Wednesday, February 22, 2017

తులారాశి

చిత్త 2, స్వాతి 4, విశాఖ 3 పాదములు తులారాశి (త్రాసు).

తులా వృషభ రాశీశో దుర్ధరో ధర్మపాలకః,
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశ విమోచకః. - శుక్రుడు (Venus) 

రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.
నికాయము - 1.గుంపు, 2.ఇల్లు, 3.తెగ.
నికాయ్యము - ఇల్లు, రూ.నీకాయ్యము, నికాయము.
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).

కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.    
కారు2 - వి. 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).

చిత్ర - 1.చిత్త, ఒక నక్షత్రము, 2.మాయ.
చిత్త -
1.చిత్ర, 2.నక్షత్రము లందొకటి, 3.ఒక కార్తె పేరు.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.

క్రాంతి - 1.ఆక్రమణము, 2.తిరుగుట, 3.అడుగిడుట, 4.మీరుట, 5.సూర్యమార్గము, 6.రేఖ.  
క్రాంతివృత్తము - సంవత్సరమున కొకసారి సూర్యుడు ఆకాశమందు ప్రయాణము చేయు వలయాకార మార్గము.
సూర్యదృశ్యగతి - (భూగో.) సూర్యుడు పోవుచునట్లు కనబడు మార్గము.

రేఖ - 1.దగ్గరదగ్గరగా నున్న వృక్షాదుల పంక్తి, 2.పాణి పాదతలము లందలి గీర, గీర, (గణి.) స్థితి, పొడవుమాత్రము కల్గి వెడల్పు మందములేని ఆకృతి  (line) పొడవు కలిగి మందము వెడల్పు లేనిది, (Curve). రాజి - 1.పంక్తి, 2.రేఖ.

(ౘ)చాఱ - గీర, రేఖ, రూ.చారిక.
చాఱిక -
చాఱ.

గీటు1 - గీత, రేఖ.
గీత - (వేదా.) అధ్యాత్మిక తత్త్వ విషయమై ప్రశ్నోత్తరమున ఉండు గ్రంథము, ఉదా.భగవత్గీత, రామగీత మొ.వి. వి.రేఖ.
భగవద్గీత - మహాభారతములోని అంతర్గ్భాగమైన వేదాంత గ్రంథము.
గీటు2 - 1.అనాదరము, 2.ఉపేక్ష. 
అనాదరము -
ఆదరస్సత్కారః స న భవతీత్యనాదరః. - ఆదర మనఁగా సత్కారము; అది గానిది అనాదరము.
గీటునఁబుచ్చు - క్రి.1.అనాదరించు, తృణీకరించు, 2.పోగొట్టు. 
తప్పఁజూచు - క్రి.1.అనాదరించు, 2.ఉపేక్షించు.
తృణీకరించు - క్రి.అలక్షముచేయు.
అవమతి - 1.అవమానము, 2.తిరస్కారము, 3.అనాదరము.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.

కన్నడ - 1.ఉపేక్ష, 2.రాగములలో ఒకటి.
కన్నడము -
1.కర్ణాటదేశము, 2.కర్ణాటభాష.
కన్నడీఁడు - (కన్నడ+ఈడు) ఉపేక్షించువాడు, వి.(కన్నడము+ఈఁడు) కన్నడదేశపువాడు.
ఉపేక్ష - 1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము. 
అశ్రద్ధ - 1.ఆసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి, (కడపటి రెండర్థములు ను తెనుగునందు మాత్రమే గలవు).
అసడ్డ - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
నిర్లక్ష్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దై వా ధీ న మై న ది(Casual), వి.అశ్రద్ధ.
ఒప్పరికము - ఉపేక్ష, ఒప్పరికించు విధము.
ఔదాసీన్యము - ఉపేక్షగా నుండుట, మిత్రశత్రు భావములు లేకుండుట. 

వన్నెమైఁ పైడిఁమలఁ దూఁగు వనితకు తులారాశి.....

తుల - 1.త్రాసు, 2.పోలిక, 3.రాసులలో ఒకటి.
త్రాసు -
తరాసు, తరాజు. రాజు గాని రాజు - తరాజు.
తరాజు - తూచెడి సాధనము, రూ.తరాసు, త్రాసు.
తులలేని ధనము చేతుల తూగనది ఏది? - తుల

పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు -
1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి - 1.మిత్రభావము, స్నేహము, 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity). 
పొందుకాఁడు - స్నేహితుడు.
స్నేహితుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు.

పోలిక - సామ్యము; సామ్యము - సమత్వము, పోలిక; తౌల్యము - సామ్యము, పోలిక. సాధర్మ్యము - పోలిక.
సవతు - సమత, సామ్యము, విణ.సమత్వమ్. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృత్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా., భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము (Shape).
రూపము-1.ఆకారము, 2.చక్షురింద్రియగోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
ఆకారము - 1.రూపము, 2.పోలిక, 3.ఒడలు, 4.హృద్గతభావములను తెలుపుచెష్ట, 5.హృద్గతభావము, ఇంగితము.
ఇంగితము - 1.హృ ద్గ తా భి ప్రాయము, 2.హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట, 3.కదలిక, విణ.కదలినది.
అనుభావము - 1.ప్రభావము, 2.ప్రతాపము, 3.భావమును తెలిపెడి ముఖవికాసాది.
సదృశ్యము - (గణి.) అనురూపము, సం.విణ. సమానము, తగినది, (Corresponding). 
అనురూపము - 1.తగినది, 2.అనుగుణము, 3.సాటియైనది, 4.(గణి.) ఒక దాని కొకటి అనుగుణముగా నున్నది, అనుగుణ్యము కలది, (Corresponding).
అనుగుణము - 1.సమానగుణము కలది, 2.అనుకూలమైనది, తగినది. యోగ్యము - 1.తగినది, 2.నేర్పుగలది.   
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.

అందము - 1.సౌందర్యము, 2.అలంకారము, 3.విధము, విణ.చక్కనిది, 2.తగినది.
సౌందర్యము -
చక్కదనము; పొంకము - 1.పొందిక, 2.సౌందర్యము. సోయగము - చక్కదనము. ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
కోమలికము - చక్కదనము.
కోమలి - చక్కదనము గల స్త్రీ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.
స్వరూపము -
1.స్వభావము, 2.రూపము.
శీలము - 1.స్వభావము, 2.మంచినడత.
సహజము - స్వభావము, విణ.కూడబెట్టినది, (భౌతి.) ప్రకృతి కనుగుణమైనది. 

ప్రతిభా విశేషము - (గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
అందకత్తియ -
సౌందర్యవతి, రూ.అందకత్తె.   
మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింపచేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉప్మాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
సింగారము - శృంగారము, అలంకారము, సం.శృంగారః.
శృంగారము - 1.నవరసములలో నొకటి, 2.అలంకారము, వికృ.సింగారము. 
ఉజ్జ్వలము - 1.ప్రకాశించునది, 2.తెల్లనిది(శుభ్రము - 1.తెల్లనిది, 2.ప్రకాశించునది), 3.అడ్డులేనిది, వి.1.సింగారము, 2.శృంగారరసము, 3.బంగారు.

కలికి - 1.ఆడుది, 2.మనోజ్ఞురాలగు స్త్రీ, విణ.మనోజ్ఞము.
పొన్నారి - మనోజ్ఞము.

మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.     
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.

హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయ్స్య ప్రియం హృద్యం - హృదయమునకు ప్రియమైనది.
హృదయంగమము - మనస్సు కింపైనది.  

చిన్నిదము - 1.చిన్నపువ్వు, 2.బంగారు.
చిన్నిపువు -
1.నమస్కృతి, 2.భూషావిశేషము, రూ.చిన్నపువ్వు.

సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచి వర్ణము కలది.
బిస్తము -
మాడ(మాడ - అరవరా, పదిరూకలు), సువర్ణము.
తపనీయము - బంగారు. ఔజనము - బంగారు.

సువర్ణబిస్తా హేమ్నో క్షే :
సువర్ణమత్రాస్తీతి సువర్ణః - సువర్ణము దీనియందుఁ గలదు.
బిస్యతి తులాకోటిం నీచైః ప్రేరయతీతి బిస్తః బిసప్రేరణే - త్రాసును క్రిందికి వంచునది. పా. విస్తః. అక్షమెత్తు బంగారు పేర్లు.

శాతకుంభము - బంగారు, వ్యు.శతకుంభ పర్వతమున పుట్టినది.

పొన్నుగట్టు - (పొన్ను+గట్టు) మేరుగిరి.
పొన్ను - 1.బంగారు, 2.కట్టుగావేయు లోహవలయము.
పైఁడి - 1.బంగారు, 2.ధనము.
పయిఁడి - బంగారు.
పసిఁడి - 1.బంగారు, 2.ధనము.

మొగ్గు - గౌరవము, క్రి.బరువు వైపు వంగు.

తులకింపు - 1.ప్రకాశము, 2.కుతూహలము.
తులకింపు -
క్రి. 1.ప్రకాశించు, 2.కుతూహలపడు.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరణమాలి - సూర్యుడు. 

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.

కుతూహలము - 1.కోరిక, 2.ఆనందము, 3.నాయికకు మనోజ్ఞమైన వస్తువును చూచుట యందుగల లోలత్వము.
కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము. ఇచ్ఛ - అభిలాష, కోరిక.
అభిలాష - కోరిక, రూ.అభిలాషము. 
ఆనందము - సంతోషము, సుఖము. సౌఖ్యము - సుఖము.

ఆభ - 1.కాంతి, వెలుగు, 2.పోలిక.
ఇద్దము -
1.పరిశుద్ధము, 2.కాంతిమంతము, 3.కాల్పబడినది, 4.అడ్డులేనిది, వి.1.ఎండ, 2.ప్రకాశము, 3.ఆశ్చర్యము.

అనుకారము - పోలిక, అనుకరణము, రూ.అనుకృతి.
అనుకృతి -
అనుకారము.
అనుకరణము - 1.ఇతరులు చేసినట్లు చేయుట, 2.ధ్వన్యాదులను అనుకరించు నపుడు వాడుపదము, (పెళపెళ, పటపట మొ.వి.)
అనుకరించు - క్రి. ఇతరులు చేసినట్లు చేయు.
అనుకరిం(ౘ)చుట - ఒకరు చేసినట్లు చేయుట.

ఉపమ1 - ఉపాయము, వెరవు.
ఉపమ2 - 1.ఒక అర్థాలంకారము, 2.పోలిక, విణ.సమాసమునందు ఉత్తరపదమైనచో సమాసము.
ఉపమరి - ఉపాయశాలి.
ఉపమానము - పోలిక, దేనితోపోలచుచున్నామో అది. అపకృతము (చంద్రుడు మొ.వి.), రూ.ఉపమితి.

ఒడికము - 1.ఉపాయము, 2.ఇంపు, 3.యుక్తము, 4.అందము, విణ.ఇంపైనది.

బాలెన్సు - (Balance) 1.తుల, త్రాసు, తక్కెడ, 2.శేషము, 3.మిగిలినది.
బ్యాలెన్సు -
(అర్థ.) (Balance) అవశేషము, కాతానిల్వ జమాఖర్చుల తౌల్యానంతరమున కనబడు ఆస్తి లేక ఋణశేషము. 
దూలము - 1.తుల, స్తంభపీఠము, 2.ఇంటికుగుజుల కాదరువుగా నమర్చు మ్రాను, తలాబి. (వ్యవ.) పెద్ద యినుప నాగలిలోని ఒక భాగము (Beam).
దంతియ - 1.మిద్దెటింటికి అడ్డముగా వేసెడుపట్టె, దూలము, 2.వ్యవసాయపు పనిముట్టు, చూ.దంతె, రూ.దంతె.
దంతెన - (వ్యవ.) నీరు పెట్టి గట్లు, మళ్ళు ఏర్పరుచుటకును మిక్కల మధ్యమట్టిని కదల్చుటకును ఉపయోగించు చేతి పనిముట్టు, రూ.దంతె,  (Tooth harrow).

తక్కెడ - త్రాసు, రూ.తక్కెడ, సం.త్ర్యంకటము్.  
వాని తలదీయ తక్కెడ జానుమీరు - తరాజు ఒకటి పట్టుకుంటే రెండు ఊగులాడతాయి. - త్రాసు
తక్కిడి - 1.మోసము, 2.త్రాసు రూ.తక్కెడ.    

కడమ - 1.కొరత, 2.శేషము.
కడమపడు -
క్రి.కొరతపడు.

శేషము - మిగులు, (గణి.) ఒక రాశిని మరియొక రాశిచే భాగింపగా మిగులు రాశి. (Remainder) (రసా.) వడబోత కాగితముపై నిలిచి యుండు ఘన పదార్థము (Residue). 
నిలువ - శేషము, రూ.నిల్వ. మిగత - శేషము; మివులు - మిగులు.
మిగులు - 1.అతిశయించు, 2.శేషించు, 3.మట్టుమీరు, రూ.మివులు. అవశిష్టము - మిగిలినది, వి.శేషము.

అవక్షేపము - 1.తప్పుపెట్టి త్రోసివేయుట, 2.నిందించుట, 3.ఎగతాళి సేయుట, (రసా.) రెండు పదార్థముల మధ్య జరుగు రాసాయనికమైన మార్పు ఫలితముగా ఏర్పడిన కరగనట్టి వేరొక పదార్థము (Residue).

మానవి - మానవ స్త్రీ; మానిని - మానవతి.
మానవతి - మానము గల స్త్రీ, అభిమానము గల స్త్రీ.
మానో (అ)స్యా ఇతి మానినీ, సీ. - ప్రణయ కోపము గలది.
మాని - మానముగల వాడు.
మానవీయము - మన్నింపదగినది, క్షమింపదగినది.
మానితము - మన్నింపబడినది, సన్మానితము. 

ఈలువు - 1.మంచినడవడిక, 2.మానము, 3.పాతివ్రత్యము.
ఈలపుటాలు - 1.మంచినడవడికగల స్త్రీ, 2.పతివ్రత(పతివ్రత - సాధ్వి).

మానము - 1.త్రాసు, 2.కొలది, (ఇది త్రివిధము: తులామానము. అంగుళీమానము, ప్రస్థమానము). 2.చిత్తౌన్నత్యము, 3.గర్వము, 4.స్త్రీలకు పురుషుల యెడ కలుగు కోపము, 5.(గణి.) 1.కొలత, 2.స్కేల్, కొలబద్ద (Measure) 3.రాసుల పరిమాణములను కొలుచు పద్ధతి.

అలఁతి - 1.సూక్ష్మము, 2.పలుచనిది, 3.అల్పుడు, 4.శక్యము, వి.1.అల్పయత్నము, 2.పరిమితి, కొలది.

అలవి - 1.కొలది, పరిమితి, 2.సామర్థ్యము, 3.విధము, విణ.శక్యము.
కొలఁది - 1.పరిమితి, 2.బలము, 3.స్థితి, 4.విధము, విణ.1.పరిమాణము కలది, 2.సమానమైనది, 3.అల్పము, 4.శక్యము.
కొద్ది - 1.పరిమితి, 2.శక్తి, విణ.1.అల్పము, 2.ప్రమాణము కలది, ఉదా.పిండికొద్ది రొట్టె, రూ.కొలఁది, కొల్ది.
సామర్థ్యము - 1.నేర్పు, 2.యోగ్యత, (భౌతి.) పనిచేయు రేటు (Power), (గృహ.) బలము, సత్తువ.
బలము - సత్తువ, సైన్యము. సత్తువ - దేహబలము, సం.సత్యమ్.
విధము - ప్రకారము, విధి. శక్యము - సాధ్యము, అలవి. 

విధము - ప్రకారము, విధి. ప్రకారము - 1.విధము, 2.పోలిక.
విధి -
1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
మన్మథుడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు. 

మైవడి - 1.విధము, 2.సమ్మతి, 3.సౌమ్యత.

కాలము1 - 1.సమయము, 2.నలుపు, 3.చావు, ఉదా. అతడు కాలము చేసెను, విణ.నల్లనిది.
కాలము2 - (గణి.) ఘటనల మధ్య దొరలు కాలము, (Time).
వేళ - సమయము, కాలము.
తరుణము - సమయము, సం.విణ.క్రొత్తది, యౌవనముగలది.

విధానము - 1.చేయుట, 2.ఆజ్ఞ.
భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.  
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము. శుభము - మంగళము.
సుకృతి - 1.పుణ్యుడు, 2.శుభుడు.
సుక్కురుఁడు - శుక్రుడు, సం.శుక్రః.
శుక్రుఁడు - 1.అసురగురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus). 

అలక1 - విణ. సూక్ష్మము, పలుచనిది.
అలక2 -
(అలకము - అలకి2) నెరికురులు, ముంగురులు (ఇది. ని. బహు.) 2.కుబేరుని పట్టణము.
అలకన - సూక్ష్మత, విణ.సూక్ష్మము.

సూక్ష్మగ్రాహకము - (భౌతి, రసా.) బయటి ప్రభావములకు చురుకుగా, నిశిరముగా ప్రతీకరించునది, (Sensitive).
సూక్ష్మగ్రాహ్య(హి)త - (భౌతి.) ఎంత చిన్న విషయములనైన తెలిసి కొనుట (Sensibility).

సున్నితపు త్రాసు - (భౌతి.) ప్రయోగశాలలో ఉపయోగించెడి సున్నితమైన త్రాసు, (Physical balance).
సున్నితము - 1.మిక్కిలి కోమలమైనది, 2.కచ్చితము, సం.సునిహితము.
కచ్ఛితము - పూర్తిగా సరియైనది, (Exact).

వర్ష్మము - 1.శరీరము, 2.మిక్కిలి చక్కని రూపము, 3.కొలత.
శరీరము -
దేహము. దేహము - శరీరము, మేను.
మేను - 1.శరీరము, 2.జన్మము, 3.పార్శ్వము.
కొలత - 1.కొలుచుట, 2.పరిమాణము, (గణి.) ఒక వస్తువు పొడవు, వెడల్పు, ఎత్తు, మొ.వి కొలత 2.రాశిపరిమాణము(Measurement). సమ్మితము - 1.సమానము, 2.సమానమైన పరిమితి గలది.

సమానము -  (సజాతీయము) (గణి.) ఒకే జాతికి సంబంధించినది, ఒకే ఘాతసంఖ్యకలిగినది (Like), వై.వి. సమ్మతి, సం.వి. నాభియందలి వాయువు, విణ.తుల్యము.
తుల్యము -
సమానము, సాటి.

ప్రమాణము - 1.ప్రత్యక్షాది జ్ఞానకారణము, 2.సత్యము, 3.మేర, 4.కొలత, 5.శాస్త్రము, వి. (భౌతి.) కొలతకు ఆధారమగునది (Standard), ఉదా. సెవర్స్ లో సంరక్షింపబడుచున్న మీటర్ దండము తక్కిన ప్రపంచములో వాడుకలోనున్న మీటర్ బద్దలకు ప్రమాణము, వి (గణి.) ఏంకాంకము. కొలతల కుపయోగించు మూలప్రమాణము (Unit).
ప్రమాణములు - నియమిత పద్ధతులు (Norms).
ప్రమాణీకృతము - (భౌతి.) ప్రమాణముగా చేయబడినది(Standardised).

సమతులితాహారము - (గృహ.) సక్రమాహారము, ఉచితాహారము, శరీరము పెరుగుటకు తగు ఆహారపదార్థము, మిశ్రాహారము (Balanced diet).

సమతులితము - (గృహ.) సరిసమానమైనది, చలించనిది, నిర్మలమైనది, నిదానము గలది, (Balanced) సం.వి. (రసా,) రెండువైపుల సమాన భావము గలది (Counterporsid).

తరము - 1.పురుషాంతరము, 2.మానము, 3.సామ్యము, 4.వరుస, 5.దినుసు, 6.శక్యము, సం.అంతరమ్, సం.వి.దాటుట.
తరగతి -
నిర్ణయించిన పద్ధతి, ప్రమాణము, తరమును తెలుపు భాగము. 
తరణము - 1.దాటుట, 2.తరించుట.
తరణి - 1.ఓడ, 2.దాటుట, 3.సూర్యుడు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

సామాన్యము - సామ్యము, విణ.సాధారణము, (గణి.) కొన్ని రాసులన్ని టికి సంబంధించినది (Common).
సామాన్య(పు)త్రాసు - (భౌతి.) దండముచే చేయబడి సామాన్యముగా వాడుకలో నున్న త్రాసు (Common balance). 

తూనిక - 1.తూచుట, 2.పోలిక(పోలిక - సామ్యము), 3.బలము.
తూకము -
1.తూనిక, 2.పూనిక, రూ.తూకు.
పూనిక - 1.యత్నము, 2.సన్నాహము, 3.పట్టుదల.
తూఁచు - తూనికవేయు; తూనికవేయు - తూచు.
తూకు - 1.ప్రమాణము, కొలది, 2.బరువు.
సరితూఁగు - క్రి. సమానమగు. 
సరిపోవు - 1.సమానమగు, 2.సమాధానమగు, 3.అయిపోవు, 4.నశించు.

మొగ్గు - గౌరవము, క్రి.బరువు వైపు వంగు.
గరువము -
1.గర్వము, 2.గొప్పతనము, విన.1విస్తృతము, 2.పెద్దది, సం.గౌరవము.

ప్రతిష్ఠ - 1.గౌరవము, 2.చోటు, వి.(గృహ.) 1.గౌరవము (Prestige), 2.మానము, 3.ప్రతిభ, వి.(వాణి.) ప్రజల దృష్టిలో ఒక వ్యాపార సంస్థకు గల ఖ్యాతి (status). ఆ సంస్థయొక్క లాభములు దీనిపై చాలవరకు ఆధారపడి యుండును. కనుక దాని మిగత ఆస్తులతో పాటు దీనిని కూడ లెక్క చూచుకొనుట పరిపాటియైనది.
గౌరవము - 1.మర్యాద, సన్మానము, 2.గొప్పతనము, 3.మన్నన.
మర్యాద - 1.కట్టుబాటు, 2.తీరము, 3.సమ్మనము.
మన్నన - సమ్మానము, గౌరవము, సం.మాననమ్.
సన్మానము - గౌరవము, రూ.సమ్మానము.
సమ్మనము - గౌరవము, సత్కారము.
సత్కారము - సమ్మానము, రూ.సత్కృతి, సత్ర్కియ.
(ౘ)చోటు - తావు; తావు - స్థానము.
ఇరువు - చోటు, స్థానము, విణ.స్థిరము. 
ప్రతిభ - అప్పటికప్పుడు వికసించు బుద్ధి; అపారప్రజ్ఞ - ప్రతిభ, మహాబుద్ధి కుశలత (Genius).

ప్రతిభా విశేషము - (గృహ.) వ్యక్తిత్వము, ఆకారము, (Personality).

విత్తం బంధు ర్వయః కర్మ విద్యా భవతివఞ్చమీ|
ఏతాని మాన్యస్థానాని గరీయా యద్యదుత్తరం||
తా.
ధనము, బంధుత్వము, వయస్సు, కర్మ, విద్య, ఈ యైదును సన్మానింపదగిన స్థానములు. ఇందు ముందు చెప్పబడిన దానికంటె వెనుక చెప్పబడిన శ్రేష్ఠ స్థానములు. అది ఎట్లనిన, ధనికునికంటె బంధువు శ్రేష్ఠుడు, బంధువులకంటె వయోధికుడు శ్రేష్ఠుడు, వయోధికునికంటె (ను)ఉత్తమ క్రియావంతుఁడు ముఖ్యుఁడు, వీనికంటె విద్యావంతుఁడు మిక్కిలి శ్రేష్ఠుడు. - నీతిశాస్త్రము 

ఇతరులకు కష్టసాధ్యమైనదాన్ని సులభంగా చేయడం విద్య. విద్యకు అసాధ్యమైన దాన్ని చేయడం ప్రతిభ. - ఏమియర్.

ఏషణీ - 1.నారాచి, 2.త్రాసు, 3.వ్రణములోని చీము, మొ.ని పైకి తీయు సాధనము.
నారాజి - నరాజి, కత్తి, స.నారాచః.    
చీము - చెడి తెల్లనైన నెత్తురు, పూయము.

నారాచీ స్యాదేషణికా :
నారం నరసమూహ నుఞ్చతీతి నారాచీ. ఈ. సీ. అంచు గతిపూజనయోః - జన సమూహమును బొందునది.
ఇష్యతే వ్యవహారిజనైరితి ఏషణికా. ఇషు ఇచ్ఛాయాం. - బేరులచే నిచ్ఛయింపఁ బడునది. ఈ రెండు త్రాసు పేర్లు.

నారసము - నారాచము, బాణము.
నారం నరసమూహ మంచంతీతి నారాచాః, అఙు గతిపూజనయోః. - నరసమూహమునుగూర్చి పోవునది.    

రాగసూత్రము - త్రాసు, త్రాడు.
త్రాసు -
తరాసు, తరాజు. వాని తలదీయ తక్కెడ జానుమీరు - తరాజు   
త్రాడు - 1.పేనినదారము, 2.పాశము(పాశము - త్రాడు), 3.కిరణము, వెలుగు.
త్రాడుఁదాలుపు - వరుణుడు. 
వరుణుఁడు -
1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటి రేడు.
నీటిఱేఁడు - 1.వరుణుడు, 2.సముద్రుడు.

కుశ - 1.త్రాడు, 2.గుఱ్ఱపు కళ్ళెము. 
కళ్ళెము - కళ్యము, నా. చిక్కుల గుఱ్ఱమునకు కక్కుల కళ్ళెము.
కళ్యము - గుఱ్ఱమునకు నోట దగిలించు కళ్ళెము, రూ.కళ్ళియము, కళ్ళెము, సం.ఖలీనః.
ఖలినము - గుఱ్ఱపు కళ్ళెము, రూ.ఖలీనము.       

ప్రగ్రహము - 1.చెరసాల, 2.త్రాసు, త్రాడు 3.పగ్గము.

పగ్గము - పశువుల లాగిపట్టెడు త్రాడు, సం.ప్రగ్రహః.
కారాగారము -
చెరసాల; బంధిఖానా - చెరసాల (బందిగము).
కార - చెరసాల, బంధనాలయము.
కృష్ణజన్మస్థానము - బంధనాలయము, చెరసాల, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన స్థలము.
చెఱ - 1.కారగృహము, 2.నిర్బంధము, సం.చారః.
బంది - నిర్భంధము, చెర, సం.బంధీ.  
నిర్బంధము - 1.బలాత్కారము, 2.కదల మెదలగూడని కట్టు.
బంధకము - 1.చెరసాల, 2.మార్పు, 3.కుదువ, 4.ప్రతిజ్ఞ, 5.ఆనకట్ట.

                                                                          

చుంబకము - 1.త్రాసుముల్లు, 2.సూదంటురాయి.
మొల -
1.కటి ప్రదేశము, 2.చీల, 3.త్రాసుముల్లు.
సూదంటురాయి - అయస్కాంతము.
అయస్కాంతము - (భౌతి.) సూదంటురాయి, లోహమును ఆకర్షించునది (Magnet). అంటురాయి - సూదంటురాయి, అయస్కాంతము.

                                                                          

కంటకము1 - 1.ముల్లు, 2.రోమాంచము, 3.వెదురు, 4.సూదిమొన, 5.కాకి, 6.తప్పు.  
పత్రసూచి - ముల్లు; ముల్లు -
ములు. ములు - 1.కంటకము, 2.త్రాసుముల్లు, 3.వరి, మొ.వానిముల్లు రూ.ముల్లు(బహు)ముళ్ళు.
రోమాచము - రోమములు గగుర్పొడుచుట, పులకరము.
పులకరము - 1.జ్వరము, 2.గగుర్పాటు, సం.పులకః.
గగ్గురుపాటు - రోమాంచము కలుగుట.
వెదురు - వేణువు, సం.వేణుకః.
వేణువు - వెదురు, పిల్లనగ్రోవి. కరతలే వేణుమ్...
కంటకము2 - విరోధయుక్తి విణ.విరుద్ధము.
విరుద్ధము - విరోధము గలది.
విరోధము - పగ(పగ - విరోధము), ఎడబాటు.
విప్రపత్తి - 1.కలత, సంతాపము, 2.విరోధము.
కాకి - వాయసము; వాయసము - కాకి.
కాకాక్ష న్యాయము - కాకి చూపు ఏదేని ఒక ప్రక్కకు ఒరగుట.

ములుచూపు -1.అతిశయించు, 2.మీఱు, 3.త్రాసుముల్లు, బరువువైపు ఒరుగు.

మితిమీఱుట (హేతువు)కారణమగునా! కాలిలో ముల్లు గుచ్చుకొన్నదని చింతించవద్దు. కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. ముల్లుతీయుటకు ముల్లే ప్రయోగించ వలెను.

త్రాసులో ఎక్కువ బరువుగల పళ్ళెం క్రిందికి వంగి, తేలికైన పళ్ళెం పైకిలేస్తుంది. అలాగే నిపుణుడు, సమర్థుడు అయిన వ్యక్తి అణుకువ, వినయం కలిగి ఉంటాడు. మూర్ఖుడు అహంకారంతో మిడిసిపడుతు  ఉంటాడు. - శ్రీ రామకృష్ణ పరమహంస

దీర్ఘాయువు - కాకి, విణ. చిరకాలము బ్రతుకువాడు.
ఆయుష్మంతుడు -
దీర్ఘకాలము జీవించువాడు, చిరంజీవి.
చిరజీవి - 1.చిరకాలము జీవించువాడు, వి.1.కాకి, 2.విష్ణువు, 3.చిరంజీవి, 4.చిరాయువు, 5.వేలుపు.

చిరంజీవి రామభక్తో దైత్యకార్యవిఘాతకః,
అంక్షహంతా కాంచనాభః పంచవక్త్రో మహాతపాః.

ఉచ్ఛయము - 1.పొడవు, 2.గొప్పతనము, 3.గ్రహాదుల ఉదయము, 4.అతిశయము, రూ.ఉచ్ఛాయము.
పొడవు - (గణి.) రెండు బిందువుల మధ్య దూరము (Length).
మాహాత్మ్యము - గొప్పతనము
మహిమా - 1.గొప్పతనము, 2.ఐశ్వర్యము.
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.) పురుషవాచక శబ్దసంజ్ఞ.
గారము - 1.గొప్పతనము, 2.ప్రేమము, ముద్దు, 3.విధము, విణ.అధికము, సం.గౌరవమ్.   
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
అతిశయము - అధిక్యము.

పజ్జ - 1.సమీపము(సదేశము - సమీపము), 2.వెనుక, సం.పశ్చాత్.
సమీపము -
చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకు నపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ. 
సేన - దండు, విణ.అధికము, చాల.    

వెనుక - 1.పశ్చాద్భాగము, 2.పడమర, 3.పిమ్మట, 4.ఉపేక్ష, అవ్య. వెంబడి. పశ్చాద్భవా పశ్చిమా - వెనుక దిక్కు.
పడమర - పశ్చిమ దిక్కు. ప్రతీచి - పడమర (West).
ప్రతీచీ. ఈ-సీ. ప్రతి పశ్చాద్గివసావసానే అస్యాం అంచతి సూర్యో అస్తమేతీతి ప్రతీతి, అఞ్చు గతి పూజనయోః - సాయంకాలమందు సూర్యుఁడు ఈదిక్కున అస్తమించును గనుక ప్రతీచి.

అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి. వి. పిమ్మట, వి.సామీప్యము. 

వెనుకటి ఆధారము - (గృహ.) పుట్టు పూర్వోత్తరములు వంశ పారంపర్యము, (Back ground).

పశ్చము - (జీవ.) వెనుక నున్నది, (Posterier).  

పడమటి వంక గ్రుంకఁ జను భాస్కర బింబముఁ దూర్పుకొండపై
బొడిచిన చంద్రమండలముఁ బోల్పెసలారె ! బయోజ సంభవుం
డెడపక రాసిమాప గతులెక్కువ తక్కువ లైన కాలముల్
తడఁబడు నంచు దూంచునెడఁ ద్రాసున దేలెడు చిప్పలో యనన్.

వెనుకయ్య - వినాయకుడు, సం.వినాయకః.
వినాయకుఁడు -  1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
విఘ్నరాజు - వినాయకుడు.

పింగలి - 1.వెనుకటిది, 2.వెనుకటివాడు.
వెనుకటివాఁడు -
తమ్ముడు.

అవతల - 1.పిమ్మట, 2.అవలిప్రదేశము.
ఆతల -
ఆవలిప్రదేశము, ఆవలికాలము, రూ.అవతల.
అవల - 1.పిమ్మట, అనంతరము (తర్వాతి కాలమున), 2.అవతల (తరువాతి ప్రదేశమున), 3.వేరుచోట, విణ.1.అవతలిది, 2.ఇతరము, రూ.అవ్వల, ఆవల, ఔలా(ఔల - అవల).
పిమ్మట - 1.మునుపు 2.పరోక్షమందు, వి.మనోవ్యధ. 
అనంతరము - 1.ఎడము లేనిది, 2.వెంబడిది, 3.చేరికైనది, క్రి.వి. పిమ్మట, వి.సామీప్యము. 
అవ్వల - అవల; ఆవల - 1.ఆప్రక్క, 2.(దేశకాలము లందు) అనంతరము.  

ఆదట1 - 1.ప్రేమ, 2.అపేక్ష, 3.దయ(దయ - కనికరము), 4.తృప్తి.
మమకారము -
1.ప్రేమ, 2.నాదియను భావము. 
ఆదట2  - అనంతరము, పిమ్మట. అనుక్రోశము - కనికరము.
ఆదటపోవు - తృప్తిచెందు, తనియు.
స్వయంసంతృప్తి - (గృహ.) తృప్తి చెందుట. తనలో తాను తృప్తిచెందుట (Self-content).

కన్నడ - 1.ఉపేక్ష, 2.రాగములలో ఒకటి.
కన్నడము -
1.కర్ణాటకదేశము, 2.కర్ణాటకభాష.
కన్నడీఁడు - (కన్నడ+ఈడు) ఉపేక్షించువాడు, వి.(కన్నడము+ ఈఁడు), కన్నడదేశపువాడు.
ఉపేక్ష - 1.అశ్రద్ధ, 2.నిర్లక్ష్యము.
అశ్రద్ధ - 1.అసక్తిలేమి, 2.అసడ్డ, 3.నమ్మికలేమి(కడపటి రెండర్థము లును తెనుగునందు మాత్రమే కలవు).
నిర్లక్ష్యము - (గృహ.) 1.ముందు ఆలోచనలేనిది, 2.దైవాధీనమైనది (Casual), వి.అశ్రద్ధ.
అసడ్డ - 1.ఉపేక్ష, శ్రద్ధలేమి, 2.తృణీకారము, సం.అశ్రద్ధా.
ఒప్పరికము - ఉపేక్ష, ఒప్పరికించు విధము.
ఔదాసీన్యము - ఉపేక్షగా నుండుట, మిత్రశత్రు భావములు లేకుండుట.

అపరదిక్కు - పడమటి దిక్కు.
వరుణుఁడు -
1.పడమటి దిక్కునకు అధిపతి, 2.నీటిరేడు.
పాశ్చాత్యుఁడు - 1.పడమటివాడు, 2.వరుణుడు.
పాశి - 1.వరుణుడు, 2.యముడు.

తెల్లదొర - 1.శివుడు, 2.బలరాముడు, 3.ఆంగ్లేయుడు, పాశ్చాత్యుడు.

వేధాస్వాంగో జితః కృష్ణో ధృఢః స్సంకర్షణో చ్యుతః|
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః||

వారుణీ - 1.పడమటి దిక్కు, సారాయి.
సారాయి -
సుర, మద్యము, రూ.సారాయము, సం.సారః.
హాల - సారాయి.
సుర1 - 1.గాలిసుడి, 2.గాలి.
సుర2 - కల్లు, విణ. పెద్ద.
చారవాయువు - పడమటిగాలి. 

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

సురా ప్రత్యక్చ వారుణీ :
వారుణీ శబ్దము మద్యమునకును, పడమటి(West) దిక్కు నకును పేరు.
వరుణా జ్జాతా, వరుణ స్యేయ మితి చ వారుణీ. సీ. - వరుణుని వలనఁ బుట్టినది. వరుణుని సంబంధ మయినది గనుక వారుణి.

వారిధిఁ దరువఁగ నంతట,
వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్
వారిజలోచను సమ్మతి,
వారై కైకొనిరి దాని వారిజనేత్రన్.
భా||
పాలసముద్రాన్ని ఆతరువాత తిరిగి చిలికారు. అప్పుడు వారుణి అనే అందగత్తె అయిన కన్య పుట్టింది. ఆ కన్యను పద్మలోచనుడైన విష్ణువు యొక్క అనుమతితో రాక్షసులు తీసుకొన్నారు.  

బ్రహ్మ సంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ,
వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ.

గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
ఆసవము - 1.కల్లు, 2.పూదేనె, 3.ద్రాక్షాసవము, మొ. పానీయములు. మదిర - కల్లు.
మదురువు -
1.మత్తు, 2.కల్లు, సం.మదిరా.
కల్లు1 - 1.బండికన్ను (చక్రము), 2.శిల, 3.కన్ను.
కల్లు2 - మద్యము, సం.కల్యమ్. మద్యపానము వలన సిగ్గు నశించి పోతుంది. 

మద్యపానం :-
మొదలి పెక్కు జన్మముల పుణ్యకర్మల్
పరగఁ బెక్కు సేసి పడయఁ బడిన
యట్టి యెఱుక జనులకాక్షన మాత్రాన
చెఱుచు మద్యసేవ సేయనగున్.

మద్యం లోపలికి పోయి, వివేకాన్ని బయటకి తరిమి వేస్తుంది. - థామస్ బేకన్ (1512 -1567)

శరత్తు - 1.ఒక ఋతువు(ఆశ్వయుజ కార్తీక మాసములు) వెన్నెల కాలము, 2.సంవత్సరము, రూ. శరద.  
శారదము -
సంవత్సరము, విణ.శరత్కాలమున బుట్టినది.

అథ శరత్ స్త్రియామ్ :
శృణాతి పంకమితి శరత్ ద. సీ. శౄ హింసాయాం. - అడుసును(పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.)బోఁగొట్టునది. ఇది అకారాంత స్త్రీలింగంబును. 'కాలప్రభూతం శరదా' అని త్రికాండి యందుఁ బ్రయోగింపఁబడియున్నది. ఈ ఒకటి ఆశ్వయుజ కార్తీక మాసములతోఁ గూడిన ఋతువు పేరు.

శరధి - 1.విల్లు, 2.సముద్రము.
సముద్రము - సాగరము. శోషిత శరధీశార్థిత రామ్|

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

శారద - 1.సరస్వతి, 2.పార్వతి.
శరది పుష్యతీతి శారదః - శరత్కాలము నందు పూచునది, పా, శారదీ. తృతీయం శారదా దేవీ|
సరస్వతి-1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం|  

ద్వౌతు శారదౌ, ప్రత్యగ్రా ప్రతిభౌ : శారద శబ్దము నూతనమైనదానికిని, సమర్థుఁడు కానివానికిని పేరు. శరది భవః శారదః శరత్తు నందుఁ బుట్టినది. 'శారద స్సప్తపర్ణే స్యాత్సరస్వత్యాంతు శారదా, శారదా గజపిప్పల్యాం మృధువర్షభవేత్రి' ప్వితిశేషః.

ఐందవి - పల్కుజెలి, సరస్వతి.  
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు; చెలియ - స్త్రీ.

శారో వాయౌ స తు త్రిషు, కర్బురే -
శారశబ్దము వాయువునకు పేరగునపుడు పు, నానావర్ణములు గలదానికి పేరగునపుడు త్రి, శృణాతీతి శారః, శౄ హింసాయాం, హింసించునది.    

శరద్ - వృక్షజాలం వెన్నెల్లో అందాలు సంతరించుకుంటుంది. చంద్రుడు వెన్నెలపాలు నేల మేద పారబోస్తాడు. నదులు నిర్మలం, మందగమనల్లా పార్తాయి. ప్రకృతి సాంతం స్వచ్ఛంగా, సుందరంగా, మౌనంగా ఉంటుంది. శరన్నవరాత్రులు అమ్మలగన్న యమ్మ పర్వాలు. ప్రమదుల సందడి - రాత్రులు ఆరాధనలు. ప్రకృతి పగలబడి నవ్వుతుంది.

శరత్ దారువు - (వృక్ష.) కాండములో శరత్కాలమున ఉత్పత్తియైన దారువు, (Autumn wood).  

శ్రీవిద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయి మింతేచాలు; చిద్భావనా
సేవన్ దామర తంపరై మనియెదన్ శ్రీకాళస్తీశ్వరా!
 
తా|| సంపదలనెడి మెఱుపుతీగెలతో గూడిన సంసారమనెడి మేఘముల(జీమూత - 1.మేఘము, 2.కొండ)నుండి కురిసిన, పాపములనెడి నీటిధారలచేత నామనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ యను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించు టచే కాదు సర్వసమృద్ధులు గలవాడనై నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను. (పద్మములు వానదెబ్బకు వాడిపోవును. శరత్కాలములో వికసించి కాంతివంతము లగును.)  

శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః|
భ్రష్టానామివ చేతాంసి పునర్యోగనిషేవయా |

పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య. 
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు. 

శివసన్నిధిని దేవీస్థానం పార్వతి| కన్యాకుబ్జము నందు దేవీస్థానం గౌరి|  

పలుకుఁ దత్తడి - చిలుక.
వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ.యుక్తయుక్తముగా మాటాడువాడు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.  

విశారదుఁడు - విద్వాంసుడు, నేర్పరి. 
వ్యక్తుఁడు - విశారదుడు.
విద్వత్పు ప్రగల్భౌ విశారదౌ,
విశారదశబ్దము విద్వాంసునికి, ప్రౌఢునికి పేరు.
విశిష్టా శారదా అస్యేతి విశారదః - అధికమైన సరస్వతి గలవాఁడు.

శరచ్చంద్రబింబాననం చారుహాసం, లసత్కుండలాక్రాంతగండస్థాలాంగమ్ |
జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్ ||

సాలు1 - 1.ఉన్నిబట్ట, 2.సన్నని వస్త్రము, రూ.సాలువు.
సాలు2 - సంవత్సరము.
సాలువరి - ప్రతి సంవత్సరమునకు సంబంధించినది, (Annual).

హాయనము - 1.సంవత్సరము, 2.కిరణము.
జహాతిఋతూన్ క్రమేనః, ప్న. ఓహాక్ త్యాగే. - వరుసగా ఋతువులను విడుచునది.

అథ హాయనాః, వర్షార్చి ర్వ్రీహిభేదా స్స్యుః -
హాయనశబ్దము సంవత్సరమునకు కిరణమునకును, వ్రీహి భేదమునకు, చకారమువలన శత్రువునకును పేరు. భావాన్ జిహీత ఇతి హాయనః, ఓ హాజ్ గతౌ. అవస్థలను బొందునది. 

ఋతువృత్తి - సంవత్సరము. 
సమ -
సంవత్సరము; సంవత్సరము - ఏడు; ఏడు - ఆరునొకటి.   
ఏడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
ఎవ్వడు - ఎవడు; ఏవాఁడు - ఎవ్వడు.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సప్త - ఏడు తంతులుగల వీణ, పరివాదిని.
సప్తకము - ఏడు, విణ.ఏడవది.
సప్తమము - ఏడవది. కౌమారీ సప్తమం ప్రోక్త|
సత్త - సత, ఏడు, సం.సత్త, వై.వి.శక్తి, సం.సత్వమ్.

జ్యోతి - 1.వెలుగు, 2.నక్షత్రము, 3.అగ్ని, 4.సూర్యుడు.   

కిరణము - వెలుగు, మయూఖము.
వెలుఁగు - 1.కిరణము, 2.ప్రకాశము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
మయూఖము - 1.కిరణము, 2.కాంతి, 3.జ్వాల.    

ఉగము - 1.ఆయువు, 2.సంవత్సరము.
ఉగాది -
సంవత్సరాది.

ఆదిశక్తి - 1.పరమేశ్వరుని మాయాశక్తి, 2.దుర్గ, 3.లక్ష్మి, 4.సరస్వతి.
బ్రహ్మ ముఖములందు దేవీస్థానం సరస్వతి| సరస్వతి యందు దేవమాత|

సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ బ్రవహించునది.
సరాంసి అస్యాం సన్తీతి సరస్వతీ. ఈ. సీ.- సరస్సులు దీనియందుఁ గలవు.   

లగ్న చామరహస్త శ్రీ శారదా పరివీజితా,
లజ్జా పద సమారాధ్యా లంపటా లకులేశ్వరీ|

సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రము నకును, నదీ విశేషమునకును, ఆవునకును పేరు. "సరస్వతీ స్యాత్ స్త్రీరత్నే నద్యాం నద్యంతరే గవి" యని అజయుడు. "సరస్వతీ నదీ భేదే" అని ప్రతాపుఁడు.                                 

దశరా - 1.దశరాత్రము, 2.దేవీ నవరాత్రము, సం.దశరాత్రమ్.
విజయదశమి -
ఆయుధములు పూజించెడు ఆశ్వయుజ శుద్ధదశమి.
మహాలయము- మహాలయామావాస్య. మహాలయము నందు దేవీస్థానం మహాభాగ| 

పాఱువేఁట - దసరానాడు ఉత్సవ విగ్రహాదులను వేటకు తీసికొని పోవుటకై తీసుకొనిపోవు ఉత్సవము.

విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ సంవత్సరము.  

                                                                                                 

భగవతి - 1.సరస్వతి, 2.పార్వతి, 3.గంగ, విణ.పూజ్యస్త్రీ.     

సరస్వతీశబ్దము మంచిస్త్రీకిని, నదీమాత్రమునకును, నదీ విశేషము నకును, ఆవునకును(ఆవు - గోవు)పేరు. "సరస్వతీ స్యాత్ స్త్రీరత్నే నద్యాం నద్యంతరే గవి" యని అజయుడు.

శుక్లాం బ్రహ్మ విచారసారపరమా మాద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తకధారిణీ మభయదాం జాడ్యాంధకారాపహామ్|
హస్తే స్ఫాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితాం
వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్|| 
 

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.

ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.

గో భూ వాచ స్విడా ఇళాః : ఇడా ఇళా శబ్దములు భూమికిని, ఆవునకు ను, వాక్కునకును పేరు.
ఇలంతి స్వపంత్యత్రేతి ఇడా భూః - దీనియందు నిద్రింతురు.
ఇల్యతే క్షిప్యతే ఇడా, ఇలాచ. ఇల స్వప్న క్షేపణయోః - ప్రేరేపించఁబడునది గనుక ఇడ, ఇలయును.
ఇళాశబ్దో బుధభార్యాయామపి. యస్యాఃపుత్రః పురూరవాః. "ఊర్వశి అంభవ స్యాయమైన సూనోర్ధనుర్భృత" ఇతి విక్రమోశ్వశీయే.

గోవిందుఁడు - 1.శ్రీకృష్ణుడు, 2.బృహస్పతి, 3.శ్రీ శంకరాచార్యుల గురువు. 

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

భారతి - 1.సరస్వతి, 2.వాక్కు.
ఇడ -
1.(యోగ.) ఒకనాడి, 2.మైత్రావరుణియను పేరుగల బుధుని భార్య, 3.గోవు, 4.వాక్కు, 5.హవిరన్నము, 6.దుర్గాదేవి.
ఈశ - 1.ఏడికోల, బండినొగ, 2.ఐశ్వర్యము, 3.ఐశ్వర్యవంతురాలు, 4.దుర్గాదేవి.

కూబరము - మనోజ్ఞము, సుందరము, వి.1.బండినొగ, 2.మోచేయి.

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా చ భోగదా,
గోవిందా భారతీ భామా గోమతీ జటిలా తథా. - 6శ్లో
 

అకలంకస్థితి నిల్పి, నాదమను ఘంటా రావమున్ బిందు దీ
వ కళాశ్రేణి వివేక సాధనము లొప్పం బూని యానంద తా
రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్పూర్తి వారించు వా
రికిగా వీడు భవోగ్ర బంధ లతికన్ శ్రీకాళహస్తీశ్వరా !
 
తా|| ఈశ్వరా! నాదబిందు కళారూపిణియై, శ్రీచక్రాంతర వర్తియైన భువనేశ్వరీదేవి యందు మనస్సును సుస్థిరముగా నిలిపి, ఆ దుర్గాదేవి దయవలన మనసు యొక్క వేగచాలన గర్వమును బోగొట్టినట్టి యోగులకు(శ్రీవిద్యోపాసకులకు) సంసారబంధములు తొలగుపోవును గదా ! - ధూర్జటి - 1.శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి.)  

సత్య జ్ఞానాత్మికా నందా బ్రహ్మీ బ్రహ్మ సనాతనీ,
అవిద్యా వసనా మాయా ప్రకృతి స్సర్వ మోహినీ. - 98శ్లో

స్వాతి  వాన(వర్షం) - Rain that falls in Swati (about october) గంగానది ఉదకమువలె నిర్మలముగను సమస్త ప్రాణులకు హితవుగ నుండును. ఆరోగ్యము నిచ్చును.

చిత్త చిత్తగించి స్వాతి చల్లచేసి విశాఖ విసిరికొడితే చేనుకంకిలో కావలినన్ని ధాన్యము పండును.

15. స్వాతి - మాణిక్యాకారముగా ఒకటే నక్షత్రము.

స్వాతి - 1.సంజ్ఞాదేవి,  2.నక్షత్రములలో నొకటి. 
త్రసరేణువు - 1.సంజ్ఞాదేవి, 2.ముప్పది పరమాణువుల కొలది.

మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.

కెంపుసవతు - స్వాతీనక్షత్రము.

వాయుర్నక్షత్ర మభ్యేతి నిష్ట్యామ్ | తిగ్మశృంగో వృషభో రోరువాణః | సమీరయన్ భువనా మాతరిశ్వా | అప ద్వేషాగ్ంసి సుదతామరాతీః | తన్నో వాయుస్తదు నిష్ట్యా శృణోతు | తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యమ్ | అన్నో దేవాసో అనుజాసంతు కామమ్ | యథా తరేమ దురితాని విశ్వా ||13|| 

అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్టవసువులతో ఒకడు.
అనిలము -
1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము.

సమీరుఁడు - వాయువు.
సమీరణుఁడు -
1.వాయువు, 2.బాటసారి, వ్యు.లెస్సగా చరించువాడు.

భువనము - 1.జగము, 2.ఆకాశము, 3.ఉదకము.
భవతి సర్వమనేనేతి భువనం, భూ సత్తాయాం. - దీనివలన నన్నియుఁ గలుగును.
జగము - లోకము, విణ.గొప్ప, పెద్ద, సం.జగత్.
జగతి - లోకము, రూ.జగత్తు, జగము.    
ౙగ - గొప్ప, పెద్ద, సం.జగత్.
ౙగా - గొప్ప, పెద్ద. గొప్ప - అధికము, పెద్దది.
అధికము - ఎక్కువది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
బృహత్తు - గొప్పది. (ౙ)జాగా - 1.పెద్దది, 2.గొప్పది, 2.చోటు, రూ.జగ, జగా, జెగ, సం.జగత్.  

నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా,
భువన జ్ఞాన నిశ్శ్రేణిః భువనాకారవల్లరీ| - 124స్తో

దొడ్ద - గొప్ప, రూ.దొడ్డు.
దొడ్డువాఱు -
1.క్రి.గొప్పయగు, 2.లావగు.
లావు - 1.బలము, 2.అతిశయము, సామర్థ్యము, విణ.స్థూలము.

భువనేశ్వరము - చుట్టుబవంతి. ద్వాదశం భువనేశ్వరీ|

సదా సమ్మోహినీ దేవీ సుందరీ భువనేశ్వరీ
ఏకాక్షరీ పరాబ్రాహ్మీ స్థూల సూక్ష్మప్రవర్ధనీ|

లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
విష్టపము -
లోకము. సర్వ చరాచర పాలక రామ్| 
లోకములు - సర్గమ ర్త్య పాతాళములు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము; ఈ ఏడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము; ఈ ఏడును అధోలోకములు. 

చరాచరము - 1.జగత్తు, 2.విణ.తిరుగునదియు, తిరుగనదియు.
జనము -
ప్రజ; ప్రజ - జనము, సంతతి.
సంతతి - 1.కులము, 2.సంతానము, 3.పుత్రపౌత్ర పారంపర్యము, 3.వరుస.
కులము - 1.వంశము, 2.ఇల్లు, 3.తెగ, 4.సరీరము, 5.ఊరు.
సంతానము - 1.బిడ్ద, పుత్రపౌత్ర పారంపర్యము, కులము, 2.ఒక కల్పవృక్షము.
జనయిత - తల్లి; జనయిత్రి - తండ్రి.

కుటుంబము - పెండ్లాము, బిడ్డలు మొ.వారు భార్యభర్తలు, వారి సంతానము. ఒక గృహములో నివసించు బంధువర్గము (Family).
కుటుంబిని - 1.పురంధ్రి, స్త్రీ, 2.భార్య.
పురంధ్రి - కుటుంబిని, స్త్రీ(ఆడుది).
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.

చరాచరజగనాథా చక్రరాజనికేతనా|
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా. - 60స్తో   

కరువలిపట్టి - వి. (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలి - గాలి.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని; కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయము, వి.బిడ్డ.

గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపు - గాలి, వాయువు రూ.గాడ్పు. గాడ్పు - గాడుపు.
గాడుపుసంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
గాడుపుమేపరి - పాము, పవనాశము.

మారుతము - వాయువు.
మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు -
1.మారుతి, 2.వృకోదరుడు.

సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః.

వృకోదరుఁడు - భీముడు.
తోఁడేటి మేటి కడుపు -
వృకోదరుడు, భీముడు.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి. పద్యయతి, సం.వళిః.
వేగ - వడి, విణ.త్వరితము.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము 2.వికసింపనిది. ముడి మూరెడు సాగునా?
ముడిగిబ్బ - ఆబోతు.

భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు.
బిభే త్యస్మాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లితనివలన భయపడును గనుక భీముఁడు.   

జయంతుడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
భీముడు :
పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విన.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు.

కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
కీచకుఁడు -
భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.

ప్రాణందాపి పరిత్యజ్య - మానమేవాభి రక్షతు|
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్ర తారకమ్||

తా. తనకు మానహానికరమైన (యా)ఆపద వచ్చినప్పుడు ప్రాణము(ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.)నైన విడువ వచ్చును. కాని మానమును రక్షించుకొన వలయును. అది యెందు వలన ననఁగా ప్రాణము(అనిత్యము - 1.నిత్యము కానిది, నశ్వరము, 2.నిలుకడ లేనిది, 3.సంశయాస్పదము, 4.తాత్కాలికము.)క్షణభంగురము.  మానము చంద్రుడును నక్షత్రములు(తారకము - 1.కంటినల్ల గ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.)నుండు వరకుండునని భీముఁడు చెప్పెను. - నీతిశాస్త్రము  

పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుఁడు, విణ.పవిత్రురాలు.

పవిత్రము - 1.జందెము, 2.నీరు, 3.ఆవుపేడ, విణ.పరిశుద్ధము.

(ౙ)జందెము - జందియము.
జందియము -
యజ్ఞోపవీతము, రూ.జందెము, జన్నిదము.
జన్నిదము - యజ్ఞోపవీతము, జందెము, చూ.జందియము.
యజ్ఞోపవీతము - 1.జందెము, 2.యజ్ఞసూత్రము.
బ్రహ్మసూత్రము - యజ్ఞోపవీతము

సూత్రము - 1.నూలిపోగు, చంద్రునికో నూలిపోగు 2.జన్నిదము, 3.ఏర్పాటు, 4.శాస్త్రాది సూచక గ్రంథము, (గణి.) కొన్ని పదములతో నేర్పడు సమీకరణము (Formula), 6.కొన్ని ధర్మముల నుగ్గడించు ప్రవచనము. 
ఏర్పాటు - ఏరుపాటు; ఏరుపాటు - 1.నిర్ణయము, 2.నియమము, 3.వివరణము, 4.భేదము, రూ.ఏర్పాటు.

అవధారణము - నిర్ణయము, నిశ్చయము. 
నిర్ణయము -
ఏర్పాటు; నిర్ణయించు - క్రి.ఏర్పాటుచేయు.
నిశ్చయము - నిర్ణయము; నిర్ధారణ - నిశ్చయము.
వ్యవసితము - నిశ్చయము, విణ.అనుష్ఠింపబడినది.  

నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.

ప్రవచనము - 1.వేదము, 2.గొప్పమాట, (గఱి) విషయ విపులీకరణము (Exposition).

విద్వాంసో యోగనిష్ఠాశ్చ- జ్ఞానినో బ్రహ్మవాదినః |
తన్ముక్తిం నైవ తే అపశ్యన్ పశ్యంతః శాస్త్ర సంచయాన్ ||

సామీరి - 1.హనుమంతుడు, 2.భీముడు.
హనుమంతుఁడు -
ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్.
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.
యోగచరుఁడు - ఆంజనేయుడు.

పవనాత్మజ - వాయుసుతుడు, ప్రభు భక్తికి హనుమంతుణ్ణి మించిన ఉదాహరణ లేదు.

హనుమంతుడు : అంజనీ సుతుండు, వాయుదేవుని వరమున బుట్టినవాడు. బ్రహ్మ, శివునియొక్క(రుద్రరూప) కలయిక వలన నేర్పడినవాడు. సూర్యుని శిష్యుడు. చిరంజీవి, వేదవిదుడు(నవవ్యాకరణ పండితుడు), మహాగాయకుడు, ఉత్తమ రామభక్తుడు.  

బుద్ధిర్బలం యశో ధైర్యం మిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్|
తా.
హనుమంతుని ధ్యానించుట వలన బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగము లేకుండుట, మాంద్యము తొలగుట, చక్కగ మాటలాడ గలుగుట సిద్ధించును.

వానరః కేసరిసుతః సీతాశోకనివారణః,
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః|      

అంజన - 1.హనుమంతుని తల్లి, 2.పడమటి దిక్కునందలి ఏనుగు.
అంజనాకారో వర్నో (అ)స్యా అస్తీత్యంజనావతీ - కాటుకవంటి దేహకాంతి గలది. 
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.   

అంజని - చందన కుంకుమాదులచే అలంకరించుకొను స్త్రీ, (వృక్ష.) కటుక రోహిణి, కాలాంజని అనెడి ఓషధులు.
కటుకరోహిణి - ఒక ఓషధి, (వ్యావ.) కటకరాణి.

వానరః కేసరిసుతః సీతాశోకనివారణః,
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః.

అంజనము - 1.కాటుక, 2.మంత్రగాడు నిక్షేపాదులను కనిపెట్టుటకు వాడు కాటుక, 3.సిరా, 4.పశ్చిమ దిగ్గజము, 5.ఒక పర్వతము, 6.ఒకజాతి బల్లి, 7.(అలం.) వ్యంగ్యార్థమును బోధించు శబ్దవృత్తి, 8.నిప్పు.
అంజనాభత్వదంజనః - కాటుకవన్నె గలది.
అనక్తి గచ్ఛతి ప్రకాశతేవా అంజనః అంజూ వ్యక్తిశ్తక్ల కాంతిగతిషు. - లెస్సగా నడుచునదైనను ప్రకాశించునదైనను, అంజనము.
ఆంజనము - కాటుక, విణ.అంజనము నకు సంబంధించినది.
కాటుక - 1.అంజనము, 2.జొన్న ఎన్నునకు గల్గువ్యాధి.
కజ్జలము - 1.మేఘము, 2.కాటుక, 3.(రసా.) దీపాంగారము, దీపపుమసి (Camp black).
మేఘము - మబ్బు; మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.  
అంజనకాడు - అంజనమువేసి నిక్షేపాదులను కనుగొనువాడు.

వర్తి - 1.వత్తి, 2.కంటికాటుక, విణ.వర్తించువాడు.
వత్తి - దీపపు వత్తి; దీపవల్లి - దీపపు వత్తి.

దశ - 1.అవస్థ, 2.వత్తి, 3.బద్దె. దశ బాగుంటే దిశ ఏమి చేస్తుంది!

దిశ - దిక్కు, దెస. (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కు లలో నొకటి.
దిక్కు-1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.     దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, దశా.
అవస్థ - 1.కా లా ను సా ర స్థి తి, 2.దురవస్థ, 3.బాధ.

నిరంజనము - 1.కాటుకలేనిది, 2.దోషములేనిది.

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుమణుఁడు, వ్యు.అసురలను హింస చేయువాడు.
ద్రుహిణః ద్రుహ్యతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులను హింస చేయువాఁడు. ద్రుహ జిఘాం సాయాం. ద్రుహిణ ముఖసదనే శారదా|
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె. 
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.  

విభక్తత్రైవర్ణ్యం - వ్యతికరిత లీలాఞ్జన తయా
విభాతి త్వన్నేత్ర - త్రితయ మిద మీశాన దయితే, |
పునస్స్రష్టుం దేవాన్ - ద్రుహిణహరిరుద్రాను పరతాన్
రజ స్సత్వం బిభ - త్తమ ఇతి గుణానాం త్రయమివ || - 53శ్లో

తా. ఓ ఈశాన ప్రియురాలా(దయిత - 1.భార్య, 2.స్త్రీ.)! నీ నేత్రత్రయాలు మూడు వర్ణాలైన తెలుపు, ఎరుపుతోను మరియు అందంకోసం అర్ధవల యాకారముగా తీర్చినదైన కాటుక నల్ల రంగుతో, ఒకేసారి మూడు వర్ణాలతో ఒప్పారుతూ, మహాప్రళయకాలంలో నీలో లీనమై పోయివున్న బ్రహ్మ(ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింస చేయువాడు.) విష్ణు(హరి) రుద్రులను(రుద్రుఁడు- శివుడు)తిరిగి సృష్టించుట కై సత్త్వం, రజస్సు, తమస్సులనే గుణత్రయాన్ని ధరించిన వాటివలె ప్రకాశించు చున్నవి. - సౌందర్యలహరి  

ఖంజనము - కాటుక పిట్ట.
కాటుకపిట్ట - ఖంజరీటము.

ఖఞ్జరీటస్తు ఖఞ్జనః,
ఖం ఆకాశం అఞ్జసా ఏటతి ఖఞ్జరీటః, ఇత కిట గతౌ. - ఆకాశమును శీఘ్రముగాఁ బొందునది.
ఖఞ్జతీతి ఖఞ్జనః(ఖంజనము - కాటుక పిట్ట), భాద్రపదమాసాది షట్కే అదృశ్యగతిత్వాత్. ఖజి గతివైక్లబ్యే. - భాద్రపదమాసము మొద లాఱు నెలలు(6 months)కనిపించక తిరుగునది. ఈ 2 మందపిచ్చిక పేర్లు. రువ్వుపులుఁగు కౌఁజు, కాటుకపిట్ట యనియు గొందఱు.

కౌఁజు - కపుఁజుపిట్ట, సం.కపింజలః.
కపింజలము - కముజు అను పిట్ట.

చంద్రకి - 1.నెమిలి, 2.కౌజు.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి. 
మయూరము - 1.నెమిలి, 2.నెమిలిజుట్టు.
మీనాతి సర్పాన్ మయూరః మీఞ్ హింసాయాం. - సర్పములను హింసించునది.  
నమిలి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
నెమ్మిలి - నెమ్మలి; నెవిలి - నెమిలి.

నెమ్మిరౌతు - కుమారస్వామి. 
నమికి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.
నెమ్మి - 1.ప్రేమ, 2.నెమ్మది, 3.సంతోషము, 4.క్షేమము, 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము, 2.బండిచక్రముకమ్మి, సం.నేమిః.

చంద్రకము - నెమలిపురి కన్ను.
మేచకము - 1.చీకటి, 2.నెమలి పురికన్ను, విణ.నల్లనిది.

సమౌ చన్ద్రక మేచకౌ,
ఛంద్ర ఇవ చంద్రకః - చంద్రకారమై యుండునది.
హరిత మిశ్రవర్ణత్వాత్ మేచకః - పచ్చవన్నెయు నల్లవన్నెయుఁ గలది. ఈ 2 నెమలిపురికన్ను పేర్లు.

మసక - 1.ఇంచుక నలుపు, 2.మునిచీకటి, సం.మేచకః.
కనుచీఁకటి - లేచీకటి, మసకచీకటి.

కలధ్వని - 1.అవ్యక్త మధురధ్వని, 2.కోయిల, 3.నెమలి.

మాయురము - నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది.

కెంపుసవతు - స్వాతీనక్షత్రము.
కెంపు -
1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
సవతు - సమత, సామ్యము, సం.సమత్వమ్.
సామ్యము - సమత్వము, పోలిక; పోలిక - సామ్యము.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు కలది.
కోకిలము - కోయిల. 
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
కోవెల - గుడి, వై.వి.కోకిలము.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

కెంపుగాము - అంగారకుడు Mars.     
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).  

గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.

కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.    
మాణిక్యము - కెంపు. 
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది. 

శోణరత్నం లోహితకః పద్మరాగః -
శోణరత్నము - కెంపు
శోణవర్ణం రత్నం శోణరత్నం - ఎఱ్ఱనిరత్నము.  
లోహితకము - కెంపు.
లోహితవర్ణత్వా ల్లోహితకః - ఎఱ్ఱనైనది.     
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
పద్మవద్రాగో యస్య పద్మరాగః - తామరపువ్వువంటి యెఱుపుగలది. ఈ 3 కెంపు పేర్లు.  

శోణిమ - ఎరుపు, రూ.శోణిమము.
శోణతీతి శోణః, శోణృ వర్ణగత్యోః. - వర్ణమును జేయునది.
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.
కోకనదము - 1.చెంగలువ, 2.కెందమ్మి.
కోకనదస్య ఛవివచ్ఛవిర్యస్య, రక్తోత్పలమువంటి కాంతి గలది.
కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱమందార.

శోణము - 1.ఎరుపు, 2.ఒక నది, 3.నిప్పు.
శోణిమ - ఎరుపు, రూ.శోణిమము.
శోణితము - రక్తము Blood.
శోణితవర్ణత్వాత్ శోణితం, శోణ్య వర్ణగత్యోః. - ఎఱ్ఱనివన్నె గలది. 

శోణో హిరణ్యవామ స్స్యాత్ -
శోణతీతి శోణః. శోణృ వర్ణగత్యోః. - ప్రవహించునది.
శోణవర్ణత్వాద్వా శోణః - ఎఱ్ఱనికాంతి గలది.
హిరణ్యం(హిరణ్యము - 1.బంగారు, 2.మాడ, 3.ధనము, 4.రేతస్సు, 6.గవ్వ.)వహతీతి హిరణ్యవాహః. వహ ప్రాపణే. - హిరణ్యమును వహించునది. ఈ రెండు శోణ నదము పేర్లు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతె కుటిలం ఊర్థ్వం వా గచ్ఛతి త్యగ్నిః, ఈ-పు. అగ కుటిలాయాం గతౌ - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు. 

ఐరిపు - అగ్ని, నిప్పు.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.    
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు.

అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః, ఊ-పు. - అగ్నివలనఁ బుట్టినవాఁడు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.

గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ.పూజ్యము (గంగగోవు).    

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు      

శ్యామ - 1.నడియవ్వనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.

శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామవర్ణో (అ)స్యాస్తీతి శ్యామలః - శ్యామవర్ణము గలిగినది.
శ్యామలము - నలుపు, విణ.నల్లనిది.
శ్యామతి శమలం, శము ఉపరమే. - నశించునది.
శ్యామిక - చీకటి, నలుపు.

పవిత్రీకర్తుం నః - పశుపతిపరాధీనహృదయే 
దయామిత్రై ర్నేత్రై - రరుణధవళ శ్యామ రుచిభిః|
నద శ్శోణో గంగా - తపనతనయేతి ధ్రువ మముం
త్రయాణాం తీర్ణానా - ముపనయసి సమ్భేద మనఘమ్|| - 54శ్లో

తా. అజ్ఞానులైన ప్రాణులను కాపాడువాడైన పశుపతి(పశుపతి - శివుడు)యందు లగ్నమైన హృదయము గలిగిన తల్లీ!  దయామిత్రములైన ఎఱ్ఱని, తెల్లని, నల్లని కాంతులుగల నీ కనులచే పాపహరమగు మూడు తీర్థములైన శోణనదము(ఎర్రని) గంగ(ధవళిమ - తెలుపు) యమున (నల్లని) నదుల సంగమ స్థానమును, మమ్ము పవిత్రులనుగా చేయుట కొఱకు తెచ్చు నట్లున్నది. ఇది నిజము. - సౌందర్యలహరి. 

మానికము - కెంపు, రత్నము, సం.మాణిక్యమ్.
మానికదారి -
1.వేశ్య, 2.మాణిక్యధారిణి.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.

మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
రత్నము -
1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)

రత్నం మణిర్ధ్వయో రశ్మజాతౌ ముక్తాదికే పిచ :
రమతే స్మి న్ మన ఇతి రత్నం. రము క్రీడాయాం. - దీనియందు మనస్సు రమించును.
మణ్యతే స్తూయత ఇతి మణిః. ఇ. ప్స. - మణి శబ్దే స్తోత్రము చేయఁ బడునది. శిలాజాతు లయిన పద్మరాగ మరకత స్ఫటికాదులకును, మౌక్తిక విద్రుమాదులకును సామాన్యముగా పేర్లు.  

మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
పచ్చ -
1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరు రేఖ. సం.పలాశః. 
హళఁది - 1.అళది, పసుపు, 2.పసుపువన్నె, సం.హలదీ. 
కావేరి - 1.కావేరీనది, 2.పసుపు. హరిద్ర - పసుపు.
పచ్చవిలుతుఁడు - మన్మథుడు.
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు). 
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
తిమ్ము - క్రి. దీవించు, (శ, ర,), నిందించు, (అని కొందరు).  

నేవడము - మణులు గ్రుచ్చిన హారము, రూ.నేవళము, నేహారము. 

ఉరుముంజి - ముత్తెములకు ప్రసిద్ధమైన ఒకదేశము, రూ.హురుముంజి.

సముద్రంలో గల ముత్యాలను సంపాదించాలని నిశ్చయించుకొంటే ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా అట్టడుగుకు మునిగి వెదకాలి. ఒకసారి మునిగి ప్రయత్నించిన వెంటనే అవి లభించకపోతే ఇక ముత్యాలే లేవని నిర్ధారించలేము కదా! అలాగే అన్నిచోట్లా ఉండే భగవంతుణ్ణి కనుగొనడంలో ఒక ప్రయత్నం విఫలమైనా నిరుత్సాహపడక పట్టుదలతో మరల మరల ప్రయత్నిస్తే భగద్ధర్శనం తప్పక లభిస్తుంది. - శ్రీ రామకృష్ణ పరమహంస  

గజ కుంభే కర్పూరాభాః వంశే రక్తసితాః స్మృతాః
ఫణాసు వాసుకేరేవ నీలవర్ణాః ప్రకీర్తితాః ||
జ్యోతిర్వర్ణాస్తు జలధే శుక్తికాయాం పితా స్మృతాః
ఇక్షుదండే పీతవర్ణాః మణయో మౌక్తికా స్మృతాః ||
గజకుంభములందు ప్రభవించు మౌక్తికములు కర్పూరకాంతి గలవి (వలువవన్నెలవి). వెదురుచెట్ల యందు పుట్టునవి తెలుపు గల్సిన ఎఱుపువన్నె గలవి. వాసుకి ఫణమునందు బుట్టిన ముక్తామణులు నీలవర్ణమువి. మేఘ సంభములైన ముక్తామణులు జ్యోతిర్వర్ణములు (మెఱుపువన్నె). ముత్తెపు చిప్పయందు బుట్టినవి శ్వేతవర్ణములు. ఇక్షుదండమున బుట్టినవి పసుపువర్ణము గలవి.

ముత్యము - నవరత్నములలో ఒకటి. రంగు తెలుపు పవిత్రమైనది.

రేఫము - ర వర్ణము, విణ.అధమము.
అంత్యము -
1.కడపటిది, 2.అధమము. 
అధమము - తక్కువైనది, నీచము.
కిఱుదు - తక్కువైనది, కిఱుదు నేల.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).

మంద్రము - గంభీరమైనది, (స్వరము).
గంభీరము -
1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది (స్వరము), రూ.గంభీరము.

మన్ద్రస్తు గమ్భీరే :
మన్యతే బుద్ధ్యతే అనేనేతి మంద్రః - దీనిచేత నెఱుఁగఁబడును.
మందతే శనైర్నిస్సరతీతి మంద్రః. మది స్తుతి మోద మద స్వప్న కాంతిగతిషు. - మెల్లగాఁ బలుకఁబడునది. ఈ ఒకటి గంభీరధ్వని పేరు.

కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ.
గరుడ పచ్చ -
ఆకుపచ్చ వన్నెగల మాణిక్యము, గారుత్మతము.
గారుడము - 1.గరుడపచ్చ, 2.పదునెనిమిది పురాణములలో ఒకటి, గరుడ పురాణము(మజ్జ) 12000 శ్లోకములు గలది. గరుడదేవతాకమైన అస్త్రము.

మందాళి - 1.పచ్చ పట్టుచీర, 2.కృత్రిమ మరకతము.
చిప్ప ముత్తెము -
కృత్రిమ మౌక్తికము, చేత ముత్తెము.  
ఉమ్మాయ ముత్తెము - కృతక మౌక్తికము, మాయాముత్యము.   
కయ్యర - తక్కువజాతి ముత్తెము.
రోహిషము - కొండగొఱ్ఱె, ముత్యము.
రౌహిషము - 1.కామంచిగడ్డి (తృణవిశేషము), 2.కొండగొఱ్ఱె.
కామంచి - కత్తృణము, ఒక తెగగడ్డి, రూ.కావంచి, సం.కామంజికా. కామంజిక - కత్తృణము.

తారాహారము - ముత్యాలసరము.
ముత్తెసరము -
మత్యాలహారము.

హారో ముక్తావళీ -
ప్రియతే చిత్తమనేన హారః, హృఞ్ హరణే. - దీనిచేత మనస్సు హరింపఁబడును.
ముక్తానాం ఆవళీ, ముక్తావళీ. ఈసీ. పా. ముక్తావళిః ఈ. సీ. - ముత్యములయొక్క పంక్తి. ఈ 2 ముత్యములదండ పేర్లు.

ముక్తావళి - ముత్యాలదండ.
హారము - 1.నూట యెనిమిది పేటల ముత్యాలహారము, 2.యుద్ధము, 3.మాల, (గణి.) భిన్నములోని క్రింది భాగము 1/2 అనుభిన్నములో 2అనునది 'హారము' (Denomination). 

సరము - హారము, ముకుగాలి, షడ్జాది స్వరము, సం.స్వరః, సం.వి. 1.హారము, 2.గమనము.
సరి -
హారము, గుచ్ఛము, విన.1.సమము, యుక్తము, 2.సమాప్తి, పూర్ణముగా, సవ్య.అంగీకార్థము, సం.సరః.
గుచ్ఛకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము. 
సరిగ - 1.హారము, 2.జరీ, సం.సరికా, స్రక్.

హారి - 1.మనోజ్ఞము, 2.హరించువాడు, 3.హారముకలవాడు.

సమము - 1.సమానము, 2.సాధువు.
సమానము -
(సజాతీయము) - (గణి.) ఒకే జాతికి సంబంధించినది, ఒకే ఘాతసంఖ్య కలిగినది (Like), వై.వి.సమ్మతి, సం.వి.నాభియందలి వాయువు, విణ.తుల్యము.
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.

కోవ - 1.గోపురాకారముగ నుండు పుట్ట చివర, 2.హారము, 3.ముత్యము, 4.హారమందలి పేట, 5.వంశానుక్రమము.

దామము - 1.పలుపు, 2.హారము, దండ.
సరిగ - 1.హారము, 2.జరీ, సం.సరికా, స్రక్.
ౙరి - జరీ, వెండి బంగారములతో మొలాము చేసిన నూలిపోగు.
ౙరత - జతారు, సరిగ, రూ.జరతారు.
ౙలతారు - జరత; మాతాబి - జలతారు.

                           

సహస్రాంశువు - సూర్యుడు, వేవెలుగు.
సహస్రమంశవో యస్య సహస్రాంశుః, ఉ.పు - వేయికిరణములు గలవాఁడు.

సహస్రాక్షుఁడు - ఇంద్రుడు, వేగంటి.
సహస్ర మక్షీణి యస్య సః సహస్రాక్షః - వేయికన్నులు గలవాఁడు.
వేగంటి - ఇంద్రుడు (వే+కన్ను).
వే - పదినూఱులు, వేలు, సహస్రము, విణ.ఆదేశము, వై.వి.వేగముగ.
వేలు - వ్రేలు యొక్క రూపాంతరము.
సహస్రము - వేయి.

అనిమీషము - 1.రెప్పపాటులేనిది, 2.జాగరూకము, 3.వికసించినది, వి.చేప.
రెప్పలు ముయ్యని జాణ. - చేప.
అనిమిషుఁడు - వేలుపు, దేవత.
వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
దేవత - వేలుపు. సురలు - దేవతలు.
బుధుఁడు- 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.    

వికచము - 1.వికసించినది, 2.వెండ్రుకలు లేనిది, సం.వి.కేతువు.
విగతః కచోబంధన మస్య వికచః కచ బంధనే. - విగతమైన బంధము గలిగినది.
కేతువు - 1.తిమ్మిదవ గ్రహము Ketu, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని Fire, 5.కాంతి.   
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు. 

సుర మత్స్యా వనిమిషా :
అనిమిష శబ్దము దేవతలకును, మత్యమునకును పేరు. న నిమిషత్య నిమిషః మిష నిమీలనే ఱెప్పపాటు లేనిది.   

తెఱగంటి ఱేఁడు - ఇంద్రుడు.
తెఱగంటి - 1.తెప్పపాటు లేనివాడు, దేవత, 2.చేప Fish. 

ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసో త్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.   

ఉన్మేషము - 1.కనువిచ్చుట, 2.వికాసము, 3.కాంతి, 4.స్ఫురణము.
ఉన్మీలనము -
1.వికసించుట, 2.(కన్ను మొ, వి) తెరచుట, 3.బయలు పరచుట, 4.రంగువేయుట.
ఉన్మీలించు - క్రి.వికసించు. 

నిమిషోన్మేషాభ్యాం- ప్రళయ ముదయం యాతి జగతీ
తవేత్యాహు స్సంతో - ధరణిధరరాజన్య తనయే |
త్వదున్మేషాజ్జాతం - జగదిద మశేషం ప్రళయతః
పరిత్రాతుం శంకే- పరిహృతనిమేషా స్తవ దృశః || - 55శ్లో
తా.
ఓ పర్వత(ధరణిధరము - 1.కొండ, 2.నేలతాలుపు.)రాజ కూతురా! నీ కనుఱెప్పలు మూతపడుటచేత(మూయుట) జగత్తునకు ప్రళయమైన నశించును. మఱల నీవు కన్నులు తెఱచుటచే సృష్టి జరుగుచున్నదని సత్పురుషులు చెప్పుచున్నారు. అందువలననే - నీ ఱెప్పలు వికసించుట వలన జనించిన ఈ సర్వజగత్తు నశింపకుండ కాపాడుటకు, నీవు నీ కనుఱెప్పలను మూయుటను పరిహరించితివి (అనగా ఱెప్పపాటు లేకుండ - మూత లేకుండ చూచుచున్నావని) మూయని నీ కన్నులే తగినవని యూహించుచున్నాను. - సౌందర్యలహరి   

ఉన్మేషనిమిషోత్పన్న - విపన్నభువనావళిః|
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్. - 66శ్లో 
 

శఫరి - ఎగసిపడెడు చేప, రూ.శఫరము.
ఎగిసిపాటు -
1.గర్వము, 2.మిడిసిపాటు.
మిడిమేలము - గర్వము, అహంకారము.

గర్వో(అ)భిమానో(అ)హంకారో -
గర్వయనేనేతి గర్వః ఖర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
ఆత్మానముత్కృష్టం మానయతీత్యభిమానః - మను అవబోధనే తన్ను ఉత్కృష్టునిఁగాఁ దలఁపించునది.
అహమితి బుద్ధిం కరోతీత్యహంకార. డుకృఞ్ కరణే. - నేను ఉత్కృష్టుఁడ నను బుద్ధినిఁ జేయునది. ఈ 3 అహంకారము పేర్లు.

అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య దేహాత్మభ్రాంతి.
అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.అత్మాభిమానము (Egotism), 5.క్రోధము, (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది), రూ.అహంకృతి, అహంక్రియ.

మిడిసిపాటు - మిట్టిపాటు.
మిడి -
మిట్టిపాట్టు, గర్వము, విన.1.మిడిసిపాటు గలది, 2.ఉన్నతము.

గరువము - 1.గర్వము, 2.గొప్పతనము, విన.1విస్తృతము, 2.పెద్దది, సం.గౌరవము.

ప్రోష్ఠీ తు శఫరీ ద్వయోః,
ప్రోష్ఠీ శఫరీ ద్వయం భక్షయితు రంతరుదర దాహక మత్స్యనామనీ - ప్రోష్ఠీ శఫరీశబ్దములు భక్షించిన వానికి పైత్యముఁ(పైత్తము - పైత్యము, పిత్తము వలన కలిగిన వ్యాధి.) జేసెడిపెను పేళ్ళు.
ప్రోష్ఠతి పిత్తకృత్త్వాత్ప్రోష్ఠీ ఈ. సీ. ప్రుషదాహే. - పైత్యకారి యగుటవలన దహించునది. 
ప్రకృష్టః ఓష్ఠః అస్యా ఇతివా ప్రోష్ఠీ - పెద్దపెదవి గలిగినది.
శఫాన్ గతిసాధనావయవాన్ రిణాతి పీడయ తీతి శఫరీ. ఈ. ప్స. రి గతిశోషణయోః. - శఫములనఁగా గొరిసెలు, వానిని శీఘ్రగమనముచేతఁ బీడించునది - ఈ 2 మత్యవిశేషము పేర్లు.  

అపర్ణ - పార్వతి.
తపసి పర్ణానామ ప్యసశనా దపర్ణా - పర్ణములైన భక్షింపక తపం బొనర్చినది.
ఆపగత మృణం యయేతివా - పోగొట్టబడిన ఋణము గలది.  

తవాపర్ణే! కర్ణే - జపనయన - పైశున్య - చకితాః
నిలీయంతే తోయే - నియత మినిమేషా శ్శఫరికాః,
ఇయం చ శ్రీ ర్బద్ధ - చ్ఛదవుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే - నిశి చ విఘటయ్య ప్రవిశతి. - 56శ్లో
తా.
ఓ అపర్ణా! పార్వతీదేవి ! ఱెప్పపాటులేని చేపలు చెవి దగ్గరనున్న నీ కనులు తమ రహస్యమును బయట పెట్టునని భయపడినవై శఫరితలు నీటిలో మునుగు చున్నవి.(దేవి నేత్రాలకున్న అనిమేషత తమ కన్నులకు కూడా వుండటంవల్ల తమచేష్టలన్నీ అమ్మచేత గమనింప బడుతున్నాయని భయం.) ఇక నీ నేత్రలక్ష్మి రాత్రిసమయంలో కలువ యందు ఉండి, ఉదయాన(ప్రత్యూషము - వేగుజాము)దాని దళాలను మూసివచ్చి పగలంతా నీ నేత్రాలలో ఉండి, రాత్రివేళ మరల కలువలు(కువలయము -1.భూమండలము, 2.నల్లకలువ, రూ.కువలము.) విప్పారగనే లోన ప్రవేశించు చున్నది. కనులు చేపలవలెను కలువలువలె నున్నవనుట. (అమ్మవి పూర్తిగా విచ్చుకున్న పద్మాలతో సరొపోల్చదగ్గ నేత్రలు అని భావము) - సౌందర్యలహరి   

అమీలితాక్ష మధిగమ్య ముదా ముకున్ద
మానన్దకన్ద మనిమేష మనఙ్గతన్త్రమ్| 
ఆకేకరస్థిత కనీనిక పక్ష్మ(పద్మ)నేత్రం
భూత్వై భవే న్మమ భుజఙ్గశయాఙ్గనాయాః. - 4స్తో

అపర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ,
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాక్షరా. - 52శ్లో
 

దృశ - చూపు; దృశ్యము - చూడదగినది.     
దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.  
దృష్టించు - క్రి.చూచు. దృష్టము - చూడబడినది.  
దృష్టిసంబంధము - (జం.) చూపునకు, కనుగ్రుడ్డునకు సంబంధించినది, (Optic).
దృష్టినాడి - (జీవ.) దృష్టిజ్ఞానమును మెదడున కందజేయు నాడి (Optic nerve).
దృష్టిరేఖ - (భౌతి.) మనచూపు పరచు ఋజురేఖ, (line of vision).
దృక్పిండములు - (జం.) మధ్యసుప్తిష్కము యొక్క పార్శ్వములందు దట్టముగా నేర్పడిన భాగములు (Optic thalami).
వీక్ష్యము - ఆశ్చర్యము, విణ.చూడదగినది. 

శలాకలు, శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (దీనిని శీఘ్ర గ్రహణశక్తి గలదు)  (Rods and cones).

దృశ - చూపు; ౘూపు - చూపించు, వి.దృష్టి 
దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
పశ్యంతి అనయా దృక్. శ. సీ. దృష్టిశ్చ. సీ. దృశిర్ ప్రేక్షణే. - దీనిచేతఁ జూతురు.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.

కాంచు - క్రి.1.చూచు, వీక్షించు, 2.పొందు.
వీక్షణము -
అవలోకము, ఈక్షిణము.
అవలోకనము - 1.చూపు, 2.చూచుట, 3.కన్ను, 4.విచారణ.
ఈక్షణము - 1.కన్ను, 2.చూపు, వీక్షణము.
ఈక్షితము - 1.చూడబడినది, 2.ఆలోచింపబడినది, వి.చూపు, దృష్టి.

చక్షువు - కన్ను. చక్షుసేతు విశాలాక్షి| 
చాక్షుషము - (భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్డివాడు, 3.మంచికన్నులు కలవాడు.

పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు -
1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి -1.మిత్రభావము, స్నేహము, 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity). 
పొందుకాఁడు - స్నేహితుడు. స్నేహితుఁడు - చెలికాడు.

విశాలాక్షి - హైమవతి, పార్వతి.
హైమవతి -
1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్త్రిక(పుత్త్రిక - 1.కూతురు, 2.బంగారు బొమ్మ).
భవ్య - పార్వతి, హైమవతి.
హిమవత అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.

దృశా ద్రాఘ్రీయస్యా - దరదళిత నీలోత్పల రుచా
దవీయాంసం దీనం - స్నపయ కృపయా మామపి శివే!
అనేనా యం ధన్యో - భవతి నచ తే హానిరియతా
వనే వా హర్మ్యో వా - సమకరనిపాతో హిమకరః. - 57శ్లో 
తా.
తల్లీ! పార్వతీదేవీ! మిగుల దీర్ఘమైన(పొడవైనదియు) కొంచెము వికసించిన  నీలాబ్జము - నల్లకలువ కాంతివంటి, కాంతి గలిగిన నీ కడగంటి చూపులోని కృపారసముచేత - కడు దూరమున నున్న దీనుడనగు నా యందు, దయతో నీ చూపును పడనిమ్ము. ఈ మాత్రము చేత నేను ధన్యుడనగు దును. ఇందుచే నీకే విధమైన నష్టము లేదు. శీతకిరణుడైన హిమకరుఁడు - చంద్రుడు వనమున గాని, మేడలపైగాని తన కిరణములను సమానముగనే ప్రసరింపజేయు చున్నాడు కదా! - సౌందర్యలహరి

దృశ్యాదృశ్యవిభూతి పావనకరీ - బ్రహ్మాండ భాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ- విజ్ఞానదీపాంకురీ|
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ.
   

మరుత్తు - వేలుపు(దేవత - వేలుపు), గాలి.
వేలుపు -
1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.  

మాతరిశ్వుఁడు - గాలి, వ్యు.ఆకాశమున వృద్ధినొందువాడు.

సుద - 1.కొన, 2.తుల.
కొన -
1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు.

అవసానము - 1.చివర, 2.ముగింపు, 3.మేర, 4.చావు, 5.(వ్యాక.) విరామము.
అవసానసూత్రము - (జం.) దారము వలె నున్న వెన్నుపాము చివర్భాగము (Filum terminale).

సాతి స్త్వవసానే స్యాత్ -
సాయ స్సాతిః, సీ. అవసానం చ షో (అ)న్తకర్మణి. - క్రియ ముగియుటసాతి, అవసానము. ఈ 2 క్రియాంతము పేర్లు.

చివర - 1.కొన, 2.అగ్రము.
అగ్రము - 1.ఎదురు, 2.సమీపము(సదేశము - సమీపము), 3.కొన, విణ.మొదటిది, (భూగో.) సముద్రములోనికి చొచ్చుకొని పోయిన నేలకొన.
మొన - 1.అగ్రము, 2.దండు, 3.సేనాముఖము.
ఎదురు - ఎదురించు, వి.1.ముందు, 2.వలపుకత్తె వలపుకాని కిచ్చు ధనము, విణ.1.అన్యుడు(అన్యుఁడు - ఇతరుడు), 2.సాటి, 3.బదులు(బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి), క్రి. విణ. 1.అభిముఖముగా, 2.సమానముగా.  
ముందర - 1.మునుపు, 2.మొదలు, 3.ఎదురు.

అంచలము - కొంగు, అంచు, కొన.
కొంగు -
చెంగు, చెరగు.
చెంగు - 1.తొలగు, 2.వెనుదీయు, వి.చెరగు.
చెఱఁగు - 1.అంచు, 2.కొంగు, 3.దిక్కు.
కొంగుపసిడి - జాతీ. కొంగుబంగారము విణ.సులభసాధ్యము, వశమైనది.

అంచు1 - 1.కొన, 2.చీరచెరగు, 3.విధము, (గణి.) రెండు సమ తలములు కలియు రేఖ, ముఖములు కలియు ప్రదేశము (Edge).
అంచు2 - క్రి.1.అజ్ఞాపించు, 2.పంపించు, రూ.అనుచు.
అంచులవాడు - చిత్రకారుడు, చిత్తరవులు వ్రాయువాడు, ముచ్చి.
చిత్రకారుడు - 1.చిత్తరువు వ్రాయువాడు, 2.ముచ్చి. ముచ్చి - చిత్రకారుడు.

కోటి1 - 1.అంచు, 2.వింటికొన, 3.చివర, 4.కోటిసంఖ్య, నూరులక్షలు, 100,00,000 (గణి.) త్రిభుజ క్షేత్రమున భుజకర్ణము, లకు భిన్నమగు అవయవరేఖ.
కోటి2 - వేగు, చారుడు.
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగరి - వేగువాడు, చారుడు. వేగువాడు - చారుడు.
వేగుఁజుక్క - శుక్రుడు (venus).
కోటిజిత్తు - కాళిదాసకవి. భోజునిలాంటి రాజుంటే కాళిదాసు వంటి కవియుంటాడు.

కొట్టికాఁడు - వేగరి, వేగువాడు, రూ.కోటికాఁడు.
యదార్థవర్ణుఁడు -
1.చారుడు, 2.వేగువాడు.
యాథార్థము - 1.సత్యము, 2.ఉన్నరూపు.
ఉన్నరూపు - యథార్ధము, కలరూపు.
కలరూపు - యథార్థ్యము, నిజము.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
నిజము - స్వభావము, విణ.1.తనది, 2.శాశ్వతమైనది.
నిజము - సత్యము, విణ.1.శాశ్వతమైనది, 2.సత్యమైనది. సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది.

అవితథము - 1.యథార్థము, 2.వ్యర్థము కానిది, వి.సత్యవచనము.

సత్యం బ్రూయాత్ప్రియంబూయాన్న బ్రూయా త్సత్య మప్రియం |
ప్రియంచనానృతంబ్రూయా దేషధర్మస్సనా తనః |
భద్ర భద్రమితి బూయాద్భద్రమి త్యేవనావదేత్ ||

తా. సత్యము నిష్టముగాఁ బలుకవలయును, సత్యమెన దైనను అప్రియముఁ బలుకరాదు, ప్రియమైనదైనను అసత్యముఁ బలుకరాదు. భద్రమనఁగా శుభము. కావున ప్రియమును(ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చు వెలగలది.)బలుకునపుడు భద్రము భద్రమని పలుక వలయును. – నీతిశాస్త్రము

బాలెన్సు - (Balance) 1.తుల, త్రాసు, తక్కెడ, 2.శేషము, 3.మిగిలినది.
బ్యాలెన్సు -
(అర్థ.) (Balance) అవశేషము, కాతానిల్వ జమాఖర్చుల తౌల్యానంతరమున కనబడు ఆస్తి లేక ఋణశేషము. 
దూలము - 1.తుల, స్తంభపీఠము, 2.ఇంటికుగుజుల కాదరువుగా నమర్చు మ్రాను, తలాబి. (వ్యవ.) పెద్ద యినుప నాగలిలోని ఒక భాగము (Beam).
దంతియ - 1.మిద్దెటింటికి అడ్డముగా వేసెడుపట్టె, దూలము, 2.వ్యవసాయపు పనిముట్టు, చూ.దంతె, రూ.దంతె.
దంతెన - (వ్యవ.) నీరు పెట్టి గట్లు, మళ్ళు ఏర్పరుచుటకును మిక్కల మధ్యమట్టిని కదల్చుటకును ఉపయోగించు చేతి పనిముట్టు, రూ.దంతె,  (Tooth harrow).

తక్కెడ - త్రాసు, రూ.తక్కెడ, సం.త్ర్యంకటము్.  
వాని తలదీయ తక్కెడ జానుమీరు - తరాజు ఒకటి పట్టుకుంటే రెండు ఊగులాడతాయి. - త్రాసు
తక్కిడి - 1.మోసము, 2.త్రాసు రూ.తక్కెడ.    

కడమ - 1.కొరత, 2.శేషము.
కడమపడు -
క్రి.కొరతపడు.

శేషము - మిగులు, (గణి.) ఒక రాశిని మరియొక రాశిచే భాగింపగా మిగులు రాశి. (Remainder) (రసా.) వడబోత కాగితముపై నిలిచి యుండు ఘన పదార్థము (Residue). 
నిలువ - శేషము, రూ.నిల్వ. మిగత - శేషము; మివులు - మిగులు.
మిగులు - 1.అతిశయించు, 2.శేషించు, 3.మట్టుమీరు, రూ.మివులు. అవశిష్టము - మిగిలినది, వి.శేషము.

అవక్షేపము - 1.తప్పుపెట్టి త్రోసివేయుట, 2.నిందించుట, 3.ఎగతాళి సేయుట, (రసా.) రెండు పదార్థముల మధ్య జరుగు రాసాయనికమైన మార్పు ఫలితముగా ఏర్పడిన కరగనట్టి వేరొక పదార్థము (Residue).

నీరుపుట్టువు - 1.తామర, 2.శంఖము, 3.కౌస్తుభము(నీటియిక్క).
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)

శంఖపాణి - విష్ణువు, వ్యు.శంఖము చేతి యందు ధరించువాడు. 

శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒకనిధి.
దుఃఖం శమయతీతి శంఖః, శము ఉపశమనే - దుఃఖమును శమింపఁజేయునది. 

శఙ్ఖో నిధౌ లలాటాస్థ్ని కమ్బౌన స్త్రీ -
శంఖ శబ్దము నిధి విశేషమునకును, నొసటి యెముకకును, శంఖము నకును పేరు.
శమయతి దుఃఖమితి శంఖః శము ఉపశమమే. - దుఁఖమును శమింపఁ జేయునది.

వెలిగుల్ల - శంఖము.
శంఖనఖము - నత్తగుల్ల.
ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.

శ ఙస్స్యాత్కమ్బు రస్త్రియౌ :
శామ్యత్య శుభమనేనేతి శంఖః - అశుభములు దీనిచేత శమించును.
శం సుఖం ఖవతి జనయతీతి శంఖః ఖను అవధారనే. - సుఖమును  బుట్టించునది.
కామ్యతే శుభార్థిభిరితికంబుః. ఉ-ప్న. కము కాంతౌ. - శుభర్థులైనవారిచేత కాంక్షింపఁబడునది. ఈ రెండు శంఖము పేర్లు.

దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము - మనల్ని మురిపించే ఆణిముత్యాలు అల్చిప్పలలో పుడుతున్నాయి కదా!

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు చిప్ప, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము. 

చిప్ప ముత్తెము - కృత్రిమ మౌక్తికము, చేత ముత్తెము.  
ఉమ్మాయ ముత్తెము - కృతక మౌక్తికము, మాయాముత్యము.

సలాపము - సముద్రములో ముత్తెపుచిప్ప లేరుట.

ముత్యపుచిప్పలో పడితేనే ముత్యాలు అవుతాయి. నత్తగుల్ల ఎండలో మెరుస్తూ వెండి లాగ కనిపిస్తుంది. ముత్యపు చిప్పను వెండిగా భావించుట మిథ్య.

శుక్తి - 1.ముత్తెపు చిప్ప, 2.శంఖము, 3.నత్తగుల్ల, 4.పుఱ్ఱ్పెంచిక.
శోకంత్యత్రేతి శుక్తి, ఇ-సీ, శుకగతౌ. - ముత్యములను బుట్టించునది.  

వెలిగుల్ల - శంఖము.    

క్షుద్రశఙ్గా శ్శఙ్ఖనఖాః -
క్షుల్లకము - 1.నత్తగుల్ల, 2.పేదరికము, 3.నూలుపోగు.
క్షుద్రాశ్చ తే శంఖాశ్చ క్షుద్రశంఖాః, అ.పు. క్షుద్రములైన శంఖములు.
శంఖనఖము - నత్తగుల్ల.
శంఖాః నఖా ఇవ శంఖనఖాః - నఖములవంటి శంఖములు ఈ 2 గుల్లల పేర్లు.   

ఆలిచిప్ప - ముత్తెపు చిప్పవంటి ఒకరకపు గుల్ల, నత్తగుల్ల.
గుల్ల - 1.నత్తగుల్ల, 2.బొబ్బ, విణ.1.అల్పము, 2.బోలు, (గుల్ల కడియము), సం.క్షుల్లః.
నత్త - గుల్ల యందుండు పురుగు.    
బోలు - లోపల నేమియు లేనిది, గుల్ల, డొల్ల.

డొల్ల - 1.బల్లవంటిది, 2.బుఱ్ఱ, 3.డొలక.

వ్విస్ఫోటము - బొబ్బ, పొక్కు.
బొబ్బ - 1.పొక్కు 2.సింహనాదము.
పొక్కు - 1.బొబ్బ 2.ఎండి లేచిన పెల్ల 3.జనశ్రుతి, క్రి. 1.దుఃఖించు 2.బొబ్బలేచు.

విస్పోటః పిటక స్ర్తిషు :
విస్ఫుటతి విస్ఫోటః. స్ఫుట భేదనే. - వ్రక్కలౌనది.
పిటతి సంశ్లిప్యతి పిటకః. అ. త్రి. పిట సంశ్లేషణే. - వ్రక్కలై కూడుకొనునది. ఈ రెండు పొక్కుల పేర్లు, బొబ్బలు.

గుల్లకాఁడు - ఏమియు లేనివాడు, వ్యర్థుడు.
గుల్ల పడు - అవమానపడు, భంగపడు.
అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము.
భంగము - 1.చెరుపు, 2.అవమానము, 3.అల, 4.రోగము, వ్యాధి.

దాకొని గుల్లలోఁ బుట్టదా ముత్తెము - మనల్ని మురిపించే ఆణిముత్యాలు అల్చిప్పలలో పుడుతున్నాయి కదా!

చిప్ప - 1.కప్పచిప్ప, 2.కల్లుత్రాగెడు చిప్ప, 3.టెంకాయచిప్ప, 4.తాబేటి చిప్ప, 5.ముత్యపుచిప్ప, 6.మోకాటి చిప్ప, 7.తలపుర్రె, 8.చేపమీది పొలుసు, 8.తునక, విణ.అల్పము. 

చిప్ప ముత్తెము - కృత్రిమ మౌక్తికము, చేత ముత్తెము.  
ఉమ్మాయ ముత్తెము - కృతక మౌక్తికము, మాయాముత్యము.

సలాపము - సముద్రములో ముత్తెపుచిప్ప లేరుట.

ముత్యపుచిప్పలో పడితేనే ముత్యాలు అవుతాయి. నత్తగుల్ల ఎండలో మెరుస్తూ వెండి లాగ కనిపిస్తుంది. ముత్యపు చిప్పను వెండిగా భావించుట మిథ్య.

ముత్యాలమ్మ - ఒక గ్రామదేవత.

చినుకుఁబూస - ముత్తెము.
ముత్తియము - ముత్యము, సం.మౌక్తికమ్, ముక్తా.    
ముత్యము - ముత్తియము.
సుపాణి - 1.ముత్తెమందలి శుభ్రమైన నీరు, 2.శుభ్రమైన నీరు, 3.ముత్తెము, రూ.సుప్పాణి, సం.సుపానీయమ్. 

నీరజము - 1.తామర, 2.ముత్యము, విణ.దుమ్ములేనిది. 

శ్లో. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్.

స్వాతి వానకు ముత్యపు చిప్పలు ఎదురు చూచినట్లు.  నత్తగుల్లలన్నీ ఒక రేవునకు ముత్యాలన్నీ ఒక రేవుకు చేరును. రత్నాలన్నీ యొకచోట నత్తగుల్లలన్నీ ఒకచోట.

why shells exist on the tops of mountains along with imprints of plants usually found in the sea?

ఆణి - 1.ఒక జాతి ముత్తెము, 2.ముత్తెము గుండ్రదనము విణ.మేలైనది.
ఆణిపూస -
ముత్తెము, గుండ్రని ముత్తెము.
కట్టాణీ - (కడు + ఆణి) మిక్కిలి గుండ్రనితనము (గల ముత్యము).

మంజరి - 1.చివురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
స్తబకము -
పూగుత్తి. 

స్థూల ముక్తాఫలోదార సుహారాయై నమో నమః |

శుక్తి - 1.ముత్తెపు చిప్ప, 2.శంఖము, 3.నత్తగుల్ల, 4.పుఱ్ఱ్పెంచిక.
శోకంత్యత్రేతి శుక్తి, ఇ-సీ, శుకగతౌ. - ముత్యము లను బుట్టించునది.

శుక్త్యంబు బిందు న్యాయము - న్యా.ముత్యపు చిప్పలోబడ్ద నీటి బిందువు ముత్యమగు ననురీతి.

చిప్పబడ్ద స్వాతిచినుకు ముత్యంబాయె
నీటబడ్డ చినుకు నీటగలిసె
బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వ.
తా||
స్వాతికార్తిలో ముత్యపుచిప్పలో బడిన చినుకు - క్రి.1.కారు, 2.కురియు, 3.కార్చు, వి.వానబొట్టు.)ముత్యమగును, నీటబడినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.

నీటిలో పుట్టాను - చిప్పలో పెరిగాను - నేలపై కొచ్చాను - స్త్రీలలో కలిసాను.

ముత్యపుచిప్పలో పడితేనే ముత్యాలు అవుతాయి. నత్తగుల్ల ఎండలో మెరుస్తూ వెండి లాగ కనిపిస్తుంది. ముత్యపు చిప్పను వెండిగా భావించుట మిథ్య.

తామర పత్రంపై పడిన వర్షపు నీటిబిందువులు ముత్యాలవలె ప్రకాశిస్తాయి. అవే జల బిందువులు ముత్యపుచిప్పలో పడినపుడు ఆణిముత్యాలుగా మారతాయి.

శ్రుతి సీమంత సిందూరీ - కృత పాదాబ్జ ధూళికా|
సకలాగమ సందోహ - శుక్తి సంపుట మౌక్తికా.

గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
గిరేః కైలాసస్యేసః గిరీశః - కైలాసమున కీశ్వరుడు.
గిరౌ శేతే గిరిశః - కైలాస మందు శయనించువాఁడు, శీఙ్ స్వప్నే.

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
హిమవద్గిరౌ ప్రచురా హైమవతీ - హిమవత్పర్వతమందుఁ బ్రచురమైనది. 
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం| 

భవ్యము - 1.శుభమైనది, 2.యోగ్యమైనది, వి.ఎముక.

నాస - ముక్కు, రూ.నస, నాసిక.
నాసతే శబ్దాయతే నాసా. నాసికా చ. నాసృశబ్ధే. - ధ్వనిచేయునది. నాసాగ్రే నవ మౌక్తికం| 

తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.
తుహినము - మంచు.
తోహతి అర్దయతి పద్మమితి తుహినం, తుహిర్ అర్దనే - పద్మమును బీడించునది.

వంశము - 1.కులము, 2.వాసము(వెదురు), 3.పిల్లనగ్రోవి, 4.వెన్నుగాడి, 5.సమూహము, 6.ఒక పురాణ లక్షణము.
వన్యతే సేవ్యత ఇతి వంశః, వన షణ సంభక్తౌ. - అందఱిచేత నాశ్రయింపఁబడునది.
వన్యతే యాచ్యతే వంశః, వను యాచనే. - అడుగఁబడునది.

ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
ధ్వజతీతి ధ్వజం, అ. ప్న. ధ్వజ గతౌ. - కదలునది.     

పట్టి - పంచమీ విభ క్తి ప్రత్యయము, వి.బిడ్డ.

హిమాచల మహావంశ పావనాయై నమో నమః|

అథ మౌక్తికమ్, ముక్తా :
మౌక్తికము - ముత్తియము.
ముచ్యతే శుక్తి సంపుటాదితి ముక్తా, ముక్త్తైవమౌక్తికం, ముచ్ ఌ మోక్షణే.
ముక్త - 1.ముత్తెము, 2.రంకుటాలు, విణ.ముక్తి నొందినది.
ముత్యపుచిప్పల వలన విడువఁబడునది గనుక ముక్తః ముక్తయే మౌక్తికము, ముత్యము. ఈ 2 ముత్యము పేర్లు.

ముక్త కణ నిర్మాణము - (వృక్ష.) ఒక జీవకణ సంహతిలో విడివిడిగా జీవకణము లేర్పడి యుండుట (Free cell formation).    

అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి!
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, |
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తా మణిధరః || - 61శ్లో
  
తా. హిమవంశమునకు పతాకవంటి(జండాయైన) ఓ తల్లీ! నీ ముక్కు అనెడి వెదురు మాకు చేరిక యైన తగిన ఫలము నొసగు గాక, ఏ నాసిక లోపల చంద్రనాడి యనెడి నిటూర్పు నుండి(శ్వాస వదలేటప్పుడు) జారిన ముత్తెములను ధరించు చున్నదో ఆ నాసిక వెలుపలను గూడ ముత్తెము మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు. లను ధరించుచున్నది - సౌందర్యలహరి

సుద - 1.కొన, 2.తుల.
కొన - 1.చివర, 2.చెట్టు చివరికొమ్మ, 3.గుఱ్ఱపుజూలు.
కొనరిక్క - రేవతీనక్షత్రము, అశ్వని మొ. వానిలో చివరి నక్షత్రము.
తుల - 1.త్రాసు, 2.పోలిక, 3.రాసులలో ఒకటి. 
సుదతి - స్త్రీ, వ్యు.చక్కని పలువరుస కలది.
శోభనౌదంతౌ యస్యాస్సా శుభ్రదంతీ. ఈ-సీ. - చక్కని దంతములు గలది. 

సుదతి - స్త్రీ, వ్యు.చక్కని పలువరుస కలది.
శోభనౌదంతౌ యస్యాస్సా శుభ్రదంతీ. ఈ-సీ. - చక్కని దంతములు గలది. 

శుభదంతి - వాయువ్యదిశ(వాయుసంబంధి వాయవ్యము) యందున్న పుష్పదంతమను దిగ్గజమునకు భార్య, విణ. చక్కనిపండ్లు గలది, సుదతి.    

బ్రహ్మావర్తము - ప్రస్తుతపు డిల్లీ నగరమునకు వాయువ్యభాగపు దేశము.

పాంచాలి - 1.ద్రౌపది (పాంచాల రాజపుత్త్రిక), 2.బొమ్మ.
బొమ - 1.కనుబొమ, 2.ప్రతిమ, రూ.బొమ్మ.

బింబము - 1.ప్రతిమ, 2.ప్రతిబింబము, 3.దొండపండు, 4.చంద్రసూర్యమండలము, సం.వి.(వృక్ష.) కొన్ని పుష్పములలో అండాశయము క్రింద నుండు గుండ్రని పళ్ళెము వంటి దిమ్మ (Disc).
బింబతి విస్తారం ప్రస్నోతీతి బింబః, ప్న. బింబ ఆభోగే - విస్తారమును జెందునది.
బింబతి ప్రకాసత ఇతివా బింబః, బింబ గతి వ్రజనన కాంత్యసనఖాదనేషు - ప్రకాశించునది.
బిల్లిక - సూర్యచంద్రుల బింబము. 

దొండ - ఒక జాతి తైగ, సం.తుండీ.
రక్తఫల - దొండచెట్టు.
రక్తం ఫలమస్యా ఇతి రక్తఫలా - ఎఱ్ఱని పండ్లుగలది.

కాకి త్రోటి బింబన్యాయము - న్యా. కాకి ముక్కున దొండపండు కట్టిన విధము (అసమానరూప వస్తు సమ్మేళనము ఇంపు కాదనుట), ఒక న్యాయము. 

బింబోష్ఠి - 1.దిండపండువంటి పెదవి గల స్త్రీ, 2.స్త్రీ.

ప్రతిబింబము - 1.ప్రతిమ, 2.ప్రతిఫలనము, వి. (భౌతి.) అద్దము మొదలయిన వానియందు అగుపడు వస్తువుల ప్రతిఫలిత బింబము, వస్తువును బోలిన దృశ్యము (Image).

బేరము - ప్రతిమ, వై.వి. వ్యాపారము, వెలకడుగుట, సం.వ్యవహారః.

ఆభాసము - 1.కాంతి, 2.ప్రతిబింబము, 3.వాస్తవము కాకపోయినను పైకి వాస్తవమైన దానివలె కనించునది, ఉదా.హేత్వాభాసము, రసాభాసము మొ.

బొమ్మ - 1.కనుబొమ, 2.బిరుదు చిహ్నము, 3.అవమానచిహ్నము, 4.ప్రతిమ, 5.బ్రహ్మ, విణ.అల్పము, సం.1.భ్రూ, 2.ప్రతిమా, 3.బ్రహ్మ.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ప్రకృత్యా రక్తయా - స్తవ సుదతి! దంతచ్ఛద రుచేః
ప్రవక్షే సాదృశ్యం - జనయతు ఫలం విద్రుమలతా|
న బింబం తద్బింబ - ప్రతిఫలనరాగా దరుణి తం
తులా మధ్యారోఢుం - కథమివ న లజ్జేత కలయాః|| - 62శ్లో
  
తా. చక్కని పలువరుసగల తల్లీ ! స్వభావముచేత యెఱ్ఱనైన నీ పెదవుల కాంతికి (సాదృశ్యము - పోలిక)సామ్యమును చెప్పుచున్నాను. పగడపు తీగ ఫలింపదు. బింబము (దొండ) ఒక వస్తువునకు ప్రతిబింబమగుటచే నెఱ్ఱనిదయినను నీ పెదవికి పదునాఱవ పాలునకు సాటి కాదు. - సౌందర్యలహరి 

సుప్రకాశా సుఖాసీనా సుమతి స్సురపూజితా,
సుషుప్త్యవస్థా సుదతీ సుందరీ సాగరాంబరా|   

అబ్ధిపల్లవము - పగడము.
విద్రుమలతా - విద్రుమవద్రక్తత్వాద్వి ద్రుమలతా - పగడపుతీఁగవలె నెఱ్ఱనైయుండునది.
ప్రవాళలత పండు పండినచో సామ్యము లభింప వచ్చును. (పవడపు తీగ ఫలింపదు. పగడపు తీగ యని కవితా సమయమేగాని వాస్తవముగా పగడములు తీగలకు పుట్టుటలేదు. అవి పండ్లు పండుట లేదు.) బింబము (దొండ)దొండపండు నకు సామ్యము చెపుదమన్న దానికి అధర కాంతి సహజము కాదు. దొండపండునకు బింబమని పేరు.

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూర హారోజ్జ్వలాం
బొంబోష్టీం స్మితదంతపం క్తిరుచిరాం పీతాంబరాలం కృతాం| 
విష్ణుబ్రహ్మసురెంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతో స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్|

హరిచందనము - 1.చెందిరము, 2.వెన్నెల, 3.కల్పవృక్షము.
చెందిరము -
1.సింధూరము, 2.కుంకుమ, రూ.చెంద్రము, చందురము.
సిందురము - 1.సిందూరము, 2.కుంకుమ, 3.వావిలిచెట్టు, సం.సిందూరమ్.
సిందూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
కాంతరజము - కుంకుమము. చెంద్రము - చెందిరము.

శ్రీచూర్ణము - తిరుచూర్ణము.
తిరుచూర్ణము -
ఎఱ్ఱబొట్టుపొడి.

గాంధారము - 1.(సంగీ.) ఒకవిధమగు స్వరము, 2.సిందూరము, 3.కాంధహార్ అను ఒకానొక దేశము.
మేకసొరము - స్వరవిశేషము, గాంధారము.

చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక. హరిశ్చంద్రము నందు దేవీస్థానం చంద్రిక|     
వెన్నెల - (వెలి+నెల), చంద్రిక.
చెంద్రిక - చెందిరిక.
చంద్రశాల - 1.పైమేడ, 2.వెన్నెల.
మేలుమౘ్చు - మేడ, చంద్రశాల.
ఓవరి - 1.లోపలిగది, 2.చంద్రశాల.  
శిరోగృహము - చంద్రశాల.   
చంద్రతాపము - వెన్నెల; చాంద్రి - వెన్నెల; నెలవెలుగు - వెన్నెల.

చన్ద్రికా కౌముదీ జ్యోత్స్నా -
చంద్రో స్త్యస్యామితి చంద్రికా - చంద్రయుక్తమైనది.
కు ముదానా మియం కౌముదీ, తద్వికాస హేతుత్వాత్ - కలువలు పుష్పించుటకు హేతువైనది గనుక కౌముది.
జ్యోతి రస్యామస్తీతి జ్యోత్స్నా - ప్రకాశము గలిగినది. ఈ మూడు వెన్నెల పేర్లు. 

కౌముది - 1.వెన్నెల, వ్యు.కుముదములను వికసింపజేయునది, భూజాను(భూజాని - 1.విష్ణువు, 2.రాజు)ను సంతోషపెట్టునది, 2.ఉత్సవము, పండుగ, 3.కార్తీక పూర్ణిమ.

జ్యోత్స్న - వెన్నెలరేయి, రూ.జ్యోత్స్ని.
జ్యోత్స్ని - వెన్నెలరేయి.

వెన్నెలగతి - చంద్రుడు.
చంద్రుడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

నెలమేపరి - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.

వనచంద్రికా న్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెల యనురీతి, నిష్ప్రయోజన మని యర్థము).

రాకామలజ్యోత్స్న ద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ...

(ౘ)చందమామ పులుగు - చకోరము.
చకోరము - చకోరకము.
నెలత్రావడము - చకోరము, వెన్నెలపులుగు. 
జీవంజీవము - వెన్నెల పులుగు, చకోరపక్షి.
జీవేన సహచరేణ క్రీడన్ జీవతి జీవంజీవః - జీవమనఁగా సహచరము; దానితోఁగూడ క్రీడించుచు బ్రతుకునది, వన్నెపులుఁగు.
చకోరకము - 1.వెన్నెల పులుగు, రూ.చకోరము, వ్యు.వెన్నెల చూచి తృప్తి పొందునది.
చకతి తృప్యతి జ్యోస్నయా చకోరకః, చకతృప్తౌ. - వెన్నెలఁ జూచి తృప్తిఁ బొందునది, వెన్నెలపులుగు. 

ఫలమతి సూక్ష్మమైనను నృపాలుఁడు మంచి గుణాఢ్యుడైనచో
నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు రదెట్లు చంద్రికా
విలసనమైఁన దామనుభవింప జకోరము లాసఁ జేరవే
చలువగలట్టివాడయినఁజందురు నెంతయుఁ గోరి, భాస్కరా.

తా. చంద్రుని యందలి చల్లదనమునకు, చంద్రిక - వెన్నెల, రూ.చందిరిక)ఆ కిరణము లను భక్షించుటకు ఎక్కువ ఆసక్తితో చకోరములు చంద్రోదయమును కోరుచుండును. అట్లే బుద్ధిమంతులు నృపాలుఁడు - రాజు మంచి వాఁడయినచో నాతని వలన లాభము ఎక్కువ లేకున్నను, సంతోషముతో నట్టిరాజునే కోరుదురు. 

కుముదబాంధవుఁడు - చంద్రుడు.
కుముదానాం బాంధవః కుముదబాంధవః - కలువలకు చుట్టము.

కుముదము - 1.ఎఱ్ఱ తామర, 2.నైఋతు దిక్కునందలి ఏనుగు, 2.తెల్లకలువ.
కుం పృథ్వీం మోదయతీతి కుముదః ముద హర్షే - భూమిని సంతోషింపఁ జేయునట్టిది.
కుముదవర్ణత్వాత్కుముదః - తెల్లకలువవంటి వన్నె గలది.
కుముదిని - 1.తెల్లకలువ తీగ, 2.కలువలు గల కొలను.  

సితే కుముదకైరవే,
కౌమోదత ఇతి కుముదం. ముద హర్షే. - భూమియందు మోదించునది.
కే రౌతీతి కేరవః హంసః తస్యేదం ప్రియమితి కైరవం - జలమందుఁ బలుకునది గనుక కేరవమనఁగా హంస; దానికిఁ ప్రియమైనది. ఈ రెండు తెల్లకలువ పేర్లు.

సితుఁడు-శుక్రుడు Venus, విణ.తెల్లనివాడు.  
సితము - 1.తెల్లనిది, 2.కట్టబడినది. 
సినోతి మన ఇతి సితః, సిఞ్ బంధనే. - మనస్సును బంధించునది. 

అల్లి1 - మందము.
అల్లి2 - 1.తెల్లకలువ, 2.కలువవంటి నీటిపువ్వు, 3.ఒకానొక చెట్టు, 4.ఒక రకమైన పిల్లలయాట.
మందము1 - యుద్ధకాలమున వాహన యోగ్యమైన గజజాతి.
మందము2 - దట్టము, స్థూలము.

అనుపమ - నైరృతి దిక్కునందలి కుముదమను దిగ్గజము యొక్క భార్య.
న విద్యతే ఉపమా యస్యాస్సా అనుపమా - తనకు సాటిలేనిది.

కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురుమామ, సం.చంద్రమాః.
చంద్రముఁడు - చంద్రుడు; చందురుమామ - చంద్రుడు, చందమామ.
చంద్రము - చందురము, సం.చంద్రః.

జాబిలితాలుపు - శివుడు, చంద్రధరుడు. 
ౙాబిల్లి - చందమామ, రూ.జాబిల్లి.
ౙాబిలిరిక్క - మృగశీర్ష నక్షత్రము. 

జాబిలిమేపరి - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు.

చంద్రోదయము - 1.ఉల్లెడ, 2.చందురా, 3.చంద్ర్రుని పొడుగు.
ఉల్లడ - మేలుకట్టు, చాందిని, రూ.ఉల్లెద, సం.ఉల్లాభః.
మేలుకట్టు - 1.మెట్టు, 2.చాందినీ.  చాందిని - మేలుకట్టు.
(ౘ)చందువ - మేలుకట్టు, ఉల్లెడ, రూ.చందురా, సం.చంద్రోదయః.
(ౘ)చందుర - చంద్రకాంతము.

(ౙ)జాబిలిరాయి - చంద్రకాంతము.
చంద్రకాంతము - చలువరాయి.
ౘలువఱాయి - చంద్రకాంతము.

వనచంద్రికా న్యాయము - న్యా. అడవి గాచిన వెన్నెల యనురీతి, నిష్ప్రయోజన మని యర్థము).

ముకుందము - 1.ఎఱ్ఱదామర, 2.ఒక నిధి, 3.ఒకానొకమణి.
ముకుందుఁడు -
విష్ణువు, వ్యు.మోక్షము నిచ్చువాడు.

స్మితజ్యోత్స్నా జాలం - తవ వదనచన్ద్రస్య పిబతాం
చకోరాణా మాసీ - దతిరసతయా చంచు జడిమా, |  
అత స్తే శీతాంశో - రమృతలహరీ మామ్ల రుచయః
పిబన్తి స్వచ్ఛందం - నిశి నిశి భృశం కాంజిక ధియా || - 63శ్లో

తా. అమ్మా! ఓ భగవతీ, అతిమధురమైన నీ ముఖచంద్రబింబ మందస్మితము(చిరునగ వనెడి) వెన్నెలను గ్రోలుతున్న(త్రాగుచున్న) చకోరపక్షుల నాలుకలు మొద్దుబారినవైనవి. చకోరములకు మిక్కుటమగు తీపిని ఆస్వాదించుటచే ముక్కులు రుచి నెఱుగజాలకున్నవి. అందువల్ల నా పక్షులు తమ జిహ్వలు తిరిగి రుచిని పొందుటకై పులుపును గోరినవై అవి ప్రతి రాత్రులయందును స్వేచ్ఛగ, చంద్రుడి అమృతపు వెల్లువను, అన్నపుగంజి అనేభ్రాంతితో త్రాగుచున్నవి. – సౌందర్యలహరి

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరఛ్ఛంద్రనిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా.
43శ్లో

విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
దేవా ఏనం విశేషేణ ధయంతి పిబంతీతి విధుః, ఉ. పు. ధేట్పానే - వేల్పు లీతని మిక్కిలి పానము చేయుదురు.

స్వాతి - 1.సంజ్ఞాదేవి,  2.నక్షత్రములలో నొకటి. 
త్రసరేణువు -
1.సంజ్ఞాదేవి, 2.ముప్పది పరమాణువుల కొలది.
సంజ్ఞదేవి దేవశిల్పి యగు విశ్వకర్మ(ప్రజాపతిర్వై విశ్వకర్మ) కూతురు, ప్రకృతి అంశకళవల్ల అవతరించింది.

త్రసరేణు త్రికం భుంక్తే యః కాలస్య తృటిస్మృతః |
శతభాగస్తు వేధస్స్యాత్ తైస్త్రిభిస్తు లవః స్మృతః || 

త్రస్స - 1.వేద్యాధ్యయనవేళ రాలునోటి తుంపర, 2.బ్రహ్మ బిందువు, సం.త్రస్సా.
బ్రహ్మబిందువు - వేదపాఠ మందలి నోటితుంపర.

పాఠే విప్రుషో బ్రహ్నబిన్దవః : బ్రహ్మణి వేదపాఠే బిందవః బ్రహ్మబిందవః ఉ.పు. - వేదపాఠ మందలి తుంపురులు. వేదము చదువునప్పుడు నోట వెడలెడు తుఁపురులు పేరు.

బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనక్షత్రము 3.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు సం.1.శుక్రః, 2.చుక్రః.   

సృష్టిలో అతి సూక్ష్మపదార్థం పరమాణువు. రెండు 2 పరమాణువులు - ఒక 1 అణువు. మూడు 3 అణువులు - ఒక త్రసరేణువు.

                                                                          

అణువు - 1.స్వల్పమైనది, అల్పము, వి.లేశము, 2.జగత్కారణమగు సూక్ష్మ ద్రవ్యము, సహజ ధర్మమును కోల్పోకుండ విభజింపబడు సూక్ష్మాంశము (Molecule).
అల్పము - 1.నీచము, 2.సూక్ష్మము, 3.చిన్నది.
నీచము - (భౌతి.) మంద్రము (ధ్వని), అధమము (Low).
సూక్ష్మము - అణువు, విణ.సన్నము.
తని - 1.అల్పము(దోనము - అల్పము), 2.సూక్ష్మము, సం.తనుః.
స్వల్పము - మిక్కిలి అల్పము.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).
అనతి - కొంచెము, అల్పము.
లేశము - కొంచెము దనము, విణ.కొంచెము. 

జిలిబిలి - 1.అల్పము, 2.సూక్ష్మము, 3.శృంగారయుక్తము. 
జినుఁగు -
1.సూక్ష్మము, 2.అల్పము, 3.మృదువు, రూ.జిలుగు, జిలువు, సం.జాలికా.
మృదువు - మెత్తనిది; మృదులము - మెత్తనిది, మృదువు.

సన్నము - సూక్ష్మత్వము, విణ.సూక్ష్మము.
సూక్ష్మము -
అణువు, విణ.సన్నము.
సన్నగిల్లు - సన్నమగు, క్షీణించు, తగ్గు రూ.సన్నగిలు, సన్నవారు.
దభ్రము - సం.వి. సన్నము వి.1.సముద్రము 2.బొంకు. 

నఱుజు - అణువు, రూ.నజ్జ.
నజ్జు(ౙ) -
అణువు, విణ.1.మిక్కిలి నలిగినది, 2.చిన్నముక్క, రూ.నరుజు, సం.నష్టమ్.
నలినము - మిక్కిలి నలిగినది.

                                                                                        

నదము - 1.పడమరగా పారెడు యేరు, 2.మడుగు, 3.సముద్రము, 4.మ్రోత(మ్రోత - ధ్వని).
హ్రదము -
ఏటినడుమ లోతుగల చోటు, మడుగు.
మడుఁగు - అడుగు, వంగు(వంగు - ముందటికి వాలు), వి.1.గుణము, 2.కొలను, 3. 8 వీసెలు, రూ.మడువు, మడ్గు, మణుగు, మణువు.

ఆమూలాగ్రము - అడుగు మొదలు తుదివరకు, మొదటినుండి చివరివరకు, అంతయు.

అంౙ - 1.అడుగు, 2.సమీపము.
అడుగు -
1.ప్రశ్నించు, 2.యాచించు, 3.కావలెనని కోరు, వి.1.క్రిందు, 2.పాదము, 3.పండెండంగుళముల దూరము, 4.పాదప్రమాణము, 5.పద్యపాదము, విణ.హీనమైనది, అధమము. 
గుణము - 1.శీలము(శీలము - 1.స్వభావము, 2.మంచి  నడత.), 2.అల్లత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము.
కొలను - కొలఁకు; కొలఁకు - సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్. కాసారము - కొలను, వ్యు.జలము కలది.

కొంత - కొంచెము, స.కించిత్.
కించిత్తు -
ఇంచుక కొంచెము.
కొండొక - 1.కొంచెము, 2.చిన్నది, 3.చిన్నవాడు, 4.ఒక, క్రి.విణ.1.కొంచెముగా, 2.కొంచెముసేపు, 3.కొంచెము దూరము, రూ.కొండిక.
కొండిక - 1.చిన్నది, 2.అల్పము, వి.1.చిన్నవాడు, 2.బాలుడు, 3.బాలిక, సం.కుణకః.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).
చిన్నవాఁడు - బాలుడు.
కింగిరి - అల్పము, స్వల్పము.    

కణము - 1.కొంచెము, 2.నూక, 3.సూక్ష్మాంశము, విణ.సూక్ష్మమైనది, సం.వి.1.(భౌతి.) అత్యంతల్ప ప్రమాణము కల ద్రవ్యశకలము (Particle), 2.(జీవ.) జీవకణము (Cell).
జీవకణము - (వృక్ష.) జీవరసముతో నిండి యున్నగది. శరీర నిర్మాణమునకు, శరీర ధర్మములు నిర్వర్తించుటకును ఇది ప్రమాణము, (Cell). 

కణాభములు - (జీవ.) జీవకణకోశరసములో సూక్ష్మమైన కడ్డీలవలెను, పోగులవలెను, రేణువుల వలెను ఉండు ఒక విధమగు పదార్థములు (Chondriosomes or mitochondria).

జీవరసము - (జీవ.) ప్రోటో ప్లాసం (Protoplasm), జీవకణములో నుండు కోశరసము, (Cytoplasm). అష్ఠి రెండును కలిసి జీవరసము లనబడును, (ఇది ద్రవ ఘన రూపములకు మధ్యస్థముగా (శ్లేషాభము (Colloid) నుండును. దీనిరసాయనిక సంఘట్టనము క్లిష్టముగా నుండును. ప్రాణి యొక్క ప్రాణమునకు ఇది మూలాధారము.   
కొశరసము - (జీవ.) జీవకణములో నుండు జీవరసము (Cytoplasm). Proto-Plasmలో అష్ఠి (Nucleus)ని మినహా యించినచో మిగిలిన ద్రవపదార్థము.

తారాకేంద్రము - (జం.) జీవకణరసములో కేంద్రికతో నేర్పడు ఒక ప్రత్యేక మైన భాగము (Centrosome).

రేణువు - 1.చూర్ణము, ధూళి, 2.నలుసు, నలక.
చూర్ణము -
1.గంధపొడి, 2.సన్నము, 3.దుమ్ము, 4.పొడి.
తుమురు - 1.చిన్న తునక, 2.చూర్ణము, పొడి, ధూళి. 
ధూళి - దుమ్ము; దుము - దుమ్ము, సం.ధూమః
ధూళిధ్వజుఁడు - గాలి, వ్యు.దుమ్ము జెండాగా కలవాడు. 

నలఁక - 1.వ్యాధి, 2.శ్రమము, 3.బాధ.
నలి - 1.రోగము, 2.పొడి, విణ.1.నలఁగినది, 2.సన్నము అవ్య.1.అత్యంతము 2.యోగ్యము.
వ్యాధి - తెవులు, రోగము.
తెవులు - తెగులు; తెగులు - వ్యాధి, చీడ, రూ.తెవులు.
వ్యాధితుఁడు - తెవులుగంటు. 
తెగులుకొను - క్రి. రోగపడు.
తెగులుగొట్టు - వ్యాధికలవాడు.
రోగము - వ్యాధి.
రోగ నిరోధకశక్తి - (జీవ.) రోగము నెదుర్కొని దానిని జయించుశక్తి. 
రోగ నిర్భయత - (జీవ.) రక్షణశక్తి, శరీరములో రోగమును కలిగించు జీవులు ప్రవేశించి రోగములు కలుగజేయకుండ నిరోధించుశక్తి, (Immunity). 

ఆఖ్య - సంజ్ఞ, పేరు.
సంజ్ఞ - 1.సైస, 2.పేరు, 3.తెలివి, 4.పరిభాష, 5.సూర్యుని భార్య.
సంజ్ఞ -
(గృహ.) 1.అభినయము, 2.చేష్ట, 3.చేష్టలచే అభిప్రాయమును తెల్పుట (Gesture).
సంజ్ఞలు - (గణి.) రాసులు ధనరాసులో ఋణరాసులో తెలియజేయుట కుపయోగపడు గుర్తులు (+) అనునది ధనరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (-) అనునది ఋణరాసులను తెలియజేయుట కుపయోగించు గుర్తు (Signs).
సన్న - సంజ్ఞ, సైగ, సం.సంజ్ఞా.
సైగ - సంజ్ఞ, రూ.సయిగ, సం.సంజ్ఞ.

    
అభినయము - నటనము; నటనము - 1.నాట్యము, 2.కపటవర్తనము.
నాట్యము - నృత్యము, నృత్యగీతవాద్యముల కూడిక.
నృత్యము - శరీరహస్తనేత్రాభినయములచే భావములను తెలుపుచు ఆడెది ఆట.
నృత్తము - నటనము; నర్తనము - 1.నటనము, 2.ఆట.
నర్తనప్రియము - నెమలి. నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.

కృత్య - 1.ఒకానొకదేవత, 2.చేష్ట. 
చేష్ట -
1.పని, 2.వ్యాపారము.
పని - 1.కార్యము, 2.వ్యాపారము, 3.ప్రయోజనము, 4.శిల్పము.
కార్యము - 1.పని, 2.హేతువు, 3.ప్రయోజనము, సం.విణ.చేయదగినది. 
హేతువు - కారణము; కారణము - 1.హేతువు, 2.పనిముట్టు.
ప్రయోజనము - ఉద్దేశము, కారణము (Motive), (అర్థ.) వ్యక్తి యొక్క వాంఛలను అవసరములను తీర్చు శక్తి (Utility).

అభిఖ్య - 1.పేరు, 2.కీర్తి, 3.చెప్పుట, 4.కాంతి.
అభిధానము -
1.పేరు, 2.చెప్పుట, 3.నిఘంటువు, రూ.అభిధేయము.
అభిధేయము - పేర్కొనదగినది, వి.1.శబ్దార్థము, 2.గ్రంథ ప్రతిపాద్య విషయము, 3.నామధేయము. 

సమాఖ్య - 1.కీర్తి, పేరు, 2.బందకుట్టు.
సమాహ్వయము -
1.పేరు, 2.ప్రాణి, 3.ద్యూతము, 4.యుద్ధము.
పేరు - 1.నామము, 2.కీర్తి, 3.దండ(కాసుల పేరు), క్రి.ముద్దకుట్టు.
నామధేయము - పేరు, నామము.
నామము - నొసట పెట్టుకొను బొట్టు, సం.వి. నామధేయము. 

సమజ్య - 1.సభ, 2.కీర్తి.
సమజ్ఞ -
కీర్తి, రూ.సమాజ్ఞ.
కీర్తన - 1.కీర్తి, యశస్సు, 2.పాట.
యశస్వి - కీర్తికలవాడు. 

శరీరి - ప్రాణి.; జీవి - జీవించువాడు, వి.ప్రాణి. 
జీవుఁడు -
1.ప్రాణి, 2.బృహస్పతి.
బృహస్పతి - 1.సురగురుగు, 2.గురుడు (Jupiter).

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
పారీణుఁడు - పాదము ముట్టినవాడు, మిక్కిలి నేర్పరి.

(ౙ)జాడ - 1.అడుగుల గురుతు, 2.సైగ, 3.త్రోవ, 4.విధము.
అడపొడ - జాడ; త్రోవ - మార్గము.
మార్గము - 1.త్రోవ, తెరవు, 2.అన్వేషణము, 3.మార్గ కవిత్వము.
పద్ధతి - 1.మార్గము, 2.వరుస, సం.వి. (గణి. భౌతి. రసా.) సమకూర్చబడిన అవయములు (భాగములు) కలిగి క్రమసహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడినది (System) లేదా ఒక పూర్ణముగా పరిగణింపబడు వస్తువుల సమూహము.
పదవి - మార్గము, వై. వి. ఉన్నతస్థితి, సం.పదమ్.
ఏకపది - 1.మార్గము, 2.ఒకడే నడువదగ్గ మార్గము.   

సమజ్య - 1.సభ, 2.కీర్తి. సమజ్ఞ - కీర్తి, రూ.సమాజ్ఞ.
కీర్తన - 1.కీర్తి, యశస్సు, 2.పాట. యశస్వి - కీర్తికలవాడు. 
తేట - నైర్మల్యము, ప్రసన్నత.    
విరివి - విసృతి, విణ.విసృతము, వెడల్పైనది.
గడ్డకుట్టు - ముద్దకుట్టు.

చైతన్యము - 1.తెలివి, 2.ప్రాణము.
అభిజ్ఞానము -
1.గుర్తు, 2.గుర్తుపట్టుట, 3.జ్ఞానము, తెలివి.
తెలివి - 1.వివేకము, 2.ప్రకాశము, 3.కాంతి, వికాసము, 4.తేరుట, 5.తెలుపు.
వివేకము - జ్ఞానము, విచారము. జ్ఞానమును కట్టిపెట్ట నియంత లేడు! చర్చ - 1.విచారము, 2.చింత, 3.గంధములోనగు వాని పూత.
మీమాంస - (వేదాం,) 1.విచారణ, 2.కర్మబ్రహ్మ ప్రతిపాదక శాస్త్రము.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.    
వికాసము - తెలివి. జ్ఞానము - తెలివి, ఎరుక.
తేఱుట - 1.తేటపడు, 2.ప్రసన్నత నొందు, 3.ఊరడిల్లు, 4.స్వస్థతనొందు, 5.ముగియు.
తెలుపు - 1.ఎరిగించు(తెలుపుడుచేయు - ఎరిగించు), 2.మేలుకొలుపు, 3.తేర్చు, వై.వి.1.ధావళ్యము, 2.పరిశుద్ధి.
ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ధవళిమ - తెలుపు.

హ్యూ - (గృహ.) (హుఎ)1.వన్నె, చాయ, 2.కేక, అరుపు. మాహ్యుర్యే ఏకవీరికా| 
వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.
(ౘ)చాయమగఁడు - సూర్యుడు.
(ౘ)చాయ - 1.ఛాయ, 2.కాంతి, 3.సూర్యుని భార్య, 4.నీడ, 5.పోలిక, 6.రంగు, 7.వైపు, 8.జాడ, 9.సమీపము, 10.చక్కన,11.(జీవ.) జీవ పదార్థములకు సహజమైన రంగు నిచ్చు పదార్థములు (Pigment).

స్పూర్తి - 1.అదరుట, 2.తోచుట, 3.వన్నె, 4.కాంతి.
స్ఫురణము - 1.అదరుట, 2.తోచుట.
స్ఫురించు - 1.అదరు, 2.తోచు.
స్ఫురితము - 1.అదిరినది, 2.తోచినది.

మేని - కాంతి.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).  

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

ఉన్మేషము - 1.కనువిచ్చుట, 2.వికాసము, 3.కాంతి, 4.స్పురణము.
ఎలమి -
1.ఆనందము, 2.వికాసము, 3.ధైర్యము.
ఆనందము - సంతోషము, సుఖము.
వికాసము - తెలివి; జ్ఞానము - తెలివి, ఎరుక. 
దైర్యము - ధీరత్వము.

ఆడదాని ఆలోచనలో హృదయం, మగవారి ఆలోచనలో తెలివి కనిపిస్తాయి. - బ్లెస్సింగన్

తెలివి లోపించిన మంచితనము, మంచితనము లోపించిన తెలివి వ్యర్థమై పోతుంది. మంచితనము బలహినము కాకూడదు.

అచ్యుతాగ్రజుఁడు - బలరాముడు.
అచ్యుతాగ్రజఁ అచ్యుత స్యాగ్రజో జ్యేష్ఠః - అచ్యుతునికి అన్న.
అచ్యుతుఁడు - విష్ణువు.
అచ్యుతః, నాస్తి చ్యుతం స్ఖలనం స్వపదాద్యస్యసః - తన చోటునుండి భ్రంశము నొందనివాఁడు.

ఐశ్వర్యాశ్రమ చిన్పయచిద్ఘన అచ్యుతానంద మహేశశివ|  

ఓంకారేశ్వరుడు - శివుడు.
ఓం - 1.పరబ్రహ్మార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క సారభూతము. వేదాంతగ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ + ఉ + మ), మంత్రముల కెల్ల శిరోమణి. ఓంకారము నందు సమస్త జగత్తును ఇమిడి యున్నదని వేదములు చెప్పుచున్నవి). ఓంకార మమలేశ్వరమ్|

అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి.1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.

ఓంకార ప్రణవౌ సమౌ :
ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.    
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రణవము - ఓంకారము.    
ప్రకృష్టో నవః ప్రణవః, ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము. ప్రణూయతే ప్రస్తుయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయఁబడునది. ఈ రెండు ఓంకారము పేర్లు.

ఉరగము - 1.పాము, వ్యు.రొమ్ముతో ప్రాకునది, 2.ఆశ్లేష నక్షత్రము.
ఉరసా గచ్ఛతీత్యురగః గమ్ ఌ గతౌ. - ఉరస్సు చేత సంచరించునది.

ఓంకారప్రియ ఉరగభూషణ హ్రీంకారాది మహేశశివ|

విష్వక్సేనుఁడు - విష్ణు సేనాధిపతి.
విష్వక్సేనః, విష్వక్సమంతతః వ్యాప్తా సేనా యస్యః సః - అంతట వ్యాపించిన సేన గలవాఁడు. 

విష్వక్సేనప్రియా ఘృష్టి ర్వారాహీ బదరేత్యపి-
విష్వక్సేనప్రియత్వా ద్విష్వక్సేన ప్రియా - విష్ణువునకుఁ బ్రియమైనది.
వారాహైః ఘృష్యత ఇతి ఘృష్టిః సీ. ఘృషు సంఘర్షణే. - వరాహములచేత నొరయఁ బడునది.
వారాహైరాక్రాంతా వారాహీ. - అడవిపందులచేత నాక్రమింపఁ బడునది.
బదతి స్థిరీభవతీతి బదరా. బడస్త్యైర్యే. - స్థిరమై యుండునది.  ఈ మూడు 3 పాఁచితీఁగె పేర్లు.

గూఁటి - పంది, సం.ఘృష్టిః.
కులాదీన్ ఘర్షతీతి ఘృష్టిః, పు. ఘృష సంఘర్షణే. - ఉన్నత ప్రదేశాదుల నొరయునది.
ఘృష్టి - 1.పాచితీగ, 2.పోటి, 3.పంది, 4.రాపిడి, 5.కిరణము.
కిరణశబ్దేన సహ ద్వంద్వసమాసాద్గభస్తిఘృణి ఘృష్టిశబ్దాః పుంలిఙ్గాః, భాతీతి భానుః భౄ దీప్తౌ - ప్రకాశించునది. 
పోటి - 1.స్పర్థ, 2.ఊతగానిల్చిన స్తంభాదికము.

సంఘర్షము - 1.ఒర యిక, 2.పోటీ, 3.వివాదము.
సంఘర్షణ - (భౌతి.) ఉదా. ఒక వస్తువుఇంకొక దాని ఢీ కొనుట, (Collision), వా యు వు లం దుం డు అణువులు వాని ఉష్ణ తాసక్తి కారణముగ సాధారణముగ అనవరతము చలించుచు ఒక దానితో నొకటి డీకొనుచు సంకుల స్థితిలో నుండును, (Collision).

ఒరపిడి - రాపిడి, రూ.ఒరయిక.
సమ్మర్దము - 1.రాయిడి, రాపిడి, 2.గుంపు.

గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, నూలు, 3.వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).

బదర - 1.పగులు, 2.తునక.
పగులు - చీలిక, క్రి.భిన్నమగు.
చీలిక - చూ.చీలిక
చీరిక - 1.పాయ, రూ.చీలిక.
పాయ - 1.ఖండము, 2.ఒక నదిలో నుండి చీలిన శాఖ.
ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, ఆఫ్రికా అస్త్రేలియా, ఐరోపాఖండములు), (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన ఘనరూపభాగము, (భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్న భిన్నముగ చేయబడిన భూభాగము.

ఇండె - 1.పూడంద, 2.ఎముక కీలు, 3.చీలిక.

భిన్నము - 1.పగిలినది, చీలినది, 2.వేరుపడినది, సం.వి.(గని.) ఒక రాశిలోని భాగము (Fraction).
చీలికలోయ - (భూగో.) రెండు రకముల భూభాగముల మధ్య పగులేర్పడి, భూకంపము లేక యితర కారణముల వలన భూమి దించుకొని పోయి లోయగా నేర్పడిన భూభాగము. 

పంతము - 1.స్పర్థ, పోటీ, 2.విధము, సం.స్పర్ధా.
పోరితము - 1.స్పర్థ, 2.పోరాటము.
స్పర్థ - (అర్థ, వాణి) అనుభోక్త లెల్లరు తమసరుకులనే కొనవలెనని ఉత్సాదికులు తమలో తాము పోటీపదుట ఉత్పాదన తక్కువగానున్న సరకుకొరకు అనుభోక్తుల మధ్యగల పోటీ, మొదటి పరిస్థితిలో ధరలు తగ్గుట. రెండవ పరిస్థితితో ధరలు పెరుగుట జరుగును, సం.వి. 1.పోటీ, 2.పోలిక(పోలిక - సామ్యము), 3.క్రమమున్నతి.
పోరాటము - జగడము, కలహము, యుద్ధము.
ౙగడము - కలహము, యుద్ధము, సం.ఝకటః.
కలహము - సమరము, వికృ.కయ్యము.
సమరము - యుద్ధము, వ్యు.మరణముతో కూడినది.
సంగ్రామము - యుద్ధము; యుద్ధము - 1.కయ్యము, 2.పోరు.
కయ్యము - జగడము, యుద్ధము.

సూకరము - పంది, శూకరము.
పంది - సూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.

కయ్యపుదిండి - (కయ్యము+తిండి) కలహభోజనుడు, నారదుడు.
ౙగడగొండి - కలహశీలుడు, కలహశీలురాలు.

వారాహి - 1. ఒక మాతృక,  2.అడవి యాడుపంది.
వరారోహ-ఉత్తమ స్త్రీ, పెద్ద పిరుదులు గల స్త్రీ.
పుంసా ఆరుహ్యత ఇతి ఆరోహః ఖతిః, వరః శ్రేష్ట ఆరోహో (అ)స్యా ఇతి వరారోహా - పురుషునిచేత ఆరోహింపఁబడునది గనుక ఆరోహ, మనఁగాఁ బిఱుఁదు. - శ్రేష్టమైన పిఱుఁదులు గలిగినది. సోమేశ్వరము నందు దేవీస్థానం వరారోహ|
వామ - ఉత్తమ స్త్రీ. 

కిమిల - విశేషసంతానము గల స్త్రీ.

గీతావాద్యే తధానృ త్యే సంగ్రామే రిపు సంకటే|
ఆహారే వ్యవహారే చ త్యక్త్వా లజ్జాం సుఖీ భవేత్||

తా. సంగీతము పాడునపుడు, వాద్యము వాయించునపుడు, నాట్య మాడునపుడు(నాట్యము చేయునపుడు), శత్రువులతో బోరునపుడు, భోజనము(ఆహారము - 1.భోజనము, భోజన పదార్థము, 2.అపహరణము, 3.తెచ్చుట.)చేయునపుడు, వ్యవహార మాడునపుడు సిగ్గు విడిచిన సుఖము గల్గును. - నీతిశాస్త్రము 

అంబా శూలధనుఃకుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమా సేవితా|
మల్లాద్యాసురమూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ.
  

విశుక్రప్రాణహరణ - వారాహీ వీర్యనందితా|
కామేశ్వరముఖాలోక - కల్పితా శ్రీగణేశ్వరా.

జనార్ధనుఁడు - విష్ణువు.
జనార్థనః సముద్రమధ్యవరినో జననామ్నో సురా నర్దితవానితి జనార్థనః - సముద్రమధ్యమం దుండెడు జనులనెడు నసురులఁ(అసురులను)బీడించువాఁడు.
ప్రళయకాలే స్సర్వానపి అరయతీతి వా జనార్దనః - ప్రళయకాలమం దెల్ల జనులను బీడించువాడు. అర్దపీడనే. దశమం తు జనార్ధనమ్|

మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.
మూర్ఛతి సముచ్ఛ్రితో భవతీతి మూర్తిః, సీ, మూర్ఛా మోహనముచ్ఛ్రాయయోః. - ఉన్నత మగునది.

అవిశ్రాంతం పత్యు ర్గుణగణకథామ్రేడనజపా
జపాపుష్పచ్ఛాయా - తవ జనని! జిహ్వా జయతి సా| 
యదగ్రాసీనాయాః - స్పటికదృషదచ్చచ్చవి మయీ  
సరస్వత్యా మూర్తిః - పరిణమతి మాణిక్య వపుషా| - 64శ్లో
  
తా. ఓ జనని ! తల్లీ! నీ పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.)గుణాలను కీర్తించడంలో అలసట చెందని దానవు. జపాకుసుమశోభను అధిగమించిన భవదీయారుణ జివ్వకు జయమగు ను గాక! నీ నాలుక కొనయందున్న సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒక నది.)యొక్క శుద్ధ స్ఫటికవంటి(మూర్తి - 1.శరీరము, 2.దేవుని స్వరూపము, 3.ప్రతిమ.)శరీరవర్ణం మ్మణిక్య సదృశంగా పరిణతమై పోయింది. -  సౌందర్యలహరి

వెనుకటి వానకారు - (వ్యవ.) అక్టోబరు, నవంబరు నెలలు హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ కార్తెలు శరదృతువు (post-monsoon period).

కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.    
కారు2 - వి. 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).

కార్తె - సూర్యుడుండు నక్షత్రము,  ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. క్రాంతిః.

16. విశాఖ - (సారిక) కుమ్మరి చక్రమును పోలియుండును, 5 ఐదు నక్షత్రములు. 

దూరమస్మచ్ఛత్రవో యంతు తాః | తదింద్రాగ్నీ కృణుతాం తద్వి - శాఖే | తన్నో దేవా అనుమదంతు యజ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభయన్నో అస్తు | నక్షత్రాణామధిపత్నీ విశాఖే | శ్రేష్ఠావింద్రాగ్నీ భువనస్య గోపౌ | విషూచ శ్శత్రూనపబాధమానౌ | అపక్షుధన్నుదత్తామరాతిమ్ |14||

రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
రాధా విశాఖా, త్యుక్తాపూర్ణిమా (అ)స్త్యస్మిన్నితి రాధః - రాధ యనఁగా విశాఖ, దానితోఁ గూడిన పున్నమ గలది. బృందావనము నందు దేవీస్థానం రాధ| 

రాధా విశాఖా -
రాధ్నోతి కార్యమనయా రాధా, రాధ సంసిద్దౌ - దీనిచేఁ గా(కా)ర్యము సిద్ధించును.
విశాఖతే కాంత్యా వ్యాప్నోతీతి విశాఖా శాఖృ వ్యాప్తౌ - కాంతి చేత వ్యాపించునది. విశాఖ పేర్లు. రాధ యనఁగా విశాఖ.

విశాఖుఁడు - షణ్ముఖుఁడు.
విశాఖానక్షత్రే జాతః విశాఖః - విశాఖనక్షత్ర మందుఁ బుట్టినవాఁడు.
వినా పక్షిణా మయా రేన శాఖతి వ్యాప్నోతీతి విశాఖః - పక్షియైన నెమిలిచేతఁ దిరుగువాఁడు, శాఖృ శ్లాఖృ వ్యాప్తౌ. విశాఖ శంకరాత్మజా|    

రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
రాధా విశాఖా, త్యుక్తాపూర్ణిమా (అ)స్త్యస్మిన్నితి రాధః - రాధ యనఁగా విశాఖ, దానితోఁ గూడిన పున్నమ గలది. బృందావనము నందు దేవీస్థానం రాధ| 

రాధా విశాఖా -
రాధ్నోతి కార్యమనయా రాధా, రాధ సంసిద్దౌ - దీనిచేఁ గా(కా)ర్యము సిద్ధించును.
విశాఖతే కాంత్యా వ్యాప్నోతీతి విశాఖా శాఖృ వ్యాప్తౌ - కాంతి చేత వ్యాపించునది. విశాఖ పేర్లు. రాధ యనఁగా విశాఖ.

విశాఖము - విలుకాడు రెండు పాదముల నడుమ జేరడెడముగ నిలుచుట, విణ.శాఖలు లేనిది.

షడాననుఁడు - కుమారస్వామి, షణ్ముఖుఁడు, వ్యు.ఆరు ముఖములు కలవాడు.
అగ్ని పత్నీనాం షణ్ణాం స్తన్య పానార్థం షట్ ఆననాని యస్య సః షడాననః - అగ్ని భార్యలైన షట్కృత్తికలత్తి స్తన్యపానముఁ జేయుటకై యాఱు ముఖముల ధరించినవాఁడు.
షణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.

రథ్యా ప్రతోళీ విశిఖా -
రథ్య - 1.రథసమూహము, 2.రాజమార్గము, 3.మార్గము.
రథాయ హితా రథ్యా - రథమునకు యోగ్యమైనది.
ప్రతోళి - పెద్దవీథి.
ప్రతోలయంతి జనా అస్యామితి ప్రతోళీ, తుల ఉన్మాదే. - దీనియందు జనులు మదింతురు.
విశిఖి - 1.రాజమార్గము, 2.పార.
విశీయంతే ప్రకాశ్యంతే (అ)స్యామితి విశిఖా, శీఙ్ స్వప్నే, విపూర్వకత్వాత్ ప్రకాశార్థకత్వం - దీనియందుఁ ప్రకాశింపఁజేయఁబడుదురు.
ఉపనిష్కరము - పురమార్గము, రాజమార్గము. 
పెందెరువు - రాజమార్గము. 
రాజమార్గము - రధములు పోదగిన విశాల మార్గము.
ముండితశిరోవత్సమభూమిత్వా ద్విశిఖా - ముండితశిరస్సువలె సమభూమిగా నుండునది. ఈ 3 పురమధ్యమార్గము పేర్లు. గ్రామమునఁ బ్రధానమైన రచ్చమిట్ట పేర్లని కొందఱు.

పార - (వ్యవ.) వ్యవసాయ దారుడు నేలను పై పైని త్ర వ్వు ట కుపయోగించు నొక విధమగు ఇనుప పనిముట్టు (Spade).
పారగమ్యము - (రసా.) చొరనిచ్చునది (Permeable).

పారదర్శకము - (భౌతి.) కాంతి కిరణములను తన గుండా పోనిచ్చునది (Transperant).
పారభాసకము - (భౌతి.) అస్పష్టముగ పారదర్శకమైనది (Transclucent).

పారస్పర్శము - (వృక్ష.) కలికాంతః పత్ర పారస్పర్శము, మొగ్గలో నున్న చిరుతయాకులు పరస్పరముగ సమర్పబడియున్న విన్యాసము (Vernation).

విశిఖము - బాణము.
విశీయతే తనూక్రియతే విశిఖః, శీఞ్ నిశాతనే. - వాఁడియౌటకొఱకు సన్నముగాఁ జేయఁబడునది.
విశన్ ఖనతీతి వా విశిఖః - ప్రవేశించుచు వ్రక్కలించునది.   

స్కందశ్చ కృత్తికాపుత్త్రో యే విశాఖాదయస్తతః|
దోషస్య శర్వరీపుత్రః శిశుమారో హరేఃకలాః |

ఉపేంద్రుఁడు - 1.వామనుడు, విష్ణువు, 2.కృష్ణుడు.
ఉపేంద్రః ఇంద్ర ముపగతః అనుజత్వా దుపేంద్రః - ఇంద్రునికి తమ్ముడు గనుక ఉపేంద్రుడు.
ఇంద్రరక్షణాయ తత్సమీపే స్థితో వా - ఇంద్రుని రక్షించుటకై అతనియొద్ద నున్నవాఁడు.
ఇంద్రలోకా దుపరితిస్థతీతి వా ఉపేంద్రః – ఇంద్ర లోకమున కంటె పైలోక మందుండువాఁడు.
ఇంద్రావరజుఁడు - ఇంద్రునితమ్ముడు, ఉపేంద్రుడు, విష్ణువు.
ఇంద్రస్య అవరజః - ఇంద్రుని దమ్ముడు.
అవరజుఁడు - తమ్ముడు.
అవరస్మిన్ కాలే జాతుః అవరజః - తరువాతి కాలమందుఁ బుట్టినవాఁడు.

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి, (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).
మాతి వర్తతే (అ)త్ర మాతా, ఋ. సీ. మామానేవర్తనే చ - గర్భ మీమెయం దిమిడి యుండును.

రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్
శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజి త్సంజ్ఞాత లగ్నంబునన్
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతో పేతకున్
దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్.

భా|| నిర్మలమైన గొప్ప పుణ్యవ్రతమును ఆచరించినది గొప్ప పతివ్రతగా పేరు పొందినది అయిన దేవమాత అదితి - 1.దేవతల తల్లి, కశ్యపుని భార్య, 2.పార్వతి, 3.భూమి, 4.పునర్వసు నక్షత్రము. గర్భంనుండి వామన రూపంతో మహావిష్ణువు శ్రావణమాస ద్వాదశి, శ్రవణా నక్షత్రం, అభిజిత్తు లగ్నం, పట్టపగలు రవి - 1.సూర్యుడు, 2.జీవుడు. ఆకాశం నట్ట నడుమ ప్రకాశించుచుండగా, గ్రహాలు నక్షత్రాలు చంద్రుడు ఉచ్చదశలో ఉండగా సమస్త లోకాలకు అధిపతి దేవదేవుడు జన్మించాడు.

ఉపేంద్రో వామనఁ ప్రాంశు అమోఘః శుచి రూర్జితః
అతీంద్రః స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః| - 17స్తో
 

వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు. 

టింగణా - పొట్టివాడు, వామనుడు.   
కొట్ర1 - వామనుడు, సం.ఖటేరకః.
కొట్ర2 - పిండి మొ.వి ఉడుకబెట్టుటకు పెట్టిన ఎసరు.

ఖర్వో హ్రస్వశ్చ వామనః,
ఖర్వతి వికలాఙ్పేక్షయా శ్రేష్ఠత్వేన దృప్యతి ఖర్వః కర్వ ఖర్వ గర్వ దర్పే. - వికలాంగునికంటె శ్రేష్ఠుఁ డౌటచేత గర్వించువాఁడు.
హ్రస్యతే హ్రస్వః హ్రసశ్బ్దే నవ్వఁబడువాఁడు.
వామత్వమస్యాస్తీతి వామనః - కుటిలత్వము గలవాఁడు. ఈ 3 పొట్టివానిపేర్లు.

వట్రము - కురుచ, హ్రస్వము, వి.వక్కాకు తిత్తి.   

గిడస - హ్రస్వము, పొట్టి, గిటక.
హ్రస్వము - కురుచ, పొట్టి.
కుఱుఁౘ - హ్రస్వస్వరము, విణ.హ్రస్వము. 
గిటక - పొట్టి, పొట్టివాడు.

పదునేనవదియైన కపట వామనావతారంబున బలిని బదత్రయంబు యాచించిమూడు లోకంబుల నాక్రమించెఁ ; పదిహేనో అవతారంలో మాయా "వామనాతారు" డై బలిచక్రవర్తిని మూడడుగులు దానమడిగి(త్రివిక్రముడు - విష్ణువు, వ్యు.మూడు లోకముల మూడడుగులుగా కొలిచి యాక్రమించినవాడు.)ముల్లోకాలు ఆక్రమించాడు.

ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన,
పదనఖనీరజనిత జనపావన |
కేశవ! ధృత వామనరూప! జయ జగదీశ! హరే!

సమయమును గాంచి ద్వేషవేషమును మార్చి
రాక్షసులమైత్రి చేసిరి శిక్ష కనిరి
గొడుగు వట్టిరి వలసిన యడుగు మాని
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|

వామనుఁడు - విష్ణువు, విణ.పొట్టివాడు.

మట్టము1 - కొలది, విణ.1.సమము, 2.కొంచెము, 3.పొట్టి, సం.మఠమ్.
మట్టము2 - (గణి.,భౌతి,) ఏకతలము (Level).
సపాట - మట్టము, సమము, రూ.సపాటము.
సమము - 1.సమానము, 2.సాధువు.
సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.

బ్రహ్మూపేంద్ర శిరోరత్న రంజితాయై నమోనమః|

బురుక - బిడ్డ, విణ.పొట్టి.
బురుకఁడు - వామనుడు, పొట్టివాడు. చతుర్ధం వామనం తధా|

బుడుత - 1.బిడ్డ, బాలుడు, విణ.పొట్టి (బుడుతడు). చిన్నవాడు - బాలుడు. 
బుడుతకీచులు - పోర్చుగీసు దేశస్థులు (Portuguese). 

రణము - 1.యుద్ధము, 2.మ్రోత.
రణన్తి భేర్యాదయో (అ)త్ర రణః రణశబ్దే. - భేరి మొదయైనవి దీని యందు మ్రోయును.

అథ శీర్షకమ్, శీర్షణ్యం చ శిరస్త్రే -
శీర్షకము - శిరస్త్రాణము, కిరీటము, శీర్షణ్యము.
శీర్షం రక్షతీతి శీర్షకం - శిరస్సును రక్షించునది, శిరసి హితం శీర్షణ్యం - శిరస్సునందు హితమైనది.
శిరస్త్రము - శిరస్త్రాణము, ఇనుప టోపి.
శిరః త్రాయత ఇతి శిరస్త్రం, త్రైఙ్ పాలనే. - శిరస్సును రక్షించునది. ఈ 3 తలబొమిడికము పేర్లు.
గొగ్గి - 1.ఎచ్చుతక్కువైనది, వి.1.ఎచ్చుతగ్గులుగా నుండుట, 2.శిరస్త్రాణము, 3.ఎచ్చుతగ్గులు గల ముత్తెము. అరగని ముత్యాలకు మెరుగుండదు. 

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి, (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).
మాతి వర్తతే (అ)త్ర మాతా, ఋ. సీ. మామానేవర్తనే చ - గర్భ మీమెయం దిమిడి యుండును.

వదనము - నోరు, ముఖము.
వదంత్యనేన వదనం, వద వక్తాయాం వాచి. - దీనిచేత పలుకుదురు.

రణే జిత్వా దైత్యా - నసహృతశిరస్త్రైః కవచిభిర్
నివృతై శ్శండాంశ - త్రిపురహర నిర్మాల్య విముఖైః|   
విశాఖేంద్రోపేంద్రై - శ్శశి విశద కర్పూర శకలాః  
విలీయంతే మాత - స్తవ వదనతాంబూల కబళాః| - 65శ్లో
         
తా. ఓ తల్లీ! మాతా! యుద్ధమున రాక్షసుల జయించి వచ్చి, తలపాగాలను కవచములను విడదీసి వచ్చిన విశాఖుఁడు - షణ్ముఖుఁడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు మువ్వురు కూడా - చణ్డాంశ డను(చండుఁడు - 1.మిక్కిలి కోపము గలవాడు, 2.వాడిమి కలవాడు. ప్రమథునిచే ననుభవింప దగిన శివుని నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి. తొలగించుటకు సమ్మతింపరు. అట్టివారు చంద్రుని వలె విశదము - తెల్లనిది, స్పష్టమైనది.)స్తోత్రము చేయదగినదైన నీ వదనము - నోరు, ముఖము. కప్పురపు తాంబూల కబళము- ముద్ద, కడి, గ్రాసము తినుట కుత్సాహించుచున్నారు. - సౌందర్యలహరి

శుద్ధవిద్యాంకురాకార - ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా|
కర్పూరవీటికామోద - సమాకర్షద్దిగంతరా. - 10

సమయమును గాంచి ద్వేషవేషమును మార్చి
రాక్షసులమైత్రి చేసిరి శిక్ష కనిరి
గొడుగు వట్టిరి వలసిన యడుగు మాని
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|

శాఖి - 1.వృక్షము, 2.వేదము, వ్యు.శాఖలు కలది.
శాఖాః అస్య సంతీతి శాభీ. న. పు. - కొమ్మలు గలిగినది.
శాఖ - 1.చెట్టుకొమ్మ, 2.వేదభాగము, 3.చేయి.
కొమ్మ - 1.శాఖ, 2.స్త్రీ.
కొమ - ఆడుది, రూ.కొమ్మ.
కొమరాలు - 1.యువతి, 2.సౌందర్యవతి.

శాఖలేనిమంత్రి - (రాజ.) ప్రత్యేక పరిపాలన శాఖకు నిర్దేశింపబడని మంత్రి (Minister without Portfolio).

శాఖావీన్యాసము - (వృక్ష.) ప్రకాండముపై కొమ్మలు బయలుదేరు తీరు (Mode of branching).  

శాఖామృగము - కోతి, వ్యు.చెట్ల కొమ్మలపై తిరుగు మృగము.
కొమ్మత్రిమ్మరి - కోతి monkey.
శాఖాచారీ మృగః శాఖామృగః - కొమ్మలయందుఁ జరించు మృగము.

సంసారవృక్ష మఘబీజ మనన్తకర్మ -
శాఖాయుతం కరణపత్ర మనఙ్గపుష్పమ్|
ఆరుహ్య దుఃఖఫలినం పతతో దయాలో!
లక్ష్మీనృసింహ! మమ దేహి కరావలమ్బమ్. – 8స్తో

శిఖావంతుఁడు - అగ్ని, విణ.జుట్టుముడి కలవాడు.
శిఖాజ్వాలా అస్య సంతీతి శిఖావాన్ త. పు. - జ్వాలలు గలవాఁడు.
శిఖ - 1.జుట్టు, 2.సిగ, 3.కొన. 
శాఖతే వ్యాప్నోతీతి శిఖా, శాకృ వ్యాప్తౌ - వ్యాపించునది.

శిఖావళము - నెమలి.
శిఖాచూడా అస్యాస్తీతి శిఖావళః, శిఖీ చ. న. పు. చుంచుగలది గనుక శిఖావళము, శిఖియును.

కాకపక్ష శ్సిఖణ్డకః,
కాకపక్షము - పిల్లజుట్టు, కూకటి.
కార్ష్ణ్యచాఞ్చల్యాభ్యాం కాకపక్షసాదృశ్యాత్కాకపక్షః. - నలుపుచేతను కదలుటచేతను, కాకిఱెక్కలవలె నుండునది.
కూఁకటి - పిల్లజుట్టు, జుట్టు, విణ.ప్రధానము, 2.లేతది, సం.కూటకః.
శిఖండకము - నెమలిపురి, పిల్లజుట్టు, రూ.శిఖండము.
శిఖాభి రగ్రభాగై ర్డీయతే చలతీతి శిఖండః, డీఙ్ విహాయసాగతౌ. - అగ్రభాగములచేత కదలుచుండునది.
శిరసి ఖండత్వేన వర్తమానత్వాచ్ఛిఖండః - శిరస్సునఁ బిలకగా నుండునది.      

శిఖండి - 1.దృష్టద్యుమ్న్యుని అన్న, 2.నెమలి, 3.నెమలిపురి, 4.కోడి, 5.బాణము.
శిఖండి వలె ఇదెక్కడ దాపురించింది అని తిడుతుంటారు.

గుచ్చకము - 1.కుచ్చు, 2.పూగుత్తి, 3.నెమలిపురి, రూ.గుచ్ఛము.

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.

శిఖివాహనుఁడు - కుమారస్వామి.
శిఖీమయూరో వాహనం యస్య సః శిఖివాహనః - నెమిలి వాహనముగాఁ గలవాఁడు.
శిఖి - 1.అగ్ని, 2.నెమిలి, 3.కోడి, 4.చెట్టు, బాణము.

శిఖినౌ వహ్ని బర్హిణౌ,
శిఖిన్ శబ్దము అగ్నికిని, నెమలికిని, పేరు. శిఖాః అస్య సంతీతి శిఖి, స. పు. జ్వాలలను, చుంచును గలిగినది. షోడశ శ్శిఖివాహనః|

కేకి - నెమలి.
కేకారవో స్యాస్తీతి కేకీ, స. పు. - కేకారవముగలది.
కేక - నెమలికూత.

కేకా వాణీ మయూరస్య -
కే శిరసి కాయతే అభివ్యజ్యత ఇతి కేకా. - శిరస్సు నెత్తి పలుకఁబడునది. ఈ ఒకటి నెమలికూఁత.

కేకరించు1 - 1.కేకలువేయు, 2.గొంతుక సరిచేసికొనునట్లు ధ్వనిచేయు.
కేకరించు2 - క్రీగంట చూచు.

కటాక్షము - 1.కడకంటి చూపు, కడకన్ను.
కడగన్ను - కటాక్షము, క్రేఁగన్ను.
క్రేఁగన్ను - (కేవ+కన్ను) కడకన్ను, అపాంగము.

కటాక్షో (అ)పాన్గదర్శనే,
అపాంగదర్శనే కటాక్షోవర్తతే, కడకంటిచూపు కటాక్ష మనం బడును.
కటేనేత్ర దేశే అక్ష్ణోతీతి కటాక్షః అక్షూ వ్యాత్తా. - కటమనఁగా నేత్రములయొక్క వెలుపలి భాగము, దానియందు వ్యాపించునది.

అపాంగము - కడకన్ను, విణ.అంగహీనము.

అపాఙ్గా నేత్రయో రన్టౌ -
నేత్రయోరన్తౌ అపాఙ్గా విత్యుచ్యేతే. - రెండుకన్నుల కడలు అపాంగము లనంబడును, కడకన్నులు.
అఙ్గా న్నాసికాయా అపకృష్టౌ అపాఙ్గా - అంగము కంటె అపకృష్టములైనవి. ఈ ఒకటి కడగన్నుల పేరు.    

మాయురము - నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది.

(ఌ)ౠకారకృతి శోకాపోహన
కేకారవయుత కేకి వినోదన| ||శరవణభవ||

వీణియ - 1.కస్తూరి మృగము యొక్క బొడ్డు కాయ, 2.వీణ, సం.వీణా.

వీణా తు వల్లకీ విపఞ్చీ -
వీణ - విపంచి, తంత్రీవాద్యము, రూ.వీణాము, వీణె, వీణియ.  
వేతి జాయతే స్వరో (అ)స్యామితి వీణా. వీ గతి వ్రజనకాంత్యసన ఖాదనేషు. - స్వరము దీని యందుఁ బుట్టును.
వల్లకి - వీణ.   
వల్లతే ధ్వని విశేషమితి వల్లకీ. ఈ. సీ. వల వల్ల సంవరణే. - స్వర విశేషమును ధరించునది.
విపంచి - వీణ; (విపంచిక). 
విపంచయతి స్వరానితి విపంచీ. ఈ. సీ. పచి విస్తారే. - స్వరములను విస్తరింపఁ జేయునది.
వివిధం పంచ్యంతే వ్యక్తీక్రియంతే స్వరా అస్యామితి వావిపంచీ. పచి వ్యక్తీకరణే. - దీనియందు స్వరములు వ్యక్తములుగాఁ జేయబడును. ఈ మూడు 3 వీణ పేర్లు.

ఘోషవతి - వీణ.
సారెలు - వీణ మెట్లు.
నిక్వణము - వీణ లోనగు వాని మ్రోత, రూ.నిక్వాణము.

పశుపతి - శివుడు.
పశూనాంజీవానాం పతిః పశుపతిః. ఈ-పు. - పశువులనగా ప్రమథులు, జంతువులు, వానికి ప్రభువు.
పశువః క్షేత్రజ్ఞాః తేషాం పతిఃత్రాతా సంసార బంధనాత్ - పశువులనఁగా జీవులు, వారిని సంసారబంధమువలన రక్షించువాడు.

ఆరబ్ధము - ఆరంభింపబడినది.

ఒళగు - 1.మర్మము, 2.లోకువ, 3.వీణాదండము, రూ.ఒళవు.
మర్మము - జీవస్థానము, ఆయుస్సు.
ఒళవు - ఒళగు.
ఒళవరి - మర్మజ్ఞుడు.

బై సణ - వీణసొరకాయ యొక్క బంధనము, రూ.బయిసణ. 
కిటకిట - 1.పెక్కురు ఎడుములేకుండ కిక్కిరియుట, 2.వీ ణె బి ర డ త్రిప్పుట యందలి ధ్వన్యనుకరణము. 

తంత్రి - 1.కంతి, 2.నరము, 3.త్రాడు. 
తంతి - లోహపుతీగ, సం.తంత్రీ.

స్పందనము - (భౌతి.) ఒక బిగించి యున్న వీణతీగవంటి దానిని చేతిలో లాగి విడిచిపెట్టి నప్పుడు ఆతీగ అటునటు చేయు ఊగులాట, ఒక వస్తువు దాని విశ్రాంతి స్థితినుండి ఇటునటు చలించి మరల మరల విశ్రాంతి స్థానమునకు వచ్చు చలనపురీతి, (Vibration). 

వాద్యము - వీణలోనగునవి.
వాపు - వీణాది వాద్యము వాయించుట, రూ.వాయింపు.

వాదిత్రము - 1.తతము (వీణ మొదలగు), 2.ఆనద్ధము (మద్దెల మొదలగు, 3.సుషిరము (పిల్లనగ్రోవి), 4.ఘనము, తాళములు మొదలగునవి, అను వాద్య చతుష్టయము, వాద్యధ్వని.
తతము - (భౌతి.) 1.బిగించబడినది, 2.వ్యాపించినది (Strectched), వి.1.ఇటునటు బలముగా లాగబడిన తంతువు (Stretched String), 3.బిరడాలు త్రిప్పిన లాగబడిన (బిగిసిన) తీగ, 3.వీణాది వాద్యము, 4.గాలి.
వాదవము - 1.వీణాది చతుర్విధ వాద్య ధ్వని, 2.మ్రోయించుట.

గద్యకావ్యము - వచన కావ్యము.
గద్యము - వచనము, 2.చెప్పదగినది, వ్యతి.పద్యము.
వచనము - మాట.
ఉచ్యత ఇతి వచనం, వచశ్చ, స, న. - పలుకఁబడునది.    

వాణి - 1.పలుకు, సరస్వతి.
వణ్యతే శబ్ద్యత ఇతి వాణీ, ఈ .సీ. వణ శబ్దే. - పలుకఁబడునది.  

గౌసెన - వీణ మొ.ని. యొర, రూ.గవుసెన, సం.కోశః.
నిశోళః ప్రచ్ఛదపటః - 
నిచోళము - గౌసెన, కప్పుడు దుప్పటి.
నితరాం చుల్యతే అచ్ఛాదనే శయ్యాదికం నిచోళః. - దీనిచేత పఱుపు మొదలైనవి కప్పఁబడును.
శాటి - 1.కాషాయవస్త్రము, 2.దుప్పటి, రూ.శాటిక.
ద్విపటి - దుప్పటము, దుప్పటి.
దుప్పటము - వెలగల సన్నని వస్త్రము, సం.ద్విపటమ్.
దుప్పటి - ద్విపటి, కప్పుకొను వస్త్రము, నిచోళము, రూ.దుప్పటీ, సం.ద్విపటీ.
పౘ్ఛడము - 1.బట్ట, 2.పరుపుమీది దుప్పటి, సం.ప్రచ్ఛదః. 
ప్రచ్ఛాద్యతే (అ)నేనేతి ప్రచ్ఛదః సచాసౌ ప్రటశ్చ ప్రచ్ఛదపటః. - దీనిచేత కప్పఁబడును. ఈ 2 పఱుపుచీర, గవిసెన.

ప్లోతము - 1.గాయమునకు కట్టుగుడ్డ, 2.బట్ట. 

పటము - 1.వస్త్రము, 2.చిత్తరువు వ్రాయు వత్రాదికము.

విపంచ్యా గాయన్తీ - వివిధ మపదానం పశుపతే
స్త్వయా రబ్ధే - వక్తుం చలితశిరసా సాధు వచనే|
త్వదీయై ర్మాధుర్యై - రపలపిత తంత్రీ కలరవాం
నిజాం వీణాం వాణీ - నిచుళయతి చోళేన నిభృతమ్|| - 66శ్లో
 
తా. తల్లి! సరస్వతి తన వీణియతో పశుపతి - శివుడు గాథలను పాడుచుండగా, నీవు తల యూపుచు మనస్సునందు కలిగిన సంతోషముతో సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః. వచనము-మాట పలుకగనే, నీ మాటలకు తన వీణాతంత్రీ(కలరవము - పావురము)కంటె మాధుర్యము కలదని తెలిసి, వాణి - 1.పలుకు, 2.సరస్వతి తన వీణగీత గవిసెనతో కప్పిపుచ్చుచున్నది. – సౌందర్యలహరి

కరవీరము - 1.కత్తి, 2.గన్నేరు.
కరవీరవత్ ఖడ్గవత్ మార్కత్వాత్ రసపానేన కరవీరః - తనరసపానముచేత ఖడ్గమువలెఁ జంపునది. 
గన్నెరు - ఒకరకపు పూలచెట్టు, రూ.గన్నెర, గన్నేరు. 

నిచులో హిజ్జలో (అ)మ్బుజః,
నిచులము - 1.కప్పుడు దుప్పటి, 2.ఎఱ్ఱగన్నేరు.
నిచోలతే అంబునా నిచులః, చల నిమజ్జనే. - జలముచేత నిండింపఁబడునది.
హితం జల మస్య హిజ్జలః - హితమైన జలము గలది., పా. ఇజ్జలః.
అంబుజము - 1.నీటినుండి పుట్టినది, తామర, 2.ఎర్రగన్నేరుచెట్టు, 3.హారతి కర్పూరము, 4.శంఖము, 5.సారసపక్షి.
అంబుని జాయత ఇత్యంబుజః - జనీ ప్రాదుర్భావే - జలమందుఁ బుట్టినది. ఈ 3 ఎఱ్ఱగన్నేరు పేర్లు.

అంబుజగర్భుఁడు - తామర జన్మస్థలముగా కలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

అంభోజము - 1.తామర, (జం.) సారసపక్షి, బెగ్గురుపక్షి.
అంబోరుహము - 1.తామరపువ్వు, 2.(జం.) బెగ్గురుపక్షి.
అంభసి రోహతీతి అంభోరుహం - జలమందుఁ బుట్టునది.   
సారసము - 1.తామర, 2.బెగ్గురపక్షి.
సరసిభవం సారసం - సరస్సునఁ బుట్టినది. 
సారస్యము - సరసత్వము.

నిజసల్లాపమాధుర్య-వినిర్భర్త్సితకచ్ఛపీ|
మంద్స్మితప్రభాపూర-మజ్జత్కామేశ మానసా. - 11    

అంతర్యాగ ప్రియానందా బహిర్యాగవరార్చితా,
వీణగాన రసానంద అర్ధోన్మీలితలోచనా |
 

చక్రపాణి - విష్ణువు.
చక్రపాణిఁ ఈ-పు. చక్రం పాణౌ యస్యసః - చక్రము హస్తము నందు గలవాఁడు.

అధిస్ఠానము - 1.దగ్గర నుండుట, 2.వసించుట, 3.ఉనికి పట్టు, 4.ఆధారము, 5.చక్రము, 6.ప్రాభవము, ఏలుబడి, 7.ఒకానొక పట్టణము.   

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి  కన్ను, 7.చూపు, 6.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.  

చక్రము - 1.శ్రీకృష్ణుని ఆయుధము, 2.బండికల్లు, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము, 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.

చక్రం సుదర్శనః
సుదర్శనము - విష్ణుచక్రము.
సుదర్శన, అ. ప్న. భక్తైస్సుఖేన దృశ్యత ఇతి సుదర్శనః - భక్తులచేత సుఖముగాఁ జూడఁబడు నట్టిది. శోభనం దర్శన మస్యేతి వా.

గుడుసు - గుండ్రము, వి.1.పరివేషము, 2.గుడిసె, 3.ఇకారచిహ్నము.
గుడుసుకయిదువు - విష్ణుచక్రము, పర్యా.గుడుసువాలు.
వేయంౘులవాలు - విష్ణుచక్రము.  

కంటివాలు - చక్రాయుధము; బిల్లవాలు - చక్రాయుధము.
(ౘ)చుట్టలుగు - (చుట్టు+అలుగు) చక్రాయుధము, చుట్టుగైదువు, రూ.చుట్టలు.

ప్రల్ల దనంబుచే నెఱుకపా టొకయింతయు లేక యెచ్చటన్
బల్లిదుడైన సత్ప్రభు నబ్బద్ధములాడిన గ్రుంగి పోదు, రె
ట్లల్ల సభాస్థలిన్ గుమతులై శిశుపాలుఁడు దంత వక్త్రుడున్
గల్లలు గృష్ణునిన్ బలికికాదె హతంబగుటెల్ల, భాస్కరా.

తా. వాచాలతకు లోబడి, గొప్పవాడు బలవంతుడు అయిన వానిని (ప్రల్లదము - 1.దుర్భాషణము, 2.దుష్కృత్యము.)చే  నిందించడం వల్ల హాని కలుగుతుంది. శ్రీకృష్ణునంతటి వానిని నిందించుట వల్లనేగదా శిశుపాలాదుల శిరస్సులు తెగిపడినవి.

పూర్వగాథ :- హరి ద్వారపాలకు లగు జయ విజయులు సనకసనందనాదులచే శపింపబడి తృతీయజన్మమున శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. వీరి దుండగములకు హద్దు లేకుండెను. భగవంతుడైన శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణావతారమై ద్వారక యం దప్పుడు వసించు చుండెను. శ్రీకృష్ణునకు బావమరదులగు పాండవు లొక సమయమున రాజసూయ యాగము చేసిరి. అందు యాగంతమునఁ ధర్మరాజాదులు శ్రీకృష్ణుని పూజింపగా శిశుపాలుడు క్రోధాధుడై శ్రీకృష్ణుడు గొల్లవాడనియు, దొంగయనియు, యనేక దుర్భాష లాడెను. అప్పుడు సకల రాజబృందమును దిలకించుచుండగనే కృష్ణుడు తన చక్రముచే నాతని మస్తకమును దునిమెను. మరి కొన్నాళకు దంతవక్రుడు కూడా శ్రీకృష్ణునితో విరోధించి పోరు సలిపి తనప్రాణములు గోల్పోయెను. 

సుదర్శనో హేతిరాజ శ్చక్రరాజ స్త్రిలోచనః
షట్కోణాంతరసంవర్తీ సహస్రారో హరిప్రియః|

చక్రము - 1.శ్రీకృష్ణుని ఆయుధము, 2.బండికల్లు, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము, 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.

కుమ్మరసారె చుక్క - విశాఖా నక్షత్రము.
కుమ్మర -
కుండలు చేసి జీవించెడు జాతి, సం.కుంభకారః.
కుంభకారుఁడు - కుండలు చేయువాడు, కుమ్మరి.
సారె1 - 1.కూతురు నత్తగారింటికి పంపు నపుడు ఇచ్చెడు వస్తువులు, 2.కుమ్మర వాని చక్రము. (గృహ.) వధువు అత్తగారింటికి పోవునపుడు తీసికొనిపోవు సామగ్రి, వధువు స్వగృహమును నిర్మించుకొనుటకై తలిదండ్రులు సహాయార్థ మిచ్చు గృహసామగ్రి.
సారె2 - 1.శారి, 2.పగడశాల కాయ, 3.పాచిక, 4.గోరువంక.
శారి - గోరువంక, రూ.1.శారిక, 2.జూదపుసారె.
శారము - 1.చిత్రవర్ణము, 2.జూదపుసారె.
శబలము - చిత్రవర్ణము. 
(ౘ)చుక్క - 1.శుక్రుడు (Venus), శుక్రనక్షత్రము 3.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు సం.1.శుక్రః, 2.చుక్రః.

నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
(ౘ)చుక్కలఱేఁడు - చంద్రుడు; చుక్కలదొర - చంద్రుడు Moon.

చక్రి - 1.విష్ణువు, 2.రారాజు, 3.కుమ్మరి, 4.హంస, 5.పాము.
చక్రాంగము -
1.హంస, 2.జక్కవ.
చక్రపక్షము - హంస; చక్రవాకము - జక్కవ. 
చక్రధరము - పాము.

చక్రము - 1.శ్రీకృష్ణుని ఆయుధము(కైదువు - ఆయుధము), 2.బండికల్లు, 3.గుంపు, 4.దండు, 5.రాష్ట్రము, 6.కుమ్మరిసారె, 7.నీటిసుడి, 8.జక్కవ.    

చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్భుదంబు ద్బుదంబు గాక!
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగముతోడి పశువు గాక!

కర్కము - 1.అందము, 2.అద్దము, 3.అగ్ని.
అందము - 1.సౌందర్యము 2.అలంకారము 3.విధము. విణ.1.చక్కనిది 2.తగినది.
సౌందర్యము - చక్కదనము. 
పొంకము - 1.పొందిక, 2.సౌందర్యము.

అలంకారము - 1.అలంకరించుట, సింగారము, 2.హారాది ఆభరణము, 3.(అలం.) ఉపమాది అలంకారములు, రూ.అలంకృతి, అలంక్రియ.
అలంకర్త - అలంకరించువాడు.
అలంకరిష్ణువు - అలంకరించు స్వభావము కలవాడు, అలంకార ప్రియుడు.

మనోజ్ఞము - 1.హృద్యము, 2.అందము.     
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.

బంగరు - బంగారము, సం.భృంగారః.

హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.
హృదయ్స్య ప్రియం హృద్యం - హృదయమునకు ప్రియమైనది.
హృదయంగమము - మనస్సు కింపైనది.

సొన్నము - స్వర్ణము, బంగారు, సం.స్వర్ణమ్.
సొన్నారి - కమసాలి; కంసాలి - కమసాలి, స్వర్ణకారుడు.

గీటురాయి బంగారాన్ని పరీక్షించినట్టు మనిషిని పరీక్షిస్తుంది బంగారం - చిలో

స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి.(రసా.) బంగారము (Gold), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ పర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.
సుష్ఠు ఋణోతి దీప్త్యత ఇతి స్వర్ణం, ఋన దీప్తౌ. - లెస్సగాఁ బ్రకాశించుఁనది.
బంగారము - వై.వి. దుర్లభము, వి.స్వర్ణము.

సువర్ణము - 1.బంగారు, 2.మాడ, విణ.మంచి వర్ణముకలది.
శోభనో వర్ణో యస్య తత్ సువర్ణం - మంచివర్ణము గలది.
స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశగంగ.  

రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 4.స్వభావము.
రూపకము - 1.నాటకము, 2.ఆరక్షరముల కాలము గల తాళభేదము, 3.రూపము, 4.రూపకాలంకారము.
రూపరి - సౌందర్యవంతుడు, అందకత్తియ.  
రూపమడఁగు - క్రి.1.చచ్చు, 2.నశించు.

కురువిందము - ఎఱ్ఱని కెంపు, అద్దము Mirror(రసా.) గనులలో దొరకు ఎల్యూమినియం ఆక్సైడ్ (ద్విఎల్యూమినియమ్ త్య్రామ్లజనిదము). (సర్ణకారులు బంగారు మెరుగు పెట్టుటకు దీనిని ఉపయోగింతురు) (Corundum).         

పాటము - కెంపుల నాణెము చూచుటకు తగిన యెండ, సం.ప్రభాతమ్.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
వరువాత - ప్రాతఃకాలము, విణ.ప్రాతః.
ప్రత్యూషము - వేగుజాము; వేకువ - వేగుజాము.
స్రీ ఘోషము - వేకువ.
ఉషస్సు - తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము, ప్రత్యూషము, వేకువ.

ఒకే సూర్యరశ్మి భూమిమీద అనేక ప్రదేశాలలో పడుతుంది. కానీ ఆ కాంతి అద్దంమీద కానీ, మెరుగు పెట్టిన లోహాల మీద కానీ, నీటిమీద కానీ పడినప్పుడే చక్కగా ప్రతిఫలిస్తుంది. అదే విధంగా భగవంతుని తేజస్సు అందరి హృదయాల మీద సమానంగా ప్రసరిస్తుంది. కానీ మంచివారు, సాధువులు మాత్రమే తమ నిర్మల హృదయాలతో ఆ తేజస్సును స్వీకరించి ఆ వెలుగును తిరిగి అందరికీ పంచగలుగుతారు. - శ్రీరామకృష్ణ పరమహంస

శోణరత్నం లోహితకః పద్మరాగః -
శోణవర్ణం రత్నం శోణరత్నం - ఎఱ్ఱనిరత్నము.  
లోహితవర్ణత్వా ల్లోహితకః - ఎఱ్ఱనైనది.     
పద్మవద్రాగో యస్య పద్మరాగః - తామరపువ్వువంటి యెఱుపుగలది. ఈ 3 కెంపు పేర్లు.

శోణరత్నము - కెంపు; లోహితకము - కెంపు.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము). మాణిక్యము - కెంపు. 
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది. 
కెంజాయ - (కెంపు+చాయ) ఎరుపు.

మానికము - కెంపు, రత్నము, సం.మాణిక్యమ్.
మానికదారి - 1.వేశ్య, 2.మాణిక్యధారిణి.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజెందినది.

మిన్న - రత్నము, విణ.శ్రేష్ఠము.
రత్నము - 1.మణి, 2.స్వజాతి యందు శ్రేష్ఠమైనది (నవరత్నములు - మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)

కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు గలది. 

కెంపుగాము - అంగారకుడు Mars.     
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).  

అబ్దము - 1.సంవత్సరము, 2.మేఘము, 3.తుంగమస్త, 4.ఒక కొండ, 5.అద్దము, విణ.నీటి నిచ్చునది.
అప్యతే అధికమాసేన అబ్దః, ఆప్ ఌ వ్యాప్తౌ. - అధికమాసముచే వ్యాపించునది.
అపః దదాతీతివా అబ్దః, డుదాఞ్దానే. - జలము నిచ్చునది.

అబ్దౌ జీమూత వత్సరౌ,
అబ్దశబ్దము మేఘమునకును, సంవత్సరమునకును పేరు. పా, అబ్దౌ జీమూతపర్వతౌ, అపో దదాతీతి, ఆప్నోతీతి చ అబ్దః, డు దాఞ్ దానే, ఆప్ ఌ వ్యాప్తౌ. - జలము నిచ్చునదియు, పొందినదియు అబ్దము. "గిరిదర్పణయో దబ్ద" ఇతి శేషః. 

ఆబ్దికము - తద్దినము, మరణించిన వారికి ప్రతి సంవత్సరము అతిథియందు చేయు కర్మము, వ్యు.అబ్దమున కొకసారి చేయబడునది.
తద్దినము - 1.ఆదినము, 2.మృతి పొందిన దినము, 3.అబ్దికము పెట్టుదినము.

అంభోదము - 1.మేఘము, 2.(వృక్ష) తుంగమస్త.
అంభోదరము - 1.మేఘము, వ్యు.నీటిని ధరించునది, 2.(వృక్ష.)ముస్త.

జీమూతము - 1.మేఘము, 2.కొండ.
జీవన ముదకం మూయతే బద్ద్యతే త్ర జీమూత, మూఙ్ బంధనే - ఉదకము దీనియందు బంధింపఁబదును. 
 
జీమూతౌ మేఘపర్వతౌ :
జీమూతశబ్దము మేఘమునకును, పర్వతము నకును పేరు.
జీవనం ముఞ్చతీతి జీమూతః - జీమూతమును (నీళ్ళను) ఇచ్చును.
జీవన ముదకం మూయతే బద్ధ్యతే త్ర జీమూతః, మూజ్ బందహనే - ఉదకము, నీరు దీనియందు బంధింపఁబడును.

అంబుదము - నీటి నిచ్చునది, మేఘము, మబ్బు.

అనువు గానిచోట నధికుల మనరాదు
గొంచెమైన నదియు గొదువగాదు
కొండ యద్దమందుఁ గొంచమైయుండదా! విశ్వ.

తా. వీలుగానిచోట అధికుఁడు - గొప్పవాడు)డని సంచరించరాదు. సామాన్యముగా నుండుట (కొద - కొదవ, తక్కువ.)నీచముగాదు. అద్దములో కొండ చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదు కదా! 

మదన బాధలలోఁ జిక్కి మమతనొంది
యందరానట్టి బాధల ననుభవింతు
దర్పణంబు నీ ముఖమౌట దారితీరు
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ|

అద్దము - 1.సగము, సం.అర్థమ్, 2.దర్పణము, సం.అబ్దమ్.
దర్పణము - అద్దము, (భౌతి.) కాంతి కిరణమును క్రమపరావర్తనము నొందించు నునుపైన ఉపరతలము గల వస్తువు, (Mirror).
దర్పణేముకు రాదర్శౌ -
దృప్యతే అనేన నువేషాభిమానా దితి దర్పణః దృప దృప్తౌ. - దీనిచేత మంచి వేషాభిమానము వలన గర్వింతురు. ముకుర సాహచర్యము చేత పులింగము.

ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.  

దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దర్శము - 1.అమావాస్య, 2.చూపు.

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదులయందలి రంధ్రము.

దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృశ - చూపు; (ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గ్రుడ్దివాడు, 3.మంచికన్నులు కలవాడు.

శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వీనికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).

తెలియని కార్యమెల్ల గడదేర్చుటకొక్క వివేకి జేకొనన్
వలయు, దానదిద్దికొననచ్చు, బ్రయోజన మాంద్యమేమయిన్
గలుఁగదు, ఫాలమందుఁ దిలకంబిడునప్పుడు చేతనద్దమున్
గలిగినఁ జక్కఁజేసికొనుఁగాదె నరుండది చూచి, భాస్కరా.

తా. చేతిలో అద్దము గలవాడు అది చూచి బొట్టు(కురువము - తిలకము)చక్కగా పెట్టుకొనును, అట్లే తనకు తెలియనిపనిని చేయవలసి వచ్చినట్ల యతే, ఆ పని నెరింగిన మంచివారి నాశ్రయించి నెరవేర్చుకొన వలెను.

విశ్వం దర్పణదృశ్యమాననగరీ - తుల్యం నిజాంతర్గతం
పశ్య న్నాత్మనిమాయయా బహిరివో - ద్భూతం యధా నిద్రయా |
యః సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమేవద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

     
ముకురము - 1.అద్దము, రూ.మకురము, 2.కుమ్మరిసారె త్రిప్పెడు కఱ్ఱ.
మంక్యతే అనేన ముకురః, మకిమండనే. దీనిచేత నలంకరింపఁబడుదురు, షా. మకురః.
ఆదర్శము - 1.పరమోత్కృష్టస్థితి, మేలుబంతి, 2.అద్దము, విణ.అనుకరింపదగినది.
ఆదశ్యతే (అ)స్తి న్నాత్తనః - ప్రతిబింబమితి ఆదర్శ, దృశిర్ ప్రేక్షణే. - దీనియందు తన నీడ కానఁబడును.

ఆదర్శగజ న్యాయము - న్యా.పెద్ద ఏనుగు చిన్న అద్దములో కనిపించుట అను న్యాయము. 

గడ్దము - 1.చుబుకము, 2.శ్మశ్రువు, సం.గండః.
చిబుకము - గడ్దము, చూ.చీలుకము, చుబుకము.
చీపతి చేవ్య తే వా చిబుకం - కమ్ముకొనియుండునది లేక పట్టుకోఁబడినది. చీవృ ఆదాన సంవరణయోః ఒకటి గడ్దము.
చుబుకము - గడ్దము, రూ.చిబుకము.
శ్మశ్రువు - గడ్దము, మీసము.

కరాగ్రేణ స్పృష్టం - తుహినగిరిణా వత్సల తయా
గిరీశే నోదస్తం - ముహు రధరపానాకులతయా.
కరగ్రాహ్యం శంభో - ర్ముఖ ముకురవృన్తం గిరిసుతే!
కథంకారం బ్రూమ - స్తవె చుబుక మౌపమ్య రహితమ్| - 67శ్లో

తా. ఓ గిరి కుమారీ! ప్రేమచే గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు. చేతితో తాకబడి నదియు, అధరపానము చేయుటకు మాటిమాటికి శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)చేతితో పైకెత్త బడునది, ముఖమనెడి అద్దము నకు పిడివంటి దైన నీ గడ్దము ఎంతటి అందము గలదో యెవరు చెప్పగలరు. - సౌందర్యలహరి

రహి-1.జ్ఞానము, 2.రక్తి, సంతోషము, 3.ఆసక్తి.
రహించు - క్రి.1ఒప్పు, 2.వర్ధిల్లు.
రహితము - విడువబడినది.
రాహిత్యము - రహితభావము, లేకుండుట.

అనాకలితసాదృశ్య - చుబుక శ్రీవిరాజితా|
కామేశబద్దమాంగల్య - సూత్రశోభితకన్ధరా.

జోడు వేల్పుల రిక్క - విశాఖానక్షత్రము.
ౙోడు(జోడు) - 1.జత, 2.చెప్పులజత, 3.సమానము, విణ.సమూహము  సం.జోడః.
ౙత - 1.జంట, 2.సామాన్యము, (గణి.) రెండు వస్తువులు గుంపు (Pair).
యుగము - 1.జత, 2.బార, 3.కాడి, 4.యుగములు నాల్గు, 1.కృత, 2.త్రేతా, 3.ద్వాపర, 4.కలియుగములు.
ౙంట - జత, సం.యమళమ్, అవ్య.1.వెంట, 2.సమీపమునకు, రూ.జమట.
ౙమట - జంట. 
యమళము - 1.జంట, 2.యుగళము.
యామళము - యమళము, జంట.
యుగ్మము - జంట, (భౌతి., గణి.) స్థితిశాస్త్రమునకు చెందిన పదము. ఒకే వస్తువు మీద సమానంతరముగను, విరుద్ధ దిశలల్లోను పనిచేయు సమాన బలముల జంట, ఒకే వస్తువుపై విరుద్ధ దిశలలో పనిచేయ, సమానంతర బలములు, (Couple).
సామాన్యము - సామ్యము, విన.సాధారణము, (గణి.) కొన్ని రాసులన్ని టికి సంబంధించినది (Common).
సామ్యము - సమత్వము, పోలిక.  

(ౙ)జోక- 1.సామ్యము, 2.బాగు, 3.జత, 4.విధము, 5.ఉత్సాహము, 6.మొత్తము, విణ.యుక్తము.
యుక్తము - కూడుకొన్నది, తగినది, వి.బార.
జోకపడు - క్రి.జతపడు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

జోడుకోడె - 1.సమానుడు, 2.జత.
సురలు -
వేలుపులు; వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ 2.జోస్యము.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది (నక్షత్రము లిరువది యేడు).
నక్షత్రేశుఁడు - చంద్రుడు Moon.

విశాఖా నక్షత్ర చతుర్థ పాదమున చంద్రుడు ఉన్నప్పుడు కృత్తికా శిరస్సున సూర్యుడు ఉండును.

పాదుక - పావకోళ్ళు, చెప్పులు.
సమ్మాళికలు -
పాదరక్షలు, సం. సంవాహికః.
సమ్మితము - 1.సమానము, 2.సమానమైన పరిమితి గలది.
లూడువులు - పాదరక్షలు. మలఁకవాలు - పాదరక్ష. 

ఉపానహము - చెప్పు, పాదరక్ష, వ్యు.పాదములందు కట్టబడినది.
చెప్పు -
పాదరక్ష, క్రి.వచించు, అను.

పాదూ రూపానత్ స్త్రీ :
పద్యన్తే అనయేతి సాదూః. ఉ.సీ. పద్ ఌ గతౌ. - దీనిచేత నడచి పోవుదురు.
పాదూ రేవ పాదుకా - పాదువే పాదుక.
ఉపాహ్యతే పాదయో రితి ఉపానత్. హ. సీ. ణహ బంధనే. - పాదము యందుఁ గట్టఁబడునది. ఈ మూడు 3 చెప్పుల పేర్లు.

ఉపానహౌ చ వాసశ్చ - ధృతమన్యైర్న థారయేత్|
ఉపవీత మలంకార వ్రజం కరక మేవచ||

తా. ఒకని చేత ధరింపబడిన పాదరక్షలు, వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు(ఆవాసము), వి.వెదురు. యజ్ఞోపవీతము, అలంకార పుష్పమాలిక, వ్రజము - 1.పసులమంద, సమూహము, 2.త్రోవ, 3.పసులకొట్టము. కమండలం వీనిని మఱియొకరు ధరింపరాదు. - నీతిశాస్త్రము

వాక్రుచ్చు - 1.పేరుచెప్పు, 2.చెప్పు, 3.శబ్దించు.

అను1 - 1.చెప్పు, వచించు, 2.అనుకరణ శబ్దములకు అనుప్రయుక్త మగును.
అను2 - అవ్య. ఈ క్రింది అర్థములనిచ్చు ఉపసర్గ : 1.ఆశ్రయము, 2.ప్రాప్తము, 3.పోలిక(పోలిక - సామ్యము), 4.తరువాత, 5.తగినది, 6.క్రమము, 7.సామీప్యము, 8.సహార్థము, 9.అనుకూల్యము.
అనుఁగు - 1.చెలికాడు, 2.ప్రేమ, 3.ముఖ్యుడు, విణ.1.ప్రియుడు, 2.ప్రియురాలు, 3.మనోజ్ఞము, 4.సహాయుడు, 5.మొదటిది.
అనుఁగుకాఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు. స్నేహితుఁడు - చెలికాడు. అంతరంగుడు - స్నేహితుడు.   
అనుఁగుఁగత్తె - చెలికత్తె.
చెలిమిరి - 1.చెలికాడు, 2.చెలికత్తె.
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

ఉజ్జి - జత, విణ.సాటి, రూ.ఉజ్జీ, ఉద్ది.
ఉద్ది -
1.జత, జట్టు, 2.చెలిమి, విణ.1.సమానము, 2.ప్రతిస్పర్ధి.
ఉద్ధీఁడు - 1.జతకాడు, 2.మిత్రుడు, రూ.ఉద్ధికాఁడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun.

పొంతనము - (పొందు + తనము) 1.గ్రహమైత్రి, 2.పోలిక.
పొందు -
1.మైత్రి, 2.సంధి, 3.అనుకూల్యము.
మైత్రి -1.మిత్రభావము, స్నేహము(చెలిమి -స్నేహము.), 2.అనూరాధ, 3.యతిమైత్రి, 4.(రసా.) రాసాయనిక ఆకర్షణ (Affinity). 
పొందుకాఁడు - స్నేహితుడు.
స్నేహితుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు.
అంతరంగుడు - స్నేహితుడు.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

ఆధారము - 1.ఆదరవు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, (యోగ.) మూలాధారచక్రము.

ఆశ్రయము - 1.ఇల్లు, 2.ఆధారము, 3.శత్రువులచే పీడింపబడుచు వారి నాశ్రయించి యుండుట, సంశ్రయము(సంశ్రయము - ఆశ్రయము), 4.ప్రాపు, 5.శరణాలయము.
ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
గృహిణి - ఇల్లాలు, భార్య.
ఇలుదొర - గృహస్థు. గృహమేధి - గృహస్థు, వ్యు.భార్యతో చేరియుండు వాడు.
ప్రాపు - ఆశ్రయము, సం.ప్రాపణమ్, ప్రాపః.
ఆసరా - ప్రాపు, ఆశ్రయము, అండ, సం.ఆశ్రయః.
అండ - 1.సమీపము, 2.ఆశ్రయము, 3.ప్రాపు, 4.మట్టిపెళ్ళ.
మద్దతు - ప్రోత్సాహము, అండ (Support). సమీపము - చేరువ. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వ.
తా||
చెప్పులోని రాయి(రాయి - శిల), చెవిలోని (ౙ)జొఱ్ఱీగ - ఒక తెగ పెద్ద యీగ, రూ.జోరీగ.), కంటిపాపలో పడిన నలుసు - రేణువు, కాలిలో విరిగిన ముల్లు, యింటిలో పోరు భరించుట అసాధ్యము.

చెప్పులు తొడిగినవానికి అంతా తోలు కప్పబడి నట్లుండును.

చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్డకేలు వేలుపు.
చతుర్భుజః చత్వారో భుజా యస్యసః - నాలుగు భుజములు గలవాఁడు.
ఉడ్డకేలు వేలుపు - చతుర్భుజుడు, విష్ణువు.

నలు - సమాసమందు నాలుగునకు వచ్చు రూపము, (నలుమోములు).
నలుగడ - నాలుగు ప్రక్కలు.

ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).

ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
(ౘ)చౌ - నాలుగు, రూ.చవు, (చౌకమునకు సమాంతరగత రూపము) సం.చతుః.

రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. 

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

చతుష్టయము - నాలుగు, నలుగురు, 2.(వృక్ష.) సూక్ష్మబీజాణు మాతృకోశిలలో ఏర్పడు నాలుగు (పుప్పొడి రేణువులు) కణములు, (Tetrad) (ఇట్లే స్థూల బీజాణు మాతృకోశికలో గూడ నాలుగు జీవకణములు ఏర్పడును.)

తిగవంచ - నాలుగు.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
ఇద్దుగ - (ఇరు+దుగ) పాచికమీది రెండు బొట్లజత, నాలుగు.
అడ్డ - 1.గుంటక మొ.ని దిండువంటి కొయ్య, 2.కుంచములో సగము, ఆ కొలత పాత్ర, 3.నాలుగు.

చతుర్థి - 1.పక్షమున నాల్గవ దినము, చవితి 2.నాల్గవది. 
(ౘ)చౌతి  - చతుర్ధి, పక్షమందు నాల్గవ తిధి  రూ.చవుతి.

(ౘ)చౌకి - పన్నులు వసూలు చేసెడిచోటు, సుంకరిమెట్టు, రూ.చవుకి, సం.చతుష్కమ్.
(ౘ)చౌసాల - చతుశ్శాల, నడుమ బయలును నాలుగు ప్రక్కలును గల ఇల్లు, రూ.చవుసాల.

కొల్లారము - చతుశ్శాల నడుమ బయలును నాలుగుప్రక్కల కట్టడమును గల యిల్లు, రూ.కొలారము, కొల్లారు. 

చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
ౘవికె - చతుష్కి, మండపము, రూ.చవిక, చవికము. 
(ౘ)చౌకము - 1.చతుష్కము, నాలుగు, 2.చదరముగ నుండు తుండుగుడ్డ, రూ.చవుకము, సం.చతుష్కమ్.       

శృఙ్గాటక చతుష్పథే,
శృంగైరటంస్మిన్నితి శృంగాటకం, అటపట గతౌ. - కొమ్మలచేత దీని యందుఁ గ్రీడింతురు.
చతుర్ణాం పథాం సమాహార శ్చతుర్ప్పథం. - నాలుగు తెరువులు గూడినది. ఈ 2 నాలుగు త్రోవలుగూడిన చోటు పేర్లు.

శ్రంగాటకము - చదుకము, నాలుగు త్రోవల కూడలి.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
చతుష్పాద - 1.చతుష్పదము, 2.నాలుగు కాళ్ళ జంతువు.
పశువు - చతుష్పాదము, గొడ్డు.

స్వస్తికము - 1.చదుకము, 2.మంగళ వస్తువు(స్వస్తి - శుభము), 3.పాముపడగ మీది నల్లనిరేఖ, 4.ఒక గుర్తు.

చతురశ్రాసనారూఢ శ్చతురో దివ్యవాహనః,
వివస్వన్మణ్డలాజ్ఞేయవాసో వసుసమృద్ధిదః.

కంధి - సముద్రము, వ్యు.కం = నీటికి నిధి = స్థానము.    
సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.

కం వారిణి చ మూర్ధని,
కం-ఇది నీళ్ళయందును, శిరస్సునందును, చకారమువలన సుఖము నందును వర్తించును. ఉ. నీళ్ళకు - 'కంజం పద్మం' శిరస్సునకు - కంధరా', సుఖమునకు - "కందర్పః', "కం సుఖే వ్యోమ్ని" ఇతి శేషః.

కంజనుఁడు - మన్మథుడు, వ్యు.సుఖమును కల్గించువాడు.

కంజజుఁడు - నలువ, బ్రహ్మ.
నలువ - చతుర్ముఖుడు. 
చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ. 
చతురాననః చత్వారి ఆననాని యస్య నః - నాలుగుముఖములు గలవాఁడు.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

కంజము - తామరపువ్వు.
కంజాతము - తామర, పద్మము.

కంబు1 - 1.జలము, 2.తల.  
కంబు2 - సజ్జపైరు.

జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జలతి జడీభవతీతి జలం, జల ఘనే - జడీభవించునది.    

కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.

జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic).

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

కంబువు - 1.శంఖము, 2.ఏనుగు, 3.కడియము, 4.నత్తగుల్ల.

కమ్బు ర్నావలయే శఙ్ఖే -
కంబుశబ్దము కడియమునకును, శంఖమునకును పేరు. కామ్యత ఇతి కంబుః, పు. కము కాంతౌ. - కాంక్షింపఁబడునది.

కంబుగ్రీవ - 1.మూడు ముడుతలు గల మెడ, 2.శంఖము వంటి మెడగలది.

కమ్బుగ్రీవా త్రిరేఖా సా -
సాత్రిరేఖా రేఖాత్రయయుక్తాచే త్కమ్బుగ్రీ వేత్యుచ్యతే - ఆ మెడ మూఁడురేఖలు గలదైన కంబుగ్రీవ మనంబడును. కమ్బుతుల్యాగ్రీవా కమ్బుగ్రీవా - శంఖసమమైన మెడ. ఈ ఒకటి మూఁడు రేఖల మెడ.

కంఠము - 1.మెడముందరి భాగము, కుత్తుక, 2.కుత్తుక యొక్క ధ్వని, 3.సమీపము.
కణతి ధ్వనతి కణ్ఠః శబ్దే. - పలుకునది.
కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.

అధోగ్రీవము - (జం.) కంఠము యొక్క క్రింది భాగమునకు సంబంధించినది (Innominate).

కారుణ్య విగ్రహా కాంతా కాంతిధూతజపావళిః
కలాలాపా కంబుకంఠీ కరనిర్జిత పలావా| - 29

గళము - 1.కుత్తుక, 2.ఒకానొక వాద్యము.
కుతిక - గొంతు, రూ.కుతుక, కుత్తుక.
గళసంబంధము - (జం.) గొంతుతో సమబంధము కలది (Phanyngeal).

జీర - రేఖ, సం.చీరమ్.
రేఖ - 1.దగ్గరదగ్గరగా నున్న వృక్షాదుల పంక్తి, 2.పాణి పాదతలము లందలి గీర, గీర, (గణి.) స్థితి, పొడవుమాత్రము కల్గి వెడల్పు మందములేని ఆకృతి  (line) పొడవు కలిగి మందము వెడల్పు లేనిది, (Curve).  

గమకము1 - 1.యత్నము, 2.నేర్పు, విణ.1.మనొజ్ఞము, 2.అధికము.
గమకము2 - (సంగీ.) స్వర విన్యాస భేదము, విణ.1.తోపజేయునది, 2.నిరూపణచేయునది.

గీత - (వేదా.) అధ్యాత్మిక తత్త్వ విషయమై ప్రశ్నోత్తరమున ఉండు గ్రంథము, ఉదా.భగవద్గీత, రామగీత మొ.వి. వి.రేఖ.

నిపుణుఁడు - నేర్పరి.
నితరాం పుణతి శుభకర్మ కరోతీతి నిపుణః, పుణ శుభకర్మణి. - మిక్కిలి శుభకర్మమును జేయువాఁడు.
నిపుణత - కౌశలము, నేర్పరితనము (Skill).

కన్నఁడు - కృష్ణుడు, రూ.కన్నయ్య, కన్నతండ్రి, సం.కృష్ణః.
కన్న - ప్రత్య. 'కంటె' అను అర్థమున వచ్చు ప్రత్యయము.
కంటియ - మెడనగ, రూ.కంటె, విణ.కంఠికా. 

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు      

గ్రైవేయకం కణ్ఠభూషా-
గ్రైవేయకము - మెడకు కట్టుకొను నగ, కంఠభూషణము.
గ్రీవాయాం భవో (అ)లంకారో గ్రైవేయకం, పా, గ్రైవేయం. - మెడయం దుండెడు అలంకారము.
గ్రైవము - 1.మెడత్రాడు, 2.మంగళసూత్రము.
కంఠాభరణము - కంఠమునకు భూషణము.
కంఠస్య భూషా కంఠభూషా. - కంఠము యొక్క భూషణము. 2 మెడయందు గుత్తమైన కంటె మొదలైనవి.

మంగళసూత్రము - మాంగల్యము, పుస్తె.      
కంఠసూత్రము - పుస్తె, మంగళసూత్రము.
పుస్తె - తాళిబొట్టు. 

శతమానము - 1.నూటికొలది, 2.పుస్తె, మంగళసూత్రము. శతమానం భవతిః|
పుస్తె - తాళిబొట్టు.

ఒక్కప్రక్కను దుఃఖ మింకొక్కప్రక్క
సుఖము గూచుచు నుండుట చోద్యమేమొ
నన్ను ముందైనఁ బ్రోవుము కన్నతండ్రి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|
 

వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్ట విధములు).

మహాలక్ష్మి-1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి. కొల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం|

మినుకులబరణి-సూర్యుడుSun, వ్యు.కాంతులకు బరణివంటివాడు.
మినుకు - 1.కిరణము, 2.తాలిబొట్టు, 3.మినుకు మినుక్కు మను కాంతి, 4.వేదము.
కిరణము - వెలుగు, మయూఖము.
కిరతి తమ ఇతి కిరణః, కౄ విక్షేపే - తమస్సును పోఁగొట్టునది.
మాంగల్యము-1.మంగళత్వము, 2.తాళిబొట్టు.
తాలిబొట్టు - మంగళసూత్రపు బొట్టు, రూ.తాళిబొట్టు.
మినుకుఁజేడియ - సరస్వతి.
జేడియ - బురదనేల, రూ.జేడె.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి.

చిరంటి - జవరాలు, 2.ఐదువరాలు.
చిరేణాటతి పితృగేహాద్భర్తృ గేహం చిరంటీ - చాలకాలమునకు నత్తింటికిఁ బోవునది.
పా, చిరిణోతి హినస్తి అమంగళాని చిరంటీ, సీ. చిరి హింసాయాం. - అమంగళములను జెఱుచునది.
చిరతీతి చరణ్టీత్యేకే - తిరుగునది. 
ౙవరాలు - యౌవనవతి. 
ఐదువ-ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు.

ఓం గిరీశ బద్ధ మాంగల్య మంగళాయై నమో నమః|    

తాలి - మంగళసూత్రము, రూ.తాళి.
తాళి - పతకము, హారము, రూ.తాలీ.

మూసిక - మంగళసూత్రమునందు తాళిబొట్టునకు ఈవలావల క్రూర్చి కట్టుకొను నానుక్రోవి. 

గళే రేఖా స్తిస్త్రో - గతిగమకగీతైకనిపుణే
వివాహవ్యానద్ద - ప్రగుణ గుణసంఖ్యా ప్రతి భువః |
విరాజన్తే నానా - విధమధుర రాగాకరభువాం  
త్రయాణాం గ్రామాణాం - స్థితినియమసీమాన ఇవ తే| - 69శ్లో

తా. శాస్త్రనియతిగ గానము చేయు గాయకీ! గతి, గమక, గీతా గానాలలో నైపుణ్యము కలదానా! వివాహవేళలో కట్టబడిన పేనిన దారములకు మారుగ నున్న నీ కంఠమందలి(త్రిరేఖలు)మూడు రేఖలు నానా - అనేకము) అనేక రాగములకు స్థానమైన (షడ్జ మధ్యమ గాంధారములను మూడు) గ్రామములను స్థిరంగా ఉంచడానికి ఏర్పరచిన సరిహద్దుల వలె విరాజమానము - మిక్కిలి ప్రకాశించునది. – సౌందర్యలహరి

కనకాంగద కేయూర - కమనీయభుజాన్వితా|
రత్నగ్రైవేయచింతాక-లోలముక్తాఫలాన్వితా.

పద్మనాభుఁడు - విష్ణువు.
పద్మనాభః పద్మం నాభౌ యస్యసః - పద్మము నాభియందు గలవాఁడు.

పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
పద్యతే త్ర లక్ష్మీరితి పద్మం. అ. ప్న. పద్మగతౌ. - దీనియందు లక్ష్మి పొందును. ఇది వికల్పమునఁ బుంలింగంబును గలదు.

పద్మాకారము - కొలను.
పద్మానాం ఆకరః పద్మాకరః - పద్మములకు ఉనికిపట్టు.
తటాకము - చెరువు, రూ.తటాగము.
చెఱువు - తటాకము.
తటాన్యకతీతి తటాకః, అ. ప్న. అక అగ కుటిలాయాం గతౌ. - గట్టును కుటిలముగాఁ బొందియుండునది.
పా, తడతీతి తడాగః, తడ అఘాతే. - గట్టును గొట్టునది. ఈ 2 తామరలుగల చెఱువు పేర్లు.

కొలను - కొలఁకు; కొలఁకు - సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్.

గుండ - 1.పల్లము, 2.చెరువు, సం.కుండమ్, మాం. (విశాఖపట్టన ప్రాంతమున) బాలిక.   

నిమ్నము - పల్లము, విణ.లోతైనది, విణ.(వృక్ష.)అధస్ద్సితము (Inferior).
నిమ్నోన్నత రేఖలు - (భూగో.) సముద్రమునకు పైని ఒకే ఎత్తున ఉన్న ప్రదేశముల నన్నిటిని కలుపు ఊహారేఖలు.

నిమ్నం గభీరం గమ్భీరమ్ :
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.

గభీరము - 1.మిక్కిలి(మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము)లోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము. మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).
గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.

కున్న - బిడ్డ, చూ.కున్నె, కూన, సం.కుణకః.
కూన - కున్న, కుర్ర, సం.కుణకః.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).

కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
స్కందుఁడు - కుమారస్వామి.

ఘనబల సత్త్వమచ్చువడ గల్గిన వానికి హాని లేనిచోఁ
దనదగు సత్త్వమే చెఱుచుఁదన్ను నదెట్లన? నీరులాపుగాఁ
గనుపసియించినన్ చెఱువుకట్టకు సత్త్వము చాలకున్నచోఁ
గనుములు పెట్టి నట్టనడిగకడితె గండకన్నె, భాస్కరా.

తా.  భాస్కరా ! చెరువు గట్టు బలము గలదిగా నున్నను ఆ చెరువు నిండా నీరు వచ్చి పడినప్పుడు దాని సందుల ద్వారా గాని, మధ్యకు గట్టు తెగినగాని ఆ నీరు పోవును. అట్లే ఎంత గొప్ప బలము కల వానికైనను ఇతరులచే కీడు సంభవింపక పోయినను, తన, బలమే తుదకు నశింపఁజేసిన దగును.    

పద్మనాభుఁడ వని నిన్నుఁ బల్కినాను
గట్టితనమేల మానరా కట్టులేదె
పలుకుపలుకున నగు కట్టుబాటు లరసి
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ | 

పద్మనాభో(అ)రవిందాక్షః పద్మగర్భ శరీరభృత్,
మహర్థిః ఋథ్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః| - 38స్తో  

పద్మాలయ - లక్ష్మి.
పద్మలయా, పద్మ మాలయో యస్యాస్సా - పద్మమే ఇల్లుగాఁగలది.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
పద్యతే త్ర లక్ష్మీరితి పద్మం. అ. ప్న. పద్మగతౌ. - దీనియందు లక్ష్మి పొందును. ఇది వికల్పమునఁ బుంలింగంబును గలదు. 
తమ్మియింటి గరిత - లక్ష్మి, పద్మాలయ. 
గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు. 
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మవ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
తోయజాక్షి - తమ్మికంటి. 
తమ్మిదొర - సూర్యుడు Sun. 
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొం దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 
తమ్మిపగతుఁడు - చంద్రుడు Moon.  
తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు  అంటువ్యాధి.)
పద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర.
పద్మ మస్యా కరే (అ)స్తీతి పద్మా - పద్మము హస్తమందు గలది.
మెట్టతామర - స్థలపద్మము.  

పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
పద్మవద్రాగో యస్య పద్మరాగః - తామరపువ్వువంటి యెఱుపుగలది.
మాణిక్యము - కెంపు.   
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది. 

పద్మాసనము - ఆసనములలో నొకటి.
బాసికపట్టు -
పద్మాసనము, (వ్యావ.) బాసీపట్టు.

నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్,
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్|

పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.                   

లక్ష్మీః పద్మాలయా పద్మా కమలా శ్రీర్హరిప్రియా,
(ఇందిరా లోకమాతా మా రమా మఙ్గళదేవతా, భార్గవీ లోకజననీ క్షీరసాగరకన్యకా.)

లచ్చి - లక్ష్మీ, సంపద, సం.లక్ష్మీః.
లక్కిమి - లచ్చి. లక్కి - లక్ష్మి, సం.లక్ష్మి. 
లక్ష్మి - 1.రమాదేవి, 2.సంపద, 3.వస్త్రభూషణాదులశోభ, 4.మెట్టదామర.
లక్ష్మీః ఈసీ. లక్ష్యతే సర్వో అనయేతి లక్ష్మీః - ఈమెచేత సర్వము చూడబడుఁగాన లక్ష్మి. లక్ష దర్శనాం కనయోః.

నీళ - విష్ణు భార్యలలో నొకతె.

సరసిజనాభుఁడు - విష్ణువు.
సరసి - కొలను, రూ.సరసు, సరస్సు.
సరసు - క్రి.సరదు, సం.వి.సరసి.
సరస్సు - సరసి.

కొలఁకు - సరస్సు, చెరువు, రూ.కొలను, సం.కూలమ్.
కొలను - కొలఁకు; చెఱువు - తటాకము. 

జలాశయో జలధారః -
జలాశయము - తటాకము.
జలే శేతే ఇతి జలాశయము, శీఙ్ స్వప్నే. - జలమందుందునది.
తటాకము - చెరువు, రూ.తటాగము.
జలమాశేతే (అ)త్ర జలాశయః, శీఙ్ స్వప్నే. - జలము దీనియందుందును.
జలస్య ఆధారః జలధారః - జలమునకు స్థానము. ఈ 2 నీరుండెడు తావుపేర్లు.

సరోజము - 1.తామర, 2.తామర కొలను.
సరసీరుహము - తామర.
సరస్యాం రోహతీతి సరసీరుహం, రుహ బీజజన్మని ప్రాదుర్భావేచ. - కొలనియందు మొలచునది.
సరసిజము - తామర, రూ.సరసీజము.
సరసిజాతము - తామర.

సహస్రార సరోజాత వాసితాయై నమోనమః|

సరసిజభవుఁడు - బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొం దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

దక్షుఁడు లేని ఇంటికి బదార్ధము వేరొక చోట నుండి వే
లక్షలు వచ్చుచిండినఁ బలాయనమై చనుఁ, గల్లగాదు ప్ర
త్యక్షము వాగులన్ వఱదలన్నియు వచ్చిన నీరునిల్చునే
యక్షయమైన గండతెగినట్టి తటాకములోన, భాస్కరా.

తా. జల ప్రవాహము లన్నియు అక్షయములుగా వచ్చి చెరువులో చేరగా అది ఒడపి - గండి, రంధ్రము.గండిపడి నీరంతయు నిల్వక పోయిన విధముగానే, సమర్త్ధుడైన యజమాని లేని ఇంటికి అక్షయము - 1.తరుగనిది, నాశములేనిది, 2.ఇల్లులేనిది, వి.పరమాత్మ.)మైన లక్షలకొలది పదార్ధములు వచ్చిననూ, అవి యంతర్ధాన మగును.

ఉశనుఁడు-  శుక్రుడు Venus, రూ.ఉశనసుడు.
వష్తి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః, స. పు. వరకాంతౌ. - అసురులశ్రేయస్సు నిచ్ఛయించువాఁడు.

ఉశీరము - వట్టివేరు. 
ఉశయ ఇతి ఉశీరం, అ, ప్న వశ కాంతౌ. - కాంక్షింపఁబడునది.
అభయము - భయములేనిది, వి.1.పరమాత్మ, 2.పరమాత్మ జ్ఞానము, 3.భయనివృత్తి, 4.రక్షణము, 5.వట్టివేరు.
విద్యతే భయ మనేనేత్య భయం - దీన భయము లేదు.
నాస్తి రోగ భయమస్యా ఇత్యభయా - రోగభయము దీనివలన లేదు.
నలదము - 1.వట్టివేరు, 2.పూదేన.
నలత్యర్ధ యతీతి నలం పిత్తాదికం, తద్ద్యతీతి నలదం, నల గంధనే, దో అవఖండనే. - పీడించునవి గనుక నల మనఁగా బిత్తాదులు, వానిని ఖండించునది.

మృణాళం బిసం -
మృణాలము - 1.వట్టివేరు, 2.తామరతూడు.
మృణ్యతే భక్ష్యత ఇతి మృణాళం. అ. ప్న. మృణహింసాయాం. – భక్షింపఁబడునది.
బిసము - తామర తూడు, తామర తీగ.
బిస్యంతే ఉత్సృజ్యంతే భక్షణసమయే తంతవో త్ర బిసం. బిస ఉత్సర్గే. - భక్షణ సమయమున దీనియందుఁ గల తంతువులు విడువఁబడును. ఈ రెండు తామరతూఁడు పేర్లు.
తూఁడు - తామరకాడ, బిసము.    
తూఁడు దిండి - హంస, వ్యు. తూడే భోజనముగా కలది.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయువిశేషము, రూ.హంసము.

చతురాననుఁడు - చతురాస్యుడు, నలువ, బ్రహ్మ.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.
నలువ - చతుర్ముఖుడు. 
చతురాననః చత్వారి ఆననాని యస్య నః - నాలుగుముఖములు గలవాఁడు.

మృణాళీమృద్వీనాం - తవ భుజలతానాం చతసృణాం
చతుర్భి స్సౌందర్యం - సరసిజభవ స్స్తాతి వదనైః
నఖేభ్య స్సంత్రస్యన్ - ప్రథమమథనా దన్దక రిపో
శ్చతుర్ణాం శీర్షాణాం - సమ మభయహస్తా ర్పణధియా| - 70శ్లో
 
తా. ఓ త్రిపురసుందరీ! సరసిజభవుఁడు - బ్రహ్మ తన మొదటి తలను నఱికిన శివుని గోళ్ళకు భయపడి నాలుగు తలలకు అభయము నొసగు నను తలంపుతో, చతుర్ముఖములతో తామర తూడులవలె  మృదువైన నీ చతుర్ముఖముల సౌందర్యమును స్తుతించు చున్నాడు. (పార్వతి వివాహ సమయమున బ్రహ్మ పార్వతిపై మోహము నందగా, అంధకరిపుఁడు - శివుడు బ్రహ్మ యొక్క యైదు శిరస్సులలో నొకదానిని ఖండించెను. తక్కిన నాలుగు తలలు నుందుటకై స్తుతించి నాడుట.) - సౌందర్యలహరి

సరసిజనయనే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే
భగవతిహరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్|

నలినము - 1.తామర, 2.తామర కొలను, 3.తామర తీగ.
నల్యతే బద్ద్యతే చంద్రేణేతి నలినం. - చంద్రుని చేత ముకుళరూపమున బంధింపఁబడినది.    

నళిన్యాం తు బిసినీ పద్మినీ ముఖాః :
నళం పద్మమస్యామ స్తీతి నళినీ. ఈ. సీ. - నళమనఁగా పద్మము; అదిగలిగినది. 'నళమబ్జే నళో నళ 'ఇతి రుద్రః.
బిసిని - 1.తామర కొలను, 2.తామర తీగ.     బిసమస్యామస్తీతి బిసినీ. ఈ. సీ. - తామరసూండ్లు గలిగినది.
ముఖ మన్నందున కమలి న్యబ్జినీ సరోజిన్యాది శబ్దములు గ్రహింపఁబడుచున్నవి. పద్మములు గల దేశమునకుఁగాని పద్మ సమూహమునకుఁగాని తామరతీఁగెకుగాని పేర్లు.

పద్మిని - సూర్యుని భార్య.
పద్మిని - 1.తామర తీగ, 2.సరస్సు, 3.పద్మినీ జాతి స్త్రీ.

ఓం బిసతంతు తనీయస్యై నమః : తామర తూడులోని దారమువలె సూక్ష్మమై సన్ననైనది (పీతాభాత్యణూపమా - అని శ్రుతి కూడా చెప్పుచున్నది అనగా పరమాణువువలె పీతవర్ణంతో భాసిల్లుచున్నదని భావము) అట్టి సూక్ష్మస్వరూపిణికి ప్రణామాలు.

సూక్ష్మ మధ్యాత్మమపి : సూక్ష్మ శబ్దము పరమాత్మకును, అపిశబ్దము వలన స్వల్పమైనదానికిని పేరు. సూచ్యత ఇతి సూక్ష్మం త్రి. సూచింపఁబడునది.

లయము - 1.నాశము, 2.ఆలింగనము, 3.నీటి వట్టివేరు. 
జఠరాగ్నౌ లీయత ఇతి లౌఅం, లీఙ్ శ్లేష్నే. - జఠరాగ్నియందు నణఁగునది, లఘులయమని యేకపదముగాను జెప్పుదురు.
నాశము - 1.చేటు, 2.కనబడమి, 3.అనుభవము లేమి.
నశ్యతే నాశః, ణశ అదర్శనే. - నశించుట నాశము.
నాశిల్లు -
నశించు. 
అవదాహము - 1.వేడిమి, 2.కాల్చివేయుట, 3.వట్టివేరు. 
అవనశ్యతి దాహో నేనే త్యవదాహం - దీనిచేత దాహ మణుఁగును.
కాపథము-1.కుత్సితపు త్రోవ, 2.నీటివట్టి వేరు.
వాతవత్వేన గమన నొరోధ కత్వాదిష్తం కాపథమన్యేతి ఇప్లకాపథం - వాతకారియై గమనమును నిరోధించుటచేత నిష్టమైన కుత్సిత మార్గము గలది.   
లాజము - 1.వట్టివేరు, 2.నాన బియ్యము.
  
వట్టివేళ్ళు - ఇవి తృణ కుటుంబము Graminae నకు చెందిన Vetiveria zizanoides అను మొక్కల వేళ్ళు (Cus cus) (ఇవి చాల పరిమళము నిచ్చును, వీనినుండి అత్తరువు, సుగంధతైలము  కూడ తీయుదురు.)     

ఔశీరము - చామరము, సురటి, విణ.వట్టివేళ్ళతో చేయబడిన మందు.    

కోకనదము - 1.చెంగలుగ, 2.కెందమ్మి.
కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.

అంభోజిని - 1.తామరతీగ, 2.తామరకొలను, 3.పద్మసమూహము.

కోరకము - 1.మొగ్గ, 2.తామరతూడు, (వృక్ష.) మొగ్గ అల్పవికసిత కాండము (Bud).
మొగ్గ - 1.ముకుళము, వికసించని పుష్పము, 2.శిరముపాదములతో జేర విల్లువలె వెలికిల వంగుట, సం.ముకుళమ్.
కాఁడ - 1.తామరతూడు, 2.కూరాకులలోని కామ, 3.తొడిమ, సం.కాండః.
తొడిమ - కాడ.
కోరగించు - 1.మొగ్గతొడుగు, 2.ఎఱ్ఱనగు, 3.ఉదయించు, 4.మారాముచేయు, ముకుళించు.  
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు. 
పుట్టు - సంభవించు, జన్మించు.
మొగుచు - ముడుచు. మొగుడు - వై.క్రి. ముకుళించు. 

పద్మిన్యాః వల్లభః పద్మినీ వల్లభః పద్మినీవల్లభో హరిః| - తామరతీఁగకుఁ ప్రియుఁడు Sun.

కళలు కలుగుఁగాక కమల తోడగుఁగాక!,
శివుని మౌళిమీఁద జేరుఁగాక!
నన్యు నొల్లఁ దపనుఁడైన మత్పతి యని,
సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె.

భా|| తాను కళలు కలిగినచంద్రుడే అగుగాక !కమల - 1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 3.కమలాఫలము. తోబుట్టువు అగుగాక ! శివుని శిఖయందు చేరుకొన్నవాడై నిక్కుగాక ! అన్యుఁడు-ఇతరుడు)అన్యుడైన చంద్రుడి పొత్తు మా కక్కరలేదు. తపింపజేసే డైనప్పటికీ తపనుఁడు - సూర్యుడు మా భర్త సూర్యుడే అని పతివ్రతవలె పద్మినీ జాతి మూతి ముడుచుకుంది. అనగా  పద్మములు సూర్యాస్తమయము  కాగానే ముకుళించుకొని పోయినవి.

అబ్ది - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య.

అబ్ధిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున పుట్టినది.

పద్మోద్భావాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం,
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్|

అరవిందము - 1.తామర, 2.ఎఱ్ఱకలువ, 3.నల్లకలువ, 4.బెగ్గురుపక్షి.
అరాన్ కేసరాన్ విందతీతి అరవిందం, విద్ద్ లాభే. - కేసరములను బొందియుండునది. 

త్పలము - కలువ, నల్లకలువ.
కలువ -
ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.
కువేలము - 1.కలువ, 2.పద్మము.    
కలువరాయుఁడు - చందమామ. రాయఁడు - రాజు, రాయలు, సం.రాజా.    

తొగ - 1.కలువ, 2.సమూహము, 3.విధము, రూ.తొవ.
తొగకంటి -
కలువకంటి, స్త్రీ.
కలువకంటి - కలువ రేకులవంటి కన్నులుగల స్త్రీ.
తొగచెలికాఁడు - చందుడు.
తొగఱేఁడు - చంద్రుడు; తొగవించు - చంద్రుడు Moon.

తొగసూడు - సూర్యుడు Sun, వ్యు.కలువలకు శత్రువు.

కల్హారము - మిక్కిలి పరిమళము గల కలువ.
కలువడము -
(కలువ+వడము) ఉత్సవములలో కట్టెడు బంగారు కలువ పూదండ, స.కైరవ వటః.

సలిలము - నీరు.
సలిలము - కొలువుడు కానిని కొలువు నుండి త్రోయుట, సం.చాలితమ్.
సరతీతి సలిలం. సృ గతౌ. రలయోరభేదః. - ప్రవహించునది.
సరతీతి సలిలం. షల గతౌ - పోవునది.

తోయజము - 1.తామర, 2.నీటి నుండి పుట్టినది.
తోయరుహము -
తామర, వ్యు.నీటియందు జన్మించినది.
వనజము - తామర, వ్యు.నీటి యందు పుట్టినది.
నీటి పుట్టువు - తామర.

కమలాప్తుఁడు - సూర్యుడు Sun, విష్ణువు.
సూర్యుడు - వెలుగురేడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.  
విష్ణుః, ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
కం జలం అలతి భూషయ తీతి కమలం, అల భూషణదౌ - జలమును భూషించునది.
కేన మల్యతే ధార్యత ఇతి వా కమలం. మలమల్ల ధారణే. - జలముచేత ధరింపఁబడునది.
కామ్యతే తృషార్తైరితి కమలం. కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరఁబడునది.
సహస్రపత్రము - కమలము, తామర.
సహస్రం పత్రాణ్యస్య సహస్రపత్రం వేయుఱేకులు గలది. కమలదళాక్ష గోవిందా| 

శ్రీపర్ణం కమలే (అ)పి చ,
శ్రీపర్ణశబ్దము తామరపువ్వునకును, అపిశబ్దము వలన నెల్లి(నెల్లి - ఉసిరిక)చెట్టునకును పేరు. శ్రీయుక్తాని పర్ణాన్య స్యేతి శ్రీపర్ణం - ఒప్పిదము గల పర్ణములు గలిగినది.

కెందమ్మి - (కెంపు+తమ్మి) ఎఱ్ఱదామర.  

తామరసము - 1.తామర, 2.బంగారు, 3.రాగి.
తమఃప్రకర్షో రసో (అ)స్య తామరసం - ప్రకృష్టమైన రసము గలిగినది.
తామ్యద్భిః రస్యత ఇతి వా తమరసం, రస అస్వాదే. - బడలినవారిచే నాస్వాదింపఁబడునది.
తామరం బలం తత్రనస్తి తిష్ఠతీతి తామరసం, షస స్వప్నే. - ఉదకమునందుండునది.

తామరతూపరి - మదనుడు.
మదనుఁడు - మన్మథుడు.
మదనః మదయతీతి మదనః - మదింప జేయువాఁడు, మదీ హర్ష గ్లేపనయోః.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మధతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

కమలములు నీటబాసిన
గమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమదమ నెలవులు దప్పిన
దమమిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.

తా. తామరులు జలమును వదలినయెడల కమలాప్తుఁడు - సూర్యుడు, విష్ణువు. తమకాప్తు లైన సూర్యుని రశ్మి - (భౌతి.)1.కిరణము, 2.కాంతి, 3.వెలుగు.)సోకి వాడిపోయి నట్లే, తమ తమ నెలవు - 1.వాసస్థానము, 2.స్థానము, 3.పరిచయము.)దప్పిన తమ స్నేహితులే తమకు శత్రువు లగుదురు.

మహాలక్ష్మి-1.సరస్వతి, 2.లక్ష్మి, నారాయణశక్తి.
కామేశ్వరి - పరాశక్తి, మహాలక్ష్మి. కొల్హాపురీ మహాలక్ష్మీ శక్తిపీఠం|

కమల-1.లక్ష్మి, 2.పూజ్యస్త్రీ, 2.కమలాఫలము.
కమలమస్యా అస్తీతి కమలా - కమలము చేతియందు గలిగినది. కమలాలయము నందు దేవిస్థానం కమల|     

స్యాత్కురజ్గే పి కమలః :
కమల శబ్దము ఇఱ్ఱికి(కురంగమము - జింక)పేరైనపుడు పు. అపిశబ్దము వలన తామరకును, నీళ్ళకును పేరైనపుడు న. మహాలక్ష్మికీ పేరైనపుడు సీ. కామ్యత ఇతి కమలః. కము కాంతౌ. కోరఁబడునది. 'కమలం సలిలే తామ్రే జలజే క్లోమ్ని భేషజే, మృగప్రభేదే కమలః కమలా శ్రీవరస్త్రియో' రితి విశ్వప్రకాశః.

కమలుఁడు - బ్రహ్మ, ఇంద్రుడు. 
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
కమలాసనుఁడు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బమ్మ - నలువ, సం.బ్రహ్మ.   
కమలాసనః, కమలం ఆసనం యస్య సః - కమలము ఆసనముగాఁ గలవాఁడు.    

ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

కమలిని - 1.తామరకొలను, 2.తామరతీగ.
కమలు - క్రి.1.తపించు, 2.సంతాపించు, 3.కాలు.

ఉమ - 1.పార్వతి, వ్యు.తపము వలదని తల్లిచేఅడ్దుపెట్టబడినది, 2.కాంతి, 3.పసుపు, 4.యశము.
ఉమా, అ-సీ, ఉ ఇత్యనేన సంబొద్య మా ఇత్యనేన తపసో మాత్రా నిషిద్దత్వాదుమా, ఉ=ఓ బిడ్డా, మా=వలదు, అని యిట్లు తల్లి చేఁ దపస్సువలన నిషేధింపఁబడెను గనుక ఉమ, అవతీత్యుమా - రక్షించునట్టిది, అవరక్షణే.

మేని - కాంతి.
కాంతి1 - 1.కోరిక, 2.(అలం.) ఒక కావ్య గుణము.
కామ్యత ఇతి కాంతిః, ఈ-సీ. కము కాంతౌ - ఇది కోరఁబడుచున్నది గనుక కాంతి.
కాంతి2 - (భౌతి.) వెలుతురు, ప్రజ్వలించు వస్తువుల నుండి వెలుపడు శక్తి రూపము, వెలుగువస్తువులు కనబడునట్లు చేయునది (Light).   

అభిరుచి - 1.అత్యాసక్తి, 2.కాంతి, 3.(గృహ.) రుచి, నచ్చినచవి (Taste).  

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కాంతికిరణపుంజము - (భౌతి.) కాంతికిరణముల గుంపు, రూ.కిరణశలాక (Beam of light).
కిరణశలాక - (భౌతి.) సమాంతరముగ నున్న కిరణముల సమూహము (Pencil of rays).

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ|

మధ్యమః స్యా ద్విహసితమ్ -
స్మితాతిహసిత యోర్మధ్యమః విహసితం - చిఱునవ్వునకును పెద్ద నవ్వునకును మధ్యమైన నవ్వు విహసిత మనంబడును.
విహసితము - మృదు ధ్వనిగల నవ్వు.
విశేషేణ హసనం విహసితం, హసే హసనే. - విశేషముగా నవ్వుట విహసితము.  

నఖానా ముద్ద్యోతై - ర్నవనలినరాగం విహసతాం
కరాణాం తే కాంతిం - కథయ కథయామః కథ ముమే|
కయాచిద్వా సామ్యం - భవతు కలయా హన్త కమలం 
యది క్రీడల్లక్ష్మీ - చరణతలలాక్షారుణదలమ్|| - 71

తా. ఓ ఉమా! తల్లీ! నూతనమగు పద్మకాంతిని విహసితము - మృదు ధ్వనిగల నవ్వు, గోళ్ళచే ప్రకాశించుచున్న నీ చేతుల కాంతి - 1.కోరిక, 2.(అలం.)ఒక కావ్యగుణము. నెట్లు ఏమని పొగడగలము? కమలము తా నే విధముగానైన క్రీడించుచున్న లక్ష్మీదేవియొక్క పాదములందలి  లాక్షారసము - పారాణి అరుణిమను పొందగలిగిన - కొంచెముగా సామ్యము - సమత్వము, పోలిక. పొందిన పొందవచ్చును. సంపూర్ణమైన సామ్యము నకు తగదు. సాటిగాని కమలపు ఏ కళతో నీ నఖకాంతి సమమగును. - సౌందర్యలహరి

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

కమలే! కమలాక్షవల్లభే! త్వం
కరుణాపూర తరంగితైరపంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః||

జడధి - సముద్రము.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జలతి జడీభవతీతి జలం, జల ఘనే - జడీభవించునది.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది. 
జలత్యపవారయతీతి జడః, లడయోరభేదాత్ జల అపవారణే - ధైర్యమును నివారించునది.  
నీళ్ళు - నీరు.

నీరజము - 1.తామర, 2.ముత్యము విణ.దుమ్ములేనిది. 

జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic). 

రాముఁడు - 1.రఘురాముడు, 2.బలరాముడు, 3.పరశురాముడు.
రామః రమయతి మోదయతి రూపసంపదేతి రామః - రూపసంపద చేత సంతోషింపఁ జేయువాఁడు. రము క్రీడాయాం.  

మహారాజులు - వీరు పదునార్గురు :- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.    

ఈ జగమందుఁదామనుజుఁ దెంత మహాత్మకు డైన దైవమా
తేజముతప్పఁజూచునెడ ద్రిమ్మరుకోల్పడు నెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడుగాల్నడఁ గాయలాకులన్
భోజనమై తగన్వనికిఁబోయి చరింపఁడె మున్ను, భాస్కరా.
తా.
పూర్వము మహా రాజ కుమారుడైన రామచంద్రుడు కాలినడకతో అడవి కేగి, కాయలు, ఆకులు అహారముగా గైకొని ఆ యడవి యందు సంచరించెను. అట్లే మనుష్యు డెంతగొప్ప మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)వాడైనను, దైవానుగ్రము లేనిచో తన గొప్పతనము బోగొట్టుకొని దేశసంచారియై ప్రవర్తించును.

పదునెనిమిదవ(18వ)దైన రామాభిధానంబున దేవకార్యర్థంబు రాజత్వంబునొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె; పద్దెనిమిదో
18వ పర్యాయం "శ్రీరాము" డై సముద్ర బంధనాది వీరకృత్యాలాచరించి దేవకార్యం నిర్వరించటం కోసం తాను రాజైనాడు.

మహారాజులు - వీరు పదునార్గురు :- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః, ఈసీ, శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది, శ్రీఞ్ సేవాయాం.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

రామరాజ్యము - రాముని రాజ్యము సుఖమైన రాజ్యమని వాడుక యందలి యర్థము.

రామాయణము - రఘువంశీయుడైన శ్రీరామచంద్రుని కథను తెల్పు పుణ్యకావ్యము. (శ్రీరామచంద్రుని భగవ దవతారముగ హిందువులు భావించుచుందురు. వాల్మీకి మహర్షిచే రచింప బడిన ఈ గ్రంథము క్రీ. పూ. 2530-1950 ప్రాంతములలో రచింపబడినదిగా చరిత్రకారులు భావించు చున్నారు. రామాయణము వలన మనకు ఆర్యులు మొదటిసారిగా వైదిక ధర్మమును, సంస్కృతిని దక్షిణాపథమున వ్యాపింప జేసినట్లు తెలియు చున్నది.)

రాముఁడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లి కా
రాముడు షడ్వికారజయరాముఁడు సాధుజనా వన వ్రతో
ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగుగెం
దామరలే భజించెదను దాశరథీ కరుణా పయోనిధీ.

తా. సకల జనులను రమింపఁజేయువా డును, ఘోరమయినపాపము లను తొలగించువాఁడును, కళ్యాణగుణములను అవ్వారిగాఁగలవాఁడును, వికారరహితుఁడై ప్రకాశించువాఁడును, సాధుజను లను(సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.)రక్షించునట్టివాఁడును రాముఁడే మాకు పరమదైవమని మీ (కెందమ్మి - (కెంపు+తమ్మి)వంటి పాదారవిందములను కొలిచెదను.

రామరాజ్యంబు నిప్పుడు రా ముదంబె
యౌర! యే మొ సుగ్రీవాజ్ఞ సారమౌనె
యాంజనేయునిభక్తి భాగ్యంబె సీత
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

ఏకపత్నీవ్రతుఁడు - త్రికరణశుద్ధిగా ఒకే భార్య యను వ్రతము గలిగినవాడు.

ఏకపత్ని - 1.పతివ్రత, 2.సవతి లేనిస్త్రీ, 3.సవతి.

కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణమునందు షట్కాండములు గలవు) 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము(గుఱ్ఱము - అశ్వము), 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.
చిత్తు - 1.జ్ఞానము, 2.వి.మొదట వ్రాసిన వ్రాత.
జ్ఞానము - తెలివి, ఎరుక. ఎఱుకువ - తెలివి.
తెలివి - 1.వివేకము, 2.ప్రకాశము, 3.కాంతి, వికాసము, 4.తేరుట, 5.తెలుపు.  
విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము. 
ఉత్స్వేదనము - (వృక్ష.) ఆకుల నుండికాని, కాండము నుండి కాని నీరు ఆవిరిరూపమున బయటికిపోవుట (Transpiration).

ఆశ్వాసము - 1.గ్రంధభాగము, 2.ఊరడించుట, 3.బతిమిలాడుట.  

భార్యావియోగశ్చ జనాపవాదః ఋణస్య శేషః కుజ సస్యసేవా |
దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ, వినాగ్ని మా పంచ దహంతి కాయమ్ ||
తా.
భార్యావియోగమును, జనులచే అపవాదము ను, ఋణశేషమును, చెడ్డవానియొద్ద(కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, అంగారకుడు (Mars) కొలువును, దారిద్ర్యకాల మందు స్నేహితులు వచ్చుటయు; నీయైదును కాయము - 1.మేను, శరీరము, 2.స్వభావము. నిప్పులేకయే దహించును. - నీతిశాస్త్రము

దశరథ రాజకుమార దానవమదసంహార నారాయణ|

రమ్యగుణధామ రంజిత రామనామ
శక్తిహితకామ పోషిత సర్వసామ
కామ్యపరిణామ బుద్ధివికాస సోమ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

శ్రీరామో రామభద్రశ్చ రామచన్ద్రశ్చ శాశ్వతః,
రాజీవలోచనః శ్రీమాన్ రాజేన్ద్రో రఘుపుజ్గవః.

రామదాసు - ఒకపిట్ట.
రామ -
స్త్రీ, వ్యు.గీతకళాదుల నేర్పి రమించునది.
లేమ - స్త్రీ, సం.రామా.

రామః రమయతి మోదయతి రూపసంపదేతి రామః - రూపసంపద చేత సంతోషింపఁ జేయువాఁడు. రము క్రీడాయాం.

బలే రామో నీల చారు సితే త్రిషు,
రామశబ్దము బలభద్రునికి పేరైనపుడు పు. నల్లనిదానికిని, అందమైన దానికిని, తెల్లనిదానికిని పేరైనపుడు త్రి. రమయతీతి రామః. రము క్రీడాయాం, రమింపఁజేయు(నది) వాఁడు. 

'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా' కవాటమై
డీకొని ప్రోచునిక్కమని ధీయుతులెన్నఁ దదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక వివత్పరం వరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణా పయోనిధీ.
తా.
"రా" అను (రామ)అనెడి దివ్యనామములోని రేఫము పాపముల నన్నిటిని బయటికి తఱుమగా,  "మా" అను అక్షరము తలుపులు వలె(కవాటము - 1.తలుపు, 2.(భౌతి.) ఒకవైపునకు పోయిన వాయు పదార్థములను గాని, ద్రవ పదార్థములనుగాని, వెనుకకు రాకుండ అడ్డు కొనుచు ఒక వైపునకు తెరచుకొనియుండు తలుపు (Valve) అడ్దుపడి వానిని ఎదిరించి లోపలికి రాకుండునట్లు చేసి ఆశ్రితులను కాపాడును. ఇది నిజమని జ్ఞానవంతులు చెప్పగా మూఢులా యక్షరము లను గ్రహించి జపింప నేరకున్నారు. అట్లుకాక, లోకులు వానిని జపింపరేని యెడతెగక వచ్చు ఆపదలు వారికి కలుగవు.       

రామాయన చపలాక్షులపేరు
కామాదుల పోరువారు వీరు
రామాయన బ్రహ్మమునకుఁ బేరు
ఆ మానవ జననార్తులు దీఱు ||తెలిసి||

కుశుఁడు - శ్రీరామ చంద్రుని జ్యేష్ట పుత్రుడు.  స్వతనయ కుశలవ పండిత రామ్|

అతిథి - 1.భోజన సమయమునకు వచ్చు పరదేశి, 2.ఆహుతుడు, 3.కుశుని కొడుకు.

వితరసి దిక్షు రణే దిక్పతికమనీయమ్, దశముఖమౌళిబలిం రమణీయమ్|
కేశవ! ధృత రఘుపతివేష! జయ జగదీశ! హరే! ||
       

కామపాలుఁడు - బలరాముడు, బలదేవుడు.
కామపాలః, భకత కామాన్సాలయతీతి కామలాపః - భక్తుల కోరికలను దీర్చువాఁడు.
కామం స్మరం పాలయతి ఆత్మజత్వాత్కామపాలః - కొమరుఁ డగుట వలన మన్మథుని బాలించువాడు.

కామము - 1.కోరిక, 2.మోహము, 3.రేతస్సు.

కామారి - ముక్కంటి, శివుడు.
కాముఁడు - మరుడు, మన్మథుడు.
కామః కామ్యతే అనేన కామః - వీనిచేత కోరఁభడును.
కామదేవుఁడు - వలపురాయుడు, మన్మథుడు. కమనుఁడు - కాముకుడు, వి.మన్మథుడు.

కామ - 1.తామర మొ.ని కాడ, 2.గొడుగు మొ.ని దండము, 3.మగగురి, 4.చనుమొన.

కారుణ్యామృతవారిరాశి మనిశం కేయూరహారై ర్వృతాం
కామారేస్సహజాం కరాబ్జవిలస - త్కీరాం కుబేరార్చితాం-
కామక్రోధముఖారివర్గశమనీం కైవల్యసంప్రదాం
కంజోద్భూతమనఃప్రియాం హృది భజే భక్త్యా సదా శారదామ్| - 4

        

శతపత్రము - తామర.
శతం పత్రాణ్యస్య శతపత్రం. - నూఱుఱేకులు గలది. సహస్రపత్రశతపత్ర శబ్దములు పద్మ విశేషవాచకములైనను పద్మత్వ సామాన్యము చేత నేకార్థములు.
కుశేశయము - తామరపువ్వు, వ్యు.నీటియం దుండునది.
కుశే జలే శేత ఇతికుశేశ్యము, శీఙ్ స్వప్నే. - నీళ్ళయందుండునది.
పంకేరుహము - పంకజము, తామర.
పంకే రోహతీతి పంకేరుహం, రుహ బీజ జన్మని ప్రాదుర్భావే. - అడుసునందు మొలచునది.
పంకజము - తామర, వ్యు.బురదలో పుట్టినది. 
పంకరుహము - తామర.
పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.
పంచతే విస్తారమాపద్యత ఇతి పంకః అ, ప్న. పచి విస్తారే. - విస్తారమును బొందునది.
పంచతి సంపర్కాద్విస్తారమాపద్యతే పంకం ప్న, పచి విస్తారే. - సంబంధము వలన విస్తారమును పొందునది.
అసలుఁబుట్టువు - తామర, పంకజము.
అసలు - 1.బురద, హిం.వి.(వాణి.) అప్పుగా తీసికొనిన సొమ్ము(Principal).   

జంబాలము - 1.అడుసు, 2.పాచి.
జమతి గ్రసతే గతిం వస్తువా జంబాలః, నము ఛము జము ఝము అదనే - గతినిగాని వస్తువునుగాని కబళించునది.
అడుసు - బురద. అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల.  

సజమ్బాలే తు పఙ్కిలః,
జంబాలేన సహవర్తత ఇతి సజంబాలః, పంకోస్యాస్తీతి కంకిలః. - అడుసు గలిగినది. ఈ ఒకటి అడుసుతోఁ గూడిన దేశము పేర్లు.

పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.
పంచతే విస్తారమాపద్యత ఇతి పంకః అ, ప్న. పచి విస్తారే. - విస్తారమును బొందునది.
బాడె - బురద, అడుసు, సం.పంకమ్. పంకిలము - బురదగలది.

కర్దమము - అడుసు, పంకము, బురద.
కర్దతి కుత్సిత శబ్దం కరోతీతి వాకర్దమః, కర్దకుత్సితే శబ్దే. - కుత్సిత శబ్దమును జేయునది. 

జేడియ - బురదనేల, రూ.జేడె.
జేడు - బంకమట్టి.  

కీర్తి - 1.యశస్సు, (వికృ.) కీరితి, 2.పేరు, 3.తేట, 4.అడుసు, 5.విరివి.

బెందడి- (వ్యవ.) 1.ఒక రకముకంకర, 2.అడుసు.
బేఁటు - 1.ఎండిన అడుసు పెల్ల, 2.కొండలోనగు వాని యందలి చీలిక.

వండ - 1.ఆపద, 2.చెరువులోనగు వాని యడుగున నుండెడి యెండిన బురద.
ఆపద - విపత్తు, ఇడుమ.
విపత్తు - ఆపద.
ఇడుమ - 1.ఆపద, 2.అలసట.
ఆపత్తి - 1.ఇడుమ, రూ.ఆపద, 2.అర్థాదులసిద్ధి కలుగుట, 3.(తర్క) అయర్థజ్ఞానము.
ఆపన్నము - 1.ఆపదనొందినది, 2.లభించినది, 3.సంభవించినది.
ఆపన్నుఁడు - ఆపదనొందినవాడు. 

రొంపి - అడుసు, బురద.
రొంపిదుక్కి - నీళ్ళు అడుసుగా దున్నుట.
కుదప - రొంపిదుక్కి, అడుసుదుక్కి. 

రొచ్చు - 1.అడుసు, 2.మాలిన్యము, 3.అపవాదము. అబ్బ ఒకటే రొచ్చు....
మాలిన్యము - మలినత.
అపవాదము - 1.నింద, దూరు, 2.ఆజ్ఞ.

ఉరిడె - 1.కుమ్మరి పురుగు, 2.ఊరు మూలదేశము.
యమకీటకము - కుమ్మరి పురుగు.  
కుమ్మరి పురుగు - కీటకము, కుదురులేనిది, సాధువు.
కుమ్మర పురుగు - అడుసు నందు తిరియు అడుసు నంటుకొనక చరించు పురుగు, మట్టిపురుగు.
కీఁచుఱాయి - 1.కుమ్మరి పురుగు, 2.ఇలకోడి, ఈలపురుగు.

వారిజపత్రమందిడినవారి విధంబున వర్తనీయ మం
దారయ రొంపిలోన దనువంటని కుమ్మెరపుర్వు రీతి సం
సారమునన్ మెలంగుచు విచారగుఁడై వర మొందు గాదె స
త్కారమెఱఁగి మానవు డు దాశరథీ కరుణా పయోనిధీ.

తా. రామా! తామరాకునందలి నీటిబొట్టు ఆ తామరాకును ఎట్లు, లంటుకొనదో, రొంపిలో కుమ్మరిపురుగు మెలఁగినను దాని దేహమునకు బురద అంటుకొనక యెట్లుండునో, అట్లే మానవుఁడు - మనుష్యుడు, వ్యు.మనువు వలన జన్మించిన వాడు.)సంసార మందు ప్రవర్తించు చుండినను తత్వవిచారమును పొంది సంసారమున తగులుబడక మోక్షమును పొందును గదా.

ఇద్దరు వ్యక్తులు అదే కటకటాల వెనుక నుంచి చూస్తారు. ఒకరికి బురద కనిపిస్తే, మరొకరికి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. - యప్. లాంగ్ బ్రిడ్జ్

అలసము - 1.మందమైనది, సోమరి, 2.శ్రమచెందినది, వి.1.బురదలో తిరుగుటచే కాలివేళ్ళనడుమ వచ్చు పుండు, బురదపుండు, 2.ఒకరకపు అజీర్ణవ్యాధి, 3.విషముగల ఎలుక. 

శ్వేత పంకజ వర్ణాభాం శరచ్చంద్ర నిభాననామ్|
చందనోక్షిత సర్వాగీం రత్నభూషణ భూషితామ్||

జడధి - సముద్రము.
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
జలతి జడీభవతీతి జలం, జల ఘనే - జడీభవించునది.
జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది. 
జలత్యపవారయతీతి జడః, లడయోరభేదాత్ జల అపవారణే - ధైర్యమును నివారించునది.  
నీళ్ళు - నీరు.

నీరజము - 1.తామర, 2.ముత్యము విణ.దుమ్ములేనిది. 

జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు) (వృక్ష.) నీటిలో నుండునది, (Aquatic). 

మన్దస్తు తున్ద పరిమృజ ఆలస్య శ్శీతకో అలసో అనుష్ణః : 
మందుఁడు - శని Saturn, విణ.1.అల్పుడు, 2.మూర్ఖుడు, 3.వ్యాధిగ్రస్తుడు.
ఆలస్యేన మందతే - స్వపితీవేతి మందః. మది స్తుత్యాదౌ. - ఆలస్యము చేత నిద్రపోవువానివలె నుండువాఁడు.
శని- నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn). 

మన్దగామీ తు మన్దరః,
మందం గచ్ఛతీతి మందగామీ నాంతః, గమ్ ఌ గతౌ. - మెల్లగా నడుచువాఁడు.
మథ్నాతి చరణా వితి మథరః, మంథ విలోడనే. - నడవలేక కాళ్ళను బిగుసుకొనువాఁడు. ఈ 2 మెల్లగా నడుచువాని పేర్లు.

మందుఁడ నే దురితాత్ముఁడ
నిందల కొడిగట్టి నట్టి నీచన్నన్నున్
సందేహింపక కావుము
నందుని వరపుత్ర ! నిన్ను నమ్మితి కృష్ణా.

తా. కృష్ణా ! నేను మందుఁడను, నీచుఁడను, దురితాత్ముడను, నన్ను సందేహింపక కాపాడుము, నిన్నే నమ్మితిని.

తుందము - కడుపు.
తుద్యతే అజీర్ణాదినాతుందం తుద వ్యథనే. - అజీర్ణాదులచేత వ్యథ పెట్టఁబదునది.
తుంది - 1.కడుపు, 2.ఉరుకుబొడ్డు, విణ.బొజ్జ కడుపు కలవాడు.
పునః పునస్తుందం పరిమార్ష్టీతి తుందపరిమృజః. మృజూ శుద్ధౌ.- పలుమాఱు కడుపు నిమురు కొనువాఁడు.  
తుందిభుఁడు - 1.బొజ్జకడుపు గలవాడు, 2.ఉరుకుబొడ్డు కలవాడు, రూ.తుందిలుడు.
తుంది పిచండశబ్దౌ కుక్షిపర్యాయౌ తద్యోగాత్ తుందిలః, తుందిభః, పా, తుందికః, తుందీ,న్.
తొంద - తుదిలుండు, బొజ్జకడుపువాడు, రూ.తొందు, సం.తుందీ.  

వృద్ధోనాభౌ తుణ్డిల తుణ్డిభౌ,
వృద్ధో నాభిరన్యేతి వృద్ధనాభిః, పు. - పొడవైన బొడ్దు గలవాఁడు.
తుండిభుఁడు - ఉరుకు బొడ్డువాడు, రూ.తుండిలుఁడు.
తుండి రున్నతనాభి స్తద్యోగాత్తుండిలః, తుండిభశ్చ - తుండి యనఁగా పొడవైన బొడ్దు; అది గలవాఁడు. ఈ 3 పొడవైన బొడ్డుగలవాని పేర్లు.   

తుండి - 1.ఉరుకు బొడ్డు, రోగముచే పెరిగిన బొడ్డు, 2.తుండము.
తుండము - 1.ఖండము, రూ.తుండు, తుండె, 2.పక్షిముక్కు, 3.నోరు, 4.మొగము, 5.గజహస్తము, రూ.తుండి.
తుడ్యతే హింస్యతే ఖాద్యమనే నేతి తుణ్డం, తుడి తోడనే. - భక్ష్య వస్తువు దీనిచేత పీడింపఁబడును. 
తుండు - ఖండము, తుండుగుడ్డ, రూ.తుండె.
తుండుపడు - వై. క్రి. మోడువలెనగు, మొండియగు. 

ఖండము - 1.తునక, 2.పులకండము, 3.పెద్దభూభాగము (ఆసియా, అమెరికా, అఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా ఖండములు). (గణి.) ఒక వస్తువును ఖండించగా లభించు భాగము, రెండు సరళరేఖల మధ్యనున్న సరళరేఖ భాగము, ఒకసరళ రేఖచే నేర్పడిన వృత్త భాగము, ఒక ఘనతలముచే ఛేదింపబడిన ఘనరూపభాగము.
(భూగో.) పెద్ద భూభాగము, సముద్రముచే భిన్నభిన్నముగ చేయబడని భూభాగము.

నచ్చుకాఁడు - అలసుడు, బాధకుడు.
సుస్తి - 1.సోమరితనము 2.జబ్బు, సం.అస్వాస్థ్యం. 
ౙబ్బు - అలసము, వి.రోగము. 

మసలిక - మాంద్యము, విణ.అలసము.
అలసము - 1.మందమైనది, సోమరి, 2.శ్రమచెందినది, వి.1.బురదలో తిరుగుటచే కాలివ్రేళ్ళనడుమ వచ్చు పుండు, బురదపుండు, 2.ఒకరకపు అజీర్ణవ్యాధి, 2.విషముగల ఎలుక.

శీతము - 1.చల్లనిది, 2.అలసమైనది.
శీతం మందం కరోతీతి శీతకః - మందముగా కార్యమును జేయువాఁడు.
శీతము - (జం.) అలలవలె కదులు యుండుపొర (Undulating membrane).
శీతకము - చలికాలము, సం.వి. (రసా.) ద్రవబాష్పములను శీతకలించి ద్రవముగా మార్చుట కుపయోగించు పరికరము (Condenser), రూ.స్వేదనము.

శీతస్వానము - (జం.) చలనము లేని స్థితిలో చలికాలమును గడుపుట (Hibernation). 

పరిమృతప్రాణులు - (జీవ.) పూర్వ మెప్పుడో యుండి ఇప్పుడు లేని ప్రాణులు (Extinct organisms).

అలసుఁడు - సోమరి, చురుకుదనము లేనివాడు.
నలసతీ త్యలసః అలస ఏవాలస్యః - ప్రకాశించువాఁడు కాఁడు గనుక అలసుఁడు, అలసుఁడే ఆలస్యుఁడు. 
సోమరి - అలసుడు, మందుడు.
అలుౘు - అలసుడు, సోమరి, అలసః. 
అలసః ఉక్తః. నవిద్యతే ఉష్ణం తేజో అస్యేతి అనుష్ట్ణః - ప్రకాశము లేనివాడు. ఈ ఆరు అలసుని పేర్లు.
ధీహరుఁడు - మందుడు. (ధీ - బుద్ధి)
బయ్యఁడు - మందుడు.

మాంద్యము - 1.ఆలస్యము, 2.జాడ్యము.
ఆలస్యము - 1.సోమరితనము, 2.అజాగ్రత్త, 3.జాగు. 
జాడ్యము - 1.జడత్వము, 2.ఆలస్యము.
జడత్వము - (భౌతి.) విశ్రాంతిస్థితిలో గాని చలించుచున్న స్థితిలోగాని ఉన్న వస్తువు దాని స్థితి మార్చుకొన కుండ ఉండు గుణము, (Inertia).
జడత - నిశ్చేష్టత, రూ.జడత్వము, జాడ్యము, జడిమము.

విళంబము - విలంబము, ఆలస్యము. 
విళంబి - విలంబము చేయువాడు, వి.ముప్పదిరెండవ(32వ) సంవత్సరము.

జాడ్యంధియో హరతినిఞ్చతివాచి సత్యం, మానోన్నతిం 
దిశతిపాపమపాకరోతి | చేతః ప్రసాదయతి దిక్షుతనోతి
కీర్తిం, సత్సంగతిః కథయ కిం నకరోతి పుంసాం ||

తా. సత్సాంగత్యము బుద్ధి జాడ్యమును బోగొట్టును, వాక్కునందు సత్యము గలుగఁజేయును, గౌరవము నిచ్చును, పాపములబోగొట్టును, మనస్సును స్వచ్ఛముగాజేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింప జేయును, మఱియు నెట్టి శుభముల నైనను గలుగజేయును. - నీతిశాస్త్రము

సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వమ్|
నిర్మోహత్వే నిశ్చలత్తత్త్వం - నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః. -  9

సత్ సంగము వలన నిస్సంగం (సంగరాహిత్యము) ఏర్పడుతుంది. నిస్సంగత్వం వలన దేనియందు వ్యామోహం కలుగకుండా ఉంటుంది. వ్యామోహం లేని మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా వుంటుంది. ఇలాంటి నిశ్చలతత్త్వమే సత్యశోధనకు అనువైన స్థితి అయి, జీవన్ముక్తిని సాధిస్తుంది. – భజగోవిందం

Through the company of the good, there arises non-attachment; through non-attachment, there arises freedom from delusion; through delusionlessness, there arises steadfastness; through steadfast ness, there arises liberation in life.

మన్దాయ మన్దచేష్టాయ మహనీయగుణాత్మనే,
మర్త్యపావన పాదాయ మహేశాయ నమోనమః|

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము (Property).  

పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాత్ | ఉన్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ | తస్యాం దేవా అధిసంవసంతః | ఉత్తమే నాక ఇహ మాదయంతామ్  | పృథ్వీ సువర్చా యువతిః సజోషాః | పొర్ణమాస్యుదగాచ్చోభమానా | ఆప్యాయయంతీ దురితాని విశ్వా | ఉరుం దుహాం యజమానాయ యజ్ఞమ్ ||15||

Krishna302

No comments:

Post a Comment