Saturday, February 11, 2017

గ్రహనక్షత్రములు

విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి.(భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe). విశ్వము నందు దేవిస్థానం విశ్వేశ్వరి.

విశ్వసృజుడు - బ్రహ్మ.
విశ్వం సృజతీతి విశ్వసృట్ జ-పు. - విశ్వమును సృజించువాడు, సృజ విసర్గే.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొం దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

విశ్వస్తము - విశ్వసింపబడినది.
విశ్వసనీయము - విశ్వసింపదగినది.
విశ్వజనీయము - సర్వజనులకు హితమైనది. 

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభుః
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః| - 1సో 

విశ్వతోముఖము - అంతట వ్యాపించినది, సర్వతోముఖము.
సర్వతోముఖము -
1.ఆకాశము, 2.జలము.
సర్వతోముఖుఁడు - 1.ఆత్మ, 2.బ్రహ్మ, 3.శివుడు.
విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.

ౙగముతల్లి - 1.పార్వతి, 2.లక్ష్మి, 3.లోకమాత.
లోకమాత - 1.జగము తల్లి 2.లక్ష్మి 3.గంగ.
లోకజనని - 1.జగము తల్లి 2.లక్ష్మి 3.గంగ.

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి (పంచమాతలు :- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).

కంసారాతి - శ్రీకృష్ణుడు.
కంసారాతిః, ఇ-పు. కంసస్య అరాతిః - కంసుని శత్రువు.
కంసుఁడు - కృష్ణుని మేనమామ.

అధోక్షజుఁడు - జితేంద్రియులకు ప్రత్యక్షమగు వాడు, విష్ణువు.
అధోక్షజః అధకృతాని అక్షాణీంద్రియాణి యస్మిన్ కర్మణి తర్యథా తథా జాతః తదుక్తం. శ్లో 'యస్యేద్రియం ప్రమథితుం ప్రమదా న శక్తా' ఇతి ఇంద్రియములను అధఃకరించి జనించినవాఁడు.
అధోక్షాణాం జితేంద్రియాణాం జాయతే ప్రత్యక్షీభవతీతి వా అధోక్షజః - జితేంద్రియులకు ప్రత్యక్ష మగువాఁడు. 
అధఃకృతం అక్షజం ఇంద్రియజన్య జ్ఞానం యనేతి వా - ఇంద్రియజన్యజ్ఞానమును అధఃకరించినవాడు.

అధోక్షకము - (జం.) భుజమునకును శరీరభిత్తిక కును సంబంధించినది (రకనాళము) (Subclavian).

విశ్వంభరుఁడు - విష్ణువు.
విశ్వంభరః విశ్వం బిభ్హరీతి విశ్వంభరః - విశ్వమును ధరించినవాఁడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
వెన్నునంటు - అర్జునుఁడు(వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము).

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు. 
కైటభజిత్. త-పు. కైటభమసురం జితవాన్ - కైటభుఁడనెడి యసురుని జయించినవాఁడు జి జయే. ప్రధమం తు హరిం విద్యాత్|

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి. కృష్ణ మేకాదశం|  
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా.
విష్ణువు చేతగాని, శివుని(హరుఁడు - శివుడు)చేతగాని, బ్రహ్మ చేతగాని, ఇతరమైన దేవతల చేతగాని నొసట వ్రాయబడిన(లిఖితము - వ్రాయబడినది, వి.అక్కరము.)వ్రాత తుడిచివేయ నలవిగాదు (మనుష్య మాత్రుల చేత కాగలదా!)శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. బ్రహ్మ రాత బయలుపడేదికాదు. - నీతిశాస్త్రము

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ|
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః|| - 6 

గ్రహము - 1.రాహుగ్రహము, 2.అనుగ్రహము(దయ, కరుణ), 3.చెర, 4.యుద్ధ యత్నము, 5.పిశాచము (పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము), 6.సూర్యాది నవగ్రహములు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు). (భౌతి.) ఆకాశములో సూర్యుని చుట్టు తిరుగుచు స్థిరముగా కాంతిని వెదచల్లెడు ఖగోళరాశి (Planet).

ఉపగ్రహము - 1.ఉపయోగము, 2.చెర, 3.(ఖగో.) ఒక పెద్దగ్రహము చుట్టు తిరుగు చిన్నగ్రహము.
ఉపయోగము -
1.అనుకూల్యము, 2.వాడుక, 3.ప్రయోజనము.
చెఱ - 1.కారాగృహము, 2.నిర్బంధము, సం.చారః.
బంది - నిర్భంధము, చెర, సం.బంధీ.
బందిఖానా - చెరసాల (బందిగము). కారాగారము - చెరసాల.
నిర్బంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
కృష్ణజన్మస్థానము - బంధనాయలము, చెరసాల, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన స్థలము.

ఆఁక - 1.అడ్డు, 2.చెర, 3.కట్టుబాటు, 4.చెలియలకట్ట.

నిర్బన్ధోపరాగార్కాదయో గ్రహః :
గ్రహ శబ్దము నిర్బంధమునకును, సూర్యచంద్ర గ్రహణములకును, సూర్యాది నవగ్రహములకును పేరు. నిర్బంధమనగా పట్టుట యని కొందరు. గృహ్ణాతీతి గ్రహణం, గృహ్యత ఇతి చ గ్రహః గ్రహ ఉపాదానే . పట్టును గనుకను, పట్టుటగనుకను, పట్టఁబడును గనుకను గ్రహము. "గ్రహో నుగ్రహ నిర్బంధ గ్రహణేషు రణోద్యమే, సూర్యాదౌ పూతనాదౌ చ సైంహికేయోప రాగయో"రితి శేషః.

అస్థిరాయిడ్ - (ఖగో.) (Asteriod) గురుకుజ గ్రహకక్ష్యల నడుమ కక్ష్యలో తిరుగు లఘుగ్రహము.
నెప్ట్యూన్ - (Neptune) సూర్యుని చుట్టు తిరుగు ఒక గ్రహము.
ప్లూటో - (Pluto), సూర్యునిచుట్టు తిరుగు ఒక గ్రహము.
యురేనస్ - (Uranus) సూర్యుని చుట్టు తిరుగు గ్రహముల లోఒకటి.

జ్యోతిశ్చక్రము - గ్రహనక్షత్ర మండలము.

గ్రహరాజు - 1.సూర్యుడు, 2.చంద్రుడు.
గ్రహపతి - 1.సూర్యుడు.

గోచారము - సూర్యాదిగ్రహముల సంచారము.
గ్రహచారము -
1.గ్రహముల యొక్క సంచారము, 2.దురదృష్టము.
దురదృష్టము - దౌర్భాగ్యము; దౌర్భాగ్యము - దురదృష్టము.

పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు -
1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
పొందుకాఁడు - స్నేహితుడు.
పోలిక - సామ్యము.
సామ్యము - సమత్వము, పోలిక.

                                                           

సంక్రాంతి - మేషాది సంక్రమణము.
సంక్రమణము -
సూర్యుడొక రాశి నుండి మరియొక రాశికి ప్రవేశించుట. సం.వి.(భౌతి.) ఒక చోటగల స్థితి, దశ, రీతి విషయము అను వానినుండి మరొకచోట గలస్థితి, దశ, రీతి విషయము అనువానికి మార్పు, (Transition), సం.వి.(రసా.) దాటుట (Transition), ఉదా.రాంబిక్ గంధకము 96 డిగ్రీల యొద్ద మోనోక్లినిక్ రూపమునకు సంక్రమణము చేయును. 

  

భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాసం కరోతీతి భాస్కరః - కాంతిని గలుగఁ జేయువాఁడు.

ఓజము - 1.బేసి, విషమము(సమముకానిది) 2.జ్యోతి, రూ.ఓజస్సు.
బేసి -
విషమము, సమముకానిది, విణ. (గణి.) సరిగాని సంఖ్య(Odd), 1, 3, 5, 7 వంటివి, చూ (అయుగ్మ సంఖ్య).
ఆయుగ్మము - బేసి, ఉదా. రెండుచే నిశ్సేషముగా భాగింపబడని అంకె 3, 7, 9 మొ, వి.
బేసికంటి - (బేసి + కన్ను) ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

(ౙ)జ్యోతి - జ్యోతి, కాంతి, దీపము, సం.జ్యోతిః.
జ్యోతి -
1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.
వెలుగు - 1.కిరణము 2.ప్రకాశము(వెలుగు, విణ. బయలు పడినది). నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు, 27). అగ్ని - 1.నిప్పు(అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక) 2.అగ్నిదేవుడు. అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.
సూర్యుడు - వెలుగురేడు. సూర్యుని ఎవరు - ఉదయించమన్నారు?సూర్యకాంతము - సూర్యరశ్మి సోకిన ప్రజ్వరిల్లు ఒకరాయి, శిల.

కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి -
సూర్యుడు.
మయూఖము - 1.కిరణము 2.కాంతి 3.జ్వాల, మంట Flame.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలువడు శక్తి రూపము, వెలుగు వస్తువులు కనబడునట్లు చేయునది (Light).
దీప్తి - కాంతి, స. (భౌతి.) ప్రకాశము, (Luminosity), కాంతి యొక్క తీక్ష్ణత, (Brightness). జ్వాలాజిహుఁడు - అగ్ని.

దివియ - 1.దీపము, 2.దివ్వటీ, రూ.దివె, దివ్వె, దివ్వియ, దీవియ, దీవె, సం.దీపికా. దీపముండగనే యిల్లు చక్కబర్చుకోవలెను.
దీపము - లాంతరు, రూ.దీపిక.
దబ్బెము - దీపము, సం.దీపః.
దీవియ - దివియ, సం.దీపికా. 
గృహమణి - దీపము; దీపవల్లి - దీపపువత్తి.
దీపకము - 1.ఓమము, 2.దీపము, 3.దీమము, 4.(అలం.)సాహిత్యమున నొక యలంకారము.
ఓమము - జీలకఱ్ఱవలె నుండు ఒకరకపు వాసనగింజలు, దీప్యము, రూ.వాము.
దీమము - 1.దీపకము 2.వేటాడుటకై వేటకాడు పెంచు పక్షి, మృగము, రూ.దీపము.

మాయించు - క్రి.1.సంహరించు, 2.కాంతి హీనముచేయు.
మాయు - క్రి.1.మలినమగు, 2.నశించు. 

తక్కటి - మూడు ముఖములు గల దీపా రాత్రికపు తట్ట, త్రిముఖదీపిక.

దీపము పేరు చెబితే చీకటిపోతుందా? దీపము దానము చేయువాడు, నిర్మలమైన నేత్రములు కలవాడు కాగలడు.

జ్యోతి ర్ఖ ద్యోత దృష్టిషు :
జ్యొతి శ్శబ్దము నక్షత్రమునకును, తేజస్సునకును, దృష్టికిని పేరు. ద్యోతత ఇతి జ్యోతిః. స. న. ద్యుత దీప్తౌ, ప్రకాశించునది. సూర్యునికిని, అగ్నికిని పేర్గునపుడు పుల్లింగమును గలదు. 'జ్యోతి ర్నా భాస్కరే గ్నౌచ క్లీబం ఖద్యోత దృష్టిషు' ఇతి రుద్రః 'జ్యోతిః ప్రకాశేతారాయాం వేదాంగాంతర నేత్రయో' రిత్యజయశ్చ. 'జ్యోతిః పుంస్యత్ని సూర్యయోః, చంద్రే చ' ఇతి శేషః.

ఓజస్సు -1.తేజము 2.ఉత్సాహము 3.బలము 4.వెలుతురు 5.పటిమ.
తేజము -
1.ప్రకాశము 2.ప్రభావము 3.పరాక్రమము 4.రేతస్సు, రూ.తేజస్సు. తేజి - గుఱ్ఱము.
ఉత్సాహము - 1.ప్రయత్నము, 2.సంతోషము(శర్మము – సంతోషము) 3.కోరిక 4.ప్రభు భక్తి 5.(అలం.)వీరరసమునకు స్థాయి 6.ఆస్థ.
బలము - 1.సత్తువ(దేహబలము, సం.సత్యమ్.) 2.సైన్యము.
సైన్యము - 1.సేనతోకూడినది 2.సేన 3.కృష్ణుని తేతి గుఱ్ఱము లోనొకటి.
వెలుతురు - 1.ఎండ (ఎండదొర - సూర్యుడు) 2.ప్రకాశము.
పటిమ - నేర్పు, సామర్థ్యము.
ఓజు(ౙ) - 1.కమసాలి 2.శిల్పి 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపసః|
బుద్ధఃస్సష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశు ర్భాస్కరద్యుతిః||

సూర్యతనయుఁడు - 1.శని, 2.కర్ణుడు.
సూర్యతనయ -
యమున.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.

అజుఁడు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.మన్మథుడు, 5.ఇక్ష్వాకు వంశమునకు చెందిన ఒక రాజు.
అజాండము - బ్రహ్మాండము.
బ్రహ్మాండము - భూగోళఖగోళాదికము, అందలి లోకములు చరాచరా ఖలము.

ఉపరాగము - 1.సూర్యాది గ్రహణము, 2.వ్యసనము, దుర్వ్యసనము, 3.అన్యాయము.

అవనాయము - అన్యాయము, న్యాయములేనిది.

ఉపరాగో గ్రహః -
ఉపరజ్యేతే సూర్యచంద్ర మసావనేన ఉపరాగః, రంజరాగే - సూర్యచంద్రులు దీనిచేత రాగమును బొందింపఁబడుదురు.
గృహ్యేతే సూర్యాచంద్రమసావనేన గ్రహః - గ్రహ ఉపాదానే. దీనిచేత సూర్యచంద్రులు గ్రహింపఁ బడుదురు. ఈ రెండు గ్రహణము పేర్లు.

గ్రహరాజు - 1.సూర్యుడు, 2.చంద్రుడు.  

గ్రహణము - 1.రాహు కేతువులు సూర్యచంద్రులను పట్టుట, 2.గ్రహించుట, 3.బుద్ధి, (భౌతి.) గ్రహమునకు వేరు గ్రహము అడ్డువచ్చి కంపించకుండుట. (Eclipse), (భూగో.) భూమియొక్క కక్ష్య, చంద్రుని యొక్క కక్ష్య, రెండు బిందువుల (రాహుకేతువుల)లో కలియును. ఆ రెండింటిలో ఏదైన ఒక బిందువు భూమికి తిన్నగా వెనుకగాని ముందుగాని, భూమికిని సూర్యునకును మధ్యగాని, వెనుకగాని వచ్చినచో గ్రహణము కలుగును. ఆకాశన పట్టే గ్రహణమంతా చూసేదే.
బుద్ధి -
బుద్ధి, మతి, సం.బుద్ధిః (గృహ.)తెలివి తేటలు(Intelligence)
కక్ష్య - (భూమి.) భూమి సూర్యుని చుట్టు పూర్తిగా తిరుగుట.

కందళము - 1.క్రొత్తమొలక, 2.అవ్యక్త మధురధ్వని, 3.గ్రహణము, రూ.కందలము.
కందళించు - క్రి.మొలుచు, అంకురించు.

గ్రహకల్లోలము - రాహుగ్రహము.

సూర్యగ్రహణము - రాహుకేతువు లలో నేదైన ఒక బిందువు భూమికి వెనుకగా వచ్చినచో సూర్యకిరణములు భూమిపై సోకక, తగులనప్పుడు సూర్యగ్రహణము కలుగును.

అంగుళీయాకారము - (ఖగో.) ఉంగరమువంటి ఆకారము, వర్తులా కారము (Annular). ఉదా.అంగుళీయ కాకార సూర్యగ్రహణము, చంద్రుని ఛాయ సూర్యబింబ మధ్య భాగమును గప్పగా చుట్టును వెలుతురు కనిపించు సూర్యగ్రహణము.

అజుఁడు వాని శిరము నంబరవీథిని,
గ్రహము సేసి పెట్టి గారవించె;
వాఁడు పర్వములను వైరంబు దప్పక
భానుచంద్రములను బట్టుచుండు.
భా||
బ్రహ్మదేవుడు రాహువు శిరస్సును ఆకాశంలో ఒక గ్రహంగా నిలిపి గౌరవించాడు. ఆ రాహుగ్రహము సూర్యచంద్రులకు నిత్యవైరి కనుక పగ వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికీ అడ్డగిస్తూ ఉండి, వారిపై దాడిచేయుటకు సదా ప్రయత్నిస్తు ఉంది.  

రాహువు, కేతువుల గ్రహ బాధల వల్ల సూర్యచంద్రునికి గ్రహణాలు ఉన్నాయి. చంద్రునికి వృద్ధిక్షయాలు ఉన్నాయి.

సూర్యుఁడు - వెలుగురేడు.
సువతి ప్రేరయతి వ్యాపారేప్వితి సూర్యః-షూఞ్ ప్రేరణే - వ్యాపారములయందుఁ బ్రేరేపించువాఁడు.   

అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు.
ఇయర్తి గచ్ఛతీతి అర్యమా, న. పు. ఋగతౌ. - గమనయుక్తుఁడు.

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
అదితేరపత్యం ఆదిత్యః - అదితి కొడుకు.

ఆదిత్యవారము - వా ర ము లో మొదటిరోజు, ఆదివారము, భానువారము Sunday.

నేక్షేతోత్యంత మాదిత్యం - నాస్తంయాతం కదాచన,
ప్రతిబింబం సదారిస్థం - సమధ్యం నభసోగతం|

తా. సూర్యుడుదయించుచున్నప్పుడు, అస్తమయ మగు చున్నపుడు, ఆకాశ మధ్యంబును(నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.)బొంది యున్నపుడు ప్రతిసూర్యుడు, (అనఁగా ఉదక మందలి సూర్య ప్రతిబింబమును)జూడగూడదు. – నీతిశాస్త్రము 

సూర్యుని ఎవరు - ఉదయించమన్నారు?

అదితేయాః అదితే రపత్యాని అదితేయాః - అదితికొడుకులు.
ఆదిత్యాః - ఆదిత్యులు పన్నిద్దరు - ఇంద్రుఁడు, ధాత, పర్జన్యుఁడు, త్వష్ట, పూష, అర్యముఁడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుఁడు అనువారలు.  

వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
బుధుఁడు - 1.ఒక గ్రహము Mercury, 2.విద్వాంసుడు, 3.వేలుపు.
వేల్పుటెంకి - స్వర్గము, వ్యు.దేవతలకు నివాసస్థానము.
వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుడు - బృహస్పతి.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.  
బృహస్పతివారము - గురువారము Thursday.

తొలువేలుపు - 1.బ్రహ్మ, 2.అసురుడు, 3.పూర్వదేవుడు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

వేల్పుదాయ - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.

పూర్వం దేవపదేస్థితాః పూర్వదేవాః - పూర్వకాలమందు దేవపదమునందున్నవారు.

ఆదిత్యానా మహం విష్ణు ర్జ్యోతిషాం రవి రంశుమాన్ |
మరీచి ర్మరుతా మస్మి నక్షత్రాణా మహం శశీ||

తా|| నేను ద్వాదశ ఆదిత్యులలో విష్ణువను సూర్యుడను; ప్రకాశించెడి వారిలో రస్మిమంతుడను సూర్యుడను; సప్త మరుద్గణములలో మరీచిని(మరీచి-1.కిరణము, 2.వెలుగు, 3.ఎండమావులు, 4.ఒక ప్రజాపతి.), నక్షత్రము లలో చంద్రుడను. - 21శ్లో విభూతి యోగము, భగవద్గీత

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

ద్వాదశాత్ముఁడు - సూర్యుడు.
ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా. న. పు. పండ్రెండువిధములైన మూర్తులు గలవాఁడు.

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
   
భా|| ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే (హరి) భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.

నక్షత్ర గ్రహ తారాణా మధిపో విశ్వభావనః
తేజసా మపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే.

ద్వాదశి - పక్షమందు పండ్రెండవ తిథి, దోదసి.
దోదసి - ద్వాదశి, ఒకానొక తిథి.
బారసి - ద్వాదశి, సం.ద్వాదశీ, ద్వాదశాహః

ద్వాదశకము - పండ్రెండు.
పండ్రెండు - (పది+ రెండు) ద్వాదశ సంఖ్య.
ద్వాదళము - పండ్రెండవది.
పరక - 1.రెండి వీసములు, 2.పండ్రెండ్రు, 3.గడ్డిపోచ.
ముచ్చౌకము - 1.పండ్రెండు (3x4), 2.మూడు చౌకములు.  
ఈరాఱు - (ఈరు + ఆఱు) రెండు ఆర్లు అనగా పండ్రెండు.

నాన్నోదకసమం దానం న ద్వాదశ్యాః పరం వ్రతమ్|
నగాయత్ర్యః పరం మంత్రం సమాతుర్ద్యైవతం పరమ్||

తా. అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతిశాస్త్రము

ఆరిరాధయిషుః కృష్ణం మహిష్యా తుల్యశీలయా|
యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతమ్||

దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
దివా దినం కరోతీతి దివాకరః - దినమును జేయువాఁడు.
దివ అహని ప్రాణినశ్చేష్టావతః కరోతీతి దివాకరః - పగలు జీవులను వ్యాపవంతులుగాః జేయువాఁడు.       

భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాసం కరోతీతి భాస్కరః - కాంతిని కలుగజేయువాఁడు.

అహస్కరుఁడు - సూర్యుడు.
అహః కరోతీత్యహస్కరః - అహస్సును జేయువాఁడు.

బ్రధ్నుఁడు - 1.సూర్యుడు, 2.శివుడు.
అన్యతేజః బధ్నాతి ప్రతిబధ్నాతీతి బ్రధ్నః - ఇతర తేజస్సులను నిరోధించువాఁడు.
బధ్నాతి తిమిరంబ్రద్ధ్నః బధబంధనే - తిమిరమును నడ్దపెట్తువాఁడు.

ప్రభాకరుఁడు - సూర్యుడు.
ప్రభాం కరోతీతి ప్రభాకరః - ప్రశస్తమైన కాంతినిఁ జేయువాఁడు.  

విభాకరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విశేషేణభాం కరోతీతి విభాకరః - మిక్కిలి కాంతినిఁ గలుగఁజేయువాఁడు.

భాస్వరుఁడు - సూర్యుడు.
భాసః అస్య సన్తీతి భాస్వాన్ త. పు. - కాంతులు గలవాఁడు. 

వివస్వంతుఁడు - సూర్యుడు.
వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతీతి వివస్వాన్. వస ఆచ్ఛాదనే - కాంతిచేత నన్నిటినిఁ గప్పెడువాఁడు. 
 
దేవ సురౌ వివస్వంత్తౌ -
వివస్వచ్చబ్దము దేవతలకును, సూర్యునకు పేరు. వివస్తేజః; తదస్యాస్తీతి వివస్వాన్. త. పు. వస ఆచ్ఛాదనే - తేజస్సు గల వాడు.     

వైవస్వతుఁడు - 1.యముడు, 2.శని.
వివస్వత సూర్యస్య అపత్యం వైవస్వతః - సూర్యుని కొడుకు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).

మనువులు - స్వాయంభువుడు (స్మృతి కర్త) స్వారోచితుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు (పదు నాల్గురు).  

శనివారము - ఏడవ వారము (ఆదివారము మొదలుకొని).
స్థిరవారము - శనివారము Saturday.

వికర్తనుఁడు - సూర్యుడు.
వికృన్తతి తమ ఇతి వికర్తనః కృతీ ఛేదనే - తమస్సును పోఁగొట్టువాఁడు.
విశ్వకర్మణా వికృత ఇతి వా వికర్తనః - పూర్వ మితఁడు సహింప గూడని తేజస్సుగలవాఁడై యుండఁగా విశ్వకర్మచేత నితని కాంతి సానపట్టి తగ్గించఁబడినది.

అర్కుఁడు - 1.సూర్యుడు, 2.ఇంద్రుడు.
అర్చ్యత ఇత్యర్కః, ర్చపూజాయాం. - పూజింపఁ బడువాఁడు.

అర్క స్స్ఫటిక సూర్యయోః,
అర్కశబ్దము స్పటికమందును, సూర్యుని యందును వర్తించును. అర్బ్యత ఇత్యర్కః, అర్బ పూజాయాంః, ఆర్బ పూజాయాం. - పూజింపఁబడును. 'అర్కో ర్కపర్ణే స్పూటికే రవౌ తామ్రే దివస్పతా' వితి విశ్వప్రకాశః.

అర్కజుఁడు - 1.శని Saturn, 2.యముడు.

అర్కము - 1.జిల్లేడు, 2.రాగి, 3.(రసా.) ఒక ద్రవ్యమునుండి స్వేదనముచేగాని ద్రావణముచే గాని, లాగబడిన అంశము (Extract).
జిల్లెడు - అర్కవృక్షము, రూ.జిల్లేడు. 

అర్కాహ్వ వసు కాస్ఫోట గనరూప వికీరనాః, మన్దార శ్చార్కపర్ణే. -
అర్కస్య అహ్వానామాస్యా స్తీతి అర్కాహ్వః - సూర్యుని యొక్క పేరుగలది.
వసత్యస్మిన్ తేజ ఇతి వసుకః వస నివాసే. - దీనియందు తేజస్సుండును.
ఆ స్ఫుట త్యాస్ఫోటః స్ఫుట వికసనే. - వికాసము గలిగినది. పా. ఆస్ఫోతః.  
గణరూపాణి బహురూపాణ్యస్య గణరూపః - కాలక్రమమున ననేక రూపములు గలది.
పుష్పాణి వికిరతీతి వికీరణః. కౄ విక్షేపే. - పువ్వులఁ జల్లునది.
మందాన్ క్షుద్ర వ్యాధీన్ ఔషధత్వేన ఇయర్తీతి మందారః. - క్షుద్రవ్యాధులను బోఁగొట్టునది.
అర్కాభాని పర్ణా న్యస్య అర్కపర్ణః - సూర్యునివలె వేఁడిమి గల యాకులు గలది. ఈ ఆరు 6 జిల్లేడుచెట్టు పేర్లు.

అర్కబంధువు - బుద్ధుడు, వ్యు.సూర్యవంశీయుడు(కావున నీవ్యవహారము).
అర్కవంశత్వాత్ అర్కబంధుః, ఉ-పు. - సూర్యవంశమున జనించుటవలన అర్కబంధువు.

అర్క మనుచు జిల్లెడు తరుపేరు
మర్కట బుద్ధులెట్ల దీఱు
అర్కుడనుచు భాస్కరునికి పేరు కు
తర్కమనే అంధాకారము తీఱు  ||తెలిసి||

మార్తాండుఁడు - సూర్యుడు.
మృతండస్యాపత్యం మార్తాండః – మృతుండుఁ డను వాని కొడుకు. పా, మార్తాండః మృతం బ్రహ్మాండం జీవయతీతి మార్తాండః - నశించిన బ్రహ్మాండమును బ్రతికించువాఁడు.

పద్మసంభవభూతేశ ముని సంస్తుత కీర్తయే,
నమో మార్తాండవంశ్యాయ రామా....

మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్త రాజ్యధూః|
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా. - 150స్తో

మిహిరుఁడు - 1.సూర్యుడు, 2.చంద్రుడు, 3.వాయువు, 4.వృద్ధుడు.
మేహతి మేఘరూపీ విశ్వం సించతీతి మిహిరః, మిహ సేచనే - తాను మేఘరూపియై ప్రపంచమును తడిపెడువాఁడు. 

అరుణుఁడు - 1.అనూరుడు, సూర్యసారథి, 2.సూర్యుడు.
ఇయర్తి గచ్ఛతీత్యరుణః ఋగతౌ. – సంచరించు వాఁడు.    

సూర్యసూతో (అ)రుణో (అ)నూరుః కాశ్యపి ర్గరుడాగ్రజః,
సూర్యస్య సూతః సూర్యసూతః - సూర్యుని సారథి.
ఋచ్యతీతి త్యరుణః ఋ గతౌ - గమనయుక్తుఁడు.
అరుణవర్ణత్వాదరుణః - ఎఱ్ఱనికాంతి గలవాఁడు.
న విద్యతే ఊరూ యస్య స అనూరుః, ఉ. పు. - తొడలు లేనివాఁడు.
కశ్యపస్య అపత్యం కాశ్యపిః. ఈ. పు. - కశ్యప ప్రజాపతి కొడుకు. 
గరుడస్య అగ్రజః - గరుడునికి అన్న. ఈ ఐదు సూర్యసారథి యగు ననూరుని పేర్లు.

అనూరుఁడు - తొడలు లేనివాడు, వి.గరుత్మంతుని అన్న(సూర్యసారథి).

పిచ్చికకుంటు - అనూరుడు, విణ.కాళ్ళు లేనివాడు.
కుంటి - 1.కాలు విరిగినవాడు, ఖంజుడు, 2.పుట్టుకతో కాలుచెడినవాడు, పంగువు. 
కుదుపు - క్రి.కదలించు ఇటునటు ఊపు, వి.కదలిక, విణ.పంగువు.

శ్రోణుడు - పిచ్చుకకుంటు, కుంటివాడు.
పంగువు - శని, విణ.కుంటివాడు.
పంగు - భయము.

శ్రోణః పఙ్గా -
శ్రోణతి సంహతో భవతి శ్రోనః, శోణృ సంఘాతే. - కరచరణాదులచేత ముద్దయయి యుండువాఁడు.
వనతి పంగుః. ఉ. పన గతౌ. - మెల్లఁగా బోవువాఁడు. ఈ రెండు పిచ్చుకకుంటువాని పేర్లు. 

ఖోడుఁడు - శనిగ్రహము, విణ.కుంటివాడు.
కుంటిగాము - శనిగ్రహము Saturn.

గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.

ఈ లోకంబునఁ బూర్వము,
నాలుగు పాదముల నీవు నడతువు నేఁడా
శ్రీలలనేశుఁడు లేమిని,
గాలముచే నీకు నొంటి కాలయ్యెఁ గదే!
భా||
ధర్మదేవతాస్వరూపుడవైన నీవు పూర్వం ఈ లోకంలో నాలుగు పాదాలతో నడుస్తూ ఉండేవాడివి. ఈ నాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేనందు వల్లనే కదా కాలప్రభావానికి లోబడిన నీవు ఒంటి కాలితో నడుస్తున్నావు


అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.

గౌరో (అ)రుణేసితే పీతే -
గౌరశబ్దము ఎఱుపు వస్తువునకును, తెలుపువస్తువునకును, పచ్చవస్తువునకును పేరు. మఱియు, మృగవిశేషమునకును పేరు.
గూయత ఇతి గౌరః, గుఞ్ గతౌ. - పొందబడునది గాని, యెఱుఁగఁబడునదిగాని గౌరము.

అరుణోదయము - సూర్యోదయమునకు ముందు నాలుగు గడియలకాలము, వేకువజాము.

కాశ్యపి - భూమి, వ్యు.పరశురామునిచే కశ్యపునకు యజ్ఞ దక్షిణగా నీయబడినది.
కాశ్యపస్యేయం కాశ్యపీ, ఈ.సీ. - పరశురామునిచేత కశ్యపునికొఱకు యజ్ఞ దక్షిణగా నియ్యఁబడినది. తథాచోక్తం._ 'శ్లో. త్రిస్రప్తకృత్వః పృథివీం కృత్వానిః క్షత్రియాం తతః, దక్షిణా మశ్వమేధాంతే కశ్యపాయాదదాత్ప్రభు ' రితి.

అరుణోదయము - సూర్యోదయమునకు ముందు నాలుగు గడియలకాలము, వేకువజాము.

అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
స్త్రీఘోషము - వేకువ; వేకువ - వేగుజాము. ఔషసి - వేకువ, ఉషఃకాలము.
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః.
రేపకడ - ప్రాతఃకాలము.
విభాతము - ప్రభాతము, వేకువ. ప్రభాతము - వరువాత, వేగుజాము.
ప్రత్యూషము - వేగుజాము.  
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1.రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగుఁ(ౙ)జుక్క - శుక్రుడు Venus.

ఉషస్సు -  సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.

ఉష- 1.రేయి, 2.రాత్రిశేషము, 3.బాణాసురుని కూతురు.
ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.

నిశాంతము - 1.వేకువ, 2.ఇల్లు.
నితరాం శామ్యతి దుఃఖమత్రేతి నిశాంతం. శము ఉపశమే. - దీనియందు దుఃఖము మిక్కిలి శమించును.
అవశ్యం నిశాయా మమ్యతే గమ్యత ఇతి నిశాంతం. అమ గతౌ. - అవశ్యముగా రాత్రియందు పొందఁబడునది. 
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.

అనేకార్కకోటి ప్రభావజ్జ్వలం తం |
మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తం |
శ్రితానా మభీష్టం నిశాంతం నితాంతం |
భజే షణ్ముఖం తం శరచ్చంద్ర కాంతమ్ ||

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||
తా.
ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము(శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి.)చూచుకొని పోవలయునని బృహస్పతి(బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు Jupiter.)చెప్పెను. ఎపుడు బయలుదేరిన కార్యము సఫల మగునని నిస్సంశయముగా(నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా)మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు (బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.) చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్దనుండు(జనార్థనుఁడు - విష్ణువు) చెప్పెను. - నీతిశాస్త్రము 

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

   

 

పూషుఁడు - సూర్యుడు Sun.
పుష్ణాతీతి పుషా. న. పు. పుష పుష్టౌ - పోషించువాఁడు.

మాఘమాసంబునఁ బూషాహ్వయంబు వహించి ధనంజయుండు వాతుండు సుషేణుండు సురుచి హృతాచి గౌతముం డను పరిజన పరివృతుండై చరియించుచు నుండు;
మాఘ మాసంలో సూర్యుడు Sun పూషుడన్న(పూషుఁడు - సూర్యుడు) పేరుతో వ్యవహరింప బడుతూ ధనంజయుడు(ధనంజయుఁడు - 1.అగ్ని, 2.అర్జునుడు.), వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతాచి, గౌతముడు(గౌతముడు - 1.గౌతమముని, 2.బుద్ధుడు.) అనేవారు పరిజనం కాగా సంచరిస్తూ ఉంటాడు.

సూర్యతనయ - యమున.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు.

సబంధుర్యో హితేషుస్స్యా త్సపితాయస్తు పోషకః|
సఖాయత్ర విశ్వానస్స - భార్యాయత్ర నిర్వృతిః||
తా.
హితము(మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు.) గోరువాఁడే బంధువు, పోషించిన వాఁడే(పితరుఁడు - తండ్రి, సం.పితా.)తండ్రి, విశ్వాసము గలవాఁడే స్నేహితుఁడు(సఖీ - 1.సకి, చెలికత్తె, 2.స్నేహితుడు, సహాయుడు, రూ.సఖుడు.), సుఖింప జేయునదే భార్య యగును. - నీతిశాస్త్రము

పూషదంత వినాసాయ భగనేత్రభిదే నమః
భవిష్యదృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః |

ద్యుమణి - సూర్యుడు, చదలు మానికము.
దివః ఆకాశన్య మణిః ద్యుమణిః, ఇ. పు. - ఆకాశమునకు మణివంటివాఁడు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమణి, నభోమణి.
ౘదలు - ఆకాశము. ౘదలుకాఁపు - వేలుపు.
ౘదలేఱు - ఆకాశగంగ.

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
ఆకాశగంగ -
మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయము తో కూడి కాంతిమంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
మందాకిని - 1.గంగ 2.అరువదేండ్ల స్త్రీ.
గంగ -
1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటిచాలు, 3.ఆకాశ గంగ.

ఆకాశధార - ఆకసమునుండి కొండపైకిని అచటినుండి క్రిందికిని ప్రవహించుధార.

మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మ్యై "మ"కారమహితాయ నమశ్శివాయ |   

తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.
తరంత్యనేన తమితి తరణిః ఈ-పు, తౄప్లవన తరణయోః - అంధకారమున నితనిచేతఁ దరింతురు.
తరతి నభ ఇతి వా - ఆకాశమును దాటువాఁడు.

తరణికులేశ నా నుడులఁ దప్పులుగల్గిన నీదు నామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియ న్నదీజలం
బరగుచు వంకయైన మలినాకృతిఁబాఱినఁ దన్మహత్వముం
దరమె గఱింప నెవ్వరికి దాశరథీ కరుణా పయోనిధీ.
తా.
సూర్యవంశమున జన్మించినవారిలో శ్రేష్ఠుడైన వాడా ! నా మాటల యందు దోషము లెన్ని యున్నను, నీయొక్క నామముతోడ శ్రేష్టమయినది యు రచింపఁబడినదియు, కావ్యము పవిత్రమయి నది కదా ? (అగు ననుట) అనగా ఆకాశగంగ(మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్ను కొలను.)యొక్క నీరు ప్రవహించుచు, వంకరగా పాఱినను ముఱికిగల ఆకారములో ప్రవహించినను, దాని మహత్మ్యము ఎన్నుటకు శక్యమా. (కాదనుట)

కాతే కాంతా ధనగతచింతా, వాతుల కిం నాస్తి నియంతా|
త్రిజగతి సజ్జనసంగతిరేకా, భవతి భవార్ణవ తరణే నౌకా|| - భజగోవిందం
   

తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.   

కప్పలి - ఓడ, నావ, త. కప్పల్.
నౌక - ఓడ.
ఓడ - నావ, తరణి, సం.హోడః. 
హోడము - నావ, ఓడ. 
నావ - ఓడ. 

స్త్రియాం నౌ స్తరణి స్తరిః,
నయతీతి నౌః ఔ, సీ. ణీఞ్ ప్రాపనే - పదార్థమును గట్టును బొందించునది.
నుద్యత ఇతివా నౌః ణుద ప్రేరణే - ప్రేరేరింపఁ బడునది.
తరంత్యనయా నదీమితి తరణిః. ఇ.సీ. తరిశ్చ. ఈ-సీ. పా, తరీ. ఈ-సీ. 'తరీషు తత్ర్యమఫల్గుభాండ ' మితి మాఘః. - దీనిచేత తరింతురు గనుక తరణి, తరియు. ఈ 3 ఓడల పేర్లు.   

దిక్సూచి - నావికులు వాడు ఒక పరికరము (Compass).
నావికాదిక్సూచి - (భౌతి.) సముద్రముపై ప్రయాణము చేయు నావికులుపయోగించు దిక్సూచి (Mariner's compass) (నావ ఎట్లొదిగినను ఇది సమతలము ననే యుండుట దీని ముఖ్య లక్షణము).  

నావ్యము - నావచే దాటదగినది.
నావ్యం త్రిలిఙ్గం నౌతార్యే -
నావా తార్యం నావ్యం, అ. త్రి. - ఓడచేత దాఁటఁ దగినది. ఈ ఒకటి ఓడలచే దాఁటఁదగిన నద్యాదుల పేర్లు.

నౌకదండము - ఓడ నడుపు గడ.

నౌకాశాఖ - ప్రభుత్వపు నౌకాదళ వ్యవహారములను చూచుకొను శాఖ.
నౌకస్థావరము - యుద్ధ నౌక లుండు స్థలము.  

నౌకా(క)పన్ను - (చరి.) దేశరక్షణ కొరకు పూర్వపు ఇంగ్లండు రాజులు నౌకలు నిర్మించు నిమిత్తము రేవుల మీద నగరముల మీద విధించిన పన్ను. 

నీళ్ళమీద ఓడ నిగడి తిన్నగఁ బ్రాకు
బైట మూరెడైన బారలేదు
నెలవు దప్పుచోట నేర్పరి కొఱగాడు విశ్వ.
తా||
నీటిపై ఓడ సులభముగ ప్రయాణము చేయును. నేలపై మూరెడైనను ముందుకుపోదు. ఆవిధముగానే తమ స్థానము(నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము,)వదలిపెట్టి నచో యెంతటివారైననూ పనికిరాని వారగుదురు.

గొండోల - (Gondola) వెనిస్ నగరములో నీటి కాలవలందు ఉపయోగించు చిన్నపడవ. 

ద్రోణి - 1.చిన్నపడవ, 2.దోనె, పసులు మేయు కంచె, 4.కొండపల్లము.
దోనె - ద్రోని, చిన్నపడవ.
దోని - ద్రోణి, దొన, కాలువతూము.

అవతారము - 1.దిగుట, 2.దేవతలు మనుష్యా కారరూపములలో పుట్టుట, వారు తాల్చినరూపము, 3.ప్రాదుర్భవించుట, 4.రేవు, 5.అవతారిక, 6.(నది మొ.వి) దాటుట, 7.ప్రవేశము.
అవతరణము - 1.దిగుట, 2.అవతారము, 3.దాటుట, 4.రేవు, 5.మెట్టు.

తీర్థము - 1.పుణ్యనది, 2.రేవు, 3.పుణ్యక్షేత్రము, 4.నూతి యొద్ద కట్టిన తొట్టి.
తీర్థమాడు -
క్రి.స్నానముచేయు.
తీర్ణము - దాటబడినది.

రేవు - 1.నద్యాదులయం దీవలి కావలికి నడుచుట కేర్పర్చిన దారి, 2.నీలాటిరేవు, 3.పాటి రేవు, 4.ఓడలలోని సరకులు ఎగుమతిచేయు చోటు, 5.రేగుచెట్టు.

రేవుపోషక ప్రదేశము - (భూగో.) సముద్ర తీరమున వర్తక వ్యాపారములకు అనువుగా నున్న భూమి.

రేవులచిన్ని - (వృక్ష.) ఒకరకమైన ఓషధి. 

కర్ణము1 - 1.చెవి, 2.చుక్కాను.
కర్ణము2 -
(గణి.) లంబకోణ త్రిభుజములో లంబకోణమునకు ఎదురుగా నున్న భుజము (Hypotenuse).
కర్ణసంబంధము - చెవికి సంబంధించినది (Auditory).
కర్ణసాయనము - (జాతీ.) చెవుల కింపైనది, కర్ణపేయము.

కర్ణకారుఁడు - ఓడవాడు, సరంగు.
కర్ణధారుడు -
సరంగు; సరంగు - నావికుడు.
ఓడంగి - ఓడవాడు, నావికుడు. నావిక ధావిత మృదుపదరామ్|

కర్ణికలు - (జం.) 1.హృదయము లోపల జఠరికల పైభాగమున నున్న రెండు కుహరములు, 2.బయటి చెవులు.
జఠరిక - (జం.) గుండెకాయలో నుండి రక్తమును బయటికి పంపునది, (Ventricle).
జఠరికలు - (గృహ.) గుండెలోని క్రింది గదులు (Ventricles).
శష్కులి - చక్కిలము, బయటచెవి.

కర్ణభేరి - 1.(శారీ) చెవి యొక్క మధ్యభాగము, మధ్య కర్ణకుహరమును బయటిదాని నుండి వేరుచేయు పొర (Ear-Drum), 2. (జం.) శబ్దములను వినుట కుపయోగించు కంపనశక్తి గల పొర, చెవిలో నుండు డోలువంటి నిర్మాణము (Tympanum). 

తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోశపు పొర క్రింద నుండు అంతస్రావగ్రంథి (Thymus gland).
పురఃకర్ణాస్థి - (జం.) శ్రవణ ప్రావరములో నున్న ఎముకభాగము (Pro-otic).

స్తంభిక - (జం.) శ్రవణ ప్రావరములో నున్న చిన్న కడ్డీ వంటి ఎముక (Columella).
రికాబు - (జం.) మధ్య చెవి భాగములో నున్న స్తంభికకు ఒకవైపున అంటియుండు చిన్న కోమలాస్థి బొడిపె (Stapes).

కర్ణాశ్మములు - (జం.) అంతర్లసికములో నుండు స్పటికాకారమైన నున్నపు సంబంధమగు రేణువులు (Ototiclas, ear Stones). 

తనకు గల్గు పెక్కు తప్పులు నుండగా
ఓగు నేర మెంచు నొరులఁగాంచి
చక్కిలంబు గాంచి జంతిక నగినట్లు విశ్వ.

తా|| తనయందు అనేక(పెక్కు - అనేకము, సం.పుష్కలమ్.)తప్పులు పెట్టుకొని, యితరుల(ఓగు - 1.అశుభము, 2.కీడు(బాగోగులని వాడుదురు బాగు+ఓగు) తప్పులను(నేరము-తప్పు) యెన్నుచిందురు. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు వుండును కదా!

చుక్కాను - 1.మేక, 2.సంతాపము నందు కలిగించు ధ్వని.
మేకసొరము -
స్వరవిశేషము, గాంధారము.
గాంధారము - 1.(సంగీ.) ఒక విధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార్ అను ఒకానొకదేశము. 

అరిత్రం కేనిపాతకః,
ఋచ్ఛతి నౌర నేనేత్యరిత్రం, ఋ గతౌ. దీనిచేత నావ నడుచును.
కే జలే నిపాత్యన్తే నావః అనేనేతి కేనిపాతకః, పత్ ఌ గతౌ. - జలమందు ఓడలు దీనిచేత నదపఁబడును. ఈ 2 ఓడ నడుపు తెడ్దు పేర్లు.   

అరిత్రము - 1.చుక్కాని, 2.ఓడ తెడ్డు.
(ౘ)చుక్కాను - పడవ నడుపు తెడ్డు, అరిత్రము. 

తండువు - 1.తెడ్దుకొయ్య, 2.నందికేశ్వరుడు.
తెడ్డు -
1.తుండువు, 2.కొయ్యగరిటె, 3.పడవ త్రోసెడు పలక, రూ.త్రెడ్డు.  
తండెలు - ఓడపెత్తనగాడు, రూ.తండేలు.

పీలికాఁడు - చుక్కాను పట్టువాడు.     
  

కలాసి - ఓడమీదిపనివాడు.

ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్ల మీద నొప్పుగవచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ.
తా.
ఓడలమీద బండ్లువచ్చును, బండ్లుమీద ఓడలు వచ్చుచుండును. అట్లే ఈ భూమి(వసుధ - భూమి, వ్యు.వసువును(బంగారమును) ధరించునది.)యందు సుఖమున్న వారికి కష్టము, దారిద్ర్యమున్నవారికి సంపద వచ్చుచుండును.

తరణము - 1.దాటుట, 2.తరించుట.
తరము -
1.పురుషాంతరము, 2.మానము, 3.సామ్యము, 4.వరుస, 5.దినుసు, 6.శక్యము, సం.అంతరమ్, సం.వి.దాటుట.
తరగతి - నిర్ణయించిన పద్ధతి, ప్రమాణము, తరమును తెలుపు భాగము.
తరించు - క్రి.1.దాటు, 2.అతిక్రమించు.

గోపనము - 1.దాటుట, 2.కాపాడుట, 3.గుప్తపరచుట, రహస్యముగా నుంచుట, గూఢ పరచుట, దాచిపెట్టు, మరుగు చేయుట (Concealment).
గోప్యము - రక్షింపదగినది, (వ్యవ.) రహస్యమైనది. 

అవనము - 1.కాపాడుట, 2.తృప్తి పరచుట, 3.తృప్తి, 4.కోరిక.

దాఁపరికము - గోపనము.
దాఁపు -
దాచు, చూ.దాఁగు.
దాఁపురము - 1.మరుగుపుచ్చుట, గోపనము, 2.దాచిన సొమ్ము.

నిహ్నవము - 1.అవిశ్వాసము, 2.కపటము, 3.తిరస్కారము, 4.దాపరికము, 5.నమ్మిక(నమ్మిక - నమ్మకము), 6.మరుగుమాట.
నిహ్నవించు - మరుగువెట్టు, దాచు.
నిహ్నుతి - మరుగుపుచ్చుట.

వహనము - 1.పడవ, ఓడ, 2.స్నాయువు.
పడవ -
మిక్కిలి పల్లమైనది.
రోకము - 1.ఓడ, 2.రంథ్రము, 3.వెలుగు, 4.కదలిక, 5.రొక్కపు టమ్మకము. 

పోతము - 1.పక్షిపిల్ల, 2.ఐదేండ్ల యేనుగు, 3.ఓడ.
పోతపణిజుఁడు -
ఓడ బేరగాడు.

దిగుమతి - 1.ఓడపై నుండి సరకులు దించుట, (అర్థ.) విదేశము నుండి సరకులను తెప్పించుట.

                                   

ఓడరేవు - రేవు పట్టణము.
నీరుమట్టము -
1.సమమును కనిపెట్టు సాధనము, 2.జలవ్యాప్తిగల భూభాగము.

ఓడకంబము - ఓడనడుమ వేయు నిడుపాటి కంబము.

స్నాయుః స్త్రియామ్ -
వస్తేఛాదయతి దేహం వస్నసా. వస ఆచ్ఛాదనే. - దేహమును గప్పుకొని యుండునది. పా. స్నసా. "స్నసా స్నాయుశ్చ కథితా"ఇత్య మరమాలాయాం.
స్నాతి సదా ఆర్ద్రీభవతి స్నాయుః. సీ. ప్ణా శౌచే. - ఎప్పుడును ఆర్ద్రమై యుండునది. ఈ రెండు సన్నపు నరముల పేర్లు. 

కండరము - స్నాయువు, మాంసరజ్జువు.
కండరములు - (జం.) మాంసపు కండెలు (Muscles).
స్నాయువు - సన్ననరము, సం. (జం.) ఎముకలను కలిసియుంచు ఆధారకణజాలములో నేర్పడిన పట్టి, సంధి, బంధనము. (Ligament). న్నస - సన్ననరము; వన్నన - సన్ననినరము.
సంధి - 1.కూడిక, 2.శత్రువుల తోడి పొందు, 3.సందు, 4.సొరంగము, 5.రూపకముల యొందొక అంగము, (వ్యాక.) ముందరిపదము యొక్క చివర యక్షరము, ఒకదానితో నొకటి కూడుకొనుట. ఉదా. వాడు + అన్నము తినెను = వాడన్నము తినెను.
సంధి - (జం.) కీలు, వేరుగానున్న రెండు ఎముకలు గాని గట్టిపడిన భాగములుగాని కలియుచోటు (Joint).
బంధనము - 1.కట్టు, 2.చెర, 3.తొడిమ(తొడిమ - కాడ), 4.కట్టెడు సాధనము.

తెఱఁగు - 1.విధము, క్రమము, 2.చక్కన, 3.సంధి, రూ.తెఱపు.
తెఱఁగుపడు - క్రి.సంధియగు.

కండరమండలము - (జం.) శరీరములో నున్న కండరముల సంపుటి (Muscular system).
కండరకణజాలము - మాం స పు కం డ (Muscular tissue).
కండర బంధనము - (జం.) కండరము యొక్క కొన, (ఇది కండరమును ఎముకతో అతికించును. ఆధారపు కణజాలము (Connective tissue)తో నేర్పడిన పట్టీ వంటి నిర్మాణము (Tendon).  

రేవుబోయ - ఓడనడుపువాడు.
ఓడంగి -
ఓడవాడు, నావికుడు.
నావికుఁడు - ఓడ నడుపువాడు. నావిక ధావిత మృదుపదరామ్|

మాలిమి - 1.ప్రేమము, వాత్సల్యము, 2.ఓడనడుపు శాస్త్రము. 
మాలిమికాఁడు -
ఓడనడుపు శాస్త్ర మెరిగినవాడు.

అక్కరపాటువచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి
న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడగ యుక్తమేసుమీ
యొక్కట నీటిలో మెరక నోడలబండ్లు బండ్ల నోడలున్
దక్కన వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా|
తా.
భాస్కరా ! ఒక్కొక్కప్పుడు నీటిలో నడుచు ఓడల మీద బండ్లును, నేలమీద నడచు బండ్ల మీద ఓడలును వచ్చుచుండుట నందఱును చూచున్నదియే గదా. అట్లే, తగిన అవసరము వచ్చినపుడు(ౘ)చుట్టము - 1.బంధువు, సంబంధి, 2.స్నేహితుడు.)బంధువు లొకరి నొకరు కాపాడుకొనుట మిత్రత్వమునకు మిక్కిలిమంచిది.

అరిగోలు - నదిని దాటించు సాధనములలో ఒకటి, తెప్ప. 

తరండము - 1.ఓడ, 2.తెప్ప, వ్యు.దాటించునది, తేలునది.       

ఉడుపము - తెప్ప, పుట్టి.

ప్లవము - 1.తెప్ప, 2.కప్ప, 3.కోతి.
కట్టుమ్రాను -
తెప్ప.
తెప్ప - 1.నీటిపై పడవవలె తేలగట్టిన కొయ్యలు, 2.రాశి, రూ.తేప.
తెప్పలఁదేలు - ఓలలాడు.
ఓలలాడు - క్రి.1.స్నానముచేయు, 2.ఓల ఓల యనుచు నీటిలో ఆడు.

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).

ప్లవంగము - 1.కోతి, 2.కప్ప, వ్యు.దాటుచు పోవునది. 
ప్లవంగ -
నలుబది యొకటవ(41వ) సంవత్సరము.
ప్లవ - ముప్పదియైదవ(35వ) సంవత్సరము.

టర్ టరాయణము - (జం.) కప్ప అరుపులు (Croaking of frogs).

ఉత్తరించు1 - క్రి.ఖండించు.
ఉత్తరించు2 - క్రి.దాటు.
ఉఱుకు - క్రి.1.దుముకు, 2.పరుగెత్తు, 3.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప.

కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైనను పతితులైనన్
ముప్పున దరిద్రుడైనను
దప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ!
తా.
కప్పకు కుంటికాలయినను, పామునకు రోగము వచ్చినను, (పతితుఁడు - 1.పడినవాడు, 2.పదవిచెడినవాడు.)లైనను, ముసలితనములో(ముప్పు - 1.వార్థకము, 2.విపత్తు.)దారిద్యము సంభవించిననూ మిక్కిలి కష్ట దాయకములు.

కంటకి - 1.రేగు, 2.ముండ్లు గల చెట్టు, 3.చేప, విణ. కంటకము గలది.

రేను - రేగు (బదరీ వృక్షము).
కర్కాణి లోహితాని పర్నాని ఫలాని చ ధత్త ఇతి కర్కన్ధూః, ఊ. ప్స. డు ధాఞ్ ధారణ పోషణయోః. -  కర్కమనఁగా ఎఱుపు, అటువంటి ఆకులును పండ్లును గలది.

రేఁగు - 1.విజృంభించు, 2.పైకిలేచు, 3.ఉద్రేకించు, 4.హుంకరించు, వి. బదరీ వృక్షము.

విజృంభణము - ఎగసిపాటు, ఉద్రేకము చెలెరేగుట.
ఉద్రేకము - 1.విజృంభించు, 2.అతిశయించు.
ఉద్రేకించు - 1.విజృంభించు, 2.అతిశయించు.
ఉద్రిక్తము - 1.ఉద్రేకించినది, 2.విదితము.
హుంకారించు - హుమ్మని ధ్వనించు, రూ.హూంకృతి.
ఏ(ౘ)చు - క్రి.1.అతిశయించు, 2.విజృంభించు, 3.పెరుగు, 4.ఏస రేగు. 

ఏస - విజృంభణము, విణ.1.గ్రామ్యము, 2.వక్రము, రూ.ఏచ.
ఏౘ - 1.గ్రామ్యము, 2.వంకర, రూ.ఏవ.
గ్రామ్యము - 1.అశ్లీలము, 2.అ స భ్య మ గు మాట, 3.పామరజన వాక్యము, విన.1.ఊరియందు పుట్టినది, 2.తెలివిలేనిది, 3.నాగరికతలేనిది.
అశ్లీలము - 1.(అలం.) ఒక అర్థదోషము, 2.ఒక శబ్దదోషము, 3.అసభ్యవచనము, ఏవగింపు పుట్టించినమాట, బూతు.
ఏౘకంకటిచుక్క - ఉ త్త రా షా ఢా నక్షత్రము.  
ఉత్తరాషాఢ - ఇరువది యొకటవ(21వ) నక్షత్రము.

కావ్యదోషములు - (అలం.) పదదోషములు శ్లేషము 17:- 1.అప్రయుక్తము, అపుష్టార్థము, అ స మ ర్థ ము, ని ర ర్థ క ము, నేయార్థము, చ్యుత సంస్కారము, సంధిగ్ధము, అప్రయోజనము, క్లిష్టము, గూఢార్థకము, గ్రామ్యము మొ, వి.    

పదరు - 1.త్వరపడు, 2.కోపించు, 3.చలించు, 4.అక్షేపించు, వి.త్వరితపు మాట.

చలనము - 1.కదులుట, 2.తిరుగుట, (భౌతి.) ఒక ప్రదేశము నుండి అన్య ప్రదేశమునకు ప్రయాణించుట. (Motion)
చరించు - 1.కదలు, 2.తిరుగు, 3.చేయు.

మాత్సర్యము - చలము, మత్సర్యము.
మత్సరము -
మచ్చరము, క్రోధము.
అంౘలము - 1.చలము, మాత్సర్యము 2.కోపము.
చలము - 1.చలించునది, 2.వణుకునది 3.వి.వణుకు.
కోపము - కినుక, క్రోధము.

మత్సరో (అ)న్యవుభద్వేషే తద్వత్కృపణయోస్త్రిషు,
మత్సరశబ్దము పరుల మేలు చూడఁజాలమికి పేర్గునపుడు పు. ఆమత్సరము గలవానికిని, కృపణునికిని పేరగునపుడు త్రి. మదేన సరతీతి మత్సరః, నృ గతౌ. - మదముచేత వర్తించును.
మాద్యతి పర క్లేశేన హృవ్యతీతి మత్సరః. మదీ హర్షగ్లేపనయోః. - పరుని దుఃఖముచేత సంతోషించువాఁడు. మత్సరౌ మక్షిక క్రోధా' వితి శేషః. 

కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూదిమొన, 5.కాకి, 6.తప్పు.
కంటకము2 - విరోధయుక్తి, విణ.విరుద్ధము.
విరుద్ధము - విరోధము కలది. 

కంటకద్రుమము - 1.బూరుగుచెట్టు, 2.ముండ్లచెట్టు.
బూరుగు -
 శాల్మలీ వృక్షము, రూ.బూరువు.
శాల్మలి -
1.బూరుగుచెట్టు, 2.సప్త ద్వీపములలో నొకటి.
బూరుగు దూది - (గృహ.) పట్టుప్రత్తి (Kapok).
పట్టు - ఒక జాతి పురుగులవల్ల కలిగెడు ఒక దినుసు మేలు నూలు, సం.పట్టః.

పిచ్ఛాతు శాల్మలీవేష్ట,
పరాఙ్గుసంగాత్ పిచ్ఛా - వ్రేలికి అంటుకొనునది.
శాల్మలిం వేష్టయతీతి శాల్మలీవేష్టః - బూరుగును చుట్టువాఱి యుండునది. ఈ 2 బూరుగుబంగ పేర్లు.

మోచ - 1.అరటి, 2.బూరుగు(ఆయిటి - బూరుగు).

దానము చేయనేరని యధార్మికు సంపద యుండియుండినన్
దానె పలాయనంబగుట తథ్యము, బూరుగు మ్రాను గాచినన్
దానిఫలంబు లూరక వృధాపడిపోవవె యెండి గాలిచేఁ
గానలలోన, నేమిటికిఁగాక యభోజ్యములౌట ! భాస్కరా.
తా.
బూరుగుచెట్టు బాగుగా ఫలించినను దాని ఫలములు తినరాని వగుటచే, అవి అడవిలో ఎవరికి ఉపయోగపడక ఎండిపోయి, గాలికి నేల రాలిపోవును. అట్లే ఒకరికి దానముచేయని వాని సంపద యొకప్పుడు న్నను మరి యొకప్పుడు తొలగిపోవును. 

బదరి - 1.రేగుచెట్టు, 2.ప్రత్తిచెట్టు, 3.ఒక పుణ్యక్షేత్రము.
బదతీతి బదరీ, ఈ.సీ బద స్థైర్యే. - స్థిరమై యుండునది. బదరి యందు దేవీస్థానం ఉరసి|

తుణ్డికేరీ సముద్రాన్తా కార్పాసీ బదరేతిచ,
తుండికాన్ పదనగతరోగాన్ ఈరయతి ప్రేరయతీతి తుండికేరీ, సీ. ఈర క్షేపే. - ముఖగతములైన రోగములను బోఁగొట్టునది.
దూర ప్రసరాత్సముద్రాంతా - దవ్వుగాఁ బోవునది.
జనోపకారాయ కల్పతే కార్పసీ, సీ. కృపూ సామర్థే. - జనోపకారముకొఱకు సమర్థమైనది. పా. కార్పాసీ.
బదరాభఫలత్వాద్బదరా - రేఁగుపండువంటి పండ్లు గలది. ఈ 4 ప్రత్తిచెట్టు పేర్లు.    

కార్పాసము - 1.ప్రత్తి, 2.నూలు, 3.వస్త్రము, కాగితము, విణ.నూలుతో సేయబడినది (వస్త్రము).

పత్తి - ప్రత్తి, సం.వి.1.గమనము, 2.ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱములు, ఐదుగురు కాల్వురుగల సైనికదళము, 3.కాలిబంటు.
దూది - ప్రత్తి. వస్త్రములు వేరు - దూది ఒకటే.  

నూలు - 1.ప్రత్తి వడికిన పోగు, 2.తంతువు.
తంతుకరణము - (గృహ.) నూలు వడకుట, దారము తీయుట (Spinning).
తంతువు - నూలుపోగు.
తంతువు - (భౌతి.) విద్యుద్దీపములో నుండు టంగ్ట్సన్ తీగవంటిది(Filament).

భారద్వాజీ తు సా వన్యా -
భరద్వాజ సృష్టత్వాత్ భారద్వాజీ, సీ. - భరద్వాజమునిచేఁ బుట్టింపఁబడినది. ఈ ఒకటి అడవిప్రత్తి. 

పింజ - 1.దూది, 2.పసుపు, 3.గుంపు.
పింజె - వస్త్రపుకుచ్చె, ధోవతి లోని కుచ్చిళ్ళు, సం.పింజా. 
తూలము - దూది. 
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

అథ పిచు స్తూలః -
విచ్యతే మర్ద్యత ఇతి పిచుః, ఉ. పు. పిచుమర్దనే. - ఏకఁబడునది.
తోల్యతే అనేనేతి తూలః ఉన్మానే. - తూఁచఁబడునది.    
తూలతే నిష్కోప్య్త ఇతి వా తూలః, తూల నిష్కోషణే. తచ్చ అంత ర్గతస్య బహిర్నిస్సరణం. - విప్పఁబడునది. పిచుతూలమని యొకపేరుగాఁ గొందఱు చెప్పుదురు. ఈ 2 దూది పేర్లు.

పింజనము - దూదేకు విల్లు.

దూదేకుట (దూది+ఏకుట) - (గృహ.) ప్రత్తిని పింజలుగా చేయుట, ప్రత్తి నుండి గింజలను వేరుచేయుట (Carding).

వడుకు - క్రి.దూదిని నూలుగా తీర్చు, (వ్యవ.) మోసముగ ద్రవ్యార్జనముచేయు.

పింజ-దగ్ధపద మార్జాలన్యాయము - న్యా. నలుగురు దూది వర్తకులు పిల్లిని పెంచిన కథ, అందు న్యాయాధికారి తీర్పురీతి. (కాలు కాలిన పిల్లి వలె).
దగ్ధపట న్యాయము - మడత పెట్టిన బట్ట కాలిపోయిన మడతలు మడతలుగాను నూలిపోగులు స్పష్టముగాను కంపించును, కాని చేత పట్టుకొనిన విడిపోవు ననురీతి. 

దగ్ధము - కాల్పబడినది. కొండంత దూదిని గాలుచుటకు కొండంత నిప్పు కావలెనా?

కొండంత దూది కూడా రవ్వంత నిప్పుతో కాలి బూడిద అయినట్లే పవిత్రమయిన భగవన్నామ స్వరణతో పాపపు రాశులన్నీ పటాపంచలవు తాయి. - శ్రీ రామకృష్ణ పరమహంస

ప్రత్తి రేవడి నేలలు - (వ్యవ.) కృష్ణ రేవడి నేలలు, ప్రత్తి సాగుచేయుట కుపయోగపడు ఒక విధమగు బంకనేలలు (Black cotton soils). 

ఖంజ - కుంటిది, వి.1.పసుపు, 2.దూది.
ఖంజము -
ఒక కాలు కుంటియైనది.

కుంటు - క్రి.చక్కగా కాలూనక నడుచు.
కుంటుపడు -
క్రి.1.తగ్గు, 2.సొట్టపడు, 3.చెడు.
తగ్గు - క్రి.తక్కువగు, 2.వెనుదీయు, 3.తెగిపడు, వి.తక్కువ.
తగ్గుదల - తక్కువ; తక్కువ - కొరత. 
చెడు - క్రి.1.కనబడకపోవు, 2.కొల్లపోవు, 3.నశించు. నశించు - క్రి.నాశమగు.
దుర్మరణము - చెడు.
ప్రిదులు - క్రి.1.సడలు, 2.విరియు, 3.తగ్గు, 4.ఊడు, 5.జారు, 6.తొలగు, సం.భిద్, ప్రదృ.
సళ్ళు - క్రి.సడలు, సం.ళ్లథ్.
సడలు - క్రి.1.ఊడు, 2.జారు, 3.వదలు, వి.వదలుట, రూ.సళ్లు, సం.శ్లథ్.
శ్లథము - శిథిలమైనది, వదులైనది.
శిథిలము - సంధులు వదిలినది, శ్లథము. 

తూలు - క్రి.1.చలించు, 2.తొలఁగు, రూ.తూలబాఱు, తూలాఱు, తూలిపడు.
తూలబాఱు - చలించు.

కుదియు - క్రి.1.అడగు, క్రుంగు, 2.తగ్గు, మరల, వెనుదీయు.
క్రుంగు - 1.(క్రిందికి) అణగు, 2.దిగబడు, 3.తగ్గు, 4.హ్రస్వమగు, 5.నీరసించు.
కుంచు - క్రి.కుంగజేయు, కుదించు.

ఓహటము - వెనుదీయుట.
ఓహటించు - క్రి.వెనుదీయు.
ఓహటిల్లు - క్రి.వెనుదీయు.

తెగుపడు - క్రి.వేరుపడు.

అపచితము - (రసా.) 1.తగ్గించబడినది, 2.ఆమ్లజని తీసివేయబడినది, వి.తగ్గుట.     

వస్త్రము - బట్ట, వలువ.
వలువ - సన్నవస్త్రము, బట్ట.
బట్ట - 1.పశువుల మేని చార, విణ.వెండ్రుక లూడినది, 'బట్టతల ' వై.వి.వస్త్రము, సం.పటః
బట్టల దొంతర్లు - (గృహ). బట్టల రాసుల మూటలు (Bales).
దుస్తు - 1.ఉడువు, 2.అందము, విణ.ఎక్కువ.
ఉడువు1 - క్రి. ఉడుగు. 
ఉడువు2 - నక్షత్రము.
ఉడువు - క్రి.1.అణగించు, 2.పోగొట్టు, వి.దుస్తు. 
ఉడువులు - (గృహ.) దుస్తులు (Clothing).
దుస్తులు - (గృహ.) బట్టలు, వస్త్రములు ఉడువులు (Garments or clothes).
దుస్తులచెయ్యి - (గృహ.) మీద దుస్తుల లోని చేతి భాగము (Sleeve).

అస్తరు - (గృహ.) గుడ్డతో చేర్చి కుట్టిన మరియొక గుడ్ద (Lining).

వస్త్ర మాచ్ఛాదనం వాస శ్చేల వసన మంశుకమ్,
వస్యతే అనేనాంగమితి వస్త్రం. వాసః. స. స. వసనం చ.వస ఆచ్చాదనే. - దీనిచేత అంగము కప్పఁబడును గనుక వస్త్రము, వాసస్సు, వసనము.
అచ్ఛాద్యతే అనేన ఆచ్ఛాదనం. ఛద ఆపవారణే. - దీనిచేత కప్పఁబడును.
చిల్యతే చేలం. చిల వసనే. - కట్టుకొనఁబడునది.
అంసుభిస్తంతుభిః. కాయతి అంశుకం. కై శబ్దే. - తంతువులచేత ఇంచుకంత పలుకునది. ఈ 5 కోకపేర్లు. నక్త కది శబ్దములు 6 కోకపేర్లని కొందరు.  

ఆచ్ఛాదనము - 1.కప్పుట, 2.వస్త్రము.
కప్పు - 1.ఆచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు, 4.చీకటి, క్రి.1.క్రమ్ము, 2.మూయు.
క్రమ్ము - 1.కవియు, వ్యాపించు, 2.పైకుబుకు.

ఆచ్ఛాదనే సంపిధాన మపవారణ మిత్యుభే,
ఆచ్ఛాదనశబ్దము వస్త్రమునకును, కప్పుటకును పేరు. ఆచ్ఛాద్యతే అనేనేతి ఆచ్ఛాదనం. ఛద అపవారణే. - దీనిచేత కప్పఁబడును కనుకను, కప్పుట గనుకను అచ్ఛాదనము.   

చీర - వస్త్రము (ఇది వాడుకయందు స్త్రీవస్త్రమాత్ర పర్యాయముగ కానబడుచున్నది. నేడు "కోక" అను అర్థమున రూఢము).
కోక - వలువ, చీర.
వలువ - సన్ననివస్త్రము, బట్ట.

స్థగితము - కప్పు.
స్థగితము - 1.కప్పబడినది, 2.కూర్పబడినది.    

కప్పుకుత్తుక పులుగు - నెమలి, నీలకంఠము.
నీలకంఠము - 1.నెమలి, 2.పిచ్చుక (నల్లని కంఠము కలది).
చటకము - పిచ్చుక.

చటకః కలవిఙ్కస్స్యాత్ -
చటతి ధాన్యాదికమితి చటకః చట భేదనే. - ధాన్యాదులను బొడిచి తినునది.
సుఖం యథా భవతితథా లపతి కలవింకః, లప వ్యక్తాయాంవాచిః. - సుఖముగా బలుకునది. ఈ 2 పిచ్చుక పేర్లు. 

కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
కఱివేల్పు -
కృష్ణుడు, నల్లనయ్య.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.

కప్పుఁదెరువరి - అగ్ని.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.

వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు(ఆవాసము), వి.వెదురు.
ఆవాసము - ఇల్లు.

వాసః కుటీ ద్వయోః శాలా సభా -
వసంతత్యస్మిన్నితి వాసః నివాసే. - దీనియందు జనులు నివసింతురు.
కుటతి కుటిలీభవతీతి కుటీ. - కుట కౌటిల్యే వక్రమగునది.
శలన్త్యస్యామితి శాలా, ప్స, శలగతౌ. - దీనియందు జనులు చేరుదురు.
శాల్యతే శాలా. శాలా శ్లాఘాయాం. - కొనియాడఁ బడునది.
సహభాంత్యస్యామితి సభా - దీనియందుఁ గూడికొని ప్రకాశించురు.
సమగ్భాతీతి సభా - లెస్సగా నొప్పునది ఈ 4 సభాగృహము పేర్లు.

కొటిక - 1.చిన్నగ్రామము, పల్లె, 2.నగరము, సం.కుటీ, విణ.పొట్టివాడు.
గూడెము - 1.కొండ ప్రాంతమందలి బోయపల్లె, 2.చిన్న గ్రామము, ఉదా. గొల్ల గూడెము మొ. వి రూ.గోడెము.
ఖండిక - 1.చిన్నపల్లె, రూ.ఖండ్రిక, కండ్రిక, 2.పన్ను లేకుండ గుత్తకిచ్చిన భూఖండము.
ఖండ్రిక - ఖండిక.

నగరము - పట్టణము, రూ.నగరి.  
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమైన ప్రథాననగరము. 
పుటభేదనము - పట్టణము, రూ.పుటభేదము. 
నగరభూగోళశాస్త్రము - (భూగో.) పల్లెలయు, పట్టణములయు వివరములు తెల్పు భూగోళశాస్త్రము.

నగరు - 1.రాజగృహము, 2.దేవగృహము, రూ.నవరు.
ప్రాసాదము - 1.దేవాలయము, 2.రాజగృహము.
దేవాలయము - గుడి; దేవళము - దేవాలయము, గుడి, సం.దేవాలయః.
మందిరము - 1.ఇల్లు, 2.పట్టణము, 3.దేవగృహము, 4.దేవపీఠము.
ఇలు - గృహము, రూ.ఇల్లు.    
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
ఆలయము - 1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి. ఇంటి కన్నా గుడి పదిలంట!

కోవెల - గుడి, వై.వి. కోకిలము.
కోకిలము - కోయిల. 
గుడి - 1.పరివేషము, 2.వలయ రేఖ, 3.ఇకార చిహ్నము (9), 4.దేవాలయము, సం.కుటీ.
గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకార చిహ్నము.   

అడుగడుగున గుడి వుంది
అందరిలో గుడి వుంది
ఆ గుడిలో... దీపముంది.. అదియే దైవం...

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
గుడిసె - గుండ్రని చిన్న ఆకుటిల్లు, సం.కుటీరః.
కుటీరము - గుడిసె, వ్యు.కుటిలమగు(వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు; తీఁగయిల్లు - పొదరిల్లు. కుడుంగము - పొదరిల్లు.
కుటీర పరిశ్రమలు - (వ్యవ.) కుటుంబ వృత్తులు, కర్మాగారముల అవసరము లేకుండ, వ్యవసాయదారు ఊత్పత్తిచేయు దినుసులనుగాని, గ్రామ పరిసరములలో లభ్యమగు ముడిపదార్థము లనుగాని ఉపయోగార్హముగ జేయు పరిశ్రమలు గృహపరిశ్రమలు. (ఇట్టి పరిశ్రమలలో ముఖ్యముగ కుటుంబములోని వారే పనిచేయుదురు. ఇతరులను ఇట్టి పరిశ్రమలలో నియమించుట అసాధారణము.) ఉదా. బుట్టలు అల్లుట, (Cottage industries).

ఆకుటిల్లు - (ఆకు + ఇల్లు)ఆకులతో కప్పిన గుడిసె, పర్ణశాల.
పర్ణశాల - ఆకుటిల్లు. 

మంజులము - 1.పాచి, శైవలము, 2.పొదరిల్లు, విణ.ఒప్పిదమైనది.

ఆయతనము - 1.ఇల్లు, 2.ఆశ్రయము, 3.యజ్ఞశాల, 4.దేవాలయము, 5.బౌద్ధాలయము, 6.(భౌతి., రసా.) ఒక వస్తువు యొక్క ఘనపరిమాణము (ద్రవముల విషయమై 'ఆయతనము' ఘనపరిమాణార్థమున ప్రయోగములో ఉన్నది.) ఒక వస్తువు ఆక్రమించు చోటు, ఒక ద్రవము ఆక్రమించు చోటు (Volume).

కొట్ర1 - వామనుడు, సం.ఖటేరుకః.
కొట్ర2 - పిండి మొ.ని ఉడక బెట్తుటకు పెట్టిన ఎసరు.

శాల - ఇల్లు.
సాల - శాల, ఇల్లు, సావిడి, సం.శాలా.

సభ - 1.కొలువుకూటము, 2.సమూహము, 3.జూదము.
దర్బారు - కొలువుకూటము.
సభికుఁడు - 1.సభాసదుడు, 2.జూదమాడించువాడు.
సభాసదుఁడు - సభాస్తారుడు, సభ యందుండు ధర్మజ్ఞుడు.
పారిషదుఁడు - 1.శివభటుడు, 2.రాజున కనుచరుడు, 3.సభ్యుడు.
భృంగి - శివభృత్యులలో నొకడు.
అనుచరుఁడు - 1.సహాయుడు, 2.భృత్యుడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు. 
భృత్యుఁడు - సేవకుడు, పనివాడు.  
సభ్యుఁడు - 1.సభయందుండువాడు, మంచివాడు.

చేలము - వస్త్రము, రూ.చేల, సేల.
సేల - చేల, వస్త్రము, సం.చేలమ్. 
చిల్యతే చేలం, చిల వసనే. - కొట్టు కొనఁబడునది.

సుచేలకః పటో స్త్రీ స్యాత్ -
శోభనశ్చాసౌ చేలకశ్చ సుచేలకః. - మంచివలువ.
పటతి వాయునా పటః, అ.ప్న. పట గతౌ. - వాయువుచేత కదలునది.
పటయతి దేహం పటః, పత వట గ్రంథే. గ్రంథో వేష్టనం, - దేహమును గప్పునది. ఈ 2 మంచికోక పేర్లు.

పరజనులు కట్టి విడిచిన
వరచేలములైనఁ గట్టవలదు; * వలువలన్
నెఱిమాయు మడత మార్చుచు
ధరియించుట యొప్పదండ్రు: ధరను గుమారా!

తా. ఇతరులు కట్టుకొని విడిచివేసిన (వస్త్రము)గుడ్దలను ఎంత మంచివైనను కట్తుకొనరాదు. మాసిన వస్త్రములు మడతలు మార్చి కట్టుకొన రాదు. 

వసనము - 1.వస్త్రము, 2.ఉనికి.
వసతి - 1.ఇల్లు, ఉనికి. నివసతి - ఇల్లు.
ఉనికి - 1.ఉండుట, స్థితి, 2.స్థానము, 3.నివాసము, ఉనికిపట్టు, 4.మృగములకై పొంచియుండుట, రూ.ఉనుకువ, (గణి.) ఒక వస్తువు ఉన్నచోటు (Position).   
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.  
స్థానభ్రంశము - (గృహ.) 1.కీలు స్థానము తప్పుట, 2.కీలు తప్పించుట, 3.పట్టు వదిలించుట, 4.బెణికుంచుట (Dislocation).  

నివాసము - ఇల్లు, రూ. నివసనము, వాసము.
నివాసి - వాసముచేయువాడు.

అంతరీయము - కట్తుబట్ట, పరిధానము.
కట్టుఁగొంగు - కోకయొక్క కట్టుకొను చెరగు.

అన్తరీ యోపసంవ్యాన పరిధానా వ్యధో అంశుకే,
నాభే రంతరే భవం అంతరీయం. – నాభి యొక్కయు పిక్క యొక్కయు నడుమనుండునది.ఉపసంవీయతే అనేనేతి ఉపసంవ్యానం, వ్యేఞ్ సంవరణే. – చుట్టఁ బడునది.
పరిధీయతే అనేనేతి పరిధానం డుధాఞ్. ధారణపోషణయోః. - ధరింపఁబడునది.
అధాస్థ్సితం అంశుకం అధోంశుకం. – క్రింద నుండు కోక. ఈ 4 కట్టుచేర పేర్లు.
 
పరిధానము - ధోవతి.
దోవతి - మగవాని కట్టువత్రము.
కట్టుగోక - మొలగుడ్డ, ధోవతి.

వేషువ - ధోవతి, సం.వేష్టితమ్.
వేష్టించు - క్రి.పరివేష్టించు.

అంకుశము - 1.వస్త్రము, 2.సన్నని వస్త్రము, 3.ఉత్తరీయము, పైట, 4.మృదుకాంతి, (వృక్ష.) ఆకుపత్రి.

సంవ్యానము - 1.ఉత్తరీయము, 2.వస్త్రము.
ఓణి - 1.ఉత్తరీయము, కండువా, 2.యుక్త వయస్సు వచ్చిన ఆడువారు పరికిణి పైన భుజముపైకి వేసికొను పైట.
కండువ - ఉత్తరీయము.
ఉత్తరవాసము - పై వస్త్రము, ఉత్తరీయము. 
ఒలె - వస్త్రము, ఉత్తరీయము, రూ.ఒల్లె, ఒల్లియ, వల్లె, వల్లియ. 
ఒల్లియ - ఒల్లె; ఒల్లె - ఒలె.
ఒల్లెవాటు - మెడచుట్టి వచ్చు నట్లు భుజముల మీద వైచుకొనుట, రూ.వల్లెవాటు.
వలెవాటు - వల్లెవాటుగా వైచుకొనిన ఉత్తరీయము.

పైఁట - పయట, సం.పైఠా.
పయఁట - స్త్రీల రొమ్ముమీదివస్త్రము చెరుగు, రూ.పయ్యఁట, పైట, సం.ప్రతిష్ఠానమ్, పై ఠా.
పైయ్యెద - (పై+ఎద) పయట, రూ.పయ్యద.

కోలము1 - 1.రేగుపండు, 2.పంది, 3.ఒడి, 4.కౌఁగిలి, 5.తెప్ప.
కోలము2 - ఒకవిధమైన నాట్యము.
కోలతి నిబిడావయవత్వాత్ కోలీ, ఈ సీ. కులసంస్త్యానే. - దట్టమై యుండునది.

                                    

ఫేనిలము - నురుగుకలది, వి.1.కుంకుడు, 2.రేగిపండు.

                                         

మిత్రుడు - 1.హితుడు, 2.సూర్యుడు.
సర్వభూతేషు మేద్యతి స్నిహ్యతీతి మిత్రః, ఞి మిధా స్నేహనే - సర్వభూతములయందు స్నేహయుక్తుఁడు.

మిత్రో రవావపి,
మిత్రశబ్దము సూర్యునికి పేరగునపుడు పు. అపిశబ్దమువలన చెలికానికి పేరగునపుడు న, మేద్యతీతి మిత్రః. ఞి మిధా స్నేహనే. - స్నేహించువాఁడు.

సుహృదుఁడు - మిత్రుడు.

జ్యేష్ఠంబున మిత్రాభిధానంబున నత్రి పొరుషేయుండు; తక్షకుండు మేనక హాహా రథస్వనుం డను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; జ్యేష్ఠ మాసంలో సూర్యుడు మిత్రుడన్న పేరు దాల్చి అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హా, హ రథస్వనుడు అనే పరిచరులతో కలిసి ప్రవర్తిస్తుంటాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
అనసూయ - 1.అసూయలేమి, 2.అత్రిమహర్షి భార్య.
తక్షుడు - తక్షకుడు; తక్షకుఁడు - 1.నాగరాజు, 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
పొరుషేయము - పురు షుడు చేసినది (వేదములు పౌరుషేయములు కావు).
పౌరుషము - 1.పురుషము, 2.పురుష ప్రయత్నము, పురుష వ్యాపారము, 3.పరాక్రమము.
పురుషకారము - పురుషప్రయత్నము.
పురుషార్థములు - ధర్మార్థకామ మోక్షములు.
మేన1 - మేనక.
మేనకాయాః ఆత్మజా మేనకాత్మజా - మేనక కూతురు, పార్వతీదేవి. 
మేన2 - తోడబుట్టిన దాని యొక్కయు, తల్లిదండ్రుల తోడబుట్టిన వారి యొక్కయు దేహసంబంధము, ఉదా. మేనకోడలు, మేనత్త.

చిత్రభానుఁడు - 1.అగ్ని, 2.సూర్యుడు.
చిత్రాః భానవో యస్యసః చిత్రభానుః, ఉ-పు. - నానావర్ణములైన కిరణములుగలవాఁడు.
చిత్రభాను - అరువది సంవత్సరములలో నొకటి.

సూర్య వహ్నీ చిత్రభానూ :
చిత్రభాను శబ్దము సూర్యునకును, అగ్నికిని పేరు.
చిత్రాః భానవోయస్య సః చిత్రభానుః – నానావిధము లైన కిరణములు గలవాఁడు.

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్రకంఠము -
1.కపోతము, 2.గువ్వ. 
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
గువ్వ - 1.అడవిపావురము, 2.పక్షి.

పారావతః కలరవః కపోతః :
పారేన బలేన అవతీతి పారావతః అవ రక్షణాదౌ. - పారమనఁగా బలము. దానిచేతః బోవునది.
కలః రవః అస్యేతి కలరవః - అవ్యక్త మధురమైన ధ్వని గలది.
శీఘ్రగామిత్వేన కస్య వాయోః పోత ఇవ కపోతః - వేగముచేత వాయువు కొదమ వలె నుండునది. ఈ మూడు పావురము పేర్లు.

పావురాయి - పావురము, సం.పారవతః. 
పారావతము -
పావురము.
కలరవము - పావురము.
కపోతము - పావురము, గువ్వ, పారావతము.
కాపోతము - 1.బూడిద రంగు గలది, 2.కపోత సంబంధమైనది. 
కూకి - ఒక రకము పావురము. 

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
స్వాహా : అగ్ని భార్య. మహేశ్వరి యందు దేవీస్థానం స్వాహా| ఆమె దయవల్లనే దేవతలకు హవిర్భాగాలు అందుతున్నాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు చేసే యజ్ఞములకు సంబంధించిన హవ్యము దేవతల ఆహారమై ఆకలిని పోగొట్టుతుంది. 

స్వాహా అనే ఆమె పేరు చేర్చకుండా యిచ్చే ఆహుతులను అగ్ని స్వీకరించడు.

అగ్నిదేవునకు దక్షుని కూతురయిన స్వాహాదేవి అను భార్యవల్ల హవిస్సులే భోజనంగాగల పావకుడు(పావకుడు - అగ్ని), పవనుడు, శుచి అనే ముగ్గురు కొడుకులు కలిగారు.

శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

గభస్తి నేమి స్సత్త్వస్థః సింహో భూత మహేశ్వరః|
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః||

స్వాహా - ముగ్గురు కొడుకులు (ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అని పేర్లు.)
ఆహవనీయము - హోమము చేయదగినది (హవిరాది) వి. త్రేతాగ్నులలో ఒకటి. (తక్కిన రెండు 1.దక్షిణాగ్ని, 2.గార్హ పత్యాగ్ని).
గార్హపత్యము - 1.మూడు శ్రౌతాగ్నులలో ఒకటి, (మూడు శ్రౌతాగ్నులు గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని) 2.గార్హస్థ్యము.
గార్హస్థ్యము - 1.గృహస్థాశ్రమము 2.గృహస్థధర్మము 3.గృహస్థుడు ప్రతి దినము అనుషింప వలసిన పంచయజ్ఞములు మొ.ని.

ఔపాసనము - గృహస్థుడగు బ్రాహ్మణుడు ప్రాతఃకాలమునందు చేయు అగ్ని ఉపాసన.

ముచ్చిచ్చు - (మూడు+చిచ్చులు) త్రేతాగ్ని (గార్హస్పత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని).

త్రేత - 1.రెండవ యుగము, 2.గార్హపత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము అను మూడగ్నులు, తేతాగ్ని.

త్రేతా త్వగ్నిత్రయే యుగే :
త్రేతా శబ్దము గార్హపత్యము మొదలైన మూఁడగ్నులకును, యుగమునకును పేరు. త్రిత్వమితా ప్రాప్తా త్రేతా. ఇణ్ గతౌ. త్రిత్వ సంఖ్యను బొందినది. టీ. స. త్రీ న్ ధర్మపాదాన్ ఇతా త్రేతా. తదుక్తం. "త్రేతాయుగే తు సంప్రాప్తే దర్మః పాదోనతాం గత"ఇతి.

త్రేతాయాం వర్తమానాయాం కాలః కృతసమో భవత్ |
రామే రాజని ధర్మజ్ఞే సర్వభూత సుఖావహే |

పూర్ణాహుతి - హోమాంతమందు ప్రీతికై పరిమళద్రవ్యాలతో చేయు హోమము.

అగ్ని హోత్రం గృహంక్షేత్రం గర్భిణీంవృద్ధ బాలకా|
రిక్త హస్తేన నోపే తో ద్రాజానందైవతం గురుమ్||

తా. అగ్ని హోత్రునకు మంత్ర పూర్వ కాహుతు లిచ్చునపుడును, గృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బాలురు, రాజులు, దేవుడు వీరుల కడకు వట్టి చేతులతో బోరాదు, అనఁగా ఫలాదులు తీసికొని పోవలయును. - నీతి శాస్త్రము.

విహాయ సగతిర్జ్యోతిః స్సురుచిః హుతభుగ్విభుః
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః - 94శ్లో

గభస్తి - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు, 3.అగ్నిభార్య, స్వాహాదేవి.
గోజ్ఞేయవర్గః తం బభస్తి దీపయతీతి గభస్తి, ఇ.పు. భసభర్త్సనదీస్త్యోః. - వస్తువులను జూపునది.    

రుచి - 1.ఇచ్ఛ 2. చవి, 3.కాంతి 4.సూర్యకిరణము.(లోకో భిన్నరుచిః) 
రుచి - (రసా.) నాలుకతో గుర్తించ బడు వస్తుగుణము, ఉదా. పులుపు, తీపి, చేదు.
ౘవి - 1.రుచి, 2.రసము. ౘప్పరించు (నాలిక) - చవిచూచు.
రసభరితము - (వృక్ష.) రసముతో నిండినది.
రుక్కు - 1.కాంతి, 2.సూర్యకిరణము, 3.ఇచ్ఛ.  
ఇచ్ఛ - అభిలాష, కోరిక.
అభిరుచి - 1.అత్యాసక్తి,  2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినవి (Taste).

రసజ్ఞుఁడు - పండితుడు, విణ.రుచి నెరిగినవాడు, కళాసౌందర్యవేత్త.

రసజ్ఞా రసనా జిహ్వా :
రసం జానాతీతి రసజ్ఞా. జ్ఞా అవబోధనే. - రసము నెఱుఁగునది.
రస్యతే అనయా రసనా. రస అస్వాదనే. - దీనిచేత నాస్వాదింపఁబడును. 
హ్వయతి రసవద్వస్తు జిహ్వా. హ్వేఞ్ స్వర్థాయాం శబ్దే చ. - రసయుక్తమైన వస్తువుల నిచ్ఛయించునది. ఈ మూడు నాలుక పేర్లు.

రస - 1.నాలుక, 2.రసాతలము.
రసన - నాలుక; నాలుక - నాలిక.
నాలిక - జిహ్వ, రూ.నాలుక, నాల్క.
జిహ్వ - నాలుక. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి. 
జిహ్వాచాపల్యము - తినవలెననెడి కోరిక.

ముఖపాకము - (గృహ.) నాలుక పూత (Red-tongue) విటమిన్ 'B 12 లేక ' డి ' లోపము వలన కలుగు వ్యాధి (Stomattis).

లోల - 1.నాలుక, 2.లక్ష్మి, విణ. 1.కదలునది, 2.మిక్కిలి యిచ్ఛగలది.

లోలశ్చల సతృష్ణయోః,
లోలశబ్దము కదలుదానికిని, ఆశ గలవానికిని పేరు.
లోలతీతి లోలః, లుల సంచలనే. - కదలునది.

చేప రసనేద్రియం జిహ్వ(నాలుక) వల్ల : ఇంద్రియ నిగ్రహం లేక నశించిపోతుంది.

వర్చస్సు - 1.కాంతి, 2.రూపము.
భాతి - 1.కాంతి, 2.రీతి. 
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి. 
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు. 

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్త్రబాంధవాః|
జిహ్వాగ్రే బంధసంప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం||

తా. నాలుకవలన సంపద (గ)కలుగును, నాలుకవలన చుట్టాలు స్నేహితులు వత్తురు, నాలుకవలన సంకెళ్ళు ప్రాప్తమగును, నాలుకవలన చావును కలుగును. – నీతిశాస్త్రము

                                                  

ముఖతస్తాలునిర్భిన్నం జిహ్వా తత్రోపజాయతే|
తతో నానారసో జజ్ఞే జిహ్వయా యో ధిగమ్యతే||    

 

విరోచనుఁడు - ప్రహ్లాదుని కొడుకు.
విశేషేణరోచతే ప్రకాశత ఇతి విరోచనః, రుచ దీప్తౌ - విశేషముగాఁ బ్రకాశించువాఁడు.

చన్ద్రాగ్న్యర్కా విరోచనాః,
విరోచనశబ్దము చంద్రునికి, అగ్నికి, సూర్యునికిని పేరు. విరోచత ఇతి విరోచనః రుచ దీప్తౌ. -  ప్రకాశించువాఁడు. "విరోచనో బలేస్తాత" ఇతి శేషః.

విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
విభాప్రదైవ వసుద్రవ్యమస్య విభావసుః, ఉ.పు. - కాంతియే ధనముగాఁగలవాఁడు. 

సూర్యవహ్నీ విభావసూ,
విభావసుశబ్దము సూర్యునికి, అగ్నికిని పేరు. విభైవ వసు ధనమ స్యేతి విభావసుః. పు. - ప్రభయే ధనముగాఁ గలవాఁడు. 'విభావసుర్హారభేద ' ఇతి శేషః.

విభవము - సంపద, ఐశ్వర్యము.
విభవతి కార్యసిద్ధౌ సమర్థో భవతీతి విభవః, భూ సత్తాయాం. - కార్యసిద్ధియందు సమర్థమైనది.
విభవ - రెండవ తెలుగు సంవత్సరము.

ప్రభ - 1.వెలుగు, 2.సూర్యునిభార్య, 3.కుబేరుని నగరము.

విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ – చంద్రాదులచేతఁ ప్రకాశించునది.

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ |
ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ||

గ్రహపతి - 1.సూర్యుడు.
గ్రహాణాంపతిః గ్రహపతి ఇ.పు. - గ్రహములకుఁ బ్రభువు.

గ్రహము - 1.రాహుగ్రహము, 2.అనుగ్రహము, 3.చెర, 4.యుద్ధప్రయత్నము, 5.పిశాచము, 6.సూర్యాది నవగ్రహములు (సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు), (భౌతి.) ఆకాశములో సూర్యునిచుట్టు తిరుగుచు స్థిరముగా కాంతిని వెదచల్లెడు ఖగోళరాశి (Planet). గ్రహములను ఎవరు – నడవమన్నారు ?

ఖగము - 1.పక్షి, 2.బాణము, 3.గ్రహము, వ్యు.ఆకాశమున పోవునది.
ఖగపతి -
గరుడుడు.

ఖగోళము - ఆకాశమండలము.
ఖగోళశాస్త్రము -
(ఖగో.) నక్షత్రములు, గ్రహములు మొ.గు వానిని గూర్చి తెలుపు శాస్త్రము (Astronomy).

పక్షి - (పక్షములు గలది) పులుగు.
పక్కి -
పక్షి, పులుగు, సం.పక్షి.
పులుఁగు - పిట్ట.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు. సేవకుఁడు – కొలువుకాడు.

బాణము - అమ్ము.
అమ్ము1 - 1.బాణము, 2.వీపు మీది నఖక్షతము, సం.అంబకమ్.
అమ్ము2 - విక్రయించు, వెలకు ఇచ్చు.

తూపు - బాణము.
తూపురిక్క -
శ్రవణ నక్షత్రము.
తూపురిక్కనెల - శ్రావణమాసము.

గరుత్మంతుఁడు - 1.గరుడుడు, వ్యు.సారవంతమైన రెక్కలు గలవాడు, 2.అగ్ని.
సుపర్ణుఁడు -
గరుత్మంతుడు, వ్యు.మంచి రెక్కలు గలవాడు.
వజ్రతుండుఁడు - గరుడుడు, వ్యు.వజ్రము వంటి ముక్కుగలవాడు.
బొల్లిగ్రద్ద - గరుడుడు; బొల్లి - 1.తెల్లనిది, 2.తెల్లనివాడు.
వైనతేయుఁడు - గరుడుడు, వినతా తనయుడు, అసూరుడు.
నాగాంతకుఁడు - గరుడుడు, వ్యు.పాములను చంపువాడు.

ఆళువారు - 1.హరిభక్తుడు, 2.గరుత్మంతుడు, రూ.ఆళ్వారు.

గరుడధ్వజుఁడు - వెన్నుడు, విష్ణువు.
వెన్నుఁడు -
విష్ణువు, సం.విషుః.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.

పక్షిణాం బలమాకాశం మత్స్యానా ముదకం బలమ్|
దుర్బలస్య బలంరాజా బాలానాం రోదనం బలమ్||
తా.
పక్షులకు ఆకాశము బలము, చేపలకు నీళ్ళు బలము, బలహీనునకు రాజు బలము, బాలురకు రోదనము బలము. – నీతిశాస్త్రము

సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్ |
సూర్యసూతమనూమారుం చ కద్రూర్నాగాననేకశః |

త్విషాంపతి - సూర్యుడు.
త్విషాం ప్రభాణాం పతిః త్విషాంపతిః, ఇ.పు. - కాంతులకు పతి. అలుక్సమానము.
త్విట్టు - 1.జిగి, కాంతి, 2.మంట, 3.వెలుగు, రూ.త్విష.  

జిగి - కాంతి.
జిగిలి - చక్కనైనది.

అహర్పతి- 1.సూర్యుడు, 2.శివుడు, 3.జిల్లేడు.
అహ్నపతిః అహర్పతిః, ఇ. పు. - పగటికిఁ బ్రభువు. అహస్కరుఁడు - సూర్యుడు.

భానుఁడు - 1.సూర్యుడు, 2.ఒక సంస్కృత నాటక కవి.
భాతీతి భానుః, ఉ.పు. భాదీప్తౌ - ప్రకాశించువాఁడు.

భానూ రశ్మి దివాకరౌ,
భానుశబ్దము కిరణమునకును, సూర్యునికిని పేరు. భాతీతి భానుః, భా దీప్తౌ. - ప్రకాశించును గనుక భానువు.

రశ్మి - (భౌతి.) 1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.

భానువు - 1.సూర్యకిరణము, 2.సూర్యుడు.
భా -
1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు. భామము - 1.కోపము 2.రోషము 3.సూర్యకిరణము.

భామ - స్త్రీ. భామలలో దేవీస్థానం తిలోత్తమ|
భామిని -
1.క్రీడాసమయమందు కోపము చూపెడు స్త్రీ, 2.స్త్రీ.

కోపనా సైవ భామినీ :
కోపశీలా కోపనా - కోపమే స్వభావముగాఁ గలిగినది.
భామ్యత్యవశ్యం కుప్యతి భామినీ. భామక్రోధే. - అవశ్యము కోపగించు కొనునది. ఈ రెండు కోపముగల స్త్రీ పేర్లు.

భాముఁడు - 1.సూర్యుడు, 2.బావ.
బావ -
తోడ పుట్టిన దాని మగడు, సం.భావుకః.
భావుకుఁడు - తోడపుట్టిన దాని మగడు, బావ. 

భానుఁడు తూర్పునందు గనుపట్టినఁబావక చంద్రతేజముల్
హీనతజెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము సేయుచున్నఁ బరదై వమరీచు లడంగ కుండునే
దానవ గర్వనిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ.

తా. సూర్యుని కాంతికి అగ్ని మొదలయినవాని కాంతులడంగునట్లు జగత్తతయు ప్రకాశించున్నా నీ పదధ్యానము యొక్క ప్రకాశమునకు ఇతర దేవతల(మరీచి - 1.కిరణము, 2.వెలుగు, 3.ఎండమావులు, 4.ఒక ప్రజాపతి.)ప్రకాశములు అడఁగిపోవును.    

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొ దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).     

అగ్రే వహ్నిః పృష్ఠే భానుః రాత్రౌ చుబుకసమర్పిత జానుః,
కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశా పాశః. - భజగోవిందం 

హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకాణా మింద్రియాణామీశః - ఇంద్రియములకు నీశ్వరుఁడు.

హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
హంతి తమ ఇతి హంసః హన హింసాగత్యోః - తమస్సును బోఁగొట్టువాఁడు.

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.
అంౘ1 -
హంస, సం.హంసః.
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
అంౘరౌతు - హంస వాహనముగా గలవాడు, బ్రహ్మ. చతుర్థం హంసవాహనా|

బ్రహ్మము - 1.హంసుడు, 2.వేదము, 3.పరమాత్మ, 4.తపము.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ - (వేదాం.) 1.జీవాత్మతో గూడి యుండు పరమాత్మ, 2.మనస్సు.

తురీయము - బ్రహ్మము, విణ.నాల్గవది, రూ.తుర్యము.

ఖ - ఒక అక్షరము, వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.    
రవి - 1.సూర్యుడు Sun, 2.జీవుడు.
జీవుఁడు - 1.ప్రాణి(శరీరి - ప్రాణి), 2.బృహస్పతి.

హృషీకము - ఇంద్రియము.

ఇంద్రియము - 1.త్వక్ఛక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు(5) అను సంఖ్య.      

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్ష జ్ఞానము (Perception). 

స్వర్గము - దేవలోకము; త్రిదశాలయము - స్వర్గము.

నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకౌకసుఁడు -
1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.
నాకిని - దేవత స్త్రీ; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
నాకేశుఁడు - ఇంద్రుడు.

ఖచరుఁడు - 1.దేవుడు, 2.సూర్యుడు, వ్యు.ఆకాశమున చరించువాడు. 

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).

అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామా తురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వమ్||
తా.
ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్ష గలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలి కొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. – నీతిశాస్త్రము

చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్డకేలు వేలుపు.
చతుర్భుజః చత్వారో భుజా యస్యసః - నాలుగు భుజములు గలవాఁడు.
ఉడ్డకేలు వేలుపు - చతుర్భుజుడు, విష్ణువు.

నలు - సమాసమందు నాలుగునకు వచ్చు రూపము, (నలుమోములు).
నలుగడ - నాలుగు ప్రక్కలు.

కొల్లారము - చతుశ్శాల నడుమ బయలును నాలుగుప్రక్కల కట్టడమును గల యిల్లు, రూ.కొలారము, కొల్లారు.      

ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
(ౘ)చౌ - నాలుగు, రూ.చవు, (చౌకమునకు సమాంతరగత రూపము) సం.చతుః.
(ౘ)చౌకము - 1.చతుష్కము, నాలుగు, 2.చదరముగ నుండు తుండుగుడ్డ, రూ.చవుకము, సం.చతుష్కమ్. 
చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
ౘవికె - చతుష్కి, మండపము, రూ.చవిక, చవికము.

శృఙ్గాటక చతుష్పథే,
శృంగైరటంస్మిన్నితి శృంగాటకం, అటపట గతౌ. - కొమ్మలచేత దీని యందుఁ గ్రీడింతురు.
చతుర్ణాం పథాం సమాహార శ్చతుర్ప్పథం. - నాలుగు తెరువులు గూడినది. ఈ 2 నాలుగు త్రోవలుగూడిన చోటు పేర్లు.

శ్రంగాటకము - చదుకము, నాలుగు త్రోవల కూడలి.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
చతుష్పాద - 1.చతుష్పదము, 2.నాలుగు కాళ్ళ జంతువు.
పశువు - చతుష్పాదము, గొడ్డు.

పశుపతి - శివుడు.
పశూనాంజీవానాం పతిః పశుపతిః. ఈ-పు. - పశువులనగా ప్రమథులు, జంతువులు, వానికి ప్రభువు.
పశువః క్షేత్రజ్ఞాః తేషాం పతిఃత్రాతా సంసార బంధనాత్ - పశువులనఁగా జీవులు, వారిని సంసారబంధమువలన రక్షించువాడు. 
పశుపాలనము - (వ్యవ.) ఉన్ని, పాలు, మాంసము, క్రొవ్వు మొదలగు వాని కొరకు పశువులను పెంచుట (Cattle rearing).
పశుగ్రాస సస్యములు - (వ్యవ.) పశువుల మేతకొరకు ఉపయోగపడు పైరులు (Fodder Crops), ఉదా. గినీగడ్డి, నేపియర్ గడ్ది, జనుము, లూస్ర్న్ మొ||   

స్వస్తికము - 1.చదుకము, 2.మంగళ వస్తువు(స్వస్తి - శుభము), 3.పాముపడగ మీది నల్లనిరేఖ, 4.ఒక గుర్తు.

రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. 

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).

చతుర్థి - 1.పక్షమున నాల్గవ దినము, చవితి 2.నాల్గవది. 
(ౘ)చౌతి  - చతుర్ధి, పక్షమందు నాల్గవ తిధి  రూ.చవుతి.

చతుష్టయము - నాలుగు, నలుగురు, 2.(వృక్ష.) సూక్ష్మబీజాణు మాతృకోశిలలో ఏర్పడు నాలుగు (పుప్పొడి రేణువులు) కణములు, (Tetrad) (ఇట్లే స్థూల బీజాణు మాతృకోశికలో గూడ నాలుగు జీవకణములు ఏర్పడును.)

తిగవంచ - నాలుగు.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
ఇద్దుగ - (ఇరు+దుగ) పాచికమీది రెండు బొట్లజత, నాలుగు.
అడ్డ - 1.గుంటక మొ.ని దిండువంటి కొయ్య, 2.కుంచములో సగము, ఆ కొలత పాత్ర, 3.నాలుగు.

పద్మనాభుఁడు - విష్ణువు.
పద్మనాభః పద్మం నాభౌ యస్యసః - పద్మము నాభియందు గలవాఁడు.

పద్మనాభో(అ)రవిందాక్షః పద్మగర్భ శరీరభృత్,
మహర్థిః ఋథ్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః| - 38స్తో  

పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
పద్యతే త్ర లక్ష్మీరితి పద్మం. అ. ప్న. పద్మగతౌ. - దీనియందు లక్ష్మి పొందును. ఇది వికల్పమునఁ బుంలింగంబును గలదు.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు  అంటువ్యాధి.)
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మవ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు. 
తోయజాక్షి - తమ్మికంటి.
తమ్మిదొర - సూర్యుడు Sun. 
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
తమ్మిపగతుఁడు - చంద్రుడు Moon. 

తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.

పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.  

పద్మనాభుఁడ వని నిన్నుఁ బల్కినాను
గట్టితనమేల మానరా కట్టులేదె
పలుకుపలుకున నగు కట్టుబాటు లరసి
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ |

పద్మాలయ - లక్ష్మి.
పద్మలయా, పద్మ మాలయో యస్యాస్సా - పద్మమే ఇల్లుగాఁగలది. 
తమ్మియింటి గరిత - లక్ష్మి, పద్మాలయ. 
గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.
పద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర. మెట్టతామర - స్థలపద్మము. 

పద్మాసనము - ఆసనములలో నొకటి.
బాసికపట్టు -
పద్మాసనము, (వ్యావ.) బాసీపట్టు.

నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్,
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్|

నలినము - 1.తామర, 2.తామర కొలను, 3.తామర తీగ.
నల్యతే బద్ద్యతే చంద్రేణేతి నలినం. – చంద్రుని చేత ముకుళరూపమున బంధింపఁబడినది.
బిసము - తామర తూడు, తామర తీగ.
బిసిని - 1.తామర కొలను, 2.తామర తీగ.
తూడు - తామర కాడ, బిసము.

నళిన్యాం తు బిసినీ పద్మినీ ముఖాః :
నళం పద్మమస్యామ స్తీతి నళినీ. ఈ. సీ. - నళమనఁగా పద్మము; అదిగలిగినది. 'నళమబ్జే నళో నళ 'ఇతి రుద్రః.
బిసమస్యామస్తీతి బిసినీ. ఈ. సీ. - తామరసూండ్లు గలిగినది.
ముఖ మన్నందున కమలి న్యబ్జినీ సరోజిన్యాది శబ్దములు గ్రహింపఁబడుచున్నవి. పద్మములు గల దేశమునకుఁగాని పద్మ సమూహమునకుఁగాని తామరతీఁగెకుగాని పేర్లు.

ఓం బిసతంతు తనీయస్యై నమః : తామర తూడులోని దారమువలె సూక్ష్మమై సన్ననైనది (పీతాభాత్యణూపమా - అని శ్రుతి కూడా చెప్పుచున్నది అనగా పరమాణువువలె పీతవర్ణంతో భాసిల్లుచున్నదని భావము) అట్టి సూక్ష్మస్వరూపిణికి ప్రణామాలు.

సూక్ష్మ మధ్యాత్మమపి : సూక్ష్మశబ్దము పరమాత్మ కును, అపిశబ్దము వలన స్వల్పమైనదానికిని పేరు. సూచ్యత ఇతి సూక్ష్మం త్రి. సూచింపఁ బడునది.

పద్మిని - సూర్యుని భార్య.
పద్మిని - 1.తామర తీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతి స్త్రీ.

పద్మిన్యాః వల్లభః పద్మినీ వల్లభః - తామరతీఁగకుఁ బ్రియుఁడు Sun.

కళలు కలుగుఁగాక కమల తోడగుఁగాక!,
శివుని మౌళిమీఁద జేరుఁగాక!
నన్యు నొల్లఁ దపనుఁడైన మత్పతి యని,
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.

భా|| తాను కళలు కలిగినచంద్రుడే అగుగాక !(కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 3.కమలాఫలము.)లక్ష్మి తోబుట్టువు అగుగాక ! శివుని శిఖయందు చేరుకొన్నవాడై నిక్కుగాక ! (అన్యుఁడు-ఇతరుడు)అన్యుడైన చంద్రుడి పొత్తు మా కక్కరలేదు. తపింపజేసే డైనప్పటికీ(తపనుఁడు - సూర్యుడు)మా భర్త సూర్యుడే అని పతివ్రతవలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. అనగా  పద్మములు సూర్యాస్తమయము  కాగానే ముకుళించుకొని పోయినవి.

పద్మోద్భావాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం,
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్|
  

అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.
అరాన్ కేసరాన్ విందతీతి అరవిందం, విద్ద్ లాభే. - కేసరములను బొందియుండునది. 

త్పలము - కలువ, నల్లకలువ.
కలువ -
ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.
కువేలము - 1.కలువ, 2.పద్మము.    
కలువరాయుఁడు - చందమామ. రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.
కువలయము - 1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.
కువలేశుఁడు - విష్ణుమూర్తి.

తొగ - 1.కలువ, 2.సమూహము, 3.విధము, రూ.తొవ.
తొగకంటి -
కలువకంటి, స్త్రీ.
కలువకంటి - కలువ రేకులవంటి కన్నులుగల స్త్రీ.
తొగచెలికాఁడు - చందుడు.
తొగఱేఁడు - చంద్రుడు; తొగవించు - చంద్రుడు Moon.

తొగసూడు - సూర్యుడు Sun, వ్యు.కలువలకు శత్రువు.

కల్హారము - మిక్కిలి పరిమళము గల కలువ.
కలువడము -
(కలువ+వడము) ఉత్సవములలో కట్టెడు బంగారు కలువ పూదండ, స.కైరవ వటః.

సలిలము - నీరు.
సలిలము -
కొలువుడు కానిని కొలువు నుండి త్రోయుట, సం.చాలితమ్.
సరతీతి సలిలం. సృ గతౌ. రలయోరభేదః. - ప్రవహించునది.
సరతీతి సలిలం. షల గతౌ - పోవునది.

సహస్రాంశువు - సూర్యుడు, వేవెలుగు.
సహస్రమంశవో యస్య సహస్రాంశుః, ఉ.పు - వేయికిరణములు గలవాఁడు.

సహస్ర పాదుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు. 
సహస్రము - వేయి.    

సహస్రాక్షుఁడు - ఇంద్రుడు, వేగంటి.
సహస్ర మక్షీణి యస్య సః సహస్రాక్షః - వేయికన్నులు గలవాఁడు.
వేగంటి - ఇంద్రుడు (వే+కన్ను).
వే - పదినూఱులు, వేలు, సహస్రము, విణ.ఆదేశము, వై.వి.వేగముగ.

సహస్రపత్రము - కమలము, తామర.
సహస్రం పత్రాణ్యస్య సహస్రపత్రం వేయుఱేకులు గలది.
కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
కం జలం అలతి భూషయ తీతి కమలం, అల భూషణదౌ - జలమును భూషించునది.
కేన మల్యతే ధార్యత ఇతి వా కమలం. మలమల్ల ధారణే. - జలముచేత ధరింపఁబడునది.
కామ్యతే తృషార్తైరితి కమలం. కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరఁబడునది. కమలదళాక్ష గోవిందా|

కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 2.కమలాఫలము. కమలాలయము నందు దేవి స్థానం కమల|
కమలమస్యా అస్తీతి కమలా - కమలము చేతియందు గలిగినది.  

స్యాత్కురజ్గే పి కమలః :
కమల శబ్దము ఇఱ్ఱికి పేరైనపుడు పు. అపిశబ్దము వలన తామరకును, నీళ్ళకును పేరైనపుడు న. మహాలక్ష్మికీ పేరైనపుడు సీ. కామ్యత ఇతి కమలః. కము కాంతౌ. కోరఁబడునది. 'కమలం సలిలే తామ్రే జలజే క్లోమ్ని భేషజే, మృగప్రభేదే కమలః కమలా శ్రీవరస్త్రియో' రితి విశ్వప్రకాశః.

మహాలక్ష్మి - 1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి. కొల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం| 

కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు.

కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.  
కమలాసనః, కమలం ఆసనం యస్య సః - కమలము ఆసనముగాఁ గలవాఁడు.

కమలుఁడు - బ్రహ్మ, ఇంద్రుడు. 
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

కమలిని - 1.తామరకొలను, 2.తామరతీగ.
కమలు - క్రి.1.తపించు, 2.సంతాపించు, 3.కాలు.

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

తా. తామరులు జలమును వదలినయెడల తమకాప్తులైన సూర్యుని కిరణం(రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయినట్లే, తమ తమ నెలవులు(నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.)దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువు లగుదురు.  

దశవాయుజయాకారా కళాషోడశ సంయుతా,
కాశ్యపీ కమలా దేవీ నాదచక్ర నివాసినీ|

సవిత - 1.సూర్యుడు, 2.తండ్రి, రూ.సవితృడు.
సుపతి సుప్తం ప్రేరయతీతి సవితా. ఋ.పు. షూ ప్రేరణే - సుప్తుని ప్రేరేపించువాఁడు. 

సవిత్రి - 1.తల్లి, 2.ఆవు.

సవిత్రీభి ర్వాచాం - శశిమణిశిలాభంగరుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం - సహ జనని సఞ్చిన్త యతి యః |
స కర్తా కావ్యానాం - భవతి మహతాం భఙ్గి రుచిభిః 
వచోభిర్వాగ్దేవీ - వదన కమలామోదమధురైః || - 17శ్లో
తా.
  తల్లీ ! ఎవడు వాక్కుల నొసగు నట్టియు చంద్రకాంత మణులవలె ప్రకాశించు వశిన్యాది దేవతలచే కూడియున్న నీ దివ్యస్వరూపాన్ని ఎవరు ధ్యానించుచున్నాడో, (చంద్రకాంతమణి శిల అతిధావళ్యమును కలిగి యుండుట జగత్ప్రసి ద్ధము.) అతడు మహాత్ములవలె నింపగుననియు, కావ్యములను రచింప సమర్థుడవుచున్నాడు. అతని కవిత్వం మృదువైన తీయని మాటలచే రుచిమంతమై, సరస్వతీదేవి(గీర్దేవి - సరస్వతి, వాగ్దేవి.)యొక్క ముఖకమలము(వదనము - నోరు, ముఖము.), పద్మమువలె పరిమళాలను వెదజల్లుతుంది. - సౌందర్యలహరి  

రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
రూయతే స్తూయత ఇతి రవిః. ఇ. పు. రుశబ్దే - నుతింపఁబడువాఁడు. 

విహాయసగతిర్యోతిః స్సురుచిః హుతభుగ్విభుః
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః|
|

కర్మసాక్షి - సూర్యుడు, వ్యు.జీవుల కర్మలను సాక్షియైనవాడు.
కర్మణః సాక్షీ కర్మసాక్షీ, న.పు. - కర్మలకు సాక్షి.
జగచ్చక్షువు - సూర్యుడు.
జగతశ్చక్షురివ జగచ్చక్షుః, స.పు - జగత్తునకు నేత్రమువంటివాఁడు. 

కర్మక్రియా -
కరణం కర్మ. న. క్రియా చ. డుకృఞ్ కరణే. - చేయుట గనుక కర్మ, క్రియయును, కర్మన్ శబ్దము పుంలింగమును గలదు.
"కర్మవ్యాప్యే క్రియాయాంచ పున్న పుంసక యోర్మతమ్" అని రుద్రుఁడు.  
"క్షపయత్యశుభం కర్మ కర్మాణం చినుతే శుభ" మితి దశటీకాసర్వస్వకారః, అత్ర శేషకారః _ "కారః కృత్యం సనా కారిః ప్రశ్నోక్త్యోః కారికా కృతిః ఇతి టీ. స. ఈ 2 చేయుట పేర్లు.

కర్మ1 - ధాతువుయొక్క అర్థమైన ఫలమునకు ఆశ్రయమైనది, ఉదా. వాడు అన్నము వండెను. వండుట అను పనికి అన్నమగుట ఫలము. ఈవాక్యములో అన్నము కర్మ.
కర్మ2 - (భౌతి.) ఏబలప్రయోగ బొందువు కొంత దూరము  ఆ బలము పనిచేయు దిక్కునకే జరుగునో, ఆబలము  సాధనముగ ఒక ఫలమును జనింపజేయు క్రియ, (Work). (బలమును బలప్రయోగ బొందువు జరిగిన దూరముచే గణించినచో ఫలిత-కర్మ=(పని) లభ్యమగును).
కర్మంది - యతి.

కర్మిష్ఠుఁడు -  1.కర్మయందు అధిక నిష్టగలవాడు, 2.పనియందు నేర్పరి.    

కర్మయుగము - కలియుగము.
కలి - 1.కయ్యము, కలియుగము, 4,32,000 సంవ. ల కాలము.

చతుర్థే పి యుగే కలిః : కలిశబ్దము కలియుగమునకూ, అపిశబ్దము వలన కలహమునకును పేరు.
కల్యన్తే స్నిన్మితి కలిః. పు. కల కిల క్షేపే. - దీనియందు ద్రొబ్బఁబడుదురు. నిపాతనము - దిగద్రొబ్బుట, పడద్రోయుట. ద్రొబ్బు - క్రి. పడదోయు.(బడుదురు)

కయ్యము - జగడము, యుద్ధము. 
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
కలహము - సమరము, వికృ.కయ్యము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది.
సంయుగము - యుద్ధము.
యుద్ధము - 1.కయ్యము, 2.పోరు. పోరు నష్టం పొందు లాభం.
కయ్యపుదిండి - (కయ్యము + తిండి) కలహభోజనుడు, నారదుడు.
ముళ్ళయతి - నారదుడు, సన్న్యాసి (ముడులు పెట్టుయతి.) 
ముళ్ళమాటలు - కలహపుమాటలు.

ఆరివేరము - విరోధము, కలహము, సం.అరివీర్యమ్.
ఆరివేరపుఁదపసి - కలహప్రియుడగుముని నారదుడు.

మారాటము - 1.కలహము, 2.యుద్ధము.
పెనఁకువ - 1.మేళసము, 2.చుట్టుకొనుట, 3.వివాదము, కలహము.
పెనఁగు - క్రి. 1.పెనుగొను, 2.చుట్టుకొను, 3.మారాడు, 4.యుద్ధము చేయు.
పెనవరి - (పెనవు+అరి) వివాదశీలుడు. 

శూరుఁడు - సూర్యుడు, వ్యు.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు.

శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
శూర ఇతి వసుదేవస్య పితావస్య గోత్రాపత్యం శౌరిః- ఇ - పు. - శూరుడనగా వసుదేవునితండ్రి, అతని మనుమఁడు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీ కృష్ణ భగవానుడు. 

సమితి - 1.సమూహము, 2.యుద్ధము.
సమిత్తు - యుద్ధము, పోరు. పోరు నష్టము పొందు లాభము.
సమీకము - యుద్ధము, వ్యు.పరస్పరము కదియుంచునది.  

సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము, (Group). 

వివాదశీలాం స్వయమర్థచోరిణీం, పరాను కూలాం పరిహాసభాషిణీమ్ |
అగ్రాశినీం మధ్య గృహప్రవేశినీం, త్యజంతి భార్యాం దశపుత్త్రమాతరమ్ |

తా. జగడమాడెడు స్వభావముగలదానిని, ఇంటిసొమ్ము దొంగిలించు దానిని, పెనిమిటికన్న ముండు భుజించుదానిని, ఎల్లప్పుడు పొరుగింటి  లో(గృహము - 1.ఇల్లు, 2.భార్య.)సంచరించు దానిని(సంచరణము - సంచారము, తిరుగుట, నడుచుట.); ఈ గుణములు గలిగిన పెండ్లాము(పెండ్లము-భార్య, రూ.పెండ్లాము.) పదిబిడ్డల తల్లియైనను దానిని విడువ వలెను(త్యాజ్యము - విడువదగినది). - నీతిశాస్త్రము 

కలియుగమున జనములను గనికరమునఁ
దగిన వెరవును గనుకొని తనుపు చునికిఁ
గృతయుగమునను గలుగని హితము గలుగు
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ|

జగముకన్ను - సూర్యుడు; ౙగము చుట్టము - సూర్యుడు.

జగతి - లోకము, రూ.జగత్తు, జగము.

లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
లోకములు -
సర్గమ ర్త్య పాతాళములు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము; ఈ ఏడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము; ఈ ఏడును అధోలోకములు. 

చరాచరము - 1.జగత్తు, 2.విణ.తిరుగునదియు, తిరుగనదియు.
జనము -
ప్రజ; ప్రజ - జనము, సంతతి.

సంసారము - 1.ఆలుబిడ్డలతోడి యునికి, 2.ప్రపంచము.
సంసృతి -
సంసారము.
సంసారి - సంసారము కలవాడు, గృహస్థుడు.

కుటుంబము - పెండ్లాము, బిడ్డలు మొ.వారు భార్యభర్తలు, వారి సంతానము. ఒక గృహములో నివసించు బంధువర్గము (Family).(వృక్ష.) సమాన లక్షనములుగల కొన్ని గుణములలోని మొక్కల సముదాయము (Family) ఉదా. గుమ్మడి కుటుంబము, ప్రత్తి కుటుంబము, (జం.) కొన్ని ముఖ్యమైన సమాన లక్షణములు గలిగి కొన్ని గణములకు చెందిన జంతువులతో ఏర్పడిన సమూహము (Family), ఉదా. ఈగ కుటుంబము, కుక్క కుటుంబము.

కళత్రము - 1.పెండ్లాము, 2.కోట, 3.నితంబము, (జ్యోతి.) లగ్నము నకు ఏడవస్థానము. (లగ్నము - మేషాదిరాసుల ఉదయము, విణ.తగులుకొన్నది.)
పెండ్లము - భార్య, రూ.పెండ్లాము.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. 
కోట - 1.దుర్గపురము, 2.పట్టణము, చుట్టుగల ప్రహరి, సం.కోటః.
కోట్టము - దుర్గపురము, కోట. దుర్గము - కోట.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాననగరము.

పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.   

అలంగము - కోటచుట్టును ఆనికిగా వేసిన మట్టిదిమ్మ, వప్రము.
వప్రము - 1.కోటకొరడు, కోట, 2.కొండ నెత్తము, 3.తీరము.
వప్రక్రీడ - ఏనుగు మొదలగునవి దంతములతో కుంభములతో భూమిని కోరాడెడి యాట. 

కుటుంబి - కుటుంబ పొషకుడు.

కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
పురంధ్రి -
కుటుంబిని, స్త్రీ(ఆడుది).
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. 

స్యాత్తు కుటుమ్బినీ, పురంధ్రీ-
కుటుంబం పుత్రభృత్యాదికం అస్యా ఇతి కుటుంబినీ., సీ. - పొషింపఁదగిన పుత్రభృత్యాదులు గలది.
పురం గృహం ధరతీతి పురంధ్రీ. సీ. ధృఞ్ ధరనే. - పురమనఁగా గృహము, దానిని భరించునది. ఈ 2 బిడ్డలు సేవకులు మొదలగు కుటుంబము గల స్త్రీ పేర్లు.

అసారే ఖలుసంసారే - సారం శ్వశుర మందిరమ్|
హిమాలయే హర శ్శేతే - హరి శ్శేతే మహోదధౌ||
తా.
సంసారము సారము లేనిదైనను శ్వశుర గృహంబు (శ్వశురులు - అత్తమామలు) సారంబు గలది. గనుకనే (హరుఁడు - శివుడు)శివుఁడు హిమవత్పర్వతంబు నందు, (హరి) విష్ణువు సముద్రము(మహాశయము - సముద్రము)నందును శయనించిరి. - నీతిశాస్త్రము

ౙగ - గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా -
గొప్ప, పెద్ద. గొప్ప - అధికము, పెద్దది
(ౙ)జాగా - 1.పెద్దది, 2.గొప్పది, 3.చోటు, రూ.జగ, జగా, జెగ, సం.జగత్.

కంచి - కాంచీనగరము, విణ.పెద్ద.
కాంచీ -
1.స్త్రీలు ధరించెడు ఒంటి పేట మొలనూలు, 2.కాంచీపురము, (పుణ్యనగరము లేండింటిలో ఒకటి). కామాక్షీ కంచికాపురీ శక్తిపీఠం| 
మొలనూలు -
ఆడువారు అలంకారార్థము ధరించెడు కటి సూత్రము.
కంచిమేఁక - పెద్దపొదుగు గల మేక. 

కామకోటిసు పీఠస్థా| కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః.

క్వణత్కాంచీదామా - కరికలభకుంభ స్తననతా
పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా | 
ధనుర్బాణాన్ పాశం - సృణి మపి దదానా కరతలైః
పురస్తా దాస్తాం నః - పురమథితు రాహో పురుషికా || - 7శ్లో
తా.
మ్రోగుచున్న(చిరుగంటలతో కూడిన)బంగరు మొలనూలు గలదియు, గున్న యేనుగు కుంభస్థలముల వంటి స్తనములచే కాస్త వంగినదీ, సన్నని నడుము కలదీ, శరత్కాల పూర్ణచంద్రుని వంటి ముఖము గలదీ, చేతులతో చెరుకు విల్లుని, పుష్పబాణాలను, పాశము అంకుశము(సృణి - అంకుశము)ను ధరించినదియు నైన త్రిపురాంతకుని యహంకార రూపిణి యగు దేవత మా యెదుట సుఖాసీనయై ప్రత్యక్షమగు గాక! - సౌందర్యలహరి 

కర్పూరగురుకుంకుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్ణోత్కృష్టకష్టకర్మదహనం కామేశ్వరీం కామినీమ్|
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవానీం భగవతీం శ్రీమాతరం భావయే.

మహాపద్మాటవీసంస్థా - కదంబవనవాసినీ,
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ | – 23శ్లో

అంశుమాలి - సూర్యుడు.
అంశుమాలాః కిరణరాజయః అస్య సంతీతి అంశు మాలీ, న.పు. - కిరణ సమూహముగలవాఁడు.
అంశువు - 1.కిరణము, 2.కాంతి, 3.కొస, 4.అణువు, 5.దారము. 

అంశుమంతుఁడు - 1.సూర్యుడు, 2.సగరచక్రవర్తి మనుమడు, 3.ధనవంతుడు.   

కలవాఁడు - 1.ఆప్తుడు, 2.ధనవంతుడు, 3.శక్తుడు.

ధనవంతుఁడె కులవంతుఁడు;
ధనవంతుఁడె సుందరుండు; ధనవంతుండే
ఘనవంతుఁడు బలవంతుఁడు
ధనవంతుఁడె ధీరుఁడనుచుఁ*దలఁపు? కుమారా!

తా. ధనముగలవాఁడు మంచి వంశము గలవాఁడు, సౌందర్యము గలవాడు(సుందరుఁడు - చక్కని వాడు), మర్యాదగలవాడు, బలముగలవాడు, ధీరుడు(ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము గలవాడు. అని తలంపుము!

త్రయీతనువు - సూర్యుడు, వ్యు.మూడు వేదములే మూర్తిగా గలవాడు.
త్రయాత్ర యోవేదా ఏవ తనుర్యస్య త్రయీతనుః, ఉ-పు. - మూఁడువేదములే శరీరముగాఁ గలవాఁడు. 
త్రయి - త్రయము, 2.మూడు వేదములు.
త్రయము -
మూటి సమూహము, రూ.త్రయి.  

ఇతి వేదా స్త్రయ స్త్రయి,
ఇమే వేదస్త్రయః త్రయీత్యుచ్యతే - ఈ వేదములు మూఁడును త్రయి యనంబడును.
త్రయోవేదా అవయవాః అస్యాఇతి త్రయీ, ఈ. సీ. - మూఁడువేదములు అవయములుగాఁ గలిగినది.
త్రయాణాం వేదానాం సమాహారస్త్ర యీతివా - మూఁడువేదములయొక్క యేకీభావము. ఈ ఒకటి మూఁడు వేదముల సమూహము పేరు.

త్రయీధర్మము - వేదవిహిత ధర్మము.

త్రికము - 1.త్రయము, 2.ముడ్డి పూస, (వ్యాక.) ఆ, ఈ, ఏ, అను మూడు సర్వనామ రూపములు.
టికము - ముడ్డిపూస, సం.త్రికమ్.  
ము(ౘ)చ్చ - ముడ్డిపూస
ముయ్యెల గుట్ట - (మూడు+ఎల్ల+గుట్ట) 1.మూడు ఎల్లలు కలియు చోటు, 2.మూడు దారులు కలియుచోటు, 3.త్రికము (ఎల్ల శబ్దమున కిచట స్థానమని అర్థము).

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ,  అను ధ్వనులు.    

తిగ - మూడు, రూ.తివ, సం.త్రికమ్.
తివ -
తిగ.

పృష్ఠవంశాధరే త్రికమ్,
పృష్ఠవంశాధరే త్రికం. - పృష్ఠవంసమనఁగా వీఁపు యెముక. దానికి దిగువనున్న ప్రదేశము త్రికమనం బడును.
త్రయాణాం ఊరుద్వయపృష్ఠా స్థినాం సమాహార స్త్రికం. - తొడలు రెండును వీఁపు యెముకయు నీమూఁటి యొక్క కూటమిగనుక త్రికము. వెన్నుముక దిగువనున్న చోటు.

త్రిపురా షోడశీ మాతా త్ర్యక్షరా త్రితయా త్రయీ,
సుందరీ సుముఖీ సేవ్యా సామవేద పరాయణా|

త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ|
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాకృతి. – 163స్తో

ఖద్యోతుఁడు - సూర్యుడు.
ఖేద్యోతతే, ఖద్యోతః, ద్యుత దీప్తౌబ్- ఆకాశమందుఁ బ్రకాశించువాఁడు.
ఖద్యోతము - 1.మబ్బు, 2.మిణుగురు పురుగు, వ్యు.ఆకాశమున వెలుగునది.

లోకబాంధవుఁడు - సూర్యుడు.
లోకస్యబాంధవో లోకబాంధవః - లోకమునకు జుట్టము. సురేషు ఉత్తమ స్సురోత్తమ - దేవతల యందు శ్రేష్ఠుఁడు.
ధామనిధి - సూర్యుడు.
ధామ్నాం నిధిః - కాంతులకు గనియైనవాఁడు.
ధామము - 1.ఇల్లు, 2.చోటు, తావు 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము 6.మేను, 7.పుట్టువు.

నివసతి - ఇల్లు; నివసనము - ఇల్లు.
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివాసి - వాసము చేయువాడు. 

పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.
పట్టణము - కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాన నగరము.
శరీరము - దేహము; దేహము - శరీరము, మేను. శరీరి - ప్రాణి.
ఇలు - గృహము, రూ.ఇల్లు. గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - ఇల్లాలు, భార్య. ప్రతిశ్రయము - 1.కొలువుకూటము, 2.గృహము.  

పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రు పురముల నాశమొనర్చువాడు.

వీడు - 1.పురము, 2.కట్నము, 3.దండు విడిసినచోటు, 4.దొమ్మరగుంపు, క్రి.వదలు, సదలు, భేదమగు, విసర్జించు, విడిపోవు.
సళ్ళు - క్రి.సడలు, సం.ళ్లథ్.
సడలు - క్రి.1.ఊడు, 2.జారు, 3.వదలు, వి.వదలుట, రూ.సళ్లు, సం.శ్లథ్.
శ్లథము - శిథిలమైనది, వదులైనది.
శిథిలము - సంధులు వదిలినది, శ్లథము.  
తెగుపడు - క్రి.వేరుపడు.

పద్మిని - 1.తామరతీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతి స్త్రీ.
పద్మిన్యాః వల్లభః పద్మినీ వల్లభః - తామరతీఁగకుఁ బ్రియుఁడు Sun.
వల్లభుడు - ప్రియుడు, స్వామి.
ప్రియుఁడు - ప్రాణనాథుడు.
వల్లభ - మేలుజాతి గుఱ్ఱము, విణ.ప్రియమైనది.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.   
భా||
ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను. 

సూర్యుని చూడలేక పోయానని కన్నీరు కారుస్తు కూర్చుంటే నక్షత్రాలను కూడా చూడలేవు. - రవీంద్రనాథ్ టాగోర్

2. హిమాంశువు - చంద్రుడు.
హిమాః శీతాః అంశవో యస్య సః హిమాంశుః ఉ. పు. - చల్లని కిరణములు గలవాడు.

చంద్రుడు - నెల, మాసము.
నెల -
1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా.
స్థానము - 1.చోటు, ఉనికి 2.విలుకాని యుద్ధ మప్పటి నిలికడ.

మలమాసము - అధిక మాసము.
అధిక మాసము - చాంద్రమానమున మూడేండ్ల కొకసారి వచ్చు పదమూడవ నెల. సూర్యసంక్రమణము లేని చాంద్రమాన మాసము.

(ౘ)చంద్రము - చందురము, సం.చంద్రః.
చంద్రేన కర్పూరేణ మీయతే ఉపమీయత ఇతి చంద్రమాః. స. పు. మాఞ్ మానే. - చంద్ర మనఁగా కర్పూరము. దానితోఁ బోల్చఁబడువాఁడు.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందిరుఁడు - చంద్రుడు.
(ౘ)చందురుమామ - చంద్రుడు, చందమామ.

(ౘ)చందు - 1.విధము, 2.అందము, 3.చంద్రుడు.
(ౘ)చందము - ఛందము, విధము, సం.ఛందః. 
చందయతీతి చంద్రః. చది ఆహ్లాదనే - సంతోషింపఁజేయువాఁడు.   

విధము - ప్రకారము, విధి.
ప్రకారము - 1.విధము, 2.పోలిక.
పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము. 
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ఐందవము - చంద్రుని సంబంధమైనది, వి.1.చాంద్రమానము, 2.చాంద్రాయణ వ్రతము.
చాంద్రమానము - చంద్రుని గతిని బట్టి యేర్పరచిన కాల ప్రమాణము.
చాంద్రాయణము - చంద్రుని వృద్ధిక్షయముల ననుసరించి ఆహార పరిమితి దిన క్రమమున హెచ్చించుచు తగ్గించు వ్రతము.
చాంద్రసంవత్సరము - చంద్రుడు అమావాస్య మొదలుకొని అమావాస్య వరకు భూమిచుట్టు తిరిగివచ్చు కాలమును బట్టి నెలను నిర్ణయించుట, చాంద్ర సంవత్సరమున గల 365 రోజులకు దానిని సరి పుచ్చుటకై అధిక మాసము వచ్చును.

ఐందవి - పల్కుచెలి, సరస్వతి.
పలుకుఁజెలి - సరస్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒకనది.

చంద్రకి - 1.నెమిలి, 2.కౌజు.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి(నెమ్మలి).
మయూరము - 1.నెమిలి, 2.నెమిలిజుట్టు.
నెవిలి - నెమిలి; నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
నెమ్మిలి - నెమ్మలి.
నమిలి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.    

మాయురము - నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది.

నెమ్మి - 1.ప్రేమ 2.నెమ్మది 3.సంతోషము 4.క్షేమము 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము 2.బండిచక్రము కమ్మి, సం.నేమిః.
నెమ్మిరౌతు - కుమారస్వామి.
కుమారస్వామి -
స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ. కొమరుసామి.

కౌఁజు - కపుఁజుపిట్ట, సం.కపింజలః.
కపింజలము - కముజు అను పిట్ట.

ఖఞ్జరీటస్తు ఖఞ్జనః,
ఖం ఆకాశం అఞ్జసా ఏటతి ఖఞ్జరీటః, ఇత కిట గతౌ. - ఆకాశమును శీఘ్రముగాఁ బొందునది.
ఖఞ్జతీతి ఖఞ్జనః(ఖంజనము - కాటుక పిట్ట), భాద్రపదమాసాది షట్కే అదృశ్యగతిత్వాత్. ఖజి గతివైక్లబ్యే. - భాద్రపదమాసము మొద లాఱు నెలలు(6 months)కనిపించక తిరుగునది. ఈ 2 మందపిచ్చిక పేర్లు. రువ్వుపులుఁగు కౌఁజు, కాటుకపిట్ట యనియు గొందఱు.

ఖంజనము - కాటుక పిట్ట.
కాటుకపిట్ట - ఖంజరీటము.

అంజనము - 1.కాటుక, 2.మంత్రగాడు నిక్షేపాదులను కనిపెట్టుటకు వాడు కాటుక, 3.సిరా, 4.పశ్చిమ దిగ్గజము, 5.ఒక పర్వతము, 6.ఒకజాతి బల్లి, 7.(అలం.) వ్యంగ్యార్థమును బోధించు శబ్దవృత్తి, 8.నిప్పు.
ఆంజనము - కాటుక, విణ.అంజనము నకు సంబంధించినది.
కాటుక - 1.అంజనము, 2.జొన్న ఎన్నునకు గల్గువ్యాధి.
కజ్జలము - 1.మేఘము, 2.కాటుక, 3.(రసా.) దీపాంగారము, దీపపుమసి (Camp black).
మేఘము - మబ్బు; మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.  
అంజనకాడు - అంజనమువేసి నిక్షేపాదులను కనుగొనువాడు.

నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.

అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.
అగ్నిభువు - కుమారస్వామి.
 
వర్తి - 1.వత్తి, 2.కంటికాటుక, విణ.వర్తించువాడు.
వత్తి - దీపపు వత్తి; దీపవల్లి - దీపపు వత్తి.

దిశ - దిక్కు, దెస. (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కు లలో నొకటి.
దిక్కు - 1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, 2.దశా.
దశ - 1.అవస్థ, 2.వత్తి, 3.బద్దె. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది!

అంజన - 1.హనుమంతుని తల్లి, 2.పడమటి దిక్కునందలి ఏనుగు. 
అంజనాభత్వాదంజనః - కాటుకవన్నె గలది.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు. 

అంజని - చందన కుంకుమాదులచే అలంకరించుకొను స్త్రీ, (వృక్ష.) కటుక రోహిణి, కాలాంజని అనెడి ఓషధులు.
కటుకరోహిణి - ఒక ఓషధి, (వ్యావ.) కటకరాణి.

విభక్తత్రైవర్ణ్యం - వ్యతికరిత లీలాఞ్జన తయా
విభాతి త్వన్నేత్ర - త్రితయ మిద మీశాన దయితే, |
పునస్స్రష్టుం దేవాన్ - ద్రుహిణహరిరుద్రాను పరతాన్
రజ స్సత్వం బిభ - త్తమ ఇతి గుణానాం త్రయమివ || - 53శ్లో

తా. ఓ ఈశాన ప్రియురాలా(దయిత-1.భార్య, 2.స్త్రీ.)! నీ నేత్రత్రయాలు మూడు వర్ణాలైన తెలుపు, ఎరుపుతోనూ మరియు అందంకోసం అర్ధవల యాకారముగా తీర్చినదైన కాటుక నల్లరంగుతో, ఒకేసారి మూడు వర్ణాలతో ఒప్పారుతూ, మహాప్రళయకాలంలో నీలో లీనమై పోయివున్న బ్రహ్మ(ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింస చేయువాడు.) విష్ణు(హరి)  రుద్రులను తిరిగి సృష్టించుటకై సత్త్వం, రజస్సు, తమస్సు అనే గుణత్రయాన్ని ధరించిన వాటివలె ప్రకాశించుచున్నవి. - సౌందర్యలహరి      

నిరంజనము - 1.కాటుకలేనిది, 2.దోషములేనిది.

సామీరి - 1.హనుమంతుడు, 2.భీముడు.
హనుమంతుఁడు - ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
యోగచరుఁడు - ఆంజనేయుడు.

పవనాత్మజ - వాయుసుతుడు, ప్రభు భక్తికి హనుమంతుణ్ణి మించిన ఉదాహరణ లేదు.

హనుమంతుడు : అంజనీ సుతుండు, వాయుదేవుని వరమున బుట్టినవాడు. బ్రహ్మ, శివునియొక్క(రుద్రరూప) కలయిక వలన నేర్పడినవాడు. సూర్యుని శిష్యుడు. చిరంజీవి, వేదవిదుడు(నవవ్యాకరణ పండితుడు), మహాగాయకుడు, ఉత్తమ రామభక్తుడు.  

బుద్ధిర్బలం యశో ధైర్యం మిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్|

తా. హనుమంతుని ధ్యానించుట వలన బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగము లేకుండుట, మాంద్యము తొలగుట, చక్కగ మాటలాడ గలుగుట సిద్ధించును.

వానరః కేసరిసుతః సీతాశోకనివారణః,
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః|

కరువలిపట్టి - వి. (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలి - గాలి.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయము, వి.బిడ్డ.

గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపు - గాలి, వాయువు రూ.గాడ్పు. గాడ్పు - గాడుపు.
గాడుపుసంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
గాడుపుమేపరి - పాము, పవనాశము. 

మారుతము - వాయువు.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు - 1.మారుతి, 2.వృకోదరుడు.

వృకోదరుఁడు - భీముడు.
తోఁడేటి మేటి కడుపు - వృకోదరుడు, భీముడు.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి. పద్యయతి, సం.వళిః.
వేగ - వడి, విణ.త్వరితము.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము 2.వికసింపనిది. ముడి మూరెడు సాగునా?
ముడిగిబ్బ - ఆబోతు.

జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముడు : పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.

బిభే త్యస్మాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లితనివలన భయపడును గనుక భీముఁడు.

భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు. 
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
కీచకుఁడు - భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.

ప్రాణందాపి పరిత్యజ్య - మానమేవాభి రక్షతు|
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్ర తారకమ్||

తా. తనకు మానహానికరమైన (యా)ఆపద వచ్చినప్పుడు ప్రాణము(ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.)నైన విడువ వచ్చును. కాని మానమును రక్షించుకొన వలయును. అది యెందు వలన ననఁగా ప్రాణము(అనిత్యము - 1.నిత్యము కానిది, నశ్వరము, 2.నిలుకడ లేనిది, 3.సంశయాస్పదము, 4.తాత్కాలికము.)క్షణభంగురము.  మానము చంద్రుడును నక్షత్రములు(తారకము - 1.కంటినల్ల గ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.)నుండు వరకుండునని భీముఁడు చెప్పెను. – నీతిశాస్త్రము

పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుఁడు, విణ.పవిత్రురాలు. 

సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః|

 

ఇందుఁడు - చంద్రుడు.
ఉనక్తి తుషారకణైరితి ఇందుః, ఉ-పు. ఉందీ క్లేదనే - మంచుకిరణములచేత తడ్పెడువాఁడు.
ఇందువారము - సోమవారము.
సోమవారము -
వారములలో రెండవ దినము.

ఇందుకళాధర ఇంద్రాది ప్రియ సుందరరూప సురేశశివ |

ఇందిర - లక్ష్మి; ఇంది - లక్ష్మి, రూ.ఇందిర.
అధికపాఠము. ఇందిరా లోకమాతా మా క్షీరాబ్ధితనయా రమా(రమ - లక్ష్మి) - ఇందతీ తీందిరా - పరమైశ్వర్యయుక్తురాలు. ఇది పరమైశ్వర్యై.

చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందుశీతలామ్,
ఆహ్లాదజననీం పుష్ఠిం శివాం శివకరీం సతీమ్|

ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామర.
నీలాబ్జము - నల్లకలువ.

ఇన్దీవరం చ నీలే (అ)స్మిన్ -
అంబుని జన్మ అస్యేత్యంబుజన్మ నీలం చ తత్ అంబుజన్మ, న. న. - నీటియందు జన్మము గలిగినది అంబుజన్మము; నీలమైన అంబుజన్మము నీలాంబుజన్మము.
ఇన్దతీతి ఇన్దీ ర్లక్ష్మీః, తయా వ్రియత ఇతి ఇన్దీ వరం. వృఞ్ వరనే. ఐశ్వర్యయుక్తురాలు గనుక ఇంది యనఁగా లక్ష్మి; ఆమెచేత వరింపఁబడినది.
ఇంద్రియాని వృణోతీతి వా ఇందీవరం. వృఞ్ వరణే. - ఇంద్రియములను సంతోషముచేతఁ గప్పునది. ఈ రెండు నల్లకలువ పేర్లు.

కువలయము - 1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.
కువలేశుఁడు - విష్ణుమూర్తి.

విశ్వామరేన్ద్రపద విభ్రమదానదక్ష
మానన్దహేతు రధితం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థ
మిన్దీవరోదరసహోదర మిన్దిరాయాః| - 4

అనిమీషము - 1.రెప్పపాటులేనిది, 2.జాగరూకము, 3.వికసించినది, వి.చేప.
రెప్పలు ముయ్యని జాణ. - చేప.
అనిమిషుఁడు - వేలుపు, దేవత.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
సురలు - దేవతలు. దేవత - వేలుపు.   
బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
వేల్పుబొజ్జ - బృహస్పతి; బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి.కేతువు Ketu.
కేతువు - 1.తిమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.   

సుర మత్స్యా వనిమిషా :
అనిమిష శబ్దము దేవతలకును, మత్యమునకును పేరు. న నిమిషత్య నిమిషః మిష నిమీలనే ఱెప్పపాటు లేనిది.  

తెఱగంటి - 1.తెప్పపాటు లేనివాడు, దేవత, 2.చేప.
తెఱ - 1.తెఱపయైనది, మరుగులేనిది, రూ.తెఱ్ఱ.
తెఱప - 1.తెరచుట, 2.ఉపశమనము, విణ.మరుగులేనిది. 

తెఱగంటి ఱేఁడు - ఇంద్రుడు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసో త్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు. 

ఉన్మేషము - 1.కనువిచ్చుట, 2.వికాసము, 3.కాంతి, 4.స్ఫురణము.
ఉన్మీలనము - 1.వికసించుట, 2.(కన్ను మొ, వి) తెరచుట, 3.బయలు పరచుట, 4.రంగువేయుట.
ఉన్మీలించు - క్రి.వికసించు.  

నిమిషోన్మేషాభ్యాం - ప్రళయ ముదయం యాతి జగతీ
తవేత్యాహు స్సంతో - ధరణిధరరాజన్య తనయే |
త్వదున్మేషాజ్జాతం - జగదిద మశేషం ప్రళయతః
పరిత్రాతుం శంకే - పరిహృతనిమేషా స్తవ దృశః || - 55శ్లో

తా. ఓ పర్వత(ధరణిధరము - 1.కొండ, 2.నేలతాలుపు.)రాజ కూతురా! నీ కనుఱెప్పలు మూతపడుటచేత(మూయుట) జగత్తునకు ప్రళయమైన నశించును. మఱల నీవు కన్నులు తెఱచుటచే సృష్టి జరుగుచున్నదని సత్పురుషులు చెప్పుచున్నారు. అందువలననే - నీ ఱెప్పలు వికసించుట వలన జనించిన ఈ సర్వజగత్తు నశింపకుండ కాపాడుటకు, నీవు నీ కనుఱెప్పలను మూయుటను పరిహరించితివి (అనగా ఱెప్పపాటు లేకుండ - మూత లేకుండ చూచుచున్నావని) మూయని నీ కన్నులే తగినవని యూహించుచున్నాను. - సౌందర్యలహరి   

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్| 
ఆకేకరస్థిత కనీనిక పక్ష్మ(పద్మ)నేత్రం
భూత్వై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః. – 5స్తో

ఉన్మేషనిమిషోత్పన్న - విపన్నభువనావళిః|
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. - 66శ్లో
 

వాలుగ - ఒక రకము చేప.
వాలుగంటి - స్త్రీ, దీర్ఘములైన కన్నులు గల స్త్రీ.
వాలుచూపు - ఓరచూపు.
ఓరచూపు - 1.ప్రక్కచూపు, క్రీగంటి చూపు, 2.ఉపేక్ష, 3.మోహపుచూపు.

(ౘ)చోఱ - ఒక తెగ చేప, రూ.చోర.
చోఱ - చోర, విణ. బాలుడు.
పోఱఁడు - బాలుడు.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.

చోఱబుడుత - 1.చోరమీనుపిల్ల, 2.చేపలవంటి కన్నులు గల స్త్రీ.    
మచ్ఛె కంటి - (మచ్చెము + కన్ను) చేపల వంటికన్నులు గల స్త్రీ.
మచ్ఛెము - చేప, సం.మత్స్యః. మత్స్యము - చేప.

చేపపిల్లకు యీత నేర్పనక్కరలేదు. చేపలు నీటియందు మునుగు చున్నందులకు స్నానఫలమున్నదా? వెయ్యికళ్ళ జంతువు వేటాడ బోయింది. - వల.

చేప(చేఁప)ముల్లు కుట్టు - (గృహ.) చేపవెన్నముకను పోలినకుట్టు (Fish bone stitch)).

మీనము - 1.చేప, 2.మీనరాశి (Pisces).
మీనవల్లంకి - ఒకానొకపిట్ట, రూ.మీనవల్లఁకి, సం.మీనవల్లి కా.

మెలయు మీనాక్షి కిని మీనరాశి.... 

శఫరి - ఎగసిపడెడు చేప, రూ.శఫరము.
ఎగిసిపాటు - 1.గర్వము, 2.మిడిసిపాటు.
మిడిమేలము - గర్వము, అహంకారము.

మిడిసిపాటు - మిట్టిపాటు.
మిడి - మిట్టిపాట్టు, గర్వము, విన.1.మిడిసిపాటు గలది, 2.ఉన్నతము.

గరువము - 1.గర్వము, 2.గొప్పతనము, విన.1విస్తృతము, 2.పెద్దది, సం.గౌరవము.

గర్వో(అ)భిమానో(అ)హంకారో -
గర్వయనేనేతి గర్వః ఖర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
ఆత్మానముత్కృష్టం మానయతీత్యభిమానః - మను అవబోధనే తన్ను ఉత్కృష్టునిఁగాఁ దలఁపించునది.
అహమితి బుద్ధిం కరోతీత్యహంకార. డుకృఞ్ కరణే. - నేను ఉత్కృష్టుఁడ నను బుద్ధినిఁ జేయునది. ఈ 3 అహంకారము పేర్లు.

అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య దేహాత్మభ్రాంతి.
అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.అత్మాభిమానము (Egotism), 5.క్రోధము, (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది), రూ.అహంకృతి, అహంక్రియ.

మిడిగ్రుడ్డు - పై కుబికిన కనుగ్రుడ్డు.  

ప్రోష్ఠీ తు శఫరీ ద్వయోః,
ప్రోష్ఠీ శఫరీ ద్వయం భక్షయితు రంతరుదర దాహక మత్స్యనామనీ - ప్రోష్ఠీ శఫరీశబ్దములు భక్షించిన వానికి పైత్యముఁ(పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.) జేసెడిపెను పేళ్ళు.
ప్రోష్ఠతి పిత్తకృత్త్వాత్ప్రోష్ఠీ ఈ. సీ. ప్రుషదాహే. - పైత్యకారి యగుటవలన దహించునది. 
ప్రకృష్టః ఓష్ఠః అస్యా ఇతివా ప్రోష్ఠీ - పెద్దపెదవి గలిగినది.
శఫాన్ గతిసాధనావయవాన్ రిణాతి పీడయ తీతి శఫరీ. ఈ. ప్స. రి గతిశోషణయోః. - శఫములనఁగా గొరిసెలు, వానిని శీఘ్రగమనముచేతఁ బీడించునది - ఈ 2 మత్యవిశేషము పేర్లు.  

తవాపర్ణే! కర్ణే - జపనయన - పైశున్య - చకితాః
నిలీయంతే తోయే - నియత మినిమేషా శ్శఫరికాః,
ఇయం చ శ్రీ ర్బద్ధ - చ్ఛదవుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే - నిశి చ విఘటయ్య ప్రవిశతి. - 56శ్లో

తా. ఓ అపర్ణా! పార్వతీదేవి ! ఱెప్పపాటులేని చేపలు చెవి దగ్గరనున్న నీ కనులు తమ రహస్యమును బయట పెట్టునని భయపడినవై శఫరితలు నీటిలో మునుగు చున్నవి.(దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా వుండటంవల్ల తమచేష్టలన్నీ అమ్మచేత గమనింప బడుతున్నాయని భయం.) ఇక నీ నేత్రలక్ష్మి రాత్రిసమయంలో కలువ యందు ఉండి, ఉదయాన(ప్రత్యూషము - వేగుజాము)దాని దళాలను మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి, రాత్రివేళ మరల కలువలు(కువలయము - 1.భూమండలము, 2.నల్లకలువ, రూ.కువలము.) విప్పారగనే లోన ప్రవేశించు చున్నది. కనులు చేపలవలెను కలువలువలె నున్నవనుట. (అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరొపోల్చదగ్గ నేత్రలు అని భావము) - సౌందర్యలహరి   

అపర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ,
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా. - 52శ్లో

కుముదబాంధవుఁడు - చంద్రుడు.
కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము.

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందురుమామ - చంద్రుడు, చందమామ.
చంద్రము - చందురము, సం.చంద్రః.
(ౙ)జాబిల్లి - చందమామ, రూ.జాబిల్లి.
(ౙ)జాబిలిరిక్క - మృగశీర్ష నక్షత్రము.   

జాబిలితాలుపు - శివుడు, చంద్రధరుడు. 
జాబిలిమేపరి - రాహువు Rahu; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

చంద్రోదయము - 1.ఉల్లెడ, 2.చందురా, 3.చంద్ర్రుని పొడుగు.
ఉల్లడ - మేలుకట్టు, చాందిని, రూ.ఉల్లెద, సం.ఉల్లాభః.
మేలుకట్టు - 1.మెట్టు, 2.చాందినీ.  చాందిని - మేలుకట్టు.
(ౘ)చందువ - మేలుకట్టు, ఉల్లెడ, రూ.చందురా, సం.చంద్రోదయః.
(ౘ)చందుర - చంద్రకాంతము.

(ౙ)జాబిలిరాయి - చంద్రకాంతము.
చంద్రకాంతము - చలువరాయి.
ౘలువఱాయి - చంద్రకాంతము.

వనచంద్రికా న్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెల యనురీతి, నిష్ప్రయోజన మని యర్థము).

దృశా ద్రాఘ్రీయస్యా - దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం - స్నపయ కృపయా మామపి శివే!
అనేనా యం ధన్యో - భవతి నచ తే హాని రియతా
వనే వా హర్మ్యో వా - సమకరనిపాతో హిమకరః. - 57శ్లో
 
తా. తల్లీ! మిగుల దీర్ఘమైన(పొడవైనదియు) కొంచెము వికసించిన నల్లకలువల కాంతివంటి, కాంతి గలిగిన నీ కడగంటి చూపులోని కృపారసముచేత - కడు దూరమున నున్న దీనుడనగు నా యందు, దయ తో నీ చూపును పడనిమ్ము. ఈ మాత్రము చేతనేను ధన్యుడ నగు దును. ఇందుచే నీకేవిధమైన(హాని - 1.తక్కువగుట, 2.కీడు.)నష్టము లేదు. శీతకిరణు డైన చంద్రుడు(హిమకరుఁడు - చంద్రుడు)వనమున గాని, మేడలపైగాని తన కిరణములను సమానముగనే ప్రసరింపజేయుచున్నాడు కదా! - సౌందర్యలహరి 

సహస్రాదిత్యసంకాశా చంద్రికా చంద్రరూపిణీ,
గాయత్రీ సోమసంభూతి స్సావిత్రీప్రణవాత్మికా|

చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక. హరిశ్చంద్రము నందు దేవీస్థానం చంద్రిక|     
వెన్నెల - (వెలి+నెల), చంద్రిక.
చెంద్రిక - చెందిరిక.
చంద్రశాల - 1.పైమేడ, 2.వెన్నెల.
మేలుమౘ్చు - మేడ, చంద్రశాల.
ఓవరి - 1.లోపలిగది, 2.చంద్రశాల.  
శిరోగృహము - చంద్రశాల.   
చంద్రతాపము - వెన్నెల; చాంద్రి - వెన్నెల; నెలవెలుగు - వెన్నెల.

చన్ద్రికా కౌముదీ జ్యోత్స్నా -
చంద్రో స్త్యస్యామితి చంద్రికా - చంద్రయుక్తమైనది.
కు ముదానా మియం కౌముదీ, తద్వికాస హేతుత్వాత్ - కలువలు పుష్పించుటకు హేతువైనది గనుక కౌముది.
జ్యోతి రస్యామస్తీతి జ్యోత్స్నా - ప్రకాశము గలిగినది. ఈ మూడు వెన్నెల పేర్లు. 

కౌముది - 1.వెన్నెల, వ్యు.కుముదములను వికసింపజేయునది, భూజాను(భూజాని - 1.విష్ణువు, 2.రాజు)లను సంతోషపెట్టునది, 2.ఉత్సవము, పండుగ, 3.కార్తీక పూర్ణిమ.

జ్యోత్స్న - వెన్నెలరేయి, రూ.జ్యోత్స్ని.
జ్యోత్స్ని- వెన్నెలరేయి. 
వెన్నెలగతి - చంద్రుడు; చంద్రుడు - నెల, చందమామ.

స్మితజ్యోత్స్నా జాలం - తవ వదనచన్ద్రస్య పిబతాం
చకోరాణా మాసీ - దతిరసతయా చంచు జడిమా, |  
అత స్తే శీతాంశో - రమృతలహరీ మామ్ల రుచయః
పిబన్తి స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజిక ధియా || - 63శ్లో

తా. అమ్మా! ఓ భగవతీ, అతిమధురమైన నీ ముఖచంద్రబింబ మందస్మితము(చిరునగ వనెడి) వెన్నెలను గ్రోలుతున్న(త్రాగుచున్న) చకోరపక్షుల నాలుకలు మొద్దుబారినవైనవి. చకోరములకు మిక్కుటమగు తీపిని ఆస్వాదించుటచే ముక్కులు రుచి నెఱుగజాలకున్నవి. అందువల్ల నా పక్షులు తమ జిహ్వలు తిరిగి రుచిని పొందుటకై పులుపును గోరినవై అవి ప్రతి రాత్రులయందును స్వేచ్ఛగ, చంద్రుడి అమృతపు వెల్లువను, అన్నపుగంజి అనేభ్రాంతితో త్రాగుచున్నవి. - సౌందర్యలహరి            

రాకామలజ్యోత్స్న ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ...

(ౘ)చందమామ పులుగు - చకోరము.
చకోరము - చకోరకము.
నెలత్రావడము - చకోరము, వెన్నెలపులుగు. 
జీవంజీవము - వెన్నెల పులుగు, చకోరపక్షి.
జీవేన సహచరేణ క్రీడన్ జీవతి జీవంజీవః - జీవమనఁగా సహచరము; దానితోఁగూడ క్రీడించుచు బ్రతుకునది, వన్నెపులుఁగు.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెల చూచి తృప్తి పొందునది.
చకతి తృప్యతి జ్యోస్నయా చకోరకః, చకతృప్తౌ. - వెన్నెలఁ జూచి తృప్తిఁ బొందునది, వెన్నెలపులుగు. 

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచి గుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁ జేరవే
చలువగలట్టివాడయినఁజందురు నెంతయుఁ గోరి, భాస్కరా.

తా. చంద్రుని యందలి చల్లదనమునకు, (చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక)ఆ కిరణములను భక్షించుటకు ఎక్కువ ఆసక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే బుద్ధిమంతులు రాజు(నృపాలుఁడు - రాజు) మంచివాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను, సంతోషముతో నట్టిరాజునే కోరుదురు. 

విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
దేవా ఏనం విశేషేణ ధయంతి పిబంతీతి విధుః, ఉ. పు. ధేట్పానే - వేల్పు లీతని మిక్కిలి పానము చేయుదురు.

విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
విధుః ఉపు విధ్యతి ప్రత్యర్థినఁ ఇతి విధుః - శత్రువులను వ్యథపెట్టువాఁడు.

విధు ర్విష్ణా చన్దమసి -
విధుశబ్దము విష్ణువునకును, చంద్రునకును పేరు. వ్యధత ఇతి విధుః వ్యధతాడనే. అసురులను అంధకారమును బోఁగొట్టువాఁడు.

కౌస్తుభవక్షుడు - విష్ణువు. వక్షస్తలే కౌస్తుభం|

కౌస్తుభో మణిః (చాప శ్శార్ఙ్గ మురారేస్తు శ్రీ వత్సో లాఞ్ఛానం మతమ్,)
కౌస్తుభః కుంస్తోభత ఇతి కుస్తుభో హరిః, తస్యాయం కౌస్తుభః - భూమిని నిలిపిన విష్ణుని సంబంధమైనది.
విష్ణుభస్తమ్భే కుంస్తుభ్నాతి వ్యాప్నోతీతి కుస్తుభస్సముద్రః - తత్ర భవతీతివా కౌస్తుభః - సముద్ర మందుఁ బుట్టినది. ఈ ఒకటి విష్ణువు యొక్క మణిపేరు. విష్ణువు ధనుస్సు శార్ఙ్గము. పుట్టుమచ్చ శీవత్సము. 

కౌస్తుభము - విష్ణువక్షస్స్థలము నందలి మణి, వ్యు.కుస్తుభ = సముద్ర మందు పుట్టినది. 
దేవమణి - 1.కౌస్తుభము, 2.గుఱ్ఱము మెడ మీది సుడి.

ఊరక వచ్చుఁ బాటుపడకుండిననైన ఫలం బదృష్టమే
పారగఁగల్గువానికిఁ, బ్రయాసము నొందిన దేవ దానవుల్
వారలటుండగా నడుమ వచ్చిన శౌరికి గల్గెగదె శృం
గారపుఁ బ్రోవులక్ష్మియును గౌస్తుభరత్నము రెండు, భాస్కరా.
తా.
సురాసురలు అమృతమునకై మందర పర్వతమును కవ్వముగాను, వాసుకి యను సర్పరాజును కవ్వపు త్రాడుగాను ఉపయోగించి పాలకడలిని మధింపగా, అందు లక్ష్మియు, కౌస్తుభరత్నమును, కల్పవృక్షమును, కామధేనువు ను పుట్టెను. ప్రయాసపడి వారు సంపాదించిన వానిలో "లక్ష్మియు, కౌస్తుభ రత్నము" అను నీ రెండును ప్రయాస పడకుండనే విష్ణువు(శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.)నకు లభించెను. అదృష్టవంతున కభివృద్ధి కలుగబోవు నెడల నతడే ప్రయాసమును బడకుండ గనే అతనికి భాగ్యము కల్గును.

బాహ్యాన్తరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారాన ళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతో (అ)పి కటాక్షమాలా
కల్యాణ మావహతు మే కమలాలయాయాః| - 7

నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము.
తామర -
1.తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.) తామరచెలి - సూర్యుడు, పద్మ మిత్రుడు.
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మ వ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు 5.ముఖము పైగల చుక్కలు. కువేలము - 1.కలువ 2.పద్మము. ఉదజము - నీటబుట్టినది, వి.1.పద్మము, 2.పశువులను త్రోలుట.
పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
మాణిక్యము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ. ఎఱ్ఱనిది.

శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒకనిధి.
గుల్ల -
1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము), సం.క్షుల్లః.
నత్త - గుల్ల యందుండు పురుగు.
బొబ్బ - 1.పొక్కు, 2.సింహనాదము.
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల.

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు - విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

జీవో వినయితాసాక్షీ ముకుందో(అ)మిత విక్రమః
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయో(అ)న్తకః. - 55శ్లో 
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ. - 157శ్లో

శక్రుఁడు - ఇంద్రుడు, వ్యు.దుష్టజయమందు శక్తుడు.
శక్తుఁడు - శక్తిగలవాడు.
శక్నోతి దుష్టజయ ఇతి శక్రః - దుష్టజయమందు శక్తుడు, శక శక్తౌ.

ఇంద్రాయుధం శక్రధమః -
ఇంద్రస్య ఆయుధం ఇంద్రాయుధం - ఇంద్రుని యాయుధము.
శక్రస్య ధనుః శక్రధనుః, స-న. - శక్రుని ధనుస్సు.
మేఘప్రతిఫలిత నానావర్ణస్య ధానురాకారేణ దృశ్యమానస్య సూర్యరశ్మే ర్నామనీ - ఇది మేఘమునందు బ్రతిఫలించి, నానావర్ణమై ధనురాకారముగా నగపడుచున్న సూర్యరశ్మి. ఈ 2 ఇంద్రుని ధనుస్సు పేర్లు.

శిలాస్థో గంధ లేపశ్చ మార్జాలోచ్చిష్ట భోజనమ్| 
ప్రతిబిం బే క్షణంనీ రే శక్రస్యాపి శ్రియమ్‌ హరేత్||
  
తా. ఱాతిమీఁద బెట్టిన గంధము పూసికొనుట, పిల్లి Cat తాకిన అన్నము భుజించుట, నీళ్ళలో నీడఁ జూచుకొనుట, ఈ పనులు ఇంద్రున(శక్రుడు - ఇంద్రుడు, వ్యు.దుష్ట జయమందు శక్తుడు.)కైనను ఐశ్వర్యమును పోగొట్టును. - నీతిశాస్త్రము

మువ్వన్నెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు - (భౌతి.) సూర్య కిరణములు(మువ్వన్నెకాఁడు - సూర్యుడు) నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow)

ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రుని ఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.   

ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు(నాల్గు దంతములు కలది), 2.అమృతము.
(ౘ)చౌదంతి - చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము. వెలిగౌరు - ఐరావతము    
పున్నాగము - 1.పొన్న 2.ఇంద్రుని ఏనుగు(ఐరావతము) 3.పురుష శ్రేష్ఠుడు.
పొన్న - పున్నాగవృక్షము సం.పున్నాగః.

పుంగవుఁడు - (సమాసమున ఉత్తరపదమైనచో) శ్రేష్ఠుడు.
పుంగవము - వృషభము.

కేసరము - 1.ఆకరువు, 2.ఇంగువ, 3.జూలు, 4.పొగడ, 5.పొన్న, రూ.కేశరము.

పుంనాగే పురుష స్తుఙ్గః కేసరో దేవవల్లభః,
పున్నాగ ఇవ పున్నాగః - పురుష శ్రేష్ఠునివలె పూజ్యమైనది.
పురుషవ దున్నతత్వాత్పురుషః తుంగశ్చ - పురుషునివలె ఉన్నతమైనది పురుషము, తుంగమును.
ప్రశస్తాః కేశరాస్సంత్యస్య కేసరః - మంచి ఆకరవులు గలది.
దేవానాం వల్లభః - దేవతలకు ప్రియమైనది. ఈ నాలుగు 4 సురపొన్న పేర్లు. 

ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
యమపత్ని - ఐరావతి.

అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
నభ్రమతి స్వం వల్లభం హిత్వా కుత్రచిన్న గచ్ఛతీ త్యభ్రముః. ఉ-సీ భ్రముచలనే - తన మగని విడిచి కదలనిది.
అభ్రేషు మాతివర్తత ఇత్యభ్రముః మాఙ్ మానే వర్తనేచ - మేఘముల యందుండునది.

పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
(ౙ)జున్ను - 1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.  

పీయూష మమృతం సుధా,
పీయత ఇతి పీయూషం- పానము చేయఁబడునది. పీఞ్ పానే.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు.
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

అమృతకరుఁడు - చంద్రుడు. లలాటం అమృతోత్భవ|

అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
అమర్త్యాః నమ్రియంత ఇత్యమర్త్యాః - చావనివారు. మృఙ్ ప్రాణత్యాగే. అమృతాంధనః-న-వు. అమృత మంధో (అ)న్నమేషాం తే - అమృతము అన్నముగాఁ గలవారు.

వేల్పుబోనము - అమృతము.

అమృతం సద్గుణాభార్యా అమృతం బాల భాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్||

తా. గుణవతియైన యాలు(స్త్రీ, భార్య), బాలుని(బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.)ముద్దు మాటలు, రాజ సమ్మానము, ప్రియయుక్త భోజనము, ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము  

సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా,
సీతా సర్వాశ్రయా సంధ్యా సుఫలా సుఖదాయినీ |

సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక.

అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము.
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.

సుధాసిన్ధో ర్మధ్యే - సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపో - పవనవతి చిన్తామణిగృహే |
శివాకారే మఞ్చే – పరమశివపర్యఙ్క నిలయామ్  
భజన్తి త్వాం ధన్యాః - కతిచన చిదానంద లహరీమ్ || - 8శ్లో
   
తా. ఓ జననీ! పాలకడలి నడుమ నెలకొన్న రత్నాల దీవిలో, చుట్టును కల్పవృక్షములు వరుసతో చుట్ట బడినదైన కదంబచెట్ల పూదోటలలో చెలువొందు చింతామణులతో నిర్మితమైన(చింతామణి)గృహంలో, శివరూపమగు మంచము నందు  పరమశివుని పడుక యందుండు(పర్యంక నిలయమైన)జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను కొందఱు సేవించుచుందురు. (ధన్యా - దాది, ధన్యురాలు. అందరికీ సామాన్యముగా నీ సేవ లభించదని భావం.) - సౌందర్యలహరి 

శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః|         

దిగ్ఘస్తిభి కనకకుమ్భ ముఖావసృష్ట
స్వరాహినీ విమల చారుజల ప్లుతాన్గీమ్
ప్రాత ర్నమామి జగతాం జననీ మ శేష
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధిపుత్త్రిమ్| - 20 

మహాపద్మావటీసంస్థా - కదంబవనవాసినీ|
సుధాసాగరమధ్యస్థా - కామాక్షీ కామదాయినీ. - 23శ్లో

పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాల సముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

చాలఁబవిత్రవంశమున సంజనితురిడగునేని యెట్టి దు
శ్శీలునినై నఁ దత్కులవిశేషముచే నొకపుణ్య పు  డెంతయున్
దాలిమి నుద్ధరించును, సుధానిధిఁబుట్టగఁ గాదె, శంభుడా
హాలహలానంబు గళమందు ధరించుటఁబూని, భాస్కరా.

తా. మున్ను సురాసురలు పాల సముద్రము మధింపగా అందుండి పుట్టిన హాలాహలం (పాల సముద్రమున పుట్టిన విషము.)మనెడి యగ్నిని శివుడు(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)తన కంఠ మందు ధరించెను. అది ఆ యగ్ని గొప్పతనముకాదు, అది పుట్టినట్టి పాల సముద్రము యొక్క గొప్పతనము చేతనే. అట్లే, మంచి వంశమందు బుట్టిన, వాడు నీచుడైనను వానిని ఆ కులము యొక్క ఔనత్యము ను దలంచియే సజ్జనులు(తాలిమి - 1.క్షమ, 2.ధైర్యము, రూ.తాల్మి.)తో కాపాడుదురు గాని ఆ నీచుని జూచికాదు.

ఫాలవిలోచన భానుకోటిప్రభ, హాలాహలధర అమృత శివ|

సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధారూపా అంశవో యస్య సః సుధాంశుః, ఉ-పు. - అమృతరూపములైన కిరణములుగలవాఁడు.
సుధాకరుడు - చంద్రుడు.

నెల మేపరి - రాహువు.
సోపపవుఁడు -
రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు).

రాహుగ్రస్తే త్విన్దౌ చ పూష్టి చ సోపప్లవోప రక్తౌ ద్వౌ -
ఉపప్లవేన ఆకులతయా సహవత్త ఇతి సోపప్లవః - ఉపప్లవముతోఁ గూడినవాఁడు.
ఉపరజ్యతే ఉపరమతే వ్యాపారాదిత్యువరక్తః – వ్యాపారము వలన నుపరతుఁ డైనవాఁడు, ఉపరజ్యత ఇత్యువరక్తః - రాహువుచేత తమోయుక్తుఁడుగాఁ జేయఁబడినవాఁడు. ఈ రెండు రాహుగ్రస్తులైన సూర్యచంద్రుల పేర్లు.     

సకలజన ప్రియత్వము నిజంబు గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగగన్
టకటక మానియుండడె దృఢస్థితి నెప్పటి యట్ల ! భాస్కరా.
తా.
చంద్రుడు తన్ను రాహువు(రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము Rahu) మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికినీ ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము బాధింపదు, అతిత్వరలోనే అతడు కోలుకొనును.

శుభ్రాంశువు - చంద్రుడు, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశవో యస్యసః శుభ్రాంశుః ఉ-పు. - తెల్లని కిరణములుగలవాఁడు.

ఓషధీశుఁడు - 1.ఓషధుల కధిపతి యైన సోముడు, 2.బుధుడు.
ఓషధీనామీశః ఓషధీశః - వరి మొదలగు నోషధులకుఁ బ్రభువు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ఓషధీశుఁడు - చంద్రుడు.
ఓషధి - 1.మందుచెట్టు, 2.ఫలించిన తోడనే నశించెడి అరటి మొ.వి.
ఔషధము - 1.ఓషధి, 2.ఓషధులతో చేయబడిన మందు. ఉత్తర కురుక్షేత్రము నందు దేవీస్థానం ఓషధి|  

ఓషధులు - (వృక్ష.) ఔషధములుగా నుపయోగపడు మొక్కలు, ఉదా. సునాముఖి, అడ్దసరము మొ.వి. (Medicinal plants or herbs) 

నిశాపతి - చంద్రుడు.
నిశాయాః పతిః నిశాపతిః, ఈ. పు. - రాతిరికి ఱేడు.

అథ శర్వరీ
నిశా నిశీధినీ రాత్రి స్త్రియామ క్షణదా క్షపా
విభావరీ తమస్విన్యౌ రజనీ యామినీ తమీ. -

శర్వరి - రాత్రి.
శృణతి వ్యాపారం దినం వా శర్వరీ. ఈ. సీ. శౄ హింసాయాం - వ్యాపారమునుగాని దినమునుగాని చెఱుచునది.
శార్వరి - 1.రాత్రి, 2.అరువది సంవత్సరములలో నొకటి.

శర్వరీ దీపక శ్చంద్రః - ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపికః||
తా.
చంద్రుఁడు రాత్రిని ప్రకాశింపఁ జేయును, సూర్యుఁడు(రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.)పగటినిఁ ప్రకాశింపఁజేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁజేయును. - నీతిశాస్త్రము  

క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - విశ్వేశ్వరీ శర్వరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ.

శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ,
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా| – 71స్తో

నిశ - 1.రేయి, 2.పసుపు.
నితరాం శ్యతి సర్వవ్యాపారన్ నిశా. శో తనూకరణే - అన్ని వ్యాపారము లను మిక్కిలి స్వల్పముగాఁ జేయునది.

పసుపు - (వ్యవ.) ఇది ఒక దుంపజాతి సంబార ద్రవ్యము (Turmeric), అల్లపు కుటుంబము (Zingiberaceae) లోని curcuma longa అను మొక్కను వ్యవసాయదారులు పైరు చేయుదురు. ఈ మొక్కల దుంపలను ఎండబెట్టి పసుపు తయారు చేయుదురు.
యువతి - 1.జవరాలు, యువతి, 2.పసుపు.

నిశాఖ్యా కాఞ్చనీ పీతా హరిద్రా వరవర్ణినీ,
నిశాయాః ఆఖ్యా యస్యాస్సా నిశాఖ్యా - రాత్రి కేపేళ్ళు గలవో ఆపేళ్ళు దీనికిఁ గలవు గనుక నిశాఖ్య.
కాంచనవర్ణత్వాత్ కాంచనీ, ఈ. సీ. - బంగారువన్నెగలది.  
పీతవర్ణత్వాత్ పీతా - పచ్చని వన్నెగలది.
హరిద్వర్ణం ద్రాతీతి హరిద్రా. ద్ర కుత్సాయాం గతౌ. - పచ్చనివన్నె గలది.
శ్రేష్ఠవర్ణత్వాత్ వరవర్ణినీ. ఈ. సీ. మంచివన్నె గలది. ఈ 5 పసుపు పేళ్ళు.

కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి. (రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ వర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.   
బంగరు - బంగారము, సం.భృంగారః.
భృంగారము - 1.బంగారు పాత్రము, 2.గుంటగలిజేరు.   

కాంచన వస్తుసంకలిత కల్మష మగ్నిపుటంబు వెట్టి వా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మల త్రయం
బంచిత భక్తియోగదహనార్చిఁ దగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణా పయోనిధీ.

తా. రామా! బంగారులోని మాలిన్యము అగ్ని పుటము వలన పోవునట్లు అత్మయందుగల మూఁడుమలములు నీయందలి భక్తియోగము చేతనే, నశించునుగాని మరొక విధముగ నశింపవు. 

హరిద్ర - పసుపు.
వరవర్ణిని - 1.భర్త యందనురాగము గల్గియుండు ఉత్తమ స్త్రీ, 2.పసుపు.
పసుపు(ౘ)చుక్క - (గృహ.) కన్ను గ్రుడ్డులో ఈ చుక్క ఉన్నచోట ప్రతిబింబము పడిన అదిస్పష్టముగా కనబడును (Yellow-spot).

నిశీధిని - రేయి, (నడురేయి కలది.)
నిశీధము - నడురేయి; అపరాతిరి - నడురేయి, అర్థరాత్రము. 
నడికిరేయి - అర్ధరాత్రము, రూ.నడురేయి.
నిశీథః అస్యామస్తీతి నిశీథినీ. ఈ.సీ. - నిశీథమనఁగా, అది దీని యందుఁ గలదు.
నిశాకరుఁడు - చంద్రుడు Moon.  

రాత్రి - సూర్యాస్తసమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాతి సుఖమితిరాత్రిః ఇ. సీ. రాదానే. - సుఖము నిచ్చునది.
రాత్రిమణి - చంద్రుడు Moon.
రే - రేయి, యొక్క రూపాంతరము, రాత్రి.
రేకంటు - (రేయి+కంటు) సూర్యుడు Sun, రాత్రికి శత్రువు.
రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.  

త్రియామ - 1.రాతిరి, 2.పసుపు, 3.యమున. 
యామము -
జాము, మూడు గంటల కాలము.  
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.
త్రయో యామాః ఊస్యాంసాత్రియామా - యామమనఁగా జాము, మూఁడు జాములు గలది, రాత్రియందు ప్రథమయామము చేష్టాకాలముగనుకను, అంత్యయామము విబోధకాలము గనుకను నీ రెండు యామములందు సగము దివసముగా వునఁ ద్రియామ యనంబడును. 

క్షణద - 1.రాత్రి, 2.పసుపు, వ్యు.తీరికను వేడుకను కలిగించునది.
క్షణమవ్యాపారస్థితిం యూనాముత్సవం వాదదాతీతి క్షణదా, డుదాఞ్ దానే - వ్యాపారశూన్యమైన స్థితినిగాని యౌవనవంతులకు నుత్సవము నుగాని యిచ్చునది. 

విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ - చంద్రాదులచేతఁ ప్రకాశించునది.

తమి - రాతిరి, చీకటి.
తమస్విని -
రాతిరి.
తమః అస్యామ స్తీతి తమస్వినీ. ఈ. సీ. - చీఁకటి గలిగినది.
తమిస్ర - 1.చీకటిరేయి, చిమ్మచీకటి.
తమిస్రము - 1.చీకటి, 2.కోపము, 3.పసుపుపొడి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ(గొంగ-శత్రువు) - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu. 

అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.

ఇరులు - (వి. బహు.) చీకటి.
ఇరులుగొంగ -
సూర్యుడు Sun, వ్యు.చీకటులకు శత్రువు. 

తాపింఛము - చీకటి మ్రాను, తమాలము.
తమాలము - 1.బొట్టు, 2.కత్తి, 3.చీకటిచెట్టు.
బొట్టు - 1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తము.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 3.కూతురు, సం.1.భేత్రీ, 2.పుత్రః, 3.పుత్రిః.
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోళపు పొర క్రింద నుండు అంతస్రావగ్రంథి (Thymus gland).
తిరుచూర్ణము - ఎఱ్ఱబొట్టుపొడి.

పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
పుండరీకము - 1.తెల్లదామర, 2.అగ్నేయపు దిక్కునందలి యేనుగు, శార్దూలము.
పుండరీకాక్షుఁడు - విష్ణువు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.  

రజని - రాత్రి.
రంజంతి కామినో త్ర రజనీ. ఈ.సీ. రంజ రాగే - దీనియందు కాముకులు రాగయుక్తులగుదురు.
రజనిజలము - మంచు.

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్దర నారాయణా|

యామిని - రాత్రి.
యామా అస్యాం సంతీతి యామిని  - యామములు గలిగినది.
యామము - జాము, మూడు గంటలకాలము.
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.

యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
మగనాలు -
(మగని+ఆలు) పతిపత్ని, కుల స్త్రీ.

సభత్తృక - మగనాలు, ముత్తైదువు.
ముత్తైదువ - ముత్తయిదువ; ముత్తయిదువ - సుమంగళి. సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.సురలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ. 
సహజ - తోడ బుట్టినది.

అథ కులస్త్రీ కులపాలికా :
కులేన అవ్యభిచారేణ రక్షితాస్త్రీ కులస్త్రీ – ఒచ్చెము(న్యూనత, కొరత)లేని కులముచేత రక్షితయైనది.
కులం పాలయతీతి కులపాలికా. పాల రక్షణే. - కులమును రక్షించునది. వ్యభిచారము చేయక కులమును మానమును కాపాడుకొను స్త్రీ పేర్లు.

కులపాలిక - 1.తల్లిదండ్ర్లచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపసుమీ
కలకంటి కంట కన్నీరొలికిన
సిరి యింటనుండ నొల్లదు సుమతీ.

తా. కులసతితో(సతి - పతివ్రత స్త్రీ, పార్వతి)కయ్యము, లేనిదోషాలు ఆరోపించుట మంచిది కాదు, ఏలయన స్త్రీ కన్నీరు విడిచిన, ఆ యింటి యందు(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)లక్ష్మి నివసించదు.

ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.

ఆపన్న జన రక్షైకదీక్షా యామితతేజసే,
నమోస్తు విష్ణవే తుభ్యం రామా…..

మాపు - పోగొట్టు, వి.1.రాత్రి, 2.సాయంకాలము, 3.మైల.
రాత్రి -
సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకు గల కాలము.
రాత్రిమణి - చంద్రుడు Moon. 

రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.

సాయంకాలము - మునిమాపు; మునిమాపు - (మును+మాపు) ప్రదోషము, సంజ.
ప్రదోషము - 1.మునిమాపు, 2.మిక్కిలి దోషము.
మఱుసంౙ - సాయం సంధ్య. అసుర సంధ్య - రాక్షసవేళ, సాయంసంధ్య.
మాపుడు - మైల, మలినము(మాసినది, నల్లనిది).
మైలావు -  పొగ ఛాయగల ఆవు.

నెత్తురుపొద్దు - సంధ్యాకాలము.
నీరుకాళ్ళు -
సాయంకాలములందు దోచు ఎఱ్ఱని పచ్చని కిరణములు.

సాయము1 - సాహాయ్యము.
సాహాయ్యము - 1.తోడుపాటు, 2.సహాయత్వము, 3.స్నేహము.
తోడ్పాటు - తోడుపాటు; తోడుపాటు - సాహాయ్యము, రూ.తోడ్పడు.
తోడ్పడు - తోడుపడు; తోడుపడు - సహాయపడు, రూ.తోడ్పడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
సాయము2 - 1.సాయంకాలము, 2.బాణము.
సాయంతనము - సాయంకాల సంబంధమైనది.

అజిహ్మగము - బాణము, వ్యు.వంకరగా పోనిది, తిన్నగా పోవునది.

నాళీకము - 1.తామర, 2.బాణము, 3.బాణపు ములికి.
నాళము - 1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 2.కూతురు, సం.1.భేత్త్రీ, 2.పుత్త్రః, 3.పుత్రి. 

ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము.

తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.

క్రోవి - 1.తామరనాళము, 2.గొట్టము, 3.తుపాకి, 4.బుడ్డి, 5.భూమిలోపల నీళ్ళు వచ్చుటకు ఏర్పడిన తూము, 6.మూస, 7.ఊదుక్రోవి.
అండీయ - చిమ్మనగ్రోవి, రూ.అండె. అండె - అండీయ.
మూష - మూస; మూస - (రసా.) ద్రవ్యములను వేడిచేయుటకు ఉపయోగించు (పింగాణితో గాని, ఇనుము, రాగి, ప్లాటినమ్ వంటి ధాతువులతో గానిచేయబడిన) కుటకవంటి పాత్ర (Crucible).

వృద్ధార్కో హోమధూపశ్చ - బాలస్త్రీ నిర్మలోదకమ్|
రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ - ఆయుర్వృద్ధిః దినేదినే||
తా.
సాయంకాలమునం దెండ(ఎండ)కాచుకొనుట, హోమము(వేల్మి, యజ్ఞము)సేయు పొగ యొడలిమీఁదఁ బాఱుట, తనకంటె చిన్నదాని తో సంగమము చేయుట, మంచినీళ్ళు త్రాగుట, రాత్రుల యందు క్షీరాన్న భోజనము చేయుట; ఇవి దినదినమున (ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.)ఆయుస్సును వృద్ధి పొందించును. - నీతిశాస్త్రము

మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.  
మకిల - 1.మాలిన్యము, 2.నలుపు Black, సం.మలినమ్.  మాలిన్యము - మలినత. మలినము - మాసినది, నల్లనిది.
ముఱికి - కల్మషము, మాలిన్యము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు. 

మంగు - 1.మాలిన్యము, 2.మొగము నందు పుట్టు నల్ల పొడ, రూ.మాఁగు, మంగుఁడు, మాఫుఁడు, 3.మిగులపండుట.
మాఁగు - క్రి.కమియబండు, వి.మాలిన్యము.
మాగుఁడు - కసటు, నలుపు.
మాపుడు - మైల, మలినము.

కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.

మాసి1 - మానిసి, సం.మానుషః.
మాసి2 - 1.మసి, 2.మురికి.
మసి - 1.చూర్ణము, 2.నలుపు, 3.బొగ్గు, సం.మసీ.
చూర్ణము - 1.గందపొడి, 2.సున్నము, 3.దుమ్ము, 4.పొడి.  

దుమ్ము - ధూళి, రూ.దుము, సం.ధూమః.
ధూళి - దుమ్ము.
దుము - దుమ్ము, సం.ధూమః.
దుమారము - దుమ్ము. ధూమము - పొగ. 
ధూమయోని - మేఘము, వ్యు.పొగయే జన్మకారణముగా కలది.
ధూళిధ్వజుఁడు - గాలి, వ్యు.దుమ్ము జెండాగా కలవాడు.

శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామిక - చీకటి, నలుపు.

అశౌచము - అశుచిత్వము, అంటు, మైల, ఉదా. (జాతశౌచము, మృతాశౌచము).
అశౌచము - 1.మురికి, 2.పురుడు, 3.మృతశౌచము, మైల.
పురుడు - జాతము, జాతశౌచము, విణ.సమానము.
జాతము - సమూహము, విణ.పుట్టినది. 

జాతకర్మము - పుట్టినపుడు చేయు క్రియ.

మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు మురికితోడ నుండనేని
అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు విశ్వ.
తా||
మాసిన చీరతోను(కోక - వలువ, చీర.), మాసిన తలతోను, మురికిగాయున్న శరీరముతోను వున్నచో గొప్పకులము నందు పుట్టినవారి నయినను హీనముగా చూతురు. (బట్టలు మురికిగానియ్యని శుభ్రత యెవ్వరికి వుండదు)

అబ్జుఁడు - 1.చంద్రుడు, 2.ధన్వంతరి, వ్యు.నీటినుండి పుట్టినవాడు.
అప్సుజాతఃఅబ్జః జనీ ప్రాదుర్భావే - నీటియందుఁ బుట్టినవాడు.

ధన్వంతరి - 1.దేవవైద్యుడు, 2.సూర్యుడు, 3.మహేశ్వరుడు.   
వేల్పువెజ్జు - దేవవైద్యుడు.

సూర్యుఁడు - వెలుగురేడు.
సూర్యతనయుఁడు - 1.శని Saturn, 2.కర్ణుడు. 
సూర్యతనయ - యమున. యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ. జమున.
ౙమున - యమున. ౙమునయ్య - సూర్యుడు.
ౙమునతోఁబుట్టు(వు) - యముడు. 
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.

మహేశ్వరుఁడు - శివుడు.
మహేశ్వరః మహాంశ్చాపా వీశ్వతశ్చ - శ్రేష్ఠుడైన యీశ్వరుఁడు. ఈశ ఐశ్వర్యే.

చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.     

బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.         
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురుడు.
విఘ్నరాజు - వినాయకుడు.

కాని ప్రయోజనంబు సమకట్టదు, తాభువినెంత విద్యవా
డైనను, దొడ్డరాజు కోడుకైనను నదెట్లు, మహేశుపట్టి, వి
ద్యానిధి, సవవిద్యలకుఁ దానెగురుండు, వినాయకుండుదాఁ
నేనుఁగు రీతినుండియు నదేమిటికాడఁడు పెండ్లి! భాస్కరా.

తా. వినాయకు డీశ్వరుని కుమారుఁడయ్యు, భూమి యందు తాను, సర్వ విద్యలకు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నకు మూలపురుషుడయ్యు జ్ఞానము నిచ్చు వాడయ్యు, ఏనుగు బలము కలవాడయ్యు అతడు (పెండ్లి - వివాహము)పెండ్లాడక లేక పోయెను. అట్లే ఎంత గొప్పవాడైనను తనకు వశము(స్వాధీనము)కాని పని చేయ బూనినచో నెరవేర్చుకొన లేడు. 

పీతాముత్పలధారిణీం శుచిసుతాం పీతాంబరాలంకృతాం |
వామే లంబకరాం మహేంద్ర తనయాం మందారమాలాధరాం||
 

త్రిమూర్తులు - బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. 

ఓం మహేశ్వరయుక్త నటన తత్పరాయై నమో నమః|

ధ్యేయః కాళీవిశ్వనాథో మహేశో
రుద్రాక్షోవై భూతి రామ్నాయవేద్యా
మంత్రాధీశో భాతి పంచాక్షరీయం
నిస్తుల్యోయం శుద్ధకైవల్యమార్గః|

తా. మహేశ్వరుఁడే ధ్యానింపఁదగినవాఁడు. వేదోచితములైన విభూతి రుద్రాక్షలే ధరింప దగినవి. మహామహిమోపేతమగు పంచాక్షరీ మంత్రరాజ మే జపింపఁ దగినది. నిరుపమానము ను బరమకైవల్యప్రాప్తికి మార్గమును నిదియే !

మహేశ్వరప్రియో దాన్తో మేరుగోత్రప్రదక్షిణః,
గ్రహమణ్డల మధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః.

ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ఈష్ట ఇతీశ్వరః - ఐశ్వర్యయుక్తుఁడు, (ప్రభుత్వము గలవాఁడు).
ఈశ్వరి - పార్వతి.
ఈశ్వరస్య పత్నీ ఈశ్వరీ, ఈ-సీ. - ఈశ్వరుని భార్య.
ఈశ్వర - ప్రభవాది అరువది సంవత్సరములలొ పదునొకండవది(11వ).

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

ఈశ - 1.ఏడి కోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము. 

శర్వుఁడు - శివుడు, వ్యు.ప్రళయ కాలమున భూతముల హింసించువాడు.  
శర్వః, ప్రళయే భూతానిశృనాతి హీనస్తీతి శర్వః - ప్రళయమందు భూతములను హింసించువాఁడు, శౄహింసాయాం.
శర్వాణి - పార్వతి. శర్వాణీ శర్వమూర్తిమాన్|
శర్వస్య పత్నీ శర్వాణీ, ఈ. సీ. - శర్వుని భార్య.

క్షయము - 1.క్షయవ్యాధి, 2.తగ్గుదల, 3.ప్రళయము, 4.క్షయనామ సంవత్సరము.

యక్ష్మము - క్షయరోగము.
క్షయరోగము - ఊపిరితిత్తుల రోగము, క్షయవ్యాధి, (Tuberculosis).
రాజయక్షము - క్షయరోగము, Consumption.

పుమాన్ యక్ష్మా క్షయ శ్శోషః -
యక్ష్యతే రోగేషు యక్ష్మా. న. పు. యక్ష పూజాయాం. - రోగములయందు రాజవుటవలనఁ బూజింపఁ బడునది.
క్షీయన్తే అనేనేతి క్షయః క్షి క్షయే. - దీనిచేత క్షయింతురు. 
శుషన్తే అనేనేతి శోషః. శుష శోషణే. - దీనిచేత శోషింతురు. ఈ మూడు 3 క్షయరోగము పేర్లు.

శోషణము - 1.శోషరోగము, 2.క్షయరోగము.
శోషణము - 1.ఇంకుట, ఎండుట, సం.వి. (రసా.) తేమను తొలగించు విధానము (Dessication).
శోషించు - ఇంకిపోవు.
ఎండు - 1.నీరింకు, 2.తడియారు, 3.శుషించు, 4.తపించు.
ఎండుతెవులు - దేహమును శుష్కింప జేసెడి ఒక వ్యాధి.

నవఁత - 1.శ్రమ, 2.దుఃఖము, 3.క్షయరోగము.
దుఃఖము - 1.బాధ, 2.చింత.

గ్లాని - 1.శ్రమచే కల్గిన దౌర్బల్యము, 2.అశక్తి, 3.రోగము, 4.నాశము.
గ్లానుఁడు - తెవులుగొంటు, రోగము చేత కృశించినవాడు.
కార్శ్యరోగము - (గృహ.) చిక్కి శల్యమగుటకు క్షీణించి పోవుట (Emaciation).

ఆస్తేనియా - (గృహ.) (Asthenia) బలము తగ్గుట లేక బలము లేకపోవుట.  

అతిరోగము - అధికమైన రోగము కలది, వి.1.అధికమైన రోగము, 2.క్షయవ్యాధి.
క్షయరోగమునకు ముఖ్యముగ కాస, శ్వాసలు, కఫము, జ్వరము, దేహము శుష్కించుట, నీరసము, అరుచి, అగ్నిమాంద్యము గలిగి యుండును.

అపచయము - 1.హాని, నష్టము, తగ్గుట, 2.పుష్పాదులను కోయుట, (రసా.) తగ్గించుట, చూ. హాసము.
నష్టము - నశించినది.
అవగడము - 1.ఏమరిపాటు, 2.అపాయము, విణ.1.అపాయకరము, ఇతరులకు అశక్యమైనది, 3.చెడ్డది. 
ఏమఱిపాటు - 1.పరాకు, 2.ప్రమాదము, విణ.1.అకస్మాత్తుగా, 2.వంచనగా, రూ.ఏమఱుపాటు.
పరాకు - 1.తత్పరత, 2.ప్రమాదము.
ప్రమాదము - (గృహ.) హతాత్తుగా కలిగిన నష్టము (Casuality).
ప్రమత్తుఁడు - ప్రమాదపడినవాడు.
ప్రమాది - అరువది సంవత్సరములలో నొకటి (13వది).
ప్రమాదీచ - నలువదియేడవ(47వ) సంవత్సరము. 
ఏమఱిలు - 1.క్రి. 1.ఏమఱు, 2.ఉపేక్షించు, మరచు, ఏమరిలు, ఏమరిల్లు.
ఏమఱచు - క్రి.ఏమరజేయు, రూ.ఏమాఱుచు.

తగ్గుదల - తక్కువ; తక్కువ - కొరత.
తగ్గు - క్రి.1.తక్కువగు, 2.వెనుదీయు, 3.తెగిపడు, వి.తక్కువ.

విలయము - ప్రళయము.
ప్రళయము - 1.కల్పాంతము, 2.అపాయము, 3.మృత్యువు, 4.మూర్ఛ.
కల్పము - 1.బ్రహ్మదినము, 2.ప్రళయము, 3.శాస్త్రము.  

సరస్వత్యా స్సూక్తీ - రమృతలహరీ కౌశలహరీః
పిబన్త్యా శ్శర్వాణి - శ్రవణచుళుకాభ్యా మవిరళమ్,
చమత్కారా శ్లాఘా - చలిత శిరసః కుండలగణో
ఝుణత్కారై స్తారైః - ప్రతివచన మాచష్ట ఇవ తే| - 60శ్లో

తా. తల్లీ! శర్వాణి! అమృతలహరీ వంటి(కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.)మాధుర్య మార్దవములను హరించు పలుకులతో సరస్వతి(సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒకనది.)చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ళచేత చక్కగా పుచ్చుకొనుచున్న దానవు (వినుచున్నదానవు); నీవు ఆ స్తోత్రగానములోని చమత్కారమును(శ్లాఘ - 1.ప్రశంస, 2.పరిచర్య, 3.ఇచ్ఛ.) శ్లాఝించుటకు గాను కదల్పబడిన శిరస్సు కల దానవగుచుండగా నీయొక్క కర్ణభూషణముల సముదాయము - అతి బహుళములైన  ఝణత్కారము చేయుచు అనుమోదించు మాటలను చెప్పుచున్నదో యన్నటుల నుండెను. - సౌందర్యలహరి

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయావహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.

శంకరుఁడు - శివుడు, విణ.సుఖమును గలుగజేయువాడు.
శం సుఖం కరోతీతి శంకరః - సుఖమును గలుగఁ జేయువాఁడు, డు కృఙ్ కరణే.
శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ – స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.

గంగా గిరిసుతవల్లభ శుభహిత శంకరసర్వ జనేశశివ|

జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూషిత భూషిత వాసిత వాద్యనుతే !
కనకధరాస్తుతి వైభవ వంధిత శంకర దేశిక మాన్యపదే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమాం| – 6

చంద్రశేఖరుఁడు - 1.శివుడు, 2.నెలతాలుపు.
చంద్రశేఖరః, ఛంద్ర శేఖరఃశిరోభూషణం యస్య - చంద్రుడు శిరోభూషణముగాఁ గలవాడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.

నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురుగింజల యెత్తు.  
మినుము - మినుపపైరు, మాషము.

నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.

నెలమేపరి - రాహువు.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.

భూతేశుఁడు - శివుడు.
భూతేశః భూతానాం ప్రమథానా మిశః - ప్రమథగణములకు నీశ్వరుడు.

బూదె - చతుర్దశి తిథి, సం.భూతః.     
భూతము - 1.పృధివ్యాధి భూతములు (ఇవి:- పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.)2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది. శివతేజ శ్చతుర్దశః|  

బూ(ౘ)చులఱేఁడు - శివుడు.
బూచి - భూతము, సం.భూతః.
దెత్తి - (వ్యావ.) భూతము. ఎంత దెత్తో! దెత్తి బట్టిందా ఏమిటి?

దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
దేవుఁడు - భగవంతుడు.
దేవర - 1.దేవత, దేవుడు, 2.ప్రభువు.

దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది.
దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

దైవికము - దైవము వలన కలిగినది.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యాము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.

ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాంగల్యము.

అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత మగుటవలన కానఁబడనిది. వహ్నితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆది శబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.

గ్రుడ్డివాటు - (గ్రుడ్డి+పాటు) దైవము వలన కలిగినది, దైవికము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property). 

బూతము - భూతము, పిశాచము, సం.భూతః.
పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము.
పిశాచాదిశబ్దములు ఇతర స్థలమందుఁ జెప్పబడనివి గనుక విద్యాధరశబ్దమువలె లింగభేదము దెలియుటకై జాతివివక్షచేత నేకవచనముగాఁ జెప్పబడినవి.    
పిశితము - మాంసము.
పిశిత మశ్నంతీతి పిశాచాః - మాంసమును భుజించువారు-కుబేరానుచరలు, అశ భోజనే.

గాము - 1.సూర్యాది గ్రహము 2.పిశాచము, సం.గ్రహః.

చతుర్దశి - 1.పక్షమున పదునాల్గవ దినము, 2.పరివారిది యన వీణ, 3.పదునాల్గవది.
సప్త - ఏడు తంతులుగల వీణ, పరివాదిని.  

ఈరేడు - (ఈరు+ఏడు) పదు నాలుగు, ఉదా.ఈరేడు జగంబులు.

అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||

తా. బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకలభూతములకు ద్రోహము గలుగని వృత్తిచేత జీవించవలయును. లేక భూతములకు స్వల్పపీడ సేయునట్టి వృత్తిచేతనైనను జీవింపవచ్చును. – నీతిశాస్త్రము

భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది.

భూతాత్మము - దేహము; దేహము - శరీరము, మేను. శరీరము - దేహము.
దేహి - దేహము గలవాడు.

భూతాత్మానౌ ధాతృదేహౌ -
భూతాత్మన్ శబ్దము బ్రహ్మకును, దేహమునకును పేరు. భూతానాం ప్రాణినా మాత్మా, పృథివ్యాది భూతస్వరూప ఇతి చ భూతాత్మా, న. పు. ప్రాణులకు ఆత్మ గనుకను, పంచమహాభూత స్వరూపముగను భూతాత్మ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
రూయతే స్తూయత ఇతి రవిః. ఇ. పు. రుశబ్దే - నుతింపఁబడువాఁడు.

రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్ఠునికిని పేరు.

జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.
జీవయతి దేవానితి జీవః. జీవప్రాణధారణే - దేవతలను బ్రతికించువాఁడు.
జీవ్యతే మృతో అనేనజీవః - చచ్చినవాఁడు ఈయనవలన బ్రతుకును.

జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
శరీరి - ప్రాణి.
జీవాత్మ - దేహి(దేహి - దేహము గలవాడు), జీవుడు

బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాద్యాయుడు, 2.కులము పెద్ద,3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

జీవోత్పత్తి క్రమము - (జీవ.) ప్రాణులు ఇదివరకున్న ప్రాణుల నుండియే పుట్టగలవు గాని ఆసస్మికముగా బయలుదేరుట కవకాశము లేదను భావన (Biogenesis).

రాము డొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె  
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో! విశ్వ.
తా.
  శ్రీరాముడు జన్మించి  సూర్య వంశమునకు పేరుతెచ్చెను. దుర్యోధనుడు పుట్టి కౌరవ(కౌరవులు - కురువంశపు వారు.)కులమును పాడుచేసెను. ఈ ప్రపంచములో(ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.)ను పుణ్యము, పాపము అనునవి యీ విధముగనే ఉండును.

విహాయసగతిర్యోతిః స్సురుచిః హుతభుగ్విభుః
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః|

ఖండ పరశువు - 1.శివుడు, 2.పరశురాముడు.
ఖండపరశుః ఉ-పు. ఖణ్డయతీతి ఖణ్డః ఖణ్డః పరశుర్యస్య సః ఖణ్డపరశుః - ఖండించెడు గండ్రగొడ్డలి గలవాఁడు. ఖండపర్శుః అని రూపాంతరము.
ఖండ భేదనే. ఖండః ఖండితః పరశురిత్యసురో నేనేతివా - పరశు వనెడు రాక్షసుఁడు ఇతనిచే ఖండింపఁబడెను. 
కదాచిత్ఖండితో స్య పరశురితి వా - ఒకానొకప్పుడు ఈయన పరశువు(గండ్ర గొడ్డలి) ఖండిత మాయెను.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

సుధన్యా ఖణ్ణ పరుశుః దారుణో ద్రవిణః ప్రదః,     
దివిద్పృక్ సర్వ దృగ్వ్యసో వాచస్పతి రయోనిజః|
- 61స్తో

కుఠారము - గొడ్డలి.
గొడ్దలి - చెట్లునరకు సాధనము, కుఠారము (వ్యవ.) పెద్దచెట్లను వానిశాఖలను నరకుట కుపయోగించు ఇనుప పనిముట్టు, సం.కుఠారః.
పరశువు - గండ్ర గొడ్దలి.
పరశ్వధము - గండ్రగొడ్దలి, రూ.పరస్వధము.

ద్వయోః కుఠార స్స్వధితిః పరశుశ్చ పరశ్వథః,
కుఠాన్ వృక్షాన్ ఇయర్తీతి కుఠార ప్స. ఋ గతౌ. - వృక్షములఁ బొందునది.
స్వం స్వకీయం ధియతి బిభర్తీతి స్వధితిః. ఈ. పు. దిధరణే. - స్వకీయమైనవారిని బోషించునది
స్వము - 1.ధనము, 2.తాను, తనది.
స్వకీయము - తనది, రూ.స్వకము. (వ్యతి.పరకీయము).  తన - ఆత్మార్థకము. 
పరాన్ శృణాతీతి పరశుః. ఉ. పు. శౄ హింసాయాం. - శత్రువులను హింసించునది. 
పరాన్ శ్యతీతి పరశ్వథః శో తనూకరణే. - పరులను క్షయింపఁజేయునది. ఈ 4 గండ్రగొడ్డలి పేర్లు.

కలిలము - 1.చొరరానిది, 2.ఎరుగరానిది, వి.గండ్రగొడ్డలి, రూ.కలలము.

ద్రూఘణము - 1.గండ్రగొడ్దలి, 2.ఇనుపగుదియ, రూ.ద్రుఘణము.

చిప్పగొడ్డలి - చెట్లునరకు గొడ్డలి. 

గంధర్వో హ్యదితి స్తార్ క్ష్య స్సువిజ్ఞేయ స్సుశారదః,
పరశ్వథాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః|

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్
క్ష్వేనీలగళం పరశ్వథధారణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| - 4

పదునాఱవదియైన(16వ) భార్గవ రామాకృతి నిఁ గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులయిన రాజుల నిరువది యొక్కమాఱు వధియించి భూమి నిఃక్షత్రంబుఁ గావించె; పదహారోమారు పరశురాముని రూపమును ధరించినవాడై రౌద్రకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి భూమిని క్షత్రియశూన్యం కావించాడు.   

ఇరువదియొక్కమాఱు ధరణీశులనెల్ల వధించి తత్క ళే
బర రుధిర ప్రవాహమున భైఁ తృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామ మూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.

తా. రామా! రాజులనందఱిని ఇరువదియొక్క పర్యాయములు చంపి, వారి దేహముల నెత్తుటి వెల్లువలచేత పితరులకు జలతర్పణమిచ్చి వారి యొద్దనుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహమునకు సంతోషము(ముదము - సంతోషము) కలుగునట్లు దానము చేసిన పరశురాముఁడవు నీవేయగుదువు. 

క్షత్రియరుధిరమయే జగదపగతపాపమ్,
స్నపయసి పయసి శమితభవతాపమ్|
కేశవ! ధృత భృగుపతిరూప! జయ జగధీశ! హరే!| - 6

భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు. భార్గవదర్ప వినాశక రామ్|      
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి.
భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.

శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || - 6

భద్రమూర్తి ర్భద్రగుణో భార్గవో భక్తపాలనః,
భగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః|

పరశురాముడు - జమదగ్ని మహర్షికిని రేణుకకును పుట్టినవాడు.
రేణుక - 1.గంధ ద్రవ్యము, 2.జమదగ్ని భార్య.

అథ ద్విజా,
హరేణూ రేణుకా కౌన్తీ కపిలా భస్మగన్ధినీ,

ద్విర్ణాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.
హరతి రోగాన్ హరేనూ, సీ. హృఞ్ హరణే. - రోగములు హరించునది.
రేణు యోగాద్రేణుకా - ధూళి(ధూళి - దుమ్ము)గలది.
కుంత్యై దుర్వాసనా దత్తా కౌంతీ, సీ. - కుంతికొఱకు దుర్వాసునిచే నియ్యబడినది.
కపిలవర్ణత్వాత్కపిలా - కపిలవర్ణము గలది.
భస్మ గంధయతి భస్మగంధినీ. సీ. గంధ అర్దనే. - ధూళిచేఁ బీడించునది. ఈ 5 రేణుక యనుగంధద్రవ్యము పేళ్ళు. తక్కోలము.

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు, 4.శివుడు.
బ్రహ్మ -
నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ప్రపాతస్తు తటో భృగుః,
ప్రవతంత్యస్మాదితి ప్రాపాతః, పత్ ఌ గతౌ. - దీనినుండి పడుదురు.
తటతీతి తటః, తట ఉచ్ఛ్రాయే. - ఉన్నతమైనది.
భ్రజ్యతే తవ్యతే సూర్యాగ్ని తేజసా భృగుః, ఉ పు. భ్రస్ట పాకే. - సూర్యాగ్ని తేజస్సులచేతఁ దపింపఁ జేయఁబడునది. ఈ 3 కొండచఱియ పేర్లు.   

కొండౘఱియ - కొండపార్శ్వభాగము.
తటము - 1.ఏటియొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము. 
తటి - 1.ఏటియొడ్డు, 2.ప్రదేశము.

ౘఱి - సంచరింప నశక్యమగు పర్వత శిఖరము క్రిందిచోటు, రూ.చఱియ.
జాఱువు - 1.కొండచఱి, 2.జారుట.  
(ౙ)జాఱుఁడు - జారుట.
(ౙ)జాఱు - క్రి.1.జరుగు, 2.ఉరుకు, 3.వదలు, 4.స్రవించు, వి.1.స్ఖలనము, 2.జారుట.

ౙరుగు - క్రి.1.రొమ్ముతో ప్రాకు, జారు, 2.జీవనము నడుచు, 3.కడచు, 4.పోవు, రూ.జరుగు.

ఉఱుకు - క్రి.1.దుముకు, పరుగెత్తు, 2.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప. 

వదలు - క్రి.శిథిలమగు, పట్టువీడు.
శ్లథము - శిథిలమైనది, వదులైనది.
శిథిలము - సంధులు వదిలినది, శ్లథము.

శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి(Venus).
శుక్రవారము - భృ గు వా ర ము, వారములలో నొక దినము Friday.

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోద్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

భృగు ర్భోగకరో భూమీసురపాలనతత్పరః,
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః| - 6

గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
గిరేః కైలాసస్యేశః గిరీశః - కైలాసమున కీశ్వరుడు. 
గిరౌ శేతే గిరిశః - కైలాస మందు శయనించువాఁడు.

ఘాతుక భంజన పాతకనాశన గౌరీసమేత గిరీశ శివ| 

గిరి - 1.కొండ, 2.అచ్ఛనగాయ, 3.గుండురాయి.
కాలేన గీర్యత ఇతి గిరుః, ఈ. పు. గ్రావా చ న పు. గౄ నిగరణే. - కాలముచేత జెఱుపఁబడునది.

గిరిధన్వుఁడు - శివుడు, వ్యు. మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు. 

గిరిజ - 1.పార్వతి, 2.కొండయరటి, 3.మల్లెతీగ.
గిరే ర్జాతా గిరిజా - పర్వతమువలనఁ బుట్టినది.   

కుటజము - కొండమల్లె.
మల్లిక - మల్లెతీగ.
మలె - మల్లె పువ్వు, సం.మల్లీ, మల్లికా.
బొండుమల్లె - గుండుమల్లె.

ఓం గిరీశ బద్ధ మాంగల్య మంగళాయై నమో నమః| 

గిరిజనులు - (వ్యావ.) కొండజాతులు, ఆదివాసులు.
ఆదివాసులు - కొండలందు, అడవులందు ఉండు అ నా గ ర కు లు (Aborigins).

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
విశాలాక్షి - హైమవతి, పార్వతి.
భవ్య - పార్వతి, హైమవతి.

అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి!
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, |
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తా మణిధరః || - 61శ్లో
  
తా. హిమవంశమునకు పతాకవంటి(జండాయైన) ఓ తల్లీ! నీ ముక్కు అనెడి వెదురు మాకు చేరిక యైన తగిన ఫలము నొసగు గాక, ఏ నాసిక లోపల చంద్రనాడి యనెడి నిటూర్పు నుండి(శ్వాస వదలేటప్పుడు) జారిన ముత్తెములను ధరించు చున్నదో ఆ నాసిక వెలుపలను గూడ ముత్తెము లను ధరించుచున్నది – సౌందర్యలహరి

పూర్వోత్తరే పారలికాభిధానే - సదాశివం తం గిరిజాసమేతమ్|
సురా(అ)సురా (ఆ)రాధితపాదపద్మం - శ్రీవైద్యానాథం సతతం స్మరామి.

మృడుఁడు - శివుడు, విణ.భక్తులను సంతోషపెట్టువాడు.
మృడతి సుఖయతి భక్తా నితి మృడః - భక్తుల సుఖింపఁ జేయువాఁడు.
స్వయం సుఖీ వా - తాను సుఖము గలవాఁడు.
మృడాని - పార్వతి.
మృడస్య పత్నీ మృడానీ, ఈ. సీ. మృడుని భార్య. 

భక్తుఁడు - భక్తిగలవాడు.
భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.
భక్తము - భాగింపదగినది, వి.1.అన్నము, 2.పూజ, 3.భాగము.

అమ్బా సంహారమథినీ మృడానీ సర్వమఙ్గళా,  
విష్ణుసం సేవితా సిద్ధ బ్రహ్మాణీ సురసేవితా|  

సర్వయంత్రాత్మికా సర్వ-తంత్రరూపా మనొన్మనీ|
మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీ ర్మృడప్రియా.

మృత్యుంజయుఁడు - శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు.
మృత్యుం జయతీతి మృత్యుంజయః - మృత్యువును గెలిచినవాఁడు. జి జయే.
మిత్తిగింగ - మృత్యుంజయుడు, శివుడు.

మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మృత్యువు - 1.చావు, 2.మరణాధిదేవత.
మృతు - చావు.

మిత్తిచూలు(ౘ) - కేతువు Ketu. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెపుగాము - వి.1.కేతుగ్రహము, మిత్తిచూలు.

ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు -
1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.
ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు. 

ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
అస్తమయము - 1.(సూర్యాదులు) కుంకుట, 2.నాశము, 3.(జ్యోతి.) గ్రహములు సూర్యునితో కలిసియుండుట.
అస్తము - 1.ప్రొద్దుక్రుంకు కొండ, అస్తాద్రి, 2.గ్రహములకు సూర్యునితోడి సంయోగము, 3.నాశము, 4.క్రుంకుట, విణ.1.త్రోయబడినది, 2.నశించినది, 3.కనబడనిది.

జని - 1.స్త్రీ, ఆడుది 2.భార్య, 3.కోడలు(కుమారుని భార్య), పుట్టుక.
జాయతే స్యాం పతిః పుత్రరూపేణేతి జాయా. జనీ ప్రాదుర్భావే. - ఈమె యందు పతి పుత్రరూపమున జనించును.
బ్రియత ఇతి భార్యా. బృఞ్ భరణే. - భరింప బడునది. 
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

జననము - 1.పుట్టుక 2.వంశము. 
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక; ప్రాదుర్భావము - పుట్టుక.

నేక్షేతోత్యంత మాదిత్యమ్నా స్తంయాంతం కదాచన
ప్రతిబింబం సదారిస్థం నమధ్యం నభసో గతం||
తా.
సూర్యు డుదయించుచున్నప్పుడు, అస్తమయ మగుచున్నపుడు, ఆకాశ మధ్యంబును బొంది యున్నపుడు ప్రతిసూర్యుని (అనఁగా ఉదకమందలి సూర్య ప్రతిబింబమును) జూడరాదు. - నీతిశాస్త్రము

ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము 5.కుబేరుని భార్య.    

వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి 2.వడ్డి.
పొడుపు కొండ -
ఫలసిద్ధి -
వడ్డి -
వృద్ధి, సం.వృద్ధిః. అసలు కన్నా వడ్డీ ముద్దు.

వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి -
(గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
కుత్సీరము - వడ్డీబ్రతుకు.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.   

పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు - (గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy).

వైమనస్యము - 1.దుఃఖమనస్కుని భావము, 2.పొదుపు, 3.అభిప్రాయ భేదము.

బాలార్కః ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వ లోదకమ్| 
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దిన దినే||
తా.
ఉదయకాలమందు ఎండగాచుకొనుటయు, పీనుగు కాలెడి పొగ తనమీదఁ బాఱుటయు, (వృద్ధ - ముసలిది)తనకంటె పెద్దదానితో సంగమము చేయుటయు, ఆకులు మురిన నీళ్ళను ద్రావుటయు, రాత్రి పెరుగన్నము భోజనము చేయుటయు నివి దినదినమున (కా)ఆయుస్సును తరుగ జేయును. - నీతిశాస్త్రము 

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

కృత్తివాసుఁడు - ముక్కంటి.
కృత్తిశ్చర్మ వాసో (అ)స్య కృత్తివాసాః, స-పు. - చర్మము వస్త్రముగాఁ గలవాఁడు.  

జైవాతృకుఁడు - 1.చంద్రుడు, 2.పంటకాపు, 3.వైద్యుడు, విణ.దీర్ఘాయువు కలవాడు.
ఓషధీః జీవయతీతి జైవాతృకః జీవప్రాణధారణే - పైరులను బ్రతికించువాఁడు.

జైవాతృక స్స్యాదాయుష్మాన్-
జీవతి చిరకాల మితి జైవాతృకః, జీవ ప్రాణధారణే. - అనేకకాలము బ్రతుకువాఁడు.
అధిక మాయు రస్యాస్తీ త్యాయుష్మాన్ త. - అధికమైన ఆయుస్సు గలవాఁడు. ఈ 2 దీర్ఘాయుష్మంతుని పేర్లు. 

జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.

జైవాతృక శ్శశాఙ్కే (అ)పి -
జైవాతృకశబ్దము చంద్రునికిని, అపిశబ్దమువలన ఆయుష్మంతునికిని పేరు.
జీవతీతి జైవాతృకః, జీవ ప్రాణధారణే. - బ్రతుకువాఁడు.
"జై వాతృకః కృషే చంద్రే భైషజ్యా యుష్మతోరపి" ఇతి విశ్వప్రకాశః. కృషః = కృషకః.

శశాంకుఁడు - చంద్రుడు.

శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః|
శశాంక ఖండ సంయు క్త మకుటాయై నమో నమః|

జీవదుఁడు - వైద్యుడు.
వైద్యుఁడు - చికిత్సకుడు, వెజ్జు.
వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.

జైవాతృక శ్శుచి శ్శుభ్రో జయీ జయఫలప్రదః,
సుధామయ స్పురస్వామీ భక్తానా మిష్టదాయకః|- 6

ఆయుష్మంతుడు - దీర్ఘ కాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి - 1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.
చిరంజీవతీతి చిరజీవీ, న. పు. జీవ ప్రాణధారణే. - చాలాకాలము బ్రతుకునది.
దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.  

కాకి - వాయసము, విణ.అల్పము, సం.కాకః.
కాకము - కాకి, వాయసము; వాయసము - కాకి.

కాకపుష్ఠము - కోయిల, వ్యు.కాకిచే పోషింపబడినది.

పరితము - కోయిల, సం.పరభృత్.
పరభృతము - కోయిల.
పరైః కాకైః భృతః పరభృతః భృఞ్భరనే. - పరుల (కాకుల)చేతఁ బెంచఁబడునది. 
పరంకోకిలం బిభర్తీతి పరభృత్. త. పు. భృఞ్ భరణే. కోయిల పిల్లను పోషించునది.

కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.

పికము - కోయిల.
అపికాయతీతి పికః, కైగైశబ్దే. చాటుననుండి కూయునది, అపిరంతర్ధౌ.
కాకపిక న్యాయము - న్యా. కోయిల(పికము - కోయిల) కాకులలో పెరిగియు తుదకు వేరుగబోవు విధము.

పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.

కాకదంత పరీక్ష - న్యా. వ్యర్థమైన పని, (కాకికి దంతము లుండవు కావున వానిని పరీక్షించుట వ్యర్థకార్యము.) నూరు కాకులలో ఒక కోకిల. కాకి మరియొక కాకిని పొడవదు. 

దైవతము - వేలుపు, విణ. దేవతా సంబంధమైనది.

వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

లోకములోన దుర్జనులలోఁతు నెఱుంగక చేరరాదు, సు
శ్లోకుఁడు జేరినంగవయజూతురు చేయుదు రెక్కసక్కెముల్
కోకిలఁగన్న చోటఁగుమిగూడియు సహ్వపుగూత లార్చుచున్
గాకులుతన్నవే తరిమి కాయము తల్లదమంద! భాస్కరా.

తా. లోకమందు సజ్జనుఁడు(సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టిన వాడు, 2.మంచివాడు.)దుర్మార్గులకు లోనుండు(దుర్జనుఁడు - దుష్టుడు)గుట్టును తెలిసికొనకయే వారి(ప్రక్కను)కలియ రాదు. అట్లు కలిసినచో వారు వేళాకోళము(ఎకనకియము - 1.వికటపుమాట, 2.అవమానము, 3.వంచన, 4.అపహాస్యము, విణ.వికటము.)చేసి అతనితో గలియబడుదురు. కీడు కలుగును. కోకిలను గన్న కాకులు దాని చుట్టును మూగి అసహ్యపు కూతలను కూయుచూ దానిని తన్ని తరిమి వేయును కదా!

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదో న్ముఖం
శ్రీధరం ధృతిదాయకం బలవర్దనం గతి దాయకమ్,
శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం
త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్| - 7

విద్వాంసుఁడు-చదువరి, విణ.ఎరుకగలవాడు.
వేత్తి సర్వం విద్వాన్, స. పు. - సర్వము నెఱింగినవాఁడు.

విపశ్చితుఁడు - విద్వాంసుడు.
విశేషేణ పశ్యన్ చేతతీతి విపశ్చిత్. త. పు. చిత్రీ సంజ్ఞానే. - విశేషముగాఁ జూచుచు నెఱుంగువాఁడు.

దోషజ్ఞుఁడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోష మెరిగినవాడు.
దోషం జానాతీతి దోషజ్ఞః జ్ఞా అవబోధనే. - దోషము నెఱిఁగినవాఁడు.

దోష్టిక దృక్సురోభాగీ -
దోషమేకం పశ్యతి దోషైకదృక్, శ. దృశిర్ ప్రక్షణే. - కేవలము దోషమునే చూచువాఁడు.
పురో దోషం భజతి గృహ్ణాతి తాచ్ఛేల్యేనేతి పురోభాగీ, నాంతః, భజ సేవాయాం. - ముందు దోషమును స్వభావమున గ్రహించువాఁడు. ఈ 2 దోషమునే వెదుకువాని పేర్లు. 

దోషాకరుఁడు - 1.చంద్రుడు, 2.దుష్టుడు.
దుర్జనుఁడు - దుష్టుడు.
దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్దజాతి.
దోషకారి - దోషముచేయువాడు.
దోషము - 1.తప్పు, పాపము.  

దోసము - దోషము.
దోషము -
1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.)కొలతలలోని తప్పులు.
దోషయుతము - లోపములు గలది, సరికానిది, నేరము కలది, (Faulty).  

అవగుణము - దుర్గుణము, తప్పు.
ప్రావ -
దోషము, సం.పాపమ్.
దురితము - పాపము.

కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
కల్మాషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.

దొసఁగు - 1.ఆపద, 2.విఘ్నము, 3.పొరబాటు, 4.తప్పు, రూ.దొసవు.
దొసఁగులఁపెట్టు - క్రి.బాధించు, పీడించు.

అరతి - 1.విరక్తుడు, 2.సంతోషము లేనివాడు, వి.1.విషయములందు ఇష్టము లేమి, 2.అనురక్తి(అను రక్తి - అనురాగము, ప్రేమ)లేమి , 3.సంతోషము లేమి, 4.బాధ, 4. అరుచిని కలిగించు పిత్తరోగము, 6.క్రోధము, 7.(అలం.) మన్మథావథలు పదింటిలో నారవది (దేని యందు ఇష్టము లేకుండుట).

అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సు లేనివాడు, 2.దుఃఖము నొందినవాడు, 3.ధ్యాన నిమగ్నుడు.   

అహితము - 1.అనిష్టము, 2.విరుద్ధమైనది, 3.(వైద్య.) పథ్యము కానిది, వి.చెరుపు. 
అనిష్టము - 1.ఇష్టముకానిది, 2.యజింప బడనిది, వి.1.కీడు, 2.దుఃఖము, 3.పాపము.

నిర్వేదము - 1.దుఃఖము, 2.వైరాగ్యము.
నిర్విణ్ణుఁడు - నిర్వేదము నొందినవాడు.

  
విరక్తి - విరాగము, వైరాగ్యము.(Dispassion)
వైరాగ్యము - వేషయేచ్ఛా రహితత్వము, లౌకిక సుఖములం దిచ్ఛలేమి.
వీతరాగి - విరాగుడు, వైరాగ్యము గలవాడు.
వైరాగి - బైరాగి; బైరాగి - విరక్తుడైన తీర్థవాసి, సం.విరాగీ.
దుఃఖము - 1.బాధ, 2.చింత.
అరుచి - 1.రోత(ఏవగింపు – రోత), 2.నోటికి రుచి కాకుండుట.

మాయువు - పైత్యరోగము. పైత్య వికారము పది విధములు.
పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.
పైత్యరసము - (జం.) కాలేయము నుండి ఊరురసము(Bile). (ఇది పిత్తాశయములో నిలువచేయబడును.)

పిత్తము - ఒక ధాతువు (వాత, పిత్త, శ్లేష్మము లనునవి త్రివిధ ధాతువులు.)
పిత్తకోశము - (గృహ.) చేదుకట్టె, పైత్యరసమును నిలువచేయు సంచి, పిత్తాశయము (Gall bladder).
పిత్తాశయము - (జం.) కాలేయము నుండి ఊరు పైత్యరసమును నిలువచేయు తిత్తి, పైత్యరసము చేరు సంచి (Gall bladder).

క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము. క్రోధము శత్రువు వంటిది.

భగము - 1.ఆడుగురి, 2.సంపత్తి, 3.వైరాగ్యము, 4.తెలివి, 5.వీర్యము, 6.కీర్తి, 7.మహత్త్వము(మహాత్మ్యము - గొప్పతనము).

రాజా రాష్ట్ర కృతంపాపం - రాజపాపం పురోహితః|
భర్తాచ స్త్రీకృత పాపం - శిష్యపాపం గురుర్వ్రజేత్||

తా. తనదేశమునందలి ప్రజలు చేయు (పాపము - దుష్కృతము, కలుషము.)పాపమును రాజు పొందును. రాజు చేయు పాపమును పురోహితుడు పొందును, పెండ్లాము చేయు పాపమును మగడు పొందును, శిష్యుడు చేయు పాపమును గురువు(గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter)పొందును. - నీతిశాస్త్రము 

అగదంకారుఁడు - వైద్యుడు, వ్యు.ఆరోగ్యమును కలిగించువాడు.
అగదము -
1.తెవులులేనిది, 2.పలుకనిది, వి.1.మందు, ఔషధము, 2.ఆరోగ్యము, 3.ఆయుర్వేదమున విషాదుల విరుగుడును తెలుపు భాగము.

యోగము - 1.ప్రాణాయామాదికము, 2.కూడిక, 3.ఔషధము, 4.ప్రయత్నము.

సంచికట్టు - సంచిపట్టుకొని అదేపనిమీద ప్రవర్తించువాడు, వైద్యుడు.

సంజీవకరణి - జీవమునిచ్చు ఓషధి.
సంజీవి - జీవమును కలుగజేయునది.

ఆయుర్వేదము - హిందూ వైద్యశాస్త్రము.

భిషక్కు - వైద్యుడు.
భేషజము -
ఔషధము, వ్యు.భిషక్ సంబంధమైనది. ఔషధేచింతయే ద్విష్ణుం| 

రోగము - వ్యాధి.
రోగనిరోధకశక్తి -
(జీవ.) రోగము నెదుర్కొని, దానిని జయించుశక్తి.
రోగనిర్భయత - (జీవ.) రక్షణశక్తి, శరీరములో, రోగమును కలిగించు జీవులు ప్రవేశించి రోగములు కలుగజేయకుండ నిరోధించుశక్తి, (Immunity).

రోగహా ర్యగద్కారో భిషగ్వైద్య శ్చికిత్సకే,
రోగం హరతి తాచ్ఛీల్యేన రోగహారీ, న, త్రి, హృఞ్ హరణే. - రోగమును హరించు స్వభావము గలవాఁడు.
అగద మరోగం కరోతి ప్రాణినమి త్యగదంకారః – (శరీరి - ప్రాణి)ప్రాణిని రోగము లేనివానిఁగాఁ జేయువాఁడు.
భిషజ్యతి భిషక్, జ. భిషజ్ చికిత్సాయాం. - చికిత్స సేయువాఁడు.  
విద్యామాయుర్వేదమధీతే వేత్తివా వైద్యః - ఆయుర్వేదమును జదివిన వాఁడుగాని యెఱిఁగిన వాఁడుగాని వైద్యుఁడు. 
చికిత్సతి చికిత్సకః. - చికిత్స చేయువాఁడు. ఈ 5 వైద్యుని పేర్లు.

గృహేపచారము - (గృహ.) రోగికి చేయు ఉపచారము, వైద్య విధానమునకు అంగముగ రోగికి గృహములో చేయు సేవ (Home-nursing).  

ఉపచారము - 1.సేవ, 2.సన్మానము, 3.చికిత్స, 4.పూజ.
ఉపచరించు -
క్రి.1.సన్మానించు, 2.సేవించు, 3.బోధించు, 4.నియోగించు.

సార్థః ప్రవసతో మిత్రం - భార్యా మిత్రం గృహే సతః
ఆతురస్య భిషక్ మిత్రం - దానం మిత్రం మరిష్యతః.
తా.
ప్రవాసికి ప్రవాసుల గుంపు మిత్రుడగును, ఇంటిలో నున్నవానికి భార్యయే మిత్రము, రోగికి వైద్యుడే మిత్రుడు, చావనున్న వానికి దానమే మిత్రుడు.

జీవదుఁడు - వైద్యుడు.
వైద్యుఁడు -
చికిత్సకుడు, వెజ్జు.
చికిత్సకుఁడు - వైద్యుడు; వెజ్జు - వైద్యుడు, సం.వైద్యః.

వైద్యము - రోగచికిత్స శాస్త్రము.
చికిత్స - రోగమునకుచేయు ప్రతిక్రియ.

అప్పిచ్చువాడు, వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పాఱు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూరు మందుము
చొప్పడికున్నట్టియూరు జొరకును సుమతీ.
తా.
అవసరమునకు ఆదుకొనినవాడు(ఉత్తమర్ణుఁడు - అప్పిచ్చువాడు. (వ్యతి. అధమర్ణుడు.), రోగం వచ్చినప్పుడు మందులు యిచ్చువాడును, స్నానపానములకు నిత్యం ప్రవహించు నది river లేక కాలువయును, శుభాశుభ కర్మలకును అవసరమగు బ్రాహ్మణుడు(ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.)ఉన్నట్టి గ్రామమున నివసింపవలెను.

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
సూతే అమృతమితి సోమః, షూఞ్ ప్రాణిప్రసవే - అమృతమును బుట్టించువాఁడు.
సూయతే ఇతివా సోమః - ప్రతిపక్షమునందును బుట్టింపఁబడువాఁడు.  

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
సోమోద్భవ -
నర్మదానది.

చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.

సౌమ్యుఁడు - బుద్ధుడు, విణ.1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.

సౌమ్యం తు సున్దరే సోమదైవతే,
సౌమ్యశబ్దము ఒప్పెడువానికిని, సోముఁడు దేవతగాఁ గలహ విస్సూక్తాదులకును పేరు.
సోమో దేవతాస్యేతి సౌమ్యం, త్రి. - సోముఁడు దేవతగాఁ గలది గనుక సౌమ్యము.

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధర శ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదాన వ్రతామ్|
కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం
శీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే| 

సత్యవాస స్సత్యవచాః శ్రేయసాంపతి రవ్యయః,
సోమజ స్సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః.

సహస్రాక్షో విశాలాక్ష స్సోమో నక్షత్రసాధకః,
చంద్ర స్సూర్య శ్శనిః కేతు ర్గ్రహో గ్రహపతి త్వరః. - 38శ్లో

శివుడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు -
1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచెలి - కుబేరుడు.
శ్రేష్ఠుడు - కుబేరుడు, విణ. మేలిమి బొందినవాడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.

లిబ్బిదొర - శ్రీదుడు(శ్రీదుఁడు - కుబేరుడు), కుబేరుడు.
లిబ్బిపడఁతి -
లక్ష్మి. పడఁతి - స్త్రీ, రూ.పణఁతి.
లిబ్బి - 1.పాతర, 2.రాశి, 3.నిధి, 4.ప్రోగు, ధనము.

ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత(దాత - ఇచ్చువాడు).
ధనాధిపుఁడు -
కుబేరుడు. 

దాతదరిద్రః కృపణోధనాఢ్యః, పాపీచిరాయుస్సు కృతీగతాయుః|
రాజాకులీన స్సుకులీనసేవ్యః, కలౌయుగే షడ్గుణ మాశ్రయంతి|
తా.
దాతయైనవాఁడు దరిద్రుఁడౌట, లోభి ధనాఢ్యుడౌట, పాపి ధీర్ఘాయుష్మ తుడౌట, పుణ్యాత్ముఁడు అల్పాయుష్కుండౌట, హీనకులుడు రాజౌట, శ్రేష్ఠకులుడు సేవకుడౌట, ఈ యాఱు(6)గుణములు కలియుగమునందు కలిగియున్నది. - నీతిశాస్త్రము 

రొక్కపుదొర - కుబేరుడు.
రొక్కము -
1.నగదు, 2.చేతివెల, 3.సమూహము, సం.ఋక్థమ్.
నగదు - నాణెము రూపమైన సొమ్ము, (అర్థః.) రొక్కము, సొమ్ము, పైకము, ద్రవ్యము.
సొమ్ము - 1.స్వము, 2.ధనము, 3.ఆభరణము, 4.గోధనము, 5.అధీనవస్తువు.
స్వము - 1.ధనము, 2.తాను, విణ.తనది.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ద్రవ్యము - 1.ధనము, 2.వస్తువు.
ద్రవ్యము - (అర్థ.) 1.క్రయవిక్రయ కార్యములలో వినిమయమునకు ఉపయుక్తమగునట్టిది (Money), 2.ప్రభుత్వామోదము కలిగిన ఏదైన వస్తువు, 3.(భౌతి.) పదార్థము (Matter).

దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.

అర్థాగృహేనివర్తంతే శ్మశానే మిత్ర బంధవాః|
సుకృతం దుష్కృతం చవగచ్ఛంత మనుగచ్ఛతి|| 
తా.
ద్రవ్యమును సంపాదించి ధర్మము సేయక దాచినను లోకాంతర గతుండౌనపు డాద్రవ్యము గృహమందుండును, వాని వెంటరాదు. పుత్త్రమిత్త్ర బాంధవులు శ్మశాన పర్యంతము వత్తురు కాని వెంటరారు, పుణ్యపాపములు రెండును వెంట వచ్చును. కనుక ధర్మమే చేయ వలెయును. - నీతిశాస్త్రము

వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
గాలిచూలి -
1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని.

మారుతము - వాయువు.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.

కరువలి - గాలి.
కరువలిపట్టి (గాలిచూలి) -
1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు -
దొర, మగడు, అధిపతి.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
అధిపుడు - 1.ప్రభువు, అధిపతి.
అధిభువు - అధిపతి, రాజు, నాయకుడు.
రావు - అధిపతి, రాజు, సం.రాజా.
రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.

క్షత్రియుఁడు - రాచవాడు; రాట్టు - రేడు; స్వారాట్టు - ఇంద్రుడు.
క్షత్త్రము - 1.క్షత్త్రియ కులము, 2.శరీరము, 3.ధనము, 4.నీరు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైన శ్రేష్థుడు, ఉదా. రాజేంద్రుడు. విష్ణువు ముఖము నుండి అగ్నితో కలిసి ఇంద్రుడు పుట్టెను.
చంద్రుడు - నెల, చందమామ.  

వర్మ - క్షత్రియులు నామాంతరమున పెట్టుకొను గుర్తు. (శర్మ గుప్త మొదలగునవి వలె.)

రాజకము - 1.రాజసమూహము, 2.క్షత్రియ జాతి సమూహము. 

క్షత్రియాణి - క్షత్రియ స్త్రీ, రూ.క్షత్రియ, క్షత్రియిక.
క్షత్రియి - క్షత్రియుని భార్య.
దొరసాని - రాణి; రాణి - రాజ్ఞి, భార్య; రాజ్ఞి - రాణి.
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దేవేరి - 1.దేవి, 2.దొరసాని, రూ.దేవెరి, సం.దేవేశ్వరీ. 

గ్లౌ - 1.చంద్రుడు, 2.కర్పూరము.
ప్రతిమాసం గ్లాయతిక్షయతీతిగ్లౌం, ఔ. పు. గ్లేమ్లేహర్షక్షయే - ప్రతిమాసము  క్షయించువాఁడు. 

చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
చంద్రేణ కర్పూరేణ మీయతే ఉపమీయత ఇతి చంద్రమాః, స. పు. మాఞ్ మానే. - ఛంద్ర మనఁగా కర్పూరము. దానితోఁ బోల్చఁబడువాఁడు.
కర్పూరము - ఘనసారము, కప్పురము.
ఘనసారము -
1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.

హిమవాలుక - కప్పురము, కర్పూరము.

మృగాంకుడు - చంద్రుడు, వ్యు.లేడి గుర్తుగా గలవాడు.
మృగః అంకో యస్య సః మృగాంకః - మృగము చిహ్నముగాఁ గలవాఁడు. 

రాజా మృగాఙ్కే క్షత్రియే నృపే,
రాజన్ శబ్దము చంద్రునికి, క్షత్రియజాతివానికి, భూమి నేలు రాజునకును పేరు.
కొందరు 'ప్రభౌ' అనునది యిక్కడికిని సంబంధించును గనుక ప్రభువన కుంబేరని చెప్పుదురు. 'ప్రభౌ భూమిపతౌ రాజా క్షత్రియే రజనీపతౌ అని రభసుఁడు.
రాజత ఇతి రాజా, న. పు. రాజ్య దీప్తౌ. - ప్రకాశించువాఁడు.

కళానిధి - చంద్రుడు.
కళానాం నిధిః కళానిధి, ఈ. పు. - కళల కునికిపట్టు.
కళ - 1. 8 సెకనుల(8 Seconds) కాలము, 2.చంద్రకళ, 3.ఒకపాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతానతము కాని పదము.
నెలపాలు - చంద్రకళ. చంద్రభాగ యందు దేవిస్థానం కళ|
నెలవీసము -
చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః|
పుష్ఠా పురాతనా పూజ్యాపుష్కరా పుష్కరేక్షణా.

కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధుర స్వరము.
కల2 - స్వప్నము.

కలా తు షోడశో భాగో :
చంద్రస్య షోడశోభాగోయః సకళేత్యుచ్యతే - చంద్రుని పదియారవ భాగము కళ యనంబడును.
కల్యతే సంఖ్యాయత ఇతి కలా, కలసం ఖ్యానే - లెక్క పెట్టఁబడునది. చంద్రునిలోని పదియాఱవపాలు.

షోడశము - పదునారు, విణ.పదునారవది, వి.చనిపోయినవానికి పదునొకండవ దినమున చేయు శ్రాద్ధవిశేషము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము. పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
విషయము -
గ్రంథాదులందు దెలియు నంశము.

ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాగల్యము.
భాగ్యము -
అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము,3.భాగ్యము,విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు -
1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకడు (Venus).

తన సత్కర్మాచరణం
బున భాగ్యము వేగ వృద్ధిఁ * బొందు; జగత్ప్రా
ణుని వర సాహాయ్యముచే
నసలం బెంతైనఁ బెరుగు * నయ్యః కుమారా!
తా.
తాను చేసిన మంచికార్యముల సాయముచేత నే అదృష్టము త్వరగా వృద్ధి పొందగలదు. వాయువు తోడ్పాటుతో అగ్ని యెంత వృద్ధి పొందునో తెలియుచున్నది గదా ?

సూర్యస్య ద్వాదశ కళస్తా - ఇందోః షోడశ స్మృతాః|
దశ వహ్నేః కళాః ప్రోక్తాస్తా - భిర్యుక్తాంస్తు తాన్ స్మరేత్||

కల2 - స్వప్నము.
స్వప్నము -
1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).   

నిదుర - నిద్ర, కునుకు, కూరుకు, రూ.నిద్దుర.
నిద్దుర -
నిదుర , సం. నిద్రా.
నిద్ర - కూరుకు. కూరుకు - నిద్దుర, క్రి.నిద్రించు.
కునుకు - నిద్రచే తూలు, తూగు, కునికి పడు.
తందర - తంద్ర, తూగు, కునికిపాటు, సం.తంద్రాః.
తంద్ర - తూగు, రూ.తంద్రి.
తూఁగు - 1.ఊగు, 2.నిద్రించు, 3.చలించు(తిరుగు), వి.1.ఊగుట, 2.కునికిపాటు. ముచ్చిలిపాటు - కునికిపాటు.
ప్రమీల - 1.కునికిపాటు, 2.మళయాళదేశపు రాణి.

సకలము - 1.సర్వము, 2.కలతో గూడినది.
సర్వము -
(సర్వ.) సమస్తము, అంతయు.
సమస్తము - సర్వము.

నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవాః| 
నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః||

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.
కలకంఠము -
1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు.మధురమైన కంఠము కలది.

ధ్వనౌ తు మధురాస్పుటే, కలో :
మధురే శ్రుతిసుఖే, అస్ఫుటే అవ్యక్తాక్షరే ధ్వనౌ కలః - సుఖమై వ్యక్తముగాని వర్ణములు గలిగిన ధ్వని కల మనంబడును.
కం సుఖం లాతీతికలః. లాదానే. - సుఖము నిచ్చునది.
కలో మదః తద్యోగాద్వాకలః. కల మదే. - కల మనఁగా మదము, అది గలిగినది. అవ్యక్తమధుర ధ్వని పేరు.

కాదంబరి - 1.కల్లు, 2.ఆడుకోయిల, 3.ఆడుగోరువంక, 4.బాణ విరచిన కాదంబరీ కావ్యము, 5.సరస్వతి.
గోమంతపర్వతే కదంబకోటరే జాతత్వాత్ కాదంబరీ, ఈ. సీ. - గోమంతపర్వతమందు కడపచెట్టుతొఱ్ఱలోఁ బుట్టినది.

కల్లు1 -1.బండికన్ను (చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్.

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

మదిర - కల్లు.
మదురువు - 1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.
మాద్యం త్యనయేతి మదిరా, మద్యం చ. మదీ హర్షే. - దీనిచేత మదింతురు గాన మదిరము, మధ్యమును.

మద్యమ్ లోపలికి పోయి, వివేకాన్ని బయటకి తరిమి వేస్తుంది. - థామస్ బేకన్(1512-1567)

సరస్వతి -1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.
పలుకుఁజెలి - సరస్వతి.
వాణి - 1.పలుకు, 2.సరస్వతి. కాశ్మీరేయ సరస్వతి శక్తిపీఠం|

కాదమ్బః కలహంస స్స్యాత్ :
కదంబస్య స్వసంఘస్య సహచారిత్వాత్ కాదంబః - కదంబమనఁగా తన సమూహము; ఆ సంఘముతోఁ గూడియుండునది.
కలో మధురాస్పుట ధ్వని, తద్వాన్ హంసః కలహంసః - అవ్యక్త మధురధ్వని గల హంస. ఈ రెండు 2 ధూమ్రవర్ణములైన ముక్కు కాళ్ళు గలిగిన హంస పేర్లు.

కాదంబము - 1.మధురముగ కూయు హంస, ధూమ్రవర్ణము లైన ముక్కు, కాళ్ళు, ఱెక్కలుగల హంస, కలహంస, 2.బాణము.

కలహంస - 1.కాదంబము, ధూమ్ర వర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.  రాజహంస - 1.రాయంచ, 2.ఎఱ్ఱని ముక్కు కాళ్ళుగల హంస, 3.మధురముగ బలుకు హంస.

తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.

ధార్తరాష్ట్రము - 1.నల్లని ముక్కు కాళ్ళు గల హంస.

నిత్యానంద రసాలయం, సురముని స్వాంతాంబు జాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజ సేవితం కలుషహృ త్సద్వా సనావిష్కృతం|
శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసా వతంస! స్థిరం
కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి|| - 48
 
తా. ఓ మానస రాజహంసా! బ్రహ్మానంద జలాలకు స్థానమైనదీ, సుర మున్యాదుల మనస్సరోజాలకు నిలయ మైనదీ, నిర్మలమైనదీ, సద్బ్రాహ్మణ సేవితమైనదీ, పాపాలను రూపు మాపేదీ, జన్మాంతర సుకృతాలను ప్రకాశింప జేసేదీ, సుస్థిరమైనదీ అయి(శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)భగద్ధ్యానమనే సరస్సునే ఆశ్రయంచుము. నీచులను(క్షుద్రుఁడు - 1.అధముడు, 2.పనికిరానివాడు, 3.లోభి, 4.హింసకుడు.)ఆశ్రయించడమన్న మురికి కాల్వలను ఆశ్రయించాలని ఎందుకు వ్యర్థంగా శ్రమ పడతావు? - శివానందలహరి

All the water in the ocean
Can never turn the swan's black legs to white,
Although she lave them hourly in the flood. – Shakespeare

కలధౌతము - 1.వెండి, 2.బంగారము.
బులియను - (అర్థ.) (Bullion), మేలిమి బంగారము లేక వెండి.

పుత్తడి - అపరంజి, సం.పురటమ్.
అపరంజి -  మేలిమి బంగారము, కుందనము.
కుందనము - అపరంజిలోహము, మేలిమి బంగారము.
ఉదిరి - అపరంజి, మేలిమి బంగారము.
మేలిమి - 1.అపరంజి, 2.అధిక్యము. 
(ౙ)జాలువా - అపరంజి, రూ.జాళువ, జాళ్వ. 
(ౙ)జాళువ - జాలువా. 

శ్రేష్ఠధాతువు - (రసా.) వాతావరణ పరిస్థితిలకు చెక్కు చెదరని గుణములు గల ధాతువు, (Nobel metal) ఉదా. వెండి, బంగారము.

నిష్కము - 1.మాడ, టంకము, 2.పతకము, 3.బంగారము, 4.వెండి.
పలము - 1.నిష్కము, మూడు తులములు, 2.మాంసము.
మాడ - అరవరా, పదిరూకలు.
టంకము - ప్రాచీన కాలపు బంగారు నాణెము, దీనారము, సం.వి.1.వెలిగారము, 2.కత్తి, 3.కోపము, సం.వి.(రసా.) ధాతువును ధాతువునకు కలుపుటకు వాడుకలో నున్న సులభముగా కరగు ధాతు మిశ్రము (Solder). గవ్వచౌకము - నాలుగు గవ్వల మొత్తము, వెలిగారము.
దీనారము - బంగారు నాణెము. దినారి - దీనారము, ఒక బంగారు నాణెము, సం.దీనారః. టంకకము - వెండినాణెము.
పతకము - హారము నడుమ నుండు రతనపు బిళ్ళ, సం.పదకమ్.

ఊఁదువెండి - శుద్ధమైన వెండి, ఊదిన వెండి.

తారము - 1.వెండి, 2.పులుగడిగిన ముత్తెము.
పులు - 1.తృణము, 2.రత్నమాలిన్యము,(పులుగడిగిన ముత్యము).

చంద్రబీజము - వెండి; మడికాసు - వెండి. 
శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.

దుర్వర్ణం రజతం రూప్యం ఖర్జూరం శ్వేత మిత్యపి :
కనకాపేక్షయా నికృష్టవర్ణత్వా దుర్వర్ణం - బంగారము కంటె నికృష్టమైన వర్ణము గలది.
రజ్యతే తామ్రాదిక మేనేనేతి రజతం. రంజరాగే. - తామ్రము మొదలైనది దీనిచేత రంజింపఁ జేయఁబడును.
ప్రశస్తం రూపమస్యేతి రూప్యం - ప్రశస్తమైన రూపముగలది.
ఖర్జ్యతే పీడ్యతే ఇతి ఖర్జూరం. ఖర్జు వ్యథనే. - అగ్నిసంతాపాదులచేతఁ బీడింపఁబడునది.
శ్వేతవర్ణత్వాత్ శ్వేతం - తెల్లనివన్నె గలది. ఈ నాలుగు వెండి పేర్లు.

రజతము - 1.వెండి, 2.హారము, విణ.తెల్లనిది (భూగ.) ఒక లోహము (Silver) సం.వి.(రసా.) వెండి ధాతువులలో నొకటి. (Argentum) నాణెములలో ఉపయోగపడు ధాతువు. 
రజతోత్సవము - సంస్థలకు 25 సంవత్సరములు నిండిన సందర్భముగ చేయు ఉత్సవము (Silver jublii).
వెండి - రజతము, అవ్య. మరియు (వెండియు).

రూక - 1.ధనము, 2.చిన్న మెత్తు, 3.వెండి బంగారముల నాణెము, సం.రూక్మమ్.
రుక్మము - 1.బంగారు, 2.లోహము.
రుక్మకారుఁడు - స్వర్ణకారుడు; స్వర్ణకారుఁడు - కంసాలి.

రూప్యం ప్రశస్తే రూపే (అ)పి,
రూప్యశబ్దము మంచిసౌందర్యము గలవానికి పేరైనపుడు త్రి, అపి శబ్దమువలన ముద్ర గల వెండికిని, బంగారునకును, పేరైనపుడు త్రి. ప్రశస్తమాహతం చ రూప మస్యేతి రూప్యం - మంచిరూపమును, ఆహతమైనరూపమును గలది గనుక రూప్యము.

రజతాద్రి - 1.వెండికొండ, 2.కైలాసము.
కైలాసము - 1.కుబేరుని ఉనికిపట్టు, 2.శివుడుండు వెండికొండ.
కైలాసనాథుఁడు -1.కుబేరుడు, 2.శివుడు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమో నమః|

కైలాసః స్థానం :
కేళీనాం సమూహః కైలం తేన ఆస్యతే స్థీయత ఇతి కైలాసః. ఆస ఉపవేశనే - కేళిసమూహము కైలము, దానిచేత నుండఁబడునది.
కే శిరసి శివయో ర్లాసో నృత్య మస్మిన్నితి వా కైలాసః - శిఖరభాగ మందు పార్వతీపరమేశ్వరుల నాట్యము గలది.
కేలయోర్జలభూమ్యోః ఆసనం స్థితి ర్యస్య కేలాసః స్పటికం - తస్యాయం కైలాసః - జలభూముల యందుండునది గనుక కేలాసము; అనగా స్పటికము, దాని సంబంధమైనది. - కుబేరుని దేశము

శ్వేతము - 1.వెండి, 2.తెలుపు, 3.కైలాసము, 4.ఒక ద్వీపము.
శ్వేతవాహనుడు - 1.చంద్రుడు, 2.అర్జునుడు.

శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.

ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ధవళిమ - తెలుపు.
తెలుపు - క్రి.1.ఎరిగించు, 2.మేలుకొలుపు, 3.తేర్చు, వై.వి.ధావళ్యము, 2.పరిశుద్ధి.
తెలుపుడు - ఎరుక.
తెలుపుడుచేయు - క్రి.ఎరిగించు.

మెఱుగురాయి - వెండికి మెరుగు పెట్టు రాయు.

అరయనెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ మొప్పగూర్చి నుపకారి మనుష్యుడు లేక మేలుచే
కూఱ దదెట్లు? హత్తుగడగూడునె చూడఁబదారు వన్నె బం
గారములో నైన వెలిగారము గూడకయున్న, భాస్కరా.
 
తా. భాస్కరా ! మేలిమి బంగారములోనైనను వెలిగారము కలియక అది ఏవో నొక భూషణముగా, అనగా ఉపయోగ కరమగు వస్తువుగా తయారు కాదు అట్లే ఎంత విద్య(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)గలవాడైనను వానికి విద్య గలదని తెలుపు వ్యక్తి (మనుష్యుఁడు - మానిసి, మానవుడు.)లేక అతని గొప్పతనము రాణింపదు.

విశేషము :- ఒక వస్తువునకు గాని ఒక వ్యక్తికిగాని సహజముగా నున్న గొప్పతనమును, బాహాటము చేయు వ్యక్తిగాని, మరి యే పదార్థము గాని లేక ఆ యా వ్యక్తులు గాని వస్తువులు గాని కీర్తిని బొంద(పొంద) నేరవు.

మహాకైలాసనిలయా మృణాళమృదుదోర్లతా|
మహనీయా దయామూర్తి - ర్మహాసామ్రాజ్య శాలినీ.

ఖర్జూరము - 1.వెండి, 2.తేలు, 3.ఖర్జూరపుచెట్టు, ఖర్జూరపు పండు.

కజ్జారము - ఖర్జూరము.
ఖర్జ్యతే పీడ్యత ఇతి ఖర్జూరం. ఖర్జు వ్యథనే. - అగ్ని సంతాపాదులచేతఁ బీడింపఁబడునది.

పూరిత సద్గుణంబుఁగలపుణ్యున కించుక రూపసంపదల్
దూరములైన వానియెడ దొడ్డగఁజూతురు బుద్ధిమంతులెట్లా
రయ గొగ్గులైన మఱి యందుల మాధురిఁ జూచికాదె ఖర్జూర ఫలంబులన్ బ్రియముజొప్పిల లోకులుగొంట, భాస్కరా.

తా. ఖర్జూరపు పండ్లు ముడతలు పడి కంటికింపుగా గానబడకున్నను జనులా పండునందు గల తీయదనమునకు మిక్కిలి యిష్టముతో కొందురు. అట్లే మంచిగుణములు గల వానికి ఒకప్పుడు భాగ్య రేఖయు, రూపును చెడిపోయి నప్పటికీ వానిని బుద్ధిమంతులగు వారు తొంటి(పూర్వపు) విధముగనే చూతురు.

ముఖం మీద ముడతలు ఇదివరకు చిరునవ్వులుండే చోట్లను సూచిస్తాయి. - మార్క్ ట్వేన్ 

కలాదుఁడు - 1.స్వర్ణకారుడు, కంసాలి, 2.చంద్రుఁడు, 3.గురువు, ఉపాధ్యాయుడు (Jupiter). 

నాడింధమ స్వర్ణకారః కలాదో రుక్మకారకే,
అగ్ని సందీపనార్థం నాడిం ధమతీతి నాడింధమః, ధ్మాశబ్దాగ్ని సంయోగయోః. - అగ్ని ప్రజ్వలించు కోఱకు కొలిమి నూఁదువాఁడు.     
స్వర్ణం కరీతీతి స్వర్ణకారః, డు కృఞ్ కరణే. - బంగారుఁజేయువాఁడు.    
కలాం స్వర్ణశిల్ప మాదత్త ఇతి కలాదః, డుదాఞ్ దానే. - బంగారు చేయు విద్యను స్వీకరించువాఁడు.
రుక్మం కరోతీతి రుక్మకారకః - బంగారును సొమ్ముగాఁ జేయువాఁడు. ఈ 4 అగసాలెవాని పేర్లు. 

ధమని - 1.అవయములకు గుండె నుండి నెత్తురు తీసికొనిపోవునరము, 2.మెడ neck, 3.అగసాలె వాని ఊదుగొట్తము, సం.వి.(జం.) మంచి రకతమును తీసికొని పోవు రక్తనాళము, (Artery).
ధమనుఁడు - అగ్ని, విణ.1.కొలిమి తిత్తి నూదువాడు, 3.క్రూరుడు.
క్రూరుఁడు - దయలేనివాడు.

పంచాణుఁడు - 1.స్వర్ణకారుడు, 2.శిల్పి.
స్వర్ణకారుఁడు - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.

కమ్మటీఁడు - కంసాలి.
కమ్మటము - కమసాలి కుంపటి.

సొన్నారి - కమసాలి.
సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
   
తట్ర - బంగారు పనిచేసి బ్రతుకుజాతి, అగసాలె, సం.త్వష్టా.
అగసాలి - కమసాలి, స్వర్ణకారుడు, బంగారు పనిచేయువాడు, రూ.అగసాలె.    

పోగర - అగసాలెవాని పనిముట్టు.

హేమకారుఁడు - అగసాలెవాడు.
హేమము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.
హేమించు - క్రి.బంగారగు. 

రుక్మకారుఁడు - స్వర్ణకారుడు.
రుక్మము - 1.బంగారు, 2.లోహము.

రూక - 1.ధనము, 2.చిన్న మెత్తు, 3.వెండి బంగారముల నాణెము, సం.రుక్మమ్.  

ఓజు(ౙ) - 1.కమసాలి, 2.శిల్పి, 3.శిల్పుల పేర్ల తుదిని వచ్చు బిరుదాంకము, శర్మ, వర్మవంటిది, ఉదా.లింగోజు.

ఆవేశనం శిల్పిశాలా -
ఆవిశంతి కర్మకారయితారో (అ)త్ర ఆవేశనం. విశప్రవేశనే. - దీనియందు పనులు చేయించువారు ప్రవేశింతురు.
సువర్ణకారాది శిల్పినాం శాలా(శాల - ఇల్లు)శిల్పిశాలా - స్వర్ణకారాది శిల్పులయొక్క శాల. ఈ 2 కంసాలి కొట్టము పేర్లు.

నీరుకాఱు - కమసాలి యొక్క ఒక పనిముట్టు, క్రి.దిగాలుపడు, నిరుత్సాహపడు.
దిగులుపడు - క్రి.దిగులొందు.
దిగులు - 1.గుండెయదురు, 2.అదైర్యము.

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపసః|
బుద్ధఃస్సష్టాక్షరో మన్త్రః చన్ద్రాంశు ర్భాస్కర ద్యుతిః||

బత్తుఁడు - కంసాలివారి పట్టపు పేరు, వై.వి. భక్తుడు, సం.భక్తః.

పశ్యలోహరుఁడు - కమసాలె, పచ్చెకాడు(పచ్చెకాఁడు - పచ్చిదొంగ), వ్యు.చూచుచుండగనే దొంగిలించువాడు.  
పచ్చియము - చూచుచుండగ దొంగిలుట, సం.పశ్యతో హరణమ్.
పశ్యత్పాలుడు - శివుడు, ముక్కంటి. 

ఐద్దాయులు - (ఐదు దాయులు) వడ్రంగి, కుమ్మరి, కంచరి, అగసాలె, కాసెకులస్థుల పనులు.

స్థపతి - 1.శిల్పి, 2.అంతఃపురపు కావలివాడు, విణ.శ్రేష్ఠుడు.

శిల్పి - శిల్పకారుడు, బొమ్మలు పని మొదలగునవి. రాయికి(శిలకు) రూపం తెచ్చేవాడు శిల్పి.

విశ్వకర్మ - దేవశిల్పి; మయుఁడు - అమర శిల్పి.

విశ్వక ర్మార్క సురశిల్పినోః : విశ్వకర్మ శబ్దము సూర్యునికిని, దేవశిల్పికిని పేరు. విశ్వం కర్మాస్యేతి విశ్వకర్మా. న. పు. సకలమైన క్రియలు గలవాఁడు. టీ. స. విశ్వస్యకర్మాణి యస్మాదితి విశ్వకర్మేతి సూర్యపక్షే.

తక్షకుఁడు - 1.నాగరాజు(పాఁపఱేఁడు - నాగరాజు), 2.వడ్లవాడు, 3.విశ్వకర్మ, రూ.తక్షుడు, సం.విణ.చెక్కువాడు.
తక్షుడు - తక్షకుడు.
వడ్రంగి - 1.వడ్లవాడు, కొయ్యపని చేయువాడు, 2.పక్షి విశేషము, రూ.వడ్లంగి, వర్థకిః.

కొఱ - 1.పాఠీనము, 2.చేప, 3.కొఱ్ఱ ధాన్యము, 4.కొరత, వెలితి 5.ప్రయోజనము, 6.శిల్పము.

సహస్రదంష్ట్రము - పాఠీనము, వేయికోరలు గల చేప.
పాఠీనము - ఒక రకమైన చేప.

సహస్రదంష్ట్రః పాఠీనః :
సహస్రం దంష్ట్రాః అస్య సహస్రదంష్ట్రః - వేయికోఱలు గలిగినది.
పాఠీం పృష్ఠ మున్నయతీతి పాఠీనః - పాఠీ అనఁగా వీఁపు; దాని నెత్తికొని యుండునది.
భక్ష్యతయా శాస్త్రే పఠ్యత ఇతివా పాఠీనః. పఠవ్యక్తాయాం వాచి. - శాస్త్రములయందు భక్యముగాఁ బఠింపఁబడినది. ఈ రెండు వేయికోఱలు గల మీను పేర్లు.

ప్రియంగువు - 1.కొఱ్ఱధాన్యము, 2.నల్లావాలు, 3.కుంకుమము.

స్త్రియౌ కఙ్గు ప్రియఙ్గూద్వే -
కేన జలేన గచ్ఛ త్యుద్దచ్ఛతీతి కంగుః, ఉ. సీ. గం ఌ గతౌ. - ఉదకముచేత నెదుగునది.
ప్రియాణ్యఙ్గాన్యస్య ప్రియఙ్గుః ఉ. సీ. - ప్రియమైన యంగములు గలిగినది. ఈ 2 కొఱ్ఱల పేర్లు.

అణి - 1.ఇరుసు తుదిచీల, కదచీల, 2.అంచు, 3.ఎల్ల, 4.కొఱ్ఱు.
శూర - 1.కొఱ్ఱు, 2.వేశ్య. 

ప్రయోజనము - (గృహ.) ఉద్దేశము, కారణము (Motive). (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).
శిల్పము - చిత్తరువు వ్రాయుట, శిల్పుల పని మొదలగునవి.

మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్తీకళ - (చరి.) విగ్రహాదులు చెక్కు శిల్ప విద్య (Sculpture).

వాస్తుపతి - వాస్తోష్పతి, ఇంద్రుడు.
వాస్తోః గృహక్షేత్రాదేః పతి రధిదేవతా వాస్తోప్పతిః - గృహ క్షేత్రాదులకు నధిదేవత.

వాస్తుశాస్త్రము - శిల్పి, వాస్తుశాస్త్రము తెలిసినవాడు.
వాస్తుశాస్త్రము -
దేవాలయములు, గృహములు, సౌధములు నిర్మించుట యందు యుక్తా యుక్తములదెలియుజేయు శాస్త్రము, వాస్తుకళ, శిల్పశాస్త్రము, కట్టడములలో నేర్పరితనము (Architecture).    

శ్రేష్ఠి - కులమందు శ్రేష్ఠుడైన శిల్పి, కోమట్ల బిరుదు, విణ.కులశ్రేష్ఠుడు, వికృ. చెట్టి. 

ఏల సమస్తవిద్యలు నొకించుక భాగ్యము కల్గి యుండినన్
జాలు ననేకమార్గముల సన్నుతికెక్కు నదెట్లొకో యన్
రాలకునేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్
వ్రాలి నమస్కరించి ప్రసవంబులు వెట్టరెవేయి విధాలు! భాస్కరా.

తా. రాళ్ళు విద్యలు నేర్వకున్నను, వానిని దేవతా విగ్రహముగా చేసినచో వాని పాదముల మీదబడి, పూవులతో వానిని మానవులు పూజింతురు. అటులనే కొంచెము భాగ్యమైనను గల మానవుడు అనేక రీతులుగ పొగడ బడుచుండును కాని, విద్యలు(విద్య - 1.చదువు, 2.జ్ఞానము.)నేర్చినందున కాదు.    

అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః|
విశ్వకర్మా మనుస్తస్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః||

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

ఉపాధ్యాయుఁడు - చదువుచెప్పువాడు.
చదువులయ్య - ఉపాధ్యాయుఁడు.

ఉపాధ్యాయి - ఉపాధ్యాయ.
ఉపాద్యాయ -
చదువు చెప్పు స్త్రీ, రూ.ఉపాధ్యాయి.  

ఉపాధ్యాయా వ్యుపాధ్యాయీ -
ఉపేత్య అధీయతే అస్యాస్సకాశాదిత్యుపాధ్యాయా; ఉపాధ్యాయీ చ. ఇఞ్ అధ్యయనే. - ఈమె సమీపమునకు వచ్చి చదువుదురు. ఈ రెండు తనంతటనే చదువుచెప్పునట్టి స్త్రీ పేర్లు.

ఒజ్జ(ౙ) - 1.ఉపాద్యాయుడు, 2.పురోహితుడు, 3.యాజకుడు, సం.ఉపాధ్యాయః.
ఒజ్జదనము - ఉపాధ్యాయత్వము.
ఒజ్జబంతి - 1.ఉపాధ్యాయుడు చూపిన పద్ధతి, 2.మేలుబంతి, రూ.ఓౙబంతి.
ఒరవడి - మేలుబంతి, ఒజ్జబంతి.
ఒజ్జసాని - ఒజ్జభార్య. ఉపాద్యాయాని - ఉపాధ్యాయుని భార్య.     

ఉపాధ్యాయా న్యుపాద్యాయీ -
ఉపాద్యాయస్య పత్నీ ఉపాద్యాయానీ, ఉపాద్యాయీ చ - ఉపాద్యాయుని పత్ని. ఈ 2 ఉపాధ్యాయుని పెండ్లాము పేర్లు.

పంతులు - ఉపాధ్యాయుడు, సం.పండితః.
పండితపుత్త్రుఁడు -
(జాతీ.) పండితుని కొడుకు(శుంఠయని వాడుక).
పండితమ్మన్యుఁడు - తన్ను పండితునిగా తలచుకొనెడివాడు.

తనకును విద్యాభ్యాసం
బును జేసిన వానికన్నఁ * బొలుపుఁగ బదిరె
ట్లను దూఁగుఁ దండ్రి; వానికి
జననియుఁ బదిరెట్లు తూఁగు * జగతి గుమారా!

తా. విద్యనేర్పిన గురువుకంటెఁ తండ్రి పదిరెట్లు ఎక్కువవాడు. వానికి తల్లి నూఱంతలు ఎక్కువయగును. కాఁబట్టి (జగతి - లోకము, రూ.జగత్తు, జగము.)లో తల్లిదండ్రులు గౌరవింపఁ దగినవారు.

బోధకుఁడు - ఉపాధ్యాయుడు.
బోధము - తెలివి.

అవబోధకుఁడు - 1.మేలుకొలుపువాడు, 2.బోధకుడు, వి.1.సూర్యుడు Sun , 2.రాజులను మేలుకొలుపు స్తుతిపాఠకుడు, 3.ఉపాద్యాయుడు.
అవబోధము - 1.మేలుకొని యుండుట, 2.తెలివి, 3.బోధించుట, 4.మేలుకొనుట.

జియ్య - 1.దేవుడు, 2.రాజు, సం.ఆచార్యః.
జియ్యరు - వైష్ణవ సన్న్యాసి, సం.ఆచార్యః.

అయ్యగారు - 1.ఆచార్యుడు, 2.పూజ్యపురుషుడు, రూ.అయ్యగారు.
అయ - 1.తండ్రి, 2.పూజ్యతను తెలుపు పదము, 3.పురుష నామములకు అనుప్రయుక్తము రూ.అయ్య, సం.ఆర్యాః.   

ఆర్యుఁడు - 1.పూజ్యుడు, 2.మంచివాడు, (చరి,) (Aryan), వి. 1.ఆర్యావర్త దేశపువాడు, 2. (నాట,) నటి భర్తను పిల్చునపుడు వాడెడి పేరు, నాట్య పరిభాషయందు పెనిమిటి.

ఆర్య - 1.పదునారేండ్ల కన్య, 2.పూజ్యురాలు, 3.పార్వతి, 4.(ఛంద,) మాత్రావృత్తభేదము, 5.అత్త, 6.(నాట,) నటుడు భార్యను పిల్చునపుడు వాడెది మాట.
ఆర్యాణి - 1.పూజ్యురాలు, 2.పార్వతి.
శ్రేష్ఠత్వా దార్యా - శ్రేష్ఠురాలు.

ఆచార్యకము - 1.ఉపాధ్యాయత్వము, 2.ఉపదేశము.
ఆచార్య - 1.వేదార్థమును వ్యాఖ్యానించెడి స్త్రీ, 2.ధర్మోపదేశికురాలు.
ఆచార్యాని - ఆచార్యుని భార్య.

మన్త్రవ్యాఖ్యా కృదాచార్యః -
మంత్ర మనఁగా కల్పసూత్రాది సహితమైన వేదము. దాని నధ్యయనము చేయించి యర్థమును దేలియఁజెప్పువాఁడు ఆచార్యుఁ డనంబడును. ఆచారం గ్రాహయతీతి ఆచార్యః. - సంప్రదాయమును గ్రహింపఁజేయువాఁడు. "ఉపనీయ తు యః పూర్వం వేద మధ్యాపయే ద్ద్విజః, సారంగం చ సరహస్యం చ త మాచార్యం విదుర్భధాః ఇతి మనుః.

ఆచార్యుఁడు - 1.వేదవ్యాఖ్యానము చేయువాడు, 2.వేదాధ్యయనము చేయించువాడు, 3.మతస్థాపకుడు, 4.యజ్ఞాదులందు కర్మోపదేశికుడు, 5.ఉపాధ్యాయుడు, గురువు Jupiter, 6.ఏదైన ఒక విషయమున నిశిత పాండిత్యము గలవాడు, 7.ద్రోణుడు. కృపి - ద్రోణుని భార్య.

కృపుఁడు - ద్రోణుని మరిది.

దేశికుఁడు - గురువు.
దేశ్యము - దేశమునకు తగినది, వి.భాషలోతత్సమాది విభాగములలో నొకటి.

ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ * బోకుము కార్యా
లోచనము లొంటిఁజేయకు
మాచారము విడువఁబోకు * మయ్య! కుమారా!

తా. ఉపాధ్యాయుని ఎదిరింపవలదు. నిన్ను గాపాడిన వారిని(దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.)వారిని తిట్టవద్దు. ఏదయినా ఆలోచనము చేయుటలో ఒంటరిగాఁ జేయవద్దు. మంచి నడవడిని వదలిపెట్టవద్దు.

అధ్యాపకుఁడు - 1.వేదములను చదివించువాడు, 2.చదువు చెప్పువాడు, గురువు.
అధ్యాపనము -
వేదమును చదివించుట.
అధ్యాయము - 1.చదువుట, 2.వేద పఠనార్హ కాలము,వ్యతి.అధ్యాయనము, 3.వేదపాఠము, 4.గ్రంథభాగము.

అధ్యేత - చదువువాడు, విధ్యార్థి.
విధ్యార్థి -
చదువు కోరువాడు.

గురుదేవ బ్రాహ్మణేషు భక్తిర్భూషణమ్| - 'గురువుల మీద, దేవతల మీద, సద్భ్రాహ్మణుల మీద భక్తి ఉండటం విద్యార్థికి అలంకారం'.

సహాధ్యాయుఁడు - సహపాఠి.
సహపాఠి - కూడ చదువువాడు, సహాధ్యాయి.

ఉపాధ్యాయన్ దశాచార్య | ఆచార్యణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా | గౌరవేణితి రిచ్యతే ||
భా||
పదిమంది ఉపాధ్యాయులు కన్న ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యులకంటె కన్నతండ్రి(కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్న తండ్రి, సం.కృష్ణః.), వెయ్యి మంది తండ్రులకన్నా విద్యావంతురాలైన ఒక తల్లి గొప్పది. 

ఏడుగడ - (ఏడు + కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.      

ద్విజరాజు - 1.చంద్రుడు, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమద్విజుడు.
ద్విజానాం బ్రహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు. 
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.
ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము(దంతము - పల్లు, కోర.), 4.చేప, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి.
ద్విర్జాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.
ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.

దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతమునకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి, సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.

ద్వితీయ స్వపరార్ధస్య వర్తమానస్య వైద్విజ
వారాహ ఇతి కల్పోయం ప్రథమః పరికీర్తితః. - మత్స్యపురాణం 

అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||

తా. తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు(పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.)రాజు, సిగ్గుగల వేశ్య(గణిక - 1.ఆడేనుగు, 2.వేశ్య.), సిగ్గులేని(సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము.)లేని ఇల్లాలు చెడుదురు. – నీతిశాస్త్రము 

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః.

శశధరుఁడు - చంద్రుడు, వ్యు.శశమును ధరించువాడు.
శశస్య ధరః శశధరః - కుందేటిని ధరించినవాఁడు.
శశకము - కుందేలు, రూ.శశము. 
కుందేలు - చెవులపోతు, శశము Rabbit. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరునా?
శశోరము -కుందేటి వెంట్రుకలతో నేసిన కంబళి. 

కుందెనకొమ్ము - కుందేటికొమ్ము.
కుందేటికొమ్ము - జాతీ. అసంభవము, హుళక్కి, వి.ఒక తెగ గడ్ది.

శశాదనము - డేగ, వ్యు.కుందేళ్ళను చంపునది.
డేగ - శ్యేనము.

అథ శశాదనః, పత్త్రీ శ్యేనః -
శశం అత్తీతి శశాదనః, అదభక్షణే. - కుందేటిని భక్షించునది.
ప్రశస్తం పత్త్రం పక్షో (అ)స్యాస్తీతి పత్త్రీ, న. పు. - మంచిఱెక్కలు గలది.
శ్యాయతే శ్యేనః, శ్త్యైఙ్ గతౌ. - తీవ్రముగాఁ బోవునది. ఈ 3 డేగ పేర్లు.

పత్రి - 1.డేగ, 2.పక్షి, 3.బాణము, 4.కొండ, 5.మ్రాను, వై.వి.పత్తిరి. 

పత్రిణౌ వర పక్షిణౌ -
పత్రిన్ శబ్దము అమ్మునకును, పక్షికిని పేరు.
పత్రాని పక్షాః అస్య సంతీతి పత్రి, న. పు. - ఱెక్కలు గలది.

శ్యేనము - డేగ, వ్యు.వేగముగా బోవునది.
డేగకన్ను - నిశితదృష్టి.

మారకము1 - 1.అంటువ్యాధి, 2.డేగ, వ్యు.చంపునది.
మారకము2 - (అర్థ.) వినియము ఒకదేసపు ద్రవ్యమునకు మరియొక దేశపు ద్రవ్యములో గల విలువ.
మారకుఁడు - చంపువాడు.

శరారువు - ఘాతుకము, చంపునది.

నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
నక్షత్రాణామీశః నక్షత్రేశః - చుక్కలఱేఁడు.

నక్షత్రమృక్షం భం తారా తారకాప్యుడు వా స్త్రియమ్ :
నక్షత్రతీతి నక్షత్రం, క్షర సంచలనే - నశింపనిది గనుక నక్షత్రము.
న క్షీయత ఇతి వా నక్షత్రం. క్షీ క్షయే - నశింపనిది.
ఋక్షతి తమో నాశయతీతి ఋక్షం, ఋక్షగతౌ - సంచరించునది.
భాతీతి భం, భా దీప్తౌ - ప్రకాశించునది.
తరంత్యనయా నావికా ఇతి తారా. తారకా. చ.స్న. తౄప్లవన తరణయోః - దీనిచేత నావికులు తరింతురు.
ఉడ్డీయత ఇత్యుడు. ఉ. స్న. డీఙ్ విహాయసా గతౌ - ఆకాశమందు సంచరించునది.
ఉడు వాస్త్రియాం. ఉడుశబ్దో వికల్పేన స్త్రీలింగే వర్తతే. పక్షే నపుంసకలింగేచ. తారక పీత్యపిశబ్దేన తార కాశబ్దస్యాపి వాస్త్రియామి త్యనేనాన్వయః పక్షేక్లీ బత్వం చ ఉడుశబ్ద సాహచర్యాత్.
తదుక్తం - ద్విత్రై ర్వ్యోమ్ని తుషార బిందు మధుర చ్ఛాయైః స్థితం తారకై రితి - ఉడు శబ్దమునకు స్త్రీ నపుంసకలింగములు గలవు.
తారాతారకా శబ్దములకు ఉడుశబ్దమునకు వలె లింగములు గలవు. ఈ. ఆరు సాధారణముగా నన్ని చుక్కలకుఁ పేర్లు.

నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువడి యేడు 27).
నక్షత్రమాల -
1.ఇరువదేడు ముత్యముల కూర్చిన హారము, 2.ఇరువదేడు 27 పద్యములు గల కావ్యము.

దాక్షాయణ్యో శ్వినీత్యాది తారాః :
అశ్వినీత్యాదితారా దాక్షాయణ్య ఇత్యుచ్యంతే - అశ్విన్యాది రేవత్యంత నక్షత్రములు దాక్షాయణు లనంబడును.
దక్షస్య ప్రజాపతే రపత్యాని స్త్రియః దాక్షాయణ్యః - దక్షప్రజాపతి యొక్క కొమార్తెలు. అశ్విని మొదలు 27 నక్షత్రములకుఁ పేర్లు.

వెలది(వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి. స్త్రీ) నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.

ఆచంద్రతారార్కము - చంద్రుడు నక్షత్రములు సూర్యుడు ఉండు నంతి వరకు, శాశ్వతముగా, ఎల్లప్పుడు. 

నక్షత్రములు అనేకము - ఆకాశము ఒకటే.
నక్షత్రములను ఎవరు - మెరవమన్నారు?

(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.

చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు -
చంద్రుడు. చంద్రుని ఎవరు - ప్రకాశించమన్నారు?

ఏకోపి గుణవాన్ పుత్రో  - నిర్గుణేవ శతైరపి|
ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనమ్||

తా. సకల గుణసంపన్నుఁడైన కుమారుం డొకఁడే చాలును, గుణములేని కుమారులు నూఱుగురున్న(కౌరవలు - కురువంశపు వారు, వందమంది యున్న)నేమి ప్రయోజన మున్నది. ఇందుకు నిదర్శనము ఒక చంద్రుడుండిన లోక మంతయు ప్రకాశించును. ఆ చంద్రుఁడు లేక నక్షత్రము లెన్నియున్న నేమి ప్రయోజనమున్నది. - నీతిశాస్త్రము

(ౘ)చుక్కల తెరవు - 1.ఆకాశము, నక్షత్రమార్గము.
సత్పథము-
1.మంచిమార్గము, 2.నక్షత్రమార్గము.

ఋక్షము-1.ఎలుగుగొడ్డు, 2.రైవత కాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి. 
ఋక్షరాజు -
చంద్రుడు, జాంబవంతుడు.

రిక్షము - రిక్క, చూ.ఋక్షము.
రిక్క -
నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్కదారి - ఆకాశము. 

ఋక్షవానర సంఘాతీ చిత్రకూట సమాశ్రయాః,
జయంతత్రాణ వరదః సుమిత్రాపుత్రసేవితః|
 

భంబు - 1.ఆకాశము, 2.నక్షత్రము.
ఆకాశము -
1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి 3.అభ్రకము 4.బ్రహ్మము 5.(గణి.) సున్న, శూన్యము 6. (భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతిక వస్తువులు ఆక్రమించు చోటు (Space).
విను - ఆకర్షించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినువాఁక - గంగ.
మిను -
ఆకాశము, రూ.మిన్ను. (మినుచూలు - వాయువు)
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.

తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య, 3.వాలిభార్య. కిష్కింధాచలము నందు దేవిస్థానం తార|     
తారాపతి -
చంద్రుడు. తారాచంద్రుల విలాసములతో...….

తారస్వరము - (భౌతి.) గట్టిగా వినిపించు స్వరము,  (High note).

వ్రతినీ మేనకాదేవి బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ,
ఏకాక్షరపరా తారా భవ బంధ వినాశినీ.

ముక్తాశుద్ధౌ చ తార స్స్యాత్ :
తార శబ్దము ముత్యముల నిర్దోషత్వమునకును, చకారమువలన నక్షత్రమునకును, అత్యుచ్చస్వరమునకును, కనుగుడ్డునకును పేరు.
తరంత్యనేనేతి తారః - దీనిచేత తరింతురు.
"తారో నామౌక్తికే శుద్ధే గురు సుగ్రీవ భార్యయోః, బౌద్ధదేవ్యాం స్తారా దౌరూప్యవర్ణ యోః, తారమత్యుచ్ఛ నిద్ధ్వనతరీ సంబంధయోస్త్రిషు"ఇతి శేషః.

తారానాయకసంకాశవదనాయ మహౌజసే,
నమోస్తు తాటకాహంత్రే రామా....... 

తారాపథము - ఆకాశము. ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈవేళ....

తారకము - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింప చేయునది.   
కనీనిక - 1.కంటి నల్లగ్రుడ్డు, 2.చిటికెన వ్రేలు.
నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక. 
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.

ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా...
రమ్మని నీవైనా చెప్పరాదా... పాపను నాపైన జాలిలేదా..

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ౘదలు - ఆకాశము.
ౘదలుకాఁపు -
వేలుపు; దేవత - వేలుపు.
ౘదలుమానికము - సూర్యుడు, ద్యుమని, నభోమణి.
ద్యుమణి - సూర్యుడు, చదలుమానికము.
ౘదలేఱు - ఆకాశగంగ.

నింగి - ఆకాశము.
నింగిచూలు -
వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.
నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.
వ్యోమకేశుఁడు - శంకరుడు, వ్యు.ఆకాశము జుట్టుగా గలవాడు.
శంకరుఁడు - శివుడు, విణ. సుఖమును గలుగ జేయువాడు. శాంకరుఁడు - 1.వినాయకుడు, 2.కుమారస్వామి, వ్యు.శంకరుని కొడుకు.

వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
ఆకసము -
మిన్ను, సం.ఆకాశః.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
ఆకాశగంగ -
మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయముతో కూడి కాంతిమంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).
మందాకిని - 1.గంగ 2.అరువదేండ్ల స్త్రీ.
గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
పాలవెల్లి - 1.పాలసముద్రము, 2.పాలపుంత.

గంగాధరుఁడు - 1.శివుడు, 2.సముద్రుడు.
కేదారుఁడు - గంగాధరుడు, శివుడు, వ్యు.శిరస్సున భార్య కలవాడు.
గంగాపుత్త్రుడు - 1.భీష్ముడు, 2.కుమారస్వామి.

భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.
భవతి సర్వమనేనేతి భువనం, భూ సత్తాయాం. - దీనివలన నన్నియుఁ గలుగును.
జగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.    
ౙగ - గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద. గొప్ప - అధికము, పెద్దది.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
(ౙ)జాగా - 1.పెద్దది, 2.గొప్పది, 2.చోటు, రూ.జగ, జగా, జెగ, సం.జగత్.  

భువనేశ్వరము - చుట్టుబవంతి.

ఉడుపు1 - ఉడుగు. (ఉడుగు - 1.మాను, 2.ఇంకు, 3.నశించు.)
ఉడుపు2 -
నక్షత్రము.
ఉడురాజు - చంద్రుడు.

క్షపాకరుఁడు - చంద్రుడు, వ్యు.రాత్రిని కలిగించువాడు.
క్షపాం కరోతీతి క్షపాకరః డు కృఞ్ కరణే - రాత్రిని జేయువాఁడు.

క్షపాచరుఁడు - రక్కసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు. 
క్షపాటుఁడు - 1.రాక్షసుడు, 2.యమదూత.
క్షపయతి సర్వచేష్టా ఇతిక్షపా. క్ష్యైక్షయే - సర్వవ్యాపారములను క్షయింపఁజేయునది.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు.సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.

3. అంగారకుడు - నవగ్రహములలో కుజుడు(Mars).
కుజుడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు 2.అంగారకుడు.
భౌముఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు, వ్యు.భూమికి పుత్రుడు.
భూమిజుడు - 1.అంగారకుడు 2.నరకాసురుడు.
నేలపట్టి(బిడ్డ) - 1.అంగారకుడు 2.నరకాసురుడు.
లోహితాంగుఁడు - అంగారకుడు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.

దుస్స్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వ విమోచకః,
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః.

అఙ్గారకః కుజో భౌమో లోహితాఙ్గో మహీసుతః. :
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ – సంచరించువాఁడు.
అంగాని అరయతి పీడయతీతి వా, అర పీడనే - శరీరములను పీడించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటి వర్ణము గలవాఁడు.
కౌ పృథివ్యాంజాతః కుజః, నీప్రాజదుర్భావే - భూమియందుఁ బుట్టినవాఁడు.
భూమేరపత్యం భౌమః - భూమికొడుకు.
లోహితమంగం యస్యసః లోహితాంగః - ఎఱ్ఱని శరీరకాంతిగలవాఁడు.
మహ్యాః సుతః మహీసుతః - భూమికొడుకు. ఈ ఐదు అంగారకుని పేర్లు.

అత ఊర్ద్వమంగారకో (అ)పి యోజన లక్షద్వితయ ఉపలభ్యమానస్త్రిభిస్త్రిభిః వక్ష్యైరేకైకశో రాశీన్ ద్వాదశానుభుంక్తే యది న వక్రేణాభివర్తతే ప్రాయేణా శుభగ్రహో (అ)ఘశంసః  

లోహితాంగుఁడు - అంగారకుడు.
లోహితకము -
1.రక్తచందనము, 2.సింధూరము, 3.నెత్తురు.
లోహితాస్యుఁడు - హరిశ్చంద్ర నృపాలుని కొమరుడు, రూ.రోహితాస్యుడు. (లౌహితాశ్వుడని కొందరు).
రోహితాశ్వుఁడు-1.అగ్ని,2.హరిశ్చంద్రుని కొడుకు, రూ.1.రోహితాశ్వుడు, 2.లోహితాస్యుడు.

మాహేయి - గోవు.
గోవు -
1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
మాహేయుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.

విశ్వ - భూమి.
విశ్వంభరుఁడు -
విష్ణువు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషు.

భూ - భూమి. భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
భూమిజుఁడు -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.

నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి -
భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.
నేల వేలుపు - భూసురుడు; భూసురుఁడు - నేలవేలుపు, బ్రాహ్మణుడు.

మహి - పుడమి, భూమి.
పుడమి -
భూమి, సం.పృథ్వీ.
పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్కచేయబడినది, విశాలమైనది.
పృథువు - గొప్పది, వి.ఒక రాజు.

పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
పార్థుఁడు -
1.రాజు, 2.అర్జునుడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
క్షత్రియుఁడు - రాచవాడు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు. 

బల్లిదుడైన సత్ప్రభువు పాయకయుండినగాని రచ్చలో
జిల్లరవారు నూరుగురు సేరినఁ (తే)దేజముగల్గ దెయ్యెడన్
జల్లని చందురుం డెడసి సన్నపుజుక్కలు కోటియున్న రం
జిల్లునె న్నెలల్ జగము చీకటులన్నియు బాయ! భాస్కరా.
తా.
భాస్కరా! చుక్కలెన్ని(మిక్కిలి చిన్నవగు నక్షత్రములు కోటి సంఖ్యలో) వుండి ప్రకాశించినను చీకటితొలగదు. వానికి తోడుగా చల్లని కిరణములుగల  చంద్రుడున్నప్పుడే Moon, లోకమున చీకటి లేకుండా నుండును. అట్లే బలవంతుడగు మంచిరాజు(నరపాలుఁడు – రాజు) సభ యందు విడువక ఉంటేనేగాని సభ ప్రకాశింపదు, సాధారణ జనులెందరుండినను ప్రయోజనము లేదు.

ఐలుఁడు - 1.పురూరవ చక్రవర్తి, 2.అంగారకుడు Mars, 3.అందగాడు.

ౙమీను - భూమి.
ౙమీందారి -
జమీందారుని వశమున నుండు భూమి.
ౙమీందారు - 1.భూమి కలవాడు, 2.రాజునకు శిస్తు చెల్లించు ఒక అధికారి.

మంగళుఁడు - కుజుడు Mars.
మంగళ -
పార్వతి.
మంగళదేవత - లక్ష్మి.

మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః,
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః.

కర్షకుఁడు 1.దున్నుకొని బ్రతుకువాడు 2.ఈడ్చువాడు, సం.వి.కుజుడు.
కార్షుఁడు -
దున్నుకొని బ్రతుకువాడు.
కృషికుఁడు - దున్నువాడు, వ్యవసాయి.
కృషీవలుఁడు - కృషికుడు, వ్యవసాయము చేయువాడు, వ్యవసాయ దారుడు, రైతు, కర్షకుడు, సేద్యగాడు (Cultivator).
రైతు - సేద్యకాడు; సేద్యకాఁడు - కృషీవలుడు.
సేద్యము - కృషి, వ్యవసాయము, సం.సేత్యమ్.
కృషి - సేద్యము, వ్యవసాయము. వ్యవసాయము - ప్రయత్నము, కృషి.
పంట - 1.పండుట, 2.కృషి.
పంటవలతి - భూమి.

కృషితోనాస్తి దుర్భిక్షం - జపతోనాస్తి పాతకం|
మౌనేన కలహంనాస్తి - నాస్తిజాగరతో భయమ్||
తా.
కృషి చేసుకొనువానికి కఱవులేదు, జపము జేసికొనువానికి పాపము(పాతకం - మహాపాపము (పంచ మ హా పాతకములు: స్వర్ణపేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము)లేదు, మౌనముతో నున్నవానికి కలహము(కలహము - సమరము, వికృ. కయ్యము.)లేదు, మేల్కొని యున్నవానికి భయము లేదు. - నీతిశాస్త్రము 

ప్రతి చోటా కృషికి స్థానం ఉంటుంది. చూడకపోవుట వలన కృషి కూడ నశించిపోవును. కృషితో సమానమైన ధర్మము, వ్యవసాయముతో సమానమైన వాణిజ్యము లేదు.

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః|
పరర్థిః పరమస్పటః తుష్టః పుష్ట శ్శుభేక్షణః||

అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు.
జ్ఞాతి -
1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
పాలికాపు - 1.పాలేరువాడు, 2.భాగస్థుడు, (వ్యవ.) కొంత పాలు ఫలసాయమును పుచ్చుకొని తనతోపాటు పనిచేయుట కొప్పుకొనిన రైతు, (Sharing partner).  
పాలేరు - పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిరా!

రెడ్డి - కాపువారి పట్టపు బేరు(పేరు).  
(ౘ)చౌదరి - గ్రామమునకు పెత్తనకాడగు కాపు, (కమ్మవారి పేర్లలో చివరిభాగము) రూ.చవుదరి, సం.చతుర్.

త్రాణము - కాపు, రక్షణము, విణ.కావబడినది, రూ.త్రాతము.
కాపు -
1.కాపుగడ, రక్షణము, 2.కాయలు కాచుట.
పరిత్రాణము - రక్షణము.  త్రాత - కాచువాడు.
కా(ౘ)చు - 1.(కాయ) కాచు, 2.(ఎండ) కాయు, 3.రక్షించు, 4.ఓర్పు, సహించు, 5.ఎదురుచూచు.
కాపాడు - రక్షించు; రక్షణ - (గృహ.) కాపాడుట, (Protection).
సాఁకు - కాపాడు, పెంచు; పెంచు- క్రి.పోషించు.
పాలించు - 1.ఏలు, 2.రక్షించు.
ఏలు - 1.పరిగ్రహించు, 2.పాలించు.
కాపరి - (కాపు+అరి) రక్షకుఁడు, ఉదా.పసులకాపరి. రక్షకుఁడు - రక్షించువాడు. 

Who is brave?
One who protects those in fright.

గోపుఁడు - రక్షించువాడు, వి.1.రాజు, 2.గొల్లవాడు, (చరి) మౌర్య కాలమునాటి గ్రామాధికారి, (అయిదింటి పైగాని, పదింటిపైగాని అధికారము కలిగి గ్రామములలోని భూముల ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్య కర్తవ్యములై యుండెను.)
గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గొల్ల1 -
1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.
కాటిపాఁపడు - గొల్లవాడు, 2.కాటికాపరి.
కాటిఱేఁడు - శివుడు, రూ.కాట్రేడు.  

సత్యేన రక్ష్యతే ధర్మః విద్యా యోగేన రక్ష్యతే |
మృజయా రక్ష్యతే రూపం కులం వృత్తేన రక్ష్యతే ||
సత్యం చేత ధర్మం కాపాడబడుతుంది. విద్య యోగం (ఏకాగ్రత, అభ్యాసం) చేత కాపాడబడు తుంది. శుభ్రపరచు కోవటం చేత అందమైన రూపం కాపాడబడుతుంది. కులం, (వంశం) మంచి నడవడిచేత కాపాడబడుతుంది.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.

చరుఁడు - 1.వేగులవాడు, 2.అంగారకుడు.
గూడచారి -
వేగులవాడు, ఇతర దేశముల రహస్యములను తెలిసికొనుటకు నియమింప బడినవాడు.
గూఢపురుషుడు - వేగులవాడు, గూఢచారుడు.

అనిరుద్దుఁడు - 1.అడ్డగింప బడనివాడు, 2.లొంగనివాడు, వి.1.గూఢచారుడు, 2.ప్రద్యుమ్నుని కొడుకు, 3.విష్ణువు, 4.శివుడు.

అనురుద్ధ ఉషాపతిః,
అనిరుద్ధః న నిరుద్ధ్యతే పరైరిత్యనిరుద్ధః - పరులచేత నడ్డగింపబడనివాఁడు. రుధిర్ ఆవరణే.
ఉషాపతిః, ఇ - పు, ఉషా బాణసుతా, తస్యాః పతిః - బాణాసురుని కూఁతురైన ఉషకు మగఁడు. ఈ 2 అనిరుద్ధుని పేర్లు.

విశ్వకేతువు - అనిరుద్దుడు, వ్యు. పెక్కు ధ్వజములు కలవాడు.

4. బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. 
బుధ అవగమనే. ప్రశస్తా బుద్ధిర్యస్య సః భుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.

ఉశనసా బుధో వ్యాఖ్యాతః తత ఉపరిష్టాద్ద్వి లక్షయోజనతో బుధః సోమసుత ఉపలభ్య మానః ప్రాయేణ శుభకృత్ యదార్కాద్వృతి రిచ్యేత తదాతి వాతాభ్రప్రాయా – నావృష్ట్యాది భయమాశంసతే   

రౌహిణేయో బుధ స్సౌమ్యః :
రోహిణ్యాః అప్యతం రౌహిణేయః. - రోహిణీదేవి కోడుకు.
బుధ్యతే సర్వమితి బుధః - బుధ అవగమనే - సర్వము నెరింగినవాఁడు.
సోమస్యాపత్యం సౌమ్యః - చంద్రుని కొడుకు. - ఈ మూడు 3 బుధుని పేర్లు.

రౌహిణేయుడు - 1.బలరాముడు, 2.బుధుడు.
బలుఁడు -
బలరాముడు, విణ.బలము గలవాడు.
ఏకకుండలుఁడు - 1.బలరాముడు, 2.కుబేరుడు, 3.ఆదిశేషుడు.
తాటిపడగవాఁడు - 1.బలరాముడు, 2.భీష్ముడు.
హలాయుధుఁడు - బలరాముడు. 
నాగఁటిజోదు - బలరాముడు, హలాయుధుడు.
హలి - 1.నాగలి, 2.బలరాముడు, 3.పొలముదున్నువాడు.
నాఁగలి - దున్ను సాధనము, లాంగలము, రూ.నాఁగెలు, నాఁగేలు, సం.లాంగులః.
లాంగులము - నాగలి; హాలము - నాగలి, రూ.హలము.
హలము - నాగలి, రూ.హాలము.
హలికుఁడు - పొలముదున్నువాడు, రూ.హాలికుడు.
హాలికుఁడు - హలికుడు. 

నాఁగటి (ౘ)చాలు యతివ(అతివ - స్త్రీ) - సీత. 

హల్య - నాగళ్ళ సమూహము.
నాఁగటిదుంప -
పణత.
నాఁగటిచిప్ప - పణత, నాగలిదుంప.

రోహిణి -1.నాల్గవ నక్షత్రము, 2.తొమ్మిదేండ్ల కన్యక, 3.బలరాముని తల్లి.
రోహిణీపతిః -
రోహిణి చంద్రుని ప్రియపత్ని, ప్రకృతి కళ వల్ల అవతరించినది. అసమాన్య అందగత్తె అయిన రోహిణి పట్ల చంద్రుడు పరమప్రీతి గలవాడు.

బుధో బుధార్చిత స్సౌమ్య స్సౌమ్యచిత్త శ్శుభప్రదః
దృఢవ్రతో దృఢఫల శ్శృతిజాలప్రబోధకః|

సౌమ్యుఁడు - బుద్ధుడు, విణ.1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.

సౌమ్యం తు సున్దరే సోమదైవతే,
సౌమ్యశబ్దము ఒప్పెడువానికిని, సోముఁడు దేవతగాఁ గలహ విస్సూక్తాదులకును పేరు.
సోమో దేవతాస్యేతి సౌమ్యం, త్రి. - సోముఁడు దేవతగాఁ గలది గనుక సౌమ్యము.

సత్యవాస స్సత్యవచాః శ్రేయసాంపతి రవ్యయః,
సోమజ స్సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః.

సౌమ్యము - మృదుత్వము(Soft).
నవకము - మృదుత్వము, సం.వి.తొమ్మిది.
సౌమ్య - 1.అరువది సంవత్సరములలో నొకటి, 2.కొంచెము సబ్బు ద్రావణముతో కలిసినవెంటనే కొంతసేపు నిలుకడగా నుండు నురుగునిచ్చు జలము యొక్క గుణము, 3.మృదుత్వము(Soft).

సౌమ్యగంధ - గులాబిపువ్వు Rose flower.
మృదులము - మెత్తనిది, మృదువు. 
మృదువు - మెత్తనిది.

తిన్న - 1.మనోజ్ఞము, 2.యుక్తము, 3.స్వస్థము, 4.ఋజువు, 5.సౌమ్యము.
మనోజ్ఞము -
1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సుకింపైనది, మదికి హితమైనది.
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.
స్వస్థము - నెమ్మదిగా నుండునది.
ఋజువు - 1.సరళము, వంకర లేనిది, 2.ఋజువర్త నిష్కపటము.
సరళము - ఔదార్యము గలది, వంకర కానిది, రూ.సరాళము, సం.వి. (గణి.) 1.లంబము, 2.శాఖలు లేని ఋజురేఖ, (Normal), (వ్యాక.) గ, జ, డ, ద, బలు సరళములు. 

అభిదిశ - (గణి.) సరళరేఖ యొక్క దిక్కు (Serse).

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకర స్సుఖీ,
సింహాధిరూఢ స్సర్వజ్ఞ శ్శిఖివర్ణ శ్శివంకరః.

అందము - 1.సౌందర్యము, చక్కదనము, 2.అలంకారము, 3.విధము, విణ. 1.చక్కనిది, 2.తగినది.
సౌందర్యము - చక్కదనము; ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమానాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
సింగారము - శృంగారము, అలంకారము, సం.శృంగారః.
శృంగారము - 1.నవరసములలో నొకటి, 2.అలంకారము, వికృ.సింగారము.
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది, 3.అడ్డులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.

మురువు - 1.గర్వము, 2.శృంగార గర్వము, 3.సౌందర్యము.
మురిపెము -
1.విలాసము, 2.శృంగార గర్వము, 3.నడక యందలి కులుకు, 4.సంతోషము.
మురియు - క్రి.1.గర్వించు, 2.సంతోషించు.
ముఱియు - క్రి.1.గర్వించు, 2.సంతోషముతో పొంగు.

అభిరామము - మనోహరము, ఇంపైనది, ఒప్పిదమైనది.
మనోహరము -
బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
మనోజ్ఞత - (గృహ.) ఆకర్షించు శక్తి, 2.రంజింప జేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
ఒప్పిదము - 1.అందము, 2.అలంకారము, 3.విధము, విణ.1.మనోజ్ఞము, 2.తగినది.
రమ్యము - ఒప్పిదమైనది; రమణీయము - ఒప్పిదమైనది.

కోమలికము - చక్కదనము.
కోమలి -
చక్కదనము గల స్త్రీ.
అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.  
ఒప్పులాఁడీ - చక్కదనముగల స్త్రీ.

ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
ౘక్కదనము -
1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
ౘక్క - 1.సుందరమైనది, 2.తిన్ననైనది.
ౘక్కనయ్య - 1.సుందరమైనవాడు, 2.వి.మన్మథుడు.
 
ౘక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.
ౘక్కాడు -
క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.

తుల - 1.త్రాసు, 2.పోలిక, 3.రాసులలో ఒకటి.
సాధర్మ్యము -
పోలిక.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము, (Property).
గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
గుణి - గుణముగలవాడు, వి.విల్లు, వ్యు.గుణము (అల్లెత్రాడు) కలది.
కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

వస్త్రముఖ్య స్వలంకారః, ప్రియముఖ్యంతు భోజనం|
గుణో ముఖ్యంతు నారీణాం, విద్యాముఖ్యస్తు పూరుషః||
తా.
అలంకారమునకు వస్త్రములు, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యయును(విద్య - 1.చదువు, 2.జ్ఞానము) ముఖ్యములు. - నీతిశాస్త్రము

ఆత్రేయగోత్రజో త్యంతవినయో విశ్వపావనః,
చాంపేయపుష్ప సంకాశచరణ శ్చారుభూషణః.

విద్వాంసుఁడు-చదువరి, విణ.ఎరుకగలవాడు.
వేత్తి సర్వం విద్వాన్, స. పు. - సర్వము నెఱింగినవాఁడు.

విపశ్చితుఁడు - విద్వాంసుడు.
విశేషేణ పశ్యన్ చేతతీతి విపశ్చిత్. త. పు. చిత్రీ సంజ్ఞానే. - విశేషముగాఁ జూచుచు నెఱుంగువాఁడు.

విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మ వాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||

దోషజ్ఞుఁడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోష మెరిగినవాడు.
దోషం జానాతీతి దోషజ్ఞః జ్ఞా అవబోధనే. - దోషము నెఱిఁగినవాఁడు. 

సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు.  
సుమన సః-సాంతః-పు. సుష్ఠు మన్వత ఇతి సుమనసః - లెస్సగా నెఱిఁగినవారు గనుక సుమనస్సులు.
మన జ్ఞానే, శోభనం మనో యేషాం తే మంచి మనస్సు గలవారు.

పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.
ప్రసూనము - 1.పువ్వు, 2.ఫలము.
కుసుమము - 1.పూవు, 2.నేత్రరోగము, 3.స్త్రీరజస్సు, 4.పండు.
సుమము - పువ్వు, కుసుమము.  
పువు - పుష్పము, రూ.పువ్వు, సం.పుష్పమ్.

మాల్యము - 1.పుష్పమాలిక, 2.పుష్పము.

పుష్పాదికములు - (గృహ.) పుష్పముల కొరకు, రమణీయత కొరకు పెంచబడు మొక్కలు (Flowers and plants) ఉదా. గులాబి, క్రోటనులు మొ.

విరి - పువ్వు.
విరిఁబోఁడి -
పుష్పమువలె మనోజ్ఞమైన స్త్రీ.
పువుఁబోఁడి - అందకత్తె, రూ.పువ్వుబోడి, పూబోడి.
పువ్వువిలుతుఁడు - మన్మథుడు.
పుష్పశరుఁడు - మన్మథుడు.

అలరు - క్రి.1.వికసించు, 2.సంతోషించు, 3.శోభిల్లు, 4.ఒప్పు, కలుగు, వి.1.పుష్పము, 2.సంతోషము, 3.శోభ.
అలరుఁబోఁడి - పుష్పమువలె మనోజ్ఞురాలగు స్త్రీ, రూ.అలరుఁబోణి.
ననఁబోడి - అలరుబోడి.
అలరువిలుకాఁడు - మన్మథుడు. అలరువిల్తుఁడు - మన్మథుడు.

పూనీరు - పన్నీరు, సం.పుష్పనీరమ్.
పన్నీరు -
చల్లనినీరు, సం.పన్నీరమ్.

ఋతువు - 1.రెండు మాసముల కాలము, 2.గర్భధారణకు యోగ్యకాలము, 3.స్త్రీ రజస్సు, 4.వెలుగు, ప్రకాశము.
ఋతుః స్త్రీకుసుమే పి చ. : ఋతుశబ్దము స్త్రీల రజస్సునకును, వసంతాది ఋతువులకును పేరు. ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ. - పోవునది.
ఋతుఁడు - సూర్యుడు Sun.

ఆర్తనము - 1.వసంతాది ఋతు సంబంధమైనది, 2.స్త్రీ ఋతు సంబంధమైనది, వి.1.స్త్రీ ఋతువు, 2.పువ్వు, 3.ఋతుస్నానమైన పిదప గర్భోత్పత్తికి అనుకూలమైన కాలము.

ద్వౌద్వౌ మాఘాదిమాసా స్యా దృతుః :
ద్వౌద్వౌ మాఘాదిమాసౌ ఋతురిత్యుచ్యతే. - మాఘము మొదలైన రెండేసి మాసములు ఋతు వనంబడును.
ఇయర్తీతి ఋతుః. ఋ గతౌ - గతించునది. ఈ రెండు నెలలు ఒక ఋతువు.

రజము - రజస్సు.
రజస్సు -
1.రజోగుణము, 2.దుమ్ము, 3.స్త్రీరజస్సు, 4.పుప్పొడి.
రాజసము - రజోగుణము వలన కలిగినది.

పుష్పపరాగము - (వృక్ష.) పుప్పొడి (Pollen), పరాగ రేణువులు = Pollen grains. 
పరాగము - 1.పుప్పొడి, 2.దుమ్ము.
మధూలిక - పుప్పొడి; పుప్పొడి - (పూ+పొడి) పుష్పములాందలి ధూళి.

తేజము - 1.ప్రకాశము, వెలుగు, విణ.బయలు పడినది 2.ప్రభావము(ప్రతాపము, తేజము),3.పరాక్రమము(బలము, శౌర్యము), 4.రేతస్సు, రూ.తేజస్సు.

కౌసుమము - 1.పూదేనె, 2.పుప్పొడి, విణ.కుసుమ సంబంధమైనది.  

కుసుమ - 1.ఒకరకపుధాన్యము (వడ్లలో పెద్దకుసుమ, చిన్నకుసుమ, గుత్తికుసుమ మొ.వి, 2.(వ్యవ.) గింజలనుండి ' కుసుమ ' నూనెనిచ్చెడి పైరు (Safflower). 

కుసుమాకరము - 1.వసంతర్తువు, 2.తోట.

కుసుమాయుధుఁడు - మన్మథుడు.
కుసుమేషుః ఉ-పు కుసుమాన్యేన ఇషవో యస్యసః - పుష్పములే బాణములుగా గలవాఁడు.

కుసుమాయోజనము - (గృహ.) సర్దుకొన లేకపోవుట, అమర్చుకొన లేకపోవుట, అలవడకపోవుట, కలసిమెలసి యుండలేకపోవుట (Maladjustment). 
అలవడు - 1.అభ్యస్తమగు, అబ్బు, 2.పరిమితమగు, 3.కలుగు, 4.శక్యమగు, 5.సిద్ధించు, 6.తగు, 7.కలియు(కలియు - పొందు), 8.ఒప్పు, 9.ఉండు, 10.స్వాధీనమగు.
అమరు - క్రి.1.ఒప్పు, 2.కుదురు, 3.సిద్ధమగు, సిద్ధించు, లభించు, కలుగు, 4.సరిపడు, 5.ఏర్పడు, పొసగు.
పొసఁగు - 1.అనుకూలించు, 2.ఒప్పు, 3.సిద్ధించు.
పొసఁగుడు - వి.ప్రాప్తి, 2.స్నేహము.

పూనిన భాగ్యరేక చెడిపోయిన పిమ్మట, నెట్టి మానవుం 
డైనను వానినెవ్వరును ప్రియంబునబల్కరు పిల్వరెచ్చటన్
దానది యెట్లోకో యనిన తథ్యము పుష్పము వాడి వాసనా 
హీనతనొంది యున్నయెడ నెవ్వరు ముట్టదు రయ్య, భాస్కరా.
   
తా. సువాసన గల పూవు(పుష్పము - 1.సుమము, పూవు, 2.స్త్రీ రజస్సు.)వాడి తన సువాసనను గోల్పోయి నంతనే దాని నెవ్వరూ ముట్టరు. అట్లే మొదట అదృష్టము గలిగి పిదప అది తొలగిన వానిని ఎవరును మునుపటి వలెనే చూడరు. వానితో సంభాషింపరు. వాడు పిలిచినను పలకరు.

సుధి - విద్వాంసుడు.
శోభనం ధ్యాయతీతి సుధీః, ఈ. పు. ధ్యై చింతాయాం. - లెస్సగా విచారించువాఁడు.
కుట్టి - కోవిదుడు, విద్వాంసుడు.
కోవిదుఁడు -
విద్వాంసుడు, వ్యు.ఇది అది అనునియమము లేక సర్వమును ఎరిగినవడు.
కిం నామ న నేత్తీతి కోవిదః, విద జ్ఞానే. - ఇది అది యను నియమములేక సర్వము నెఱిఁగినవాఁడు.

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతి స్సుధీః,
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః.

సరజ్ఞుఁడు - 1.బుద్ధుడు, 2.శివుడు, విణ.అన్నియు నెరిగినవాడు.   
సర్వ్జః, సర్వంజానాతీతి సర్వజ్ఞః - సమస్తము నెఱింగినవాఁడు. జ్ఞా అవబోధనే.
సర్వం జానా తీతి సర్వజ్ఞ - సర్వము నెఱింగినవాఁడు.
ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్రకవి.
ధూర్భారతా జటిః జటా యస్యేతి ధూర్జటిః ఇ-పు. - భారమైన జడలు గలవాఁడు.

బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధ - మంచి బుద్ధి గలవాఁడు.      

బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
సర్వం బుధ్యతే బుధః బుధ అవగమనే. - అన్నిటి నెఱిఁగినవాడు.

ఌంగస్వరూపక సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశశివ|  

అమరుఁడు - 1.దేవత, 2.అమరసింహుడు (సంస్కృత నిఘంటు కర్త), విణ.మరణము లేనివాడు.
నిర్జరుఁడు - వేలుపు; దేవత - వేలుపు.
దేవర - 1.దేవత, దేవుడు, 2.ప్రభువు.
దేవుఁడు - భగవంతుడు.

భగవంతుఁడు - 1.విష్ణువు, 2.శివుడు, 3.బుద్ధుడు, విణ.సన్మానితుడు.
భగవాన్ త.పు. శ్లో. "మహాత్మస్య సమగ్రస్య ధైర్యస్య యశసశ్శ్రియః జ్ఞానవైరాగ్య యోశ్చ్యైవ షణ్ణాం భ" ఇత్యక్తభగో అస్యాస్తీతి. భగవాన్ - సంపూర్ణమైన మహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునివి భగమని చెప్పబడును అదిగలవాఁడు.

దేవానాంప్రియము - మేక, యజ్ఞము లందు దేవతల కర్పింపబడును గాన.

దేవానాంప్రియుఁడు - మూర్ఖుడు, (చరి.) దేవతలకు ప్రియుడు, అశోకుడు.
వైధేయుఁడు -
మూర్ఖుడు.

వంజులము - అశోక వృక్షము.
అశోకము -
1.పొగడచెట్టు, 2.కంకేళివృక్షము, 3.పాదరసము, విణ.దుఃఖము లేనిది.
పాదరసము - పారదము, రసము, సం.పాదరసః.
పారదము - (రసా.) సాధారణముగ ద్రవస్థితిలో నుండి వెండివలె తెల్లగా ప్రకాశించు ధాతువు (Mercury). ఇది ఆవర్త కర్మ పట్టికలో రెండవ వర్గములోనిది).
పారదీయము - (రసా.) పారద(పాదరస) సంబంధమైనది (Mercurial).
పారభానకము - (భౌతి.) అదృష్టముగ పార దర్శకమైనది (Translucent).

వంజుల - ఎక్కువగా పాలిచ్చు ఆవు.

వఞ్జుళో అ శోకే
వన్యతే యాచ్యతే వఞ్జుళః. వను యాచనే. - అడుగఁబడునది.
అశ్నుతే అశోకః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది,
శోకనా శకత్వాద్వా అసోకః - శోకమును చెఱుచునది. ఈ రెండు అశోకచెట్టు పేర్లు.

నమోవాకం బ్రూమో - నయనరమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ – స్పుటరుచిరసాల క్తకవతే!
అసూయత్యత్యంతం - యదభిహననాయ స్పృహయతే 
పశూనామీశానం - ప్రమదవనకంకేళితరవే|- 85శ్లో
      
తా. తల్లీ ! నీ పాదములచేత తాడనము నపేక్షించుచున్న(ప్రమదావనము - అంతఃపుర స్త్రీలు విహరించు ఉద్యానవనము)ఉద్యానవన మందలి అశోక వృక్షమునుజూచి, పశుపతియగు పశుపతియైన ఈశ్వరుడు(ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.)అసూయ చెందుతున్నాడో, అట్టి నీ పాదములు నయన రమణీయములై తడి లత్తుకతో ప్రకాశించుచున్న కాంతి గలిగినవై యున్నవో,  ఆ నీ పాద ద్వయమునకు నమస్కారమని చెప్పెదము. – సౌందర్యలహరి

అనుగ్రహప్రదాం బుద్ధిమ్ అనఘాం హరివల్లభామ్|
అశోకామమఋతాం దీప్తాం లోకశోక వినాశినీమ్||

త్రిదశుఁడు - వేల్పు, వ్యు.ముప్పది యేండ్లు వయస్సుగా గలవాడు.
త్రిదశాలయము -
స్వర్గము; త్రిదివము - స్వర్గము. స్వర్గము - దేవలోకము.

వేల్పుబొజ్జ - బృహస్పతి Jupiter.
బొజ్జదేవర
(బొజ్జ - కడుపు) - వినాయకుడు.
పిళ్లారి - వినాయకుడు, త. పిళ్ళెయార్. 

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
విఘ్నరాజు -
వినాయకుఁడు.

సురలు - వేలుపులు.
సురలోకము -
స్వర్గము.
సురాలయము - 1.మేరుగిరి, 2.స్వర్గము.
సురాచార్యుఁడు - బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
సురాచార్యుఁడు - బృహస్పతి.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).

సురద్విషుఁడు - అసురుడు, వ్యు.దేవతలకు శత్రువు.
సురాన్ ద్విషంతీతి సురద్విషః - ష-పు. దేవతలను ద్వేషించువారు.ద్విష అప్రీతౌ. 
అసుర - 1.రాక్షసుడు, 2.రాత్రి, 3.వేశ్య.

అసురము - 1.ఏనుగు, 2.మాలకాకి.
బొంతకాకి -
మాలకాకి.

సుపర్వుఁడు - వేలుపు.
వేలుపు -
1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

త్రిదివేశుఁడు - వేలుపు.

దివౌకసుఁడు - వేలుపు, రూ.దివొకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
దివౌకసము - పక్షి, రూ.దివోకసము.

దివిషదుఁడు - దేవత,స్వర్గమున నుండువాడు. 
దివిజుఁడు - దేవత.

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివసము -
1.పగలు, 2.దినము, 3.రోజు.
దినము - 1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
దినకరుఁడు - సూర్యుడు.
దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.

అమర్త్యుఁడు - దేవత, వేల్పు, విణ.చావు లేనివాడు.

అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
అమర్త్యాః నమ్రియంత ఇత్యమర్త్యాః - చావనివారు. మృఙ్ ప్రాణత్యాగే. అమృతాంధనః-న-వు. అమృత మంధో (అ)న్నమేషాం తే - అమృతము అన్నముగాఁ గలవారు.

బృందారకుఁడు - వేలుపు, విణ.మనోజ్ఞుడు.
బృందము -
సమూహము.

దైవతము - వేలుపు, విణ.దేవతా సంబంధమైనది.
దేవత -
వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.

దైవికము - దైవము వలన కలిగినది.
దైవము -
1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యాము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.

ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాంగల్యము.

అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత మగుటవలన కానఁబడనిది. వహ్నితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆది శబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.

గ్రుడ్డివాటు - (గ్రుడ్డి+పాటు) దైవము వలన కలిగినది, దైవికము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property). 

ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము కలవాడు. 
ప్రశస్తాం ధియం రాతీతి ధీరః, రా ఆదానే. - మంచి బుద్ధి నిగ్రహించువాఁడు.
ధీర - 1.వ్యంగముగా కోపప్రకాశము చేయునాయిక, 2.ధీరురాలు.
ధీరధీర - వ్యంగ్యవ్యంగముగా కోప ప్రకాశముచేయు నాయిక.

మనీషి - విద్వాంసుడు.
మనీషా (అ)స్యాస్తీతి మనీషీ, న. పు. - బుద్ధి గలవాఁడు. శేముషి - బుద్ధి, మనీష.

ప్రాజ్ఞుఁడు - 1.సమర్థుడు, 2.పండితుడు.
సమర్థుఁడు -
నేర్పరి.
క్షముఁడు - 1.నేర్పరి, సమర్థుడు, 2.సహించువాడు.

నిష్ణాతుఁడు - నేర్పరి; చతురిమ - నేర్పరి.
ప్రవీణుఁడు - నిపుణుడు; నిపుణుఁడు - నేర్పరి. 

కృతహస్తుఁడు - 1.నేర్పరి, 2.గురితప్పక వేయువాడు.

విబుధుఁడు - విద్వాంసుడు.
విబుధ్యంత ఇతి విభుథాః - విశేషముగా నెఱింగినవారు గనుక విబుధులు. బుధ అవగమనే.

విద్వా న్విదంశ్చ -
విద్వచ్ఛబ్ధము ఎఱుక గలవానికిని, చకారమువలన ఆత్మజ్ఞునకును, విద్వాంసునికి పేరు.
వేత్తీతి విద్వాన్, స, విద జ్ఞానే. - ఎఱిఁగినవాఁడు. విద్వానాత్మవిది ప్రాజ్ఞే పండితే చాభియవ ' దితి శేషః.

సుముఖుఁడు - విద్వాంసుడు, విణ.ప్రసన్నుడు.
నేరిమి -
సామర్థ్యము, రూ.నేరుపు, నేర్మి, నేర్పు Skill.
సామర్థ్యము - 1.నేర్పు, యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు (Power) (గృహ.) బలము, సత్తువ.
యోగ్యత - అర్హత.
బలము - 1.సత్తువ, 2.సైన్యము.
సత్తువ - దేహబలము, సం.సత్యమ్. 

కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటికాకి.
కవతే చాతుర్యేణ కవిః కబృవర్ణే, వబయో రభేదః. - చాతుర్యముచేత వర్ణించువాఁడు.

ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.
ధీరస్యాస్తీతి ధీమాన్. త. పు. - బుద్ధిగలవాఁడు.
బుద్ధిమంతుడు - బుద్ధికలవాడు. 
ధీ - బుద్ధి; బుద్ది - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Inteligence).
మతి - బుద్ధి, మనస్సు, సం.మతిః.
ధీంద్రియము - (ధీ+ఇంద్రియము) జ్ఞానేంద్రియము.
జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీఘ్రగ్రాహియైన అవయవము (Sense organ).

మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.
మనసరి - 1.బుద్ధిమంతుడు, 2.అభిమానవంతుడు, సం.మనస్విన్.
మానసము  - 1.ఒక కొలను(మానస సరస్సు), 2.మనస్సు.
మానసౌక(స)ము - హంస.

మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము) (Mental development).

మనసిజుఁడు - మన్మథుడు.
మనసి జాయత ఇతి మనసిజః - మనస్సునందుఁ బుట్టెడువాఁడు. 

కృతి - 1.ప్రబంధము, సప్తసంతానములలో ఒకటి, 2.చదువరి, విణ.నేర్పరి.
ౘదువరి -
విద్వాంసుడు.
కృతం జ్ఞాన మనేన కృతీ. న. పు. జ్ఞానము వీనిచేతఁ జేయఁబడును.
ప్రబంధము - కావ్యము; కావ్యము - కవికృత గ్రంథము, కవి కల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కృతికర్త - గ్రంథము రచించినవాడు, కవి. 

కావ్యుఁడు - శుక్రుడు Venus.
కవే రపత్యం కావ్యః - కవి యను ఋషికొడుకు. కావ్యము - కవికృత గ్రంథము, కవికల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).
కావ్యగుణములు - (అలం.) శ్లేష్మము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కృతిపతి - గ్రంథమును అంకిత మందినవాడు.    

విశారదుఁడు - విద్వాంసుడు, నేర్పరి.
విద్వత్పు ప్రగల్భౌ విశారదౌ,
విశారదశబ్దము విద్వాంసునికి, ప్రౌఢునికి పేరు.
విశిష్టా శారదా అస్యేతి విశారదః - అధికమైన సరస్వతి గలవాఁడు.

విచక్షణుఁడు- విద్వాంసుడు, సం.విణ.నేర్పరి.
విశేషేణ చప్టే విచక్షణః చక్షిణ్ వ్యక్తాయాం వాచి. - విశేషముగాఁ బలుకువాఁడు.

స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామేపూజ్యతే ప్రభుః|
స్వదేశే పూజ్యతే రాజా విద్వ్వన్ సర్వత్ర పూజ్యతేః ||
తా.
మూర్ఖుఁడు తన యింటియందును, ప్రభువు స్వగ్రామ మందును, రాజు తన రాజ్యమందును గొనియాడబడును, విద్వాంసుఁడు సకల దేశముల యందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము

వేదవి ద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞాన భాస్వరః,
విద్యావిచక్షణో విభు ర్విద్వత్ప్రీతికరో బుధః.

ఇల - 1.నేల, 2.బుధుని భార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.     

వేల - 1.చెలియలకట్ట పోలిమే, 2.అనాయాస(ఆయాసములేనిది) మరణము, 3.బుధునిభార్య, 4.దాస్యము.
చెలియలకట్ట - సముద్రపుగట్టు, వేల, రూ.చెల్లెలికట్ట.

ఆఁక - 1.అడ్దు, 2.చెర, 3.కట్టుబాటు, 4.చెలియలికట్ట.
అడ్డు -
క్రి.అడ్దగించు, నిరోధించు, విణ.నిరోధకము, నిరోధకుడు.
ఆఁకట్టు - క్రి.1.అడ్డగించు (ఆఁక=కట్టు), 2.ఆక్రమించు.
ఆఁపు - క్రి.అడ్దగించు, ఆగజేయు, వి.1.అడ్డగింత, 2.ఏర్పాటుగా నుంచుట, విణ.ప్రతిబంధము.
ఆఁకిడు - (ఆఁక+ఇడు) అడ్దుపెట్టు.
ప్రతిబంధకము - అడ్దగించునది.

తడ - 1.అడ్దు, 2.కడ, 3.దూరము.
తడకట్టు -
క్రి.అడ్దగించు, నొరోధించు.

నిరోధము - 1.అడ్దు, 2.చేటు, సం.వి. (భౌతి.) ఒక వస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).
నిరోధించు - క్రి.అడ్దగించు. 

అపూర్వ మాణ మచలప్రతిష్ఠం
సముద్ర మాపః ప్రవిశన్తి యద్వత్ |
తద్వ త్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ || 70శ్లో
తా||
అనేక నదీప్రవాహములు వచ్చి కలిసిన ప్పటికి సముద్రము పొంగి చెలియలకట్టను దాటక స్థిరముగ నుండునట్లు, భోగవిషయములు ప్రారబ్ధ కర్మవశమున సంప్రాప్తము లైనప్పటికిని, ఎవడు నిర్వికారుడై యుండునో అట్టి స్థితప్రజ్ఞుడే మన శ్శంతిని బొందును. కాని, విషయాసక్తి కలవాడు మనశ్శంతిని పొందలేడు. - సాంఖ్యయోగము, భగవద్గీత  

అంబువు - నీరు, (జ్యోతి, లగ్నము నకు నాలుగవ స్థానము, (ఛం.) ఒకరకపు వృత్తము.
అంభస్సు - నీరు, (జ్యోతి.) లగ్నము నకు నాలుగవ స్థానము, (వృక్ష.) కురువేరు.

పులస్త్యుఁడు - బ్రహ్మ మానస పుత్రుడు.
పౌలస్త్యుఁడు - పులస్త్య బ్రహ్మ వంశమువాడు, 1.కుబేరుడు, 2.రావణుడు. దశకంఠుఁడు - రావణుడు, లంకాధిపతి.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
పౌలోమి - శచీదేవి. శచి - ఇంద్రుని భార్య.
పులహుడు -
ఆంగీరసుఁడు -
1.అంగిరసుని పుత్త్రుడు, బృహస్పతి 2.జీవాత్మ, రూ.అంగిరసుడు. అంగిరసః అపత్యం ఆన్గిరసః - అంగిరస్సు కొడుకు. జీవాత్మ - దేహి, జీవుడు; దేహి - దేహము కలవాడు.

ప్రజాపతేరంగిరసః స్వధా పత్నీ పితౄనథ |
అథర్వాంగిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ ||

క్రతువు - యజ్ఞము; క్రతుధ్వంసి - శివుడు, వ్యు. దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.
క్రతుభుజుఁడు -
వేలుపు, జన్నపుఁ దిండి, రూ. క్రతుభుక్కు.
యజ్ఞము - 1.యాగము, 2.వ్రేలిమి, 3.క్రతురాజము, రాజసూయ యాగము (బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞము ఇవి పంచయజ్ఞములు). వికృ. జన్నము.
యజ్ఞపురుషుఁడు - విష్ణువు.
ౙన్నము -
యజ్ఞము, ,వెలిమి, హోమము, వ్రేల్మి, సం.యజ్ఞః.
ౙన్నపుఁదిండి - వేలుపు, క్రతుభుజుడు.
ౙన్నపుగొంగ(శత్రువు) - శివుడు, క్రతుధ్వంసి.

ౙన్నపుఁబొజ్జ - ఋత్విజుడు.
ఋత్విజుడు - ఋత్విక్కు, యజ్ఞకర్త వలన ధనము పుచ్చుకొని యజ్ఞము చేయించువాడు, యాజకుడు, రూ.ఋత్విజుడు.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాంగతిః|
సర్వదర్శీ నివృత్తాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమమ్||

చక్షువు - కన్ను; కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలి పురికన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.పలినము, సన్నని తెలుపుబట్ట.
(ౙ)జాడ -
1.అడుగుల గురుతు(వర్తని - త్రోవ, కాలిజాడ) 2.సైగ, సంజ్ఞ 3.త్రోవ, మార్గము 4.విధము (ప్రకారము, విధి).
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు.
కనుపుల విలుఁకాడు - చెరకు విలుకాడు, మన్మథుడు.

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృష్టించు -
క్రి.చూచు.
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve). 
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగుడ్డునకు సంబంధించినది, (optic).
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు.

సర్వస్య గాత్రస్య శిరఃప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణాం రసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదుల కంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము

5. బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఇ.పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు(బృహత్తు - గొప్పది)లనం బడును. వారలకై నను వానికైనను ప్రభువు.    

బృహస్పతి స్సురాచార్యో గీష్పతి ర్ధిషణో గురుః
జీవ ఆజ్గీరసో వాచస్పతి శ్చిత్ర శిఖండిజః. - 

గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు.
గాంభూమిం ధేనుం స్వర్గం వేదం వా విన్దతి ఇతి గోవిందః - భూమిగాని, గోవునుగాని, స్వర్గముగాని, వేదమునుగాని పొందెడువాఁడు.  

గోష్ఠాధ్యక్షే(అ)పి గోవిన్దః -
గోవింద శబ్దము ఆవుల నేలువానికి, అపిశబ్దమువలన శ్రీకృష్ణునికి, బృహస్పతికిని పేరు. గాః విందీతి గోవిందః. విద్ ఌ లాభే. ఆవులను బొందినవాడు, వాక్కులను బొందినవాఁడును గనుక గోవిందుఁడు.  

సాత్వికౌదార్యశంకరాచార్య గురుఁడు
శ్రేయమును గోరి "లక్ష్మీనృసింహ దేహి
మమ కరావలంబన" మని స్మరణ చేసె
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

నీవే తల్లివి దండ్రివి,
నీవే నాతోడునీడ * నీవే సఖుఁడౌ
నీవే గురుఁడవు దైవము,
నీవే నాపతియు గతియు, నిజముగ కృష్ణా.

తా. కృష్ణా ! నీవే నాతల్లివి, తండ్రివి, హితుఁడవు, సోదరుఁడవు, గురుఁడవు, దైవమువు, నా ప్రభుఁడవు నాకు ఆధారుఁడవు అని నిజముగ నమ్మితిని.  

సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా|
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.   

సురాచార్యుఁడు - బృహస్పతి.
సురాణాం ఆచార్యః సురాచార్యః - దేవతల కాచార్యుఁడు.
సురలు - వేలుపులు; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.

వేల్పుబొజ్జ - బృహస్పతి.
బొజ్జదేవర(బొజ్జ - కడుపు) - వినాయకుడు.
పిళ్లారి - వినాయకుడు, త. పిళ్ళెయార్.

వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ – స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.

విఘ్నరాజు - వినాయకుడు.
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు. 

గీష్పతి - 1.బృహస్పతి, 2.పండితుడు.
గిరాం పతిః గీష్పతిః - వాక్కులకు పతిః
నుడుఱేఁడు - బృహస్పతి, గీష్పతి.

వాగీశో వాక్పతి స్సమౌ,
వాచామీశో వాగీశః, వాచాం పతిర్వాకపతిః - వాక్కులకు కర్త వాగీశుఁడు, వాక్పతియును. ఈ 2 (గ్రద్యపద్యాది ప్రబంధములను) నిర్ధోషముగాఁ బలుకనేర్చినవాని పేర్లు.

ఇడ - ఇడ చంద్రరూపిణి (తెలుపు, చంద్రుని తేజస్సు) 1.(యోగ.) ఒక నాడి, 2.మైత్రావరుణి యను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.

అంతర్వాణి - పండితుడు, అంతరంగ ప్రబోధము (Inner voice).  

అన్తర్వాణి స్తు శాస్త్రవిత్,
అంత రంతశ్శరీరే శాస్త్రరూపా వాణీ యస్యేతి అంతర్వాణి - శరీరములో శాస్త్రరూపమైన సరస్వతి గలవాఁడు.
అంతస్సభామధ్యే ప్రసరన్తీ వాణీ యస్యే త్యంతర్వాణి - సభయందు వ్యాపించు వాక్కు గలవాఁడు.
శాస్త్రం వేత్తీతి శాస్త్రవిత్, ద. విదజ్ఞాన్. - శాస్త్రము నెఱిఁగినవాఁడు. ఈ 2 శాస్త్రము  నెఱింగినవాని పేర్లు.   

సూరి - 1.సూర్యుడు, 2.పండితుడు.
సువతిప్రేరయతి సత్కర్మణితి సూరుః. ఈ. పు. షూప్రేరణే. - సత్కర్మమునందుఁ బ్రేరేపించువాఁడు. పా. సూరీ, న. పు. "సూరీ విచక్షనః," అని అభిధానమాలయందు నకారాంతము. 

అభిజాతుఁడు - 1.గొప్పవంశము నందు పుట్టినవాడు, 2.పండితుడు, 3.న్యాయవంతుడు, 4.శ్రేష్ఠుడు.

వక్త - 1.విశేషముగ మాటలాడువాడు, వాచాటుడు, 2.పండితుడు.

ధిషణుఁడు - బృహస్పతి.
దిషణాబుద్ధిరస్యాస్తీతి ధిషణః - మంచిబుద్ధి గలవాఁడు.
ధిషణ - బుద్ధి.

ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.
ధీరస్యాస్తీతి ధీమాన్. త. పు. - బుద్ధిగలవాఁడు.
బుద్ధిమంతుడు - బుద్ధికలవాడు. 
ధీ - బుద్ధి; బుద్ది - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివితేటలు (Inteligence).
మతి - బుద్ధి, మనస్సు, సం.మతిః.
ధీంద్రియము - (ధీ+ఇంద్రియము) జ్ఞానేంద్రియము.
జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీఘ్రగ్రాహియైన అవయవము (Sense organ).

మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.
మనసరి - 1.బుద్ధిమంతుడు, 2.అభిమానవంతుడు, సం.మనస్విన్.
మానసము  - 1.ఒక కొలను(మానస సరస్సు), 2.మనస్సు.
మానసౌక(స)ము - హంస.

మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము) (Mental development).

మనసిజుఁడు - మన్మథుడు.
మనసి జాయత ఇతి మనసిజః - మనస్సునందుఁ బుట్టెడువాఁడు. 

 

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

సర్వార్థాన్ గృణాతీతి గురుః. ఉ. వు. గృశబ్దే - సర్వార్థములను వచించువాఁడు.    

వినీతుఁడు - 1.జితేంద్రియుడు, 2.గురువుచేత శిక్షింపబడినవాడు, 3.విధేయుడు, వి.వర్తకుడు.
జితేంద్రియుఁడు - ఇంద్రియములను జయించినవాడు.

శిష్టుఁడు - 1.సదాచార సంపన్నుడు, 2.విధేయుడు.
విధేయుఁడు -
వినయము(వినయ సంపద) కలవాడు.
వినయము - 1.అడకువ, 2.గురుశిక్ష.
అడఁకువ - వినయము, నమ్రత, రూ.అణకువ.
అణఁకువ - నమ్రత, రూ.అడకువ.  
నమ్రత - అణకువ, వినయము, అగర్వము.

గురురాత్మవతాం శాస్తా - శాస్తా రాజా దురాత్మనామ్ |
అథ ప్రచ్ఛన్నపాపానాం శాస్తా వైవస్వతో యమః ||
తా||
మనసు అదుపులో ఉన్నవాడిని గురువు శాసిస్తాడు. దుర్మార్గులను రాజు(రావు - అధిపతి, రాజు, సం.రాజా.)శాసిస్తాడు. రహస్యముగా పాపాలు చేసేవాడిని యముడు(వైవస్వతుఁడు - యముడు, 2.శని.) శాసిస్తాడు.

What is the Kalpa creeper in the world?
Knowledge imparted to the earnest student. 

శిష్యుఁడు - విద్యకొరకుచేరి సేవించుచు శిక్షింప బడువాడు.
శుశ్రూషకుఁడు -
శుశ్రూష చేయువాడు, శిష్యుడు, సేవకుడు.
సేవకుఁడు - కొలువుకాడు; కొలువుకాఁడు - సేవకుడు.
సేవ - శుశ్రూష, కొలువు.
కొలువు - 1.ఓలగము, ఆస్థానము, 2.సేవ.
ఆస్థానము - సభ, రాజసభ, సభామండపము.
సభ - 1.కొలువుకూటము, 2.సమూహము, 3.జూదము.
సమజ్య - 1.సభ, 2.కీర్తి.
ఓలగము - 1.కొలువు, 2.కొలువు కూటము.
సేవనము - 1.కొలువు, 2.కుట్టు.
శుశ్రూష - 1.విననిచ్ఛ, 2.సేవని, 3.చెప్పుట.
సేవని- (జీవ.) రెండు భాగములు కలియుచోట ఏర్పడినరేఖ(Suture). 

ఛాత్రాన్తేవాసినౌ శిష్యే -
గురోరసచ్చరిత్రం ఛాదయతీతి ఛాత్రః. ఛద అపవారణే. - గురువుయొక్క అనచ్చరిత్రమును గప్పువాఁడు.
గురోరన్తే నికటే వసతీ త్యన్తేవాసీ. స. పు. వస నివాసే. - గురువు యొక్క సమీపమందుండెడు వాఁడు.
శాసనీయః శిష్యః. శాసు అనుశిష్టా. – శిక్షింపఁదగిన వాఁడు. ఈ 3 శిష్యుని పేర్లు.

ఛాత్రుఁడు - శిష్యుడు.
అంతేవాసి -
1.శిష్యుడు, 2.హరిజనుడు, విణ.దగ్గరనుండువాడు, 2.ఎల్లయొద్ద నుండువాడు.
హరిజనుడు - అంటరానివాడు, (అస్పృశ్యులకు గాంధీ పెట్టిన పేరు).
అంత్యజుఁడు - చండాలుడు, హరిజనుడు.
చండాలుడు - మాలవాడు, రూ.మాలవాడు. పంచముఁడు - మాలడు, విణ.ఐదవవాడు.

సుఖార్థినః కుతో విద్యా నాస్తి విద్యార్హినః సుఖమ్ |
సుఖార్థీ వా త్యజే ద్విద్యాం విద్యార్హీ వా త్యజేత్ సుఖమ్ ||
సుఖం కోరేవాడికి విద్య ఎక్కడి నుండి వస్తుంది? విద్యార్హికి సుఖం లేదు. సుఖం కావాలనుకుంటే విద్యను త్యజించాలి. విద్య కావాలనుకుంటే సుఖం త్యజించాలి.

సముద్ధతుఁడు - గురువుచే శిక్షింప బడినవాడు, దుడుకువాడు.
దుడుకు -
1.దౌష్యము, 2.ఉద్ధతి, 3.చెడ్డపని, త. తటుక్కు, క.దుడుకు.
దౌష్ట్యము - దుష్టత్వము.
దుందుడుకు - 1.గర్వము, ఉద్దతి, 2.తొందర.
దుండగము - 1.తప్పు, 2.దౌష్ట్యము, 3.కీడు, రూ.దుండఱికము, సం.దుంకుకః.
దుండఱికము - దుండగము. కాకృత్యము - అకార్యము, చెడ్డపని.
దుర్మతి - 1.చెడ్డబుద్ధి కలవాడు, వి.60 సంవత్సరములలో నొకటి. 

శివే రుష్టే గురు ప్త్రాతా, గురే రుష్టే స శంకరః||
శివుడు కోపిస్తే గురువు కాపాడగలడు. గురువు కోపిస్తే ఆ శిష్యుణ్ణి శివుడు కాపాడలేడు.

ఉత్తమం కులవిద్యాచ మధ్యమం కృషివాణిజాత్|
అధమం సేవకావృత్తిః మృత్యుశ్చౌర్యోప జీవనాత్||
తా.
కులవిద్యవలను జీవనము సేయుటయు ఉత్తమము, కృషివల్లను వర్తకమువల్లను జీవించుట మధ్యమము, కొలువుగొలిచి జీవించుట(అ)ధమము, దొంగతనముచేత జీవించుటకంటె చావుమంచిదని తెలియ వలెను. - నీతిశాస్త్రము

వసోరాంగిరసీ పుత్రో విశ్వకర్మాకృతీపతిః |
తతో మనుశ్చాక్షుషో భూత్ విశ్వే సాధ్యా మనోఃసుతాః |

అంగిరసుఁడు - 1.అంగిరుని పుత్త్రుడు, బృహస్పతి, 2.జీవాత్మ, రూ.అంగిరసుడు. అంగిరసః అపత్యం అజ్గీరసః - అంగిరస్సు కొడుకు.
ఆంగిరస - 1.ప్రభవాది షష్ఠి సంవత్సరము లలో ఒకటి, 2.పుష్యమీ నక్షత్రము. 
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. 
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ.
అంతరాత్మ -
(వేదాం.) 1.జీవాత్మతో గూడియుండు పరమాత్మ, 2.మనస్సు.

ఆత్మభువు - 1.బ్రహ్మ, 2.ఈశ్వరుడు, 3.విష్ణువు, వ్యు.తనకుతానే పుట్టినవాడు, 4.మన్మథుడు, వ్యు.మనస్సు నుండి పుట్టినవాడు(మనసి చంద్రః), 5.కొడుకు, వ్యు.దేహము నుండి పుట్టినవాడు, 6.బుద్ధి, 7.కూతురు.
ఆత్మభూః. ఊ-పు. ఆత్మనా భవతీ త్యాత్మభూః - తనంతటఁ బుట్టినవాడు.

ఆత్మజుఁడు - 1.కొడుకు, 2.మన్మథుడు.
ఆత్మజ -
1.కూతురు, 2.బుద్ధి.
బుద్ధి - బుద్ధి, మతి, సం.బుద్ధిః.
బుద్ధి - (గృహ.) తెలివి తేటలు (Intelligence).
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ. మది. మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.  

మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మారుఁడు - మన్మథుడు.

ఆత్మ బుద్ధి స్సుఖ చైవ గురుబుద్ధి ర్విశేషతః|
పరబుద్ధిర్వినాశాయ స్త్రీబుద్ధి, ప్రళయాంతకమ్||
తా.
తనబుద్ధి సుఖమునిచ్చును, గురుబుద్ధి విశేషముగా సుఖము నిచ్చును, పరబుద్ధి చెఱుచును, స్త్రీబుద్ధి చంపునని తెలియవలెను. - నీతిశాస్త్రము

వాచస్పతి - సు రా చా ర్యు డు, బృహస్పతి.
వాచాం పతిః వాచస్పతిః - వాక్కులకు పతి.

వాగీశో వాక్పతి స్సమౌ,
వాచామీశో వాగీశః, వాచాం పతిర్వాకపతిః - వాక్కులకు కర్త వాగీశుఁడు, వాక్పతియును. ఈ 2 (గ్రద్యపద్యాది ప్రబంధములను) నిర్ధోషముగాఁ బలుకనేర్చినవాని పేర్లు.  

గురు ర్గురుతమో ధామ సత్యస్సత్య పరాక్రమః|
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||

సురాచార్యుఁడు - బృహస్పతి.
బృహస్పతి - సురగురువు, 2.గురుడు. 
గురుఁడు - 1.గురువు, 2.బృహస్పతి (Jupiter).

వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ. యుక్తయుక్తముగా మాటాడు వాడు.
మాటకారి -
1.వాగ్మి, 2.వాచాటుడు; మాటలమారి - వాచాటుడు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

కీరము - 1.చిలుక, 2.ఒకానొక దేశము.
చిరు -
చిలుక; చిలుక - కీరము, శుకము, రూ.చిల్క.  
శుకము - చిలుక; చిలుకలకొలికి - స్త్రీ. శుకవాహుఁడు - మన్మథుడు.    

కీరశుకౌ సమౌ,
కీతి శబ్దం రాతి కీరః. రా ఆదానే. కీ యను శబ్దమును గ్రహించునది.
వుకతీతి శుకః శుక గతః. చరించునది. ఈ రెండు చిలుక పేర్లు.

లాజము - 1.చిలుక, 2.ఒకానొక దేశము. 
రామతమ్మ - చిలుక; వచము - చిలుక; చిలుకరౌతు - మదనుడు.

పలుకుఁ దత్తడి - చిలుక; ౘదువుల పులుఁగు - చిలుక.

మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ -
ధారణాశక్తి గల బుద్ధి.

రాకొమరుల్ రస్జుని దిరంబుగ మన్నననుంచి నట్లు భూ
లోకమునందు మూఢుఁదమలోపలనుంపరు, నిక్కమేకదా!
చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురు గాక, పెంతురే
కాకము నెవ్వరైన, శుభకారణ సన్ముని సేవ్య! భాస్కరా.
తా.
చిలుకను చూచినా, దాని పలుకులను ఆలకించినా మానవులకు ఆనందం కలుగుతుంది. ఎవ్వరైనను మనుష్యులు భూమిమీద చిలుకను పెంచుదురు గాని కాకిని (కాకము - కాకి, వాయసము.) పెంచరు. అట్లే, ప్రభువులు ఒక రసజ్ఞుని(పండితుని) పోషించిన విధముగా మూర్ఖుని తనఇంటిలో నుంచి కొనరుగదా.

వాచస్పతిస్తథా మిథ్యావక్తా చేద్దానవాన్ప్రతి |
కః సత్యవక్తా సంసారే భవిష్యతి గృహాశ్రమీ ||

 

చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు, (సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).
చిత్రశ్సిఖండాః చూడావిశేషాః ఏషాం సంతీతి చిత్రశిఖండిన, న. పు. - చిత్రములైన జటా విశేషములుగలవారు. 
చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
అంగిరా ఏవ చిత్రశిఖండీ తస్మాజ్జాతః చిత్రశిఖండిజః - చిత్ర శిఖండి యనఁగా నంగిరస్సు వానికొడుకు.   
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.  

దిదీవి - 1.అన్నము, 2.బృహస్పతి, 3.సర్గము, దేవలోకము.
అన్నము -
కూడు, బువ్వ, విణ. తినబడినది. కూడు బెట్టిన వానిని - కూలద్రోయకు.

అన్ని దానములను నన్నదానమె గొప్ప
కన్న తల్లికంటె ఘనము లేదు
ఎన్న గురునికన్న నెక్కుడు లేదయా విశ్వ.
తా||
అన్ని దానములకంటె అన్నదానము గొప్పది. కన్నతల్లి కంటె మించినది లేదు. గురువుల సేవకంటె గొప్పదిలేదు.

దిషణుఁడు - బృహస్పతి.
దిష్ణ్యము -
1.ఇల్లు, సదనము 2.చోటు, తావు 3.బలము (బలము -1.సత్తువ, 2.సైన్యము), 4.నక్షత్రము.

ధామము - 1.ఇల్లు, 2.చోటు, 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము, 6.మేను, 7.పుట్టువు.
ధామనిధి - సూర్యుడు Sun.

ఇలాపురీరమ్యశివాలయే(అ)స్మి- న్సముల్లసన్తం త్రిజగద్వరేణ్యమ్|
వన్దే మహోదారతరస్వభావం సదాశివం తం ధిషణేశ్వరాఖ్యమ్| 

ఠాకురు - 1.తండ్రి, 2.అధిపతి, 3.గురువు, రూ.ఠాగూరు, సం.ఠక్కురః. బాబు - 1.పూజ్యుడు, 2.తండ్రి, సం.భావ్యః.

పిత - జనకుడు, (కన్నవాడు, వడుగుచేసినవాడు, చదువు చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, శరణొసగినవాడు.)
జనకుఁడు - తండ్రి, సం.పితా.

జనితా చోపనీతాచ యేన విద్యోపదిశ్యతే|
అన్నదాతా భయత్రాతా పంచె తే పితరస్మృతాః||
తా.
కన్నతండ్రి, ఉపనయనము చేసినవాఁడు, విద్య చెప్పినవాఁడు, అన్నము బెట్టినవాఁడు, భయము తిర్చినవాఁడు; ఈ ఐదుగురును తండ్రులు. - నీతిశాస్త్రము 

బార్హ స్పత్య మానాబ్ధము - ఒక రాశి యందు బృహస్పతి నివసించి యుండు కాలము. (ఇది వింద్యపర్వతమున(కు) ఉత్తరమున వ్యవహారములో గలదు. సంవత్సరమునకు 361 దినములు).

గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క ఏడాది(సంవత్సరం) వుంటాడు. వక్రగతిలో తప్ప మిగతా కాలమంతా ప్రజలకు మేలు కలిగించే శుభగ్రహం బృహస్పతి.

మౌఢ్యము - 1.మూఢ భావము, 2.గురు శుక్ర గ్రహముల అస్తమయము, శుభకార్య నిరోధము.
నిరోధము - 1.అడ్డు, 2.చేటు, సం.(భౌతి.) ఒకవస్తువుయొక్క చలనమునకు ఇంకొక వస్తువు కల్పించు అడ్దంకి (Resistance).
అడ్డు - క్రి.అడ్దగించు, నిరోధించు, విణ.నిరోధనము, నిరోధకుడు.
అంతరాయము - అడ్దు, విఘ్నము, ఆటంకము. 

6. శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

శుక్రో దైత్యగురుః కావ్య ఉశనా భార్గవః కవిః :
శుక్లవర్ణత్వా చ్ఛుక్రః - శ్వేతవర్ణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేణ నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రుని రేతస్సు వలనఁ బుట్టినవాఁడు.  
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రాదానే - దేవతలకు దుఃఖము నిచ్చువాఁడు.
దైత్యగురుః ఉ-పు. - దైత్యులకు గురువు.
కవే రపత్యం కావ్యః - కవి యను ఋషికొడుకు.
వష్టి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః. స పు. వరకాంతౌ - అసురుల శ్రేయస్సు నిచ్ఛయించువాఁడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు.
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యముచేత వర్ణించువాఁడు. ఈ ఆరు శుక్రుని పేర్లు. 

శుక్రము - 1.రేతస్సు, 2.కంటిపువ్వు.

శుచి - 1.అగ్ని, చిచ్చు, 2.ఉపధాశుద్ధు డైనమంత్రి, 3.గ్రీష్మ ఋతువు, విణ.తెల్లనిది, పరిశుద్ధమైనది.
శోచయతీతి శుచిః. ఇ. పు. శుచశోచనే – దుఖింపఁ జేయువాఁడు.
శుచిత్వాచ్ఛుచిః - శుచియైనవాఁడు.
శుభ్రము - తెల్లనిది, ప్రకాశించునది.
శుభ్రాంశువు -
చంద్రుడు Moon, రూ.శుభ్రాంకుడు.
శుభ్రాః అంశనో యస్యసః శుభ్రాంశుః. ఉ-పు. - తెల్లని కిరణములు గలవాఁడు. 

చిచ్చు - 1.శిఖ, అగ్ని, 2.తాపము.
చిచ్చుఱ -
చిచ్ఛఱ.
చిచ్చఱ - 1.అగ్ని, రూ.చిచ్ఛుఱ, సం.శుచిః.
చిచ్ఛుఱకంటి - శివుడు, అగ్నినేత్రుడు.

శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన.
శిఖావంతుఁడు -
అగ్ని, సం.విణ. జుట్టు ముడికలవాడు.
శ్శిఖాజ్వాలా అస్య సంతీతి శిఖావాన్ త. పు. జ్వాలలు గలవాఁడు.

శిఖి - 1.అగ్ని, 2.నెమలి, 3.కోడి, 4.చెట్టు, 5.బాణము. 
శిఖివాహనుడు -
కుమారస్వామి.

శుక్ర శుచ్చి శ్సుభగుణ శ్శుభద శ్సుభలక్షణః,
శోభనాక్ష శ్శుభ్రరూప శ్శుద్ధస్పటికభాస్వరః|- 1 

ఉశనుఁడు - శుక్రుడు, రూ.ఉశనసుడు.
ఉశీరము -
వట్టివేరు.

దీనార్తిహారకో దైత్యగురు దేవాభినందితః,
కావ్యాసక్తః కామపాలః కవిః కల్యాణదాయకః|

                      

భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు. భార్గవదర్ప వినాశక రామ్|      
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి.
భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.

శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || - 6

భద్రమూర్తి ర్భద్రగుణో భార్గవో భక్తపాలనః,
భగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః|

కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటి కాకి.   
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యముచేత వర్ణించువాఁడు.

కుశీలవుఁడు - 1.చారణుడు, 2.నానాదేశ  సంచారియైన నట్టువుడు, 3.వాల్మీకి, 4.బట్టువాడు.
చారణుఁడు - 1.నానాదేశ  సంచారకుడైనట్టి నటకుడు, 2.దేవతలలో చారణ తెగకు చెందినవాడు.

ఒంటికంటిగాము - శుక్రుడు.
ఒంటి -
ఏకాకిత్వము, విణ.ఒకటి.

సితిఁడు - శుక్రుడు, విణ.తెల్లనివాడు.
తెలిగాము -
శుక్రుడు.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషములేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మల్యము. 
తెల్ల - 1.ధవళము, 2.స్పస్టము. స్పష్టము - వెల్లడియైనది.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.

సుక్కురుఁడు - శుక్రుడు, శుక్రః.
చుక్క -
1.శుక్రుడు, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం. 1.శుక్రః, 2.చుక్రః.

పృషకము - 1.దుప్పి, 2.నీటిబొట్టు, విణ. బ్రహ్మబిందువుతో కూడినది.
దుప్పి -
పొడలుగల అడవిమృగము, చమూరువు.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం. (గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
బొట్టు - 1.తిలకము, 2.చుక్క, సున్న 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సఅం. 1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.

సోఁకుబొజ్జ - శుక్రుడు.
సోఁకు -
1.తగులు 2.గ్రహమావేశించు, వి.1.స్పర్శము, 2.రాక్షసుడు.
సోఁకుడు - 1.స్పర్శము 2.గ్రహావేశము 3.పిశాచము 4.రాక్షసుడు.
స్పర్శము - 1.తాకుడు 2.ఈవి 3.వ్యాధి(తెవులు, రోగము).
తాఁకుడు - తాకుట, సోకుడు, స్పర్శ.
ఈవి - 1.దానము, వితరణము 2.వరము(కోరిక, వరించుట) 3.బహుమానము, రూ.ఈగి.
వ్యాధి - తెవులు, రోగము(రోగము - వ్యాధి).
తెవులు - తెగులు; తెగులు - వ్యాధి, చీడ.
చీడ - పైరులను చెరిపెడి పురుగు.

దాతృత్వం ప్రియవ కృత్వం ధీరత్వ ముచితజ్ఞతా|
అభ్యాసేన నలభ్యంతే చ త్వార స్సహజాగుణాః||
తా.
ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిగి తెలివిగానుండుట, యీనాలుగు తనతోఁ గూడఁ బుట్టు నవియే కాని నేర్చుకొనుటచే గలుగవు. - నీతిశాస్త్రము  

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింస చేయువాడు.
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.

అరి1 - 1.చక్రము, 2.చక్రాయుధము, 3.చక్రవాకపక్షి, 4.శత్రువు, 5.(జ్యోతి.) లగ్నమునుండి ఆరవస్థానము, 6.చండ్రచెట్టు.
అరి2 -
1.కప్పము, 2.అల్లెత్రాడు, 3.హద్దు, మర్యాద.
అరి3 - అవ్య. కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా.కల్లరి, నేర్పరి (కల్ల+అరి, నేర్పు+అరి). 

చక్రము - 1.శ్రీకృష్ణువి ఆయుధము, 2.బండికల్లు, రథచక్రము, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము(దేశము, ఉపద్రవము) 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.

చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము. చక్రధరము - పాము. చక్రధరుఁడు - విష్ణువు; చక్రపాణి - విష్ణువు.
రారాజు - 1.చక్రవర్తి, సార్వభౌముడు, 2.దుర్యోధనుడు, 3.చంద్రుడు.
చక్రవర్తి - సార్వభౌముడు, రాజులకు రాజు.
సార్వభౌముడు - చక్రవర్తి, వ్యు.సమస్త భూమిని ఏలువాడు.

రథాంగము - 1.రథచక్రము, 2.చక్రవాకము.
బండికల్లు -
రథచక్రము. 

చందమామపులుగు - చకోరము.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు. వెన్నెల చూచి తృప్తి పొందునది.

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచిగుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతవి కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁజేరవే
చలువగలట్టి వాడయినఁ(ౘ)జందురు నెంతయుఁగోరి, భాస్కరా.
తా. చంద్రుని యందలి వెన్నెల కాంతిని, ఆ కిరణముల చల్లదనమును, తాము అనుభవించుట కొరకు(భక్షించుటకు) ఎక్కువ ఆశక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే వివేకము కలవారు రాజు మంచివాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను సంతోషముతో నట్టిరాజునే కోరుదురు.

కుంభి - 1.ఏనుగు, వ్యు.కుంభములు కలది 2.కుమ్మరి.
కుమ్మర -
కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
ఘటికారుఁడు - కుమ్మరి.
నీఁడు - కుమ్మరివారి బిరుదు పేరు, రూ.నాయుడు (ఉదా. అంకినీడు), సం.నాయకః.
నాయఁకుఁడు - 1.అధిపతి, 2.పన్నిద్దరు భటుల కధిపతి, సం.నాయకః. 
నాయఁడు - 1.ప్రభువు, 2.బలిజలుమున్నగు వారి పట్టపు పేరు, వై. విణ. శ్రేష్ఠుడు, సం. నాయకః.

అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).

మృత్పిండమేకో బహు భాండరూపం, సువర్ణమేకం బహు భూషణాని |
గోక్షీర మేకం బహు ధేనుజాతం, ఏకఃపరాత్మా బహు దేహవర్తీ ||
తా.
కుండలు వేర్వేరు మట్టియొకటి, భూషణము(నగ, అలంకరణము) వేర్వేరు బంగార మొకటి, గోవులు వేర్వేరు పాలొకటి, అట్లే శరీరములు వేర్వేరు పరమాత్మ యొక్కటే. - నీతిశాస్త్రము

హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీరవాయు విశేషము, రూ.హంసము.

రథాంగము - 1.రథచక్రము, 2.చక్రవాకము.
చక్రాంగము - 1.హంస, చక్రపక్షము 2.జక్కవ, చక్రవాకము.

ౙక్కవ - చక్రవాక పక్షి, రూ.జక్కువ.
ౙక్కవ గొంగ(శత్రువు) - చంద్రుడు.
ౙక్కవఱేఁడు - సూర్యుడు.

సనాభి - జ్ఞాతి, సమానుడు. 
స్వజనుఁడు -
తనవాడు, జ్ఞాతి.
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.(సగోత్రుఁడు - దాయ.)
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.
దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు.
అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు. 
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.  
తొలఁగుబావ - శత్రువు, దాయ.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
ప్రత్యర్థి - శత్రువు; విద్విషుఁడు - శత్రువు; అరాతి - శత్రువు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు).
పగ - విరోధము; విరోధము - పగ, ఎడబాటు.  

అహితుఁడు - శత్రువు, విరోధి.
విరోధి -
1.పగవాడు, 2.ఇరువది మూడవ సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.  

వైరిణం నోవసేవేత సహాయం చైవ వైరిణః |
అధార్మికం తస్కరంచ తథైవ పరయోషితం ||
తా.
శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, దొంగ, పరస్త్రీ, వీరలతో సహవాసము జేయరాదు. - నీతిశాస్త్రము 

అరిందముఁడు - 1.శత్రువుల నణచువాడు, 2.అరిషడ్వర్గమును గెలుచువాడు, వి.1.శివుడు, 2.ఒకానొక ఋషి.

అరి2 - 1.కప్పము, 2.అల్లెతాడు, 3.హద్దు, మర్యాద.
భాగధేయము - 1.భాగ్యము, 2.కప్పము.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూపకర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.
పుణ్యము - 1.ధర్మము, 2.సుకృతము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్త విధి, 7.విల్లు, ధనుస్సు (గణి.) గుణము.(Property)

సధర్మము - 1.సమానము, 2.ధర్మముతో కూడినది.

అరి3 - కలది, కలవాడు అను అర్థమున తెలుగు పదము చివరచేరు ప్రత్యయము, ఉదా. కల్లరి, నేర్పరి (కల్ల + అరి, నేర్పు+అరి).
కలవాడు - 1.ఆప్తుడు 2.ధనవంతుడు 3.శక్తుడు, శక్తి కలవాడు.
ఆప్తుడు - 1.బంధువు 2.స్నేహితుడు, చెలికాడు 3.యదార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

ఆప్తప్రత్యయితౌ సమౌ :
ఆప్నోతి రహస్య మిత్యాప్తః. ఆప్ ఌ వ్యాప్తౌ. రహస్యమును బొందువాఁడు.
పు.ప. త్రి. ప్రత్య విశ్వాసో స్య సంజాతః. ప్రత్యయితః. - విశ్వాసము ఇతని యందుఁ బుట్టును. ఈ రెండు ఆప్తుని పేర్లు.

సబంధుర్యోహి తేషుస్స్యా త్సపితాయస్తు పోషకః|
సఖాయత్ర విశ్వాసస్స భార్యాయత్ర నిర్వృతిః||
తా.
హితము గోరువాఁడే బంధువు, పోషించినవాఁడే తండ్రి, విశ్వాసము గలవాఁడే స్నేహితుఁడు, సుఖింపజేయునదే భార్య యగును. – నీతిశాస్త్రము

7. శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).

సురగురువునకు మీఁదై భా
స్కరసుతుఁ డిరు లక్షలను జగములకుఁ బీడల్
జరుపుచుఁ ద్రింశన్మాసము,
లరుదుగ నొక్కొక్కరాశి యందు వసించున్.
భా||
బృహస్పతి లేక గురుగ్రహము కన్న రెండు లక్షల యోజనాలకు పైన సూర్యుని(భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.) కుమారుడైన శని(Saturn) తిరుగుతుంటాడు. ఇతడు ప్రతి రాశిలోను, ముప్పయి మాసాలు(30 months) చరిస్తాడు. ఈ ముప్పయి మాసాలలోనూ శని ప్రజలకు కష్టాలే కలిగిస్తాడు. అందరికీ అశాంతినే కలిగిస్తాడు.

తత ఉపరిష్టాద్యోజనలక్షద్వయాత్ ప్రతీ యమానః శనైశ్చర ఏకైకస్మిన్ రాశౌ త్రింశన్ మాసాన్ విలంబమానః సర్వానేవానుపర్యేతి తావద్భిరనువత్సరైః ప్రాయేణ హి సర్వేషామ శాంతికరః.

సమౌ సౌరి శనైశ్చరౌ : (శనిమన్దౌ పఙ్గు కాళౌ ఛాయాపుత్రో సితో ర్కజః.)
సూరస్యాపత్యం సౌరిః - పా. సౌరో వా సూర్యుని కొడుకు.
శనైర్మందం చరతీతి శనైశ్చరః, చర గతిభక్షణయోః - మెల్లఁగా సంచరించు వాఁడు. (శనిః, మన్దః, పఙ్గుః, కాళః చాయాపుత్రః, అసితః, అర్కజః) ఏతాన్య పిశనైశ్చర నామాని. - ఈ రెండు శనైశ్చరుని పేర్లు.

సమవర్తి - యముడు, వ్యు.అందరి యెడ సమానముగ నుండువాడు.
సమం వర్తితుం శీలమస్యేతి సమవర్తీ, న. పు. వృతు వర్తనే - అందఱియందును పక్షపాతము లేక సమముగా వర్తించు స్వభావము గలవాఁడు.

సౌరి - 1.శని, 2.యముడు, వ్యు.సూర్యుని కుమారుడు.
సౌరికుడు -
కల్లమ్మువాడు.

శౌణ్డికో మణ్డహారకః,
శుండా పానస్థానం తాత్ధ్యత్ సురాపిశుండా, సా పణ్యమస్యేతి శౌండికః. - శుండ యనఁగా పానస్థానము; అందుండునది గనుక సురయుశుండ యనిపించు కొనును, దాని నమ్మువాఁడు.
మండ మచ్చసురాంహరతీతి మందహారకః హృఞ్ హరణే. - కల్లుమీఁది తేటను అమ్ముటకై తీయువాఁడు. ఈ 2 కల్లమువాని పేళ్ళు.

శౌండికుఁడు - కల్లు అమ్మువాడు.
కబ్బిలి - కల్లమ్మువాడు, శౌండికుడు.

కృతాంతుఁడు - యముడు.
కృతః అంతో వినాశో యేన నః కృతాంతః - ఇతనిచే వినాశము చేయఁబడును.

కృతాంతము - 1.అశుభకర్మ, 2.భాగ్యము, 3.సిద్ధంతము.

శమనుఁడు - యముడు.
శమయతి ప్రాణిన ఇతి శమనః, శము ఉపశమనే - ప్రాణులను శమింపఁజేయువాఁడు.

యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు. సని - శని, సం.శనిః.
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః. 
శమనుఁడు - యముడు.
శమనము - శాంతి పథము, రూ.శామనము.
శామనము - 1.శమనము, 2.వధము.
శమము - శాంతి, కామక్రోధాదులు లేక యడగి యుండుట.
శమి - జమ్మిచెట్టు, విణ.శమము గలవాడు.  

సౌరి - 1.శని, 2.యముడు, వ్యు.సూర్యుని కుమారుడు.
సౌరికుడు -
కల్లమ్మువాడు.

శౌణ్డికో మణ్డహారకః,
శుండా పానస్థానం తాత్ధ్యత్ సురాపిశుండా, సా పణ్యమస్యేతి శౌండికః. - శుండ యనఁగా పానస్థానము; అందుండునది గనుక సురయుశుండ యనిపించు కొనును, దాని నమ్మువాఁడు.
మండ మచ్చసురాంహరతీతి మందహారకః హృఞ్ హరణే. - కల్లుమీఁది తేటను అమ్ముటకై తీయువాఁడు. ఈ 2 కల్లమువాని పేళ్ళు.

శౌండికుఁడు - కల్లు అమ్మువాడు.
కబ్బిలి - కల్లమ్మువాడు, శౌండికుడు.

శనైశ్చరుఁడు - శని, వ్యు.మెల్లగా నడుచువాడు.

మందుఁడు - శని, విణ.1.అల్పుడు, 2.మూర్ఖుడు, 3.వ్యాధిగ్రస్తుడు.

మన్దస్తు తున్ద పరిమృజ ఆలస్య శ్శీతకో అలసో అనుష్ణః :
ఆలస్యేన మందతే - స్వపితీవేతి మందః. మది స్తుత్యాదౌ. - ఆలస్యము చేత నిద్రపోవువానివలె నుండువాఁడు.
పునః పునస్తుందం పరిమార్ష్టీతి తుందపరిమృజః. మృజూ శుద్ధౌ. - పలుమాఱు కడుపు నిమురుకొనువాఁడు.
నలసతీ త్యలసః అలస ఏవాలస్యః - ప్రకాశించువాఁడు కాఁడు గనుక అలసుఁడు, అలసుఁడే ఆలస్యుఁడు.
శీతం మందం కరోతీతి శీతకః - మందముగా కార్యమును జేయువాఁడు.
అలసః ఉక్తః. నవిద్యతే ఉష్ణం తేజో అస్యేతి అనుష్ట్ణః - ప్రకాశము లేనివాడు. ఈ ఆరు అలసుని పేర్లు.


ధీహరుఁడు - మందుడు. (ధీ - బుద్ధి; హరుఁడు - శివుడు.)
అల్పుఁడు - నీచుడు; నీచుఁడు - అధముడు, రూ.నీచు.
అధముఁడు - తక్కువైనవాడు, నీచుడు.
పామరుఁడు - 1.మూర్ఖుడు, అజ్ఞుడు, 2.నీచుడు.
అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
నీచు - 1.చేపమీది పొలుసు, 2.రక్తము చెడి నీరైనది, 3.నీచుడు.

నొప్పిగుంటి - వ్యాధిగ్రస్తుడు.
నొప్పి -
1.బాధ, 2.ఆపద.
ఆపద - విపత్తు(విపత్తు - ఆపద), ఇడుమ.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క.) అయథార్థజ్ఞానము.

మందుఁడ నే దురితాత్ముఁడ
నిందల కొడిగట్టి నట్టి నీచన్నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర ! నిన్ను నమ్మితి కృష్ణా.

తా. కృష్ణా ! నేను మందుఁడను, నీచుఁడను, దురితాత్ముడను(దురితము - పాపము), నన్ను సందేహింపక కాపాడుము, నిన్నే నమ్మితిని.

మసలిక - మాంద్యము, విణ.అలసము.
మాంద్యము - 1.ఆలస్యము, 2.జాడ్యము.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త(అజాగ్రత్త కొంచెమైన కీడు అధికము) 3.జాగు.
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము. (ౙ)జాగు - ఆలస్యము.
అలసము - 1.మందమైనది, సోమరి, 2.శ్రమచెందినది, వి.1.బురదలో తిరుగుటచే కాలివ్రేళ్ళనడుమ వచ్చు పుండు, బురదపుండు, 2.ఒకరకపు అజీర్ణవ్యాధి, 2.విషముగల ఎలుక.
జడత్వము - (భౌతి.) విశ్రాంతిస్థితిలో గాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.

విళంబము - విలంబము, ఆలస్యము.
విళంబి -
విలంబము చేయువాడు, వి.ముప్పదిరెండవ(32వ) సంవత్సరము.

సుస్తి - 1.సోమరితనము 2.జబ్బు, సం.అస్వాస్థ్యం.
బయ్యఁడు - మందుడు. ౙబ్బు - అలసము, వి.రోగము.
నచ్చుకాఁడు - అలసుడు, బాధకుడు. సోమరి - అలసుడు, మందుడు. అలు(ౘ)చు - అలసుడు, సోమరి, అలసః.
అలసుఁడు - సోమరి, చురుకుదనము లేనివాడు.

జాడ్యంధియో హరతినిఞ్చతివాచి సత్యం, మానోన్నతిం
దిశతిపాపమపాకరోతి | చేతః ప్రసాదయతి దిక్షుతనోతి
కీర్తిం, సత్సంగతిః కథయ కిం నకరోతి పుంసాం ||
తా.
సత్సాంగత్యము బుద్ధి జాడ్యమును బోగొట్టును, వాక్కునందు సత్యము గలుగఁజేయును, గౌరవమునిచ్చును, పాపములబోగొట్టును, మనస్సును స్వచ్ఛముగాజేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింప జేయును, మఱియు నెట్టి శుభముల నైనను గలుగజేయును. – నీతిశాస్త్రము

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్|
నిర్మోహత్వే నిశ్చలత్తత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. - భజగోవిందం

మన్దాయ మన్దచేష్టాయ మహనీయగుణాత్మనే,
మర్త్యపావన పాదాయ మహేశాయ నమోనమః.

కప్పుమేనిగాము - శనిగ్రహము.
కప్పు - 1.ఆచ్ఛాదనము, 2.ఇంటిపై కప్పు, 3.నలుపు, 4.చీకటి, క్రి.1.క్రమ్ము, 2.మూయు.
ఆచ్ఛాదనము - 1.కప్పుట, 2.వస్త్రము (బట్ట, వలువ).
క్రమ్ము - 1.కవియు, వ్యాపించు, 2.పైకుబుకు.

గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః. 

కప్పుఁదెరువరి - అగ్ని.
అగ్ని -
1.నిప్పు, 2.అగ్నిదేవుడు.

కప్పుకుత్తుక పులుగు - నెమలి, నీలకంఠము.
నీలకంఠము -
1.నెమలి, 2.పిచ్చుక (నల్లని కంఠము కలది).
చటకము - పిచ్చుక.  

స్థగితము - కప్పు.
స్థగితము -
1.కప్పబడినది, 2.కూర్పబడినది.

కప్పువేల్పు - కరివేల్పు, కృష్ణుడు, విష్ణువు.
కఱివేల్పు -
కృష్ణుడు, నల్లనయ్య.
నల్లనయ్య - కృష్ణుడు, కరివేల్పు.
కృష్ణుఁడు - 1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీకృష్ణ భగవానుడు.

కఱ్ఱి - అర్జునుడు, విణ.నల్లనివాడు, నల్లనిది, సం.కాలః.
అర్జునుఁడు -
1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

హీనాంగా నతిరిక్తాంగాన్ విద్యాహీనాన్ వయౌధి కాన్ |
రూపద్రవ్య విహీనాంశ్చ జాతిహీనాంశ్చ నాక్షి పేత్ ||

తా. కుఱచగల నిడుపులైన చేతులు, కాళ్ళు మొదలయిన అవయములుగల వారలను, విద్యావిహీనులను, వయసుచేత పెద్దనైన వారలను, సౌందర్యము(చక్కదనము), ద్రవ్యము(ద్రవ్యము - ధనము, వస్తువు), జాతి వీనిచే(హీనము - 1.తక్కువైనది, 2.దూరదగినది, 3.విడువబడినది.)దక్కువైన వారలను ఆక్షేపింపఁగూడదు. - నీతిశాస్త్రము 

ఛాయాపుత్త్రుఁడు - శని.
ఛాయ -
1.నీడ, ఛాయ 2.కాంతి, 3.రంగు, 4.ప్రతిబింబము, 5.సూర్యునిభార్య, 6.లంచము, 7.వరుస, 8.కొంచెము, 9.చీకటి(అంధకారము), (భౌతి.) ఒక కాంతి నిరోధకమైన వస్తువునకు వెనుకవైపున నుండు కాంతి విహీన చిత్రము, (Shadow).
రంగు - 1.ఛాయ, కాంతి 2.సొంపు, సం.రంగః. చాయమగఁడు - సూర్యుడు.  

ఛాయా సూర్యప్రియా కాన్తిః ప్రతిబిమ్బ మనాతపః :
ఛాయా శబ్దము సూర్యుని పెండ్లామునకును, కాంతికిని, ప్రతి బింబమునకును, నీడకును పేరు. ఛ్యతి తాపాదికమితి ఛాయా. ఛోచ్ఛేదనే. - తాపము మొదలయిన దానిని బోమొత్తునది. "ఛాయా స్యాత్పాలనో త్కోచ స చ్ఛోభాకావ్యరీతి" ప్వితిశేషః.

ఛాయాకరుఁడు - గొడుగు పట్టువాడు, విణ.నీడను కలుగచేయువాడు.

ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః |
కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్ |

(ౘ)చాయపట్టి(బిడ్ద) - శనైశ్చరుడు.
చాయ -
1.ఛాయ, 2.కాంతి, 3.సూర్యునిభార్య, 4.నీడ, 5.పోలిక, 6.రంగు, 7.వైపు, 8.జాడ, 9.సమీపము, 10.చక్కన, 11.(జీవ.) జీవ పదార్థము లకు సహజమైన రంగు నిచ్చు పదార్థములు (Pigment).

హ్యూ - (గృహ.) (Hue)1.వన్నె, చాయ, 2.కేక, అరుపు.

స్పూర్తి - 1.అదరుట, 2.తోచుట, 3.వన్నె, 4.కాంతి.
స్ఫురణము - 1.అదరుట, 2.తోచుట.
స్ఫురించు - 1.అదరు, 2.తోచు.
స్ఫురితము - 1.అదిరినది, 2.తోచినది.

ప్రభ - 1.వెలుగు, 2.సూర్యుని భార్య, 3.కుబేరుని నగరము. (సూర్య బింబము నందు దేవీస్థానం ప్రభ.)

ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలము, వి.(భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).

ఛాయాపుత్త్రాయ శర్వాయ శరతూణీరధారిణే,
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః.

అసితుఁడు - నల్లనివాడు, వి. 1.శనైశ్చరుడు, 2.దేవలుడు అను ముని.
అసితము -
నల్లనిది, వి.నలుపు Black, నీలవర్ణము Blue.
శనైశ్చరుఁడు - శని, వ్యు.మెల్లగా నడుచువాడు.
దేవలుఁడు - తంబళవాడు, నంబివాడు, పూజారి.
పూజారి - పూజచేయువాడు, అర్చకుడు.
తంబళ - శివార్చన చేసి బ్రతికెడు ఒక జాతి.
నంబి - విష్ణు పూజకుడు.

నంబెరుమాళ్ళు - శ్రీరంగనాయకుడు.
రంగఁడు -
1.శ్రీరంగడు, 2.నంబెరుమాళ్ళు.
సిరంగఁడు - శ్రీరంగనాథుడు, సం.శ్రీరంగః.
సిరంగము - శ్రీరంగము.
రంగము - 1.సత్తు, 2.యుద్ధభూమి, 3.నాట్యస్థానము, 4.శ్రీరంగము, 5.రంగు.
రంగు - 1.చాయ, కాంతి, 2.సొంపు, సం.రంగః.

సత్తు - సత్త్వము, సత్యము, సారము, వి.సీసము (మహాబలము – సీసము, Lead), సం.విణ, (సత్) ఉన్నది, 1.చదువరి, 2.శ్రేష్ఠము, 3.సత్యము, 4.సాధువు, వి.1.నక్షత్రము, 2.సత్యము.
సత్త్వము -1.సత్త, బలము 2.స్వభావము 3.ఒక గుణము 4.జంతువు. సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము. సారము - 1.జవము, 2.ధనము, 3.న్యాయము, 4.బలిమి, 5.చేప, 6.మూలగ, విణ.శ్రేష్ఠము, వి.(గృహ.) ఫలత్వము, 7.ఫలించుశక్తి (Fertility).

సాధు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.
సమము - 1.సమానము, 2.సాధువు.
సమవర్తి - యముడు, వ్యు.అందరి యెడ సమానముగనుండువాడు.

కుమ్మర పురుగు - అడుసు నందు తిరియు అడుసునంటుకొనక చరించు పురుగు, మట్టిపురుగు.
కుమ్మరి పురుగు - కీటకము, కుదురులేనిది, సాధువు.
కీఁచుఱాయి - 1.కుమ్మరి పురుగు, 2.ఇలకోడి, ఈలపురుగు.
ఉరిడె - 1.కుమ్మరి పురుగు, 2.ఊరు మూలదేశము.
యమకీటకము - కుమ్మరి పురుగు. రొంపిలో కుమ్మరి పురుగు మెలగినను దాని దేహమునకు బురద అంటు కొనక అట్లే యుండును.

పరేతరాట్టు - యముడు.
పరేతాః మృతాః తేషాం రా ట్పరేతరాట్, జ-పు. - పరేతలనఁగా మృతిఁ జెందినవారు వారికి బ్రభువు.

పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన
బట్టునా జగంబు వట్టదెవుడు
యముని లెక్కరీతి నరుగుచు నుందురు విశ్వ.

తా|| పుట్టినవారు మరణించినచో యీభూలోకము పట్టదు యముని లెక్కప్రకారము ఒకరి తరువాత ఒకరు చనిపోవుచునేయుండుదురు.

ఆయోధము - 1.యుద్ధము, 2.యుద్ధభూమి, 3.వధము, చంపుట.
యుద్ధము -
1.కయ్యము, 2.పోరు. పోరు నష్టము పొందు లాభము. పొలికలను - యుద్ధభూమి.

నీలము - 1.నీలిచెట్టు, Indigo plant, 2.నలుపు, 3.నల్లరాయి. నీలము - ఒక విలువ గల రత్నము,(Sapphire). (ఇది రాసాయనికముగ ఎల్యూమినియమ్ ఆక్సైడ్ (Corundum). దీని నీలిరంగునకు కారణము అందులో అతిసూక్ష్మరాశిగా నుండు క్రోమియమ్ ఆక్సైడ్).
ఇంద్రనీలము - నీలమణి; కప్పుఱాయి - నీలమణి.
నీలలోహితము - (రసా.) బచ్చలి పండు రంగు గలది (Purple).
నీలలోహితుఁడు - శివుడు.

నీలాంబరుఁడు - 1.బలరాముడు 2.నైరృతి, 3.శని.

శ్యామలము - నలుపు, విణ. నల్లనిది.
(ౘ)చామనము -
శ్యామలము, నల్లనిది.
చామ - 1.యౌవనవతి, 2.నలుపు(నీలిమ - నలుపు), 3.ఒక జాతి పైరు, సం. శ్యామా, 2.శ్యామాకః.
శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ 5.కాళికాదేవి, వికృ.చామ.
శ్యామల - పార్వతి, విణ. నల్లనిది. 

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ,
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః.

క్రోడుఁడు - శనిగ్రహము; కోణుఁడు - శని.

ఎన్నిచోట్ల తిరిగి యేపాటు పడినను
అంటనియ్యక శని వెంట దిరుగు
భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వ.
తా||
ఎన్నిచోట్ల తిరిగి యెన్ని కష్టములుబడినను, లాభము కలుగనీయక శని(Saturn) వెంటాడి తిరుగుచుండును. తమ ప్రదేశము క్రొత్తదైన తినువారు క్రొత్తవారు కాదు గదా.

ప్రొద్దుఁగొడుకు - 1.యముడు, 2.రాహువు, 3.శని, 4.కర్ణుడు, కుంతి పెద్దకొడుకు, 5.సుగ్రీవుడు.
ప్రొద్దు - 1.సూర్యుడు(Sun), 2.కాలము, 3.దినము Day, సం.బ్రధృః. యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలము1 - 1.సమయము 2.నలుపు 3.చావు, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము(Time).

కాలసర్పము - కృష్ణసర్పము, నల్లత్రాచు.
కృష్ణసర్పము -
నల్లత్రాచు.

కాలాంతకుఁడు - శివుడు, (వ్యవ.) అసాధ్యుడు.
గడుసరి -
1.అసాధ్యుడు, 2.కఠినుడు, 3.దుష్టుడు.
కఠోరుఁడు - కఠినుడు.
దుర్జనుఁడు - దుష్టుడు; దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్డజాతి.

క్రూరదృక్కు - 1.పిశునుడు, లోభి(లోభికి ఖర్చు ఎక్కువ), 2.శని, 3.అంగారకుడు, 4.రాహువు, విణ.క్రూరదృష్టి కలవాడు. క్రూరదృషి - 1.అంగారకుడు, 2.శని, విణ.క్రూరదృషికలవాడు.

తమస్తు రాహుస్స్యర్భాను స్సైంహికేయో విధుంతుదః :
సూర్యాచంద్రమసౌ అనేన తామ్యత ఇతి తమః. అ. పు. తము గ్లానౌ - ఇతనిచేత సూర్యచంద్రులు వ్యథను బొందుదురు.
ప. తమస్కారిత్వాత్తమః. స. స. - తమస్సును జేయువాఁడు.
తమ ఆకృతి రస్య తమః - స. న. - చీఁకటి రూపముగా గలవాఁడు.
రహతి భుక్త్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః. ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు.
స్వః స్వర్గే భాతీతిస్వర్భానుః. ఉ. పు. భాదీప్తౌ - స్వర్గమునందు ప్రకాశించువాడు.
సింహికాయాః అపత్యం సైంహికేయః - సింహిక హిరణ్యకశిపుని చెల్లెలు, ఆమె కొడుకు.
విధు తుదతీతి విధుంతుదః, తుద వ్యథనే - విదు వనఁగా చంద్రుఁడు వానిని వ్యథఁ బెట్టువాఁడు - ఈ నాలుగు రాహువు పేర్లు. (కేతుః. శిఖి, రెండు కేతువు పేర్లు.) 

విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనత్ |
రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వం య ఉపాగతః | 

8. రాహువు - ఒక చాయాగ్రహము, దలగాము.(Shadowy Planet)

తలగాము - రాహువు.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ. మొదలు.
గాము - 1.సూర్యాది గ్రహము 2.పిశాచము, సం.గ్రహః.

ముండుఁడు - రాహుగ్రహము, విణ.తెగిన కాళ్ళు చేతులు కలవాడు.
ముండము -
తల.    

మూర్ధము - తల.
మూర్ధాభిషిక్తుడు -
1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).

చీఁకటిగాము - రాహువు.
గాము - 1.సూర్యాదిగ్రహము, 2.పిశాచము, సం.గ్రహః. 

తమస్సు - తమము.
తమము -
1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
శోకము - దుఃఖముచే తపించుట, వగపు(శోకము).
అంధకరిపుఁడు(రిపువు - శత్రువు) - శివుడు.    

చీఁకటిగొంగ – సూర్యుడు Sun, వ్యు. చీకటికి శత్రువు.

స్వర్భానుఁడు - రాహువు.
స్వః స్వర్గే భాతీతిస్వర్భానుః. ఉ. పు. భాదీప్తౌ - స్వర్గమునందు ప్రకాశించువాడు.

భయానకము - 1.పులి, 2.రాహువు, 3.భయానకరసము.
పృదాకువు -
1.పులి, 2.పాము, 3.తేలు.
పులి - 1.నల్లని, 2.పులిసినది, వి.శార్దూలము.
శార్దూలము - పులి. వ్యాఘ్రము - వేగి, పులి.

ఆధిభౌతికము - వ్యాఘ్ర సర్పాది భూతముల వలన కలిగినది. (ఇది తాపత్రయములలో ఒకటి).

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః. సప్పపుఁజుక్క - ఆశ్లేష.
చక్షుశ్రవము - 1.పాము, కనువినికి.
కనువినికి - పాము, చక్షుశ్రవము. 
ద్విరసనము - పాము, వ్యు.రెండు నాలుకలు కలది.

తామసము - 1.ఆలస్యము, 2.పాము, సం.విణ.తమోగుణము కలది.

వృశ్చికము - 1.తేలు(పొట్టియ - తేలు), 2.వృశ్చికరాశి.
తేలు -
1.నీళ్ళలో మునుగక పైకివచ్చు, 2.నీటిలో క్రీడించు, 3.తేలగిల్లు, 4.పొడచూపు, వి.వృశ్చికము.

వృశ్చికస్య విషంపుచ్ఛం మక్షికస్య విషంశిరః|
తక్షకస్య విషం దంష్ట్రః, సర్వాంగం దుర్జనేవిషమ్||
తా.
తేలునకు తోకయందును, ఈఁగకు శిరస్సునందును, పామునకు కోఱలయందును, దుర్జనునకు సర్వాంగములందును విషముండును. - నీతిశాస్త్రము

అహి - 1.పాము, 2.రాహుగ్రహము, 3.వృత్రాసురుడు.
అంహతీత్యహిః. అహి గతౌ. - చరించునది. 
అహి ర్వృత్రే పి :
అహిశబ్దము వృత్రాసురునికిని, అపిశబ్దమువలన పామునకును పేరు. హంతీ త్యహిః. పు. హన హింసాగత్యోః హింసించును గనుక అహి.
అంహతి లోకాన్ వ్యాప్నోతీతి అహిః. అహి గతౌ. వృత్రేయథా _ "ధృతం దనుష్ఖండ మివాహివిద్విష"ఇతి భారవిః. "సర్పే వృత్రాసురే ప్యహి"రితి రభసః.

అహితుఁడు - శత్రువు, విరోధి.
అహిభయము - 1.పాములవలని భయము, 2.రాజులకు స్వపక్షము వారి వలని భయము.
వృతహుఁడు - ఇంద్రుడు, వ్యు.వృత్రాసురుని చంపినవాడు.

అహిర్భుధ్న్యుఁడు - 1.శివుడు, 2.ఏకాదశ రుద్రులలో ఒకడు.

అహిపతి - శేషుడు.
శేషుఁడు -
వేయిపడగలు గల సర్పరాజు.

అహిద్విషుఁడు - 1.గరుడుడు, 2.ఇంద్రుడు.
అహిభుక్కు -
1.గరుడుడు, 2.ముంగిస, 3.నెమలి peacock. 

అహిద్విషము - 1.నెమలి, 2.గ్రద్ధ, 3.ముంగిస.
కౌశికము -
1.గుడ్లగూబ, 2.ముంగిస. 
కౌశికుఁడు - 1.విశ్వామిత్రుడు, వ్యు.కుశికపుత్రుడు, 2.ఇంద్రుడు, 3.నిఘంటువు తెలిసినవాడు, 4.పాములవాడు.
గాధేయుఁడు - విశ్వామిత్రుడు, గ్రాధిపుత్త్రుడు. అహితుండికుఁడు - పాములవాడు; బరిజోగి - పాములవాడు.

నరేంద్రుడు - 1.రాజు, 2.పాములవాడు.
పార్థుఁడు -
1.రాజు, 2.అర్జునుడు.
అర్జుఁనుడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

నవిగర్హ్యకథాంకుర్యాద్యహి ర్మాల్యం నథారయేత్ |
గవాం చయానం వృష్ఠేన సర్వదైవ విగర్హితం ||

తా. నిందింపఁలగిన ప్రబంధకల్పన చేయరాదు, చిలువల మాల్యము(అహి - 1.పాము, 2.రాహు గ్రహము, 3.వృత్రాసురుడు.)ధరింపరాదు, ఎద్దు(గవయము - 1.గురుపోతు, వన వృషభము, అడవియెద్దు.)నెక్కిపోవుట అన్నివిధంబులచేత నిషిద్ధమైనది. – నీతిశాస్త్రము 

ఆశి - పాముకోర (ఆశీవిషము, కోరయందు విషముకలది, పాము), విణ.తినువాడు, ఉదా.మాంసాది మొ.వి.
అశిషి దంష్ట్రాయాం విషమస్యాస్తీ త్యాశీవిషః - ఆశీస్సు అనఁగా కోఱ, అందు విషము గలది.
అశీశబ్ద ఈకారాంతో(అ)ప్యస్తి. "ఆశీమివ కలామిందో" రితి రాజశేఖరః.
ఆశీస్సు - 1.దీవన, 2.హితము కోరుట, 3.కోరిక, 4.పాముకోర.
కోఱ - పందికోఱ, పాముకోర, దంష్ట్ర, సం. ఖరుః.
అశీరుఁడు - 1.అగ్ని, 2.రాక్షసుడు, 3.సూర్యుడు.

స్త్రీ త్వాశీర్హితాశంపాహి దంష్ట్రయోః,
అశీశ్శబ్దము హితమైన యర్థము గావలయు ననుటకును, పాముకోఱకును పేరు. 
అశాసనం, అశంసతీతి చ అశీః, స. సీ. ఆజ శ్శాసు ఇచ్ఛాయాం, ఇచ్ఛయించుటయు, హింసించునది యు ఆశీస్సు.

ఖరుఁడు - ఒక రాక్షసుడు, ఖరదూషణాదులలో ఒకడు, విణ.1.వాడిమి కలవాడు, 2.వేడిమి కలవాడు.
ఖరము - 1.గాడిద, 2.వాడిమి, 3.వేడిమి, విణ.వాడిమికలది, 2.వేడిమికలది.

ఖర- అరువది సంవత్సరములలొ ఒకటి (25వది).
ఖరకిరణుఁడు - సూర్యుడు Sun.

కృష్ణవర్త్మ - అగ్ని, రాహుగ్రహము Rahu, దురాచారుడు.
కృష్ణం వర్త్మ మార్గోయస్యసః కృష్నవర్త్మాన - పు. నల్లనిజాడ గలవాఁడు.
గ్రహకల్లోలము - రాహుగ్రహము.
సొరదోఁకీ - దురాచారుడు, సం.సురద్రోహి.
దురాచారుడు -
చెడునడవడి కలవాడు.

ఖరువు - 1.గుఱ్ఱము, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము(రదనము - దంతము), 5.భర్తను వరించు కన్య, విణ.దురాచారుడు, 2.క్రూరము.

దుర్వృత్తోవా సువృత్తోవా మూర్ఖః పండిత ఏనవా|
కాషాయ దండమాత్రేణయతిః పూజ్యోన సంతియః||
తా.
అతిదురాచారుఁడైనను, సదాచారుఁడైనను, మూర్ఖుఁడైనను, పండితుడై నను, కాషాయ(కాషాయము - 1.కావివస్త్రము, 2.కావిచీర.)దండము లను ధరించుటచేత పూజ్యుడగును. - నీతిశాస్త్రము

జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః,
పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృతవేషః. - భజగోవిందం

విధుంతుదుఁడు - రాహుగ్రహము.
గ్రహ కల్లోలము -
రాహుగ్రహము.

ముండుఁడు - రాహుగ్రహము, విణ.తెగినకాళ్ళు చేతులు కలవాడు. మొండెపుగాము - రాహువు.
మొండి -
1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.
కింపాకుఁడు - 1.నిరర్థకుడు, 2.మూఢుడు, 3.మాతృశాసితుడు.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.

కబంధము - 1.జలము, 2.మొండెము, 3.సముద్రము.
జలము -
1.నీరు, 2.జడము 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, Urine సం.నీరమ్.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.

మొండెము - తలతెగిన కళేబరము, కబంధము, సం.వి.ముండమ్, (గృహ.) భుజము క్రింది తుంటిపై భాగము, కభంధము, ఊర్థ్వకాయము (Trunk).

జడధి - సముద్రము. సముద్రము - సాగరము.

కబంధుఁడు - 1.కేతువు, 2.ఒక రాక్షసుడు.
మొండెపురక్కనుఁడు -
కబంధుడు. కబంధ బాహు చ్ఛేదన రామ్.

9. కేతువు - 1.తొమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
వికచము -
1.వికసించినది, 2.వెండ్రుకలులేనిది, సం.వి.కేతువు. 
కూచి - 1.యుద్ధయాత్రకై వాద్యము మ్రోగించుట, 2.ఆడుది(స్త్రీ - ఆడుది), విణ.1.వాడియైనది, 2.వికసించినది.

గ్రహభేదే ధ్వజే కేతుః :
కేతుశబ్దము కేతుగ్రహమునకును, టెక్కెమునకును పేరు. కిత్యతే అనేనేతి కేతుః. కిత జ్ఞానే. - దీనెచేత నెఱుఁగబడును. కేతుశబ్దము కాంత్యుత్పాత చిహ్నములకును పేరు. "పతాకాయాం ద్యుతౌ కేతుః గ్రహోత్పాతాది లక్ష్మసు" అనె రుద్రుఁడు.

ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
టెక్కెము -
టెక్కియము.
టెక్కియము - జండా(జెండా - టెక్కెము), రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము(Ketu), 2.మిత్తిచూలు.

కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెము -
టెక్కియము.
టెక్కియము - జండా(జెండా - టెక్కెము), రూ.టెక్కెము.
టెక్కెపుగాము - 1.కేతుగ్రహము, 2.మిత్తిచూలు.

మిత్తి (ౘ)చూలు - కేతువు.
మిత్తి -
1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః 2.మితిః.
మిత్తిగొంగ - మృత్యుంజయుడు, శివుడు. 

నవమగ్రహక స్సింహికాసురీగర్భసంభవః,
మహాభీతికర శ్చిత్రవర్ణో వా పిఙ్గలాక్షకః|

గుఱుతు - 1.చిహ్నము, 2.మేర, 3.కీర్తి, 4.పరిమితి, 5.స్థానము, 6.విధము, 7.మచ్చ(కళంకము - మచ్చ), 8.సాక్షి, రూ.గుర్తు.

చిహ్నము - 1.గురుతు, 2.టెక్కెము.
చిన్నియ - 1.చిహ్నము, గురుతు, 2.విలాసము, రూ.చిన్నె.
చెన్నె - చిన్నియ యొక్క రూపాంతరము
చిన్నెలాఁడు - విలాసవంతుడు.
చిన్నెలాడి - విలాసవతి.

లక్ష్మము - 1.చిహ్నము, 2.మచ్చ, 3.ముఖ్యము.

మేర - 1.ఎల్ల, 2.మర్యాద, 3.క్రమము, 4.ఏర్పాటు, 5.దూరము, సం.మీరా.
కీర్తి-1.యశస్సు, (వికృ.) కీరితి, 2.పేరు, 3.తేట, 4.అడుసు, 5.విరివి. విరివి - విస్తృతి, విణ.విస్తృయము, వెడల్పైనది.
స్థానము - 1.చోటు, ఉనికి, 2.విలుకాని యుద్ధ మప్పటి నిలుకడ.
విధము - ప్రకారము, విధి.
మచ్చ - 1.గాయపుగుర్తు, 2.పుట్టుమచ్చ(కాలకము - పుట్టుమచ్చ).
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.

ప్రామాణ్యము - 1.దృష్టాంతము, 2.సాక్ష్యము.
ప్రామాణికుఁడు -
1.సత్యము తప్పనివాడు, 2.మేరమీరనివాడు, 3.శాస్త్రము నెరిగినవాడు.

గండము - 1.ఏనుగు చెక్కిలి, 2.ఖడ్గమృగము, 3.గుర్తు, 4.పుండు, 5.చెక్కిలి(కపోలము - చెక్కిలి), 6.ప్రాణాపాయము.
అపమృత్యువు -
1.అకస్మాత్తుగా కలిగిన చావు, 2.గండము.

గండకము - 1.విఘ్నము, 2.ఖడ్గమృగము(కటిక మెకము - ఖడ్గమృగము), 3.పులిగోరు పదకము, 4.చేపపిల్ల, 5.ఒక సంఖ్య.

అభిజ్ఞానము - 1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
లలామము -
1.గురుతు, 2.టెక్కెము, 3.తొడవు, 4.నొసటిబొట్టు, 5.తోక, 6.గుఱ్ఱము (ఉత్తరపదమైనచో శ్రేష్ఠము).

     
కంబము - గుంజ, సం.స్కంభః.

గుంజ - 1.గురివెంద తీగ, 2.తప్పెట, 3.కల్లు దుకాణము, 4.అవ్యక్త మధుర ధ్వని, 5.ఉప్పళము(ఉప్పళము - ఉప్పు పండు నేల).
గరువము - 1.గర్వము, 2.గొప్పతనము, విణ.1.విస్తృతము, 2.పెద్దది, సం.గౌరవమ్.
కంబమయ్య - కంబము,(స్తంభము)నందు ఉద్భవించిన నృసింహస్వామి.

   

తోఁక - తొంక; పుచ్ఛము - తోక.
తొంక -
పుచ్ఛము, వ్యు.తొంగునది, వంగియుండునది, రూ.తోఁక.
పుచ్ఛసంబంధి - (జం.) తోకకు సంబంధించినది (Caudal).
వాలము - 1.తోక, 2.కత్తి.

   

ధూమకేతువు - 1.తోకచుక్క, 2.ఉత్పాతము, 3.అగ్ని.
దుమగతికేతు -
ధూమకేతువు, అరిష్ట సూచకమగు తోకచుక్క.
తోఁకచుక్క - ధూమకేతువు, (భూగో,) సూర్యునిచుట్టు తిరుగు ఘనపదార్థ కేంద్రము, వెలుగుచున్న తోక గలిగిన ఒక గ్రహము, (Comet).

అగ్న్యుత్పాతౌ ధూమకేతూ -
ధూమకేతుశబ్దము అగ్నికి, ఉత్పాతమునకును పేరు. ధూమః కేతు శ్చిహ్నమస్యేతి, ధూమప్రధానం కేతు రుత్పాత ఇతి చ ధూమ-కేతుః - ధుమము చిహ్నముగాఁ గలవాఁడు గనుకను, ధూమప్రధానమైన యుత్పాతము గనుకను ధూమకేతువు.


ఉత్పాతము - 1.ఉల్కాపాతము మొ. అపశకునము, 2.ఎగురుట, 3.ఉపద్రవము.
అజన్యము - ఉత్పాతము, విణ.జన్యము కానిది.
ఉపప్లవము - 1.ఉత్పాతము, 2.ఉపద్రవము, 2.నీటిపై తేలుట.
ఉపద్రవము - 1.ఆపద, 2.బాధ, 3.విప్లవము, 4.పీడ, 5.రోగోద్రేక కారణమగు శ్లేష్మాది వికారము.  
ఉల్కశ్మలోహము - (రసా.) ఆకాశమునుండి అప్పుడప్పుడు భూతలము పైబడు ఉల్కలలో నుండు ఇనుము (Meteoric iron).
ఉల్క - 1.కొఱివికట్టె, 2.కాగడా, 3.ఆకాశమునుండి పడు తేజపుంజము, 4.అగ్ని కణము (Meteor).
మిడుఁగు - అగ్నికణము; విస్ఫులింగము - అగ్నికణము. 

ఆహికము - 1.వంతుజ్వరము, 2.ఒకరకపు సుషిరవాద్యము (సన్నాయి మొ.వి.)3.ధూమకేతువు.

ఆపద - విపత్తు(విపత్తు - ఆపద), ఇడుమ.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి, కలుగుట, 3.(తర్క) అయథార్థజ్ఞానము.

అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.
అగ్ని -
1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.
నీటిచూలి - అగ్ని; నీరుపాప - 1.అగ్ని, 2.నీటిమనుష్యుడు.
నీటికానుపు - అగ్ని, వ్యు.నీరు బిడ్దగా కలది.   

అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు.

యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
నక్షత్రాణివా అపామాయతనం, ఆయతనవాన్ భవతి,
యో నక్షత్రాణామాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
ఆపోవై నక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి, య యేవ వేద.
  తా. జలాలకును నక్షత్రాలే స్థానం. ఆ నక్షత్రాల స్థితిని తెలుసుకుని నక్షత్రాలకు జలమే(ఉదకము) స్థానమని గ్రహించినవారు ముక్తిని పొందుతారు. - మంత్రపుష్పం     

LordVishnu

No comments:

Post a Comment