Thursday, February 16, 2017

వృషభరాశి

కృత్తిక 3, రోహిణి 4, మృగశిర 2 పాదములు వృషభరాశి.

తులా వృషభ రాశీశో దుర్ధరో ధర్మపాలకః,
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశ విమోచకః. - శుక్రుడు(Venus)

ఎండదొర - సూర్యుడు.
ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.  
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period.    
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

కృత్తిక ఎండకు కుత్తుకలు ఎండి పోతాయి. (సూర్యుడుండే నక్షత్రము, భయంకరమైన ఎండలు). సంవత్సరానికి రెండు వేసవులు రావు, ఉండవు.

ఎండకాలంలో కొత్త కుండలో నీళ్ళు ఎంత రుచి! చల్లని నీరు నాలుకకు ఇంపు!

కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.
కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, 5.ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons). 

వయసు - ప్రాయము, యౌవనము.
వయస్య - చెలికత్తె.
వయస్యుఁడు - చెలికాడు; చెలికాఁడు - స్నేహితుడు.

వేసఁగి - వేసవి, సం.వైశాఖః.
వేసవి -
వేసవికాలము.    

విశాఖుఁడు - షణ్ముఖుఁడు.
విశాఖానక్షత్రే జాతః విశాఖః – విశాఖనక్షత్ర మందుఁ బుట్టినవాఁడు.
వినా పక్షిణా మయా రేన శాఖతి వ్యాప్నోతీతి విశాఖః - పక్షియైన నెమిలిచేతఁ దిరుగువాఁడు, శాఖృ శ్లాఖృ వ్యాప్తౌ. విశాఖ శంకరాత్మజా|
షడాననుఁడు - కుమారస్వామి, షణ్ముఖుఁడు, వ్యు.ఆరు ముఖములు కలవాడు.
అగ్ని పత్నీనాం షణ్ణాం స్తన్య పానార్థం షట్ ఆననాని యస్య సః షడాననః - అగ్ని భార్యలైన షట్కృత్తికలత్తి స్తన్యపానముఁ జేయుటకై యాఱు ముఖముల ధరించినవాఁడు.

షణ్మాతురుఁడు - కుమారస్వామి, వ్యు.ఆర్గురు తల్లులు కలవాడు.

సురభి - 1.కామధేనువు, 2.ఆవు, 3.వాసన గలువ, 4.సంపెంగ, విణ.1.మంచివాసన గలది, 2.మనోజ్ఞమైనది.
సుష్ఠురభంతే హృష్యంత్యత్రేతి సురభిః. ఇ-పు. రభరాభ్యసే. - దీనియందు జనులు లెస్సఁగా సంతోషింతురు.
సుష్ఠు రభంతే ఉపక్రమంతే శుభకార్యం కర్తుమితి సురభిః. - దీనియందు జనులు శుభకార్యముఁ జేయ నారంభింతురు.
కామధేనువు - వెల్పుటావు, కోరిన వస్తువులను ఇచ్చెడి ఆవు. 
సురగలి - కామధేనువు; కామదుఘ - కామధేనువు.
వెలిగిడ్డి - కామధేనువు. 
ఈవులమొదవు - కామధేనువు.
తెలిమొదవు - కామధేనువు(మొదవు - పాడియావు).

సురభిశబ్దము ఆవునకు పేరగునపుడు సీ. చకారమువలన వసంత ఋతువునకు పేరైనపుడు పు. మంచి పరిమళము గలిగినదానికిని, మనోహరమైన దానికిని పేరైనపుడు త్రి. కామధేనువునకు పేరైనపుడు సీ. సుష్ఠు రభత ఇతి సురభిః. రభ రాభస్యే, మిక్కిలి వేగిరపడునది. "సురభి ర్నా జాతిఫలే వసంతే చంపకద్రుమే, సల్లక్యాం స్త్రీ మాతృభేదే మనోజ్ఞేతు విశేవ్యవ"దితి శేషః.

ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.

చాంపేయము - 1.బంగారము, 2.సంపెంగ.
చంపాఖ్యదేశే భవత్వాచ్చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చంపకము - సంపెంగ, సంపెగ.
సంపగియ - చంపకము, రూ.సంపగి, సంపెంగ, సంపగి, సం.చంపకః.

అథ చామ్పేయ శ్చమ్పకో హేమపుష్పః.
చంపాఖ్యదేశే భవః చాంపేయః - చంపయను దేశమందుఁ బుట్టినది.
చమ్యతే అశిభిరితి చంపకః. చము అదనే. - తుమ్మెదలచే నాస్వాదింపఁ బడునది.
హేమవర్ణం పుష్యమన్యేతి హేమ పుష్పకః - బంగారు వన్నెగల పువ్వులు గలది. ఈ 3 సంపెంగ చెట్టు పేర్లు.    

గంధఫలి - సంపెంగ మొగ్గ, రూ.గంధఫలి.

పూనూనె - సంపెంగనూనె.
కమ్మనూనియ - సంపెంగ, మొ.వి చేర్చి చేసిన తైలము, రూ.కమ్మనూనె. మింగమెతుకులేదు మీసాలకు సంపెంగనూనె.

సమూహఫలము - (వృక్ష.) ఒకే పుష్పములోని విభక్తాండ కోశము నుండి తయారైన ఫలసమూహము (Etacrio), ఉదా. సీతాఫలము, సంపంగి. పేర్లు
పుంజఫలము - (వృక్ష.) ఒకేపుష్పము నందు బయలుదేరి, విభక్తకమైన అండాశయము నుండి తయారైన పండు (Aggregate fruit), ఉదా. సీతాఫలము), చూ. సమూహఫలము.

కాంచనము - 1.బంగారము, 2.ఉమ్మెత్త, 3.సంపెంగ.
కచతి దీప్యత ఇతి కాఞ్చనం, కచి దీప్తి బంధనయోః. - ప్రకాశించునది.  
బంగారము - దుర్లభము, వి.స్వర్ణము.
స్వర్ణము - బంగారము, రూ.సువర్ణము, సం.వి. (రసా.) బంగారము (ఘొల్ద్), నాణెములు చేయు ధాతువులలో మిక్కిలి విలువగల ధాతువు, ఆ వర్తక్రమ పట్టికలో మొదటి వర్గములోనిది.

దుర్జనం కాంచనం భేరీ దుష్టస్త్రీ దుష్టవాహ మ్|
ఇక్షుం తిలా నౌషధాకాశ్చ మర్దయేడ్గుణ వృద్ధమ్||

తా. దుర్జనులను, బంగారమును, భేరిని, దుష్ట స్త్రీని, చెడుగుఱ్ఱమును, చెఱుకుగడలను, నువ్వులను, మందును గుణవృద్ధి కొరకు మర్దింప వలయును. - నీతిశాస్త్రము     

చంపకాశోకపున్నాగ సౌగంధికలసత్కచా|
కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా.  

కృత్తిక ఎండకు కుత్తుకలు ఎండి పోతాయి. (సూర్యుడుండే నక్షత్రము, భయంకరమైన ఎండలు). సంవత్సరానికి రెండు వేసవులు రావు, ఉండవు.

కృత్తివాసుఁడు - ముక్కంటి.
కృత్తిశ్చర్మవాసో (అ)స్య కృత్తివాసాః. స-వు. - చర్మము వస్త్రముగాఁ గలవాఁడు.

భవిష్యత్త్రిపురాంతాయ తరాంధక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే||

ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.
ముక్కంటిచెలి - కుబేరుడు. 

కృత్తిక - ఇరువదియేడు నక్షత్రములలో మూడవది, కత్తెర.
కృత్తి -
1.చర్మము, తోలు, 2.కృత్తికానక్షత్రము.

దేహంలోని ఆయుః స్థానాలైన షట్చక్రాలకు ప్రతీక కృత్తికా నక్షత్రము.

కృత్తిక ప్రథమ భాగమున సూరుడున్నప్పుడు, విశాఖా చతుర్థ పాదమున చంద్రుడు ఉండును. విశాఖా చతుర్థపాదమున చంద్రుడు ఉన్నప్పుడు, కృత్తికా శిరస్సున సూర్యుడు ఉండును.

కృత్తికాసుతుఁడు - కుమారస్వామి.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాధిపతి, వికృ.కొమరుసామి.
కారికేయుఁడు - కుమారస్వామి, వ్యు.కృత్తికల కుమారుడు. 
కృత్తికానా మపత్యం కారికేయః - షటృత్తికల కొడుకు.
బాహులేయుఁడు - కుమారస్వామి.
బహులానాం కృత్తికానా మపత్యం బాహులేయః - కృత్తికల కొడుకు.

బాహులము - 1.బాహుత్రాణము, 2.కార్తీక మాసము.
కార్తికము - కార్తిక మాసము.

ఏకదంతుఁడు - వినాయకుడు.
కార్తికేయోత్పాటితైక దంతత్వా దేకో దంతో యస్య స ఏకదంతః - కుమారస్వామిచే నొకదంతము పెఱికివేయఁబడెను గనుక నేకదంతుడు.
ఒంటికొమ్మువేలుపు - ఏకదంతుడు, గణపతి.
గణపతి - వినాయకుడు.
వినాయకుఁడు - 1.విఘ్నేశ్వరుడు, 2.బుద్ధుడు, 3.గురువు Jupiter.
వినాయకః, సర్వాన్ వినయతి హిత మనాశాస్తీతి వినాయకః - ప్రాణులకు హితమును బోధించువాడు. ణీఞ్ ప్రాపణే.
వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నంశ్చేతి వినాయకః - దుష్టులను విఘ్నములను శిక్షించువాఁడు. వీఞ్ ప్రాపణే. విగతో నాయకః ప్రభుర్యస్య స్వతంత్ర త్వాత్ – స్వంత్రుఁడౌట వలనఁ దనకు నితర ప్రభువు లేనివాఁడు.
విఘ్నరాజు - వినాయకుడు. 
విఘ్నానాం రాజా విఘ్నరాజః - విఘ్నములకు రాజు.

గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.
గురుఁడు - గురువు, బృహస్పతి, (Jupiter). 

కృత్తికాదీని నక్షత్రాణీందోః పత్న్యస్తు భారత|
దక్షశాపాత్ సో అనపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః|

అంధకరిపుఁడు - శివుడు.
అంధక స్యాసురస్య రిపుః, ఉ-పు. - అంధకాసురునికి శత్రువు. 
రిపువు - శత్రువు.
రప త్యపకీర్తిం రిపుః, ఉ. పు. రప లప వ్యక్తాయాం వాచి. - అపకీర్తిని(అపకీర్తి - చెడుపేరు, దుర్యశము.)బలుకువాఁడు.
రేవయతీతి వా రిపుః, రేవృ గతౌ. - మూఁకను గూర్చుకొనివచ్చువాఁడు.   

అంధకుఁడు - గ్రుడ్డివాడు, వి.1.ఒక రాక్షసునిపేరు, 2.బృహస్పతి అన్న కొడుకు.

అంధో (అ)దృక్ -
అంధ్యతే వికలీక్రియత ఇతి అంధం, చక్షుః, తద్యోగాత్ అంధః, అంధ దృష్ట్యపఘాతే - వికలత్వము పొందినది గనుక అంధమనఁగా గ్రుడ్దికన్ను; అదికలవాఁడు.
అవిద్యమానా దృగస్య అదృక్, శ. పు. - చూపులేనివాఁడు. ఈ 2 గ్రుడ్దివాని పేర్లు.

కన్నవిటి - అంధుడు.
కన్న - ప్రత్య, 'కంటె ' అను అర్థమున వచ్చు ప్రత్యయము.
కంట - 1.కనుట, 2.నాట్యబంధము.
కంటియ - మెడనగ, రూ.కంటె, విణ.కంఠికా.
కంఠాభరణము - కంఠమునకు భూషణము.

కాననివాఁడు - గ్రుడ్డి, అంధుడు.
గ్రుడ్డి - అంధుడు (రాలు), చూడశక్తి లేనిది (వాడు).  

అంథిక - 1.చీకటి, 2.ఒకవిధమైన జూదము, 3.కంటిజబ్బు.
అంధుఁడు - 1.గ్రుడ్డివాడు, 2.వివేకము లేనివాడు, వి.బాహ్యదృష్టి లేని సన్న్యాసి.    

దివ్యచక్షువు - 1.జ్ఞానదృష్టి కలవాడు, 2.గుడ్డివాడు, 3.మంచి కన్నులు కలవాడు.  

అంధము - చీకటి; విణ.గ్రుడ్డిది.
చీకటి - అంధకారము; అంధకారము - చీకటి.
తామిస్రము - 1.చీకటి, 2.చీకటి మయమైన నరకము.

అన్ధం తమస్యపి,
అంధశబ్దము అంధకారమునకును పేరగునపుడు న. అపిశబ్దము వలన గ్రుడ్డివానికిఁ బేరగునపుడు త్రి, అన్ధయతీ త్యన్ధం, అన్ధ దుష్ట్ట్యపసంహారే. - కానరాకుండఁ జేయునదియు, కానరానివాఁడును అంధము, అంధుఁడును.

గ్రుడ్డు - 1.కనుగ్రుడ్డు, 2.పక్షుల అండము, విణ.గ్రుడ్డితనము.
గ్రుడ్డిచుక్క - (గృహ.) కన్నుగ్రుడ్డులో రెటీనాకు వెనుకభాగమున దృష్టినరము బయలుదేరు చోటనున్న చుక్క (చూచిన వస్తువునీడ ఈ చుక్కపైబడిన దృష్టి కనిపించదు)(Blind spot). 
అంధబిందువు - (జం.) 1.గ్రుడ్దిచుక్క, 2.కంటిపూవు, 3.కంటియొక్క మూర్తిపటములో అక్షనాడి ప్రవేశించు చోటు (Blind spot). అంధ్యము - గ్రుడ్డితనము, అంధత్వము.

గ్రుడ్డుకానుపు - 1.పాము, 2.పిట్ట, పక్షి. 

గ్రుడ్డివాటు - (గ్రుడ్డి+పాటు) దైవము వలన కలిగినది.

దైవికము - దైవము వలన కలిగినది.
దైవము - 1.దేవుడు, 2.అదృష్టము, 3.యజ్ఞము నడిపిన ఋత్విజు నలంకరించి కన్య నిచ్చిచేయు వివాహము.
అదృష్టము - 1.అగ్నిజలాదులవలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము, 3.భాగ్యము, విణ.చూడబడనిది.
భాగ్యాము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది. 
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.

అదృష్టం వహ్నితోయాది -
న దృష్టం అదృష్టం దైవకృత మగుటవలన కానఁబడనిది. వహ్నితోయాది = అగ్ని జలాదులవలనఁ బుట్టిన భయము. ఆది శబ్దముచేత వ్యాధి దుర్భిక్ష మూషిక శలభాదులవలనఁ బుట్టిన భయంబును అదృష్టమనంబడును.

ప్రాయి - 1.భాగ్యము, 2.పౌరుషము, 3.సౌమాంగల్యము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి.) గుణము (Property).

తమము - 1.చీకటి, 2.ఒక గుణము, 3.శోకము, రూ.తమస్సు.
చీఁకటి - అంధకారము; అంధకారము - చీకటి.
తమస్సు - తమము.
తమిస్ర - చీకటిరేయి, చిమ్మచీకటి.
చీఁకటిగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

ఇరులు - (ని. బహు.) చీకటి.
ఇరులుగొంగ - సూర్యుడు Sun, వ్యు.చీకటులకు శత్రువు.

శోకము - దుఃఖముచే తపించుట, వగవు.
వగవు - శోకము.
వగచు - క్రి.శోకించు, విచారించు.

వంత - వ్యథ, ఏడ్పు సంతాపము.
వెత - వ్యథ. వందు - క్రి.సంతాపించు.
వందరు - క్రి.శోకించు, క్లేశపడు.
వెనుబడు - క్రి.శోకించు.
వెగచు - క్రి. వెక్కివెక్కి యేడ్చు.

అంతర్మన్యుడు - 1.దుఃఖాదులచే బాహ్యవ్యాపారమున మనస్సు లేనివాడు, 2.దుఃఖము నొందినవాడు, 3.ధ్యాన నిమగ్నుడు.

కన్ను(ఎఱగన్ను - శివుని అగ్నినేత్రము ఎర్రనైనా, మిన్ను(ఆకాశము) యెర్రనైనా నీరే (కన్నీరు, వర్షం). చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలురావు. - కన్నీరు.

గుడ్డికన్ పాదుషా - కుబేరుడు.
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
ధనదుఁడు - కుబేరుడు, విణ.దాత.
దాత - ఇచ్చువాడు.

నడువుల నేర్పుచాలని మనుష్యుడెఱుంగక తప్పునాడినన్
కడుఁగృపతోఁ జేలంగుదురుగాని యదల్పరు తజ్ఞులెల్లద
ప్పడుగులు పెట్టుచున్నప్పుడు బాలుని ముద్దు సేయఁగాఁ
దొడగుదు రెంతకాని పడద్రోయుదురే యెవరైన భాస్కరా.

తా. ఎట్టి కఠిన మనస్సుగల వారైనను చిన్నవాడు - బాలుడు తప్పటడుగులు పెట్టి నడుచు చున్నప్పుడు వానిని ముద్దు పెట్టుకొందు గాని వానిని కసిరి త్రోసివేయరు, అట్లే మనుష్యుడు - మానిని, మానవుడు. తెలిసిన వారు తెలియని వారిని మిక్కిలి కృప - దయ, కనికరముతో తీర్చి దిద్దురురేగాని వారిపై కోపించరు.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

ఖరువు - 1.గుఱ్ఱము horse, 2.దర్పము, 3.శివుడు, 4.దంతము, 5.భర్తను వరించు కన్య, విణ.1.దురాచారుడు, 2.క్రూరము.

దర్పకుఁడు - మన్మథుడు, వ్యు.దర్పింప చేయు.
దర్పయతీతి దర్పకః - గర్వింపఁ జేయువాఁడు.
దర్పము - 1.గర్వము, 2.కస్తూరి.
దర్పించు - క్రి.గర్వించు.

అహోపురుషిక - గర్వముచే తన్ను గొప్పగా సంభావించుకొను వీరాలాపము, రూ.అహోపురుషిక.

మదము - 1.క్రొవ్వు, 2.రేతస్సు, 3.గర్వము, 4.కస్తూరి.
క్రొవ్వు - 1.మదము, కామము, 2.బలుపు, 3.శరీర ధాతువులలో ఒకటి యగు వస. బహు. గర్వోక్తులు క్రి.1.మదించు, 2.మిక్కుటమగు.

మాదో మదే :
మదనం మాదః, మదశ్చ. మదీ హర్షే. - మదించుట మాదము, మదమును. ఇవి విద్యాధాదుల వలన వచ్చిన గర్వము పేర్లు.

అహంకారము - (గృహ.) 1.గర్వము, 2.అంతఃకరణ చతుష్టయములో ఒకటి, 3.అష్టప్రకృతులలో ఒకటి, 4.ఆత్మాభిమానము (Egotism), 5.క్రోధము (కడపటి అర్థము తెనుగున మాత్రమే కానవచ్చుచున్నది), రూ.అహంకృతి, అహంక్రియ.

అహంభావము - 1.గర్వము, నేననుట, 2.(వేదాం.) అవిద్య, దేహత్మభ్రాంతి. 
అహమ్మతి - అజ్ఞానము.
అహమితిబుద్ధిరహం మతిః, సీ. - నే ననెడు స్వతంత్రబుద్ధి అహంమతి.

అహమహమిక - 1.ఒకరితో నొకరు నేను ముందు, నేను ముందు అని రోషముతో పలుకుట, 2.యుద్ధాదులందు చూపు అహంకారము.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

ఆమిక - 1.కావరము, 2.మదము, రూ.ఆము, సం.అహమహమికా.
ఆము - మదము, అవ్య.1.అధికముగా, 2.దట్టముగా, సం.అహమ్.
ఆముకొను - 1.అలముకొను, వ్యాపించు, 2.పైకొను, 3.క్రొవ్వు.

హామిక - అహమిక, మదము, రూ.అమిక.

ఆఁకరము - 1.ఆగ్రహము, 2.మదము, సం.అహంకారః, ఆగ్రహః.

క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మృతి విభ్రమః |
స్మృతి భ్రంశా ద్భుద్ధినాశః బుద్ధినాశాత్ప్రణశ్యతి ||
తా.
క్రోధంవలన మోహం కలుగుతుంది. మోహం ఆలోచనను భ్రమింప చేస్తుంది. ఆలోచనాభ్రంశం బుద్ధిని నాశనం చేస్తుంది. బుద్ధినాశంవల్ల నశిస్తాడు. - భగవద్గీత 

మత్తి - 1.కామము 2.అవివేకము, సం.మదః.
కామము -
  1.కోరిక 2.మోహము 3.రేతస్సు.

సముద్రం, అగ్ని, అల్లుడు, ఉదరము, కామం మొదలగునవి తృప్తినొందించుటకు వీలుకానివి. - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు

దంతము - పల్లు, కోర. రదనము - దంతము.
పలు - దంతము, విణ.అనేకము, విస్తారము.
కోఱ - పందికోఱ, పాముకోఱ, దంష్ట్ర, సం.ఖరుః.

స్వయంవర - తనంతత భర్తను వరించుట.
స్వయం వృణతే పతి మితి స్వయంవరా, వృఞ్ వరణే. - తానే మగని గోరుకొనునది.
స్వయంవరము - తనంతత భర్తను వరించుట.
పతింవర - తనంతట మగని వరించునట్టి ఆడుది. 
పతిం వృణత ఇతి పతింవరా - పతిని వరించునది.
పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.
వర్య - తనంతట మగని వరించు స్త్రీ, విణ.ముఖ్యురాలు.
వరణం వరః తత్ర నిపుణా వర్యా - వరించుట యందు నేర్పు గలది.
వరణము - 1.అవరించుట, 2.చుట్టకొనుట, ప్రహరి (గృహ.) ఎన్నిక చేయుట, ఎన్నుకొనుట (Selection).
వరము - కోరిక, వరించుట.

ఆలోక్య యస్యాతిలలామలీలాం
సద్భాగ్యభాజౌ పితరౌ కృతార్థౌ |
తమర్భకం దర్పకదర్పచౌరం
శ్రీజానకీజీవనమానతోస్మి| - 1

నాకేశుఁడు - ఇంద్రుడు.
ఇంద్రుఁడు - 1.దేవతలరాజు, 2.సమాసో త్తర పదమైనపుడు శ్రేష్ఠుడు, ఉదా.రాజేంద్రుడు.
ఇందతీ తీంద్రః పరమైశ్వర్యయుక్తుఁడు, ఇది వరమై నపుడు. 
నాకము - 1.స్వర్గము, 2.ఆకాశము.
నాకః, కం సుఖం తన్న భవతీత్యకం తన్నాస్త్యత్రేతి నాకః, కము అనఁగా సుఖము. అది కానిది అకము - అనఁగా దుఃఖము, ఆ దుఃఖ మిచ్చట లేదు గనుక నాకము.
ఆకాశే త్రిదివే నాకః -
నాకశబ్దము ఆకాశమందును, స్వర్గమందును వర్తించును, నవిద్యతే అకం దుఃఖ మత్ర నాకః. 
నాకిని - దేవత స్త్రీ.
నాకౌకసుఁడు - 1.వేలుపు, వ్యు.సర్గము నివాసముగా గలవాడు.   
దేవత - వేలుపు; వేలుపు - 1.దేవత, దేవతస్త్రీ, 2.జ్యోస్యము.
బుధుఁడు - 1.ఒక గ్రహం (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

చండి - 1. పార్వతి,  2.కోపముగల స్త్రీ,  3.స్త్రీ,  రూ.చండిక.
చండతి కుప్యతీతి చండికా - కోపము గలది, చడికోపనే.
చండాసురమథనాధ్యా - చండాసురునిఁ జంపినది. అమర కంటకము నందు చండిక|
పార్వతి - 1.గౌరీ, (పర్వతిపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.
ౘండి - చండి, పార్వతి   విణ. 1.మూర్ఖపుట్టు గలవాడు, 2.క్రూరుడు.
చండతి కుప్యతీతి చండః, చది కోపే. - మిక్కిలి కోపించుకొనువాఁడు.

ౘండిపోతు - మూర్ఖపుపట్టుదల స్వభావము గలవాడు.   

క్రూరుడు - దయలేనివాడు.
కృంతతీతి క్రూరః, కృతీ ఛేదనే. - వ్యథ పెట్టువాఁడు.
క్రూరము - 1.గుగ్గిలము, విణ.1.భయంకరమైనది, గట్టిది, 2.దయలేనిది.
కృంతతి క్రూరం, కృతీ ఛేదనే. - నొప్పించునది.
అరపూస - గుగ్గిలము (Rosin).

క్రూరో కఠిన నిర్దయౌ,
క్రూరశబ్దము కఠినమయినదానికిని, దయలేనివానికిని పేరు. మఱియు, భయంకరమైనదానికిని పేరు. కృణాతీతి క్రూరః, కృఞ్ హింసాయాం. హింసించునది.

క్రూరజనులకు నీమీఁదఁ గోరికేల ?

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
చరత్యనేన చరణః, ఆ. ప్న. చర గతిభక్షణయోః. - దీనిచేత సంచరింతురు.

నఖై ర్నాక స్త్రీణాం - కరకమలసంకోచశశిభిః
తరుణాం దివ్యానాం - హసత ఇవ తే చండి! చరణౌ,
ఫలాని స్వ(స్థే)స్థ్సేభ్యఃః - కిసలయకరాగ్రేన దదతాం
దరిద్రేభ్య భద్రాం - శ్రియ మనిశ మహ్నాయ దదతౌ| - 89శ్లో

తా. ఓ చండీ! దరిద్రుఁడు - బీదవాడు)లకు భాగ్యమునిచ్చు నీ పాదములు నాకిని - దేవత స్త్రీల కరపద్మపు(కిసలము - చిగురు, రూ.కిసలయము, కిసాలము, కిసాలయము.)కాంతి మించి నీ (పాదముల యందలి)గోళ్ళు దేవతలకు కోరికల నిచ్చు కల్పవృక్షములను మించి యున్నవి. - సౌందర్యలహరి

చండికా చండ రూపేశా చాముండా చక్రధారిణీ
త్రైలోక్య జననీ దేవీ త్రైలోక్య విజయోత్తమా|

చండము - 1.భయంకరము, 2.కోపముగలది, 3.తీవ్రమైనది, 4.ఘాటయినది, 5.వేడైనది, వి.1.కోపము, 2.తీవ్రత, 3.వేడిమి.

చండిమ - వాడిమి, తీవ్రము.
చండించు -
క్రి. మిక్కిలి కోపించు.
చండుఁడు - 1.మిక్కిలి కోపము గలవాడు, 2.వాడిమిగలవాడు. 

చణ్డస్త్వత్యన్తకోపనః,
చండతి కుప్యతీతి చండః, చది కోపే. - మిక్కిలి కోపించుకొనువాఁడు
కుప్యతి తాచ్ఛీల్యేనేతి కోపన; - అత్యంత కోపన, కుప కోపే. - స్వభావముననే మిక్కిలి కోపగించుకొనువాడు. ఈ 2 మిక్కిలి కోపగించు కొనువాని పేర్లు.

ముంగోపి - ఓర్పులేక తటాలున కోపము చేసికొనువాడు.
ముక్కోపము - (వ్యావ.) ముంగోపము.
ముంగోపము - ముక్కోపము, ఓర్పు లేక తటాలున వచ్చు కోపము.

చండము - 1.భయంకరము, 2.కోపము గలది, 3.తీవ్రమైనది, 4.ఘాటయినది, 5.వేడియైనది, వి.1.కోపము, 2.తీవ్రత, 3.వేడిమి.
తీవ్రము - 1.అధికము 2.వేడిమి గలది 3.కారముగలది (భౌతి.) గట్టిగా వినబడునది (ధ్వని.) (Loud).
తీవరము - తీవ్రము, త్వరితము, సం.తీవ్రమ్.
త్వరితము - శీఘ్రము, వడిగలది.
తీవరపాటు - తొందరపాటు. తొందరపాటు - త్వరపడుట.
తొందర - 1.మిక్కిలి త్వర, 2.బాధ.
తొందరచేయు - 1.బాధించు, 2.త్వరపడు.

దొంబులిగొట్టు - (దొందు+పులి+కొట్టు), పిరికి.
గొట్టు1 - 1.కఠినము, 2.దుర్లభము, 3.భయంకరము, 4.విరోధి, వి.1.దౌష్ట్యము, 2.అల్లరి, 3.గాలి, సం.కటుః.
గొట్టు2 - ప్రత్య. తాచ్చీల్యాద్యర్థమున వచ్చు ప్రత్యయము, ఉదా. (తాచ్చీల్యమున) గొడవగొట్టు, (స్వార్థమున)పిసినిగొట్టు.

ఈషణము - త్వరపెట్టునది, వి. త్వర, ఇచ్ఛ(ఈషణత్రయము: దారేషణ, విత్తేషణ, పుత్త్రేషణ.) 

తొందరపాటుతనం తక్కువ మందికే విజయాన్ని, ఎక్కువ మందికి దురదృష్టాన్ని చేకూరుస్తుంది. – ప్రూథాన్

అజ్ఞుఁడు - మూర్ఖుడు, తెలివిలేనివాడు.
న జానాతి త్యజ్ఞః - ఎరుకలేనివాఁడు.
అజ్ఞత - తెలివిలేనితనము, రూ.అజ్ఞత్వము.
మఱకువ - అజ్ఞానము.
అజ్ఞానము - తెలివిలేనితనము.
న జ్ఞానం అజ్ఞానం - జ్ఞానముకానిది అజ్ఞానము. 
మంకు - మూర్ఖుడు, మొండి.
మడియఁడు - మూఢుడు.
మూఢుఁడు - 1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
ముహతీతి మూఢః, మూర్ఖశ్చ ముహ వైచిత్యే. - మోహమును బొందువాఁడు.
యథాజాతుఁడు - 1.మూర్ఖుడు, 2.జ్ఞానము లేనివాడు.
జాత ఇవ వివేకశూన్యత్వా దితి యథాజాతః - వివేకశూన్యుఁ డౌటవలన పుట్టిననాఁటివలె నెల్లప్పుడు నుండువాఁడు.
వైధేయుఁడు - మూర్ఖుడు.
విధాతుం యోగ్యో ధేవియః, విధేయ ఏవ వైధేయః - శిక్షింపఁదగినవాఁడు, వైధేయుఁడు.    

మొప్పె - 1.మూర్ఖుడు, 2.కరకు.
మూర్ఖము - మౌర్ఖ్యము గలది.
ముదిగారము - మౌర్ఖ్యము; మౌర్ఖ్యము - మూర్ఖత్వము.
పెడసగము - మౌర్ఖ్యము, మూఢత్వము.
పెంకితనము - చెప్పినమాట వినకుండుట, మూర్ఖత.

అవిద్య - 1.అజ్ఞానము, తత్త్వజ్ఞానములేమి, 2.మాయ.
విపరీతజ్ఞాన మవిద్యా, విదజ్ఞానే. - విపరీత జ్ఞానము అవిద్య.

స్వగృహే పూజ్యతేమూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభుః|
స్వదేశేపూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే||

తా. మూర్ఖుడు స్వగృహము - (గృహ.) 1.నివాసస్థలము, ఇల్లు, 2.తనగృహము (Home)యింటిదును, ప్రభువు స్వగ్రామందును, రాజు తనస్వదేశము - (గృహ.) తాను నివసించు దేశము(Home country)రాజ్యమందును గొని యాడ బడును. విద్వాంసుఁడు - చదువరి, విణ.ఎరుకగలవాడు.)సకల దేశముల యందు పూజింపఁబడును. - నీతిశాస్త్రము

కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
సదా బాలత్వాత్ కుమరః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాఁడు.
కుత్సితాన్ మారయతీతి వా - కుత్సితుల సంహరించువాఁడు.
మృఙ్ప్రాణత్యాగే, కౌ పృథివ్యాం మార్యతి మన్మథవ దాచరతీతి వా - భూమియందు మన్మథునివలె సుందరుఁడైనవాఁడు.
కౌ పృథివ్యాం మాం లక్ష్మీం రాతి దదాతీతి వా - భూమి యందు సంపద నిచ్చువాఁడు.
రాదానే, సదా బ్రహ్మచారిత్వా ధ్వా - ఎల్లప్పుడు బ్రహ్మచారి గనుక కుమారుఁడు.  

బాల - పదునారేండ్లకు లోబడిన పిల్ల.
పాపఁడు - బాలుడు, పురుషశిశువు.
"ఆ షోడశాద్భవే ద్బాలస్తత స్తరుణ ఉచ్యత" ఇతి మనుః, బలతి అల్పాయాసేన బాలః, బలప్రాననే. - అల్పాయాసముచేత బ్రతుకువాఁడు.
చిన్నవాడు - బాలుడు.
బాలాజీ - శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి బైరాగులు వాడు పేరు, సం.బాలాః.

బాలిశుఁడు - 1.మూర్ఖుడు, 2.బాలుడు.
పరదత్తం బలిం పూజాంశ్యతీతి బలిశః; బలిశ ఏవ బాలిశః - తనకుఁ జేసిన సన్మానమును జెఱుచుకొనువాఁడు బాలిశుఁడు. 
దేవతార్థం దత్తమవూపాది బలిం శ్యతి భక్షణేన తనూకరోతీతి బలిశః; బలిశ ఏవబాలిశః - దేవతార్థమై యుంచఁబడిన యపూపాదులను భక్షించి స్వల్పముగాఁ జేయువాడు.

పాలసుఁడు - బాలిశుడు, మూర్ఖుడు, సం.బాలిసః.

అర్భకుఁడు - బాలుడు, విణ.మూర్ఖుడు.
అవటువు - బాలుడు, నేర్పరికానివాడు, విణ.తెవులుగొంటు.

మాణవకుఁడు - 1.బాలకుడు, శిశువు, 2.దుష్టుడు.
మనోరల్పమపత్యం మాణవకః - మనువుయొక్క అల్పమైన అపత్యము.
మాణవ్యము - బాలురగుంపు.

మాణవానాం తు మాణవ్యమ్ -
మాణవా బాలాః తేషాం సమూహో మాణవ్యం - బాలుర యొక్క సమూహము, పిన్నవాండ్ర సమూహము పేరు. 

దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్దజాతి.
దుర్జనుఁడు - దుష్టుడు.

బాలసఖత్వ మకారణహాస్యం, స్త్రీషునివాద మస జ్జనసేవా|
గార్దభయాన మసంస్కృతవాణి, షట్సునరో లఘుతా ముపయాతి|

తా. బాలురతో చెలిమి, కారణంలేని నగవు, స్త్రీల తో వాదులాడుట, దుర్జనుఁడు - దుష్టుడు యొద్ద కొలువుండుట, గార్ధభము - గాడిదనెక్కుట, సంస్కృతభాష తెలియకుండుట యీ యాఱింటిచే నరుఁడు - 1.మనుష్యుడు, 2.అర్జునుడు, 3.ఒక ౠషి.)మనుష్యులు చులకనయగుదురు. - నీతిశాస్త్రము    

ఏడుగడ - (ఏడు+కడ) గురువు Jupiter, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.

అర్జునకుఁడు - 1.బోయ, 2.తెల్లనివాడు.

అర్జుని - 1.ఆవు, 2.ఒకజాతి పాము, 3.బహుదానది, 4.కుంటెనకత్తె, 5.బాణాసూరుని కూతురు. 
ప్రాయేణ ద్వళత్వా (ద)అర్జునీ. ఈ.సీ. - తఱచుగా తెల్లనై యుండునది, ఆవు.

అఘ్న - ఆవు, విణ.చంపదగనిది.
నహన్యత ఇత్యఘ్నా. హన హింసాగత్యోః. - హింసింపఁ బడునది.  

కింకరము- 1.కోయిల, 2.తుమ్మెద, 3.గుఱ్ఱము.
కోకిలము- కోయిల; కోవెల- గుడి, వై.వి.కోకిలము.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
తుమ్మెద - భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
భ్రమతీతి భ్రమరః, భ్రము అనవస్థానే. - తిరుగుచుండునది.
గుఱ్ఱము - అశ్వము.
అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
అశ్నుతే గమనేనే త్యశ్వః, అశూ వ్యాప్తౌ. - గమనముచేత వ్యాపించునది.

కింకిరాటుఁడు- మన్మథుడు, రూ.కింకరాతుఁడు.
కింకిరుఁడు - మన్మథుడు. 
మన్మథుఁడు - మారుడు, విణ.విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే. 
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

కింకరుఁడు - పరిచారకుడు, వ్యు.ఏమి చేయుదు నని అడుగువాడు.
కిమపి కరోతీతి కింకరః, డు కృఞ్ కరణే. - దేనినైనను చేయువాఁడు.
కింకరి - పరిచారిక, దాసి, రూ.కింకర.
పరిచారిక - సేవకురాలు.
దాసి - పనికత్తె, పరిచారిక.

కటాక్షకింకరీభూత - కమలాకోటిసేవితా|
శిరస్థ్సితా చంద్రనిభా పాలస్థేంద్రధనుఃప్రభా. - 119స్తో 

ఎండదొర - సూర్యుడు.
ఎండ - సూర్యప్రకాశము, ఆతపము.  
ఎండకారు - ఉష్ణకాలము, April, May నెలల కాలము, పునాసకారు.
పునాసకారు - (వ్యవ.) ఎండకారు, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి కార్తెలు, April, May నెలలు వసంతర్తువు, Pre-monsoon period. 
రోహిణి కార్తె ఎండ ఱోళ్ళు బద్దలు కొడుతుంది.
కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా. చిత్తకార్తె, స్వాతికార్తె మొ,వి. సం.క్రాంతిః.

4. రోహిణి - తొమ్మిదేండ్ల కన్యక, బలరాముని తల్లి, 4th star.

రోహిణీనక్షత్ర వదభ్యుదయ హేతుత్వాత్ రోహిణీ, ఈ. సీ. - రోహిణీ నక్షత్రమువలె శుభహేతువైనది. 

రోహిణీపతిః - రోహిణి చంద్రుని ప్రియపత్ని. ప్రకృతి కళ వల్ల అవతరించినది. అసమాన్య అందగత్తె అయిన రోహిణి పట్ల చంద్రుడు పరమప్రీతి గలవాడు.  

రౌహిణేయుఁడు - 1.బలరాముడు, 2.బుధుడు. 
రౌహీణేయః రోహిణ్యా అపత్యం - రోహిణీదేవి కొడుకు.
రౌహిణేయో బుధ స్సామ్యః :
రోహిణ్యాః అప్యతం రౌహిణేయః - రోహిణీదేవి కొడుకు.
బుధుఁడు - 1.ఒక గ్రహము(Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.
బుధ్యతే సర్వమితి బుధః - బుధ అవగమనే - సర్వము నెరింగినవాఁడు.
సౌమ్యుఁడు - బుధుడు, విణ.1.తిన్ననివాడు, 2.ఒప్పినవాడు.
సోమస్యాపత్యం సౌమ్యః - చంద్రుని కొడుకు. ఈ మూడు బుధుని పేర్లు. 

అనుపమ యాదవాన్వయ సుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుఁడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుఁడనంగ బాహుబలదర్పమునన్ బలరామమూర్తివై
తనరిన వేల్ప నీవెకద దాశరథీ కరుణా పయోనిధీ.

తా. రామా! యాదవంశ తిలకుఁడైన కృష్ణమూర్తి - కృష్ణావతారము)కృష్ణుడు తమ్ముఁడుగా రోహిణిదేవి కడుపునఁ బుట్టి భుజబలాతిశయముచేత, దుష్ట సమూహముల నెల్ల రూపుమాపి బలరాముడుగా నవతరించినదేవుడవు నీవె యగుదువు.     

రోహిణీ రేవతీ రమ్యా రంభా రావణవందితా,
శతయజ్ఞమయీ సత్త్వా శతక్రతువరప్రదా.

రోహిణి - నందుని చెల్లెల్లు, వసుదేవుని పత్ని. కద్రువ కశ్యపులు రోహిణీ వసుదేవులుగా జన్మించి దంపతులైనారు. ఈ రోహిణికే బలరాముడు, శేషాంశలో జన్మించాడు.  

ప్రజాపతే రోహిణీవేతు పత్నీ | విశ్వరూపా బృహతీ చిత్రభానుః | సా నో యజ్ఞస్య సువితే దధాతు | యథా జీవేమ శరదస్సవీరాః | రోహిణీ దేవ్యుదగాత్సురస్తాత్ | విశ్వా రూపాణి ప్రతిమోదమానా | ప్రజాపతిగ్ం  హవిషా వర్ధయంతీ | ప్రియా దేవానా-ముపయాతు యజ్ఞమ్ ||2||  

ప్రజాపతి - బ్రహ్మ, (చరి.) 1.యుద్ధ సమయములందు కులపతులపై నుండి సైనికాధికారి, 2.గ్రామపెద్ద.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

క్రతుధ్వంసీ - శివుడు, వ్యు.దక్షయజ్ఞమును నాశము చేసినవాడు.
క్రతుం దక్షయజ్ఞం ధ్వంసితుం శీలమస్యేతి క్రత్యు ధ్వంసీ, న-పు. - దక్షయజ్ఞమును జెఱిచినవాఁడు. ధ్వంసు అవస్రంసనే.
ౙన్నపుగొంగ - శివుడు, క్రతుధ్వంసి.
గొంగ - శత్రువు. 

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు, (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).     

మారిష - దక్షుని తల్లి. 

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్త్రిగుణాత్మకం త్రివిలోచనమ్
భక్తిముక్తిఫలప్రదం సకాలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| - 6

దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమోనమః. 

దాక్షాయణి - పార్వతి, రోహిణి నక్షత్రము.
దక్షస్యాపత్యం దాక్షాయణీ - దక్షుని కూఁతురు.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ. ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

దాక్షాయణ్యో శ్వినీత్యాది తారాః :
అశ్వినీత్యాదితారా దాక్షాయణ్య ఇత్యుచ్యంతే - అశ్విన్యాది రేవత్యంత నక్షత్రములు దాక్షాయణు లనంబడును.
దక్షస్య ప్రజాపతే రపత్యాని స్త్రియః దాక్షాయణ్యః - దక్షప్రజాపతి యొక్క కొమార్తెలు. అశ్విని మొదలు 27 నక్షత్రములకుఁ పేర్లు.

దక్ష ప్రజాపతి సుత వేషాఢ్యాయై నమోనమః|

సుచరిత్రాతు సతీ సాధ్వీ పతివ్రతా :
శోభనం చరిత్ర మస్యా ఇతి సుచరిత్రా - శుభకరమైన చరిత్రము(చరిత - నడవడి, రూ.చరితము, చరిత్రము.)గలది.
సతి - 1.పతివ్రత స్త్రీ, 2.పార్వతి.  (చరి.) చనిపోయిన భర్త చితిలో ప్రవేశించి ప్రాణముల విడుచు హైందవ స్త్రీ. 
దర్శనాదేవ పాపం స్యతీతి సతీ. సీ.షో అన్తకర్మణి. - దర్శన మాత్రముననే పాపమును(పాపము - దుష్కృతము, కలుషము) బోఁగొట్టునది.
సాధ్వి - పతివ్రత; పతివ్రత - సాధ్వి.
సాధు(సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.)గుణ యోగాత్సాధ్వీ. సీ. - మంచి గుణములు గలది.
ఏకపత్ని - 1.పతివ్రత, 2.సవతిలేని స్త్రీ, 3.సవతి.  
పతినేనైవ వ్రత మస్యా ఇతిపతి వ్రతా - పతి(పతి - మగడు, ఏలిక, విణ.కాపాడువాడు.)సేవయే వ్రతముగాఁ గలది.

ఈలపుటాలు - 1.మంచినడవడికల స్త్రీ, 2.పతివ్రత.
ఈలువు - 1.మంచినడవడిక, 2.మానము, 3.పాతివ్రత్యము.

పట్టుగ నిక్కుచున్ మదముఁబట్టి మహాత్ముల దూలనాడినన్
బట్టినకార్యముల్ చెడును బ్రాణముపోవు నిరర్ధదోషముల్
పుట్టు, మహేశుగాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్
ముట్టకపోయి దక్షునికి మోసమువచ్చెఁగదయ్య, భాస్కరా.
తా.
దక్ష ప్రజాపతి ఒకప్పుడు శివు నవమాన పరచుట కొక యాగము సంకల్పించి, ఈశ్వరునిఁదక్క దక్కిన మరల నాహ్వానించెను. ఆ యజ్ఞమం దీశ్వరుని కీయవలన హవిర్భాగ మీయలేదు. పైగా శివనింద చేసినాడు. అందుచే యీశ్వరుడు కోపించి వీరభద్రుడను వానిచే నాయజ్ఞమును పాడు చేయించి యాతని చంపించెను. కాబట్టి తానెంత గొప్పవాడైనను మహాత్ము(మహాత్ముఁడు - 1.గొప్ప ఆత్మకలవాడు, 2.గొప్పవాడు.)లగు వారిని దూషింపరాదు. అట్లు దూషించినచో పాపములు కలుగుటయేగాక ప్రాణములు గూడా గోల్పోనగును.

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా|
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ.

పూర్వ కథ :- దక్ష ప్రజాపతి ఒకప్పుడు శివుని నవమాన పరచుటకై ఒక యాగమును తలపెట్టి, బ్రహ్మాది దేవతల నందరిని పిలిచి ఈశ్వరుని పిలచుట మానెను. ఆ యాగము చూచుటకు పిలువని పేరంటముగా తన కుమార్తెయు మహేశ్వర పట్టమహిషియగు సతీదేవి, తన తండ్రియేకదా యజ్ఞము చేయుచున్నాడని శివుడు వలదన్నను న్నెట్లో నాతని అంగీకరింపజేసి, చూడరాగా దక్షుడామెను గౌరవింపలేదు. కుమార్తెపై యెంతప్రేమ చూపవలెనో నంత అగౌరము చేసినాడు. అట్లు తండ్రి తనయందు వాత్సల్యత లేనివాడయ్యెను, పతి మొగమేగతిని చూతును? అని పరిపరి విధముల తలపోసి యామె అగ్నిలో పడి ప్రాణములు బాసెను. అది తెలిసి శివుడు వీరభద్రుని(వీరభద్రుఁడు - 1.వీరభద్రుడను ప్రథముడు, 2.ఏకాదశ రుద్రులలో నొకడు, 3.శివుని కొడుకు.) సృజించి యతనిచే దక్షుని చంపించి, యజ్ఞమును నాశము చేయించెను.    

దేవీ సర్వవిచిత్రరత్నరుచిరా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ|
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా(అ)న్నపూర్ణేశ్వరీ. - 8

బండిరిక్క - రోహిణీ నక్షత్రము. శకటము(బండి)వలె నక్షత్రములుండును.

రిక్క - నక్షత్రము, సం.ఋక్షమ్.
నక్షత్రము -
రిక్క, వ్యు.నశింపనిది(నక్షత్రము లిరువది యేడు).
రిక్కదారి - ఆకాశము.

తేరు - 1.కలుగు, వై.వి. 1.రథము, 2.బండి, సం.రథః.
రథము -
1.అరదము, 2.శరీరము.
అరదము - తేరు, సం.రథః.
బండి - 1.శకటము, 2.రథము. ఱ - ఒక అక్షరము, శకటరేఫము.

రథికో రథినో రథీ,
రథో (అ)స్యాస్తీతి రథినః, రథీ చ, పా, రథిరః. - రథముగలవాఁడు రథికుఁడు, రథినుఁడు, రథియును. ఈ 3 రథముమీఁద నుండు రాజు మొదలైనవాని పేర్లు.

శకటము - 1.బండి, 2.శకట వ్యూహము. భారతంలో శకట పద్మవ్యూహం ద్రోణాచార్యుడు రచించాడు.
వ్యూహము - 1.మిక్కిలి ఊహ, మొగ్గరము, (ఊహపోహలు ఎక్కువైతే అపార్థాలు ఎక్కువౌతాయి) 2.సమూహము, గుంపు.
మొగ్గరము - వ్యూహము.
సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group). 
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.

డయనము - బాలకాదుల క్రీడా శకటము. 

సగటు - చదరంగమున శకటము, (గణి.) రాసుల మొత్తము, రాసుల సంఖ్య మధ్యగల నిష్పత్తి (గణి.) సరాసరి (Average), సం.శకటః, సంఘాతః.
సరాసరి - సరసి చూడగానైన సమత్వము.
సంఘాతము - 1.సమూహము, 2.దట్టి దిబ్బ.

తేరుకాఁడు - రథికుడు. రథి - రథము నెక్కువాడు.
తేరుపూన్పరి - సారథి.
సారథి - 1.తేరునడుపువాడు, 2.నియంత. 
నియంత - తేరునడుపువాడు, విణ.నడపువాడు, సం.వి. (చరి. రాజ.) సర్వాధికారి, అధినాయకుడు (Dictator).  

రథ్యము - రథము నీడ్చు గుఱ్ఱము.  

వాజి - గుఱ్ఱము.
వాజో వేగస్తద్యోగా ద్వాజీ. న. పు. వజ గతౌ. - వాజ మనఁగా వేగము; అది గలది.   

వాజినో (అ)శ్వేషు పక్షిణః,
వాజిన్ శబ్దము గుఱ్ఱమునకును, అమ్మునకును, పక్షికిని పేరు.
వాజాః పక్షాస్సంత్యస్యేతి వాజీ, న. పు. - ఱెక్కలు గలిగినది.
     
మందడి - గుఱ్ఱపుసాల, సం.మందురా.

వాజిశాలా తు మందురా,
వాజినాం శాలా - గుఱ్ఱముల చావడి.
మందంతే అశ్వా అత్ర మందురా, మది స్తుత్యాదౌ. - దీనియందు గుఱ్ఱములు మదించును. ఈ 2 గుఱ్ఱపు చావడి పేర్లు. 

వాజపేయము - ఒకానొక యాగము.
వాజము - 1.నెయ్యి, 2.నీరు, 3.రెక్క.
వాజః పక్షో వా వేగో వా, తద్యోగాత్ వాజీ, న. పు. - ఱెక్కలుగాని వేగముగాని వాజము, అది గలిగినది.

పక్షోవాజః -
పక్షతి శరం గృహ్ణతీతి పక్షః, పక్ష పరిగ్రహే. - బాణమును ప్రతిగ్రహించునది
వజత్యనేన బాణమితి వాజః, వజ గతౌ. - దీనిచేత బాణము పోవును. ఈ 2 గఱులపేర్లు, ఱెక్కలు.

పక్షము - 1.నెలయందు బదునైదు దినములు (శుక్ల కృష్ణపక్షములు), 2.రెక్క. రెక్క ఆడితేగాని డొక్క ఆడదు.

శకటంపంచ హస్తేషు దశహస్తేషు వాజినమ్|
గజం హస్తేసహస్రేషు దుర్జనం దూరవర్జ యేత్||

తా. బండిని జూచిన (నై)ఐదుమూరల దూరము తొలగిపోవలెను. వాజి - గుఱ్ఱమును జూచిన పది మూరల దూరము తొలగి పోవలెను. గజము - 1.ఏనుగు, 2.మూడడుగుల కొలత, 3.సేనాంగము లలో ఒకటి.)జూచిన వేయి మూరల దూరము తొలగిపోవలెను. దుర్జనుఁడు - దుష్టుడు, దుర్జనునిఁ జూచిన మిక్కిలి దూరము తొలగి పోవలయును. – నీతిశాస్త్రము

మెయి - తృతీయ విభక్తి యందు ఒకచో వచ్చు ప్రత్యయము, వి.1.విధము, 2.పార్శ్వము, 3.వెంబడి, 4.భూమి, మహి, 5.దేహము.
విధము -
ప్రకారము, విధి.
విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.    

విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
విధధాతి సర్వం విధాతా-ఋ-పు. సర్వముఁ జేయువాఁడు. డు ధాఙ్ ధారణ పోషయో.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి). 

వెంబడి - వెంట; వెంట - 1.దారి, 2.వేట, 3.విధము, అవ్య.వెంబడి.

శరీరము - దేహము; దేహము - శరీరము, మేను.
మేను -
1.శరీరము, 2.జన్మము(జన్మము - పుట్టుక), 3.పార్శ్వము. పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), విం.విణ. (జీవ.) క్రన్కులనుండి బయలుదేరీనది, (Latral).  క్రేవ - పార్శ్వము. 
అంక - పార్శ్వము, ప్రక్క, రూ.అణక.
అణక - ఎద్దు మెడమీద కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.
సదేశము - సమీపము. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది. సనీడము - సమీపము, విణ.నీడముతో గూడినది.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
చేవాటు - సమీపము. చేయలఁతి - సమీపము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము. సాంగత్యము - కూడిక.
చేరుగడ - 1.సమీపము, 2.దిక్కు, 3.శరణము.
చేరువకాడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
నేలచూఁలి - సీత, భూపుత్రి.
భూమిజ - సీత, వ్యు.భూమినుండి జన్మించినది.
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

భూమిజుఁడు - అంగారకుడు, 2.నరకాసురుడు.
నేలపట్టి -
1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.కడచినది, 2.పొందబడినది.
భూతేశుఁడు - శివుడు.

పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్క చేయబడినది, విశాలమైనది.
పృథువు - గొప్పది, వి. ఒక రాజు.

భూతాత్మము - దేహము.
దేహము -
శరీరము, మేను.
శరీరము - దేహము. 
మేను - 1.శరీరము, 2.జన్మము(జన్మము - పుట్టుక), 3.పార్శ్వము. ఆకృతి - 1.రూపము, 2.దేహము, 3.హృద్గతభావమును తెలుపు చేష్ట, అనుభావము, 4.పోలిక, (రసా, భౌతి.) ఒక వస్తువుయొక్క ఆకారము, (Shape).

పార్శ్వము - 1.ప్రక్క, 2.సమీపము, (భౌతి.) ఒక వస్తువుయొక్క ఒక భాగము (Side), విం.విణ. (జీవ.) క్రన్కులనుండి బయలుదేరీనది, (Latral).  క్రేవ - పార్శ్వము. 
అంక - పార్శ్వము, ప్రక్క, రూ.అణక.
అణక - ఎద్దు మెడమీద కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.
సదేశము - సమీపము. సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది. సనీడము - సమీపము, విణ.నీడముతో గూడినది.
సమీపము - చేరువ; చేరువ - 1.సమీపము, 2.సమూహము, 3.సేన.
చేవాటు - సమీపము. చేయలఁతి - సమీపము.
చేరిక - 1.కూడిక, 2.సమీపము. సాంగత్యము - కూడిక.
చేరుగడ - 1.సమీపము, 2.దిక్కు, 3.శరణము.
చేరువకాడు - 1.సేనాపతి, 2.కావలివాడు.
సేనాని - కుమారస్వామి, సేనాధిపతి.

శరణము - 1.రక్షకము, 2.రక్షణము, 2.గృహము.
గృహము -
1.ఇల్లు, 2.భార్య.
గృహిణి - ఇల్లాలు, భార్య.  

సమూహము - గుంపు, (గణి.) రాసులసమూహము (Group).
గుంపు - 1.ప్రాణి సమూహము, 2.సమూహము, 3.నూలు వడుకునపుడు నడుమ నడుమ వచ్చెడి ఉండ.   

ఇరుసు - బండి చక్రములకు అడ్డముగ వేయు ఇనుపకడ్డి, అక్షము.
అక్షము1 -
(భూగో.) ఉత్తర దక్షిణ ధ్రువము లనెడి స్థిరబిందువులను కలుపు 'ఊహరేఖ', (గణి.) గణించుటకు వీలైన ఒక స్థిరరేఖ, (Axis).
అక్షము2 - 1.జూదము, 2.పాచిక, 3.రుద్రాక్షము, 4.వాజ్యము, 5.పదునారు మాషముల ఎత్తు, 6.తులాదండము, 7.రథము, 8.బండికన్ను, 9.ఇరుసు, 10.సర్పము, 11.కణత క్రిందిభాగము, 12.ఇంద్రియము,13.కన్ను, 14.సౌవర్చలమనెడి ఉప్పు, 15.మైలుతుత్తము.

కట్టుబండీ - సకల పరికరసహితమైన బండి.
బండిగిల్లు -
1.కడగండ్లుపడు, 2.బండి తలక్రిందుగ బొల్తాకొట్టు.
కడగండ్లు - కష్టములు, ఇకట్లు.

అలమార్చు - క్రి.బండికి ఎడ్లను మార్చికట్టు.

కందెన - బండి ఇరుసునకు పూసెడు మసి, ఒక విధమగు చమురు, ఉదా. "ఇరుసునఁ గందెనఁబెట్టక పరమేశ్వరుబండి యైన బాఱదు సుమతీ",(Lubricant).  
స్నేహనము - (భౌతి.) కందెనవేయుట ఘన వస్తువుల మధ్య రాపిడిని తగ్గించుటకు నూనెలవంటి ద్రవ్యముల పూయుట (Lubrication).  

కరముల ననుసరింపక
విరసంబున దిన్నతిండి వికటించుసుమీ
యిరుసనఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైన బాఱదు సుమతీ.
తా.
దేవుని వాహనమైనను ఇరుసునకు కందెనపూయనిదే నడువనట్లు కరణములను ఆశ్రయించనివారు వారి స్వభోజనమే ఆరగించిననూ అది దేహానికి పట్టదు. 

బంధకవిత్వము - చక్రము, ఖడ్గము, రథము మొదలగు వాని యాకృతులగ పద్యములు వ్రాయుట. 

బాహులేయుఁడు - కుమారస్వామి.
బహులానాం కృత్తికానా మప్త్యం బాహులేయః - కృత్తికల కొడుకు.
కుమారస్వామి - స్కందుడు, శంకరుని పుత్త్రుడు, దేవసేనాపతి, వికృ.కొమరుసామి.
స్కందుఁడు - కుమారస్వామి.

స్కన్ధో భుజశిరో అంసో (అ)స్త్రీ -
కం శిరో దధాతీతి స్కంధః డు ధాఞ్ ధారణపోణయోః. - శిరస్సును ధరించునది.
భుజస్య శిరో అగ్రం భుజశిరః. స. న. - భుజము యొక్కకొన.
అమ్యతే భారణే అంసః. అ. ప్న. అమరోగే. - భారముచేఁ బీడింపఁ బడునది. ఈ 3 మూఁపు పేర్లు.   

స్కంధము - 1.మూపు, 2.చెట్టుబోదె, 3.యుద్ధము, 4.సమూహము, 5.శరీరము, సం.వి. (వ్యవ.) బోదె ప్రకాండము (Trunk).
ప్రకాండము -
చెట్టుబోదె, ఉత్తరపదమైనచో శ్రేష్ఠ వాచకము, ఉదా.పండిత ప్రకాండుడు = పండిత శ్రేష్ఠుడు.
కాండము - 1.గ్రంథభాగము, కావ్యపరిచ్ఛేదము(రామాయణమునందు షట్కాండములు గలవు), 2. సమూహము, 3.బాణము, 4.జలము, 5.ఈనె, 6.బోదె, 7.గుఱ్ఱము, 8.ఏకాంతము, 9.సమయము.
కాండత్రయము - 1.జ్ఞానము, 2.కర్మ, 3.ఉపాసన.  

బాహ్వస్థి - (జం.) దండయెముక, మోచేతిపై యెముక, భుజపు టెముక (Humerus).

భుజకీర్తి - బాహుపురి, కేయూరము.
బాహుపురి -
కేయూరము.
కేయూరము - భుజకీర్తులు, వ్యు.భుజాగ్రమున నుండునది.
సందలిదండ - కేయూరము, బాహుపురి.

దోష - 1.భుజము, 2.రాత్రి.
దోర్మధ్యము -
1.పిడికిలిపోటు, 2.భుజముల నడిమి ప్రదేశము. 
దోర్యుగము - రెండు బాహువులు.

ఎగుభుజము - ఉన్నత భుజము.

భుజము - (గణి.) సమతల క్షేత్రములో వరుసగా నున్న రెండు కోణబిందువుల కలువగావచ్చు సరళరేఖ (Side) సం.వి.చేయి.
భుజసంధి - (జం.) భుజపు కీలు, చెయ్యి ఎముక భుజపు ఎముక కలిసిన భాగము (Shoulder joint).
ౙబ్బ - 1.భుజము, 2.తొడ వెలుపలి మీది భాగము, సం.భుజా.
రెట్ట - 1.పక్షిమలము, 2.భుజము.
బాజు(ౙ)బందు - 1.భుజబంధము, 2.భూషణము, జం.బాహుబంధః.
దో - బాహువు; బాహువు - భుజము.

అంసము - 1.మూపు, భుజాగ్రము, 2.అంశము.
మూపు -
భుజ శిరస్సు, అంసము.
అంసకూటము - ఎద్దుమూపురము.
అంసలుఁడు - మంచిమూపు గలవాడు, బలవంతుడు.

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
వంతు -
1.భాగము, 2.వరుస, 3.సామ్యము, 4.పోటీ.
విషయము - గ్రంథాదులందు దెలియు నంశము.
భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
పాలు - 1.క్షీరము, 2.చెట్లయందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.
క్షీరము - 1.పాలు, 2.పాలసముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

కంసారాతి - శ్రీకృష్ణుడు.
కంసారాతిః. ఇ-పు. కంసస్య అర్తాతిః - కంసుని శత్రువు.
కంసుఁడు - కృష్ణుని మేనమామ.

అరాతి - శత్రువు.
ఇయర్తి అరాతిః, ఇ.పు. ఋ గతౌ. - సంహరించువాఁడు.

చేరి బలధికుం డెఱిఁగిచెప్పినకార్యము చేయ కుండినన్
పారము ముట్టలే డొకఁనెపంబున, దాఁజెడు నెట్టి ధన్యుడున్,
బోరకపాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టమన్న గం
సారిని గాకుచేసి చెడడాయెనె కౌరవభర్త భాస్కరా.

తా. గొప్ప వాడగు కంసారాతి - శ్రీకృష్ణుడు      జరగబోవు కౌరవ(కౌరవలు - కురువంశపు వారు.)నాశన మెఱింగి, దుర్యోధనునితో చెప్పగా వాడా తనిని మోసగించి కాకుచేయు-క్రి.1.అవమానించి, 2.అపహరించు, 3.ఆక్రమించు, 4.బాధపట్టు.)మోసగించి తుదకు తానే నశించెను. అట్లే గొప్పవారు రాబోవు ఉపద్రవము తెలిసికొని అది తప్పించుకొను నుపాయము చేరువకు పారము - 1.అవతలిదరి, 2.సమీపము.) వచ్చి చెప్పినను ఎటువంటి ధన్యుఁడు - పుణ్యవంతుడు)డైనను వానిని ఏదో ఒకనెపమున లెక్కచేయక తుదకు నశింతురు.

అఘబకక్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణా|

కృష్ణమూర్తి - కృష్ణావతారము.
ద్వాపరయుగములో, అష్టమి తిథి(శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన)రోహిణీ నక్షత్రం అర్థరాత్రి వ్యాపించిన సమయంలో దేవకిదేవి అష్టమ గర్బాన శ్రీకృష్ణుడు జన్మించాడు.

అష్టము రోహిణి ప్రొద్దున
నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకీకిన్
దుష్టుని కంసుఁ వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా.
తా.
లోకమును ధర్మయుక్తముగాఁ బాలించుటకు దేవకీదేవికి(ప్రొద్దు - 1.సూర్యుడు, 2.కాలము, 3.దినము, సం.బృధృః.) రోహిణీ నక్షత్రముతో గూడిన అష్టమితిథినాడు, ఎనిమిదవ బిడ్డవైపుట్టి దుర్మార్గుఁడగు కంసుని చంపితివి. కృష్ణా! నీక్రియలు ధర్మాత్మకములు.

నామస్మరణా దన్యోపాయం న హి పశ్యామో భతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
కృష్ణానంత కృపజలధే కంసారే కమలేశ హేరే
కాళియమర్దన లోకగొరో భక్తం తే పరిపాలయ మామ్. - 8

కంౘరము - ఒక రకపు శకటము, సం.కంచరః.
కంచర - కంచుపనిచేసి బ్రతుకుజాతి, సం.కంౘరి, సం.కాంస్యకారః.    

కాంస్యకారుఁడు - కంచర.
కంౘరి - కంచర.
కం(ౘ)చు - ఒక విధమగు లోహము, సం.కంసమ్ (Bronze).

కంసో (అ)స్త్రీ పానభాజనమ్,
కామ్యతే పానార్థమితి కలసః, అ, ప్న, కము కాంతౌ. - పానార్థమై కాంక్షింపఁ బడునది.
పానస్య భాజనం పాన భాజనం - పానము యొక్క పాత్రము. ఈ 2 గిన్నె పేర్లు.

కంసము - 1.కంచు, 2.కంచుపాత్రము. 
కాంస్యము - 1.కంచు, 2.లోహపాన పాత్ర.

ద్విధాతుకము - (రసా.) రెండు ధాతువులు కలిసియున్నది (Bimetallic), ఉదా రాగి, తగరము అను రెండు ధాతువుల మిశ్రమము కంచు, ద్విధాతుక మిశ్రము.
కం(ౘ)చుకొమ్ము - ఒక రకపు వాద్యము.

గిన్నియ - 1.లోహాది పాత్రము, 2.పానపాత్రము, రూ.గిన్నె.
గిన్నె - గిన్నియ.

అల్పు డెపుడు పల్కు నాదంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వ.

తా. అల్పుఁడు - నీచుడు) డంభములు చెప్పుచుండును, సజ్జనుఁడు - 1.మంచి కులమున బుట్టినవాడు,2.మంచివాడు.) మెల్లగ మాటలాడుచుందురు. తక్కువఖరీదైన లోహము అయినను కంచు Bronze దడదదమని మ్రోగునట్లు యెక్కువఖరీదైన కనకము - 1.బంగారు, 2.ఉమ్మెత్త.)అనులోహము మ్రోగదు గదా! 

కింకరము- 1.కోయిల, 2.తుమ్మెద, 3.గుఱ్ఱము.
కోకిలము- కోయిల; కోవెల- గుడి, వై.వి.కోకిలము.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
తుమ్మెద - భ్రమరము.
భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
భ్రమతీతి భ్రమరః, భ్రము అనవస్థానే. - తిరుగుచుండునది.
గుఱ్ఱము - అశ్వము.
అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
అశ్నుతే గమనేనే త్యశ్వః, అశూ వ్యాప్తౌ. - గమనముచేత వ్యాపించునది.

కింకిరాటుఁడు- మన్మథుడు, రూ.కింకరాతుఁడు.
కింకిరుఁడు - మన్మథుడు. 
మన్మథుఁడు - మారుడు, విణ.విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరము చేయువాడు.
మననం మత్ చేతనా తాం మథతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే. 
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ).

కింకరుఁడు - పరిచారకుడు, వ్యు.ఏమి చేయుదు నని అడుగువాడు.
కిమపి కరోతీతి కింకరః, డు కృఞ్ కరణే. - దేనినైనను చేయువాఁడు.
కింకరి - పరిచారిక, దాసి, రూ.కింకర.
పరిచారిక - సేవకురాలు.
దాసి - పనికత్తె, పరిచారిక.

కటాక్షకింకరీభూత - కమలాకోటిసేవితా|
శిరస్థ్సితా చంద్రనిభా పాలస్థేంద్రధనుఃప్రభా. - 119స్తో
    

చంచరీకము - తుమ్మెద, వ్యు.చరించు చుండునది.     

తుమ్మెద కుటుంబము - తుమ్మెదలు, చీమలు, తేనెటీగలు, కందురీగలు మొదలగు పురుగులీ కుటుంబమునకు చెందినవి.

హీర - 1.లక్ష్మి, 2.చీమ.
చీమ - పిపీలిక. చీమకు చిప్పెడు నీళ్ళే సముద్రము. చీమ గంగా యాత్ర. పిపీలిక - చీమ; కొండచీమ -
పిపీలిక, ఒకరకమైన చీమ.

చీమల నుంచి మనం అహార నిలువలు నేర్చుకున్నాం. చీమ బారు తప్పదు. తప్పించండి. తనువు ఉన్నంత సేపు చీమల బారును చేరుకునే ప్రయత్నం చేస్తుంది! చీమలు ఒక్కొక్క రవ్వ - ఒక్కొక్క గింజ మోసుకు పోతాయి! చీమ తన జాతి జీవనం కోసం నిలువ చేస్తుంది.

గచ్ఛన్ పీపిలికో యాతి, యోజనానాం శతాన్యపి|
అగచ్ఛన్ వైనతే యోపి, పదమేకం న గచ్ఛతి||
తా.
"నడిస్తే చీమైనా వంద యోజనాలు కూడా ప్రయాణించగలదు. నడవ కుండా ఉన్నప్పుడు గరుత్మంతుడు సైతం ఒక్క అడుగు కూడా పయనించలేడు." ప్రయత్నమంటూ చేస్తే ఎవరైనా, దేనినైనా సాధించగలరు. ప్రయత్నమే లేనప్పుడు ఎంత గొప్పవాడైన దేనినీ సాధించలేరు. ప్రయత్నం శక్తి అంతటి గొప్పది.  

కండచీమ - పెద్దచీమ, రూ.గండుచీమ.
గండ్ర1 -
1.దుష్టుడు(దుర్జనుఁడు - దుష్టుడు.), 2.ధృష్టుడు, 3.బోయడు, 4.పెద్దది, ఉదా. గండ్రచీమ, బహు. పరుషవచనములు. నరకఁడు - 1.దుష్టుడు, 2.దయలేనివాడు, సం.నరకగః.
దుర్జాతి - దుర్జనుడు, వి.చెడ్దజాతి. మృగయుఁడు - బోయ.
గండ్ర2 - తునక, ముక్క, సం.ఖండః.
గండ్రలు - పరుషవచనములు, వై.వి. తునుకలు.
పరుషము - 1.నిష్ఠురము, 2.నిష్ఠుర వాక్యము, (వ్యాక.) క, చ, ట, త, ప, లు. నిష్ఠురము - కఠినము, పరుషము.

మాధవుఁడు - లచ్చిమగడు, విష్ణువు.
మాధవః, మాయాః లక్ష్మ్యాః ధవః - లక్ష్మీదేవికి భర్త.
యదోర్జ్యాయా స్పుత్రో మధుః, తద్వంశ జత్వాస్మాధవః. - యదువనెడివాని పెద్దకొడుకు మధుఁడు; అతని వంశమునఁ బుట్టినవాఁడు.
మధూయతే శత్రూనితివా - శత్రువులఁ గంపింపఁజేయువాఁడు. ధూఙ్ కంపనే.

మాధవి - 1.పూల గురివెంద, 2.కల్లు, 3.తెనె, 4.లక్ష్మి, 5.కుంటెనకత్తె.
మధౌ చైత్రే పుష్పవతీతి మాధవీ, ఈ. సీ. - చైత్ర మాసమందుఁ బుష్పించునది.      

మాధవము - 1.వైశాఖమాసము, 2.వసంత ఋతువు.
కుసుమసంభృతం మధు ప్రచురం అస్మిన్నస్తీతి మాధవః - కుసుమ సంభృతమైన మధువు విస్తారముగలది. మధుః వసంతః అస్మిన్నితివా మాధవః - మధువనఁగా వసంతుఁడు, అతఁడు దీనియందుఁ గలఁడు. సర్వకాలేషు మాధవం| 

వసంతము - 1.చైత్రవైశాఖ మాసములు, 2.ఒకానొక రాగము, వి.పసుపును సున్నమును కలిపిన యెఱ్ఱనీళ్ళు.
మధువు - 1.నీరు, 2.పాలు, 3.తేనె, 4.కల్లు, 5.వసంతర్తువు, 6.చైత్రమాసము.

రాధ - ఒక గొల్లస్త్రీ, కర్ణుని పెంపుడు తల్లి.
రాధా విశాఖా, త్యుక్తాపూర్ణిమా (అ)స్త్యస్మిన్నితి రాధః - రాధ యనఁగా విశాఖ, దానితోఁ గూడిన పున్నమ గలది. బృందావనము నందు రాధ| 

రాధా విశాఖా -
రాధ్నోతి కార్యమనయా రాధా, రాధ సంసిద్దౌ - దీనిచేఁ గా(కా)ర్యము సిద్ధించును.
విశాఖతే కాంత్యా వ్యాప్నోతీతి విశాఖా శాఖృ వ్యాప్తౌ - కాంతి చేత వ్యాపించునది. విశాఖ పేర్లు. రాధ యనఁగా విశాఖ.

మధురిపుఁడు - విష్ణువు.
మధో రసురస్య రిపుః మధురిపుః - ఉ- పు. మధు వనెడి రాక్షసునికి శత్రువు.

వసంతం యౌవనంవృక్షాః, పురుషా ధన యౌవనమ్|
సౌభాగ్యం యౌవనానార్యో, యౌవనావిద్యయా బుధాః||
తా.
వృక్షములకు వసంతఋతువు యౌవనము, పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమాత్మ.)లకు ధనము యౌవనము, స్త్రీలకు సౌభాగ్యము - 1.అందము, సుభగత్వము, 2.వైభవము.)యౌవనము, బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.)లకు విద్యయే యౌవనము. - నీతిశాస్త్రము   

దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా|
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా. - 148శ్లో
 

వైశాఖము - 1.వైశాఖమాసము, 2.కవ్వము, 3.వీలుకాని స్థానము.
విశాఖానక్షత్రయుక్తా పూర్ణిమా వైశాఖీ, సా(అ)స్థిన్నితి వైశాఖః, - విశాఖా నక్షత్రముతో గూడిన పున్నమ దీనియందుఁ గలదు.

వైశాఖమాసంలో సూర్యుడు అర్యముడు(అర్యముఁడు - 1.సూర్యుడు, 2.పితృదేవతలలో ఒకడు.)అనే పేరు వహిస్తాడు.
పులహుడు, ఓజుడు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుడు, కంజవీరుడు అనేవారు అనుచరులు కాగా కాలగమనం సల్పుతుంటాడు.

అర్యముఁడు - 1.సూర్యుడు Sun, 2.పితృదేవతలలో ఒకడు.
ఇయర్తి గచ్ఛతీతి అర్యమా, న. పు. ఋగతౌ - గమనయుక్తుఁడు.    

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవ బ్రహ్మలు:- భృగువు, పులస్తుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

వైశాఖము - 1.వైశాఖమాసము, 2.కవ్వము, 3.వీలుకాని స్థానము.
విశాఖయాం భవో వైశాఖః - విశాఖయందుఁ బుట్టినది.
విశాఖస్య కాష్ఠ స్యాయమితి వైశాఖః - కొమ్మ సంబంధమైనది.
మంథరము - 1.చొరవలేనిది, 2.మెల్లగా పోవునది, 3.వంకరైనది, వి.కవ్వము.
మంథానము - కవ్వము.
మథ్యతే అనేనేతి మంథః, మంథాన. అ. పు. మంథాశ్చ. న. పు. మంథ విలోడనే. - దీనిచేత మథింపఁబడును.
మంథనార్థం దండః మంథదండకః - మంథనార్థమైన దండము.

కవ్వము - పెరుగు చిలుకు సాధము. 
మంథనము - 1.త్రచ్చుట, 2.కవ్వము.
దధిచారము - కవ్వము. తరిగోల - కవ్వము. క్షుబ్ధము - కలత పెట్ట బడినది, వి.చల్ల కవ్వము.    

గట్టుతాలుపు - విష్ణువు, వ్యు.మందరగిరి నెత్తినవాడు.
గట్టు - ఒడ్డు, తీరము, కొండ, చెఱువుకట్ట, పర్వతము, సం.ఘట్టః.

గిరిధరుఁడు - విష్ణువు, వ్యు.మందర పర్వతమును ధరించినవాడు. 

కవ్వపుఁగొండ - (కవ్వము+కొండ) మంథరగిరి.
మందరము - 1.కవ్వపు కొండ, 2.మందారమును కల్ప వృక్షము, విణ.అలసము.
మందంతి మోదంతే అనేనేతి మందారః - దీనిచేత సంతోషింతురు.
మది స్తుతి మొద మద శ్వప్న కాంతి గతిషు, మంద్యతే స్తూయత ఇతివా - స్తోత్రము చేయఁబడునది.  

తరిగొండ - మంధాద్రి.
తరిగంబము - పెరుగు చిలుకు స్తంభము.
దందవిష్కంబము - తరిగంబము, చల్ల చిలుకుట కాధారమైన స్తంభము.
దండం విష్కభ్నాతీతి దండవిష్కంభః, స్కంబ రోధనే. - కవ్వమును నిలుపునది. 

దండాహతము - మజ్జిగ, వ్యు.కవ్వముచే త్రచ్చ బడినది.
దండేన మఁథదండే నాహతం దండాహతం – కవ్వముచేతఁ జిలుకఁ బడునది.
మజ్జిగ- చల్ల, సం.మార్జికా.
చల్ల - మజ్జిగ, శీతము. చల్లకొచ్చి ముంత దాచడమెందుకు!

రసాయనము - 1.జరావ్యాధులను పోగొట్టెడి మందు 2.మజ్జిగ butter milk.    

శీతము - 1.చల్లనిది, 2.అలసమైనది.
శీతలము - చల్లనిది.
శీతము - (జం.) అలలవలె కదులు చుండుపొర, (Undulating membrane).    

ఆఁకత్రాళ్ళు - కవ్వమును తగిలించుటకై తరికంబమునకు కట్టు త్రాళ్ళు. 

మోడము - 1.మేఘావరణ, 2.మందారము.
మందాని సూక్ష్మాణి అరాని కంటకాని యస్య సః మందారః - సూక్ష్మమైన ముండ్లు కలది. 
మందారము - 1.జిల్లేడు, 2.పారిజాతము.
మందాన్ క్షుద్ర వ్యాధీన్ ఔషధత్వేన ఇయర్తీతి మందారః - క్షుద్రవాధులను బోఁగొట్టునది.

గుత్తి - 1.పూగుత్తి, 2.చీలిమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.

ఉరుగుణవంతుడొడ్లు దనకొండపకారము చేయునప్పుడున్
బరహితమే యునర్చు నొకపట్టుననైనను గీడుఁ జేయఁగా
నెఱుఁగడునిక్కమేకదా యదెట్లనఁ గవ్వముఁ బట్టియెంతయున్
దరువఁగజొచ్చినన్ బెరుంగు తామినీయదె వెన్న, భాస్కరా.
 
తా. పెరుగును కవ్వముతో నెంత తరచిన నంత వెన్నపూస - వెన్నముద్ద butter నిచ్చును. అట్లే గుణవంతుడు తనకు పరుల(అ)పకారము అపకృతి - అపకారము చేసినను, వాని సన్నిటిని సహించి వారికి ఉపకారమునే చేయును.

బందీకృత సుర బృందానందన
వందారుమనుజ మందార ద్రుమ| ||శరవణభవ||
 

అంబరీషుడు - 1.సూర్యవంశీయులలో విష్ణుభక్తుడగు ఒకరాజు, 2.సూర్యుడు Sun, 3.విష్ణువు, 4.శివుడు, 5.బాలకుడు.

క్షీరకంఠుఁడు - బాలకుడు.
దారకుఁడు - 1.బాలకుడు, 2.కృష్ణుని సారథి, విణ.చీల్చువాడు.
ద్రియత ఇతి దారకః. - ఆదరింపఁబడువాఁడు. 

మహారాజులు - వీరు పదునార్గురు:- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగుడు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

క్లీబే (అ)మ్బరీషం భ్రాష్ట్రః-
అంబరీషము - 1.యుద్దము, 2.మంగలము, 3.పశ్చాత్తాపము, 4.ఒక నరకము, (వృక్ష.) అడవిమామిడి.
అంబతేభ్రజ్య మానలాజాదిభి రిత్యమరీషం, అబి శబ్దే. వేఁచఁ బడులాజాది వస్తువులచేత మ్రోయునది.
భ్రాష్ట్రము - మంగలము, వేపుడు చట్టి.
భ్రజ్యతే (అ)స్మి న్నితి భ్రాష్టం, భ్రష్ట పాకే. - దీనియందు వేఁచబడును. ఈ 2 మంగలము పేర్లు.

అంబ - 1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.

పార్వతి - 1.గౌరీ, (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

అంబరీషము - 1.యుద్దము, 2.మంగలము, 3.పశ్చాత్తాపము, 4.ఒక నరకము, (వృక్ష.) 5.అడవిమామిడి.

అథ మాగధీ, గణికా యూథి కామ్బష్ఠా -
కీకటము- 1.గుఱ్ఱము horse, 2.మగధ దేశము.
మగధదేశే ప్రచురా మాగధీ - మగధదేశమందు ప్రచురమైనది.  
మగధదేశే భవామాగధీ, సీ. - మగధదేశమందుఁ బుట్టినది, పిప్పలితీఁగె.
గుఱ్ఱము – అశ్వము horse.
అశ్వము - 1.గుఱ్ఱము, 2.ఏడు అను సంఖ్య.
అశ్నుతే గమనేనే త్యశ్వః, అశూ వ్యాప్తౌ. - గమనముచేత వ్యాపించునది.
మగధుఁడు - 1.మగధదేశమువాడు, 2.వంశావళి చదివెడువాడు, రూ.మాగధుడు, మధుకుడు.
మాగథః క్షత్రియావిశో- మగధదేశే ప్రాయేణ భవన్తి తిష్ఠన్తి మాగధాః మగధదేశ మందు తఱచుగా నుండువారు. ఈ 1 క్షత్రియస్త్రికిని వైశ్యునికిని బుట్టిన వానిపేరు.

స్యు ర్మాగధాస్తు మగధాః -
మగధ్యంతి స్తువంతి మాగధాః, మగధాశ్చ, మగధ స్తుతౌ. - వంశములు స్తోత్రముచేయువారు గనుక మాగధులు, మగధులును, పా. మధుకాః. ఈ 2 వంశావళిఁ జదువువారి పేర్లు.

గణిక - 1.ఆడేనుగు, 2.వేద్య.
గణికావచ్చిక్తకర్షణాద్గణికా - వేశ్యవలె మనస్సును హరించునది.
విటగణో (అ)స్యా అస్తీతి గణికా - విట సమూహము గలది.
గణయతి ధనికా నితి గణికా, గణసంఖ్యానే. - ధనికులు నెంచునది.
యూధము - సజాతీయ పశుసమూహము.
యూథోజాల మస్యా ఇతి యూథికా - గుంపు గలిగి యుండునది. 
వాసంతి - అడవి మొల్ల, పూలగురివెంద.
వసంతే పుష్ప్యతీతి వాసంతీ, ఈ. సీ. - వసంత కాలమందుఁ బుష్పించునది.     
అంబష్ట - 1.(వృక్ష.) 1.అడవిమొల్ల, 2.పులిచింత, 3.చిరుబొద్ది, 4.సరస్వతి తీగ, 5.అడవిమామిడి.
అంబః భ్రమరాణాం ధ్వని; సో (అ)త్ర తిష్ఠతీతి అంబష్ఠా, ష్ఠా గతినివృత్తౌ - తుమ్మెదలమ్రోఁత దీనియం దుండును, అడవిమొల్ల.
అంబే శబ్దే తిష్ఠతీతి అంబష్ఠా-శబ్దమందుండునది, అబేవ తిషతీత్యంబష్ఠా - తల్లివలె సహకారిణియై యుండునది, అగురుసొంటి. ఈ 4 అడవి మొల్ల పేర్లు.

అమ్లము - 1.పులుపు, 2.నాల్గవ భాగము నీళ్ళుచేరిన మజ్జిగ, 3.పులిసిన పెరుగు, 4.పులిచింత, 5.దబ్బ.

అమ - 1.తల్లి, 2.పూజ్యురాలు, రూ.అమ్మ, సం.అంబా.
అమ్మ - 1.తల్లి, 2.పూజ్యురాలు, సం.అంబా. అవ్య. ఆశ్చర్యాది వాచకము, ఔర.

అమ్బా మాతా -
అంబ్యతే శబ్ద్యతే బాలై రిత్యంబా. అబి శబ్దే. - బాలురచేఁ బిలువఁబడునది. ఈ ఒకటి తల్లిపేరు.

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి, (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).
మాతి వర్తతే గర్భో (అ)త్ర మాతా, ఋ సీ, మామానేవర్తనే చ - గర్భ మీమెయం దిమిడియుండును. 

మాతరపితలు - మాతాపితలు, తల్లిదండ్రులు.
మాకాపితలు - తల్లిదండ్రులు, కన్నవారు (Parents). 

ధరణినాయకు రాణియు
గురురాణియు నన్నరాణి * కులకాంతను గ
న్నరమణి దను గన్నదియును
ధర నేవురు తల్లులనుచుఁ * దలఁవుఁ గుమారా!
తా.
రాజు భార్యయును(రాణి - రాజ్ఞి, భార్య), గురు భార్యయును, అన్న - జ్యేష్టసోదరుడు)అన్నభార్య యును, భార్యతల్లి(అత్తయును), తను(తన- ఆత్మార్థకము కన్నతల్లి, ధర - భూమిలో ఐదుగురు తల్లులని భావింపవలెను.

ఏడుగడ - (ఏడు+కడ) గురువు, తల్లి, తండ్రి, పురుషుడు, విద్య, దైవము, దాత అని ఏడువిధము లైన రక్షకము, రూ.ఏడ్గడ.  

భ్రమరాంబ - అంబ, పార్వతి.
అంబ - 1.అమ్మ, తల్లి, 2.పార్వతి, 3.కాశిరాజు కూతురు, (వృక్ష.) 1.చేదుసొర, 2.పులిచింత, 3.అడవి మామిడి.
భ్రామరి - పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది. 
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతురు.  శ్రీశైలే భ్రమరాంబికా శక్తిపీఠం| 

భ్రమరము - 1.తుమ్మెద, 2.ముంగురులు.
అస్య భ్రమర ఇతి నామ్నిద్వౌ రేఫా స్త ఇతి ద్విరేఫః - భ్రమర మను తన పేరునందు రెండు రేఫలు గలది.
ద్విరేఫము - భ్రమరము, వ్యు.రెండు రేఫలు కలది.
రేఫము - ర వర్ణము, విణ.అధమము.

తే లలాతే భ్రమరకాః -
తే అలకాః, లలాటోపరి పతితా శ్చేత్ భ్రమరకా ఇత్యుచ్యంతే. - ఆ కురులు అలకరింపఁబదునవి. 'అలకా యక్షనగేఅ (అ)లకో (అ)స్త్రీచూర్ణకుంతలే' అని రత్నమాలిక. 'స్వభావక్రాణ్యకాని యోషితం' అని ప్రయోగంబును.
చూర్ణకుంతలము - అలకలు, ముంగురులు.
చూర్ణాః కుటిలాః కుంతలా చూర్ణకుంతలాః. - కుటిలములైన వెండ్రుకలు, 'చూర్ణః క్షోదే చ కుటిలే' అని రభసుడు. ఈ 2 ముంగురుల పేర్లు.

భ్రామరము - భ్రమరములు గూర్చిన తెల్లని తెనె.

భ్రమరకము - 1.తుమ్మెద, 2.బొంగరము.
భ్రమతీతి భ్రమరః భ్రము అనవస్థానే. - తిరుగు చుండునది.

భ్రమణము - 1.తిరుగుట, 2.తుమ్మెద, సం.వి.(భౌతి., గణి.) పరిభ్రమనమునకు విరుద్ధముగ ఒక వస్తువు ఇంకొకదాని చుట్టు ఒక కక్ష్యలో తిరుగుట (Revolution), ఉదా. భూమి సూర్యునిచుట్తు తిరుగును, సం. (గణి.) ఏదైన బిందువు చుట్టుగాని సరళరేఖ చుట్టుగాని తిరుగుట (Rotation).
భ్రమో భ్రమౌ,
భ్రమణం భ్రమః, భ్రమిశ్చ, సీ, భ్రము అనవస్థానే. - తిరుగుట భ్రమము, భ్రమియు, పా, భ్రమీ. ఈ 2 తిరుగుట పేర్లు.

బొంగరము - త్రాడుచుట్టి యాడెడు ఆటవస్తువు, సం.భ్రమరకమ్.  
ములికి - 1.బాణము, 2.బాణపుటలుగు, 3.బొంగరము కొననుండు ఇనుపముక్క, రూ.ముల్కి.

(ౙ)జాలె - 1.ఒక తెగ డేగ, 2.వరాలసంచి, 3.బొంగరపు త్రాడు, రూ.జాలియ. 

భ్రమి - (భౌతి.) శరీర కేంద్రమం దొక కుహరమును కల్పించుకొని ఒక ప్రవాహి గ్రహించు భ్రమణము (Vorten motion), పర్యాయపదము, భ్రమరకము).

తుమ్మెద - భ్రమరము.
భ్రమర కీటన్యాయము - న్యా. ఒక పదార్థమును తీవ్రముగ భావించి దాని యట్లే తాననురీతి (తుమ్మెద పురువుం దెచ్చి తన గూటిలో నుంచి దాని యందే మనస్సు నిల్పి తుమ్మెద యగు నను రీతి).

ఝంకారము - తుమ్మెదలరొద, రూ.ఝుంకృతి.

తత్త్వము - 1.పరమాత్మ, 2.స్వభావము, 3.సారము, సం.వి. (భౌతి.) మౌలికమైన, సారమైన విషయము. దేని మీద ఇతర సత్యములు ఆధారపడి యుండునో అట్టి మ్మౌలిక సత్యము లేదా దేని నుండి ఇతర సత్యము లుత్పన్నములగునో అట్తి మౌలిక సత్యము (Principle).

భ్రమరమ కీటకంబు గొని పాల్పడి ఝూం కరణోపకారియై
భ్రమరముగా నొనర్చునని పల్కుట జేసి భావాది దుఃఖసం
తమనమెడల్చి భక్తసహితంబుగ జీవుది విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుచు దాశరథీకరుణా పయోనిధీ|

తా. తుమ్మెద పురుగును ఝుకారముచేత ఉపకరించి, తనవలె తుమ్మెదగా చేయునని(జనులనుకొనుటచేత)జేయుట లోకమునకు తెలియుచుండఁగు, నీవు(జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి.)పుట్టుక మొదలుగాగల, దుఃఖము లనెడి చీఁకటిని పోఁగొట్టి, భక్తి - 1.సేవ, 2.భయముతో కూడిన స్నేహము, 3.భాగము.)గలిగించి వానికి నీతోడి సారూప్యమును ఒసగుట ఆశ్చర్యము గాదని తాత్పర్యము.

సహితము - కూడుకున్నది, అవ్య. (తెనుగున) సహార్థకము, రూ.సయితము.

పుష్పదయము - తుమ్మెద.
పుష్పం లేఢి ఆస్వాదయతీతి పుష్పలిట్. హ. పు. లిహ ఆస్వాదనే. - పుష్పము నాస్వాదించునది.

అరిందముఁడు - 1.శత్రువుల నణచువాడు, 2.అరిషడ్వర్గములను గెలుచువాడు, వి.1.శివుడు, 2.ఒకానొకఋషి.
అరిషడ్వర్గములు - అంతశ్శత్రువులు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు).    

భృంగము - తుమ్మెద, షట్పదము.
కార్ష్యం భరతీతి భృంగః భృఞ్ భరణే. - నలుపును భరించునది.  
షట్పదము - తుమ్మెద, వ్యు.ఆరు కాళ్ళుకలది. షట్పదా న్యస్యేతి షట్పదః - ఆఱుకాళ్ళు గలది. ౙంటముక్కాలి - తుమ్మెద, షట్పదము.
ౙంట - జత, సం.యుగళమ్, అవ్య. 1.వెంట, 2.సమీపమునకు, రూ.జనుట.

యథా మధు సమాదత్తే రక్షన్ పుష్పాణి షట్పదః |
తద్వదర్థాన్ మనుష్యేభ్యః ఆదద్యాద విహింసయా ||

భా|| పూలు(పుష్పాణి - పూవులు)కందకుండా తుమ్మెద తెనెను గ్రహించినట్లు మనుష్యుల్ని హింసించకుండా/బాధించకుండా రాజు సంపదలను గ్రహించాలి.  

అర్థము - 1.శబ్ద వివరణము, 2.వస్తువు, 3.ఇంద్రియములచే గ్రహింప దగిన విషయము (శబ్దాదులు), 4.కారణము, 5.కార్యము, 6.ధనము, 7.పురుషార్థములలో రెండవది.
అర్థ్యత ఇత్యర్థః అర్థ ఉపయాచాజ్ఞాయాం - ప్రార్థింపబడునది.

భృంగరాజము - 1.గండుతుమ్మెద 2.గుంట గలిజేరు.
భృంగవద్రాజతే భృంగరాజ, రాజృదీప్తౌ. - తుమ్మెదవలె, బ్రకాశించునది.  
భృంగారము - 1.బంగారు పాత్రము 2.గుంట గలిజేరు.
భ్రియతే జలమనేనేతి భృంగారః - దీనిచేత జలము భరింపఁబడును.
బంగరు - బంగారము, సం.భృంగారః.

భృంగి - శివభృత్యులలో నొకడు.

ఓం హ్రీంకారాంభోజ భృంగికాయై నమః : హ్రీంకార రూపమైన పద్మము నందు లలితాదేవి భ్రమరము వంటిది. పరాగ, పరిమళాదులు విశేషంగా ఉండునట్టి పద్మంలో విశేషాసక్తితో భ్రమరం ఉంటుంది.

ఝంకారము - తుమ్మెదలరొద, రూ.ఝుంకృతి.
ౙుం - 1.తావివీచుటయం దనుకరణము, 2.తుమ్మెదలు చేయు ధ్వన్యనుకరణము.

ఝంకారాశ్రయ భృంగిరిటిప్రియ ఓంకారేం మహేశశివ| 

ప్రకరము - గుంపు, విణ.చెదిరినది. 

మకరందము - పుష్పరసము, మరందము.
మంక్యతే పుష్పతే అనే నేతి మకరందః, మకి మండనే. - దీనిచేత పుష్పమలంకరింపఁబడును.
మకరందకోశము - (వృక్ష.) పుష్పములో తేనె ఉండు స్థలము లేక తెనె ఉత్పత్తిచేయు గ్రంథి (Nectary).

గుత్తి - 1.పూగుత్తి, 2.చీలిమండ, 3.మణికట్టు క్రింది హస్తభాగము, 4.ఒకానొక వన్యవృక్షము, 5.(కవ్వము యొక్క) బిళ్ళ, సం.గుచ్చః.

మంజరి - 1.చిగురించిన లేతకొమ్మ, 2.పూగుత్తి, 3.పెద్దముత్తెము.
స్తబకము - పూగుత్తి.
స్తూయతే స్త్బకః, ష్టుఙ్ స్తుతౌ. - స్తోత్రముచేయ బడునది.

వికిరణము - వెదజల్లుట.
పుష్పాణి వికిరతీతి వికీరనః కౄ విక్షేపే. - పువ్వులఁ జల్లునది. 
వికిరణము - (రసా., భౌతి.) కిరణ పుంజము (Radiation) (భౌతి.) ఎట్టి పదార్థము సహాయము లేకయే శూన్య ప్రదేశము ద్వారా వేడిగాని వెలుతురు గాని వ్యాపించు విధానము (Radiation). 
వికరించు - (భౌతి.) కిరణ ప్రసారము గావించు (Radiate).
వికీర్ణతాపము - (భౌతి.) ఒక వస్తువు నుండి పరిసరములకు వెదజల్లబడిన తాపము (Radiant heat).

సొబగుడు - చక్కనివాడు.
సొబగు - చక్కదనము, సం.సుభగః.
ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
ౘక్కనయ్య - 1.సుందరమైనవాడు, 2.మన్మథుడు.

సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి.
అథ సుభగాసుతః, సౌభాగినేయః -
సౌభాగినేయుఁడు - భాగ్యవతి కొడుకు.
సుభగాయా స్సుతః సుభగాసుతః, 1 సుభగాయా అపత్యం సౌభాగినేయః - భాగ్యవంతురాలి కొడుకు. ఈ 2 భాగ్యవంతురాలి కొడుకు పేర్లు. 
సౌభాగినేయ - భాగ్యవతి కూతురు.

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
చరత్యనేన చరణః, ఆ. ప్న. చర గతిభక్షణయోః. - దీనిచేత సంచరింతురు.

నిమజ్జనము - స్నానము, రూ.మజ్జనము.
మజ్జనము - స్నానము; స్నానము - మునక.
మునక - మునుగుట, మునుకచేయుట.

దదానే దీనేభ్యః - శ్రియ మనిశ మాశానుసదృశీ
మమందం సౌందర్య - ప్రకర మకరందం వికిరతీ|
తవా(అ)స్మిన్ మందార - స్తబక- సుభగే యాతు చరణే
నిమజ్జ న్మజ్జీవః - కరణచరణై షాట్చరణతామ్. - 90శ్లో

తా. ఓ తల్లీ! సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి. ! దీనుఁడు - 1.ఖిన్నుడు, 2.దరిద్రుడు కోరికకు దగినట్లు భాగ్యము నిచ్చు నదియును, మిక్కుటముగ సౌందర్యరాశి యను మకరందము చిమ్మునదియు, మందారము - 1.కవ్వపుకొండ, 2.మందారమను కల్పవృక్షము, విణ.అలసము. స్తబకము-పూగుత్తి వలె నందమైన నీ పాదమందు మునిగిన జీవుఁడు - 1.ప్రాణి, 2.బృహస్పతి - ఆఱు చరణములచే (ఆరింద్రియములచే) షట్పదత్వమును (తుమ్మెద రూపును) పొందును గాక. - సౌందర్యలహరి  

సదృశము - (గణి.) అనురూపము, సం.విణ.సమానము, తగినది, (Corresponding).
సదృశ సమ్మేళనములు - (వాణి.) ఒకే పారిశ్రామిక ప్రక్రియ లేక దశలలో పని చేయుచున్న సంస్థలు ఒకటిగ వ్యవహరించుట.

నారాయణ! కరుణామయ! శరణం కరవాణి తావకౌ చరణౌ|
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు| - 7
   

కృతకాద్రి - క్రీడించుట కొరకు ఏర్పడిన కొండ, చేతగట్టు.
చేఁతగట్టు - కృతకాద్రి, క్రీడార్థము కృతకముగా నిర్మించుకొన్న కొండ.
ఆటతిప్ప - క్రీడార్థ మేర్పడిన కొండ, కృతకాద్రి.

పుమ నాక్రీడ ఉద్యానం రాజ్ఞ స్సాధారణం వనమ్,
ఆక్రీడము - 1.రాజు యొక్క క్రీడోద్యానము, 2.ఆట, విణ.విహరించునది.
ఆ క్రీడంతి జనాః అస్మిన్నితి ఆ క్రీడః, క్రీడృ విహారే. - దీనియందు సర్వజనులును గ్రీడింతురు.
ఆటతోఁట - విహార్థ మేర్పడిన తోట, ఉద్యానము, ప్రమదవనము.
ఉద్యానము - 1.(రాజుల) విహార్థమైన తోట, 2.విహారముకోరకు వెడలుట, 3.ప్రయోజనము.
ఉద్యాంత్యస్మిన్ని త్యుద్యానం, యాప్రాపణే. - జనులు దీనియందుఁ జేరుదురు. ఈ 2 ఎల్లరు విహరింపఁదగిన రాజు క్రీడోద్యానము పేరు.

అంౘ1 - హంస, సం.హంసః.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము. 
అంౘ2 - 1.ప్రక్క, 2.సమీపము.
అంౘల - ప్రక్క, సమీపము.
అంౘరౌతు - హంసవాహనముగా గలవాడు, బ్రహ్మ.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్థుడు, మరీచి).

హంసస్య యోషి ద్వరటా -
హంసి - ఆడుహంస.
వృణీతే హంసమితి వరటా, వృఞ్ వరే. - హంసను వరించునది.
వరట - ఆడుహంస, వి.పేడ యెండిన చెక్క.
వరం శ్రేష్ఠం అటనం అస్యా ఇతి వరటా - శ్రేష్టమైన నడుపు గలది. ఈ ఒకటి ఆఁడుహంస పేరు.

యోష - 1బోటి, 2.ఆఁడుది, రూ.యోషిత, యోషిత్తు.
యౌతి పుంసా యోషిత్, త. సీ. యోషా చ. యు మిశ్రనే. - పురుషునితోఁ(పురుషుఁడు - 1.మనుష్యుడు, 2.పరమత్మ.)తో గూడుకొనునది. పా, యోషితా, జోషా, "స్త్రీ వధూ ర్యోషితా రామా" ఇతి త్రికాండశేషః.
బోటి - 1.స్త్రీ, 2.చెలికత్తె.
స్త్రీ - ఆడుది.  

ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.
ప్రాణంత్యనేన ప్రాణః, అన ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.
ప్రకర్షేణానతి జీవంత్యనేన ప్రాణః, అన ప్రాణనే. - దీనిచేత బ్రతుకుదురు.

మాటకు ప్రాణంబు సత్యము
కోటకు ప్రాణము సుభటకోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ.

తా|| మాట - 1.పలుకు, వచనము, 2.నింద, 3.వృత్తంతము నకు సత్యం, కోట - 1.దుర్గపురము, 2.పట్తణము, చుట్టుగల ప్రహరి, సం.కోటః.కు మంచి సైన్యం, బోటికి - 1.స్త్రీ, 2.చెలికత్తె)స్త్రీకి శీలం, చీటి - 1.చిన్నజాబు, 2.ఖండపత్రిక, 3.రంగు ముద్రలు గల వస్త్రము, రూ.చీటీ. ప్రాణంబు వ్రాలు - వి.(వ్రాయి బహువచనము) సంతకము, క్రి.1.క్రిందకిదిగు, 2.తగ్గు, 3.ఒరగు.)జీవనాధారములు.

గండోలిగాఁడు - వికృతవేషభాషలచే నవ్వించువాడు.    

గణ్డోలీ వరటా ద్వయోః :
గండోలి - 1.ఎఱ్ఱతుమ్మెద, కణుదురీగ, 2.ఆడుహంస, 3.భద్రానది.
గణ్డం కపోలం ఉలతి ఆవృణోతీతి గణ్డోలీ. ప్స. ఉల సంవరణే. - చెక్కిలి(కపోలము - చెక్కిలి)మీఁద ముసురునది.
పా, గన్ధయ త్యర్దయతి గన్ధోలీ. గన్ధ అర్ధనే. - పీడించునది.
కందురీఁగ - కందురు. ఇంటిలో కణుదురీగ దూరితే ఇల్లు కాల్చుకుంటారా!
వరట - ఆడుహంస, వి.పేడ యెండిన చెక్క. 
వృణోతీతి వరటా. ప్స. వృఞ్ వరణే. - అంతట వ్యాపించునది. ఈ 2 ఎఱ్ఱతుమ్మెద పేర్లు. కణుఁదురీఁగ.

హంసి - ఆడుహంస.    
అంౘయాన - 1.హంసనడకవంటి నడకగల స్త్రీ, సం.హంసయాన.
క్రేంకృతము - 1.హంసాదులధ్వని, 2.అందెలచప్పుడు.

పదము - 1.కాలు, పద్యమందలి నాలవ చరణము, 3.చిహ్నము, 4.స్థానము, 5.శబ్దము, సం.వి.(గణి.) 1.ఒక సమాసములోగాని, సమీకరణములోగాని ఉండు నొక రాశి (Term) ax2 +b2+c=0 ఇందు మూడు పదము లున్నవి, 2.ఒక లేక్కచేయుటలో కనబరిచిన క్రమము (Step).     

పదం వ్యవసిత త్రాణ స్థాన లక్షాఙ్ఘ్రిన స్తుషు,
పదశబ్దము ఉద్యోగమునకును, రక్షించుటకును, స్థానమునకును, చిహ్నమునకును అడుగుటకును, వస్తువునకును పేరు. పద్యతే అనే నేతి పదం, పద్ ఌ గతౌ. - దీనిచేత పొందుదురు. 

న్యాసము - 1.ఉంచుట, 2.ఇల్లడ, 3.వాడిక.
న్యసనం న్యాసః, అసు క్షేపణే. - పెట్టుట న్యాసము.
ఇల్లడ - భద్రపరచి యుంచి అడిగినప్పుడు ఇమ్మని ఏదేని వస్తువును ఒకరివద్ద ఉంచుట, న్యాసము.

ఆక్రీడము - 1.రాజు యొక్క క్రీడోద్యానము, 2.ఆట, విణ.విహరించునది.
క్రీడ - 1.ఆట, 2.ప్రియుల పరిహాసము, 3.అనాదరము, 4.వినోదము, 5.విహారము, 6.గంతులువేసి ఎగురుట.
క్రీడాదురము - అచ్చనకాయలాట, బాలికాక్రీడ.
అౘ్చనగండ్లు - బాలిక లాడెడి క్రీడ, రూ.అచ్చనలు, అచ్చనగాయలు.

క్రీడనము - 1.ఖేలనము, విలాసము, ఆట, 2.ఆటబొమ్మ.
క్రీడనం క్రీడా, క్రీడృ విహారే. - క్రీడించుట క్రీడ.
ఖేల - ఆట.
ఖేలనం ఖేలా. - విహరించుట.

విభావము - 1.పరిచయము, 2.(అలం.) రసోత్పాదనకారణము.
పరిచయము - 1.ఎరుక, 2.స్నేహము.
సంస్తవము - 1.పరిచయము, 2.స్తుతి. 
సంస్తవనం సంతవః, ష్టుఞ్ స్తుతౌ. పరిచ్యనం పరిచయః, చిఙ్ చ్యనే. - పరిచ్యము చేయుట సంతవము, పరిచ్యమును. ఉపసర్గ వశమున నీధాతువు లీఅయర్థము నిచ్చును. ఈ 2 చాలాకాల మొక వస్తువుతోఁ గూడియుండుట పేర్లు.
స్తుతి - స్తోత్రము; స్తోత్రము - పొగడ్త.

సొబగుడు - చక్కనివాడు.
సొబగు - చక్కదనము, సం.సుభగః.
ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.
ౘక్కనయ్య - 1.సుందరమైనవాడు, 2.మన్మథుడు.

సుభగ - 1.మనోహరురాలు, 2.భాగ్యవతి.
అథ సుభగాసుతః, సౌభాగినేయః -
సౌభాగినేయుఁడు - భాగ్యవతి కొడుకు.
సుభగాయా స్సుతః సుభగాసుతః, 1 సుభగాయా అపత్యం సౌభాగినేయః - భాగ్యవంతురాలి కొడుకు. ఈ 2 భాగ్యవంతురాలి కొడుకు పేర్లు. 
సౌభాగినేయ - భాగ్యవతి కూతురు.

మణి-1.పచ్చరాయి, 2.ముత్తెము, 3.మణికట్టు.
హరిద్వర్ణో మణిః హరిస్మణిః - పచ్చనిమణి. 
మణ్యతే స్తూయతి ఇతి మణిః, ఇ. ప్స. మణి శబ్దే - స్తోత్రము చేయఁబడునది.
మంజీరము - అందె; అందె - అందియ.  
మంజు మనోహరం ఈరయతి ధ్వనతీతి మంజీరః. - మనోహరముగాఁ మ్రోయునది.  
హంసకము - కాలీయందె.

చారువు- 1.బృహస్పతి, 2.విణ.ఒప్పిదమైనది.
బృహతాం దేవానాం వేదమంత్రాణాం వా పతిః బృహస్పతిః, ఇ.పు. - దేవతలును వేదమంత్రములును బృహత్తు లనంబడును, వారలకి నను వానికైనను ప్రభువు.
బృహస్పతి - 1.సురగురువు, 2.గురుడు.
బృహస్పతివారము - గురువారము, Thursday.
గురుఁడు - గురువు, బృహస్పతి (Jupiter).
గురువు - 1.ఉపాధ్యాయుడు, 2.కులము పెద్ద, 3.తండ్రి, 4.తండ్రితో బుట్టినవాడు, 5.తాత, 6.అన్న, 7.మామ, 8.మేనమామ, 9.రాజు, 10.కాపాడువాడు, చూ.గురుఁడు.    

చరిత - 1.నడవడి, రూ.చరితము, చరిత్రము.
చరితము - చరిత.

పదన్యాసక్రీడా - పరిచయ మివా(ఆ)రబ్దు మనసః
స్ఖలన స్తే ఖేలం - భువనకలహంసా న జహతి|
అతస్తేషాం శిక్షాం - సుభగమణిమఞ్జీర రణిత 
చ్ఛతా దాచక్షాణం - చరణకమలం చారు చరితే! - 91శ్లో

తా. చక్కని నడువడిగల సుభగ - 1.మనోహరురాలు, 2.సౌభాగ్యవతి.! నీ యింట నున్న హంసలు అడుగువేయ నేర్చుకొన తలంపు గలిగి తడబడుచు నిలుకడగ మ్రోతలనే నెపంతో, నా కలహంస-1.కాదంబము, ధూమ్రవర్ణముగల రెక్కలు గల హంస, రాజహంస, 2.హంస.)లకు ఖేలనశిక్షను(ఖేల - ఆట) నేర్పుతున్నట్లుగా ఉన్నది. (పెంపుడు హంసలు స్వాభికముగా పెంచువారి వెంట పోవును.) - సౌందర్యలహరి  

తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ|
మాలినీ హంసినీ మాతా మలయాలచవాసినీ.

కంకటీకుఁడు - ముక్కంటి, శివుడు.
కంకటి - మంచము, రూ.కంగటి, సం.ఖట్టికా, ఖట్వా.  

ఖట్టిక - 1.గద్దియ, సింహాసనము, 2.మంచము.    
గద్దె - గద్దియ, సోదె.
గద్యానము - గద్దియ.
గద్దియ - 1.సింహాసనము, 2.పీఠము, 3.పువ్వులలోని దుద్దు, రూ.గద్దె, సం.ఖట్టికా, 4.బంగారునాణెము, వరహా, రూ.గద్దె, సం.గద్యాణమ్.

మఞ్చ పర్యఙ్కాః ఖట్వయా సమాః,
మంచము -
మఞ్చ్యతే సరో (అ)నేన మఞ్చః, మచి ధారణోచ్ఛ్రాయపూజనేషు. - దీనిచేత నరుఁడు ధరింపఁబడును.
పర్యంకము - మంచము.
పరితః అఙ్క్యతే ఉపభోగాది నా లక్ష్యత ఇతి పర్యంకః, పల్యంకశ్చ, అకి లక్షణే. - దీనియందు ఉపభోగాదులచేత నరుఁడు కానఁబడును. 
పలకము - చిన్నమంచము, కుక్కి, సం.పల్యంకః.
పల్యంకము - 1.పాలకి, 2.మంచము, 3.యతులు లోనగువారి యానము.
పల్యంకిక - పాలకి, పల్లకి. 
ఖట్వ - మంచము.
ఖట్యతే కాంక్ష్యతే ఖట్వా ఖట కాంక్షాయాం. - కాంక్షింపఁబడునది. ఈ 4 మంచము పేర్లు.     

పట్టికామంచము - పట్టెమంచము.
పట్టి - పంచమీ విభక్తిప్రత్యయము, వి.బిడ్ద.

ౘట్టము - 1.న్యాయశాస్త్రము, 2.శాసనము, 3.మంచము లోనగువాని పట్టెలచేరిక, వి.పునుగు చట్టము.
పట్టె - 1.డాలు, 2.మంచముపట్టె, దున్నినచాలు, సం.పట్టికా. 

పట్టెడ - 1.నవారు, 2.పశ్వాదుల మెడకు కట్టు పట్టె, 2.కంసాలివాని దాగలి.
నవారు - మంచమున కల్లు నూలు పట్టెడ. 

ఖట్వాంగపాణి - ముక్కంటి, శివుడు, వ్యు.ఖట్వాంగము చేతియందు గలవాడు.
ఖట్వాంగము - 1.శివుని ఆయుధములలో ఒకటి, 2.మంచపుకోడు.
కాలు - 1.పాదము, 2.పాతిక భాగము, 3.మంచపు కోడు, క్రి. మండు. కాలికి జుట్టుకున్న పాము కరవక మానునా?
ఖురము - 1.గొరిజ, 2.మంగలి కత్తి, 3.మంచపు కోడు.
ఖురతి భూతాని హంతీతి ఖురః, ఖుర విలేఖనే. - భూతములను సంహరించునది.
గొరిజ - పసువు కాలిగిట్ట, సం. ఖురః.

బొగడ - 1.చూచుకము, 2.మంచపుకోడు, 3.శిఖరము, 4.గందపట్టెమీది గుబ్బ, 5.చెరువుకట్టలో పడిన చిన్న బెజ్జము.

ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింసచేయువాడు.
ద్రుణినః ద్రుహతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులకు హింసచేయువాఁడు, ద్రుహ జిఘాం సాయాం.
దుగినుఁడు - ద్రుహిణుఁడు, బ్రహ్మ, సం.దుహిణః.

గత స్తే మంచత్వం - ద్రుహిణహరిరుద్రేశ్వవర భృతః
శివ స్స్వచ్ఛచ్ఛాయా - కపటఘటితప్రచ్ఛద పటః,
త్వదీయానాం భాసాం - ప్రతిఫలనరాగారుణ తయా
శరీరీ శృంగారో - రస ఇవ దృశాం దోగ్ది కుతుకమ్| - 92శ్లో

తా. గౌరీ! అధికారము వహించిన బ్రహ్మ విష్ణు  (హరి)రుద్రేశ్వరులు(రుద్రుఁడు - శివుడు నీకు మంచముగా నయిరి. శివుడు తన తెల్లని కాంతిచే నీకు కప్పుడు పటము - 1.వస్త్రము, 2.చిత్తరువు వ్రాయు వస్త్రాదికము.) వస్త్రమై నీ కాంతుల ప్రతిబింబముచే నెఱ్ఱనైన శరీరము కలవాడై శృంగారరసము మూర్తీభవించినట్లు తోచుచున్నది. – సౌందర్యలహరి

ఆముకొను నొరవుల మెరయు నతివకు వృషభరాశి.....

ఉక్షము - ఎద్దు.
ఉక్షతి రేత స్సించతీతి ఉక్షా. న.పు. ఉక్షసేచనే. - ఆవుల యందు రేతస్సును విడుచునది.
మహోక్షము - ఆబోతు.     

ఉక్షా మహాన్ మహోక్షస్యాత్ -
మహాంశ్చాసా వుక్షా చ మహోక్షః - దొడ్దయెద్దు.

ముడిగిబ్బ - ఆబోతు.
ముడి -
1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము(కలహము - సమరము, వికృ.కయ్యము), విన.1.అఖండము, 2.వికసింపనిది.

గిబ్బరౌతు - శివుడు, వృషభవాహనుడు.
గిబ్బ - 1.అచ్చుటెద్దు, అచ్చువేసి విడిచిన యెద్దు, ఆబోతు, 2.బుడ్దకొట్టని కోడె, 3.ఎద్దు, 4.సమాసోత్తర పరమైనపుడు శ్రేష్ఠ వాచకము, ఉదా. జక్కవ గిబ్బలు మొ.వి.
ఢంకము - అచ్చుపోసిన ఆబోతు.

షణ్డో గోపతి రిట్చరః :
షండము - 1.తామర లోనగువాని సమూహము, 2.ఆబోతు.
సన్యతే ఉత్సృజ్యత ఇతి షండః షణు దానే. - విడువఁబడునది.
గోపతి - 1.ఆబోతు, 2.ఇంద్రుడు, 3.రాజు, 4.శివుడు, 5.సూర్యుడు.
గవా పతివద్గర్భాధానకారిత్వాద్యోగపతిః. ఇ.పు. - ఆవులకు పతివలె గర్భాధానముఁజేయునది.  
ఇషా స్వేచ్ఛయా చరతీతి ఇట్చరః - స్వేచ్ఛ చేతఁ జరించునది. ఈ 3 ఆఁబోతు పేర్లు.   

ౙన్నియ - 1.దేవతాదుల నుద్దేశించి యెత్తియుంచిన వస్తువు, 2.మీదు, 3.వ్రతము.
ౙన్నియవిడుచు - అచ్చుపోసి ఆబోతును విడుచు.

ఉత్సర్గము - 1.దానము, 2.వృషాదులను విచ్చలవిడిగా తిరుగ విడుచుట, 3.సామాన్యవిధి (వ్యతి, అపవాదము-విశేషవిధి), 4.(వ్రతాదుల) సమాప్తి, రూ.ఉత్సర్జనము.
దానము - 1.ఈవి, 2.ఏనుగు దవుడల నుండి కారు మదము, 3.చతురపాయములలో ఒకటి, 4.ఛేదనము.
ఈవి - 1.దానము, వితరణము, 2.వరము, 3.బహుమానము, రూ.ఈగి.
వితరణము - ఈవి.
వరము - కోరిక, వరించుట. కోరిక - ఇచ్ఛ, విణ.అభీష్టము.
వరణము - 1.వరించుట, 2.చుట్టుకొనుట, ప్రహరి (గృహ) ఎన్నిక ఎంచుట, ఎన్నుకొనుట (Selection).
బహుమానము - (గృహ) కానుక, ప్రతి ఫలము (Reward).
ఏనుఁగుపాఁడి - అమితమైన ఈవి.

కృంతనము - ఛేదనము, కత్తిరించుట.
ఛేదనము -
ఛేదించుట, (వ్యవ.) వేళ్ళను, కొమ్మలను, ఆకులను కత్తిరించుట, (Prunning).
అవఛేదము - 1.ఛేదనము, 2.మితిఏర్పరచుట, 3.హద్దు(హద్దు - మేర, ఆజ్ఞ), 4.వేరుపాటు, 5.నిర్ణయించుట, 6.(గణి.) ఒక వస్తువును ఒక సమతలమును ఉపయోగించి అడ్డుగా కోయుటవలన లభించు సమతల ఖండము.

దాతృత్వం ప్రియన కృత్వం ధీరత్వముచిత జ్ఞతా|
అభ్యాసేన నలభ్యంతే చత్వార స్సహజా గుణాః||
తా.
ఈవి యిచ్చుట, విన నింపుగాఁ బలుకుట, ధైర్యము కలిగి యుండుట, మంచిచెడుగులెఱిఁగి తెలివిగానుండుట, యీ నాలుగు తనతోఁ గూడఁ బుట్టునవియే కాని నేర్చుకొనుటచే గలుగవు. - నీతిశాస్త్రము  

పాలిచ్చే గోవులకు పసుపు కుంకం(కుంకుమ), పనిచేసే బసవడికి పత్రి పుష్పం...

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు.

భన్దత ఇతి భద్రః, భది కల్యాణే. - కల్యాణ స్వరూపమైనది.

బలీవర్థము - ఎద్దు.
వలీః కంఠప్రదేశేస్త్ర వృణుతే స్వీకరోతీతి బలీవర్దః. వృఞ్ వరణే. వబయోరభేదః - కంఠమందు వళులు గలది.

ఋషభధ్వజుఁడు - శివుడు. 
వృషో ధ్వజో యస్య సః వృషభధ్వజః - వృషభము ధ్వజముగా గలవాఁడు.
ఋషభము -1.ఎద్దు, 2.మదించిన ఏనుగు, 3.సప్తస్వరములలో ఒకటి.
ఋష తిగాం ప్రతి గచ్ఛతీతి ఋషభః, వృషశ్చ. వృషు సేచనే. - రేతస్సును విడుచునది గనుక వృషభము, వృషము.          
ఆబోతుసొరము(స్వరము) - వీణయందును, కంఠము నందును బుట్టు ఒక స్వరము, సప్తస్వరములలో రెండవది (రి), ఋషభము.

వృషభధ్వజ విజ్ఞాన భావనానై నమో నమః|

వృషభము - 1.ఎద్దు, బసవన్న, 2.వృషభరాశి.
ఆలఱేఁడు -
ఎద్దు, ఆబోతు, బసవడు.
బసవఁడు - వృషభము.
బసివి - శివునకు పరిచర్య చేయుటకై చిన్నతనమునందే యర్పింపబడిన స్త్రీ, సం.పశుపీ.   

ఆఁబోతురౌతు - శివుడు, వ్యు.అబోతు నెక్కువాడు. 
ఆఁబోతు - (ఆవు+పోతు), 1.ఎద్దు, 2.అచ్చుపోసి విడిచిన ఎద్దు, బసవడు.

శివ ! తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ! మమగుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే
సకల భువన బంధో ! సచ్చిదానంద సింధో !
సదయ ! హృదయ గేహే సర్వదా సంవసత్వమ్. - 84శ్లో
తా.
సమస్త భువనాలకూ బంధువైనవాడా ! సచ్చిదానంద సాగరా ! దయాహృదయా ! గౌరీసమేతుడవగు భవుఁడు - శివుడు నిన్ను సేవించడానికి - నా బుద్ధిరూప కన్యను నీకు సమర్పించు చున్నాను. నువ్వు నా హృదయ గేహము - గృహము, ఇల్లు.)సదనంలో సదా వసించెదవు గాక ! - శివానందలహరి

వృషాహి వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|
వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్శ్రుతిసాగరః||

ధవళము - ఆబోతు విణ. 1.తెల్లనిది 2.చక్కనిది.
తెలుపు - 1.ఎరింగించు 2.మేలుకొలుపు 3.తేర్చు వై.వి.1.ధావళ్యము 2.పరిశుద్ధి (purity). 

ధవళ - ఆవు, వ్యు.పరిశుద్ధమైనది. 
ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

పాలిచ్చే గోవులకు పసుపు కుంకం(కుంకుమ), పనిచేసే బసవడికి పత్రి పుష్పం...

గిబ్బరౌతు - శివుడు, వృషభవాహనుడు.
గిబ్బ - 1.అచ్చుటెద్దు, అచ్చువేసి విడిచిన యెద్దు, ఆబోతు, 2.బుడ్దకొట్టని కోడె, 3.ఎద్దు, 4.సమాసోత్తర పరమైనపుడు శ్రేష్ఠ వాచకము, ఉదా. జక్కవ గిబ్బలు మొ.వి.
ఢంకము - అచ్చుపోసిన ఆబోతు. 

ఎద్దు - వృషము, (బహు, ఎడ్లు).
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.
ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము. (Property)

ధర్మము - ధర్మము నుండి తొలగనిది.
ధర్మి -
ధర్మము గలది.
దమ్మము - ధర్మము, సం.ధర్మః.

ధర్మస్తు తద్విధిః :
ధరతి లోకానితి ధర్మః - లోకములను ధరించునది.
ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేఁ బూనఁబడునది. ఈ ఒకటి వేదవిహితమైన కర్మ పేరు.

ధర్ముఁడు - 1.యముడు, 2.సోమయాజి.
దమ్మఁడు - 1.ధర్ముడు, 2.కపటము లేనివాడు, సం.ధార్మికః.
ధార్మికుఁడు - 1.పుణ్యాత్ముడు, 2.విలుకాడు. 
సోమాని - సోమయాజి, సోమయాగము చేసినవాడు, సం.సోమయాజీ.
సోమసీథి - 1.సోమపానము చేయువాడు, 2.సోమయాజి, యజ్ఞము చేసినవాడు.
గేస్తు - 1.ఇంటి యజమాని, 2.సోమయాజి, 3.భర్త, సం.గృహస్థః. సోమిదమ్మ - సోమయాజి భార్య, సోమిసాని.

గణిల్లు - ఎద్దు రంకె వేయుధ్వని.
ఱంకె -
1.కేక, 2.వృషభధ్వని, 3.ధ్వని, రూ.ఱంకియ.
కేక - నెమలికూత.
కేకరించు1 - క్రి. 1.కేకలువేయు, 2.గొంతుక సరిచేసికొనునట్లు ధ్వని చేయు.
కేకరించు2 - క్రి. క్రీగంటచూచు. 
ధ్వని - 1.శబ్దము, చప్పుడు, 2.వ్యంగప్రధానశబ్దము, 3.వ్యంగము, (భౌతి.) శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహింపబడు సంక్షోభము, (Sound). 

కుణిః కచ్ఛః కాన్తలకో నన్దివృక్షః -
తుద్యతే హస్త్యాదిభిరితి తున్నః తుద వ్యథనే. - గజాదులచేఁ బీడింపఁ బడునది.
కుత్సీంబేరమస్యాస్తీతి కుబేరకః - కుత్సితమైన శరీరముగలది.
శాఖాభంగాత్కౌతీతి కుణిః పు. కు శబ్దే. - కొమ్మలు విరుగునప్పుడు మ్రోయునది.
కవ్యతే గజైః కచ్ఛః కష హింసాయాం. - గజములచేఁ బీడింపఁబడునది.
కస్య జలస్య అంతం గచ్ఛంతీతి కాంతాగజాః తైర్లక్యత ఇతి కాంతలకః. లకి ఆస్వాదనే. - జలసమీపమును బొందునవి గనుక కాంతము లనఁగా గజములు; వానిచేత నాస్వాదింపఁ బడునది.

నంది - 1.శివుని వాహనమైన వృషభము, 2.వృషభము.

పుంగవము - వృషభము.
పుంగవుఁడు - (సమాసమున ఉత్తర పదమైనచో) శ్రేష్ఠుడు.

నందివర్ధనము - 1.ఒక జాతి పూలచెట్టు, 2.అమావాస్య లేక పున్నమ.
నన్దయతీతి నన్దీ, నన్దిసమ్జకో వృక్షః నందివృక్షః - సంతోషపెట్టునది గనుక నన్ది; నందియను పేరు గల వృక్షము. 

నంద్యానర్తము - 1.పడమట తక్క, తక్కిన మూడు దిక్కుల వాకిళ్ళు గల రాజగృహము, 2.నందివర్ధన వృక్షము.
అపీతము - 1.త్రాగబడినది, 2.కొంచెము పసుపువన్నె కలది, వి.1.ఇంచుక పసుపువన్నె, 2.పద్మకేశరములు, 3.నందివృక్షము.    

నిమిత్తస్థో నిమిత్తం చ నంది ర్నాందికరో హరిః,
నందీశ్వరశ్చ నందీ చ నందనో సంధివర్థనః|
- 76శ్లో

అనడ్వాహము - ఎద్దు, వృషభరాశి.
అనో వహతీ త్యనడ్వాన్. హ.పు. - బండిని వహించునది.
ఎద్దు - వృషము, (బహు. ఎడ్లు).
ఎళ్లు - ఎడ్లు, ఎద్దులు.
వృషము - 1.ఎద్దు, 2.ధర్మము.

ధర్మము - 1.పుణ్యము, 2.న్యాయము, రూ.ధర్మువు, 2.సామ్యము, 3.స్వభావము, 4.ఆచారము, 5.అహింస, 6.వేదోక్తవిధి, 7.విల్లు, (గణి) గుణము. (Property)

వృషభి - 1.స్వైరిణి, 2.విధవ.
స్వైరిణి - రంకుటాలు, జారిణి.
స్వైరగమనమస్యా అస్తీతిస్వైరిణీ - యథేచ్ఛ గమనముగలది.

స్వైరి - స్వతంత్రుడు, రూ.స్వైరుడు.
మన్ద స్వచ్ఛన్దయోః స్వైరః -
స్వైరశబ్దము అలసునికిని, స్వతంత్రునికిని పేరు. స్వేన ఈర్తే గచ్చతీతిః స్వైరః ఈర గతౌ. - స్వేచ్ఛచేతఁ జరించువాఁడు. 

రాశి - 1.రాసి, 2.నిక్కయము, సమూహము, 3.మేషాది రాసులు (అర్థ.) పరిమానము, మొత్తము (గణి.) సంభావించుత కనువైన విషయము, వస్తు సముదాయము (Quantity).
రాసులు - ఇవి పండ్రెండు, మేషము, వృషభము, మిథునము, కర్కటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము.  
సమూహము - గుంపు, (గణి.) రాసుల సమూహము, (Group).

దీర్ఘశృంగ మనడ్వాహం నిర్లజ్జా విధవాస్త్రి యామ్|
దుష్ట మక్షరసంయుక్త దూరతః పరివర్జయేత్ ||

తా. నిడుపు(దీర్ఘము - నిడుద)కొమ్ములగల యెద్దును, లజ్జ - సిగ్గు)సిగ్గులేని విధవ స్త్రీని, చదువుగల(దుర్జనుఁడు - దుష్టుడు)దుష్టుని దూరముగా పరిత్యజింపవలయును. - నీతిశాస్త్రము  

ఎద్దుమొద్దు - 1.మూఢుఢు, 2.అరసికుడు.
మూఢుఁడు -
1.మొండి, 2.మోటు, 3.మొద్దు, తెలివిలేనివాడు.
మొండి - 1.చేతులు కాళ్ళులేనివాడు, మూర్ఖుడు, మూర్ఖురాలు, 3.మొక్కపోయినది, 4.వట్టిది, సం.ముండమ్.
మొఱటు - మోటు; మోటు - 1.మొద్దు, 2.తట్టువ గుఱ్ఱము, 3.పందికెదుట మనుష్యాకారముగ నిల్చిన కపతలక్ష్యము, విణ.మూర్ఖుడు, సం.మూఢః.
మొద్దు - మ్రానిమోడు, విణ.1.మూఢుడు, 2.వాడిలేనిది, సం.ముగ్ధః.
మొఱకు - మూర్ఖుడు, సం.మూర్ఖః.

 

తొలకరివానకారు - (వ్యవ.) ముంగటి వానకారు, జూన్ June జూలై July నెలలు, పడమటి వర్షములు పడు మొదటి భాగము, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి కార్తెలు, గ్రీష్మర్తువు (Early monsoon time).
కారు1 - 1.జ్యేష్ఠమాసము మొదలు నాలుగేసి నెలల కాలము, 2.వర్షకాలము, 3.వయసు.    
కారు2 - 1.ఉప్పు, 2.అడవి, 3.నలుపు(నీలిమ - నలుపు), 4.నస, 5.ముదిమి.
కారులు (విత్తుటకు) - (వ్యవ.) వర్షపాత భేదములను ఇతర వాతావరణ పరిస్థితుల భేదములను బట్టి (తెలుగు) వ్యవసాయ దారులు ఆయా పైరులను విత్తి పెంచుకాలము. సంవత్సరమును పునాస (ఎండ)కారు, తొలకరి(ముంగటి వాన కారు), నడివాన కారు, వెనుకటి వానకారు, శీతకారు, పయరకారు అను ఆరుకారులుగా విభజింప వచ్చును (Sowing seasons).

తొలకరి - చైత్ర వైశాఖములందలి వాన, వర్షర్తువు, రూ.తొల్కరి.
తొల్కరి - తొలుకరి.
తొలుకారు - మొదటికారు, వర్షర్తువు ముక్కారు పంటలలో మొదటికారు పంట.
తొలుకు - క్రి. కురియు. కురియు - క్రి.1.గుప్పించు, 2.వర్షించు.
గుప్పించు(ౘ) - క్రి. 1.(అధికముగా)ఇచ్చు, 2.బాణాదులను(అధికముగా) ప్రయోగించు, 3.కురియు.
తొలకరించు - క్రి.వానకురియు, పుట్టు, రూ.తొల్కరించు.   
పుట్టు - క్రి. సంభవించు, జన్మించు.
ఉదయించు - క్రి. 1.పుట్టు, కలుగు, 2.సూర్యాదులు పొడుచు.

తొలకరిసూడు - హంస, వ్యు.వర్షాకాల విరోధి.
హంస - 1.అంచ, 2.యోగి, 3.పరమాత్మ, 4.తెల్లగుఱ్ఱము, 5.శరీర వాయు విశేషము, రూ.హంసము.

కార్తె - సూర్యుడుండు నక్షత్రము, ఉదా.చిత్తకార్తె, స్వాతికార్తె మొ.వి. సం.క్రాంతిః.

5. మృగశిర - ఐదవ నక్షత్రము. మృగము తలవలె 3 నక్షత్రముండును.
ఆకృత్యా మృగస్యేవ శీర్షం యస్య తత్ మృగశీర్షం, మృగశిరశ్చ - ఆకృతిచేత మృగము యొక్క శిరము వంటి శిరము గలిగినది.

మృగము - జింక, అడవియందు తిరిగెడు ఏనుగు, మృగశీర్ష నక్షత్రము.  

మృగశిర - అయిదవ నక్షత్రము. 5th star.
మీసర - మృగశిర (మీసరము - శ్రేష్ఠము, మేలైనది)  

జింకతలచుక్క - మృగశీర్షము. 
(ౙ)జాబిలిరిక్క -  మృగశీర్ష నక్షత్రము.  

ఇల్వలా స్తచ్చిరోదేశే తారకా నివసన్తియాః :
తస్య మృగశీర్షస్య శిరోదేశే యాస్తారకా నివసంతితాః ఇల్వలా ఇత్యుచ్యంతే - మృగశీర్ష నక్షత్రమునకు మీఁద నున్న నక్షత్రములు ఇల్వలా లనబడును.
ఇలంతి గఛ్చంచి నక్షత్రాణాం మూర్థ్నీతి ఇల్వలాః ఇలప్రేరణే - నక్షత్రముల మీఁద సంచరించునవి.
శివబాణేన ఇల్యంతే ప్రేర్యంతే ఇల్వలాః - శివుని బాణముచేత ప్రేరేపింపఁ బడునవి. ఇన్వకాః - మృగశీర్షపై నుండు చిన్న చుక్కలకు పేర్లు.

వరాంగము - 1.ఏనుగు, 2.తల.
ఒగ్గము -
 అవపాతము, ఏనుగులను పట్టుటకై త్రవ్వబడిన గోయి.
ఓదము -
ఏనుగును బట్టుటకై త్రవ్విన పల్లము (గుంట) అవపాతము.
అవపాతము - 1.క్రిందికి పడుట, 2.పడత్రోయుట, 3.దిగుట, 4.పక్షి తటాలునవ్రాలుట, 5.గోయి, 6.ఏనుగును పట్టుటకై త్రవ్వబడిన పల్లము ఓదము, (భౌతి.) క్రిందికి వంగుట, ఒక ప్రదేశములోని సమస్ఫుటము నకును అయస్కాంత సూచి అక్షమునకును మధ్యగల కోణము.  

భేరుండము - భేరుండము, గజములను తన్నుకొని పోవు పక్షి.
భేరుండము - ఒక పెద్ద పక్షి.
గండభేరుండము - ఒకానొక పెద్ద పక్షి అని చెప్పెదరు, కాని ప్రయోగము లందు మృగపర్యాయముగ కానవచ్చు చున్నది.

జింకతలచుక్కనెల - మార్గశిరము.
మారశీర్షము - తొమ్మిదవ నెల.  
హైమనము - మార్గశీర్షము(శీర్షము - తల) విణ.1.మంచుచే కలిగినది  2.బంగారుచే కలిగినది.
హైమము - వేకువను మంచుచే కలిగిన జలము, విణ.బంగారుచే కలిగినది.

హేమంతము - ఒక ఋతువు, మంచుకాలము, మార్గశిర, పుష్య మాసములు, హేమంతఋతువు.
మీసర - మృగశీర్ష (మీసరము -శ్రేష్ఠము, మేలైనది)

సహో బలం సహా మార్గో : సహశ్శబ్దము బలిమికి పేరైనపుడు న. మార్గశీర్షమాసమునకు పేరైనపుడు పు. సహంతే అనేన, అస్మిన్నితి చ సహః, సహాశ్చ. స. షహ మర్షణే. - దీనిచేత, దీనియందును ఓర్తురు(ఓర్చుట) గనుక సహస్సు. ' సహో జ్యోతిషి హేమంతే నా హాసవతి వాచ్యవ ' దితి శేషః.

పొంగటినెల - మార్గశీర్ష మాసము(పొంగలి + నెల), పొంగలి పండుగ.
పొంగటి పండుగ - మకర సంక్రాంతి. సంక్రాంతి - మేషాది సంక్రమణము. 
పొంగలి - 1.పాలు చేర్చి పొంగించునట్టి అన్నము, 2.పొంగలి పండుగ.
పొంగలి - పక్షుల ఆహారము.

మార్గశిరంబునం దర్యమనామ వ్యవహృతుండై కశ్యపుండు తార్క్ష్మ్యండు ఋతసేనుం డూర్వశి విద్యుచ్ఛత్రుండు మహాశంఖుం డనెడు ననుచరులం గూడి చరించుచుండుః; మార్గశీర్ష మాసంలో సూర్యుడు అర్యముడన్న పేరుతో అభిహితుడౌతాడు. కశ్యపుడు, తార్క్ష్యుడు(తార్ క్ష్యుడు), ఋతసేనుడు, ఊర్వశి - ఒకానొక అప్సరస. , విద్యుచ్ఛత్రువు, మహాశంఖుడు అనేవారు అనుచరులు కాగా కాలనిర్వహణ కార్యక్రమం చేస్తుంటాడు.

అర్యముఁడు - 1.సూర్యుడు Sun, 2.పితృదేవతలలో ఒకడు.
ఇయర్తి గచ్ఛతీతి అర్యమా, న. పు. ఋగతౌ - గమనయుక్తుఁడు.

సరము - స్వరము, ముకుగాలి, షడ్జాది స్వరము, సం.స్వరః, సం.వి.1.హారము, 2.గమనము.  గమనము - 1.పోవుట, 2.తలపు, 3.ప్రయాణము, 4.పొందుట, 5.రమించుట.
గమ్యతే గమనం; గమశ్చ, గమ్ ఌ గతౌ. - కదలిపోవుట.

సోమో రాజా మృగశీర్షేణ ఆగన్న్ | శివం నక్షత్రం ప్రియమస్య ధామ | ఆప్యాయమానో బహుధా జనేషు | రేతః ప్రజాం యజమానే దధాతు | యత్తై నక్షత్రం మృగశీర్ష మస్తి | ప్రియగ్ం రాజన్ ప్రియతమం ప్రియాణామ్ | తస్మై తే సోమ హవిషా విధేమ | శన్న ఏధి ద్విపదే శం చతుప్పదే ||3||

సోముడు - 1.చంద్రుడు, 2.శివుడు, 3.కుబేరుడు, 4.వాయువు.
సూతే అమృతమితి సోమః, షూఞ్ ప్రాణిప్రసవే - అమృతమును బుట్టించువాఁడు.
సూయత ఇతివా సోమః - ప్రతిపక్షము నందును బుట్టింపఁబడువాఁడు.

సోమవారము - వారములో రెండవ దినము.
ఇందువారము - సోమవారము.

సోమధార - ఆకాశగంగ, పాలపుంత.
ఆకాశగంగ - మిన్నేరు, 1.మందాకిని, 2.పాలవెల్లి (Milky way).
పాలపుంత - ఆకాశములో నక్షత్ర సముదాయము తో కూడి కాంతిమంతముగ కనిపించు మార్గము, ఆకాశగంగ (Milky way).

మందాకినీ వియద్గంగా స్వర్ణదీ సురదీర్ఘికా:
1.మందాకిని - 1.గంగ 2.అరువదేండ్ల స్త్రీ.
మంద మకతి కుటిలం గచ్చతీతి మందాకినీ ఈ-సీ. - మెల్లగా కుటిల గమనముచేఁ బోవునది. అక అగ కుటిలాయాం గతౌ.
2.గంగ - 1.గంగానది, 2.నీరు, (ఈ యర్థము తెలుగున మాత్రమే కలదు), విణ. పూజ్యము (గంగగోవు).
వియతి గంగా వియద్గంగా - ఆకాశమందుండెడి గంగ.
3.స్వర్ణది - వేల్పుటేరు, ఆకాశ గంగ.
స్వః స్వర్గే నదీ స్వర్ణదీ. ఈ-సీ. - స్వర్గ మందుండెడి నది. 
4.సురదీర్ఘిక - గంగ.
సురాణాం దీర్ఘికా సురదీర్ఘికా - సురల యొక్క నడబావి. ఈ నాలుగు ఆకాశగంగ పేర్లు.

ముత్తెరవులాఁడి - ఆకాశ గంగ.    
చారలేరు - ఆకాశ గంగ.
తెలియేఱు - ఆకాశ గంగ.
తెలి - 1.తెల్లనిది 2.నిర్మలము.

సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశగంగ.

ఆకాశధార - ఆకసమునుండి కొండపైకిని అచటినుండి క్రిందికిని ప్రవహించుధార.

మందాకినీ సలిల చందనచర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|   
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై ‘మ’ కార మహితాయ నమశ్శివాయ| - 2

సోమోద్భవ - నర్మదానది.
సోమవంశజేన పురూరవసా భువం ప్రత్యవతారితా సోమోద్భవా - సోమవంశమునఁ బుట్టిన పురూరవుఁ డనురాజుచేత భూమికిఁ దేఁబడినది.

సోమ - 1.శ్రమము, 2.పరాక్రమము, రూ.సోమము, సం.శ్రమః, స్తోమః.
సోమము - పరాక్రమము, సం.వి.1.తిప్పతీగ, 2.జలము, 3.కర్పూరము, 4.సోమరసము.
సోమలత - 1.తిప్పతీగ, 2.సోమరసము తయారుచేయు తీగ.
సోమస్య అంశభూతా వల్లీ సోమవల్లీ - సోమమునకు అవయవమయిన తీఁగె.
సోమా అహ్లాదకారిణీ వల్లీ అస్యా ఇతి సోమవల్లికా. - ఆహ్లాదమును జేయు తీఁగెలుగలది. 

సోము - 1.సుఖము, 2.కోరిక, విణ.ఆసక్తము, సం.1.సుఖము, 2.సమీహ.
సౌక్యము - సుఖము; సౌఖ్యము - సుఖము.
సుఖము - 1.సౌక్యము, 2.స్వర్గము.
సుష్ఠుఖనత్య శుభమితిసుఖం - అశుభమును బోఁగొట్టునది. 
శోభనాని ఖాని ఇంద్రియాణ్యస్మిన్నితిని సుఖం - ఇంద్రియముల నాప్యాయనము చేయునది.
సమీహ - కోరిక.

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు Sun.    

చంద్రుడు - నెల, చందమామ.
నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు - 1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

నెలపాలు - చంద్రకళ.
నెలవీసము -
చంద్రకళ.
నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

నెలమేపరి - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.
రహతి భుత్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః, ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు. 
తలగాము - రాహువు Rahu.

సోపపవుఁడు - రాహువుచే పట్టబడిన వాడు (చంద్రుడు లేక సూర్యుడు).
ఉపప్లవేన ఆకులతయా సహవత్త ఇతి సోపప్లవః - ఉపప్లవముతోఁ గూడినవాఁడు.

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు.
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

ముక్కంటిచెలి - కుబేరుడు. 
కుబేరుఁడు - ఉత్తరదిక్పాలకుడు, ధనదుడు, రావణుని అన్న.
కుత్సితం బేరం శరీరం యస్య సః కుబేరః - బేరమనఁగా శరీరము, కుత్సితమైన శరీరము గలవాఁడు.

సౌమ్యం తు సున్దరే సోమదైవతే,
సౌమ్యశబ్దము ఒప్పెడువానికిని, సోముఁడు దేవతగాఁ గలహ విస్సూక్తాదులకును పేరు.
సోమో దేవతాస్యేతి సౌమ్యం, త్రి. - సోముఁడు దేవతగాఁ గలది గనుక సౌమ్యము.

సౌమనస్యము - 1.సుమనోభావము, 2.తృప్తి.
సౌమ్య - 1.అరువది సంవత్సరములలో నొకటి, 2.కొంచెము సబ్బు ద్రావణములో కలిసిన వెంటనే కొంతసేపు నిలకడగా నుండు నురుగునిచ్చు జలము యొక్క గుణము, 3.మృదుత్వము(Soft).
సౌమ్యగంధ - గులాబిపూవు.

పుష్పాదికములు - (గృహ.) పుష్పముల కొరకు, రమణీయత కొరకు పెంచబడు మొక్కలు (Flowers and plants) ఉదా. గులాబి, క్రోటనులు మొ.

సత్యవాస స్సత్యవచాః శ్రేయసాంపతి రవ్యయః,
సోమజ స్సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః|

ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధర శ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తి ప్రదాన వ్రతామ్|
కన్యాపూజన సుప్రసన్నహృదయాం కాంచీలస న్మధ్యమాం
శీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే|

మృగవాహనుఁడు - జింకరౌతు(వాయువు).
జింకరౌతు - వాయువు.

వాతం అయతే వాతాయుః. ఉ. పు. అయ గతౌ. - వాయువును బొందునది.  

వాతప్రమీ ర్వాతమృగః -
వాతం ప్రమిమీతే అభిముఖ్యేన ప్రతిపద్యతే వాతప్రమీః, ఈ. పు. మాఙ్ మానే వర్తనేచ. - వాయువున కభిముఖముగాఁ బోవునది.
అయం స్త్రీలింగే (అ)పి. లక్ష్మీశబ్దవద్రూపం.
వాతం మృగయతీతి వాత మృగః మృగ అన్వేషణే. - వాయువును వెదకునది. ఈ 2 గాలి కెదురుగా నడుచు మృగముపేర్లు.

వాయువు - (భూగో.) గాలి యొక్క చలనము, సం.వి.గాలి.
వాతీతి వాయుః, ఉ-పు. వా గతిగంధనయోః - విసిరెడువాఁడు.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
గాలి1 - 1.వాయువు, 2.దయ్యము, (ఈమెకు గాలి సోకినది), 3.మృగముల దేహవాసన, పసి, 4.ఒక విధమైన పశువ్యాధి.
దయ్యము - 1.దైవము, దేవుడు, 2.దేవత, 3.విధి, 4.పిశాచము, సం.దైవమ్.
పసి - 1.పశ్వాదుల మీదగాలి, 2.పువ్వుల మీదిగాలి, లేత, వై.వి. గోగణము, గోవులు, సం.పసుః.
గాలి2 - 1.నింద, 2.శాపము. 
నింద - దూరు, అపదూరు.
నిందనం నిందా, ణిదికుత్సాయాం - నిందించుట నింద.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.

వా వ్య వ కా శ ము లు - (వ్యవ.) గాలితో నిండియుండు స్థలములు, (Air-spaces).

కరువలి - గాలి.
కరువలిపట్టి - (గాలిచూలి), 1.భీముడు, 2.ఆంజనేయుడు.
కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని.

గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని.

                                               

గ్లౌ - 1.చంద్రుడు, 2.కర్పూరము.
ప్రతిమాసం గ్లాయతిక్షయతీతిగ్లౌం, ఔ. పు. గ్లేమ్లేహర్షక్షయే - ప్రతిమాసము  క్షయించువాఁడు.    

చంద్రుడు - నెల, చందమామ.
నెల - 1.మాసము, 2.చంద్రుడు, 3.పున్నమ, 4.స్థానము, 5.కర్పూరము.
మాసము - నెల (చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గునము అని 12 తెలుగు మాసములు), మాషపరిమాణము.
మాషము - 1.మినుములు, 2.అయిదు గురిగింజలయెత్తు.
మినుము - మినుపపైరు, మాషము.

నెలచూలి - బుధుడు, నెలపట్టి, వ్యు.చంద్రుని కుమారుడు.
బుధుఁడు -
1.ఒక గ్రహము (Mercury), 2.విద్వాంసుడు, 3.వేలుపు.

నెలకూన - 1.బాలచంద్రుడు, 2.నఖిక్షతము.
నెలవంక -
బాలచంద్రుడు.

అథ కర్పూర మస్త్రియామ్,
ఘనసార శ్చన్ద్రసంజ్ఞ స్సితాభ్రో హిమవాలుకా,
కర్పూరము - ఘనసారము, కప్పురము.
కల్పతే సుఖాయ కర్పూరం, అ. ప్న. కృపూసామర్థ్యే. - సుఖము కలుగ చేయుటకొఱకు సమర్థమైనది.
ఘనరసము - 1.నీరు, 2.కర్పూరము, 3.చల్ల, 4.చెట్టుబంక.  
ఘనసారము - 1.కర్పూరము, 2.నీరు, 3.పాదరసభేదము.
శీతలత్వేన ఘనతుల్యసారత్వాద్ఘనసారః - శీతలమౌటచేత ఘనము వంటి సారము గలది.
చంద్రము - 1.కర్పూరము, 2.నీరు, 3.బంగారు.
చంద్రేణ కర్పూరేణ మీయతే ఉపమీయత ఇతి చంద్రమాః, స. పు. మాఞ్ మానే. - ఛంద్ర మనఁగా కర్పూరము. దానితోఁ బోల్చఁబడువాఁడు.
సితాభము - కర్పూరము, రూ. సితాభ్రము.  
ఆహ్లాదకత్యేన చంద్రస్య సంజ్ఞాయస్య సః చంద్రసంజ్ఞః. - ఆహ్లాదకర మౌటచేత చంద్రునియొక్క పేర్లు తనకు పేర్లుగాఁ గలది.
ౘలియిసుక - హిమవాలుక, కర్పూరము.    
హిమవాలుక - కప్పురము, కర్పూరము.
వాలుకా సదృశత్వాద్వాలుకా, హిమా చ సా వాలుకా చ హిమవాలుకా. - మంచువలెఁ జల్లనై యుసుక వంటి యాకారము గలది. ఈ 4 కర్పూరము పేర్లు

జైవాతృకము - 1.కర్పూరము, 2.కందకము, 3.ఇనుపగద.    
కందకము - అగడ్త; అగడ్త - అగడిత.
అగదిత - కోట చుట్టుత్రవ్వబడిన కందకము, రూ.అగడత, అగడ్త.

శీర్షము - తల, (గణి.) భూమి కెదురుగా నుండు కోణబిందువు (Vertex).
శీర్షసంబంధము - (జం.) తలకు సంబంధించినది.

ఉత్తమాంగము - తల.
ఉత్తమం చ తత్ అంగం ఉత్తమాంగం. ఉత్తమమైన అంగము.
శిరము - 1.తల, 2.శిఖరము, 3.సేవాగ్రము, రూ.శిరసు, శిరస్సు.
తల - 1.చోటు, 2.రంగము, 3.పక్షము, సం.స్థలము, తలమ్. వి.1.శిరస్సు, 2.శిరోజము, 3.కొన, 4.పూనిక, 5.ఎత్తు, 6.ముందుభాగము, 7.మొత్తము, 8.ఎడ, 9.సమయము, విణ.మొదలు.  
శిఖరము - 1.కొండకొన, 2.చెట్టు కొన, 3.కొన.

సిరమము - శిర, తల, సం.శిరః.
శిర -
1.నరము(నరము - నాడి), ఈనె.
ఈన - ఆకులలోని నరము, చీపురుపుల్ల, ర్రొ.ఈనియ, ఈనె.
సిర - 1.నాడి, 2.ఈనె (జం.) శరీరమునుండి గుండెకు రక్తము తీసికొనిపోవు రక్తనాళము. (Vein)

తలగాము - రాహువు Rahu.
రాహువు - ఒక ఛాయాగ్రహము, దలగాము.

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్, సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్|
షణ్ణామ్రసానాం లవణం ప్రధానం, భవేన్నదీనా ముదకం ప్రధానమ్||
తా.
దేహమున కంతటికిని శిరస్సు ప్రధానము, ఇంద్రియముల కన్నింటికిని(నయనము - 1.కన్ను, 2.పొందించుట.)కన్నులు ప్రధానము, రసముల కన్నిటికిని లవణము ప్రధానము, నదులకంతటికిని ఉదకము ప్రధానమని తెలియవలెను. – నీతిశాస్త్రము

మూర్ధాభిషిక్తుడు - 1.క్షత్రియుడు, 2.చక్రవర్తి (శిరస్సునం దభిషేకము చేయబడినవాడు).
మూర్ధము - తల. 
మూర్ఛత్యున్నతో భవతిమూర్ధా, న. పు. మూర్ఛామోహ సముచ్ఛ్రాయయోః. - ఉన్నతమైనది.

శీర్షోన్నత - (భూమి.) భూమినుండి శీర్షబిందువు యొక్క రూపము, (Altitude).

అరాళము - వంకరైనది, వి.1.మదపుటేనుగు, 2.మ ద్ది జి గు రు, 3.ఒకరకపు అభినయ హస్తము.
అర్యతే ప్రీత్యా అరాళః, ఋ గతౌ ప్రీతితోఁ - గూడియుండునది, పా. రాతి ప్రీతిం రాళః ప్రీతి నిచ్చునది.
అరాః వేష్టనాని సంత్యస్యే త్యరాళం - చుట్లు గలది. 

హాసము - నవ్వు (ఆరు విధములు:- స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, అపహసితము, అతిహసితము).
మందస్మితము - చిరునగవు. 
స మనాక్ స్మితమ్,
స్మితము - 1.అధరమందు మాత్రము ప్రకాశించుచిరునవ్వు, 2.లేతనవ్వు, రూ.స్మితి.
స హాసః మనాక్ ఈషచ్ఛేత్ స్మిత మిత్యుర్యతే. - ఆ నవ్వు అల్పమైనచో స్మిత మనంబడును.
స్యీయతే స్మితం, స్మిఙ్ ఈషద్దసనే. - ఇంచుకంత నవ్వుట స్మితము, కపోల వికాసమాత్రము గలది స్మితము. (పాశ్రుశరీరం కంపం అతిహసితం - బాష్పశరీరకంపములతోఁ గూడినది అతిహసిత మనంబడును.) చిఱునగవు పేరు.

అమావాస్య - (భూగో.) చంద్రుడు తన మార్గములో సూర్యునికి భూమికిని ంఅధ్య వచ్చినపుడు చంద్రునిపై సూర్యుని వెలుగుపడిన భాగము కనిపించని దినము. కృష్ణపక్షమున కడపటిదినము, వికృ.అమవస, అమాస.
అమావాస్యా త్వమావస్యా దర్శ స్సూర్యేషు సంగమః,
అమవస - చంద్రుడు ప్రకాశింపని దినము, రూ.అమాస, సం.అమావాస్యా.
అమాశబ్దస్సహార్థే అవ్యయం అమా సహ తిష్ఠతః - రవిచంద్రావస్యామిత్య మావాస్యా. అమావాస్యా చ, వస నివాసే. - దీనియందు సూర్యచంద్రులు కూడుకొనియుందురు.
దర్శము - 1.అమావాస్య, 2.చూపు.
దృశ్యతే సూర్యచంద్రావత్రేతి దర్శః, దృశిర్ ప్రేక్షణే - దీనియందు సూర్యచంద్రులు కూడుకొని యగపడుదురు.
సూర్యేంద్వోః సంగమః మేళనమ్రత సూర్యేందు సంగమః - దీనియందు సూర్యచంద్రులకు సంగమము కలదు గనుక సూర్యేందు సంగమము. 4 అమావాస్య పేర్లు.

దర్శనము - 1.చూపు, 2.కన్ను, 3.అద్దము, 4.తెలివి, 5.శాస్త్రము.

దరిసెనము - 1.దర్శనము, 2.పెద్దల చూడకొనిపోవు కానుక, సం.దర్శనము.
దరిసించు - 1.దర్శించు, చూచు, 2.కానుక యిచ్చు.

శిరీషస్తు కపీతనః భణ్ణిలో (అ)పి,
శిరీషము - దరిశెనము.
శీర్యతే సౌకుమార్యా చ్ఛిరీషః, శృ హింసాయాం. - కోమల మౌటచేత వ్రక్కలౌనది. 
కపీన్ తనోతీతి కపీతనః తను విస్తారే. - కపి-కోతి, కోఁతులను విస్తరింప జేయునది. 
భణ్ణతీతి భణ్ణిలః భడి కల్యాణే, పా. భణ్ణిరః - శుభకరమైనది ఈ 3 దరిసెనపుచెట్టు పేర్లు.

భాతి - 1.కాంతి, 2.రీతి.
భాతీతుభా, ఆ. సీ భా దీప్తౌ - ప్రకాశించునది.
భా - 1.సూర్యకిరణము, 2.సూర్యుని వెలుగు.
భాసతేభాః, స.సీ. భాసృ దీప్తౌ - ప్రకాశించునది.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ.ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.

అరాళే కేశేషు - ప్రకృతిసరళా మన్దహసితే
శిరీషాభా చిత్తే - దృషదుపలశోభా కుచతటే
భృశం తన్వీ మధ్యే - పృథు రురసిజారోహ విషయే
జగత్త్రాతుం శంభో - ర్జయతి కరుణా కాచి దరుణా| - 93శ్లో

తా. ఓ హైమవతీ! నీ యొక్క కుంతలముల యందు కుటిలత్వమును, మందహాసము హసితము - పండ్లుకనబడునట్లు నవ్వెడి నవ్వు
నందు మృదుత్వమును, చిత్తమునందు దరిశెనపూవు కాంతియును, వక్షస్థలములయందు విశాలతయును, తనుమధ్య-స్త్రీ, సన్ననినడుము కలది.)యందు విస్తారమును(భృశము-అధికము), అనిర్వాచ్యమగు రక్తిమగల శంభువు - 1.బ్రహ్మ, 2.విష్ణువు, 3.శివుడు, 4.బుద్ధుడు, రూ.శంభుడు.)కరుణ (దేవి) లోకరక్షణ కొఱకు సమర్థమగు చున్నది. - సౌందర్యలహరి

మృగరాజు - సింహము Lion.
మృగాణామధిపః మృగాధిపః - మృగములకు దొర.
మృగాణా మింద్రః శ్రేష్ఠః మృగేంద్రః - మృగములలో శ్రేష్ఠమైనది.    

మహామృగము - ఏనుగు.
ఎక్కుడుమెకము - మహామృగము, ఏనుగు.

మృగము - జింక, అడవియందు తిరిగెడు ఏనుగు, మృగశీర్ష నక్షత్రము.
మృగ్యతే లుబ్ధకైరితి మృగః, మృగ అన్వేషణే. - వేటకాండ్రచే వెదకఁబడునది.

పశవో పి మృగాః : మృగశబ్దము పసులకును, అపిశబ్దమువలన లేళ్ళకును, మృగశీర్ష నక్షత్రమునకును, ఏనుఁగుజాతి విశేషమునకును, మృగణ - వెదకుటకును పేరు. మృగ్యంత ఇతి మృగాః. మృగ అన్వేషణే వెదకఁ బడునవి.   

మృగధూర్తకము - నక్క fox.
మృగేషు దూర్తః మృగధూర్తకః. - మృగముల యందు ధూర్తమైనది.
ధూర్వతి ఉన్మాదేన హిన స్తీతి ధూర్తః. దుర్వీ హింసాయాం. – ఉన్మాదము చేత హింసించునది.

ధూర్తస్తు వఞ్చకః,
ధూర్తుఁడు - 1.జూదరి, 2.మోసకాడు, రూ.ధూర్తుః.
ధూర్వతి హినస్తి కుటుంబాదికమితి ధూర్తః, ధుర్వీ హింసాయాం. - కుటుంబాదికమును జెఱుచువాఁడు.
ధూర్వతి హినస్తీతి ధూర్తః, ధుర్వీ హింసాయాం. - పీడించువాఁడు.
వంచకుఁడు - మోసగాడు.
వఞ్యతీతి వఞ్చకః, వఞ్చు విప్రలంభే. - మోసపుచ్చువాఁడు. ఈ 2 మోసపుచ్చువానిపేర్లు. 

చేట చెవుల మెకము - ఏనుగు.
ఏనుఁగు పాఁడి - అమితమైన ఈవి.
ఏనుఁగు రాకాసి గొంగ - గజాసురవైరి, శివుడు.

దీమము - 1.దీపకము, 2.వేటాడుటకై వేటకాడు పెంచుపక్షి, మృగము, రూ.దీపము.

కౌలేయక స్సారమేయః కుక్కురో మృగదంశకః, శునకో భషక శ్శ్వా స్స్యాత్-
గ్రామమృగము - కుక్క, (గ్రామసింహము).
కుక్క - శునకము, సం.కురుకురః.   
కులే గృహే భవః కౌలేయకః - ఇంట నుండునది.

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణమేలమాను వినరా సుమతీ!

తా. కుక్కను ఎంతమంచి శుభముహూర్త మందు బంగారు సింహాసనమున పట్టము - 1.రాజ్యాభిషేకమందు నొసట కట్టెడు పట్టె, 2.రైతుల కిచ్చు పట్ట(కవులు.)పై కూర్చుండ పెట్టినను తన మునుపటి గుణమును వదలి పెట్టదు.   

సరమా శునీ,
సరమ - శ్రమము, 1.విభీషణునిభార్య, 2.ఆడుకుక్క.
సరతి శ్వానం ప్రతీతి సరమా, సృ గతౌ. మొగకుక్కను గూర్చి పోవునది.
శుని - ఆడుకుక్క.
శునః స్త్రీ శునీ, ఈ. సీ. ఈ 2 ఆఁడుకుక్క పేర్లు.
సారమేయము - కుక్క.
సమాశునీ; తస్యా అపత్యం సారమేయః - సరమ యనఁగా నాఁడుకుక్క దానికిఁబుట్టినది.

మదిఁదన నాసపడ్దయెడ మంచిగుణోన్నతు డెట్టిహీనునిన్
వదలడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుగా
త్రిదిశవిమానమధ్యమునదెచ్చి కృపామతి సారమేయమున్
మొదలనిడండెధర్మజుడుమూఁగి సురావళి చూడ! భాస్కరా.

తా. ధర్మరాజు(ధర్మరాజు - 1.యుధిష్ఠిరుడు, 2.యముడు, 3.బుద్ధదేవుడు.)తన్ననుసరించుచు వచ్చు సారమేయము - కుక్కను దేవతలాశ్చర్య మొందునట్లు దేవతా విమానము(త్రిదశాలయము - స్వర్గమున గూర్చుండబెట్టెను. అట్లే సజ్జనుండు తన్నాశ్రయించినచో హీనులై నను సమయము తప్పకుండా గౌరవించును.        

అవశ్యము - 1.అణపరానిది, లోబడనిది, 2.తప్పనిసరైనది, 3.నిశ్చయముగా, తప్పకుండా.

కుక్కురము - 1.కుక్క, వ్యు.ఎముకలు మొ.ని తెచ్చుకొనునది, 2.మాచిపత్రి.
కోకతే అస్థ్యాదిక మాదత్త ఇతి కుక్కురః, కుక వృక ఆదానే. - ముడుసు (ఎముక)లు మొదలయిన వానిని గొఱుకునది. 

మృగదంశకః - 1.కుక్క, 2.ఎలుగు.
మృగాన్ దశతీతి మృగదంశకః, దంశ దంశనే. - మృగములను గొఱుకునది.

రదనా దశనా దన్తా రదాః -
రదనము - దంతము.
రదీన్తే భక్ష్యా ణ్యేభి రితి రదనాః, రదాశ్చ - రద విలేఖనే, వీనిచేత భక్ష్యములు తునకలుగాఁ జేయఁబడును.
దంశము - 1.అడవియీగ, 2.కాటు, 3.దంతము. 
కాటు - 1.మాడి అడుగంటుట, 2.కరచుట, 3.కరచిన గాయము.
దంశనము - 1.కాటు, 2.కవచము, 3.పల్లు, రూ.దంశనము.
దశతి శరీర మితి దంశనము, దంశ దశనే, పా, దంశనం. - శరీరమును కదసియుండునది.
దంసనము - దంశనము.
దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును. 
పలు - దంతము, విణ.అనేకము, విస్తారము.
కోఱ - పందికోఱ, పాముకోఱ, దంష్ట్ర, సం.ఖరుః. ఈ 4 పుల్లింగములు పండ్లపేర్లు.

కాటు - 1.మాడి అడుగంటుట, 2.కరచుట, 3.కరచిన గాయము.    

కుక్కవెఱ్ఱి - (గృహ.) వెఱ్ఱికుక్క కాటు వల్ల కలిగెడు ఒక రోగము, జలద్వేషము (Hydrophobia).
అలర్కరోగము - (గృహ.) వెఱ్ఱి కుక్క కరచినచో వచ్చు పిచ్చి.
యోగికము - పిచ్చికుక్క.

అలర్కస్తు సయోగితః,
అల్యతే వార్యతే దంశభయా దిత్యలర్కః, అలవారణే. - కఱుచునను భయము వలన నడ్డగింపఁబడునది. ఈ ఒకటి ఔషధ ప్రయోగమువలన వెఱ్ఱిపట్టిన కుక్క పేరు.

భైరవి - 1.పార్వతి, 2.ఒకానొకరాగము.

భైరవుఁడు - 1.శివుడు, 2.శునకము, విణ.భయంకరరసము గలవాడు.
శునకము - కుక్క.
శునతి ఇతస్తతో గచ్ఛతీతి శునకః శునగతౌ. - ఇట్టటుఁ దిరుగునది.
భషకము - శునకము.
భషతీతి భషకః భష భషణే, భషణం శ్వరవః. - మొఱుగునది.

శ్వా విశ్వకద్రుర్మృగయాకుశలః -
విశ్వాన్ మృగాన్ కందయతీతి విశ్వకద్రుః, ఉ. పు. కదిరోదనే. - సకలమైన మృగములను మొఱపెట్టించునది. ఈ ఒకటి వేఁటయందు నేర్పుగల కుక్కపేరు.

వేఁపి - కుక్క.    

కాపంతము - కుక్క మెడకు గట్టెడి కొయ్య.
కొణత - కుక్కకు కట్టెడి కొయ్య, రూ.కొణతము.

మొఱఁగు - 1.1.కుక్కకూత, 2.మోసము, విణ.వంచకుడు, క్రి.పొందు. 

శూనారము - 1.కుక్కపాలు, 2.పాముగ్రుడ్దు.

భైరవము - 1.భయానకరసము, 2.భయము.
భీరోస్సంత్రానకృద్భైరవం, ఞి భీ భయే. - భీరులకు వెఱపుఁబుట్టించునది.
బిభేత్యస్మాదధీర ఇతివా భైరవం - అధీరుఁడు దీనిచేత వెఱపుఁజెందును.

నిషాదుఁడు - 1.బోయవాడు, 2.మాలవాడు.
నిషీదతి పాప మస్మిన్నితి నిషాదః, షద్ ఌ విశరణ గత్యవసాదనేషు. - వీనియందు పాప ముండును.
పావి - పాపి, సం.పాపీ.
పాపమన్యేతి పాపః - పాపముగలవాఁడు. ఈ 4 పరులకు బాధచేయు స్వభావము గలవాని పేర్లు.

పాపము - దుష్కృతము, కలుషము.
పాతి రక్ష్యత స్మాదాత్మానమితి పాపం, పా రక్షణే. - దీనివలన జనము తన్ను రక్షించుకొనును.
పిబతి పాపిష్ఠమితి పాపం, పాపానే. - పాపిష్ఠుని గ్రహించునది.

ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః |
భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే ||

భా|| ఒకడు పాపాలు చేస్తాడు. చాలామంది ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అనుభవించినవారు విడుదలౌతారు. కర్త - బ్రహ్మ, విణ.చేయువాడు. చేసిన వాణ్ణి మాత్రం ఆ దోషం అంటుకునే ఉంటుంది.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొదించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

శ్వపచుఁడు - చండాలుడు, వ్యు.కుక్కను వండుకొనువాడు.
శ్వానం పచతీతి శ్వపచః, డు పచ్ ష్ పాకే. - కుక్కను వండుకొనువాఁడు.
శ్వానము - కుక్క.
శ్వయతి గచ్ఛతీతిశ్వా, న. పు, టుఓశ్వి గతివృద్ధ్యోః - తిరుగుచుండునది.

వారణసీ మీశ్వరరాజధానీం వసంతు విశ్వేశ్వర మర్చయంతు
శ్వపాచకా నాహుతి పాచకాస్వా ముక్తాంగనా యత్ర సమం వృణితే|

భా|| ఏ పురమునందు యాయజాతులతో సమముగ శ్వపచులను (చందాలుడును) సైతము ముక్తికాంత వరించుచున్నదో యట్టి ఈశ్వరుని పురమైన వారణాశి - కాశీ)కాశీక్షేత్రము నందే నివసింపుడు. పాపరహితులారా! విశ్వేశ్వరుని భక్తి మైఁ బూజింపుఁడు.

భేదాః కిరాత శబర పుళిన్దా మ్లేచ్ఛజాతాయః,
"గోమాంసభక్షకో యస్తులోకబాహ్యం చ భాషతే, సర్వాచార విహీనో (అ)సౌ మ్లేచ్ఛ ఇత్యభిదీయతే" ఆసురీతిని మ్లేచ్ఛంతే అవ్యక్తం భాషంత ఇతి మ్లేః, మ్లేచ్ఛ అవ్యక్తే శబ్దే. - వ్యక్తముగాకుండఁ బలుకువారు గనుక మ్లేచ్ఛులు.

కిరాతుఁడు - ఆటవికుడు, అడవియందు తిరిగెడు బోయ.
కీతి శబ్దం రాతీతి కిరాతః, రా ఆదానే. - కీయను శబ్దమును బలుకువాఁడు.  
బోయత - కిరాత స్త్రీ, రూ.బోయత, (చెంచెత వలె).  

పట్ర - ఒకానొక కిరాతుడు, సం.పాటచ్చరః.    
పాటచ్చరుఁడు - దొంగ, వ్యు.ముసుగు వేసికొనినట్లు కనబడకుండ తిరుగువాడు.
పాటయన్ విదళయన్ చరతీతి పాటచ్చరః చరగతి భక్షణయోః. - పీడించుచుఁ జరించువాఁడు, పటచ్చర మపి గృహ్నాతీతి పాటచ్చరః - చినిఁగిన కోకనైనను దీసికొనువాఁడు. 
పాటచ్చర యామిక న్యాయము - న్యా. దొంగను గస్తీ తిరుగుటకు నియమించినచో దొంగతనము పట్టువారుండురను రీతి. 

శంబరము - జలము.
శంబయతీతి శంబరం, పా. సంబయతీతి సంబరం, షంబ సంవరణే; శంబ చ. ఆవరించునది.
శంవృనోతీతి శంబరం, వృఙ్ వరణే. - సుఖముచేతఁ గప్పునది; వబయోరభేదః.
శమ్బరము - ఎఱ్ఱని జింక.  
శం సుఖం వృణోతీతి శంబరః వృఙ్ వరణే. - సుఖమును గప్పునది.
వబయోరభేదః సకారాదియుఁ గలదు. - ఎఱ్ఱని వన్నె గల సన్నపుజింక.
శాంబరి - 1.మాయ, 2.రతీదేవి.
శమరస్యేయం శాంబరీ, ఈ. సీ. శంబరుఁ డను రాక్షసుని సంబంధమైనది.
శంబరారి - మన్మథుడు. 
శమరారిః, ఈ-పు. శంబరస్యాసుర స్యారిః - శంబరుఁ డనెడి రాక్షసునకు శత్రువు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మననం మత్ చేతనా తాం మధతీతి మన్మథః - బుద్ధిని గలియఁ బెట్టువాఁడు, మంథ విలోడనే.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువదితొమ్మిదవది(29వ).

శబరుఁడు - 1.బోయ, 2.శివుడు.
శవతి గచ్ఛతి వన మితి శబరః, శు గతౌ. - అడవిని దిరుగువాఁడు.

పక్కణము - బోయపల్లె.
పచ్యతే కదన్నమత్రేతి పక్కణః, డు పచవ్ పాకే. - కుత్సితాన్నము దీనియందుఁ బాకము చేయఁబడును.
శబరాలయము - 1.బోయపల్లె, 2.వక్కణము.
శబంతే భ్రమంతీతి శబరాః, శబ భ్రమణే., తేషామాలయశ్సబరాలయః - భ్రమించువారు శబరులు; వారికి ఆలయము శబరాలయము.

పుళిందుఁడు - బోయ (భాషాజ్ఞానమే లేక అడవిలో తిరుగు బోయ).
పులంతీతి పుళిందాః, పుల మహత్వే. - ప్రబలమైయుండువారు. ఈ 3 చండాలభేదము లైన మ్లేచ్ఛజాతుల పేర్లు.

    

ౙాబిలితాలుపు - శివుడు, చంద్రధరుడు.
ౙాబిలి - చందమామ Moon, రూ.జాబిలి.
ౙాబిలిరిక్క - మృగశీర్షనక్షత్రము.  

జాబిలి మేపరి - రాహువు Rahu.  
రాహువు - ఒక ఛాయగ్రహము, దలగాము.
రహతి భుత్వా త్యజతి సూర్యాచంద్రమసా వితి రాహుః, ఉ. పు. రహత్యాగే - సూర్యచంద్రులను కబళించి విడుచువాఁడు. 
తలగాము - రాహువు.

మృగాంకుడు - చంద్రుడు, వ్యు.లేడి గుర్తుగా గలవాడు.
మృగః అంకో యస్య సః మృగాంకః - మృగము చిహ్నముగాఁ గలవాఁడు.
లేడి - జింక, రూ.లేటి.
లేడికి లేచినదే(ఉషఃకాలం) ప్రయాణం. లేళ్ళు, చెంగున దూకే జింకలు, కుందేళ్ళు గంతులు వేస్తూ ఉరకలు పెడుతాయి. సింగారెద్దును కాయనూ లేరూ - పట్టుకోనూ లేరు. - లేడి 

రాజా మృగాఙ్కే క్షత్రియే నృపే,
రాజన్ శబ్దము చంద్రునికి, క్షత్రియజాతివానికి, భూమి నేలు రాజునకును పేరు.
కొందరు 'ప్రభౌ' అనునది యిక్కడికిని సంబంధించును గనుక ప్రభువన కుంబేరని చెప్పుదురు. 'ప్రభౌ భూమిపతౌ రాజా క్షత్రియే రజనీపతౌ అని రభసుఁడు.
రాజత ఇతి రాజా, న. పు. రాజ్య దీప్తౌ. - ప్రకాశించువాఁడు.

జింకతాలుపరి - 1.శివుడు, 2.చంద్రుడు.
జింక - ఇఱ్ఱి. ఇఱ్ఱి - జింక, హరిణము. సీతా హరిణానుగ రామ్|  
జింకతలచుక్క - మృగశీర్షము. 

కురంగపాణి - ముక్కంటి, శివుడు.
శివుఁడు -
ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, అర్ద్రానక్షత్రమని కొందరు.

కురంగము - 1.జింక, 2.కోతి, రూ. కురంగమము.
కౌరఙ్గతీతి కురంగః. రగి గతౌ. - భూమియందుఁ (జ)చరించునది.
కురంగమము - జింక; జింక - ఇఱ్ఱి.
కురంగనాభి - కస్తూరి.

దక్షిణారు ర్లుబ్ధయోగా ద్దక్షిణేర్మా కురఙ్గకః,
దక్షిణే దక్షిణగ్భాగే ఈర్మం వ్రణమస్య దక్షిణేర్మా, న.పు. - కుడిదిక్కు గాయము తగిలినది. ఈ ఒకటి
వేఁటకానిచేతి కుడిదిక్కున గాయము చేయఁబడిన మృగము పేరు.

హస్తేకురంగం గిరిమధ్యరంగం
శృంగారితాంగం గిరిజానుషంగమ్,
మూర్దేందుగంగం మదనాంగ భంగం
శ్రీశైలలింగం శిరసా నమామి| 

ఇఱ్ఱి - జింక, హరిణము.
ఇఱ్ఱిగోఱౙము - కస్తూరి; మృగమదము.

జింక పొక్కిలి - 1.కస్తూరి, 2.మృగనాభి.
మృగనాభి ర్మృగమదః కస్తూరీ చ -
మృగనాభి - మృగమదము, కస్తూరి. 
మృగనాభిభవత్వా న్మృగనాభిః. ఇ. పు. - మృగము యొక్క నాభి వలనఁ బుట్టునది.     
మృగమదము - కస్తూరి. 
"ముఖ్యరాట్ క్షత్రయోః పుంసి నాభిః ప్రాణ్యం గకేద్వయోః" అను త్రికాండశేష వచనము వలన స్త్రీలింగంబును గలదు.
మృగస్య మదో మృగమదః. - మృగము యొక్క మదము.
కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి.
కేస్తూ యతే కస్తూరీ. సీ. ష్టుఞ్ స్తుతౌ. - శిరస్సునందు స్తోత్రము చేయఁబడునది. ఈ 3 కస్తూరి పేర్లు.

అండజ - కస్తూరి, వ్యు.కస్తూరి మృగము యొక్క బొడ్డుతిత్తి నుండి పుట్టినది.

నాభి - 1.కస్తూరి, 2.బొడ్డు, 3.బండి చక్రపు నడిమితూము, 4.విష విశేషము. 1.(గణి.) ఒక బిందువు నొద్ద నుండి ఒక శంకుచ్ఛేదము పైనున్న బిందువునకు గల దూరము. ఆ శంకుచ్ఛేద సంబంధమైన నిర్దేశకము నుండి మరల దాని రూపము స్థిరనివృత్తిలో నుండునట్టి స్థిర బిందువు (Focus). 2.(భౌతి.) పరావర్తితములై కాని వక్రీభూతములై కాని కాంతి కిరణము లే బిందువు నొద్ద ఉపసరణత (Convergence)ను చెందునో యట్టి బిందువు. ముఖ్యాక్షమునకు సమాంతరము గా నుండు కిరణములు పరావర్తనము చెంది కేద్రీకరించెడి బిందువు. లేక వికేంద్రీకరించునట్లు కనిపించు బిందువు (Focus).

క్షత్రియే (అ)పిచ నాభి ర్నా -
నాభిశబ్దము క్షత్రియునికిని, అపిశబ్దము వలనఁ విజిగీషుఁ డైన రాజునకును పేరైనపుడు పు, ప్రాంగణమునకు ప్స, బండికంటి నడిమికిని, ప్రధానమునకును, కస్తూరికిని పేరైనపుడు సీ, నహ్యత ఇతి నాభిఃః, ణహ బంధనే. - కట్టఁబడునది. "ముఖ్యరాట్ క్షత్రియో ర్నాభిః పుంసి ప్రాణ్యంగకే ద్వయోః చక్రమధ్యే ప్రధానే చ స్త్రియాం కస్తూరి కామదే" ఇతి రభసః.

బొడ్డు - 1.నాభి, 2.నూతిచుట్టు పెట్టిన గోడ. పొక్కిలి - 1.బొడ్డు, 2.గుంట.

నాభిజన్ముఁడు- బ్రహ్మ, పొక్కిలి చూలి, వ్యు.బొడ్డు నుండి జన్మించినవాడు.
బ్రహ్మ -
నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).

అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థలశోభితా|
ముఖచంద్రకళంకాభ - మృగనాభివిశేషకా. – 5స్తో

ప్లవంగము - 1.కోతి, 2.కప్ప, వ్యు.దాటుచు పోవునది.
ప్లవో లంఘనం తేన గచ్ఛతి ప్లవంగః, ప్లవగశ్చ, గమ్ ఌ గతౌ. - దాఁటునది.
ప్లవ - ముప్పదియైదవ(35వ) సంవత్సరము.
ప్లవంగ - నలుబది యొకటవ(41వ) సంవత్సరము.

గోపుచ్ఛము - 1.కోతి, 2.ఆవుతోక.
హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి.

మృగమదంబుఁ జూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైనవారి గుణము లీలాగురా, విశ్వ.

తా. ఓ వేమా! కస్తూరి చూచుటకు నల్లగా వుండును కాని, దాని సువాసన విశేషమైన గొప్పదిగ నుండును. గురువులైనవారిలో మంచిగుణములు గుణము - 1.శీలము, 2.అల్లెత్రాడు, 3.దారము, 4.(అలం.) కావ్యగుణము. గూడ ఆ విధముగనే చాలా గొప్పవిగా నుండును.

నమస్తేస్తు గంగే త్వదంగ ప్రసంగా
ద్భుజంగా స్తురంగా కురంగాః ప్లవంగాః
అనఁగారి రంగాసకంగా శ్శివంగా
భుజంగాధిపాంగీ కృతాంగా భవంతి| - 1

కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే
మరాలే మదేభే మహోక్షే(అ)ధిరూఢామ్|
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం
భజే శారదాంబా మజస్రం మదంబామ్. - 6స్తో

పిఱికిమెకము - జింక.
పిఱికిపంద - బెదురుపోతు, పిరికి (Coward).
పిఱికి - భయశీలుడు, భీరుకః.
దొంబులిగొట్టు - (దొందు+పులి+కొట్టు), పిరికి. 
భీరుకుఁడు - వెరవరి, రూ.భీలుకుడు.
భీతము - భయము నొందినది, వి.వెరపు. 
భీతి - భయము, బెదురు.
భ్యం శీలస్యా ఇతి భీరూః - వెఱుపు స్వభాముగాఁ గలది.
పిఱుతివియు - (పిరుదు+తివియు) వెనుదీయు, జంకు.

కంకు - క్రి.1.జళిపించు, 2.తిట్టు, 3.గద్దించు.
ౙళిపించు - క్రి.కత్తిని ఆడించు.
శపించు - క్రి.తిట్టు.
తిట్టు - 1.శాపము, 2.నింద, క్రి.1.శపించు, నిందించు. 
ౙోకు - క్రి.తిట్టు,,వి.తిట్టుట. 
భర్త్సనం త్వపకారగీః,
భర్త్సనము - బెదిరింపు మాట, గద్దింపు.
భర్త్సతే అనేనేతి భర్సనం, భర్స తర్జనే - దీనిచేత బెదిరింపఁబడును. 
గదుము - క్రి.గద్దించు, అదలించు.   

భీ - భయము.    
భీతిః, ఈ. సీ. భీః, భయం చ. ఞి భీభయే. భీతి సాహచర్యాత్ భీశబ్దః స్త్రీలింగః.
భీతి - భయము, బెదురు.
భ్యం శీలస్యా ఇతి భీరూః - వెఱుపు స్వభాముగాఁ గలది.
సాధ్వసము - భీతి. 
సాధూనస్య తీతి సాధ్వసం, అసు క్షేపణే. - సాధువులను బాధించునది.
భీతము - భయము నొందినది, వి.వెరుపు.    
ౙంకు - క్రి.1.భయపడు, 2.సంకోచపడు, వి.1.భయము, 2.సంకోచము, శంక, సం.శంకః.

అడలు - క్రి.1.ఏడ్చు, దుఃఖించు, 2.భయపడు, వి.1.శోకము, 2.భీతి.

ఉద్విగ్నము - 1.భయము నొందినది, 2.మనసు కుదురులేనిది, వ్యాకులమైనది.

మొగతప్పు - క్రి. పిరు తివియు, వెనుతీయు.
పిఱుతివియు - (పిరుదు+తివియు) వెనుదీయు, జంకు.

జింక - ఇఱ్ఱి.  
ఇఱ్ఱి - జింక, హరిణము.
ఇఱ్ఱింకులు - (ఇంకులు+ఇంకులు) మిక్కిలి ఇంకుటలు.
ఇంకు - క్రి.1.నేల మున్నగు వానిలో (ద్రవపదార్థములు) ఇగిరిపోవు, 2.వట్టిపోవు, ఎండు, 3.నశించు, 4.కృశించు, రూ.ఇసుకు.
ఇనుకు - ఇంకు.    

ఓం కస్తూరీ తిలకోల్లస నిటలాయై నమో నమః|

హరిణీ స్యా న్మృగీ హేమప్రతిమా హరితా చ యా: హరిణీ శబ్దము లేడికిని, బంగారు ప్రతిమకు ను, పచ్చవన్నె(తెలుపు పసుపు కూడినది) గలదానికి ని పేరు.
హరతి మన ఇతి హరిణీ. సీ. హృఞ్ హరణే - మనస్సును హరించునది. "హరిణీవృత్తభేధే పి యూధికాసురయోషితో"రితి శేషః. సీతా ప్రియహరిణానుగ రామ్|

హర్షిణీ హరిణీ వృత్తహర్షముననొ
గాదొ చెప్పఁగా నేరరు గానరారు
నీదు నాకృతి నేరరు నీతి గనరు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|

వనహరిణములు - అడవిలేళ్ళు, వీటికి అడవిలో క్రూరమృగముల వలన ప్రమాద మెక్కువ. అందుచేత ఇవి చిన్న అలికిడికే భయపడును. గ్రామ హరిణములు మనుష్యాది దర్శనమున భయపడవు.

హ్రీంకారారణ్య హరిణీ హ్రీంకారావాలవల్లరీ,
హ్రీంకారపంజరశుకీ హ్రీంకారాంగణ దీపికా|

ఓం హ్రీంకారారణ్య హరిణ్యై నమః : హ్రీంకార రూపారణ్యంలో పరమేశ్వరి హరిణి వంటిది. సాధారణంగా అరణ్యాలలో వ్యాఘ్ర సింహాది క్రూరమృగాలు వుంటాయి. కాని సహజాతభయ విహారిణులైన హరిణులున్న ప్రదేశంలో కౄరజంతువులుండవని తెలిసికోవాలి. అటులనే భవాటవిలో భీతిల్లిన భక్తజనులను దర్శన మాత్రంచే భయదూరులను చేయు సర్వేశ్వరికి వందనాలు.

హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవ నాశినీ,
కైవల్యపదవీరేఖా సూర్యమండల సంస్థితా| - 53శ్లో

హరిణః పాణ్డురః పాణ్డుః -
హరిణము - జింక, విణ.తెల్లనిది.
హ్రియతే హరిణః. హృఞ్ హరణే. - హరింపఁ బడునది.
హరిణాదయస్త్రయః సితపీతసంకరవర్ణనామాని తదుక్తం _ "సితపీత సమాయోగాత్పాండు వర్ణః ప్రకీర్తితః" ఇతి హరిణాది శబ్దములు ఈ 3 పచ్చ తెలుపు కలిసిన వర్ణము పేర్లు.
హరతి మన ఇతి హరిణః, హృఞ్ హరణే. - మనస్సును హరించునది.
హరిణి - ఆడుజింక, విణ.ఆకుపచ్చ వన్నెకలది.

త్రిషు పాణ్డౌ చ హరిణః -
హరిణశబ్దము తెలుపు పసుపులు గూడిన వస్తువునకును పేరైనపుడు త్రి, చకారమువలన ఇఱ్ఱికి పేరైనపుడు పు. హరతి మన ఇతి హరిణః - మనస్సును హరించునది.

పాండిమము - తెలుపు.
పండతే యాతి మనోః (అ)స్మిన్నితి పాండరః, పడి గతౌ. - దీనియందు మనస్సు పొందును.
పాండురము - తెల్లనిది.
పాండుగుణయోగాత్పాండురః - తెలుపువన్నె గలిగినది.
పాండీఁడు - పాండ్యదేశపు రాజు, సం.పాండ్యః.
పాండువు - 1.పాండురోగము, 2.పాండురాజు, సం.వి.(వృక్ష.) పత్ర లకము హరితవర్ణము లేక తెల్లగా నుండుట (Chlorosis).
పండతే యాతి మన ఇతి పాండుః, పడి గతౌ. - మనస్సును పొందునది. ఈ 3 పసుపుతోః గూడిన తెలుపు పేర్లు.
పాండురోగము - (గృహ.) పాలిపోవుట, రక్తహీనత (Anemia). 

అవదాతము - 1.తెల్లన, 2.పసుపుపచ్చన, విన.1.ఇంపైనది, 2.తెల్లనిది, 3.పసుపుపచ్చనిది, 4.దోషరహితమైనది, 5.ఖండింప బడినది, 6.శ్రేష్ఠమైనది.

హృతి - హరణము, రూ.అహృతి.
హృతము -
హరింపబడినది, రూ.ఆహృతము.

కోమలము - 1.నీరు, 2.హరిణము, విణ.1.మృదువైనది, 2.అందమైనది, 3.ఇంపైనది.

జలీయము - (రసా.) నీటితో కలిసినది, (Aqueous, aqua = నీరు (వృక్ష) నీటితో నుండునది, (Aquatic).

సుకుమారం తు కోమలం మృదులం మృదు,
సౌకుమార్యము - సుకుమార్యము.
సుష్ఠు కుమారయంత్యనేనేతి సుకుమారం, కుమర క్రీడాయాం. - దీనిచేత లెస్సగాఁ గ్రీడింతురు.
మవ్వము - కోమలత, సౌకుమార్యము.
కామ్యతే జనైతి కోమలం, కముకాంతౌ. - జనుల చేత కోరఁబడునది. కామ్యము - కోరదగినది.
మృదువు - మెత్తనిది. నౌరు - మృదువు, రూ.నవురు.  
మృద్యత ఇతి మృదు. మృదక్షోదే. - మెదుపఁ బడునది.
మృదులము - మెత్తనిది, మృదువు.
మృదు మృదుత్వ మస్యాస్తీతి మృదులం. - మృదుత్వము గలిగినది. ఈ 4 మెత్తనిదాని పేర్లు.

మృదూ చాతీష్టకోమలౌ,
మృదుశబ్దము క్రూరముగానివానికిని, మెత్తనివానికిని పేరు. మృద్యత ఇతి మృదు, త్రి.  మెదపఁబడునది.

పేలవము - పలుచనిది, కోమలమైనది.
పిల్యతే క్షిప్యత ఇతి పేలవం, పిల క్షేపే. - ద్రొబ్బఁబడునది.

సుకుమారి - కోమలమైనది.
సుకుమారుఁడు - కోమలమైనవాడు.

స్వారస్యము - (గృహ.) నాజూకు, సుకుమారము (Daintiness).
సుకుమారము - కోమలము, (జం.) ఒబీలియా (Obelia) జలీయ కాభశిఫ, జలీయాకాభ స్తంభము దాని యొక్క వివిధ భాగములు కలిసినప్రాణి, హైడ్రాయిడ్ చెట్టు.
జలీయకాభశిఫ - (జం.) సుకుమారము (Obelia) అను జంతువు ఏదైన కఱ్ఱరాయి, సముద్రపు మొక్కకు అంటుకొని యుండు పాదభాగము (Hydrorhiza).   
జలీయకాభ స్తంభము - (జం.) సుకుమారము యొక్క కాండమువంటి శరీరభాగము,(Hydroculus).

కోమలాస్థి - (జం.) సంకోచ వ్యాకోచ శక్తిగల సున్నితమయిన (జంతు) సంబంధమగు, ఎముకవంటి పదార్థము (Cartillage).

కోమలి - చక్కదనము గల స్త్రీ.
కోమలికము -
చక్కదనము.
ఒప్పులాఁడీ - చక్కదనముగల స్త్రీ.
సౌందర్యము - చక్కదనము.
ౘక్కదనము - 1.సౌందర్యము, 2.ఋజుభావము, రూ.చక్కన.
ౘక్కన - 1.అందము, విణ.సరియైనది.

అందము - 1.సౌందర్యము, 2.అలంకారము , 3.విధము, విణ.చక్కనిది, 2.తగినది.
అందకత్తియ - సౌందర్యవతి, రూ.అందకత్తె.    

అభిరామము - మనోహరము, ఇంపైనది, ఒప్పిదమైనది.
మనోహరము - బంగారు, విణ.1.హృద్యము, 2.అందము.
మనోహరతీతి మనోహరం, హృఞ్ హరణే. - మనస్సును హరించునది, పా. మనోరమం. 
హృద్యము - మనస్సు కింపైనది, మదికి హితమైనది.

మనోజ్ఞత - (గృహ.) 1.ఆకర్షించు శక్తి, 2.రంజింప జేయు శక్తి, 3.సౌందర్యము (Charm).
ఒప్పిదము - 1.అందము, 2.అలంకారము, 3.విధము, విణ.1.మనోజ్ఞము, 2.తగినది.
రమ్యము - ఒప్పిదమైనది; రమణీయము - ఒప్పిదమైనది.

ౘక్క - 1.సుందరమైనది, 2.తిన్ననైనది.
ౘక్కనయ్య -
1.సుందరమైనవాడు, 2.వి.మన్మథుడు.
 
ౘక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.
ౘక్కాడు - క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.

రూపము - 1.ఆకారము, 2.చక్షురింద్రియ గోచరము, 3.సౌందర్యము, 4.అగ్నిగుణము, 5.స్వభావము.
రూపకము - 1.నాటకము 2.ఆరక్షరముల కాలము గల తాళభేదము,3.రూపము,4.రూపకాలంకారము.
స్వరూపము - 1.స్వభావము, 2.రూపము.
స్వభావము - స్వధర్మము, పుట్టుకతో వచ్చు గుణము.

అథ సారఙ్గః స్తోకక శ్చాతక స్సమాః :
సారంగము - 1.జింక, 2.ఏనుగు, 3.తుమ్మెద, 4.వానకోయిల.
సంహత్య అరం గచ్ఛతీతి సారంగః - తన జాతిపక్షులతోఁగూడి త్వరగాః బోవునది. పా. శారంగః.
స్తోకకము - 1.ఒక రకమైన విషయము, 2.వాన కోయిల, విణ.అల్పము వ్యు. వాన బొట్టును కోరునది.      
స్తోక్తం అల్పం కాయతీతి స్తోకకః. కై శబ్దే. - మెల్లగా గూయునది.
స్తోక మల్పం కం శిరో హ్ స్యేతివా స్తోకకః. - అల్పమైన శిరస్సు గలది. 
చాతకము - వానకోయిల.  
వర్షోదకం చతతీతి చాతకః. చతే యాచనే. - వర్షోదకమును యాచించునది. ఈ మూడు 3 వానకోయిల పేర్లు (చాతకము)    

చాతకే హరిణే పుంసి సారఙ్గ శ్శబలే త్రిషు,
సారంగశబ్దము చాతకపక్షికిని, ఇఱ్ఱికిని పేరైనప్పుడు పు. నానా వర్ణములు గల వస్తువునకు పేరైనపుడు త్రి. సారాణ్యంగాని యస్య సః సారంగః - మంచి యవయములు గలది. టీ. స. సజాతీయైస్సహ అరం అత్యర్థం గచ్ఛతీతి సారంగ 'హస్తిభృంగౌ చ సారంగా' వితి శేషః.

ఘనతాళము - 1.వానకోయిల, 2.తాళభేధము.
ధారాటము - 1.గుఱ్ఱము horse, 2.వానకోయిల. వానకోయిల - 1.చాతక పక్షి, 2.ఒక రకము పాము. 

తూర - వానబొట్టు, రూ.తువర.
చినుకు - క్రి.1.కారు, 2.కురియు, 3.కార్చు, వి.వానబొట్టు.
చినుకుఁబూస - ముత్తెము.

శుభాంగో లోకసారంగః స్సుతంతుః తంతువర్ధనః
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః|

కళానిధి - చంద్రుడు.
కళానాం నిధిః కళానిధి, ఈ. పు. - కళల కునికిపట్టు.
కళ - 1. 8 సెకనుల(8 Seconds) కాలము, 2.చంద్రకళ, 3.ఒకపాలు, 4.శిల్పుల నైపుణ్యము, 5.ద్రుతానతము కాని పదము.
నెలపాలు - చంద్రకళ. చంద్రభాగ యందు  కళ|
నెలవీసము - చంద్రకళ.

నెలఁత - స్త్రీ, రూ.నెలఁతుక.

కళాకుశలము - (గృహ.) 1.చమత్కారమైనది, 2.కళాపూర్వకమైనది, 3.నాగరికత గలది, (Artistic).

త్రింశత్తు తాః కలా,
త్రింశత్తు - ముప్పది.
త్రింశత్కాష్ఠాః కలేత్యుచ్యతే. - 30 కాష్ఠలకాలము కల యనంబడును.
కాష్ఠ - 1.పదునెనిమిది రెప్పపాట్ల కాలము, 2.దిక్కు, 3.మేర.
కాలం కలయతీతి కలా, కల సంఖ్యానే. - కాలమును లెక్కపెట్టునది, ఒకటి 30 కాష్ఠలు ఒక కల. 

క్షేత్రాణి సంతి కతి నాబ్జభవాండమధ్యే
వశ్యన్తి తాని కథితాని యుగే యుగే చ
ఏకా కళాధర కళాధర రాజధానీ
కల్పాంతరేషు న వినశ్యతి వారనాసీ.     

కల1 - 1.కళ, 2.భాగము, 3.చంద్రునిలో పదునారవ భాగము, విణ.అవ్యక్త మధుర స్వరము.
కల2 - స్వప్నము. 
కలా తు షోడశో భాగో :
చంద్రస్య షోడశోభాగోయః సకళేత్యుచ్యతే - చంద్రుని పదియారవ భాగము కళ యనంబడును.
షోడశము - పదునారు, విణ.పదునారవది, వి.చనిపోయినవానికి పదునొకండవ దినమున చేయు శ్రాద్ధవిశేషము.
కల్యతే సంఖ్యాయత ఇతి కలా, కలసం ఖ్యానే - లెక్క పెట్టఁబడునది. చంద్రునిలోని పదియాఱవపాలు.   

భాగము - 1.పాలు, వంతు, వాటా, 2.భాగ్యము.
భజ్యతే క్రమేణేతి భాగః, భజసేవాయాం. - క్రమముగా పొందఁబడునది.
పాలు - 1.క్షీరము, 2.చెట్ల యందు గలుగు తెల్లని రసము, సం.పయః, వి.భాగము, వంతు.

భాగ స్తురీయః పాద స్స్యాత్ -
పద్యత ఇతి పాదః-విభాగమును బొందునది. ఒకటి నాలవపాలు పేరు.  

కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః|
పుష్ఠా పురాతనా పూజ్యాపుష్కరా పుష్కరేక్షణా.

కలకంఠము - 1.కోయిల, 2.పారావతము, 3.హంస, వ్యు.మధురమైన కంఠము కలది.

కలధ్వని - 1.అవ్యక్త మధుర ధ్వని, 2.కోయిల, 3.నెమలి.

ధ్వనౌ తు మధురాస్ఫుటే, కలో -
మధురే శ్రుతిసుఖే, అస్ఫుటే అవ్యక్తాక్షరే ధ్వనౌ కలః - సుఖమై వ్యక్తముగాని వర్ణములు గలిగిన ధ్వని కల యనంబడును.
కం సుఖం లాతీతికలః, లాదానే. - సుఖము నిచ్చునది. 
కలో మదః తద్యోగాద్వాకలః, కల మదే. - కల మనఁగా మదము, అది గలిగినది. ఈ ఒకటి అవ్యక్తమధురధ్వని పేరు. 

పంచమము - 1.కోయిల, 2.రాగ విశేషము, 3.ఒక స్వరము, విణ.ఐదవది.   
కోకిలము - కోయిల.
కోకతో శ్రోతృచిత్తం గృహ్ణోతీతి కోకిలః, కుక వృక ఆదానే. - తన పలుకులు వినువారి మనస్సుల నాకర్షించునది.
కోవెల - గుడి, వై.వి.కోకిలము.
తిరుకాపు - కోవెల తలుపు.

పైకము - ధనము, సం.వి.కోకిలగుంపు.
ధనము - 1.విత్తము, 2.ఆలమంద, వి.అంకగణిత సంఖ్య, (Positive).
ధినోతి ప్రీణయతీతి ధనం, ధని ప్రీణనే. - సంతోషపెట్టునది. 'ధన ధాన్యే' అను ధాతువు మీఁద వ్యుత్పన్నమైనదని కొందఱు.

ముజరా - తిరిగి రావలసిన పైకము మొ వి. 

నెమిలి - మయూరము, రూ.నెమ్మిలి.
నెమ్మిలి - నెమ్మలి.
మయూరము - 1.నెమిలి, 2.నెమిలి జుట్టు.
మీనాతి సర్పాన్ మయూరః, మీఞ్ హింసాయాం. - సర్పములను హింసించునది.
మాయూరము - నెమిళ్ళ గుంపు, విణ.మయూర సంబంధమైనది.

క్షీరము - 1.పాలు, 2.పాలసముద్రము, 3.నీళ్ళు, 4.పాలపిట్ట.
క్షీరాశము - హంస, విణ.పాలుత్రాగునది.

అంశము - 1.భాగము, పాలు, వంతు, 2.విషయము.
విషయము -
గ్రంథాదులందు దెలియు నంశము.

భాగ్యము - అదృష్టము, సుకృతము, విణ.భాగింపదగినది.
అదృష్టము - 1.అగ్నిజలాదుల వలన కలిగెడు కీడు, 2.సుఖదుఃఖ నిమిత్తమైన పుణ్యపాపరూప కర్మఫలము,3.భాగ్యము,విణ.చూడబడనిది.
సుకృతము - 1.పుణ్యము, 2.శుభము.

సూర్యస్య ద్వాదశ కళస్తా - ఇందోః షోడశ స్మృతాః|
దశ వహ్నేః కళాః ప్రోక్తాస్తా - భిర్యుక్తాంస్తు తాన్ స్మరేత్||

కల2 - స్వప్నము.
స్వప్నము -
1.కల, 2.నిదుర.
నిద్రాగతి - (వృక్ష.) నిద్రపోవుచున్నట్లు ఆకులుగాని పూవులుగాని ముకుళించుకొనుట (Sleep movement).   

నిదుర - నిద్ర, కునుకు, కూరుకు, రూ.నిద్దుర.
నిద్దుర -
నిదుర , సం. నిద్రా.
నిద్ర - కూరుకు. కూరుకు - నిద్దుర, క్రి.నిద్రించు.
కునుకు - నిద్రచే తూలు, తూగు, కునికి పడు.    
ముచ్చిలిపాటు - కునికిపాటు.

తందర - తంద్ర, తూగు, కునికిపాటు, సం.తంద్రాః.
తంద్ర - తూగు, రూ.తంద్రి.
అత్యంత మింద్రియాని ద్రాంత్యత్రేతి తంద్రీ, ఈ. సీ. ద్రాకుత్సాయాం గతౌ. - దీనియందు ఇంద్రియములు మిక్కిలి యువరతములౌను.
తూఁగు - 1.ఊగు, 2.నిద్రించు, 3.చలించు(తిరుగు), వి.1.ఊగుట, 2.కునికిపాటు.
ప్రమీల - 1.కునికిపాటు, 2.మళయాళదేశపు రాణి.
ప్రమీలం తింద్రియాణ్యత్రేతి ప్రమిలా, మీల నిమీలనే. - ఇంద్రియములు దీనియందు మిక్కిలి మూయఁబడును.

సకలము - 1.సర్వము, 2.కలతో గూడినది.
సర్వము -
(సర్వ.) సమస్తము, అంతయు.
సమస్తము - సర్వము.

నిద్రయా చాల్యతే చిత్తం భవంతి స్వప్న సంభవాః| 
నానావిధా మనోభేదా మనోభావా హ్యనేకశః||

కళంకము - మచ్చ.
కల్యతే జ్ఞాయతే అనేనేతి కళంకః, కల సంఖ్యానే - దీనిచేత పదార్థం బెఱుంగఁబడును.
మౘ్చ - 1.గాయపుగుర్తు, 2.పుట్టుమచ్చ.

కళఙ్కో (అ)ఙ్కాపవాదయోః,
కళంకశబ్దము గుఱుతునందును, నిందయందును వర్తించును. కల్యతే క్షిప్యతే కళంకః, కల కిల క్షేపే. - త్రోయఁబడునది.
టీ. స. కల్యతే క్షిప్యత ఇతి కలః, అకంక్యత ఇతి అంకః, కలశ్చాసా వంకశ్చ కలంకః, 'కలంకో లోహ కిట్టక ' ఇతి శేషః.

నెఱసు - 1.తప్పు, 2.కళంకము, 3.నలుసు.
తప్పు - క్రి.1.చెడుగుచేయు, 2.అతిక్రమించు, వి.అపరాధము, రూ.తప్పిదము, క్రి.చిక్కు.
నలుసు - రేణువు.
రేణువు - 1.చూర్ణము, ధూళి, 2.నలుసు, నలక.

మకరతము - మరకతమణి, రూ.మరకతము.
మరకతము - (రసా.) పచ్చ, బెరిలియమ్, అల్యూమినియమ్ సి లి కే ట్ (Emarald), (ఇది మణుల(రత్నముల)లో ఒకటి, చాల విలువగలది.)
మరం మరణం తకత్యనేనేతి మరకతం, తక హనహననయోః.- విషరహితమైనది గనుక దీనిచేత మరణమును గెలుతురు. 

నిబిడము - దట్టము.
నిబిడీకరించు - క్రి.దట్టముచేయు.

కళంకః కస్తూరీ - రజనికరబింబం జలమయం
కళాభిః కర్పూరై - ర్మరకతకరండం నిబిడితమ్,
అత స్త్వద్భోగేన - ప్రతిదిన మిదం రిక్తకుహరం
విధి ర్భూయోభూయో - నిబిడయతి నూనం తవ కృతే. - 94శ్లో

తా. ఓ త్రిలోకసుందరీ! చంద్రుని కళంకము - మచ్చ, కస్తూరి - మృగమదము, వికృ.కస్తురి.  చంద్రబింబము జలముతోను, కళలతోను, కర్పూరముతోను నింపిన పెట్టె కరండము - 1.కత్తి, 2.తెనెపెర, 3.పేటిక.)మరకత మాణిక్యము ఈ చంద్రుడు. అందువలన విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.ప్రతిదినమును నీవు ఉపయోగించు టచే  శూన్యమైన ఈ పెట్టెను మాటిమాటికి నీకై పై వస్తువులచే నింపుచున్నాడు నిజము. - సౌందర్యలహరి 

విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విదధాతీతి విధిః- ఇ-పు. - సర్వముఁ చేయువాఁడు.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును.

విధి ర్విధానే దైవే(అ)పి -
విధిశబ్దము చేయుటకును, దైవమునకును, అపిశబ్దమువలన బ్రహ్మదేవునికిని, ప్రకారము నకును, విధాయత వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్ధే ప్రజాపతా" వితి శేషః.

స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతతవైభవా|
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః. – 172

ద్విజా త్యగ్రజన్మ భూదేవ బాడబాః,
విప్రశ్చ బ్రహ్మణః -
ద్విజరాజు - 1.చంద్రుడు Moon, 2.గరుడుడు, 3.శేషుడు, 4.ఉత్తమ ద్విజుడు.
ద్విజానాం బ్రాహ్మణానాం రాజా ద్విజరాజః - పుడమి వేల్పుల ఱేఁడు Moon.    
ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనము చే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ. ద్విజన్ముఁడు.    
దేహోత్పత్త్యుపనయనాది లక్షణే ద్వే జాతీ జన్మనీ అస్యేతి ద్విజాతిః,  ఇ. పు. - దేహోత్పత్త్యుపనయనాది సంస్కారము లనెడు రెండు జన్మములు గలవాఁడు.

ఇరుఁబుట్టువు - (ఇరు+పుట్టువు) 1.బ్రాహ్మణుడు, ద్విజుడు, 2.పక్షి.
ఇరు - (సమాసమున హల్లు పరమగు నపుడు) రెండు, ఉదా. ఇరుగడ.
ఇరుగడ - రెండు ప్రక్కలు.  

హీనజాతి స్త్రియం మోహాదుద్వహంతో ద్విజా తయః|
కులాన్వేన నయంత్యాశు ససంతానాం శూద్రతా||
 
తా. బ్రాహ్మణులు తక్కువజాతి(హీనము - 1.తక్కువైనది, 2.దూరతగినది, 3.విడువ బడినది.) స్త్రీని మోహమువలన పరిగ్రహించిరేని, వారికి గలిగెడి సంతానములతోఁ గూడి వారి కులములు శూద్రత్వమును బొందును. – నీతిశాస్త్రము  

ద్విజము - 1.పక్షి bird, 2.పాము snake, 3.దంతము, 4.చేప fish, రూ. ద్విజన్మము, వ్యు.రెండు పుట్టుకలు గలది. 
అండరూపేణ పక్షిరూపేణ చ ద్విర్జాయతితి ద్విజః, జనీ ప్రాదుర్భావే. - గ్రుడ్డుగాను పక్షిగాను రెండుమార్లుగాఁ బుట్టునది bird.

ద్విర్జాయతే ద్విజా - రెండుమార్లు పుట్టినది.  

దన్త విప్రాణ్డజా ద్విజాః : ద్విజ శబ్దము దంతము నకును, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును, పక్షి సర్పాలకును పేరు.
ద్విజ శబ్దము ఉపలకణార్థము. ద్విర్జాయంత ఇతి ద్విజాః. జనీ ప్రాదుర్భావే. - రెండుసారులు పుట్టునవి; రెండుసారులు పుట్టువారు.

పాము - 1.సర్పము, 2.కష్టము, క్రి.రుద్దు.
సర్పము - పాము, సప్పము. సర్పతీతి సర్పః. సృప్ ఌ గతౌ. - చరించునది.
సప్పము - సర్పము, సం.సర్పః.
సప్పపుఁజుక్క - ఆశ్లేష.

సర్పి - 1.నేయి, 2.జలము, 3.రోగవిశేషము.
సర్పతీతి అర్పిః, సృప్ ఌ గతౌ. - వ్యాపించునది.

దంతము - పల్లు, కోర.
దమ్యతే భక్ష్య మేభి రితి దన్తాః, దము ఉపశమే - భక్ష్య వస్తువు వీనిచేత భక్షింపఁబడును.    
పలు - దంతము, విణ. అనేకము, విస్తారము. 
దంత్యము - (వ్యాక.) దంతస్థానము నందు పుట్టిన ధ్వని, ఉదా. ౘ, ౙ.
'సి' విటమిన్ - (గృహ.) Vitamin ‘ C’ 1.పళ్ళచిగుళ్ళ బలహీనతను తొలగించు విటమిన్, 2.శరీర కణజాలముల బంధనమునకు తోడ్పడు విటమిన్.
పయోరియా - (గృహ.) పంటిచిగురు రోగము, ఒక విధమైన పండ్ల వ్యాధి, పన్నుకుదురులలో నుండి చీమురక్తము స్రవించువ్యాధి,(Pyorrhoea).
స్కర్వీ (సీతాదము) - (గృహ.) (Scurvy)  'సి' విటమిన్ Vitamin C, లోపము వలన కలుగువ్యాధి. చిగుళ్ళవాపు, పండ్ల నుండి రక్తము కారుట, (ఈ వ్యాధి ఖటిక (Calcium) లోపము వలన కూడ కలుగ వచ్చును.

ఆకాదము - (జం.) దంతము యొక్క కిరీటములో క్రింది భాగముపై కప్పి యుండు గట్టిపొర యొక్క పదార్థము (Enamel).

చేఁప - మత్స్యము; మత్స్యము - చేప Fish.
మాద్యతి మాంసజిఘృక్షయా మత్స్యః, మదీ హర్షే. -మాంసమును హరించు నిచ్ఛచేత హర్షించునది. 

చేప(చేఁప) ముల్లు కుట్టు - (గృహ.) చేపవెన్నెముకను పోలినకుట్టు (Fish bone stitch).

గణిక - 1.ఆడేనుగు, 2.వేద్య.
గణికావచ్చిక్తకర్షణాద్గణికా - వేశ్యవలె మనస్సును హరించునది.
విటగణో (అ)స్యా అస్తీతి గణికా - విట సమూహము గలది.
గణయతి ధనికా నితి గణికా, గణసంఖ్యానే. - ధనికులు నెంచునది.  

గణికాదేస్తు గాణిక్యం,
గణికాదేర్గణే గాణిక్యాదీని వర్తంతే - గణికాది సమూహమందు గాణిక్యాది శబ్దములు వర్తించును.
గాణిక్యము - వేశ్యాసమూహము.
గణికానాం సమూహో గాణిక్యం - వేశ్యల యొక్క సమూహము.

అసంతుష్టో ద్విజోనష్టః సంతుష్టోపిచ పార్థివః|
సలజ్జా గణికానష్టా నిర్లజ్జాపి కులాంగనా||

తా. తృప్తిలేని బ్రాహ్మణుండు, తృప్తిబొందెడు పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.)రాజు, సిగ్గు - స్తుత్యాదులచే గలుగు మనస్సంకోచము, లజ్జ, బిడియము)గల గణిక - 1.ఆడేనుగు, 2.వేద్య., లజ్జ - సిగ్గులేని ఇల్లాలు చెడుదురు నష్టము - నశించినది. - నీతిశాస్త్రము 

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుమ్బర నగావాస ఉదారో రోహిణీపతిః.

                                                                                                    

ఖట్టికుఁడు - 1.వేటకాడు, 2.పక్షులను వేటాడువాడు, పర్యా. మృగయుడు, వ్యాధుడు, వికృ.కటికవాడు.
కటిక - 1.కటికవాడు, 2.బెత్తము పట్టియుండువాడు, 3.మాంసము అమ్మువాడు.

దీమము - 1.దీపకము, 2.వేటాడుటకై వేటకాడు పెంచుపక్షి, మృగము, రూ.దీపము.

వ్యాధుఁడు - బోయవాడు.
విధ్యతి మృగానితి వ్యాధః. వ్యధ తాడనే. - మృగములను జంపువాఁడు.

పోలెవాఁడు - వ్యాధుడు.

మృగవధే నాజీవతీతి మృగవధజీవః. జీవ ప్రాణధారణే. - మృగవధచేత బ్రతుకువాడు.

వాగురా మృగబన్ధనే,
వాగుర - మృగపక్ష్యాదులను పట్టు ఉరి, ఉచ్చు, వల.
మృగబంధనే అవగురతే వాగురా, గురీ ఉద్యమనే. - మృగబంధన మందుద్యోగించునది.
ఉరి - 1.ఉచ్చు, వాగుర, 2.కంఠపాశము.
ఉౘ్చు - క్రి.1.అంకురించు, పైకివచ్చు, 2.చీలు, 3.చీల్చు, వి.ఉరి, వాగుర.
మృగా బధ్యంతే అనయేతి మృగబంధనీ, ఈ. సీ. బంధ బంధనే. - మృగములు దీనిచేత బంధింపఁబడును. ఈ 2 మృగములఁబట్టు వలపేర్లు.
ఉరిదీయు - క్రి.మెడకు త్రాడుకట్టి వ్రేలదీసి చంపు.

వాగురయని తెలియక మృగ గణములు
వచ్చి తగులురీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సరమను ||తెర||

అఖేటకుడు - వేటకాడు.  
అఖేటము - వేట, మృగయ.
అఖేట్యంతే మృగా అత్రేతి ఆఖేటః, ఖట త్రాసే. - దీనియందు మృగములు వెఱపింపఁబడును.

ఖేటము - 1.రైతులుండు పల్లె, 2.వర్తకులుండు పేట, 3.సూర్యాది గ్రహము, 4.శ్లేష్మము, 5.బలరాముని గద, 6.వేట, 7.చర్మము, 8.గడ్ది, 9.డాలు, విన.1.అధమము, 2.వడ్ది బ్రదుకునది.
ఖిట్యతే స్త్వైతి ఖేటః, ఖిల త్రాసే. - అందఱి చేతను వెఱపింపఁబడువాఁడు.     

వేఁటగిరి - వేటకాడు.
వేఁట - 1.మృగయ, 2.పొట్టేలు, మేకపోతు.

మృగయుఁడు - బోయ.
మృగాన్ వధార్థం యాతీతి మృగయుః. ఉ. పు. యా ప్రాపణే. - వధార్థ మయి మృగములను దఱుము కొనిపోవువాఁడు.

మృగయ - 1.వేట, 2.వెదకుట.
మృగాణా మన్వేషణం మృగయా, మృగ అన్వేషణే. - మృగములను వెదకుట. ఈ 4 వేఁట పేర్లు.
మృగణ - వెదుకుట.
మృగ్యము - వెదుకదగినది.

అన్వేష్ట - వెదకువాడు.
అన్వేషణ -వెదకుట.
అన్విప్యతే అనయా అన్వేషణా. - దీనిచేత వెంటఁ దిరుగఁబడును. వినష్ట సీతాన్వేషక రామ్|

లుబ్ధకుఁడు - 1.పిసినిగొట్టు, లోభి, 2.బోయవాడు.
లుభ్యతి మృగేప్వితి లిబ్ధకః లుభ గార్ధ్న్వే. - మృగముల యం దాసగొనువాఁడు.  
లుబ్ధుఁడు - 1.బోయ, 2.లోభి, పిసినిగొట్టు.
లుభ్యతి కాంక్షతీతి లుబ్ధః, లుభ గార్ధ్యే. - ఆశించువాఁడు. 
లోభి - లుబ్ధుడు.    

గవి1 - ఆవు; ఆవు - గోవు.
గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.   
గవి2 - 1.గుహ, 2.గుంట. 
గవేషణ - వెదకుట.
గవేషణం, గవేషనా గవేష మార్గణే - వెదకుట.    

తస్మాత్ త్రస్యంతి భూతాని మృగవ్యాధా న్మృగా ఇవ |
సాగరాంతామపి మహీం లబ్ద్వా స పరియీయతే ||

భా|| వేటాడే బోయవాడికి మృగాలు బెదిరినట్లు ప్రాణులన్నీ ఎవడికి భయపడతాయో, అతడు, సముద్రం హద్దుగా గల మహి - పుడమి, భూమి. నంతా చేజిక్కించుకొన్నా (ప్రజలచే) నామ రూపాల్లేని వాడౌతాడు.   

బోయవాని వేణుగానానికి మురిసిపొయిన లేడి, పరుగెట్టి అతని వలలో చిక్కి శ్రవణేంద్రియం(శ్రోతు, చెవి) చేత మోసపోతుంది. శబ్దాది విషయాలకు చింతించే మనిషి, నిగ్రహం కోల్పోయి నశిస్తున్నాడు.

ఆక్షేపకుఁడు - 1.ఆక్షేపించువాడు, 2.బోయవాడు.
నత్తివాఁడు - 1.నత్తిగలవాడు, 2.ఆక్షేపకుడు. 
లోహలుఁడు - నత్తివాడు, స్ఫుటము గాని మాటలుగలవాడు.
లోహతి స్థానప్రయత్నవైకల్యం కరోతీతి లోహలః, లుహ కుత్థనాదౌ ఉచ్చరణమందు వైకల్యము గలవాఁడు.
లోహః అతికాఠిన్యేన లోహసదృశం రసనాతాల్వాదికం; తం లాతీతి లోహలః - దట్తమైయుండుటచేత నినుమువంటి కాఠిన్యము గల నాలుక మొదలైనది లోహము; అది గలవాఁడు.
అస్పుటా వా గ్యసేత్య స్ఫుటవాక్, చ. - వ్యక్తముగాని వాక్కు గలవాఁడు. ఈ 2 వ్యక్తము కాకుండ మాటలాడువాని పేర్లు.
నత్తి - తడబడుచు మాటాడు.

ఆక్షేపము - ఆక్షేపణము, 1.(అలం.) ఒక అర్థాలంకారము, 2.అడ్దము, 3.నిరోధము.
అక్షిప్యతైత్యాక్షేపః, క్షిపనిందాయాం - అక్షేపించుట ఆక్షేపము.    
ఆక్షేపణము - 1.త్రోసివేయుట, 2.లాగుట, 3.అదల్పు, 4.అపవాదము, 5.అపహరించుట, 6.దో ష ము లు ఎంచుట, 7.వణుకురోగము.  

నిరసనము - 1.తిరస్కారము, ఆక్షేపము, 2.వధము, రూ.నిరాసనము.
నితరా మసనం నిరసనం, అసు క్షేపణే. - మిక్కిలి ద్రొబ్బుట నిరసనము.
ప్రతివిరుద్ధ మాదేశనం ప్రత్యాదేశః దిశ సర్జనే. - విరుద్ధముగా నియోగించుట ప్రత్యాదేశము.
నిరాకృతము - న్యాయముచేత్రోయబడినది, నిరస్తము.
నికృష్టం ఆసమంతాత్కరణం నిరాకృతిః, సీ. డు కృఞ్ కరణే. - నికృష్టముగా నంతటఁచేయుట. ఈ 4 తిరస్కరించుట పేర్లు
నిరస్తము - తిరస్కరింపబడినది, వెడలగ్రక్క బడినది, నిరాకృతము.
నిరాకరణ - (గృహ.) విసర్జన, త్రోసివేయుట (Rejection).

ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం…….

నిష్ఠీపనము - 1.ఉమియుట, 2.నిరసనము.
నిష్ఠూతము - 1.ఉమియబడినది, 2.త్రోయబడినది.

నికారణము - వధము; వధము - చంపుట.  
హన్యతే వధః హనహింసాగత్యోః.
ౘంపు - క్రి.చావచేయు.
ౘంపుడుగట్టు - వధ్యస్థానము. 
ౘావఁజూఁచు - క్రి.చంపు.    
ౘక్కాడు - క్రి.1.ఖండించు, 2.చంపు, రూ.చక్కడుచు.
చక్కడుచు - క్రి.1.ఖండించు, 2.చంపు.

నిర్వాదము - నిశ్చితవాదము, అపవాదములేమి.
నికృష్టో వాదో నిర్వాదః, పరీవాదః, అపవాదశ్చ, అపవాదశ్చ వదవక్త్యాయాం వాచి, అపవాదము.
నిష్క్రాంతో వాదాదితి నిర్వాదః - వాదమువలన నిష్క్రాంతమైనది.  

కౌలీనము - 1.గొప్పవంశమున పుట్టుక, 2.అపవాదము, 3.కుకార్యము, విణ.వంశపారపర్యముగా వచ్చినది (ఆచారము మొ.వి.)

అపవాదము - 1.నింద, దూరు, 2.ఆజ్ఞ.
అపవదన మపవాదః, పా, అవవాదః, వద వ్యక్తాయాం వాచి. - పనిబూని చెప్పుట.
నిదేష్ట - ఆజ్ఞాపించువాడు; నిర్దేష్ట - నిర్దేశించువాడు.
నిదేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట, 3.దాపు.
నిర్దిశ్యతే ఆదిశ్యతే నిర్దేశ; నిదేశశ్చ, దిశ అతిసర్జనే. - ఉపదేశింపఁబడునది.
నిర్దేశము - 1.ఆజ్ఞ, 2.చెప్పుట.
నిర్దిష్టము - నిర్దేశింపబడినది.
నిర్దుష్టము - (గణి.) ఒక సిద్ధంతము గాని, ప్రమేయముగాని స్థాపించు విషయమున తిరుగులేనిది (Rigorous) సం.విణ. (గృహ.) కొరత లేనిది, తప్పులు లేనిది, నిష్కళంకమైనది (Faultless, perfect).
నిర్దేశకులు - (వాణి.) కంపెనీ యొక్క దైనందిన కార్యక్రమములను పర్యవేక్షించుటకు వాటాదారులు ఎన్నుకొన్న ప్రతినిధులు.

ఉపక్రోశము - నింద.
ఉపక్రోశ ముపక్రోశః, క్రుశ ఆహ్వానే రోదనేచ. - అంతట నాక్రోశించుట ఉపక్రోశము.

జుగుప్స - 1.రోత, 2.నింద, 3.దయ.
జుగుప్సనం జుగుప్సా, గుపగోపన కుత్సనయోః. - రోయుట జుగుప్స.     

అవడు - నీచము, నింద్యము, వి.నింద, రూ.అగడు.  

కుత్స - నింద, దూఱు.
కుత్సనం సుత్సా, కుత్స నిందాయాం, నిందించుట కుత్స. 
కుత్సించు - 1.క్రి.రోతపడు, 2.దూఱు.
కుత్సితము - నికృష్టము.

నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.

నింద - దూరు, అపదూరు.
నిందనం నిందా, ణిదికుత్సాయాం - నిందించుట నింద.
అపదూఱు - నిష్కారణముగ వచ్చిన నింద, అపనింద, రూ.అవదూరు.
అపనింద - నిష్కారణముగ వచ్చిన నింద, వృథాదూషణము.

స్యాజ్జల్పాకస్తు వాచాలో వాచాటో బహుగర్హవాక్,
జల్పాకుఁడు - వదరుబోతు.
జల్పతి కుత్సితం వదతీతి జల్పాకః, జల్ప వ్యక్తాయాం వాచి. - కుత్సితముగాఁ బలుకువాఁడు.
జల్ప్యతే స్మజల్పితం, జల్ప వ్యక్తాయాం వాచి.
జల్పము - ఉపయుక్తముకాని మాట.
వాచాలుఁడు - వదరుబోతు.
కుత్సితా వాచ స్సంత్యస్యేతి వాచాలః; వా చాటశ్చ - కుత్సితములైన పెక్కుమాటలాడును గనుక వాచాలుఁడు, వాచాటుఁడును.
వాచాటుఁడు - వదరుబోతు; మాటలమారి - వాచాటుడు.
వదరు - క్రి.ప్రేలు, సం.వక్త్కృ.
గర్హణము - నింద, దూఱు.
బహ్వః గర్హవాచో యస్యేతి బహుగర్హ్యవాక్, చ. - కుత్సితమైన పెక్కుమాటలు గలవాఁడు.
ప్రకృతోపయుక్తములు గాక దోషయుక్తముగాఁ బెక్కు మాటలాడువాని పేర్లు.
గర్హణము - నింద, దూఱు.
గర్హణం, గర్హకుత్సాయాం, గర్హించుట గర్హణము.   
గర్హించు - క్రి.నిందించు, దూఱు. 

నిందితుఁడు - దూరబడినవాడు.
నింద్యుఁడు - దూరదగినవాడు.

అవాచ్యము - 1.చెప్ప శక్యము కానిది, 2.చెప్పదగనిది, వి.నిందావచనము.
వక్తుం యోగ్యం వాచ్యం తన్నభవతీ త్యవాచ్యం. - పలుక యోగ్యముగానిది.

మన్ను1 - 1.మృత్తు, 2.నేల.
మన్ను2 - 1.ఒకజాతి జింక, 2.ఒక రకపు యుద్ధ సాధనము, 3. (భూగో.,వ్యవ.) రాళ్ళు విశ్లేషము నొందుట వలన ఏర్పడి, పల్లపు ప్రదేశములలో కూడుకొని కొంత సేంద్రియ పదార్థముతో గలసి, యిదివరకు పెక్కు మార్పులను పొంది, యింకను పెక్కు మార్పులను పొందుచున్న వివిధ పరిమాణములు గల శిలారేణు సంచయము. ఇట్టి మట్టిచే నాక్రమింప బడిన ప్రదేశము వ్యవసాయదారులచే 'నేల' యన బడును. (భూమి, క్షేత్రము.)
మృత్తిక - 1.మన్ను, 2.తొగరిమన్ను.
మృత్స్న - మంచిమన్ను. 

రోదసి - 1.మన్ను, 2.మిన్ను.
రోదము - భూమ్యాకాశము మధ్యము.

మను - 1.జీవించు, 2.నర్తించు, వి.1.మన్ను, 2.నేల.

నేల - 1.భూమి, 2.ప్రదేశము, 3.దేశము.
భూ - భూమి; భూమి - నేల, చోటు, పృథివి, (భూగో.) భూగోళములోని వాయువు నీరు కానటువంటి దృఢమైన పదార్థము, నేల.
నేలచూఁలి - సీత, భూపుత్రి.

భువి - 1.భూమి, 2.స్థానము.
భూమిజ-సీత, వ్యు.భూమి నుండి జన్మించినది.

మిన్ను - ఆకాశము, రూ.మిను.
మిను - ఆకాశము, రూ.మిన్ను.
మిన్నువాఁక - ఆకాశగంగ, మిన్నుకొలను.  
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

మిన్ను విఱిగి మీఁదపడుట - జాతీ. ఆపత్తు తటస్థించుట.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు. 

నేలవేలుపు - భూసురుడు.
భూసురుఁడు -
నేలవేలుపు, బ్రాహ్మణుడు.
బ్రాహ్మణుడు - పారుడు; పాఱుఁడు - బ్రాహ్మణుడు.   

నేలపట్టి - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
భూమిజుఁడు - 1.అంగారకుడు, 2.నరకాసురుడు.
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.

జన్మనా జనకః సో అభూద్వైదేహస్తు విదేహజః|
మిథిలో మథనాజ్జాతో మిథిలా యేన నిర్మితా||

కృష్ణసారము - నల్లయిఱ్ఱి.
కృష్ణేన నీలవర్ణేన సారః కృష్ణసారః - నల్లనివన్నె చేత శ్రేష్ఠమైనది. కృష్ణశారమని కొందఱు.

రురువు - నల్లచారల దుప్పి.
నల్లకప్పున విచిత్రమైన యిఱ్ఱి, రౌతి ప్రాయేణ రురుః. ఉ. పు. శబ్దే. - తఱుచుఁగా గూఁతలు పెట్టునది.         

న్యంకువు - 1.ఇఱ్ఱి, 2.ఒక ముని.
న్యఞ్చత్యధోముఖతయా న్యఞ్కుః, ఉ. పు. అఞ్చు గతిపూజనయోః. - తలవంచుకొని పోవునది, జింకపోతు. 
ఇఱ్ఱి - జింక, హరిణము. 
జింక - ఇఱ్ఱి. 
ఇఱ్ఱిగోఱౙము - కస్తూరి; మృగమదము.

రంకువు - తెల్లని వెండ్రుకలును మెత్తని  తోలును గల జింక.
రఞ్జయతిరఙ్కుః, ఉ, పు. రఞ్జ రాగే. - రాగమును బొందించునది, మృదువైన తెల్లరోమములుగల యిఱ్ఱి.

రాఙ్కం మృగరోమజమ్,
రాంకవము - మృగ రోమములతో చేయబడినది (సాలువు).
రంక్వాఖ్య మృగరోమ వికారః రాంకవం, రంకు వనఁగా తెల్లయిఱ్ఱి. - దాని రోమములచేతఁ జేయబడినది.
మృగరోమభిః జాతం మృగరోమజం. - మృగ రోమములచేతఁ బుట్టునది. ఈ 2 మృగరోమముల చేతఁ జేయఁబడిన శాలువ మొదలైనవి.

రౌహిషము - 1.కామంచిగడ్ది (తృణ విశేషము), 2.కొండగొఱ్ఱె.
రోహతీతి రౌహిషం, రుహ బీజ జన్మని ప్రాదుర్భావే - మొలచునది.
రోహిషము - కొండగొఱ్ఱె, ముత్యము.
రోహతీతి రౌహిషః తృణవిశేషః, సః భక్ష్యమనేతి రౌహిషః, పా, రోహిషః - మొలుచునది గనుక రౌహిషమనఁగా దృణవిశేషము. దానిని భక్షించునది రౌహిషము. దోహిషమని దకారాదిగాఁ గొందఱు, కొండగొఱ్ఱె.  
కామంచి - క త్తృణము, ఒక తెగగడ్డి, రూ.కామంచి, సం.కామంజికా.
కామంజిక - క త్తృణము.

శ్రుతిసీమంత సిందూరీ - కృతపాదాబ్జ ధూళికా|
సకలాగమ సందోహ - శుక్తిసంపుట మౌక్తికా.

గంధమృగము - 1.పునుగుపిల్లి, 2.కస్తూరీ మృగము.
కమ్మపిల్లి -
పునుగు పిల్లి.
పునుఁగు - పునుగుపిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము.

సంకువు - జివ్వాజి పిల్లి.
సంకుమదము - జివ్వాజి.

ఏడ ననర్హుఁడుండు నటకేగు ననర్హుఁడు నర్హుడున్నచోఁ
జూడఁగనొల్ల డెట్లన, నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం
గూడినపుంటిపై నిలువఁ గోరినయట్టులు నిల్వ నేర్చునే,
సూడిదవెట్టు నెన్నుదుటి చొక్కపుఁగస్తురిమీఁద, భాస్కరా.

తా. ఈగ,  చీము - చెడి తెల్లనైన నెత్తురు, పూయము. చీముతో(పూయము - 1.చీము, 2.పీనుగు.)కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడునట్లుగా కస్తూరిబొట్టుపై నుండుటకు ఇష్టపడదు. అట్లే అపాత్రము - అనర్హుడు, అనర్హము.)నీచుడెందుగలడో అచ్చటకే నీచుడగు వాడు పోయి నిల్వఁజూచును. అరుహుఁడు - తగినవాడు, రూ.అర్హుడు, సం.అర్హః.న్నచో ఆ నీచునకు గిట్టదు.

చిట్టడవుల్లో కస్తూరి మృగం ఉంటుంది. కస్తూరి వలపు కప్పి వుంచితే దాగేవి కావు. ఈగ, చీముతో కూడిన కురుపుపై వ్రాలియుండుటకు ఇష్టపడు నట్లుగా కస్తూరి బొట్టుపై నుండుటకు ఇష్టపడదు.

గవయము - 1.గురుపోతు, వనవృషభము, అడవియెద్దు.
గా మయతే సదృశత్వాత్ గవయః, అయ గతౌ. - గోవును బోలునది, గురుపోతు.

మాతరిశ్వుఁడు - గాలి, వ్యు.ఆకాశమున వృద్ధిబొందువాడు.
మాతరి ఆకాశే శ్వయతి వర్ధత ఇతి, మాతరిశ్వాః, న-పు. టు ఓశ్వ గతివృద్ధ్యోః - ఆకాశము నందు వృద్ధిఁబొందువాఁడు.

సర్వదా - ఎల్లప్పుడు; సదా - ఎల్లప్పుడు.
సర్వదా సదా,
సర్వదా, సదా ఈ 2 ను ఎల్లప్పుడు నను నర్థమందు వర్తించును. 'సర్వదా సర్వదో (అ)నేనేతి యాచతే యాచక స్సదా'.
సదాగతి - 1.వాయువు, 2.మోక్షము, 3.సూర్యుడు Sun, 4.సర్వేశ్వరుడు.
సదాగతిః గమనం యస్య సః సదాగతి, ఈ. పు. - సర్వదా సంచరించువాఁడు.
మోక్షము - 1.కైవల్యము, 2.మోచనము, విడుపు, 3.ముక్తి.
దుఃఖాదీనం మోక్షణ మవసానం మోక్షః - దుఃఖాదులయొక్క వినాశము మోక్షము.
ఆత్మానం పాశేభ్యః మోచయతీతిమోక్ష, ముచ్ మోక్షణే. - జీవుని పాశములవలన విడిపించునది.
మోచకము - 1.విడుపు, 2.మోక్ష కాలము.
అపవర్గము - మోక్షము.  
దుఃఖాదీనా మపవర్జన మపవర్గః; అపపూర్వో వృజీవర్జన ఇతి ధాతుః. - దుఃఖాదులను వర్జించుట.

పృషదశ్వుఁడు - వాయువు.
పృషత్ మృగవిశేషః అశ్వ యస్య సః పృషదశ్వః - పృషత్తనఁగా నొకానొక మృగము. అది వాహనముగాఁ గలవాఁడు.
పృషంతి జలబిందనః అశ్వా అస్యేతివా - జలబిందువులు వాహనముగాఁ గలవాఁడు.
తద్యుతగతి త్వాదశ్వత్వ నిరూపణం - వానిని మోసికొనిపోవుటవలన అశ్వత్వ నిరూపణము.

పృషకము - 1.దుప్పి, 2.నీటిబొట్టు, విణ. బ్రహ్మబిందువుతో కూడినది.
పృషతాః బిన్దవో స్యేతి పృషతః - చుక్కలు గలిగినది, దుప్పి. 
దుప్పి - పొడలుగల అడవిమృగము, చమూరువు.
బిందువు - 1.నీటిబొట్టు, 2.చుక్క, 3.సున్న, సం. (గణి.) స్థితి మాత్రము కలిగి, పొడవు వెడల్పు మందము లేని ఆకృతి (Point).

బొట్టు - 1.తిలకము, 2.చుక్క, సున్న 3.మంగళ సూత్రమున కూర్చు స్వర్ణాభరణము, సం. 1.పుండ్రమ్, 2.బిందుః, 3.వృత్తమ్.
తిలకము - 1.బొట్టు, 2.నల్లగుర్రము Black horse, 3.పుట్టుమచ్చ, 4.బొట్టుగు చెట్టు, విణ.శ్రేష్ఠము.
పుండ్రము - 1.నలుపు గలిగిన ఎఱ్ఱ చెరుకు, 2.తెల్లదామర, 3.నుదుటి బొట్టు.

ఏణము - పెద్ద కన్నులుగల నల్లజింక.
ఏణీ - పెద్దకన్నులు గల నల్ల ఆడులేడి, జింక. 
ఏతీత్యేణః, ఇణ్ గతౌ. - పోవునది, పొడలతో నల్లనై పెద్దకండ్లుగల యిఱ్ఱి.

ఐణేయము - ఏణి యొక్క తోలు, మాంసము మొ. కి సంబంధించినది.
ఏణ్యా ఇదం ఐణేయం - ఆఁడులేడి సంబంధమైనది ఐణేయము.
ఐణము - ఏణము (ఇఱ్ఱి) యొక్క తోలుఅజినము - తోలు, మాంసము మొ. వి. (జింక మాంసము, లేడిమాంసము, దుప్పి మాంసము ఐణము లనబడును)(Venison).
ఏణస్య ఇదం ఐణం - మొగదుప్పి సంబంధమైనది ఐణము, ఐణేయ ఐణశబ్దములు మూఁడులింగములయందును వర్తించును. ఆఁడు లేడియొక్కయు మొగదుప్పి యొక్కయు తోలు మాంసము మొదలయినవాని పేర్లు.

అజినము - తోలు.
అజిసస్య చర్మణః యోనిః కారణం అజినయోనిః. పు. - చర్మమునకుఁ గారణమైనది.
పా. జినో బుద్ధః రురూపః యోనిరుత్పత్తి స్థాన మేషామితి జినయోనయ ఇతి కశ్చిత్. - ఇఱ్ఱి రూపముగల బుద్ధదేవుఁడు ఉత్పత్తిస్థానముగా గలది.    

రాన్ డీర్ - (భూగో.) (Ran-deer) ధ్రువపుజింక, ఉత్తర దక్షిణ ధ్రువములలో ప్రయాణ సౌకర్యములకై ఉపయోగింప బడు జింక.
కెరిబో - (భూగో.) (Caribow) మంచు ఎడారులలో నుండు 'రాన్ డీర్ ', (Rein deer) అను జింక. 

సురమందిర తరుమూల నివాసః - శయ్యా భూతలమజినం వాసః,
సర్వపరిగ్రాహ భోగత్యాగః - కస్య సుఖం న కరోతి విరాగః - 18శ్లో
Living in temples or at the foot of trees, sleeping on the ground, wearing deer-skin, renouncing all possessions and their enjoyment - to whom will not dispassion bring happiness?

పావకుఁడు - అగ్ని.
పునాతీతి పావకః, పూఙ్ పవనే - పవిత్రమును జేయువాఁడు.
పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుడు, విణ.పవిత్రురాలు.

అనలుఁడు - 1.అగ్నిదేవుడు, 2.అష్ట వసువులలో ఒకడు.
అనంతి జీవంత్యనేన లోకా ఇత్యనలః, అన ప్రాణనే. - ఇతనిచేత లోకములు జీవింపుచున్నవి.
కాష్ఠాదిభి రలం పర్యాపి ర్నాస్త్యస్యేతివా - కాష్ఠాదులచేత చాలుననుట లేనివాఁడు.
అనలము - 1.అగ్ని, 2.జఠరాగ్ని, 3. (వృక్ష.) చిత్రమూలము, నల్లజీడి, 4.మూడు అను శంఖ్య.   

అనిలము - 1.గాలి, 2.దేహము నందలి వాతధాతువు, 3.వాతరోగము.
అనంత్యనేనేత్యనిలః, అన ప్రాణనే - ఇతనిచేత బ్రతుకుదురు.
అనిలుఁడు - 1.వాయుదేవుడు, 2.అష్ట వసువులలో ఒకడు.  

అనిలాః అన్యంతే ప్రాణ్యంతేలోకా ఏభి రిత్యనిలాః - వీరిచే లోకములు ప్రాణయుక్తములుగాఁ జేయఁబడును గనుక అనిలులు, అన ప్రాణనే, ఇలా యం న చరంతీతి వా - భూమియందు సంచరించనివారు, వారు 19డ్రు.

వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.
వాతరోగము - (గృహ.) వాతము చేత నేర్పడు రోగము, (సాధారణముగ ఈ నొప్పులు శరీరమునందు కీళ్ళ వద్ద ఏర్పడును), (Rheumatism). కోరవాయువు - వాతరోగము.

వాతకీ వాతరోగీ స్యాత్ -
వాతసంజ్ఞి కోరోగో (అ)స్యాస్తీతి వాతకీ, న. పు. వాతరోగీ చ. న. పు. - వాతరోగము గలవాఁడు. ఈ 2 వాతరోగము గలవాని పేర్లు.

వాతం అయతే వాతాయుః. ఉ. పు. అయ గతౌ. - వాయువును బొందునది.

మహావాతము - 1.గాలితో గూడిన పెద్దవాన, 2.పెద్ద వాతరోగము.

వాతము - 1.గాలి, 2.వాతనాడి నీరసించిన రోగము.
వాతీతి వారః. వా గతిగంధనయోః - వీచుచుండెడువాఁడు.
వాతవాఁడి - అప్రియంవదుఁడు, దురుసుగా మాటాడువాడు. (వ్రాత+ వాడి+కలవాడు).  
దురుసు - 1.కాఠిన్యము, 2.శీఘ్రము, సం.ధృష్. 
శీఘ్రము - వడి, విణ.వడిగలది.  

వాతఘ్నము - ఆముదపుచెట్టు, వ్యు.వాతమును పోగొట్టునది.
గంధర్వహస్తకము - ఆముదపుచెట్టు, రూ.గంధర్వ హస్తము.
గంధర్వ మృగవిశేషస్య భూతవిశేషస్య వా హస్త ఇవ పత్రమస్య గంధర్వహస్తకః - గంధర్వమనఁగా మృగ విశేషముగాని భూతవిశేషముగాని, దానిచేతివలె నుండెడు ఆకులుగలది.   

అనిలో మృగనాభిరేణుగంధి ర్హరవామాంగకుచో త్తరీయ
హరతే మరణశ్రమం జనానా మథికాశి ప్రణవోపదేశకాలే|

భా|| మనోజ్ఞమైన కస్తూరికా రేణుగంధిలమై శివుని వామాంగకుచోత్తరీయ సం జనితమైన పిల్లగాడ్పు కాశీపురమందుఁ బ్రణవోపదేశసమయమున దేహుల మరణ శ్రమమపనయించును. (ఉత్క్రమణ సమయమున దేహునకు శంకరుఁడు(ఉ)మాసమేతుఁడై ప్రణవోపదేశము సేయునని భావము.)

రోహితాశ్వుఁడు - 1.అగ్ని, 2.హరిశ్చద్రుని కొడుకు, రూ.రోహితాశ్వుడు, రోహితాస్యుడు.
లోహితాస్యుఁడు - హరిశ్చంద్ర నృపాలుని కొమరుడు, రూ.రోహితాస్యుడు, (లౌహితాశ్వుడని కొందఱు.)
లోహితవర్ణాః అశ్వాః యస్యసః లోహితాశ్వః - ఎఱ్ఱని గుఱ్ఱములు గలవాఁడు. (పా, రోహితో మృగః స ఏవ అశ్వో యస్యసః రోహితాశ్వః - రోహితమృగము వాహనముగాఁ గలవాఁడు).    

రోహితము - 1. కుంకుడు పువ్వు, 2.నెత్తురు, 3.ఎరుపు, 4.ఎఱ్ఱచేప.
రోహితత్వాత్ రోహితః - ఎఱ్ఱనై యుండునది. 
జలే మజ్జతీతి మద్గురః. టుమస్ మజ్జనే. - జలమందు మునిఁగి యుండునది Fish.
రక్తవర్ణత్వేన రోహితః - ఎఱ్ఱని వన్నెగలది, కేసరి యను మృగము.   

తదేవ ఋజు రోహితమ్,
తదేవ ఋజు రోహిత మిత్యుచ్యతే - ఆ యింద్ర ధనుస్సు చక్కఁగా నుండునేని రోహిత మనంబడును.
రోహతీతి రోహితం, రుహ బీజజన్మని ప్రాదుర్భావే చ-ప్రాదుర్భవించునది.
రోహితవర్ణత్వా ద్వా రోహితం రక్తవర్ణము గలది. ఈ ఒకటి చక్కని యింద్రధనుస్సు. 

రుధిరము - 1.నెత్తురు, రక్తము, 2.సిందూరము.
రుద్యతే త్వచా రుధిరం రుధిర్ ఆవరణే. - చర్మముచేత కప్పఁబడునది.
సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.

లోహితము - 1.రక్త చందనము, 2.సింధూరము, 3.నెత్తురు blood.
రక్తము - 1.నెత్తురు, 2.కుంకుమ, 3.ఎరుపు. 
లోహితవర్ణత్వాత్ లోహితం. రక్తం చ. - ఎఱ్ఱని వన్నె గలది, లోహితము రక్తము. 

లోహితో రోహితో రక్తః -
రోహితి ప్రాదుర్భవతి సంధ్యాదావితి రోహితః - రలయోర భేదాత్ లోహితశ్చ రుహ బీజజన్మని ప్రాదుర్భావే. - సంధ్యాదికాలములయందుఁ బుట్టునది. అది దాసాని పువ్వు వంటిది.
రజ్యత ఇతి రక్తః, రంజరాగే. - రాగమును బొందునది, అది సంధ్యారాగమువంటిది. ఈ 3 ఎఱుపువన్నె పేర్లు.

రక్తచందనము - ఎఱ్ఱ చందనము, (రక్త) ద్రవపదార్థము సం.వి. (జం.) సామాన్యముగా రక్తములోనున్న ద్రవపదార్థ భాగము, (Plasma) రసకళ, Plasma membrane.
ఎఱ్ఱగందము - రక్తచందనము.

                                                                                             

లోహితాంగుఁడు - అంగారకుడు Mars.
లోహితమంగం యస్యసః లోహితాంగః - ఎఱ్ఱని శరీరకాంతిగలవాఁడు.   
అంగారకుఁడు - నవగ్రహములలో కుజుడు.
అంగతి గచ్ఛతీత్యంగారకః, అగి గతౌ - సంచరించువాఁడు.
అంగీరవర్ణత్వా దంగారకః - నిప్పువంటివర్ణము గలవాఁడు.
కుజుఁడు - 1.నరకాసురుడు, వ్యు.భూమికి పుట్టినవాడు, 2.అంగారకుడు (Mars).

చమరము - 1.వింజామరము, రూ.చామరము, 2.సవరము, 3.చమరీ మృగము.
చమతి తృణం చమరః, చము అదనే. - తృణమును భక్షించునది, చమరీమృగము.

చామరము - వింజామరము, రూ.చమరము.
వీచోపులు - (వీచు+ చోపులు) వింజామరలు. వీచు - గాలి విసరు. వీవరి - వాయువు.       

చామారం తు ప్రకీర్ణకమ్,
చమరమృగ సంబంధి చామరం - చమరమృగ సంబంధమైనది.
ప్రకీర్యతే రాజసమీప ఇతి ప్రకీర్ణకం, కౄ విక్షేపే. - రజ సమీపమందు విసరఁబడునది. ఈ 2 వింజామర పేర్లు.

ప్రకీర్ణము - 1.విరివి, విసృతము, 2.వింజామరము, 3.గుఱ్ఱము. 

ఔశీనరుఁడు - శిబిచక్రవర్తి.
ఔశీరము - చామరము, సురటి, విణ.వట్టివేళ్ళతో చేయబడిన మందు.

లగ్న చామరహస్త శ్రీ శారదా పరివీజితా,
లజ్జా పద సమారాధ్యా లంపటా లకులేశ్వరీ|

కుచ్చుల బఱ్ఱె - జడల బఱ్ఱె, చమరీ మృగము.
ౙడబఱ్ఱె - చమరీమృగము.
చమరీ - ఆడు చమరీమృగము.

చమ్యతే చమూరుః, ఉ. పు. చము అదనే. - భక్షింపఁబడునది, సంశయాసృదమైన తోఁక గలిగి, తెలుపుగాని నలుపుగాని నానావర్ణములుగాని కలిగిన మృగము.   

ధవిత్రము - జింకతోలు, విసనకఱ్ఱ. 
వ్యజనము - విసనకఱ్ఱ, వీవన.
వ్యజ్యతే శ్రమో (అ)పనీయతే అనేనేతి వ్యజనం. - అజగతిక్షేపణయోః. - దీనిచేత బడలిక పోఁగొట్టఁబడును.    
వీజనము - సురటి, విసనకఱ్ఱ.
వీవన - సురటి, రూ.వీవెన, సం.వ్యజనమ్, వీజనమ్. 

ధవిత్రం వ్యజనం తద్యద్రచితం మృగచర్మణా,
యాగే అగ్ని ప్రజ్వాలనాయ మృగచర్మణా రచితం యద్వ్యజనం తత్ ధవిత్ర మిశ్యుచ్యతే. - యాగమందు అగ్ని ప్రజ్వలింపఁజేయుట కొఱకు మృగచర్మముచేఁ జేయఁబడిన విసనకఱ్ఱ ధవిత్ర మనంబడును.
ధూయతే అగ్ని రనేన ధవిత్రం, ధూఞ్ కమ్బనే. - దీనిచేత అగ్ని కంపింపఁజేయఁబడును.

ఔశీనరుఁడు - శిబిచక్రవర్తి.
ఔశీరము - చామరము, సురటి, విణ.వట్టివేళ్ళతో చేయబడిన మందు.

వింజామరము - (వెల్ల + చామరము) తెల్లని చామరము, సురటి.
వీచోపులు - (వీచు+ చోపులు) వింజామరలు.

సచామర రమా వాణీ విరాజితాయై నమో నమః

సింగినాదము - 1.పొడ, దుప్పి కొమ్ములతో చేసిన సుషిరవాద్యము, 2.హేళనాదులయందు ఉపయోగించు వాడుకపదము. సింగినాదము జీలకఱ్ఱ కాదూ!

వాహము - 1.గుఱ్ఱము, 2.ఎద్దు, 3.భుజము.
వహతి నరంవాహః. వహప్రాపణే. - నరుని వహించునది.

వ్యోమకేశుడు - శంకరుడు, వ్యు.ఆకాశము జుట్టుగా గలవాడు.
వ్యోమ్ని కేశాః యస్య సః వ్యోమ కేశః - ఆకాశమున నిండియున్న తలవెండ్రుకలు గలవాఁడు. 
వ్యోమము - 1.ఆకసము, 2.నీరు.
విశ్వం వ్యయతి సంవృణోతీతి వ్యోమః, న. వ్యేఞ్. సంవరణే. - విశ్వమును వ్యాపించునది. 
విశేషేణ అవత్యవకాశదానేనేతి వ్యోమ, అవ రక్షణే. - విశేషముగా అవకాశ మిచ్చి రక్షించునది.
వ్యోమధూమము - మేఘము.
వ్యోమచారి - పక్షి Bird, వ్యు.ఆకాశమున చరించునది.
వ్యోమగామి - గ్రహాంతరములకు అంతరిక్ష నౌకలో (Space ship) ప్రయాణము చేయు వ్యక్తి (Austronaut).
వ్యోమయానం విమానో (అ)స్త్రీ,
వ్యోమ్నియానం గమనం దేవానామ్యేన త ద్వ్యోమయానం - దేవతలకు ఆకాశమందు గమనము దేనిచేతఁ గలుగునో అది, యాప్రాపణే. 
విశేషేణ మాంతి వర్తంతే దేవా అస్మిన్నితి విమానః, అ-ప్న. - దీనియందు దేవతలు విశేషముగా నుందురు, మాజ్ మానే వర్తనేచ.
వినాపక్షిణామాన ముపమానం గమనే యస్యేతి నా-గమనమందు పక్షితో సాదృశ్యము గలది. ఈ 2 దేవరథము పేర్లు

నింగిసిగ - శివుడు, వ్యోమకేశుడు.  
నింగి - ఆకాశము Sky.
నింగిచూలు - వాయువు, వ్యు.ఆకాశము నుండి పుట్టినది.

నింగిపడు - క్రి.అస్తమించు.

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ|
పంచయజ్ఞప్రియా పంచ - ప్రేతమంచాధి శాయినీ. – 174

పృథివి - పృథ్వి, భూమి, వ్యు.పృథు చక్రవర్తిచే చక్క చేయబడినది, విశాలమైనది.
ప్రథతే పృథివీ; పృథ్వీ చ, ఈ సీ. ప్రథ ప్రఖ్యానే. - ప్రసిద్ధమగునది.
పృథుచక్రవర్తినా సత్కృతావా పృథివీ; పృథ్వీచ - పృథుచక్రవర్తిచేత లెస్సగాఁ జేయఁబడినది.
పృథుత్వాత్పృథివీ - విశాలమైనది.      

పృథువు - గొప్పది, వి.ఒక రాజు.
పార్థివుఁడు - రాజు, వ్యు.పృథివి కలవాడు.
పృథి వ్యా ఈశ్వరః పార్థివః - భూమికిఁ బ్రభువు.

ఋషులచేతఁ గోరంబడి తొమ్మిదవ(9వ) జన్మంబునఁ బృథు చక్రవర్తియై భూమిని ధేనువుం జేసి సమస్త వస్తువులం బిదికె; తొమ్మిదో(9వ) జన్మలో ఋషుల ప్రార్థనను మన్నించి "పృథు చక్రవర్తి" యై భూదేవిని గోవు గావించి ఔషధులను, సమస్త వస్తువులను పిదికాడు. 

మహారాజులు - వీరు పదునార్గురు :- గయుడు, అంబరీషుఁడు, పృథువు, మరుత్మంతుడు, మరుదత్తు, మహోత్రుడు, పరశురాముడు, శ్రీరాముడు, దిలీపుడు, నృగువు, రంతిదేవుడు, యయాతి, మంధాత, భగీరథుడు, శశిబిందువు, అనంగుడు.

భూతము - 1.పృథివ్యాది భూతములు (ఇవి:- పృథివి, అప్పు, తేజము, వాయువు, ఆకాశము.) 2.పిశాచాది, 3.కృష్ణ చతుర్దశి, విణ.కడచినది, 2.పొందబడినది.

పార్థివము - పృథివీ సంబంధమైనది, సం.వి.గుఱ్ఱము Horse.
పార్థివ - అరువది సంవత్సరములలో నొకటి (19వది). పార్థివకుల సమ్మానిత రామ్|   

పార్థుఁడు - 1.రాజు, 2.అర్జునుడు.    
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు Moon.
అర్జునుఁడు - 1.పాండవులలో మూడవవాడు, 2.కార్తవీర్యార్జునుడు, 3.తల్లికి ఒకడే కొడుకైనవాడు.

గెలుపు పేరుగలఁవాడు - పార్థుడు, అర్జునుడు, విజయు డను పేరు గలవాడు.
విజయుఁడు - 1.అర్జునుడు, 2.విష్ణుద్వారపాలకులలో నొకడు.
కపిధ్వజుఁడు - విజయుడు, అర్జునుడు, వ్యు.కపి చిహ్నము ధ్వజమందు కలవాడు.

తన - ఆత్మార్థకము.
తనయ - కూతురు; కూఁతురు - కుమార్తె.
తనయుఁడు - కొడుకు.  
కులం ముదం వా తనోతీతి తనయః, తను విస్తారే. - కులముగాని సంతోషమునుగాని(ముదము - సంతోషము)విస్తరింపఁజేయువాఁడు.

పార్థివే తనయే సుతః,
సుతశబ్దము రాజునకును, కొడుకునకును పేరు. సౌతీతి సుతః, షుప్రసవైశ్వర్యయోః. - ఐశ్వర్యమును బొందించువాఁడు, పుట్టినవాఁడును గనుక సుతుడు.

సుతుఁడు - కొడుకు.
సౌత్యేనం మాతా సుతః, షుప్రసవైశ్వర్యయోః. - తల్లి వీనిని ప్రసవించును. 
సుత1 - మొదలుకొని, ప్రభృతి, ఉదా.ఆదిసుత, నాటిసుత.
సుత2 - కూతురు.  

తనువు - 1.దేహము, 2.తోలు, విణ.1.చిన్న, సన్న.
తన్యతే ఆహారేన తనుః, ఉ. సీ. తనూశ్చ, ఊ. సీ. తనువిస్తారే. - ఆహారముచేత విస్తారము చేయఁబడునది.
తను శబ్దము నకారాంత నపుంసకంబును గలదు, 'తను షేతను షేక ' మితి వాసవదత్తా.
తను కోశములు - (జం.) పునరుత్పత్తి క్రియ కాక శరీరములో తక్కిన జీవిత వ్యాపారములతో సంబంధము కల జీవ కణములు (Somatic or body cells.)
తనుజుఁడు - కుమారుడు, రూ.తనుజుఁడు, తనూభవుడు.

తనూనపాత్తు - అగ్ని, వ్యు.అన్నాదులను పచనముచేసి శరీరము పడకుండ కాపాడునది.

కుమారుఁడు - 1.కొడుకు, 2.బాలుడు, 3.స్కందుడు.
సదా బాలత్వాత్ కుమరః - ఎల్లప్పుడు బాలుఁడుగా నుండువాఁడు.
కుత్సితాన్ మారయతీతి వా - కుత్సితుల సంహరించువాఁడు.
మృఙ్ప్రాణత్యాగే, కౌ పృథివ్యాం మార్యతి మన్మథవ దాచరతీతి వా - భూమియందు మన్మథునివలె సుందరుఁడైనవాఁడు.
కౌ పృథివ్యాం మాం లక్ష్మీం రాతి దదాతీతి వా - భూమి యందు సంపద నిచ్చువాఁడు.
రాదానే, సదా బ్రహ్మచారిత్వా ధ్వా - ఎల్లప్పుడు బ్రహ్మచారి గనుక కుమారుఁడు.

తనుజులనుం గురువృద్ధుల
జననీ జనకులను సాధు * జనుల నెఁవడు దా
ఘనుఁడయ్యుఁ బ్రోవఁడో యా
జనుఁడే జీవన్మృతుండు * జగతిఁ గుమారా!

తా. కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, (సాదు - సాధువు, మంచివాడు, మంచిది, సం.సాధుః.)సజ్జనులను, ఎవఁడు తాను గొప్పవాఁడుగానుండియును రక్షింపకయుండునో అట్టివాడు లోకములో (జీవన్మృతుఁడు - బ్రతికి యుండియు చచ్చిన వానితో సమానుడు.)బ్రతికి యుఁ జచ్చినవాఁడువలె నుండువాఁడు.

నప్త - 1.మనుమరాలు, 2.మనుమడు, 3.మున్మనుమడు, రూ.సప్తి. 

నప్త్రీ పౌత్రీ సుతాత్మజా,
న పత త్యనయా కులమితి నప్త్రీ. ఈ. సీ. పత్ ఌ గతౌ. - కులము దీనిచేత పడదు.
ఋకారాంతము గలదు.'నప్తా నప్త్రీ చ పౌత్రికే' తి రభసః.
పుత్రస్య పుత్య్రావా అపత్యం పౌత్రీ - కొడుకునకై నను కూఁతురునకైనను కూఁతురు. ఈ 2 మనుమరాలి పేర్లు.

పట్టిపట్టి - 1.మనుమడు, 2.మనుమరాలు, విణ.గట్టిగా నొక్కి నొక్కి.
పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయనము, వి.బిడ్డ.  

పౌత్రుఁడు - కొడుకు కొడుకు.
పౌత్రి - మనుమరాలు, (కొడుకు లేక కూతురు కూతురు).
ప్రపౌత్రి - ము న్మ ను మ రా లు, పౌత్రుని కూతురు.

దౌహిత్రి - దుహితకొమార్తె, మనుమరాలు. 
దౌహిత్రుడు - దుహితకొడుకు, మనుమడు.
ఇనుమనుమఁడు - మునిమనుమడు, ప్రప్రౌత్రుడు.

సప్తాశ్వుఁడు - సూర్యుడు Sun, వ్యు.ఏడు గుఱ్ఱములు గలవాడు.
సప్త అశ్వాః యస్య సః సప్తాశ్వః - ఏడు గుఱ్ఱములు గలవాఁడు.
సప్తనామకః అశ్వో యస్యేతి వా సప్తాశ్వః - సప్త యనెడు ఒక గుఱ్ఱము గలవాఁడు.

సప్తి - గుఱ్ఱము.
సపతిసేవాదిధర్మేణ సప్తిః. ఇ. పు. షప సమవాయే. - సేవాది ధర్మములతోఁగూడినది.

సప్తమి - పక్షము నందు ఏడవతిధి విణ.ఏడవది.
సప్తమము - ఏడవది.
సప్తకము - ఏడు, విణ.ఏడవది.
ఏఁడు - సంవత్సరము, బహు.ఏండ్లు, సర్వ. ఎవడు.
సంవత్సరము - ఏడు; ఏడు - ఆరునొకటి.
ఎవఁడు - ఏమనుజుడు, రూ.ఎవ్వడు, ఏవాడు, ఏడు. ఎవ్వఁడు - ఎవడు.

సతనాల్కల జేజే - సప్తజిహ్వుడు, వ్యు.ఏడు నాలుకలున్న దేవుడు.
సప్తహస్తుఁడు - అగ్ని.

సత - సప్త, ఏడు, రూ.సత్తా, సం.సప్త.
సత్తా - సత, ఏడు, సం.సత్త,  వై.వి. శక్తి, సం.సత్వమ్.

శక్తిధరుఁడు - కుమారస్వామి.
శకేర్ధశ్శక్తిధరః - శక్తి యను నాయుధమును ధరించినవాఁడు. హస్తౌ శక్తిధరః|
సత్తితాలుపు - కుమారస్వామి, శక్తిధరుడు.
సత్తి - 1.శక్తి, 2.ఒక ఆయుధము, 3.కాళి, 4.బలము, 5.వశిష్ఠుని కుమారుడు, సం.శక్తిః.
సత్త - సత్త్వము, శక్తి, రూ.సత్తువ.    
శక్యతే శక్తిః, ఈ. సీ. శక్ ఌ శక్తౌ. - దీనిచేత శక్తుఁడౌను. 
శక్తి - (గణి., భౌతి.) అచల స్థితిని గాని, ఒకేదిక్కుగా చలించెడి స్థితినిగాని కలుగజేయు బలము, (శక్తి వివిధ రూపములలో నుండును, ఉదా. యాంత్రిక, తేజః, విద్యుత్, ఉష్ణ, అయస్కాంత, రసాయనిక, శబ్దశక్తులు మొదలైనవి, (Energy), సం.వి. 1.బలిమి, 2.చిల్లకోల, 3.పార్వతి ఇచ్ఛాది శక్తులు మూడు (జ్ఞాన, క్రియ, ఇచ్ఛ), ఉత్సాహాది శక్తిత్రయము (ఉత్సాహ శక్తి, ప్రభుభక్తి, మంత్రశక్తి). ప్రథమో జ్ఞానశక్తాత్మా|  

నిర్వాహము - 1.శక్తి, 2.జరుగుబాటు.
నిర్వాహిక గ్రంథి - (జం.) వాహికా నాళము లేకుండ తిన్నగా రక్తములోనికి న్యాసర్గమును స్రవింపచేయు గ్రంథి (Ductless gland, endrocrine).
నిర్వహిల్లు - జరుగు, నెరవేరు.

కాళి - 1.గౌరి, పార్వతి, ఆదిశక్తులలో నొకతె, 2.బొగ్గు.
కాళవర్ణత్వాత్కాళీ - నీల వర్ణముగలది.
గౌరి - 1.దుర్గ, పార్వతి, 2.రజస్వల కానికన్యక, 3.భూమి, 4.వరుణుని భార్య.
గౌర వర్ణత్వాద్గౌరీ ఈ-సీ. - గౌరవర్ణము గలది. 
దుర్గ - పార్వతి, రూ.దుర్గి.
దుగ్గ - దుర్గ, కాళి, పార్వతి, రూ.దుర్గి, సం.దుర్గా.

కల్యాణి - 1.గౌరి, 2.నేల, 3.ఒకానొక రాగము, 4.ఆవు. 

కాత్యాయిని - 1.గౌరి, పార్వతి, 2.సగము వయసు చెల్లి కావిచీర కట్టిన విధవ.

ధనవంతులైన బహు స
జ్జనులై నను నీకు మిగుల * సమ్మతులై యు
న్నను సతి జనకుని గృహమం
దున నుండుట తగదు కీర్తి * తొలఁగుఁగుమారా!

తా. ఆఁడుది తన పుట్టినయింటివారు ధనవంతులై నప్పటికిని, సత్పురుషులై నప్పటికిని, మిక్కిలి(సమ్మతి - అంగీకరము, ఇచ్ఛ.)ప్రేమగలవారయి నప్పటికిని సతి పుట్టిన యింటి(జనకుడు - 1.తండ్రి, 2.సీతయొక్క తండ్రి, (జనకర్షి). యింటిలో నివసించియుండ రాదు. కీర్తి తొలఁగి పోవును.

హరిదశ్వుఁడు - సూర్యుడు Sun, వ్యు.పచ్చగుఱ్ఱములు కలవాడు.
హరితః హరిద్వ్ర్ణా అశ్వాః యస్య హరిదశ్వః - పచ్చనికాంతి గల గుఱ్ఱములు గలవాఁడు.

పాలాశో హరితో హరిత్,
పలాశం పర్ణం తత్తులవర్ణతయా పాలాశః పలాశమనఁగా ఆకు, దానితో సమానమైనకాంతి గలది.
హరిత మన ఇతి హరితః - హరి చ్చ. త. హృఞ్ హరణే. - మనస్సును హరించునది. ఈ 3 ఆకుపచ్చవన్నె పేరు.   

పత్రము - 1.ఆకు, 2.రెక్క, 3.వ్యవహారము, చెల్లుబడికై వ్రాసికొను కాగితము, 4.వాహనము, 5.బాణము.
వృక్షాత్పతతీతి పత్రం, పత్ ఌ గతౌ. - వృక్షము నందుండి పడునది.

పత్రకిణము - (వృక్ష.) ఆకుమచ్చ, ఆకురాలిన తరువాత కాండముపై పత్రాధారముతో నేర్పడినగుర్తు, (Leaf scar).

పతనశీలము - (వృక్ష.) క్రిందికిరాలి పోవునట్టిది, సామాన్యముగా శీతకాలమున రాలిపోవునట్టిది (ఆకులు) (Deciduous).   

పలాశము - 1.ఆకు, 2.ఆకుపచ్చ, 3.మోదుగు.
పలాశ్యత్యేగ్రస్యతే పలాశం. పరపూర్వః అశ భోజన ఇతి ధాతుః రలయోరభేదః - వ్రతయుక్తులైన వారిచేత భక్షింపఁబడునది.
ఆకు - 1.చెట్లనందలి ఆకు, 2.తమలపాకు, 3.గ్రంథములోని పత్రము, 4.ఆజ్ఞాపత్రము, 5.జాబు, 6.చెవికమ్మ, 7.వ్రాత కుపయోగించెడి తాటియాకు, 8.బండికంటి ఆకు, 9.వరి మొ.ని నారు, 10.విస్తరాకు, 11.ఇచ్చిపుచ్చుకోలు పత్రము.

ఆకుపచ్చ - పచ్చనిది, హరితము.
పసిరిక - 1.పసరువన్నె, 2.పచ్చపిట్ట.
పసరు - 1.ఆకు నలిపిన రసము, 2.ఆకుపచ్చన, విణ.ఆకు పచ్చనిది.
హరితః - పక్షివిశేషము. గిజిగాఁడు - పచ్చపిట్ట. హరితము - 1.ఆకుపచ్చవన్నె, 2.పచ్చ గుఱ్ఱము, 3.పచ్చపిట్ట, సం.వి.శాకము, కూరాకు.
పత్రహరితము - (వృక్ష.) ఆకులలో నుండు ఆకుపచ్చని పదార్థము, హరితము (Chlorophyll).

హరిత్తు - 1.దిక్కు, 2.ఆకుపచ్చవన్నె, 3.పచ్చగుఱ్ఱము.
హరంతి తమాసింహరితః, త-సీః, హృఙ్ మరణే - తమస్సులను హరించునట్టివి.
హర్యతే అభిరప్రతీతి రితి హరితః - వీనిచే నజ్ఞానము హరింపఁబడును.

ఛదము - 1.ఆకు, 2.ఈక, 3.ఱెక్క, 4.కప్పు, రూ.చనలము, సం.(వృక్ష.) పుష్పము యొక్క మూలమున సాధారణముగ నగపడు చిన్న ఆకువంటి నిర్మాణము. దీనికి ముఖ్యాక్షమునకును మధ్యగల పంగలో పుష్పము బయలు దేరును (Bract)  
ఛాద్యతే వృక్షః అనేనేతి ఛదనం, ఛద అపవారణే. - దీనిచేత వృక్షము కప్పఁబడును.
దళము - 1.ఆకు, 2.దండు.
దళతీతి దళం, దళ విశరణే. - పగులునది. 

పలాశే కింశుకః పర్ణో వాతషోథః - 
పుణ్యాని పాలశాని యస్య సః పలాసః - పుణ్యములైన ఆకులు గలది.
సంపుప్పైః పలం మాంసం అశ్నాతీవ తిష్ఠతీతి నా పలాశః - పుష్పములచేత మాంసమును భక్షించు దానివలె నుండునది.
కించిచ్ఛుకవన్నీలత్వాత్కింశుకః - ఇంచికంత పచ్చనై చిలుకవలె నుండునది.
ప్రశ స్తపర్ణ యోగాత్వర్ణః - మంచి ఆకులు గలది.
వాత రోగం పోథయతీతి వాతపోథ. పుథ హింసాయాం. - వాతరోగమును బోఁగొట్టునది. ఈ నాలుగు మోదుగచెట్టు పేర్లు.

కింశుకము - పలాశము, మోదుగు చెట్టు.
మోదుగు -
కింశుక వృక్షము, రూ.మోదువు. 
మంకెన - 1.బంధూకము, మోదుగు, 2.ఎద్దు మీద నీళ్ళబిందెలు ఆనుటకై వేయుబెత్తపు బుట్టల జత. మంకెనపువ్వు ఎరుపు. 
బంధూకము -
మోదుగ పూవు, మోదుగ.     

పర్ణము - ఆకు, పత్రము.
పిపర్తి వృక్షమితి పర్ణం, పౄపాలనపూరణయోః - వృక్షమున నిండియుండునది.
ఛదనము - ఛదము.
ఛాద్యతే వృక్షో నేనేతి ఛదః, చద అపవారణే. - దీనిచేత వృక్షము కప్పఁబడును.

శుకముల్ కింశుక పుష్పముల్ గని ఫలస్తోమం బటంచున్ సము
త్పుకతన్ ౙరగఁబోవ నచ్చట మాహాదుఃఖంబు సిద్ధించుఁ గ
ర్మకళాభాషలకెల్ల బ్రాపులగు శాస్త్రంబుల్ విలోకించు వా
రికి నిత్యత్వమనీష దూరమగునో శ్రీకాళహస్తీశ్వరా!

తా|| ఈశ్వరా! శుకములు(శుకము - చిలుక)మోదుగ పూలు జూచి పండ్లని భ్రాంతిపడి వెళ్ళగా వానికి నిరాశయే(దుఃఖము - 1.బాధ, 2.చింత.)మిగులును. అట్లే శాస్త్రములు పరిశీలించి దైవతత్వమును గ్రహింప వలెనన్నచో వారికిఁ దెలియునవి కర్మకాండలును, కవిత్వాది కళా విషయములును అంతేకాని వారికి శాశ్వతమైన నీ స్వరూపమెట్లు బోధపడును? - ధూర్జటి - శివుడు, 2.ఒకానొక ఆంధ్ర కవి    

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు Sun, 4.చంద్రుడు Moon, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

మోదుగు - కింశుక వృక్షము, రూ.మోదువు. 
మంకెన - 1.బంధూకము, మోదుగు, 2.ఎద్దు మీద నీళ్ళబిందెలు ఆనుటకై వేయుబెత్తపు బుట్టల జత. మంకెనపువ్వు ఎరుపు. 
బంధూకము -
మోదుగ పూవు, మోదుగ.

రక్తకస్తు బన్దూకో బన్ధుజీవకః,
రక్తవత్పుష్పతయా రక్తకః - ఎఱ్ఱని పువ్వులు గలది.
సుకుమారత్వాత్ బద్నాతి చిత్తం బంధూకః, బంధ బంధనే. - సుకుమారమౌట వలన మనస్సులు బంధించునది.
బంధూన్ జీవయతి బంధుఃజీవకః, జీవప్రాణ ధారణే. - తనకు బంధువులైయుండు తుమ్మెదలను బ్రతికించునది. 

పాలశోదణ్డ ఆషాఢో వ్రతే : ఆషాఢాసు జాతః ఆషాఢః - పూర్వాషాఢాది నక్షత్రముల యందగు నట్టిది.  
పాలాశః దణ్డః - బ్రహ్మచర్యాది వ్రతమందుఁ బుట్టు మోదుగు కోల.

రూపయౌవన సంపన్నా విశుద్ధ కులసంబంధాః|
విద్యాహీనా నశోభంతే నిర్గంధా ఇవకింశుకాః||

తా. రూపము, ప్రాయము, సంపద, మంచికుల గోత్రములు, ఇవి గలవారై నను విద్య(విద్య - 1.జ్ఞానము, 2.చదువు.)లేనివారు ప్రకాశింపరు. అది యెట్లనిన, మోదుగ పువ్వులు ఎంత యెరుపు(ఎఱుపు) గలిగినవైనను పరిమళము లేనందు వలన ప్రకాశింపవు గదా. - నీతిశాస్త్రము 

బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ|
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ. - 177

శశధరుఁడు - చంద్రుడు, వ్యు.శశమును ధరించువాడు.
శశస్య ధరః శశధరః - కుందేటిని ధరించినవాఁడు.
శశకము - కుందేలు, రూ.శశము.
శశతి ప్లుతేన గచ్ఛతీతి శశః, శశ ప్లుతగతౌ. - దాఁటుచుఁ బోవునది, కుందేలు. 
కుందేలు - చెవులపోతు, శశము Rabbit. తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరునా?శశోరము -కుందేటి వెంట్రుకలతో నేసిన కంబళి. 

శశోర్ణం శశలోమని,
శశస్య ఊర్ణం శశోర్ణం - కుందేటియొక్క వెండ్రుక. ఒకటి కుందేటి వెండ్రుకల పేరు.

వంటయింటికుందేలు - (భౌతి.) స్వాధీనమైనది.

కుందెనకొమ్ము - కుందేటికొమ్ము.
కుందేటికొమ్ము - జాతీ. అసంభవము, హుళక్కి, వి.ఒక తెగ గడ్ది.

అథ శశాదనః, పత్త్రీ శ్యేనః -
శశాదనము - డేగ, వ్యు.కుందేళ్ళను చంపునది. 
శశం అత్తీతి శశాదనః, అదభక్షణే. - కుందేటిని భక్షించునది.
పత్రి - 1.డేగ, 2.పక్షి, 3.బాణము, 4.కొండ, 5.మ్రాను, వై.వి.పత్తిరి.
ప్రశస్తం పత్త్రం పక్షో (అ)స్యాస్తీతి పత్త్రీ, న. పు. - మంచిఱెక్కలు గలది(డేగ).
పత్రం పక్షో (అ)స్యాస్తీతి పత్రీ, న. పు. - గఱులు గలది(బాణము).        

పక్కి - పక్షి, పులుగు, సం.పక్షీ.
పక్షి - (పక్షములు గలది) పులుగు.
పులుగు - పిట్ట.    

పత్రిణౌ వర పక్షిణౌ -
పత్రిన్ శబ్దము అమ్మునకును, పక్షికిని పేరు.
పత్రాని పక్షాః అస్య సంతీతి పత్రి, న. పు. - ఱెక్కలు గలది.

శ్యేనము - డేగ, వ్యు.వేగముగా బోవునది.
డేగ - శ్యేనము.
శ్యాయతే శ్యేనః, శ్త్యైఙ్ గతౌ. - తీవ్రముగాఁ బోవునది. ఈ 3 డేగ పేర్లు.
డేగకన్ను - నిశితదృష్టి.

కడసరము - ఒకానొక జాతిడేగ.
కడు(ౙ)జు - ఒకజాతి డేగ.

మారకము1 - 1.అంటువ్యాధి, 2.డేగ, వ్యు. చంపునది.
ఎపిడమిక్ - (Epidemic) (గృహ.) అంటువ్యాధి, ఊరంతయు వ్యాపించెడి వ్యాధి.
మారకము2 - (అర్థ.) వినియము ఒకదేశపు ద్రవ్యమునకు మరియొక దేశపు ద్రవ్యములో గల విలువ.

పతత్రి - పక్షి, వ్యు.రెక్కలుగలది.
పతత్రే పత్రే చ అస్యస్త ఇతి పతత్రీ, పత్రీచ, న. పు. - ఱెక్కలు గలది. 
పత్రరథము - పక్షి, వ్యు.రెక్కలే రథముగా గలది.
పత్త్రానిరథః గమనసాధనమస్యేతి పత్త్రరథః - ఱెక్కలే రథముగాఁ గలది.
పతత్రము - 1.రెక్క, 2.పత్రము.

పక్షము - 1.నెలయందు బదునైదు దినములు(శుక్ల కృష్ణ పక్షములు), 2.రెక్క.
రెక్క -
రెక్క, పక్షివిరక.
పక్షచరుఁడు - 1.చంద్రుడు Moon, 2.సేవకుడు.
పక్షాంతము - 1.పున్నమ, 2.అమవస.

పక్షపాతము - ఒక ప్రక్క కొరగుట, పక్షపాత బుద్ధితో మెలగుట.
పక్షవాతము - శరీరము నొక ప్రక్క కొరగచేసెడి రోగము.

శృంగి - 1.పాపమీను, 2.ఏనుగు, 3.కొండ, 4.మ్రాను.
సింగి - ఎరుకది, సం.శృంగీ.
ఎఱుకత - బోయ స్త్రీ, ఎఱుకసాని. 
బోయత - కిరాత స్త్రీ, రూ.బోయత, (చెంచెత వలె).
చెంచు - ఒక తెగ బోయ.

మద్గురస్యప్రియ శృఙ్గీ - 
మద్గురస్య జలాంతర్య్మకరస్య ప్రియా శృంగీత్యుచ్యతే - శృంగీ శబ్దము మద్గురమను మీనుయొక్క పెంటిపేరు.
శృణాతీతి శృంగీ, ఈ. సీ. శౄ హింసాయాం. - హింసించునది. ఆఁడు మద్గురము పేరు.

ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏనుగు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.
దంతి - ఏనుగు, విణ.కోరపండ్ల వాడు.
దంతావస్యస్త ఇతి దంతీ, న. పు. దంతావళశ్చ - దంతములు గలది.
దంతావళము - ఏనుగు, వ్యు.ప్రశస్త దంతములు గలది.

ఘోణి - ఏనుగు, దోమ, పంది.
స్థూలా ఘోణాస్యాస్తీతి ఘోణీ న. పు. - పెద్ద మోర గలది. 

ఏనుఁగు - ఏనిక, విణ.పెద్దది, రూ.ఏనుగు.
ఏనిక - దంతి, ఏనుగు, సం.అనేకపః.

ఏనికదోమ - ఒక తెగ పెద్దదోమ, ఘోణిక.
దోమ - చీకటీగ, మశకము.
చీఁకటి యీఁగ - చిన్నదోమ.
మశకము - దోమ.
మశహరి - దోమతెర, రూ.మశకహరి.
దోమతెర - దోమలు చొరకుండ వేయు వల గుడ్డ.
మలేరియా - (గృహ.) (Malaria), చలి జ్వరము, (ఈజ్వరము దోమ కుట్టుట వలన కలుగును.)

పంది - సూకరము.
సూకరము - పంది, శూకరము.
శూకరము - రక్షింపబడని దుష్టాశ్వము.
బహూ న్యపత్యాని సూతే సూకరః, షూఞ్ ప్రాణిప్రసవే. - అనేకములైన పిల్లల నీనునది.
పా, శుచః కరః శూకరః - దుఃఖమును జేయునది.

తిమ్మప్పఁడు - వేంకటేశ్వరుడు, కొండ మీది తండ్రి. 

కొండ - మల, పర్వతము.
మల - పర్వతము, మలై.
మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
పార్వతి - 1.గౌరీ (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

మ్రాను - మాఁకు; మాకు - మ్రాను; మ్రాఁకు - మాను, చెట్టు.
చెట్టు - 1.గుల్మము, 2.వృక్షము.

మ్రానుద్రిమ్మరి - కోతి monkey.

శశకో(అ)హం మశకో(అ)హం పురా మతంగజో(అ)హం మన్సుష్యో(అ)హం
ఇత్యన్యోన్యం జల్పంతః కాశీపురనూతన పశుపతయః |
 
భా|| వారణాసిలో నవీనముగా బయలు వెడలు చున్న శంకరులు తామొక రొకరితోఁదొలి జన్మమున నేను గుందేలు(Rabbit)ననియు, నేను దోమ ననియు, నేను మనుష్యుఁడననియు, నేను దంతావళముననియు నీవిధముగా మాటలాడుకొను చుందురు. (కాశీపురమునఁ పంచత్వము - మరణమును బొందిన శశక మశక గజ మనుష్యులు సమానముగ శంకరస్వరూపమును బొందు చున్నారని భావము)

నరుని నిను రాజ్యలక్ష్మి యేవరుసఁ గోరె
హరిని నినుఁ జెంచులక్ష్మి యే యదును నందె
నరహరుని బీదసాదలు నన్నియుంద్రు
సిరుల నిడుము వేదాద్రి లక్ష్మీనృసింహ|  

గుదియతాలుపు - యముడు, దండధరుడు.
యముఁడు - 1.కాలుడు, 2.శని Saturn, వికృ.జముడు.
గద - దుడ్డువలె నుండు ఒకరకపు ఆయుధము, వికృ.గుదియ.
గుదియ - 1.ఇనుపగద, 2.నాలుగు మూరలదండము, (యమ)దండము, 3.గుదిగిఱ్ఱ, రూ.గుదె, సం.గదా.
గుదిగఱ్ఱ - పోట్లావు మొ.గు వానికి మెడను గట్టెడు కొయ్య.
గుదిపడు (గుది+పడు) - క్రి.కట్టుపడు, స్తబ్ధమగు.

దండధరుఁడు - యముడు.
కాలదండాఖ్యస్య దండస్య ధరః దండధరః, దండంధారయతితీవా, దృ ధారణే - కాలదండ మనెది దండమును ధరించినవాఁడు.  
దండి - 1.ప్రతాపము, 2.గొప్ప, సం.వి.1.యముడు, 2.ద్వారపాలకుడు, విణ.దండముగలవాడు.
దండము - 1.దండము, 2.రాజు ధనవంతుని బలాత్కారము చేసి పుచ్చుకొనెడు ధనము, 2.అపకారి అపరాధి వలన గొనెడు డబ్బు, 4.జరిమానా, 5.నష్టము, రూ.దండుగు, దండుగ, దండువు. అన్ని దండుగ పనులే. ఏంతో నష్టము వచ్చింది. అంతా నష్టమే.   
దండనము - శిక్ష, దండించుట. 
దండించు - శిక్షించు.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

గోపాలుఁడు - 1.గొల్ల, 2.శ్రీకృష్ణుడు, 3.రాజు, 4.శివుడు.
గాః పాతీతి గోపః, గాః పాలయతీతి గోపాలః. పా రక్షణే; పాలరక్షణే. - ఆవులను రక్షించువాడు.    

గోపే గోపాల గోసంఖ్య గోధు గాభీర వల్లవాః,
గా స్సంచష్టే గోసంఖ్యః. చక్షిఙ్ వ్యక్తాయాం వాచి. - ఆవులను విచారించువాఁడు.

గోస్వామి - 1.గోపాలుడు, 2.రాజకుమారుడు, 3.జితేంద్రియుడు. గోపాలం చింతయే ద్బుధః|   

గోపుఁడు - రక్షించువాడు, 1.రాజు, 2.గొల్లవాడు, (చరి.) మౌర్య కాలమునాటి గ్రామాధికారి. (అయిదింటిపై గాని, పదింటిపై గాని అధికారము కలిగి గ్రామములోని భూములు ఆదాయ వ్యయములను, జనాభాను, దానవిక్రయముల జాబితాలను తయారుచేయుట, ప్రజల ఆర్థిక సాంఘిక పరిస్థితుల వివరములను గ్రహించుట యాతని ముఖ్యకర్త్యవ్యము లై యుండును.)   

గొల్ల1 - 1.గొల్లజాతి, 2.పాడి పసరముల మేపి పాలమ్మి జీవించు జాతి, సం.గోపాలః.
గొల్ల2 - 1.ద్వారపాలకుడు, 2.కోశాగారమును కాపాడువాడు.

వేత్రవతీ - ఒక నది.
వేత్రయోగా ద్వేత్రవతీ, ఈ. సీ. - ప్రేఁపతీఁగెలు గలది.

వేత్రహస్తుఁడు - ప్రతిహారుడు, చోపుదారు, పణిహారుడు.
ౘాపుదారుఁడు - వేత్రధరుడు, హిం. చోబ్ దార్.
వేత్రము - చేతికఱ్ఱ, బెత్తము. 

ప్రతీహారే ద్వారపాల ద్వార్థ్స ద్వార్థ్సిత దర్శికాః,
ప్రతిహారి - ద్వారపాలకుడు, పడిహారి.
ప్రతిహరతి నూతనజనాన్ ప్రతీహారః - నూతన జనులను పరిహరించువాఁడు.
పడిహారి - పణిహారి, ద్వారపాలకుడు, సం.ప్రతీహారీ.
పణిహారి - పడిహారి.
ద్వారపాలకుఁడు - వాకిటి కావలివాడు.
ద్వారం పాలయతీతి ద్వారపాలః, పాల రక్షణే వాకిలిని గాచియుండువాఁడు.
ద్వార్థ్సికుఁడు - ద్వారపాలకుడు, రూ.ద్వార్థ్స్యుడు.
ద్వారి తిష్ఠతీతి ద్వార్థ్యః, ద్వార్థ్సితశ్చ, ష్ఠా గతి నివృత్తౌ. - ద్వారమండువాఁడు ద్వార్థ్సుఁడు, దార్థ్సితుఁడు.
దర్శకుఁడు - ద్వారపాలకుడు, విణ.చూపెడువాడు, 2.నేర్పరి.
దర్శయతి జనాన్ దర్శికః. - జనులను రాజునకు జూపించువాఁడు.
ద్వారము - 1.వాకిలి, 2.ఉపాయము.
దువారము - ద్వారము, వాకిలి, రూ.దోరము, సం.ద్వారమ్.
దోరము - దువారము, ద్వారము.
వాకిలి - గృహద్వారము.
వాకిట నున్న వారిని రాజునకుఁ జూపించువాఁడు గనుక ద్వార్థ్సిత దర్శకుండని యొకపేరని కొందఱు. ఈ 6 వాకిటికావలివాని పేర్లు.

ఘూర్జరము - గుజరాతు దేశము.
ఘర్ఝరము - 1.కొండదారి, 2.ఉరుము, 3.వాకిలి, 4.గుడ్లగూబ, 5.హాస్యము.
ఝు ర్ఘ తే భాషత ఇతి ఝుర్ఘ పరిభాషణ సంతర్ణ సయోః. - ధ్వనిఁ జేయునది.
ఝుర్ఘే తి శబ్దము రౌతీతి ఝు ర్ఘ రః. - ఝు ర్ఘ యనెడి ధ్వనిని బలుకునది.
ఉఱుము1 - ఉడుము.
ఉడుము - బల్లి వంటి పెద్ద జంతువు, గోధ, రూ.ఉఱుము.
ఉఱుము2 - క్రి.గర్జించు, వి.1.మేఘధ్వని, 2.వీరహుంకారము.
ద్వారము - 1.వాకిలి, 2.ఉపాయము.
వాకిలి - గృహద్వారము. 

మొగ - 1.ద్వారము, 2.వాకిలి, 3.ఆప్రాణివస్తు ముఖము, 4.మొన, సం.ముఖమ్.

కొణౙా - వాకిటి కావలి యిల్లు.

ద్వారబంధము - వాకిలి కమర్చిన మ్రాని చట్టము.

దిడ్డి - పెద్దవాకిలి ప్రక్కనుండు చిన్నవాకిలి.

గూబ1 - చెవిగూబ, కర్ణమూలము. 
గూబ2 - గుడ్లగూబ, సం.ఘూకః.
ఘూకము - గుడ్లగూబ.
ఘూ ఇతి రవం కరోతీతి ఘూకః. - ఘూ యని కూయునది.
ఘూకి - ఆడు గుడ్లగూబ.

ఘోరదర్శనము - 1.పులి, 2.గూబ.

చెప్పినమాట వినకపోతే నీగూబ పగలగొడతాను అంటూంటారు.

గూండ్ర - 1.గుడ్లగూబకూత, 2.కడుపులో కలుగు వికారము.     

హాస్యము - 1.నవ్వు, 2.గేలి, 3.(అలం.) ఒక రసము.
హాసము - నవ్వు (ఆరు విధములు:- స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, అపహసితము, అతిహసితము).  

ఆద్వా రేణచ నాతీయాద్గ్రామందా వేశ్మనా వృతం|
రాత్రౌ చ వృక్షమూలాని దూరతః పరివర్జ యేత్||
 
తా. గ్రామమునకుగాని, యింటికిగాని వాకిలివిడిచి తప్పుత్రోవలో పోరాదు, రాత్రియందు వృక్ష మూలమును పరిత్యజింప వలయును. – నీతిశాస్త్రము

దండి - 1.ప్రతాపము, 2.గొప్ప, సం.వి.1.యముడు, 2.ద్వారపాలకుడు.
దండించు - క్రి.శిక్షించు.

ఉపదర్శకుఁడు - 1.తప్పునడవ కుండ చూచుకొను అధికారి, 2.చూచువాడు, చూపువడు, వి.ద్వారపాలకుడు.

భూభృత్తు - రాజు, కొండ.
భూభుజుఁడు - రాజు.
రాజు - 1.రేడు, రాచవాడు, 2.ఇంద్రుడు, 3.చంద్రుడు.

భూభృద్భూమిధరే నృపే,
భూభృచ్ఛబ్దము పర్వతమునకును రాజునకును పేరు. భువం బిభర్తీతి భూభృత్, త. పు. డు భృఞ్ ధారణ పోషణయోః. - భూమిని భరించునది.

దేవీ కృతాభిషేకాయామ్ -
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దేవపుత్రీసంజ్ఞకత్వాద్దేవి, సి, దేవపుత్రి యను పేరుగలది(దేవి).
దివ్యతీతి దేవి, ఈ. సీ. దివుక్రీ డాదౌ. - ప్రకాశించునది. 
దీవ్యతీతి దేవీ, దివు క్రీడాయాం. - క్రీడించునది. ఈ ఒకటి పట్టభిషిక్తురాలైన రాజభార్య (రాణీ) పేరు.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు.

రాణి - రాజ్ఞి, భార్య. రాజ్ఞి - రాణి.
రాణివాసము - 1.అంతఃపురము, 2.రాజు భార్య.
స్త్య్రగారం భూభుజా మన్తఃపురం స్యా దవరోధనమ్, శుద్ధాన్తశ్చావరోధశ్చ - 
అంతఃపురము - రాణివాసపు స్త్రీలుండుచోటు, వికృ. అంతిపురము, అంతపురిః.
అంత రభ్యంతరం పురం గృహ మంతపురం, "అగారే నగరేపుర" మితి రత్నమాలాయాం, పురమనఁగా గృహము, లోపలిగృహము అంతఃపురము.
అంతఃపురి - అంతఃపురము.
అవరోధము - 1.అంతఃపురము, 2.అంతఃపురస్త్రీలు, 3.అడ్డగింత, 4.ముట్టడి, 5.చెర.
అవరుధ్యంతే రాజస్త్రియో (అ)త్ర అవరోధనం, అవరోధశ్చ రుధిర్ ఆవరణే. - రాజస్త్రీలు దీనియందు నిరోధింపఁబడుదురు.
శుద్ధాంతము - 1.అంతఃపురము, 2.అంతపురస్త్రీ. 
శుద్ధాః పరిశుద్ధాః రక్షకాః అంతే సమీపే అస్యేతి శుద్ధాన్తః - పరిశుద్ధులైన రక్షకులు సమీపమందుఁ గలిగినది.

సౌవిదల్లుఁడు - అంతఃపురకావలివాడు, రూ.సోవిదుడు.
సుష్ఠు వేత్తీతి సువిత్-రసికః, తం లాన్తి వల్లభత్వేన స్వీకుర్వన్తీతి సువిదల్లాః స్త్రియ, తాః పాలయన్తీతి సౌవిదల్లాః - లెస్సగా నెఱిఁగినవానిఁ దమకు నాయకునిఁగా స్వీకరించువారు గనుక సువిదల్లనఁగా స్త్రీలు; వారిని గాచుకొనియుండు వారు సౌవిదల్లులు.
సుష్ఠు విదన్తీతి సువిదః ప్రగల్భాః స్త్రియాః; తాః రక్షన్టీతి సౌవిదాః. - లెస్సగా నెఱుంగువారు గనుక సువిద లనగా ప్రౌఢస్త్రీలు; వారిని గాచువారు.

అంగజాల - అంతఃపురపు కావలివాడు.

అంగ - కాలు చాచి పెట్టిన అడుగు.
అంగదట్టము - పావడ, పరికిణి.

అన్తపురే త్వథికృత స్స్యాదన్తర్వంశికో జనః,
అధికృతుఁడు - అధికారమున నియమింప బడినవాడు, అధికారి.
అన్తః అభ్యన్తరో వంశో గృహం తస్మిన్ నియుక్తః అంతర్వం శికః అన్తపురే అధికృతః. ఈ 1 అంతఃపురాధికారి పేరు.

వర్షవరుఁడు - అంతపురపు కావలివాడు.
వర్షం రేతస్సేకం వృణోతీతి వర్షవరః, వృఞ్ వరణే. - రేతస్సేకము నాచ్ఛాదించువాఁడు.
వర్షస్య రేతఃపాతస్య వరః వర్షవరః. - రేతః పాతము గోరువాఁడు. తదుక్తం "యే త్వల్పసత్త్వాః ప్రథమాః క్లీబాశ్చ స్త్రీ స్వభావినః, జాత్యా న దుష్టాః కార్యేషు తేనై వర్షవరాః స్తృతాః" ఇతి.

ఎగ్గడికత్తె - అంతఃపుర కావలికత్తె.   

అసూర్యపశ్య - ఎండకన్నెరు గనిది (అంతఃపుర స్త్రీజనము).    
ఎండకన్నెఱుఁగని - జాతీ. రాణివాసమందుండి బయటికిరానట్టి (ఎండ కన్నెఱుగని) పుట్టు, భోగి, ఎండకన్ను, వాన కన్ను ఎరుగని వారు. )

నీతము - నియతము, నియమము, సం.నియమ్, సం.విణ.1.తేబడినది, 2.పొందబడినది.

సిద్ధుఁడు - అణిమాది సిద్ధులు పొందినవాడు.
సిద్ధి - 1.ఈడేరుట, 2.అణిమాద్యష్ట సిద్ధులు.
ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద. 
అణిమ - 1.అణుత్వము, 2.ఒక ఐశ్వర్యము, అష్టసిద్ధులలో ఒకటి, రూ.అణిమము. 
అణిమా, అణుత్వం సూక్ష్మతయా యా లభ్య తే సా అణిమా.  

పురారాతే రన్తః-పురమపి తత స్త్వచ్చరణ యోః
స్సపర్యామర్యాదా- తరళకరణానా మసులభా|
తథా హ్యేతే నీతా - శ్శతమఖముఖా స్సిద్ధి మతులాం
తవ ద్వారోపాన్త - స్థితిభి రణిమాధ్యాభి రమరాః|| - 95శ్లో

తా. అమ్మా! నీవు శివునికి అంతఃపురమవు (రాణివి) అందువలన ఛపల చిత్తులకు నీ పాదపూజ సపర్య-1.పూజ, 2.సేవ.)సులభముగ లభింపదు. ఎట్లన? మఖవంతుఁడు - ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు నీ వాకిటయందున్న యణిమాది సిద్ధులచే గొప్ప లాభమును పొందుచున్నారు. - సౌందర్యలహరి

మలయము - 1.ఒక కొండ, 2.ఆరామము.
ఆరామ స్స్యాదుపవనం కృత్రిమం వనమేవ యత్,
ఆరామము - ఉపవనము, తోట, వ్యు.విహరించు స్థలము.
ఆరమన్త్యత్ర ఆరామః - ఇందు క్రీడింతురు.
ఉపవనము - పెంచినతోట, ఉద్యానము, అవ్య.పవసమీపమున.
ఉపగతం వనం ఉపవనం,
తోఁట - 1.ఉపవనము, 2.ఆశ్రమము.
తోఁట సేద్యము -
(వృక్ష.) ఎక్కువ నీరు నిలువకుండ తగుమాత్రము నీరు పెత్తి పైరులను సాగుచేయు పద్ధతి. దీనికి అనుకూలముగా నుండు నేలలు 'తోట నేలలు' అనంబడును, (Garden cultivation).  
ఉద్యానము - 1.(రాజుల) విహార్థమైన తోట, 2.విహారముకోరకు వెడలుట, 3.ప్రయోజనము.  
2.
ప్రాదయో గతాద్యర్థే ఇతి సమాసః, యత్ కృత్రిమం వనం తదేవ. ఈ 2 మనుస్యులు వేసి పెంచిన తోఁట పేర్లు.    

మలయమ్మ - (మల+అమ్మ) పార్వతి.
పార్వతి - 1.గౌరీ(పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

గందపుఁగొండ - (గంధము+కొండ) మలయాచలము.
తావిగట్టు - మలయ పర్వతము.

గన్ధసారో మలయజో భద్రశ్రీ శ్చన్దనో స్త్రియమ్,
గంధేనసారః గంధసారః - పరిమళముచేత నుత్కృష్టమైనది.
మలయజము - చందనము.
మలయశైలే జాతః మలయజః జనీ ప్రాదుర్భావే. - మలయపర్వతము నందుఁ బుట్టినది.
భద్రశ్రీ - చందనము, గంధము.
భద్రా శ్రీ శ్శోభా స్య భద్రశీః , ఈ. పు. - శుభ స్వరూపమైన యొప్పిదము గలది.
శ్రీఖండము - చందనము.
చందయతీతి చందనః ప్న. చది ఆహ్లాదనే. ఆహ్లాదమును జేయునది. ఈ 4 చందనము పేర్లు.
సిరిగంధము - శ్రీచందనము, సం.శ్రీగంధః. 

చందనము - 1.కుంకుమపువ్వు, 2.గంధము, (ఇది Santalaceae అను కుటుంబమునకు చెందిన Santalum album అను మొక్క యొక్క కఱ్ఱ (Sandal wood) ముదిరిన కఱ్ఱ నుండి చందన తైలమును తీయుదురు.)

గంధవతి - 1.కల్లు, 2.వ్యాసునితల్లి, 3.నేల, 4.అడవిమల్లె, 5.వాయుదేవుని పురము.
గంధే నోత్తమా గంధోత్తమా - పరిమళముచేత నుత్తమమైనది.

గంధము - 1.గర్వము, 2.గంధకము, 3.సంబంధము, 4.చందనాది లేపన ద్రవ్యము, (రసా.) వాసన (Odour).  

సగంధుఁడు - స్నేహితుడు.   

గంధకము - పసుపురంగు గల ఖనిజ వస్తువు, (రసా.) ధాతువు కాని పసుపు రంగుగల ఒక మూల పదార్థము (Sulpher). చెట్టుచేనులకు కావలసిన ప్రధాన మూలద్రవ్యములలో ఒకటి, ఒక మందు దినుసు.    

సంబంధము - 1.చుట్టరికము, 2.కూడిక.
చుట్టరికము -
బంధుత్వము, సంబంధము.
సాంగత్యము - కూడిక. 
కూడిక - సంయోగము, చేరిక, (Addition).
సంయోగము - కూడిక, సం.వి. (రసా.) 1.రెండుద్రవ్యముల రాసాయనికముగ నుపయోగించుట(Combination), 2.కొన్ని మూలకముల రసాయనసమ్మేళవమువలన నేర్పడిన పదార్థము (Compound).
చేరిక - 1.కూడిక, 2.సమీపము.
సదేశము - సమీపము; సమీపము - చేరువ.
సమర్యాదము - సమీపము, విణ.మర్యాదతో కూడినది.

బంధుత్వము - (రసా.) రాసుల సమూహము (Affinity), (గృహ.) చుట్టరికము, సంబంధము (Relationship). 

అతిపరచయాదవజ్ఞః - సంతత గమాదనాదరః భవతి !
మలయేభిల్లీ పురంధ్రీ - చందన తరూన్ ఇంధనం కురుతే ||

తా. ఎవరితోనైనా అతిపరిచయం వల్ల అవజ్ఞ - అవమానము, ఎప్పుడూ వెళ్ళడం వల్ల అనాదరణ జరుగుతుంది. అరుదైన విలువైన చందన వృక్షం మలయ పర్వతంలో అతిగా దొరకడం వల్ల - అక్కడి  పురంధ్రీ - కుటుంబిని, స్త్రీ.)గిరిజన స్త్రీలు వంట వండేందుకు ఇంధనంగా వాటిని వాడతారు కదా!

తనను కొట్టిన గొడ్డలికే పరిమళం ప్రసాదిస్తుంది చందన తరువు! 

సౌరభము - 1.తావి, వాసన, 2.ఎద్దు, 3.కుంకుమము.
తావి - పరిమళము; పరిమళము - మంచుతావి.
తావిమోపరి - గాలి, గంధవహుడు.

విమర్దోత్థే పరిమళో గన్ధే జనమనోహరే,
పరిమళశబ్దః సమ్మర్దోత్పన్నే జనమనోహరే గన్ధే వర్తతే - పరిమళ శబ్దము నానద్రవ్యముల మెదుపుటవలనఁ బుట్టిన జన మనోహరమైన గంధముపేరు. మల్యతే ధార్యత ఇతి పరిమళః, మల మల్లధారణే. - ధరింపఁబడునది. ఈ ఒకటి పరిమళము పేరు.

ఆమోదము - 1.సంతోషము, 2.పరిమళము.
ఆసమంతాన్మోదః ఆమోదః - అంతటను మోదము.
సమ్మదము - సంతోషము.
సమ్యఙ్మదః సమ్మదః - మంచి సంతోషము సమ్మదము.

ఆమోద స్సో (అ)తినిర్హారీ -
స ఏవ అతినిర్హారీ అతిదూరగామీ చేత్ ఆమోద ఇత్యుచ్యతే. - ఆమోదశబ్దము మిక్కిలి దూరముగా వ్యాపించునట్టి యా పరిమళము పేరు. ఆ సమతాన్యోదతే అనేనేత్యామోదః, ముద హర్షే. - అంతట దీనిచేత సంతోషింతురు. ఈ ఒకటి సుగంధము పేరు.   

మోదము - 1.వాసన, 2.సంతోషము.
మోదయతీతి ముత్, ద. సీ. మోదశ్చ, ముద హర్షే - సంతోషింపఁజేయునది.
వాసన - 1.గంధము, 2.సంస్కారము, (రసా.) ముక్కుచే గ్రహింపబడు జ్ఞానము (Odour).

సౌరభేయము - ఎద్దు.
సురభే రపత్యం సౌరభేయః - ఆవునకుఁ బుట్టినది.
గచ్ఛతి సుచిరమితి గౌః. ఓ.పు. - తిన్నగా నడుచునది.
అనడుహ్, సౌరభేయ - గో శబ్దములు ఆవులకు పేర్లు. అప్పుడు అనడుహీ, సౌరభేయీ అని యీకారంతములుగా నుండును. గోశబ్దమునకు రూపము తుల్యము.  

సౌరభేయి - ఆవు.
సురభే ర్గోత్రాపత్యం స్త్రీ సౌరభేయీ, ఈ. సీ. - సురభి యనఁగా కామధేనువు; దాని వంశమందుఁ బుట్టినది.

సౌరభం గన్ధం అర్వన్తి గన్ధర్వాః - సువాసనను పొందువారు. అర్వ గతౌ - గంధర్వులు, హాహాహూహూ ప్రభృతులు.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ. ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.

అథ కుఙ్కుమమ్, కాశ్మీరజన్మాగ్ని శిఖం బాహ్లిక పీతనమ్,
రక్తం సంకోచపిశునం ధీర లోహిత చన్ధనమ్,
కాంతరజము - కుంకుమము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.
శుష్కదశాయాం కుమితె కుయతే కుంకుమం, కు శబ్దే. - ఎండినప్పుడు కుమని పలుకునది.  
కాశ్మీరము - 1.కుంకుమవ్వు, 2.మెట్టతామర దుంప, 3.కాశ్మీరదేశము.
కాశ్మీరే జన్మాన్య కాశ్మీరజన్మ, న. న. - కాశ్మీరదేశ మందుఁ బుట్టినది. కాశ్మీరేయ సరస్వతీ శక్తిపీఠం|
కుంకుమపువ్వు - అగ్నిశిఖయను అంగడి దినుసు, కాశ్మీరము, (వ్యవ.) 'ఇరిడేసి' (Iridacease) అను కుటుంబమునకు చెందిన Crocus sativus  అను మొక్క యొక్క పుష్పములలోని కీలాగ్రములు. ఇవి నారింజ వర్ణముతో గూడిన ఎరుపు రంగు కలిగియుండును. ఇది పరిమళ ద్రవ్యముగను, ఓషధిగను ఉపయోగింప బడుచుండును (Saffron).
వహ్నిశిఖము - కుంకుమపువ్వు; ఘుసృణము - కుంకుమపువ్వు.
అగ్నిశిఖము - కుంకుమపువ్వు.
అగ్నిరివ పింగళవర్ణాః శిఖాః కేసరాః అస్యేతి అగ్నిశిఖం. - అగ్నివంటి వర్ణము గల యాకరులు గలది.   
బాహ్లికము - 1.ఇంగువ, 2.కుంకుమపువ్వు, 3.ఒక దేశము.
బాహ్లికదేశే భవత్వాత్ బాహ్లికం. - బాహ్లిక దేశమందుఁ బుట్టినది, దీర్ఘ మధ్య్మని కొందఱు.

రుధిరము - 1.నెత్తురు, రక్తము, 2.సిందూరము.
రుద్యతే త్వచా రుధిరం రుధిర్ ఆవరణే. - చర్మముచేత కప్పఁబడునది.
సింధూరము - కుంకుమ, చెందిరము.
కుంకుమ - నుదుట బెట్టుకొను రాగద్రవ్యము, ఎఱ్ఱని చూర్ణము, చెందిరము, రూ.కుంకుమ, కుంకుమము, సం.కుంకుమమ్.

అరుణము - 1.ఇంచుక ఎరుపు, 2.కపిలవర్ణము, 3.సంధ్యారాగము, 4.బంగారు, 5.కుంకుమ, 6.రాగి, 7.నెత్తురు, విణ. ఇంచుక ఎఱ్ఱనిది, రూ.అరుణిమ.
రక్తము - 1.నెత్తురు, 2.కుంకుమ, 3.ఎరుపు.
రక్తవర్ణత్వాత్ రక్తం. - ఎఱ్ఱనివన్నెగలది. 
లోహితము - 1.రక్త చందనము, 2.సింధూరము, 3.నెత్తురు blood.
లోహితవర్ణత్వాత్, లోహితం. - ఎఱ్రనివన్నె గలది.
లోహితవర్ణత్వాత్ లోహితం. రక్తం చ. - ఎఱ్ఱని వన్నె గలది, లోహితము రక్తము.
చందనము - 1.కుంకుమపువ్వు, 2.గంధము, (ఇది Santalaceae అను కుటుంబమునకు చెందిన Santalum album అను మొక్క యొక్క కఱ్ఱ (Sandal wood) ముదిరిన కఱ్ఱ నుండి చందన తైలమును తీయుదురు.)
చందయత్యాహ్లాదయతీతి చందనం, చది ఆహ్లాదనే. - సంతోషమును జేయునది.  ఈ 11 లోహితచందనమని యొక్క పేరుగాఁ గొందఱు, కుంకుమపువ్వు పేర్లు.

క్షతజము - 1.నెత్తురు, 2.చీము.
క్షతా జ్ఞాయత ఇతి క్షతజం. - గండివలనఁ బుట్టినది.
క్షతము - 1.గాయపడినది, 2.చీల్చబడినది, 2.నాశనమైనది, సం.వి.1.గాయము, 2.చీల్చుట, 3.దెబ్బ.
క్షతి - 1.గాయము, 2.నాశము.

అంబరము - 1.ఆకాశము Sky, 2.శూన్యము, 3.వస్త్రము, 4.కుంకుమపువ్వు, 5.అంబరు అనెడి పరిమళద్రవ్యము, 6.ద్యూత్యాది వ్యసనము.

అంబరు-ఒక పరిమళద్రవ్యము, సం.అంబరమ్.

అంగరాగము - 1.చందనాది ద్రవ్యము, 2.చందనాదుల పూత, 3.మేని యెరుపు.

ముఖం పద్మదళాకారం వచ శ్చందన శీతలమ్|
హృత్కర్త రీసమం చాతివినయం ధూర్త లక్షణమ్|
తా.
తామరరేకులవంటి ముఖము - 1.మొగము, 2.నోరు, 3.మాట, 4.ముందటి భాగము.)ముఖ వర్చస్సును, శ్రీగంథమువలె చల్లనిమాటలును, కర్తరి - కత్తెరతో సమానమగు హృదయమును, అతి వినయమును ఇట్టివి ధూర్తుఁడు - 1.జూదరి, 2.మోసకాడు, రూ.ధూర్తు.)మోసగాని లక్షణములు. - నీతిశాస్త్రము.

తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ|
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ.

వంశకము - అదురుచెక్క, అగరు గంధము.
వన్యతే యాచ్యతే వంశకం, వసు యాచనే. - ప్రార్థింపఁబడునది.
వశ్యతే కామ్యత ఇతి వా వంశకం, వస కాంతౌ. - కామింపఁబడునది, పా, వంశికం.
అగురువు - పరిమళద్రవ్యము, అగులు.
న గురు అగురు. - చులకనైయుండునది, పులింగమును గలదు, 'శీతకృత్తే (అ)గురోర్ధదః' ఇతి ప్రయోగః.
అగలు1 - అగరువు.
అగలు2 - క్రి.పెల్లగిలు, పగులు.
అగలిక - చీలిక, పగులు.  

అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్ని చెడ త్రాగుతుంది. అరుగ తీసిన గంధపు చెక్క తరుగును కాని వాసన కోల్పోవునది కాదు.

పూఁత - 1.చందనము, 2.పాలగచ్చు.
విచ్చిత్తి -
1.ఎడబాటు(ఎడఁబాటు - వియోగము.), 2.వస్త్రభూషణాదుల కొలది యైనను ఒప్పిదము గలగజేయు స్త్రీల శ్రంగారాచేష్ట, 2.పూత, 4.నరకుడు.
విచ్ఛేదము - 1.ఎడబాటు(ఎడయిక - ఎడబాటు), 2.నరకుడు.
విచ్ఛిన్నము - 1.ఎడబడినది, నరకబడినది, 2.పూయబడినది. నికృత్తము - నరకబడినది.

నికృంతనము - ఖండనము, నరకుడు.
ఖండనము -
నరకుట.
నరకఁడు - 1.దుష్టుడు), 2.దయలేనివాడు, సం.నరకగః. దుర్జనుఁడు - దుష్టుడు.
మొత్తు - దెబ్బ, క్రి.మోదు, కొట్టు(అడుచు – కొట్టు), నరకు; తెగవేయు - నరకు.

వలసింత సతికిఁ బుట్టక
బలిమిన తమకించి విటుఁడు పైకొనుటెల్లన్
మలయజముసాన మీఁదను
జలముంచక తీసినట్టి చందము సుమతీ.
తా.
సానపై నీరు చల్లకుండా గంధపుచెక్కతో మలయజము - చందనము తీసిన యెట్లు నిష్పలమో అట్లే కొంచెమైనను మోహముగలగని సతి - 1.పతివ్రత స్త్రీ, 2.పార్వతి, (చరి)చనిపోయిన భర్త చితిలో ప్రవేశించి ప్రాణములు విడుచు హైందవ స్త్రీ.) స్త్రీతో, విటుడు బలవంతముగా(తమకము - 1.త్వర, 2.మోహము.)కోరి కామించినను నరర్థక మగును.

గంధవాహుఁడు - వాయువు, గాలి, రూ.గంధవాహుడు, వ్యు.వాసనను కొనిపోవువాడు.
గంధస్య వహో గంధవహః, గంధం వహతీతి గంధవాహః, వహ ప్రాపణే - గంధమును వహించువాఁడు.
గంధవహ - ముక్కు, రూ.గంధవాహ. 
గంధం వహతీతి. గంధవాహా. వహ ప్రాపణే. - గంధమును వహించునది.

వాసన - 1.గంధము, 2.సంస్కారము, (రసా.) ముక్కుచే గ్రహింపబడు జ్ఞానము (Odour).

గంధము - 1.గర్వము, 2.గంధకము, 3.సంబంధము, 4.చందనాది లేపన ద్రవ్యము, (రసా.) వాసన (Odour).

సంస్కారము - 1.చక్క జేయుట, 2.శవమును దహించుట, 3.అనుభూతార్థ స్మృతిపాకము, రూ.సంస్క్రియ.
సంస్క్రియ - సంస్కారము.  

గంధగజము - మదపుటేనుగు, ఒక రకమైన ఏనుగు.

గంధమాదనము - 1.ఒక పర్వతము, 2.ఒకానొక కోతి, 3.మగ తుమ్మెద, 4.మదపుటేనుగు, 5.నల్లని పెద్దతుమ్మెద, విణ.సుఘంధముచే పరవశము చేయునది.

చక్కఁదలంపగా, విధివశంబున నల్పునిచేత నైన దాఁ
జిక్కి యవస్థలన్ బొరలు జెప్పగరాని మహా బలాఢ్యుడున్
మిక్కిలి సత్త్వసంపదలమీరిన గంధగజంబు మావటీ
డెక్కి యదల్చి కొట్టికుదియించిన నుండదె యోర్చి, భాస్కరా.

తా. మావటివానికి గొప్పబలముగల యేనుగెట్లు ఓర్చి లొంగియుండవలసి వచ్చెనొ అట్లే ఎంతటి వాడైనను విధి- 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.)వశమున అల్పుఁడు - నీచుడు చేతనైన (కుంచు - క్రి.కుంగజేయు, కుదించు.)యుండ వలసి వచ్చును.

సౌరభ్యము - 1.వాసన, 2.ఒప్పిదము, 3.గుణగౌరము.     

వాసన - 1.గంధము, 2.సంస్కారము, (రసా.) ముక్కుచే గ్రహింపబడు జ్ఞానము (Odour).
గంధము - 1.గర్వము, 2.గంధకము, 3.సంబంధము, 4.చందనాది లేపన ద్రవ్యము, (రసా.) వాసన (Odour). సగంధుఁడు - స్నేహితుడు.

ఒప్పిదము - 1.అందము, 2.అలంకారము, 3.విధము, విణ.1.మనోజ్ఞము, 2.తగినది.

హర్షము - సంతోషము.
హర్షణము - సంతోషించుట.

సౌరభం గన్ధం అర్వన్తి గన్ధర్వాః - సువాసనను పొందువారు. అర్వ గతౌ - గంధర్వులు, హాహాహూహూ ప్రభృతులు.

బంధుర సద్గుణాఢ్యుఁ డొకపట్టున లంపట మొందియైన దు
స్సంధిఁదెలంపఁ డన్యులకుఁ జాలహితం బొనరించుఁగాక, శ్రీ
గంధముఁజెక్క రాగిలుచు గాదె, శరీరుల కుత్సవార్ధమై
గంధములాత్మబుట్టఁ దఱుంగంబడి యుండుటయెల్ల, భాస్కరా.
తా.
మంచి గంధపుచెక్క సానరాపి చేత తరుగ బడియును, సిరిగంధము - శ్రీచందనము, సం.శ్రీగంధః తనయందు గల పరిమళము వ్యాపించునట్లు జనులకు వేడుక కలిగించును. అట్లే ఆఢ్యుఁడు - ధనికుడు, సమృద్ధికలవాడు. గుణవంతు డొక సమయమున లంపట - 1.అలసట, 2.ఆపద.) కష్టపడి యైనను ఇతరులను సంతృప్తి పరచును.

గంధర్వము - 1.ఒకానొకమృగము, 2.గుఱ్ఱము, 3.మగకోయిల, 4.కడఁతి, మరణమునకును పునర్జన్మమునకును మధ్యకాలమున యాతనా శరీరమును ధరించిన ప్రాణి.

గంధ్యతే కశాదినాపీడ్యత ఇతి గంధర్వః, గంధ అర్ధనే. - కశాదులచేత పీడింపఁబడునది.

గండుఁగోయిల - 1.మగకోయిల, 2.క్రొవ్వెక్కిన కోయిల.

గంధర్వులు - దేవలోకమునందు గానము చేయు ఒక తెగ దేవతలు.     

అన్తరాభవసత్త్వే అశ్వే గన్ధర్వో దివ్యగాయనే -
గంధర్వ శబ్దము అంతర పిశాచమునకును, గుఱ్ఱమునకును, దేవలోక మందు పాడునట్టి విశ్వావసువు మొదలయినవారికిని పేరు. గంధమర్వతీతి గంధర్వః. అర్వపర్వగతౌ. గంధమును బొందును గనుక గంధర్వము, గంధర్వుఁడును.  

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకంచితా|
ఉమా శైలెంద్రతనయా గౌరీ గంధర్వసేవితా.

గాంధర్వము - 1.గానము, సంగీతము, 2.గుఱ్ఱము horse, 3.వధూవరులు పరస్పరేచ్ఛచేత చేసికొను వివాహము, 5.దినము యొక్క పదునేను భాగములలో ఏడవ భాగము.

సంగీతము - గానము.
గానము - 1.పాట, 2.ధ్వని, Sound 3.స్తుతి.
గీతము - పాట, విణ.పలుకబడినది, పాడబడినది. 

గీతం గాన మిమే సమే,
గీయత ఇతి గీతం, గానం చ, గై శబ్దే. - పాడఁబడునది ఈ 2 పాట పేర్లు. ఈ 2 ను సమానర్థకములు.

గీతి - 1.గోపికల గీతము, పాట, 2.వృత్తభేదము, విణ. 1.గానముచేయువాడు, 2.సంగీతముతో చదువువాడు.

సీకారీ - పాట పాడువాడు, గాయకుడు, సం.శ్రీకారీ.
గాయనుఁడు - 1.పాటపాడువాడు, 2.గానము వృత్తిగా గలవాడు.

వివాహము - పెండ్లి, (బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహములు అష్టవిధములు). 

గాంధర్వవేదము - నృత్యగీతవాద్యాభినయాదుల వివరించు ఉపవేదము.

విద్యాశ్చతస్రో సాధ్యాస్స్యుర్జన్మనా సహ సంభవాః|
గాంధర్వంచ కవిత్వంచ శూరత్వం దాన శీలతా||
తా.
జనులకు సంగీతము, కవిత్వము(కవిత - కవిత్వము), శౌర్యము, దానశీలత్వము; ఈ నాలుగు విద్యలు నుత్పత్తితోడ గలుగవలసినవి గాని నేర్పుచేత సాధింపదగినవి కావు. - నీతిశాస్త్రము

త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకంచితా|
ఉమా శైలెంద్రతనయా గౌరీ గంధర్వసేవితా. - 126 

గాంధర్వం త్రివిధం గీత వాద్య నర్తన భేదత|
గీతం వాద్యం తథా నృత్యం త్రయం సంగీత ముచ్యతే|| 

గోకర్ణము - 1.కడితిమృగము, 2.పాము, 3.కంచరగాడిద, 4.ఆవు చెవి ఆకారము గల పాత్రము, 5.దక్షిణ దేశమందలి ఒక శివక్షేత్రము.  
గో రివ కర్ణా వన్యేతి గోకర్ణః - ఆవుచెవులవంటి చెవులు గలది.
గోకర్ణా కృతిరత్రా స్తీతి గోకర్ణః - ఆవు చెవులవంటి ఆకారము గలది, పెనువ్రేలు దర్భవేళ్ళ నడిమి కొలత. గోకర్ణము నందు భధ్రకర్ణిక|

కడఁజు - గోకర్ణమృగము, రూ.కణఁజు.
కడతి - గంధర్వమృగము, రూ.కడితి, కణతి, కణితి.

గన్ధయతి అర్ధయతీతి గన్ధర్వః, గన్ధ అర్దనే. - పీడించునది, వట్రువ తోఁకయు దొడ్డకడుపునుగల మృగము.

బొరుగు - 1.వేపుడుచట్టి, 2.కణితి మృగము.

అశ్వతరము -  1.కంచరగాడిద, 2.పాతాళలోకము నందలి ఒకసర్పము, 3.కోడెదూడ, 4.గంధర్వులలో ఒక తెగ.
కంౘరగాడిద - కంచరము లాగు గాడిద, అశ్వతరము.
వేసడము - కంచరగాడిద, రూ.వేసరము, సం.వెసరః.
ప్రఖరము - 1.గుఱ్ఱపు కవచము, 2.కంచరగాడిద, విణ.మిక్కిలి వాడియైనది.

కోడెరౌతు - వృషభవాహనుడు, శివుడు.
కోడియ - కోడెదూడ, గిత్త, రూ.కోడె.
కోడె - 1.కాడి మరపదగిన దూడ, 2.విటుడు. 
గిత్త - కోడె, పొట్టియెద్దు.  
కోడెకాడు - 1.యుక్తవయసువాడు, 2.విటుడు.

గుజ్జువేలుపు - వినాయకుడు.
గుజ్జు(ౙ) - 1.పొట్టిదనము, 2.కోడెదూడ, 3.పాపట, 4.దూలము మీది గురుజు, 5.క్రొవ్వు, విణ.1.పొట్టివాడు, సం.కుబ్జః.
కుబ్జము - 1.గజ విశేషము, 2.ఒకానొక చెట్టు, విణ.మరుగుజ్జు.
కుబ్జ - పొట్ల.

కుబ్జే గడులః -
కుత్సితం ఉబ్జతీతి కుబ్జ, ఉబ్జ ఆర్జవే. - కుత్సితమైన ఋజుత్వము గలవాఁడు.
గడుర్మాంసగ్రంథిరస్యేతి గడులః - గడు వనఁగా కణతి; వీపునఁగాని ఱొమ్మునగాని ఘనమైన కణితిగలవాఁడు. ఈ 2 ముఱుగుజ్జు వానిపేర్లు. ఱొమ్మునగాని వీఁపునగాని కణితి గలవాఁడు.

గడము1 - కుండలోనగువాని మూత, గడి.
గడము2 - 1.తెర, 2.కంచె, 3.అగడ్త, 4.విఘ్నము, 5.గండె చేప, 6.ఒకానొక దేశము.

గడి - 1.ఎల్ల, సీమ, పొలిమేర, మేర, 2.చదరపు బల్లమీదిగడి, సమీపము, 4.దుర్గము, కోట, 5.కోడెదూడ.
గడువు1 - నిర్ణయకాలము, కాలము యొక్క అవధి, మేర.
గడువు2 - 1.బల్లెము, 2.వానపాము, 3.మెడమీది కంతి. 

సీమంతము - 1.పాపట, 2.గర్భిని స్త్రీలకు చేయు ఒక శుభకర్మము.
సీమంతిని - స్త్రీ; స్త్రీ - ఆడుది.
సీమంతం కేశవీథీ అస్యా ఇతి సీమ న్తినీ సీ. - సీమంతమనఁగా బాపట; అది గలిగినది.

సేన - 1.అక్షత, 2.సేనప్రాలు, 3.పాపట, సం.శీర్షమ్.
సేనవ్రాఁలు - తలబ్రాలు.

కళత్రము - 1.పెండ్లాము, 2.కోట, 3.నితంబము, (జ్యోతి.) లగ్నము నకు ఏడవస్థానము.

కళత్రం శ్రోణి భార్యయోః,
కళత్ర శబ్దము పిఱుదునకును, పెండ్లామునకును పేరు. కల్యత ఇతి కళత్రం, కల సంఖ్యానే. - ఎన్నఁబడునది.   "నృపతి ప్రభృతీనాం తు దుర్గస్థానం కళత్ర" ఇతి శేషః.

ప్రకృతి - (వాక్య.) 1.ప్రత్యయము చేరకముందటి శబ్ద రూపము, 2.సౌరవర్గము, 3.స్వభావము, 4.అవ్యక్తము, (స్వమి, అమాతుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము - ఇవి సప్త ప్రకృతులు). 

దుర్గము - కోట.
కోట - 1.దుర్గపురము, 2.పట్టణము, చుట్టుగల ప్రహరి, సం.కోటః.
కోట్టము - దుర్గపురము, కోట.
కోట్టారము - 1.కోట్టము, 2.కొలని మెట్టు, 3.నూయి.

కటో నాశ్రోణి ఫలకమ్ -
కటి - నడుము.     
కట్యతే అవ్రియతే వస్త్రాదినేతి కటః, కటే వర్షావరణయోః. - వస్త్రాదులచేఁ గప్పఁబడునది.
శ్రోణి - పిరుదు, మొల.
శ్రోణతి సంగచ్ఛతే శోణిః, సీ. పా. శోణీ, సీ. శ్రోణృ సంఘాతే. - సంహతమైయుండునది.
శ్రోణీఫలకము - మొల.
ఫలకాకృతిః శ్రోణిః శ్రోణిఫలకం. - పలకవలె నుండెడు శ్రోణి. ఈ 2 మొలపేర్లు.
మొల - 1.కటి ప్రదేశము, 2.చీల, 3.త్రాసుముల్లు.

తుంటి - కటిపార్శ్వ భాగము, రొండి.
రొండి - నడుము యొక్క పార్శ్వభాగము. 
శ్రోణము - (జం.) తుంటి సంబంధమైనది, కటి సంబంధమైనది (Pelvic).
శ్రోణీచక్రము - (జం.) తుంటికి సంబంధించిన ఎముకల కూర్పు, నితంబ మేఖలము (Pelvic-girdle).

శ్రోణ్యులూఖలము - (జం.) నితంబ మేఖలము నకు ఇరుప్రక్కల నుండు గిన్నె వంటి లోతైన భాగము (దీనిలో తొడ ఎముక యొక్క తల అమరి యుండును).           

కళత్రం వైధాత్రం - కతి కతి భజన్తే న కవయః
శ్రియో దేవ్యాః కో వా - న భవతి పతిః కైరపి ధనైః |
మహాదేవం హిత్వా - తవ సతి! సతీ నామచరమే !
కుచాభ్యా మాసంగః - కురవకతరో రప్య సులభః || - 96శ్లో

తా. ఓ సతీమతల్లీ ! ఎందరు కవులు సరస్వతిని సేవించుటలేదు! ఎవడు లక్ష్మికి అధికారి శ్రియపతి - విష్ణువు, లక్ష్మీభర్త. కాకుండును? పతివ్రత లలో ప్రథమురాలవగునో యమ్మా! శివునికి తప్ప నీ కౌగిలి  కురువకము-ఎఱ్ఱ గోరింట తరువునకు కూడ దొరుకదు. అనగా విద్యా ధనములు పెక్కురకు లభించును. కవి - 1.కావ్యకర్త, 2.శుక్రుడు, 3.వాల్మీకి, 4.నీటికాకి.) సరస్వతీ పతి అవుతాడు. కైరవి - 1.చందమామ, 2.వెన్నెల.)ధనాధిపుడు అవుతాడు. పార్వతీపతి మాత్రం మహాదేవుడు - శివుడు డొక్కడే. మహాదేవుణ్ణి వీడి నీ హృదయాన్ని దోచుకోవడం, యెవరికి వశముగాదు. ఆమె పాతివ్రత్యం అవాఙ్మానస గోచరం అని భావము. – సౌందర్యలహరి

ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ|
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా. – 176
   

విశ్వంభరుఁడు - విష్ణువు.
విశ్వంభరః, విశ్వం బిభర్తీతి విశ్వంభరః - విశ్వమును భరించువాఁడు.
విశ్వ - భూమి.
విశ్వం బిభర్తీతి విశ్వంభరా, భృఞ్ భరణే. - విశ్వమును భరించునది.
విశ్వము - లోకము, విణ.సమస్తము, సం.వి. (భౌతి.) దృశ్యాదృశ్య ప్రపంచము (Universe).
విశతి సర్వత్ర విశ్వం, విశ ప్రవేశనే. - అంతటఁ బ్రవేశించునది.
విశతి రోగిణః హృదయే విశ్వా, విశ ప్రవేశనే. - రోగిహృదయమందు ప్రవేశించునది. విశ్వము నందు దేవిస్థానం విశ్వేశ్వరి|

విశ్వనాథుడు - కాశీక్షేత్రవాసియగు శంకరుడు.

లోకము - 1.చరాచరము, 2.జనము, 3.కుటుంబము.
లోక్యతే సర్వ మస్సిన్నితి లోకః, లోకృ దర్శనే - సర్వము దీనియందుఁ గానఁబడును.   
లోకములు - స్వర్గమర్త్య పాతాళములు, భూలోకము, భువలోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఈ యేడును ఊర్థ్వలోకములు. అతలము, వితలము, మతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము, ఈ యేడును అధోలోకములు.

ఏకానేక స్వరూపవిశ్వేశ్వర యోగిహృది ప్రియవాసశివ |

విష్టపము - లోకము.
విశం త్యస్మిన్నితి విష్టపం, విస ప్రవేశనే. - దీనియనుఁ బ్రవేశింతురు.
త్రివిష్టపము - స్వర్గము.
తృతీయం విష్టపం = భువనం-త్రివిష్టపమ్, అ-న. మూఁడవలోకము గనుక త్రివిష్టపము. 

ప్రపంచము - 1.లోకము, 2.సంసారము, 3.విరివి.
సంసారము - 1.ఆలుబిడ్డలతోడి వునికి, 2.ప్రపంచము.
ప్రపంచించు - క్రి.విరివిచేయు.  

విపర్యానే విసరే చ ప్రపఞ్చః -
ప్రపంచశబ్దము వైపరీత్యమునకును, విరివికిని పేరు. ప్రపంచ్యత ఇతి ప్రపంచః పచ విస్తారే. - విస్తరింపఁబడునది, విస్తరించుటగనుక ప్రపంచము. ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం|

దేవీ కృతాభిషేకాయామ్ -
దేవి - 1.పార్వతి, 2.రాణి.
దేవపుత్రీసంజ్ఞకత్వాద్దేవి, సి, దేవపుత్రి యను పేరుగలది(దేవి).
దివ్యతీతి దేవి, ఈ. సీ. దివుక్రీ డాదౌ. - ప్రకాశించునది. 
దీవ్యతీతి దేవీ, దివు క్రీడాయాం. - క్రీడించునది. ఈ ఒకటి పట్టభిషిక్తురాలైన రాజభార్య (రాణీ) పేరు.
పార్వతి - 1.గౌరి (పర్వతపుత్త్రి), 2.ద్రౌపది.
పర్వత స్యాపత్యం స్త్రీ పార్వతీ, ఈ. సీ. - పర్వతమునకు గూతుఁరు.

కృష్ణ - 1.కృష్ణానది, 2.యమునానది, 3.ద్రౌపది, 4.నీలి, 5.ద్రాక్ష, 6.జీలకఱ్ఱ, 7.కృష్ణతులసి, 8.నల్లావాలు. 

విశ్వసృజుఁడు - బ్రహ్మ.
విశ్వం సృజతీతి విశ్వసృట్ జ-పు. - విశ్వమును సృజించువాడు.
బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి).
ద్రుహిణుఁడు - బ్రహ్మ, రూ.ద్రుఘణుఁడు, వ్యు.అసురులను హింసచేయువాడు.
ద్రుణినః ద్రుహతి హింసత్య సురేభ్యో ద్రుహిణః - అసురులకు హింసచేయువాఁడు, ద్రుహ జిఘాం సాయాం.
దుగినుఁడు - ద్రుహిణుఁడు, బ్రహ్మ, సం.దుహిణః. గృహము - 1.ఇల్లు, 2.భార్య.
గృహ్ణాతి పురుషేణార్జితం ధనమితి గృహం, గేహం చ గ్రహ ఉపాదానే. - పురుషునిచే సంపాదింపఁ బడిన ధనమును గ్రహించునది.
గృహిణి - ఇల్లాలు, భార్య.

హరుఁడు - శివుడు.
హరతి ప్రళయే సర్వమితి హరః - ప్రళయకాలమున సర్వమును హరించువాఁడు.
భక్తానా మూర్తిం హరతీతి వా - భక్తులపీడను హరించువాఁడు. హృఞ్ హరణే.
సహచరి - 1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడనుండునది.

ఐశ్వర్యము - 1.విభూతి (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి), 2.ప్రభుత్వము, 3.సంపద.
మహిమా - 1.గొప్పదనము, 2.ఐశ్వర్యము.
మహత్వేన మహిమా|
మహత్తు - 1.దొరతనము, 2.గొప్పతనము, 3.(వ్యాక.) పురుషవాచక శబ్ద సంజ్ఞ.
మహ్యతే పూజ్యత ఇతి మహత్, త. మహ పూజాయాం. - పూజింపఁబడునది.

తురీయము - బ్రహ్మము, విణ.నాలగవది, రూ.తుర్యము.

గిరా మాహు ర్దేవీం - ద్రుహిణగృహిణీ మాగమ విదో
హరేః పత్నీం పద్మాం - హరసహచరీ మద్రిత నయామ్,
తురీయా కా(అ)పి త్వం - దురధిగమనిస్సీమ మహిమా
మాహామాయా విశ్వం - భ్రమయసి పరబ్రహ్మ మహిషి! - 97శ్లో

తా. ఓ పరబ్రహ్మ స్వరూపిణీ! వేదాంతవేత్తలు నిన్ను బ్రహ్మ భార్యయగు సరస్వతిగను, (హరి)విష్ణుపత్ని-భార్య యగు ఫద్మ - 1.లక్ష్మి, 2.మెట్టదామర.)గను, హరుఁడు-శివుడు భార్యయగు(సహచరి-1.భార్య, 2.స్నేహితురాలు, విణ.కూడదిరుగునది.)పార్వతిగా చెప్పుచున్నారు. నీవా మువ్వురిని మించినదానవై పొందరాని అంతులేని మహిమగల గొప్ప మాయాప్రకృతివై ప్రపంచమును భ్రమింపచేయు చున్నావు. – సౌందర్యలహరి

దుంతరౌతు - యముడు. 
దుంత - దున్న; దున్న - మహిషము, దున్నపోతు.    
ౙమునెక్కిరింత - దున్నపోతు, యముని వాహనము.
మాహిషము - దున్నపోతు, బఱ్ఱెలకు సంబంధించినది, పెరుగు మొ.వి.
పోతురౌతు - యముడు.
పోతు - 1.పశుపక్ష్యాదులలో పురుషజాతి, 2.ఆబోతు, 3.ఎనుబోతు, 4.ఎద్దు.

ఎద్దుకైనగాని యేడాది తెలిపిన
మాటఁ దెలిపి నడచు మర్మమెరిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన!
తా.
ఓ వేమా! వొకయేడాది శిక్షణ నిచ్చినచో యెద్దువంటి పశువైననూ క్రమశిషణతో చెప్పినమాట వినును. కాని ముప్పది(30సం.)సంవత్సరములు, నూరిపోసిననూ మొప్పె - 1.మూర్ఖుడు, 2.కరకు.)మంచిని తెలుసుకొనలేడు.

ఆబోతుల కలహము దూడలకు ప్రాణభయము. ఆవులు ఆవులు కలహించి లేగలకాళ్ళు విరుగద్రొక్కును.

మహిషము - ఎనుబోతు.
సత్వవత్త్వాత్ మహ్యత ఇతి మహిషః, మహ పూజాయాం. - బలము గలదౌటవలన నాదిరింపఁబడునది.

కాసరము - ఎనుబోతు, వ్యు.1.గొప్ప శరీరముచే మందగతి పోవునది, 2.ఉదకమును పొందునది.
కం ఉదకం ఆసరతీతి కాసరః, సృగతౌ. - ఉదకమును బొందునది.
కా ఈష త్సరతి గచ్ఛతి మహాకాయత్వాద్వా కాసరః - గొప్పదైన శరీరముగలది గనుక మందముగ నడచునది.

మహిషి - 1.పట్టపుదేవి, 2.బఱ్ఱె.

కృతాభిషేకా మహిషీ -
మహ్యతే పూజ్యత ఇతి మహిషీ, సీ. మహ పూజాయాం. - పూజింపఁబడునది. ఈ ఒకటి రాజపట్టపుదేవి పేరు.

ఎనుమ -  మహిషి, బఱ్ఱె, గేదె.
గేదె - బఱ్ఱె, ఎనుము.
గేదెచెలప - మూడేండ్ల యెనుపదూడ.  

మాహిషము - దున్నపోతు, బఱ్ఱెలకు సంబంధించినది, పెరుగు మొ.వి.   

చెట్టుపాలు జనులు చేదందు రిలలోన
ఎనుపగొడ్డు పాలదెంత హితవు
పదుగురాడుమాట పాటియై ధరఁజెల్లు విశ్వ.
తా||
ఈ ప్రపంచములో జనులు చెట్లపాలు మంచివి గావందురు. గేదె - బఱ్ఱె, ఎనుము. గేదెపాలు వారికి హితవుగా నుండును. ఈ ప్రపంచములో పదిమంది ఆడుమాటనే పాటి - సామ్యము, విణ.సమము.)గౌరవింతురు. 

ఏనుగుకు ఒకసీమ, గుర్రానికొక గ్రామము, బర్రెకొక బానిస వుంటేగాని జరుగదు.

ఒఱ్ఱియ - 1.సాధువుకాని ఆవు, 2.వక్రస్వభావము కలవాడు, విణ.వక్రము, రూ.బఱ్ఱె.
గౌడిగేదె - పొట్టికొమ్ముల పెద్దబఱ్ఱె.

గిడ్డి - ఆవు, పొట్టియావు, సం.గృష్టిః.
నఱవ -
అరవ, సాధువుకాని యావు.
అరవ - తమిళుడు, తమిళదేశపువాడు, రూ.అఱవ, 2.పర్వతమార్గము, కనుమ.
కనుమ - కొండలసందు, త్రోవ, (భూగో.) కొండలవరుస.
నఱ్ఱ - 1.ప్రయాసచే పిదుకదగిన యావు, 2.ప్రయాసముచే బండికి గట్టబడిన యెద్దు.  

జరద్గవము - ముసలి ఎద్దు.
జరఠము - 1.ముసలిది, 2.గట్టియైనది.
జర - ముసలితనము.

కకుద్మంతము - గొప్ప మూపురము గల ఎద్దు.
కకుత్తు - 1.ఎద్దు మూపురము, కకుదము, 2.శ్రేష్టము.

కకుభస్తు ప్రసేపకః,
కకుభ ప్రసేవకశబ్దౌ వీణాదందాథస్థ్సితవక్రదారుణి వర్తేతే. కంవాయుం స్కుభ్నాతి బధ్నాతీతి దకుభః స్కుభి స్తంభనే. - వాయువును పోనీయక నిలుపునది.
ప్రసేవ్యత ఇతి ప్రసేవకః, షేవృ సేవనే. - మిక్కిలి కదిసియుండునది. ఈ 2 వీణయొక్క కరివె పేర్లు.

దురంధరము - బరువు మోసెడి ఎద్దు.
దూర్వహము -
బరువు మోసెడి ఎద్దు.
మోటబరి - బరువు మోసెడి ఎద్దు.

ఒంటెద్దుకాడి - (వ్యవ.) ఒక యెద్దు మాత్రమే నాగలి దున్నునపుడు అమర్చుకాడి (One bullock yoke).

ఏరు - 1.ఎద్దులనుగట్టి దున్నుటకు సిద్దపరచిన నాగలి, 2.తలనొప్పి head-ace.

అణక - ఎద్దు మెడమీది కాడిని మెడక్రిందికి తెచ్చుకొనుట.

మడి - మడుగు వస్త్రము, విణ.పరిశుద్ధము, సమాసమునందు మడుగు శబ్దమునకు ఆదేశమగు రూపము, ఇనుమడి మొ, (వ్యవ.) సమమట్టముగా నున్న నేలలో నాలుగువైపులను అడ్డుగట్లుగల భాగము (Plot of cultivable land).  

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగలం యెద్దుల గట్టుక
మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలో సుమతీ.

తా. ప్రపంచంలో జీతము - వేతనము, సం.జీవితమ్. కష్టసుఖము లెరుగని మిడిమేలము - గర్వము, అహంకారము)అహంకారి వద్ద పనిచెసి బాధపడుట కంటె, జవసత్తవముగల రెండు యెద్దుల సాయంతో పొలము దున్నుకొని జీవించుట మంచిది.          

                                                                 

వైదేహి - 1.సీత, 2.నర్తకురాలు.
విదేహదేశేభవా వైదేహీ. సీ. - విదేహదేశ మందుఁ బుట్టినది. విదేహ మానస రంజక రామ్|
సీత - 1.శ్రీరాముని భార్య, 2.నాగటి చాలు, 3.ఆకాశ గంగ.

వాగ్మి - 1.చిలుక, 2.బృహస్పతి, విణ. యుక్తయుక్తముగా మాటాడు వాడు.    

మేధావి - ధారణాశక్తి గల గొప్ప బుద్ధి కలవాడు, వి.చిలుక.
మేధ - ధారణాశక్తి గల బుద్ధి.

పలుకుఁ దత్తడి - చిలుక.
పలుకు - మాటాడు, అను, వి.1.వచనము, 2.నింద, 3.విద్య, 4.తునక.    
అను1 - క్రి.1.చెప్పు, వచించు, 2.అనుకరణ శబ్దములను అనుప్రయుక్త మగును.
అను2 - అవ్య. ఈ క్రింది అర్థములనిచ్చు ఉపసర్గ: 1.ఆశ్రయము, 2.ప్రాప్తము, 3.పోలిక, 4.తరువాత, 5.తగినది, 6.క్రమము, 7.సామీప్యము, 8.సహార్థము, 9.అనుకూల్యము. వచనము - మాట.    

వచము - చిలుక; చిరు - చిలుక.
చిలుకలకొలికి - స్త్రీ; స్త్రీ - ఆడుది.
చిలుకరౌతు - మదనుడు; మదనుఁడు - మన్మథుడు.
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలొ ఇరువది తొమ్మిదవది(29వ). 

కథకుఁడు - 1.కథలు చెప్పువాడు, 2.పురాణము తెలిసినవాడు.
కత - చరితము, సం.కథా.
కథ - తొల్లింటికత, వాస్తవార్థము కలది.
కథ్యత ఇతి కథా, కథ వాక్యప్రబన్ధే - రచింపఁ బడునది. 
కద - ప్రసిద్ధి తెలుపునది, రూ.కదా, కాదా, కదే, కాదే.  
చరితము - చరిత.
చరిత - 1.నడవడి, 2.తిరుగు, 3.చేయు.
నడవడి - 1.ప్రవర్తనము, 2.నడత, చరిత్రము, రూ.నడవడిక.
ప్రవర్తన -(గృహ.) నడవడి, నడత (Behavior).
చరిత్ర - 1.చరితము, 2.మానవ నాగరికత, గత చరిత్ర సంఘటనలతో అవినాభావ సంబంధము కలిగి భవిష్య్త్ మానవ సాంస్కృతికార్థిక, రాజకీయ, సాంఘిక, పురోగమమునకు దారిచూపు శాస్త్రము.
చరిత్రయుగము - (చరి.) దేశ చరిత్ర తెలిసికొనుటకు లిఖితాధారములు గల కాలము.

మాత - 1.తల్లి, 2.లక్ష్మి, 3.పార్వతి, (పంచమాతలు:- రాజుభార్య, గురుభార్య, అన్నభార్య, భార్యజనని, స్వజనని).
మాతి వర్తతే గర్భో (అ)త్ర మాతా, ఋ సీ, మామానేవర్తనే చ - గర్భ మీమెయం దిమిడి యుండును.

విద్యార్థి - చదువు కోరువాడు.
విద్య - 1.చదువు, 2.జ్ఞానము.
విద్దె - చదువు, విద్దియ, సం.విద్యా.
విద్యమానము - వర్తమానము; వర్తమానము - వృత్తాంతము, విణ.జరుగుతున్నది

సుఖార్థినః కుతో విద్యా నాస్తి విద్యార్థివః సుఖమ్|
సుఖార్థీ వా త్యజే ద్విద్యాం విద్యార్థీ వా త్యజేత్ సుఖమ్ ||

భా|| సుఖం కోరేవాడికి విద్య ఎక్కడి నుండి వాస్తుంది? విద్యార్థికి సుఖం లేదు. సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము.) కావాలనుకుంటే విద్యను త్యజించాలి. విద్య కావాలనుకుంటే సుఖం త్యజించాలి.

సుఖము - 1.సౌఖ్యము, 2.స్వర్గము. 
సుష్ఠుఖనత్య శుభమితిసుఖం - అశుభమును బోఁగొట్టునది.
శోభనాని ఖాని ఇంద్రియాణ్యస్మిన్నితిని సుఖం - ఇంద్రియముల నాప్యాయనము చేయునది.    

గోవు - 1.ఆవు, 2.భూమి, 3.కిరణము, 4.స్వర్గము, 5.సూర్యుడు.

వాణి - 1.పలుకు, 2.సరస్వతి.
వణ్యతే శబ్ద్యత ఇతి వాణి. ఈ. సీ. వణ శబ్దే - పలుకఁబడునది
పలుకుఁజెలి - సరస్వతి.
సరస్వతి - 1.పలుకుజెలి, 2.పలుకు, 3.ఒక నది.
సరః ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ, ఈ.సీ. - అంతట వ్యాప్తిగలిగినది.
బ్రహ్మలోకే బ్రహ్మసరః ఆశ్రయత్వేన అస్యా అస్తీతి వా సరస్వతీ - బ్రహ్మ లోకమందు బ్రహ్మసరస్సు నాశ్రయించి నది రూపముగాఁ ప్రవహించునది.
చెలి - 1.స్త్రీ, 2.స్నేహితురాలు.    

వాణి ర్వ్యాతిః స్త్రియౌ తుల్యే -
వయన వాణిః, వ్యూతిశ్చ, ఈ. సీ. వేఞ్ తంతుసంతానే. - నేయుట. ఈ 2 నేయుట పేర్లు.

వాణిని - 1.ఆటకత్తె, ముగ్ధ.
ఆటకత్తియ - ఆటయాడునది, నటి, నర్తకి, రూ.ఆటకత్తె.
నర్తకి - 1.ఆటకత్తె, 2.ఆడేనుగు.
ముగుద - స్త్రీ, సం.ముగ్ధా.
ముదియ - స్త్రీ, ముద్దియ, సం.ముగ్ధా.
ముదిత - ముద్దియ, స్త్రీ. ముద్ధరాలు - ముగ్ధస్త్రీ. 

వాణిన్యౌ నర్తకీ దూత్యే -
వాణినీశబ్దము నృత్యమాడు స్త్రీకిని, దూతికకును పేరు. వణతి తాచ్ఛీల్యేనేతి వాణినీ. సీ. వన శబ్దే. - పలుకునట్టి స్వభావముగలది.
పా. మత్తా విదగ్ధే వాణినౌ. - అప్పుడు మదించిన స్త్రీకి, నేర్పరియైన స్త్రీకిని పేరు. "వాణినీ వానినీ సమే" ఇతిశేషః.

బేల - 1.మూఢురాలు, 2.ముగ్ధ, 3.మూఢుడు, 4.గోల, 5.అమాయకుడు.
అమాయకుడు - మాయ, కపటము మొ.వి ఎరుగనివాడు, రూ.అమాయకుడు.

భేల - పేల, ముగ్ధ.
పేలవము - పలుచనిది, కోమలమైనది.

చరణము - 1.తినుట, 2.తిరుగుట, 3.నడవడిక, 4.పాదము, 5.పేరు, 6.పద్యపాదము.
చరత్యనేన చరణః, ఆ. ప్న. చర గతిభక్షణయోః. - దీనిచేత సంచరింతురు.    

పాదములాస్థి - (జం.) మడమ ఎముకల కూటము (Tarsus).
పాదశలాకులు - (జం.) పాదముల కుండు ఎముకలు (Meta-tarsals).   

లాక్ష - లక్క; లత్తుక - లక్క, సం.లాక్షా.
లాక్షారసము - పారాణి.
పారాణి - కుంకుమ మొదలగు వానితో పాదములకు చేయు అలంకారము.

కదా కాలే మాతః - కథయ కలితాలక్తకరసం  
పిబేయం విద్యార్థీ - తవ చరణ నిర్ణేజనజలమ్|
ప్రకృత్యా మూకానా - మపి చ కవితా కారణ తయా
కదా ధత్తే వాణీ - ముఖకమలతాంబూల రసతామ్ || - 98శ్లో
 
తా. తల్లీ!  పరబ్రహ్మ నెఱుగగోరు విద్యార్థి - చదువు కోరువాడు.)విద్యార్థినైన నేను పారాణి వలె నెఱ్ఱనగు నీ పాదములు కడిగిన జలము - 1.నీరు, 2.జడము, 3.ఎఱ్ఱతామర.)తీర్థమును ఎప్పుడు త్రాగుదును? పుట్టుకతో మూగయైన వారలకు గూడ కవిత్వము - కవిత వచ్చుటకు కారణభూతమైన వాణి - 1.పలుకు, 2.సరస్వతి. ముఖకమల తాంబూల రససమును నెప్పుడు గ్రహింతునో! – సౌందర్యలహరి

అరూపా బహురూపా చ విరూపా విశ్వరూపిణీ,
పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా|

విధువు - 1.చంద్రుడు, 2.విష్ణువు, 3.బ్రహ్మ, 4.శివుడు.
దేవా ఏనం విశేషేన ధయంతి పిబంతీతి విదుః, ఉ. పు. ధేట్పానే - వేల్పు లీతని మిక్కిలి పానము చేయుదురు. 
విధుః ఉపు విధ్యతి ప్రత్యర్థిన(ప్రత్యర్థి - శత్రువు) ఇతి విధుః - శత్రువులను వ్యథపెట్టువాఁడు.

విధు ర్విష్ణా చన్దమసి -
విధుశబ్దము విష్ణువునకును, చంద్రునకును పేరు. వ్యధత ఇతి విధుః వ్యధతాడనే. అసురులను అంధకారమును బోఁగొట్టువాఁడు.

విదుంతుదుఁడు - రాహుగ్రహము Rahu.
విధుం తుదతీతి విధుంతుదః, తుద వ్యథనే - విదు వనఁగా చంద్రుఁడు వానిని వ్యథఁ బెట్టువాడు. వ్యథ - బాధ, క్లేశము, ఆయాసము.
విథ్యంతే అనయేతి వ్యథా, వ్యథ భయచలనయో. - దీనిచేఁ జనులు భయపడుదురు లేక చలింతురు గనుక వ్యథ.

విధాత - 1.బ్రహ్మ, 2.మన్మథుడు.
విధతి సృజతీతి వేధాః-స-పు. - సృజించువాఁడు. విధ విధానే.
విధధాతి సర్వం విధాతా-ఋ-పు. సర్వముఁ జేయువాఁడు. డు ధాఙ్ ధారణ పోషయో.

సనత్కుమారో వైధాత్రః -
సనత్ సనాతనో బ్రహ్మతస్య కుమారః సనత్కుమారః - బ్రహ్మకుఁ గుమారుఁడు.
సనత్ నిత్యం కుమారావస్థత్వాద్వా - ఎల్లప్పుడు(సదా - ఎల్లప్పుడు)కుమారావస్థయం దుండువాఁడు. విథాతు రపత్యమః-వైధాత్రః - విధాత కొమారుఁడు. ఈ 2 బ్రహ్మకొడుకు పేర్లు.

బ్రహ్మ - నలువ, వ్యు.ప్రజలను వృద్ధి బొందించువాడు (నవబ్రహ్మలు:- భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు,మరీచి).   
మన్మథుఁడు - మారుడు, విష్ణువు కుమారుడు, వ్యు.బుద్ధిని కలవరముచేయువాడు.
మన్మథ - అరువది సంవత్సరములలో ఇరువది తొమ్మిదవది(29వ). 

విధి - 1.విధాత, 2.కాలము, 3.చేయుట, 4.భాగ్యము.
విదధాతీతి విధిః- ఇ-పు. - సర్వముఁ జేయువాఁడు.
విధీయతే అనేనేతి విధిః, ఈ-పు. - దీనిచేత విధింపఁబడును.  
విధి ర్విధానే దైవే పి : విధి శబ్దము చేయుటకును, అపిశబ్దము వలన బ్రహ్మదేవునికిని, ప్రకారమునకును, విధాయక వాక్యమునకును పేరు. విధానం, విదధాతీతి చ విధిః, పు. చేయుటయును, చేయువాఁడును విధి. "విధిః ప్రకారే కల్పే చ లిఙ్గాద్యర్థే పజాపతా"వితి శేషః.
విధీయతే అనేనేతి విధిః, ఇ-పు. - దీనిచేత విధింపఁబడును. విధి భవ ముఖ సురసంస్తుత రామ్|

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు, 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.
హరిప్రియ - 1.లక్ష్మి, 2.భూమి, 3.తులసి, 4.ఏకాదశి. 

సరస్వత్యా లక్ష్మ్యా - విధిహరి సపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం - శిథిలయతి రమ్యేణ వపుషా| 
చిరం జీవన్నేవ - క్షపితపశుపాశ వ్యతికరః
పరానందాభిఖ్యం - రసయతి రసం త్వద్భ జనావాన్|| - 99శ్లో

తా. తల్లీ! భగవతీ! నిన్ను భజించు నీ భక్తుడు సరస్వతీదేవితోను, లక్ష్మీదేవితోను చిరంజీవియై విహరించువాడై, బ్రహ్మకు విష్ణువుకును నసూయ పుట్టించును. రమ్యేణ వపుషా - అతి రమ్యమైన తనువుచే మన్మథుని సౌందర్యముతో తుల్యమైన కాంతి సౌందర్యము పుట్టించి రతీదేవి పాతివ్రత్యము సడలించువాడగును - ఆమె పాతివ్రత్యమునకు భంగము కలిగించువాడగును. చాలా కాలము బ్రతికియు అవిద్య నశించిన జీవునితో గలసి(జీవన్ముక్తుడై సదా శివతత్త్వాత్మకుడై) బ్రహ్మానంద రసమును పానము చేయుచున్నాడు. - సౌందర్యలహరి  

సరస్వతితో విహరించుట బ్రహ్మకు అసూయ, ఆయనకు శత్రువు.  
లక్ష్మీదేవితో చిరంజీవియై విహరించుటచేత విష్ణువునకు అసూయ, ఆయనకు శత్రుత్వము. 
సరస్వతీ దేవితో విహరించుట యనగా సకల విద్యాపతియగుటయని, లక్ష్మీదేవితో విహరించుట యనగా సిరిసంపదలతో తులతూగుట యనియు భావము.

హరి - 1.విష్ణువు, 2.ఇంద్రుడు(హరిహయుఁడు - ఇంద్రుడు), 3.సూర్యుడు, 4.చంద్రుడు, 5.యముడు, 6.గుఱ్ఱము, 7.కోతి, 8.పాము, 9.గాలి, 10.కప్ప, 11.చిలుక, 12.బంగారువన్నె.

కరువలి - గాలి.
కరువలిపట్టి - వి. (గాలిచూలి) 1.భీముడు, 2.ఆంజనేయుడు.
పట్టి - పంచమీ విభక్తి ప్రత్యయము, వి.బిడ్డ.
కరువలివిందు - వాయుసఖుడు, అగ్ని fire.
గాలిచూలి - 1.భీముడు, 2.ఆంజనేయుడు, 3.అగ్ని.
గాలినెచ్చెలి - అగ్ని fire.  

పావని - 1.ఆవు, 2.భీముడు, 3.ఆంజనేయుఁడు, విణ.పవిత్రురాలు.

                                             

జయంతుఁడు - 1.ఇంద్రుని కుమారుడు, 2.భీముడు, 3.శివుడు.
ఇంద్రుని కొమారుఁడు జయంతుఁ డనంబడును, జయంతి శత్రూనితి జయంతః - శత్రువుల జయించువాఁడు, జి జయే సౌందర్యేణ సర్వానభిభవతీతివా - సౌందర్యముచే నందఱిని బరిభవించువాఁడు.
భీముఁడు - 1.ధర్మరాజు సోదరుడు, 2.శివుడు, విణ.భయంకరుడు. 
బిభే త్యస్యాత్ త్రైలోక్యం భీమః - ముల్లోకము లితనివలన భయపడును గనుక భీముఁడు, ఞి భీ భయే.
భీమము - భయానకరసము.
భీ - భయము; భీతి - భయము, బెదురు.
బిభేత్యస్మాదితి భీషణం, భీష్మం, భీమం, భయానకము చ. - అధీరుఁడు దీనిచేత వెఱపుఁజెందును గనుక భీషణము, భీష్మము, భీమము, భయానకము.
భీముడు : పంచ పాండవులలో రెండవవాడు, మహా బలశాలి, వేయి ఏనుగుల బలము గలవాడు. కోపి, ముష్టి, గదా యుద్ధములందారి తేరినవాడు, మహావీరుడు.    

శివుఁడు - ఈశ్వరుడు, ముక్కంటి.
ఈశ్వరుఁడు - 1.శివుడు, 2.పరమాత్మ, విణ.శ్రేష్ఠుడు. 
ముక్కంటి - త్రిలోచనుడు, శివుడు.
త్రిలోచనుఁడు - శివుడు, ముక్కంటి.
ముక్కంటిచుక్క - ఉత్తరభద్రపదా నక్షత్రము, ఆర్ద్రానక్షత్రమని కొందరు.

సన్నుతకార్యదక్షుఁ డొకచాయ, నిజప్రభ ప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొనరించు, సత్త్వసం
పన్నుడు భీముడా ద్విజుల ప్రాణముకావడె యేకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపునరూపడగించి, భాస్కరా.
తా.
పూర్వము పాండవు లజ్ఞాతవాసము చేయునప్పుడు ఏకచక్రపురమగు గ్రామములో బ్రాహ్మణ వేషధారులై యున్నప్పుడు, ఆ పుర మందు భీముడు బకాసురుడను రాక్షసుని జంపి, ఆ ద్విజుఁడు - 1.బ్రాహ్మణుడు, 2.క్షత్రియుడు, 3.వైశ్యుడు, వ్యు.జన్మించిన పిదప ఉపనయనముచే రెండవ పుట్టుక గొన్నవాడు, రూ.ద్విజన్ముఁడు.)గ్రామవాసుల ఆదరమునకు పాత్రుడయ్యెను. సజ్జనుడగువాడు తనకు విభవము కోరవోయిననూ గుణశక్తితో లోకులకు ఉపకర్త - మేలు చేయువాడు, రూ.ఉపకారి.)మేలుచేసి కీర్తిని పొందును.   

అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాం గదః,   
జననో జన జన్మాదిః భీమో భీమ పరాక్రమః|

మారుతి - 1.స్వాతీనక్షత్రము, 2.భీమసేనుడు, 3.హనుమంతుడు.
భీమసేనుఁడు -
1.మారుతి, 2.వృకోదరుడు.

గాడుపుచూలి - 1.హనుమంతుడు, 2.భీముడు, వ్యు.వాయు సంతానము.
గాడుపు - గాలి, వాయువు రూ.గాడ్పు. గాడ్పు - గాడుపు.
గాడుపుసంగడీఁడు - అగ్ని, గాలికి స్నేహితుడు.
గాడుపుమేపరి - పాము, పవనాశము. 

సర్వగ్రహవినాశీ చ భీమసేన సహాయకృత్,
సర్వదుఃఖహర స్సర్వలోకచారీ మనోజవః.

వృకోదరుఁడు - భీముడు.
తోఁడేటి మేటి కడుపు -
వృకోదరుడు, భీముడు.
వడిముడి - వృకోదరుడు, భీముడు.
వడి - 1.వేగము, 2.కాలము, 3.శౌర్యము, 4.దారముపిడి, వై.వి. పద్యయతి, సం.వళిః.
వేగ - వడి, విణ.త్వరితము.
ముడి - 1.గ్రంథి, 2.చెట్టు మొ.ని ముడి, 3.దారములోని ముడి, 4.వెండ్రుకల ముడి, 5.గొంతుముడి, 6.కలహము, విణ. 1.అఖండము 2.వికసింపనిది. ముడి మూరెడు సాగునా?    

కీచకరాతి - కీచకుని శత్రువు భీముడు.
కీచకుఁడు -
భారతములో సుధేష్ణకు సోదరుడు, విరటుని బావమరిది.

అరాతి - శత్రువు.
ఇయర్తి అరాతిః, ఇ.పు. ఋ గతౌ. - సంహరించువాఁడు.

బాహుజుఁడు - 1.అశ్వవిదుడు, 2.నలుడు, 3.కీచకుడు, 4.పుణ్యశ్లోకుడు.

ప్రాణందాపి పరిత్యజ్య - మానమేవాభి రక్షతు|
అనిత్యోభవతి ప్రాణో మానమాచంద్ర తారకమ్||

తా. తనకు మానహానికరమైన (యా)ఆపద వచ్చినప్పుడు ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.)నైన విడువ వచ్చును. కాని మానమును రక్షించుకొన వలయును. అది యెందు వలన ననఁగా ప్రాణము - 1.గాలి, 2.హృదయమందలి గాలి, ఉసురు.)క్షణభంగురము.  మానము చంద్రుడును నక్షత్రములు(తారకము - 1.కంటినల్ల గ్రుడ్డు, 2.నక్షత్రము, రూ.తారక, తరింపజేయునది.)నుండు వరకుండునని భీముఁడు చెప్పెను. - నీతిశాస్త్రము 

ఆచంద్రతారార్కము - అవ్య. చంద్రుడు నక్షత్రములు సూర్యుడు ఉండు నంతవరకు , శాశ్వతముగా, ఎల్లప్పుడును.   

సామీరి - 1.హనుమంతుడు, 2.భీముడు.
హనుమంతుఁడు - ఆంజనేయుడు, రూ.హనుమానుడు.
హనుమ - హనుమంతుడు, సం.హనుమాన్. హనుమత్సేవిత నిజపద రామ్| 

56-4d8b958077_thumb2

1 comment:

  1. 🌹సమస్తతెలుగువారికీ ఉపయోగకరమైన మంచిపనిచేసారమ్మ .తమకు వేవేలవందనములు.🌹
    మీ
    సోదరతుల్యుడు:పెద్దింటి లక్ష్మణాచార్యులు యానాం
    9701034219.

    ReplyDelete