లేతది.
ఎల - 1.లేతది, 2.స్వల్పము, 3.యౌవనము గలది, 4.సాక్షియైనది.
ఎలనాఁగ - 1.యౌవనవతి, 2.స్త్రీ.

లలిత సహకార పల్లవ,
కలితాస్వాదన కషాయ కంఠ విరాజ
త్కలకంఠ పంచమ స్వర,   
కలనాదము లుల్లసిల్లఁ గడు రమ్యములై.
భా||
లేతలేత తియ్యమామిడి చిగుళ్ళను తెగమెక్కి వగరెక్కి పొగరెక్కిన గొంతులతో కోయిలలు ఎంతో రమ్యంగా అవ్యక్త మధురంగా, పంచమ స్వరంతో కూస్తూ ఉన్నంతచేత చక్కగా ఆ వనం(వన్యము - వనము నందు బుట్టినది.)ఒప్పుతున్నది.

మామిడి చివిళ్ళు నోమియోమి
గొంతు సవరించి కీలించి వంతగించి
పాటపాడెడి పిల్లల పలుకు కులుకు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

పుష్ప సమయము - వసంత ఋతువు
పూదఱి -
వి.పుష్పసమయము, వసంతఋతువు.
ఋతుపతి - వసంతర్తువు, king of seasons.

పుష్పవంతులు - సూర్యచంద్రులు.

మదనము - 1.ఆమని, వసంతకాలము, 2.ఉమ్మెత్త.
ఆమని -
1.వసంతఋతువు, వసంతుడు, 2.ఫలసమృద్ధి, విణ.1.మిక్కుటము, 2.తృప్తికరము, క్రి.విణ.1.మిక్కుటముగా, 2.తృప్తికరముగా.

ఆమని పాడవే కోయిలా మూగవైపోకు ఈవేళ... సుకుమారమైన మామిడి పండును గోరెడి చిలుక యిష్టముతో వుమ్మెత్త కాయ తినునా?

మిక్కటము - మిక్కిలి, అతిశయము, రూ.మిక్కుటము.
తుష్టి -
1.తృప్తి, 2.సంతొషము. 

ననుపు - 1.అనురాగము, 2.అతిశయము, 3.ఇంపు.
ననుపుకత్తె -
ప్రియురాలు, విటి.
ననుపుకాఁడు - ప్రియుడు, విటుడు.
ననువుపడు - క్రి.పొత్తు కలుగు.

వసంతదారువు - (వృక్ష.) కాండములో వసంత కాలమున ఉత్పత్తియైన దారువు (Spring wood).

వసంతం యౌవనంవృక్షాః పురుషా ధనయౌవనమ్|
సౌభాగ్యం యౌవనానార్యో యౌవనావిద్యయా బుధాః||
తా.
వృక్షములకు వసంత ఋతువు యౌవనము, పురుషులకు ధనము యౌవనము, స్త్రీలకు భాగ్యమే యౌవనము, పండితులకు విద్యయే యౌవనము. - నీతిశాస్త్రము

సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
కామధేనువు -
వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు.
సురగలి - కామధేనువు; కామదుఘ - కామధేనువు.
తెలిమొదవు - కామధేనువు(మొదవు - పాడియావు).
వెలిగిడ్డి - కామధేనువు; ఈవులమొదవు - కామధేనువు.

సురభిశబ్దము ఆవునకు పేరగునపుడు సీ. చకారమువలన వసంత ఋతువునకు పేరైనపుడు పు. మంచి పరిమళము గలిగినదానికిని, మనోహరమైన దానికిని పేరైనపుడు త్రి. కామధేనువునకు పేరైనపుడు సీ. సుష్ఠు రభత ఇతి సురభిః. రభ రాభస్యే, మిక్కిలి వేగిరపడునది. "సురభి ర్నా జాతిఫలే వసంతే చంపకద్రుమే, సల్లక్యాం స్త్రీ మాతృభేదే మనోజ్ఞేతు విశేవ్యవ"దితి శేషః.

ఆవు - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.

చాంపేయము - 1.బంగారము, 2.సంపెంగ. 
జాతరూపము -
బంగారము; అష్టాపదము - బంగారము.
కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
హేమము - 1.బంగారు, 2.ఉమెత్త.
తపనీయము - బంగారు.  
క్షౌద్రము - 1.తేనె, 2.ఉదకము, 3.సంపెంగ.
చంపకము - సంపెంగ, సంపెగ.
సంపగియ - చంపకము, రూ.సంపగి, సంపెంగ, సంపగి, సం.చంపకః.
తేనెదిండి - తుమ్మెద.
తుమ్మెద కంటు - సంపెంగ, వ్యు.తుమ్మెద కంటు గల్గించునది.

అథ చామ్పేయ శ్చమ్పకో హేమపుష్పః.
చంపాఖ్యదేశే భవః చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చమ్యతే అశిభిరితి చంపకః. చము అదనే. - తుమ్మెదలచే నాస్వాదింపఁ బడునది.
హేమవర్ణం పుష్యమన్యేతి హేమ పుష్పకః - బంగారు వన్నెగల పువ్వులు గలది. ఈ 3 సంపెంగ చెట్టు పేర్లు.

గంధఫలి - సంపెంగ మొగ్గ, రూ.గంధఫలి.

పూనూనె - సంపెంగనూనె.
కమ్మనూనియ -
సంపెంగ, మొ.వి చేర్చి చేసిన తైలము, రూ.కమ్మనూనె. మింగమెతుకులేదు మీసాలకు సంపెంగనూనె అన్నట్లు.

సమూహఫలము - (వృక్ష.) ఒకే పుష్పములోని విభక్తాండ కోశము నుండి తయారైన ఫలసమూహము (Etacrio), ఉదా. సీతాఫలము, సంపంగి. పేర్లు
పుంజఫలము - (వృక్ష.) ఒకేపుష్పము నందు బయలుదేరి, విభక్తకమైన అండాశయము నుండి తయారైన పండు (Aggregate fruit), ఉదా. సీతాఫలము), చూ. సమూహఫలము.

దుర్జనం కాంచనం భేరీ దుష్టస్త్రీ దుష్టవాహ మ్|
ఇక్షుం తిలా నౌషధాకాశ్చ మర్దయేడ్గుణ వృద్ధమ్||
తా.
దుర్జనులను, బంగారమును, భేరిని, దుష్ట స్త్రీని, చెడుగుఱ్ఱమును, చెఱుకుగడలను, నువ్వులను, మందును గుణవృద్ధి కొరకు మర్దింప వలయును. - నీతిశాస్త్రము     

చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచా|
కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా.

ఆర్తనము - 1.వసంతాది ఋతు సంబంధమైనది, 2.స్త్రీ ఋతు సంబంధమైనది, వి.1.స్త్రీ ఋతువు, 2.పువ్వు, 3.ఋతుస్నానమైన పిదప గర్భోత్పత్తికి అనుకూలమైన కాలము. 

ఋతుః స్త్రీకుసుమే పి చ. : ఋతుశబ్దము స్త్రీల రజస్సునకును, వసంతాది ఋతువులకును పేరు. ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ. - పోవునది.

ఋతుఁడు - సూర్యుడు.

ఋతువు - 1.రెండు మాసముల కాలము, 2.గర్భధారణకు యోగ్యకాలము, 3.స్త్రీ రజస్సు, 4.వెలుగు, ప్రకాశము.

ద్వౌద్వౌ మాఘాదిమాసా స్యా దృతుః :
ద్వౌద్వౌ మాఘాదిమాసౌ ఋతురిత్యుచ్యతే. - మాఘము మొదలైన రెండేసి మాసములు ఋతు వనంబడును.
ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ - గతించునది. ఈ రెండు నెలలు ఒక ఋతువు.

రజము - రజస్సు.
రజస్సు -
1.రజోగుణము, 2.దుమ్ము, 3.స్త్రీరజస్సు, 4.పుప్పొడి.
రాజసము - రజోగుణము వలన కలిగినది.

పుష్పపరాగము - (వృక్ష.) పుప్పొడి (Pollen), పరాగ రేణువులు = Pollen grains. 
పరాగము - 1.పుప్పొడి, 2.దుమ్ము.
మధూలిక - పుప్పొడి; పుప్పొడి- (పూ+పొడి) పుష్పములాందలి ధూళి.

కౌసుమము - 1.పూదేనె, 2.పుప్పొడి, విణ.కుసుమ సంబంధమైనది.  

కుసుమ - 1.ఒకరకపుధాన్యము (వడ్లలో పెద్దకుసుమ, చిన్నకుసుమ, గుత్తికుసుమ మొ.వి, 2.(వ్యవ.) గింజలనుండి ' కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower). 

కింజల్కము - ఆకరవు, కేసరము, (వృక్ష.) పుం కేసరము, పుష్పములోని పురుషభాగము, పుప్పొడితిత్తిగల కాడ (Stamen).
కేసరము - 1.ఆకరవు, 2.ఇంగువ, 3.జూలు, 4.పొగడ, 5.పొన్న, రూ.కేశరము.
ఆకరువు - తామరదుద్దుచుట్టు నుండునది, రూ.అకరు, ఆకరు. 

కింజల్క కేసరో (అ)స్త్రియమ్,
కించిజ్జలతి జడీభవతి కింజల్క - ఇంచుకంత జడమైయుండునది.
కే జలే సరతి కేసరః అ. ప్న. సృగతౌ. - జలమందుందునది.
పా, కేసరః, 'ఆందోళిత కుసుమ కేసరే కేసర ' ఇతి వాసవదత్తాయాం, కేశీర్యత ఇతి కేశర, శౄ హింసాయాం. - కొనయందు విడిపోవునది. ఆకరువుపేర్లు.

కేసరదండము - (వృక్ష.) కింజల్కమునకు గల కాడ, శై వలసూత్రము (Filament). 
ఆధారలగ్నము - (వృక్ష.) కింజల్కము యొక్క దండము పుప్పొడి తిత్తి క్రింది భాగమున అంటుకొని యున్న స్థితి (Innate or basefixed).

తేజము - 1.ప్రకాశము, వెలుగు, విణ.బయలు పడినది 2.ప్రభావము(ప్రతాపము, తేజము),3.పరాక్రమము(బలము, శౌర్యము), 4.రేతస్సు రూ.తేజస్సు.

కుసుమాయుధుఁడు - మన్మథుడు.
కుసుమేషుః ఉ-పు కుసుమాన్యేన ఇషవో యస్యసః - పుష్పములే బాణములుగా గలవాఁడు.

కుసుమాయోజనము - (గృహ.) సర్దుకొన లేకపోవుట, అమర్చుకొన లేకపోవుట, అలవడకపోవుట, కలసిమెలసి యుండలేకపోవుట (Maladjustment). 
అలవడు - 1.అభ్యస్తమగు, అబ్బు, 2.పరిమితమగు, 3.కలుగు, 4.శక్యమగు, 5.సిద్ధించు, 6.తగు, 7.కలియు(కలియు - పొందు), 8.ఒప్పు, 9.ఉండు, 10.స్వాధీనమగు.
అమరు - క్రి.1.ఒప్పు, 2.కుదురు, 3.సిద్ధమగు, సిద్ధించు, లభించు, కలుగు, 4.సరిపడు, 5.ఏర్పడు, పొసగు.
పొసఁగు - 1.అనుకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.
పొసఁగుడు - వి.ప్రాప్తి, 2.స్నేహము.  

పూనిన భాగ్యరేక చెడిపోయిన పిమ్మట, నెట్టి మానవుం 
డైనను వానినెవ్వరును ప్రియంబునబల్కరు పిల్వరెచ్చటన్
దానది యెట్లోకో యనిన తథ్యము పుష్పమువాడి వాసనా 
హీనతనొంది యున్నయెడ నెవ్వరు ముట్టదు రయ్య, భాస్కరా.
   
తా. సువాసన గల పూవు(పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.)వాడి తన సువాసనను గోల్పోయి నంతనే దాని నెవ్వరూ ముట్టరు. అట్లే మొదట అదృష్టము గలిగి పిదప అది తొలగిన వానిని ఎవరును మునుపటి వలెనే చూడరు. వానితో సంభాషింపరు. వాడు పిలిచినను పలకరు.

ఫసలు - (వ్యవ.) 1.పంట, 2.ఋతువు, 3.కాలము, 4.జరుగుచున్న సంవత్సరము.
ఫలము -
1.పండు, 2.పంట, 3.ప్రయోజనము, 4.లాభము, వి.(రసా.) భౌతిక రసాయనిక ప్రక్రియల యొక్క పర్యవసానము (Effect), వి.(గణి.) కొన్ని రాసులపై గనితశాస్త్ర విధానముల నుపయోగించిన లభించు రాశి (Result).
ఫలసాయము - (వ్యావ.) పండినపంట.
ఫలినము - పండ్లుగలది (వృక్షము).

పంటవలఁతి - భూమి.
పంట -
1.పండుట, 2.కృషి.
ఫలము - 1.పండు, 2.పంట, 3.ప్రయోజనము, 4.లాభము, వి.(రసా.) భౌతిక రసాయనిక ప్రక్రియల యొక్క పర్యవసానము (Effect), వి.(గణి.) కొన్ని రాసులపై గణితశాస్త్ర విధానముల నుపయోగించిన లభించు రాశి (Result).
ఫలసాయము - (వ్యావ.) పండినపంట. 
కృషి - సేద్యము, వ్యవసాయము.
సేద్యము - కృషి, వ్యవసాయము, సం.సేత్యమ్.

ఋతు స్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః|
ఉగ్ర స్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||

వాసంతము - వసంత సంబంధమైనది, వి.1.ఒంటె, 2.కోయిల, 3.తెమ్మెర.
ఒంటె -
ఒంటియ.
ఒంటియ - ఉష్ట్రము, మహాంగము, లొట్టుపిట్ట, రూ.ఒంటె.
ఉష్ట్రము - ఒంటె, వ్యు.ఎల్లప్పుడును ఎండచే తపింపబడునది.
మహాంగము - 1.లొట్టిపిట్ట, 2.పందికొక్కు.
లొటిపిట - లొటిపిట్ట, లొట్టిపిట, లొట్టిపిట్ట.
కొక్కు - పందికొక్కు; కొక్కురౌతు - వినాయకుడు.
పందికొక్కు - మూషికము; ఎలుక - మూషికము.
మూషికము - 1.ఎలుక, 2.పందికొక్కు.
అఖువు - ఎలుక, పందికొక్కు.
అఖువాహనుఁడు - వినాయకుడు, వ్యు.ఎలుక వాహనముగా గలవాడు.

కానకచేరఁబో దలతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినన్
దా నదినమ్మి వానికడ డాయఁగబోయిన హానివచ్చున
చ్చోనదియెట్లనన్ గొరుకచూపుచు నొడ్డనబోను మేలుగా
బోనవి కానకాసపడిపోవుచుఁ గూలదెకొక్కు, భాస్కరా.
తా.
బోనులోని యాహారమును చూచి అది ఒక బోననియు, తనకక్కడ పోయినచో ఆపద కలుగుననియు తెలిసి కొనక, పందికొక్కు అందలి యెరకైనేగి యందు చిక్కుకొని మృతి నొందును. అట్లే, దుర్మార్గుల మోసమును తెలిసి కొనక వారాచరించు పను లన్నియు మంచివే యని తలచి, వారి యొద్దఁ జేరినచో యాపద కలుగుట నిశ్చయము.

కోకిలము - కోయిల.
పరితము -
కోయిల, సం.పరభృత్.
పరభృతము - కోయిల; పికము - కోయిల.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు. 

వనప్రియః పరభృతః కోకిలః పిక ఇత్యపి :
వనం ప్రియమస్య వనప్రియః - వనమే ప్రియముగాఁగలది.
పరైః కాకైః భృతః పరభృతః భృఞ్ భరణే. - పరుల(కాకుల) చేతఁ బెంచఁ బడునది.  
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః. కుక వృక అదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
అపికాయతీతి పికః కైగైశబ్దే. - చాటున నుండి కూయునది. అపిరంతర్ధౌ. ఈ నాలుగు 4 కోయిల పేర్లు.

చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గ ప్రవర్తినీ,
కోకిలా కులచక్రేశా పక్షతిః పఙ్క్తి పావనీ|

కోవెల - గుడి, వై.వి. కోకిలము.
గుడి -
1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.

దేవాలయము - గుడి. ఇంటి కన్నా గుడి పదిలంట!
దేవళము -
దేవాలయము, గుడి, సం.దేవాలయః. 
ప్రాసాదము - 1.దేవాలయము, 2.రాజగృహము.
నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు.
మందిరము - 1.ఇల్లు, 2.పట్టణము, 3.దేవగృహము, 4.దేవపీఠము.
ఇలు - గృహము, రూ.ఇల్లు.  
గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - భార్య. 
నగరము - పట్టణము, రూ.నగరి.  
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమైన ప్రథాననగరము. 
పుటభేదనము - పట్టణము, రూ.పుటభేదము. 

ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి.

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో... దీపముంది.. అదియే దైవం...

గుడిసె - గుండ్రని చిన్న ఆకుటిల్లు, సం.కుటీరః.
ఆకుటిల్లు -
(ఆకు + ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.
పర్ణశాల - ఆకుటిల్లు.

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము -
గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు; తీఁగయిల్లు - పొదరిల్లు. కుడుంగము - పొదరిల్లు.

మంజులము - 1.పాచి, శైవలము, 2.పొదరిల్లు, విణ.ఒప్పిదమైనది.

పరాయణము - 1.ఆశ్రమము, 2.అత్యంతాసక్తి, విణ.అభీష్టమైనది.
ఆశ్రమము -
1.మునుల ఇల్లు, 2.ఆకుటిల్లు, 3.మఠము, 4.బ్రహ్మచర్యాది, 5.పాఠశాల.
ఆకుటిల్లు - (ఆకు+ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల; పర్ణశాల - ఆకుటిల్లు.
మఠము - సన్న్యాసులు మొ.వారుండు చోటు.
పాఠశాల - బడి; బడి - 1.పాఠశాలు, 2.క్రమము, అవ్య.వెంబడి.
బడితోఁటలు - (వ్యవ.) బడిపిల్లలకు ప్రకృతి జ్ఞానము గరపుటకు పాఠశాలల ఆవరణములలో పెంచు తోటలు (School gardens). 

ఆశ్రమములు - 1.బ్రహ్మచర్యము, 2.గార్హస్థ్యము, 3.వానప్రస్థము, 4.సన్న్యాసము.

ఆయతనము - 1.ఇల్లు, 2.ఆశ్రయము, 3.యజ్ఞశాల, 4.దేవాలయము, 5.బౌద్ధాలయము, 6.(భౌతి., రసా.) ఒక వస్తువు యొక్క ఘనపరిమాణము  (ద్రవముల విషయమై 'ఆయతనము' ఘనపరిమాణార్థమున ప్రయోగములో ఉన్నది.) ఒక వస్తువు ఆక్రమించు చోటు, ఒక ద్రవము ఆక్రమించు చోటు (Volume). 

కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు కలది.
కెంపు -
1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.

కోకిలా స్వరోరూపం పాతివ్రత్యస్తు యోషితామ్|
విద్యారూపం విరూపాణాం క్షమారూప తపస్వి నామ్||
తా.
కోకిలకు(కోయిలేమో నల్లనిది)స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము(పాతివ్రత్యము - పతివ్రత యొక్క శీలము), కురూపునకు విద్యయే రూపము, యతులకు(కర్మంది - యతి) శాంతమే రూపము. - నీతిశాస్త్రము

మాసరమయ్యె నంత మధు మాసము పాంథ విలాసినీ జన
త్రాసము పుష్పబాణ నవరాజ్య విలాసము వల్లరే వధూ
హాసము మత్త కోకిల సమంచిత పంచమ నాదమం జిరు
వ్యాసము జీవలోక హృదయంగమ సౌఖ్య వికాసమెంతయున్. - పశుపతి నాగనాథ కవి(సంస్కృతకవి) క్ర్రి.శ. 1369

పరభృతము - కోయిల.
కాకపుష్ఠము -
కోయిల, వ్యు.కాకిచే పోషింపబడినది.
కాకము - కాకి, వాయసము. 
కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకపిక న్యాయము - కోయిల కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము. 

పంచమము - 1.కోయిల, 2.రాగ విశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.  

పంచమ స్థాయిని సుతారముగా కూసే కోయిలలు, పైకి కాకుల వలె కనిపిస్తాయి. గాని గొంతు విప్పితే వాటి మధురగానం (కోకిల స్వరం) బయటికి వస్తుంది.

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.
కలకంఠము -
1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు.మధురమైన కంఠము కలది.

ధ్వనౌ తు మధురాస్పుటే, కలో :
మధురే శ్రుతిసుఖే, అస్ఫుటే అవ్యక్తాక్షరే ధ్వనౌ కలః - సుఖమై వ్యక్తముగాని వర్ణములు గలిగిన ధ్వని కల మనంబడును.
కం సుఖం లాతీతికలః. లాదానే. - సుఖము నిచ్చునది.
కలో మదః తద్యోగాద్వాకలః. కల మదే. - కల మనఁగా మదము, అది గలిగినది. అవ్యక్తమధుర ధ్వని పేరు.

కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధురస్వరము.
కళ - 1. 8 సెకనుల(8 Seconds) కాలము, 2.చంద్రకళ, 3.ఒకపాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతానతము కాని పదము.
నెలపాలు - చంద్రకళ. చంద్రభాగ యందు దేవిస్థానం కళ|
నెలవీసము -
చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు. మధురమైన కంఠము కలది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని.
కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.

పంచమము - 1.కోయిల, 2.రాగ విశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.

కల2 - స్వప్నము.
స్వప్నము - 1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).   

నిదుర - నిద్ర, కునుకు, కూరుకు, రూ.నిద్దుర.
నిద్దుర - నిదుర , సం. నిద్రా.
నిద్ర - కూరుకు. కూరుకు - నిద్దుర, క్రి.నిద్రించు.
కునుకు - నిద్రచే తూలు, తూగు, కునికి పడు.
తందర - తంద్ర, తూగు, కునికిపాటు, సం.తంద్రాః.
తంద్ర - తూగు, రూ.తంద్రి.
తూఁగు - 1.ఊగు, 2.నిద్రించు, 3.చలించు(తిరుగు), వి.1.ఊగుట, 2.కునికిపాటు. ముచ్చిలిపాటు - కునికిపాటు.
ప్రమీల - 1.కునికిపాటు, 2.మళయాళదేశపు రాణి.

సకలము - 1.సర్వము, 2.కలతో గూడినది.
సర్వము -
(సర్వ.) సమస్తము, అంతయు.
సమస్తము - సర్వము.

నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవాః|
నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః||

కళానిధి - చంద్రుడు.
కళానాం నిధిః కళానిధిః. ఇ. పు. - కళల కునికిపట్టు.
కలాదుఁడు - 1.స్వర్ణకారుడు, కంసాలి, 2.చంద్రుఁడు, 3.గురువు, ఉపాధ్యాయుడు (Jupiter). 

కలా తు షోడశో భాగో :
చంద్రస్య షోడశోభాగోయః సకళేత్యుచ్యతే - చంద్రుని పదియారవ భాగము కళ యనంబడును.
కల్యతే సంఖ్యాయత ఇతి కలా, కలసం ఖ్యానే - లెక్క పెట్టఁబడునది. చంద్రునిలోని పదియాఱవపాలు.

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః|
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా. - 152శ్లో 

షోడశము - పదునారు, విణ.పదునారవది, వి.చనిపోయినవానికి పదునొకండవ దినమునచేయు శ్రాద్ధవిశేషము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.

సూర్యస్య ద్వాదశ కళస్తా - ఇందోః షోడశ స్మృతాః|
దశ వహ్నేః కళాః ప్రోక్తాస్తా - భిర్యుక్తాంస్తు తాన్ స్మరేత్||

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
భాగము -
1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
విషయము - గ్రంథాదులందు దెలియు నంశము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది. 

ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాగల్యము.
భాగ్యము -
అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము,3.భాగ్యము,విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకడు (Venus).

తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
నసలం బెంతైనఁ బెరుగు * నయ్యః కుమారా!
తా.
తాను చేసిన మంచికార్యముల సాయముచేతనే అదృష్టము త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడ్పాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా ? 

చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు, (సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).
చిత్రశ్సిఖండాః చూడావిశేషాః ఏషాం సంతీతి చిత్రశిఖండిన, న. పు. - చిత్రములైన జటా విశేషములుగలవారు. 
చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
అంగిరా ఏవ చిత్రశిఖండీ తస్మాజ్జాతః చిత్రశిఖండిజః - చిత్ర శిఖండి యనఁగా నంగిరస్సు వానికొడుకు.   
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.  
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).  

కాలద్వర కవాటబంధనము, దుష్కాల ప్రమాణ క్రియా
లీలాజాలక చిత్రగుప్త ముఖవల్మీక్రోగ జిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధి, మృత్యుముఖ దంష్ట్రా హర్యవజ్రంబు, ది
క్చేలాలంకృత! నీదు నామ మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!
తా||
ఈశ్వరా! పవిత్రమైన నీ నామము, యముని యింటి ద్వారములను మూసివేయును; జీవుల మరణకాలములను నిర్దేశించు చిత్రగుప్తుని నో రనెడి పుట్టలోని పాములకు గరుడుని వంటిదై అతని యాలోచనల నుపసంహరించును. మృత్యువు కోరలనెడి పర్వతములను గూడ ఛేదించును. (అనగా పుట్టిన తరువాత జనులకు చావురాదని కాదు. నీ నామస్మరణము చేయువారికి ఈ జన్మము తరువాత మరల పుట్టుట, చచ్చుట అనునవి ఉండవని యర్థము.) - ధూర్జటి

చిత్రగుప్తుఁడు - 1.యముడు, 2.యముని యొద్ద లేఖఖుడు.
కంటిపాప -
చిత్రగుప్తుడు.
కంటిపాప - కంటి నల్లగ్రుడ్డులోని చుక్క, (ఈ ద్వారమునకే వెలుగు లోపలికి ప్రవేశించును) (Pupil).
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.
తారకము - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింప చేయునది.   
కనీనిక - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.చిటికెన వ్రేలు.
నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక. 
చిటికెన - 1.చిన్నవ్రేలు(చిటివ్రేలు - చిన్నవ్రేలు), 2.కనిష్ఠిక.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము. 

తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య, 3.వాలిభార్య.
తారాపతి -
చంద్రుడు.

కంటిలోపువ్వు - నల్లగ్రుడ్డు మీద ఏర్పడు తెల్లచుక్క (పువ్వు), వైటమిన్ "A" లోపముచే కలుగు కంటి వ్యాధి (Xero-phthalmia).

యముఁడు - 1.కాలుడు, 2.శని Saturn, వికృ.జముడు.

అత్యాస - మితిమీరిన ఆశ, పేరాస.
లాలూచి - 1.అత్యాశ, 2.నైచ్యము.

ఆతురే నియమో నాస్తి బాలేవృద్ధే తధైవచ |
సదాచార రతౌచైవ హ్యేషధర్మ స్సనాతనః||
తా.
అత్యాశ గలవానికి, బాలునికి, వృద్ధునికి, సదాచార రతునికి వీరలకు వ్రతంబు పనిలేదు. - నీతిశాస్త్రము

మాయ - 1.అవిద్య, 2.ఇంద్ర జాలాదివిద్య, 2.ఒక పట్టణము, వి.(గృహ.) మావి, పిండపుసంచి (Placenta).
అవిద్య -
1.అజ్ఞానము, తత్త్వజ్ఞానము లేమి 2.మాయ. 
అజ్ఞానము - తెలివిలేనితనము.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.  

అథాజ్ఞాన మవిద్యాహంమతిః స్త్రియామ్ :
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము.
విపరీతజ్ఞాన మవిద్యా. విదజ్ఞానే - విపరీత జ్ఞానము అవిద్య. అహమితిబుద్ధిరహం మతిః. సీ. - నే ననేడు స్వతంత్రబుద్ధి అహంమతిః. ఈ మూడు అజ్ఞానము పేర్లు.

అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.

అవిద్య వల్ల బంధం, విద్య(చదువు, జ్ఞానం) వల్ల మోక్షం కలుగుతాయి. విధ్యాధిక్యతకడ వివేకం, అవివేకం గూడ నుండవచ్చును. భేధము లన్నిటినీ అధిగమించునదే విద్య.

'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనగా అవిద్యచే జరా మరణములను లేకుండ చేసికొని, విద్యచే అమృతస్థితిని (మోక్షమును) పొందునని శ్రుతి(వేదము) చెప్పినది.

విద్యావంతులైన ప్రజలను నడిపించడం తేలిక, తోలడం కష్టం; పరిపాలించడం తేలిక, అణగద్రొక్కడం అసాధ్యం. - లార్డ్ బ్రూగం 

ఇంద్రజాలము - 1.కనుకట్టు విద్య, 2.మాయ, 3.మోసగించుట.
కనుకట్తు - కనికట్టు, ఇంద్రజాలము.
కనికట్టు - కండ్ల కగపడకుండ జేయుగారడి, రూ.కనుకట్టు.
మాయము - మాయ, కనికట్టు, కనుకట్టు.
మాయకాఁడు - వంచకుడు, మాయావి.
వంచకుఁడు - మోసకాడు.
మాయావి - మాయదారి, మాయలు కలవాడు, రూ.మాయకుడు, మాయి.
మాడులాఁడు - మాయకాడు.
మాయలాఁడి - స్త్రీ టక్కులాడి.
టక్కులాడి - టక్కులు చేయునది (స్త్రీ).
తక్కులాడి - 1.టక్కులాడి, వన్నెలాడి, 2.మోసకత్తె.

కైలాట -1.మాయ, ఉదా.కల్లగాదిదికైలాట గాదు సుమ్మి, రూ.కైలాటకము.
కైలాటము -
1.మ్రొక్కు నతి, 2.మాయోపాయము, రూ.కయిలాటకము.  

నతి - మ్రొక్కు, వి. (గణి.) వాలుతనము (Slope, inclination).
మొక్కు - క్రి.నమస్కరించు, వి.ముడుపు, రూ.మ్రొక్కు.
ముడుపు - శుభకార్యాదుల ఆరంభమున ధనము ముడిచి మీదు కట్టిన మూట, ముల్లె.
మూట - ముడియ, ముల్లె.
మ్రొక్కుబడి - దేవతలకిచ్చెదనని మ్రొక్కు కొనిని కానుక.
ముల్లియ - మూట, ముడుపు, సం.మూలమ్.
ముల్లియవిప్పు - మూటల దొంగ.

గాయకము - 1.మర్మము, 2.మాయ, వంచన, విణ.1.వంచకము, 2.మిక్కిలి వెలగలది.
మర్మము - జీవస్థానము.
నెరకు - మర్మము, జీవస్థానము, రూ.నెరను.
నెళవు - 1.పరిచయము, 2.మర్మము, రూ.నెలవు.
పరిచయము - 1.ఎరుక, 2.స్నేహము.
నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.
నెళవరి - 1.పరిచయము కలవాడు, 2.మర్మమెరిగినవాడు, రూ.నెలవరి.
నెలవరి - 1.పరిచయము కలవాడు, 2.మర్మజ్ఞుడు.

మారాము - 1.మర్మము, 2.గారాబము, 3.పెంకిపట్టు. 

మతకము - కపటము, మాయ, సం.మంత్రకః.
మతకరి -
మాయావి (మతకము+అరి).
మాయావి - మాయదారి, మాయలు కలవాడు, రూ.మాయకుడు, మాయి.
మాయకాఁడు - వంచకుడు, మాయావి.
మాడులాఁడు - మాయకాడు.    

కపటము - కవుడు, వ్యాజము.
వ్యాజనము -
కపటము, నెపము.
నెపము - 1.వ్యాజము, కారణము, 2.తప్పు, రూ.నెపము, సం.నిభ, త. నిపమ్, క.నెవ, నెవను. నిభము - నెపము, విణ.సమానము.
తప్పు - 1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.

తప్పిదము - దోషము; దోసము - దోషము. 
దొషము -1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.) కొలతలలోని తప్పులు.

చిక్కు - క్రి.కృశించు, 2.తక్కు, 3.తగులు, 4.దొరకు, 5.మిగులు, 6.మెలి, 7.సంకటము.
తనకవి - 1.చిక్కు, 2.చిక్కుపెట్టువాడు.
దొరకు - 1.లభించు, 2.చిక్కు.
మెలి - మెలిక, చిక్కు, సం.మిళితమ్.
మిళితము - 1.మెలిక, 2.పేనబడినది, 3.కలిసినది.
క్షీణించు - క్రి.తరుగు, కృశించు.
క్షీణము - క్షయించినది, కృశించినది.
క్షీణించుట - (గృహ.) 1.శుషించుట, 2.బలహీనమగుట, 3.సన్నగిల్లుట.
కృశము - 1.బక్క, 2.సన్నము, 3.అల్పము.
కృశాంగి - స్త్రీ, విణ.బక్కపలుచని దేహము కలది.

క్షీణోపయుక్తి న్యాయము - న్యా. (అర్థ.) ఒకే వస్తువును అనుభోగించు నపుడు, రానురాను ఆవ్యక్తికిని దానికిని గల ఉపయుక్తి తరుగుచుండు నను న్యాయము.

మాయ గెల్చినవాఁడు నీమాయగాఁడు
మాయ గెల్వనివాఁడు నీమాయ గాఁడు
మాయ గెల్చియు గెల్వనిదే యదేమొ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

గారడము - 1.గరుడదేతాక మైన విషయంత్రము, 2.మాయ, సం.గారుడమ్.
గారడీవాడు - 1.ఇంద్రజాలికుడు, 2.పాములవాడు, గారుడమంత్రము తెలిసినవాడు. 

శాంభరి - 1.మాయ, 2.రతీదేవి.   

మాయాదేవ్యాస్సుతః మాయాదేవీసుత - మాయాదేవి కొడుకు, శాక్యముని.
సర్వార్థసిద్ధుఁడు - శాక్యబుద్ధుడు.

మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ|
మహామాయా మహాసత్త్వా మహాశక్తి ర్మహారతిః||

రతి - 1.రతనాల తూనికయం దొక యెత్తు, 2.మణుగునం దిరువది యైదవ భాగము, సం.వి.1.సురతము, 2.మన్మధుని భార్య, 3.అనురాగము.
సురతము -
స్త్రీపురుషుల కలయిక, రతి. పైసరము - రతి.
రతము - 1.సురతము, 2.సంయోగము.
సంయోగము - కూడిక, సం.వి. (రసా.) 1.రెండు ద్రవ్యముల రాసాయనికముగ నుపయోగించుట (Combination), 2.కొన్ని మూలకముల రసాయన సమ్మేళనమువలన నేర్పడిన పదార్థము (Compound).
కూటము - 1.కూడిక(సంగము - కూడిక), 2.సురతము.
రంతు - రతి, క్రీడ, సం.రతిః.
రంతుకాఁడు - క్రీడాపరుడు.

రతేః పతిః రతిపతిః - రతీదేవికి భర్త, మన్మథుడు.

సంభోగము - 1.మంచిసుఖము, 2.సురతము.
సంభోగించు - 1.కలయు, 2.రమించు(రమించు - క్రీడించు).
సంగమించు - క్రి.కలియు.

సంగమము - కలయిక, సంయోగము, సం. (జం.) రెండు భాగములు, కలిసి యుండుట సామాన్యముగా రెండు ఎముకలు కలిసియుండుట, (Symphysis) సం.వి. (గణి.) ఒకే బిందువుతో రేఖలు కలిసికొనుట (Concurrence).

సంహతి - 1.సమూహము, 2.కలయిక, 3.సత్తువ.
సమ్మేళనము -
కలయిక, సమావేశము.
సమేలము - 1.సమ్మేళనము, 2.ఒద్దిక, చేరిక, సం.సమ్మేళనమ్. సరాగము - ఒద్దిక, సం.విణ. రాగముతో గూడినది.   

సయ్యొద్ద - చేరిక, స్నేహము, రూ.సయ్యోద్ధ.
చేరిక -
1.కూడిక, 2.సమీపము.
సమీపము - చేరువ; చేయలఁతి - సమీపము; సదేశము - సమీపము. 

కొక్కోక మెల్లఁ జదివిన
జక్కనివాడైన రాజచంద్రుండైనన్
మిక్కిలి రొక్కము లీయక
చిక్కుదురా వారకాంత సిద్ధము సుమతీ!
తా.
రతి శాస్త్రమును చదివినవాడైనను, అందగాడైనను(ౘక్కనయ్య - 1.సుందరమైనవాడు, 2.వి.మన్మథుడు.), రాజయినను అధిక ధన మీయనిదే వేశ్య(వారకాంత - వేశ్య)పొందు పొందలడు.

సహస్ర రతి సౌందర్య శరీరాయై నమో నమః

రాగము - 1.అనురాగము, 2.రంగు, 3.మాత్సర్యము, 4.సంగీతమున నాట మొ|| రాగము.
అనురాగము -
అనురక్తి, ప్రేమ, కూర్మి.
అనురక్తి - అనురాగము, ప్రేమ.
రక్తి - అనురాగము; రక్తకుఁడు - అనురాగము గలవాఁడు.
అనురకము - 1.అనురాగము కలది, 2.ఎఱ్ఱనిది, 3.రంగుకలది.
అనురక్త - అనురాగముకలది.
అనురక్తిఁడు - అనురాగము కలవాడు. 

మమకారము - 1.ప్రేమ, 2.నాది యను అభిమానము.
పేరిమి -
1.ప్రేమ, 2.గౌరవము, 3.అతిశయము.
నెనరు - 1.కృతజ్ఞత, 2.ప్రేమము.
కృతజ్ఞుఁడు - చేసినమేలు తలచువాడు.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పదనము, 3.మన్నన.
అతిశయము - అధిక్యము; వలదు - అధిక్యము, అవ్య.వద్దు.

ఆబంధము -1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.  

లలి - 1.ప్రేమము, 2.ఒయారము, 3.క్రమము, 4.ఉత్సాహము.
లలితము - సౌకుమార్యముచే అంగ విన్యాసరూపమగు స్త్రీల శృంగారచేష్ట, విణ.మనోజ్ఞము, ఈప్పిదము.

సరాగము - ఒద్దిక, సం.విణ.రాగముతో గూడినది.
ఒద్దిక -
1.నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము, 2.అనుకూల్యము, పోలిక, 3.వినయము, 4.ప్రతిమానమైన పడి, వస్తువునకు సమానమైన తూకపురాయు.
అనుకూలము - 1.ఇష్టము, 2.సరిపడునది, 3.సహాయమైనది, (వ్యతి.ప్రతికూలము). 
అనుకూల్యము - ఒద్దిక, తగియుండుట, అనుకూలభావము.
అనుగుణ్యము - అనుగుణభావము, తగియుండుట, అనుకూల్యము.
అనురూప్యము - తగియుండుట, (భౌతి.) రెండింటి మధ్యగల అంగప్రత్యంగ సాదృశ్యము (Correspondence). 
పోలిక - సామ్యము. సామ్యము - సమత్వము, పోలిక. వినయము - 1.అడకువ, 2.గురుశిక్ష.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property). 

రాగరజ్జువు - మన్మథుడు. మారుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు -
మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.

అనగ  ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వ.
తా||
తరచుగ పాడుచుండిన కంఠధ్వని మాధుర్యముగా నుండును, ప్రతిదినము తినుచుండిన వేప(వేము-వేపచెట్టు)వేరైనను తియ్యగ నుండును. ప్రయత్నము చేయుచుండిన పనులు నెరవేరును. ఈ ప్రపంచమున పద్ధతులు ఈ విధముగ నుండును.

గాయకము - 1.మర్మము, 2.మాయ, వంచన, విన.1.వంచకము, 2.మిక్కిలి వెలగలది.
మర్మము -
జీవస్థానము, ఆయుస్సు.
ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.
కొఱసంది - ఆయము, జీవస్థానము, మర్మము.
ఆయము1 - 1.జీవస్థానము, ఆయువు పట్టు, 2.మర్మము, సం.అయుః.
ఆయము2 - 1.రాక, 2.లాభము, 3.రాబడి(రాబడి - ఆదాయము), 4.పన్ను.   

ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది - సంవత్సరాది.

ఋతువృత్తి - సంవత్సరము.
సంవత్సరము -
ఏడు; ఏడు - ఆరునొకటి. వత్సరము - ఏడాది.
హాయనము - 1.సంవత్సరము, 2.కిరణము.
కిరణము - వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.
కిరణమాలి - సూర్యుడు; సూర్యుఁడు - వెలుగురేడు.

సప్తకము - ఏడు, విణ.ఏడవది.
సప్తమము -
ఏడవది.
సప్తహస్తుఁడు - అగ్ని.
సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.

చిత్రభానుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు.
చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః, ఉ-పు. - నానావర్ణములైన కిరణములుగలవాఁడు.
చిత్రభాను - అరువది సంవత్సరములలో నొకటి.

సూర్య వహ్నీ చిత్రభానూ :
చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు.
చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః – నానావిధము లైన కిరణములు గలవాఁడు.

విరోచనుఁడు - ప్రహ్లాదుని కొడుకు.
విశేషేణరోచతే ప్రకాశత ఇతి విరోచనః, రుచ దీప్తౌ - విశేషముగాఁ బ్రకాశించువాఁడు.

చన్ద్రాగ్న్యర్కా విరోచనాః,
విరోచనశబ్దము చంద్రునికి, అగ్నికి, సూర్యునికిని పేరు. విరోచత ఇతి విరోచనః రుచ దీప్తౌ. -  ప్రకాశించువాఁడు. "విరోచనో బలేస్తాత" ఇతి శేషః.

విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విభాప్రదైవ వసుద్రవ్యమస్య విభావసుః, ఉ.పు. - కాంతియే ధనముగాఁగలవాఁడు. 

సూర్యవహ్నీ విభావసూ,
విభావసుశబ్దము సూర్యునికి, అగ్నికిని పేరు. విభైవ వసు ధనమ స్యేతి విభావసుః. పు. - ప్రభయే ధనముగాఁ గలవాఁడు. 'విభావసుర్హారభేద ' ఇతి శేషః.

విభవము - సంపద, ఐశ్వర్యము.
విభవతి కార్యసిద్ధౌ సమర్థో భవతీతి విభవః, భూ సత్తాయాం. - కార్యసిద్ధియందు సమర్థమైనది.
విభవ - రెండవ తెలుగు సంవత్సరము.

ప్రభ - 1.వెలుగు, 2.సూర్యునిభార్య, 3.కుబేరుని నగరము.

విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ - చంద్రాదులచేతఁ ప్రకాశించునది.

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ||

శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపశుద్ధుడైన మంత్రి, 3.గ్రీష్మౠతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శోచయతి శుచిః, ఇ. పు. శుచశోచనే - దుఖింపఁ జేయువాఁడు. శుచిత్వాచ్చుచిః - శుచియైనవాఁడు.

నిర్వేదము - 1.దుఃఖము, 2.వైరాగ్యము.
నిర్విణ్ణుఁడు - నిర్వేదము నొందినవాడు.

అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సు లేనివాడు, 2.దుఃఖము నొందినవాడు, 3.ధ్యాన నిమగ్నుడు.

అరతి - 1.విరక్తుడు, 2.సంతోషము లేనివాడు, వి.1.విషయములందు ఇష్టము లేమి, 2.అనురక్తి(అను రక్తి - అనురాగము, ప్రేమ)లేమి , 3.సంతోషము లేమి, 4.బాధ, 4. అరుచిని కలిగించు పిత్తరోగము, 6.క్రోధము, 7.(అలం.) మన్మథావథలు పదింటిలో నారవది (దేని యందు ఇష్టము లేకుండుట).  

మాయువు - పైత్యరోగము. పైత్య వికారము పది విధములు.
పైత్తము -
పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.
పైత్యరసము - (జం.) కాలేయము నుండి ఊరురసము(Bile). (ఇది పిత్తాశయములో నిలువచేయబడును.)

పిత్తము - ఒక ధాతువు (వాత, పిత్త, శ్లేష్మము లనునవి త్రివిధ ధాతువులు.)
పిత్తకోశము -
(గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువచేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కాలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువచేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).

అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు. 
అనిష్టము - 1.ఇష్టముకానిది, 2.యజింప బడనిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.  
విరక్తి - విరాగము, వైరాగ్యము.(Dispassion)
వైరాగ్యము - వేషయేచ్ఛా రహితత్వము, లౌకిక సుఖములం దిచ్ఛలేమి.
వీతరాగి - విరాగుడు, వైరాగ్యము గలవాడు.
వైరాగి - బైరాగి; బైరాగి - విరక్తుడైన తీర్థవాసి, సం.విరాగీ.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
అరుచి - 1.రోత(ఏవగింపు – రోత), 2.నోటికి రుచి కాకుండుట.
క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము. క్రోధము శత్రువు వంటిది.

భగము - 1.ఆడుగురి, 2.సంపత్తి, 3.వైరాగ్యము, 4.తెలివి, 5.వీర్యము, 6.కీర్తి, 7.మహత్త్వము(మహాత్మ్యము - గొప్పతనము).

రాజా రాష్ట్ర కృతంపాపం - రాజపాపం పురోహితః|
భర్తాచ స్త్రీకృత పాపం - శిష్యపాపం గురుర్వ్రజేత్||
తా.
తనదేశమునందలి ప్రజలు చేయు (పాపము - దుష్కృతము, కలుషము.)పాపమును రాజు పొందును. రాజు చేయు పాపమును పురోహితుడు పొందును, పెండ్లాము చేయు పాపమును మగడు పొందును, శిష్యుడు చేయు పాపమును గురువు(గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter)పొందును. - నీతిశాస్త్రము 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్దనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||

    dhanvantari2

1 comment:

  1. చాల విలువైన సమాచారమును శ్రమకోర్చి ఒకచోట పేర్చి కూర్చిన మీ శ్రద్ధాసక్తులకు ధన్యవాదపూర్వక నమస్సులు. భమిడిపాటి వారు పూర్వం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే వారు. మీ అక్షర పద యజ్ఞ చేస్తున్నారు. చాల ఆనందము. కొనసాగింప మనవి.

    ReplyDelete