Wednesday, February 8, 2017

తిధులు

ఓం ప్రతిపన్ముఖ్య రాకాంత తిధి మండల పూజితాయై నమః : పాడ్యమీ ప్రభృతి పూర్ణిమా పర్యంత విశేష విధులచే పూజించ దగిన మాతకు (లలితాదేవి) ప్రణతులు.

దేవేశీ దండనీతిస్థా - దహరాకాశ రూపిణీ|
ప్రతిపనుముఖ్యరాకాంత - తిథిమండలపూజితా.
 

ఆదిత్యుఁడు - 1.సూర్యుడు, వేలుపు, 3.సూర్యమండలాంతర్గత విష్ణువు.
లోకబాంధవుఁడు -
సూర్యుడు. లోకబాంధవో లోకబాంధవః - లోకమునకుఁ చుట్టము, బంధువు.
ౙగముచుట్టము - సూర్యుడు.
ౙగముకన్ను - సూర్యుడు.
జగచ్చక్షువు - సూర్యుడు. 

                                        

తేది - తిథి, దినము, రూ.తేదీ, సం.తిథిః.
తిథి -
1.పాడ్యమి మొదలగునవి, 2.శ్రాద్ధదినము.

తదాద్యా స్థిథయో ద్వయోః,
తన్యతే షష్టిఘటికాభిరితి తిథిః, ఇ. ప్స. తనువిస్తారే - అఱువది 60 గడియలచేఁ బెంపొందునది.

ద్యుపు - 1.ఆకాశము, 2.దినము, 3.స్వర్గము.

ఆకాశము - 1.విన్ను, మిన్ను, 2.భూతము లైదింటిలో ఒకటి, 3.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు(Space).
ఆకసము - మిన్ను, స.ఆకాశః.  

ఘస్రో దినాహనీ వా తు క్లీబే దివస వాసరౌ,     

ఘస్రము - దినము, విణ.కర్కశము.
ఘన త్యన్ధకారమితి ఘస్రః, ఘ స్డ్ అదనే - అంధకారము(అంధకారము - చీకటి.)ను దినివేయునది.

దినకరుఁడు - సూర్యుడు.
దినము - 1.పగలు, 2.రేపవళ్ళు చేరినది.
పగలు - పవలు, దినము.

ద్యుతి అంధకారమితి దినం. దో అవఖండనే - అంధకారము(అంధకారము-చీకటి)ను ఖండించునది.

దినరేఖ - (భూగో.) 180 డిగ్రీలు రేఖాంకముతో సరిపోవు రేఖ. (పశ్చిమముగ పయనించువాడు ఈ రేఖ దాటినప్పుడు తేదీకి ఒక రోజు కలుపుకొనవలెను. అట్లే తూర్పుగ పయనించువాడు ఒక రోజు తీసివేసి కొనవలెను. ఈ ఊహారేఖ తూర్పునకు అలాస్కా పశ్చిమమునకు దక్షిణ సముద్ర ద్వీపములు (South Sea Islands) కలవు.

దివాకరుఁడు - సూర్యుడు, వ్యు.పగటిని కల్గించువాడు.
దివా దినం కరోతీతి దివాకరః - దినమును జేయువాఁడు.
దివ అహని ప్రాణినశ్చేష్టావతః కరోతీతి దివాకరః - పగలు జీవులను వ్యాపవంతులుగాః జేయువాఁడు.      
2. న జహాతి ప్రత్యాగమనమిత్యహః. స. న. ఓహాక్ త్యాగే - తిరిగి వచ్చుటను విడువనిది.
సూర్యేణ న హీయత ఇత్యహః - సూర్యునిచే విడువఁబడనిది.

దివము - 1.ఆకాశము, 2.స్వర్గము, 3.పగలు.

దివి - 1.ఆకాశము, 2.స్వర్గము.
దివ్యము -
1.దివియందు పుట్టినది, 2.ఒప్పైనది.
దివిజుఁడు - దేవత; దేవత - వేలుపు.
వేలుపు - 1.దేవత, దేవతాస్త్రీ, 2.జ్యోస్యము.
దివిషదుఁడు - దేవత, స్వర్గమున నుండువాడు.
దివౌకసుడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.స్వర్గమే నెలవుగా గలవాడు.
బుధుఁడు -1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. 

దివసము - 1.పగలు, 2.దినము, రోజు.      
దీవ్యంతి జనా అస్మిన్నితి దివసః. ప్న. దివు క్రీడాదౌ - దీనియందు జనులు ప్రకాశింతురు.
వసంత్య స్మిన్నితి వాసర్థః. ప్న. వస నివాసే - దీనియందు వసింతురు.

ద్యుతి - 1.కాంతి, 2.కిరణము.
ద్యోత ఇతి ద్యుతిః ఇ-సీ ద్యుత దీప్తౌ - ప్రకాశించునది.
ద్యోతతే ద్యుతిః, ఇ.సీ. ద్యుత దీప్తౌ - ప్రకాశించునది.  

దీప్తి - కాంతి, సం. (భౌతి.) ప్రకాశము, (Luminosity), కాంతి యొక్క తీక్ష్ణత, (Brithtness).
దీప్యతే దీప్తిః, ఇ.సీ. దీపీ దీప్తౌ – ప్రకాశింపఁ జేయునది.
దీప్తమండలము - (రసా.) క్రొవ్వు వత్తి జ్వాలలో తిమిర భాగము నావరించి కాంతిని వెదజల్లు అంతర్భాగము (Luminous zone).
దీప్తము - 1.వెలిగినది, 2.కాలినది.
దీప్యమానము - (భౌతి.) వెలుతురును వెడల గ్రక్కుచున్నది (Luminis-cent). 

రోజు - దినము.
రోజు -
24 గంటలు, దినము భూమి తన అక్షముపై పడమటనుండి తూర్పునకు తనచుట్టును 360 డిగ్రీలు తిరుగుటకు తీసికొను వ్యవధి, సం.రోచిః.

రోచిస్సు - 1.కాంతి, 2.సూర్యకిరణము.
రోచత ఇతి రోచిః, స, న. రుచ దీప్తౌ - ప్రకాశించునది. 
రోచనము - ప్రకాశించునది.
రోచిష్టువు - ప్రకాశించువాడు.

వాసరము - దినము.   
వాసయతి స్థాపయతి జదితి వాసరః - లోకమును నిలుపునది.
4.దివసవాసర శబ్దౌ వికల్పేన నపుంసకలిఙ్గే వర్తేతే - దివసము, వాసరము ఇవి యొక పక్షమున నపుంసకలింగములు నగును. ఈ నాలుగు 4 పగలు పేర్లు. 

ప్రాహ్ణము - ఉదయాదిగ పది గదియల వరకు గల కాలము, లేబగలు.
లేఁబగలు -
(లేత+పగలు) ప్రాహ్ణము.

ఆహ్నికము - 1.పగలు చేయదగినది, 2.పగలు జరుగునది, వి.1.పగలు చేయదగిన కర్మము, 2.మహాభాష్య ప్రకరణము.

ఓర1 - 1.అంచు, ఓడ్డు, 2.మేర, 3.వైపు, అవ్య. అడ్డముగా.
ఓర2 - అహోరాత్రము, సం.హోరా.
ఓరంతపొద్దు - 1.అహోరాత్రము, దినమంతయు, 2.ఎల్లపుడు, 3.రవంత.

అహర్పతి - 1.సూర్యుడు, 2.శివుడు, 3.జిల్లేడు.

మధ్యాహ్నము - పట్టపగలు, దినము నడిమి భాగము.
మధ్యాహ్న రేఖలు - (భూగో.) రేఖాంశములు, ఉత్తర, దక్షిణ ధ్రువముల గుండా పోవు వృత్తములు.

మూన్న్నాళ్ళపట్టపగలు - జాతీ. మూడు రోజుల మధ్యాహ్నము, స్వల్పకాలము.

                                                     

త్రిద్యుస్పృక్కు - మూడు దినములు వ్యాపించిన తిథి; అవమము.

లోకబాంధవుఁడు - సూర్యుడు.
లోకస్యబాంధవో లోకబాంధవః - లోకమునకు జుట్టము. సురేషు ఉత్తమ స్సురోత్తమ - దేవతల యందు శ్రేష్ఠుఁడు.
ధామనిధి - సూర్యుడు.
ధామ్నాం నిధిః - కాంతులకు గనియైనవాఁడు.
ధామము - 1.ఇల్లు, 2.చోటు, తావు 3.కిరణము, 4.కాంతి, 5.ప్రభావము 6.మేను, 7.పుట్టువు. 

నివసతి - ఇల్లు; నివసనము - ఇల్లు.
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
నివాసి - వాసము చేయువాడు. 

పురము - 1.పట్టణము, 2.శరీరము, 3.ఇల్లు.
పట్టణము -
కోటచేతను, అగడ్తచేతను దుర్గమమైన ప్రధాన నగరము.
శరీరము - దేహము; దేహము - శరీరము, మేను. శరీరి - ప్రాణి.
ఇలు - గృహము, రూ.ఇల్లు.
గృహము - 1.ఇల్లు, 2.భార్య. గృహిణి - ఇల్లాలు, భార్య.

పురందరుఁడు - ఇంద్రుడు, వ్యు.శత్రు పురముల నాశమొనర్చువాడు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు),  3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 6.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
కైటభజిత్తు - వెన్నుడు, హరి.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు. ప్రధమం తు హరిం విద్యాత్|
వెన్నునంటు -
అర్జునుడు (వెన్నుని + అంటు = కృష్ణుని మిత్రము). 

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద - తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి. కృష్ణ మేకాదశం|  
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.

హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి|
లలాట లిఖితాలేఖా పరిమార్ ష్ణుం నశక్యతే||
తా.
విష్ణువు చేతగాని, శివుని(హరుఁడు - శివుడు)చేతగాని, బ్రహ్మ చేతగాని, ఇతరమైన దేవతల చేతగాని నొసట వ్రాయబడిన(లిఖితము - వ్రాయబడినది, వి.అక్కరము.)వ్రాత తుడిచివేయ నలవిగాదు (మనుష్య మాత్రుల చేత కాగలదా!)శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. బ్రహ్మ రాత బయలుపడేదికాదు. - నీతిశాస్త్రము

అనుగ్రహప్రదాం బుద్ధి మనఘాం హరి వల్లభామ్,
అశోకా మమృతాం దివ్యాం లోకశోకవినాశినీమ్|

సూర్యసూతో (అ)రుణో (అ)నూరుః కాశ్యపి ర్గరుడాగ్రజః,
సూర్యస్య సూతః సూర్యసూతః - సూర్యుని సారథి.
ఋచ్యతీతి త్యరుణః ఋ గతౌ - గమనయుక్తుఁడు.
అరుణవర్ణత్వాదరుణః - ఎఱ్ఱనికాంతి గలవాఁడు.
న విద్యతే ఊరూ యస్య స అనూరుః, ఉ. పు. - తొడలు లేనివాఁడు.
కశ్యపస్య అపత్యం కాశ్యపిః. ఈ. పు. - కశ్యప ప్రజాపతి కొడుకు. 
గరుడస్య అగ్రజః - గరుడునికి అన్న. ఈ ఐదు సూర్యసారథి యగు ననూరుని పేర్లు.

అరుణుఁడు - 1.అనూరుడు, సూర్యసారథి, 2.సూర్యుడు. 
అనూరుఁడు-
తొడలు లేనివాడు, వి.గరుత్మంతుని అన్న(సూర్యసారథి).
అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.
అరుణోదయము - సూర్యోదయమునకు ముందు నాలుగు గడియలకాలము, వేకువజాము.

అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
వేకువ -
వేగుజాము; ఔషసి - వేకువ, ఉషఃకాలము.
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః.
రేపకడ - ప్రాతఃకాలము.
విభాతము - ప్రభాతము, వేకువ. ప్రభాతము - వరువాత, వేగుజాము.
ప్రత్యూషము - వేగుజాము.  
వేగు - తెలతెలవారు, శుభోదయమగు, వి.1.రాజ్యసమాచారము, 2.చారుడు.
వేగుఁ(ౙ)జుక్క - శుక్రుడు Venus.

ఉషస్సు -  సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.

                      

నిశాంతము - 1.వేకువ, 2.ఇల్లు.
నితరాం శామ్యతి దుఃఖమత్రేతి నిశాంతం. శము ఉపశమే. - దీనియందు దుఃఖము మిక్కిలి శమించును.
అవశ్యం నిశాయా మమ్యతే గమ్యత ఇతి నిశాంతం. అమ గతౌ. - అవశ్యముగా రాత్రియందు పొందఁబడునది. 
నివాసము - ఇల్లు, రూ.నివసనము, వాసము.
వాసము - 1.వస్త్రము, 2.ఇల్లు (ఆవాసము), వి.వెదురు.

అనేకార్కకోటి ప్రభావజ్జ్వలం తం |
మనోహారి మాణిక్య భూషోజ్జ్వలం తం |
శ్రితానా మభీష్టం నిశాంతం నితాంతం |
భజే షణ్ముఖం తం శరచ్చంద్ర కాంతమ్ ||

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు -
1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.
ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు. 

నేక్షేతోత్యంత మాదిత్యమ్నా స్తంయాంతం కదాచన
ప్రతిబింబం సదారిస్థం నమధ్యం నభసోగతం||
తా.
సూర్యు డుదయించుచున్నప్పుడు, అస్తమయ మగుచున్నపుడు, ఆకాశ మధ్యంబును బొంది యున్నపుడు ప్రతిసూర్యుని (అనఁగా ఉదకమందలి సూర్య ప్రతిబింబమును) జూడరాదు. – నీతిశాస్త్రము

ఋద్ధి - 1.వృద్ధి, 2.పార్వతి, 3.లక్ష్మి, 4.ఒకానొక గంధ ద్రవ్యము 5.కుబేరుని భార్య.  

వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి 2.వడ్డి.
పొడుపు కొండ -
ఫలసిద్ధి -
వడ్డి -
వృద్ధి, సం.వృద్ధిః. అసలు కన్నా వడ్డీ ముద్దు.

మిత్తి - 1.మృత్యుదేవత, చావు, 2.వడ్డి, సం.1.మృత్యుః, 2.మితిః.
మృత్యువు -
1.చావు, 2.మరణాధిదేవత.
మృతు - చావు.
మిత్తిచూలు(ౘ) - కేతువు Ketu. చూలు - 1.గర్భము 2.బిడ్డ.
కేతువు - 1.తొమ్మిదవ గ్రహము, 2.గురుతు, 3.తోకచుక్క, 4.అగ్ని, 5.కాంతి.
కేతనము - 1.టెక్కెము, 2.గురుతు, 3.ఇల్లు.
టెక్కెపుగాము - వి.1.కేతుగ్రహము, మిత్తిచూలు.  

మిత్తిగొంగ - మృత్యుంజయుడు, శివుడు.
మృత్యుంజయుఁడు -
శివుడు, మిత్తిగొంగ, వ్యు.మృత్యువును జయించినవాడు. మృత్యుం జయతీతి మృత్యుంజః - మృత్యువును గెలిచినవాఁడు. జి జయే.

వడ్డి - వృద్ధి, సం.వృద్ధిః.
వడ్డి -
(గణి.) సొమ్మునుపయోగించు కొన్నందుకు అదనముగానిచ్చు సొమ్ము (Interest) (అర్థ.) వృద్ధి. ఒకరి వద్ద తీసికొనిన పైకమును ఉపయోగించుకొని నందుకు ప్రతిఫలముగ చల్లించు అధిక ద్రవ్యము (Interest).
వృద్ధి - 1.పెరుగుట, అభివృద్ధి, 2.వడ్డి.
పెరుఁగుట - ఎదుగుట, వృద్ధిపొందుట (Growth).
ఎదుగు - 1.వర్ధిల్లు, వి.1.అధికము, 2.పెరుగుట.
అభివృద్ధి - పెంపు, పెరుగుదల.
తేమానము - 1.వడ్డి, 2.ఆలస్యము.
కుత్సీరము - వడ్డీబ్రతుకు.
వడ్డీబ్రతుకు - వృద్ధిజీవిక, వడ్డీతోజీవనము చేయుట.
వడ్డీకాసులవాడు - తిరుపతి వేంకటేశ్వర స్వామి.   

పొదుపు - 1.అనవసరముగ వ్యయము చేయకుండుట, 2.వృద్ధి.
పొదుపు - (గృహ.) అనవరముగ ఖర్చు చేయకుండుట, (అర్థ.) అనుభోగమును కనీసముగ చేసికొని కొనుగోలుశక్తిని దాచిపెట్టుట (Thrift Economy).

వైమనస్యము - 1.దుఃఖమనస్కుని భావము, 2.పొదుపు, 3.అభిప్రాయ భేదము.

జని - 1.స్త్రీ, ఆడుది 2.భార్య, 3.కోడలు(కుమారుని భార్య), పుట్టుక.
జననము -
1.పుట్టుక 2.వంశము. 
జన్మము - పుట్టుక; జనువు - పుట్టుక; ప్రాదుర్భావము - పుట్టుక. 
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
జాయతే స్యాం పతిః పుత్రరూపేణేతి జాయా. జనీ ప్రాదుర్భావే. - ఈమె యందు పతి పుత్రరూపమున జనించును.
బ్రియత ఇతి భార్యా. బృఞ్ భరణే. – భరింప బడునది.

ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.

బాలార్కః ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినదినే||
తా.
ఉదయకాలమందు ఎండగాచుకొనుటయు, పీనుగు కాలెడి పొగ తనమీదఁ బాఱుటయు, (వృద్ధ - ముసలిది)తనకంటె పెద్దదానితో సంగమము చేయుటయు, ఆకులు మురిన నీళ్ళను ద్రావుటయు, రాత్రి పెరుగన్నము భోజనము చేయుటయు నివి దినదినమున (కా)ఆయుస్సును తరుగ జేయును. - నీతిశాస్త్రము 

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః||

                      

దర్శ, ద్రష్ట, దర్శతా, విశ్వరూపా(భూమిరూపం), సుదర్శనా (విష్ణు చక్రము), ఆప్యాయమానా, అప్యాయమానా, ఆప్యాయా, సూవృతా, ఇరా, అపూర్వమాణా, ఆపూర్వమాణా, పూరయంతీ, పూర్ణా, పౌర్ణమాసీ అని ఈ నామములు వేదములందు చెప్పబడినది.

నారాయణుఁడు - 1.విష్ణువు, 2.సూర్యుడు, 3.చంద్రుడు, 4.శివుడు, 5.అగ్ని, 6.బ్రహ్మ, వ్యు. సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు.  
నారాయణి - 1.లక్ష్మి, 2.పార్వతి.
నారాయణాజ్జాతా నారాయణీ - నారాయణుని వలనఁ బుట్టినది. 
సుపార్శ్వము నందు దేవీస్థానం నారాయణి. నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ. 

నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా|
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయ వర్జితా. - 70శ్లో  

ఉరస్సు - పక్షము.
పక్షము -
 1.నెలయందు పదునైదు దినములు (శుక్ల కృష్ణ పక్షములు) 2.రెక్క. 

మూలే తు పక్షతిః పక్ష భేదయోః :
పక్ష భేదము లనఃగా శుక్ల కృష్ణపక్షములును, పక్షిఱెక్కలును; వాని యొక్క మూలమనఁగా పాడ్యమియును, ఱెక్కలమొదలును. ఈ రెంటికిని పక్షతి యని పేరు. పక్షయో ర్మూలం పక్షతిః. సీ. పక్షముల మొదలు గనుక పక్షతిః.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చః మానద |

ఏట - పక్షము, ప్రక్క, విన.అతిశయము, రూ.ఏటము.
ఏటవాలు - 1.పక్షపాతము, 2.వంపు.

పక్షౌ పూర్వా పరౌ శుక్ల కృష్ణా - పూర్వాపరౌ పక్షౌ శుక్ల కృష్ణా విత్యుచ్యేతే, ఇందు పూర్వపక్షము శుక్ల మనియు, అపరపక్షము కృష్ణ మనియుఁ జెప్పఁబడును. మొదటిది శుక్లపక్షము, రెండవది కృష్ణపక్షము.

అధవా - అట్లుకాకున్న, పక్షాంతరమున.
పక్షాంతరము -
మరియొక విధము.   
ఏని - అవ్య. పక్షాంతరమును అనిశ్చయమును తెలుపును.
పక్షాంతరస్థాపన - (గణి) ఒక పక్షము నుండి మరొయొక పక్షమునకు రాసులను కొనిపోవు ప్రక్రియ (Transposition). 

ప్రతి నెలయందు మొదటి 15 దినములకు శుక్లపక్షము, లేక శుద్ధపక్షము అనియు 2వ భాగముగల 15 దినములకు కృష్ణపక్షము లేక బహుళపక్షము అనియు పేర్లు కలవు. శుక్లపక్షము నందు వెన్నెల వృద్ధియగును. కృష్ణపక్షము నందు చీకటి వృద్ధియగును.

పక్షచరుఁడు - 1.చంద్రుడు, 2.సేవకుడు. చంద్రుడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము(నెలకువ - స్థానము), 5.కర్పూరము.
(ౘ)చందమామ - చంద్రముడు, చంద్రుడు, రూ.చందురమామ, సం.చంద్రమాః. 

మాసస్తు తావుభౌ,
తావుభౌ మాస ఇత్యుచ్యతే ఆ పక్షములు రెండు కూడిన కాలము మాసమనంబడును.
మస్యతే పరిమీయతే (అ)నేనేతి మాసః. మసీ పరిమాణే- దీనిచేత కాలము పరిమాణము చేయఁబడును. రెండు పక్షములు ఒక నెల.  

సోముఁడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
సూయత ఇతివా సోమః -
ప్రతి పక్షము నందును బుట్టింపఁబడువాడు.

గ్లౌ - 1.చంద్రుడు, 2.కర్పూరము.
ప్రతిమాసం గ్లాయతిక్షయతీతిగ్లౌం. ఔ. పు. గ్లేంలేహర్షక్షయే - ప్రతిమాసము క్షయించువాడు.

ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.
ఘనసారము - 1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.

తొలుపక్కము - శుక్లపక్షము.
తొలుత -
1.ముందు, 2.మొదట.

తెలిపక్కము - శుక్లపక్షము.
తెలి -
1.తెల్లనిది, నిర్మలము.
తెల్ల - 1.ధవళము, 2.స్పస్టము.
ధవళము - ఆబోతు, విణ.1.తెల్లది, 2.చక్కనిది.
ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది.
నిర్మలము - మలినములేమి, శుద్ధము, నిర్మాల్యము.
శుద్ధము - 1.తెల్లనిది, 2.దోషము లేనిది, 3.బాగుచేయబడినది, 4.కేవలము.
ప్రసన్నము - 1.నిర్మలము, 2.సంతుష్టము.
నిర్మాల్యము - ధరించి తీసివేసిన పూలదండలు మొ||వి.

ధావళ్యము - తెలుపు, రూ.ధవళిమము.
ధవళిమ -
తెలుపు.

సిత పక్షము - శుక్లపక్షము.
సిత -
1.చెక్కర, 2.తెల్లగంక
సితము - 1.తెల్లనిది 2.కట్టబడినది
సితాభము - కర్పూరము రూ.సితాభ్రాము

సితుఁడు - శుక్రుడు, విణ.తెల్లనివాడు.

శుక్లము - 1.వెండి, 2.తెలుపు, 3.మాసమునకు పూర్వపక్షము.
చంద్రబీజము -
వెండి. 
వెండి - రజతము, అవ్య. మరియు (వెండియు).
రజతము - 1.వెండి, 2.హారము, విణ.తెల్లనిది (భూగ.) ఒక లోహము (Silver) సం.వి. (రసా.) వెండి ధాతువు లలో నొకటి. (Argentum). నాణెములలో ఉపయోగపడు ధాతువు.
రజతాద్రి - 1.వెండి కొండ, 2.కైలాసము.
కైలాసము - కుబేరుని ఉనికిపట్టు, 2.శివుడుండు వెండికొండ.

1. ప్రతిపత్తు - పాడ్యమి.

అథ పక్షతిః, ప్రతిపద్ద్వే ఇమే స్త్రీత్వే :
పక్షస్య మూలం ప్రారంభః - శుక్ల కృష్ణ పక్షములయొక్క ప్రారంభము.
ప్రతిపద్యతే చంద్రస్య ఉదయః క్షయో వా అస్యాం ప్రతిపత్ - దీనియందు చంద్రుని యొక్క ఉదయముగాని క్షయముగాని తెలియఁబడును. ఈ రెండు పాడ్యమికిఁ పేర్లు.

పాడ్యమి - మొదటి తిధి, ప్రథమా.  ప్రథమశబ్దము మొదటిదానికిని, శ్రేష్ఠమైనదానికిని పేరు.

పరిఢవము - 1.హెచ్చు, 2.అతిశయము, సం.ప్రథిమా.

మూలే తు పక్షతిః పక్ష భేదయోః,
పక్ష భేదము లనఃగా శుక్ల కృష్ణపక్షములును, పక్షిఱెక్కలును; వాని యొక్క మూలమనఁగా పాడ్యమియును, ఱెక్కలమొదలును. ఈ రెంటికిని పక్షతి యని పేరు. పక్షయో ర్మూలం పక్షతిః, సీ. పక్షముల గనుక పక్షతిః. 

ప్రభృతి - మొదలు.
ప్రథమము -
1.ముఖ్యము, 2.మొదటిది.
ముఖ్యము - ప్రధానము.
ప్రధానము - 1.ముఖ్యము, 2.ముందిచ్చుసొమ్ము, 3.వివాహా త్పూర్వము వధువున కలంకారాదుల నిచ్చినిశ్చయించుకొనుట, 4.పరమాత్మ. 

కేవలము - 1.నిర్ణయము, అవధారణము, విణ.1.అంత, 2.సమస్తము, 2.అచ్ఛము, ఒకటి, 3.ప్రధానము.
కేవలుఁడు -
1.పరమాత్మ, 2.సామాన్యుడు.
అంత - 1.సర్వము, 2.ఆ కొలది, 3.పరిమాణార్థక ప్రత్యయము, అవ్య.పిమ్మట, వి.అవుడు.
సర్వము - (సర్వ.) సమస్తము, అంతయు. సమస్తము - సర్వము. అశేషము - అంతయు, సర్వము, వి.మిగులులేమి. అన్ని - సమస్తము, సర్వము. సకలము - 1.సర్వము, 2.కలతో గూడినది.   

లోను - 1.లోపల, 2.మొదలు, విణ.లోకువ.
లోపల -
అవ్య. నిర్థారణ షష్ఠియందు వచ్చు ప్రత్యయము, వి.లోను, అంతరము.
అంతరము - 1.ఎడము, 2.భేదము, 3.సమయము, 4.సందు, 5.ఎడబాటు, (గణి.) రెండింటిమధ్య నున్న సమయము లేక దూ ర ము (Interval), విణ.1.అన్యము, ఉదా.గ్రామాంతరము, 2.వెలుపలిది.
అన్యము - 1.ఇతరము, వేరు, 2.అసాధారణము.
అసాధారణము - 1.సాధారణము కానిది, అసామాన్యము, 2.(భౌతి.) సామాన్య విషయములకు వ్యతిరేకమైనది, వి.(తర్క.) హేత్వాభావము లలో ఒకటి.
అసామాన్యము - సామాన్యము కానిది (Abnormal). 

అంతర్యామి - లోపల నుండువాడు, వి.1.పరమాత్మ, 2.జీవాత్మ. 

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

లోఁకువ - అధీనము, తక్కువ.
అధీనము -
ఆయత్తము, స్వాధీనము, అగ్గము.
అయత్తము - 1.సంసిద్ధము, 2.అధీనము, 3.ప్రయత్నించునది.
అగ్గము - 1.అధికము, 2.దుస్సహము.        
లొక్కు - లోకువ.
లొ(ౘ)చ్చు - తక్కువ, విణ.న్యూనము.
తక్కువ - కొరత. న్యూనము - తక్కువైనది.

ఆయత్తుఁడు - ఒకరికి లోబడినవాడు, అధీనుడు. 
లోఁబడు -
క్రి.అధీనమగు.
లొంగు - క్రి.లోకువగు, వెనుదీయు, లోబడు.
లోఁగు - 1.అడగు, 2.లోకువగు, 3.వెనుదీయు, 4.చొచ్చు.

స్వాధీనుఁడు - తనకు లోకువైనవాడు.
స్వాధీనపతిక - స్వాధీనుడైన పనిమిటిగల నాయిక.

ఏకము - 1.ఒక్కటి, 2.ముఖ్యము, అసహ్యాయము, 4.అవ్యము.
ఒకటి -
1.అన్యము, 2.ఒకడు, రూ.ఒకొటి, ఒక్కటి, ఒక్కొటి, ఒక్కడు, ఒక్కొడు, సం.ఏకః.
అన్యము - 1.ఇతరము, వేరు, 2.అసాధారణము.
అన్నెము1 - ఇతరము, వేరగునది, సం.అన్యమ్.
ఇతరము - 1.అన్యము, 2.నీచము.
అన్నెము2 - పాపము, సం.అన్యాయః.
ఒండు - 1.ఒకటి, 2.అన్యము. 
ఒంటి - 1.ఏకాకిత్వము, విన.ఒకటి.
ఒకఁడు - 1.ఒక అనుజుడు, 2.అన్యుడు, రూ.ఒకడు, ఒకరుడు, ఒకొరుడు, ఒకరువుడు, ఒకొరువుడు, 'వీనికీ కకారద్విత్వములును (క్క) కలవు.
ఒకత - ఒక స్త్రీ, రూ.ఒకటి, ఒకతుక, ఒకతె, ఒకరిత, ఒకరితి, ఒకరుతుక, ఒకరితె వీనికొక 'కార్యద్విత్వములు కలవు), ఒర్త, ఒర్తి, ఒర్తు, ఓర్తుక అను రేఫతకా రసమ్యుక్తములును గలవు.
ఓర్త - ఒకత; ఓర్తి - ఒకత; ఓర్తు - ఒకత.
ఒక - ఏకార్థకము, రూ.ఒక్క, ఒకానొక.

పగడ - పాచికల మీద ఒకటి చుక్క, సర్వ.ఒకటి, సం.వటికా.
వంచ -
1.ముఖ్యము, 2.ఒకటి. 

పంకము - 1.బురద, 2.పాపము, వి.పాలు.
అసలు -
1.బురద, హిం. వి.(వాణి.) అప్పుగా తీసికొనిన సొమ్ము (Principal).
అసలుఁబుట్టువు - తామర, పంకజము.
పంకజము - తామర, వ్యు.బురదలో పుట్టినది.
పంకేరుహము - పంకజము, తామర.
పంకరుహము - తామర.
పంకిలము - బురదగలది. 

ఏకోత్తరాంశములు - (గణి.) 1, 2, 3, 4, 5... ఈ వరుసలో మనము వ్రాయు అంకెలు (Natural numbers) (ఈ వరుసలో సమీప సంఖ్యల భేదము) '1' కనుక వీనికి ఏకోత్తరసంఖ్యలని పేరు.

ప్రథమం శైల పుత్రీతి| ప్రథమం భారతీనామ| ప్రథమో జ్ఞానశక్త్యాత్మా.

ఉదయే ధిగమే ప్రాప్తిః : ప్రాప్తి శబ్దము పుట్టుటకును, లాభమునకును పేరు. ప్రాపణం ప్రాప్తిః. సీ ఆప్ ఌ వ్యాప్తౌ పొందుట ప్రాప్తి.

దర్శ - అనగా అమావాస్య తరువాత వచ్చు ప్రతిపత్తి (పాడ్యమి).

ప్రత్తిపత్తు మొ||లుగా శుక్లపక్ష కృష్ణపక్షములందలి తిథుల స్వరూపము లగుట చేత క్రమముగా వృద్ధి క్షయములు కలవగు చున్నది. మరల అవే కృష్ణ ప్రతిపత్తు నుండి అమావాస్య వరకు తిధులను ప్రవర్తింప జేయు నవియు 15 కాగా వృద్ధి క్షయములు యీ 15 వరకే.

చంద్రుని ప్రథమ కళకు ప్రతిపత్తు అని నామము తో వ్యవహారము. ఆ ప్రతిపత్తే కళా స్వరూపమున సూర్య మండలమునుండి బయలు వెడలి వచ్చియున్నదగును. కృష్ణపక్షమున ఆ ప్రథమ కళ సూర్యమండలమును ప్రవేశించు చున్న దగును. – సౌందర్యలహరి

అఖిలము - సమస్తము, అశేషము, అంతయు.
న విద్యతే ఖిల మస్యేత్యఖిలం - ఖిలముగానిది.
అశేషము - అంతయు, సర్వము, వి.మిగులులేమి.

నభము - 1.ఆకాశము, 2.మేఘము, రూ.నభస్సు.
మేఘైర్న భాతీతి నభః, స. న. భా దీప్తౌ ప్ మెయిళ్ళచేతఁ బ్రకాశింపనిది.
నభస్వంతుఁడు - వాయువు.
నభఃకారణత్వాన్నభో (అ)స్యాస్తీతి నభస్వాన్ త-పు. - ఆకాశము ఉత్పత్తిస్థానముగాఁగలవాఁడు.

నభసి గఛంతీతి నభసంగమాః - ఆకాశమునఁ బోవునది bird .

నభః ఖం శ్రావణో నభాః,
నభశబ్దము ఆకాశమునకు పేరినపుడు న శ్రావణమాసమునకు పేరగునపుడు పు, శూన్యత్వాత్, మేఘచ్ఛన్నత్వాచ్ఛ నభాతీతి నభః నభాశ్చ, స, భా దీప్తౌ. శూన్యమయ్యును, మేఘచ్ఛన్నమయ్యు నుండుట వలన ప్రకాశించనిది. ' నభః క్లీబం జలధారే నా తు ఘ్రాణే పతద్గ్రహే, మృణాళసూత్రవర్షాసుః ' ఇతి శేషః.

నభస్య అశ్వినోర్జౌ చ మార్గశీర్షః శుచిర్నభాః|     
ఏతే మాసాఁ కథారంభే శ్రోతౄణాం మోక్షసూచకాః||

శ్రావణము - 1.వినిపించుట, 2.ఒక మాసము, 3.పట్టుగఱ్ఱవంటి చిన్న పనిమ్ముట్టు (Forceps).   

అఖిలజగజ్జని పాలన నిలయన
కారణ సత్సుఖ చిద్ఘనభో గుహ| ||శరవణభవ||

హృషీకేశుఁడు - విష్ణువు.
హృషీకేశః హృషీకానా మింద్రియాణామీశః - ఇంద్రిలములకు నీశ్వరుఁడు.

హృషీకం విష యీన్ద్రియమ్,
హృషీకము - ఇంద్రియము.
హృష్యంత్యనేనేతి హృషీకం, హృషతుష్టౌ. - దీనిచేత సంతోషింతురు.
విషయము- గ్రంథాదులందు దెలియు నంశము. 
విషయో (అ)స్యాస్తీతి విషయి - విషయము గలిగినది.
ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు 5 అను శంఖ్య. 
ఇంద్రస్య అత్మనః లింగం ఇంద్రియం - ఇంద్రుఁడనఁగా నాత్మ; ఆత్మకు జ్ఞాపకముగనుక ఇంద్రియము. ఈ 3 ఇంద్రియముల పేర్లు.

ఇంద్రియజ్ఞానము - ఇంద్రియముల ద్వారా విషయము తెలిసికొనుట, ప్రత్యక్షజ్ఞానము (Perception).

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థశాస్త్రము - 1.కౌటిల్యునిచే రచింపబడిన రాజనీతిశాస్త్ర గ్రంథము, 2.వస్తువుల ఉత్పత్తి, వినిమయము, మొదలగు అర్థిక విషయములను గురించి తెలుపు శాస్త్రము (Economics).

జీవితస్థాయి - (అర్థ.) వ్యక్తి తన జీవితావసరములను సమకూర్చుకొన గలుగు పరిమితి (Standard of Life).

అర్థాతురాణాం నగురుర్నబంధుః, కామా తురాణాం నభయం నలజ్జా |
విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వమ్||

తా. ధనాపేక్షకలవారికి గురువు బంధువులు లేరు, కామాతురులకు వెఱపు సిగ్గులేదు, విద్యాపేక్ష గలవారికి సుఖమును నిద్రయును లేదు, ఆకలి కొన్నవారికి రుచి పక్వములు లేవని తెలియవలెను. – నీతిశాస్త్రము

ఖ - ఒక అక్షరము, సం.వి.1.రవి, 2.బ్రహ్మము, 3.ఇంద్రియము, 4.స్వర్గము.
ఖనతి జ్ఞానమితి ఖం, నీరూపత్వాద్దుర్ఝే యమిత్యర్థః, ఖను అవదారణే. - రూపము లేనిది కనుక బుద్ధిచేతఁ దెలియఁగూడనిది.

ఇన్ద్రియే (అ)పి ఖమ్,  
ఖశబ్దము ఇంద్రియమునకును, అపిశబ్దమువలన ఆకాశమునకును పేరు. ఖనతి వ్యథయతీతి ఖం, ఖను అవదారణే. - వ్యథ పెట్టునది, "స్వర్నభశ్చ ఖ" మితి త్రికాండశేషః.

రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.
రూయతే స్తూయత ఇతి రవిః. ఇ. పు. రుశబ్దే - నుతింపఁబడువాఁడు.

రవిశ్వేతచ్చదౌ హంసౌ : హంసశబ్దము సూర్యునికిని, హంసకును పేరు. మఱియు, లోభములేని రాజునకును, విష్ణువునకును, అంతరాత్మకును, మత్సరములేని వానికిని, ఉత్తమ సన్న్యాసికిని, ఉత్తరపదమై యుండు నపుడు శ్రేష్ఠునికిని పేరు.

తురీయము - బ్రహ్మము, విణ.నాలగవది, రూ.తుర్యము. 

హంసుఁడు - 1.సూర్యుడు, 2.జీవుడు, 3.విష్ణువు, 4.శివుడు, 5.లోభగుణము లేని రాజు.
హంతి తమ ఇతి హంసః హన హింసాగత్యోః - తమస్సును బోఁగొట్తువాఁడు.

శ్వేతగరుత్తు - శ్వేతపత్రము, హంస. 
శ్వేతీగరుతః పక్షా అస్యేతి శ్వేతగరుత్. త. పు. - తెల్లని ఱెక్కలు గలది.  

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.

ఆపన్నత్వ - గర్భిణి, వ్యు.లోపల ప్రాణిగలది.
ఆపన్నం గృహీతం సత్వం గర్భో (అ)నయే త్యాపన్నసత్త్వా - గ్రహింపఁబడిన గర్భముగలది. 
జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి. 
జీవయతి దేవానితి జీవః, జీవప్రాణధారనే - దేవతలను బ్రతికించువాఁడు.
జీవ్యతే మృతో (అ)నేనజీవః - చచ్చినవాఁడు ఈయనవలన బ్రతుకును.
జీవాత్మ - దేహి, జీవుడు.       
శరీరి - ప్రాణి. జీవి - జీవించువాడు, వి.ప్రాణి.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు. 
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఇ.పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు(బృహత్తు - గొప్పది)లనం బడును. వారలకై నను వానికైనను ప్రభువు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).
గురువు - 1.ఉపాద్యాయుడు, 2.కులము పెద్ద,3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.

జీవి - జీవించువాడు, వి.ప్రాణి. ప్రాణులలో మెలిగే - జీవి ఎవరు?

జీవోత్పత్తి క్రమము  - (జీవ.) ప్రాణులు ఇదివరకున్న ప్రాణుల నుండియే పుట్టగలవు గాని ఆసస్మికముగా బయలుదేరుట కవకాశము లేదను భావన (Biogenesis).     

సంఘము - 1.ప్రాణిసమూహము, 2.గుంపు.

ప్రాణి ఏకాంతరోత్త్పత్తిక్రమము - (జీవ.) ప్రాణి జీవమున లింగ సంబంధమును, లింగసంబంధము కానిదియునగు రెండు దశలు నొకదాని తరువాత నొకటి వచ్చుట ((Alternation of generations).

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

స్వర్గము - దేవలోకము.
గోవు- 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

రాము డొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులముఁ జెఱచె  
ఇలను బుణ్యపాప మీలాగు కాదొకో! విశ్వ.

తా. శ్రీరాముడు జన్మించి రవి - 1.సూర్యుడు, 2.జీవుడు.) సూర్య వంశమునకు పేరుతెచ్చెను. దుర్యోధనుడు పుట్టి కౌరవ(కౌరవులు - కురువంశపు వారు.)కులమును పాడుచేసెను. ఈ ప్రపంచము లో ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.)ను పుణ్యము, పాపము అనునవి యీ విధముగనే ఉండును.

ఇళ - అల.
ఇల - 1.నేల, 2.బుధునిభార్య, 3.ఆవు, 4.మాట, రూ.ఇళ.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

విహాయసగతిర్యోతిః స్సురుచిః హుతభుగ్విభుః 
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః|

చక్రపక్షము - హంస.
హంతి గచ్ఛతీతి హంసః హన హింసాగత్యోః. - చరించునది.
చక్రాంగము - 1.హంస, 2.జక్కవ.
చక్రవత్ వృత్తమంగ మస్యేతి చక్రాంగః. - చక్రము వలె వట్రువయైన అంగముగలది.

సంవిత్తు - 1.జ్ఞానము, 2.సంకేతము, 3.ప్రతిజ్ఞ, 4.అంగీకారము, 5.ఆచారము, 6.యుద్ధము, 7.సంభాషణము, రూ.సంవిత్తి.
జ్ఞానము - తెలివి, ఎరుక. 

స్త్రీసంవిద్ జ్ఞాన సంభాషా క్రియాకా రాజి నామసు,
సంవిచ్ఛబ్దము జ్ఞానమునకును, సంకేతమునకును ప. సంభాషణమునకును క్రియానిశ్చయము నకును, యుద్ధమునకును, నామధేయమునకును పేరు. సంవేదనం, సంవిదం త్యనయా చేతి సంవిత్, ద.సీ. లెస్సగా నెఱుఁగుటయు, దీనిచేత లెస్సగా నెఱుగుదురు గనుక సంవిత్తు. "సంవిజ్ఞానే ప్రతిజ్ఞాయాం సంకేతాచార నామసు, సంభాషణే తోషనే చ క్రియాకారే చ సంగర" ఇతి ప్రతాపః.

కమలము - 1.తామర, ఎఱ్ఱతామర, 2.జలము, 3.రాగి, 4.మందు.
కామ్యతే తృషార్తైరితి కమలం, కము కాంతౌ. - దప్పిగొన్నవారిచేఁ గోరబడునది.
మకరందము - పుష్పరసము, మరందము.
మంక్యతే పుష్పతే అనే నేతి మకరందః, మకి మండనే. - దీనిచేత పుష్పమలంకరింపఁబడును. 

భజజనము - 1.సేవించుట, 2.భాగించుట.
భజమానము - 1.సేవించునది, 2.భాగించునది.
న్యాయం భజతే భజమానం, భ సేవాయాం. - న్యాయమును బొందునది.
భజించు - క్రి.1.సేవించు, 2.భాగించు.
భజిష్యము - 1.సేవింపదగినది, 2.భాగింపదగినది.

తెలిపిట్ట - హంస.
తెలి - 1.తెల్లనిది, 2.నిర్మలము.   

ఓం భక్త హంస పరీ ముఖ్య వియోగాయై నమో నమః| 

ద్వయి - దోయి, జత. 
దోయి - ద్వయి, జత, సం.ద్వయీ.
దొందము - రోగము, వాత పిత్త శేష్మములలో ఏ రెండిటి చేతనైనను కల్గు రోగము, సం. ద్వంద్వమ్.
దొందు - దొందుదొందే! (జత.) సం.ద్వంద్వమ్. 
ద్వందము - 1.జత, 2.స్త్రీపురుషుల జత, 3.ఇద్దరు ఒకరితో ఒకరు చేయు యుద్ధము, 3.రహస్యము, 4.శీతోష్ణాదులు.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

ఆత్మనిగ్రహము - ఆత్మస్వాధీనత, మ న స్సు ను వశమునునం దుంచుకొనుట (Self-control).   

మానసౌక(స)ము - హంస.
మానససరః ఓకః స్థానమస్య మాన సౌకః. స. పు. - మానససరస్సు స్థానముగాఁ గలది.    
చేతము - మానసము.
చేతస్సు - 1.మనస్సు, రూ.చేతము.

మానసము - 1.ఒక కొలను(మానస సరస్సు), 2.మనస్సు.
మన్యతే అనేనేతి మనః, స-న. మనేఅవ మానసం, మన జ్ఞానే. - దీనిచేత నెఱుఁగబడును గనుక మనస్సు మనస్సే మానసము.    
మనము1 - బుద్ధి, మనస్సు.
మనము2 - నీవును, నేనును.

మానసికాభివృద్ధి - (గృహ.) బుద్ధి వికాసము, మనో వికాసము (Mental-development). 

ఓం హంసగత్యై నమః : "హంస" శబ్దానికి వివిదర్ధాలున్నయి. 1) హంస-అంటే జీవుడు అని అర్థము. శ్వాసక్రియ జరుగు వేళ వాయువు "హ" కారములో బహిర్గతమై "స" కారములో లోపలికి వస్తుంది అంటే హంస శబ్దానికి ప్రాణమని అర్థంకూడ ఉంది. ప్రాణంద్వారా జరిపించబడు ఆ జపామంత్ర రూపిణీయైన దేవికి వందనాలు. - శ్రీ లలితా త్రిశతీ నామావళిః

పరిభాష - శాస్త్రకారులు చేయు సంకేతము.
పరిభాషణము - నిందాసహితమైన వాక్యములు, ఆలాపము.
ఆలాపనము - 1.రాగాలాపనము, 2.మాటలాడుట.
ఆలతి - రాగాలాపము, సం.ఆలప్తిః.
ఆలపించు - క్రి.రాగముతీయు, రూ.ఆలపించు.

అష్టాదశము - పదునెనిమదవది.
గుణితము - హల్లులతో అచ్చులను హల్లులను చేర్చి చెప్పుట, విణ.హెచ్చింపబడినది.
గుణ్యతేస్మ గుణితం, గుణ అభ్యాసే. - గుణింపఁ బడునది.
విద్దె - చదువు, విద్దియ, సం.విద్యా. 
విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
పరిణతము - పరిపాకము పొందినది.
పరిణమతే అవస్థాంతర మా పద్యతే పరిణతం - వేఱొక యవస్థను పొందునది.

పయస్సు - 1.క్షీరము, 2.నీరు.
పయత ఇతి పయః స - స, పయ గతౌ. - ప్రవహించునది.
పీయత ఇతి వా పౌఅః, పా పానే. - పానము చేయఁబడునది. 

సమున్మీలత్సంవి- త్కమల మకరందైకరసికం
భజే హంసద్వంద్వం- కిమపి మహతాం మానసచరమ్ 
యదాలాపా దష్టా - దశగుణిత విద్యాపరిణతిః 
యదాదత్తే దోషా - ద్గుణ మఖిల మద్బ్యః పయ ఇవ. - 38శ్లో

తా. ఓ దేవీ! ఏ హంసల జంటల కూతలు అష్టాదశము - పదునెనిమదవది విద్యలగునో, యే హంసలు నీటినుండి పాలను గ్రహించునట్లు దోషముల నుండి గుణము లను గ్రహించునో, వికసించిన విద్య - 1.చదువు, 2.జ్ఞానము. పద్మమందలి మకరందముచే ఆనందించు మహాత్ముల యొక్క మనస్సు లనెడి మానస సరస్సునందు విహరించు నా హంసల జంటను సేవించుదును. – సౌందర్యలహరి  

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property). 

ఏవం కృతా యేన విచిత్రలీలా
మాయామనుష్యేణ నృపచ్ఛలేన |
తం వై మరాలం మునిమానసానాం
శ్రీజానకీజీవనమానతో స్మి | - 8

చిత్రశిఖండీ - సప్తర్షులలో నెవరైనను ఒకడు, (సప్తర్షులకు చిత్రశిఖండులని పేరు).
చిత్రశ్సిఖండాః చూడావిశేషాః ఏషాం సంతీతి చిత్రశిఖండిన, న. పు. - చిత్రములైన జటా విశేషములుగలవారు. 
చిత్రశిఖండిజుఁడు - బృహస్పతి.
అంగిరా ఏవ చిత్రశిఖండీ తస్మాజ్జాతః చిత్రశిఖండిజః - చిత్ర శిఖండి యనఁగా నంగిరస్సు వానికొడుకు.   
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.  
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter). గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, రూ.గురుఁడు.

హిమాంశువు - చంద్రుడు.
హిమాః శీతాః అంశవో యస్య సః హిమాంశుః ఉ. పు. - చల్లని కిరణములు గలవాడు.

చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.

పంచదశి - 1.అమవస, 2.పున్నమ.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.

పక్షాంత్తౌ పఞ్చదశ్చౌ ద్వే - పక్షయోః అంతౌ పక్షాంత్తౌ, శుక్ల కృష్ణపక్షములయొక్క తుదలు. పంచదశానాం తిథీనాం పూరణ్యౌ పంచదశ్యౌ, పంచదశ తిథులను నిండించునవి. పూర్ణిమకును అమావాస్యకును పేర్లు.

పౌర్ణమాసి - పున్నమ.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా.

పౌర్ణమాసీ తు పూర్ణిమా :
మీయతే తిథిరనేన మాః చంద్రః పూర్ణశ్చాసౌ మాశ్చ పూర్ణిమాః, తస్యేయం పుర్ణమాసీ. ఇతనిచేత తిథి లెక్క పెట్టఁబడును గనుక మాః అనఁగా చంద్రుఁడు. అతఁ డిందు పూర్ణుడుగాఁ దోఁచును.
పూర్ణిమ-పున్నమ, అఖండ చంద్రుడు గలది. 
పూర్ణోమాసో స్యామితావా, మాసము ఇందు పూర్ణమౌను. చంద్రస్య పూర్ణతయా నిర్వృత్తా పూర్ణిమా, చంద్రునియొక్క నిండుటచేత నిర్వృత్తమైనది. పూర్ణఃమాశ్చంద్రో స్యామితివా పూర్ణిమా, అఖండచంద్రుఁడు గలిగినది.

పౌర్ణమి - సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే తలములో నున్నప్పుడు, సూర్యుని కాంతి చంద్రుని అర్థభాగము పై పడగా చంద్రుడు భూమిపై నున్న వారలకు పూర్తిగా కనిపించుట.

పూర్ణే రాకా నిశాకరే :
తస్మిన్ పూర్ణే సతి సా రాకేత్యుచ్యతే శుద్ధేతిభావః - చంద్రుఁడు పూర్ణుఁడై యున్నపుడు ఆ పున్నమ రాక యనంబడును. అనఁగాఁ చతుర్దశి వేధ లేనిది. అసుమన్యంతే దేవాః పితృసహితా అస్యామిత్యనుమతిః. దీని యందు దేవతలు పితృసహితులై సేవకొఱకు తలఁపఁబడుదురు. రాతి దదాతి సుఖమితి రాకా. రా దానే - సుఖము నిచ్చునది. అన్ని కళలతో నిండిన చంద్రుఁడు గలది.

రాక - 1.సంపూర్ణకళలు గల చంద్రునితో గూడిన పున్నమ, 2.ఒక యేఱు, వి.ఆగమనము. రాకాచంద్ర సమానన రామ్|    

ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.
అవాప్తి - ప్రాప్తి, పొందుట. 
ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది, వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి. రాకాచంద్ర సమానన రామ్|

నిశాకరుఁడు - చంద్రుడు; నిశాపతి - చంద్రుడు.
నిసివెలుఁగు - చంద్రుడు Moon.
నిశ - 1.రేయి, 2.పసుపు.
నిసి - నిశ, రేయి, సం.నిశా.

నిసుఁగు - శిశువు, బిడ్డ, రూ.నిసువు, సం.శిశుః. 

పూర్ణేందు బింబ వదనాం రత్నాభరణ భూషితాం,
వరదాభయ హస్తాభ్యాం ధ్యాయే చ్చంద్ర సహోదరీమ్.

రాకాచంద్రసమానకాంతివదనా నాకాధిరాజ స్తుతా
మూకానామపి కుర్వతీ సురధునీనీకాశ వాగ్వైభమ్
శ్రీకాంచీనగరీవిహారరసికా శోకాపహంత్రీ సతా
మేకా పుణ్యపరంపరా పశుపతేరాకారిణీ రాజతే|
 
తా. సంపూర్ణ పూర్ణిమనాటి చంద్రుని కాంతిగల వదనము - నోరు, ముఖము.)గలది, ఇంద్రునితో పొగడబడేది, మాటలు రానివారికి కూడ గంగానదీ ప్రవాహంవంటి నీకాశము - 1.ప్రకాశము, 2.నిశ్చయము, విణ.తుల్యము.) వైభవంగల వాక్కులను ప్రసాదించేది, సజ్జనుల శోకము - దుఃఖముచే తపించుట, వగవు.)దూరం చేసేది, పశుపతి - శివుడు పుణ్యఫలాలకు ఆకారమైనది, శ్రీకాంచీ నగరంలో విహరించటంలో ఆనందించేది - అయిన ఒకానొక తల్లి ప్రకాశిస్తున్నది.  

సర్వమంగళ - పార్వతి.
సర్వాణి మంగళాని యస్యాస్సా సర్వమంగళా - సమస్తమైన శుభములు గలది.
మంగళ - పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.  
మంగళదేవత - లక్ష్మి.

సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా
సర్వకర్త్రీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ|

ఆగమము - 1.వచ్చుట, రాక, 2.ప్రాప్తి, 3.రాబడి, 4.శాస్త్రము, 5.వేదము, 6.(వ్యాక.) అధికముగా వచ్చెడి వర్ణము, 7.జనప్రవాదము.

ఆగమనము - 1.రాక, వచ్చుట, 2.ప్రాప్తి.
అవాప్తి - ప్రాప్తి, పొందుట.

ఆగతము - 1.వచ్చినది, 2.జరిగినది, 3.పొందబడినది(ప్రణిహితము - పొందబడినది), వి.1.ఆగమనము, రాక, 2.ప్రాప్తి.   
లబ్ధి - లాభము; లాభము -  (అర్థ.) పరిశ్రమలవలన కాని వ్యాపారము వలన కాని ఖర్చులుపోను మిగిలిన నికరపు ఆదాయము. విక్రయించుటకు కావలసిన అన్ని వ్యయములుపోగ మిగిలిన సొమ్ము, సం.వి. క్రయ విక్రయములందు వచ్చు హెచ్చు ధనము అధికముగా పొందబడినది.
రాబడి - ఆదాయము; వసూలు - ఆదాయము, జమ.
జమ - (వాణి.) లెక్కలోకట్టుట (Credit).
ఆదాయము1 - 1.గ్రహించుట, 2.లాభము, లబ్ధద్రవ్యము, రాబడి.
ఆదాయము2 - (అర్థ.) ఆస్తి వలనగాని, కృషివలనగాని మానవుడు ఆర్జించు సంపాదన.
ఆదాయపుపన్ను - (అర్థ.) వ్యక్తి యొక్క ఆదాయమునుబట్టి ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పన్ను, రాబడిపై పన్ను, (ఇది వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లింప వలసి యున్నది. ఇది సంవత్సరాది కాదాయముపై విధింపబడును. దీనిని మన దేశములో కేంద్రప్రభుత్వము(Central Government) వసూలు చేయుచున్నది, (Income-tax).

పన్ను మదింపు - మొత్తము రాబడినిబట్టి పన్ను విధించుట.

వదంతి - గాలిమాట, గూమాను, పుకారు.
గుమాను - అనుమానము.  

ఆభాణకము - లోకోక్తి, జనప్రవాదము.
లోకోక్తి - 1.వాడుకమాట, 2.పుకారు, 3.సామెత.

కింవదన్తీ జనశ్రుతిః,
కింవదంతి - జను లాడుకొను మాట.
కో (అ)పి వాదః కింవదన్తీ, ఈ-సీ. - సత్యంబును అసత్యంబును గాని యొకానొక వాదము.
కింకిమితి పరస్పరం వదంత్యత్రేతి కింవదంతీ, వదవక్తాయాం వాచి. - ఏమేమని పరస్పరము చెప్పుకొందురు.
గాలిమాట - 1.లోకప్రమాదము, 2.ఆధారము లేనిమాట, జనశ్రుతి. 
జనశ్రుతి - నానుడి, కింవదంతి.
జనేభ్యః శ్రుతిః జనశ్రుతిః, ఇ-సీ, శ్రు శ్రవణే - జనులవలన వినుట జనశ్రుతి. 
జనైఃశ్రూయత ఇతి జనశ్రుతిః - జనులచేత వినఁబడునది. ఈ 2 లోకవాదము పేర్లు.

నానుడి - (నాను+ నుడి) కింవదంతి, సామెత.
సామెత - లోకోక్తి, నానుడి, సం.సామ్యోక్తి.
ప్రవాదము - కారణము లేకయే వ్యాపించిన మాట.

ఉద్ఘోషము - 1.మొర, 2.పెద్దధ్వని, 3.చాటుట, 4.కింవదంతి.
ఉద్ఘోషించు - క్రి.1.మొరపెట్టు, 2.పెద్ద ధ్వనిచేయు, 3.చాటు.

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్ 
గని కల్ల నిజము దెలసిన
మనుజుఁడెపో నీతిపరుడు మహిలో సుమతీ.

తా. ప్రపంచములో యెవరేమి చెప్పినను శ్రద్ధతో వినవలెను. విన్నంత మాత్రాన తొందరపడరాదు, విచారించవలెను. నిజానిజాలను తెలుసుకొని నడుచు కొనువాడే నీతిపరుడైన మానవుడు.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత, అని ఏడు విధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

ఆగమ నిగదిత మంగళ గుణగణ
ఆదిపురుష పురూహుత సుపూజిత| ||శరవణభవ|| 

మానికదారి - 1.వేశ్య, 2.మాణిక్యధారిణి.
వేశ్య - బోగముది, వ్యు.అలంకారము చేత శోభజేందినది.
వేశే భవ వేశ్యా - వేశమనఁగా వేశ్యావాటిక. - దానియందుఁ బుట్టినది.
వేశో నైపథ్యం తేన శోభతే వేశ్యా. - అలంకారము  చేత ప్రకాశించునది.
మానికము - కెంపు, రత్నము, మాణిక్యమ్.
మాణిక్యము - కెంపు.
కెంపు- 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
పద్మవద్రాగో యస్య పద్మరాగః - తామరపువ్వువంటి యెఱుపు గలది.
రత్నము - 1.మణి, 2.స్వజాతియందు శ్రేష్ఠమైనది (నవరత్నములు:- మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)
కెంపుసవతు - స్వాతీనక్షత్రము.
కెంపు- 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.
సవతు - సమత, సామ్యము, సం.సమత్వమ్.
సామ్యము -
సమత్వము, పోలిక; పోలిక - సామ్యము.

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కెంపుగాము - అంగారకుడు Mars.     
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు Mars.
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).  

గాము - 1.సూర్యాది గ్రహము, 2.పిశాచము, సం.గ్రహః.

కెంపుకంటి - కోయిల, వ్యు.ఎర్రని కన్నులు కలది.
కోకిలము - కోయిల. 
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
కోవెల - గుడి, వై.వి.కోకిలము.
తిరుకాపు - కోవెల తలుపు.
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణీయతీతి ధనం, ధిని ప్రీణనే. - సంతోషపెట్టునది. 'ధన ధాన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది, (Positive).     
గగనము - 1.ఆకాశము, 2.శూన్యము, సున్న, విణ.దుర్లభము.
గఛంత్యనేన దేవా ఇతి గగనం గమ్ గతౌ. - దీనిమార్గము వలన దేవతలు పోవుదురు.
గచ్ఛత్యత్ర ఖగజాతిరితివా - పక్షిజాతి యిచ్చట సంచరించును.
గగనకుసుమము -  (జాతీ.) ఆకాశ పుష్పము (అసంభవము, శూన్యము అను అర్థముల ప్రయుక్తము). 

శమంతకమణి - విష్ణుహస్తము నందలి మణి.
మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము pearl, 3.మనికట్టు.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి.  
పౘ్చ  - 1.పసుపువన్నె, 2.మరకతమణి, 3.కరచరణాదుల పొదుచు పసరురేఖః, సం.పలాశః.    

మణిబంధము; మణికట్టు - (గృహ.) అరచేతికి మోచేతికి మధ్యనున్న కీలు (Carpus).
మణి బంధాస్థి - (జం.) చేతి మణికట్టులోనున్న ఎముకల సముదాయము (Carpus).  

మణికారుఁడు - రత్నములను సాన బట్టువాడు.
మణిగము - అధికారము, రూ.మణియము.

పూస - 1.పూదె, 2.మణి, 3.వ్రేలులోనగు వాని కీలు. 

సాంద్రము - దట్టమైనది.
సహ అంద్యతే బధ్యత ఇతి సాంద్రం, అది బంధనే. - కూడఁగట్టఁబడియుండునది.
సాంద్రీకరణము - (భౌతి.రసా.) ఒక ఏకాంకము విస్తీర్ణముగల చోటులో ద్రవ్యరాశిని ఎక్కువచేయుట (Concentration).

కిరీటము - రాజు ధరించు శిరోభూషణము, మకుటము. 
కీర్యతే లలాటోపరిక్షిప్యత ఇతి కిరీటం, అ ప్న. కౄ విక్షేపే. - నొసటిమీఁదఁ బెట్టఁబడునది.
కిరీటి - 1.అర్జునుడు, వ్యు.ఇంద్ర దత్తమగు కిరీటము గలవాడు, 2.కోతి.
క్రీడి - అర్జునుడు, సం.కిరీటి.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.
క్రీడించు - క్రి.ఆటలాడు, విహరించు.
కిరీటిపచ్చ - మరకతము, గరుడపచ్చ. 
మకరతము - మరకతమణి, రూ.మరకతము. 
మరం మరణం తకత్యనేనేతి మరకతం, తక హనహసనయోః. - విషహరమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు.   
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, ఆల్యూమినియమ్‌సిలికేట్ (Emerald). ఇది మణుల (రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.  
తృణగ్రాహి - మరకతము, (శ, ర,) ఇంద్రనీలము (అని కొందరు).

మార్గశీర్షము - తొమ్మిదవ నెల.
హైమనము - మార్గశీర్షము, విణ.1.మంచుచే కలిగినది, 2.బంగారుచే కలిగినది.
హైమము - వేకువనుమంచుచే కలిగిన జలము, విణ.బంగారుచే కలిగినది.

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత. 
సుత2 - కూతురు; కూతురు - కుమార్తె.  
సుతుఁడు - కొడుకు.
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును. 

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతుని పుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
హిమవద్గిరౌ ప్రచురా హైమవతీ – హిమవత్పర్వత మందుఁ బ్రచురమైనది. 
భవ్య - పార్వతి, హైమవతి.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం|

(ౘ)చాయమగఁడు - సూర్యుడు Sun.      
ౘాయ - 1.ఛాయ, 2.కాంతి, 3.సూర్యునిభార్య, 4.నీడ, 5.పోలిక, 6.రంగు, 7.వైపు, 8.జాడ, 9.సమీపము, 10.చక్కన, 11.(జీవ.) జీవ పదార్థము లకు సహజమైన రంగు నిచ్చు పదార్థములు (Pigment).  
ౘాయపట్టి - శనైశ్చరుడు Saturn.  
శనైర్మందం చరతీతి శనైశ్చరః, చర గతిభక్షణయోః - మెల్లఁగా సంచరించువాఁడు.
పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయనము, వి.బిడ్డ.

ఛాయాపుత్త్రుఁడు - శని Saturn.
శని -
న వ గ్ర హ ము ల లో ఏడవ గ్రహము (Saturn).   
ఛాయ - 1.నీడ, ఛాయ 2.కాంతి light, 3.రంగు, 4.ప్రతిబింబము, 5.సూర్యునిభార్య, 6.లంచము, 7.వరుస, 8.కొంచెము, 9.చీకటి, (భౌతి.) ఒక కాంతి నిరోధకమైన వస్తువునకు వెనుకవైపున నుండు కాంతి విహీన చిత్రము, (Shadow).
రంగు - 1.ఛాయ, కాంతి 2.సొంపు, సం.రంగః. ప్రతిరూపాచ్ఛాయా ప్రిచ్ఛా యా - ప్రతియైన ఛాయ.  

ఛాయా సూర్యప్రియా కాన్తిః ప్రతిబిమ్బ మనాతపః :
ఛాయా శబ్దము సూర్యుని పెండ్లామునకును, కాంతికిని, ప్రతి బింబమునకును, నీడకును పేరు. ఛ్యతి తాపాదికమితి ఛాయా. ఛోచ్ఛేదనే. - తాపము మొదలయిన దానిని బోమొత్తునది. "ఛాయా స్యాత్పాలనో త్కోచ స చ్ఛోభాకావ్యరీతి" ప్వితిశేషః.

ఛాయాకరుఁడు - గొడుగు పట్టువాడు, విణ.నీడను కలుగచేయువాడు.

ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః |
కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్ |                                                             

హ్యూ - (గృహ.) (Hue)1.వన్నె, చాయ, 2.కేక, అరుపు. మాహ్యుర్యే ఏకవీరికా శక్తిపీఠం|
వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.  
వన్నెకత్తియ - వన్నెకత్తె; వన్నెకత్తె - విలాసవతి.
వన్నెలాడి - వన్నెకత్తె.
వన్నెలాఁడు - వన్నెకాడు; వన్నెకాఁడు - విలాసవంతుడు.

నీడ - చాయ.
నీడకుట్టు - (గృహ.) సరియైన వైపు నమూనా నీడ కనబడుటకై వెనుక భాగమున సన్నని బట్టమీద చేయు ఎంబ్రాయిడరీ (Shadow work).

సనీడము - సమీపము, విణ.నీడముతో గూడినది.
సమానం నీడమ స్యేతి సనీడః - సమానమైన ఉనికిపట్టు గలిగినది.

కులయో నీడ మస్త్రియామ్,
కులాయము - 1.పక్షిగూడు, 2.చోటు, 3.ఇల్లు.
సాయంకాలే పక్షికుల మయతవన మితి కులాయః అయ గఔ. - సాయంకాలమందుఁ బక్షి సమూహము దీనిని బొందును.
నీడోద్భవము - పక్షి, గూటికానుపు.
నీడాత్ ఉద్భవతీతి నీడోద్భవః - గూడువలన బుట్టునది.
నీడము - 1.చోటు, 2.పక్షి గూడు.
నీయతే తృనాదిక మత్రేతి నీడం, అ. ప్న. ణీఞ్ ప్రాపనే. - తృణాదులు దీనియందుంచఁ బడును. ఈ 2 గూఁటి పేర్లు.
గూడుకానుపు - పక్షి, నీడోద్భవము.
గూఁడు - 1.కులాయము, 2.పంజరము, 3.గోడలో దీపముంచుటకు ఏర్పరచిన చోటు, 4.ఆకుగుడిసె, 5.చాప మొ.నితో కుట్టిన బండిపైకప్పు, బహు. గూండ్లు, గూడులు.
పంౙరము - పక్షులను పెంచెడుగూడు, సం.పంజరమ్.

ఒర1 - 1.ఒరపెట్టుట, 2.సామ్యము.
ఒర2 -
(భౌతి.) 1.గూడు, 2.ఒక వస్తువు నుంచుటకు సరిగా సరిపోవుగూడు (Socket or sheath).

అరగూడు - గోడయం దేర్పరచిన గూడు.    

మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.
మతి - 1.తలపు, 2.శాస్త్ర చింతనాదులచే గలుగు అర్థనిర్ణయ జ్ఞానము, వికృ.మది.   
మతిలేకుండా మాట్లాడకు అని కోపడతారు కదా!

మది యొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగన్
అది చిలుక బిల్లిపట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ.

తా. చిలుకను పెంచి పిల్లి Cat కప్పగించినట్లు. చిలుక పంజరములో పిల్లిని ప్రవేశపెట్టిన చిలుక వలె ౘదువుల పులుగు - చిలుక)మాటలు మాటలాడనట్లు, ఒకని మది - బుద్ధి, మనస్సు, సం.మతిః.)మదిలో కోరియున్న వనితను మరియొకరు(వదలక తిరిగినను-ఆ తిరుగుడు వ్యర్థం)స్వాధీన పరచుకొనలేరు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

ఓంకార పంజరశుకీ ముపనిష దుద్యానకేశి కలకంఠీమ్,
ఆగమ విపిన మయూరీ మార్యా మంతర్వి భావయే గౌరీమ్|
 

శబలము - చిత్రవర్ణము.
శబతి నానా వర్ణానితిశబలః శబగతౌ - అనేక వర్ణములఁ బొందునది.
ధనువు - 1.విల్లు, 2.గ్రహరాసులలో నొకటి, 3.నాలుగు మూరల కొలది, రూ.ధనుస్సు.
ధన్యతే ప్రార్థతే ధనుః స. న. - ప్రార్థింపఁబడునది. "ధనుర్వంశ విశుద్ధో అపి నిర్గుణః కిం కరిష్యతి" యని ఉకారాంత పులింగ ప్రయోగమును గలదు. "శరావహీ ధనూః స్త్రీ స్యాత్ "అని, త్రికాండశేష మందు ఊకారాంత స్త్రీలింగముగాః జెప్పఁబడి యున్నది.  

సునాసరుఁడు - ఇంద్రుడు, రూ.శూనాశీరుడు, వ్యు.గొప్ప సేనకలవాడు.
శోభనం నాసీరం యస్యసః సువసీరః - శ్రేష్ఠమైన సేనాగ్రభాగముగలవాఁడు.
శవర్ణాది పాఠమునందు శునంతీతి శునాః, శున గతౌ, శునాస్సీరా లాంగలాని యేన సః - వరప్రదుఁ డైన యెవనిచేత నాఁగేళ్ళు కదలుచున్నవో అతఁడు శునాసీరుఁడు.
శునా స్సమృద్ధా స్సీరా యేనేతి వా - ఎవనిచేత నాఁగేళ్ళు సముద్దములగుచున్నవో అతఁడు.
శునాసీరౌ వాయుసూర్యా వస్యస్త ఇతి వా - వాయుసూర్యులు గలవాఁడు.
దిషణుఁడు - బృహస్పతి Jupiter.
ధిషనాబుద్ధిరస్యాస్తీతి ధిషనః - మంచిబుద్ధి గలవాఁడు. 
ధిషణ - బుద్ధి.
ధృష్ణువంతి ప్రగల్భంతీ నయా ధిషణా, ఞిధృషా ప్రాగల్భ్యే. - దీనిచేత ప్రగల్భులగుదురు.

గతై ర్మాణిక్యత్వం - గగనమణిభి స్సాంద్ర ఘటితం
కిరీటం తే హైమం - హిమగిరి సుతే! కీర్తయతి యః |
స నీడేయచ్ఛాయా - చ్ఛురణ (పటలం) శబలం చంద్రశకలం
ధనుః శ్శౌనాసీరం - కిమతి న నిబధ్నాతి ధిషణామ్. - 42శ్లో

తా. ఓ హైమవతీ! హిమవంతుని కూతురా! ఎవడు దట్టముగ మాణిక్యము - కెంపు, సూర్యకాంత మణులు పొదిగిన నీ బంగారు కిరీటమును వర్ణిస్తున్నాడో - వాడు గూళ్ళయందు పొదిగిన వివిధములగు రత్నకాంతులుగల శబలము - చిత్రవర్ణము  గల చంద్రకళను ఇంద్రధనుస్సుగ నూహింపకుండునా? (చంద్రరేఖను తన మనస్సులో ధ్యానించి ధ్యానించి అదినిజంగా ఇంద్రధనుస్సే అని నిశ్చయబుద్ధి కల్పించు కొనుచున్నాడని భావము.) - సౌందర్యలహరి

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).  

చందిరుడు - చంద్రుడు.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
చంద్రేణ కర్పూరేణ మీయతే ఉపమీయత ఇతి చంద్రమాః, స. పు. మాఞ్ మానే. - చంద్రమనఁగా కర్పూరము, దానితో బోల్చఁబడువాఁడు.
చంద్రముడు - చంద్రుడు.
చందయతీతి చంద్రః, చది ఆహ్లాదనే సంతోషింపఁజేయువాఁడు.
చంద్రుడు - నెల, మాసము.

నెలమేపరి - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
రహతి భుత్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః, ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు. 
తలగాము - రాహువు Rahu.

ధ్వాంతము - చీకటి.
ద్వనంత్యత్ర మార్గ మపస్యంత ఇతి ధ్వాన్తం, ధ్వన సద్బే. - మార్గమును గాననివారలై దీనియందు మొఱపెట్టుదురు.

ధ్వాన్తే గాఢే(అ)న్ధతమసమ్ -
అంధం కరోతీత్యంధం, అంధం చ త త్తమశ్చ అంధతమసం, అ, స. - లోకము నంధముగాఁ జేయునట్టి తమస్సు. ఈ ఒకటి గాడాంధకారము పేరు.

ఇందుఁడు - చంద్రుడు.
ఉనక్తి తుషారకణైరితి ఇందుః, ఉ-పు. ఉందీ క్లేదనే - మంచుకిరణములచేత తడ్పెడువాఁడు.
ఇందువారము - సోమవారము Monday.
సోమవారము - వారములలో రెండవ దినము.

ఇందుకళాధర ఇంద్రాది ప్రియ సుందరరూప సురేశశివ |

ఇందిర - లక్ష్మి; ఇంది - లక్ష్మి, రూ.ఇందిర.
అధికపాఠము. ఇందిరా లోకమాతా మా క్షీరాబ్ధితనయా రమా(రమ - లక్ష్మి) - ఇందతీ తీందిరా - పరమైశ్వర్యయుక్తురాలు. ఇది పరమైశ్వర్యై.

అథ నీలామ్బుజన్మ చ, ఇన్దీవరం చ నీలే (అ)స్మిన్ -
అంబుని జన్మ అస్యేత్యంబుజన్మ నీలం చ తత్ అంబుజన్మ, న. న. - నీటియందు జన్మము గలిగినది అంబుజన్మము; నీలమైన అంబుజన్మము నీలాంబుజన్మము.
నీలాబ్జము - నల్లకలువ.
ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామర.
ఇన్దతీతి ఇన్దీ ర్లక్ష్మీః, తయా వ్రియత ఇతి ఇన్దీ వరం. వృఞ్ వరణే. ఐశ్వర్యయుక్తురాలు గనుక ఇంది యనఁగా లక్ష్మి; ఆమెచేత వరింపఁబడినది. 
ఇంద్రియాని వృణోతీతి వా ఇందీవరం. వృఞ్ వరణే. - ఇంద్రియములను సంతోషముచేతఁ గప్పునది. ఈ రెండు నల్లకలువ పేర్లు.

ఇందిందిరము - తుమ్మెద.
ఇందతి ఇందిరయా ఇందిందిరః ఇది పరమైశ్వర్యే. - పద్మ సంపదతోఁ గూడినది.

స్నిగ్థము - 1.స్నేహముగలది, 2.నునుపుగలది, 3.చిక్కనగలది. 
స్నిగ్ధవయనము - (గృహ.) నునుపు నేతబట్తకు మెరుపు నునుపునిచ్చు ఒక విధమైన నేత (Satin weave). 

చికురము - 1.వెండ్రుక, 2.కొండ, 3.ఒకజాతి పక్షి, 4.పాము, 5.ముంగిస, విణ.కదలునది.
చిన్వన్ వర్ధమానః కుర్యతే ఛిద్యుత ఇతి చికురః, ఈఞ్ చయనే-కుర ఛేదనే. - వృద్ధిఁబొందుచు ఖండింపఁబడునది.
చ్లకతి తృప్యతి స్వకర్మనేతి చికురః - తాఁ జేసిన ప్రయోజనముచేత తృప్తిబొందువాఁడు.

కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, త. మలై.
పర్వాణి సంధయో (అ)స్య పర్వతః - సంధులు గలిగినది. 
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
కొండౘూలి - పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతురు. 
కొండమల్లయ్య - శివుడు; కొండయల్లుడు - శివుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు. 
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము.
సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - అశ్లేష.
ఆశ్లేష - ఇరువదియేడు నక్షత్రములలో తొమ్మిదవది.  

ముంగి - ముంగిస, నకులము.
నకులము - ముంగిస.

ధమ్మిల్లము - కొప్పు.
కొప్పు -
1.దోపిన వెండ్రుకలముడి, 2.వింటికొన, 3.కోపు, 4.ఇంటి నడికొప్పు.

అథ ధమ్మిల్ల స్వయంతాః కచాః,
సమ్యతా, బద్ధాః కేశా ధమ్మిల్ల ఇత్యుచ్యతే. - కట్టఁబడిన వెండ్రుకలు ధమిల్ల మనంబడును.
చ మిత్యవ్యయం మూర్ధధః ఊర్ధ్వం వా మిల్యతే ధమ్మిలః, మిల శ్లేషణే. - శిరస్సుయొక్క అధోభాగమనుఁగాని ఊర్ధ్వభాగమందుఁగాని కూడు యుండునది. ఈ ఒకటి కీలుగంటు పేరు.

కచము - జుట్టు, కేశము.
కంచబంధము -
జుట్టుముడి.

కురులు - ముంగురులు, వెండ్రుకలు, సం.కురలః.
కురుళము - ముంగురులు.

కైశికము - వెండ్రుకల సమూహము.
కైశికుఁడు - చంద్రుడు Moon. 

తద్బృన్దే కైశికం కైశ్యమ్ -
కేశానాం సమూహః కైశికం కైశ్యం చ, కేశముల సమూహము కైశికము కైశ్యము. ఈ 2 తలవెండ్రుకల సమూహము పేర్లు.

నికురుంజము - సమూహము.

కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్తనాళములు (ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries). 

నికురుంబము - సమూహము.
నితరాం కురతి శబ్దాయతే నికురుంబం, కుర శబ్దే. - మిక్కిలి రొదచేయునది.

కేశినాళికలు - (జీవ.శారీ.) వెండ్రుకల వలె సన్నగా చీలియున్న రక్తనాళములు (ఇవి ధమనిని సిరను కలుపుచుండును) (Capillaries). 

సౌరభ్యము - 1.వాసన, 2.ఒప్పిదము, 3.గుణగౌరవము.
సహజము - స్వభావము, విణ.కూడ బుట్టినది, (భౌతి.) ప్రకృతికనుగుణమైనది, (Normal).

ఉపలబ్ధద్రవ్యములు - (పా. శా.) ముఖ్యమైన పరిశ్రమలో లభించు ఉపయోగకరమైన ఉప పదార్థములు (By-products).
లబ్ధము - పొందబడినది, (గణి.) భాగహారము చేయగా నేర్పడు సంఖ్య.
లబ్ధము - (గణి.) అంకగణిత ప్రక్రియలో నొకటి (Product).

సుమనస్సు - 1.పువ్వు, 2.వేలుపు, 3.విద్వాంసుడు.   
సుమన సః-సాంతః-పు. సుష్ఠు మన్వత ఇతి సుమనసః - లెస్సగా నెఱిఁగినవారు గనుక సుమనస్సులు.
మన జ్ఞానే, శోభనం మనో యేషాం తే మంచి మనస్సు గలవారు.  

విటపి - చెట్టు, వ్యు.విటపములు కలది.
విటపాః అస్య సంతీతి విటపీ, న. పు. - కొమ్మలు గలది.
విటపము - 1.చివురించిన కొమ్మ, 2.చిగురు, 3.కొమ్మ, 4.బోదెలేనిచెట్టు.

ధునోతు ధ్వాంతం న - స్తులితదళితేన్దీవర వనం    
ఘనస్నిగ్దం శ్లక్షణం - చికుర నికురుంబము తవ శివే
యదీయం సౌరభ్యం - సహజ ముపలబ్థం సుమససో
వసంత్యస్మిన్మన్యే - బలమథన వాటీ విటపి నామ్. - 43శ్లో

తా. ఓ మంగళ దేవతా! నందనవనమందలి(ఉద్యానవనము)కల్పవృక్షాల పూవులు సహజమగు నీ కురుల సువాసనను పొందుటకు నీ కుంతలముల వసించు చున్నవని తలచు చున్నాను. అప్పుడే పుష్పించిన ఇందీవరము - 1.నల్లకలువ, 2.నీలితామరలకు సాటియైనవియు, దట్టమై నున్ననై మృదువైనవగు నీ కురుల సమూహము మా అజ్ఞానము తొలగించు గాక! (ఆ చెట్ల పూవులు నీకురులకు సౌరభ్యము- 1.వాసన, 2.ఒప్పిదము, 3.గుణగౌరవము.) ఆపాదించటానికి బదులుగా అవే నీకురులనుండి సౌరభ్యాన్ని గ్రహిస్తున్నా యని భావము) - సౌందర్యలహరి    

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షమ్
ఆనందహేతు రధికం మురవిద్విషో పి|
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థమ్
ఇందీవరోదరసహోదరమిందిరాయాః|| - 4

త్రిదివేశుఁడు - వేలుపు.
త్రిదివేశాః - త్రిదివస్య ఈసా స్త్రిదివేఅశాః - స్వర్గముబకుఁ బ్రభువులు.
దివౌకసుఁడు - వేలుపు, రూ.దివోకసుఁడు, వ్యు.సర్గమే నెలవుగా గలవాడు.
దివౌకసః, స-పు. దివ్ దివం వా ఒకః స్థానం యేషాం తే - స్వర్గము స్థానముగాఁ గలవారు.
దివశబ్దము అకారాంతంబును గలదు. శ్లో. 'న శోభతే తేన హి నో వినాపురం మర్తుత్వతా వృతపధే యథా దివం'అని అనిరుద్ధచరిత్రమునందు దివశబ్దము అకారాంతముగఁ బ్రయోగింపఁబడి యున్నది.

హిమకరుఁడు - చంద్రుడు.
హిమధాముఁడు - చంద్రుడు.

కళాహీనే సానుమతిః -
అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.
నిశాకరే కళాహీనే నతి సా పూర్ణిమా అనుమతి రిత్యుచ్యతే. - చతుర్దశీ యుక్తేతి భావః - చంద్రుఁడు కళాహినుఁడైనపుడు ఆ పున్నమ అనుమతి యనంబడును, అనఁగాఁ జతుర్దశితో గూడినదని భావము. 1 ఒకకళ తక్కువగాఁ గల చంద్రునితో గూడిన పున్నమ.

2. విదియ - రెండవ తిధి  సం.ద్వితీయా.    
ద్వితీయ - 1.భార్య, 2.విదియ, 3.రెండవది స్త్రీ, 4.(వ్యక) ద్వితీయా విభక్తి.
యజ్ఞాధికార ఫలభాగినో ర్జాయాపత్యో రన్యతరత్వేన ద్వితీయా - యజ్ఞాధికార మందు ఫలమును బొందునప్పుడు పతితోఁ గూడ తాను రెండవది.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు. భరింపదగినది.
భ్రియత ఇతి భార్యా. భృఞ్ భరణే. - భరింపఁ బడునది.

ద్వితీయం చ సరస్వతీ| ద్వితీయా బ్రహ్మచారిణీ|

ద్వితీయుఁడు - కొడుకు, విణ.రెండవవాడు.
కొడుకు - కుమారుడు, సం.కుణకః.
కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
స్కందుఁడు - కుమారస్వామి. ద్వితీయః స్కంద ఏవ చ| 

ద్వితయము - రెండు.
దుగ - ద్వికము, రెండు, రూ.దువ, సం.ద్వికమ్.
రెండు - 1.భేదము, వేరుపాటు, 2.ద్వయము.

అక్షి - 1.కన్ను, 2.రెండు అను సంఖ్యకు సంకేతము.
అక్ష్ణోతి దూరమిత్యక్షి. అక్షూ వ్యాప్తౌ. - దూరముగా వ్యాపించునది. ఇ. న. ద్వి.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెన ద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

ఇరుగడ - రెండు ప్రక్కలు.
ఇరు - సర్వ. (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా.ఇరుగడ.
ఇరుగురు - ఇద్దరు, రూ.ఇరువురు. 
ఇరువురు - ఇరుగురు.  

ని - ద్వితీయా విభక్తి ప్రత్యయము.
ను - 1.ద్వితీయా విభక్తి ప్రత్యయము, 2.క్రియాప్రత్యయము, ఉదా.తద్ధర్మాదు లందు ప్రథమ పురుషైక వచనమున చేరు ప్రత్యయము, సూర్యుడు తూర్పున ఉదయించును, 2.సముచ్ఛయార్థకము, ఉదా.వాడును నీవును రండు.
తద్ధర్మము - (వ్యాక.) 1.మూడు కాలములను బోధించు క్రియాపదము, ఉదా.సూర్యుడుదయించును, 2.దాని యొక ధర్మము, 3.స్వభావము.

లలటపార్శ్వాస్థి - (జం.) పుఱ్ఱెలో పైభాగమును ఏర్పరుచు ఎముకలలో నొకటి. ఇది లలాటాస్థి, పార్శ్వాస్థి అను రెండు ఎముకలుకలిసి ఏర్పడినది (Frontoparietal bone).

లలాటము-నుదురు. లలాటం అమృతోత్భవ|
లలంత శ్చలంతః అటం త్యలత అత్రేతి లలాటః అట గతౌ. - దీనియందు ముంగురులు చలింపుచు నటించును.
లావణ్యము - అవయవ కాంతివిశేషము.
ద్యుతి - 1.కాంతి, 2.కిరణము.
ద్యోత ఇతి ద్యుతిః ఈ-సీ, ద్యుత దీప్తౌ - ప్రకాశించునది.
 
విమలము - నిర్మలమైనది.
విగతం మలమనయేతి విమలా - దీనిచేతఁ గల్మషము పోవును. 

లలాటం లావణ్య ద్యుతి - విమల మాభూతి తవ యత్
ద్వితీయం తన్మన్యే - మకుట ఘటితం చంద్రశకలమ్|
విపర్యాసన్యాసా దుభయమపి - సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః- పరిణమతి రాకాహిమకరః|| - 46శ్లో

తా. తల్లీ! లావణ్యమను వెన్నెల చేత స్వచ్ఛముగ ప్రకాశించుచున్న నీ లలాటము - నుదురు కిరీటమందున్న రెండవ నెలపాలు - చంద్రకళగా భావించుచున్నాను. ఈ రెండును  క్రిందు మీదుగ(తలక్రిందులుగా) నుండుటవలన పరస్పరము కలిసి, సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక. అమృతము పూసిన పూర్ణిమ చంద్రుని హిమకరుఁడు - చంద్రుడువలె నీ ముఖము గన్పట్టుచున్నది. - సౌందర్యలహరి

ఆగమ ప్రణవ పీఠికా మమల వర్ణ మంగళ శరీరిణీం,
ఆగమావయశోభినీం అఖిల వేదసారకృత శేఖరీం,
మూలమంత్ర ముఖమండలాం ముదిత నాద బిందునవయౌవనాం
మాతృకాం త్రిపుర సుందరీం మనసి భావయామి పరదేవతామ్. - 8శ్లో

ఉభయము - 1.రెండవయములు గలది, 2.రెండు, వి.గుడిఉత్సవము నడుపు వంతు.

ద్వితీయ(విదియ)చంద్రుని దర్శించునపుడు :
క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర|
హిరణ్య మకుటా భాస్వదాచల చంద్ర నమోస్తుతే||

విదియనాడు కనిపించని చంద్రుడు తదియనాడు తానే కనిపిస్తాడు.

కార్తీకశుద్ధ విదియ(యమ ద్వితీయ)నాడు ఎవడు తన సోదరి యింట భోజనం చేస్తాడో, అతనికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుభయం కాని సంభవించని విధంగా యమునకు వరం ప్రసాదించాడు.

సోదరుణ్ని తనఇంటికి అహ్వానించి, మనఃపూర్వకంగా తన చేతి వంటకాలను వడ్డించి, తృప్తిపరిచే చెల్లెల్లు(స్త్రీ) వైధవ్యం పొందక చిరకాలం 'సువాసిని' గానే ఉంటుంది, అన్నాడు యమధర్మరాజు, తన చెల్లెల్లు యమునతో. పసుపు-కుంకుమ స్త్రీకి పుష్టి కలిగిస్తుంది.

భాస్కరుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని.
భాసం కరోతీతి భాస్కరః - కాంతిని కలుగజేయువాఁడు.

త్రిధాముఁడు - 1.అగ్ని, 2.విష్ణువు, 3.శివుడు, 4.యముడు.

అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతె కుటిలం ఊర్థ్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఇ-పు. అగ కుటిలాయాం గతౌ. - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది. 

అగ్నిభువు - కుమారస్వామి.
అగ్నేర్భవతీ త్యగ్నిభూః, ఊ-పు. అగ్నివలనఁ బుట్టినవాఁడు.

అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు. అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3.(వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను సంఖ్య.     
అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్టవసువులలో ఒకడు.  

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభధ్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు. 

అహస్కరుఁడు - సూర్యుడు.
అహః కరోతీత్యహస్కరః - అహస్సును జేయువాఁడు.

అహస్సు - అహము.
అహము - 1.దినము, రేయుంబవలు, 2.పగలు, రూ.అహస్సు, 3.గర్వము.
అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య, దేహత్మభ్రాంతి.

గర్వో(అ)భిమానో(అ)హంకారో -
గర్వయనేనేతి గర్వః ఖర్వ దర్పే. - దీనిచేత గర్వింతురు.
ఆత్మానముత్కృష్టం మానయతీత్యభిమానః - మను అవబోధనే తన్ను ఉత్కృష్టునిఁగాఁ దలఁపించునది.
అహమితి బుద్ధిం కరోతీత్యహంకార. డుకృఞ్ కరణే. - నేను ఉత్కృష్టుఁడ నను బుద్ధినిఁ జేయునది. ఈ 3 అహంకారము పేర్లు.

హంకారము - 1.అహంకారము, 2.అభిమానము, సం.అహంకారః.

అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.ఆత్మాభిమానము (Egotism), 5.క్రోధము, (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది, రూ.అహకృతి, అహంక్రియ. 

అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
అజ్ఞానము - తెలివిలేనితనము.
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము.
అవిద్య - 1.అజ్ఞానము, తత్త్వజ్ఞానములేమి, 2.మాయ.
విపరీతజ్ఞాన మవిద్యా, విదజ్ఞానే. - విపరీత జ్ఞానము అవిద్య.
అహమ్మతి - అజ్ఞానము.
అహమితిబుద్ధిరహం మతిః, సీ. - నే ననెడు స్వతంత్రబుద్ధి అహంమతి. ఈ 3 అజ్ఞానము పేర్లు.

అజ్ఞాతరాశి - (గణి.) సమీకరణముల లోని తెలియని రాశి (Unknown Quantity).
అజ్ఞేయవాదము - దేవుడున్నాదో లేడో తెలియ దనువాదము.

తిగగంటి - శివుడు, వ్యు.మూడు కన్నులు కలవాడు. 
తిగ - మూడు, రూ.తివ, సం.త్రికమ్.
తిగలు - ముగ్గురు బిడ్ద లొక కానుపులో కలుగుట (Triplet).

తివ - తిగ.
తివియు - క్రి.తిగియు.
తిగియు - క్రి.ఆకర్షించు, రూ.తిగుచ, తివియు.

మూఁడు - రెండు నొకటి, క్రి.1.సంభవించు, 2.ముగియు.  

ముగురు - (మూడు+గురు) మువ్వురు, రూ.ముగ్గురు, మువురు, మూగురు, మూవురు.
మూగురు - ముగ్గురు.

ప్రథానసంఖ్య - (గణి.) ఒకటి తప్ప మరి యేఇతరసంఖ్యచేతను తెగని సంఖ్య 3, 7, 11, 17, 19, వంటివి, ఒకటికాక ఈతర కారణాంకములు లేని సంఖ్య (Prime number).  

ముఖ్య సంఖ్యలు - (గణి.) ఎన్ని? అను ప్రశ్నకు సమాధానము నిచ్చు 1, 2, 3, 4 వంటి అంకెలు (Cardinal numbers) (చూ. క్రమిక = Ordinal) 

3. తదియ - తృతీయ, పక్షమునందు  మూడవ తిథి. సం.తృతీయా.  
తృతీయ -
1.పక్షమునందు మూడవ దినము, తదియ.

తద్దె - తదియ, తద్దియ.
అట్లతద్దె ఉండ్రాళ్ళ తద్దె. తద్దికి అట్లు బలం అన్నారు.

తృతీయకము - (గృహ.) మూడవది, రూ.తృతీయము. తృతీయం శారదా దేవీ|
తృతీయము - తృతీయకము.

ముగురు - (మూడు+గురు) మువ్వురు, రూ.ముగ్గురు, మువురు, మూగురు, మూవురు.
మూగురు - ముగ్గురు.

ప్రథానసంఖ్య - (గణి.) ఒకటి తప్ప మరి యేఇతరసంఖ్యచేతను తెగని సంఖ్య 3, 7, 11, 17, 19, వంటివి, ఒకటికాక ఈతర కారణాంకములు లేని సంఖ్య (Prime number).  

ముఖ్య సంఖ్యలు - (గణి.) ఎన్ని? అను ప్రశ్నకు సమాధానము నిచ్చు 1, 2, 3, 4 వంటి అంకెలు (Cardinal numbers) (చూ. క్రమిక = Ordinal) 

త్రింశత్తు - ముప్పది.
త్రింశము - ముప్పదవది.

త్రింశత్తు తాః కలాః,
త్రింశత్యాష్ఠాః కలేత్యుచ్యతే. 30 కాష్టలకాలము కల యనంబడును.
కాలం కలయతీతి కలా, కల సంఖ్యానే. - కాలమును లెక్కపెట్తునది. ఈ ఒకటి 30 కాష్టలు 1 కల. 

అహస్సూతే సవ్యం - తవ నయన మర్కాత్మక తయా
త్రియామాం వామం తే - సృజతి రజనీ నాయక తయా, |
తృతీయా - తే దృష్టి ర్దరదళిత హేమామ్భుజ రుచిః
సమాధత్తే సంధ్యాం - దివసనిశయో రన్తర చరీమ్ || - 48శ్లో
తా.
ఓ భగవతీ ! నీ కుడికన్ను(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)సూర్యాత్మకమైన పగటిని సృజిస్తోంది, నీ యెడమ కన్ను(దాకన్ను - ఎడమకన్ను.)చంద్రుడు అధిదేవతగాగల రాత్రి(రజని-రాత్రి)ని కలిగిస్తుంది. ఇంచుక వికసించిన సువర్ణకమలాన్ని(పుష్పించిన బంగారు పద్మపు కాంతి)పోలిన నీ మూడవ నేత్రం(దృష్టి -1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.)దివారాత్రాల నడుమ కలిగే సంధ్యలను ఏర్పరుస్తోంది.(రాత్రిం బగళ్ళకు మధ్యనున్న సాయం సమయమును చేయుచున్నది) - సౌందర్యలహరి 

దుష్ట విద్రావిణీ దేవీ సర్వోపద్రవనాశినీ,
శారదా శరసంధానా సర్వశస్త్ర స్వరూపిణీ. – 24శ్లో

కావ్యగుణములు - (అలం.) శ్లేషము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

తీ - సమాసమునందు తిగ శబ్దమునకు ఆదేశ రూపము, ఉదా.తీవంచ.
తీవంచ - నాలుగు, (తీ=తిగ=మూడు+వంచ=ఒకటి).

వెడఁద - విశాలము.
వెడలు - క్రి.బయలుదేరు, విశాలము.

విశాలము - విరివియైనది.
విశాలస్య భవః విశాలతా. - విశాలముయొక్క భావము.
వైశాల్యము - విశాలత్వము, వెడల్పు (గణి.) తలపరిమాణము (Area). 
విశాలఫలత్వా ద్విశాలా - పెద్దపండ్లుగలది. 
విశాలసముద్రశాఖ - (భూగో.) ఒక పెద్ద ప్రవాహముగ నది సముద్రములో పడు స్థలము (Estuary).
కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు Cow.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.
భూ - భూమి (సమాసములందే).
భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము. 
నేలచూఁలి - సీత, భూపుత్రి. 
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ. సీతా ప్రాణాధారక రామ్| సీతానాయక గోవిందా|
అయోధ్య -

నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయము, వి.బిడ్డ. 
భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు. 
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగాని అరయతి పీడయతీతి వా, అర పీడనే - శరీరములను పీడించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
మంగళుఁడు - కుజుడు Mars.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).
కౌ పృథివ్యాంజాతః కుజః, నీప్రాజదుర్భావే - భూమియందుఁ బుట్టినవాఁడు.

ఐలుఁడు - 1.పురూరవ చక్రవర్తి, 2.అంగారకుడు Mars, 3.అందగాడు.

కువలేశుఁడు - విష్ణుమూర్తి.
కువలయేశుఁడు - 1.రాజు, 2.చంద్రుడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon. 

కలువరాయుఁడు - చందమామ.
కువేలము - 1.కలువ, 2.పద్మము.
కలువ - ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్.  
కలువకంటి - కలువరేకుల వంటి కన్నులుగల స్త్రీ.

కల్హారము - మిక్కిలి పరిమళము గల కలువ.
కలువడము - (కలువ+వడము) ఉత్సవములలో కట్టెడు బంగారు కలువ పూదండ, స.కైరవ వటః.

ఉత్పలము - కలువ, నల్లకలువ.
ఉత్ ఊర్థ్వం వలతి గచ్ఛతీ త్యుల్పలః, వల గతౌ. - ఊర్థ్వమును బొందునది.
కలువ - ఉత్పలము, రూ.కల్వ, సం.కైరవమ్. 
కువలయము - 1.భూమండలము, 2.నల్ల కలువ, రూ.కువలము.
కౌ వలత ఇతి కువలయం, వల సంవరణే. - భూమియందుఁ జుట్టుకొని యుండునది.
కుత్సితో బహిర్వలయః పత్రసంవేష్టనమత్రే తివా కువలయం - కుత్సితమైన పత్రవలయము గలిగినది. 
కౌ భువి వలతే భ్రమతీతి కువలం, వ్ల సంచలనే. - భూమియందు చరించునది.

కువ - కువ్వ, కుప్ప.
కుప్ప - ధాన్యము మొ. ని రాశి.
రాశి - 1.రాసి, 2.నికాయము, సమూహము, 3.మేషాది రా సు లు (అర్థ,) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము. (Quantity)
అశ్నుత ఇతి రాశిః, పు. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.   

కృపాళువు - దయాళువు, దయగలవాడు.
కృపాం రాతీతి కృపాళు, లా ఆదానే. - కృపను స్వీకరించువాఁడు.
కృప - దయ, కనికరము.
కృపయన్తే అనయా కృపా, కృప కృపాయాం. - దీనిచేత దయచేయుదురు.
ఆధారము - 1.ఆదరువు, ప్రాపు, 2.కుదురు, పాదు, 3.నాటకపాత్రము, 4.(యోగ.) మూలాధారచక్రము.
ఆధారరాశి - (క్షే.గణి.) శీర్షమున కెదురుగా నుండు భుజము (Base).
ఆదుకొను - క్రి.1.ఆధారమగు, ప్రాపగు, 2.రక్షించు, ఆదరించు. 

మధుర - ఒక పట్టణము.
భోగవతి - 1.పాతాళము, 2.పాతాళమందలి నది, విణ.భోగము గలది.
అవంతి - 1.ఉజ్జయిని, 2.అక్క.
విజయ - 1.గౌరి, 2.దినము యొక్క ఆరవభాగము, 3.ఇరువదిఏడవ(27వ)సంవత్సరము.  

విశాలా కల్యాణీ - స్పుటరుచి రయోధ్య కువలయైః
కృపాధారా (ఆ)ధారా - కిమపి మధురా భోగవతికా,
అవంతీ దృష్టిస్తే బహునగర విస్తారవిజయా
ధ్రువం తత్తమ్మామ - వ్యవహరణయోగ్యా విజయతే. - 49శ్లో

తా. ఓ సకలాధారా! నీ దృష్టి విశాలమైనది, శుభము నిచ్చునది, స్పష్ట ప్రకాశముగలది, కలువలచే జయింపరానిది, దయ కాధారమైనది. భోగము కలది, రక్షించునది, పెక్కు నగరములను జయించునదియై ఆయా పేరులతో పిలుచుటకు దగినదై సర్వోత్కృష్టముగ నున్నది. అనగా విశాల, కల్యాణి, అయోధ్య, మధుర, భోగవతి, అవంతి, విజయ, అను నగర నామములు దేవి దృష్టి - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ది.)చేతనే యేర్పడినవని భావము. - సౌందర్యలహరి

శుభాంగ శ్శాన్తిద స్స్రస్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతి ర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||

ననుచు భయమందనేల నేననుచు నీవె
నీతులను నేర్పి యభయప్రదాత వగుచు
వెన్నుతట్టుచు నుందువో విష్ణుమూర్తి
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|

అప్ప - అప1.
అప1 -  అవ్య. సమాసపూర్వ పదముగా నుండి క్రింది అర్థముల నిచ్చును, 1.విపరీతము, ఉదా.అపకీర్తి,  2.అపగతము, ఉదా.అపక్రమము = క్రమము తప్పినది, క్రమములేనిది, 3.చెడ్దది, ఉదా.అపక్రర్మము = చెడ్డపని.
అప2 - 1.తల్లి, 2.తండ్రి, 3.అక్క, రూ.అప్ప.

జడ్డక్కరము-(వ్యావ.) ఒత్తక్షరము, ఉదా.క్క, మ్మ.
ద్విత్వము- (వ్యాక.) ఒత్తక్షరము, ఉదా. క్క, మ్మ.

అప్పళము1 - 1.అప్పడము, 2.బాలక్రీడలలో ఒకటి, 3.(తోడ మొ.వి)చరచుట.
అప్పడము - ఒకరకపు భక్ష్యము, రూ.అప్పళము, సం.అర్పటమ్.
అప్పళము2 - అవ్య. బిరాన, శీఘ్రముగా.
బిరబిర - శీఘ్రముగ, బిరాన.

అప్పము - బెల్లమును పిండియు కలిపిచేసిన గుండ్రని భక్ష్యము, గుడాపూపము, సం.అపూపః.
అప్పచ్చి - అపూపము; రూ.అప్పచ్చి.

పురోడాశము - 1.యజ్ఞార్థమైన అపూపము, సోమలతరసము, 2.హుతశేషము.

పూపో (అ)పూపః పిష్టకస్స్యాత్ -
పూపము - అపూపము, అప్పము.
పునాతీతి పూపః, పూఞ్ పవనే. - పవిత్రము చేయునది.
అపూపము - పిండివంట, అప్పము.
నపూయతే నవిశీర్యత ఇత్యపూపః, పూయీవిశరణే. - జీర్ణముగానిది.
పిష్టకము - 1.కంటితెవులు, 2.పిండివంట.
పిష్టవికారత్వాత్ పిష్టకః - పిండిచేతఁ జేయబడునది. ఈ 3 పిండివంట పేర్లు.

అప్పా ! యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
యప్పా నను గనుఁగొనవే
యప్పా ననుఁబ్రోవు వేంకటప్పా కృష్ణా.
  
తా. కృష్ణా! అప్పములు అరిసెలు(అతిరసము - అరిసె)ఇత్తువు. నను దయతోడ కావుము, వేంకటాద్రి మునీ ! నిను గొలిచెదను. 

అవ1 - 1.తల్లి తల్లి, 2.తండ్రి తల్లి, 3.తల్లి, 4.పూజ్యస్త్రీ, 5.వృద్ధురాలు, రూ.అవ్వ.
అవ్వ - అవ1. అవ్వ పేరే ముసలమ్మ.  
అవ2 - ఇది సమాసపూర్వపదమై క్రింది అర్థముల తెలుపును, 1.వంగినది, ఉదా. అవాగ్రము = వంగిన అగ్రముకలది, 2.విరుద్ధము, ఉదా.అవమానము(అవమానము - అగౌరవము, తిరస్కారము, అనాదరము), 3.అనాదరమును సూచించునది, ఉదా.అవకర్ణనము = అనాదరముతో వినుట. అవ్వకావాలి బువ్వకావాలి అంటే ఎట్లా!

మాతామహి - తల్లి తల్లి, అమ్మమ్మ. 
పితామహి - తండ్రితల్లి.

అప్పం దన తల్లిగ మే
లొప్పం గని జరుపవలయు * నుర్వీస్థలిఁ జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడఁతియు మాతృతుల్య * యండ్రు కుమారా!

తా. తోడఁబుట్టిన అక్కచెల్లెండ్రను గౌరముగాఁ జూచి సంతోషించునట్లు వారికి క్షేమము కలుగ చేయవలెను. బాల్యమునఁ జనుపాలనిచ్చి పెంచిన స్త్రీని కూడ తల్లితో సమానురాలని మర్యాద చేయవలెనని పెద్దలు చెప్పుదురు.

మహాకాలుఁడు - 1.శివుడు, 2.శివభటుడు.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

అవంతి - 1.ఉజ్జయిని, 2.అక్క.
అవంత్యాఖ్యదేశే ప్రాయేణ సూయత ఇతి అవంతీసోమం, షూఙ్ ప్రాణిప్రసవే. - ఆవంతి దేశమందు తఱుచుగాఁ బుట్టునది. 
అక్క1 - 1.తనకంటె పెద్దది అగు తోడబుట్టువు, జేష్ఠభగిని, అప్ప, 2.పూజ్య స్త్రీ, 3.వంటలక్క.  ఉజ్జయిన్యాం మహాకాళమ్| ఉజ్జయిన్యాం మహాకాళీ శక్తిపీఠం|

అంతిక - 1.అక్క, 2.పొయ్యి, 3.(వృక్ష). సాతల మనెడు ఓషధి.
అంతోనాశో అస్యామస్తీతి అంతికా - దీనియందు పదార్థములకు నాశము గలుగును.   

పొక్కలి - ఎత్తుడు ప్రొయ్యి. 
ఎత్తుగడలు - ప్రొయ్యిగడలు.
గడ్డప్రొయ్యి - గడ్డలతో నేర్పరచిన పొయ్యి.

ఇంటింటా ఒక పొయ్యి మా ఇంట్లో మరో పొయ్యి. కర్రవంకరని పొయ్యి తీస్తుందట.  

అక్క2 - తల్లి.
తలి - జనని, తల్లి. తల్లి - జనని, రూ.తల్లి, విణ.మొదటిది, సం.వి. జవరాలు, తరుణి.
తరుణి - యువతి, స్త్రీ, రూ.తలుని.
కన్యావస్థాం తరతీతి తరుణీ, సీ, తౄప్లవన తరణయోః - కన్యావస్థను దాఁటినది. పా. తలునీ. అక - అక్క, పూజ్యస్త్రీ.
ఆయక - (ఆ+అక) 1.ఆపూజ్యస్త్రీ, 2.అకె, ఆ యక్క.
ఆకె - ఆమె, ఆయమ. ఆమె ఎవరు ? 
ఆయమ - (ఆ+అమ)ఆమె, ఆపె, ఆకె.
ఆబిడ - (ఆ+బిడ్ద) ఆపె, రూ.అబిడె.
ఆపె - ఆమె, రూ.ఆకె.
ఆకె - ఆమె, రూ.ఆకె.
ఆమె - స్త్రీ; స్త్రీ - ఆడుది.
ఆమెత - 1.విందు, 2.ఉత్సవము.     
విందు - 1.ఆతిథ్యము, చుట్టములులోనగు వారికిడు భోజనము, 2.చుట్టము, అతిథి.
ఆతిథ్యము -  ఆతిథేయము, విణ.అతిథి కొరకైనది. 
అతిథేయము - అతిథి సత్కారము, విణ.అతిథికి యోగ్యమైనది.
ఆగంతుకుఁడు - అతిథి, విందు.
అవేశాత్ స్వగృహాత్ ఆగతః ఆవేశికః - తన యింట నుండి వచ్చినవాఁడు.  
ఆగంతువు - అకస్మాత్తుగ వచ్చునది, అకస్మికముగ సంభవించునది, వి.అతిథి, విందు.
అగచ్ఛత్యాగస్తుః, ఉ. పు. - వచ్చినవాఁడు.

అరదేశి - 1.పరదేశి, 2.యాత్రికుడు.
అతిథి - 1.భోజన సమయమునకు వచ్చు పరదేశి, 2.అహుతుడు, 3.కుశుని కొడుకు.
అతతి సతతం గచ్ఛతీ త్యతిథిః, ఈ. పు. అత సాతత్యగమనే. - ఎప్పుడు తిరుగువాఁడు. 
బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
"ఆ షోడశాద్భవే ద్బాలస్తత స్తరుణ ఉచ్యత" ఇతి మనుః, బలతి అల్పాయాసేన బాలః, బలప్రాననే. - అల్పాయాసముచేత బ్రతుకువాఁడు.
చిన్నవాడు - బాలుడు.
బాలాజీ - శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలాః.

బలారిష్టము - పుట్టినది మొదలు 12 సంవత్సరముల లోపున బాలబాలిక లకు కలుగుకీడు, మరణము.

నృపతి - రాజు, రూ.నరపతి.
నౄన్ పాతీతి నృపః, పా రక్షణే. - నరులను బాలించువాఁడు. 
జామాత - అల్లుడు, పెనిమిటి.
జాయాం మిమాతే జామాతా, ఋ, పు, మాఙ్ మానే. పెండ్లామును వివాహార్థమై కొలుచువాఁడు.

మనుగడుపు - అల్లియము, క్రొత్త పెండ్లి కుమారునకు అత్తగారుచేయు విందు.
అల్లియము - 1.ఆలుడగుట, 2.క్రొత్త పెండ్లికొడుకునకు బెట్తెడి అత్తవారింటి విందు, మనుగడుపు.
అల్లెము - అల్లియము.

ఇల్లంట్రము - అల్లుడు మామగారియింటనే వాస ముండుట, రూ.ఇల్లటము.
ఇల్లరికము - (ఇల్లు+అఱికము), చూ. ఇల్లంత్రము.   

విత్తము - ధనము, సం.విణ.1.విచారింపబడినది, 2.తెలియబడినది.
విద్యతే లభ్యత ఇతి విత్తం, విద్ ఌ లాభే. - పొందఁబడునది. 

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా|
ఏతే విత్తం నజానంతి జామాతా శ్చైవ పంచమః||

తా. అడుగవచ్చెడు అథిథి, చిన్నవాడు - బాలుడు, స్త్రీలు, నృపతి - రాజు, రూ.నరపతి., జామాత - అల్లుడు, పెనిమిటి.; యీ ఐదుగురు కలిమి లేమి నెఱుగరు. - నీతిశాస్త్రము

అకారము - అనర్హ కాలము, సరికాని కాలము, విణ.(గృహ.) 1.పక్వముకానిది, 2.యుక్త కాలమునకు ముందో వెనుకనో జరుగునది (Premature), ఉదా. అకాల భోజనము, అకాల మరణము.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ. 

అవన్తికాయాం విహితావతారం 
ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్|
అకాలమృత్యోః పరిరక్షనార్థం
వన్దే మాహాకాల మహం సురేశమ్. - 3స్తో

గౌరుఁడు - చంద్రుడు.
చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా. 

నెల మేపరి - రాహువు Rahu.
సోపపవుఁడు - రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు). 

గౌరో (అ)రుణేసితే పీతే -
గౌరశబ్దము ఎఱుపు వస్తువునకును, తెలుపువస్తువు నకును, పచ్చవస్తువునకును పేరు. మఱియు, మృగవిశేషమునకును పేరు.
గూయత ఇతి గౌరః, గుఞ్ గతౌ. - పొందబడునది గాని, యెఱుఁగఁబడునదిగాని గౌరము.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 5.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.
అరుణవర్ణత్వాదరుణః - ఎఱ్ఱనికాంతి గలవాఁడు.
అరుణవర్ణత్వాదరుణా - ఎఱ్ఱవన్నెగలది. 

అవ్యక్తరాగ స్త్వరుణః -
ఇయర్తీత్యరుణః ఋ గతౌ. - మనస్సును బొందునది. ఈ ఒకటి వ్యక్తము కాని యెఱుపు పేరు.       

చంద్రకి - 1.నెమిలి, 2.కౌజు.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి. 
మయూరము - 1.నెమిలి, 2.నెమిలిజుట్టు.
మీనాతి సర్పాన్ మయూరః మీఞ్ హింసాయాం. - సర్పములను హింసించునది.  
నమిలి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.
నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
నెమ్మిలి - నెమ్మలి; నెవిలి - నెమిలి.

నెమ్మిరౌతు - కుమారస్వామి. 
నమికి - నెమిలి, రూ.నెమిలి, నమ్మి, నెమ్మిలి, నెమ్మి.
నెమ్మి - 1.ప్రేమ, 2.నెమ్మది, 3.సంతోషము, 4.క్షేమము, 5.నెమిలి, వై.వి. 1.తినాసవృక్షము, 2.బండిచక్రముకమ్మి, సం.నేమిః.

సమౌ చన్ద్రక మేచకౌ,
చంద్రకము - నెమలిపురి కన్ను.    
ఛంద్ర ఇవ చంద్రకః - చంద్రకారమై యుండునది.
మేచకము - 1.చీకటి, 2.నెమలి పురికన్ను, విణ.నల్లనిది. 
హరిత మిశ్రవర్ణత్వాత్ మేచకః - పచ్చవన్నెయు నల్లవన్నెయుఁ గలది. ఈ 2 నెమలిపురికన్ను పేర్లు.

కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదులయదలి రంధ్రము. 

మసక - 1.ఇంచుక నలుపు, 2.మునిచీకటి, సం.మేచకః.
కనుచీఁకటి - లేచీకటి, మసకచీకటి.

నేత్రశోష - (గృహ.) కన్నుమసక విటమిన్ 'A' ఆహారములో తక్కువగుట వలన కలుగు వ్యాధి (Kerophthalmia) (ఇది ఎక్కువగా ముదిరిన కన్ను గ్రుడ్డియగును)

కలధ్వని - 1.అవ్యక్త మధురధ్వని, 2.కోయిల, 3.నెమలి.

మాయురము - నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది. 

అంజనావతి - ఈశాన్య దిక్కునందలి సుప్రీతిక మను దిగ్గజముయొక్క భార్య.
అంజనగిరి సదృశత్వా దంజనవర్ణ త్వాద్వా అంజనా - అంజనపర్వత సమానమౌట వలననైనను కాటుకవన్నె గల దౌటవలన నైనను అంజన.
అంజనాకారో వర్ణో (అ)స్యా అస్తీత్యంజనావతీ - కాటుకవంటి దేహకాంతి గలది.

అంజన - 1.హనుమంతుని తల్లి, 2.పడమటి దిక్కునందలి ఏనుగు.
అంజనాకారో వర్నో (అ)స్యా అస్తీత్యంజనావతీ - కాటుకవంటి దేహకాంతి గలది. 
ఆంజనేయుఁడు - అంజనాదేవి పుత్త్రుడు, హనుమంతుడు.   

అంజని - చందన కుంకుమాదులచే అలంకరించుకొను స్త్రీ, (వృక్ష.) కటుక రోహిణి, కాలాంజని అనెడి ఓషధులు.
కటుకరోహిణి - ఒక ఓషధి, (వ్యావ.) కటకరాణి.

వానరః కేసరిసుతః సీతాశోకనివారణః,
అంజనాగర్భసంభూతో బాలార్కసదృశాననః.

అంజనకాడు - అంజనమువేసి నిక్షేపాదులను కనుగొనువాడు.

అంజనము - 1.కాటుక, 2.మంత్రగాడు నిక్షేపాదులను కనిపెట్టుటకు వాడు కాటుక, 3.సిరా, 4.పశ్చిమ దిగ్గజము, 5.ఒక పర్వతము, 6.ఒకజాతి బల్లి lizard, 7.(అలం.) వ్యంగ్యార్థమును బోధించు శబ్దవృత్తి, 8.నిప్పు.
అంజనాభత్వదంజనః - కాటుకవన్నె గలది.
అనక్తి గచ్ఛతి ప్రకాశతేవా అంజనః అంజూ వ్యక్తిశ్తక్ల కాంతిగతిషు. - లెస్సగా నడుచునదైనను ప్రకాశించునదైనను, అంజనము.
ఆంజనము - కాటుక, విణ.అంజనము నకు సంబంధించినది.
కాటుక - 1.అంజనము, 2.జొన్న ఎన్నునకు గల్గువ్యాధి.
కజ్జలము - 1.మేఘము, 2.కాటుక, 3.(రసా.) దీపాంగారము, దీపపుమసి (Camp black).
మేఘము - మబ్బు; మబ్బు - 1.మేఘము, 2.చీకటి, 3.అజ్ఞానము.  

కాటుకరాయి - సౌవీరాంజనము.

కౌఁజు - కపుఁజుపిట్ట, సం.కపింజలః.
కపింజలము - కముజు అను పిట్ట.

ఖఞ్జరీటస్తు ఖఞ్జనః,
కాటుకపిట్ట - ఖంజరీటము.
ఖం ఆకాశం అఞ్జసా ఏటతి ఖఞ్జరీటః, ఇత కిట గతౌ. - ఆకాశమును శీఘ్రముగాఁ బొందునది.
ఖంజనము - కాటుక పిట్ట.    
ఖఞ్జతీతి ఖఞ్జనః, భాద్రపదమాసాది షట్కే అదృశ్యగతిత్వాత్. ఖజి గతివైక్లబ్యే. - భాద్రపదమాసము మొద లాఱు నెలలు(6 months)కనిపించక తిరుగునది. ఈ 2 మందపిచ్చిక పేర్లు. రువ్వుపులుఁగు కౌఁజు, కాటుకపిట్ట యనియు గొందఱు.   

వర్తి - 1.వత్తి, 2.కంటికాటుక, విణ.వర్తించువాడు.
వత్తి - దీపపు వత్తి; దీపవల్లి - దీపపు వత్తి.

కొడి - 1.దీపశిఖ, 2.దీపశిఖ నుండి వెడలు పొగ, 3.వత్తి, మొ,వి. కాలినతుది భాగము, సం.కోటిః.

దశ - 1.అవస్థ, 2.వత్తి, 3.బద్దె.
దిశ - దిక్కు, దెస. (గణి.) అంతరాళములో మనము గుర్తించగల క్రిందు-మీదు, ముందు-వెనుక, కుడి-ఎడమ దిక్కు లలో నొకటి.
దిక్కు-1.శరణము, 2.దిశ, స్థానము, నెలవు.    
దెస - 1.దిశ, దిక్కు, పార్శ్వము, 2.అవస్థ, దురవస్థ, ప్రాపు, సం.1.దిశా, దశా.
అవస్థ - 1.కా లా ను సా ర స్థి తి, 2.దురవస్థ, 3.బాధ.
అవతిష్ఠతీత్యవస్థా, ష్ఠా గతినివృత్తౌ. - శరీరమునందుండునది.

బద్దె - 1.వస్త్రము మొదలు, 2.అపరకర్మము చేయునపుడు జందమువలె వేసుకొను వస్త్ర ఖండము (బద్దియ), సం.వస్తిః, పట్టికా.

అగ్గికంటి - శివుడు.
అగ్గి - నిప్పు, అగ్ని, సం.అగ్నిః.
నిప్పు - అగ్ని, అగ్నికణము, రూ.నిప్పుక.
నిప్పుకోడి - ఉష్ణపక్షి.
అంటరానివేలుపు - అగ్ని.
అగ్ని - 1.నిప్పు, 2.అగ్నిదేవుడు.
అగతె కుటిలం ఊర్థ్వం వా గచ్ఛతీ త్యగ్నిః, ఇ-పు. అగ కుటిలాయాం గతౌ. - ఊర్థ్వముగా నైనను కుటిలముగానైనను జ్వలించువాఁడు.
అగ్నిముఖుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.వేలుపు. 
అగ్గితత్తడి - అగ్నిదేవుని వాహనము, పొట్టేలు.
అగ్గిచూలి - 1.కుమారస్వామి, 2.నీరు, వ్యు.నిప్పునుండి పుట్టినది.  

దీపకము - 1.ఓమము, 2.దీపము, 3.దీమము, 4.(అలం.) సాహిత్యమున నొక అలంకారము.
దీపము - లాంతరు, రూ.దీపిక.
దీమము - 1.దీపకము, 2.వేటాడుటకై వేటకాడు పెంచు పక్షి, మృగము, రూ.దీపము.
దీవియ - దివియ, దీపికా.
దీపః ప్రదీపః,
దీప్యతే అనేన దీపః, ప్రదీపశ్చ, దీపీ దీప్తౌ. - దీనిచేఁ బ్రకాశింపఁజేయఁబడును. ఈ 2 దీపము పేర్లు. 

చము రింకిబోయినను దీ
పము శమియించిన విధంబు, పౌరుషము విహీ
నమె యగును; దైవ మనుకూ
లము గాకుండినను భూత, లమునఁ గుమారా!

తా. స్నేహము - 1.చెలిమి, 2.చమురు.)తగ్గిపోఁగా దీపమేరీతిగా, శమింౘు - క్రి.అడగు, దగ్గిపోవునో ౘమురు - రాచు, వి.నేయి, నూనె మొదలగునవి రూ.చమురు.లేని దీపవల్లి - దీపపువత్తి చరచర కాలిపోతుంది. అట్లే పౌరుషము - 1.పురుషము, 2.పురుష ప్రయత్నము, పురుషవ్యాపారము, 3.పరాక్రమము.)పురుషుని ప్రయత్నమంతయు దైవమను కూలము కాక యుండిన నశించును.
 
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.   

విభక్తి - (వ్యాక.) శబ్దముల పరస్పర సంబంధమును తెలియజేయునది.
వర్ణము - 1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము.

నేత్రము - 1.కన్ను, 2.తరిత్రాడు, 3.వలిపము.
నేత్రం చ, ణీఞ్ ప్రాపణే. - దీనిచేత అర్థములు పొందింపఁబడును.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురి కన్ను, 7.చూపు, 8.వల యందలి రంధ్రము, 9.వ్రణాదులయదలి రంధ్రము.
కను - క్రి.1.చూచు, 2.ప్రసవించు, 3.తెలియు, వి.నేత్రము. 
నేత్రపర్వము - కనులపండువు.  

నిరంజనము - 1.కాటుకలేనిది, 2.దోషములేనిది.

ఈశానుఁడు - 1.శివుడు, 2.రాజు.
ఈష్టే ఈశానః - ఐశ్వర్యముగలవాఁడు.
ఈశానము - 1.కాంతి light, 2.శివుని 5 ముఖములలో ఒకటి, 3.పదునొకండు(11)అను సంఖ్య, 4.ఆర్ద్రానక్షత్రము.
దయితుఁడు - 1.ప్రియుడు, 2.పతి.
ప్రీణాతి ప్రియః ప్రీఞ్ ప్రీణనే. - ప్రేమించువాడు.
దయిత - 1.భార్య, 2.స్త్రీ.
దయతే చిత్తమాదత్త ఇతి దయితం, దయ దానగతి రక్షణ హింసా దానేషు. - మనస్సు నాకర్షించునది.
భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.
భ్రియత ఇతి భార్యా, భృఞ్ భరణే. - భరింపఁబడునది.    

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుమణుఁడు, వ్యు.అసురలను హింస చేయువాడు.
ద్రుహిణః ద్రుహ్యతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులను హింస చేయువాఁడు. ద్రుహ జిఘాం సాయాం. ద్రుహిణ ముఖసదనే శారదా|
దుగినుఁడు - ద్రుహిణుడు, బ్రహ్మ, సం.దుహిణః.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె. 
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

రుద్రుఁడు - శివుడు.
రోదయతి శత్రూన్ రుద్రః - శత్రువులను దుఖఃపెట్టువాఁడు.
స్వయం రురో దేతివా, రుదిర్ అశ్రువిమోచనే, ఏకదా బ్రహ్మాసురోధేన ప్రాప్త జన్మ పరిగ్రహ్ణో (అ)సౌరురో దేతి పురాణప్రసిద్ధిః - ఒకానొక్కప్పుడు బ్రహ్మవలన జన్మమును బొందినవాడై దుఖించెను గనుక రుద్రుఁడు.
రుదం రోదనం ద్రావయ తీతివా - దుఃఖమును బోఁగొట్టువాఁడు, ద్రు గ్రతౌ.
రుద్రాణి - పార్వతి.
రుద్రస్య పత్నీ రుద్రాణీ - రుద్రునిభార్య.

త్రైగుణ్యము - సత్త్వరజస్తమో గుణములు. 

విభక్తత్రైవర్ణ్యం - వ్యతికరిత లీలాఞ్జన తయా
విభాతి త్వన్నేత్ర - త్రితయ మిద మీశాన దయితే, |
పునస్స్రష్టుం దేవాన్ - ద్రుహిణహరిరుద్రాను పరతాన్
రజ స్సత్వం బిభ - త్తమ ఇతి గుణానాం త్రయమివ || - 53శ్లో

తా. ఓ ఈశాన దయిత - 1.భార్య, 2.స్త్రీ.)! నీ నేత్రత్రయాలు మూడు వర్ణాలైన తెలుపు, ఎరుపుతోను మరియు అందంకోసం అర్ధవల యాకారముగా తీర్చినదైన కాటుక నల్ల రంగుతో, ఒకేసారి మూడు వర్ణాలతో ఒప్పారుతూ, మహాప్రళయకాలంలో నీలో లీనమై పోయివున్న ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింస చేయువాడు.) విష్ణు(హరి) రుద్రులను(రుద్రుఁడు- శివుడు)తిరిగి సృష్టించుట కై సత్త్వం, రజస్సు, తమస్సులనే గుణత్రయాన్ని ధరించిన వాటివలె ప్రకాశించు చున్నవి. - సౌందర్యలహరి  

అచ్యుతాగ్రజుఁడు - బలరాముడు.
అచ్యుతాగ్రజఁ అచ్యుత స్యాగ్రజో జ్యేష్ఠః - అచ్యుతునికి అన్న.
అచ్యుతుఁడు - విష్ణువు.
అచ్యుతః, నాస్తి చ్యుతం స్ఖలనం స్వపదాద్యస్యసః - తన చోటునుండి భ్రంశము నొందనివాఁడు.

దుర్భర బాణము రాఁగా
గర్భములో నుండి యభవ ! గావు మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.

తా. కృష్ణా ! వచ్చిన బాణమునకు భీతిల్లి ఉత్తర - 1.ఉత్తర ఫల్గునీ నక్షత్రము, 2.ఉత్తరదిక్కు, 3.విరటుని కూతురు.) గర్భమందుండి 'కృష్ణా కావుమని'  వేడగా, అభిమన్యుని కుమారుఁడగు ఔత్తరేయుఁడు - పరీక్షిన్మహారాజు, పరీక్షిత్తుని గాపాడితివి, నీవు అచ్త్యుతుఁడు - విష్ణువు ఆర్తత్రాణ పరాయణుఁడవు. 

ఐశ్వర్యాశ్రమ చిన్పయచిద్ఘన అచ్యుతానంద మహేశశివ|  

ఓంకారేశ్వరుడు - శివుడు.
ఓం - 1.పరబ్రహ్మార్థకము, 2.ప్రారంభార్థకము, (ఓంకారము వేదముల యొక్క సారభూతము. వేదాంతగ్రంథము లన్నియు దీనిని ప్రశంసించు చున్నవి. ఇదియే ప్రణవము (అ + ఉ + మ), మంత్రముల కెల్ల శిరోమణి. ఓంకారము నందు సమస్త జగత్తును ఇమిడి యున్నదని వేదములు చెప్పుచున్నవి). ఓంకార మమలేశ్వరమ్|

అక్షరము - 1.నాశములేనిది (జీవాత్మ, పరమాత్మ), 2.మారనిది, వి.1.ఖడ్గము, 2.అకారాది వర్ణము, 3.ఓంకారము, 4.పరబ్రహ్మము, 5.మోక్షము.

ఓంకార ప్రణవౌ సమౌ :
ఓంకారము - 1.ప్రణవము, 2.ప్రారంభము.    
అవతి భూతానీతి ఓం. అవ రక్షణే. ఓమిత్యక్షర మోంకారః - సర్వభూతములను రక్షించునది.
ప్రణవము - ఓంకారము.    
ప్రకృష్టో నవః ప్రణవః, ణు స్తుతౌ - మిక్కిలి స్తోత్రము చేయుట ప్రణవము. ప్రణూయతే ప్రస్తుయత ఇతి ప్రణవః - మిక్కిలి స్తోత్రము చేయఁబడునది. ఈ రెండు ఓంకారము పేర్లు.

ఆరావంబుదయించెఁదారకముగా నాత్మాభ్ర వీథిన్ మహా
కారోకార మకార యుక్తమగు నోంకా రాభిధానంబు, చె
న్నారున్ విశ్వమనంగఁ దన్మహిమచే, నా నాదబిందుల్ సుఖ
శ్రీరంజిల్లఁ గడంగు నీవదె సుమీ! శ్రీకాళహస్తీశ్వరా!

తా|| ఈశ్వరా! అకార ఉకార మకారములతో ఏర్పడిన ప్రణవనాదము దహరాకాశములో బుట్టినది. అది జీవులను తరింపజేయును. దాని ప్రభావము వలననే విశ్వమంతయు నడచు చున్నది. ఆ ప్రణవ నాదమే బ్రహ్మానంద స్వరూపము. ఆ బ్రహ్మానంద స్వరూపుడవు నివేకదా! "ఓమితిబ్రహ్మ" అని వేదవాక్కు. 

ఓంకారప్రియ ఉరగభూషణ హ్రీంకారాది మహేశశివ|

ఉరము - వృక్షము, రూ.ఉరస్సు, వికృ.రొమ్ము.
స్థైర్యమృచ్చత్యురః స. న. ఋ గతౌ. - స్థైర్యమును బొందునది.
ఉరస్సు - పక్షము.
పక్షము - 1.నెలయందు బదునైదు దినములు(శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

ఉరగము - 1.పాము, వ్యు.రొమ్ముతో ప్రాకునది, 2.ఆశ్లేష నక్షత్రము.
ఉరసా గచ్ఛతీత్యురగః గమ్ ఌ గతౌ. - ఉరస్సు చేత సంచరించునది.

రొమ్ము - పక్షము, రూ.ఱొమ్ము, సం.ఉరస్.
అక్కు - 1.ఱొమ్ము, 2.గుండె.
హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.)గుండెకాయ, గుండె (Heart).

స్వజాతే త్వౌర సారస్యా -
ఔరసుఁడు - ధర్మపత్ని యందు బుట్టిన కొడుకు. 
ఉరసా నిర్మితః ఔరస్యశ్చ - తనయు(ఉ)రస్సుచేత పుట్టినవాఁడు. 
స్వజాతే అను పదముచేత దత్తక్షేత్రజాది నిరాసము. ఈ 2 రెండు సవర్ణస్త్రీయందు తనవలనఁ బుట్టిన కొడుకు పేర్లు.

పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్దుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, సౌవర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతిరేతుడు).

అంతకుఁడు - యముడు.
అంతం నాశం కరోతీత్యంతకః, డు కృఞ్ కరణే. - నాశమును జేయువాఁడు.
అంతము - 1.తుద, 2.చావు, 3.స్వభావము, విణ.1.సమీపము, 2.రమ్యము.
అంత్యతేబధ్యతే (అ)త్ర అంతః, అతి అదిబంధనే. - దీనియందు పాశబద్ధుఁడౌను.
తుద - చివర, కడ, అంతము, రూ.తుది. 
తుదితాకు - క్రి.నెరవేరు. 
తుదిముట్టు - క్రి.1.చచ్చు, 2.నెరవేరు.
తుదిరేయి - 1.కల్పాంతము, 2.చివరిరాత్రి.
కల్పస్య సృష్టే రంతః కల్పాంతః - కల్పము యొక్క అంతము(ప్రళయకాలము).  

నెఱయు - క్రి.నిండు, 2.నెరవేరు, 3.వ్యాపించు.
నెఱపు - క్రి.1.నిండించు, 2.పరచు, 3.నెరవేర్చు, 4.వ్యాపింపజేయు, వి.వ్యాపనము, విణ.అధికము, రూ.నెరపు.
నెఱపు - క్రి.నిండించు, 2.నెరవేరచేయు.

మును - 1.పూర్వకాలము, 2.ఆరంభము, 3.అంతము.

కడ - 1.దిక్కు, 2.పార్శ్వము, 3.అంతము, 4.సమీపము, 5.స్థానము, సం.కాష్ఠా.
కాష్ఠా - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశంతే ప్రకాశంత ఇతి కాష్ఠాః, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. 

అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా -
అష్టాదశ నిమేషాః కాష్ఠేత్యుచ్యతే - పదునెనిమిది 18 ఱెప్పపాట్ల కాలము కాష్ఠ యనంబడును.
కాశతే కాష్ఠా, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. 18(Seconds) నిమేషములకాలము ఒకటి కాష్ఠ.

కడౘుక్క - రేవతీ నక్షత్రము.
ౘుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
ౘుక్కయెదురు - 1.శుక్రనక్షత్ర మెదురుగ నుండుట, 2.అశుభమును కల్గించునది, వి.ప్రాతికూల్యము.

ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ|

రేవతీపతి - బలరాముడు.
రేవతీరమణః, రేవత్యారమణః పతిః - రేవతిదేవికి భర్త.
రేవతి - 1.ఇరువది ఏడవ నక్షత్రము (27వ), 2.బలరాముని భార్య.

చంద్రశేఖరుఁడు - 1.శివుడు, 2.నెలతాలుపు.
చంద్రశేఖరః, ఛంద్ర శేఖరఃశిరోభూషణం యస్య - చంద్రుడు శిరోభూషణముగాఁ గలవాడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.

చంద్రుడు - నెల, మాసము.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు). మాష పరిమాణము.
పున్నమ - పూర్ణిమ, సం. పూర్ణిమా, ప్రా. పుణ్ణమా. 

నెలచూలి - బుధుడు Mercury, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.

నెలమేపరి - రాహువు Rahu.
రహతి భుక్త్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః. ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు.
రాహువు - ఒక చాయాగ్రహము, దలగాము.(Shadowy Planet)

ఖండ పరశువు - 1.శివుడు, 2.పరశురాముడు.
ఖండపరశుః ఉ-పు. ఖణ్డయతీతి ఖణ్డః ఖణ్డః పరశుర్యస్య సః ఖణ్డపరశుః - ఖండించెడు గండ్రగొడ్డలి గలవాఁడు. ఖండపర్శుః అని రూపాంతరము.
ఖండ భేదనే. ఖండః ఖండితః పరశురిత్యసురో నేనేతివా - పరశు వనెడు రాక్షసుఁడు ఇతనిచే ఖండింపఁబడెను. 
కదాచిత్ఖండితో స్య పరశురితి వా - ఒకానొకప్పుడు ఈయన పరశువు(గండ్ర గొడ్డలి) ఖండిత మాయెను.

కలిలము - 1.చొరరానిది, 2.ఎరుగరానిది, వి.గండ్రగొడ్డలి, రూ.కలలము.

ద్వయోః కుఠార స్స్వధితిః పరశుశ్చ పరశ్వథః,
కుఠారము - గొడ్డలి. 
కుఠాన్ వృక్షాన్ ఇయర్తీతి కుఠార ప్స. ఋ గతౌ. - వృక్షములఁ బొందునది.
గొడ్దలి - చెట్లునరకు సాధనము, కుఠారము (వ్యవ.) పెద్దచెట్లను వానిశాఖలను నరకుట కుపయోగించు ఇనుప పనిముట్టు, సం.కుఠారః.
స్వకీయము - తనది, రూ.స్వకము. (వ్యతి.పరకీయము).
స్వం స్వకీయం ధియతి బిభర్తీతి స్వధితిః. ఈ. పు. దిధరణే. - స్వకీయమైనవారిని బోషించునది
స్వము - 1.ధనము, 2.తాను, తనది.
పరశువు - గండ్ర గొడ్దలి.
పరాన్ శృణాతీతి పరశుః. ఉ. పు. శౄ హింసాయాం. - శత్రువులను హింసించునది.
పరశ్వధము - గండ్రగొడ్దలి, రూ.పరస్వధము.  
పరాన్ శ్యతీతి పరశ్వథః శో తనూకరణే. - పరులను క్షయింపఁజేయునది. ఈ 4 గండ్రగొడ్డలి పేర్లు.

సుధన్యా ఖణ్ణ పరుశుః దారుణో ద్రవిణః ప్రదః,     
దివిద్పృక్ సర్వ దృగ్వ్యసో వాచస్పతి రయోనిజః|
- 61స్తో

ద్రూఘణము - 1.గండ్రగొడ్దలి, 2.ఇనుపగుదియ, రూ.ద్రుఘణము.    

చిప్పగొడ్డలి - చెట్లునరకు గొడ్డలి. 

గంధర్వో హ్యదితి స్తార్ క్ష్య స్సువిజ్ఞేయ స్సుశారదః,
పరశ్వథాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః|

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత చారువామకళేబరమ్
క్ష్వేనీలగళం పరశ్వథధారణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| - 4

క్షత్రియరుధిరమయే జగదపగతపాపమ్,
స్నపయసి పయసి శమితభవతాపమ్|
కేశవ! ధృత భృగుపతిరూప! జయ జగధీశ! హరే!| - 6

పరశురాముడు - జమదగ్ని మహర్షికిని రేణుకకును పుట్టినవాడు.    

అథ ద్విజా,
హరేణూ రేణుకా కౌన్తీ కపిలా భస్మగన్ధినీ,
ద్విజము - 1.పక్షి, 2.పాము, 3.దంతము, 4.చేప, రూ.ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది.
ద్విర్ణాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.
హరతి రోగాన్ హరేనూ, సీ. హృఞ్ హరణే. - రోగములు హరించునది.  
రేణుక - 1.గంధ ద్రవ్యము, 2.జమదగ్ని భార్య.
రేణు యోగాద్రేణుకా - ధూళి(ధూళి - దుమ్ము)గలది.
కుంత్యై దుర్వాసనా దత్తా కౌంతీ, సీ. - కుంతికొఱకు దుర్వాసునిచే నియ్యబడినది.
కపిల - 1.అగ్నేయదిశ యందలి ఆడేనుగు, 2.పుల్లావు.
కపిలవర్ణత్వాత్కపిలా - కపిలవర్ణము గలది. 
కపిశము - పసుపు మించిన ఎరుపు.
భస్మ గంధయతి భస్మగంధినీ. సీ. గంధ అర్దనే. - ధూళిచేఁ బీడించునది. ఈ 5 రేణుక యనుగంధద్రవ్యము పేళ్ళు. తక్కోలము.

నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
క్షితిపతివంశ క్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూ ర్తే
భృగుకులరామ పరేశ నమో భక్తం తే పరిపాలయ మామ్| - 6

శుక్రో దైత్యగురుః కావ్య ఉశనా భార్గవః కవిః,
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
శుక్లవర్ణత్వా చ్ఛుక్రః - శ్వేతవర్ణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేణ నిర్యాతత్వా శుక్రః - రుద్రునిరేతస్సు వలనఁ బుట్టినవాఁడు.
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రాదానే - దేవతలకు దుఃఖము నిచ్చువాఁడు.

కావ్యుఁడు - శుక్రుడు Venus.
కవే రపత్యం కావ్యః - కవి యను ఋషికొడుకు.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలొ నొకటి (Venus). 

ఉశనుఁడు-  శుక్రుడు Venus, రూ.ఉశనసుడు.
వష్తి ఇచ్ఛతి దైత్యశ్రేయ ఇత్యుశనాః, స. పు. వరకాంతౌ. - అసురులశ్రేయస్సు నిచ్ఛయించువాఁడు.

భార్గవుడు - 1.శుక్రుడు, 2.పరశురాముడు.
భృగోరపత్యం భార్గవః - భృగు సంతతియందుఁ బుట్టినవాఁడు. భార్గవదర్ప వినాశక రామ్|
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
శుక్రవారము - భృ గు వా ర ము, వారములలో నొక దినము Friday.
భార్గవి - 1.లక్ష్మి, 2.పార్వతి. 
భృగోరియం భార్గవీ - భృగుసంబంధమైనది.

న కశ్చిన్నాపనయతే పుమానవ్యత్ర భార్గవాత్|
శేషసంప్రతిపత్తిస్తు బుద్ధిమత్స్వేవ తిష్ఠతి ||

భా|| శుక్రాచార్యుడు తప్ప ఇంకెవరూ తప్పు చేయరని ఎక్కడా లేదు. అందరూ ఎపుడో ఒకప్పుడు తప్పు చేస్తాం. కాని మిగిలిన పనిని గురించి మంచి చెడు విచారణ మాత్రం తెలివైన వారే చేస్తారు. (పొరబాటు పడినతరువాత సరిదిద్దుకుంటారు).

భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదా స్థితా,
వ్యోమకేశాఖిల ప్రాణా పంచకోశవిలక్షణా|
    

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్పురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || – 6

పదునాఱవదియైన(16వ) భార్గవ రామాకృతి నిఁ గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహులయిన రాజుల నిరువది యొక్కమాఱు వధియించి భూమి నిఃక్షత్రంబుఁ గావించె; పదహారోమారు పరశురాముని రూపమును ధరించినవాడై రౌద్రకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను, ఇరవై ఒక్కమారు సంహరించి భూమిని క్షత్రియశూన్యం కావించాడు.

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోద్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.    

ఇరువదియొక్కమాఱు ధరణీశులనెల్ల వధించి తత్క ళే
బర రుధిర ప్రవాహమున భైఁ తృకతర్పణ మొప్పఁజేసి భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామ మూర్తివై
ధరణినొసంగితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.

తా. రామా! రాజులనందఱిని ఇరువదియొక్క పర్యాయములు చంపి, వారి దేహముల నెత్తుటి వెల్లువలచేత పితరులకు జలతర్పణమిచ్చి వారి యొద్దనుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహమునకు సంతోషము(ముదము - సంతోషము) కలుగునట్లు దానము చేసిన పరశురాముఁడవు నీవేయగుదువు. 

భద్రమూర్తి ర్భద్రగుణో భార్గవో భక్తపాలనః,
భగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః|

కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు Venus, 3.వాల్మీకి, 4.నీటి కాకి.   
కవయతి చాతుర్యేణ వర్ణయతీతి కవిః. ఇ-పు. - చాతుర్యముచేత వర్ణించువాఁడు.     

కృతికర్త - గ్రంథము రచించినవాడు, కవి. 
కృతి - 1.ప్రబంధము, సప్తసంతానములలో ఒకటి, 2.చదువరి, విణ.నేర్పరి.
కృతం జ్ఞాన మనేన కృతీ. న. పు. జ్ఞానము వీనిచేతఁ జేయఁబడును.
ౘదువరి - విద్వాంసుడు.
విద్వాంసుఁడు -  - చదువరి, విణ.ఎరుకగలవాడు.

ప్రబంధము - కావ్యము.
కావ్యము -  కవికృత గ్రంథము, కవి కల్పితమైనది, గద్యకావ్యము, పద్యకావ్యము, మిశ్రకావ్యము (చంపువు).

కావ్యగుణములు - (అలం.) శ్లేష్మము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

కవిలె - గంటముతో వ్రాసిన తాటాకుల లెక్క పుస్తకము, గ్రంథము.
గ్రంథము - 1.కావ్యము, పుస్తకము, 2.ధనము, 3.ముప్పది రెండక్షరముల శ్లోకము.
కితాబు - 1.బిరుదు, 2.పుస్తకము.
బిరుదము - సామర్థ్య చిహ్నము, బిరుదు, శౌర్యచిహ్నము, పట్టము.

పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి. 
ఐందవి - పల్కుజెలి, సరస్వతి.  
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.
చెలిచుక్క - అనూరాధ.

గ్రంథము - 1.కావ్యము, పుస్తకము, 2.ధనము, 3.ముప్పది రెండక్షరముల శ్లోకము.
పుస్తకము - పొత్తము. 
పొత్తువు - సరస్వతి, సం.పుస్తకమ్.
నెలగ - ధనము.  
విడిముడి - ధనము, (విడియు + ముడి).
ధనము - 1.విత్తము, 2.ఆలమంద వి.(గణి.) అంకగణిత సంజ్ఞ (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోషపెట్టునది, 'ధన ధన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.
ధనాత్మకము - (గణి.) శూన్యము కన్న పెద్దదైనది (Positive).

పైకము - ధనము, సం.వి.కోకిల గుంపు.      

భోగము - 1.సుఖము, సంతోషము, 2.పాముపడగ, 3.ధనము, 4.వేశ్యాదుల కిచ్చెడు వెల, (భోగములు ఎనిమిది; గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము).

కృతిపతి - గ్రంథమును అంకిత మందినవాడు.

కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణము నందు షట్కాండములు గలవు), 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు. 

వేళ - సమయము, కాలము.
సమ్యగయతే సమయః, అయగతౌ - లెస్సగా నెఱుఁగఁబడునది. 
సమయము - 1.కాలము, 2.ఆచారము, 3.ప్రతిజ్ఞ, ఒట్టు. 

పుస్తకేషుచ యావిద్యా పరహస్తే చ యద్ధనమ్|
సమయేతు పరిప్రాప్తేన సావిద్యా నతద్ధనమ్||

తా. పుస్తకములోని విద్య - 1.చదువు, 2.జ్ఞానము.), పరులకిచ్చిన ధనము, ఇవి సమయమున కుపయోగింపవు. - నీతిశాస్త్రము

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

కాశ్యపి - భూమి, వ్యు.పరశురాముచే కశ్యపునకు యజ్ఞదక్షిణగా నీయబడినది.
కాశ్యపస్యేయం కాశ్యపీ, ఈ.సీ. - పరశురాముచేత కశ్యపునికొఱకు యజ్ఞ దక్షిణగా నియ్యబడినది.
తథాచోక్తం._ 'శ్లో. త్రిసప్తకృత్య్వః పృధివీం కృత్వానిః క్షత్రియాం తతః, దక్షిణా మశ్వమేధాంతే కశ్యపాయాదదాత్ప్రభు' రితి.

కశ్యపస్య అపత్యం కాశ్యపిః. ఈ. పు. - కశ్యప ప్రజాపతి కొడుకు. 

ప్రణుతి సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషన శాంతి సమాకృత హాస్యముఖే|
నవనిధి దాయిని కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయమాం|| - 7

రాముఁడు - 1.రఘురాముడు, 2.బలరాముడు, 3.పరశురాముడు.
రామః రమయతి మోదయతి రూపసంపదేతి రామః - రూపసంపద చేత సంతోషింపఁ జేయువాఁడు. రము క్రీడాయాం.  

మహారాజులు - వీరు పదునార్గురు :- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

ఏకపత్నీవ్రతుఁడు - త్రికరణశుద్ధిగా ఒకే భార్య యను వ్రతము గలిగినవాడు.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.    

ఈ జగమందుఁదామనుజుఁ దెంత మహాత్మకు డైన దైవమా
తేజముతప్పఁజూచునెడ ద్రిమ్మరుకోల్పడు నెట్లన న్మహా
రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులన్
భోజనమై తగన్వనికిఁబోయి చరింపఁడె మున్ను, భాస్కరా.
తా.
పూర్వము మహా రాజ కుమారుడైన రామచంద్రుడు కాలినడకతో అడవి కేగి, కాయలు, ఆకులు అహారముగా గైకొని ఆ యడవి యందు సంచరించెను. అట్లే మనుష్యు డెంతగొప్ప మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)వాడైనను, దైవానుగ్రము లేనిచో తన గొప్పతనము బోగొట్టుకొని దేశసంచారియై ప్రవర్తించును.

పదునెనిమిదవ(18వ)దైన రామాభిధానంబున దేవకార్యర్థంబు రాజత్వంబునొంది సముద్ర నిగ్రహాది పరాక్రమంబు లాచరించె; పద్దెనిమిదో
18వ పర్యాయం "శ్రీరాము" డై సముద్ర బంధనాది వీరకృత్యాలాచరించి దేవకార్యం నిర్వరించటం కోసం తాను రాజైనాడు.

మహారాజులు - వీరు పదునార్గురు :- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

తిరు - శ్రీప్రదము, పూజ్యమైన సం.శ్రీః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః, ఈసీ, శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది, శ్రీఞ్ సేవాయాం.  

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

రామరాజ్యము - రాముని రాజ్యము సుఖమైన రాజ్యమని వాడుక యందలి యర్థము.

రామాయణము - రఘువంశీయుడైన శ్రీరామచంద్రుని కథను తెల్పు పుణ్యకావ్యము. (శ్రీరామచంద్రుని భగవ దవతారముగ హిందువులు భావించుచుందురు. వాల్మీకి మహర్షిచే రచింప బడిన ఈ గ్రంథము క్రీ. పూ. 2530-1950 ప్రాంతములలో రచింపబడినదిగా చరిత్రకారులు భావించు చున్నారు. రామాయణము వలన మనకు ఆర్యులు మొదటిసారిగా వైదిక ధర్మమును, సంస్కృతిని దక్షిణాపథమున వ్యాపింప జేసినట్లు తెలియు చున్నది.)

రాముఁడు ఘోరపాతక విరాముడు సద్గుణ కల్పవల్లి కా
రాముడు షడ్వికారజయరాముఁడు సాధుజనా వన వ్రతో
ద్దాముడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగుగెం
దామరలే భజించెదను దాశరథీ కరుణా పయోనిధీ.

తా. సకల జనులను రమింపఁజేయువా డును, ఘోరమయినపాపము లను తొలగించువాఁడును, కళ్యాణగుణములను అవ్వారిగాఁగలవాఁడును, వికారరహితుఁడై ప్రకాశించువాఁడును, సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.)జనులను రక్షించునట్టివాఁడును రాముఁడే మాకు పరమదైవమని మీ (కెందమ్మి - (కెంపు+తమ్మి)వంటి పాదారవిందములను కొలిచెదను.

రామరాజ్యంబు నిప్పుడు రా ముదంబె
యౌర! యే మొ సుగ్రీవాజ్ఞ సారమౌనె
యాంజనేయునిభక్తి భాగ్యంబె సీత
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!  

కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము (రామాయణమునందు షట్కాండములు గలవు) 2.సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.
చిత్తు-1.జ్ఞానము, 2.వి.మొదట వ్రాసిన వ్రాత.     
విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
ౘదువు - క్రి.పఠించు, వి.1.పఠనము, 2.విద్య, 3.వేదము. 
ఉత్స్వేదనము - (వృక్ష.) ఆకుల నుండికాని, కాండము నుండి కాని నీరు ఆవిరిరూపమున బయటికిపోవుట (Transpiration).

ఆశ్వాసము - 1.గ్రంధభాగము, 2.ఊరడించుట, 3.బతిమిలాడుట.  

భార్యావియోగశ్చ జనాపవాదః ఋణస్య శేషః కుజ సస్యసేవా |
దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ, వినాగ్ని మా పంచ దహంతి కాయమ్ ||

తా. భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది.)వియోగమును, జనులచే అపవాదము-1.నింద, దూరు, 2.ఆజ్ఞ. ఋణశేషమును, కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, అంగారకుడు (Mars)యొద్ద కొలువును, దారిద్ర్యము - బీదతనము, లేమి.)కాలమందు స్నేహితులు వచ్చుటయు; నీయైదును కాయము - 1.మేను, శరీరము, 2.స్వభావము.)నిప్పులేకయే దహించును. - నీతిశాస్త్రము 

దశరథ రాజకుమార దానవమదసంహార నారాయణ|

రమ్యగుణధామ రంజిత రామనామ
శక్తిహితకామ పోషిత సర్వసామ
కామ్యపరిణామ బుద్ధివికాస సోమ
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ!

శ్రీరామో రామభద్రశ్చ రామచన్ద్రశ్చ శాశ్వతః,
రాజీవలోచనః శ్రీమాన్ రాజేన్ద్రో రఘుపుజ్గవః.

రామదాసు - ఒకపిట్ట, కంచెర్ల గోపన్న.
రామ - స్త్రీ, వ్యు.గీతకళాదుల నేర్పి రమించునది.
లేమ - స్త్రీ, సం.రామా.

రామః రమయతి మోదయతి రూపసంపదేతి రామః - రూపసంపద చేత సంతోషింపఁ జేయువాఁడు. రము క్రీడాయాం.

బలే రామో నీల చారు సితే త్రిషు,
రామశబ్దము బలభద్రునికి పేరైనపుడు పు. నల్లనిదానికిని, అందమైన దానికిని, తెల్లనిదానికిని పేరైనపుడు త్రి. రమయతీతి రామః. రము క్రీడాయాం, రమింపఁజేయు(నది) వాఁడు. 

'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా' కవాటమై
డీకొని ప్రోచునిక్కమని ధీయుతులెన్నఁ దదీయ వర్ణముల్
గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక వివత్పరం వరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణా పయోనిధీ.
తా.
"రా" అను (రామ)అనెడి దివ్యనామములోని రేఫము పాపముల నన్నిటిని బయటికి తఱుమగా,  "మా" అను అక్షరము కవాటము - 1.తలుపు, 2.(భౌతి.) ఒకవైపునకు పోయిన వాయు పదార్థము లను గాని, ద్రవ పదార్థములనుగాని, వెనుకకు రాకుండ అడ్డు కొనుచు ఒక వైపునకు తెరచుకొనియుండు తలుపు (Valve)తలుపులు వలె అడ్దుపడి వానిని ఎదిరించి లోపలికి రాకుండునట్లు చేసి ఆశ్రితులను కాపాడును. ఇది నిజమని జ్ఞానవంతులు చెప్పగా మూఢులా యక్షరము లను గ్రహించి జపింప నేరకున్నారు. అట్లుకాక, లోకులు వానిని జపింపరేని యెడతెగక వచ్చు ఆపదలు వారికి కలుగవు.       

రామాయన చపలాక్షులపేరు
కామాదుల పోరువారు వీరు
రామాయన బ్రహ్మమునకుఁ బేరు
ఆ మానవ జననార్తులు దీఱు ||తెలిసి||

కుశుఁడు - శ్రీరామ చంద్రుని జ్యేష్టపుత్రుడు.  స్వతనయ కుశలవ పండిత రామ్|

అతిథి - 1.భోజన సమయమునకు వచ్చు పరదేశి, 2.ఆహుతుడు, 3.కుశుని కొడుకు.

వితరసి దిక్షు రణే దిక్పతికమనీయమ్, దశముఖమౌళిబలిం రమణీయమ్|
కేశవ! ధృత రఘుపతివేష! జయ జగదీశ! హరే! || - 7

కామపాలుఁడు - బలరాముడు, బలదేవుడు.
కామపాలః, భకత కామాన్సాలయతీతి కామలాపః - భక్తుల కోరికలను దీర్చువాఁడు.
కామం స్మరం పాలయతి ఆత్మజత్వాత్కామపాలః - కొమరుఁ డగుట వలన మన్మథుని బాలించువాడు.

కామము - 1.కోరిక, 2.మోహము, 3.రేతస్సు.

కామారి - ముక్కంటి, శివుడు.
కాముఁడు - మరుడు, మన్మథుడు.
కామః కామ్యతే అనేన కామః - వీనిచేత కోరఁభడును.
కామదేవుఁడు - వలపురాయుడు, మన్మథుడు. కమనుఁడు - కాముకుడు, వి.మన్మథుడు.

కామ - 1.తామర మొ.ని కాడ, 2.గొడుగు మొ.ని దండము, 3.మగగురి, 4.చనుమొన.

కారుణ్యామృతవారిరాశి మనిశం కేయూరహారై ర్వృతాం
కామారేస్సహజాం కరాబ్జవిలస - త్కీరాం కుబేరార్చితాం-
కామక్రోధముఖారివర్గశమనీం కైవల్యసంప్రదాం
కంజోద్భూతమనఃప్రియాం హృది భజే భక్త్యా సదా శారదామ్| - 4 

శార్ఙి - విష్ణువు, వ్యు.శార్ఙ్గము కలవాడు.  
శృఙ్గస్య వికారః శార్ఙ్గీం ధనుః తదస్యాస్తీతి శార్ఙ్గీ మనెడి విల్లు గలవాఁడు.
శార్జము - విష్ణువు విల్లు, విల్లు, వ్యు.శృంగముతో జేయబడినది.
సింగాణి - 1.కొమ్ములతోచేసిన విల్లు, 2.విల్లు, రూ.సింగిణి, సం.శార్జ్గమ్, శృంగిణీ.

శృంగము - 1.కొమ్ము, 2.కొండ కొమ్ము, 3.చిమ్మనగ్రోవి, 4.ఊదుకొమ్ము, 5.దొరతనము.
శృణాని హినస్తీతి శృంగం. శౄ హింసాయాం. - హింసించునది.

శృంగిణి - ఆవు.
శృంగయోగాత్ శృంగిణీ. ఈ. సీ.- కొమ్ములు గలది.
శృంగము క్తత్వాత్ శృఙ్గీ. సీ. - కొమ్ములు గలది.
ఆవు - గోవు. ప్రద్యుమ్నే శృంగాళాదేవి శక్తిపీఠం| 
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

శృఙ్గీతు వృషభో వృషః -
శృంగాకారావయవత్వాత్ శృంగీ, న.పు. అత ఏవ వృషభసామ్యాద్వృషభః. పా. ఋషభః - వృషశ్చ కొమ్మువంటి వయములు గలదిగనుక శృంగి.
వృషభమువలె నుండునది, గనుక వృషభము, ఋషభము, వృషమును. ఈ 3 వృషభ మహౌషధము పేర్లు.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము, (Property).

జనార్ధనుఁడు - విష్ణువు.
జనార్థనః సముద్రమధ్యవరినో జననామ్నో సురా నర్దితవానితి జనార్థనః - సముద్రమధ్యమం దుండెడు జనులనెడు నసురులఁ(అసురులను)బీడించువాఁడు.
ప్రళయకాలే స్సర్వానపి అరయతీతి వా జనార్దనః - ప్రళయకాలమం దెల్ల జనులను బీడించువాడు. అర్దపీడనే. దశమం తు జనార్ధనమ్|

అర్జునకుఁడు - 1.బోయ, 2.తెల్లనివాడు.

అర్జుని - 1.ఆవు, 2.ఒకజాతి పాము, 3.బహుదానది, 4.కుంటెన కత్తె, 5.బాణాసురుని కూతురు.
ప్రాయేణ ద్వళత్వా (ద)అర్జునీ. ఈ.సీ. - తఱచుగా తెల్లనై యుండునది.

అఘ్న్య - ఆవు, విణ.చంపదగనిది.
నహన్యత ఇత్యఘ్నా. హన హింసాగత్యోః. - హింసింపఁ బడునది.  

తూరుపుఁఱేడు - ఇంద్రుడు.
తూరుపు - సూరు డుదయించు దిక్కు, ప్రాగ్దిశ, రూ.తూర్పు East.

తూరుపుఁవానలు - (వ్యవ.) ఈశాన్య వర్ష వాయువుచే వచ్చు వానలు (Eastern rains).     

తొలుగట్టు - ఉదయాద్రి; తూరుపుఁకొండ - ఉదయాద్రి.
ఉదయము - 1.పుట్టుక, 2.వృద్ధి, 3.పొడుపుకొండ, 4.సృష్టి, 5.ఫలసిద్ధి, 6.వడ్డి, 7.ప్రాతఃకాలము.
ఉదయించు - 1.పుట్టు, కలుగు, 2.సూర్యచంద్రాదులు పొడుచు.
పుట్టుక - సంభవించుట, జన్మించుట.    

ఉదయః పూర్వపర్వతః,
ఉత్యన్ని స్సూర్యాదయ అస్మాత్ ఉదయః, ఇణ్ గతౌ. - దీనియందు సూర్యాదులు ఉదయింతురు.
పూర్వాశ్చాసౌ పర్వతశ్చ పూర్వపర్వతః - తూర్పు దిక్కున నుండెడు పర్వతము. ఈ 2 ఉదయపర్వతము పేర్లు.

ఉద్భవము - 1.పుట్టుక, 2.జన్మకారణము, విణ.పుట్టినది.
ఉద్భవించు - క్రి.జనించు, పుట్టు.

ఉత్పన్నము - 1.పుట్టినది, 2.ఒనగూడినది.
ఉపపన్నము - 1.పుట్టినది, 2.పొందబడినది, 3.యుక్తయుకతము, 4.తగినది.

ఉపపత్తి - 1.కలిమి, 2.పుట్టుక, 3.కారణము, 4.(గణి.) ఒక సిద్ధాంతమును స్థాపించుటకు లేదా రుజువు చేయుటకు కల్పించబడు సబబు.    
కలిమి - 1.అతిశయము, 2.సంపద.
అతిశయము - అధిక్యము.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

తనకలిమి యింద్రభోగము
తనదుఃఖమె సర్వలోక దారిద్యంబౌఁ
దనచావు జలప్రళయము
తనువలచిన యదియె రంభ తధ్యము సుమతీ!

తా|| తన(తన - ఆత్మార్థకము)ఐశ్వర్యమే దేవేంద్ర పదవిగాను, తనదుఃఖము - బాధ, చింత సర్వలోక దారిద్ర్యముగాను, తనమృతి - చావు యుగ ప్రళయముగాను, తను వలచిన(అది - ఆ వస్తువు, ఆమె.)స్త్రీ రంభ - 1.ఒకానొక అచ్చర, 2.అరటి చెట్టు.)గానుతోచుట తధ్యము. 

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ. 

అరుణోదయము - సూర్యోదయమునకు ముందు నాలుగు గడియలకాలము, వేకువజాము.

ప్రత్యూషము - వేగుజాము.
ప్రత్యూషతి నిశాం ప్రత్యూషః, ఊష రుజాయాం - రాత్రిని బోఁగొట్టునది.
పా, ప్రత్యుషః, అ. పు. ఓషత్యంధకారమితి ప్రత్యుషః - చీఁకటిని బోఁగొట్టునది.
తథాచ ప్రయోగః_ 'ప్రత్యుషః పారిజాత ' ఇతి సూర్యశతకే.
అహర్ముఖము - వేకువ, ప్రాతఃకాలము, ప్రభాతము.
అహ్నః ముఖమారంభః అహర్ముఖం - అహస్సుయొక్క ప్రారంభము.
కల్యము - 1.వేకువ, 2.ఉపాయము.
కల్యంతే ప్రతిబుధ్యంతే (అ)త్ర కల్యం, కలగతౌ. - ఇందు జనులు ప్రబోధింపఁబడుదురు.
కలయతి మంగళంకల్యం, కలశబ్ద సంఖ్యానయోః - శుభమును జేయునది. పా, కాలే సాధు కాల్యమితి వా - కాలమందు యోగ్యమైనది.
కల్యవ ఠ్తము - ప్రాతఃకాల భోజనము.
స్త్రీఘోషము - వేకువ; వేకువ - వేగుజాము.
వ్యుష్టము - వేగుజాము. 

విశ్వకేతువు - అనిరుద్దుడు, వ్యు. పెక్కు ధ్వజములు కలవాడు.
విశ్వకేతుః-అనుపాఠమునందు - విశ్వవ్యాపీకేతు ర్ద్యుతిర్యస్యసః - విశ్వవ్యాపకమైన తేజస్సు గలవాఁడు, మన్మథుడు.
అనురుద్ధ ఉషాపతిః,
అనిరుద్దుఁడు - 1.అడ్డగింప బడనివాడు, 2.లొంగనివాడు, వి.1.గూఢచారుడు, 2.ప్రద్యుమ్నుని కొడుకు, 3.విష్ణువు, 4.శివుడు.
అనిరుద్ధః న నిరుద్ధ్యతే పరైరిత్యనిరుద్ధః – పరుల చేత నడ్డగింపబడనివాఁడు. రుధిర్ ఆవరణే.
ఉషాపతిః, ఇ - పు, ఉషా బాణసుతా, తస్యాః పతిః - బాణాసురుని కూఁతురైన ఉషకు మగఁడు. ఈ 2 అనిరుద్ధుని పేర్లు.

ఉష - 1.రేయి, 2.రాత్రివిశేషము, 3.బాణాసురుని కూతురు.

ఉషా రాత్రే రవసానే -
ఉషా - ఇది ప్రాతఃకాలమందును, ఉ, 'ఉషా జనాః ప్రతి బుధ్యంతే', 'ఉషా తమో వాయు రుపైతి మందం' పా, ఉషః, 'ఉషా స్యా ద్రజనీశేషే ఉష ఇత్యపి దృశ్యతే' అని రభసుడు.

ఉషర్భుధుఁడు - 1.అగ్ని, 2.బిడ్డడు, వ్యు.ప్రభాతకాలమున మేలుకొని యుండువాడు.
ఉషసి ప్రభాతే బుధ్యతే జ్వలతే త్యుషద్బుధః, బుధ అవగమనే - ప్రభాతకాలమునందు జ్వలించువాఁడు.

ఉషస్సు -  సం.వి. తెల్లవారుటకు ముందు నాలుగైదు గడియల కాలము(24 నిమిషముల కాలము), ప్రత్యూషము, వేకువ.
ఔషసి - వేకువ, ఉషఃకాలము.
ఓషతి అర్కకరై రిత్యుషః ప్రత్యుషశ్చ, స. న. ఉషదాహే - సూర్యకిరణములచేత దహింపఁజేయునది, వ్రతిరుపసర్గాంతర వ్యావర్తకః.
విభాతము - ప్రభాతము, వేకువ.
ప్రభాతము - వరువాత, వేగుజాము.
భాతం ప్రవృత్తం ప్రభాతం, భా దీప్తౌ - ప్రకాశింపఁ బ్రవర్తించునది. 
వరువాత - ప్రాతఃకాలము, సం.ప్రాతః. 
రేపకడ - ప్రాతఃకాలము.

శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
కృష్ణవర్ణత్వాత్ శ్యామా - నల్లనిది.

ఉషశ్శశ సగార్గ స్తు శకునంతు బృహస్పతిః|
మనో జయంతు మాండవ్యో బుధ వాక్యో జనార్దనః||

తా. ఏ కార్యమున కైనను పోవుటకు ఉషఃకాలము మంచిదని గార్గ్య ముని చెప్పెను. శకునము - 1.శుభసూచక నిమిత్తము, 2.పక్షి.)చూచుకొని పోవలయునని బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు Jupiter చెప్పెను. ఎపుడు బయలు దేరిన కార్యము సఫల మగునని నిస్సంశయముగ - సందేహము లేనిది(లేకుండా)మనస్సున తోచునో, అపుడు పోవలయునని మాండవ్యముని చెప్పెను. పెద్దలు బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు. చెప్పినట్లు పోవుట శ్రేష్ఠమని జనార్థనుఁడు - విష్ణువు చెప్పెను. - నీతిశాస్త్రము

అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః|
అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మితవిక్రమః.

మువ్వనెకాఁడు - సూర్యుడు Sun.
వన్నియ - కాంతి, రంగు, ప్రసిద్ధి, మేలిమి, రూ.వన్నె, సం.వర్ణః.
వర్ణము - 1.అక్షరము, 2.రూపము, 3.రంగు, 4.బంగారు, 5.పూత, 6.జాతి, 7.నాలుగు వర్ణములు, బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్ర జాతులు, 8.కులము. 
మువ్వనెవిల్లు - ఇంద్రధనుస్సు.
ఇంద్రధనుస్సు - (భౌతి.) సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల, హరివిల్లు, కొఱ్ఱు (Rainbow).

కావ్యగుణములు - (అలం.) శ్లేష్మము, ప్రసాదము, మాధుర్యము, సమత, అర్థదీపనము, ఔదార్యము, కాంతి, ఓజము, సమాధి, సౌకుమార్యము.

ఐరావతము - 1.వంకరలేని నిడుపైన ఇంద్రధనుస్సు, 2.ఇంద్రుని ఏనుగు, 3.మబ్బు మీద వచ్చు మబ్బు, 4.రాజమేఘము, 5.తూరుపు దిక్కేనుగు.
ఇరా ఆపః అస్మిన్ సంతీతి ఐరావాన్ సముద్రః తస్మిన్ జాతః ఐరావతః - సముద్రమునందుఁ బుట్టినది.

ఐరావణము - 1.ఇంద్రుని ఏనుగు(నాల్గు దంతములు కలది), 2.అమృతము.
(ౘ)చౌదంతి - చతుర్దంతి, ఐరావతము, రూ.చవుదంతి, సం.చతుర్దంతీ.
తెల్లయేనుగు - ఐరావతము. వెలిగౌరు - ఐరావతము    

ఐరావతి - 1.మెరుపుకోల, 2.ఐరావతము యొక్క భార్య అభ్రమువు.
ఇరా ఆపః సన్త్యస్య ఐరావాన్ - మేఘః -తస్మిన్ ఐరావతి భవ ఐరావతీ, ఈ-సీ. - ఐరావంతము మేఘము, అందుఁ బుట్టినది.
యమపత్ని - ఐరావతి.

అభ్రమువు - తూర్పున నుండు ఐరావత దిగ్గజము యొక్క భార్య.
నభ్రమతి స్వం వల్లభం హిత్వా కుత్రచిన్న గచ్ఛతీ త్యభ్రముః. ఉ-సీ భ్రముచలనే - తన మగని విడిచి కదలనిది.
అభ్రేషు మాతివర్తత ఇత్యభ్రముః మాఙ్ మానే వర్తనేచ - మేఘముల యందుండునది.

పీయూష మమృతం సుధా,
పీయూషము - 1.అమృతము, 2.జున్ను.
పీయత ఇతి పీయూషం- పానము చేయఁబడునది. పీఞ్ పానే.
ౙున్ను - 1.ఈనిన మూడు దినముల లోపలిపాలు, అన్నుగడ్డ, 2.తేనెపెట్టె, 3.ఒక విధమైన మందు.
జున్నుపాలు - జున్ను.   

వేల్పుబోనము - అమృతము.
నమ్రియంతే అనేనేత్యమృతం, మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేతఁజెడరు. 
అమృతము - 1.నీరు, 2.సుధ, 3.పాలకడలి వెన్న, 4.పాలు, 5.మోక్షము, 6.స్వాదుపదార్థము, 7.బంగారు, 8.పాదరసము, 9.విషమునకు విరుగుడు మందు, 10.బ్రహ్మము. 
నమ్రియంతే అనేనేత్యమృతం. మృఙ్ ప్రాణత్యాగే. - దీనిచేత మరణమును బొందరు.
నమృతా భవం త్యనేత్యమృతం - దీనిచేత మృతులు గారు. 

అమృతాంధసుఁడు - వేలుపు, దేవత, వ్యు.అమృతమే అన్నముగా గలవాడు.
అమర్త్యాః నమ్రియంత ఇత్యమర్త్యాః - చావనివారు. మృఙ్ ప్రాణత్యాగే. అమృతాంధనః-న-వు. అమృత మంధో (అ)న్నమేషాం తే - అమృతము అన్నముగాఁ గలవారు.

అమృతకరుఁడు - చంద్రుడు. లలాటం అమృతోత్భవ|

నెల మేపరి - రాహువు Rahu.
సోపపవుఁడు -
రాహువుచే పట్టబడినవాడు (చంద్రుడు లేక సూర్యుడు).

రాహుగ్రస్తే త్విన్దౌ చ పూష్టి చ సోపప్లవోప రక్తౌ ద్వౌ -
ఉపప్లవేన ఆకులతయా సహవత్త ఇతి సోపప్లవః - ఉపప్లవముతోఁ గూడినవాఁడు.
ఉపరజ్యతే ఉపరమతే వ్యాపారాదిత్యువరక్తః – వ్యాపారము వలన నుపరతుఁ డైనవాఁడు, ఉపరజ్యత ఇత్యువరక్తః - రాహువుచేత తమోయుక్తుఁడుగాఁ జేయఁబడినవాఁడు. ఈ రెండు రాహుగ్రస్తులైన సూర్యచంద్రుల పేర్లు.     

సకలజన ప్రియత్వము నిజంబు గల్గిన పుణ్యశాలి కొ
క్కొకయెడ నాపదైన దడవుండదు వేగమె బాసిపోవుగా
యకుషమూర్తియైన యమృతాంశుడు రాహువు తన్ను మ్రింగగన్
టకటక మానియుండడె దృఢస్థితి నెప్పటి యట్ల ! భాస్కరా.
తా.
చంద్రుడు తన్ను రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము Rahu మ్రింగినను స్థయిర్యముతో తొందరపాటు లేకుండా నుండును. అట్లే, ఎల్లరికినీ ప్రియమగువానికి ఆపద వచ్చినను ఎక్కువ కాలము బాధింపదు, అతిత్వరలోనే అతడు కోలుకొనును.

శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః|

సుధాకరుడు - చంద్రుడు Moon.
సుధాంశువు - చంద్రుడు, అమృతకిరణుడు.
సుధారూపా అంశవో యస్య సః సుధాంశుః, ఉ-పు. - అమృతరూపములైన కిరణములుగలవాఁడు.
సుధ - 1.అమృతము, 2.పాలు, 3.సున్నము, 4.ఇటుక. 
సుఖేన ధీయతే పీయత ఇతి సుధా - సుఖముగాఁ బానము చేయఁబడునది. ధేట్ పానే. ఈ మూడు 3 అమృతము పేర్లు.

ఇటిక - మట్టితో కాల్చి చేసిన రాయి, రూ.ఇట్టిక, ఇటుక, సం.ఇష్ఠికా.
ఇష్టక - ఇటిక.

సుధా లేపో (అ)మృతం స్నుహీ,
సుధాశబ్దము పూయునట్టి సున్నమునకును, అమృతమునకును, జెముడు చెట్టునకును పేరు. సుష్ఠు ధీయత ఇతి సుధా, డు ధాఞ్ ధారణ పోషణయో, ధేట్ పానే, లెస్సగా ధరింపఁబడునది, పాపము చేయఁబడునది సుధ. "సుధ పయసి మూర్వాయా" మితి శేషః. 

అమృతం సద్గుణాభార్యా అమృతం బాల భాషితమ్|
అమృతం రాజసమ్మాన మమృతం మాన భోజనమ్||

తా. గుణవతియైన భార్య - అగ్నిసాక్షిగ పరిణయమాడిన పెండ్లాము, వ్యు.భరింపదగినది. బాలుని బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.)ముద్దు మాటలు, రాజ సన్మానము - గౌరవము, రూ.సమ్మానము, ప్రియయుక్త భోజనము - ఆహారము, సాపాటు ఇవియన్నియు నమృత సమానములు. - నీతిశాస్త్రము     

సుధాంశుబింబవదనా సుస్తనీ సువిలోచనా,
సీతా సర్వాశ్రయా సంధ్యా సుఫలా సుఖదాయినీ |

సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
పలుకుఁజెలి - సరస్వతి.
ఐందవి - పల్కుజెలి, సరస్వతి.  
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు; చెలియ - స్త్రీ.
చెలిచుక్క - అనూరాధ. 

సుద్ధి - 1.శుద్ధి, సం.శుద్ధిః, 2.వృత్తాంతము, మాట, సం.సూక్తిః.

నిపుణత - కౌశలము, నేర్పరితనము (Skill).
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు. 
నితరాం పుణతి శుభకర్మ కరోతీతి నిపుణః, పుణ శుభకర్మణి - మిక్కిలి శుభకర్మమును జేయువాఁడు.
కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
క్షిణోత్యశుభమితి క్షేమం, ప్న, క్షిణుహింసాయాం - అశుభమును బోఁగొట్టునది.
క్షియతి వసత్యస్మిన్ గన్ధ ఇతి క్షేమః క్షినివాసగత్యోః. - గంధము దీనియం దుండును.  

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె. 
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.    

శర్వుఁడు - శివుడు, వ్యు.ప్రళయ కాలమున భూతముల హింసించువాడు.  
శర్వః, ప్రళయే భూతానిశృనాతి హీనస్తీతి శర్వః - ప్రళయమందు భూతములను హింసించువాఁడు, శౄహింసాయాం.
శర్వాణి - పార్వతి. శర్వాణీ శర్వమూర్తిమాన్|
శర్వస్య పత్నీ శర్వాణీ, ఈ. సీ. - శర్వుని భార్య.

శ్రవణము - 1.చెవి, 2.వినికి, 3.నక్షత్రములలో ఒకటి.
శ్రవ - చెవి Ear.
శ్రవణీయము - వినదగినది.

చమత్కారము - 1.నేర్పు, రూ.చమత్కృతి.
చమత్కృతి - చమత్కారము.
శ్లాఘవనీయము - పొగడదగినది, రూ.శ్లాఘము.
శ్లాఘ - 1.ప్రశంస, 2.పరిచర్య, 3.ఇచ్ఛ.
శ్లాఘించు - క్రి.పొగడు.    
మెచ్చు - 1.శ్లాఘవ, 2.ప్రేమము, క్రి.శ్లాగించు.
మెచ్చులచెట్టు - కల్పవృక్షము.
మెచ్చులాఁడి - మెచ్చుకొనదగినస్త్రీ, విణ.మెచ్చుకొనదగినది.
మెచ్చులాఁడు - మెచ్చుకొనదగినవాడు. 

సరస్వత్యా స్సూక్తీ - రమృతలహరీ కౌశలహరీః
పిబన్త్యా శ్శర్వాణి - శ్రవణచుళుకాభ్యా మవిరళమ్,
చమత్కారా శ్లాఘా - చలిత శిరసః కుండలగణో
ఝుణత్కారై స్తారైః - ప్రతివచన మాచష్ట ఇవ తే| - 60శ్లో

తా. తల్లీ! శర్వాణి! అమృతలహరీవంటి నీవు చేయు స్తోత్రములను చెవులనెడు చులుకము - 1.పుడిసిలి, 2.చేర.)పుడిసిళ్ళచేత చక్కగా వినుచున్నదానవు) సరస్వతి - 1.పలుకుచెలి, 2.పలుకు, 3.ఒకనది. చమత్కారమును గాను కదల్పబడిన శిరస్సు కల దానవగుచుండగా నీయొక్క కుండలము - 1.యజ్ఞము చేసినవారు ధరించు కర్ణభూషణము, గుండ్రనితనము.)కర్ణభూషణముల సముదాయము అవిరళము - దట్టమైనది)లైన ఝణత్కారము చేయుచు అనుమోదించు వచనము - మాటలను చెప్పుచున్నదో యన్నటుల నుండెను. - సౌందర్యలహరి

భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయావహా|
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.

శర్వరి - రాత్రి.
శృణతి వ్యాపారం దినం వా శర్వరీ. ఈ. సీ. శౄ హింసాయాం - వ్యాపారమునుగాని దినమునుగాని చెఱుచునది.
శార్వరి - 1.రాత్రి, 2.అరువది సంవత్సరములలో నొకటి. 

అథ శర్వరీ
నిశా నిశీధినీ రాత్రి స్త్రియామ క్షణదా క్షపా
విభావరీ తమస్విన్యౌ రజనీ యామినీ తమీ. -

శర్వరీ దీపక శ్చంద్రః - ప్రభాతో దీపకో రవిః|
త్రైలోక్య దీపకోధర్మ - స్సుపుత్రః కులదీపికః||

తా. చంద్రుఁడు రాత్రిని ప్రకాశింపఁ జేయును, రవి - 1.సూర్యుడు, 2.జీవుడు. పగటినిఁ ప్రకాశింపఁ జేయును, ధర్మము మూడులోకములను ప్రకాశింపఁ జేయును, సుపుత్రుండు కులమును ప్రకాశింపఁ జేయును. - నీతిశాస్త్రము

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).   

క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాత కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - విశ్వేశ్వరీ శర్వరీ|
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ. - 10

శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ,
ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా| - 71స్తో

నిశ - 1.రేయి, 2.పసుపు.
నితరాం శ్యతి సర్వవ్యాపారన్ నిశా. శో తనూకరణే - అన్ని వ్యాపారము లను మిక్కిలి స్వల్పముగాఁ జేయునది.
నిశీధిని - రేయి, (నడురేయి కలది.)
నిశీధము - నడురేయి; అపరాతిరి - నడురేయి, అర్థరాత్రము. 
నడికిరేయి - అర్ధరాత్రము, రూ.నడురేయి.
నిశీథః అస్యామస్తీతి నిశీథినీ. ఈ.సీ. - నిశీథమనఁగా, అది దీని యందుఁ గలదు.
నిశాపతి - చంద్రుడు Moon.
నిశాయాః పతిః నిశాపతిః. ఇ - పు. - రాతిరికి ఱేడు. 
నిశాకరుఁడు - చంద్రుడు.  

రాత్రి - సూర్యాస్తసమయము నుండి సూర్యోదయము వరకుగల కాలము.
రాతి సుఖమితిరాత్రిః ఇ. సీ. రాదానే. - సుఖము నిచ్చునది.
రాత్రిమణి - చంద్రుడు Moon.
రే - రేయి, యొక్క రూపాంతరము, రాత్రి.
రేకంటు - (రేయి+కంటు) సూర్యుడు Sun, రాత్రికి శత్రువు.
రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.  

త్రియామ - 1.రాతిరి, 2.పసుపు, 3.యమున. 
యామము -
జాము, మూడు గంటల కాలము.  
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.
త్రయో యామాః ఊస్యాంసాత్రియామా - యామమనఁగా జాము, మూఁడు జాములు గలది, రాత్రియందు ప్రథమయామము చేష్టాకాలముగనుకను, అంత్యయామము విబోధకాలము గనుకను నీ రెండు యామములందు సగము దివసముగా వునఁ ద్రియామ యనంబడును.  

క్షణద - 1.రాత్రి, 2.పసుపు, వ్యు.తీరికను వేడుకను కలిగించునది.
క్షణమవ్యాపారస్థితిం యూనాముత్సవం వాదదాతీతి క్షణదా, డుదాఞ్ దానే - వ్యాపారశూన్యమైన స్థితినిగాని యౌవనవంతులకు నుత్సవము నుగాని యిచ్చునది.
క్షపాకర్వుఁడు - చంద్రుడు Moon, వ్యు.రాత్రిని కలిగించువాడు.
క్షపాం కరోతీతి క్షపాకరః. డు కృఞ్ కరణే - రాత్రిని జేయువాఁడు.
క్షపాచరుఁడు - రక్కసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు. 
క్షపాటుఁడు - 1.రాక్షసుడు, 2.యమదూత.    

క్షపయతి సర్వచేష్టా ఇతిక్షపా. క్ష్యైక్షయే - సర్వవ్యాపారములను క్షయింపఁజేయునది.

విభావరి - 1.రాత్రి, 2.కుంటెనకత్తె, 2.పసుపు.
విభాం సూర్యకాంతిం ఆవృణోతీతి విభావరీ, ఈ వృఞ్వరణే - సూర్యకాంతిని గప్పునది.
విభాతి చంద్రాదిభిరితి విభావరీ. భాదీప్తౌ - చంద్రాదులచేతఁ ప్రకాశించునది.
విభావసుఁడు - 1.సూర్యుడు, 2.అగ్ని. 

తమి - రాతిరి, చీకటి.
తమస్విని -
రాతిరి.
తమః అస్యామ స్తీతి తమస్వినీ. ఈ. సీ. - చీఁకటి గలిగినది.
తమిస్ర - 1.చీకటిరేయి, చిమ్మచీకటి.
తమిస్రము - 1.చీకటి, 2.కోపము, 3.పసుపుపొడి.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
చీఁకటిగొంగ(గొంగ-శత్రువు) - సూర్యుడు Sun, వ్యు.చీకటికి శత్రువు.
చీఁకటిగాము - రాహువు; రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు Rahu. 

అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
తామిస్రము -
1.చీకటి, 2.చీకటి మయమైన నరకము. 

ఇరులు - (వి. బహు.) చీకటి.
ఇరులుగొంగ - సూర్యుడు, వ్యు.చీకటులకు శత్రువు. 

తాపింఛము - చీకటి మ్రాను, తమాలము.
తమాలము -
1.బొట్టు, 2.కత్తి, 3.చీకటిచెట్టు.
బొట్టు - 1.తిలకము, 2.చుక్క సున్న, 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం.1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తము.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం.(గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).
(ౘ)చుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రని బొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 3.కూతురు, సం.1.భేత్రీ, 2.పుత్రః, 3.పుత్రిః.
తిలకసంధి - (జం.) (కప్పలో) కర్ణభేరి క్రింద నుండు ఎఱ్ఱని రెండు గ్రంథులలో నొకటి, బహత్కోళపు పొర క్రింద నుండు అంతస్రావగ్రంథి (Thymus gland).
తిరుచూర్ణము - ఎఱ్ఱబొట్టుపొడి.

పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.
పుండరీకము -
1.తెల్లదామర, 2.అగ్నేయపు దిక్కునందలి యేనుగు, శార్దూలము.
పుండరీకాక్షుఁడు - విష్ణువు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె. తమోహరతీతి హరిః - చీఁకటిని బోఁగొట్టువాఁడు. 

రజని - రాత్రి.
రంజంతి కామినో త్ర రజనీ. ఈ.సీ. రంజ రాగే - దీనియందు కాముకులు రాగయుక్తులగుదురు.
రజనిజలము - మంచు.

పాతకరజనీసంహార కరుణాలయ మాముద్దర నారాయణా|

యామిని - రాత్రి.
యామా అస్యాం సంతీతి యామిని  - యామములు గలిగినది.
యామము - జాము, మూడు గంటలకాలము.
(ౙ)జాము - యామము, ఏడున్నర గడియల కాలము, సం.యామః.

యామి - 1.కుల స్త్రీ, 2.తోడబుట్టినది.
మగనాలు - (మగని+ఆలు) పతిపత్ని, కుల స్త్రీ.

సభత్తృక - మగనాలు, ముత్తైదువు.
ముత్తైదువ - ముత్తయిదువ; ముత్తయిదువ - సుమంగళి. సుమంగళి - ముత్తైదువ, సువాసిని.
సువాసిని - 1.ముత్తయిదువ, 2.పేరంటాలు.
పేరంటాలు - 1.సురలోకమున నున్న ముత్తైదువ, 2.పేరంటమునకు వచ్చిన ముత్తైదువ. 
సహజ - తోడ బుట్టినది.

అథ కులస్త్రీ కులపాలికా :
కులేన అవ్యభిచారేణ రక్షితాస్త్రీ కులస్త్రీ – ఒచ్చెము(న్యూనత, కొరత)లేని కులముచేత రక్షితయైనది.
కులం పాలయతీతి కులపాలికా. పాల రక్షణే. - కులమును రక్షించునది. వ్యభిచారము చేయక కులమును మానమును కాపాడుకొను స్త్రీ పేర్లు.

కులపాలిక - 1.తల్లిదండ్ర్లచే ఒసగబడి పెండ్లి చేయబడిన స్త్రీ, 2.తన కులమును మానమును కాపాడుకొను స్త్రీ.

చిరంటి - 1.జవరాలు, 2.ఐదువరాలు.
ౙవరాలు - యౌవనవతి.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళసూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు; ఈ ఐదు వన్నెలు సుమంగళి చిహ్నములు), జీవభతృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

కులకాంతతోడ నెప్పుడు
గలహింపకు వట్టితప్పు ఘటియింపసుమీ
కలకంటి కంట కన్నీరొలికిన
సిరి యింటనుండ నొల్లదు సుమతీ.

తా. కులసతితో(సతి - పతివ్రత స్త్రీ, పార్వతి)కయ్యము, లేనిదోషాలు ఆరోపించుట మంచిది కాదు, ఏలయన స్త్రీ కన్నీరు విడిచిన, ఆ యింటి యందు(సిరి - 1.శ్రీ, లక్ష్మి, 2.సంపద, 3.శోభ, సం.శ్రీః.)లక్ష్మి నివసించదు.

ఏడగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము,  రూ.ఏడ్గడ.

ఆపన్న జన రక్షైకదీక్షా యామితతేజసే,
నమోస్తు విష్ణవే తుభ్యం రామా….
 

మాపు - పోగొట్టు, వి.1.రాత్రి, 2.సాయంకాలము, 3.మైల.     
రాత్రిమణి - చంద్రుడు Moon.
రాత్రి - (రజని - రాత్రి) సూర్యాస్తమయము నుండి సూర్యోదయము వరకు గల కాలము.

రాత్రించరుఁడు - రాక్షసుడు, వ్యు.రాత్రులందు తిరుగువాడు.

సాయంకాలము - మునిమాపు; మునిమాపు - (మును+మాపు) ప్రదోషము, సంజ.
ప్రదోషము - 1.మునిమాపు, 2.మిక్కిలి దోషము.
మఱుసంౙ - సాయం సంధ్య. అసుర సంధ్య - రాక్షసవేళ, సాయంసంధ్య.
మాపుడు - మైల, మలినము(మాసినది, నల్లనిది).
మైలావు -  పొగ ఛాయగల ఆవు.

నెత్తురుపొద్దు - సంధ్యాకాలము.
నీరుకాళ్ళు -
సాయంకాలములందు దోచు ఎఱ్ఱని పచ్చని కిరణములు.

సాయము1 - సాహాయ్యము.
సాహాయ్యము - 1.తోడుపాటు, 2.సహాయత్వము, 3.స్నేహము.
తోడ్పాటు - తోడుపాటు; తోడుపాటు - సాహాయ్యము, రూ.తోడ్పడు.
తోడ్పడు - తోడుపడు; తోడుపడు - సహాయపడు, రూ.తోడ్పడు.
సహాయుఁడు - 1.తోడగువాడు, 2.స్నేహితుడు.
సాయము2 - 1.సాయంకాలము, 2.బాణము.
సాయంతనము - సాయంకాల సంబంధమైనది.

అజిహ్మగము - బాణము, వ్యు.వంకరగా పోనిది, తిన్నగా పోవునది.

తూపు - బాణము.
తూపురిక్క - శ్రవణ నక్షత్రము.

నాళీకము - 1.తామర, 2.బాణము, 3.బాణపు ములికి.
నాళము -
1.తామరలోనగు వాని కాడ, 2.క్రోవి, చిమ్మనగ్రోవి.
బొట్టియ - 1.బాణపు ములికి, 2.కొడుకు, 2.కూతురు, సం.1.భేత్త్రీ, 2.పుత్త్రః, 3.పుత్రి. 

ప్రదరము - 1.బాణము, 2.ఆడుదానికి కలుగు రక్తస్రావ రోగము. 

క్రోవి - 1.తామరనాళము, 2.గొట్టము, 3.తుపాకి, 4.బుడ్డి, 5.భూమిలోపల నీళ్ళు వచ్చుటకు ఏర్పడిన తూము, 6.మూస, 7.ఊదుక్రోవి.
అండీయ - చిమ్మనగ్రోవి, రూ.అండె. అండె - అండీయ.
మూష - మూస; మూస - (రసా.) ద్రవ్యములను వేడిచేయుటకు ఉపయోగించు (పింగాణితో గాని, ఇనుము, రాగి, ప్లాటినమ్ వంటి ధాతువులతో గానిచేయబడిన) కుటకవంటి పాత్ర (Crucible).

వృద్ధార్కో హోమధూపశ్చ- బాలస్త్రీ నిర్మలోదకమ్|
రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ - ఆయుర్వృద్ధిః దినేదినే||
తా.
సాయంకాలమునం దెండ(ఎండ)కాచుకొనుట, హోమము(వేల్మి, యజ్ఞము)సేయు పొగ యొడలిమీఁదఁ బాఱుట, తనకంటె చిన్నదానితో సంగమము చేయుట, మంచినీళ్ళు త్రాగుట, రాత్రుల యందు క్షీరాన్న భోజనము చేయుట; ఇవి దినదినమున (ఆయువు - జీవితకాలము, ఆయుస్సు.)ఆయుస్సును వృద్ధి పొందించును. - నీతిశాస్త్రము

మైల - 1.అశుచిత్వము, 2.మాలిన్యము, 3.చీకటి, మలిన వస్త్రము, సం.మలినమ్.  
మకిల - 1.మాలిన్యము, 2.నలుపు Black, సం.మలినమ్.  మాలిన్యము - మలినత. మలినము - మాసినది, నల్లనిది.
ముఱికి - కల్మషము, మాలిన్యము.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
అంధము - చీకటి, విణ.గ్రుడ్డిది.
అంధిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు. 

మంగు - 1.మాలిన్యము, 2.మొగము నందు పుట్టు నల్ల పొడ, రూ.మాఁగు, మంగుఁడు, మాఫుఁడు, 3.మిగులపండుట.
మాఁగు - క్రి.కమియబండు, వి.మాలిన్యము.
మాగుఁడు - కసటు, నలుపు.
మాపుడు - మైల, మలినము.

కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.

మాసి1 - మానిసి, సం.మానుషః.
మాసి2 - 1.మసి, 2.మురికి.
మసి - 1.చూర్ణము, 2.నలుపు, 3.బొగ్గు, సం.మసీ.
చూర్ణము - 1.గందపొడి, 2.సున్నము, 3.దుమ్ము, 4.పొడి.  

దుమ్ము - ధూళి, రూ.దుము, సం.ధూమః.
ధూళి -
దుమ్ము.
దుము - దుమ్ము, సం.ధూమః.
దుమారము - దుమ్ము. ధూమము - పొగ. 
ధూమయోని - మేఘము, వ్యు.పొగయే జన్మకారణముగా కలది.
ధూళిధ్వజుఁడు - గాలి, వ్యు.దుమ్ము జెండాగా కలవాడు.

శ్యామల - పార్వతి, విణ.నల్లనిది.
శ్యామలము -
నలుపు, విణ.నల్లనిది.
శ్యామిక - చీకటి, నలుపు.

అశౌచము - అశుచిత్వము, అంటు, మైల, ఉదా. (జాతశౌచము, మృతాశౌచము).
అశౌచము - 1.మురికి, 2.పురుడు, 3.మృతశౌచము, మైల.
పురుడు - జాతము, జాతశౌచము, విణ.సమానము.
జాతము - సమూహము, విణ.పుట్టినది. 

జాతకర్మము - పుట్టినపుడు చేయు క్రియ.

మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు మురికితోడ నుండనేని
అగ్రకులజుఁడైన నట్టిట్టు పిల్వరు విశ్వ.

తా|| మాసిన చీరతోను(కోక - వలువ, చీర.), మాసిన తలతోను, మురికిగాయున్న శరీరముతోను వున్నచో గొప్పకులము నందు పుట్టినవారి నయినను హీనముగా చూతురు. (బట్టలు మురికిగానియ్యని శుభ్రత యెవ్వరికి వుండదు) 

గిరీశుఁడు - 1.హిమవంతుడు, 2.శివుడు.
గిరేః కైలాసస్యేసః గిరీశః - కైలాసమున కీశ్వరుడు.
గిరౌ శేతే గిరిశః - కైలాస మందు శయనించువాఁడు, శీఙ్ స్వప్నే.

హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
హిమవద్గిరౌ ప్రచురా హైమవతీ - హిమవత్పర్వతమందుఁ బ్రచురమైనది. 
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం|

భవ్యము - 1.శుభమైనది, 2.యోగ్యమైనది, వి.ఎముక.

నాస - ముక్కు, రూ.నస, నాసిక.
నాసతే శబ్దాయతే నాసా. నాసికా చ. నాసృశబ్ధే. - ధ్వనిచేయునది. నాసాగ్రే నవ మౌక్తికం|

తుహినకరుఁడు - చంద్రుడు, వ్యు.చల్లని కిరణములు గలవాడు.
తుహినము - మంచు.
తోహతి అర్దయతి పద్మమితి తుహినం, తుహిర్ అర్దనే - పద్మమును బీడించునది.

వంశము - 1.కులము, 2.వాసము(వెదురు), 3.పిల్లనగ్రోవి, 4.వెన్నుగాడి, 5.సమూహము, 6.ఒక పురాణ లక్షణము.
వన్యతే సేవ్యత ఇతి వంశః, వన షణ సంభక్తౌ. - అందఱిచేత నాశ్రయింపఁబడునది.
వన్యతే యాచ్యతే వంశః, వను యాచనే. - అడుగఁబడునది.

ధ్వజము - 1.టెక్కెము, 2.టెక్కెపు కంబము, 3.గురుతు, 4.గర్వము.
ధ్వజతీతి ధ్వజం, అ. ప్న. ధ్వజ గతౌ. - కదలునది.

పట్టి - పంచమీ విభ క్తి ప్రత్యయము, వి.బిడ్డ.

మహావంశము - సింహళ దేశపు చరిత్రను గురించి తెలుపు పాళీగ్రంధము (క్రీ.శ. 5వ శతా.)
దీపవంశము - (చరి.) సింహళదేశ చరిత్రను గూర్చి తెలుపు పాళీ గంధము.

హిమాచల మహావంశ పావనాయై నమో నమః|

అథ మౌక్తికమ్, ముక్తా :
మౌక్తికము - ముత్తియము.
ముచ్యతే శుక్తి సంపుటాదితి ముక్తా, ముక్త్తైవమౌక్తికం, ముచ్ ఌ మోక్షణే.
ముక్త - 1.ముత్తెము, 2.రంకుటాలు, విణ.ముక్తి నొందినది.
ముత్యపుచిప్పల వలన విడువఁబడునది గనుక ముక్తః ముక్తయే మౌక్తికము, ముత్యము. ఈ 2 ముత్యము పేర్లు.

ముక్తావళి - ముత్యాలదండ.
ముక్తానాం ఆవళీ, ముక్తావళీ, ఈసీ, పా. ముక్తావళిః ఇ. సీ. - ముత్యములయొక్క పంక్తి.

ముక్త కణ నిర్మాణము - (వృక్ష.) ఒక జీవకణ సంహతిలో విడివిడిగా జీవకణము లేర్పడి యుండుట (Free cell formation).

మణి-1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి. 
మణ్యతే స్తూయతి ఇతి మణిః, ఇ. ప్స. మణి శబ్దే - స్తోత్రము చేయఁబడునది.
పూస - 1.పూదె, 2.మణి, 3.వ్రేలులోనగు వాని కీలు.
మణిబంధము; మణికట్టు - (గృహ.) అరచేతికి మోచేతికి మధ్యనున్న కీలు (Carpus).
మణి బంధాస్థి - (జం.) చేతి మణికట్టులో నున్న ఎముకల సముదాయము (Carpus).  

అసౌ నాసావంశ - స్తుహినగిరివంశధ్వజపటి!
త్వదీయో నేదీయః - ఫలతు ఫలమస్మాక ముచితమ్, |
వహత్యన్త ర్ముక్తా - శ్శిశిరకర నిఁశ్వాస గళితం
సమృద్ధ్యా య త్తాసాం - బహిరపి స ముక్తా మణిధరః || - 61శ్లో
  
తా. హిమవంశమునకు పతాకవంటి(జండాయైన) ఓ తల్లీ! నీ ముక్కు అనెడి వెదురు మాకు చేరిక యైన తగిన ఫలము నొసగు గాక, ఏ నాసిక లోపల చంద్రనాడి యనెడి నిశ్వాసము-నిటూర్పు నుండి (శ్వాస వదలేటప్పుడు) జారిన ముత్తెములను ధరించు చున్నదో ఆ నాసిక వెలుపలను గూడ  మణి - 1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మనికట్టు. లను ధరించుచున్నది - సౌందర్యలహరి

శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా|
శాతోదరీ శాంతిమతీ నిరాకారా నిరంజనా.

నక్షత్రేశుఁడు - చంద్రుడు, రిక్కరాయుడు.
నక్షత్రాణామీశః నక్షత్రేశః - చుక్కలఱేఁడు.

నక్షత్రమృక్షం భం తారకాప్యుడు వా స్త్రియామ్,
నక్షత్రము - రిక్క, వ్యు.నశింపనిది, (నక్షత్రము లిరువది యేడు 27).
నక్షరతీతి నక్షత్రం, క్షర సంచలనే - నశింపనిది గనుక నక్షత్రము.
న క్షీయత ఇతి వా నక్షత్రం, క్షీ క్షయే - నశింపనిది.

నక్షత్రాకార రేఖలు - (జం.) అప్రత్యక్ష కణవిభాగము జరుగునపుడు జీవకణములో తారా కేంద్రము చుట్టును ఏర్పడు నక్షత్రమువలె నుండు రేఖలు, (Aster).

రిక్కదారి - ఆకాశము.
రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
రిక్షము - రిక్క, చూ.ఋక్షము.

దాక్షాయణ్యో శ్వినీత్యాది తారాః :
అశ్వినీత్యాదితారా దాక్షాయణ్య ఇత్యుచ్యంతే - అశ్విన్యాది రేవత్యంత నక్షత్రములు దాక్షాయణు లనంబడును.
దక్షస్య ప్రజాపతే రపత్యాని స్త్రియః దాక్షాయణ్యః - దక్షప్రజాపతి యొక్క కొమార్తెలు. అశ్విని మొదలు 27 నక్షత్రములకుఁ పేర్లు.

నక్షత్రములు అనేకము - ఆకాశము ఒకటే.
నక్షత్రములను ఎవరు - మెరవమన్నారు?

వెలఁది - నిర్మలము, ప్రసన్నము, వి. స్త్రీ) నీకేమైన బిడ్దలా చెపుమన్న కనురెప్ప మింటి చుక్కలను చూపె. - ఇరవై ఏడు.

ఆచంద్రతారార్కము - చంద్రుడు నక్షత్రములు సూర్యుడు ఉండు నంతి వరకు, శాశ్వతముగా, ఎల్లప్పుడు. 

చుక్కలదొర - చంద్రుడు.
చుక్కలఱేఁడు - చంద్రుడు. చంద్రుని ఎవరు - ప్రకాశించమన్నారు?

ౘుక్క - 1.శుక్రుడు Venus, శుక్రనక్షత్రము, 2.నక్షత్రము, 3.గుండ్రనిబొట్టు, 4.నీరు మున్నగు వాని బొట్టు, సం.1.శుక్రః, 2.చుక్రః.

ఏకోపి గుణవాన్ పుత్రో  - నిర్గుణేవ శతైరపి|
ఏక చంద్ర ప్రకాశేన నక్షత్రైః కిం ప్రయోజనమ్||

తా. సకల గుణసంపన్నుఁడైన కుమారుం డొకఁడే చాలును, గుణములేని కుమారులు నూఱుగురున్న(కౌరవలు - కురువంశపు వారు, వందమంది యున్న)నేమి ప్రయోజన మున్నది. ఇందుకు నిదర్శనము ఒక చంద్రుడుండిన లోక మంతయు ప్రకాశించును. ఆ చంద్రుఁడు లేక నక్షత్రము లెన్నియున్న నేమి ప్రయోజనమున్నది. - నీతిశాస్త్రము

ఋక్షరాజు - చంద్రుడు, జాంబవంతుడు.
ఋక్షము-1.ఎలుగుగొడ్డు, 2.రైవత కాద్రి, 3.నక్షత్రము, 4.మేషాదిరాశి.  
ఋక్షతి తమో నాశయతీతి ఋక్షం, ఋక్షగతౌ - సంచరించునది.

ఋక్షవానర సంఘాతీ చిత్రకూట సమాశ్రయాః,
జయంతత్రాణ వరదః సుమిత్రాపుత్రసేవితః|

భంబు - 1.ఆకాశము, 2.నక్షత్రము.
భాతీతి భం, భా దీప్తౌ - ప్రకాశించునది.
ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి 3.అభ్రకము 4.బ్రహ్మము 5.(గణి.) సున్న, శూన్యము 6. (భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతిక వస్తువులు ఆక్రమించు చోటు (Space).
విను - ఆకర్షించు, వి.ఆకాశము, రూ.విన్ను.
వినువాఁక - గంగ.
మిను -
ఆకాశము, రూ.మిన్ను. (మినుచూలు - వాయువు)
మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
సీత -
1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

తాయి - తల్లి.
తాయెత్తు - తల్లి బిడ్దలకు కట్టు రక్షాబంధము, రూ.తాయెత్తు.

తారాపథము - ఆకాశము. ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈవేళ....

తారాపతి - చంద్రుడు. తారాచంద్రుల విలాసములతో...….
తార - 1.నక్షత్రము, 2.బృహస్పతి భార్య, 3.వాలిభార్య.  కిష్కింధాచలము నందు తార|
తరంత్యనయా నావికా ఇతి తారా, తారకా చ్,స్న, తౄప్లవనతరనయోః - దీనిచేత నావికులు తరింతురు.

ముక్తాశుద్ధౌ చ తార స్స్యాత్ :
తార శబ్దము ముత్యముల నిర్దోషత్వమునకును, చకారమువలన నక్షత్రమునకును, అత్యుచ్చస్వరమునకును, కనుగుడ్డునకును పేరు.
తరంత్యనేనేతి తారః - దీనిచేత తరింతురు.
"తారో నామౌక్తికే శుద్ధే గురు సుగ్రీవ భార్యయోః, బౌద్ధదేవ్యాం స్తారా దౌరూప్యవర్ణ యోః, తారమత్యుచ్ఛ నిద్ధ్వనతరీ సంబంధయోస్త్రిషు"ఇతి శేషః.

తారాకేంద్రము - (జం.) జీవకణరసములో కేంద్రికతో నేర్పడు ఒక ప్రత్యేక మైన భాగము, (Centrosome).
తారానాభి - (జం.) కేంద్రిక చుట్టు నుండు గుండ్రని భాగము, (Centro-sphere).  
కేంద్రిక - (జం.) తా రా కేం ద్ర ము యొక్క కేంద్రస్థామున నుండు చిన్న రేణువు (Centriole).
 
Centrioles and Centrosome : Centrioles are hollow cylinders and do not have membranes. They occur in pairs at right angles to one another. Centrioles are found in most of the animal cells and lower plant cells. It is made of nine triplets of microtubules. They separate and mitigate to opposite poles of an animal cell. Cilia and flagella development and organisation is also done by Centrioles.

తారానాయకసంకాశవదనాయ మహౌజసే,
నమోస్తు తాటకాహంత్రే రామా.......
 

తారస్వరము - (భౌతి.) గట్టిగా వినిపించు స్వరము,  (High note).

నవచంపకపుష్పాభ - నాసాదండవిరాజితా|
తారాకాంతితిరస్కారి - నాసాభరణభాసురా. –
7స్తో

తారకజితుఁడు - కుమారస్వామి.
తారకం జితవాన్ తారకజిత్, త-పు. తారకసురుని జయించినవాఁడు, జి.జయే.  

తార కాక్ష్ణ కనీనికా,
తారకము - 1.కంటినల్లగ్రుడ్దు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.
తారయతి తమః తారకా, తౄ ప్లవనతరనయోః, అంధకారమును దాఁటించునది.   
కనీనిక - 1.కంటినల్ల గ్రుడ్దు, 2.చిటికెనవ్రేలు.
కనతి ప్రకాశయతి సర్వం కనీనికా, కనదీప్తౌ. - అన్నిటినిఁ బ్రకాశింపఁజేయునది. ఈ 2 కంటి నల్లగ్రుడ్దు పేర్లు.

నల్లఁగ్రుడ్డు - కంటిలోని నల్లభాగము, కనీనిక. 
ఆబ - 1.కంటి నల్లగ్రుడ్డు, కంటిపాప, 2.కనురెప్పల వాపు, 3.ఆత్రము, తిండి మొ. పై ఎక్కువ ఆశ.
కనిష్ఠ - 1.చిటికెన వ్రేలు, 2.అందరి కంటె చిన్నదగు చెల్లెలు.
పాప - 1.శివుడు, 2.కంటి వల్ల గ్రుడ్డులోని ప్రతి బింబము.

ప్రయోగము - 1.నడుపుట, 2.తార్కాణము, 3.ప్రయత్నము, వి.(భౌతి.) క్రొత్త విషయములను తెలిసికొనుటకు గాని ఒక సిద్ధాంతమును సరిచూచుటకు గాని చేయు పరీక్ష (Experiment), వి.(గణి.) శాస్త్ర ప్రయోగము, శాస్త్ర న్యాయము నుపయోగించుట (Application).
ప్రయోగశాల - (భౌతి.) విజ్జాన సముపార్జన కుద్దిష్టమైన ప్రయోగములు గావింపబడు మందిరము (Laboratory), వి.(భౌతి.,రసా.) ప్రయోగాత్మకముగా సత్యాసత్యములను చర్చించు ప్రదేశము (Laboratory).  

ఉదాహరణము - 1.దృష్టాంతము, తార్కాణ, 2.ఒకరకపు కావ్యము, ఉదా.త్రిపురాంతకో దాహరణము, రూ.ఉదాహారము.
తార్కాణము - తారకాణ.    
తారకాణ - దృష్టాంతము, రూ.తార్కాణము, తారకాణము, తార్కాణ.
దృష్ఠాంతము - 1.ఉదాహరణము, 2.శాస్త్రము, 3.చావు, 4.(అలం.) ఒక అర్థాలంకారము.
దిష్టస్య జీవిత కాలస్య ప్రారబ్ధ కర్మణో వా అంతః దిష్టాంతః. - జీవిత కాలముయొక్కగాని ప్రారబ్ధ కర్మము యొక్కగాని అంతయు దిష్టాంతము.
దృషాంతరీకరించు - క్రి.ఉదాహరించు.
నిదర్శనము - 1.దృష్టాంతము, 2.(అలం.) ఒక అర్థాలంకారము.
ప్రామాణ్యము - 1.దృష్టాంతము, 2.సాక్ష్యము.
ప్రామాణికుఁడు - 1.సత్యము తప్పనివాడు, 2.మేరమీరనివాడు, 3.శాస్త్రము నెరిగినవాడు.

నిజమరి - సత్యశీలుడు.
నిజము - స్వభావము, విణ. 1.తనది, 2.శాశ్వతమైనది.
నిబద్ది - నిజము.
నిబద్దించు - క్రి. నిజపరచు, నిబద్దిలించు
నిజము - సత్యము, విణ.1.శాశ్వతమైనది, 2.సత్యమైనది.
సత్యము - 1.నిజము, 2.ఒట్టు, 3.కృతయుగము, 4.బ్రహ్మలోకము.
సత్సు సాధుషు భవం సత్యం - సత్పురుషుల యందుఁ బుట్టినది.

స్వకే నిత్యే నిజం త్రిషు,
నిజశబ్దము తన వస్తువునకును, నిత్యమైనదానికిని పేరు. నియతంజాయత ఇతి నిజం, జనీ ప్రాదుర్భావే. - నయతముగా నగునది. టీ. స. ఝూన్తానాం క్లిష్టకల్ప్యతయా తా నుపేక్ష్య ఞాంతానాహ.

అవితథము - 1.యథార్థము, 2.వ్యర్థము కానిది, వి.సత్యవచనము. 
ఉన్నరూపు - యథార్ధము, కలరూపు.
కలరూపు - యథార్థ్యము, నిజము.
యాథార్థము - 1.సత్యము, 2.ఉన్నరూపు.
యథార్థంతు యథాతథమ్,
యథార్థం, యథాతథం ఈ 2 ను సత్యమందు వర్తించును, ఉ. 'యథార్థ ముక్తవా న్నాన్యత్ ', గురుర్వక్తి యథాతథం'.  
సూనృతము - శుభము, విణ.ప్రియము సత్యమైనది.

భద్రత - (గృహ.) 1.నిర్భయత్వము, 2.కాపాడబడుట, 3.నిర్భయముగా నుండుట.

సత్యం బ్రూయాత్ప్రియంబూయాన్న బ్రూయా త్సత్య మప్రియం |
ప్రియంచనానృతంబ్రూయా దేషధర్మస్సనా తనః |
భద్ర భద్రమితి బూయాద్భద్రమి త్యేవనావదేత్ ||

తా. సత్యము నిష్టముగాఁ బలుకవలయును, సత్యమెన దైనను అప్రియముఁ బలుకరాదు, ప్రియమైనదైనను అనృతము - అసత్యమైనది, వి.1.అసత్యము, 2.సేద్యము.)బలుకరాదు. భద్ర మనఁగా శుభము. కావున ప్రియము - 1.ఇష్టము, 2.హెచ్చు వెలగలది.)బలుకునపుడు భద్రము భద్రమని పలుక వలయును. - నీతిశాస్త్రము

నిత్యము - ఎల్లప్పుడు, ఎడతెగనిది.  
నియతం భవతీతి నిత్యం - నియతమైనది.
శాశ్వతము - నాశనములేనిది.
సతము - శాశ్వతము, సం.శాశ్వతమ్. 

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి) గుణము (Property). 

ఛేదిత తారక భేదిత పాతక
ఖేదిత ఘాతుక వాంఛిత దాయక| ||శరవణభవ||
          

ఉడురాజు - చంద్రుడు.
ఉడుపు1 - ఉడుగు.
ఉడుగు - 1.మాను, 2.ఇంకు, 3.నశించు.
ఉడుపు2 - నక్షత్రము.
ఉడ్డీయత ఇత్యుడు. ఉ. స్న. డీఙ్ విహాయసా గతౌ - ఆకాశమందు సంచరించునది.
ఉడు వాస్త్రియాం. ఉడుశబ్దో వికల్పేన స్త్రీలింగే వర్తతే. పక్షే నపుంసకలింగేచ. తారక పీత్యపిశబ్దేన తార కాశబ్దస్యాపి వాస్త్రియామి త్యనేనాన్వయః పక్షేక్లీ బత్వం చ ఉడుశబ్ద సాహచర్యాత్.
తదుక్తం - ద్విత్రై ర్వ్యోమ్ని తుషార బిందు మధుర చ్ఛాయైః స్థితం తారకై రితి - ఉడు శబ్దమునకు స్త్రీ నపుంసకలింగములు గలవు.
తారాతారకా శబ్దములకు ఉడుశబ్దమునకు వలె లింగములు గలవు. ఈ. ఆరు సాధారణముగా నన్ని చుక్కలకుఁ పేర్లు.

జలజము - 1.తామర, 2.శంఖము.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు అంటువ్యాధి.)
శంఖము - 1.గుల్ల, 2.నొసటి యెముక, 3.ఒక నిధి.
దుఃఖం శమయతీతి శంఖః, శము ఉపశమునే - దుఃఖమును శమింపఁజేయునది.  

దరము - 1.భయము, 2.గొయ్యి, 3.శంఖము, అవ్య.ఇంచుక.
రసానుక్వా భావానాహ - దరేతి దీర్యతే (అ)స్యాదితి దరః, దౄభయే.
గొయ్యి - పల్లము, రూ.గోయి.     

దరో (అ)స్త్రియాం భయే శ్వభ్రే -
దరశబ్దము భయమునకును, గుంటకును పేరు. దరణం, దీర్యత ఇతి చ దరః, ప్న. దౄ విదారణే. వెఱచుట, త్రవ్యఁబడునదియును దరము. ఈషదర్థమందు దరశబ్ద మవ్యయము. "దరదళిత హరిద్రాపింజరాణ్యంగకాని" "ఈషదర్ధే ద రాలింగ" మితి శేషః.

శ్వభ్రము - రంధ్రము, బెజ్జము.
శోభసమభ్ర మాకాశ మస్మిన్నితి శ్వభ్రం. - బయలు దీనియందు లెస్సగాఁ గలదు.

ముందుకుపోతే నుయ్యి, వెనుకకుపోతే గొయ్యి. శంఖములో పోస్తే తీర్థము, పెంకులో పోస్తే నీళ్ళు.

జలజనిభ నయనఖిల మనుజమథన
బలిదనుజ మదన కలికలుష శమన| ||శరవణభవ||

ఝషము - 1.చేప, 2.మొసలి.     
ఝషతి హినస్తి బాలమత్స్యానితి ఝషః ఝష హింసాయాం - పిల్ల చేఁపలను (ౘ)చంపి తినునది.

చేఁప - మత్స్యము; మత్స్యము - చేప Fish.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః, మదీ హర్షే. - మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది.

మాత్స్య న్యాయము - న్యా. పెద్ద చేప చిన్న చేపను తినునను న్యాయము. హెచ్చు బలము కలిగిన పెద్ద చేపలు బలహీనమైన చిన్న చేపలను బలవంతంగా, మింగుతుంటాయి.

ఝషకేతుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మారుఁడు - మన్మథుడు.
మారయతి విరహిజనం మారః - విరహినులను జంపువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

ఝుష కేతన సమవృష కేతనరమ
మిష చేతనయమ వృషకారి సుగమ| ||శరవణభవ||

మకరరేఖ - (భూగో.) భూమధ్య రేఖకు దక్షిణమున 23 1/2 డిగ్రీలలో ఉన్న రేఖ (Tropic of Capricorn).

పవనః పవతామస్మి రామశ్శస్త్రభృతామహమ్ |
ఝుషాణాం మకరశ్చాస్మి ప్రొతసామస్మి జాహ్నవీ || - 31శ్లో 
పావనమొనర్చువాటిలో వాయువును, శస్త్రధారులలో రాముడును, జలచరములలో మొసలియు, నదులలో గంగయు(జాహ్నవి - గంగ) నావిభూతులే. రామబాణమఘోఘమైనది కావుననే శత్రధారులలో అతడగ్రేసరుడు. 

త్రిలోకపావనియగు గంగ విష్ణుపాదమునుండి పుట్టినది. వైజ్ఞానికులు గంగా జలములు ఎంతకాలముంచినను చెడిపోవనియు, వీనియందు రోగక్రిములు జీవింప జాలవనియు ఋజువు చేసిరి. హిందువులు గంగను పూజించుటచే సర్వపాపములు నశించి ముక్తికలుగునని విశ్వసింతురు. - భగవద్గీత విభూతియోగః    

అంశి - 1.దాయభాగము కలవాడు, 2.భాగముకలవాడు. 
అంశకుడు - 1.దాయాది, జ్ఞాతి, 2.పాలికాపు. పాలికాపు కండల్లో ధనమున్నదిగా...

దాయాదుఁడు - 1.జ్ఞాతి, 2.పుత్రుడు.
పుత్త్రుఁడు - కొడుకు, పున్నామ నరకమునుండి రక్షించువాడు. పుత్త్రులు పండ్రెండుగురు; ఔరసుడు, క్షేత్రజుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, కానీనుడు, సహోఢజుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయంచిత్తుడు, జ్ఞాతిరేతుడు).

సపిండీకరణము - చచ్చిన పండ్రెవ దినమున చేయు శ్రాద్ధము.

సపిణ్డాస్తు సనాభయః,
సపిండుఁడు - ఏడు తరముల లోపలి జ్ఞాతి.
సమానః ఏకః పిండః పిండప్రదాన మేషామితి సపిండాః - సమానమైన పిండప్రదానము గలవారు.
సమానః ఏకః పిండః శరీరమేషామితి వా సపిండాః - ఒక్కటైన శరీరము గలవారు.
సనాభి - జ్ఞాతి, సమానుడు. 
సమాన నాభిః మూలకారణం కూటస్థపురుషో యేషామితి సనాభయః, ఈ-పు. - సమానమైన కూటస్థ పురుషుఁడు గలవారు. ఈ 2 ఏడు తరములకు లోఁబడిన జ్ఞాతుల పేర్లు.   

స్వజనుఁడు - తనవాడు, జ్ఞాతి.
జ్ఞాతి - 1. దాయాది, 2.తండ్రి.

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter).

                                                                                                                                                                                                                                                                                                                                                                       

తొలఁగుబావ - శత్రువు, దాయ.
శత్రువు - పగతుడు; పగతుఁడు - (పగ+అతడు) శత్రువు, పగవాడు.
సగోత్రుఁడు - దాయ.
దాయ - 1.దాయాదుఁడు, జ్ఞాతి, 2.శత్రువు, సం.దాయాదః.    

దాయాదౌ సుత బాన్ధనౌ,
దాయాదశబ్దము కొడుకునకును, జ్ఞాతికిని పేరు.
దాయం విభజనీయం ధన మత్తీతి, ఆదత్త ఇతి వా దాయాదః అద భక్షణే, డు దాఞ్ దానే. – పాలిసొమ్మును భుజించువాఁడుగాని, పుచ్చుకొను వాఁడు గాని దాయాదుఁడు.

విమతుఁడు - శత్రువు, విణ.విరుద్ధ మతము గలవాడు.
విరుద్ధము - విరోధము గలది.
విరుద్ధః పక్షో (అ)స్యేతి విపక్షః - విరుద్ధమైన పక్షము గలవాడు.  

విరోధి - 1.పగవాడు, 2.ఇరువది మూడవ(23వ) సంవత్సరము.
విరోధికృత్తు - నలువదియైదవ(45వ) సంవత్సరము.

విరోధచర్య - (రాజ.) యుద్ధము ప్రకటించుటకు తగినంత కారణముగా నెంచదగినచర్య.

వైరి - శత్రువు.
వైరమస్యాస్తీతి వైరీ, న. పు. - వైరము గలవాఁడు.
వైరము - విరోధము.
విరోధము - పగ, ఎడబాటు.
పగఱు - (బహు.) శత్రువు (పగ+వాఱు). విద్విషుఁడు - శత్రువు.

వైరిణం నోప సేవేత సహాయం చైవ వైరిణః,
అధార్శికం తస్కరంచ తథైవ పరయోషితం|
తా.
శత్రువు, శత్రుస్నేహితుడు, ధర్మహీనుడు, తస్కరుఁడు - దొంగ, పరస్త్రీ(యోష - 1.బోటి, 2.ఆఁడుది, రూ.యోషిత, యోషిత్తు., వీరలతో సహవాసము జేయరాదు. - నీతిశాస్త్రము

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

జ్ఞాతాగమచయ ధూతాఘవిచయ
వీతషడరిరయ గీతగుణోదయ| ||శరవణభవ||

డిమ్బే డమర విప్లవౌ,
డింభము - పిల్ల, గ్రుడ్దు.
డయతే డింభః, డీఙ్ విహాయసాగతౌ. - కాలక్రమమున నెగయునది.
డయతే గమనాయ డింభా, డీఙ్ విహాయసాగతౌ. - గమనము కొఱకు నెగయునది. గ్రుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిదిట.
డీనము - పక్షిగతి, మీది కెగరుట.
డీయతే జనో (అ)నేనేతి డింబః, డీఙ్ విహాయసాగతౌ. - దీనిచేత మనుజుఁడు తొలఁగిపోవును.    

డిమ్భౌతు శిశు బాలిశౌ, 
డింభశబ్దము శిశువునకును, మూర్ఖునికిని పేరు. డయతే డింభః, దీఙ్ విహాయసా గతౌ. - ఎరుగువాఁడు.

బాల - పదునారేండ్లకు లో బడిన పిల్ల.
బాలాజీ - శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, విణ.బాలా.
బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు. 
పరదత్తం బలిం పూజాంశ్యతీతి బలిశః; బలిశ ఏవ బాలిశః - తనకుఁ జేసిన సన్మానమును జెఱుచుకొనువాఁడు బాలిశుఁడు. 
దేవతార్థం దత్తమవూపాది బలిం శ్యతి భక్షణేన తనూకరోతీతి బలిశః; బలిశ ఏవబాలిశః - దేవతార్థమై యుంచఁబడిన యపూపాదులను భక్షించి స్వల్పముగాఁ జేయువాడు.  

డింభౌషణము - (గృహ.) పొదుగుటకు అనుపగుస్థితి, గ్రుడ్లుగాని, క్రిమిబీజములుగాని వృద్ధి పొందుటకు అనువగు సూచనలు అనగా తగు శీతోష్ణస్థితులు కలిగి యుండుట, (Incubation).
డింభౌషణకాలము - (జం.) గ్రుడ్డు పగిలి దానినుండి ప్రాణి బయటికి వచ్చుటకు పట్టుకాలము, శరీరమున రోగజీవులు ప్రవేశించినది మొదలు రోగ చిహ్నములు పైకి కనబడువరకు పట్టుకాలము (Incubation period).

డింభాకృతియుత రంభానటరత
జంభారివినుత కుంభోద్భవ నుత| ||శరవణభవ||  

తాపత్రయము - మూడు విధములైన తాపములు - ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము.
ఆధ్యాత్మికము - 1.మనశరీరాదులవలన కలిగినది, (శోక జ్వరాది దుఃఖము. ఇది తాపత్రయములలో ఒకటి), 2.ఆత్మకు సంబంధించినది, ఉదా.ఆధ్యాత్మిక విద్య.

ఆధిభౌతికము - వ్యాఘ్రసర్పాది భూతములవలన కలిగినది, (ఇది తపత్రయములలో ఒకటి). 

కాలచక్రము - చక్రాకారమున నుండు కాలము.
కాలత్రయము - 1.భూతకాలము, 2.వర్త మాల కాలము, 3.భవిష్యత్కాలము.

ప్రజాతి - (జం.) జంతుజాలమును వర్గీకరించుటలో నొకముఖ్య విభాగము (Phylum).

త్రైవర్గికుఁడు - ధర్మార్థ కామములం దిచ్ఛ గలవాడు. 

త్రివర్గములు - 1.ధర్మార్థకామములు, 2.సత్త్వరజస్తమములు, 3.క్షయ స్థాన వృద్ధులు.
వర్గము - (రసా.) సమాన ధర్మములు గల ద్రవముల సమూహము (Group) సం. (జీవ.) తరగతి (Class) సం. (గణి.) ఒక రాశిని ఆ రాశిచేతనే గణించగా లభించు లబ్ధము (Square) సం. 1.వి.సజాతీయ సమూహము, 2.తెగ, 3.అధ్యాయము, 4.కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనునవి అరిషడ్వర్గము లన బడును.
వర్గయుక్కులు - ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ధ, థ, ఫ, భ లు.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హః అను ధ్వనులు.

సంసృష్టి - సంవర్గము.
సంవర్గము - సంబంధము, చేరిక.
సంసృష్టము - సంవర్గము నొందినది.

అనాగతము - భవిష్యత్కాలము, సం.విణ.1.రాబోవునది, భావి, 2.పొందబడనిది.

తాపత్రయహర కాలత్రయ చర
లోకత్రయధర వర్గత్రయకర| ||శరవణభవ||

తిరు - శ్రీప్రదము, పూజ్యమైన, సం.శ్రీః. 
తిరుమల - వేంకటాచలము.
శేషాచలము - తిరుమల; శేషశైలము - తిరుమల. 
శ్రీనివాసుఁడు - విష్ణువు, వేంకటేశ్వరుడు.
విష్ణువు - విశ్వమంతట వ్యాపించి యుండువాడు, వెన్నుడు.
విష్ణుః, ఉ-పు, విశ్వం వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః - విశ్వమును వ్యాపించి యుండువాడు, విష్ణు వ్యాప్తౌ.
వెన్నుఁడు - విష్ణువు, సం.విషుః.
శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః, ఈసీ, శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది.
తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి. 

తిమ్మ - స్వస్థము.
స్వస్థము - నెమ్మదిగా నుండునది.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము, అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.

జితము - జయింపబడినది, వై.విణ.స్థిరము, సం.స్థితమ్.
జితపడు - క్రి.1.స్థిరపరుడు, 2.వాడుకపడు, 3.అనుకూలపడు, జితించు.    

ఆస్తిపరుఁడు - స్థితిమంతుడు, ధనవంతుడు.
ఆస్తి - సంపాదించిన భూమి, ధనము మొ.ని., సొత్తు.

స్థిరాస్థి - ఒక చోటినుండి మరియొక చోటికి తీసుకొనిపోవుటకు వీలులేని(భూమి ఇల్లు, తోటలు మొ నవి)ఆస్తి (Immovable property).

స్థిర - భూమి.
తిష్ఠతి సదా స్థిరా, ష్ఠా గతినివృత్తౌ. - ఎల్లప్పుడు నుండునది.
తిష్ఠతి సర్వమస్యామితి వా స్థిరా - సర్వము దీనియందుండునది.

స్థిరము - 1.కొండ, 2.చెట్టు, 3.మోక్షము, విణ.నిలుకడైనది, కదలనిది.
తిరము - స్థిరము.    

పదిలుఁడు - 1.మేలుకొని యుండువాడు, 2.స్థిరుడు. 
స్థిరుఁడు - శని Saturn. తిరుడు - స్థిరుడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn). 

స్థిరవారము - శనివారము Saturday.
శనివారము - ఏడవ వారము (ఇది ఆదివారము మొదలుకొని).

స్థిరపద దాయక సురవర నాయక
నిరసితసాయక నిరుపమ గాయక | ||శరవణభవ||

బుద్ధుఁడు - 1.బుద్ధదేవుడు, 2.విద్వాంసుడు.
బుద్ధః సర్వం క్షణికం బద్ధ్యతే బుద్ధః - సమస్తమును క్షణికముగా దలంచువాఁడు.
బుద్ధ అవగమనే, ప్రశస్తా బుద్ధిర్యస్య సః బుద్ధః - మంచి బుద్ధి గలవాఁడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

ధీమంతుఁడు - 1.బుద్ధిమంతుడు, 2.విద్వాంసుడు.    
ధీః - బుద్ధి.
ధ్యాయం త్యనేయేతి ధీః, ఈ. సీ. ధ్యై చింతాయాం. - దీనిచేత ధ్యానము చేయుదురు.
ధీంద్రియము - (ధీ+ఇంద్రియము) జ్ఞానేద్రియము.

ధారణ - 1.భగవంతునం దేకాగ్ర చిత్తము, 2.మేర, 3.వస్తునియమము, 4.జ్ఞాపకశక్తి.
ధారణశక్తి - (భౌతి.) అయస్కాంత శక్తిని నిలుపు కొనగలిగిన శక్తి (Retentivity).  

మేధ - ధారణాశక్తి గల బుద్ధి.

ధీ ర్ధారణావతీ మేధా -
మేధతే అనుభూతం సర్వమస్యామితి మేధా, మేధృ సంగమే. - అనుభూతమైనవన్నియు దీనియందు సంగతములై యుండును. ఈ ఒకటి ధారణాశక్తి గలిగిన బుద్ధి పేరు.

ధీరుఁడు - విద్వాంసుడు, విణ.1.ధైర్యము గలవాడు, 2.స్వాతంత్యము కలవాడు.  
ప్రశస్తాం ధియం రాతీతి ధీరః, రా ఆదానే. - మంచి బుద్ధి నిగ్రహించువాఁడు.
ధీర - 1.వ్యంగముగా కోపప్రకాశము చేయునాయిక, 2.ధీరురాలు.
ధీరధీర - వ్యంగ్యవ్యంగముగా కోప ప్రకాశముచేయు నాయిక.

గాళకుఁడు - 1.ధీరుడు, 2.ప్రౌఢుడు.     

ధీరోదత్త గుణోత్తర జిత్వర
ధీరోపాసిత విత్తమహత్తర| ||శరవణభవ||

మూలే పుష్కర కాశ్మీర పద్మపత్రాణి పొష్కరే,
పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర, 3. ఆకాశము Sky, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
స్థలపద్మినీ మూలత్వేన పుష్కరస్య మూల మిదం పుష్కరం. - నేలతామర దుంప.
కాశ్మీరము - 1.కుంకుమపూవు, 2.మెట్ట తామరదుంప, 3.కాశ్మీరదేశము.
కాశ్మీరదేశే భవం కాశ్మీరం - కాశ్మీరదేశమందుఁ బుట్టినది. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం| 
పద్మస్యేవ పత్రాణ్యస్య పద్మపత్రం - తామర పాకులవంటి ఆకులు గలది.  ఈ 3 పుష్కరమూలము పేర్లు. కాశ్మీరదేశము నందలి మెట్టతామరదుంప.

తమ్మిదీవి - పుష్కరద్వీపము.
పుష్కరము -  1.మెట్ట తామర దుంప, 2.తామర 3. ఆకాశము, 4.నీరు, 5.తొండము చివర, 6.ఒక ద్వీపము, 7.పండెండేండ్ల కొకసారి వచ్చు జీవనదుల పండుగ.
శ్రాన్తం పుష్ణాతీతి పుష్కరం, పుక్ష పుష్టౌ. - బదలినవానిని బోషించునది(తామర). 
పుష్పత్యవకాశమితి పుష్కరం, పుష పుష్టౌ - అవకాశమును పొషించునది. 
పుష్కముదకం రాతీతి వారాదనే - ఉదకము నిచ్చునది(ఆకాశము).
పోషయతీతి పుష్కరం, పుష పుష్టౌ. - పోషించునది(నీరు). పుష్కరమునందు పురుహూత|   

తిరుకొలను - పుష్కరిణి, కోనేరు.
కట్టుదొన - కోనేరు. కట్టుకొన - కోనేరు.
తిరు - శ్రీ పదము, పూజ్యమైన, సం.శ్రీః. 

పుష్కరిణ్యాం తు ఖాతం స్యాత్ -
పుష్కరిణి - 1.తామరకొలను, కోనేరు, 2.ఆడేనుగు.
పుష్కరం జలం తద్యోగాత్పుష్కరిణీ, ఈ. సీ. పుష్కరమనఁగా అది కలిగినది.
కోనేఱు - (కోన+ఏఱు) చుట్టును మెట్లు గల నలుచదరపు గుంట పుష్కరిణి. 

ఖాతకుఁడు - 1.అప్పు పడినవాడు, 2.త్రవ్వెడువాడు.
ఖాతము - 1.గాతము, 2.అగడ్త, 3.పుష్కరిణి. ఖన్యత ఇతి ఖాతం, ఖను అవదారణే. - త్రవ్వఁబడునది. ఈ 2 నలుచదరముగాఁ ద్రవ్వఁబడిన బావి పేర్లు.
గాతము - పల్లము, గుంత, సం.ఖాతమ్. 
ఖేయము - 1.అగడ్త, 2.ఆనకట్ట, సేతువు, విణ.త్రవ్వదగినది.

నిఘాతము - త్రవ్వబడినది.
నిఖాతకము - (జం.) భూమి నుండి త్రవ్వి యెత్తబడినరాయి, లేక ఖనిజము, రాళ్ళలో నిక్షిప్తమై యున్న పూర్వజీవి యొక్క అంశము (Fossil).   

గండూషము - 1.పుక్కిలింత, 2.పుడిసిలి, 3.ఏనుగు తొండము చివర, 4.పుక్కిట పట్టిన నీరు.
కొణిదిలి - పుడిసిలి. చేర - చాచిన అరచేయి, పుడిసిలి.
కమి - 1.పంపబడిన వ్రేళ్ళుగల పుడిసిలి(కమికిలి), 2.కబళనము, 3.తృప్తి.
కమికిలి - పంపబడిన వ్రేల్ళుగల పుడిసిలి. కబళము - ముద్ద, కడి, గ్రాసము.

అరదేశి - 1.పరదేశి, 2.యాత్రికుడు.
అతిథి - 1.భోజన సమయమునకు వచ్చు పరదేశి, 2.అహుతుడు, 3.కుశుని కొడుకు.
అతతి సతతం గచ్ఛతీ త్యతిథిః, ఈ. పు. అత సాతత్యగమనే. - ఎప్పుడు తిరుగువాఁడు.

ఆపోశనము - ఆపోసనము, రూ.ఆపోశానము.
అపొసనము - భోజనమునకు ముందు వెనుకల పుడిసితిలో నీరుపోసికొని మంత్ర పూర్వకముగ పుచ్చుకొనుట, శుద్ధాచమానము, రూ.ఆపోసనము, సం.ఆపోశనమ్.
ఆపోక - ఆపోవుట, తనివి, తృప్తి.

భక్షక కణములు - (జం.) శ్వేత కణములు (Phagocytes) సూక్ష్మజీవులు తినివేయు జీవకణములు (Leucocytes).

భక్షణము - తిండి.
భక్ష్యము - భక్షణీయము, తినుబండము (పంచభక్ష్యములు:- భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయము.) 

అతిధౌతిష్టతిద్వారే హ్యోసొ గృహ్ణాతియోనరః|
ఆపోశసం సురాపానం - అన్నంగోమాంస భక్షణమ్|

తా. వాకిటనున్న అతిథి - 1.భోజన సమయము నకు వచ్చు పరదేశి, 2.ఆహుతుడు, 3.కుశుని కొడుకు.)ని విడిచి ఆపోశనము బుచ్చుకొన్న యెడల నాయాపోశనము సురాపానమును అన్నము - కూడు, బువ్వ, విణ.తినబడినది.) గోమాంస భక్షణ సమానము. - నీతిశాస్త్రము

పాతకము - మహాపాపము (పంచ మహా పాతకములు : స్వర్ణస్తేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గమనము, ఇవి చేయువారి తోడి సహవాసము).

పుష్కరమాలా వాసిత విగ్రహ
పుణ్యపరాయణ విహితపరిగ్రహ| ||శరవణభవ||

సంద్రుఁడు - సముద్రుడు, సం.సముద్రః.
సంద్రము - సందరము, సం.సముద్రః.
సందరము - సముద్రము, మున్నీరు, రూ.సంద్రము, సం.సముద్రః.

సముద్రము - సాగరము.
సమ్యగునక్తి చంద్రోదయాదితి సముద్రః, ఉదీ క్లేదనే. - చంద్రోదయమువలన మిక్కిలి క్లేదమును బొందునది, అనఁగా వృద్ధిఁ బొందునది.
సమంతాన్ముదం రాతీతి వా సముద్రః, రా దానే. - అంతట సంతోషము నిచ్చునది.
ముద్రయా సహితస్సముద్రః - ఈశ్వరాజ్ఞతోఁ గూడుకొనియుండునది.

మున్నీరు - (మును+నీరు) సముద్రము.
మున్నీటిచూలి - క్షిరసాగర కన్యక, లక్ష్మి.
క్షీరాబ్ధేస్తనయా క్షీరాబ్ధితనయా - పాలకడలి కూఁతురు. రమత ఇతి రమా - క్రీడించునది, రము క్రీడాయామ్.  

శ్రీ - 1.లక్ష్మి, 2.సంపద, ఐశ్వర్యము, 3.కాంతి, 4.అలంకారము, 5.విషము.
శ్రీః, ఈసీ, శ్రయతి హరిమితి శ్రీః - విష్ణువు నాశ్రయించునది, శ్రిఞ్ సేవాయాం. 

విషము - 1.గరళము, 2.జలము.
దేహం వేవేష్టీతి విషం, విష్ ఌ వ్యాప్తౌ. - దేహమును వ్యాపించునది.

విష మప్సు చ,
విషశబ్దము నీళ్ళకును, చకారమువలన విషమునకును పేరు.
వేవేష్టీతి విషయం, విష్ ఌ వ్యాప్తౌ. - వ్యాపించునది.

సముద్ర మథనే లేభే హరిర్లక్ష్మీం హరోవిషమ్|
భాగ్యం ఫలతి సర్వత్రన విద్యానచ పౌరుషమ్||
తా.
సముద్రమును మధించినపుడు విష్ణువు(హరి) లక్ష్మీదేవిని, హరుఁడు - శివుడు విషంబును      (బొ)పొందిరి. గాన వారివారి భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.)భాగ్యాసు సారముగా ఫలంబు గలుగును. - నీతిశాస్త్రము

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము. (Property)

పద్మే పద్మాలయే పద్మ పూర్ణ కుంభాభిషేచితే,
ఇందిరేందిందిరాభాక్షీ క్షీరసాగర కన్యకే|

అబ్ధి - 1.సముద్రము, 2.సరస్సు, 3.(గణి.) నాల్గవ సంఖ్య. 
ఆపః ధీయంతే అస్మిన్నిత్యబ్ధిః. ఇ. పు. డుధాఞ్ ధారణపోషణయోః - జలములు దీనియందు ధరింపఁబడును.

అబ్ధిభవే త్రిషు సముద్రియమ్,
సముద్రే భవం సముద్రియం, అ. త్రి. - సముద్ర మందుఁ బుట్టినది.
సముద్రియా ఆపః; సముద్రియో ముక్తామణిః సముద్రియం లవణం. అని మూఁడు లింగములయందును వర్తించును. ఈ ఒకటి సముద్రమునఁ బుట్టిన వస్తువు పేరు.

అబ్దిజ - 1.లక్ష్మీదేవి, 2.మద్యము, విణ.సముద్రమున బుట్టినది.

మాధ్వి - 1.మద్యము, 2.మకరందము.

అబ్దిపల్లవము - పగడము.   

అబ్దిమేఖల - భూమి, వ్యు.సముద్రమే మొలనూలుగా గలది.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె (Heart).
హ్రియతే విషయైరితి హృద్యం, హృచ్ఛ, ద. స. హృఞ్ హరణే - విషయాదులచేత హరింపఁ బడునది, మనస్సు.
హ్రియత ఇతి హృదయం హృచ్చ. ద. స. హృఞ్ హరణే. - హరింప బడునది.   
హృది ప్రాణః - ప్రాణము హృదయము నందుండి గర్భమునం(దన్నా)అన్నాదులఁ బ్రవేశింపఁజేయు చుండును.
డెందము - హృదయము.
హృదయ స్పందనము - (గృహ.) గుండెకొట్టు కొనుట (Heart beat).

అనైచ్చిక కండరములు - (జం.) అనిచ్ఛాపూర్వకముగ పనిచేయు కండరములు (Involuntary muscles), ఉదా. గుండెకాయ, పేగులయొక్క కండరములు.

ధరము - 1.కొండ, 2.వెల.
ధరతి భువం ధరః. ధృఞ్ ధరణే. - భూమిని ధరించునది.
ధరాధరము - 1.కొండ, 2.తాబేలు.
కొండ - మల, పర్వతము.  
మల - పర్వతము, త. మలై.
పర్వాణి సంధయో (అ)స్య పర్వతః - సంధులు గలిగినది.
అకూపారము - మేరలేనిది, 1.సముద్రము, 2.ఆదికూర్మము.
మర్యాదయా న కుం పృథివీం పృణాతీత్యకూపారః. వౄ పాలన పూరనయోః - మర్యాదచేతను భూమిని నింపనిది.
అకుత్సితం పారమన్య అకూపారః - కుత్సితము గాని దరిగలిగినది.
అవిద్యమానా కుః పృథ్వీ పారే (అ)స్యేతి వా అకూపారః - దీని అవలి దరియందు భూమి లేదు. 

పారావారము - 1.ఈవలిదరులు, 2.సముద్రము.    
పారమావృణోతి పారావారః వృఞ్ వరనే. - దరిని గప్పునది, అనఁగాఁ దరిలేని దనుట.
పా. పార మపారమస్య పారావారః. - అపారమైన తీరము గలిగినది.
"సతమాస్సత మాలతయా పారాపారాయ యస్సదా వోదావ" ఇతి హరి ప్రబోధే సందిష్టయమకం.
సముద్రతీరమునందు పారవార|    

పారావారే పరార్వాచీ తీరే -
పరంచ అర్వాక్చ పరార్వాచీ, తే తీరే పారావారే ఇత్యుచ్యేతే. - పార అవారశబ్దములు వరుసగా, ఈవలిదరికిని ఆవలిదరికిని పేర్లు. 
పారము - 1.అవతలిదరి, 2.సమీపము. 
పార్యతే తరణకర్మాత్ర పారం - దీనియందు దాఁటెడు వ్యాపారము ముగియును. 
న విద్యతే వాః జల మత్ర అవారం - దీనియందు జలము లేదు. పా. అపారమిత్యపి పారముగానిది అపారము.

అపారము - ఈవలిదరి, విణ.దరిలేనిది.
అవారి - 1.అధికము, 2.అడ్దులేనిది, రూ.అవ్వారి, సం.అపారమ్.
అవ్వారి - అవారి.

సమీపము - చేరువ.
సంగతా ఆపో (అ)స్మిన్నితి సమీపః - సమగతమైన జలమును గలది, లక్షణచేత సమీపమందు వర్తించును.
సమీపించు - చేరవచ్చు.

కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
అరవ - 1.తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.    

ద్రవిడము - 1.దక్షిణదేశము, 2.దక్షిణదేశ భాష, రూ.ద్రావిడము.
ద్రావయతి రోగాన్ ద్రావిడకః, ద్రు గతిహింసా కౌటిల్యేషు. - రోగములను సంహరించునది.
ప్రాయోద్రవిడదేశే భవతీతి ద్రావిడకః - తఱచుగా ద్రవిడదేశమందుఁ బుట్టినది.  
ద్రవిణము - 1.ధనము, 2.బంగారు, 3.బలము.
ద్రవతి గచ్ఛతీతి ద్రవిణం, ద్రు గతౌ. - వెచ్చ పోవునది.
త్రాణ - 1.ద్రవిణము, 2.బలము, 3.సత్తువ, సం.ద్రవిణమ్.
ద్రవత్యనేన శత్రుం ప్రతి ద్రవిణం, ద్రుగతౌ. - దీనిచేత శత్రువును గూర్చి పోవును.
అఱవము - ద్రవిడభాష.

ద్రవిణం తు బలం ధనమ్,
ద్రవిణశబ్దము బలిమికిని, ధనమునకును పేరు. ద్రవంత్య సేన, ద్రవతీతి చ ద్రవిణం, ద్రు గతౌ. దీనిచేత యుద్ధాదులకుఁ బోవుదురు గనుకను, కరఁగునది గనుకను ద్రవిణము.

ద్రావణీయము - కరగునట్టిది (Soluble). 

ద్రావిడ ప్రాణాయామము - జాతీ. 1.సులభముగా కానిపని, 2.సూటిగా చెప్పక డొంకతిరుగుడుగా చెప్పుట. 

ఆస్వాదనము - 1.అనుభవించుట, 2.చవిచూచుట, రూ.ఆస్వదనము.

ప్రోఢ - 1.ప్రౌఢ స్త్రీ, 2.ప్రౌఢుడు, 3.నిపుణుడు, 4.ఉపాయశాలి, సం.1.ప్రౌఢా, 2.ప్రౌఢః.
ప్రౌఢ - పదునెనిమిదేండ్లకు పైబడిన వయస్సుతోడి సంపూర్ణ యౌవనముగలది.
ప్రోఢము - 1.పెరిగినది, 2.వయస్సు వచ్చినది, 3.నేర్పుగలది.
ప్రౌఢి - 1.సామర్థ్యము, 2.నేర్పు, 3.వృద్ధి, 4.గర్వము.
సామర్థ్యము - 1.నేర్పు, 2.యోగ్యత, అర్హత (భౌతి.) పనిచేయు రేటు, (Power) (గృహ.) బలము, సత్తువ.   

ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు. 
నితరాం పుణతి శుభకర్మ కరోతీతి నిపుణః, పుణ శుభకర్మణి - మిక్కిలి శుభకర్మమును జేయువాఁడు.
నిపుణత - కౌశలము, నేర్పరితనము (Skill). 
కౌశలము - 1.నేర్పరితనము, 2.క్షేమము.
క్షేమము - కలిగిన శుభము చెడకుండుట, వికృ.సేమము.
క్షిణోత్యశుభమితి క్షేమం, ప్న, క్షిణుహింసాయాం - అశుభమును బోఁగొట్టునది.
క్షియతి వసత్యస్మిన్ గన్ధ ఇతి క్షేమః క్షినివాసగత్యోః. - గంధము దీనియం దుండును.

ఆత్మప్రాగల్భ్యము - 1.తన సామర్థ్యమును నిరూపించుకొనుట, 2.మాట నిలబెట్టుకొన ప్రయత్నించుట (Self-assertion). 

తవస్తన్యం మన్యే - ధరణిధరకన్యే! హృదయతః
పయఃపారావారః - పరివహతి సారస్వత మివ|
దయావత్యాదత్తం - ద్రవిడశిశు రాస్వాద్య తవ యత్
కవీనాం ప్రౌఢానా - మజని కమనీయః కవయితా|| - 75శ్లో

తా. ఓ పర్వతపుత్రీ! తల్లీ! కారుణ్యముతో నీ విచ్చిన దత్తము - ఇయ్యబడినది పాలను ద్రవిడ శిశువు(శ్రీ శంకర భగత్పాదులు)త్రావి గొప్ప కవులకును కమనీయము - మనోహరమైనది) కవిత్వము చెప్పెను. ద్రవిడ శిశువు ప్రౌఢ కవులతో జగన్మోహనుడైన కవిగా నెట్లయ్యెను? నీ స్తన్యము - చనుపాలు హృదయము నుండి క్షీరసముద్రము వలె సారస్వతము - సరస్వతీ సంబంధమైనది, వి.1.వాఙ్మయము, 2.భాష.)విరివిగ ప్రవహింప చేయుచున్నది. - సౌందర్యలహరి

దద్యద్దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్ అకించనవిహంగశిశౌ విషణ్ణే|
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయనీ నయనాంబువాహః| - 9

కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం స పతతి శోకే |
పారావారవిహారిణి గఙ్గే విముఖయువతి కృత తరళాపాఙ్గే || 

చతుర్భుజుఁడు - విష్ణువు, ఉడ్డకేలు వేలుపు.
చతుర్భుజః చత్వారో భుజా యస్యసః - నాలుగు భుజములు గలవాఁడు.
ఉడ్డకేలు వేలుపు - చతుర్భుజుడు, విష్ణువు.

ఉడ్డ - 1.నాలుగు, 2.రాశి, రూ.ఉడ్డా.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
(ౘ)చౌ - నాలుగు, రూ.చవు, (చౌకమునకు సమాంతరగత రూపము) సం.చతుః.

రాశి - 1.రాసి 2.నికాయము(నికాయము - 1.గుంపు 2.ఇల్లు 3.తెగ) సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమాణము, మొత్తము (గణి.) సంభావించుట కనువైన విషయము వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. 

ద్వౌరాశీ పుఞ్జ మేషాద్వౌ : రాశి శబ్దము ప్రోగునకును, మేషము వృషభము మొదలైన ద్వాదశ రాసులకును పేరు.
అశ్నుత ఇతి రాశిః. అశూ వ్యాప్తౌ. - వ్యాపించునది.

నలు - సమాసమందు నాలుగునకు వచ్చు రూపము, (నలుమోములు).
నలుగడ - నాలుగు ప్రక్కలు.

ఉడ్డమోము వేలుపు - నలువ, బ్రహ్మ.
నలువ - బ్రహ్మ, చతుర్ముఖుడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు :- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, చక్షువు, వసిష్ఠుడు, మరీచి).

నాలుగు కన్నుల వేలుపు - అగ్ని.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
నాల్గునేత్రములు రెంటికన్న బాగా చూడగలవు.

చతుష్టయము - నాలుగు, నలుగురు, 2.(వృక్ష.) సూక్ష్మబీజాణు మాతృకోశిలలో ఏర్పడు నాలుగు (పుప్పొడి రేణువులు) కణములు, (Tetrad) (ఇట్లే స్థూల బీజాణు మాతృకోశికలో గూడ నాలుగు జీవకణములు ఏర్పడును.)

తిగవంచ - నాలుగు.
నాలుగు - మూడునొకటి, రూ.నాలువు, నాల్గు.
ఇద్దుగ - (ఇరు+దుగ) పాచికమీది రెండు బొట్లజత, నాలుగు.
అడ్డ - 1.గుంటక మొ.ని దిండువంటి కొయ్య, 2.కుంచములో సగము, ఆ కొలత పాత్ర, 3.నాలుగు.

4. చతుర్థి - 1.పక్షమున నాల్గవ దినము, చవితి 2.నాల్గవది. 
(ౘ)చౌతి  -
చతుర్ధి, పక్షమందు నాల్గవ తిధి  రూ.చవుతి.
(ౘ)చౌ - నాలుగు, రూ.చవు, (చౌకమునకు సమాంతర్గత రూపము) సం.చతుః.

కూష్మాండేతీ చతుర్థకీ; చతుర్థం హంసవాహనా|

(ౘ)చౌకి - పన్నులు వసూలు చేసెడిచోటు, సుంకరిమెట్టు, రూ.చవుకి, సం.చతుష్కమ్.
(ౘ)చౌసాల - చతుశ్శాల, నడుమ బయలును నాలుగు ప్రక్కలును గల ఇల్లు, రూ.చవుసాల.

కొల్లారము - చతుశ్శాల నడుమ బయలును నాలుగుప్రక్కల కట్టడమును గల యిల్లు, రూ.కొలారము, కొల్లారు. 

చతుష్కము - 1.చదుకము, 2.చవిక, నాల్గు.
ౘదుకము - 1.చతుష్కము, నాలుగు దారులు కలియుచోటు, 2.శృంగాటకము.
ౘవికె - చతుష్కి, మండపము, రూ.చవిక, చవికము. 
(ౘ)చౌకము - 1.చతుష్కము, నాలుగు, 2.చదరముగ నుండు తుండుగుడ్డ, రూ.చవుకము, సం.చతుష్కమ్.       

శృఙ్గాటక చతుష్పథే,
శృంగాటకము - చదుకము, నాలుగు త్రోవల కూడలి.
శృంగైరటంస్మిన్నితి శృంగాటకం, అటపట గతౌ. - కొమ్మలచేత దీని యందుఁ గ్రీడింతురు.
చతుష్పథము - 1.చదుకము, నాలుగు కాళ్ళ జంతువు, రూ.చతుష్పాత్తు, చతిష్పదము.
చతుర్ణాం పథాం సమాహార శ్చతుర్ప్పథం. - నాలుగు తెరువులు గూడినది. ఈ 2 నాలుగు త్రోవలుగూడిన చోటు పేర్లు.

చతుష్పాద - 1.చతుష్పదము, 2.నాలుగు కాళ్ళ జంతువు.
పశువు - చతుష్పాదము, గొడ్డు.

స్వస్తికము - 1.చదుకము, 2.మంగళ వస్తువు(స్వస్తి - శుభము), 3.పాముపడగ మీది నల్లనిరేఖ, 4.ఒక గుర్తు.

చతురశ్రాసనారూఢ శ్చతురో దివ్యవాహనః,
వివస్వన్మణ్డలాజ్ఞేయవాసో వసుసమృద్ధిదః.

పద్మనాభుఁడు - విష్ణువు.
పద్మనాభః పద్మం నాభౌ యస్యసః - పద్మము నాభియందు గలవాఁడు.

పద్మాలయ - లక్ష్మి.
పద్మలయా, పద్మ మాలయో యస్యాస్సా - పద్మమే ఇల్లుగాఁగలది.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
పద్యతే త్ర లక్ష్మీరితి పద్మం. అ. ప్న. పద్మగతౌ. - దీనియందు లక్ష్మి పొందును. ఇది వికల్పమునఁ బుంలింగంబును గలదు.
పద్యత ఇతి ఫద్మః, పద గతౌ సేవాయాం చ - సేవింపఁబడునది(నిధి).

పద్మవ్యూహము - పద్మాకారముగ యుద్ధములో పన్ను మొగ్గరము.                   

పద్మి - ఏనుగు, హస్తి, వ్యు.మొగమున మచ్చలు హలది.
పద్మం బిందుజాలక మస్త్యాస్తీతి పద్మీ, న. పు. - పద్మమనఁగా దేహమందలి బొట్లు; అవి గలిగినది.

పద్మక, బిన్దుజాలకమ్,
పద్మవర్ణసామ్యాత్ పద్మకం. - పద్మమువన్నె గలది. ఈ ఒకటి ఏనుఁగునకు యౌవనమందు దేహమునఁ బుట్టిన బొట్లు, ఏనుఁగు సిబ్బెము.

తమ్మియింటి గరిత - లక్ష్మి, పద్మాలయ. 
గరిత - 1.ఇల్లాలు, 2.పతివ్రత, 3.స్త్రీ, రూ.గర్త, సం.గృహస్థా.
తమ్మికంటి - 1.స్త్రీ, 2.విష్ణువు.
తోయజాక్షి - తమ్మికంటి.  
తమ్మి - 1.తామరసము, 2.పద్మము, 3.పద్మవ్యూహము, రూ.తామర, సం.తామరసమ్.
తమ్మిదొర - సూర్యుడు Sun.
తామరచెలి - సూర్యుడు, పద్మమిత్రుడు.
తామర - తామరసము, పద్మము, రూ.తమ్మి, వి.చర్మరోగము, (Ring worm). (ఇది చర్మమును శుభ్రముగా నుంచని యెడల ఏర్పడు  అంటువ్యాధి.)
తమ్మిపగతుఁడు - చంద్రుడు Moon.

పద్మసంభవభూతేస ముని సంస్తుత కీర్తయే,
నమో మార్తాండవంశాయ రామా…..

  
తమ్మిచూలి - బ్రహ్మ, తమ్మియందు పుట్టినవాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొం దిం చు వా డు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).  

పద్మాకర స్తటాకో (అ)స్త్రీ -
పద్మాకారము - కొలను. 
పద్మానాం ఆకరః పద్మాకరః - పద్మములకు ఉనికిపట్టు.
తటాకము - చెరువు, రూ.తటాగము.
చెఱువు - తటాకము.
తటాన్యకతీతి తటాకః, అ. ప్న. అక అగ కుటిలాయాం గతౌ. - గట్టును కుటిలముగాఁ బొందియుండునది.
పా, తడతీతి తడాగః, తడ అఘాతే. - గట్టును గొట్టునది. ఈ 2 తామరలుగల చెఱువు పేర్లు.
కొలను - కొలఁకు; కొలఁకు - సరస్సు, చెరవు, రూ.కొలను, సం.కూలమ్.

గుండ - 1.పల్లము, 2.చెరువు, సం.కుండమ్, మాం. (విశాఖపట్టన ప్రాంతమున) బాలిక.
చిన్నది - బాలిక, విణ.చిన్నయైనది (వస్తువు).

నిమ్నం గభీరం గమ్భీరమ్ :
నిమ్నము - పల్లము, విణ.లోతైనది, విణ.(వృక్ష.)అధస్ద్సితము (Inferior).
ఖననాయ నితరాం మ్నాయతే అభ్యన్యత ఇతి నిమ్నం. మ్నా అభ్యాసే - త్రవ్వుటకు మిక్కిలి యభ్యసింపఁబడునది.
గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యము కానిది, 3.మంద్రమైనది(స్వరము), విణ.గంభీరము.
గమనే భియం రాతీతి గభీరం, గంభీరమ చ. రా దేనే - చొచ్చునపుడు మిక్కిలి భయము నిచ్చునది. ఈ మూడు 3 లోఁతైనదాని పేర్లు.  

గంభీరము - 1.లోతుగలది, 2.దురవగాహము, 3.మంద్రము.
మంధ్రము - గం భీ ర మై న ది, (స్వరము).

నిమ్నోన్నత రేఖలు - (భూగో.) సముద్రమునకు పైని ఒకే ఎత్తున ఉన్న ప్రదేశముల నన్నిటిని కలుపు ఊహారేఖలు.

ఒడిపి - గండి, రంధ్రము.
గండి1 - 1.బిలము, 2.సందు, 2.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారు నపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కందము.

సత్త్వము - 1.సత్త, బలము, 2.స్వభావము, 3.ఒక గుణము, 4.జంతువు.
సత్త్వము -
(రసా.) ఒక వస్తువు యొక్క పనిచేయగలసారము (Active principle).
కట్టు - 1.చోటు, 2.తొట్టికట్టు, 3.కట్టుబాటు, 4.నిర్భంధము, 5.బంధము, 6.పొల్ల, బొత్తిగా గింజపట్టని ధాన్యము, 7.ఉడికిన కందిపప్పు మొ.ని రసము, క్రి.1.తయారుచేయు, 2.బంధించు, 3.ధరించు, 4.జంతువులు గర్భము ధరించు.
కట్టుదిట్టము - కట్టుబాటు.

ఒడిపి - గండి, రంధ్రము.
గండి1 - 1.బిలము, 2.సందు, 2.నీళ్ళధికముగా వచ్చుటచేత తెగిన చెరువుకట్ట సందు, 4.నది పర్వతముపై వడిగా పారు నపుడు ప్రవాహవేగముచే రెండుగా కోయబడిన పర్వతభాగము.
గండి2 - చెట్టుబోదె, స్కందము.

ఘనబల సత్త్వమచ్చువడ గల్గిన వానికి హాని లేనిచోఁ
దనదగు సత్త్వమే చెఱుచుఁదన్ను నదెట్లన? నీరులాపుగాఁ
గనుపసియించినన్ చెఱువుకట్టకు సత్త్వము చాలకున్నచోఁ
గనుములు పెట్టి నట్టనడిగకడితె గండకన్నె, భాస్కరా.

తా.  భాస్కరా ! చెరువు గట్టు బలము గలదిగా నున్నను ఆ చెరువు నిండా నీరు వచ్చి పడినప్పుడు దాని సందుల ద్వారా గాని, మధ్యకు గట్టు తెగినగాని ఆ నీరు పోవును. అట్లే ఎంత గొప్ప బలము కల వానికైనను ఇతరులచే హాని - 1.తక్కువగుట, 2.కీడు.)సంభవింపక పోయినను, తన, బలమే తుదకు నశింపఁజేసిన దగును.    

పద్మనాభుఁడ వని నిన్నుఁ బల్కినాను
గట్టితనమేల మానరా కట్టులేదె
పలుకుపలుకున నగు కట్టుబాటు లరసి
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ | 

పద్మనాభో(అ)రవిందాక్షః పద్మగర్భ శరీరభృత్,
మహర్థిః ఋథ్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః| - 38స్తో  

పద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర.
పద్మ మస్యా కరే (అ)స్తీతి పద్మా - పద్మము హస్తమందు గలది.
పద్మము - 1.తామర, 2.ఒక నిధి, 3.ఒక వ్యూహము, 4.ఏనుగు, ముఖము పై గల చుక్కలు.
పద్యతే త్ర లక్ష్మీరితి పద్మం. అ. ప్న. పద్మగతౌ. - దీనియందు లక్ష్మి పొందును. ఇది వికల్పమునఁ బుంలింగంబును గలదు.
పద్యత ఇతి ఫద్మః, పద గతౌ సేవాయాం చ - సేవింపఁబడునది(నిధి).

పద్మరాగము - మాణిక్యము (ఉత్తమ జాతి రత్నము).
పద్మవద్రాగో యస్య పద్మరాగః - తామరపువ్వువంటి యెఱుపుగలది.
మాణిక్యము - కెంపు.   
తమ్మికెంపు - పద్మరాగము, వ్యు.తమ్మివంటి కెంపు ఎరుపు కలది.
కెంపు - 1.పద్మరాగమణి, 2.ఎఱుపు, విణ.ఎఱ్ఱనిది.

రత్నము - 1.మణి, 2.స్వజాతియందు శ్రేష్టమైనది (నవరత్నములు:- మౌక్తికము, పద్మరాగము, వజ్రము, ప్రవాళము, మరకతము, నీలము, గోమేధికము, పుష్యరాగము, వైడూర్యము.)

పద్మాసనము - ఆసనములలో నొకటి.
బాసికపట్టు
- పద్మాసనము, (వ్యావ.) బాసీపట్టు.

ఆసనము - 1.పీఠము, 2.దేశకాలాదులను పట్టి దండెత్తిపోక నిల్చియుండుట, (వ్యతి.) యానము, 3.యోగాసనము.

విస్తరము - 1.విరివి, 2.పీఠము, 3.సమూహము.

గద్దియ - 1.సింహాసనము, 2.పీఠము, 3.పువ్వులలోని దుద్దు, రూ.గద్దె, సం.ఖట్టికా, 4.బంగారునాణెము, వరహా, రూ.గద్దె, సం.గద్యాణమ్.
పీఠము - 1.ఇల్లు కట్టుటకు వేసిన పునాది స్థానము (Plinth), 2.పీట.     
పీఁఠవెట్టు - క్రి.లేవక యొక చోటనే నాదుకొని యుండు.
పీఠ మాసనమ్,
పీఠ్యతే సంశ్లిష్యతే పీఠం, పీఠ సంశ్లేషణే. - పొందఁబడునది.
ఆసనము - 1.పీఠము, 2.దేశకాలాదులను పట్టి దండెత్తిపోక నిల్చియుండుట, (వ్య.) యానము, 3.యోగాసనము. 
ఉపవేశము - 1.ఆసనము, 2.కూర్చుండుట. 
ఆస్తే (అ)త్రేత్యాసనం, ఆస ఉపవేశనే. - దీనియందుఁ గూర్చుందురు. ఈ 2 పీఁట పేర్లు.

ఆసనాస్థి - (జం.) తుంటి ఎముకలలో ఒకటి (Ischium).

పీఠసంయోగము - (వృక్ష.) ఒక గది మాత్రమే గల అండాశయములో క్రింది భాగమున పుష్పాసనము పై నేర్పడిన జరాయువు మీద నొకబీజాండ ముండు స్థితి (Basal placentation).

ఉపాసనము - 1.సేవ, 2.చింతనము, 3.పూజ, 4.శరాభ్యాసము, 5.చిన్నపీట. పట్టుచీర ఎరువిచ్చి, పీటపట్టుకొని కూడా తిరిగిందిట.   

సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group). 

ఉపోత్ఘాతము - 1.పీఠిక, 2.ఆరంభము.
ఉప సమీపే ఉద్ద్న్యత ఇత్యుపోద్ఘాతః, ఉపోత్పూర్వో హన హింసాగత్యోరితి ధతుః - మిక్కిలి సమీపము నందెఱుఁగఁ జేయఁబడునది.
అవతారిక - పీఠిక. పీఠికాయాం పురూహూతికా శక్తిపీఠం| 
పీఠిక - 1.మేలైన పీఠము, 2.గ్రంథ ప్రారంభమున వ్రాయు ఉపోత్ఘాతము.

ముక్కలిపీఁట - మూడుకాళ్ళపీట, రూ.ముక్కాలి పీఁట.

ఈరెండ - (ఈరు+ఎండ) కొంచెము ఫాటి ఎండ, లేత ఎండ, నీరెండ.

బాలాతపః ప్రేతధూమో వర్జ్య భిన్నం తథా సనం|  
వచ్ఛింద్యాన్నఖరోమాని దంతైర్నోత్పాట యే ర్నఖాన్||

తా. లేత యెండయును, ప్రేతము - 1.భూతము, 2.ఏనుగు.)మీది పొగయును, విఱిగిన ఆసనము - 1.పీఠము, 2.దేశకాలాదులను పట్టి దండెత్తిపోక నిల్చియుండుట (వ్యతి.) యావము, 3.యోగాసనము.)పీటయును వర్జింప దగును(విడువ దగినవి). నఖము గోళ్ళను, వెంట్రుకలను గిల్లరాదు, దంతము - పల్లు, కోర.)చేత గోళ్ళను గొఱుక(కొరక)రాదు. - నీతిశాస్త్రము   

నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్,
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్| 

ఆగమ నిగదిత మంగళ గుణగణ
ఆదిపురుష పురుహూత సుపూజిత |
||శరవణభవ||  

అచల - భూమి.
న చలతీత్యచలా, చల కంపనే. - చలింపనిది.
భూమిజ-సీత, వ్యు.భూమినుండి జన్మించినది. 
నేలచూఁలి - సీత, భూపుత్రి.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.  

అచలము - కొండ, విణ. కదలనిది.
న చలతీత్యచలః, చల కంపనే. - చలింపనిది.
కొండ - పర్వతము.
కొండ(ౘ)చూలి - పార్వతి.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ, సీ. - పర్వతమునకు గూతుఁరు.
కొండమల్లయ్య - శివుడు; కొండయల్లుఁడు - శివుడు.

కట్టుపకాసు - అచలుడు.
విలోమచలత్వము - (గణి.) రెండు రాసులు తమ గణన ఫలము అచలమగు నట్లు మారుచుండుట (Indirect Variation or Inverse Variation).

అచలోద్దృతిచంచత్కర భక్తానుగ్రహతత్త్పర నారాయణా|    

అచలసంధి - (జం.) కదలికకు వీలులేని ఎముకలసంధి, ఉదా. పుఱ్ఱెలోని ఎముకలు కదలని కీలు (Immovable joint).
కదలని కీళ్ళు - (జం.) కదల్చుటకు వీలుకాని కీళ్ళు, ఉదా. తల ఎముకలు (Immovable joints).

కొండఱేఁడు - హిమవంతుడు.
హైమవతి - 1.పార్వతి, 2.గంగ, 3.హిమవంతునిపుత్రిక.
హిమవత్ అపత్యం స్త్రీ హైమవతీ - హిమవంతుని కూతురు.
హిమవద్గిరౌ ప్రచురా హైమవతీ - హిమవత్పర్వత మందుఁ బ్రచురమైనది.
భవ్య - పార్వతి, హైమవతి.
విశాలాక్షి - హైమవతి, పార్వతి. వారణాశీ విశాలాక్షి శక్తిపీఠం| 

భవ్యము - 1.శుభమైనది, 2.యోగ్యమైనది, వి.ఎముక.

హరుఁడు - శివుడు.
హరతి ప్రళయే సర్వమితి హరః - ప్రళయకాలమున సర్వమును హరించువాఁడు.
భక్తానా మూర్తిం హరతీతి వా - భక్తులపీడను హరించువాఁడు. హృఞ్ హరణే.

అరతి - 1.విరక్తుడు, 2.సంతోషము లేనివాడు, వి.1.విషయములందు ఇష్టము లేమి, 2.అనురక్తి(అను రక్తి - అనురాగము, ప్రేమ)లేమి , 3.సంతోషము లేమి, 4.బాధ, 4. అరుచిని కలిగించు పిత్తరోగము, 6.క్రోధము, 7.(అలం.) మన్మథావస్థలు పదింటిలో నారవది (దేని యందు ఇష్టము లేకుండుట).

క్రోధము - 1.కోపము, రోషము, 2.రౌద్రరస స్థాయిభావము.
క్రోధేనం క్రోధః, క్రుధ క్రోధే - క్రోధించుట క్రోధము.
క్రుధతీతి క్రోధనః, క్రుధ క్రోథే - స్వభావముననే కోపించుకొనువాఁడు.
క్రోధన - అరువది సంవత్సరములలో ఏబది తొమ్మిదవది(59వ).
క్రోధి - అరువది సంవత్సరములలో ఒకటి.

హర త్యార్తిం చ లోకానాం యో వా మధు నిషూదనః,
నమోస్తు హరయే తుభ్యం రామా.....
   

మనసిజుఁడు - మన్మథుడు.
మనసి జాయత ఇతి మనసిజః - మనస్సునందుఁ బుట్టెడువాఁడు.
చేతోభవుఁడు - మన్మథుడు, మనసిజుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

ఆరు1 - 1.కలుగు, 2.నిండు, 3.ఒప్పు, 4.అతిశయిల్లు, వి.1.రొమ్ము నుండి నాభివరకు గల రోమావళి, నూగారు, 2.నింద, ఉదా. అరుసు, సోరుసు లేని సంసారము.
ఆరు2 - (వ్యవ.) గుంటకయను పనిముట్టులో ముఖ్యమైన భాగము (Blade).

హరక్రోధజ్వాలా - వళిభి రవలేఢేన వపుషా
గభీరే తే నాభీ - సరసి కృతసంగో మనసిజః|
సముత్తస్థౌ తస్మా - రచలతనయే! ధూమలతికా
జన స్తాం జానీతే - తవ జనని! రోమావళి రితి|| - 76శ్లో

తా. ఓ అచలతనయా! హరుని క్రోదాగ్ని జ్వాలా వళి - కడుపుమీద ముడుతచే ఆక్రమింపబడిన శరీరముతో మనసిజుఁడు - మన్మథుడు తన్ను తాను కాపాడుకొనుటకుగాను లోతైన గభీరము - 1.మిక్కిలిలోతైనది, 2.తెలియ శక్యముకానిది, 3.మంద్రమైనది(స్వరము), రూ.గంభీరము.)నీ నాభిసరస్సున చేరెను. కనుక జననీ! అందువలన మన్మథుని దేహబహిర్గతమైన ధూమ(లతిక-1.తీగ, 2.నూరు పేటల హారము.)జనులు నీ రోమావళిగా నెరుగుచున్నారు. - సౌందర్యలహరి   

హరనేత్రాగ్నిసందగ్ధ - కామసంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవకూటైక - స్వరూపముఖపంకజా.

హరసార సముద్భవ హైమవతీ |
కరపల్లవ లాలిత దివ్యతనో |
మురవైరి విరించి ముదంబునిధే |
పరిపాలయ తారకమారకమాం ||

సంకర్షనుఁడు - బలరాముడు.
శత్రూన్ ప్రళయే జనాన్వాసంకర్షతీతి సంకర్షణః - శత్రువులను లేక ప్రళయమందు సర్వజనులఁగాని సంహరించువాఁడు.

సీరపాణి - హలాయుధుడు, బలరాముడు.
సీరపాణిఁ ఇ-పు, సీరం లాంగులం పాణౌ యస్య సః - నాఁగేలు హస్తమందుఁ గలవాఁడు.
సీరి - సీరముకలవాడు, బలరాముడు. 
సీరము - నాగలి. 
సీయతే యుగేన సహ బద్ధ్యత ఇతి సీరం. షిఙ్ బంధనే. - కాఁడితోఁగూడఁ గట్టఁబడునది.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది.
కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
కాళవర్ణత్వాత్కాళీ - నీల వర్ణముగలది. 
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుఃఖేన గంతుం శక్యతే దుర్గా - కష్టముచే నెఱుగఁదగినది.
దుర్గం వనగిరిరూప మావాసోయ స్యా స్సా - వనాదిదుర్గము స్థానముగాఁ గలది.  

శ్యామ - 1.నడియౌవనముగల స్త్రీ, 2.యమున, 3.రేయి, 4.నల్లని స్త్రీ, 5.కాళికాదేవి, వికృ.చామ.
కృష్ణవర్ణత్వాత్ శ్యామా - నల్లనిది.

కాళింగము - ఏనుగు Elephant, విణ.కళింగ దేశమున పుట్టినది.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.
కర్షతి చిత్తమితి కృష్ణః, కృష విలేఖనే. - చిత్తము నాకర్షించునది.

కృష్ణసారము - నల్లయిఱ్ఱి.
కృష్ణేన నీలవర్ణేన సారః కృష్ణసారః - నల్లనివన్నె చేత శ్రేష్ఠమైనది, కృష్ణశారమని కొందఱు. నల్లకప్పున విచిత్రమైన యిఱ్ఱి.

కాళింది సూర్యతనయా యమునా శమన స్వసా:
కాళింది - యమునానది, శ్రీకృష్ణుని భార్య.
కళిందపర్వతాజ్ఞాతా కాళిందీ - కళింద పర్వతము వలనఁ బుట్టినది.
సూర్యతనయ - యమున, యముని తోబుట్టువు.
సూర్యస్య తనయా సూర్యతనయా - సూర్యుని కూఁతురు.
యమున - 1.యమునానది, 2.పార్వతి, వికృ.జమున.          
యమేన సహ జాతా యమునా - యమునితోఁ గూడఁ బుట్టినది.
శమనస్య యమస్య స్వసా శమనస్వసా - యముని చెల్లెలు.

కాళిందీ బోధసుఁడు - బలరాముడు.
కాళిందీం యమునాం హలేన భినత్తీతి కాళిందీ భేదనః : హలముచేతఁ కాళిందీ నదిని భేదించినవాడు.

దేవకీనన్దన శ్శ్రీశో నన్దగోప ప్రియాత్మజః,
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః|
 

మధుర - ఒక పట్టణము. ఉత్తర మధుర ఉత్తరప్రదేశ్. శ్రీకృష్ణ జన్మభూమి. యమునానది వర్షాకాలపు కొత్త నీటి పొంగు తగలి, అంతంత ఎత్తుకి ఎగిరెకెరటాలలో ఉరకలుపెడుతూ, కడు వడిగా ప్రవహిస్తూ ఉంది. వసుదేవుడు పసిగుడ్దు చిన్నికృష్ణునితో నదిలో దిగగానే (శ్రీకృష్ణుని పాదలు తగిలిన యమున పునీతమయింది) మోకాలి బంటి అయి దారియిచ్చి సహాయపడినది.

యమునాతీరవిహార ధృతకౌస్తుభ మణిహార నారాయణ| 

నందవ్రజశ్చ్యైవతే - నంద గోకులం.   శ్రీకృష్ణడు గోపికలతో కలసి జలక్రీడలు సలిపిన పవిత్రమైనది యమునానది. పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది తీరమున విహరించువాడు శ్రీకృష్ణుడు.  

జమునయ్య - సూర్యుడు Sun .
సూర్యుఁడు - వెలుగు రేడు. 
జమున - యమున.
యమున -  యమునానది, పార్వతి , (వికృ.) జమున. యమున యందు దేవీస్థానం మృగావలి|

ౙమునెక్కిరింత - దున్నపోతు, యముని వాహనము.

కర్కాటకరాశిలో గురుడు Jupiter ప్రవేశం యమునానది పుష్కరాలు.   

యమునోదకము - Water of the Jamuna river రుచిగా నుండును. ఇంద్రనీల కాంతిగలిగి మనోహరమై యుండును; గ్రీష్మఋతువు(గ్రీష్మఋతువు - వేసవి (జ్యేష్టాషాడ మాసములు.)నందు కోరతగినది, జఠరదీప్తి, మనోవికాసము, బుద్ధి, బలము, కాంతి వీనినిచ్చును; ఆయాసమును బోగొట్టును, ఆరోగ్యమునిచ్చును.  

సుధి - విద్వాంసుడు.
శోభనం ధ్యాయతీతి సుధీః, ఈ. పు. ధ్యై చింతాయాం. - లెస్సగా విచారించువాఁడు.

వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
విశ్వం వ్యయతి సంవృణోతీతి వ్యోమ, న. వ్యేఞ్ సంవరణే. - విశ్వమును వ్యాపించునది.
విశేషేణ అవత్యవకాశదానేనేతి వ్యోమ, అవ రక్షణే. - విశేషముగా అవకాశ మిచ్చి రక్షించునది. 
ఆకసము - మిన్ను, సం.ఆకాశః.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.   

యదేత త్కాళిందీ - తనుతరతరఙ్గాకృతి శివే!     
కృశే మధ్యే కించి - జ్జనని తవ యద్భాతి సుధి యామ్| 
విమర్దా దన్యోన్యం - కుచకలశయో రంతర గతం  
తనూభూతం వ్యోమ - ప్రవిశదివ నాభిం కుహరిణీమ్|| - 77శ్లో

తా. తల్లీ! జనని! యమునానది తరంగమువలె సన్ననైన కృశము - 1.బక్క, 2.సన్నము, 3.అల్పము.)కృశించిన నీ నడుము నందు కొలదిగనున్న కలశములవంటి స్తనముల నడుమ మధ్యనున్న వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.)ఆ కుచములు రెండు అన్యోన్యము - పరస్పరము, వి.ఒక అర్థాలంకారము.)ఒరయుటవల్ల, తనుమధ్య - స్త్రీ, సన్నని నడుముకలది.)మిగుల నలిగినల్లనై సన్నగా కిందికి కుహరము-1.గుహ, 2.రంధరము. వంటి నాభిని చొచ్చినట్లుగ సుధి - విద్వాంసుడు)పండితులూహించుచున్నారు. – సౌందర్యలహరి
 
అంతర్గతము -
1.లోపలనున్నది, 2.దాచబడినది, 3.మరవబడినది.
అంతస్థము - (వ్యావ.) య, ర, ల, వ లకు వ్యాకరణ పరిభాష, విణ.లోపల నుండునది.

కాళిందీ నది నలుపు | నలుపు బింబిత మాహాకాశంబు నల్పు |
అందులో కూలంబందు తమాల రాశి నలుపు | ఆ ఘోరాహియున్ నలుపు
తన్ మౌళిన్ నర్తియు నీవు నలుపు | నల్పులు భావింపగా నిన్ని యున్
నాలో నలుపు తొలగున్, చిత్రమిది కృష్ణా ఆపదోద్ధారకా !

ఇడా పింగళా సుషుప్నా నాడులను గంగ యమునా సరస్వతులుగా చెప్పుట కలదు. కాళిందీ నామ యమున నామధేయ పింగళానాడి గత ప్రాణ క్రియను మనసునందుచుకొని యీ ఉపమానమును కల్పించుట వున్నది. జారునట్టి ఆకాశతత్త్వము సూర్యమండలమునుండి క్రింది జాఱుచున్నది.   

గంగాం సరస్వతీం నందాం కాలిందీం సితవారణమ్ |
ధ్రువం బ్రహ్మఋషీన్ సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్ |
  

శమనుడు - యముడు.
శమయతి ప్రాణిన ఇతి శమనః, శము ఉపశమనే - ప్రాణులను శమింపఁజేయువాఁడు.  
ౙముఁడు - యముడు, శమనుడు, సం.యమః. జమున తోబుట్టువు - యముడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని, వికృ.జముడు.
కాలుఁడు - యముడు.
శని - నవగ్రహములలో ఏడవ గ్రహము (Saturn).
ౙముఁడు- యముడు, శమనుడు, సం.యమః. 
యమునానద్యాః భ్రాతా యమునాభ్రాతా - యమునానదికి తోడఁబుట్టిన వాఁడు.
యమునయా సహ యమళత్వేన జాతత్వాద్యమః - యమున తోఁగూడ కవగాఁ బుట్టినవాఁడు.     

శమనము - శాంతి పథము, రూ.శామనము.
శాంతి - శమనము.
శామనము - 1.శమనము, 2.పధము.

మదిమది - 1.నెమ్మది, శాంతి, 2.అనాలోచనము.

శాన్తః శమితే - 
శామ్యతేస్మ శమిత, శ్శంతశ్చ, శము ఉపశమే. - శమింపఁబడినది. శాంతము, శమితమును. ఈ 2 శమింపఁబడిన రాగాదుల పేర్లు. ప్రతి క్రియా నివర్తితస్య రోగాదేర్నామనీ, ఇతి టీ. స.

ఉపశమము - 1.అడగుట, 2.రోగాదుల బాధ తగ్గుట, 3.ఇంద్రియ నిగ్రహము, 4.ఓర్పు, రూ.ఉపశాంతి.  
ఉపశాంతి - ఉపశమము. ఓర్పు కవచము వంటిది. ఓర్పు ఒక్కటే ఉత్తమమైన శాంతి. 
శమించు - అడగు.

శమథస్తు శమశ్శాన్తిః -
శమనం శమథః, శమః, శాంతిశ్చ, సీ. శము ఉపశమే. శమించుట గనుక శమథము, శమము, శాంతియును. ఈ 3 కామక్రోథాదులు లేకుండుట పేర్లు.

శమము - శాంతి, కామక్రోధాదులు లేక యదగి యుండుట.
శాంతము - శాంతిబొందినది, సం.వి.1.కామ క్రోధాది రాహిత్యము, 2.ఉపశమనము, 3.తొమ్మిది రసాలలో నొకటి.

శమనము - శాంతి పథము, రూ.శామనము.
శాంతి - శమనము.
శామనము - 1.శమనము, 2.పధము.

మదిమది - 1.నెమ్మది, శాంతి, 2.అనాలోచనము.

శాన్తః శమితే - 
శామ్యతేస్మ శమిత, శ్శంతశ్చ, శము ఉపశమే. - శమింపఁబడినది. శాంతము, శమితమును. ఈ 2 శమింపఁబడిన రాగాదుల పేర్లు. ప్రతి క్రియా నివర్తితస్య రోగాదేర్నామనీ, ఇతి టీ. స.

తనకోపము తనశత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.

తా. తనకోపమే శత్రువగును, తనసహనమె రక్షణ, దయ - కనికరము)చుట్టము వలె ఆదరించును. సంతోషము స్వర్గలోకంవలె సుఖమునిచ్చును, తన దావంతము - దుఃఖము, త.దావందం.)నరకమని చెప్పబడుచున్నది.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

5. పంచమి - 1.పక్షము నందు ఐదవ తిథి, 2.ద్రౌపది.

ఏను - 1.అయిదు, 2.నేను యొక్క రూపాంతరము.

అరపది - అయిదు, పదిలోసగము, సం.అర్థపంక్తిః.
ౘవ్వంచ -
అయిదు; అయిదు - ఐదు (సంఖ్యావాచకము).
పంచకము - అయిదు; ఐదు - నాలుగునొకటి, అయిదు.
ఐదువ - ఐదు వన్నెలు కలది (మంగళ సూత్రము, పసుపు, కుంకుమ, గాజులు, చెవ్వాకు - ఈ ఐదువన్నెలు, సుమంగళి చిహ్నములు), జీవభర్తృక, సౌభాగ్యవతి, రూ.ఐదువరాలు. 

పంచముఖుఁడు - శివుడు (ఐదుమోముల వేలుపు.)
ఐదుమోముల వేలుపు -
పంచముఖుఁడు, శివుడు, రూ.అయిదు మోముల వేలుపు.

ఇంద్రియము - 1.త్వక్చక్షురాది జ్ఞానేంద్రియ కర్మేంద్రియములలో ఒకటి, 2.రేతస్సు, 3.ఐదు అను సంఖ్య.

ఓం పంచమ్యై నమః : పంచమీ తిథి దేవతా రూపిణికి ప్రణామాలు. పంచ తిధి రూపత్వ ముండుట వలన శ్రీవిద్యకు చంద్రకలా విద్య అని నామాంతరము కలదు.

పంచమీ పంచభూతేశీ - పంచసంఖ్యోపచారిణీ|
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా - శర్మదా శంభుమోహినీ. - 175శ్లో    

ద్రోవది - ద్రౌపది, ద్రుపదరాజు కూతురు.
పాంచాలి -
1ద్రౌపది (పాంచాల రాజపుత్రిక), 2.బొమ్మ.
పార్వతి - 1.గౌరి(పర్వత పుత్రి) 2.ద్రౌపది(పాండవుల భార్య, ధీరురాలు).
గౌరి - దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌరుఁడు - చంద్రుడు Moon. 

దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.
దుర్గ -
పార్వతి, రూ.దుర్గి.
కాళి - పార్వతి అవతారము, రౌద్రమూర్తి, భయంకరరూపం 1.గౌరి, పార్వతి, ఆది శక్తులలో ఒకటె 2.బొగ్గు. 
కాలిక - 1.బొగ్గు, 2.ద్రౌపది, 3.చీకటి, 4.పార్వతి శివుని భార్య, మంగళగౌరి, 5.క్రొత్త మబ్బు.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

ఎప్పుడదృష్టతా మహిమయించుక పాటిలునప్పుడింపుసొం
పొప్పుచునుండుగాక యదియొప్పనిపిమ్మట రూపుమాయుగా
నిప్పుననంటియున్న యతినిర్మలినాగ్నిగురు ప్రకాశముల్
దప్పిననట్టి బొగ్గునకుఁదా నలుపెంతయుబుట్టు, భాస్కరా.
తా.
బొగ్గు అగ్నితో చేరియున్నపుడు దానియందలి స్వచ్ఛమైన కాంతులతో ప్రకాశించును, అగ్ని సంబంధము తప్పిపొయినచో, అది ముందు తనకున్న కాంతిని బాసి నల్లగా నగును. అట్లే అదృష్టమున్న దినములలో మానవుడు ప్రభ కలిగి యుండును, లేనిచో తొల్లింటి ప్రభ నశించును.    

6. షష్ఠీ - పక్షమందు ఆరవ తిధి విణ.అరవది. శుక్లపక్షపు షష్ఠి సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైనరోజు. 

షష్టి - అఱువది.
షష్టము - అరవది.
షష్ఠ్యంకపద్ధతి - (గణి.) లంబకోణము 90 డిగ్రీలగను, డిగ్రీని 60 మినిట్లగను, మినిట్ ను 60 సెకెండ్లుగను పరిగణించెడి పద్ధతి (Sexagesimal system).  

సేగి - సష్ఠి, కీడు.
కీడు -
1.అశుభము, 2.తప్పు, దోషము, 3.పాపము, 4.అపకారము, 5.అపరాధము.
అశుభము - 1.కీడు, 2.అమంగళము, 3.పాపము, విణ.1.అశుభ సూచకము, 2.పవిత్రముకానిది, 3.దుష్టము.
అమంగళము - 1.అశుభము, కీడు, 2.ఆముదపుచెట్టు, విణ.అశుభమైనది.

ఒప్పమి - 1.తప్పు, 2.కీడు, 3.అనంగీకారము.
తప్పు -
1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, తప్పిదము, క్రి.చిక్కు.
తప్పిదము - దోషము; దోసము - దోషము; దోషము - 1.తప్పు, 2.పాపము.

పాపము - దుష్కృతము, కలుషము.
దుష్కృతము -
పాము; పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సప్పము - సర్పము, సం.సర్పః.
కలుషము - పాపము.

దొసఁగు - 1.ఆపద, 2.విఘ్నము, 3.పొరపాటు, 4.తప్పు, రూ.దొసవు.
దొసఁగులఁబెట్టు -
క్రి.బాధించు, పీడించు.
వేధించు - క్రి.బాధించు.

దోష - 1.భుజము, 2.రాత్రి.
దోషాకరుఁడు -
1.చంద్రుడు, 2.దుష్టుడు.
దొషాచరుడు - 1.చంద్రుడు, 2.రాక్షసుడు, వ్యు.నిసి యందు తిరుగువాడు.

ప్రదోషో రజనీముఖమ్,
దోషయాః ప్రారంభః ప్రదోషః - దోష యనఁగా రాత్రి. దాని యొక్క ప్రారంభము.
రజన్యాః ముఖం రజనీముఖం. - రాత్రియొక్క ఆరంభము. 2 రాత్రి యొక్క మొదలు.

దోషజ్ఞుడు - 1.విద్వాంసుడు, 2.వైద్యుడు, విణ.దోషమేరిగినవాడు.

అఱజాతి - 1.హీనకులుడు, 2.దుష్టుడు.   

అపకారము - 1.కీడు, 2.ద్రోహము, 3.చెడ్డపని, రూ.అపకృతి.
ద్రోహము -
1.కీడుతలపు, 2.చంపునిచ్ఛ.
ద్రోహి - ద్రోహము చేయువాడు.
అపకృతి - అపకారము.
హాని - 1.తక్కువగుట, 2.కీడు.  
అపకరించు - క్రి.హానిచేయు.
అపనయము - 1.కీడు, 2.తొలగించుట.
అపనోదము - తొలగించుట, పోగొట్టుట.
అపకర్ష్ణ - 1.తొలగించుట, 2.తగ్గించుట, 3.అవమానపరచుట, (భౌతి.) ఒక వస్తువు ఇంకొకదానిని మళ్ళగొట్టు గుణము (Repultion). 

ఉపకారికి నుపకారము
విపరీతము కాదుసేయ, వివరింపగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ.
తా.
మేలుచేసినవానికి మేలుచేయుట గొప్పతనము కాదు. తనకు హాని చేసినవానికి వాని తప్పులను గణింపక మేలు(మేలు - 1.క్షేమము, శుభము, 2.వలపు, 3.పుణ్యము, సుకృతము, 4.లాభము.)చేయువాడె గొప్పబుద్ధిమంతుడు.      

కల్మషము - 1.కసటు, 2.పాపము, 3.నలుపు, విణ.1.నల్లనిది, 2.కలక బారినది.
కల్మషకంఠుఁడు - ముక్కంటి, శివుడు, వ్యు.నల్లని కంఠము కలవాడు.

ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు -
శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

షష్ఠం వాగీశ్వరీ తథా : నిత్య తిధులలో శుక్లషష్ఠీ తిధికి అధీశ్వరి - దేవి. ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీదేవీ మనస్వినీ.

ఓం మహా వజ్రేశ్వర్యై నమః : శుద్ధ షష్ఠి తిధికి అధిష్ఠాన దేవత అయిన మహా వజ్రేశ్వరీ నామక దేవికి ప్రణతులు.

(షష్ఠా కాత్యాయి నీతి చ) కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి, కావిచీర కట్టిన విధవ. కాత్య అనే ఋషి తనకు పార్వతీదేవి కుమార్తెగా జన్మించాలని తపస్సు చేసాడు. అతనికి కూతురుగా(పార్వతి) ఆమె జన్మించింది కనుక కాత్యాయిని అనే పేరు వచ్చింది.

ప్రకృతిదేవి యొక్క షష్ఠాంశ (ఆరవ కళ) వల్ల బ్రహ్మ మానససృష్టిగా అవతరించింది. స్కందుని(కుమారస్వామి) పత్ని పేరు దేవసేన, షష్ఠీదేవి. షష్ఠీదేవి కుమారస్వామి ప్రియురాలు, శిశురక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఆ దేవి దివ్యమాత.

శిశువు మానవుడి తండ్రి(తల్లి). - వర్డ్స్ వర్త్  

7. సప్తమి - పక్షము నందు ఏడవతిధి విణ.ఏడవది.
సప్తమము -
ఏడవది.
సప్తకము - ఏడు, విణ.ఏడవది.
ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ.ఎవడు.
సంవత్సరము - ఏడు; ఏడు - ఆరునొకటి.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు.
సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సత్తా - సత, ఏడు, సం.సత్త,  వై.వి. శక్తి, సం.సత్వమ్.

సతనాల్కల జేజే - సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు -
అగ్ని.

అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య, 7number.
గుఱ్ఱము -
అశ్వము.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము.

సప్తి - గుఱ్ఱము.
నప్త -
1.మనుమరాలు, 2.మనుమడు, 3.మున్మనుమడు, రూ.సప్తి.
నప్త్రీ పౌత్రీ సుతాత్మజా,
న పత త్యనయా కులమితి నప్త్రీ. ఈ. సీ. పత్ ఌ గతౌ. - కులము దీనిచేత పడదు.
ఋకారాంతము గలదు.'నప్తా నప్త్రీ చ పౌత్రికే' తి రభసః.
పుత్రస్య పుత్య్రావా అపత్యం పౌత్రీ - కొడుకునకైనను కూఁతురునకైనను కూఁతురు. ఈ 2 మనుమరాలి పేర్లు.

పౌత్రి - మనుమరాలు, (కొడుకు లేక కూతురు కూతురు).
పౌత్రుఁడు - కొడుకు కొడుకు.
దౌహిత్రి - దుహితకొమార్తె, మనుమరాలు. 
దౌహిత్రుడు - దుహితకొడుకు, మనుమడు.
ఇనుమనుమఁడు - మునిమనుమడు, ప్రప్రౌత్రుడు.
ప్రపౌత్రి - ము మ్మ ను మ రా లు, పౌత్రుని కూతురు.

సప్తాశ్వుఁడు - సూర్యుడు, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.
సప్త అశ్వాః యస్య సః సప్తాశ్వః - ఏడు గుఱ్ఱములు గలవాఁడు.
సప్తనామకః అశ్వో యస్యేతి వా సప్తాశ్వః - సప్తయనెడు ఒక గుఱ్ఱము గలవాఁడు.

రేవంతుఁడు - అశ్వశిక్షకుడు.
రౌతు -
రావుతు, రాహుత్తు రావుతు, సం.రాహుత్తః.
రాహుతు - గుఱ్ఱపు రౌతు, సం.రాహుత్తః.

సరదారు - శూరుడు, రౌతు, సం.శరధారీ.
శూరుఁడు -
సూర్యుడు, వ్యు.యుద్ధమునకు భయపడనివాడు, ప్రౌఢుడు.
ప్రౌఢుఁడు - 1.నిపుణుడు, 2.ప్రవృద్ధుడు.
నిపుణుఁడు - నేర్పరి; ప్రవీణుఁడు - నిపుణుడు.

శౌరి - కృష్ణుడు, వ్యు.శూరుని మనుమడు.
కృష్ణుఁడు -
1.విష్ణువు, 2.వ్యాసుడు, 3.శ్రీ కృష్ణ భగవానుడు. 

అక్కరకు రానిచుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున, తా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
తా.
అవసరమునకు వచ్చి సహాయపడని చుట్టమును, పూజించినను కోరిక తీర్పని దైవమును, తానధిరోహించినప్పుడు యుద్ధరంగమున పరుగెత్తని గుర్రమును బుద్ధిమంతుడైనవాడు వెంటనే విడిచి పెట్టును.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము horse, 7.కోతి monkey, 8.పాము Snake, 9.గాలి air, 10.కప్ప frog, 11.చిలుక Parrot, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

అద్రి - 1.కొండ, 2.చెట్టు, 3.సూర్యుడు Sun.
నరాణా మువజీవనీయత్వాత్ అద్యత ఇత్యద్రిః. ఈ. పు. అదభక్షణే. - ఫలమూలద్వారమున నరులచేత భక్షింపఁబడునది.

అద్రయో ద్రుమ శైలార్కాః -
అద్రిశబ్దము వృక్షమునకును, పర్వతమునకును, సూర్యునికిని పేరు. ఆద్యతే, అత్తీతిచ అద్రిః, పు. అద భక్షణే. - భక్షింపఁబడునది, భక్షించువాఁడును అద్రి. 'నిద్రాముద్రాం ద్రావయన్నంబుజనా ముద్రావద్రిశ్శోణయత్యద్రి జాత' రితి రామాభ్యుదయే.

ద్రుమము - వృక్షము.
ద్రూయతే ద్రుః, ఉ. పు. ద్రు గతౌ. - పొందఁబడునది.
ద్రుః వృక్షావయవో (అ)స్య ద్రుమః. - ద్రు అనఁగా శాఖ; అది గలిగినది.
ద్రుమిక - మొలక, మొక్క.

ఆఖండలుఁడు - ఇంద్రుడు, వేలుపురేడు, వ్యు.పర్వతములను భేదించువాడు.
ఆఖండయతి అరీన్ భినత్తీతి ఆఖండలః - శత్రువుల ఖండించువాఁడు.

గిరి - 1.కొండ, 2.అచ్ఛనగాయ, 3.గుండురాయి.
కాలేన గీర్యత ఇతి గిరుః, ఈ. పు. గ్రావా చ న పు. గౄ నిగరణే. - కాలముచేత జెఱుపఁబడునది.

దూరగిరిన్యాయము - న్యా. దూరముగా నున్న పర్వతములు నునుపుగా కాన్పించును, దగ్గరకు పోవ గుట్టలు మిట్టలు ముండ్లుగా నుండునను రీతీ, దూరపు కొండలు నునుపు. 

దృషత్పుత్రి - క ల్వ పు గుండు, గుండ్రాయి.
కలువము - మందు నూరెడు రాయి, రూ.కల్వము.

గండశైలము - 1.పెద్దరాయి, 2.కొండనుండి భూకంపాదులవలన జారిన పెద్దరాయి, 3.కోయిల.
కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
పంచమము - 1.కోయిల, 2.రాగ విశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.  
పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.

గుండు - 1.పెద్దరాయి, 2.ఫిరంగి గుండు, 3.గుండ్రాయి, 4.తూనికరాయి, 5.కొండ, 6.వెండ్రుకలు గొరుగబడిన తల, సం.గండః.

పరగ రాతిగుండు పగులగొట్టగవచ్చు
కొండలన్ని పిండి గొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగారాదు విశ్వ.

తా|| రాతిగుండు పగులగొట్టవచ్చును కొండలన్నియు పిండిగొట్ట వచ్చును. కాని, కఠినహృదయుని(ౙద్దు - కఠిన హృదయత్వము.)మనసు మాత్రము మార్చలేము.

గిరిజ - 1.పార్వతి, 2.కొండయరటి, 3.మల్లెతీగ.
గిరే ర్జాతా గిరిజా - పర్వతమువలనఁ బుట్టినది. మల్లిక - మల్లెతీగ.
మలె - మల్లె పువ్వు, సం.మల్లీ, మల్లికా.    

తృణశూల్యం తు మల్లికా భూపదీ శీతభీరుశ్చ -
తృణశూలే వాతగుల్మే సధు తృణశూల్యం - తృణశూలమనగా వాతగుల్మము, అందుకు మంచిది. పా, తృణశూన్యం, తృణశూన్య తృణశూల్యా.
మల్లిక - మల్లెతీగ.
మల్యతే మూర్ధ్నిమల్లికా - శిరస్సునందు ధరింపఁ బడునది .
భువి పద మస్యాః భూపదీ, ఈ సీ. - భూమియందు స్థానముగలది.
శీతాద్భిభేతి గ్రీష్మజత్వా చ్ఛీతభీరుః ఉ.సీ. - గ్రీష్మ కాలమందుఁ బూచునది గానఁ జలికి వెఱచునది. ఈ 4 మల్లెచెట్టు పేర్లు.  

కుటజము - కొండమల్లె.    
బొండుమల్లె - గుండుమల్లె.

ఓం గిరీశ బద్ధ మాంగల్య మంగళాయై నమో నమః| 

గిరిజనులు - (వ్యావ.) కొండజాతులు, ఆదివాసులు.
ఆదివాసులు - కొండలందు, అడవులందు ఉండు అ నా గ ర కు లు (Aborigins).

8. అష్టమి - ఎనిమిదవతిథి. అష్టమా చాతి భైరవీ|

అష్టకము - 1.ఎనిమిదింటి సమూహము, 2.ఎనిమిది, 3.ఋగ్వేద మందలి ఒక భాగము, అట్టము, రూ.అష్టము. ఎనిమిది - ఏడు నొకటి.
అట్టము - ఎనిమిది పన్నములుగల వేదభాగము, సం.అష్టకమ్.
అష్టము - (భౌతి.) 1.ఎనిమిదింటి సమూహము, 2.ఒక క్రింది స్వరమునకు ఎనిమిదవ మీదిస్వరము (Octave).
అష్టమము - ఎనిమిదవది. అష్టమం బ్రహ్మచారిణీ|

అష్టాదశ నిమేషాస్తు కాష్ఠా -
అష్తాదశ నిమేషాః కాష్ఠేత్యుచ్యతే - పదునెనిమిది ఱెప్పపాట్ల కాలము కాష్ఠ యనంబడును.
కాష్ఠ - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
కాశతే కాష్ఠా, కాశృ దీప్తౌ - ప్రకాశించునది. ఈ ఒకటి 18(Seconds) నిమేషములకాలము ఒక కాష్ఠ.

దరణము - ఎనిమిది డబ్బుల నాణెము.

ఎనబండ్రు - ఎనిమిదిమంది. 
ఎనుబది - ఎనిమిదిపదులు, అశీతి.
అశీతి - ఎనుబది.

తరంగిణి - నది, ప్రవాహము.
తరంగా, అస్యాం సంతీతి తరంగిణీ - అలలు గలిగినది.
తరంగకము - పిల్లతరంగము, చిన్న అల.
తరంగణము - (భౌతి.) తరంగరూప చలనము (Undulation).
తరంగగతి సంకోచము - (జం.) అన్నవాహిక యొక్క గోడలు సంకోచము చెందుచు ఆహారము తరంగము మాదిరిగా ముందుకు జరుగుట, (Peristalisis).  

లాఘువేల ప్రవాహము - (భూగో.) శుద్ధ బహుళ పక్షములందలి అష్టమీ తిథుల యందు సముద్రపు నీటిమట్టమును సూర్యుడొక వైపు, చంద్రుడు మరియొక వైపు ఆకర్షించుటచే కలిగిన అధికమైనపాటు.

అష్టమీ చంద్ర విభ్రాజ - దళికస్థల శోభితా|
ముఖచంద్ర కళంకాభ - మృగనాభి విశేషకా. - 5శ్లో
 

అష్టమ్యం చతుర్థశ్యం నవమ్యాం భృగువాసరే|
పౌర్ణమాస్యా మమాయాం చ పర్వకాలే విశేషతః|| - లక్ష్మీసహస్రనామం

అష్టమీ నవమీ చైవ దశమ్యేకాదశీ తథా|
పౌర్ణమాసీ కుహూరూపా తిథీ రాత్రిస్వరూపిణీ|| - శ్రీ భువనేశ్వర్యస్టోత్తర శతనామ స్తోత్రము

అష్టమూర్తి - శివుడు, (పంచభూతములు, సూర్యచంద్రులు, పురుషుడు- అష్టమూర్తులు).

శివుఁడు - ఈశ్వరుఁడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

భూతధాత్రి - భూమి Earth, వ్యు.జీవులన్నిటినీ ధరించునది.
భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది.
భూతః భవన్తి ఇష్టం ప్రాప్ను వంతీతి భూతాః - బాలగ్రహాదయః- ఇష్టము నొందెడి బాల  గ్రహాదులు, భూప్రాప్తౌ.   

పుష్పవంతులు - సూర్యచంద్రులు. 
పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.
పురంతి ప్రాణినామగ్రే గచ్ఛంతీతి పురుషా, పూరుషాశ్చ, పుర అగ్రగమనే. - ప్రాణులకెల్ల అగ్రేసరులు గనుక పురుషులు, పూరుషులు.
పూరుషుఁడు - మనుష్యుడు.
పురిశరీరే శేత ఇతి పురుషః, శీఙ్ స్వప్నే. - పురమనఁగా శరీరము, అందుందువాఁడు గనుక పురుషుడు.
పురిదేహే సీదతీతివా పురుషః, షద్ విశరణగత్య పదనేషు. - శరీరమందుండువాఁడు.

పురుషా వాత్మ మానవౌ,
పురుషశబ్దము జీవునికిని, మనుష్యునికిని పేరు. పిపర్తీతి పురుషః పౄ పాలన పూరనయోః, పాలించువాఁడు.

అహో ! వాణిజ్య సంపత్తిః కాశీపురవాసినాం
ఏకః పంచత్వ మాపన్నో జాయతే పున రష్టధా|
తా.
ఆహా! కాశీపట్టణవాస్తవ్యుల ప్రసిద్ధమైన వాణిజ్యవైభవ మేమని చెప్పవచ్చును? ఒకటి యైదయి(పంచకము - అయిదు)తిరిగి యెనిమిది గాఁ బుట్టుచున్నది. కాశీ పట్టణమున(పంచత్వము - మరణము)మరణించినవాఁడష్టమూర్తి(శివుడు) యగుచున్నాఁడని భావము. 

కాశీబృందావనావాసౌ - త్రిభంగీశ స్త్రివిక్రమః,
తేజస్త్రయ ద్వంద్వదృష్టీ - అష్టమూర్తి ర్దశాకృతిః|

అష్టమూర్తికి నీకును న్యాయమునను
భేదమే లేదు గద యష్టవాద మేల
పాంచభౌతిక రవిచంద్ర భవభవముర
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ !

అష్టమ మూర్తిని మేరుదేవియందు నాభికి జన్మించి యురుక్రముం డనం బ్రసిద్ధిండై విద్ద్వజ్జనులకుఁ బరమ హంస మార్గంబుం బ్రకటించె; ఎనిమిదో(8వ) రూపంలో నాభికి మేరుదేవి యందు "ఋషభుడై" ప్రభవించి పండితులకు అన్ని ఆశ్రమములవారిచే నమస్కరింపబడే పరమహంస - ఉత్తమ పదము నిందిన సన్న్యాసి)మార్గాన్ని ప్రకటించాడు.  

మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుండెడి మణి, 3.హార మధ్యమునందు వ్రేలెడు మణి.
మినాత్యసురానితి మేరుః, ఉ-పు. - అసురుల హింసించునది, మీఙ్ హింసాయాం.
మినోతి క్షిపతి శిఖరైర్జ్యోతీంషీతి మేరుః - శిఖరములచే నక్షత్రాదుల వహించునది, డు మిఞ్ ప్రక్షేపణే.

గిరిధన్వుఁడు - శివుడు, వ్యు. మేరుపర్వతము ధనుస్సుగా గలవాడు.

మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుండెడి మణి, 3.హార మధ్యమునందు వ్రేలెడు మణి.
మినాత్యసురానితి మేరుః, ఉ-పు. - అసురుల హింసించునది, మీఙ్ హింసాయాం.
మినోతి క్షిపతి శిఖరైర్జ్యోతీంషీతి మేరుః - శిఖరములచే నక్షత్రాదుల వహించునది, డు మిఞ్ ప్రక్షేపణే.
సుమేరువు - మేరుపర్వతము, వ్యు.శిఖరములచే నక్షత్రాదులను వహించునది.
సుష్టు మినోతీతి సుమేరుః, ఉ-పు. మేరు శబ్దమునకు గల యర్థమే సుమేరు శబ్దమునకు నూహ్యంబు. 

నాయకము - హారమందలి నడిమి రత్నము. 
తరలో హారమధ్యగః,
తరళము - నాయకమణి, విణ.1.చలింపనిది, 2.ప్రకాశించునది, 3.అనురాగము కలది.
హారమధ్యగో విశిష్టమణి స్తరళ ఇత్యుచ్యతే. - కంఠమాల నందుమ నుండు నాయకమణి తరళ మనంబడును.
ప్రభయా తరతి తమ ఇతి తరళః, తౄ ప్లవన తరణయోః. - కాంతిచేత అంధకారము ధరించునది. ఈ 1 నాయకమణి పేరు.     

తరళేక్షణ - స్త్రీ, క్రాలుగంటి.
క్రాలుగంటి - 1.చలించునట్టి కన్నులుగల స్త్రీ, 2.స్త్రీ.

క్రాలు - క్రి. 1.ఒప్పు, 2.చెదరు, 3.అల్లలాడు, 4.గిరగిరతిరుగు, 5.సంచరించు, 6.సంచలించు.

మిడుకు - జీవము, క్రి.1.త్రుళ్ళు, 2.పరితపించు, 3.సంచరించు.
మెదలు - క్రి.కొంచెము చలించు, సంచరించు.

చెదరు - క్రి.1.నీళ్ళులోనగునవి యెగిరిపడు, 2.వ్యాపించు, 3.చెదరుట.

ౘంగలించు - క్రి.1.చలించు, 2.తొలగు.
అల్లలాడు - క్రి.1.చలించు, వణకు, 2.భయాదులచే క్షోభపడు, 3.తిరుగు, రూ.అల్లలనాడు, అల్లాడు.
అల్లలనాడు - క్రి.1.చలించు, 2.సంక్షోభించు.
తలఁకు - క్రి.చలించు, 2.భయపడు.
తలడిల్లు - క్రి.చలించు, రూ.తల్లడిల్లు.

వడఁకుతోవ - ఉత్తరాయణము.
వడఁకు - క్రి.వణకు, చలించు.
వడఁకుగుబ్బలి - హిమాలయము, మంచుపర్వతము. 

ఎడ1 - 1.స్థానము, 2.అవకాశము, 3.దూరము, 4.గడువు, 5.భేదము, 6.విఘ్నము, 7.వ్యవహారము, 8.దౌత్యము, విణ.1.అధికము, 2.ఎలప్రాయము కలది, 3.ఎడమప్రక్కనున్న, అవ్య. అందు విషయమున.
ఎడ2 - హృదయము, సం.హృత్.
ఎడఁద - హృదయము.
ఎన్నడు - (ఏ+నాడు), 1.ఏకాలము, ఎప్పుడు, 2.ఎల్లప్పుడు.
ఎపుడు - ఎల్లప్పుడు, ఏకాలము, రూ.ఎప్పుడు, ఎప్డు. ఎప్డు - ఎపుడు.
పరియాచకము - పరిహాసము, ఎగతాళి, సం.పరిహాసకః.
పరితః హసంత్యత్రేతి పరీహాసః హసే హసనే. - దీనియందు నవ్వుదురు.
ప్రహసనము - 1.ఒక రూపకము, 2.పెద్దనవ్వు, 3.పరిహాసము.
ప్ర - మిక్కిలి అను అర్థము గల ఉపసర్గ.
నవ్వు - క్రి.1.హసించు, 2.వికసించు, 3.పరిహసించు, 4.అపహసించు, రూ.నవు, నగు, వి.1.హాసము, 2.వికాసము, 3.పరిహాసము, 4.అపహాసము, రూ.నవు, నౌ.

తరలాక్షుడ యెడ నెన్నఁడుఁ
పరిహాసాలాపములను * బచరింపకుమీ;
పరికించి నిరీక్షించిన
నురు దోషం బనుచుఁ దలఁపు * చుండు కుమారా!

తా. స్త్రీలను జూచి వారిదగ్గర ఎగతాళి - గేలి, పరిహాసము)నెగతాళిగ మాటలాడవలదు. పరికించు - క్రి.1.పరీక్షించు, 2.విచారించు.)చూచినయెడల నిది గొప్ప దోషము - 1.తప్పు, 2.పాపము, సం.వి.(గణి.) కొలతలలోని తప్పులు.)లని తలంపవలయును.

తలపు - 1.తలచుట, 2.కోరిక, 3.ఆలోచనము, 4.జ్ఞప్తి, 5.హృదయము, 6.అభిప్రాయము, 7.ఊహించుట.

త్రిసంధ్యం సమ ల్లేఖకోటీర నానా
విధానేన రత్నాంతు బింబప్రభాభిః
స్ఫురత్పాదపీఠే హేరేనాష్టమూర్తే
ర్జటాజటవాసే నతాస్మః పదంతే|| - 8           

"అగ్నీధ్రు"డనే వాడికి "నాభి" అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. ఆమెకు మేరుదేవి అని మరో పేరు ఉండేది.

4. ఉదానము - 1.బొడ్డు, 2.కంఠము నందలి గాలి, 3.ఒకానొక పాము.
ఉదానః కంఠదేశస్థః : ఉదానము, కంఠస్థానము నందుండి భాషణాదులఁ బుట్టించునది. air that rises in the throat and navel.
ఉదానము కంఠస్థానము నందుండి భాషణాదులఁ బుట్టించును. 
భాషణాది సామర్థ్యజననాత్ ఊర్థ్వ మనంత్యనేనే త్యుదానః - మాటలాడుట మొదలైన సామర్థ్యము గలుగఁజేయుటవలన ఊర్థ్వప్రదేశంబున దీనిచేత బ్రతుకుదురు.
ఉత ఊర్థ్వమానయతి శబ్దాదీనితీవా ఉదానః - శబ్దాదుల నూర్థ్వమునకుఁ దెచ్చునట్టిది.

కంఠ్యము - కంఠమునందు పుట్టునది, (వ్యాక.) అ, ఆ, క, ఖ, గ, ఘ, జ, హ, ః అను ధ్వనులు.

ఉదానము కంఠ ప్రదేశమున నుండి దేహములో సగము భాగమును పెంచుట కుపయోగించును. కంఠస్థానం(ప్రదేశమును) నుండి ముఖమును, పెదవులను, కన్నులను అదురు నట్లు చేయుచు కామ క్రోధాదులను ఉత్తేజపరచునది ఉదాన వాయువు.

అండజ - కస్తూరి, వ్యు.కస్తూరి మృగము యొక్క బొడ్డుతిత్తి నుండి పుట్టినది.

నాభి - 1.కస్తూరి, 2.బొడ్డు, 3.బండి చక్రపు నడిమితూము, 4.విష విశేషము. 1.(గణి.) ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువునకు గల దూరము. ఆ శంకుచ్ఛేద సంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనివృత్తిలో నుండునట్టి స్థిర బిందువు (Focus). 2.(భౌతి.) పరావర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence)ను చెందునో యట్టి బిందువు. ముఖ్యాక్షమునకు సమాంతరము గా నుండు కిరణములు పరావర్తనము చెంది కేద్రీకరించెడి బిందువు. లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus). నాభిం భువన మాతృకా..

క్షత్రియే (అ)పిచ నాభి ర్నా -
నాభిశబ్దము క్షత్రియునికిని, అపిశబ్దము వలనఁ విజిగీషుఁ డైన రాజునకును పేరైనపుడు పు, ప్రాంగణమునకు ప్స, బండికంటి నడిమికిని, ప్రధానమునకును, కస్తూరికిని పేరైనపుడు సీ, నహ్యత ఇతి నాభిఃః, ణహ బంధనే. - కట్టఁబడునది. "ముఖ్యరాట్ క్షత్రియో ర్నాభిః పుంసి ప్రాణ్యంగకే ద్వయోః చక్రమధ్యే ప్రధానే చ స్త్రియాం కస్తూరి కామదే" ఇతి రభసః.

గవి1 - ఆవు.
గవి2 - 1.గుహ, 2.గుంట.

పొక్కిలి - 1.బొడ్డు, 2.గుంట.
బొడ్డు - 1.నాభి, 2.నూతిచుట్టు పెట్టిన గోడ. 

నాభిజన్ముఁడు - బ్రహ్మ, పొక్కిలి చూలి, వ్యు.బొడ్డు నుండి జన్మించినవాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

నాభ్యాంతరము - (భౌతి.) నాభి ధ్రువముల మధ్య దూరము (Focal length).
బొడ్డుచేరులు - (గృహ.) నాభిగొట్టము, బొడ్డుత్రాడు (Umbilical cord).

సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
ప్రభృతి - మొదలు.
సుత2 - కూతురు.
సుతుఁడు - కొడుకు.
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును.

స్థిరో గంగా(ఆ)వర్త - స్స్తనముకుళ రోమావళి లతా
తలా(ఆ)వాలం కుండం - కుసుమశరతేజో హుతభుజః| 
రతే ర్లీలాగారం - కిమపి తవ నాభి ర్గిరిసుతే!
బిలద్వారం సిద్ధే - ర్గిరిశనయనానాం విజయతే|| - 78శ్లో

తా. ఓ భూధర సుతా! గిరిసుతా! నీ నాభి స్థిరమైన గంగానది నీటిసుడిగను, పాలిండ్లను పూల మొగ్గలు(ముకుళము - అరవిరి మొగ్గ)పూచిన లతకు(తీగ)పాదు. కుసుమాయుధుఁడు - మన్మథుడు బాణాగ్నికి కుండముగను, రతీదేవికి లీల - 1.క్రీడ, 2.క్రియ, 3.శ్రంగారచేష్ట, 4.రీతి.)విలాసగృహముగను, గిరీశుఁడు- 1.హిమవంతుడు, 2.శివుడు నేత్రముల సిద్ధికి గుహాద్వారముగను నుండి యిదియా యని యూహింప నలవిగానిదై యొప్పుచున్నది. - సౌందర్యలహరి

కుసుమాయుధుఁడు - మన్మథుడు.
కుసుమేషుః, ఉ-పు. కుసుమాన్యేవ ఇషవో యస్యసః - పుష్పములే బాణములుగా గలవాఁడు. 
కుండము - 1.వంటకుండ, 2.గుడిలోని గుంట, 3.నిప్పుల కుండము, 4.కొండ.    

కాశీబృందావనావాసౌ - త్రిభంగీశ స్త్రివిక్రమః,
తేజస్త్రయ ద్వంద్వదృష్టీ - అష్టమూర్తి ర్దశాకృతిః|  

అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ |
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా. - 131స్తో

శైలధన్వుఁడు - శివుడు, గట్టు విలుకాడు.
గట్టువిలుకాఁడు - శివుడు, వ్యు.మేరువు విల్లుగా గలవాడు.
గట్టు - ఒడ్దు, తీరము, చెఱువు కట్ట, పర్వతము, సం.ఘట్టః. 

గట్టుద్రిమ్మరి - కోఁతి, వానరము, వ్యు.గట్టులందు తిరుగునది.
వానరము - కోతి monkey.
నర ఇవ వానరః - నరునివలె నుండునది.
క్రోఁతి - వానరము, రూ.క్రోఁతి. 

మేరువు - 1.మేరుపర్వతము, 2.శిఖరము నందుండెడి మణి, 3.హార మధ్యమునందు వ్రేలెడు మణి.
మినాత్యసురానితి మేరుః, ఉ-పు. - అసురుల హింసించునది, మీఙ్ హింసాయాం.
మినోతి క్షిపతి శిఖరైర్జ్యోతీంషీతి మేరుః - శిఖరములచే నక్షత్రాదుల వహించునది, డు మిఞ్ ప్రక్షేపణే.

శైలము - కొండ, వ్యు.శిలలు దీనియందు గలవు, సం.వి.(భూగో.) నేల యందుండు (ఉవ) అధాతువులలో నిది నొకటి.
శిలా అత్ర సంతీతి శైలః - శిలలు దీనియందుఁ గలవు.

శిలోచ్ఛయము - కొండ.
శిలోచ్ఛయః - శిలలయొక్క సమూహము.

శైవలిని - ఏరు, నది.
శైవలమస్య అస్తీతి శైవలినీ - నాచు కలిగినది.
శైవలము - నీటిపాచి, రూ.శైవాలము, శేవలము.
శైవలములు - (వృక్ష.) నీటిలో పెరుగు మొదటితరగతి ఉద్భిజములు (Algae).

సముద్ర శైవాలము - (వృక్ష.) సముద్రపు నీటిలో పెరుగు నాచువంటి మొక్కలు (Sea weeds).

ఓడిక1 - నీవారధాన్యము, ఒకరకము వడ్లు.
ఓడిక2 - 1.ప్రవాహము, 2.తూము.
నీరుగండి - తూము. 

ప్రస్థము - 1.తూము, 2.కొండనెత్తము.
ప్రతిష్ఠంతే (అ)స్మి స్సమ భూభాగత్వా త్ప్రస్థః, అ. ప్న. ష్ఠా గతినివృత్తౌ. - సమభూమియౌటవలన మిక్కిలి దీనియందు వసింతురు.
సానుమంతము - కొండ, వ్యు.చరియలు కలది.
సానువు - 1.కొండనెత్తము, 2.కొన, 3.త్రోవ, చరియ.
సనోతి సుఖం దదాతీతి సానుః, ఉ. ప్న. షణుదానే. - సుఖము నిచ్చునది. 

ౘఱి - సంచరింప నశక్యమగు పర్వత శిఖరము క్రిందిచోటు, రూ.చఱియ.
జాఱువు - 1.కొండచఱి, 2.జారుట.  
ౙారుఁడు - జారుట. 
(ౙ)జాఱు - క్రి.1.జరుగు, 2.ఉరుకు, 3.వదలు, 4.స్రవించు, వి.1.స్ఖలనము, 2.జారుట.
ౙరుగు - క్రి.1.రొమ్ముతో ప్రాకు, జారు, 2.జీవనము నడుచు, 3.కడచు, 4.పోవు, రూ.జరుగు.

ఉఱుకు - క్రి.1.దుముకు, పరుగెత్తు, 2.దాటు.
ఉఱుకుడుఁగప్ప - దుముకుచు పోవు ఒక జాతికప్ప.  

ప్రపాతస్తు తటో భృగుః,
ప్రవతంత్యస్మాదితి ప్రాపాతః, పత్ ఌ గతౌ. - దీనినుండి పడుదురు.    

తటిని - ఏరు, వ్యు.తటముకలది.
తటమస్యా అస్తీతి తటినీ - దరులు గలిగినది.
తటము - 1.ఏటి యొడ్డు, 2.కొండ చరియ, 3.ప్రదేశము. 
తటి - 1.ఏటి యొడ్డు, 2.ప్రదేశము.
తటతీతి తటం త్రి, తట ఉచ్ఛ్రాయే - ఉన్నత మయినది. 
తటతీతి తటః, తట ఉచ్ఛ్రాయే. - ఉన్నతమైనది.
ప్రదేశము - స్థలము, చోటు.

తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలమ్, తలమ్, వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.

భృగువు - 1.ఒకముని, 2.కొండచరియ, 3.శుక్రుడు Venus, 4.శివుడు.
కొండౘఱియ - కొండపార్శ్వభాగము. 
భ్రజ్యతే తప్యతే సూర్యాగ్ని తేజసా భృగుః, ఉ పు. భ్రస్జ పాకే. - సూర్యాగ్ని తేజస్సులచేతఁ దపింపఁ జేయఁబడునది. ఈ 3 కొండచఱియ పేర్లు.
శుక్రుఁడు - 1.అసుర గురువు, వ్యు.తెల్లనివాడు, అగ్ని, వ్యు.తేజస్సు కలవాడు, నవగ్రహములలో నొకటి (Venus).
శుక్లవర్నత్వా చ్ఛుక్రః - శ్వేతవ్రణము గలవాఁడు.
రుద్రశుక్రద్వారేన నిర్యాతత్వాద్వా శుక్రః - రుద్రునిరేతస్సు వలనఁ బుట్టినవాఁడు.
శుచం దుఃఖం రాతి దేవేభ్య ఇతి వా శుక్రః రాదానే - దేవతలకు దుఃఖము నిచ్చువాఁడు.

శుక్రవారము - భృగువారము, వారములలో నొక దినము Friday.      

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

ఉపత్యక - కొండచేరువ నేల (వ్యతి. అధిత్యక.)

పొంత - 1.తీరము, 2.సమీపము, సం.ప్రాంతః.
ప్రాంతము - 1.తీరము, 2.సమీపము, సం.వి. (భూగో.) పెద్ద భూభాగము, ప్రత్యేక నైసర్గిక లక్షణములు కలిగి ప్రత్యేక శీతోష్ణస్థితి, జంతు వృక్ష సంపదలు గల భూభాగము, (రాజ.) పరిపాలనా సదుపాయమునకై విభజింపబడిన రాజకీయ భాగము.
సమీపము - చేరువ.
సంగతా ఆపో (అ)స్మిన్నితి సమీపః - సమగతమైన జలమును గలది, లక్షణచేత సమీపమందు వర్తించును.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

నిసర్గము - స్వభావము.
నిసృజ్యతే అనేనేతి నిసర్గః, సృజ నిసర్జే. - పదార్థమును దీనిచేత మిక్కిలి సృజింపఁబడును.

నైజము - 1.తనది, స్వాభావికము.
నైసర్గికము - స్వాభావికము.
స్వాభావికము - స్వభావముచేత కలిగినది. 
నైసర్గికలక్షణము - (భూగో.) ఒక ప్రదేశపు సహజగుణము, ఉదా. ఒక ప్రాంతము చెట్లలోగాని, కొండలలోగాని, నదులలోగాని నిండియుండు స్థితి.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 3.సామ్యము, 4.స్వభావము, 5.ఆచారము, 6.అహింస, 7.వేదోక్తవిధి, 8.విల్లు, (గణి.) గుణము, (Property).

మధ్య - పదుమూడేండ్ల నుండి పదునెనిమిది(13-18వ) వరకు గల కన్య.     
వేస్ట లైన్ - (గృహ.) (Waist line)నడుము, మధ్యము, కడుపు దగ్గర సన్నని భాగము.

న్యాయ్యే (అ)పి మధ్యమ్,
మధ్యశబ్దము ఉచితమయినదానికిని, అపిశబ్దమువలన నడుమునకును, అవకాశమునకును, అధమునికిని పేరు. "న్యాయ్యావలగ్నయోర్మధ్య మంతరే చాధమే త్రిషు" అని రభసుడు. మన్యత్త ఇతి మధ్యం, మన జ్ఞానే. - తలపఁబడునది.
మధ్యమం చావలగ్నం చ మ ధ్యో(అ)స్త్రీ,
మధ్యమము - నడుము, (గణి.) రెండు పదముల మధ్య చొప్పించబడిన పదము (Mean). 
మధ్యేభవం మద్యం, మధ్యమం చ. - శరీరము నడుమఁ బుట్టినది. 
అవలగ్నము - న డు ము, విణ.తగులుకొనినది.
అవలగ్యత ఇతి అవలగ్నం లగే సఙ్గే. - పూర్వాపరములతోఁ గలియునది. ఈ 3 నడుము పేర్లు.

చిరము - బహుకాలము.
కుశలము - 1.క్షేమము, శుభము, 2.(వ్యావ.) చిన్నది, ఉదా. "మాయిల్లు కుశలము" = ఇరుకైనది, 3.తనివి, 4.పుణ్యము.

తనయ - కూతురు; కూతురు - కుమార్తె. 
తన - ఆత్మార్థకము.  
తనయుఁడు - కొడుకు.
కులం ముదం వా తనోతీతి తనయః, తను విస్తారే. - కులముగాని సంతోషమునుగాని(ముదము - సంతోషము)విస్తరింపఁ జేయువాఁడు.

నిసర్గక్షీణస్య - స్తనతటభరేణ క్లమజుషో 
నమన్మూర్తే ర్నాభౌ - వళిషు! శనకై స్త్ర్యుట్యత ఇవ|    
చిరం తే మధ్యస్య - త్రుటిత తటినీతీర తరుణా   
సమావస్థా స్థేమ్నో - భవతు కుశలం శైలతనయే! - 79శ్లో

తా. ఓ శైలతనయా! శైలజ! నారీతిలకమా!  స్వాభావము చేతనే సన్ననిదియు, స్తనభారము చేత బడలిపోయి వళి - కడుపుమీది ముడుత కృశించునదియు, మెల్లగ జారుచు వంపుగలది, విఱిగిన యొడ్దు వలె నున్న నీ నడుము చిరము - బహుకాలము శాశ్వతముగ స్థేమము-శరీరబలము, సత్తువ. క్షేమముగ నుండుగాక! - సౌందర్యలహరి

త్ర్యక్షరీ దివ్యగాందాఢ్యా సిందూర తిలకాంచితా|
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా. - 126 

నగము - 1.కొండ, 2.చెట్టు, రూ.అగము.
న గచ్ఛతీత్యగమః, గమ్ గతౌ. - కదలనిది. అగమము - 1.చెట్టు, 2.కొండ, వ్యు.కదలనిది.

శైలవృక్షౌ నగా వగౌ,
నగావగ శబ్దములు 2 ను ఒక్కొక్కటి పర్వతమునకును వృక్షమునకునుగూడ పేర్లు.
న గచ్ఛత ఇతి నగౌ, అగౌ చ గమ్ ఌ గతౌ. - ఎక్కడికిని కదలనేరనివి గనుక నగములు, అగములు.

నగవైరి - ఇంద్రుడు, వ్యు.కొండలకు శత్రువు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసో త్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.

అగము - 1.చెట్టు, 2.కొండ, 3.పాము, 4.సప్త సంఖ్య.

అగచరము - కోతి monkey, వ్యు.చెట్టు లేక కొండలపై తిరుగునది.     

అగజాత - 1.పార్వతి, 2.వసురాజు భార్య గిరిక.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ - పర్వతమునకు గూతుఁరు.

అగౌకసము - 1.సింహము Lion, 2.శరభమృగము, 3.పక్షి, వ్యు. కొండ లేక చెట్టు నివాస స్థానముగా గలది.
నగో వృక్షః ఓకః స్థానమస్యేతి నగౌ కాః, స, పు. - వృక్షము స్థానముగాఁ గలది.

పర్వతారణ్యములు - (భూగో.) పర్వతముల యందు పెరుగు నడవులు,[కొండల యెత్తునిబట్టి అరణ్య వృక్షములు మారుచుండును].

ఊర్థ్వలోచనము - మీగండ్ల మెకము, శరభము.
లోచనము - నేత్రము.
లోచ్యతే అనేనేతి లోచనం. లోచృ దర్శనే. - దీనిచేత చూడఁబడును.
శరభము - 1.మీగండ్ల మెకము, 2.ఒంటెపిల్ల.
శౄణాతి సింహం సరభః, శౄ హింసాయాం. - సింహమును జంపునది, ఎనిమిదికాళ్ళు గలిగి సింహమును జంపెడు మృగము. తథాచోక్తం మాహాభారతే - "అష్టపాదూర్ధ్వనయనః శరభో వనగోచర" ఇతి. 
దచ్చికాళ్ళమెకము - శరభము, అష్టాపదము.
దచ్చౌక - (దంట+చౌకము) ఎనిమిది, రూ.దచ్చి, సం.ద్విచతురమ్.
(ౘ)చౌగంటి - 1.అగ్నిదేవుడు, 2.శరభము, రూ.చవుగంటి. 

కరభము - 1.మనికట్టు మొదలు చిటికెనవ్రేలి మొదలుదాక చేతి వెలుపలి చోటు, 2.ఒంటెపిల్ల.
కరభాస్థులు - (జం.) అరచేతి ఎముకలు (Metacarpal Bones). 

అష్టాపదము - బంగారము.
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
అష్టసు లోహేషు పదం ప్రతిష్ఠా అస్యేతి అష్టాపదం, అ. ప్న. - అష్టలోహములయందు ఉనికి గలది. "సువర్ణం రజతం తామ్రమ్రీతిః కాంస్యం తథా త్రపుః, సీసం చ ధీవరం చవివ అష్టలోహాని చక్షతే" అని అష్ట లోహములు.
అష్టౌ పదా న్యుత్పత్తిస్థానాన్యస్యేతి వా అష్టాపదం - ఎనిమిది యుత్పత్తి స్థానములు గలది.
అష్టాపదం శారిఫలమ్,
నెత్తపలక - పాచిక లాడెడు పలక, అష్టాపదము.  
ప్రతిపఙ్క్తి అష్టౌపదాన్నతే త్యష్టాపదం, ప్న. ప్రతిపఙ్క్తియందును, ఎనిమిదిదేసి యిండ్లు (గదులు) గలది.
శారిఫలము - నెత్తపలక, చదరంగపు పలక.
శారీణాం ఫలం శారిఫలం, ప్న. - సారె లుండు పలక. ఈ 2 నెత్త(జూద) మాడు పలకపేర్లు.

శారము - 1.చిత్రవర్ణము, 2.జూదపుసారె.
శారి - గోరువంక, రూ.1.శారిక, 2.జూదపుసారె.

బిందుతంత్రము - 1.చదరంగము, 2.నెత్త పలక.
ౘదరంగము - 1.చతురంగము, 2. ఒక యాట, సం.చతురంగమ్. చతురంగము - చదరంగము.

పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁడిక్కఁడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధప్రకరంబుర కేమి యొగ్గగన్
కొండొక కోతి చెట్టుకొన కొమ్మలనుండగ క్రింద గండభే
రుండ మదేభ సింహ నికరంబులు నుండవె, చేరి భాస్కరా.

తా. ఒక చెట్టుక్రింద గండభేరుండములు, సింహములు, ఏనుగులు గుంపులుగా నుండగా, ఆ చెట్టుపైకొక కోతి monkey ఎక్కి కూర్చునంత మాత్రమున దానిచే వాటి కేయాపదయు ఘటిల్లదు, అట్లే పండితులొక్కప్పుడు తక్కువ స్థానములలో నుండగా ఒక అల్పుఁడు - నీచుడు ఎక్కువ స్థాన మందున్నను యాతనివలన వారి కెట్టిలోపమును రాదు.         

శరభమే సారమైనదో హరియె సార
వంతమో యననేల నీ కాంతి నీది
కాంతిమంతము లెందును గాంతి నింపు
సిరుల నిడుము వేదాద్రిలక్ష్మీనృసింహ|

9. నవమి - పక్షమందు తొమ్మిదవ తిధి విణ.తొమ్మిదవది.
నవమము -
తొమ్మిదవది, నవమి. (నవమం బుద్ధిదాత్రీ చ; నవమా సర్వసిద్ధిశ్చాత్, నవ దుర్గా ప్రకీర్తితాః)

నవకము - మృదుత్వము, సం.వి.తొమ్మిది.
తొమ్మిది -
ఎనిమిదియు నొకటి.
ముత్తిగ - (మూడు+తిగ) తొమ్మిది.
తొమ్మండ్రు - తొమ్మిదిమంది.

నవతి - తొంబది.  
తొంబది -
తొమ్మిది పదులు.
తొంబనూఱు - తొంబదు నూర్లు.
తొమ్మన్నూఱు - తొమ్మిది నూరులు, రూ.తొమ్మనూఱు. 

10. దశమి - 1.పక్షమున పదియవ తిధి, 2.పదియవది.

యంతి భ్రామ్యంత్యనయేతి ఇరా. ఇణ్ గతౌ. దీనిచేతఁ తిరుగుదురు.

దశాంశపద్ధతి -  (గణి.) పదులను పదుల వర్గములను ఉపయోగించి సంఖ్యలను వ్రాయుపద్ధతి, (Decimal system).
దశాంశభాగము - (గణి.) సంవర్గ భాగములోని దశాంశభాగము. దశకము యొక్క దశాంశ బిందువు తరువాతి భాగము (Mantissa) ఉదా. 30 అను అంకెకు 10 అధారముగా గ్రహించ బడినపుడు లఘు గణకము 1.2010 ఇందులో 2010 అను భాగము దశాంశ భాగము. ఒకటి 1 అనునది పూర్ణాక భాగము.  

దశరా - 1.దశరాత్రము, 2.దేవీనవరాత్రము, సం.దశరాత్రమ్.   దశమం వరదాయినీ| 

దశకము - పది.
పది  - దశకము, సం.పంక్తిః.
పంక్తి - 1.వరుస, 2.పది.

పఙ్త్కి శ్ఛన్దో (అ)పి దశమమ్ -
పఙ్త్కి శబ్దము పది అక్షరముల పాదముగల ఛంధస్సునకును, అపిశబ్దము వలన శ్రేణికిని, పది యను సంఖ్యకును పేరు. పంచత ఇతి పఙ్త్కి, సీ. సచి విస్తారే. - వివివియైనది.

ధోరణి - 1.పద్ధతి, 2.పంక్తి.
పద్ధతి -
1.మార్గము, 2.వరుస, సం.వి.(గణి, భౌతి, రసా,) సమకూర్చ పడిన అవయములు (భాగములు) కలిగి క్రమసహిత సంబద్ధ పూర్ణముగా పరిగణింపబడునది (System). లేదా ఒక పూర్ణముగా పరిగనింపబడు వస్తువుల సమూహము.
పదవి - మార్గము, వై.వి. ఉన్నత స్థితి, సం.పదమ్.   

బంతి - చెండు, కందుకము, వై.వి.1.పంక్తి, 2.పది, సం.పంక్తిః.
చెండు -
క్రి. ఖండించు, వి.1.కందుకము, బంతి, 2.పూబంతి.  
చెండాడు - క్రి. ఖండించు. 

గేన్దుక కన్దుకః -
గేందుకము - చెండు, బంతి, రూ.గేండుకము.
గాతే గేదుకః గాఙ్ గతౌ. - రివ్వునఁ బోవునది.
గే గగనే ఇందురివ గేందుకః. - గగనమందు చంద్రునివలె నుండును.
కండుకము- బంతి, చెండు, రూ.కందుకము.
కందుకము - బంతి, చెండు.
స్కంద్యతే పీడ్యత ఇతి కందుకః., పా, కండుకః. స్కందిర్ గతిశోషణయోః. - పీడింపఁబడునది. చెండు పేర్లు బంతి.

ముండకము - (వృక్ష.) బంతి, చేమంతి, సూర్యకాంతము మొ. మొక్కల పుష్పగుచ్ఛము వంటిది. (ఈ పుష్పగుచ్ఛమందలి పువ్వునకు వృంతము లుండవు. అవి చుట్టును ఉన్నని పత్రచక్రముచే రక్షింప బడుచుండును. ఇది 'మధ్యాభిసాం' పుష్పగుచ్ఛముల తరగతిలో ఒకటి (Capitulum or head). అసత్యముండకము = False head).    

నఱకు - క్రి.ఖండించు.
నఱకుఁడు - ఖండనము.

దళనము - 1.ఖండించుట, 2.చీల్చుట.
దళితము - 1.ఖండింపబడినది, 2.వికసించినది, 3.ఛేదింపబడినది.

ఈరేను - (ఇరు+ఏను) పది.

11. ఏకాదశి - 1.పదునొకండవ తిధి, 2.పదునొకండు తంత్రులుగల పరివాదిని యను వీణ.
ఏకాదశము -
పదునొకండు, విణ.పదునొకండవది.

శుక్లపక్షంలో గాని కృష్ణపక్షంలో గాని ఏకాదశీ వ్రతం చేస్తే బ్రహ్మపర్యంతం వైకుంఠవాసం లభిస్తుంది. 

దేవ నీ దయ యున్నచోఁ దేజమందు
నదియె ముక్కోటి పండుగ ముదము నొసగు
నిదియె యేకాదశీసేవ వృద్ధికరము
సిరులనిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ.

అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనస్సు; మొత్తం పదకొండింటినీ భగవంతుని యందు నిలుపుటయే పదకొండవ తిధి అయిన ఏకాదశిలోని అంతరార్థం. 

పరితోవదతి సప్తస్వరానితి పరివాదినీ - తంతులతోఁ గూడిన వీణ, అంతటను సప్తస్వరములఁ బలుకునది.

కాయమీద మ్రాను కడురమ్యమైయుండు, మ్రాను మీద లతలు అలరుచుండు, లతలమీద వేళ్ళు నాట్య మాడుచు చుండు - వీణ.
తీగల బుర్ర - తీరైన బుర్ర - తనవారి చేతిలో పలికేటి బుర్ర - వీణ.

హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.
బృంద -
తులసి(తొళసి - తులసి), హరిప్రియ.
హరివాసరము - ఏకాదశి.(వాసరము - దినము.)
హరేః ప్రియా హరిప్రియా - హరికి ప్రియురాలు.  

ప్రత్యంగిరా ధరావేలా లోకమాతా హరిప్రియా,
పార్వతీ పరమా దేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ.

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ|
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణ జీవనీ||

ఏకాదశం క్షుద్ర ఘంటా : ఏకాదశి, పౌర్ణమి అమావాస్య మొదలగు పుణ్యదినములలో స్త్రీలతో (పరస్త్రీలతో) కలిసి తిరుగకుము.

ద్వాదశాత్ముఁడు - సూర్యుడు Sun.
ద్వాదశ ఆత్మానః మూర్తయః యస్య ద్వాదశాత్మా. న. పు. పండ్రెండువిధములైన మూర్తులు గలవాఁడు.

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ  
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ  
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.
    
భా|| ఒకే ఒక సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగా కనిపించే విధంగా తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయకమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే (హరి) భగవంతుణ్ణి పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను.

12. ద్వాదశి - పక్షమందు పండ్రెండవ తిథి, దోదసి.
దోదసి - ద్వాదశి, ఒకానొక తిథి.
బారసి - ద్వాదశి, సం.ద్వాదశీ, ద్వాదశాహః

ద్వాదశాయత నేత్రాయ ద్వాదశోద్యత బాహవే |
ద్వాదశాయుధ ధారాయ ద్వాదశాత్మ న్నమోస్తుతే ||   

ద్వాదశకము - పండ్రెండు.
పండ్రెండు - (పది+ రెండు) ద్వాదశ సంఖ్య.
ద్వాదళము - పండ్రెండవది.
పరక - 1.రెండి వీసములు, 2.పండ్రెండ్రు, 3.గడ్డిపోచ.
ముచ్చౌకము - 1.పండ్రెండు (3x4), 2.మూడు చౌకములు.  
ఈరాఱు - (ఈరు + ఆఱు) రెండు ఆర్లు అనగా పండ్రెండు.

నాన్నోదకసమం దానం న ద్వాదశ్యాః పరం వ్రతమ్|
నగాయత్ర్యః పరం మంత్రం సమాతుర్ద్యైవతం పరమ్||

తా. అన్నోదక దానముతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతముకంటె నెక్కువైన వ్రతమును, గాయత్రీమంత్రముకంటె శ్రేష్ఠమైన మంత్రమును, తల్లికంటె నితర దైవమును లేదు. - నీతిశాస్త్రము

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.    

ఆరిరాధయిషుః కృష్ణం మహిష్యా తుల్యశీలయా|
యుక్త సంవత్సరం వీరో దధార ద్వాదశీ వ్రతమ్||
 

13. త్రయోదశము - పదుమూడవది, వి.త్రయోదశి.
త్రయోదశి -
1.పదుమూడవది, 2.తిథులలో నొకటి, 3.పరివాదిని; పదుమూడు తీగలు గల వీణ.
సప్త - ఏడు తంతులు గల వీణ, పరివారిది. 

చంద్రశేఖరుఁడు - 1.శివుడు, 2.నెలతాలుపు.
చంద్రశేఖరః, ఛంద్ర శేఖరఃశిరోభూషణం యస్య - చంద్రుడు శిరోభూషణముగాఁ గలవాడు.
నెలతాలుపు - శివుడు, చంద్రశేఖరుడు.

నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, అశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురుగింజల యెత్తు.  
మినుము - మినుపపైరు, మాషము.

నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.

నెలమేపరి - రాహువు.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
తలగాము - రాహువు. 

భూతేశుఁడు - శివుడు.
భూతేశః భూతానాం ప్రమథానా మిశః - ప్రమథగణములకు నీశ్వరుడు.

14. బూదె - చతుర్దశి తిథి, సం.భూతః.      భూతము - 1.పృధివ్యాధి భూతములు (ఇవి:- పృధివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.)2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.1.కడచినది, 2.పొందబడినది. శివతేజ శ్చతుర్దశః|   

బూ(ౘ)చులఱేఁడు - శివుడు.
బూచి - భూతము, సం.భూతః.
దెత్తి - (వ్యావ.) భూతము. ఎంత దెత్తో! దెత్తి బట్టిందా ఏమిటి?

బూతము - భూతము, పిశాచము, సం.భూతః.
పిశాచము - 1.దేవయోని విశేషము, 2.భూతము.
పిశాచాదిశబ్దములు ఇతర స్థలమందుఁ జెప్పబడనివి గనుక విద్యాధరశబ్దమువలె లింగభేదము దెలియుటకై జాతివివక్షచేత నేకవచనముగాఁ జెప్పబడినవి.    
పిశితము - మాంసము.
పిశిత మశ్నంతీతి పిశాచాః - మాంసమును భుజించువారు-కుబేరానుచరలు, అశ భోజనే.

మోహిని - 1.మోహింపజేసెడు స్త్రీ, 2.దేవత, 3.పిశాచ స్త్రీ. 

గాము - 1.సుర్ర్యాది గ్రహము, 2.పిశాచము సం.గ్రహః.
అవేశము - 1.ప్రవేశము, 2.పిశాచాదుల సోకుట, 3.వేగిరపాటు, 4.చలము, 5.గర్వము, 6.కోపము, 7.(భౌతి.) ఒక వస్తువు పై ప్రోగైన విద్యుద్రాశి (Charge).

బేతాళుఁడు - యమకింకరుడు.
బేతాళము - పిశాచము, భూతావిష్ట మృత శరీరము.

అపదేవత - పిశాచము; కాలియ - పిశాచము, సం.కాళికా.
కొఱివి తాల్పు - పిశాచము (కొఱవి దయ్యము). వ్యావృతి - కొరివి దయ్యము.
డాకిని - ఆడు దయ్యము; శాకిని - ఒక తెగ పిశాచ స్త్రీ. డాకిన్యాం భీమశంకరమ్| 

యో డాకినీశాకిని కా సమాజే - నిషేవ్యమాణః పిశితాశనైశ్చ|
సదైవ భీమాది పద ప్రసిద్దం - తం శంకరం భక్తహితం నమామి.
 

చతుర్దశి - 1.పక్షమున పదునాల్గవ దినము, 2.పరివారిది యన వీణ, 3.పదునాల్గవది.
సప్త -
ఏడు తంతులుగల వీణ, పరివాదిని.  

ఈరేడు - (ఈరు+ఏడు) పదు నాలుగు, ఉదా.ఈరేడు జగంబులు.

బహుళ చతుర్థిని, సంకటహర చతుర్థి అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుణ్ని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయంటారు. గుప్పెడు గరికతో పూజించినా గంపెడు సంపదలిస్తాడు గణనాథుడు.     

అద్రోహేణచ భూతానా మల్పద్రోహేణవాపునః|
యావృ తిస్తాం సమాస్థాయ విప్రో జీవేత చాపది||
తా.
బ్రాహ్మణుండు ఆపత్కాలమునందైనను సకలభూతములకు ద్రోహము గలుగని వృత్తిచేత జీవించవలయును. లేక భూతములకు స్వల్పపీడ సేయునట్టి వృత్తిచేతనైనను జీవింపవచ్చును. – నీతిశాస్త్రము

భూతధాత్రి - భూమి, వ్యు.జీవుల నన్నిటిని ధరించునది.

భూతాత్మము - దేహము; దేహము - శరీరము, మేను. శరీరము - దేహము.
దేహి - దేహము గలవాడు.

భూతాత్మానౌ ధాతృదేహౌ -
భూతాత్మన్ శబ్దము బ్రహ్మకును, దేహమునకును పేరు. భూతానాం ప్రాణినా మాత్మా, పృథివ్యాది భూతస్వరూప ఇతి చ భూతాత్మా, న. పు. ప్రాణులకు ఆత్మ గనుకను, పంచమహాభూత స్వరూపముగను భూతాత్మ.

ఆత్మ - 1.పరమాత్మ, 2.జీవాత్మ, 3.దేహము, 4.స్వరూపము, 5.మనస్సు, 6.తాను, 7.బుద్ధి, 8.స్వభావము, 9.హృదయము, రూ.ఆత్మము.

మాతృవ త్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్ఠవత్ |
ఆత్మవత్సర్వభూతాని యః వశ్యతి సవశ్యతిః ||

తా. పరస్త్రీని తల్లివలెను, పరద్రవ్యమును మట్టిపెళ్ళవలెను, సకల భూతములను తన వలెను, నెవడు చూచునో, అతఁడు బ్రహ్మజ్ఞాని యగునని నకులుడు చెప్పెను. - నీతిశాత్రము  

ప్రణిహితము - పొందబడినది.     
ఆత్తము - 1.పొందబడినది, లబ్ధము, 2.హరింపబడినది, ఉదా.ఆత్తగర్వుడు.
ఆప్తము - 1.పొందబడినది, 2.నమ్మదగినది, 3.యథార్థజ్ఞానము కలది, 4.నిండినది, 5.యుక్తయుక్తమైనది, 6.(గణి.) భాగహారము చేయగా ఏర్పడిన సంఖ్య, లబ్ధము. 
ఆప్తి - 1.పొందుట, 2.స్త్రీసంయోగము, 3.లాభము, 4.చెలిమి, 5.రాబోవుకాలము, ఆయతి.
ఆప్తుడు - 1.బంధువు, 2.స్నేహితుడు, 3.యథార్థమును పలుకు పురుషుడు, నమ్మదగిన వ్యక్తి.

లబ్ధము - పొందబడినది, వి.(గణి.)భాగహారము చేయగా నేర్పడు సంఖ్య. 
లబ్ధము - (గణి.) అంకగణిత ప్రక్రియలో నొకటి (Product).

విన్నము - తెలియబడినది, పొందబడినది
ఇతము1 - 1.పొందబడినది, 2.పొందినది, 3.పోయినది(అపగతము – పోయినది), సం.వి.1.గతి, 2.జ్ఞానము.  
ఇతము2 - 1.కోరిక, 2.ఇంపు, రూ.ఇతవు(ఇతవు - ఇతము), సం.హితమ్.    

గతి - 1.పోక, 2.విధము(ప్రకారము), 3.త్రోవ, 3.స్థానము, 5.ప్రమాణము, 6.ఆధారము, 7.ఉపాయము, (భౌతి.) చలనము(Motion).
జ్ఞానము - 1.తెలివి, 2.ఎరుక. విద్య - 1.చదువు, 2.జ్ఞానము.

హితవరి - ఇతవుచెప్పువాడు.
హితవు - హితము, ఇతవు, మంచి.
హితము - 1.వెనుకటికి మేలుచేయునది, 2.ధరింపబడినది, 5.తగినది, 6.ఇష్టము.
ఇతవరి - (ఇతవు+ అరి) హితము చెప్పువాడు, మేలుకోరువాడు. 
హితైషి - మంచికోరువాడు.
మిత్రుఁడు - 1.హితుడు, 2.సూర్యుడు Sun. 

భావితము - పొందబడినది. 

తుల్యే భావిత వాసితే,
భావ్యత ఇతి భావితం, భువో (అ)వకల్కనే. వాస్యత ఇతి వాసితం. వస నివాసే. - వాసింపఁబడునది గనుక భావితము, వాసితమును. ఈ 2 వాసింపఁబడిన వస్తువు పేర్లు. 

వాసితము - 1.వాసితము, 2.వాసెనకట్టబడినది. వాసి - 1.తారతమ్యము, 2.అధిక్యము, 3.ప్రసిద్ధి, 4.బాగు, 5.పరిమితి, 6.లాభము.

భావితం వాసితం త్రిషు,
భావ్యతే సురభిద్రవ్వైరితి భావితం, భువో అవకల్కనే. - సురభి ద్రవ్యములఁ చేతఁ జేయఁబడినది.
వాస్యతే గంధద్రవ్వైరితి వాసితం. - గంధద్రవ్యము లచేత వాసింపఁబడునది. ఈ 2 ను త్రి, వాసన కట్టిన వస్తువు. 

భావము - 1.అభిప్రాయము, 2.మనోవికారము, 3.పుట్టుక, 4.ధాత్వర్థ రూప క్రియ, 5.సత్తు, 6.స్వభావము, సం. ఊహ, సామాన్యమైన ఊహ, భావన (Concept).
భావన - 1.తలపు, యోచన, 2.వాసనకట్టుట.

అభిప్రాయము - 1.తలపు 2.భావము, తాత్పర్యము 3.అభిలాష, కోరిక 4.వైఖరి, రీతి, సంస్థితి (Attitude).
ఆంతర్యము - 1.అభిప్రాయము, 2.మిక్కిలి సన్నిహిత సంబంధము, 3.అక్షరములకు స్థానప్రయత్నాదులచే కలుగు పరస్పర సాదృశ్యము, 4.గుట్టు, 5.హృదయము.

ఆశయము - 1.తలపు, 2.మనస్సు, 3.పడుక, 4.మృగములను పట్టుటకై వేటకాండ్రు త్రవ్వుగోయు, 5.ఆధారము, 6.స్థానము, 7.(వైద్య.) దేహము నందలి శ్లేష్మాదుల స్థానము, ఉదా. పిత్తాశయము, మూత్రాశయము , మొ.వి.

హృదయము - మనస్సు, గుండె, రొమ్ము, రూ.హృది, (జం.) గుండెకాయ, గుండె(హేర్త్). హృదయం ఒకటైనా..... భావాలెన్నో...…  

అభిప్రాయాన్ని చెప్పడానికి నీరసులు వణుకుతారు. తెలివి తక్కువవారు దాన్ని వ్యతిరేకిస్తారు. బుద్ధిమంతులు విషయ నిర్ణయం చేస్తారు. చతురులు దాని గమనాన్ని నిర్దేశిస్తారు. - మదాం జిన్నెరోలండ్

ఊహ - 1.యోచన, భావము, 2.విత్కరము.
ఊహించు(ౘ) - క్రి.ఆలోచించు, వితర్కించు.
ఊహ్యము - 1.ఊహింపదగినది, 2.(గణి.) ఋణరాసుల వర్గమూలములకు సంబంధించినది (Imaginary).
ఊహ్యసంఖ్య - (గణి.) ఋణరాసుల వర్గమూలములకు సంబంధించిన సంఖ్య (Imaginary number).  

భావ - ఏనిమదవ సంవత్సరము.
భావిని - 1.భావముగల స్త్రీ, 2.అందకత్తె.      

భావుఁడు - (నాట్య పరిభాషలయందు) విద్వాంసుడు.

భావో విద్వాన్ -
భావయతీతి భావః. - సర్వార్థములను భావింపఁ జేయువాఁడు. ఈ ఒకటి విద్వాంసుని పేరు.    

భావజుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ). 

అధిగతము - 1.పొందబడినది, 2.చదువ బడినది, చక్కగా నేర్చుకొన బడినది.  

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |
పక్షః పంచదాశాహాని శుక్లః కృష్ణశ్చ మానద ||

పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్క చేయబడినది, విశాలమైనది.
పృథువు - గొప్పది, వి.ఒక రాజు.
పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము horse.
పార్థివ - అరువది సంవత్సరములలో నొకటి (19వది).
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

పృథివీ హ్యేషా నిథిః సర్వాధార, సర్వసంపద్దాత్రి, రత్నగర్భ, సమస్త సురాసుర మానవ సంపూజ్యమాన. 

పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.
ఱేఁడు - దొర, మగడు, అధిపతి.
క్షత్రియుఁడు - రాచవాడు.
దొర - 1.రాజు, 2.సేనాపతి, 3.యోధుడు, విణ.1.గొప్పవాడు, 2.సమానుడు.  
మగఁడు - 1.పురుషుడు, 2.భర్త, 3.రాజు, 4.శూరుడు.
అధిపతి - 1.ప్రభువు, అధిపుఁడు, 2.తలలోని ఒక భాగము (దీనికి గాయము తగిలిన తోడనే వ్యక్తి మరణించును).
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసోత్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
చంద్రుఁడు - నెల, చందమామ.

పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.
అర్జునుఁడు -
1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యాజునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

నృనతి - రాజు, రూ.నరపతి.
నృపుఁడు -
రాజు; నృపాలుఁడు - రాజు.
నరపాలుఁడు - రాజు.

నృపలక్ష్యము - రాజునకు పట్టెడి తెల్లగొడుగు.
లోకసమ్మతము - చంద్రుని గొడుగు.

స్థానవృద్ధిక్షయజ్ఞస్య షాడ్గుణ్యవిదితాత్మనః |
అనవజ్ఞాతశీలస్య స్వాధీనా పృథివీ నృప ||

భా|| తనస్థితి యొక్క వృద్ధి క్షయాలు, షాడ్గుణ్యమూ తెలిసిన వానికి, అవమానింపబడని శీలం(శీలము - 1.స్వభావము, 2.మంచినడత.)కలవానికి ఈ భూమి అంతా స్వాధీన మవుతుంది. 

అప్పు - ఋణము, సం.వి.జలము.
ఋణము -
1.అప్పు, 2.దుర్గభూమి, 3.జలము, 4.(బూ.గణి.) a.తీసివేయు సంఖ్య, b.తీసివేతగుర్తు, విన.ఋణరాశి (Negative).
ఋణాత్మకము - (గణి.) శూన్యము కన్న తక్కువైనది, (Negative).
జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.
నీరు - 1.నీరము, జలము, 2.మూత్రము, సం.నీరమ్.
నీరము - జలము. జడము - నీళ్ళు, రూ.జలము, విణ.తెలివిలేనిది.

ఋణం పర్యుదఞ్చనమ్, ఉద్దారః -
అర్యతే కాలాన్తర ప్రాప్యత ఇతి ఋణం. ఋ గతౌ. - కాలంతరమునఁ బొందఁబడునది.
పర్యుదఞ్చ్యతే పరిప్రాప్యత ఇతి పర్యుదఞ్చనం. అఞ్చు గతిపూజనయోః. - కాలాంతరమునఁ బొందఁబడునది.
ఉద్ద్రియతే గృహ్యత ఇతి ఉద్దారః. హృఞ్ హరణే. - పుచ్చుకొనఁబడునది. ఈ 3 అప్పు పేర్లు.

ఉత్తరము - 1.బదులు, 2.ఒక దిక్కు, 3.జాబు, (ఈ అర్థము తెనుగు నందు మాత్రమే కలదు, సంస్కృతమున లేదు), విణ.మీదిది.
బదులు - 1.అప్పు, 2.మారు, ప్రతి.
మారు - ప్రతి.
ప్రతి - 1.సమానము, 2.మారు, 3.ఒక్కొక్క. 

ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః|
ఋణక్షయే క్షయంయాతి కా తత్ర పరివేదనా||
తా.
సకలజనులకు పశువులు, పెండ్లాము(పత్ని- భార్య), కొమాళ్ళు(సుతుఁడు - కొడుకు), ఇండ్లును(ఆలయము-1.ఇల్లు, 2.స్థానము, 3.కలిసిపోవుట, 4.గుడి), జన్మాంతర ఋణసంబంధముల చేత గలిగి, ఋణము తీరగానే నశించు చున్నవి. కాబట్టి చింతించుటవలన లాభమేమి. - నీతిశాస్త్రము    

మహస్సు - 1.తేజము, 2.వెలుతురు, 3.యజ్ఞము, 4.ఉత్సవము.
తేజము -
1.ప్రకాశము 2.ప్రభావము 3.పరాక్రమము 4.రేతస్సు, రూ.తేజస్సు.
ప్రకాశము - వెలుగు, విణ.బయలు పడినది.
ప్రభావము - 1.ప్రతాపము 2.తేజము.
పరాక్రమము - 1.బలము 2.శౌర్యము.
రేతము - 1.వీర్యము, శుక్లము 2.పాదరసము, రూ.రేతస్సు.

బృహస్పతి సమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః| బుద్ధి మనస్సు కంటే శ్రేష్ఠమైనది.

వాయువు - ముఖ్యప్రాణుడు, (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి. గాలి.  వాయువు నిత్య సన్నిహితుడు. ప్రతిజీవిలోను వాయువు ప్రథాన రూపం శ్వాస.

నింగిచూలు - వాయువు వ్యు.ఆకాశము నుండి పుట్టినది.

బహుళము - 1.ఆకాశము, 2.కృష్ణపక్షము, విణ.1.అధికము, 2.తరచు, (వ్యాక.) ఒకప్పుడు కలుగుట ఒకప్పుడు కలుగ కుండుట, ఒకప్పుడు వైకల్పితముగా నుండుట, ఒకప్పు డొంకొక విధముగా నుండుట.

బహుళాః కృత్తికా గావో బహుళో (అ)గ్నౌ సితౌ త్రిషుః,
బహుళశబ్దము కృత్తికానక్షత్రమునకును పేరైనపుడు సీ. బహువచనమువలన నల్లని వస్తువునకును పేరగునపుడు త్రి. గోవునకును, చకారము వలన ఏలాకులకును పేరగునపుడు సీ. అగ్నీకిని, క్ర్ష్నపక్షమునకును పేరగునపుడు పు. 'కృత్తికాసు స్త్రియాం భూమ్ని బహుళా బహుళా గవి, ఏలాయాం చ పుమానగ్నౌ కృష్ణపక్షే సితే త్రిషు ' అని రభసుఁడు.
బహుత్వాత్, బహునర్థాన్ లాతీతి చ బహుళా, లా దానే. - అనేకములైనవి గనుకను, అనేకార్థముల నిచ్చునది గనుకను బహుల.

ఆకాశము - 1.విన్ను, మిన్ను 2.భూతము లై దింటిలో ఒకటి, 2.అభ్రకము, 4.బ్రహ్మము, 5.(గణి.) సున్న, శూన్యము, 6.(భౌతి.) అంతరాళము, అవకాశము, భౌతికవస్తువులు ఆక్రమించు చోటు (Space).

అంబరము - 1.ఆకాశము, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళ ద్రవ్యము, 6.ద్యూతాది వ్యసనము.       

పంచభూత మహాగ్రాసా పంచభూతధి దేవత
సర్వప్రమాణా సంపత్తి స్సర్వరోగ ప్రతిక్రియా.

అపరపక్షము - బహుళ పక్షము, కృష్ణపక్షము.
బహుళ పక్షము -
చీకటి పక్షము, వ్యతి.శుద్ధపక్షము.    

ఉత్తరపక్షము - 1.సిద్ధాంతము (వ్యతి. పూర్వపక్షము), 2.కృష్ణపక్షము.
సిద్ధాంతము -
1.స్థిరమైన పక్షము, 2.నవవిధ జ్యోతిష గ్రంథములు (గణి.) గణిత ప్రవచనము నందలి సత్యమును నిరూపణ చేయ నుద్దేశించినది. నిరూపణ చేయ వీలైన ప్రాథమిక స్వీకృతముకాని గణిత ప్రవచనము (Theorem) (గణి., భౌతి., రసా.,) నిరూపించబడవలసిన తత్త్వము లేదా ఉపయుక్తులచే రుజువుచేయ బడవలసిన ప్రమేయము.
రాద్ధాంతము - సిద్ధాంతము, స్థిరమైన పక్షము.
సిద్ధాంతి - 1.జ్యోతిషము తెలిసినవాడు, 2.తత్త్వ శాస్త్రము తెలిసినవాడు.

రాద్ధాంతము - సిద్ధాంతము, స్థిరమైన పక్షము.

పెల్లు - హెచ్చు, విణ.అత్యంతము, సం.బహుళమ్.
హెచ్చు -
అధికమగు, రూ.ఎచ్చు.
ఎచ్చు(ౘ) - అధికము, విణ.అధిక్యము, క్రి.అధికమగు.
అధికము - ఎక్కువైనది, పెద్దది, వి.(అలం.) ఒక అర్థాలంకారము.
వలదు - అధిక్యము, అవ్య.వద్దు.
అత్యంతము - మిక్కిలి; మిక్కిలి - 1.అధికము, 2.శ్రేష్ఠము. 
నితాంతము - పెల్లు, అధికము. నిర్భరము - పెల్లు, అధికము. 

తరుచు - త్రచ్చు.
త్రచ్చు -
చిలుకు, మధించు, రూ.తరుచు, సం.ధర్ష్, తక్ష్. 
త్రచ్చన - 1.చిలుకుట(చిలుకుడు - చిలుకుట), 2.చెక్కుట.
మథనము - త్రచ్చుట.  

అనుమతి - 1.సమ్మతి, అంగీకారము, 2.ఒక కళ తక్కువైన చంద్రుడు గల పున్నమ.

కళాహీనే సానుమతిః :
నిశాకరే కళాహీనే సతి సా పూర్ణిమా అనుమతి రిత్యుచ్యతే. చతుర్దశీ యుక్తేతి భావః - చంద్రుఁడు కళాహీనుఁడైనపుడు ఆ పున్నమ అనుమతి యనంబడును. అనఁగా జతుర్దశితోఁ గూడినదని భావము. ఒక కళ తక్కువగాఁగల చంద్రునితో గూడిన పున్నమ.

     
అనుమోదము -
1.సంతోషము, 2.అంగీకారము, సమ్మతి.
సమ్మదము - సంతోషము; ప్రహ్లాదము - సంతోషము.
హ్లాదనము - సంతోషించుట, సంతోషము, రూ.హ్లాదము.
సమ్మతి - అంగీకారము, ఇచ్ఛ. ఇచ్ఛ - అభిలాష, కోరిక.
సమ్మతము - ఇష్టమైనది, అంగీకృతమైనది, సం.వి. (గృహ.) స్వీకరణ, అంగీకారము, (Acceptance).
అంగీకారము - 1.సమ్మతి, ఒప్పుకొనుట, 2.స్వీకారము.
స్వీకారము - అంగీకారము.

ఉపగతి - 1.ప్రాప్తి, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.అంగీకారము.
ఉపగమము -
1.అంగీకారము, 2.సమీపించుట, 3.జ్ఞానము, 4.ప్రాప్తి, 5.కలియుట.

పర్వము - 1.పండుగ, 2.సమూహము, 3.అమావాస్య లేక పున్నమ, (వృక్ష.) కణుపుల మధ్యనుండు కాండభాగము (Internode), గ్రంథి.
పండుగ - సంబరము, ఉత్సవము, సంక్రాంతి మొదలైనవి.
సంబరము -
సంభ్రము, వేగిరపాటు, సంతోషము, పండుగ, రూ.సంబ్రము, సం.సంభ్రమః.
సంభ్రమము - (గృహ.) 1.సంబరము, 2.వేగిరపాటు, 3.భయము, 4.ఆదరము.  
సమ్రంభము - 1.వేగిరపాటు, 2.ఆటోపము. దడబడ - ఆటోపము.
ఆటోపము - 1.వే గి ర పా టు, 2.గర్వము, 3.వ్యాపించుట.
సంభ్రమించు - వేగిరపడు; వేగిరపాటు - వేగపాటు.
సంతోషము - సంతసము, ముదము.  
పబ్బము - 1.పండుగ, ఉత్సవము, 2.అతిథ్యము, సం.స్వరమ్.   
ఉత్సవము - 1.ఊరేగింపు, 2.పండుగ, 3.కోపము, 4.గర్వము.
సంవేగము - సంభ్రమము, వేగిరపాటు, సం.(జీవ.) ప్రేరేపణ (Impulse).
సంవేగాత్మకము - (గృహ.) సులభముగా మనోవికారము పొందు నట్టిది, (Emotional).
సంవేదకనాడులు - (జం.) జ్ఞానేద్రియముల (చర్మము, నాలుక, కన్ను, ముక్కు, చెవి) నుండి కేంద్ర నాడీమండలమునకు ప్రేరణలు పంపు నాడులు, జ్ఞాననాడులు, (Sensory nerves).
జ్ఞానతంతువులు - (గృహ.) ఈనరముల తంతువులు జ్ఞానేద్రియముల నుండి మెదడునకు వార్తలను గొపోవును, (ఇవి చైతన్యము కలుగచేయును), (Sensory nerves).
జ్ఞానేంద్రియము - (జీవ.) ప్రత్యేకమగు ఏదైన నొక ప్రేరణకు శీగ్రాహియైన అవయవము (Sensory organ).   

ఆతిథ్యము - ఆతిథేయము, విణ.అతిథికొరకైనది.
ఆతిధేయము - అతిథి సత్కారము, విణ.అతిథికి యోగ్యమైనది.

పర్వముల సతుల గలియకు,
ముర్వీశుల కరుణనమ్మి యుబ్బకు మదిలో
గర్వింప నాలి బెంచకు,
నిర్వాహము లేనిచోట నిలువకు సుమతీ.
తా||
ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య మొదలగు పర్వదినములందు(సతుల గలియకు……సతి - 1.పతివ్రత స్త్రీ, 2.పార్వతి.) స్త్రీలోలుడై తిరుగకుము, మనస్సులో రాజులయొక్క(ఉర్వీశుఁడు - రాజు, భూపతి)దయను నమ్మి సంతోషించకుము, అహంకారం పొందునట్లుగా భార్యను(ఆలి)పోషించకు, ఏస్థలము నందైనను తనకు (నిర్వాహము - 1.శక్తి, 2.జరుగుబాటు)లేని యెడల ((తన మాటకు విలువలేని యెడ)ఉండుట మంచిదికాదు.       

సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము, (Group).
గుంపు -
1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ వచ్చెడి ఉండ.

గ్రంథి - 1.బుడిపి, గడ్డవలె పుట్టు రోగము, 2.చెట్టు మొ.ని ముడి, 3.కీలు (జీవ.) శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).
జీవకణ సంహతి - (వృక్ష.) జీవకణ సమూహము, (Tissue).
బుడిపి - 1.మ్రాని యందలి ముడి, కనుపు, 2.బొప్పి. బొప్పి - బుడిపి. 
కణుపు - 1.బుడిపి, 2.వెదురు, చెరకు మొ.ని కనుపు, 3.(వృక్ష.) కాండముపై ఆకు బయలుదేరిన స్థానము (Node).
కనుపు - గనుపు, పర్వము, రూ.కణుపు. 
గంటు - 1.కనుపు, బుడిపి, 2.గాయము, 3.వెండ్రుకలముడి, 4.రూకలముడి, క్రి.గాయపరచు.
గాయము - కత్తి మొ.వానితాకున గలుగు దెబ్బనరకు, క్షతి.
క్షతి - 1.గాయము, 2.నాశము. ధ్వంసము - నాశము.
ముడి - 1.గ్రంథి 2.చెట్టు మొ.ని. ముడి, 3.దారము ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ.1.అఖండము, 2.వికసింపనిది.
గ్రంథికుఁడు - 1.జోస్యుడు(కాలజ్ఞుఁడు - జ్యోస్యుడు.), 2.సహదేవుడు.
జ్యోతిషికుఁడు - జోస్యుడు, (Astrologer).   

కుటి - 1.గుడిసె, 2.బుడిపి, 3.నీళ్ళు మోయు పనికత్తె.
కుటీరము -
గుడిసె, వ్యు.కుటిలమగు (వంకరయగు) ఈరము (గుడిసె).
ఈరము - నికుంజము, పొదరిల్లు.
నికుంజము - పొదరిల్లు.

అనిత్యాని శరీరాని విభవో నైవశాశ్వతః|
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః||
తా.
శరీర మనిత్యము, (విభవము - సంపద, ఐశ్వర్యము.)సంపద శాశ్వతము కాదు, మృత్యువెల్లప్పుడు దగ్గర నుండును. కాబట్టి ధర్మ సంగ్రహమే చేయఁదగిన దని సహదేవుఁడు వచించెను. - నీతిశాస్త్రము 

పర్వవేలా తరంగము - (భూగో.) అధికమైన పోటు, అమావాస్యనాడు పౌర్ణమినాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో నుండు నప్పుడు సూర్యచంద్రుల ఆకర్షణ శక్తిచే సముద్రపు నీటి మట్టములో గలిగిన అధికమైన పోటు.

ఆటుపోటు - 1.సముద్రతరంగములు ముందుకు వచ్చుటకు పోటనియు, వెనుకకు పోవుటకు ఆటనియు అందురు. (దుఃఖము తెరలు తెరలుగా వచ్చుటకును దీనిని వాడుదురు), 2.బాధ, 3.దుఃఖము.

ఆటు - 1.అడువు, దెబ్బ, 2.తగ్గుట.
పోటు  - 1.పొడుచుట, 2.యుద్ధము, 3.శౌర్యము, 3.పెద్ద అల.
పాటు - 1.కష్టము, 2.శ్రమము, 3.పడుట, 4.అలయడగుట, 5.అల హెచ్చగుట, సం.పత్, పాతమ్, (అర్థ,) శ్రమ, వాంఛించిన ఏ వస్తువు నైనను ఉత్పత్తిచేయుటకు చేయబడు యత్నము (Labour).

సముద్రపు పోటుపాటులు - (భూగో.) సూర్యచంద్రుల ఆకర్షణశక్తిచే సముద్ర మందలి నీటిమట్టము ప్రతిదినము రెండు సార్లు హెచ్చును, రెండు సార్లు తగ్గుట. (పాటు = సముద్రపు నీరు హెచ్చుట; పోటు = సముద్రపు నీరు తగ్గుట.)  

నందివర్ధనము - 1.ఒక జాతి పూలచెట్టు, 2.అమావాస్య లేక పున్నమ.
నంద్యానర్తము - 1.పడమట తక్క, తక్కిన మూడు దిక్కుల వాకిళ్ళు గల రాజగృహము, 2.నందివర్ధన వృక్షము.

అపీతము - 1.త్రాగబడినది, 2.కొంచెము పసుపువన్నె కలది, వి.1.ఇంచుక పసుపువన్నె, 2.పద్మకేశరములు, 3.నందివృక్షము.

దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
అమావాస్య -
(భూగో.) చంద్రుడు తన మార్గములో సూర్యునికిని భూమికిని మధ్య వచ్చినపుడు చంద్రునిపై సూర్యుని వెలుగుపడిన భాగము కనిపించని దినము. కృష్ణపక్షమున కడపటిదినము, వికృ.అమవస, అమాస.
అమవస - చంద్రుడు ప్రకాశింపని దినము, రూ.అమాస సం.అమావాస్యా.

అమావాస్యా త్వమావస్యా దర్శ స్సూర్యేందు సంగమః :
అమాశబ్దస్సహార్థే అవ్యయం. అమా సహ తిష్ఠతః రవిచంద్రావస్యామిత్య మావాస్యా. అమావస్యా చ. వస నివాసే - దీనియందు సూర్యచంద్రులు కూడుకొనియుండురు.
దృశ్యేతే సూర్యచంద్రావత్రేతి దర్శః, దృశిర్ ప్రేక్షణే - దీనియందు సూర్య చంద్రులు కూడుకొని యగపడుదురు.
సూర్యేంద్వోః సంగమః మేళనమత్ర సూర్యేందుసంగమః - దీనియందు సూర్యచంద్రులకు సంగమము కలదు గనుక సూర్యేందు సంగమము.

అమావాస్యరోజు చెట్లు పూలు కాయలు, కోయరాదు తాకరాదు. సూర్యచంద్రులు అమావాస్యనాడు చెట్లకి, అహారము వెలుగు ఇచ్చేరోజు.

అమావాస్య యనగా కృష్ణపక్షము. పంచదశి(పదునైదవ) కళయందు - ఎప్పుడు - సూర్యచంద్రులకు అత్యంత సంయోగము కులుగునో అప్పుడు అమావాస్య అగుచున్నది.

అమావాస్యనాడు చంద్రుడు కనిపించనంత మాత్రాన చంద్రుడు లేడనటం అజ్ఞానము. అయ్య రాక పోతే అమావాస్య ఉండిపోతుందా?

సా వష్టేందుకళా కుహూః :
కుహయతి విస్మాపయతి తమసేతి కుహూః - తమస్సుచేత నాశ్చర్యము ను గలుగఁ జేయునది. చంద్రకళ గానరాని యమావాస్య పేరు.

రాకా కుహూ రమా వాస్యా పూర్ణిమానుమతీ ద్యుతిః.

(ౘ)చూపు - చూపించు, వి.దృష్టి.
దృష్టి -
1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.
దృక్కు - 1.కన్ను, 2.చూపు, 3.బుద్ధి.

ఇక్కడ చూచి అక్కడ చూశామంటే ఆమడ పరుగెత్తుతుంది. - దృష్టి.

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు 2.గుడ్డివాడు 3.మంచి కన్నులు కలవాడు.

చక్షువు - కన్ను.
చాక్షుషము -
(భౌతి.) కంటిచే గ్రహింపబడునది, (Optical) దృష్టి (చూపు,) సంబంధమైనది, (Visual).

శలాకలు శంకువులు - (జం.) కంటిలోని మూర్తి పటము యొక్క బయటి పొరలోనున్న అధిచ్ఛద జీవకణములు, (వినికి శీఘ్రగ్రహణశక్తి గలదు) (Rods and cones).

కన్నులు పెద్దవైన కనుపాపలు చిన్నగానే ఉంటాయి. కన్ను ఎరింగింప కున్నను కడుపు ఎరింగించును. నిశ్చయార్థము కలది బుద్ధి. బుద్ధి జ్ఞానము వల్ల అంకురిస్తుంది.

దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.
దరిసెనము -
1.దర్శనము, 2.పెద్దల చూడకొనిపోవు కానుక, సం.దర్శనము.
దరిసించు - 1.దర్శించు, చూచు, 2.కానుక యిచ్చు.
ఆత్మదర్శము - అద్దము, వ్యు.దేహమును చూపునది.
ఆదర్శము - 1.పరమోత్కృష్ట స్థితి, మేలు బంతి, 2.అద్దము, విణ. అనుసరింప దగినది. అద్దము పగులకొడితే, అసలు రూపం నశిస్తుంది.

నయనము - 1.కన్ను, 2.పొందించుట.
కన్ను - 1.నేత్రము, 2.జాడ, 3.కనుపు, 4.చక్రము, 5.వంతెనద్వారము, 6.నెమలిపురికన్ను, 7.చూపు, 8.వలయందలి రంధ్రము, 9.వ్రణాదుల యందలి రంధ్రము.

ప్రేక్షణము - 1.నేత్రము, 2.నృత్యము, 3.చూచుట.
ప్రేక్షణికుఁడు -
ప్రేక్షకుడు, చూచువాడు.
సాక్షి - చూచువాడు; సాకిరి - సాక్షి.

కంటికి చూడడం లక్షణం. దానికి అంతే తెలుసు. చూసేవి చెప్పలేవు. చెప్పే లక్షణం నోటిది. చూడడం చేత కానిది. చెప్పేది చూడలేదు. చూసేది చెప్పేది కాదు, చెప్పేది చూసేది కాదు.

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణంతరసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నిటికిని కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము  

సినీవాలి - 1.చంద్రకళ కానవచ్చెడి అమావాస్య, 2.పార్వతి. శివుని సన్నిధి నందు దేవిస్థానం పార్వతి|

సా దృష్టేంధు స్సినీవాలీ :
అః విష్ణుః తేన సహవర్తత ఇతి సా లక్ష్మీః సా అస్యామితి సినీ చంద్రకళా సా బాలా అస్యామితి సినీవాలి. అ  అనఁగా విష్ణువు. అతనితోఁగూడినది గనుక సా అనఁగా లక్ష్మి. ఆలక్ష్మి గలది గనుక సిని అనఁగా జంద్రకళ. ఆ చంద్రకళ దీనియందు లేఁతదైయుండును గనుక సినీవాలి. వబయోరభేదః. చంద్రకళతోఁ గూడిన యమావాస్య పేరు.

సినీవాలీ శివావశ్యా వైశ్వదేవీ పిశంగిలా…

చంద్రుడు అమావాస్య నుండి ఎదుగుతూ పూర్ణిమనాడు పరిపూర్ణుడు అవుతాడు. అక్కణ్ణుంచి కృష్ణపక్షంలో తరగడం ప్రారంభిస్తాడు. చల్లని వెన్నెలనిచ్చే చంద్రుడు క్షీణిస్తుంటాడు. అమావాస్యనాడు లోపిస్తాడు. అదే పునరావృతం అవుతూ ఉంటుంది.

సంతత పుణ్యశాలి కొకజాడను సంపద వాసిపోవ తా
నంతటఁబోక నెట్టుకొని అప్పటి యట్ల వసించు చుండు మా
సాంతము ననదుఁజందురుని పన్నికళల్ వెడబాసిపోయినన్
గాంతి వహింపడెట్లు, తిరుగంబడి దేహము నిండ, భాస్కరా.
తా.
చంద్రుడ(అ)మావాస్య యగు నప్పటికి, తన కళలన్నియు పోయి తిరిగి మరల సంపూర్ణ చంద్రుడై వెలుగొందును. అట్లే, పుణ్యాత్ముని(సుకృతుని) కొకప్పుడు లేమి గలిగినను వెంటనే తిరిగి సంపదలు కల్గును.

రాహువు, కేతువుల గ్రహబాధల వల్ల సూర్యచంద్రునికి గ్రహణాలు వున్నాయి. చంద్రునికి వృద్ధిక్షయాలు వున్నాయి.

చంద్రుడు వృద్ధిపొందే పక్షమునందలి కళలచే దేవతలకు, క్షీణ కళలచే పితృదేవతలకు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. చంద్రుఁడు వృద్ధిక్షయాలకు చలించని తత్త్వాన్ని బోధించాడు.

3.Moon

No comments:

Post a Comment