Monday, January 16, 2017

కుంభరాశి

ధనిష్ఠ 2 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 3 పాదములు - కుంభరాశి, కడవ.

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

బృందము - సమూహము.
బృందారకుఁడు -
వేలుపు, విణ.మనోజ్ఞుఁడు. 

శీతకారు - (వ్యవ.) డిసెంబరు December, జనవరి January నెలలు, జ్యేష్ఠ, మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ అను కార్తెలు, హేమంత ఋతువు (Winter season).
హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశీర్ష, పుష్య మాసములు హేమంతఋతువు.
మంౘుకారు - హేమంత ఋతువు.
కర్తె - సూర్యుడుందు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.

హేమన్తః -
హిమేన హంతీతి హేమతః. హన హింసాగత్యోః - చలిచేత జనులను హింసించునది. మార్గశీర్ష పౌషమాసములతోఁ గూడిన ఋతువు పేరు.

శీత - నాగటిచాలు, రూ.సీత.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ. 

శీతకరుఁడు - చంద్రుడు, చలివెలుగు.
ౘలివెలుఁగు - చంద్రుడు, శీతకిరణుడు.
శీతకిరణుఁడు - చంద్రుడు; శీతాంశుఁడు - చంద్రుడు; శీతభానుఁడు - చంద్రుడు.
శీతమయూఖుఁడు - చంద్రుడు, వ్యు. చల్లని కిరణములు కలవాడు. 
శీతము - 1.చల్లనిది, 2.అలసమైనది.  
శీతలము - చల్లనిది.
శీతలీకిరణము - (భౌతి.) చల్లచేసి తాపక్రమమును తగ్గించుట, (Cooling).

శీతకము - చలికాలము, సం. వి. (రసా.) ద్రవభాష్పములను శీతకరించి ద్రవముగా మార్చుట కుపయోగించు పరికరము, (Condenser), చూ. స్వేదనము.
శీతస్వానము - (జం.) చలనము లేని స్థితిలో చలికామును గడుపుట, (Hibernation).
శీతనగము - హిమాచలము.
శీతమండలము - (భూగో.) ఉత్తరార్థములో అర్కిటిక్ వృత్తములోని ప్రాంతములు, దక్షిణార్థములో అంటార్కిటిక్ వృత్తములోని ప్రాంతములు. ఈ ప్రాంతములలో సూర్యకిరణము లెల్లప్పుడు చాల ఏటవాలుగ ప్రసరించుటచే వేసవి కాలలోకూడ చల్లగనే యుండును. చలికాలములో విపరీతమైన చలిగ నుండును.     

తుహినము - మంచు.
తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.  

ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి.
శైత్యము - 1.చలువ, 2.జలుబు.
ౘలువడి - చలువ.
ౘలువజ్యోతి - చంద్రుడు Moon.  

ఇగము - 1.మంచు, 2.శైత్యము, చల్లదనము, రూ.ఇవము, ఈము, సం.హిమమ్.  

హిమాచల మహావంశ పావనాయై నమో నమః|

గుబ్బదొర - హిమవంతము; ౘలువగట్టు - హిమవంతము. హిమవంతము - చలిమల, హిమాలయము. మంౘుగుబ్బలి - మంచుకొండ.
గుబ్బలివిలుకాఁడు - శివుడు. 

గుబ్బలి - పర్వతము.
గుబ్బ - 1.కుచము(కుచము - చన్ను, స్తనము.), 2.బుడిపి, 3.గొడుగుమీది పొన్ను, 4.పర్వతము, 5.తలుపు గంద పెట్టెల మీద అమర్చిన లోహము ముద్ద, విణ.గుండ్రనిది, సం.కుంభః.

గుబ్బటిలు - క్రి.1.అతిశయించు, 2.ఉప్పొంగు, 3.తిరుగుపడు, 4.పరితపించు, రూ.గుబ్బటిల్లు.
గుబ్బతిలు - క్రి.1.అతిశయించు, 2.ఉప్పొంగు, 3.పరితపించు, 4.మండు, రూ.గుబ్బతిల్లు.

కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి....

గుబ్బెత - గుబ్బలాఁడి.
గుబాలాఁడి - యువతి, రూ.గుబ్బెత.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
ౙవ్వనము - యౌవనము, పదునారేండ్లకుపై ప్రాయము, సం.యౌవనమ్.
యౌవనము - పదియాఱు మొదలు ఏఁబది(16-50)సంవత్సరముల వఱకు గల ప్రాయము, రూ.జవ్వనము.
యౌవనము - యువతీ సమూహము.

కుంభము - 1.కుండ, 2.ఏనుగు నెత్తి మీద గుబ్బ, 3.పదునొకండవ రాశి (Convex - కుంభకార).
కుండ -
1.మట్టిపాత్ర, 2.ఇరుసు తగిలించెడి బండి కంటి నడుమ గుబ్బ, 3. ఏనుగు కుంభస్థలము, 4.స్పోటకపు పొక్కు, సం.కుండమ్.
కుండరాశి - కుంభరాశి Aquarius.

కుమ్భౌ ఘటేభ మూర్ధాంశౌ : కుంభశబ్దము కడవకును, ఏనుగు కుంభస్థలమునకును పేరు.
కుంభతీతి కుంభః. కుభి ఆచ్ఛాదనే. - కప్పియుండునది.
"కుంభస్స్యా త్కుంభకర్ణస్య పుత్రే వారాంగనాపతౌ, రాశిభేదే మానభేదే గుగ్గులు త్రివృతోరపి, కుంభీతు పాటలా వారిపర్ణీ పిఠరకట్ఫలే"ఇతి శేషః.

కుంభాకార - (భౌతి.) గోళకేంద్రమునకు వెలుపల నున్న తలము, విణ.పరావర్తన తలముగా పనిచేయు (దర్పణము) (Convex).

మారకుఁడు - చంపువాడు.
మారకము1 - 1.అంటువ్యాధి, 2.డేగ, వ్యు.చంపునది.
మారకము2 - (అర్థ.) వినియము, ఒక దేశపు ద్రవ్యమునకు మరి యొక దేశపు ద్రవ్యములోగల విలువ.

డేగ - శ్యేనము.
శ్యేనము - డేగ, వ్యు.వేగముగా బోవునది.
డేగకన్ను - నిశితదృష్టి.

అంటువ్యాధి - ఒకరినుండి మరొకరికి (నీరు, గాలిలో నుండు రోగక్రిముల వలన లేక స్పర్శవలన) వ్యాపించు వ్యాధి (విషూచి, మశూచి మొ.)

టీకాలువేయు - (గృహ.) మశూచి రాకుండుటకై దానికి విరుగుడును శరీరము లోనికి ఎక్కించు (Vaccination). 

స్పోటకము - ముశూచికము, అమ్మవారు.
మశూచకము -
(గృహ.)స్పోటకము, అమ్మవారు,(Small pox) (ఇది అంటువ్యాధి, నీటి ద్వారా వ్యాపించును). మశూచిక - స్పోటకము. పోటకము - స్ఫోటకము, పెద్దమ్మవారు, ఒడలెల్ల పోటకత్తి బొబ్బలు లేచు వ్యాధి, సం.స్ఫోటకః.
అమ్మవారు - 1.స్త్రీ దేవత, గ్రామదేవత 2.పూజ్యస్త్రీ, 3.స్పోటకము 4.స్ఫోటకాధిష్ఠాన దేవత.

విషూచి - (గృహ.) పమన విరేచన వ్యాధి (కలరా).
కలరా - (గృహ.) (cholera) వాంతి భేది. (ఇది నీటి ద్వారా వ్యాపించు ప్రాణా పాయకరమైన జాడ్యము.) (Infectious disease).
ధూము - వాంతి భేది జాడ్యము, కలరా.
వమధువు - వమనము, వాంతి.
వమనము - డోకు, వమధువు.
వాంతి - డోకు.
డోఁకు - వాంతి, ఒకర (ఓకలింత), క్రి.ఓకిలించు.
ఓకర - 1.ధ్వనిపూర్వకమగు వాంతి, డోకు, 2.రోత, సం.ఉద్గారః.
ఓకరించు - క్రి.1.ఓకర (డోకు) వచ్చి ఉమియు, 2.అసహ్యించు.
రోఁత - 1.ఏవము, 2.ఎబ్బెరికము.
ఏహ్యము - ఏవము, విన.రోత పుట్టించునది, సం.హేయమ్.
వమనేచ్ఛ - (గృహ.) వికారము, వాంతివచ్చునట్లుండుట(Nausea).

పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరుకాలము ఫిబ్రవరి February, మార్చి March నెలలు, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు, శిశిర ఋతువు.    
పయర- దక్షిణపుగాలి, వాయువు, రూ.పయ్యెర.
పయరగాలి - (భూగో.) వేసవి చలికాలముల యందు అగ్నేయదిశ నుండి సముద్రమునుండి భూమికి వీచుగాలి, (South-east sea breeze). 

కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
కారు2 - వి. 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).

కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.

24. శతభిషము - చూచుటకు విందుగా, వరుసగా 10 నక్షత్రము లుండును. 

శతభిషము - ఒక నక్షత్రము.
నీటిఱేని రిక్క -
శతభిషము (వరుణుడు అధిదేవతగా గలది).

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు.)
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
ఋక్షము - 1.ఎలుగుగొడ్డు, 2.రైవతకాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి. 
ఋక్షరా(ౙ)జు - 1.చంద్రుడు, 2.జాంవంతుడు.
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon, రిక్కరాయుడు. 

క్షత్రస్య రాజా వరుణోధిరాజః | నక్షత్రాణాగ్ం శతభిష గ్వసిష్ఠః | తౌ దేవేభ్యః కృణుతో దీర్ఘమాయుః | శతగ్ం సహస్రా భేషజాని ధత్తః | యజ్ఞన్నో రాజా వరుణ ఉపయాతు | తన్నో విశ్వే అభి సంయంతు దేవాః | తన్నో నక్షత్రగ్ం శతభిష గ్జుషాణమ్ | దీర్ఘమాయుః ప్రతిరద్భేషజాని ||24||    

వరుణము - 1.నీరు, 2.దినము యొక్క నాలుగవ భాగము.

నీటిఱేఁడు - 1.వరుణుడు, 2.సముద్రుడు.
నీటిఱేనిరిక్క - శతభిషము (వరుణుడు అధిదేవతగా గలది.)

క్షత్రము - 1.క్షత్రియకులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.    

మూర్దాభిషిక్తుఁడు - 1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).
మూర్దము - తల.

రాజన్యుఁడు - క్షత్రియుడు.
క్షత్రియుఁడు - రాచవాడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.

రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
రావు - అధిపతి, రాజు, సం.రాజా. యదా రాజా తథా ప్రజ.    

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

అధిపుడు - 1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
నవాబ్ - 1.ప్రభువు, 2.రాజు ప్రతినిధి.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.

నాయకుఁడు - 1.అధిపతి, 2.నాటకమందలి ప్రధానపాత్ర. నాయకులు కావ్య నాటకాదుల యందు నలుగురు, 3.శృంగార రసాలంబన పురుషులు నలుగురు, విణ.శ్రేష్ఠుడు.

విభుఁడు - 1.ప్రభువు, సర్వవ్యాపకుడు, 2.బ్రహ్మ, 3.శివుడు.
పబువు - ప్రభువు, సం.ప్రభుః.
నేత - ప్రభువు.

అధిపుడు - 1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
నవాబ్ - 1.ప్రభువు, 2.రాజు ప్రతినిధి.
అధినేత - నాయకుడు, ముఖ్యుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
అధీశుఁడు - సామంతులచే సేవింపబడు రాజు, ప్రభువు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  

ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.
ఈశుఁడు -
1.శివుడు, 2.ప్రభువు.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈశ్వరి - పార్వతి. 

యద్రూపరాకేశమయూఖమాలా
సురంజితా రాజరమాపి రేజే |
తం రాఘవేంద్రం విభుదేంద్రవంద్యం
శ్రీజానకీజీవనమానతో స్మి  |
 

కుంభము - 1.కుండ, 2.ఏనుగు నెత్తి మీద గుబ్బ, 3.పదునొకండవ రాశి (Convex - కుంభకార).

కుంభాకార - (భౌతి.) గోళకేంద్రమునకు వెలుపల నున్న తలము, విణ.పరావర్తన తలముగా పనిచేయు (దర్పణము) (Convex).

కుంభసంభవుఁడు - 1.అగస్త్యుడు, 2.ద్రోణుడు.
కుంభజుఁడు - 1.అగస్త్యుడు 2.ద్రోణుడు.
ప్రజా పతిర్వై ద్రోణ కలశః.

కలశాబ్ది - పాలసముద్రము.
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.

కలశము - ఘటము, కుండ.
ఘటికారుఁడు - కుమ్మరి.

మఱువకందు- కుంభ సంభవుడు, అగస్త్యుడు.
మఱువ - కుండ. 

కలశస్తు త్రిషు ద్వయోః, ఘటః కుట నిపొ -
కం జలం లాతీతి కలశః, త్రి. లా ఆదానే - ఉదకమును దీసికొనునది.
తాలవ్యంతము, "సుక్షేత్రమివ సకలశాలికం స్నానాగారమ్" అని యాశ్చర్య మంజరియందు. "కలసః కలశో (అ)పి చ" అని దంత్యాంతముగా రభసుఁడు.
ఘటతే జలాహరణాయేతి ఘటః, ప్న. ఘట చేష్టాయాం. - జలహరణము కొఱకు ఘటించునది.
కుటతీతి కుటః, కుట కౌటిల్యే. - కుటిలమైనది.
నితరాం పిబన్త్యనేనేతి నిపః, పా పానే. - దీనిచేత మిక్కిలి పానముసేయుదురు. ఈ 4 కడవ పేర్లు.

మైత్రావరుణి- అగస్త్యుడు, వ్యు.మిత్రావరుణుల వలన గలిగినవాడు.

మైత్రావరుణిః :
అగం వింధ్వం స్త్యాయతి స్తంభయతి త్యగస్త్యః. స్త్యైప్ట్యై శబ్దసంఘాతయోః - అగ మనఁగా పర్వతము వింధ్యపర్వతము, దాని నణఁచినవాఁడు. అగస్తి రితిపాఠాంతరం.
కుంభే సంభవో యస్య సః కుంభసంభవః – కలశమునందుఁ బుట్టినవాఁడు.
మిత్రావరుణయో రపత్యం మైత్రావరుణిః. ఇ. పు. - మిత్రావరుణుల కొడుకు. ఈ మూడు 3 అగస్త్యుని పేర్లు.

సృష్టి మొత్తంలో బరువైనవాడు. - అగస్త్యుడు.

ఘటికారుఁడు - కుమ్మరి.
కలశము - ఘటము, కుండ.
ఘటము - 1.ఎళనీరుకాయ, 2.కడవ, 3.కుంభస్థలము.
ఘటోద్భవుఁడు - అగస్త్యమహర్షి. అగస్త్యానుగ్రహ వర్థిత రామ్| 

ఎళనీరు - ఎడనీరు.
ఎడనీరు - లేతటెంకాయలోని నీరు, రూ.ఎలెనీరు, ఎళనీరు.
ఎలనీరు - లేత టెంకాయలోని నీరు, రూ.ఎడనీరు, ఎళనీరు.

ఱంపు - కలశము, రచ్చ.
రచ్చ -
1.కలకల ధ్వని, 2.గోష్ఠి, 3.కలహము, 4.మండపము, 5.మొగసాల, సం. 6.రాజమార్గము, 7.బాధ.

రచ్చకొట్టము - రాజకూటము, రథ్యాకూటః.

పూర్ణానకము - 1.తప్పెట, 2.పూర్ణపాత్రము.
తప్పట -
ఒక వాద్యవిశేషము, సం.తమ్మటః.
పూర్ణపాత్రము - 1.దోపు, 2.ఉత్సవ సమయమున సంతోషముచే వస్త్రాభరణాదిక నుపహరించుట, 2.వస్తు సంపూర్ణపాత్రము.

ద్రకుమ్భః పూర్ణకుమ్భః :
భద్రార్థం కుంభః భద్రకుంభః - మంగళార్థమైన కుంభము.
పూర్ణశ్చాసౌ కుంభశ్చ పూర్ణకుంభః - పూర్ణమైన కుంభము.
ఈ రెండు రాజద్వారాదులయందుఁ బెట్టఁబడిన పూర్ణ కలశము పేర్లు.

సువర్ణ కుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః|

గుమ్మెట - 1.కుంభవాద్యము, 2.తుడుము, రూ.గుమ్మెత.
తుడుము - 1.తప్పెట, 2.తుటుము, 3.గుంపు.
తుటుము - సమూహము, రూ.తుడుము. సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).

గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.      

సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్|
సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం
భజే శారదాంబా మజస్రం మదంబామ్.

కుంభాభిషేకము - క్రొత్తగా గుడిలో ప్రతిష్ఠించిన విగ్రహముకునకు కుంభము నందు ఉదకము నింపి అభిషేక మొనర్చుట.       

మనసులోన నున్న మమతలన్నియు గోసి
ధృఢము చేసి మనసు తేటపరచి
ఘటము నిల్పువాడు ఘనతర యోగిరా! విశ్వ.

ధీయంత్రేణవచో ఘటేన కవితాకుల్యోప కుల్యాక్రమై
రానీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశి దివ్యా మృత్తైః
హృత్కేదారయుతాశ్చభక్తి కలమాస్సాఫల్య మాతన్వతే
దుర్భిక్షా న్మమసేవకస్య భవన్విశ్వేశ భీతిః కుతః || - 40శ్లో
  
తా|| ఓ పరమాత్మ ! బుద్ధిరూప(ధీ - బుద్ధి)యంత్రంతో, వాగ్రూప ఘటంతో కవిత్వము-అనే కుల్య - 1.కయ్య, 2.నది నుండి త్రవ్విన కాలువ. తీసుకురాబడ్ద సదాశివుడు - శివుడు చరిత్ర అనే అంబోరాశి - సముద్రము లోని దివ్యజలాలతో నాహృదయమనే కేదారము మడిలో ఉన్నట్టి భక్తిరూపమైన కలమము - 1.కలము, 2.వరిపైరు. సత్ఫలాలను పొందు తూన్నది. ఓ జగన్నాథా ! నీ సేవకుడనైన నాకు కరువు వస్తుందన్న భయమే లేదు. - శివానందలహరి                         

కుండగోఁకరి - వంటలవాడు.
కుండ - 1.మట్టిపాత్ర, 2.ఇరుసు తగిలించెడు బండికంటి నడుమ గుబ్బ, 4.స్ఫోటకపుపొక్కు, సం.కుండమ్.    

పిఠరః స్థాల్యుఖా కుణ్డమ్:
పచ్యతే న్నమత్రేతి పిఠరః డు పచ్ ష్ పాకే. - దీనియం దన్నము వండఁబడును.
తిష్ఠన్తి పదార్థా అస్మిన్నితి స్థాలీ. ఈ. సీ. ష్ఠా గతి నివృత్తౌ. - పదార్థములు దీనియందుండును.
ఓఖతీ భోజనస్థానం గచ్ఛతీత్యుఖా. ఉఖ గతౌ. - భోజనస్థానమును బొందునది.
కుణ్డ్యతే స్మిన్నితి కుండం. కుడిదాహే. - దీనియందు వండఁబడును. ఈ నాలుగు 4 కుండ పేర్లు.

పసటి - 1.కుండ, 2.వంటకుండ.     
వెసల - వంటకుండ.

కఠినము - 1.పరుషము, 2.నిష్ఠురము, 3.క్రూరము, వి.వంటకుండ.

నిష్ఠురం పరుషమ్ -
నిష్ఠురము - కఠినము, పరుషము.
నిశితమివ తిష్ఠతీతి పరుషం. ష్ఠా గతినివృత్తౌ. - తీక్షణమైయుండునది.
పరుషము - 1.నిష్ఠురము, 2.నిష్ఠురవాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు.
పివర్తివక్తారమితి పరుషం. వౄ పాలన పూరణయోః - పలికెడు వానిని బూర్ణముగాఁ జేయునది. ఈ 2 కఠినమైన వాక్కు పేర్లు. 

క్రూరము -1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది. అరపూస - గుగ్గిలము (Rosin).
గుగ్గిలము - (వ్యవ.) ధూపద్రవ్యముగ నుపయోగించబడు ఒక పదార్థము (Burseraceae) అను కుటుంబమునకు చెందిన "Boswllia serata" అను చిన్నచెట్టు నుండి స్రవించు జిగురు పదార్థము (Indian balsam).    

స్థాలము - కంచము.
కంచము - భోజన పాత్రము, సం.కంసమ్.

తలియ - భోజనపాత్రము, సం.స్థాలికా.
తళిగ - 1.స్థానము, భోజన పాత్రము, 2.దేవునికి నివేదించు అన్నము, రూ.తళియ, సం.స్థాలికా.

సానిక - మట్టికంచము, మల్ల.
మల్ల -
మట్టికంచము.
మల్లము - మల్ల.

లోవి - వంటకుండ, స్థాలి, పచనపాత్ర.
లోహుండి - వంటకుండ.

స్థాలి - వంటకుండ.
తిష్ఠన్తి పదార్థా అస్మిన్నితి స్థాలీ. ఈ. సీ. ష్ఠా గతి నివృత్తౌ. - పదార్థములు దీనియందుండును.

స్థాలీవులాకన్యాయము - న్యా. ఉడుకుచున్న కుండెడు అన్నమునకు ఒక మెతుకునుబట్టి చూచుటవలె ఒక దానినిబట్టి పూర్ణవిషయ మెరుగుట.

పలుచని హీనమానవుఁడు పాటిఁదలఁపక నిష్ఠురోక్తులన్
బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణ ప్రపూర్ణుడ
ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగనెట్లన వెల్తికుండదాఁ
దొలుఁకుచునుండుఁగాని, మఱితొల్కునె నిండు ఘటంబు భాస్కరా.

తా. వెల్తికుండలోని నీరు తొణకును గాని, నీరు నిండుగా గల ఘటము - 1.ఎళనీరుకాయ, 2.కడవ, 3.ఏనుగుకుంభస్థలము. తొణకదు. అట్లే చులకన తనము గల నీచుడు పాటి - సామ్యము, విణ.సమము. న్యాయము తెలియక కఠినమైన మాటలు మాట్లాడును, సద్గుణములచే ప్రకాశించు బుద్ధిమంతుడు(బుద్ధిమంతుఁడు-బుద్ధికలవాడు)ఆవిధముగా మాట్లాడడు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).

కుంటముక్కు - ఒకానొక చేప.
కుంట - 1.కొలను, 2.పల్లము, రూ.గుంట, సం.కుండమ్.

కుండము - 1.వంటకుండ, 2.గుడిలోని గుంట, 3.నిప్పుల గుండము, 4.కొండ.
కొండము - నిప్పుకుండము, సం.కుండమ్. 

గుండము1 - 1.నిప్పులగుంట, 2.నీటిగుండము, సం.కుండమ్.
గుండము2 - వాసనగల ఒక విధమైన గడ్ది.

గుండ - 1.పల్లము, 2.చెరువు, సం.కుండమ్, మాం. (విశాఖపట్టన ప్రాంతమున) బాలిక.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).

నిమ్నము - పల్లము, విణ.లోతైనది, విణ.(వృక్ష.)అధస్ద్సితము (Inferior).
నిమ్నోన్నత రేఖలు - (భూగో.) సముద్రమునకు పైని ఒకే ఎత్తున ఉన్న ప్రదేశముల నన్నిటిని కలుపు ఊహారేఖలు.

నిమ్నం గభీరం గమ్భీరమ్ :
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.

గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము. మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.

గుండ1 - వస్త్రము.
వస్త్రము - బట్ట, వలువ.
గుండ2 - పొడి, సం.గుండకః.
పొడిశుభ్రత - (గృహ.) ఉన్ని, పట్టు మొదలగు రంగు దుస్తులను నీరు ఉపయోగించకుండ శుభ్రము చేయుట, ఉదా. పెట్రోల్ లేదా సుద్దపొడిచే శుభ్రము చేయుట (Dry-cleaning).

కోక - వలువ, చీర.
వలువ - సన్ననివస్త్రము, బట్ట.
చీర - వస్త్రము (ఇది వాడుకయందు స్త్రీవస్త్రమాత్ర పర్యాయముగ కానబడుచున్నది. నేడు "కోక" అను అర్థమున రూఢము).
పప్పళి - వస్త్రము నందలి చిత్రవర్ణము.

జీబు - 1.ఆడుదానికట్టుకోక, 2.ఆకుల తీగల తరచు, 3.త్రాడులోనగు వాని మీదపీచు. 
జేబు - జీబు, ఆడుదాని కట్టుకోక, హిం.వి.చొక్కాయ సంచి.

ఆతాపి చిల్లౌ -
ఆతతాయి - 1.దుర్మార్గుఁడు, 2.హింసాస్వభావము కలవాడు.
ఆతాపయతి పరజాతీ మిత్యాతాసీ, న. పు. తప సంతాపే. - ఇతర జాతిని తపింపఁ జేయునది, పా, ఆతాయీ, న, పు.
చిల్లకొండి - కలహకారి.
చిల్ల - 1.శల్యము, 2.కతకవృక్షము.
చిల్లయతి శిథిలీకరోతి పరానితి చిల్లః, చిల్ల శైథిల్యే. - ఇతర పక్షులను శిథిలముగా జేయునది. ఈ 2 పిన్న గ్రద్ద పేర్లు, జెముడు కాకి, చీరపిట్టయు.

భండుఁడు - 1.ఆకతాయి, 2.దుశ్చేష్టుడు.
బండగుఁడు - బండడు, ఆకతాయి, సం.భండః.
ఆకతాయి - తుంటరి, దుష్టుడు, సం.ఆకతాయీ.

బండ - 1.వెడల్పగురాయి, 2.పొట్టి రోకలి, వై.వి.ఘోరకృత్యములచే బిచ్చమెత్తెడు ఒక నీచ జాతి, రూ.బండడు, సం.భండః, విణ.అరిగినది.

ఆగడకాఁడు - (ఆగడము + కాడు) అకార్యముల చేయువాడు, దుండగీడు, దుష్ఠుడు.
ఆగడీఁడు - అకార్యము చేయువాడు, దుండగీడు, దుష్టుడు.
దుండగీఁడు - 1.దుష్టుడు, 2.కొంటె.
కొంటె - అకార్యశీలుడు, తులువ.
తులువ - తుంటరి; తుంటరి - దుష్టుడు.  

కాకృత్యము - అకార్యము, చెడ్దపని.

ఆగడము - 1.చెడ్దపని, 2.దుష్కార్య చిహ్నము, 3.దౌష్ట్యము, 4.వంచన, 5.అనాదరము, 6.అన్యాయము, 7.ఉత్పాతము, విణ.1.వంచకుడు, 2.అపరాధి, సం.ఆగస్.       

అవద - పలుగాకి, దుష్టుడు.
పలువ - పలుగాకి; పలుగాకి - దుష్టుడు.

వెంబర - దుష్టుడు.
వెంబరవిత్తు - దుష్టా గ్రేసరుడు.

దొసఁగు - 1.ఆపద, 2.విఘ్నము, 3.పొరబాటు, 4.తప్పు, రూ.దొసవు.
దొసఁగులఁపెట్టు - క్రి.బాధించు, పీడించు.

కీడు - 1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
కీడుపడు - క్రి.1.తక్కువగు, 2.దైన్యపడు, 3.చచ్చు, రూ.కీడ్పడు.

జాడ్యం హ్రీమలిగణ్యతే వ్రతరతే దంభ శ్శుచౌ కై తనం, 
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని| 
తేజస్వి న్యవలి ప్తతా ముఖరతా వక్తవ్య శక్తి స్థిరే,
తత్కోనామగుణో భవేత్సుగుణినాం యా దుర్జనై ర్నాంకితః||

తా. దుర్జనుఁడు సజ్జనుల యందుగల సద్గుణము లను దుర్గుణములుగా నెంచును. అవియెట్లనిన, హ్రీ -సిగ్గు)లజ్జావంతునిజూచి జడుఁడని చెప్పును, వ్రతి - వ్రతము కలవాడు.)వ్రతశీలుని డాంభికుఁ డని చెప్పును, శౌచము - శుచిత్వము గలవానిని కపటుఁడని చెప్పును, శూరుఁడు - సూర్యుడు, విణ.యుద్ధము నకు భయపడనివాడు, ప్రౌఢుడు.)కనికరములేని వాఁడని చెప్పును, యమి - 1.ముని, 2.హంస. తేజస్సుగలవానిని గర్వించు వాఁడని చెప్పును, వక్త - 1.విశేషముగ మాటలాడు వాడు, 2.పండితుడు.)సద్వర్తనుని వాచాలునిగా నెంచును, కావున దుర్జనునికి సకల జనుల యందలి సద్గుణ మొకటియైనను కనుపడదు. – నీతిశాస్త్రము

చరువు - 1.హవ్యము, 2.హవ్యము వండెడికుండ.
హవ్యవాహనుఁడు -
అగ్ని, రూ.హవ్యవహుడు.

ఇగిరిక - 1.హవిస్సు, 2.అత్తెసరు, రూ.ఇగిరిక.
అత్తెసరు -
గంజి వార్చకుండ అన్నములో ఇగిరి పోవునట్లు పెట్టెడు ఎసరు.
ఎసరు - 1.వంటకై కాగబెట్టిన నీరు, అత్తెసరు, 2.కవోష్టజలము, క్రి.మీరు, అతిశయించు.
ఎసలారు - క్రి. అతిశయించు, (ఇంపెసలారు).

దొంతర - పరంపర, దొంతి.
దొంతి -
1.ఒకటి మీద నొకటిగా నుంచిన కుండలులోనగు వానివరుస, 2.వరుస.

అడుకు - క్రి.దింతిగా పేర్చు, వి.1.దొంతి, 2.వెరపు, భయము. 

పల్లెటూళ్ళలోని యువతులు నాలుగైదు కుండలను ఒకదానిమీద ఒకటి దొంతరగా తలమీద పెట్టుకొని నీళ్ళు తెచ్చుకుంటూ దోవలో తమ కష్టసుఖాలు ముచ్చటించు కొంటారు. అయినా, ఆ కుండలనుండి ఒక్క నీటిచుక్క కూడా తొణకదు.

ధర్మమార్గంలో జీవించేవ్యక్తి కూడా అదే విధంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల లోనూ అతడి మనస్సు ధర్మమార్గాన్ని తప్పకుండా చూసుకోవాలి. అందుకోసం అతడు ఎల్లప్పుడూ మెలకువగాను, అప్రమత్తంగానూ ఉండాలి. - శ్రీ రామకృష్ణ పరమహంస   

కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ. 
కతి అయనాని మోక్షమార్గా స్సంతీతి విచారయ తీతి కత్యయనః తస్యగోత్రా పత్యంకాత్యాయనీ - మోక్ష మార్గంబు లెన్నిగలవనీ విచారించువాఁడు కత్యయనుఁడు. ఆ ఋషి గోత్రమందేఁ బుట్టినది.

కాత్యాయన్యర్ధవృద్ధా యా కాషాయవసనాధవా,
యా అర్ధజరతీ కాషాయవసనా విధవాచ సా కాత్యాయనీత్యుచ్యతే - సగము ముదిసి కావిచీరఁ గట్టి విధవయైన స్త్రీ కాత్యాయని యనంబడును.
కత్యస్య ఋషే రపత్యమివ వర్తతే కాత్యాయనీ. సీ. - కత్యుఁడను ఋషి కూఁతురివలె నుండునది.

కావి - 1.ఎరుపు, 2.కావి వస్త్రము.
కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.  

శాటి - 1.కాషాయవస్త్రము, 2.దుప్పటి, రూ.శాటిక.

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|

నితా య త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే
సత్యా యాదికుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే
మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాం త సంచారిణే
సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శ్శంభవే|
తా||
శాశ్వతమైనవాడు, త్రిగుణ (సత్త్వ రజ స్తమోగుణాలు) స్వరూపుడూ, పురత్రయాన్ని జయించినవాడు, కాత్యాయనీదేవికి శుభాలు చేకూర్చేవాడు, సత్యమూర్తియూ, ఆది కుటుంబియు, మునుల మనస్సులకు సాక్షాత్కరించునట్టి జ్ఞా న మూ ర్తి యు, మాయతో లోకత్రయాన్ని సృజించువాడు, ఉపనిషత్తు లన్నిటి యందు సంచరించువాడూ, సాయం సంధ్యవేళలో తాండవం చెయాలన్న అభిలాష కలవాడును, జడలను ధరించినవాడు అయిన శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)శంభుదేవునికి యిదే ప్రణమిల్లుతూన్నాను. - శివానందలహరి     

అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ|
కాత్యాయినీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా.

న్రస్థిమాలీ - శివుడు, వ్యు.పుఱ్ఱెల దండ ధరించినవాడు.

పుఱ్ఱె - (గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium). 
బుఱ్ఱ - 1.కొబ్బెరకాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

శిరోస్థని కరోటిః స్త్రీ-
కం వాయుం రోటతే కరోటిః రుట దీప్తౌ, ప్రతిఘాతే. - వాయువు నడ్డపెట్టునది. ఈ ఒకటి తలపుఱ్ఱె.

కరంకము - 1.పుఱ్ఱె, 2.లోపల నెమియు లేని  బొండ్లపు చిప్ప, 3.తల, 4.కంకాళము.

స్యా చ్ఛరీరాస్థ్ని కఙ్నాలః -
కం జలం స్వాభ్యన్తరేన కాలయతి ప్రేరయతి కంకాళః, కల కల క్షేపే. - జలమును తనలోనికిఁ బ్రేరేపించునది, డొక్క పేరు.
చర్మమాంస రహితమై ఒకటితో నొకటి కూడుకొనియున్న ఒడలియెముకల సముదాయము.  

డొక్క - 1.ఒడలి యెముకలగూడు, 2.ప్రక్క కడుపు. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు. 

అస్థిపంజరము - కంకాళము, ఎముకలగూడు.
కంకాళము -
ఎముకలగూడు.

కమండలువు - సన్యాసు లుంచుకొను గిండి వంటి పాత్ర. 
కుండి - కమండలువు, వికృ.గిండి.
గిండి - సన్నని మెడగల చిన్నచెంబు, సం.కుండీ.  
ౙారీ - గిండి, కమండలువు. 

అస్త్రీ కమణ్డలుః కుణ్డీ -
కం జలం అండే మధ్యే లాతీతి కమండలుః ఉ.ప్న.లా ఆదానే. - ఉదకమును మధ్యమందు గ్రహించునది.
కుండవద్వృత్తత్వాత్ కుండీ. ఈ. సీ. - కుండవలె వట్రువుగా నుండునది. ఈ రెండు కమండలువు పేర్లు.

కుంపెరుగు - (కుండి+పెరుగు) ద్రప్పము, అడుగున నుండు గట్టి పెరుగు.
ద్రప్పము - 1.అడుగు పెరుగు, 2.నీటిబొట్టు, 3.నీళ్ళుకలిపిన పెరుగు.

కుసుంభము - 1.కుసుంభపువ్వు, 2.కమండలువు.
కుసుంభరాగము -
బయటికి కనబడుచు అంతఃకరణమందు లేనిప్రేమ.

స్యా స్మహారజనే క్లీబం కుసుమ్భం కరకే పుమాన్,
కుసుంభ శబ్దము కుసుమపువ్వునకును పేరైనపుడు న. కమండలువునకు పేరైనపుడు పు. కుస్యతీతి కుసుంభః, కుసశ్లేషణే. - కూడియుండునది.

కరకము - 1.ఎముకలగూడు, 2.కమండలువు, 3.దానిమ్మ, 4.పక్షి, 5.వడగల్లు.
దాడినిమ్మ - దాడిమము, ఒక ఫల వృక్షము, రూ.దానిమ్మ, దాడిమ్మ, దాళిమ్మ.

సమౌ కరక దాడిమౌ,
కరోతి దోషాభావ మితి కరక - దోష శుద్ధిని జేయునది.
పక్వా వస్థాయాం దళ్యతే దాడిమః, దళ విశరణే. - పక్వావస్థయందు వ్రక్కలౌనట్టిది. ఈ 2 దానిమ్మచెట్టు పేర్లు. 

డొక్క - 1.ఒడలి యెముకలగూడు, 2.ప్రక్క కడుపు. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు. 

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్ష్యా వస్యస్త ఇతి పక్షీ, న. పు. - ఱెక్కలు గలిగినది.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పులుగు - పిట్ట.    

వడగల్లు - (వడ+కల్లు) వానరాయి.
వడగండ్లు - (భూగో.) మంచు ముక్కలు ఆవిరియై పైకెగసిన నీరు చాల త్వరిత గతిని చల్లబడి వానగా భూతలముపై బడుటకుముందే నీరు మంచుగ మారి భూమిపై బడును. 

వర్షోపలస్తు కరక -
వర్షస్య ఉపలః వర్షోపలః - వానయొక్క శిల. 
కృణోతి హినస్తిసస్య మితి కరక, ప్స. కృఞ్ హింసాయాం - పయిరులను(పైరు - సస్యము)చెఱచునది.
కీరతే వాయునా భువీతి కర్యకా, కౄవిక్షేపే – వాయువు చేత వెదచల్లఁబడునది.
అయం పుంలింగేన వర్తతే - ఇది పులింగమందును గలదు. 
'వర్షోపలస్తు కరక కరకో (అ)పిచ దృస్యత ' ఇతి రభసః - 2 వడగండ్లు. 

కరక1 - వడగల్లు.
కరక2 - ఒకానొక అడవిచెట్టు, హరీతక.
రోగం హన్తీని హరీతకీ, హృఞ్ హరణే. - రోగమును హరించునది.  
మేఘాస్థి - వడగల్లు. 

సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.
సంశ్చాసౌ జనశ్చ సజ్జనః - మంచిజనుడు.

పలుమాఱుసజ్జనుండు ప్రియభాషలెపల్కుఁ గఠొరవాక్యముల్
పలుకడొకానొకప్పు డవి పల్కినఁగీడునుఁగాదు, నిక్కమే
చలువకువచ్చి మేఘుడొక జాడనుదా వడగండ్లు రాల్చినన్
శిలలగు నేమె వెగిరమె శీతలనీరముగాక ! భాస్కరా.

తా. ౘలువ - 1.శైత్యము, 2.ఉదికిన వస్త్రము, రూ.చలువడి కొచ్చి మేఘము cloud ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు. కురియుటకై వచ్చి ఒకమారు వడగండ్లను రాల్చినను అవి యెట్లు రాళ్ళు గాకుండా శీతలము - చల్లనిది నీరగునో అట్లే సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)నొకప్పుడు కఠినపు మాట లుచ్చరించినను వానివలన నెవ్వరికిని కీడు గలుగదు.

నిక్కము - 1.నిశ్చయము, 2.యథార్థము, 3.అన్వర్థము, రూ.నికము, నిక్కువము.        

తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా|
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ. - 114

బొచ్చె - 1.కుండలోనగు వాని పెంకు, 2.తలపుఱ్ఱె.    
పెంకు - 1.ఇంటి కప్పున కుపయోగించు ఓడుబిల్ల, 2.కుండముక్క, 3.తలపెంకు.
ఓడుబిళ్ళ - ఇంటి పైకప్పు పెంకు.
ఓడు - 1.కుండ మొ.తూటు, బీట, 2.పరాజయము, క్రి.పరుగిడు, వెనుదీయు, 3.ధారపడు, 4.ఓడుగిల్లు, 5.కారు, విణ.ఓటిది, 2.పగిలినది.

అత్త చెయ్యిజారినది అడుగు ఓటికుండ, కోడలు చెయ్యి జారినది క్రొత్తకుండ.

కటాహము - 1.కడవ, బాన 2.తాబేటి వెన్నుచిప్ప, 3.కప్పెర.
గూన - పెద్దకుండ. డేగిస - పెద్దకాగు.

కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.
గాబు -
మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.

సూది ఇచ్చి గాబు(గాబు - మూతి వెడల్పు గల పాత్రము, కొప్పెర.)తీసుకొని పోయాడుట. 

కటాహము - 1.కడవ, బాన 2.తాబేటి వెన్నుచిప్ప, 3.కప్పెర.
గూన - పెద్దకుండ.

కుండక బ్రాహణులు - మహారాష్ట్ర బ్రాహ్మణులలో ఒక తెగ.

అచలసంధి - (జం.) కదలికకు వీలులేని ఎముకలసంధి, ఉదా. పుఱ్ఱెలోని ఎముకలు కదలని కీలు (Immovable joint).
కదలని కీళ్ళు - (జం.) కదల్చుటకు వీలుకాని కీళ్ళు, ఉదా. తలఎముకలు (Immovable joints).

హలాస్థులు - (జం.) నాసాస్థులకు పైన పుఱ్ఱెలో మూడు రేఖలుగల ఎముకలు (Vomers)
శ్వసన నియంత్రిక నాడిముడి - పుఱ్ఱెనుండి బయటికి వచ్చిన తరువాత ప్రాణేశ నాడిపై నగుపడు ముడి, (Vagus ganglion).

పయరకారు - (వ్యవ.) పయరగాలి విసరుకాలము ఫిబ్రవరి February, మార్చి March నెలలు, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కార్తెలు, శిశిర ఋతువు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.

25. పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర - రెండేసి 4 నక్షత్రములుండును.

ప్రౌష్ఠపద - పూర్వాభద్రా నక్షత్రము.
పూర్వ -
తూర్పు; ప్రాచి - తూర్పు.
ప్రాక్ ప్రాచ్యాం భవం ప్రాచీనం - తూర్పునఁ బుట్టినది.

ఐంద్రి - 1.జయంతుడు, 2.అర్జునుడు, 3.ఇంద్రుని భార్య, 4.జ్యేష్ఠానక్షత్రము, 5.తూర్పు.

స్యుః ప్రోష్ఠపదా భాద్రపదాః స్త్రియః :
ప్రోష్ఠోగౌః తస్యేవ పాదాయాసామితి ప్రోష్ఠపదాః. ఆ. సీ. - ప్రోష్ఠ మనఁగా నెద్దు(ఎద్దు), దానిపాదముల వంటి పాదములు గలవి.
భద్ర పదం యాసా తాః - శుభకరములైన పాదముగలవి. ఈ రెండు 2 పూర్వభాద్ర ఉత్తరాభాద్రల పేర్లు.

అజ ఏకపాదుదగాత్పురస్తాత్ | విశ్వా భూతాని ప్రతి మోదమానః | తస్య దేవాః ప్రసవం యంతి సర్వే | ప్రోష్ఠపదాసో అమృతస్య గోపాః | విభ్రాజ మానస్సమిధా న ఉగ్రః | ఆంతరిక్ష మరుహదగంద్యామ్| తగ్ం సూర్యం దేవ - మజమేకపాదమ్ |  ప్రోష్ఠపదాసో అనూయంతి సర్వే ||25||

అజ - 1.ప్రకృతి, వ్యు.పుట్టుకలేనిది, శాశ్వతమైనది(శాశ్వతము - నాశనములేనిది., 2.ఆడుమేక, ఎక్కువగా తిరుగునది.
ఛాగి - మేక; మేఁక - ఆడుమేక, సం.మేకః.

ప్రకృతి - 1.ప్రత్యయము చేరక ముందటి శబ్ద రూపము, 2.సౌర వర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము(స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కొశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి, సప్త ప్రకృతులు). 

అజా ఛాగీ :
అజతీ త్యజా. అజ గతిక్షేపణయోః - తిరుగునది.
ఛ్యతి రోగానితి ఛాగీ. ఈ. సీ. ఛో ఛేదనే. - రోగములఁ జెఱుచునది. ఈ రెండు మేక పేర్లు.

అజ స్సర్వేశ్వరస్సిద్ధః సిద్ధి స్సర్వాదిరచ్యుతః
వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిస్సృతః|

మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.
గాంధారము -
1.(సంగీ.) ఒకవిధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార అను ఒకానొకదేశము.

అజా క్షయవినిర్ముక్తా ముగ్ధ క్షిప్రప్రసాదినీ|
అంతర్ముఖ సమారధ్యా బహిర్ముఖ సుదుర్లభా||

సృష్టి - 1.సృజించుట, 2.ప్రకృతి, 3.స్వభావము.
సృజన -
సృష్టి.

సంసిద్ధి ప్రకృతీ సమే, స్వరూపం చ స్వభావశ్చ నిసర్గశ్చ -
1.
సమ్యక్ సిద్ధిః సంసిద్ధిః ఇ. సీ. షిధు గత్యాం. - పదార్థమును లెస్సగా పొందునది.

2. ప్రకృతి - 1.ప్రత్యయము చేరక ముందటి శబ్ద రూపము, 2.సౌర వర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము(స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కొశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి, సప్త ప్రకృతులు).  
ప్రకృష్టం కరోతీతి ప్రకృతిః ఇ. సీ. డు కృఙ్ కరణే. - పదార్థమును ప్రకృష్టము - ప్రకర్షము గలది, శ్రేష్ఠమైనదిగాఁ జేయునది.
సమే, అనెడు విశేషముణముచేత సంసిద్ధి ప్రకృతి శబ్దములు స్త్రీ లింగములు.

ప్రకృతీ యోని లిఙ్గే చ -
ప్రకృతిశబ్దము ఉపాదానకారణమునకును, స్త్రీపుంసపుంసక లింగమునకును, చకారము వలన స్వామ్యమాత్యాది సప్తాంగములకును, పౌరశ్రేణుల కును పేరు. స్వభావమునకును, భగమునకును, సత్త్వరజస్తమో గుణముల యొక్క సామ్య వస్థకును పేరని కొందఱు. ప్రక్రియతే అనయా కార్యమితి ప్రకృతిః, సీ. డుకృఙ్ కరణే. - దీనిచేత కార్యము చేయఁబడును.

ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః|     

3. స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
స్వస్య రూపం స్వరూపం - తనయొక్క రూపము స్వరూపము.
రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగిణము, 5.స్వభావము.
రోవయతి విమోహ యతీతి రూపం, రుపు విమోహనే. - మోహింపఁ జేయునది.

ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.

ఆకారా విఙి తాకృతీ,
ఆకారశబ్దము ఇంగితమునకును, ఆకృతికిని పేరు. ఇంగిత మనఁగా భావసూచకమైన చేష్ట. ఆకృతి యనఁగా వైవర్ణ్యాది శరీరవికారము, ఇంగితము వైవర్ణ్యాది శరీర వికారము. ఆకృతి సంస్థానము అని కొందఱు చెప్పుదురు. ఆ క్రియత ఇత్యాకారః - చేయఁబడునది.

ఇంగితము - 1.హృద్గతాభిప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విన.కదలినది.
స్వామ్యము - సమత్వము, పోలిక.

రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపఱు -
1.చచ్చు(ౘచ్చు - క్రి.మరణించు), 2.అంగవిహీనమగు.
రూపడఁగు - క్రి.1.చచ్చు, 2.నశించు. 

అడ - 1.ముద్ద, 2.ఆకృతి, త.అడై.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).  

రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
రూపుమాపు - క్రి.చంపు, నాశనమొనర్చు.

వర్చస్సు - 1.కాంతి, మేని 2.రూపము. 

ప్రతిభా విశేషము -(గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

రూపనిర్మాణశాస్త్రము - (జీవ.) శరీరము, దానిరూపము, ఏయే అవయములతో నిర్మింపబడినదో, అవిచేయు పనులేవో తెలియజేయు శాస్త్రము (Morphology).
ఆకారవిజ్ఞానము - (జీవ.) ఒక ప్రాణియొక్క ఆకారము, వివిధమగు అవయవములు, అవి చేయుపనులు అను వానిని గూర్చిన జ్ఞానము (Morphology).

4. స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వస్య భావః స్వభావః - తనయొక్క భావము స్వభావము.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది.
సహజజ్ఞానము - (జం.) వివేకముతో గాని అనుభవముతో గాని నిమిత్తము లేనట్లు జంతువులు తమ సహజమైన ప్రేరేపణ సాయముతో ప్రవర్తించుట, (Instinct).
సాజము - సహజము, సం.సహజః. 

మంచి స్వభావము, సౌందర్యం తాలూకు లోటును ఎప్పుడూ భర్తీచేస్తుంది. కాని, సౌందర్యం మంచి స్వభావమనే లోటును భర్తీ చేయలేదు. – ఎడిసన్

శీలము - 1.స్వభావము, 2.మంచినడత.

సబాము - స్వభావము, సం.స్వభావః.
బాము - 1.జన్మము, 2.శోకము, 3.ఆపద, సం.భవః. 

ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదామ్,
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్|
 

5. నిసర్గము - స్వభావము.
నిసృజ్యతే అనేనేతి నిసర్గః, సృజ నిసర్జే. - పదార్థమును దీనిచేత మిక్కిలి సృజింపఁబడును. ఈ 5 స్వభావము పేర్లు.

నైజము - 1.తనది, స్వాభావికము.
నైసర్గికము - స్వాభావికము.
స్వాభావికము - స్వభావముచేత కలిగినది. 
నైసర్గికలక్షణము - (భూగో.) ఒక ప్రదేశపు సహజగుణము, ఉదా. ఒక ప్రాంతము చెట్లలోగాని, కొండలలోగాని, నదులలోగాని నిండియుండు స్థితి. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము, (Property).
ధర్మములు - (భౌతి.) వస్తువుల గుణములు, (Properties).

తత్త్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి.(భౌతి). మౌలికమైన, సారమైన విషయము, దేనిమీద ఇతర సత్యములు ఆధారబడి యుండునో అట్టి మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్టి మౌలిక సత్యము (Principle).

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

సర్గము - 1.అధ్యాయము, 2.విసర్జనము, 3.నిశ్చయము, 4.స్వభావము, 5.సృష్టి.

ప్రకృష్ట వాచకః ప్రశ్చ కృతిశ్చ సృష్టి వాచకః|
సృష్టౌ ప్రకృష్టా యా దేవీ ప్రకృతిః సా ప్రకీర్తితా||

పగిది - 1.ప్రకృతి, 2.విధము, రీతి(తరహా - రీతి.), సం.ప్రకృతిః.
(ౘ)చందు -
1.విధము, 2.అందము, 3.చంద్రుడు Moon.
విధము - ప్రకారము, విధి. విధికి, నదికి ఎదురీదలేము !
భాతి - 1.కాంతి, రీతి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. 
విధాత  - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  

భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.

అఙ్గం ప్రతీకో (అ)వయవో (అ)పఘనః -
అంగము1 - 1.రీతి, విధము, 2.అందము.
అఙ్గతి చలతి అఙ్గం , అగి గతౌ. - చలించునది. 
అంగు - 1.అందము, 2.రీతి, విధము, 3.అంగబలము, 4.ఇంటిలొని సామగ్రి, రూ.హంగు.
అందము - 1.సౌందర్యము, చక్కదనము, 2.అలంకారము, 3.విధము, విణ.1.చక్కనిది, 2.తగినది.
ప్రత్యేత్య న్యోన్యమాభీముఖ్యేన గచ్ఛతీతి ప్రతీకః, ఇణ్ గతౌ. - అన్యోన్యమభి ముఖముగా నుండునది. 
అంగము2 - 1.అవయవము, దేహము, 2.ఉపాయము, 3.ఒక దేశము, విణ.1.అవయవముగలది, 2.సమీపించినది, వి.(గణి.) ఏదేని వస్తువుయొక్క ముఖ్యభాగము, మూలధర్మము, మూలకము (Element).
అవయవము - అంగము, (జీవ) ఇంద్రియము, శరీరములో కొన్నిరకముల జీవకణజాలముతో ఏర్పడిన ఒకప్రత్యేక భాగము.
అవయౌతి మిథో మిశ్రీభవతి అవయవః, యమిశ్రణే. - అన్యోన్యము(పరస్పరము-అన్యోన్యము)కూడియుండునది.
అపఘనము - 1.శరీరావయవము, 2.శరీరము, విణ.మబ్బులేనిది.
అపహన్యత ఇత్యపఘనః, హన హింసాగత్యోః. - పీడింపఁబడునది. ఈ 4 కరచరణాద్యవయవముల పేర్లు.

ఉన్నామక కండరము - (జం.) అవయములను పై కెత్తుటకు ఉపయోగపడు కండరము (Elevator muscle).

అంగజుఁడు - 1.మన్మథుడు, 2.కొడుకు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో (29వ)ఇరువది తొమ్మిదవది.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
కుమారయతీతి కుమారః. - ఆడువాఁడు, కుమార క్రీడాయామ్. 

అంగభవుడు - 1.మన్మథుడు, 2.పుత్రుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో (29వ)ఇరువది తొమ్మిదవది.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌవర్భవుడు, స్వయందిత్తుడు, జ్ఞాతిరేతుడు.

అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయ న్తీ
భృంగాఙ్గ నేవ ముకుళాభరణం తమాలమ్
అఙ్గీకృతాఖిలవిభూతి రపాఙ్గలీలా
మాంగల్యదాస్తు మమ మఙ్గలదేవతాయాః|
      

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు.

బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.
హంసుఁడు -
1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
వేదము - దీనిచేత ధర్మాధర్ముల నెరుగుదురు, తొలిచదువులు(తొలిచదువులు - వేదములు). ఇవి నాల్గు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము.
పరమము - పరమాత్మ, విణ.ఉత్కృష్టము, 1.ఆద్యము, 2.ప్రధానము.
తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది, రూ.తుర్యము. 

ఓం హంసిన్యై నమః : పరమహంస స్వరూపిణికి ప్రణామాలు. తురీయాశ్రమమైన సన్యాసాశ్రమంలో నాలుగు తరగతులూన్నయి. అందులో తృతీయాశ్రమాన్ని పొందిన సన్యసికి "హంస" అని పేరు. అట్టి పరమహంసకు - పరమేశ్వరికి అభేధము.

ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.
హృషీకము -
ఇంద్రియము.    

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception).

రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగిణము, 5.స్వభావము.

ఆకారా విఙి తాకృతీ,
ఆకారశబ్దము ఇంగితమునకును, ఆకృతికిని పేరు. ఇంగిత మనఁగా భావసూచకమైన చేష్ట. ఆకృతి యనఁగా వైవర్ణ్యాది శరీరవికారము, ఇంగితము వైవర్ణ్యాది శరీర వికారము. ఆకృతి సంస్థానము అని కొందఱు చెప్పుదురు. ఆ క్రియత ఇత్యాకారః - చేయఁబడునది.

ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచేష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.    
ఇంగితము - 1.హృద్గతాభిప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విన.కదలినది.
స్వామ్యము - సమత్వము, పోలిక.

రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.
రూపఱు -
1.చచ్చు(ౘచ్చు - క్రి.మరణించు), 2.అంగవిహీనమగు.
రూపడఁగు - క్రి.1.చచ్చు, 2.నశించు. 

అడ - 1.ముద్ద, 2.ఆకృతి, త.అడై.
ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).  

రూపు - 1.ఆకృతి, 2.రీతి, 3.సౌందర్యము, 4.కన్యకల మెడలందు కట్టెడి బొట్టు.
రూపుమాపు - క్రి.చంపు, నాశనమొనర్చు.

వర్చస్సు - 1.కాంతి, మేని 2.రూపము. 

ప్రతిభా విశేషము -(గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

రూపనిర్మాణశాస్త్రము - (జీవ.) శరీరము, దానిరూపము, ఏయే అవయములతో నిర్మింపబడినదో, అవిచేయు పనులేవో తెలియజేయు శాస్త్రము (Morphology).
ఆకారవిజ్ఞానము - (జీవ.) ఒక ప్రాణియొక్క ఆకారము, వివిధమగు అవయవములు, అవి చేయుపనులు అను వానిని గూర్చిన జ్ఞానము (Morphology).

భూమి రాపో(అ)నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా || - 4శ్లో
తా||
భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఎనిమిది విధములుగ నా ప్రకృతి విభజింపబడినది. - జ్ఞాన విజ్ఞానయోగము, భగవద్గీత   

ప్రకృతి శాస్త్రములు - (జీవ.) వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, భూగర్భ శాస్త్రము మొదలగునవి, ప్రకృతికి సంబంధించిన శాస్త్రములు (Natural Sciences).

భూతాత్మము - దేహము.
దేహము -
శరీరము, మేను.
శరీరము - దేహము. ఏది సాధించాలన్న దేహం ఉండాలి.
మేను - 1.శరీరము, 2.జన్మము, పుట్టుక 3.పార్శ్వము.
పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము(Side).విం.విణ.(జీవ.) క్రన్కలనుండిబయలుదేరీనది(Latral)

ప్రకృతి శాస్త్రములు - (జీవ.) వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, భూగర్భ శాస్త్రము మొదలగునవి, ప్రకృతికి సంబంధించిన శాస్త్రములు (Natural Sciences).

అవ్యక్తము - స్పస్టముకానిది, వి.1.మూలప్రకృతి, 2.అజ్ఞానము, 3.సూక్ష్మశరీరము, 4.పరబ్రహ్మము, 5.(బీ.గణి.) తెలియబడని సంఖ్య.
అవ్యక్తుఁడు - 1.శివుడు, 2.విష్ణువు, 3.మన్మథుడు, విణ. మూఢుడు.

స్వామ్యమాత్య సుహృత్కోశ రాష్ట్ర దుర్గ బలాని చ,
రాజ్యాఞ్గా ప్రకృతయః పౌరాణాం శ్రేణయో (అ) పి చ,

స్వామి యనఁగా రాజు; అమాత్యుఁడు మంత్రి; సుహత్తు చెలికాఁడు; కోశము భండారము; రాష్ట్రము దేశములతోఁ గూడిన పట్టణము; దుర్గము పర్వతోదక వృక్షములచేతఁ బోవ శక్యముగాని పట్టణము; బలము సైన్యము; ఒకఁడు ముఖ్యుఁడుగాఁ గలవారును సజాతీయులునునైన పురజనుల సమూహములు పౌరశ్రేణులు.

1.స్వం విద్యతే అస్యేతి స్వామీ - ధనముగలవాఁడు.
స్వము - 1.ధనము, 2.తాను, విన.తనది.
2.అమా సమీపే భవః అమాత్యః - సమీపమందుండు వాఁడు.
అమాత్యుఁడు - 1.మంత్రి, 2.సహచరుడు, రాజుతో నుండువాడు.
మంతిరి - మంత్రి, ప్రధానుడు, సం.మంత్రి.
మంత్రి - 1.ధీసచివుడు, 2.సహాయుడు.
సహకారి- సహాయుడు; సహాయుఁడు- 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
3.శోభనం హృదయమస్యేతి సుహృత్ - మంచి హృదయము గలవాఁడు.
హృదయాళువు - మంచిమనస్సు కలవాడు. 
సుహృదుఁడు - మిత్రుడు; మిత్రుడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.
సహచరుఁడు - మిత్రుడు, విణ.కూడ దిరుగువాడు.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
4.కూయతే ఉత్కృష్ట ఇతికోశః - కోషమని మూర్థన్యాంతముగా గొందుఱు.
కుశబ్దే - ఉత్కృష్టమని పలుకఁబడునది. 
5.రాజత ఇతి రాష్ట్రం - ప్రకాశించునది. 
6.దుఃఖేన గమ్యత ఇతి దుర్గం - ప్రయాసముచేతఁ బొందఁబడునది.
7.బలంత్త్యనేన బలం, బల ప్రాణనే - దీనిచేత బ్రదుకుదురు.
ప్రక్రియతే రాజ్యమాభి రితి ప్రకృతయః - వీనిచేత రాజ్యము ప్రకృష్టముగాఁ జేయఁబడును.
8.శ్రయంత్తే పరస్పర మితి శ్రేణయః. శ్రిఞ్ సేవాయాం - పౌరులయొక్క శ్రేణులు పౌరశ్రేణులు.
స్వామిన్ శబ్దము మొదలు ను రాజ్యాంగములనంబడును. ఈ సప్తాంగములే ప్రకృతులనంబడును. పౌరశ్రేణులను ప్రకృతులనంబడును.

అష్టప్రకృతి రష్టాష్ట విభ్రాజద్వికృతాకృతిః,
దుర్భిక్ష ధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ| 64స్తో

ఆజకము - మేకలమంద, మేక.
లంబకర్ణము - మేక, విణ.వ్రేలాడెది చెవులు కలది.
లంబ - దుర్గ, లక్ష్మి.

దేవానాంప్రియము - మేక, యజ్ఞములందు దేవతల కర్పింపబడును గాన.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.

అజోరజః ఖరరజస్తథా జన్మార్జనీరజః|
స్త్రీణాంపాదరజశ్చైవ శక్రస్యాసి శ్రియం హరేత్|
తా.
మేకలకాలిదువ్వ, గాడిదకాలిదువ్వ, మార్జని - చీపురుకట్ట దువ్వ, స్త్రీకాలిదువ్వ, ఇవి పైబడిన శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు. కైన ఐశ్వర్యము తొలగి పోవును. - నీతిశాస్త్రము

ఆదిశక్తి రమేయాత్మా - పరమా పావనాకృతిః|
అనేకకోటి బ్రహ్మాండ - జననీ దివ్యవిగ్రహా.

భన్దత ఇతి భద్రః. భది కల్యాణే. - కల్యాణ స్వరూపమైనది.

ప్రౌష్ఠపదము - భాద్రపదమాసము.
భాద్రపదము - భాద్రపద మాసము.

ఋషిపంచమి - భాద్రపదశుద్ధ పంచమి, ఒక వ్రతము.
ఋషి -
1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు. 

ఋషయస్సత్యవచసః -
జ్ఞానస్య పారగమాత్ ఋషిః ఈ. పు. ఋ గతౌ. - జ్ఞానముయొక్క పారమును బొందినవాఁడు.
సత్యం వచో యేషాం తే సత్యవచనః. స.పు. - సత్యమైన వాక్కులు గలవారు. 2 ఋషుల పేర్లు.

భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాలచి యుగ్రసేనుండు వ్యాఘ్రుం డాసారణుండు భృగు వనుమ్లోచ శంఖపాలుండు లోను గాగల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయుచు నుండు  -  భాద్రపద మాసంలో సూర్యుడు వివస్వంతు(వివస్వంతుఁడు - సూర్యుడు)డన్న పేరు తో విరాజిల్లుతూ ఉగ్రసేనుడు(కంసుని తండ్రి), వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు(భృగువు - 1.ఒకముని, 2.కొండ చరియ, 3.శుక్రుడు Venus, 4.శివుడు.), అనుమ్లోచ, శంఖపాలుడు అనే వారు ఆవరించి ఉండగా సమయ పాలనం చేస్తుంటాడు.  

వివస్వంతుఁడు - సూర్యుడు.
వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్. వస ఆచ్ఛాదనే - కాంతిచేత నన్నిటినిఁ గప్పెడువాఁడు. 
 
దేవ సురౌ వివస్వంత్తౌ -
వివస్వచ్చబ్దము దేవతలకును, సూర్యునకు పేరు. వివస్తేజః; తదస్యాస్తీతి వివస్వాన్. త. పు. వస ఆచ్ఛాదనే - తేజస్సు గల వాడు.     

వక్షస్తాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటిరోజ్జ్వల రత్న దీపకలికా నీరజనం కుర్వతే
దుష్ట్వా ముక్తివధూ స్తనోతి నిభృతాశ్లేషం భవానీ పతే !
యచ్చేత స్తవె పాదపద్మ భజనం తస్యేవ కిం? దుర్లభం? - 64

భా|| పార్వతీనాథా ! నీ పాదారవిందాలను సేవించే మనస్సు కలవాణ్ణి చూసి యముడు - ఱొమ్ముమీద తన్నెదవన్న సంశయంతో పలాయనం చిత్తగిస్తాడు. బృందారకులు(నిర్జరుఁడు - వేలుపు)తాము ధరించిన కిరీటాల లోని రత్నదీపాలతో హారతులను సమర్పిస్తున్నారు. మోక్షకాంత ఆలింగనం చేసికొంటూన్నది. అట్తివాడు యిహంలో పొందజాలని దేమున్నది ? - శివానందలహరి

వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.
వివస్వత సూర్యస్య అపత్యం వైవస్వతః - సూర్యుని కొడుకు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).

మనువు కాని మనువు - వైవస్వత మనువు.

మనువులు - స్వాయంభువుడు (స్మృతి కర్త) స్వారోచితుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు (పదు నాల్గురు).  

శనివారము - ఏడవ వారము (ఆదివారము మొదలుకొని).
స్థిరవారము - శనివారము Saturday.

క్రోధో వైవస్వతోరాజా ఆశా వైతరణీనదీ|
విద్యా కామధుగ్దేరు స్సంతుష్టో నందనం వనమ్||

తా. కోపము వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.)తో సమానమైనది, ఆశ వైతరిణి నదితో సమానమైనది, విద్య - 1.చదువు, 2.జ్ఞానము.) కామధేనువుతో సమానమైనది, సంతోషము నందనవనముతో నందనము - 1.ఇంద్రుని ఉద్యానవనము, 2.ఉద్యానవనము సమానమైనది. - నీతి శాస్త్రము 

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

తటిని - ఏరు, వ్యు.తటముకలది.
తటమస్యా అస్తీతి తటినీ - దరులు గలిగినది.
తటము - 1.ఏటి యొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము. 
తటి - 1.ఏటి యొడ్డు, 2.ప్రదేశము.
తటతీతి తటం త్రి, తట ఉచ్ఛ్రాయే - ఉన్నత మయినది. 
తటతీతి తటః, తట ఉచ్ఛ్రాయే. - ఉన్నతమైనది.
ప్రదేశము - స్థలము, చోటు. 

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు Venus, 4.శివుడు.
భ్రజ్యతే తప్యతే సూర్యాగ్ని తేజసా భృగుః, ఉ పు. భ్రస్జ పాకే. - సూర్యాగ్ని తేజస్సులచేతఁ దపింపఁ జేయఁబడునది. ఈ 3 కొండచఱియ పేర్లు.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
శుక్లవర్నత్వా చ్ఛుక్రః - శ్వేతవ్రణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేన నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రునిరేతస్సు వలనఁ బుట్టినవాఁడు.
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రాదానే - దేవతలకు దుఃఖము నిచ్చువాఁడు.

శుక్రవారము - భృగువారము, వారములలో నొక దినము Friday.      

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

తాపత్రయము - మూడు విధములైన తాపములు - ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము.
ఆధ్యాత్మికము - 1.మనశరీరాదులవలన కలిగినది, (శోక జ్వరాది దుఃఖము. ఇది తాపత్రయములలో ఒకటి), 2.ఆత్మకు సంబంధించినది, ఉదా.ఆధ్యాత్మిక విద్య.

ఆధిభౌతికము - వ్యాఘ్రసర్పాది భూతములవలన కలిగినది, (ఇది తపత్రయములలో ఒకటి). 

కాలచక్రము - చక్రాకారమున నుండు కాలము.
కాలత్రయము - 1.భూతకాలము, 2.వర్త మాల కాలము, 3.భవిష్యత్కాలము.

త్రివర్గములు - 1.ధర్మార్థకామములు, 2.సత్త్వరజస్తమములు, 3.క్షయ స్థాన వృద్ధులు.
వర్గము - (రసా.) సమాన ధర్మములు గల ద్రవముల సమూహము (Group) సం. (జీవ.) తరగతి (Class) సం. (గణి.) ఒక రాశిని ఆ రాశిచేతనే గణించగా లభించు లబ్ధము (Square) సం. 1.వి.సజాతీయ సమూహము, 2.తెగ, 3.అధ్యాయము, 4.కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనునవి అరిషడ్వర్గము లన బడును.
వర్గయుక్కులు - ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ధ, థ, ఫ, భ లు.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.

అనాగతము - భవిష్యత్కాలము, సం.విణ.1.రాబోవునది, భావి, 2.పొందబడనిది.

తాపత్రయహర కాలత్రయ చర
లోకత్రయధర వర్గత్రయకర| ||శరవణభవ||

ఆచార్యుఁడు - 1.వేదవ్యాఖ్యానము చేయువాడు, 2.వేదాధ్యయనము చేయించువాడు, 3.మతస్థాపకుడు, 4.యజ్ఞాదులందు కర్మోపదేశికుడు, 5.ఉపాధ్యాయుడు, గురువు, 6.ఏదైన ఒక విషయమున నిశిత పాండిత్యము గలవాడు, 7.ద్రోణుడు.
ఆచార్య - 1.వేదార్థమును వ్యాఖ్యానించెడి స్త్రీ, 2.ధర్మోపదేశికురాలు.
ఆచార్యాని - ఆచార్యుని భార్య.
కృపి - ద్రోణుని భార్య.

అహిచ్ఛత్రము - అర్జునుడు జయించి ద్రోణాచార్యునకు సమర్పించిన దేశము.

తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః.
తిరుమాళిగ - 1.గృహము, 2.వైష్ణవుల పూజాగృహము, 3.పూజ్యులుండు గృహము.

తిరుముడి - 1.వైష్ణవుడు, 2.జడలు కట్టిన జుట్టు.
వైష్ణవుఁడు - విష్ణుభక్తుడు. 
వైష్ణవము - విష్ణుసంబంధమైనది, వి.ఒక మతము. 
మడిచేఱు - (మడిచిన+చేఱు) వైష్ణవ స్త్రీలు ముందునుండి యెత్తి వెనుకకు పెట్టుకొను కోక చేఱు.

తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః. 
తిరుమల - వేంకటాచలము; .శేషాచలము – తిరుమల; శేషశైలము - తిరుమల.    
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.

శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి. 

తిమ్మ - స్వస్థము.
స్వస్థము - నెమ్మదిగా నుండునది.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

జితము - జయింపబడినది, వై.విణ.స్థిరము, సం.స్థితమ్.
జితపడు - క్రి.1.స్థిరపరుడు, 2.వాడుకపడు, 3.అనుకూలపడు, జితించు.    

ఆస్తిపరుఁడు - స్థితిమంతుడు, ధనవంతుడు.
ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.ని., సొత్తు.

స్థిరాస్థి - ఒక చోటినుండి మరియొక చోటికి తీసుకొనిపోవుటకు వీలులేని(భూమి ఇల్లు, తోటలు మొ నవి)ఆస్తి (Immovable property).

స్థిర - భూమి.
తిష్ఠతి సదా స్థిరా, ష్ఠా గతినివృత్తౌ. - ఎల్లప్పుడు నుండునది.
తిష్ఠతి సర్వమస్యామితి వా స్థిరా - సర్వము దీనియందుండునది.

స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది.
తిరము - స్థిరము.
స్థిరుఁడు - శని Saturn.

పదిలుఁడు - 1.మేలుకొని యుండువాడు, 2.స్థిరుడు. 
స్థిరుఁడు - శని. తిరుడు - స్థిరుడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn). 

స్థిరవారము - శనివారము Saturday.
శనివారము - ఏడవ వారము (ఇది ఆదివారము మొదలుకొని).

భద్రుఁడు - వీరభద్రుడు, విణ.మేలుకొని యుండువాడు.
వీరభద్రుఁడు - 1.వీరభద్రుడను ప్రథముడు, 2.ఏకాదశ రుద్రులలో నొకడు, 3.శివుని కొడుకు. భద్రకాళీ వీరభద్రో| 

జాగరూకో జాగరితా -
జాగర్తి తాచ్ఛీల్యేనేతి జాగరితా చ, ఋ. జాగ్రనిద్రాక్షయే. - స్వభావముననే మేల్కొనియుండువాఁడు. ఈ 2 మేలుకొనియుండు స్వభావము గలవాని పేర్లు.

జాగరూకుఁడు - మేలుకొని యుండువాడు.
జాగరిత - మేలుకొని యుండునది.
నిర్నిద్రము - జాగరూకత గలది.
జాగ్రత్త - జాగరూకత. ఎంత జాగ్రత్త.
(ౙ)జాగారము - జాగరము, రాత్రి మేల్కని యుండుట, సం.జాగరః.
జాగరము - మేలుకొని యుండుట. జన్మంతా జాగారమే!

భద్రకాళీపతి ర్భద్రో భద్రాక్షాభరణాన్వితః,
భానుదంతభి దుగ్రశ్చ భగవాన్ భావగోచరః|

వీరభద్ర పళ్ళెరము - మిక్కిలి పెద్ద పళ్ళెము, హరివాణము.
హరివాణము -
1.పళ్ళెము, తట్టు.
పళ్యము - పళ్ళెము, పళ్ళేరము, భోజనపాత్రము, తాంబాళము, స.బిలకా.
తాంబాళము - పెద్దలోహపు పళ్ళెము.

తట్ట - 1.వెదురుబద్దలు మొదలగువానితో నల్లిక వల్లిక, 2.లోహముతో చేసిన తబుకు, పళ్ళెము.
తట్ట - 1.కంచము, 2.తెర, 3.తడక.
స్థాలము - కంచము; కంచము - భోజన పాత్రము, సం.కంసమ్.
తట్టు - 1.కలుగు, 2.తోచు, 3.చరుచు, హిం.వి.పొట్టిగుఱ్ఱము, వై.వి.దరి, పార్శ్వము.
తట్టువ - గుఱ్ఱము, రూ.తట్టువము.

తక్కటి - మూడు ముఖములు గల దీపా రాత్రికపు తట్ట, త్రిముఖదీపిక.

పాత్ర - (భౌతి.) ద్రవ్యము నిలువ యుంచుట కుపయోగించునది (Vessel).  
పాత్రలు - (గృహ.) ఉపకరణములు, వంట గిన్నెలు (Vessels).
పాత్రము - 1.యోగ్యము, 2.భోజనము, 3.నాటకవేషము, సం.వి.(భూగో.) శిలాప్రదేశములలో సహజముగ పాత్రవలె ఏర్పడిన ప్రాంతము, (ఇట్టి ప్రాంతములలో నీరు నిండి యుండవచ్చును, లేదావానలు లేనిచోపొడిగా నుండవచ్చును.)
భాజనము - పాత్రము, యోగ్యము.
భజ్యతే అధేయేనేతి భాజనం, భజ సేవాయాం. - అధేయముంచేత పొందఁబడునది.

అంట్లు - 1.వంటచేసిన పిదప తోమక యుండు పాత్రలు (ని. బహు.), 2.అంటు పేలు.

ఆత్మశుద్ధిలేని యాచార మదియెల ?
భాండశుద్ధిలేని పాకమేల ?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా ? విశ్వ!
తా.
వేమా! నిర్మలమైన మనస్సుతో చేయని ఆచారము వలన ప్రయోజనము లేదు. వంటచేసుకొను కుండను తోమకనే(పరిశుభ్రము చేయని పాత్రలో), వంటచేసిన ఆ పదార్థము తినుటకు మంచిదికాదు గదా, అట్లే నిశ్చలమైన మనస్సుతో చేయని శివపూజ వలన పుణ్యము లభింపదు.

స్థిరపద దాయక సురవర నాయక
నిరసితసాయక నిరుపమ గాయక | ||శరవణభవ||

కబంధము - 1.జలము, 2.మొండెము, 3.సముద్రము.
కం శరీరం బద్నాతీతి కబంధం - శరీరమును నిలుపునది.
పా. కమంధమితిపాఠే కం, అంధం ఇతి నామద్వయం. కామ్యత ఇతి కం. కముకంతౌ. - కోరఁబడునది.
అనంత్యనే నేతంధం. అనప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.

కబన్ధో స్త్రీ క్రియాయు క్త మపమూర్ధ కళేబరమ్,
క్రియాయుక్తం = నర్తనక్రియతోఁగూడిన అపమూర్ధకళేబరం = తల పోయిన శరీరము, కబన్ధః = కబంధ మనంబడును.
కం శిరో (అ)స్యబధ్యతే (అ)త్రేతి కబంధః, అ. ప్న. బంధ బంధనే. క మనఁగా శిరస్సు; అది దీనియందు బంధింపఁబడును.
ఇక్కడ బంధన మనఁగా విరుద్ధ లక్షణచేత ఛేదనము. ఈ 2 మొండెము పేర్లు.  

కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కసుఁడు - కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్|

రుండము - మొండెము.
మొండెము - తలతెగిన కళేబరము, కబంధము, సం.వి.ముండమ్, (గృహ.) భుజము క్రింది తుంటిపై భాగము, కభంధము, ఊర్థ్వకాయము (Trunk).
సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.

కళేబరము - మేను, శరీరము.
ఆదానాద్యుపయోగితయా కళే కరేబరం వరం కళేబరం, రళయోర్వ బయోశ్చాభేదః - పుచ్చుకొనుట మొదలైన క్రియల కుపయోగించుటచేత హస్తమందు శ్రేష్టమైనది.
కల్యతే ఆద్రియత ఇతి వా కళేబరం, కల సంఖ్యానే. - ఆదరింపఁబడునది.

కళత్ర సంసర్గ నితాంతభీతాః కాశీంగతాః కాలవశా న్మనుష్యాః,
కళత్రీన స్తేపి కళే బ రా ర్ధే వహం త్యహో ! వారిని ధేః కళత్రమ్|
 
భా|| నరుఁ డొకభార్య సంసర్గము-సంబంధము, చేరిక వలన(మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.)తీవ్రమైన భీతిచేతఁ గాశీనగరమున కేగి యచ్చట మరణించి సగముశరీరమునం దొక భార్యను ధరించి పైఁగా సముద్రునిభార్య(గంగ) నొఁదల వహించు చున్నాఁడు. ఔరా! ఎంతచోద్యము ! (శంకరుఁడగు చున్నాడని భావము.)  

దాంతకయాకర కాంత కళేబర
భ్రాంతంమాంతర శాన్త హృదయవర| ||శరవణభవ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగాతరంగైర్విశాలం
శివం శంకరం శంభు మీశానమీడే|| – 2

ఉదన్వంతము - సముద్రము.
ఉదక మస్మిన్నస్తీత్యుదన్వాన్, త. పు. - ఉదకము గలిగినది.
ఉదధి - సముద్రము.
ఉదకం ధీయతే అస్మిన్నిత్యుధిః ఇ. పు. డు ధాఞ్ ధారణ పోషయోః. - ఉదకము దీనియందు ధరింపఁబడును.

ఉదకము - నీరు, (వ్యు.) తడుపునది.
ఉనక్తీతి ఉదకం, ఉందీక్తేదనే. - ద్రవమైయుండు నది.
ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పసువులను త్రోలుట.

                                                                                               

సింధువు - 1.ఒకనది, అఖంఢ భారత్ లో పొడవయినది  2.సముద్రము, 3.ఏనుగు, 4.నదము, 5.ఒకదేశము.
స్యందతే సింధుః. ఉ. పు. స్యందూ ప్రస్రవణే. - ప్రవహించునది.  

దేశే నదవిశేషే బ్ధౌ సిన్ధు ర్నా సరితి స్త్రియామ్ :
సింధుశబ్దము దేశ విశేషమునకును, నద విశేషమునకును, సముద్రము నకును పేరైనపుడు పు. సామాన్యముగా నదికిని నదీ విశేషమునకును పేరైనప్పుడు సీ. స్యందత ఇతి సింధుః. స్యందూ ప్రస్రవణే. - ప్రవహించునది. "సింధు ర్గజమదే పిస్యా' దితి శేషః.

సింధురము - ఏనుగు, వ్యు.కణతల నుండి మదము కారుచుండునది.

సింధునది సముద్రంలో సంగమించే తీర్థానికి వరుణ తీర్థం అని పేరు.

సర్వసంవత్స్వరూపాత్వం సంతుష్టా సర్వరూపిణి
రామేశ్వర్యధిదేవీత్వం త్వత్కళాస్సర్వయోషితః
కైలాసే పార్వతీత్వంచ - క్షీరోదే సింధుకన్యకా
సర్గేచస్వర్గ లక్ష్మీస్త్వమర్త్యలక్ష్మీశ్చ భూతలే|| –2స్తో

ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ -
మన్యేన సిన్ధుతనయా మవలమ్భ్య తిష్ఠన్| 
వామేతరేణ వరదా(అ)భయపద్మచిహ్నం    
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్భమ్.      

నదము - 1.పడమరగా పారెడి యేరు, 2.మడుగు, 3.సముద్రము, 4.మ్రోత.

సరస్వంత్తౌ నదార్ణవౌ : సరస్వచ్ఛబ్దము సరస్వంతమను నదమునకును, సముద్రమునకును పేరు. సరో స్యాస్తీతి సరస్వాన్ త. పు - సరస్సు గలిగినది. (సరస్సనఁగా నదపక్షమందు మడుఁగును, సముద్రపక్షమందు నీళ్ళును. "సరో నీరే తటాకే చ" అని రుద్రుడు). సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రము నకును, నదీ విశేషమునకును, ఆవునకును పేరు. "సరస్వతీ స్యాత్ స్త్రీరత్నే నద్యాం నద్యంతరే గవి" యని అజయుడు. "సరస్వతీ నదీ భేదే" అని ప్రతాపుఁడు.

బుసి - పశ్చిమ సముద్రము నడుమ నుండు వరుణోద్యాన నది.
బుసివోవు - క్రి.నశించు.

మడుఁగు - క్రి.అడుగు, వంగు, వి.1.గుణము, 2.కొలను, 3. 8వీసెలు, రూ.మడువు, మడ్గు, మణుగు, మణువు.    
అడువు - క్రి.1.ప్రశ్నించు, 2.కొట్టు, వి.అడుగు, పాదము.

అడుగుపుట్టువు - 1.గంగ, 2.శూద్రుడు.
అడుగు - క్రి.1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.

సచ్చూద్రుఁడు - మంచియాచారము గల శూద్రుడు.
శూద్రుఁడు - నాలవజాతివాఁడు.
శూద్ర - శూద్రజాతి స్త్రీ.
శూద్రి - శూద్రుని భార్య.

మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!   

సైంధవము - గుఱ్ఱము, వ్యు.సింధుదేశమున పుట్టినది.
సింధుదేశే భవః సైంధవః - సింధు దేశమందుఁ బుట్టినది.

కుంభరాశిలో(గురుడు) ప్రవేశం సింధునది పుష్కరాలు.

రథారూఢో గచ్ఛ న్పథి మిళిత భూదేవ పటలైః
స్తుతి ప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసిన్ధు ర్భాను స్సకల జగతాం సింధుతనయా
జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే|

మొగాళము - (వ్యావ.) నదీ సముద్రాదుల ముఖము.    
వేల్మోరి - (భూగో.) నదీసముద్ర సంగమము వద్ద వైశాల్యము తక్కువగు టచే నీరుగోడవలె లేచి కదలుట (Tidal-wave).  

ముగ్ధా ముహు ర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాః ప్రణిహితాని గతాగతాని
మాలా దృశ్యో ర్మధుక రీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరాసమ్భవాయాః|

     

చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

చక్రవర్తీ సార్వభౌమః -
చక్రం రాష్ట్రం స్వామిత్వేన వర్తయతీతి, న. పు. వృతువర్తనే. - స్వామిత్వము చేత భూచక్రమును వర్తించువాఁడు.
సర్వభూమే రీశ్వరః సార్వభౌమః. - సమస్త భూమికి నీశ్వరుడు. ఈ 2 చక్రవర్తి సార్వభౌమ శబ్దములు సమస్తమైన భూమి నేలు రాజు పేర్లు. 

విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.

చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు. 
సార్వభౌముడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.
సమ్రాట్టు - చక్రవర్తి.
రారాజు - 1.చక్రవర్తి, సార్వభౌముడు, 2.దుర్యోధనుడు, 3.చంద్రుడు Moon.
గాంధారేయుఁడు - దుర్యోధనుడు, గాంధారికొడుకు.

గాంధారి - 1.గంజాయి, 2.ధృతరాష్ట్రునిభార్య.

దుస్ససేనుఁడు - దు శ్శా స ను డు, దుర్యోధనుని తమ్ములలో నొకడు.

శకుని - 1.పక్షి, 2.దుర్యోధనుని మేనమామ.

భూపతికాత్మబుద్ధి మదిఁబుట్టనిచోట ప్రధాను లెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము, కార్య దక్షులై
యోపిన ద్రోణభీష్మకృపయోధులనేకులు గూడి కౌరవ
క్మాపతి కార్యమేమయిన జాలిరె చేయగఁవారు! భాస్కరా.

తా. దుర్యోధనుడు నీచుడగుటచే అతనియొద్ద సర్వకార్యములును నెరవేర్చ గల ద్రోణ  భీష్మాది మాహావీరులుండియు కౌరవులు - కురువంశపు వారు.)కురుపాండవ సంగ్రామమందు ఏమియు చేయలేక పోయిరి. అట్లే భూపతి - నేలరేడు, రాజు.)నకు తెలివిలేనప్పు డతనియొద్ద ఎంత మంది ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము)గల మేధావంతులున్నను లాభము లేదు.

తెలిపిట్ట - హంస.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.

                                                          

కర్మంది - యతి. 
యతి - 1.పద్య విశ్రమస్థానము, 2.సన్యాసి.
సన్యాసి - సన్యసించినవాడు.  

యే నిర్జితేంద్రియగ్రామా యతినో యతయస్చ తే,
యతం ఇంద్రియసంయమః ఏషా మస్తీతి యతినః, న. పు. - - ఇంద్రియ నియమము గలవారు.
యచ్ఛంతి ఇంద్రియేభ్య ఇతి యతయః, ఇ. పు. యమ ఉపరమే. - ఇంద్రియమువలనఁ జాలించినవారు. ఈ 2 జయింపఁబడిన యింద్రియ సమూహము గలవారి పేర్లు.

విరతి - విరామము, యతిస్థానము.
విరామము - 1.విశ్రాంతి, 2.యతిస్థానము.
విరతము - 1.వెలుగు లేనిది, 2.మిక్కిలి విరతి బొందినది, ఉడగినది, మరలినది. 
విరామ బిందువు - (భౌతి.) ఏ బిందువు వద్ద ఒక స్పందించు వస్తువు చలనరహితముగా నుండునో అట్టిబిందువు (Resting point).

నిర్జితుఁడు - గెలువబడినవాడు, ఓడినవాడు.
నిర్జించు - క్రి.గెలుచు, జయమునుపొందు. 

ఆశ పాపజాతి యన్నింటి కంటెను 
ఆశ చేత యతులు మోసపోరె
చూచి విడుచువారె శుద్ధాత్ములెవరైన విశ్వ.

తా|| ఆశ చాలా పాపమైనది. ఆశచే మునులు సహితము చెడి పోయిరి.  ఆ ఆశ(ఆశ - 1.కోరిక, 2.దిక్కు.)ను విడిచినవారే నిషల్మషమైన మనసు గలవారు.  

యమి - 1.ముని, 2.హంస.
సంయమి -
ముని, వ్యు.సంయమము కలవాడు.
సంయమము - హింసాదులవలన విరమించుట, రూ.సంయమము.
వాచంయముఁడు - మౌని (ముని).
మౌని - మౌనవ్రతుడు, ముని. మౌనము - మాటాడకుండుట.
నిరాహారి - మౌని, సం.నిరాహారీ.

వాచంయమో మునిఁ,
వాచం నియచ్ఛతీతి వాచంయమః. యమ ఉపరమే. - వాక్కును నిలుపువాఁడు.
మన్యత్తే మునిః ఇ. పు. మనజ్ఞానే. - జ్ఞానము గలవాఁడు. ఈ 2 మౌనవత్రము గలవాని పేర్లు. ఈ రెండు యు సన్న్యాసి పేర్లని కొందరు.

ముని - 1.ఋషి, 2.అవిసెచెట్టు.
ఋషి - 1.జ్ఞానముచే సంసారపారమును పొందినవాడు, 2.మంత్రద్రష్ట, 3.వెలుగు.
రుసి - ఋషి. వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.  
అగస్త్యము - అవిసెచెట్టు.
అవిసియ - అగిసె, రూ.అవిసె, అగస్త్యః. 
అగిసియ - అగిసె; అగిసె - అగస్త్యము.

అతసీ స్యా దుమా క్షుమా,
అతతీత్యతసీ, ఈ. సీ. అత సాతత్యగమనే. - ఏకాలమునైనను పైరగునది.
ఉమతి శుష్కదశ్యాయామిత్యుమా; క్షౌతీతి క్షుమా. ఉమ శబ్దే, టు క్షు శబ్దే. - ఎండినప్పుడు గల్గలయని మ్రోయునది. ఈ 3 నల్లయగిసె పేర్లు.

బాసవాలు - 1.వేలుపు, 2.ఋషి, వ్యు.పలుకే ఆయుధమైన వాడు.

క్షుమము - (గృహ.) అవిసెచెట్టునార లేదా గోగుచెట్టునార, (ఈనారను బట్టలు నేయుటకు ఉపయోగింతురు. దీనిని నారబట్ట అందురు.) క్షామము (నారబట్ట) (Linen)).
నారమడి - నారతో వేసిన మడిబట్ట. 

శోషకతైలములు - (గృహ.) ఏ వస్తువున కైనను పూసినచో గాలిపారి త్వరలో నారి(ఆరిపోయి), పొరకట్టిపోయి ఆ వస్తువునకు జిడ్డు లేకుండ చేయు నూనెలు, (Drying oils) ఉదా.సీమ అవిసెనూనె (Linseed oil).

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము White horse, 5.శరీర వాయువిశేషము, రూ.హంసము.

మహాయోగీ మహామౌనీ మౌనీశ శ్శేయసాంపతిః
హంసః పరమహంసశ్చ విశ్వగోప్తా విరాట్ స్వరాట్.

మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ! 

తాపసుఁడు - తపసి.
తబిసి - తపసి, ముని, సం.తపస్వీ.
తపస్వి -
తపస్సుచేయువాడు.
తపస్విని - తాపసురాలు.
తబము - తపము, తపస్సు, సం.తపన్.

తపము - 1.ధ్యానము, రూ.తపస్సు, 2.ఎండకాలము, 3.శిశిరర్తువు.
ద్యానము -
చాంచల్యము లేక మనసున భగవంతుని తలచుట.
ధ్యానీయము - 1.ధ్యానింపదగినది, 2.కోరదగినది.
ధ్యాతవ్యము - 1.ధ్యానింపదగినది, 2.ధ్యేయము.
ధ్యేయము - ధ్యానింపదగినది.
ధ్యాతము - ధ్యానింపబడినది.
ధ్యాత - ధ్యానించువాడు.

శినోతి పద్మ శోభా మితి శిశిరః-శీఞ్ నిశాతనే - పద్మములకాంతిఁ జెఱుచునది.

తపః కృచ్ర్ఛాదికర్మ చ. :
తపశబ్దము సాంతపనము, చంద్రాయణము మొదలయిన కృచ్ర్ఛము లకును, చకారమువలన ధర్మమునకును పైరైనపుడు న. శిశిరర్తువు నకును, మాఘమాసమునకును పేరైనపుడు పు. తపంత్యత్రేతి తపః, తపాశ్చ. స. తప సంతాపే. దీనియందు తపింతురు. 'తపౌ లోకే ధర్మమాత్రే క్లేశే శిశిర మాఘయో'రితి శేషః.

భూసుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనన్
మాని చరింపరో యనుచు మానవులట్లు చరింపఁబోవ దం      
బోనిధులన్నియున్ తనదు పుక్కిటబట్టె నగస్తుడంచునా
పూనిక నెవ్వడోపు నదిపూర్వమహత్త్వముగాక! భాస్కరా.
తా.
లోకులచే ఆరాధింపబడు దేవతాదులు కొందరు, వావి - బంధుత్వము)వరుసలు లేకుండా ప్రవర్తించినా రని, మనుష్యులు సైతము వారివలె ప్రవర్తించుట తగనిపని, ఎట్లనిన మునిశిరోరత్న మైన అగస్త్య మహర్షి - సప్త సముద్రములను అవలీలగా త్రాగి వైచినాడని - సామాన్యులట్టి పనికి పూనుకొనలేరు గదా! కావున వారి మహత్త్వవంతులే(గొప్పదనము) తప్ప యితరులు వారి నెన్నడనూ అనుసరింప రాదు.  

ఏవం కృతా యేన విచిత్రలీలా
మాయామనుష్యేణ నృపచ్ఛలేన |
తం వై మరాలం మునిమానసానాం
శ్రీజానకీజీవనమానతో స్మి |

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లఱఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.    

హంసాస్తు శ్వేతగరుత శ్చక్రాఙ్గా మానసౌకసః,
హంతి గచ్ఛతీతి హంసః హన హింసాగత్యోః. - చరించునది.

యోగి - యోగాభ్యాసము జ్యేయు పురుషుడు.
యోగాభ్యాసము -
(యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.

యోగము - 1.ప్రాణాయామాదికము, 2.కూడిక, 3.ఔషధము, 4.ప్రయత్నము.

యోగిహృదయ సరసీరుహ భాస్వర
యోగాధీశ్వర భోగవికస్వర| ||శరవణభవ||

యోగపట్టము - యోగులు జందెము వలె వేసికొను వస్త్రపుపట్టె, రూ.యోగపట్తె.
యోగవాగలు - యోగపాదుకలు, సిద్ధులు తమ యోగబలముచే నంతరిక్షమున బోవునపుడు ధరించు పాదరక్షలు.

ఓం భక్త హంస పరీ ముఖ్య వియోగాయై నమో నమః| 

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడి యుండు పరమాత్మ, 2.మనస్సు.
అంతర్యామి -
లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.  

యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భావమాన లహరీ-త్రైలోక్య రక్షాకరీ|
సర్వైస్వర్యకరీ తపఃఫలకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| - 3

చక్రధరము - పాము.
శిరసి చక్రయోగాచ్చక్రీ, న. పు. - శిరస్సునందు చక్రము గలిగినది. చక్రం మండలాకారతా అస్యాస్తీతివ చక్రీ - మండలాకారమై యుండునది.

చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్భుదంబు ద్బుదంబు గాక!
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగముతోడి పశువు గాక!  

కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు కలది 2.కుమ్మరి.

కుమ్భౌతు శిరసః పిణ్డౌ :
కుంభాకృతి యోగాత్కుంభౌ. అ. పు. - కుంభముల వంటి యాకారము గలవి.
శిరసః పిణ్డౌ - ఏనుఁగుతల మీఁద నుండు మాంస పుంజములు రెండును కుంభము లనంబడును. కుంభస్థలము.

కుమ్మర - కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.    

కుమ్భకారః కులాల స్స్యాత్ -
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
కుంభం కరోతీతి కుంభకారః. డు కృఞ్ కరణే. - కడవలు చేయువాడు.
కులాలుఁడు - కుమ్మరవాడు.
కుం భూమిం లడతి మృదర్థ మితికులాలః. లడ మర్దనే. - లడయో రభేదః. - మంటికొరకు భూమిని మర్దించువాఁడు. ఈ రెండు కుమ్మరవాని పేర్లు. 

ఐద్దాయులు - (ఐదు+కాయలు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.

పట్టడ - కుమ్మరి పనిచేయుచోటు.   

నవశిలాయుగము - (చరి.) కొత్త రాతియుగము, (ఈ కాలములోని మానవులచే రాతి పనిముట్లు, నాణెములు వాడబడుచుండెను. వీరికి వ్యవసాయము, నూలు వడుకుట, కుండలు చేయుట, అగ్నిని ఉపయోగించు విధము తెలియును. వీరు స్థిరనివాసము లేర్పరచుకొని, పండిన పదార్థములు తినుచుండిరి).  

భరటుఁడు - 1.కూలివాడు, 2.కుమ్మరి.
భరణ్యము - 1.కూలి, 2.జీతము.
భరణము - 1.భరించుట, 2.జీతము, 3.కూలి.    
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు. 
సేవకుఁడు - కొలువుకాడు.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.
భృత్య - కూలి. 
భృతి - 1.కూలి, 2.మోచుట, 3.విలువ.
భర్మము - 1.బంగారు, 2.జీతము.
జీతగాడు - జీతము గొని పనిచేయువాడు. 
జీతము - వేతనము, సం.జీవితమ్.
వేతనము - భృతి, కూలి, చేసినపనికి ప్రతిఫలముగ నిచ్చు ద్రవ్యము, జీతము.
వీయతే అనేనేతి వేతనం, వీ గతి వ్రజన కాంత్యసనఖాదనేషు. - దీనిచేత పొందఁబడును.
వేతనముల స్థాయి - (అర్థ.) వేతన ప్రమాణము.

జీవనము - 1.బ్రతుకు తెరువు, 2.నీళ్ళు.
జీవిక - బ్రతుకు తెరువు.

దొంతి - 1.ఒకటి మీద నొకటిగా నుంచిన కుండలులోనగు వాని వరుస, 2.వరుస.
దొంతర - పరంపర, దొంతి.

నీఁడు - కుమ్మరివారి బిరుదు పేరు, రూ.నాయుడు (ఉదా. అంకినీడు), సం.నాయకః.
నాయఁకుఁడు - 1.అధిపతి, 2.పన్నిద్దరు భటుల కధిపతి, సం.నాయకః. 
నాయఁడు - 1.ప్రభువు, 2.బలిజలుమున్నగు వారి పట్టపు పేరు, వై. విణ. శ్రేష్ఠుడు, సం. నాయకః.

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా. యదా రాజా తథా ప్రజ. 

స్వగృహేపూజ్యతే మూర్ఖః - స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా - విద్వాన్ సర్వత్ర పూజ్యతే||
తా.
మూర్ఖుఁడు తన స్వగృహము - (గృహ.) 1.నివాస స్థలము, ఇల్లు, 2.తనగృహము(Home)యింటియందును, ప్రభువు స్వగ్రామమందును, రాజు తన రాజ్యమందును (గొ)కొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశముయందు పూజింపఁ బడును. - నీతిశాస్త్రము

కుమ్మరి ఆవములో కుండలేగాని బొందెలు దొరకవు. కుమ్మరి కష్టమంతా ఒక్క దెబ్బకు లోకువ.

కుమ్మరివాడు గాలి ఊది కొలిమిలో నిప్పును మరింత రగిలించినట్లే, మనం కూడ మన మనస్సును సత్సాంగత్యం ద్వారా నిర్మలంగాను, ప్రశాంతం గాను ఉంచుకోవాలి. సత్సాగత్యం ఆత్మవికాసానికి ఎంతో అవసరం. - శ్రీ రామకృష్ణ పరమహంస                                                                          

సింధురము - ఏనుగు, వ్యు.కణతల నుండి మదము కారుచుండునది.

ఆరక్షము - రక్షించునది, సం.1.రక్షణము, 2.ఏనుగు కుంభముల క్రింది చోటు, 3.సైన్యము.
కాపు -
1.కాపుగడ, రక్షణము, 2.కాయలు కాచుట. 
రక్షణ - (గృహ.) కాపాడుట, (Protection).
సైన్యము - 1.సేనతో కూడినది, 2.సేన, 3.కృష్ణుని తేరిగుఱ్ఱములలో నొకటి.
మేఘపుష్పము - 1.నీరు, 2.కృష్ణుని తేరిగుఱ్ఱములలో ఒకటి.

విచక్షణుఁడు- విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
విశేషేణ చప్టే విచక్షణః చక్షిణ్ వ్యక్తాయాం వాచి. - విశేషముగాఁ బలుకువాఁడు.

అనూచానుఁడు - సాంగవేదాధ్యయనము చేసినవాడు, విణ.వినయముగలవాడు, విచక్షణుడు.
అనూచానము - పరంపరగా ప్రశస్తమైనది. 

రక్షో శిక్షణ కృత్య విచక్షణ
రక్షణదక్ష కటాక్ష నిరీక్షణ| ||శరవణభవ||

సామజము - ఏనుగు, వ్యు.సామ వేదమువలన పుట్టినది.

సామము - 1.ఒక వేదము, 2.మంచిమాట, 3.అనుకూలోపాయము.    

సామ సాన్త్వమ్ -
స్యతి వైరం సామ. న. న. షో అన్తకర్మణి. - వైరమును జెఱుచునది.
స్వాంత్వయంత్యసేన సాంత్వం. సాంత్వ సామప్రయోగే. - దీని చేత నూరడింతురు. ఈ రెండు సామోపాయము పేర్లు.

స్వాంతము - 1.మనస్సు, 2.గుహ.
స్వనతీతి స్వాన్తం, స్వనశబ్దే, తద్ద్యోగాభావే వాగ్వ్యాపారాభావాద త్రోవచారః. - పలుకునది.
మనస్సంబంధము లేనపుడు వాగ్వ్యాపారము గలుగదు గనుక పలుకునది యని చెప్పుట ఔపచారికము. ప్రియ గుహవిని వేదిత పద రామ్|

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

సామయిక పవనములు - ఎల్లప్పుడు ఒకే సమయమున వీచు పవనములు.

అహంకారీతరజన స్వాంత సౌధ విహరణే,
నమోస్తు చిత్వరూపాయ రామా.....
 

వైష్ణవీ సమాయాచారా కౌళినీ కులదేవతా |
సామగానప్రియా సర్వవేదరూపా సరస్వతీ ||

ఉద్గాత - యజ్ఞమందు సామవేద తంత్రమును నడుపు వ్యక్తి. 

వేదానాం సామవేదో స్మి దేవానా మస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానా మస్మి చేతనా || - 22శ్లో
తా||
చతుర్వేదములలో సామవేదమును, ముక్కోటి దేవతలలో వాసవుఁడు - ఇంద్రుడు, వసూని రత్నాన్యస్య సంతీతి వాసవః - రత్నములు గలవాడు.), పదకొండు ఇంద్రియములలో మనస్సును, జీవులయందు చైతన్యమును నేనే. - విభూతియోగము, భగవద్గీత 

గిష్ణుఁడు - 1.వేదాంతి, 2.గాయకుడు, 3.సామదానవేత్త.
బ్రహ్మవాది -
వేదాంతి; వేదాంతి - వేదాంతము తెలిసినవాడు.
గాయకుఁడు - 1.పాటపాడువాడు, 2.నర్తకుడు, నటుడు, 3.ప్రౌఢుడు, నేర్పరి, చతురుడు.
సీకారి - పాటపాడువాడు, గాయకుడు, సం.శ్రీకారీ.
గాయనుఁడు - 1.పాటపాడువాడు, 2.గానము వృత్తిగా గలవాడు.
గాయని - పాటకత్తె.
గేష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు, విణ.పాడెడివాడు (అనికొందఱు.)
గీష్ణువు - 1.నటుడు, 2.గాయకుడు.

గీష్పతి - 1.బృహస్పతి, 2.పండితుడు.
గిరాం పతిః గీష్పతిః - వాక్కులకు పతిః. 
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతి, ఇ.వు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు లనంబడును, వారలకై నను వానికైనను ప్రభువు. 
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).


సూరి - 1.సూర్యుడు Sun, 2.పండితుడు.
అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (inner-voice). ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.

నర్తకుఁడు - 1.నట్టువుడు, 2.పాములవాడు, విన.ఆడెడువాడు.
ఆటకాఁడు -
ఆటయాడువాడు, నటుడు, నర్తకుడు.
నృత్తము - నర్తనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నటనము - 1.నాట్యము, 2.కపట వర్తనము. 
నాట్యము - నృత్యము, నృత్యగీత వాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్త నేత్రాభినయముల్చే భావములను తెలుపుచు ఆడెడి ఆట.
ఆట - (ఆడు+ట) 1.క్రీడ, 2.నృత్యము, 3.విహారము, ఉదా.ఆటతోట, 4.స్నానముచేయుట, 5.చెరుకు, నువ్వులు మొ.వి గానుగలో వేసి త్రిప్పుట, 6.పలుకుట, 7.నింద, 8.పరిహాసము.
ఆటకత్తియ - ఆటయాడునది, నటి, నర్తకి, రూ.ఆటకత్తె. 
నటి - 1.వేశ్య, 2.నట్టువుని భార్య.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు. 
నర్తించు - 1.ఆడు, 2.నటించు, రూ.వర్తిల్లు, వర్తిలు.
నటించు - 1.నర్తించు, వర్తించు, 2.కపటముగా వర్తించు.     

స్వాంతము - 1.సామోపాయము, 2. దాక్షిణ్యము.

దాక్షిణ్యము - 1.దయ, 2.నేర్పు, 3.సామర్థ్యము, 4.దక్షిణ నాయక భావము.     
కృప - దయ, కనికరము. దయ - కనికరము.
అనుక్రోశము - కనికరము; కనికరము - 1.దయ, 2.శోకము(దుఃఖముచే తపించుట, వగవు).
కృపాళువు - దయాళువు, దయకలవాడు. 
దయాళువు - కనికరము కలవాడు. 

ప్రావీణ్యము - నేర్పు. పటిమ - నేర్పు, సామర్థ్యము.
సామర్థ్యము -
1.నేర్పు, 2.యోగ్యత (భౌతి.) పనిచేయు రేటు,(Power) (గృహ.) బలము, సత్తువ.
నేరిమి - సామర్థ్యము, రూ.నేరువు, నేర్మి, నేర్పు.
నేరువు - క్రి.1.నెరువూచేయు, 2.సామర్థ్యము.
నేరుపుకాఁడు - నేరువరి, సమర్థుడు. సమర్థుఁడు - నేర్పరి.
నేరుపులాఁడు - నేరువుకాడు. 
ప్రోఢ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రౌఢ - పదునెనిమిదేండ్లకు పైబడిన వయస్సుతోడి సంపూర్ణ యౌవనముగలది.
ప్రోఢము - 1.పెరిగినది, 2.వయస్సు వచ్చినది, 3.నేర్పుగలది.
ప్రౌఢి - 1.సామర్త్యము, 2.నేర్పు, 3.వృద్ధి, 4.గర్వము.    
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు - నేర్పరి; చతురిమ - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు. 
చతురుఁడు - నేర్పరి తనము; కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము. 

ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion). 

దాక్షిణ్యంస్వజనే దయాపరిజనే శాఠ్యంసదా దుర్జనే
ప్రీతిస్సాధుజనే నయోనృపజనే విద్ద్వజ్జనే చార్జవం|
శౌర్యంశత్రుజనే క్షమాగురుజనే కాంతాజనే ధృష్టతా
యేచై వంపురుషాఃకలామ కుశలా స్తేష్వేవ లోకస్థితిః||
తా.
బంధుజనుల(స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.)యందు దాక్షిణ్యమును, పరిజనము - పరివారము యందు దయ - కనికరమును, దుర్జనుఁడు - దుష్టుడు యందు శాఠ్యము - శఠత్వము, కపటమును, సజ్జనుల యందు ప్రీతి - 1.సంతోషము, 2.స్నేహము., నృపుఁడు - రాజుల యందు నీతి - న్యాయము యును, విద్ద్వజ్జనుల యందు నిష్కాపట్యమును, శత్రువుల యందు శౌర్యము - శూరత్వము, ప్రౌడిమమును, గురువుల యందు క్షమ - 1.ఓర్పు patience, 2.నేల, 3.మన్నింపు., కాంత - కోరతగిన స్త్రీ, స్త్రీ. యెడల దిట్టతనమును గలిగి ప్రవర్తించునట్టి విద్యా ప్రావీణ్యమును గల పురుషుల యందు లోకము నిలుచును. - నీతిశాస్త్రము

వైష్ణవీ సమాయాచారా కౌళినీ కులదేవతా |
సామగానప్రియా సర్వవేదరూపా సరస్వతీ ||

ఆదిభిక్షువు - శివుడు.
భిక్షువు - సన్న్యాసి, బ్రహ్మచారి, (చరి.) బౌద్ధ సన్న్యాసి.
భిక్షతే భిక్షుః ఉ. పు. భిక్ష భిక్షాయాం. - అడుగువాఁడు. భిక్షుక సంస్తుత గోవిందా|

భిక్షతేయాచతే భిక్షుః, ఉ. పు. భిక్ష భిక్షయాం యాచించువాఁడు సన్న్యాసి. ఆ సన్న్యాసి కుటీచకుఁడు, బహూదకుఁడు, హంసకుఁడు పరమహంసకుఁడు అని నాలుగు తెఱఁగులు గలవాఁడు. ఇట్లీ నాలుగు శబ్దములును క్రమముగా బ్రహ్మచారికి, గృహస్థునికి, తపస్వికి, సన్న్యాసికిని పేర్లు.

కక్షపాల - సన్యాసుల జోలె, సం.కక్షపాలః.
కక్షపాల - కకపాల.
(ౙ)జోలియ - చంకకు వ్రేల వేసికొను బిచ్చపు సంచి, రూ.జోలె.
ౘంకరాళి - చంకమూట.

పరివ్రాజకుఁడు - సన్న్యాసి.
పరిత్యజ్య సర్వం వ్రజతీతి పరివ్రాట్, జ. పు. వ్రజగతౌ. - అన్నింటిని బరిత్యజించి పోవువాఁడు.
పరిత్యాగము - బొత్తుగా విడిచిపెట్టుట. 

మార్గణుఁడు - యాచకుడు.
మార్గయతి దాతారమితి మార్గణః, మార్గ అన్వేషణే. - దాతను వెదకువాఁడు.
మార్గణము - 1.వెదకుట, 2.యాచించుట, 3.బాణము, వ్యు.గురివెదకుచు పోవునది.
మార్గయతి లక్ష్యమితి మార్గణః, మార్గ అన్వేషణే - గుఱిని వెదకునది.    

మస్కరి - సన్న్యాసి, యాచకుడు.
మస్కరో వేణుదండః, సో (అ)స్యోస్తీతి మస్కరీ, న. పు. మస్చర మనఁగా వెదురుగడ; అది గలవాఁడు.
మా కరణశీలః కామకర్మవ్రతిషేధపరోవా మస్కరీ. - కామకర్మములను బ్రతిషేధించు స్వభావముగలవాఁడు.   

యాచకుఁడు - 1.భిక్షుకుడు, 2.వేడువాడు.
యాచనం యాచ్జా, టు యాచృ యాచ్జాయాం, భిక్షణం భిక్షా, భిక్ష యాచ్జాయాం. అర్థనం అర్థనా, అర్థ ఉపయాచ్జాయాం. అర్థనం అర్దనా, అర్ద గతౌ యాచనే చ. అడుగుట యాచ్జ, భిక్ష, అర్థన, అర్దనయును, అ. ఈ నాలుగు అడుగుట పేర్లు.
యాచన - దైన్యముతో వేడుట.

(ౙ)జోగి - 1.యోగి, 2.భిక్షుకుడు, సం.యోగీ.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవిశేషము, రూ.హంసము.

యోగి - యోగాభ్యాసము జేయు పురుషుడు.
యోగాభ్యాసము - (యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.

(ౙ)జొగ్గు - భిక్షము, రూ.జోగు.
(ౙ)జోగు - భిక్షము, రూ.జొగ్గు, ఓడ.      

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందిట. 

భిక్షుకుఁడు - బిచ్చగాడు.
బికారి - బిచ్చగాడు, దరిద్రుడు, వికృతవేషధారి, సం.వికారీ.
బిక్క - 1.నిరుపేద, 2.బెదురు గలది, సం.భిక్షుకమ్, 2.భీరుకమ్.
భిక్ష - బిచ్చము, బికిరము.
బికిరము - 1.వేడికోలు, 2.బిచ్చము, సం.వికరమ్.

భిక్షా సే వార్థనా భృతిః,
భిక్షాశబ్దము సేవించుటకును, యాచించుటకును, కూలికిని పేరు. భిక్షణం భిక్షా, భిక్ష యాచ్జాయాం - అడుగుట గనుక భిక్ష, "భిక్షాభిక్షిత వస్తుషు" ఇతి శేషః.

తిరిపిగాడు - బిచ్చగాడు; తిరుపగత్తె - బిచ్చకత్తె.
తిరివగొట్టు - బిచ్చమెత్తుటయే వృత్తిగా కలవాడు, రూ.తిఱిగొట్టు.
తిరియు - క్రి.బిచ్చమెత్తు, రూ.తిరుచు.
తిరిపము - భిక్షము.    

ఋణము - 1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బీ. గణి.) a. తీసివేయు సంఖ్య, b.తీసివేత గుర్తు, విణ.ఋణరాశి (Negative).    

ఋణం యాచ్నా చ వృద్ధత్వం జార చోర దరిద్రతా|
రోగశ్చ భుక్త శేష శ్చా వ్యష్టకష్టాః ప్రకీర్తితాః||

తా. ఋణము debt, యాచించుట, వృద్ధత్వము - ముసలితనము (Senility), వ్యభిచారము, చోరీ - దొంగతనము robbery, దారిద్ర్యము poverty, రోగము - వ్యాధి disease, భుక్తశేష భోజనము ఇవి అష్టకష్టములు. - నీతిశాస్త్రము

కష్టము - 1.దుఃఖము, 2.దోషము, 3.పాపము.
కప్యతి హినస్తీతి కష్టం, కష హింసాయాం. - హింసించునది. 

భిక్షురూప సమాక్రాంత బలి సర్వైకసంపదే,
నమో వామనరూపాయ రామా.....

రాజీవము - తామర.
కేనరరాజియోగాత్ రాజీవం - ఆకరులయొక్క పంక్తి గలిగినది.

రాజీవ శోచిస్సంస్పంద రుచిరాంగాదిశోచిషే,
నమః కైవల్య నిధయే రామా......

పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
శ్రాన్తం పుష్ణాతీతి పుష్కరం, పుక్ష పుష్టౌ. - బదలినవానిని బోషించునది.  

కపాలభృత్తు - శివుడు.
కపాలం బిభర్తీతి కపాలభృత్. త-పు. - కపాలమును భరించినవాడు. భృఞ్ భరణే.  

కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium). 

స్యా త్కర్పరః కపాలో (అ)స్త్రీ -
భారధారణాయ కల్పతే సమర్ధో భవతి కర్పరః, కృపూ సామర్థే. - భారమును ధరించుట కొఱకు సమర్థమైనది.
కం శిరః పాలయతి కపాలః. అప్న. - శిరస్సును రక్షించునది. ఈ 2 తలయెముక తునక పేర్లు.

కపాలము - 1.తలపుఱ్ఱె, 2.సమూహిము, 3.కుండపెంకు, (జం.) 1.పుఱ్ఱె, 2.పృష్ఠ వంశీక జంతువుల తలలోనున్న ఎముకల సముదాయము. కపాల మొచనము నందు దేవీస్థానం శుద్ధి|

పునక - తలపుఱ్ఱె, తలయెముక.
పుఱ్ఱె - (గృహ.) తల ఎముకల(సుకుమారము యొక్క)గూడు (Cranium).

బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.

కపాలనాడులు - మెదడు నుండి వచ్చు నాడులు (cranial nerves).

ఆకృషినాడి - (జం.) కపాలము నుండి బయలుదేరి కనుగ్రుడ్డు యొక్క కండరములకు బో వు నా డి (Pathetic nerve).

లలామాంకపాలం లసద్గానలోలాం
స్వభక్తైకపాలం యశఃశ్రీకపోలామ్|
కరే త్వక్షమాలాం కనద్రత్నలోలాం
భజే శారదాంబా మజస్రాం మదంబామ్. - 3 

ధరాధరము - 1.కొండ, 2.తాబేలు.
తామేలు - తాబేలు.

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోక ధృత్|
సుమేధా మేధజో ధన్యః స్సత్య మేధా ధరాధరః|| - 80స్తో

కూర్మము - కమఠము, తాబేలు. 
కుత్సితః ఊర్మిర్వేగః అస్యకూర్మః - ఊర్మియనఁగా వేగము; కుత్సితమైన వేగము గలది.
'ఊర్మిః స్త్రీపుంస యోర్వీచ్యాం ప్రకాశే వేగభంగయో' రితి రభసః. కం జలం ఊర్వతీతివా కూర్మః.
ఊర్వీ హింసాయాం. - జలమును (ౙ)జెరుచునది.
కే ఉదకే మఠతీతి కమఠః. మఠ నివాసే. - జలమునందు వసించునది.

కమఠము - 1.తాబేలు, 2.భిక్షాపాత్రము.
కే ఉదకే మఠతీతి కమఠః, మఠ నివాసే. - జలమును వసించునది.
యజ్ఞార్థం కామ్యత ఇతివా కమఠః, కముకాంతౌ. - యజ్ఞార్థమై కాంక్షింపఁబడునది.      
అక్షయపాత్ర - భిక్షాపాత్ర. 
భవనాసి - (వ్యావ.) 1.బిచ్చగాని గిన్నె, 2.అక్షయపాత్ర.

కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium). 

డులి - ఆడుతాబేలు, రూ.డులి.
కమఠీ డులిః -
కమఠస్య స్త్రీ కమఠీ - కమఠముయొక్క స్త్రీ కమఠి.
ఢులతీతి ఢులిః పా. ఇ. సీ. ఢుల ఉతేక్ష పే. - జలమును జల్లునది. ఈ రెండు 2 ఆఁడుతాఁబేటి పేర్లు. 

కచ్ఛపము - తాబేలు, కమఠము. 
కచ్ఛేన పుచ్ఛేన పిబతీతి కచ్ఛపః. పా పానే. - పుచ్ఛము - తోక)చేత పానము చేయునది.
కచ్ఛమనూపదేశం క్షుద్రజంతు భకణేన పాతీతి వా కచ్ఛపః - జలప్రాయ ప్రదేశమును క్షుద్ర జంతు భక్షణముచేత రక్షించునది.

కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మము - air in the eyes.

కూర్మవత్ స్థితత్వాత్కచ్ఛపః - కూర్మము వలె నుండునది.

కూర్మీ వీణాభేదశ్చ కచ్ఛపీ,
కచ్చపీశబ్దము ఆఁడుతాఁబేటికిని, సరస్వతివీణకు ను పేరు.
కచ్చం పాతీతి కచ్ఛపీ. సీ. పా రక్షణే. - జలప్రాయ భూమిని బాలించునది.

నిజసల్లాపమాధుర్య-వినిర్భర్త్సితకచ్ఛపీ|
మందస్మితప్రభాపూర-మధ్యత్కామేశ మానసా. – 11స్తో

సరీసృపములు - (జం.) చల్లని నెత్తురు చర్మముపై పెంకువలె నుండు గట్టి నిర్మాణములు, ఊపిరితిత్తులు, రెండు బృహద్ధమన చాపములు గల పృష్ట వంశిక జంతువులు (Reptilia), ఉదా.బల్లి, తొండ, మొసలి, పాము, తాబేలు, మొ.

కరమనురక్తిమందరముగవ్వముగా యహిరాజు ద్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్థపయోధిమధించు చున్నచో
ధరనిచలింప లోకములు తల్లడమందఁగఁ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరధీ కరుణాపయోనిధీ.

తా. రామా! దేవతలును, రాక్షసులును, మందర పర్వతమును కవ్వముగాను, అహిరాజగు అహిరాజగు వాసుకుని కవ్వపు త్రాడుగానుజేసి పాల సముద్రమును(పయోధి - సముద్రము) చిలుకు చుండగా, అపుడాకొండ తటాలున  మునుగుట చేత భూమి, లోకములు తల్లడిల్లటం జూచి కూర్మావతారము యెత్తి కొండను వీఁపుమీఁద దాల్చినవాడవు నీవేకదా!

గిరిధరుఁడు - విష్ణువు, వ్యు.మందర పర్వతమును ధరించినవాడు.  

గుహ్యము - 1.ఏకాంతము, 2.పురీషమార్గము, 3.వంచన, 4.తాబేలు, విణ.దాచదగినది. 

సముద్ర మథన కాలంబునం బదునొకండవ(11వ) మాఱు కమఠాకృతిని మందరాచలంబుఁ దన పృష్ఠ కర్పరంబున(కర్పరము - 1.వెడల్పు ముఖము గలపాత్ర, 2.భిక్షాపాత్రము, 3.(జం.) కపాలము, పుఱ్ఱె (Cranium) నేరుపరియై నిలిపి; పదకొండో పర్యాయం సముద్ర మధన సమయం లో "కూర్మావతారం" స్వీకరించి మున్నిటిలో మునిగి పోతున్న మందరపర్వతాన్ని నేర్పుగా తన వీపునగల పెంకుపై ధరించాడు.

ఎట్లుగఁ బాటుపడ్డనొకయించుక ప్రాప్తములేక వస్తువుల్
పట్టుపడంగనేరవు నిబద్ధి, సురావళిఁ గూడి రాక్షసుల్
గటుపెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మధించి రెంతయున్
వెట్టియెకాక యే మనుభవించిరి వా రమృతంబు, భాస్కరా.
తా.
రాక్షసులు దేవతలతో కలిసి మందర పర్వతమును పెకలించు దానిని తీసుకొనివచ్చి కవ్వముగా నుపయోగించి, పాలసముద్రము మధించిరి. తుదకు అమృత మందు జనిత మయ్యెను. కాని ప్రయాసపడిన రక్కసులు దానిని తామనుభవింపలేకపోయిరి. కావున యెవరెంత కష్టపడినను, వారికి అదృష్టములేనిచో తామాశించు ఫలమును పొందలేరు.

దాశార్హుఁడు - కృష్ణుడు, వ్యు.దశార్హుని సంతతివాడు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.

దాసరయ్య - 1.తాబేలు, 2.విష్ణుభక్తుడు.
దాసరి - విష్ణుసేవకుడగు శూద్రుడు, రూ.దాహరి, సం.దాసః.
దాసుడు - 1.పనివాడు; సేవకుడు, 2.భక్తుడు(భక్తిగలవాడు), 3.జ్ఞాని.

దాసి - పనికత్తె, పరిచారిక.
దస్యతి క్షీయతే కాలేన దాసీ, ఈ. సీ దసు ఉపక్షయే. - కాలవశమున క్షయించునది.  
దాసేయుఁడు - పనివాడు, విణ.దాసికి పుట్టినవాడు, రూ.దాసేరుడు.
దాస్యా అపత్యం దాసేరః, దాసేయశ్చ. - దాసీపుత్రుఁడు.
దంసయతే స్వామికార్యాని సావధానేనేతి దాసః, దపి దంశ దర్శనయోః. - స్వామికార్యములను సావధానముగాఁ జూచువాఁడు.     

దాసరిపాము - చారలుగల పెద్దపాము.

టెక్కి - దాసరికుల్లయి, ఒక రకమైన పొడుగు టోపి.

తాబేలు -  A sea or land turtle. The land species is often called దాసరితాబేలు or hermit-tortoise.

కొండమోసెడి యయ్యకుఁ గూడ నణువు
కాని నేనె భారమ్మైతి నింక
నాదు గతి యేమొ తెల్పరా వాదమేల
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|

కూర్మము - Tortoise, air that holds the breathe.
కూర్మము - air in the eyes.

క్రోడపాదము - తాబేలు Tortoise, వ్యు. రొమ్మున నిముడ్చుకొను పాదములు కలది.

Turtle - Tortoise with short legs, An animal of water covered with a hard shell, withdraws all its limbs in its body.

క్రోడము - 1.రొమ్ము, 2.పంది, 3.ఒడి.
క్రోడ తీతి క్రోడః క్రుడ ఘనత్వే. - ఘనమైనది.

న నా క్రోడం భుజాన్తరమ్,
క్రోడతీతి క్రోడం, అ. న్న. క్రుడ ఘనత్వే. - ఘనమైనది.
భుయో రంతరం భుజాంతరం. - భుజముల యొక్కనడుము. ఈ 2 చేతుల నడుము వేళ్ళు.

రొమ్ము - పక్షము, రూ.ఱొమ్ము, సం.ఉరస్.
రొమ్ము పడిసెము - (వైద్య., గృహ.) గుండె జలుబు.
రొంప - పడిసెము.
ౙలుబు - శైత్యము, సం.జలమ్, శైత్యమ్. ప్రతిశ్యాయము - పడిసెము, రూ.ప్రతిశ్య.

ఉపయోజనము -  (జీవ.) నిర్మాణము నందును, శరీర ధర్మముల యందును, ప్రాణి ప్రత్యేక పర్యావరణమునకు తగియుండు క్రమము (Adaptation).

హృదయము - మనస్సు, గుండె, రొమ్ము రూ.హృది ప్రాణః (జం.)గుండెకాయ, గుండె(Heart). 

స్యా దురస్వా సురసిలః -
ప్రశస్తమురో (అ)స్యాస్తీతి ఉరస్వాన త, ఉరసిలశ్చ. - ప్రసస్తమైన ఱొమ్ము గలవాఁడు గనుక ఉరస్వంతుఁడు, ఉరసిలుఁడును. ఈ 2 ఘనమైన ఱొమ్ము గలవానికిని, ఱొమ్ము బలము గలవానికి పేర్లు.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.  

పంది - సూకరము.
సూకరము - పంది, శూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.   

క్రోడాడు - 1.(ఎద్దు మో.వి) కొమ్ములతో నేలను పొడిచి దుమ్మెగజల్లు, 2.(పంది) ముట్టెతో నేలను కెల్లగించు.

ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా,
గూఢగుల్భాకూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా. - 18శ్లో

మొగపిఱికి - మొగము (+పిఱికి) తాబేలు, వ్యు.మొగము చూచుటకు పిరికితనము కలది.

మోము - మొగము, సం.ముఖమ్.
ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.
ఖన్యతే భక్ష్యమనేనేతి ముఖం, ఖను అవదారణే. - దీనిచేత భక్ష్యము పీడింపఁబడును.
మొకము - ముఖము, సం.ముఖమ్. ముఖం పాతు వరాలక్ష్మీ|

ముఖకుహరములు - (జం.) నోరు (Buccal cavity).
ముఖశ్వసనము - (జం.) నోటితో గాలినిపీల్చి వదలివేయుట (Buccal respiration).
ముఖవలయము - (జం.) నోరుచుట్టును ఉండు ప్రదేశము (Peristome).
ముఖపథము - (జం.) బహిశ్చర్మము లోనికి పెరుగుటచే ఏర్పడిన అన్నవాహిక యొక్క ముందరి భాగము, (Stomodaeum).

ముఖపాకము - (గృహ.) నాలుక పూత(Red-tongue) విటమిన్ 'B12' లేక 'డి' లోపము వలన కలుగు వ్యాధి (Stomatitis).

యదా సంహరతే చాయం కూర్మోంగా నీవ సర్వశః |
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా || - 58శ్లో

తా|| భయపడిన తాబేలు తలను, నాలుగు కాళ్ళను లోనికిముడుచు కొనునట్లు, ఆత్మారాముడగు యోగి రాగద్వేషాది  దోష భయమున పంచేద్రియములను సర్వ విషయములనుండి వెనుకకు మరల్చి స్థిత ప్రజ్ఞుడగుచున్నాడు. ఇంద్రియ ప్రవృత్తి లేనందున నిశ్చలుడై కూర్చుండునని భావము. - సాంఖ్యయోగము, భగవద్గీత

ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం|
జాప్యసమేత సమాధివిధానం, కుర్వవధానం మహదవధానం|| - 30

ప్రాణాయామం చేయాలి, ప్రత్యాహారం (ఇంద్రియ నియంత్రన) చేయాలి, నిత్య అనిత్య, వస్తు వివేచనచే విచారణ చేయాలి. నామజపంతోపాటు ధ్యానం చేయాలి. సమాధిస్థితిని పొందు విధానం అతి మెళకువతో అభ్యసించాలి. జాగ్రత్తగా ఆచరించాలి.
The regulation of breath, the withdrawal of the senses (from their respective objects), the inquiry consisting in the discrimination between the eternal and the non-eternal, the method of mind-control associated with the muttering of mantras – perform these with great care. - భజగోవిందం

నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
భూదోరకహర పుణ్యమతే క్రీడో ద్ధృత భూ శ్రీ నృహరే
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయవ మామ్. - 3

స్తూపపృష్టము - తాబేలు, వ్యు.దిబ్బవంటి వీపుకలది.
స్తూపము -
మట్టి మొదలగువాని దిబ్బ.

క్షుబ్దాద్రౌ క్షుభితజలోదరే తదానీం దుగ్దాబ్దౌ గురుతరభారతో నిమగ్నే |
దేవేషు వ్యథితతమేషు తిత్ప్రియోషీ కమఠ తనుం కఠోరపృష్ఠామ్||

దేవా! సురాసురలు క్షీరసముద్రమును చిలుకు చుండగా మందర పర్వతము మిక్కిలి బరువుగా ఉండుటచే అది అల్లకల్లోలముగా నున్న ఆ జలములలో మునిగిపోయెను. అందులకు దేవతలు అందఱును చింతా క్రాంతులైరి. అప్పుడు వారికి ప్రీతిని గూర్చుటకై నీ కఠినమైన మూపుగల కూర్మ రూపమును ధరించితివి. – నారాయణీయము

పీవరము - బలిసినది, వి.తాబేలు.
పీనము -
బలిసినది, వి.సంతోషము.

లప్ప - రాశి, విణ.కండకలది, బలిసినది.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటిచిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.  

వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో విస్తారాత్ పరిగతలక్షయోజననేన|
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నినేథ||
శ్రీ మహావిష్ణు! కూర్మ రూపముననున్న నీ యొక్క వెన్నుచిప్ప, వజ్రము కంటె మిక్కిలి కఠినముగా లక్షయోజనముల వైశాల్యమున ఉండెను. సముద్రము లోపల గుభిల్లుమను శబ్దముతో పడిపోయిన మందర పర్వతమును ఆ చిప్పపై ఉంచుకొని దానిని సముద్రముపైకి తెచ్చితివి. - నారాయణీయము

క్షితి రతి విపులతరే తవ తిష్ఠతి పృష్ఠే, ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే|
కేశవ! ధృత కచ్ఛపరూప! జయ జగదీశ! హరే!

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు.
వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ - స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.   

సుగతే చ వినాయకః
వినాయకశబ్దము బుద్ధదేవునియందును, చకారము వలన గణాధిపతి యందును, గర్త్మంతుని యందును, గురువునందును వర్తించును.
వినయతి శిక్షయతీతి వినాయకః, ణీఞ్ ప్రాపణే. - శిక్షించువాఁడు. "వినాయకస్తు హేరంబే గరుత్మతి గురావ" పీతి శేషః.

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.

విఘ్నో (అ)న్తరాయః ప్రత్యూహః -
విఘ్నము - అంతరాయము, అడ్డు.
హననం కార్యస్యేతి విఘ్నః, హన హింసాగత్యోః. - కార్యము చెడుట. 
అంతరాయము - అడ్దు, విఘ్నము, ఆటంకము.
అంతరా మధ్యే ఆయనం అంతరాయః, అయ పయ గతౌ. - నడుమ నెడతెగుట.
ప్రతికూల మూహసమితి ప్రత్యూహః, ఊహవితర్కే. - ప్రతికూలమైన ఊహ. ఈ 3 విఘ్నము పేర్లు.
ప్రతికూలము - అనుకూలముకానిది. 
ఆటంకము - ఆడ్డంకి, నిరోధము.
అడ్డు - క్రి.అడ్డగించు, నిరోధించు, విణ.నిరోధము, నిరోధకుడు.
అడ్డము - 1.నిరోధము, అడ్దంకి, 2.చాటు, 3.తాకట్టు, 4.పూట, విణ.నిరోధకము, అడ్డునది.
నిరోధము - 1.అడ్దు, 2.చేటు, సం.వి.(భౌతి,) ఒక వస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).
నిరోధించు - క్రి.అడ్దగించు.

మునీంద్రః మునీనా మింద్రః శ్రేష్ఠః - మునులలో శ్రేష్ఠుడు.
శ్రీఘనః శ్రియా యోగవిభూత్యాఘనః పూర్ణ - యోగసంపద చేత నధికుఁడు.

పాథోధి - సముద్రము.
పాధస్సు - 1.జలము, 2.అన్నము. 
పీయతే పాథః, స-న. పా పానే. - పానము చేయఁబడునది.
పాతి భూతానీతి పాథః, పా రక్షణే. - భూతములను రక్షించునది. 
పాథేయము - అన్నము, బియ్యము లోనగు దారి బత్తెము.

అన్న మిడుటకన్న అధిక దానంబుల
నెన్ని చేయనేని యెన్నఁ బోరు
అన్న మెన్న జీవనాధార మగునయా విశ్వ.
తా.
ఇతర దానములు యెన్ని చేసిననూ అన్నదన్నముతో సాటిగా ఆలోచించినచో అన్నమె యీలోకములో జీవనాధారము.

సూపకారాస్తు వల్లవాః ఆరాళికా ఆన్ధసికా స్సూదా ఔదనికా గుణాః,
సూపకారుఁడు - వంటవాడు, రూ.సూపుడు.
సూపం వ్యఙ్జనం కుర్వన్నీతి సూపకారాః, డు కృఞ్ కరణే. - కూరలు చేయువారు.
సువారము - వంట, సం.సూపకార్యమ్.
సూపము - వండినపప్పు.
కూరము - అన్నము, వంటకము.   
వంటకము - అన్నము.

అట్టము - 1.వంటకము, 2.వంటచెరకు, 3.మేడ వెనుకటిల్లు, 3.అతిశయము.
వంటకము - అన్నము.

ఇన్ధనం త్వేధ ఇధ్మ మేఢ స్సమిత్ స్తియామ్,
ఇంధే అగ్నిరనేన ఇంధనం ఇధ్మస్చ, ఞ్ ఇంధీ దీప్తౌ. - దీనిచేత నగి ప్రకాశించును.
ఏధతే అగ్నిరనేనే ఏధః, స. న. ఏధశ్చ. అ. పు. ఏధవృద్ధౌ. - దీనిచేత అగ్ని వృద్ధిఁబొందును.
సమిధ్యతే అగ్ని రనయేతి సమిత్, ధ. సీ. - దీనిచే నగ్ని మిక్కిలి ప్రకాశించును. ఈ 5 సమిధ పేర్లు.

వంటచెఱకు - వంటకట్టియలు.
ఇంధనము - వంట చెరకు, (రసా.) 1.నిప్పుచేయుటకు ఉ ప యో గిం చు ద్రవ్యము (Fuel), ఉదా. కఱ్ఱలు, బొగ్గు మొ.వి. 2.(Fuel) నుండి వేడి నిచ్చెడి పదార్థము.
ఇధ్మము - 1.సమిధ, 2.చిదుగు, వంటచెరుకు.
సమిధ - చిదుగు, వంటచెరకు.
చిదుగు - 1.ఎండిన సన్నపుల్ల, 2.సమిధ. 
వంటచెఱకు చెట్టు - (వ్యవ.) వంటకట్టెల నిచ్చు వృక్షములు, ఉదా. సరుగుడు మొదలగునవి (Fuel trees).

ముటాలు - (వ్యావ.) వంట కట్టియలు. 

నొగిలినవేళ నెంతటిఘనుండు దన్నొక రొక్క నేర్పుతో
నగపడి ప్రొదిసేయక తనంతట బల్మికిరాఁడు నిక్కమే
జగమున నగ్నియైనఁ గడుసన్నగిల్లంబడి యున్న నింధనం
బెగయఁగద్రోచి యూదక మెఱెట్లురవుకొననేర్పు, భాస్కరా|

తా. అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు. కొంచెము నున్నప్పుడు దానిపై ఎండుపుల్లలు వేసి నూదకుండగా నదిమండ నేరదు. అట్లే గొప్పవానికి ఘనుఁడు - గొప్పవాడు, వి.మేఘుడు.)పేదఱికము వచ్చినప్పుడు యొంకొక ఉపాయముచే తనని పోషించుకున్నచో నతడు తనంత తాను అభివృద్ధి కాజాలడు.

భిస్సస్త్రీ భక్త మన్ధో (అ)న్నమోదన్నో (అ)స్త్రీ స దీదివిః,
భిస్స - అన్నము.
భన్యతే భక్ష్యత ఇతి భిస్సా, సీ. భవభక్షణదీప్త్యాః - భక్షింపఁబడునది. 
భిస్సట - మాడన్నము.
మాడు - క్రి.దగ్ధమగు, వి.1.ఇంటి యొక భాగపు కప్పు, 2.అడుగంటి మాడిన అన్నము మొ.వి.
అడుగంటు - క్రి.(అడుగు+అంటు) 1.వట్టిపోవు, 2.అన్నము మొ. అడుగున మాడు.
భక్తము - భాగింపబడినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.    
భజ్యత ఇతి భక్తం. భజసేవాయాం. ఆశ్రయింపఁ బడునది. అద్యత ఇత్యంధః, స. న. అదభక్షణే. - భక్షింపఁబడునది.
అన్నము - కూడు, బువ్వ, విణ.తినబడినది.
అనంత్యనేనేత్యన్నం, అన్నప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
కూడు - అన్నము, క్రి.1.ఒప్పు, 2.సాధ్యపడు, 3.కూడబెట్టు, 4.లెక్కకూడు, 5.కలుపు.
కూడుదల - లాభము. కూడు బెట్టిన వానిని - కూలద్రోయకు.
బువ్వ - అన్నము.
బువ్వము - 1.పెండ్లివారి సహభోజనము, 2.ఆహారము.
బువ్వముబంతి - వివాహము నందు నాల్గనాడు బంధువులు స్త్రీ పురుషాదులు ఒకటిగా కూర్చుండి భుజించుట.
హరిబువ్వము - వివాహమైన నాలవనాటి రాత్రి పెండ్లి వారందరు కలిసి వేడుకగా భుజించుట, బూజము బంతి అని వాడుక. 
ఉందతిక్లిద్యతీత్యోదనః, అ. న్న. ఉందీక్లేదనే. - పాసినప్పుడు నీళ్ళు కాఱునది.

సాదము1 - అన్నము.
సాదము2 - 1.శ్రమ, 2.నాశము, 3.ప్రాపు.

ఆకొన్న కూడె యమృతము
తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్
సోకోర్చువాడె మనుజుడు
తేకువ గలవాడె వంశతిలకుడు సుమతీ!

తా. మంచి ఆకలి సమయమున లభించిన పదార్థమే అమృతము, యాచించి నంతనే నిరాటకంగా దానమొసంగువాడే దాత. శ్రమను సహించువాడే మానవుడు, తేఁకువ - 1.ధైర్యము, 2.భయము, 3.మెలకువ, 4.సందేహము, 5.వివేకము. ధైర్యముగా ప్రవర్తించువాడే వంశోద్ధారకుడు.

వల్లవుఁడు - గొల్లవాడు.
వల్లన్తి భోక్తుః ప్రీతి ముత్పాదయంతీతి వలావాః, వల్లప్రీతౌ. - భోజనము చేయువానికి ప్రీతిగలుగఁ జేయువారు, పా. వర్ణవాః.
అరాళకుటిలం చరంతీతి ఆరాళికాః - కుటిలముగా సంచరించువారు.
అంధస్సు - అన్నము, వంటకము. 
అంధః అన్నం తత్సాధనం శిల్పమేషాంతే ఆంధసికాః. - అంధస్సనఁగా నన్నము; దాని జేయు నేర్పుగలవారు.
సూదుఁడు - వంటవాడు. 
సూదయంతి తండులానితి సూదాః షూద క్షరణే. - తండులములను పక్వముచేయువారు.
సూదము- వండినపప్పు; సూపము-వండినపప్పు.
బేడలు - కాయధాన్యముల పప్పు.
పప్పు - పొట్టుపోయి బ్రద్దలైన కాయధాన్యము, సూపము.
పప్పుదినుసులు - (గృహ.) కందులు, పెసలు, అనుములు, బటాణీలు మొదలగు నవి, కాయధాన్యములు, శింబీధాన్యములు,(ళెగుమెస్).  

రుచి - (రసా.) నాలుకతో గుర్తించ పడు వస్తుగుణము, ఉదా.పులుపు, తీపి, చేదు.

ఉప్పులేని కూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేని వాడె అధిక సంపన్నుడు విశ్వ.

తా. ఉప్పులేని ఉప్పిఁడి - ఉప్పులేనిది కూర - శాకము, వ్యంజనము, సం.కూరమ్. రుచిగా వుండదు. పప్పులేని తిండి - ఆహారము మంచిది కాదు. అప్పులేనివాడె ధనవంతుడు.

ఔదనికుఁడు - వంటవాడు.
ఓదనం ప్రయోజనమేషాం తే ఔదనికాః - అన్నము ప్రయోజనముగాఁ గలవారు.
ఔదరికుఁడు - 1.తిండియందే ఆసక్తి గలవాడు, 2.ఏమియు పనిలేకుండ నున్నవాడు.
ఓదనము - అన్నము.
గుణయంతి పాకం పునరావర్తయంతీతి గుణాః, గుణ అభ్యాసే. - పాకమైనదానిని తిరుగఁబోసి వండువారు. ఈ 6 వంటవాని పేర్లు.

దూఁబఱదిండి - మిగుల బెట్టక అంతయు వెచ్చించి తినువాడు. 

ఆద్యూన స్స్యాదౌదరికో విజగీషా వివర్జితే,
విజిగీష యనఁగా నైషికాముష్కిక - సాధనమైన యుద్యోగము ఉద్యోగము - 1.యత్నము, 2.పని, 3.కొలువు, 4.పాటుపడు.)అదిలేక, పొట్టపోసి కొనువాని యందు ఆద్యూన ఔదరిక శబ్దములు వర్తించును.
ఆదీవ్యతి ఈషత్(ఈషత్ - అవ్య. కొంచెము, రూ.ఈషతు.)క్రీడతి అన్యత్రాసక్తత్వాత్ ఆద్యూనః, దిపు క్రీడాదౌ. - ఉద్యోగము లేక క్రీడించువాఁడు.
ఉదరే ఆసక్తః ఔదరికః - ఉదరమందే ఆసక్తి గలవాఁడు.   

ఉదరము - 1.కడుపు, (వ్యు.) ఆహారముచే నింపబడునది, 2.నడుము, 3.యుద్ధము, 4.మధ్యభాగము, 5.(జం.) మొండెములో రొమ్మునకు దిగువుగా నుండు భాగము (Abdomen).

తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనము(పచనము - వండుట)చేసి శరీరము పడకుండ కాపాడునది.
తనూం న పాతయతి ధారయతీతి తనూనపాత్. త.పు. వఌ గతౌ - శరీరమును నిలుపువాఁడు.
ఇంధనం వినా స్వతనుం నపాతీతివా. పా రక్షణే - ఇంధనము లేక తన్ను రక్షించుకొనఁజాలనివాఁడు.

ప్రోౘు - క్రి.అన్నపానాదు లొసగి పోషించు, సం.పుష్.

అన్నదానాత్పరం దానం నభూతం న భవిష్యతి| 
నాత్ర పాత్ర పరీక్షా స్స్యాన్న కాలనియమః క్వచిత్||
తా.
అన్నదానం కంటే గొప్పదానం ఏ కాలంలోనూ మరొకటి లేదు. ఇది అందరూ(తరతరముగా), అందరికీ అన్నివేళలా చెయ్యదగిన ఉత్తమోత్తమ దానం.

పంటవలఁతి - భూమి Earth.     
పంట - 1.పండుట, 2.కృషి. 

పచనము - వండుట.
వంట - పాకము. పాగు-చక్కెరపాకము, సం.పాకః.
పచా పాకే -
పచనం పచా, పాకశ్చ, డు పచ్ ష్ పాకే. ఈ 2 వండుట పేర్లు.
పాకము - 1.పరిపక్వము, 2.పంట, (అలం.) కావ్యపాకము (కావ్యపాకములు: ద్రాక్షా కదళీ నారికేళ పాకములు).
పరిపక్వము - సంపూర్ణముగా నభివృద్ధి చెందినది (Mature).  
పాకాన్నము - పెండ్లిలో మూడవ నాటి విందు, రూ.పాకెన, పాకెన్న.
పాచకము - (జం.) జఠరరసమందు కల సేంద్రియమండము (Pepsin).

చిమిడిక - చిమిడిన అన్నము.
చిముడు - క్రి.1.అన్నమధికముగ నుడికి ముద్దయగు, 2.పాకముచెడు.

విఱుగు - క్రి.1.తునియు, 2.పాకముచెడు, 3.వెనుతీయు.    

పక్వము - 1.పరిపాకము పొందినది, 2.చేటుమాడినది.
పరిణతము -
పరిపాకము పొందినది.
పక్వం పరిణతే -
పచ్యతే క్రమేణ పక్వం - కాలక్రమమున పరిపాకమును బొందినది. పక్వా బుద్ధిః, పక్వం ఫలం. అని.
పరిణమతే అవస్థాంతర అవస్థాంతర మా పద్యతే పరిణతం - వేఱొక యవస్థను బొందునది. ఈ 2 కాలవశమునఁ బరిపాకమును బొందిన బుద్ధి మొదలైనదాని పేర్లు.  
పక్వమాంసకృత్తులు - (జం.) మాంసకృత్తులు, ' పాచకము ' అను సేంద్రియమండముచే ప్రసరణకు అనుకూలముగా నుండునట్లు మార్చబడిన పదార్థములు (Peptones).

మానవుడాత్మకిష్టమగు మంచి ప్రయూజన మాచరించుదో
గానక యల్పుడొక డదిగాదని పల్కిన వాని పల్కు కై
మానగఃజూడడాపని సమంచిత భోజనవేళ నీఁగ కా
లూనిక వంటకంబు దినకుండుట నేర్పగు నోయి? భాస్కరా.
తా.
వండిన వంటకముపై ఈగ వ్రాలిన యా వంటకమును విడుచుట మంచిదికాదు. అట్లే అల్పుఁడు - నీచుడు, మంచివాడు చేయు పనిని వలదన్నను మానివేయుట యుక్తము గాదు. 

పాట్ లక్ - (గృహ.) (Pot-luck), ఒక స్థలము నకు మిత్రులు భోజనము లేదా వంటకములను తెచ్చుకొని కలసి వేడుకగా భుజించుట.

దిదీవి - 1.అన్నము, 2.బృహస్పతి, 3.స్వర్గము, దేవలోకము.
దీన్యంత్యనేనేతి దీదివిః. ఇ.న్న. దివు క్రీడాదౌ. - దీనిచేతఁ బ్రకాశింతురు. ఈ 6 వంటకము పేర్లు.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఈ,పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు లనంబడును, వారలకై నను వానికైనను ప్రభువు.  
సురాచార్యుఁడు - గురువు. 
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్న తల్లికంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా! విశ్వ.

తా|| అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినది లేదు. గురువుల సేవకంటె గొప్పదిలేదు.

గురుచరణాంబుజ నిర్భరభక్తః, సంసారాదచిరా ద్భవ ముక్తః |
సేంద్రియమానవ నియమాదేవం, ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవం || - 31

గురుచరణ కమలములందు మిక్కిలి భక్తిగల ఓ సాధకుడా! ఈ సంసర బంధనాలనుండి శీఘ్రముగనే ముక్తి పొందుదువుగాక! నీ ఇంద్రియ మనస్సులను నియమించి (అదుపులో పెట్టి)న వాడవై నీ హృదయంలోనే ఉంటున్న దేవుని దర్శించెదవు గాక! - భజగోవిందం

Being devoted  completely to the lotus-feet of the Master, become released soon from the transmigratory process. Thus, though the discipline of sense and mind-control, you will behold the deity that resides in your heart.

బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుద్ధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

గాళకుఁడు - 1.ధీరుడు, 2.ప్రౌఢుడు.     

ధీరోదత్త గుణోత్తర జిత్వర
ధీరోపాసిత విత్తమహత్తర| ||శరవణభవ||

పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ. పుష్కరమునందు దేవీస్థానం పురుహూత|
శ్రాన్తం పుష్ణాతీతి పుష్కరం, పుక్ష పుష్టౌ. - బదలినవానిని బోషించునది.
పుష్పత్యవకాశమితి పుష్కరం, పుష పుష్టౌ - అవకాశమును పొషించునది.
పుష్కముదకం రాతీతి వారాదనే - ఉదకము నిచ్చునది.

మూలే పుష్కర కాశ్మీర పద్మపత్రాణి పొష్కరే,
స్థలపద్మినీ మూలత్వేన పుష్కరస్య మూల మిదం పుష్కరం. - నేలతామర దుంప.
కాశ్మీరము - 1.కుంకుమపూవు, 2.మెట్ట తామరదుంప, 3.కాశ్మీరదేశము.
కాశ్మీరదేశే భవం కాశ్మీరం - కాశ్మీరదేశమందుఁ బుట్టినది. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం| 
పద్మస్యేవ పత్రాణ్యస్య పద్మపత్రం - తామర పాకులవంటి ఆకులు గలది.  ఈ 3 పుష్కరమూలము పేర్లు. కాశ్మీరదేశము నందలి మెట్టతామరదుంప.

పుష్కరిణి - 1.తామరకొలను, కోనేరు, 2.ఆడేనుగు.
కోనేఱు - (కోన+ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి.
వశ - ఆడేనుగు.

పుష్కరిణ్యాం తు ఖాతం స్యాత్ -
పుష్కరం జలం తద్యోగాత్పుష్కరిణీ, ఈ. సీ. పుష్కరమనఁగా అది కలిగినది
ఖన్యత ఇతి ఖాతం, ఖను అవదారణే. - త్రవ్వఁబడునది. ఈ 2 నలుచదరముగాఁ ద్రవ్వఁబడిన బావి పేర్లు. 

తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
కట్టుదొన - కోనేరు. కట్టుకొన - కోనేరు.
తిరు - శ్రీ పదము, పూజ్యమైన, సం.శ్రీః. 

ఖాతకుఁడు - 1.అప్పు పడినవాడు, 2.త్రవ్వెడువాడు.
ఖాతము - 1.గాతము, 2.అగడ్త, 3.పుష్కరిణి.
గాతము - పల్లము, గుంత, సం.ఖాతమ్. 
ఖేయము - 1.అగడ్త, 2.ఆనకట్ట, సేతువు, విణ.త్రవ్వదగినది.

నిఘాతము - త్రవ్వబడినది.
నిఖాతకము - (జం.) భూమి నుండి త్రవ్వి యెత్తబడినరాయి, లేక ఖనిజము, రాళ్ళలో నిక్షిప్తమై యున్న పూర్వజీవి యొక్క అంశము (Fossil).   

గండూషము - 1.పుక్కిలింత, 2.పుడిసిలి, 3.ఏనుగు తొండము చివర, 4.పుక్కిట పట్టిన నీరు.
కొణిదిలి - పుడిసిలి. చేర - చాచిన అరచేయి, పుడిసిలి.
కమి - 1.పంపబడిన వ్రేళ్ళుగల పుడిసిలి(కమికిలి), 2.కబళనము, 3.తృప్తి.
కమికిలి - పంపబడిన వ్రేల్ళుగల పుడిసిలి. కబళము - ముద్ద, కడి, గ్రాసము. 

ఆపోశనము - ఆపోసనము, రూ.ఆపోశానము.
అపొసనము - భోజనమునకు ముందు వెనుకల పుడిసితిలో నీరుపోసికొని మంత్ర పూర్వకముగ పుచ్చుకొనుట, శుద్ధాచమానము, రూ.ఆపోసనము, సం.ఆపోశనమ్.
ఆపోక - ఆపోవుట, తనివి, తృప్తి.

అతిధౌతిష్టతిద్వారే హ్యోసొ గృహ్ణాతియోనరః|
ఆపోశసం సురాపానం – అన్నంగోమాంస భక్షణమ్|

తా. వాకిటనున్న అతిథి - 1.భోజన సమయము నకు వచ్చు పరదేశి, 2.ఆహుతుడు, 3.కుశుని కొడుకు.)అథిధిని విడిచి ఆపోశనము బుచ్చుకొన్న యెడల నాయాపోశనము సురాపానమును అన్నం గోమాంస భక్షణ సమానము. - నీతిశాస్త్రము

పుష్కరమాలా వాసిత విగ్రహ
పుణ్యపరాయణ విహితపరిగ్రహ| ||శరవణభవ||

సర్వతోముఖము - 1.ఆకాశము, 2.జలము.
సర్వతః ముఖాన్యన్న సర్వతోముఖం - ప్రవహించునప్పుడు  అంతట ముఖములు గలది. 

సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

సముద్రము - సాగరము.
సాగరము1 - నేయి మొ నవి నింపిన సిద్దెల జోడు.
సాగరము2 - 1.సముద్రము, 2.ఏనుగు చెవియందలి మదము.
సగరిపుత్త్రైః ఖాతస్సగరః - సగరపుత్రులచేఁ ద్రవ్వఁబడునది.

శారదా శబ్దనిలయా సాగరా సరిదంబరా|
శుద్ధా శుద్ధతను స్సాధ్వీ శివధ్యానపరాయణా||

సముద్ర సంగమము - (భూగో.)నదులు సముద్రమున కలియు స్థలము.

సాముద్రికము - 1.భాగ్యాదిసూచిక, 2.దేహలక్షణములను తెలుపునది, 3.సముద్ర సంబంధమైనది.  

మొగాళము - (వ్యావ.) నదీ సముద్రాదుల ముఖము.    
వేల్మోరి - (భూగో.) నదీసముద్ర సంగమము వద్ద వైశాల్యము తక్కువగు టచే నీరుగోడవలె లేచి కదలుట (Tidal-wave).  

సత్యపి భేదాపగమే నాథ! తవాహం నమామకీ నస్త్వమ్ |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః|
- 3 

అర్ణోరాశి - 1.జలరాశి, సముద్రము.
అర్ణాంసి సంత్యస్మిన్నిత్యర్ణవః - జలములు గలిగినది.
నీరువాయి - జలరాశి; నీటికుప్ప - జలరాశి, రూ.నీరుకుప్ప.
అర్ణవము - 1.సముద్రము, 2.అల.

తరంగిణి - నది, ప్రవాహము.
తరంగా, అస్యాం సంతీతి తరంగిణీ - అలలు గలిగినది.
తరంగకము - పిల్లతరంగము, చిన్న అల.
తరంగణము - (భౌతి.) తరంగరూప చలనము (Undulation).
తరంగగతి సంకోచము - (జం.) అన్నవాహిక యొక్క గోడలు సంకోచము చెందుచు ఆహారము తరంగము మాదిరిగా ముందుకు జరుగుట, (Peristalisis).

అక్కలి - అల.
అల - తరంగము, విణ.1.ప్రసిద్ధిని తెలుపును, ఉదా. అలవైకుంఠపురంబు లో, 2.నిర్దేశమును తెలుపును, ఉదా.చోరుడల చంద్రుడు. 

భంగము - 1.చెరుపు, 2.అవమానము, 3.అల, 4.రోగము, వ్యాధి.
భజ్యతే స్వయమేవ భంగః, భఞో ఆమర్దనే. - తనంతత నశించునది.

తరఁగ - తరంగము, అల, సం.తరంగః.
తరంగము - 1.అల, తరగ, 2.ఒక తరీతిగేయము, సం.వి.(భౌతి.) ఏదైన వస్తువు వేగముగా చలించుటచే గాలిలో సంపీడనము, విరశీకరణము. ఒకదాని వెంబడి ఒకటి సంభవించుటచే ఏర్పడిన చలనము (Wave).
తరతీతి తరఙ్గః, తౄ ప్లవనతరనయోః. - దరి చేరునది. 

పర్వవేలా తరంగము - (భూగో.) అధికమైన పోటు, అమావాస్యనాడు పౌర్ణమినాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో నుండు నప్పుడు సూర్యచంద్రుల ఆకర్షణ శక్తిచే సముద్రపు నీటి మట్టములో గలిగిన అధికమైన పోటు.

సముద్రపు పోటుపాటులు - (భూగో.) సూర్యచంద్రుల ఆకర్షణశక్తిచే సముద్ర మందలి నీటిమట్టము ప్రతిదినము రెండు సార్లు హెచ్చును, రెండు సార్లు తగ్గుట. (పాటు = సముద్రపు నీరు హెచ్చుట; పోటు = సముద్రపు నీరు తగ్గుట.)

ఆటుపోటు - 1.సముద్రతరంగములు ముందుకు వచ్చుటకు పోటనియు, వెనుకకు పోవుటకు ఆటనియు అందురు. (దుఃఖము తెరలు తెరలుగా వచ్చుటకును దీనిని వాడుదురు), 2.బాధ, 3.దుఃఖము.

కల్లోలిని - నది.
కల్లోలము - 1.పెద్ద అల, 2.ఆనందము.

అథోర్మిషు, మహ త్పూల్లోల కల్లోలౌ -
ఉత్ ఊర్త్వం లోడతీత్యుల్లోః, లోడృ ఉన్మాదే, లడయోరభేదః. - పైకి లేచునది.
కలతే శబ్దాయతే కల్లోలః, కల అవ్యక్తే శబ్దే. - అవ్యక్తముగా మ్రోయునది.
కల్యతే జలమనేతి కల్లోలః, కల కిలక్షేపే. - దీనిచేత జలము చల్లఁబడును. ఈ 2 గొప్పకరుళ్ల పేరు.

కడలు - పెద్ద అల; పోతుకరడు - పెద్ద అల.
కడలుకొను - క్రి.1.అతిశయించు, 2.ఉప్పొంగు, 3.సంతోషించు, 4.వ్యాపించు.
దొరగడలు - గొప్ప అల.

ఆటు - 1.అడువు, దెబ్బ, 2.తగ్గుట.
పోటు  - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 3.పెద్ద అల.
పాటు - 1.కష్టము, 2.శ్రమము, 3.పడుట, 4.అలయడగుట, 5.అల హెచ్చగుట, సం.పత్, పాతమ్, (అర్థ,) శ్రమ, వాంఛించిన ఏ వస్తువు నైనను ఉత్పత్తిచేయుటకు చేయబడు యత్నము (Labour).

అర్గళము - 1.త లు పు గడియ, 2.ప్రతిరోధము, అడ్దంకి, 3.పెద్ద అల.   

కరడు - అల, కెరటము.
కెరటము - అల, కరడము.

గడము1 - కుండలోనగువాని మూత, గడి.
గడి - 1.ఎల్ల, సీమ, పొలిమేర, మేర, 2.చదరంగపు బల్లమీదిగడి, 3.సమీపము, 4.దుర్గము, కోట, 5.కోడెదూడ.
గడము2 - 1.తెర, 2.కంచె, 3.అగడ్త, 4.విఘ్నము, 5.గండె చేప, 6.ఒకానొక దేశము.    

అపటి - తెర; కాండపటము - తెర.
తెర - 1.మరుగుచీర, 2.అల, 3.పరంపర, సం.1.తిరః, 2.తరంగః, 3.పరంపరా, వై.వి.(భౌతి.) ప్రతి బింబములను పట్టుటకు వీలయిన సమతలము (Screen). 
ప్రతిసీరా యవనికా స్యా త్తిరస్కరణీ చ సా,
ప్రతిసీయతే ప్రతిబద్యత ఇతి ప్రతిసీరా షిఞ్ బంధనే. - అడ్దముగాఁ గట్టఁబడునది.
జవనిక - తెర, యవనిక.
యవనిక - 1.తెర, 2.తెరచీర, సం.(గృహ.) తెర, పరదా, మరుగునిచ్చుటకై కిటికీలకు ద్వారములకు వేయుపరదా లేక తెర (Curtain), వికృ. జవనిక.
యువంత్యత్ర జనా ఇతి యవనికా, యు మిశ్రనే. - జనులు దీని యందుఁ గూడుదురు, పా. జవనికా.
తిరస్కరణి - 1.తెర, 2.ఒకానొక మంత్ర విద్య.
తిరస్కరోతి ఆచ్ఛాదయతీతి తిరస్కరణీ, ఈ. సీ. - కప్పునది. ఈ 3 తెరచీర పేర్లు.

లహరి - 1.పెద్ద అల, 2.వీచి.
వాతీతి వీచిః, ఈ. ప్స. వా గతిగంధనయోః - చరించునది.
బిస్మయం చినోతీతి వా వీచిః, చిఞ్ చయనే. - విస్మయమును జేయునది. వీచిశబ్దః వా స్త్రియామితి కేచిత్.
వీచి - తరంగము.    

ఇళ - అల.
ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.

అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలలఁ గాంచు లక్ష్మి గనుటలేదు
ఇలను భోగభాగ్య మీతీరు గాదొకో విశ్వ.
 
తా|| కెరటములో బుట్టిన బుడగలు అప్పుడే నశించును. కలలో కనబడు లక్ష్మిని పొందలేము. ఈ భూమిలో(ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.)భోగభాగ్యములు కూడా యిట్టివే కదా.    

ఊర్మి - 1.అల, 2.ఉమ్మి, 3.నొప్పి, 4.తహతహ, 5.వస్త్రపు ముడుత, 6.కడుపుమీద నుండు ముడుత, (ఆకలి, కోరిక, మోహము, దుఃఖము, ముసలితనము, మరణము - వీనిని షడూర్ములందురు).
ఊర్మిశబ్దః పుంలింగే (అ)ప్యస్తి తథా చ వామనభట్టః "పుంలింగస్త్రీలింగా మరీచిమని యస్టి ముష్టయో వీచిః, కోటిరపి పాటలిరపి శాల్మలీ తరణీ శ్రేణ్యుర్మయ" ఇతి.   
ఊర్మిక - 1.అల, 2.ఉంగరము, 3.వస్త్రపు ముడుత. 

ఉమ్మి - ఉమి.
ఉమి - ఉమిసిన ఎంగిలి, రూ.ఉమ్మి.
ఉమియు - ఎంగిలి ఉమ్ము.
జుష్ఠము - ఎంగిలి.

గతుకు - క్రి. ఎంగిలితిను, వి.ఎంగిలి తినుట, బహు.ఎత్తుపల్లములు.

ఫేల - ఎంగిలి, రూ.ఫేలము, ఫేలి.
ఎంగిలి - 1.ఉచ్ఛిష్టము, 2.లాలాజలము.

ఉచ్ఛిష్టము - 1.ఎంగిలి, తినగా మిగిలినది, 2.పూర్వులు ఉపయోగించినది, వి.తేనె.
లాలాజలము - (జం.) నోటిలో ఊరెడి నీరు, ఉమ్మినీరు, (Saliva).
లాల జలగ్రంధులు - (జం.) ఉమ్మిని ఉత్పత్తిచేయు గ్రంధులు (Salivary glands) (ఇవి నోటికి ఇరుప్రక్కల దవడలలో ఉండును).
లాలాజలనాళము - (జం.) లాలాగ్రంధుల నుండి ఉమ్మినీటిని తీసికొనివచ్చు గొట్టము, (Salivary duct).

ఏంజైం - (జీవ.)(Enzyme) ఒక సేంద్రియ పదార్థము, ఫేనక ద్రవ్యము.
ఎన్జైమ్స్ - (Enzymes) (గృహ.) జీవకణములలో నుద్భవించెడు ప్రేరక ద్రవ్యములు, (ఇవి శరీరములో నేక రాసాయనిక ప్రక్రియలను జరుపు చుండును).

సేంద్రియ మండలములు - (వృక్ష.) చయాపచయ క్రియలకు ఉత్తేజమునిచ్చు నత్రజనిసంబంధమగు ప్రత్యేక రసాయన పదార్థములు (Enzymes) (ఇవి జీవరసముచే నుత్పత్తిచేయబడును, ఇవి నీటిలో కరగును.)   

క్రాయు - 1.కక్కు, 2.ఉమియు.
కక్కు - క్రి.1.కడుపులోనిది వెలిబుచ్చు, వి.విసురురాయి, రోలు మొ,కి కలుగజేసెడు గరుకు.

నిష్ఠీపనము - 1.ఉమియుట, 2.నిరసనము.
నిష్ఠూతము - 1.ఉమియబడినది, 2.త్రోయబడినది.
నిరసనము - 1.తిరస్కారము, ఆక్షేపము, 2.వధము, రూ.నిరాసనము.
నిరస్తము - తిర్కరింపబడినది, వెడలగ్రక్కబడినది, నిరాకృతము.
నిరాకృతము - న్యాయముచేత్రోయబడినది, నిరస్తము.
ఆక్షేపము - ఆక్షేపణము, 1.(అలం.) ఒక అ ర్థా లం కా ర ము, 2.అడ్డము, 3.విరోధము.
అక్షేపణము - 1.త్రోసివేయుట, 2.లాగుట, 3.అదల్పు, 4.అపవాదము, 5.అపహరించుట, 6.దోషములు ఎంచుట, 7.వణకురోగము.
అపవాదము - 1.నింద, దూఱు, 2.ఆజ్ఞ.
ఉపక్రోశము - నింద; నింద - దూరు, అపదూరు.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.
నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.  

ఆక్షేపకుఁడు - 1.ఆక్షేపించువాడు, 2.బోయవాడు.
వ్యాధుఁడు - బోయవాడు. 

లుబ్ధకుఁడు - 1.పిసినిగొట్టు, లోభి, 2.బోయవాడు.
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.

విరోధము - పగ, ఎడబాటు.
విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.
విశ్లేషము - ఎడబాటు.

ఆఘాతము - 1.కొట్టుట, 2.దెబ్బ, 3.చంపుట, 4.చంపుచోటు, 5.గాయము, 6.దుఃఖము, 7.మూత్రము అడ్దుపడుట, మూత్రాఘాతము.
ఆఘాతిం(ౘ)చు - చంపు.
చంపుట ఏమి గొప్ప, ఏమి ఘనకార్యము ? 

నికారణము - వధము; వధము - చంపుట.
(ౘ)చంపు - క్రి.చావచేయు.
(ౘ)చంపుడుగట్టు - వధ్యస్థానము.
(ౘ)చావఁజూఁచు - క్రి.చంపు.
(ౘ)చక్కాడు - క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.
చక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.

త్రుంచు - క్రి.1.తునకలుచేయు, 2.చంపు, 3.చించు.
చించు - క్రి.1.చినుగచేయు, రూ.చింపు.   

కుతిల - 1.బాధ, 2.దుఃఖము.
కుతిలపడు - క్రి.గాసిచెందు, బాధపడు.

నొప్పి - 1.బాధ, 2.ఆపద.
నొవ్వి - 1.వేదన, 2.వ్యాధి, రూ.నొవ్వు, నోవి, నోవు.
నోవరి - నొవు, రూ.నొవ్వు.
వేదన - నొప్పి.
నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.

ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపన్నము - 1.ఆపదనొందినది, 2.లభించినది, 3.సంభవించినది.
ఆపన్నుఁడు - ఆపదనొందినవాడు.

ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.

ఆక్రోశము - 1.తిట్టు, శాపము, 2.నింద, అపవాదము, 3.(రక్షణము నకు) బిగ్గరగా అరచుట, రూ.ఆక్రోశము.
ఆక్రోశించు - క్రి.1.తిట్టు, శపించు, 2.నిందవేయు, 3.(రక్షణకై) బిగ్గరగా పిలుచు, 4.చాటించు, 5.(భయాదులచే) అరచు.
ఆఘోషిం(ౘ)చు - క్రి.1.అరచు, 2.మ్రోయు, 3.చాటు.

దుర్జనుల నైనఁ దిట్టకు;
వర్ణింపకు సుజనగోష్ఠి; వరులను నెల్లన్
నిర్జింతు ననుచుఁ ద్రుళ్ళకు;
దులనుఁడండ్రు నిను నిందఁ దోఁపఁ గుమారాః
తా.
కుమారా! దుర్జనుఁడు - దుష్టుడు)ని ఎప్పటికి దూషింప వద్దు. సత్పురుషు లతో సంభాషణము చేయుట మానవలదు. గొప్పవారిని (నిర్జించు - క్రి.గెలుచు, జయమును పొందు.)నని చెప్పవలదు. నీయందే లోపము కనఁబడినను, చెడ్దవాఁడని యందురు.

షట్కోణస్థిత షట్తారకసుత
షడ్భావరహిత షడూర్మిఘాతక ||శరవణభవ||
 

ఉంగరము - చేతివ్రేలి నగ, రూ.ఉంగ్రము, 1.ఉంగరపు గొట్టము. 
ముద్దుటుంగరము - అక్షరములు చెక్కిన, ఉంగరము, చక్కని, ఉంగరము, సం.ముద్రాంగుళీయకమ్.
ముద్రిక - ముద్దుటుంగరము.
ముద్ర - 1.సంజ్ఞాక్షరములు చెక్కిన ఉంగరము, 2.అందలి అక్షరములు, 3.అచ్చు. 

కుళువు - ఉంగరమున పొదిగెడు ఒకానొక మణి.

అంగుళి - 1.వ్రేలు, 2.తొండము చివర.
కరశాఖ - వ్రేలు; వ్రేలు - క్రిందికి ఊగాడు, వి.అంగుళి.

అంగుళము - 1.వ్రేలు, 2.బొటన వ్రేలు, 2.అడుగులో పండ్రెండవ భాగము.
అంగుష్టము -
బొటన వ్రేలు, (గృహ.) బట్టలు చేతితో కట్టునపుడు వ్రేలికి పెట్టుకొను చిన్నటోపీవంటి గొట్టము (Timble).
అంగుటము - బొటన వ్రేలు, అంగుష్ఠము, సం.అంగుష్ఠః.
బొటనవ్రేలు - అంగుష్ఠము, రూ.బొటమన వ్రేలు, బొటవ్రేలు, బొట్టనవ్రేలు, బొట్టవ్రేలు.
(ౘ)చూపుడువ్రేలు - జుట్టనవ్రేలు, తర్జని.
(ౙ)జుట్టానవ్రేలు - తర్జని, రూ.జుట్టనవ్రేలు, జుత్తనవ్రేలు.
తర్జని - జుట్టనవ్రేలు, చూపుడువ్రేలు. 
జుత్తనవ్రేలు - జుట్టవ్రేలు.
జుట్టలి - 1.ప్రాదేశము, 2.చాపబడిన బొట్టనవ్రేలు, చూపుడువ్రేలి నడిమి కొలత, రూ.జుత్త(జుత్త - జుట్టిలి), జుత్తలి.
అంగుళిముద్ర - 1.ముద్రగల ఉంగరము, ముద్దుటుంగరము, 2.బొటనవ్రెలి ముద్ర.    

స్ఫురతరకీర్తిమంతులగు పుత్రులగాంచిగాక మూఢము
షర్కులఁ గనంగ తేజములు గల్గవుగా మణి కీలితాంగుళా
భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినగాక గాజుటుం
గరముల పెట్టినందున వికాసము గల్గునటయ్య, భాస్కరా.
తా.
మణులచే(మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు. )కూర్చబడిన ఉంగరములను వ్రేళ్ళకు పెట్టినచో అందముగా కనబడునుగాని, లేనిచో గాజు టుంగరములను పెట్టినచో అందముగా ప్రకాశింపవు కదా!  అట్లే, సజ్జనులగు బిడ్డలను గన్నవారికి వారివలన కీర్తి హెచ్చును గాని, దుర్జనులను గన్నచో ఉన్న కీర్తిగూడా పోవును.   

నళినీదళగత జలమతి తరళం - తద్వత్ జీవిత మతిశయ చపలమ్,
విద్ధి, వ్యాధ్యభి మానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్. - 4

The water on the lotus leaf is very unsteady; so also is life extremely unstable. know that the entire world is devoured by disease and conceit, and smitten with sorrow. – భజగోవిందం

అర్ణము - 1.నీరు, 2.వర్ణము, అక్షరము, 3.టేకు, విణ.1.చలించునది, 2.కలతపడినది.
ఋణాతీత్యర్ణః, స, న. ఋ గతౌ. - పోవుచుండునది.

వర్ణము - 1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.

వర్ణో ద్విజాదౌ శుక్లాదౌ స్తుదౌ వర్ణం తు వాక్షరే :
వర్ణశబ్దము బ్రహ్మక్షత్ర వైశ్యశూద్ర జాతులకును, తెలుపు, నలుపు మొదలైన వన్నెలకును, స్తోత్రమునకును పేరైనపుడు పు. అక్షరమునకు పేరైనపుడు ప్న వర్ణ్యతే, వర్ణయతి వర్ణం. వర్ణ స్తుతౌ. - కొనియాడఁ బడునది, కొనియాడునది గనుక వర్ణము. "వర్ణస్తాల విశేషేస్యాద్ బ్రహ్మచర్యే విశేషనే, విలేపనే కుధాయాం"చేతి శేషః.

వర్ణుఁడు - కుమారుడు.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.

సంహిత - 1.వర్ణసంయోగము, 2.ధర్మశాస్త్రము, విణ.సంధింపబడినది.

వర్ణా స్స్యుర్బ్రాహ్మణాదయః :
వర్ణ్యంతే కపిలారుణ పీతకృష్ణవర్ణ్యేః నిరూప్యన్త ఇతి వర్ణాః. వర్ణ స్తుతౌ. - కపిలారుణ పీత నీల వర్ణములచేత స్తోత్రము చేయఁబడునది. "కపిలాశ్చారుణాః పీతాః కృష్ణా శ్చేతి పృథక్పృథక్, బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రా శ్చేతి వివక్షితాః" ఇతి శ్రీవిష్ణుపురాణే. - బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతులు.

(విప్ర క్షతియవిట్ఛూద్రా శ్చాతుర్వర్ణ్యమితి స్మృతమ్)
(బ్రహ్మక్షత్త్రవిట్ఛూద్ర వర్ణములు గూడి చాతుర్వర్ణ్య మనంబడును. చత్వారో వర్ణాః చాతుర్వర్ణ్యం. - నాలుగు జాతులు గనుక చాతుర్వర్ణ్యము.)

అక్షరుఁడు - 1.చెడనివాడు, 2.శివుడు, 3.విష్ణువు.

అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి. 1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.    

అక్షరం తు మోక్షే(అ)పి-
అక్షరశబ్దము మోక్షమునకును, అపిశబ్దమువలన కకారాదివర్ణములకును, పరబ్రహ్మమునకును పేరు. న క్షరతీ త్యక్షరం, క్షర సంరక్షణే. - చెడనిది గనుక అక్షరము, 'వర్ణే బ్రహ్మ ణ్యక్షరం స్యా' దితి శేషః.

అక్షమాల - 1.అకారము మొదలు క్ష కారము వరకు గల వర్ణమాలిక, 2.జపమాల, తావళము, 3.అరుంధతి.  
అక్షసరము - జపమాల; అక్షసూత్రము - జపమాల. రుద్రాక్షమాల - అక్షమాల.
తావడము - రుద్రాక్షలు మొదలగునవి కూర్చిన హారము, రూ.తావళము.
అరుంధతి - 1.వసిష్ఠుని భార్య, 2.ఒకానొక నక్షత్రము, 3.దక్షుని కూతురు, వికృ. ఆరంజ్యోతి.
ఆరంజ్యోతి - 1.వసిష్ఠుని భార్య, 2. ఆ పేరుగల నక్షత్రము, సం.అరుంధతీ. సతుల యందు దేవీస్థానం అరుంధతి|

అక్షరాస్యుఁడు - అక్షరజ్ఞానము కలవాడు.
అ(ౘ)చ్చరము - అక్షరము, సం.అక్షరమ్. 
అక్కరము - అచ్చరము, సం.అక్షరమ్.

అకారాది క్షకారాంత సర్వవర్ణ కృతస్థలా,
సర్వలక్ష్మీ స్సదానందా సారవిద్యా సదాశివా|

శాకము - 1.కూర, 2.టేకు చెట్టు, 3.ఒక ద్వీపము.
టేకు - శాక వృక్షము.
టేకుదీవి - శాక ద్వీపము.
శాకకృషి - (వృక్ష.) కూరగాయల తోటలను పెంచుట (Vegetable cultivation).

అస్త్రీ శాకం హరితకం శిగ్రు -
శక్యతే భోక్తుమనేన శాకం, శక్ ఌ శక్తౌ. - దీనిచేత భోజనము చేయ శక్యమౌను.
హరితవర్నత్వాద్ధరితకం - పచ్చనైయుండునది.
శిగ్రుత్యరుచి మితిశిగ్రు, శీఙ్ నిశాతనే. - అరుచిని జెఱుచునది. ఈ 3 కూరపేర్లు.

కుముద - 1.టేకు, 2.గుమ్మడు.
టేకు - శాక వృక్షము.
గుమ్మఁడు - అలంకరించుకొనువాడు, సొగసుకాడు. 

కూర - శాకము, వ్యంజనము, సం.కూరమ్.
వ్యంజనము - 1.కూర, దప్పళము(దప్పళము - పులుసు), 2.లేహ్యము.
కూరదినుసులు - (వ్యవ.) కూరగాయల నిచ్చు పైరులు, ఉదా. బెండ, బీర, తోటకూర, మొ.వి.(Vegetables).

హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చ గుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.

ఆకులురాలు చెట్ల అడవులు - (భూగో.) వెడల్పు ఆకులుగల చెట్ల అడవులు. ఇవి సమశీతమండలమున పెరుగును. ఇవి ఉత్తరార్థగోళము నను, దక్షిణార్థగోళమునను 45 డిగ్రీలు(degrees) మొదలుకొని 55 డిగ్రీల వరకు ఉన్నవి. శీతకాలమున కలుగు మంచు శీతలత నుండి రక్షించుకొనుటకై శీతకాలము రాకపూర్వమే చెట్టు తమ ఆకులను రాల్చి వైచును. ఉదా. సుందూరము, టేకు(టేకు - శాక వృక్షము.) ఎల్మ మొ. వృక్షములు ఈ జాతికి చెందినవి.

ఋతుపవనారణ్యములు - (భూగో.) 40" మొదలు 80" వరకు వర్షము గల ప్రదేశములలో నున్న అడవులు (వెడల్పయిన ఆకులు గలిగి, వేసవిలో ఉష్ణము నుండి తప్పించుకొనుటకై ఆకులురాల్చును, వర్షకాల మందు పుష్పించి ఆకులు వేయు చెట్లుగల అడవులు. ఉదా. టేకు చెట్ల అడవి.)

చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదనుగ మంచికూర నలపాకముచేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టఁగనేర్చున టయ్య, భాస్కరా.

తా. కూరలో వేయవలసిన పదార్ధములన్నియువేసి బాగుగా వండినను అందు ఉప్పు(salt)మాత్రము వేయనిచో అది రుచిగాయుండదు. అట్లే సమస్త విద్యలను అభ్యసించిన (ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము.)మానవునకు గూడ ఆ గ్రంధములోని సారము గ్రహింప లేనిచో వానిని సజ్జను లెవ్వరును మెచ్చరు. అప్పుడు వాని ౘదువు నిరర్థకము-ప్రయోజనము లేనిదిగా తలచ బడును.                                        

ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం,
ఆగమావయశోభినీం అఖిల వేదసారకృత శేఖరీం
మూలమంత్ర ముఖమండాలాం ముదిత నాద బిందునవయౌవనాం
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్| - 6

తోయధి - సముద్రము. 

తోయము - 1.విధము, 2.తెగ, 3.తడవ, 4.పరివారము, 5.సమయము, సం.వి.నీరు.
తాయతే పాలయతీతి తోయం. తాయ్య సంతాన పాలనయోః - రక్షించునది.
తోయరుహము - తామర, వ్యు.నీటియందు జన్మించినది. 
తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయజాక్షి - తమ్మికంటి.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు.
తోయలి -
తొయ్యలి, స్త్రీ.
తొయ్యలి - స్త్రీ, తోయలి, త.తయ్యల్.

తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.
సమయము -
1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు.

తరవాయి - 1.సమయము, 2.అనుక్రమము, 3.పరిశిష్టము, 4.తడవ.
తరువాయి - అనంతరము.
అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి.వి.పిమ్మట, వి.సామీప్యము. 

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః| |

తా|| చిత్తశుద్ధి కలవాడు భక్తితో సమర్పించు ఆకుగాని, పువ్వుగాని, పండుగాని, నీరుగాని, నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. – రాజవిద్యారాజ గుహ్యయోగము, భగవద్గీత

తోయడము - 1.మేఘము, 2.నెయ్యి, వ్యు.నీటి నిచ్చునది.

నే - నేయి.
నేయి -
నెయ్యి, సం.స్నేహః.
నేయము - నెయ్యము, సం.స్నేహః.

నెయ్యము - స్నేహము, చెలిమి, 2.ఇంపు, రూ.నెయ్యమి, నేయము, సం.స్నేహః.
నెయ్యమాడు - క్రి.స్నేహించు.
నెయ్యుఁడు - స్నేహితుడు, నెయ్యరి.
నెయ్యపుఱేఁడు - మదనుడు.
మదనుఁడు -
మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్నువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
నెయ్యపుటలుక - ప్రణయకోపము.

ప్రేమా నా ప్రియతా షార్దం ప్రమ స్నేహః -
ప్రియస్య భావః ప్రేమా, న. పు. ప్రియతా చ - ప్రియము యొక్క భావము ప్రేమ ప్రియత.
హృదయే భవం హార్దం. - హృదయ మందుఁ బుట్తినది.
ప్రీణనం ప్రేమ. న. న. ప్రీఞ్ తర్పనే. - సంతోషింపఁజేయుట.
స్నిహ్యత ఇతి స్నేహః ప్ణిహప్రీతౌ, ప్రీతి. ఈ 4 స్నేహము పేర్లు.

హార్దము - స్నేహము, విణ.హృదయ సంబంధమైనది.  

నెయి - ఘృతము, రూ.నెయ్యి, నేయి, సం.స్నేహః.
ఘృతము - 1.నెయ్యి, 2.నీరు.

ఘృతం - ఘృతంచ మధుచ ప్రజాపతి రా సీత్| నెయ్యి వేదంలో ఎంతో పవిత్రత సంతరించుకుంది. యజ్ఞంలో ఆవు నెయ్యి హవిస్సుగా దేవతలకు చేరి దేవతలను పోషిస్తోంది.

ఘృతేన వర్ధ తేబుద్ధిః, క్షీరేణా యుర్వి వర్థనమ్|
శాకేన వర్ధ తేవ్యాధి ర్మాంసం మాంసేన వర్ధతే||
తా.
నేతిచేత బుద్ధియు, పాలచేత ఆయువు - జీవితకాలము, ఆయుస్సు), కూరగాయల చేత వ్యాధియు, మానసముచేత మాంసమును వృద్ధిపొందుచున్నవి. – నీతిశాస్త్రము

పానకము - ఫలరసము, సం.పానీయము.
పీయత ఇతి పానీయం పా పానే. పానము చేయఁబడునది.
పాతు యోగ్యమితి వా పానీయం - పానము చేయఁదగినది.

చషకము - 1.గిన్నె, 2.కల్లుత్రాగు పాత్ర, మధుపాత్ర.
చషంతి పిబంతి సురా మత్రేతి చషకః అ. ప్న. చష భక్షణే. - దీనియందు పానముసేయుదురు.   

పానము - 1.త్రాగుడు, 2.త్రాగుడుగిన్నె, వై.వి.పానపట్టము, లింగపీఠము, సం.పానీయవృత్తమ్.
త్రాగుడు - త్రాగుట, రూ.త్రావుడు.
త్రాగు - క్రి.పానముచేయు, రూ.త్రావు.
త్రావు - క్రి.త్రాగు.

నీరధి - సముద్రము.
సరో నీరే తటాకే చేతి రుద్రః, తద్యోగాత్సరస్వాన్ త, పు. - సరస్సనఁగా నుదకము అది గలిగినది.
నీరదము - మేఘము; మేఘము - మబ్బు.
మేహమీతి మేఘః, మిహ సేచనే - తడుపునది.

నీరుమోపరి - 1.కడవ, 2.మేఘము, మబ్బు.

నవనీరదసంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ|

లోకత్రయోద్వేగకర కుంభకర్ణ శిరశ్ఛిదే
నమో నీరదదేహాయ రామా.....

నీరము - జలము.
నిమ్నమీర్తే నీరం, ఈరగతౌ. - పల్లమును బొందునది.
నయతి సుఖమితి నీరం. నీఞ్ ప్రాపణే. - సుఖమును బొందునది.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

నీరే ప్రాణాధారము,
నోరే రసభరితమైన నుడవుల కెల్లన్
నారే నరులకు రతనము
చీరే శృంగారముండ్రు సిద్ధము సుమతీ.
తా||
సమస్త జీవులకు నీరే ముఖ్యాధారం, సంభాషణకు నోరే కేంద్రం, మానవులకు స్త్రీ రత్నంవంటిది, చీరయే స్త్రీకి అలంకారం.

నీరమునకుఁ బాలునకును దారి నీవు
కలుపఁగా విడఁదీయఁగాఁ గర్త వీవు
హంస సోహమ్మునందు మాహాత్మ్యమూను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
 

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

 

యోగి - యోగాభ్యాసము జ్యేయు పురుషుడు.
యోగాభ్యాసము -
(యోగ.) జీవాత్మ పరమాత్మ సంయోగము పొందుటకు జేయు నభ్యాసము.

యోగము - 1.ప్రాణాయామాదికము, 2.కూడిక, 3.ఔషధము, 4.ప్రయత్నము.

యోగిహృదయ సరసీరుహ భాస్వర
యోగాధీశ్వర భోగవికస్వర| ||శరవణభవ||

యోగపట్టము - యోగులు జందెము వలె వేసికొను వస్త్రపుపట్టె, రూ.యోగపట్తె.
యోగవాగలు - యోగపాదుకలు, సిద్ధులు తమ యోగబలముచే నంతరిక్షమున బోవునపుడు ధరించు పాదరక్షలు.

ఓం భక్త హంస పరీ ముఖ్య వియోగాయై నమో నమః| 

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడి యుండు పరమాత్మ, 2.మనస్సు.
అంతర్యామి -
లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.  

యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానల భావమాన లహరీ - త్రైలోక్య రక్షాకరీ |
సర్వైస్వర్యకరీ తపఃఫలకరీ-కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| - 3

ఉదీచ్యము - 1.ఉత్తర దిక్కున ఉన్నది, 2.ఉత్తర కాలమున ఉన్నది, వి.1.శరావతీ నదికి వాయవ్యమున ఉన్న దేశము, 2.కురువేరు.
ఉదక్ ఉత్తరస్యాం భవం ఉదీచీనం - ఉత్తరదిక్కునఁ బుట్టినది.

అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము. (వృక్ష.) కురువేరు.

హ్రీబేరము - కురువేరు. హ్రీ - సిగ్గు.
కేశము - 1.తలవెండ్రుక, 2.కురువేరు.
శిరోజము - తలవెండ్రుక; శిరోరుహము - తలవెండ్రుక.
వెండ్రుక - కేశము, రూ.వెంట్రుక.

కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు - చంద్రుడు Moon.

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది. కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి| 

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.   

ధరణీశ్వరుఁడు- 1.రాజు, 2.శేషుడు, 3.విష్ణువు.
ధరణీశ్వరుడు - రాజు.
ధరణీనురుఁడు - బ్రాహ్మణుడు.

అహిపతి - శేషుడు.
శేషుఁడు - వేయిపడగలు గల సర్పరాజు.
నాగుఁడు - శేషుడు, సం.నాగః. శేషతల్ప సుఖనిద్రిత రామ్|

ధరిత్రి - భూమి, రూ.ధారయిత్రి.
ధరతి విశ్వం ధరా, ధరిత్రీ. ఈ. సీ. ధరణిశ్చ. ఇ.సీ. - విశ్వమును ధరించునది.
ధారణి - భూమి, రూ.ధారుణి, ధరణి.
ధరణా -
భూమి, రూ.ధారణి.

ధరణీజాతము లే యే
తరి నెట్లెట్లను ఫలించుఁ * దగనటు పూర్వా
చరణ ఫలంబు ననుభవము:
గరమనుభవనీయ మగును * గాదె? కుమారా!

తా. లోకమున చెట్లు ఏయే విధముగా పండు చున్నవో, ఆ విధముగనే పూర్వము చేసినకర్మను అనుసరించి ఆ ఫలము అనుభవింపఁ దగియుండును. చేసినంత తప్పక యనుభవింప వలసినదే.

ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియదాన శివ| 

వర్ణాటుఁడు - 1.గాయకుడు, 2.ముచ్చి, 3.చిత్రకారుడు.
గాయకుఁడు - 1.పాటపాడువాడు, 2.నర్తకుడు, నటుడు, 3.ప్రౌడుడు, నేర్పరి, చతురుడు.
వర్ణి - 1.బ్రహ్మచారి, 2.వ్రాతకాడు, 3.ముచ్చి.
వటువు - బ్రహ్మచారి, బాలకుడు.
బ్రహ్మచారి - బ్రహ్మచర్య వ్రతము ననుష్ఠించువాడు.
బ్రహ్మ వేదః తదధ్యయనార్థం వ్రతమపి బ్రహ్మ తచ్చరతీతి బ్రహ్మచారీ, న. పు. - బ్రహ్మ మనఁగా వేదము తదధ్యనార్ర్థమైన వ్రతంబును బ్రహ్మము దాని నాచరించువాఁడు.

వర్ణినో బ్రహ్మచారిణః,
వర్ణా ఏషాం సంతీతి వర్ణినః, న. పు. స్తుతులు (బ్రహ్మణాది వర్ణములు)గలవారు.
బ్రహమవేదాధ్యనవ్రతం చరంతీతి బ్రహమచేరిణః, న. పు. చరగతిభక్షనయోః, బ్రహ్మ మనఁగా వేదాధ్యనవ్రతము; దాని నాచరించువారు. ఈ 2 బ్రహ్మచారి పేర్లు.

బ్రహ్మమేఖలము - బ్రహ్మచారులకు ముంజిగా నుపయోగపడు తృణము.

క్షోణి - 1.నేల, 2.మొలత్రాడు, 3.ముంజ-తృణముచే బ్రహ్మచారి మొలత్రాడు.
క్షౌతీతి క్షోణిః, ఈ. సీ. పా. క్షోణీ, ఈసీ, టు క్షు శబ్దే - శబ్దించునది.
మౌంజి - ముంజదర్భ మొలత్రాడు.

అబ్ధిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.

కక్ష్య1 - 1.మొలనూలు, 2.తొట్టికట్టు, 3.ఏనుగు నడుమునకు గట్టు గొలుసు, 4.వసారా, 5.(గణి.) పరిభ్రమణ మార్గము (Orbit).
కక్ష్య2 - (భూగో.) భూమి సూర్యుని చుట్టు పూర్తిగా తిరుగుట.

తొట్టి - నోరు వెడల్పయిన మట్టి లేక కఱ్ఱ పాత్రము, కొప్పెర.
తొట్టికట్టు - లోగిలి; లోగిలి - ముంగిలి.  
ముంగిలి - (ముంగల+ఇల్లు), 1.అంగణము, 2.బయలు. 

కొప్పెర - 1.పెద్ద పాత్రము, 2.తలపుఱ్ఱె, సం.కర్పరః.

అంకణము - నలుచదరపుచోటు, రెండు దూలముల మధ్య ప్రదేశము, కక్ష్య, సం.అంగణమ్.  

ఆలానము - ఏనుగును కట్టుకంబము.
కట్టుఁగంబము - ఏనుగు మొ.ని కట్టుకంబము. 

నడికట్టుత్రాడు - 1.ఏనుగును నడుమున కట్టెడు త్రాడు, 2.కక్ష్య.
కక్షాయాం గజమధ్యభాగే భవాకక్ష్యా - గజమధ్య భాగమందుండునది. 'కక్ష్యాకక్షా' అనిక్షాంతమని విశ్వప్రకాశిక యాంతమని అజయుడు.
నడికట్టు - 1.బిగికై నడుమునకు కట్టుకొను కట్టు, కాసెకోక.   

అస్థిరాయిడ్ - (ఖగో.) (Asteriod) గురుకుజ గ్రహకక్ష్యల నడుమ కక్ష్యలో తిరుగు లఘుగ్రహము.

మడి - మదుగువస్త్రము, విణ.పరిశుద్ధము సమాసమునందు మడుగు శబ్దమునకు ఆదేశమగు రూపము, ఇనుమడి మొ, (వ్యవ.) సమమట్టముగా నున్న నేలలో నాలుగువైపులను అడ్డుగట్లుగల భాగము (Plot of cultivable land).
మడిసంధి - బాహుమూలము, చంక.    

బాహమూలే ఉభే కక్షౌ -
బాహుమూలము - చంక.
బాహ్వోర్మూలే బాహుమూలే, అ. న. - చేతులయొక్క మొదళ్ళు.
కష్యేతే స్వేదేన క్షౌ. అ. పు. క్ష హింసాయాం. - చెమటచేఁ బీడింపఁబడునవి. ఈ 2 చంకల పేర్లు.

కక్ష - 1.చంక, 2.పోటీ, పందెము.
ౘంక - కక్షము, బాహుమూలము, రూ.చంకలి, చక్కిలి.
ౘంకిలి - చంక.
ౘక్కిలి - చంక, చంకిలి యొక్క రూపాంతరము, సం.కక్షః.

ౘక్కలిగింత - గిలిగింత, కితకిత. 

చోళః కూర్పాసకో (అ)స్త్రియామ్,
చోలము - 1.కుప్పసము, 2.రవిక.
చుల్యతే అనేన చోళః, చుల అచ్చాదనే. - దీనిచేత దేహము కప్పఁబడును.
కూర్పాసము - 1.కవచము, 2.రవిక, 3.అరచట్ట.
కూర్పతే కపోనౌ అస్యతే కూర్పాసకః, అ. ప్న. అసుక్షేపణే. - మోఁచేతియందు పెట్టఁబడునది. 2 స్త్రీపురుషుల కుబుసము, రవిక, చొక్కాయః స్త్రీలయొక్క రవికకు పేళ్ళని కొందఱు. గొంతు మొదలు పాదములదాఁక వేసికొను చొక్కాయని కొందఱు. పంౙ - రవిక.

గనిమ - మడి చుట్టుగల చిన్నగట్టు, ఒక రకపు సేతువు.

కుచౌ సద్య స్స్వి ద్య - త్తటఘటితకూర్పాస భిదురౌ
కషన్తౌ దొర్మూలే - కనకకలశాభౌ కలయతా,
తవ త్రాతుం భంగా దలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధం దేవి త్రివళిలవలీవల్లిభి రివ| - 80శ్లో

తా. ఓ దేవీ! చెమటకు తడిసిన కూర్పానము - 1.కవచము, 2.రవిక, 3.అరచట్ట.) రవికను పిగుల్చునట్టివియు, కక్ష (చంక)లను ఒఱయు చున్నట్టివియు, బంగరు గిండ్లతో సమానమగు నీ కుచములను రక్షించుటకై వానిని సృజించిన మన్మథుఁడు ఏలకి తీగలను ముప్పేటగ బిగించినట్లు పొట్టమీది వలగ్నము - నడుము ముడుతలు మూడు కనుపట్టుచున్నవి. - సౌందర్యలహరి 

కౘ్చడము1 - ఒకరకపు శకటము. 
కౘ్చడము2 - గోచి, కౌపీనము, సం.కచ్ఛటా. 
కౘ్చ - 1.వెనుకకు చెక్కుకొనెడి దోవతికొంగు, 2.గోచి, రూ.కాసె, సం.కచ్ఛటా. 
గోఁచి - కచ్చడము, కౌపీనము, సం.కచ్ఛః.

కౌపీనము - 1.గోచి, 2.గుహ్యాంగము, 3.అకారము.
అకారము - అనర్హకాలము, సరికాని కాలము, విణ.(పక్వము కానిది), 2.యుక్త కాలమునకు ముందో వెనుకనో జరుగునది (Premature), ఉదా. అకాలభోజనము, అకాల మరణము.
అనర్హము - అర్హముకానిది, తగనిది.

అకారగుహ్యే కౌపీనమ్ -
కౌపీనశబ్దము చేయరానిపనికిని, గుహ్యమునకును పేరు. లక్షణచేత గుహ్యాచ్ఛాదకమైన వస్త్రము నకును పేరు. కూపం ప్రవేష్టుమర్హతీతి కౌపీనం - కూపమును ప్రవేశింప నర్హమైనది, "కౌపీనం చీరఖండే స్యా' తిది శేషః.

గోఁచికట్టు - బ్రహ్మచారి.
గోఁచికాఁడు - నిర్ధనుడు, (గోచిపాత రాయడు అని వాడుక), వి.బ్రహ్మచారి.
బ్రహ్మచారి - బ్రహ్మచర్య వ్రతము ననుష్టించువాడు.
బ్రహ్మ వేదః తదధ్యయనార్థం వ్రతమపి బ్రహ్మ, తచ్చరతీతి బ్రహ్మచారీ, న. పు. - బ్రహ్మ మనఁగా వేదము.
తదధ్యయనార్థమైన వ్రతంబును బ్రహ్మము దాని నాచరించువాఁడు. ఆ బ్రహ్మచారి నాలుగు విధములు గలవాఁడు. గాయత్రీబ్రహ్మచారి, ప్రాజాపత్యబ్రహ్మచారి, వైదికబ్రహ్మచారి, నైష్ఠిక బ్రహ్మచారి.

మెఱకరి - 1.బ్రహ్మచారి, 2.నేర్పరి (అని కొందరు).
వినగ్నుఁడు - నేర్పరి, చొరవకాడు.

ఆశ్రమములు - 1.బ్రహ్మచర్యము, 2.గార్హస్థ్యము, 3.వానప్రస్థము, 4.సన్న్యాసము.

ఆశ కోసివేసి యనలంబు చలార్చ్ర
గోచి బిగియగట్టి గుట్టు దెలిపి
నిలిచినట్టివాడె నెరయోగి యందైన విశ్వ.

తా|| ఆశ వదలి ఆశలను అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.)చల్లార్చుకొని, కామము వదలి గోచి బిగించికట్టి జ్ఞానము తెలుసుకొనువాడే నేర్పరియైన యోగి.

అల్లకము1 - 1.కౌపీనము, 2.అల్లుట, అల్లిక.
కౌపీనము - 1.గోచి, 2.గుహ్యాంగము, 3.అకారము.
అల్లకము2 - ధనియాలు. 

చీరము - కౌపీనము, 2.నారచీర, 3.నలువది పూసలు గల సరము.    
క్షౌమం దుకూలం స్యాత్ -
క్షౌమము - 1.నారచీర, 2.తెల్లచీర.
క్షూయతే శోభనమితి క్షౌమమ, టు క్షు శబ్దే. - శుద్ధత్వముచేత మంచిదని పలుకఁబడునది.
పా, క్షోమం, "క్షోమపట్టీ దుకూలే (అ)స్త్రీ" ఇతి మేదినీ.
దుకూలము-1.తెల్ల వస్త్రము, 2.సన్నవస్త్రము.
ప్రావారోత్తరాసంగ రూపేన ద్విధా కూల్యత ఇతి దుకూలం, కూల ఆవరణే. - కట్టుకొనుటకును మీఁద వేసికొనుటకును రెండు విధములుఁగా గప్పఁడునది. ఈ 2 వెలిపట్టుచీర పేర్లు, తెల్లని వలువలయును.

లోలదుకూలాంచల పాదాంచల
బాలకుతూహల లీలాపేశల| ||శరవణభవ||
  

మనమునకు నందరాని సాధనము లేదు
ధనమునకు నందమైనబోధనము రాదు
మనమె ధన మౌను మోక్షసాధనము నౌను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

అనికి - 1.మూతి వెడల్పుగల కుండ, 2.అల్లిక.
అల్లిక - (చాప మొ,ని) అల్లుట, 2.(పదముల) కూర్పు, 3.నేత.  

అని1-1.యుద్ధము, 2.సేన, 3.అల్లిక మొదలు.
అని2 - సర్వ. అన్ని యొక్క రూపాంతరము.
అని - అను ధాతువు యొక్క క్త్వార్థక రూపము, (ప్రకారము, కాలణము, ప్రసిద్ధి మొ., అర్థములను తెల్పును.

అల్లువాఁడు - అల్లుడు.
అల్లుఁడు - 1.కూతుమగడు, 2.మేనల్లుడు, రూ.అల్లువాడు.
అల్లుఁడుకొమాళ్ళు - ప్రభువునకు ప్రేమ పాత్రులై అంగరక్షకులుగ ఉండువారు.

కకుప్పు - 1.దిక్కు, 2.సంపెంగ దండ, 3.కాంతి, 4.అల్లిక, 5.జడ.
కేనసూర్యేణస్కుభ్నం తిద్యోతంత ఇతి కుకుభః, భ-సీ. – సూర్యుని Sun చేత ప్రకాశించునవి.
కం ఉదకం వాయుం వాస్కుభ్నంతి విస్తారయంతీతి కుకుభః కుభి ద్యుతౌ విస్తారేచ - ఉదకమునైనను గాలినైనను విస్తరింపఁ జేయునది. ఆశ - 1.కోరిక, 2.దిక్కు. 

కాంతి1 - 1.కోరిక, 2.(అలం.)ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుబడు శక్తిరూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది (Light).
కాంతుఁడు - 1.మగడు, 2.అధిపతి, 3.ప్రభువు, విణ.అందగాడు.

అల్లు - (జడ, చాప, మాటలు మొ.వి) 1.కూర్చు, 2.నేయు, 3.అల్లుకొను, 4.పెనుగొను.
కూర్పు - 1.కూరుపు, 2.ముద్రణము.
కూర్చు - కూరుచు; కూరుచు - 1.సంబంధించు, 2.ప్రియపడు, 3.కూడబెట్టు, 4.సంగ్రహించు, 6.రచించు, రూ.కూర్చు.
నేత - ప్రభువు; పబువు - ప్రభువు, సం.ప్రభు. నయతి వినియుఙ్త్కే సేవకానితినాయకః, నేతా చ. ఋ. ణీఞ్ ప్రాపణే.- సేవకుల నియోగించువాఁడు.
ప్రభవతి సమర్థో భవతీతి ప్రభః, ఉ. భూ. స్తుతాయాం. - సమర్థుఁ డగువాఁడు.

పోహణ - (పోహము)1.కూర్పు, 2.నేర్పు. 

అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపాతీతి అధిపః, పా రక్షణే. - అధిక్యమున రక్షించువాఁడు.

అల్లకము2 - ధనియాలు. 
దనియాలు - ధన్యాకము, కొత్తిమిరి విత్తులు, సం.ధనికః.

కుస్తుంబరి - కొత్తిమిరి.
కుత్సితం దాహాది రోగం తుమ్బతీతి కుస్తుంబురు, ఉ. న. తుబి అర్దనే. - కుత్సితమైన దాహాది రోగములఁ జెఱుచునది.
కొత్తిమిర - ధనియాల మొక్కలు, ధనియపు మొక్క రొట్ట (ఇదీఅహార అర్థములలో పరిమళము కొరకు ఉపయోగింపబడుచుండును, కొత్తిమెర, కొత్తమరి, సం.కుస్తుంబరీ (Coriander leaf).
ధాన్యాకము - దనియాలు.
ధాన్యసాదృశ్యమకతీతి ధాన్యాకం, అక కుటిలాయాం గతౌ. - ధాన్య సాదృశ్యమును బొందునది.
దనియాలు - ధన్యాకము, కొత్తిమిరి విత్తులు, సం.ధనికః.
ధనికము - ధనియాలు. ధనియాల జాతి.

ధాన్యము - 1.వడ్లు మొ.నవి, 2.ధనియాలు, 3.కొఱ్ఱ, జొన్న మొదలగు తృణధాన్యములు (Grain).

ధనియము - (వ్యవ.) సంబార ద్రవ్యములలో నొకటి. ఇది Umbeluiferae అను కుటుంబముకు చెందిన కొత్తిమిరి మొక్క (Coriandrum sativum) యొక్క ఎండిన కాయ, (Coriander).     

యుగ్మవేశ్మఫలము - (వృక్ష.) రెండు గదులు గల శుష్క అవిదారణ ఫలము. ఇది అధఃస్థిత ద్విఫల దశాండాశయము నుండి తయారైనది. ఉదా. కొత్తిమిరి కుటుంబములోని మొక్కలు (Cremo-carp).

ధనిక - 1.వర్తకుని భార్య, 2.యువతి.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.  
ధనికవర్గాధిపత్యము - (రాజ.) ధనిక స్వామ్యము, ధనిక ప్రభుత్వము (Plutocracy).

ధనికుఁడు - 1.ధనము కలవాడు, 2.మంచివాడు, 3.అప్పిచ్చువాడు.
ధని - ధనము కలవాడు.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోష పెట్టునది. 'ధన ధాన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు. 
విత్తము - ధనము, సం.విణ.1.విచారింప బడినది, 2.తెలియబడినది.
విద్యతే లభ్యత ఇతి విత్తం, విద్ ఌ లాభే. - పొందఁబడునది.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).

దాయి - దాకలి, సం.విణ.ఇచ్చువాడు.
దాకలి - లోహము కాచి సాగగొట్టుటకు క్రింద ఊతముగా నుంచుకొను ఇనుముదిమ్మె, విఘాతక, రూ.దాకలి, దాగలి.
దాగలి - దాకలి.

విడిముడి - ధనము, (విడియు+ముడి).
విడువరి - పరిత్యాగశీలుడు.
 
వితరణి - దాత. 
వదాన్యుఁడు - మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.
ఉదాత్తుఁడు - 1.గొప్పవాడు, 2.దాత, 3.మనోజ్ఞుడు, వి.(అలం.) ధీరోదాత్త నాయకుడు.
ఉదారుఁడు- 1.గొప్పవాడు, 2.దాత, 3.నేర్పరి.  
ఉత్తంసుఁడు - గొప్పవాడు.

మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.
మహనీయుఁడు - గొప్పవాడు.
అధికుఁడు - గొప్పవాడు; అలఘుఁడు - గొప్పవాడు.

లోకసమ్మతము - చంద్రుని గొడుగు. 
ఛత్రము - గొడుగు. 
ఛత్రాకార పుష్పమంజరి - (వృక్ష.) ఇది ఏకవర్ధ్యక్షక పుష్పమంజరులలో నొక రకము.
పుష్పములన్నియు కలిసి గొడుగువలెనుండును (Umbe), ఛత్రాకార పుష్పమంజరీ సమూహము, (Compound umbel).
ఛత్రాకము - పుట్టగొడుగు, రూ.ఛత్ర.
ఛాదయతి పితాదిసోషా నభిభవతీతి ఛత్రా, ఛద అవదారణే. - పిత్తాది దోషములఁ జెఱుచునది.
పుట్టకొక్కు - పుట్టగొడుగు, ఛత్రాకము.
ఛత్ర - పుట్టగొడుగు.
ఛత్రనితలము - (జం.) ఛత్రిక యొక్క పుటాకార తలము (Sub-umbrella).

ఛత్రభంగము - 1.రాజ్యనాశము, 2.స్వాతంత్ర్యము, 3.వైధవ్యము

ద్రవ్యము - 1.ధనము 2.వస్తువు.
ద్రవణీయ మితి ద్రవ్యం, ద్రుగతౌ. - పొందఁదగినది.

దాతాదరిద్రః కృపణోధానాఢ్యః, పాపీ చిరాయుస్సు కృతీగతాయుః | 
రాజాకులీన స్సుకలీనసేవ్యః, కలౌ యుగే షడ్గుణ మాశ్రయంతి||

తా. దాతయైనవాఁడు దరిద్రుఁడౌట, కృపణుఁడు- 1.పిసినిగొట్టు, లోభి, 2.కుత్సితుడు ధనాఢ్యుడౌట, పావి - పాపి, సం.పాపీ.) దీర్ఘాయుష్మ తుండౌట, పుణ్యాత్ముఁడు అల్పాయుష్కుండౌట, హీనకులుడు రాజౌట, శ్రేష్ఠకులుడు సేవకుడౌట, ఈ యాఱు గుణములు కలియుగమునందు కలిగియున్నవి. – నీతిశాస్త్రము

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.   

కమలాసనపాణినా లలాతే
లిఖితామక్షరపంకిమస్య జంతోః|
పరిమార్జయ మాతరంఘ్రిణా తే
ధనికద్వారనివాస దుఃఖదోగ్ధ్రీమ్ || – 23

కాశ్యపి - భూమి, వ్యు.పరశురాముచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయబడినది.
కాశ్యపస్యేయం కాశ్యపీ, ఈ.సీ. - పరశురాముచేత కశ్యపునికొఱకు యజ్ఞ దక్షిణగా నియ్యబడినది.
తథాచోక్తం._ 'శ్లో. త్రిసప్తకృత్య్వః పృధివీం కృత్వానిః క్షత్రియాం తతః, దక్షిణా మశ్వమేధాంతే కశ్యపాయాదదాత్ప్రభు' రితి.

ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.
ఇడ -
1.(యోగ.) ఒక నాడి (ఇడ - చంద్ర రూపిణి తెలుపు, చంద్రుని తేజస్సు), 2.మైత్రావరుణి యనుపేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.    

గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకు ను, వాక్కునకును పేరు.
ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు.
ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః - ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును.
ఇళాశబ్దో బుధభార్యాయామపి. యస్యాఃపుత్రః పురూరవాః. "ఊర్వశి అంభవ స్యాయమైన సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోశ్వశీయే.

ఆవు - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.
సమర్థుఁడు - నేర్పరి.

క్షమ - 1.ఓర్పు, patience 2.నేల, earth 3.మన్నింపు.
ఓర్మి - క్షమ, సహనము, సహించుట, రూ.ఓరిమి (Tolerance).
ఓరిమి - క్షమ, శాంతము, ఓరుపు.
ఓరుపు - ఓరిమి.
ఓపిక - 1.బలము, శక్తి, 2.ఓర్పు. 
సహనము - ఓర్పు; సహించు - ఓర్చు.

క్షంత - ఓర్పరి, సహిష్ణుడు.
సహిష్ట్ణు స్సహనః క్షాన్తా తితిక్షః క్షమితా క్షమీ,
సహిష్ణువు - ఓర్చువాడు.
సహతే తాచ్ఛీల్యేనేతి సహిష్ణుః, సహనశ్చ,
క్షాంతము - 1.ఒర్పుస్వభావము గలది, 2.మన్నింపబడినది. 
క్షమతే తాచ్చీల్యే నేతి క్షంతా, ఋ క్షమితా, ఋ, క్షమీ చ, నాంతః.
తితిక్షువు - ఒర్పరి.
తితిక్షత ఇతి తితిక్షుః, సహ మర్షణే, క్షమూష్ సహనే, తిజ నిశాతనే. - స్వభావమున నోర్చువాఁడు. ఈ 2 స్వభావముననే యోర్చువాని పేర్లు. "బాహ్యేచాధ్యాత్మికే చైవ దుఃఖే చోత్పాదితే నతి, న కుప్యతివ వా హంతి సాక్షమా పరికీర్తితా" అని క్షమా లక్షణము.

అడకర - తాలిమి, ఓర్పు.
తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.
తాల్మి - తాలిమి.  

క్షాంతి స్తితిక్షా -
క్షాంతి - 1.ఓర్పు, 2.మన్నించుట.
క్షమా క్షాంతిః, ఈ, సీ. క్షమూష్ సహనే. - క్షమించుట క్షాంతి.
తితిక్ష - ఓర్పు.
తితిషతే తితిక్షా, తిజ నిశాతనే. - ఓర్చుట తితిక్ష. ఈ 2 ఓర్పు పేర్లు.

కుంభిని - నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము. 
భూ - భూమి; భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటు వంటి దృడమైన పదార్థము, నేల.    

నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ-సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.
నేల వేలుపు -
భూసురుడు.
బ్రాహ్మణుఁడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు. 

నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు -
నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

క్షమ గలిగిన సిరి గలుగును,
క్షమ గలిగిన వాని గలుగు సౌఖ్యము లెల్లన్
క్షమ గలుగఁ దోన కలుగును,
క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుఁడు తండ్రీ!
భా||
ఓ తండ్రీ! క్షమకలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ ఉంటే విద్య అబ్బుతుంది. క్షమ ఉంటే సుఖములన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు. సంతోషిస్తాడు. సూర్యప్రభలు కలిగిన క్షమా గుణమును అలవర్చు కొనుట బ్రాహ్మణుని ధర్మము.

మను  - 1.జీవించు, 2.నర్తించు, వి.1.మన్ను, 2.నేల.

మన్ను1 - 1.మృత్తు, 2.నేల.
మన్ను2 - 1.ఒకజాతి జింక, 2.ఒక రకపు యుద్ధ సాధనము, 3. (భూగో.,వ్యవ.) రాళ్ళు విశ్లేషము నొందుట వలన ఏర్పడి, పల్లపు ప్రదేశములలో కూడుకొని కొంత సేంద్రియ పదార్థముతో గలసి, యిదివరకు పెక్కు మార్పులను పొంది, యింకను పెక్కు మార్పులను పొందుచున్న వివిధ పరిమాణములు గల శిలారేణు సంచయము. ఇట్టి మట్టిచే నాక్రమింప బడిన ప్రదేశము వ్యవసాయదారులచే 'నేల' యన బడును. (భూమి, క్షేత్రము.)
మృత్తిక - 1.మన్ను, 2.తొగరిమన్ను.
మృత్స్న - మంచిమన్ను. 

మృన్తృత్తికా -
మృద్యత ఇతి మృత్, త. సీ. మృత్తికా చ. మృద క్షోదే. - మెదుపఁబడునది.

రోదసి - 1.మన్ను, 2.మిన్ను.
రోదము - భూమ్యాకాశము మధ్యము.

బాండువ - కుండ, సం.భాండః.
బాన -
కడవ, సం.భాండః.

నీరుమోపరి - 1.కడవ, 2.మేఘము, మబ్బు.

కుండ - 1.మట్టిపాత్ర, 2.ఇరుసు తగిలించెడి బండి కంటి నడుమ గుబ్బ, 3. ఏనుగు కుంభస్థలము, 4.స్పోటకపు పొక్కు, సం.కుండమ్. అలకి - కుండ, సం.అలుకా.    

కుండమార్పు - ఒక టిచ్చి మరియొకటి పుచ్చుకొనుట.

బాండువ - కుండ, సం.భాండః.
బాన -
కడవ, సం.భాండః.

భాండము - 1.తొడవు, 2.మట్టి పాత్రము, 3.ప్రస్తువు.
భణ్డ త్యాధ్యేయస్య భాండం భడి కల్యాణే. - అధేయ వస్తువును శుభమును జేయునది.    

తొడవు - భూషణము. 
భూష - భూషణము, తొడవు.
ఆభరణము - 1.నగ, 2.చక్కగా పోషించుట.
నగ - భూషణము; భూషణము - అలంకరణము.
మండనము - 1.భూషణము, 2.అలంకరించుకొనుట.
రవణము - భూషణము, సం.రమనమ్, సం.మ్రోగునది.

ఆబంధము - 1.గట్టికట్టు, 2.పలుపు, 3.ప్రేమ, చెలిమి, 4.భూషణము.

మృత్పిండమేకో బహుభాండరూపం, సువర్ణ మేకం బహుభూషణాని|
గోక్షీర మేకం బహుధేనుజాతం, ఏకఃపరాత్మా బహు దేహవర్తీ||
తా.
కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము వేర్వేరు బంగార మొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే దేహము - శరీరము, మేను.)శరీరములు వేర్వేరు  పరమాత్మ యొక్కటే. – నీతిశాస్త్రము

గుప్తిః క్షితివ్యుదాసే (అ)పి -
గుప్తి - 1.కాపాడుట, 2.చెరసాల, 3.వడ్లపాతర, 4.దాచుట, 5.గోయి త్రవ్వుట.
గుప్తిశబ్దము నేలగుంటకును, అపిశబ్దమువలన రక్షించుటకును, చెఱసాలకును పేరు. "గుప్తికారా చ రక్షా చ దీర్ణం చ వివరం భువః" అని శాశ్వతుడు. గోప్యతే గోపనం చ గుప్తిః, గుపూ రక్షనే. - రక్షింపఁబడునది, రక్షించుటయు గనుక గుప్తి. 
ఉదాసీనము - తటస్థముగా నుండునది.
ఊర్త్వమాస్తే తిష్ఠతీతి ఉదాసీనః, శత్రుమిత్ర దేశములకు మీఁద నుపకారాపకారములు చేయక యూరకుండువాఁడు.
ఉదాసీన వక్రరేఖలు - (అర్థ.) రెండు వస్తువులను ఒకేవ్యక్తి అనుభోగించునపుడు తనకు లభ్యమగు ఉపయోగిత వివిధము లైన వస్తురాశి మిశ్రములనుండి లభించు ఉపయోగితతో సమాన మగును, ఇట్టి మిశ్రములన్నిటిని వక్రరేఖల ద్వారా చూపించిన అవి ఉదాసీనవక్రరేఖ లగును (ఏలయన ఇట్టి మిశ్రములలో దేనివలన నైనను వ్యక్తికి లభించు ఉపయోగిత సమానము. అందువలన వివిధమిశ్రమములపట్ల వ్యక్తి ఉదాసీనతను చూపించును.)     

క్షితి - 1.భూమి, 2.ఉనికిపట్టు.
క్షియంతి నివసంతి సర్వే స్యామితి క్షితిః, ఈ. సీ. క్షి నివాసగత్యోః. - దీనియందందఱుందురు.
క్షితిధరము - కొండ.
క్షితిపతి - రాజు, భూమీశుడు.

క్షితిరుహము - చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.
వృక్షము - చెట్టు, సం. (వృక్ష.) చాల యెత్తుగా, లావైన కాండము, ఎక్కువ ధారువుతో ధృడమైన శాఖలుగల మొక్క (Tree).
వృశ్చ్య ఛిద్యత ఇతి వృక్షః, ఓవ్రశ్చూ చ్ఛేదనే. - ఛేదింపఁబడునది.
చెట్టుగట్టు - క్రి.చెట్టుగా నేర్పడు (అవయవ సౌష్ఠవ మేర్పడుట).

చెట్టువ - 1.రెక్క, రూ.చట్టువ.
ౘట్టుప - రెక్క, రూ.చెట్టుప.
రెక్క - రెక్క, పక్షివిరక. రెక్క ఆడితే గాని డొక్క ఆడదు.

క్షయకరణము - (రసా.) ఒక పదార్థమునందలి ఆక్సిజన్ మొ. ఋణ విద్యు దాత్మకము లగు మూలకమున్లను తొలగించుట లేక వాని నిషత్తి తగ్గించుట, న్యూనీకరణము, అపచయము (Reduction).

క్షయ వాసావపి క్షితిః,
క్షితిశబ్దము నాశమునకును, ఉనికిని, అపిశబ్దము వలన భూమికిని పేరు.
క్షయః క్షియంతి నివసంత్యస్యామితి చ క్షితిః, క్షి క్లయే, క్షి నివాసగత్యోః. - నశించుటయు, ఉండుటయు దీనియందుందురు గనుకను క్షితి.

వాస - వాసము (వెదురు).
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు(ఆవాసము), 3.వి.వెదురు.
వసంత్యస్మిన్నితి వాసః, వస నివాసే.  దీనియందు జనులు నివసింతురు.
ఆవాసము - ఇల్లు.    

వెదురు - వేణువు, సం.వేణుకః.
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి.
వయ్యంత్యనేన వేణుః, పు. వేఞ్ తంతుసంతానే. - దీనిచేత నల్లుదురు.  

వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
వసతి - 1.ఇల్లు, ఉనికి. నివసతి - ఇల్లు.
నివాసము - ఇల్లు, రూ. నివసనము, వాసము.
నివాసి - వాసముచేయువాడు.

ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉంకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).

స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
స్థాని - స్థానము కలది.
స్థానాంతరీకరణము - (భౌతి.) ఒక వస్తువును ఒక చోటునుండి ఇంకొకచోటికి మార్చుట, (గతిశాస్త్రము,) ఇంకొక చోటికి తరలించుట (Translocation). 

స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికించుట, (Dislocation).

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, ఘరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

సంపద గలవారిని మో
దింపుచుఁ జుట్టుకొనియుందు * రెల్లప్పుడు; స
త్సంపద తొలంగిన నుపే
క్షింపుదు రవివేకిజనులు * క్షితిని గుమారా!

తా. కుమారా! ఐశ్వర్యముగలవారలను జనులు పొగడుచుఁ జుట్టును చేరియుందురు. ఆ సంపద తొలఁగిపోయినచో నెవ్వఁడై నను దగ్గఱఁజేరరు. ఎంత బుద్ధిహీనులో కాంచుము.

కొండఱేఁడు - హిమవంతుడు.

క్షైతిజము - (గణి.) క్షితిజ సంబంధమైనది, (ఆకాశము భూమి కలియు నట్లు కనబడు వలయమునకు క్షితిజమని పేరు), భూమితో సమానమైన లేదా సమాంతరమైన మట్టము గలది (Horizontal).

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.  

గురుత్వము - గౌరవము, గురుభావము, (భౌతి.) భూమ్యాకర్షణశక్తి (Gravity), మనము నివసించు భూమిపై నున్న వస్తువులకు, భూమికి మధ్య గల ఆకర్షణ (Gravity), దానినే మనము భారము అందము.

గరిమనాభి - (భౌతి.) గురుత్వ కేంద్రము (Centre of gravity).
గరిమ - 1.గొప్పదనము, 2.బరువు, 3.అణిమాద్యష్టైశ్వర్యములలో ఒకటి.

కళత్రము - 1.పెండ్లాము, 2.కోట, 3.నితంబము, (జ్యోతి.) లగ్నమునకు ఏడవస్థానము.
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
భ్రియత ఇతి భార్యా భృఞ్ భరణే. - భరింపఁబడునది.

దుర్గము -కోట.
కోట - 1.దుర్గపురము, 2.పట్టణము, చుట్టుగల ప్రహరి, సం.కోటః.
కోట్టము - దుర్గపురము, కోట.
కోట్టారము - 1.కోట్టము, 2.కొలని మెట్టు, 3.నూయి.   

నితంబము - 1.పిరుదు, మొల, 2.కొండ నడుము, 3.మూపు, 4.దరి, ఒడ్దు.
పర్వతస్య నితంబప్రాయత్వాన్ని తంబః - పర్వతమును నడునువంటిది నితంబము.
నితంబ మేఖల - (జం.) కటివలయము, తుంటి యెముకల చక్రము (Hip-girdle or pelvic-girdle).
నితంబ సంబంధము - (జం.) తుంటికి సంబంధించినది (Sciatic).
నితంబిని - స్త్రీ; స్త్రీ - ఆడుది.
పృథు ర్నితంబః కటిపస్చాద్భాగః సో (అ)స్యా అస్తీతి నితంబినీ. సీ. గొప్ప పిఱుఁదులు గలది.

తుంటి - కటిపార్శ్వ భాగము, రొండి.
రొండి - నడుము యొక్క పార్శ్వభాగము.

ప్రావృతస్నాయువు - (జం.) తుంటి కీలునకు గల స్నాయువు (Capsular ligment). ఇది చుట్టును అమర్చబడి యుండును.

హరణము - 1.హరించుట, 2.అరణము, 3.భాగహారము.
హ్రీయతే స్త్రియా స్వాతంత్య్రేనేతి హరణం, హృఙ్ హరణే. - స్త్రీచేత స్వాతంత్య్రమున హరింపఁ బడునది.        
అరణము - వివాహకాలమందు వధూవరుల కిచ్చు ధనాదికము, సారె, సం.హరణమ్.
సారె1 - 1.కూతు నత్తవారింటికి పంపు నపుడు ఇచ్చెడు వస్తువులు, 2.కుమ్మర వాని చక్రము, (గృహ.) వధువు అత్తగారింటికి పోవునపుడు తీసికొనిపోవు సామగ్రి వధువు స్వగృహమును నిర్మించుకొనుటకై తలితండ్రులు సహాయార్థమిచ్చు గృహ సామగ్రి.
సారె2 - 1.శారి, 2.పగడశాలకాయ, 3.పాచిక, 4.గోరువంక.

గురుత్వం విస్తారం - క్షితిధరపతిః పార్వతి! నిజా
న్నితమ్బా దాచ్ఛిద్య - త్వయి హరణరూపేణ నిదధే|
అత స్తే విస్తీర్ణో - గురు రయ మశేషాం వసుమతీం 
నితంబ ప్రాగ్భారః - స్థగయతి లఘుత్వం నయతి చః. - 81శ్లో

తా. తల్లీ! పార్వతీ! హిమవంతుడు తన పర్వత ప్రదేశమునుండి (కొండ చరియనుండి) మిక్కుటమగు భారమును దెచ్చి నీకు అరణముగ నిచ్చినాడు. అందువలననే విశాలమగు నీ పిఱుదుల భారము ముందుకు వంగి భూ భాగమును గప్పుచున్నది, మఱియు లఘిమ - లఘుత్వము)తేలికగను నగుచున్నది. - సౌందర్యలహరి

క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే, ధరణి ధరణకిణచక్రగరిష్ఠే|
కేశవ! ధృత కచ్చపరూప! జయ జగదీశ! హరే!

సర్వంసహ - భూమి.
సర్వం సహత ఇతి సర్వంసహా, షహమర్షనే. - సర్వమును సహించునది.     

సహ - భూమి.
సై - సహ, తోడ, రూ.సయి, సం.సహ.
సయ్యాట - (సయి+ఆట) 1.సహక్రీడ, 2.లీల, 3.సల్లాపము, రూ.సయ్యాటము.
సయ్యాటించు - క్రి.పరిహసించు.

సల్లాపము - పరస్పరసంభాషణము, రూ.సల్లపనము.

సైదోఁడు - తోబుట్టువు.

సహజీవి - (జం.) సహజీవనముచేయు ప్రాణులలో ఒకటి (Symbiont).
సహజీవనము - (వృక్ష.) ఒక తరగతి ప్రాణియు మరియొక తరగతి ప్రాణియు కలిసి పరస్పర లాభదాయకముగా జీవించుట (Symbioais).

సహవేదననాడులు - (జం.) పరిణాహ నాడీ మండలమునకు చెందిన ఒక తరగతి నాడులు (Sympathetic nerves).

సహసమన్వయము - (భౌతి., గణి రసా.) ఒకదానితో నింకొకదానిని సంబంధమునకు తెచ్చుట. రెండిటి మధ్య అనురూప్యమును గాని సంబంధమును గాని స్థాపించుట.

సహదర్మణి - భార్య.
పత్యాభర్త్రా సహ ధర్మః దాన యజ్ఞాది రస్యా ఇతి సహధర్మణీ, సీ. - పతితోఁ గూడ దానయజ్ఞాది ధర్మములు గలిగినది.

సహవాసము - 1.కూడనుండుట, 2.స్నేహము.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.

సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.
సహచరుఁడు- మిత్రుడు, విణ.కూడదిరుగువాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun. సుహృదుఁడు - మిత్రుడు.

సహోదరుఁడు - తోడబుట్టినవాడు.
సహోదరి - తోడబుట్టినది. 

సమానోదర్య సోదర్య సగర్భ్య సహజా స్సమాః,
సమానే ఉదరే శయితః సమానోదర్యః, సోదర్యశ్చ - ఒక గర్భమందున్నవాఁడు.
సమానే గర్భేభవ స్వగర్భాః - ఒక గర్భమునఁ బుట్టినవాఁడు.
సహ జాయత ఇతి సహజః, జనీ ప్రాదుర్భావే. - కూఁడబుట్టినవాఁడు. ఈ 4 ఒకతల్లి బిడ్డల పేర్లు.

సోదరుఁడు - తోడబుట్టినవాడు.
సోదర్యుఁడు - సోదరుడు.

సౌభ్రాతము - మంచి తోడపుట్టుతనము.     

సహజ - తోడబుట్టినది.
ఆఁడుతోడు - సోదరి, తోడబుట్టువు.
సోదరి - తోడబుట్టినది.
తోఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోబుట్టుగు, తో బుట్టువు, తోడబుట్టువు.
తోడ(ౘ)చూలు - తోబుట్టువు.
తోడఁబుట్టు - 1.సోదరుడు, 2.సోదరి, రూ.తోడబుట్టువు.

తల్లిని దండ్రిని సహజల
నల్లరఁబెట్టినను వార * లలుగుచు నీపై
నుల్లముల రోయుచుందురు
కల్లరి వీఁటనుచుఁ గీర్తి * గందఁ గుమారా!

తా. తల్లిదండ్రులను, తోడఁబుట్టువులను కలవరపెట్టవలదు. వారు కోపింతురు, నీమీఁద మనస్సులో రోయు - క్రి.1.రోతపడు, 2.వెదకు, 3.నిందించు దుర్మార్గుఁడని తలంతురు. నీకు కీర్తి కలుగకుండునట్లు అసహ్యపడి నిందింతురు.  

వసుమతి - భూమి.
వసుధనమస్యామస్తీతి వసుమతీ. ఈ. సీ. - ధనము దీనియందుఁ గలదు.

వసుధ - భూమి, వ్యు.వసువుని(బంగారమును) ధరించునది.
వసుధనమస్యామస్తీతి వసుమతీ. ఈ. సీ. - ధనము దీనియందుఁ గలదు.
వసు దధతీతి వసుధా. డుధాఞ్ ధారణ పోషణయోః - ధనమును ధరించునది.
వసువు - బంగారు, ధనము, రత్నము.
వసతి ప్రభూణాం గృహే వసు, ఉ. న. వస నివాసే. - ప్రభు గృహముల యందుందునది.

రత్నము - 1.మణి, 2.స్వజాతియందు శ్రేష్ఠమైనది (నవరత్నములు_ మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వడూర్యము.)

ప్రవజితుఁడు - సన్యాసి.
ప్రవ్వ - కుండ.  
ౘలిపందిరి - 1.దాహమునకు నీరిచ్చు చోటు, 2.ప్రవ.

ప్రపా పానీయశాలికా, 
ప్రకర్షేణ పిబంత్యస్యామితి ప్రపా, పా పానే. - దీనియందు ఉదకమును మిక్కిలి పానముచేయుదురు.
పానీయస్య జలస్య శాలా పానీయశాలికా - జలముయొక్క యిల్లు. ఈ 2 చలిపందిరి పేర్లు.

పానకము - ఫలరసము, సం.పానీయము.
పీయత ఇతి పానీయం పా పానే. పానము చేయఁబడునది.
పాతు యోగ్యమితి వా పానీయం - పానము చేయఁదగినది.

సౌరి - 1.శని Saturn, 2.యముడు, వ్యు.సూర్యుని కుమారుడు.
సూరస్యాపత్యం సౌరిః - పా. సౌరో వా సూర్యుని కొడుకు.
సౌరికుడు - కల్లమ్మువాడు. 

శౌణ్డికో మణ్డహారకః,
శౌండికుఁడు - కల్లు అమ్మువాడు.
శుండా పానస్థానం తాత్ధ్యత్ సురాపిశుండా, సా పణ్యమస్యేతి శౌండికః. - శుండ యనఁగా పానస్థానము; అందుండునది గనుక సురయుశుండ యనిపించు కొనును, దాని నమ్మువాఁడు.
కబ్బిలి - కల్లమ్మువాడు, శౌండికుడు.
మండ మచ్చసురాంహరతీతి మందహారకః హృఞ్ హరణే. - కల్లుమీఁది తేటను అమ్ముటకై తీయువాఁడు. ఈ 2 కల్లమువాని పేళ్ళు.

ఆపానము - 1.అనేకులు గూడి కల్లు త్రాగుచోటు, 2.కల్లు అంగడి.
అపిబన్త్యస్మిన్ని త్యాపానం - దీనియందు మద్యపానము సేయుదురు.
పానము - 1.త్రాగుడు, 2.త్రాగుడు గిన్నె, వై.వి. పానపట్టము, లింగపీఠము, పానీయవృత్తమ్.
త్రాగుడు - త్రాగుట, రూ.త్రావు.
త్రాగు - క్రి.పానముచేయు, రూ.త్రావు.
త్రావు - క్రి.త్రావు. లింగపీఠము - పానపట్టము.

ౙల్లేరి - పానపట్టము, లింగపీఠము.

స్వాదనము - 1.పానము, 2.రుచి చూచుట.
స్వాదుముకుళములు - (జం.) రుచిని గ్రహించు జీవకణములు గుంపులు (Taste buds).

లొట్టిముచ్చు - త్రాగుబోతు.
లొట్టి - కల్లుదీసెడి ముంత.

తాగుబోతు - అమితముగ మద్యము సేవించినవాడు.
తాగు - క్రి.పానముచేయు, రూ.త్రాగు.
మత్తుఁడు - మదించినవాడు.
మాద్యత్తి స్మ మత్తః మదీ హర్షగ్లేపనయోః - మదించినవాఁడు.
మత్తు - మంపు, మదము, సం.మత్తా, మదః.
శౌండుఁడు - 1.కల్లు త్రాగుట లోనగువానిచే మత్తిల్లినవాడు, 2.నేర్పరి.
శుండా పానాగారం, సురా వా తత్ర స్థితః ఆసక్తో వా శౌండః - మద్యపానగృహమందునికి గలవాఁదు గాని మద్యమందాసక్తి గలవాఁడు గాని శౌండుఁడు. 

శుండాలము - ఏనుగు.    
శుణ్డా పానం మదస్థానమ్ -
శుండ - 1.తొండము, 2.కల్లు, 3.వేశ్య. 
శునంత్యేనాం పానార్థమితి శుండా, శున గతౌ. - పానముసేయుట కొఱకు దీనిఁగూర్చి పోవుదురు.
పానము - 1.త్రాగుడు, 2.త్రాగుడు గిన్నె, వై.వి.పానపట్టము, లింగపీఠము, సం.పానీయవృత్తమ్.
పిబంత్యస్మిన్నితి పానం, పా పానే. - దీనియందు కల్లు ద్రాగుదురు.
మదస్య స్థానం మదస్థానం - మదమునకు నునికిపెట్టెనది. ఈ 3 కల్లుపాక పేర్లు.

బొళ్ళపాయి - కల్లుత్రాగు తాటాకువాయ.
బొళ్ళ - శూన్యము, ఉత్తది.

చషకము - 1.గిన్నె, 2.కల్లుత్రాగు పాత్ర, మధుపాత్ర.
చషంతి పిబంతి సురా మత్రేతి చషకః అ. ప్న. చష భక్షణే. - దీనియందు పానముసేయుదురు.

గఞ్జాతు మదిరాగృహమ్,
గంజ - 1.కల్లుపాక, 2.గని, 3.గంజాయి, 4.కల్లుకుండ, 5.గుడిసె. 
గఞ్జంతి శబ్దాయంతే (అ)స్యామితి గంజ, గజి శబ్దే. - దీనియందు కూఁతలు పెట్టుదురు.
మదిరాయా స్సంధానగృహం మదిరాగృహం - మద్యమును చేసియిచ్చునట్టి ఇల్లు. ఈ 2 మద్యముచేయు నింటి పేర్లు. 

గని - 1.బంగారు మొ.వి. పుట్టు చోటు, ధాతువులను త్రవ్వి తీసెడు భూభాగము, 2.బిలము, రంధ్రము, సం.ఖని.
బిలము - 1.రంధ్రము, 2.గుహ.
బిల్యతే భిద్యత ఇతి బిలం, బిల భేదనే. - భేదింపఁబడునది.

రంధ్రాన్వేషణము - రంధ్రములను అన్వేషించుట (తప్పులు వెదుకుట యని వాడుకలోని యర్థము.)

రంథ్రముల కుట్టు - (గృహ.) అలంకారపు కుట్టులో రంథ్రముల నేర్పరుచు కుట్టు (Eyelet-stitch).

గాంధారి - 1.గంజాయి, 2.ధృతరాష్ట్రుని భార్య.
గంజాయి - 1.గంజామొక్క, 2.దాని ఆకు, 3.ఆ ఆకుతో తయారు చేసిన మత్తు పదార్థము, కబళము, (వ్యవ.) ఉన్మాదక ద్రవ్యములలో ఒకటి (Hemp). (ఇది Cannabinaceae అను కుటుంబమునకు చెందిన Cannibis sativa (గంజాయి మొక్క) అను ఆడు మొక్కల పూవుల నుండి తయారుచేయుదురు. భంగు అనునది ఈ మొక్కలనుండియు, వాని కాడల నుండియు తయారుచేయబడును. గంజాయిలో 'కన్నబిన్ ' (Cannabin) అను ముఖ్యమైన క్షారాభము (Alkaioid) ఉండును. తులసివనములో గంజాయి మొక్క.

గాంధారేయుఁడు - దుర్యోధనుడు, గాంధారికొడుకు.

గుడిసె - గుండ్రని చిన్న ఆకుటిల్లు, సం.కుటీరః.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకారచిహ్నము.
గుడుసుకయిదువు - విష్ణుచక్రము, పర్యా. గుడుసువాలు.

ఉర్వి - భూమి, వ్యు.విశాలమైనది.
ఉర్వీపతి - రాజు, భూమీశుడు.
ఉర్వీశుఁడు - రాజు, భూపతి.
భూపతి - నేలరేడు, రాజు. నేలఱేఁడు - రాజు. 

ఉర్వరా సర్వసస్యాఢ్యా -
ఉర్వతి క్షుధం హినస్తీత్యుర్వరా. ఉర్వీ హింసాయాం. - ఆఁకలిని బోఁగొట్టునది
ఉరుం మహాంతం వృణోతి తదర్హత్వా దుర్వరా - అధికమును వరించునది. ఈ ఒకటి సమస్తమైన పైర్లతోఁ గూడియున్న భూమి పేరు. 

భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

తప్పులెన్నువారు తండోపతండంబు
నుర్విజనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు విశ్వ.

తా. ఇతరుల, తప్పులను పట్టుకొనువారు, అనేకులుగలరు. కాని తమ తప్పు - క్రి.1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.లను తెలుసుకొన లేరు.    

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ - నత్యాన్నదానేశ్వరీ|
సాక్షా న్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్న్నపూర్ణేశ్వరీ. - 7

అంకపాళి - 1.తొడ, 2.తిన్నె, 3.కౌగిలి, 4.దాది, రూ. అంకపాళి, అంకపాలిక, అంకపాళిక.    

సక్ఠి - తొడ; తొడ - ఊరువు.
సజతే సంగచ్ఛతీతి సక్ఠి, షంజ సంగే. - కూడుకొనియుండునది.
ఊరువు - తొడ, వ్యు.వస్త్రముచే అచ్ఛాదింప బడునది.
ఊర్ణూయతే వస్త్రేణేతి ఊరుః, పు. ఊర్ణుఙ్ ఆచ్ఛాదనే. - వస్త్రముచేఁ గప్పఁబడునది.
ఊరుసంధి - (జం.) తుంటికీలు, పెల్విస్ (Pelvis), తొడ ఎముకతో కలియు భాగము (Hip-joint).
ఊర్వస్థి - (జం.) (ఊరు+అస్థి) తొడ ఎముక (Femur).

ఊర్వశి - ఒకానొక అప్సరస.
ఊర్వశీ ఈ, సీ. ఉరు అధికం వ్ష్టి ప్రకాశత ఇతి ఊర్వసీ, వస కాంతౌ. - మిక్కిలి ప్రకాశించునది. (పా, ఊర్వసీ నారాయణస్య ఊరౌ ఉషితా ఊర్వసీ.) వస నివాసే - విష్ణువు తోడలయందు న్నది. నారాయణస్య ఊర్వో ర్భత్వాద్య్వా - విష్ణువు తొడలయందుఁ బుట్టినది, సా ముఖం ఆదిత్యసాం తాః. ఊరూః నారాయణి|

జగతి - తిన్నె; ౙగిలె - తిన్నె, రూ.జగిలె.
తిన్నె - తిన్నియ; తిన్నియ - అరుగు, వేదిక, రూ.తిన్నె, తీనియ, తీనె. అరుఁగు - తిన్నె, రూ.అరఁగు. తీనియ - తిన్నియ.
వేది - 1.వేదిక, తిన్నె, 2.విద్వాంసుడు, విణ.తెలిసినవాడు.
విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.

జానువు - మోకాలు. జానునీ చంద్ర సోదరి|
జాయతే అంఘోరుసంధిభాగ ఇతి జానుః, ఉ. స, ప. పుం. జనీ ప్రాదుర్భావే. - తొడపిక్కలనందునఁ బుట్టునది. 'జాను మప్యస్య మృద్నియాత,' అని సుశ్రుతప్రయోగము.
ఊరుపర్వము - మోకాలు, జానువు, వ్యు.తొడకు కణుపు వంటిది.
ఊర్వోః పర్వ ఊరుపర్వః, న, స. - తోడల యొక్క కనుపు.
(ౙ)జాను - అందము, రూ.జానువు. 
మోకాలు - (మోపు+కాలు) జానువు.  

జాను ఫలకము - (గృహ.) మోకాటి చిప్ప, తొడ ఎముక, మోకాలి ఎముక కీలుపై గల బిళ్ళ, (Knee-cap).

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపు చిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము.

కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.   

కపోనిస్తు కూర్పరః,
కపోణి - మోచేయి.
కం సుఖం పుణతి కరోతి కపోణిః, ఈ. పు. పుణ శుభకర్మణి చ, సుఖమును జేయునది. పా. కపోణీ, సీ. 'కపోణిరనపుంసకం' అని రభసుడు. కపోణిశబ్దము నుకారమధ్యముగాఁ గొందఱు చెప్పుదురు.
మోఁచేయి - (మోపు+చేయి) కూర్పరము. 
కపోణ్యగ్రప్రవర్థము - (జం.) మోచేతికీలులో రేడియో అల్నాకు పైకి పొడుచుకొని వచ్చిన భాగము (Ocecanon process).
మడత బందుకీలు - (జీవ.) తలుపువలె ముడుచుటకు వీలగు కీలు, ఉదా.మోచేతికీలు (Hinge - joint).
కూర్పసము - 1.మోచేయి, 2.మోకాలు.
పదార్థకర్షనే హఠాత్ కురతి కూర్పరః కుర శబ్దే పదార్థములను గొబ్బునతీయునపు డించుక ధ్వనించునది, ఋ. కుర్పరః, మోచేతి పేర్లు.

విబుధుఁడు - విద్వాంసుడు.
విబుధ్యంత ఇతి విబుథాః - విశేషముగా నెఱింగినవారు గనుక విబుధులు, బుధ అవగమనే.

ప్రణతి - 1.వినమ్రత, 2.నమస్కారము.
ప్రణిపత్తి - అభివాదము, మ్రొక్కు.     

మోఁకరించు - క్రి. మోకాళ్ళు నేలనూని ముందరికొరగు, మోకరిలు.
మ్రొగ్గు -
క్రి.మోకరిల్లు, వి.ఎక్కువ, రూ.మొగ్గు.
మ్రొగ్గబఁడు - క్రి.మోకరించు, 2.మ్రొగ్గతిలబదు, 3.మ్రొగ్గుతిలు, 4.ముందునకుపడు.

కరీంద్రాణాం శుండాన్ - కనకకదళీకాండ పటలీం
ఉభాభ్యా మూరుభ్యా - ముభయ మపి నిర్జత్య భవతీ,
సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే!
విధిజ్జే! జానుభ్యాం - విబుధకరికుంభద్వయ మపి|| - 82శ్లో

తా. శాస్త్రముల నెఱిగిన ఓ గౌరీ! నీవు నీ తొడలచే నేనుగుల తొండములను, కాంచన కదళి - బంగారపుటరటి స్థంభములను జయించితివి. మఱియు గుండ్రనివియు పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.)భర్తకు నమస్కరించుటచే గట్టిపడినవియు నగు మోకాళ్ళ చే దేవగజముల కుంభస్థలములను జయించు చున్నావు. – సౌందర్యలహరి

దిగ్ఘస్తిభి కనకకుమ్భ ముఖావసృష్ట
స్వరాహినీ విమల చారుజల ప్లుతాన్గీమ్
ప్రాత ర్నమామి జగతాం జననీ మ శేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధిపుత్త్రిమ్| - 20 

అంబుధి - సముద్రము. శ్రవణే సాగరాంబుజా| సముద్ర నవనితము - చంద్రుడు Moon.

అంబువు - నీరు, (జ్యోతి.) లగ్నమునకు నాలుగవ స్థానము, (ఛం.) ఒకరకపు వృత్తము.
అంబతే అంబు, ఉ. న. అబిరబి లబి శబ్దే. ప్రవహించునప్పుడు ధ్వనియుక్తమై యుండునది. అమతి గచ్ఛతీత్యంభః స-న, అమగత్యాదిషు. - పోవునది. 

అంభోరాశి - సముద్రము. 
అంభోధి - సముద్రము.

అంబుదము - నీటినిచ్చునది, మేఘము, మబ్బు.
అంబు బిభర్త తయంబుభృత్, త-పు, భృఞ్ భరణే. - ఉదకమును భరించునది.

నీరుమోపరి - 1.కడవ, 2.మేఘము.

చేగలవాడు - ఈవికాడు, వదాన్యుడు.
వదాన్యుఁడు - మిక్కిలియిచ్చువాడు, ఉదాత్తుడు.

వదాన్యో వలువాగపి,
వదాన్యశబ్దము లెస్సగా మాటలాడువానికిని, అపిశబ్దమువలన దాతకును పేరు. వద వక్తాయాం వాచి. - మంచిమాటలాడువాడు.   

దానమున్ చేయఁ గోరిన వద్యాన్యున కీయఁగ శక్తి లేనిచో
నైన బరోపకారమునకై యొకదిక్కునఁ దెచ్చి యైన నీఁ
బూనును, మేఘు డంబుధికిఁబోయి జలంబుల దెచ్చి యీఁయడే
వాన, సమస్తజీవులకు వాంఛిత మింపెసలార, భాస్కరా.

తా. మబ్బు అంబుధి - సముద్రము మందలి నీటిని తెచ్చి అన్ని ప్రాణులను సంతృప్తి కరమగు వాన - వర్షము నిచ్చునట్లే, వదాన్యుఁడు - మిక్కిలి యిచ్చువాడు, ఉదాత్తుడు. తనవద్ద ధనము లేకున్నను యొంకొక చోటి నుండి తెచ్చి యైనను దానము చేయును.   

ద్రోణీ కాష్ఠామ్బువాహినీ,
ద్రోణి - 1.చిన్నపడవ, 2.దోనె, 3.పసులు మేయు కంచె, 4.కొండపల్లము.
ద్రవత్యస్యాం జలమితి ద్రోణీ, ఈ.సీ. ద్రుగతౌ - దీనియందు జలము కాఱిపోవును.
అంబువాహిని - 1.దోనె, 2.కొయ్య బొక్కెన, 3.నీళ్ళుమోయుస్త్రీ.
అంబు వహతీత్యంబువాహినీ; కాష్ఠకృతా అంబువాహినీ కాష్ఠాబువాహినీ, ఈ. సీ. కాష్ఠముచేఁ జేయఁబడిన అంబువాహిని. ఈ 2 దోనెపేర్లు.

దోనె - ద్రోణి, చిన్నపడవ.
దోని - ద్రోణి, దొన, కాలువతూము.
దొన్నియ - ద్రోణి, దొప్ప, డొప్ప.
దొన - 1.తూణము, అమ్ములపొది, 2.ద్రోణి, కొండమీదిపల్లము, 3.చెరువు, సం.1.తూణమ్, 2.ద్రోణీ.

పాణివడము - అమ్ములపొది, సం.బాణపాత్రమ్.

తూణోపాసఙ్గ తూణీర నిషఙ్గా ఇషుధిర్ద్వయోః తూణ్యమ్ -
తూణము - అమ్ములపొది, రూ.తూణీరము, తూణి.
తూణ్యతే కరీరితి తూణః, తూనీరః, తూనీ చ తూణ పూరణే. - బాణములచేత పూరింపఁబడునది గనుక తూణము, తూణీరము, తూనియును తూణతూణీర శబ్దములు పుంలింగములు. తూణీశబ్దము ఈకారాంత స్త్రీలింగము, ఆకారాంత స్త్రీలింగమని కొందఱు. 
నిషంగము - అమ్ములపొది.
ఉపాసజ్జంతే శరా అత్ర ఉపాసంగ నిషంగశ్చ, షంజ సంగే. - బాణములు దీనియందు కూర్చఁబడును, గనుక ఉపాసంగము నిషంగమును.   
ఇషుది - అమ్ములపొది.
ఇషవోధీయంతే (అ)త్రేతి ఇషుధిః, ఇ.పు. దు ధాఞ్ ధారణపోషణయోః. - బాణములు దీనియందు ధరింపఁబడును.  
ఇషువు - బాణము.
ఇష్యతి గచ్ఛతీతి ఇషుః, ఉ.ప్స. ఇష గతౌ. - లక్ష్యమును గూర్చి పోవునది.

పడవ - 1.ఎక్కటి కయ్యము చేయు భూమి, 2.ప్రళయము, వై.వి. చిన్నదోనె, సం.ప్లవః.
ప్రళయము - 1.కల్పాంతము, 2.అపాయము, 3.మృత్యువు, 4.మూర్ఛ.    

గొండోల - (Gondola) వెనిస్ నగరములో నీటి కాలవలందు ఉపయోగించు చిన్నపడవ. 

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము - గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు; తీఁగయిల్లు - పొదరిల్లు.
కుంజము - 1.పొదరిల్లు, 2.ఏనుగు కొమ్ము.
కుడుంగము - పొదరిల్లు.

మంజులము - 1.పాచి, శైవలము, 2.పొదరిల్లు, విణ.ఒప్పిదమైనది.

కుటీర పరిశ్రమలు - (వ్యవ.) కుటుంబ వృత్తులు, కర్మాగారముల అవసరము లేకుండ, వ్యవసాయదారు ఊత్పత్తిచేయు దినుసులనుగాని, గ్రామ పరిసరములలో లభ్యమగు ముడిపదార్థము లనుగాని ఉపయోగార్హముగ జేయు పరిశ్రమలు గృహపరిశ్రమలు. (ఇట్టి పరిశ్రమలలో ముఖ్యముగ కుటుంబములోని వారే పనిచేయుదురు. ఇతరులను ఇట్టి పరిశ్రమలలో నియమించుట అసాధారణము.) ఉదా. బుట్టలు అల్లుట, (Cottage industries).

ఆకుటిల్లు - (ఆకు + ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.
పర్ణశాల - ఆకుటిల్లు.

గుడి - 1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.   

కోవెల - గుడి, వై.వి. కోకిలము.
కోకిలము - కోయిల.

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో... దీపముంది.. అదియే దైవం...  

చెలియలకట్ట - సముద్రపుగట్టు, వేల, రూ.చెల్లెలికట్ట.

అబ్ధ్యంబువికృతౌ వేలా కాలమర్యాదయో రపి,
వేలాశబ్దము సముద్ర ముప్పొంగుటకును, కాలమునకును, మర్యాదకును పేరు. అపిశబ్దమువలన అనాయాస మరణమునకును, చెల్లెలి కట్టకును, రాజుల భోజనమునకును పేరు. వేలతీతి వేలా, వేలృ చలనే. చలించునది. "వేలా కాలే జలనిధే స్తీరవీర వికారయోః, అక్షిష్టమరణే రాగే సీమ్ని వారి బుధస్త్రియా" మితి ప్రకాపః. 

వేల - 1.చెలియలకట్ట పోలిమే, 2.అనాయాస(ఆయాసములేనిది) మరణము, 3.బుధునిభార్య, 4.దాస్యము.

అనాయాసము - ఆయాసములేనిది, సులువైనది, వి.ఆయాసములేమి.

ఇళ - అల.
ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.

ఆఁక - 1.అడ్దు, 2.చెర, 3.కట్టుబాటు, 4.చెలియలికట్ట.
అడ్డు -
క్రి.అడ్దగించు, నిరోధించు, విణ.నిరోధకము, నిరోధకుడు.
ఆఁకట్టు - క్రి.1.అడ్డగించు (ఆఁక=కట్టు), 2.ఆక్రమించు.
ఆఁపు - క్రి.అడ్దగించు, ఆగజేయు, వి.1.అడ్డగింత, 2.ఏర్పాటుగా నుంచుట, విణ.ప్రతిబంధము.
ఆఁకిడు - (ఆఁక+ఇడు) అడ్దుపెట్టు.
ప్రతిబంధకము - అడ్దగించునది.

తడ - 1.అడ్దు, 2.కడ, 3.దూరము.
తడకట్టు -
క్రి.అడ్దగించు, నొరోధించు.

నిరోధము - 1.అడ్దు, 2.చేటు, సం.వి. (భౌతి.) ఒక వస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).
నిరోధించు - క్రి.అడ్దగించు.

అపూర్వ మాణ మచలప్రతిష్ఠం
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వత్ |
తద్వ త్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ || 70శ్లో
తా||
అనేక నదీప్రవాహములు వచ్చి కలిసిన ప్పటికి సముద్రము పొంగి చెలియలకట్టను దాటక స్థిరముగ నుండునట్లు, భోగవిషయములు ప్రారబ్ధ కర్మవశమున సంప్రాప్తము లైనప్పటికిని, ఎవడు నిర్వికారుడై యుండునో అట్టి స్థితప్రజ్ఞుడే మన శ్శంతిని బొందును. కాని, విషయాసక్తి కలవాడు మనశ్శంతిని పొందలేడు. - సాంఖ్యయోగము, భగవద్గీత

నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యు భంజనీ,
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరంగీ నిర్గుణప్రియా|

పయిఁడి - బంగారు; పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పసిఁడి - 1.బంగారు, 2.ధనము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
పైఁడినెలఁత - లక్ష్మి.  

పైఁడిఱేఁడు - కుబేరుడు.
పైఁడిచూలాలు -
వసుంధర, భూమి.

అపరంజి -  మేలిమి బంగారము, కుందనము.
కురదనము - అపరంజిలోహము, మేలిమి బంగారము. 
ఉదిరి - అపరంజి, మేలిమి బంగారము.
పుత్తడి - అపరంజి, సం.పురటమ్.
మేలిమి - 1.అపరంజి, 2.అధిక్యము. 
ౙాలువా - అపరంజి, రూ.జాళువ, జాళ్వ. 
ౙాళువ - జాలువా.

నిష్కము - 1.మాడ, టంకము, 2.పతకము, 3.బంగారము, 4.వెండి.
మాడ - అరవరా, పదిరూకలు.
టంకము - ప్రాచీన కాలపు బంగారు నాణెము, దీనారము, సం.వి.1.వెలిగారము, 2.కత్తి, 3.కోపము, సం.వి.(రసా.) ధాతువును ధాతువునకు కలుపుటకు వాడుకలో నున్న సులభముగా కరగు ధాతు మిశ్రము (Solder). గవ్వచౌకము - నాలుగు గవ్వల మొత్తము, వెలిగారము.
దీనారము - బంగారు నాణెము.
దినారి - దీనారము, ఒక బంగారు నాణెము, సం.దీనారః. 
టంకకము - వెండినాణెము.
పతకము - హారము నడుమ నుండు రతనపు బిళ్ళ, సం.పదకమ్.

పలము - 1.నిష్కము, మూడుతులములు, 2.మాంసము.
స్యాచ్చామిషే పలమ్,
పలశబ్దము మాంసమునకును, 320 గురిగింజల యెత్తునకును పేరు. పల్యత ఇతి పలం పల గతౌ. - పొందఁబడునది.

తారము - 1.వెండి, 2.పులుగడిగిన ముత్తెము.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము,(పులుగడిగిన ముత్యము).

టంక - 1.పిక్క, జంఘ, 2.వెలిగారము. 
వెలిగారము - గర్వచౌకము, టంకము, సం.ధవళక్షారః. (గృహ.,రసా.) టంకణము, సిల్కు బట్టలకు తేటగా చేయుటకును బట్టల మీది మచ్చలు తీయుటకును ఉపయోగించెడి రాసాయనిక ద్రవ్యము, (ఇది బోరికామ్లము యొక్క సోడియపు లవణము). (Borax).   

జఙ్ఘాతు ప్రసృతా -
జంఘ - పిక్క.
జాయత ఇతి జంఘా. జనీ ప్రాదుర్భావే. - పుట్టునది.
పిక్క - 1.చిరుతొడ, జంఘ, 2.గింజ, సం.1.పిండికా, 2.స్పృక్కా. 
ప్రసరతీతి ప్రసృతా - సృగతౌ, వృద్ధిఁబొందునది. ఈ ఒకటి పిక్క పేర్లు.

చిఱుదొడ - పిక్క.
ౙంగ - పిక్క, 2.దాటు, సం.జంఘా. 
ౙంగగొను - 1.దాటు, 2.దుముకు. 
గింౙ - విత్తు; విత్తనము - గింజ.

జఙ్ఘాలో (అ)తిజవ స్తూల్యౌ-
జంఘాలుఁడు - మిక్కిలి వేగముగా నడచువాడు.
ప్రశస్తే జంఘే అస్యస్త ఇతి జంఘాలః - మంచి పిక్కలుగలవాఁడు.
అతిశయము - అధిక్యము. అతిశయితో జవో వేగో యస్య సః అతిజవఁ - అతిశయమైన వేగము గలవాఁడు.

పిక్కచెదురు - 1.చెదురు, 2.భయపడు.
చెదురు - 1.నీళ్ళలోనగునవి ఎగిరిపడు, 2.వ్యాపించు, 3.చెదరుట.

ప్రజంఘ కండరము - (జం.) పిక్క ఎముకపై నుండు బలమైన కండరము (Gastrocnemius muscle).   

జానుక - (జం.) అనుజంఘాస్థి, పిక్క ఎముకలలో బయటివైపున నున్న ఎముక (Fibula).
జంఘిక - (జం.) పిక్క యెముకలలో రెండవది, అనుజంఘాస్థి, (Fibula).
జంఘానుజంఘాస్థి - (జం.) జంఘాస్థి అనుజంఘాస్థి కలసియున్న యెముక (Tiblo-fibula).
జంఘాస్థి - (జం.) పిక్క ఎముకలలో లోపలివైపున నున్న ఎముక, (Tiblo).

ద్విపాద్యో ద్విగుణో దణ్డః -
ద్వౌ పాదౌ ప్రమాణమస్మిన్నితి ద్విపాద్యః - రెండుభాగములు ప్రమాణముగాఁ గలది.
దుగుణము - ద్విగుణము రెండు, రెండింతలు, సం.ద్విగుణమ్.
ద్విగుణః దణ్డః - రెట్టింపు దండుగ. ఉచితమైనదానికంటె నినుమడిగా దండుగఁ గొనుట. 
ద్విగుణ - (జీవ.) తయారైన అండము, శుక్రకోశము తప్ప శరీరమున మిగిలిన జీవకణము లన్నిటిలోను క్రోమోసోములు రెండు వర్గములుగా నుండుట (Diploid). 
ద్విగుణాధిస్ఫురితము - (వ్యవ.) సామాన్యమగు అధిస్ఫురితము (Super phosphate) లలోకంటె స్ఫురత్పంచామ్ల జనితము సుమారు రెట్టింపు ఉండునది (Double super phosphate).

తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).
మకరతము -
మరకతమణి, రూ.మరకతము.

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు.

నిషంగము - అమ్ములపొది.
ఉపాసజ్జంతే శరా అత్ర ఉపాసంగ నిషంగశ్చ, షంజ సంగే. - బాణములు దీనియందు కూర్చఁబడును, గనుక ఉపాసంగము నిషంగమును.

పరాజేతుం రుద్రం- ద్విగుణశరగర్భా గిరిసుతే!
విషంగే జంఘే తే- విషమవిశిఖో బాఢ మకృత,
యదగ్రే దృశ్యంతే- దశ శరఫలాః పాదయుగళీ
నఖాగ్రచ్ఛద్మాన - స్సురమకుటశాణైకనిశితాః| - 83శ్లో

తా. ఓ గిరిజా! మన్మథుడు రుద్రుఁడు - శివుడు శివుని జయించుటకై నీ పిక్కలను రెండింతలు బాణములుగల నిషంగము - అమ్ములపొది)లుగ జేసియుండును. నీ పిక్కల కొనల కాళ్ళ గోళ్ళనెడి విశిఖము - బాణములు దేవతల కిరీట మాణిక్యములయందు నిశాతము - మిక్కిలి వాడిచేయబడినది, నిశితము.)సానబెట్టబడిన పది బాణములుగ దోచుచున్నది. - సౌందర్యలహరి

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడగడ.

కైలాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ|
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా(అ)న్నపూర్నేశ్వరీ. - 4

యాదోనాథుఁడు - సముద్రుడు.
యాదసాం జలజంతూనాంపతిః యాదఃపతిః. ఇ. పు. - యాదస్సు అలనఁగా జలజంతువులు, వానికి పతియైనది.
అథ యాదాంసి జలజన్తవః,
యాదస్సు - 1.క్రూరజంతువు, 2.నీటిదయ్యము, 3.నది, 4.నీరు.
యాన్తీతి యాదాంసి, స. న. నిత్యబహువచనము. యా ప్రాపణే. - చరించునవి.
యయంటే బాలమత్స్యాన్ హంతుమితివా యాదాంసి, యతీ ప్రయత్నే. – బాలమత్స్యము లను హింసించుట కొఱకు యత్నముచేయునవి.
జలచరము - జలజంతువు.
జలే జంతవః జలజంతవః ఉ. పు. - జలమందలి జంతువులు. ఈ 2 జలజంతువుల పేర్లు.

కటిక మెకము - ఖడ్గమృగము.
గండము - 1.ఏనుగు చెక్కిలి, 2.ఖడ్గమృగము, 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి, 6.ప్రాణాపాయము. 
అపమృత్యువు - 1.అకస్మాత్తుగా కలిగిన చావు, 2.గండము.

అడీదము - ఖడ్గము, కత్తి.
అడీదపు మెకము - (అడిదము+మెకము) వి.ఖడ్గమృగము.

కత్తి - 1.ఖడ్గము, 2.మంగలికత్తి, సం.కర్త్రీ.

గండకి - 1.సాలిగ్రామములు పుట్టెడినది (గంగానదికి ఉపనది), 2.ఆడు ఖడ్గమృగము. 

గణ్డకే ఖడ్గ ఖడ్గినౌ,
గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము, 3.పులిగోరు పదకము, 4.చేపపిల్ల, 5.ఒక సంఖ్య.
ప్రసశ్తో గండో (అ)స్యాస్తీతి గండకః - శ్రేష్ఠమైన గండ స్థలము గలది.  
ఖడ్గము - 1.కత్తి, 2.ఖడ్గమృగము, దాని కొమ్ము.
ఖండయతీతి ఖడ్గః ఖడి ఖేదనే. - ఖండించునది.
ఖండయతి తీక్ష్ణ త్వాత్ ఖడ్గః శృంగం తద్యోగాత్ ఖడ్గః, ఖడ్గీ చ. న. పు. - ఖండించునట్తి కొమ్ము గలది. ఈ 3 ఖడమృగము పేర్లు.

ఖడ్గో నందకః
నందకము - విష్ణుఖడ్గము, విణ.సంతోషించునది.
నందయతి దేవా నితి నందకః - దేవతలను సంతోషపెట్టునది. ఈ ఒకటి విష్ణు ఖడ్గము. 

నిస్త్రింశము - కత్తి.
నిష్క్రాంత స్త్రింశదంగుళీభ్యో నిస్త్రింసః - ముప్పదియుంగుళములకంటె నధికమైనది.

చంద్రహాసము - 1.కత్తి, 2.రావణాసురుని ఖడ్గము.
చంద్రవత్ హసతిప్రకాశతే చంద్రహాసః - చంద్రునివలెఁ బ్రకాశించునది.

అసితుఁడు - నల్లనివాడు, వి.1.శనైశ్చరుడు, 2.దేవలుడు అనుముని.
శనైర్మందం చరతీతి శనైశ్చరః, చర గతిభక్షణయోః - మెల్లఁగా సంచరించువాఁడు Saturn. 
అసి1 - అల్పము, కొంచెము.
అసి2 - కత్తి, ఖడ్గము.
అస్యతే క్షిప్యత ఇతి అసిః, ఇ.పు. అసు క్షేపణే. - విసరఁబడునది.
అసిపుత్రి - చురకత్తి, చిన్నకత్తి, రూ.అసిపుత్రిక.
అసివాఱు - విహారము, మందగమనము.
అసియాడు - క్రి.1.చలించు, 2.అల్లలాడు, 3.సంచరించు.
అసివోవు - క్రి.1.తప్పిపోవు, కొంచెము తగిలి తప్పిపోవు, 2.క్షీణించు, నశించు. 

అసిధావకుఁడు - కత్తి సానపెట్తువాడు, రూ.అసిధావుఁడు.
అసిధార - కత్తివాదర.
అసిపత్రము - 1.చెరకు, 2.కత్తిఒర.
 
అసిమి - సంచి, చిన్నగోనె.
అసిమిగొల్లెన - గోనెలతో నిర్మించిన చిన గుడారము. 

రిష్ట - 1.అశుభము, 2.పెద్దకత్తి.
రిష్యతే హింస్యతే (అ)నేనేతి రిష్తః, ఈ. పు. రిషి హింసాయాం. - దీనిచేత హింసింపఁబడును.
అజాదియుఁ గలదు. "చంద్రహాసర్షి నిస్త్రింస్శా జ్ఞాయా ఏకార్థవాచకాః" అని త్రికాండశేషము.
రిష్టము - 1.క్షేమము, 2.అశుభము, 3.అభావము.    

కౌక్షేయము - కత్తి, ఖడ్గము, వ్యు.కుక్షికి దగ్గరగా ఉంచుకొన బడినది.
కుక్షౌ చర్మ నిర్మితకోశే భవః కౌక్షేయకః - చర్మ నిర్మితమై కుక్షిప్రాయమైన యొరలో నుండునది.

కరవాలము - కత్తి.
కరే వలతీతి కరవాలః, వల సంచలనే. - కరమందు చలించునది.
"దంతైశ్చిచ్ఛిదిరే లూనకరవాలాః పదాతయః" అని మాఘమందు శ్లేషగాఁ జెప్పఁబడియున్నది.
కరపాలము - కరవాలము, కత్తి.  
పా, కరం పాలయతీతి కరపాలః - కరమును బాలించునది. "విధూతకరపాలకఁకః పాలకః" అని యమకము.

కరవీరము - 1.కత్తి, 2.గన్నేరు.
కరవీరవత్ ఖడ్గవత్ మార్కత్వాత్ రసపానేన కరవీరః - తనరసపానముచేత ఖడ్గమువలెఁ జంపునది. 
గన్నెరు - ఒకరకపు పూలచెట్టు, రూ.గన్నెర, గన్నేరు. 

నిచులో హిజ్జలో (అ)మ్బుజః,
నిచులము - 1.కప్పుడు దుప్పటి, 2.ఎఱ్ఱగన్నేరు.
నిచోలతే అంబునా నిచులః, చల నిమజ్జనే. - జలముచేత నిండింపఁబడునది.
హితం జల మస్య హిజ్జలః - హితమైన జలము గలది., పా. ఇజ్జలః.
అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంబుని జాయత ఇత్యంబుజః - జనీ ప్రాదుర్భావే - జలమందుఁ బుట్టినది. ఈ 3 ఎఱ్ఱగన్నేరు పేర్లు.

కృపాణము - పెద్దకత్తి, ఖడ్గము, రూ.కృపాణకము.
కల్పతే హననే కృపాణః, కృపూ సామర్థే. - హింసయందు సమర్థమైనది.
కపాణమెట్లు ఖడ్గవాచకమో, అట్లే కరవాలము ఖడ్గవాచకమని వచ్ఛబ్దర్థము. ఈ 8 పెద్దకత్తి పేర్లు.

ఖడ్గశూలామృగ ఢకాద్యాయుధవిక్రరూప విశ్వేశశివ|

వైకుంఠుడు - 1.విష్ణువు, 2.ఇంద్రుడు.
వైకుంఠః కస్మింశ్చిన్మన్వంతరే వికుఠాయాంమాతరి జాతత్వాద్వై కుంఠః - ఒకానొక మన్వంతరమున వికుంఠ యను తల్లియందు నవతరించె గావున వైకుంఠుడు.

ఘోరకృతాంతవీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా
కార పిశాచసంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వారకవాటభేది నిజ దాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.

తా. రామా! నీ తారకనామము భయంకరులయిన యమదూతలను(కృతాంతుఁడు - యముడు)గుండెలదరజేయును. దరిద్రత అనెడి పిశాచమును బోగొట్టును. ఎల్లప్పుడును నీ దాసజనులు పరమ పదమునకుఁ బోవుటకుగల యుడ్డములను తొలగించును.      

వాసుకము - వైకుంఠము. కంఠం వైకుంఠ వాసినీ|   
వైకుంఠము - విష్ణుస్థానము, అక్షయస్థానము.
పరమపదము - విష్ణువుండెడు చోటు, వైకుంఠము. వైకుంఠాలయ సంస్థిత రామ్|   

విష్ణుపదము - ఆకసము, పాలకడలి.
విష్ణోః పదం విష్ణుపదం - విష్ణువునునకు స్థానము.  
2. విష్ణుపది - గంగ, వ్యు.విష్ణుపాదమే పుట్టుకకు కారణముగా గలది.
విష్ణుపదోద్భవా విష్ణుపదీ. ఈ. సీ.- విష్ణుపాదమునఁ బుట్టినది.
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను. 

మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.

పాలావెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.
కలసాబ్ది - పాలసముద్రము.
జిడ్డుకడలి - పాలసముద్రము.
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతి వంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.  

వైకుంఠేచ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతి
గంగాచతులసీ త్వంచ సావిత్రీ బ్రహ్మలోకగాః
కృష్ణప్రాణాధిదేవీత్వం గోలోకేరాధికాస్వయమ్
రాసేరాసేస్వరీ త్వంచబృందావనేవనే|| - 3స్తో

విరజ - వైకుంఠము నందుండు నది. (మోక్షం కలగాలంటే దీన్ని దాటాలి) పరమపదమున సమీపముగా నుండునది విరజానది, ఆ విరజా నదియే యమునగా మారి వచ్చినది - తిరుప్పవై.

విరజే విరజే మాతా బ్రహ్మణా సంప్రతిష్ఠితా,
యస్యాః సందర్శనా న్మర్త్యాః పునాత్యాసప్తమం కులమ్ |

ఉత్కలదేశమున విరజయను క్షేత్రముకలదు. ఆ క్షేత్ర అధిస్ఠానదేవతకు విరజయను సంజ్ఞ కలదు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠింపబడిన ఈ దేవతా సందర్శనమున నేడుతరముల(ఏడు తరముల)వారిని పునీతుల చేయుదురని బ్రహ్మాండ పురాణమున తెలియుచున్నది.   

శ్రీరమ సీతగాఁగ నిజ సేవకబృందము వీర వైష్ణవా
చారజనంబుగాఁగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్రశైల శిఖరాగ్రముగాఁగ వసించు చేతనో
ద్ధారకు డన విష్ణుఁడవు దాశరథీ కరుణా పయోనిధీ.
తా.
దశరథరామా ! నీవు పరమపదమందున్న లక్షీదేవిని ఇచట సీతగాఁ జేసికొని, అందలి పరివారము ఇచట వీరవైష్ణవజనులుగా వచ్చి కొలుచు చుండగా, అచ్చట విరజానది ఇచట గోదావరిగా ప్రవహింపగా, ఆ వైకుంఠమే ఇచ్చట భద్రగిరి కొమ్మకొనయై రాణింపగా వేంచేసి చేతనులను ఉద్దరించుచున్న శ్రీవిష్ణుదేవుండవే కాని వేఱుకావు.

రామో విరామో విరజో మార్గనేయో నయోనయః
వీర శక్తిమతాం శ్రేష్ఠో ధర్మోధర్మవిదుత్తమః - 43శ్లో
 

వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ|
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ. – 149శ్లో

జహ్నువు - 1.ఒక ముని, 2.విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు. విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ. 
3. జహ్నుతనయ - గంగ.    
జహ్నోస్తనయా జాహ్నవీ - జహ్ను మహామునియొక్క చెవియందుఁ బుట్టినది.
జాహ్నవి - గంగ.

జహ్నువు యజ్ఞశాలను గంగ ముంచెత్తగా కోపముచే కన్నెఱ్ఱచేసి, భగవంతుని యజ్ఞపురుషు(యజ్ఞపురుషుఁడు- విష్ణువు)ని పరమ సమాధి చేత ఆత్మారోహణము చేసుకొని, గంగనెల్ల త్రావి వైచెను. అప్పుడు దేవర్షులు ప్రసన్నుని కావించి, గంగను మునికి కుమార్తెను కావించిరి.  

పతితోద్ధరిణి జాహ్నవి గఙ్గే ఖణ్డితగిరివర మణ్డితభఙ్గే |
భీష్మజనని హే మునివరకన్యే పతితనివారిణి త్రిభువనధన్యే ||

పతితులను ఉద్దరించే జహ్ను పుత్రి గంగా! నీ తరంగముల హిమగిరులను ఖండిస్తూ సుశోభితంగా ప్రవహిస్తుంటాయి. నీవు మునివర జహ్ను పుత్రికవు, భీష్ముని జననివి. పతితులను పావనం చేసి, త్రిభువనాలలో ధన్యత నొందుతావు. - 5శ్లో  

సుజయా జయభూమిస్థా జాహ్నవీ జనపూజితా,
శాస్త్రీ శాస్త్రమయీ నిత్యా శుభా చంద్రార్థ మస్తకా|

నమోజహ్ను కన్యేనమన్యే త్వదన్యై - ర్ని సర్గేందు చిహ్నాది భిల్లోకభర్తుః
అతో హం నతో హంస్వతో గౌరతోయే - వసిష్టాది భిర్గీయమానా భిదేయే.

ఆకంఠం సలిరే నిమజ్జ్య పులినాభోగోపధానే శిరః
కృత్వా శైలసుతాపతే ! పురరిపో ! గంగాధరే త్యాలపన్
గృహ్ణన్ కర్ణపుటే శివేన కృపయా ప్రత్యాహృతం తారకం
తీరే జాహ్నవి ! జహ్నునందని ! కదా మోక్షే శరీరం ముదా|

గంగా ! నీజలములం దాకంఠము మునింగి శిరంబున నీసంబంధములగు నిసుక తిన్నెలను తలగడయందుఁ జేర్చుకొని శంభూ ! పార్వతీ రమణా! పురహరా ! గంగాధరా! యని వాకొనుచుఁ గృపతోడ శివుండు గర్ణపుటము నందు సూచించు మహనీయమగు తారకమంత్రమును గ్రహించి సంతృప్తుఁడనై యెన్నఁడీ దేహమును ద్యజియించెదనో కదా ?   

నారాయణీ ప్రభాధారా జాహ్నవీ శంకరాత్మజా,
చిత్రఘంటా సునందా శ్రీ ర్మానవీ మనుసంభవా. – 38శ్లో                

4. సురనిమ్నగ - దేవగంగ.
సురాణాం నిమ్నగా సురనిమ్నగా - సురలయొక్క నది.
సురదీర్ఘిక - గంగ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ అర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).

నిమ్నగ - ఏరు, వ్యు.పల్లమునకు పారునది.
నిమ్నం గచ్ఛతీతి నిమ్నగా, గమ్‌గతౌ. - పల్లమును గూర్చి పోవునది.
నిమ్నము - పల్లము, విణ.లోతైనది, విణ.(వృక్ష.)అధస్త్ధితము (Inferior).

నిమ్నోన్నత రేఖలు - (భూగో.) సముద్రమునకు పైని ఒకే ఎత్తున ఉన్న ప్రదేశముల నన్నిటిని కలుపు ఊహారేఖలు.
నిమ్నకోణము - (గణి.) నీటి మట్టముతో క్రిందనున్న వస్తువు చేయుకోణము (Angle of depression).    

ద్వైమాతురుఁడు - 1.వినాయకుడు, 2.జరాసంధుడు, వ్యు.ఇద్దరు తల్లులు కలవాడు.
ద్వయో ర్మాత్రో (ఉమ)రుమాగంగయో రపత్యం ద్వైమాతురః - గంగా పార్వతులకు నిద్దఱికినిఁ గుమారుడు.

వైమాత్రేయో విమాతృజః,
విమాత - సవతితల్లి.
విగతా విభిన్నావా మాతా విమాతా, తస్యా అపత్యం వైమాత్రేయః - విమాత యనఁగా సవతితల్లి, ఆమె కొడుకు.
సవితితల్లి - మారుతల్లి, విమాత.
విమాతుర్జాతః విమాతృజః - సవతి తల్లి వలనఁ బుట్తినవాఁడు. పా, ద్వాభాయ్మ్ మాతృభ్యాం జాయత ఇతి ద్విమాతృజః, జనీ ప్రాదుర్భావే. - ఇద్దఱు తల్లులవలనఁ బుట్టినవాఁడు. ఈ 2 మాఱుఁదల్లి కొడుకు పేర్లు.

గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వజనేశ శివ|

జగచ్చక్షువు - సూర్యుడు.
జగతశ్చక్షురివ జగచ్చక్షుః, స.పు - జగత్తునకు నేత్రమువంటివాఁడు.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.
గమ్య తేజనైరితి జగతీ, ఈ. సీ. జగచ, త. న. గమ్ ఌ గతౌ. - జనులచేత బొందఁబడునది.
ప్రళయకాలే గచ్చతీతి జగతీ జగచ్ఛ – ప్రళయకాల మందు లయమైపోవునది.
ౙగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద.

జగతీ జగతిచ్ఛన్దో వరేషే(అ)పి క్షితావపి,
జగతీసబ్దము లోకమునకును, పండ్రెండక్షరముల పాదముగల ఛందస్సునకును, భూమికిని పేరు. గచ్ఛతీతి జగతీ, గమ్ ఌ గతౌ. - పోవునది.

లోకమాత - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ.
లోకానం మాతా లోకమాతా - ఎల్ల లోకములకు తల్లి.
ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.  
లోకజనని - 1.జగము తల్లి, 2.లక్ష్మి, 3.గంగ. గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).

నెత్తికెక్కిన ఆడది చిత్తం స్వామీ అంటూ కాళ్ళు కడుగుతోంది.

శ్రుతీనాం మూర్ధానో - దధతి తవ యౌ శేఖరతయా
మమా ప్యేతౌ మాత! - శ్శిరసి దయయా ధేహి చరణౌ|
యయోః పాద్యం పాథః - పశుపతి జటాజూట తటినీ
యయౌ ర్లాక్షాలక్ష్మీ - రరుణ హరి చూడామణి రుచిః|| - 84శ్లో 
తా.
ఓ! లోకమాతా! శ్రుతుల(వేదముల) శిరస్సులైన ఉపనిషత్తులు నీ సిగలో అలంకరించు కొన్న పుష్పములు శిరోభూషణములుగ నున్నవి. పశుపతి - శివుడు జటాజూటంలో వర్తించే గంగానది నీకు పాద్యము - పాదము కొరకైన నీళ్ళు)అగు చున్నది. ఎఱ్ఱనై హరికి శిరోభూషణమైన మణిమయకిరీటం చింతామణి - కోరికలొసగు దేవమణి) యొక్క కాంతులే లాక్షారస(చరణలత్తుక)కాంతి గాగలవియు నగు నీదు పాదములు, కృపతో కూడిన చిత్తంగల దానవై, నా శిరస్సు మీదకూడ ఉంచు. -  సౌందర్యలహరి

గంగాయాః పరమం నామ పాపారణ్యదవానలః
భవవ్యాధిహరీ గంగా తస్మా త్సేవ్యా ప్రయత్నతః| 

మా1 - 1.లక్ష్మి, 2.తల్లి.
మా2 - విణ. మిక్కిలి, సం.మహాన్.
తల్లి - జనని, రూ.తల్లి, విణ.మొదటిది, సం.వి. జవరాలు, తరుణి.

తరుణీ యువతిస్సమే :
కన్యావస్థాం తరతీతి తరుణీ, సీ, తౄప్లవన తరణయోః - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ.
పుంసా యౌతీతి యువతిః, యు మిశ్రణే. - పురుషునితోఁ గూడునది. ఈ రెండు జవ్వని పేర్లు. 30 ఏండ్లకులోఁ బడిన వయస్సు గలిగినది.

యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.
ౙవరాలు - యౌవనవతి; ౙవ్వని - యౌవనవతి.
యౌవతము - యువతీ సమూహము.

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.

మారేడు - బిల్వము; బిల్వము - మారేడు.
బిలుపము - మారేడు పండు, సం.బిల్వ. 
బిలతి కుష్ఠాదీన్ బిల్వః, బిల భేదనే. - కుష్ఠాదులను గొట్టివేయునది.
సేవకస్య పాపం బిలతి హిన స్తీతి వా బిల్వః - సేవకుని పాపమును(పాపము - దుష్కృతము, కలుషము.)బోఁగొట్టునది. బిల్వనిలయాం| బిల్వపత్రార్చిత గోవిందా|

బిల్వాటవీమధ్య లసత్సరోజే
సహస్రపత్రే సుఖ సన్నివిష్టామ్
అష్టాపదామ్భోరుహ పాణిపద్మాం 
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్. – 22

రమ - లక్ష్మి.
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదులశోభ, 4.మెట్టతామర.

సంపత్తిః శ్రీశ్చలక్ష్మీశ్చ :
సంపద్యతే జనైరితి సంపత్. ద.సీ. సంపత్తిశ్చ. ఇ. సీ. పద్ ఌ గతౌ. - జనులచేత పొందఁబడునది.
శ్రియతే జనైరితి శ్రీః ఈ. సీ. శ్రిఞ్ సేవాయాం. - జనులచే నాశ్రయింపఁ బడునది.
లక్ష్యతే లక్ష్మీః. ఈ. సీ. లక్ష దర్శనాంకనయోః. - జనులచేఁ జూడఁబడునది. ఈ నాలుగు 4 సంపద పేర్లు. 

సంపత్తి - సంపద, సంవృద్ధి.
సంపత్తు - ఐశ్వర్యము, రూ.సంపద.
సంపన్నము - సంపదతో గూడినది, సమృద్ధమైనది.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. 

సిరి - 1.శ్రీ, లక్ష్మి 2.సంపద 3.శోభ, సం.శ్రీః.
సిరిమంతుఁడు - శ్రీమంతుడు, సం.శ్రీమాన్.
శ్రీమంతుఁడు - సంపదకలవాడు.
శ్రీమంతము-1.సంపదకలది, 2.ఒప్పిదముకలది.
శ్రీకరుఁడు - సంపత్కరుడు. మాఢ్యుడు - సిరితో గూడినవాడు. 

లక్ష్మీవాం ల్లక్ష్మణ శ్శ్రీల శ్శ్రీమాన్ -
లక్ష్మీ రస్యాన్తేతి లక్ష్మీవాన్. త. లక్ష్మణశ్చ శ్రీరస్యాస్తీతి శ్రీలః శ్రీమాంశ్చత.- లక్ష్మియనినను సంపదయు, ఒప్పిదమును; అది గలవాఁడు.
శ్రియం లాత్యాదత్తే వా శ్రీలః. లా ఆదానే. - సంపదను బుచ్చుకొనువాఁడు. పా. శ్లీలః ఈ 4 సంపద గలవాని పేర్లు. ఒప్పిదము గలవాఁడు. 

శ్లీలము - 1.సంపదగలది, 2.సభ్యత కలది.
శ్లీలుడు - అదృష్టవంతుడు.
జాతకుఁడు - 1.పుట్టినవాడు, 2.అదృష్టవంతుడు.

శ్రీపుత్రుఁడు - మదనుడు, సిరిచూలి.
సిరిచూలి - మదనుడు; మదనుఁడు - మన్మథుడు;
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).      

సిరి చేర్చు బంధువుఁల నా
సిరియే శుభముల నొసంగు * చెలువులఁ గూర్చున్
సిరియే గుణవంతుండని
ధరలోఁబొగడించుగం మఁ * దలంపు కుమారా !

తా. కుమారా! సంపదయే చుట్టములను దగ్గరఁ జేరునట్లుచేయును, శుభములన్నింటిని యిచ్చును. అందముకూడ కలిగించును. ప్రపంచములో గుణవంతుఁడని పొగడునట్లు చేయును.

రమాభూమి సుతారాధ్య పదాద్జాయై నమః

ఫద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర.
లక్కి - లక్ష్మి, సం.లక్ష్మీ. లక్కిమి - లచ్చి.
లచ్చి - లక్ష్మి, సంపద, సం.లక్ష్మీః. 
శోభ - 1.వస్రభూషణాదులచే గలుగు కాంతి, 2.కాంతి, 3.ఇచ్ఛ.

అవ్యథా అతిచరా పద్మాచారణీ పద్మచారణీ :
న వ్యథతే అనయేత్యవ్యథా, వ్యథ భయచలనయోః - దీనిచేత వ్యథను బొందరు.
అత్యర్థం చరతి వ్యాప్నోతీతి అతిచరా. చర గతి భక్షణయోః - మిక్కిలి వ్యాపించునది.
పద్మాసాదృశ్యాత్పద్మా. - పద్మమువంటిది.
చరతి వ్యాప్నోతీతి చారటీ. సీ. - వ్యాపించునది.
పద్మమివ చరతీతి పద్మచారిణీ - పద్మమువలె వ్యాపించునది. ఈ నాలుగు 4 మెట్ట(కాశ్మీరదేశపు)తామర పేర్లు.

అంతస్థము - (వ్యాక.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది. 

వస్త్రముఖ్య స్వలంకారః - ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం - విద్యాముఖ్యస్తు పూరుషః||

తా. అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)ముఖ్యములు. - నీతిశాస్త్రము

సుషమ - మిక్కిలిశోభ.
సుషమము - 1.మనోజ్ఞమైనది, 2.సమానమైనది. 

సుషమా పరమా శోభా -
సుష్ఠు సమం సర్వ మస్యా స్సుషమా - దీనికి సర్వము లెస్సగ సమమై యుండును. ఒకటి శ్రేష్ఠమైన కాంతి.

అన్నువు - 1.శోభ, 2.ఒడలెరుగమి, పారవశ్యము.
అన్ను - 1.ఒడలెరగమి, 2.శోభ, 3.స్త్రీ, క్రి.మత్తిల్లు, పరవశమగు.
అన్నుకొను - 1.అల్పము, సన్నము, 2.హీనుడు, దుర్బలుడు, కొంచెము తక్కువ, 4.చిన్నది, 5.మనోహరము, వి.స్త్రీ.

శోభకృత్తు - అరువది సంవత్సరములలో నొకటి.

సర్వమంగళ - పార్వతి.
సరాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమతమైన శుభములు గలది.
మంగళ - పార్వతి.
పార్వతి - పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
మంగళదేవత - లక్ష్మి.

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్త్రీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ|

త్రిశంకువు - 1.హరిశ్చంద్రుని తండ్రి, 2.పిల్లి, 3.మిడత.

ఓతువు - పిల్లి, మార్జాలము.
అవతి మూషకబాధయాః ఓతుః, పు. అవరక్షణాదౌ. - మూషక బాధవలన రక్షించునది.

బిడాలము - 1.పిల్లి Cat, 2.కనుగుడ్డు.
బిడతి మూషికాన్ బిడాలః, బిడ భేదనే. - మూషికములను భేదించునది.
బిడాలకము - 1.పునుగు చట్టము, 2.కంటిమందు, 3.పిల్లి.

మది యొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగన్
అది చిలుక బిల్లిపట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.
తా.
చిలుక పంజరములో పిల్లిని ప్రవేశపెట్టిన చిలుక(ౘదువుల పులుగు - చిలుక)వలె మాటలు మాటలాడనట్లు, ఒకని మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.) మదిలో కోరియున్న వనితను మరియొకరు(వదలక తిరిగినను-ఆ తిరుగుడు వ్యర్థం)స్వాధీన పరచుకొనలేరు. చిలుకను పెంచి పిల్లి కప్పగించినట్లు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

When I play with my cat, who knows whether I do not make her more sport than she makes me?   

గంధమృగము - 1.పునుగుపిల్లి, 2.కస్తూరీ మృగము.
కమ్మపిల్లి -
పునుగు పిల్లి.
పునుఁగు - పునుగుపిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము.

సంకువు - జివ్వాజి పిల్లి.
సంకుమదము - జివ్వాజి. సాంకవము - సంకుమదము, జివ్వాజి.

ఏడ ననర్హుఁడుండు నటకేగు ననర్హుఁడు నర్హుడున్నచోఁ
జూడఁగనొల్ల డెట్లన, నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడినపుంటిపై నిలువఁ గోరినయట్టులు నిల్వ నేర్చునే,
సూడిదవెట్టు నెన్నుదుటి చొక్కపుఁగస్తురిమీఁద, భాస్కరా.
తా.
ఈగ,  చీముతో(పూయము - 1.చీము, 2.పీనుగు.) కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడునట్లుగా కస్తూరిబొట్టుపై నుండుటకు ఇష్టపడదు. అట్లే నీచుడెందుగలడో అచ్చటకే నీచుడగువాడు పోయి నిల్వఁజూచును. సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు, 2.మంచివాడు.)న్నచో ఆ నీచునకు గిట్టదు.

చిట్టడవుల్లో కస్తూరి మృగం ఉంటుంది. కస్తూరి వలపు కప్పి వుంచితే దాగేవి కావు. ఈగ, చీముతో కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడు నట్లుగా కస్తూరి బొట్టుపై నుండుటకు ఇష్టపడదు.

మార్జాలము - మార్జారము.
ఆఖుగ్ర హణేన గృహం మార్జీతి మార్జారః, పా. మార్జాలః, మృజూ శుద్ధౌ. - మూషక గ్రహణముచేత గృహమును శుద్ధిచేయునది.
మార్జారము - పిల్లి cat, రూ.మార్జాలము.

మార్జాల కబళ న్యాయము - న్యా. పిల్లి భోజనము చేయువాని వద్ద కూర్చుండువాడు తీసికొను కబళములన్నియు తన నిమిత్తమేయని తలచెడు రీతి.

కబళము - ముద్ద, కడి, గ్రాసము.
ముద్ద - కబళము, పిండము, పిడుచ.
కడి - 1.కబళము, 2.(పేడ) ముద్ద, 3.వాసన.
పిడుచ - 1.ముద్ద, 2.కబళము.

గ్రాసస్తు కబళః పుమాన్,
గ్రస్యత ఇతి గ్రాసః, గ్రసు అదనే. - భక్షింపఁబడునది.
భక్షణ సమయేకే తాలుని వలత ఇతి కబళః, వలసంచలనే. - భక్షణ సమయమందు దౌడ యందు కదలునది.
గ్రాసశబ్దము కబళము యొక్క అర్థము గలది గనుక కబళార్థకము. రెండు పర్యాయములు. ఈ 2 కడి పేర్లు   

గ్రాసము - 1.కబళము, తిండి, 2.గ్రహణము.
పిండము - 1.బ్రదుకు తెరువు, 2.పితృదేవతల కిచ్చెడు అన్నపుముద్ద, 3.గర్భము, 4.సమూహము. 

తాలిమితోడుతన్ దగవుతప్పక నేర్పరి, యొప్పుదప్పులన్ 
బాలన సేయుఁగాబట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే
పాలును నీరు వేఱుపరుపంగ మరాళ మెఱుంగుగాక మా
ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞతఁబూన, భాస్కరా.
 
తా. పాలును, నీరును కలిపి ఒక పళ్ళె మందు పోసి మరాళ మార్జాలముల ఎదుట పెట్టినచో, హంస అందలి పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు. త్రాగి వేసి నీళ్ళను విడిచి పెట్టును, మార్జారము - పిల్లి, రూ.మార్జాలము. అట్లు పాలను నీళ్ళనుండి వేరుచేయ లేదు. అట్లే ఓర్పుగలవాడు తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.తో, తగవు యొక్క న్యాయ న్యాయము లను విమర్శించి నిర్ణయించును, తెలివి రసజ్ఞత లేనివా డట్లుచేయలేదు.

సింజానమణిమంజీర-మండిత శ్రీపదాంబుజా|
మరాళీమందగమనా - మహాలావణ్యశేవధిః.

పతంగము - 1.మిడుత, 2.పక్షి, 3.బాణము, 4.పాదరసము.

సమౌ పతఙ్గ శలభౌ -
పత త్యగ్నౌ పతఙ్గః పత్ ఌ గతౌ. - అగ్నియందుఁ బడునది.
మిడుత - శలభము; శలభము - మిడుత.
శలత్యాశు గచ్ఛ త్యగ్నిం శలభః, శల అశుగమనే. - అగ్నిని గూర్చి శీఘ్రముగాఁ బోవునది. ఈ 2 మిడత పేర్లు. దివ్యాఱుపుఁ బ్రువ్వు అని కొందఱు.  

మిడుత కుటుంబము - (వ్యవ., కీట.) వరి మిడతలు, జొన్న మిడతలు, జట్టి మిడుతలు మొ. కీటకములు ఈకుటుంబమునకు చెందినవి.

ఆకుమిడుత - పచ్చని పెద్దమిడుత. 

పతఙ్గా పక్షి సూర్యౌ చ -
పతంగ శబ్దము పక్షికిని, సూర్యునకును, చకారమువలన మిడుతకును పేరు. పతతీతి పతంగః, పత్ ఌ గతౌ. - పోవునది.

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్ష్యా వస్యస్త ఇతి పక్షీ, న. పు. - ఱెక్కలు గలిగినది.
పక్కి - పక్షి, పులుగు, సం.పక్షి.
పులుగు - పిట్ట.

దురితలతానుసార భవదుఃఖ కదంబము రామ నామ భీ
కరతర హేతిచేఁ దెగిఁనకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాదికీటకో
త్కరము విలీనమై చనదె దాశరథీ కరుణాపయోనిధీ.
తా.
రామా! పాపము పయివడిరాఁగా దానితోఁగూడ సాఁగు దుఃఖాత్మకమైన జన్మపరంపర, కత్తిచేత హేతి - 1.అగ్నిశిఖ, మంట, 2.సూర్యకిరణము, 3.ఆయుధము. చేత, తీఁగ త్రెంపఁబడునట్లు, నీ నామ నామముచేత నశించి పటాపంచలై, రగిలి మండుతున్న శిఖి - 1.అగ్ని, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము.) అగ్నియందుబడిన మిడతలు మొదలైన పురుగులవలె రూపుమాసి పోవును.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

అథ చపలో రస స్సూతశ్చ పారదే,
అస్థిరము - 1.నిలుకడలేనిది, అశాశ్వతము, 2.నిశ్చితము కానిది.
అస్థిరత్వాచ్చపలః - ఒక దిక్కున నిలువనిది.
రసము - 1.పాదరసము, 2.నీరు, 3.పండ్లరసము, (శృంగారము, హాస్యము, కరుణము, వీరము, రౌద్రము, భయానకము, బీభత్సము, అద్భుతము, శాంతము, నవరసములు).
రస్యతే ఔషధత్వేనేతి రసః రస ఆస్వాదనే. - ఔషధమౌటచేత నాస్వాదింపఁబడునది.
సూతే హేమాదిక మితి సూతః షూఙ్ ప్రాణిప్రసవే. - బంగారు మొదలయిన దానిఁ గలిగించునది.
పాదరసము - పారదము, రసము, సం.పాదరసః. 
రోగస్య పారం దదాతీతి పారదః డు రాఙ్ దానే. - రోగముయొక్క తుద నిచ్చునది.
పా, పారతః, "రసేంద్ర సారతః ప్రోక్తః పారదశ్చనిగద్యతే" అని తారపాలుఁడు. కొందఱు పారద పారతములకు భేదమును జెప్పుదురు. "పారతస్తు మనాక్పాండు స్సూతస్తురహితో మలాత్, పారదస్తు మనాక్శీత స్సర్వే తుల్యగుణాస్కృతాః" అని శబ్దార్ణవము. ఈ 4 పాదరసము పేర్లు. 
రసమిశ్రమము - (రసా.) పాదరసముతో కలిసిన మిశ్రమము, రసమిశ్ర లోహము (Amalagam).

పారదము - (రసా.) సాధారణముగ ద్రవస్థితిలో నుండి వెండివలె తెల్లగా ప్రకాశించు ధాతువు (Mercury). ఇది ఆవర్త కర్మ పట్టికలో రెండవ 2వ వర్గములోనిది).
పారదీయము - (రసా.) పారద(పాదరస) సంబంధమైనది (Mercurial).
పారభానకము - (భౌతి.) అదృష్టముగ పార దర్శకమైనది (Translucent). 

కజ్జలి - (రసా.) పాదరసము, గంధకము కలిపి నూరిన లభ్యమగుయోగికము (Black sulphide or mercury).

వంజులము - అశోక వృక్షము.    
కంగేళి - అశోకము, సం.అశోకము.
వఞ్జుళో అ శోకే
వన్యతే యాచ్యతే వఞ్జుళః. వను యాచనే. - అడుగఁబడునది.
అశోకము - 1.పొగడచెట్టు, 2.కంకేళివృక్షము, 3.పాదరసము, విణ.దుఃఖము లేనిది.
అశ్నుతే అశోకః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది,
శోకనా శకత్వాద్వా అశోకః - శోకమును చెఱుచునది. ఈ రెండు అశోకచెట్టు పేర్లు.
పొగడ - వకుళ వృక్షము, సం.వకుళః.
వంజుల - ఎక్కువగా పాలిచ్చు ఆవు. 

నమోవాకం బ్రూమో - నయనరమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ - స్పుటరుచిరసా లక్తక వతే! 
అసూయత్యత్యంతం - యదభిహననాయ స్పృహయతే 
పశూనా మీశానం - ప్రమదవనకంకేళితరవే|- 85శ్లో
      
తా. తల్లీ ! నీ పాద తాడనము నభిలషించుచున్న ప్రమదావనము - అంతఃపుర స్త్రీలు విహరించు ఉద్యానవనము మందలి అశోక వృక్షమునుజూచి, పశుపతియగు ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.)అసూయ చెందుతున్నాడో, యటి చూడనింపగు పారాణిగల నయన రమణీయములై తడి లత్తుకతో ప్రకాశించుచున్న,  నీ పాద ద్వయమునకు నమస్కరించుచున్నాను. – సౌందర్యలహరి

త్ర్యంబకుఁడు - శివుడు, ముక్కంటి.
త్రీణి అంబకాని లోచనాని యస్య సః త్ర్యంబకః - మూఁడుకన్నులు గలవాఁడు.
త్రయాణాం లోకనామంబకః పితా - ముల్లోకములకుఁ దండ్రి. త్ర్యంబకం గౌతమీతటే|  

త్ర్యంబక సఖుఁడు - కుబేరుడు.
త్ర్యంబకస్య శివస్యసఖా త్ర్యంబక శఖః - శివుని సఖుఁడు.

ధనపతి సఖుడై యుండిన
నెనయంగా శివుడు భిక్ష మెత్తఁగ వలసెన్
దనవారి కెంతగల్గిన
దనభాగ్యమె తనకుఁగాక తధ్యము సుమతీ.

తా. కుబేరుడంతటి ధనవంతుడే స్నేహితుడుగా ఉన్నను, శివుడు నకు భిక్షాటన తప్పలేదు. కాబట్టి తనవారి కెనలేని సంపద యున్నను, తనకెంత భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది. అంతే లభించును. కాని ఎక్కువ కల్లనేరదు.   

ముక్కంటిపండు - కొబ్బరికాయ. 
నారికడము - నారికేళము, కొబ్బరికాయ, రూ.నారికేడము, సం.నారికేళః.
నారికేడము - నారికడము; కరరీఫలిని - నారికేళము.

నాళికేరస్తు లాఙ్గలీ,
నాళ్యాక ముదక మీరయతీతి నాళికేరః, ఈరక్షేవే. - రంధ్రములచేత ఉదకములను బీల్చునది.
నాళీకాని నాళ యుక్తాని పుష్పఫలాని ఈరయతీతి వా నాళికేరః - కాఁడలతోఁ గూడిన పుష్పఫలాదులఁ బ్రేరేపించునది. పా, నారికేళః.
లాంటలాకారపత్త్రత్వాల్లాగలీ, న.పు. నాఁగేఁటివంటి యాకులుగలది. ఈ 2 నాళికేరవృక్షము (టెంకాయ చెట్టు).    

కదళీపాకములు - (అలం.) ద్రాక్షాపాకము, కదళీపాకము, నారికేళపాకము.

ఇందీవరాక్ష ! నీ ఇల్లెక్కడన్న
తలనీరుమోసెన త్తరువు క్రిందనియె - కొబ్బరి చెట్టుక్రింద  

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలముభంగిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుధావహమునగును భువిలో సుమతీ.
తా.
నారికేళ వృక్షమునకు ఎంత నీరిపోసి పెంచిన, అది అంత బలవంతమై నారికేళము లిచ్చును. అటులనే (ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము కలవాడు.)శ్రేయోభిలాషులకు చేసిన ఉపకారం అనునది ఉచితమైనది. అది గౌరవమును, సుఖోన్నతిని కలుగ జేయును.

అష్టిఫలము - (వృక్ష.) లో పెంకుకండకాయ, (ఈ మాదిరి ఫలము యొక్క చర్మము మూడుపొరలుగా ఉండును. మధ్యపొర గుంజు కాని పీచుకాని కలిగియుండును. కాని లోపలిపొర అంతఃకవచము) గట్టిగా పెంకువలెగాని టెంకవలెగాని ఉండును) (Drupe), ఉదా. కొబ్బరికాయ, మామిడిపండు.   

తేఁజెట్టు - టెంకాయచెట్టు, రూ.తేమ్రాను, తెన్+చెట్టు = దక్షిణచేశపు చెట్టు.
టెంకాయ - కొబ్బరికాయ, (తెన్ = దక్షిణము, అచట, ఎక్కువగా దొరుకుకాయ.)
తెంకాయ - టెంకాయ.
బొండము - పెచ్చుతో కూడిన టెంకాయ, కొబ్బరి బొండము, రూ.బొండాము, బొండలము, బొండ్లము, బొండ్లాము.

రాజమందిరం చినదానా - రాజావారికి నచ్చే జాణా - చేద వేయకుండా - నీళ్ళు తోడకుండా చేయి తడపకుండా దాహానికి నీళ్ళు తేవే. - కొబ్బరి బొండం   
బావినిండా నీరే పిట్టకందదు - ఎలుకకందదు. - కొబ్బరిబొండం       

తృణరాజము - 1.తాటిచెట్టు, 2.కొబ్బరిచెట్టు, 3.గిరకతాడిచెట్టు.
తృణద్రుమము - కొమ్మలు లేని తాటి, కొబ్బరిచెట్ట్లు మొదలగునది.

కీతు - కొబ్బరియాకుల చాప.

మట్ట - 1.కొబ్బరి, తాటి మొ. వాని ఆకులకొమ్మ, 2.మొ. ఆవు వానితోక.

గళ్ళెము - పాలమీగడవంటి లేత కొబ్బెర.
ఒంటి స్తంభంమీద చలువ పందిరి - చలువపందిరిలోన చలువ నీటికుండ - చలువ నీటికుండలోన చవులూర మీగడ. - టెంకాయ లేతకొబ్బరి 

కురుడి - లోపలి నీరింకిన కొబ్బెర.
కుడుక -
తక్కెడ తట్ట.    

కంబరత్రాఁడు - కొబ్బరి పీచుతో పేనిన త్రాడు.
కీతు - కొబ్బరియాకుల చాప.    

బుఱ్ఱ - 1.కొబ్బరికాయ మొదలగువాని చిప్ప, 2.ఎండిన సొరకాయ, 3.పాములవాని నాగసరము, 4.క్రోవి, 5.పుఱ్ఱె, 6.తాటిటెంక, విణ.పెద్ద.
అసలు నీకు బుఱ్ఱ లేదా! బుర్ర లేకుండా మాట్లాడకు. బుఱ్ఱ వున్నవాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు, తెలివితక్కువ తనానికి కోప్పడే మాట.

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు గిన్నె, 3.టెంకాయ చిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీదిపోలుసు, 8.తునక, విణ.అల్పము.

అగప - 1.టెంకాయ చిప్ప, కొయ్య గరిటె, 2.ఓడల మురికిని గోకి శుభ్రము చేయు కొయ్యగుద్దలి, రూ.అవక, అబక. అబక - అగప. 

వృక్షాగ్రవాసీ నచ పక్షిరాజః చర్మాంగధారీ నచసోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణిః జలంచ బిభ్రన్న ఘటోన మేఘః. - కొబ్బరికాయ   
చెట్టుపైన నివాసం - పక్షిగాని - చర్మధారినిగాని సోమయాజిగాను - ముక్కంటిని నేను త్రినేత్రుడనుగాను - నీరు గల్గియుంటి - మేఘుడను కాను. - కొబ్బరికాయ
ఆకాశాన అంబు-అంబుకులో చెంబు - చెంబులో చారెడునీళ్ళు. - టెంకాయ
సూర్యుడు చూడని గంగ - చాకలి ఉతకని మడుగు. - టెంకాయ
చెక్కని స్తంభం - చేయనికుండ పోయనినీరు వెయ్యనిసున్నం. - కొబ్బరికాయ
చెయ్యనికుండ - కురియనినీరు - వెయ్యనిసున్నం తియ్యగనుండు. - కొబ్బరికాయ     
చెట్టుకొమ్మలో పిట్ట - పిట్టకు మూడుకళ్ళు - పొట్టనిండా కడవెడు నీళ్ళు. - కొబ్బరికాయ   
నిటారు నిలువలు - పటాకు బయళ్ళు - మజ్జిగ ముంతలు - మాణిక్యాలు. - కొబ్బరికాయలు
మంచమంత ఆకు - ముంతంత కాయ. - టెంకాయ
కొప్పుందిగానీ జుట్టులేదు - కళ్ళున్నాయిగాని చూపులేదు. - టెంకాయ 
మూడు కండ్లవాడు ముక్కంటి మరికాడు - తలకు పిలకయుండు తాతగాడు - తాత గుడికిపోవ తలకాయ పగెలెరా ! - కొబ్బరికాయ    
బొచ్చుకాయ. - కొబ్బరికాయ
గుండ్రాయికి గుప్పెడంత పిలక - మూడు కళ్ళు. - టెంకాయ  
చుట్టూకంప - కంపలో పెంకు - పెంకులో శంఖు - శంఖులో తీర్థం. - టెంకాయ    
గుడిలో నీళ్ళు - గుడికి తాళం. - కొబ్బరికాయ
సన్నని నూతికి దారులు లేవు. - కొబ్బరికాయ    

కంచుక పత్రాధారము - (వ్యవ.) కొబ్బరి మొ.మొక్కల ఆకుల మొదళ్ళు కనుపులచుట్టును ఒరవలె అమరి యుండునది (Sheathing leaf base).

గండిక బరిణె పురుగు - (వ్యవ.) కొమ్ము పురుగు, ఎన్నెమ్మ పురుగు, (ఇది బరిణె పురుగు కుటుంబములోనిది, కొబ్బరిచెట్ల మొవ్వులను కొట్టివేయును (Oryctes rhinoceros).
ఎన్నెమ - పురిటిపురుగు, రూ.ఎన్నెమ్మ, ఎనెమ్మ.

ఆజగామ యదాలక్ష్మీ ర్నారికేళ ఫలాంబువత్|
నిర్జగామ యదాలక్షీ ర్గజభుక్త కపిత్థవత||
తా.
సంపద వచ్చునపుడు నారికేడము - నారికడము(కొబ్బరికాయ)యందలి జలమువలె తనంతట వచ్చును. పోవునపుడు గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగము లలో ఒకటి.) భక్షించిన కపిత్థము - వెలగచెట్టు వెలగపండు వలె పోవును. – నీతిశాస్త్రము

సహ్యాద్రిపార్శ్వే(అ)బ్ది తటే రమన్తం గోదావరీ తీర పవిత్రదేశే|
యద్దర్శనా త్పాతకజాతనాసః ప్రజాయతే త్ర్యమ్బక మీశ మీడే. – 10

నిటలాక్షుఁడు - శివుడు. 
నిటలము - నొసలు, రూ.నిటాలము.
నుదురు - నొసలు. 
లలాట మలికం గోధిః -
లలాటము-నుదురు. లలాటం అమృతోత్భవ| 
లలంత శ్చలంత ఆటం త్యలకా ఆత్రేతి లలాటః అట గతౌ. - దీనియందు ముంగురులు చలింపుచు నటించును. 
అలికము - నొసలు, లలాటము, రూ.అళికము.
అల్యతే భూష్యతే అనే నేత్వలికం, అల భూషణే. - అలంకరింపఁబడునది. పా, అలీకం "త్వేదృష్ట మాత్రపతితా అలికస్య నామక్షో భాయ పక్ష్మలదృశామలకాః కలాశ్చ, నీచాస్సదైవ సవిలా సమలీకమగ్నా" ఇతి కావ్యప్రకాశికా.  
అళీకము - 1.అప్రియమైనది, 2.అసత్యమైనది, వి.1.అప్రియము, 2.బొంకు, 3.నొసలు. 
నొసలు - నుదురు.
గావౌ నేత్రే ధీయతే అస్మిన్నితి గోధిః, గోశబ్దము నేత్రవాచకము. - నేత్రములు దీనియందు ధరింపఁబడును, పుల్లింగము. "పాలో గోధిర్నరా వుభౌ" అని యాదవుఁడు. ఈ 3 నుదురు పేర్లు. బొల్లు - అసత్యము, బొంకు.

అళీకం త్వప్రియే నృతే : అళీక శబ్దము అప్రియమునకును,  అసత్యమునకును పేరు. అల్యతే వార్యత ఇత్యళీకం. అల భూషణాదౌ. వారింపఁబడునది. "ఆళీకం తు లలాటే స్యా"దితి శేషః.

లలాట పార్శ్వాస్థి - (జం.) పుఱ్ఱెలో పైభాగమును ఏర్పరుచు ఎముకలలో నొకటి. ఇది లలాటాస్థి, పార్శ్వాస్థి అను రెండు ఎముకలుకలిసి ఏర్పడినది, (Frontoparietal bone).
పార్శ్వకపోలాస్థి - (జం.) పుఱ్ఱెకు పైభాగమున ప్రక్కవైపు నున్న ఎముక (Parietal bone).

ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
ప్రాణంత్యనేన ప్రాణః, అన ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
ప్రకర్షేణానతి జీవంత్యనేన ప్రాణః, అన ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.

డబ్బు - ధనము, క్రి.బొంకు.
డబ్బఱ - 1.ఆపద, 2.బొంకు, సం.దంభః, దభ్రః.
ఆపద - విపత్తు, ఇడుమ.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధికలుగుట, 3.(తర్క.) అయతార్థజ్ఞానము.
దభ్రము - సన్నము, వి.1.సముద్రము, 2.బొంకు. 
దభ్యతే నివార్యత ఇతి దభ్రం, దంభురోధనే. - అడ్దగింపఁబడునది.
సన్నము - సూక్ష్మత్వము , విణ.సూక్ష్మము.
సముద్రము - సాగరము. 
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.   
బొంకరి - బొంకులాడువాడు.
బొంకు - కల్లమాట, క్రి.కల్లలాడు.
అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.

పరువు - 1.వెదురుగనుపు, 2.సముద్రము.
పరువు - 1.ధావనము, పరుగెత్తు, 2.కోసుదూరము, రూ.పరుగు.
ధావనము - 1.పరుగు, 2.శుద్ధి.
శుద్ధి - 1.శోధనము, 2.మార్జనము, 3.కడుగుట, 4.పవిత్రత.
శోధనము - (రసా.) ఒక ద్రవ్యమును శుద్ధముచేయుట, (Purification), సం.వి.శుద్ధిచేయుట, పరిశోధించుట, వెదకుట.
మార్జనము - 1.శుద్ధి, 2.తుడుచుట.
ధావనము - (రసా.) కడుగుట (Washing).
పరువు - 1.పరిపాకము, 2.గౌరవము, సం.భరః.

చిట్టియ - 1.వెదురు గనుపు, 2.వస్త్రపు టంచుల సన్నకమ్మి, రూ.చిట్టె.
చిట్టె - చిట్టియ.    

పునీతుఁడు - పవిత్రుడు, శుద్ధుడు.

గురువులువాఱు - (గురువులు+పాఱు) 1.అతిశయించు, 2.వేగముగా పరుగెత్తు, 3.ఉప్పొంగు.

విను ప్రాణ రక్షణమునన్
ధనమంతయు మునిగిఁపోవు * తఱి బరిణయమం దున గురుకార్యమున వధూ  
జన సంఘములందు బొంకఁ * జనును గుమారా!

తా. ప్రాణమును గాపాడుట రక్షణ - (గృహ.) కాపాడుట, (Protection)యందును, ధనము పోవునపుడును, పరిణయము - వివాహము నందును, గురువుల పనులయందును, స్త్రీల సమూహము నను అబద్ధమాడవచ్చును దాన దోషము కలుగదు.

మృషావాది - కల్లరి.
మృష - బొంకు.
మిథ్య - మృష, అసత్యము.

మృషా మిథ్యా చ వితథే -
మృషా, మిథ్యా ఈ 2 అసత్యమందు వర్తించును. ఉ 'ఉచ్ఛ్రాయ సౌందర్యగుణా మృషోద్యా', మిథ్యా వాదిని దూతిబాంధవ జనస్యాజ్జాత పీడాగమే'.

గుట్ట - 1.చిన్నకొండ, 2.ప్రోవు, సం.గోత్ర, విణ.భీరువు.

తులాకోటి - అందె; అందె - అందియ.
తులతి ఆకుటతీతి చ తులాకోటిః, ఇ. పు. తుల ఉన్మానే, కుటి కౌటిల్యే. - అధికమైన తూనికగలిగి వక్రమైయుండునది. 

అందెబందెలు - (ని, బహు.) 1.చిక్కులు, 2.జంజాటము, 3.కట్టుదిట్టములు.

క్వణనము - వీణ, భూషణము మొ.ని మ్రోత.
క్వాణము - వీణాదుల మ్రోత.
రణః క్వణే,
రణనం రణః క్వణనం క్వణః, రణ క్వణ శబ్దే. ఈ 2 మ్రోయుట పేర్లు.

కిలికించితము - (అలం.) స్త్రీ యొక్క శృంగార చేష్టలలో ఒకటి (రోషహర్ష భీత్యాదులను దెలుపునది).

మృషా కృత్వా గోత్ర - స్ఖలన మథ వైలక్ష్య నమితం
లలాటే భర్తారం - చరణకమలే తాడయతి తే,  
చిరా దంత శ్శల్యం - దహనకృత మున్మూలిత వతా
తులాకోటి క్వాణ్యైః - కలికిలిత మీశానరిపుణా| - 86శ్లో
    
తా. ఈశ్వరి! తల్లీ! ఏ కాంతమున  నీ పేరును స్ఖలనము - 1.జారుట, 2.తొట్రుపాటున జెప్పిన పిదప(నమితము - వంగినది)యున్న భర్తను నీవు పాదస్పర్శచే లలాటము-నుదురు తన్నగా, తన్ను దహనుఁడు - అగ్ని దహించుటచే ఎంతో కాలమునుండి కోపముతో నున్న మన్మథుడు తన కసిదీర తులాకోటి - అందె)కాలియందెల శబ్దముచే ఈశానము - 1.కాంతి, 2.శివుని ముఖములలో నొకటి, 3.పదునొకండు అనుసంఖ్య, 4.ఆర్థ్రానక్షత్రము.)రిపువు-శత్రువై శివుని పరిహసించినట్లున్నది. - సౌందర్యలహరి

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

ఏనాదము - సముద్రతీరము.
ఏనాది - 1.ఒక కులము 2.ఆకులము లోనివాడు. 

వ్యళీకుఁడు - విటుడు, ముండరి. 
విటరాయుఁడు - విటశ్రేష్ఠుడు.
విటకాఁడు - విటుడు.
ముండరి - వేశ్యా సంగమశీలుడు.
విటి - విటకత్తె.
విటకత్తె - విటుకులాడి, విణ.రంకులాడి.    

వ్యళీకము - 1.అప్రియము, 2.అసత్యము, 3.బాధ, 4.సిగ్గు, 5.అచ్చెరు పాటు, 6.మోసపుచ్చుట, 7.కామినీ జనాపరాధము.
అటమట - 1.వంచన, 2.దుఃఖము, విణ.1.వ్యర్ధము, 2.అసత్యము.
మభ్యపెట్టు - 1.మోసపుచ్చు, 2.ఉపాయముగ దాటవేయు. 
పీడార్థే పి వ్యళీకం స్యాత్ :
వ్యళీకశబ్దము దుఃఖమునకు, ఆపి శబ్దమువలన అప్రియమునకును, అకార్యమునకును, సిగ్గునకును, కామినీ జనాపరాధమునకును పేరు. విశేషేణ అల్యకే వార్యత ఇతి వ్యళీకం - విశేషముగా వారింపఁ బడునది. "వ్యళీక మప్రియా కార్యవైలక్ష్యానృత కామజే" ఇతి శేషః కామజః కామావేశ కృతో హ్ పరాధః లజ్జాయాం. "వ్యళీక నిశ్వాసమివోత్ససర్జ" ఇతి "సత్రాంతే సచివసఖః పురస్త్రియాభిః గుర్వీభిశ్శమిత పరాజయవ్య్ళికా"ఇతి, కుమారసంభవే, రఘువంశే చ ప్రయోగః.

ఉత్త - 1.వట్టి, 2.కేవలము, 3.అసత్యము, 4.పనిలేనిది, 5.ఏహ్యము, సం.వ్యర్ధమ్, రిక్తమ్.  
వట్టి - 1.రిక్తము, ఉపయోగములేనిది 2.అసత్యము.

కేవలుఁడు - 1.పరమాత్మ, 2.సామాన్యుడు.
కేవలము - 1.నిర్ణయము, అవధారణము, విణ.1.అంత, సమస్తము 2.అచ్చము, ఒకటి 3.ప్రధానము.

అసత్యము - బొంకుమాట, విణ.సత్యముకానిది.
అబద్దము - 1.పొసగనిది, అసంగతము, 2.ప్రయోజనము లేనిది, విణ.పొసగనిమాట, అసత్యవాక్యము, అసంగతవాక్యము.

రిత్త - 1.రిక్తము, కల్ల, 3.కారణములేనిది, అవ్య.ఊరక, విణ.రిక్తమ్.
కల్ల - 1.అసత్యము 2.పరుషవచనము.    
రిత్తపోవు - క్రి.వ్యర్థమగు.

అభూతము - 1.కల్లయైనది, 2.లేనిది, 3.జరుగనిది.

ఏహ్యము - ఏవము, విణ.రోత పుట్టించునది, సం.హేయమ్.
ఏవము - ఏవ.
ఏవ - రోత, విణ.రోతయైనది, రూ.ఏవము.
ఏవగింపు- రోత; రోఁత- 1.ఏవము,2.ఎబ్బెరికము.
ఏవగించు - క్రి.రోతపడు, 2.నిందించు, 3.విడుచు.

టిట్టిభము - లకుముకి పిట్ట.
టిట్టితి నిష్ఠురం భాషతే టిట్టిభకః - టిట్టి యని నిష్ఠురముగాఁ బలుకునది.
లకుమిక - చేపలబట్టు పిట్ట, తిట్టిభము. 
టిట్టీతి శబ్దేన భాతీతి టిట్టిభకః, భా దీప్తౌ. - టిట్టి యనెడు శబ్దముచేత నొప్పునది, లకుముకి పిట్ట.

లవిటి - 1.రెక్కమొదలు, 2.చెవిటి.

కల్లఁడు - చెవిటి, బదిరుడు.
కల్ల - 1.అసత్యము, 2.పరుషవచనము.
అసత్యము - బొంకుమాట, విణ.సత్యము కానిది.
పెద్దవిన్నపము - 1.చెవుడు, 2.గొప్పమనవి.
చెవుడు - చెవులు వినని రోగము, బాధిర్యము.
బాదిర్యము - బధిరత్వము, చెవుడు.
బదిరుఁడు - చవిటివాడు.
బధ్యతే వాతాదినా శ్రవణ సామర్థ్య మస్యేతి బధిరః, బధ బంధనే. - ఇతనికి శ్రవణ సామర్థ్యము బంధింపఁబడును.
ఏడుఁడు - చెవిటివాడు.
చెవిటిమూఁగ - చెవుడును, మూగతనమును కలవాడు, ఏడమూకుడు. చెవిటివానికి సత్కథా శ్రవణమేల ?

ఆలరి - 1.దుశ్సీలుడు, 2.అవివేకి.
అవివేకము - అజ్ఞానము, తెలివిలేమి, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యములేమి, విణ.తె లి వి లే ని ది, మంచిచెడుగులను విభజించి తెలిసికొను సామర్థ్యము లేనిది.

నవరస భావాలంకృత
కవితాగోష్టియును, మధుర గానంబును తా 
నవివేకికి కెంత జెప్పిన
జెవిటికి శంకూదినట్లు సిద్ధము సుమతీ.
 
తా|| నవరసములు అనగా, శృంగారం, హాస్యం కరుణ, వీరత్వం, శాస్త్రం భయానకము, భీభత్సం, అద్భుతం, శాంతం అను వీటియొక్క భావాలను, మధురంగా నుండు గానము - 1.పాట, 2.ధ్వని, 3.స్తుతి. గూర్చి యెంత చెప్పినను అవివేకి గ్రహింప జాలడు, ఎట్లనగా చెవిటివాని వద్ద శంఖంతో ఊదినను దాని ధ్వనిని ఆ చెవిటివాడు గ్రహింప లేక పోవుచున్నాడు గదా!

అంతకుఁడు - యముడు.
అంతం నాశం కరోతీత్యంతకః, డు కృఞ్ కరణే. - నాశమును జేయువాఁడు.
అంతము - 1.తుద, 2.చావు, 3.స్వభావము, విణ.1.సమీపము, 2.రమ్యము.
అంత్యతేబధ్యతే (అ)త్ర అంతః, అతి అదిబంధనే. - దీనియందు పాశబద్ధుఁడౌను.
తుద - చివర, కడ, అంతము, రూ.తుది. 
తుదితాకు - క్రి.నెరవేరు. 
తుదిముట్టు - క్రి.1.చచ్చు, 2.నెరవేరు.
తుదిరేయి - 1.కల్పాంతము, 2.చివరిరాత్రి.   

నెఱయు - క్రి.నిండు, 2.నెరవేరు, 3.వ్యాపించు.
నెఱపు - క్రి.1.నిండించు, 2.పరచు, 3.నెరవేర్చు, 4.వ్యాపింపజేయు, వి.వ్యాపనము, విణ.అధికము, రూ.నెరపు.
నెఱపు - క్రి.నిండించు, 2.నెరవేరచేయు.

మును - 1.పూర్వకాలము, 2.ఆరంభము, 3.అంతము.

కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కడౘుక్క - రేవతీ నక్షత్రము.
ౘుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
ౘుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.

ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ| 

కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కాష్ఠా - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. 

అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా -
అష్టాదశ నిమేషాః కాష్ఠేత్యుచ్యతే - పదునెనిమిది ఱెప్పపాట్ల కాలము కాష్ఠ యనంబడును. కాశతే కాష్ఠా, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. 18(Seconds) నిమేషములకాలము ఒకటి కాష్ఠ.

గడము1 - కుండలోనగువాని మూత, గడి.
గడి - 1.ఎల్ల, సీమ, పొలిమేర, మేర, 2.చదరంగపు బల్లమీదిగడి, 3.సమీపము, 4.దుర్గము, కోట, 5.కోడెదూడ.
గడము2 - 1.తెర, 2.కంచె, 3.అగడ్త, 4.విఘ్నము, 5.గండె చేప, 6.ఒకానొక దేశము.

అంతకము - 1.మొత్తము, 2.ఎల్ల, 3.సీమ, (సం.వి. అని కొందరు).        

ఎల్ల - 1.పొలిమేర, 2.సమస్తము, అవ్య.సర్వశబ్దార్థకము.
సమస్తము - సర్వము; సర్వము - (సర్వ.)సమస్తము, అంతయు.

సీమ సీమే స్త్రియా ముభౌ,
సీయతే బద్ధ్యత ఇతి సీమా, న. సీ. సీమా చ, ఆ, సీ. షిఞ్ బంధనే. - ఇంత మేర యని కట్టఁబడునది. ఈ 2 పొలిమేర గుఱుతు పేర్లు.

పొలిమేర - 1.రెండూళ్ళను వేరుచేయు సరిహద్దు, ఎల్ల.  

సీమ1 - 1.దేశము, 2.ప్రదేశము, 3.రాజ్యము, 4.పరదేశము.
సీమ2 - 1.ఎల్ల, 2.పెడతల.
మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
మర్యేతి సీమార్థే (అ)వ్యయం, తత్రదీయత ఇతి మర్యాద, డుదాఞ్ దానే. - మర్య యనఁగా సీమ; అందు ఇయ్యఁబడునది, మేర దప్పకయుండుట.

అవటు ర్ఘాటా కృకాటికా,
న వటతి న వేష్టతే అవటుః, వట వేష్టనే. - చుట్టువాఱియుండనిది, పుంలింగము. 'అవటుః పురుషే కృకాటికా' అని రతకోశము.
ఘట - 1.గుంపు, 2.ఏనుగులగుంపు, 3.గోష్ఠి, 4.కూర్చుట.
శరీరమస్తకయోస్సంధిం ఘటతే ఘటా, ఘట చేష్టాయాం. - శరీరమస్త కములయొక్క సంధిని ఘటించునది.
ఘటన - సంధానము, కూర్చుట.
కృకాటిక - 1.పెడతల, 2.పెడతల యందలి ముచ్చిలిగుంట.
కృశం శిరోగ్రీవే అటతి వ్యప్నోతి కృకాటికా, అట గతౌ. - శిరస్సును మెడను పొందియుండునది. ఈ 3 పెడతల పేర్లు.

ప్రాంతరము-1.అడవి, 2.తొఱ్ఱ, 3.ఎడారిత్రోవ, 4.పొలిమేర.

ప్రాన్తరం దూరశూన్యో (అ)ధ్వా -
ప్రకృష్టం గ్రామయోరంతరం వ్యవధానమత్రేతి ప్రాంతరం - అధికమైన గ్రామములయొక్క వ్యవధానము గలిగినది. ఈ ఒకటి ఎడరియై జనసమూహము లేని మార్గము పేరు.

అడవికాపు - వానప్రస్థుడు.
అడవి - అరణ్యము.

తొఱట - కోటరము, రొ.తొఱ, తొఱ్ఱ.
తొట్ట - తొఱ్ఱ.

నిష్కుహః కోటరం నానా -
నిష్కుటము - 1.తొఱ్ఱ, 2.అంతిపురము, 3.ఇంటితోట, 4.తలుపు, రూ.నిష్కాటము.
నిష్కూతే విస్మాపయతీయి నిష్కుహః, కుహ విస్మాపనే. - విస్మయమును బొందించునది.
కోటరము1 - చెట్టుతొఱ్ఱ.
కుటతీతి కోటరం, అ. ప్న. కుట కౌటిల్యే కుటిలమై యుండునది. ఈ 2 మ్రానితొఱ్ఱ పేర్లు. 
కోటరము2 - కోడంత్రము, కోడలితనము.
కోటఱికము - కోడరికము.
కోడంట్రము - కోటరికము, రూ.కోడంట్రికము, కోడరికము.

ఉపకంఠము - దాపైనది, వి.1.పొలిమేర, 2.సమీపదేశము, 3.సమీపకాలము.
కంఠసమీపంగత ఉపకంఠః - కంఠసమీపమును బొందినది.

సదేశము - సమీపము.
సమానో దేశో (అ)స్యేతి సదేశః. - సమానమైన దేశము గలిగినది.

వఱడు - పెద్దజాతి నక్క.
వఱ - మేర, హద్దు.
మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
మేరమీఱు - క్రి.దాటు, అతిక్రమించు.   
వఱగొడ్దము - 1.వంకరమాట, 2.మర్యాద నతిక్రమించుమాట.

భంగము - 1.చెరుపు, 2.అవమానము, 3.అల, 4.రోగము, వ్యాధి.
భజ్యతే స్వయమేవ భంగః, భఞో ఆమర్దనే. - తనంతత నశించునది.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.

ఎడరు - క్రి.భగ్నమగు, వి.1.ఆపద, 2.భంగము, 3.సందు, 4.ఎడారి.

ఎడారి - నిర్జనమగు ఇసుకబయలు.
ఎడారిభూములు - (భూగో.) కర్కాటక మకర రేఖల పైన అధిక పీడన ప్రదేశములో గల భూములు, (ఇక్కడ వర్షము నామ మాత్రముగా నుండును. మనుష్యులుచెట్లు చేమలు లేని ప్రదేశము. సమశీతోష్ట్ణమండలమున గల వర్షచ్ఛాయా ప్రదేశములో కూడ ఎడారు లున్నవి), ఇసుకభూములు. 

ఇసుకతెర - సముద్ర సమీపమున ఉన్న నేల. 
ఇసుక - ఇసుము, సికత.
ఇసుము - ఇసుక.
సైకతము - ఇసుకదిబ్బ, ఇసుకనేల.
సై కతం సికతామయమ్,
సికతాః అస్య సంతీతి సైకతం, సికతామయంచ - సికతమనఁగా ఇసుక; అది గలిగినది సైకతము, సికతామయమును. ఈ 2 ఇసుకదిన్నె పేర్లు.
ఇసుకతిన్నె - ఇసుకదిబ్బ, సైకతము.
ఇసుక నేలలు - బంకరేణువులు, వండలి రేనువులు తక్కువగా నుండి ఇసుక హెచ్చుగా నున్న నేలలు (Sandy soils). 

పులినము - ఇసుక తిన్నె.

సికత - ఇసుకనేల, మొరపనేల, (రసా.) ఇసుక (రసాయనముగ నిది సిలికస్ ద్వ్యామ్లజనిదము) (Silica).

ఇసుక గరములు - బంక రేణువులు, సన్న వండలి రేణువులు ప్రమాణములు నూటికి 20, 30 ఉన్న నేల.

కెరిబో - (భూగో.) (Caribow) మంచు ఎడారులలో నుండు 'రాన్ డీర్ ', (Rein deer) అను జింక. 
రాన్ డీర్ - (భూగో.) (Ran-deer) ధ్రువపుజింక, ఉత్తర దక్షిణ ధ్రువములలో ప్రయాణ సౌకర్యములకై ఉపయోగింప బడు జింక.

శూన్యం తు వశికం తుచ్ఛ రిక్తకే,
శూన్యము - (గణి.) సున్న = మూల్య రహితము (Null) గాలి తీసివేసిన చోటు (Vaccum), సం.వి.సున్న, విణ.పాడు.
నివారకాభావాత్ శునే హితం శూన్యం - అడ్ద పెట్టువాఁడు లేకుండుటవలన శునకమునకు హితమైనది.
శూన్యప్రదేశము - (భౌతి.) ఏ వస్తువు లేని ప్రదేశము, (Vaccum).
శూన్యీకరణము - (రసా,) ఒక పాత్రను గాలి పంపు సహాయమున గాలి లేకుండచేయుట, (Evacuation).
వశికము - 
తుచ్ఛము - 1.అల్పము, 2.శూన్యము.
తుదతి మనఃక్లేశ యతీతి తుచ్ఛం, తుద వ్యథనే. - మనస్సును వ్యథపెట్టునది.
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).  
రిక్తము - శూన్యము, వట్టిది.
రిచ్యతే వస్తుభి రితి రిక్తం, రిచిర్ పృథగ్భావే. - వస్తువులచేత విడువఁబడునది. ఈ 4 రిత్తయైన యిల్లు మొదలైనదాని పేర్లు.

ముఱి - 1.అల్పము, 2.కుత్సితము.

చెనటి - 1.కుత్సితము, 2.వ్యర్థము, 3.శూన్యము, రూ.చెన్నటి.
కుత్సితము - నికృష్ఠము; నికృష్ఠము - అధమము.
చెన్నఁటి - చెనటి.
చెనుటరి - గ్రామ్యపుమాట.  

వ్యర్థము - వమ్ము, అప్రయోజనము.
వమ్ము - నాశము, విణ.వ్యర్థము, సం.వ్యర్థః. 

వితథము - అసత్యమైనది.

సత్యం ఎంత చిన్న స్థలం లోనైన ఇమిడి పోతుంది. అసత్యానికే ఎక్కువ చోటు కావాలి. - హెన్రీ సెంట్ జాన్(1678-1751)

ప్రాపు - ఆశ్రయము, సం.ప్రాపణమ్, ప్రాపః.
ప్రాపణము - ప్రాపించు.

లగ్గు - మేలు, వ్యతి, ఎగు.
ఎగ్గు - 1.కీడు, అపకారము, 2.దోషము.
ఎగ్గాడు - క్రి.దూషించు, రూ.ఎగ్గులాడు, ఎగ్గించు.

మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది.   

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించు రాజు గొల్వకు
పాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ.

తా|| అబద్ధమును సాక్ష్యముల మూలంగా రూపించు - క్రి.నిరూపించు.)నిజమని నిరూపించుట, ౘుట్టము - 1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు. లను దూషించుట, మదిలో కోపించు రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.)రాజును గొల్చుట, పాపపుభూమి కేగుట తగిన పనులుగావు - కాన ఈవిషయాలలో పదిలము - స్థైర్యము, విణ.1.జాగరూకము, 2.ధృఢము, సం.భద్రమ్.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

నీరధి - సముద్రము.
సరో నీరే తటాకే చేతి రుద్రః, తద్యోగాత్సరస్వాన్ త, పు. - సరస్సనఁగా నుదకము అది గలిగినది.
నీరదము - మేఘము; మేఘము - మబ్బు.
మేహమీతి మేఘః, మిహ సేచనే - తడుపునది.

నీరుమోపరి - 1.కడవ, 2.మేఘము, మబ్బు.

నవనీరదసంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ|

లోకత్రయోద్వేగకర కుంభకర్ణ శిరశ్ఛిదే
నమో నీరదదేహాయ రామా.....

నీరము - జలము.
నిమ్నమీర్తే నీరం, ఈరగతౌ. - పల్లమును బొందునది.
నయతి సుఖమితి నీరం. నీఞ్ ప్రాపణే. - సుఖమును బొందునది.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది.

నీరే ప్రాణాధారము,
నోరే రసభరితమైన నుడవుల కెల్లన్
నారే నరులకు రతనము
చీరే శృంగారముండ్రు సిద్ధము సుమతీ.
తా||
సమస్త జీవులకు నీరే ముఖ్యాధారం, సంభాషణకు నోరే కేంద్రం, మానవులకు నారి - అల్లెత్రాడు, వై.వి. నరము, సం.నాడీ, సం.వి.స్త్రీ.  రత్నంవంటిది, చీరయే స్త్రీకి అలంకారం.

నీరమునకుఁ బాలునకును దారి నీవు
కలుపఁగా విడఁదీయఁగాఁ గర్త వీవు
హంస సోహమ్మునందు మాహాత్మ్యమూను
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!
 

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీయతే క్షీరము, క్షి నివాసగత్యోః. - ప్రవహించునది.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.    

జిడ్డుకడలి - పాలసముద్రము.
జిడ్డు - నేయి మొదలగు వాని యందలి మెరుగు.

క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయువిశేషము, రూ.హంసము.

క్షీరాబ్ధి లోపల క్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ.….

అడుగుపుట్టువు - 1.గంగ, 2.శూద్రుడు.
అడుగు - క్రి.1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండ్రెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము.

సచ్చూద్రుఁడు - మంచియాచారము గల శూద్రుడు.
శూద్రుఁడు - నాలవజాతివాఁడు.
శూద్ర - శూద్రజాతి స్త్రీ.
శూద్రి - శూద్రుని భార్య.

మొదలారి - అరవ శూద్రులలో ఒక తెగ (ముదలియార్, మొదలియార్).

5. భాగీరథి - గంగ (వ్యు. భగీరథునిచే భూమికి తేబడినది.)
భగీరథేన రాజ్ఞా భూలోకమవతారితేతి భాగిరథీ. ఈ. సీ. - భగీరథుఁడను రాజుచేత భూలోకమునకుఁ దేఁబడినది.

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

గంతవ్యా మదనాంతకస్య నగరీ దేవస్య వారణాసీ
స్నాతవ్యం జనఘోరపాపమధనే భాగీరథీ పాథసి
కర్త వ్యం గృహమేదినాం పతకుటీవాటిషు బిక్షాటనం
మర్తవ్యం మణికర్ణి కాతబభువి ప్రా ప్తవ్య మాద్యం మహః|

భా|| మహేశ్వరుని రాజధానియైన కాశీనగరమునకే పోవలయును, సర్వ జనుల మహాపాతకముల నెల్ల నూఁచముట్టుగ హరించు భాగీరథీ పవిత్రోదకముల యందే మునుంగవలయును. కాశీక్షేత్రమునందు నివసించు గృహమేథుల(గృహమేధి - గృహస్థు,, వ్యు.భార్యతో చేరియుండువాడు.) ముంగిశుల యందే బిక్షాటనము నలుపవలయును. మహామహిమోపేతమగు మణికర్ణికా తటమునందే మేను దొరంగవలయును. జగద్రక్షాదక్షమును బ్రసన్నతాపూర్తిచే భక్తజనుల ననుసరించియున్న భవతాపమును దావఁజాలునదియును నైన యాదితేజమునే కన్నుల కఱవుదీఱఁ గాంచ వలయును. (ఇయ్యవియే జన్మమునకు ఫలము లని భావము.)       

Bhagirathi river where blood and beauty are represented in equal measure.

భాగీరథీ సుఖదాయిని మాతః తవ జలమహిమా నిగమే ఖ్యాతః |
నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానమ్ ||

ఓ భాగీరథీ ! నీవు సుఖప్రదాయినివి. వేదశాస్త్రాలలో నీ జలమహత్యము కీర్తించబడినది. దయామయి! నీ మహిమలు తెలియని అజ్ఞానినైన నన్ను కృపతో రక్షించు.

గంగానదీ ప్రాశస్త్యం, హిమాలయ పర్వతాలలో పుట్టి 13,800 అడుగులు ఎత్తున గల గంగోత్రికి ఉత్తరాన జన్మస్థలం. గంగోత్రికి మరోపేరు భగీరథి. భగీరథుడు గంగను భూమికి తీసుకు రావడానికి తపస్సు చేసిన ప్రాంతం, గంగోత్రికి దక్షిణంగా సుమారు 2 మైళ్ళ దూరాన ఉన్న ప్రాంతాన్ని బిందుసారమని అంటారు. గంగాసహోదరీ గంగాధరో|

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
గంగాయాః ధరః గంగాధరః - గంగను ధరించినవాఁడు.
కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్య కలవాడు.

హిమవంతము - చలిమల, హిమాలయము.
హిమశిఖరము - (భూగో.) ధ్రువముల వద్ద ఎల్లప్పుడు మంచు కరడు గట్టి యున్న ప్రదేశము.

హిమాని - హిమసమూహము.
అథ హిమానీ హిమసంహతిః,
మహ ద్ధిమం హిమానీ, ఈ-సీ. - అధికమైన మంచు.
హిమస్య సంహతిః, హిమసంహతిః, ఇ - సీ మంచు సమూహము. ఈ 2 దట్టమైన మంచు.

హిమపవనము - (భూగో.) తీవ్రమైనమంచు తుఫాను.  

హిమరేఖ - (భూగో.) ఎన్నటికిని మంచుకరగని పర్వతపు మట్టము.

హిమానీనదము - కదలుచున్న మంచు నది. (ఈ నదులు కొండలోయలో నేర్పడును. ఇవి చాల పొడవుగా నుండి సంవత్సరమునకు కొద్ది అడుగులు మాత్రమే ఎత్తు ప్రదేశమునుండి దిగువగా పారును. ఉష్ణోగ్రత హెచ్చు అగుకొలది ప్రవాహ వేగము హెచ్చును.)

హిమిక - మంచు.
హిమశిలలు - (భూగో.) సముద్రము పై తేలియాడు ఆర్కిటిక్ ప్రాంతపు మంచు గడ్డలు.     

హిమప్రపాతము - (భూగో.) తీవ్రవేగముచే పెద్దమంచు శిలలు కరిగి కొట్టుకొని పోవుట (Avalanche).

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్త్రిక.
హిమవత అపత్యం స్త్రీ హైమవతి - హిమవంతుని కూతురు. 

హిమానీహన్తవ్యం - హిమగిరినివాసైకచతురౌ  
నిశాయాం నిద్రాణాం - నిశి చరమభాగే చ విశదౌ |
పరం లక్ష్మీపాత్రం - శ్రియ మతిసృజంతౌ సమయినాం, 
సరోజం త్వత్పాదౌ - జనని! జయత శ్చిత్ర మిహ కిమ్ || - 87శ్లో

తా. ఓ జననీ ! హిమాలయము నందు నివసించుటకు సమర్థమైన వియు, వేకువనుగూడ విశదము - తెల్లనిది, స్పష్టమైనది.)లైనవియు, భక్తులకు సంపదలను(లక్ష్మిని)కలిగించేవి అయిన నీ పాదములు మంచుచే గొట్టబడినది, నిశ - 1.రేయి, 2.పసుపు.) యందు ముడుచుకొని పోవునది లక్ష్మీదేవికి ఆలవాల మైన సరోజము - 1.తామర, 2.తామరకొలను.  జయించు చున్నది ననుటలో ఆశ్చర్యం ఏమున్నది ? ఏమీ లేదు. - సౌందర్యలహరి   

హిమాద్రిపార్శ్వే ద్రి తటే రమన్తం - సంపూజ్య మానం సతతం మునీన్ద్రైః |
సురాసురై ర్యక్షమహోరగాద్యైః - కేదారసంజ్ఞం శివ మీశ మీడే. - 11

అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగు వాడు, విష్ణువు.
అధోక్షజః అధకృతాని అక్షాణీంద్రియాణి యస్మిన్ కర్మణి తర్యథా తథా జాతః తదుక్తం. శ్లో 'యస్యేద్రియం ప్రమథితుం ప్రమదా న శక్తా' ఇతి ఇంద్రియములను అధఃకరించి జనించినవాఁడు.
అధోక్షాణాం జితేంద్రియాణాం జాయతే ప్రత్యక్షీభవతీతి వా అధోక్షజః - జితేంద్రియులకు ప్రత్యక్ష మగువాఁడు. 
అధఃకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం యనేతి వా - ఇంద్రియజన్యజ్ఞానమును అధఃకరించినవాడు.

అధోక్షకము - (జం.) భుజమునకును శరీరభిత్తిక కును సంబంధించినది (రకనాళము) (Subclavian).

ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.

జితేంద్రియుఁడు - ఇంద్రియములను జయించినవాడు.

గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు.
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు. గోపాలం చింతయే ద్బుధః|
గాః పాతీతి గోపః, గాః పాలయతీతి గోపాలః. పా రక్షణే; పాలరక్షణే. - ఆవులను రక్షించువాడు.

గోపే గోపాల గోసంఖ్య గోధు గాభీర వల్లవాః,
గా స్సంచష్టే గోసంఖ్యః. చక్షిఙ్ వ్యక్తాయాం వాచి. - ఆవులను విచారించువాఁడు.

గోపుఁడు - రక్షించువాడు, 1.రాజు, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి. (అయిదింటిపై గాని, పదింటిపై గాని అధికారము కలిగి గ్రామములోని భూములు ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్త్యవ్యము లై యుండును.)   

దోగ్ద - 1.గొల్లవాడు, 2.దూడ, 3.కవిత్వము చెప్పి జీవించువాడు, విణ.పాలు పిదుకువాడు.
గాః దోగ్ధీతి గోధుక్. హ.పు. దుహ ప్రపూరనే. - ఆవులను బితుకువాఁడు.
దోగ్ద్రి - 1.ఈనిన ఆవు, 2.గొల్లది.
దోహనము - పాలు పిదుకుట.

గొల్ల1 - 1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.  

గొల్లభామ - 1.గొల్లజాతికి చెందిన స్త్రీ, 1. (వ్యవ, కీట.) సన్నగానుండు మిడత కుటుంబములోని పురుగు. కొన్ని గొల్లభామలు ఇతర కీటకములను దినుచుండును) (Mantis).

జీవవృత్తి - గోవులు మున్నగు వానిని కాచుకొని జీవించుట.  

గోదుమ - గోధుమ, ఒకరకపు ధాన్యము Wheat, సం.గోధూమః.

గోధూమ స్సుమన స్సమౌ,
గుధ్యతే పరివేష్ట్య ఇతి గోధూమః, గుధ పరివేష్టనే. - విసరఁబడునది.
శోభనం మన్యతే సుమనః, అ. పు. మనజ్ఞానే. - మంచిదిగాఁదలఁపఁబడునది. గోదుమల పేర్లు.

‘ఇ’  విటమిన్ - (గృహ.) (Vitamin E) సంతానోత్పత్తికి తోడ్పడు విటమిన్. ఇది గోధుమ మొలకలలో ఉండును.  

అభీరుఁడు - భీరువుకానివాడు, వి.గొల్లవాడు. ఆసమంతాత్ భియం రాతీతి అభీరః. రా ఆదానే. - అంతట భయము గలవాఁడు.

అభీరుఁడు - 1.గొల్లవాడు, వ్యు.మిక్కిలి పిరికివాడు, 2.అభీరదేశవాసి.
అభీరి - 1.గొల్లది, 2.గొల్లవాని భార్య, 3.గొల్లలభాష.
అభీరపల్లి - గొల్లపల్లె, వ్రేపల్లె.

అభీరీతు మహాశూద్రీ జాతిపుంయోగాయో స్సమే,
అభీరుఁడు - 1.గొల్లవాడు, వ్యు.మిక్కిలి పిరికివాడు, 2.అభీరదేశవాసి.
అభీరస్య గోపస్య భార్యా తజ్జాతీయా వా అభీరీ. - అభీరుడనఁగా గొల్లవాఁడు, వాని భార్యయు, ఆ గొల్లజాతి స్త్రీయును.
అభీరి - 1.గొల్లది, 2.గొల్లవాని భార్య, 3.గొల్లలభాష.
మహాశూద్రి - గొల్లది.
మహాశూద్రస్య భార్యా తజ్జాతీయా వా మహాశూద్రీ, సీ. - మహాశూద్రుఁడనఁగా గొల్లవాఁడు, వాని భార్యయు, తజ్జాతీయము. - ఒకటి గొల్లవాని భార్యకును, తజ్జాతి స్త్రీకిని పేరు.
గోపి - గొల్లది (గోపిక).
రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.

వల్లవుఁడు - గొల్లవాడు.
బత్ స్థైర్యం లునాతీతి లవః బదః స్థైర్యస్యలవో వల్లవః, బద స్థైర్యే. లూఞ్ ఛేదనే. వబయోరభేదః - భయము నొంది మనస్థైర్యము వీడినవాఁడు.
గోమహిస్యాదికం వలమానాః సంవృణ్వంతో వాంతి గచ్ఛంతీతి వల్లవాః. వల సంవరణే. వా గతిగంధనయోః. - గోమహిష్యాదులను జుట్టుకొని పోవువాఁడు.

కిలారి - గొల్లడు.
కిలారము - పసులమంద, రూ.కిలారము.

గొల్లవారి బ్రదుకు గొఱఁతన వచ్చునే,
గొల్లరీతిఁ బాలకుప్పఁ ద్రచ్చి 
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు,
చేటు లేని మందు సిరియుఁ గనిరి.

భా|| గోపాలకుల జీవితం కొంచెమైంది కాదు. దేవతలు(సురలు -వేలుపులు)గొల్లవారివలె పాల సముద్రాన్ని చిలికినారు. విష్ణువు సైతం గొల్ల అయినాడు. అమరత్త్వాన్ని అందించే అమృతాన్నీ(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః)శ్రీలక్ష్మినీ పొందగలిగాడు.

7. త్రిస్రోత - గంగ, వ్యు.మూడు ప్రవాహములు గలది.
త్రీణిస్రోతాంసి యస్యాస్సా త్రిస్రోతాః. స. సీ. - మూఁడు ప్రవాహములు గలది.

వెల్లివాక - గంగ.
వెల్లి - ప్రవాహము, పరంపర, తెలుపు, సం.వేల్ల్.

గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వ జనేశశివ|

స్రోతస్విని - నది, వ్యు.ప్రవాహము కలది.
స్రోతః అస్యా అస్తీతి స్రోతస్వినీ - తనంతటఁ బ్రవహించునది.

స్రోతస్సు - 1.ప్రవాహము, 2.ఏరు, 2.నీరువచ్చు తూము. 

స్రోత ఇన్ద్రియ నిమ్నగారయే,
స్రోతశ్శబ్దము చెవులు మొదలయిన ఇంద్రియ ద్వారములకును, నదీ వేగమునకును పేరు. స్రువతీతి స్రోతః, స్రు ప్రస్రవణే. స్రవించునది గనుక స్రోతస్సు, టీ. స. - ఇంద్రియ మింద్రియ స్థానగతం ద్వారం. 'స్త్రోతోభిస్త్రిదశజా మదం క్షరంత ' ఇతి భారవిః, రయశబ్దేనాత్ర ప్రవాహః, యథా - తీవ్రస్రోతాః.

నిమ్నగ - ఏరు, వ్యు.పల్లమునకు పారునది.
నిమ్నం గచ్ఛతీతి నిమ్నగా, గమ్ గతౌ. - పల్లమునకు గూర్చి పోవునది. 

ౙాలు - ఏరు, చిన ప్రవాహము నీరు, రూ.జోలువు (జామునకు బహు.)
ౙాలువారు - క్రి.ప్రవహించు.
ౙాలువు - జాలు, సం.ఝరా. 

శృంగవక్రసరస్సు - (భూగో.) నదీ ప్రవాహములో వంకరలు తిరుగుచు శృంగ వక్రమువలె పాఱు నదీ సమీప తీరము. నది 'U' వలె ప్రవహించి మధ్యప్రాంతమును సారవంతముగ తయారుచేయును.

సరణి - 1.త్రోవ, 2.వరుస, 3.విధము.
సరంత్యనేనసృతి, ఈ-సీ. సరణిశ్చ, ఈ. సీ. సృగతౌ. - దీనిచేత సంచరింతురు.

స్రోతో (అ)మ్బుసరణం స్వతః,
స్వతః అంబుసరణం స్రోత ఇత్యుచ్యతే - తనంతట పాఱుచున్న ప్రవాహము ప్రోతస్సనంబడును.
స్వతః సరతీతి స్రోతః, స. న. సృగతౌ - తనంతటఁ బోవునది. ఈ ఒకటి తనంతట పాఱునదాని పేరు.  
 
సరడు - 1.సరండము, స్త్రీల మెడకు ధరించు బంగారు అల్లిక తీగ, 2.నూలు దారము, సం.సరండః.
సరణశ్రేణి - (గణి.) ఒకదానిపైన ఒకటి జారుటకు వీలుగా నమర్చిన రెండు లఘుఘటక చిహ్నిత మాపక శ్రేణులుగల కొలుచుయాంత్రిక పరికరము,(Sliderule).

విశ్వంభరుఁడు - విష్ణువు.
విశ్వంభరః, విశ్వం బిభర్తీతి విశ్వంభరః - విశ్వమును భరించువాఁడు.
విశ్వ - భూమి.
విశ్వం బిభర్తీతి విశ్వంభరా, భృఞ్ భరణే. - విశ్వమును భరించునది.
విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి. (భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe).
విశతి సర్వత్ర విశ్వం, విశ ప్రవేశనే. - అంతటఁ బ్రవేశించునది.
విశతి రోగిణః హృదయే విశ్వా, విశ ప్రవేశనే. - రోగిహృదయమందు ప్రవేశించునది. విశ్వము నందు దేవిస్థానం విశ్వేశ్వరి|

విశ్వంభరధరా ధారా నిరాధారా ధికస్వరా,
రాకా కుహూ రమావాస్యా పూర్ణిమా(అ)నుమతీ ద్యుతిః| - 22స్తో

విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.

విశ్వసృజుఁడు - బ్రహ్మ.
విశ్వం సృజతీతి విశ్వసృట్ జ-పు. - విశ్వమును సృజించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ఏకానేక స్వరూపవిశ్వేశ్వర యోగిహృది ప్రియవాసశివ |

కైటభజిత్తు - వెన్నుడు, హరి.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు. 
కైటభజిత్. త-పు. కైటభమసురం జితవాన్ - కైటభుఁడనెడి యసురుని జయించినవాఁడు జి జయే. ప్రధమం తు హరిం విద్యాత్|

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు,  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.    
బృంద - తులసి(తొళసి-తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి. కృష్ణ మేకాదశం| 
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు,మరీచి).

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||

తా. విష్ణువు చేతగాని, శివుని(హరుఁడు - శివుడు)చేతగాని, బ్రహ్మ చేతగాని, ఇతరమైన దేవతల చేతగాని నొసట వ్రాయబడిన(లిఖితము - వ్రాయబడినది, వి.అక్కరము.)వ్రాత తుడిచివేయ నలవిగాదు (మనుష్య మాత్రుల చేత కాగలదా!) - నీతిశాస్త్రము

గంగా సంభవ గిరిశ తనూభవ
రంగపురోభవ తుంగ కుచాధవ| ||శరవణభవ||

కౌస్తుభవక్షుడు - విష్ణువు. వక్షస్తలే కౌస్తుభం|
శ్రీవత్సలాంఛనః శ్రీవత్స్సోనామ వక్షఃస్థలే మహాపురుష లక్షణో రోమావర్ణ విశేషః స ఏవ లాఞ్చనం యస్యసః - వక్షః స్థలమందు మాహాపురుషలక్షణమైన శ్రీవత్స మనెడు మచ్చ గుఱుతుగాఁ గలవాఁడు.    

కౌస్తుభో మణిః (చాప శ్శార్ఙ్గ మురారేస్తు శ్రీ వత్సో లాఞ్ఛానం మతమ్,)
కౌస్తుభః కుంస్తోభత ఇతి కుస్తుభో హరిః, తస్యాయం కౌస్తుభః - భూమిని నిలిపిన విష్ణుని సంబంధమైనది.
విష్ణుభస్తమ్భే కుంస్తుభ్నాతి వ్యాప్నోతీతి కుస్తుభస్సముద్రః - తత్ర భవతీతివా కౌస్తుభః - సముద్ర మందుఁ బుట్టినది. ఈ ఒకటి విష్ణువు యొక్క మణిపేరు. విష్ణువు ధనుస్సు శార్ఙ్గము. పుట్టుమచ్చ శీవత్సము.  

నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము.

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.

కౌస్తుభము - విష్ణువక్షస్స్థలము నందలి మణి, వ్యు.కుస్తుభ = సముద్ర మందు పుట్టినది. 
దేవమణి - 1.కౌస్తుభము, 2.గుఱ్ఱము మెడ మీది సుడి.

ఊరక వచ్చుఁ బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగఁగల్గువానికిఁ, బ్రయాసము నొందిన దేవ దానవుల్
వారలటుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగదె శృం
గారపుఁ బ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు, భాస్కరా.

తా. సురాసురలు అమృతమునకై మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి యను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభము, కల్పవృక్షము, కామధేనువు పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో "లక్ష్మియు, కౌస్తుభ రత్నము" అను నీ రెండును ప్రయాస పడకుండనే విష్ణువు(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.)నకు లభించెను. అదృష్టవంతున కభివృద్ధి కలుగబోవు నెడల నతడే ప్రయాసమును బడకుండ గనే అతనికి భాగ్యము కల్గును. 

బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారాన ళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో (అ)పి కటాక్షమాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయాః| – 7

8. గాందిని - గంగానది, 1.అక్రూరుని తల్లి.
భీషం సూత ఇతి భీష్మసూ. ఊ. సీ. షూజ్ ప్రాణిప్రసవే. - భీష్మునిఁ గన్నది.
గాందినీసుతుఁడు - 1.భీష్ముడు, 2.అక్రూరుడు, 3.కార్తికేయుడు, కుమారస్వామి.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.  
గాంగేయుఁడు - గాంగుడు. 
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.  

భీష్ముఁడు - 1.శంతను పుత్త్రుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
భీష్మము - భయానక రసముగలది, విణ.భయంకరమైనది.
భీషణము - భయానక రసముగలది, విణ.భయంకరమైనది.
భీ - భయము; భీతి - భయము, బెదురు.
బిభేత్యస్మాదితి భీషణం, భీష్మం, భీమం, భయానకము చ. - అధీరుఁడు దీనిచేత వెఱపుఁజెందును గనుక భీషణము, భీష్మము, భీమము, భయానకము.  

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రనక్షత్రమని కొందరు.

గాంగేయుఁడు - గాంగుడు. 
గాంగుఁడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.  

ఊర్ధ్వరేతసుఁడు - విణ.1.జితేంద్రియుడు, 2.అధఃపతనములేని రేతస్సు కలవాడు, వి.1.సనకాది ఋషులలోనివాడు, 2.శివుఁడు, 3.భీష్ముఁడు, రూ.ఊర్ధ్వరేతుడు.  

పరసతుల గోష్టినుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నిందపడున్
గరిత సుశీలయైనను,
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ.

తా|| బ్రహ్మచారియైన భీష్మునంతటి వాడైనను ఇతర స్త్రీలతో గోష్ఠి-1.పరిషత్తు, సభ, 2.ఇష్టాగోష్ఠి. జరిపినచో భువి - 1.భూమి, 2.స్థానము. అట్టి వానిని అనుమానించును. అట్లే యెంతటి గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా. సుశీలయైన స్త్రీ అయినను అన్యపురుషుల(సంగతి - 1.చేరిక, 2.జ్ఞానము, 3.సమాచారము.)పోషణలోవున్న నిందల పాలగును. 

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ప్రధానం పరమాత్మా ధీః :
ప్రధాన శబ్దము పరమాత్మకును, ప్రజ్ఞకును, మఱియు ప్రకృతికిని, ప్రధానికిని, ముఖ్యునికిని, పేరు.
ప్రకర్షేణ దధాతీతి ప్రధానం. డు ధాఞ్ ధారణపోషణయోః. - ప్రకర్షము చేత నన్నిటిని ధరించునది. "ప్రధానం ముఖ్యమంత్రిణో"రితి శేషః.

ముఖ్యమంత్రి - (శాస., రాజ., పౌర.) మంత్రివర్గ నాయకుడు, రాష్ట్రప్రధాని, రాష్ట్ర మంత్రివర్గ నాయకుడు.

ధీ - బుద్ధి.
ధీంద్రియము -
(ధీ + ఇంద్రియము), జ్ఞానేంద్రియము.
ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.    

ఆత్మజ - 1.కూతురు 2.బుద్ధి.
బుద్ధి -
బుద్ధి, మతి సం.బుద్ధి. మతి చెడిన - గతి చెడును.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Inteligence).
మతి - 1.తలపు 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది. మది - బుద్ధి, మనస్సు. సం. మతిః. మతిని బట్టియే గతి. ప్రజ్ఞ - బుద్ధి, సామర్థ్యము.

ప్రజ్ఞాయతే అనయేతి ప్రజ్ఞా. జ్ఞా అవబోధనే. - దీనిచేత లెస్సగా నెఱుఁగ బడును.
మన్యతే అనయేతి మతిః. ఇ. సీ. మనజ్ఞానే. - దీనిచేత నెఱుఁగఁబడును.
బుధ్యతే అనయేతి బుద్ధిః. ఇ-సీ. బుధ అవగమనే - దీనిచేత నెఱుఁగఁ బడును.

స్మృతము - తలపబడినది, సం.వి.1.తలపు, 2.ధర్మశాస్త్రము, 3.బుద్ధి.

బుద్ధి కొద్ది సుఖం. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది. సంకల్పించేది మనస్సు. మనస్సు మహామేరువైనా చాటుతుంది కాని కాలు గడపదాటదు.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతఃకరణము -
1.మనస్సు 2.దయ. ధర్మానికి అధారం దయ.

మనిషికి నిలబడటం తేలిక - పరుగెత్తడము కష్టము.
కాని మనస్సుకు పరుగెత్తడం తేలిక - నిలబడటం కష్టం.

దిషణుఁడు - బృహస్పతి Jupiter.
ధిషనాబుద్ధిరస్యాస్తీతి ధిషనః - మంచిబుద్ధి గలవాఁడు. 
ధిషణ - బుద్ధి.
ధృష్ణువంతి ప్రగల్భంతీ నయా ధిషణా, ఞిధృషా ప్రాగల్భ్యే. - దీనిచేత ప్రగల్భులగుదురు.
ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము కలవాడు.  
ప్రశస్తాం ధియం రాతీతి ధీరః, రా ఆదానే. - మంచి బుద్ధి నిగ్రహించువాఁడు.
ధీర - 1.వ్యంగముగా కోపప్రకాశము చేయునాయిక, 2.ధీరురాలు.
ధీరధీర - వ్యంగ్యవ్యంగముగా కోప ప్రకాశముచేయు నాయిక.
ధీః - బుద్ధి.
ధ్యాయం త్యనేయేతి ధీః, ఈ. సీ. ధ్యై చింతాయాం. - దీనిచేత ధ్యానము చేయుదురు.
ధీంద్రియము - (ధీ+ఇంద్రియము) జ్ఞానేద్రియము.    

బుద్ధిమంతుడు - బుద్ధికలవాడు.  
బుద్ది - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధ్యతే అనయేతి బుద్ధిః, ఈ-సీ, బుధ అవగమనే. - దీనిచేత నెఱుఁగఁబడును.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Intelligence).
మనీషి - విద్వాంసుడు, మనీష.
మనుతే మనీషా, మన అవబొధనే. అన్నిటిని దెలిసికొనునది.
మనస ఈషావత్ లాంగలదండవ త్సంబంధాద్వా మనీషా. ఈష యనఁగా నేడికోల దానివలె మనస్సునఁ గూడియుండునది.

మనీషి - విద్వాంసుడు.
మనీషా (అ)స్యాస్తీతి మనీషీ, న. పు. - బుద్ధి గలవాఁడు.
శేముషి - బుద్ధి, మనీష.

ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం మంత్రౌషధి సమాగమా|
దానమానావమానాశ్చ నవగోప్యాః మనీషిభిః||
తా.
ఆయుస్సు, విత్తము - ధనము, సం.విణ.1.విచారింప బడినది, 2.తెలియ బడినది., ఇంటిగుట్టు, మంత్రము, ఔషధము, సమాగమము - 1.చక్కనిరాక, 2.పొందిక., దానము, మానము, అవమానము, ఈ తొమ్మిది యును బుద్ధిమంతులగు వారిచేఁ బరులకు దెలియనీయక దాఁచఁదగినవి. - నీతిశాస్త్రము.

ఏలాపురీరమ్యశివాలయేస్మి - న్సముల్లస న్తం త్రిజద్వరేణ్యం|
వన్దే మహోదారతరస్వభావం - సదాశివం తం ధిషణేశ్వరాఖ్యమ్. - 12
 

6.19.11Vishnu_and_Lakshmi_thumb3

No comments:

Post a Comment